వచ్చి, నన్ను వెంబడించుడి

వచ్చి, నన్ను వెంబడించుడి

1... మంచిది, లేదు, అది బెక్కీ పుట్టకముందే జరిగింది. కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “సరే, మీకు తెలుసా.... నేను ఒక గిన్నెడు వోట్మీల్ (ఓట్స్ తో కూడిన భోజనం) మాత్రమే తినేవాడిని —దాని వెల పది సెంట్లు మాత్రమే.” మంచిది, నేను కేవలం ... వారు నా టికెట్ నాకు ఇస్తారు, నేను సంతకం చేస్తాను, అది ఎంత ఖర్చు అయినదో అది ఇస్తాను... ఆ టికెట్టును తిరిగి తీసుకుని ఖాతాలో వేస్తాను, 'ఎందుకంటే నాకు కంపెనీ లో ఖర్చుల ఖాతా ఉన్నది.మరియు ఒక రోజు మాకు గస్తీదారుల యొక్క కూడిక జరిగినప్పుడు, కంపెనీ వారు, “ఈ పది సెంట్లు ఖర్చు ఖాతాలో వేసిన వెఱ్ఱివాడు ఎవరు?” అని అన్నారు [చూడండి, ఆయన ఒక తలబిరుసు ఉన్న మనిషి.] “అల్పాహారమునకు పదిసెంట్లా!” కాబట్టి ఇది ఇతరులకు నిజంగా చౌకగా కనిపిస్తుంది, మీకు తెలుసా. వాళ్ళలో కొందరు ఒక డాలర్‌, రాత్రి భోజనానికి రెండు డాలర్లు బిల్లు పెట్టారు. మరియు నేను సరిగ్గా ఎంత ఖర్చు చేసానో అంతే బిల్లు పెట్టాను. అయితే నేను అనుకున్నాను, “సరే, ఇప్పుడు, నేను బిల్లు పెట్టే అవసరం లేదు, నేను పది సెంట్లు మాత్రమే తింటే నేను ఏమి చేయగలను?”

2.ఉప పర్యవేక్షకుడుగా ఉన్న మిస్టర్. ఫీల్డ్స్, అన్నాడు, “బిల్లీ ఎలాగైనా డాలర్‌ ఖర్చు చేసిన బిల్లు పెట్టు. మిగిలిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు.” “మీరు అందరు ఒకే విదంగా చేయాలి కదా ” అని అన్నాడు. “సరే, ”నేను, “నేను ఒక గిన్నె వోట్మీల్ తప్ప ఎప్పుడూ ఏదీ తినను మరియు దాని ఖర్చు నేను ఖాతాలో వేస్తున్నాను” అని అన్నాను. “అయ్యో, ఎన్నడూ అలా చేయకు” అని అన్నాడు. సరే, అప్పుడు నేను అనుకున్నాను, “నేను దానితో ఏమి చేయను?” అప్పుడు నేను అల్పాహారం కొరకు యాభై సెంట్లు బిల్లు పెడతాను అనుకున్నాను. అప్పుడు నేను ఏదైనా ఖర్చు చేయాలనుకుంటే అందులో నలభై సెంట్లు తీసుకుని, వీధిలో కొంతమంది పిల్లలకు ఇస్తాను—మీకు తెలుసు కదా కొంతమంది పిల్లలు, నిజముగా అల్పాహారం అవసరమైన వారు ఉంటారు.... మంచిది, అప్పుడు, నేను అలా.... స్వయంగా ఆ కంపెనీ వారే నాకు అలా చేయమని చెప్పియున్నారు. ఆ కంపెనీ లోని ఒక వ్యక్తే అలా చెప్పియున్నాడు. అందుకని, “బహుశా నేనేమైనా తప్పు చేసి ఉండవచ్చు” అందుకే ఆలా చెప్పారని అనుకున్నాను.

3.కాబట్టి చాలా కాలం క్రితం ఇక్కడ ఒక గస్తీదారునితో.... మీరు చూస్తే, ఇప్పుడు వారు హెలికాప్టర్‌ల ద్వారా గస్తీ చేస్తున్నారు. అతను నా దగ్గరకు వచ్చి ఆగాడు. అతను, “బ్రదర్ బ్రాన్హాం, ఈ చెట్టు పెరుగుతున్నది కదా ” అని అన్నాడు.నేను “అవును”. “ పిల్లలు అక్కడ దాని కింద ఆడుకుంటారు” అని అన్నాను.అతను, “మనము దాని కొమ్మలు కత్తిరించ వచ్చా?” అని అన్నాడు.నేను, “అవును, కానీ చూడండి దానిని నరికివేయవద్దు” అని అన్నాను.అతను, “సరే, మేము దానిని నరికివేయాలనుకుంటున్నాము. దానికి మేము మీకు చెల్లిస్తాము” అని అన్నాడు.నేను, “లేదు, లేదు. మీరు దానిని నరికివేయడం ఇష్టం లేదు. సరే, నాకు దాని యొక్క చట్టాలు కూడా తెలుసు, మీకు తెలుసా, ”ఎందుకంటే నేను ఏడు సంవత్సరాలు దానిలో ఉన్నాను. “లేదు, నాకు దానిని నరకడం ఇష్టం లేదు, కానీ మీరు దాని కొమ్మలు కత్తిరించవచ్చు అని అన్నాను. ”నేను ఎప్పుడూ దాని కొమ్మలు మాత్రమే కత్తిరిస్తాను . కాబట్టి, “మీకు కావాలంటే దాని కొమ్మలు కత్తిరించవచ్చు” అని నేను చెప్పాను, “బ్రదర్ వుడ్స్ మరియు నేను దాని కొమ్మలు కత్తిరించటానికి సిద్దపడుతున్నాము. దానితో పాటు మిగతా చెట్ల కొమ్మలు కూడా కత్తిరిస్తాము.” అని చెప్పాను. మరియు నేను చెప్పాను, “కానీ మేము పిల్లల కొరకు దానిని అక్కడే ఉంచాలనుకుంటున్నాము. జోయి మరియు ఆ చిన్న పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటారు”.

4.నేను ఒక యాత్రకు వెళ్ళాను, మరియు మేము తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ చెట్టు పూర్తిగా నరికివేయబడి తీసివేయబడినది. ఓహ్, ఆ చెట్టును నరికివేసినందుకు కంపెనీపై దావా వేసి ఉండగలను, మీరు చూడండి. కాబట్టి నేను అనుకున్నాను, “ఇప్పుడు, ప్రభువా, నేను కూడా దాని గురించి ఎవరితోనూ చెప్పను”. చూసారా. నేను అనుకున్నాను “కొన్ని సార్లు పదిసెంట్ల అల్పాహారం తిని యాభైసెంట్ల బిల్లు పెట్టిన దానిని బట్టి ఏదైనా ఉంటే”, మీరు చూడండి. “దానిని బట్టి ఏదైనా ఉంటే, దానిని జరుగనివ్వమని” నేను అనుకున్నాను , మీరు చూడండి. “ మరియు అప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ క౦పెనీలో ఉండుటను గూర్చిన కల నుండి బయటికి వచ్చాను , చూడండి, అక్కడ ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా గమనించాలి. ఏమి చేస్తున్నామో దానిని మరలా ఎదో ఒక రోజు కచ్చితంగా కలుసుకుంటాము.

5.పిల్లలు, ఇక్కడికి రండి. ట్రూడీ—మీ అమ్మ నీకు దీనిని గురించి చెప్పినదా. ఆమె చెప్పలేదని నేను అనుకుంటున్నాను ...ఈ కూడికను గూర్చి నీకు తెలియదు కదా. ఇది నీకు ఆశ్చర్యం కలిగించేదని నేను అనుకుంటుంటున్నాను. మరియు నీవు డిగ్రీ పట్టా పుచ్చుకోబోతున్నావు (గ్రాడ్యుయేషన్). మరియు మేము ఇక్కడ మీతో కలిసి ఈ యాత్రను కలిగియున్నాము. నేను ఇప్పుడు వేరొక కూడికకు వెళ్ళబోతున్నాను. ఈ కూడిక తర్వాత వెంటనే మేము ఇంటికి వెళ్ళబోతున్నాము. కాబట్టి నీతో మాట్లాడేందుకు ఇదే మంచి అవకాశం అని అనుకున్నాను, మరియు నీవు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకముందే ఈ పిల్లలతో కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందని అనుకున్నాను. బైబిల్ నుండి ఒక వాక్యము చదివి మరియు నా హృదయం నుండి ఒక పది నిముషాలు మీతో మాట్లాడిన తరువాత ... నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను.

6.పిల్లలైన మీతో నేను మాట్లాడే ముందు, నేను పెద్దలతో లేదా అందరితో ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది.... ఇప్పుడు బహుశా, ఇది ఒక కఠినమైన యాత్రగా ఉన్నది... కానీ నేను దేవుని నుండి నేర్చుకున్న అనుభవం, నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి దేవుని యొద్ద నుండి నేర్చుకున్న అనుభవంతో పది వేల డాలర్లు కూడా సరిపోవు. నేను సర్వశక్తివంతునియొక్క ఆజ్ఞకు పూర్తి విధేయతతో వచ్చానని నేను నిజముగా నమ్ముతున్నాను, మరియు నేను ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. అక్కడ ఒక.…

7.నేను వచ్చినప్పుడు, ఒక విషయం ఏమిటంటే, దర్శనము ద్వారా ఇక్కడికి వచ్చాను — ఒక పేలుడు సంభవించినప్పుడు నేను టూసాన్ పై భాగాన నిలబడి ఉన్నాను. అది జరిగినప్పుడు సహోదరుడు ఫ్రెడ్ అక్కడే ఉన్నాడు. మరియు మీకు తెలుసా ఆకాశంలో వారు ఒక చిత్రం తీసుకున్నారు. అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, ఎన్నడూ గమనించలేదు. అయితే దానిని గురించి ఒకరోజు నాకు ప్రేరేపణ కలిగింది. మరియు ఇక్కడ బ్రదర్ నార్మన్ యొక్క తండ్రి, “ఇది మీరు గమనించారా?” అని అన్నారు..మరియు నేను చూసినప్పుడు, దానిలో దేవదూతలు ఎంతో స్పష్టముగా ఆ చిత్రంలో అక్కడ ఉన్నారు, చూశారా. అది ఏ సమయములో అని నేను చూసాను, సమయం అప్పుడు... అదే సమయము... నేను అక్కడ ఉన్న సుమారు ఒకటి లేదా రెండు రోజుల ముందు లేదా, ఒకటి లేదా రెండు రోజుల తర్వాత. అది ఎక్కడ అని నేను చూసినప్పుడు, ఫ్లాగ్‌స్టాఫ్ లేదా ప్రెస్‌కాట్‌కు ఈశాన్యంవైపు ఉన్నది, ఇది ఫ్లాగ్‌స్టాఫ్ క్రింద భాగాన ఉన్నది. మంచిది, కచ్చితంగా అక్కడే మేము ఉన్నాము, సరిగ్గా అక్కడే.

8.ఇరవై ఆరు మైళ్ల ఎత్తులో. ఎందుకు, ఆవిరి-తేమ లేదా ఏ రకమైన పొగమంచు లేదా ఏదైనా సరే నాలుగు లేదా ఐదు మైళ్ల కంటే ఎత్తుకు వెళ్లలేదు, చూశారా. పంతొమ్మిది వేల అడుగుల ఎత్తులో విమానాలు ప్రయాణిస్తాయి. మేఘాలన్నిటి పైన విమానాలు ప్రయాణిస్తాయి, చూశారా. మరియు పంతొమ్మిది వేల అడుగుల అంటే సుమారు నాలుగు మైళ్ల ఎత్తు. మీరు చిత్రాన్ని చూసినట్లయితే ఇది ఇరవై ఆరు మైళ్ల ఎత్తు మరియు ముప్పై మైళ్ల వెడల్పులో ఉన్నది మరియు పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.మరియు కుడి వైపున, నేను మీకు చెప్పినట్టుగా గమనించాను -ప్రత్యేకమైన -ఆ దేవదూత, అక్కడ అతడు ఉన్నాడు. రొమ్ము విరుచుకుని, రెక్కలు వెనక్కి, ఏవిధంగా నాయొద్దకు వచ్చాడో సరిగ్గా అదే విధంగా చిత్రంలో ఉన్నది. నేను ఇది వరకు దానిని గమనించలేదు .. ఎన్నో విషయాలు ఉన్నాయి .…

9.ఆ తర్వాత ఒక రోజు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఏదో జరిగింది నేను చేయవలసిన పనిని గురించి నాతో మాట్లాడినది. మరియు ఇది ఒక ... ఇది నా వర్తమానము కాదు. ఒకానొక సమయములో లియో మెర్సియర్ ఇలా అన్నాడు, “బ్రదర్ బ్రాన్హాం, దీని తర్వాత ఒక సమయం వస్తుంది,” (సుమారు ఐదు లేదా ఆరు సంవత్సరాల క్రితం, బహుశా ఏడు సంవత్సరముల క్రితం), “ప్రభువు మీ పరిచర్యను మార్చబోతున్నప్పుడు, బ్రదర్ బ్రాన్హాం.”, “ఆయన అలా చేసినప్పుడు, మీరు బహుశా ఆసుపత్రులను వెలిగింపజేస్తారు, మరియు మీ మాటతో వారిని పడకల మీద నుండి బయటికి తీసుకుని వస్తారు .” అని అన్నాడు.అది నాకు సరిగా అనిపించలేదు, అయినప్పటికీ సహోదరుడు లియో ఎంతో నిజాయితీతో దానిని గురించి చెప్పాడని నమ్ముతున్నాను.

10.అయితే అది సరిగా అనిపించలేదు, ఎందుకంటే, మన ప్రభువైన యేసు ఎప్పుడూ అలా చేయలేదు. మరియు ఆయన ఆసుపత్రుల్లోకి వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో ఒకడు ఉన్నాడు. అది బైబిల్ లో ఎక్కడ ఉన్నదో గుర్తుందా? బేతెస్తా కోనేరు. రోగులైన ఎంతో గొప్ప జనసమూహము అక్కడ పడి ఉన్నారు , వికలాంగులు, కుంటివారు, గుడ్డివారు, క్రుంగిపోయినవారు-దూతకోసం వేచి చూస్తూ ఉన్నారు.ఇప్పుడు, అది, ప్రజలు దైవిక స్వస్థత కోసం ఎదురుచూస్తున్న ఆత్మీయ ఆసుపత్రిలో జరిగింది. మరియు అక్కడ స్వస్తపరచువాడు స్వయంగా వచ్చి ఒకరిని స్వస్థపరిచి బయటకు వెళ్లాడు. కాబట్టి ఒక మర్త్య మనిషి లేదా ఒక పరిచర్య వచ్చి దాని కంటే గొప్పదిగా ఉంటుందని అనుకోలేము, చూశారా. అందుకే నేను దానితో ఏకీభవించలేకపోయాను.కానీ నేను వెనక్కి తిరిగినప్పుడు, పరిశుద్ధాత్మ నాపైకి వచ్చింది. నేను లియోని పెన్ను ఇవ్వమని అడిగాను. నా దగ్గర ఉన్న ఒక కాగితంపై దానిని వ్రాసాను. మరియు మీరు ఎప్పుడైనా అది ఎక్కడ ఉన్నదో చూడాలనుకుంటే అది ఈరోజు అతని ట్రేలర్ (వాహనానికి వెనక లాక్కెళ్ళే అదనపు భోగి) లో ఉన్నది. అది నేను లోడింగ్ కోసం వాడే పాత అల్యూమినియం ట్రేలర్. మీరు ద్వారమునుండి లోపలకి వెళ్ళగానే కుడి వైపున, ట్రైలర్ కి ముందు భాగంలో షెల్ఫ్ ఉన్నది. ఆ కాగితాన్ని ఆ షెల్ఫ్ మీద పెట్టాను. నేను, “ఏదో ఒకరోజు నీవు దీన్ని బయటకు తీయవచ్చు” అని అతనితో చెప్పాను. దేవుడు ఎప్పటికీ పరిచర్యను మార్చడు, కానీ ఆయన పరిచర్య లో ఉన్న మనిషిని మార్చుతాడు. జరగవలసినది అదే.చూడండి, నేను ఏమి చేయాలో నాకు తెలుసు, కానీ నేను చేయలేను... నేను ఉన్న ఈ స్థితిలో దానిని చేయలేను, ఎందుకంటే .... నాలో ఏదో ఒక మార్పు జరగాలి, అది దేవుని మూలముగా మాత్రమే జరగాలి.

11.మేము ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాము. పిల్లలు ఇంటిపై బెంగ కలిగి ఉన్నారు, కుటుంబమంతా తిరిగి వెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి, ప్రభువు చిత్తమైతే, బహుశా శనివారం కూడిక తర్వాత నేను వారిని తిరిగి తీసుకు వెళ్ళుటకు ఏర్పాటు చేస్తున్నాను. మరియు కాబట్టి ... తిరిగి వెళ్లిన తరువాత. అక్కడ నుండి నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు ప్రజల పట్ల కలిగిఉన్న భావన కంటే భిన్నమైన భావన కలిగించే ఆ ఎదోఒకటి నాలో జరిగిన వెంటనే నేను దానిని చేస్తాను .... నేను ప్రజలను తిరస్కరించాను, చూశారా, మరియు నేను వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదనుకున్నాను. నేను దేని గురించి చెప్తున్నానో మీకు తెలుసు- నేను రికీ మరియు రికెట్టా అని పిలిచే వారి గురించి. వారు ... వారు చేసిన కార్యములు. నేను పూర్తి యధార్ధతతో భోదించాను, మరియు దేవుడు దానిని అన్ని విధాలుగా రుజువుపరిచాడు. వారు నమ్మకపోతే, ఎందుకు, వారి మార్గంలో వారిని వదిలేద్దాం.నేను ఈ రాబోయే శరదృతువులో, నా స్నేహితుడు బడ్ యెద్దకు వెళతాను. అక్కడే జీవిస్తాను. అరణ్యంలో ఎదురుచూస్తాను, నా జుట్టు మరియు గడ్డం పెరగనిస్తాను. మరియు ప్రభువు నేను ఎక్కడికైనా వెళ్లాలని కోరితే, ఆయన వాక్కు నాకు పంపుతాడు మరియు నేను వెళ్లి దానిని చేస్తాను.మరియు ఒక రోజు నేను వచ్చే దారిలో ఆయన నన్ను ఆపాడు. మరియు నేను...నేను దేని లోనికి వెళ్ళబోతున్నానో చూసాను. నేను ఇప్పుడు వేరొకదాని మార్గంలో ఉన్నాను. మరియు నేను ఇంటిని చేరుకున్న తరవాత హృదయపూర్వకంగా మాట్లాడాలని అనుకుంటున్నాను, బహుశా దానిని నేను టేప్‌లో ఉంచుతాను. ఆపై ... అలా ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పును గూర్చి ప్రజలు గ్రహించునట్లు దానిని చేస్తాను.

12.ఇప్పుడు, పిల్లలారా, మనం చిన్న ప్రార్థన చేద్దాం.ప్రభువైన యేసు, యవ్వనస్తులు మరియు వృద్ధులు, మధ్య వయస్కులు మరియు మేము అందరమూ ఇక్కడ ఈ సమయంలో కూడుకున్నందుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. మరియు మేము నిత్యత్వానికి ఈ వైపున మీ గురించి మరియు నిత్య జీవమునకు సంబంధించిన వాటిని గురించి మాట్లాడటానికి మరొక్కసారి కూడుకొనియున్నాము.ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఈ యవ్వనులు, వీరిలో కొందరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు, కొందరు ఇప్పటికే పట్టభద్రులయ్యారు (గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు). కానీ ప్రభువా, టూసాన్ కు ఉత్తరాన ఉన్న పర్వతముమీద, ప్రభువుయొక్క దేవదూతలు దిగివచ్చినప్పుడు ఆ గొప్ప పేలుడు సంభవించటానికి కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో నేను గ్రహిస్తున్నాను. అక్కడ చెప్పబడినది, మరి ముఖ్యంగా యవ్వనస్తుల గురించి చెప్పబడిన కార్యము నాకు గుర్తుంది. ప్రభువా, అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరియు ఈ యవ్వనస్తులకు వారి జీవన ప్రయాణంలో సహాపడునట్లుగా నేను ఈరాత్రి ఏదైనా వారికి చెప్పగలుగునట్లు చేయండి. ప్రభువా, ఈ సమయంలో మాకందరికీ ఆ సహాయం అవసరమై ఉన్నది.

13.మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మా పాపములను క్షమించుము. మరియు మేము వచ్చినప్పటినుండి మీకు ఆయాసకరమైనది ఏదైనా చేసినట్లైతే, దానిని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే, రేపటికి మాకు ఏ నిశ్చయత లేదు అని ఈ రోజు మేము గ్రహిస్తున్నాము. రేపు ఏమి జరగబోతుందో మాకు తెలియదు. రేపటి దినాన్ని ఎదుర్కోవటానికి మేము తప్పక ఈరోజు సిద్ధంగా ఉండవలసి యున్నది.మరియు తండ్రీ దేవా, దీన్ని చేయడానికి మాకు తెలిసిన ఒకే ఒక మార్గం ఉన్నది. నిన్ను చూచుటకు సిద్ధపడటం ఒక్కటే మార్గం. ఒకానొక రోజు మేమందరం మిమ్మల్ని కలుసుకోవలసియున్నది, సమాధానంలో మీకు ఒక స్నేహితుడు లేదా మీ బిడ్డగా అయినా లేదా మీకు శత్రువుగానైనా మిమ్మల్ని కలుసుకోవలసిఉన్నదని మేము గ్రహిస్తున్నాము. ప్రభువా మీ ప్రియ పిల్లలుగా ఉండుట తప్ప ఇంక దేనిగానైనా ఉండుట మాకు దూరమవునుగాక . ఈ కార్యములు అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమెన్.

14.ఈ రోజు, నేను ఈ రోజు తెల్లవారుజామున కలుపు మొక్కలు కోస్తున్నప్పుడు, నేను బైబిలు లో ఒక స్థలాన్ని కనుగొన్నాను, ఈ సమయంలో చదవడం మంచిదని నేను అనుకున్నాను. మరియు అది అంత సందర్బానుసారమైనది కాకపోవచ్చు, కానీ నేను కేవలం ఒక ... కొన్ని నిమిషాలు మాట్లాడాలని అనుకున్నాను. లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం నుండి నేను చదవాలని అనుకుంటున్నాను. నలుగురు సువార్త రచయితలు దాని గురించి రాశారు. 18వఅధ్యాయం, 18వ వచనం:ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అందుకు యేసు నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింప వద్దు, నరహత్యచేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. యేసు విని నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.“వచ్చి, నన్ను వెంబడింపుము” అనే మాటను గూర్చి నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను పదివేల మంది పిల్లలతో మాట్లాడినా లేదా ఇప్పుడు మాట్లాడుతున్నట్లు మాట్లాడినా నేను ఇవ్వగలిగిని అత్యంత శ్రేష్ఠమైన సలహా ఇదే. ఇది ఒక ఆజ్ఞ, మరియు ఎవరికైనా ఎప్పుడైనా, ముఖ్యంగా ఒక యవ్వనస్తునికి ఇవ్వబడిని ఒక గొప్ప అవకాశం: “నన్ను వెంబడింపుము.” అనేది అని నేను అనుకుంటున్నాను.

15.మీరు ఎవరో ఒకరిని వెంబడించబోతున్నారు. ఇప్పుడు, మీరు ... మీరు గుర్తుంచుకోండి, మీరు ఎవరో ఒకరిని వెంబడించబోతున్నారు. మరియు మీరు ఒక వ్యక్తిని వెంబడించే ముందు, ఆ వ్యక్తి ఎవరిని వెంబడిస్తున్నాడో గమనించండి, చూశారా. మనము... పౌలు ఒకసారి ఇలా అన్నాడు, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” మరోమాటలో చెప్పాలంటే, “నేను క్రీస్తును వెంబడించినట్టు మీరును నన్ను వెంబడించుడి.” మరియు ఇప్పుడు, ఈ మలుపులో, మనమందరము జీవిస్తున్న ఈ దశలో .... మరియు అనేకసార్లు నేను “రికీ,” లేదా “రికెట్టా” అని చెప్పుట మీరు విన్నారు. ఇదే ఆ కాలము అయియున్నది. మనము జీవిస్తున్న కాలము ఇలాంటిదే; ఇది నిజముగా ప్రజలు కాదు.

16.వారు మనలాంటి ప్రజలే. వీధుల్లో ఈ హాట్ రాడ్‌లతో (వేగముగా వెళ్ళే కార్లు) అటు ఇటు తిరుగుతూ వారు ప్రవర్తిస్తున్న రీతిలో ఉన్న పిల్లలు, సిగరెట్లు త్రాగుతూ, మద్యం సేవిస్తూ, అమ్మాయిలు హీనమైన దుస్తులు ధరించి— ఆ అమ్మాయిలు మరియు అబ్బాయిలు మన వంటి వారే, చూశారా. వారు మానవులు. వారు ప్రేమిస్తారు, తింటారు, త్రాగుతారు, నిద్రపోతారు, వారు ఊపిరి తీసుకుంటున్నారు, వారు చనిపోవలసి యున్నది. వారు మనలాంటి మానవులుగా ఉన్నారు. మరియు ఇంకా వారు... వారు దురాత్మతో పట్టబడి ఉన్నారు. వారికి అది తెలియదు. ఇది ఆ ప్రజల వలన కాదు , కాని కొన్నిసార్లు, వారు వెంబడిస్తున్న ఒక నాయకుడు వారిని తప్పు మార్గంలో నడిపించుటను బట్టి అది జరిగింది.

17.ఇప్పుడు, ఇక్కడున్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు దానిని చక్కగా ఎరిగి ఉన్నారు. మీరు దాని కంటే చక్కగా బోధించబడ్డారని మీకు తెలుసు. మీరు మంచి తల్లిదండ్రులను కలిగి యున్నారు. అలాంటివి చేయకుండా మీరు మెరుగైన శిక్షణ పొందారు. మీకు బాగా తెలుసు. కానీ వారికి తెలియదు. చూశారా. ఎందుకంటే వారు వెళ్ళే సంఘాలు ఆధునికమైన సంఘాలు, ఆధునికమైనవి. మరియు వారు కేవలం ఆ దినము కోసం జీవిస్తారు— ఇది అందరు మెచ్చుకునేది మరియు ఓహ్, ఇంకా.... అసహ్యమైనది వారికి మంచి గుణం, చూడండి. అయితే వారు....... నేను కొంతకాలం క్రితం నేను చూసిన సొదొమ మరియు గొమొర్రా యొక్క ఒక నాటకంలో దురాత్మతో నింపబడిన ఈ స్త్రీ లోతుతో, “నీవు అసహ్యమైనది అని పిలిచేదాన్ని నేను మంచి గుణం అంటాను.” అని చెప్పినట్టు.యేసు ఇలా అన్నాడు, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. కాబట్టి మనము మళ్లీ ఆ స్థలానికి తిరిగి వచ్చాము.

18.మనం చదివిన ఈ వ్యక్తిని గురించి కొన్నినిమిషాలు చూద్దాం. ఈ పిల్లవాడు మీలాగే మంచి ఇంట్లో పుట్టాడు అని చెప్పుటకు ఏ సందేహం లేదు. అతను మంచి తల్లిదండ్రుల చేత పెంచబడ్డాడు ఎందుకంటే అది నిరూపించబడింది. దేవుని ఆజ్ఞలను గురించి యేసు అతనికి చెప్పినప్పుడు, “నేను బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. అతను సరిగ్గా పెంచబడ్డాడని ఇది చూపిస్తుంది. అతను ఒక తీసివేయబడే వ్యక్తి కాదు, మరియు ... మీకు తెలుసు. మీలాంటి పిల్లల వలె అతను సరైనది ఏమిటో తెలుసుకునేలా పెంచబడ్డాడు. బహుశా చిన్నతనము నుండి భయభక్తులు గల తల్లి మరియు తండ్రి కింద అతను సరిగ్గా నేర్పించబడ్డాడు. సరే, అది మంచిది.

19.బహుశా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు అతడు గొప్ప వ్యక్తి కావాలనే ఉన్నతమైన ఆశయం అతని తల్లి కలిగి ఉండవచ్చు. అతను మంచి విద్యతో బయటకు వచ్చి ప్రపంచములో ఏదో ఒక గొప్ప వాడు అగులాగున... అతని తండ్రి అతనికి మంచి విద్యను అందించటానికి డబ్బు ఖర్చు పెట్టి ఒక మంచి పాఠశాలకు పంపించి ఉంటాడు.మరియు ఈ తల్లి మరియు తండ్రి వారి యధార్ధత తో ఈ బిడ్డని చదివించిన తరువాత బహుశా మీలాగే అతని గ్రాడ్యుయేషన్ సమయము వరకు వచ్చి ఉండవచ్చు, చూడండి, అతను విద్యను ముగించి తన పట్టా పొందినప్పటి నుంచి, అతను బహుశా ఆ తల్లి తండ్రులకు ఎంతో గర్వకారణముగా మరియు సంతోషమై ఉన్నాడు అనడంలో ఏ సందేహం లేదు. మీరు వాహనాలు కలిగి యున్నట్లుగా ఆ రోజుల్లో అతనికి మంచి గుర్రాలు ఉన్నాయి అని చెప్పుటకు, ఏసందేహం లేదు; ఈ రోజుల్లో మీకు మంచి దుస్తులు, మరియు ఒక కారు మరియు జీవితంలో సంతోషాన్ని ఇచ్చే తల్లిదండ్రులను మీ అందరు కలిగిఉన్నట్టే అతను మంచి తల్లిదండ్రులను కలిగిఉన్నాడు.

20.ఆ తల్లి తండ్రులు... తమ కుమారుడు కేవలం ఒక సామాన్యుడిగా కాకుండా అసాధారణమైన వ్యక్తి కావాలని నిరంతరం ప్రార్దించి ఉండవచ్చు. అందరు తల్లిదండ్రులూ అదే కోరుకుంటారు. “నీ తండ్రిని మరియు తల్లిని సన్మానించుము” అని యేసు ఆ ఆజ్ఞను సూచించడం మీరు విన్నారా. మరియు అయన దానిని అక్కడ ఆపాడు, చూశారా.మరియు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల కోసం అత్యంత ఉత్తమమైనది చేయటమే ఒక ఆశయమై ఉంటుంది. వారికి చదువు నేర్పించడం, వారు బహుశా తమంతట తాము సంపాదించలేని వాటిని వారికి ఇవ్వటం. నేను నా పిల్లల గురించి అదే విధముగా భావిస్తాను.కొన్నిసార్లు, నేను అనుకుంటాను, పిల్లలు పాఠశాలకి వెళ్ళేటప్పుడు ... బెక్కీ, శారా మరియు జోసెఫ్ ను ఈ కార్యాలన్నీ జరుగుతున్న ఇలాంటి ఉన్నత పాఠశాలల లోకి పంపేటప్పుడు, నేను వారిని పర్వతము మీదకు తీసుకుని వెళ్లి, భారతీయులు కొండలపై జీవించునట్టు వారిని అక్కడ పెంచాలి అని అనుకుంటాను.

21.అయితే వాస్తవము ఇక్కడ ఉన్నది— పిల్లల్లో ఏమున్నదో అది బయటకు వస్తుంది. వారు ఎక్కడ ఉన్నా సంబంధం లేదు... అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. వారిలో చెడు ఉంటే, అది కొండలలోని భారతీయుల శిబిరంలోనైనా బయటపడుతుంది. వారిలో మంచి ఉంటే, ఏ శిబిరంలోనైనా బయటకు వస్తుంది, చూడండి. పిల్లవాడిలో ఏమున్నదో, పిల్లవాడు ఏమైయున్నాడో, మీలోపల ఏమున్నదో అది బయటకు వస్తుంది. మరియు ఇప్పుడు మీరు ఏమై ఉన్నారో బహుశా మీ జీవితాంతం మీరు అదే అయి ఉంటారు. మీరు మార్పుచెందే దశలో ఉన్నారు. మీకు తెలుసా? యేసుక్రీస్తులోనికి మార్చబడే వారిలో ఎనభై ఆరు శాతం మంది ఇరవై ఒక్క సంవత్సరాల వయసు లోపు వారే. ఇది చూపిస్తుంది - గణాంకాలు దానిని చూపిస్తున్నాయి. క్రీస్తు వద్దకు వచ్చేవారిలో, ఎనభై ఆరు శాతం మంది ఇరవై ఒక్క సంవత్సరాల వయసు లోపే వస్తారు. మీరు ఆ వయస్సు దాటిన తర్వాత మీ సొంత ఆలోచనలను మరియు మార్గాలను ఏర్పరచుకుంటారు. ఓహ్, నిశ్చయంగా మీరు మారటం సాధ్యమే. డెబ్బై, ఎనభై, ఏళ్ళ వయసు వారు కూడా క్రీస్తు వద్దకు రావటం సాధ్యమే. కానీ అది చాలా అరుదు.మీరు మీ యవ్వనంలోనే మీ వ్యక్తిత్వాన్ని మరల్చుకుంటారు. మీరు జీవితంలో ఏమి చేయాలనీ అనుకుంటారో లేదా ఏమి సాధించాలని అనుకుంటారో వాటిని మీ ఆశయాలుగా పెట్టుకుంటారు. మీరు దానిని గురించి ఆలోచిస్తారు. మరియు మీరు అనుకున్నట్లుగా, వాస్తవానికి, మీ మనస్సు ... మీ మనస్సుపై ఆధిపత్యం వహించే ఏదో ఒక తెలియనిది దాని ద్వారా మీ మనస్సులో అది దృడంగా పెట్టబడుతుంది. మరియు అది మీ మనసులో పెట్టబడిన తరువాత, అది నేను చేయబోతున్నాను అని చెప్తారు. తరువాత మీ ఆశయాలు దాని యొద్దకు మిమ్మును నడిపిస్తాయి.

22.కాబట్టి, ఈ యువకుడి ఆశయాలు గొప్పగా ఉండాలని తన తల్లి తండ్రులు కోరుకున్నారు, దానిని సాధించటానికి తగినంత డబ్బు వెచ్చించారు, మరియు ఈ యువకుడు ఆ అవకాశం పొందాలని వారు ప్రార్దించారనడంలో ఏ సందేహం లేదు. మీరు చూడండి, వారు చేయగలిగినదంతా చేసారు. అతనికి బహుశా మంచి గుర్రాలు ఉండవచ్చు. మరియు బహుశా అతను స్త్రీలలో మంచి పేరు పొందిన వానిగా ఉండవచ్చు. మరియు పురుషులకు ఏదైతే వర్తిస్తుందో స్త్రీలకు కూడా అదే వర్తిస్తుంది, చూశారా. ఎందుకంటే మనము మానవ జీవితం గురించి అనగా స్త్రీలు మరియు పురుషులను గురించి మాట్లాడుతున్నాము.ఈ అబ్బాయికి ఉన్న ఇంత అవకాశాన్ని బట్టి, చూడండి, మనం “సులువైన వీధి” అని పిలిచే మరియు అతను దేనిగురించి చింతించే అవసరం లేని ఒక సులువైన స్థితిలోకి వచ్చాడు. అతని తల్లిదండ్రులు డబ్బు కలిగి ఉన్నారు. ... అతను చాలా ... అతను అధికారి అయ్యాడు. బైబిలు అతనిని ధనవంతుడైన యవ్వనుడు, యవ్వన అధికారి అని సూచిస్తుంది. మరియు మనం చూసాము ... చిన్న వయస్సులో, బహుశా అతని యుక్తవయస్సులో పాఠశాల చదువు అయిపోయిన వెంటనే , బహుశా కేవలం గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తయిన కొన్ని వారాలకే, ... అతను ఒక అధికారి అయ్యాడు. మరియు హృదయము కోరిన వాటినన్నిటిని కలిగి ఉన్నాడు.

23.మరియు ఆ బాలుడు ఈ ఆధునిక కాలంలో చెడిపోయినవాడు (రికీ) కాదు. అతను ఒక మంచి పిల్లవాడు. దాని గురించి లూకా వ్రాసినప్పుడు, లేదా మార్కు అని నేననుకుంటున్నాను, అతనిని గూర్చి వ్రాసినప్పుడు, యేసు అతనిని చూసి నిట్టూర్చాడు, ఎందుకంటే ఆయన అతనిని ప్రేమించాడు, చూడండి. పిల్లవాడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పిల్లవాడిలో చక్కటి వ్యక్తిత్వం ఉన్నది. అతను ఎక్కడ నుండి వచ్చాడు? దేవుని ఆజ్ఞలను నేర్పించి మరియు అతను వాటిని పాటించేలా చూసిన ఒక మంచి కుటుంబం నుండి వచ్చాడు. మరియు అతను తన యవ్వనం నుండి వాటిని చేసాడు. మరియు బాలుడు ఒక ఆశయం కలిగి ఉన్నాడు: అతను నిత్యజీవాన్ని కోరుకున్నాడు. అతను, “సద్భోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదు నని ఆయన నడిగెను?”

24.చూడండి, ఈ లోకంలో మీరు సమస్తం కలిగియున్నప్పటికీ లోపల ఉన్న మీ ప్రాణం మీకు కొదువగా ఉన్నది ఒకటి మీకు అవసరమై ఉన్నదని చెప్తుంది. సంపద మాత్రమే కాదు ....అది ఎల్లప్పుడూ సంపద మాత్రమే కానవసరంలేదు. కొన్ని సార్లు అది పేరు ప్రఖ్యాతి అయి ఉండొచ్చు. ఒక అందమైన అమ్మాయి తాను గర్వించే అందం అయి ఉండొచ్చు. బహుశా ఆమె పాఠశాలలో బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు.బహుశా ఒక అబ్బాయి ఏ అమ్మాయిని కోరుకున్నా పొందుకునే స్థితిలో ఉండవచ్చు. బహుశా భద్రత ఉన్న వానిగా అతను భావించవచ్చు. అది భద్రత కాదు. అది పొలంలో పువ్వులా వాడిపోతుంది, చూడండి. అది పోతుంది. ఎక్కువ కాలం ఉండదు, కేవలం కొన్ని రోజులైన తరువాత అది పోతుంది. అప్పుడు మీరు నిత్యత్వంలో జీవించవలసిన ఒక ప్రాణం కలిగివున్నారు.

25. మరియు ఈ యవ్వనస్తుడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి ఉంటాడు, ఎందుకంటే అతను యేసు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు మోకరిల్లాడు. అతను మోకాళ్లూని నమస్కరించాడు. అతను ఇలా అన్నాడు, “సద్భోధకుడా, నేను నిత్యజీవాన్ని పొందుకొనుటకు ఏమి చేయవలెను?”.అందుకు యేసు “నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాకాడని నీకు తెలుసు కదా ” అని అన్నాడు, చూడండి, ఇందులో ఆ యవ్వనస్తుడు ఏమి వ్యక్తపరిచాడు? ఆయన దేవుడు అని వ్యక్తపరిచాడు, చూడండి. ఆయన, “నీవు ఆజ్ఞలను ఎరుగుదువు కదా, వాటిని పాటించుము”, అని చెప్పెను.కాబట్టి అతను, “భోధకుడా ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు.ఆయన, “నీ తండ్రి మరియు తల్లిని సన్మానించుము మొదలైన ఆజ్ఞలు అని చెప్పాడు.అందుకతడు “బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.” చూడండి నేను వాటిని చేసాను అన్నాడు.యేసు విని “నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.”ఎలాంటి ఒక అవకాశము! అది పేతురు, యాకోబు లేదా యోహాను వంటి వారిలో ఒకరు అయి ఉండవచ్చు. చూడండి, పిల్లవాడు సరిగా శిక్షణ పొంది, సరిగ్గా పెంచబడ్డాడు మరియు అతను ఉపయోగించ బడుటకు క్రీస్తుకు సమర్పించబడ్డాడు. అతనిలో ఉన్న సామర్ద్యమంతటితో ఉపయోగించబడి ఉండేవాడు అనగా విద్యావంతుడిగా, యువకుడిగా, ధనవంతుడిగా, పలుకుబడితో-అతను సువార్తను ప్రకటించగలిగి ఉండేవాడు ; అయినప్పటికినీ దానిని తిరస్కరించాడు. ఆ యువకుడికి అది ఎంత ఘోరమైన కార్యమో చుడండి.

26.“నన్ను వెంబడించుము.” ఇప్పుడు చూడండి, అతడు ఎవరో ఒకరిని వెంబడింపవలసి యున్నది. ఇప్పుడు అతడుతో సంబంధం కలిగిఉన్న ప్రజల ప్రభావమును వెంబడింపవలసి యున్నది- ఒక యవ్వన స్త్రీ యొక్క ప్రభావము, లేదా అతను సంబంధం కలిగి ఉన్న కొంతమంది అబ్బాయిల యొక్క ప్రభావము, లేదా పాఠశాలలో అతని సహ విద్యార్థుల యొక్క ప్రభావము అయినా వెంబడింపవలసి యున్నది - లేదా యేసుక్రీస్తును అయినా వెంబడించాలి. ఇప్పుడు అతనికి ఈ మంచితనం అంతా ఉన్నప్పటికీ, తనకు నిత్యజీవము లేదని అతనికి తెలుసు.పిల్లలారా, మీరు ఆలోచించవలసింది అదే, చూడండి. ఇప్పుడు ఈ రాత్రి ఆ అబ్బాయిని చూడండి-అతను ఏమై ఉండగలిగే వాడు, మరియు ఈ రాత్రి అతను ఏమై యున్నాడు. అతడు ఎక్కడో ఉన్నాడు. అతను ఒక పురుషుడు. ఎక్కడో ఉన్నాడు. తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దినాన తీర్పును ఎదుర్కొనేందుకు వేచి యున్నాడు. పిల్లలైన మీకు ఇవ్వబడుతున్న అదే అవకాశాన్ని అతను త్రోసివేసాడు. దాదాపు ఇప్పుడు మీరు ఉన్నట్టుగా అదే పరిస్తితిలో, మంచి పిల్లలుగా, మంచి వ్యక్తిత్వంతో, మీరు కలిగిఉన్నట్లుగా మంచి తల్లి తండ్రులు ; మీరు చేయాలి అని అనుకుంటే తప్ప పని కూడా చేయవలసిన అవసరం లేదు, చూడండి.

27.కానీ దానితో పాటు మరొకటి ఉన్నది. దానితో పాటు ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఉన్నది. ఈ రాత్రి ఆ వాక్యము ఎప్పటికీ చావదు. ప్రతి యవ్వనస్తునికి మరియు ప్రతి యవ్వనురాండ్రకి ఇది ఇప్పటికీ ఒక సవాలుగా ఉన్నది. “నన్ను వెంబడించుము.” చూడండి, ఆ మాటలు చనిపోవు. మీరు ఏది మాట్లాడినా , గుర్తుంచుకోండి-అది రహస్యంగా మీ కారులో కావచ్చు, బలిపీటము మీద కావచ్చు , మీ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వీధి మూలలో అయినా కావచ్చు - అది ఎక్కడైనా కావచ్చు , మీ మాటలు ఎప్పటికి చనిపోవు. అవి శాశ్వతంగా జీవించాలి.

28.ఆ అమ్మాయిని నేను ... ఒక రాత్రి దర్శనములో చూసినప్పుడు. అందమైన యువ్వన అమ్మాయి హాలీవుడ్ నటి, మరియు నేను ఆమె చనిపోవడం చూసాను, సహాయం కోసం సమీపిస్తూ ప్రయత్నించడం చూశాను. మరియు ఆమె గుండెపోటుతో మరణించింది. ఆమె పేరు మిస్ మోన్రో. ఆపై ... అది రెండు సంవత్సరాల క్రితం, నేను ఆమె చనిపోవడం దర్శనములో చూశాను. రెండు రోజుల తర్వాత ఆమె చనిపోయింది.మరియు ఈమద్య ఒక రాత్రి నేను ఆ అమ్మాయి గొంతు విన్నాను. ఎలా? నా పిల్లలు చెప్పారు, “నాన్న, నువ్వు ఆ తిరిగి రాలేని నది యొద్దకు వెళ్తావు కదా ”. “ఈ రాత్రి అలాంటి ఒక నాటకం వారు అక్కడ వేస్తారు” అని నాతో చెప్పారు. అది ఒక వారం లేదా రెండు వారాల తర్వాత ఒక రాత్రి సమయములో దానిని వారు అక్కడ వేస్తారు అని నాకు చెప్పారు. నేను అనుకున్నాను, “సరే, నేను దానిని చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను రెండు మూడు సార్లు ఆ నది యొద్దకు వెళ్ళాను -లేదా ఐదు సార్లు అక్కడికి వెళ్ళాను.”సరే, నేను దానిని చూడటానికి వెళ్ళాను మరియు మిస్ మార్లిన్ మన్రో అందులో నటించింది. మంచిది, నేను దర్శనములో చూసిన అదే అమ్మాయి. మరియు ఆమె చిత్రం అక్కడ ఉన్నది- ఆమె నటనలు , ఆమె “తిరిగి రాలేని నది” నాటకములో ఆమె నటించిన విధంగా ఉన్నది, అదే విధముగా, ఆ సమయంలో ఆమె చిత్రం తీయబడింది , బహుశా పదిహేను సంవత్సరాలు క్రితం (అది పాత చిత్రం, బహుశా ఇరవై సంవత్సరాల క్రితం) తీసి ఉండవచ్చు. మరియు ఆమె చనిపోయి రెండు సంవత్సరాలు అయింది; మరియు అక్కడ ఆమె మళ్లీ సజీవంగా ఉంది. ప్రతి నటన మరియు ప్రతి మాట, చూడండి, ఇప్పటికీ మరల జీవింపజేయునంతగా అది టేపులో రికార్డు చేయబడి ఉన్నది.

29.అంతేకాదు, మనం మాట్లాడేదంతా ఎప్పటికి సజీవంగా ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట మరణించదు. ఇప్పుడు ఈ గదిలో నుంచి మాటలు, వ్యక్తుల రూపాలు వస్తున్నాయి. టీవీ వాటిని అందుకుంటుంది. మీరు ఇక్కడ మాట్లాడినది, ఇదే క్షణములో ప్రపంచవ్యాప్తంగా దానిని వినిపించవచ్చు. ఈ గదిలో మీరు వినే కన్నా ముందే, ఇది ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది. మరియు దేవుని యొక్క గొప్ప తెర దానిని అందుకుంటుంది. మరియు మీరు చేసే ప్రతి కదలిక మరియు ప్రతి చర్య, మీరు తీర్పు యెదుట దానిని కలుసుకోవలసి ఉన్నది, చూడండి. కాబట్టి, ఓ యవ్వనస్తుడా, ఈవిషయాల గురించి నీవు ఆగి ఆలోచించడం మంచిది, చూడండి, 'ఎందుకంటే మీరు మళ్ళీ వాటిని కలవబోతున్నారు, చూడండి.

30.ఈ యవ్వనుడిని గమనించి చూద్దాం, ఇతనికి ఉన్న అవకాశాన్ని చూడండి. అతని స్థానంలో మిమ్మల్ని మీరు చూడండి. మరియు అమ్మాయిలు కూడా అదే విధముగా-బెక్కీ, మార్లిన్. ఇలాగే... మీరందరు అలాగే అతని స్థానంలో నిలబడి, ఇంకా సజీవంగా ఉన్న ఆ స్వరాన్ని మీరు వినగలుగు తున్నారు. అది ఇంకా సజీవంగా ఉంది. ఇది ఇంకా కదలాడుతోంది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన వాస్తవమైన స్వరాన్ని విజ్ఞానశాస్త్రం వారు ఇరవై సంవత్సరాల తర్వాత వినిపించగలమని చెప్తున్నారు. అది ఇంకా సజీవంగా ఉంది. సముద్రంలో పడే గులకరాయి వలె అది ఉంటుంది: ఆ అల ఎప్పటికీ ఆగదు; అది వేల మైళ్ల దూరంలో ఉన్న ఒడ్డుకు వెళ్లి వెనక్కి తిరుగుతుంది.

31.ఒక స్వరం గాలిలోకి ఒకసారి అలా మాట్లాడితే అది ఎప్పటికీ చావదు. మీరు తీర్పులో చెప్పగలిగేది ఏదీ ఉండదు -అది అక్కడే ఉంటుంది. “నన్ను వెంబడించుము” అని ఆ యవ్వనస్తుని పిలుస్తున్న యేసుక్రీస్తు యొక్క స్వరం అక్కడ ఉంటుంది; మరియు అతనికి గొప్ప ఆస్తులు ఉన్నాయి కాబట్టి అతను విచారంగా, ముఖము చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగి వెళ్లడం(తెరపై) అక్కడ కనిపిస్తుంది. చూడండి. ఇది ఎల్లప్పుడూ డబ్బు అయ్యి ఉండనవసరము లేదు... ఇతర విషయాలు కారణము కావచ్చు, చూడండి. మనకి ఆ పిలుపు కంటే ఏదైనా ప్రియమైనదిగా ఉంటే, చూడండి, అది మనకు డబ్బులా మారుతుంది. అది మనల్ని చెడగొట్టేదిగా అవుతుంది.

32.ఇప్పుడు మనం అతనిని కొంచెం వెంబడిద్దాం. అతను వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు ఏమి జరిగింది ? అతను క్రీస్తు యొక్క ఆ స్వరాన్ని వినలేదు; అతను తన స్నేహితులతో వెళ్ళాడు. పిల్లలైన మీరు కూడా , మీరంతా చక్కని పిల్లలు మరియు మీరు తప్పనిసరిగా స్నేహితులను కలిగి ఉంటారు. అయితే మీకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడో గమనించండి. ఒకవేళ ఆ స్నేహితుడు క్రీస్తుని వెంబడిస్తున్నట్లు అయితే, ఆ స్నేహితుడితో వెళ్ళండి. క్రీస్తును కూడా వెంబడించండి. కానీ అలా చేయకపోతే, మీరు వెంబడించవద్దు.అతనిని చూద్దాం. అతను బహుశా తన స్నేహితుతోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అతను గొప్ప అధికారి అయ్యాడు. అతను అప్పుడు ఒక అధికారి. తరువాత అతను తన ధాన్యాన్ని కూర్చుకొనటానికి అదనపు కొట్లను కట్టాల్సినంతగా అభివృద్ధి చెందినట్లు మనం చూస్తున్నాము. ఆపై అతను తనలో తాను అనుకున్నాడు, అతను వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత, యవ్వన కాల జీవితం గతించిన తరువాత .... అతను తన జీవితంలో చేసినదంతా, వినోదమే అయ్యి ఉండవచ్చు.

33.ఇప్పుడు.... నేను మరియు నా భార్య వంటి ఒక వృద్ధుడు మరియు వృద్ధురాలు, లేదా మీ అమ్మ నాన్నలు - వారు ఆలోచించగలిగేది ఏమీ ఉండదు. మీకు తెలుసా, వారు బయటికి వెళ్లి, యవ్వన పురుషులు మరియు యవ్వన స్తీలు వీధులలో తిరుగులాడినట్టుగా తిరుగుటకు వారు ఇష్టపడరు. ఎవరు మీ భార్య కాబోతున్నారు, లేదా మీ భర్త కాబోతున్నారు, లేదా ... చూడండి, వారికి అలాంటివి ఏమీ మనస్సులో ఉండవు. వారికి పిల్లలు ఉన్నారు, వారు పిల్లలు పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు....రేపు అనే దినము ఉంటే, మీరు అందరూ అలాగే ఉండబోతున్నారు.మరియు చూడండి, అప్పుడు అతడు ... బహుశా అతను వివాహం కూడా చేసుకుని ఉండకపోవచ్చు. అయినప్పటికీ, అతను గొప్ప అధికారి. మరియు అతను....యెరూషలేములో నేటి వరకు ఉన్నట్లుగా , వారు రోజు సాయంత్రం చల్లనిపూట ఇంటి పైన కూర్చొని తింటారు. మరియు మనము అతనితో పాటు వ్యక్తి చిత్రీకరించబడటం చూస్తున్నాము - అది ఒక బిచ్చగాడు.

34.మరియు ఆ మనుషుడు, పొరుగువారిని గౌరవించటము మరియు ఇతరులు తమకు చేయునట్లుగా ఇతరులకు చేయటం వంటివి చేయునట్లు పెంచబడ్డాడు. చూడండి, క్రీస్తు యొక్క ఆ పిలుపును తిరస్కరించడం ద్వారా, చివరకు.... అలాంటి ఇంట్లో పెంచబడిన ఒక అబ్బాయి, వాటి నుంచి ఎప్పటికి తొలగిపోడు అనిపిస్తుంది, కానీ వాటి నుంచి తొలగిపోయాడు. అది జరిగింది. మరియు లాజరు అనే ఒక వ్యక్తి అతని ద్వారం దగ్గర అతనిని బిక్షమడుగుతూ వ్యర్థంగా అక్కడ పడివున్నాడు. ఆ బిచ్చగాడి కోసము కోసం కాకుండా కుక్కల కోసం అతడు తుడిచి పడేసిన ముక్కలను బిచ్చగాడు భుజించేవాడు-మరియు అతను పుండ్లతో నిండి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి సమాజం లోని ఆధునిక జీవితం వలన కనికరము లేకుండా అయ్యాడు. అతను క్రీస్తు యొక్క ఆ పిలుపును తిరస్కరించినందున అతను మొద్దుబారిపోయాడు.అప్పుడు బహుశా ఒక సాయంత్రం, ఈ సమయానికి అతడు చక్కటి ద్రాక్షరసముతో రొట్టెను కాల్చుకుంటూ, అతని చుట్టూ ఆభరణములు ధరించుకున్న అందమైన స్త్రీలు , మరియు అలాంటి విషయాలతో, అతడి హృదయం కోరినవన్నీ కలిగివుండి, బహుశా రొట్టెలు కాల్చుకుంటూ ఉండగా, బిచ్చగాడు ద్వారము వద్ద పడి ఉన్నాడు .... మరియు మరుసటి రోజు ఉదయం తెల్లవారకముందే, అతడు పాతాళంలో ఉండి నాలుకపై నీళ్లు వేయుటకు లాజరును పంపుమని కేకలు వేయుచుండెను. దృశ్యం మారిపోయింది.

35.మరియు మీరు గమనిస్తే, “తండ్రియైన అబ్రాహామా....”అని అతడు చెప్పినప్పుడు, అబ్రాహాము యూదుల యొక్క తండ్రి అని అతనికి ఇంకా గుర్తుంది. అతడు, “తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను-నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను.”అబ్రహాము అన్నాడు, “అది... నేను అలా చేయలేను” అని చాలా మాటల్లో చెప్పాడు.“ మరియు వీటన్నింటితో పాటు, నీవు జీవితంలో నీ అవకాశాన్ని కలిగియున్నావు.అతను దానిని ఎప్పుడు కలిగి ఉన్నాడు? “నన్ను వెంబడించుము” అని యేసు చెప్పినప్పుడు. కానీ అతడు దానిని తిరస్కరించాడు. అతను డబ్బు సంపాదించగల మార్గంలో వెళ్ళాడు. మరియు అది సరే-డబ్బు సంపాదించడం తప్పు ఏమీ కాదు. అయితే చూడండి మీరు అది చేస్తున్నప్పుడు యేసును వెంబడించండి, చూడండి. అతను ఆ గుంపుతో కలిసి వేరే మార్గంలో వెళ్ళాడు. మరియు మీరు గమనించినట్లయితే, అబ్రహము ఇలా అన్నాడు, “అంతేకాక, అక్కడి నుండి నీ యొద్దకు ఏ మనుష్యుడు ఎప్పటికి దాటలేకుండా, అతనికి నీకు మధ్య మహా అగాధము ఉంచబడియున్నదని చెప్పెను. ఇది నియమించబడినది. ఏ మనిషి ఇదివరకు ఎప్పుడు దాటలేదు, ఇకముందు కూడా దాటలేరు.”

36.అప్పుడు అతను సువార్తికుడు కావాలనుకుంటున్నాడు చూడండి. యేసు నన్ను వెంబడించుము అని అతనికి ఇచ్చిన పిలుపు (మరియు యవ్వనస్తుడిగా ఆత్మలు సంపాదించువానిగా ఉండటానికి) మళ్లీ అతని వద్దకు తిరిగి వచ్చింది. అతనికి భూమిమీద ఐదుగురు సహోదరులు ఉన్నారని గుర్తుకొచ్చింది, మరియు అతను ఉన్నచోట వారు ఉండకూడదని కోరాడు. అతను ఇలా అన్నాడు, “ఈ స్థలమునకు రాకుండ నా సహోదరులకు చెప్పుటకు లాజరును పంపుము. ” -ఇంకొక మాటలో, “నన్ను వెంబడించుము” అనే పిలుపును అంగీకరించుమని చెప్పుము.కానీ అబ్రాహాము అన్నాడు, “వారు అంగీకరింపరు” అని చెప్పాడు.అతను, “అవును, లాజరు వలె మృతులలోనుండి ఒకడు లేచి వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.”మీరు చూడండి, మనము చనిపోయిన తర్వాత, ఇంకా మనస్సాక్షి కలిగి ఉంటామని ఇది చూపిస్తుంది. అతను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రాహాము అన్నాడు, “కుమారుడా, నీ దినములు గుర్తు తెచ్చుకో ....” చూశావా? మీకు ఇంకా గుర్తు ఉంటుంది. మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోరు. మీకు గుర్తుంటుంది. మరియు ఆ మనుష్యుడుకి ఉన్న జ్ఞాపకాలు, ఇంకా అదే స్థలంలో, “నన్ను వెంబడించుము” అని యేసు చెప్పినప్పుడు అతనికి ఉన్న అవకాశాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ అతను ఒక తప్పుడు వ్యక్తిని, తప్పు గుంపును వెంబడించాడు. అతను తప్పు గుంపులో మరియు తప్పు స్థలములో వెళ్లి పడ్డాడు. అతను తప్పుడు నిత్యత్వములో పడిపోయాడు - ఆ దినములో దేవునియొద్దనించి వేరుచేయబడి నశించిపోయాడు.

37.యేసు ఒక గొప్ప అద్భుతమైన మాటను కూడా చెప్పాడు, “ఒకడు మృతులలో నుండి లేచి వారి యొద్దకు వెళ్లినను వారు నమ్మరు. ఎందుకనగా మోషేయు మరియు ధర్మశాస్త్రము (చెప్పిన మాటలు) వారు విననియెడల ఒకడు మృతులలో నుండి లేచినను వారు నమ్మరు. వారు దానిని నమ్మరు.”ఎందుకు? ఎందుకు? ధర్మశాస్త్రం అలా ఏమైనా మాట్లాడుతుందా? అవును. “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి”. మరియు అతను ధర్మశాస్త్రం క్రింద జీవించాడు; కానీ అతను ద్వారము వద్ద బిచ్చగాడి చనిపోతుండగా వదిలేసాడు, చూశారా. అతను దేవుని ఆజ్ఞల క్రింద జీవించాడు, అయిననూ ఆ గొప్ప నిత్య జీవమును చూడలేకపోయాడు.

38.పిల్లలూ, మీరందరూ నా పిల్లలవలె కనిపిస్తున్నారు. మీరంతా నా కుమారులు కుమార్తెల వలె ఉన్నారు, మరియు ఒక విధంగా ఆత్మీయంగా చెప్పాలంటే మీరు అదే అయి ఉన్నారు, చూడండి. అది సరైనది. మీరు వచ్చి నా మాటలు విని నన్ను నమ్ముతున్నారు కాబట్టి, ప్రభువైన దేవుడు మీ ఆత్మలను నా సంరక్షణలో ఉంచి యున్నాడు. చూశారా. మరియు ఆ విషయం లో చూచినట్లైతే మీరు నా కుమారులు మరియు కుమార్తెలు. అది నిజమే. మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, దేవుని ఆజ్ఞలను పాటించడం గొప్ప విషయం. మంచి గృహములో పెరగటం దేవుని నుండి వచ్చిన స్వాస్థము. మరియు మీరు కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాలతో చక్కని పిల్లలుగా ఉండటం మంచిది. విద్యను కలిగి ఉండటం అద్భుతం. ఈస్వేచ్ఛ కలిగిన దేశంలో జీవించడం కూడా అద్భుతమైనది. కృతజ్ఞులమై ఉండవలసిన అనేక విషయాలు మనకు ఉన్నాయి. అయితే మీరు వారసత్వంగా పొందని ఒక విషయం ఉంది; మీరు దానిని అంగీకరించాలి. అది నిత్య జీవం. మరియు మీరు యేసును వెంబడించి, తిరిగి జన్మించిన అనుభవము ద్వారా మాత్రమే నిత్య జీవం పొందుకోగలరు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

39.ఒకసారి నేను ఒక వ్యక్తి గురించి చిన్న కథ విన్నాను ... ఓహ్, అతను పేదవాడు మరియు అతను ఎల్లప్పుడూ ఈ విధముగా కోరుకున్నాడు.... (ఇది ఒక చిన్న పొడుపు కథ, అయితే ఇది ఎల్లప్పుడూ నా హృదయానికి తాకిన కథ.) మరియు ఒక రోజు అతను ఒక పుష్పం తీసుకున్నాడు. మరియు అది ఒక మాయాజాల పుష్పం, ఆ పుష్పం అతనితో మాట్లాడుతూ సమాధానమిచ్చింది, “నీవు నీ జీవిత కాలమంతా పేదవాడిగా ఉన్నావు.”, “ఇప్పుడు నీకేం కావాలో అడుగు అది నీకు ఇవ్వబడుతుంది.” అని చెప్పింది.అతను, “అక్కడ ఆ పర్వతం తెరుచుకుని, నేను అందులోకి వెళ్లి పర్వతంలోని బంగారమును కనుగొన గలిగేలా చేయుమని కోరుకున్నాడు.”ఆ పుష్పం, “సరే,” ,“నీవు ఎక్కడికి వెళ్లినా నన్ను నీతో తీసుకెళ్లాలి,” అని చెప్పింది. చూశారా. “నన్ను నీతో తీసుకు వెళ్ళినట్లయితే, నేను ఎక్కడ ఉన్నా, నీకు ఏమి కావాలో అది అడగవచ్చు”, అని చెప్పింది.

40.అతను ఆ పర్వతం వద్దకు వెళ్ళాడు, మరియు పర్వతం తెరుచుకుంది, అతను లోపలికి వెళ్ళాడు. ఈ చిన్న పొడుపు కథలో చెప్పినట్టు , అక్కడున్న అరలు అన్ని బంగారం మరియు వజ్రాలతో నిండి ఉన్నాయి. అతను ఒక బల్ల మీద, లేదా ఒక బండ మీద పుష్పాన్ని పెట్టాడు. మరియు అతను పరిగెత్తి ఒక పెద్ద వజ్రం పట్టుకుని అన్నాడు, “నేను దీన్ని నా స్నేహితులకు చూపించాలి. ఇప్పుడు నేను ధనవంతుడిని. నా దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇది నేను చూపించాలి.”అయితే ఆ పుష్పం, “నీవు అసలైన దానిని మర్చిపోయావు.” అని చెప్పింది.అందుకతడు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి … “సరే, బహుశా నేను ఒక బంగారు ముక్క తీసుకుంటాను, నేను ఒక వెండి ముక్క తీసుకుంటాను.” అని అనుకొని, “నేను కలిగి ఉన్నదంతా మరియు నేను ఎంత ధనవంతుడనో ప్రజలకు చెప్పడానికి నేను తొందరగా వెళ్ళాలి.” అనుకున్నాడు.మరియు అతను ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు, “నీవు అసలైన దానిని మర్చిపోయావు.” అని పుష్పం అన్నది. “కాబట్టి అతను మళ్లీ వెనక్కి పరుగెత్తాడు. అతను, ”ఇక్కడ అన్ని రకాల విలువైన పదార్థాలు ఉన్నాయి.“ అనుకొని ఒక రాయిని తీసుకుని, ”నేను ఈ రాయిని తీసుకొని వెళ్లి ప్రజలకు ఈ పర్వతం ఏ రాతి నుండి తయారు చేయబడింది చూపిస్తాను, కాబట్టి నేను మరల దీనికి తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనగలను.“ అని అనుకున్నాడు. చూడండి.మరియు అతను తలుపు వద్దకు వెళ్ళగానే పుష్పం చివరిసారి చెప్పింది, “నీవు అసలైన దానిని మర్చిపోయావు.”!“ఓహ్,” అతను, “ఓహ్, నోరు మూసుకో, అని అన్నాడు.”చూడండి, అతను దానిని ఇక వినడానికి ఇష్టపడలేదు, “అసలైన దానిని మర్చిపోయాడు.” అతను ఆ తలుపు నుండి బయటకు పరుగెత్తాడు. అతను అలా చేసినప్పుడు, ఆ పుష్పం లోపలే ఉండిపోయి అతని వెనుక తలుపు మూసివేయబడింది. అసలైన విషయం పుష్పం, చూశారా. అసలైనది ఆ పుష్పం.

41.సంవత్సరాల క్రితం- మీరందరూ ఇప్పుడు ఉన్నట్లే- నా చిన్నప్పుడు, ఇక్కడ ... ఇక్కడ ఫీనిక్స్ కు పైభాగంలో పశువుల పెంపకం జరిగేది. అయితే నేను ఒక పత్రికలో ఒక పరిశోధకుడి గురించి చదువుతున్నాను ... అప్పుడు ఇక్కడ నుండి రోడ్లు లేవు-తిన్నని ఇసుక మార్గాలు ఉన్నవి. ఇప్పటికి వారు ఇక్కడ చాలా పరిశోధన చేస్తారు, మీకు తెలుసా.కానీ ఈ పరిశోధకుడు లోపలికి వచ్చాడు మరియు అతనికి చాలా డబ్బు దొరికింది. అతనికి చాలా బంగారం దొరికింది. మరియు తన తిరుగు దారిలో అతను కనుగొన్న ఒక క్యాబిన్‌ లో ఉన్నాడు. మరియు అతనితో ఒక కుక్క ఉన్నది, మరియు ఆ కుక్క బయట కట్టివేయబడింది. ఆ రాత్రి బంగారం తీసుకోవటానికి ఒక అక్రమార్కుడు అతనిని వెంబడిస్తూ ఉన్నాడు. అతను దానిని పాత స్పానిష్ గనులలో తీసుకుని వస్తున్నాడు. కుక్క మొరగడం ప్రారంభించింది. ఆ పరిశోధకుడు ఆ కుక్కతో ఇబ్బంది పడటం ఇష్టం లేదు. అతను “నోరు మూసుకో” అన్నాడు. అతను, “రేపు నేను దీనిని నగరానికి తీసుకువెళతాను. [మరియు కథ యొక్క నీతి ఇది.] మరియు నేను దాని బరువు తూచి అమ్ముతాను. మరియు నేను ధనవంతుడిని అవుతాను. మరియు నేను గొప్ప కొనుక్కుంటాను. నేను అన్ని రకాల మహిళలను మరియు పెద్ద పార్టీలను (వినోదాలను) కలిగి ఉంటాను. మరియు నేను ధనవంతుడిని అవుతాను, ఎందుకంటే నేను ఇప్పటికే ఈ బంగారమంతా నాది అయింది.” అని అనుకున్నాడు.మరియు అతను నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుక్క మొరుగుతూనే ఉన్నది, ఎందుకంటే అక్రమార్కుడు దాక్కుంటూ, పరిశోధకుడు నిద్రపోయే వరకు వేచి ఉండి రావడం కుక్క చూసింది కాబట్టి. మరియు అతను మళ్ళీ లేచి, “నోరు మూసుకో” అని కుక్క మీద అరిచాడు. పాపం ఆ కుక్క విసుక్కుంటూ, ప్రమాదం పొంచి ఉందని తన యజమానిని హెచ్చరించడానికి ప్రయత్నించింది.మరియు ...మరల కుక్క మొరగడం ప్రారంభించినప్పుడు.... పరిశోధకుడు ఒక తుపాకీ కలిగి ఉన్నాడు. అతను కుక్కతో ఇబ్బంది పడకూడదనుకుని, అతను లేచి కుక్కను కాల్చాడు. ఆ పరిశోధకుడు ఆ రాత్రి అక్రమార్కుడిచే చంపబడ్డాడు. అతడు కనిన కలలన్ని అతనికి ఏ మంచి చేయలేకపోయాయి. ఎందుకు? తనను హెచ్చరిస్తున్న స్వరాన్ని అణచాడు.

42.మీరు ఎవరూ ఏమీ చేయటానికి ప్రయత్నించలేరు ....పిల్లలైన మీరు పెంచబడిన విధంగా పెరిగిన తర్వాత ఎప్పటికీ ఏ తప్పు చేయలేరు, మరియు తప్పు చేయకూడదని మీకు ఏదోఒకటి చెప్పకుండా అలా ఉండలేరు. ఇప్పుడు, మిమ్మల్ని హెచ్చరించే ఆ స్వరాన్ని ఎప్పుడూ అణచి వేయవద్దు. మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, “నన్ను వెంబడించుము” అని చెప్పిన ఆ స్వరాన్నిఅంగీకరించినట్లైతే మీరు ఎల్లప్పుడూ సరిగ్గా ఉంటారు. మీరు అలా చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోండి, …మనము మాట్లాడిన ప్రతి మాట మరియు ప్రతి స్వరం సజీవంగా ఉన్నట్టు, ఆ స్వరము కూడా భూమిమీద ఈ రాత్రి సజీవంగా ఉన్నది. గాలిలోని ఈథర్ తరంగంపై ఆ స్వరం బయటకు వెళ్లినప్పుడు ....చూడండి, మీరు దానిని పంపే ట్రాన్స్‌మిటర్‌ (తరంగాలు పంపే పరికరము) ని ఇక్కడ కలిగియున్నారు. వాటిని బయటకు పంపే పరికరము మీరే అయి యున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకోడానికి ఒక కేంద్రం అవసరమై యున్నది. మరియు యేసు దేవుని వాక్యం పంపించే పరికరం అయ్యిఉన్నాడు, ఎందుకంటే ఆయన ఒక మానవునిలో ప్రత్యక్షమైన దేవుని త్రిత్వము. ఆయన పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మానవుడు.

43.మరియు దేవుని యొక్క త్రిత్వము ... తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అనే దేవుని లక్షణముల యొక్క త్రిత్వము యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి లో ప్రత్యక్షమయ్యాయి. కాబట్టి ఆయన వాక్యం అయి ఉన్నాడు. మరియు “నామాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు” అని చెప్పిన ట్రాన్స్‌మిటరుగా ఆయన ఉన్నాడు. చూడండి. “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.ఇప్పుడు ఆ వాక్యము ట్రాన్స్‌మిటర్ నుండి బయటకు వచ్చింది. ఆయన ఒకరోజు ఇలా అన్నాడు, “ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.; మీరు చెప్పినది మీరు పొందవచ్చు.”ఇప్పుడు, మీరు దానిని పొందుకునే కేంద్రంగా ఉండగలిగితే, విశ్వాసము ద్వారా లోపల కొంత నియంత్రణ జరిగి, అది మిమ్మల్ని దేవుని వృత్తములోనికి మరియు కొత్తజన్మ లోనికి నడిపించి, తిరిగి జన్మించు లాగున చేస్తుంది. అప్పుడు మీకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మరియు పరిస్థితులు తప్పులోనికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ హెచ్చరించే ఆ స్వరాన్ని వినడానికి మీరు ఎల్లప్పుడూ అనుసంధానంలో ఉంటారు. అప్పుడు మీరు ఎదో ఒక రోజు మనము మాట్లాడుతున్న ఆ ధనవంతుడైన యువకుడిలా కాకుండా, అపొస్తలుడైన పేతురు, పౌలు, లేదా యేసుక్రీస్తు కోసం ఆత్మలను సంపాదించిన ఒక వ్యక్తి వలె ఉంటారు. పిల్లలారా మీరు అలాగున ఉండండి. మనం ప్రార్ధించుకుందామా?

44.ప్రభువైన యేసు, రేపు అనే దినము ఉన్నట్లయితే, రేపటి స్త్రీ పురుషులు కాబోవుతున్న ఈ యౌవనస్థులకు మేము తప్పక శిక్షణ ఇవ్వవలసి యున్నది ప్రభువా. రేపటి దినము ఉన్నది అని భావించి వారికి శిక్షణ ఇచ్చే భారాన్ని కలిగి యున్నాము. రేపటి దినము లేకపోతే, అప్పుడు ఈరోజే ఆ దినం అయి ఉన్నది.తండ్రీ, మీ దృష్టిలో ఎవరూ అంగీకరించబడరని మాకు తెలుసు. ఏ శరీరియు, ఏ విద్య (ఇవి మంచివి అయినప్పటికీ), ఏ మంచి పనులు, ఏ మతపరమైన సంస్థ, ఏ మనస్తత్వ శాస్త్రం అయినా, ఏదీ దేవునిని రుజువుపరచలేవు కాని కేవలం పరిశుద్దాత్మ మాత్రమే రుజువుపరచగలడు. ఆయనే ఒక సాధనముగా ఉన్నాడు, దేవుడు స్వయంగా, నిత్యజీవం రూపంలో వ్యక్తిగతముగా మా యొద్దకు రాగలడు. మరియు దీనిని బట్టి మేము కృతజ్ఞులమై యున్నాము. ఇది నిజముగా పేతురు ఒప్పికొనినప్పుడు వ్యక్తపరచబడినది, మరియు యేసు అతనితో, “రక్త మాంసములు నీకు దీనిని బయలుపరచలేదు” అని అన్నాడు. నీవు దీన్ని ఒక శిక్షణలో నేర్చుకోలేదు. నీవు దీనిని ఏదో పాఠశాలలో నేర్చుకోలేదు. ఇది వ్యక్తిగత కార్యము అయి యున్నది, ప్రతి వ్యక్తి పొందుకొనవలసిన కార్యము అయి యున్నది.ఆయన “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని” అని అన్నాడు. ప్రభువా, అందుకు మేము కృతజ్ఞులము.

45.ఈ రాత్రి ఆ స్వరం ఇంకనూ సజీవముగా ఉన్నది. ఇంకా కేంద్రములు, బయటికి వెళ్ళే కేంద్రములు, వినుచున్న కేంద్రములు ఉన్నాయి, దానిని అంగీకరించగల విశ్వాస కేంద్రములు ఉన్నాయి. ప్రభువా, ఈ పిల్లలలో ప్రతి ఒక్కరూ, వారి హృదయాలలో దానిని అంగీకరించాలి అని మేము ప్రార్థిస్తున్నాము. మరియు వారు మంచిగా ఉండటానికి చేయు క్రియలను బట్టి కాదు కాని... దేవుడు మేము చేసే క్రియలను బట్టి తీర్పు తీర్చడు, కాని మేము అంగీకరించిన దానిని బట్టి తీర్పు తీరుస్తాడు. మేము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము క్రియల వలన కాదు.కాబట్టి పరలోకపుతండ్రీ, వారు ఇప్పుడు దర్శనాన్ని అర్ధం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము, మరియు “వచ్చి, నన్ను మెంబడించుము” అనే గొప్ప నిత్యమైన ఆహ్వానమును వారు చూడాలని మరియు వినాలని ప్రార్దిస్తున్నాము. వారిలో ప్రతి ఒక్కరు, ప్రభువా, ఈ లోకం లోని అన్ని కార్యముల నుండి, ఈ మర్త్యమైన, అంచుగల, జీవితము నుండి ప్రక్కకు తొలగును గాక. ఈ రాత్రి బంగారు రాగి జుట్టు కలిగిన వారు ఉన్నారు, మరియు వారిలో కొందరు నల్లటి జుట్టు, నల్లటి కళ్ళు, నీలి కళ్ళు కలిగి, ఇక్కడ కూర్చుని ఉన్నారు, వారు ఎప్పటికీ ఉండలేనంత ఉత్తమమైన స్థితిలో ఉన్నారు.... మరియు గొప్ప రచయిత చెప్పినట్లుగా, “చెడ్డ దినములు దగ్గరకు రాకమునుపే నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనుము అప్పుడు నీకు వాటిలో సంతోషం ఉండదు.”ప్రభువైన యేసు, మీరు పేతురుతో ఇలా అన్నారు: “నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీనడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవును” ఇదే ఆ దినము, ఇదే సమయమని వారు గుర్తుంచుకొందురు గాక. తండ్రీ, అనుగ్రహించుము.ఈ రాత్రి ఇక్కడ ఉన్న నా స్వంత బిడ్డ నుండి, కాయుటకు మీరు నాచేతికి అప్పగించిన ప్రతి బిడ్డను గురించి అడుగుచున్నాను. నేను వారందరిని సాతాను నుండి మరియు మరణము నుండి యేసు క్రీస్తులో జీవములోనికి ప్రకటిస్తున్నాను. ఆమెన్.

46.పిల్లలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు కొన్నిమాటలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది మరియు నేను తిరిగి ఇక్కడకు వస్తాను. చక్కని పిల్లలు, మిమ్మల్నిఅభినందిస్తున్నాను. సహోదరుడా ఫ్రెడ్, దేవుడు మిమ్మును దీవించును గాక. సహోదరీ, దేవుడు మిమ్మును దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...