బాప్తీస్మ ఆరాధన
VGR Paracount-37...?... అపొస్తలుల హృదయాలలో నివసించారు మరియు గుడ్డివారికళ్ళు తెరిచారు, నమ్మినవారు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడించును: ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. [టేప్ పై ఖాళీ ఉన్నది ]...?...
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, తన సంఘమును చూచుటకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. మనుష్యుల యెదుట ఆయనను ఒప్పుకొనువాడెవడో, ఆ పరలోకమందున్న తండ్రియెదుట ఆయన వానిని ఒప్పుకొనును, ఆ తరువాత ఆయన తన శక్తితో మహిమతో దిగి వచ్చును. ఆయన శిష్యులుబయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్: మార్కు సువార్త 16.
2
ఆయన ఎంతో అద్భుతమైనవాడు, ఎంతో మహిమాన్వితుడు. బాప్తీస్మము కొరకు ప్రపంచములో ఇంతకంటే గొప్ప సమయంలేదు. అక్కడే నిలిచి ఉండండి... కొద్ది సేపట్లో అబ్బాయిలు కొంత మంది బయటికి వస్తారు...?...పునరుద్దానుడైన క్రీస్తు యొక్క స్వరమును ప్రేక్షకులు వినియున్నారు.
బాప్తీస్మం పొందడానికి ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె విదేశీయురాలు. ఆమె రిచ్మండ్ ను ఆక్రమించుటకు గ్రాంట్ వచ్చుట చూసినప్పుడు… ఆమె, “నా కన్నులు ప్రభువురాకడ మహిమను చూచియున్నవి” అని చెప్పినది. ఏదో ఒక రోజు ఆయన వస్తాడు. అప్పుడు మన బాధలన్నీ తీరిపోతాయి. ఇది అద్భుతమైన రోజు, పునరుత్థానము కొరకు ఉన్న దినము. మీలో ఎవరైనా...?...[టేప్ పై ఖాళీ ఉన్నది]
3
ఆయన ఉండగానే... అప్పుడు ప్రభువు యొక్క ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. నపుంసకుడు యెషయా 40వ అధ్యాయమును చదువుతున్నాడు: “మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”
మరియు ఫిలిప్పు, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అన్నాడు.
అతను ఇలా అన్నాడు, “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పాడు?” కాబట్టి ఫిలిప్పు రథము ఎక్కి ఓ- అదే లేఖనము అనుసరించి క్రీస్తు పునరుత్థానము మరియు ఆయన యొక్క శక్తిని గురించి అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. క్రీస్తు మనతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముచున్నారా?
నపుంసకుడు ఆ వర్తమానమును వినిన వెంటనే, “ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను?”
అతను, “నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, మరియు నీ మనస్సుతో విశ్వసించినట్లైతే నీవు పొందవచ్చును” అని అన్నాడు.
అతను ఇలా అన్నాడు, “యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని నేను నా హృదయపూర్వకముగా, ఆత్మతో మరియు మనస్సుతో నమ్ముతున్నాను.” అతడు రథాన్నిఆపాడు. అది జరిగింది.
మీరు నిజముగా, మీ హృదయపూర్వకముగా, ఆయన దేవుని కుమారుడని నమ్మినట్లైతే, నమ్మినవారికి ఏ శిక్షా విధియు లేదు. అతడు రథాన్ని ఆపాడు. ఫిలిప్పు మరియు నపుంసకుడు నీళ్ళలోనికి దిగారు. ఫిలిప్పు అతని ఒప్పుకోలును బట్టి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. వారు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.; అతను రెండు వందల మైళ్ల దూరంలో ఉన్నాడు....?...[టేప్ పై ఖాళీ ఉన్నది] ఇక్కడ...
4
మరణిస్తున్నవాడు.... ఇప్పుడు రక్షించబడి ఆత్మతో నింపబడ్డాడు. వారంతా కేకలు వేస్తూ, అరుస్తూ తీసుకువెళుతున్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుచున్నది. మార్పు తరువాత తదుపరి కార్యము బాప్తీస్మము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, 37వ వచనము: వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా
పేతురు - “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు; ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.”
పరలోకపు తండ్రీ, లేఖనము వ్రాయబడి పంతొమ్మిది వందల సంవత్సరాలు గడిచాయి, మీ వాగ్దానము ఇంకనూ కొనసాగుచున్నది. మరియు ఇప్పుడు, ప్రభువా, ఇక్కడఈ యవ్వనస్తులు, ఇక్కడ నా కుడివైపు నిలబడి ఉన్న ఈ ఇద్దరు యవ్వన స్త్రీలు, వారు నిన్ను తమ రక్షకునిగా అంగీకరించారు; వారు సువార్త వృత్తాంతమును నమ్ముచున్నారు. నా ఎడమవైపు, ప్రభువా, నా చిన్న మేనల్లుడు మెల్విన్ మరియు నా స్వంత కుమారుడు ఉన్నారు. ఓ దేవా, ఈ ఉదయం వీలైతే వారి అబ్బాయిలను ఈ మెట్లు మీదుగా చూసేందుకు వారి ఇద్దరు తల్లులను పిలవవచ్చు...ఓహ్, ప్రభువా మీరు ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తారు అని తెలుసుకొనుటకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ వృద్దురాలైన (పేదరాలైన) చిన్న తల్లి రూతు, ఆమె కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది, కానీ ఆమె ప్రార్థనకు ఇప్పుడు సమాధానం లభించింది. అతను నిన్ను ప్రేమించి, నీకు సేవ చేయాలని ఆమె ప్రార్థించింది. అతను ఈ ఉదయం నిర్ణయము తీసుకున్నాడు. ఈ ఇతరులకు, వారి తల్లులు చనిపోయి ఉండవచ్చు, ప్రభువా, మాకు తెలియదు; నీవు చేయగలవు, కానీ ఏదేమైనా, ప్రార్థనకు సమాధానం దయచేయండి.
మరియు ఇప్పుడు, ప్రియమైన తండ్రీ, మీ వినయపూర్వకమైన సేవకుడిగా, సువార్త పరిచారకునిగా, కాపరిగా నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చాను. దేవా, కరుణించుము. మరియు నేను వారికి బాప్తీస్మము ఇచ్చుచుండగా, పరిశుద్ధాత్మ క్రీస్తును వారి హృదయాలలో ముద్రించును గాక. మీరు ఈస్టర్ ఉదయం పైకి లేచినట్లుగా వారునీటి నుండి పైకి లేచి బయటకు వచ్చును గాక, మరియు వారు ఈ చల్లని నీటి యొక్క సమాధి నుండిపైకి లేచును గాక; ఏదో ఒక రోజు, వారు సమాధిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినట్లయితే, ఆ మట్టి గడ్డలు విరిగి, సమాధి రాయి వెనక్కి దొరలును గాక. ప్రభువా, ఇవన్నియు సాధ్యపరచిన మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా రాజ్యములో వారి ప్రియులను వారు మళ్ళీ కలుసుకొనునుగాక. వారు ఇప్పుడు ఈ వృత్తాంతమును నిజమని నమ్ముతూ ముందుకు సాగుతుండగా ప్రతి ఒక్కరు పూర్తి జ్ఞాపకశక్తితో, వారు ఏమి చేయుచున్నారో దానిపై పూర్తి ఖచ్చితత్వముతో కదిలి వెళ్ళునుగాక. అందుకు యేసు, “నమ్మినవారికి ఏ శిక్షావిధియు లేదు. పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు,” అని చెప్పాడు. ఇక్కడ వారి విశ్వాసం, వారి సాక్ష్యం ఉన్నది. ప్రభువా, నేను వారికి ఈ సంఘ సహవాసములోనికి బాప్తిస్మమిచ్చుచుండగా, ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారానీ ప్రియమైన కుమారుని యొక్క సహవాసములోనికి వారికి బాప్తీస్మము ఇవ్వమని ప్రభువైన యేసునామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.
మీరు మీ గదికి వెళ్ళుచుండగా దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరినీ దీవించును గాక. [టేప్ పై ఖాళీ ఉన్నది]
5
... నీ విశ్వాసమును ఒప్పుకొని, ప్రభువైన యేసు నామములో వెళ్ళుచూ, యేసు చనిపోయి, ఈ ఉదయం లేచాడు అన్న కార్యమును విశ్వసించి, ఈ ఒప్పుకోలుతో వెళ్ళుచుండగా...?...దేవుడు అతనిని ఆశీర్వదించి, మరణిస్తున్న దేశానికి జీవ వాక్యాన్ని తీసుకువెళ్ళే బోధకుడుగా చేయాలని నా ప్రార్థన.
తలలు వంచుకుందాం. ఓ పరలోకపు తండ్రీ, ప్రియమైన తండ్రీ, దయ చూపించండి. ఇక్కడ నిలబడి ఉన్న ఈ చిన్న పిల్లవాడిని చూడండి. సాధ్యమైతే, మాకు తెలియదు...?...ప్రభువా. సాధ్యమైతే, ప్రభువా, దూరములో ఉన్న అతని తల్లి, ఈ ఉదయం తన ప్రియమైన బాలుడు ఇప్పుడు ప్రభువైన యేసు వైపు తిరిగి పాత చల్లటి సమాధిలోకి వెళ్ళుచున్నాడు, ఏదో ఒక రోజు అతడి ముఖముపై నుండి మట్టి ముద్దలు కదిలి, అతడు పునరుత్థానములో ముందుకు వస్తాడని గ్రహించును గాక. దేవా అతనిని ఆశీర్వదించి మరియు అతనిని గొప్ప వ్యక్తిని చేయండి, ప్రభువా, అతడిని మీ నామమునకు మహిమకరముగా ఉండనివ్వండి. ఇప్పుడు...?...ప్రభువా, నేను చూశాను- మీరు అతనిని ఏదో ఒక రోజు పిలుస్తారు. మరియు మీరు ఓహ్ అతనికి నిత్య జీవమును ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. మరియు అది మీ చిత్తమైతే, వాక్యమును బోధించుటకు అతని నుండి ఒక సేవకుడిని తీసుకురండి (అతనిని ఒక సేవకునిగా చేయండి - తె||త ||దారుడు). కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమివ్వుడి అని మీరు ఆజ్ఞాపించిన దానిని బట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. మీ విశ్వాసం మరియు దేవుని కుమారునిపై మీ విశ్వాసం యొక్క ఒప్పుకోలుపై, నాప్రియ సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. ఆమెన్.
6
[“ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తాడో నేను వెంబడిస్తాను” అని ప్రజలు పాడుచున్నారు. పాట సమయంలో సహోదరుడు బ్రన్హాంగారు మాట్లాడుతున్నారు.] దేవునిని స్తుతించండి...?... సహోదరుడు అందరికీ తెలుసు...?... ఎలాగో నాకు తెలుసు...?... ఎక్కడో ఉన్న అతని కుటుంబము, మీ ప్రార్థనకు ఇదిగో సమాధానం. ఇక్కడ దేవుని యొక్క... ఇక్కడ నాకు ఒక తండ్రిలాంటి వ్యక్తి ఉన్నారు. చాలా సార్లు నేను అతనిని మెల్లగా తిరస్కరించాను. అది సరైనది. నేను అతనిని ఎంత తిరస్కరించినా లేదా నేను ఏమి చేసినా, అతను నాకు మిత్రుడు అదే విధముగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు అలా ఉంటాడు. ఏదో ఉండే స్నేహితుడుగా ఉండదు; మీరు సరైనను లేదా తప్పు అయిననూ మీకు కట్టుబడి ఉండే స్నేహితుడుగా ఉంటాడు. సహోదరుడు నెల్సన్ను బట్టి నేను ఈ ఉదయం సంతోషిస్తున్నాను. అతను ఈ రోజును ఎంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను... తను చేస్తాడని నాకు తెలియదు, కానీ అతను ఈ రోజును, పునరుత్థానమును ఎంచుకున్నాడు, యేసును రక్షకునిగా అంగీకరించి, ఆయన పునరుత్థానాన్ని విశ్వసించి, మరణం, సమాధి చేయబడటం మరియు యేసుక్రీస్తు పునరుత్థానముపై నమ్మకం ఉంచాడు అనియు, ఆయనను తన రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు బాప్తీస్మము పొందబోతున్నాడని అతను ఈ ఉదయం ప్రజల ముందు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతను బాప్తీస్మము పొందబోవుచున్నాడు అని నాకు తెలియదు. సహోదరుడా మాక్, నా ప్రియమైన సహోదరుడా దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు అతనిని పరిశుద్ధాత్మతో నింపాలని ప్రార్థిస్తున్నాను. ...?... ఒకటి ...?... అక్కడ ఆయన స్థానం సేవకుల కొరకు ఉన్న ఒకే ఒక స్థిరమైన స్థానం. ఏదైతేనేం... సేవకులు వారి యొద్ద ఏమున్నదో అదే పరిచర్యతో తమకు తాము సహాయం చేసుకుంటారు. అతను మరియు అతని భార్య మరియు అతని పిల్లలు మంచి హృదయం, మంచి స్వభావం గలవారు. మరియు దేవుడు ఇప్పుడు సమృద్ధిగా ఇంకనూ దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మేము ఇప్పుడు ప్రార్దిస్తుండగా, మీరు తలలు వంచండి. మీరు ఇటువైపు కుడివైపు తిరగండి...?...
సర్వశక్తిమంతుడైన దేవా, ఈ మనిషి దాన ధర్మ కార్యము ఎప్పుడూ చేయలేదు దాని గురించి మీకు తెలుసు. మీరు అన్నింటినీ పూర్తి స్థాయిలో నమోదు చేసియున్నారు. కానీ అతను తన జీవితంలో ఎప్పుడూ చేయని గొప్పకార్యం ఏమిటంటే, నీ ప్రియ కుమారుడిని అతని స్వంత రక్షకునిగా అంగీకరించడం. ఇక్కడ కొలను వద్దకువచ్చి పునరుద్దానము యొక్క కథ నిజమని నమ్మి, నీటిలోనికి బాప్తీస్మము పొందుతున్నట్లు ప్రేక్షకుల యెదుట ఒప్పుకోలు చేసి సాక్ష్యమివ్వాలని అతని ప్రియమైన భార్య మరియు అతని పిల్లలు మరియు ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఆయనను పరిశుద్ధాత్మతో నింపుము. అతనికి సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితమును రాబోయే లోకములోనూ, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమును ఇవ్వండి. ఓ యేసు, దేవుని కుమారుడా! కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మివ్వుడి అని మీరు ఆజ్ఞాపించినదానిని బట్టి... మీ పాపాల ఒప్పుకోలుపై, దేవుని కుమారునిపై మీ విశ్వాసమును బట్టి, నాప్రియమైన సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమెన్. [టేప్ పై ఖాళీ ఉన్నది]
7
ఇప్పుడు, మనమందరము సహోదరుడు బిల్లీని ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపాలని దేవునిని ప్రార్దిద్దాం. నేను అతనిని సహోదరుడు బిల్లీ అని పిలుస్తాను, ఎందుకంటే మేము వ్యక్తిగత స్నేహితులము. ఇప్పుడు ఒకరి చేతులు మరొకరి చుట్టూ వేయండి.
పరలోకపు తండ్రీ, ఇప్పుడే ఈ దృశ్యాన్ని చూడండి. మాసోదరుడు జేసన్ యేసు క్రీస్తులో ఒప్పుకున్న విశ్వాసంతో ఇక్కడ నిలబడి, మరణం, సమాధి చేయబడటం, మరియు పునరుత్థానమును నమ్ముచూ, చల్లని నీటిలో ఇక్కడ నిలబడటం దీనిని సూచిస్తున్నది, అది ఏదనగా ఏ మరణమైతే మన కొరకు మరణించిన మన రక్షకుడైన యేసుని తీసుకుని వెళ్ళినదో, మనము ఆయన మరణం, సమాధి చేయబడటం మరియు పునరుత్థానముయొక్క జ్ఞాపకార్ధం, ఆయనను సేవించడానికి కొత్త జీవములోనికి లేచుచున్నాము. సర్వశక్తిమంతుడైనదేవా, నా సహోదరుడుని దీవించుము; అతని ప్రతిభను ఆశీర్వదించండి, ప్రభువా, మీ కొరకు వాడబడే గొప్ప వ్యక్తిగా చేయండి. మీ సేవకుని యొక్క ప్రార్థన వినండి. ప్రభువైన యేసు, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మివ్వుడి అని మీరు ఆజ్ఞాపించిన దానిని బట్టి, మరియు పాపపు ఒప్పుకోలు మరియు దేవుని కుమారునిపై మీ విశ్వాసమును బట్టి, నా ప్రియమైన సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమెన్. [టేప్ పై ఖాళీ ఉన్నది]
8
నా జీవితములో గొప్ప క్షణాలలో ఇవి ఒకటి. ఒకరి భుజం మీదుగా చూస్తూ , నా తల్లి నిలబడి ఉన్నది. నేను ఆమెను ఇక్కడికి ఒహియో నది వద్దకు నడిపించాను మరియు ప్రభువైన యేసు నామములో ఆమెకు బాప్తీస్మము ఇచ్చాను. ఇప్పుడు, నా స్వంత కుమారుడు. ఓ దేవా, వీలైతే, హోప్ ను ఈ ఉదయం భూమి మరియు మహిమ మధ్య వేలాడుతున్న ఆ తెరలోనుండి ఈ మెట్ల అంచుల నుండి క్రిందికి చూడనివ్వండి. దేవా, నా కుమారుడిని ఒక బోధకుడిగా చేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు అతనిని అభిషేకించి రెండింతల ఆత్మను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు అతని జీవితాన్ని దీవించును గాక.
మీ ప్రార్థనల కొరకై అందరికీ ధన్యవాదాలు. ప్రార్థన కార్యములను మారుస్తుంది. నేను మీ పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తాను. బిల్లీ, బాబూ, ఈ కొన్ని రోజుల్లో, బాబూ, యేసు ఆలస్యము చేస్తే, మనము వీటిలో ఒక దినాన వెళ్ళవలసి వస్తుంది, వారు మనపై మట్టి వేస్తారు. కానీ, బాబూ, దేవుడు మనల్ని లేపుతాడు. “నాకు తెలుసు నా విమోచకుడు జీవించి ఉన్నాడు, చివరి రోజుల్లో ఆయన ఈ భూమిపై నిలబడతాడు.”
దేవుడు అతన్ని ఆశీర్వదించాలని, శత్రువు నుండి అతడిని తప్పించాలని నేను ప్రార్థిస్తున్నాను. కుమారుడా, ఈ దీర్ఘమైన యాత్రలో, నిన్ను చేరుకునే దారిని ఆయనకు ఇవ్వుము. అక్కడ చాలా మంది ఆత్మలు చనిపోతున్నాయి, కానీ వారికి జీవనాధారమును అందించుము, వారిని తీసుకురా. బిల్లీ, నువ్వు నిలబడి వారి పాప విముక్తి కొరకు సాక్ష్యం కొరకు వేలకు వేలరెట్లు ఎక్కువ మందికి బాప్తీస్మము ఇస్తావని నేను నమ్ముతున్నాను. దేవా, నా కుమారుడిని దీవించుమని, నేను ప్రార్థిస్తాను...?...
ఓ యజమానుడా, ఓహ్, నేను...?... నా కుమారుడు, ప్రభువా, నేను మీ కొరకు పెంచాను. ప్రభువా, ఇదిగో నా కుమారు డు; నాకు ఉన్నదంతా అతడే. ఈ ఉదయం నేను అతనిని మీ యొద్దకు తీసుకువస్తున్నాను. అతడు దీనిని నమ్ముచున్న దానిని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడను...?... దేవా, అతను పశ్చాత్తాపపడినందుకు ఎంతో కృతజ్ఞుడను. ఓ ప్రభువైన యేసు, ఓ క్రీస్తు, అతనిని పరిశుద్ధాత్మతో అభిషేకించుము. ప్రభువా, పునరుద్దానుడైన క్రీస్తుయొక్క ఆత్మ యొక్క శక్తిని అనుగ్రహించుము; నా కుమారుడిని పట్టుకోండి. ఇవ్వండి ప్రభూ. కల్తీలేని క్రీస్తు సువార్త వాక్యమును, ప్రపంచంలోని అన్ని చివరలకు బోధించుటకు అతడు దేవుని ఆత్మతో నింపబడును గాక. అనుగ్రహించండి ప్రభువా. దీవించి అతనిని వాడుకొనుము.
ఇక్కడ అతను సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు, ప్రభువా. నేను దూరమున ఉన్న ఆ ఉదయం గురించి ఆలోచిస్తున్నాను, మేము అక్కడ ఉన్న తల్లి మరియు సహోదరిలా వెళ్ళబోవుచున్నాము. ఓ క్రీస్తు, ఇది పరలోకములో నమోదు చేయబడును గాక. దయ చూపండి, దేవా, నా కుమారుని జీవితములో అతని ఇంటికి చేరు ప్రయాణంలో విశ్వాసం కలిగించు, ఆ జీవితములో అతన్ని ఆశీర్వదించండి, ప్రభువా ఆశీర్వదించండి. ఆయన ఆత్మలను రక్షించే గొప్ప పరిచర్యను కలిగి ఉండుగాక. ప్రభువా, ఇక్కడ అతడు ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమివ్వుడి అని మీరు ఆజ్ఞాపించిన దానిని బట్టి; ఎందుకో, నా హృదయం మీ కొరకు ఎంతో తపిస్తున్నది.
నా కుమారుడా, నీ పాపాల ఒప్పుకోలు మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుపై నీ విశ్వాసమును బట్టి, నా ప్రియ కుమారుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నీకు బాప్తిస్మమిస్తున్నాను. ఆమెన్. [టేప్ పై ఖాళీ ఉన్నది]