అంత్య-కాల సువార్త
VGR COUNT-259 1ఆర్మన్ సహోదరుడా, వందనములు. ఒక చిన్న ప్రార్ధన నిమిత్తమై ఇప్పుడు మన తలలు వంచుదాము. మరియు మన తలలు వంచియుండగా, చేతిని పైకెత్తుట ద్వారా ఒక ప్రత్యేక విన్నపమును తెలియజేయగోరువారు ఎవరైనా ఇచ్చట ఉన్నారా అని నేను తలంచుచున్నాను. దేవుడు ఈ విషయములను చూచును, నేను ఆ నిశ్చయత కలిగియున్నాను. ఆయన దానిని అనుగ్రహించునని నమ్ముచున్నాను.
MATT 18:20
2మా పరలోకపు తండ్రీ, మా ప్రభువైన యేసు నామమును ఘనపరచుటకు తప్ప మరే ఇతర అవసరతకూ మేము ఇక్కడ సమకూడలేదు. మరియు ఇప్పటికే మేము ఆయన సన్నిధిని అనుభూతి చెందియున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఆయన మమ్మల్ని సంధిస్తారు అనే నిశ్చయత మేము కలిగియున్నాము, ఏలయనగా, "ఎక్కడ ఇద్దరు లేక ఇంకా ఎక్కువమంది నా నామమున కూడుదురో, వారిమధ్య నేనుంటాను," అని ఆయన వాగ్ధానమున్నది. ప్రభువా, ఈ రోజు, ఇప్పుడు చేతులు పైకెత్తుట ద్వారా తెలియపరచబడిన విన్నపముల విషయమై మీ ఆశీర్వాదములను అడుగుతున్నాము. ఆ చేతి క్రింద, హృదయంలో ఏముందో మీరెరుగుదురు, మరియు మీరు ప్రతిఒక్కరికి బదులిచ్చెదరని నేను ప్రార్ధిస్తున్నాను.
ఈ రోజు మిమ్మల్ని ఆరాధించుటకైన అవకాశమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఒక సంఘము, ఒక జనము, మరియు ఒకే రకమైన ప్రశస్త విశ్వాసము కలిగిన సహోదరులను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మరియు ఈ రోజు మీరు మా హృదయ వాంఛలను అనుగ్రహించెదరని అడుగుచున్నాము, అది మిమ్ము సేవించుటయై యున్నది. బైబిలులో, ఈయబడింది అని మీరు చెప్పిన ఆ మరుగైన మన్నాతో మమ్మల్ని పోషించండి, అది కేవలం యాజకులకై ఉంచబడింది. మరియు ఆత్మీయ బలులను అనగా, మా జిహ్వ ఫలములను, ఆయన నామమునకు స్తోత్రములను అర్పిస్తున్న మేము దేవుని యాజకులమని మాకు బోధించబడింది. ఇప్పుడు ముందున్న ఆరాధన భాగములో, జీవాహారమును మాకై విరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ప్రార్ధించుచున్నాము. యేసు నామములో ఆమేన్.
TIT 2:13
3ఈ ఉదయం మన పెద్ద కుటుంబమును మరల తిరిగి చూచుటకు సంతోషిస్తున్నాను, మరియు మీతో ఇక్కడ ఉండుటను బట్టి ఆనందిస్తున్నాను. మరియు దేశములో వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ, ఆదివారం ఉదయం మనతో కూడి ఇక్కడున్న కొత్తవారికి. మాకు ఏ సంఘ శాఖా లేదు. మనము కేవలము కూడుకుంటాము; దేవునియందు విశ్వాసముంచు జనులు కలిసి ప్రభువును ఆరాధించుటకు, కలిసి కూడుకొని, మరియు మన ప్రార్థనలను దేవునికి ఆర్పించుట, మన ఒప్పుకోలులను ఆయనకు తెలియపరచుట. మరియు ప్రతి ఆదివారమూ మరియు ప్రతిరోజూ మనము ఒక పర్గేటరీ, (మృతులు తమ పాపముల వెల చెల్లించుటకు ఒక స్థలముందనీ, వారి బంధువులు క్యాథలిక్ యూజకులకు తగినంత సొమ్ము చెల్లిస్తే వారు వల్లించే ప్రార్ధనల వలన మృతులు శుద్దీకరించబడి పరలోకములో ప్రవేశించడానికి అర్హత పొందుతారనీ క్యాథలిక్ విశ్వాసము. ఆ శుద్దీకరణ స్థలాన్ని వారు "పర్గేటరీ" అంటారు — తర్జుమాదారుడు.) గుండా వెళ్తాము, అనగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలను మన పాపముల నుండి శుద్ధిచేయుట, ఏ సమయమందైనా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ, ఈ ప్రస్తుత కాలములో మనకు తెలిసినంత దగ్గరగా భక్తిగలిగి జీవించుట. మరియు ఏ క్షణంలోనైనా మనము దానికొరకు ఎదురు చూస్తున్నాము.
4ఇప్పుడు, ఈ రోజు మనకు ఒక పెద్ద కార్యక్రమము ఉంది. ఈ ఉదయం మనకిక్కడ ఆదివారపుబడి ఆరాధన ఉంది, మరియు తర్వాత ఈ రాత్రి మనకు చాలా ప్రత్యేకమైన కార్యక్రమముంది. నా మంచి స్నేహితుడు, సహోదరుడు జోసెఫ్ బోయే, ఇక్కడ మన మధ్య ఆయన కొత్తవాడు కాదు, కానీ మనల్ని సంఘములో ఆయన సందర్శించటం ఇదే మొదటిసారి అని నేను నమ్ముచున్నాను. నేను ప్రయాణించిన ప్రపంచం మొత్తంలో, నేను ఎల్లప్పుడూ "ఆదర్శ సంఘాలు" అని పిలిచే రెండు సంఘాలు నాకున్నాయి, వాటిలో ఒకటి ఇలినాయిస్ నందలి షికాగోలోని సహోదరుడు జోసెఫ్ బోయే యొక్క ఫిలడెల్ఫియా సంఘము, మరియు రెండవది లూయిసియనా లోని ష్రీవ్ పోర్టీనందలి సహోదరుడు జాక్ మూర్ యొక్క సంఘము. నేను ఆ సంఘాల వద్ద ఎంతగా ఉన్నానంటే, నేను సువార్త ప్రయాణాల నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎవరో ఒకరు "బ్రెన్హాం సహోదరుడిని కలవాలంటే జెఫర్సన్ విల్ ఫోన్ చెయ్యొద్దు, షికాగో చెయ్యండి చాలు. ఆయన అక్కడ లేకపోతే, మంచిది అప్పుడు ష్రీవ్ పోర్ట్ ఫోన్ చెయ్యండి," అంటారు. అంతగా నేను అక్కడ ఉన్నాను.
5జోసెఫ్ షికాగోని విడిచిపెట్టాడు. ఆయన షికాగోని విడిచి వెళ్ళాలని మొదట ఆలోచించినప్పుడు మా హృదయం బ్రద్దలయ్యింది, కానీ ప్రార్ధించిన తర్వాత అది దేవుడు ఆయనకు ఇస్తున్న పిలుపని కనుగొన్నాము. మరియు ఇప్పుడు నాయొక్క ఈ చిన్న స్నేహితుడు టాంగాన్యికా, మరియు కెన్యా మరియు ఉగాండాలో ఒక గొప్ప పనిలో మండుచున్నాడు మరియు ఒక గొప్ప పనిచేస్తున్నాడు. మరియు, ఈ కూటములలో, మనము చేయగలిగిన ప్రతి మార్గములోనూ ఆయనకు సహాయం చేయ్యాలనుకుంటున్నాము. దేవుని చిత్తమైతే, ఈ రాబోయే జనవరిలో, ఆయన పాఠశాలల నుండి దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పుడు, అక్కడ ఆఫ్రికా అంతటా ఉన్న ఆయన పాఠశాలల్లో, ఆయనతో ఉండాలని ప్రణాళిక వేసుకుంటున్నాను. ఈ రాత్రి ఆయన సంఘాన్ని సంబోధించినప్పుడు దాని గురించి ఆయన ఇంకా చెప్తారు. ముందు పనులన్నీ అయిపోగానే, ఈ మధ్యాహ్నం, దాదాపు ఎనిమిది గంటలకు, ఆయన మీతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న ఫిల్ము (చలనచిత్రం - తర్జుమాదారుడు) చూడటానికి మీరు ఇష్టపడతారని నేను నిశ్చయత కలిగియున్నాను. మరియు ఆ ఫిల్ము ఆఫ్రికాలో ఉన్న ఆయన పాఠశాలల గురించి: స్వల్పమైన ఈ కొద్ది సంవత్సరాలలో దేవుడు ఆయన కొరకు ఏమి చేశాడో దాని గురించి. ఆ ఫిల్ము చూడటం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది… ఎందుకంటే ఆయన చిత్తమునూ, స్థలమునూ కనుగొనే ఒక్క మనిషితో దేవుడు ఏమి చెయ్యగలడో అది చూపిస్తుంది. సంవత్సరాల పాటు దానిని కనుగొనుటకు వేచియుండిన తర్వాత, అప్పుడు దేవుడు తనను నడిపించిన త్రోవలో నడిచి పిల్లలను కూడా తీసుకు రండి, దీనిలో మొదటి భాగము చాలా చిన్న భాగము.
6మరియు మీలో చాలా మందికి తెలిసినట్లుగా, జోసెఫ్ కి చాలా హాస్య - చతురత ఉంది. అతని చిత్రాన్ని నేను చూస్తానని అతడు ఊహించి ఉంటాడని నేను అనుకుంటున్నాను, అందువల్ల ఒక సింహం చిత్రం తీయాలని, ఒక రాత్రి అతను బయటికి వెళ్ళాడు. ఆఫ్రికాలో సింహాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక జోసెఫ్ బయటికి వెళ్ళి ఒక సింహాన్ని తీస్తాడు. మరియు అది అత్యంత అందమైన విషయమని నేను అనుకున్నాను. తల్లి వేటాడి చంపిన తర్వాత, మరియు అవి ఆ జంతువును తినేసిన తర్వాత, అది చర్మాన్ని లాగుతుంది. మరియు ఆ చిన్న పిల్ల సింహం దాని వెనుక వెంబడిస్తూ, దానిని మరలా చంపుటకు ప్రయత్నిస్తున్నట్లు నటించుటకు ప్రయత్నిస్తుంది. మీరు చూశారా? మరియు ఆ ఫిల్ములో దాదాపు మొదటి ఐదు లేక పది నిమిషాలు యౌవనులు తప్పకుండా ఆశ్వాదిస్తారని నేననుకుంటున్నాను. ఇప్పుడు తొందరగా రండి.
7మరియు ఇది చెప్పుమని నాకు చెప్పబడలేదు. నాకిది చెప్పటం ఇష్టం లేదు. జోసెఫ్ కు దీని గురించి ఏమీ తెలియదు. కానీ, విదేశాలలో ఆయన పరిచర్యల విషయమై మన ప్రశంసను చూపించటానికి, ఈ రాత్రి జోసెఫ్ కు ఒక కానుక ఇవ్వబోతున్నామని నేను అనుకుంటున్నాను. ప్రభువైన యేసు వస్తున్నాడని మనము నమ్ముతున్నాము. మరియు సువార్త పరిచర్య కొరకూ, ఎంతైనా, లేదా సువార్తికుల కొరకూ మీరు పొదుపు చేసి ఉంచినట్లయితే, లేదా దానికి మీరు ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడితే, మీ చందా, మీ చెక్కును జోసెఫ్ బీ-ఓ-జెడ్-ఈ పేరిట వ్రాయండి. బీ-ఓ-జెడ్-ఈ, అది సరియే, కదా? జోసెఫ్ బోయే. మరియు సహోదరుడు జోసెఫ్ నాకు వ్యక్తిగతంగా ప్రియ మిత్రుడు, మరియు తనకున్న జ్ఞానమంతటితో, ఇది దేవుని రాజ్యం కొరకు వెళ్తుందని అతనికి తెలుసు.
8అందువల్ల మనము ముందుకు వెళ్ళేముందు, ఆయనను పరిచయం చేసి, ఇక్కడ ఒక మాట చెప్పునిద్దామనుకుంటున్నాను. ఈ ఉదయం ఆరాధన ఆయన తీసుకునేలా చేద్దామని ప్రయత్నించాను, కానీ ఆయన తీసుకోనన్నారు, కావున ఈ రాత్రి ఎనిమిది గంటలకి, లేదా ఆయనకి నచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. మరియు చిత్రం కొరకు ఇక్కడ కెమెరా మరియు తెర సిద్ధపరచబడతాయి. కానీ నా మంచి స్నేహితుడూ మరియు సహోదరుడూ అయిన జోసెఫ్ బోయేని ఇప్పుడే సంఘానికి చెప్పి పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. బోయే సహోదరుడా [బోయే సహోదరుడు సాక్ష్యమును పంచుకొన్నారు.] ధన్యవాదాలు బోయే సహోదరుడా, అది చాలా బాగుంది. ఇది ఒక స్వీడన్ మరియు ఐర్లాండ్ల కలయిక, జోసెఫ్, నిన్ను దేవుడు దీవించును గాక, జోసెఫ్ సహోదరుడా, నీ ప్రసంశలను బట్టి ధన్యవాదాలు. ఆయన గురించి నేనూ అదే చెప్పగలను. ఆఫ్రికాలో జరుగుతున్న ఈయన గొప్ప పనినిబట్టి ప్రభువుకు ఎంతో కృతజ్ఞలం, మరియు ఈ రాత్రి ఈయన దాని గురించి మీకు ఇంకా చెప్తారు.
9మరియు ఇప్పుడు బిల్లీ బయటికి జారివచ్చి సహోదరుడు నెవిల్ని గాని మరొకరిని గానీ కలిగియుండాలని నాతో చెప్పాడు. వెనుక వైపు ధ్వని అంత బాగాలేదు. అయినా బహుశా, ఆ వెనుక కూర్చున్న మీరు సరిగ్గా వినగలుగుతున్నారా? లేదు, వారు అంత బాగా వినలేకపోతున్నారు. మీరు మిషనును సవరిస్తారా?
అతను అది చేయుటకు మనము ఎదురుచూస్తూ౦డగా, నా సోదరుని కుమార్తె, డోనా, ఆమె మరియు టెడ్డీ ఒక చిన్నపిల్లవాన్ని ప్రభువునకు ప్రతిష్టించాలనుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరియు, కావున, డోనా, ఇప్పుడు నీవు ఆ చిన్న పిల్లవాన్ని తీసుకువస్తే, ఎందుకు మరియు మనము చూద్దాము. పియానో వద్ద సహోదరి ఎక్కడ, వాయించే సహోదరి, ఆమె ఉన్నదా?
MATT 19:14•
MARK 10:14•
LUKE 18:16
10(ఇక్కడున్న ఇదా? సరేనయ్యా, అది బాగుంటుంది. సరే.) నేను తప్పు స్థలంలో ఉండియున్నాను. తప్పు స్థలంలో ఉన్నది నేనేనని అనుకుంటున్నాను.
ఇప్పుడు, మనము సాధారణంగా ఈ సమయంతో చిన్నపిల్లల కోసం పాడే ఒక చిన్న పాట వుంది, అది "వారిని లోపలికి తీసుకురండి, చిన్నవారిని యేసునొద్దకు తీసుకు రండి." ఇప్పుడు…
ఇప్పుడు చాలా సంఘాలు ఈ చిన్నవారిపై చిలకరిస్తాయి, మరియు వారది చేయాలనుకుంటే, అది చేయటం, అదంతా సరియే. నాకు సంబంధించినంత వరకూ అదంతా సరియే. మరియు ఇతరులకు మార్గాలున్నాయి, బహుశా, వారు దానిని బాప్తిస్మమనవచ్చు మరియు వారు దానిని బాప్తిస్మమని పిలవాలనుకుంటే నాకు సంబంధించినంత వరకూ అది సరియే.
కాని మనము అనుసరించాలని ప్రయత్నించేది లేఖనాలని, అచ్చం బైబిల్ దానిని చెప్పినట్లుగా, కేవలం లేఖనాలను ఖచ్చితంగా ఆచరించటం. చిన్నపిల్లలను వారు యేసునొద్దకు తెచ్చినప్పుడు మరియు ఆయన వారిని దీవించి, "చిన్నపిల్లలను నా యొద్దకు రానిమ్ము, ఏలయనగా పరలోక రాజ్యము వారివంటి వారిదే," అని చెప్పటం తప్పు బైబిల్లోని క్రొత్త నిబంధనలో మరొక చోటు లేదు. ఇప్పుడు మనం దానిని అదే విధంగా చేస్తాము. పాస్టరూ, నేనూ అక్కడ నిలబడియుండగా, చిన్నవానిని తీసుకొని, మరియు ప్రభువునకు ప్రతిష్ఠ ప్రార్థన చేయుదుము. మరియు తర్వాత వారు…
PS 51:5
11మరియు ఒక శిశువుకి పాపం ఉండదని మేమనుకుంటున్నాము, అది దేనియందైతే పుట్టిందో ఆ పాపము కంటే ఎంత మాత్రం ఎక్కువ పాపం లేదు. మనమంతా పాపంలో పుట్టి, అతిక్రమములో రూపించబడి, అబద్దాలు పలుకుతూ లోకంలోకి వచ్చాము. మరియు ఇప్పుడు, యేసు కల్వరి యొద్ద చనిపోయినప్పుడు, ఆయన లోకము యొక్క పాపములను తీసుకొనిపోయెను. అప్పుడు శిశువు పుట్టి ఉండవచ్చు, లేక పుట్టక మునుపే చనిపోవచ్చు; లేదా పుట్టి, బాధ్యతవహించగల వయసుకు రాక మునుపు, దానికి ఏ పాపములూ ఉండవు. యేసు లోకము యొక్క పాపములను తీసికొనిపోయెను. కాని అది తగినంత వయస్సు వచ్చిన తర్వాత పాపములు చేసినట్లైతే, అప్పుడు అది దాని పాపములను ఒప్పుకొని, మరియు పాప పరిహారము నిమిత్తము బాప్తిస్మము పొందవలసియున్నది. మీరు చూశారా. కాని ఇప్పుడు, సరే, అది చాలా చిన్నది.
12ఇప్పుడు, మనమంతా ఈ మంచి పాత కీర్తన పాడుదాం, మనమిప్పుడు పాడుదాం. నేను పాడగలనో లేదో
వారిని లోపలికి తీసుకు రమ్ము, వారిని లోపలికి తీసుకు రమ్ము,
పాపము యొక్క పొలముల నుండి వారిని లోపలికి తీసుకు రమ్ము;
లోపలికి తీసుకు రమ్ము, లోపలికి తీసుకు రమ్ము,
చిన్నవారిని యేసు నొద్దకు తీసుకు రమ్ము.
వీని పేరేంటి? టెడ్డీ, జూనియర్. సరేనయ్యా. ఈ ఉదయం, ఈ మంచి చిన్న టెడ్డీతో ఈ యౌవ్వన జంటను ఇక్కడ చూడటానికి మనమెంతో సంతోషిస్తున్నాం, మరియు దేవుడు వీడిని సమృద్ధిగా దీవించాలని, రాబోవు లోకంలో నిత్యజీవాన్నీ ఇక్కడ దీర్ఘాయువునూ ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాము. నేనొక్క నిమిషం వీడిని పట్టుకోవచ్చా? వీడు చిన్న టెడ్డీ ఆర్నాల్డ్ అందరికీ ఇక్కడ టెడ్డీ తెలుసును - ఇక్కడ సంఘంలో అతడు మన సహోదరుడు, నా సోదరుని కుమార్తె డోనాను పెండ్లి చేసుకున్నాడు. మరియు వారికి ఈ చిన్నవాడు కలిగాడు, ఒక కొత్తవాడు. ఇది మీ రెండవవాడనుకుంటున్నాను. ఇంకొకరు ఒక చిన్న అమ్మాయి, అది సరియేనా? వీడొక కాంతివంతముగా కన్పిస్తున్న చిన్నవాడు. వారు వచ్చినప్పుడు వారిని విరిచేస్తానేమోనని నేను ఎల్లప్పుడూ భయపడతాను. చాలా నాజూకుగా, వారు విరిగిపోతారేమోనని నాకు భయము.
ఒక తల్లి తన చిన్నవానిని ఈ విధంగా ప్రభువైన యేసునొద్దకు తీసుకురావటం మీరూహించగలరా? ఈ ఉదయం ఆయన ఇక్కడ వ్యక్తిగతంగా, మనము నిలుచున్నట్లు ఉన్నట్లయితే, ఈ తల్లి త్వరపడి ఆయన యొద్దకు వెళ్ళి, ఆయన ఈ శిశువు పై చేతులుంచి, దీనిని దీవించాలని కోరును. తండ్రి హృదయము ఆనందముతో గంతులు వేయును. దేవుడు వారి కలయికకు దీనిని అనుగ్రహించాడని, మరియు దేవుడు వారికి ఇచ్చినందులకు ప్రశంసాపూర్వకముగా వారు తిరిగి దీనిని ఆయనకు సమర్పించాలనుకుంటున్నారనీ మనకు తెలుసు. మన తలలు వంచుదాము.
13మా పరలోకపు తండ్రీ, మీ ఉదాహరణను మేము అనుసరించుటకు ప్రయత్నించుచున్నాము. తల్లులునూ, తండ్రులునూ చిన్నపిల్లలను మీ యొద్దకు తెచ్చినప్పుడు, మీరు వారిపై మీ చేతి నుంచి వారిని దీవించారు. మరియు పరలోకపు తండ్రీ, ఇప్పుడు ఈ యౌవ్వన జంట, వారి ఇంట ఈ చిన్నబాలుని, చిన్న టెడ్డి ఆర్మాల్డ్ జూనియర్ను స్వీకరించుటకు ఆశీర్వదించబడింది. కావున, పరలోక తండ్రీ, ఈ చిన్నవానిపై మీ ఆశీర్వాదములు ఉండాలని మేము ప్రార్ధిస్తున్నాము. మీ గొప్ప వాక్యము యొక్క జ్ఞాపకముగా మేము జనులపై చేతులుంచాలని, మీరు చేసిన వాగ్ధానముయొక్క జ్ఞాపకమును బట్టి మేము దీనిపై చేతులుంచుచున్నాము. చిన్న టెడ్డీని దీవించండి. దేవా, దీర్ఘాయువునూ, మంచి ఆరోగ్యాన్ని మీరు వీనికి దయచేయాలని మేము ప్రార్ధిస్తున్నాము. అది సాధ్యమైతే ప్రభువు రాకడను చూచుటకు వీడు జీవించు గాక, మరియు వీని తండ్రి, మరియు తల్లి కొరకు ప్రార్ధిస్తున్నాము, ఈ పిల్లవాని పెంచుట ద్వారా వారు ఆశీర్వదింపబడుదురు గాక. మరియు రేపు అనునది ఒకటి ఉన్నట్లయితే, ప్రభువా, వీనిని సువార్త యొక్క సేవకునిగా చేయువు, మరియు వీడు జీవమును, సమృద్ధియైన జీవమును కలిగియుండునట్లుగా, మీరు మానవజాతికి వాగ్దానము చేసిన వాటిని వీనికి ఇమ్ము ఇప్పుడు, చిన్న టెడ్డీ ఆర్మాల్డ్ ను యేసుక్రీస్తు నామములో మీకిచ్చుచున్నాము ఆమేన్.
డోనా మరియు టెడ్డీ, దేవుడు మిమ్మును దీవించును గాక, దీర్ఘాయుస్సు మరియు అనేక దీవెనలు; మరియు నీకునూ చిన్న టెడ్డీ, ఏలయనగా ఆయన మిమ్ము ప్రేమించుచున్నాడు.
14ఓ, వారు చాలా అందంగా ఉంటారని నేననుకుంటున్నాను, నేను చిన్నపిల్లలు నేను మనుష్యులందర్నీ ఇష్టపడతాను, కానీ అనుకుంటున్నాను, చిన్నపిల్లలూ మరియు వృద్దులూ, మీకు వయస్సు మీరినప్పుడు. త్రోవంతా పయనించి వచ్చిన ఒక వృద్దుడు లేక వృద్దురాలు, చాలా బలహీనంగా, మరియు వారు చాలా దయనీయంగా ఉంటారని నేనను కుంటున్నాను, మీకు తెలుసు, మరియు నేననుకుంటాను, మనము ఏనాడూ కూడా… వారు వీధి దాటుచుండగా చూసి, ఆగండి. అది మీ తండ్రి లేక తల్లి అయివుంటే ఏమై యుండేది? చూశారా? తండ్రి లేక తల్లి, కనుక వారిని గౌరవించండి. మరియు బహుశా వారు నెమ్మదిగా మరియు ఎక్కువసేపు మాట్లాడవచ్చును, మరియు మీకు వినటం ఇష్టం లేని విషయాలు, కాని గుర్తుంచుకోండి, ఒక రోజు మీరు కూడా ముసలివారు కావచ్చు, కావున ఎల్లప్పుడు వారిని గౌరవించండి.
MATT 18:10
15మరియు ఆ చిన్నవారు, వారిలో ఒకరికి ఎవరికి కీడు చేస్తారు? అలాగే, మీరది ఎన్నడూ చేయరాదు. మీకు తెలుసు, యేసు అన్నారు, "ఈ చిన్నవారిలో ఒకరిని మీరు అలక్ష్యము చేయకుండునట్లు మీరు జాగ్రత్తపడుడి, ఏలయనగా వారి దూతలు ఎల్లప్పుడూ పరలోకమందున్ననా తండ్రి ముఖమును చూచెదరు." గుర్తుంచుకోండి, వారికొక దూత ఉండును. మీరు పుట్టినప్పుడు అది జీవితమంతా మీతో ఉండును. మరియు ఇప్పుడు మీరు రక్షింపబడిన తరువాత, మీరు పరిశుద్ధాత్మను కలిగియుందురు, మరియు అది మీకు మార్గదర్శకత్వము వహించి నడిపించును.
16మరియు ఇప్పుడు నాకు తెలిసినవారిని చూచుటకు తిన్నగా శ్రోతల పైకి చూస్తున్నాను. మరియు నేను పొరబడనట్లయితే, బయట ఇక్కడ షికాగోనుండి ఒక సహోదరిని చూస్తున్నాను; చికాగోలో ప్రాతినిధ్యం వహించబడుట, ఒక రకంగా ఇంటి వద్ద ఉన్నట్లు అనిపిస్తుంది, అక్కడ ఆ దారి అంతటా సహోదరి పెకెన్పాగ్ మరియు ఇతరులు. మరియు సహోదరుడు కాక్స్ మరియు సహోదరి కాక్స్, మరియు చార్టీ, నెల్లీలను ఈ ఉదయం ఇక్కడ చూడటానికి మనము సంతోషిస్తున్నాము, ఏలయనగా వారు మనకు తెలుసు. సహోదరి కాక్స్, రాడ్నీ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నేననుకుంటున్నాను. మరియు ఇక్కడ పరిచారకులైన మన సహోదరులలో ఒకడైన సహోదరుడు విలార్డ్ క్రేజ్ మరియు ఇంకా చాలామంది ఇతరులు, నేను క్రింది వరకూ వెళ్ళి అందరినీ పిలువలేనంతమంది ఉన్నారు.
MARK 16:17,18
17వెనుక అక్కడ సహోదరుడు ఇవాన్స్ మరియు సహోదరి ఇవాన్స్ ను చూడటం సంతోషంగా ఉంది. రాటిల్-స్నేక్ అను పాము చేత కరవబడ్డాడని నేను మీకు చెబుతున్న మనుష్యుడతడే, మరియు ప్రభువు . ఇవాన్స్ సహోదరుడా, లోపల ఉన్నవారు అది చూచునట్లుగా నీ చేతిని గాని మరేదైనా పైకెత్తెదవా. మేము చేపలు పడుతూ ఉండగా, ఒక విష సర్పము తిన్నగా కాలిలోనికి కాటు వేసింది. మరియు అతని పై చేతులుంచి అతని కొరకు ప్రార్ధించగా, అది ఎన్నడూ కనీసం పుండు కూడా పడలేదు, లేదా ఆ తర్వాత మరెన్నడూ దానితో మరేం పని పడలేదు. మరియు మీకు తెలుసు, "వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురు; వారు తేళ్ళు మరియు సర్పముల యొక్క తలలపై నడిచెదరు, మరియు ఏదియూ వారికి హాని చేయదు; మరియు వారి నా నామములో, నా మీద విశ్వాసముంచు వారికే," అని బైబిల్ చెప్పుచున్నది, సమస్త శక్తులూ, మరియు అవి ఏమి చేయునో, మొదలగునవి మనకియ్యబడినవి. ఇప్పుడు మీరు కేవలం భయపడకుండినయెడల!
18ఒకరు నీకు ఒక చెక్కు ఇచ్చి దాని క్రింద ఒక పేరు సంతకము చేయబడి యున్నప్పుడు, నీ జీవితమంతా నీవు ఆ చెక్కును నీ జేబులో ఉంచుకొని తీసుకెళ్లే ఏమగును — అది నీకు ఏ మంచియూ చెయ్యదు. నీవు దానిని ద్రవ్యము కొరకు మార్చుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్ధానము క్రిందా యేసు యొక్క పేరు సంతకము చేయబడియున్నది. పరలోకపు బ్యాంకు బాధ్యత వహించును. మరియు కల్వరిపై పాపములు క్షమించబడినప్పుడు డిపాజిట్ కట్టబడింది. మనము దేవుని కుమారులూ మరియు కుమార్తెలుగా చేయబడ్డాము. కావున దేవుడు వాగ్ధానము చేసిన ఏ వరమునైనా ఉపయోగించుకొనుటకు భయపడవద్దు. గుర్తుంచుకోండి చాలు, ఆయన వాగ్ధానము చేశాడు, మరియు అది మీది.
ఆయన అగ్నిజ్వాలలను ఆపటం నేను చూశాను, రక్తాన్ని ఆపటం, దెయ్యం యొక్క హింసను చల్లార్చటం, శత్రువులను వెళ్ళగొట్టడం, మరియు క్యాన్సరును స్వస్థపరచటం, డాక్టరు అక్కడ నిలిచియుండగా మృతులను లేపడం, గంటలు తరబడి గంటల సేపు చనిపోయి ఉండగా, మళ్ళీ తిరిగి ప్రాణంతో లేపడం. పర్యాయము వెంబడి పర్యాయము వెంబడి పర్యాయము, నా చిన్న బలహీన పరిచర్యలోనే నేను దాన్ని చూశాను. అలా నేను క్రూర మృగాలు, అది కదలలేనంతగా మచ్చిక చేయబడం, మరియు అన్ని విషయలూ చూశాను. కావున ఆయన కేవలము… ఆయన ఇంకా దేవుడే. ఆయన ఎప్పుడైనా దేవుడై ఉన్నట్లయితే, ఆయన ఇంకా దేవుడే మరియు ఆయన ఎన్నడూ… మరియు ఆయన దేవుడు కానట్లయితే, ఆయన ఏనాడు దేవుడైయుండలేదు, ఏలయనగా ఆయన అయ్యుండవలసియున్నది… దేవుడై యుండుటకు ఆయన అనంతుడు అయ్యుండవలెను; ఆయనకన్నీ తెలుసు; ఆయన సర్వశక్తిమంతుడు అయ్యుండవలెను, సమస్త శక్తిగలవాడు, సర్వజ్ఞుడు, అంతటా ఉన్నవాడు. మరియు, ఓ, ఆయన కేవలం దేవుడు. పరిపూర్ణత యొక్క పరిపూర్ణత దేవుడు.
19ఇప్పుడు నా లక్ష్యము కాదు… కొన్నిసార్లు నేను ఈ ఆదివారపుబడి పాటాలు భోధించేటప్పుడు అలా అలా, దగ్గరగా నాలుగు గంటలు అయిపోతుంది. కొన్ని ఆదివారాల క్రితం నేనిక్కడ ఆరు గంటలున్నాను. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదని ఆశిస్తున్నాను, కానీ ఈ ఉదయం అది నా ఉద్దేశ్యం కాదు. కేవలం అయిదున్నర; లేదు కేవలం…
ఇప్పుడు నేను కొంతకాలం మీతో ఉండకపోవచ్చు. మేము వర్జీనియా వరకు వెళ్ళుతున్నాము, లేదా కరోలినా వరకూ, మరియు ఉత్తర మరియు దక్షిణ కరోలినా, మరియు తర్వాత పశ్చిమ తీరానికి, మరియు అప్పుడు పశ్చిమ తీరం నుండి పైకి కెనడా మరియు అలాస్కా మరియు తర్వాత వెనక్కి, మరియు, బహుశా, ప్రభువు చిత్తమైతే, ఆఫ్రికా వెళ్ళి జోసఫ్ని చూసి, మళ్ళీ క్రిందికి దక్షిణాఫ్రికా గుండా వెళ్ళవచ్చు.
20దేవుడు కేవలం ఆయన అద్భుతముల చేత, మొత్తం ఆఫ్రికా గతినే కేవలం కొన్ని గంటలలో మార్చివేసినప్పుడు, దక్షిణాఫ్రికలో కొంతకాలం క్రితం గొప్ప కూటములు కలిగియుంటిమి. అక్కడ వార్తాపత్రికలు మొదటి పేజీల్లో వ్యాసాలు ప్రచురించాయి, మొత్తం మొదటి, మరియు రెండవ, మరియు మూడవ పేజీల్లో కూటముల గురించిన వార్తలు తప్ప మరేమీ రాయలేదు. మొదట అక్కడికి వెళ్ళినప్పుడు వారు అస్సలు సహకరించలేదు, ఒక మనిషి కూటమునకు వెళ్ళుచున్నాడని వారు అతనికి పెట్రోలు కూడా ఇవ్వలేదు, అతనికి అమ్మటానికి ఇష్టపడలేదు, అన్నారు, "ఇలాంటి పిచ్చోడెవడైనా!" ఆ తర్వాత రోజు అతనికి ఉచితంగా పెట్రోలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు, చూశారా. కావున ఇప్పుడు, కేవలం ఆ తేడా, మీరు చూడండి, నేను ఒకానొకటి జరుగుతుంది. అక్కడ అతడొక చిన్న సింహపు పిల్లను పెంచుకుంటున్నాడు, మీకు తెలుసా, మరియు అతనితో అన్నాడు, అన్నాడు, "నువ్వెక్కడికెళ్తున్నావ్?"
"నేను జోహానెస్ బెర్గ్ కి వెళ్తున్నాను" అని అతను అన్నాడు.
"ఓ, నువ్వు వ్యాపారివా?" అని అతను అన్నాడు.
"లేదు, నేను బ్రెన్హాం సోదరున్ని చూడటానికి వెళ్తున్నాను, కూటమునకు" అని అతడన్నాడు.
"ఏంటి? నువ్వు దానికంటే కొంచెం తెలివైన మనిషిలా కనిపిస్తున్నావే" అన్నాడు.
అతను, "మంచిది," అన్నాడు, "నేనొక క్రైస్తవుడను; నేను క్రిందికి వెళ్ళి అది చూస్తాను" అని అతడన్నాడు.
"ఇంకో చోటికెక్కడికైనా బండి నడుపుకెళ్ళి, పెట్రోలు సంపాదించుకో" అని అతడన్నాడు.
మరియు అలా తర్వాత రోజు తిరిగి వస్తూ౦డగా, ట్రాన్స్వాల్ కి, అక్కడికీ మధ్య అదొక్కటే విరామము ఉంది, కనుక అతడు ఆ పైవరకూ వెళ్ళి క్రింద ఉన్న ఆ తర్వాతి స్టేషను దగ్గర ఆగాడు. మరియు ఇతగాడు పరుగెత్తుకెళ్ళి అతనిని పట్టుకొని, అన్నాడు, "ఇక్కడికి రా, ఇక్కడికి రా." పేపర్ల నిండా మొదటి పేజీలూ, రెండో పేజీలూ, మరియు అలా, మన ప్రభువు చేసినది వుంది. మరియు అందుకు మనమెంతో కృతజ్ఞులం.
21ఇప్పుడు, కలిసి ఒక చిన్న కూడిక కొరకు, మీలో ఎవరికైనా బయట మిత్రులుంటే, మేమిప్పుడు కౌపేలస్ లో ఉంటాము. పశ్చిమ తీరంలోని సౌత్-గేట్ వద్ద, ఇది ఒక గొప్ప పశ్చిమ - పశువుల ప్రదర్శన. కావున, మీలో కొందరు, నాలాగా తుపాకీలు ఇష్టపడువారు, నేను వెదర్బీ ఫ్యాక్టరీ గుండా వెళ్ళుచున్నాను, మీరు ఆ చుట్టు ప్రక్కల ఉన్నట్లయితే, మీకిష్టమైతే అక్కడికి నాతో రావచ్చును. కావున వారు పగటివేళంతా చాలా స్థలములగుండా వెళ్తున్నారు, మీరు కాటలీనా ద్వీపానికి వెళ్ళవచ్చు, అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. మరియు చిన్నపిల్లలతో ఉన్న పురుషులూ, మరియు స్త్రీలూ, డిస్నీలాండ్ మరియు అతడు కూడా బృందంలో ఒక సభ్యుడే, కావున తిన్నగా వచ్చేయండి. నాకు తెలుసు, మీరు మంచి సమయాన్ని కలిగియుందురు. మరియు అన్నిటికంటే పైగా, దేవుడు అవిశ్వాసుల కళ్ళు తెరచి క్రీస్తు కొరకు వారిని మార్చునట్లుగా ప్రార్థన చేయుడి.
22ఇప్పుడు, ఇక్కడ మనం బైబిలోనుండి కొన్ని మాటలు చదవబోతున్నాం, ఏలయనగా నేను అది చేయుటకు ఇష్టపడుదును. మరియు, ఇక్కడ నాకు కొన్ని లేఖనములు వ్రాయబడియున్నవి, మరియు ఈ ఉదయం కొంత సమయం పాటు బోధించుటకు కొన్ని రాసుకున్న సూచనలున్నవి. ఈ రాత్రి ఆరాధన కొందరు నాకు తెలుసు. ఈ వారం, వారియొద్దకు వెళ్ళుటకు మనం ప్రయత్నించెదము, వీలైనంత తొందరగా… మేము వెళ్ళేముందు ఇక్కడ ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కటీ చూచుటకు ప్రయత్నిస్తాం.
MARK 16:14-20
23ఇప్పుడు సువార్తలలో పరిశుద్ధ మార్కు 16వ అధ్యాయం త్రిప్పుదాము. ఈ రోజు దీనికి నా శీర్షిక, "అంత్య-కాల సువార్త." మరియు మార్కు 16లో 14వ వచనం యొద్ద నుండి చదవటం మొదలుపెడదాం.
పిమ్మట పదనొకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.
మరియు మీరు సర్వలోకమునకూ వెళ్ళి సర్వసృష్టికీ సువార్తను ప్రకటించుడి.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును.
నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు;
పాములను ఎత్తి పట్టుకొందురు; మరణకరమైనదేది త్రాగిననూ అది వారికి హాని చేయదు; రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి.
ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.
దీనిపై చాలా మాట్లాడవచ్చును. సంఘానికి ప్రభువు ఇచ్చిన ఆఖరి పరిచర్య ఇది.
24నేను ఈ క్రిందికి చూడటం జరిగింది, నేను ఆలోచించుటకు ప్రయత్నిస్తున్నాను… జార్జియా నుండి అక్కడ కూర్చున్న వెస్ట్ సహోదరుడా, కొన్ని క్షణాల క్రితం నీ పేరు గుర్తుచేసికొనుటకు ప్రయత్నిస్తుంటిని. కేవలం కొన్ని క్షణాల క్రితం నీపేరేంటో నేను గుర్తుచేసుకో లేకపోయాను. మరియు అక్కడ కూర్చొన్న మరో సహోదరుడు, అతని పేరు నాకు గుర్తు రావటం లేదు. నాకు ఒకరు తెలిసినట్లుగా చూపించుకొనుటకు నేను ప్రయత్నం చేయుట లేదని మీలో చాలామంది అర్థంచేసుకుంటారు. నా బుర్రలో వారి పేర్లు నేను స్థిరంగా ఉంచుకోలేను.
25ఇప్పుడు మనము చివరి కాలంలో సువార్త గురించి ఆలోచిస్తున్నాము. వార్తా పత్రిక చదవగలిగినవారెవరైనా, మరియు చదవగలిగిన… ఆకాశం నల్లబడి మరియు చీకటి పడుతుంది, మరియు మేఘాలు పైకి వస్తున్నాయి, మరియు వర్షం కురవబోతుందని మనకు తెలుసు, మరియు గాలిలో దానిని తాకగలం, మరియు దూరంలో గొప్ప వెలుగులనూ, మరియు మెరుపులనూ మరియు గాలి యొక్క తోపునూ, మనకి ఒక తుఫాను రాబోతుందని, చాలా త్వరగా వర్షం పడబోతుందని తెలుసు. ఎవరైనా వార్తాపత్రిక చదివి దేశం యొక్క పరిస్థితులు తెలుసుకోవచ్చు - దేశములారా, ఒకటి జరగబోతుందని గ్రహించండి. ఒకరు ఒక భుజము మీద చిప్ తోనూ, మరియు మరొకరు, మరియు వారు అలా కొట్టుకొనుటకు అన్ని రకముల ఆయుధములతోనూ వాదించుచూ, మరియు అంగీకారము లేక, మరియు వారి సమావేశాలలో వారి బూట్లను తన్ని బల్లలపై కొట్టి మరియు ప్రతిదీ మీరు చూస్తున్నప్పుడు, ఒకటి జరగబోతుందని మీకు తెలుసు. మరియు అది ప్రజలలో ఏదో ఒకటి జరగనైయున్నదనే భావనను తీసుకొని వచ్చును. మనము విశ్వము అని పిలిచే లోకము, బయటి ప్రపంచము, ఒక నాశనము రానున్నదని భావిస్తున్నది, బహుశా ముందుకు పేలనైయున్న ఒక అణుయుగంలాంటిది.
అది ప్రభువు యొక్క రాకడని క్రైస్తవునికి తెలియును, చూశారా. ఒక వాతావరణము అక్కడ ఉన్నది. మీరు దేనిని చూస్తున్నారనే దానిపై అది ఆధారపడుతుంది, ఏలయనగా మన ప్రభువు ఆ సయములో ఏమి జరగనైయున్నదో మనకు ఖచ్చితముగా చెప్పెను, మరియు ఆ నిమిషము లేక ఘడియ మనకి తెలియదు, కాని ఇప్పుడు మనం ఒకదానిని సమీపిస్తున్నామని తెలుసును.
26కొంతకాలం క్రితం ఇక్కడ నేను చెప్పినట్లుగా, ఆఫ్రికాలో ఒక రోజు గొర్రెల దొడ్డి బయటినుండి ఒక గొర్రెపిల్లను చూస్తున్నాను, మరియు అది ప్రశాంతంగా మేస్తుంది, మరియు ఒక్కసారిగా అది గాభరా పడిపోయింది. ఈ చిన్నదానికేమయ్యిందా అని నేను ఆలోచించాను. మరియు మీకు తెలుసు, అది ఎక్కడినుండి వచ్చినప్పటికీ ఒక గొర్రె తన మార్గాన్ని తిరిగి కనుక్కోలేదు; అది పూర్తిగా తప్పిపోతుంది. ఆ కారణము చేతనే ప్రభువు మనల్ని గొర్రెలతో పోలుస్తారు, చూశారా. మనము తప్పిపోయినప్పుడు మనల్ని వెనక్కి తీసుకొని రాగల్గినది ఒకే ఒకటున్నది; గొర్రెల కాపరి. మరియు ఈ గొర్రెపిల్ల అరుస్తున్నది, మరియు అది దొడ్డినుండి తప్పిపోయి బయటకు వచ్చేసింది. ఆ గడ్డి త్రోవ క్రింద నేను గమనించాను, ఆ చిన్న గొర్రె దానిని చూడలేదు. మరియు ఒక లేడి లేక అలాటిది మరొకటి చేయునట్లు ఒక గొర్రెపిల్ల లేదా గొర్రె శత్రువు వాసనను పసిగట్టలేదు — కాని మరణము దగ్గరగానే ఉన్నదని అది గ్రహించగలదు. మరియు అక్కడ ఒక సింహము పైకి జారుకుంటూ, సులువుగా వస్తుంది. అది గొర్రె వాసనని పసిగట్టగలదు, కావున అది గొర్రెపిల్లను పట్టుకొనుటకు వస్తుంది, మీరు చూశారా, మరియు ఈ చిన్న గొర్రె భయపడిపోయింది, ఎందుకు అనే కారణాన్ని మీరు చూడలేరు, కాని మరణం చాలా దగ్గరలో పొంచి ఉండటం వల్ల అది భయపడింది.
27మరియు, సరిగ్గా ఇప్పుడే లోకమంతా ఎంత భయాక్రాంతమైన రూపంలో ఉందంటే, వారు వీధి క్రిందికి గంటకు తోంభై మైళ్ళ చొప్పున నడుపుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళే రెండు గంటల ముందు, ఒక బీర్ జాయింట్లో కూర్చుని తాగుతున్నారు. మరియు ఇది ఒక సంహారము…
ఎవరితోనైనా మాట్లాడండి, ఓ, మై, వారు పేలుతారు. గత రాత్రి ఒక గుడారమువద్ద, నెవిల్ సహోదరుడి కాల్స్ ని స్వీకరించడానికి ఒక ఆసుపత్రికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నప్పటిలా, మరియు ఒక నర్సు లేక డాక్టరుతో నేను మాట్లాడిన ప్రతీసారీ, వారు నన్ను ఆపి, "దానిగురించి నాకేమీ తెలియదు" అందురు.
సరే, నేననుకొన్నాను, "ఏంటి సంగతి? అందరూ ఒత్తిడి, వదిలించుకుంటున్నారు కాబోలు." కావున డాక్టరు, మానసిక వైద్యులు - మానసిక వైద్యులకు చికిత్స చేయుచున్నారు.
కాని, బయటికి రావడానికి ఒక మార్గముంది; అది క్రీస్తు.
28ఇప్పుడు క్రైస్తవుడు ఆ స్థితిలో ఉండకూడదు. మనము రాకడ కొరకు ఎదురుచూస్తూ సంతోషంగా ఉండాలి, ఏలయనగా అది దగ్గరగా ఉన్నది. కల్వరి యొక్క చల్లబరచు చల్లని గాలిని మనము అనుభూతి చెందగలుగుచున్నాము. వాగ్ధానము చేసిన పరలోకపు దేవుని మనము చూసినప్పుడు, యేసు తన జీవితంలో చేసిన అవే కార్యములు ఈ చివరి దినములలో తిరిగి వచ్చునని వాగ్ధానము చేసెను, మరియు ఇక్కడ మనము దానిని చూచుచున్నాము. అది ఏమిటి? అదే ఆ తాజాపరచు శ్వాస, వాన కురిసినట్లుగా, చూశారా. విమోచన సమీపమున ఉన్నదని మనకు తెలుసు, చూశారా. ఒకానొకటి జరుగుటకు సిద్ధంగా ఉన్నది. మరియు ఇప్పుడు లోకము దానిని చూడదు. వారు దీనిని బట్టి నవ్వుదురు, ఏలయనగా ఇతర తరములలో వలె వారు అదే చేసిరి. కాని అది దగ్గర కొస్తుందని మనకు తెలుసు.
అందుచేతనే, టేబర్నికల్ కొరకు కొద్దికాలం పాటు నా చివరిదిగా, ఈ రోజు ఈ అంశాన్ని అంత్య-కాల సువార్తపై ఎంచుకున్నాను. మరియు మనము దేవుని వాక్యముతో మిషనరీ పని లేదా విదేశీ మిషనరీ పని చేస్తున్నప్పుడు, మనము ఎల్లప్పుడూ దేవుని చిత్తమందు ఉన్నామని ఎరుగుదుము, ఏలయనగా యేసు తన సంఘానికి అప్పజెప్పిన మొదటి పని "బయలువెళ్ళి సువార్త ప్రకటించుడి." ఈ చివరి పని సువార్తను ప్రకటించుటయే.
MATT 10:8•
MARK 16:14,15
29దేశమంతటా వెళ్ళి వాక్యము ప్రకటించుట కొరకు ఆయన మొదటిసారి మనుష్యులను అభిషేకించినప్పుడు, "రోగులను స్వస్థపరచుడి మృతులను లేవుడి, దెయ్యములను వెళ్ళగొట్టడి. మీరు ఏలాగు ఉచితముగా పొందితిరో, అలాగే ఉచితముగా ఇవ్వుడి" అని చెప్పెను. పరి. మత్తయి 10వ అధ్యాయము, డెబ్బది మందిని ఇద్దరిద్దరి చొప్పున పంపించినప్పుడు, ఆయన సంఘానికి ఆయన అప్పజెప్పిన మొదటి పని అదే.
ఇప్పుడు, ఆయన మహిమలోనికి చేర్చుకొనక బడక మునుపు ఆయన సంఘమునకు ఆయన అప్పజెప్పిన చివరి పరిచర్య "మీరు లోకమందంతటికీ వెళ్ళడి," అని ఆయన చెప్పెను. అప్పుడే ఆయన మృతులనుండి లేచెను. మరియు వారిలో చాలామంది కలిసి కూర్చొని యుండిరి, మరియు వారి హృదయ కాఠిన్యము నిమిత్తమునూ, ఆయన లేచిన తర్వాత ఆయనను చూచిన వారిని వారి అవిశ్వాసము వలన నమ్మని వారినీ ఆయన గద్దించెను. చూడండి, వారు ప్రభువును చూచినట్లు సాక్ష్యము కలిగియుండిరి. మరియు ఇతరులు దానిని నమ్మలేదు, మరియు వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారిని గద్దించెను. ఆయన మృతుడు కాడని చూచిన ఈ ప్రజలను వారు నమ్మలేదు, "ఆయన సజీవుడు!"
30మీరు ఆయన క్రియలను చూస్తున్నప్పుడు, ఈ రోజూ అదే సంగతి. ఇప్పుడు, మనము ప్రభువు యొక్క ప్రత్యక్షతను ఇప్పటికే చూసియున్నాము, మరియు సాక్ష్యమిచ్చుచున్నాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, ప్రత్యక్తపరచబడుట మరియు రాకడ అనునవి రెండు వేర్వేరు మాటలు: ప్రత్యక్షపరచబడుట, మరియు ఆ తర్వాత వచ్చుట. ఈ చివరి దినములలో ఆయన ఇప్పటికే ప్రత్యక్షపరచబడెను. గత కొన్ని సంవత్సరాలుగా, సరిగ్గా ఈ చోటనే, మన మధ్యనే ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు, అది ఆయన రాకడకు ఒక సూచన. అది ఆయనే అని అగుపరచుకొనుచూ, ఆయన యొక్క సంఘంలో పరిశుద్ధాత్మగా ప్రత్యక్తపరచుకొనుచున్నాడు, ఏలయనగా, పరిశుద్ధాత్మ చేయుచుండగా మీరు చూస్తున్న ఈ విషయాలు ప్రజలు చేయజాలరు, అందువల్ల ఇది ప్రభువు యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఇది రెండు చోటలా చెప్పబడింది, "ప్రత్యక్షపరచబడుట" మరియు "రాకడ."
MARK 16:15,17
31ఇప్పుడు, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారిని గద్దించెను, ఏలయనగా అది చూసిన వారిని వారు నమ్మలేదు. ఈ రోజు కూడా ఆయన అదే చేయునని నమ్ముచున్నాను. తర్వాత మనము… ఆ ప్రజల సాక్ష్యమును వారు నమ్మలేదు, మరియు అందువలన ఆయన వారిని గద్దించెను. మరియు అప్పుడు, వారిని లోకమంతటికి వెళ్ళి, ప్రతి జీవికి సువార్త బోధించమని, మరియు కడవరకూ, యుగాంతము వరకూ ఆయన వారితో ఉంటాననీ పరిచర్య అప్పజెప్పెను. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును."
MARK 16:15•
1THS 1:5
32ఇప్పుడు, ఈ రోజు, అక్షర రూపంలో ఉన్న వ్రాయబడిన వాక్యాన్ని మనము, ఆచార రూపంలోనూ మరియు మొదలగు రూపంలో, లోకమంతటికీ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. మరియు మిషనరీలు ప్రతిచోటికి వెళ్ళియున్నారు. కాని అక్కడికి వెళ్ళినప్పుడు మనమేమి కనుగొంటున్నాము? తన పేరు కూడా చదువుకోలేని ఒక మూలవాసి, చేతిలో ఒక కరపత్రం పట్టుకుని ఉండటం. తన కుడి ఏదో ఎడమ ఏదో తెలిసినదానికంటే, అతనికి దాని గురించి ఎంతమాత్రం ఎక్కువ తెలియదు. కాని యేసు "వెళ్ళి సువార్త బోధించండి" అన్నప్పుడు, ఆయన "వాక్యము నేర్చించండి" అని ఎన్నడూ అనలేదు. ఆయన "సువార్త బోధించుడి," అన్నాడు. "మరియు సువార్త వాక్యముగా మాత్రమే రాలేదు గాని, వాక్యము యొక్క ప్రత్యక్షత ద్వారా వచ్చింది," ఏలయనగా దానిని చేయుటకు ఉన్న ఒకే మార్గము ఆయన వాగ్ధానమును ఉనికిలోనికి తీసుకొని వచ్చుటయే.
33ఒకరు దానిని చదువవచ్చును - విల్లియం జెన్నింగ్స్ బైయాంట్ వలె డార్విన్ నైతికత గురించి ఆయన డారెల్ తో వాదించినట్లు, చూశారా. అతడు కేవలం డార్విన్ చెప్పినది మాత్రమే చెప్పగలడు. మరియు విల్లియం జెన్నింగ్స్ బ్రెయాంట్ బైబిల్ ఏమి చెప్పిందో అది చెప్పగలడు. అదే అప్పటి వాదన. కాని ఈ విషయంలో దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి ఆయన వాక్యము ప్రత్యక్షపరచబడుటను రుజువు చేయును. మీరు అది చేయుటకు ఉన్న ఒకే ఒక్క మార్గము ఒక కరపత్రము వలన కాదు గాని, పరిశుద్ధాత్మ మీ ద్వారా పనిచేయుట వలననే. మీ జీవము, ఆయన జీవము అవుతుంది. ఆయన మీయందుండును.
MARK 16:15,17•
LUKE 24:48
34అన్యులు, వారు విగ్రహాన్ని ఆరాధించునప్పుడు, వారు ఆ విగ్రహం ముందు సాగిలపడి, ఆ విగ్రహం తిరిగి తమతో మాట్లాడుతుందని నమ్ముతారు, అనగా వారి దేవుడు ఈ విగ్రహం లోనికి వచ్చి, వాటి ద్వారా తిరిగి వారితో మాట్లాడునని, నమ్ముతారు. ఇప్పుడు, అది సరిగ్గా విరుద్దమైనది, దేవుడేమైయున్నాడో దానిని చుట్టూ త్రిప్పివేయుట. దేవుడు విగ్రహాలతో వ్యవహరించడు. నీవే ఆయన పరికరానివి. నీవు దేవుని ముందు సాగిలపడుదువు, మరియు ఆయన నీలోనికి వచ్చి జనులతో మాట్లాడును. అదే తేడా. ఆయన సజీవ మనిషికి జీవము గల దేవుడే గాని, చచ్చిన విగ్రహానికి మృతుడయిన దేవుడు కాడు. ఆయన ఒక జీవి విషయమై జీవముగల దేవుడు. మరియు ఆయన ఇక్కడ చెప్పినదానికి, మీరు ఆయన యొక్క సాక్ష్యులగుదురు.
అది ఇప్పుడు, గమనించండి, అది కేవలం అపోస్తలులకు మాత్రమేనని చాలామంది అంటారు, "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త బోధించండి, మరియు (సముచ్చయము) నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును," అని ఆయన ఇక్కడ చెప్పెను.
JOHN 3:7•
1COR 15:31
35ఇప్పుడు, ఈ రోజున, ఒక మంచి సంఘ సభ్యుడు పాస్టర్ తో కరచాలనం చేయును, తన పేరును మెథడిస్టు నుండి బాప్టిస్టు లోనికి, లేక బాప్టిస్టులో నుండి మెథడిస్టులోనికి మార్చుకొనును, లేదా అలాంటిది, మరియు ఒక చక్కని మంచి జీవితం జీవించునని మనమంటాము. ఆ అన్యులు జీవించు జీవితముతో పోల్చుటకు, క్రైస్తవులనబడిన ఈ అమెరికా వారి జీవితములు ఎంత మాత్రమూ సరిపడవని మిషనరీలమైన మేము చూస్తున్నాము, కనుక లెక్కించబడునదంతా మంచి జీవితము మాత్రమే అయినట్లయితే మిగిలిన వారివలే వారు కూడా ఒక విగ్రహం ద్వారా రక్షించబడినట్లే. వారి నీతి మరియు వారి క్రియలు మనము వారి ముందు నిలువలేనంతగా మనల్ని ఊపిరాడకుండా చేస్తాయి, అది నిజం. కాని అది కాదు.
"మీరు మరలా జన్మించవలెను" అని యేసు చెప్పెను. మరలా జన్మించుటకు మిమ్మల్ని మీరు వెళ్ళి మరణించనివ్వాలి, మరియు క్రీస్తు ఆత్మ మీలోనికి రావాలి. అప్పుడు నీవెంత మాత్రము నీ వాడవు కావు; అది నీలోనున్న క్రీస్తు, చూశారా, పరిశుద్ధాత్మ. పౌలు అన్నాడు, "నేను ప్రతి రోజూ చనిపోవుచున్నాను; అయిననూ జీవించుచున్నాను, జీవించువాడను నేను కాదు గానీ క్రీస్తు నాయందు జీవించుచున్నాడు." చూడండి. క్రీస్తు!
MARK 16:17•
JOHN 14:12
36మరియు జాన్ డిలింజర్ ఆత్మ నాలో ఉన్నదని నేను చెప్పినట్లయితే, నేనిక్కడ తుపాకులు కలిగియుందును. మరియు నేను చట్ట విరోధినవుదును, ఏలయనగా అది నాయందున్న అతని ఆత్మ అగును. ఒక చిత్రకారుడి ఆత్మ అని నేను మీకు చెప్పినట్లయితే, ఒక చిత్రకారుడి బొమ్మను నేను చిత్రించాలని మీరు ఆశించుదురు.
నేను క్రైస్తవుడినని మీతో చెప్పినట్లయితే, మరియు క్రీస్తు ఆత్మ నాలో లేక మీలో ఉన్నట్లయితే - అప్పుడు మనము క్రీస్తు యొక్క క్రియలు చేయుదము. "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును," అని యేసు పరి. యోహానులో చెప్పెను. "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును" అని తర్వాత ఆయన చెప్పెను.
జెకర్యా 14:6,7
ZECH 14:6,7
37ఇప్పుడు, యుగములలో విశ్వాసులను ఈ సూచనలు వెంబడించని కాలమొకటి కలదు. అది నిజము. దాని గురించి ప్రవక్త చెప్పెను, మరియు దానిని గురించి అతడు జెకర్యాలో చెప్పెను, "పగలూ, రాత్రీ కాని ఒక సమయం వచ్చును. అస్తమయ కాలములో వెలుగు కలుగును" అని అతడు చెప్పెను.
ఇప్పుడు, సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించును. అది మారదు; అది అదే సూర్యుడు. మరియు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మనుష్యుకుమారుడైన యేసుక్రీస్తు, ఆయన తూర్పున, తూర్పు ప్రజల యొద్దకు వచ్చెను. అది ఒక పగలు అయినది. అది పయనించుచుండగా, నాగరికత సూర్యునితో పాటు పయనించుచుండగా, తూర్పు నుండి పడమటికి వచ్చుచుండగా, మరియు ఇప్పుడు మనము పడమటి తీరాన ఉన్నాము… ఇంతకంటే మనము ముందుకు వెళ్ళినట్లయితే మనము తిరిగి తూర్పున ఉంటాము. కావున ప్రతి విషయమూ ఆయన రాకడను సూచించుచున్నది. మనము చివరికాలంలో ఉన్నాము. అంతా సమాప్తమైనదని ప్రతి విషయమూ చూపిస్తున్నది.
ZECH 14:6•
2PET 1:20
38ఇప్పుడు, ప్రవక్త చెప్పెను… మరియు యేసు చెప్పినట్లుగా ఏ ప్రవచనానికి సొంత అర్ధము చెప్పకూడదు. అది ఏమి చెప్పుతున్నదో అది సరిగ్గా అదే. "సాయంకాల సమయంలో వెలుగు కలుగును." అలాగయితే, తూర్పు ప్రజల పైగా వచ్చి తన క్రియలనూ, తన ఆశీర్వాదములనూ చూపించిన అదే కుమారుడు; ఒక పరిగణించబడని (dismal day) దినము వచ్చును; పగలు కాదు, రాత్రి కాదు; అది ఒక చీకటి దినము, అలా మసకగా ఉన్నట్లు, అని ప్రవచింపబడింది. మరియు మీరు సూర్యుడ్ని చూడలేరు, అయినప్పటికీ సరిపడినంత వెలుగును సూర్యుడిచ్చును. ఇప్పుడు ఆ బయట ఉన్నట్లుగా, బహుశా ఇంకొంచెం చీకటిగా, సంఘంలో చేరటం మరియు పుస్తకాలలో మన పేరు ఉంచటం మొదలైనవాటిని మనము చాలినంతగా చేశాము, కాని సాయంకాల సమయంలో, పూర్వము తూర్పులో వచ్చినట్లుగా క్రీస్తు యొక్క అదే గొప్ప శక్తి ఆయన సంఘముపై దిగి వచ్చును. పశ్చిమాన కూడా అదే విధంగా అది ఉండును. కావున, అందువలననే నాకు సాయంకాల సువార్త గురించి మాట్లాడాలనివుంది.
39ప్రతి కాలమూ దాని వర్తమానమునూ, మరియు వర్తమానికులనూ కలిగియుండెను. కాలమంతటిలో, ప్రతి తరమూ ఒక వర్తమానికుతో తన వర్తమానమును పొందినది. ప్రతి తరములోనూ, ప్రతి కాలములోనూ, దేవుడు ఆయన వర్తమానమును తీసికొనివచ్చుటకు, పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఒకని ముందుకు పంపెను.
ఇప్పుడు, దీనిని కొంచెం సమర్ధించుటకు, మనము వెనుక మొదలు పెట్టవచ్చును. ఆది నుండి కూడా, "నీవు దీనిని తినవచ్చు, కాని ఇది నీవు చేయకూడదు," అని ఆదాము మరియు అవ్వలకు చెప్పుటకు, ఆదియందు దేవుడే వర్తమానికుడు. అదే వర్తమానమై యుండెను. మరియు మనిషి ఆ ఘడియకైన వర్తమానమును అతిక్రమించినప్పుడు, అది మానవ జాతి అంతటికీ మరణమునూ, గందరగోళమునూ తీసుకొని వచ్చెను. ఇప్పుడు అదే వర్తమానము యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు గుర్తుంచుకొనండి, హవ్వ నమ్మినది దేవుడు చెప్పిన దానిని పూర్తిగా నిష్కర్షగా తిరస్కరించటం కాదు; అది దేవుడు చెప్పినదానిని తీసికొని దానిపై సున్నం కొట్టి - లేదా దానిని కొంచెం తప్పుగా అన్వయించుకొని, సరిగ్గా దానికి కొంచెం కలిపి, లేదా దానిలోనుండి కొంచెం తీసివేయుటయే.
JOHN 17:17
40ఆ కారణము చేతనే నేను వాక్యమే సత్యమని నమ్ముదును. మన ఆచారములు మరియు మన సంఘ శాఖలూ దేవుని వాక్యముతో సంపూర్ణముగా సరిపడనట్లయితే, అప్పుడు అది తప్పు. మరియు ఆయన వాక్యము ఎంత ముఖ్యమైనదంటే, కేవలం దానిలో ఒక మాటను తప్పుగా చెప్పుట వలన అంతా జరిగినది, ఇప్పటి వరకూ జరిగిన ప్రతి మరణమూ, ప్రతి బాధా, ఏడ్చుచున్న ప్రతి శిశువు, ప్రతి సమాధి ఊరేగింపు, కొండ ప్రక్కనున్న ప్రతి సమాధీ, కేక వేయుచున్న ప్రతి అంబులెన్సూ, చిందించబడిన ప్రతి రక్తమూ, మరియు మనము కలిగియున్న సమస్తమైన ముసలితనమూ మరియు ఆకలి, మరియు సమస్యా, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా లెక్కించుటవలననే, ఇదంతా జరిగినది, మరియు దేవుడు దానిని అనుమతించనట్లయితే, ఈ చివరి కాలంలో దానిని మనము మరలా తప్పుగా లెక్కించినయెడల, ఆయన విడిచిపెట్టునా?
PS 96:13•
JOHN 1:1,14•
JOHN 12:48
41కనుక మీరు చూడండి, క్రైస్తవ్యము ఒక ముఖ్యమైన విషయము. ఒక్క వాక్యము తప్పుగా ఉపయోగించుట వలన ఈ ఆరువేల సంవత్సరాల బాధ కలిగినట్లయితే, ఇప్పుడు మరొక వాక్యము తప్పుగా ఉపయోగించుట ద్వారా మనము తిరిగి వెనక్కి వెళ్ళబోవటం లేదు. అది ఖచ్చితంగా వాక్యంతో నిలిచియుండవలసియున్నది, ఏ ఒక్కరి సొంత అనువాదమూ లేకుండా, సరిగ్గా వాక్యము చెప్పినట్లే. చాలామంది మనుష్యులు సమకూడి దీని అర్థం ఇది అని చెప్పుదురు మరియు వారు ఒప్పుకొందురు, మరియు ఇతరులు ఇది అని చెప్పుదురు. కాని "ఇదే ఇది!" అని ఇది (వాక్యము - తర్జుమాదారుడు) చెప్పుచున్నది.
దేవుడు సంఘము ద్వారా లోకమునకు తీర్పు తీర్చనైయున్నయెడల, అది ఏ సంఘము? ఆయన ఒక దేశము ద్వారా దానికి తీర్పు తీర్చనైయున్నయెడల, అది ఏ దేశము? ఆయన లోకమునకు వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా తీర్పు తీర్చనైయున్నాడు. ఏలయనగా, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై యుండెను. మరియు వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." అది, క్రీస్తు శరీరము ధరించిన దేవుని యొక్క వాక్యము, మనిషి ద్వారా మాట్లాడెను.
REV 22:19
42"ఏ మనుష్యుడైనా దీనినుండి ఒక వాక్యము తీసివేసినా, లేక దీనికి ఒక మాట కలిపినా, జీవగ్రంథము నుండి వాని భాగము తీసివేయబడును" అని ఆయన ఇప్పుడు ప్రకటన గ్రంథములో చెప్పియున్నాడు.
కనుక మీరు చూడండి, అది కేవలం "సరే, నేను దీనిని నమ్ముదును, కాని దానిని గురించి నాకు తెలియదు." కాదు దీనినంతటినీ నీవు నమ్మవలసియున్నది. దాని వరకూ నిలువబడుటకు అవసరమైన విశ్వాసము నీకు లేకపోవచ్చును, కాని వేరొకని త్రోవలో నిలుచుటకు ప్రయత్నించవద్దు.
నా జీవితం ముగిసిన తర్వాత, హనోకు వలె, మరణించకుండా, ఒక మధ్యాహ్నము నడుస్తూ దేవునితో పాటు గృహమునకు వెళ్ళుటకు కావల్సిన విశ్వాసము కలిగియుండవలెనని నేను తరచుగా కోరుకున్నాను. ఆలాగు చేయుటకు నేను ఇష్టపడుదును. కాని, ఆ రకమైన విశ్వాసము నాకు లేనియెడల, ఆ రకమైన విశ్వాసము కలిగిన వేరొకరి మార్గములో నేను నిలబడను, చూశారా.
43ఇప్పుడు, మనము సాయంకాల సమయంలో ఉన్నాము. మరియు కాలము గుండా వర్తమానికులు… ఆదియందు ఒక వర్తమానికుడు పంపించబడినప్పుడు, ఆయన వాక్యమును తప్పుగా అన్వయించుకొనుట లేక ఒక మాటను సందేహించుట, సంపూర్ణ నాశనము మరియు దేవుని నుండి నిత్యమైన వేర్పాటు అని మనము కనుగొనుచున్నాము, ఆ వర్తమానికుని వాక్యమును తప్పుగా అన్వయించుకొనుట. మరియు మొదటి వర్తమానికుడు స్వయంగా దేవుడే. మరియు అప్పటి నుండి ప్రతి వర్తమానికుడు - మనుష్యుని ద్వారా దేవుడు మాట్లాడుటయై యున్నది, అది దేవుని వాక్యము, ఏలయనగా ఆయన మాట్లాడుచున్న ఆ ఒక్క మనుష్యుడు తప్పించి ఆయన ఒకని ద్వారా మాట్లాడుటకు అప్పుడు ఆయనకు ఏ మనుష్యుడూ లేకపోయెను. కాని ఆయన మనుష్యుని చేసి, మనుష్యుని విమోచించి యుండుటవలన, అది దేవుడు మనిషి ద్వారా వూట్లాడుటయై యున్నది. ఆయన ఒక యంత్ర పరికరము యొక్క మధ్యవర్తిత్వమును వాడుకొనడు గాని ఒక మనుష్యుని యొక్క మధ్యవర్తిత్వమును వాడుకొనును, దేవునికి సమర్పించుకొని, ప్రతిష్టించుకొనిన ఒక మనుష్యుని.
44దీనిని ప్రవక్తలు, మరియు సమ్సోను గుండా, క్రిందికి సరిగ్గా ఈ ప్రస్తుత కాలానికి ఏలాగు తీసికొని రాగలమో కదా. అది ఎల్లప్పుడు దేవునితో ఒక ఒంటరి వ్యక్తియై యున్నది. ఇప్పుడు ప్రతి కాలానికీ దాని వర్తమానమూ మరియు దాని వర్తిమానికులూ ఉన్నారని నేను చెప్పాను. ఇప్పుడు చిన్న నేపథ్యం కొరకు ఏదేను కాలం తర్వాత మరొక కాలాన్ని మనం తీసుకొందాము. ఇప్పుడు ఏదేను కాలం తర్వాత నోవహు కాలం వచ్చింది. ఇప్పుడు లోకము మేము అంత్య-కాల సూచన అనే అంశంపై నేను ఒక రాత్రి క్లార్క్ విల్ గుడారము నొద్ద మాట్లాడుచుంటిని. మరియు తర్వాత మరొక రాత్రి, గురువారం రాత్రి, యేసుతో గుర్తించబడుట గురించి. మరియు ఇప్పుడు ఈ ఉదయం అంత్య-కాల సువార్తికుని గురించి, నన్ను క్షమించండి, సువార్త గురించి.
45ఇప్పుడు, సరిగ్గా జలప్రళయమునకు ముందు, మరియు వరదకాలంలో, ఈ రోజు మనకున్న నాగరికత కంటే గొప్ప నాగరికతను వారు కలిగియుండిరని మనము కనుగొనుచున్నాము. వారు అణు శక్తిని నియంత్రణలో ఉంచుకొని యున్నారని నేను నమ్ముచున్నాను. ప్రపంచాన్ని దాని కక్ష్యలో నుండి వణికించింది అదేనని నేను అనుకుంటున్నాను. నేను బ్రిటిష్ మంచు భూములలో నిలబడియుంటిని; ఐదు వందల అడుగుల క్రిందికి తవ్వి, పామ్ (ఎడారిలో పెరిగే తాటిచెట్టు వంటి ఒక చెట్టు) తీసుకు వచ్చిరి, చాలా వందల ఏండ్ల క్రితం అక్కడ పామ్ లు ఉండెడివి. మరియు భూమి నిటారుగా నిలిచియుండెడిదని మనకు బోధించబడినది, మరియు మనము ఎరుగుదుము. కాని, మనము ఇప్పుడు తిరిగి ఉత్పత్తి చేయజాలని పిరమిడ్లు, స్ఫింక్స్ లు మొదలగువాటిని నిర్మించునంతగా వారు యాంత్రికతను మరియు శాస్త్రీయతను కలిగియుండిరి, అది అణుశక్తి ఆధారితమైనది కొనియెడల ఆ బండలను అంత దూరము ఎత్తుటకు కావల్సిన యంత్రములు మనకు లేవు. పెట్రోలు శక్తి దానిని చేయలేదు, విద్యుచ్ఛక్తి దానిని చేయలేదు. కాని అది మన కాలము కంటే చాలా చురుకైన కాలము.
GEN 6:2
46మరియు ఆ కాలములో దేవుడు నోవహు అను ఒక మనుష్యుని పిలిచెను, కేవలం ఒక సాధారణ మనిషి, రైతు, ఏలయనగా అతని తరములో అతడు భక్తిపరునిగా ఉండెను. "ఒక ఓడ నిర్మించు" అను అంశంపై దేవుడు ఆ ఒక మనిషితో వ్యవహరించెను. ఏలయనగా, పాపము, ఆ కాలములో "నరుల కుమార్తెలు," మనము గమనించగలము, బైబిల్ చెప్పెను, "దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి…"
దీనిని చర్చిస్తూ, చాలామంది రచయితలు పడిపోయిన దేవదూతలు ఆత్మలో హత్తుకొనినది దేవుని కుమారులకే అనుకొందురు. ఒక మనిషి అది ఎలా అనుకోగలడో నేను చూడలేకపోవుచున్నాను. అది వాడిని ఒక సృష్టికర్తగా చేస్తుంది, సాతానుని ఒక సృష్టికర్త చేస్తుంది. సాతాను సృష్టికర్త కాదు; సాతాను సృష్టిని వక్రీకరించువాడు, చూశారా. అబద్ధము, అనగా, కేవలము తప్పుగా చెప్పబడిన సత్యమే. ఒక వ్యభిచారము సరియైన కార్యమును తప్పుగా అన్వయించుటయే, చూశారా. మరియు పాపమనగా సరిగ్గా అదే. సాతాను సృష్టించలేడు, వాడు కేవలం సృష్టించబడియున్న దానిని వక్రీకరించగలడు.
కావున అది దేవుని కుమారులు, వారు దేవుని వంశావళి నుండి, ఆదాము ద్వారా కలిగిన షేతు కుమారులు; మరియు కయీను, సాతాను కుమార్తెలు "మరియు వారు అందమైనవారని వారు చూచినప్పుడు."
GEN 6:2
47కొన్ని సంవత్సరాల క్రితం, ఒక వంద సంవత్సరాలు అనుకుందాం, ఫోటోలు తీసుకు వచ్చినట్లయితే స్త్రీలలో ఉండిన అందాన్ని (నేటి - తర్జుమాదారుడు) స్త్రీలలో ఉన్న అందం ఎలా దాటి వచ్చిందో మనమిప్పుడు గమనించగలం. మీరు ఆదికాండం 6వ చదివినట్లయితే దీనియొక్క ఒక అందమైన చిత్రాన్ని మీరు అక్కడ కనుగొందురు. వారు తెల్లగా ఉండిరి. మరియు ఈ రోజు స్త్రీలు అంతకు ముందుండిన వారికంటే చక్కగా ఉన్నారు. అది వారి దుస్తులు మరియు ఆధునిక పోకడ వలన. వారిని బయటికి తీసుకొని వచ్చునది అదే.
ఆ రహస్య ప్రేమికుడు, స్కాట్ జాక్సన్, ఆమె ఛాతిలోనికి కత్తిదూసి, పేర్ల్-వైట్ ని హత్య చేసినప్పటి ఫోటో ఒకటి నా వద్ద ఉంది, మరియు ఈ గొప్ప దేశము పేర్ల్-వైట్ యొక్క పాటతో ఊగిపోయింది. ఆ రోజులలో ప్రపంచంలో ఉన్న అత్యంత అందమైన స్త్రీగా ఆమె ఆమె పరిగణించబడింది. ఎందుకు, ఈనాటి కొందరు స్త్రీల ముందు, ఆమె వీధిలో ఒక పురాతన వస్తువువలె ఉండును.
MATT 24:37•
LUKE 17:26
48లేదా, ఆమె తన స్టాకింగ్స్ ను (స్టాకింగ్స్ అనగా స్త్రీలు మోకాళ్ళ పై వరకూ తొడుగుకునే సాక్సుల వంటివి), తన మోకాళ్ళ క్రిందికి చుట్టి, "అమ్మాయిలూ వాటిని చుట్టండి, వాటిని చుట్టండీ," అంటూ ఆ సిగ్గుమాలినతనాన్ని మొదలు పెట్టిన కాలానికి, క్లారా-బౌ చిత్రాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళండి. నా చిన్నప్పుడు, అది నాకు జ్ఞాపకము. మరియు క్లారా-బౌ చిత్రాన్ని తీసుకుని ఈనాటి కొందరు అందగత్తెల చిత్రాలతో దానిని పోల్చండి, చూశారా.
మరియు అదే అంత్యకాలము యొక్క సూచన. "నోవహు దినములలో యుండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ దినములలోనూ ఉండును," అని యేసు చెప్పెను. మరియు వారు ఎడతెగక వారి బట్టలు విప్పుకొనిరి. అది ఏమిట? కయీను కుమార్తెలు. అందువలననే, దానిని గూర్చిన సువార్త సత్యమును వివరించునప్పుడు, మనము పిచ్చివారిగానూ, వేర్రివారిగానూ పరిగణించబడుచున్నాము. కాని వారు ఎడతెగక తమను తామే నీతిమాలినవారుగా చేసికొనుచూ, మరియు వీధులకెక్కుచూ, మరియు వారు చేయుచున్నట్లుగా చేయుచున్నారు, మరియు తీర్పు దినమున జవాబు చెప్పవలసియుండునని గ్రహించకున్నారు. ఇప్పుడు, తన బట్టలు సరిగ్గా తొడుగుకొనని స్త్రీ, సెక్సీగా, మరియు బహుశా నీ భర్తకు లేక నీ ప్రియునికీ, లేక నీ బాయ్-ఫ్రెండ్ కి నువ్వు పద్మము వలే స్వచ్చముగా ఉండవచ్చును, కాని నువ్వు ఆ విధంగా దుస్తులు ధరించినప్పుడు వీధిలో వెళ్తున్న పాపి నిన్ను చూచినప్పుడు, అతడు నీ కొరకు వాంఛగొనును, ఏలయనగా నిన్నునీవు ఆ విధంగా అతనికి అగుపరచుకొన్నావు.
MATT 5:28
49దెబ్బలు తినవలసిన అవసరత కలిగియున్నది పిల్లలు కాదు, వారు ఆలాగున చేయుటకు అనుమతించిన తండ్రి మరియు తల్లియే. అది అది బాల్య త్రాగుబోతుతనం కాదు, అది తల్లిదండ్రుల త్రాగుబోతు తనమే. మరియు అది చాలా వరకూ బలిపీఠము పై నుండి చెప్పకపోవుట వలన తప్పిదము అని నేను అనుకుంటున్నాను. ఏలయనగా అది వాక్యములో చెప్పుబడియుండగా దానిగురించి ఏమీ చెప్పకుండా వారిని ఆ విధంగా వెళ్ళనిచ్చుచున్నారు.
ఇప్పుడు, "ఒక స్త్రీ వైపు మోహపు చూపు చూచువాడు ఇదివరకే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించియున్నాడు (భూతకాలం)" అని యేసు చెప్పెను. మరియు ఆ పాపి ఒక వ్యభిచారము కొరకు జవాబు చెప్పుటకు తీర్పులోనికి వెళ్ళినప్పుడు, అది తిన్నగా వెనక్కి ఎగిరి వచ్చును; అది నీవు ఎవరితో చేసితివి? నీతో! నీవు ఆ క్రియ ఏనాడు చేయునప్పటికినీ, కాని ఏలాగైనా నీవు దోషివేనని బైబిల్ చెప్పుచున్నది. అప్పుడు నిందించవలసినదెవరిని?" ఒక స్త్రీ వైపు మోహపు చూపు చూచువాడు ఇదివరకే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించియున్నాడు." దాని యొక్క తీవ్రత!
GEN 6:2
50ఈ రోజు జెఫర్సన్విల్లో తొంభై తొమ్మిది మరియు తొంభై తొమ్మిది దశాంశముల శాతం (99.99%) స్త్రీలు దేవుని ముందు దోషులు. మొత్తం దేశం ఆ విధంగా ఉంది. ఎందుకు? బలిఫీఠమ యొద్ద త్రాగుబోతుతనం, ప్రజలకు చెప్పుటకు; మరియు ఇంటియొద్ద నేర్పుటకు నిర్లక్ష్యం వలన, యౌవ్వన స్త్రీలను వీధుల పైకి వచ్చి ఆ రకమైన క్రియలు చేయునట్లు చేయుచున్నది. మరియు అది సరేరని వారందురు.
ఇప్పుడు, నోవహు తన దినములో ఎదుర్కొని పోరాడవలసి వచ్చినది సరిగ్గా దీనితోనే. నరుల కుమార్తెలు అందముగా నుండిరి, మరియు దేవుని కుమారులు వారివైపు చూచిరి. మరలా ఆ వాంఛ రావటం చూడండి. కాని నోవహు, ఓ, మనమిక్కడ గంటల పాటు ఉండగలము. కాని నోవహు ఒక దైవీకమైన నిజాయితీగల, నీతిమంతుడైన మనుష్యుడు, మరియు అతడు అటువంటి దానికి విరోధంగా కేకలేసెను. మరియు వారతనిని పిచ్చి మనిషి అనిరి. అపహాసకులు, వారతనిని అపహసించి, చులకన చేసిరని బైబిల్ చెప్పింది. "ఒక తుఫాను, ఆకాశము నుండి నీరు కురియు ఒక కాలము వచ్చుచున్నది" అని అతడు చెప్పెను. ఏనాడూ వర్షము కురిసియుండలేదు. మరియు అతని సువార్త ఆనాటి శాస్త్రీయ సిద్ధాంతములతో నిలబడలేదు, ఏలయనగా ఆకాశములో వర్షము లేదు.
MATT 21:9•
MARK 11:9•
LUKE 19:38-40
51మరియు ఈ రోజు, మతపరమైనవని పిలువబడుచున్న ఈ ఆధునిక గుంపుల శాస్త్రీయ సిద్దాంతాలు, పరిశుద్ధాత్మ అనబడు, మనము కలిగియున్న ఆశీర్వదింపబడిన దానిని, కేవలం ఒక ఉద్రేకమేనని రుజవు చేయుటకు ప్రయత్నించినవి. చూడండి, అది వారి శాస్త్రీయ సిద్దాంతముతో నిలువదు. కాని వారిని నేను ఇది అడగాలనుకుంటున్నాను: వారు మారునట్లుగా చేయునదేమిటి? ఒక త్రాగుబోతు త్రాగుట ఆపి వేయునట్లు చేయునదేమిటి? ఒక వేశ్య తన చెడు జీవితాన్ని ఆపివేయునట్లు చేయున దేమిటి? క్యాన్సరు మరియు వ్యాధులు ప్రజలయొద్ద నుండి తొలగిపోవునట్లు, మరియు చెవిటి, మూగ, మరియు గ్రుడ్డివారు మరియు మృతులు లేచునట్లుగా చేయునదేమిటి? దానిని వివరించు. అది ఉద్రేకమా? దానితో కూడా ఉద్రేకముంది, నిశ్చయంగా.
సజీవమైనది ఏదైనా ఉద్రేకము కలిగియుంటుంది, మరియు ఉద్రేకము లేనిదేదైనా చచ్చినదే. ఈ వాడుకను మన్నించండి, కాని మన మతములో ఉద్రేకము లేనిదానిని కొంత పాతి పెట్టవలసియున్నదని నేననుకుంటున్నాను, ఏలయనగా అది చచ్చినది. దానికి ఏ విధమైన ఉద్రేకమూ లేదు. ఉద్రేకము లేని ఏ మతమునైనా సమాధి చేయాలి.
ఎందుకంటే అది ఉద్రేకపూరితమైనది!
52యేసు, ఆయన నగరిలో ప్రవేశించినప్పుడు, పిల్లలు మరియు వారందరూ - ఆయన మిత్రులందరూ, కేకలు వేయుచుండిరి, "హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు ఆయన!" మరియు ఆనాటి ఆ మతనిష్టపరులు దానిని సహించలేకపోయిరి, అది ఎంతో ఉద్రేకమైనది. "వారు కేకలు వేయుట మానివేసినయెడల, ఈ రాళ్లు కేకలు వేయును" అని ఆయన వారితో చెప్పెను, చూశారా. ఏదో ఒకటి కేకలు వేయాలి, ఏలయనగా అక్కడ జీవమున్నది.
నోవహు ఒక భయంకరమైన కాలంలో ఉండెను, కాని చివరికి అతనికి ఒక పరీక్ష వచ్చెను.
మరియు దేవునితో నుండు వారందరికీ పరీక్షలు వచ్చును; మీ విశ్వాసము పరీక్షించబడును. మీరు ఆయనకొరకు జీవించుట మొదలుపెట్టినప్పుడు, అప్పుడు పొరుగున ప్రతివారూ మీ గురించి మాట్లాడుతారు; మీకు ఏదీ అనుకూలించదు. కేవలం దానిని గుర్తుంచుకొనండి, ఏలయనగా అది దేవుడు మిమ్మల్ని పరీక్షించుటయైయున్నది. "దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు, మొదట రుజవు చేయబడి, సరిదిద్దబడి, బాల్య-తర్ఫీదు పొందవలసియున్నదని" బైబిలు చెప్పెను. నేను తప్పు చేసినప్పుడు మా నాన్న నాకు తర్ఫీదు నిచ్చినట్లుగా, తలుపుకి పైగా పది ఆజ్ఞలు వేలాడునట్లుగా వారు కలిగియుండిరి; అది ఇంచుమించు ఇంత పొడవున్న ఒక కర్ర; మరియు బ్రెన్హాం (ప్రవక్త తండ్రి - తర్జుమాదారుడు) చాలా చక్కని చేతి వాటం గలవాడు, మరియు ఆయన మమ్మల్ని బయటకు లాగి మాకు తర్ఫీదు నిచ్చెను. మరియు దేవుడునూ అదే విధంగా చేయును. ఆయన నిన్ను పరీక్షించును, బాల్య-తర్ఫీదు నిచ్చును, పోషించును, ఏలయనగా నీవు ఆయన బిడ్డవు; భవిష్యత్తులో నీ కొరకు ఒకటున్నది, మహిమలో గృహము. మరియు ఆయన నీకు తర్ఫీదునిచ్చును. మరియు ఇప్పుడు ప్రవేశించు ప్రతి కుమారుడు పరీక్షింపబడవలయును.
GEN 7:16
53ఇప్పుడు తన సొంత తరానికి ఒక మాదిరిగా ఉన్న నోవహు, ఒక పరీక్ష కలిగియుండెను, ఏలయనగా దేవుడు ఓడలోనికి వెళ్ళుమని అతనికి చెప్పెను, మరియు అతడు ఓడలోనికి వెళ్ళినప్పుడు, తలుపు దానంతటదే మూతపడినది. మరియు, సందేహము లేదు, నోవహు తన కుటుంబముతో, "రేపు చూడండి. ఓ, ఈ రాత్రి తలుపు మూతపడినది, కాని ఉదయము పైన ఆకాశంలో వర్షముంటుంది," అని చెప్పియుండును. ముందెన్నడూ లేదు, గుర్తుంచుకొనండి.
మరియు అపహాసకులు, బహుశా వారిలో కొందరు మధ్యరకం విశ్వాసులు, "మనము పైకి వెళ్ళి నిలబడుదుము. మీకు తెలుసా ఆ ముసలివాడు చెప్పినది సరియైనది కావచ్చును" అని యుండవచ్చు. మీకు తెలుసా, వారు ఓడ చుట్టూ నిల్చుని, ఎదురు చూస్తూ, "సరే, ఇప్పుడు, అతడు చెప్పినది నిజము కూడా కావచ్చు" అనుకొనిరి. మరియు వారు పైకి వెళ్ళిరి. మరియు మరుసటి ఉదయం, సూర్యుడు ఎప్పటివలే చక్కగా ఉదయించాడు, దాటివచ్చెను.
మీకు తెలుసా, నిస్సందేహంగా సాతాను ఓడ పైని రంధ్రం యొద్ద, ఆ కిటికీ యొద్ద కూర్చుని "ఇంకా నువ్వు నిజమని అనుకుంటున్నావా?" అనును. సరే, మనందరికీ అపవాది ఆ విధంగానే చేయును. కాని దేవుడు ఆలాగు చెప్పినంత కాలము, దానితో నిలిచియుండుడి. అది ఏమైనదీ లెక్కలోనికి రాదు, సరిగ్గా దానితో నిలచియుండుడి.
GEN 7:11
54రెండవ రోజు గడిచింది, మూడవ రోజు గడిచింది. నోవహుకి దాని విషయమై చెమటలు పడుతున్నాయి. కాని చివరికి, ఏడు రోజుల తర్వాత! మరియు అతడు లోపలికి వెళ్ళినది ఫిబ్రవరి 17న, మరియు అప్పుడు ఏడు రోజుల తర్వాత, ఆ ఉదయం అతడు నిద్రలేచినప్పుడు, ఉరుములు గర్జిస్తుండెను మరియు గొప్ప పెద్ద వర్షపు చినుకులు చుట్టూ పడుచుండెను. "సరే, మనము వెళ్ళి ఏమైనా జరుగుతుందేమో చూచెదము," అని కనుగొనుటకు పైకి వచ్చి, ఒక రోజు లేక రెండు రోజులు ఉన్నవారికి, అప్పటికి అది చాలా ఆలస్యమైనది. వారు తలుపు తట్టిరి; వారు అరచిరి. వీధుల నిండా నీళ్ళు నిండినవి, కొండల ప్రక్క నీటి మట్టం పెరగటం మొదలయ్యింది. ప్రజలు మెట్ట భూములకు వెళ్ళిరి. వారిని పడవలు మొదలైనవాటిలో ఎక్కించుటకు వారు ప్రయత్నించిరి, కాని పడవ దేవునిచే నిర్మించబడినది కానిచో, ఆ కాలంలో భూమిని కుదిపిన ఆ పెద్ద బలమైన కుదుపు దానిని తిన్నగా నీటి క్రిందకు కుదిపినది.
55"ఏదైనా, నేనూ అలాగే ఒక మతమును కలిగియున్నాను, అది సరిపోవును" అని మీరందురు. కాదు, అది కాదు. అది మతములో దేవుడు నిర్మించిన అనుభవం కావల్సి యున్నది, చూశారా. మిగతావన్నీ నశించిపోవును. భిన్నముగా ఉండుట కొరకు నేను దీనిని చెప్పుట లేదు. నేను దీనిని కేవలం ప్రేమవలననే చెప్పుచున్నాను, మరియు ఆ దినమున దీనికొరకు జవాబు చెప్పవలసియున్నదని యెరిగి మరియు బాధ్యత వహించుచున్నాను. కావున నేను కేవలం ఆయన చెప్పినదే చెప్పినట్లయితే, అప్పుడు అది అంతా సరియేనని నాకు తెలియును. కాని ఒకరి ఆచారము గాని సిద్దాంతమును గాని అందులో ఉంచుటకు నేను ప్రయత్నము చేసినయెడల, నేను దానిని చేయలేను, నాకు దానియందు ఏ విశ్వాసమూ ఉండదు. నేను కేవలం ఆయన చెప్పిన దానినే నమ్ముదును.
56ఇప్పుడు గమనించండి, కొద్దిసేపటి తర్వాత అది మరింత లోతుగా, మరియు మరింత ఎత్తుగా అయినది. వారు తలుపు తట్టిరి, అరిచిరి, మరియు కేకలు వేసిరి. అది కొంచెమైనను మంచి చేయలేదు. బహుశా కొన్ని రోజుల ముందు, వారు ఆ జంతువులను లోపల ఉంచినప్పుడు, కొందరు అపహాసకులు, "నీ వాసన కొట్టుచున్న జంతువులతో లోపలికి వెళ్ళును. నీ ఇష్టమైతే నీ కంపు అంతటితో ఆ లోపల బ్రతుకు" అనుట నేను వినగలుగుచున్నాను.
ఈ రోజు సరిగ్గా అదే, వారు మీకు అదే విషయము చెప్పుదురు. "వెళ్ళుము, నీకిష్టమైతే పాత తరహాలో ఉండు. మేము బ్రతుకును అనుభవించుదుము." ముందుకు సాగిపొమ్మ, దానిని పోనిమ్ము. కాని, ఓ, సహోదరుడా, ఓడలో సురక్షితంగా ఉండుట, తలుపు మూయబడుట! అదీ విషయము.
GEN 7:23•
GAL 3:24
57కాని, నోవహు, తన దినమునందు, తన కాలములో అది అతనికి కష్టముగా నుండెను, చూశారా. ఏలయనగా జనులు ఎప్పుడూ అలాంటి దానిని గురించి విని యుండలేదు, కాని అది సరిగ్గా అలాగే వచ్చింది. నోవహు యొక్క విమోచన - మొదలైన వాటి తర్వాత, మరియు భూమి మరలా ఎదుగుట ప్రారంభించినప్పుడు, మరియు ఊపిరి పీల్చిన ప్రతి ఒక్కటీ నశించిన తర్వాత, అప్పుడు రంగముపై కనుగొందుము. మరియు అప్పుడు ఒక సమయము రావటం మనము కనుగొందుము, దేవుడు తన బిడ్డలను ఐగుప్తు నుండి బయటికి తెచ్చుచుండెను, ఆ మోషే ధర్మశాస్త్రముతో కూడా వచ్చెను. అది ప్రజలకు, అర్ధము చేసికొనుటకు ఎంతో కష్టముగా నుండెను. కాని ఒక దేవుని కాలము ధర్మశాస్త్రమునకు మారుచుండెను. మరియు ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత, మోషే ప్రయత్నించుట… అది ఒక బడిపంతులు. ప్రజలు వారికిష్టము వచ్చినట్లు బదుకుచుండిరి, కావున బడిపంతులు అయిన ధర్మశాస్త్రము, ఇది తప్పు అని ప్రజలు గ్రహించునట్లు చేయుటకు, ఆయన పది ఆజ్ఞలనిచ్చెనని బైబిలు చెప్పుచున్నది. అది చాలా మార్పు, ప్రజలు దానిని స్వీకరించుటకు ఇష్టపడలేదు. సరే.
JOHN 3:16
58అప్పుడు మోషే తర్వాత యోహాను వచ్చెను. మరియు యోహాను తర్వాత, కాలము వచ్చెను, మరియు అతడు యేసుని పరిచయం చేసెను. మరియు మనలను కృప యొద్దకు తీసికొనివచ్చుటకు ప్రయత్నించుటకు యేసు వచ్చినప్పుడు, అది ఆత్మలో దేవుడైయుండెను, ఆత్మ యొక్క క్రమములో, తన ప్రేమను ప్రత్యక్షపరచెను, "ఏలయనగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను," మరియు యేసు ధర్మశాస్త్రమునకు ఎంతో భిన్నముగానూ, విరుద్ధముగానూ యుండెను, చూశారా, కాని అది వేరొక కాలము, వేరొక సమయము.
మరియు అప్పుడు యేసు వెళ్ళినప్పుడు, ఆయన ఈ పరిశుద్ధాత్మ యొక్క కాలము, దానిలోని జీవము, ఆయన యొక్క పునారుద్దానము యొక్క సాక్షిమును గూర్చి చెప్పెను. నాకిక్కడ చాలా లేఖనములున్నవి, కాని వాటిలోనికి వెళ్ళుటకు కావల్సిన సమయము లేదు, నేను వాటిని క్లుప్తముగా చెప్తాను. సరే. ఇది ఎల్లప్పుడూ ఒక వాస్తముగా మరియు ఒక పోరాటముగా నుండెను, ఒక కాలము ఎప్పుడైతే పాత-కాలము నుండి ప్రస్తుత-కాల వర్తమానానికి మారుచున్నప్పుడు, అది ఎల్లప్పుడు ప్రజలతో ఒక పోరాటముగా నుండెను. వారు …. అది అన్నివేళలా లేఖనపరంగా ఉన్నప్పటికీ కూడా అనుసరించుటకూ, లేక చేయుట కొరకూ దేవుడు వారికి ఒక కాలమును ఇచ్చు సమయములో, వెంటనే భూమి పైని నరులు దానిని ప్రతిఘటించి, దానినుండి మానవ-కల్పితమును చేయుటకు ప్రయత్నించుదురని మనము కనుగొనుచున్నాము.
GEN 3:15•
DEUT 18:15,18
59నోవహు ఓడ తర్వాత, మరియు ఆ తర్వాత వెనువెంటనే, నిమ్రోదు, ఆ దుర్మారుడు, వాడొక గోపురమును కట్టెను, మరియు అనెను, "వరదలు వచ్చినట్లయితే, మనము పైకి యొక్కి దానిమీదికి పోవుదుము." మరియు అప్పుడు దేవుడు ధర్మశాస్త్రముతో వచ్చెను అది కేవలం… చూడండి, ఆ కాలము తన సమయమును దాటియుండెను.
మరియు ధర్మశాస్త్రము తర్వాత, యేసు వచ్చినప్పుడు కూడా, ధర్మశాస్త్రము మోషేను గూర్చి చెప్పెను మరియు క్రీస్తు యొక్క రాకడను గూర్చి చెప్పెను. కాని ఆయన వచ్చినప్పుడు, వారు ఎంతగానో పితరుల ఆచారములలో నుండిరి. వారికి వారి ఆచారములు ఉండెను; వారికి వారి పోకడలు ఉండెను; వారికి వారి సంఘములు ఉండెను. వారు స్థిరపడి యుండిరి, అందువల్ల ఆ రాజ్యమును (ఆ సంఘమును) ఆచారము నుండి ఆయనను నమ్మునట్లు కదిలించుటకు ప్రయత్నించుట ఆయనకు కష్టముగా నుండెను. మరియు అయిననూ ఏదెను యొక్క మొదటి విధాన కాలము నుండియు లేఖనములు ఈ ఒకని గురించి ప్రత్యేకముగా చెప్పుచునే యున్నవి, "ఆయన సంతానము సర్పము యొక్క తలను చితుకగొట్టును." ప్రతి విధానకాలములోనూ యేసు వాగ్దానము చేయబడెను, మరియు ఆయన వచ్చినప్పుడు, వారాయనను గుర్తించలేదు, ఏలయనగా వారు వారి ఆచారమున ముడివేయబడియుండిరి. కాని అయిననూ అది లేఖన సత్యము. ప్రతి వర్తమానికుడూ మరియు దాని వర్తమానమూ, ప్రతిసారీ రాబోవు దానిగూర్చి ముందుగా చెప్పెను. మోషే, ప్రవక్తలూ ముందుగా చెప్పిరి, మోషే యేసు రాకడను ముందుగా చెప్పెను. "ప్రభువైన మీ దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీ మధ్య నిలబెట్టును" అని మోషే చెప్పెను. రాబోవు మెస్సీయా ఒక ప్రవక్త కావలసియున్నదని, ప్రపంచమంతటా మన వర్తమానములలో మనము ఎన్నిసార్లు చెప్పుకున్నాము.
JOHN 4:7-26
60అందువలననే ఆ చెడ్డ-పేరుగల స్త్రీ, ఆనాటి పరిచారకులందరికి విరుద్ధంగా, ఆమె వర్తమానమును నమ్మింది. సమరయలోని ఆ స్త్రీ యేసు ఆమెతో మాట్లాడుతూ, "నాకు త్రాగుట కిమ్ము" అని అనెను.
"చేదుకొనుటకు నీయొద్ద ఏమీ లేదు. నన్ను ఒక సమరయురాలిని అడుగుట మీ ఆచారము కాదు" అని ఆమె అనెను. మరియు ఆ సంభాషణ కొనసాగింది.
అంతట ఆయన, "వెళ్ళి, నీ భర్తను ఇక్కడికి తీసుకురా," అనెను.
"నాకు భర్త ఎవరూ లేరు" అని ఆమె అనెను.
"అది నిజము, నీకు ఐదుగురుండిరి, మరియు ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ వాడు కాడు" అనెను.
ఆమె అన్నది, "అయ్యా, మీరు ప్రవక్త అని గ్రహించుచున్నాను. ఇప్పుడు కాలము యొక్క మార్పు రానుందని మేమెరుగుదుము. అభిషిక్తుడైన, మెస్సీయా అనబడిన దేవుని క్రీస్తు ఒకడు రానైయున్నాడు, మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఒక ప్రవక్తగా నుండును." ఆ దినపు బోధకులందరికంటే ఆ స్త్రీకి ఎంత ఎక్కువగా తెలియును. అవును. మరియు ఆమె స్థితిలో, చూశారా, ఆమె లేఖనములను గ్రహించెను. అయిననూ ఒక దీనమైన చిన్న స్త్రీ అయిదుగురు భర్తలను పెండ్లాడీ, మరియు ఆరవ వానితో ఉంటున్నా, అయినను ఆమెకు లేఖనముల గూర్చి ఎక్కువగా తెలుసు, ఎందుకంటే ఆమె దానిని ముఖ విలువను బట్టి (ఉన్నదానిని ఉన్నట్లుగా - తర్జుమాదారుడు) తీసికొనెను. మరియు ఆమె అనెను, "ఆయన వచ్చినప్పుడు, ఆయన ఒక ప్రవక్తగా నుండును."
యేసు ఆమెతో ఏమి చెప్పెను? "నేనే ఆయనను."
JOHN 4:28,29
61మరియు ఆమె తన నీటి కుండను విడిచిపెట్టి, ఊరిలోనికి పరిగెత్తుకెళ్ళి, "వచ్చి నేను చేసినదంతా నాతో చెప్పిన ఒక మనుష్యుని చూడుడి. ఆయనే మెస్సీయా కాడా?" అనెను. అది ఆయనే.
ఇప్పుడు, చూడండి, ఆయన రానైయున్నాడని ఆమెకు తెలుసు, ఎందుకంటే ప్రవక్తలూ మరియు లేఖనములూ, మోషే దినములలో, ప్రవక్తల దినములో, మరియు వెనుకటి కాలములన్నిటిలోనూ, "ఆయన ఇక్కడ ఉండును, మరియు ఆయన ఇలాగ ఉండును," అని చెప్పబడెను. ఓ, మై!
ఈ రోజు ప్రజలు కేవలం దానిని చూడగలిగినయెడల, అప్పుడు మనము నివసించుచున్న దినమును వారు ఎరుగుదురు. అది ఈ రోజునకు దేవుని వాగ్దానమని వారు చూచెదరు. అది ఈలాగు ఉండునని దేవుడు చెప్పెను. అక్కడ తప్పు ఏమీ లేదు. దేవుని గొప్ప గడియారము ఖచ్చితంగా సరైన సమయమును చూపుచున్నది. మరియు సైన్సు ప్రకారం కూడా, ఇది అర్ధరాత్రికి మూడు నిమిషాలే ఉన్నది. కనుక మీరు చూడండి, ఆ దెబ్బ (Stroke) ఎప్పుడైనా రావచ్చు. మరియు అది వారు చెప్పిన తర్వాత రెండు మూడేండ్లు అయినది.
62చూడండి. మనము అంత్య-కాలంలో ఉన్నాము. అయితే మీరు చూడండి, మనము ఆ పాత సంఘకాలము యొక్క కాలము నుండి పరిగణించబడని (dismal day) దినమునకు మారియున్నాము — కేవలము సంఘమున చేరి మరి పుస్తకములో పేరు నమోదు చేసుకొనుట అనునది మాత్రమే ఉండెను; సాయంకాలపు వెలుగున, పునరుద్ధణ, భూమిమీదికి మరలా పరిశుద్ధాత్మ తిరిగి రావటం, మరొక పెంతెకోస్తు, మరొక సూచన, మరొక కార్యము జరుగవలసియున్నది. మరియు ప్రజలు దీనిని నమ్మరు, ఎందుకంటే యేసు దినములలో వలే వారు ఎంతగానో స్థిరపడియున్నారు, చూశారా. ఆయన ఇక్కడ భూమిపై యుండగా, ఈ దినమును గూర్చి ఆయన చెప్పెను. ఆయన ఖచ్చితంగా లేఖన-ప్రకారముగా వచ్చెను, మరియు ఈ దినము వస్తుందని ఆయన ముందుగా చెప్పెను.
MATT 24:32•
MARK 13:28•
LUKE 21:25,26•
REV 3:15,16
63ఇప్పుడు, ఇప్పుడు, ఇంకొక దానిగురించి మనము ఆలోచించాలనుకుంటున్నాము. నా యొద్ద ఉంది… మీరు దానిలో కొంత చదవాలనుకుంటే, మత్తయి 24. యేసు ఈ దినమును గూర్చి చెప్పెను; యూదులు ఈ చివరి దినాన మరలా సమకూడుదురని ఆయన చెప్పెను. "అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూసినప్పుడు, కాలము సమీపించినదని తెలిసికొనుడి" అని ఆయన చెప్పెను. "కాలము యొక్క కలవరపాటు, దేశముల మధ్య దుఃఖము, సముద్రపు ఘోష, మనుష్యుల హృదయములు ఎడతెగని బాధ చేత విఫలమగుట ఉండునని" ఆయన చెప్పెను. స్త్రీల యందు కాదు, అది పురుషుల యందు. యేసు స్త్రీలు అని ఎన్నడూ అనలేదు, "పురుషులే." తెగులును చూడండి. మరియు ఆ దినమున ఏమి జరుగును. అది అంత్య-కాల సూచన యగును, "హృదయములు విఫలమగుట, భయము, కలవరపాటు." ప్రకటన, అది పలికినప్పుడు, ప్రవక్త ఈ దినము గురించి మాట్లాడుచూ, సంఘము నెలివెచ్చగా ఉండు ఒక కాలము వచ్చునని ఆయన చెప్పెను, చివరి దినమున వచ్చు లవొదికయ సంఘకాలము. అదేమిటి? అది ఈ కాలము యొక్క (చివరి కాలము) అంతమును ముందుగా చెప్పుచున్న యేసు.
64సరిగ్గా ఏదేనులో ఉన్నంత ఖచ్చితంగా, క్రింది నోవహు కాలములో ఉన్నట్లుగా, మరియు మోషే కాలములో ఉండినట్లుగా, క్రింద ధర్మశాస్త్రము యొక్క కాలములో ఉండినట్లుగా, మరియు తర్వాత ఒక కృపాకాలము, మరియు ఇప్పుడు సాయంకాల సమయము. మనకు సమయమున్నట్లయితే ఇంకా వేరేవి చాలా అక్కడ ఉన్నాయి, కాని నేను వాటిని దాటివేశాను, ఎందుకంటే మనకు సమయముండదు. ప్రతికాలమూ, ఆ తర్వాతి కాలములో ఏముండునో అనునది చెప్పుటను గురించి, కాని సంఘము, వారి ఆచారాలు, తప్పుడు సిద్దాంతాలు, మరియు నమ్మించు మరియు మానవ-కల్పిత సిద్ధాంతములలో ఎంత సాంఘికంగా మారినదంటే, వారు వాక్యమును తప్పిపోవునంత వరకూ. ఇప్పుడు, సాయంకాల సువార్త ఏలాగు ఉండబోవునో మీరు చూస్తున్నారు, చూశారా. ఏమిటది? దానిని మోయువారు పిచ్చివారనబడుదురు. వారు చాలా భిన్నముగా ఉందురు. వారు నోవహు కాలములో నుండిరి, వారు ప్రతి కాలములోనూ ఉండిరి. వారు యేసునందు విశ్వాసముంచినందుకు వారి సంఘమునుండి బహిష్కరించబడుదురు. ఆయనను వినువాడెవడైనా సంఘము నుండి వెలివేయబడవలెను, చూశారా. కాని ఆయన ఆ కాలము కలిగియుండెను, అది ఆయన సమయము, కుమారుని కాలము.
65ఇప్పుడు, ఆ గొప్ప పరిశుద్ధాత్మ దానిని గురించి ప్రవచించినట్లు కూడా మనము కనుగొనుచున్నాము. ఈ లేఖనములలో కొన్నింటిని మీరు రాసుకోవలెననుకొందురు, మత్తయి 24, మరియు ఆ తర్వాత II తిమోతి 3:1 రాసుకొనండి. పరిశుద్ధాత్మ చివరి కాలములో ఒక గొప్ప మేధో యుగము గూర్చి చెప్పుచున్నాడు. అది మీకు తెలుసా? అది ఎందుకు?
జోసెఫ్, ఇక్కడ దేశములో నువ్వు నాతో చాలా ప్రయాణించావు. మరియు విదేశాలలో కూటముల గురించి నీవు విన్నావు. నేను విదేశాలకు వెళ్ళి, నూట-యేబది, రెండు వందల వేలు, అయిదు వందల వేలు, మరియు ప్రజలు కేవలం… ఇక్కడ టెబర్నికల్లో దాదాపు ప్రతిరోజూ జరుగు కూటములలో, నీవు కేవలం ఒక విషయం చూచెదవు, పది, ఇరవై లేక ముప్పైవేల వరకూ దేవుని స్తుతించుటకు, వారి పాదములపై పడుదురు. వారు దానిని చూచుదురు. అది అమెరికాలో జరుగకుండుటకు కారణమేమి? ఇది ఒక తెలివైన కాలము. వారికి తీర్పు గురించి ఇలాంటి వాటి గురించి మాట్లాడువారు అవసరం లేదు, ఎందుకంటే వారు చెందియున్న క్లబ్బులూ, లాడ్జిలూ మరియు భక్తిహీనమైన వాటినుండి వారి సభ్యత్వము తెగిపోవును. అందువల్ల ఇలాంటి ఒకదానిని వారి పాస్టరు ప్రస్తావించినట్లయితే, డీకన్-బోర్డు ఆయనను వెలివేయును, మరియు వేరొకరిని ఉంచుదురు, ఒక యవ్వన రిక్కీ లేక అలాంటి మరొకటి. నా భావము మీకు తెలుసు.
66దానిని మన్నించండి, అది నా ఉద్దేశ్యం కాదు, చూశారా, కాని కొన్నిసార్లు నేను అత్యుత్సాహము చెందుదును, బహుశా… కాని నా భావము… రిక్కీ అనునది సరియే. నాకు ఆ పేరు అస్సలు నచ్చదు. అది నిజం. అయినా మీరు సంఖ్యాశాస్త్రము చూసినట్లయితే మీ పిల్లవాని పేరు మార్చెదరు. అవునయ్యా. ఇప్పుడు, రిక్కీ లేక ఎల్విస్, లేక అలాంటిదేదైనా. ఓ, కృప! కావున, ఓ, ఏదైనా, ఇప్పుడు మీరు చూడండి. వారు చెయ్యవలసి ఉన్నది. ఆ పేరు గతంలో ఉండెడివి కాదు, అది రావలసియుండెను. అది ఇక్కడ ఉండుటకు ఇదే తగిన కాలము. అది ఖచ్చితంగా సరియే.
1TIM 3:4•
1TIM 4:1
67ఇప్పుడు, "మరియు ఇప్పుడు ఆత్మ చెప్పుచున్నది," ఇప్పుడు వినండి, నేను మీకు లేఖనము నుండి వినిపించుచున్నాను.
చివరి కాలములలో, అని ఇప్పుడు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. [చూశారా], చివరి కాలములలో మోసపరచు ఆత్మలకూ దెయ్యముల బోధకూ చెవినిచ్చి కొందరు విశ్వాసము నుండి తొలగిపోవుదురు; మరియు అలా, చూశారా.
ఏ విధంగా వారు "అహంకారులు గానూ, గర్వాంధులుగానూ ఉందురో" గొప్పవారనబడిన వారు (బిగ్ షాట్స్) దీనిని మన్నించండి, అయినా సామాన్య వాడుకలో మనము బిగ్ షాట్స్ ( big shots - గొప్ప మనిషి- ధనము, పలుకబడికలవాడు - తర్జుమాదారుడు) అని దేనిని అంటామో మీకు తెలుసు. అలా అనటం మనందరికీ బాగా తెలుసు. "అహంకారులూ, గర్వాంధులూ, దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు."
JOHN 9:6,7
68నిన్న నేను అక్కడ నిలబడి సరిగ్గా మా క్రింద ఉన్న ఈత కొలను వైపు చూశాను. మరియు సండే స్కూలు బోధకుడైన ఒక మనుష్యుని గూర్చి ఆలోచించాను, నాతో అన్నాడు "యేసు ఉమ్మివేసిన చోటు, బైబిల్లో ఉండకూడదు," అన్నాడు, "యేసు ఉమ్మివేసి మరియు ఆ ఉమ్మితో మట్టి చేయుట. పరిశుభ్రతా నియమాలకు విరుద్ధము."
అతడు నిలబడి మాట్లాడుచుండెను, గ్రీకు మూలములో "ఆయన నేలపై ఉమ్మి వేసెను" అని చెప్పుబడింది. ఈ మనిషితో మాట్లాడుచూ, మరియు నేలపై ఉమ్మివేసెను. ఆయన ముగించిన తర్వాత, తన చేయి క్రిందికి చాచి, ఉమ్మితో ఉన్న మట్టిని తీసి అతని కళ్ళపై రాసెను, మరియు అతని కళ్ళపై రుద్ది, మరియు చెప్పెను, "వెళ్ళి సిలోయము (పంపబడిన) అను కోనేటిలో కడుగుకొనుము, మరియు నీ కళ్ళు తెరువబడును." మరియు అతడు వెళ్ళి కడుగుకొనెను, అతని కన్నులు తెరువబడెను.
69దానిని బట్టి ఈ మనిషి నాతో అన్నాడు, "అది ఈ రోజు పనిచేయదు. అది పరిశుభ్రతా నియమములకు, ఆరోగ్య నియమములకు విరోధము." మరియు అదే మనిషి తన కుటుంబమును తీసికొని, భార్య మరియు ఆ పిల్లలందర్నీ ఆ క్రింది ఈత కొలను లోనికి తీసుకెళ్ళాడు, అక్కడ ఆ స్త్రీ పురుషులందరూ, మరియు నెలలో వారు నీటిలో ఉండకూడని సమయాల్లో, మరియు అలాంటిదంతా. కొన్ని సమయాల్లో వారు అసలు విశ్రాంతి గదికి కూడా వెళ్ళరు, మరియు ఆ మురికి శరీరాలతో మరియు ఆ లోపలి మురికి, మరియు వారి నోరు, మరియు కన్నులగుండా దానిని అంతా ఉమ్మివేస్తూ, మరియు, ఇప్పుడు యేసు నేలపై ఉమ్మివేసి ఒక మనిషి చూచునట్లు చేయుట గురించి మాట్లాడటం!
70ఒక రోజు అక్కడి నుంచి ఒక చిన్న బాలుడిని నేను తీసికొని వచ్చాను, వాడన్నాడు, "నేను కొంత నీటిని మింగివేశాను," అన్నాడు, నాకు అస్సలు బాగాలేదు, నేను ఇంటికి వెళ్తున్నాను." వీధి చివర రెండు-మూడు కట్టడాల ఆవల ఒక ట్రయిలర్లో నివసించే ఆ చిన్నవాడు, ఆ చిన్నవాడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, నేను అతడ్ని అక్కడ దిగబెట్టాను, అన్నాడు, "ఇంకెప్పుడు నేనక్కడికి వెళ్ళను."
అయినా కాని అది "ఆధునిక నాకరికత అనబడుతుంది." మీరు ఎక్కడికెళ్తున్నారో చూశారా? "దోమను వడ కట్టి ఒంటెను ప్రిమింగుట" అనే పాత సామెత, చూశారా. ఇప్పుడు అతడ్ని కలవడానికి చాలా ఆతృతగా ఉన్నాను. ఇప్పుడు, సరిగ్గా అక్కడే నీవున్నావు. అటువంటి వాటికి దూరంగా ఉండుట మంచిది.
JOHN 10:37•
1TIM 4:1•
2TIM 3:3,4
71"ఒక తెలివైన, అహంకారము గల, గర్వముగల వారు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు." నేను లేఖనమును చూపించుచున్నాను. అంత్యకాలములో ఇది జరుగునని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. "అహంకారులూ, గర్వముగలవారూ, పైకి భక్తి కలవారివలె ఉంటూ… " సరే, మొదట, "వారు అజితేంద్రియులుగానూ, సజ్జన ద్వేషులుగానూ ఉందురు," వాక్యమును నమ్మువారిని ద్వేషించువారు. వారిని చూశారా? వీరు సాంప్రదాయ ఆచారములు మరియు వాటితో ఏకీభవించరు, అందువల్ల వారు వీరిని ద్వేషింతురు.
ఆ పరిసయ్యులు మరియు సద్దూకయ్యల వలె, వారు యేసును ద్వేషించిరి. ఎందుకు? ఎందుకంటే ఆయన వారి ఆచారమును వ్యతిరేకించుచుండెను, చూశారా. ఆయన భిన్నముగా ఉండవలెనని కాదు, కాని ఆయన జీవించవలసియున్నది. ఆయన వాక్యమైయుండెను, సజీవ వాక్యము జీవించుట. "నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మవద్దు" అని ఆయన చెప్పెను, చూశారా.
72సరే, ఈ రోజూ అదే సంగతి. ఒక మనిషి వీటిని బోధించినప్పుడు అది జరుగని యెడల, అప్పుడు అది తప్పు, ఎందుకంటే అది జరుగునని లేఖనము చెప్పుచున్నది. కాని అది జరిగినట్లయితే, అప్పుడు అది సరియైనది; ఆ మనిషి సరియినవాడని కాదు, కాని వాక్యము సరియైనది. కాని ఈ రోజు మనం చేరుకున్న పరిస్థితి ఇది. స్నేహితులారా, మీరు చూడండి, ఇది అంతే సహేతుకమైనది. మీరు దీనిని చూశారా? అంత్య-కాల సువార్తలో ఇక్కడ ముగింపును మీకు చూపించడానికి నేను ఇక్కడ నిర్మిస్తున్నాను.
2TIM 3:3-5
73ఇప్పుడు గమనించండి, ఈ కాలములో, తెలివిగల యుగము, "అహంకారులు, గర్విష్ణులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు," బుధవారం రాత్రి ఆ బూతు నాటికల్ని చూడటానికి ఇంటియొద్ద ఉండిపోవుదురు, "మేము సూసీని ప్రేమిస్తున్నాము" లేదా "లూసిని," లేక అటువంటి చెత్తంతా, స్త్రీలు ఒక డజను సార్లు పెళ్ళి చేసుకుని మరియు పురుషులతో జీవిస్తూ, మరియు వారు జీవిస్తూ… మరియు, ఓ, మై, వారిలో ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకొని విడాకులు తీసుకుని, మళ్ళీ పెళ్ళి చేసుకొని విడాకులు తీసుకుని, మరియు వారికి మీరు దేవుళ్ళలాగా విగ్రహాలు కడుతున్నారు. కాని మీరు ప్రార్ధన కూటముకు వచ్చుటకంటే, ఇంటి యొద్ద ఉండి దానిని చూస్తున్నారు. "దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు." టౌన్ లోకి ఒక బాల్ గేమ్ రానివ్వండి, లేక కలనల్స్ అండ్ జెయింటర్స్, లేక ఇక్కడ ఏదో ఒకచోట తలపడనున్న మరేదైనా, వారు వెళ్ళుటకు సంఘములు మూసివేయుదురు. ఒక బుధవారం రాత్రి వాడి గిటారుతో ఎల్విస్ ప్రేస్లీని ఇక్కడి వీధిలోనికి వచ్చి దానిని ముందుకీ - వెనక్కీ ఊపమనండి, లేక అలాంటివారు మరెవరైనా, ప్రార్ధనా కూటములు మూతపడిపోతాయి. "దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు. అహంకారులూ, గర్విష్ణులూ, అజితేంద్రియులూ, క్రూరులూ మరియు సజ్జన ద్వేషులూ, పైకి భక్తికలిగినవారూ!"
2TIM 3:5,6•
2TIM 4:5
74"వారు కమ్యూనిస్టులని" మీరందురు. కాదు, వారు కాదు.
వారు సంఘ సభ్యులు, ఒక విధమైన భక్తికలిగినవారు. కాని ఏంటి? దాని శక్తిని ఖండించువారు! ఒక రకమైన దేవుడిని కలిగియుందురు, కాని, "దేవుడు ఈ కార్యములు చేయడు. చూడండి, దానికి ఏ శక్తి లేదు; నీవు కేవలం దానిని అంగీకరించి అదీ ఇది చెయ్యి" అందురు. చూడండి. జీవితంలో మార్పు ఉండదు, ఏమీ ఉండదు, అది కేవలం సంఘానికి చెందియుండుటయే.
"పైకి భక్తిగలవారివలే ఉండి, దాని శక్తిని ఆశ్రయించనివారు. అట్టి వారికి విముఖడనై యుండుము" అని బైబిల్ చెప్పింది. "పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఇంటింటికీ తిరుగుతూ, అవివేక స్త్రీలను చెరపట్టుకొనిపోవు రకము వారు వీరే." ఖచ్చితముగా బైబిల్ చెప్పినది అదే. ఇప్పుడు మనము ఖచ్చితంగా ఆ తరములోనే జీవిస్తున్నాము. "కాని నీవైతే ఒక సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్య యొక్క పరిపూర్ణత రుజువుచేయుము." చూశారా, అదీ విషయం.
MARK 16:17,18•
2TIM 3:4,5
75ఇప్పుడు, మనము చూస్తున్న ఈ వర్తమానికులూ మరియు సాక్షుల వలన మనము ఏ పంటకు చెందియున్నామో కనుగొనుచున్నాము. ఈ ఉదయము మీరు ఏ పంటలో ఉన్నారో చూడండి. మనము ఏ పంటలో ఉన్నామో చూడండి. ఎందుకు, ఈ వైపున, నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించునని ఆయన చెప్పెను; నోవహు దినముల వలే వారు అపహసించబడి ఎగతాళి చేయబడుదురు, మరియు ఇక్కడ మరో గుంపు వారిని చులకన చేయుచూ వచ్చును, మూర్ఖులూ, గర్విష్ణులూ, ఒక రకమైన భక్తి కలిగియుండియూ, మీరు బోధించుచున్న ఆ సంగతినే ఖండించువారు. కనుక మీరు ఏ పంటలో ఉన్నారో చూడవచ్చు, చూశారా, ఈ దినము యొక్క ఈ నిజ వర్తమానికులు. అది వాడి వర్తమానముతో వచ్చు సాతానే అని యేసు ముందుగా చెప్పెను. మరియు ఆయన వర్తమానికుడు ఈ విషయము కలిగియుండును, నమ్మినవారిని ఆ సూచనలు వెంబడించును. చూడండి, సాతాను వర్తమానికులు పైకి భక్తిగలవారు. ఆయన వర్తమానికులు ఈ సూచనలు కలిగియుందురు, సర్పములను ఎత్తిపట్టుకొనుట, ప్రమాదకరమైనవి త్రాగుదురు, దెయ్యములను వెళ్ళగొట్టుదురు, రోగులపై చేతులుంచుదురు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము స్వీకరించుదురు, సూచనలు మరియు అద్భుత కార్యములు చేయుదురు. ఇప్పుడు, మనము ఎదో ఒక పంటలో ఉన్నాము, మరియు మనము అంత్యకాలములో ఉన్నాము. ఓ, మై!
ISA 1:6•
AMOS 3:3
76"నడినెత్తి నుంచి అరికాలు వరకూ ఒళ్ళంతా పచ్చిపుండ్లతోనూ, గాయములతోనూ ఉన్నదని" ప్రవక్త యొషయా చెప్పుటలో ఆశ్చర్యములేదు. మనమెక్కడికి వెళ్ళగలము? మనమంతా కలిసి ఒక్కటిగా ఉండినయెడల ఏమి చేయుదుము? అది దానిని ఎప్పటికంటే హీనముగా చేయును, చూశారా, అన్ని రకాల సంగతులూ అక్కడ ఉండును. వాళ్ళు ప్రయత్నము చేస్తున్నట్లుగా - ప్రపంచ సంఘముల సమాఖ్య, అది ఎన్నడూ పనిచేయదు, వారు నాస్తికులనూ, అవిశ్వాసులనూ కలిగియున్నారు. మరియు, "ఇద్దరు ఏకీభవించని యెడల ఎలాగు కూడి నడుతురు?" అని బైబిలు చెప్పుచున్నది. చూశారా? మరియు వారిలో ఏ ఇద్దరూ కలిసి ఏకీభవించరు.
రక్షణ అనునది, ఒక సంఘముతో కాదు గానీ, ప్రతి వ్యక్తికి మరియు దేవునికి మధ్య ఒక వ్యక్తిగత వ్యవహారము. వాక్యముతో నడచుట! అవును. సహోదరుడా, మనము చూచుచుండగా, చూడుము. నేను చాలా అలస్యము చేయుచున్నానని నేనెరుగుదును.
77గమనించుము, ఆయన రాకడ యొక్క సూచనయైన ఆ గొప్ప ప్రకాశించుచున్న ఎర్రని వెలుగు వ్రేలాడుచున్నది. అది మనకు తెలుసును. ఇక్కడ నేను రాసి ఉంచుకున్న అనేక లేఖనాలను తీసికొని మనము చివరికాలములో ఉన్నామని మీకు చూపించగలను. యూదులు పాలస్తీనాకు తిరిగి వచ్చారు, అంజూరపు వృక్షము చిగురించింది. భయముతో మనిషి హృదయము విఫలమగుచున్నది. స్త్రీలు, వారున్న ఆ కామాతురపు మూర్ఖత. ప్రకటన గ్రంథమునకు వెళ్ళి, ఈ దేశము స్త్రీ చేత గుర్తించబడినదని ఏలాగు మీకు చూపించగలనో కదా, పదమూడు. స్త్రీ సంఖ్య. మచ్చుకు, మనకు పదమూడు కాలనీలు ఉన్నాయి, పదమూడు గీతలు, (అమెరికా జెండాలో పదమూడు అడ్డగీతలు - అనువాదకుడు), ప్రతిదీ పదమూడే, పదమూడు రాష్ట్రాలూ, డాలర్ మీద పదమూడు నక్షత్రాలూ, ప్రతీదీ పదమూడే, మరియు ఒక స్త్రీయే.
REV 13:11
78కొంతకాలం క్రితం, నేను స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు, నేను మాట్లాడుచుంటిని. ఒక స్త్రీ అన్నది, "మేము అమెరికా రావాలనుకుంటున్నాము, అప్పుడు అక్కడి స్త్రీలవలె మేము స్వేచ్చను పొందగలము." వారేమి చేశారో నేను వారికి చెప్పాను. వారన్నారు, "అలాగైతే మాకది అక్కర్లేదు." చూశారా. చూశారా?
కాని అది అమెరికా, వెనక్కి వెళ్ళి సరిగ్గా ఇక్కడే దానిని మనం చూపించగలం, జలములు లేని చోట, ప్రజలు లేని చోట పైకి లేచు దేశం ఇదే కావలసియున్నది. ఒక గొర్రెపిల్లవలె పైకి లేచును, రెండు చిన్న కొమ్ములు కలిగియుండును, పౌర మరియు మతపరమైన శక్తులు, కాని అవి రాజకీయ శక్తుల ద్వారా ఐక్యపరచబడును, మనకొక క్రొత్త అధ్యక్షుడు వచ్చును, తిరిగి రోమ్ ను లోనికి తెచ్చును.
ISA 60:2
79ఇక్కడ వున్న లేక మరెక్కడైనా వున్న వేదాంతిగాని మరెవరైనా గాని, కమ్యూనిజం ప్రపంచాన్ని ఏలుతుందని బైబిలు ఎప్పుడైనా ప్రవచించినట్లు నాకు చూపించాలని నేను కోరుతున్నాను. మీరు కమ్యూనిజానికి భయపడవద్దు; దానికేమీ లేదు. అది దేశములను దండించుటకు దేవుడు వాడుకుంటున్న వట్టి కార్యము, దేశములను దండించుటకు. నిశ్చయముగా, రోమ్ ప్రపంచాన్ని పాలిస్తుందని బైబిలు చెప్పుచున్నది. రాజైన నెబుకద్నెజరును చూడండి, అతని కలను, అతని దర్శనమును, దానియేలు చెప్పిన భావము, ఎలా వాటిలో ప్రతి ఒక్క రాజ్యమూ మరియు విధానమూ ఖచ్చితంగా తాకిందో, మరియు సరిగ్గా క్రిందికి ఆఖరున రోమ్ ఉన్నది. కావున అది రోమ్ కానున్నది. అది కమ్యూనిజం కానేరదు, వారు కేవలం నామమాత్రపు అధికారులు. అంతే వారు మరెక్కడికి వెళ్ళరు. లేదు, వారు వెళ్ళరు.
ఇప్పుడే జోసెఫ్ చెప్పినట్లుగా, "ఆఫ్రికా యొక్క హృదయము, ఆ వెనుక వున్న ఆ దీన అన్యమతస్తులు పాలించబడకూడదు. వారు ఇప్పటికే పాలించబడ్డారు." ఈ రోజు వారి సంగతి అదే, వారు కొట్టివేయబడ్డారు. వారికి ప్రేమ కావాలి, వారికి దేవుడు కావాలి. మరియు కమ్యూనిజం దైవభక్తిలేని వారు కావున, వారు ఎన్నడూ దానిని అంగీకరించరు. నిశ్చయంగా కాదు, ఖచ్చితంగా కాదు.
ఆ ఎర్రని దీపం వెలుగుచున్నది. సూచన వ్రేలాడుచున్నది. ఆయన రాకడ సమీపముగానున్నది. ఓ, మై యెషయా 60వ అధ్యాయం 2వ వచనం చెప్పినది, "చీకటి భూమిని కప్పును. మరియు కటిక చీకటి ప్రజలను కమ్మును." మరియు అది ఖచ్చితంగా సరియే.
80అంత్య-కాల వర్తమానికుడూ మరియు వర్తమానమూ అంత్య-కాల పరిస్థితులను ఎదుర్కొనవలసియున్నది. అలా అని మీరు అనుకోవటం లేదా? ఈ వర్తమానము నలభై ఏండ్ల క్రితము బోధింపబడుట జరిగియుండెడిది కాదు. లేదు, అంత్య-కాల వర్తమానమూ మరియు వర్తమానికుడూ కలవవలసియున్నది. వారున్న ఆ వెనుకటి దినములలో, బహుశా ఇది పనిచేయకపోయి వుండును. కాని ఇది అంత్య-కాల పరిస్థితులను ఎదుర్కొనవలసియున్నది. మార్పు చెందండి, సువార్త సూచనలను నమ్మండి. అంత్య-కాల వర్తమానము. మీ ఆత్మలను గొర్రెపిల్ల రక్తములో కడుగుడి మరియు సువార్తను నమ్ముడి, మరియు అంత్య-కాల సూచనలిక్కడ వున్నవని నమ్ముడి. సువార్త విత్తనము స్థలమును తీసుకొనుచున్నది.
MARK 16:15,17
81వారు సంస్కరణల గురించి ఎంతగానో మాట్లాడుచున్నారు, దాని విషయమై, నేను వారితో వెళ్ళుదును ఉదాహరణకు, సువార్తిక సంస్కరణలు. "సంస్కరణ" అనగా "శుభ్రము చేయబడుట." కావున మన అపనమ్మిక ఎక్కువగా శుభ్రపరచబడుట అవసరమని నేను అనుకుంటున్నాను, మరియు సువార్తను నమ్ముట అవసరము. అదే సరి. మన అనుమానాలు మరియు ఆశ్చర్యాలు చాలా ఎక్కువైనవి. సంస్కరణ, గ్రీకు తర్జుమాలో "పశ్చాత్తాపము" అనబడిన మాటకు కూడా "సంస్కరణ" అని అర్థము. మరియు "సంస్కరణ" అనగా "శుభ్రపరచుట" వెనుక వున్నదానంతటిని, గత మంతటిని, మరియు దాని శక్తి మరియు ప్రత్యక్షతలో సువార్తను నమ్ముట. "వారిని ఈ సూచనలు వెంబడించును."
"ఆ కాలానికి మాత్రమే," అని వారందురు.
"యుగ సమాప్తి వరకూ," అని ఆయన చెప్పెను. ఇప్పుడు ఎవరో ఒక్కరే సరియైనవారు. అవిశ్వాసి అయిన ఆ మనిషి అది అపోస్తలులకు మాత్రమే అన్నప్పుడు, మరియు యేసు స్వయంగా, "యుగ సమాప్తి వరకూ" అన్నట్లయితే, అప్పుడు నేను ఆయన మాటలే తీసికొందును. అదే సరియైనది. ఇదే సరి!
82ఆయన ప్రజలు అవిశ్వాసము నుండి, మరియు అవిశ్వాసుల నుండి వేరుపరచబడాలని దేవుడు కోరుచున్నాడు. మీలో చాలా మంది ఈ విషయమై పొరపాటు చేస్తారు, కొన్నిసార్లు ఇక్కడ మీ పిల్లలను ఒక చిన్న ఓస్వాల్డ్ ప్రవర్తించునట్లు అనుమతిస్తారు, చూశారా. ఇప్పుడు భిన్నముగా ఉండుట, లేక బిరుసుగా, మరియు ఆ విధంగా, లేక ఒక రకమైన మూఢభక్తిగా ఉండుట నా ఉద్దేశ్యము కాదు. అది నా ఉద్దేశ్యము కాదు. కాని మీరు ఒక రాత్రివేళ మీ అమ్మాయి ఎవరితో వెళ్తుందో మీరు ఖచ్చితంగా తెలిసికొనుడి, చూశారా. బహుశా మీరు ఆమెను ఒక భక్తి గల చిన్న బాలికగా సంఘము చుట్టూ పెంచి ఉండవచ్చును, మరియు మీకు తెలిసే మొదటి విషయము, ఆమె ఓస్వాల్డ్ లేక వారిలో ఒకరితో బయటికి వెళుతు౦ది మరియు అతడు ఒక నాస్థీకుడు, అవిశ్వాసి, మరియు ఆమె జీవితం చెడిపోయి పైకి వస్తుంది, మరియు అతడేమిటో మీకు తెలియదు. మీరు చూశారా. అప్పుడతడు ఆమెను పెళ్ళాడతాడు, మరియు మీ పిల్లలెక్కడుంటారో చూడండి, అప్పుడు మీ మనవలు, చూశారా. జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన ప్రజలు వేర్పాటు చేయబడాలని కోరుచున్నాడు.
EXOD 34:12,13
83నిర్గమకాండము 34:12 ఒకసారి మీరు చదివి, దేవుడు ఇశ్రాయేలుకు ఏమి చెప్పాడో చూడండి. "మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ వున్న ప్రతిదానినీ శుభ్రం చేయండి. దానితో మీరు ఏమీ కలిగియుండవద్దు." యొహోషువ కూడా, 23వ అధ్యాయం, 12వ వచనం, చూడండి. యెహోషువ అన్నాడు, "ఇప్పుడు, దేవుడు మిమ్మల్ని ఈ మంచి దేశమునకు తీసికొని వచ్చాడు," ఇప్పుడు సంఘమును తీసుకొచ్చినట్లుగా, "మరియు ఈ మంచిదేశమునకు తీసుకొనివచ్చెను. మీరు దీనిని ఆస్వాదించుచున్నారా?"
"ఆమేన్, మేము ఆస్వాదించుచున్నాము," అని వారు అనిరి.
అన్నాడు, "ఇప్పుడు, ఇక్కడ అవిశ్వాసుల శేషము కొంత ఉన్నది, మరియు మీరు వారితో సంబంధము కలిగి ఉండవద్దు. వారితో వెళ్ళవద్దు." నీవు వెళ్ళవద్దు, సహోదరీ, ఆ కుర్రవాడు నిన్ను ఒకచోటవున్న మద్యశాలకు, సరదాగా కొంచెం త్రాగటానికి తీసుకెళ్ళాలనుకుంటే, వాడికి దూరంగా ఉండు. మరియు అబ్బాయిలైన మీకు కూడా అంతే అలా చేయాలనుకొనే అమ్మాయికి దూరంగా ఉండండి. వారికి దూరంగా ఉండండి.
"బ్రెన్హాం సహోదరుడు ఒక ముసలి మొరటువాడు" అని మీరు అందురు. కాని ఒకానొక రోజున నీవు కనుగొందువు. నేను వెళ్ళిన త్రోవ గుండా నీవు వెళుృదువు - అది నిజమని నీవు తెలుసుకొందువు. అవునయ్యా.
84పడుచు అమ్మాయిలు అవమానముతో లోనికి రావటం ఎన్నిసార్లు నేను ఒప్పుకోలు గదులలో చూడలేదు. ఆమె చనిపోయే వరకూ ఆ ముద్ర ఆమెతో వెళ్తుంది, మరియు ఆమె చెప్పిన విషయాలు కూడా ఒకప్పుడు మంచి క్రైస్తవ కుటుంబములో పెంచబడినది, కాని జరిగినది ఇది, ఆమె ఈ కుర్రవానితో బయటికి వెళ్ళినది. అతడు ఎంత అందంగా ఉన్నాడంటే, ఆమె అతనికి దూరంగా ఉండలేక పోయింది, మరియు అలా అంతా. మొదటి విషయం, అతడు సిగరెట్లు కాల్చేవాడు మరియు జేబులో సీసా ఉండేది, మరియు వారు త్రాగుట మొదలుపెట్టారు, మరియు ఇక్కడే నీవున్నావు, చూశారా. మరియు అక్కడ ఆమె అవమానలో ఉన్నది. ఓ, అది ఒక దయనీయమైన విషయము. దానిని మీరు ఇరువైపులా చూచుదురు. కావున, దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరే వేరుపరచుకోండి. అందరితోనూ మంచిగా దయగా ఉండండి, కాని వారి పాపంలో పాలివారు కావద్దు. దానికి దూరంగా ఉండండి. అవునయ్యా.
85స్నేహితులారా, కాలములు మారుతున్న ప్రతిసారీ, ఎల్లప్పుడూ ప్రజలను కలవరపరచినది నాయకులే. ప్రజలు అంతగా అయివుండలేదు. బలిపీఠానికి చెందిన సువార్త అక్కడ నిలచియున్నట్లయితే!
నేను అక్కడ బెతానీ కళాశాలలో, లూథరన్లతో మాట్లాడినట్లుగా అతడన్నాడు, "బ్రెన్హాం సహోదరుడా, మేమేమి కలిగియున్నామని నీవనుకుంటున్నావు?" మరియు అతడన్నాడు…
నేనన్నాను, "సరే, అది ఇక్కడున్నది."
అతడన్నాడు, "నీవు చెప్పుచున్న ఈ పెంతెకోస్తుకూ లూథరన్లమైన మాకునూ ఉన్న తేడా ఏమిటి?"
నేనన్నాను, "పెంతెకోస్తు సంఘము పురోగమించిన లూథరను సంఘమే. అది ఖచ్చితంగా సరియే, మీరు ఉండవలసిన చోట ఉండియున్నట్లయితే మీరు కూడా పెంతెకోస్తువారగుదురు."
ఈ ఉదయం ఎవరో చెబుతుండగా నేను విన్నాను, "సంఘములన్నీ - మొదటి మతము, క్రైస్తవులంతా నిజానికి రోమ్నుండి వచ్చారు." ఎవరైనా దానిని నాకు రుజువు చేయాలని నేను కోరుచున్నాను. సంఘ శాఖలన్నీ రోమ్లో మొదలయ్యాయని నేను ఒప్పుకుంటున్నాను. కాని క్రైస్తవులు యెరూషలేములో మొదలయ్యారు.
2COR 6:17,18•
2TIM 3:5•
REV 17:5•
REV 18:4
86కావున మనమంతా తిరిగి క్రైస్తవ్యము యొక్క తల్లి యొద్దకు రావాలని క్యాథలిక్ మతగురువులు కోరినట్లయితే, నేను అతనితో ఆ విషయమై అంగీకరించుదును; మనము పెంతెకోస్తుకు తిరిగి వెళ్ళి, అందరమూ పరిశుద్ధాత్మను పోందుకొందుము, రండి. ఆ విషయమై నేను అతనితో అంగీకరించెదను. అది ఎన్నడూ రోమ్నుండి రాలేదు, అది పెంతెకోస్తు నుండి వచ్చినది. సంఘము రోమ్లో ఆవిష్కరించబడలేదు; అది పెంతెకోస్తు దినాన ఆవిష్కరింపబడినది. నిశ్చయముగా, వారి తప్పుడు సిద్దాంతాల క్రింద కాదు గాని, పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రిందనే. అదే నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. మనము వెనక్కి వెళ్ళినట్లయితే, దానియొక్క ఆరంభానికి వెళ్తాము రండి; సంఘశాఖ యొద్దకు కాదు, నీవు రోమ్కి వెళ్ళుదువు, ఏలయనగా ఒక సంస్థ లేక శాఖ కలిగియున్న మొట్టమొదటివారు వారే, మరియు అది వారందరికి తల్లియైయున్నది.
మరియు ప్రకటన 17లో బైబిలు ఆలాగు చెప్పినది. ఆమె స్వయంగా ఒక వేశ్య మరియు వేశ్యలకు తల్లి, తన కుమార్తెలకు తల్లి, చూశారా. బైబిల్ చెప్పినది అదే. రోమన్ క్యాథలిక్ సంఘము వేశ్య అని, మరియు ఆమె యొక్క ప్రొటస్టెంటు కుమార్తెలంతా ఆమెతో కూడా వ్యభిచారిణులని యేసుక్రీస్తు చెప్పెను. మరియు "నా ప్రజలారా, ఆమె పాపములో పాలివారు కాకుండునట్లు, వాటినుండి బయటికి రండి; మరియు నేను మిమ్మును స్వీకరించుదును, మరియు మీరు నాకు కుమారులు మరియు కుమార్తెలగుదురు" అని ఆయన చెప్పెను, చూశారా. కావున అక్కడే మీరున్నారు, చూశారా, "పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయి౦చనివారునై యుందురు," మరియు మొదలైనవి.
87ప్రశస్త మెథడిస్తులారా, ఎంతగా మీరు దేవుని శక్తిని మీ మధ్య కలిగియుండెడివారో కదా. నేను వెళ్ళి మరియు నిలుచుంటిని… రాజైన జార్జికి ప్రార్ధించుటకు వెళ్ళినప్పుడు, ఇంగ్లండు నందలి, లండన్లో నేను జాన్ వస్త్రమును తొడుగుకొంటిని. మరియు వారు నన్ను వెస్లీ మందిరమునకు తీసుకుని వెళ్ళిరి. అక్కడ అతడు (జాన్ వెస్లీ - తర్జుమాదారుడు) ప్రతి ఉదయమూ ఐదు గంటలకు పదిహేను వందల మందికి బోధించెడివాడు, ఆ పురుషులు పనికి బయలుదేరక ముందుగా, అతని సీటులో కూర్చొంటిని - అతడు సీటుగా మార్చుకున్న రూస్టర్-ఫైటర్లో మరియు అక్కడ నిలచి అతని బలిపీఠము మీదికి వెళ్ళితిని. మరియు అతడు పరమునకు వెళ్ళిన గదిలో ప్రార్ధించితిని. మరియు, "ఓ, ఆ మెథడిస్తు సంఘం చేసినదేమిటో జాన్ కి తెలిసినట్లయితే, అతడు తన సమాధిలో మెలి తిరుగును," అనుకున్నాను. మీరు రోగుల కొరకు ప్రార్ధి౦చి గొప్ప సూచనలను కలిగియుండినప్పుడు జాన్ వెస్లీ… ఒక చెట్టు ఉన్న ఆ మందరిము యొద్ద నేను నిలుచుంటిని. ఆ రోజు, దైవిక స్వస్థత బోధిస్తుండగా, ఇంగ్లాండు యొక్క పెద్ద సంఘము, ఆంగ్లికను సంఘము… ఒక సభ్యుల గుంపు క్రిందికి వచ్చి ఒక నక్కనూ, కొన్ని వేట కుక్కల్నీ విడిచిపెట్టి, జాన్ యొక్క సమాజమును చెదరగొట్టిరి. చిన్న ముసలి జాన్ తన జీవితకాలంలో ఏనాడూ నూట-పది పౌనులకంటే ఎక్కువ తూగలేదు, కాని అతడు తిరిగి తన వేలెత్తి అన్నాడు, "వేషధారీ, నీ కొరకు ప్రార్ధించుటకు నన్ను పిలువక ముందు సూర్యుడు, నీ నెత్తిన మూడుసార్లు అస్తమించడు." మరియు, జాన్ వచ్చి తన కొరకు ప్రార్ధించాలని కబురు పంపించి, శరీరములో పక్షవాతం వలన, వాడు ఆ సాయంత్రము మరణించాడు. మరియు వాడు చనిపోయాడు, చూశారా? ఓ, మెథడిస్తులైన మీరు అలాంటి మెథడిస్తులుగా ఉండినచో, మీరు పెంతెకోస్తువారగుదురు. అది సరియే.
88పాస్టరు పదిహేను నిమిషాలకంటే యొక్కువ బోధించినట్లయితే మీరు అతనిని వెలివేయగోరుదురు. బాప్టిస్టు సంఘ స్థాపకుడైన జాన్ స్మిత్, కొన్నిసార్లు రాత్రంతా ప్రార్ధించేవాడు, మరియు ప్రజల పాపములకై మొరపెట్టుట వలన ఏడ్చి ఏడ్చి అతని కన్నులు మూతపడిపోయేవి, మరియు అతని భార్య అతనిని బల్ల యొద్దకు నడిపించి - చెంచాతో అతనికి అల్ఫాహారము తినిపించేది. ఇక ఎంతమాత్రమూ పదిహేను నిమిషాలు ప్రార్ధించలేరు. ఏంటి సంగతి? చూడండి, మీరు దానిలోనికి ఆచారాలను కలిపివేశారు.
వర్తమానము ఇంకా కదులుతుంది. ఇశ్రాయేలు అగ్నిస్తంభమును వెంబడించినది. అది ఆగిన చోట, వారూ ఆగిరి. అది వెళ్ళిన చోటికి, వారునూ వెళ్ళిరి. అగ్నిస్తంభము కదులుతూ ఉన్నది. అవును.
EXOD 18:18•
NUM 11:16,17
89ఇప్పుడు అది చేయునది నాయకులని మనము కనుగొనుచున్నాము. నాయకులు ఎల్లప్పుడూ కలవరపడినవారై యుండిరి. వెనుక బైబిల్ కాలంలో, మోషే ధర్మశాస్త్రము యొక్క తరములో ముసలి దాతానును చూడండి. మిశ్రిత జనాంగానికి నాయకత్వము వహించిన వాడతడే, దాతాను. అది కోరహు; దేవుడు తన ప్రవక్తయైన మోషేను నిలువబెట్టినప్పుడు, మరియు అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియుండెను. ఆ ఎడారిలో అతడు ఇరవై-ఐదు-లక్షలమందిని కలిగి యుండెను, మరియు యిత్రో వచ్చి చెప్పెను, "మోషే, ఇది నిన్ను చంపివేయును. నీ భారము చాలా ఎక్కువగా ఉన్నది." దేవుడు ఆయన ఆత్మలో భాగమును తీసి డెబ్బదిమంది పెద్దలపై ఉంచెను, మరియు వారు ప్రవచించిరి. అది మోషేను ఎంత మాత్రమూ బలహీనపరచలేదు. కాని ఇప్పటికీ మోషేయే మాటే చివరి మాట, ఏలయనగా అతడు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును" కలిగియున్నాడు.
NUM 16:21,32,33
90మీరు ఒక మనుష్యుల గుంపు క్రిందికి వెళ్ళలేరు. అది ఎన్నడైనా అలా వెళ్ళినదనుటను నేను ఖండిస్తున్నాను - దేవుడెన్నడైనా ఒక మనుష్యుల గుంపును వాడుకున్నాడనుటను, ఆయన ఒక మనిషిని వాడుకొనును. ఖచ్చితముగా. ఒక్కసారికి ఒక మనిషి, ఏలయనగా ఇద్దరు మనుష్యులకు రెండు అభిప్రాయములుండును. ఒక్క మనిషి అది ఖచ్చితంగా సరియే. ఇప్పుడు గమనించండి, ప్రతి కాలములోను అది ఆ విధముగానున్నది, క్రిందవరకూ ఆ త్రోవగుండా, అది ప్రతిసారీ అలాగే యున్నది.
మరియు అక్కడ మోషే నిలిచియుండెను. మరియు కోరహు ఏమి చేశాడో మీకు తెలుసా? అతడన్నాడు, "ఎందుకు, అతనొక్కడే బోధించగలిగినవాడైనట్లు, అతనొక్కడే వర్తమానమును కలిగియున్నవాడైనట్లు మోషే ప్రవర్తించనేల. ఓ, అగ్నిస్తంభము అతనిపై వ్రేలాడుతుందని మాకు తెలుసు, వెలుగు అతనిపై ఉన్నదని మాకు తెలుసు; మాకు అదంతా తెలుసు: కాని అతనొక్కడే వర్తమానమును కలిగియున్నట్లు అతడు ప్రవర్తించుచున్నాడు."
అది అతని (మోషే) ఉద్దేశ్యము కాదు. ఆ విధంగా చేయాలని అతడు అనుకోలేదు. అతడు ప్రజలను సరిచేయుటకు ప్రయత్నించుచుండెను. అక్కడ చాలా తలంపులున్నవి. మీరు ఒకదానిని వినవలసియున్నది. మరియు ఏమైనది? "కేవలం నిన్నునీవు వానినుండి వేరుపరచుకో, ఏలయనగా నేను వానిని వాని సమాజమునూ భూమిలోనికి మ్రి౦గివేయుదును" అని దేవుడు చెప్పెను. మరియు భూమి తెరవబడి, అగ్ని రాగా, వారు లోనికి వెళ్ళిరి, చూశారా.
91కలగలుపు, నాయకులు, ప్రజల మద్య కలవరం కలిగించనది నాయకులే. అది కానియెడల, ఈ రోజు మనము ఇక్కడి లోపలికి వచ్చుదుము, ఈ పట్టణము మరియు ప్రతి సంఘము మరియు ప్రతి సమాజము కూడివచ్చును. ఏల, వారు ఈ స్థలమును కలిగియుందురు; ప్రతి మద్యపు దుకాణము మూసి వేయబడును. ఎందుకు, ఈ పట్టణము ఎంతో ఎండిపోవును, ఎంతవరుకు అనగా, ఆ త్రాగుబోతు ఉమ్మివేయుటకు అర్ధగంట నుండి ప్రయత్నించును, అంతగా అతడి నోరు ఎండిపోవును. ఎందుకు, అది ఆలాగు ఉండును! నన్ను మన్నించండి, నేను అది చెప్పి ఉండకూడదు. ఆగండి. వినండి, నేను చెప్పదలచుకున్నది ఇది. మనమంతా చెదిరి పోయాము. అది నాయకులవల్లే. ఒకానొకటి చేయుటకు దేవుడు లోపలికి వచ్చును, మరియు ఏదో కోల్పోబోతున్నామనే భయంతో ఈ చిన్న గుంపుల నాయకులు దేవుని వర్తమానమును అంగీకరించుటకు బదులుగా, వారిని దానినుండి దూరముగా లాగివేయుదురు. నోవహు దినములలోనూ, అది నాయకులే. మోషే దినములలోనూ, అది నాయకులే. యేసు దినములలోనూ, అది నాయకులే. ఈ రోజు పరిశుద్ధాత్మలోనూ, అది నాయకులే. మిశ్రమ జనాంగము! "ఓ, స్త్రీలను అది చేయనివ్వు. నువ్వెందుకు వారి మీద అరుస్తావ్?" అని వారందురు
92ఇంతకుముందు ఇక్కడ చెప్పానని నేననుకుంటున్నాను. ఒక రోజు ఒకరన్నారూ, ఎందుకంటే నేనెప్పుడూ నా సహోదరీలను క్రమములో ఉంచుటకు ప్రయత్నించాను. దీనిని చూడండి, వారే లక్ష్యము - ప్రతికాలములోనూ వారే లక్ష్యముగా నుండిరి. వెనుక అక్కడ ఏదేను తోటలో వారిని సాతాను ఉపయోగించుకున్నాడు, మరియు ప్రతిసారీ వాడు వారిని ఉపయోగించుకున్నాడు. మరియు, చివరి దినములలో అమెరికా మరియు దాని స్త్రీల వైపు బైబిలు చూపించినప్పుడు నేను దానిని (స్త్రీల వైఖరిని, పోకడలను - తర్జుమాదారుడు) కొట్టడం మొదలుపెడతాను. మరియు ఒకరన్నారు, "బ్రెన్హాం సోదరుడా, ప్రజలు నిన్ను ఒక ప్రవక్తగా ఎంచుచున్నారు."
నేనన్నాను, "నేను కాను."
అతడన్నాడు "కాని వారు నిన్ను అలా ఎంచుచున్నారు. గొప్ప ఆత్మీయ వరములు పొందుకొనుట ఎలాగో వారికి నీవు బోధించవచ్చు కదా? వారికి ఆ విషయాలు బోధించు… దేవుడు నీతో వ్యవహరించుచున్నాడు, మాకది తెలుసు." "ఎల్లప్పుడూ వారిని ఖండించుటకంటే, ఆ స్త్రీలకు బోధించవచ్చు కదా," అని అన్నాడు.
నేనన్నాను, "నేను వారికి ముప్పయి-ఒక్క సంవత్సరాలు బోధించాను, మరియు నేను వారికి ఎలా బోధించగలను, వారికి వారి అ-ఆ-ఈ లు కూడా తెలియనప్పుడు నేను వారికి బీజగణితం ఎలా బోధించగలను? ఎందుకు, వారు కనీసం వస్త్రములు ధరించి స్త్రీలవలే ప్రవర్తించరు? వారు చేయుచున్నట్టే వారు చేయుచూ కొనసాగుటకు కారణమేమి? వారు సహజమైన విషయములనే కనీసం నమ్మలేకున్నప్పుడు, వారికి ఆత్మీయ విషయాలు నీవు ఎలా బోధించగలవు? వారికి ఆ విషయాలు నీవు ఎలా బోధించగలవు?" సంఘమును ఆ పరిధిలోనికి ఎదగనీయుడి, మరియు అప్పుడు ఆ పరిధిలో దేవుని వరములు పొందుకొనుట ఎలాగ మరియు వరములు మొదలగువాటిని బయలుపరచుట ఎలాగ అనునవి నేర్పవచ్చు. కాని, ఆ హృదయము సరిగా ఉండి దానిని స్వీకరించుటకు సిద్ధమగునంతవరకూ, పరిశుద్ధాత్మ ఎన్నడూ దానిని రానీయదు.
93మరియు, దేవుడు అక్కడ ఒక గొప్ప ఒత్తిడివలే నిలుచున్నాడు. అక్కడ అలాంటి వారు అనేకులు ఉందురని భయపడవద్దు. మీరు దేవుడిని ఖాళీ చేయలేరు. ఐగుప్తు, ధాన్యాగారాల క్రింద, దాదాపు అంత పొడవున్న ఒక చిన్న ఎలుక, ఒక చిట్టెలుక, "నేను రోజుకు ఒక గోధుమ గింజ మాత్రమే తినుట మంచిది; మరుసటి కోత కాలానికంటే ముందే ఇవి ఖాళీ అయిపోవచ్చు" అనటం మీరు ఊహించగలరా? అంత పొడవున్న ఒక చిన్న చేప, మహాసముద్రము మధ్యలో ఈదుతూ, "నేను ఈ నీటిని పొదుపుగా త్రాగటం మంచిది, ఎందుకంటే ఒకవేళ ఇది ఎండిపోవచ్చు," అనటం మీరూహించగలరా? ఓ, మై, అది తన ప్రజల యెడల దేవునికున్న కృపా మంచితనములను ఖాళీచేయుటవలే ఉన్నది. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. భూమిలో ఉన్న నీటినంతటినీ, సముద్రములనూ మరియు అన్నింటినీ పోగుచేసి పైన ఒక నాలుగడుగుల గొట్టంలో ఉంచితే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? దాని అడుగున ఒత్తిడి ఉంటుంది, ఒక చిన్న రంధ్రము దొరికినట్లయితే బయటికి వచ్చుటకు ప్రయత్నించును. ప్రతి జీవితములోనికీ రావడానికి పరిశుద్ధాత్మ చేయుచున్న ప్రయత్నపు ఒత్తిడి అదే.
94కాని వారది చేయరు, వారు ఆచారములు మొదలగువాటిని దేవునికంటే ఎక్కువగా ప్రేమింతురు. మీరు ఈ లోక విషయాలని విడిచి, దేవుని నమ్మవలసియున్నది. దానిని ఖండింపజాలము, మీరు సంవత్సరం వెంబడి సంవత్సరం, పర్యాయము వెంబడి పర్యాయము దానిని చూసారు. "అది ఎన్నడూ తప్పిపోదు. అది దేవుడే కావలసియున్నది." అని జోసెఫ్ ఒక పర్యాయము అన్నాడు, చూశారా. మరియు అది ఈ దినముకైన దేవుని వాగ్ధానము. నేను కాదు; నేను దేవుని వాగ్ధానమును కాదు. నేను ఒక మనిషిని. నేను ఇక్కడ ఉన్న ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుచున్నాను. అది ఈ దినమునకైన వాగ్ధానము. "ఎక్కడైనా, ఎవరికైనా."
GEN 6:2
95ఇప్పుడు అది వారేనని మనము కనుగొనుచున్నాము. మరియు, చూడండి, మచ్చుకు బిలామును చూద్దాము. బిలాము, అతడు క్రిందికి వచ్చి ప్రజలకు తన సిద్దాంతాన్ని బోధించాడు, మరియు వారన్నారు, "ఇప్పుడు చూడండి, మేమంతా విశ్వాసులం, మేము లోతు కుమార్తె పిల్లలం, పైనున్న మోయాబీయులం," అన్నారు, "మనమంతా ఒక్కటే." మరియు వాడు వారిని కలగాపులగం చేసి వారి మధ్య వివాహం జరిగించాడు. మరియు వాడు, ఆ అందమైన మోయాబీ స్త్రీలను బొమ్మలలా అలంకరింపజేసి, క్రిందికి వచ్చి ఇక్కడి దేవుని కుమారులతో చివరికి వారంతా ఒక్కటే అని చెప్పాడు; దేవుడు అన్ని జాతులకూ దేవుడు, మరియు ప్రతిదీ సరియైనదే. మరియు వాడు వారిని కలిపి పెళ్ళి చేశాడు. మరియు దేవుడు విభజన రేఖను గీసి వారిని వారి ఇండ్లు విడుచునట్లు మొదలగునవి చేసెను. అది ఏమిటి? దానిని చూశారా? ఖచ్చితంగా ఆ వెనుక వరద (నోవాహు) కాలానికి ముందు జరిగినదే? "దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూచుటకు అందమైనవారని చూసినప్పుడు, వారికొరకు వాంఛగొని వారిని భార్యలుగా స్వీకరించిరి," చూశారా. అక్కడా అదే కార్యము జరిగింది.
మరియు ఇప్పుడూ అదే సంగతి! మళ్ళీ అదే విషయము. మీరు దానిని చూడాలి. ప్రతి తరమూ తర్వాతి తరంలో ఏమి జరుగునో చెప్పుతుంది. అది ఇక్కడే వుంది. మనము దానిని చూస్తున్నాము. ఇది అదే అని మనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ బైబిల్ అప్పుడు ఎలాగున్నదో ఇప్పుడూ అలాగే ఉండునని ప్రకటించుచున్నది. సరే. ఇప్పుడు, మనము నివసించుచున్న దినమునకు అదంతా లెక్కలోనికి వస్తుంది.
MATT 23:16,19,26•
JOHN 3:18
96ఇప్పుడు ఈనాటి పిలుపు, ఈ రోజు సంఘములలో పరిగణించబడునదంతా సభ్యులే. వారికి కావల్సినదంతా సభ్యులే. 1944లో బాప్టిస్తుల నినాదం మనకు తెలుసు. "44లో మనము మరొక పది లక్షలమందిని కలిగియుందుము" అన్నారు. మన ప్రశస్త దయగల సోదరుడైన బిల్లీ గ్రాహాం మనకు తెలుసును, లేఖనములలో అతని స్ధానమును మనము చూస్తున్నాము, అతనెక్కడికి వెళ్ళును, ఏమి చేయును అనునవి. కాని ఎల్లప్పుడూ అవి, "నిర్ణయములే, అనేకమైన కల్పిత నిర్ణయములే." కేవలం సంఘ శాఖ, వారికి కావల్సినదంతా అదే, చూశారా.
యేసు దినములలోనూ అదే విధముగా ఉండెను, అదే విషయము. వారు చెడ్డ మనుష్యులు కారు. వారు గ్రుడ్డివారు. అంతే. వారు సత్యమునకు గ్రుడ్డివారై యుండిరి. యేసు వారితో అలాగు చెప్పెను, "గ్రుడ్డివారైన పరిసయ్యులూ మరియు సద్దూకయ్యలారా, మీరు చేయునదంతా ఏమిటి!" మీరేమి చేయుచున్నారని ఆయన చెప్పెను. "శాస్త్రులు, పరిసయ్యులులారా, మీరు గ్రుడ్డివారు!" "మీరు పాపులు" అని ఆయన అనలేదు. వారు పాపులే, అయితే మనము పాపమని దేనిని పిలుస్తాము.
ఇప్పుడు, "వ్యభిచారము, పొగ త్రాగుట, అబద్ధములాడుట, దొంగలించుట మొదలగు విషయములు, అది పాపము." అది పాపము కాదు. అవి అవిశ్వాసముము యొక్క లక్షణములు.
"నమ్మనివానికి ఇదివరకే శిక్ష విధింపబడియున్నదని" బైబిలు చెప్పెను. వాక్యము నందు అవిశ్వాసమే పాపము.
MATT 23:15•
JOHN 8:44
97ఆ మనుష్యులను చూడండి, పవిత్రులు. ఎందుకు, నైతికంగా మీరు వారిపై వేలెత్తి చూపలేరు. వారి తాత, మరియు ముత్తాత, మరియు తాతగారి తాత, మరియు తాతగారి తాతగారి తాత అందరూ యాజకులే. తరములన్నింటా వారు ధర్మశాస్త్రమును, మరియు పితరుల మరియు పెద్దల ఆచారములనూ కాపాడుకుంటూ వచ్చిరి. వారిపై ఒక మచ్చ కూడా లేదు. ఉన్నట్లయితే, వారు రాళ్ళతో కొట్టబడుదురు. మంచి మనుష్యులు, మరియు యేసు, "మీరు మీ తండ్రియైన అపవాది సంబంధులు" అనెను. ఎందుకు, ఏలయనగా వారు వర్తమానమును, వాక్యమును చూడలేదు. ఆయన అక్కడ ఉండెను.
మరియు "ఈ మనుప్యుడు మన సంఘాలను చీల్చుటకు ప్రయత్నించుచున్నాడు" అని వారనిరి.
ఆయన అన్నాడు, "గ్రుడ్డివారైన పరిసయ్యులు మరియు సద్దూకయ్యలారా." ఆయన అన్నాడు, ఆయన అన్నది ఇక్కడున్నది: ఆయన, "ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును చుట్టి వచ్చెదరు, అతను మీ సంఘశాఖలో కలిసినప్పుడు అతడు బయట ఉన్నప్పటికంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు," అనెను. యేసు చెప్పినది సరిగ్గా అదే.
MATT 23:15
98అనైతికమైనది మరియు భక్తిహీనమైనది అంటూ ఏదైనా ఉన్నట్లయితే, అది వారు చాలా మంచివారు అనుకొనే ఒక పాత నాచు పట్టిన సంఘ సభ్యుని తీసికొనుటయే, మరియు వారు వారి కళ్ళద్దాల నుంచి తప్ప బయటికి చూడలేరు. నేను విమర్శించటం లేదు. కాని, అవును, నేను విమర్శిస్తున్నాను కూడా. మరియు అది ఖచ్చితంగా సరియే. మరియు యేసు చెప్పెను, "నీవు మొదలు పెట్టినప్పటికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ నరకపు సంబంధివి." మరియు మనము సంఘములను తీసికొనినప్పుడు, ఆ సంఘములో మీరు ఎంతమంది సభ్యులను సంపాదించుకున్ననూ లెక్క లేదు, వారు పందెములకు, గుర్రపు పందెములకు వెళ్ళుట చూచినప్పుడు, మరియు ఆ బయట నిలబడినప్పుడు, మరియు స్త్రీలు పొట్టి దుస్తులు ధరించి వీధులలో క్రిందికీ పైకి తిరుగుతూ, సంఘములో పాటలు పాడుతున్నప్పుడు, ఒక పాపికి ఉన్న అతి పెద్ద అడ్డబండ అదే. ఖచ్చితంగా. క్రైస్తవులని పిలుచుకుంటున్న జనులు చక్కని జీవితం జీవించాలని వారు ఆశిస్తున్నారు, ఒక భిన్నమైన వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నారు. అది ఒక ఉదాహరణ. అది ఒక అడ్డు బండ, అది ఒక వేషధారి. నువ్వెప్పుడైనా ఉన్నదాని కంటే అది పదిరెట్లు చెడ్డది. నీవంతకు ముందు ఉన్నట్లుగా ఉండటమే నయము.
99అప్పుడే ఒక మనిషి వచ్చి, "వారు నాకంటే ఏమీ భిన్నంగా జీవించుటలేదు. అవును, నిశ్చయంగా లేదు. నేనూ వారియంతటి మంచివాడనే," అనును. అది ఒక అడ్డుబండ. అది ఖచ్చితంగా నిజం. వారు అనుట చూడండి. ఒక పాపి వచ్చి, "యేసు ఇక్కడ ఈలాగు చెప్పెను," అనును.
"ఆహా, అది అందుకు కాదు. దాని అర్ధం అది కాదు. అక్కడ ఆయన ఉద్దేశ్యం అది కాదు. అది వేరొక కాలానికి." ఏమి, ఓ అవిశ్వాసీ! చూశారా? ఏమిటి సంగతి? ఆ వ్యక్తి త్రోవలో నీవొక అడ్డుబండను పెట్టావు.
PS 1:1-3•
MATT 15:14•
LUKE 6:39
100యేసు, లేదా నా ఉద్దేశ్యము కీర్తనలో దావీదు చెప్పెను, "అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనవద్దు, భక్తిహీనుల మార్గములో నిలువవద్దు," చూశారా. "ఆ విధమగు భక్తిహీనుల త్రోవలో మిమ్ములను ఉంచుకొనవద్దు, మరియు అపహాసకులు కూర్చొను చోట కూర్చొనవద్దు, వారు నీతిమంతులను చులకన చేయుదురు, మరియు చుట్టూ నిలబడి ఒక విధమైన భక్తి కలిగియుందురు. కాని ప్రభువు యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, అది చేయుటను ప్రేమించును, అతడు నీటి కాలువల యొడ్డున నాటబడిన చెట్టువలె నుండును. అతని ఆకువాడదు మరియు అతడు చేయునదంతయు వర్ధిల్లును. ఖచ్చితంగా అలాగే అది జరుగును." దేవునికి కావల్సిన సంఘము ఆ విధమైనదే. గ్రుడ్డి వారికి త్రోవ చూపించు గ్రుడ్డి నాయకులు, ఈ చివరి దినములలో అపహాసకులు మొదలగువారిని తయారుచేయువారు.
MAL 4:5,6•
JUDE 1:3
101అంత్య-కాల సువార్తికుని వర్తమానము మలాకీ 4 నుండియున్నది. అది ఒక పునరుద్ధరణ. వర్తమానము మరియు వర్తమానికుడూ రెండు విశ్వాసము యొక్క పునరుద్ధరణకై కావలెను. ప్రభువు శిలువకు దాదాపు ముప్ఫయి యేండ్ల తర్వాత యూదా పత్రికలో యూదా, "సహోదరులారా, ఆ వెనుక, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము మీరు శ్రద్ధగా పోరాడవలెనని నేను మిమ్మును వేడుకొనుటకై జాగ్రత్తతో వ్రాయుచున్నాను," అనెను. చూడండి, చూశారా? పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకీ, చివరి దినాల గురించి "యెహోవా యొక్క మహా భయంకరమైన దినము రాకమునుపు నేను మీ యొద్దకు ప్రవక్తయగు ఏలియాను పంపుదును. మరియు అతడు నాశన కాలమునకు ముందు వచ్చి, పిల్లల విశ్వాసమును తిరిగి తండ్రుల విశ్వాసము తట్టుకు పునరుద్ధరించును" అని చెప్పెను. అదేమిటి? అది ముందుకు వెళ్ళు ఒక వర్తమానము, చివరి దినములలో ఒక వర్తమానమూ మరియు వర్తమానికుడు, అది వారిని తిరిగి ఒక ఆచారముల యొద్దకు తెచ్చుటకు కాదు, కాని వారిని వారి ఆచారముల నుండి విదిలించి వారిని తిరిగి తండ్రుల యొక్క మూల విశ్వాసమునకు పెంతెకోస్తు తండ్రుల యొద్దకు, చివరి దినములలో సంఘము ఎక్కడైతే ఉండవలసియున్నదో అక్కడికి, మోషే నాటి పితరుల యొద్దకు కాదు గాని, పెంతెకోస్తు తండ్రుల యొద్దకు తీసికొని వచ్చును.
MAL 3:1•
MATT 11:9,10•
LUKE 7:24-27
102మోషే నాటి పితరులకైనది మలాకీ 3, "ప్రభువు మార్గము సిద్దపరచుటకై నా దూతను ముందుగా పంపుచున్నాను." మత్తయి 11:6 అదే విషయము చెప్పుచున్నది. యోహానును అక్కడే ఆయన చూసినట్లు యేసు సాక్ష్యమిచ్చుచున్నాడు, చెప్పెను, "మీరు ఏమి చూడ బయలువెళ్ళితిరి? మంచి కాలర్లు గల బట్టలు తొడుగుకొనిన ఒక మనుష్యునా. యోహాను కాదు." ఆయన చెప్పెను, "ఆ విధముగా వస్త్రధారణ చేయువారు రాజుల మందిరాలకూ, మరియు ఆ పెద్ద సంఘ శాఖలకూ చెందియుందురు, వారు శిశువులను ముద్దు పెట్టుకొందురు, పెళ్ళిళ్ళు చేయుదురు, మృతులను పాతిపెట్టుదురు, మొదలైనవన్నీ మీకు తెలుసు, మరియు యౌవనులకు పెళ్ళి చేయుదురు మొదలగునవి. వారు ఆ వెనుక అక్కడ ఉన్నారు." "మీరు ఏమి చూడ బయలు వెళ్ళితిరి? ఏ గాలికైనా కదిలిపోవు ఒక రెల్లునా? కాదు, యోహాను కాదు. లేదు, లేదు, వారు అతనిని నిలువరించినప్పుడు అతడు చలించలేదు," అనెను.
"నీవక్కడికి వెళ్ళినట్లయితే నీకు సహకారము ఉండదు," అనిరి. యోహానుకు అది ఏ తేడా చేయలేదు, ఎలాగైనా అతడు వెళ్ళాడు, చూశారా.
"అయితే మీరు ఏమి చూడ వెళ్ళితిరి, ప్రవక్తనా?" అనెను. "ప్రవక్తకంటే గొప్పవానినని నేను మీకు చెప్పుచున్నాను! మీరు గ్రహించగలిగినట్లయితే, 'నాకు ముందుగా నా మార్గము సిద్ధపరచుటకైనా దూతను పంపుచున్నాను' అని ప్రవక్తచేత పలుకబడినవాడితడే" అనెను, మలాకీ 3.
JOEL 2:25•
MAL 4:3,5•
MATT 11:7,8,10
103మరియు మలాకీ 4లో సంఘ కాలమునకు ఆయన చెప్పెను. "ఆ దినమునకు ముందు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదును." ఇప్పుడు అది యోహాను కానేరడు, ఏలయనగా, వెనుక, అక్కడ ప్రపంచము దహించబడలేదు మరియు నీతిమంతులు దుష్టుల బూడిదెపై నడువలేదు. కాదు. అది ఈ కాలము, ఒక వర్తమానము ముందుకు వెళ్ళును! అది ఏమి చేయును? ప్రజల విశ్వాసమును పునరుద్ధరించును, ఈ రకరకాల కుళ్ళులో, మరియు కుళ్ళిపోయి ఉన్న సంఘశాఖా శరీరమును, తిరిగి జీవము గల దేవునియందు సజీవ విశ్వాసమునకు నడిపించును. వర్తమానము సంవత్సరాలుగా వెళ్ళుచున్నది. అది నిజము. పునరుద్ధరణకైన ఈ అంత్య-కాల సువార్తను మనము నమ్మి స్వీకరించుటకు ఇది సమయము. యోవేలు కూడా అదే విషయాన్ని చెప్పాడు, "పసరు పురుగు తినివేసిన సంవత్సరములన్నింటినీ నేను పునరుద్ధరించెదను."
PS 1:3
104ఇటు చూడండి. ఈ మధ్య వధువు వృక్షమును గురించిన నా వర్తమానము గుర్తు చేసుకొనుడి, చూశారా, వారు యేసుని ఏలాగు తీసికొనిరో? ఆయన ఒక వృక్షము, దావీదు చూసిన వృక్షము, తన కాలమందు ఫలమిచ్చుచూ, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు, అత్యంత పరిపూర్ణమైన చెట్టు. మరియు వారాయనను నరికివేసి, మనుష్యులు చేసిన రోమను వృక్షమునకు వ్రేలాడదీసిరి, అపహాస్యము చేయుటకై. కాని ఆయన ఏమి చేసెను? మరలా మూడవ దినాన లేచెను. ఆయన ఇంకా ఏమి చేసెను? ఆయన ఒక వధువు వృక్షమును ముందుంచెను, ఏదేను తోటలో ఉన్న చెట్లవలే ఒక పురుషుడూ మరియు స్త్రీ, రెండు చెట్లు, వాటిలో ఒకటి జీవ వృక్షము, మరియు ఒక చెట్టు మరణ వృక్షము మరియు ఆయన ఏమి చేసెను? ఈ చెట్టును విమోచించుటకు ఆయన వచ్చెను. కావున ఆయన దానిని కల్వరి యొద్ద విమోచించినందున ఇప్పుడు దానిని నాటుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఓ, మై మీరది చెప్పునప్పుడు నేను ఆత్మీయముగా పరవశించుచున్నాను. ఆయన వధువు వృక్షమును పునరుద్దరించుటకు, ఏదెనులో ఉండవలసినదానిని, కాని ఆమె అక్కడ పడిపోయినది, ఏలయనగా ఆమె వాక్యమును నమ్మలేదు. కాని ఇక్కడ వాక్యమును నమ్మునట్టి ఒక వృక్షమును ఆయన పునరుద్ధరించును. మరియు ఆమె పెంతెకోస్తు దినాన పైకి వచ్చినప్పుడు, ఆ నిజబోధ, మరియు, నిజ విశ్వాసము, అప్పుడు రోమ్ ఏమి చేయుట మొదలుపెట్టినది? పసరు పురుగును పంపించుట, గొంగళి పురుగును పంపించుట. మరియు ప్రతి ఒక్కటీ ఫలములో నుండి తన భాగమును తీసికొనెను, మరియు ఆకుల నుండి మొదలగువాటి నుండి, మరియు దానిని క్రిందివరకూ పీల్చివేసినది.
JOEL 2:25•
MAL 4:6
105కాని, "నేను ఆ వృక్షమును పునరుద్ధరించెదను" అని యెహోవా సెలవిచ్చుచున్నాడు" అని ప్రవక్త చెప్పుటకు అతడు ఏమి చూసెను? ఆమె వెనుక సంస్కరణ కాలంలో మొదలయినది. ఆమె ఏమి చేసినది? సంఘశాఖయైనది. పరిశుద్ధ యోహాను 14లో వలే దేవుడు ఆమెను సరిదిద్దెను, దానినుండి సంస్థనంతటినీ కత్తిరించెను. మరియు వెనుక వెస్లీ యొద్దకు వచ్చినది, ఆమె స్థాపక సంఘమైనది. అమెను సరిదిద్దెను.
"నేను పునరుద్ధరించుదును!" ఆమె ఇంకా వచ్చుచున్నది. ఇప్పుడు, అది ఏమి చేయును. సాయంకాలము వేళ అక్కడ ఒక సంఘశాఖ ఉండదు. ఒక కొన ఉండును. ఒక పండు మొదట ఎక్కడ ముగ్గుతుంది? పైన. ఎందుకు? ఎండ దానిని తాకుతుంది. మరియు సాయంకాలము, ఇప్పుడు, సాయంకాలపు వధువు వృక్షము కొరకు విత్తనములు నాటబడినవి, ఇప్పుడు జీవవృక్షము వధువు వృక్షమునొద్దకు తిరిగి వచ్చును. మీరు చూశారా? మరియు నాటబడిన ఆ చెట్టుమీద ఉన్న ఆ ఫలమునకు నీరుపోసి ముగ్గునట్లు చేయుటకు ఇప్పుడు సాయంకాలపు వెలుగు వచ్చియున్నది. విత్తనములు విత్తబడినవి, చూశారా. సాయంకాలము. కావున సాయంకాల సువార్త మలాకీ 4 యొక్క ముద్ర యగును, ప్రజల యొక్క విశ్వాసమును తిరిగి తండ్రుల యొక్క విశ్వాసమునొద్దకు పునరుద్ధరించుటకు. అవునయ్యా. తిరిగి కట్టడపు రాళ్ళయొద్దకి! ఆమేన్. తిరిగి…
MATT 23:15
106ఈ రోజు నాయకులు మళ్ళీ "సంఖ్య, సంఖ్య" అంటున్నారు. ఆ వెనుక యేసు కాలములో, ఆ విధాన తరములో వారు అదే అన్నారు. యేసు చెప్పెను, "వేషధారులైన శాస్త్రులూ, పరిసయ్యులులారా, ఒకనిని మీ మతమునకు మార్చుటకు మీరు సముద్రములు చుట్టుదురు, కాని అతనిలోనికి తీసుకు వచ్చినప్పుడు, అతడు మొదలుపెట్టినప్పటికంటే రెండింతలు నరకపాత్రునిగా యగును." మరియు ఈ దినాన వారు సంఘమునకు మరొక సభ్యుని చేర్చుటకు కోట్ల డాలర్లు మరియు ప్రతిదీ ఖర్చుచేయుచున్నారు. మరియు మీరు చేసినప్పుడు, అతడు ఆ బయట ఉన్నప్పటికంటే నీచముగా అగుచున్నాడు. మీరు కేవలం అతనిని ఒక వేషధారిగా చేయగలరు, పురుషులను ఆ కార్యములు చేయనిచ్చి లోకములోనికి బయలు వెళ్ళి సువార్తను చులకన చేయచూ నవ్వుచూ మరియు అలాంటిదంతా. చూశారా.
JAS 2:19
107ఈనాటి నాయకులు మరలా "సంఖ్య, సంఖ్య, సంఖ్య!" అనుట. ఈ రోజు లెక్క లోనికి వచ్చునవి అవే, అంకెలు, నిర్ణయాలు.
ఇప్పుడు, ఈ రోజు, అది అంత పెద్ద మాట, "నిర్ణయాలు." ఒకరు సంఘములో చేరవలెనను నిర్ణయమునకు బదులుగా దేవుని సేవించవలెనను నిర్ణయము తీసుకొనవలెనని నేను కోరుదును." ఒక నిర్ణయము తీసుకో, లోనికి రా, నీ పేరు పుస్తకములో రాయించుకో," ఒక పూర్తి పెద్ద ప్రజల గుంపును అక్కడికి పంపండి, వారు రాసుకొందురు, "నీ పేరేమిటి, "జాన్ జోన్స్." "నీవు క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరిస్తున్నావా?" "అవును." ""యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు నమ్ముచున్నావా?" "అవును." సాతాను కూడా అదే చేయును, అదే వాడు చేయునని బైబిలు చెప్పుచున్నది. వాడు నమ్మి వణుకుచుండును. అవునయ్యా.
2TIM 4:7,8
108కాని నీవు నిజంగా నమ్మినప్పుడు నీవు వణకవు. నీవు సంతోషించెదవు. ఆమెన్. "ఆయన రాకడను ప్రేమించువారందరూ." ఒకరు నాకు ఎడతెగక చెప్పినట్లు, ఉత్తరములు రాయుచున్నట్లు నేను మీకు చెప్పాను, "బ్రెన్హాం సహోదరుడా నీవు ప్రజలను చావు మట్టుకు భయపెట్టుచున్నావు, అంతము సమీపమున ఉన్నదని వారికి చెప్పుచున్నావు." సంఘమును భయపెట్టుట? మై, జరుగగలిగిన అత్యంత మహికరమైన విషయమది, ప్రభువు యొక్క రాకడ, యుగ సమాప్తి, అది సరిగ్గా ఇప్పుడే కావలెనని నేను కోరుచున్నాను. నిశ్చయంగా, ఎందుకు, నేనిప్పటివరకూ ఊహించినవాటిలో అత్యంత మహిమకరమైనది ప్రభువును కలిసికొనుటయే. ఈ పాత మాంసపు వస్త్రమును నేను విడిచెదను, మరియు లేచి నిత్యమూ ఉండు బహుమానమును చేజిక్కించుకొందును, మరలా యవ్వనస్తుడినగుదును, మరియు నా ప్రభువుతోను, నా ప్రజలందరితోనూ సదాకాలమూ జీవించెదను. ఎందుకు? మై, ఇక్కడి ఈ పాత రోగశాలలో పాపము మరియు శోధన, మరియు, ఓ, బాధలూ మరియు నొప్పుల గుండా పోరాడుటను నేను ఆలోచించలేను. దీనిని విడిచిపెట్టుట మరియు ఒక నీతి కిరీటముకై వెళ్ళట, ఎందుకు, నేను ఎన్నడైనా విన్న అత్యంత మహిమగల విషయమదే. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, "నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకొంటిని; ఇకపై ఒక… విశ్వాసము నిలుపుకొంటిని, మరియు ఇకపై నాకై ఒక నీతి కిరీటము ఉంచబడినది, ఆ దినమున నీతిమంతుడైన ప్రభువు దానిని నాకు అనుగ్రహించును; నాకు మాత్రమే కాదు గాని ఆయన ప్రత్యక్షతను ప్రేమించువారందరికి." ఆయన ప్రత్యక్షతను నమ్మువారికి అనలేదు; కాని "ప్రేమించువారికి" ఆయన వస్తున్నాడని ఎరిగియుండుట ఎంత ఆనందమో! నిశ్చయంగా! అవునయ్యా!
109కాని ఈనాడు అది "సభ్యులు," అది "నిర్ణయములు," అది "సంఘము యొక్క సభ్యులు," ఇంకా ఎంతో మంది సభ్యులు. అది ఏమిటి… అది సాయం-కాలపు సువార్త కాదు.
ఇప్పుడు నేను ఒక నిమిషం ఆగబోతున్నాను, మరియు నా మనస్సులో నుండి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మిమ్మును ఎక్కువ సమయం ఉంచలేదని నేను ఆశిస్తున్నాను. అది, నాకింకా ఏడెనిమిది నిమిషాలుంది, మరియు నేను మీతో మనస్సులో నుండి మాట్లాడాలనుకుంటున్నాను.
ఇప్పుడది నిజము కాదా? "నిర్ణయములు, సంఘములో చేరుట. మీరు మెథడిస్టు సంఘమును విడిచి, మా బాప్టిస్తులలో చేరుడి. లేదా బాప్టిస్తులను విడిచి, వచ్చి మా మెథడిస్తు ప్రెస్బిటేరియన్, లూథరన్లలో చేరుడి?" క్యాథలిక్ అందరినీ తీసికొందురు, చూశారా. "సభ్యులు, సభ్యులు, సభ్యులు, నిర్ణయములు, నిర్ణయములు."
MARK 16:17
110వాటిని చెక్కుటకు శిల్పి లేనియెడల రాళ్ళు ఉండి ఏమి లాభము? ఒప్పుకోలులు రాళ్ళే పేతురు తన ఒప్పుకోలును తెలిపినప్పుడు యేసు చెప్పెను, "నీవు పేతురువి, ఒక చిన్నరాయివి." అతడిని ఒక దేవుని కుమారునిగా చెక్కుటకు అక్కడ ఒక రాళ్ళు చెక్కు శిల్పి లేనియెడల ఒక రాయి ఉండుట వలన మేలు ఏమిటి? మీరు కేవలము ఒక బండల గుట్టను వేయుచున్నారు. అది సరియేనా? కొంచెము కూడా మంచి చేయుట లేదు. చూశారా? నీరు (ప్రవాహము - తర్జుమాదారుడు) రాళ్ళను కరిగించును. చూడండి, అది నిజము, అదే ప్రజలు. ఒక పదునైన పనిముట్టు చేత వానిని చెక్కి దేవుని గృహములో సరైన స్థానములో అమర్చుటకు ఒక రాళ్ళు చెక్కువాడు నీకు లేనియెడల మంచి రాయి ఉండి ఏమి లాభము? కేవలం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నిర్ణయాల వల్ల లాభమేమిటి? నీ పేరుని పుస్తకంలో ఉంచుట వలన లాభమేమిటి? దానినీ, దీనినీ విడిచిపెట్టునట్లు చేయుటకు, వారిని కత్తిరించి ఈ విధంగా చేయుటకు, మరియు వారిని చెక్కి క్రైస్తవులగా చేసి దేవుని గృహములో ఉంచి సూచనలు విశ్వాసులను వెంబడించునట్టుగా చేయుటకై శిల్పి లేనియెడల వచ్చి సంఘములో చేరుట వలన లాభమేమి?
అది అంత్య-కాల సువార్త, రాళ్ళను తీసికొని వాటిని చెక్కుట, చూశారా.
111నీవు వాటిని కేవలం ఒక గుట్టగా వేసినయెడల రాళ్ళ వలన జరుగు మేలు ఏమిటి? అవి ఎక్కడ ఉండినవో అక్కడే విడిచిపెట్టడి, గుట్టగా వేసినప్పటికంటే ఎక్కడివి అక్కడ విడిచిపెట్టబడుటయే కొంచెము మేలు. అవి అక్కడ అవసరమయి ఉండొచ్చు, మరియు ఒక్కటి కూడా అక్కడ ఉండకపోవచ్చు. చూడండి, అది నిజము. రాతిని చెక్కు శిల్పి లేకుండా, రాయివల్ల లాభం లేదు.
యేసు గుణమును లెక్కించును, సభ్యులను కాదు. మీకది తెలుసా? ఆయన గుణము లెక్కించును. దేవుడు ఎల్లప్పుడూ ఒక్క మనిషిని తన చేతిలోనికి తీసికొనుటకు ప్రయత్నించెను. ఆయనకు కావల్సినదల్లా ఆ ఒక్క మనిషే, మరియు ఆయన తన పనిచేయును. ఏండ్లు తరబడి కేవలం ఆలోచించండి, నోవహు కాలంలో ఆయన ఒక్క నీతిమంతుడినే కనుగొనెను. మోషే కాలంలో ఆయన ఒక్క నీతిమంతుడినే కనుగొనెను.
సమ్సోనును చూడండి. చూడండి, మీరు ఆయనకు సమర్పించిన దానినే దేవుడు వాడుకొనగలడు. సమ్సోను ఒక పెద్ద శక్తిగల మనిషి, అతనికి చాలా బలమున్నది. సమ్సోను తన బలమును దేవునికి అర్పించెను, కాని తన హృదయమును ఇవ్వలేదు. అతడు తన వాృదయమును దెలీలాకు ఇచ్చెను, చూశారా. మరియు ఈ రోజు ప్రజల త్రోవ అదే. ఓ, సహోదరుడా, వారు క్రిందికి వచ్చి అప్పులు తీర్చుదురు, మరియు అటువంటివి చేయుదురు, మరియు ఇంకా పెద్ద సంఘ శాఖ కట్టుదురు, మరియు మొదలైనవి, కాని వారి హృదయం ఇవ్వవలసి వచ్చేసరికి, వారది చేయరు. అది నిజం. ఏమి లాభం…
MATT 26:51,72,74•
MARK 14:47,71•
LUKE 22:50,57•
JOHN 18:10,17,25
112పేతురు యొద్ద ఒక కత్తి యుండెను. అతడు ఆ కత్తి తీసి ప్రధాన యాజకుని చెవిని నరకబోయెను, మరియు అటువంటివి, అతడు అది చేసెను. కాని నిజమైన క్రైస్తవ ధైర్యము యొద్దకు వచ్చేసరికి, అది అతనికి లేకపోయెను. అతడు వెనక్కి తగ్గి ఆయనను ఎరుగననెను. అది నిజమేనా? తన కత్తితో అతడు ప్రధాన యాజకుని చెవి నరకగలడు, నిశ్చయంగా, అది ఏలాగుచేయాలో అతనికి తెలుసు. కాని దేవుని వాక్యముపై నిలువబడుటకు నిజమైన ఒత్తిడి మరియు సమయము వచ్చినప్పుడు అతనికి ఆ ధైర్యము లేదు, మరియు అతడు యేసును ఎరుగుదుని ఒప్పుకొనకపోయెను.
ఈ రోజు అది అక్కడే యున్నది. మనకు భవనములు నిర్మించుటకు, వాటిలో మిలియన్ల డాలరు పెట్టుటకూ ధైర్యమున్నది. పైప్ ఆర్గాన్లూ, ఆధునిక కుర్చీలూ మరియు ప్రతీవీ తెచ్చుటకు మనకు ధైర్యమున్నది, మరియు మనము బయలు వెళ్ళి ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మతములు మార్చుచూ, మరియు మెథడిస్తులను బాప్టిస్తులుగా చేయుచూ, మరియు అలాంటివి, వెనక్కీ ముందుకూ అలా చేయుదురు. కాని వాక్యమునూ మరియు దేవుని వర్తమానమునూ అంగీకరించి, దానిపై నిలబడవలసిన క్రైస్తవ ధైర్యమునకు వచ్చేసరికి మనము కొద్దిమందిమే. కావున, మరలా, రాళ్ళు చెక్కువాడు లేకుండా రాళ్ళు ఉండి లాభమేమిటి? అది నిజమేనా?"
GEN 24:12
113దేవుడు గుణలక్షణము కొరకు చూచుచున్నాడు, సభ్యుల కొరకు కాదు, గుణలక్షణము కొరకు. ఇస్సాకుకు వధువును వెదుకుటకు వెళ్ళినప్పుడు ఎలియాజరు, గుణలక్షణము కనుగొను వరకూ చెమటోడ్చాడు. గుర్తుంచుకొనండి, దేవుడు మనలను బాధ్యులుగా చేసినట్లే, అబ్రహాము అతనిని బాధ్యునిగా చేసెను, అది నిజం, సేవకులమైన మనలను. "నా వధువును వెదకుడి!" దేవుడు మీ హృదయమును దీవించును గాక, నేను సభ్యుల కొరకు చూచుట లేదు. నేను హృదయ శుద్ధిగలవారి కొరకు చూచుచున్నాను, చూశారా, వాక్యమును నమ్ము ఒకరి కొరకు.
ఎలియాజరు చూసి, "ఓ, నేను దీనిని నాకు నేనుగా చేయలేను. చాలా బాధ్యత ఉన్నది. ఇస్సాకు కొరకు వధువును వెదకుట యొక్క బాధ్యతను నేను గ్రహించుచున్నాను…" అనుకొనెను. అది సంఘమునకు మాదిరియై యున్నది, మీకు తెలుసు, క్రీస్తునకు; రిబ్కా, సంఘమునకు సాదృశ్యము. మరియు ఎలియాజరు మోకరించి, "దేవా, నీవు నాకు తప్పక సహాయము చేయవలసియున్నది," అనెను. మరియు అతడు దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడతనికి సహాయము చేసెను. అతనికి గుణలక్షణము దొరికెను.
GEN 24:57,58
114సహోదరుడా, వాక్యమునొద్దకు తిరిగి రమ్ము దేవుని యొద్దకు తిరిగి రమ్ము. నీవు చెందిన ఈ సంఘమునకు ఏమాత్రము శ్రద్ధ చూపవద్దు. వారు నిన్ను ఉండనిచ్చినయెడల, నీకు ఇష్టమైతే నీవక్కడ ఉండవచ్చును. కాని ముందు చేయాల్సిన పని దేవుని యొద్దకు వచ్చుటయే. అది నిజం. ఇదే అంత్య-కాల సువార్త. అవును. గుణలక్షణము!
మరియు అతడు కనుగొన్నప్పుడు. రిబ్కా అను స్త్రీలో, ఇస్సాకు యొక్క అందమైన వధువులో ఉన్న గుణలక్షణము ఎలియాజరు కనుగొనినప్పుడు, అతడు ఆమెకు ఇస్సాకు గురించి చెప్పెను. మరియు ఆమె ఎన్నడూ ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆమె వర్తమానికుని మాటను నమ్మి వెళ్ళుటకు సిద్ధపడెను. మరియు వారు వెళ్ళి, తండ్రిని అడిగినప్పుడు, "ఆమెనే అడగండి, ఆమె వయస్సుకు వచ్చినది. ఆమె నిర్ణయము చొప్పున జరుగనీయుడి," అని అతడు అనెను.
"నేను, వెళ్ళుదును," అని ఆమె చెప్పెను. ఎక్కడికి? ఆమె ఎన్నడూ చూడని, ఏమియూ ఎరుగని మనుష్యుని యొద్దకు. కాని, అయినా ఆమె సిద్ధముగా యుండెను, ఏలయనగా ఆమె అందుకు ఏర్పరచబడినది, మరియు ముందుగా నిర్ణయించబడినది. ఖచ్చితంగా నిజం.
MATT 22:17•
MARK 12:14•
LUKE 20:22
115యేసు పాదములు కడుగుచున్న స్త్రీని మీరు గమనించారా? ఆమె ఎన్నడూ ఒక దీవెన కొరకు అడగలేదు. ఆమె కేవలం అక్కడ చూసినది. మరియు అక్కడ ఆ వేషధారి ఆయనను చులకన చేయుటకు ప్రయత్నించుచు, ఆయన గుణలక్షణము అవమానపరచుచు, వారు ఎల్లప్పుడూ చేయుటకు ప్రయత్నించినది అదే, అయనను తక్కువ చేయుట. మీకు తెలుసు, కొందరు జనులు కేవలం అందుకే ఆయనను వెంబడించిరి. వారందురు, "ఇప్పుడు, ఇటు చూడండి. మంచి బోధకుడా, నీవు దేవుని యొక్క గొప్ప మనిషివని మాకు తెలుసు. నీవు దేనికీ భయపడవు. మేము కైసరుకు పన్ను కట్టవలెనా"? చూశారా? అన్నియూ - కేవలం ఆయన నామముకు నల్లమచ్చ తెచ్చుటకై ఏదో ఒకటి వెదుకుటకు ప్రయత్నించుట, దానిని నిందించుటకు. ఈ పరిసయ్యుడు అక్కడకు ఆయనను విందుకై ఆహ్వానించెను, ఆయనను వారక్కడికి ఆహ్వానించుదురని ఆ సంఘ శాఖకు తెలుసు. వారు ఎక్కడో అగ్నిలో ఒక ఇనుప కడ్డీని కలిగియుండిరి, (ఒక జూదగాని భాషలో "వాని చొక్కాయి చేతిలో ఒక పేక ముక్క దాచువాడు"), వారంతా ఒకే (వారు యేసును అవమానించుటకు - తర్జుమాదారుడు) ఉద్దేశ్యము కలిగియుండిరి.
116మిమ్మును ద్వేషించువారిని, క్రీస్తు కొరకైన మీ లక్ష్యమును ద్వేషించువారిని, ఆలాంటి వారిని మీరు చూసినప్పుడు, మరియు వారు మిమ్మును లోనికి పిలిచినట్లయితే, అది మీ నుండి బోలెడంత డబ్బు తీసికొనుటకై యగును, లేక ఏదో విధముగా మిమ్ములను ఉపయోగించుకొనుటకు యగును, చూశారా. వారు వర్తమానమును నమ్మరు. వేరొక ఉద్దేశ్యము కొరకు వారు నిన్ను అక్కడికి రప్పించిరి. అదే క్రీస్తు ఈ రోజు దానిని వివేచించడని మీరు అనుకొనుచున్నారు? నిశ్చయంగా, ఆయన వివేచించును.
కాని అక్కడ వారు ఆయనను లోనికి తీసికొనివచ్చిరి, "ఇప్పుడు మేము దానిని రుజువు చేయుదుము," అని వారనిరి. ఆ వెనుక ఆయనను రప్పించి, ఆయన కడుగకుండా, స్వాగతించకుండా, ఆయనను మురికిగా లోనికి రానిచ్చిరి. అక్కడ దానియందు కూర్చొనుచూ, వారు ఆ వస్త్రములలో వచ్చుదురు, మీకు తెలుసు, ఆ రోజులలో గుర్రములు మొదలైనవి వెళ్ళిన ఆ చిన్న పాత త్రోవలలో వాటిని ఈడ్చుకుంటూ నడుచుదురు. వారందరూ అదే విధముగా ప్రయాణించుదురు. ఆ పెద్ద వస్త్రము ఆ కంపును అంటించుకొనుచూ, మరియు అది ఆయనపై యుండెను, మరియు అది త్రోవ పైని దుమ్ము, మొదలగువాటివలన కంపుకొట్టుచుండెను. మరియు పాత… కంపు, కోళ్ళ గూళ్ళలో మరియు వాటిలో వలె. మరియు అది ఆయనపై యుండెను, ఆ గొప్ప చెనిల్లీ రగ్గులూ మొదలగునవి నేల మీద పరచియున్న అతిథి యొక్క ఇంటికి వెళ్ళుచుండగా, వారికొక రకమైన పరిమళ తైలముండెడిది, వారు వారి ముఖము మరియు కాళ్ళు కడుగుదురు, మరియు వారికి ఒక జత పడక గది చెప్పులు ఇచ్చెడివారు, మరియు వారి మేజోళ్ళు సర్దుదురు. అప్పుడు అంతా చక్కగా దుస్తులు ధరించి, చక్కగా దువ్వుకుని, మరియు తన తల సరుకున్న తర్వాత లోపలికి వచ్చేవారు. అప్పుడు మీరు అతిథిలును కలిసికొందురు, మరియు - అప్పుడు మీరు వారిని పలుకరించి హత్తుకొందురు. వారు ఒకరి మెడను ఒకరు హత్తుకొందురు, మరియు ఒకరినొకరు మెడపై ముద్దు పెట్టుకుందురు, కొద్ది సమయం క్రితం నన్నూ - జోసెఫ్ని ఒకరి చుట్టూ ఒకరు చేతులు వేసికొనుట మరియు తట్టుట మీరు చూసినట్లు, మరియు వారు ఒకరినొకరు మెడ మీద ముద్దుపెట్టుకొందురు. కాని ఆ పరిసయ్యుడు, ఆయనను అక్కడికి ఆహ్వానించిన తర్వాత, మరియు ఆయన ఆ వెనుక అక్కడ కూర్చొని యుండెను, వారు ఆయన కాళ్ళు ఎన్నడూ కడుగలేదు. వారు ఆయనకు ఏమియూ చేయలేదు, కేవలం ఆయనను చులకన చేయుటకు అక్కడ కూర్చుండనిచ్చిరి.
LUKE 7:28,37
117కానీ తన అపకీర్తిగల, జీవితంతో సంపాదించిన కొన్ని నాణములతో ఉన్న ఒక దీన దిగజారిన వేశ్య ఆయన అక్కడ కూర్చుండుట చూసినది. మరియు ఆమె చెంపల పై పెద్ద కన్నీటి చుక్కలు దొర్లినవి. ఆమె అక్కడికి వెళ్ళి, ఆమెకున్న ధనమంతటితో ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. ఏదో ఒక రకంగా లోపలికి జారుకుని ఆ వెనుకకు వెళ్ళింది, ఆమె ఆయన పాదముల యొద్ద సాగిలపడింది, మరియు ఆమె జుట్టు క్రింద పడగా, ఆమె ఏడ్చుట ప్రారంభించినది. మరియు ఆమె ఏడ్చుచూ తన ఆయన కాళ్ళు కడుగుటకు వారికి తువ్వాలు లేదు, ఆమె ఈ జుట్టు తీసుకొని ఆయన కాళ్ళు తుడుచుచుండెను. ఆయన కాళ్ళకు ఎంత అందమైన నీరు, ఒక పశ్చాత్తాప పడిన పాపియొక్క కన్నీరు మరియు ఆయన కేవలము తన పాదము కదిపినయెడల, ఆమె పైకి ఎగిరియుండెడిది. ఆమె ఏమియు అడుగుట లేదు, కేవలం అది చేయట అవసరము అని ఆమె చూసెను.
118ఈ రోజు మనము అది చేయలేమా? ఇప్పుడు, మనము ఏమీ అడుగము. అది చేయబడవలసియున్నది, సువార్త బోధింపబడవలసియున్నది. మనకు ఒక నాణము వచ్చునా లేదా అనుదానివల్ల ఏ తేడా ఉండదు. నేను నా జీవితంలో ఎన్నడూ ఒక కానుక తీసికొనలేదు. ఇది ఒక అవసరము. ఇది ఒక పిలుపు. వేర్పాటు, మరియు సంఘములు నిన్ను ద్వేషించును, మరియు తక్కినవన్నీ మరియు నిన్ను వెలివేయుదురు, మరియు నీవు కూర్చుకొనిన ఆ అతికొద్దిమంది స్నేహితులు. కాని ఇది ఒక వర్తమానము. అది వెళ్ళవలసియున్నది, ఏది ఏమైనా. ఇది నేను ప్రజలను డబ్బు కొరకు అడుక్కోవలసి వచ్చునట్లుగా నన్ను నేనెన్నడూ రేడియోలోనూ పెద్ద టీ.వీ. కార్యక్రమములలోను కనబరచుకొనలేదు. నేనది చేయలేను. నేను మీ సోదరునిగా ఉండగోరుచున్నాను. దేవుడు ఎక్కడికి… నేను వెళ్ళగోరుదును. ఇక్కడ ఐదుగురు జనులు ఉన్నచో, అక్కడికి వెళ్ళు. పది లక్షలు ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్ళు, నేను వెళ్ళుటకు దేవుడు ఒక మార్గము ఏర్పరచును. అంతే. కేవలం దానిని విశ్వాసముతో జీవించుట. మనమందరమూ ఆ విధంగా చేయుచుండవలెను. మరియు దేవునికి కృతజ్ఞతలు, అనేకులు ఆలాగు చేయుచున్నారు, మీరు చూశారా, అదే విధంగా. అది నిజం, వారు దానిని చేయుచున్నారు.
LUKE 7:39
119ఈ చిన్న స్త్రీని చూడండి. యేసు ఎన్నడూ ఒక్క పాదమును కదపలేదు. ఆ క్రింద నిలబడియున్న ఆ ముసలి పరిసయ్యుడిని చూడండి, ఇప్పుడు ఆయనను గేళి చేయుటకు ప్రయత్నించుచూ, "ఇప్పుడు, ఆయన ఒక ప్రవక్తయై ఉన్నయెడల, ఆయన కాళ్ళు కడుగుచున్న స్త్రీ ఏలాటిదో తెలిసికొనియుండెడివాడు, చూశారా. ఆయనయొద్ద ఉన్న స్త్రీ ఏలాటిదో ఆయనకు తెలిసియుండెడిది. చూడండి, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఏ రకం జనులతో వ్యవహరించునో దీనిని బట్టి తెలియుచున్నది," అనెను. అందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను. అవును. అయనకు తెలుసు. ఆయనతో ఏ రకమైన తరగతి మనుష్యులున్నారో అక్కడ చూడండి. మనము పరువుగలవారము. మనము సంఘ సభ్యులము. మరియు అక్కడ ఆయనతో ఉన్న ఆ పాత పాపిని, ఆ స్త్రీని చూడుడి. ఆమె ఎవరో మనకు తెలుసు. ఆమె వీధిలో నడచునది. ఆమె… నేను దేని గురించి మాట్లాడుచున్నానో మీరెరుగుదురు. "కావున అక్కడ, ఆమె ఆ రకమైన స్త్రీ చూడండి. చూడండి, ఆయనతో కూడా ఉండు ప్రజలు అలాంటి వారే." నేను చాలా సంతోషించుచున్నాను. నేను చాలా సంతోషముగా ఉన్నాను.
LUKE 7:38,44,45
120మీకు తెలుసు, నేను అలాంటివాడినైయుంటిని. నేను ఆ రకమైన మనిషిని, ఏ మంచిలేని పాపిని. మరియు మీలో ఆయన యొద్దకు రాని ప్రతి ఒక్కరూ అంతే. మీరు కేవలం సంఘ సభ్యులగుటకు రావటం లేదు, ఒకటి చేయవలసియున్నది కనుక మీరు వచ్చుచున్నారు. యేసు సేవింపబడవలెను, ఎవరో ఒకరు అక్కడ ఉండాలి. మనము చేయుదము రండి. "ప్రభువా, నన్ను ఆశీర్వదించెదవా, నాకు ఇది ఇచ్చెదవా," అని ఆమె ఎన్నడూ అడుగలేదు. లేదు, కేవలం ఆమె ఆయన కాళ్ళు కడుగుచూ, తన తల వెండ్రుకలతో వాటిని తుడుచుచూ ఉన్నది. ఆయన కాళ్ళు తుడుచుటకు సరిపడునంత జుట్టు కొరకు, మన సహోదరిలలో కొందరు తమ తలపై నిలబడవలసివచ్చును.
మరియు ఆమె, తన చక్కని ముడులు జారవిడిచి ఆయన పాదములు తుడుచుచూ అక్కడ ఉన్నది. మరియు ఆమె ఎడతెగక అలా ఆయన పాదములను ముద్దాడుచుండెను, మరియు యేసు కూర్చొని ఆమెను చూసెను; ఆయన ఒక్క అంగుళము కూడా కదల లేదు. మరియు కొద్దిసేపటి తర్వాత ఆమె ముగించినప్పుడు, ఆయను చుట్టూ తిరిగెను.
LUKE 7:40,45-47
121అక్కడ ఆ ముసలి సీమోను సేవకుల సమాఖ్యతో కూడా ఉండెను, "చూశారా? ఆహా! అదిగో అతడు. చూడండి, అక్కడే మీరున్నారు, అతడేమిటో అది చూపించుచున్నది. అతడు ప్రవక్త కాదు. అతని వైపు చూడండి" అనెను.
ఆయన వెనక్కి తిరిగి మరియు అనెను, "సిమోనూ!" ఓ, ఆయన ముఖము ఎర్రగా ఉండెనని నేను ఊహించుచున్నాను. ఆయన అనెను, "నేను నీకు ఒకటి చెప్పదలచుకున్నాను. నీవు నన్నిక్కడికి ఆహ్వానించావు, చూశారా. నేను ద్వారములో ప్రవేశించినప్పుడు, నీవెంత మాత్రమూ నా పాదములు కడుగలేదు; నాకు ముద్దుపెట్టి స్వాగతించలేదు; నా తలకు పరిమళ తైలము పూయలేదు. నీవక్కడ నిలచి నన్ను గేళి చేయ ప్రయత్నించుచున్నావు, చూశారా. నీవు ఆ ఉద్దేశ్యము కొరకే నన్ను లోనికి తీసుకొనివచ్చావు. మరియు ఈ స్త్రీ, నేను వచ్చినప్పటినుంచీ - నేను వచ్చినప్పటి నుంచీ, ఆమె ఎడతెగక తన కన్నీళ్ళతో నా కాళ్ళు కడిగినది, మరియు తన తలవెండ్రుకలతో వాటిని తుడిచినది. మరియు ఆమె ఎడతెగక, నా మెడను కాదు గాని, నా పాదమును ముద్దు పెట్టుకొనెను."
"నీవేమి ఆశించలేదు, ఆశించావా, సహొధరీ?"
"లేదు."
"కాని నేను నీకు చెప్పుచున్నాను. అనేకములైయున్న నీ పాపములన్నీ క్షమించబడినవి," చూశారా. త్రోవయందంతటా ఆమెకు ఏమీ లేదు, బహుశా ఆమె సరియైనది చేయుటలేదేమో అనే భయము తప్పు, కాని అది చేయబడవలసియున్నది, అయితే ఆమె బహుమతి చివరన వచ్చినది.
122నేను ఈ వర్తమానములు బోధించుట మీరు వినవచ్చును. పరిశుద్ధాత్మ వివేచించి గొప్ప సంగతులనూ మరియు అద్భుతములనూ చేయుట మీరు చూడవచ్చు. మీరు ప్రార్ధించవచ్చు, మరియు అది ఎన్నటికి జరుగకపోవచ్చు. కొనసాగిపొమ్ము, మీ బహుమతి ఆఖరున వచ్చును. సరిగ్గా అప్పుడే అది మరింత బాగుండదా? అవును. చూడండి, యేసుకు ఒక సేవ చేయుడి. అదే అంత్య-కాల వర్తమానము. ఆయనకు ఒక వధువు ఉన్నది. దేవుడు గుణలక్షణము కొరకు చూచుచున్నాడు. మరియు ఎలియాజరు గుణలక్షణము కనుగొనిన తర్వాత, అప్పుడు తర్వాతి సంగతి ఆమెను తీసుకెళ్ళుటకు సిద్ధపరచుట. ఇప్పుడు అది అదే, సోదరుడా, ఇప్పుడూ అంతే. అంత్య-కాల వర్తమానము ఆ బయట దూరాన ఉన్న బబులోనులో కాదు.
123జోసెఫ్, నేను నీతో చెప్పినది అదే, మరియు నా యొక్క ఈ చిన్న స్వీడన్ వాడైన సహోదరుడు ఒక రోజు అక్కడ బయట నిలిచి, నా భుజము పై తలవంచి శిశువువలే ఏడ్చాడు. "బ్రెన్హాం సహోదరుడా, దేవుడు నన్ను షికాగో పంపించాడు, ఒకానొక రోజు నేను షికాగో వణికించబడటం చూస్తాను," అన్నాడు. మరియు అతడన్నాడు, "ఇప్పుడు వాళ్ళు నన్ను బయటికి పంపివేయుచున్నారు. తిన్నగా నా క్రిందినుండి నా సంఘమును తీసేసుకుంటున్నారు; షికాగోలో ఉన్న గొప్ప, చక్కని సంఘము." అన్నాడు, "వాళ్ళు నా సంఘమును తీసుకొనుచున్నారు, మరియు వాళ్ళు నన్ను వెలివేసారు. వారు ఓటు వేసి నన్ను బయటికి పంపించారు, నాకేమి చేయాలో తెలియటం లేదు."
నేనన్నాను, "జోసెఫ్, దేవుడు అబద్ధం చెప్పడు." నేనన్నాను, "షికాగో వణకడం నువ్వు చూశావు." నేను నిన్ను అక్కడ చూసినప్పుడు అది న్యూయార్క్ నగరంలో మొదలయ్యింది, వారు నీతో సహకరించనందున నేను కనీసం వెళ్ళలేదు. మరియు కనీసం అతనిని ఎరుగను, కానీ అతని గురించినది ఏదో అతని వైపు నన్ను లాగినది. ఈ రోజు రాత్రి ఒక మిషనరీ ర్యాలీ ఉన్నదని నేను ఇది చెప్పుట లేదు. కాని అది నిజము. నేను జోసెఫ్ వైపుకు లాగబడితిని. వాళ్ళు అతనిని రానియ్యలేదు, సహాయమునకై అతనిని రానియ్యలేదు కనుక నేను షికాగో వెళ్ళుటకు నిరాకరించితిని. "అలా అయితే నేను కూడా వెళ్ళను," అని నేనన్నాను.
"నీవు అతనిని ఎరుగవు," అనిరి.
"నేను అతనిని ఎరుగనని నాకు తెలియును, కాని దేవుడు అతనిని ఎరుగును. అతడు దేవుని సేవకుడు. మరియు, నా వరకూ అతడు సరిగానే ఉన్నాడు" అని నేనన్నాను.
ACTS 19:1-6
124మరియు కావున అప్పుడు జోసెఫ్ అన్నాడు, "షికాగో వణికించబడుట నేను చూడగోరుచున్నాను."
ఓ, మై! అది వణుకుచుండుట అనగా బయట ఉన్న ఆ ఫిరంగుల మోత కాదు అని గ్రహించుట లేదు. నాశనముకానున్న ఆ బయటి చెత్త అని నేను అనటం లేదు. సంఘము వణుకుచున్నది, చూశారా. ఆ వణికించుట వచ్చినప్పుడు మిలియన్ల మందిలో నూట-ఇరవైమంది మాత్రమే మేడ గదిలో ఉండిరి. అది నిజం. ఖచ్చితంగా, అది ఆ ప్రజలను వణికించుచున్నది.
చూడండి, వారు అక్కడ ఆ గొప్ప ఉజ్జీవమును కలిగియున్నప్పుడు, ఆ అపోల్లో, ఆ బాప్టిస్టు బోధకుడు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు, ఎన్నడూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందలేదు. పౌలు ఎఫెసు యొక్క పై ప్రాంతముల గుండా వెళ్ళుచున్నప్పుడు, బైబిలు చెప్పుచున్న ఈ గొప్ప సంఘమును కనుగొనెను, మరియు అతను అక్కడికి వెళ్ళి వారికి ప్రభువు యొక్క మార్గము చెప్పెను. మరియు వారనిరి… అతడనెను, "మీరు విశ్వసించిననాటి నుండి పరిశుద్ధాత్మను పొందుకొనిరా?" మరియు వారు కేకలు వేయుచు గొప్ప సమయమును కలిగియుండిరి. "మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా?"
"పరిశుద్ధాత్మ ఉన్నదని మేము ఎరుగము," అనిరి.
"అయితే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరి?" అనెను.
"మేము యోహాను యొద్ద బాప్తిస్మము పొందితిమని" వారు చెప్పిరి.
"అది ఇక ఎంతమాత్రమూ పనిచేయదు. మీరు మరలా బాప్తిస్మము పొందవలసి యున్నది," అని అతడు చెప్పెను. మరియు అతడు వారికి మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చెను, వారిపై తన చేతులుంచెను, మరియు పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చెను. వారు భాషలు మాట్లాడి ప్రవచించిరి. మరియు అక్కడ వారు ఎనిమిది లేక పది మంది ఉండిరి. అది నిజం.
125వణికించుట! చూశారా, దేవుడు దానిని వణికించడు, దానిని గైకొనునప్పుడు నరకమే దానిని వణికించును. కాని దేవుడు తన సంఘమును వణికించును.
కొండ మీదికి, అబ్రహాము మరియు అతని గుంపు యొద్దకు ఒక దూత వచ్చి ఒక అద్భుతము చేసి, అతని హృదయాలోచనను వివేచించెను. అది నిజమేనా? మరియు శారా లోపల ఉండెను. అక్కడ సోదోమునకు వెళ్ళిన దూతలు ఆ క్రింద వేలమందిని కలిగి యుండిరి. చూడండి, వణికించుట చిన్న గుంపులోనికి వచ్చును. జోసెఫ్, నీవు దానిని చూశావు. షికాగో దాని చివరి పిలుపు పొందుట నువ్వు చూశావు. అది నిజం. మరియు దేవుడు నిన్ను సన్మానించాడు, ఆయన ఏమి చెప్పాడో ఖచ్చితంగా అదే చేశాడు.
JOEL 2:25•
MAL 4:6
126వధువును సిద్ధపరచుట, ఇది అదే.
ఇప్పుడు ఇది చెప్పి ఇక్కడ మనము ముగించబోవుచున్నాము. అంత్య-కాల వర్తమానము వధువును సిద్ధపరచి, ఎత్తబాటుకు తయారుచేయుటకై యున్నది. మలాకీ 4 ప్రకారం పరిశుద్దులకు ఒక్కసారే అప్పజెప్పబడిన విశ్వాసమునకు తిరిగి తెచ్చును. పునరుద్ధరణ కాలములో, వారిని తండ్రుల విశ్వాసమునకు తిరిగి తెచ్చుట, పెంతెకోస్తు భాగము. "నేను పునరుద్ధరించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు." అది నిజమగు అంత్య-కాల సువార్త.
ఇప్పుడు ముగించే ముందు నేను ఈ రెండు మాటలు చెప్పుగోరుచున్నాను. మిగిలిన ఈ లేఖనములను నేను విడిచిపెట్టుదును, బహుశా మరో సమయంలో వాటిని చూడవచ్చు. కాని నేనిది చెప్పాలనుకుంటున్నాను. మనము చివరికాలములో ఉన్నామని మనము నమ్ముచున్నాము. మనమది నమ్ముచున్నాము. మరియు ఇది అంత్యకాలమువలె కనిపించినప్పటికి, ఈ కాలములో వర్తమానము మరియు వర్తమానికుడూ ఇద్దరూ దాదాపు విరిగిరి. మమ్ములను ఛిన్నాభిన్నము చేయుటకు సాతాను వాడి అత్యుత్తమ ప్రయత్నము చేసినట్లు అగుపడుచున్నది. నెవిల్ సోదరుడు, అతని ఏక్సిడెంటు; అక్కడ సహోదరుడు క్రేజ్ దానిని తుపాకి పేల్చివేయుట. చూడండి, అది అలా కనపడుచున్నది, మరియు సరిగ్గా ఇప్పుడే, ఆ బయట ఉన్న ప్రతి సంఘము నా యెడల ప్రతికూలముగానున్నవి. చూడండి, చూడండి, అది ఇప్పుడే దాదాపు చిన్నాభిన్నమైనట్లు కనబడుచున్నది. మనము ఓడిపోయినట్లు కనబడుచున్నది. మీరు కంగారు పడవద్దు. మీకు తెలుసా, సాధారణంగా ఆ సమయంలోనే ఆయన దీర్ఘకాలంగా చూస్తున్న ఒక విషయము నిమిత్తమై దేవుడు రంగంలోనికి అడుగుపెట్టును. మీరు గుర్తుంచుకొనండి.
127ఒకానొకసారి క్రింద ఒక మండుచున్న అగ్నిగుండములో ఉన్న కొందరు పిల్లಲು ఉండుటను జ్ఞాపకము చేసికొనండి, వారు ఆ వాక్యముతో నిజముగా నిలచియుండిరి. అంతా ప్రతికూలముగా జరిగినది. వాళ్ళు వారిని చెరసాలలో వేసిరి. వారిని రాత్రంతా అక్కడ ఉంచిరి. మరుసటి ఉదయము వారిని తగులబెట్టవలెనని యుండిరి. మరియు అంతము సమీపమైనట్లు కనబడెను, వారు సరిగ్గా అగ్నిగుండము వరకూ నడచుచుండిరి. కాని ఆయన మార్పు తెచ్చుటకు క్రిందికి దిగి వచ్చెను. ఒక్క క్షణములో దృశ్యమంతా మారిపోయింది.
అది ఎల్లప్పుడూ అత్యంత బలహీన క్షణములలోనే, నిజమైన వర్తమానము దాదాపు ఓడిపోయినట్లు కనిపించినప్పుడే, అప్పుడే దేవుడు లోనికి అడుగుపెట్టును. వర్తమానమునూ మరియు వర్తమానికునిడిని త్రోవ యొక్క కడవరకూ ఆయన పోనిచ్చును, చూశారా, అప్పుడాయన లోనికి వచ్చును మరియు ఆ పెద్ద అలలపై ఆయన స్వారీచేయును. అది నిజం.
128మీరు గుర్తుంచుకోండి, అది యేసు, ఆయన శత్రువులు ఆయనను ఓడించామనుకొనినప్పుడు, "మనము ఆయనను శిలువ ఎక్కించాం," అని ఆ అవిశ్వాసి అన్నాడు. ఆయనను ద్వేషించి శిలువకు వ్రేలాడదీసిన సద్దూకయ్యలులూ మరియు పరిసయ్యులులూ, "ఇప్పుడు మనము అతడిని పట్టేశాం" అనుకున్నారు. హు-హు. దాదాపు ఆ సమయములోనే దేవుడు రంగములోనికి దిగి, ఈస్టరు ఉదయాన ఆయనను లేపి, సాతాను రాజ్యములను పగులగొట్టి, నరకమును ఊడపెరికి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపుచెవులు తీసికొని, మరియు వాటితో లేచెను. నిశ్చయంగా, అది బలహీన సమయములోనే. ఆయన వర్తమానమును ఆయన బోధించెను, వాక్యముతో ఆయన నిలచియుండెను, మరియు సమస్తమూ, మరియు విజయము వచ్చినప్పుడు అది నిజముగా బలహీన క్షణమే. ఆయన చేయగలిగినదంతా ఆయన చేసినప్పుడు, అప్పుడు దేవుడు లోనికి వచ్చెను. ఆయన దృశ్యమును మార్చివేసెను.
GEN 32:24
129అది ఏశావు నుండి పారిపోతున్న యాకోబు, అక్కడికి ఇక్కడికి తప్పించుకొనుచూ, పరిపాలన కొరకూ, మరియు వివిధ స్థలములకూ, మరియు ఏశావు నుండి దాగుకొనుటకు ప్రయత్నించుచుండెను. అప్పుడు అతని హృదయము ఇంటికి వెళ్ళవలెనని ఆశపడుట మొదలుపెట్టెను మరియు అతను ఇంటికి వెళ్ళే త్రోవలో ఏశావును శాంతపరచుటకు, అతను వర్తమానికులను పంపించెను, కానుకలనూ మరియు అన్నీ పంపించెను. కాని అది యాకోబు తనకు తాను అంతమునకు వచ్చినప్పుడు, ఎటువైపు తిరుగవలెనో యాకోబుకు తోచలేదు. అతడు తన భార్యాపిల్లలను నీటి అవతల ఉంచి, మరియు అతడు వెనక్కి వాగును దాటెను. అది యాకోబు శక్తి అంతా హరించుకుపోవు వరకూ రాత్రంతా కుస్తీ పట్టినప్పుడు, మరియు అతడు కుంటివాడైనప్పుడు, మరియు బలహీనుడై అతని శరీరము క్షీణించినప్పుడు. ఆ సమయములోనే దేవుడు రంగము మీదికి వచ్చెను. మరియు మరుసటి ఉదయం మనము అతడిని ఎలా కనుగొనుచున్నాము? అతని బలహీనత గతించిన పిదప, ఒక నిర్భయుడైన రాజకుమారుడాయేను. మరియు అతడు ఓడిపోయినవానివలె అగుపడెను. కాని మనము అతనిని ఒక నిర్భయుడైన రాకుమారునిగా కనుగొనుచున్నాము. వర్తమానము వెళ్ళుచుండెను మరియు వర్తమానికుడు దానితో ఉండెను. అది ఖచ్చితంగా నిజం. తర్వాతి రోజు అతడు ఒక నిర్భయుడైన రాకుమారుడు.
130ఏశావు, అతనిని పట్టవలెనని ఘోరముగా కోరినవాడై, ఏశావు, అతని కలిసినప్పుడు… అతడు మరియు మీరు గుర్తుంచుకోండి, అదే సమయమందు దేవుడు అతని సహోదరుని హృదయముపై కూడా పని చేసెను. అది నిజం. మరియు ఏశావు అతని యొద్దకు వచ్చి, "నాకు ఇక్కడ సైన్యములున్నవి" అనెను. "యాకోబూ నువ్వు బలహీనముగా ఉన్నావు, నీ శరీరము రోగ గ్రస్తముగా ఉన్నది, నువ్వు క్షీణించియున్నావు" అనెను. "నిన్ను రక్షించుటకు నేను సైనికులను పంపుదును," అనెను, సరిగ్గా అతనికి అవి అవసరమైనప్పుడు.
కాని అతడు ఎదో కనుగొనెను. "నేను ఒంటరిగా వెళ్ళుదును," అనెను. ఆమేన్. అది అతడు ఆ బలహీనత నుండి కోలుకొన్న వేళ ఆ అదురుపాటునుండి కోలుకున్న వేళ.
131యేసు మరణము యొక్క అదురుపాటు నుండి కోలుకున్నప్పుడు, ఆయన అత్యంత బలవంతుడాయెను. కనీసం ఒక గచ్చు రాతిని కూడా కదపకుండా ఆయన భవనము గుండా వెళ్ళగలిగెను. ఆయన రొట్టెయు చేపలను తినగలిగెను. ఆమేన్. ఓ, అవును. అది అప్పుడే బలహీనత వచ్చిన తర్వాతనే, ఆయన తనను తాను శక్తిమంతునిగా కనుగొనెను. అది బలహీనత వచ్చిన తర్వాతనే.
మరియు ఇప్పుడిది వర్తమానమునకునూ, వర్తమానికునికిని ఇద్దరికి బలహీన క్షణముగా అగుపడుచున్నది. కాని మీరు తొందరపడవద్దు! ఎక్కడో ఒక చోట, ఎలాగో నాకు తెలియదు గాని నేనాయనపై ఆధారపడుచున్నాను. ఒకానొక రోజు ఆయన రంగములోనికి స్వారీ చేయుచూ వచ్చును. మీరు తొందరపడవద్దు. మనము కలిసి వెళ్ళుదము. మనము కలిసి మన తలలు వంచుదము. సాయం-కాల సువార్త.
LUKE 24:49•
ACTS 1:4
132ఓ దేవా, ఇప్పుడు కొంతకాలంగా ఆ గొప్ప సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి. ఇక్కడి ఈ కుర్చీల మధ్య దారి గుండా మీరు సంచరించి, కేవలం పురుషులూ, స్త్రీల యొక్క నీడలుగా ఉండి, క్యాన్సరు చేత తినివేయబడి, అంధులుగా మొత్తబడి, రోగులై వ్యాధిగ్రస్తులై, డాక్టరు, ఆఖరుకి మాయో వారిచేత (ఆనాటి అమెరికాలో గొప్ప పేరుగాంచిన వైద్యుశాల — తర్జుమాదారుడు) మరియు అన్నిచోటలా విడువబడిన వారిని తీసుకొని వచ్చుట మేము చూచితిమి. ఈ ఉదయం వారిక్కడ కూర్చునియున్నారు. వారిలో ఎందరో ఆరోగ్యముగా బలంగా ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాదు గాని, ప్రపంచ వ్యాప్తంగా గంటల వ్యవధి క్రితం చనిపోయిన తమ పిల్లలను స్త్రీలు మరలా సజీవంగా పొందుకున్నారు. రోడ్డు మీద మోటారు వాహనాల వల్ల చనిపోయిన పిల్లలు, చనిపోయారని ప్రకటించబడిన తరువాత, వారిలో ఒక ఎముక కూడా సవ్యంగా లేనప్పుడు, మరియు ఒక నిమిష కాలంలో దేవుని స్తుతించుచూ రోడ్డు క్రిందికి నడిచిరి. అవును, ప్రభువా, నీవు దేవుడవు. సాయంకాల సమయము ఇక్కడున్నది. సాయంకాల సువార్త విత్తనములు నాటబడినవి, మరియు తండ్రీ, ఇది ఒక విధమగు అవిటితనము కలుగజేయు కాలమువలే కనపడుచున్నది. వీరిలో ఎందరో…
మీ విధాన తరమునందు మొదటిసారి మీరు వచ్చినప్పుడు వారందరూ, "ఆ గలిలయుడైన యౌవ్వన ప్రవక్త!" ఓ వారు మీ చుట్టూ తిరిగిరి. కాని మీరు వారికి వారి ఆచారములు మరియు సంగతుల గురించి చెప్పి వారిని కొట్టుట ప్రారంభించినప్పుడు, అప్పుడు వారు మీ యొద్ద నుండి తొలగిపోయిరి. మీరు ఒంటరిగా నిలువవలసి వచ్చెను. మరియు ఆఖరున వారు మిమ్మును కల్వరికి తీసుకెళ్ళిరి. వారు గెలిచినట్లు అది అగుపడినది, వారి గొప్ప మేధావుల గుంపు దేవుని చిత్తమును ఓడించినట్లు అగుపడినది. కాని, ఓ, కాదు! ఈస్టరు ఉదయాన భూమి భయముతో వణికినది, సమాధి తెరువబడి మరియు దేవుని కుమారుడు లేచెను. ఆయన మరణము యొక్కయు నరకము యొక్కయు తాళపుచెవులు కలిగియుండెను. అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చుటకు ఆయన హక్కు కలిగియుండెను. "ఆ పైన ఉన్న యెరూషలేమునకు పోయి ఎదురు చూడుడి, మరియు నేను దానిని మీ మీదికి పంపుదును, మరియు నేను తిరిగి వచ్చే వరకూ నాకు సాక్ష్యులై యుండుడి," అని తన సంఘమునకు ఆయన చెప్పెను.
PS 2:1•
ACTS 4:25
133మరియు అప్పుడు మీరు నిలిచి కాలము ఎలా ఉండునో వారికి చెప్పారు, మరియు ఇక్కడ మేము ఆ అంత్యకాలములో ఉన్నాము. ప్రభువా, మరలా స్వారీ చేయుచూ లోనికి రమ్ము, నీవు వచ్చెదవా, తండ్రీ? మేము అలసి, వేసారియున్నాము. మనుష్యులు ప్రతిచోటి నుంచీ మమ్ములను వెళ్ళగొట్టిరి, సంఘ శాఖలన్నీ ప్రతికూలముగా నున్నవి. కాలిఫోర్నియాలో ఆ ప్రశస్త పరిశుద్ధులు అక్కడ నిలచి ఏడ్చుచున్నారు, నలభై సంఘాలు, మరియు ఆ ఒక్క నాయకుడు నిలువబడి, "సరే, అతడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చినట్లయితే, అతడు మనకక్కరలేదు," అన్నాడు. మరియు ఆ దీన ఆకలిగొన్న ప్రజలనుండి సువార్తను త్రిప్పివేశాడు.
మరియు, తండ్రీ, నేను, "వచ్చి నన్ను లేఖనముతో ఎదుర్కొనుము," అన్నాను, గానీ అతడు అది చేయడు. ఎందుకో అతనికి బాగుగా తెలుసు? తండ్రీ, అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, మరియు ప్రజలు ఏల వ్యర్ధమైన దానిని ఆలోచించుచున్నారు? నిజముగా నీ పరిశుద్ధ కుమారుడైన యేసు యొక్క చేతిని చాచి రోగులను స్వస్థపరచుట ద్వారా, మరియు అంత్యకాలము యొక్క సూచనలనూ మరియు అద్భుతములనూ చూపితివి. అది పునరావృత్తమైనది, ప్రభువా. నేను వారికొరకు ప్రార్ధిస్తున్నాను. దేవా, వారిని పారద్రోలబడనీయవద్దు. ఇంకా వారిలో ఎందరో మంచి మనుష్యులున్నారు. ప్రభువా, వారు చూచి బయటికి వచ్చునట్లు అనుగ్రహించుము.
134మరియు ఈ ఉదయము మా చిన్న సమాజములో, తండ్రీ, మేము ప్రజల హృదయములను ఎరుగము. మీరు ఎరుగుదురు. ఇక్కడి ఈ చిన్న గుంపు, నేను ఎలాగైనా తిన్నగా ఆ బయటికి వెళ్ళుచున్నాను. మరియు ఇప్పుడు మేము సంఘమును విడిచి వెళ్ళే ముందు, ప్రభువా, ఈ చిన్నగుంపు ఇక్కడ ప్రయాణించుచున్నది, వారు యాత్రికులు. ప్రభువా, వారు ఈ లోకపువారని చెప్పుకొనుట లేదు. వారు క్రొత్తవారు. వారు మరలా జన్మించినారు, వారు నూతన సృష్టి. "ఎంతో వేగముగా నశించిపోయే ఈ లోకపు వ్యర్థమైన సంపదలను ఆశించవద్దు. మేము మా నిరీక్షణను నిత్యమైనవాటిపై కట్టుకొంటిమి, అవి ఎన్నడూ తొలగిపోవు," అని ఎరిగినవారై వీరు లోకపు విషయముల నుండి, దేవుని సేవించుటకు బయటకి వచ్చిరి.
పరలోకపు తండ్రీ, ఈ ఉదయం వారు తిరుగవలసియున్నదనే తలంపు ఎన్నడూ కలుగని వారు ఒకరు గానీ ఎక్కువమంది గానీ ఇక్కడ మా మధ్య ఉండుట తటస్థించినట్లయితే, మీరు వారి హృదయములతో ఈ సమయమందు మాట్లాడవలెనని నేను ప్రార్ధిస్తున్నాను. మరియు వారు మధురముగా మరియు వినయముగా వారి హృదయములతో అంతటినీ మీకు లోబరచి, "ప్రభువైన యేసూ, పాపినైన నా యెడల కృప చూపుము. నేను ఇప్పుడు ఉన్న స్థితిలో చావడానికి ఇష్టపడుటలేదు. నేను కనీసం ఈ దినమంతా సజీవముగా యందునా అని యెరుగనప్పుడు, ఈ లోక విషయములలో నా సమయమును వ్యర్థపరచుట బుద్ధిహీనత కాదా," అవి అందురు గాక, మరియు ఇక్కడున్న సమస్తమూ నశించిపోవును, మరియు ప్రజలు కూడా లోకముతో నాశన మగుదురు. కాని, నిత్యుడగు తండ్రియైన దేవుడు నశించలేడు, ఆయన ప్రజలును నశించలేరు. మా పరలోకపు తండ్రి, వారు దానిని ఇప్పుడు స్వీకరించుదురు గాక.
ACTS 19:12
135ఇక్కడ రోగులు మరియు వ్యాధిగ్రస్తులు కొరకు ఉంచబడిన ఈ చేతి రుమాళ్ళను పరిశుద్ధపరచండి. వారు పౌలు శరీరము నుండి చేతిరుమాళ్ళు మరియు వస్త్రములు తీసుకెళ్ళినప్పుడు - దురాత్మలు వారిని విడిచి వెళ్ళెనని వారు చెప్పిరి. ఈ ఉదయము మా మధ్య ఉన్న రోగులను స్వస్థపరచండి. మా మధ్య ఒక్క బలహీనుడైనా ఉండరాదని నేను ప్రార్ధించుచున్నాము. ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఇప్పుడు శ్రోతల మధ్య సంచరించును గాక, మరియు ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని గ్రహించుదురు గాక. మరియు నేను మొదట్లో చెప్పినట్లుగా, పొడి వేసవిలో ఒక తుఫాను వచ్చునప్పుడు, దహించునట్లు వేడిగాలులు వీచును, మరియు ధూళి విసురును, కాని ఆకస్మాత్తుగా మనము ఉరుమును వినగలుగుదుము, మేఘము లేచుట మనము చూడగలుగుదుము. మరియు ఆ ఎర్రని సూచన వ్రేలాడుచున్నదని నేను చెప్పియుంటిని, ఆయన వచ్చుచున్నాడు. మరియు, మనముండిన స్థలములగుండా పరిశుద్ధాత్మ యొక్క ఆహ్వానముతో కదలాడుచున్న చల్లని గాలిని మనము అనుభవించుచున్నాము. ఈ దినము మాకు సహాయము చేయుము.
LUKE 19:40
136తప్పిపోయిన వారిని రక్షించుము. వెలుగులు ఆరిపోకమునుపే, ప్రభువా, త్వరగా పరిశుద్ధాత్మతో నింపుము, ఏలయనగా సూచన ఇప్పటికే వ్రేలాడుచున్నది. ఆ పాత సియోను ఓడ ఇప్పుడు బయలుదేరనున్నది, మరియు ఆమె పిలుచుటకు ఇంకెంతో సమయము లేదు. మరియు ఆకస్మాత్తుగా వారికొక వార్తాపత్రిక బయటికి వచ్చును, "ఏమైనది? దేశమందంతటా వందలమంది జనులు అదృశ్యమయ్యిరి."
ఓ, దేవా, అప్పుడు మిగిలినవారికి సమయము మించిపోవును, రాకడ వచ్చియున్నది. భూమిని తీర్పు తాకును, నీతిమంతులు వెళ్ళిపోయియుందురు. అప్పుడు వారు శ్మశాన భూములకు వెళ్ళి, "సరే, ఈ సమాధిని వారు తెరిచారా? సరే, ఇక్కడేమి జరిగినది?" ఓ, దేవుని నమ్మి సంవత్సరాల క్రితం చనిపోయినవాడు వెళ్ళిపోయియుండును. "అప్పుడు, ఓ, తప్పిపోయినవారి గతి వారికి తెలుపబడినప్పుడు ఎలాంటి ఏడ్పు మరియు బాధ ఉండునో, వారు బండలకు పర్వతములకు మొరపెట్టుదురు," లేఖనముల ప్రకారము, "ప్రార్ధించుదురు గాని సమయము మించిపోయినది." ఈ రోజు ఇక్కడ ఉన్న వారికెవరికీ ఆలాగు జరుగకుండును గాక.
137మరియు మనము మన తలలు వంచియుండగా, మన హృదయములను కూడా వంచి. ప్రజలను బలిపీఠమునొద్దకు పిలుచుట విషయమై నేను చాలా వింత వ్యక్తిని. అది అపోస్తలుల సిద్దాంతము కాదని నేను నమ్ముదును. మీరు నిజంగా బ్రదుకాలనుకుంటున్నారా లేక చావాలనుకుంటున్నారా అనే నిర్ణయాన్ని సరిగ్గా మీరు కూర్చున్న చోటనే మీరు తీసుకొందురని నేను నమ్ముచున్నాను. అది మీ ఇష్టమని నేను నమ్ముచున్నాను. భవనములో ఇక్కడ, ఇంతకు మునుపెన్నడూ దానిని ఆ విధముగా చూడక, మనము ఉన్న ఈ ఘడియను గ్రహించి, మీరు క్రైస్తవులగుట కోరి, క్రీస్తువలె జీవించవలెనని కోరి, మరియు ఆయన రాకడకు సిద్ధపడగోరి, నేను ప్రార్ధనలో మిమ్ములను జ్ఞాపకము చేసికొనగోరినయెడల, మీరు కేవలం మీ చేతులను పైకి ఎత్తైదరా. ప్రభువు మిమ్ములను దీవించును గాక. మిమ్ము దీవించును గాక, మరియు మిమ్ములను, మరియు మిమ్ములను ఆ వెనుక మిమ్ములను, మరియు ఈ క్రింది మిమ్ములను దేవుడు దీవించును గాక. అది మంచిది. యౌవ్వన స్త్రీ దేవుడు నిన్ను దీవించును గాక, సరిగ్గా జీవితము యొక్క కూడలిలో, సహోదరీ. అది ఒక గొప్ప నిర్ణయము. మీరు చాలా గొప్పవి చేసియుండవచ్చు… దేవుడు మిమ్ము దీవించు గాక. తండ్రీ, అవును, మీ జీవితంలో మీరు కూడా అనేక కఠిన దినములు పనిచేసియుండవచ్చు మరియు ఒక చిన్నపిల్లవాని పెంచియుండవచ్చు. అమ్మా, ఆమె ప్రక్కన కూర్చున్న మీరు. ఓ, దేవా! బహుశా మీరు మీ కుటుంబాన్ని పెంచి గొప్ప పనులు చేసియుండవచ్చు, చిన్న పాప ఏడుస్తున్నప్పుడు దాని చెంపలు సవరించియుండవచ్చు, ఆ చిన్న యౌవ్వన హస్తములతో ఉయ్యాల ఊపి ఉండవచ్చును, మరియు ఇప్పుడు అవి ముసలివై బలహీనమైనవి. మీరు శిశువును జోకొట్టి మరియు ఇంకా అనేక గొప్ప పనులు చేసియుండవచ్చు, కాని మీరు చేసిన అత్యుత్తమమైనది అప్పుడు మీ చేయి ఎత్తినప్పుడే. నన్ను క్షమించండి, దయచేసి నన్ను మన్నించండి.
LUKE 23:42,43•
JOHN 6:37,44
138మా పరలోకపు తండ్రీ, మీరు చేతులను చూసియున్నారు. వాటి వెనుక ఏమున్నదో మీకు తెలుసును. ఇప్పుడు అవి ఈ కూటముల యొక్క విజయ సూచికలు. వారు వర్తమానము యొక్క విజయ సూచికలు. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు, మరియు తండ్రి మొదట వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రానేరడు" అని మీరన్నారు. మరియు మీరు ఈ ప్రజలతో మాట్లాడారు. మరియు వారక్కడ కూర్చొనియుండిరి - మరియు విజ్ఞానము ప్రకారము వారి చేతులు క్రిందికి వ్రేలాడి ఉండాలి, ఏలయనగా గురుత్వాకర్షణ వాటిని క్రిందికి పట్టి ఉంచుతుంది. కాని వారు విజ్ఞాన నియమాలను బద్దలు చేసారు, మరియు ఉల్లంఘించారు. వారిలో ఒక ఆత్మ వుండి ఆ చేతిని పైకెత్తించినది, అది విజ్ఞానమునకు విరుద్ధమైనది, ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆత్మ విజ్ఞానమును ఖండించగలదు. మరియు వారిచ్చట దేవుని ఆత్మ ఉండి, "నీకు క్రీస్తు అవసరం" అని చెప్పినందువల్ల వారు వారి చేతిని పైకెత్తారు. మరియు "ఓ, ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొమును," అని వారు చేతులను పైకెత్తారు.
శిలువపై చనిపోతున్న ఆ దొంగ చెప్పినట్లుగా, "నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము."
మరియు మీరతనికి ఏమని సెలవిచ్చిరి? "ఈ రోజు నీవు నాతో పరదైసులో నుందువు."
JOHN 5:24
139తండ్రీ, ఇక్కడ వున్న ప్రతి విశ్వాసికి మీరు దయచూపి ఈ రోజే మీరు వారిని మీ రాజ్యములోనికి, ఇక్కడ భూమి పైని మీ సహవాసమునులోనికి తీసుకొనవలెనని నేను ప్రార్థిస్తున్నాను. యేసూ, మీరు ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు పరి. యోహాను 5:24లో మీరన్నారు, "నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాడు, తీర్పు భూమిని తాకినప్పుడు వారు అక్కడ ఉండరు, వారు మరణము నుండి జీవమునకు దాటినవారు." మీరు దానిని వాగ్ధానము చేశారు, ప్రభువా. వాటిని నేను ఆ హక్కుతో అడుగుచున్నాను. మరియు ఇప్పుడు చేతులెత్తిన వారందరినీ, మరియు వారి హృదయములో ఎత్తవలెనని నమ్మియూ ఎత్తనివారినీ కూడా, తండ్రీ, ఈ ఉదయము యేసుక్రీస్తు కృప యొక్కయు మరియు ఈ ఉదయము మేము బోధించిన ఆయన వాక్యము యొక్కయూ విజయ సూచికలుగా వారిని మీకిచ్చుచున్నాను. వారు మీ వారు. ప్రభువా, ఆ దినము వరకూ వారిని భద్రముగా ఉంచుము. మరియు వారు శిశువులవలే ఎదుగుదురు గాక, వారు వారి పాపములను ఒప్పుకొనగా, చనిపోవుచూ, క్రీస్తునందు పాతిపెట్టబడి, క్రొత్త జీవితమునకై మరలా లేచి క్రొత్త లోకములో కొత్త సహచరులతో దేవదూతలతో నడుచుచూ, సహజాతీతమైన సన్నిధిలో నడుచుటకు, కొలనులోని నీరు వారిని కనుగొనును గాక. వారిచూట్టూ వారు చూడలేనివి, కాని వారు అనుభూతి చెంది అక్కడ అవి ఉన్నవని కనుగొనినవి, అవే కొనసాగునవి, సహజాతీతమైనదే కొనసాగునది (కడదాకా ఉండునది - తర్జుమాదారుడు). యేసు నామములో వారిని మీకిచ్చుచున్నాము తండ్రీ, ఆమేన్.
140మిమ్మల్ని కొంచెం ఎక్కువ సమయం ఉంచినందుకు నన్ను క్షమించండి, మరియు మీరు… నిశ్చయముగా మీరు సంతోషించుచున్నారా? ఇప్పుడు, కూటములో కొన్నిసార్లు నేను కత్తిరించి కుదించవలసి వచ్చును. ఇప్పుడు చేతులెత్తి ప్రభువైన యేసునందు విశ్వసించినవారికి ఈ సాయంత్రము బాప్తిస్మపు కార్యక్రమము గలదని నేననుకుంటున్నాను. లేక, అది మీకు ఇప్పుడే కావల్సినయెడల, కొలనులు నింపబడియున్నవి, మరియు దుస్తులు మొదలగునవి సిద్ధముగా ఉన్నవని నేను అనుకుంటున్నాను. మీరు సరిగ్గా ఇప్పుడే బాప్తిస్మము తీసికొనగోరినచో, ఏ వేళ అయినా, మేము ఇక్కడ అందుకే ఉన్నాము. మరియు ఇప్పుడు చెక్కుట మరియు కోయుట అయిన తర్వాత…
మా ద్వారములో ఉన్న క్రొత్తవారికి మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము, ఈ ఉదయము దేవుని వాక్యమునందు మాతో సహవాసము చేయుటకు వచ్చినవారికి, మీ రాకను మేము ప్రశంసిస్తున్నాము. ప్రభువు మిమ్మును దీవించును గాక. మీరు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషము.
141నేను చాలా కాలముగా చూడని నా మిత్రుడొకరు భవనము వెనుక కూర్చొనుట నేను చూసితిని. నాకు ఆ బాలుని పేరు కూడా తెలియదు. అతడు నాకు మంచి మిత్రుడు. ఒకప్పటి నా స్నేహితురాలైన మేరీ ఫ్రాన్సిస్కో యొక్క దూరపు సోదరుడు. అతని పేరు ఏమనేది నాకు జ్ఞాపకము రావటం లేదు. నీవు నీ చేతిని ఎత్తైదవా? ఈ రోజు నీవు ఇక్కడ కూర్చుండుటను బట్టి మేము సంతోషించుచున్నాము, దేవుడు నిన్ను దీవించును గాక. ఆ బాలుడు అనేక సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉండెను. మరియు నేను…
ఇక్కడ నా మిత్రుడు జిమ్ పూల్, నా బాల్య మిత్రుడగు జిమ్ పూల్ గూర్చి నేను ప్రస్తావించుటను ఇక్కడ ఎందరు విన్నారు? అతని కుమారుడు, అతని భార్య.
మరియు డానీ, అతని ఇంటి పేరు నాకు గుర్తురావటం లేదు. గార్డ్, డానీ గార్డ్ మరియు అతని చక్కని చిన్న భార్య నిన్న వారు నన్ను చూచుటకు ఇంటికి వచ్చిరి. ఈ ఉదయం వారు ఇక్కడ ఉండుటను బట్టి ఎంతో సంతోషము.
ఇక్కడ వే సహోదరుని ప్రక్కన కూర్చొనియున్నది ఒక క్రొత్త సహోదరుడని నేను ఊహించుచున్నాను. మరియు, ఓ, కావున, సరిగ్గా ఇక్కడే, బహుశా నేనన్నది తప్పు కావచ్చును, మరియు కొన్నిసార్లు నేను ముఖములు మరచిపోవుదును. ఈ ఉదయం మీరంతా ఇక్కడ ఉండుటను బట్టి నేను సంతోషించుచున్నాను.
HEB 4:12
142మరియు కత్తిరించిన తర్వాత మనము వెళ్ళే ముందు… మరియు, బైబిలు చెప్పినది, మీకు తెలుసు, దేవుని వాక్యము ఆ నిర్ణయము ఒక రాయిని చేసిన విధంగా, కాని నీకు ఆ రాయిని దాని రూపములో చెక్కుటకు ఒక రాతి పనివాడు కావలెను, చూశారా. మరియు హెబ్రీ 4వ అధ్యాయము, "దేవుని వాక్యము రెండంచులుగల ఖడ్గముకంటే పదునైనదని" చెప్పినది. అది కత్తిరించును, సున్నతి చేయును, అదనముగా ఉన్నవాటిని కత్తిరించును." ఆలోచనలను మరియు హృదయము యొక్క తలంపుల మట్టుకు దూరుచూ వివేచించును," దేవుని వాక్యము. మరియు అది కత్తిరించును.
ఇప్పుడు, కేవలం ఆరాధన కొరకు, మనము నా ప్రియమైన పాత చిన్న పాటను పాడుకొందుము, నా ప్రియమైన వాటిలో ఒకటి, "నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను." ఎందరు నిజంగా ఆయనను ప్రేమించుచున్నారు, నీవు క్రైస్తవుడవా కాదా, అనునది నాకు అక్కరలేదు, "నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఏలయనగా ఆయన నన్ను ముందు ప్రేమించెను" అని మీరు అనండి. ఇప్పుడు మనము కలిసే దానిని పాడుదము, అందరమూ కలిసి.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఏలయనగా ఆయనే ముందు నన్ను ప్రేమించెను
మరియు కల్వరి మ్రానుపై నా రక్షణను కొనెను.
143మీరు దానిని ప్రేమించుట లేదా? దానిని మనము మరలా పాడుదము. మరియు మీరు పాడుచుండగా, మీ ప్రక్క ఉన్న ఒకరితో కరచాలనము చేయుడి. లేవవద్దు, కేవలం "దేవుడు నిన్ను దీవించు గాక," అనుడి, మీ చుట్టూ ఉన్న ఎవరో ఒకరితో - కావున మీరు - అందరూ నిజంగా స్వాగతించబడిన అనుభూతి పొందుదురు. అది ఇక్కడ టేబర్నికల్ కు నా తరపున మీకు స్వాగతము. మీలో ప్రతి ఒక్కరికి. సరే.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను
మరియు కల్వరి ప్రమానుపై నా రక్షణను కొనెను.
దీనిని పాడుచుండగా, మన తలలు వంచుదుము. [సహో, బ్రెన్హాం "నేనాయనను ప్రేమించుచున్నాను" అని పాడుట ప్రారంభించిరి.] ఇప్పుడు, సులువుగా మీ చేతులను ఆయన యొద్దకు పైకి ఎత్తండి. [ఆయన పాడుటను కొనసాగించుచున్నారు, "నేనాయనను ప్రేమించుచున్నాను."] ఇప్పుడు, ఆయన ఆశ్చర్యకరుడు కాడా?
MARK 16:17,18
144[ఒక సహోదరుడు భాషలలో మాట్లాడుచున్నాడు. సాహో బ్రెన్హాం అగిరి.] నిజంగా గౌరవంగా. యేసు చెప్పెను, "నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు. వారు పాపములను ఎత్తిపట్టుకొనిననూ, విషకరమైనది త్రాగిననూ, అది వారికి హానిచేయదు, ఏలయనగా ఒక ప్రమాదము గాని, ప్రేలుడు గాని వారికి హాని చేయదు. వారు రోగులపై చేతులుంచగా వారు కోలుకొందురు." మీరు కేవలం ఒక నిమిషము ఎదురు చూడండి, దీనికి ఒక తర్జుమా వచ్చునేమో చూడండి. క్రొత్తవారు మన ద్వారములో ఉన్నట్లయితే, ఈ వర్తమానము ద్వారా ప్రభువు మనకేమి చెప్పుచున్నారో చూచుటకు ఎదురు చూస్తున్నాము. [ఒక సహోదరుడు అర్ధము చెప్పుచున్నాడు.] దాని అర్థము ఏమిటి అని ఎరుగని వారికొరకు, ఇక్కడ ఈ వ్యక్తి చెప్పిన అనువాదము. అది ఆత్మ. అది అంతా టేబర్నెకల్లో జరుగును, ప్రజలకు వర్తమానము ఇచ్చుటకు. మనము ప్రార్థించుదము.
145పరలోకపు తండ్రీ, ఇందులకు మేము మీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము, ఎక్కడో ఒకరు దానిని ఎరుగక, ఎక్కడో మీరు ఒక హృదయముతో మాట్లాడుట యెరుగనందున, మరియు అది మరలా వెనుకకు పిలిచినది, ముగింపు వర్తమానములో కూడా, వారిని నీ బిడ్డలని పిలిచినది, ఏలయనగా మీరు వారిని పిలిచిరి, మరియు బహుశా వారు మిమ్మును స్వీకరించకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారేమో. ఈ వర్తమానము మరలా వచ్చినది. కావున, ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ అతని పై మీ ఆత్మ యొక్క గొప్ప భాగమును అనుగ్రహించమని మేము ప్రార్ధిస్తున్నాము. మీరు వారి పేరు పిలువలేదు, మీరు కేవలం మాట్లాడారు. మరియు కావున, తండ్రీ, బహుశా, మీకు ఆ విధముగానే అది కావలయునేమో. మరియు ప్రభువా, ఆ వ్యక్తికి లేదా వ్యక్తులకూ, వారెవరైనప్పటికీ, అది ఆఖరి పిలుపునకు వచ్చునట్లుగా మీ చిత్తము అనుగ్రహింపబడవలెనని మేము ప్రార్ధిస్తున్నాము. తండ్రీ, అది కానిచో, ఈ ఉదయం మీరు పలుకుచూ చెప్పినప్పుడు వారు వర్తమానమును విని, వారి హృదయమంతటితో నమ్మి దానిని స్వీకరించినట్లయితే, మరియు అప్పుడు వారు తమ గిన్నెనెత్తుకొని ఆత్మను స్వీకరించుదురు గాక, అని నేను ప్రార్ధించుచున్నాను. వారు లేచి వారి పాపపరిహారము నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుదురు గాక, మరియు మధురముగా పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, మరియు సంతోషము మరియు సేవతో కూడిన జీవితమునకు నడిపించబడుదురు గాక. తండ్రీ, ఇప్పుడు, నేనునూ, సంఘమునూ దానిని, యేసు నామములో మీకు అప్పగించుచున్నాము. ఆమేన్.
MARK 16:17
146ఆ వర్తమానములు కొన్నిసార్లు మాట్లాడును, ఎవరో ఒకరు, వారెవరో మనమెరుగము. కొన్నిసార్లు వారెవరో అని చెప్పును, కాని ఇక్కడ ఎవరో అది లేకుండా ఇక్కడ నుండి దూరముగా కదలుట మొదలు పెట్టియుండవచ్చు. మరియు మీరు చేయునప్పుడు, గుర్తుంచుకొనండి, అది పరిశుద్ధాత్మ ఒక భాషలో మాట్లాడుట, దానికి కొంత ప్రేరేపణ కావలెను, దానిని మాట్లాడుటకు ఏదో, అర్ధము చెప్పుటకునూ అదే. ఇప్పుడే నేను చదువుట ముగించినదానిని ఇప్పుడు గుర్తుంచుకొనండి, "నమ్మిన వారిని ఈ సూచనలు వెంబడించును." చూడండి, అది విశ్వాసుల మధ్యన. అది ప్రజలందరూ చేయవలెనని మేము నమ్మము. అది సంఘములో ప్రజల మధ్య వచ్చునని మేము నమ్మదుము. కొన్నిసార్లు అలాంటి వాటిగురించి ఎన్నడూ వినని వారు ఇక్కడికి వచ్చెదరు, మరియు పరిశుద్ధాత్మ వారిపై దిగి ఒక వర్తమానము నిచ్చును, మరియు అక్కడ క్యాన్సర్ తోనూ మరియు అన్ని విధములైన వ్యాధులతోనూ మరియు వాటితోనూ చనిపోతూ కూర్చున్న ప్రజలను స్వస్థపరచును, మరియు తిన్నగా వెనక్కి వెళ్ళును. అది ఆయన ప్రజల మధ్య ఉన్న పరిశుద్ధాత్మ.
మీరాయనను ప్రేమించుచున్నారా? ఆమేన్. నేను కూడా ఆయనను ప్రేమించుచున్నాను. ఈ రాత్రి మిమ్ములను చూడవలెనని మేము నిరీక్షించుచున్నాము. మరియు ఇప్పుడు, నెవిల్ సోదరుడా, నేను ఆరాధనను మన పాస్టరైన నెవిల్ సోదరునికి అప్పజెప్పుచున్నాను.