ఒప్పుకొనిన తరువాత పట్టింపును కలిగియుండుట
VGR COUNT-219 1సహోదరుడా పార్కర్, చాలా కృతజ్ఞతలు. స్నేహితులారా, శుభసాయంకాలము. మరలా ఈ రాత్రి ఇక్కడ యు౦డుట చక్కగా యున్నది. మీరు ఇచ్చట కూర్చొని, నా మాటలు విని అలసిపోయారని నేను అనుకొనుచున్నాను, మరియు నేను కూడా అలసిపోయాను, బలముగా బోధించుట వలన నా యొక్క గొంతు కొద్దిగా బొంగురు పోయినది. చాలా కాలము తరువాత ప్రభువు నాకు ఒక శ్రేష్టమైన కూటములను ఇచ్చియున్నాడని ఇంతకు మునుపే నేను సహోదరుడు పార్కర్ తో మాట్లాడుచూ ఆయనకు చెప్పుచుంటిని. ఇది పెద్ద కూటము కాదు. నేను ఏమి చెప్పదలచుచుంటినో మీకు తెలియునని నేను అనుకొనుచున్నాను. అయితే ఇది బాగా పెద్ద కూడిక కాదు. ఎక్కువ జనులు ఈ కూటమునకు రాలేదు, కానీ దాని యొక్క విలువను చూచినప్పుడు, అది ఎంతో అద్భుతమైనదిగా యున్నది. విశ్వాసము? మై, ఇక్కడ ఏదైన జరుగవచ్చును అనే విధముగా కనబడుచున్నది. ఏ సమయములోనైన, ఏదైనా జరుగవచ్చును అనే భావము కలిగే ఒక కూటమును నేను ఇష్టపడుదును. మరియు నేను దానిని ఇష్టపడుదును. మరియు దీని యొక్క ఫలితములు శాశ్వతముగా ఉండునని నేను నిశ్చయత కలిగియున్నాను. మరియు దానిని అది బహిరంగముగా చూపించుచున్నది.
నేను గంటల పాటు చేయుచున్న ప్రసంగమును కూర్చొని, ఓపికతో వినుచున్న మీ అందరి యొక్క సహనాన్ని నేను నిశ్చయముగా అభినందించుచున్నాను, మరల మరియొక్క రాత్రికి తిరిగి వచ్చుచున్నారు. ఖచ్చితముగా మీరు ఎక్కువ శిక్షను భరించగలుగుచున్నారు! కాబట్టి నేను మీరు మంచి సహనమును కలిగియున్నారని నేను ఎరిగియున్నాను.
2కాబట్టి మీరు… సహోదరుడు థామస్ నకు, మన అందరి తరుపున మేము మీకు కృతజ్ఞలమైయున్నామని నేను చెప్పగోరుచున్నాను. సహోదరుడు థామస్ గారి యెడల నేను కలిగియున్న అను భూతిని వ్యక్తపరచజాలను. ఆయనను నేను ఎరిగియుంటిని అని నేను తలంచితిని. అయితే వేరొకనితో ఆయనను కలగలుపు చేసితిని. ఆయన యొక్క ప్రశస్తమైన భార్యతో నేను కరచాలనం చేసాను, మరియు వారు నిజమైన క్రీస్తు యొక్క సేవకులు. దేవుని చిత్తమైతే జీవితములో పలుమారులు మా యొక్క మార్గములు ఎదురుపడును అనే నిరీక్షణను నేను నిశ్చయముగా కలిగియున్నాను.
మీవలె యుండి మరియు నేను ఇక్కడ నివసించినయెడల, ఆయన సంఘమునకే నేను వెళ్లి యుందును. కాబట్టి నేను అటువంటి ఒక మనిషిని ఇష్టపడుచున్నాను… [సాహో పార్కర్, సాహో బ్రెన్హా౦ను కృతజ్ఞతలు తెలిపి మరియు మరొకసారి వచ్చుటకు పిలచుచున్నారు.] కృతజ్ఞతలు. మీకు ఎంతో కృతజ్ఞతలు. అది నిజముగా చక్కగా యున్నది. కృతజ్ఞతలు, సాహో పార్కర్.
3నేను చాలా చాలా… [సాహో పార్కర్ మరలా మాట్లాడుచున్నారు.] ప్రతి ఒక్కదానికి, అన్ని ఖర్చులకు సరిపోయిన డబ్బులు చెల్లించబడినవి అని ఆయన చెప్పియున్నారు. మీ అందరి యొక్క సహాయ సహకారములను మేము అభినందించుచున్నాము, ఎందుకనగా, ఇటువంటి కూడికలు పెట్టుట ఖర్చుతో కూడిన పని అని మీ అందరికి తెలియును. మరియు ప్రతి ఒక్కటి చెల్లించబడినది. అది చాలా మంచి కార్యము. ఇక్కడ జరిగిన సమస్తమైన కార్యముల కొరకు, మేము కృతజ్ఞులమై యున్నాము. ప్రభువు రక్షించెను, స్వస్థపరచెను, మరియు సమస్తము ఇక్కడ సంభవించినవి. కాబట్టి, దీనిని చూస్తూ… మేము చాలా సంతోషముగా యున్నాము… ఈ యొక్క కూటము చరిత్రలోనికి వెళ్ళిపోవుటను చూచుటకు ఇష్టపడుట లేదు. అయితే రాబోవు కాలములలో అది మరల తిరిగి వచ్చును. మనము దాని యొక్క ఫలములను చూచెదము.
ఇప్పుడు, ఈ సమయములో మీరు నాకు పంపిన ఆ చిన్న బహుమానముల కొరకు మరియొక్క సారి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. నేను దానిని చాలా, చాలా అభినందించుచున్నాను.
4మరియు ఇప్పుడు, మేము దక్షిణ కరోలినాలో గల కొలంబియా, దక్షిణ కరోలినాలో గల కొలంబస్లోయున్న సహోదరుడు "బిగ్ బీ"ను దర్శించుటకు వెళ్ళుచున్నాము. మరియు మేము రేపటి రాత్రి మరియు మంగళవారము రాత్రి సహోదరుడు "బిగ్ బీతో కలిసి ఉంటాము. పిమ్మట మేము పడమర తీరమునకు వెళ్ళుదము.
నేను మిమ్ములను అడుగగోరుచున్నాను, మరియు అటు పిమ్మట, నేను బహుశా, మేము అక్కడ కూడికలను ముగించుకొనిన తరువాత, నేను ఆఫ్రికా, ఆస్టేలియా, న్యూజిలాండ్ మరియు అక్కడికంతా వెళ్ళగోరుచున్నాను. దేవుడు నాకు సహాయము చేయలాగున, నా కొరకు మీ యొక్క ప్రార్థనలను నేను కోరుచున్నాను. మరియు మిక్కిలి ధన్యవాదములు.
5మరియు సమస్తమైన కార్యముల కొరకు మేము చాలా కృతజ్ఞుమైయున్నాము. దీనిని నా తరుపున మరియు నా గుడారము నుండి ఇక్కడికి వచ్చిన నా ప్రజల తరుపున చెప్పుచున్నాను. మా యొక్క… లేదా నేను ఇక్కడ మా యొక్క ధర్మకర్తలలో మరియు పెద్దలలో కొందరిని, మరియు నా స్నేహితులలో కొందరిని ఇక్కడ కలిగియున్నాను.
మా యొక్క సంఘకాపరి ఇక్కడ యున్నారు. నేను ఎన్నడూ బ్రదర్ నెవిల్ ను చూడలేకపోవుచున్నాను. ఆయన పరిచయము చేయబడియున్నాడు అని నేను తలంచుచున్నాను. ఆయన పరిచయము చేయబడెనా? బ్రదర్ నెవిల్? బ్రదర్ ఓర్మన్ నీవు ఎక్కడున్నావు? నేను మిమ్ములను అక్కడ కనుగొనలేకపోవుచున్నాను. ఓ, మై! పెద్ద ఆకారములో ఆయన ఆ వెనుక భాగమున కూర్చొనియున్నారు. ఒక్క నిమిషం ఇక్కడకు రండి!
ఈ యొక్క మనిషి క్రీస్తు యొక్క నిజమైన సేవకుడు అని నేను ఎరుగుదును. ఆయన రంగు వేయబడిన ఒక మెథడిస్ట్ మరియు పిమ్మట పరిశుద్ధాత్మను పొందుకొనెను. ఇప్పుడు, అతను ఒక పరిశుద్దాత్మను పొ౦దుకొనిన మెథడిస్ట్ అయి ఉన్నాడు.
ఈయన మన యొక్క ప్రశస్తమైన సంఘకాపరి. సహోదరుడా నెవిల్ మీతో కరచాలనం చేయదలచుచున్నాను. [సాహో నెవిల్ ప్రతిస్పంది౦చుచున్నారు.] మీకు కృతజ్ఞతలు. కొన్ని సంవత్సరముల క్రితము నుండి సహోదరుడు నెవిల్ ను నేను ఎరుగుదును. మరియు ఆయన యొక్క ప్రియమైన భార్యను, వారిరువురి వివాహమునకు ముందు నుండే ఎరుగుదును. మరియు కొన్ని సంవత్సరముల క్రితము నుండి నేను ఆయనను ఎరిగియుంటిని, ఆయనలో కొంచెమైనను మార్పు రాలేదు; కేవలం దేవునిలో మరి ఎక్కువగా ఎదిగియున్నాడు. అంతే. అయితే ఆయన నమ్మకస్తుడు. ఇప్పుడు మేము ఆయనను ఒక సంఘ కాపరిగా ప్రేమిస్తున్నాము. ఆయన కొన్ని సంవత్సరములుగా అక్కడ ఉండియున్నాడు, మరియు, ఒకవేళ అది ప్రభువు యొక్క చిత్తమైతే, యేసు రాకడ వరకు ఆయన ఉంటారని మేము నిరీక్షణ కలిగియున్నాము, సహోదరుడు నెవిల్, నీవు ఈ ప్రజలకు ఏమైనా వాక్యము చెప్పదలచుచున్నావా? [సహోదరుడు నెవిల్ జనులకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు.] సహోదరుడా నెవిల్, దేవుడు మిమ్ములను దీవించును గాక.
ఇప్పుడు మీకు తెలియునా, మీరు పికినిక్ (వనభోజనము)కు వెళ్ళినప్పుడు, ఎవరైననూ ఒకరు ఒక చిన్న మొక్కను ఎక్కడైనా నాటినట్లయితే, మంచిది, అది అక్కడే యున్నదా, లేదా? అని మీకు తెలియదు, మీరు చెప్పలేరు. చూడండి, ఎందుకనగా, అది కేవలం ఆరంభించబడి, నాటబడినది లేదా ఏదో అయినది. అది అక్కడ ఉన్నది అని తెలిసినట్లయితే, మీరు ఆ వృక్షము క్రి౦ద విశ్రాంతి తీసుకొనివుండేవారు. అయితే, సహో నెవిల్ ఒక పురాతన సి౦ధూర వృక్షమువంటివాడు. ఆయన అనుదినము అదే విధముగా ఉంటూ ముందుకు సాగిపోవుచున్నాడు. దానినిబట్టి నేనెంతో సంతోషించుచున్నాను.
6మా యొక్క సహోదరుడు వేరొకరు ఇక్కడ యున్నారు, ఇక్కడ మన యొక్క సంఘమువంటిదే అయిన వేరొక సంఘమునకు అతడు కాపరియైయున్నాడు. అతడు వేదిక మీదకి రానట్లయితే, లేచి నిలబడవలసినదిగా కోరుచున్నాను. సహోదరుడు జూనియర్ జాక్సన్, వేరొక మెథడిస్ట్ సహోదరుడు పరిశుద్ధాత్మతో ని౦పబడియున్నారు. జూనియర్ జాక్సన్ ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మెథడిస్ట్ అయిన జాక్సన్. ఆయన ఇక్కడనే ఉన్నాడు, సాహో జాక్సన్. మీరు ఏదైనా చెప్పాలని కోరుచున్నారా, లేక ఏమైనా మీరు కోరినది? మంచిది.
మా యొక్క సహోదరులలో వేరొకరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మరియొక సహోదరుడు పామర్ ఉన్నాడు. సహోదరుడా పామర్ ఒకసారి లేచి నిలబడగలరా? జార్జియా మెకాన్ అను ప్రాంతము నుండి ఒక సంఘకాపరి ఉన్నారు. ఈయన మాయొక్క స్నేహితులలో ఒకరు. మరియు సాహో ఫ్రెడ్ సోత్మన్, ఆయన ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఆయన మా సంఘములోని ధర్మకర్తలలో ఒకరు. ఎక్కడ ఉన్నారు, ఫ్రెడ్? ఇక్కడే ఎక్కడో — అక్కడ వెనకాల నిలబడియున్నారు.
7సహోదరుడు బ్యాంక్ ఉడ్ — మీరు ఎక్కడ ఉన్నారు? సహోదరుడా బ్యాంక్స్ ఇక్కడ ఉన్న మా యొక్క ధర్మకరలతో ఆయన కూడా ఒకరు, ఎక్కడ ఉన్నారు? మీకు తెలుసా సాహో బ్యాంక్ ఉడ్ యెహోవా సాక్షులు, అను దాని నుండి వచ్చెను అని మీకు తెలుసా. అతడు కూటమునకు వచ్చెను, మరియు అతడికి ఒక వికలాంగుడైన బాలుడు ఉన్నాడు, డేవిడ్, అతడి కాలు పోలియోతో చిన్నగా మారెను. మరియు అది ఒక టెంట్ మీటింగ్, మొదట అతడు చూచెను… అతడు డల్లాస్ లో రాత్రి ఉండెను… లేక, పరిశుద్ధాత్మ వెలుగుగా క్రిందికి దిగి వచ్చినప్పుడు అతడు హుస్టన్ లో, మరియు వారు దాని యొక్క చిత్రమును తీసుకొన్నారు. సాహో వుడ్ అక్కడ ఉన్నారు. అపుడు నేను అతడిని ఎరుగను. ఆయన ఒక కాంట్రాక్టరు. ఆయన యొద్ద కావలసినంత ధనము యున్నది. ఆయన తరువాత జరిగిన కూటమునకు కూడా వచ్చియున్నాడు. అక్కడ నుండి నేను విదేశములకు వెళ్ళితిని. మరియు తరువాత జరుగు కూటమునకు వెళ్ళాను. పోలియో కలిగిన అంగవైకల్యముగల ఒక కుమారుని ఆయన కలిగియున్నాడు. మరియు మేము అక్కడ యున్నప్పుడు. నేను పరిశుద్దాత్మ యొక్క అభిషేకముతో నిండినవాడనై అక్కడ నిలబడియుంటిని, జనములలో నుండి వెనుకకు వెళ్లి, ఆయనతో మాట్లాడితిని. దాని గురించి అంతయు ఆయనకు చెప్పాను; ఆయనను లేచి నిలువబడమని చెప్పాను.
8డేవిడ్, నీవు ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రి, నీవు ఇక్కడ ఉన్నావా? —అంగవైకల్యముతో యున్న ఆ బాలుడు. అతడే. డేవిడ్, పోలియో చేత కాలు వంకర చేయబడిన ఆ మనిషిని దేవుడు స్వస్థపరచగలడు అని ఆ ప్రజలు నమ్మనట్లయితే, ఒక్క నిముషం అక్కడ నీవు నడువవలెను అని నేను ఆశిస్తున్నాను, నీవు ఎలాగు నడువగలవో వారికి చూపించు. అవును. అవును. ఇక్కడ, ఏదో వేడుక చేయుట కొరకు కాదు, అయితే ఒక సాక్ష్యము నిమిత్తము మాత్రమే. అక్కడ చూడండి, కనీసం ఒక్క వంకర గాని లేక ఏమియూ లేదు, అంతయూ పరిపూర్ణముగా సాధారణముగా యున్నది, చూచారా. మన యొక్క ప్రభువు ఏమి చేయగలడు అనేది, నిజముగా ఒక అద్భుతముగా యున్నది.
ఇప్పుడు ఒకవేళ ఆయన అతని కొరకు చేసినట్లయితే, ఎందుకు, మిగిలిన వారి కొరకు కూడా ఆయన చేయును. కచ్చితముగా! అది కేవలము అటువంటి విశ్వాసము మనము పొందుకొనినట్లయితే ఆయన చేయును.
9ఇప్పుడు, సహోదరులలో, ఇక్కడ యున్న సహోదరుడు బెన్ను మీరందరు బాగుగా ఎరిగి యుంటిరి. ఆయన కేవలము… మీకు తెలియునా, అందరికంటె గొప్ప స్వరముతో ఈ వ్యక్తి "ఆమేన్" అని చెప్పుట సహోదరులలో మీరు వినగలరు. అతని గురించి కొద్దిగా నేను మీకు చెప్పెదను. ఆయన నిమిత్తము ఈ విషయం చెప్పుటకు నేను ఇష్టపడుట లేదు. ఆయన భార్య అక్కడ కూర్చునియున్నది. మన మందరము బెన్ ను ప్రేమించుచున్నాము, మరియు ఇది ఆయన వివాహమునకు మునుపు జరిగినది. నేను అప్పుడు పడమర తీరములో యుంటిని. మరియు ఆ బాలుడు దక్షిణ ఇండియానాకు చెందినవాడు.
ఒక రాత్రి యందు నేను పడమర తీరమునందు, సాన్ పెర్నాండో లోయలో, బాప్టిస్ట్ ప్రజలతో పూర్తిగా ప్రజలతో నిండియున్నపెద్ద టెంట్ (గుడారము)లో వాక్యమును బోధించుచున్నాను. ఇప్పుడు, మీకు తెలియునా, వారు ఒక రకమైన శుద్ధిచేయబడిన జనులు, మరియు నేను కేవలము బోధించుచున్నాను. సూటిగా నేను ఒక బలమైన శబ్దమును విన్నాను; నల్లని తల వెంట్రుకలు కలిగి ఒక మెక్సికన్ వలె ఊగినది; ఆ విధముగా ఆయన చేతులు, రెండు పెద్ద పాదములు పైన గాలిలో అతుక్కుని యున్నవి. నేను ఆపివేసితిని, "బెన్, నీవు ఎలాగు ఇక్కడకు వచ్చితివి?" అని నేను అన్నాను. ఆయన అక్కడ యున్నాడు. బెన్, దేవుడు మిమ్మును దీవించును గాక. కేవలం నీవు మాత్రమే నిలబడుట కాదు. నీవు మరియు నీ భార్య దయచేసి లేచి నిలబడ౦డి, ప్రజలు కొరకు మేము ఇష్టపడుచున్నాము. సహోదరుడు బెన్, ఇక్కడ ఆ మూలన కూర్చొని "ఆమేన్" చెప్పుచున్నాడు. దేవుడు మిమ్ములను దీవించును గాక.
10మరియొక మిషనరీ, బ్రదర్ వే, సువార్త సేవలోనికి తన మార్గములో వెళ్ళుటకు ప్రయత్నించుచున్నాడు. ఈ రాత్రి ఆయన మనతోనే యున్నారు. ఆయనను మనము ఎరిగియుంటిమి. కొన్ని దినములుగా ఆయన మనతో కూడా ప్రయాణము చేయుచూ వచ్చుచున్నాడు. బ్రదర్ వే, మీరు ఎక్కడ ఉన్నారు? ఈ కూటములో మీరు ఉన్నారా? ఇక్కడే… ఆయన భార్య కూడా ఉన్నది.
మరియు ఇప్పుడు, నేను మీకు చెప్పుచున్నాను, నార్వే మరియు ఇంగ్లాండ్ కు మధ్య జరుగుచున్న యుద్ధము ముగిసినది. ఆయన ఒక ఆంగ్లేయుడు మరియు ఆమె ఒక నార్వే జాతీయురాలు. అది అంతయు అయిపోయినది. వారు ప్రియమైన జనులు. అవునండీ, ఆ యుద్ధము ముగిసినది.
11గత రాత్రి, బ్రదర్ బోజ్ ఆ క్రింద ఉండి, తన యొక్క చిత్రపటమును చూపిస్తూ, "ఓ, మంచిది" అని చెప్పుచున్నాడు. "అక్కడ ఒక స్త్రీ ఉన్నది" అని ఆయన చెప్పెను. ఆమె సహోదరి సాత్మాన్ మరియు ఇక్కడే, ఎక్కడో ఆమె ఉన్నది. (ఆమె ఫ్రెడ్ తో కలిసి నిలబడవలసినదిగా నేను ఆశిస్తున్నాను. వారు ప్రియమైన జనులు మరియు ఆమె ఒక నార్వే జాతీయురాలు. సహోదరుడు బోజ్ ఒక స్వీడన్ కు చెందినవాడు.) మరియు ఆయన "హమ్! హమ్" అని అన్నాడు. (జోసఫ్ ఎలా చేస్తాడో మీకు తెలుసు.) "ఇక్కడ ఒక స్త్రీ యున్నది, ఒక సహోదరి" అని అన్నాడు, "ఆమె నార్వే జాతీయురాలు" అని అన్నాడు. "మీరు స్వీడన్ దేశీయులుగా ఉండనట్లయితే, ఒక నార్వే జాతీయులుగా ఉ౦డుట మంచిది" అని అనెను.
బయటకు వచ్చితిని, ఆయన నా వైపుగా చూచెను, మరియు నేను, "జోసఫ్, మనమంతా ఐరిష్ వారము కాము, అది చాలా బాధాకరము," అని చెప్పాను. కావున అక్కడ మేమందరము తమాషా గల మనస్సును కలిగియున్నాము.
12సహాడరుడా హిగ్గిన్స్ బోతమ్, మీరు ఎక్కడ ఉన్నారు మన మార్గములో ఇక్కడే ఎక్కడో వేరొక దైవజనుడు ఉన్నారు. కొన్ని స౦వత్సరములుగా అక్కడ ఉన్న సంఘములో ఆయన ఒక ధర్మకర్త మరియు ఆయన యొక్క సహోదరి ఆర్గన్ బ్రయిట్ మరియు రూత్ ఆర్గాన్ బ్రయిట్ ఇక్కడే యున్నారు. ఇక్కడే ఆమె ఒక స్తలములో కూర్చొనియున్నది అని నేను నమ్ముచున్నాను. నిలువబడ౦డి! ఎంత మంది చిన్న ఆర్గన్ బ్రయట్ ను ఎరుగుదురు? సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తల సంస్థ ఉపాధ్యక్షులలో ఒకరికి అతను మేనల్లుడై యున్నాడు.
HEB 11:37,38
13ఓ మై, ఏమిటి మీలో ఎవరినైన నేను మర్చిపోయినట్లయితే… మీతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి గర్విస్తున్నాను. మీరంతా మాతో కలిసి ఇక్కడ ఉండుట చాలా సంతోషకరమైన విషయము. లోపలికి వెళ్ళుట బయటకు వచ్చుట అనేది మనకు తెలియదు. సహొదరి మరియు సహోదరుడు డౌ కూడా అక్కడ కూర్చొనియున్నారు మరియు సహోదరి బ్రవున్ మరియు సహోదరుడు బ్రవున్; సహోదరుడా మెక్కిన్ని, పరిశుద్ధత్మతో నిండియున్న వేరొక మెథడిస్ట్ బోధకుడు ఉన్నారు, సాహోరుడా మెక్కిన్ని మీరు ఎక్కడ ఉన్నారు? ఈ చుట్టు ప్రక్కలయున్నారా? ఆయన ఒహాయోకు చెందివాడు. ఇక్కడే, వెనుకవైపుయున్నాడు మరియొక సంపూర్ణమైన, ఈ వాక్యములో జన్మించిన, విధల్చబడిన మెథడిస్ట్. అది సరియే. ఇప్పుడు, పరిశుద్దాత్మ బాప్తిస్మమును పొందుకొని, దేవుని కొరకు ముందుకు వెళ్ళుచున్నారు.
నా సన్నిహితుడైన స్నేహితుడు పొట్ టైలర్, ఇక్కడ ఉన్నాడు. సోదరుడా పాట్, నిలబడండి సహోడరుడా, పాట్, కృతజ్ఞతలు. దేవుడు మిమ్మును దీవించును గాక. అతడొక ఆవుట్లా, అతనొక తుపాకీ కలిగిన వ్యక్తి, మరియు చంపేవాడు. మరియు దేవుడు అతని నుండి ఒక పరిశుద్దుని తయారు చేసేను. కూడికలను హాజరవుటకు దేశమంతటా తిరుగుచూ యున్నాడు.
మీకు తెలియునా, నేను ఈ జనులు ఎక్కడ నుండి వచ్చియున్నారు అని ఆలోచించే వాడిని? హెబ్రీయులు 11వ అధ్యాయము అనుకుంటున్నాను, "రంపములతో కోయబడిరి, మరియు గొర్రే చర్మములను, మేక చర్మములను వేసికొని తిరుగులాడుచూ, సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు." వారందరు, వారి యొక్క సాక్ష్యమును పొందియున్నారు.
టామ్ సింసన్, టామ్ ఎక్కడ? ఆయన పైకి వచ్చియున్నారా? ఆయన కారును నేను బయట చూసినట్లుగా నాకు అనిపించినది. ఆయన మరియు ఆయన యొక్క కుటుంబము, ఆయన ఇక్కడే యున్నాడని నేను భావిస్తున్నాను, బహుశా నేను తప్పుగా తలంచియుండవచ్చును. అవును. అక్కడ బయట గాలములో తేలుచున్న ఒక ఎర వలె, ఇటూ అటూ వ్రేలాడుచూ, "బమ్ప్-బమ్ప్!" అనుచున్నది. మంచిది.
14ప్రభువు మిమ్మలనందరిని దీవించును గాక, ఇక్కడ ఉండుటను బట్టి మేము ఎంతగానో ఆనందించుచున్నాము. జార్జియా, మరియు వేరే ప్రదేశముల నుండి కొందరు ఇక్కడ ఉన్నారు, మరియు మీరందరు ఇక్కడ ఉన్నదానిని బట్టియు మరియు మా యొక్క పాత స్నేహితులను కలియుటను బట్టియు మేము ఆనందించుచున్నాము.
నేను చికాగో నుండి వచ్చిన సహోదరి పెక్కిన్నాను చూచుచున్నాను. ఆమెయే అని తలంచాను. ఆమె ప్రక్కన కూర్చొనియున్న సహోదరి లిటిల్ మరియు ప్రశస్తమైన సహోదరి "డామికో" చికాగో నుండి వచ్చిన ప్రియమైన ప్రజలు, ఆ గుంపు స్త్రీలు నాకు చాలా ప్రియమైన వారు.
జార్జియా నుండి వచ్చిన సహోదరుడు, నేను కనీసం ఆయన పేరును కూడా ఉచ్చరించలేను. ఇంకా మిగతా వారు ఇక్కడ కూర్చొనియున్నారు. నేను… ఓ, మై! అంతయూ ఈ చుట్టు ప్రక్కల ఉన్నవాటన్నిటి బట్టి వారు ఆశ్చర్యపడ్డారు. ఈ యొక్క సహవాసములో ఉండుటను బట్టి మేము ఆనందించుచున్నాము.
వృద్దుడైన సహోదరుడు బోస్వర్త్ నాకు ఈ విధంగా చెప్పేవాడు, ఆయన "సహోదరుడా బ్రెన్హాం, సహవాసము అనగా ఏమిటో నీకు తెలుసా?" అని అడిగెను.
"నాకు తెలియును అని నేను అనుకొనుచున్నాను" అని నేను అన్నాను.
"అది ఇద్దరు వ్యక్తులు ఒక పడవలో యుండుట" అన్నాడు. కాబట్టి, మనము అక్కడే యున్నాము, అయితే మనము సహవాసమును కలిగియున్నాము. మీపై ప్రభువు కృప చూపును గాక.
15నా పరచర్యలో ఈ కూటము ఒక ప్రాముఖ్యమైనదిగా, నా పట్టికలో చేర్చుకుంటాను, మీరు చేసిన చక్కని సహకారము కొరకు మరియు ఈ సహోదరి, సహోదరులు మరియు అందరి ఆహ్వనము కొరకు మరియు మీరు చేసిన దానంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గృహములో ఉండిన విధముగానే భావించుచున్నాను, కాబట్టి నేను నా గొంతు బొంగురు పోయినంత వరకు బోధించాను.
ఇప్పుడు, నా తరువాత సహోదరుడు నెడ్ ఐవర్సన్ కొలంబియాలో సహారోదరుడు బిగ్ బీతో కలసి కూటములను కొనసాగించెదరు. సహోదరుడు నెడ్ ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నారా? నాకు తెలియదు. బహుశా. అవును, వెనుక వైపు పరిశుద్దాత్మతో నిండిన ఒక ప్రెస్బిటేరియన్.
మరియు డాక్టర్ లీవైల్ మరియు ఆయన యొక్క భార్య నాకు ప్రియమైన ప్రశస్తమైన స్నేహితులు. సహోదరుడు వైల్ నాతో కలసి కూటములలో పని చేసారు, ఒక ప్రశస్తమైన స్నేహితుడు. వీరందరు, పరిచయము చేయబడిన వారేనని నేను అనుకొనుచున్నాను. సహోదరుడా వైల్, మీరు ఇక్కడ యున్నారా? సహోదరుడా వైల్, ఈ రాత్రి మీరు ఈ భవనములో యున్నారా? వెనుక వైపున ఉన్నారు. ప్రభువు మిమ్మును దీవించును గాక. సహోదరి వైల్, మీరు ఎక్కడ ఉన్నారు? నేను మిమ్మును చూచి, నా చేయి ఊపడమే జరుగుచున్నది. సహోదరి, దేవుడు మిమ్ములను దీవించును గాక. వారందరిని ఇక్కడ కలిగియుండుటను బట్టి మేము చాలా ఆనందముగా యున్నాము.
16ఇప్పుడు, మీరందరు నా కొరకు ప్రార్థించుడి. మరియు మనము ఎదో ఒక సమయములో, ప్రభువు యొక్క రాకడను చూస్తామను విశ్వాసముతో, దానిని నమ్ముచూ నేను కదులుచున్నాను. అది ఎలాగు, ఎప్పుడు, ఎక్కడ అనేది తెలియదు, అయితే ఆయన వచ్చునప్పటికి నేను సిద్ధముగా యుండవలెనని ఆశిస్తున్నాను. మరియు కొన్ని సమయములలో అది ఇలాగుండవచ్చును, మరియు మరొక విధముగా అని నేను తలంచుచుందును. అయితే, ఎలాగైనను, ఆయన వచ్చునప్పుడు నేను అక్కడుండాలని ఆశించుచున్నాను. ఆయనతో కలసి నేను వెళ్ళవలెనని ఆశిస్తున్నాను. ఇప్పుడు, అదే నా యొక్క ఆశ. మరియు నేను మాత్రమే వెళ్ళవలెనని కాదు గాని, నా స్నేహితులందరు మరియు నా శత్రువులందరు కూడా ప్రవేశించవలెనని నేను కోరుకొనుచున్నాను. అందరూ వెళ్ళవలెనని నేను ఆశిస్తున్నాను.
17నేను ఒక చిన్న దర్శనమును పొందాను… లేదా, దానిని నేను రూపాంతరము అని పిలువదలచుకోవటం లేదు. అటువంటి దర్శనమును నేనెన్నడూ చూడలేదు. ఇక్కడ, మధ్యకాలములో అక్కడ నిలబడి నేను దాని వైపు చూస్తు, మరల నా వైపు నేను చూసుకొంటున్నాను. పత్రికలలోను మరియు అటువంటి వాటిలో మీలో చాలా మంది దానిని చదివియుండవచ్చును. స్నేహితులారా, మీరు దానిని కోల్పోకూడదు! అలాగు చేయకండి!
ఇప్పుడు, అక్కడే ఎక్కడో ఉన్నాను. ఇక్కడ ఏ విధముగా యున్నానో అక్కడనూ అలాగే యున్నాను, తిరిగి నన్ను నేను చూసుకున్నాను. నేను దర్శనములను పొందుకున్నాను. దర్శనములు అంటే ఏమిటో నాకు తెలియును. ఒక వేళ అది దర్శనము అయినట్లయితే, అది నేను ఎన్నడు చూడలేనంత వింతగా యున్నది. మరియు అక్కడకు వెళ్ళిన ప్రజలను చూసాను. అక్కడ నేను వారిని చూసాను. ముసలివారు, యావ్వనస్తులుగా యున్నారు. మరియు పారు పాపము లేకుండా నా వలె మనుష్యులుగా అక్కడ నిలబడియున్నారు. అది పరిపూర్ణత కంటే శ్రేష్టమైనదిగా యున్నది. ఘనమైనది! నీవు అది ఏమిటి అని వర్ణింపజాలవు. మరియు నేను వెనుకకు తిరిగి రావలెనని నేను ఎరిగినప్పుడు, జనులకు దాని గురించి బోధించ ప్రయత్నించుటకు మాత్రమే నేను తిరిగి రావలసియున్నది అని తలంచితిని; మీరు ఏమి చేసినప్పటికి, దానిని కోల్పోవద్దు! దానిని కోల్పోవద్దు! దానిని కోల్పోవద్దు! నీవు దానిని కోల్పోజాలవు. మిగిలినవన్నియూ… సమస్తమూ వెళ్ళిపోనివ్వండి, అయితే, చూడండి, మీరు ఏమి చేసినప్పటికి దాని కొరకు సిద్ధపడండి.
18ప్రభువు చిత్తమైతే, ఈ శీతాకాలములో ఈ ప్రయాణములు ముగించి వచ్చిన తరువాత, నేను సువార్త సేవకై విదేశములకు వెళ్ళనైయున్నాను. కాబట్టి నా కొరకు ప్రార్ధనలో యుండుడి, ఎందుకనగా ఇక్కడ అది సులభముగా యున్నది, ఎప్పుడైన ఒక్కసారి అపవిత్రాత్మ కూటము లోనికి వచ్చి మరియు కలతపెట్టుటకు ప్రయత్నము చేయును, అయితే ఆ ప్రదేశములలో — మంత్రగాళ్ళు మరియు దెయ్యములు ఉన్నవి. మీరు దేని నిమిత్తము మాట్లాడుచున్నారో, దాని గురించి బాగుగా ఎరిగియుండవలసియున్నది. నిశ్చయముగా ఎరిగియుండవలెను. ఏలయనగా, వారు దయ్యములు, మరియు అక్కడే వారు మీతో సవాలు చేస్తారు. అయితే, ఓ, ఎలాగు… ఒక్కసారి కాదు. (నా పరిశుద్ధ గ్రంథము మీద నా చేతులుంచి చెప్పుచున్నాను.) ఒక్కసారి కాదు — ఎన్ని సార్లు ప్రపంచము మొత్తం మీద సవాలు చేయబడినదో అది మీరు ఉహించవచ్చు — అయితే ప్రతిసారీ దేవుడు రంగము మీదికి వచ్చి ముసుగును తొలగించి మరియు ఏలీయా కాలములో ఆయన ఎలా యున్నాడో, అదే విధముగా యున్నాడని, ఆయన దేవుడు అని తనకుతాను రుజువు చేసికొనియున్నాడు. ఆయన ఇంకనూ దేవునిగానే యున్నాడు! ఒక్కసారి కాదు!
19ఆ కారణము చేతనే మీలో కొందరు, కొంత మంది బోధకులు, వచ్చి నన్ను వాళ్ళ యొక్క స్థలములకు రావలెనని అడుగుచున్నారు. అక్కడకు వెళ్ళుటకై నాకు నడిపింపు వచ్చువరకు నేను వేచియుండును. తరువాత, నేను వచ్చినట్లయితే, నా సొంత నామములో మాత్రమే నేను వచ్చుచున్నాను, నేను ఆ విధముగా వచ్చినట్లయితే, మీ యొక్క స్నేహితునిగా వచ్చుచున్నాను. అయితే అక్కడకు వచ్చుటకు నేను నడిపింపును పొందినట్లయితే, నేను ప్రభువైన యేసు నామములో వచ్చెదను. ఆ స్థలము నుండి నీ కాలును బయట పెట్టుము, అది నాకు సంబంధించినది. ఆమేన్! దానినంతటిని నేను యేసుక్రీస్తు నామములో తీసుకొందును. తరువాత నీవు ఆయనను ఆవల కలుసుకొనవలసియున్నది, ఏలయనగా అప్పుడు నీవు దేవుని యొక్క ప్రతినిధివి. కానీ, ఇప్పుడు మిమ్ములను ఏదైనా సంఘము పంపినప్పుడు లేదా మీ కొరకు ఎవరైనా స్నేహితుడు పిలిచినప్పుడు, ఏదైనా, మరల ఊహించుకొనుచూ, మీరు కేవలము వెల్లెదరు. మై, ఊహించుకొనుట, దానిని వినుచూ మీరు అలసియుంటిరని నేను ఊహిస్తున్నాను!
EPH 1:3•
EPH 2:6
20ఇప్పుడు, కృప గల, పురాతన పరిశుద్ధ గ్రంథము వైపునకు తిరుగుదము. మరియు మనము దానిని చేయు ముందుగా, మనము ప్రార్థించెదము. చూడండి, మనము మాట్లాడుచున్న, మరియు ఇంకను, మరియు ఇప్పుడు మన యొక్క తలంపులను కొద్ది నిమిషముల పాటు ఆయనపై ఉంచుదుము.
మా యొక్క పరలోకపు తండ్రి, ప్రజలు మా యెడల చూపిన దయ కొరకు మరియు మా పట్ల కలిగియున్న గొప్ప విశాలమైన, వారి యొక్క వాత్సల్యత కొరకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము, మరియు మేము ఎంతగానో వారిని అభినందించుచున్నాము. మరియు ఇప్పుడు, తండ్రీ, అన్నిటికి పైగా, మిమ్ములను బట్టి, ప్రభువా, ఇది చేసిన దానిని బట్టి, మేము మీకు కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాము. మమ్మును ఆశీర్వదించినది మీరే మరియు క్రీస్తులో పరలోక స్థలములలో కలిసి కూర్చొనెదము. ఒకవేళ సాతాను మన యొక్క కూటములను కలతపరిచి పాడుచేయవచ్చును, అయితే మేము అందరము, కూడుకొని మరియు వాక్యము చుట్టూ సహవాసము కలిగి ఉండేటట్లుగా మీరు మమ్ములను ఎంతో చక్కగా ప్రేమించితిరి. మరియు దేవా, మేము ఎంతో అభినందించుచున్నాము. ప్రభువా, స్వరము ఎక్కువగా ఉపయోగించుట వలన గొంతు కొంచెం బొంగురుపోయినప్పటికీ, మీ ఆత్మ నా ప్రాణమును దీవించుచున్నదని నేను గ్రహించినవాడనై, నేను ఒక గొప్ప సమయాన్ని కలిగియుంటిని, వాక్యము… దేని గురించి వేచియుండకుండా, నేను ముగించి కూర్చుండు వరకు నదీప్రవాహమువలె పారుచున్నది. దేవా, దాని కొరకు నేను చాలా కృతజ్ఞుడనైయున్నాను.
21ప్రభువా, మా యొక్క సహోదరుడు పార్కర్ మరియు ఆయనతో పనిచేయు వారందరు, మమ్ములను ఆహ్వానించిన ఈ స్థలము వారందరును దీవించబడుదురు గాక. వారికి వేవేల కొలది ఆత్మలను అనుగ్రహించుము. వారు రోగుల కొరకు ప్రార్ధించినప్పుడు, చెవియెగ్గుము; ప్రభువా, వారి ప్రార్థనలను ఆలకించుము మరియు రోగులను స్వస్థపరచుము. ప్రభువా, నీ నామములో వారు ఏదైన చేయుటకు ప్రయత్నించినప్పుడు, ప్రభువా దానిని గౌరవించుము. వారికి ఆత్మఫలమును అనుగ్రహించుము. మరియు ప్రభువా, వారి హృదయము యొక్క గొప్ప కోరికను దయచేయుము, వారికి ఆత్మలను దయచేయండి. తరువాత, మేము మీ ఎదుట నిలబడిన ఆ దినమున, ఆ ఆత్మలు అన్ని చోట్ల నుండి వచ్చి వారి యొక్క చేతులను, ఈ ప్రశస్తమైన దేవుని మనుష్యుని చుట్టూ మరియు ఆయనతో పనిచేయు వారందరి చుట్టూ వేసి, "సహోదరుడా పార్కర్, నీవు గనుక ఈ మైదానములో నిలచియుండని యెడల మేము ఇక్కడ ఉండి యుండే వారము కాదు అని చెప్పుదురు గాక." ఓ, ప్రభువా, క్రీస్తు యొక్క నిజమైన సేవకులందరికి ఇది ఒక నిష్కపటమైన కోరిక అని మేము ఎరుగుదుము, వారు రక్షణ నిచ్చే క్రీస్తు యొద్దకు నశించిన మనుష్యులను, బీదవారిని నడిపించుదురని ఎరిగియుంటిమి. వీటన్నిటి కొరకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము.
22మరియు ఇప్పుడు, ప్రభువా, ప్రతీ ఒక్కరిని మీరు దీవించమని మేము ఇప్పుడు ప్రార్థించుచున్నాము. ప్రతీచోట జరగబోవు కూటములను దీవించండి. ప్రతీ ఒక్క గృహమునకు వెళ్ళండి. ఈ రాత్రి మా యొక్క విభిన్నమైన గృహములకు వెళ్ళుచుండగా, మేము విడిచిపెట్టుచుండగా వారితో ఉండుము. మా యొక్క మార్గములలో మాతో యుండండి. మార్గములోనే యుండండి. ప్రభువా, మా యొద్ద నుండి ఆ శత్రువును దూరపరచుము. మరియు మీరు వీటన్నింటిని అనుగ్రహించుమని నేను ప్రార్ధన చేయుచున్నాను.
ఇప్పుడు, ఈ రాత్రి ప్రతీ విన్నపమును, మా యొక్క హృదయ వాంఛను దయచేయుము. మరియు ప్రభువా, ఈ రాత్రి మీరు మా కొరకై మరలా జీవపు రొట్టెను విరచవలెనని నా యొక్క విన్నపము.
ఇక్కడ రక్షణ పొందనివారు ఎవరైన ఉంటే, వారిని రక్షించండి. ఎవరికైనా పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరమైనచో, ఈ రాత్రి అది వచ్చును గాక; ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే, వారిని స్వస్థపరచండి; ఎవరైన అలసినవారు ఉన్నట్లయితే, వారికి సంతోషమును దయచేయండి. ప్రభువా, దయచేయండి. ఇప్పుడు మేము దీనిని చదువుచుండగా, మీ యొక్క వాక్యమును దీవించండి, మరియు గ్రంథకర్త ఆ పాఠమును మాకు దయచేయును గాక. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
JOHN 1:35-42
23పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 35 నుండి 41 వరకు ఈ ప్రశస్తమైన వాక్యములను చదువుటకు ఇష్టపడుచున్నాను.
మరునాడు మరల యేసును అతని శిష్యులలో ఇద్దరును నిలుచు౦డగా [నన్ను క్షమించండి] … శిష్యులలో ఇద్దరును నిలుచుండగా;
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి - ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను.
అతను చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసుని వెంబడి౦చిరి.
యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు రబ్బీ, నీవు ఎక్కడ కావురమున్నావని ఆయనను అడిగిరి (రబ్బీయను మాటకు బోధకుడని అర్ధము.)
వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి: అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.
యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు నీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ.
ఇతడు మొదట తన సహోదరుడైన నీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, యేనునొద్దకు అతని తోడుకొనివచ్చెను. మెస్సియ అను మాటకు అభిషిక్తుడని అర్ధము.
యేసు అతనివైపు చూచి నీవు యోహాను కుమారుడవైన నీమోనువు: నీవు కేఫా అనబడుదువని చెప్పెను, కేఫా అను మాటకు రాయి అని అర్ధము.
ఇప్పుడు, ఈ వాక్యమునకు దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదములను జోడించును గాక.
24ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే ఈ రాత్రికి కావలసిన అంశమునకు రెండు మాటలను అక్కడి నుండి ఉపయోగించగోరుచున్నాను. నేను ఉపయోగించాలనుకుంటున్న ఆ రెండు మాటలు, "పట్టింపు" మరియు "ఒప్పుకోలు."
దేశములయందంతటా మొత్తం చల్లదనం ఉండుట, ఇప్పుడు మనము చూచుచున్నాము మరియు ఎరిగియున్నాము. నేను మొదట ప్రారంభించినప్పుడు, జరిగిన కూడికల్లో చాలా ఉజ్జీవము కనిపించినది. ప్రతీ చోట, ప్రార్థనా కూటములలో ప్రజలు యుండేవారు. విమర్శించిరి… వారాపత్రికలు నన్ను విమర్శించినవి. ఒక స్త్రీ అద్దె కారులో మూడు వందల మైళ్ళ దూరము ప్రయాణము చేసి, కెనడా దేశములో జరిగిన కూటమునకు వచ్చినది. అయితే ఇప్పుడు వారు అంతగా పట్టింపు కలిగియుండుట లేదు. పడిపోవుట అనేది జరుగుచున్నట్లుగా అది అనిపించుచున్నది. మరియు ఎక్కువగా కావలసినంత పట్టింపు లేనట్లుగా కనిపించుచున్నది. ఏ విధముగానైనను, వారు కలిగి ఉండవలసినంత పట్టింపు వారు కలిగిలేరు… చాలా తక్కువ పట్టింపును కలిగియున్నారు.
25ఇప్పుడు, మనకున్న ఒకే ఒక పట్టింపు, అప్పటిలో కలిగియుండిన సంపూర్ణ రాత్రి కూటములు కాదు. ఒకసారి నేను వేదికపైయుండి, ఎనిమిది రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళు విడువకుండా, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయుటకు ప్రయత్నించేవాడిని; మరియు చివరన, నలభైవేల మంది ప్రజలు ఇంకా ప్రార్థన కొరకు వేచి యుండేవారు, చూచారా. దానిని చేయలేకపోయాను! అయితే వారు ఒక గుంపును ఈ వైపునకు, అరణ్యములోనికి తీసుకొని వెళ్ళేవారు; వారు ఒక గుంపును ఈ మార్గములో అరణ్యములోనికి తీసుకొని వెళ్ళేవారు; ప్రజలకు పరిశుద్దాత్మ బాప్తిస్మము కొరకు సేవకులు ప్రార్ధి౦చేవారు. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకొనువరకు వారు విశ్రాంతి తీసుకునేవారు కాదు.
మీ క్షమాపణ కోరుచున్నాను. నేను నలుబది-రెండు వేల మంది అని చెప్పాను; నేను నమ్ముచున్నాను, మీరు ఆ వార్తాపత్రికను లేక చూచినట్లయితే, అక్కడ వేచియున్నవారు ఇరువై-ఎనిమిది వేలమంది అని ఉన్నది. జోనెస్-బోరో ప్రాంతములలో నుండి కొన్ని మైళ్ల దూరము వరకు మీరు అద్దెకు తీసుకొనుటకు అక్కడ ఒక్క స్థలము కూడా లేదు. పట్టణములో గుడారము వేసుకొనియుండిరి. అయితే ఇప్పుడు వారికి అంతగా పట్టింపు లేదు. చూచారా, ఉజ్జీవమనే అగ్ని మెల్లగా ఆరిపోవుచున్నది.
26ఇప్పుడు, కనిపిస్తున్న పట్టింపు ఏమనగా, "కేవలం వచ్చి సంఘములో చేరుట మాత్రమే!" లేదా ఒక గొప్ప పట్టింపు ఏమనగా, రేడియోలో వచ్చు సేవకు లేదా ఏదో టెలివిజన్ సేవకు సహాయము చేయుట మరియు ఏదో ఒక రకమైన ప్రదర్శనవలె చేయుచున్నారు, (మరియు మంచి కొరకు, సరే, ఖచ్చితముగా); పెద్ద భవనములు, గొప్ప పాఠశాలలు కట్టుట మరియు అటువంటివి, ఆ విధమైనవి! ఇప్పుడు అదే పట్టింపుగా కనిపించుచున్నది. వారు కలిగియున్న విధముగా, ఆ ప్రార్ధన మరియు నిర్భందము యొక్క దర్శనమును కోల్పోవుటవలెయున్నది. అక్కడ ఏదో జరిగినది. అది ఏమిటో కేవలము నేను తెలుసుకొనగోరుచున్నాను.
27మరియు ఇప్పుడు వారు దానిని గురించి పట్టింపు కలిగియున్నట్లుగా కనిపించుటలేదు… మీరు ఈ సంఘమును దర్శించవచ్చును లేదా బలిపీఠము యొద్దకు వచ్చుటకు జనులకు పిలుపునివ్వవచ్చును, మరియు అది వారు కేవలము బలిపీఠము యొద్దకు పరిగెత్తునట్లుగా యున్నది. మరియు నేను బోధించుచున్నప్పుడు, నేను సమయమును చూచితిని, నేను నా యొక్క వర్తమానమును ముగించుటకు ముందుగా, బలిపీఠము, మరియు పైనా, క్రిందా వున్న స్థలమంతయూ జనులతో నింపబడినది. పరిశుద్దాత్మ జనులలోనికి వెళ్ళె సమయమును నేను చూచితిని, మరియు ఒక ప్రవచనమును మరియు ఎవరికో ఏదో చెప్పితే, మరియు జనులు ఆశ్చర్యపడి వారు ఉండు స్థలములోనే అక్కడనే మూర్ఛపోయేవారు.
28ఎక్కడో ఏదో తప్పిదము ఉన్నది! ఇంకనూ అదే కార్యమును చేయుచున్నారు. ఇంకను అదే సువార్త నేను ప్రారంభమైననాటి నుండి రవ్వంత కూడా నేను మారలేదు. కల్మషము లేని స్వచ్ఛమైన దేవుని వాక్యముతో నేను మొదలుపెట్టితిని మరియు అప్పటి నుండి దానిమీదనే ఇంకను నిలిచియున్నాను. నేను బలిపీఠము యొద్ద ముప్పై-రెండు సంవత్సరముల నుండి ఉన్నాను మరియు ఎన్నడూ ఏదియూ వెనుకకు తీసుకొనలేదు లేదా ఏదియూ మార్చలేదు; నేను ఎలా ఆరంభమైతినో అలాగే ఉన్నాను. నేను దానిని వెనుకకు తీసుకొనలేదు. అది దేవుని యొక్క వాక్యము, మరియు ఇక్కడ ఇది చెప్పబడిన విధముగా, నేను చెప్పినయెడల ఆ తరువాత నేను అదే విషయమును చెప్పవలసివచ్చును, ఏలయనగా ఇక్కడ ఈ విధముగా వ్రాయబడివున్నది, చూచారా! కాబట్టి దాని గురించి ఇంకేమియూ చేయజాలము. పరిశుద్దాత్మ అదే కార్యమును ఇంకనూ చేయుచున్నది. కాబట్టి… అయితే కావలసినంత పట్టింపు ఉన్నట్లుగా కనిపించుటలేదు. ఇప్పుడు, నేను ఎందుకని ఆశ్చర్యపోవుదును.
29అక్కడ మునుపు ఉన్న విధముగా పట్టింపు ఎందుకు కలిగిలేరు? నేను నమ్ముచున్నాను, దానికి కారణము ఏమిటంటే, వారు కలిగియుండవలసినంత పట్టింపు కలిగియుండనట్లయితే, వారు ఒప్పుకొనవలసినంతగా వారు ఒప్పుకొనరు. మీరు పట్టింపు కలిగియుండుటకు మునుపు మీరు ఒప్పుకొనవలసియున్నది. పట్టింపును కలిగిలేరు… మీరు ఇప్పుడు సమయమును తీసుకొనుడి, సువార్త చేయుచూ మరియు ఏదో చేయుటకు ప్రయత్నించుటకు బదులుగా, ప్రతీ ఒక్కరు ఒక గొప్ప పాఠశాల లేదా వారు బోధించుటకై ఏదో గొప్ప పెద్ద స్థలమును కోరుచున్నారు. మరియు సేవకులు శ్రేష్టమైన బలిపీఠపు ఆచారవ్యవహారములు మరియు అటువంటి వాటిని తయారు చేయుచున్నారు.
నేను ఏమి నమ్ముచున్నానో మీకు తెలియునా? ప్రజలు యేసు త్వరగా రానైయున్నాడు అను దానిని ఒప్పుకొనుటలేదు అని నేను నమ్ముచున్నాను. ఆయన ఈ యుగములో వచ్చును (రానైయున్నాడు) అని వారు ఒప్పుకొనిరని నేను నమ్ముటలేదు. మరియు ఆ కారణము చేతనే వారు పట్టింపు కలిగియుండుట లేదు అని నేను నమ్ముచున్నాను, ఏలయనగా వారు పుర్తిగా ఒప్పుకొనలేదు. సరియే. ఆయన వారితో యున్నాడు అని వారు ఒప్పుకొనుటలేదు. వారు అలా ఉన్నచో, తిరిగి వారు వాక్యము యొద్దకు వచ్చియుండేడివారు. అది సరియే!
30మరియు ఇప్పుడు చాలా మంది జనులు దానిని అపార్ధము చేసుకొనుచున్నారు. ప్రేమ క్రమశిక్షణ. నీపు గనుక వారిని ప్రేమించినట్లయితే, నీవు జనులను తప్పనిసరిగా క్రమశిక్షణలో పెట్టవలెను. నేను ఈ ఉదయకాలములో చెప్పిన విధముగా, మట్టితో కేకులు తయారు చేయుచు మీ యొక్క బాలిక బయట రోడ్డు మీద కూర్చున్నట్లయితే, మీరు నిజముగా ఆమెను ప్రేమించినయెడల, మీరు అమెను రోడ్డుపై నుండి లాగుదురు.
నీ భార్య ఏమి చెప్పినప్పటికీ, "యోహాను అను ఎవరో ఒకరు (నీ పేరు ఏమయినప్పటికి), నీకు తెలుసా…" నీవు ఆమెను వేరొక పురుషునితో పారిపోనిచ్చెదవు, ఎందుకనగా "ఆమె యొక్క చిన్న హృదయము దీవించబడును గాక; ఆమె దానిని చేయవలెనని కోరినది, మరియు నేను ఆమెను ఎంతగానో ప్రేమించుచున్నాను, ఆమె దానిని చేయుటకు నేను అనుమతించితిని" అని నీవు చెప్పితివి. నీవు భర్తగా చాలా దీనస్థితిలో యున్నావు. ఆమె నీ నుండి విడుదల కోరినది. మరియు ఆమెను గురించి జాగ్రత్త వహించి, ఆమెను ప్రేమించే ఎవరినో ఆమె పొందుకొనినది. ఆ విధముగా అని నా భావము కాదు, ఎందుకనగా నీవు దానిని చేయలేవు.
31అయితే నేను దేనిని పొందగోర ప్రయత్నించుచున్నాను, అదేమనగా, దేవుడు హవ్వకు చెప్పదలిచినయెడల - ఏమి చెప్పును, "దీనమైన చిన్న హవ్వ నీకు తెలియునా, నీవు నా బిడ్డవు. నీవు అది చేయవలెననుకొనలేదు." ఏలయనగా ఆమె అది చేయకూడదు; నిశ్చయముగా ఆమె చేయకూడదు, అయితే ఆమె దానినే చేసినది! మరియు ఆమె దానినే చేయును అని మనము ఎరిగియుంటిమి. ఇంకనూ దాని ఫలితములు మనము చూచుచున్నాము. అయితే మీరు చూడండి, అతను ఆమెను ప్రేమించెను, మరియు అతను ఆమెకై అతని యొక్క మాటను నిలబెట్టుకొనవలెను. మరియు దేవుడు మనకై తన యొక్క వాక్యము నిలబెట్టుకొనియున్నాడు. కాబట్టి మనము తప్పనిసరిగా ఆయన వాక్యమునకు విధేయులై యుండవలెను. మరియు మనము ఆయన వాక్యమునకు విధేయత కలిగియున్నప్పుడు, మరియు ఆయనను చూడండి. తరువాత ఆయన ఏమి చెప్పెనో, దానిని ఆయన చేయును అని నిరూపించవలెను, అప్పుడు మనము ఒప్పుకొనెదము, నిజము. అప్పుడు ఆ వాక్యము సత్యమైయున్నది.
JOHN 14:12
32ఇప్పుడు మనము కనుగొనినప్పుడు… మనము తెచ్చెదము… ఇక్కడ కొద్దికాలము క్రితము, ఒక మహమ్మదీయునికి ఈ గొప్ప సువార్తికుడు — నేను చదివిన విధముగా దీనిని మీరు వార్తాపత్రికలో చదివియుండవచ్చును. ఈ మహమ్మదీయుడు ఈ సువార్తికునితో ఈ విధముగా సవాలు చేయుచున్నాడు, "యేసుక్రీస్తు అనేది ఒక మనిషి ఆరాధన; ఆ జనులు ఒక మనిషిని వెంబడించుచున్నారు."
సువార్తికుడు నమ్ముచున్న అదే దేవుడిని అతడూ నమ్ముచున్నాడు, అయితే, "యేసు ఆయన యొక్క కుమారుడు కాడు. ఇది కేవలము ఒక మానవుడు తయారు చేసిన ఆరాధన" అని చెప్పెను. మరియు అతను సువార్తికునికి సవాలు చేసెను, "ఆయన చేసిన కార్యములను పరిశుద్ధ గ్రంథము చెప్పినది, (క్రీస్తు), ఆయనను వెంబడించువారును అదే కార్యములను చేయుదురు," అని చెప్పెను. ఆయన, "ఇప్పుడు, ముప్పది మంది వ్యాధిగ్రస్తులను నేను లోపలకు తీసుకొని వచ్చెదను, మరియు నీవు ముప్పది వ్యాధిగ్రస్తులను లోపలకి తీసుకొని రమ్ము, మరియు మీరు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని నేను స్వస్థపరచెదను" అని అనెను. చూచారా! మరియు సువార్తికుడు పరుగెత్తెను. అతడు వేగముగా పారిపోయెను. మరియు నేను గనుక సువార్తికుడిని అయినచో, నేను చేయగలిగినంత విశ్వాసము నేను కలిగిలేనట్లయితే, నేను ఎన్నడూ ఒక అవిశ్వాసిని అక్కడ నిలబడనిచ్చెవాడిని కాను. నేను చెప్పాను, "దానిని చేయగలిగిన విశ్వాసముగల ఒక్కరిని మన యొక్క పరిధిలో నేను ఎరిగియున్నాను."
JOHN 21:15-17
33ఎందుకు? అది దేవుడైయున్నాడు, అని మొదటిగా నీవు ఒప్పుకొనవలసియున్నది, తరువాత నీవు ఎక్కడ నిలబడియున్నావు అనేది నీవు ఎరిగియుందువు. ఇది సత్యము. మొదటిగా ఒప్పుకొనవలసియున్నది, తరువాత నీ పట్టింపును నీవు పొందుకొనెదవు. అయినప్పటికి దేవుడు వారితో యున్నట్లుగా జనులు అడుగుచున్నారు, అయితే అది అంతయూ కాదు… అమ్మ చెప్పుచూ ఉండేది, "మాటలకన్నా చేతలు బిగ్గరగా కేకలు వేయును." నిశ్చయముగా ఇది చేయును. మీరు తప్పనిసరిగా దానిని చేసి, దానిని నమ్మి ఒప్పుకొనవలసియున్నది, మరియు తరువాత నీవు పట్టింపు కలిగియుందువు.
యేసు, "మీరు నన్ను ప్రేమించిన యెడల, నా గొర్రెలను కాయమని" చెప్పెను. ఇప్పుడు, అక్కడనే, ఆయన గొర్రెలను కాయుటలో మనమ౦దరము విఫలమవుచున్నామని నేను తలంచుచున్నాము. "మీరు గనుక నన్ను ప్రేమించిన యెడల నా గొర్రెలను కాయుడి." ఈ రోజు, ఇది దాదాపుగా "నా గొర్రెల బొచ్చు కత్తిరించునట్లుగా యున్నది." వాటిని ఒక స్థలములోనికి తీసుకొని వెళ్ళి మరియు వారు కలిగియున్నవన్నియూ తీసివేయుచుండెను, మరియు వారి యొక్క గృహమును, మరియు వారి యొక్క వృద్దాప్య-పింఛనులను మరియు మిగిలినవన్నిటిని కొదువపెట్టునట్లుగా చేయుచున్నారు. గొర్రె బొచ్చు కత్తిరించుట గురించి మాట్లాడుకుందాం; యేసు ఎన్నడూ అది చెప్పలేదు!
JOHN 6:48•
JOHN 21:15-17
34ఈ ఉదయకాలమున, "దేవుడు ఆయన ప్రజలను ప్రేమించును" అని సహోదరుడు పార్కర్ చెప్పెను. ఆయన తన గొర్రెలను ప్రేమించును. ఆయన "వాటిని కాయుడి" అని చెప్పెను. మరియు గొర్రెలు తప్పనిసరిగా గొర్రెల ఆహారము కలిగియుండవలెను." మరియు ఆయన, "నా గొర్రెలకు విద్య నేర్పించుము" అని చెప్పలేదు. ఆయన "వాటిని పోషించుము. వాటికి విద్య నేర్పుట కాదు; వాటిని పోషించుము; వాటికి గొర్రెల ఆహారమును ఇమ్ము."
గొర్రెల ఆహారము అనగా ఏమిటి? జీవాహారము (యేసే జీవాహారము), సువార్త, మరియు సత్యము. రాజీపడకుండా దానిని బోధించుము! అప్పుడు వారి యొక్క ఆత్మ కొరకు తీర్పు దినమున నీవు జవాబు చెప్పవలసి వచ్చినప్పుడు, నీవు ఎరుగుదువు, ఒక సువార్త సేవకునిగా నీవు నిలువబడి, "వాక్యములో అదే వ్రాయబడియున్నది" అని చెప్పగలవు. వారిని సత్యముతో పోషించుము. నా గొర్రెలను కాయుము!
35యోహాను ఎంతో పట్టింపు కలిగియున్నప్పుడు, ఆయన యుగములో మెస్సీయా వచ్చునని అతడు ఎరిగియున్నాడు… బాప్తిస్మమిచ్చు యోహాను దానిని ఎరిగియున్నాడు. కాబట్టి అతడు నివసించిన యుగములో మెస్సీయా వచ్చును అని అతడు ఎరిగియున్నాడు, అయితే అతడు అరణ్యము నుండి బయటకు వచ్చినప్పుడు, అతడు ఎన్నడు ఎటువంటి పాఠశాలలు ప్రారంభించలేదు. అతడు ఎన్నడు ఏ కళాశాలలు ప్రారంభించలేదు. అతడు ఎన్నడు ఏ శాఖను ప్రారంభించలేదు. ఎందుకు? ఆయన సమయములో మెస్సీయా వచ్చును అని అతడు ఒప్పుకోలు కలిగియుండెను! ఆయన యొక్క ఫలము, ఆయన యొక్క వర్తమానము, ఆయన యొక్క కార్యములు దానికి సాక్షమిచ్చుచున్నవి. మరియు ఆయన ఈ యుగములో వచ్చును అని మేము నమ్ముచున్నాము!
మనము ఎందుకు గొప్ప కార్యమును సేకరించవలెనని కోరుచున్నాము? మనమెందుకు కోట్లాది డాలర్లు ఖర్చుపెట్టి పాఠశాలలను మరియు భవనములను కట్టించి, మరియు తరువాత యేసు రానైయున్నాడు అని చెప్పగోరుచున్నాము? ఎందుకు, సామాన్య ప్రజలు వాటికంటే గొప్పవి ఎరిగియున్నారు! మీరు విశ్వసించని దానిని గురించి మీరు మాట్లాడుచున్నారు అని వారు ఎరిగియున్నారు. మనమేమి బోధించుచున్నామో దానినే చేయవలెను! సరే. ఇప్పుడు మనము దానిని తప్పక చేయవలసియున్నది.
ISA 40:3•
JOHN 1:26
36యోహాను ఎంతో అనుకూలంగా యున్నాడు. అతడు జన్మించినప్పుడు, అతడు ఒక వింతైన జన్మను పొందియున్నాడని అతడు ఎరిగియున్నాడు. జెకర్యా ఎలా దూతను చూచియున్నాడో మనమందరము ఎరుగుదుము. మరియు వృద్ధాప్యములో యున్న దంపతులకు అది కొద్దిగా కష్టతరముగా ఉండును. జెకర్యా ఒక వయసు పైబడిన వాడు, మరియు ఎలిజెబెత్ ఒక వయసు పైబడిన స్త్రీ, అయితే ఏదో ఒక దినమున దేవుడు వారికి ఒక బిడ్డను దయచేయును అని వారు నమ్మియుండిరి. ఆమె గొడ్రాలైయుండెను.
మరియు యోహాను జన్మించినప్పుడు, అది ఒక విచిత్రమైన జన్మ మరియు అతను దేవుని సేవకునిగా యుండును అని ఎరిగియున్నప్పుడు, వృద్ధ దంపతులకు అది చాలా కష్టమైన విషయముగా యున్నది అని మనము ఎరిగియున్నాము. వారి యొక్క జీవిత కాలమును బట్టి, ఆ బాలుడు తన పరిచర్య చేయు సమయమును చూచుటకు వారు బ్రతికియుండరు అని వారు ఎరిగియున్నారు.
మరియు యోహాను తండ్రి ఒక యాజకుడైయున్నాడు. అయితే అతనికి బదులుగా, ఆ పిలుపుతో అతని తండ్రి వెళ్ళి వచ్చిన ఆ సెమినరీకి, అక్కడకు అతను వెళ్ళలేదు. అతడు దానిపై ఉండు అవకాశమును తీసుకొనలేదు. దానితో అతడు కలగలుపు కాలేదు, ఎందుకనగా "అరణ్యములో కేక వేయు ఒక స్వరము" ఆయనే అయి ఉన్నాడు అని అతను లేఖనములో చూచెను. మెస్సీయాకు ముందు వెళ్ళు వర్తమానికుడు ఆయనే అయి ఉన్నాడు అని అతడు చూచెను. మరియు దానిని గురించి అతను ఒక నిశ్చయత గలిగినవాడై యుండవలెను. మరియు అతను ఒప్పించబడువరకు, అరణ్యములోనే వేచియుండెను, మరియు తరువాత అతను పట్టింపు కలిగియుండెను. అతను ఒప్పించబడెను. అతడు నిలిచియుండగోరెను, అతడు కోరెను. అతడు దీనిని చెప్పేంతవరకు యేసును చూడగలను అను గొప్ప నిశ్చయతను అతడు కలిగియుండెను. "అక్కడ, ఆయన ఇప్పుడు మీ మధ్యలో నిలబడియున్నాడు. మీరు ఎరుగని ఒకాయన, మీలో ఒకడిగాయున్నాడు." ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను!
ISA 40:3•
MATT 3:3•
MARK 1:3•
LUKE 3:4•
JOHN 1:23,34
37ఈ రాత్రి, మన మధ్యలో ఒకాయన ఉన్నాడు, అయితే ఆయనను ఎరిగి యున్నందుకు నేను ఆనందించుచున్నాను. మరియు సాక్ష్యమిచ్చుచున్నది ఆయనే అని నేను నమ్ముచున్నాను. యేసు త్వరగా రానైయున్నాడు అని గొప్ప పరిశుద్దాత్మ సాక్ష్యమిచ్చుచున్నది, అది వాక్యానుసారముగా యున్నది, మరియు అన్ని సూచనలు నెరవేరుచున్నవి. మనము అంత్యకాలములో యున్నాము!
అతడు ఆయన యొక్క స్థితిని కోరుకొనలేదు, ఎటువంటి తప్పిదము చేయలేదు, మెస్సీయా ఎవరు అను దానిని అతడు ఎరిగినంత వరకు, అతడు ఒప్పించబడినంతవరకు, అతడు అరణ్యములోనే నిలచియుండెను. అతను మెస్సీయాను చూచినప్పుడు, ఎటువంటి సూచన కొరకు ఎదురు చూడవలెను అనే దానిని దేవుడు అతనికి చెప్పెను. కాబట్టి అతను ఆయనను చూచినప్పుడు, ఆయనను వెంబడించనైయున్న సూచనను చూచినప్పుడు, అది ఆయనే అని అతను ఒప్పించబడెను. "అది ఆయనే అని నేను సాక్ష్యమిచ్చెదను" అని అతడు చెప్పెను. అతడు జన్మించుటకు ఏడువందల-పండ్రేడేల్లకు మునుపు, "దేవుని కొరకు అతను, ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచి; మరియు ఆయన మార్గమును సరాళము చేయు, అరణ్యములో కేక వేయు ఒక శబ్దము" అని ఎవరి గురించి ప్రవక్త చేత ముందుగా తెలియజేయబడి మరియు చెప్పబడెనో అతనే ఆ వ్యక్తి (యోహాను), మరియు దేవుడు ఇతనిని ముందుగానే ఎన్నుకొనెను మరియు ఆ పని కొరకు ముందుగా నిర్ణయించెను, దేవుని యొద్ద నుండి వినినంత వరకు అతను ఆ దేవుని మీద ఆనుకొనెను. ఆమేన్! ఏమి జరగనైయున్నదో అని దేవుడు అతనికి చెప్పినప్పుడు, అతను ఒప్పించబడెను (ఒప్పుకొనెను). అతడు ఆ సూచనను చూచినప్పుడు, "ఆయన అక్కడ ఉన్నాడు!" అని చెప్పెను. ఆమేన్!
EPH 2:6
38మనము అలాగే నిజాయితీగా యున్నట్లయితే! మనము బలిపీఠము యొద్ద వేచి యున్నయెడల, ఏదో ఒక చిన్న అనుభూతిని పొందుకొని, గంతులు వేయుచూ పరుగెత్తి వెళ్ళడము కాదు, కానీ అక్కడే నిలిచియుండవలెను. ఏమి జరిగినా ఫరవాలేదు, ఆయన పునరుద్దాన శక్తి ద్వారా నీవు పరిపూర్ణముగా ఒప్పించబడేంత వరకు అక్కడనే నిలచి యుండుము, ఆ పరిశుద్దాత్మ నీ గురించి జాగ్రత్త వహించి మరియు నిన్ను పట్టుకొనును, మరియు నీవు క్రీస్తు నందు నూతన సృష్టివి.
ఎఫేసి 2:6
నీవు మరణించినంత వరకు అక్కడనే నిలిచియుండుము మరియు తిరిగి మరలా పైకి లేవుము. తరువాత ఒక వేషదారి వలె నీవు నీళ్ళ యొద్దకు వెళ్ళవు. నీవు అక్కడకు వెళ్ళిదవు, మరియు నీ కొరకు ఆయన మరణించెను, మరియు ఆయనతో నీవు చనిపోయితివి అని నీవు తెలుసుకొందువు. ఇప్పుడు నీవు క్రిందకు వెళ్ళి మరలా ఆయనతో పాటుగా తిరిగి లేచెదవు; ఆయన మరణించి తిరిగి లేచెనని, మరియు నీవు ఆయనతో పాటుగా చనిపోయి, ఇప్పటికే తిరిగి లేచియున్నావని, నీవు నమ్మినట్లు ఈ లోకమునకు చూపించుము. మరియు ఇప్పుడు నీవు పరలోక స్థలములందు కూర్చుండపెట్టబడి, గొర్రెల ఆహరమును తినుచున్నావు.
MATT 3:7-10•
LUKE 3:7-9
39అంద్రెయ, మనము మాట్లాడుకొనుచున్న ఈ గొప్ప వ్యక్తి, సీమోను యొక్క సహోదరుడు, అతడు ఒప్పించబడేంత వరకు, రాత్రంతయూ అతడు వేచియుండెను. అతడు ఆ నది ఒడ్డున వెళ్ళుచుండగా, యోహాను, ఈ గొప్ప ప్రవక్త ఇలా చెప్పుచుండెను, "అక్కడ ఒకాయన యున్నాడు! సమయము సమీపముగాయన్నది. గడ్డిలోయున్న సర్పముల వంటి ఈ తరములన్నియూ, నేను ఫలానా దానికి చెందియున్నాను, మరియు నేను ఫలానా దానికి చెందియున్నాను. మేము అబ్రహమును మా యొక్క తండ్రిగా కలిగియున్నాము అని చెప్పుటకు ఆలోచించవద్దు. నేను మీకు చెప్పుచున్నాను, అబ్రహముకు దేవుడు ఈ రాళ్ళవలన బిడ్డలను పుట్టించగలడు." ఓ, ఆయన తన గొడ్డలిని చెట్టు వేర్ల యొద్ద ఉంచియున్నాడు.
చూడండి, యోహాను ఒక అడవి మనిషి (అరణ్యవాసి). అతను దేని గురించి మాట్లాడుచున్నాడో చూడండి: గొడ్డళ్ళు, చెట్లు, పాములు, చూచారా. అక్కడ అరణ్యములో, అదే అతను వాడుచున్న పదజాలము. మరియు అతడు "గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది, మరియు సరిగా ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి కాల్చబడును" అని చెప్పెను. చెట్టుకు వ్యతిరేకముగా గొడ్డలితో కొట్టుట; పాముల యొక్క తలలు నరకుట మరియు మొదలగునవి. అతను ఒక అడవి మనిషి.
MATT 11:7-9•
LUKE 7:24-26
40"మీరు ఏమి చూడ వెళ్ళితిరి?" అని యేసు అడుగుటలో ఆశ్చర్యము లేదు. ఆ "మరచిన దన్యత, అనే దాని మీద నేను బోధించాను. ఆయన కొండ దాటి వెళ్ళినప్పుడు, యోహాను యొక్క శిష్యులు చెప్పెను. "మీరు ఏమి చూడవెళ్ళితిరి? — నారబట్టలు కట్టుకొన్న మనిషినా?" "డాక్టర్, పరిశుద్ధ తండ్రీ, ఆ విధముగా వారు పిలిచెదరు అని ఆయన చెప్పెను. మరియు వారు సన్నని వస్త్రములు ధరించెదరు. వారు పిల్లలను ముద్దాడెదరు, మరియు యవ్వనస్తులకు పెండ్లి చేసెదరు, మరియు వృద్దులను పాతిపెట్టెదరు. అలాంటి వాడు ఒక కలము వంటి కత్తిని ఉపయోగించును." యుద్ధ రంగములో రెండంచుల వాడిగల ఖడ్గమును ఉపయోగించుట అతనికి ఏలాగు తెలియును? "అలాంటి వాడిని చూచుటకు మీరు వెళ్ళితిరా?"
కొందరు "గాలికి కదులుచున్న రెల్లును చూచుటకు వెళ్ళితిరా, లేదా అటువైపుగా వస్తున్న ఏదైనా చిన్న గుంపు, నిన్ను దీని నుంచి దానికి, మరియు దాని నుంచి దీనికి మార్చుచున్న దానిని చూచుటకు వెళ్ళితిరా?" అని చెప్పెను. యోహాను కాదు! అతను ఒప్పించబడెను. అతడు ఎక్కడ ఉన్నాడో అతడు ఎరిగియున్నాడు! అతని స్థానమును అతను ఎరిగియున్నాడు! అది యోహానును ఏమాత్రము కదిలించలేదు. లేదు, లేదు!
"మీరు దేనిచూడ వెళ్ళితిరి, ప్రవక్తనా?" అని అనెను. "మరియు నేను మీకు చెప్పుచున్నాను, ప్రవక్త కంటె గొప్పవాడు, ఆయన ప్రవక్త కంటే ఘనమైనవాడు!" అని ఆయన చెప్పెను.
JOHN 1:36,37
41కాబట్టి యోహాను ఒప్పించబడెను, మరియు అతడు బోధించుట ఆరంభించెను. మరియు అంద్రెయ కూటములకు హాజరవుచున్నాడు. మరియు కాబట్టి, యేసు వెళ్ళిపోయినప్పుడు, అంద్రెయ మరియు ఇంకొక శిష్యుడు అక్కడ ఉండెను, మరియు యోహాను ఎత్తి చూపి, చెప్పెను, "లోక పాపములను మోసుకొనుపోవుచున్న దేవుని గొర్రెపిల్ల." మరియు వారు ఆయనను వెంబడించెను. నేను దానిని ఇష్టపడుచున్నాను. నా బోధలో అంతటి శక్తి ఉండాలని నేను కోరుచున్నాను. నేను, "ఇదిగో లోక పాపములను మోసుకొనుపోవుచున్న దేవుని గొర్రెపిల్ల" అని చెప్పినప్పుడు, ప్రతీవ్యక్తి ఆయన వెంబడి వెళ్ళును గాక. మై, నన్ను…. "సహోదరుడా, బ్రెన్హా౦ నేను ఆయనను ఎక్కడ కనుగొనగలను?" నేను మీకు చూపించగలను!
42కొంత కాలము క్రితము, నేను వ్యాపారవేత్తల కూటములో యున్నాను. నేను పశ్చిమ కోస్తాలో బోధిస్తున్నాను. అక్కడ ఎవరో ఒక వ్యక్తి నా యొద్దకు నడిచి వచ్చెను, మరియు అతను చెప్పెను, "నీవు బోధకునివి కావా, చెప్పు?" అనెను.
నేను చెప్పాను, "అవునండి."
అతను, "నీవు ఈ వ్యాపారవేత్తలతో ఏమీ చేయుచున్నావు?" అనెను.
నేను చెప్పాను, "నేను ఒక వ్యాపారవేత్తను."
మరియు అతను, "ఎటువంటి వ్యాపారమును నీవు కలిగియున్నావు?" అని అడిగెను.
నేను చెప్పాను, "భరోసా అనే వ్యాపారము."
అతను, "ఎటువంటి భీమా అది?" అనెను.
నేను చెప్పాను, "నమ్మిక గల భరోసా."
"అది ఎటువంటిది?" అనెను.
నేను, "దీవించబడిన భరోసా, యేసు నావాడు" అని చెప్పాను. "నీకు గనుక భీమా యందు ఆసక్తి ఉన్నట్లయితే, దాని గురించి నేను నీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను" అని చెప్పాను.
43నా యొక్క ఒక స్నేహితుడు, శ్రీ, స్నైడర్, ప్రశస్తమైన బాలుడు, అతడు నా గృహమునకు వచ్చెను. నేను చిన్నవాడిగా యున్నప్పుడే అతడిని నేను ఎరిగియున్నాను. మరియు మేము కలసి పాఠాశాలకు వెళ్ళెవారము. అతను, "బిల్లీ, నేను నీకు ఒక రకమైన భీమాను అమ్మగోరుచున్నాను" అనెను.
మంచిది, ఒక్కసారి ఈ భీమా మీద, ఒక వ్యవహారం నా మీదకు వచ్చినది, మరియు నేను ఎన్నడూ ఆ పధకములో చేరుటలేదు, కాబట్టి అతను చెప్పెను. నేను చెప్పాను, "విల్మర్, నేను నిశ్చయముగా అతనిని ఇష్టపడుదును, కానీ "నేను ఇప్పటికే ఒక భరోసాను కలిగియున్నాను" అని చెప్పాను.
"ఓ, నీవు కలిగియున్నావా?" అని అతను చెప్పెను. నేను ఒక వేషదారి వలె ఉన్నానని నా భార్య నా వైపు చూచుచున్నది. నేను ఎటువంటి భీమాను కలిగిలేననే విషయం ఆమెకు తెలుసు, కానీ నేను "భరోసా" అని చెప్పాను. చూచారా.
ఆయన చెప్పెను, "ఓ, నన్ను క్షమించండి, బిల్లీ." ఆయన చెప్పెను, "అది ఏ సంస్థకు సంబంధించినది?"
నేను, "నిత్యజీవము" అని చెప్పాను.
"నేను ఆ సంస్థ గురించి ఎన్నడూ వినినట్టు గుర్తులేదు" అని చెప్పెను.
నేను "మీకు తప్పకుండా తెలియును" అని చెప్పాను. ఓ, అది సరియేనని నేను ఒప్పించబడ్డాను! అది సరియే!
JOHN 1:36
44కాబట్టి, యోహాను బోధించి మరియు చెప్పెను, "ఆయన అక్కడ యున్నాడు, లోక పాపములను మోసుకొనుపోవు దేవుని గొర్రెపిల్ల."
జనసమూహము పైగా ఆయన కదులుచూ, ఒక పాపిని లేదా ఒక వ్యాధిగ్రస్తుడను లాగి, వారితో మాట్లాడుట నేను చూచినప్పుడు, ఆయనే దేవుడని ఎరిగియుంటిని. ఎవరయినా, ఏదయినా తెలిసినవారు, నేను దానిని చేయలేనని ఎరిగియుందురా. "ఇదిగో లోక పాపములను మోసుకొనుపోవు దేవుని గొర్రెపిల్ల" అని నేను చెప్పగోరుచున్నాను. ప్రజల కొరకు నేను ఇష్టపడుచున్నాను, "దీనిని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు నేను నా పాపముల నుండి మారుమనస్సు పొందుచున్నాను. నేను యేసు క్రీస్తునందు నమ్మిక కలిగియున్నాను" అని చెప్పండి. ఓ, వారు అది చేయుట నేను చూడగోరుచున్నాను.
JOHN 1:38,39,46
45మరియు ఈ శిష్యులు వెంటనే యేసును వెంబడించిరి. మరియు ఆయన చుట్టూ చూసెను మరియు ఆయన వారిని కనుగొనెను. మరియు ఆయన "ఎవరిని వెదకుచున్నారు" అని అడిగెను.
"రబ్బీ (తర్జుమా చేసినచో, "బోధకుడా"), నీవు ఎక్కడ నివసించుచున్నావు" అని వారు అడిగిరి.
ఆయన, "వచ్చి చూడుము" అనెను. ఇప్పుడు అది ఒక అద్భుతమైన ఆహ్వానము! "వచ్చి చూడుము." నేను దానిని ఇష్టపడుచున్నాను.
ఫిలిప్పు, నతనయేలుకు అదే చెప్పెను. నతనయేలు, "నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా?" అని చెప్పినప్పుడు. ఆయన "వచ్చి చూడుము" అనెను. కాబట్టి, మేము వచ్చి కనుగొన్నాము! ఇంటి యొద్దనే కూర్చొని, విమర్శించవద్దు. వచ్చి కనుగొనుము! వచ్చి మీకు మీరే చూడండి!
ఇప్పుడు, ఇది సాయంకాల సమయము అని వారు చెప్పిరి, కాబట్టి అంద్రెయ రాత్రంతయూ నిలచియుండెను. ఓ, అది మంచి విషయము. అతను ఒప్పించబడినంత వరకు అతను వేచియుండెను. ఆ రాత్రి ఆ వ్యక్తి ఏమి చెప్పెను, అతడికి ఆయన ఏమి చెప్పెను, లేదా ఆయన ఏమి చేసెను, ఆయనే మెస్సీయా అని అక్కడ ఏదో సంపూర్ణముగా అంద్రెయను ఒప్పించెను.
JOHN 1:45
46మరుసటి రోజు ప్రొద్దున, నేను ఊహించుచున్నాను, అతడు ఆయన యొక్క కోటును, టోపిను లాగుకొనెను, మరియు క్రిందకు తీసుకొనెను, ఎందుకనగా పేతురు చేపలు పట్టుటకు నది యొద్దకు వెళ్ళుచుండెను, మరియు అతను, "వచ్చి, మేము ఎవరిని కనుగొంటిమో చూడుము. అది మెస్సీయా" అని చెప్పెను. అతను ఒప్పించబడెను! ఆయనే మెస్సీయా అని పరిపూర్ణముగా అతను ఒప్పించబడినప్పుడు, అతను తన సహోదరుని పట్టింపు కలిగియుండెను!
ఈ రాత్రి కనిపించే విషయం అదే. వర్తమానము చేత జనములు పరిశుద్దాత్మ గురించి ఒప్పుకొనియుండలేదు. మీరు నిజముగా ఒప్పుకొనియుండినయెడల, అప్పుడు మీరు పట్టింపు కలిగియుందురు. దాని గురించి మీరు చేయగలిగినదంతయూ, మీరు దానితో ఏమీ చేయగలరో అదంతయూ మీరు చేసియుందురు. "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నేను బోధకుడను కాను" అని అనవచ్చును. మంచిది, మీరు కుడా ఇంకేదైనా చేయగలరు.
47జ్ఞాపకమున్నదా, ఒకసారి మనము ఒక కూటమును కలిగియుంటిమి. అక్కడ ఒక రైతు రక్షించబడి మరియు పరిశుద్ధాత్మతో నింపబడెను. అతడు ఒక వాహనమును మరియు తన అనుభవమును తప్ప మరేమియూ కలిగిలేడు; అయితే ఆయన చాలా మందిని ఆ కూటమునకు తీసుకొనివచ్చియున్నాడు, దానికి ముందు మరొక ముప్పది మంది పరిశుద్దాత్మతో నింపబడిరి. ఎందుకు? ఆయన ఒప్పించబడెను! ఆయన ఒప్పించబడినప్పుడు, ఆయన పట్టింపు కలిగియుండెను. చిన్న కుమార్తె స్వస్థపరచబడెను. ప్రతీ రాత్రి మేము వ్యాధిగ్రస్తులను కలిగియున్నాము, ఒక ట్రక్కు నిండుగా, అన్ని చోట్ల నుండి వారిని తీసుకొనివచ్చారు. ముప్పది మంది పరిశుద్దాత్మను పొందుకొనిరి. చూచారా, అది సత్యమని అతడు ఒప్పించబడెను, కాబట్టి మిగిలిన వారి గురించి అతను పట్టింపు కలిగియుండెను! మరియు మనము యేసు త్వరగా రానైయున్నాడని ఒప్పించబడిన యెడల, నశించిన మనవారిని గురించి మనము పట్టింపు కలిగియుందుము! సువార్తను బయటకు పంపించుటకు మనము చేయగలిగినదంతయూ చేయుదుము!
GEN 32:23,24•
GEN 33:15
48ఒక రాత్రి, యాకోబు, ఆ రాత్రంతయూ నిలచియుండి పెనుగులాడెను. ఆ పెనుగులాడిన రాజకుమారుడు, అతడు రాత్రంతయూ పెనుగులాడెను. ఇక్కడ, అక్కడ అతడు ఏశావును మోసగించెను. అతడిని బట్టి ఇతను మరణమగునంతగా భయపడెను. ఏశావు వస్తున్నాడు అను వార్తను అతడు వినెను. చిన్న నదికి ఆవల అతను తన భార్యను ఉంచెను. ఆవల ఒడ్డుకు వెళ్ళి, మోకరించెను. మీకు తెలుసా, దేవుడు దిగి వచ్చి యాకోబును పట్టుకొనెను, మరియు ఆ రాత్రంతయూ వారిరువురు పెనుగులాడిరి. కాబట్టి, అతడు ఆరంభములో సంపూర్ణముగా ఒప్పుకొనలేదు. అయితే దేవుడు అతనితో పోరాడి ముగించులోపల, అతను ఒప్పుకొనెను.
అవును, ఆయన దేవుడని అతను ఒప్పుకొనినంత వరకు ఆయన నిలచియుండి, మరియు పట్టుకొనెను! సహోదరుడా, తరువాత అతను ఏశావునకు భయపడలేదు. నదిని దాటెను, మరియు అతను బలహీనముగా యుండి, కుంటుచుండెను. చూచుటకు అతను చాలా క్లిష్ట సమయములో ఉన్నాడు, అతడు ఎన్నడూ లేనంత బలహీనముగా యున్నాడు. అతడు కుంటివానివలె యున్నాడు మరియు అంతయూ. అయితే ఏశావు అతనికి ఇలా చెప్పెను, "నీకు సహాయము చేయుటకు నా సైన్యమును పంపమందువా?"
"నాకు ఎటువంటి సహాయము అవసరము లేదు" అనెను. ఎందుకు? అతనిని పట్టుకొనిన దేవుడు, అతనిని కాపాడగల సమర్ధుడని అతను ఒప్పుకొనెను. హల్లెలూయా! ప్రజలు అలాగు చేసినయెడల!
49దేవుడు నిన్ను పట్టుకొనును అని నీవు ఒప్పుకొనినయెడల, ఆయన నీ హృదయమును కదల్చి క్రీస్తుయేసులో నిన్ను నూతనసృష్టిగా మార్చును. వ్యాధిగాని, మరణముగాని, లేదా ఇంకేదైనా ఇటు వైపు వచ్చినను, ఆయన నీ గురించి చక్కగా జాగ్రత్త వహించును అని నీవు ఒప్పించబడితివి. నిశ్చయముగా, ఆమేన్! నేను దానిని ఇష్టపడుచున్నాను.
గత రాత్రి మనము మాట్లాడుకున్న ఆ చిన్న బాలుని పేరు షవురు, అతను తన కుటుంబము పట్ల పట్టింపు కలిగియుండెను. అవును, వారు ఆకలిగొనియున్నారని అతడు ఎరిగియుండెను. వేలమందిగా, ఫిలిష్తియులు పైకి వచ్చిరి, నేను నమ్ముచున్నాను - ఆరు వందలు మరియు పైచిలుకు సైనికులు; ఆరువందల మంది, యుద్ధ వీరులు (సైనికులు) బరిలోనికి వచ్చియున్నారు అని నేను నమ్ముచున్నాను. అతడు తన కుటుంబముయెడల పట్టింపు కలిగియుండెను, ఏలయనగా ఆ చలికాలములో వారు ఆకలితో చచ్చిన వారివలె మరణమునకు సిద్ధముగా యుండిరి. అయితే అతడు అక్కడనే నిలచియుండి, ఆలోచించుచూ ధ్యానించుచుండెను. అతడు ఏమి చేయగలడు? దేవుడు తన యొక్క వాగ్దానమును నెరవేర్చును అని అతడు ఒప్పుకొనినంతవరకు అతను అక్కడనే వేచియుండెను.
GEN 22:17
50ఇప్పుడు, అతడు ఏమి ఆలోచన కలిగియుండెనని గమనించండి. "ఇప్పుడు, ఇక్కడ, నా తండ్రియైన అబ్రహాము, అతని ద్వారా సున్నతియను ముద్రను నేను నా శరీరమందు దరించుకొనియున్నాను, ఎందుకనగా అబ్రహాము దేవుని యొక్క మనిషి అని నేను నమ్ముచున్నాను — అతను ఒప్పించబడెను (ఒప్పుకొనెను). అతను తన గృహమును విడిచెను; దేవుని సేవించుటకై, అతను తను కలిగియున్నదంతటిని విడిచిపెట్టెను. ఆ దినమున ఆ పర్వతముపైన, అతను ఇస్సాకునకు బదులుగా పొట్టెలును బలి అర్పించినప్పుడు, దేవుడు అబ్రహామునకు చెప్పెను, 'ఎందుకనగా నీవు ఈ కార్యము చేసినందున, నీ సంతతి వారు శత్రువు గవిని స్వాధీనపరచుకొందురు." (అది నిజము.) అబ్రహామా, నేను నీకు వాగ్దానము చేయుచున్నాను, దీని చేత నేను ప్రమాణము చేయుచున్నాను, నీ సంతానము. (హల్లెలూయ! ఓ, మై! ఇప్పుడు నేను భక్తితో పరవశించుచున్నాను.) ఇప్పుడు దీనిని బట్టి నేను ప్రమాణము చేయుచున్నాను. అబ్రహామా, నీ సంతతి వారు శత్రువు గవినిని స్వాధీనపరచుకొందురు.'"
GEN 22:17
51ఇప్పుడు షవురు చెప్పవచ్చును, "నేను అబ్రహాము యొక్క సంతానము." ఆమేన్! అబ్రహాము యొక్క స్వాభావిక (శరీర) సంతతియైన షవురు అలాగు తలంచినట్లయితే, ఈ రాత్రి గురించి ఏమిటి, మనము అబ్రహాము యొక్క రాజ సంతానము! వ్యూ! నేను పిచ్చివాడిని అని నీవు తలంచవచ్చు; బహుశా నేను కావచ్చును. నన్ను ఒంటరిగా వదిలివేయండి. ముందు నాకున్న ఆలోచనకన్ననూ, ఈ స్థితి నాకు శ్రేష్టముగా యున్నది. అవును. అబ్రహాము యొక్క రాజ సంతానము! సంఘము అనగా వాగ్దానము చేయబడిన రాజ సంతానము. ప్రకృతి సంబంధమైన (స్వాభావికమైన) సంతానము అంతటి దైర్యమును కలిగియుంటే, పరిశుద్దాత్మ సన్నిధి యొక్క అభిషేకము చుట్టూ కలిగియుండి తనను బయలుపరచుకొనియున్న రాజ సంతతి ఏమి చేయవలెను? వ్యూ! మహిమ!
నిశ్చయముగా, "నేను అబ్రహాము యొక్క సంతతి" అని షవురు చెప్పెను. అతను దాని గురించి ఆలోచించుట ఆరంభించెను: "అతని యొక్క సంతతి వారు శత్రువు గవినిని స్వాధీనపరచుకొందురు అని దేవుడు అబ్రహామునకు చెప్పెను, దానిని నేను విశ్వసించుచున్నాను. ఇదిగో అక్కడ వారు నా గుమ్మముల ద్వారా వరుసలో వచ్చుచున్నారు." అతను చేయి చాపి ఒక మునికోలును తీసుకొనెను.
52ఇప్పుడు, అతను దానిని ఆపలేదు; ఎలాగు ద్వంద యుద్ధము చేయవలెనో నేర్చుకొనుటకు అతను వేచియుండలేదు, లేదా "ఇప్పుడు, ఒక క్షణము ఆగండి, నేను రాజ సంతానమైయున్నాను; నేను అబ్రహాము యొక్క సంతానము. నేను సున్నతి చేయబడ్డాను. కాబట్టి, మీకు తెలియునా, ఈ ఫిలిస్తీయులంతా మంచి యుద్ధ వీరులు. వారు చాలా కాలముగా అభ్యాసము చేసియున్నారు. నేను సెమినరీకి వెళ్ళి, నా పి.హెచ్.డి. మరియు ఎల్.ఎల్.డి ని పొందుకొనెదను, మరియు ఎలాగు ద్వంద యుద్ధము చేయవలెను నేర్చుకొనెదను. నేను అన్ని సంఘముల యొక్క క్రమములు, ప్రశ్నోత్తర క్రమముగా వుండే సంగ్రహ గ్రంథమును నేర్చుకొనెదను" అని చెప్పలేదు.
అతను అలాగు చేసియుంటే, దానంతటి గురించి దానిని మాత్రమే అతను యెరిగి యుండును! అది మాత్రమే అతను ఎరిగియుండును. అతను వారిని జయించలేకపోయి యుండేవాడు. అప్పుడు శత్రువును అతను దీటుగా ఎదుర్కొనలేకపోయి ఉండేవాడు. మీరు శత్రువుకు దీటుగా ఉండజాలరు; నేను దానికి దీటుగా ఉండలేను, అయితే నేను ఒక వాగ్దానము క్రింద జీవించుచున్నాను అని నాకు గుర్తున్నది (హల్లెలూయ!) అది ఇప్పటికే… వాడి యొక్క శక్తులు దీటుగా ఎదుర్కొనబడినవి మరియు జయించబడి మరియు క్రిందకు ప్రోసివేయబడినవి. "ఇప్పుడే, నేను జయశీలి కంటే ఉన్నతుడను." నేను కాను, నా కొరకు వాడిని జయించిన ఆయన యందు నేను ఉన్నాను! [స్పష్టత లేని మాటలు] ఆయన యొక్క రక్తము, నేను అబ్రహాము యొక్క రాజ సంతానములో భాగమును. ఒక క్షణము దాని గురించి ఆలోచించుడి, తరువాత మీ యొక్క మునికోలును తీసుకొనుడి! మీ యొద్ద నుండి సందేహము అనే ఆ దయ్యమును తరిమివేయుడి.
అవును. "నేను ద్వంద యుద్ధము నేర్చుకొనలేను" అనెను. అతను ఒకవేళ నేర్చుకొనియుంటే, ద్వంద యుద్ధము ఎలాగు చేయవలెనో, దానిని మాత్రమే అతను ఎరిగియుండును. దానిని గురించి మాత్రమే అతను మాట్లాడగలడు.
53ఈ రోజు, ఈ దినమున, ఆ విధముగానే మనము దానిని చేయ ప్రయత్నించుచున్నాము, "సేవకునిగా యుండుటకు నేను నా జీవితములో ఒక పిలుపును పొందుకొనియున్నాను" అని మనుష్యులు చెప్పెను.
"మంచిది, కుమారుడా, ఇప్పుడే నేను బిషప్పును పిలిచెదను, నిన్ను వేద పాఠశాలకు పంపించగలనా లేదా అని నేను కనుగొనెదను, మరియు నీవు మనస్తత్వ శాస్త్రము, మరియు అన్ని విషయములు నేర్చుకొనవచ్చును. నీవు పది సంవత్సరములు ఆ సెమినరి పాఠశాలలో ఉంటే నిన్ను అది ప్రావీణ్యునిగా చేయును." నిశ్చయముగా, అలాగు చేయును! అతను ఇక పైకి వెళ్ళలేనంతగా, అది అతడిని పట్టుకొనును.
ఆది సంఘములో వారు ఒక బోధకుని పంపిన దానికిని, మరిప్పుడు ఈ రోజు పంపించుచున్నదానికి ఎంత వ్యత్యాసమున్నది. వారు పది సంవత్సరములు వేచియుండలేదు; వారు పది దినములు వేచియుండిరి. నీవు ఒప్పుకొనుటకు పది సంవత్సరములు తీసుకున్నట్లయితే, వారు ఒప్పుకొనుటకు పది దినములు పట్టినది! ఆమేన్!
ACTS 4:13
54మనస్తత్వ శాస్త్రము గురించి అతను ఒప్పుకొనవచ్చును, కానీ నీవు మోకాళ్ళ శాస్త్రమును పొందు కొనవలసియున్నది. కేవలము పది రోజులలో, వారు ఒప్పించబడిరి, మరియు తరువాత వారు ఇతరుల గురించి పట్టించుకొనిరి. వారిలో కొందరు కనీసం వారి సంతకము కూడ పెట్టలేరు. వారు చదువులేనివారు, అమాయకులు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది, కానీ వారు ఒప్పించబడిరి. హల్లెలూయ!
నేను విద్య గురించి పట్టించుకొనను; యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను ఒప్పించబడితిని! ఇది పరిశుద్దాత్మ అని నేను ఒప్పించబడితిని! ఆయన స్వస్థపరచువాడు అని నేను ఒప్పించబడితిని! ఆయన రక్షకుడు అని నేను ఒప్పించబడితిని! ఆయన రానైయున్నాడు అని నేను ఒప్పించబడితిని! ఇది అదేనని నేను ఒప్పించబడితిని! నేను ఒప్పించబడితిని! దానిని నేను నమ్ముచున్నాను!
వారు చెప్పిరి, "వారు ఒప్పించబడిరి. ఎదో జరిగినది." వారు ఒప్పించబడిరి, పిమ్మట వారు ఒప్పించబడిన తరువాత వారు పట్టించుకొనిరి. మిగిలిన వారికి ఆయన వాక్యమును తెలియజేయుటకై వారు పట్టించుకొనిరి. వారు ఒప్పించబడిరి అనేది ఒక శుభసూచనయై యున్నది. వారు పట్టించుకొనిరి.
55వారు విద్య గురించి పట్టించుకొనలేదు; ఇప్పుడే, మేము "ఆమేన్" చెప్పగలుగుచున్నామా లేదా అనే దాని గురించి పట్టించుకొనిరి. వారు ఏ సంస్థకు చెందిన వారు అనే దాని గురించి, లేదా వారు సహవాసపు కార్డు కలిగియున్నారా లేదా - అనే దాని గురించి వారు పట్టించుకొనలేదు. వారికి అవసరమైనది ఆయనే అని వారు ఒప్పించబడిరి! ఈ రాత్రి నేను అదే మాదిరిగా యున్నాను. మనకు అవసరమైనది అంతయూ క్రీస్తే అని నేను ఒప్పించబడితిని. క్రొత్త మేయర్ అవసరము లేదు; మనకు క్రొత్త రాష్ట్రపతులు అవసరము లేదు; మనకు క్రొత్త సైన్యము అవసరము లేదు; మనకు క్రొత్త బాంబు అవసరము లేదు; మనకు యేసు అవసరమైయున్నాడు. వారు ఒప్పించబడినదంతయూ అదియే.
మరియు ఆయన చేయును అని వారు విశ్వసించిరి. వారి యొక్క అవసరములన్నియూ ఆయన సంధించును అని వారు నిశ్చయత కలిగియుండిరి. అలాగు మీరును ఈ రోజు రాత్రి ఒప్పించబడితిరా?
MATT 6:30,32,34•
MATT 10:29•
MATT 28:20•
LUKE 12:28
56"నేను ఒప్పుకొనియున్నాను. నా ముందర ఏమి వచ్చినా ఫరవాలేదు, ఆయన దానిని ఎదిరించును. నా ముందర ఏమి వచ్చినా నాకు అనవసరము, ఆయన నా గురించి జాగ్రత్త వహించును అని నేను ఒప్పించబడితిని, అని చెప్పండి. ఆయన దానిని చేయును అని ఆయన చెప్పెను: "యుగసమాప్తి వరకు, నేను మీతోను, మీలోను మీయందును. రేపటి గురించి ఏ ఆలోచనా పెట్టుకొనవద్దు, దాని గురించి అదే ఆలోచన చేసుకొనును." అది సరియే. ఈ రోజు గురించి ఆలోచించు.
నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల, ఆయన చిత్తము లేకుండా ఒక పిచ్చుక అయినను వీధిలో క్రింద పడనియెడల; మరి ఇంకెంతగా ఆయన మన యొక్క అవసరతలు ఎరిగియున్నాడు?
నేను ఒప్పించబడితిని. ఆ కారణము చేతనే, నేను కానుకల కొరకు ప్రాధేయపడుట, అదీ, ఇదీ మీరు చూడరు. నేను ఒప్పుకొనియున్నాను. నేను ఈ వాక్యముతో నిలచియున్నయెడల, దేవుడు నాతో నిలచియుండును. నేను ఒప్పుకొనియున్నాను. ఇవ్వబడవలసిన అవసరము లేదు. ఏదో విధముగా అది వచ్చును. నేను, కేవలము, నేను ఒప్పుకొనియున్నాను. నేను దానిని విశ్వసించుచున్నాను. ఆయన చెప్పిన ప్రతీ మాటను నేను విశ్వసించుచున్నాను. దానిని నేను ఒప్పుకొనియున్నాను. నాకు అవసరమైన అవసరతలన్నిటిని ఆయన సంధించును అని నేను ఒప్పుకొనియున్నాను. దాని గురించి నేను చింతించనవసరము లేదు.
57మరియు వారికి తీసుకొనుటకు మనస్తత్వ శాస్రము, మిగిలిన చెత్తంతయూ అవసరము లేదని అతను కూడా ఒప్పుకొనియున్నాడు. వారు దానిని గురించి వారికి అవసరమైన దంతయూ ఇతరులకు బోధించునప్పుడు - వారికి చాలినంతగా యున్నదని వారు ఒప్పుకొనిరి.
ఈ రోజు ఉన్న సమస్య అదే. సిద్దాంతములను, మరియు అలాంటి వాటన్నిటిని వారిలోనికి ప్రవేశపెట్టవలెనని వారు ప్రయత్నిస్తున్నారు. పరిశుద్దాత్మ సరియేనని మీరు నిమ్మళముగా ఒప్పుకొనరు. నాకు కావలసినదంతయూ అదే, మరియు మీకు కావలసినదంతయూ అదే. ఎవరికయినా కావలసినదంతయూ అదే.
MATT 23:15
58కొద్దికాలము క్రితము ఆఫ్రికా దేశములో యుంటిని. అక్కడ యున్న ప్రజలకు మరియు గిరిజనులకు వారు విద్యను నేర్పించుటకు ప్రయత్నము చేసిరి, మరియు వారిని నీవు తెల్లజాతి మనుష్యులలోనికి తీసుకొని వచ్చినచో, అతడు తెల్లజాతి మనిషి యొక్క పాపమును తీసుకొనును. వారి గిరిజన తెగలో అక్కడ వారి సొంత పాపకార్యము గలదు. అతనిని లోపలకు తీసుకొని రమ్ము. అతడు తెల్లజాతి వారి యొక్క పాపమును తీసుకొనును, తరువాత ముందున్నదాని కన్ననూ రెండింతలుగా మారిపోయి నరకానికి వారసులు అయ్యెదరు. అతనికి కావలసినది ఒక్కటే; అతనికి క్రీస్తు అవసరము! ఆమేన్!
59ఒక్కసారి, హడ్సన్ టేలర్, చైనాలో యున్న గొప్ప మిషనరీ అయిన హడ్సన్ టేలర్ గురించి నీవు వినియుండవు? అక్కడ ఒక యవ్వనుడైన ఇండియన్ బాలుడై ఉన్నాడు. అతడు రక్షింపబడియున్నాడు, పరిచర్యకై అతడు ఒక పిలుపును కలిగియున్నాడు అని చెప్పెను. అతడు వచ్చి శ్రీ. టేలర్ కు ఇలా చెప్పెను. "శ్రీ. టేలర్, నన్ను నాలుగు సంవత్సరములు మనస్తత్వ శాస్త్రమును తీసుకోమంటారా," (మరియు విభిన్నమైన కార్యములు అతడు చేయవలయును), "మరియు నా ఆర్ట్స్ డిగ్రీని పొందుకొనుటకు నాకు ఎంత సమయము పడుతుంది?"
శ్రీ. టేలర్ అతనికి చెప్పెను, "కుమారుడా, నీవు ప్రారంభించడానికి మునుపే క్రొవ్వొత్తిని సగం కాల్చవద్దు" అనెను. వద్దండి! నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. క్రొవ్వొత్తి సగం కాలినంత వరకు వేచి యుండవద్దు, మరియు ఒక విధమైన వేద పాఠశాల విద్య తట్టుచు నీలోనికి వచ్చును, ఒక విధమైన శవాలను భద్రపరచు తైలము వచ్చును. దానిని చేయవద్దు. అయితే నేను చెప్పుచున్నాను, ఆ క్రొవ్వొత్తి వెలిగించబడినంతలో, ప్రారంభించు! నేను అజ్ఞానమును ప్రోత్సహించుటకు ప్రయత్నించుట లేదు, కానీ నా ఉద్దేశ్యము ఇక్కడ ఉన్నది. నీకు ఏమీ తెలియనియెడల, క్రొవ్వొత్తి ఏ విధముగా వెలిగించాలి అనేది వారికి చెప్పు, వారు తెలుసుకొనవలసినదంతయూ అదే. క్రొవ్వొత్తిని ఏది వెలిగించినదో అనేది వారికి చెప్పండి; అక్కడ ఏమి మండుచున్నదో వారికి చెప్పండి. అది ఎలా వెలిగించబడును అని మాత్రము వారికి చెప్పండి. వారినే వెలిగించనివ్వండి; వారు మిగతాదాని గురించి వారే జాగ్రత్త వహించుదురు. నిశ్చయముగా.
ఆరంభము నుంచే నీకు తెలియనిదియూ, అవి తెలిసిన తరువాత, ఉపయోగము లేని అన్ని రకముల గొప్ప పదములను వారి యొద్ద చెప్పవద్దు, చూచారా. "దేవునికి మహిమ! పరిశుద్ధాత్మ నన్ను తాకినది, మరియు నేను ఒక భిన్నమైన మనిషిని" అని మాత్రము వారికి చెప్పుము. క్రొవ్వొత్తి ఎలాగు వెలుగింపబడినది అను దానిని వారికి చెప్పుము. అది కాలిపోవునంతవరకు వేచి యుండవద్దు. తరువాత ఆ సమయములో అది పొగను వెదజల్లును. ఈ రోజులలో చాలామందికి అది ఎలాగు వెలిగింపబడినది అని మాత్రము చెప్పుము.
JOHN 9:2,3,19,22
60యేసు చూపునిచ్చిన ఆ గ్రుడ్డివాడు అక్కడ యున్నాడు, వారు హడావిడిపడుచున్నారు. ఆయన ఆ మార్గమున వెళ్ళినప్పుడు, ఆయన యొక్క శిష్యులు, ఇది ఎవరు చేసిన పాపము, అతడా, అతని తల్లియా, లేదా అతని తండ్రా?" అని అడిగెను.
అందుకు యేసు, "ఎవ్వరూ కాదు. అయితే దేవుని యొక్క కార్యములు బయలుపరచబడుటకు అలాగు జరిగెను" అని చెప్పెను. మరియు ఆయన అతనికి తన చూపును ప్రసాదించెను.
ఇదిగో వేదపండితులు మరియు పరిసయ్యులు అందరూ ఇక్కడకు వచ్చిరి. ఆయన తల్లి మరియు తండ్రి చనిపోదుము అని భయపడిరి, ఎందుకనగా వారు ఇప్పటికే చెప్పిరి, "ఆ ప్రవక్త నజరేయుడైన యేసు మాటలు ఎవ్వరయినా వినినయెడల, అతను మీకు సంఘము నుండి ఒక పత్రికను ఇచ్చును. నీవు వెలివేయబడెదవు."
వారు కొంచెము కూడా మారలేదు - అదే విధముగా యున్నారు. "ఎవ్వరయినా అతని మాట విన్నచో లేదా ఆయన కూటమునకు వెళ్ళినచో, వారు వెంటనే సంఘము నుండి బహిష్కరించబడెదరు, ఆది నుండి అలానే యున్నది." పుస్తకములో మీ పేరును వారు తుడిచి వేయుదురు.
JOHN 9:19-25,30,32
61కాబట్టి, వారు వెళ్ళి అతని తండ్రిని మరియు తల్లినీ తీసుకొని వచ్చి అడిగిరి, "ఈయన మీ కుమారుడేనా?"
"అవును, మా కుమారుడే" అని చెప్పెను. "ఈయన మా యొక్క కుమారుడే అని మేము ఎరుగుదుము. మరియు అతడు పుట్టు గ్రుడ్డివాడు అని ఎరుగుదుము" అని చెప్పిరి.
"మంచిది," "ఇతను ఎలా చూపును పొందుకొనెను" అని అడిగిరి.
"అతడినే అడగండి; అతను వయస్సు గలవాడు" అనెను.
"దేవునికే మహిమ చెల్లించుడి; ఈ మనిషి ఒక పాపి" అనెను.
ఎందుకు? అతను వారితో తత్వజ్ఞానమును గురించి వాదించలేదు. నిశ్చయముగా కాదు. అయితే అతనికి ఒక విషయం తెలియును. అతను చూడగలిగెదను అని అతను ఒప్పుకొనియున్నాడు. "అతను పాపియా కాదా, నాకు తెలియదు. ఏ వేద పాఠశాల నుండి అతను వచ్చియున్నాడో నాకు తెలియదు, లేదా దాని గురించి ఏమీయు తెలియదు; అయితే నేను వాదించుటకు ఇది ఒక మంచి విషయము దొరికినది: ఒకప్పుడు నేను గ్రుడ్డివాడిని, నేను చూచెదను అని నేను ఒప్పించబడియున్నాను. "ఎందుకనగా అలాగు జరుగును అని ఆయన నాతో చెప్పెను, మరియు నేను ఆయన చెప్పినది వినియున్నాను" అనెను. హల్లెలూయ!
నాకు కూడా అదే జరిగినది: నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని, అయితే ఇప్పుడు నేను చూచుచున్నాను. ఒకప్పుడు నేను దీనిని చూడలేకపోతిని. నేను ఒక పాపినైయుంటిని. ఆయన నా కన్నులు తెరిచెను. ఒకప్పుడు ఎక్కడైతే నేను గ్రుడ్డివాడిగా ఉంటినో, అక్కడే నేను ఇప్పుడు చూచుచున్నాను.
అతనికి వాదించుటకు ఒక మంచి విషయము దొరికినది. నిశ్చయముగా దొరికినది. ఎంతగా అనగా, ఇక వారు అతనితో వాదించలేనంతగా, ఎందుకు? అతడు చూడగలను అనే దానిని అతడు ఒప్పుకొనియున్నాడు. మరియు అతడు ఒప్పుకొని యున్నాడు. అది అతడు "ఇప్పుడు అది ఒక ఆశ్చర్యకరమైన విషయము, అని చెప్పెను. ఇక్కడ ఉన్న మీరు, ఈ దేశము యొక్క మత నాయకులై యున్నారు, మరియు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మేము ఎరుగుకయున్నాము అని మీరు చెప్పుచున్నారు; మరియు ఇక్కడ నా మీద ఆయన ఒక అద్భుతమును జరిగించియున్నాడు, ఈ లోకములో అది ఎన్నడూ జరుగలేదు. అది ఒక ఆశ్చర్యకరమైన విషయము" అని చెప్పెను.
సహోదరుడా, అతను ఆ విషయంలో, గొప్ప వేదాంత పండితుడు అని నేను నమ్ముచున్నాను. ఎందుకు? అతను ఒప్పుకొనెను. అతనిని ఒప్పించుటకు అతను ఒక దానిని కలిగియుండెను. అతను గుడ్డివాడిగా యున్నాడు, ఇప్పుడు చూడగలుగుచున్నాడు.
1SAM 16:12•
1SAM 17:42
62దావీదు, సౌలు యొక్క సైన్యము యొద్దకు అతను వచ్చినప్పుడు, గొల్యాతు అటువైపు నిలచియుండెను, అక్కడ ఉన్నంవార౦దరి కన్నా దావీదు చిన్నవాడిగా యున్నాడు; గొల్యాతు అందరిలో పెద్దగాయున్నాడు. సాలు అతనికి సరిజోడిగా యుండవచ్చును. సౌలు దాదాపు ఏడు అడుగుల పొడవు ఉన్నాడు అని నేను అనుకొనుచున్నాను లేదా ఇంకా ఎక్కువ, బహుశా ఎనిమిది అడుగులు ఉండవచ్చును. "ఆయన యొక్క సైన్యమంతటిలో ఆయన శిరస్సు మరియు భుజములు ప్రతీ మనిషికి పైగా (ఎత్తుగా) యున్నవి." మరియు అక్కడ దావీదు చిన్నవాడిగా యున్నాడు, మరియు అక్కడ ఉన్న జనులలో అతడు మాత్రమే తర్ఫీదు లేనివాడిగా యున్నాడు. అయితే, సహోదరుడా, అతను ఒప్పుకొనియున్నాడు. మహిమ! చూడండి? "నేను ఎలాగు కనిపించుచున్నానో, అలాగే ఉండగోరుచున్నాను."
గమనించండి, అతను తర్ఫీదు పొందలేదు. అతను ఎటువంటి ఈటెలను కలిగిలేడు, దానిని గురించి అతనికి ఏమియు తెలియదు. మరియు అతను కేవలము ఒక చిన్న ఎర్రని శరీరము గల బాలుడు; అయితే అతను ఒప్పుకొనియున్నాడు మరియు తమను తాము "జీవించుచున్న దేవుని యొక్క సైన్యము" అని పిలుచుకొనుచున్న సైన్యమును గురించి అతను పట్టించుకొనెను. మరియు ఆ సింహమును మరియు ఎలుగుబంటిని వడిసెలతో చంపుటకై అతనికి సహాయము చేసిన ఆ దేవుడు, నిశ్చయముగా సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడిని చంపును అని అతను నిశ్చయత కలిగియుండెను. అతను నిశ్చయత కలిగియుండెను, అప్పుడు ఆ సైన్యమును గురించి అతనికి పట్టింపు కలిగెను.
అతను ఏమి కలిగియున్ననూ, అనవసరము. నీవు గనుక ఒప్పుకొనియున్నయెడల, నీవు పట్టింపు కలిగియుందువు, అయితే మొదటిగా నీవు ఒప్పుకొనవలసియున్నది. కాబట్టి, అతను ఒప్పుకొనెను.
2SAM 5:23,24•
PS 103:3
63నిజముగా వేడిగా యున్న ఒక రాత్రి, చుట్టూ భయానకముగా యున్నది, ఆ రాత్రి యుద్దమునకు బయలుదేరుట నాకు గుర్తున్నది. ఓ, సమస్తమూ అతనికి విరుద్ధముగా యున్నది. మరియు అతను ప్రార్థించెను. అతను బయట కంబళి చెట్టు క్రింద పరుండి యుండెను. అక్కడ అతని కలుసుకొనుటకు సైన్యమంతయూ అప్పటికే సిద్ధముగా యున్నది. ఈ కంబళి చెట్లు క్రింద అతను దాగియుండెను. మరియు కొంత సమయమునకు ఏదో వచ్చుచున్నది అని అతను వినెను, మరియు ఆ కంబళి చెట్టు పొదలలో నుండి వెళ్ళెను, మరియు ఇంకొక మార్గములో బయటకు వెళ్ళెను. సహోదరుడా, అతను ఒప్పుకొని యున్నాడు. సమస్తమూ అతనికి విరుద్ధముగా ఉండినను ఫరవాలేదు, అతనికి ముందుగా దేవుడు వెళ్ళెను అని అతను నమ్మిక కలిగియుండెను.
పురుషులారా, ఈ రాత్రి, నీవు ఇక్కడ నిలబడియున్నయెడల, నీలో ఏ తప్పిదము ఉన్నను లెక్క లేదు; వేగముగా వచ్చుచున్న పరిశుద్ధాత్మ గాలి, నీ ద్వారా వచ్చుచున్నదని నీవు గనుక అనుభూతి చెందిన యెడల మరియు "నీ వ్యాధులనన్నిటిని స్వస్థపరచు ప్రభువును నేనే; ఇప్పుడు నేను నిన్ను స్వస్థపరచుచున్నాను" అని చెప్పుచుండెను. నీవు గనుక ఒప్పుకొనియున్నట్లయితే, సహోదరుడా, అక్కడ ఎటువంటిది జరిగినను, నీవు పట్టించుకొనవు. అది ఇప్పటికే జరిగిపోయినదని నీవు ముందుగానే ఎరిగియుందువు. నిశ్చయముగా, అతను ఒప్పుకొనెను మరియు తరువాత అతను పట్టింపు కలిగియుండెను.
EXOD 3:12•
EXOD 4:20•
JUDG 15:15
64సమ్సోను ఫిలిస్తీయుల ముందర, కేవలము తన చేతిలో ఒక గాడిద యొక్క దవడ ఎముకను పట్టుకొని నిలువబడెను, అతను తర్ఫీదు పొందినవాడు కాడు. అయితే ఆ ఫిలిస్తీయులను ఆ గాడిద దవడ ఎముకతో చంపుటకు దేవుడు అతనిని పైకి లేపగల సమర్దుడు అని అతను నమ్మిక కలిగియుండెను. మరియు అతను వేలమందిని చంపివేసెను.
పారిపోవుచున్న ప్రవక్త అయిన మోషే, ఆ పొదలో ఉన్నది దేవుడు అని మోషే ఒప్పుకొనినప్పుడు… మీకు తెలుసా, మోషే దేవునితో ఎన్నడూ ఒక అనుభవమును కలిగిలేడు. అతను చాలా ఎక్కువ తత్వజ్ఞానమును కలిగియుండెను. అయితే అతను పారిపోయెను. అయితే ఆ పొదలో యున్నది దేవుడు అని అతను ఒప్పుకొనియున్నాడు — ఎందుకనగా ఆ పొదలో నుండి ఒక స్వరము మాట్లాడినది, అతనికి లేఖనమును చూపించినది, మరియు అతను అది దేవుడు అని ఒప్పుకొనెను. మరియు దేవుడు "నేను నీతో యుండును" అని చెప్పెను. మీకు తెలుసా, ఐగుప్తులో భారమంతటిని గురించిన పట్టింపును అతను కోల్పోయెను. మరియు ఆ బానిసలకు దూరముగా, నలుబది సంవత్సరములు బయట అక్కడ యున్నాడు. అయితే వారికి విడుదల అనుగ్రహించుట దేవుని యొక్క చిత్తము అని అతను ఒప్పుకొనినప్పుడు, ఆ మరుసటి దినము నుండే అతను పట్టింపు కలిగియుండెను.
ఇక్కడ ఆ మార్గము గుండా అతను వెళ్ళుచుండెను. అది ఎలాంటి దృశ్యము అని మీరు ఊహించగలుగుచున్నారా? సిప్పోరా, గాడిద పైన కూర్చోని, ఆ చిన్న తన యొక్క నడుముపై ఎత్తుకొనియుండెను. ఎనుబది సంవత్సరముల వయస్సు కలిగి, గడ్డము ఈ విధముగా క్రిందకు వ్రేలాడుచుండెను; సూర్యకాంతికి అతని యొక్క బట్టతల ప్రకాశించుచున్నది; వంకర కర్ర అతని చేతిలోయున్నది, "హల్లెలూయ!" అని అరచుచుండెను. స్వాధీనపరచుకొనుటకై ఐగుప్తుకు వెళ్ళుచుండెను."
అవును. అది మిమ్ములను వింతగా నడుచునట్లు చేయును. అతనిని అది, వింతగా నడుచునట్లు చేసియుండవచ్చును, అయితే అతను ఒప్పించబడియుండెను. ఎందుకు? "మోషే, నీతో పాటుగా నేను వెళ్ళుచున్నాను. నేను నీ చేతిలో యున్న ఈ కర్రను తీసుకోనైయున్నాను, మరియు నేను నా ప్రజలను విడుదల చేయనైయున్నాను."
ఇప్పుడు, ఆ చిన్న పాతదైన వంగిన ఆ కర్ర మంచిగా కనిపించక పోవచ్చును, అయితే, సహోదరుడా, అతను ఒప్పించబడెను, ఎందుకనగా దానితో దేవుని యొక్క వాక్యము నిలచియున్నది. మీకు తెలుసా, దేవుని వాక్యము మీతోను, మీలోను యున్నది, మీరు ఒప్పించబడగలరు.
65అవును, వారు దాని మీద ఆధారపడియున్నంత వరకు ఆయన తన మాటను నిలబెట్టుకొనగల సమర్దుడు అని హెబ్రీ కుమారులు, వారు నమ్మిక కలిగియున్నారు. విగ్రహములకు తలవంచవద్దు అని దేవుడు వారికి చెప్పెను. ఖచ్చితముగా దేవుని యొక్క ఉద్దేశ్యము అదే. మరియు ఆ విగ్రహమునకు వారు శిరములు వంచనట్లయితే, దేవుడు ఆయన మాటను నిలబెట్టుకొనును అని వారు ఎరిగియున్నారు. ఆయన చేయును అని వారు నమ్మిక కలిగియున్నారు. మరియు తరువాత ఆయన వాక్యములో నిలిచియుండుటను గురించి వారు ఒప్పుకొనియున్నప్పుడు, దేవుడు వారితో నిలచియుండుటను గురించి పట్టింపు కలిగియుండెను.
ఇది దేవుని యొక్క వాక్యము అని మీరు ఒప్పుకొనినప్పుడు, దీనితో జాగ్రత్త వహించుటకు దేవుడు పట్టింపు కలిగియున్నాడు. ఇది సత్యము అని నీవు ఒప్పించబడినప్పుడు, అన్ని చోట్ల, ఇతర దేశములలో కూడా నేను దానిని ప్రయత్నించాను - అయితే మీరు ఒప్పించబడవలయును, తరువాత దేవుడు మీతో పట్టింపు కలిగియుంటాడు. అయితే మొదటిగా, అది ఆయనే అని మీరు తప్పనిసరిగా ఒప్పుకొనవలయును, మరియు ఆయన తన యొక్క వాగ్దానమును నిలుపుకొనును; తరువాత దేవుడు పట్టింపు కలిగియుండును.
JOHN 11:21,22
66యేసు దేవుడిని అడిగినట్లయితే, అది జరుగును అని మార్త నమ్మిక కలిగియుండెను. ఆమె "మిగిలిన వారు ఏమి అన్ననూ నేను పట్టించుకొనను. చివరికి నా సహోదరి మరియ దానిని నమ్మనట్లయిననూ నేను పట్టించుకొనను. బోధకుడు ఏమి చెప్పినను నేను పట్టించుకొనను, నేను నమ్మను. అయితే, ప్రభువా, నీవు గనుక ಇక్కడ ఉండియున్నట్లయితే, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు" అనెను. మరియు ఆయన చెప్పెను. "ఇప్పటికైనా, నీవు గనుక దేవుడిని అడిగినట్లయితే, దేవుడు నీకు దానిని ఇచ్చును అని నేను నిశ్చయత కలిగియున్నాను. అది నెరవేరును. నేను వేంటనే వెళ్ళి మరియు అడ్డు పెట్టిన రాతిని తొలగించెదను. దాని కొరకు నేను సిద్ధపరచెదను. నేను ఒప్పుకొనియున్నాను." నిశ్చయముగా.
67కొన్ని సంవత్సరముల క్రితము, కెంటకీలో నా తండ్రి గుర్తున్నారా? పంటలు అన్నియూ ఎండిపోయినవి, మరియు పాతకాలమునకు చెందిన ఒక సంచార భోధకుడు అక్కడికి వచ్చెను, మరియు ఆయన బహు వృద్దుడు. అతను మోకాళ్ళపై కూర్చుంటే, ఏదో ఒకటి జరిగినంతవరకు అక్కడనే మోకాళ్ళపై నిలచియుండేవాడు. ఆ రోజు వారందరు వర్షము కురువవలెనని ప్రార్థించగోరెను. నా తండ్రి చెప్పెను, ఆ వృద్ధుడు అతని మోకాళ్ళపై కూర్చండుటకు వెళ్ళినప్పుడు మరియు అతడు, ఆ ముడుచుకొనిపోయిన వృద్ధ హస్తములు గాలిలో పైకి ఎత్తబడుట చూచెను. అతడు, "ఓ దేవా, నేను మిమ్ములను సేవించితిని. ఈ ప్రజలు మీ వారు, మరియు వారి పంటలు ఎండి పోవుచున్నవి" అనెను. నా తండ్రి చెప్పెను, అతను సంఘములో నుండి బయటకు వెళ్ళి, అక్కడకు వెళ్ళి, మరియు అతని యొక్క గాడిద గంతను తీసివేసి, సంఘ భవనము క్రిందకు దానిని విసరివేసి వర్షము రానైయున్నదని అతను ఎరిగి యుండెను. అవునండీ! ఒప్పుకొనెను, తరువాత అతను అతని యొక్క గంత గురించి పట్టింపు కలిగియుండెను. మీరు ఒప్పుకొనిన తర్వాత…
MATT 9:18•
MARK 5:23,35•
LUKE 8:49
68మార్త "నీవు గనుక ఇక్కడ ఉండి యున్నట్లయితే, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఇప్పటికైనను, నీవు దేవుడిని ఏమి అడిగిననూ, దానిని దేవుడు నీకు దయచేయును. అది నిజము. నీవు దేవుడిని అడిగినట్లయితే, అది జరుగును" అనెను. అది అద్భుతముగా లేదా?
యూయీరు, తన యొక్క పన్నెండు సంవత్సరముల ప్రాయము గల చిన్న బాలిక మరియు అతని యొక్క ఏకైక బిడ్డ యొక్క శవముతో తన గృహములో యున్నాడు. "బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు, ఏలయనగా ఆమె ఇప్పటికే చనిపోయినది" అని వర్తమానము వచ్చినది, మరియు యేసు చెప్పెను. మొదట, అతడు యేసునకు చెప్పెను, "నా చిన్న బాలిక ఇప్పుడు చనిపోయినది, అయితే నేను ఒప్పించబడితిని." హల్లెలూయా! "వచ్చి ఆమెపై నీ చేతులను ఉంచుము, ఆమె బాగుపడును." ఒప్పుకొనెను! అతను యేసును గురించి వినెను. ఆయన కార్యములు అతడు ఎరిగియున్నాడు. అతడు ఒక రహస్య విశ్వాసి. అతని హృదయపు లోతులలో, ఆయన దేవుని యొక్క కుమారుడు అని అతను నమ్మెను. అదేనని అతను సంపూర్ణముగా ఒప్పుకొనెను.
MATT 9:18•
MARK 5:23•
JOHN 11:21,22
69మీకు తెలియునా, అది వింతగా లేదా? ఆ విషయమునకై దేవుడు అతడిని బలవంతపరచెను. నిన్ను ఎలా బలవంతము చేయవలెనో దేవునికి తెలియును. నిజము. నిన్ను దాని యొద్దకు పంపించుటకు, నీ వ్యక్తిత్వము మరియు నీవు ఏమైయున్నావో చూపించుటకు, కొన్నిసార్లు ఆయన వ్యాధిని, మిగిలినన్నిటిని నీకు అనుమతించును. అతనిని బలవంతము చేసెను. దానిని నమ్ముటకు యాయీరు బలవంతము చేయబడెను. కాబట్టి, తరువాత అతను ఏమైయున్నాడో ఆయన చూపించును. "నీవు వచ్చి నా కుమార్తె మీద నీ చేతులు ఉంచిన యెడల, ఆమె మరణించిననూ, ఆమె జీవించును" అనెను. ఓ, ఏమిటి! నేను దానిని ఇష్టపడుచున్నాను. మార్త కూడా అదే విషయము చెప్పినదని నేను అనుకొనుచున్నాను. యేసు కూడా దాని గురించి ఒప్పించబడెను.
MATT 8:8-10•
LUKE 7:7-9
70శతాధిపతియైన ఆ రోమా సైన్యాధిపతి, యేసు కేవలము ఒక్క మాట సెలవిచ్చినట్లుగా చేసినచో చాలు, అతను ఒప్పించబడెను. అన్యుడైన, అన్యమతస్తుడైన, ఒక రోమా సైన్యాధిపతి చెప్పినది వినండి. అతను, "నేను అధికారము గల వ్యక్తిని. ఇక్కడకు నీవు వెళ్ళు అని ఈ సైనికునితో, ఈ మనిషితో నేను చెబితే, అతను వెళ్ళును. మరియు రమ్మని ఈ వ్యక్తితో నేను చెబితే, అతను వచ్చును" అనెను. ఎందుకు? అతను వానిపై అధికారి. అతను ఏమి సాక్షమిచ్చుచున్నాడు? "యేసు, మీరు అన్ని వ్యాధులపైన అధికారము కలిగియున్నారు. మీరు అన్నిటి మీద అధికారము కలిగియున్నారు. నీవు ఒక్క మాట సెలవిచ్చుట నేను వినినయెడల, నా సేవకుడు బ్రతుకును. నేను పరిపూర్ణముగా ఒప్పుకొనియున్నాను."
మరియు తరువాత, దానంతటి మీద, మేము ఇంకనూ ఒప్పుకొనుటలేదు, చూచారా. అది ఏమిటి? అది గొప్ప విశ్వాసము అని యేసు చెప్పెను. అటువంటి దానిని ఆయన ఇశ్రాయేలీయులలోనైనను కనుగొనలేదు. "కేవలము మాట మాత్రము సెలవియ్యుము."
ISA 53:5•
MATT 17:20•
MATT 21:21,22•
MARK 5:28•
MARK 11:23,24•
LUKE 8:43,44•
1PET 2:24
71అది నేరుగా ఇక్కడే ఉన్నది: "మీరు ప్రార్థించునప్పుడు, దేనిని అడుగుదురో వాటిని పొందుకొనియున్నామని విశ్వసించుడి, అప్పుడు అవి మీరు కలిగియుందురు. ఈ కొండను చూచి, నీవు ఎత్తబడి పడవేయబడుదువని చెప్పి తన హృదయములో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
అలాగయితే ఒప్పుకొనుము! దేనిని? "ఆయన పొందిన గాయములచేత నేను స్వస్థత నొందితిని. ఆయన యొక్క కృప ద్వారా నేను రక్షింపబడితిని. ఆయన వాగ్దానము చేత నేను విధేయుడనై యందును. మరియు నేను పరిశుద్దాత్మ చేత నింపబడితిని." ఆయన తన మాటను నిలబెట్టుకొనును అని మీరు ఒప్పుకొనిన యెడల, అక్కడే మీరుయున్నారు, అయితే మొదటిగా నీవు ఒప్పుకొనవలెను.
రక్తస్రావము గల ఆ స్త్రీ, ఆమె ఒప్పుకొనెను. రబ్బి ఏమి చెప్పినా మరియు బోధకుడు ఏమి చెప్పినా, మరియు ఆమె యొక్క భర్త ఏమి చెప్పినా మరియు ఇంకెవరు ఏమి చెప్పినా అనవసరము. ఆమె, "ఆయన పరిశుద్దుడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. మరియు నేను గనుక ఆయన యొక్క వస్త్రపు అంచును ముట్టిన యెడల, నేను స్వస్థపరచబడెదనని నేను ఒప్పుకొనియున్నాను, నేను చేయవలసినదంతయూ అదే" అని అనెను. వైద్యులు ఆమె స్వస్థపరచబడదు అని చెప్పిననూ, "కేవలము ఆయన వస్త్రము యొక్క అంచును ముట్టినయెడల నేను స్వస్థపరచబడెదను" అని ఆమె అనెను. ఆమె ఒప్పుకొనియున్నది.
72బావి యొద్ద నున్న స్త్రీ, ఆయన మెస్సీయా అని ఒప్పుకొనెను, ఆమె లేఖనానుసారమైన సూచనను చూచినప్పుడు, మెస్సీయా ఎలాగుండును అని ఆమె ఎరిగియున్నది. నేను ఈ ఉదయకాలములో చెప్పినట్లు, ఆ ముందు నిర్ణయించబడిన జీవము అక్కడ యున్నది. మరియు ఆమె చూసిన వెంటనే, వేడి జలములు పోయబడెను, చల్లని జలము అని చెప్పవలెను. జగత్తు పునాది చేయబడక మునుపు దేవుడు నిర్ణయించిన జీవపు వాక్యముపై జలములు పోయబడినప్పుడు, వెంటనే ఆమె దానిని చూచినది, [సహోదరుడు బ్రెన్హాం వేళ్ళను విరుచుకున్నారు], ఇలా వెళ్ళు విరిచినంత సమయములోనే. ఎప్పుడైతే అక్కడ ఉన్న సేవకులు దానిని చూడలేదు; యాజకులు దానిని చూడలేదు; ప్రధాన యాజకులు దానిని చూడలేదు; గొప్ప పండితులు దానిని చూడలేదు… దానిని "దెయ్యము" అని పిలిచిరి. మరియు ఆ బీద, చిన్న వేశ్య అక్కడ ఉన్నది, జగత్తుపునాది వేయబడకముందే, దేవుడు దానిని నిర్ణయించెను. నీవు ఎప్పటికి అక్కడే ఉన్నట్లయితే, నీవు కూడా ఉన్నావు.
MATT 24:24•
MARK 13:22•
REV 17:8
73ఇప్పుడు, పరిశుద్ద గ్రంధము, "అంత్యదినములలో అంత్యక్రీస్తు ఎంతో భక్తి పరుడుగా ఉండి, దాదాపుగా నిజమైన దానివలె ఉండి, సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసము చేయుటకు ప్రయత్నించును" అని చెప్పుచున్నది. అయితే, వాడు మోసగించలేడు. అది సత్యము! మరియు సమస్తమూ… ఎవరి పేర్లయితే గొర్రెపిల్ల జీవగ్రంథము నందు లిఖించబడలేదో, ఈ భూమి మీద యున్న వారినందరిని అతడు మోసము చేయును — గడిచిన ఉజ్జీవము నుండి? అది పరిశుద్ధ గ్రంధమువలె అనిపించుట లేదు, అవునా? "జగత్తు పునాది వేయబడినప్పటి నుండి!" నీవు వారిని మోసపరచలేవు, ఎందుకనగా వారు తిన్నగా వాక్యములోనే ఉన్నారు. ఆ విషయములు సమీపించుట వారు చూచినప్పుడు, ఇది జీవము, ఇప్పుడే వారు పట్టుకొనెదరు.
ఇతరులు చుట్టూ నడచి మరియు, "ఆహా అక్కడ దానికి ఏమియూ లేదు," అని చెప్పెదరు. చూడండి, వారు ఒప్పుకొనలేదు. వారిని ఒప్పించుటకు అక్కడ ఏమియూ లేదు, వారు విశ్వసించుటకు అక్కడ ఏమియూ లేదు.
నా తల్లి చెబుతూ యుండేది, "అక్కడ రక్తమే లేనప్పుడు, తెల్లని ఒక దుంప నుండి నీవు రక్తము ఎలా పొందుకొనగలవు!" అది నిజము.
MATT 12:24•
LUKE 11:31•
JOHN 4:25,26,29•
JOHN 10:27
74"నా గొర్రెలు నా స్వరము వినును." వారు వాక్యమును ఎరిగియున్నారు. ఆయన స్వరము ఏమిటి? ఇదిగో ఇక్కడ యున్నది. వారు ఈ సిద్దాంతములను వెంబడించరు, అయితే వారు నా స్వరమును వినియున్నారు; దానిని వారు వెంబడించిరి.
బావి యొద్ద నున్న స్త్రీ పూర్తిగా ఒప్పుకొనెను. అది మెస్సీయా అని ఆమె ఒప్పుకొనిన తరువాత, ఆమె యొక్క జనులు కూడా ఆ సూచనను చూచి, విశ్వసించవలెనని ఆమె పట్టింపు కలిగియున్నది, ఏలయనగా ఆమె సమస్య ఎక్కడ యున్నదో, ఆయన ఆమెకు చెప్పెను. ఆమె "అయ్యా, మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన వాటిని చేయును అని మేము ఎరిగియున్నాము" అనినది.
ఆయన, "నేనే ఆయనను" అని చెప్పెను.
ఇలాంటి సంఘటనలు చేయుచున్న ఈ మనిషి నిశ్చయముగా సత్యమునే పలుకును అని ఆమె ఎరిగియుండెను. దేవునికి మహిమ! అవును. ఆ విధముగా దేవుడు వాడుకొనుచున్న ఆ మనుష్యుడు అబద్దమాడడు. సరే. ఆయన సత్యమునే చెప్పుచున్నాడు.
"నేనే ఆయనను" అని చెప్పెను.
మరియు ఆ మాట మీద ఆ వెలుగు పడినప్పుడు ఆమె ఎంతో పరవశించిపోయినది, ఆమె పట్టణములోనికి పరుగెత్తినది. ఆమె సంపూర్తిగా ఒప్పుకొనినది. ఆమె అలాగు చేయవలెనని తలంచినను, లేకపోయిననూ, ఆమె పట్టణములోనికి పరుగెత్తుకొని పోయి, మరియు యాజకులకు, రబ్బీలకు చెప్పినది, మరియు వీధులలో యున్న మనుష్యులందరికి, వ్యాపారస్తులకు మరియు పచారి దుకాణములలో యున్న వారందరికి చెప్పినది. ఆమె వెళ్ళుచున్న వీధులలో పైనా, క్రింద సాక్షమిచ్చుచున్నది, నేను చేసిన కార్యములను నాతో చెప్పిన ఆ మనుష్యుని వచ్చి చూడండి. మీ పరిశుద్ధ గ్రంధమును తీసుకొనండి; లేఖనములో పరిశీలించండి; ఆయనే ఆ మెస్సీయా అయి ఉన్నాడు, అది సత్యము కాదా?" ఆమె ఒప్పించబడినది! ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రములలో యున్న వేలకొలది జనులను, ఆ తీర్పు దినమున ఆమె లేచి ఖండించును నిశ్చయముగా.
మీకు తెలుసా, యేసు, "దక్షిణ దేశపు రాణి తీర్పు దినమున లేచి వారిని ఖండించును, ఏలయనగా ఆమె సాలొమోను కలిగియున్న వివేచన, జ్ఞానమను వరమును వినుటకు వచ్చెను" అని చెప్పెను. మరియు "సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ యున్నాడు" అని చెప్పెను. నిశ్చయముగా, అయితే ప్రజలు ఇంకనూ ఆయనను నమ్ముట లేదు, నిశ్చయముగా.
JOHN 4:25,26
75ఆమె ఒప్పుకొనినది, మరియు ఆమె యొక్క జనులు కూడా ఒప్పించబడవలెను అని కోరుకొనినది. చూచారా, ఆమె ఒప్పుకొనిన తరువాత, ఆమె తన యొక్క జనుల గురించి పట్టింపు కలిగియున్నది. ఆయన మెస్సీయా అను దానిని ఆమె ఎరిగియున్నది. మెస్సీయా వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినది జరుగును అని ఆమె ఎరిగియున్నది.
ఆమె "క్రీస్తనబడిన మెస్సీయా వచ్చునని మేమెరుగుదుము, ఆయన వచ్చునప్పుడు, ఈ సమస్తమైన వాటిని గురించి ఆయన మనకు తెలియజేయును. అయితే నీవు ప్రవక్తవై యుండవలెను" అనెను.
యేసు, "నేనే ఆయనను" అనెను.
అక్కడ ఆమె ఒప్పుకొనెను, ఏలయనగా లేఖనము అలాగు చెప్పెను అని ఆమె ఎరిగియుండెను, మరియు అది నెరవేరినది. ఆమె ఒప్పుకొనెను, తరువాత ఆమె పట్టింపు కలిగియుండెను. ఆమె వెళ్లి ఇతరులకు దానిని గురించి చెప్పెను.
PS 16:10•
MATT 26:61•
MARK 14:58•
JOHN 2:19•
ACTS 2:27•
ACTS 13:35
76ఇప్పుడు, ఆయన మూడవ దినమున తిరిగి లేచును అని యేసు నిశ్చయత కలిగియుండెను. ఆయన ఎంతగానో నిశ్చయత కలిగియుండెను, ఆయన, "ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడవ దినమున నేను దీనిని తిరిగి లేపెదను" అనెను.
ఎందుకు? లేఖనములలో, ఒక ప్రవక్త దావీదు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా - మీకు తెలియును, దావీదు ఒక ప్రవక్త, పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా, దావీదు ప్రవచించెను, మరియు, "ఆయన ఆత్మను నేను పాతాలములో విడిచిపెట్టను, నేను నా పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యను" అనెను. మరియు డెబ్బది-రెండు గంటల లోపు, శరీరము కుళ్ళుపోవుట ఆరంభమవుటకు మునుపు ఏదో సమయములో, ఆయన తిరిగి లేపును అని ఆయన ఎరిగియున్నాడు. దెబ్బది-రెండు గంటలు అంటే మూడు పగళ్ళు మరియు మూడు రాత్రులు. "నాశనము చేయుడి నేను దానిని లేపెదను అని పరిపూర్ణముగా ఒప్పుకొనెను, ఆయన తిరిగి లేపును అనునది నిజము. లేఖనములు నిరర్ధకము కానేరవని ఆయన ఎరిగియున్నాడు. హల్లెలూయ!
HEB 13:8
77ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు అని నేను ఒప్పుకొనియున్నాను. ఈ పరిచర్యలో మరియు వర్తమానములో, నేను ఒప్పుకొనియున్నాను, నేను బోధించుచున్నాను, ఇది సత్యము అని నేను ఒప్పుకొనియున్నాను. ఈ దర్శనములు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నవని నేను ఒప్పుకొనియున్నాను. అంత్యదినములలో మనము జీవించుచున్నాము అని నేను ఒప్పుకొనియున్నాను. ఇప్పుడు నా మీద యున్న ఈ ఆత్మ పరిశుద్దాత్మయై యున్నదని నేను ఒప్పుకొనియున్నాను. మహిమ!
నేను పరిపూర్ణముగా ఒప్పుకొనియున్నాను. పరిశుద్దాత్మ యొక్క మార్గము సరియేనని నేను ఒప్పుకొనియున్నాను. బైబిలు మార్గము సత్యము అని నేను ఒప్పుకొనుచున్నాను. ఇప్పుడు, ఇది యేసుక్రీస్తేనని నేను ఒప్పుకొనియున్నాను. నేను ఒప్పుకొనియున్నాను. ఈ క్షణములో మీరు గనుక ఆయనను విశ్వసించినయెడల, ఈ క్షణములోనే, ఒక కనురెప్పపాటులో, ప్రతీ వ్యాధిగ్రస్తుడిని ఆయన స్వస్టపరచును అని నేను ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించి, జనములు కేకవేసి ఏమి జరుగునని చెప్పలేని స్థితి గలిగే అవకాశమున్నదని నేను ఒప్పుకొనియున్నాను.
HEB 13:8
78నేను ఒప్పుకొనియున్నాను. నేను ముసలివాడనని కాదు, నేను నా హృదయపూర్తిగా దీనిని విశ్వసించుచున్నాను. ఇరువది సంవత్సరముల వయస్సు నుండి కాదు, నేను చిన్ననాటి నుండి దీనిని బోధించుచున్నాను. ఆయన ఆ నది యొద్ద నన్ను కలుసుకొనినప్పటి నుండి నేను ఒప్పుకొనియున్నాను. హల్లెలూయ! ఇప్పుడు ఆయన ఇక్కడయున్నాడు అని నేను నిశ్చయత కలిగియున్నాను. నేను ఒప్పుకొనుచున్నాను. అరణ్యములో ఇశ్రాయేలీయులతో యున్న అగ్నిస్తంభము, మరియు ఆ అగ్నిస్తంభము ఒక్కటే, అదే అగ్నిస్తంభము ఈ రోజు సంఘములో యున్నది. మహిమ!
అది నిజమని నేను ఒప్పుకొనియున్నాను. దాని కొరకు నేను నా జీవితమును ఇచ్చెదను. నేను నా గృహమును మరియు సమస్తమును విడిచితిని, దాని కొరకు నా సమస్తమును ఇచ్చెదను. అది సత్యమని నేను ఒప్పుకొనియున్నాను.
ఆయన ఇప్పుడు ఇక్కడనే యున్నాడని నేను ఒప్పుకొనియున్నాను. ఇప్పుడు, ఇక్కడ యున్న ఆ ఆత్మ పరిశుద్దాత్మ అని నేను ఒప్పుకొనియున్నాను. ఇప్పుడు ఇక్కడనే మనము ఆయన ఆత్మలోనికి బాప్తిస్మము పొందియున్నామని నేను ఒప్పుకొనియున్నాను. అది సత్యమని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడని నేను పరిపూర్ణముగా ఒప్పుకొనుచున్నాను. నేను సంపూర్తముగా ఒప్పుకొనుచున్నాను, నేను ఒప్పుకొనుచున్నాను.
79ఆ దూత నన్ను అక్కడ కలుసుకొని, ఆయన ఏమి చేసెనని నాతో చెప్పెను నేను కొన్ని వేలమంది అన్యుల ఎదుట నిలబడితిని. "మీకు భయమా అని మీరడగవచ్చును?" లేదండీ! అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేను ఒప్పుకొనుచున్నాను! అది లేఖనానుసారమైనది, గనుక నేను ఒప్పుకొనియున్నాను! అది ప్రభువు యొక్క దూత అని నేను ఒప్పుకొనియున్నాను హృదయ పూర్తిగా నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము దేవుని ఏమైనా అడిగినచో దానిని దయచేయును అని నేను ఒప్పుకొనుచున్నాను. ఆయన మనకు ఇచ్చియున్నాడు భయపడకుడి, కేవలము మీరు భయపడెదెరు. భయపడకండీ, ఆయన ఇక్కడనే యున్నాడు.
మీలో కదులుచున్నట్లుగా మీరు అనుభూతి చెందే ఆ ఆత్మ పరిశుద్దాత్మాయేనని నేను ఒప్పుకొనుచున్నాను, అది క్రీస్తేనని నేను ఒప్పుకొనుచున్నాను. ఆమేన్!
నేను చూచుచున్న నా ఎదుట యున్న ఆ వృత్తాకారములో గల వెలుగు పరిశుద్దాత్మయని నేను ఒప్పుకొనుచున్నాను. ఆ దర్శనము నా కళ్ళముందర కనిపిస్తున్నదని నేను ఒప్పుకొనుచున్నాను. ఆయన ఉన్నాడని నేను ఎరుగుదును. ఆమేన్! ఈ ఘడియలో ప్రపంచములో యున్న ప్రతీ దెయ్యమునకు నేను సవాలు చేయుచున్నాను. నిజము! ఆయన దేవుడు. క్రీస్తు కేవలము ఒక ప్రవక్త కాదు, ఆయన దేవుడైయున్నాడు. ఆయన దేవుడైయున్నాడు, అందులో సందేహము లేదు
HEB 13:8
80కొంత సమయమునకై మన యొక్క శిరములు వంచుదుము. ఇక బోధించలేను - ఎటువంటి అభిషేకము! [టేపు పై ఖాలి.]
ప్రభువు యొక్క నామము దీవించబడును గాక. ఆయన నిన్న, నేడు, ఏకరీతిగా యున్నాడని నా హృదయపూర్వకముగా ఒప్పుకొనియునాను.
పరలోకపు తండ్రీ, అది నీవేనని నేను ఒప్పుకొనుచున్నాను. దేవా, నేను ఈ వేదికను విడిచిపెట్టి వెళ్ళకమునుపు, నీవు గొప్ప కార్యము చేయుదువు అని నేను ప్రార్ధించుచున్నాను. మరొక్కసారి, ఇది నీవేనని, ప్రజలకు రుజువు చేయుము. నేను ఈ జనులను నీకు సమర్పించుచున్నాను. ప్రభువా, మేము మీ హస్తములలో యున్నాము. మీ చూపునకు మేము సరిపోయినట్లుగా చేయండి. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
81ఏదో జరిగినది. దేవుడు ఇక్కడనే యున్నాడని నేను ఒప్పుకొనుచున్నాను.
ఏవైనా ప్రార్ధనా కార్డులను, ప్రార్ధనా కార్డులను అతను ఇచ్చెనా? లేదు. అవి మనకు అవసరము లేదు. ఆయన ఇక్కడ యున్నాడు అని నేను నిశ్చయత కలిగియున్నాను. దానిని మీరు నమ్ముచున్నారా? మీరు గనుక సంపూర్ణముగా ఒప్పుకొనినయెడల, "యేసూ, నా బలహీనతలలో నేను నిన్ను ముట్టుకొనుచున్నాను. సహోదరుడు బ్రెన్హాం సత్యమును చెప్పెనని నేను నమ్ముచున్నాను. అతను ఒక మనిషి మాత్రమే; నీవు దేవుడవు. అయితే అతను నిజము చెప్పుచున్నాడని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా అది వాక్యమైయున్నది. ప్రభువా, అది జరుగును గాక. ఆయన నాతో మాట్లాడి మరియు నాకు చెప్పనివ్వు నేను ఒప్పించబడునట్లు చేయుము."
ఈ కూటములో, ఇక్కడ ఆయన ముందుగానే యున్నాడు. అక్కడ కూర్చోని యున్న ఆ స్త్రీ, నరాల బలహీనత కొరకు ఆమె ప్రార్థించుచున్నది. ఆమెతో యున్న ఆమె యొక్క చిన్న బాలిక, మందబుద్ధి కలిగియున్నది. (మెదడు ఎదుగుదల తక్కువగా యున్నది). దానిని నమ్ముదువా? ఇంటి యొద్ద వ్యాధిగ్రస్తురాలైన తల్లి ఉన్నది. విశ్వాసముంచుము; సందేహించవద్దు! నీవు దేనినయితే అడిగితివో, దానినంతటిని పొందుకొనెదవు.
MARK 9:23
82మానవ రూపములో వచ్చి, తన వీపు భాగమును గుడారము వైపునకు త్రిప్పి, అబ్రహాముతో మాట్లాడిన అదే దూత ఈ రాత్రి ఇక్కడ యున్నాడు అని నేను ఒప్పుకొనుచున్నాను. అది నెరవేరును అని ఆయన వాగ్దానమిచ్చియున్నాడు. అదే దూత మనలను అభిషేకించును అని నేను విశ్వసించుచున్నాను, ఏలయనగా అది దేవుడైయున్నాడు. దానిని నీవు విశ్వసించుచున్నావా?
అది సరియే, శారా, ఇక్కడే ఎక్కడో, నీవు దేవునితో మాట్లాడుచున్నావు. సహోదరీ, నేను నేను ఒప్పుకొనుచున్నాను. సహోదరుడా, నేను ఒప్పుకొనుచున్నాను, అది సత్వము అని నేను ఎరిగియున్నాను.
నిశ్చయముగా వెనుక ఒక స్త్రీ కూర్చొనియున్నది. ఆమె గుండె సమస్యతో యున్నది. ఆమె నా వెనుకనే కూర్చొనియన్నది. ఆమెను నేను ఎరుగను. ఆమె యునది. ఆమె నా ముందర నిలబడి యున్నది, ఆమె నడివయస్కురాలు. ఆమె ఇక్కడ నివాసముండే స్త్రీ కాదు. ఆమె వర్జీనియా నుండి వచ్చియున్నది. శ్రీమత్రి. స్టాక్సు, యేసుక్రీస్తు మిమ్ములను బాగుచేయును. ఇక్కడనే ఆమె కూర్చొనియున్నది. చూద్దాం. ఇక్కడనే, ఆమె యున్నది. విశ్వసించుము, నీవు నమ్ముచున్నావా? "నీవు నమ్మినట్లయితే, నమ్మువానికి సమస్తము సాధ్యము."
MARK 9:23
83అమ్మా, దాని గురించి నీవేమనుకొనుచున్నావు? నేను మరియు నీవు ఒకరికొకరము అపరిచితులము? ఆయన ప్రవక్తయైయున్నానని నీవు నన్ను నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? నీవు తల సమస్య కలిగియున్నావు. అది సరియేనా. నీ పేరు శ్రీమతి మూర్. అది సత్యమైనచో నీ హస్తమును పైకి లేపుము. ఇంటికి వెళ్ళుము, స్వస్థత పొందుకొనుము.
నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, ఇక్కడ నా ముందర ఎవరో ఒకరు కనిపించెను. ఇక్కడనే, ఎవరో. ఆమె ఒక స్త్రీ. ఆమెకు రొమ్ము మీద కేన్సర్ ఉన్నది. శ్రీమతి. రోడ్స్. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముము. ఆ స్త్రీని నేను ఎరుగను. దేవుడు ఆమెను ఎరుగును. "నీవు నమ్మినట్లయితే సమస్తము సాధ్యము." నిజము.
ఒక వ్యక్తి అక్కడ కూర్చొనియుండి ప్రార్థించుచున్నాడు, అతను తుల్సా ప్రాంతమునకు చెందినవాడు. శ్రీ. హర్వుడ్ ప్రభువైన యేసుక్రీసునందు విశ్వాసము తాకియున్నాడు. వెళ్లి స్వస్టత పొందుకొనుము. విశ్వసముంచుము. నేను ఆ వ్యక్తిని ఎరుగను; నా జీవితములో ఎన్నడు చూడలేదు. మనము ఒకరినొకరు ఎరుగనివారము, అయితే అది నిజము. ఎందుకు? అతడు దేనినో తాకెను.
మీరు ఒప్పుకొనియున్నారా? దేవుడు ఆయన వాక్యమును నిలుపుకొనును అని నీవు ఒప్పుకొనుచున్నావా?
నీవు ఒప్పుకొనియున్నట్లయితే… మీలో ఎంత మంది అవసరతను కలిగియున్నారు? ఇప్పుడు, నిశ్చయముగా, ఆ బావి యొద్ద స్త్రీ తలంచిన విధముగా…. ఈ ప్రజలను అడుగుము; వెళ్ళి వారితో మాట్లాడుము, వారు ఎక్కడ ఉన్ననూ… నేను వేరొక వ్యక్తిని చూచుచున్నాను; అవును, వేరొక వ్యక్తి. గమనించండి, అది సరియేనా లేక కాదా చూడండి.
84ఇప్పుడు, ఇది భవనమును ఆవరించియున్నది. ఈ భవనమంతయూ, ఈ స్థలమంతయూ అభిషేకించబడినది. ఇక్కడ ఉన్న ప్రతీ వ్యక్తిని యేసుక్రీస్తు యొక్క సన్నిధి స్వస్థపరచును అని నేను ఒప్పుకొనుచున్నాను.
అలాగుననే మీరు ఒప్పుకొనుచున్నారా? నేను నీకు సత్యమును చెప్పుచున్నానని నీవు ఒప్పుకొనుచున్నావా? నేను నీకు సత్యమును చెప్పుచున్నానని దేవుడు రుజువు పరుచుచున్నాడు. అలాగయినచో, మీరు లేచి మీ పాదములపై నిలువబడి, మీ స్వస్థతను అంగీకరించుమని నేను యేసుక్రీస్తు యొక్క నామములో ఆజ్ఞాపించుచున్నాను. మీరు ఒప్పుకొనినచో, ఆయన వైపునకు మీ చేతులను ఎత్తండి, మరియు ఆయనకే స్తుతి చెల్లించుడి.
పరలోకపు తండ్రీ… యేసుక్రీస్తు నామములో సాతాను ఓడిపోయెనని వారు ఒప్పుకొనువరకు, పరిశుద్దాత్మ ఈ భవనమును నింపును గాక.
సాతానా, ఇక్కడ యీ స్థలమును విడిచి బయటకు రా. ఇది యేసుక్రీస్తు యొక్క సన్నిధి అని మేము ఒప్పుకొనియున్నాము. అది నిశ్చయముగా జరుగును గాక.