దేవునికి మరియు సాతానుకు మధ్య పోరాటము

దేవునికి మరియు సాతానుకు మధ్య పోరాటము

VGR COUNT-270 1ఈ అద్భుతమైన పాటలను వినుచూ, సంఘము వాటిని పాడుట వినుచూ, మరియు గతకాలమును గూర్చి ఆలోచించుచూ, మరియు చాలా కాలము నుండి నేను చూడనటువంటి ముఖములను చూడటం మరియు తిరిగి సంఘమునకు వచ్చుట కొరకు దానిలో ఏదో ఉన్నది, అది వాస్తవమైనది. మీరు అలా అనుకొనుట లేదా? మంచిది.

నేను కొద్దిసేపటి క్రితము, నేను చూడనటువంటి ఒక పాత స్నేహితుడు — ఓ, అతని వైపు చేయి ఊపుచూ, నేను ఊహించుచున్నాను, కానీ నేను అతడిని కలుసుకొని సంవత్సరములు అయినవి — జిమ్ పూలే, అను బాలుడు, నేను ఒక బాలునిగా ఉన్నప్పటి నుండి నా చుట్టూ ఉండేవాడు. మరియు ఇప్పుడు, కొద్దిసేపటి క్రితం అతడు నా గృహమునకు వచ్చాడు, నాకు వివాహం కాబడిన తరువాత, అవును, అతడు మొదటిసారి నా స్థలమునకు వచ్చియున్నాడు. మరియు శ్రీమతి. ఉడ్స్ అతడిని ఇక్కడికి ఆహ్వానించి, మరియు వచ్చి మేము చెప్పునది వినమని కోరినది. అతడు చెప్పాడు, "మంచిది, నేను అతడు చెప్పునది ఎప్పుడూ వినుచూనే ఉందును." మరియు అప్పుడు మేము అలవాటుగా అలా కలిసి నడిచి, వేటాడి, మరియు అటువంటివి చేశాము, మరియు మేము… మీకు తెలుసా, అతడు ఎక్కువగా చెప్పడు. సమయమంతా నేనే మాట్లాడాను. నేను చెప్పాను, "నీవు ఏమైనా ఎందుకు చెప్పకూడదు?" అతడు చెప్పాడు, "నేను ఏ విధముగా చేయగలను?" సమయమంతా నేను తీసుకొనియున్నాను.

కనుక నాతో ఆ విధముగా ఉండునని కనపడుచున్నది: సమయమంతా తీసుకొనే రకము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా, చాలా ఎక్కువగా మాట్లాడుచూ నుండుట. కానీ నేను ఆనందించుచున్నాను, ఈ రోజు అప్పటి రోజుల నుండి నేను నా మాట్లాడే విధానమును మార్చుకొనియున్నాను — దేవుని గూర్చి మాట్లాడుట. నేను కేవలము ఆయనను ప్రేమించెదను!

2నేను సహో, రదెల్ తో మాట్లాడుచూ ఉన్నప్పుడు, మరియు అతడు అక్కడ నాతో చెప్పుచున్నాడు. (సహో టెంపుల్, ధన్యవాదములు)… నేను సహో, రదెల్తో మాట్లాడుచున్నాను. మరియు కొద్దిరోజుల క్రితము అతడు వచ్చి, మరియు అతడు నాతో మాట్లాడుచున్నాడు, మరియు అతడు కలిగిన మూడు కలలను గూర్చి నాతో చెప్పాడు, మరియు నేను రెండు కలిగి ఉన్నాను. మరొకటి నేను మరిచాను. అది ఏమిటో అతడికి నేను చెప్పడానికి ప్రయత్నించాను. నాతో ఒక అద్దము ఉన్నది, ప్రతిబింబించుటకు ప్రయత్నించుచున్నది, మరియు చెప్పెను, "దేవుడు ఏ విధముగా ప్రతిబింబించునో చూడుము, మనము అద్దములో ఏ విధముగా ప్రతిబింబిస్తున్నామో అలాగే." ఆయన ఖచ్చితముగా మంచివాడు.

సహో క్రీచ్, పియానో వాయించునది మీ అమ్మాయే కదా? ఆమె ప్యాటీ కదా? ఎలా…? మై, గుడ్నెస్ ప్యాటీ, వారు అక్కడ జీవించడం నాకు తెలుసు, మంచిది, ఇప్పుడు వారెక్కడ జీవిస్తున్నారో అక్కడ, అది ఆ చిన్నపిల్ల ఇక్కడ కూర్చొన్నట్టుగానే ఉన్నది. మరియు మేరి జో, నేను ఊహిస్తున్నాను, వివాహము అయినదని, కొద్దిసేపటి క్రితము జిమ్ అక్కడ నిలబడియున్నాడు. అతడి మనవడు అక్కడ నిలబడియున్నాడు, మరియు ఇక్కడ నా మనవడు లోనికి వచ్చాడు. నేను చెప్పాను, "మనము కూడా ఒక నడిచే కర్ర తెచ్చుకొని కూర్చొందాము. నీకు అలాగు అనిపించుట లేదా?

కానీ నదికి వెంటనే అవతల, అదే ఆ గొప్ప స్థలము. మనము చూచుచున్నది అక్కడికే. మరియు అది కేవలము నేను పొందుకున్న కారణమును బట్టి కాదు. ముసలివాడినవుచూ, దాని కొరకు నేను ఆలోచించుట కాదు. నేను ఒక చిన్న, చిన్న పిల్లవానిగా జీవన ప్రామాణ్యములో సరైన యవ్వనుడిగా నున్నప్పటి నుండే నేను దానిని గూర్చి మాట్లాడుట ప్రారంభించాను. ఎక్కడో ఒక దేశము ఉన్నదని నేను నమ్ముచున్నాను. మనము ఆ మార్గములోనే వెళ్ళుచున్నాము. దాని కొరకు నేనెంతో ఆనందిస్తున్నాను.

3మీకు తెలుసు, ప్రత్యేకించి మనము మాట్లాడుచూ ఉన్నప్పుడు, దేని గూర్చి అయినా సంబంధము కలిగి ఉన్నదానిని నేను ఎక్కువగా చెప్పను. అయితే చాలాసార్లు లేఖనములలో నుండి, ఇక్కడ వేరొక దానిని నేను తీసుకొనెదను. అయితే కొన్నిసార్లు ప్రభువు ఏదో ఒకదానిని నాకిచ్చును, మరియు ఏదో ఒక నిజమైన మంచి దానిని నేను పట్టుకొన్నప్పుడు, అది నన్ను చంపునంతగా చేయును. నేను కేవలము, ఓ, అది నాకు చాలా మంచి చేయును. మనందరము అదే విధముగా అనుభూతి చెందెదము. సహా నెవిల్, నీవు మరియు ఇక్కడ ఉన్న సహోదరులు, సహో జూనియర్, మరియు మిమ్ములనందరినీ నేను ఎరుగుదును, మరియు దేవుడిచ్చిన దానిని మీరేదైనా పొందుకొన్నప్పుడు, మరియు అది వాస్తవమగుట మీరు చూచినప్పుడు, మీరు కూడా అదే విధముగా అనుభూతి చెందుదురు.

మరియు గత రాత్రి, నేను ప్రసంగించినప్పుడు, అది గుడారమును గూర్చి అని నేను నమ్ముచున్నాను, నేను మార్పు చెందినప్పటి నుండి అని నేను అనుకొనుచున్నాను, మరి దేనికన్ననూ నాకు ఎక్కువగా మంచి చేసినది ఒకటి నాకు తట్టినది. మరియు అది… ఒకవేళ అది మంచిదైతే, నేను మరలా దానిని తిరిగి చెప్పెదను. నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగుదురని, అయితే అది ఆ రక్షణ యొక్క రుజువు, చూశారా. అది ఇప్పుడే నాకు తట్టినది, మరియు నేను దానిని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళాను, నేను నా గదిలోనికి వెళ్ళాను, మరియు నేలపై అటు ఇటూ నడిచాను. మీకు తెలుసా, కేవలము అక్కడ దానిని గూర్చి ఆలోచించుట ద్వారా, నాకు నేనుగా ఒక చిన్న మంచి సమయమును నేను కలిగియున్నాను.

1COR 3:21•

2COR 6:10•

GAL 5:22

 

4మరియు ఇక్కడున్నది అదే. ఒక్క క్షణము దానిని మీకు నేను కొనసాగించెదను. "మనము సమస్తమును స్వతంత్రించుకొనేవారము. సమస్తము మనదే," అను దాని గూర్చి నేను మాట్లాడుచున్నాను. వారు చెప్పెదరు, మనము ఒక పిచ్చి గుంపు అని, మీకు తెలుసు. కానీ ఇంకా, అంతటి తరువాత, అది అంతా మనకు చెందినదే. మరియు బహుశా మనము… ఆ కారణము చేతనే మనము కొంచెము వింతగా ప్రవర్తించెదము, మీరు చూశారా, మనము సమస్తానికి వారసులము, మీరు చూశారా.

మరియు నేను అనుకొనుచున్నాను, మనము ప్రేమ, సంతోషము, సాహసమును కలిగియున్నామని; మనము విశ్వాసమును, మరియు దీర్ఘశాంతము, దయాళుత్వము, సహనము, సాత్వికమును కలిగి యున్నాము. మీరు దానిని ఏ రకమైన ధనముతోను కొనలేరు. ఏమైనా, లేదు… వెళ్ళి పావువంతు వెల సహనమును కొని తీసుకొని రండి, మీరు చూశారా. దానిని చేయలేరు, మరియు… అయినప్పటికీ, దేవుడు దానిని మనకు ఇచ్చును. దానిని మనము స్వతంత్రించుకొనెదము. అది మన స్వాస్ధ్యము మరియు అప్పుడు మాకు కొంచెము విశ్వాసమును కొనండి. కొంచెము విశ్వాసము కొరకు, మాకున్నదంతయూ ఇచ్చివేయుట కొరకు, మేము ఇష్టపడుచున్నాము, చూశారా. అయితే అది మనకు ఇవ్వబడుచున్నది, అంతా ఉచితముగా, దేవుని దగ్గర నుండి వచ్చుచున్నది. అది అద్భుతముగా లేదా?

EXOD 1:13,14•

EXOD 13:5•

ACTS 7:6

 

5అప్పుడు నేను దీని గూర్చి ఆలోచించాను: ఒకప్పుడు ఇశ్రాయేలు బానిసగా ఉన్నప్పుడు, ఐగుప్తులో, దేవుని బిడ్డలు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు, అది దేవుని యొక్క స్వాస్థ్యము, ఈ రోజు మనమున్నట్లుగానే. మరియు అప్పుడు… వారు తినుట కొరకు దేనినో తెచ్చి మడత పెట్టిన కొన్ని రొట్టెలు, మరియు వాటిని విసిరెదరు, మరియు వారు కలిగియున్న దేనినైనా, ఒకరిని చ౦పి, అది ఒక కుక్కను లేదా మరిదేనినైనా చంపినట్లుగా, మరియు అక్కడ నుండి ఒక విడుదల కొరకు వారు ఎదురు చూచారు. అక్కడ వారు నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారు.

అప్పుడు ఒక రోజు, అరణ్యములో నుండి వచ్చాడు, ఒక ప్రవక్త అతడిని ఒక వెలుగు వెంబడించుచున్నది. మరియు అతడు వారితో చెప్పాడు, "పాలు మరియు తేనెలు ప్రవహించు దేశము ఒకటున్నది, మరియు దేవుడు దానిని వారికి ఇచ్చియున్నాడు." మరియు అతడు సూచనలు మరియు అద్భుతములు చేసియున్నాడు, వారికి అతడు ఒక బోగస్ (నకిలీ), ఏదో ఒక తప్పుడువాడు కాదని చూపించాడు; అయితే నిజానికి ఆ జనులను ఆ దేశమునకు తీసుకొని వెళ్ళుటకు అతడు దేవుని చేత ఆజ్ఞాపించబడినవాడు.

EXOD 6:6•

EXOD 13:5

 

6ఇప్పుడు దాని గూర్చి ఆలోచించుడి. వారి పిల్లలు… బానిసత్వం నడిపేవారు వచ్చి ఒకవేళ ఒకరిని చంపదలచిన, అది కేవలము అంతా మంచిదే. ఏమీ చెప్పజాలరు. ఏదో పాడుపని చేయుటకు వెళ్ళి, నీ యవ్వన కుమార్తెను తీసుకొని పోయినా, ఎందుకు చెప్పుటకు ఏమియూ లేదు. కేవలము అక్కడ నిలబడి, మరియు ఆమెను వెళ్ళనిచ్చుటయే, చూశారా. నీ బాలుడు, ఒక రకమైన… సరిగా పనిచేయకపోతే, మరియు దాని కొరకు వారు అతడిని చంపగోరినట్లయితే, అది సరియే, చెప్పుటకు ఏమియూ లేదు.

అయితే ఇప్పుడు వారు ఆ బానిసత్వము నుండి బయటకు వచ్చుచున్నారని వారు చెప్పబడ్డారు, మరియు వారు పాలు మరియు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోవుచున్నారు. వారి సొంత పొలమును వారు కలిగి ఉండబోవుచున్నారు. వారి పంటను వారు పండించుకొని, వారి స్వంత బిడ్డలను పోషించుకొని, వారిని పాఠశాలలకు పంపి, శాంతముగా జీవించెదరు. మరియు ఆ గొప్ప దేశము, మరియు అది వారికి చెందినది. మీకు తెలుసు, అది ఒక గొప్ప వాగ్దానము. దానర్ధము ఏమిటో గ్రహించండి. మంచిది, అతడు నిజముగానే దేవుని చేత పంపబడిన మనుష్యుడని వారు చూచేంత వరకూ ఈ ప్రవక్త వారిమధ్య చాలా అద్భుతములు చేసియున్నాడు.

NUM 13:16,23

 

7మరియు వారు కాదేషు-బర్నయాకు వచ్చినప్పుడు, ఇప్పుడు, కాదేఘ-బర్నయా ఒక తీర్పునిచ్చు స్థానమై యున్నది. ప్రపంచానికి, ఆ రోజు అది. కాదేఘ-బర్నయా, అది ఒక స్థలము, ఒక గొప్ప పెద్ద నీటి ఊట ఉన్నది, మరియు చాలా చిన్న నీటి బుగ్గలు, ఈ పెద్ద ఏరుకు చిన్న ఉపనదులు (వాటిలో కలిసేవి) ఉన్నవి.

మంచిది, వారి మధ్యలో వారు ఒక మనుష్యుని కలిగి ఉన్నారు, ఒక గొప్ప యోధుడు, అతడి పేరు యెహోషువ (యెహోషువ అనగా "యెహోవాయే-రక్షకుడు"), మరియు యోహోషువ వాగ్దాన దేశములో ప్రవేశించియున్నాడు. ఇప్పుడు, గుర్తించుకొనండి, వారిలో ఎవ్వరూ కూడా ఎప్పుడునూ అక్కడ ఉండలేదు. అసలు ఆ దేశము నిజానికి ఉన్నదో లేక లేదో కూడా వారిలో ఎవ్వరికినీ తెలియదు, వారు కేవలము, విశ్వాసము ద్వారా దేవుడు వారికొక స్థలమును కలిగియున్నాడని, వారికి చెప్పబడిన దానితో వెళ్ళారు. మరియు కేవలము విశ్వాసము ద్వారానే, వారు ఆ స్థలమునకు వెళ్ళబోవుచున్నారు. ఇప్పుడు దానిగూర్చి ఆలోచించండి. ఐగుప్తును విడచి, మరియు దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు, మరియు ఇప్పుడు వారు ఆ దేశాన్ని సమీపిస్తున్నారు.

మరియు వారు ఆ దేశాన్ని సమీపించినప్పుడు, యొహోషువ ఆ దేశములోనికి ప్రవేశించి మరియు రుజువును తీసుకొని వచ్చాడు. యోర్దాను దాటి, పాలస్తీనాలోనికి ప్రవేశించి, రుజువును తీసుకొని వచ్చాడు, గొప్ప ద్రాక్షగెలలు, ఒకదానిని ఇద్దరు మోసెటంత మరియు వారు ఆ ద్రాక్షాలు తినేవారు. మరియు అతడు చెప్పాడు, "దేవుడు దేనినైతే చెప్పాడో, ఆ దేశము ఖచ్చితముగా అలాగే ఉన్నది." ఓ, ఎటువంటి స్వాతంత్ర్యము అది, ఇప్పుడు వారెక్కడకు పోగలరు. వారు తమ స్వంత పొలములను కలిగియుండి, మరియు వారి పిల్లలను పోషించుకొనగలరు. మరియు కలిగి వారిపైన దేవుని ఆశీర్వాదములు ఉండి, మరియు సమాధానముతో జీవించుచున్నారు. వారింక ఎవరికీ బానిసలు కారు.

అయితే చివరికి, వారు ఒక మంచి చిరకాలము జీవించిన తరువాత, దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ, చివరికి వారు చనిపోవలసియుండెను. అది సంవత్సరము వెంబడి సంవత్సరము కొనసాగి, వారి పంటలను పండించుకొనుచూ, మరియు వారి కుటుంబాలను కలిగియుండి, మరియు మంచి సమాధానము గల జీవితము, మరియు అప్పుడు చనిపోవుట.

MARK 16:15,16•

LUKE 24:39,41•

JOHN 14:2,3•

ACTS 1:3

 

8మరియు అప్పుడు, ఒక రోజు, అందరిలో గొప్ప యోధుడైనవాడు, ప్రభువైన యేసు, దేవుని కుమారుడు వచ్చాడు. మరియు ఆయన చెప్పాడు, "ఏ మనుష్యుడు చనిపోజాలని ఒక దేశమున్నది. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములున్నవి. అది అలాగు కానియెడల, నేను మీకు చెప్పియందును. నేను వెళ్ళి మరియు ఒక స్థలమును సిద్ధపరచి మరియు మిమ్ములను తీసుకొని వెళ్ళుటకు తిరిగి వచ్చెదను." ఇప్పుడు, వచ్చిన ప్రవక్త ఆయనే, మరణము, అనే యోర్దాను నది ఆవలనున్న దేశము కొరకు మాట్లాడుచున్నాడు. ఎక్కడ, అది, మీ పొలములు మీరు కలిగియున్నప్పటికీ, మీ కుటుంబములు మీరు కలిగియున్నప్పటికీ, మీరు దేవుని చేత ఆశీర్వదించబడినప్పటికీ, అయినా మీరు చనిపోవలసినదే. అయితే ఇంకా, మీరు చనిపోజాలని దేశము ఒకటి ఆవల ఉన్నది. ఓ, మై!

అప్పుడు ఆయన కాదేషు-బర్నయాకు వచ్చాడు, కల్వరి, తిరిగి మళ్ళీ తీర్పు స్థానమునకు. ఎక్కడైతే, పాపమునకు శిక్ష ప్రతీ వ్యక్తి చనిపోవుటకు కారణమైనది, అది తీర్పు దగ్గర కలుసుకొన్నది, ఆయన కాదేఘ-బర్నయా దగ్గర. ఆయన పాపమునకు వెల చెల్లించియున్నాడు — మరణించాడు — యోర్దానును దాటాడు, మరణము యొక్క యోర్దాను, మరియు మూడవ దినాన తిరిగి లేచియున్నాడు,

తిరిగి వచ్చుచు, "నన్ను తాకి చూడుము, ఒక ఆత్మకు నావలె మాంసము మరియు ఎముకలు ఉండవు. తినుటకు ఏదైనా ఉన్నదా?" అని చెప్పాడు. ఆయన చేపను మరియు రొట్టెను తిన్నాడు. మరియు ఆయన వారితో నలభై దినాలు ఉన్నాడు, రుజవు చేస్తూ, యెహోషువా వలె, అక్కడొక దేశమున్నదని. అక్కడ దేశము ఉన్నది అనుదానికి రుజువు ఆయనే. ఇప్పుడు, ఆయన చెప్పాడు, "దీనిని నమ్మిన వారందరూ, లోకములోనికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందునో అతడు రక్షింపబడును. ఎవరైతే నమ్మలేదో వాడు నశించును."

ROM 6:4•

EPH 2:6

 

9అప్పుడు, పెంతుకోస్తు దినమున, ఆ స్థలము యొక్క సంచకరువును ఆయన తిరిగి పంపియున్నాడు, నిశ్చయత, ఈ దేశము వాస్తవము అనుదానికి రుజువు. కేవలము యెహోషువ రుజువును తీసుకొని వచ్చిన దానివలె, యేసు పరిశుద్దాత్మ యొక్క రుజువును తీసుకొని వచ్చాడు.

ఇప్పుడు, మనము మరణించామని మనమే నమ్ముచున్నాము. ఆయన మరణములోనికి, బాప్తిస్మము ద్వారా (లో) ఆయనతో మనము పాతిపెట్టబడియున్నాము. మరియు పునరుత్థానములో ఆయనతో పాటుగా మనము లేచియున్నాము. మరియు ఇప్పుడు మనము, ఇప్పటికే, మనము ఉండబోవుటలేదు కానీ, ఉన్నాము. మనము ఇప్పటికే లేచియున్నాము. ఓ, మై! ఇప్పుడే మనము ఉన్నాము, ఉండబోవుట లేదు కానీ, ఇప్పుడే మనము ఉన్నాము, ఈ రాత్రి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము. ఎలా? క్రీస్తు యేసులో. మనము ఎప్పుడో తరువాత సమయములో కాదు; ఇప్పుడే మనము ఉన్నాము. సంఘము ఇంకా వారెవరో వారు గుర్తించలేదు. ఇప్పుడే మనము ఉన్నాము, ఈ క్షణములోనే. ఎలా? క్రీస్తు యేసులో, ఇప్పటికే మరణము నుండి లేపబడి, ఆయనలో సమకూర్చబడియున్నాము. మన ప్రాణములు ( Souls) అమర్త్యములు.

ACTS 2:38•

ROM 6:4•

EPH 2:6

 

10ఇప్పుడు ఒక్క క్షణము మనము ఆపుదాము. ఇక్కడ, ఒక్కసారి, మనము అబద్దములాడుట, దొంగతనము, మోసము, జగడము, శాపములు అన్నీ చేసెడివారము. మరియు అప్పుడు ఆ పాపమంతటిని ఒప్పుకొనియున్నాము. అప్పుడు మనము ఆయనతో పాటు బాప్తిస్మములో పాతిపెట్టబడియున్నాము, మరియు ఆయనతో పాటు లేపబడియున్నాము. మరియు మనము పైకి వచ్చినప్పుడు, "మారు మనస్సు పొంది, మరియు పాపక్షమాపణ నిమిత్తము ప్రతీవాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, మరియు మీరు రుజువును పొందెదరు," ఈ మంచి దేశము యొక్క రుజువు మరియు అప్పుడు మన మీదకు వచ్చు ఆ ఆత్మ - ఆ అబద్ధములాడుట నుండి, దొంగతనము, మరియు అక్కడనున్న అటువంటి సంగతంతటి నుండి పైకి తీసుకొని వచ్చును. మరియు ఇప్పుడు ఆయనతో పాటు లేపబడియున్నాము, ఇక్కడ పరలోక స్థలములలో, ఇప్పుడు ఆయనతో పాటు కూర్చొండియున్నాము. మన ప్రాణములు ఇప్పటికే పరిపూర్ణముగా సిద్ధపడియున్నవి…

EPH 2:6

 

11ఎందుకు, విలియం బ్రెన్హా౦ చనిపోయి ముప్పె-లేదా-ఎక్కువ సంవత్సరములైనవి. నేను ఒక నూతన సృష్టిగా మారాను. ఆ ముసలివాడు చనిపోయాడు. ఈ మధ్యాహ్నం, నేను అక్కడ చూచాను, నా స్నేహితుడు నాతో మాట్లాడుచున్నాడు, అతడు చెప్పాడు, "నీకు గుర్తున్నదా, మనము ఫలాన-ఫలాన చేసేవారము? ఆ రాత్రి గురుక పెట్టే ఆ బాలుని నీటిలోనికి గెంటివేసినది గుర్తున్నదా."

నేను చెప్పాను, "అవును. నేను తిరిగి మళ్ళీ దానిని చేయను."

"ఆ కప్ప గుర్ర్ అని ఆ విధముగా ఉన్నప్పుడు, ఆ సమయములో మనము ఆ సూదిని ఆ కప్పలో గుచ్చుట జ్ఞాపకమున్నదా?"

"అవును," నేను చెప్పాను, "అది నాకు జ్ఞాపకమున్నది, మరియు మనము చేసిన అవి అన్నియు."

ఎఫేసి 2:6

నేను అనుకొన్నాను, "నీకు తెలుసు, అది నేను… అది నేను ఒక చనిపోయినవానిగా ఉన్నప్పుడు," చూశారా. అయితే ఇప్పుడు నేను జీవించుచున్నాను. ఓ, ఇప్పుడు నేను దానిని చేయను. క్రీస్తు యేసులో ఇప్పుడు మనము పరలోక స్థలములలో కూర్చు౦డి యున్నాము, మరియు ఇప్పుడు మన రక్షణ యొక్క సంచకరువును కలిగియున్నాము, మొదటి చెల్లింపు (బయానా) వస్తువు ఖరీదు పదివేల డాలర్లు, మరియు ఆయన మనకు మొదటి వేయిని ఇచ్చియున్నాడు, చూశారా. మన సంచకరవు యొక్క మొదటి దశమ భాగము ఏదనగా… క్రీస్తుతో పాటు పునరుత్థానములోనికి లేపబడి, ఇప్పటికే మనము పాపము మరియు అవిశ్వాసము నుండి లేచియున్నాము. మరియు ఇప్పుడు కలిసి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము, యెహోషువ తిరిగి తీసుకొని వచ్చిన, అటువంటి రుజువుతో, అక్కడ ఆ దేశము ఉన్నది, మరియు మనము మన యొక్క మార్గములో ఉన్నాము. మరణమిక లేదు. ఇక మరణించలేము.

EPH 4:24

 

12వారు కొన్నిసార్లు చెప్పెదరు, "సహో, బ్రెన్హాం చనిపోయాడు," దానిని మీరు నమ్మవద్దు. ఎందుకు? సహో, బ్రెన్హాం చనిపోలేడు, చూశారా. అది సరియే. నేను చనిపోలేను — చనిపోవుట జరిగినది. ఇప్పుడు, విలియం బ్రెన్హాం చనిపోయాడు, చాలా కాలం క్రితము, సుమారు ముప్పె సంవత్సరాల క్రితం, లేక సుమారు ముప్పె-రెండు సంవత్సరాల క్రితం. ముప్పె రెండు సంవత్సరాల నుండి నేను ప్రసంగిస్తూ ఉన్నాను, కనుక అతడు దానికి ముందే చనిపోయాడు. అయితే, ఇప్పుడు, ఇది ఒక నూతన జీవి.

రసెల్ క్రీచ్, ఒక క్రొత్త జీవి. ఆ కార్జియాన్ క్రింద అటు ఇటు పరిగెత్తే, ఆ చిన్న బాలుడు కాదు. ఆర్మన్ నెవిల్, అలా ఉండుటకు అలవాటు పడిన ఆ చిన్న బాలుడు కాదు. మరియు సహో, రదెల్ అలా ఉండుటకు అలవాటు పడిన అటువంటి బాలుడు కాదు, మీకు తెలుసు. మరియు సహో, జాక్సన్, ఈ మిగతా వారందరూ, అటువంటి వ్యక్తులు కారు. సహోదరీ మరియు సహోదరులైన మీరు, ఆ విధముగా ఉండుటకు అలవాటు పడినవారము కాదు. మనము నూతన జీవులము — నూతన సృష్టి. మీరు దానిగూర్చి చింతించనవసరము లేదు. మనము ఇప్పటికే ఇక్కడ ఉన్నాము. మనమెక్కడ ఉండేవారమో చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడండి. "క్రీస్తు యేసులో నూతన సృష్టి." ఓ, మై!

ఇప్పుడు, మీకు తెలుసు, రసెల్, ప్రతీసారీ నేను వినే ఆ యొక్క పాటను దాదాపుగా పాడే అనుభూతిని కలిగియున్నాను, సహో క్రీచ్ మరియు నీ గూర్చి ఆలోచించుచున్నాను.

నేను ఎగిరిపోవుదును, ఓ మహిమ,

ఉదయకాలమునే నేను ఎగిరిపోదును.

(అవునయ్యా! మనము దానిని పాడేవారము

జ్ఞాపకమున్నదా?)

నేను చనిపోయినప్పుడు, హల్లెలూయ, తిరిగి మరియు తిరిగి,

నేను ఎగిరిపోవుదును. (దానిని నేను ఇష్టపడెదను.)

ROM 6:9•

ROM 8:2•

1COR 15:55,57

 

13మరియు మనము ముసలివారవుటకు ప్రారంభించినప్పుడు, మరియు జుట్టు నెరయుచున్నప్పుడు, భుజాలు జారిపోతున్నప్పుడు, అది ఎప్పటికంటె మనకెంతో ఎక్కువ, చూశారా. ఎందుకనగా ఒక చిన్న పిల్లవాడు ఎదురుచూచును: అతడు ఎవరిని వివాహము చేసుకోనైయున్నాడు? అతడు ఏ విధముగా తన పిల్లలను చదివించనైయున్నాడో? మరియు అంతా ముగిసినతరువాత, అప్పుడే అంతా ముగిసినది, మీరు చూచారా. అప్పుడు మీరు సూర్యుని యొక్క అస్తమయమును ఎదుర్కోనైయున్నారు. అయితే కొంచెము ఆలోచించండి, సహోదరుడా, మనము కలిగియున్న దానికి మించి మరేమి లేదు. మనము ప్రేమను కలిగియున్నాము, మనము సంతోషమును కలిగియున్నాము, మనము సమాధానమును కలిగియున్నాము, మనము జీవమును కలిగియున్నాము, మనము… మనము మరణమును పొందుకొన్నాము. అది సరియే బైబిల్ చెప్పుచున్నది, మనము మరణము పొందికొనియున్నామని — అది మనకు సంబంధించినదే. మనము దానికి సంబంధించిన వారము కాదు; అది మనకు సంబంధించినది.

చెప్ప౦డి, "నీవు మరణముతో ఏమి చేయనైయున్నావు?"

పౌలు చెప్పిన విధంగా, అతడు ద్వారము తట్టుటకు వచ్చినప్పుడు. చెప్పాడు, "నది ఆవలకు నన్ను తోడ్కొనిపోవుటకు వచ్చావా, నీవు?"

మరియు రచయిత ఒకసారి చెప్పాడు, "దేవుడు మరణమును ఒక బగ్గికి (బండికి) కట్టివేశాడు, మరియు అది చేయగలిగిన ఒకే ఒక కార్యము అది నిన్ను దేవుని సన్నిధిలోనికి లాగుకొని వచ్చును." అంతే. చనిపోజాలము. వారు కేవలము మరణమును ఒక బగ్గికి కట్టివేశారంతే, మరియు అది చేయు ఒకే ఒక సంగతి, అది తిన్నగా నిన్ను దేవుని యొక్క సన్నిధిలోనికి లాక్కొని వచ్చును. అది (మరణము) కేవలము ఒక నిన్ను నది ఆవలకు లాగుటకు వచ్చినది. అదంతయూ అదే కనుక మనలను ఇబ్బందిపరచునది ఇక ఏదియూ లేదు.

పౌలు చెప్పాడు, మరణము ఆ విధముగా దానిలో నుండి దొర్లుకొని వచ్చినప్పుడు, అది అతడి యొక్క సమయము, అతడు చెప్పాడు, "ఓ, మరణమా, నీ ముల్లెక్కడ?"

అతడు చెప్పాడు, "మంచిది, నేను నిన్ను సమాధిలోనికి తీసుకొనబోవుచున్నాను."

అతడు చెప్పాడు, "అప్పుడు, సమాధీ, నీ విజయమెక్కడ? నేను నిన్ను కూడా పొందుకొన్నాను." అప్పుడు అతడు వెనుకకు తిరిగి, చెప్పాడు, "మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు విజయమిచ్చిన దేవునికి వందనములు." అప్పుడు మనము దానిని పొందుకొన్నాము, సహో టెంపుల్. అది అదే. అంతా ముగిసినది.

14మంచిది, సహోదరి స్నెల్లింగ్ ప్రతీసారీ ఒక పాత పాట పాడుతూ ఉండేది. మీరెవ్వరూ బహుశా సహోదరి స్నెల్లింగ్ ను జ్ఞాపకము తెచ్చుకొనలేరని నేను అనుకొనుచున్నాను. నిన్నటి దినమున ఆమె యొక్క సమాధి దగ్గర నేను ఉన్నాను. ఆమె ఎప్పుడూ ఒక చిన్న పెంతుకోస్తు సునాద గీతము పాడుతూ ఉండేది:

సాగిపోదుము, సాగిపోదుము,

ఈ పాత మార్గమును గూర్చి మాట్లాడుకొనుచూ.

సాగిపోదుము, సాగిపోదుము,

ప్రభువును గూర్చి మాట్లాడుచూ,

(దానిని మీరెప్పుడైనా విన్నారా?)

చాలా మంచి అనుభూతి కలుగుచున్నది.

ఆ పాత మార్గమును గూర్చి మాట్లాడుచున్నప్పుడు,

ప్రభువును గూర్చి మాట్లాడుచున్నప్పుడు,

నాకు చాలా మంచి అనుభూతి కలుగుచున్నది.

అది అదియే. అంతా సరియే. ఆయన యొక్క వాక్యము చదువుటకు ముందు, ఒక ప్రార్ధనతో, ఇప్పుడు ఒక్క నిమిషము ఆయనతో మాట్లాడుదాము.

మన యొక్క తలలు వంచియుండగా మరియు మన కన్నులు మూసియుండగా, మరియు దినమునకు కావలసినవి ఇప్పుడు కొనసాగుచున్నవి. ఆయన యొక్క నామములో మరియు ఆయన యొక్క సన్నిధిలో ఇప్పుడు మనము సమకూడియున్నాము. దేవుని ముందర జ్ఞాపకముంచుకొనుటకు దేనినైనా గుర్తుకు తెచ్చుకొనేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ చేతిని పైకి ఎత్తండి, మరియు దాని ద్వారా, "దేవా, నన్ను జ్ఞాపకముంచుకొనుము."

MATT 13:46

 

15మా పరలోకపు తండ్రీ, ప్రపంచమనేది ఏర్పడక ముందే, మేము ఇక్కడ నిలబడెదమని ఎరిగియున్న అనంతుడైన దేవా, నీవు ఆ చేతులను చూచియున్నావు. పైకెత్తబడిన చేతి యొక్క హృదయం క్రింద ఏమున్నదో, ప్రతీదాని వెనుక ఏమున్నదో నీవు ఎరిగియున్నావు. వారిని గూర్చి ప్రార్ధిస్తున్నాను, తండ్రీ, నీ శక్తి మరియు మహిమలో నీ అపారమైన సంపదను బట్టి జవాబు దయచేయుము.

మేము ఈ యొక్క సంఘము కొరకు, దాని యొక్క కాపరి కొరకు, దాని బోర్డు, దాని ధర్మకర్తలు, డీకన్సు, సభ్యులందరూ, మరియు ఈ క్లార్క్ విల్లీలో విడిది చేయుచున్న ఆ ప్రశస్త ఆత్మలనన్నీటినీ బట్టి, యాత్రికులు, క్రొత్తవారు, ఇక ప్రపంచముతో సంబంధము లేని వారికి వందనములు తెలియజేస్తున్నాము. వారు లోకానికి సంబంధించిన వాటినన్నిటిని విడిచిపెట్టారు, వారికున్నదంతయూ అమ్మివేసియున్నారు, మరియు మనకు నిత్యజీవమునిచ్చు ఆ ప్రభువైన యేసును గొప్ప వెలగల గొప్ప ముత్యమును కొనియున్నారు. ప్రభువా, దానికొరకు వందనములు చెల్లించుచున్నాము.

ఈ ప్రశస్తమైన ఆత్మలను గూర్చి వందనములు. ప్రతీ ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్ధిస్తున్నాను. నేను సహో జాక్సన్ గూర్చి ఆలోచిస్తున్నాను, అతడు ఏ విధముగా శ్రమపడి మరియు కష్టపడి, గొర్రెలను పోషించుట కొరకు ప్రయత్నించుచున్నాడు, మరియు యాత్రికులందరూ కూడియుండుటకు ఒక కూడిక స్థలమును తయారుచేయుట, వారినందరినీ కలిపి ఉంచుట, ప్రభువు యొక్క రాకడను గూర్చి ఎదురుచూచుట; అతడు మరియు అతడి భార్య, మరియు కుటుంబము ఈ రాత్రి, ఇక్కడ నా వెనుక కూర్చొన్న అతడు, సహో రదెల్, మరియు అతడు కూడా 62పై విడిది చేయుచున్న ఒక చిన్న గుంపును అతడు కలిపి ఉంచుచున్నాడు. సహో నెవిల్, మరియు ఆ గుంపు గుడారము దగ్గర విడిది చేయుచున్నారు. మరియు ఇతరులు, ప్రభువా, బహుశా ఇక్కడ హాజరైన ప్రజలు ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు. మేము ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము.

ISA 40:31•

JOHN 15:16

 

16మమ్ములను క్షమించు ప్రభువా, ఇప్పుడు మేమందరమూ కలిసి కూడుకొనియున్నాము. నీవు మా మొర విందువని చేసిన వాగ్దానమును ఎరిగి, మేము యేసు నామములో వచ్చుచున్నాము. "ఆయన నామములో మేము ఏది అడిగిననూ అది అనుగ్రహించబడును." మరియు ఇప్పుడు, ఈ రాత్రి, మా పరిశుద్ధ గ్రంధములు తెరచుచుండగా, ఒక చిన్న పాఠము కొరకు, ఇప్పుడు, కేవలము వ్యక్తులవలె కనిపించుటకు లేదా వినబడుటకు మేము ఇక్కడలేము. "మంచిది, ఈ రాత్రి నేను సంఘమునకు హాజరయ్యాను," అని కేవలము చెప్పుకొనుట కొరకు జనులు ఈ గదిలో కూర్చొనిలేరు. ప్రభువా, నీ నుండి ఒక సందర్శనను మేము ఎదురు చూచుచున్నాము. దాని కొరకు మేము ఎదురు చూచుచున్నాము. "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు." మరియు మా కొరకు నీ జీవపు రొట్టెను విరువమని నిన్ను అడుగుచున్నాము. పరిశుద్దాత్మ కొన్ని మాటలను తీసుకొని, హృదయపు లోతులలో వాటిని నాటునట్లు చేయును గాక. ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని బలపరచుము, ప్రభువా, మరియు ఎవరైతే బలవంతులో వారికి సంతోషమును ఇవ్వుము, ధైర్యము చెడినవారికి ధైర్యమును, ఎవరైతే రోగముతో ఉన్నారో వారికి ఆరోగ్యమును, నశించినవారికి రక్షణను దయ చేయుము. మరియు మా తలలు వంచి మరియు నిన్ను స్తుతించెదము. యేసు నామములో, నీ వాక్యముతో, మమ్ములను సమర్పించుకొని అడుగుచున్నాము. ఆమేన్.

17సువార్తను బోధించుటకు, ప్రయాణములో రెండు దేశముల గుండా మరుసటివారము వెళ్ళుటకు ప్రారంభమగుచున్న మా గూర్చి ఈ సంఘము ద్వారా గుర్తించుకొనబడుటకు నేను ఇష్టపడుచున్నాను. మేము వెళ్ళనైయుండగా, మా కొరకు ప్రార్ధించండి. మరియు చుట్టుప్రక్కల మీరెవరైనా స్నేహితులను కలిగియుంటే, మీకు తెలుసు, కూడికలకు వచ్చుట, మేము … లేదా రావచ్చు, వారిని కూడికలలో కలిగియుండుట మాకెంతో సంతోషము.

ఇక్కడనున్న మీ అందరి కొరకు మేము ప్రార్ధించెదము, మీ కాపరి మరియు ఇతరులు, మేము తిరిగి వచ్చేంత వరకూ మీ యొక్క గృహములను మండుచూ ఉ౦డనివ్వండి. ఒకవేళ మేము తిరిగి రావడానికి ముందే యేసు వచ్చినట్లయిన, ఆ ఉదయకాలమున మేము మిమ్ములను కలుసుకొనెదము. ఒకవేళ దానికి మించి మేము మరే ఉద్దేశ్యము కలిగి ఉన్నా, దేవా మమ్ములను క్షమించుము.

JOSH 24:14,15

 

18పరిశుద్ధ గ్రంధము నుండి, కొన్ని మాటల కొరకై, ఈ రాత్రి, మేము త్రిప్పాలని ఇష్టపడుచున్నాము, యొహోషువ గ్రంధములోని 24వ అధ్యాయము, 14వ మరియు 15వ వచనము. నేను ఆయన వాక్యములో నుండి చదువగోరుచున్నాను. ఆయన యొక్క వాక్యము కొరకు జాగ్రత్తగా వినండి. యెహోషువ 24:14-15:

కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి.

యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను.

ఆయన లేఖనములను చదువుట ప్రభువు ఆశీర్వదించును గాక! ఇక్కడ నేను మాట్లాడుటకు ఇష్టపడుచున్న ఒక చిన్న అంశములను కలిగియున్నాను. మరియు ఈ రాత్రి నేను ఒక పాఠమును తీసుకొనగోరుచున్నాను, దానిని పిలుచుటకు, "పోరాటము," దేవునికి మరియు సాతానుకు మధ్య పోరాటం. మరియు ఇప్పుడు, కేవలము ఒక ఆదివారపుబడి పాఠమువలె బోధించుటకు, ఇక్కడ నాకు చాలా లేఖనములు పడియున్నవి.

19ఏదేనులో, దేవుడు తన శత్రువును ఎరిగియున్నాడు మరియు తన శత్రువు యొక్క ప్రతీ దాడిని ఎరిగియున్నాడు. ఇప్పుడు, దేవుడు అనంతుడగు దేవుడు, మరియు అనంతుడగు దేవుడు పరిపూర్ణతలో కెల్లా పరిపూర్ణుడు, ఏమియూ లేక మునుపే సమస్తమును ఆయన ఎరిగియున్నాడు. మరియు కాబట్టి, ఒకవేళ ఈ అనంతుడగు దేవుడు ముందుకు చూచి మరియు ప్రారంభము నుండి అంతమును చూచినయెడల, మరియు ఈ భూమిపై ఆయన బిడ్డలను కలిగియుందును అని ఎరిగి, ఆయన యొక్క సొంత ఆశీర్వదించబడిన బిడ్డలు, అప్పుడు ఆయన సమకూర్చగల దానిలో బహు శ్రేష్టమైన వాటిని సమకూర్చగలడని నీవు నమ్మవా?

ఈ రాత్రి, నీవు, వారి కొరకు వారు జాగ్రత్తవహించలేని నిస్సహాయులగు నీ చిన్న పిల్లల కొరకు నీవు కష్టపడవా, మరియు పనిచేసి, ఆ పిల్లలకు సమకూర్చుటకు శక్తి గల లేదా నీవు చేయగలిగిన దానిలో శ్రేష్టమైనది సమకూర్చుటకు, నీవు చేయగలిగినదంతా చేయవా? ఎందుకనగా నీవు ఒక నాన్నవు, ఒక తండ్రివి. మరియు ఒకవేళ అది… నేను ఏమి చెప్పెదను, వాస్తవము మరియు ఒక భూసంబంధమైన తండ్రి ఆలోచన, మరియు పితృత్వము దేవునిలో నుండి ఆరంభమైనది, ఎందుకనగా ఆయనే మొదటి తండ్రి. సాతాను ఏమగును, సాతాను ఏమి చేయును అని దేవుడు చూచుచూ, వారికి సమకూర్చగలిగిన దానిలో శ్రేష్టమైనది సమకూర్చగలడు అని నీవు ఆలోచించవా? శత్రువు యొక్క దాడి ఏమిటి అని ఎరిగియుండి, దేవుడు తన బిడ్డలకు ఆశ్రయమిచ్చెను.

ISA 46:10

 

20మనము యుద్ధమును తీసుకొందాము, ఒక యుద్ధములో ఒక సైన్యాధ్యక్షుడు ఇంకొక సైన్యాధ్యక్షుడిని కలుసుకొనుటకు వెళ్ళినప్పుడు మరియు ఈ సైన్యాధ్యక్షుడు, ఒకవేళ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశానికి అతడు ఒక నిజమైన పౌరుడైన ఎడల (మరియు అతడు ఖచ్చితముగా సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు) మరియు అతడు… మొదట, అతడు శత్రువుల దాడులను చదువుతాడు. అతడు ఏమి చేయనైయున్నాడో, ఏ విధముగా పనిని జరిగింపబోవుచున్నాడో ఎరుగును, ఎందుకనగా అతడి వంటి వారు వెళ్ళి మరియు వేగు చూచారు.

మీకు తెలుసా, ప్రతీచోటా మనము వేగుల వారిని కలిగియున్నాము. ఇంగ్లాండులో అమెరికా వేగులవారు ఉన్నారు. ఫ్రాన్సులో అమెరికా వేగులవారు ఉన్నారు. మరియు వారి జర్మనీ వేగులవారు ఇక్కడ ఉన్నారు. మరియు అక్కడ మనమెంత స్నేహితులమైనప్పటికీ, ఇంకనూ మనము వేగులవారిని కలిగియున్నాము. మరియు మనము ఒక రకమగు అణ్వాయుధమును వేగు చూచెదము. అప్పుడు మనము దానిని కనుగొనెదము, తిరిగి దేశానికి తీసుకొని వెళ్ళెదము. అప్పుడు, అది ఏమిటి, వారు సిద్ధపడెదరు, యుద్ధము వచ్చినప్పుడు, వారి యొక్క శత్రువుపై ఏ విధముగా దాడి చేయాలన్నది వారు ఎరిగియున్నారు.

21మరియు ఒకవేళ మనము ఎరిగిన… దేవునికి తెలుసు ఈ గొప్ప యుద్ధము రాబోవుచున్నదని, మంచికి మరియు చెడుకు మధ్య మరియు శత్రువు ఏమి చేయనైయున్నాడని ఆయన ఎరిగియున్నాడు. తన యొక్క జనులను ఖచ్చితముగా ఎలా సిద్ధపరచాలని ఆయనకు తెలుసు. కనుక ఒకవేళ మనము గమనించినట్లయితే, దేవుడు తన పిల్లలను సిద్ధపరచిన మొదటి సంగతి ఏదనగా… అంతము లేకుండుటయే, ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడైనా, ఏ స్థలమందైనా, ఏ సమయములోనైనా, సాతానును ఓడించుటకు ఏమి కావలయునో ఆయన ఎరిగియున్నాడు. ఇప్పుడు, "నేను ఇక్కడ ఏదో వారికి ఇచ్చెదను, మరియు ఇంకొన్ని సంవత్సరముల తరువాత, వారికి ఇచ్చుట కొరకు ఒక మంచి దానిని నేను అధ్యయనము చేసెదను, తరువాత కొద్ది సంవత్సరముల…" అని ఆయన చెప్పడు.

మనకు లాగ, సైన్యములో, పాత విల్లు మరియు బాణము, రాతి సుత్తి; మరియు దాని తరువాత … విల్లు మరియు బాణము తరువాత, భుజాన వేసుకోని వెళ్ళే పొడవాటి తుపాకి, మరియు పొడవాటి తుపాకి తరువాత చేతి తుపాకీలు వచ్చినవి, మరియు ఇప్పుడు అణ్వాయుధాలు మరియు అటువంటివి. చూశారా, మనము ఎక్కువగా ఎదుగుతూ ఉన్నాము; అయితే దేవుడు ప్రారంభములోనే, తన యొక్క పిల్లలకు అణ్వాయుధాలను ఇచ్చాడు, ఎందుకనగా ఆయన అనంతుడైన దేవుడు.

MATT 4:4,7,10•

LUKE 4:4

 

22ఇప్పుడు, ఒక పోరాటము ఉండబోవుచున్నదని చూచి, మరియు ఒక యుద్ధము జరుగబోవుచున్నదని, సరైన దాడి కొరకు, సరైన ఆయుధ సామాగ్రితో తన యొక్క బిడ్డలను దేవుడు సిద్ధపరిచెను, వారికి అవసరమైన సరైన అన్ని సంగతులలో, ఏదేను నుండి ఎత్తబడుట వరకూ వారిని ఈడ్చుకు రాగలిగినది ఏది? అది వాక్యము. వాక్యము. సాతానును ఓడించేది వాక్యమే. అది వాడిని ఎక్కడైనా, ఏ స్థలమందైనా ఓడిస్తుంది. ఇప్పుడు, ఇప్పటికే ఉన్న వాటిలో శ్రేష్టమైన సంగతి, వాక్యమును మనము కలిగియున్నప్పుడు, మరి దానికి బదులు మరేదో మనమెందుకు కోరుచున్నాము?

మరియు సమకూర్చబడిన శ్రేష్టమైన సామాగ్రి ఇదే అని రుజువు చేయుటకు, మనము యేసును భూమిపై కనుగొన్నాము. సాతాను యేసుతో ముఖాముఖి యుద్దానికి వచ్చినప్పుడు, ఆయన తన యొక్క శక్తి అంతటితో వెళ్ళి మరియు వాడి యొక్క చేతులు కట్టలేదు. ఆయన దేవుని చేత ఏదేనులో ఇవ్వబడిన అదే ఆయుధమును తీసుకొని, ఆయన యొక్క వాక్యము, మరియు చెప్పాడు, "అది వ్రాయబడినది. అది వ్రాయబడినది." మరియు దానితో వాడిని ఆ పోరాటము చేసే రింగు (స్థలము) నుండి బయటకు గెంటివేశాడు. అది సరియే, ఎందుకనగా అది దేవుని యొక్క శ్రేష్టమైనది.

PS 91:7

 

23మరియు అది ఎక్కడ ఉన్నదో చూడుము. అది సంఘములో కేవలము ఒకరికో లేక ఇద్దరికో కాదు. అది మనలో ప్రతీ ఒక్కరికీ, ప్రతీ ఒక్క విశ్వాసి ఈ వాక్యమును తీసుకొని అతడు శత్రువును ఎక్కడ కలుసుకుంటాడో అక్కడ దానితో పోరాడే హక్కును కలిగియున్నాడు. నీవు ఎక్కడ శత్రువును కలుసుకొనినా, నీవు ఉపయోగించవలసినది ఈ వాక్యము మాత్రమే. మరియు యేసు వచ్చినప్పుడు దానిని రుజువు చేసియున్నాడు. కనుక శత్రువు నుండి రక్షింపబడుటకు, ఆయన తన బిడ్డలను వాక్యముతో సిద్ధపరచెను.

ఎప్పుడైతే వెంటనే యుద్ధము వచ్చినదో, మరియు పోరాటములు, మరియు వరుసలో నిలువబడినవో, అప్పుడు ఒక నిజమైన సైనికుడు ఉపయోగించగలిగినది ఒకే ఒక్కటున్నది - ఒక నిజమైన క్రైస్తవ సైనికుడు. అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అక్కడకు నడిచి వెళ్ళి మరియు శత్రువును కలుసుకొనుము, ఏమీ జరుగదు అను నిశ్చయతతో… "వేయి మంది నీ కుడి ప్రక్కన పడిననూ, మరియు పది వేల మంది ఎడమ ప్రక్కన, కానీ అది నీ యొద్దకు రాదు." కేవలము గుర్తించుకొనండి, దేవుడే ఈ ప్రకటనను చేసి, మరియు దీనిని తన బిడ్డలకు ఇచ్చెను, మరియు ఇప్పటి వరకూ అదే శ్రేష్టమైనది.

24సాతాను, ఏదేనులో, మొదటిగా ఈ దాడికి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని దాడి చేయుటకు, దేవుని యొక్క పిల్లలందరూ ఈ వాక్యము ద్వారా కోట కట్టబడినారని ఎరిగి, సాతాను వాక్యము పై దాడి చేసెను, చూశారా. అతడు వ్యక్తిపై ఎన్నడూ దాడి చేయలేదు. మొదటిగా, అతడు వాక్యముపై దాడి చేసెను. నీచ స్వభావము గల, ఊసరవెల్లి వంటి వాడిని చూడుము, అతడు ఈ రోజు ఏమి చేయును. మొదటి సంగతి, "అతడు మంచివాడు కాదు," అను చెప్పుదానిపై అతడు ఆధారపడడు. అతడు మంచివాడు, చూశారా. కానీ అతడు చేయుటకు ప్రయత్నించు ఒకే సంగతి, ఆ వ్యక్తి ఎంత మంచివాడైనప్పటికీ, ఆ వాక్యమును కాదు అనుటకు తీసుకొని వచ్చును. వాడికి కావలసిన ఒకే ఒక్క సంగతి అదే: నిన్ను వాక్యమును తిరస్కరించులాగున చేయుట.

కనుక ఏదేను తోటలో సాతాను వాక్యముపై దాడి చేయుటకు ప్రయత్నించెను. కనుక మానవునికి, ఆ వాక్యము కన్నా అందముగా కనిపించునదేదో ఒకదానిని ఇప్పుడు వాడు కలిగియుండవలెను, చూశారా. మానవునికి, వాక్యము కన్నా మంచిగా కనిపించు ఒకదానిని ఏదో వాడు కలిగియుండవలెను. మరియు మీకు తెలుసా, వాడు దేనిని ఉపయోగించెనో? హేతువాదము — సామాన్యముగా మనము, "ఇంగిత జ్ఞానము" అని చెప్పెదము. కనుక దానినే వాడు ఉపయోగించి మరియు వాడు విజయము పొందెను. కనుక ఎల్లప్పుడూ వాడు దానినే ఉపయోగించెను.

25కానీ దేవుడు తన వాక్యమును తప్ప మరి దేనిని ఇవ్వజాలడు, ఎందుకనగా ఆయన మొదట దానినే ఎన్నుకొనెను. మరియు దేవుడు ఒక నిర్ణయము తీసుకొన్నప్పుడు, అది ఎన్నటికినీ ఆ విధముగా ఉ౦డవలసినదే. మరియు సాతాను కారణములను తీసుకొనెను, మరియు కారణములను తీసుకొని మరియు వాక్యముపై దాడి చేసెను, మరియు హవ్వను మార్గములో నుండి కదిలించెను. అది నిజము — కారణముల ద్వారా, మనవీయమైన తర్కము.

ఇప్పుడు, అతడు లేక ఆమె దేవుని యొక్క వాక్యమందు అవిశ్వాసము కలిగియుండగలిగిన ఒకే ఒక మార్గము, అది ఆకర్షణీయముగా ఉండవలసియున్నది, మరియు ఆ కారణములను ఏ విధముగా ఆకర్షణీయముగా చేయాలో సాతానుకు తెలుసు. అది నిన్ను ఆకర్షించాలి మరియు పాపము చాలా ఆకర్షణీయముగా ఉండును, మరియు కేవలము ఒకే ఒక పాపమున్నది, మరియు అది అవిశ్వాసము కనుక అది చాలా ఆకర్షణీయముగా ఉండును. నీకు ఆ పాపము చాలా ఆకర్షణీయముగా ఉండులాగున సాతాను చేయును.

26కొద్ది నిముషములు ఇక్కడ నేను ఆపుచూ ఉన్నాను. ఒక యవ్వనస్తునిగా, నేను చాలా సార్లు అనుకొన్నాను, మరియు వేర్వేరు దేశముల గూర్చి మరియు దేశము యొక్క నైతిక విలువల గూర్చి చదివియున్నాను. మరియు ప్రత్యేకించి ఫ్రాన్స్ లోని పిగ్ఆలి అనే ప్రాంతమును గూర్చి వివిధ జనులు చెప్పడం నేను విన్నాను, మరియు ఏ విధముగా ఆ ప్రజలు అనైతికమైనవారో అని. మంచిది, నేను అనుకొన్నాను, "ఒకవేళ నేను అక్కడకి వెళ్ళగలిగిన, నేను అక్కడ ప్రజలను చూడగలను, స్త్రీలు బయటకు వచ్చి మీకు తెలుసా, భ్రష్టులు, అటువంటి వికారమైన ముసలి చూపులతో, మీకు తెలుసా, మరియు నీచమైనవి. మరియు నేను పిగ్ఆలి లోనికి వెళ్ళాను, ఆ మొదటి రాత్రి, నేను మరియు మరొక ముగ్గురు సేవకులు. సహోదరుడా, ఎటువంటి ఆశ్చర్యము మేము పొందుకొన్నాము! ఇప్పుడు, సాతాను దాని కొరకు చాలా తెలివైనవాడు. అతడు అటువంటిదేదో ఉత్పత్తి చేయబోవడము లేదు, కానీ నా జీవితములో నేను చూసిన అందగత్తెలైన బాలికలలో కొందరు అక్కడున్నారు, ఆకర్షణీయముగా. ఖచ్చితముగా. పాపము చాలా అందముగా మరియు ఆకర్షణీయముగా ఉండును.

సాతాను ఏదో పాయలైన డెక్క కాళ్ళతో మరియు సూదంటి తోకను మరియు అటువంటి దానివలె ఉండడు. అతడు ఏదో చెవులు క్రిందకు జారిపోయి, మరియు కోటు పైకి వ్రేలాడదీయబడిన పాత జాన్ బార్లీకార్న్ వలె ఉండడు; అతడు ఒప్పింపచేయునట్లు కనపడువాడు — ఆకర్షణీయుడు. పాపము మీరనుకొన్న విధముగా కేవలము క్రూరత్వము కాదు; అది చాలా ఆకర్షణీయమైనది. కాబట్టి, దానిని మనము చాలా దగ్గరగా గమనించాలి. (కొద్దిసేపట్లో మనము దాని యొద్దకు వచ్చెదము; నేను మరొకటేదో ఆలోచించాను.)

ISA 6:1-3•

EZEK 1:10,15

 

27కనుక, సాతాను ఏ విధముగా అది వాస్తవముగా కనబడునట్లు దానిని చేయునో, అది వారికి ఆకర్షణీయముగా ఉండును. అయితే ఒకవేళ వారు గనుక వాక్యముతో కోట కట్టబడి నిలువబడితే, వాక్యము వారి యొక్క కోట, అప్పుడు, చూడండి వారు కోట కట్టబడియుండెదరు. వారు వాక్యము వెనుక ఉండెదరు. ప్రతీసారి, వాక్యము వారి ఎదుట ఉండును: "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," కుడియైన లేక ఎడమయైన, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

యెషయా అక్కడ, ఆ రోజు ఆ దేవాలయములో కలుసుకొన్న దేవదూతల వలె, అతడు బాగా మంచిగా కొనసాగుచున్నాడు అని అతడు అనుకొన్నాడు. నిజమైన మంచి ప్రసంగీకుడు, ఆ రాజు అతడిని చాలా మంచిగా ఇష్టపడెను, కానీ ఒక రోజు ఆ రాజు అతడి యొద్ద నుండి తీసివేయబడెను. మరియు అతడు బలిపీఠము యొద్ద మోకాళ్ళూని మరియు దర్శనములోనికి వెళ్ళెను. మరియు ముఖాలపై రెక్కలు కప్పుకొన్న మరియు వాటి పాదములపై మరియు రెండు రెక్కలపై ఎగురుచూ ఉన్న దూతలను చూచెను, అవి ఎటువైపు వెళ్ళుచున్నవో అటు, చూడుము, "సర్వోన్నతుడగు ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని పాడుచుండెను.

యెహేజ్కేలు, దర్శనము యొక్క దృశ్యమును ఈ విధముగా చూచెను. దేవుని యొక్క ఆత్మ కదులుచుండెను. అది ఎద్దు ముఖమును కలిగియున్నది. ఇటువైపు, అది సింహపు ముఖమును కలిగియున్నది. మరియు ఎటువైపు అది కదిలినా, అటువైపు అది ముఖమును కలిగియున్నది. అది ఎక్కడకి వెళ్ళినా, అది కోట కట్టబడినది. దేవుని యొక్క వాక్యము, చుట్టూ మరేది లేదు. కోట కట్టబడెను, అన్ని వైపులా, ప్రతీ చోటా — "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

28నీ నడక, నీ మాట, నీ వ్యాపారము, నీ సహవాసము, మరియు ప్రతీది — దేవుని యొక్క వాక్యమును మొదట పెట్టుము. "నేను ఈ రాత్రి వెళ్ళెదనని నేను నమ్ముచున్నాను, మరియు ఈ చిన్న నాట్యము ఎవ్వరినీ ఇబ్బందపరచదు," అని చెప్పండి. నీవు నీతో "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడును" తీసుకు వెళ్ళగలవా?

"నేను నమ్ముచున్నాను, ఒకవేళ నేను ఈ చిన్న ఒప్పందమును నేను చేయగలిగినయెడల… ఓ, అది కొంచెము అనుమానముగా ఉన్నది." అయితే దానితో, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని" అని నీవు చెప్పగలవా? చూశారా, ప్రతీసారీ ఆయననే మొదటిగా తీసుకొనండి, కోట కట్టబడి యుండండి, ఎందుకనగా ఆయనే మన కోట.

అది వింతగా ఉండును, కానీ మీకు తెలుసా, మీరు ఎరుగనట్లు దానిని దాటిపోవలసియున్నది… ముందు దెయ్యము యొక్క అబద్ధమును నమ్ముటకు, దెయ్యము యొక్క అబద్ధమును నీవు నమ్ముటకు ముందు, మొదటిగా — దేవుని యొక్క సత్యమును మీరు తిరస్కరించి మరియు నిరాకరించవలసియున్నది. నీవు ఎన్నడైనా దానిని గూర్చి ఆలోచించావా? నీవు ఒక అబద్ధమును నమ్ముటకు ముందు, మొదటిగా నీవు సత్యమును తిరస్కరించవలసియున్నది. సరియే — దానిని తిరస్కరించవలెను.

GEN 3:3-6

 

29హవ్వ దాని వెనుక నుండి పొందుకొన్నది మరియు పోరాటమును ఓడిపోయినది. ఎప్పుడైతే హవ్వ… సాతాను గురివైపు ఎక్కుపెట్టి, నిలబడి కాల్చుచున్నాడు. ఆమె చెప్పినది, "కానీ ప్రభువు చెప్పియున్నాడు…" మరియు అప్పుడు అతడు తిరిగి కాల్చాడు. ఆమె చెప్పినది, "కానీ ప్రభువు చెప్పియున్నాడు…" కనుక అప్పుడు అతడు మరొక విధముగా తిరిగి కాల్చాడు. "కానీ ప్రభువు చెప్పియున్నాడు…"

సాతాను అక్కడ వెనుక తిరిగి లేచి, చెప్పాడు, "అయితే ఒక్క నిముషము ఆగు. ఒకవేళ ప్రభువు ఆలాగు చెప్పినట్లయితే, కేవలము ఒక్క విషయము నన్ను నీకు చెప్పనివ్వు. నీవు చూడు, నీవు దేవుని వలె జ్ఞానివి కావు; సరైనదేదో, తప్పైనదేదో నీకు తెలియదు. కానీ ఒకవేళ… వినుము, నీవు దేవుని వలె జ్ఞానిగా ఉండుటను నీవు ప్రేమించుట లేదా?"

ఎందుకు, హవ్వ చెప్పెను, "అవును, నేను… నేను ఉందునని నేను నమ్ముచున్నాను." బహుశా అటువంటిదేదో, "దేవుని యొక్క జ్ఞానమంతా కేవలము తెలుసుకొనుటను ఇష్టపడెదనని నేను నమ్ముచున్నాను. ఏది సరైనదో మరియు తప్పైనదో తెలుసుకొనుటను నేను ఇష్టపడుచున్నాను. దానిని నేను ఎరుగను."

"మంచిది, నేను నీకు చెప్పెదను…"

ఇప్పుడు, ఆమె చెప్పినది, "కానీ, ప్రభువు చెప్పెను…"

"ఓ, కానీ ఖచ్చితముగా, ఆయన ఒక మంచి దేవుడని నీకు తేలుసు. అది ఆయన చేయడు." చూశారా. అక్కడే, అతడు కాల్చులాగున ఆమె రంధ్రము పొడిచినది. అక్కడే ఆమె తప్పటడుగు వేసినది, అక్కడే — ఒక్క క్షణం ఆగినది.

30ఇప్పుడు, ఇక్కడున్న క్రైస్తవులైన మీకు నన్ను ఒక సంగతి చెప్పనివ్వండి. దెయ్యము కొరకు ఎన్నడూ ఒక్క క్షణము కూడా మీరు ఆగవద్దు. దానిని తర్కించుటకు ఆగవద్దు. దానిని తర్కించుట ప్రారంభించగానే, దెయ్యము అక్కడే లోపలికి వచ్చును. నీవు దేవుని యందు తర్కించలేవు, నీవు దేవునిని అర్థము చేసుకోలేవు; నీవు కేవలము దేవునిని నమ్మవలసినదే. చూశారా. నేను దేవున్ని వివరించలేను. ఎవరూ వివరించలేరు. నేను చాలా సంగతులను వివరించలేను. కానీ ఒకే విషయము, నేను దానిని నమ్మెదను, ఎందుకనగా ఆయన అలా చెప్పియున్నాడు. ఇప్పుడు, మనలో ఎవరూ కూడా దానిని వివరించలేరు. దానిని వివరించడానికి ప్రయత్నించవద్దు.

"మంచిది, ఇప్పుడు చూడు, అక్కడ ఉన్న నీ పాస్టర్, జూనియర్, అతడు రోగులను గూర్చి ప్రార్ధించడం నేను విన్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న మీరందరూ పిచ్చివారు. దైవీక స్వస్థత అనునది ఏదియూ లేదు," అని చెప్పు అవిశ్వాసులతో వెళ్ళవద్దు.

చెప్పండి, "అయితే సరే, అప్పుడు అది నీ కొరకు కాదు; నీవొక అవిశ్వాసివి." మరియు ఆ విధముగా ముందుకు నడిచి వెళ్ళిపోండి, చూశారా. అది కేవలము విశ్వాసులకు మాత్రమే, చూశారా. వద్దు…

"మంచిది, మీరందరూ పరిశుద్ధాత్మను కలిగియున్నారని చెప్పెదరు. పరిశుద్దాత్మ అనునది ఏమియూ లేదు."

చెప్పండి, "అది నీ కొరకు కాదు; అది నా కొరకు." ముందుకు సాగిపోండి, చూశారా. దానిని తర్కించుటకు ప్రయత్నించవద్దు. దానికి ఎటువంటి తర్కములు లేవు. నీవు దానిని కేవలము నమ్ముము.

JOHN 11:26

 

31ఒక్క సంగతిని గూర్చి కూడా నీవు కారణము వెదకవద్దు, ఎందుకనగా గుర్తించుకొనండి: నీవు దేవునిని అంగీకరించే ఒకే ఒక మార్గము కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే, కారణములను బట్టి కాదు, అర్ధము చేసుకొనుటను బట్టి కాదు, వివరించలేము. నీవు దేనిని వివరించవద్దు. నీవు ఒక దానిని నమ్మము. నీవేమి అనుభూతి చెందుచున్నావో అది కాదు. "నీవు దానిని అనుభూతి చెందావా?" అని యేసు ఎన్నడూ అడుగలేదు. ఆయన చెప్పాడు, "నీవు దానిని నమ్ముచున్నావా?" అది సరియే. దేవుడు ఏమి చెప్పియున్నాడో దానిని మాత్రమే నీవు నమ్ముము.

నేను నీకు వివరించలేను, వారు ఏ విధముగా… ఏ విధముగా ఒక… నేను ఆలోచించదగిన ఒక గొప్ప అద్భుతము, అది ఒక మనుష్యుడు. ఊరికే ఒక పందిని తీసుకొనండి, మరియు ఆ పందితో "నీకు తెలుసా, ఇక నీవు పందివి కాదు; నీవొక గొర్రెపిల్లవు," అని చెప్పండి, మరియు అది గొర్రెపిల్లయగును, చూశారా. అది నమ్ముటకు కష్టముగా ఉండును. ఎందుకు, నీవు ఒక పాపి నుండి ఒక క్రైస్తవునిగా మారునప్పుడు జరుగునది అదియే.

చూశారా, అది నీ సొంత భావములను మార్చి వేయును. అది నీ సొంత చిత్తమును మార్చివేయును. అది నీలో ఉన్న సమస్తాన్నీ మార్చివేయును. అది నిన్ను వేరొక జీవములోనికి తీసుకొని వచ్చి మరియు వేరొక ఆత్మను ఇచ్చును. అది వేరొక సాక్ష్యమును కలిగియుండును, చూశారా. అప్పుడు నీ పాత జీవితము చావవలసి యున్నది, మరియు క్రొత్తది తిరిగి జన్మించవలసియున్నది. మరియు అప్పుడు, చూశారా, ఎంత మాత్రము ఇక నీవు అంతకు ముందు ఉన్న జీవివి కాదు. అది నీవు రక్తము వెనుక ఉండి, వాక్యముతో కోట కట్టబడినప్పుడు. దేనిని వివరించుటకు ప్రయత్నించవద్దు, కేవలము నమ్మి సాగిపొమ్ము.

"ప్రభువా, నేను నమ్ముచున్నాను. రక్షకుడా, నీలో నా విశ్వాసాన్ని పెంపొందించుము, అది ఒక పర్వతమును కదుపునంతగా," చూశారా. "ప్రభువా, నేను నమ్ముచున్నాను, నా సందేహములన్నియూ ఆ ఊటలో పాతి పెట్టబడినవి."

ROM 4:20

 

32ఒకవేళ ఆ వైద్యులు వచ్చి, అబ్రాహామును, "అబ్రాహాము, నీవు నూరు సంవత్సరముల వయస్సు కలవాడవు, నీ భార్యకు తొంభై సంవత్సరాలు. నీవు ఏ విధముగా కుమారుడిని పొందుకొనబోతున్నావు," అని అడిగితే ఏమగును.

ఇప్పుడు అబ్రాహాము చెప్పును, "మంచిది, ఇప్పుడు, నేను మీకు చెబుతాను, అది ఈ విధముగా. మీరు చూడండి, ఒక సమయము ఉండబోవుచున్నది, అప్పుడు మేము ఒక దానిని త్రాగబోవుచున్నాము, మరియు ఇది దీనిని చేయబోవుచున్నది, మరియు ఈ రకమైన మార్పు జరుగుచున్నది." అబ్రాహాము దానిని వివరించలేకపోయెను. "నాకు తెలియదు. మీకు తెలిసిన దాని కన్నా ఎక్కువగా నాకు ఏమియూ తెలియదు. మేము దానిని కలిగియుండబోతున్నామని ఆయన చెప్పిన దానిపైనే, ఆ ఒక్క సంగతి పైనే నేను విశ్రాంతి తీసుకొనుచున్నాను. మరియు నేను దాని కొరకు చూస్తున్నాను," అని అబ్రాహాము ఆ విధముగా చెప్పియుండవచ్చు. అవునయ్యా. ఇప్పుడు, కావలసినదంతా అదే. కేవలము దానిని తీసుకొనుము, దానిని నమ్మము. "దేవుడు ఆ విధముగా చెప్పెను మరియు అది అన్ని సంగతులను స్థిరపరచును, ఎందుకనగా దేవుడు దానిని చెప్పియున్నాడు.

GEN 17:17

 

33ఇప్పుడు, మనము కనుగొన్నాము, హవ్వ పోరాటము ఓడిపోవడము, ఆమె వాక్యము వెనుక నుండి పొందుకొన్నది, లేచి కందకము పైభాగమున నిలబడి మరియు చెప్పినది, "నీవు ఆ విధముగా చెప్పవద్దు? అది సత్యమా?" అక్కడే, ఆమె ఓడిపోయినది.

"మంచిది, నీకు తెలుసా, దానిని మా సంఘములో మేము బోధించము."

"ఆయన ఇక్కడ ఏమి చెప్పియున్నాడో దానియందు నమ్మకముంచుతాము."

"సరే, కానీ వినండి, దాని కన్నా మిన్నయైనది మీరు ఎరిగియున్నారు. మీ సొంత మనఃసాక్షి మీకు చెప్పును అది సత్యము కాదని, ఎందుకు, ప్రజలు ఆ విధముగా ఏడ్చుచూ మరియు మొర్రపెట్టడం నేను విన్నాను. వారు దేనిగూర్చి మొర్రపెట్టుచున్నారు?" చూశారా. ఇప్పుడు, సొంత మనఃసాక్షి నీకు చూపించును, అది వారు ఆ విధముగా నేర్పించబడ్డారు. వారు ఉద్రేకముతో కూడుకొన్నవారు," చూశారా. ఒకవేళ నీవు దానిని వినడము ఆపివేస్తే, నీవు పోరాటము ఓడిపోయావు.

ఒకవేళ వారు చెబితే, "ఓ, ఇప్పుడు, ఒక్క క్షణం ఆగుము. నీ డాక్టరు దానిని చెప్పాడు, అది నీవు క్షయను కలిగియున్నావని, మరియు అది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది. నీవు ఆ క్షయను జయించే మార్గము మరెప్పటికినీ లేదు. డాక్టరు చెప్పాడు, ఏ మార్గమును లేదు." ఇప్పుడు, దానిని గూర్చి మనఃసాక్షి చెప్పదా? మంచిది, ఒకవేళ నీవు కారణములపైన ఆధారపడబోతున్నట్లయితే, నీవు చనిపోవుటకు సిద్ధపడుదువు. అయితే ఒకవేళ ప్రభువు ఇచ్చిన వాగ్దానము యొద్దకు నీవు వెళితే మరియు దానిని నీవు నమ్మితే, అది మొత్తము ప్రణాళికనే మార్చివేయును.

34ఇప్పుడు, అది మార్పు చెందుచున్నట్లుగా, అక్కడ నున్న అదే విధముగా మార్చివేసినది, చూశారా. నేను కేవలము దానిని నమ్ముచున్నాను. అది ఏ విధముగా జరిగినదో తెలియదు, కానీ ఒక నూతన సృష్టి వచ్చినది. నేను… నేను సంఘమునకు వెళ్ళక పోయేవాడిని. నేను బాక్సింగ్ ఆటను ఆడేటప్పుడు, ఒక వ్యక్తి నాకు చెప్పాడు… నేను ఇక్కడ ఇవాన్స్ విల్లీ, ఇండియానా దగ్గర, నా పదిహేనవ ప్రొఫెషనల్ పోటీలో పోటీ చేయుచున్నాను. మరియు హోవార్డ్ మెక్లాన్… మీలో న్యూ-ఆల్బనీకి చెందినవారు అతడిని అక్కడ ఎరిగియున్నారు. మరియు మేము వీధిలో నడుచుచున్నాము. మరియు హోవార్డ్ ఒక వెల్టర్ వెయిట్ (బాక్సింగ్ పోటీలలో ఒక అర్హత ప్రమాణము-బరువును బట్టి) మరియు నేను ఒక బాంటమ్ వెయిట్, నేను పశ్చిమ వర్జీనీయాలోని - హటింగ్జిన్ నుండి వచ్చిన బిల్లీ ఫ్రిక్ తో పోరాడుచున్నాను. ఇటువంటి ఒక నీలము రంగు సూటు వేసుకున్నాను. ఆ రోజులలో, నాకు కొంచెము జుత్తు ఉండేది. మరియు నేను వీధిలో నడుస్తున్నాను. మేము రాత్రి భోజనము మూడు గంటలకు (మధ్యాహ్నము) తినెడివారము, ఆ రాత్రి పోటీకి సిద్ధపడేవారము. మేము అప్పుడు విశ్రాంతికి వెళ్ళేవారము, మరియు ఆ తరువాత మా చేతులు చుట్టుకొందుము. (ఆటకు సంబంధించిన గుడ్డలతో).

మరియు హోవార్డ్ నాకు చెప్పాడు, "బిల్, ఏమిటో నీకు తెలుసా?"

నేను చెప్పాను, "ఏమిటి?"

చెప్పాడు, "నీవొక చిన్న బాప్టిస్టు బోధకునివలె ఉన్నావు."

మరియు అతడు నన్ను ఏమైనా పిలిచియుండవచ్చు… నేను ఎన్నడూ … నేను వెనుకకు తిరిగాను. నేను చెప్పాను, "హోవార్డ్, ఇప్పుడు, ఒక్క క్షణం ఆగు. ఇప్పుడు, నీవు దానిని చెప్పినప్పుడు నీవు నవ్వెదవు."

నేను సుమారు ఇంత ఎత్తుగా ఉండి, అయితే నేను తిన్నగా అతడి పైకి పోరాడుటకు సిద్ధపడ్డాను. ఏ బోధకునితోనూ నాకు ఏమీ సంబంధము లేదు; మరియు ఇప్పుడు, మరియు అతడు నాకు ఇవ్వగోరిన అతి గొప్ప అభినందన అది. ఓ, ఎవరో ఏదో చెప్పినప్పుడు, "సహా బ్రెన్హాం, నీవొక బోధకునివలె కన్పిస్తున్నావు." "దేవునికి స్తోత్రం!" అని చెప్పుదును. చూశారా.

35ఏమిటి సంగతి? నేను చనిపోయాను! మరియు నేనొక నూతన సృష్టి. దానిని ఏ విధముగా నేను చేయగలిగాను? నేను ఆయన వాక్యమును తీసుకొన్నాను. "సహో బ్రెన్హాం, ఏ రకపు మందు, ఏ సూత్రమును నీవు తీసుకొన్నావు?" నేను దేనిని తీసుకోలేదు. "ఆయన దానిని ఏ విధముగా చేశాడు?" నాకు తెలియదు, కాని ఏది ఏమైనా, నేను దానిని నమ్మాను. నేను ఎన్నడూ ఏమీ తీసుకొనలేదు. నేను కేవలము దానిని నమ్మాను, మరియు నేను ఏమైయున్నానో దాని నుండి ఆయన నన్ను లేపియున్నాడు, ఒక పాపి నుండి ఒక క్రైస్తవునిగా. ఆయన దానిని చేసియున్నాడు, ఎందుకనగా నేను ఆయన వాక్యమును తీసుకొన్నాను. ఆయన వ్యాధితోనూ అదే సంగతి చేయును, ఆయన పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మముతోనూ అదే చేయును; ఆయన ఇచ్చిన ఏ వాగ్దానముతోనైనా, ఆయన అదే సంగతి చేయును.

36కానీ చూడండి, నా అంశము ఏమిటి? "పోరాటము." పోరాటము: దానిని గూర్చి తర్కించడానికి నీవు ప్రయత్నించేలా సాతాను చేస్తుంది, మరియు నీవు దానిని చేయవద్దు. కానీ నీవు క్రైస్తవునిగా మారిన తరువాత, అప్పుడు నీవు వాక్యము ద్వారా మరియు వాక్యములో ఉన్న ఏ వాగ్దానము ద్వారా అయినా కోట కట్టబడ్డావు. వ్యూ! నేను దానిని చెప్పబోతున్నానని తెలియదు.

నీవు… నీవు క్రైస్తవునిగా మారినప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యము వెనుక ఉంచబడ్డావు, చూశారా. ఇప్పుడు, అదిగో నీ కోట, భద్రత, ఓ, మై! దానిలో ఉన్న ప్రతీ వాగ్దానము నీదే. నీవు చేయవలసిన ఒకే ఒక సంగతి ఏదనగా కేవలము వెళ్ళి మరియు దానిని పొందుకో, మరియు దానితో తిన్నగా సాగిపో, "అది పనిచేస్తుందని నీకు ఏలాగు తెలియును? అది ఏలాగు పనిచేయునో నాకు తెలియదు. "నాకు వివరించుము." నాకు తెలియదు. నాకు తెలిసిన ఒకే సంగతి ఏమనగా, దేవుడు తన పిల్లలకు వారు కలిగియుండవలసిన ఒక మంచి ఎదురు దాడిని ఇచ్చియున్నాడు, మరియు ఎదురు దాడి చేయుటకు కావలసిన ఒక మంచి సంగతి, ఎందుకనగా శత్రువు యొక్క పనితనము ఆయనకు తెలుసు.

MATT 24:35•

JOHN 1:1

 

37ఇప్పుడు వినండి. దానిని పరిశీలన చేద్దాం — రక్తము యొక్క మూలకాల సమీకరణాన్ని తీసుకొనండి, లేక నీటి యొక్క రసాయన సమీకరణము, లేక అది ఏమైనా, చూశారా. దానిని పరిశీలన చేద్దాం. ఎందుకు? ఆయన వాక్యమును ఎందుకు ఇచ్చెను? ఎందుకనగా (మీరు సిద్ధముగా ఉన్నారా?) వాక్యము నిత్యమైనది, చూశారా. మరియు ఒకవేళ దేవుడు గనుక నిత్యమైన వాగ్దానము చేసినట్లయితే, మరియు ఏదీ ఎక్కడ కూడా దానిని ఆపలేదు.

వారు ఆపలేరు… ప్రతీ కణమును తలక్రిందులు చేయుము, మరియు దానిని వెనుకకు త్రిప్పుము, ఎన్నడూ దేవుని యొక్క వాక్యమును పొడవలేము, ఒక చిన్న వాక్యము, చూశారా, ఎందుకనగా యేసు చెప్పెను, "భూమ్యాకాశములు గతించిపోవును, కానీ నా మాట ఎన్నడూ గతించిపోదు," చూశారా. అదే అక్కడ ఉన్న శ్రేష్టమైన ఆయుధము. అది నిత్యదేవుని యొక్క వాక్యమైయున్నది.

ఇప్పుడు దేవుని యొక్క వాక్యమనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యమనగా స్వయముగా దేవుడే. కనుక, విశ్వాసికి దేవుడు స్వయముగా తనను తానే ఇచ్చుకున్నాడు. ఆమేన్. వ్యూ! అది స్వయముగా దేవుడే! శత్రువును ఎదుర్కోవడానికి ఆయన విశ్వాసికి స్వయముగా తననుతానే ఇచ్చుకొనెను. ఇంకొక మాటలో, ఆయనే తండ్రి మరియు వాక్యమే దేవుడైయుండెను. అప్పుడు వాక్యము మన తండ్రి అయి యున్నాడు. మనము వాక్యము ద్వారా జన్మించాము, మరియు ఆయన తన పిల్లల కొరకు ముందు నిలబడియున్నాడు. ఆమేన్! మీరు అక్కడే ఉన్నారు. తన పిల్లల కొరకు ఆయన అక్కడ నిలబడియున్నాడు. మనము దేనిని గూర్చి భయపడుచున్నాము? ఎత్తబాటు ఖచ్చితము, రాకడ ఖచ్చితము, వాగ్దానము చేయబడిన ప్రతీ ఆశీర్వాదము మనదే, అన్నీ మనకు చెందినవే.

1TIM 2:14

 

38ఇప్పుడు ఒకవేళ ఒక రకమైన మందగింపుతో మనము చెబితే… సాతాను చెబుతుంది, "ఇటు వైపుకు ఇలా రమ్ము. దాని కారణము నీకు ఇచ్చెదను." ఓ, అప్పుడు నీవు తండ్రి వెనుక ఉన్నావు, చూశారా. దానిని చేయవద్దు. తండ్రి ఎక్కడ నిలుచునో నీవునూ అక్కడే ఉండుము — అది ఎక్కడ చెప్పునో అక్కడ చెప్పుము. "అది తండ్రి ఈలాగు సెలవిచ్చునది," చూశారా. "నా తండ్రి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా తండ్రి ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది అతడిని ఓడించబోతుంది మరియు ఖచ్చితముగా, లోకమంతయు. అది చేయవలయును. అది సరే. కానీ హవ్వ చేసినట్లుగా, దాని వెనుక నుండి నీవు వస్తే, పోరాటము ఓడిపోతుంది.

ఇప్పుడు, దీన హవ్వ, ఆమె విన్నది. ఆమె తన స్థానము కోల్పోయినది. అది సరే. మరియు అప్పుడు తన కోటను పట్టుకొనియుండుటకు దేవుడు పురుషులను ఎన్నుకొనెను, మరియు అప్పటి నుండి ఆయన ఆ విధముగానే చేసెను. ఆ విధముగానే, చాలా సార్లు, ప్రజలు ఈ చివరి దినములలో కొన్నిసార్లు, "ఆ బలిపీఠముపై పురుషుడు చేయునట్లుగా ఒక స్త్రీ కూడా ఒక మంచి పని చేయగలదు అని నీవు ఎందుకు ఆలోచించలేవు?" అని చెబుతారు. నేను దానిని వాదించుట లేదు, ఎంత మాత్రము కాదు. కొన్నిసార్లు నేను చేయగలిగిన దాని కన్నా చాలా ఉత్తమముగా, వారిలో చాలా మంది చేయవచ్చు. కానీ మీరు చూడండి, దేవుడు ఏమి చేసియున్నాడో దానినే మనము తీసుకోవాలి, చూశారా. అక్కడే, ఆ గీతను దాటినది హవ్వ మాత్రమే. ఆదాము ఆ గీతను దాటలేదు. లేదయ్యా. అయితే అతడు తన భార్యను ప్రేమించినందుకు, అతడు ఆమెతో వెళ్ళిపోయియున్నాడు, చూశారా. కనుక, ఆ కోటను నిలిపియుంచుటకు దేవుడు పురుషునినే ఎన్నుకొనియున్నాడు.

39ఇప్పుడు, ఆ తరువాత మనము కనుగొన్నాము, ఆ పోరాటము ఓడిపోయిన తరువాత… నాశనమగు సమయము వారి యొద్దకు వచ్చినప్పుడు. ఆ తరువాత సారి, ఆ సమయము నుండి యుగముల యొక్క మార్చు జరుగుచున్నది. ఆ సమయము నుండి, ఆ యుద్ధము ఏ విధముగా జరిగినదో మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యముపై విశ్వాసముంచుటకు బదులుగా, తన యొక్క తర్కములపై (కారణములు) ఆధారపడి హవ్వ తన పోరాటము ఓడిపోయినదని మనకు తెలుసు. మనము దానిని తిరిగి చెబుదాం. దేవుని యొక్క వాక్యముపై విశ్వాసము౦చుటకు బదులుగా, ఆమె తన యొక్క కారణములపై ఆధారపడినది. దాని కారణము వెదికినది. అందువలన, ఆమె ఆ ముందు వరుసలను పగులగొట్టినది మరియు శత్రువు లోపలికి చొచ్చుకొని వచ్చినది. మరియు అప్పుడు మరణము లోకమును తాకినది. ఇప్పుడు అందువలన, ఆ ముందు వరుసను పట్టుకొని యుండుటకు, దేవుడు ఎన్నడూ ఆ స్త్రీలను నమ్మలేదు. అది పురుషునికే ఇవ్వబడినది.

40మరియు ఇప్పుడు, తరువాత యుగము యొక్క మార్పు, పోరాటము ఆరంభమైనది. మరియు ఇక్కడ నేనొక లేఖనము వైపు చూస్తున్నాను. నేను కొంచెము ప్రారంభించి మరియు దానిని చదివెదనని నేను నమ్ముచున్నాను. నిజముగా మనము ఎంత సమయము కలిగియున్నాము… నిజమా?… నేను దాదాపు… ఇంకా ఆరు గంటలు ఎక్కువ పట్టును, మరియు మంచిది… మరియు కావున మనము… అది నా భావము కాదు, ప్రజలారా. మంచిది. మీరు మీ బైబిళ్ళలో నుండి, ఇక్కడ ప్రారంభించెదము. కొద్ది నిముషములు చదివెదము. దానిని చదువుటకు నేను ఇష్టపడెదను, కొనసాగుతుండగా, మరియు అప్పుడు ఇది పూర్తిగా దేవుని యొక్క వాక్యము.

GEN 6:1,2•

LUKE 17:26

 

41యుగముల యొక్క మార్పు యొద్ద నుండి తిరిగి ప్రారంభించెదము, ఆదాము నుండి… ఆదాము యుగము నుండి నోవహు యుగము వరకు. ఇప్పుడు ఆ సమయము రావడానికి కొంచెము ముందు, ఏమి జరిగినదో కొంచెము చూద్దాం. ప్రారంభిద్దాము, ఆదికాండము 6వ అధ్యాయము నుండి ప్రారంభించి, మరియు కొన్ని వచనములు చదివెదము:

నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు,

దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు నచ్చినవారిని భార్యలనుగా తీసుకొనిరి.

ఇప్పుడు దానిని పోల్చెదము. ఇప్పుడు గుర్తించుకొనండి, యేసు చెప్పెను, "నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును." ఇప్పుడు గమనించండి, ఒక ఆదివారపుబడి పాఠము వలె, దానిని ఇప్పుడు జాగ్రత్తగా చదివెదము, ఒకటి లేదా రెండు వచనములకు.

అప్పుడు మరికొంత లేఖన భాగము కొరకు నేను వెళ్ళెదను, నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత, మరియు వారికి కుమార్తెలు పుట్టినప్పుడు [నరులు చూడండి],

… దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి [ఇప్పుడు, దానిని మీరు గమనించారా?] దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి; మరియు తమకు నచ్చిన వారిని భార్యలనుగా చేసుకొనిరి, [తమకు నచ్చిన వారినందరినీ].

GEN 2:21•

GEN 5:2•

GEN 6:2

 

42ఇప్పుడు, తత్వవేత్తలలో చాలా మంది గొప్పవారు… నేను వేరుగా ఉండగోరుట లేదు. నేను ఆ విధముగా భావించుట లేదు, కానీ తత్వవేత్తలు ఈ విధముగా నమ్మెదరని మీలో చాలా మందికి తెలుసు, అది "ఈ పడిపోయిన దూతలు, లూసిఫర్ యొక్క అబద్ధము ద్వారా పడిపోయినవారు, వారే తమకు భార్యలను తీసుకొనిరి. వారు పడిపోయిన దూతలు, నిజానికి దేవుని యొక్క కుమారులు - వారు కృప నుండి పడిపోయి, భూమి పైకి త్రోయబడ్డారు, తమకు తాము శరీరములలోనికి చొచ్చుకొని వెళ్ళి (బలవంతముగా), మరియు భార్యలను తీసుకొన్నారు." లేఖనములలో నుండి కొంచెము కారణములను వెదకెదమని నేను తలంచను. ఎందుకనగా, మొదటిగా ఒక పడిపోయిన దూత తననుతాను పురుషుడిగా చేసుకునే ముందు, మొదటిగా వాడు ఒక సృష్టికర్త అయి యుండవలసియున్నది. మరియు ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, మరియు ఆయన దేవుడే. కనుక అది దానిని కొట్టివేయును.

మరొక సంగతి, "దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలను తీసుకున్నారు, మరియు మీకు తెలుసా, బైబిలు ఎన్నడూ దూతలలో లింగభేదమును సూచించలేదు. చూశారా, దూతలలో లింగభేదమును సూచించుట లేదు. మరియు బైబిలులో ఎక్కడా ఒక ఆడ దూత ఉందని చెప్పబడలేదు, ఎందుకనగా స్త్రీ, పురుషుని యొక్క ఉప-ఉత్పత్తి. అంతా ఒకేలా ఉండును — చెప్పాలంటే మొదట ఆదాములో, హవ్వ మరియు ఆదాము ఉన్నట్లుగా, చూశారా. ఆమె అతడి ప్రక్కనుండి తీయబడినది. కాబట్టి ఇవి పడిపోయిన దూతలు అనే వారి వాదనను నిరర్ధకము చేస్తున్నది.

GEN 6:2•

LUKE 17:26

 

43అయితే — ఒకవేళ మీరు నన్ను క్షమించి మరియు నేనే అంతా ఇక్కడ తెలుసును అని చేయుచున్నట్లుగా ప్రయత్నిస్తున్నానని ఆలోచింప ప్రయత్నము చేయవద్దు, కానీ దానిని గూర్చిన నా ఆలోచన ఇచ్చుచున్నాను. నేను అనుకొనుచున్నాను, "ఈ దేవుని యొక్క కుమారులు షేతు యొక్క కుమారులు, కయీను వారి యొక్క కుమార్తెలను చూచి, కయీను వారు, వారు చక్కనివారని." ఎందుకనగా, "షేతు కుమారులు వచ్చారు… ఆదాము యొక్క కుమారుడు, ఎవరనగా దేవుని యొక్క కుమారుడు; కానీ కయీను యొక్క కుమార్తెలు - అతడు సాతాను యొక్క కుమారుడు."

ఇప్పుడు, మీరు గమనించండి, అంతములో, ఈ జలప్రళయము యొక్క నాశనమునకు ముందు, వారు గమనించారు; ఆ కయీను వారి యొక్క కుమారైలు చక్కనివారు, అందమైన వారు, ఆకర్షణీయమైన వారు. మీకు అర్థమైనదా? ఇప్పుడు, యేసు చెప్పెను, "నోవహు దినములలో ఉన్నట్టు, మనుష్యకుమారుని దినములలోను జరుగును." స్త్రీలు, ఆకర్షణీయమైన వారు. ఎటువంటి రకమైన స్త్రీలు? కయీను వారు, చూడండి, దేవుని యొక్క కుమారులను తీసుకొనుచున్నారు, చూశారా — దేవుని యొక్క కుమారులు, కయీను స్త్రీలను తీసుకొనుచున్నారు.

44గత యాభై సంవత్సరాలలో స్త్రీల యొక్క సాధారణ సౌందర్యము బాగా పెరిగిపోయినది… ఒక ఆకర్షణీయమైన స్త్రీ ఎలాగు కనిపించేదో చూచుటకు, యాభై సంవత్సరాల క్రితము ఒక చిత్రమును తీసుకొనెదము. గత దినమున, నేను చూస్తూ ఉన్నాను, యుద్ధముల యొక్క చరిత్రలో, వందల సంవత్సరాల క్రితము, ఏ విధముగా ఆ పెర్ల్ వైట్, తన ప్రియుడైన స్కాట్ జాక్సన్ చే పొడవబడినదో, మరియు స్త్రీల యొక్క అందము. ఇప్పుడు, కూడా, మేరీ బొన్నీ విల్లీ, మరియు ఆ విధముగా పిలువబడే అనేక మంది ఆకర్షణీయమైన స్త్రీలు, యాభై నుండి వంద సంవత్సరాల క్రితము, వారిని ఈనాటి స్త్రీలతో పోల్చండి, వారు కనీసము నీడలో కూడా నిలువలేరు. ఖచ్చితముగా నిలువలేరు.

బర్లీ స్త్రీలు అందముగా స్త్రీవాదులుగా, మరియు అటువంటివి, ఎంతో అందముగా మారిపోయారు. మరియు అది ఏమిటి? మరింత అందముగా కనపడులాగున వారు దుస్తులు ధరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు పురుషులు వారియందు కోరికను కలిగియుండకుండా, స్త్రీలు గొప్ప పొడవాటి దుస్తులు, మరియు పెద్ద గౌను మరియు పొడుగు పరికిణీలు ధరిస్తూ మరియు వారి శరీరమును కప్పుకొనేవారు (తమను భార్యగా ఎన్నుకొన్న ఒక్క పురుషుని కొరకు జీవించేవారు); ఈ రోజు స్త్రీలు తమనుతాము పొట్టి దుస్తులలో కుమ్మరించుకొనుచున్నారు, మరియు అనైతికత మరియు వినాశనము ఎంతగా కదులుచున్నదంటే, అది ఆలోచనను కూడా దాటియున్నది.

ISA 4:2,3

 

45నేను అక్కడ ఉన్నప్పుడు, గత దినమున నేను చికాగోను గూర్చిన ఒక విశ్లేషణను చదివాను, అది చాలా తాకియున్నది. న్యూయార్క, లాస్ ఏంజెల్స్, బర్మింగ్ హాము, మరియు చాలా అటువంటి పేరుగాంచిన పట్టణములు, ఈ క్లబ్బులోనికి, ఈ సామాజిక వినోద సంఘాలకు, ఎంతగా అంటే - కుటుంబాల వెంబడి కుటుంబాలు కలిపి వచ్చేస్తూ, పొరుగు వారి ద్వారా, ఈ వినోద సంఘాలలో చేరుతూ ఉన్నారు. మరియు వారు ఫలానా సమకూడు స్థలమునకు వెళ్ళి వారి తాళములను తీసుకొని, ఒక టోపిలోనికి వాటిని విసిరెదరు, ఆ స్త్రీలు అక్కడకు చేరుకొని మరియు ఒక తాళమును తీసుకొనెదరు మరియు వారు తిరిగి కలుసుకొనేంత వరకూ అతడే ఆమె భర్త. వారు మన అమెరికన్ స్త్రీలు. మీరు చూడండి, అది ఏమి చూపించగోరుచున్నది… వెనుక మళ్ళీ ఆదిలో అది స్త్రీ ద్వారా ప్రారంభించబడినది, లైంగిక చర్య ద్వారా, మరియు తిరిగి ఇప్పుడు అంతములో అదే విధముగా అది ముగియును. దేవుడు దానిని ఆశీర్వదించలేదు, ఏలయనగా ఒక నీతి గల మంచి స్త్రీ కొరకు. యెషయాలో చదవండి, చివరి దినములలో వారు ఏ విధముగా తప్పించుకొనెదరని ఆయన చెప్పెను, భూమి పైన ఉన్న ఈ భరింపరాని సంగతుల నుండి సీయోను కుమార్తెలు ఏ విధముగా తప్పించబడెదరో.

GEN 6:2-4

 

46ఇప్పుడు, "దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు నచ్చిన వారిని భార్యలనుగా తీసుకొని పోయిరి." — ఇప్పుడు అంతము యొక్క ఒక గొప్ప సూచన. ఇంకొక వచనము చదివెదము.

మరియు యెహోవా చెప్పెను, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, …

వెంటనే దీని తరువాత వివాహాలు జరుగనారంభించెను. లూకా అది చెప్పుచున్నాడు. నేను ఇక్కడ దానిని వ్రాసుకొన్నాను. లూకా 7:27 అది చెప్పుచున్నదని నేను అనుకొనుచున్నాను, ఎలా … లేక లూకా 17:27 అది చెప్పెను, ఏ విధముగా, నోవహు దినములలో వారు పెండ్లాడుచూ మరియు పెండ్లికియ్యబడుచూ నుండిరి. చూడండి, ఏ విధముగా అది ఉన్నదో? అదే సంగతి. పురుషులు ఆకర్షణీయతను చూసారు… దేవుని యొక్క కుమారులు కోటను పట్టుకొనియుండుటకు బదులుగా, వారు నరుల యొక్క కుమార్తెలను చూచిరి — నరుల యొక్క. వారు చాలా అందముగా, ఆకర్షణీయముగా అయ్యారు అని, మరియు వారిని భార్యలనుగా తీసుకొని, మరియు వారు పెండ్లి చేసుకొని, మరియు పెండ్లికియ్యబడుచూ నుండిరి. అదే సంగతి వారు ఈ రోజు కూడా చేయుచున్నారు, చూశారా.

మరియు యెహోవా చెప్పెను, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులైయున్నారు: అయినను వారి దినములు నూట-ఇరువది యేండ్లగుననెను.

ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి; తరువాత, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.

47ఈ అందమైన, విద్యావంతులైన కయీను స్త్రీలను గమనించుము. (లేదు…) కయీను వంశావళి నుండి వచ్చి వారు, ఈ దీనులైన వ్యవసాయదారులైన షేతు కుమారులను వివాహము చేసుకొన్నారు. మరియు అక్కడ నుండి, "బలాఢ్యులు" మరియు "పేరుపొందిన" వారయ్యారు. వారు గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప వడ్రంగి పనివారు అవ్వడము మనము కనుగొన్నాము. గొప్ప అందమైన, విద్యావంతులైన ప్రజలు, మరియు వారు గొప్ప ధనమును కలిగియున్నారు. మరియు మనము ఈ రోజుకు కూడా నిర్మించలేని గొప్ప పిరమిడ్లను నిర్మించగలిగినంత శాస్త్రయుక్తమైన యుగములో వారు జీవించారు. కాలమనే ఇసుకలో ఈ రోజుకు కూడా మనము పునరుత్పత్తి చేయలేని స్పినిక్స్ విగ్రహము మరియు చాలా గొప్ప చిహ్నములుగా రాతి కట్టడాలపై మనము చూసే వాటిని వారు నిర్మించారు. ఎందుకనగా ఆ ప్రజలు తమ జ్ఞానముపై ఆధారపడి, మరియు శాస్త్రవేత్తలుగా మరియు తెలివైన వారిగా, మరియు పేరుగాంచిన వారిగా అయ్యారు.

కానీ దేవుని యొక్క కుమారులు, దీనులుగానే ఉన్నారు, అటువంటి సంగతులకు దూరముగా ఉండి, మరియు అంతములో అన్ని సంగతులను వారు స్వతంత్రించుకొనబోవుచున్నారని ఎరిగి, మరియు దేవునిపై ఆధారపడ్డారు, చూశారా.

కనుక ప్రజలు ఈ రోజు చెబుతారు, "వారు తెలివైనవారు, వారు ఇవన్నీ కలిగియున్నారు, మేము ఇవన్నీ చేస్తాము, కనుక అంతకు ముందు ఉన్నదాని కన్నా ఎక్కువ తెలివైనవారము;" మరియు మనము అంతకు ముందు ఉన్నదాని కన్ననూ మరింత ఎక్కువగా దేవునికి దూరముగా ఉన్నాము, చూశారా. వెంటనే అక్కడే నిన్నునీవు లాగివేసుకొనుము.

48ఇంకా క్రిందకు చదువుటకు నేను ఎక్కువ సమయము తీసుకొనను. ఎప్పుడైనా, నీకు అవకాశము వచ్చినప్పుడు, క్రిందకు చదువుము, ఆదికాండము 6వ అధ్యాయము, ఏ విధముగా ఆ సంగతులు జరిగియున్నవి. ఒక చిన్న గుర్తు ఇక్కడ వ్రాసుకొన్నాను, నేను దానిని చదివానని అనుకొనుచున్నాను, నేను దానిని చదివెదను - కేవలము ఒకటి లేక రెండు వచనములు, ఈ కాలము నోవహు యొక్క కాలమునకు ఏ విధముగా సమాంతరముగా ఉన్నదో చూపించగోరుచున్నాను.

ఇప్పుడు, జనులు పెండ్లాడుచూ మరియు పెండ్లికియ్యబడుచూ నుండడము మనము చూస్తున్నాము. స్త్రీ యొక్క అందము, దేవుని యొక్క కుమారులకు ఆకర్షణీయముగా ఉండుటకు, వారి దుస్తులను తీసివేయడము మనము చూస్తున్నాము. ఇప్పుడు, కేవలము స్త్రీలపైనే వర్తమానము యొక్క ఈ భాగమును మోపడము కాదు. ఇక్కడున్న స్త్రీలవంటి వారిని కలిగియున్నందుకు నేను కృతజ్ఞుడిని, ఆ స్త్రీలు, ఇంకనూ గౌరవ-మర్యాదలు గలిగిన యవ్వన స్త్రీಲು, అది వారిపై మోపడం లేదు. ఇప్పుడు, హవ్వ వలె ఒక మాదిరి స్త్రీ, ఈ రోజు తిరిగి అంజూరపు ఆకులలో ఉన్నది. మరియు "అంజూరపు ఆకు" నిజానికి ఒక మానవ-నిర్మిత వ్యవస్థ, పొట్టి దుస్తులు, పొగ త్రాగడము, పొట్టి జుట్టు, ఆకర్షణ. దానిని వారెందుకు చేయుదురు, వారి భర్తకు అగుపించుట కొరకా? ఒకవేళ వారు చేస్తే, అప్పుడు అతడు దేవుని యొక్క కుమారుడు కాదు; అతడు ఒక కయీను వాడు. మరియు అప్పుడు ఒకవేళ అతడు ఒక దేవుని కుమారుడైతే, "నీ ముఖము కడుగుకొని మరియు కొన్ని దుస్తులు ధరించు," అని నీకు చెబుతాడు, చూశారా? అవును.

2SAM 11:24•

HEB 1:1

 

49ఇప్పుడు, దేవుడు ఈ సమయములో, తన యొక్క బిడ్డల కొరకు, తన యొక్క వాక్యమును తిరిగి పంపించుటను ఆయన ఎన్నుకొనెను. మరియు ఆయన ఒక ప్రవక్తను ఎన్నుకొనెను. "మరియు ప్రభువు యొక్క వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకు వచ్చును." మరియు నోవహు మరియు హనోకు, ఎంత అందమైన మాదిరి.

JOHN 5:24•

REV 1:5

 

50మరియు కొంతమంది… చాలా సార్లు, జనులు … నేను సమాధానమివ్వలేని కొన్ని ప్రశ్నలు, నేను గమనించాను. వారు ఆ ప్రశ్న అడిగారు. "సహోదరుడు బ్రెన్హాం, నేను నీతో ఏకీభవించలేను," అన్నారు. నేను ఇప్పుడు వెళ్ళబోవుచున్న, కొన్ని చాలా మంచి వ్యాసములు వ్రాసిన ఆ ప్రశస్త సహోదరుడు. సహోదరుడు… (ఆ వ్యక్తి పేరు ఏమిటి, మనము ప్రసంగించుటకు వెళ్ళుచున్న అక్కడ ఉన్న ఈ జరుగబోవుచున్న తరువాత కూడిక సౌత్ పైన్ వద్ద లేక సదరన్ పైన్? పార్కర్, ధామస్ పార్కర్. "సంఘము శ్రమలకాలములోనికి వెళ్ళదని సహోదరుడు బ్రెన్హాం నమ్ముతాడు, నేను ఆయనతో ఏకీభవించని ఒక విషయము," అతడు చెప్పాడు. "శుద్దీకరణ కొరకు సంఘము శ్రమలకాలము గుండా వెళ్ళును అని నేను నమ్ముతాను," అని చెప్పాడు.

మరప్పుడు యేసు యొక్క రక్తము సంగతి ఏమిటి, చూశారా? ఏ ఉపమానములోని ఏ స్థలమందైనా, లేక ఏ వాక్యములోనైనా, సంఘము శ్రమల కాలములోనికి వెళ్ళును అని లేదు. (ఎవరో ఒక ఫ్యాన్ ను కదుపుచున్నారు — బట్టతల లేనివారి పైన అది ఉంచవలసియున్నది, వారికి త్వరగా గొంతు బొంగురు పోదు.) సంఘము శ్రమలకాలము గుండా వెళ్ళును అని చెప్పు ఒక్క స్థలము కూడా లేదు. క్రీస్తు యొక్క రక్తము, మరియు యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క సంపూర్ణ పనితనము, ప్రతీ పాపమును తుడిచివేయును. మరియు మనమెందుకు శుద్ధిచేయబడాలి? ప్రతీ దినము మనము శుద్ధిచేయబడుచున్నాము. శ్రమల కాలము లేదు. వినండి. పరిశుద్ధ యోహను 5:24లో యేసు ఏమి చెప్పెనో వినండి, "నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు." ఆమేన్.

GEN 5:24•

HEB 11:5

 

51హనోకు, ప్రవక్త… నోవహు యూదులకు ఒక మాదిరి, శేషము, దేవుని యొక్క సేవకుడు; మరియు హనోకు, ప్రభువు యొక్క రాకడను గూర్చి ప్రవచించిన గొప్ప ప్రవక్త, రూపాంతరపరచబడ్డాడు — వరదలకు ముందు ఎత్తబడ్డాడు. భూమిపై విత్తనమును సంరక్షించేందుకు, నోవహు దాని గుండా ప్రయాణించాడు.

ఇప్పుడు, తన ప్రవక్త ద్వారా దేవుడు వాక్యమును పంపించెను, నోవహు. మరియు నోవహు మరియు హానోకు ప్రవచించుట ఆరంభించగానే, మరియు అప్పుడు ఆ వరద తాకుటకు కొంచెము ముందు, ఏమి జరిగినది? హానోకు పైకి వెళ్ళాడు (ఎత్తబడ్డాడు); నోవహు దాని గుండా వెళ్ళాడు, చూశారా. హానోకు మార్చబడ్డాడు. నోవహు యొక్క సూచన, ఏమనగా హానోకును గమనించుట. ఎప్పుడైతే హానోకు కనబడకుండా పోయాడో , అప్పుడు వరద సమీపముననే ఉన్నదని నోవహు ఎరిగియున్నాడు, ఎందుకనగా అతడు తన దృష్టిని హానోకుపై ఉంచియుండెను.

52ఇప్పుడు, సాతాను ఈ సమయములో, ఏదెను తోటలో వాడు చేసియున్న అదే వ్యవస్థను తిరిగి నెలకొల్పెను, ఈ ప్రవక్తల మాటల యందు కారణములు వెదకుట, అదే సంగతి! ఇప్పుడు, సాతాను వాడి యొక్క వ్యవస్థను పైకి తీసికొని వచ్చాడు. ఇప్పుడు దానితో వ్యవహరించుటకు వాడికి ఒకరూ లేదా ఇద్దరు జనుల కన్నా ఎక్కువ ప్రజలు ఉన్నారు; వాడు వ్యవహరించుటకు కొన్ని లక్షల మందిని కలిగియున్నాడు. జలప్రయలము కాలములో — ఇప్పుడు ఉన్నదానికంటెను ఎక్కువ ప్రజలు. వారు భూమి యందంతటా విస్తరించారు. ఆ కాలములో ఒక గొప్ప భూజనాంగము ఉన్నారు, బహుశా ఇప్పుడున్న దాని కన్నా మరెక్కువగా. మరియు ఇప్పుడు చూడండి, సాతాను ఒక్కరితో ఆ వ్యవస్థ కాదు — హవ్వతో — అతడు తనకు ఒక వ్యవస్థను తయారు చేసుకొనెను. అది ఏమిటి? ప్రవక్తల యొద్దకు వచ్చిన ప్రభువు యొక్క వాక్యముతో పోరాడుట. మీకు అర్థమైందా? ప్రతీసారి, వాడు అదే పాత తంత్రమును ఉపయోగించును; మరియు దేవుడు ఎల్లప్పుడూ తన దానితోనే నిలిచియుండును, అది వాక్యము.

53ఒక ఓడను నిర్మిస్తూ, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానితో, ఇక్కడ నోవహు మరియు హనోకు వచ్చెను. ఇప్పుడు, గమనించండి, సాతాను యొక్క వ్యవస్థ దేవుని యొక్క వ్యవస్థను చూసి నవ్వియున్నది. ఇప్పుడు నేటితో దానిని పోల్చండి, "పరిశుద్ధ బండరాళ్ళు," మరియు ఇంకా ఏమిటి, చూశారా. అపహాస్యకులు, బైబిಲು చెప్పెను. వారు దేవుని యొక్క వ్యవస్థను చూసి నవ్వియున్నారు. సాతాను యొక్క వ్యవస్థ దేవుని యొక్క వ్యవస్థను చూసి నవ్వియున్నది. అది వారి యొక్క సొంత ఆలోచనకు మరియు తర్కమునకు తగినట్లుగా లేదని వారు ఆలోచించిరి.

ఇప్పుడు, వారు చెప్పారు, "కొండపైన ఆ ముసలివాడు, ఓడను కట్టుచున్నాడు, మరియు ఎక్కడో పై నుండి కొంచెము నీరు రాబోవుచున్నదని అతడు చెప్పుచున్నాడు. ఇప్పుడు, ప్రపంచములోనే శ్రేష్టమైన శాస్త్రవేత్తలను మనము కలిగియున్నాము. ఇప్పుడు, బహుశా చంద్రుని పైకి ప్రయోగించగల ఒక రాడార్ ను కలిగియున్నారు, మరియు ఇంకేమిటి, మరియు అక్కడ నీరు లేదని వారు నిరూపించగలరు. ఇప్పుడు, ఏ విధముగానైనా, ఏదైనా దిగి వచ్చునా? ముసలివాడా, నీకు పిచ్చిపట్టినది."

"కానీ నాకు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉన్నది. వెంటనే నిర్మించు, ఓడ ద్వారము దగ్గర నిలబడి, సువార్తను బోధిస్తూ, మరియు నిర్మిస్తూ, మరియు హానోకును గమనించుచున్నాడు.

ఒక సాయంకాలమున, ఆయన అక్కడికి వచ్చినప్పుడు, అడిగాడు, "అక్కడ దానిని వారు స్వీకరించారా?"

"లేదు, వారు నన్ను చూసి నవ్వుచున్నారు. వారు నాపై కుళ్ళిన గుడ్లను విసిరియున్నారు, మరియు ప్రతీది."

"ఇక్కడ కూడా అదే చేసెను, అయితే వెంటనే విసురుదాము," చూశారా.

"ఓ, వారు నన్ను ఒక పరిశుద్ధ-బండరాయి అని, మరియు ప్రతీది పిలుచుచున్నారు, కానీ అది పరవాలేదు."

వారందరూ ప్రార్ధనా కూడిక కొరకు సమకూడియున్నారు, మరియు అదే విధముగా కొనసాగిరి, చూడండి. ఖచ్చితముగా ఈ రోజు జరుగుచున్నట్లుగానే అది ఉన్నది, ఎందుకనగా వారు కోట కట్టబడియున్నారని వారు ఎరిగియున్నారు, ఎందుకనగా వారు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" వెనుక నిలబడియున్నారు.

ఇప్పుడు, సాధారణ మామూలు కారణము వెదుకువాడు చెప్పును, "ఓ, అది బుద్ధిహీనత."

ISA 6:3

 

54ఒక స్త్రీ ఒకసారి చెప్పినది… ఒకసారి నేను… ఈ బాలుడు బాప్టిస్టు సంఘములో సండే స్కూలు బోధించేవాడు. ఒక రాత్రి, నేను అక్కడ ప్రసంగించుచున్నాను. మరియు నేను అతనిని డౌన్ టౌన్ వద్ద కలుసుకొన్నాను. నేను సైకిల్ పై ఉన్నాను. నేను డౌన్ టౌన్ లో ఉన్నాను మరియు నేను అతడని కలుసుకొన్నాను. అతడు ఒక సైకిల్ పై ఉన్నాడు. అతడు ప్రక్కకు తీసుకొన్నాడు. అతడు చెప్పాడు, "బిల్లీ, గతరాత్రి నీ ప్రసంగము వినుటకు నేను వచ్చాను." మరియు చెప్పాడు, "ఆ స్త్రీಲು ఏడ్వనారంభించి మరియు వెళ్ళుపోవునంత వరకూ నీవు చెప్పుచున్న దానిని నేను ఆనందించుచున్నాను, ఆ ప్రజలందరూ 'ఆమేన్' చెప్పుచున్నారు." మరియు చెప్పాడు, "నేను దానిని భరించలేకపోయాను," చూశారా. అతడు చెప్పాడు, "నీవు ఏదైనా చెప్పుచున్నప్పుడు, వెంటనే ఆ ప్రజలు 'ఆమేన్!' చెప్పడము వింటే అది వెన్ను జలదరించేది."

నేను చెప్పాను, "సహోదరుడా, నాకు అది ఆలాగు ప్రభావమును చూపలేదు." నేను చెప్పాను, "ఆ చిన్న అరుపులు మరియు వారు చేయుచున్న సంగతులు, "ఆమేన్" చెప్పడము నీవు నమ్మట లేదా?"

చెప్పాడు, "లేదు, నేను దానిని నమ్మట లేదు."

నేను చెప్పాను, "ఒకవేళ నీవు ఎప్పుడైనా పరలోకమునకు వెళితే, నీవు గడ్డ కట్టుకొనిపోతావు." నేను చెప్పాను, "ఎందుకనగా, ఒకవేళ అదే నీ వెన్ను జలదరించేలా చేస్తే, మరి దేవదూతలు దేవుని ముందు నిలబడి, దివారాత్రములు, "పరిశుద్దుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు, సర్వశక్తుడైన ప్రభువగు దేవుడు. పరిశుద్దుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు అని అరుస్తూ ఉన్నప్పుడు, ఏమి జరుగును? ఎందుకు, నీవు జీవించగలిగే నిశ్శబ్దమైన ప్రపంచమేదైనా ఉన్నదంటే, అది ఇదే." అది నిజము.

నరకములో ఏడ్పును మరియు పండ్లు కొరుకుటను ఉండును; పరలోకములో అరుపులు మరియు కేకలు ఉండును. కనుక నీవు ఎప్పుడైనా ఉండదగిన నిశ్శబ్ద ప్రపంచములో ఇప్పుడు నీవు ఉన్నావు. కాబట్టి ఒకదానికైనా లేక మరొకటైనా, దానికి నీవు అలవాటుపడుట మంచిది. కనుక నేను నా అవకాశమును తీసుకొని మరియు దేవుని యొక్క వాక్యము వెనుకకు వచ్చెదను. మీరునూ ఆలాగు చేయరా? దానినే కొనసాగిస్తూ నుండుము. అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." కొనసాగుతూ ను౦డుము. సరియే.

MARK 16:17

 

55అయిననూ అది వారి యొక్క శాస్త్రీయ సమీకరణమునకు అందలేదు. మరియు ఈ రోజు, దేవుడు ఈ విధముగా చెప్పియున్నాడు, వెళ్ళి వారికి చెప్పు మరియు ముందు జరుగబోవునది చెప్పు, భాషలలో మాట్లాడుట, అనువదించుట, దేవుని యొక్క ఆత్మ హృదయ రహస్యములను వివేచించుట, ఇటువంటి వేర్వేరు వరములను వారు చూసినప్పుడు; అది మనస్సులను చదువుట (telepathy), అని వారు చెప్పెదరు, చూశారా. దానిని వారు లోపలికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించెదరు. వారు చెప్పెదరు, "మంచిది, అది జరగడం మేము చూచియున్నాము, కానీ అది ఏమిటో నీకు తెలుసా, అది ఒక మానవ మనస్సులను చదువుట."

కానీ అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు".

యేసు చెప్పెను, "నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును," నాకు అంతే తెలుసు. ఎంత కాలము? "యుగ సమాప్తి వరకూ."

అది వారి యొక్క శాస్త్రీయ పరిశోధనకు అందలేదు, కనుక వారు దానిని చూసి నవ్వియున్నారు. మరియు నోవహు యొక్క దినములలో కూడా వారు అదే సంగతిని చేసియున్నారు. ఓ, అవును. అది వారి యొక్క తర్కమునకు అందలేదు. దానికి కారణము నీవు వెదకలేవు, కానీ అది దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు ఒకే రీతిగా ఉండును. అది సరియే.

MARK 16:17

 

56కనుక ఏదెనులో వాడు చేసినట్లుగా, నోవహు యొక్క గుంపుపై సాతాను వాడి దాడిని ఆరంభించెను, మరియు ప్రతీ దానిని విశ్వాసము ద్వారా ఎన్నుకొనవలసియున్నది. మహిమ! నీవు తీసుకొని వచ్చినదేదో కాదు, కానీ విశ్వాసము ద్వారా; మరియు నీవు తీసుకొని రాగలిగిన ఒకే మార్గము - విశ్వాసము ద్వారా, సంఘ శాఖల యొక్క అబద్ధమును నమ్ముట అనగా, మొదటగా - దేవుని యొక్క వాక్యమును తిరస్కరించుటయే. మీరు రక్షణను గూర్చి ఆలోచించుచున్నారా? అది ఇదే. మరియు నీవు దీనిని నమ్మకుండా ఉండు ఒకే ఒక మార్గము, నీవు తిరిగి జన్మించగలిగిన, దేవుని యొక్క వాక్యముపై విశ్వాసముంచుటకు బదులుగా — కారణము ద్వారా, దెయ్యము యొక్క నకిలీ అబద్ధముపై నీవు విశ్వాసముంచుటయే. మరియు మీరు ఆ విధముగా చేసినప్పుడు, నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును. ఓ, నేను దీనిని ప్రేమించెదను. అది నాకు మంచిగా అనిపించును, చూశారా.

ఎవ్వరు ఏమి చెప్పినా గాని, ఆయన వాక్యమును నమ్ముము, "దేవుడు అలాగు చెప్పెను. దేవుడు అలాగు చెప్పెను."

వారు చెప్పును, "మంచిది, ఇది ఫలానా-ఫలానా…"

"కానీ, దేవుడు అలాగు చెప్పెను."

"మంచిది, మేము ప్రెస్బిటేరియన్…"

నేను పట్టించుకోను, అయితే దేవుడు అలాగు చెప్పెను."

"మేము బాప్టిస్టు."

నేను పట్టించుకోను; దేవుడు అలాగు చెప్పెను," చూశారా.

"మేము కేథలిక్."

"దేవుడు అలాగు చెప్పెను," చూశారా. ఈ విధముగానే నిలిచి యుండుము.

"ఎందుకు, మా పాష్టరుకు అనేకమైన డిగ్రీలు ఉన్నవి."

"కానీ, దేవుడు అలాగు చెప్పెను."

"మా పోప్లు ఇవి కలిగియున్నారు, మా బిషప్పులు ఇవి కలిగియున్నారు."

"కానీ, దేవుడు అలాగు చెప్పెను."

PS 3:3•

PS 18:2,10•

MATT 5:5•

1COR 12:13•

GAL 2:20

 

57అక్కడే నిలిచియుండము! అది నీ దుర్గము — దేవుని యొక్క వాక్యములో కోట కట్టబడుట. చుట్టబడుట. ఎందుకు, నీవు వాక్యములో బాప్తీస్మము పొందావు. ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మ ద్వారా మనమందరము బాషీస్మము పొందియున్నాము, మరియు ఆ శరీరమే క్రీస్తు. అది నిజమేనా? అవునయ్యా. ఒక్క ఆత్మ ద్వారా, అందరము దేవుని యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము, అప్పుడు నీవు దేవునిలోనికి బాప్తీస్మము పొందావు. నీవు దేవునితో కోట కట్టబడ్డావు. ఆయన వాక్యమే నీ కోట.

ఆయనే బలమైన దుర్గము. ప్రభువు యొక్క నామమే బలమైన దుర్గము; నీతిమంతులు అందులోనికి పరుగెత్తి వెళ్ళి, మరియు సురక్షితముగా ఉందురు. ఆయనే నా కోట, నా పట్టు, నా కవచము, నా బూట్లు, నా టోపి, నా కోటు, నా హృదయము, నా సమస్తములో సమస్తము — ఓ దేవా, సమస్తములో సమస్తమై యున్నాడు. దేవుడు — ఆయనలో చుట్టబెట్టుకొని యున్నాడు, లోకమునకు మరణించి, పునరుత్థానములో ఆయనతో పాటు లేచెను. "నేనెంతమాత్రము జీవించుట కాదు, కానీ క్రీస్తే మనలో జీవించుచున్నాడు.

"ఆ గొప్ప వెయ్యేండ్ల దినము వచ్చుట కొరకు మనము చూస్తున్నాము, అప్పుడు ఆశీర్వదించబడిన ప్రభువు వచ్చి మరియు ఎదురుచూస్తున్న తన వధువును తీసుకొనిపోవును. ఓ, ఎప్పుడు మన రక్షకుడు భూమిపైకి తిరిగి వచ్చును అని లోకము మూలుగుచు - మధురమైన ఆ విడుదల దినము కొరకు ఏడ్చుచున్నది." అప్పుడు సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు.

ప్రతీది విశ్వాసము ద్వారా ఎన్నుకొనబడవలసియున్నది. నీవు దానిని చేయవలసియున్నది. నీవు, ఈ దినాన దెయ్యము యొక్క అబద్దమునైనా నమ్మవలయును; లేదా దేవుని యొక్క వాక్యమును నమ్మవలెను — అది రెంటిలో ఏదైనా ఒకటి.

GEN 6:2

 

58ఇప్పుడు మనము కనుగొన్నాము… ఇక్కడ మనము విడిచిపెట్టుటకు ముందు, ఒక్క క్షణము కొరకు నోవహును తీసుకొనెదము. నేను ఊహించగలను, నోవహు, మీకు తెలుసు, దానిగుండా వెళ్ళుటకు అతడికి కొన్ని సంగతులు కలవు. అతడు వీదిలొనికి వెళ్ళి, "తీర్పు రాబోవుచున్నది!" అని అతడు చెప్పుటను నేను ఊహించగలను.

ఎందుకు, వారు… "నీకు ఏలాగు తెలుసు? ఎటువంటి తీర్పు అది?"

"ఈ పాపయుక్తమైన దేశమును దేవుడు తాకును! కయీను యొక్క కుమార్తెలను దేవుని యొక్క కుమారులు వివాహము చేసుకొనిరి, మరియు అక్కడ వారున్నారు. నీవు ఏలాగు మారి యున్నావో చూచుకొనుము. నీవు దేవుని యొద్ద నుండి తిరిగియున్నావు. నీ గొప్ప మతసంబంధమైన వ్యవస్థలను నీవు కలిగియున్నావు. నీవు ఈ సంగతులన్నీ కలిగియున్నావు, కానీ దేవుడు భూమిని తాకును!"

చెప్పెను, "దీన ముసలివాడు, అతడొక రకపు… అతడిని ఒంటరిగా విడిచిపెట్టుము, చూశారా. అతడు…" కానీ అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడును" కలిగియుండెను. అతడేమి చెప్పుచున్నాడో అతడు రుజువు చేయగలడు, కానీ వారు దానిని నమ్మియుండలేదు, చూశారా. అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియుండెను.

GEN 7:9,15

 

59ఇప్పుడు, బహుశా దినము తరువాత దినము, వారు నవ్వి మరియు అపహాస్యము చేసెను. బహుశా పిల్లలు అతడిని ఆటపట్టించి యుండవచ్చు. కానీ నోవహు బోధించుచూనే ఉండెను, ఏ విధముగానైనా, మరియు తన కటుంబమంతా మరియు మార్పుచెందిన వారంతా నమ్ముచూ కొనసాగుచునుండిరి, ఏ విధముగానైనా, నోవహును వెంబడించిన వారంతా నోవహును నమ్మియుండిరి. అది నిజము. ఈ లోకము ఏమి చెప్పినది అని నమ్ముటకు, లేక ఈ బలమైన అభిషేకించబడిన ప్రవక్త చెప్పినది నమ్ముటకు, వారు తమ ఎంపిక చేసుకొనవలసియున్నది. కనుక అతడు చెప్పాడు, "ఇప్పుడు గమనించండి, ఈ ఒకానొక రోజులలు హనోకు కొనిపోబడబోవుచున్నాడు, సంఘము. మరియు అది జరిగినప్పుడు… హనోకు వెళ్ళిపోయినప్పుడు, మనము లోపలికి వెళ్ళుట మంచిది. మనము హనోకును కోల్పోనైయున్నాము; అతడు కొనిపోబడబోవుచున్నాడు, కాబట్టి మనము లోపలికి వెళ్ళుట మంచిది." కనుక దినములు గడుస్తుండగా వారు జాగ్రత్తగా గమనించుచుండిరి.

కొంత సమయము తరువాత, దేవుడు చెప్పాడు, "వారు పరిహాసము ఇక నాకు చాలు. వారి అవమానములు ఇక నాకు చాలు. నేను దానిని తీసుకొని రాబోవుచున్నాను. ఇప్పుడు జంతువులను తీసుకొనుము, అక్కడికి వెళ్ళి మరియు ఐదు సార్లు, "హల్లెలూయా!" అని బిగ్గరగా కేక వేయుము, మరియు ఆ పక్షులు ఎగురుకుంటూ వచ్చును. సింహములన్నీ ప్రతీదియు, వచ్చును, జతలు జతలుగా, నాలుగు లేక అయిదు సార్లు, "దేవునికి స్తోత్రము!" అని బిగ్గరగా కేక వేయుము మరియు ఇక్కడకు అవి వచ్చును," చూశారా.

GEN 7:7-16•

JOHN 10:7,9•

REV 3:8

 

60ఇప్పుడు, కావున నోవహు సిద్ధపడెను, మరియు జంతువులన్నీ లోపలికి వెళ్ళెను, మరియు అప్పుడు నోవహు స్వయముగా లోపలికి వెళ్ళెను. మరియు అతడు లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు యొద్ద నిలువబడి అతడు చెప్పిన చివరి సంగతి అని నేను ఊహించుచున్నాను, మరియు "ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఇది చివరి పిలుపు, అని చెప్పాడు. ఈ రోజు మనము అక్కడే నిలువబడి యున్నాము — ఓడ యొక్క తలుపు వద్ద. క్రీస్తే ఆ ద్వారము.

ఒకవేళ మీరు దానిని అక్షరార్ధముగా తీసుకొని, మరియు దానిపైన కొంచెము కసరత్తు చేయగోరిన ఎడల ప్రకటన గ్రంధములోని ఫిలడెల్ఫియాకు మరియు లవొదికయా కాలమునకు మధ్యన తీసుకొనండి. ఆయన చెప్పాడు, "మీ ముందు ఒక తెరువబడిన ద్వారమును ఉంచియున్నాను, మరియు మీరు దానిని తిరస్కరించియున్నారు," చూశారా. ఆ ఘడియలోనే మనము జీవించుచున్నాము, నాశనమునకు ముందు — ఒక తెరువబడిన ద్వారము. కానీ వారు వినరు. ఇప్పుడు వారు ఆయనను త్రోసివేసియున్నారు. ఇప్పుడు ఆయన ద్వారములో నిలువబడి, "దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడు ఘడియ సమీపములోనే ఉన్నది," అని ప్రకటించెను. అది నిజము.

GEN 7:16

 

61ఓడలోనికి అతడు వెళ్ళెను. మరియు అతడు ఓడలోనికి వెళ్ళినప్పుడు, ఏమిటో మీకు తెలుసా? దేవుడు ద్వారమును మూసివేసెను. ఓ, మై! ఎవరూ దానిని మూయనక్కర లేదు; దేవుడే దానిని మూసివేశాడు. అంతయూ అదే — రక్షించబడుటకు ఉన్న చివరి అవకాశము కూడా పోయినది. కనుక నేను ఊహించగలను, దాదాపు అయిదు వందల గజాల ఓడ అక్కడ, దాని చుట్టూ, పిల్లలు చేతులు చేతులు కలిపి తిరుగుచున్నారు. మరియు ఆ ముసలివారు దాని చుట్టూ తిరుగుతూ మరియు చెప్పెను, "మంచిది, ఆ ముసలివాడు అక్కడే దానిలోనే పడి చచ్చును," చూశారా. కనుక, అలా, అతడిని గూర్చి అపహాస్యము చేస్తూ, అదే విధముగా, ఎగతాళి చేసెను.

మరియు మీకు తెలుసు, ప్రతీ మనుష్యుడు… (ఇప్పుడు వినండి. బహుశా ఇది మీకు సహాయపడవచ్చును. జాగ్రత్తగా వినండి.) నీవు దేవుని యొక్క వాక్యమును తీసుకొని, మరియు దేవుని యొక్క వాక్యమును వెంబడించినప్పుడు, చాలా సార్లు, అది నీవు చేయగలిగినదంతా చేసిన తరువాత, నీ విశ్వాసమునకు ఒక పరీక్ష పెట్టబడును. ఇక్కడ స్థానిక జనులు తప్ప మరెవ్వరునూ లేరు. ఆ నేలపైనే నేను ఇప్పుడు నిలబడియున్నాను. అది నిజము. ఏమి చేయవలయునో నాకు తెలియదు. ఉజ్జీవము ముగిసినది, మీరు చూశారా. తరువాత పిలుపు ఎక్కడికి అనేది నాకు తెలియదు. నేను కేవలము నిలబడి — భయముతో, చూస్తూ, తరువాత ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాను.

62నోవహు లోపలికి వెళ్ళెను, అతడు దేవుని యొక్క చిత్తమును వెంబడించెను. అతడి వెనుకే దేవుడు ద్వారమును మూసివేసెను, కానీ మరింకా ఏడు దినముల వరకూ వర్షము ఎన్నడూ కురువలేదు. సమయమంతా అక్కడ ఉండి, నోవహు ఏమి ఆలోచించి ఉండెనో? నోవహు ఓడలో కూర్చొని ఉండెను, తలుపు మూసియుండెను. ఆయన తలంచాడు, "ఏ సమయములోనైనా, పిల్లలు, మీరు దానిని వినెదరు. మేము ద్వారమును లాగెదము, ఆ పైన కిటికీ ఉన్నది." మీకు తెలుసు, వారు పైన పై అంతస్తులో ఉన్నారు. ఆ జంతువులు క్రింద, పక్షులు తరువాత, మరియు వారు పైన, ఆ సూర్యుడు… "ఓ, ఉదయమున, అక్కడ ఏదో ఒకటి ఉండియుండును, కొంచెము చీకటి, వర్షము వచ్చును." కానీ తరువాత ఉదయము, సూర్యుడు వచ్చేవాడు.

బహుశా కొంత మంది ప్రజలు, ఆ రకముగా సగము విశ్వసించెదరు. నోవహు, బహుశా ఓడ దగ్గరకు వెళ్ళి మరియు ఓడ చుట్టూ నిలబడి, చెప్పేవాడు, "నీకు తెలుసా ఏమిటో? ఆ ముసలివాడు (చెప్పినది) సరై ఉండవచ్చు. మనము ఇక్కడ నిలబడుట మంచిది." మంచిది అప్పుడు, వారు ఒక తప్పును చూశారు. దేవుని యొక్క ప్రవక్తలు ఏ తప్పును చేయరు! దేవుని యొక్క వాక్యము విఫలమవ్వదు.

యోనా నీనెవేకు వెళ్ళడము గూర్చి నేను ప్రసంగించడము మీరు వినియున్నారు. అతడు వెనుకకు జారియున్నాడని వారు చెబుతారు; అతడు ఖచ్చితముగా కాదు. దేవుని యొక్క చిత్తములో అతడు సరిగానే చేసియున్నాడు — ఖచ్చితముగా. అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడు, మరియు అతడు దానిలో నడిచియున్నాడు.

GEN 7:7,10,13,16

 

63ఇక్కడ నోవహు చెప్పెను, "ఇప్పుడు, పిల్లలు, అందరూ చుట్టూ రండి, మరియు ఆకాశములో ఎప్పుడూ రాని ఆ మొదటి మేఘమును మీరు చూచెదరు. ఉదయకాలమున, అది వచ్చును." మంచిది, సూర్యుడు పైకి వచ్చాడు. "మంచిది, బహుశా తొమ్మిది గంటలకు కావచ్చు — మనము తొమ్మిది గంటలకు చూద్దాం. పది గంటలు, పదకొండు గంటలు, పన్నెండు గంటలు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, వ్యూ! "ఆయన నిన్నే ద్వారము మూసివేసియున్నాడు, కూడా."

కొంత మంది చెప్పారు, "మంచిది, నీకు తెలుసా ఏమిటో? అక్కడ సహోదరి సూసీతో నేను ఏకీభవించబోవుచున్నాను, ఆమె యొక్క పెద్ద సంఘములో ఆ ముసలివాడు పిచ్చివాడు. చూశారా, అతడు అక్కడికి వెళ్ళి మరియు ఆ తలుపు వేసుకున్నాడు, మరియు చెప్పాడు, "వర్షము రాబోవుచున్నది — మరియు అతడు అక్కడ కూర్చొని ఉన్నాడు. మరియు అప్పుడు, దానితో ఏమీ లేదు, చూశారా."

సూర్యుడు తిన్నగా వచ్చి, ప్రతీసారి అది చేయుచున్నట్లుగా అది దాటిపోయెను. వర్షము అనునటువంటిది ఏమీ లేదు. కనుక, ఆ నులివెచ్చనివారు, సరిహద్దు విశ్వాసులు — అసంపూర్ణమైన-హృదయము కలవారు, దేవునిని తీసుకొనుటకు ఇష్టము లేనివారు, మార్గము చివర వరకూ సాగదీయువారు, జీవించినా లేక చనిపోయినా. నేనేమి చెప్పుచున్నానో, మీరు చూడండి? నీ కోట కట్టబడిన స్థితిలోనే నిలిచియుండు. జీవించినా లేక చనిపోయినా, మునిగినా లేక తేలినా. ఆ విధముగానే అక్కడే నిలిచియుండుము.

GEN 22:10•

HEB 11:19

 

64విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రాహాము, కత్తిని బయటకు లాగి, తన బిడ్డ నుదుటున ఉన్న జట్టును వెనుకకు లాగియున్నాడు, అతడు గొంతును కోయుటకు, అతడు చెప్పాడు, "నేను అతడిని అనుభూతి చెందుచున్న ఆ రూపములోనే, దేవుడు అతడిని మరణము నుండి లేపగల సమర్దుడని నేను ఒప్పించబడ్డాను." చివరి వరకూ అతడు దేవుని యొక్క వాక్యమును వెంబడించుటకు ఇష్టపడుచున్నాడు. దానిని మీరు గ్రహించారా? అది ఏమైనా గాని — అక్కడే నిలిచియుండుము, ఒకవేళ ప్రతీది ఆ విధముగా అగుపించినా… నీవు ఒక్క అంగుళము కూడా ముందుకు వెళ్ళలేవు, ఆ అంగుళము ముందుకు వెళ్ళు. మరియు ఒకవేళ నీవు ఒక గోడను గ్రుద్దుకొనినట్లయితే, దానిలో నుండి దేవుడు మార్గము తెరిచేంత వరకు అక్కడే నిలిచియుండుము.

65మొదటి రోజు గడిచినది, రెండవ రోజు గడిచినది, మూడవ రోజు గడిచినది, నాలుగు, అయిదు, ఆరు. మీకు తెలుసా, నోవహు చేయవలసినది చాలా ఉన్నది. తన సమాజములో కొందరు ఈ విధముగా చెప్పుట నేను ఊహించగలుగుచున్నాను, "డాడీ, మనము ఆ కిటికీ గుండా ఎక్కవలసియున్నదేమోనని నీవు ఆలోచించుచున్నావా? ఇదంతయూ తప్పేమో ఆలోచించుము?"

అతడు చెప్పాడు, "లేదు, లేదు, లేదు. హనోకును తీసుకొని వెళ్ళినది, అది ఎవరు? ఆ ద్వారమును మూసినది, అది ఎవరు? మన ముందు అన్ని సంగతులను చేసినది, అది ఎవరు? ఒకవేళ ఆయన మనలను ఇంత దూరము నడిపించి, మరియు లోపల మూసియున్నట్లయితే, ఆయనతోనే నిలిచియుందుము."

సంఘమా, అది అదే. ఒకవేళ ఆయన మనలను లోకములో నుండి బయటకు తీసుకొని వచ్చి మరియు ఇంత దూరము నడిపించి, మరియు ఆయనతో పాటు మనలను లోపల మూసివేసి, మన చుట్టూ పరిశుద్ధాత్మతో మనలో, మరియు మన గుండా, ఆ విధముగానే మనము ఆయనను వెంబడిద్దాము. అది నిజము. సమయము వచ్చును. సమయము వచ్చును. అపహస్యకులు వారు కోరిన విధముగా చెప్పుకొననివ్వండి.

GEN 7:10,11,17,22

 

66అప్పుడు, ఏడవ దినమున, ఆ ఉదయమున ప్రజలు బయట వీధులలో ఉన్నారు. వారు అటువంటి సంగతిని ఎన్నడూ చూడలేదు. మేఘములు వస్తున్నాయి, గొప్ప ఉరుముల శబ్దము, ఆకాశములో మెరుపులు మెరుస్తున్నాయి. ఏడు గంటలకు, భూమి యొక్క ముఖముపై, మొదటిసారి, వర్షము యొక్క గొప్ప పెద్ద చినుకులు పడుట ప్రారంభించాయి. పక్షులన్నీ బిగ్గరగా అరుస్తూ ఉండడం నేను ఊహించగలను. ప్రకృతి అంతా చిధ్రమైనది. పురుషులు ఆశ్చర్యపడడం ప్రారంభించి, మరియు చెప్పారు, "మీ శాస్త్రీయ పరికరములను తీసుకురండి. మీ రాడార్ ను ప్రయోగించండి. మాకు చెప్పండి ఇదంతయూ ఏమిటి." కానీ అది పని చేయదు. "మా జీవితమంతటిలో అటువంటి దానిని మేమెన్నడూ చూడలేదు."

మంచిది, మధ్యాహ్న సమయమునకు, వాగులు పొంగడం ప్రారంభించాయి. మరుసటి రోజు ఉదయమునకు, నదులు, లోతులు తెగబడ్డాయి. మొదటి మూడు లేక నాలుగు రోజులకు, వీధులన్నీ నీటితో నిండిపోయాయి — వరదలు. "తెరువుము!" అని ద్వారముపై కొట్టుచూ, ప్రజలు ఓడ చుట్టూ వస్తున్నారు. నోవహు సరిగ్గా అలలపై సవారీ చేయుచున్నాడు. అది సుమారు ఇరవై అడుగుల ఎత్తు వచ్చినది, ఓడ భూమి మీద నుండి పైకి లేచి, తన మార్గములో పయనించుట ప్రారంభించెనని, బైబిలు చెప్పుచున్న దానిని నేను నమ్ముచున్నాను.

వారు ఎత్తైన శిఖరము ఎక్కిరి, ఎత్తైన కొమ్మకు వ్రేలాడిరి, వారు అరచిరి; మరియు ఆ ఓడలో లేని, ఊపిరి పీల్చుటకు ముక్కు రంధ్రములు కలిగిన ప్రతీదియు నశించెను. ఊపిరి పీల్చిన ప్రతీది చచ్చెను. వారు దయ కొరకు అరవవచ్చు, వారు మొర్రపెట్టవచ్చు, కానీ చేయుటకు మరేమి లేక ఆయన న్యాయమును తీసుకువచ్చునంతగా, చాలా సార్లు వారు దేవునిని తృణీకరించిరి. మరియు ఆయన న్యాయము ఆయన తీర్పే. ఆయన హవ్వకు చెప్పిన విధముగానే, "నీవు దానిని తిన్న రోజున, అదే రోజు నీవు మరణించెదవు."

GEN 3:23•

GEN 7:7,13•

JOSH 24:15

 

67ఇప్పుడు, నేను మీరు గమనించాలని కోరుచున్నాను… ఇప్పుడు మనము రెండు సార్లు, వాక్యము తర్కముతో పోరాటము చేసెను అని చూశాము. మరియు ఇప్పుడు అది తిరిగి వచ్చియున్నది — వాక్యమునకు వ్యతిరేకముగా తర్కము. ఇప్పుడు నీవు ఎన్నుకొనవచ్చును. యొహోషువ అదే సంగతిని చెప్పియున్నాడు. అతడు చెప్పాడు, "ఇప్పుడు, ఒకవేళ వరదలు వచ్చుటకు ముందు మీ పితరులు సేవించిన దేవుడిని మీరు ఎంపిక చేసుకొనగోరిన ఎడల, చూడుము, లేక మీరు స్వతంత్రించుకొనబోవుచున్న అమోరీయుల యొక్క దేవున్ని సేవించుటను మీరు ఎన్నుకొందురా? వరదలకు ముందు తండ్రులు, దేవుని యొక్క వాక్యమును నమ్మినవారు, వరదల గుండా ప్రయాణించిరి. అమోరీయులు దానిని తిరస్కరించిరి, వారి యొక్క దేశమును దేవుడు మీకిచ్చియున్నాడు. ఇప్పుడు ఒకవేళ దేవునిని సేవించుట చెడు అని మీరు భావించినట్లయితే, మీరు ఎవరిని సేవించెదరో ఈ దినమునే ఎన్నుకొనండి, కానీ నా వరకైతే - నేను మరియు నా కుటుంబము, మేము ప్రభువుతోనే నిలిచియుందుము." ఆమేన్! నేను దానిని ఇష్టపడెదను.

పోరాటము. గమనించుము, ఏ రోజైతే ఏదెనులో ఆ కోట బ్రద్దలైనదో, మానవుడు "బయటకు" వెళ్ళిపోయాడు. ఆమేన్. వారు బయటకు వెళ్ళిపోయారు. మరియు ఏ దినమునైతే నీటితో కలుగు నాశనములో వారు దేవుని యొక్క నిబంధనను నెరవేర్చిరో, వారు లోనికి వెళ్ళియున్నారు. వారు ఏదెనులో నుండి బయటకు వెళ్ళారు; వారు ఓడలోనికి వెళ్ళారు, మరియు ఈ మూడవదిగా వారు "పైకి" వెళ్ళెదరు. బయటకు వెళ్ళుట, లోనికి వచ్చుట, పైకి వెళ్ళుట. రెండు సార్లు వారు ఏమి చేసారో మనము చూసాము. నేను ప్రభువుతో నిలబడబోవుచున్నాను. మీరు కూడా నిలబడగోరుట లేదా? నేను దేవుని యొక్క వాక్యముతో నిలబడగోరుచున్నాను.

LUKE 17:26

 

68యేసు చెప్పెను, "నోవహు దినములలో జరిగినట్టుగా, మనుష్యకుమారుని రాక దినములలోను జరుగును." చెడుకు వ్యతిరేకముగా మంచి; చీకటికి వ్యతిరేకముగా వెలుగు; మరణమునకు వ్యతిరేకముగా జీవము; విజ్ఞాన శాస్త్రమునకు వ్యతిరేకముగా వాక్యము. అది నిజము. వారు అనుకొనుచున్నట్లుగా, విజ్ఞాన శాస్త్రపరిశోధన వాక్యము తప్పు అని నిరూపించును అని వారు అనుకొందురు; అయితే అది వాక్యమును తప్పు అని నిరూపించలేదు. సాతాను, తన వ్యవస్థను తిరిగి పని చేయలాగున చేసియున్నాడు, ప్రజలు దేవుని యొక్క వాక్యము నందు అపనమ్మకముంచునట్లు చేసియున్నాడు.

సాతాను యొక్క తప్పుడు విధానములో ఆరాధన — కయీను మరియు బిలాము వలె — వారు ఎంతో మతభక్తులు. కయీను చాలా భక్తుడు. అతడు ఒక బలిపీఠమును తీసుకొని వచ్చి, ఒక బలిపీఠము తయారు చేశాడు, మరియు యధార్ధముగా, హేబేలు కన్ననూ కయీను చాలా భక్తుడు. ఖచ్చితముగా, హేబేలు చేసిన దానికన్నా అతడు ప్రభువు కొరకు ఎక్కువ చేసియున్నాడు; అయితే హేబేలు వాక్యము యొక్క క్రమములో వచ్చాడు, అంతే. అతడు ఎక్కువ చేశాడు, అతడు గొప్ప సంఘ శాఖను తయారు చేశాడు, అతడు ఒక గొప్ప సంగతిని నిర్మించాడు, ఒక గొప్ప క్రైస్తవ వారసత్వ సంపద. కానీ మీరు చూడండి, అతడు తప్పుడు మార్గములో వచ్చాడు మరియు అది అంగీకరింపబడలేదు. ఇప్పుడు, తప్పు, ఏలయనగా అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నది.

బిలాము కూడా మోషే వంటి భక్తిపరుడే. అతడు అదే బలియర్పణ, అదే గొర్రెపిల్లలు, అవే పరిశుద్ధమైన జంతువులు, మరియు అన్నిటితో వచ్చాడు; మరియు అదే దేవునికి ప్రార్ధించాడు, మరియు మోషే చేసినట్లుగా అదే దేవునికి బలి అర్పించాడు, అతడు తప్పుడు మార్గములో వచ్చినా గానీ, చూశారా. ఏదేనులో ఉన్న దానివలె, అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నది.

MARK 16:17•

JOHN 3:7•

JOHN 14:12

 

69ఆధునిక సిద్ధాంతముతో వాక్యము మిళితము కాలేదు, చూశారా. మీరు ఆధునిక సిద్ధాంతములు కలిగియుండలేరు (ఇప్పుడు ముగింపులో, జాగ్రత్తగా వినండి), వాక్యము ఏ నవనాగరికత సిద్ధాంతముతో కలగలుపు కాలేదు, అది సిద్ధాంతమును మరియు వాక్యమును కలిపి కలిగియుండలేదు. నీవు వాక్యమునైనా లేక లోక సిద్ధాంతమునైనా కలిగియుండాలి. ఇప్పుడు దేనిని నీవు నమ్మబోవుచున్నావు? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును గూర్చి బైబిలు బోధించుచున్నది — మరియు సంఘము తండ్రీ, కుమార, మరియు పరిశుద్ధాత్మ, అని చెబితే; అప్పుడు నీవు ఎవరిని నమ్మబోతున్నావు?

ఒకవేళ యేసు, "నీవు తప్పక తిరిగి జన్మించవలెను" అని చెబితే, మరియు సంఘము - "వచ్చి చేరుము," అని చెబితే; ఇప్పుడు నీవు ఏమి నమ్మబోతున్నావు? మరియు యేసు చెప్పెను, నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును, మరియు సంఘము, నీవు మంచి సభ్యుడవు, అని చెప్పినట్లయితే; నీవు ఎవరిని నమ్మెదవు? ఒకవేళ యేసు, "నేను చేయు క్రియలు, మీరునూ చేయుదురు," అని చెబితే, మరియు సంఘము "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి," అని చెప్పినట్లయితే; నీవు ఎవరిని నమ్మబోతున్నావు?

నా భావమును మీరు చూశారా? ఒక గంట నేనిక్కడ నిలబడగలను, ఆ సంగతులను వ్రాయగలను, ఆ వేర్వేరు సంగతులను తీసుకొని రాగలను — దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన దానిపై సిద్ధాంతము ఏ విధముగా ఒక వ్యవస్థను నిర్మించినదో తీసుకొని రాగలను. ఇప్పుడు, క్రైస్తవులారా, వాక్యము వెనుక నిలబడండి! అవునయ్యా. తప్పుడు జీవిత విధానము — దానితో కలుపుటకు ప్రయత్నించుచున్నది.

ఈ రోజు వారికి ఇష్టము వచ్చినట్లుగా దుస్తులు ధరించుచున్న ఈ స్త్రీలను వారు తీసుకొనుచున్నారు. ఒకవేళ వారు పొగ త్రాగినా, మధ్యము సేవించినా, లేక ఏదైనా, అటువంటి పురుషులను తీసుకొని, డీకన్లుగాను మరియు అటువంటి వారిగాను, సంఘములో, పాష్టర్లుగా కూడా చేయుచున్నారు. ఈ స్త్రీలను, వారికిష్టము వచ్చినట్లుగా దుస్తులు ధరించుచున్న వారిని, మరియు లోనికి తీసుకొని వచ్చి సంఘములో సహోదరిలుగా చేయుచున్నారు. నీవు ఎన్నడూ పరలోకమునకు ఆ విధముగా వెళ్ళుటకు ప్రయత్నించవద్దు, అది ఆధునికమైన సిద్ధాంతముతో కొంచెము కూడా కలవదు.

MATT 25:2•

ACTS 2:38•

REV 22:18,19

 

70కనుక, ఆ విధముగా ప్రకటించుకొనుచున్న రెండు తరగతులు వారు ఈ రోజు మనకున్నారు. (ముగింపులో ఇప్పుడు జాగ్రత్తగా వినండి), క్రీస్తు యొక్క వధువుగా ప్రకటించుకొనుచున్న రెండు తరగతుల వారు మనకున్నారు. అది నిజము. మరియు అక్కడ రెండు తరగతుల వారు ఉండునని బైబిలు మాట్లాడియున్నది. అది నిజము. బుద్ధిగల కన్యక మరియు బుద్ధిలేని వారు. అది నిజమేనా? అక్కడ రెండు తరగతులు కలవు.

"మేమే ఆ సంఘము" అని సంఘము చెప్పుచున్నది. వారు బయటకు వెళ్ళి మరియు ఈ గొప్ప సువార్త కూడికలను కలిగి, ప్రజలను సంఘములోనికి తీసుకొని వచ్చెదరు. స్త్రీలు తమకు ఇష్టము వచ్చినట్లుగా చేయుటను కొనసాగించెదరు. పురుషులు వారికి ఇష్టము వచ్చినట్లుగా కొనసాగెదరు. వారు ఎన్నడూ తమ సిద్దాంతమును మార్చుకొనరు. ఆ మెథడిస్టులు, మరియు బాప్టిస్టులు, మరియు ప్రెస్బిటేరియన్లు, మరియు కేథలిక్ వారందరూ చదివే, ఆ అపొస్తులుల సూత్రములు, మరియు కొన్ని ప్రార్థనలు, మరియు ఇటువంటి ప్రశ్నావళులన్నీ మరియు అటువంటి ప్రతీ దానిని వారు వ్రాసియుంచుకొని, మరియు గ్రంథముగా చేసి మరియు ఏర్పరచియున్నారు.

మరియు వారు ఆ ప్రశ్నావళిని అంగీకరించెదరు, ఎందుకనగా వెనుక ఎవరో గొప్ప వ్యక్తి అది సరైనది అని చెప్పియున్నాడు. అతడు బహుశా గొప్పవాడై యుండవచ్చు, అతడు బహుశా సరైనవాడై యుండవచ్చు. అయితే అతడు దానిని చెప్పే అధికారమును కలిగిలేడు, ఎందుకనగా బైబిలు దేవుని యొక్క అధికారమై యున్నది. అది దేవుని యొక్క వ్రాతపూర్వకమైన వాక్యము. "మరియు ఏ మనుష్యుడైనా దానికి (వాక్యమునకు) ఒక సంగతి కలిపినా, లేక (వాక్యమునకు) దానిలో నుండి ఏదైనా తీసివేసినా, (ఆ వాక్యమే) అతడి భాగమును జీవగ్రంథములో నుండి కూడా తీసివేయును. ఆ విధముగా చేయబడకూడదు.

71కానీ దానిని ప్రకటించుచున్నవారు ఇద్దరు మనకున్నారు. ఒకరు చెప్పారు, "మంచిది, మేమే ఆ సంఘము." మరొకరు చెప్పారు, "మేమే ఆ సంఘము." అది సరే. బుద్ధిగలవారు మరియు బుద్ధిలేనివారు, ఇద్దరూ ఆహ్వానించబడ్డారు, కానీ మీరు గమనించారా — ఇద్దరి దగ్గరా దీపములున్నవి? అది నిజము. వారిద్దరూ కన్యకలే, విశ్వాసులు. వారిద్దరూ ఆ దీపములు కలిగియున్నారు. కానీ, సాతాను మనకు మరెక్కువైన జతగాడు (పోటీదారుడు). అది మనకు తెలుసు. ఏ మానవుడికైననూ సాతానే సరైన జతగాడు అని మనకు తెలుసు. నీవు ఎన్నడూ నీ యొక్క జ్ఞానముతో వాడిని ఓడించడానికి ప్రయత్నించవద్దు. నీవు కేవలము దానిని చేయలేవు.

ఇది యేసు ఎరిగియున్నాడు, కనుక ఆయన సంఘమునకు పంపియున్నాడు, అది, కనుక సాతాను వారిని ఓడించకుండా, కోట కట్టబడుటకు ఒక స్థలము. ఆయన వారికి పరిశుద్ధాత్మను పంపియున్నాడు. మరియు సంఘము తెలివైనవారని హక్కు పొందడం కాదు, వారు నమ్ముటకు హక్కును పొందియున్నారు. వారి ప్రసంగీకులు బయటకు వెళ్ళి మరియు వారి పి.హెచ్., ఎల్ఎల్. క్యు, యు, ఎస్, డిడి, మరియు ఇవన్ని సంగతులు మీకు చూపించలేరు. ఒక సేవక సంఘములోనికి వారు నియమించబడినప్పుడు, వారేమి పెద్ద, గొప్ప ప్రారంభోత్సవ సమయములను కలిగిలేరు.

మీకు తెలుసా, నేను ఒక చిన్న పాట పాడుకుంటూ ఉంటాను:

ఈ ప్రజలు బహుశా నేర్చుకొని లేరు,

లేక లోకము యొక్క ప్రఖ్యాతుల కొరకు గొప్పలు కలిగిలేరు,

వారందరూ తమ పెంతుకొస్తును పొందుకొనియున్నారు,

యేసు యొక్క నామములో బాప్తిస్మము పొందుకొన్నారు;

మరియు వారిప్పుడు దూరమునకు మరియు దగ్గరకు కలిపి చెప్పుచున్నారు,

ఆయన యొక్క శక్తి ఇంకనూ అలాగే ఉన్నది,

నేను వారిలో ఒకడినని చెప్పుటకు నేను చాలా సంతోషిస్తున్నాను.

JOHN 14:18,19

 

72అవునయ్యా. అవును, వారు ఈ గొప్ప సంగతులను కలిగిలేరు. ఏదైననూ తెలుసుకొనుటకు వారు హక్కును కలిగియుండలేదు, మరేదో నమ్ముటకు వారు హక్కును కలిగియున్నారు. యేసు పరిశుద్దాత్మను పంపియున్నాడు, ఆయనే తనకుతానే. ఆయన చెప్పాడు, "కొంచెము కాలమైన తరువాత ఈ లోకము నన్ను చూడదు, అయిననూ మీరు చూచెదరు, ఏలయనగా నేను మీలో ఉండెదను; సదాకాలము మీతోనూ, మీలోనూ ఉండెదను."

ఇప్పుడు, ఇప్పుడు గమనించండి. యేసు దానిని ఎరిగియున్నాడు, కనుకనే వాక్యము రుజువు చేయుట కొరకు ఆయన పరిశుద్దాత్మను పంపియన్నాడు. దానిని మీరు అర్ధము చేసుకొన్నారా? చూశారా, ఎవరైతే వాక్యము వెనుక తమ ఆశ్రయమును తీసుకొనియున్నారో, వారికి "ఆయన వాక్యములో ఉన్నాడు," అని రుజువు చేయుటకు. వారిని అక్కడ ఉండనివ్వండి. వారు వ్యవస్థను చూసి నవ్వెదరు. "వారు పిచ్చివారు," అని వారు చెప్పెదరు. కానీ అబ్రాహాము యొక్క గుంపు వలె, వారిముందు వాక్యమును రుజువు చేయుటకు, ఆయన ఇంకనూ వాక్యమే అయియున్నాడని వారికి చూపించుటకు, వాక్యము వెనుకనున్న వారిలోనికి ప్రవేశించడానికి, యేసు తానే స్వయముగా అయియున్న పరిశుద్దాత్మను పంపెను. అది సరే.

MATT 25:4,7,8•

JOHN 1:1•

JOHN 6:63

 

73అగ్నే వాక్యములో నుండి వెలుగు వచ్చుచున్నది అను దానికి రుజువు. వారు నింపెదరు… తెలివి గల కన్యక, బుద్ధిగల కన్యక, తన దీపములో నూనెను కలిగియున్నది, మరియు ఆమె తన దీపమున శుభ్రపరచుకొని మరియు దానిని వెలిగించెను. ఇప్పుడు, అది ఏమిటి? ఇప్పుడు, ఆ దేవుడు వాక్యమైయున్నాడు, నూనె ఆత్మయైయున్నది, మరియు అగ్నే ఆ నూనె పై సువార్త వెలుగైయున్నది. దేవుడు అలాగు చెప్పెను, చూశారా. అదే ఆ దివిటీ అయియున్నది. అది సరియే. నూనె ఆ దివిటీలో (దీపములో) ఉన్నది. మరియు దానిని మండించుచున్న ఆ అగ్ని వాక్యము ఏమి చెప్పుచున్నది అను దాని యొక్క వెలుగును ప్రతిబింబించుటను అది చూపించుచున్నది, చూశారా. అదే ఆ ప్రతిబింబము. ఇప్పుడు, ఆ బుద్ధిగల కన్యక దానిని చేయగలదు; కానీ ఆ మరొకటి, బుద్ధిలేని కన్యక, బయట ఉన్నది, నూనె లేదు. కేవలము వారి యొక్క సంఘమును మరియు సంఘ శాఖను తప్ప ప్రతిబింబించుటకు వారి యొద్ద ఏమీ లేదు, చూశారా.

ఇప్పుడు, "మీరు చెప్పెదరు వాక్యము… వాక్యమే ఆత్మయై యున్నదని నీవు చెప్పావు?"

అవునయ్యా. దేవుడు చెప్పాడు, "నా వాక్యమే ఆత్మగా ఉన్నది." అది నిజము. నిజమైన వధువు వాక్యముతో ఐక్యమవ్వవలసియుండెను. ఇప్పుడు, గుర్తించుకొనండి, ఒకవేళ ఆమె క్రీస్తులో భాగమైతే, ఆమె క్రీస్తు యొక్క వాక్యముగా ఉండవలెను. క్రీసు యొక్క వాక్యముగా ఉండుటకు, నీవు క్రీసులోనికి బాప్తిస్మము పొందవలసియుండెను. మరియు నీవు క్రీస్తులో ఉన్నట్లయితే, నీవు క్రీస్తును నమ్మెదవు, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు.

ఆమేన్! ఆమేన్! ఆమేన్!

నీవు దానిని నమ్ముచున్నావా? ఆమేన్!

నీవు దానిని నమ్ముచున్నావా? ఆమేన్!

నీవు ఆయనను సేవించెదవా? "ఆమేన్!"

ఆయన లోకమునకు వెలుగైయున్నాడు. "ఆమేన్!"

ఆయన మన హృదయము యొక్క ఆనందమైయున్నాడు. "ఆమేన్!"

ఆయన మన జీవితము యొక్క శక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్!

EST 2:15•

JOHN 10:27•

ACTS 2:38•

EPH 2:6•

HEB 13:8

 

74వధువు ఐక్యమవ్వవలసి యుండెను — వాక్యముతో కలసి ఐక్యమవ్వవలసియుండెను. "నా గొర్రెలు నా స్వరమును వినును మరియు ఇది ముద్రించబడిన వాక్యమునందు ఆయన స్వరము. అది సరియే. వాక్యముతో ఐక్యము చేయబడి, ఆమె తనను తాను సిద్ధపరచుకొనుచున్నది — సాధారణ మత సిద్ధాంతములతో కాదు.

ఎస్తేరు వలె. రాజు ముందు నిలబడుటకు ఎస్తేరు ఎన్నుకొనబడినప్పుడు, ఆమె అన్ని సంగతులతోను అలంకరించుకొనలేదు, కానీ ఆమె ఒక మధురమైన, సాత్వికమైన ఆత్మతో తన్నుతాను అలంకరించుకొన్నది. దానిని వెంబడించుచున్న ఆత్మ యొక్క ఫలములన్నిటితో, దానితోనే వధువు తన్నుతాను అలంకరించుకొనుచున్నది. ఆమె ఏమి పొందుకొన్నది? వాక్యము యొక్క సహవాసములో కలిపి సమకూడుట. ఆమేన్. వాక్యము యొక్క సహవాసము. అది నిజము. సహవాసము చేస్తూ, ఈ రాత్రి, క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కలిసి కూర్చొనియున్నాము — ఒక్క సమ్మతి, ఒక్క స్థలము, ఒక్క ఆత్మ ఒక్క మనస్సు, ఒక్క నిరీక్షణ, ఒక్క దేవుడు, ఒక్క ఉద్దేశ్యము. ఆమేన్. చూశారా, మీరు అక్కడే ఉన్నారు.

ప్రతీసారి బైబిలు ఏదైనా చెప్పినప్పుడు, మేము "ఆమేన్" చెప్పెదము. ప్రతీ వాక్యము "ఆమేన్"తో ముగించుట. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. "ఆమెన్." మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు యొక్క నామములో, బాప్తిస్మము పొందుడి. "ఆమేన్." చూశారా, ప్రతీది, కేవలము "ఆమేన్, ఆమేన్, ఆమేన్." అక్కడే క్రింద, చూడండి, సహవాసములో.

JOHN 1:14•

GAL 5:22

 

75ఆత్మ యొక్క ఫలములు… ఆమె… ఆమె ఏమి పొందుకొన్నది? ఆత్మ యొక్క ఫలము ఏమిటి? ఆనందము, ఆమె హృదయము యొక్క ఆనందము, ఆయన త్వరలోనే రాబోవుచున్నాడని తెలుసుకొని, "ఆమేన్, మరియు ఆమేన్, ఆమేన్, అవును. మనఃశాంతి. ఎందుకు? మనఃశాంతి. మనఃశాంతి. ఏమిటో తెలుసా? ఏమి వచ్చినా గానీ లేక ఏమి పోయినా గానీ, ఓడ బ్రద్దలైనా, తుఫానులు రానిమ్ము, మెరుపు ప్రకాశింపనిమ్ము, ఉరుము గర్జి౦చనిమ్ము, ఏమి జరిగినా, చిన్న వ్యత్యాసమును కూడా కలుగజేయదు. అణుబాంబులు పడవచ్చు. మీరు రాతి ఆశ్రయములను (కాపాడుకొనుటకు) నిర్మించవచ్చు, బాంబు ఆశ్రయములు నీకు ఏమి కావాలంటే అది నిర్మించవచ్చు. కానీ ఆమె ఇంకనూ చెప్పుచున్నది, "ఆమేన్, ఆమేన్, ఆమేన్!"

ఎందుకు? ఆమె కోట కట్టబడినది. ఏమిటి? దేనిలో కోట కట్టబడెను? వాక్యము, వాక్యము (ఏమిటి?) శరీరమాయెను, మనమధ్య నివసించుచున్నది, మన సమాజములో, మన మధ్యలో ఆయన కదలడము చూస్తున్నాము, చూశారా. ఆయన అక్కడ ఉన్నాడు. కనుక అది ఎటువంటి వ్యత్యాసమును చేయును? "ఆమేన్" ఆ పోరాటము కొనసాగనిమ్ము.

నా ప్రాణమును విశ్రాంతి స్థానములో లంగరు వేసియున్నాను,

ఇక మీదట కష్టమైన సంద్రములపై సవారీ చేయకుండా;

ఆ శోధన కఠినమైన తుఫాను లోతును దాటి వెళ్ళును గాక,

కానీ యేసులో నేనెప్పటికీ సురక్షితము.

GAL 5:22

 

76నీవు యేసులో ఉన్నావని నీవు చెప్పుచూ మరియు అప్పుడు వాక్యమును నిరాకరించెదవా? ఏదో తప్పు ఉన్నది. ఆయన ఎల్లప్పుడు ఆయన సొంత వాక్యమునకే "ఆమేన్" చెప్పును. మీకు అది తెలుసు. నిజము. అది సరే.

సహవాసము కొరకు సమకూడుట. ఆనందము, ఆత్మ యొక్క ఫలములలో ఒకటి, మనఃశాంతి, మరియు వాక్యము నందు విశ్వాసము. సమాధానము, సంతోషము, విశ్వాసము, దీర్ఘశాంతము, సహనము, దయాళుత్వము (మంచితనము), విశ్వాసము. ఎటువంటి రకపు విశ్వాసము? నీవు నీ విశ్వాసమును ఏ రకమైన మార్గములో ఉపయోగించుచున్నావు, పోరాటమును పోరాడుటకా? ఏదో సిద్దాంతముపై నీ విశ్వాసమును నీవు ఉపయోగించబోవుచున్నావా, ఏదో తర్కముపై ఏదో? అనేక మంది ప్రజలు ఈ సంఘమునకు వచ్చుట సహేతుకము కాదా? ఇది పెద్ద సంఘమేనా? లేదయ్యా, ఇది కాదు.

ఒకవేళ ఆ సంఘము ఆ బైబిలు యొక్క ప్రతీ వాక్యమును బోధించకపోతే, మరియు దాని యొక్క ప్రతీ వాక్యమునకు "ఆమేన్" చెప్పకపోతే, ప్రతీ సూచనను నమ్మి ప్రతీ అద్భుతము, వారి మధ్యలోనే అవి కార్యము చేయడము చూస్తున్నప్పుడు, అది ఎంత పెద్ద సంఘమైనా, ఎంత చిన్నదైనా, నేను దాని నుండి బయటకు వెళ్ళుదును, చూశారా. విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, మరియు వాక్యము నందు విశ్వాసము.

కనుక సాతాను వాడి యొక్క తుపాకులను గురి పెట్టుకొననివ్వండి. మనము లంగరు వేయబడ్డాము. ఆమేన్. మనము గొప్పవారమని ఆరోపించుకొనుట లేదు. మనము లోకము యొక్క దృష్టిలో మనము గొప్పవారము కాము. మనము దీనులమై యున్నాము, వ్యవసాయదారులము. మనము లోకపు సంపదలను పట్టించుకొనము.

77నా స్నేహితుడా, ఈ రాత్రి… నేను ఈ సువార్తను ప్రసంగించుట ప్రారంభించాను… ఆలస్యమగుచున్నది, కాబట్టి చూడండి, ఈ రాత్రికి, నేను ముగించబోవుచున్నాను. ముప్పై సంవత్సరములు లేక ముప్పై-ఒక్క సంవత్సరముల క్రితము మనము ప్రసంగించుట ప్రారంభించాము. సుమారు 1930-31, ఎక్కడో సుమారు అక్కడే నేను సువార్తను ప్రసంగించుట ఆరంభించాను. ఇదే వర్తమానమును ప్రసంగించాను, మరియు ఎన్నడూ దాని నుండి మారలేదు, ఎందుకనగా ఇది సత్యమైయున్నది. దానితోనే నిలిచియుండుము.

ఇప్పుడు, ఈ రాత్రి, నేను మధ్యవయస్కుడను, యాభై-మూడు సంవత్సరముల వయస్సు — తాతను. నేను మునుపటికన్నను ఎక్కువగా ఆయనను ప్రేమించుచున్నాను, ఎందుకనగా నేను ఎక్కువ శ్రమలలోను మరియు పోరాటములలోను ఆయనను చూసియున్నాను. మరియు నేను చూశాను, చాలా ఎక్కువగా (మిక్కిలిగా) శోధింపబడే స్థలమునకు నేను వచ్చినప్పుడు, నేను ఏదో చెప్పినప్పుడు, ఓడలో ఉన్న నోవహు వలె, "ఇది జరుగును." ఇప్పుడు గమనించు. ఓ, కృప! దేవుడు ఏమిటి? దేవుడలాగు చెప్పెను, "అది జరుగును" అక్కడే నిలిచియుండు, "అది జరుగును. సూర్యుడు గతించిపోవును; అది జరుగును.

"సహోదరుడా బ్రెన్హాం, నీకు ఏలాగు తెలుసు?"

దేవుడు అలాగు చెప్పెను. అది జరుగును. అది జరుగవలసియుండెను — దేవుడు అలాగు చెప్పెను."

కనుక, "నా ప్రాణమును విశ్రాంతి స్థానములో లంగరు వేసియున్నాను. యేసులో నేనెప్పటికీ సురక్షితము." ఏది వచ్చినా లేక వెళ్ళిపోయినా, ఆ విధానములోనే మనము దానిని తీసుకొనెదము.

78ఆయనకు వందనములు చెప్పుటకు, ఇప్పుడు మన శిరములు వంచెదము. ఈ రాత్రి ఆ విధముగా లంగరు వేయబడని, ఆయనను ఎరుగని వారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క వాక్యముతో నీ గొప్ప నిర్ణయమును ఎన్నడూ తీసుకొనని వారు, మరియు నీవు చెప్చెదవు, "సహోదరుడా బ్రెన్హాం, నేను నా చేయిని పైకెత్తబోవుచున్నాను, మరియు నన్ను నీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుము," అని చెప్పువారు. ఏమి జరుగనైయున్ననూ నేను దేవునినే నమ్మెదను, నేను ఎన్నడూ అటువంటి నిర్ణయము తీసుకొనలేదు. నేను ఆయన వాక్యమును తీసుకొనెదను, ఎవ్వరు ఏమి చెప్పినా లేక చేసినా, నేను ఇంకనూ ఆయన వాక్యమునే నమ్మెదను. సహో బ్రెన్హాం, నా కొరకు నీవు ప్రార్థించమని నేను కోరుచున్నాను. పోరాటము జరుగుచున్నదని నేను నమ్ముచున్నాను, మరియు నేను నా నిర్ణయమును తీసుకొన్నా… ఇప్పటికీ, నేను ఎన్నడూ నా నిర్ణయమును తీసుకొనలేదు. నేను దేవుని పక్షము వైపు, మరియు వాక్యముతో దానిని తీసుకొనగోరుచున్నాను."

ఎంత మంది, ఇప్పటికే మీ నిర్ణయమును తీసుకొన్నవారు, మరియు ప్రభువు యొక్క వాక్యము వెనుక నిలబడ్డారు? మీ చేయి పైకెత్తి, "నేను చేసినందులకు నేను కృతజ్ఞుడను," అని చెప్పుము. దేవుడు మిమ్ములను దీవించును గాక, వంద శాతము. దేవునికి స్తోత్రము, చిన్న పిల్లలు కూడా తమ చేతులు పైకెత్తుచున్నారు, మై, మై! ఓ, ఒకవేళ ఇది నిజము కాకపోతే!

79క్రీస్తు యేసులో పరలోక స్థలములు, వాక్యముతో కోట కట్టబడుట. ఆరంభ దినములలో చేసినట్లుగా, రుజువు చేస్తూ, మనకు నిరూపిస్తూ, ఆత్మ యొక్క సన్నిధి ఇక్కడ ఉండుట ద్వారా, వాక్యముతో కోట కట్టబడుట — అదే సువార్త అదే సూచనలు, అవే అద్బుతములు, అదే దేవుడు, అదే వాక్యము, అవే సంగతులను జరుగనిచ్చుచుండెను. ప్రజలు లేచి నిలబడి, ప్రవచనము యొక్క వరము — ప్రవచిస్తూ. ఒకరు నిలబడెదరు, ఆత్మ ప్రజలపై పడుచుండెను, వారు భాషలతో మాట్లాడునట్లుగా. ఆత్మ వారిపై పడెను, వారు భాషలలో మాట్లాడెదరు, వారు సమాధానముతో ఉందురు, మరియు మరొకరు దానిని అనువదించెదరు, మరియు అది జరుగును.

ఓ, మై! మన గొప్ప పరిశుద్ధాత్మ యొక్క శక్తులు మన జీవితములను పాప జీవితము నుండి మార్చివేస్తూ, దాని నుండి పైకి లేవనెత్తుతూ, మరియు క్రీస్తు యేసులో మనలను నూతన సృష్టిగా చేయుచున్నాడు. ఏ విధముగా మనము ప్రభువుకు వందనములు చెల్లించుదము.

80పరలోకపు తండ్రీ, ఈ రాత్రి, నీ బిడ్డలైన ఈ గుంపుతో సమకూడుట అది చాలా శ్రేష్టము, ఇక్కడ క్లార్క్ విల్లీలో విడిది చేయుచున్న వీరు. ఈ సంఘము ఈ విధముగా కదులుచూనుండుట చాలా సంతోషము, పాష్టరు గారిని చూచుట, ప్రజల మధ్యలో ఒక అవిశ్వాసి కూడా లేకుండుట, అందరూ ఆశ్రయపురములోనే ఉన్నారు. ఓ, దాని కొరకు ఏ విధముగా నీకు వందనములు తెలియజేయుదుము, తండ్రీ.

ఒక్కసారి ఒక చిన్న దుప్పిని గూర్చి నేను ఆలోచించుచున్నాను. అది ఆశ్రయపురము నుండి బయటకు వచ్చినది, మరియు అనేక గాయములు తగిలెను. మరియు తన ప్రియమైన జీవము కొరకు అది పరుగెత్తుచున్నది. మరియు ఆశ్రయపురమున్న ఆ కంచె యొద్దకు అది వచ్చినప్పుడు, అది ఆ కంచెను తగులుకొన్నది, మరియు చాలా ఆనందపడినది. అది అరుస్తూ, మరియు వెనుకకు తిరిగి ఆ వేట కుక్కలను చూసెను, ఎందుకనగా అది సురక్షితముగా ఉన్నది. అవి ఆ కంచెను ఎక్కి దాటి రాలేవు. అవి ఆ విధముగా నిర్మించబడలేదు. ఒకవేళ అవి గనుక ఆ కంచెను తాకితే, అవి విద్యుత్ శక్తి తాకిడికి వెనుకకు ఎగిరిపడతాయి. మేము ఆ విధముగానే ఉన్నాము, ప్రభువా, దేవుని యొక్క వాక్యమనే కంచె వెనుక మేము నిలబడినట్లయితే, పరిశుద్దాత్మ యొక్క విద్యుత్ శక్తి మన యొక్క శత్రువును విసిరివేయును. వాడు ఆ కంచెను దాటి రాలేడు; అతడు ఆ విధముగా చేయబడలేదు.

తండ్రీ, మీరు మమ్ములను ఆ విధముగా చేసినందుకు వందనములు, కాబట్టి ప్రభువా, మేము భద్రత కొరకు క్రీస్తు యేసులోనికి దుమికెదము. ప్రభువా, మేము మిక్కిలిగా ఆనందిస్తున్నాము, ఎప్పటికీ సురక్షితముగా ఉంచుము. ఈ చిన్న సంఘమును నీవు దీవించెదవని మేము ఇప్పుడు ప్రార్ధిస్తున్నాము, దీని పాష్టరును, దీని ప్రియమైన వారిని, ఈ రాత్రి ఇక్కడనున్న ప్రతీ ఒక్కరినీ దీవించండి. ప్రతీ సేవకుడిని దీవించండి.

81మన ప్రశస్తమైన మరియు మిక్కిలి గౌరవనీయుడైన సహోదరుడు నెవిల్ కొరకు మనము ప్రార్థించెదము. మరియు ఇప్పుడు, నిన్నటి దినమున, సాతాను అతడిని రంగముపై నుండి తీసివేయడానికి ప్రయత్నించాడు, ఆ కారుతో అతడిని ఢీకొట్టి మరియు వాడు ఏదో చెడు చేయుటకు ప్రయత్నించాడు, కానీ నీవు రంగముపై ఉన్నావు. దేవా, ఆ రైఫిల్ రేంజ్ (తుపాకీలు పేల్చు స్థలము) యొద్ద గత దినమున వాడు నన్ను తీసివేయుటకు ప్రయత్నించాడు, కానీ నీవు అక్కడ రంగముపై ఉన్నావు. సహోదరుడు విల్లార్డ్ క్రేస్, అతడు ఆ స్తంభములోనికి గుద్దుకొన్నప్పుడు, వాడు అతడిని తీసుకొనడానికి ప్రయత్నించాడు, కానీ నీవు అక్కడ రంగముపై ఉన్నావు. ఓ, నిన్ను తెలుసుకొనుట చాలా మంచిది. ఒకసారి ఒక కవి చెప్పినట్లుగా: యేసు యందు నమ్మకముంచుట చాలా మాధుర్యము, ఆయన వాక్యము నందు ఆయనను తీసుకొనుట, వాగ్దానమునందు విశ్రాంతి తీసుకొనుట, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును" తెలుసుకొనుట. దీని కొరకు ఏ విధముగా నీకు వందనములు తెలియ జేయుదుము.

మా ప్రాణములను దీవించుము, మా పాపములను క్షమించుము, ప్రభువా, మా మధ్యలో ఉన్న రోగమును స్వస్థపరచుము, ఈ పాత మృత-శరీరములు బలహీనమైనవి, మరియు అవి రోగము యొక్క ప్రభావము క్రింద నలిగిపోవుచున్నవి, అని మేము ఎరిగియున్నాము. మరియు సువార్తను ప్రసంగించుటకు, మమ్మలను బాగుగా ఉంచెదవని మేము ప్రార్ధిస్తున్నాము. ఒకవేళ యేసు ఆలస్యము చేస్తే చాలా సంతోషకరమైన సంవత్సరములు మనము జీవించెదము.

క్రీస్తు యేసు నందు, ఒక్క ఆత్మ ద్వారా, అక్కడ బాప్తీస్మము తీసుకొని; అందరూ భద్రత అనే ఓడలో, మనమందరము ఎత్తబాటు కొరకు సిద్ధపడియుందుము; ఆ పై అంతస్తు మీద, ఎక్కడైతే సువార్త యొక్క వెలుగు ప్రకాశించడము మనము చూడగలమో, మరియు ప్రతీ వాక్యమును "ఆమేన్ తో ముగించుము. ప్రభువా, అనుగ్రహించుము వారిని దీవించండి మరియు వారిని కాపాడండి. నీ యొక్క కిరీటములో వారిని రత్నములుగా నేను ఆరోపిస్తున్నాను, ప్రభువా, యేసు నామములో. ఆమేన్.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణనూ కొనెను

కల్వరి వృక్షము పైనే.

HEB 4:12

 

82ఇప్పుడు, మనకు తెలిసినట్లుగా, వాక్యము కొన్నిసార్లు కోయుచున్నది, కానీ ఆ విధముగానే దానిని మనము ప్రేమించెదము. "దేవుని యొక్క వాక్యము," హెబ్రీయులకు 4 చెప్పెను, "అది రెండంచుల గల వాడియైన ఖడ్గము." అది ప్రతీ దానిని కోయును, రెండంచులు, వచ్చుట మరియు వెళ్ళుట. "మరియు అది మరింత శక్తిగలది, చాలా త్వరితమైనది, ప్రాణాత్మలను కిళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది." అది ఏమిటి? వాక్యము. వాక్యము, చూశారా. మరియు ఇప్పుడు, మనము ఒక నిజమైన కోతను కలిగియున్న తరువాత, కఠినమైన వర్తమానము, మీరు దానిని ఆనందించారా? అవునయ్యా — పోరాటము!

ఈ రాత్రి, మీరు కోటగా కట్టబడి యున్నందుకు ఆనందముగా లేరా? అది , సంఘమునకు విశ్వాసము మరియు బలము మరియు నిరీక్షణ నిర్మించును. ఓ, "క్రీస్తు అనే స్థిరమైన బండపై నేను నిలబడెదను? మిగతా నేలలు అన్నీ కూలిపోయే ఇసుకే."

83ఇప్పుడు రెండు లేక మూడు నిముషములు ఆయనను ఆరాధించెదము, మీరు చేసెదరా? మన కళ్ళను మూసి, మన చేతులను పైకెత్తుదాము. సహోదరీ, నేను ఆయనను ప్రేమించుచున్నాను, దాని పైన తాళమును మాకు ఇమ్ము, నీవు ఇవ్వగలవా? నేను దానిని తీసుకొనెదను.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

(ఇప్పుడు మిమ్ములను మీరు మర్చిపోండి, ఇప్పుడు ఆరదించుడి.)

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,

మరియు నా రక్షణనూ కొనెను

కల్వరి వృక్షముపైనే.

ఇప్పుడు ఒకరి వైపు ఒకరు చూసుకొనెదము,

మరియు ఒకరి చేయి మరొకరు కరచాలనము చేసుకొనండి, చెప్పండి

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.

మరియు నా రక్షణనూ కొనెను

కల్వరి వృక్షము పైనే.

LUKE 24:37•

LUKE 24:39,41•

LUKE 24:49

 

84కల్వరి ఏమిటి? ఆయన యొక్క కాదేఘ-బర్నయా, అది ఏమి చేసినది? అక్కడికి వెళ్ళి మరియు చెప్పాడు, "మరణించిన తరువాత మానవుడు జీవించును. నేను మీకు రుజువు చేసెదను." మనయందరి యొక్క తీర్పును తీసుకొనుటకు, అక్కడ కాదేఘ-బర్నయాకు వెళ్ళెను. కల్వరి! మన పాపముల కొరకు చనిపోయి, మరియు మరణము అనే నదిని దాటాడు. ఆ మూడవ దినమున, ఆయన తిరిగి వచ్చియున్నాడు. కొండ దిగువకు ఆ రాయి దొర్లిపోయెను, మరియు సజీవముగా ఆయన నడిచి వచ్చియున్నాడు.

వారిలో కొంత మంది చెప్పారు, "ఆయన ఒక ఆత్మ."

ఆయన చెప్పెను, "నన్ను తాకుము. నేను కలిగియున్నట్లుగా దెయ్యమునకు (ఆత్మకు) శరీరము మరియు ఎముకలు ఉండునా?" చెప్పెను, "మీ దగ్గర తినుటకు ఏదైనా ఉన్నదా?"

వారు చెప్పిరి, "మేము కొంచెము కాల్చిన రొట్టెను ఇక్కడ కలిగి యున్నాము, నేను ఊహించుచున్నాను, మరియు కొన్ని చేపలు."

చెప్పెను, "మనము దానిలో కొంచెము ముక్కను తీసుకొనెదము." మరియు ఆయన తీసుకొని మరియు దానిని తినియున్నాడు. ఆయన చెప్పాడు, "మీరు చూడండి, నేను తినుచున్నట్లుగా ఒక ఆత్మ తినలేదు." ఆయన చెప్పాడు, "ఇప్పుడు మీరు యెరుషలేమునకు వెళ్ళుడి, మరియు అక్కడ నుండి మీరు సువార్తతో ప్రారంభించండి, మరియు నేను మీకు మీ పునరుత్థానము యొక్క ఆ ప్రథమ ఫలములను తిరిగి పంపెదను, ఎందుకనగా వాక్యములో నుండి నేను మిమ్ములను అవిశ్వాసములో నుండి పైకి లేపెదను, మరియు దీనియందు విశ్వాసముంచునట్లుగా మరియు నమ్మునట్లుగా చేసెదను. మరియు మీరు పాపము మరియు సమస్త అవిశ్వాసము నుండి పైన ఉండెదరు."

MATT 25:6,7

 

85మరియు ఆ విధముగా, కొందరు మొదటి జాములో వచ్చెదరు, రెండవ జాము — గుర్తించుకొనండి, ఏడవ జాము. మీరు దానిని గుర్తించుకొన్నారా? ఏడవ జాము అనగా ఆయన వచ్చినప్పుడు. ఏడవ జాము అనగా ఏమిటి? ఏడవ దూత వర్తమానము. మొదటి జాము, వారు కునికి నిద్రించిరి, రెండవ జాము, మూడు, నాలుగు, అయిదు, ఆరు, కాలముల గుండా, తుయతైర, మరియు అన్ని యుగముల గుండా అంతయూ, లవొదికయ జాము వరకూ; కానీ ఏడవ జాములో స్వరము వచ్చినది, "ఇదిగో, పెండ్లి కుమారుడు వచ్చెను, ఆయనను కలుసుకొన వెళ్ళుడి." మరియు ఏమిటి? వారు మేల్కొని మరియు వారి దీపములను శుభ్రపరచుకొనిరి.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.

మరియు నారక్షణనూ కొనెను

కల్వరి వృక్షము పైనే.

ఓ, మై, సహోదరి రూతు, దానిని ఆపివేయమని నేను చెప్పుట కాదు. ఈ అందమైన పాటలను దానిలో పెట్టకూడదు అని నేను తలంచాను. మీరు చూశారా, అది టేపు చేయబడాలని నేను కోరియున్నాను. నేను చేయుటకు ప్రయత్నించుచున్నాను — అవి వెళ్ళియున్నట్లుగా, ఈ పాటలను పట్టుకొని ఉంచుము. మీరు దానిని ప్రేమించుట లేదా?

86మీకు తెలుసు, పాత పెంతుకోస్తు పాటలు పాడడం నేను కూడా మంచిగా ప్రేమించెదను, కానీ ప్రతీసారీ నేను చెప్పాను, ఎక్కువగా తర్ఫీదు పొందిన స్వరమును నేను ద్వేషించెదను — వారి యొక్క ముఖము నీలము రంగులోనికి మారునంతగా తమ ఊపిరి బిగబెట్టువారు, ఆ విధముగా, బిగ్గరగా అరుస్తూ, మరియు వారు … వారు పాడుట లేదు; వారు కేవలము అల్లరి చేయుచున్నారు, చూశారా. ఆ పాత పాటల పాడే విధానమును నేను ఇష్టపడెదను, మీ హృదయము నుండి, మీకు తెలుసు, ఆ విధముగా: "ఆమేన్, ఆమేన్, ఆమేన్!" మీరు కాదా? నేను దీనిని ఇష్టపడెదను.

తండ్రియందు విశ్వాసము, కుమారుని యందు విశ్వాసము,

పరిశుద్ధాత్మ యందు విశ్వాసము, ముగ్గురూ ఒక్కటే;

దెయ్యములు వణుకును, మరియు పాపులు మేల్కొనును;

యెహోవా యందు విశ్వాసము దేనినైనా కదిలించును.

87ఈ దెయ్యము యొక్క రాజ్యము కదిలింపబడి మరియు పడిపోవునట్లు చేయుము. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనే పెద్ద తూటా వంటి మాటలను ప్రేల్చుము. ఆ దేవుని యొక్క అణు వాక్యము అక్కడకు ఎగిరి వెళ్ళి మరియు సాతాను యొక్క రాజ్యమును తత్తనీయులుగా చేయును. ఆమేన్. అప్పుడు, "కవాతు చేయుచున్న క్రైస్తవ సైనికులు, యుద్ధమునకు కొనసాగుదురు." అది నిజము. అది సరే. ప్రతీ ఒక్కరూ, వారి యొక్క స్వరములు ఎత్తి, ఇప్పుడు మళ్ళీ పాడెదము, మీ కళ్ళు మూసుకొని, చేతులు గాలిలో పైకెత్తి, నేను ఆయనను ప్రేమించుచున్నాను. అది సరే, ప్రియమైన సహోదరి. అంతా సరియే.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.

మరియు నా రక్షణనూ కొనెను

కల్వరి వృక్షముపైనే.

పరలోకపు తండ్రీ, నీ చేతులకు మమ్ములను మేము సమర్పించుకొనుచున్నాము. నీకు అనుకూలమైనది మా పట్ల చేయుము. ప్రభువా, నీవు మమ్ములను ఉపయోగించుకొనెదవని మేము నమ్ముచున్నాము, ఇతరులైన మా ప్రజల మధ్య, మరియు మేము ఎక్కడికైతే నడిపించబడతామో అక్కడ వెలుగును తీసుకొని రమ్ము. మరియు, దేవా, మరియు ప్రశస్తమైన పనలు తీసుకొని వచ్చి, మళ్ళీ మేము తిరిగి కలుసుకొనేంత వరకూ మమ్ములను ఇప్పుడు గమనిస్తూ మరియు కాపాడుము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

ఇప్పుడు, ఈ రాత్రి, మీ అందరితో ఉండుట ఆనందమై యున్నది, సహవాస సమయమును కలిగియుండుము. మీ ప్రియమైన పాస్టరు గారైన, సహోదరుడు జూనీకి తిరిగి బలిపీఠమును నేను అప్పగించుచున్నాను. అది సరే, సహోదరుడా.

.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...