యేసు పక్షమున నిలుచుట
VGR COUNT-284 1…లూయిస్ విల్ లో మీరు భోజనము చేసే ఒక స్థలమున్నది. మనం చూద్దాం. మరియు అది డాగ్-ప్యాచ్ రెస్టారెంట్ అని పిలవబడును. ఎవరైన అచ్చట తిన్నప్పుడు, వారికి మీరు ఇచ్చిన డబ్బును వారు తీసుకొని మరియు దానిలోనుండి దశమ-భాగమును సంఘమునకు పంపించెదరు. అది 319 పశ్చిమ జఫర్సన్ వీధి దగ్గరలో ఉండియున్నది. అందుచేతనే బిల్లీ దానిని ఇచ్చట పెట్టియున్నాడని నేను అనుకొనుచున్నాను. దాన్ని బట్టి వారు చూడగలరు. అది చాలా బాగుంది.
సహోదరులారా, ఇప్పుడు పురుషుల కూటమును గూర్చిన మీ విధానము ఎట్లుండునో, మీరు ఏమి చేయుదురో లేదా మీ కూటములను మీరెట్లు నిర్వర్తించుదురో నాకు తెలియదు. మరియు వాడుక చొప్పున క్రమంగా ఇచ్చట జరిగే కార్యక్రమ పట్టికను గనుక నేను తప్పినయెడల దానిని నా దృష్టికి తీసుకురండి.
2అది ఈ రాత్రి ఉద్దేశించబడినదని నేను అనుకున్నాను. మన అత్యంత ప్రియమైన సంఘకాపరియైన, సహోదరుడు నెవిల్ తో కలిసి నేను ఈ మధ్యనే భోజనం చేసియున్నాను, మరియు నా హృదయమందున్న విషయమును అతనితో చెప్పుచుంటిని. మరియు పురుషులను మరియు సేవకులను, సువార్తలో మన జతపనివారిని మనము పోగుచేసినయెడల, మనము బహిరంగముగా ప్రజల యెదుట మాటలాడే విధంగా కాకుండా, మనము ఒకరితోనొకరము మాటలాడుకొనెదమని నేను అనుకున్నాను. ఎందుకనగా మనమంతా, మనము పురుషులము గనుక పురుషులవలె అర్థం చేసుకొనెదము, మనము క్రైస్తవ పురుషులమై యున్నాము. మరియు ఆ విధంగా సాధారణంగా, ఒక సంఘ సభ్యుల గుంపులో మీరు ఏదైనా ఒక విషయమును చెప్పుదురు మరియు ఒకరు ఈ విధంగా మరియు ఒకరు ఆ విధంగా దానిని అర్ధం చేసుకొనెదరు. మరియు అది పూర్తిగా బయటికి పోవును. అయితే ఈ రాత్రి, నేను సంఘము యొక్క స్థానమును మరియు దాని స్థితిని గూర్చి నా హృదయములో ఉన్నది చెప్పవలెనని ప్రయత్నించుటకు వచ్చియున్నాను. మరియు తగిన సమయములో మనము ముగించినయెడల, అప్పుడు సరియని అనిపించినచో నేను వాక్యముపై కొద్దిసేపు మీతో మాటలాడవలెనని కోరుచున్నాను. కొద్దిగా దానిని స్థిరపరచి, అప్పుడు మనము మన వ్యవహారమునకు వచ్చెదము లేదా ముందుగా నేను మీకు వ్యక్తపరచవలెననుకొన్న భాగమునకు వచ్చెదము. మరియు ప్రతీ రాత్రి మామూలుగా మీ సమయానికి దాదాపు 9:30 గంటలకు లేదా ఇంచుమించు ఆ సమయమునకు మీరు బయటకు వెళ్ళవచ్చునని నేను అనుకొనుచున్నాను. సరి, నేను మిమ్మల్ని ఎక్కువ సేపు ఉండనీయకుండా ప్రయత్నించెదను. రేపు శనివారమైయున్నది, మరియు అది ఒక వ్యాపార దినమైయున్నది, అయితే మనమప్పుడు మన కిరాణా సరుకులు మరియు మొదలుగునవి తెచ్చుకోవలసియున్నది.
3సహోదరుడు నెవిల్ కు నేను బహిరంగముగా చెప్పగోరుచున్నాను. ఇప్పుడు మీలో ప్రతీ ఒక్కరితో, సరిగ్గా నేను మీతో వ్యక్తిగతముగా మాట్లాడుచున్నట్లే, మీలో ప్రతీ ఒక్కరితో నేను చెప్పగోరుచున్నాను. ఎందుకనగా దేవుడు తనయొక్క సంఘమునకు, తనయొక్క ప్రజలకు, పురుషులనే నాయకత్వం వహించునట్లు చేసియున్నాడను దానిని నేను నిజముగా తలంచుచు, మరియు నమ్ముచు, మరియు బోదించుచున్నాను. మీరు అటువంటి ఒక గుంపు యైయున్నారు, చూశారా. మరియు అదొక… గతరాత్రి దేవుడు తన ప్రజలను ఆయన యొక్క వాక్యముతో భద్రపరిచి యున్నాడను దానిగూర్చి నేను నా సహోదరుడు జూనీయర్ జాక్సన్ కు బోధించుచున్నాను. మరియు ఆ (దేవుని) క్రమము నుండి తప్పిపోవుటకు ఒక స్త్రీ (హవ్వ) కారణమైనది, మరియు అట్లు చేసినప్పుడు, నిత్యము తన సంఘమును వాక్యముచేత భధ్రపరచి యుండుటకు, దేవుడు ఎల్లప్పుడు దానిని పురుషులకు అప్పగించెను.
ఇప్పుడు, నేను అతనితో వ్యక్తిగతముగా మాట్లాడి సహోదరుడు నెవిల్ ను కొద్దిగా ప్రోత్సాహపరచవలెనని కోరుచున్నాను, గతరాత్రి నేను వేదికమీద ఉండగా, రెండు లేదా మూడు సార్లు, వివేచన నన్ను తట్టుటను నేను గమనించాను. మరియు నేను చుట్టూ తిరిగాను, ఎందుకనగా ఇటీవలే, కొన్ని వారాల క్రితం నాకు కలిగిన ఈ కల యొక్క భావము ఏమైయున్నదని కనుగొను వరకు, నేను దానికి తగినంత దూరములో ఉండుటకు ప్రయత్నించుచున్నాను. అది చాలా కాలంగా నన్ను అంటుకొనియున్నది, నేను వర్తమానము గూర్చి మరియు వివేచన గూర్చి మరియు మొదలగువాటిని గూర్చి ఏదో ఒక దానిని నేను ఇచ్చట సంఘములో చెప్పియున్నాను, అది సరిగ్గా బయలు వెళ్ళుటలేదు. ఆ సమయము అయిపోయినదని నా అభిప్రాయమైయున్నది. మరియు ఆ విషయంలో బహుశా నేను తప్పైయుండవచ్చును, అయితే సహోదరుడు నెవిల్ అలసట చెందినట్లుగాను మరియు నిరాశగాను ఉండుటను నేను గమనించియున్నాను.
4మరి అయిననూ సహోదరుడా నెవిల్, ఈ సహవాసములో నీవు కేవలం దానికొరకే ఎదురుచూచుచున్నావని నీవు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను. గత కొద్ది రోజులుగా ఈ సహవాసముతో సంబంధము కలిగియున్న సేవకులను, అపవాది ఏమి చేయుటకు ప్రయత్నించెనో నీవు గమనించితివా? కొద్ది నిమిషములు ఆగి మరియు ఆశ్చర్యపోవుదుము. ఈ రాత్రి సహోదరుడు క్రేస్ ఇచ్చట కూర్చునియున్నాడు. దాదాపుగా ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయేవాడు, చూశారా. మరియు ఒక తుపాకి లేదా ఒక రైఫిల్ ప్రేలుడుతో దాదాపుగా నా తల బద్దలైపోయియుండేది, చూశారా. సాతానుడు మనలను తీసుకొనిపోవుటకు ప్రయత్నించుచున్నాడు. మరియు నీవు అచ్చట నేరుగా గ్రుద్దుకొని నీకు నీవు మరియు ఎవరో ఒక స్త్రీని కూడా ఆ ప్రమాదంలో చంపియుండేవాడివి. చూశారా, కేవలం సేవకులే, కేవలం సేవకుల గుంపు యైయుండుటను గమనించండి, చూశారా. అది సాతానే, మరియు వాడు మనలను వదిలించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు.
ఇప్పుడు, మనము ఇచ్చట సమావేశమైనది ఏదో ఒక విధమైన వ్యాపారము గూర్చి మాటలాడుకొనుటకు కాదని మనము గ్రహించుయున్నాము, మనము ఇచ్చట క్రీస్తును గూర్చియు మరియు పట్టుకలిగి యుండు సంగతులను గూర్చియు, మరియు ఈ ప్రస్తుత సమయములో మనమేమి చేయవలెనో దానిని గూర్చియు మాట్లాడుకొనుటకు మనము ఇచ్చట సమావేశమై యున్నాము. మరియు సహోదరుడా నెవిల్, నేను నిన్ను ప్రోత్సాహించగోరుచున్నాను. ధైర్యముగా ఉండుము. ఏది వచ్చినను, ఏది వెళ్ళినను, ఏమి జరిగినను, లక్ష్యపెట్టకుము. ఏదియు నిన్ను ఇబ్బంది పరచుటకు అనుమతించకుము. కేవలం అచ్చట ఒక యుగముల బండ వలె నిలబడుము, మరియు దేవుడే ప్రతీది సక్రమముగా జరుగునట్లు చేయును. ఆయన దానిని మీకు నిరూపించియున్నాడు. అది నిన్ను కృంగదీసి యుండవచ్చునేమో. అది ఆ స్త్రీని చంపియుండవచ్చును. మరియు అది నీ మిగతా దినముల అన్నిటా నీ మనస్సులో ఉండవచ్చును. మరియు ఇంకా అనేక సంగతులు జరిగియుండవచ్చును, అయితే దేవుడింకనూ సింహాసనముపై ఉండియున్నాడు. ఆయన ఆ కార్యములన్నిటిని మేలుకొరకై అనుమతించును. ఆయన మనలను కూడా తీసుకొనియుండేవాడు. మరియు కావున సాతానుడు సంఘమునొద్ద పోట్లాడుచున్నాడు.
5ఇప్పుడు, ఆ ఉదయమున అచ్చట నేను మూలరాయిని పెట్టినప్పుడు, నేను ఒక సంఘ కాపరినగుదునని నేనెన్నడూ భావించలేదు. మొదటిగా నా పిలుపులో అది లేదు. మరియు నా మొదటి పిలుపు నేను సువార్త రంగము మీద ఉండుటకైయున్నది. అది చాలా ఏండ్ల క్రితమైయున్నది. మరియు సరిగ్గా ఈ వీధికి ఎదురుగా ఒక గుడారములో ప్రారంభించితిని. మరియు అచ్చట సహోదరుడు రాయి డేవిస్ యొక్క మందిరము కాలిపోవుట నాకు జ్ఞాపకమున్నది. ఆ గుంపు ప్రజలు కాపరి లేని గొర్రెలవలే చెదిరిపోయియుండి, వెళ్ళడానికి చోటు లేకుండిరి. మరియు అప్పుడు శ్రీ. హిబీస్టెన్బర్గ్ పోలీసు అధికారియైయుండి, మరియు నన్ను అక్కడికి పిలిపించెను. ఆయన నాతో ఇట్లనెను, "మేము నీకు సహాయము చేయుటకై ఇచ్చట ఉన్నాము." ఇట్లనెను, "నేను స్వయముగా ఒక కథోలిక్ నై యున్నాను, కాని," ఇట్లన్నాడు, "ఆ ప్రజలు వారికి బహుశా వస్త్రములు లేకపోవచ్చును." అది ఆర్ధిక ఇబ్బందుల సమయం ఇట్లన్నాడు, వారు ఇతర సంఘములకు వెళ్ళుచున్నారు మరియు వారు వీరిని పరాయివారిగా భావించుచున్నారు, మరియు వారు మంచి ప్రజలైయున్నారు, వారిలో చాలా మందిని నేను ఎరిగియున్నాను." అతడు ఇట్లన్నాడు, "బీల్లీ, నీవు ఒక సంఘమును ప్రారంబించగోరినయెడల, ఏ విషయములోనైనను నీకు సహాయము చేయుటకై మేము నీ వెనుక ఉండియున్నామని నీవు తెలుసుకొనవలెనని కోరుచున్నాము." మరియు దానికై నేను అతనికి కృతజ్ఞతలు చెల్లించాను.
6మేమొక విరాళములు సేకరించు దినమును (Tag Day) కలిగియున్నాము. మొదటిగా మేము ప్రార్ధించి మరియు ప్రభువును అడిగియున్నాము. మరియు ప్రజలు నా వద్దకు వచ్చి ఒక సంఘమును నిర్మించమని కోరియున్నారు. తద్వారా వెళ్ళుటకు ఒక స్థలమును కలిగియుండవచ్చును. మరియు మేము ఈ స్థలమును నిర్ణయించుకున్నాము. మరియు ఒక రాత్రి సుమారుగా ఈ సమయానికి లేదా మరికొద్ది సమయమునకు, ఒక విధమైన కలుపు మొక్కలతో మరియు ఈ గోతి నిండా నీళ్ళతో, మరియు సరిగ్గా ఈ చోటు ఒక చెత్త కుప్పవలె ఉండియున్నది. సరి, నిశ్చయముగా ప్రభువు నాతో మాట్లాడి మరియు దానిని సరిగ్గా ఇచ్చట నిర్మించుము," అని చెప్పెను. ఒక పైసా కూడా లేకుండెను మరియు మా మధ్య సుమారు ఎనబది సెంట్లు లేదా ఒక్కడాలరు మాత్రమే ఉండియున్నది మరియు ఇప్పుడు మీరు దాని విషయమై నవ్వుట సహజమే కాని సహోదరుడా అప్పట్లో అది ఎంతో కొంత డబ్బైయున్నది.
ఎవరైన ఒక పొరుగువాడు ఒక కుండెడు చిక్కుడు కాయలు వండినప్పుడు మరియు అప్పటికే ఆ పొరుగువానికి రెండు లేదా మూడు రోజులు వరకు ఏమియూ లేకుండిననూ వచ్చి మరియు వాటిలో కొన్నింటిని తినేవారు. అవి కష్ట సమయములైయున్నవి. చాలా మంది యౌవనస్తులు దానిని ఎన్నడూ చూసియుండలేదు, అయితే అది కష్టంగా గడిచే సమయమైయున్నది. ఇరుకు చోటుగా ఉండిననూ రెండు లేదా మూడు సార్లు ఈ సంఘములో ఇటునుండి అటువైపుకు ఒక చందా పెట్టెను అందించిననూ ముప్పది అణా పైసలు మాత్రమే వచ్చెడివి. బహుశా ముప్పది అణా పైసలు వచ్చెడివి. అదియే బాగుగా చెల్లించబడ్డ కానుకయైయున్నది, చూశారా. అది నిజముగా కష్టముగా గడుచుటయైయున్నది.
7మరియు వెళ్ళుటకు ఒక స్థలము ఉండునట్లు, ఒక మందిరమును నిర్మించవలెనని జనుల యొక్క కోరికయైయున్నప్పటికినీ, నిర్మించుటకు మా వద్ద ఏమియూ లేకుండెను. ఏలయనగా ఆ రోజుల్లో… సరి. ఈనాడు వర్తమానము చెడుగా ఎంచబడుచున్నదని మీరనుకొనుచున్నారు గదా, మరియు మేము నమ్ముచున్న యేసుక్రీస్తు నామములో ఈ నీటి బాప్తిస్మము, మరియు ఆ ఆశీర్వాదములు మరియు మేము నమ్మి నిలబడియున్న కార్యములను గూర్చి నిలబడుటకు, ఎవరులేని ఆ రోజుల్లో అది ఎట్లుండేదో మీరు తెలుసుకొనవలసియున్నది.
కావున, మేము ఇక్కడేయుండి మరియు మందిరమును నిర్మించెదమని నా హృదయమందు దేవునికి ప్రమాణం చేసియున్నాను. సరిగ్గా ఆ సంవత్సరములో ఈ సమయానికి ఆ ఉదయమున మేము మూలరాయిని వేసియున్నాము, ఆ ఉదయమున సుమారు ఎనిమిదిగంటలకు నేనచ్చట కూర్చొనియుండి సూర్యుడు పైకి వచ్చుటను గమనించుచుండగా, అచ్చట ఒక దర్శనము ద్వారా ఆయన నన్ను కలుసుకొనెను. మరియు ఆ నది వద్ద ఆయన నన్ను కలుసుకొన్న పిమ్మట, ఆ వెలుగునందు ప్రభువు దూత ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నాతో చెప్పియున్నాడు. దూరము నుండి దానిని నేను చూసియున్నాను. అది ఒక నక్షత్రమువలె కనిపించెను. మరియు సరిగ్గా నేను ఉన్నచోటికి అది వచ్చెను, మరియు ఆ గుర్తింపదగిన మాటలు పలుకబడెను. మరియు కావున, ప్రజలు ఆరాధించుటకు వారికొక స్థలమును సంపాదించుటకు అప్పుడు నేను ఉద్దేశించుకొంటిని.
8ఇప్పుడు, నాలో నేను ఇట్లు తలంచితిని, "అది నా కొరకు కాదు. దానితో నాకు ఏమియు లేదు, అయినా దేవునికి సంబంధించినది ఏదైననూ అది నాలో భాగమైయున్నది, అది ఏమైనాగాని… నా కర్తవ్యము ఇది చేయుట లేదా అది చేయుటయైయున్ననూ, దేవుని పిల్లలకు సంబంధించినది ఏదైననూ, అది నాదైయున్నది. అది ఎచ్చట ఉన్నాగాని దేవుని యొక్క వారసత్వమును చూచుకొనుట, నా కర్తవ్యమైయున్నది," చూశారా.
సరిగ్గా మీరు చెప్పినట్లే, "మంచిది, నేను…" మీరు ఒక చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు, ఇట్లందురు, నా పని కేవలం కట్టెలను నరుకుట మాత్రమే. వాటిని లోపలికి మోయుట నా పని కాదు, జాన్ వాటిని మోసేవాడు. కట్టెల మీద మంచు పడిననూ, వర్షం పడిననూ, నాకు సంబంధము లేదు. అతడినే బయటకు వెళ్ళి మరియు వాటిని తీసుకురానీయుడి. కాదండి, ఆ ఇంటి బిడ్డగా నీ తల్లి కొరకు, ఆ కట్టెలు తడవకుండా చూచుకొనే బాధ్యత నీదైయున్నది, చూశారా. వాటిని లోపలికి తీసుకు రండి.
9వారు ఇట్లు చెప్పినచో, "మంచిది, ఫ్రాంక్ వెళ్ళి నీళ్ళు మోసుకొనిరావాలి; అది నా పని కాదు." అయితే ఒకవేళ ఫ్రాంక్ వెళ్ళి నీళ్ళు మోసుకురానియెడల, ఆ నీళ్ళ విషయమై శ్రద్ధవహించవలసిన బాధ్యత నీదైయున్నది. అది అంతేయైయున్నది. ఇప్పుడు, అది సరిగ్గా ఆ ప్రకారంగానే కొనసాగును. మరియు, దేవుని కుటుంబంలో కూడా అది ఆ విధంగానే పనిచేయును.
ఒకవేళ వారిలో కొందరు… వారిలో కొందరు ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, "నువ్వు ప్రసంగించే ఆ విధానాన్ని నిలిపివేయి. ఓ, అలాగుచేసి నీవు కలిగియున్న ప్రతి స్నేహితుడిని మరియు ప్రతిదానిని నీవు పోగొట్టుకొనుచున్నావు. దానిని విడిచిపెట్టుము. అది తప్పని నాకు తెలియును; కాని అది మన పని కాదు," అని అన్నాడు. సరి, అలాగయినచో అది ఎవరి పని? అది తప్పైనచో, దానిని ఎవరైనా సరిచేయవలసియున్నది. కావున మనమే దానిని చేద్దాం. మరియు సంఘము విషయములో నేను ఆ విధంగా తలంచుచున్నాను.
10భవన నిర్మాణ వ్యవహార విషయంలో ఆటుపోటులు మరియు ఒడుదుడుకులు వచ్చెను, మరియు వాగ్వాదములు మొదలుగునవి సంభవించెను. ఒకరు కావాలి అనిరి - మరొకరు వద్దు అనుకొనిరి మరియు ఇదియు, అదియు అనిరి. దానిని మీరు ఆ విధంగా కనుగొనెదరు.
మీరు వెళ్ళిన చోటల్లా సేవకుల మధ్యను వ్యాపారవేత్తల మధ్యను లాడ్జిల మధ్యను మీరు వ్యవహరించిన కొలది దానిని మీరు కనుగొందురు. ఎక్కడైతే మీరు గుంపు మనుష్యులను కలిగియుంటారో, అక్కడ భిన్నమైన ఆలోచనలు మీరు కలిగియుందురు. మరియు కావున తద్వారా మీరు నమ్మికయుంచునట్లుగా, మీరు ఒక వ్యక్తిని కలిగియుండవలసియున్నది మరియు ఆ వ్యక్తిని ఎన్నుకొనవలసియున్నది. దానితో పని అంతయూ జరుగును. సరిగ్గా సైనిక దళములో ఉన్నట్లే మీరు ఒక సైన్యాధ్యక్షుడిని కలిగియుండవలసియున్నది; అతడే ప్రధాన కేంద్రమైయున్నాడు. నాయకుడు దీనిని చెప్పును; అతడు ఆ గుంపుకు నాయకుడు, అయితే అతని ఆజ్ఞలను సైన్యాధ్యక్షుడు మార్చగలడు. మరియు సంఘములో ఆ ప్రధాన సైన్యాధ్యక్షుడు యేసుక్రీస్తేయైయున్నాడు, మరియు ఆయన యొక్క సేవకులు ఇచ్చట భూమి మీద ఆయనకు ప్రాతినిధ్యం వహించువారైయుండి, ఆయా ప్రజల సమూహములకు ఆయన యొక్క నాయకులుగా ఉన్నారు.
11మరియు ఇచ్చట ఈ చిన్న గుడారము విషయంలో వారు అనేక విధములైన ప్రయత్నములు చేసిరి. మరియు చివరిగా…. నేను దానిని నిర్మించిన తరువాత చూద్దాము అన్నట్లు నేను దాని విషయంలో మౌనంగా ఉంటిని. మరియు తరువాత సుమారు పదిహేను మరియు పదహారు సంవత్సరముల క్రితం ప్రభువు నన్ను సువార్త రంగమునకు పిలిచెను. మరియు నేను సంఘమును విడిచిపెట్టితిని. అయినాగాని, నేను దానిని అసలు వదిలివేయలేదు. ఇచ్చట ఏదైనా ఒక తప్పుడు కార్యము ప్రారంభమైనయెడల, నా మాట చెల్లునట్లుగా, నేను ఎల్లప్పుడూ నా పేరును దానికి జోడించాను. నేను వచ్చి మరియు దానిని ఒక హక్కును కలిగియున్నాను, ఎందుకనగా ఇచ్చట అనేక సంవత్సరాలుగా ఈ వేదిక వెనుక విషయమును తిన్నగా ఉంచుటకు పదిహేడు సంవత్సరములుగా చెమటోడ్చి యున్నాను. ఒక సంఘ శాఖగా కాకుండా ఉండుటనుబట్టి అన్ని విధములైన సిద్ధాంతములు మరియు నిగూఢమైన విషయములు చొరబడుచున్న వాటన్నింటిని దేవుని యొక్క సహయము వలన సంకరము చేయబడని సువార్తతో ఇచ్చట నిలబడి ఎదుర్కొనియున్నాము, మరియు ఆమె ఇంకనూ ఈ రాత్రి అట్లే నిలచియున్నది. వాస్తవము. కావున మేము… అయితే నా నుండి ఈ సంఘమును అమ్మివేసే ప్రయత్నములు మరియు అటువంటివి జరిగిన సమయములు ఉండియున్నవి. అచ్చట దానికి నా పేరు జోడించబడనియెడల, అది జరిగియుండేదే, అంతేకాకుండా ఈ రాత్రి అది ఖచ్చితంగా ఒక భయంకరమగు అయోమయ స్థితిలో ఉండియుండేది. మరియు నేను కాదు, దానిని చేసినది దేవుడే.
12మరియు పిదప, ఇప్పుడు అది ఉన్నచోటుకు వచ్చుటను, మరియు మనము ఒక గొప్ప సమయములో జీవించుటను నేను చూచుచుండగా, ఈ సంఘము గూర్చి ఏదైన చెప్పుటకు నేను ఇంకనూ ఆసక్తి కలిగియున్నాను, చూడండి. ఎందుకనగా అది నాలో ఒక భాగమైయున్నది. నేను ఇచ్చట ఉన్ననూ, లేకున్ననూ అది ఇంకనూ నాలో భాగమైయున్నది. మరియు అది శుభ్రముగాను, క్రమముగాను నడిపించబడుచున్నదా, అని చూచుటయు మరియు దేవుని రాజ్యము కొరకు నేను చేయగలిగినంత ఉత్తమమైన దానిని చేయుటయు నా కర్తవ్యమైయున్నది. మరియు నేను చాలా కృతజ్ఞుడను…
13ఈ రోజుల్లో అది చిన్న ఉపగ్రహములను కలిగియుండుటను నేను చూచుచున్నాను. అందుకు నేను చాలా కృతజ్ఞుడనైయున్నాను. ఇచ్చటున్న సహోదరుడు క్రేస్, అతని యొక్క సెల్లర్స్ బర్గ్ బృందం, మరియు యుటికా వద్ద సహోదరుడు స్నెల్లింగ్ యొక్క స్థలమును తీసుకున్న ఆ వెనుకనున్న సహోదరుడు మరియు ఇచ్చటున్న రడెల్ సహోదరుడు, మరియు సహోదరుడు జూనియర్ జాక్సన్, మరియు ఆ ప్రశస్తమైన పిల్లలు, వారు చక్కని వ్యక్తులు, దేవుని యొక్క అద్భుతమైన మనుష్యులైయున్నారు; వారు ఈ వర్తమానమును బోధించుదురు. ఇప్పుడు, వారిలో ఒకరు ఏదైన ఒక విషయము లేదా మరొక విషయములో కొద్దిగా ఏకీభవించకపోవచ్చును, అది కేవలం సేవకుల మధ్యనున్న మానవ నైజమైయున్నది. మరియు సేవకులు ఒక చిన్న వ్యత్యాసము కలిగియుండినయెడల, అది ఏమాత్రము బేధమును కలిగించదు. బహుశా ఒకరు ఇట్లందురు, " వెయ్యేండ్ల పాలన వచ్చునని నేను నమ్ముచున్నాను. మరియు యేసు ఒక తెల్లని గుర్రముపై వచ్చును." మరొకరు ఇట్లు చెప్పుదురు, "ఆయన వచ్చినప్పుడు, ఆయన ఒక తెల్లని మేఘముపై వచ్చును." చూడండి, ఆయన ఎట్లు వచ్చుచున్నాడనునది విషయము కాదు గాని, ఆయన వచ్చుచున్నాడని నమ్మడమే, అదియే ప్రధానమైన విషయమైయున్నది. ఆయన వచ్చుచున్నాడన్నది మాత్రం వారు నమ్ముచున్నారు మరియు ఆ విధానములో దానికొరకై వారు సిద్దపడుచున్నారు.
JOEL 2:25
14నేను ఇప్పుడు కనుగొన ప్రయత్నించాను, మరియు నేను అధ్యయనం చేయుచూ ఉంటిని. నేను దానిని సంఘము ఎదుట చెప్పియున్నాను. నేను ఆదిమ సంఘము గూర్చి చదువుచుంటిని. మరియు ఆ అభిషేకించబడిన వ్యక్తులు ఏ విధంగా ఆ దేవుని యొక్క గృహమును సిద్దపరచువారు అనునది, మరియు ఆ గృహములో దేవుని యొక్క ఆరాధన క్రమమును నేను గమనించియున్నాను, మరియు అది నిజంగా చాలా బాగున్నదని నాకు తోచియున్నది. మరియు యోవేలు 2లో గల, "గొంగళిపురుగులు, మిడతలు, మరియు పసరపురుగులు మొదలగునవి తినివేసిన పంటను నేను మరల పునరుద్దరించెదను అని ప్రభువు సెలవిచ్చియున్నాడు," అను అంశముపై కొద్దికాలం క్రితం నేను ఇచ్చట ప్రసంగించియున్నాను. మరియు నేను ఈ వ్యక్తులు ఏమి చేశారా అనియు మరియు వారు సంఘము పట్ల ఎంతగా శ్రద్ద కలిగియుంటేగాని దేవుడు వారిని దీర్ఘదర్శులుగా నియమించాడన్న దానిపై నేను అధ్యయనం చేయుటను మొదలుపెట్టితిని.
ACTS 1:25,26
15ఇప్పుడు, మనము ఆ ఆదిమ సంఘముతో ప్రారంభించి, తీసుకొన్నయెడల కేవలం ఇప్పుడు వారేమి చేశారన్న దాని కొరకు ఒక ఐదు నిమిషములు దానిని మరియు తరువాత భవిష్యత్తును గూర్చి నాకు కలిగిన దర్శనమును నేను మీకు చూపించగలను. ఇప్పుడు, ఆదిలో సంఘము పెంతెకొస్తు వద్ద ప్రతిష్టించబడియున్నది. మరియు ఎక్కడైతే యేసు పండ్రెండ్రు మందిని ఏర్పరుచుకొనుయున్నాడో, అచ్చట పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడియున్నది, అయితే వారిలో ఒకడు తప్పిపోయియున్నాడు, మరియు ఆ స్థానమును తీసుకొనునట్లు వారు మత్తీయను ఎన్నుకున్నారు. మరియు పరిశుద్ధాత్మ రావడానికి ముందు, అదంతయూ క్రమములో ఉండునంతవరకు వేచియున్నాడు. లేఖనము నేరవేరునట్లు, అతిక్రమము చేత తన ప్రధానత్వమును నిలిపుకొనక పడిపోయిన యూదా స్థానమును తీసుకొనుటకు వారు ఒకరిని ఎన్నుకొనవలసియుండెను.
2SAM 5:24
16మరియు ఈ సంగతులన్నియూ ఇంతవరకు పొడిగించబడవలెనని, వేచియుండవలెనని ఒక సమయముండియున్నదని నేను నమ్ముచున్నాను, అయితే లేఖనము నెరవేర్చబడి, ప్రతీది సరిచేయుబడి, ప్రతీది క్రమములోనికి తీసుకురాబడు ఒక సమయమునకై అది వేచియున్నది. చాలాసార్లు ఒక పిల్లవాని వలె మనము సహనము కోల్పోతాము. మనము గొప్పగా ఆశిస్తాము, మరియు చాలాసార్లు తొందరపడుతుంటాము, మరియు అది ఆ పని దానంతట అది జరగకుండా అభ్యంతరపరచునది అదియే, చూశారా. మనము కేవలం భక్తి గౌరవముతో వెళ్ళుచూ, దేవుడ ఫలానా మరియు ఫలాన విధంగా మనలను వాడుకోవాలని ఆయన కోరినయెడల, ఆయన దానిని ప్రారభించు వరకు మనము వేచియుండాలి అను ఒక ఉద్దేశ్యమును మన హృదయములో కలిగియుండవలసియున్నది, ఏలయనగా ఆయన మనకు ముందుగా వెళ్ళవలసియున్నది.
ఆ రాత్రివేళ దావీదు యుద్దమునకు వెళ్ళుట గుర్తుండియున్నదా? ఆ యుద్దమునుబట్టి అతడు అలసిపోయెను, మరియు ప్రభువు అతనికి ముందుగా బయలుదేరెనని ఆ ఆకుల చప్పుడు వినునంత వరకు అతడు ఆ కంబళిచెట్ల క్రిందనే పడియుండెను. పిదప అతడు ధైర్యముగా వెళ్ళెను, ఏలయనగా ప్రభువు అతని ముందుగా బయలుదేరేనని అతడు ఎరిగియుండెను. మరియు సహోదరులారా, మనమును అలాగు చేసిన చాలును. యుద్దము వచ్చునని ఎరిగియున్నాగానీ, మార్గము కలుగజేయుటకు ప్రభువు యొక్క హస్తము మనకు ముందుగా వెళ్ళుటను మనము చూచువరకు మనము వేచియుండవలెను.
17ఇప్పుడు, సంఘములు ఎట్లు వచ్చెనో, సువార్త ఏ విధంగా అంతటికీ వ్యాపించుట మొదలయ్యెనో నేను గమనించాను. మరియు పిదప, పౌలు మనకు ఒక గొప్ప మిషినరీగాయగుటను దృష్టాంతరముగా తీసుకుందాము. ప్రభువు అతడిని నడిపించినచోటుకల్లా అతడు వెళ్ళి, మరియు ఒక సంఘమును అతడు స్థాపించేవాడని మనము కనుగొనియున్నాము. మరియు అది ఒక నూతన విశ్వాసమైయుండెను. ఆసియా మైనరులోను, ఐరోపాయంతటను ఉన్నట్టుగానే, ఆనాటి సంఘములు ఆ యొక్క వర్తమానమును వారు నమ్మలేదు. మరియు అతడు ఆ వర్తమానమును ప్రసంగించగా అనేకులు అందులోనికి మారినప్పుడు, అతడు ఆ స్థితిలో ఆ ప్రజలను విడిచిపెట్టినయెడల, వారిని నడిపించుటకు ఎవ్వరు లేనందున… మరలా వారి అన్య దేవుళ్ళ తట్టు, యూదా మతాచారములోనికి మరియు అటువంటివాటిలోనికి వారు తిరిగి వెళ్ళసాగిరి, ఎందుకనగా ఆ ప్రజలకు బోధించుటకు ఎవ్వరు లేకపోయిరి. ఆ మారిన వారికి వెళ్ళుటకు స్థలములేనందున, దేశములోని ఆయా ప్రాంతములలో పౌలు సంఘములను స్థాపించెను.
ప్రతీ సంఘమునకు క్రమములోనున్న ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని, పాస్టరుగా గుర్తించబడిన ఒక కాపరిని నియమించెను. లేదా, అటు, తర్వాత ఈ సంఘము… దానినుండి వేరే చిన్న సంఘములు బయటకు వచ్చును. యౌవనస్తులు మరియు వృద్దులు ఎదిగియుండిరి, మరియు దానినుండి సంఘములు తయారైనవి. ఆ మొదటి సంఘముపైనున్న ఆ వ్యక్తి బిషప్పు అని పిలువబడును. మరియు తరువాత అతని నుండి బయలుదేరిన అతని పిల్లలు, కాపరులుగా లేదా పాస్టర్లుగా (సంఘ కాపర్లుగా) పిలువబడతారు. మరియు పిదప ఈ చిన్న సంఘముల గుంపంతయు తిరిగి ఈ బిషప్పు వద్దకు వచ్చును.
JOEL 2:25
18ఐరేనియస్ కాలములో అలాగే యున్నది, అతడు అదే విధానములో కొనసాగియుండెను. మార్టిన్ అదే విధంగా కొనసాగియుండెను. పోలికార్పు అదే రీతిలో కొనసాగియుండెను. ఆ కాలమంతయు వారు దానిని కలిగియున్నారు. మరియు తర్వాత సంఘము యొక్క అపోస్తలుడు, అపోస్తలుడైన పౌలైయుండెను. మరియు పౌలు వెళ్ళిపోయిన పిమ్మట, యోహాను సంఘముపై అధికారమును తీసుకొనెను. మరియు యోహాను తర్వాత పోలికార్పు దానిని తీసుకొనెను. పోలికార్పు వెడలిపోయిన పిమ్మట, ఐరేనియస్ దానిని తీసుకొనెను. మరియు ఆ విధంగానే మార్టిన్, మరియు మొదలగువారైయున్నారు. రోమన్ కథోలిక్ వచ్చి సమస్త కార్యమును ముక్కలుగా చేసి, వారిని తగులపెట్టి, మరియు వారిని చెదరగొట్టునంత వరకు వారు బాగుగానే కొనసాగియుండిరి. మరియు గొంగళి పురుగు దానిని తినివేసెను, చీడపురుగు దానిని తినివేసెను, మరియు మొదలగునవి దానిని తినివేసెను, మరియు దానిని తినివేసెను, తుదకు వారు దానిని ఒక కాండము వరకు తీసుకువచ్చిరి.
అయితే ఇప్పుడు, అదే కార్యమును తిరిగి పునరుద్ధరించెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. మనము అంత్యదినములలో జీవించుచున్నామని నేను నా హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. దీనిని భంగపరచుటకు అంతగా ఏదియు లేదని నేను నమ్ముచున్నాను… మరియు ఈ రాత్రి యేసు రాలేడు అనుటలో, (లేఖనములపట్ల బహుశా నా అనువాదము తప్పైయుండవచ్చును) కొద్దిగా ఏదైతే నేరవేర్చబడుటకు మిగిలియున్నదో, అది ఉదయముకల్లా నెరవేర్చబడవచ్చునని నేను నమ్ముచున్నాను; మరియు అది నేరవేర్చబడే సమయం విషయములో నేను తప్పైయుండ వచ్చును, అయితే అది సమీపముగా ఉన్నది. దానిని నేను నమ్ముచున్నాను. మరియు దానిని పౌలు నమ్మెనని గుర్తుంచుకొనుడి; యోహాను దానిని నమ్మెను; పోలికార్పు దానిని నమ్మెను; ఐరేనియస్ దానిని నమ్మెను; మార్టిన్ దానిని నమ్మెను; ఆ మిగతావారందరూ దానిని నమ్మియున్నారు.
19"ఇప్పుడు, నేను వచ్చుటకు ఇంకా రెండువేల సంవత్సరములు పట్టును," అని దేవుడు, ప్రకటనకర్తయైన యోహానుతో చెప్పినచో ఏమగును? యోహాను తిరిగివచ్చి మరియు సంఘముతో ఇట్లు చెప్పియుండేవాడు, "మంచిది, మనము తినుచూ, త్రాగుచూ మరియు ఉల్లసించవచ్చునని నేను అనుకొనుచున్నాను, ఎందుకనగా ఇంకా అనేక తరములు ఉండబోవుచున్నవి. [చూశారా?] యేసు రెండువేల సంవత్సరముల వరకు రాడు," చూశారా. కావున చూడండి, సంఘము నిర్లక్ష్యముగా ప్రవర్తించును. ఎటువంటి లక్ష్యము లేకుండును. ఇక ఎటువంటి ఎదురుచూపు ఉండదు. మరియు మెట్టుకు అది మీ యొక్క ఎదురుచూచుటయైయున్నది, మీరు ఆ జాములో నిద్రించినయెడల, మీరు అదే ఎదురు చూపుతో మేల్కోనెదరు. ఎట్లనగా అది దేనిని ఆటంకపరచదు. ఏ విధముగానైననూ, సరిగ్గా ఆ సమయమునకు మీరచ్చటనుండెదరు, చూశారా. నా భావమును మీరు గ్రహించారా?
ఇప్పుడు, పరిశుద్ధ మార్టిన్, పరిశుద్ధ పౌలు, మిగతా వారందరూ పునరుత్థానములో మేల్కొన్నప్పుడు అది ఎట్లుండుననగా - సరిగ్గా వారు యుద్దరంగలో ఉండి పోరాడుచుండినంత తాజాగా అది ఉండును, ఎట్లనగా వారు ఆయన రాకడకై కనిపెట్టుచూ అదే ఎదురుచూపుతో వెళ్ళియుండిరి. మరియు అంతట ఒక కేక వచ్చును మరియు సంఘమంతయూ పైకి వచ్చును. మీరు చూశారా? అది అదే. కావున అది విషయమేమికాదు.
1THS 4:16,17
20చూశారా, సరిగ్గా ఇప్పుడు మనము కూడా ఆయన కొరకు ఎదురు చూడవలసియున్నది. మనము ఎరగము. ఇప్పటి నుండి ఒక వంద సంవత్సరముల తర్వాత అది జరుగుట సాధ్యపడవచ్చును. ఐదు వందల సంవత్సరములు, వెయ్యి సంవత్సరములు, పదివేల సంవత్సరములు పట్టవచ్చునేమో, నాకు తెలియదు. ఎవ్వరికిని తెలియదు. అయితే ఉదాహరణకు, ఆయన ఆ రోజే వచ్చుచున్నాడన్నట్లుగా మనము ప్రతీ రోజు, జీవించియున్నామని తలంచుడి, చూశారా. ఆయన ఈ రోజే వచ్చుచున్నాడన్నట్లుగా మనము జీవించినయెడల మనము మేల్కొనునప్పుడు (మనము నిద్రించినయెడల మరియు మనము పునరుత్థానములో మేల్కొనెదము), మనము ఇప్పుడే నిద్రించి, మరప్పుడే మేల్కొనునంత తాజాగా అది ఉండును. బూర మ్రోగును మరియు క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు; ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు కొనిపోబడుదుము, చూశారా. కావున అది అంత తాజాగా ఉండును.
21అయితే ఇప్పుడు, ఆ సమయము వచ్చువరకు ఆయన వచ్చువరకు, ప్రతీ రోజు, ఆ మరో నిమిషమే ఆయన రానైయున్నట్లుగా మనము జీవించగోరుచున్నాము, ఎట్లనగా ఆ నిమిషమే అది నీ జీవితము యొక్క ముగింపుయై యుండవచ్చును. నీవెప్పుడు పోవుదువో నీకు తెలియదు. మనమిప్పుడు కలిగియున్న ఇదియే మనలో కొందరికి చివరి శ్వాసయైయుండవచ్చును, కావున మీరు అట్లు జీవించగోరవలెను.
అయితే ఇప్పుడు, ఇంకా ముందుకు కొనసాగునట్లు, ఇతరులు చూచుటకై ఇచ్చట కాలమనే ఇసుకతెన్నుల మీద మనము అడుగుజాడలను ఉంచవలసియున్నది. పౌలు అతను వెళ్ళిన విధానములో వెళ్ళనియెడల, అప్పుడు ఎట్లు వెంబడించవలెనో యోహానుకి తెలియకపోవును. యోహాను అట్లు వెళ్ళనియెడల, ఎట్లు వెంబడించవలెనో పోలికార్పునకు తెలియకపోవును. పోలికార్పు అట్లు వెళ్ళనియెడల ఎట్లు వెంబడించవలెనో ఐరేనియస్ కు తెలియకపోవును, ఐరేనియస్ అట్లు వేళ్ళనిచో, ఎట్లు వెంబడించవలెనో మార్టిన్ కు తెలియకపోవును. నా భావము మీరు గ్రహించుచున్నారా? ప్రతీ ఒక్కరూ కాలమనే ఇసుకతెన్నులపై అడుగుజాడలను ఉంచవలసియున్నది.
22సరి, సహోదరులారా, ఒక సంఘ శాఖ గాని లేదా ఏదైనా ఒక విశ్వాసుల గుంపు గాని, మనమిచ్చట కలిగియున్న దానికన్నా శ్రేష్ఠమైనది కలిగియున్నారని నేను తలంచినయెడల వెంటనే ఈ చిన్న శరీరమును దానితో కలుపగోరెదను. ఏదో ఒక దినమున ఆ గొప్ప వ్యక్తివచ్చుచున్నాడనియు లేదా వస్తాడని నేను చెప్పినట్లు ఎలీషా వంటి ఆ గొప్ప ప్రవక్త వచ్చుననియు, నేను ఆశగా ఎదురుచూస్తూ, నమ్మికతో వేచియున్నాను. నేను మార్పుపొందే ఆ దినమును చూచువరకు బహుశా నేను జీవించియుంటానని నేనెల్లప్పుడూ నమ్ముచూ మరియు ఆలోచించేవాడిని, ఎప్పుడైతే ఆ వ్యక్తి రంగము మీదికి లేచుటను నేను చూచెదనో, అప్పుడు నా చిన్న సంఘమును తీసుకొని మరియు ఇట్లు చెప్పుదును, "సహోదరులారా, మనము ఎదురుచూచిన ఆ వ్యక్తి ఇతడే. ఈ మనుష్యుడే, ఇతడేమైయున్నాడు." దానికొరకే నేను వేచియున్నాను. మరియు వాస్తవముగా అది జరిగినపోయినచో, అప్పుడు నేను ఇట్లు చెప్పుటకు ఎదురు చూచుచున్నాను, ఇచ్చటినుండి, "సహోదరులారా, ఇదిగో ఇతడే," ఇచ్చటి నుండి వచ్చుచున్నాడు, చూడండి. మరియు సంఘము ఆ స్థితిలో ఉండుటను నేను చూడగోరుచున్నాను.
(నేను దేనిమీదనో అడుగుపెట్టియుండవలసియున్నది, లేదా ఏదైనా చేసియుండవలసియున్నది, మరియు ఆ విషయములో ఇంకా ఎక్కువగా జీవితమును వెచ్చించియుండవలసియున్నది.)
కావున ఇప్పుడు నేను దీనిని చెప్పగోరుచున్నాను. ఏమిటనగా ఇప్పుడు ఇది ఒక స్థిరపడిన సంఘమైయున్నది.
23మరలా ఒక్క క్షణము నన్ను ఆపనీయండి. నేను బొంబాయి వెళ్ళినప్పుడు… (ప్రజలపై అది చూపిన ప్రభావమునుబట్టి అది నా యొక్క గొప్ప కూటముగా నేను లెక్కించుచున్నాను.) మరియు ఆఫ్రికాలో ముప్పై వేలమంది ఒక్కసారిగా క్రీస్తునొద్దకు వచ్చారని వారు చెప్పిరి, పిదప అక్కడున్న ఐదులక్షల మందిలో, లక్షా-యాభై లేదా రెండు లక్షల మంది ఒక్కసారిగా క్రీస్తునొద్దకు వచ్చియున్నారు. నేనేమి చేయగలను? అచ్చట ఏమియూ లేకుండెను. బహుశా, కేవలం అచ్చట ఒక లక్షమందే ఉన్నారనుకుందాము. అచ్చట సంఘము లేనందున నేనేమియు చేయలేకపోయాను. నేను నమ్మిన వర్తమానమును వారికి అందించుటకు ఎవ్వరూ లేకుండిరి, వారికి సహకరించుటకు కనీసం పెంతెకోస్తు సంస్థయైననూ అచ్చట లేకుండెను. మరియు బహుశా ఆ ఆత్మలన్నియూ వారెచ్చటినుండి వచ్చారో నేరుగా వాటిలోనికి, అనగా సిక్కులు, జైను, బౌద్ద, తదితర వాటిలోనికి తిరిగి కొట్టుకొనిపోయిరి. వారిని ఉంచుటకు స్థలము లేకుండెను. ఇప్పుడు, అది ఒక సిగ్గుకరమైన విషయమైయున్నది. అది ఒక అవమానకరమైన సంగతియైయున్నది (చూశారా), ఎందుకనగా నేను నమ్ముచున్న దానిని బట్టి నాకెటువంటి సహకారము లేకుండెను, చూశారా.
24సరి, ఆఫ్రికాలో (ఆఫ్రికన్స్ ఫైత్ మిషన్ వారి A.F.M) ప్రోద్భలము వలన నేనచ్చటికి వెళ్ళియుంటిని. మరియు నేను వెళ్ళినప్పుడు నేను వారితో ఏకీభవించలేనన్నది విదితమే. వారు ప్రజలను మూడుసార్లు ముందుకు ముంచి, త్రిత్వంలో బాప్తిస్మము ఇచ్చుదురు. మరియు వారిలో ఒకరు మూడుసార్లు వెనుకకు ముంచి బాప్తిస్మము ఇచ్చుదురు. ఒకటి తండ్రియైన దేవుని కొరకు; మరొకటి మరొక దేవుడైన కుమారుని కొరకు; మరొకటి మరొక దేవుడైన పరిశుద్ధాత్మ కొరకు; మరి ఆ విధంగా ముగ్గురు వివిధ దేవుళ్ళ కొరకు మూడుసార్లు బాప్తిస్మము ఇచ్చుచూ మరియు అటువంటి పనికిరానివి చేయుచుండిరి. మరియు బహుశా డర్బన్ కూటములో సరియైనది కలిగిలేకపోవుట చేత, పెంతెకోస్తు విశ్వాసములు మరియు మొదలగు వాటి మధ్యన ప్రజలు చెదిరిపోయినట్లు అగుపడిరి, ఏమి చేయవలెనో ఆ ప్రజలు ఎరుగకుండిరి. వారు వెళ్ళుటకు స్థలము లేకుండెను.
25సహోదరులారా, ఒకవేళ మనమిచ్చట ఒక ఉజ్జీవమును కలిగియుండినయెడల ఏమగును? దీనిని ఈ విధంగా చెప్పనివ్వండి. మనమొక గొప్ప ఉజ్జీవము ద్వారా వచ్చియుండి మరియు సహోదరులైన మీరు ఇప్పుడే మారుమనస్సు పొందియుండి మరియు దేశములో ఎచ్చటనూ ఈ రకమైన ఒక సంఘము లేకుండ మరియు నేను సువార్తికుడనైయుండి ఇక మీరు నన్నెన్నడూ చూడరన్నట్టుగా ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోవుచున్నయెడల ఎట్లుండును? మీరేమి చేయవలెనో తోచకయుండెదరు. మీరు తిరిగి మరలా ఆ బురదలోనికి దొర్లకుందురు. పొట్టి దుస్తులు ధరించునట్లు మీ భార్యలతో, మరియు మీ పేకాటలకు మరియు నాట్యములకు మరియు అటువంటి కార్యములలోనికి సంతృప్తి పొందునట్లు తిరిగి అచ్చటికి మీరు వెళ్ళకుందురు. మీరు జీవములోనికి వచ్చియున్నారు. మీరు అట్టి కార్యములను దాటియున్నారు. ఇది మా మతసిద్ధాంతము అని చెప్పుటకు బదులు ఇది దేవుని యొక్క వాక్కము, అని చెప్పునటువంటి స్థితిలోనికి మీరు వచ్చియున్నారు. మరియు మీరు దీని ద్వారా, ఇది ఏమి చెప్పునన్న దానిని జీవించునంతగా మీరు వచ్చియున్నారు. మరియు అనుదినము మీరిచ్చట కూర్చున్నవారైయుండి, వాక్యము యొక్క గొప్ప భోజన ఉత్సవమును అనుభవించిన తర్వాత మీరు అచ్చటికి వెళ్ళి వారు చెప్పునది విందురు, మరియు వారు చెప్పినది విని, వెళ్ళి పేక ఆడుదురు, మరియు చిందులు వేయుదురు, ఇది మరియు అది చేయుదురు, మరియు ఎవరో మేయరు లేదా దేనిగుర్చియో, లేదా మరలా ఎన్నికల గురించి లేదా ఒక విధమైన రాజకీయ వ్యవహారమును గూర్చియో మరియు పది లేదా పదిహేను నిమిషములకే ముగించబడు ఎటువంటి విషయములేని వర్తమానమును వింటారు; పిదప ఏమి చేయవలెనో మీరు ఎరుగకయుందురు. మీరు దానివిషయమై ఎంతగా భారమును కలిగియుందురనగా, సంఘస్థులైన మీరే ఒక సంఘమును ప్రారంభించి మరియు మీరే ప్రసంగించుటను మొదలుపెట్టవలెనని అనుకొందురు, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము కొరకు మీ హృదయము మండుచుండును, మరియు మీ వలె భావించునట్టి ప్రజల నిమిత్తము మీరు విచారపడుదురు. ఇప్పుడు, అది వాస్తవము కాదా?
26యేసు వచ్చుచున్నాడని మీరు ఎరిగియున్ననూ, ఆయన రేపు వచ్చునని తలంచినను, అయినా కానీ, దేవుని రాజ్యము యొక్క సాటి పౌరులైన ఆ ప్రజలు ఒకటిగా కూడుకొనునట్లు వారి నిమిత్తము, ఈ రోజు మీరేదైనా చేయగోరుదురు. వారితో మీరు సహవాసము చేయగోరుదురు. అది వాస్తవము. కావున అది ఈ ప్రకారముగా ఉన్నయెడల…
ఇప్పుడు, ప్రభువు నాకు సహాయము చేసి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ దినముల నుండి ప్రపంచమును తాకిన ఒక గొప్ప ఉజ్జీవమునకు కారకుడిగా నన్ను వాడుకునియున్నాడని నా హృదయపూర్వకముగా నేను నమ్ముచున్నాను. దానిని మనము ఎరిగియున్నాము. అది వాస్తవమైయున్నది. ఆ సమయమున అదంతయూ పోయెను, మరియు అయిన ఆ నది వద్ద నన్ను కలుసుకొని మరియు నేను కలిగియున్న వర్తమానము క్రీస్తు యొక్క రెండవ రాకడను పరిచయం చేయునని నాతో చెప్పెను. మరియు ఈ రాత్రి ఇక్కడున్న వారిలో ఎవ్వరునూ ఆ దినమున అచ్చట లేరని నేను అనుకొనుచున్నాను. అది దాదాపు 32 సంవత్సరముల క్రితము సంగతైయున్నది, ఆ వెలుగు ప్రత్యక్షమై మరియు అచ్చట నిలబడినప్పుడు, నేను నేరుగా దానివైపు చూచుచుంటిని. వందలకొలది ప్రజలు అచ్చట నిలబడి దానివైపు చూచుచుండిరి. అది నేరుగా క్రిందకి వచ్చెను మరియు ఆ స్వరము మాట్లాడెను.
సంవత్సరముల తర్వాత… కేమెరా తీసిన పటము ఖచ్చితంగా ఆ నది దగ్గర నేను మీతో చెప్పిన దానివలెనే అగుపించుట వింతయైయున్నది. ఇప్పుడు, సహోదరులారా, అనేక విషయములలో నేను పొరబడియుండవచ్చును, కానీ నేనొక వేషధారివలె ఉండగోరుటలేదు. నేను మీతో నమ్మకస్తుడిగాను మరియు ముక్కుసూటిగాను ఉండగోరుచున్నాను.
27మరియు పిదప మరియొక సంగతి ఏదనగా, నేను వెళ్ళిపోయినయెడల ఏమగును? మనము ఇటువంటి ఒక ఆలయమును మనమిచ్చట నిర్మించియుండేవారము కాదు. చూడండి, నేను వెళ్ళిపోయినయెడల, మనము ఏదైనా కలిగియున్నామని చెప్పుటయే కష్టమగును, అయితే ఇచ్చట ఈ సంఘమును నిర్మించుటను పరలోకపు దేవుడు నా హృదయమందు ఉంచెను. మరియు పిదప ఆయన నన్ను సువార్త నిమిత్తము పిలిచినప్పుడు… మనము సంఘకాపరి వెంబడి సంఘకాపరిని కలిగియుంటిమి, అయితే ఇప్పుడు వర్తమానమును నమ్ముచూ, అదే విశ్వాసములోనున్న ఒక ప్రశస్త సహోదరుడను ఇచ్చట మనము కలిగియుంటిమి. ఈ వర్తమానమును నమ్ము ఇతర సహోదరులను కూడా మనమిచ్చట కలిగియుంటిమి.
(బీలర్ సహోదరుడా, నా మాట పెద్దగా వినిపించుచున్నదా? సరి, అది మంచిది.) మనము ఆ సామాగ్రిని కలిగియున్నాము.
28మరియు ఇప్పుడు మీరు ఇట్లు చెప్పుదురు, సరి, సహోదరుడా బ్రెన్హాం, పరలోకపు గొప్ప దేవుని యొక్క ఈ సూచనలను మరియు అద్భుత కార్యములను వారు విననియెడల, వాటిని మనమెట్లు చేయుదుము? సరి, ఇప్పుడు పరిశుద్ద పౌలు కూడా అదే ఆలోచనను కలిగియున్నచో ఏమగును? ఏమిటో చూశారా? అయితే అతనట్లు చేయలేదు. ఆ వర్తమానము పట్ల ఆ బిషప్పులు అంతే నిజాయితీగా నిలబడిరి! మరియు వారు… మరియు పౌలు, తరుచుగా, తన పర్యటన ముగించిన తర్వాత… అతడెట్లు ఈ సంఘములను దర్శించెనో, సంఘ కాపరులతో మరియు బిషప్పులతో మరియు మొదలగువారితో ఎట్లు మాట్లాడేనో మరియు ప్రజల నుండి ఎట్లు ఉపశమనం పొందెనో మరియు ఒక ఉజ్జీవము లేదా ఒక గొప్ప జూబ్లీ సమయము వలె, ఒక గొప్ప సహవాసపు సమయమును ఎట్లు కలిగియుండెనో, మీరు పరిశుద్ద గ్రంథము చదివియున్నారు. మరియు పరిశుద్ధాత్మ వారిమీద కుమ్మరించబడి మరియు వర్తమానములు వచ్చుచుండెడివి.
ACTS 21:11,13
29చూడండి అతను ఫిలిప్పు వద్దకు వచ్చినప్పుడు, అతని కుమార్తెలు సైతం ప్రవచించి మరియు ఇట్లు చెప్పిరి, మన సహోదరుడు అచ్చటికి వెళ్ళినప్పుడు, అతనికొరకు బంధకములు మరియు చెరసాల వేచియున్నవి. అతను పెరటిలోనికి వెళ్ళునంతలోనే అగబు అను ఒక ప్రవక్త నడుచుకొని వచ్చుచూ వీధిలో నుండి చూసెను, మరియు ఆసియాలోనున్న సంఘములన్నింటిపై విచారణకర్తయైన పౌలును అతడు ముందెన్నడూ చూసియుండలేదు. మరియు అతడు అచ్చటికి నడుచుకుంటూ వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, మరియు ఇట్లు ప్రవచించెను, "యెహూవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ నడికట్టుగల మనుష్యుని కొరకు బంధకములు మరియు చెరసాల వేచియున్నవి." చూశారా.
పౌలు ఇట్లనెను, నాకు తెలియును; నాకు తెలియును, అయితే మీరు ఏడ్చి నా గుండె బ్రద్దలు చేసేదరేలా? నా పరుగును తుదముట్టించనీయుడి. అతడు అలిసిపోయియుండెను. అతడు ముగించి వేసెను. మరియు తన బిషప్పు అధికారమును తిమోతికి విడిచిపెట్టి, తాను వెళ్ళిపోవుచుండెను.
30ఇప్పుడు, మనము యౌవ్వనస్తుల గూర్చి ఆలోచించవలసి యున్నది. మనకి పిల్లలున్నారు. ఇచ్చట మనలో చాలామంది వివాహితులైన పురుషులు, పిల్లలను కలిగియున్నారు. సరి, ఆ వచ్చుచున్న వారి సంగతి ఏమిటి? చూశారా?
అచ్చట ఆ నదిలో వలలు వేసి చేపలు బయటపారవేసి మత్తుపానీయములతో మరియు ఇతర కార్యములతో చెడగొట్టువారిని నేను అభ్యంతరపరచినట్లేయైయున్నది. ఈ పైకప్పు అంత ఎత్తుగా ఆ పెద్ద, చక్కని, చేపలు పడియుండుట చూసితిని. ఆ నది చుట్టుప్రక్కలంతా ఆ కంపు వాసన ఉండియుండేది. వారు ఆలాగు చేయకుండా ఆపుటకు ఒక గేమ్ వార్డెన్ గా నేను అచ్చటికి వెళ్లాను. వారిని విడిచిపెట్టు. నీవు ఏమి చేయదలంచావు? అది కెంటకీకి చెందినది అని ఒక లేఖను నాకు పంపిరి. ఇప్పుడు, కెంటకీకి చెందిన వార్డెన్ ఇచ్చటకు రాలేడు, ఎందుకనగా అది అతని పరిధిలోనిది కాదు. ఇండియానా వార్డెన్ కు ఈ విషయంలో మాటలాడుటకు ఏమియూ లేదు, ఎందుకనగా ఆ నది కెంటకీకి చెందియుండెను. అదీ విషయం. ఏమియూ చేయలేము.
నేనిట్లన్నాను, చేపలు పట్టగోరు ఒక అబ్బాయి నావద్ద ఉన్నాడు. అంతెందుకు, వారి వలలు, ఉచ్చులు, వాటన్నింటినీ ఆపకుండా ఆలాగు వదిలివేసినచో, ఇప్పటినుండి ఇరువది సంవత్సరాలు తర్వాత అతడు ఒక్క చేపను పట్టుకున్నా వారతని ఫోటోను తీసి, వార్తలలో ప్రకటించెదరు. మరియు అది ఇప్పుడే మన ఎదుట క్రియారూపకంగా జరుగుచున్నది, చూశారా. విషయమేమిటి? జరుగబోవువాటిని మీరు ఆలోచించవలసిన వారైయున్నారు.
31కావున మన వెనుక వచ్చు ఈ యౌవనస్తులు మొదలగువారు, మరియు ఆ ఇతరులగూర్చి, మరియు మన పిల్లలకు ఒక స్థలము విషయమై మనము ఆలోచించవలసియున్నది. మన కుమార్తెలు, ఇట్టి కార్యములలో వారు లోకములో ఉండుటను మనము కోరుటలేదు. ఆ ఆడపిల్లలు వారి తల్లులవలె ఎదుగవలెనని మనము కోరుచున్నాము. మరియు దానికొరకు మనము ఏర్పాట్లు చేయవలసినవారిగా ఉన్నాము. మరియు రేపు అనేది లేనిచో, అది మనకు తెలియదు. రేపు అనునది లేనిచో, మనము ఏది చేయకున్నాగాని మన యజమాని పనిమీద ఉండియున్నాము మరియు ఆయన వచ్చినప్పుడు మన కార్య నిర్వహణలో మనము కనుగొనబడియుండెదము, చూశారా.
కావున దీనిని నేను సూచిస్తున్నాను. సహోదరుడు నెవిల్ కు నేను సలహా ఇచ్చాను. మనము కలిగియున్నట్టే దీనిని కొనసాగించెదము. అది ఉన్నట్టుగానే దానిని ఉండనిద్దాము. ఈ యౌవన సేవకుల విషయమై నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. చూడండి, వాస్తవముగా, తీర్పు దినమున, ఇక్కడున్న ఈ ప్రాంతమంతటికీ ఎటువంటి సాకు చెప్పుటకు వీలులేదు, ఎందుకనగా అంతటా కేంద్రములను, వర్తమానము వినిపించు కేంద్రములుగా, చిన్న చిన్న సంఘములను మనము సిద్ధపరచియుంచాము.
గతరాత్రి నేను సహోదరుని యొక్క సంఘములో ఉన్నాను, మరియు అక్కడున్నవారందరూ వాక్యము వెనుక భద్రపరచబడియున్నారా అని అడిగాను. మరియు ప్రతీ ఒక్కరూ తమ చెయ్యి పైకెత్తిరి. ఇప్పుడు, అది నాకు మంచిగా అనిపించినది, చూశారా.
REV 12:4
32ఇప్పుడు, సహోదరులారా నేను ఆలోచించునది ఏదనగా, అది అప్పుడిక్కడున్న సంఘములో వలెనేయైయున్నది. నా యొక్క శ్రేష్ఠమైన ఆలోచన మేరకు, చేయగలిగినట్టి నాలుగు సంగతులను నా పరిచర్య కలిగియున్నది. మరియు బహుశా నాలుగు కాకపోవచ్చును, అయితే క్లుప్తముగా అదేయని నాకు తోచుచున్నది; ఆయన నాతో మాటలాడినదాన్ని బట్టి, అన్యసంఘమునకు విడిచిపెట్టబడినదంతయూ ఇదేమైనచో, సరిగ్గా ప్రకటన గ్రంథములో, ఒకటి, రెండు, మూడు అధ్యాయములు సంఘమునకు వర్తించునని మనము గ్రహించియున్నాము. సంఘము నాల్గవ అధ్యాయములో పైకి వెళ్ళును. అది ఇక 19వ అధ్యాయము వరకు తిరిగి రాకుండును, అదెప్పుడనగా శ్రమలకాలము తర్వాత దేవుడు యూదులను బయటకు పిలుచునప్పుడైయున్నది. అది వాస్తవమైయున్నది.
మరియు హానోకు వలెనేయైయున్నది, భూమి మీద ఒక్క వర్షపు చినుకైనా పడకముందే అతడు పైకి వెళ్ళెను. అతడు వెళ్ళిపోయిన తర్వాతే శ్రమలు వచ్చెను, చూశారా. ఎటువంటి శ్రమ రాకముందే, నోవహు ఓడలోనికి ప్రవేశించెను. ఎటువంటి శ్రమ సంభవించకముందే, లోతు సోదొమ బయటకు పోయెను, చూశారా. మరియు ఎటువంటి శ్రమల కాలము రాకముందే, సంఘము వెళ్ళిపోవును.
ఇప్పుడు, శ్రమల కాలమప్పుడు ఆ నిద్రించుచున్న కన్యకను ఆ ఘటసర్పము తరుమును, మరియు తన నోటి నుండి నీళ్ళు వెళ్ళగ్రక్కును, అనగా విస్తారమైన జనసముహము, ఆ స్త్రీని, ఆమె శేషసంతానమును, వెదికి పట్టుకొను సైన్యమైయున్నది, మరియు ఆమెను చంపుదురు. శ్రమల కాలమప్పుడు, జరుగునది అదేయైయున్నది, అయితే సంఘము గృహమునకు వెళ్ళిపోవును. ఇప్పుడు, అది రేపు సంభవించినాగాని, ఈ రోజు మన గమనానికి అది ఆటంకము కలిగించదు. మనము ఈ రోజునే పరిగణలోనికి తీసుకొనవలెను.
33ఇప్పుడు, నేను తలంచునది ఏదనగా, అక్కడ నాతో ఆ మాటలు చెప్పిన ఆ దూత, ఇట్లు చెప్పెను, క్రీస్తు యొక్క మొదటి రాకడను పరిచయము చేయుటకు బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లు, చూడండి, నీ వర్తమానము… నేను ఈ వర్తమానమును తీసుకొని వెళ్ళవలెను. మరియు అది క్రీస్తు యొక్క రెండవ రాకడను పరిచయము చేయును. సరి, దాని అర్ధము ఇదేమైనచో, అప్పుడు సహోదరులారా, మనము చాలా, చాలా సమీపములో ఉన్నాము, ఎందుకనగా ఆ ఘడియ మరియు వర్తమానము యొక్క వెలుగు అప్పుడే బయలు వెళ్ళియుండెను.
JOEL 2:25
34పెంతెకోస్తు కుమ్మరించబడినప్పుడు, మరియు ఆ సహోదరులు పెంతెకోస్తునాడు పరిశుద్ధాత్మతో నింపబడుటను, మీరు గమనించారా? వర్తమానము యొక్క కాంతి మసకబారుచు మరియు ఆయన రానైయున్నాడను ఎదురుచూపుతో వారు క్రీస్తుకొరకు సంఘములను దుర్గముగా ఎంచుటను మొదలు పెట్టునంత వరకు, అది మునుపెన్నడునూ జరిగియుండలేదు. సరి, లేఖనము సత్యమైనచో, ఈనాడు అదే జరుగుచున్నది, "ఆ గొంగళిపురుగులు మరియు పసర పురుగులు తినివేసినదంతయు నేను తిరిగి పునరుద్దరించెదను, అని యెహోవా సెలవిచ్చెను." ఇప్పుడు, ఒకవేళ అది ఇదేయైనచో, ఈ వర్తమానము అదేయైనచో, (మరియు నాకు తెలియదు, దేవుడు నన్ను మన్నించునుగాక.) అప్పుడిక నిజముగా సమస్తము ఎంతో లేదు, ఎందుకనగా వర్తమానము ముగిసినది.
35మరియు గతరాత్రి, ఎక్కడైతే కొన్ని వేలమంది నా స్నేహితుల సమూహము కూడియున్నారో, అట్టి కూటమునకు నేను వివేచన చేయుటకు వెళ్ళినట్లు కలగంటిని. అక్కడ ఒకతను వచ్చి నన్ను పట్టుకున్నాడు. మరియు మీరు నాతో మాట్లాడరు గనుక సాధారణముగా బిల్లీ వచ్చి నన్ను పట్టుకునేవాడు. మరియు ఈ వ్యక్తి నిర్విరామముగా మాటలాడసాగెను మరియు అందువల్ల నేను అచ్చటికి వెళ్లేలోగా అభిషేకమంతయు నా నుండి వెడలిపోయినది. మరియు అప్పుడు నేనిట్లన్నాను, సరి నేనచ్చటికి వెళ్ళి, ఆ సంస్థలతో ఆటలాడవద్దని మరియు మొదలగువాటిని ఆ ప్రజలకు ప్రసంగించి, మరియు వచ్చుచుననుకొంటిని. మరియు నేను వేదిక మీదకు వెళ్ళగానే అది నన్ను వదిలిపోయెను. దాని భావవేయున్నదో నేను ఎరుగనుగాని, నేను సాగిపోవుచున్నాను. నాకేమియు తెలియదు.
36అది నా జీవితము యొక్క ముగింపుయైయుండవచ్చును. అది ప్రభువు యొక్క రాకడ కావచ్చును. అది కాలము యొక్క మార్పుయైయుండవచ్చును. ఇదివరకే వచ్చినది కాకుండా ఇంకా వేరెవరన్న రావలసినయెడల, అది ఆ బలవంతుని యొక్క రాకడయైయుండవచ్చును, అది అదేయైయుండవచ్చును. ఆ సంగతులన్నియూ అదేయైయుండవచ్చును అన్నట్టుగా మనము తీసుకొనవలెను. మరియు ఈ రాత్రి దేవునియెదుట మరియు సహోదరులైన మీ ఎదుట నేను నిలబడియుండగా దానిని నేనెరుగను. నేను మీకు చెప్పలేను. నాకు తెలిసినయెడల నేను మీతో చెప్పుదును, లేదా ఏ దారో నాకు తెలియకుండా ఇటువంటిది మీ ఎదుట నేను ప్రస్తావించను. ఆ విషయము ఎటు దారితీస్తుందో నాకు తెలిసినయెడల, నేను చెప్పియుండేవాణ్ణి, అయితే నాకు తెలియదు. నేను చెప్పలేను. సరిగ్గా నేనిప్పుడు ఎటువంటి ఒక నడిపింపు లేకుండానే కూటములకు పోవుచున్నాను. అచ్చట ఊరకే కూర్చుండుట నాకు ఇష్టములేదు గనుక నేను పోవుచున్నాను. నేను నేను ఇతరులు కోరుకున్నట్లే, నేను కూడా అడవులకు వెళ్ళగోరుదును. ఈ విషయములో నేను తప్పైనయెడల, దేవుడు నన్ను క్షమించును గాక.
37నాకు మూడు సంగతులు జరగవచ్చును. అది నా జీవితము యొక్క ముగింపుయైయుండి మరియు ఈ వేరొకరు వచ్చుటయై యుండవచ్చును; ఆయన నడిపించునట్లు నేను దారి పరచియుంచాను, ఎందుకనగా గుర్తుంచుకొనుడి, వచ్చువాడు, పిల్లల విశ్వాసమును తండ్రుల తట్టునకు త్రిప్పుట, అను వాక్యప్రకారము ప్రసంగించుటకు వచ్చును. అది నా జీవితము యొక్క ముగింపుయైయుండవచ్చును. అది విదేశాల కొరకు నా పరిచర్యను తిరిగి ఆయన సువార్త వైపునకు మార్చుటయైయుండవచ్చును. లేదా, ఆయన ఇక నన్నెంతమాత్రమూ ఒక సువార్తికునిగా పిలువకుండా, వాగ్దానము చేయబడినవాడు వచ్చుటకు ముందుగా నన్ను పంపునట్లు, నన్ను అభిషేకించుటకు ఆయన నన్ను ఎక్కడైనా అడవులలోనికి తీసుకువెళ్ళవచ్చునని నేను తలంచుచున్నాను.
అది ఆ సంగతులలో ఏదైనాయైయుండవచ్చును. నేను వెళ్ళుచుండిన మార్గములో నేను వెళ్ళలేను. ఎందుకనగా నేను… ప్రజలు నన్ను నమ్మియున్నారు గనుక నేను దీనిని చెప్పవలెను. దీనిని మనుష్యులందరి ఎదుట నేను చెప్పుచున్నాను. అనేకసార్లు ప్రజలు నన్ను ఒక ప్రవక్తయున్నట్టుగా పరిగణించారు. నాకు నేనుగా దానిని నేను పరిగణించుటలేదు. లేదండి. నేను పరిగణించుటలేదు. నేను… దానిని నేను దీనుడిగా ఉండుటకై చెప్పుటలేదు; నేను దీనిని యదార్ధముగానుండుటకై చెప్పుచున్నాను. నన్ను నేనొక ప్రభువు యొక్క ప్రవక్తగా పరిగణించుకొనుటలేదు. నేనా ఘనతను కలిగిలేను.
EPH 4:11•
2TIM 4:3-5
38బహుశా రానైయున్న ఒక ప్రవక్తకు పునాదిని వేయునట్లు సహాయకరముగా ఉండుటకై, కొన్ని ప్రత్యేకమైన విషయములకై ప్రభువు నన్ను వాడుకొనెనని నేను నమ్ముచున్నాను. అయితే ఒక ప్రవక్త నేను పనిచేయు విధముగా పనిచేయడు; ఇప్పుడది మీకు తెలియును. ఒక ప్రవక్త సువార్తికుడు కానేరడు మరియు ఒక సువార్తికుడు ప్రవక్త కానేరడు. ఒక సంఘ కాపరి సువార్తికిడు కానేరడు మరియు ఒక సువార్తికుడు ఒక సంఘకాపరి కానేరడు. అయితే దేవుడు సంఘములో, మొదటిగా అపోస్తలులను, పిదప ప్రవక్తలను, తరువాత ఉపదేశకులను, అటు తర్వాత సంఘకాపరులను, మొదలగువారిని నియమించెను. దేవుడు వారిని సంఘములో నియమించి మరియు దేవుడు వారికి ఒక అధికారమును ఇచ్చియుండెను.
అయితే ఆ ఉదయమున నేను ఆ మూలరాయిని వేసినప్పుడు, ఏలయనగా ఇప్పుడు, మీరు గనుక ఆత్మ సంబంధులైనయెడల మీరు దానిని గ్రహించుదురు. ప్రజల యొక్క ఆర్తనాదమును బట్టియే మీరు దానిని బ్రద్దలుకొట్టి బయటకు తీసినయెడల, లేదా పుస్తకమును తీసికొని మరియు దానిని చదివినయెడల, అది ఇట్లు చెప్పబడెను, "సువార్తికుని పనిచేయుము." ఒక సువార్తీకునిగా ఉండునట్లు నన్ను పిలువలేదు, కాని "సువార్తికుని పనిచేయుము, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక - కల్పనాకథల వైపునకు తిరుగుకాలము వచ్చును," అని చెప్పెను. చూశారా. ఆ లేఖనమును ఎత్తిచూపించి మరియు దానిని ఎచ్చట కనుగొనవలెనాయని నాతో చెప్పెను. దానిని మూడుసార్లు చెప్పెను. మరియు నేను బైబిలును తీసుకున్నాను మరియు ఆయన నాతో చెప్పిన చోటుకి త్రిప్పగా, అది అచ్చటుండెను. మరియు పిదప ఏకత్వమును నమ్ము పెంతెకోస్తు మరియు పెంతెకోస్తు సంఘములు, అను ఈ రెండు తొట్ల గురించి మీరెరిగియున్నారు. నేను వాటినెన్నడూ సంకరము చేయలేదు. నేను వారియొక్క సొంత చెట్లను సరిగ్గా అవి ఎక్కడుండెనో అక్కడే నాటాను, ఎందుకనగా ఆ రెండును తప్పని నేను తలంచాను. అయితే దానికి బయట, సిలువ వద్ద, ఫలమువద్ద నేను ఉండియున్నాను.
ACTS 10:34,44
39యదార్ధవంతుల నెవరినైననూ దేవుడు గౌరవించును. దానిగూర్చి పేతురు చెప్పెను; ప్రారంభములో వారు పొందుకున్నట్లే కొర్నేలి ఇంటివారునూ పరిశుద్ధాత్మను పొందినప్పుడు, ప్రతి జనమును ఆయన పిలచుచున్నాడు గనుక దేవుడు పక్షపాతి కాడని అతడు గ్రహించెను, చూశారా. దేవుడు పక్షపాతి కాడు. ఒక వ్యక్తి ఎంతో యదార్ధముగా ఉండియు, అతడు యదార్ధముగానే తప్పైయుండుటను మనము చూడగలము, అయితే అతడు యదార్ధతతోనే ఉండినయెడల, దేవుడు అతడిని ఎక్కడైనా వెలుగునొద్దకు నడిపించును. అతడు దానివద్దకు వచ్చును, ఎందుకనగా అట్లు చేయుటకు దేవుడు బద్దుడైయున్నాడు.
మరియు గొప్ప విషయమైయున్న ప్రభువు యొక్క రాకడను గూర్చియు, వర్తమానము వెళ్ళుటను గూర్చియు మనము ఆలోచించుచున్నాము. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ముందుగా నిర్ణయించబడిన గుంపు ఉంటుందనియూ, మరియు వారు ఒక డజనుకన్నా ఎక్కువమంది ఉండరనియూ గుర్తుంచుకొనుడి, చూశారా. మనకు తెలియదు, అదొక వంద లక్షలమందియై ఉండవచ్చును; పది వేలమందియై ఉండవచ్చును. కాని ఒకవేళ మనము విశ్వసించునట్లు అది దేవునియొద్ద నుండి పంపబడిన వర్తమానమైనయెడల, ముందుగా నిర్ణయించబడినవారు వర్తమానమును విని మరియు దానిని విశ్వసించుదురు.
40అట్లైనచో, మనమిప్పుడు సరిగ్గా కాలము యొక్క ముగింపునకు వచ్చియున్నాము. ఎప్పుడైతే, దేవుడు నన్ను పిలిచినచో… ఇప్పుడు, వినండి, ఇది పునరావృతమవ్వకూడదు. ఆయన నన్ను తన ప్రవక్తగానుండుటకై పిలిచినయెడల, అటువంటప్పుడు నిశ్చయముగా నేనైతే అటువంటి ఒక అధికారమును కలిగిలేను. ప్రవక్తలు సువార్తీకరణ చేయరు. ఖచ్చితముగా, ఖచ్చితముగా, అతడేమి చేయవలేనని దేవుడు కోరుచున్నాడను దానిని సూటిగా పొందినంతవరకు ఒక ప్రవక్తయనువాడు తనకుతానుగా అరణ్యములో దేవునితో ఒంటరిగా దాగుకొనియుండును. మరియు అతడు బయటకు కదంతొక్కి తన వర్తమానమును ఇచ్చును మరియు తిరిగి మరలా అతడు అరణ్యములోనికి వెళ్ళిపోవును. సువార్తికులు చేయునట్లు కూటములను ఏర్పాటు చేసి, సహకారములు పొంది మరి అటువంటివన్నియూ చేయుటకు అతడొక సువార్తికుడు కాడు. అతడు సువార్తికులవలే బోధించడు. అతడు కేవలం, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అనునది కలిగియుండును, అంతేయైయున్నది. అతడు దానినే ఇచ్చును, దానిని వెదజల్లును, మరియు ఆ ముక్కలు ఎక్కడ పడవలెనో అక్కడ పడును, అటు తర్వాత అతడు మరలా వెళ్ళిపోవును. అతడెచ్చటనున్నాడో ఎవరికీ తెలియదు, అతడు ఎక్కడో ఏకాంతముగా నుండును.
MATT 24:40•
LUKE 17:34,36
41ఇప్పుడు, నేను చేయజాలను, లేదా అట్లుండుటకు నన్ను ఆయన పిలిచినాగానీ, నేను ఒక సువార్తికునిగా ఉండలేను. మరియు ఒక సువార్తికునిగా ఉండుటకు ఆయన నన్ను పిలిచినయెడల, నేను ఒక ప్రవక్తగా ఉండలేను. ఇప్పుడు, మీరు నా భావమును గ్రహించారా? ఏమి చేయవలెనో నేను ఎరుగకయున్నాను. మొదటిగా, జనుల చెయ్యిపట్టుకొని వారికొరకు ప్రార్ధించుటను గూర్చి మరియు పిదప వారియొక్క హృదయరహస్యములను తెలిసుకొనుటను గూర్చి మరియు ఈ ఇతర కార్యములను గూర్చి ఆయన నాతో చెప్పినప్పుడు, నేను భక్తిపూర్వకంగా చేసియున్నాను. మరియు, సహోదరులార, అవి తప్పిపోనివైయున్నవి. అది వాస్తవమైయున్నదని మీరెరుగుదురు. మీలో ప్రతీయొక్కరూ దానినెరుగుదురు, చూశారా. మరియు అది ప్రపంచమంతటినీ ఎట్లు కుదిపివేయునని ఆయన చెప్పెనో, ఖచ్చితముగా అట్లే అది చేసియుండెను! ఆకాశము క్రిందనున్న ప్రతీ దేశము, ప్రతిచోటా, వార్తా పత్రికలు, టేపు రికార్డింగులు, అంతటా దానిని వినియున్నారు. అసలు అది ఎటు జరిగెనో నేనెరుగను. కానీ ప్రపంచమంతటినుండి, థాయ్-ల్యాండ్ ప్రజలు మొదలుకొని ఆదిమవాసీల వరకు ఉత్తరములు వచ్చుచున్నవి. ఆ మిషనరీలు అచ్చట ఆ టేపులతో గుమిగూడి మరియు వాక్యమునకు అనువాదమును ఎట్లు ఇచ్చుచున్నారో గదా. మరియు ఇప్పుడైతే ప్రపంచమంతటి నుండి, మనము ప్రపంచవ్యాప్తముగా వినుచున్నాము (చూడండి). ఇప్పుడు, వారు అనగా ఆ సంఘము, ప్రపంచ వ్యాప్తముగా, అంతటా ముందుగా నిర్ణయించబడియున్నది. "ఇద్దరు మంచము మీద ఉందురు, ఇద్దరు పొలములో ఉందురు," చూడండి. ఒకరు కొనిపోబడుదురు మరియు ఒకరు విడిచిపట్టబడుదురు.
42ఇప్పుడు నేను ఒక సువార్తికుని పనిని చేసియున్నందున, (మరి ఇదియే నా విన్నపమైయున్నది), దేవునికి అది సమ్మతముగానున్నయెడల, మరియు నేను ఆ పనిని సక్రమంగా నిర్వర్తించియున్నాను గనుక ఆయనను సంతోషపెట్టియున్నానని నమ్ముచూ, నా తప్పిదములన్నింటికీ క్షమాపణ అడుగుచున్నాను, బహుశా అప్పుడు, సువార్త రంగము నుండి, ఆయన యొక్క ప్రవక్తగా ఉండుటకు ఆయన నన్ను పిలచునేమో. అప్పుడది అలాగైనచో నేను సువార్తీకరణను విడిచిపెట్టుదును. అయితే ఒక ప్రవక్తగానుండునట్లు ఆయన నన్ను పిలిచినయెడల, ఒక సువార్తికునిగా నేను ఉండలేను. నేను ఒక సువార్తికునిగా ఉండవలసియున్నచో, ఒక ప్రవక్తగా నేను ఉండలేను. నేను ఈ రెండు కార్యాలయములను కలుపుచున్నాను. నేనెల్లప్పుడూ ఇబ్బందిపడినది ఈ విషయములోనేయైయున్నది. వేదిక మీద నిలబడియుండియు, అది ఎన్నడూ మంచిగా, జయకరముగా ఉండలేదు. దేవుడు దానిని వాడుకొనియున్నాడు, అయితే అది ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమని నేనెన్నడూ తలంచియుండలేదు. అది ఆయన యొక్క అనుమతపూర్వకమైన చిత్తమైయుండును. ఒకటి లేదా రెండు దర్శనములు దాదాపు మిమ్ములను వేదిక నుండి పడద్రోయునట్లు చేయును, చూశారా. మరియు పిదప ఈ వ్యక్తితో తాను ఎట్లు సరిచేసుకొనవలెననియు, మరియు ఏమి చేయవలెననియు మీరు చెప్పినయెడల; మరప్పుడు ఆ తర్వాత వ్యక్తియు అచ్చట నిలబడి, తను కూడా అదే కార్యమును ఆశించును. మరియు అతనితో చెప్పమని ఏదైనా మీతో చెప్పువరకు, మీరు అతనికి చెప్పలేరు. మరియు అప్పుడు ఆ వేరొక వ్యక్తి నీవొక మోసగాడివనియు, లేదా ఒక భక్తి లోపించినవాని గాను లేదా ఒక దయ్యముగాను లేదా మరేదైనా అన్నట్టుగా భావించును, ఎందుకనగా వారేమి తెలుసుకొనగోరుచున్నారో దానిని మీరు వారికి చెప్పకుందురు. చూడండి, ఒక ప్రవక్త పనిచేయు విధానము, కార్యాలయము అది కాదు.
43తాను నేరుగా ఆసుపత్రికైననూ లేదా తాను ఎచ్చటికి వెళ్ళుచున్ననూ, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో అడుగుపెట్టువరకు ఒక ప్రవక్త ఎక్కడో ఉండి మరియు దానిని చెప్పివేసి, తిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోవును. అతడు ఎంతమాత్రమును సువార్తికుడు కానేరడు. అతడు కూటములను ఏర్పాటు చేసి మరియు సంగతులను చర్చించడు. అతడు ఎవరియొద్దకు పంపబడెనో, వారికొరకు అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడు.
అతడు వైట్-హౌస్ కు పంపబడినచో, అతడు నేరుగా వైట్-హౌస్ ముందు అడుగుపెట్టి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పును. అది ఆ రాష్ట్రము యొక్క గవర్నర్ కొరకైననూ, అది ఎవరైనా సరే, అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడైయున్నది." వారు లోపలికి వచ్చి మరియు వాక్యమును స్వీకరించునట్లు ప్రయత్నించుచూ, ఒక సంఘముల గుంపుతో అతడు ఆటలాడడు మరియు సువార్తికులవలె ఇట్టి కార్యములను ప్రసంగించడు; అతడొక సువార్తికుడు కాడు.
కావున, సహోదరులారా, మీరు చూడండి, ఆ కారణము చేతనే నన్ను నేను ఒక ప్రవక్తగా చెప్పుకోను. నేను కనీసం ఏ ఒక్క అధికారమందైననూ లేను, చూశారా. ఇప్పుడు నా భావమును మీరు గ్రహించియున్నారా? ఇప్పుడు, ఆ విధంగా చాలా సేపటి వరకు చెప్పడానికి ఎంతో ఉండియున్నది, అయితే ఈ రాత్రి నేను చదవగోరుచున్న ఈ కొద్ది వాక్యమును నేను పొందుకునే వరకు మీ యొక్క అధిక సమయము నేను తీసుకొనకూడదని ఆశిస్తున్నాను.
44ఇప్పుడు, నేను చేయునది ఇదేయైయున్నది. నేను ఇండియానాలో నివసించవలెనని నేను ఎన్నడూ భావించలేదు. నేనొక లోకసంచారినైయున్నాను. నేనొక చోటికి వెళ్ళెదను, నేను ఇట్లు తలంచుదును, నేను ఇచ్చటికి వెళ్ళి, నేనిచ్చట స్థిరపడుదును. ఇంతేయైయున్నది. నేను అట్లు చేయలేను. నేను ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను ఇట్లు తలంచుదును, నేను ఎచ్చటికి పోవుదును. నేను దానిని చేసినప్పుడు… నా భార్య నన్ను ఇట్లు పిలుచును… (వారు పాడే ఆ పాట ఏమిటి?) "విరామం లేని గాలులు." మీరు దానిని వినియున్నారని నేననుకొనుచున్నాను. వారు పాడుటను దాదాపు మీరందరూ వినియున్నారు. సరి, ఆమె నన్ను ఆలాగు పిలచును, విరామం లేని గాలులు. నేనిచ్చటికి రావడానికిముందు, ఇట్లనుకుంటాను, అబ్బాయి, నేను ఇంటికి వెళ్ళాలి. భార్యను మరియు పిల్లల్ని నేను చూడాలి. సంఘమునకు మరొక్కసారి వెళ్ళి ప్రసంగించాలి. నేను ఇచ్చటికి వచ్చెదను, వచ్చి ఒకసారి ప్రసంగించెదను. నా భార్యను ముద్దుపెట్టుకొని మరియు పిల్లలందరినీ కౌగలించుకుంటాను. గడ్డిని కత్తెరించుటకు పెరటిలోనికి వెళ్ళుదును, మరియు ఒక విమానము వెళ్ళును. నేను ఆగి, నా ముఖము పైనున్న చెమటను తుడుచుకుంటాను, మరియు అతనితో వెళ్ళగోరుదును. నేను ఇంకెక్కడికైనా వెళ్ళవలసివచ్చును. సరి, నేను అచ్చటికి వెళ్ళవలెను అని తలంచుదును. మరియు నేను నేను అచ్చటికి పోయెదను, మరియు అచ్చట కొద్దిసేపు ప్రసంగించుదును. చుట్టూ చూడగా, అచ్చట మరొకటి వెళ్ళును. నేనాయనతో వెళ్ళవలెను. చూడండి, నాకు ఒక స్థిరమైన చోటు లేకుండెను. నేను అట్లు చేయలేను. నేను విశ్రాంతి లేకుండా, ఒక చోటు నుండి మరొక చోటుకి మారుచున్నాను. ఆ విషయంలో నేనేమి చేయలేను. అది నాలోపల ఉన్న కార్యమైయున్నది, మరియు నేను దానిని చేయవలెనని ఎరిగియున్నాను.
45ఇప్పుడు, సంఘము దాని ప్రస్తుత స్థితిలో ఉండియుండగా, ఇచ్చట నుండి దూరంగా వెళ్ళుట నాకు భయంకరముగా అనిపించును. మరియు ఇక్కడ కూర్చునియున్న మీ అందరిగూర్చి తలంచగా, నేను నిత్యత్వములో ఆ మహిమ దేశమందు మీతో గడుపుదునని నేను నమ్ముచున్నాను. చక్కని ప్రజల, చక్కని విశేషముగల, ధృడమైన, స్థిరమైన ప్రజలను మనము కలిగియున్నాము. ఇటీవల కాలములో సంఘములోని ఈ ప్రజల మధ్యన ఒక ఉజ్జీవము ప్రజ్వలించినది. ఆత్మ వారి మధ్యకు వచ్చి, వరములను ఇచ్చుటకు ప్రారంభించెను. అది మూడత్వములోనికి వెళ్ళునాయని చూచుటకు, నేను దానిని గమనించియున్నాను. ప్రతీసారి అది ఆ విధంగా కదులుట మొదలయినప్పుడు, ఆత్మ దానిని సరిచూచి మరియు తిరిగి దానిని ఇచ్చటకు తెచ్చును. నేనిట్లు తలంచాను, "ప్రభువుకు స్తుతికలుగును గాక," చూశారా. మీరు కేవలం మీ స్థానములోనే ఉండుడి, అదియే మంచిది, చూశారా.
ఇప్పుడు, నా ఆలోచన ఏదనగా, నేనెచ్చటకైనా వెళ్ళనారంభించినప్పుడు, ఎచ్చటికి వెళ్ళుచున్నానో నాకు తెలియకుండుట సాధ్యమగును అనునదైయున్నది. అయితే నేను ఊరికే కూర్చునియుండలేను. నేనిచ్చట ఉండబోవుటలేదు. నేను దానిని చేయలేను. నేను ఎక్కడికైన వెళ్ళవలసియున్నది. మరియు బహుశా నేనచ్చట కొద్ది దినములే ఉండెదను, మరి ఎచ్చటికైనా వెళ్ళుదును. నేను ఏదో ఒక చోటుకి వెళ్తూనే యుండవలెను. నేనెచ్చటికి వెళ్ళుచున్నానో నేనెరుగను. తానేచ్చటికి వెళ్ళుచున్నాడో, అబ్రాహాము కూడా ఎరుగక ఉండెను. అతడు కేవలం ఆ నదిని దాటుకొని బయలుదేరును. అంతే.
46ఈ ప్రస్తుత సమయంలో మనమిచ్చట ఏమి చేయవలెనని నాకు అనిపించుచున్నదనగా, మనకు ఒక సంఘము అవసరమైయున్నాదని నేను నమ్ముచున్నాను. దేవుని గృహమని నేను తలంచుచున్నాను… సరి, ప్రభువు రానైయున్నయెడల, ఆ డబ్బంతయు దానికై వ్యయము చేయనేల? అని మీరందురు. సరి, ప్రభువు వచ్చినయెడల, ఆ డబ్బును మీ వద్ద అట్టిపెట్టుకొని ఉండుటవలన ఏమి ప్రయోజనము? చూశారా? ప్రజలు సంఘము కొరకు డబ్బును కేటాయించినయెడల, (ఇచ్చట ఆ రాత్రి నేను తీసుకొనియున్న నూరుశాతము అంగీకారమును బట్టి) సంఘమును నిర్మించుట మన బాధ్యతయైయున్నది; కావున దానిని నిర్మించండి! దానిని నిర్మించమనే నేను చెప్పుదును! అవునండీ!
దీనిని ముందెన్నడూ నేను వ్యక్తపరచలేదు, అయితే దానిని పురుషులైన మీ యెదుట నేను చేయగోరుచున్నాను. స్త్రీలను ఇచ్చట ఉంచగోరుటలేదు, ఎందుకనగా ఒకరు ఒక వైపు మరియు ఒకరు అటువైపు మొగ్గు చూపుదురు. దానిని నేను చేయగోరుటకు గల కారణమును మీకు చెప్పుటకు ఇప్పుడు ప్రయత్నించుచున్నాను. వచ్చే వారములో ప్రభువు వచ్చుచున్నయెడల, ఈ వారములోనే సంఘమును నిర్మించుటను మొదలుపెట్టవలెనని నేను తలంచుచున్నాను. నిశ్చయముగా, మనమాయనకు చూపించుదాము. మనము మన కర్తవ్యముపై నిలచియుందాము. అవునండి.
47మరియు పిదప ఒకవేళ మనము… సంఘము నిర్మించబడినప్పుడైయున్నది. ఎందుకు …? ఇప్పటినుండి పది సంవత్సరముల తరువాత ఆయన వచ్చినచో, ఏంటి? ఇరువది సంవత్సరముల తర్వాత వచ్చినచో, ఏంటీ? లేదా వంద సంవత్సరముల తర్వాత వచ్చినచో, ఏంటి? ఆయన వచ్చినప్పుడు, అది ఏమైననూ, అది విషయమేమియు కాదు. ఇంకా ఒక వంద సంవత్సరములు మనము బ్రతుకము గనుక, ఆ సమయమునకు మునుపే ఆయన మన నిమిత్తము వచ్చునని మనం ఎరిగియున్నాము. ఆయన మన కొరకు వచ్చును, అయితే మనము విభేదాలను వెనుకకు విడిచిపెట్టవలసియున్నది. మరియు నేను దీనిని ఆలోచించాను: ఇచ్చటనున్న సంఘము యొక్క ఆలోచన సభ, (వారితో ఇప్పుడు మాట్లాడి) సంఘమును ఎందుకు నిర్మించకూడదు? దానిని ఇచ్చట నిర్మించుడి. దానిని చక్కగా చేయుడి, మరియు ప్రజలు వచ్చేటటువంటి ఒక చక్కని స్థలముగా నిర్మించుడి.
సంఘము, సహోదరుడు నెవిల్ ను సంఘకాపరిగా ఉండునట్లు ప్రతిపాదించునంత వరకు అతడు సంఘకాపరిగా ఉండవలెనని నేను సూచించుచున్నాను. అది సంఘము యొక్క ఎన్నికయైయున్నది. అతడు ఆ కార్యనిర్వాహణను చేపట్టి మరియు విశ్వాసముతో నిలిచియున్నంత కాలము ప్రభువు యొక్క నడిపింపుతో రావలెనని కోరునంతవరకు; సంఘము మరలా అతడిని ఎన్నుకొనినయెడల, అప్పుడు అతడే ఉండటానికి ప్రభువు యొక్క నడిపింపుయైయున్నది.
48పిదప, నేను చెప్పినది ఏమనగా, ఇచ్చటున్న ఈ వ్యక్తులందరూ, సహోదరుడు క్రెస్ మరియు సహోదరుడు జూనియర్ వంటి ఇతర వ్యక్తులు వారందరూ కార్యనిర్వహణలో భాధ్యతగా ఉన్నంతవరకు ఇచ్చట వారు కలసి సహవాసము కలిగియుందురు. మీరు వెళ్ళి మెథడిస్టుతో కలసియుండరు; వారితో మీకు సహవాసము లేదు. భాషలతో మాట్లాడుట మరియు యేసు నామంలో బాప్తీస్మం గూర్చి మాటలాడుటకు బాప్టిస్టుల వద్దకు మీరు వెళ్ళినయెడల, వెంటనే వారు మిమ్ములను బయటికి తరిమివేయుదురు. అది వాస్తవము. మీరచ్చట కూర్చున్నయెడల, ఒక కాకుల గుంపు మధ్యన మీరొక పావురము వలె నుందురు. అసలు మీకు సహవాసమే ఉండదు. మీరు చనిపోవుదురు. నేనిప్పుడు మెథడిస్టులు మరియు బాప్టిస్టుల గూర్చి ఎగతాళి చేయలేదు. దానిని గుర్తించుకొనుడి. నేను దానిని కేవలం ఒక సాదృశ్యం కొరకై చెప్పుచున్నాను. మెథడిస్టులు మరియు బాప్టిస్టుల లోను అనేకమంది మంచి వ్యక్తులు, దైవభక్తి గలవారు ఉండియున్నారు, అయితే నేను మాట్లాడుచున్నది సహవాసమును గూర్చియైయున్నది. అక్కడ సహోదరుడు ఉన్నాడు…. అతని పేరేమిటి? ఈ రాత్రి ఆ వెనుక, సువార్తకుడైయున్న సహోదరుడు జె. డి. పార్నల్ ఆ వెనుక కూర్చునియున్నాడు. సహోదరుడు బీలర్, ఈ సహోదరుడు ఇచ్చట కూర్చునియున్నాడని నమ్ముచున్నాను. కొందరు…. మీలో ఇచ్చట అనేకులు, మీ జీవితములో పిలుపును కలిగియున్న దైవజనులైయున్నారు. మీరు ఏదో ఒకటి చేయుచుండవచ్చును. ఊరకే కూర్చునియుండకుడి. మనము ఏదో ఒకటి చేయుదుము. ఒక ఆత్మ రక్షించబడుట తప్ప మీరేమియు పొందుకోరు, ఆ ఒక్కదానిని రక్షించుడి. మనలో ప్రతి ఒక్కరు అట్లు చేయుడి.
49ఇప్పుడు, నేనిట్లు తలంచుచున్నాను, ఈ సంఘములో, పురుషులైన మీరు ఈ సంఘమును నిర్మించినయెడల, దీనిని మీ ప్రధానకార్యాలయముగా చేయుడి, మరియు సహోదరుడు నెవిల్ మీ మధ్యన అనుభవజ్ఞుడైన పెద్దగా ఉండనీయుడి, చూశారా. మరియు కొన్నిసార్లు మీ సంఘముతో చర్చించలేని ప్రశ్న మీకు తలెత్తినయెడల, అప్పుడు దానిని ఇచ్చట సహోదరుడు నెవిల్ వద్దకు తీసుకురండి, మరియు మీరంతా కలసి దానిని విచారించుడి. మీరు ఎటువంటి నిర్ణయానికి రాలేనియెడల, నేను శీఘ్రముగా వచ్చుదును, అప్పుడు మనమందరము కలసి దానిని పరిశీలించెదము.
మరియు పిదప, అక్కడ, మీ స్వంత సముహములలోని ఇతర సేవకులకు, పరిచర్య చేయుటకై తమ జీవితములో పిలుపు ఉన్నట్లు మీకు అగుపడిన వ్యక్తులకు, తర్ఫీదునియ్యుడి. ఆ యవ్వన మనుష్యులైన వారికి తర్ఫీదునియ్యుడి. వారిని ఇచ్చటనున్న పెద్ద యొద్దకు తీసుకురండి. మీరందరు ఒక సేవకుల కూటములో కూడుకొని, మరియు అక్కడ దేవుని యొక్క లోతైన విషయములను బోధించుడి. దుర్బోదల వైపు వెళ్ళకుడి. మీరు నమ్మకముంచునట్లు, మీకు ఒక విధమైన నాయకుడిగా ఉండునట్లు ఎవరైనా ఒకరిని మీరు కలిగియుండుడి. మరియు పిదప, కొన్నిసార్లు ఖచ్చితంగా అతడు చేయుచూ, పోవుచున్న విధానములో దానిని మీరు చూడకుండనియెడల, పరవాలేదు. ఏలాగునైననూ మీరైతే విశ్వాసములో ఉండియున్నారు. కేవలం కలసి వెళ్ళుడి. బహుశా మనము కూడివచ్చినప్పుడు, మనమంతా కలసి ప్రార్థించెదము; అప్పుడు, దేవుని యొక్క వివేచన దిగివచ్చును, అప్పుడు ఆయన అదేమైయున్నదో ఖచ్చితంగా అట్లే దానిని అందించును, మీరు చూడండి, మరియు సరిగ్గా దానిని ఎట్లు చేయవలెనో మనకు తెలియజేయును.
మరియు అచ్చటికి, సంఘములు వెళ్ళి వినవచ్చును. మరియు ఒక గుంపు మనుష్యులకు తర్ఫీదునిచ్చే విషయమైతే, నేనెచ్చటయైన సువార్త పనిమీద ఉండినయెడల, ప్రపంచవ్యాప్తంగా, వారిని నేను నియమించుటకు అనేక స్థలములు ఉండియున్నవి.
50ఒకవేళ నేను ఇండియాలో ఉన్నయెడల, తిరిగి ఇండియాకు వెళ్ళినచో ఏమగును? నేను అచ్చట ఈ ప్రజలకు చెప్పుదును, బహుశా వారు వేలకొలదిగా ఉండియుందురు. ఒకటి లేదా రెండు వారములు అచ్చట ఉండెదను మరియు వారు ఈ పరిచర్యను చూచెదరు. వారు దీనిని ప్రేమించుదురు. ఇది నిజమని వారు నమ్ముదురు; వారు అన్యమతము నుండి బయటకు వచ్చుదురు. నేను అచ్చట….. మరియు నేను రెండు లేదా మూడు వారములు కలిగియుందును. నేను రెండు రాత్రులు అచ్చట ఉన్నప్పుడు, బహుశా ఒక లక్షమంది క్రీస్తును స్వీకరించారు; ఎటు వెళ్ళుటకు లేకుండెను. ఆ మరునాడు విమానం ఎక్కి తిరిగి రోమ్ దేశమునకు ప్రయాణమయ్యాను, పిదప అమెరికా వచ్చాను తోడేళ్ళ మధ్యన గొర్రెలు ఉంచబడినట్లు వారిని వదిలివేశాను. చూడండి, వర్తమానములో తర్ఫీదు పొందిన ఒక గుంపు వ్యక్తులను, యవనస్తులైనవారిని నేను కలిగియుండి, "ఇప్పుడు ఒక నిమిషం వేచియుండండి; నేనిచ్చటనుండి వెళ్ళేముందు ఈ సంఘములను మేము ఒక క్రమములో అమర్చెదము. నేనొక మనుష్యుని కలిగియుండెదను. ఒక మంచి మనిషి. అతనితో కూడా ఇద్దరు లేక ముగ్గురు యవనస్తులు అతనికి సహయకులుగా మరియు సహాకారులుగా ఉండియున్నారు. నేను వారికి ముందుగానే టెలిగ్రాం చేసియున్నాను. వారు డబ్బును కలిగియున్నారు. సరిగ్గా ఇప్పుడు దీనిని చేపట్టేందుకు వారు దారిలోనేయున్నారు," అని చెప్పినచో ఎట్లుండును?
మరియు ఇండియాలో ఒక కేంద్రముగా, జర్మనీలో ఒక కేంద్రముగా, స్విట్జర్లాండ్ ఒక కేంద్రముగా ఉండునట్లు ఇదే విశ్వాసముగల ఒక సంఘమును అచ్చట ఏర్పాటు చేయవచ్చును. నేను వెళ్ళిన చోటల్లా ఆ దేశములన్నింటిలో సరిగ్గా ఇప్పుడు వాటిని మనము ఎందుకు కలిగియుండకూడదు. మరియు అప్పుడు వర్తమానము అక్కడి నుండి ఇంకొకరి వద్దకు, ఇంకొకరి వద్దనుండి ఇంకొకరివద్దకు వచ్చును. నా భావమును గ్రహించారా?
51ఇప్పుడు, రేపు రాత్రి లేదా ఎల్లుండి రాత్రి, నా స్నేహితుడైయున్న మాట్సేన్-బోస్ ఇక్కడికి వచ్చుటను మీరు చూచెదరు. కుంటివాడైయున్న ఒక చిన్న స్వీడెన్ దేశస్థుడు అక్కడ టాంగానికాలో ఏమి చేసేనో మీరు చూచెదరు. అతను అచ్చటికి వెళ్ళియున్నాడు. మరియు ఇప్పుడు మాట్సేన్-బోస్ మంచి వ్యక్తే, కానీ మనము నమ్ము విశ్వాసమును అతడు నమ్మడు.
నేను నేరుగా అతడిని బయటకి తీసుకొని వెళ్ళాను మరియు అతనిని తీసుకొని మరియు లేఖనములో ఫలానా విషయముతో కట్టివేసియున్నాను. నేనన్నాను, "మాట్సేన్, నీవు నా స్నేహితుడవై యున్నావు. ఇప్పుడు నీవు ఎగరడం కాని పరిగెత్తడం కానీ చేయలేవు. మనము కేవలం ఇచ్చట నిలబడి, క్రైస్తవ సహోదరులవలె ఒకరి చేతులను ఒకరు పట్టుకొని మాట్లాడుకొనెదము," చూశారా.
మరియు వర్తమానమును నేరుగా అతనియెదుట ఉంచాను, మరియు ఆయన కేవలం అచ్చట నిలబడి, "సహోదరుడా బ్రెన్హాం, నీవు నిశ్చయంగా సరియైయున్నావు," అని అన్నాడు.
నేనిట్లన్నాను, "ఇప్పుడు మాట్సేన్, నీవు దానిని నమ్ముటలేదు, లేనియెడల నీవు దానిని అంగీకరించెదవు."
"మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నీవు చెప్పునది సత్యమని నేను నమ్ముచున్నాను."
"అలాగైతే దానిని నీవు ఎందుకు అంగీకరించకూడదు?" చూశారా? అతని వద్దకు చేరువరకు దానిని మండించుడి. మరియు అతను పిదప, దానినుండి అతను దూరంగా పోయిన వెంటనే, అతడు అయిపోవును, చూశారా.
52అయితే అక్కడ అతని మిషినరి పనిలో ఆ వ్యక్తి ఏమి చేసెనో గమనించండి - కేవలం ఒక వ్యక్తి; ఎందుకనగా, అతడు నేరుగా చికాగోకి తిరిగి పంపించి మరియు బర్టన్ ను మరియు మిగతా వారినందరిని తీసుకొని ఆ విధంగా అక్కడికి వారిని పంపించి మరియు కార్యములు చేయుటను మొదలు పెట్టవచ్చును. ఇప్పటికి ఒక ఉజ్జీవముతో వారు వేలమందిని సంపాదించుచున్నారు. వరములు కలిగిన వ్యక్తి కాదు. కేవలం అక్కడికి వెళ్ళి మొదలు పెట్టుటకు సరిపడ ధైర్యముగల వ్యక్తియైయున్నారు. మరి లక్షల కొలది స్థాయిలోనున్న ఈ పరిధిలో ఏమి చేయవచ్చును? నిశ్చయంగా, మనము ఆ సమయాన్ని కోల్పోయాము. నా యొక్క సలహా అదియైయుండెను.
ఇప్పుడు గుర్తించుకొనుడి, దీనిని చేయుటలో కొన్నిసార్లు మీరు ఫలానా మరియు ఫలానా సహోదరునితో ఏకీభవించని సమయాలు ఉంటాయని మీరు కనుగొంటారు. మీరుఇచ్చట ఏకీభవించకయుందురు. మరియు మీరు ఆ స్థానమునకు వచ్చువరకు మీరు ఇట్లు అంటారు, సరి, అతడు నావలె నమ్ముటలేదు గనుక నేను వెళ్ళను. అప్పుడు నీలో ఏదో తప్పిదము ఉన్నది. ఇతర వ్యక్తిలో తప్పిదము లేదు. సహోదరులు ఎవరైతే కలసియుండునట్లు ప్రయత్నము చేయుచుండగా తప్పిదము నీదైయైయున్నది!
ఒక సంగతి కలదు, బ్రెన్హములమైన మేము తొమ్మండుగురము ఉండియున్నాము, మరియు మేము పెంపుడు కుక్కలవలె పోట్లాడుకుంటాము; అంతే మేమెంత పోట్లాడుకున్ననూ తుదకు వేము బ్రెన్హమీయులమైయున్నాము. ఒకనికొరకు బ్రెన్హములమని ఎరిగియున్నాము. అతడు బ్రెన్హాం అని నాకు తెలియును. నేను బ్రెన్హాం అని అతనికి తెలియును, చూశారా. అయిననూ మేము పోట్లాడుకుంటాము. మీరు మీ కుటుంబంలో అట్లు చేయుదురు, అయిననూ వారు మీ సహోదరులైయున్నారు. ఇదియును అట్లే ఉండియున్నది. మనము విభేదించవచ్చును, అది సరియే. అయిననూ మరియు ఒక్కటేయైయున్నాము. మనము క్రీస్తులో ఒక్కటిగా ఉన్నాము. మనము ఈ వర్తమానమును నమ్ముచున్నాము, మరియు దీనితో నిలబడియుందాము.
53మరియు చేయవలసినది అదేయని నేను తలంచుచున్నాను, యేసు వచ్చువరకు, కొనసాగుపోవుచుండవలెను. మరియు ఆ విషయములో నేను చెప్పగోరినది అదేయైయున్నది. మరియు నేను నమ్ముచున్నాను. ఒకవేళ మీరు…
చూడండి, మీరు దానితో ఉత్తేజభరితులైయుండవలెను. మీరు ఉతేజభరితులై యుండనియెడల, అప్పుడు ఏదో తప్పిదము ఉన్నది. అక్కడేదో తప్పిదము ఉన్నది. మీరిట్లు చెప్పకుండవలెను, "మంచిది, పోయిన నెల నేను చాలా చక్కగా ఉత్తేజభరితుడనైయున్నాను, కానీ ఇప్పుడేమైనదో నాకు తెలియదు." చూడండి, అలాగైనచో ఎక్కడో ఏదో తప్పిదము ఉండియున్నది. నీవు అన్నివేళలా ఉత్తేజభరితుడవై ఉండవలసి ఉన్నది, చూడండి, మరియు అదే ఉత్తేజమును కొనసాగించండి; ఎందుకనగా అపవాది మిమ్ములను పట్టుకొన ప్రయత్నించుచున్నాడు. మన మాజీ రాష్ట్రపతి శ్రీ. ఐసెన్ హువర్ ని నేనేల్లప్పుడూ ఇష్టపడుదును. జనరల్ ఐసెన్ హువరని నేను గొప్పగా ప్రశంసించుదును. అతను చెప్పెను, "మనము యుద్దము చేయుచున్నప్పుడు," అతను ఇట్లు చెప్పెను, "చాలాసార్లు మేము ఒక తూటాను తుఫాకీ లో పెట్టి మరియు దాని మీటను నొక్కినప్పుడు అది చటుక్కున పడిపోయేది; అది దూసుకొనిపోదు," అని చెప్పెను. "మేము విరమించుకొనలేదు." ఇట్లనెను, "మేము మరొకటి దానిలో పెట్టేవారము మరియు అది కూడా దూసుకొనిపోయేది కాదు." ఇట్లన్నాడు, "మేము వదిలి పెట్టేవారము కాదు. అది దూసుకుపోవునంతవరకూ మేము మీట నొక్కుతునే ఉండేవారము," అని అన్నాడు.
54అంతే, యుద్ధమును గెలుచు మార్గము అదే. ప్రయత్నించుచూ ఉండుటయైయున్నది. తూటాను దానిలో పెట్టి మరియు దాని మీటను లాగవలేను. నీవు పేల్చుటకు ఒక ఉద్దేశమును, ఒక గురిని కలిగియున్నావు. మరియు అది దూసుకుపోనియెడల, దానిని బయట పారవేసి, మరొకటి దానిలోపల పెట్టి మరలా ప్రయత్నించవలెను. ఒకటి దూసుకుపోయేంతవరకు దానిని లోపల పెట్టి మరలా ప్రయత్నించవలెను. దానిలో పనికివచ్చినది ఒకటి ఉండియుండును గనుక దానిలో ఒకటి దూసుకొనిపోవును. మనము చేయవలసిన విధానం అదేయైయున్నది. పేలుస్తూనే ఉండుడి, ఏదో ఒకటి జరుగువరకు పేలుస్తూనే ఉండుడి.
నేనేమి చేయుచున్నాను? నేనిప్పుడు పేల్చుచున్నాను. కనీసం తెలియకుండానే… ఎటువంటి నడిపింపు లేకుండానే, నేనిచ్చటకి వెళ్ళుచున్నాను. ఒక భాద్యతయైయున్నది! నీవేమి చేయబోవుచున్నావు? తర్వాత కదలిక ఏమైయున్నది? అని లక్షల కొలది ప్రజలు నీ వైపు చూచుచున్నారు. నేను చనిపోయానని కొందరు తలంచుదురు. కొందరు ఇలాగు తలంచుదురు. గడిచిన దినమున ఆ తుపాకీ పేలినప్పుడు కూడా, నేను ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించానని చెప్పియున్నారు. ప్రతీదీ దేశమంతటను ప్రతీదానిని గమనించుడి, చూశారా?. అయితే మీరు పోరాడుట కొరకే అది అంతయూ కలిగియున్నారు. పిదప మీరు ప్రజల కొరకు భారమును కలిగియున్నారు.
55మరియు కేవలం ఊహించుకొనుడి, నీవు మాటలాడుచున్న ఆ ప్రజల యొక్క హృదయమును నీవు తెలిసికొనునట్టిది దేవుడు నీలో పెట్టినయెడల ఏమగును? దానిగూర్చి ఆలోచన చేయుడి. చూశారా, సహోదరులారా, బహుశా మీకు సమస్యలున్నవని నేనెరుగుదును, కానీ మీరు గ్రహించలేరు. మరియు అంతేకాకుండా ఇచ్చట మీరు భాద్యతను కలిగియున్నారు.
"మంచిది, సహోదరుడు బ్రెన్హాం, అది నీకు తేలికగానే ఉండును. ఏది చేయవలెనన్ననూ, దేవుడు నీతో చెప్పును," అని మీరు అనవచ్చును. లేదు, ఆయన చెప్పడు. నీవలె, మరియు ఇంకా ఎక్కువగానే కష్టపడి నేను చెమటోడ్చియున్నాను. నిశ్చయముగా. మీకన్నా ఎక్కువగా కష్టపడి నేను చమటోడ్చవలసియున్నది. మరియు నా యొక్క అవసరత ఎక్కువగా ఉండియున్నది. మీరైతే ఒక సంఘమునకు జవాబు ఇవ్వవలెను, మీ కుటుంబానికి జవాబు ఇవ్వవలెను, లేదా బహుశా మీకు మీరే జవాబునిచ్చుకొనవలెను. చూడండి, నేనైతే లక్షల కొలది ఆత్మలకు జవాబుదారుడనైయైయున్నాను. నా కదలికలను నేను తెలిసికొనవలసియున్నది. మరియు ఒక ఆత్మ కొరకు, లేదా మీరు సంపాదించే కొన్ని ఆత్మల విషయమై అపవాది మిమ్మల్ని తలక్రిందులు చేయుచున్నయెడల, లక్షల మంది ఇక్కడ వరుసలో కూర్చుని ఉండియున్న దాని సంగతి ఏమిటి? ఇక్కడ వాడు మరెన్ని దాడులు జరుపుచున్నాడు? చూశారా? కావున సహోదరులారా, మీరు గుర్తించవలసినది ఇంకా ఎంతో ఉండియున్నది. కొన్నిసార్లు నేను ఉద్రిక్తతకు లోనగుదును అనుటలో ఆశ్చర్యపోవనసరం లేదు. నిశ్చయంగా.
56అయితే సరిగ్గా ఇప్పుడు నేను పిడికిలి బిగించి గుద్దుచున్నాను. నేను ఒక తూటాను లోపల పెట్టుచున్నాను; అది పేలినయెడల, పరవాలేదు. అది పేలనియెడల, నేను ఆగిపోను; నేను దానిని పారవేసి మరొకటి ప్రయత్నించెదను. వాటిలో ఒకటి దూసుకునిపోవును. దానిలోని విషయం అదేయైయున్నది. వాటిలో ఒకటి ఎక్కడో ఒకచోట పేలనైయున్నది. అప్పుడు నేను గురి పెట్టుకొనియుండవలసియున్నది, ఎట్లనగా అది పేలినప్పుడు, నేను గురిపెట్టిన లక్ష్యాన్ని పేల్చుదును. మరియు ఇప్పుడు మీరు నా భావమును గ్రహించుదురని నేను నిశ్చయత కలిగియున్నాను, చూశారా. ఎక్కడో ఏదో ఉండియున్నది. నేను ఈ కూటముల నిమిత్తము అచ్చటకు వెళ్ళుటకు త్వరపడుచున్నాను. నేను మీకు బోధించే ఈ గొప్ప విషయములను నేర్పించుటను లక్ష్యముగా కలిగిలేను.
నేను అనువాదమును పొందుకొనియున్న ఆ కల ఏమైయున్నదో మీకు గుర్తున్నదా? వెనక్కి వెళ్ళుము మరియు ఆహారమును నిల్వచేయుము. నిల్వచేయు స్థలము ఎక్కడున్నది? ఈ ఆలయమేమైయున్నది. ఈ దేశములో, ఈ చుట్టూ ప్రక్కలా ఎక్కడైననూ మనము కలిగి ఉన్న వర్తమానముతో పోల్చదగినది ఏదైనా ఉండియున్నాదా? సహజంగా ఇప్పుడు, ఇక్కడున్న మన చిన్న సహోదరులు, ఈ ఇతర చిన్న సంఘములు మనమైయున్నాము. మనము ఒక్కటైయున్నాము. దానిని కనుగొనుటకు మీరెచ్చటికి వెళ్ళుదురు? దానిని పోలియున్నది. ఎక్కడైనా ఉన్నదో చూపించండి. మీరు నేరుగా సంఘశాఖ సిద్ధాంతంలోనికి పోవుదురు. మీరు నేరుగా ప్రభువైన యేసు యొక్క నామము నుండి దూరమైపోవుదురు. మీరు నేరుగా ఈ ఇతర కార్యముల నుండి దూరమైపోవుదురు, చూశారా. మరియు ఆ ఆహారము నిలువచేయబడినది ఇచ్చటనేయైయున్నది.
57మంచిది, నేను ఇచ్చట మీ అందరికి ప్రసంగించిన ఒక వర్తమానము… చూడండి, నేను ఒక వర్తమానముపై మీకు ఒకటి నుండి ఆరు గంటల వరకు బోధించుచుంటిని. సరి, అటువంటి ఒక వర్తమానమును నేను ఉపయోగించవలసి వచ్చిన, దానిని చెప్పుటకు నేను ఒక వారమును తీసుకొనవలసియుండును. కొంత ఇచ్చట మరికొంత ఇచ్చట (చూడండి) ఎందుకనగా అది ఇచ్చట నిలువచేయబడియున్నది.
అది టేపులపై రికార్డు చేయబడియున్నది. అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క గృహములలోని టేపులలోనికి వెళ్ళును. ఆ టేపులు నేరుగా దేవుని చేత ముందుగా నిర్ణయించబడినవారి చేతులలో పడును. ఆయన వాక్యమును నిర్దేశించగలడు. ఆయన ప్రతిదానిని దాని యొక్క క్రమము చొప్పున నిర్దేశిస్తాడు. ఆ కారణము చేతనే నేను దీనిని చేయుటకు ఆయన నన్ను వెనుకకు పంపించెను. "ఇచ్చట ఆహారమును నిల్వచేయుము." నేను విదేశాలకు వెళ్ళుటను ఆయన నిరాకరించెను.
58సహోదరుడు ఆర్గన్ బ్రైట్ ఇలా అన్నాడు, "సరే, రమ్ము; వెళ్ళుదుము. నీకు ఒక రాత్రి గడువు ఉండియున్నది, కాని దేశమంతటికీ ఒక విహారయాత్రగా నిన్ను మేము తీసుకుని వెళ్ళుదుము." సహోదరుడు ఫ్రెడ్ మరియు సహోదరుడు బ్యాంక్స్ వెళ్ళుటకు ప్రయత్నించిన విధముగానేయని నేను చూచితిని.
నేనిట్లన్నాను, "నేను ఆ విధంగా వెళ్ళను," చూశారా. అచ్చట ఇంకేదో ఉండియున్నదని అది చూపించుచున్నది. నేనిప్పుడు సరిగ్గా గురియొద్దకు వచ్చియున్నాను, అయితే ఏ వైపునకు వెళ్ళవలెనో ఎరుగకయున్నాను. అయితే నా చుట్టూర యుద్ధ సామాగ్రి పడియున్నది.
ఆయన నన్ను తిరిగి సువార్త కొరకు పిలిచియున్నాడా? ఆయన నన్ను విదేశీ మిషనరీగా పిలిచియున్నాడా? నన్ను ఆయన తన ప్రవక్తగా నుండుటకు పిలుచుయున్నాడా? ఎక్కడైనా సంఘకాపరిగా కాపరత్వం చేయవలేనా? నేనేమి చేయవలిసినా గాని, నేను కేవలం తూటాను లోపల పెట్టుచునేయుందును మరియు దాని మీట నొక్కెదను. వాటిలో ఒక్కటి పోవును! అయితే నేను మాత్రం ఊరకే కూర్చుని మరియు ఎదురుచూచుచు, ప్రభువా, నీవే తుఫాకీలో తూటాను పెట్టుము అని చెప్ప బోవుటలేదు. నేనే తుఫాకీలో తూటాను పెట్టుదును, స్వయంగా నేనే మీట నొక్కెదను. పేల్చుట ఆయన వంతైయున్నది. దాని విషయమై శ్రద్ద వహించునది ఆయనేయైయున్నాడు. నేను కేవలం ముందుకి సాగిపోవుచునుందును.
59ఇప్పుడు నేను ఈ బయట కూటములకు వెళ్ళుచుండగా, నేను కేవలం వెళ్ళుచున్నాను అంతే. నాకు తెలియదు. అది నేను ఇచ్చట ప్రసంగించు వర్తమానము గూర్చి బహుశా ఒక్క సంగతియైననూ నేను చెప్పలేకపోవచ్చును. బహుశా ఒక్క రాత్రియైననూ వివేచననూ నేను కలిగియుండకపోవచ్చును. నేను ఎరుగను. నేను ఏమి చేయబోవుచున్నానో ఎరుగకయే నేను పోవుచున్నాను. నేను మీతో చెప్పలేను; నేను కేవలం వెళ్ళుచున్నాను.
మరి అది… మరియు ఆ విధంగానే మీరు చేయవలసియున్నది. మనసులో మీరు ఏదోఒకటి కలిగియుందురు. ఇక్కడున్న ప్రజలు ఒక సంఘమును కోరుచున్నారు. దానిని నిర్మించండి. వీలైనంత త్వరగా దానిని సాధించండి. మీ బోధకులను మరియు కార్యములను తీసుకురండి. మీ చిన్న సంఘములతో, అచ్చట దూరమునున్న సహోదరులైన మీరు, మీరొక కార్యమును చేయుచున్నారు, దానికై దేవుడు మీకు ప్రతిఫలమును అనుగ్రహించును. అచ్చటికి వెళ్ళి, ప్రసంగించుడి, మీరు చేయగలిగినదంతయూ చేయుడి. పురుషుల సమూహమైయున్న మీరందరూ కూడుకొని, కూటములు ఏర్పాటు చేసుకొని, మరియు లేఖనము యొక్క లోతైన విషయముల పై మాటలాడుకొనుడి. మరియు ప్రార్థన చేయండి. మీరు ఊరకే ఇచ్చట కూడుకొనక, కేవలం ప్రార్ధన కూటమునకు మాత్రమే మీరిచ్చటికి రావలయును. మీ ప్రార్థనను రహస్యముగా చేయుడి. మీ స్థానములలో నిలిచియుండుడి. మీ గదులలోనికి వెళ్ళి, ఎచ్చటైనా దాగియుండి, కేవలం మోకరించి మరియు కేవలం అచ్చటనే దేవుని యెదుట వేచియుండుడి. పిదప ఏదైనా మెదిలినట్లు అనిపించుటను మీరు కనుగొన్నయెడల, ఓ, మీరు ముందుకు వెళ్ళుటకు మొదలు పెట్టుదురు, అయితే అది కొద్దిగా వాక్యము నుండి తొలగియున్నట్లు మీరు కనుగొన్నయెడల, అప్పుడు జాగ్రత్తగా నుండుడి. అది ఎంత మంచిగా కనిపించిననూ లెక్క చేయకుడి, సరిగ్గా అక్కడే నిలువుడి! ఒక తప్పుడు ఆత్మ మిమ్మును తాకియున్నది, ఎందుకనగా ఈ దినపు వర్తమానము వాక్యమునొద్దకేయై యున్నది, చూశారా. వద్దు సుమీ…
60చూశారా, ఒకవేళ మీరు, "ఓ, మై, సహోదరుడా బ్రెన్హాం! నీకు ఫలానా మరియు ఫలానా విషయం నీకు చెప్పెదను. ఎందుకంటే గతరాత్రి ఫలానా మరియు ఫలానా నిలిచియుండెను. ఈ మరొక విషయం ఈలాగున జరిగెను," అని చెప్పినయెడల, దానిని గమనించండి. దానిని జాగ్రత్తగా గమనించండి! దేనినైననూ నిరాకరించకుడి. కొద్దిగా వేచియుండి అది ఎట్లు పనిచేయునో చూడండి, మరియు పిదప దానిని వాక్యమునొద్దకు తీసుకువచ్చి మరియు అది వాక్యముతో ఎట్లు పోల్చబడునో చూడండి. తరువాత, అది వాక్యముతో సరిపోల్చబడి మరియు అంతయు బాగుగా ఉండినయెడల, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి మరియు చూడండి, పిదప అది వాక్యముతో నిలిచియున్నంతవరకు కేవలం కొనసాగుచునుండుడి. నా అభిప్రాయం అదేయైయున్నది. మీరు చేయవలసినది అదేయని నా తలంపైయున్నది.
61సహోదరుడా నెవిల్, సహోదరుడా రడెల్, సహోదరుడా క్రేస్, మరియు సహోదరుడా బీలర్ మరియు ఇచ్చటనున్న సహోదరులైన మీరందరూ, జూనీ, మీరెచ్చటనున్నను, మరియు ఇంకా మిగతా సహోదరులారా, దేవుడు మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించును గాక. టెర్రి, లిన్, చార్లీకాక్స్, డేవిడ్ లను, యవ్వనస్తులైన మిమ్ములను చాలామందిని నేను ఇచ్చట చూచుచున్నాను. దేవుడు మిమ్మును అభిషేకించును. మై! మీరు వచ్చియున్నారని ఎరిగియుండుటవలన, సువార్త కొరకై మీలో ఒక పిడికెడు మందిని నేను తీసుకొని మరియు ఎచ్చటైనా నియమింపగోరుచున్నాను, చూడండి. మీ జీవితంలో మీరు పిలుపును కలిగియున్నయెడల, మిమ్మును మీరు నిరూపించుకొనుటకు గాను మీరు వర్తమానమును తెలుసుకొని మరియు ధ్యానించి దానితో నిలబడగలరు. ఆ విధంగా, ఇద్దరు లేదా ముగ్గురు, మరియు నలుగురు లేదా అయిదుగురు యవ్వనస్తులు ఇచ్చట వెనుకనున్న వరుసలో కూర్చునియుండుటను నేను చూచుచున్నాను. మీరు యవ్వనస్తులైయున్నారు; నేను వృద్దుడనగుచున్నాను. సహోదరుడు నెవిల్ వృద్దుడగుచున్నాడు. మేము మధ్యవయస్కులవారమై యున్నాము. కాలము గడుస్తున్న కొద్ది మేము రంగము మీద నుండి వెడలిపోయెదము. తదుపరి మీరు మా స్థానాన్ని భర్తీ చేయవలసినవారైయున్నారు, చూశారా.
62మరియు కావున మీరు చూడండి… మరియు పిదప బహుశా, ఒకవేళ రేపు అనునది ఉండినయెడల ఆ దినమున ఇంకా గొప్పగా ఎదుగగలవారైయున్నారు. అయితే నేడు అనేది ఉండగానే, పగలున్నంతవరకు మనము పనిచేయుదము. రేపు అనేది ఎన్నటికీ రాకపోవచ్చును. అది వచ్చినయెడల, దానికై మనము సిద్దముగానుండెదము. నా భావమును గ్రహించారా? ఇప్పుడు మీ విషయమై నేను తలంచునది అదేయైయున్నది.
అచ్చట యూటికా నుండి వచ్చిన సహోదరుడు క్రేస్, ఇచ్చటనున్న సహోదరులైన మీరందరూ కలిసికొని, ఒక చోటుకు వచ్చి కూడుకొనియుండుటను చూచుట అద్భుతముగానున్నది గదా. సేవకులైన మీరు కూర్చుని మరియు విషయములను చర్చించెదరు. మీరెచ్చటైననూ సహవాసమును కలిగియుండవలసి యున్నది. దేనిగూర్చియైనా కూడుకొన్నారన్నట్లుగా, కూడుకొనుటకు మీరేదైనా ఒకటి కలిగియుండవలసి యున్నది. బహుశా నెలకొక్కసారి, పురుషులైన మీరందరూ, సేవకులైనవారు మాత్రమే ఒక గుంపుగా కూడివచ్చి మరియు ఆ రీతిగానే ఒకరినొకరు విశ్వసించి, మరియు కూర్చుని ఈ సమస్యలను విచారించుడి. ఎచ్చటైననూ మీ సంఘములలోని ఒక దానిలో మీరు కలుసుకొనుడి. కాపరులైననూ, సువార్తికులైననూ, మరియు మీరు ఏదైయున్నప్పటికినీ, మీలో ప్రతియొక్కరూ అచ్చట కూర్చుని మరియు దానిని చర్చించుకొనుడి, మరియు దాని గూర్చి మాటలాడుకొనుడి. మరియు పిదప ఒకవేళ మీరు పరిష్కరించలేని కొన్ని పెద్ద సమస్యలు వచ్చినయెడల, అప్పుడు నేను సువార్త పనిమీదకు పిలువబడినయెడల, ఏమో నేనెరుగను, ఒకవేళ పిలువబడినయెడల, నేను ఎప్పుడూ వచ్చినట్లే తిరిగి వచ్చెదనని మీకు తెలియును. మరియు కావున అటువంటి విషయములు మీకు తలెత్తినయెడల, తిరిగి నేనిచ్చటికి వచ్చినప్పుడు, సరి, మనము కలుసుకొని మరియు అచ్చట కూర్చుండెదము. మీ జీవితములో పిలుపును కలిగిన ఒకరు… మనము తరచుగా కలిగియున్నట్లు వ్యక్తిగత ఇంటర్వ్యూలు మరటువంటివి లేకుండా, మనము నేరుగా కూడుకొని, మరియు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అనునది పొందుకునేంతవరకు అచ్చట వేచియుందుము.
EXOD 18:22
63మరియు అతడు సరిగా వెళ్ళునట్లు మనము బోధకులను సరిచేయగలిగినయెడల, అతడేమి చేయబోవుచున్నాడో చూడండి. అతడు ప్రభావితం చేయును… అది ఇటువంటివి వందలకొలది విషయములను చక్కబరచును. అది అంతే. మీరు చూడండి, మనము కేవలం సరిచేయుచున్నాము. మీరు దానిని ఒక పద్దతిలోనికి అనగా దేవుని యొక్క పద్దతిలోనికి తీసుకురావలసియున్నది.
మోషేతో, ఇత్రో చెప్పినట్లేయున్నది, "వారందరినీ నీవు సరిచేయలేవు." దేవుడచ్చట వారిలో డెబ్బదిమంది పెద్దలను నియమించెను. మరియు మోషేపైనున్న ఆత్మను తీసుకొని ఆ డెబ్బదిమంది పెద్దలపై ఉంచెను. మరియు వారు ప్రవచింపసాగిరి. మరియు అది మోషేను బలహినుని చేయలేదు. అది ఆయనను బలపరచియున్నది. వారు ప్రవచించునట్లు తన మీదనున్న ఆత్మను తీయుటకు మునుపు ఉన్నట్లే ఇంకనూ ప్రవచనము అతనిలో ఉండియున్నది, చూశారా. అతడు కేవలం వేరుచేసెను. ఇట్లనెను, ఇప్పుడు, మోషే అల్పవిషయములను వారే న్యాయము తీర్చనిమ్ము. మరియు గొప్ప వ్యాజ్యముల విషయమైతే, వారితో నీవు వచ్చి మరియు ఆ రీతిగా వారికి సహాయము చేయుము.
ఇప్పుడు, విధానము అదే. అప్పటిలో అది దేవుని విధానమైయున్నది. సంఘకాల ప్రారంభములోను అది దేవుని విధానమైయున్నది. మరియు సరిగ్గా ఇప్పుడు కూడా దీనిని చేయుటకు అది మనకొరకు దేవుని విధానమైయున్నదని నేను నమ్ముచున్నాను. కావున మనము దానిని చేయుదుము. దాని గూర్చి మాట్లాడుటను నిలిపివేసి మరియు దానిని చేయుదము. అంతే. మనము దేవుని కృప వలన దానిని చేయగలము. దానిని మీరు నమ్ముటలేదా?
64ఇప్పుడు, మనమిప్పుడు చూద్దాం. ఓ, నా సమయమంతా నేను వాడుకొనియున్నాను, అయితే బిల్లీ ఇక్కడ ఒక గమనికను వ్రాసియుంచాడు. ఒక క్షణం, అదేమిటో నేను చూచెదను: "నేను న్యూ-ఆల్బనీ నివాసురాలిని… డాటర్, గ్రేస్… మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుచుంటిని. ఆమె చేయి విరిగినది. పేరు W.C ట్రైబ్." తన కొరకు ప్రార్ధనను కోరుచున్నది. ట్రైబ్ (అటువంటి పేరైయున్నది.) ఈ యవ్వనస్తురాలి కొరకు మనం ప్రార్ధించెదము,
మా పరలోకపు తండ్రి, ఇప్పుడు మేము మాట్లాడుచుండగా, ఐరేనియస్ తన జనుల యొక్క చిన్న గుంపును చూసినప్పుడు, బహుశా అది ఇక్కడున్న గుంపుకంటే చాలా చిన్నదైయుండవచ్చునని నేను తలంచుచున్నాను. మరియు కూర్చుండుటకు వారికొక చోటు లేకుండెను. వారు ఆ పాత నల్లరాయిపై కూర్చునియుండేవారు. మరియు వారచ్చట కూర్చొనియుండగా, ఆయన వారితో మాట్లాడేవాడు. వారు వెళ్ళినచో సింహములకు ఎరగా వేయబడుదురనియూ, వారి తలలు నరికివేయబడునని ఎరిగియుండియూ ఆ మనుష్యులు బయటకు వెళ్ళిరి. అయితే చెరసాల, అగ్నిజ్వాల, మరియు ఖడ్గము ఉన్నప్పటికినీ మన పితరుల యొక్క విశ్వాసము స్థిరముగా జీవించుచున్నది.
ప్రభువా, ఈ మనుష్యుని కొరకై నీకు వందనములు చెల్లించుచున్నాను. నీవు వారిని ఆశీర్వదించుదువని నేను ప్రార్థించుచున్నాను. పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసమందు వారిని నీవు కాపాడుము దానినుండి వారు ఎన్నడూ తొలగిపోకుండునట్లు వారిలో ప్రతి ఒక్కరిని ఇప్పుడు నీ నామమందు ఆశీర్వదించుము. మరియు ఈ గుంపునుండి కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను నీవు పంపుదువు గాక. ఓ, దేవా, దీనిని అనుగ్రహించండి. మరియు వారెచ్చటనున్ననూ, అంతటనూ వారు ఆ కోటను హత్తుకొనియుందురు గాక. యేసు వచ్చునంతవరకు వారు నిరంతరం పనిచేయుదురు గాక.
65మరియు ఇప్పుడు, తండ్రి, ఈ రాత్రి ఇచ్చటనున్న ప్రతియొక్క విన్నపముల నిమిత్తము నేను ప్రార్థించుచున్నాను, మరియు ఇంతక్రితమే తన చేయి విరగొట్టుకొనుయున్న ఇచ్చటనున్న ఈ స్త్రీని నీవు జ్ఞాపకము చేసుకొనుమని అడుగుచున్నాను. సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి ఆమెను స్వస్థపరచి మరియు ఆమెను బాగుచేయును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. నీవు ఆమెకు సహయము చేసి మరియు ఆమెను ఆశీర్వదించెదవని నేను ప్రార్ధించుచున్నాను. పిలుపునిచ్చినందుకు ఆమె యొక్క ప్రియులను దీవించండి. మరియు సమాధి నుండి యేసుని లేపిన అదే శక్తి ఈ అమ్మాయిని లేపును గాక. ఆమె చేయి బాగావును గాక.
ఈ రాత్రి చెప్పబడిన ఈ విన్నపములన్నియు: అచ్చట పడియున్న ఆ పేద పిల్లవాడు, హాడ్జికిన్స్ వ్యాధి సోకినందువలన, వారతనికిచ్చుచున్న రేడియం మరియు అట్టి పదార్ధములను బట్టి అతని ముఖము మాడిపోయినదని ఆ సహోదరుడు ప్రకటించుచుండగా నేను వినియున్నాను. దేవా, ఆ పిల్లవాని పట్ల కనికరము చూపండి. అతడిని జీవింపచేయండి. నిన్ను కలుసుకొనుటకు సిద్దపడకుండా యుండి మరియు ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని. తల పగిలియున్న అతని భార్యను, ఆ దత్తత తీసుకోబడిన పిల్లవాణ్ణి! ఇంకా ఈ ఇతరలందరి గూర్చి మేము తలంచుచున్నాము. ఆ నీటిని మోసుకొనుపోవు సహోదరి బ్రూస్. తండ్రీ, ఆమె వృద్దురాలగుచున్నది. మరియు అక్కడ ఆమె చేతులు కాలిపోయినవి, మరియు ఆమె శరీరము పైనుండి క్రింది వరకు కాలిపోయినది. మేము ఆమె కొరకు ప్రార్థించుచున్నాము. బహుశా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుచుండవచ్చును. మరియు నీవు ఆమెకు విడుదలనిచ్చి, ఆమెను బయటకు తీసుకురాగలవని మేము ప్రార్థించుచున్నాము. తండ్రి, దీనిని అనుగ్రహించండి. ఈ దీవెనలన్నింటిని మేము యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్.
66ఇప్పుడు, నేను మిమ్ములను ఒక్కటి అడగగోరుచున్నాను. కొద్దిగా వాక్యము కొరకై మనము సమయము ఉన్నదని మీరు నమ్ముచున్నారా అని అడుగుచున్నాను. మీకు సమయము ఉన్నదా? కేవలం… ఇప్పుడు, కొంచెం ఆలస్యమైనదని నేను ఎరుగుదును, అయితే ఈ రోజు నేను ఆలోచించిన ఒక చిన్న విషయము ఇచ్చట నేను కలిగియున్నాను, దాని గూర్చి ఒక నిమిషం నేను మాటలాడగోరుచున్నాను, మరియు అది మీకు సహాయపడవచ్చును. మరియు ముందుగా నేను దీనిని ప్రకటించదలంచాను. ఇప్పుడు, అది ఈ టేపుపై ఉండియున్నది. మరియు నేనేమి చేయదలంచుచున్నానో, మరియు ఇప్పుడు సహోదరులైన మీ నిమిత్తము ఏమి చేయవలెనన్నదానిని ఎవరైననూ విచారించగోరినయెడల, చూడండి, దానిని జిమ్ కలిగియున్నాడు.
ఇప్పుడు, ఆ కాలపు పురుషులు బయటకు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు వారు సుమారు ఆరుగురు లేదా ఎనిమిది మంది మాత్రమే, కలిసి వెళ్ళుదురని మీకు తెలియునా? మరియు వారు దేశమును కుదిపి వేసిరి. సరి, అచ్చట అపొల్లో ఆ గొప్ప ఉజ్జీవమును కలిగియున్నప్పుడు, అకుల మరియు ప్రిస్కిల్లాలు ఉన్నప్పుడు, సుమారు ఆరుగురు లేదా ఎనిమిది మంది స్త్రీలు, పురుషులు మాత్రమే ఆ గుంపులో ఉన్నారని మీకు తెలియును. ఆ సంఘమంతయూ, ఆరుగురు లేదా ఎనిమిది మంది మాత్రమేయైయున్నారు. అప్పుడు వారు కలిగియున్నదాని కంటే ఐదు, ఆరు, లేదా ఏడు రెట్లు ఎక్కువగా ఈ రాత్రి ఇచ్చట మీరు కలిగియున్నారు.
యేసు కేవలం పన్నెండు మంది అపోస్తలులను కలిగియుండెనని మీరెరుగుదురు. మనమెల్లప్పుడూ ఏదో గొప్పదాని గూర్చి ఆలోచిస్తుంటాము, అయితే ఆ పెద్ద సంఖ్యలతో దేవుడు వ్యవహరించడు. ఈ చిన్న గుంపులలోనికి ఆయన వచ్చును, చూశారా. ఏ సమయములోనైనా ఆయన ఎక్కువమందిని కలుసుకున్నాడాయని కాలమంతటిలో గమనించండి. చూడండి, చిన్న గుంపులలోనే కలుసుకొని మరియు వారితో మాటలాడెను మరియు వారిని నియమించెను. దానిని చేయుటకు దేవునికి ఇష్టమైయున్నది. దానిని ఆ విధంగా చేయుట ఆయనకు ఇష్టమైయున్నది. మరియు మనమిప్పుడు దేవుడిని మన మధ్యనుంచుకొని, ఈ కార్యములను చేయుచూ, ముందుకు వెళ్ళగోరుచున్నాము.
67ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, ఆదివారము ఉదయమున "అంత్యకాల సువార్త" అనుదానిపై నేను మీతో మాటలాడగోరుచున్నాను. మరియు పిదప నేను, ప్రభువు అనుమతించినయెడల, నేను తిరిగి మరలా వచ్చువరకు, బహుశా ఈ శరదృతువంతయూ నేను విడిచివెళ్ళుదును. బహుశా ఏదో ఒక సమయమున సెప్టెంబరుకల్లా నేను తిరిగి వచ్చెదను. మరియు అప్పటికల్లా సహోదరులైన మీకు ప్రతీది అద్భుతంగా జరగాలనియు, మరియు మీ కూటములు అధిక సంఖ్యలోనికి ఎదగాలనియు నేను ఆశిస్తున్నాను, మరియు మనము కలుసుకొనునంత వరకు దేవుని కృప మీ అందరిపై ఉండును గాక. మీరు నా కొరకు మరియు కార్యసిద్ధి కొరకు ప్రార్ధించెదరని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్ధనల్లో నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. మీరు నా జతపనివారైయున్నారని దాని అర్ధమైయున్నది. మీరు నా సన్నిహితులు, నా సహచరులైయున్నారు. మరియు మనమంతా కలిసి దేవునిలో సహచరులమైయున్నాము. మరిప్పుడు, అచ్చట శత్రువు ఎదుట నేను నిలబడియున్నప్పుడు, రోగుల కొరకు మరియు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించి జవాబునొందిన విశ్వాసనీయమైన ఆ నిజమైన యోధులను నేను జ్ఞాపకము చేసికొనగోరుచున్నాను, మరియు అట్టి మనుష్యులు నా కొరకు ప్రార్ధించుచున్నారు. అచ్చట నేనే దాని అవసరతను కలిగియున్నాను. అది నాకు నిజముగా అవసరమైయున్నది. కావున మీరు కూడుకున్నప్పుడు, మీరంతా నా కొరకు ప్రార్ధన చేయండి. ఏ కూటములోనైననూ, నన్ను మరువకండి; నా కొరకు ప్రార్ధించండి.
JOHN 9:26-35
68ఇప్పుడు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో, 26వ వచనము నుండి 35వ వచనము వరకు కొద్ది నిమిషములకై, ఇప్పుడు నేను చదువగోరుచున్నాను. మరియు ప్రభువు చిత్తమైతే, ఇరువై లేదా ముప్పది నిమిషములలో మనము ముగించెదము. ఇప్పుడు ఈ లేఖనములను నేను చదువగోరుచున్నాను, యోహాను సువార్త 9:26-35 వరకు, నేను తలంచునదేదో ఇక్కడ వ్రాసుకొనియున్నాను.
అందుకు వారు - ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరేచేనని మరల వానిని అడుగగా,
వాడు - ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరునూ ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.
అందుకు వారు - నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి.
అందుకు ఆ మనుష్యుడు - ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్యర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము; ఎవడైనను దైవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.
ఈయన దేవునియొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చెయ్యనేరడని వారితో చెప్పెను.
అందుకు వారు - నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా, అని వానితో చెప్పి, వాని వెలివేసిరి.
పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను.
69ఇప్పుడు, సహోదరులైన మీతో కేవలం కొద్ది నిమిషములపాటు నేను మాటలాడగోరుచున్నాను, ఇచ్చట నా కొద్ది సంభాషణ వల్ల ఏమి జరుగనున్నదో నేను ఎరుగనని నాకు తెలియును. దానిని దేవుడు ఏదో ఒక విధముగా వాడుకొనునని నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు దీనియందు, ఆయన యొక్క వాక్యముపై, సాధారణముగా సహోదరుడు సింక్, సహోదరుడు నెవిల్, లేదా సేవకులైన మీలో ఒక్కరు, ప్రసంగించియుందురని నాకు తెలియును. మరియు కేవలం ఇచ్చట మీతో ఉండుటనుబట్టి, కొద్దిగా మీతో ఈ విధానంలో నేను మాటలాడగోరుచున్నందుకు మీరు నన్ను క్షమించగలరు.
ఇప్పుడిక్కడ నేనొక అంశమును తీసుకొనగోరుచున్నాను, "యేసు పక్షమున నిలుచుట." ఆయన కాలములోని పరిసయ్యులు మరియు నాయకులు ఎల్లప్పుడూ ప్రజల ఎదుట ఆయనను తక్కువ చేయ ప్రయత్నించిరి. అపవాది పనిచేయు విధానములలో అదొకటైయున్నది. ఆయన దినములలోని పరిసయ్యులు మరియు బోధకులందరూ నిత్యమూ యేసును అవమానపరచుటకు ప్రయత్నించిరి. వారు ఎంతగా ఆయనను దూషణలు చేయాలో అంతగా వారు చేసిరి. ఎక్కడ ఒక్క తపైనా దొరకునాయని నిరంతరం వారాయనను గమనించసాగిరి. మరియు ఆయన మంచి కార్యములను గూర్చి వారెన్నడూ మాటలాడకుండిరి. వారు ఎప్పుడూ ఆయనను అవమానపరచుటకు ఏదో ఒక దానిని వెతకసాగిరి, మరియు ఇట్లనిరి, మీరు చూడండి, "ఇక్కడ గమనించండి. ఆయన దైవజనుడైనయెడల, దీనిని ఆయన ఈ విధంగా చేసియుండేవాడు కాదు." లేదా, "ఆయన దైవజనుడైనయెడల, దీనిని ఆ విధంగా చేసియుండేవాడు కాదు." ప్రజలు ఆయనను విశ్వసించకుండునట్లు వారాయన పై అనుమానములను వెళ్ళగక్కిరి, అది అపవాది యొక్క పనైయున్నది, మరియు ఆ పాత పద్దతి ఇంకనూ ఆగిపోలేదు.
70అనేకసార్లు ఒక సేవకుడు తప్పుచేయుట జరుగును. మరియు అతడు సత్యమైనది చేయుటకు ప్రయత్నించుచూ ప్రజలను సరిగ్గా నడిపించాలనుకునే ఆ ప్రశస్త సహోదరుడు, పొరుగువారి యొద్దకు వచ్చినయెడల, ఆ మనుష్యుని దూషణలు చేయుటకు, ఆ ప్రాంతములోనున్న అవిశ్వాసికి లేదా నామకార్ధ క్రైస్తవుడికి వేలెత్తి చూపుటకు అపవాది ప్రతీది చేయును, వాడు దానిని చేయును. ఒక సహోదరుని నుండి దాచగలిగినంత దాచడమే నిజమైన క్రైస్తవ విధానమని మీకు తెలియును. అతని చెడు కార్యములను చెప్పకుడి; కేవలం అతని మంచి కార్యములను చెప్పుడి. కేవలం అతని గూర్చి మీకు తెలిసిన మంచినే చెప్పండి. ఏదైనా చేడు ఉన్నయెడల, దానిని విడిచిపెట్టండి. ఏలాగూ ఆ దీనుడికి సరిపడా వ్యతిరేకత ఉండియున్నది గదా. ఒక దుంగను తీసుకొని మరియు ఆ వ్యక్తిని ఇంకా గుంటలోనికి బలవంతంగా త్రోయుటకు ప్రయత్నించకండి. క్రైస్తవ విధానమేదనగా, అతడిని పట్టుకొని మరియు ఆ గుంటలో నుండి అతడిని బయటకు తీయుటయైయున్నది, చూశారా. అతడిని ఎన్నడూ బలవంతంగా క్రింద పడవేయుటకు ప్రయత్నించకండి. అతడు ఇదివరకే క్రింద పడియున్నాడు. అతడిని పైకి లేపుటకు సహాయపడండి. మరి అయితే, ఈనాడు మనలో అనేకులు, ఈనాడు చాలామంది ప్రజలు, వారు చెప్పుటకు ఇంకేదైనా దొరకునని ప్రయత్నించెదరని నేను చెప్పగలను, అది చాలా బాధాకరమైయున్నది.
MATT 18:15,16
71ఇప్పుడు, ఉదాహరణకు, మీలో ఒక సహోదరుడు ఒక పొరపాటు చేసి మరియు ఏదైనా తప్పు చేసినయెడల - సహజముగా మీరు మరియు నేను కూడా మరియు మనమందరము చేయదుము. అయితే మనము వెళ్ళేకొద్దీ మనము సహోదరులమైయున్నామని జ్ఞాపకముంచుకుందాము; మనము సహోదరులమైయున్నాము. మరియు మనకు ఏదైనా పోట్లాట ఉండినయెడల, మనము ఒకరితో ఒకరము పోట్లాడుకున్నా, దానిని మన సహోదరుల ఎదుటకు తీసుకువచ్చి మరియు పరిష్కరించండి.
ఇప్పుడు, బ్రెన్హాం కుటుంబములో, ఒక వాడుక ఉండియుండేది, చిన్న వారిలో ఒకరు ఏదైనా తప్పు చేసినయెడల, వారు దానిని గూర్చి బిల్లీకి చెప్పేవారు, ఎందుకనగా నేను పెద్దవాడనైయున్నాను. మరియు నేను అక్కడ నిలబడి మరియు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని చూడవలసియున్నది. సరి, ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అని నేను నిర్ణయిచవలసియున్నది. వారింకనూ దానిని నమ్మనియెడల, అపుడు వారు నా వెనుకకు వెళ్ళి, దానిని గూర్చి పోట్లాడుకునేవారు. అయినను వారు సహోదరులైయున్నారు, మీరు చూడండి. వారు వెనుక పెరటిలో ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు, మరియు ఇంటిముందు వాకిట్లో ఒకరికొరకు ఒకరు పోట్లాడేవారు. కావున అది ఆ రీతిగా ఉండియున్నది, చూడండి, మరి ఇంకనూ సహోదరులుగానే ఉండియున్నారు.
సరి, ఆ విధముగానే మనము దీనిని చేయవలసియున్నది. చూశారా, ఎవరైనా మీ సహోదరునికి వ్యతిరేకముగా మరేదైనా కనుగొన్నయెడల, దానిని గూర్చి వేరెవ్వరికో చెప్పకండి. అది తప్పైనయెడల, అతని యొద్దకు వెళ్ళి మరియు అతనితోనే చెప్పండి. మరియు పిదప అతడు మీతో వాదించగోరినయెడల, అప్పుడు మీతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళుడి. పిదప పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు దానిని చేయండి.
1PET 5:8
72అయితే, యేసు విషయంలో, ఆయనను ప్రజల దృష్టిలో చులకనచేయ ప్రయత్నించుచూ, వారు కనుగొనగలిగిన ప్రతీ చిన్నలోపమును కనుగొనుటకు ప్రయత్నించిరి. మరియు అపవాది కోరుకునేది అదేయైయున్నది. వారు ప్రజల ఎదుట మీకున్న పలుకుబడిని దెబ్బతీయగోరుదురు. ఆ విధానం అదేయైయున్నది. మీరు ఏమి చేయుదురో దానిని మీరు జాగ్రత్తగా గమనించవలెను. నిజమైన దైవజనులవలే నడుచుకొనుడి. దైవజనులవలే మాటలాడుడి, చూశారా. దైవజనులవలె ప్రవర్తించుడి; దైవజనులవలె జీవించుడి, ఎందుకనగా "మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు."
వారెందుకొరకు ఈలాగు చేయుచున్నారు? వారు ఆయన పట్ల అసూయ కలిగియుండిరి. వారు ఆయనను చులకన చేయ ప్రయత్నించుటకు గల కారణము అదేయైయున్నది. ఆయన పరిచర్యను గూర్చి వారు అసూయ కలిగియుండిరి. మరియు ఆ కారణముచేతనే వారాయనను చులకన చేయుటకు ప్రయత్నించుచుండిరి. సరి, అతడు దేవుని యొక్క పరిచర్యను కలిగియుండెను మరియు అది వారికి తెలియును, అయితే అది వారియొక్క మత సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఉండియున్నది. కావున వారు ఆయనను చులకన చేయుటకు ప్రయత్నించుచుండిరి, ఏ చిన్న తప్పైననూ కనుగొని, ఆయన అడ్డు తొలగించుకొనుటకై ప్రతీది చేయుచుండిరి. వారాయనను వదిలించుకోదలిచిరి. ప్రజలు ఆయనను దూషించవలెనని వారు కోరుకొనిరి. వారు ఇట్లు చెప్పగోరిరి, ఇప్పుడు, "ఈ అబ్బాయితో ప్రయోజనమేమియు లేదు. ఇటు చూడండి. ఇప్పుడు, అదిగో ఆయన దొరికిపోయాడు. ఆయన ఆయన దీనిని చేసియున్నాడు, మరియు అది తప్పని మీరెరుగుదురు. మన జీవితమంతయు పెద్దలను మనము విశ్వసించవలెనని మనము నేర్చుకొని యున్నాము. మరియు ఇదిగో ఆయన సరిగ్గా అచ్చట నిలబడి మరియు ఆ పెద్దను గద్దించి వెళ్ళగొట్టియున్నాడు. ఆయన పితరుల యొక్క పారంపర్యాచారమును వ్యతిరేకించియున్నాడు. మరియు మనము మన పితరుల యొక్క పారంపర్యాచారమును నమ్మవలసిన వారమైయున్నాము, సంవత్సరములన్నిటా ప్రతీ బోధకునిచేత అది మనకు బోధించబడియుండెను. మరియు ఇక్కడ ఈ మనిషి వచ్చి వారిని వ్యతిరేకించుచున్నాడు." చూశారా? "అంతెందుకు, అటువంటి ఆ మనిషి ఒక బోధకునిగా ఏమాత్రము పనికిరాడు."
చూశారా, వారాయనను చులకన చేయుటకు ప్రయత్నించుచుండిరి. అయితే దానంతటిలో, ఆయనయందు నమ్మికయుంచినవారు మరియు ఆయనను ప్రేమించి మరియు ఆయన యొక్క లేఖనానుసారమైన, అద్భుతమైన సూచనలను చూసినవారు మాత్రం, వారిచేత ఆటంకపరచబడలేదు. లేదండీ! ఎవరైతే ఆయనను నమ్మియున్నారో వారాయనను నమ్మియున్నారు. ఎవరైతే ఆయనను ప్రేమించియున్నారో వారాయన పక్షమున నిలబడియున్నారు. ఇతరులు వారికి వేలెత్తి చూపిన దానిని వారు చూడకుందురు.
73ఓ, మనమట్లుండగలిగిన చాలును. మనము చూడకుండిన చాలును. ఎవరైనా ఇచ్చటికి వచ్చి ఇట్లు చెప్పినయెడల, "నీకు తెలుసా? నీవు ఒక పెంతికోస్తువాడవని," వారనుచున్నారు.
"సంఘ శాఖను బట్టి కాదు."
"సరి, నీవు యేసు నామములో బాప్తిస్మము ఇచ్చువారి వంటివాడవు."
"అవును, అది నిజమే."
"సరి, నీకొక సంగతి చెప్పనిమ్ము. ఒకప్పుడు ఆ విధంగా బాప్తిస్మము ఇచ్చిన ఒక వ్యక్తిని నేనెరుగుదును, మరియు ఆయన ఫలానా మరియు ఫలానా కార్యమును చేసెను."
అయితే చూడుము, దీనితో దానికెటువంటి సంబంధము లేదు. అది నీ పైన నెపమును మోపుటకు ప్రయత్నించుచున్న అపవాదియైయున్నాడు. వారెల్లప్పుడు సముద్రపు ఒడ్డున బ్రద్ధలైన ఆ పాత ఓడవైపు వేలెత్తి మీకు చూపుటకు ప్రయత్నించుచున్నారు, అయితే ప్రయాణమును సురక్షితంగా ముగించిన దానిని మాత్రం వారు మీకు చూపగోరరు. అది నిజము, చూశారా. అది వాస్తవమైయున్నది.
74వారెల్లప్పుడూ, ఆ ఓడ యొక్క చిన్న ముక్కను అక్కడ వేసి, "ఇదిగో ఇదే ఉదాహరణయైయున్నది; దానిని చేసినది ఇదేయైయున్నది. నాకు తెలిసిన ఒక ఫలానా బోధకుడున్నాడు, అతడు పరిశుద్ధతను ప్రచారముచేయు బోధకుడు, కానీ అతడు ఇదీ - అదీ, లేదా మరొకటి చేసియున్నాడు," అని చెప్పుటకు ప్రయత్నించుదురు. అయితే వారు, పరిశుద్ధముగా లేని ఇతరులు, దానిని చేసినప్పటికి, వారిని వేలెత్తి చూపరు. మీరు చూచారా? మరియు దేవుడు చేసిన గొప్ప కార్యములను వారు చూపించరు.
ఎవరో చెప్పినట్లేయున్నది, "ఓ, ఇచ్చట ఈ మనిషి చాలా దూరం వెళ్ళిపోయాడు. అతడు చాలా దూరం వెళ్ళాడు." ఆయన అది చేసియుండవచ్చును. "ఆయన తనను తాను పాడుచేసుకొనియున్నాడు; అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు; అతడొక మూడభక్తిగలవాడిగా మారిపోయాడు." ఆయన దానిని చేసియుండవచ్చును. అయితే, ఎంతమంది వెళ్ళిపోయిరని వారు చూపించుచుండగా… ఒక్కడే చాలా దూరం వెళ్ళిపోయాడు, అయితే ఎన్నడూ దూరంగా వెళ్ళకుండిన ఈ లక్షలమంది సంగతేమిటి? దానిని చూచుటలో వారు విఫలమయ్యారు. నా భావమును గ్రహించారా?
75కావున, ఆ ప్రజలు ప్రయత్నించిరి, ఆ పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు మరియు వేషధారులు మరియు హేరోదీయులు వారందరూ యేసుపై నెపమును మోపుటకు ప్రయత్నించిరి. అయితే ఆ వర్తమానమును వినుటకు ముందుగా నిర్ణయించబడిన నిజమైన విశ్వాసులైనవారు, దానిని వినిరి మరియు దానిలో ఎటువంటి తప్పిదము లేదని గ్రహించియుండిరి.
ఇప్పుడు అదేయైయున్నది. ఆయనయందు విశ్వాసముంచువారు, ఆయనను ప్రేమించుదురు. ఆయనను విశ్వసించినవారు, ఆయనయందు ఏ తప్పిదమును చూడకుందురు. వారు ఏ తంత్రమును చూడకుందురు. వారు ఎటువంటి తప్పిదమును చూడకుందురు. ఆయన యొక్క వాక్య విషయములో వారు ఎటువంటి తప్పిదమును చూడకుందురు. వారు ఆయన ప్రజల విషయములో ఎటువంటి తప్పిదమును చూడకుందురు. వారు యేసుని మాత్రమే చూచెదరు. అంతే. వారు నిత్యజీవమునకై ముందుగా నిర్ణయించబడిన వారు గనుక వారు కేవలం యేసు పక్షమును వహించి మరియు అచ్చటనే నిలిచియుందురు.
సహోదరుడా రాయ్ రాబర్సన్, మనం ఒక చిన్న పాట పాడుచుండేవారము. మరియు నీవిచ్చటికి వచ్చే సమయానికి మేము ఇచ్చట ఆ చిన్న పాటను పాడుచున్నామని నేననుకొనుచున్నాను.
తిరస్కరించబడిన ప్రభువు యొక్క కొద్దిమంది మార్గమునే తీసికొందును;
నేను యేసుతో ప్రారంభించాను మరియు నేను అనుసరించి వెళ్ళుచున్నాను.
నేను యేసుతో మరి ఎక్కువగా ఒంటరిగా నడచి వెళ్ళెదను,
మరియు యాకోబు వలె, ఒక రాయిని, నా తలగడగా కలిగియుందును.
76మంచిది, ఆ చిన్న పాటను మీరు వినియున్నారు. అది వాస్తవము. నేను ఆ వివాదస్పదమైన మార్గమున పోవుటయే మంచిది, తృణీకరింపబడినవారి మార్గమును తీసుకొందును, ఆ వదంతులను భరించువారి మార్గమును తీసుకొందును, మరియు యేసుతో నడిచెదను. అసలు దానిలో ఎటువంటి తప్పిదములు చూడకండి. వేరొకని తప్పును చూడకండి, కేవలం కొనసాగిపోవుడి. అంతే.
ఇప్పుడు, అలా వారు యేసుతో నడుచుచున్నారు. మరియు కాపరులైన మీరు, మీ జనులకు, అలాగే చేయమని భోదించవలెను. ఎవరైనా ఇటుగా వచ్చి, ఇట్లు చెప్పినయెడల, మీకు తెలియునా, మీ సంఘములో, వారు ఫలానా మరియు ఫలానయైయున్నారు. వారు…
అవునండి, అప్పుడక్కడ అటువంటి వారు ఒక డజను మంది కూర్చునియుండవచ్చును, అయితే సరియైన వాడైయుండి, అక్కడ కూర్చునియున్న ఆ ఒక్కడి సంగతి ఏమిటి? (చూశారా?) మీరు అసలు పరిస్థితిని తేటగా చూడలేకున్నారు; అంతే. ఇప్పుడు, అది అంతే, తిరిగి విషయానికి వచ్చెదము. ఇప్పుడు చూశారా?
ISA 53:2,3•
1PET 2:25
77మరియు వారు అట్లు ప్రయత్నించారు. ఆయన దేవుని కార్యమును చేయుచున్నాడని వారు ఒప్పుకొనగోరలేదు, కావున వారు భేదమైనది నాటుటకు ప్రయత్నించి మరియు ప్రజలను నమ్మకుండునట్లు చేయుచున్నారు; అయితే ఆయనయందు నమ్మికయుంచిన ప్రజలు సరిగ్గా ఆయనతోనే నిలచియున్నారు. వారు ఆయన పక్షమున నిలచియున్నారు.
మీకు తెలియునా, నేనిచ్చట తలంచిన కొందరి గూర్చి ఇచ్చట నేను వ్రాసుకొనియున్నాను. ఆ గ్రుడ్డివాడు వారి ద్వారా మార్చబడలేకుండెను, అయితే ఆయన అతనికి చూపును అనుగ్రహించెను; ఆ కథ మనకు తెలియును. మరియు ఇది కాకుండా అతడు వారికి ఒక చురుకైన ప్రశ్నలు వేసెను. ఇప్పుడు, వారచ్చటకు వచ్చియుండిరి. మరియు యేసు నడుచుకుంటూ వచ్చెను, మరియు ఆయన తృణీకరించబడినవాడిగాను మరియు ద్వేషించబడినవాడిగాను ఉండెను. ఆయన తృణీకరింపబడునని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. మనమతనిని చూచి, ఆపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. అతడు వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించినవాడుగాను ఉండెను. మరియు ఆయన ఏమైయుంటాడు అను దాని గూర్చి పరిశుద్ధ గ్రంథము అంతటిలో ఎట్లు చెప్పబడెనో గదా. అతడు తృణీకరింపబడినవాడును, మరియు విసర్జింపబడినవాడును ఆయెను. మరియు ఆ మనుష్యుని మనము చూచుచున్నాము.
JOHN 9:1,2•
1PET 4:8•
1JN 4:18
78ఇప్పుడు, వాక్యమును నమ్మినవారికి, యేసు చేయు ఆ కార్యములు తన జీవితమును గూర్చి అని తెలిసినవారికి; ఆయన ఎవరన్నది వారికి తెలియును. కావున వారు ఎటువంటి చెడును ఆయనకు అంటగట్టలేదు, ఏలయనగా దానిని వారు చూడలేరు. మరియు ఏలాగుననూ అటువంటి విషయములపట్ల, ప్రేమ గుడ్డిదని మీరెరుగుదురు. ప్రేమ అనేక పాపములను కప్పును, అని మీకు తెలియును. పరిపూర్ణమైన ప్రేమ భయమును, మరియు పాపమును, కలహములను అన్నింటిని వెళ్ళగొట్టును; ప్రేమ అట్లు చేయును.
ఇప్పుడు, ఈ గ్రుడ్డివాడచ్చట కూర్చునియుండగా, యేసు మరియు ఆయన శిష్యులు అచ్చటకు వచ్చిరి. మరియు ఇచ్చట యేసు వారికి ఒక చిన్న పాఠమును నేర్పించెనని నేను తలంచుచున్నాను. ఈ పేదవాడైన గ్రుడ్డివాడిని వారు చూచినప్పుడు వారిట్లు అనుకున్నారు, "సరి, ఇప్పుడు నిశ్చయంగా, దాని వెనుక ఎక్కడో ఏదో ఒక పాపము ఉండియున్నది." ఒక వ్యక్తికి ఏదైనా సంభవించుటను మనము చూసినప్పుడు, "సరి, అతడు పాపము చేసాడు. ఎక్కడో అతడు ప్రభువు చిత్తమునుండి తొలగిపోయాడు," అని మనమెప్పుడు అంటాము. సహోదరుడు క్రేస్ ఆ స్తంభమునకు గుద్దుకున్నప్పుడు; "అతను ఎక్కడో ప్రభువు చిత్తమునుండి తొలగిపోయాడు," అని ఎవరో తలంచారు. తుపాకీ నాపై ప్రేలినప్పుడు, "సరి, అతడు దేవుని చిత్తమునుండి తొలగిపోయాడు," అన్నారు. సహోదరుడు నెవిల్ కారుని గ్రుద్దినప్పుడు, "అతడు ప్రభువు చిత్తము నుండి తొలగిపోయాడు," అని అనుకున్నారు. అది ఖచ్చితముగా సరికాదు. కాదండి, అది కాదు. దేవుడు అట్టి సంగతులను అనుమతించును.
JOHN 9:2,3,7,8,22
79యేసు వారివైపు తిరిగి మరియు వారికి ఒక పాఠమును నేర్పించాడు. వారు ఇట్లన్నారు, "అతని తండ్రి పాపము చేసియుంటాడు. లేదా, అతని తల్లి పాపము చేసెనా? లేదా, అతడు పాపము చేసేనా?" అందుకు యేసు ఇట్లు చెప్పెను, "వీడైననూ వీని కన్నవారైననూ పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెను." ఆమెన్! చూశారా? కేవలం దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు మాత్రమే కార్యములు జరుగుటకు దేవుడు అనుమతించును.
ఇప్పుడు… మరియు కావున ఆయన ఆ మనుష్యునితో మాటలాడెను, మరియు అతనికి చూపును అనుగ్రహించి మరియు ఆయన తన దారిన వెళ్ళిపోయెను. మరియు ఆ వార్త అంతటా వ్యాపించిన పిమ్మట, పరిసయ్యులు అచ్చటికి వచ్చిరి, అక్కడ కూర్చొని భిక్షమెత్తుకొనే గ్రుడ్డివాడైన ఆ మనుష్యుడు ఇక్కడున్నాడు, మరియు ఇచ్చట అతను చూడగలుగుచున్నాడు." మరియు వారి మధ్యన అంతటా ఆ వార్త వ్యాపించెను. మరియు ఓ, మై, అది దేనినో కుదిపివేసెను! మరియు ఇదిగో వారచ్చటికి వచ్చి, ఆ గ్రుడ్డివాడు చూడగలుగుచున్నాడని వారు గమనించిరి. మరియు మొదటిగా, వారు వెళ్ళి, ప్రజలందరిలో ఒక భయమును కల్పించుటకు ఏదైనా మార్గమును వెతకాలనుకొనిరి, ఎందుకనగా వారిదివరకే ఇట్లు చెప్పిరి, "ఎవరైనా ఈ కొత్త సిద్ధాంతమును మరియు నజరేయుడైన యేసు అనబడే ఈ కొత్త ప్రవక్తను వెంబడించినచో, వెంటనే వారియొక్క సహవాస సభ్యత్వము సంఘము నుండి తొలగించబడును. ఇకమీదట వారు ఆ సమాజమందిరమునకు వెళ్ళకూడదు. మీరాయనతో సహకరించినా, ఆయన కూటములకు లేదా మరి దేనికైనా హాజరైనయెడల, మీరికమీదట సమాజమందిరమునకు వెళ్ళలేరు."
JOHN 9:19-22
80కావున, వారు దానినుండి ఒక పెద్ద ప్రదర్శన చేయగోరిరి, ఎందుకనగా వారాయనను ద్వేషించిరి. ఆ పేదవాడైన గ్రుడ్డివాని గూర్చి వారు ఆలోచించడంలేదు, అయితే ప్రజలను ఆయననుండి దూరపరచుటకు వారొక పెద్ద ప్రదర్శనను చేయగోరిరి.
వారు అతడి తల్లిదండ్రులను అడగగోరుచున్నామని వారు చెప్పిరి; కావున వారు వెళ్ళి, అతని తల్లిదండ్రులను కనుగొనిరి, "వీడు మీ కుమారుడేనా?" అని వారిని అడిగిరి.
"అవునండీ," అని అతను చెప్పెను.
"వాడు పుట్టు గ్రుడ్డివాడేనా?"
"అవునండీ."
"మరి, వీడు చూచుచున్నాడనుటలో అర్థమేమిటి?"
బైబిలు ఈలాగు చెప్పెను, "దానిని అవునని వారు ఒప్పుకొనినయెడల వారిని సమాజమందిరములో నుండి వెలివేతురని వారెరిగియున్నారు గనుక వాని తల్లిదండ్రులు భయపడిరి." మరియు చూడండి, అచ్చట వారు చర్చించుకొనసాగిరి. "వీడు మా కుమారుడని మేమెరుగుదుము," అని వారు చెప్పిరి.
JOHN 9:11,20-26
81ఓ, బహుశా అచ్చట కొన్ని వేలమంది ప్రజలు నిలబడియుండిరి. అయితే ఒకవేళ అతడు… ఆ మురికి పరిసయ్యులు సరిగ్గా అచ్చట ఆయన పేరును చెరుపుటకు లేదా ప్రజలను భయపెట్టుటకు ఏదైనా చేయగలిగినయెడల, ఆ కూటము నిమిత్తమై వారాయనను అచ్చటనుండి వెళ్ళగొట్టియుండేవారు, చూశారా. ఆయన పలుకుబడి అంతయూ చెడిపోయి ఉండేది.
కావున వారు చెప్పిరి, వారిలో కొంతమంది వారి యాజక వస్త్రములను ధరించినవారై అచ్చటకు వచ్చి మరియు వారిట్లనిరి, "వాడి గూర్చి చెప్పండి."
అందుకు వారిట్లనిరి, "వీడు మా కుమారుడనియు, వీడు గ్రుడ్డివాడుగా పుట్టెనని మేమెరుగుదుము, అయితే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో మేమెరుగము. వీనినే అడుగుడి; వీడు వయస్సు వచ్చినవాడు," చూశారా.
అది సరియే. కావున వారు వెళ్ళి మరియు వాడిని పట్టుకొని ఇట్లనిరి, "నీకు నీ కనుదృష్టిని ఇచ్చినదెవరు? ఆయన నిన్ను ఏ విధంగా స్వస్థపరచెను?"
అతడిట్లనెను, "నజరేయుడైన యేసు అనబడే ఆయన నాకు దృష్టిని అనుగ్రహించెను."
మరియు వారిట్లనిరి, "దేవుని మహిమ పరుచుము." ఇట్లనిరి, "ఈ మనుష్యుడు ఒక పాపియని మేమెరుగుదుము." ఇంకా ఇట్లనిరి, "ఇతడెక్కడి నుండి వచ్చెను?"
అందుకు వాడు, "నేనెరుగను. ఆయన వచ్చి కేవలం నన్ను స్వస్థపరచెను, మరియు దాని గూర్చి నాకు తెలిసినదంతయూ అదే. అదొక్కటి మాత్రమే నేనెరుగుదును. ఆ మనుష్యుడు పాపియో, కాదో నేను మీకు చెప్పలేను; నేనెరుగను. కేవలం ఈ రోజే ఆ మనుష్యుని కలిసాను. అయితే ఆయన నాకు చూపును ప్రసాదించెను గనుక ఈ ఒక్కటి నేనెరుగుదును, అదేదనగా ఒకప్పుడు గ్రుడ్డివాడనైన నేను ఇప్పుడు చూడగలుగుచున్నాను! దాని విషయమై నేను నిశ్చయత కలిగియున్నాను. ఎట్లనగా ఒక అరగంట క్రితం నేను గ్రుడ్డివాడనైయున్నాను, మరియు ఇప్పుడు సరిగ్గా మీలో ఎవరికైనా ఉన్నంత మంచి చూపును నేను కలిగియున్నాను. కావున, నేను చూడగలుగుచున్నానని నేనెరుగుదును."
ఓ, అది వారికెటువంటి అవమానకరమో కదా! కావున వారు ఇట్లు తలంచిరి, "ఎలా…"
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 9:27,28
82అతను చెప్పెను, "మంచిది," ఇట్లన్నాడు, "మీరునూ ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి?" అది మంచిది. అది ధృడమైన ఒక మంచి సాక్ష్యమైయున్నది. అది మంచిది. అది మంచి నేపధ్యమైయున్నది. అది నిజముగా చక్కని సాక్ష్యమైయున్నది, అని నేను చెప్పగలను.
"మీరునూ…" అనెను. ఇదిగో ఇతడొక సంఘసభ్యుడు కాదు, ఒక గ్రుడ్డివాడైయుండి, యేసును కలుసుకొన్న పిమ్మట వీధిలో నిలబడి, ఇప్పుడు వారు కూడా ఆయన శిష్యులగుటకు కోరుచున్నారాయని ఆ పరిసయ్యులను అడుగుచుండెను. ఈ బిషప్పులు, పేదలైన మీరు కూడా ఆయన శిష్యులగుటకు కోరుచున్నారాయేమి?"
అందుకు వారు, "లేదు! నీవే వాని శిష్యుడవు; మేము మోషే శిష్యులము." [చరిత్ర ద్వారా వెనక్కి తిరిగి చూసినయెడల, అది మీకు తెలియును.] "మేము మోషే యొక్క శిష్యులము. ఈ మనుష్యుడు, అతని గూర్చి మాకేమియూ తెలియదు. అతడెక్కడినుండి వచ్చెనో మేమెరుగము. సరి, మా పాఠశాలలో దేనిలోనైననూ అసలు వచ్చెనన్న ఆదేశమును మేము కలిగిలేము. ఆయన వచ్చి మరియు ఈ సంగతుల గూర్చి మమ్ములను ఎన్నడూ అడగనేలేదు. [చూశారా?] దాని గూర్చి మాకేమియూ తెలియదు. అచ్చటున్న ప్రజలైన మీరు, ఆ మనుష్యుడు నియమించబడలేదని మీరు గ్రహించితిరా? ఆ మనుష్యుడు ఒక సోదెగాడు లేదా ఇంకేదోయైయున్నాడు; అతడు బయల్జెబూబైయున్నాడు. మీరు వంచించబడినారు. ఇదియూ గాక, అతనికి ఎటువంటి అధికారము లేకుండెను. ఇప్పటివరకు దానిని మేము అతనికి ఇచ్చియుండలేదు. [చూశారా?] అసలు ఈ మనుష్యుడు ఎక్కడినుండి వచ్చెనో మేమెరుగము."
JOHN 9:30,32
83చూడగలుగుచున్న ఈ పిల్లవాడు అచ్చట నిలబడియుండి, ఇట్లనెను, "ఇప్పుడు ఇదొక మహత్తరమైన కార్యమైయున్నది." చూశారా, ఈ పరిసయ్యులు భయపెట్టుచూ వచ్చిన ఆ ప్రజలును అతడు దాదాపుగా కుదిపివేసినట్లు అయ్యెను, చూశారా. అయితే చూడండి, అతడు యేసు పక్షమున నిలిచెను గనుక అతడిట్లు చెప్పెను, "ఇది ఒక అద్భుతమైన కార్యమైయున్నది." బహుశా అతడు చెప్పిన కొన్ని మాటలను, నన్ను విడమరచి చెప్పనివ్వండి. "ఇప్పుడు, ఇచ్చటనున్న వ్యక్తులైన మీరు ఈ మతపరమైన వాటన్నింటిని కొన్ని వందల ఏండ్లుగా నిర్వర్తించుచున్నారు. మరియు మీరు రానున్న మెస్సీయా గూర్చియు మరియు సరిగ్గా ఆ విమోచకుడు మనలను చూచుటకు వచ్చుచున్న తరుణంలో జరగనున్న దానిని గూర్చియూ మీరు చెప్పుదురు. మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన చేయబోవుదానంతటిని మీరు మాకు చెప్పెదరు. మరియు ఇచ్చట ఈ సమాజము యొక్క ఆత్మీయ నాయకులు, ప్రధానయాజకులు మరియు యాజకులైన మీరంతయూ కలిసికట్టుగా ఈ ప్రజల యెదుట నిలబడి ఆయన పేరును అపకీర్తిపాలు చేయ ప్రయత్నించుచున్నారు, ఆయనకు విరోధముగా ఏదైనా చెడును చెప్పుటకు ప్రయత్నించుచున్నారు; ఆ మనుష్యుడే వచ్చి నా యొక్క గ్రుడ్డి నేత్రములకు చూపునిచ్చెను. నేను పుట్టు గ్రుడ్డివాడనైయున్నాను. ఇదిగో నా తల్లి మరియు నా తండ్రి నేను పుట్టు గ్రుడ్డివాడినని సాక్షమిచ్చుచున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పుట్టు గ్రుడ్డివాడినైయుండి సరిగ్గా ఇచ్చట మీ మధ్యనే కూర్చునియుండేవాడిని. మరియు లోకారంభము నుండి ఇటువంటిదేన్నడూ జరిగియుండలేదు. మరియు ఇదిగో ఆ మనుష్యుడు వచ్చి మరియు లోకారంభము నుండి జరగనటువంటి ఒక అద్భుతమును జరిగించెను, మరియు మీరు ఆత్మీయ నాయకులైయుండియూ దానిగూర్చి ఏమియూ ఎరుగకయున్నారు." (వ్యూ! హుమ్!) "ఇది ఒక అద్భుతమైన కార్యమని నేను చెప్పుచున్నాను," అని అన్నాడు. అతడు యేసు పక్షమున నిలిచెను, చూశారా.
JOHN 9:34-36
84దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే అతడు గ్రుడ్డివాడగుటకు అనుమతించబడెను, చూడండి, ఎందుకనగా అతడు ప్రభువైన యేసు వైపుకు వచ్చెను. అతడు ఆయన పక్షమున నిలిచెను.
ఇప్పుడు, అతడు వారికొక ముల్లును పెట్టియుండెను. వారేమి చేసిరో మీకు తెలియునా? వారిట్లన్నారు, "నీవు కేవలం పాపివై పుట్టినవాడవని ఇప్పుడు మేమెరుగుదుము. నీవు మాకు బోదింప వచ్చితివా?" వారతనిని సంఘము నుండి వెలివేసిరి. అతనిని కొట్టి, నెట్టి, అతనిని బయటకు త్రోసివేసిరి. అయితే అతడు బయటకు త్రోసివేయబడిన వెంటనే, ఏమి జరిగినదో మీరు గమనించారా? యేసు వానిని మరలా కనుగొనెను. ఆమెన్, ఆమెన్! యేసు వానిని మరలా కనుగొనెను. కావున వారు మిమ్మును త్రోసివేసినయెడల విచారించకుడి. ఆయన మిమ్మును మరలా కనుగొంటాడు, చూశారా. అది సరియే.
మరియు ఆయన అతనితో ఇట్లనెను, "నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా?"
అందుకు వాడు, "ప్రభువా, ఆయన ఎవరు?" అని అడిగెను. అతడేమియూ ఎరుగకుండెను, అయితే అతనికి తెలిసిన ఒకే ఒక విషయం ఏదనగా, ఒకప్పుడు అతడు గ్రుడ్డివాడైయుండి, ఇప్పుడు చూడగలుగుచున్నాడు.
85ఇప్పుడు, సహోదరుడా, నేను ఈ ఒక్క సంగతిని ఎరుగుదును. వారు దీనిని మూఢభక్తియని గాని మరియు వారు కోరినదేదైనా గాని పిలుచుకొనవచ్చును. కాని, నేనైతే ఒకప్పుడు ఒక పాపినైయున్నాను, ఇప్పుడు కృపలోనికి వచ్చియున్నాను. ఏదో నాకు జరిగినది, చూశారా. ఆయన వాక్యమును నమ్ముటవలన, ఆయనయందు విశ్వాసముంచుటవలన, ఈ ఒక్క విషయమును నేను ఇప్పుడు ఎరిగియున్నాను. ఆకాశము క్రిందనున్న ప్రతీ సంస్థ నుండియూ నేను వెళ్ళగొట్టబడినాను. ఇక వారిలో నన్ను చేర్చుకొనేవారు ఎంతమాత్రమును లేరు. అది మీకు తెలియును. వారిలో కొందరు మనుష్యులు ఇక్కడ ఉన్నారు. మంచి వ్యక్తులు, వారు స్వీకరించుదురు. అయితే ప్రతీ సంస్థయూ నా పట్ల తిరస్కారమును చూపియున్నారు. అది వాస్తవమైయున్నది. అయితే ఆయన నన్ను కనుగొనియున్నాడు; ఆయన నన్ను ఎక్కడైనా లేక మరొక విధముగానైనను కనుగొంటాడు. అది వాస్తవమైయున్నది. అది నిజము. ఆ విధంగా వెంట వచ్చును…
మరి అయినను ఏమి పర్వాలేదు, ఎందుకనగా మనము యేసు పక్షమున నిలబడగోరుచున్నాము. మరియు మీరు యేసు పక్షమున నిలవబడుటకు ఒకే ఒక విధానము కలదు, అదేదనగా ఆయన వాక్యమును నమ్మి, ఆయన చెప్పిన దానితో నిలుచుటయైయున్నది. కావున మనము ఆయన పక్షమున నిలిచెదము. ఆ గ్రుడ్డివాడు, వారికి ఒక నిజమైన సాక్ష్యమును ఇచ్చెను. ఇది సరియే.
LUKE 7:36-39
86వారాయన పేరును అపకీర్తిపాలు చేయుటకు ప్రయత్నించిరని మరలా మనము కనుగొన్నాము. (కొద్ది సమయముకై, నేనిచ్చట కొన్ని విషయములు దాటవేయవలసియున్నది.) కావున ఒకప్పుడు, ఒక పరిసయ్యుడు ఉండేవాడు. నేను దానిని "యేసు పాదములు కడుగుట" అను అంశముతో కొంతకాలం క్రితం ఇక్కడ బోధించియున్నాను. ఒక పరిసయ్యుడు యేసుని తన ఇంటికి రమ్మని అడుగుటకు గూర్చి నేను ఇక్కడ బోధించుటను మీరందరూ వినియున్నారని నేను నమ్ముచున్నాను. ఒక పెద్దవాడైన, కఠినాత్ముడైన పరిసయ్యుడుండెను మరియు ఆయనను రమ్మని అడిగెను మరియు ఎట్లు ఆ కొరియర్ పిల్లవాడు వచ్చి మరియు ఆయనను కనుగొనెనన్నది, ఒక చిన్న నాటికవలె నేను చూపించానన్నది నీకు తెలియును. మరియు ఆయన ద్వేషించబడుదును అని ఎరిగియుండియు, ఆయన అచ్చటికి వచ్చెను. అయినను ఆయన అచ్చటికి వెళ్ళెను. మరియు
ఆయన అచ్చటికి వెళ్ళినప్పుడు, వారాయన పాదములు కడుగలేదు. మరియు ఆ బాటలోని శ్రమతో అసహ్యకరమగు వాసనతో మరియు ప్రతీదానితోను ఆయనను అక్కడ కూర్చుండునట్లు చేసిరి. మరియు ఇదిగో ఆయన అక్కడ కూర్చునియున్నాడు. మరియు అల్పురాలైన ఒక స్త్రీ లోపలికి వచ్చినది. వారు ఇలా తలంచిరి, "ఓ, మై, ప్రభువు మన పట్ల మంచివాడైయున్నాడు, ఏలయనగా, చూడండి ఇదియే మనకు గొప్ప విందును తీసుకువచ్చినది!" వారాయనను అక్కడికి రప్పించినది కేవలం ఆయనను ఎగతాళి చేయుటకేయైయున్నది. వారు కొద్దిగా ఆయనతో ఆటలాడుటకై ఆయనను అక్కడికి తీసుకువచ్చిరి. మరియు ఈ చెడ్డ పేరుగల, వ్యభిచారపు స్త్రీ అచ్చటకు వచ్చెను, మరియు ఏడ్చుచూ, మరియు కన్నీళ్ళతో ఆయన పాదములను కడుగుచూ మరియు తన తలవెంట్రుకలతో వాటిని తుడుచుచున్నది కనుక ఇప్పుడు ప్రభువు వారితో సరిగ్గా కార్యము చేయుచున్నాడని వారు తలంచిరి. మరియు ఆ పరిసయ్యుడు మరియు ఆ మిగతా యాజకులందరూ ఆ మూలన నిలబడి, "సహోదరుడా, ప్రతీదానిని, ఖచ్చితంగా దేవుడు మనకొరకే ఏర్పాటు చేసియున్నాడు. ఇప్పుడు సరిగ్గా ఇక్కడ మనమాయన పేరుకు మచ్చ తీసుకురావచ్చును. ఆయన తనకుతాను ఒక ప్రవక్తనని చెప్పుకొనుచున్నాడు, మరియు ఆయన ఒక ప్రవక్తయని ప్రజలు తలంచుచున్నారు. మరియు ఆయనను గలలియా ప్రవక్తయని వారు పిలుచుచున్నారు. మరియు తాను మెస్సీయానని కూడా ఆయన ప్రకటించుకొనుచున్నాడు, మరియు మెస్సీయా ఒక ప్రవక్తయైయుండునని మనమెరుగుదుము. మరియు ఇదిగో ఆయన అక్కడ ఆ వెనుక కూర్చునియున్నాడు. మనమాయనను ఎక్కడికి తీసుకొచ్చామో మీరు చూశారా? అటు చూడండి. అబ్బాయి, సరిగ్గా ఇప్పుడు మనమాయనను ఇరుకున పడవేశాము. అదిగో ఆయన అచ్చట ఉన్నాడు, ఒక దెబ్బలు తిన్న ఒక చిన్న కుక్కపిల్లవలె లేదా అటువంటి వానివలె ఒంగిపోయి ఆ వెనుక కూర్చునియున్నాడు. మరియు తన స్వంత తరగతికి చెందిన ఒక వేశ్య వచ్చి, మరియు ఆ రీతిగా ఆయన పాదములను కడుగుచున్నది, మరియు ఇప్పుడు కనీసం ఆమె ఎవరన్నది ఆయన ఎరుగకయున్నాడు. ఆయన ఒక ప్రవక్తయైనయెడల, ఆ స్త్రీ ఎటువంటిదో ఆయన తప్పక ఎరిగియుండేవాడు. ఇప్పుడు, అబ్బాయిలు, దీనిని బట్టి మనము త్రాగెదము," అన్నారు, "ఎందుకనగా అక్కడ గమనించండి," అని అన్నారు.
JOHN 5:39•
JOHN 10:37
87చూశారా, వారు దయ్యము పట్టినవారైయుండి అట్లు చేయుచున్నారని ఎరుగక, ఆయన పేరుకు మచ్చ తీసుకువచ్చుటకు గాను, ప్రజల యొక్క నమ్మకమును పాడుచేయుటకు గాను ఏదైనా చేయుటకు గాను వారు ప్రయత్నించిరి. వారు అపవాదికి అనుగుణంగా పనిచేయుచున్నారు, దేవుని కుమారుని యొక్క పేరుకు మచ్చ తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నారు.
సహోదరులారా, దీనిని వారెట్లు చేసిరి? వారు లేఖనములను ఎన్నడూ పరిశోధించలేదు గనుక అట్లు చేసిరి. "లేఖనములను పరిశోధించుడి. వాటియందు మీకు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు గదా, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి," అని యేసు చెప్పెను. ఓ, ఆయన ఎటువంటి పరిచర్యను కలిగియున్నాడు గదా! చూశారా? అవునండీ. "నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి," చూశారా?
అయితే ఇచ్చట ఈ పరిసయ్యుడు ఇట్లు చెప్పెను, " ఇప్పుడు మేము ఆయనను పట్టుకున్నాము. ఓ, ఇటు చూడండి, బహుశా అక్కడ ఈ విందులో పదిహేను వందలమంది ప్రజలు ఉండవచ్చును. అక్కడ కూర్చునియున్న అతనివైపు ఇప్పుడు చూడండి. ఆయన ఒక వేశ్యతో అచ్చట కూర్చునియున్నాడు!"
LUKE 7:38,39
88మరియు, ఓ, ఆ రోజున అది ఎంత భయంకరమైన సంగతియైయున్నది గదా. (వ్యూ! హుమ్!) మరియు అక్కడ ఆయన ఒక చెడ్డపేరుగల స్త్రీతో, లోపలికి చొరబడినట్లు (అట్లు అగుపించెను) ఆయన లోపలికి చొరబడెను. ఆయన ఆ కాళ్ళు కడుగు బంట్రోతు ప్రక్కనుండి మరియు ప్రతీదాని ప్రక్కనుండి వచ్చి మరియు అచ్చట కూర్చుండెను.
మరియు అతడు ఇట్లన్నాడు, "ఇదిగో ఆమె, అచ్చట ఆయన పాదములు కడుగుచునుండెను. ఇప్పుడు, ఆయన ఒక ప్రవక్తయైనచో? సహోదరులారా, మీరు చూడండి, ఆ మనుష్యుడు ప్రవక్త కానేరడు. ఆయన ఒక ప్రవక్తయైనయెడల, మరి అప్పుడు తన పాదములను కడుగుచున్న ఈ స్త్రీ ఎటువంటిదో యెరిగి ఉండును."
మరియు యేసు కేవలం కూర్చొని మరియు ఆమెను గమనించెను, ఆమె ముగించు వరకు ఒక్క పాదమైనను కదిలించలేదు. మీరు ఏదైన యేసు కొరకు చేయబోవుచున్నయెడల, యేసు కూర్చొని మరియు ఏదో ఒక సమయములో మీరు దానిని చేయుటను గమనించును. మీరు ముగించేవరకు ఆయన మిమ్ములను సాగిపోనిచ్చును, పిదప ప్రతిఫలం వచ్చును. బహుశా ఆయన కొరకు పని చేయుటలోనే, మీరు మీ జీవితమంతా గడిపియుండవచ్చును, అయితే విచారించకండి, మీరు గనుక మీ మార్గమున ఆయన పక్షమున నిలిచినయెడల, తుదకు ఒక ప్రతిఫలము ఉండియున్నది.
89మీరు ప్రార్థన చేసిన ఒక్క వ్యక్తియైనా స్వస్థత పొందుటను మీరు చూసియుండకపోవచ్చును. ఇంకా వారికొకరు ప్రార్థించుచూనే యుండుడి. నేను తరచుగా చెప్పినట్లు, "నేను గనుక ఒక రాత్రి ఐదువందలమంది కొరకు ప్రార్థించినయెడల; ఆ ఐదు వందల మంది ఉదయమున మరణించిన గాని, రేపు రాత్రి నేను దైవిక స్వస్థతను గూర్చి ప్రసగించుచు మరియు రోగుల కొరకు ప్రార్థించుచూనే యుందును," చూశారా. దాని విషయములో చేయవలసినది ఏమియూ లేదు, చూశారా.
ఆయన ఆ స్త్రీని నడిపించినట్లే, మీరునూ మార్గము యొక్క ముగింపునకు వచ్చి మరియు మీ పనిని ముగించువరకు, ఆయన మిమ్ములను నేరుగా ఓటములలో నుండి మరియు ప్రతీదానిలో నుండి వచ్చునట్లు చేయును. ఆమె ఆయనకు ఒక పరిచర్య చేయగోరెను, కావున ఆయన తన పాదములను అట్లే ఉంచి మరియు ఆమె వాటిని కడుగుటకు అనుమతించెను. ఓ, "దానిని చేయకుము," అని ఆయన చెప్పినయెడల, ఆమె గంతువేసి పరుగుతీసియుండేది; అయితే పరిచర్య చేయుటకు ఆయన ఆమెకు అనుమతించెను.
LUKE 7:40,44-46,48
90మరియు ఆమె చేయునట్టి ఆ పరిచర్యను చేయుటను ఆమె ముగించిన తర్వాత, అచ్చట నిలబడియుండి ఆయన పేరుకు మచ్చ తీసుకువచ్చుటకు ప్రయత్నించుచున్న ఆ వేషదారి వైపు ఆయన చూసి ఇట్లన్నాడు, "సీమోనూ, నేను నీతో ఒక మాట చెప్పవలెనని యున్నాను; ఆమెతో కాదు, కానీ నీతో చెప్పవలలెననియున్నాను. నీవచ్చట వెనుక నిలబడియున్నావు. నాతో నీకెట్టి సహవాసము లేకుండెను. అయినను నీవు నన్ను ఇచ్చటికి రప్పించియున్నావు. మరియు నన్ను ఎగతాళి చేయుటకు నీవు నన్నచ్చట వెనుక కూర్చుండబెట్టావు, ఆ కారణముచేతనే నన్ను నీవు ఇచ్చటికి ఆహ్వనించావు. నీ హృదయములో ఉన్నది నాకు తెలియదా? నా పాదములు కడుగుకొనుటకు నీవు నాకు నీళ్లియ్యలేదు. నాకు ఉపశమనం కలుగుటకు నీవు నాకేమియు ఇయ్యలేదు. మంటవలన బాధతో నేనిచ్చట కూర్చునియుండగా, నీవు అసలు నా ముఖమునకై నూనెను ఇవ్వలేదు. నన్ను ఆహ్వనపు ముద్దుపెట్టుకొనుటకు లేదా నాతో కరచాలనము చేయుటకు నీవు సిగ్గుపడియున్నావు. (చూశావా?) నీ సహచరులముందు నీవు సిగ్గుపడియున్నావు. నీవది చేయుటకు సిగ్గుపడియున్నావు. ఈ స్త్రీ వచ్చినప్పటినుండి, ఆమె నా పాదములను తన కన్నీటితో కడిగి మరియు తన తలవెంట్రుకలను తువాలుగా చేసి వాటిని తుడుచుట తప్ప మరేమియూ చేయలేదు. పిదప సరిగ్గా నేనొక ప్రవక్తనో కాదో నీకు చూపించెదను." ఆమెన్! నేను అది ఇష్టపడుచున్నాను.
"ఇప్పుడు, నేను కేవలం ఒక నిమిషము. నీతో మాటలాడగోరుదును. నీ విస్తారమైన పాపములన్నియూ క్షమించబడెను."
హుమ్, వారాయన పేరుకి కళంకము తెచ్చిరా? వారు దానిని చేశారని వారు తలంచారు. వారు దానిని ఆపివేసారని, వారు తలంచారు; సమాజములో ఆయన యొక్క ఉజ్జీవము లేకుండా ఆయనను చిక్కున పడవేసామని వారు తలంచియున్నారు; వారు ఆయన యొక్క పలుకుబడిని పాడుచేస్తామని తలంచారు, అయితే ఆయనను ప్రేమించిన ఒక్క వ్యక్తి ద్వారా ఆ పరిస్థితి అంతయూ మార్చబడియున్నది!
LUKE 7:48
91నీ సమాజమునకు లేదా నీవు కలుసుకునేవారెవరికైనా, నీవే ఆ వ్యక్తివి కాదని నీకెట్లు తెలియును? ఆయన పక్షమున నిలువుడి. ఆయనకు ఒక పరిచర్య చేయుడి. ఆయన కొరకు ఏదైనా చేయుడి. సహోదరులారా, నా భావము గ్రహించారా? యేసు పక్షముగా నిలబడుము. ఆయనను తీసుకొనుడి… ఆయననే మీ ఎంపికగా చేసుకొనుడి. ఎవరు ఏమన్నాగాని, మీరు ప్రతిఫలం పొందకపోయినా గాని, లేదా ఇంకేదైనా కానీ ఆయనకు సేవచేయుడి. ఎటువంటి వ్యత్యాసము కలగనియ్యకుడి. పని పూర్తయ్యేంతవరకు వేచియుండుడి.
ఆయన గూర్చి మీరు ఎంతగా చెప్పగోరవలెననిన… మీరు రోగుల కొరకు ప్రార్థించినా, మరియు వారు బాగుకాలేదు; అన్యభాషలలో మాట్లాడుటకొరకు మీరు ప్రార్థించినా గాని, మరి అది జరగలేదు; ప్రవచించుటకొరకు మీరు ప్రార్థించినా, మీరట్లు చేయలేదు; మీరు ఒక్క కార్యమైన చేయలేదు, ఒక వ్యక్తినైనా నడిపించలేదు, అయినా కానీ, మీరు చేయగల ఒకే ఒక కార్యమేదనగా, యేసును గూర్చిన కథను మీ సంఘములో, లేదా మీ సమాజములో, మీరు పనిచేయుచోట చెప్పుటయైయున్నది. ఆ స్త్రీ ఒక్కరినైనా క్రీస్తునొద్దకు నడిపించలేదు. కాని ఆమె, ఆయనకు ఒక పరిచారము చేసినది. మరియు "నీవు చేసిన ఒక్క ప్రార్థనకైన నీకు జవాబు దొరకకపోయిననూ, నీవు నా వాక్యమును ఆధారము చేసుకొని వచ్చియున్నావు. నా యందు విశ్వాసముంచియున్నావు గనుక నీవు వచ్చి మరియు నీవు నాకొక పరిచర్యను చేసియున్నావు. మరియు నీవు చేసిన విస్తారమైన పాపములు క్షమించబడెనని నేను నీతో చెప్పుచున్నాను." అది నాకు చాలును! ఆమెన్. అవునండి.
92అది సరియే. వారిట్లు చెప్పగోరుదురు, "అద్భుతాలు జరుగు కాలము అయిపోయినది." వారిని అలాగే చెప్పసాగనీయుడి, కానీ మనమైతే ప్రభువునకు ఒక పరిచర్యను చేయుదము. ఆయనపట్ల వారికి అసూయ గనుక వారాయననూ ద్వేషించిరి. అదొక్కటే కారణమైయున్నది. వారు అసూయతో నుండిరి. వారిప్పుడు చేయుచున్నట్లే ప్రజల ముందు ఆయనకున్న పలుకుబడిని పాడుచేయుటకు వారు ప్రయత్నించసాగిరి. వారు, కేవలం వారు గనుక ప్రజలయెదుట వర్తమానము యొక్క ప్రాముఖ్యతను పాడుచేయగలిగినయెడల, అప్పుడు వారు విషయమును అధిగమించినట్లే అవుతుంది. అది నిజము. ఎట్లనగా, దానిని చేయుటకు వారెందుకొరకు ప్రయత్నము చేసిరి? ఎందుకనగా వారి మత సిద్ధాంతములన్నింటిని మరియు వారి సంఘ సిద్ధాంతములన్నింటిని మరియు వారు నమ్ము ప్రతీదానిని మరియు వారి విశ్వాసములను మరియు మొదలగువాటిని ఆయన వ్యతిరేకించుచుండెను. ఆయన వాటన్నింటిని వ్యతిరేకించుచుండెను; మరియు ఆయన వారితో ఏకీభవించనందువల్లే వారాయననూ ద్వేషించిరి.
JOHN 5:19
93ఇప్పుడు, ఆయన గనుక వచ్చి ఇట్లు చెప్పినయెడల, "ఓ, కయపా, నీవు నా తండ్రి యొక్క అద్భుతమైన మనిషివైయున్నావు. నేను మెస్సీయాను, కయపా ఇక్కడికి రమ్ము. అచ్చటనున్న ఆ నీటిని నీవు చూచుచున్నావా? అక్కడ ఐగుప్తులో, గొప్ప ప్రవక్తయైన మోషే దానిని రక్తముగా మార్చుట నీకు జ్ఞాపకము ఉన్నది కదా. కయపా అది నీకు జ్ఞాపకమున్నదా?"
"ఓ, యౌవనస్థుడా, ఆ కథను నేను బాగుగా ఎరుగుదును."
"సరే, కయపా, మోషే పలికిన ఆ ప్రవక్తను నేనే అని చూపించుటకు, ఇప్పుడు నేను ఆ నీటిని రక్తముగా మార్చబోవుచున్నాను. కయపా, ఇదిగో ఇచ్చటనున్నది. దానిని గూర్చి నీవేమి తలంచుచున్నావు?
"ఒక పరిసయ్యునిగా ఉన్న కయపాను గూర్చి మీరేమి తలంచుదురు? ఆ పరిసయ్యుల గూర్చి మీరేమి తలంచుదురు?
"ఓ, వారు ఒక అద్భుతమైన జాతి ప్రజలని నేను తలంచుదును. ఓ, సరిగ్గా మీరందరూ మీ పితరుల పారంపర్యచారములను పాటించుదురు."
"నీకు తెలుసా, నీవు మెస్సీయావైయుండవచ్చును."
లేదు, ఆయన ఉండబోడు! ఆయన కాదనుటకు అదే ఒక ఆనవాలైయున్నది. ఎవరైనా వచ్చి, "ఇక్కడికి రమ్ము, నేనేమి చేయుదునో నీకు చూపించెదను. మరియు ఇక్కడికి రమ్ము, నేను దీనిని చేయుదును, మరియు దానిని చేయుదును," అని చెప్పుటను మీరు చూచినయెడల. ఇప్పుడు మీరు గుర్తించుకొనుడి, చెప్పాలంటే దాని విషయములో ఏదో అస్పష్టత ఉన్నది. యేసు చెప్పెను, "మొదటిగా, తండ్రి నాకు చూపించనంతవరకు నేనేమియు చేయను," చూశారా.
MATT 23:14•
LUKE 20:46,47
94అవును, ఆయన వారికి విరోధముగా ఉండెను; ఆయన వారికి విరోధముగా భోదించెను. వారి విశ్రాంతి దినాచారమును ఆయన ఖండించెను; ఆయన వారి వస్త్రధారణను ఖండించెను; వారి జీవిత విధానములన్నింటిని, వారి ఆచారములను, వారు పాత్రలు శుభ్రము చేయుటను మరియు చేతులు కడుగుకొనుటను మరియు ప్రతీ దానిని ఆయన ఖడించెను. ఆయన వాటిని అణువణువున ఖడించెను. వారి వస్త్రధారణ విషయంలో, ఆయన ఇట్లు చెప్పెను, "మీరు బుట్టాపని వస్త్రమును ధరించుదురు, మరియు అగ్రపీఠములను కోరుకుందురు, మరియు దీర్ఘ ప్రార్థనలను చేయుదురు, విధవరాండ్ర ఇండ్లను దిగమింగుదురు." ఇట్లనెను, "మీరు మరి విశేషముగా శిక్ష నొందుదురు."
ఈ సరి, నేను డాక్టరు ఫలానా అని గుర్తించుకో!"
"నీవు ఎవరన్నది నేను లెక్కచేయను." ఓ, మనుష్యుడా, ఆయన నిజముగా ప్రతికూలించును. ఎందువలన? - ఎందుకనగా వారాయననూ విశ్వసించలేదు. ఆయన వాక్యమైయున్నాడు, చూశారా. ఆ లీగలిస్టు గుంపును ఆయన బ్రద్దలు చేయుటకు ప్రయత్నించుచున్నాడు, ఒకవేళ ఆయన ఈనాడు ఇక్కడ భూమి మీద ఉన్నయెడల, ఆయన అదే కార్యమును చేయుటకు ప్రయత్నించును.
MARK 12:38-40
95కొందరు ప్రజలు ఇట్లు చెప్పుదురు, "సరి, ఇప్పుడొక నిమిషము ఆగుము. మేము విశ్రాంతి దినమును ఎప్పుడూ ఆచరిస్తూ వుంటాము. మేము దీనిని చేయుదుము. మరియు, నీకు తెలియును, మేము వీటిని మరియు వాటన్నింటిని పాటించుదుము. మరియు ప్రతీ…. అంతేకాకుండా ప్రతీ గుడ్ ఫ్రైడేను… ఎందుకు, ఉపవాసదినములు వచ్చినప్పుడు, మేము ఎల్లప్పుడూ ఈష్టర్ కు ముందు నలుబది రోజులు ఉపవాస దినములను ఆచరిస్తాము. ఆ నలుబది రోజులు నేను ప్రొగ త్రాగడం మానేస్తాను. ఆ నలుబది రోజులు, లెంటు దినములలో మద్యం సేవించడం మానివేస్తాను." ఓ! పితరుల పారంపర్యచారములు - లీగలిస్టులు. మీరు గనుక దేవునిని ప్రేమించినట్లయితే, మీరు మొదటిగా మీరు అసలు ప్రొగ త్రాగరు. మీరు దేవునిని ప్రేమించినట్లయితే, మీరు… నేను మొట్టమొదట కలిగియున్న నా చిన్న బైబిల్ వెనుక నేను ఇలా వ్రాసుకొనియున్నాను; నేను చెప్పాను:
బుద్ధిహీనపు ప్రశ్నలు నన్ను అడుగవద్దు;
మీ మనస్సులో దీనిని పెట్టుకొనుడి.
మీ హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమించినయెడల,
మీరు పొగత్రాగరు, మద్యం సేవించరు, లేదా…
పొగత్రాగరు, నమలరు, లేదా ఎటువంటి మత్తు పానీయము సేవించరు.
మరియు అది ఈ నాటికి మంచిదే. నేను దానిని చేయను, ఎందుకనగా దానిని చేయుటను బట్టి ఆయన నన్ను ఖండించునని నేను తలంచుదును. అది ఒక మురికి కార్యము గనుక నేను దానిని విడిచిపెట్టుదును, మరియు ఒక సేవకునికి అది యుక్తము కాదు. అది నిజము.
96అనేకసార్లు నేను ఇండ్లకు వెళ్ళుదును మరియు అచ్చట స్త్రీలు బయట నిలబడియుందురు. మరియు నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టుదును, మరియు ఒక సహోదరి తలుపునొద్దకు వచ్చి, "సహోదరుడా బ్రెన్హాం లోపలికి రమ్ము," అని అనును. ఆమె భర్త అక్కడ లేనియెడల, అది ఒక వ్యాధికి సమంధించిన విషయమైనచో, లేదా నాతో పాటు ఎవరైనా ఉంటేగాని నేను వెళ్ళను. మరియు వారు నన్ను ఒక ఆసుపత్రికో లేదా ఒక గదిలోనికో పిలుచుదురు, "సహోదరుడా బ్రెన్హాం, ఇచ్చటికి రమ్ము, నేను ఫలానా సహోదరిని, ఫలాన చోటనుండి వచ్చాను. నేనిచ్చట హోటాల్ వద్ద ఉన్నాను. నేను నా తల్లిని వెంటబెట్టుకొని వచ్చాను. ఆమె అనారోగ్యంతో ఉన్నది," అని చెప్పుదురు. నేను నా భార్యను తీసుకొని వెళ్ళుదును. లేనియెడల, నేను వేరొక సహోదరుడిని తీసుకు వెళ్ళుదును.
చూశారా, నేను తలంచను… నేనచ్చటికి వెళ్ళుట సరియే అని నేను తలంచుదును, కానీ నేనచ్చటికి వెళ్ళుటను ఎవరైనా చూసినచో ఏమగును? చూశారా? నేను అట్లు చేయుటను ఎవరైనా చూసినచో ఏమగును? చూశారా? అప్పుడు, మొదటి విషయం మీకు తెలియునా, వారు ఇట్లు చెప్పుదురు, "ఆయన అచ్చట ఆ స్త్రీ ఉన్న చోటుకి వెళ్ళినాడు. అతడు స్త్రీల వెంబడి పోవువాడు." అది, చూడండి, నేను చేయకూడని కార్యము అదేయైయున్నది, చూశారా. మీరు అటువంటిది ఎన్నడూ చేయకూడదు, ఎందుకనగా మీరు ఇంకొకరి దారిలో అడ్డువేసినట్లగును, చూశారా. నేనచ్చట ఎటువంటి తప్పు చేయనని నేను నమ్ముదును, నేను చేయను… మరియు నేనచ్చటకి వెళ్ళుటకు దేవునియందు నమ్మికయుంచుదును. ఎటువంటి పరిస్థితియైననూ నేను దేవునియందు నమ్మికయుంచుదును. మరి అయిననూ చూడండి, మరియు నేను దానిని చేయకుండా ఉండేంతగా ప్రభువును నేను ప్రేమించుదును. చూశారా, అది మీరు కలిగియున్న ప్రేమయైయున్నది. అది మీ కర్తవ్యము గనుక మీరు దానిని చేయకుందురు. మీరు ప్రభువును ప్రేమించుదురు గనుక మీరు దానిని చేయుదురు. మీరు దానిని చేయనవసరము లేదు, కానీ ఏ విధముగానైనా, మీరు దానిని చేయుదురు.
1COR 10:23
97పౌలు ఇట్లు చెప్పెను, "అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, అన్నియు చేయదగినవి కావు," చూశారా. బహుశా, ప్రభువు తనను అర్ధం చేసుకున్నాడనియు మరియు తనను నమ్మియున్నాడనియు ఎరిగియున్న పౌలు అనేక విషయములను చేయవచ్చును, అయితే ఆయన దానిని చేయుటకు అది ఉపయోగకరము కాదు. కావున ఆ విధంగా ఈ లీగలిస్టులు, "ఈస్టరుకి ముందు నలుబది రోజులు మేమెల్లప్పుడూ ఉపవాసము చేయుటను మొదలు పెట్టుదుము," అని చెప్పుటకు ప్రయత్నించుదురు, మరియు వారెన్నడూ తిననంతగా వారు తిందురు. బహుశా వారిట్లు చెప్పెదరు, "సరి, నేను చిక్కుడు కాయలను ఇష్టపడుదునును, గనుక నేను లెంటు దినములలో చిక్కుడు కాయలను తినుట మానుదును." వారట్లు చెప్పుటను నేను వినియున్నాను. "నేను పంది మాంసమును ఇష్టపడుదును కనుక నేను పంది మాంసమును మానివేయుదును, మీకు తెలియునా, నేను లెంటు దినములకై త్రాగుటను మానివేయబోవుచున్నాను."
ఒక స్త్రీ నాతో ఇట్లు చెప్పినది, "సహోదరుడా బ్రెన్హాం, ఈ సంవత్సరము నేను లెంటు దినములకై ఏమి మానివేసానో నీకు తెలియునా?"
నేనిట్లన్నాను, "తెలియదు, ఏమిటి?"
ఇట్లు చెప్పినది, "క్యాండీ." ఇట్లన్నది, "ఏలాగునైనను దానిని నేను ఎన్నడూ అంతగా లెక్క చేయను."
చూశారా? అదీ విషయం. ఇప్పుడు, దానిని వారు ఉపవాసమని చెప్పుదురు, చూశారా. మతశాస్త్రము వంటిదైయున్నది. వారు ఇట్లందురు, "సరి, మీకు తెలియునా, చాలా కాలంగా నేను సంఘమునకు స్థిరంగా వెళ్ళేవాణ్ణి కాదు. అయితే నేను ఆదివారపు బడికి ఒక పూర్తి సంవత్సరము వెళ్ళియుంటిని, కారణం మీకు చెప్పెదను, ఎందుకనగా ఒక్క రోజైనా మానక వెళ్ళినవారికి వారు బైబిలును ఇచ్చెదరని మా టీచరు చెప్పినది."
1COR 6:12
98ఇప్పుడు, సహోదరుడా, వెళ్ళుటకు అది వేరొక విధానమైయున్నది. దానికన్నా నేను వెళ్ళి, నాకొక బైబిల్ ను కొనుక్కొనుట ఉత్తమము, చూశారా. ప్రభువును ప్రేమించుటను బట్టి మీరు సంఘమునకు వెళ్లనియెడల, మీరు దూరముగా ఉండుటయే మంచిది. అంతే, చూశారా. ఎందుకనగా… మీరు దేవుని ప్రేమించుదురు గనుకనే మీరచ్చటికి వెళ్ళుదురు. మనము పాడే ఈ పాటను గూర్చి నేను తలంచుచున్నాను:
క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను;
బంధించిన బంధము ఎంత ధన్యమైనది
పరమందు దానివలెనున్న
నెనరుగల మనస్సుతో కూడిన సహవాసము.
మనము దూరముగా వెళ్ళినప్పుడు,
అది మనలో బాధను కలిగించును;
కాని మనము ఇంకా హృదయములో కలిసే ఉండగలము,
మరల కలసికొనెదమని నిరీక్షించెదము.
చూశారా? అంతే. "మనము దూరముగా వెళ్ళిపోయియెడల, మనకు అంతరంగములో బాధ కలిగించును." సహోదరుడా, నేను ఆ సమయమున చూచియున్నాను. (నేను మనల్ని ఖండించనీయకుడి, అయితే నన్ను దేనికొరకో మనలను మేల్కొల్పనీయుడి), ప్రజలు ఒకరినొకరు కలుసుకొనుటకు బుధవారము వరకు వేచియుండవలసిన ఒక సమయమును ఈ సంఘములో నేను చూచితిని, వారు దాని విషయమై ఏడ్చేవారు. మరియు అది వాస్తవమైయున్నది. సేవకులు ఇచ్చటకు వచ్చి మరియు ఇట్లనుటను నేను చూసియున్నాను, "నీవు దానిని ఎట్లు చేసావు?" సరి, ఆ ప్రజలు సరిగ్గా ఏక హృదయము కలిగియున్నారు, చూశారా.
వారు ద్వారము నొద్ద కలుసుకొని మరియు ఇట్లందురు… ఆ సహోదరీలు ఆ వెనుక కలుసుకొని మరియు ఒకరినొకరు కౌగిలించుకొందురు, మరియు కన్నీళ్ళతో నిండిన కళ్ళతో ఇట్లు చెప్పుకొందురు, "సహోదరీ, ఇప్పుడు నిశ్చయంగా నా కొరకు ప్రార్ధించుము. ప్రియా, మరలా బుధవారము రాత్రి నేను నిన్ను చూసెదను. నీవు ప్రార్ధించుదువు గదా? నీవు నా కొరకు ప్రార్థించుము; నేను నీ కొరకు ప్రార్ధించుచూ నుండెదను." మరియు తమ కళ్ళలో కన్నీటితో అలా చెప్పుదురు.
సహోదరులు ఒకరితోనొకరు కరచాలనము చేయుచూ మరియు అతికష్టముగా ఒకరినొకరు విడిచి ఆ రీతిగా వెళ్ళుటను చూసియున్నాను. నిజమైన క్రైస్తవ సహవాసము అదే, చూడండి, చూడండి, కేవలం వేచియుండి, ఒకరికొరకు ఒకరు ప్రార్ధించుటయైయున్నది. అవునండీ. మనము ఉండవలసిన విధానము అదే. అది సరియే.
99ఇప్పుడు, ఈ ప్రకటనలు చేసిన ఈ మనుష్యులు, వారు చెడ్డవారు కాదు. చెడ్డగా ఉండుట వారి ఉద్దేశ్యము కాదు; వారు దేవునికి ఒక సేవ చేయుచున్నారని వారు అనుకొనియున్నారు. ఆ పరిసయ్యులు మరియు ఇతరులు, వారు సారాయి కాచువారు మరియు త్రాగుబోతులు కాదు; వారు భక్తిగల ప్రజలు. వారు చెడ్డవారు కాదు; వారు కేవలం సత్య వాక్యమును అంగీకరించలేదు. వారు ఆ ఆత్మను అంగీకరించలేదు. ఎందువలన? వారియొక్క మత సిద్ధాంతములకు మరియు వారి నాయకుల యొక్క ఆచారములకు వారు కట్టుబడియున్నారు, చూశారా. అది వారు తమ నాయకులను ప్రేమించుచున్నారని అది చూపించుచున్నది.
ఇదిగో ఆ పెద్దవాడైన కయపా ప్రధానయాజకుడైయున్నాడు. అక్కడ ఆ మిగతా ఆ గొప్ప యాజకులు, మరియు ఆ వ్యక్తులు కలిసి వెళ్ళుచున్నారు. ఇప్పుడు, మీరు కథోలిక్ వంటివారిని తీసుకొనుడి. వారు… (వారి పైన వేయడం కాదు. ప్రొటెస్టంట్లలోనూ అదే విషయమున్నది.) మీరు ఒక కథోలిక్ ను తీసుకున్నట్లైతే; అతడు తన బోధకుడిని ప్రేమిస్తాడు. మరియు నేను దేవుని యొక్క వాక్యము గూర్చి అతనికి చెప్పెదను, మరియు అతడు దేవుని కార్యములను చూచును. అతడిట్లంటాడు, "కానీ నా సంఘము దానిని నమ్ముటలేదు." మరియు మీరు ఇంకనూ అతడితో మాట్లాడియెడల… గడిచిన దినమున ఒక స్త్రీ నాతో ఇట్లన్నది, చెప్పెను, "నేను నీ బోధను వినుట ఒక పాపమే," అని అన్నది, చూశారా. ఆమె చెడ్డదిగా ఉండగోరుటలేదు. ఆమె తన సంఘమును గూర్చియు మరియు తన బోధకుని గూర్చియూ ఎంతగా ఆలోచించినదనగా - ఆమె మరేదైనా విన్నచో, అది పాపమని తలంచినది… ఆమె ఆ బోధకునికి నమ్మకస్తురాలిగా ఉండియున్నది.
JOHN 8:44
100వారు విశ్వసించుదానికి ఒక యెహోవా సాక్షి నమ్మకస్తునిగా ఉంటాడు. బాప్టిస్టువాడు తాము విశ్వసించుదానికి నమ్మకస్తునిగా ఉంటాడు. ప్రేస్బిటేరియనువాడు తాము విశ్వసించుదానికి నమ్మకస్తునిగా ఉంటాడు. మరియు వారు వారి కాపరుల పట్ల ఎంతో నమ్మకముగా ఉంటారు. మనమును వాక్యమునకు అంతే నమ్మకముగా ఉండలేమా? చూశారా? ఇప్పుడు వారు గనుక…
నేను మిమ్మును ఒక విషయము అడగగోరుచున్నాను. మీరు ఇట్లందురు, "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, వారు లేరని నీకెట్లు తెలియును?" ఇప్పుడు, ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు ఆనాటి మత నాయకులు వారి మత సిద్ధాంతములకు మరియు వారి ఆచారములకు దూరముగా నుండి, మరియు వాక్యము ఏమి చెబుతుందో దానిని (ఖచ్చితముగా మెస్సీయా ఏమి చేయవలసియుండెనో), మరియు ఖచ్చితముగా మెస్సీయా ఏమి చేయునని, యేసు వారితో చెప్పెనో దానిని వారు విన్నయెడల వారాయనను హత్తుకొనియుండేవారు, చూశారా. అయితే వారి మతనాయకుల గూర్చియే వారు ఎక్కువగా ఆలోచించిరి… వారు చెడ్డవారేమి కాదు. వారు దొంగిలించరు, అబద్ధమాడరు, దూషించరు, మరియు అటువంటిదేమియూ చేయరు. వారు అట్లు చేయకుందురు. అంతేకాకుండా, వారు నిశ్చయంగా వ్యభిచరించకుందురు. అంతే కాదు, ఎవరైనా అటువంటి కార్యమును చేసినయెడల, రాళ్ళతో కొట్టి చంపవలెననుటకు వారు సాక్షులుగా నిలిచిరి. మరియు వారు చేయరు. వారు దానిని చేయకుందురు. వారు మంచి వ్యక్తులైయున్నారు, అయితే ఒకే ఒక విషయమేదనగా, వారు ఆత్మసంబంధమైన వ్యక్తులు కారు. నైతికంగా, వారు మంచివారే, అయితే అది లెక్కలోనికి రాదు. మరియు ఆ ప్రజలు భక్తిపరులైనప్పటికి, యేసు వారితో ఏమి చెప్పెను? "మీరు, మీ తండ్రియగు అపవాది సంబందులు," అని ఆయన చెప్పెను, చూశారా. వాక్యమే లెక్కలోనికి వచ్చును.
ACTS 2:22
101ఇప్పుడు నేను వీలైనంతగా త్వరపడుదును. ఇప్పుడు, వారు ఆత్మ - నింపుదల కలిగిలేరు, కానీ వారు భక్తిగలవారైయుండి మరియు వారు నాయకుల యొక్క ఆధునిక సిద్ధాంతములను హత్తుకొనియున్నారు, చూశారా. అది సరియే. ఆయన పరిచర్య వారి సిద్ధాంతమును బట్టబయలు చేయుచున్నది. విషయం అదేయైయున్నది. ఇప్పుడు చూడండి! నేను కేవలం దానిని తీసుకొందును. ఇప్పుడు కేవలం… (సహోదరులారా, నేను - నేను మిమ్మును క్షమించమని అడుగగోరుచున్నాను, ఇంత సేపు ఉంచినందుకు నన్ను ఇప్పుడు క్షమించగలరు. బహుశా, మరొక దానికై నేను తిరిగి వచ్చుటను మీరు కోరుకొనరు, కానీ చూడండి దీనిని వినండి. చూశారా, నిశ్చయముగా దీనిని మీరు పొందుకోవాలని నేను కోరుచున్నాను.)
ఇప్పుడు, వారు వారి మత సిద్ధాంతములను కలిగియున్నారు, మరియు అచ్చట గొప్ప సంఘములు మరియు గొప్ప ప్రజలు మరియు గొప్ప వ్యక్తులు, పరిశుద్దులు, మంచి మనుష్యులు, మర్యాదస్తులు, గౌరవప్రధమైన వ్యక్తులు, ఘనతవహించినవారు, విద్యావంతులు, తెలివైనవారు, మతభక్తిగలవారు అచ్చట ఉండియుండెను. అది నిజమేనా? ఇప్పుడు, అది మనందరికి తెలియును. అటువంటివారిని మీరు ఎచ్చటనైనా కనుగొనవచ్చును, చూశారా. అయితే యేసు వచ్చినప్పుడు, ఆయన పరిచర్య, వారి సిద్ధాంతమును బట్టబయలు చేసియున్నది, ఏలయనగా ఆయన తనతో ఉండియున్నాడని, దేవుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య ద్వారా, రుజువు చేయుచున్నాడు.
పేతురు అదే విషయమును చెప్పలేదా? ఆయన చెప్పెను, "ఇశ్రాయేలువారలారా, ఈ సంగతి మీకు తెలియనీయుడి, మరియు నా మాటలు వినుడి." అతడిట్లు చెప్పెను, "నజరేయుడైన యేసు, దేవునిచేత మెప్పు పొందినవానిగా మీ మధ్యన నిర్ధారించబడెను," చూశారా. చూశారా, వారు గనుక…
102ఈ గ్రుడ్డివాడు చెప్పినట్లు, "ఇది ఒక ఆశ్చర్యమైన కార్యము కాదా? మీరు ఈ దేశములోని ఆధ్యాత్మిక నాయకులైయున్నారు, మరియు ఇదిగో ఇచ్చటకు ఒక మనుష్యుడు వచ్చి దేవుని యొక్క శక్తితో నా కన్నులు తెరిచెను, మరి అయిననూ ఆయన గూర్చి మీకేమియు తెలియకుండెను." అతడు చెప్పెను, "ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతియైయున్నది." ఆయన దీనిని కలిగియున్నాడు, కాదా? నిశ్చయంగా ఆయన కలిగియున్నాడు. అది సరియే. ఆయన కలిగియున్నాడు. దీనిని చేయగల ఒక మనుష్యుడైయున్నాడు, మరి అయిననూ ఆయన ఎచ్చటి నుండి వచ్చెనో వారెరుగకయున్నారు! ఇప్పుడది ఒక ఆశ్చర్యకరమైన సంగతియైయున్నది.
ఇప్పుడు సహోదరులారా, ఈ దినమువైపు చూడండి. చూశారా, మనకొక… మనకొక దేవుని యొక్క కదలిక ఉన్నదని మనమెరిగియున్నాము. అది అద్భుతములను జరిగించుటయని మనమెరిగియున్నాము; అది రోగులను స్వస్థపరచుటయైయున్నది; అది చనిపోయినవారిని సహితము లేపుటయైయున్నది; అది దయ్యములను వెళ్ళగొట్టుటయైయున్నది; అది భాషలతో మాట్లాడుట మరియు భాషలకు అనువాదము చెప్పుటయైయున్నది; అది ప్రవచనములను వెళ్ళడి చేయును; అవి సంభవించును; ఆయన మనకు ఖచ్చితముగాను, పరిపూర్ణముగాను, కలలను, అనువాదములను చూపించియున్నాడు; అయిననూ ఆ గొప్ప నాయకులు, వారు ఈ దేశము యొక్క నాయకులైయుండియు, సంఘముల యొక్క నాయకులై యుండియూ, మనలను ఒక వెర్రి ప్రజలని పిలుచుట ఒక వింతైన కార్యముగా లేదా? అదొక ఆశ్చర్యమైన కార్యమైయున్నది.
JOHN 9:30
103అది ఏమైయున్నది? అదింకనూ అసూయయైయున్నది. ఈ అంత్యదినములలో దేవుని యొక్క ఆత్మయు, శక్తియు మరియు వాక్యము, వారి మత సిద్ధాంతములను మరియు ఆచారములను తేటతెల్లము చేయుచున్నది, వాటిచేత వారు మనుష్యులకు గ్రుడ్డితనము కలగజేసియున్నారు, (దానిలోని విషయము అదే) కావున, నా యవ్వన సహోదరులారా, ఇచ్చట ఈ సంఘములకు పోవుచున్న మీరంతా, దేవుని వాక్యమును హత్తుకొనియుండుడి. మీరు స్థిరముగా నుండుడి. అది మీ వల్ల కానియెడల, వీరెవరి దారికి అడ్డముగా నిలబడకండి. కేవలం ద్వారము యొక్క తలుపును తట్టుచు సరిగ్గా దానివైపునకు చూపించుచూ, అచ్చట నిలబడియుండుడి. అదే సరియైనది. సరిగ్గా అచ్చటే ఉండుడి. మూఢభక్తిని ప్రారంభించకండి, ఎందుకనగా అది మిమ్మల్ని బట్టబయలు చేస్తుంది. అయితే మీరు సత్యముతోను, పరిశుద్దతతోను, మరియు ఆ వాక్యముతోను నిలిచినట్లైతే, దేవుడు మిమ్మును రుజువు చేయును. అది వాస్తవమైయున్నది.
ఆయన పరిచర్య - వారి సిద్ధాంతములను మరియు ఆచారములను బట్టబయలు చేయుచున్నది, కావున వారు ఆయనను వదిలించుకొనుటకు వారికి దొరికిన ప్రతీ అవకాశమును తీసుకొనిరి. ఆయనను వదిలించుకొనుటకు వారు కనుగొనిన ప్రతీదానిని వారు చేసిరి. "సరి, ఇప్పుడు, ఇటు చూడండి. ఇటు గమనించండి. ఫలానా మరియు ఫలాన, ఇదొక్కటి గమనించండి," అని చెప్పుటకు ప్రయత్నము చేసిరి.
JOHN 5:2,3,8,9
104అచ్చట ఒక దినమున ఆయన కుష్టరోగియైన సీమోను ఇంట కూర్చునియుండెను. ఒక్క మాటయైన అనకుండా ఆయన అతడిని స్వస్థపరచెను. (అతనొక కుష్టు రోగి.) ఏమి మాట్లాడకుండా ఆయన అతనిని స్వస్థపరచెను. అది నిజము.
ఆయన బేతస్థ కోనేరుగుండా వెళ్ళెను మరియు రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు, దాదాపు రెండువేలమంది అచ్చట పడియుండిరి. మరియు ఆయన ఒక మనుష్యుని వద్దకు నడుచుకుంటూ వెళ్ళి, అతడిని స్వస్థపరచి వెళ్ళిపోయెను. సరే, ఇప్పుడు ఆయన మెస్సీయా అయిన యెడల, ఆయన వారందరిని స్వస్థపరిచియుండేవాడు. మీరు చెప్పినట్లు, ఆయన పూర్తిగా కనికరముతో నిండినవాడైనచో, ఆయన వారందరినీ కనికరించేవాడు కదా," అని చెప్పిరి. ఆయనకు ఒక చెడ్డ పేరును తీసుకువచ్చుటకు వారు కనుగొనిన ప్రతీదానిని, వారాయనపై వేసిరి అది వాస్తవము. ఆయనను వదిలించుకొనుటకు వీలయిన ప్రతీ అవకాశమును వారు తీసుకొనిరి.
ISA 7:14
105సరే. ఆయనను వదిలించుకొనుటకు ప్రతి అవకాశమును వారు తీసికొనిరి. ఆయన జన్మను ప్రశ్నించిరి. ఆయన జన్మ ఒక ప్రశ్నార్థకంగా నుండెను. దానిని వారు ప్రజలయెదుట నుంచిరి. ఆయన తండ్రి, యోసేపు ఒక వడ్రంగివానిగా నుండగా, (ఆయన ఎట్లు ఒక కన్యకకు) జన్మించెనన్నది వారు అర్ధం చేసుకొనలేకపోయిరి. ఆయన యోసేపు మరియు మరియకు వివాహము కాకముందే జన్మించెను. వారు ఆ విషయాన్ని ప్రజలముందు పెట్టిరి. అవునండీ, చూశారా. ఇప్పుడు నేను చెప్పుచున్నది ఏమిటి? వారాయనకు చెడ్డ పేరును తెచ్చుచున్నారు, చూశారా.
"ఆయన వైపు చూడండి! ఆయన ఎచ్చటి నుండి వచ్చెను? ఆయన తల్లివైపు చూడండి, ఈ పిల్లవాణ్ణి కలిగియున్న ఆమె ఒక వేశ్యగాక మరేమియు కాదు. మరియు ఈ పిల్లవాడు జన్మించిన తర్వాత… ఆమె గర్భవతియై, ఈ పిల్లవాడు పుట్టనైయుండగా, దానిని దాచిపెట్టుటకు యోసేపు ఆమెను వివాహమాడెను, పిదప ఒక విధమైన విషయముతో వచ్చిరి… ఏమిటది, అది దయ్యము యొక్క కార్యమైయున్నది. మీరు చూడలేరా? అది అటువంటి ఒక జన్మయైయున్నది!" వారు పరిశుద్ధ గ్రంథమందు, యెషయా 9:6 "కన్యక గర్భవతి యగును," అని చదువక, దానిని ప్రజల యెదుట నుంచిరి. చూశారా, అదేమిటి? వారు వాక్యము నుండి తొలగిపోయిరి. అంతే.
106ఆయన యొక్క అధికారము పట్ల వారు తప్పుడు అభిప్రాయములను వెళ్ళగక్కిరి. "ఘనులారా, మనము మోషే యొక్క శిష్యులమని మీరెరుగరా? మనము క్రీస్తు యొక్క సేవకులమని మీరెరుగరా? మనము అనుదినము లేఖనములను పరిశోధించు వారమని మీరెరుగరా? మరియు మనకు ఒక్క విషయమైనను లేకుండెను." వారిట్లనిరి, "మెస్సీయా తన ఆలయమునకు వచ్చును. ఈయనైతే ఒక ఆలయమునకు వచ్చెనన్న ఒక్క మాటయినా వినపడలేదు. ఈయన ఎచ్చటనున్నాడు? ఈయన ఏ పాఠశాల నుండి వచ్చెను? మీకు తెలిసిన (మెథడిస్టు మరియు బాప్టిస్టు ఇరువురిని, మరియు ప్రెస్బిటేరియనులను) పరిసయ్యులను, సద్దూకయ్యులను మరియు మొదలగు సహోదరులనెవరినైనా అడగండి. ఈయన ఏ సహవాసపు కార్డును కలిగియున్నాడు? ఈయనకు కనీసం ప్రసంగించుటకైనా అధికారము ఎక్కడనున్నది? ఈయన అభిషేకించబడియుండలేదు. ఈయనకు కనీసం ప్రసంగించే హక్కు లేదు."
ఆయన ఇట్లనెను, "దేవుని యొద్దనుండి నాకు అధికారము ఇవ్వబడెను. నేను చేయు క్రియలే నేను ఎవరన్నది రుజువు చేయును. [అది నిజము.] నేను మీ పత్రములను కలిగియుండనక్కర్లేదు."
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 9:28
107నా భావమును గ్రహించియున్నారా? వారాయన సిద్ధాంతమును త్రోసివేసిరి. అంతేకాకుండా, వారాయనను బయెల్జెబూబు అని పిలిచిరి. ఆయన యొక్క సిద్దాంతమును, వారు గ్రహించలేకపోయిరి.
"ఎందుకు, ఆయన పితరుల యొక్క ఆచారములన్నింటితో ఏకీభవించడు. ఆయన పరిసయ్యులతోను ఏకీభవించడు. ఆయన సద్దూకయ్యూలతోనూ ఏకీభవించడు. ఆ గుంపంతటితోనూ ఆయన ఏకీభవించడు. ఇప్పుడు, ఆయన తన సిద్ధాంతమును ఎచ్చటినుండి పొందుకొనెను?"
మరెచ్చటి నుండియూ కాదు, పరిశుద్ధ గ్రంథము నుండియే.
"సరి," మీరిట్లందురు, "సరి, అది వాస్తవమని నాకెట్లు తెలియును?"
దేవుడు దానిని ఆమోదించుట వలన తెలియును!
ఆ గ్రుడ్డివాడు చెప్పినది అదే: "మీరు అంతగా ఒప్పైయుండి మరియు ఆయన అంతగా తప్పైయుండుట అనునది ఒక వింతైన కార్యమైయున్నది. అయిననూ ఆయన దేవుని యొక్క శక్తిని తీసుకొని మరియు నా కండ్లు తెరిచెను. మీరైనా కానీ కనీసం అటువంటిది జరుగుటను మీరెన్నడూ చూచియుండలేదు. [అదియొక వింతైన కార్యముగా యున్నది." ఓ, మై! నేనాయన పక్షమున నిలుచుటకు ఇష్టపడుచున్నాను. మీరు ఇష్టపడుటలేదా? నిశ్చయంగా.] "మీరు మోషే శిష్యులమని మీరు చెప్పుచున్నారు, మరియు మీరు అంతగా ఒప్పైయుండి మరియు ఆయన అంతగా తప్పైనయెడల; అప్పుడు ఆయన చేయుచున్న కార్యములను మీరునూ చేయుటను నన్ను చూడనివ్వండి." ఆమెన్!
అక్కడే ఆయన యొక్క సిద్ధాంతమును…… ఆయన యొక్క హక్కులన్నింటిని వారు నిరాకరించిరి. వారిట్లనిరి, "ఆయన కలిగిలేడు… ఆయన మెస్సీయా అగుటకు గల హక్కులన్నియూ తప్పైయున్నవి. ఆయన ఒక మెస్సీయా ఎట్లు కాగలడు? సంఘమునకు రాకుండా, ఆయన ఒక మెస్సీయా ఎట్లు కాగలడు? మరియు ఇశ్రాయేలు యొక్క మీగడయైయున్న మనము ఇచ్చటనున్నాము." అయితే ఆ మీగడ పులిసిపోయెను, చూశారా. అవునండీ, ఈగలు దానిలోపల ఉండియున్నవి. కావున వారు ఆ మీగడను తీసివేయవలసియున్నది.
కావున అతడిట్లనెను, "ఎన్నుకొనబడిన సంఘమైయున్న మనము ఇచ్చటనున్నాము. మనము మన సాంప్రదాయమును పాటించాము. మనము మోషే ధర్మశాస్త్రమును ఆచరించాము. మనము ఇటువంటి కార్యములన్నిటినీ చేయుచూ వచ్చియున్నాము మరియు ఇచ్చట ఈ మనుష్యుడు వచ్చి మన హక్కులన్నిటినీ ధిక్కరించుచున్నాడు. మరియు ఇదియూ గాక, దీనిని మరియు దానిని, మరియు ఈ ఇతర విధములైన కార్యములన్నిటినీ చేసిన మన పరిశుద్ద యాజకులను, మన పరిశుద్ద పితరులను, మరియు మనము కలిగియున్న గొప్ప వ్యక్తులందరినీ ఆయన 'అపవాది సంబంధులు' అని పిలుచుచున్నాడు, పిదప తనను తాను దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు!"
108ఓ, మై! చూశారా, వారు ప్రజల దృష్టికి తీసుకువచ్చునట్లు, యేసు నామముపై మరియు యేసు పై దుష్టప్రచారము చేయ ప్రయత్నించిరి. అచ్చట ఇంకా చాలా చెప్పవచ్చును, కానీ చాలా సమయం పడుతుంది. అయితే ఏమైంది? అయితే ఆ వాక్యము మరియు ఆ క్రియలు ఆయనను రుజువు చేసినవి. ఆమెన్!
ఓ, నిజమైన విశ్వాసులకు, ఏర్పరచబడినవారైయుండి ఆయనను చూచుటకు మరియు ఆయన పరిచర్య ఎదుగుదలకు ముందుగా నిర్ణయించబడినవారి కొరకు ఆయన అచ్చటనున్నాడు. ఆయన దేనిగూర్చి తన నోరు విప్పినా గానీ వారికి చింతలేదు, ఆయన అదైయున్నాడని వారు ఎరిగియున్నారు. హల్లెలూయా!
JOHN 4:7-20
109ఆ దినమున ఒక కుండతో నీళ్ళు తెచ్చుకొనుటకు అల్పురాలైన వేశ్యాయొకతే అచ్చట బావియొద్దకు నడుచుకుంటూ వచ్చెను. మరియు అచ్చట కూర్చునియున్న మధ్వ-వయస్కుడైన ఒక మనిషి, ఇట్లనెను, "నాకు దాహమునకిమ్ము."
ఆమె ఇట్లన్నది, "యూదులైన మీకు ఒక సమరయ స్త్రీని అట్లడుగుట వాడుక కాదు గదా."
ఆయన ఇట్లన్నాడు, "అయితే నీవెవరితో మాటలాడుచున్నావో ఎరిగియుంటే…"
"ఇప్పుడు," ఆమె ఇట్లనుకొన్నది, "ఇతడొక అహంకారియైన యూదుడు," ఆమె వెనుకకు తిరిగి, ఇట్లన్నది, "నీవొక యూదుడవన్నట్టుగా నాకు కనబడుడుచున్నది. మరియు నీవొక యూదుడవైనయెడల, సహజంగానే మీరు భక్తిపరులైయుందురు మరియు యెరుషలేమునందు ఆరాధించవలెనని మీరు చెప్పుదురు. అయితే మా పితరుడైన యాకోబును మరియు అతని పశువులును ఈ బావినుండి నీళ్ళు త్రాగెను. ఈ బావి లోతైనది, మరియు చేదుకొనుటకు నీకేమియు లేకుండెను. మరియు మేము ఈ పర్వతమందు ఆరాధించుదుము…"
ఆయనిట్లనెను, "ఒక్క నిమిషము ఆగుము. వెళ్ళి, నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్ము."
ఆమె ఇట్లనెను," నాకు పెనిమిటి లేడు."
ఆయన ఇట్లనెను, "నీవు సత్యమే చెప్పితివి." ఇట్లన్నాడు, "నీకు అయిదుగురుండిరి. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి మరియు ఇప్పుడు ఎవరితో నీవు జీవించుచున్నావో, వాడు నీ పెనిమిటి కాడు."
అల్పురాలైన ఆ వేశ్య - ముందుగా నిర్ణయించబడియుండెను - ఆమె ఆ కుండను క్రిందపెట్టుటను నేను చూడగలుగుచున్నాను మరియు ఆమె ఇట్లనెను, "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను."
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 4:19,25-29
110చూశారా, చూశారా? ఆ విత్తనము అచ్చట ఉండియున్నది. మరియు దానికి అవసరమైనది ఒకే ఒకటి ఏదనగా, నీళ్ళైయున్నది. మరియు ఆ నీళ్ళు దానిపై పడియుండెను.
అది ఆ పరిసయ్యులపై పడియున్నప్పుడు, వారు ఇట్లనిరి, "ఇది ఒక బయెల్జెబూబు." ఏమియూ తీసుకురాబడలేదు, అచ్చట ఎదుగుటకు, గురుగులు తప్ప మరేమియూ లేకుండెను.
అయితే ఆ జీవజలము, ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనమును తాకినప్పుడు, ఆమె ఇట్లన్నది, "అయ్యా, నీవొక ప్రవక్తవైయుండవచ్చు. మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన మాకు ఈ సంగతులను తెలియజేయునని నేనెరిగియున్నాను."
ఆయన ఇట్లనెను, "నీతో మాటలాడుచున్న నేనే ఆయనను."
ఆమె ఆ నీళ్ళకుండను విడిచిపెట్టి మరియు పట్టణములోనికి వెళ్ళెను! చెప్పుటకు ఆమె దేనినో కలిగియున్నది. ఆమె ఇట్లు చెప్పినది, "మీరు వచ్చి, నేను చేసినవన్నియూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన మెస్సీయా కాడా?" చూశారా? ఆమె యేసు పక్షమున నిలిచినది. అది నిజము.
అది ఆశ్చర్యకరమైన సంగతి కాదా? ఆ పరిసయ్యులు మరియు సద్దూకయ్యులందరూ ఆయనను ఎరుగకపోయిరి, కానీ ఈ వేశ్య ఆయనను ఎరిగియున్నది, చూశారా. ఎందువలన? ఎవరైతే ఆయనను విశ్వసించి మరియు ఆయనను ప్రేమించి మరియు ఆయన యొక్క సూచనలను చూసియున్నారో, వారే అది మెస్సీయా యొక్క సూచనని ఎరిగియున్నారు. దానిలో ఎటువంటి సందేహము లేదు; వారు దానిని ఎరిగియున్నారు.
JOHN 1:47-49
111నతానియేలు అక్కడికి నడుచుకుంటూ వచ్చినప్పుడు, బహుశా ఫిలిప్పు ఎదుట ఇట్లన్నాడు, "ఫిలిప్పు, ఇప్పుడు దీని గూర్చి నాకు తెలియదు. ఈ అంత్యదినములలో అనేక సంగతులు జరుగనారంభించుటను నేను చూసియున్నాను. చాలా సంగతులు జరుగుచున్నావని నేనెరుగుదును." అయితే అతడు అచ్చట ఆయన ఎదుటకు నడుచుకుంటూ వచ్చెను. ఇట్లనెను, "నేను వెళ్ళి, ఆయన చెప్పినది వింటాను, మరియు ఏమి చెప్పునో చూస్తాను."
అచ్చటకు నడుచుకొని వెళ్ళెను, మరియు యేసు ఇట్లనెను, "ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు."
అతడిట్లనెను, "బోధకుడా, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు?"
ఆయన ఇట్లనెను, "ఫిలిప్పు నిన్ను పిలువకముందే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని."
ఏమి జరిగినది? ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనమును నీళ్ళు తాకినవి. ఓ, మై! అది జరిగినప్పుడు, అతడిట్లన్నాడు, "బోధకుడా, నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజువైయున్నావు!"
అదేమిటి? ఆ విత్తనము ముందుగానే అచ్చట ఉండియున్నది. సరిగ్గా ఆ సమయానికి అది ఆ వెలుగును తీసుకువచ్చునట్లు, జగత్తుపునాది వేయబడకముందే దేవుడు దానిని అక్కడ నాటియున్నాడు. హల్లెలూయా!
సహోదరుడా, సరిగ్గా అచ్చట దానికే నేను కట్టుబడియున్నాను. అచ్చటే, సరిగ్గా దానినే నేను నమ్ముచున్నాను. నేను దానిని బోధించగా, మరది ఇక్కడ మరియు అక్కడ పడును. మరియు అవి ఇటువైపుకు మరియు అటువైపునకు పోవును. ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. ఎక్కడో అది ఒక విత్తనమును తాకనైయున్నది. మరియు అది జరిగినప్పుడు, నిశ్చయంగా లోకమువలెనే, ఆ విధంగా అది జీవమును పొందుకొనును. అవునండీ.
ZECH 4:6•
JOHN 6:37,39,44•
JOHN 9:3
112ఆ గ్రుడ్డివాడివలే… చెప్పెను, "దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఇది జరిగెను." చూశారా. ఏమి జరుగనైయున్నదో ఆయన ఎరిగియున్నాడు. నిశ్చయంగా ఆయనకు తెలుసు.
సరి. ఇప్పుడు, ఆ ముందుగా నిర్ణయించబడినవారు, ఆయన యొక్క లేఖనానుసారమైన సూచనలను చూచినప్పుడు, వాక్యము ఆ క్రియలను నిరూపించేనని లేదా ఆ వాక్యము సత్యమని, ఆ క్రియలే ఆ వాక్యమును నిరూపించేనని వారెరుగుదురు. దానిని చూచుటకు వారు ముందుగా నిర్ణయించబడియున్నారు. మరియు దానిని చూచుటకు వారు సరియైన క్రమములోనే ఉండియున్నారు మరియు వారు దానిని పొందుకున్నారు.
అప్పుడు వారు చెప్పిరి… వారు చూచిన తర్వాత వారెచ్చటికి వెళ్ళలేరు. ఆ ప్రజలు నిత్యజీవమునకై ముందుగా నిర్ణయించబడినవారు గనుక, దానిని వారు కనుగొందురు, అంతే. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యెద్దకు వచ్చెదరు. మరియు నా యొద్దకు వచ్చిన వారందరికీ నేను నిత్యజీవమును అనుగ్రహించెదను మరియు అంత్యదినమున వారిని లేపుదును. వారిలో ఏ ఒక్కరును నశించరు." ఆమెన్! నేను సరిగ్గా దానినే హత్తుకొనియున్నాను, చూశారా. "కార్యములవలన కాదు, క్రియలవలన కాదు, శక్తిచేత కాదు, బలముచేత కాదు - నా ఆత్మ ద్వారా చేతునని దేవుడు సెలవిచ్చెను." నేను ఏమి చేశానని కాదు, నేనేమైయున్నానని కాదు, లేదా నేనేమై యుండబోవుదునని కాదు; కానీ ఆయన ఏమైయున్నాడనునదియే. మరియు నేనాయనలో ఉండియున్నాను. మరియు ఆయన ఏమైయున్ననూ, నేనాయనలో భాగమైయున్నాను! ఆమెన్! నేనాయనలో భాగమైయున్నాను గనుక నేను రక్షించబడియున్నాను. మరియు ఆయన దేవుడైయున్నాడు. ఆయన కుమారుడనైయుండుట వలన నేను ఆయనలో భాగమైయున్నాను. అది నిజము. కావున నేనేమి చేశానని కాదు, నేనేమి చేయుదునని కాదు. అది ఆయన ఏమి చేశాడన్నదైయున్నది. సరిగ్గా అదే నా నమ్మికయైయున్నది. అది సరియే.
MATT 11:28•
JOHN 1:43
113సరి. కావున వారెచ్చటికి వెళ్ళలేరని వారు చూసిరి. (నేనిచ్చట ఈ కొన్ని లేఖనములను దాటివేయుదును.) ఆయన ఉండగా వారేచ్చటికి వెళ్ళలేరని వారు గ్రహించిరి. అయితే, మీకు తెలియును, వారు చేయవలసిన తదుపరి కార్యమేదనగా, ఆయనను రంగము మీద లేకుండ చేయుటకు ప్రయత్నించుట యైయున్నది. వారు వెళ్ళి, అతని సహోదరులతో మరియు అతని తల్లితో ఇట్లు చెప్పిరి, "ఆయన చెప్పలేనంతగా అలసిపోయాడని మీకు తెలియును. మీరు కొంతకాలం ఆయనను ఎచ్చటికైనా తీసుకుపోవలసియున్నది. "ఆ వేషధారుల గుంపు! వారు కేవలం… విషయమేదనగా, వారు అసలు ఆ కార్యమును పొందుకొనగోరలేదు, దానిని వారు చేయగోరలేదు. అది ఆయన ఎంతగానో అలిసిపోయి యున్నాడని వారు తలంచుట కాదు గానీ, వారాయనను వదిలించుకొనగోరిరి; ఆయన చనిపోవునంతగా పనిచేయుటనే వారు ఇష్టపడిరి. అయితే ఆయన బయటకు వెళ్ళిన ప్రతీసారీ, అద్భుతములు కుమ్మరించ నారంభించెను, దేవుని యొక్క వాక్యము బయలువెళ్ళెను.
ఆ దినమున ఆయన ఆ నదీ తీరమున నిలబడి, సీమోను పేతురును పిలిచి మరియు "నన్ను వెంబడించుము," అని చెప్పినప్పుడు నేను వినగోరుటలేదా! ఒక మొద్దు పైకి ఎక్కి, అచ్చట క్రింద కూర్చొనియుండి, నా వలలను, మరియు నా గాలమును విడిచిపెట్టి మరియు ఒక మొద్దుకు ఆనుకొని అచ్చట క్రింద కూర్చొనియుండి, సహోదరుడా క్రేస్, ఆయన ఆ దోనెలోనికి వచ్చి ప్రసగించునప్పుడు, నేను వినునోరుటలేదా! ఓ, మై! "ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును," అని ఆయన చెప్పినప్పుడు నేను దానిని వినుటకు ఇష్టపడియుండలేదా! ఆమెన్! ఆయన దాని చెప్పుటను నేను వినుటకు ఇష్టపడియుందును.
114ఆయన తల్లి మరియు వారు రంగం మీద నుండి ఆయనను తీసుకొనిపోవలెనని వారు ప్రయత్నము చేసిరి. వారిట్లనిరి, "సరి, ఆయన చాలా ఎక్కువగా పనిచేసియున్నాడని మీరెరుగుదురు. కావున మీరాయనను ఆ వైపునకు పంపివేయుట మంచిదని నేను నమ్ముచున్నాను." ఏ విధంగానైననూ, ఏ విషయంతోనైననూ వారాయననూ వదిలించుకొనగోరిరి, వారికి కావలసినదంతయూ అదే. అవునండీ.
ఇంకా, ఆయన వెంబడి వెళ్ళినవారంతా, కేవలం ఆయనను ఇరుకున పెట్టుటకు ఒక అవకాశమును కనుగొనగోరుచున్నారు. అది మీకు తెలియునా? కేవలం ఒక అవకాశమును కనుగొనుటకు ప్రజలు ఆయనను వెంబడించిరి. ఒక దినమున వారాయనకు ఒక నాణెమును ఇచ్చిరి. మరియు వారిట్లనిరి, "బోధకుడా, మనము యూదులము. నీవు ఒక గొప్ప దైవజనుడవని మేమెరిగియున్నాము." [ఓ, ఆ వేషధారి! చూశారా?] అవును. "అవునయ్యా, బోధకుడా, నీవు ఒక గొప్ప దైవజనుడవని మాకు తెలియును." [వారాయనతో పాటు నడుచుచూనేయున్నారు.] ఓ, సహోదరుడా శుభోదయం. ఓ, నీవిచ్చట మా దేశంలో ఉన్నందుకు గాను మాకు చాలా సంతోషముగానున్నది. ఓ, నిన్ను చూచుటకు మాకు చాలా ఆనందంముగా నున్నది సహోదరుడా. మేము వెనుదీయకుండా, నిజముగా నీ కొరకు మేమున్నాము. నీవు ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు వెళ్ళుచున్నయెడల, మేము నీతో కూడా సహకరించేదము!" వారు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నారో చూచారా? ఆయన కొరకు ఒక ఉచ్చును పెట్టియున్నారు, చూశారా.
MATT 22:16-21•
MARK 12:14-17•
LUKE 20:21-25
115వారిట్లు చెప్పిరి, "ఇప్పుడు, నీవు ఒక గొప్ప దైవజనుడవని మేమెరుగుదుము. నీవు భయపడవనియు, ఏ మనుష్యుని వైపు మొగ్గుచూపవనియు మేమెరుగుదుము. నీవు దేవునికి తప్ప మరిదేనికి భయపడువాడవు కావు. మరియు నీవు మొహమాటము లేనివాడవని మేమెరుగుదుము. ఓ, నీవు నీ వర్తమానముతో నిర్భయుడవైయున్నావు! నీవొక గొప్ప ప్రవక్తవని మేమెరుగుదుము, ఎందుకనగా అతడొక దేవుని ప్రవక్తయైయుండి, తానెచ్చట నిలబడియున్నాడో ఎరిగియుంటేనే గానీ, ఇటువంటి రోజుల్లో ఏ మనుష్యుడును ఆ విధంగా చేసి మరియు తన వర్తమానముతో నిర్భయముగా ఉండలేడు. కావున నీవు పక్షపాతివి కాదని మేమెరుగుదుము. బోధకుడా, నీవు గొప్పవాడవైయున్నావు. మేము యూదులమైయున్నాము. సహోదరుడా, మేము ఖచ్చితంగా నీతోనే ఉండియున్నాము. నిశ్చయముగా, మేము ఉండియున్నాము. "ఇప్పుడు, బోధకుడా, కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా?"
ఓ, అది వేషధారుల గుంపైయున్నది! చూచారా? పరిశుద్ధాత్మ ఆయనతో నుండెను; ఆయనే పరిశుద్ధాత్మయై ఉండెను. అందుకాయన ఇట్లనెను, "మీ యొద్ద ఒక నాణెము ఉన్నదా?"
చెప్పిరి, "ఓ, ఉన్నది, ఉన్నది. నా వద్ద ఒక నాణెము ఉన్నది."
"దానిని నాకియ్యుడి," అనెను. "దానిపై నున్న రూపమును, వ్రాతయు ఎవరివి?" అని అడిగెను.
"కైసరు," అని చెప్పిరి.
అందుకాయన, "అలాగయితే కైసరువి కైసరునకును; దేవునివి దేవునికిని చెల్లించుడి," అని చెప్పెను.
MATT 11:3•
LUKE 7:19
116ఆయనకు స్నేహితులవలె నటించుచూ, ఆయనకొక ఉచ్చును తయారు చేయుచున్నారు. ఆయనను ఎవరునూ అర్ధంచేసుకొనలేరన్నట్టు అనిపించుచున్నది. వారు కొంతవరకు ఆయనతో ప్రయాణించుదురు, పిదప ఆయనతో వారు విసుగుచెంది మరియు ఆయనను విడిచిపెట్టుదురు. వారిట్లు చెప్పవచ్చును, "ఓ, సరి, మేము అనుకున్నాము, నిశ్చయముగా మేము అనుకున్నాము…" శిష్యులు సైతం ఇట్లనిరి, "ఈయనే ఆయనని మేము నిశ్చయముగా తలంచుచున్నాము…" యోహాను కూడా తన శిష్యులను పంపించి, "రాబోవువాడవు నీవేనా? లేదా మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా?" అని ఆయనను అడిగెను. చూశారా? ఓ, చూడండి, దానిని ఎరిగియుండియూ, ఆయన ఎటువంటి ఒక జీవితమును జీవించియుండెనో గదా! అయితే ఆయన ఒక ఉద్దేశ్యమును, ఒకే ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడు - దేవుని యొక్క కార్యమును చేయుటయైయున్నది.
కేవలం ఆయనకు ఉచ్చు వేయుటకే, అనేకులు ఆయనను వెంబడించిరి. ఇప్పుడు, అది ఈనాడు కూడా ఆ రీతిగానే ఉన్నదని నేను చెప్పినచో, అది దైవదూషణ కాదని నేను భావించుచున్నాను. అనేకులు కూటములను వెంబడించుచూ మరియు లోనికి వచ్చి మీరు ఎవరికొరకైనా ప్రార్ధించుటను కనిపెట్టునది, కేవలం ఒక ఉచ్చు వేయుటకైయున్నది.
MARK 6:4
117ఇచ్చట ఇటీవల కాలంలో, ఈ సంఘమునకు వెళ్ళే ఫలానా సహోదరి, ఎక్కడైతే దేవుడు ప్రతీది జరుగునట్లు చేయుచున్నాడో, అట్టి వేరొక సంఘము వద్దకు వచ్చియుండెను. మరియు ఈ సహోదరి, మరొక సహోదరితో ఇట్లన్నది, "నీకు తెలియునా, రోగుల కొరకు ప్రార్ధించే ఆ మనుష్యుడు నిజంగా ఒక జయజీవితమును కలిగియుండవలసియున్నది." ఇంకా ఇట్లనెను, "అతడు తన కుటుంబమును, ప్రతీదానిని, కేవలం ఒక పలుకబడిన మాటచేత, ఆ రీతిగా స్వస్థపరచుటకు సమర్ధుడైయుండవలసియున్నది." [సహోదరుడు బ్రెన్హాం తన వ్రేలుతో చిటికెను వేసారు.] మరియు ఆ మరొక సహోదరి జఫర్సన్ విల్ నుండియైయున్నది. (మరియు యేసు చెప్పినది ఎవ్వరూ తెలుసుకోలేనిది కాదని నేను నిశ్చయంగా అనుకొనుచున్నాను. "నీ స్వంత ప్రజల మధ్యన…" మీకు తెలియును, "నీ స్వంత దేశములో. అది నిజము. ఆ కారణము చేతనే నేను… బహుశా సరిగ్గా ఇప్పుడది సమీపించుచుండ వచ్చును; బహుశా అది కాలము యొక్క మార్పుయైయుండవచ్చును, మీరు చూడండి.) మరియు ఆయన ఇట్లు చెప్పెను, "ఏమిటో మీకు తెలియునా?" చెప్పెను, "అతడు వారిని వైద్యునివద్దకు తీసుకువెళితేనే గానీ, ఆయన పిల్లలలో ఒకరైననూ శ్వాస పీల్చుకొనలేరు." చూడండి, చూడండి, ఆమె కేవలం అటువంటి ఒక దరిద్రమైన, అవమానకరమైన, మోసకరమైన విషయమును మోపజూచు ఒక స్త్రీయైయున్నది. ఇట్లు చెప్పెను, "ఆయన పిల్లలకు వ్యాధి కలిగినచో, వారిని ఆయన వైద్యుని యొద్దకు తీసుకువెళతాడు."
118వివేకముగల వారెవరైనా అదే కార్యమును చేయుదురు. అవునండీ. ఔషధము (Medicine) దేవునియొద్ద నుండియే పంపబడినదని ప్రజలు గ్రహించలేకపోవుచున్నారు. ఎందువలన, సహోదరులారా, అట్లు కానియెడల, అది దయ్యము నుండి పంపబడినదైయుండును. నిశ్చయంగా అదైయుండును. ఔషధము చేరుకోలేని చోట దేవుడు ఉండియున్నాడు. నిశ్చయంగా. ఔషధము దేవునిదైయున్నది. "సరి," మీరనవచ్చును, "నాకు అనేకమంది వైద్యులు తెలుసు…" ఓ, అవును, ఆ ప్రకారమే నాకు కూడా చాలా మంది బోధకులు తెలుసు. అది ఏమైయున్నదో అదే గానీ, దానిని నిర్వహించునది మానవుడు కాదు. దైవిక స్వస్థతను నమ్మకుండా, కనీసం దేవుడిని కూడా నమ్మకుండా, దేవుని యొక్క వాక్యమును చేతపట్టిన అనేకులను నేనెరిగియున్నాను. నిజము. అయితే దానిని వారావిధంగానే చేతపట్టుకొందురు. ఔషధము, శస్త్ర చికిత్స, మరియు మొదలగువాటితో ఉండి, దేవుడిని మరియు ప్రతీదానిని నిరాకరించే, అనేక మంది మనష్యులు ఉండియున్నారు, అయితే ఆయనను నమ్మువారు కూడా అనేకులు ఉండియున్నారు. కావున అది ప్రజలకు సహాయపడినచో, అది దేవునిదైయున్నది. నేను ఈ రాత్రి, ఆ కారు తీసుకొని దానిలో ఇంటికి ప్రయాణించనక్కర్లేదు; కావాలంటే నేను నడుచుకుంటూ వెళ్ళగలను, అయితే దేవుడు నాకొక కారుని తయారుచేసియున్నాడు, కావున దానికై నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదును. ఈ వస్తువులన్నియు దేవునియొద్ద నుండియే వచ్చును, అయితే వాటిని వివేకముగా వాడుకొనుడి. వాటితోనే పిచ్చివారై యుండకుడి. చూశారా.
119అదే కార్యమైయున్నది. కావున అది అంతే, మీరు చూడండి. మార్పునొందిన ఈ యౌవనస్తునుకి చూపించుటకు, దేవుని క్రియల యొక్క పేరును పాడుచేసే ఏదైనా ఒకటి కనుగొన ప్రయత్నించుచున్నారు. చూశారా, వారు దానిని పాడుచేయగోరిరి. "ఆయన బిడ్డలలో ఒకరికి వ్యాధి కలిగిన ప్రతీసారీ, ఆయన వారిని ఒక వైద్యుని యొద్దకు తీసుకు వెళ్ళును." నిశ్చయంగా, నేను తీసుకు వెళ్ళుదును. పిదప ఒకవేళ వైద్యుడు వలన కానిచో… నేను అచ్చటకు వెళ్ళుటకు ముందే సహాయము చేయవలసిందిగా, నేను దేవుడిని అడిగెదను. పిదప దాని విషయమై వైద్యుడు ఏమియూ చేయలేనియెడల, అప్పుడు నేను వారిని అంతకన్నా ఉన్నతమైనదాని వద్దకు తీసుకు వెళ్ళుదును. అది నిజం. అవునండీ. ఓ, సరిగ్గా ఈనాటివలె ఉన్నది, ఎక్కడైనా ఒక ఉచ్చు బిగించుటకు వారు ప్రయత్నించుచున్నారు.
120ఆయన వారిని ఎరిగియున్నాడు, అయితే గమనించండి, ఆయన వారిని ఎన్నడూ గద్దించలేదు. ఆయన వారితో కూడా వెళ్ళియుండెను. ఆయన ఇప్పుడూ అదే కార్యమును చేయుచున్నాడు. వారు పూర్తిగా ఆయనకు విరోధముగా చేసినప్పటికినీ, ఆయన నేరుగా వారితో కూడా వెళ్లుచుండును, వారికి తన కనికరమును చూపును (అది నిజము) ఎందువలన? ఎందుకనగా ఆయన వారిని ప్రేమించును. మరియు ఆయన వారితో కూడా వెళ్ళియుండెను, అయితే వారెల్లప్పుడూ ఒక అత్యవసర పరిస్థితిలోనే ఆయనను పిలుచుటకు సిద్దముగానున్నారు. వారు అటువంటప్పుడే ఆయనను కోరుచున్నారు. కేకలువేయు ఎవరినైనా ఒకరిని వారు ఎగతాళి చేయుదురు. దైవిక స్వస్థతను బోధించు ఎవరినైనా వారు ఎగతాళి చేయుదురు, వారు దానిని నమ్ముటలేదని చెప్పుదురు. వారింకనూ సరిగ్గా సరియైన వ్యాధికి గురవ్వలేదు. నేను చాలా మంది గూర్చి వినియున్నాను.
121నేను సరిగ్గా ఇచ్చట ప్రసంగించున్నప్పుడు, ఒక స్త్రీ మరణావస్థలో ఉండెను, నేరుగా నేను ఆ మెట్ల మీదకు పరిగెత్తియుంటిని. ఆమె ఇటుగా నడుచుకుంటూ వెళ్ళియుండెను. ఆమె ఇక్కడున్న ఒక వీధిలో నివసించియుండెను, మరియు ఒక ఆవును అచ్చట కలిగియుండెను. మరియు ఆమె ఇట్లన్నది, "బిల్లీ, నీవు కలిగియున్నటువంటి మతమును నా ఆవు కలిగియున్నయెడల, నేను నా ఆవును చంపియుండేదాన్ని." అది జరిగిన ఒక గంటలోపే, ఒక అందమైన యౌవనస్థురాలగు ఆమె, మొత్తబడియుండెను మరియు ఆసుపత్రికి తీసుకొనిపోబడెను. మరియు నేనచ్చటికి పరిగెత్తుకొని వెళ్ళియుంటిని. ఆమె భర్త కథోలిక్ సంఘమునకు చెందినవాడు మరియు వారు నా కొరకు కబురుపెట్టారు. ఆమె చనిపోవుచుండెను. మరియు ఆమె కన్నులు వాచిపోయెను. ఆమె చెప్పెను, "ఆయనను పిలువుడి; ఆయనను పిలువుడి; ఆయనను పిలువుడి, ఆయనను పిలువుడి, త్వరగా, త్వరగా."
మరియు ఆమె సహోదరుడు పరిగెత్తుకొని వచ్చి అచ్చట తలుపునొద్ద నిలబడియుండెను, మరియు ఎంతో సేపటిగా నా కొరకు వేచిచూస్తూ అటు-ఇటు తిరుగుచుండెను. మరియు ఆ స్థలము ప్రజలతో కిక్కిరిసియుండెను. మరియు కొద్దిసేపటి తరువాత, ఎవరో వచ్చి మరియు ఇచ్చట బోర్డు మీద ఒక ప్రకటనను పెట్టిరి. అది ఇట్లు చెప్పెను, "ఆసుపత్రిలో ఒకరు చనిపోవుచుండిరి." మరియు సహోదరుడు గ్రహం స్నేల్లింగ్ తో, "నేను వెళ్ళు వరకు నా స్థానము తీసుకొనుము," అని చెప్పానని నేను నమ్ముచున్నాను. మరియు అతడు కేవలం నిలబడి పాటలు నడిపించేవాడు. అ సమయానికి అతడు ప్రసంగించుటకు ఇంకనూ పిలుపును కలిగియుండలేదు. అతడు పాటలు నడిపించుటకు వచ్చెను. మరియు నేను బయటకు వెళ్ళి, నా కారు ఎక్కి మరియు అచ్చటకు వేగంగా వెళ్ళితిని. మరియు సరిగ్గా నేను మెట్లు ఎక్కుచున్నప్పుడే, ఆమె తన చివరి శ్వాసని విడిచెను. మరియు ఆ ప్రేగులు మరియు మూత్రపిండములు, ప్రతీదియూ సహజంగానే పనిచేయుచున్నవి. మరియు నేను లోపలికి పరిగెత్తుకొని వెళ్ళితిని మరియు వారు ఆమె ముఖముపై ముసుగును కప్పిరి, మరియు చుట్టూ ఆ విధంగా ఆవిరి వచ్చుచుండెను; మరియు అచ్చట నిలబడియున్న ఆ నర్సు ఇట్లు చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, ఆమె చివరి శ్వాసవరకు నీ కొరకు కేకలు వేసినది." సరిచేసుకొనుటకు ప్రయత్నించెను, కాని అప్పటికే ఆలస్యమైపోయెను, మీరు చూచారా? మీరు ఒకేసారి బహు విస్తారమైన పాపము చేయుదురని, మీరెరుగుదురా. మరియు ఆమె ఒక విధమగు… ఆమె ముఖము….
122రాగివన్నె గల తలవెంట్రుకలను ఆమె నలుపు - గోదుమరంగు తల వెంట్రుకలు కలిగిన చాలా అందమైన ఒక స్త్రీ, నిజంగా ఒక అందమైన స్త్రీ అయి యున్నది మరియు ఆమె అందంగా కత్తిరించుకున్న ఆమె జుట్టు చింపిరిజుట్టువలె అయినది. గోధుమ వర్ణము గల ఆమె యొక్క పెద్ద కండ్లు బయటికి వచ్చినవి, మరియు కేవలం సగము మూతపడినవి. మరియు ముఖము మీద మచ్చలతో ఏ విధంగా అయినదంటే, అవి కేవలం, ముఖమునిండా చిన్న చిన్న దద్దురులవలె అయ్యెను మరియు ఆమె నోరు తెరువబడియుండెను. మరియు నేను నడుచుకుంటూ అచ్చటికి వెళ్ళి, ఆమె వైపు చూశాను. మరియు ఆమె భర్త అచ్చట నిలబడియుండెను, మరియు ఇట్లనెను, "బిల్లీ, చివరకు ఈలాగు జరిగినది." ఇట్లనెను, "నేను కథోలిక్ నైయున్నాను. నీవు ఆమె కొరకు ఒక ప్రార్ధన చేయవలసిందిగా నేను కోరుచున్నాను, ఎందుకనగా ఆమె ఆత్మలు శుద్ధినొందు స్థలమునకు (purgatory) వెళ్ళియున్నది."
"ఏమిటీ?" అని నేను అన్నాను.
ఇట్లు చెప్పెను, "ఆమె కొరకు ఒక ప్రార్ధన చేయుము." ఇట్లన్నాడు, "ఆమె ఆత్మలు శుద్ధినొందు స్థలమునకు వెళ్లియున్నది. రెండు గంటల క్రితం ఆమె మీ సంఘము ప్రక్కనుంచి పోవుచూ, "నీవు కలిగినటువంటి మతమును మా ఆవు కలిగియున్నయెడల, దానిని ఆమె చంపివేస్తాను," అని అన్నది. చూశారా. "ఆమె కొరకు ఒక ప్రార్ధన చేయుము," అని చెప్పెను.
నేనిట్లన్నాను, "ఎంతో ఆలస్యమైపోయినది. ఆమె ఆత్మను ఇచ్చటనే ఆమె శుద్ధి చేసుకొనవలసియున్నది, ఆమె వేరెచ్చటికో వెళ్ళిన తర్వాత కాదు," చూశారా. అది నిజం. 'ఓ, అవును. అయితే ఎల్లప్పుడు శ్రమ వచ్చినప్పుడే మనము ఆయనను కోరుకుంటాము. ప్రజలు, వారిట్లు చెప్పుటను నేను వినియున్నాను, "నేను దేవునియందు నమ్మికయుంచను." ఒక్కసారి నిజంగా తనకు తీవ్రమైన గాయం తగలనీయండి, అప్పుడు మొదటిగా ఆయన ఎవరిని పిలుచునో చూడండి.
MATT 14:26
123ఆయన శిష్యులు కూడా, ఒకసారి తుఫానులో వారు చిక్కుకున్నప్పుడు, వారు ఆయనను చూసియున్నప్పటికినీ, కొద్దిగా వారాయనకు భయపడిరి. వారు ఖచ్చితముగా అది ఏమైయుండెనో దానిని ఎరుగకపోయిరి. "అది ఒక భూతం," అని వారనిరి. మరియు వారు కేకలు వేసిరి. మరి అయిననూ రక్షింపబడతారనే ఆశలన్నియు పోయినవి గనుక వారాయనను లోపలికి ఆహ్వానించిరి. అవును, ఎప్పుడూ అక్కడే, ఆశలన్నియు పోయినప్పుడు మీకు సందేహము ఉన్నా లేకున్నా, మీరు ఆయనను ఆహ్వానించుటకు ఇష్టపడుదురు. అవును. వారు ఆయన యొక్క అవసరతను కలిగియున్నారు గనుక వారాయనను లోపలికి స్వీకరించిరి. అది వాస్తవము.
మీకు తెలియునా, బహుశా కొన్నిసార్లు తుఫానులు అందువలననే వచ్చునని నేను తరచుగా ఆశ్చర్యపోవుదును. మీరెప్పుడైనా దానిగూర్చి ఆలోచించితిరా? వారికి ఆయన అవసరత వచ్చేంత వరకు, ఆయన అచ్చట కూర్చుండి మరియు వారిని గమనించుచుండెను, మరియు పిదప ఆయన రంగము మీదకు వచ్చెను. కావున, ఇప్పుడు మనకు ఆయన యొక్క అవసరం ఉన్నదని మనము చూడగలుగుచున్నాము. సహోదరుడా, ఆ తుఫాను వచ్చుటను మనము చూచుచున్నాము. ఈ రాత్రి మనము ఆయన పక్షమున నిలబడుదాము, ఆయన వాక్య పక్షమున నిలబడుదాము. నేను ఇంతటితో ఆపివేయుదును.
124మనము ఆయన పక్షమున నిలబడుదాము. మీరు మరియు నేను, సహోదరులారా, మనము ఈ రాత్రి ఆయనతో చేరెదము. ఆ తుఫాను వచ్చుచున్నది. మరియు ఆ చిన్న దోనె మునిగిపోవు వరకు వేచియుండకుడి. ఇప్పుడే మనమాయనను మన చిన్న పడవలోనికి తీసుకువెళదాము. మీరు చూసి మరియు ఇట్లు చెప్పవచ్చును, "సహోదరుడా బ్రెన్హాం, ఈ కార్యములన్నిటినీ నేను గ్రహించలేకపోవుచున్నాను."
వాక్యములో ఉన్నది కాకుండా మేము మరేదైనా చెప్పామేమో చూడండి. ఆయన చేయుదునని వాగ్దానము చేసినది కాకుండా వేరేదైనా కలదాయని చూడండి. అది మీకు కొన్నిసార్లు ఒక చిన్న భూతమువలె కనిపించవచ్చును. "ఓ, మై, దానిని నేను గ్రహించలేకపోవుచున్నాను," అని మీరు తలంచుదురు. అయితే మీ ప్రాణముపోయే రోజు ఒకటి వస్తుంది. అప్పుడది మీకు అంత తప్పుగా కనిపించదు. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, మీరు మీ సృష్టికర్తయైన దేవుని వైపునకు తిరుగవలసివచ్చును, అప్పుడు మీరాయనను లోపలికి తీసుకొనగోరుదురు. ఆ తుఫాను మునుపున్న దానికంటే ఇంకా దుర్బరముగా మారకముందే, ఇప్పుడే మనమాయనను లోపలికి తీసుకుందాము.
125నేనాయనను నా హృదయములోనికి తీసుకొనగోరుచున్నాను. నేను పూర్తిగా ఆయన చేత నింపబడునంతగా, ఆయన నా జీవితములో ఉండవలెనని నేను కోరుచున్నాను; నా మనస్సు, నా ఆలోచనలు, నేనేమైయున్నానో అదంతయు క్రీస్తు యేసు చేత ఏలబడి మరియు నియంత్రించబడ గోరుచున్నాను. నాకు తెలిసినదంతయు మరియు నేను చూచునదంతయు క్రీస్తు యేసే అనునంతగా నన్ను నేను కోల్పోగోరుచున్నాను. నేను మాట్లాడిన ఈ సంగతులను పొందుకొనుటకు పరలోకపు దేవుడు మీకు అనుమతించినయెడల, అప్పుడు నేను మీ అందరి ముందుకి రాగోరుచున్నాను. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, నేను సిలువవేయబడిన క్రీస్తునే ఎరుగగోరుచున్నాను. దేవుని యొక్క మహిమను, మరియు ప్రశస్తమైన స్తుతులను నేను ఎరుగగోరుచున్నాను; మీ మధ్యన కూర్చొనియుండి మరియు ఒక సేవకుడు లేచి తన సంఘములో చేయబడిన దానిని చూసిన దానిని బట్టి దేవునికి స్తుతి చెల్లించుటను, మరియొకరు తన సంఘములో చేయబడిన దానిని చూచుటను, మరియొకరు తన సంఘములో జరిగినదానిని చూచి దేవునికి స్తుతి చెల్లించుటను నేను వినగోరుదును. ఖచ్చితముగా వారు చేసినది అదే.
ACTS 4:25,31
126మరియు అపోస్తలుల కార్యములు 4లో, వారు కూడా వచ్చి, మరియు సహవాసములో కలుసుకున్నప్పుడు, దేవుడు ఇక్కడ ఏమి చేసాడనియు మరియు దేవుడచ్చట ఏమి చేసాడనియు వారు వివరణ ఇవ్వసాగిరి. పేతురు మరియు యోహాను కొరడాతో కొట్టబడిరి. మరియు వారు గనుక యేసు నామమున బట్టి ఎంత మాత్రమైనా బోధించినయెడల వారిని ఏమి చేయుదమా అని తాము భయపెట్టిరి… మరియు వారు వారి ప్రజలతో కూడుకొని మరియు వారందరూ ఏకమనస్సుతో ప్రార్థించిరి, మరియు దేవుని చిత్తప్రకారం ప్రార్థన చేసి మరియు లేఖనమును ఎత్తి చూపిరి. "అన్యజనులు ఏల అల్లరి చేసిరి మరియు ప్రజలెందుకు వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకొనిరి." మరియు వారు ప్రార్ధించగానే, వారు కూడియున్న చోటును పరిశుద్ధాత్మడు కంపింపచేసెను. మనకు అటువంటి ఒక కూటము అవసరమైయన్నది. సహోదరులారా, మనము కలిగియుండవలసినది అదే అయున్నది.
ACTS 7:2,51•
2TIM 1:12
127దేవుని యొక్క వాక్యముతోను, దేవుని యొక్క ఆత్మతోను, దేవుని యొక్క శక్తితోను మనము దృఢపరచబడుదుము గాక. మరియు మనము సైఫనువలే ఇప్పుడు మన వెలుగును ప్రకాశింపజేయుదుము.
అతను అచ్చట నిలబడెను, బహుశా ఐదు లక్షలమందితో ఉన్న ఆ సన్హేద్రిన్ సభ ఎదుట, ఒక్క మనుష్యుడు, ఒంటరిగా అచ్చట నిలబడియుండెను. వారిలో ప్రతీ ఒక్కరు అతని ముఖమువైపు తమ వేలెత్తి చూపుచు, నేరారోపణ చేసిరి. చిన్నవాడైన అతడు అక్కడికి నడిచి వచ్చినప్పుడు, ఇట్లు చెప్పబడెను, "అతని ముఖము దేవదూతవలె ప్రకాశించెను." బహుశా అతని ముఖముపై ఆ విధంగా ఏదో ఒక వెలుతురు పడుటయని నా భావము కాదు. ఒక దేవదూత తనపై ఒక వెలుతురును కలిగియుండనక్కరలేదు. అయితే ఒక దూత అనగా ఒక మనుష్యుడు లేదా… ఒక దూత అనగా ఒక వర్తమానికుడై యుండెను, తాను ఏమి మాట్లాడుచున్నాడో అతడు ఎరిగియున్న ఒక వర్తమానికుడై యుండెను. అతను అచ్చటికి నడుచుకొని వచ్చి మరియు చెప్పెను, "సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము మెసపొటేమియలో నుండి ఎట్లు బయటకు తీసుకురాబడెనో, మరియు మొదలుగునవి మరియు ఇంకా ఫలాన, ఫలానావి చెప్పెను. మరియు పిదప అతడు కొల్లగొట్టే విషయానికి వచ్చి ఇలాగు చెప్పెను, "ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఎదిరించుచున్నారు? మీ పితరులవలెనె మీరును చేయుచున్నారు." అతను ఎచ్చట నిలబడియున్నాడో ఖచ్చితముగా అతడు ఎరిగియున్నాడు. ఆ కారణముచేతనే అతడు ప్రకాశించెను. అతడు కొంచమైనను భయపడలేదు. అతడు ఎవనియందు నమ్మిక ఉంచెనో అతడు ఎరిగియున్నాడు.
పరిశుద్ద పౌలు యొక్క హృదయమును మరణము తట్టినప్పుడు కూడా అంతే మరియు అతడు ఇలా చెప్పెను, "నేను నమ్మినవానిని ఎరుగుదును, మరియు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢీగా నమ్ముచున్నాను." ఆమేన్!
128సహోదరులారా, ప్రభువు మిమ్మును దీవించును. పదకొండు కావుటకు ఇంకా ఇరవై-ఐదు నిమిషాల వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు నన్ను మన్నించండి. ఇది మీకు అలవాటు కాదని నాకు తెలియును. దీనిని చేసినందుకు నన్ను మన్నించండి, అయితే ఈ రాత్రి మీరు నిజంగా మంచిగా ఉన్నారు; మీలో ఎవ్వరు వెళ్ళిపోలేదు. మీరు కూర్చొని మరియు మీ ధ్యాసను మళ్ళించకుండా ఉన్నారు; మరియు విరిగిపోయిన నా ఈ చిన్న తత్తరపాటు ప్రసంగంలో, పరిశుద్ధాత్ముడైన దేవుడు మీ హృదయములో ఎక్కడో ఒక చిన్న విత్తనమును వేసియున్నాడనియు తద్వార బావినొద్ద ఉన్న ఆ స్త్రీవలే మరియు నిత్యజీవమునకు ముందుగా నిర్ణయించబడిన ఆ ఇతరులవలే, దేవుని యొక్క శక్తి దానిని తాకి మరియు దానిని జీవములోకి తీసుకువచ్చునని నేను నమ్ముచున్నాను మరియు ఆశిస్తున్నాను. ప్రభువు మిమ్మును దీవించును.
సహోదరుడా నెవిల్, సెలవు ఇవ్వబోవుచున్నావా, లేదా నీవేమి చేయగోరుచున్నావు? నీవెట్లు చేయుదువు. కేవలం… మీరు ఆయనను ప్రేమించుచున్నారా? మీరు ఆయనను నమ్ముదురా? ఆమేన్! మీరు ఆయనను నమ్ముదురా? ఆమేన్!
మీరు ఆయనను ప్రేమించుదురా? ఆమేన్.
మీరు ఆయనను సేవించుదురా? ఆమేన్.
మీరు ఆయనను నమ్ముదురా? ఆమేన్. ఆమేన్, ఆమేన్.
మేము దానిని పాడగోరుచున్నాము. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
బైబిలు సత్యమైనది. ఆమేన్.
నేను దానిని నమ్ముదును. ఆమేన్.
అది దేవుని యొక్క వాక్యమైయున్నది.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మనము లేచి నిలబడుదుము.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రభువా, మేము నిన్ను ప్రేమించుచున్నాము.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
నీవు వచ్చుచున్నావని మేము నమ్ముచున్నాము. ఆమేన్
నిన్ను ఎదుర్కొనుటకు మేము సిద్దముగా ఉన్నాము.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రభువైన యేసు, రమ్ము. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆయనను సేవించుటకు మమ్మల్ని అన్ని వేళలా ఉత్తములుగా ఉండునట్లు చేయమని మేము ప్రార్థించుచున్నాము, దేవా.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆయన మిమ్మును ఆశీర్వదించి, మరియు మిమ్మును భద్రపరిచి, మరియు మిమ్మును కాపాడి మరియు మన మధ్య కావలియుండి, మరియు గొప్ప కార్యములు చేయుటకు ఆయన రాజ్యములోనికి మిమ్మును మండించి మరియు మనము మరలా కలుసుకొనేంతవరకు రంగము మీద నాకు సహాయము చేయునని నేను నమ్ముచున్నాను.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
నేను మీ కొరకు ప్రార్థించుదును; మీరు నా కొరకు ప్రార్థించెదరా?
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
129మా తండ్రి, మేమందరము ప్రేమించే మరియు ఆరాధించే ఆ ప్రియమైన మరియు ఇష్టమైన నామము, ప్రభువైన యేసుక్రీస్తు అను ఘనమైన నామములో ఈ రాత్రి మేము కూడుకొనియున్నాము. సంవత్సముల తరబడి, ముప్పది లేదా ఇంకా ఎక్కువ సంవత్సరములుగా గుంపుల కొద్ది పురుషులుగా ఈ పాతదైన చిన్న భవనములో మేము ఎట్లు కూడుకొనేవారమో అని నేను ఆలోచించుచున్నాను. దాదాపు మా పాదములు గడ్డకట్టుచుండగా, పొయ్యి చుట్టూ మేము ఎట్లు కూర్చునియుండేవారమో, మరియు అచ్చట కూర్చుని ఆ పొయ్యి మీద మా పాదములు ఆనించి, మరియు ప్రభువైన యేసును గూర్చి మాటలాడుకొనేవారము. ఒకప్పుడు అచ్చట దానికి ఎదురుగా వారి పాదములు పెట్టుకొని కూర్చునియుండి, ఈ భూమి మీద నడిచిన కొన్ని ప్రశస్తమైన పాదములను గూర్చి నేను ఆలోచించుచున్నాను. సహోదరుడు స్టీవార్డు, సహోదరుడు స్పార్క్స్, సహోదరుడు జార్జి డేఆర్క్, ఇంకా ఆ పొయ్యికి ఎదురుగా తమ పాదములు పెట్టుకొని కూర్చున్నవారై, ఈ రాత్రి తమ ప్రభువును కలుసుకొనుటకు వెళ్ళియుండి, దూరాన సమాధిలో విశ్రాంతి నొందుచు, పై నుండి పిలుపు కొరకు వేచియున్న అనేక ప్రశస్తమైన ఆత్మల గూర్చి నేను ఆలోచించుచున్నాను. వారొక పోరాటము పోరాడినారు. వారు విశ్వాసమును కాపాడుకున్నారు. వారి పరుగును తుదముట్టించినారు. ఇప్పుడు వారు నీతిమంతుడైన న్యాయాధిపతి అయిన ఆ ప్రభువు యొక్క నీతి కీరీటమునకై వేచియున్నారు, ఆ దినమున వారికి ఇచ్చును.
130తండ్రివైన దేవా, ఆ మూలలో, ఈ చిన్న సంఘమును మేము ప్రతిష్టించినప్పుడు, మేము ప్రార్ధించి మరియు ఇట్లు చెప్పియున్నాము, "ప్రభువైన యేసూ, సంఘమును శీఘ్రముగా కొనిపోవుటకు, గగనమును చీల్చుకొని నీవు ఆ రహస్యముగా వచ్చువరకు దీనిని నిలబడనీయుము, మరియు ప్రజలను దీనిలో ఉండనీయుము. దేవా, గత ముప్పై ఏండ్లుగా వెనుకకు మరియు ముందుకు, వెనుకకు మరియు ముందుకు, మరియు వెనుకకు మరియు ముందుకు ఇచ్చట నాటబడియున్న సువార్త విత్తనము ద్వారా ఆ ముందుగా నిర్ణయించబడిన జీవమునొద్దకు ఈ వాక్యమును తీసుకొనివచ్చుటకు మేము వినియోగించిన ఈ బలహీనమైన ప్రయత్నములను బట్టి, ఈ వేదిక యొద్దకు వచ్చిన ఆత్మలను గూర్చియూ, నిన్ను సేవించిన ఆత్మలను గూర్చియూ, ఆ దినమున అచ్చట ఉందురని మేము నమ్ముచున్న ఆ ప్రశస్త ప్రజలు అనేకులకు గూర్చియూ మేము ప్రార్ధించుచున్నాము. దానికొరకై నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు దేవా, ఆ దినమున రక్తముచేత కప్పబడి, యేసులో లంగరు వేయబడియున్నవారిలో, ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరైననూ తప్పిపోకుండా ఉందురని నమ్ముచున్నాను." తండ్రీ, దీనిని అనుగ్రహించండి. మేము ఆయనయందు నమ్మిక ఉంచియున్నాము.
131ఇప్పుడు, మరలా ఆదివారము ఉదయమున, మనలో అనేకులు ఇచ్చట కలుసుకొందుము. మరియు దేవా, మీరు మమ్ములను కలుసుకొని మరియు జీవపు రొట్టెను మా కొరకు విరువమని మేము ప్రార్ధించుచున్నాము. దేవా, సహోదరుడు రడెల్ ను మరియు ఎక్కడైతే అతనితో కూడా నివాసము చేయుచున్నవారు ఉన్నారో ఆ ప్రాంతమును మేము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ప్రభువా, ఆ ప్రశస్తమైన పిల్లవాడితో ఉండమని నేను ప్రార్ధించుచున్నాను. అతడు మరియు ఈ యవనస్తులు వచ్చుటను నేను చూచుచుండగా, వారు నా తిమోతీలు, అని నేను భావించుకొనుచున్నాను. తండ్రీ, సహోదరుడు రడెల్ ను మరియు అతని పరిచర్యను మీరు ఆశీర్వదించవలసిందిగా నేను ప్రార్ధించుచున్నాను. సహోదరుడు జూనియర్ జాక్సన్ ను ఆశీర్వదించండి. ఓ దేవా, అతనిపై, సహోదరుడు క్రేస్ పై, సహోదరుడు స్నెల్లింగు పై, అతని స్థానమును తీసికొనుచున్న ఈ సహోదరుని పై మరియు సహోదరుడు వీలర్ పై మరియు ఇక్కడున్న ఈ సహోదరులందరిపై మరియు సహోదరుడు నెవిల్ పై మరియు మాలో ప్రతీయొక్కరిపై మీ ఆశీర్వాదములు ఉండునట్లు మేము ప్రార్ధించుచున్నాము ప్రభువా, మేము కొనసాగుటకు మాకు అవసరమైనదల్లా నీ కృపే అనియు, నీ ఆశీర్వాదములకు మా చిరునవ్వే నిదర్శనముగా ఉండునట్లు చేయుమనియు మేము ప్రార్ధించుచున్నాము. మరియు ఈ రాత్రి ఆ చిన్న వాఖ్యానమును మేము మరవకుందుము గాక. ముగింపు ఎట్లుండెనో ఎరుగకుండా, అల్పురాలైన ఆ స్త్రీ అచ్చట నిలబడియుండెను; అయితే యేసు తనను లక్ష్యపెట్టవలెనని ఆపేక్షించుచున్నాడు. మరియు దానిని ఆమె ఆయనకు చేయుచున్నది, అవును, ఆయన పాదములను కడుగుచున్నది. అది ఆయన శిష్యులమని చెప్పుకొనువారు సైతము దానిని చేయుటలో విఫలమైనటువంటి, ఒక నిర్లక్ష్యము చేయబడ్డ కార్యము వంటిదైయున్నది, మరియు వారు ఆయనను ఎగతాళి చేయుటకు ప్రయత్నించుచున్నారు. కాని ఆమె మాత్రం ఒక ప్రతిఫలమును ఆశించకుండా ఆయనకొక పరిచర్యను చేసెను, మరియు అంతకంటే ఘనమైన సమర్పణ మరొకటి ఉండబోదు.
MATT 25:21
132దేవా, మేము కూడా అట్లే చేయుదుము గాక, కేవలం ముందుకు సాగిపోవుచూ మరియు దేవుని సేవను చేయుదుము గాక, మరియు ప్రభువా, మేము ఆశించునదంతయూ ఏమనగా, ఆ దినమున, "బాగుగా చేసితివి, భళా, నమ్మకమైన మంచి దాసుడా. జగత్తు పునాది వేయబడకముందే నీ కొరకు సిద్ధపరచియుంచిన ప్రభవు యొక్క సంతోషములో పాలుపొందుము," అని వినుటయైయున్నది. దేవా, మేము దానిని చేయునట్లును మరియు ఒకరితో ఒకరము సహవాసమును కాపాడుకొనునట్లునూ అనుగ్రహించండి. మరియు పరిశుద్ధాత్మ మాకు మార్గదర్శిగా ఉండి మరియు మేము చేయువాటన్నింటిలో మమ్ములను నడిపించును గాక. మరియు బహుశా సాధ్యమైనచో ప్రభువైన యేసు యొక్క రాకడను చూచుటకై మాకు దీర్ఘాయువును దయచేయండి. దీనిని ఆయన యొక్క నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను
బంధించిన బంధము ఎంత ధన్యమైనది;
పరమందు దానివలేనున్న
బంధుత్వపు మనస్సుతో కూడిన సహవాసము.
మనము దూరముగా వెళ్ళినప్పుడు,
అది మనలో బాధను కలిగించును;
కాని మనము ఇంకా హృదయములో కలిసే ఉండగలము,
మరల కలసికొనెదమని నిరీక్షించెదము.
పరిశుద్ధ గ్రంథము ఈలాగు చెప్పెను, "వారు ఒక కీర్తన పాడి మరియు బయటకు వెళ్లిరి." ఇప్పుడు, ప్రభువు చిత్తమైనయెడల, ఆదివారం ఉదయమున నేను మరలా మిమ్ములను చూచువరకు, ప్రభువు మిమ్ములను దీవించును గాక, ఇక సెలవు.