జీవమార్గము

జీవమార్గము

VGR COUNT-173 , 1మీకు తెలుసు, ప్రజల మధ్యన ఉండుట అది ఒక చక్కని భాగ్యము. మరియు అప్పుడు ఒక యూదుల సమాజములో ఉండుట ఇది నాకు మొదటిసారి, ఇది నాకు చాలా అరుదైన ఆదరణ. మరియు తరువాత, ఇక్కడ ఉన్న ఈ గ్రంథపు చుట్టల యొక్క క్రమము, మరియు అవి ఏ విధముగా జాగ్రత్త తీసుకొనబడుతున్నాయి - మరియు అటువంటి వాటిని అర్ధము చేసుకొనుట ఈ సమాజ మందిరములోనికి ఒకసారి వచ్చి మరియు స్వస్థతా కూడికను కలిగియుండుట, యూదులతో అది చాలా మంచి సమయముగా ఉండును. సహోదరుడా, వందనములు. చాలా వందనములు.

యూదుల ప్రజల కొరకు నేను ఎల్లప్పుడూ ఒక అనుభూతిని కలిగియున్నాను. ఈ ఉదయమున బహుశా ఇక్కడ ఎవరూ లేకపోవచ్చు, కానీ నేను వారి కొరకు ఒక అనుభూతిని కలిగియున్నాను. ఎల్లప్పుడూ కలిగియున్నాను. మరియు నేను నమ్ముచున్నాను యూదులు దానిని అన్యులకు ఇచ్చినట్లుగా, ఒక రోజు అన్యుల యొక్క సంఘము ఈ వర్తమానమును యూదుల యొద్దకు తీసుకొని వెళ్ళును. నా హృదయమంతటితో దానిని నేను నమ్ముచున్నాను.

మరియు అది యూదుల యొద్దకు సంపూర్ణముగా వెళ్ళినప్పుడు, మీరు గమనించండి, అప్పుడు అన్యుల యొక్క ద్వారము మూసివేయబడును, మరియు అప్పుడు యూదులే. కనుక ఆ సమయము ఇప్పుడే. కనుక ఇప్పుడే సరిగ్గా లోపల ఉండినందుకు చాలా ఆనందించుచున్నాను.

2ఈ దయగల చిన్నవాడైన, సహోదరుడు మైఖల్సన్ ను దేవుడు దీవించును గాక. నా జీవితమంతటిలో నేను ఎన్నడూ అతడిని చూడలేదు. ఒకవేళ అతడు ఇక్కడ నిలబడియుంటే నేను అతడిని ఎరిగియుండెడివాడను కాదు. అతడు ప్రేక్షకులలో ఉండియుండవచ్చు, మరియు దానిని నేను ఎరిగియుండెడివాడను కాదు. కానీ నేను అతడి కార్యక్రమమును విన్నాను, మరియు దానిని నేను అభినందించాను - దేవుని యొక్క గొప్ప సేవకుడు, ఆ దీన చిన్న యూదుడు తన జీవితమును ఇప్పుడు దేవుని యొక్క సేవలోనికి ఇచ్చివేసియున్నాడు. "నా యేసు," అని అతడు చెప్పే విధానమును నేను ఇష్టపడుదును. అవును, "నా యేసు." ఆలోచించినయెడల దానిని చెప్పుటకు ఒక యూదునికి చాలా ఆశ్చర్యమైనది.

అతడు ఖచ్చితముగా ఒక దివిటీ మోయువాడు, ఇక్కడ అమెరికా చుట్టుప్రక్కల, ఈ దేశములో యూదా ప్రజలకు ఒక దివిటీ పట్టుకొనువాడు. మరియు నా యదార్ధమైన ప్రార్ధన ఏదనగా: దేవా, ఒకవేళ అది సాధ్యమైతే, యేసు వచ్చేంత వరకు ఆ వృద్ధ బలహీనమైన చేతులకు దానిని పట్టుకునేంత బలమును ఇమ్ము. నేను అతడిని ప్రశంసించుదును. ఆ ముసలివారు మంచి పోరాటములు పోరాడినప్పుడు నేను వారిని ప్రశంసించుదును.

2KGS 2:12•

2KGS 13:14

 

3డాక్టర్ ఎఫ్.ఎఫ్. బోస్వర్త్ ను జ్ఞాపకముంచుకొనండి, నా సహాయకులలో ఒకడు. ఎనభై-నాలుగు సంవత్సరముల వయస్సులో అతడిని చూచుటకు నేను వెళ్ళినప్పుడు, అతడు తన చిన్న బలహీనమైన చేతులను ఆ విధముగా చాచెను, మరియు వారు అక్కడ … వారు ఎనభై సంవత్సరాల వయస్సులో ఇప్పుడే ఆఫ్రికా నుండి వచ్చారు, నాతో పాటు అడవులలో సేవ చేయుచున్నారు, మరియు నేను అతడి యొద్దకు పరుగెత్తి, నా చేతులను అతడి చుట్టూ వేశాను. అతడు చనిపోవుచున్నాడని నాకు తెలుసు, మరియు నేను మొర్రపెట్టాను, "నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకు రధములును, రౌతులును నీవే." ఎంతో ధైర్యశాలి.

మరియు అతడు చెప్పాడు, "సహోదరుడా బ్రెన్హాం, నా జీవితమంతటిలో ఇదే ఆనందకరమైన సమయమైయున్నది." అతడు చెప్పాడు…

నేను చెప్పాను, "నీవు చనిపోతున్నావని నీకు తెలుసా?"

అతడు చెప్పాడు, "నేను చనిపోజాలను. నేను ఇప్పటికే అరవై సంవత్సరముల నుండి చనిపోయాను." అతడు చెప్పాడు, "నేను ఆ క్షణము కొరకే ఎదురుచూచుచున్నాను, నేను జీవించినదానంతటి కొరకు నేను చూస్తూన్నప్పుడు, ఆయన గృహములోనికి నన్ను ఆహ్వానించుట కొరకు ఆయన ఆ ద్వారము గుండా నడిచి రావడము నేను చూస్తున్నాను." చెప్పెను, "అదే ఆ మార్గము."

అప్పుడు నేను ఆలోచించెదను,

గొప్ప వారి యొక్క జీవితములన్ని మనకు గుర్తుచేయును

మన యొక్క జీవితములను అద్భుతముగా మార్చుకొనవచ్చు,

మన వెనుక కాలమను ఆ ఇసుకపై

మన అడుగు గుర్తులను మన వెనుక విడచినప్పుడు.

అది నిజము. అవునా? [ఎవరో ఒక ప్రశ్న అడుగుచున్నారు.] నేను వినియుండకపోవచ్చు కేవలం… అతడు చేతులతో కరచాలనము చేసాడు అని నేను విన్నాను - గదిలో నిలబడి, కరచా … [శ్రోతలలో ఒకరు మాట్లడుచున్నారు.] అవునయ్యా, నేను దానిని విన్నాను. అది సరియే, బ్రదర్ గోఫ్ఫ్, దానిని గూర్చి నీవు నాకు జ్ఞాపకము చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. వారు చెప్పారు అతడు చనిపోవుటకు కొంచెము ముందు, లేక గృహమునకు వెళ్ళుట, అతడు పైకి లేచి, చాలా కాలము నుండి తన పరిచర్య ద్వారా క్రీస్తులోనికి వచ్చిన వారందరితో కరచాలనము చేసెను, మరియు తన ఆత్మను విడిచెను, మరియు వారితో ఉండుటకు వెళ్ళెను. ఎంత ధైర్యశాలి… అటువంటి సంగతులను నేను ప్రేమించెదను. అది కేవలము…

4సహోదరులారా, ఇక్కడ లాస్ఏంజిల్స్ లో ఉండుట ఒక భాగ్యమైయున్నది, లేక ఈ సౌత్-గేట్ - ఇక్కడ దీనిని ఏమని పిలుచుచున్నప్పటికీ - ఎక్కడైతే మనము ఈ అందమైన సహవాసముతో కూడికను కలిగియున్నామో, అది … మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించుచున్నారు. మరియు ఒకవేళ రావాలనే ఒక రకమైన ఈడ్పు గనుక నాకు కలిగియుండకపోతే నేను వచ్చియుండేవాడిని కాదు.

మరియు నా పరిచర్య ఒక స్థానమునకు వచ్చియున్నది, అది దాదాపుగా ఒక బలప్రదర్శన యొక్క ముగింపునకు వచ్చియున్నదని నేను గ్రహించాను, నేను అన్ని సంగతుల వలే అది కూడా వచ్చినది… నేను కలిగి… లోకము కలిగియున్న, మరియు ఆ సంఘాలు (అసోసియేషన్లు) మరియు అటువంటివి, వారు ఆ సంగతులను మాట్లాడుట ప్రారంభించారు, అది నేను ఒక అబద్ద ప్రవక్తను, మరియు అన్నీ మరియు అది వచ్చుట కొరకు నేను చూస్తున్నాను. ఇప్పటికి ముందుగా అది రాలేకపోయినందులకు నేను ఆశ్చర్యపడుచున్నాను, మరియు … కాని అది ఇంకనూ మరింత హీనముగా అగుట కొరకు నేను చూస్తున్నాను.

మరియు నా పరీక్షల యొక్క ఈ ఘడియలో, మరియు అమితమైన బాధల గుండా వెళ్ళుచుండగా, సహోదరులైన మీరు, మీ చేతులు చాచడం కనుగొనినప్పుడు, మరియు నేను మిమ్ములను అభినందిస్తున్నాను. ప్రభువు మిమ్ములను దీవించును. మరియు సహోదరత్వమును కలిపి ఏక హృదయములో ఐక్యము చేయుటకు, బలపడే విధముగా సంఘములకు సహాయము చేయుటకు, మరియు ఏ విధముగా చేయవలెనని నేను ఎరిగియున్నానో ఆ విధముగా సమస్తమును చేయుటకు నేను ఇక్కడ ఉన్నాను. మరియు నేను కలిగియున్న ఉద్దేశ్యము అదే. మరియు గతరాత్రి నేను చెప్పినట్లుగా, ప్రతీ చిన్న మూలన వల విసిరి, మరియు దేవుని యొక్క రాజ్యము కొరకు పట్టగలిగిన ప్రతీ చిన్న చేపను పట్టుకొనెదము.

5మరియు ఇప్పుడు, గతరాత్రి నేను ఆలస్యమయ్యాను, మరియు మేము ఆలస్యముగా ప్రారంభించాము. మరియు దాదాపుగా నేను ఎప్పుడూ ఆలస్యమే. నా తల్లి చెప్పెను, నేను పూర్తి తొమ్మిది నెలలు నిండిన బిడ్డను, మరియు ఆ రకముగానే నేను ఇక్కడ ఆలస్యమవుచున్నాను. మరియు నేను కేవలము అయిదు పౌండ్ల బరువుతోనే పుట్టాను, మరియు నేనొక చెడ్డ ప్రారంభమును కలిగియున్నాను, మరియు ఎన్నడూ చాలా పెద్దగా అవ్వలేదు. నేను నా వివాహము కొరకు ఆలస్యమయ్యాను. నేను నా భార్యను చాలా సమయము ఎదురు చూసేలా చేసాను. మరియు అది ఎల్లప్పుడూ ఎదురుచూపు మరియు ఆలస్యము. ఇప్పుడు, ఒకవేళ నేను నా సమాధి కార్యక్రమము కొరకు ఆలస్యమైన, అంతే చాలును. వారు వేచిచూడగలిగినంత కాలం వారిని వేచి చూడనివ్వండి, ఎందుకనగా ఎంతకాలమైతే అంత నేను సువార్తను బోధించగలిగి మరియు నా సహోదరులతో సహవాసము చేయగోరుచున్నాను. మరియు ఇప్పుడు, అలా ఈ రాత్రి కొంచెము త్వరగా ఉండుటకు నేను ప్రయత్నించెదను.

6గతరాత్రి… ఇప్పుడు, అది కేవలము సేవకులు మాత్రమే అని నేను అర్ధము చేసుకున్నాను. నేను ఒక ఎరను వేయుటకు ప్రయత్నించుచున్నాను. ఇప్పుడు, అక్కడ పాపులు కూర్చొనియున్నారు, చూశారా. మరియు మొదటి సంగతి… నేను ఎందుకు వేదిక పిలుపును పిలవలేదు, అని మీరు ఆశ్చర్యపడవచ్చును. మొదటి సంగతి, నేను కొంచెము ఆలస్యమయ్యాను అని నేను అనుభూతి చెందాను, మరియు అది ప్రజలను అలసటకు గురిచేయును, మరియు అటువంటివి. కానీ వివేచనా లేక మరి ఏదో దాని క్రింద కేవలము ఒక చిన్న ఎరను వేసినయెడల, మరియు అది వారిని ఆకర్షిస్తుంది. మరియు అప్పుడు మీ వలను చుట్టూ విస్తరించవచ్చును, మీరు చూశారా, మరియు అప్పుడు వారిని లోపలికి తీసుకొని రండి. ఇప్పుడు కొంచెము నాతో భరించండి. ఆత్మ ఏ విధముగా నన్ను నడవమని చెప్పుచున్నదో, ఆ విధముగానే నేను నడుచుచున్నానని నేను తలంచుచున్నాను.

మరియు ఇప్పుడు, రక్షింపబడగోరియున్న మరియు ఆత్మతో నింపబడగోరిన వారిలో కొందరిని ఒకవేళ మనము వలలోనికి తీసుకొని రాగలిగితే, సహోదరులారా, ఏ పరిపాలనా ప్రాంతము నుండి వారు బయటకు వచ్చారని మీరు తెలుసుకొందురు. వారిని మీ సంఘమునకు తీసుకొని వెళ్ళండి, ఎందుకనగా అది… బలిపీఠము యొద్దకు వారిని లాగుట అనునది కావలసినంత దూరము వారిని మనము అక్కడకు తీసుకొని వెళ్ళెదము. మరియు అప్పుడు, మార్గమధ్యలో అక్కడ నుండి నీవు వారిని తీసుకొని వెళ్ళుము. వారిని లోపలికి తీసుకొనుము, మరియు వారికి బాప్తిస్మము ఇమ్ము, మరియు వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకునేంత వరకూ వారితో నిలిచియుండుము. మరియు సూర్యుడు పశ్చిమమున అస్తమిస్తుండగా, మరియు సాయంకాలపు వెలుగు కనుమరుగవుచుండగా, దానికొరకే ఈ గొప్ప చీకటి ఘడియలో మనమిక్కడ ఉన్నాము.

7మరియు నేను ప్రజల మధ్యలో ఉన్నాను… ఒకవేళ నీవు, మీలో చాలా మంది… అది ఏమీ రహస్యము కాదు - మీరందరూ నా టేపులను కలిగియున్నారు, మీరందరూ. కానీ అక్కడనున్న ప్రజల మధ్యలో, నేను గుడారములో లేక ఏదో చోట ఉండుటకు ఇష్టపడెదను, నేను లేఖనపరమైన, హితబోధలను సమీపించను, మరియు సేవకులు ఆ టేపులను తీసుకొనుచున్నారు మరియు చదువుచున్నారు. ఈ ఉదయకాలమున ఆ పాతదేశము నుండి వచ్చియున్న ఒక గ్రీసు దేశస్తుడు నన్ను కలిసికొన్నాడు, మరియు అతడు నా ఆరు గంటల టేపు అయిన "వాక్య విత్తనమును" కలిగియున్నాడు. మరియు అతడు నాకు చెప్పియున్నాడు, అతడు ప్రతీరోజు కొంచెము వెళ్ళి, మరియు వాటిని తీసుకొని, మరియు దానిని విరిచి, మరియు గ్రీకులోనికి దానిని తీసుకొని వచ్చుచున్నాడు; మరియు అతడు ఏ విధముగా చూపించుచున్నాడు ఎలా అని (నేను దానిని గూర్చి ఏమియూ ఎరుగను) - ఎలా అది ఆ విధముగా కూర్చబడుచున్నది అని. అది చదువుట కొరకు.

ఇక్కడ మనము చేపలు పట్ట ప్రయత్నించుచున్నాము. అది ఇదే. మనము అక్కడ ఎరను పెట్టుచున్నాము, మరియు ఆ చేపకు ఎన్నడూ గాలమును చూపించము. దానికి మీరు ఎరను చూపుదురు. అది ఎరను లాక్కొని మరియు గాలమునకు పడును, కనుక అది అది నా సమయమంతయూ రోగులకు ప్రార్ధన చేయుట, మరియు అటువంటి సంగతులు, అది కేవలము పాపి యొక్క దృష్టిని పట్టుకొనుట కొరకు. అదే ఎర అయియున్నది. కానీ గాలము, సువార్త గాలము, మీరు దానిని ఉపయోగించెదరు. నేను అతడి ముందు కేవలము ఎరను అల్లాడించెదను, మీరు చూశారా. కనుకనే మీరు గాలము ఉపయోగించెదరు.

8కనుక అప్పుడు… మరియు ఈ రాత్రి మనయొక్క చిన్న మాటలు ఇంకనూ చిన్నగా చేయుటకు ప్రయత్నించేదను, మీకు తెలుసు, కనుక నేను కేవలము… మరియు నేను మాట్లాడుటకు ముందు సహోదరుడు బోర్డర్స్ కొంచెము మాట్లాడును, మరియు లోనికి వచ్చెదను. నేను నా ప్రసంగమును కొంచెము… అవి చిన్న మాటలు కనుక, సహోదరులారా అవి మీకు పరిపక్వత లేని మాటల వలె ఉండును, మరియు ఒకవేళ మీరు వాటిని ఆలోచిస్తే, అవును నేను చెప్పునదేదైనా అవి బహుశా మీకు పరిపక్వము లేనివాటిగా ఉండవచ్చు. కానీ మీరందరూ బోధకులు, మరియు నేను ఒక బోధకుడను కాను. కానీ నా యొక్క ఉద్దేశ్యము దేవుని యొక్క రాజ్యమునకు సహాయపడుటకు ప్రయత్నించుట, మీ సంఘములను బలపరచుటకు ప్రయత్నించుట, మరియు జనుల మధ్యలో సహోదరత్వమును బలపరచుట, ఏలయనగా మనము ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. మరియు దానిని మీరందరూ అర్ధము చేసుకొనెదరు అనే నిశ్చయత నేను కలిగియున్నాను.

మరియు ఇప్పుడు, ఇక్కడ లాస్-ఏంజిల్స్, ఈ ఉదయకాలమున నేను గమనించాను… మరియు నేను, నా యొక్క స్నేహితులను కొంతమందిని ఇక్కడ కలిసాను: జెఫర్సన్-విల్ నుండి వచ్చిన బ్రదర్ సాత్మన్, మరియు మూలమునకు అతడు ఒక కెనడా దేశస్తుడు; మరియు బ్రదర్ టామ్ కూడా ఒక కెనడా దేశస్తుడే, ఈ సమయములో అతడు కూడా మాతో పాటు జెఫర్సన్-విల్ లో తాత్కాలికముగా నివసించుచున్నాడు; మరియు జార్జియాలోని, టిప్టన్ నుండి వచ్చిన బ్రదర్ వెల్ష్ ఈవాన్స్, మాతో పాటు తాత్కాలికముగా నివసించువాడే, నేను సువార్తను ప్రసంగించుటను వినుటకు ప్రతీ ఆదివారము పదిహేను వందల మైళ్ళ దూరము నడుపుచున్నాడు. ఇప్పుడు, అక్కడ సహోదరుడు నార్మన్ మరియు సహోదరి నార్మన్, మరియు సహోదరి ఈవాన్స్ మరియు సహోదరుడు విల్లీ ఉన్నారు. నేను ఎన్నడూ ఆలోచించలేను… మేము కూడికకు వెళ్ళుచుండగా మమ్ములను బలపరచుటకు, మరియు మాతో పాటు ప్రార్ధించుటకు, చిన్న గుంపు అక్కడ కూర్చొనియున్నది, మాతో పాటు ఇక్కడకు వచ్చారు. కూడికలలో వారిని మనతో పాటు కలిగియుండుట సంతోషము.

9ఇప్పుడు, ఈ కూడికలో కూర్చొని, నేను చూచాను, మేము ఒక పుస్తకము నిండా కూడికలను కలిగియున్నాము - కేవలము ప్రజలు. మరియు ఇప్పుడు మనము సంఘ శాఖల సహోదరుల మధ్యలో కలిగియున్న చిక్కు, మరియు వారిలో చాలా మంది, వారు… సంఘ శాఖ సహోదరులైన మీరందరూ… అయినా, ఈ ఉదయకాలమున ఈ బలిపీఠముపై, నా అభిప్రాయమును నేను వ్యక్తపరచగోరుచున్నాను, చూశారా. సహోదరులారా, మీ గురించి మీరే తెలుసుకొనండి, మీ జనుల మధ్యలో ఈ విధముగా మీరు ఏదో చెప్పవచ్చు, మరియు ఒకరు ఈ విధముగా తీసుకొని, మరియు ఈ విధముగా దీనిపైన ఆనుకొనుటను ప్రారంభించిరి. మరియు అతడు తరువాత వానికి చెబుతాడు, మరియు తరువాత వాడు ఆ తరువాత వానికి, మొదటి సంగతి మీకు తెలుసా, అదంతయూ అర్ధము చేసుకొనుటకు దూరముగా ఉన్నది. మరియు ఒకరు ఈ వైపు ఒరిగి, మరియు మరోవైపునకు తీసుకొని పోయెదరు. మీకది తెలుసు.

సహోదరులైన మీరు దానిని అర్ధము చేసికొనియున్నారనీ నాకు ఖచ్చితముగా తెలుసు. ఆ విధముగానే చాలా సంగతులు నా గూర్చి చెప్పబడినవి, అవి కొందరి ద్వారా తీసుకొనబడి మరియు అపార్ధము చేసుకొనబడినవి, మరియు తప్పుగా నడిపించబడ్డారు. అదెంత మాత్రము అర్ధము అది కాదు.

10సంఘ శాఖలకు వ్యతిరేకముగా ఉండుట అనునది, ఖచ్చితముగా కాదు. నా సహోదరులు అక్కడ ఉన్నారు. అది ఈ రోజు చాలా మంది ప్రజలు సంఘ శాఖపై ఆధారపడినట్లు ఉన్నది. ఇప్పుడు, ఐక్య సహోదర సంఘము నుండి వచ్చిన ఒక సహోదరుడు ఇక్కడ కూర్చొనియున్నాడు, మరియు వేర్వేరు స్థలములు. ఎంతవరకైతే మీరు మీ వస్త్రమును కొంచెము సాగదీసి పరిచినట్లైతే, మరియు ద్వారమును తెరువగలిగి, మరియు యాకోబు తవ్వించిన మూడవ బావి (అది ఏమిటో మీకు తెలుసు) యొద్ద త్రాగి, మరియు ఒక సహవాసము కలిగియుండునంత వరకూ, ఆ సంఘ శాఖలకు పరవాలేదు.

కానీ మీరు వచ్చినప్పుడు, మీరు ఎంతకాలమైతే శాఖా సంఘమునకు చెందియుంటారో మీరు చేయవలసినదంతయూ అదే, లేదు, దానిని మించి మరేక్కువైనది ఉన్నది, సహోదరులారా. మరియు అక్కడే ఈ ప్రపంచమంతా ఎల్లప్పుడూ… మరియు మీరు… ఈ ఉదయకాలమున ఒక మంచి చరిత్రకారుడు, ఇక్కడ మనతో కూర్చొండుటను మనము కలిగియున్నాము, మరియు మనకు తెలుసు సంఘములు ఆ గీతను గీసుకున్న వెంటనే, శాఖా సంఘము, "అది మేమే," అక్కడే దేవుడు వారిని విడిచిపెట్టును, మరియు వారు చనిపోయి మరియు ఎన్నడూ తిరిగి ఉజ్జీవింపబడరు, చూశారా. ఒక సంఘము ఎప్పటికిని పడిపోయి, మరియు తిరిగి లేచెనని చరిత్రలో ఎక్కడనూ లేదు. అది లేవదు. మరియు ఎందుకనగా…

11మొదటిగా నేను దీనిలోనికి వచ్చినప్పుడు, ఈ పరిచర్యలో, ఐక్య పెంతుకొస్తు సంఘము యొక్క సహోదరులైన మీరే మొదటిగా నా కొరకు మీ చేతులను చాచియున్నారు. అది బ్రదర్ రిచర్డ్ రీడ్, బ్రదర్ జాక్ మూర్, మరియు బ్రదర్ బెన్ పెంబర్ట్న్, మరియు సెయింట్ లూయిస్ నా మొదటి కూడిక. మరియు నేను హాజరైన మొదటి కూడిక, మరియు దానిని గూర్చి ఎరిగియున్నదేమైనా ఉందంటే, అది P.F.W., P.F.J.C. (వివిధ సంఘ శాఖలు) మరియు వారు విలీనము కాకమునుపు ఉన్నట్లుగా మరియు కలిసి వచ్చి - మిష్వాకా వద్ద బ్రదర్ ర్యాల్, మరియు సహోదరుల యొక్క అటువంటి అందమైన సహవాసమును నేను ఎన్నడూ చూడలేదు.

అయితే, అప్పుడు నేను కనుగొన్నాను… పెంతుకొస్తు అంతయూ అదే అని నేను తలంచాను. అదే పెంతుకొస్తు. కానీ ప్రతీచోటా చుట్టూ వేర్వేరు గుంపులు ఉండడం నేను కనుగొన్నాను, మరియు ప్రతీ ఒక్కొక్క దానిలో మంచి వ్యక్తులు ఉన్నారు. కనుక నా చేతులు బయటకు చాచి ఖాళీలో నిలబడుటకు నేను ప్రయత్నించాను, ప్రతీ ఒక్క సహోదరుడిని సహవాసము యొక్క ఐక్యతలోనికి పిలుచుటకు ప్రయత్నించుచున్నాను, వారు ఏమి నమ్మినప్పటికి, మనము సహోదరులముగా ఉన్నంత కాలము మనము ఒక అవగాహన కలిగియుండెదము. ఎందుకనగా నాకు ఖచ్చితముగా తెలుసు, ఒకవేళ నన్నునేను ఉంచుకొనవలసి వచ్చినప్పుడు… ఈ ఉదయకాలమున దేవుడు నా ముఖముపై వేలు పెట్టి చూపించునంతగా అనేకమైన తప్పిదములు ఉన్నవి, మరియు చెప్పును, "యవ్వనస్తుడా, నిన్ను నీవు పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చుటకు నీవు చాలా దూరములో ఉన్నావు." కనుకనే ప్రతీ ఒక్కరిని గూర్చి నేను ఆ విధముగానే అనుభూతి చెందుటకు నేను ప్రయత్నించెదను, వారిని అందరినీ కలిపియుంచుట. ఇప్పుడు, సహవాస ఐక్యతను కలిగియుండుట, అదియే నా ఉద్దేశ్యము. దేవుడు ఎప్పటికీ మిమ్ములను దీవించును.

12మరియు కొద్ది క్షణముల క్రితము నేను చెప్పుట ప్రారంభించినప్పుడు, వీటన్నిటి మధ్యలో, మరియు సువార్త పొలముల నుండి, వందలాది ప్రదేశముల నుండి పిలుచుచున్నారు. మరియు ఇప్పుడు, నేనొక సువార్త యాత్రను కలిగియున్నాను. నేను దేశమును దాటుచున్నాను. మరియు నేను దానిని విడిచిన వెంటనే, ఒక మీషనెరీ యాత్రపై విదేశాలకు వెళ్ళుచున్నాను.

మరియు నాలో నేను ప్రయత్నించుచున్నాను, దానిని వివరించుటకు సమయము లేదు, దేవుని యొద్ద నుండి ఏదో వెదుకుట, ఎందుకనగా నేను నమ్ముచున్నాను ఆ సమీపించు… మనము తలంచుచున్న దాని కన్ననూ క్రీస్తు యొక్క రాకడ ఎంతో సమీపముగా నున్నది. అది ద్వారము యొద్దనే ఉన్నదని నేను నమ్ముచున్నాను, మరియు దానిని గూర్చి నేను ఆలోచించినప్పుడు, అది నిజముగా నాకు వణుకు పుట్టించుచున్నది. నా గురించి వణకుట కాదు, కానీ దీనిని గూర్చి వణుకుట; నేను చేయగలిగిన శ్రేష్ఠమైనది చేశానా? దేవుని యొక్క రాజ్యము కొరకు నేను ఇవ్వగలిగిన మరొక్క ఔన్సు నాలో ఉన్నదా? నేను చేయగలిగినది మరేదైనా ఉన్నదా, ఎందుకనగా మనము ఎప్పటికి కలిగియుండబోవుచున్న ఒకే అవకాశము ఇది, ఇప్పుడే.

13మరియు నేను సంఘమును గద్దించాను, మా జనులను నేను గద్దించాను, వారి యొక్క జుట్టును కత్తిరించుకొనుచున్నందుకు మా సహోదరిలను నేను గద్దించాను, మేకప్ వేసుకొనుచున్నందుకు వారిని గద్దించాను. దానిని చేయుటకు అనుమతించుచున్న మా సహోదరులను నేను గద్దించాను, మరియు మా సేవకులు మరియు అటువంటి సంగతులు - నేను ఏదో వారికి వ్యతిరేకముగా ఉన్నానని కాదు. అది ఎందుకనగా నేను వారి యందు రోషము కలిగియున్నాను. వారు దేవుని యొక్క వారసత్వపు సంపద.

మరియు నేను మా సేవక సహోదరులను ఒక చిన్న గుంపులోని ఒక చిన్న సంగతి యొద్దకు తమను తాము లాగుకొనవద్దని గద్దించాను. ఇప్పుడు, నేను ఆలోచించదను… ఒకవేళ ఒక సంఘశాఖ ఉన్నదని చెబితే, "మేము దీనిని నమ్మొదము, దానితో పాటు, దానికి దేవుడు జత చేయునవన్నీ…" కానీ మనము మన సంఘ శాఖల పరిధులు చేసుకున్నప్పుడు, మనము చెప్పెదము, "మేము దీనిని నమ్మొదము, విరామచిహ్నం (.)," మరియు పరిశుద్ధాత్మ తిన్నగా లోనికి వచ్చును, మరియు దానిలో నుండి బయటకు వెళ్ళును. అది నిజము, చూశారా. ఇప్పుడు, ఒకవేళ మనము దానిని ఒక కామా (,) తో ముగిస్తే, అప్పుడు మనము ఎదుగుతూ ఉండెదము.

14మిన్నెసోటాలోని, మీన్నిపోలీస్ లో ఈ మధ్యనే నేను లూథరన్ సహోదరులతో ఒక కూడికను కలిగియున్నాను. (మీరందరూ దానిని గూర్చి వినియున్నారని నేను తలంచుచున్నాను). మరియు ఓ, మై! అతడు ఇరవై-రెండు పేజీల ఉత్తరములో నన్ను బొగ్గులపై కాల్చెను! అతడు చెప్పాడు, "అదే ఆలోచన!" "గత రాత్రి నేను పదిహేను మైళ్ళ దూరము నడిపాను, ఒక తీవ్రమైన మంచు తుఫానులో, ఒక క్రీస్తు యొక్క సేవకుడిని నేను వినెదనని నేను తలంచాను. మరియు నేను ఏమి విన్నాను అనగా, నేను ఒక సోదె చెప్పేవాడిని నిన్నాను," అని అతడు చెప్పెను.

మరియు ఓ, అతడు… మరియు చెప్పాడు, "నీ యొక్క ఆలోచన, సువార్త పొలములలో పదిహేను సంవత్సరములున్న ఒక వ్యక్తి, మరియు ఇరవై-ఐదు సంవత్సరముల నుండి సువార్తను బోధించుచున్నానని చెప్పుచున్నావు." మరియు చెప్పాడు, "నీవు ఉపయోగించుచున్న వ్యాకరణమును వినుట, మరియు నీవు మాట్లాడే అదే సిద్దాంతము వినుట." అతడు చెప్పాడు, "గతరాత్రి ఇంకను నీవు చాలా చెప్పియున్నావు, అది సాతాను స్వస్థపరచలేడు అని." చెప్పాడు, "అటువంటి వ్యాఖ్య చేయుట నీకు సిగ్గు అయియున్నది."

మరియు నేను తలంచాను, "ఒక లూథరన్ కాలేజి యొక్క ఒక డీను (విశ్వవిద్యాలయంలో ఒక శాఖాధిపతి)!"

15మరియు అతడు చెప్పాడు, "మా కాలేజీ నుండి ఎంతో దూరము కాదు గానీ ఇక్కడ అటువంటి ఆత్మనే కలిగియున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఒక పెద్ద అంగీలాంటిది వేసుకొనును, మరియు ప్రజలు లోనికి వచ్చెదరు, మరియు ఆమె తన యొక్క చేతులను వారిపై ఉంచును. మరియు అప్పుడు ఆమె వారి యొక్క నరములను లాగివేయును, మరియు ఆమె మెడ వెనుక భాగము నుండి ఒక చిన్న వెంట్రుకను తీసుకొని, మరియు దానిని చుట్టివేసి, అక్కడ నుండి రక్తమును తీసుకొని, మరియు ఆమె వెనుకనున్న ఒక వాగు యొద్దకు నడిచెను, మరియు ఆమె తలపై నుండి ఆ విధముగా వాగులోనికి విసిరి వేసెను. ఆమె నడవడం ప్రారంభించెను చేతులతో…"

మరియు చెప్పెను, "ప్రజలు అక్కడ నిలబడియున్నారు, ఒకవేళ వెనుకకు చూచుటకు ఆమె బలవంతము చేయబడితే, రోగము ఆ వ్యక్తి రక్తముపై ఉన్నది… ఆమె యొక్క జుట్టులో." మరియు చెప్పెను, "అప్పుడు, వారు వెనుకకు చూచినప్పుడు, ఆ రోగము ఆ వ్యక్తి యొద్దకు తిరిగి వచ్చును. కానీ ఒకవేళ కాకపోతే," చెప్పెను, "ఆ వ్యక్తి బాగుపడవలసియున్నది." మరియు చెప్పెను, "వారిలో ఇరవై శాతము మంది బాగుపడును. మరియు అప్పుడు దెయ్యము స్వస్థపరచలేదు అని నీవు ఎలా చెప్పెదవు."

16ఓ, అతడు మంచి మానసిక స్థితిని కలిగియున్నాడు. కానీ, సహోదరుడా, మనము సమీపించేది అది కాదు - మానసికము కాదు; మనము లేఖనమును సమీపించెదము. కనుక నేను తలంచాను, "మంచిది, ఇరవై-రెండు పేజీల లేఖ… కనీసము నన్ను సహోదరుడుగా కూడా సంభోదించలేదు; కేవలము చెప్పెను, బ్రెన్హాం." కనుక నేను అనుకొన్నాను, "మంచిది …"

అతడు చెప్పెను, "మరియు నీవు నీ సంవత్సరములను గూర్చి మాట్లాడుచున్నావు", చెప్పెను, "నీవు పుట్టక ముందు నుండే నేను సువార్తను ప్రసంగిస్తున్నాను."

మంచిది, నేను అనుకొన్నాను, "అంతకాలము నుండి సువార్తను ప్రసంగించుచున్న ఒక వ్యక్తి గౌరవమును కలిగియుండవలసియున్నది, అతడు ఏమైయున్నప్పటికీ, చూశారా. మనము అతడిని గౌరవించవలెను.

కనుక నేను కూర్చొని మరియు అతడికి ఉత్తరము ఇచ్చాను - నా చిన్న మొదటి కార్యము, అతడిని గుర్తించుటకు, నేను చేయగలిగిన శ్రేష్ఠమైనది - రెండు పేజీల వెనుక. మరియు నేను చెప్పాను, "ప్రియ సహోదరుడా, నీవు గడిపిన ఈ సంవత్సరములు మరియు ఇవన్నీ నేను ఖచ్చితముగా అభినందించెదను." నేను చెప్పాను, "దానిని నేను అభినందించెదను, క్రీస్తు యొక్క ఒక సేవకుడు, మరియు విమర్శను కూడా నేను అభినందించెదను." ఇప్పుడు, విమర్శను తీసుకొనలేని ఒక వ్యక్తి, అతడి అనుభవముతో ఏదో తప్పు ఉన్నది, మీరు చూశారా, ఎందుకనగా మనలను మనము సరిచేసుకొనుటకే దేవుడు విమర్శను పంపును, మన యొక్క చెడ్డ అంశములను చూనుకొనులాగున చేయుట కొరకు, విమర్శల ద్వారా నేను చాలా సహకరించబడ్డాను, అది స్నేహపూర్వకమైన విమర్శ, అసహ్యపడవద్దు, మరియు కోపపడవద్దు; కానీ కేవలము స్నేహపూర్వక విమర్శ. కనుక నేను చెప్పాను, "అయ్యా, నేను దానిని అభినందించెదను."

MATT 12:24-32•

MARK 3:22,26,29•

LUKE 11:15,18•

LUKE 12:10•

ROM 3:4

 

17మరియు అప్పుడు నేను చెప్పాను, "కేవలము ఒకే ఒక్క విషయము నేను ఇక్కడ వ్యక్తపరచుటకు ఇష్టపడుచున్నాను, మీరు నా వ్యాకరణమును గూర్చి మాట్లాడుచున్నారు కాబట్టి, అవును నేను ఎటువంటి చదువును కలిగి లేను. అది నిజము." కానీ నేను చెప్పాను, "నన్ను ఆశ్చర్యపరచు సంగతి, ఒక లూథరన్ కాలేజీ యొక్క డీన్ తన వేదాంతమును ఒక అనుభవము పైన ఆధారము చేసుకొనును, దేవుని యొక్క వాక్యము బదులుగా, స్వస్థపరిచెడి మంత్రగత్తెను గూర్చి నీవు మాట్లాడినప్పుడు…"

నేను చెప్పాను, "యేసు చెప్పెను, 'ఒకవేళ సాతాను గనుక సాతానును వెళ్ళగొడితే, అప్పుడు అతడి రాజ్యము విడిపోవును.' అతడు స్వస్థపరచలేడు. ఇప్పుడు, మీరు చేయ… చూడండి, ఒకవేళ అతడు చేయ… యేసు చెప్పెను, అతడు స్వస్థపరచలేడు, మరియు మీరు చెప్పారు అతడు స్వస్థపరచువాడని. నేను యేసును నమ్మబోవుచున్నాను, చూడండి, (అది నిజము), ఎందుకనగా ఆయన చెప్పెను ప్రతీ మనుష్యుని మాట అబద్ధము మరియు ఆయనది సత్యము. మరియు నేను చెప్పాను, "నేను యేసును నమ్మెదను."

"మరియు నా ఆశ్చర్యమునకు, ఒక లూథరన్ కాలేజీ యొక్క డీన్ తన వేదాంతమును ఒక అనుభవము పైన, లేక ఒక ఉద్రేకమును ఆధారము చేసుకొనును, దేవుని యొక్క వాక్యము బదులుగా." నేను చెప్పాను, "ఒక డీన్, లేక ఎవరైనా, ఏ సేవకుడైనా తన వేదాంతమును ప్రభువు యొక్క వాక్యము పైన ఆధారము చేసుకొనును."

మరియు నేను చెప్పాను, "నేను ఖచ్చితముగా… మరియు జ్యోతిష్కుడను అని పిలచే మీరు." నేను చెప్పాను, "అది వివేచన అని నేను ఊహిస్తున్నాను." మరియు నేను చెప్పాను, "మన ప్రభువు ద్వారా అదే సంగతి చేయబడడము వారు చూచినప్పుడు, నీకు అది తెలుసా, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఒకప్పుడు తమకు తాము అవే వ్యాఖ్యలు చేసి, ఆయనను బయల్జెబూబు అని పిలిచిరి అని ఎరుగరా?" నేను చెప్పాను, "ఇప్పుడు, ఒకవేళ నేను సరైతే ఏమిటి? ఇప్పుడు, యేసు చెప్పెను, పరిశుద్ధాత్మ అదే కార్యమును చేయుటకు వచ్చినప్పుడు, దానికి వ్యతిరేకముగా మాట్లాడినయెడల ఈ యుగములోనైననూ, రాబోవు యుగములోనైననూ అది ఎన్నడూ క్షమించబడదు, మీ యాభై సంవత్సరముల ప్రసంగము కూడా ఏమీ కాదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఒక్క మాట." నేను చెప్పాను, "దానికొరకు నేను నిన్ను క్షమిస్తాను, మరియు దేవుడు కూడా అని నాకు తెలుసు, ఎందుకనగా నీవు దానిని అర్ధము చేసుకొనలేదు అని ఆయన చూచెను." మరియు నేను వ్రాయగలిగినంత మంచి ఉత్తరమును నేను ఆయనకు వ్రాసాను. తరువాత నన్ను రమ్మని ఆహ్వానించియున్న ఒక ఉత్తరమును నేను పొందాను.

18కావునా అక్కడ నేనొక వ్యాపారస్తుల అల్పాహారమును కలిగియున్నాను, మరియు సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల కొరకు మాట్లాడుచున్నాను. మరియు శ్రీ. మూర్, సహోదరుడు జాక్ మూర్ - మీలో చాలా మంది సహోదరులు అతనితో పరిచయం కలిగియున్నారు, ఒక మంచి వ్యక్తి, మరియు నేను…

డాక్టర్. హెగ్రీ, సహోదరుడు మూర్ దగ్గరకు వచ్చాడు, మరియు అతడిని అడిగాడు ఒకవేళ అతడు నన్ను కాలేజికి తీసుకొని రాగలడా అని.. మరియు నేను అనుకొన్నాను, "ఇప్పుడు అది ఖచ్చితము అని నేను తలంచాను." కనుక నేను … సహోదరుడు మూర్ ఒక వేదాంతవేత్త కనుక నేను అనుకొన్నాను, "మంచిది, నేను అతడిని తీసుకొని వెళ్ళుట మంచిది." కనుక నేను చెప్పాను, "నీవు నా ప్రక్కనే కూర్చొనుము. మరియు ఒకవేళ నేను అర్ధము చేసుకొనలేని కొన్ని మాటలను మరియు వ్యాకరణమును అతడు మాట్లాడితే, నేను నీ కాలిపై అలా తన్నెదను. మరి అక్కడ నుండి నీవు కొనసాగించుము."

మరియు అతడు చెప్పాడు, "అది సరియే."

19కనుక మేము కాలేజికి వెళ్ళాము. మరియు మేము అక్కడికి వెళ్ళినప్పుడు, రాత్రి భోజనము కొరకు ఈ ఆడిటోరియం పరిమాణములో ఉన్న ఒక స్థలమును వారు కలిగియున్నారు. మరియు వారు నార్వే దేశపు ప్రజలు మరియు వారు వారి యొక్క విందు పాత్రలను కలిగియున్నారు, మరియు చాలా అందమైనవి, మంచివి. మరియు ఆ డీన్ తరువాత ఒక ప్రక్కన కూర్చొన్నాడు, మరియు ఆయన సహాయకుడు వేరే వైపు.

కనుక, నేను ముగించిన తరువాత, అతడు చెప్పాడు, "సహోదరుడా బ్రెన్హాం, మేము నిన్ను కొన్ని ప్రశ్నలను అడుగదలచాము."

నేను చెప్పాను, "మొదటిగా నన్ను ఒక మాట మాట్లాడనివ్వండి." నేను చెప్పాను, "నేను బహుశా మీ ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేకపోవచ్చు." నేను చెప్పాను, "ఒకవేళ నేను చెప్పలేకపోతే, ఇక్కడ నాకు సహాయము చేయుటకు ఒకవేళ సహోదరుడు మూర్ ఇక్కడ ఉండుట మంచిది." నేను చెప్పాను, "మీ ప్రశ్నలకు సమాధానమిచ్చుటలో బహుశా నేనంత మంచిగా చెప్పలేకపోవచ్చు, కానీ నేను చేయగలిగినది నేను చేస్తాను."

మరియు అతడు చెప్పాడు, "అది ఇదిగో." చెప్పాడు, "సంవత్సరముల సంవత్సరముల నుండి మేము పెంతుకోస్తు వారిని గూర్చి విన్నాము. మరియు వారిని చూచుటకు మేము వెళ్ళాము," అని చెప్పెను. మరియు "మేము ఏమి కనుగొన్నాము అంటే, కుర్చీలపైన తన్నుకొనుట, మరియు కిటికీలను బ్రద్దలుకొట్టుట, మరియు అటువంటివన్నీ," చెప్పెను, "మరియు మా జీవితమంతటిలో మేము విన్న అల్లరి అంతా." చెప్పెను, "ఆ ప్రజలు ఏమి పొందుకొనిరి?"

నేను చెప్పాను, "పరిశుద్ధాత్మ."

అతడు చెప్పాడు, "పరిశుద్ధాత్మా?"

నేను చెప్పాను, "అవును," అని నేను చెప్పాను.

అతడు చెప్పాడు, "నీవు ఎల్లప్పుడూ పెంతెకొస్తు వాడవైయున్నావా?"

నేను చెప్పాను, "మంచిది, నేను ఒకప్పుడు మిషనెరీ బాప్టిస్టు సంఘమునకు చెందినవాడిని, నేను కేవలము ఒక బాలునిగా ఉన్నప్పుడు, నియమించబడ్డాను." కానీ నేను చెప్పాను, "నేను నియమించబడిన వెంటనే," నేను చెప్పాను, "నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, కనుక నేను తలస్తున్నాను నేను ఒక పెంతెకొస్తువాడను."

అతడు చెప్పాడు, "అంటే నీవు ఆ పెంతెకొస్తు వారిని గూర్చి చెప్పాలనుకొనుచున్నావా, ఆ పెంతెకొస్తు ప్రజలు, అదే ఆ పరిశుద్ధాత్మ వారిని కుర్చీలను తన్నేటట్లుగా, మరియు అటువంటివాటిని చేసేది?"

నేను చెప్పాను, "అవును, అది పరిశుద్ధాత్మే." నేను చెప్పాను, "దాని యొక్క సంగతి, వారిలో ఎక్కువ ఒత్తిడి పెరిగిపోయినది, నీటి ఆవిరి, దానిని ఇంజనులో పెట్టి చక్రములను తిప్పుటకు బదులుగా వారు ఆ ఈలలో నుండి దానిని బయటకు నెట్టివేయుచున్నారు, చూశారా. అంతయూ అదే." నేను చెప్పాను, "అది నిజము." నేను చెప్పాను, "అక్కడ చాలా ఆవిరి ఉన్నది, వారు ఈల ఊదవలసియున్నది. నాకు తెలిసినది అంతయూ అదే, చూశారా." మరియు నేను చెప్పాను, "వారు ఎంతో కాలము దానిని పట్టుకొని యుండలేరు."

మరియు అతడు చెప్పాడు, "మంచిది ..

నేను చెప్పాను, "ఒకవేళ పెంతెకొస్తు విశ్వాసములో ప్రాధమిక బోధను నేను పొందగలిగితే, లేక ప్రాధమికమైన బోధలో పెంతెకొస్తు విశ్వాసమును… ఆ ప్రజలు దేవుని యొక్క సేవకులు, కానీ వారు పట్టుకొనియున్న స్థానమును నిజముగా వారు గ్రహించలేదు. అది అంతే."

మరియు అతడు చెప్పాడు, "మంచిది, లూథరనులమైన మేము పొందుకొన్నది ఏమిటి అని నీవు తలంచుచున్నావు?"

"పరిశుద్ధాత్మ" అని చెప్పాను.

తరువాత అతడు ఆగిపోయెను, మరియు అతడు చెప్పెను, "ఇప్పుడు, నిన్ను ఏమి అడగవలెనో నాకు తెలియదు."

20నేను చెప్పాను, "మంచిది, మొక్కజొన్న వేయుటకు ఒక వేయి ఎకరములను నీవు ఇక్కడ కలిగియున్నావని నేను అర్ధము చేసుకొన్నాను." నేను చెప్పాను, "ఒకవేళ విద్యార్థులు తమ అవసరముల కొరకు చెల్లించలేనియెడల, అప్పుడు కాలేజీ ద్వారా తమ పనిని తాము చేసుకొనగలరు."

అతడు చెప్పెను, "నిజము."

కనుక ప్రభువు నాకు ఒక చిన్న ఆలోచనను ఇచ్చెను, మరియు నేను చెప్పాను, "అయ్యా, ఒకసారి ఒక వ్యక్తి మొక్కజొన్నను విత్తుటకు ఒక గొప్ప పొలమును విడగొట్టెను, మరియు అతడు పొలములో మొక్కజొన్నను విత్తెను. మరియు తరువాత … ఒక ఉదయమున అతడు బయటకు వెళ్ళెను. మరియు అతడు తన పొలము వైపునకు చూసినప్పుడు అతడు రెండు చిన్న పోచలను చూసియున్నాడు." ఎవరికైనా తెలుసా మొక్కజొన్న పెరిగినప్పుడు అది ఆ విధముగానే వచ్చును. దక్షిణాన దానిని చిన్న కొమ్మ జొన్న" (స్పిన్ కార్న్) అని మేము పిలిచెదము, ఆ విధముగా రెండు చిన్న రెమ్మలు వచ్చును.

మరియు నేను చెప్పాను, "ఆ వ్యక్తి గడప మెట్లపై నిలబడెను, మరియు చెప్పెను, 'నా మొక్కజొన్న పంట కొరకు ప్రభువుకు వందనములు.'" నేను చెప్పాను, ఇప్పుడు, అతడు ఒక మొక్కజొన్న పంటను కలిగియున్నాడా?"

"మంచిది, అతడు ఒక ప్రారంభమును కలిగియుండెను," అని అతడు చెప్పాడు.

మరియు నేను చెప్పాను, "మంచిది, సంభవనీయముగా (సాధ్యమైనట్టుగా) అతడు ఒక మొక్కజొన్న పంటను కలిగియుండెను, చూశారా. అదీ దానియొక్క బాల్యదశలో ఉన్నది." మరియు నేను చెప్పాను, "అది లూథరనులైన మీరు."

JOEL 2:25

 

21మరియు నేను చెప్పాను, "చివరగా, ఆ జొన్న కాండమును (లేక గుత్తులు) కలిగియుండే ఒక స్థానమునకు ఎదిగియున్నది. మరియు ఆ కాండము ( tassel) ఏమి చేసినదో నీకు తెలుసా? ఆ కాండము వెనుకకు రెమ్మల వైపు చూసినది, మరియు చెప్పినది, 'ఇక నీతో నాకు ఎటువంటి ఉపయోగము లేదు. నేను ఒక కాండమును. కానీ అది తనను తాను పునరుత్పత్తి చేసుకొనుటకు ఆ రెమ్మను తిరిగి ఉపయోగించుకొనవలసియున్నది. తరువాత అతడు ఆ కాండము నుండి తిరిగి ఆ పోచలోనికి వచ్చెను, మరియు ఒక వెన్నును తీసుకొని వచ్చెను."

నేను చెప్పాను, "ఇప్పుడు, మొదటిగా లూథరన్లు అయిన మీరు; రెండవది దేవుని యొక్క మెథడిస్టు కదలిక; మూడవది, వెన్ను, అది సంఘములోనికి వరముల యొక్క పునరుద్దరణను తీసుకొని వచ్చిన ఆ పెంతెకోస్తు గుంపే, అది భూమిలోనికి వెళ్ళిన అసలైన గింజకు చెందినది. అది యోవేలు చెప్పినట్లుగా, కేవలము తిరిగి పునరుద్ధరించబడుచున్నది." చూశారా? నేను చెప్పాను, "ఇప్పుడు ఆ వెన్నుపై మనము చాలా బూజును కలిగియున్నామని నాకు తెలుసు; కానీ ఇంకా మనము కొన్ని గింజలను కూడా కలిగియున్నాము, మీకు తెలుసు."

నేను చెప్పాను, "మంచిది…"

నేను చెప్పాను, "అదే అసలైన గింజ." నేను చెప్పాను, "ఇప్పుడు, పురోగమించిన (ముందుకు కొనసాగిన) లూథరను సంఘమే పెంతెకొస్తు సంఘమై యున్నది. దానంతటి తరువాత, ఒకవేళ అక్కడ ఆకు లేకపోతే, కాండమే ఉండెడిది కాదు; మరియు ఆకులో ఉన్న జీవమే, కాండమును తయారుచేసినది. మరియు ఆ కాండములో ఉన్న జీవమే, గింజను తయారుచేసినది. కనుక అది సజీవ దేవుని యొక్క పురోగమించుచున్న సంఘము.

22అతడు ఆగిపోయెను, తన ప్లేటును వెనుకకు త్రోసెను, "సహోదరుడా బ్రెన్హాం, ఒకసారి నేను పశ్చిమమునకు వెళ్ళాను. నేను విన్నాను… అన్ని ఆత్మీయమైన వరములను గూర్చి వ్రాసిన ఒక గ్రంధమును నేను విన్నాను." మరియు చెప్పాడు, " ఆ వ్యక్తిని కనుగొనుటకు నేను పశ్చిమమునకు వెళ్ళాను." మరియు చెప్పెను, "నేను వ్రాసినప్పుడు, అతడు చెప్పాడు, 'ఓ, నేను కేవలము వాటిని గూర్చి వ్రాసాను. నేను వాటిని కలిగిలేను.' చెప్పాడు, 'నేను వాటిని గూర్చి కేవలము వ్రాసాను.' మంచిది," చెప్పెను, "నేను దానిని చేసియుండెడివాడిని."

మరియు చెప్పెను, "నేను చుట్టూ తిరిగి మరియు నేను వీటన్నిటిని గమనించాను, మరియు నేను పెంతెకొస్తు గుంపులు మరియు అటువంటి వాటి యొద్దకు వెళ్ళాను." మరియు "వారు అరుస్తూ ఉండడం నేను గమనించాను," అని చెప్పాడు.

మీరు చూడండి, అది అలా అక్కడ ఉండటం జరిగినది. తప్పుడు సమయములో ఆ దెయ్యము అతడిని అక్కడ ఉంచుట జరిగినది, మీకు తెలుసా, ఆ ప్రజలు నిజముగా సంతోషిస్తున్నప్పుడు. మరియు అక్కడ అతడు ఒక అభిప్రాయమును కలిగి, మరియు బయటకు వెళ్ళిపోయెను, చూశారా.

మరియు అతడు చెప్పాడు, "నేను నీకు వ్రాసిన ఉత్తరమును గూర్చి క్షమాపణ అడుగుచున్నాను." చెప్పెను, "నేను అటువంటి స్థలములో నన్ను నేను నిర్మించుకొన్నాను, అది దానికి వ్యతిరేకము, మరియు అక్కడే నేను దానిని తిరస్కరించాను, అక్కడే; మరియు నీవు ఒక సోదె చెప్పువాడవు తప్ప మరేమి కాదు అని చెప్పాను." అతడు చెప్పాడు, "నన్ను క్షమించమని నేను నిన్ను అడుగుచున్నాను."

నేను చెప్పాను, "ఎందుకు, ఖచ్చితముగా, అయ్యా. నేను ఎన్నడూ ఏమి ఉంచుకొనను, మరియు ఎన్నడూ చేయలేదు - నేను నీకు ఉత్తరములో ఏమి చెప్పాను."

23అతడు చెప్పాడు, "నేను నీ పెదవులపై నుండి దానిని వినాలని కోరుచున్నాను." అతడు చెప్పాడు, "ఇప్పుడు, సహోదరుడు బ్రెన్హాం, నాకు మరియు విద్యార్థులందరికీ, మేమందరము పరిశుద్ధాత్మ కొరకు ఆకలిగొనియున్నాము, మేమేమి చేయవలెను?"

కనుక అతడికి నేను ఏమి చెప్పానో మీకు తెలుసు, మీకు తెలియదా? నేను చెప్పాను, "మీ వీపులను త్రిప్పండి, మీ వీపులను ఈ వైపు, మరియు మీ ముఖములు చుట్టూ ఉన్న గోడ వైపు. మరియు దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చేంత వరకు మీరు ఎన్నడూ మీ మోకాళ్ళు వీడరని మీ హృదయములో ఒక ఉద్దేశ్యము తయారు చేసుకొనండి." మరియు నేను చెప్పాను, "ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించవద్దు, లేక అది, లేక వేరొకటి. అక్కడే నిలబడి మరియు చెప్పుము, దేవా, నాకు పరిశుద్ధాత్మ కావాలి."

నేను చుట్టూ వెళ్ళి మరియు వారిపై చేతులుంచాను, మరియు అక్కడే నలభై మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరియు ఇప్పుడు, వారిలో అయిదు వందల మంది, బలముగా కొనసాగుతూ, సూచనలు కలిగి, అద్భుతాలు, మరియు ఆశ్చర్య క్రియలు, మరియు అటువంటివి, చూశారా.

24సహోదరులారా, ఈ లోకము కలిగియుండవలసిన సంగతిని మనము కలిగియున్నామని నేను నమ్ముచున్నాను. కానీ దానిని మనము ఒక మార్గములో సమీపించవలసియున్నది… ఒకవేళ నీవు వడ్రంగి వానివైతే ఏమిటి? ఇక్కడ మూలన నేను ఆ వ్యక్తిని తీసుకొనెదను, లేక సహోదరుడు బోర్డర్స్ అక్కడొక వడ్రంగివాడు ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. మంచిది, అతడు ఒక సుత్తితో ఈ విధముగా కొట్టిన ఏమి, మరియు మేకులు కొడుతూ, మరియు ఒక రకపు ఆటోమేటిక్ సుత్తిని నేను కలిగియున్నాను, దానితో ఒక సీసా మేకులను దానితో కొట్టవచ్చు, మరియు దానిని ఈ విధముగా పట్టుకొని, మరియు అతడు తన సుత్తితో చేసిన దాని కన్నా ఉత్తమముగా బోర్డులను బిగించెను.

ఇప్పుడు, ఒకవేళ అతడి యొద్దకు నేను నడిచి, "ఓరేయి, అబ్బాయి, కనీసము నీవు దానిలో లేవు. దానిని గూర్చి ఏమియూ నీకు తెలియదు. ఎందుకు, నీవు నీ వ్రేళ్ళను నలుగగొట్టుకొనుచున్నావు. మై, నీవు ప్రారంభించుటకు ఇంకా ఒక ఉత్పత్తిని కూడా కలిగిలేవు," అని చెప్పాను, నేను అతడికి కోపము తెప్పించుచున్నాను. నేను సుత్తిని ఎన్నడూ అమ్మను. అది నిజము, చూశారా. నేను కలిగియున్నదానితో నేను ఆ విధముగానే వ్యవహరిస్తాను. నా ఉత్పత్తి, నాకు తెలుసు, అతడు కలిగియున్న దాని కన్ననూ ఉత్తమమైనది. కానీ సరైన మార్గములో అతడిని నేను సమీపించవలయును, అని నేను గుర్తించుకోవాలి.

మరియు ఒకవేళ నేను అతడి యొద్దకు నడిచి, మరియు "ఎలా వున్నావు, అయ్యా? నా పేరు బ్రెన్హాం" అని చెప్పాను.

"నా పేరు, బోర్డర్స్."

"నీవొక వడ్రంగి వాడివని నేను చూస్తున్నాను."

"అవును, అవును, అయ్యా, నేను."

"నీవొక నిజమైన వడ్రంగి వాడివని నేను నిజముగా నమ్ముచున్నాను."

"అవును."

"నీవు నీ పనిముట్లును (సుత్తి) వినియోగించే విధానమును నేను గమనిస్తున్నాను."

"ఓ, అవును. పాత బెట్సీ (పనిముట్టు) నాతో చాలా కాలము నుండి ఉన్నది."

నేను చెప్పాను, "అవును. అది చాలా మంచిది. అవును, ఖచ్చితముగా మంచిది, కూడా, మరియు నీవు దానిని నిజముగా వినియోగించగలవు. అవును." ముందుకు వెళ్ళి అతడితో కొంచెము మాట్లాడుము.

నేను చెప్పాను, "ఫలానా-ఫలానా క్రొత్త సుత్తిని గూర్చి నీవు ఎప్పుడైనా విన్నావా?"

"లేదు, నేను ఎప్పుడైనా విన్నానని నమ్ముటలేదు."

"మంచిది, ఇదిగో అది. నీవు నీ మేకులను ఇక్కడ పెట్టి, మరియు అక్కడ ఆ బోర్డులను బిగించుము. ఇది ఎంత సమయములో చేయునో చూడుము, మరియు ఎటువంటి ఉత్పత్తిని నేను కలిగియున్నాను." అతడికి ఆ విధముగా చూపించుము. "దానిని తీసుకో. కొద్ది దినములు దానిని ప్రయత్నించి మరియు దానిని గూర్చి నీవు ఏమనుకొనుచున్నావో చూడుము. నేను వెంటనే వస్తాను," అని చెప్పాను, చూశారా.

ఒకవేళ అది సరైన ఉత్పత్తి అయితే, అది దానికదే అమ్మబడును. సహోదరులారా, నేను ఏమి చెప్పానో మీకు అర్ధమైనది కదా, అర్ధమవ్వలేదా?

1COR 12:13•

EPH 2:6

 

25చూడండి, మనము సరైన సంగతిని పొందుకున్నాము. దానితో మనము ప్రజలను సరిగ్గా సమీపించవలెను, చూశారా. అదియే సంగతి, చూశారా. అది నిజమైన అసలైన సంగతి. ఇదీయే పరిశుద్ధాత్మ. నా హృదయమంతటితో దానిని నేను నమ్ముచున్నాను.

ఆ సహోదరులు తిరుగుబాటు దారులు అని నేను తలంచుట లేదు. వారు సహోదరులని నేను నమ్ముచున్నాను. వివేచన చేయు ఆత్మ - ఏదో సోదె చెప్పునది అని నేను నమ్మను. కేవలము సంఘము తన స్థానమునకు వచ్చునట్లుగా చేయుటకు, పరిశుద్ధాత్మయే తన సంఘములో బయలుపరచుకొనుచున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు ఒకవేళ మనము పెంతుకొస్తు యొక్క కదలికను తీసుకొను ఏదో మార్గమును కలిగినయెడల, మరియు మన చిన్న అవరోధములను తొలగించుకొని, మరియు కలిపి వచ్చుటకు ఒక స్థలమును కలిగి, మరియు క్రీస్తు యేసులో పరలోక స్థలములలో కూర్చొని, దానికొరకే మనము ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందియున్నాము, ఓ, అంతకు ముందెన్నడు తెలియనటువంటి ప్రదర్శనలు ఉండునని నేను తలంచుచున్నాను. మరియు ఒకవేళ మనము మెథడిస్టును, బాప్టిస్టును, పెంతుకొస్తు వారిని సమీపిస్తే, ఎక్కడికైనా ఏ స్థలమునకైనా వెళ్ళవచ్చు, సహోదరులారా, అది జరుగగలదని నేను విశ్వసిస్తున్నాను.

26నేను ఇక్కడ నిలబడగోరుట లేదు. పరిశుద్ధ గ్రంధము నుండి ఒక వాక్యము లేక రెండు నేను చదవగోరుచున్నాను మరియు ఒక్క క్షణము మీతో మాట్లాడతాను. కానీ నేను … మీరు వెళ్ళవలెను అని నాకు తెలుసు, మరియు నేను కూడా, మరియు నేను అల్పాహారమును పొందాను - శనివారము ఉదయము; మరియు తరువాత సోమవారము రాత్రి ఇక్కడ ఒకటి కలిగియుండుట కొరకు ఎదురు చూచుచున్నాను. నాకు ఇంకనూ తెలియదు. నేను సహోదరుడు బోర్డర్స్, మరియు మొదలగు వారితో మాట్లాడవలెను. కానీ దీనిని మీతో విడువగోరుచున్నాను: అది మీకు సహాయము చేయుటకు నేను ఇక్కడ ఉన్నాను. ఇది కేవలము… మనము కలిగిలేము కానీ… కేవలము కొద్ది నిముషములు కలిసి కూర్చోండుటకు. ఈ మధ్యాహ్నము కూడిక ప్రారంభించబడే వరకూ మనమిక్కడ ఉండవచ్చునని నేను ఆశిస్తున్నాను, తరువాత ఉదయమున తిరిగి వచ్చెదము. మరియు సహోదరులైన మీరు ఏమి చెప్పవలసియున్నదో మరియు దానిని నేను ఎలా అభినందించానో నేను వినియున్నాను.

కానీ ఇప్పుడు, కొంచెము నా హృదయము మీరు తెలుసుకొనుటకు, నేను మిమ్ములను అభినందిస్తున్నాను, మరియు నేను మీకు సహాయము చేయుటకు సమస్తమును నేను చేయబోవుచున్నాను, నా సహోదరులుగా, ప్రభువు నాకిచ్చియున్న చిన్న పరిచర్యతో, మరియు ఆయన మీకిచ్చిన దానితో, ఆయన రాజ్యము కొరకు మనమేమి చేయగలమో చూచుటకు మనము వాటిని కలిపి పెట్టుచున్నాము. ఆయన యొక్క వాక్యమును మనము సమీపించే ముందు, ఒక్క క్షణము. మనము మన తలలు వంచెదము.

27అత్యంత కృప గల దేవా, దీనత్వముతో, నలిగిన ఆత్మలతో, విరిగిపోయి, యేసుక్రీస్తు నామములో మేము నీ యొద్దకు వస్తున్నాము, ప్రభువా, మేము మలచబడుటకు సిద్దముగా ఉన్నామని ఎరిగి, ప్రవక్త మలచబడుటకు కుమ్మరి వాని గృహమునకు వెళ్ళినట్లుగా. మరియు తండ్రీ, మా హృదయములలో ఈ ఉదయ కాలమున మేము కోరుకొనుచున్నాము, అది యేసుక్రీస్తును ప్రతిబింబించే వ్యక్తిత్వములు, కనుక మేము వేర్వేరు వ్యక్తిత్వములలోనికి మలచబడునట్లుగా మీరు మమ్ములను విరుగగొట్టెదరు. నా బుద్దిహీనమైన హృదయమును తీసివేయండి, ప్రభువా, నా నత్తి మాటలను తీసుకొని మరియు వాటిని ముక్కలుగా చేయుము, ప్రభువా. నా యొక్క స్వచిత్తమును బయటకు తీసివేసి మరియు క్రీస్తులో నూతన వ్యక్తిగా చేయుము. ప్రభువా, అనుగ్రహించండి. అది మా హృదయముల యొక్క కోరికయై యున్నది. అందుకే మేము ఇక్కడ ఉన్నాము.

మరియు, ప్రభువా, మేము మాట్లాడుతుండగా, నీవు ఈ బలిపీఠము పైన, నీ యందు నమ్మకము కలిగియున్న ఈ చిన్న యూదుడైన సహోదరుడు, సహోదరుడు మైఖేల్సన్, నేను అతడిని గూర్చి ప్రార్ధించుచున్నాను, తండ్రి. నీవు అతడిని దీవించెదవని నేను ప్రార్ధించుచున్నాను. మరియు మేము ఇక్కడ ఈ క్రైస్తవ సమాజ మందిరములో ఉండే అవకాశము కొరకు వందనములు.

28వాక్యము చదువుట యందు కొద్ది క్షణములు మేము ఎదురుచూచుటను బట్టి, మమ్ములను కలిపి దీవించండి. మా ఆలోచనలకు దీనిని దీవించండి. మా కూడికలను దీవించండి, ప్రభువా.

దేవా, నీవు మా హృదయములను ఎరిగియున్నావు. మరియు నేను కేవలము ఒక్క హృదయము, మరియు ఒక్క ప్రాణము, మరియు ఒక్క ఉద్దేశ్యముతో నేను అల్లివేయబడగోరుచున్నాను, అది ఇక్కడున్న నా సహోదరులతో ఇక్కడ ఈ అంధకారమైన, నిరాశాజనకమైన, ఇరవైయ్యో శతాబ్దపు భాగములో, 1962లో ఇక్కడ, శతాబ్దపు యొక్క మలుపు దగ్గరలో తిరిగి, సమయము ముగించబడినది.

మరియు ఇక్కడ పశ్చిమ తీరములో, ఎక్కడైతే నాగరికత తూర్పు నుండి పశ్చిమముకు ప్రయాణము చేసినదో, మరియు ఇక ఇప్పుడది ముందుకు కొనసాగలేదు అని మేము గ్రహించుచున్నాము. మేము ఈ తీరమును విడిచిపెట్టినప్పుడు మేము తిరిగి తూర్పునకు వెళ్ళెదము. మరియు నాగరికత వచ్చినట్లుగా, సూర్యుడు తూర్పు నుండి పశ్చిమముకు ప్రయాణము చేయునని మేము గ్రహించాము. కుమారుడు తూర్పునున్న ప్రజల పైకి వచ్చిన ఒక సమయమున్నది, మరియు ఆయన గొప్ప వెలుగును చూపించాడు, మరియు ఆయనే మెస్సియా అని సూచనలు చూపించాడు. మరియు ఆయన వాగ్దానము చేసాడు…

ZECH 14:7•

MAL 4:6

 

29పగలు మరియు రాత్రి కాని ఒక దినము ఉండునని ప్రవక్త చెప్పియున్నాడు. దాదాపుగా, రెండు వేల సంవత్సరముల ఈ నిరాశాజనకమైన, పొగమంచుతో (ఏమీ కనబడని) దినమును మేము కలిగియున్నాము, చుట్టూ పొందుకొనుటకు తగినంత వెలుగు కలిగియున్నామని నమ్మే శక్తి గలిగి, మరియు ఆయన దేవుని కుమారుడని తెలుసుకొని, మరియు మాకొక సంఘమును నిర్మించుకొని, మరియు ఒక సంస్థ, మరియు సహోదరీ మరియు సహోదరులను కలిపి యుంచే ప్రయత్నము, మరియు వారిని సరిగా జీవించేలా చేయును.

కానీ, ప్రభువా, ఆ పొగ మంచు తొలగిపోవుచున్నది, మరియు పశ్చిమమున ఉన్న ప్రజలకు ఒక వెలుగు వచ్చుచున్నది, అవే సూచనలతో అదే కుమారుడు, అదే సువార్త, ఒక పునరుద్ధరణ.

ఈ చివరి దినములలో పిల్లల యొక్క విశ్వాసము తండ్రుల యొద్దకు త్రిప్పే వర్తమానము వచ్చునని నీవు వాగ్దానము చేసియున్నావు. ఓ దేవా, పెంతుకోస్తు యొక్క ఆ అసలైన దినము యొద్దకు తిరుగుదుము గాక. ఒకప్పుడు పరిశుద్ధులకు ఇవ్వబడిన ఆ గొప్ప విశ్వాసము యొద్దకు తిరిగి వచ్చుచుము గాక.

30ఆ దేవుని యొక్క గొప్ప వధువు వృక్షము, ఆ గొంగళిపురుగు తినివేసినది, దేవుని యొక్క కుమారుని కొరకు సాయంకాలపు వెలుగులు పక్వము చేయుచున్న ఆ ఫలమును దాని పైన అది తీసుకొని వచ్చును. దానిని అనుగ్రహించండి, ప్రభువా. ఈ ఉద్దేశ్యము కొరకు కలిపి లాగబడుచున్న మాకు సహాయము చేయండి.

మమ్ములను మీకు సమర్పించుకొనుచున్నాము. మేము నీ వారము. సరిపడ్డామని నీవు చూచునట్లుగా, ప్రభువా, మాతో చేయుము. ఈ ఉదయకాలమున ఈ సమాజ మందిరములో మమ్ములను నీ హస్తములలోనికి సమర్పించుకొనుచున్నాము, ప్రభువా. సమ్సోను వలె కాకుండా, మేము నీకు పరిపూర్ణముగా ఇచ్చుకొనుచుండగా, నీ యొక్క గొప్ప ఉద్దేశ్యము మా జీవితములలో నెరవేర్చబడును గాక. సమ్సోను తన బలమును ఇచ్చెను, కానీ తన హృదయమును ఎన్నడూ అతడు ఇవ్వలేదు. దేవా, మా హృదయము, మా బలము, మా సమస్తము, మా సమస్తము నీకు ఇవ్వబడును గాక. ప్రభువా, దీనిని శక్తివంతముగా చేయుము. దేవుని యొక్క రాజ్యము యొక్క కారణమును బట్టి దీనిని విస్తరించుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

PS 16:11•

MATT 13:4,7•

MARK 4:4,8•

LUKE 8:5,8

 

31కీర్తనలు 16లో, ఏలయనగా కొంచెము చదువుటకు, చివరి వచనము:

జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు: నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు; నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

మరియు ఇప్పుడు, నేను ప్రసంగించుటకు ప్రయత్నించనని మీకు తెలుసు. నేను ఒక్క క్షణము మీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను, లేక ఉదాహరణకు పదిహేను, ఇరవై నిముషములు అని నేను చెప్పుదును. దావీదు ఇక్కడ జీవమును గూర్చి మాట్లాడుచున్నాడు. "జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు." మీరు దానిని గమనించారా? నీవు నాకు చూపించేదవా? లేక, నీవు నాకు చూపించగలవా? నీవు నాకు చూపించెదవని నేను ఆశిస్తున్నాను; "నీవు నాకు చూపించెదవు." (తెలియజేసెదవు).

దేవుడు పిలిచిన ప్రతీ ఒక్కరూ విని మరియు వచ్చెదరని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, మన కూడికలలో అదే మనము ఎదుర్కొనుచున్నాము అని నేను నమ్ముచున్నాను. మనము విత్తనము మాత్రమే విత్తగలము. కొన్ని మార్గము ప్రక్కన పడును; కొన్ని ఒకవైపు పడును, మరియు కొన్ని ఇంకొకవైపు. కానీ కొన్ని మంచి నేలపై పడును. అది నిజము. "నాకు జీవమార్గమును చూపించుము."

32ఇప్పుడు, మనము పొందుకొనగలిగిన గొప్ప సంగతి జీవమైయున్నది. జీవము కన్నా గొప్పది ఏదియునూ లేదు. ఒకవేళ ఈ ఉదయవేళ నేను మహిమకు వెళ్ళగలిగితే, మరియు మనమందరము అక్కడకు వెళ్ళి, మరియు నేను అబ్రాహామును కలవగలను…

"అబ్రాహామా, ఉన్నటువంటి గొప్ప సంగతి ఏది?"

అతడు చెబుతాడు, "జీవము." అక్కడ … మరేమి ఉన్నప్పటికిని, ఎవరైనా పొందుకొనగలిగిన గొప్ప సంగతి జీవమే - అది జీవమే. జీవము కొరకు నీవు ఏమి ఇచ్చెదవు?

గృహము దగ్గర నేనొక గ్రంథమును కలిగియున్నాను. మరియు అది సహోదరుడు న్యూగెంట్ ద్వారా వ్రాయబడినది, అతడు చెరసాలలలో మత ప్రచారకుడు. మరియు క్రీస్తు యొక్క కాలము దగ్గర నుండి ఈ భూమిపైన చనిపోయిన గొప్ప వ్యక్తుల యొక్క సాక్ష్యములను అతడు ఇందులో పొందుపరచియున్నాడు. మరియు పుస్తకమునకు ఇంకొక ప్రక్క మోసగాళ్ళలో గొప్పవారి యొక్క సాక్ష్యము, మరియు ఆత్మీయమైన వారిలో గొప్పవారి యొక్క సాక్ష్యమును అతడు ఇచ్చియున్నాడు. మరియు నేనక్కడ చదువుచున్నాను, అది ఇంగ్లాండు యొక్క రక్తము కార్చిన మేరీ అనీ నేను తలస్తున్నాను, అక్కడ ఆమె చెప్పినది, "ఒకవేళ నేను చేయగలిగి… అయిదు నిముషముల ఎక్కువ జీవితము కొరకు నేను నా రాజ్యమును ఇచ్చెదను," ఆ రాజ్యము కొరకు ఆమె అనేక మందిని మరణించేలా చేసినది ఎందుకనగా… మరియు అలాంటివి, మరియు ఇంకా, అటువంటి దానిని అయిదు నిముషముల జీవితము కొరకు ఆమె ఆ రాజ్యమును ఇచ్చివేయును.

33పాల్ రేడర్ యొక్క సాక్ష్యమును ఇక్కడ నేను ఇంకా జ్ఞాపకముంచుకొనుచున్నాను, అతడు అక్కడ గుడారములో చనిపోయినప్పుడు… లేక వారు గుడారము కలిగియున్నప్పుడు, అతడు చెప్పియున్నాడు… అతడు చనిపోవుచున్నప్పుడు, అతడు లూకాను పిలిచెను, అతడి యొక్క సహోదరుడు. వారు నేను మరియు నా కుమారుడు బిల్లీ పాల్ వలె చాలా సన్నిహితముగా ఉంటారు.

మరియు నేను మూడీ పాఠశాల నుండి దానిని అర్ధము చేసుకొన్నట్లుగా, వారు అక్కడ పాటలు పాడే ఒక చతుష్టయమును (నలుగురు వ్యక్తుల గుంపు) కలిగియున్నారు. మరియు పౌలు హాస్యచతురతను కలిగియున్నాడు. వారు పాడుచున్నారు, "నా దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు," మరియు అతడు చెప్పాడు, "చెప్పుము, ఇక్కడ ఎవరు చనిపోవుచున్నారు, నేనా లేక నీవా?" మరియు చెప్పాడు, "ఆ తెరలను ఎత్తి మరియు నా కొరకు కొన్ని సువార్త గీతములను పాడుము." మరియు వారు పాడటం ప్రారంభించారు, "సిలువ యొద్ద," అటువంటి దానివలె, ఆ చతుష్టయము. మరియు అతడు చెప్పాడు, "లూకా ఎక్కడ?"

అతడు ప్రక్క గదిలో ఉన్నాడు. వారు అతడిని లోపలికి తీసుకొని వచ్చారు. ఆయన లూకా హస్తమును పట్టుకొన్నాడు. ఆయన చెప్పెను, "లూకా, దానిని గూర్చి ఆలోచించుము. ఇప్పటి నుండి అయిదు నిముషములలో, నేను యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో నిలబడెదను, ఆయన యొక్క నీతిని కప్పుకొనెదను." నన్ను ఆ విధముగా వెళ్ళనివ్వు.

34ద్వైత్ మూడీ, అతని యొక్క సాక్ష్యమేమిటో మీకు తెలుసా, అతడు లేచినప్పుడు, మరియు చెప్పాడు, "ఇదే మరణమా?" చెప్పాడు, "ఇదే నా పట్టాభిషేక దినము." ఆ విధముగానే నేను వెళ్ళుటకు ఇష్టపడెదను.

ఈ మధ్యనే నా ప్రశస్తమైన తల్లి యొక్క చేతిని నేను పట్టుకొన్నాను, వెళుతూ. ఆమె వెళ్ళినప్పుడు నా భార్య యొక్క చేతిని నేను పట్టుకొన్నాను. మార్గము యొక్క ముగింపుకు (జీవితము యొక్క) వచ్చినప్పుడు వారిని నేను గమనించాను. జీవమే అక్కడ గొప్ప సంగతైయున్నది. మరియు ఇది ముగించబడిన తరువాత ఎటువంటి నిరీక్షణ లేని వారందరికీ, అది ఒక భయంకరమైన సంగతి. మనము జీవము యొక్క మార్గముల గుండా నడిచెదము.

కావున అనేక మంది ప్రజలు అడిగెదరు, "జీవమనగా ఏమిటి? దానిని ఎక్కడ కనుగొనెదము?"

ఎందుకు, అది మన చుట్టూనే ఉన్నది. దేవుడు దానిని బహుగా చేసెను …

35ఇంకనూ యోబులో వలె. మనము దానిని కనుగొనెదము, యోబులో అతడు దానిని గూర్చి అడిగెను జీవితమంతయూ దానిని మనము వినెదము, దానిని గూర్చి అడుగుచుందుము.

జెఫర్సన్-విల్ లో జీవించియున్న ఒక చిన్న బాలుని గూర్చి నాకు జ్ఞాపకం వచ్చుచున్నది, నేను అక్కడే జీవించేవాడిని. ఒక రోజు, వారు చెప్పారు అతడు… తన తల్లి దగ్గరకు వెళ్ళి, మరియు అతడు చెప్పాడు, "అమ్మా? దేవుడు, నీవు మాట్లాడుచున్న ఈ దేవుడు, ఆయన అంత గొప్ప వ్యక్తి. ఎవరైనా ఆయనను చూడగలరా?"

ఆమె చెప్పెను, "పాష్టరుగారిని అడుగుము."

కనుక, పాష్టరు దగ్గరకు వెళ్ళి మరియు ఆయనను అడిగెను, మరియు అతడు చెప్పాడు … లేదు, సండే స్కూలు టీచరు. మరియు ఆ సండే స్కూలు టీచరు చెప్పెను, "నీవు పాష్టరుగారిని అడుగుట మంచిది." ఆమెకు తెలియదు.

కనుక పాష్టరు దగ్గరికి వెళ్ళెను.

అతడు చెప్పాడు, "లేదు, లేదు, కుమారుడా," అతడు చెప్పెను, "ఏ మనుష్యుడు దేవుడిని చూసి మరియు జీవించలేడు." చెప్పెను, "నీవు దేవునిని చూడలేవు." మంచిది, అది కొంచెము ఆ చిన్నవానిని నిరుత్సాహపరచినది.

36మరియు అక్కడ ఒక వృద్ద జాలరి ఉండెను, మరియు అతడు నదిపై ఉండెను, ఒక రోజు, ఆ వృద్ద జాలరి వానితో చేపలు పడుతూ ఉన్నప్పుడు మరియు అక్కడ ఒక తుఫాను వచ్చినది. మీలో చాలా మంది, నేను ఊహించుచున్నాను, తూర్పు నుండి వచ్చారని మరియు తెలుసు ఏ విధముగా … ఆకులను తుడిచిపెట్టును, మరియు అతడు నదిపై నుండి వచ్చుచున్నాడు. మరియు ఆ చిన్న బాలుడు పడవ వెనుక కూర్చొని ఉన్నాడు. మరియు సూర్యుడు పశ్చిమమునకు అస్తమించుచున్నాడు, మరియు ఒక వర్ష ధనుస్సు నదిపై ఆ విధముగా వచ్చెను.

మరియు ఆ వృద్ధ జాలరి, తెడ్డును వేస్తున్నాడు … మరియు తుఫాను ప్రభావము నుండి నీళ్ళు అన్నీ నిమ్మళించెను, మరియు అంత తాజాగా ఉన్నది, మరియు పూల యొక్క పరిమళము. మరియు అతడు తెడ్డు వేస్తున్నప్పుడు అతని నెరసిన గడ్డముపైన పెద్ద మెరయుచున్న కన్నీళ్ళు గడ్డముపై నుండి క్రిందకు కారడం ప్రారంభించాయి, అతడు చూచుచున్నాడు.

మరియు అతడు ఏమి చూస్తున్నాడు అను దానివైపు చూచుటకు ఆ చిన్న బాలుడు చుట్టూ చూచెను. అతడు ఆ వృద్ధ జాలరి వైపు చూచెను. మరియు అతడు పడవ వెనుక భాగము నుండి పరుగెత్తి వచ్చెను, పడవ యొక్క మధ్యభాగము వరకు, మరియు ఆ వృద్ద జాలరి యొక్క మోకాళ్ళ దగ్గర కూర్చొనెను.

మరియు అతడు చెప్పాడు, "అయ్యా, నేను మిమ్ములను ఒకటి అడుగగోరుచున్నాను. నా తల్లి నాకు సమాధానమివ్వలేకపోయెను, నా సండే స్కూలు టీచరు, లేక నా పాష్టరు." చెప్పాడు, "అది … దేవుడు, గొప్పవాడై యుండి, ఆయనను ఎవరైనా చూడగలరా?"

మరియు ఆ వృద్ద జాలరి ఆ తెడ్డులను తన ఒడిలోనికి లాగుకొనెను, చిన్న బాలుని యొక్క తలను తన భుజము పైన పెట్టుకొని, చెప్పాడు, "హనీ, నీ చిన్ని హృదయమును దేవుడు దీవించును. గత నలభై సంవత్సరముల నుండి నేను చూచినదంతయూ దేవుడే," చూశారా. ఆయన కేవలము… ఆయనను అక్కడ చూచుటకు నీవు దేవుడిని ఇక్కడ కలిగియుండవలసియున్నది, చూశారా - అంతరంగమున ఉన్న దేవుడు నీ కళ్ళ ద్వారా చూచుచున్నాడు.

JOB 14:7,10,13,21

 

37వీధి వైపు ఒక చెట్టును నేను చూచుచున్నాను. ఇప్పుడు నేను ఆలోచించుచున్నాను, నేను ఆ మోజావే ఎడారి గుండా వచ్చినప్పుడు, లేక ఇక్కడకు వచ్చుచున్న ఆ ఎడారి, అంతయూ (ప్రతీదీ) చాలా చనిపోయినట్లు అనిపించినది. మరియు కొంచెము నేను ఆ కొలరాడో నది దగ్గరకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక చిన్న పచ్చని పొద ఉన్నది. అది చాలా ఆకర్షణీయముగా ఉన్నది. నేను అనుకొన్నాను, "అది తన జీవమును ఎక్కడ నుండి పొందుకొనుచున్నది?" చూడండి, అది జీవమును కలిగియున్నది. అది జీవించునదై యున్నది. దేవుడు జీవములో ఉన్నాడు. ఆయన… జీవించుచున్న ప్రతీ దానిలోనూ దేవుడు ఉన్నాడు.

యోబు ఒక దినమున చెప్పెను, "ఒకవేళ ఒక చెట్టు చనిపోతే, అది మరలా జీవించును. కానీ నరుడు మరణించిన తరువాత; అతడు ఆత్మను విడుచును, అతడు ఏమైపోవును? అతడిని గౌరవించు నిమిత్తము అతడి యొక్క కుమారులు వచ్చి ఏడుస్తారు, కానీ దానిని అతడు పొందుకొనలేడు. ఓ, నీవు నన్ను సమాధిలో దాచినయెడల ఎంతో మేలు, మరియు నీ ఉగ్రత చల్లారు వరకు నన్ను నీ రహస్య స్థలమందుంచుము."

మరియు అతడు చూచాడు… ఆయన యొక్క ప్రకృతిలో అతడు దేవున్ని గమనించాడు, జీవములో, ఏ విధముగా ఒక చిన్న పువ్వు పైకి వచ్చి, మరియు అక్కడ నిలబడును. మరియు కొంత సేపటి తరువాత … అది అందమైనది, మరియు ఆ పూలగుత్తులలో కొన్ని యవ్వనమైనవి ఉన్నవి, మరియు కొన్ని మధ్య వయస్సులో, మరియు కొన్ని ముసలవి. కానీ మంచు (గడ్డకట్టే) వచ్చి మరియు వాటిని తాకినప్పుడు, అది వాటన్నిటిని చంపును. మరియు ఆ చిన్న పుష్పము తన రేకులన్నిటిని రాల్చును. మరియు ఆ పూల గుత్తిలో నుండి, ఒక చిన్న నల్ల విత్తనము, చిన్న, చిన్నదైన ఒకటి బయటకు వచ్చును.

మరియు ఎంత వింతగా అది కనబడును… కానీ ఇంకా, దేవుడు ఆ పువ్వు కొరకు సమాధి క్రమమును చేసెను. అది మీకు తెలుసా? ఆ పడుచున్న వర్షము వచ్చి, మరియు అది గొప్ప పెద్ద కన్నీళ్ళతో నీటిని కార్చుచూ ఏడ్చును. మరియు ఆయన ఆ చిన్న విత్తనమును నేలలో పాతి పెట్టును. తరువాత శీతాకాలపు చల్లదనము వచ్చును, మరియు దానిని గడ్డ కట్టించును, విత్తనము పగులును; దానిలో నుండి సారము బయటకు వెళ్ళును. నీవు చూడగలిగిన ప్రతీ సహజమైన సంగతి అంతా పోయినది.

38ఒక శాస్త్రవేత్త చేతికందినంత ఆ ధూళిని తీసుకొని, మరియు దానిని పరిశోధనాశాలకు తీసుకొని వెళ్ళి, మరియు ముందు వెనుకా దానిని పరిశోధించ వచ్చును. మరియు ఆ జీవము యొక్క బీజమును నీవు కనుగొనలేవు. అది అక్కడ లేదు. పొటాష్, కాల్షియం, మరియు చమురు, మరియు తేమ, దానిలో ఉన్న ప్రతీది మట్టిలోనికి తిరిగి వెళ్ళినది. కానీ ఎక్కడో ఆ జీవము యొక్క బీజము దాగి యున్నది. మరియు వసంతకాలములో తిరిగి సూర్యుడు ఉదయించినంత ఖచ్చితముగా, అది తిరిగి జీవించును. దాని కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసెను.

మీ యొక్క వసారాలో చలికాలమున నీవు కాంక్రీటును తీసుకొని పోయుము, రాళ్ళను వేయుము. నీ యొక్క గొప్ప గడ్డిపాన్పు ఎక్కడ? అది నీవు నడుస్తున్న దాని చుట్టూ చివరనే ఉండును. ఎందుకు? అవి ఆ విత్తనములే కప్పబడినవి. మరియు సూర్యుడు ఆ వృక్షజాలముపై ప్రకాశించుట ప్రారంభించినప్పుడు, ఆ చిన్న జీవము యొక్క బీజము ఆ కాంక్రీటు అంతటి నుండి తన మార్గమును కనుగొని, ప్రతీ రాయి పైన, ప్రతీ కర్ర క్రింద మరియు తన యొక్క చిన్న ముఖము బయటకు చొచ్చుకొని వచ్చేంత వరకు వచ్చి, మరియు దేవుని యొక్క జీవమును స్తుతించును. నీవు జీవమును ఏ మాత్రము దాచియుంచలేవు. సహోదరులారా, దాని కొరకే మనము ఇక్కడ ఉన్నాము, జీవమును తీసుకొని వచ్చుటకు.

39ఎంతో కాలము క్రితము కాదు, నేను ఒక పాత మెథడిస్టు సేవకునితో కూర్చొని, భోజనము చేయుచున్నాను, దేవుని యొక్క కృపగల పాత పరిశుద్దుడు. అతడు తన జీవితములో పరిశుద్ధాత్మను కలిగియుండెను. మరియు మేము లూయిస్-విల్లీ నుండి వచ్చే వ్యవసాయ గంట కార్యక్రమమును వినుచున్నాము. మరియు జొన్న విత్తనములను బాగు చేయగల ఒక యంత్రమును 4H క్లబ్బు కలిగియున్నది, మరియు పొలములోనే పెరిగినట్లుగా ఉన్న ఒక మంచి జొన్న రొట్టె వలె అది తయారు చేయును - అదే రకపు జొన్న రేకులు (corn flakes).

మరియు నిజానికి, మీరు దానిని ముక్కలు చేసి తెరువవచ్చు, వాటిని పరిశోధనాశాలలో పెట్టి, మరియు దానియొక్క గుండె సరైన స్థానములో ఉన్నది, తగినంతగా తేమ, మరియు పొటాష్, మరియు ఆ జొన్నలో ఉన్నవన్నీ. మీరు వాటిని వేరు చేయలేరు. ఒకసారి వాటిని కలిపి మిశ్రమము చేస్తూ, నీవు ఒక దానితో ఇంకొక దానితో తేడాను చెప్పలేవు, అది చాలా పరిపూర్ణము.

అతడు చెప్పాడు… "మరియు ఏది ఏదో నీవు చెప్పుటకు ఒకే ఒక మార్గము వాటిని పాతిపెట్టుము. మరియు ఆ యంత్రము కుళ్ళిపోజేసినవి, మరియు అవి అన్నీ. కానీ దేవుడు పెంచినవి, అవి అక్కడ జీవమును కలిగియుండి అవి తిరిగి లేచును."

JOHN 10:10

 

40ఒక వ్యక్తి క్రైస్తవుని వలె కన్పించవచ్చు, ఒక క్రైస్తవుడిని అనుకరించవచ్చు, లేక క్రైస్తవుని వలే నడవవచ్చు, లేక అటువంటివి. కానీ ఆ జీవము యొక్క బీజము ఉన్నంతవరకు, అతడు తిరిగి లేవలేడు.

యేసు చెప్పెను, "వారు జీవమును కలిగియుండుటకే నేను వచ్చాను," - జో (Zoe), దేవుని యొక్క సొంత జీవము వారిలో ఉన్నది. మరియు అక్కడ… ప్రారంభము కలిగియున్న ప్రతీ దానికి ముగింపు ఉన్నది. ఏ సంగతులకైతే ప్రారంభము లేదో దానికి ముగింపు లేదు. ప్రారంభము లేనిది ఒకే ఒక్కటున్నది; అది దేవుడే. మరియు మనము ఆయన పిల్లలమగుదుము, ఆయనలో భాగము, తరువాత జో, దేవుని యొక్క సొంత జీవము, నిత్యజీవము, మనకు విభాగించబడినది. మరియు మనము జీవించుటకు ఒకే ఒక్కమార్గము అదే. మరియు ఇక్కడనున్న మన నశించిన స్నేహితులు, ఇంకా సంఘ సభ్యులు, తిరిగి జీవించగల ఒకే ఒక మార్గము అదే, ఎందుకనగా జో వారికి విభాగించబడినది, మరియు మనము భాగమయ్యాము.

ACTS 2:3,4•

HEB 11:26

 

41మీరు గమనించారా పెంతెకొస్తు దినాన, ఏ విధముగా ఆయన యొక్క గొప్ప అగ్నిస్తంభము మనకందరికి తెలిసిన నిబంధన దూత, యేసుక్రీస్తు, అది… మోషే ఐగుప్తు యొక్క సంపదలు కంటే క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను, ఏలయనగా అతడు ఐగుప్తును విడిచిపెట్టెను, ఆ గొప్ప వర్తమానికుడిని వెంబడించుచున్నది, ఈ వెలుగు.

పెంతెకొస్తు దినమున, ఈ గొప్ప వెలుగు అక్కడ వచ్చినప్పుడు, దేవుడు తన్ను తాను విభాగించుకొనెను. అన్నీ నాలుకలు ప్రతీ ఒక్కరిపైనా కూర్చొనెను, మరియు వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిరి, మరియు అన్యభాషలలో మాట్లాడుట ప్రారంభించిరి, ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించెను, సంఘములో ఒక్కొక్కరి యందు దేవుడు తన్ను తాను వేరుపరచుకొనుచున్నాడు, తన ప్రజలతో తన జీవమును విభాగించుచున్నాడు. ఆ వర్తమానమునే ఖచ్చితముగా మనము ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళవలెను. అది లేకుండా వారు నశించెదరు. వారు నశించవలసినదే.

42నా సొంత తల్లి ఈ మధ్యనే నిద్రించినది. నేను ఆమె ప్రక్కన నిలబడినప్పుడు, ఆమె చెప్పినది, "బిల్లీ…" జీవించియున్నవారు ఆమె యొక్క పిల్లలు అందరు అక్కడ నిలబడ్డారు. మా పదిమందిలో ఇద్దరు చనిపోయారు. మరియు బాలిక… ఆమె నావైపు చూచినది, మరియు ఆమె చెప్పినది… మొదటిగా ఆమె డెలోరస్ ను చూసినది. ఆమె చెప్పెను, నా చివరి, మరియు నా మొదటి మరియు తల్లి కృపగల క్రైస్తవురాలు, మరియు చాలా సంవత్సరాల క్రితము నేను ఆమెను క్రీస్తు యొద్దకు నడిపించి మరియు ఆమెకు బాప్తిస్మమిచ్చాను.

మరియు ఆమె చెప్పినది, "డెలోరస్, నీవు నన్ను మంచిగా చూసుకున్నావు. నీవు నాకు సహాయము చేశావు. నేను ముసలిదాననై మరియు ఉతుక్కొనలేనప్పుడు, నీవు నా కొరకు చాలా ఉతికియున్నావు. నా ఇంటిని శుభ్రము చేయుటకు నీవు వచ్చావు. నీవు ఈ సంగతులను చేసియున్నావు." ఆమె చెప్పెను, "హనీ, నేను నిన్ను ప్రేమించుచున్నాను."

మరియు డెలోరస్, ఒక యవ్వన క్రైస్తవురాలు, ఏడుస్తూ అక్కడ నిలబడెను, క్రిందకి చూస్తూ, మరియు ఆమె చెప్పెను, "అమ్మా, ఇదంతా చాలా తక్కువ."

ఆమె చెప్పెను, "బిల్లీ, నేనెన్నడూ ఆకలిగొనకుండా నీవు నన్ను చూచావు."

మరియు నేను చెప్పాను, "అమ్మా, మన దగ్గర తినడానికి ఏమీ లేనప్పుడు, నాకు తినుటకు ఏదో ఉండాలని ఎన్నిసార్లు నీవు బల్లయొద్ద నుండి నడిచి వెళ్ళిపోయావు?" మరియు నేను చెప్పాను, "అమ్మా, అది ఒక బాధ్యత మాత్రమే."

మరియు ఆమె చెప్పెను, "తరువాత నీవు నాకు ఒక రకమైన ఆత్మీయ మార్గదర్శివై యున్నావు, బిల్లీ. నీవు నాకు బాప్తిస్మమిచ్చావు. నాకు జీవమార్గమును చెప్పియున్నావు."

నేను చెప్పాను, "అమ్మా, నీకు తెలుసు మన నేపధ్యము కాథలిక్కు అయి యున్నది." మరియు నేను చెప్పాను, "అప్పుడు నేను చర్చికి వెళ్ళాను, కానీ వారు చెప్పారు, "ఇదే సంఘము," మరియు అది వాక్యానికి వ్యతిరేకము. నేను సంఘము నుండి సంఘమునకు వెళ్ళాను, మరియు అది చాలా వ్యతిరేకమని నేను కనుగొన్నాను. కనుక, నేను వాక్యముతోనే నిలిచానమ్మా." మరియు నేను చెప్పాను, "మరియు ఏది నిజమో నేను నీకు చెప్పుటకు ప్రయత్నించి మరియు నిన్ను క్రీస్తు నొద్దకు నడిపించాను."

మరియు ఆ ప్రియ వృద్ధ పరిశుద్ధురాలు దేవున్ని కలుసుకొనుటకు వెళ్ళిపోయెను. మరియు తరువాత ఆమె ప్రాణమును తిరిగి దేవునికి అప్పగించాను.

PS 116:15

 

43డెలోరస్ నన్ను పిలిచి, మరియు ఆమె చెప్పెను, "బిల్లీ, నేను దానిని మరచిపోలేకున్నాను." ఆమె చెప్పెను, "అమ్మ!"

నేను చెప్పాను, "డెలోరస్, నీవు జీవించుచున్న దాని దగ్గర నుండి దూరముగా రోడ్డు వైపు చూడుము. అక్కడొక పెద్ద పొడవైన ఓక్ వృక్షము ఉన్నదా?"

ఆమె చెప్పెను, "అవును." అది అమ్మ చనిపోవుటకు కొద్ది దినములు ముందు మాత్రమే. మరియు ఆమె చెప్పెను, "అవును."

నేను చెప్పాను, "ఇప్పుడు ఆకురాలు కాలము వచ్చుచున్నది." నేను చెప్పాను, "ఒక నెల క్రితము ఆ ఆకులు నిజముగా అందముగా మరియు పచ్చగానున్నవి."

"అవును," ఆమె చెప్పెను, "బిల్."

చెప్పెను, "ఎప్పుడు… అవి ఇప్పుడు ఏ విధముగా కనిపించుచున్నవి?"

మరియు ఆమె చెప్పెను, "మంచిది, అవి పసుపు, మరియు గోధుమ రంగు, మరియు పచ్చ, ఎరుపు."

మరియు నేను చెప్పాను, "డెలోరస్, వాటిని పసుపు, గోధుమ రంగు, పచ్చ మరియు ఎరుపు రంగులలో చేయునది ఏది?"

ఆమె చెప్పెను, "అవి చనిపోవుచున్నవి."

నేను చెప్పాను, "ఆ చెట్టు తన పూర్తి అందముతో ఎప్పుడున్నది?"

ఆమె చెప్పెను, "ఇప్పుడే,"

నేను చెప్పాను, "యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది," చూశారా. అది సమయము వచ్చినప్పుడు. నేను చెప్పాను, "జీవము వెనుకకు వెళ్ళిపోవుచున్నది. జీవము ఒక వృక్షమైయున్నది. మనమందరము జీవవృక్షము పైన వ్రేలాడుచున్నాము. అది నిజము."

44శ్రీ. వుడ్, కూడికలలో అతడు పుస్తకాలను అమ్మువాడు, అతడొక యెహోవా సాక్షి. అతడొక బాలుడిని కలిగియున్నాడు, అతడు కూడా అతనితోనే ఉన్నాడు; అతడి కాలు పోలియోతో ఇలా ఈడ్వబడుచున్నది. మరియు అతడు లూయిస్ విల్ లోని ఒకానొక కూడికలో ఉన్నాడు, మరియు అతడు ఆ వివేచనను గమనించాడు. మరియు అతడు చెప్పాడు, "ఇప్పుడు, అది సరియే అని నాకు తోచినది."

కనుక నేను అక్కడ బ్రదర్ కిడ్సన్ మరియు వారితో ఉన్నప్పుడు అతడు టెక్సాస్ లోని, హూస్టన్ కి వెళ్ళాను, అప్పుడే ప్రభువు యొక్క దూత యొక్క చిత్రము తీయబడినది. మరియు, మంచిది, అది చాలాసార్లు తీయబడినది, మరియు ఈ మధ్యనే మళ్ళీ తీయబడినది. అది జర్మనీలో తీయబడినది, మరియు చాలాసార్లు.

45కనుక, మరియు సహోదరుడు వుడ్ తన బాలుడిని తీసుకొని వచ్చాడు, మరియు ఒకానొక కూడికలలో ఉన్నాడు. మరియు వారు ఎక్కడో వెనుక కూర్చొన్నారు, ఓ దాదాపుగా సగము పట్టణము అవతల, లేక దూరముగా. ఒక రాత్రి వేదికపై నిలబడియున్నాడు, నా జీవితమంతటిలో ఎన్నడూ అతడిని గూర్చి వినలేదు, అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. నా ముందు ఒక దర్శనమును నేను గమనించాను, మరియు నేను చెప్పాను, "అక్కడొక వ్యక్తి. అతడు వెనుక ఎక్కడో కూర్చొన్నాడు, అతడు మరియు అతడి భార్య. మరియు వారు కెంటకీ రాష్ట్రానికి చెందినవారు, అక్కడొక స్థలముగా పిలువబడే లాగ్రేంజ్, కెంటకీ. అతడి పేరు వుడ్. అతడొక వడ్రంగి, పోలియో వలన పాడై తన యొక్క కాలు లాగివేయబడిన ఒక బాలుడు అతడికి ఉన్నాడు. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ బాలుడు స్వస్థపడ్డాడు," మరియు ఆ విధముగా ప్రారంభించాడు. మరియు అతడి భార్య ఒక మెథడిస్టు, కనుక… లేక చర్చ్-ఆఫ్-గాడ్ అని నేను నమ్ముచున్నాను, ఆండర్స్న్ చర్చ్-ఆఫ్-గాడ్.

చెప్పెను, "రూబీ, అది నీవు విన్నావా?" మరియు అతడు చెప్పాడు, "దావీదు, లేచి నిలబడు." అతడి కాలు వేరే కాలు ఉన్నంతగా పరిపూర్ణమైనది. అతడు కూడికలో ఉన్నాడు. మరియు ఆ యెహోవా సాక్షి తనను తాను క్రీస్తుకు ఇచ్చుకున్నాడు.

46మరియు తరువాత, అక్కడ నుండి తన సహోదరుడు క్రిందకి వచ్చాడు… ఓ, వారు మీకు తెలుసా, ఆ యెహోవా సాక్షులు ఏ విధముగా అనుభూతి చెందెదరు. వారియొక్క సహవాసము నుండి తన సహోదరుడిని బయటకు గెంటి వేయుటకు వారు వచ్చారు. అతడు చెప్పాడు, "నీవు అటువంటి సంగతిని వినుచున్నావా?" చెప్పాడు, "ఈ తప్పుడు సంగతులు అలా వెళ్ళుచున్నవా? నీవు…?" అతడి యొక్క తండ్రి యెహోవా సాక్షులలో పాఠకుడై యున్నాడు. అతడు చెప్పాడు, "అటువంటి సంగతి కన్నా మిన్నయైనదేదో నీకు తెలుసు." అతడు చెప్పాడు, "ఒకవేళ నేను ఎన్నడైనా ఆ మనుష్యుని చూస్తే, నేను అతడికి మనఃశాంతిని ఇచ్చెదను." చెప్పాడు, "మా నాన్నను గూర్చిన బోధన అది నాకిచ్చును అని నాకు తెలుసు."

"అతడే అక్కడ గడ్డిని కోయుచున్నాడు," అని చెప్పాడు.

మరియు ఒక పాత వంగియున్న టోపీతో నేను వచ్చాను, మీకు తెలుసు, మరియు కూర్చొని అతడితో మాట్లాడాను. అతడు చెప్పాడు, "మంచిది, బ్రెన్హాం గారు, నేను నీకు చెప్పెదను, మేము యెహోవా సాక్షులుగానే ఎదిగాము."

నేను చెప్పాను, "అది చాలా మంచిది." నేను చెప్పాను, "అస్సలు ఏ వెలుగు లేకుండా ఉండుటకు బదులు నేను ఒక యెహోవా సాక్షిగా ఉందును," మరియు అతడు చెప్పినది ఏమీ నిరాకరించకుండా, మరియు ఆ విధముగా నేను కొనసాగాను; మరియు నేను మాట్లాడగలిగినంత శ్రేష్ఠముగా అతడితో మాట్లాడితిని. మరియు నేను చెప్పాను, "నీవు ఒక వివాహితుడవని, మరియు నీవు ఇద్దరు పిల్లలను కలిగియున్నావని నేను చూస్తున్నాను." మరియు నేను చెప్పాను, "కానీ నీవు నీ భార్య నుండి వేరైనావు."

47మరియు అతడు బాంక్స్ వైపు చూచాడు. అది శ్రీ. డేవిడ్ వుడ్స్ తండ్రి, అతడిక్కడ కూడికలో ఉన్నాడు. అతడు చూచాడు - బహుశా శ్రీ. వుడ్ దానిని నాకు చెప్పియున్నాడని అతడు అనుకొన్నాడు, మరియు అతడి ఆలోచనను నేను అక్కడే పట్టుకొన్నాను, చూశారా.

కనుక నేను చెప్పాను, "సహోదరుడు బాంక్స్ నాకు దానిని చెప్పాడు అని నీవు తలంచావు. అతని కుటుంబమును గూర్చి అతడు నాకు ఏమియూ చెప్పలేదు." అయితే నేను చెప్పాను, "బహుశా బాంక్స్ నాతో చెప్పెను అని నీవు అనుకొని ఉండవచ్చు… గతరాత్రి ముందు నీవొక ముదురు గోధుమరంగు జుట్టు కలిగిన స్త్రీతో ఉన్నావు. ఆమె ప్రియుడు తలుపునొద్దకు వచ్చి, మరియు తలుపు తట్టినప్పుడు నీవు గదిలో ఆమెతో ఉన్నావు. మరియు ఆమె తలుపు నొద్దకు వెళ్ళినది, మరియు నిన్ను రానివ్వలేదు, మరియు నీవు కిటికీ గుండా చూచావు. అది ఒక మంచి సంగతి. అతడు నీ మెదడును పేల్చేసేవాడు." నేను చెప్పాను, "ఆ వ్యక్తి ముదురు రంగు సూటు, ఎర్రని టై కట్టుకొని అక్కడ నిలబడియున్నాడు."

ఓ, అతడు నేలపై పడిపోబోయాడు. అతడు చెప్పాడు, "అది సత్యము. అది సత్యము!" మరియు అక్కడే నేను అతడికి బాప్తిస్మమిచ్చాను. మరియు అక్కడ నుండి కొద్ది దినముల తరువాత, ఇదిగో అతడి యొక్క నాన్న ఇక్కడికి వచ్చాడు. అతడి సహోదరి ఇక్కడకు వచ్చింది. ఆమె ఆ ఇద్దరు బాలురను సరిచేయుటకు రానైయున్నది. ఆమె వచ్చిన దినమునే ఆమెకు బాప్తిస్మమిచ్చాము, అదే దాని ద్వారా. అతడి యొక్క నాన్న వచ్చాడు, మరియు ఆయన మమ్ములనందరినీ సరిచేయబోవుచున్నాడు. కనుక అతడు మమ్ములను తీసుకొని వెళ్ళగోరాడు…

ACTS 8:36

 

48నేను చెప్పాను… అతడొక జాలరి. నేను చెప్పాను, "బాంక్స్, ఇప్పుడు, అతడిని చేపలు పట్టుటకు తీసుకొని వెళ్ళెదము." కనుక మేము నదిపైన ప్రారంభించాము. రాత్రంతా వర్షము కురిసినది. తూర్పు ప్రాంతమున ఎలా ఉండునో మీకు తెలియును. ఆ నదులు పొంగుతూ ఉండును, మరియు అటువంటివి. మేము వూల్ఫ్ క్రీక్ జలాశయమునకు వెళ్ళుచున్నాము. మరియు ఆ రోడ్డుపై… ఇంకనూ మతమును గూర్చి అతడు ఏమియూ చెప్పలేదు, చాలా కఠినమైన వృద్దుడు. మరియు అతడు చెప్పాడు… అతడు కావలసినంత తెలివిగలవాడు. కనుక అతడు నదిని దాటాడు.

నేను చెప్పాను, "మంచిది…" నేను అక్కడ కూర్చొనియున్నప్పుడు నా ముందుకు ఒక దర్శనము వచ్చుట నేను చూచాను. బాంక్స్ కారు నడుపుచుండెను, నేను దర్శనమును చూచాను. నేను చెప్పాను, "ఇప్పుడు, మనము దాటు ప్రతీ వాగు…"

అతడు ఇప్పుడే చెప్పాడు… ఆ రాత్రి అతడు చెప్పాడు, "ఒకవేళ అటువంటిదేదైనా జరుగుట ఎన్నడైనా నేను చూచినయెడల, దానిని నేను నమ్మెదను."

కనుక ఆ ఉదయము… ప్రభువు యొక్క కృప, మరియు చెప్పెను, "మనము దాటు ప్రతీ వాగు బురదగా ఉండును. మనము ఆ వూల్ఫ్ క్రీక్ జలాశయమునకు వెళ్ళినప్పుడు… ఆ వర్షము జలాశయమునకు పైగా లేక జలాశయమునకు క్రిందగా వెళ్ళెను, మరియు అది బురదగా ఉండదు, మరియు ఈ రోజు మనము చేపలు పట్టెదము. సాయంత్రము వరకు ఈ రోజు మనము ఏమీ పట్టుకొనము."

"మరియు అప్పుడు ఇక్కడ శ్రీ. వుడ్, బాంక్స్ వుడ్, నీవు ఒక చిన్న క్యాట్ ఫిష్ ను పట్టుకొనబోవుచున్నావు. నేను దాదాపు ఇరవై పౌండ్లను పట్టుకొనబోవుచున్నాను, మరియు వాటిలో కొన్ని ఒక్కొక్కటి పది పౌండ్ల బరువు ఉండును. నీవు అదే ఎరతో అదే స్థలములో చేపలు పట్టెదవు, నీవు దేనిని పట్టవు."

"రాత్రి సుమారు పదకొండు గంటలకు మనము చేపలు పట్టెదము, చేపలు ఎరను తినడం ఆపి వేయును. మనము లోపలికి వెళ్ళి మరియు రాత్రి పదకొండు గంటలకు మన రాత్రి భోజనమును తిందుము, రాత్రి అంతా ఉందుము. మరియు తరువాత ఉదయము, మనము బయటకు వెళ్ళెదము, మరియు దానిపైన పొలుసులు ఉన్న ఒక పెద్ద చేపను నేను పట్టుకొనబోవుచున్నాను, మరియు అదే పట్టుకొనబోతున్న చివరది. మనము చేయము… మిగతా దినమంతా మనము చేపలు పట్టెదము, మరియు ఏమీ పట్టుకొనము."

మరియు ఆ వృద్దుడు చుట్టూ చూచాడు, ఆ విధముగా. మేము క్రిందకు వెళ్ళాము; మరియు అంతా జరుగవలసిన విధముగా, ఖచ్చితముగా జరిగినది. మరియు ఆ సాయంత్రము నేను ఆ ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు అతడు చెప్పాడు, "ఇదిగో నీళ్ళు. బాప్తిస్మము తీసుకొనకుండా నన్ను ఆపునది ఏమున్నది?" మరియు ఆ గుంపు అంతా అక్కడే ఉన్నారు. ఓ, మనము ఆ చెట్టు పైన వ్రేలాడి ఉన్నామని తెలుసుకొనుట ఒక మహిమకరమైన సంగతి.

49ఇప్పుడు, అక్కడ… శ్రీ. వుడ్ మరియు నేను ఉడుతలను వేటాడుచున్నాము. మీకు తెలుసు, నేను వేటాడుటను ఇష్టపడెదను. మరియు ఇప్పటి నుండి రెండేళ్ళ క్రితము, మేము ఇరువురము కలిపి కెంటకీలో ఉడుతలను వేటాడుచున్నాము. ఆ ఆకురాలు కాలమున నా సెలవులకు నేను వచ్చెదను. మరియు నేను ఆఫ్రికాలో, ఇండియా, మరియు దగ్గరగా ప్రపంచమంతా, కానీ నేను… ఆగష్టులో ఒక మంచు కురిసే ఉదయమున, ఆ సమయాన… ఒక 0.22 రైఫిల్తో.

కనుక అప్పుడు, ఉడుతలు వేటాడుటను నేను ప్రేమించెదను. మరియు ఒక రెండు వారములు ఉండుట కొరకు మేము కెంటకీలో ఉన్నాము, మరియు అక్కడ చాలా వేడిగా ఉన్నది. ఇప్పుడు, కాలిఫోర్నియా వాసులైన మీకు తెలియకపోవచ్చు నేను ఏమి మాట్లాడుతున్నానో, ఆకులు మరియు అవన్నీ చాలా వేడిగా ఉన్నప్పుడు… మరియు మీరు అక్కడ అడుగు పెట్టెదరు, మరియు ఆ చిన్న బూడిదరంగు ఉడుతలు …

మరియు మేము కన్నును మాత్రమే కాల్చెదము, యాభై గజాల దగ్గర. ఒకవేళ అది నలభై గజాలైన (దూరమైన) యెడల, మేము యాభై గజాల వెనుకకు వెళ్ళి, మరియు కన్నుపైన కాల్చెదము. ఒకవేళ కాకపోతే… ఒకవేళ అది దాని కన్నుకు క్రింద తగిలితే, లేక దాని కన్నుపైన, నేను రైఫిల్ మార్చబోవుచున్నాను. ఏదో తప్పు జరిగినది. కనుక మేము అక్కడే దానితో నిలిచియుందుము. అదే విధముగా… దాని కొరకు నాకు నేను తర్ఫీదు ఇచ్చుకొనుటకు నేను ప్రయత్నించాను, ఖచ్చితముగా గురిని కాల్చుటకు.

50మరియు కనుక, అప్పుడు, అక్కడ శిబిరము వేయుచున్నాము (వేట కొరకు), మరియు అది చాలా వేడిగా మారినది. మరియు ఆ చిన్న బూడిద రంగు ఉడుతలు! మీరు హూడిని గూర్చి మాట్లాడితే అతడు ఒక తప్పించుకునే కళాకారుడు - అవి (ఉడుతలు) అటువంటి కళను కలిగయున్నవి. కేవలము ఒక చిన్న పొదను తాకించుము, మరియు అవి వెళ్ళిపోయెను.

మీ అందరికీ జి.హెచ్. బ్రౌన్ తెలుసు. ఒక్కసారి దానిని గూర్చి ఆయనను అడుగుము. మేము కలిపి వేటాడాము. కనుక అప్పుడు… మరియు అతడి భార్య అతడికి కొనియున్న ఒక పాత ఆటోమేటిక్ షాట్ గన్ ను గూర్చి నేను అతడిని ఏడ్పించేవాడిని, మీకు తెలుసు, సుమారు ఇరవై సంవత్సరాల క్రితము, కనుక - ఒక షాట్ గన్ తో ఉడుతలను కాల్చుట.

51కనుక అప్పుడు, మేము వేటాడుచున్నాము, మరియు అక్కడ… సహోదరుడు వుడ్ చెప్పాడు, "బ్రదర్ బ్రెన్హాం, నీకు తెలుసా," అతడు చెప్పాడు, "ఇక్కడ ఒక ఖచ్చితమైన స్థలములో కొన్ని తొర్రలు ఉన్నవి." వాటిని కాలిఫోర్నియాలో మీరు కలిగియుండెదరని నేను అనుకోవడము లేదు. ఇదిగో ఇక్కడ, ఇక్కడ క్రింద ఆ ఏరులు పారుచున్న చోట్ల మరియు అది చిత్తడిగా (తడి నేల) చేయుచున్నది. ఆ చదును నేలపై, మీరు ఆ పొద తాకగానే, మరియు అవి వెళ్ళిపోవును. మీరు వాటి వెనుక వెళ్ళలేరు, ఎందుకనగా… అవి రెండు లేక మూడు వందల గజాల దూరము వెళ్ళిపోవును. అవి అంత వేగముగా వెళ్ళిపోవును.

కనుక అప్పుడు, మేము చెప్పాము, "మేము ఇక్కడకు వెళ్ళెదము, మరియు ఒకవేళ అవి మమ్మును వేటాడనిచ్చెదడేమో చూచెదము. అతడు సుమారు అయిదు వందల ఎకరాలు కలిగియున్నాడు."

మరియు నేను చెప్పాను, "మంచిది, అది చక్కగా ఉండును."

కనుక మేము క్రిందకు వెళ్ళాము - ఇక్కడ మీరు కలిగియున్నటువంటి మంచి రోడ్లవంటివి కాదు - కానీ గతుకుల మార్గములలో, మరియు ప్రతీది, పొద గుండా తొర్రలలో నుండి, మేము అక్కడకు చేరుకునేంతవరకూ… అతడు చెప్పాడు, "ఇప్పుడు, దీనిని గూర్చి ఒకే ఒక లోపమున్నది." చెప్పాడు, "ఈ ముసలివాడు," చెప్పాడు, "అతడొక నాస్తికుడు. మరియు, ఓ, అతడు కఠినమైనవాడు."

నేను చెప్పాను, "ఓ, నేను నిన్ను మాట్లాడనిచ్చెదను." కనుక నేను ఆ చిన్న ట్రక్కులో కూర్చొన్నాను, మరియు మేము ఒక తెల్లని అందమైన గృహము దగ్గరకు నడిపించాము, ఒక పెద్దకొండ యొక్క పాదము వద్ద, మరియు ఒక పెద్ద కలుపు పొలము మరియు ఒక మొక్కజొన్న పొలము ఇటువైపు. మేము నడిపించుకు వెళ్ళాము. అక్కడొక ఇద్దరు ముసలివారు కూర్చొని ఉన్నారు, కెంటకీకి చెందినవారు. మరియు మీకు తెలుసు, కెంటకీ తన సొంత జీవన విధానమును కలిగియున్నది.

52అక్కడ, బ్రదర్ డేవిడ్, ఆ గ్రీకు సహోదరుడు చెప్పాడు, "బ్రదర్ బ్రెన్హాం, నేను నీ యొక్క టేపును విన్నాను, నేను…" అల్పాహారము తరువాత దీనిని చెప్పుట ఒక రకముగా భయంకరమైనది. అతడు చెప్పాడు, "బిస్కెట్లో ఒక వెంట్రుకను గూర్చి నీవు ప్రస్తావించావు." చెప్పాడు, "నేను చూచాను. అది ఏమిటో నేను కనుగొనలేకపోయాను."

మరియు నేను చెప్పాను, "అది కేవలము కెంటకీనే, మీరు చూశారా, బిస్కెట్టులో వెంట్రుక నేను చెప్పాను, దానిని నిఘంటువులో కనుగొనుటకు ప్రయత్నించవద్దు, ఎందుకనగా అది అక్కడ ఉండదు." నేను చెప్పాను, "కెంటకీలో…"

53కనుక ఆ సాస్ఫ్రాస్ పల్లములోనికి మేము అక్కడకు వెళ్ళాము, మీకు తెలుసు, ఆ పాత పెద్ద టోపీలు వ్రేలాడుచున్నవి. మేము ఆగిపోయాము, మరియు సహోదరడు వుడ్ బయటకు దిగి, చుట్టూ వెళ్ళాడు. అక్కడ ఇద్దరు వృద్ధులు కూర్చొని ఉన్నారు, మరియు వారిలో ఒకని యొద్దకు అతడు నడచి వెళ్ళాడు. మరియు ఇతడు అతనిని పిలిచి, "ఎలా ఉన్నావు?" అని అడిగాడు.

మరియు అతడు అడిగాడు, "అయ్యా, ఎలా ఉన్నారు?"

మరియు అతడు చెప్పాడు, "నేను… నా పేరు వుడ్. నేను బ్యాంక్స్ వుడ్." అతడు చెప్పాడు, "నేను ఆశ్చర్యపడుచున్నాను… మేము ఇక్కడ డట్టన్ దగ్గర వేటాడుచున్నాము…" ఆ నదీ పాయలను బట్టి వారు వారి యొక్క స్థలములకు పేర్లు పెట్టెదరు. చెప్పాడు, "మేము డట్టన్ యొద్ద వేటాడుచున్నాము, మరియు మీ ఒక స్థలములో మేము వేటాడవచ్చునేమో అని అడుగుచున్నాము."

అతడు అడిగాడు, "నీవు ఏ వుడవైయున్నావు?"

అతడు చెప్పాడు, "నేను జిమ్ వుడ్ యొక్క బాలుడను."

చెప్పాడు, "వారెవరైనా …" [వారు నిజమైన ప్రజలైన ఒక గుంపు యెహోవా సాక్షులై యున్నారు.] అతడు చెప్పాడు, "జిమ్ వుడ్ వారు ఎవరైనా, అతడి ప్రజలు ఎవరైనా - నేను కలిగియున్న ఈ స్థలములోనికి ఎవరినైనా రావచ్చును." అతడు అడిగాడు, "ముసలివాడైన జిమ్, అతడు ఇంకనూ జీవించుచున్నాడా?"

ఆయన చెప్పాడు, "అవును. అతడు ఇప్పుడు ఇండియానాలో ఉన్నాడు," మరియు చెప్పాడు, "నేను కూడా అక్కడే జీవించుచున్నాను. మరియు ప్రతీ వేసవిలోను ఉడుతలను వేటాడుటకు నేను ఇక్కడకు వచ్చెదను."

54మంచిది అతడు చెప్పాడు, "నీకు నీవే సహాయపడుము. నాకు అయిదు వందల ఎకరాలు ఉన్నవి, మరియు అనేకమైన మడుగులు మరియు అవన్నీ. కేవలము నీకు నీవే సహాయము చేసుకో."

అతడు చెప్పాడు, "మంచిది, చాలా ధన్యవాదములు. నేను నా పాష్టరును కూడా తీసుకొని వచ్చాను. అతడు కూడా వేటాడుటను నీవు పట్టించుకొనవుగదా?"

అతడు చెప్పాడు, "వుడ్, అంటే ఎక్కడకు వెళితే అక్కడకు ఒక బోధకుడిని తీసుకొని వెళ్ళేంతగా నీవు తగ్గిపోయావని నాకు చెప్పాలనుకొనుచున్నావా?" మరియు అతడు చెప్పాడు…

కనుక నేను కారు బయటకు రావలసిన సమయము అదే అని నేను తలంచాను. కనుక నేను కారు బయటకు వచ్చి, మీకు తెలుసా, మరియు అక్కడకు నడుచుకొని వెళ్ళి, మరియు నేను చెప్పాను, "మీరు ఎలా ఉన్నారు?"

అతడు అన్నాడు, "మీరెలా ఉన్నారు." మరియు అతడు చెప్పాడు… వారు నన్ను పరిచయం చేయడానికి ముందే, అతడు అక్కడే ఎగతాళి చేసియున్నాడు. ఆయన చెప్పాడు, "మంచిది, కుర్రవాళ్ళారా నేను మీకు ఎటువంటి ఉపయోగపడను."

నేను చెప్పాను, "మంచిది, మీ నిజాయితీని నేను ఇష్టపడుచున్నాను."

మరియు అతడు చెప్పాడు, "దానికి కారణము, ఈ ఒక్క సంగతే." అతడు చెప్పాడు, "మొదటిగా, నీవు ఒక బోధకుని వలె కనిపించుట లేదు." [ఉడుత రక్తము మరియు వ్రేలాడే గడ్డము, మరియు రెండు వారముల నుండి స్నానము లేక ఉండుట, నేను…]"

కనుక నేను చెప్పాను, "మంచిది, అది సరైనదే అని నేను ఊహించుచున్నాను."

55మరియు అతడు చెప్పాడు, "మీకు వ్యతిరేకముగా నేను కలిగియున్న సంగతి ఏదనగా, అక్కడ ఏమీ లేకపోయినా, మీరు ఆ చెట్టు వద్ద మొరుగుచున్నారు."

ఇప్పుడు, అది ఏమిటో మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అది మరో "కెంటకీ," డేవిడ్. దానిని నిఘంటువులో కనుగొనడానికి ప్రయత్నించొద్దు. ఒక వేట కుక్క అబద్దమైనదైతే, అది ఒక చెట్టు యొద్దకు పరిగెత్తును. అది ఒక పన్నాగమును కలిగియున్నది. అది పరిగెత్తును, చెట్టు పైకి దుముకును, మరియు తరువాత క్రిందకు దూకును, మీరు చూశారా. మరియు ఒకవేళ ఒక కుక్క బాగుగా తర్ఫీదు పొందకపోతే, అది వేటను చూసిన ఈ చెట్టు యొద్దకు పరుగెత్తి వచ్చును, చెట్టు చుట్టూ అది వాసన చూచును, మరియు అక్కడే నిలబడి మొరుగును. మరియు అక్కడ ఆ చెట్టులో ఏమీ లేదు. కనుక సాధారణముగానే వారు ఆ కుక్కను కాల్చి వేసెదరు.

కనుక "మీరు… మీకు కావలసినది అదే - ఒక మంచి లోడు కలిగిన తుపాకీ గుళ్ళు," అని అతడు చెప్పాడు. "ఎందుకనగా అక్కడ ఏమీ లేకపోయినా మీరు చెట్టు వద్ద మొరుగుచున్నారు." నేను ఏమి చెప్పుచున్నానో మీకు తెలుసు, ప్రసంగించుట. అతడు చెప్పాడు, "నేను ఒక అవిశ్వాసిగా లెక్కించబడుచున్నాను."

నేను చెప్పాను, "మంచిది, ప్రతీ ఒక్కరూ సొంత అభిప్రాయము కలిగియుందురు. కానీ నాకైతే, గొప్పగా చెప్పుకొనుటకు అక్కడ ఏమీ లేదు."

56అతడు చెప్పాడు… "మంచిది," అతడు చెప్పాడు, "దాని సంగతి ఏదనగా," చెప్పెను, "అటువంటిది కాని ఒక విషయము కొరకు మీరు ఏదో మాట్లాడుచున్నారు."

చెప్పెను, "అవునయ్యా." నేను చెప్పాను, "అవును, అది అభిప్రాయమునకు."

మరియు అతడు చెప్పాడు, "మంచిది, మీరు ఒక దేవుని గూర్చి మాట్లాడుచున్నారు, మరియు అటువంటి సంగతి అనేదే లేదు." మరియు అతడు చెప్పాడు, "ఒకవేళ ఉంటే నేను ఆయనను చూడగలిగేవాడిని." మరియు చెప్పాడు, "నేను ఈ సంవత్సరములన్నీ జీవించాను. నేను డెబ్బై మరిన్ని సంవత్సరములు కలిగియున్నాను," మరియు చెప్పాడు, "నేను ఆయనను ఇంతవరకూ చూడలేదు." మరియు అతడు చెప్పాడు, "అటువంటి సంగతి లేనేలేదు, మరియు మీరు తప్పుడు చెట్టు వద్ద మొరుగుచున్నారు. మరియు మీ జీవనోపాధి కొరకు మీరు ప్రజల డబ్బును తీసుకొనుచున్నారు, మరియు అటువంటి సంగతులు, మరియు మీరు మరేమి కాదు కానీ ఒక గుంపు మోసగాళ్ళు."

నేను తలంచాను, "ఓ, మై!" నేను చెప్పాను, "అవునయ్యా. అవును అది అభిప్రాయము." నేను తలంచాను, "ఓ దేవా, ఒకవేళ నీవు నాకు సహాయము చేయకపోతే…" కనుక నేను చెప్పాను, "అవునయ్యా. అది అవును, అభిప్రాయము." నేను చెప్పాను…

57మరియు మీకు తెలుసు, అమ్మ, నా పాత దక్షిణదేశపు అమ్మ ఎల్లప్పుడూ నాకు మంచి సలహా ఇచ్చును, మరియు ఒకసారి ఆమె ఓక భావనను నాకు ఇచ్చినది. ఆమె చెప్పెను, "ఒక ఆవునకు తగినంత తాడును ఇమ్ము, మరియు అది దానికదే ఉరివేసుకొనును," మీరు చూశారా. కనుక అది అతడికి ఒక మంచి సంగతి అని నేను తలంచాను: అతడిని కొంచెము ఆ విధముగా పోనిచ్చి మరియు కొంచెము సేపు మొరగనిచ్చెదను, మరియు అతడు ఏ చెట్టుపైన ఉన్నాడో మనము చూచెదము, మీరు చూశారా. నేను అతడిని ముందుకు పోనిచ్చి మరియు మాటలాడి, మరియు ఒకదానిని కనుగొన్నాను. మరియు ఏదో నా మనస్సులోనికి వచ్చినది.

మరియు అక్కడ ఒక ఆపిల్ చెట్టు ఉన్నది, వారు అక్కడ దాని క్రింద కూర్చొన్నారు. మరియు సంవత్సరములో వేసవి కాలమున ఆపిల్ పళ్ళు, (అది సుమారు ఆగష్టు చివరి వారములో), ఆపిల్ పండ్లు రాలిపోవుచున్నవి, మరియు యెల్లో జాకెట్స్ (కందిరీగలు) వాటిని తినివేయుచున్నవి. యెల్లో జాకెట్స్ (కందిరీగలు) ఏమిటో మీకు తెలుసా? అది సరియే. మంచిది, నీవు కెంటకీలో ఏ భాగము నుండి వచ్చావు? కనుక, అప్పుడు నేను అతడికి చెప్పాను, "ఆపిల్ పండ్లలో ఒకదానిని నేను తీసుకొన్నయెడల నీకేదైనా అభ్యంతరమా?" అని నేను చెప్పాను.

అతడు చెప్పాడు, "నీవే సహయము చేసుకొనుము. కందిరీగలు వాటిని తినివేయుచున్నవి."

58అక్కడకు వెళ్ళి మరియు వాటిని పొందుకొని, మరియు ఈ పాత మాసిన ఫ్యాంటు పైన వాటిని రుద్ది మరియు కొరికాను; నేను చెప్పాను, "మై, అది ఒక మంచి ఆపిల్ పండు."

చెప్పాడు, "అవును, అది ఒక చక్కనైనది."

నేను చెప్పాను, "అది చాలా బరువుగా ఉన్నట్లు కనిపించుచున్నది. "అవునయ్యా." "నేను ప్రతీ సంవత్సరము అధిక మొత్తములో వాటిని పొందుకుంటున్నాను," అని చెప్పాడు.

"చెట్టు వయస్సు ఎంత?" అని అడిగాను. అతని యొద్ద అంశము మారుస్తూ, మీకు తెలుసు.

మరియు అతడు చెప్పాడు, "ఓ," అతడు చెప్పాడు, "అక్కడ ఆ పాత దీపస్తంభము నిలబడియుండుట నీకు కనబడుతుందా?" చెప్పాడు, "నేను అక్కడ జన్మించాను." "అమ్మా, నాన్న అక్కడ నివసించారు," అని చెప్పాడు. మరియు చెప్పెను, "మరియు అగ్నిలో అది తగలబడినది. మేము ఇక్కడ ఈ కొత్త గృహమును నిర్మించాము." "అప్పుడు నేనక్కడ పెరిగాను, మరియు అమ్మ మరియు నాన్న చనిపోయినప్పుడు, నేను అక్కడే గృహముతో ఉండిపోయాను."

మరియు చెప్పాడు, "మేము ఇక్కడకు కదిలి వచ్చినప్పుడు, నలభై, యాభై సంవత్సరాల క్రితము, లేక మరెన్నో, నేను ఆ చెట్టును అక్కడ పాతియున్నాను." మరియు చెప్పాడు, "అప్పటి నుండి అది అక్కడ ఉన్నది."

నేను చెప్పాను, "అది మంచిది." నేను చెప్పాను, "మై, అది అద్భుతము."

59అతడు చెప్పాడు, "అవునయ్యా." అతడు చెప్పాడు, "మళ్ళీ ప్రసంగీకునిగా ఉండుట యొద్దకు వచ్చెదము, నేను నిన్ను ఏదో అడగాలనుకొనుచున్నాను."

నేను చెప్పాను, "సరే అయ్యా. అది ఏమిటి?"

అతడు చెప్పాడు, "మీరు, ఒకవేళ మీరు ఏదైనా ఉత్పత్తి చేసినయెడల, ఎందుకు, అది వ్యత్యాసముగా ఉండును." అతడు చెప్పాడు, "ఇప్పుడు, ఒకసారి ఒక ప్రసంగీకున్ని నేను విన్నాను, లేక అతడిని గూర్చి విన్నాను."

చెప్పాడు, "వృద్ద సహోదరి (ఎవరో) ఇక్కడ కొండపై ఉన్నది," చెప్పెను, "ఆమె కేన్సరుతో చనిపోవుచున్నది." మరియు చెప్పెను, "ఇక్కడ ఉన్న యాక్షన్, కెంటకీ నొద్దకు ఒక బోధకుడు వచ్చాడు [అక్కడ, అక్కడ నుండి అది ముప్ఫై మైళ్ళ దూరము, మరియు వుడ్స్ నా వైపు చూచాడు, మరియు నేను నా తలను ఆడించాను], అతడు చెప్పాడు, "ఆ మెథడిస్టు క్యాంప్-గ్రౌండ్ వద్ద."

అతడు చెప్పాడు, "ఈ బోధకుడు ఇండియానా నుండి వచ్చాడు." మరియు అతడు చెప్పాడు, "మరియు ఆయన అక్కడకి వచ్చాడు, మరియు చెప్పాడు… వారు చెప్పారు అక్కడ సుమారు ఇరవై-ఐదు వందలమంది ఆ రాత్రి అక్కడ సమకూర్చబడ్డారు." మరియు అది అక్కడ ఆ కొండలలో, మీకు తెలుసు. వారు అక్కడకు వచ్చుటకు గుర్రపు బగ్గలు మరియు వాటన్నిటిపై వచ్చారు.

60మరియు చెప్పాడు, "ఆయన అక్కడ మూడు రాత్రులు ఉన్నాడు."

మరియు చెప్పాడు, "రెండవ రాత్రి, ఈ వృద్ధ సహోదరి యొక్క చెల్లి క్యాంప్-బెల్స్-విల్ అని పిలువబడే ప్రాంతములో నివసిస్తున్నది. మరియు ఈ బోధకుడు ప్రసంగిస్తున్నప్పుడు, అతడు వెనుకకు ప్రేక్షకుల వైపుకు చూశాడు, ఈ స్త్రీ ఉన్న వైపునకు మరియు ఆమె పేరును పిలిచాడు, మరియు చెప్పాడు, "ఈ రాత్రి, నీవు ఇంటిని విడిచిపెట్టక ముందు, ఎడమ వైపున ఉన్న ఒక డ్రెస్సింగ్ బల్లవైపు చూచావు. దాని చివరన ఒక నీలపు రంగు బొమ్మ ఉన్న ఒక చిన్న చేతి రుమాలును నీవు తీసావు. నీవు నీ జేబు పుస్తకములో దానిని ఉంచావు, మరియు ఫలానా - ఫలానా పేరును కలిగియున్న ఒక సహోదరిని నీవు కలిగియున్నావు, ఆమె ఉదరము (కడుపు) యొక్క కేన్సరుతో చనిపోవుచున్నది, వెళ్ళి ఆ చేతి రుమాలు తీసుకో, ఆ స్త్రీ పైన పెట్టు, మరియు ఆమె పూర్తిగా బాగుపడును."

"మంచిది," చెప్పాడు, "ఆ రాత్రి మధ్యరాత్రిలో ఆ కొండపైన అక్కడ సాల్వేషన్-ఆర్మీ వారు ఉన్నారని మేము తలంచాము." అతడు చెప్పాడు, "నేను నా జీవితములో అంత గర్జనను ఎప్పుడూ వినలేదు, మరియు వారు అరుస్తూ ఉన్నారు. [మరియు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే, అది సహోదరుడు బెన్, మరియు వారు, అక్కడ ఆ స్త్రీ పై చేతి రుమాలును ఉంచుచున్నారు.]" మరియు చెప్పాడు, "బహుశా ఆ వృద్ద స్తీ చనిపోయినదని మేము తలంచాము."

మరియు ఆ మరుసటి ఉదయము, వారు ఎప్పుడు ఆ సమాధి కార్యక్రమమునకు ఏర్పాట్లు చేయబోవుచున్నారో చూచుటకు మేము అక్కడకు వెళ్ళాము." మరియు చెప్పాడు, "ఆమె అక్కడ బల్ల యొద్ద కూర్చొని ఉన్నది, ఆమె మరియు ఆమె భర్త, వేయించిన ఆపిల్-పై ను తింటూ మరియు కాఫీ త్రాగుచున్నారు."

61ఒక వేయించిన ఆపిల్-పై అంటే ఏమిటో నీకు తెలుసా? అది ఒక సగము - చంద్రుడు తిరిగి వచ్చుట? (తిరిగి బలము పొందుకొనుట) నేను గృహము యొద్దనే ఉన్నానని నాకు ఖచ్చితముగా తెలుసు. కనుక అప్పుడు… మీకు తెలుసు, దాని పైన మోలాసిస్ ను నేను ఇష్టపడెదను, చూశారా. మరియు వాటిపై దానిని చిలకరించుటకు నేను ఇష్టపడను. నేను బాప్తీస్మమిస్తాను (అనగా ఆ తీపి పదార్ధముతో పూర్తిగా ముంచివేయుదును), మీకు తెలుసు. నీజముగా నేను దానిని పూర్తిగా దానిపై కుమ్మరింస్తాను. నా ఆపిల్-పై ను నేను చాలా మొలాసిస్ తో ఇష్టపడెదను. కనుక నేను దానిని ప్రేమించెదను.

మరియు అప్పుడు, ఆమె ఈ వేయించిన ఆపిల్-పైను తినుచున్నది. మరియు చెప్పాడు, "అక్కడ ఒక రోజు ముందు, ఆమె అటువంటి సమస్యలో ఉన్నది, కనీసము… వారు ఆమెను మూత్రము కొరకు ఆ పాత్రపైన కూడా ఉంచలేకపోయేవారు; దాని కొరకు వారు ఒక షీటును ఉపయోగించవలసి వచ్చేది." మరియు చెప్పాడు, "నేను మరియు నా భార్య అక్కడకు వెళ్ళి మరియు రోజుకు రెండుసార్లు పడక మార్చవలసివచ్చేది."

మరియు చెప్పాడు, "దానికి ఆరు వారాల ముందే వైద్యుడు ఆమెను గూర్చి చేతులెత్తేశాడు, మరియు ఆమె పోయేంత వరకూ ఆమెను నిలిపియుంచుటకు ఆమెకు తగినంత నిద్రపోయెడి మందును ఇచ్చాడు. కేన్సరు… వారు ఆమెను కోసి మరియు తిరిగి ఆ విధముగా కప్పివేశారు." చెప్పారు, "ఇక ఏమాత్రము ఆమెతో వ్యవహరించనవసరము లేదు." మరియు చెప్పాడు, "మరియు మీకు తెలుసు, ఆమె అక్కడ కూర్చొని తింటూ, మరియు ఎగిరి, మరియు పరుగెత్తి వచ్చి, మాతో కరచాలనము చేసినది." మరియు చెప్పినది…

నేను చెప్పాను, "నీవు అలా చెప్పవద్దు."

చెప్పెను, "అవును." చెప్పెను, "ఇప్పుడు…" మరియు చెప్పాడు, "ఒకవేళ నీవు దానిని నమ్మకపోతే, నీవు అక్కడకు వెళ్ళి చూడుము. ఆమే స్వయముగా నీకు చెప్పును." చూశారా, తిరిగి అతడు నాకు బోధిస్తూ ఉన్నాడు. కొంచెము సేపు అతడిని సాక్ష్యమివ్వనిద్దాము.

62నేను చెప్పాను, "ఓ, నీవు దానిని నమ్మవా, నీవు నమ్మెదవా?"

అతడు చెప్పాడు, "ఖచ్చితముగా." చెప్పాడు," ఒకవేళ దానిని నీవు నమ్మకపోతే, నీవు తిన్నగా వెళ్ళి… నీవు తిన్నగా ఆ కొండపైకి వెళ్ళి మరియు కనుగొనుము. నేను నిన్ను అక్కడకు తీసుకొని వెళ్ళెదను."

నేను చెప్పాను, "ఉహ్-హ్." చెప్పాను, "లేదు." నేను చెప్పాను, "దాని కోసము నీ మాటను తీసుకొనెదను," చూశారా. నేను చెప్పాను, "దాని కొరకు నీ మాటను తీసుకొనెదను." నేను అడిగాను, "చెప్పుము, ఆ వ్యక్తి ఎవరు?"

"నాకు తెలియదు." చెప్పాడు, "అతడు ఇండియానా నుండి వచ్చాడు, మరియు వారు చెప్పారు అతడు తిరిగి ఇక్కడకు రాబోవుచున్నాడు. అతడు వచ్చినప్పుడు నేను అతని యొద్దకు వెళ్ళుచున్నాను." చెప్పాడు, "నేను అతని యొద్దకు నడుచుకొని వెళ్ళి మరియు చెప్పెదను, 'బోధకుడా, నేను నీకు కొంచెము చెప్పుగోరుచున్నాను. లోకములో దానిని నీవు ఏలాగు ఎరిగియున్నావో నాకు చెప్పుము, అంతకు ముందెన్నడూ నీవు ఈ ప్రదేశములో లేనప్పుడు.'" (నేను ఎన్నడూ అక్కడకు వెళ్ళలేదు, చూచారా.) చెప్పాడు, "అది ఏ విధముగా నీవు ఎరిగియున్నావు?"

నేను చెప్పాను, "అవునయ్యా. అతడిని నీవు ఖచ్చితముగా కలుసుకొనెదవని నేను ఆశిస్తున్నాను." నేను చెప్పాను, "అతడు నీకు సహాయము చేయునని నేను ఆశించుచున్నాను."

మరియు అతడు చెప్పాడు, "మంచిది, నేను వెళ్ళుచున్నాను." అతడు పొగాకు నములుచున్నాడు, మీకు తెలుసు, మరియు అతడు ఆ విధముగా క్రిందకు ఉమ్మివేశాడు, మరియు ఆకులు…

63మరియు నేను చెప్పాను, "మరియు ఇప్పుడు నువ్వు నాకు చెప్పదలిచావా… వెనుక ఈ చెట్టుకు." నేను చెప్పాను, "దానియందు నేను ఆశ్చర్యపోయాను." మరియు నేను చెప్పాను, "మీకు తెలుసు, మేము కనీసము ఒక చల్లని రాత్రి గానీ, పేరుకుపోయిన మంచుగానీ, లేక మరేమి కలిగిలేము." మరియు నేను చెప్పాను, 'ఆ చెట్టుపై నుండి ఆ ఆకులు నేలరాలుచున్నవి. మరియు అందుకే మేము ఇక్కడకు వచ్చాము, ఆ మైదానపు చెట్లలో నుండి, ఆకులు అక్కడ క్రిందకు రాలుచున్నవి, ఎండిపోతూ మరియు ఇక్కడ ఈ పల్లపు ప్రాంతములోనికి పడుతూ, అక్కడ నీళ్ళతో పడుతూ మరియు నానుచున్నవి." నేను చెప్పాను, "మరియు నీవు… ఆ చెట్టు నుండి ఆకులు ఎందుకు రాలుచున్నవి?"

"మంచిది," అతడు చెప్పాడు, "జీవము వాటిని విడిచిపెట్టినది."

నేను చెప్పాను, "ఏమిటి?"

అతడు చెప్పాడు, "జీవము వాటిని విడిచిపెట్టినది."

"ఆకును విడిచిపెట్టినదా?"

"అవును." అతడు చెప్పాడు, "అదే దానిని రాలేలా చేసినది."

నేను చెప్పాను, "మంచిది, మనము ఎటువంటి మంచు లేక ఏ చల్లని వాతావరణమునకు సంబంధించిన మరే సూచననైనా కలిగిలేము."

అతడు చెప్పాడు, "మంచిది, కేవలము… అది దానిని విడిచి పెట్టును."

మరియు నేను చెప్పాను, "మంచిది, ఆ జీవము ఏమైనది?"

అతడు చెప్పాడు, "అది ఆ చెట్టు యొక్క వేరులోనికి వెళ్ళిపోయినది."

నేను చెప్పాను, "నీవు ఏమనుచున్నావు?"

చెప్పెను, "మంచిది, శీతాకాలము దానిని గడ్డ కట్టించును, మరియు అది ఆ చెట్టులోని జీవకణమును చంపివేయును."

మరియు నేను చెప్పాను, "అయితే అది అక్కడ దాగుకొనుటకు ఆ చెట్టు యొక్క వేరులోనికి వెళ్ళును, ఎప్పటి వరకూ?"

అతడు చెప్పాడు, "వసంత కాలము వరకు."

"మరియు అది నీకు మరొక గుత్తు ఆపిల్ పండ్లను, మరియు ఒక గుంపు ఆకులను తీసుకొని వచ్చునా?"

"అవునయ్యా."

64"ఉహ్," నేను చెప్పాను, "అది వింతగా ఉన్నది." నేను చెప్పాను, "నేను నిన్నొకటి అడగాలనుకొనుచున్నాను."

అతడు చెప్పాడు, "అవునయ్యా."

నేను చెప్పాను, "ఏ జ్ఞానము (లేక మేధస్సు) ఆ చెట్టుకు చెప్పినది, ఆ చెట్టులోని జీవముకు, శీతాకాలము వచ్చుచున్నదని? మరియు ఒకవేళ నీవు ఆ కొమ్మలను విడిచి, మరియు ఇక్కడకు రానియెడల, మరియు ఈ వేర్లతో కప్పబడకపోతే, నీవు చనిపోతావు; మరియు ఆ జీవము ఆ జ్ఞానమునకు లోబడి, మరియు ఆ చెట్టు యొక్క వేరులోనికి క్రిందకు వెళ్ళును, మరియు శీతాకాలము గతించేంత వరకూ అక్కడే నిలిచియుండును; మరియు అప్పుడు మరొక ఆకును తిరిగి తీసుకొని వచ్చును?" నేను అడిగాను, "అయ్యా, ఏ జ్ఞానము దానిని చేయును?"

మరియు అతడు చెప్పాడు, "ఓ, అది ప్రకృతి."

నేను అడిగాను, "ప్రకృతి అంటే ఏమిటి?"

అతడు చెప్పాడు, "మంచిది, అది నిజానికి అలా చేస్తున్నది." అతడు నా అంశమును చూచాడు, చూశారా, మరియు దానినుండి అతడు దాయడానికి ప్రయత్నించుచున్నాడు. అతడు చెప్పాడు, "మంచిది, నీవు చూడుము…"

65నేను చెప్పాను, "మంచిది, ఏమిటో నేను నీకు చెప్పెదను. ఒక బకెట్ తో నీరు తీసుకొందాం, మరియు ఆ ఓక్ వృక్షము యొక్క మొదలుపై ఉంచుదాము. మరియు ఇప్పుడు, ఆగష్టు నెల మధ్యలో, అది ఆ చెట్టు మొదలు యొక్క క్రింద భాగమునకు వెళ్ళి, మరియు వసంతకాలము వరకు అక్కడ నిలిచియుండి, మరియు తిరిగి వచ్చి మరలా ఆ బకెట్టును నింపునా, అది దానిని చేయునా?"

అతడు చెప్పాడు, "లేదు, లేదు."

మరియు నేను చెప్పాను, "మంచిది, నాకు చెప్పుము అది ఏ జ్ఞానము? ఇప్పుడు అది ఒక జ్ఞానమైయుండవలసియున్నది, ఎందుకనగా ఆ చెట్టుకు ఎటువంటి జ్ఞానము లేదు. ఆ జీవమును చెట్టు యొక్క కొమ్మలపై నుండి క్రింద వేర్లలోనికి వెళ్ళునట్లు చేయు ఒక జ్ఞానముండవలసియున్నది, మరియు ఇది తిరిగి వెనుకకు తిరిగి వచ్చే సమయము అని చెప్పే జ్ఞానముండవలసియున్నది."

అతడు చెప్పాడు, "దానిని గూర్చి నేను ఆలోచించనేలేదు."

మరియు నేను చెప్పాను, "ఇప్పుడు, ఎక్కువ సేపు దానిపై ఆలోచించుము. మరియు ఆ చెట్టులో ఉన్న సారము, ఆ జీవము, ఆ క్రింద వేర్లలోనికి వెళ్ళి దాగుకొనుము, లేక అది చనిపోవును అని చెప్పే జ్ఞానము ఏమిటి అని నీవు కనుగొనినప్పుడు; అప్పుడు ఆ స్త్రీ ఎవరో మరియు ఆమె జీవితమును కాపాడుటకు ఏమి చేయవలెనో నాకు చెప్పిన జ్ఞానమును గూర్చి నీకు చెప్పెదను."

అతడు అడిగాడు, "ఆ ప్రసంగీకుడవు నువ్వేనా?"

నేను చెప్పాను, "నేనే."

PS 16:11

 

66అక్కడే. నాకు చూపించు… "జీవమునకు మార్గమును నీవు నాకు చూపించెదవు," అది చాలా సామాన్యముగా ఉండును. మరియు అక్కడ అతని మోకాళ్ళపై, తన టోపిని తీసివేసి, నేను అతడిని క్రీస్తు యొద్దకు నడిపించాను. "నీ జీవమార్గమును నాకు తెలియజేయుము" ఒక అమాయకుడైన వ్యవసాయదారునికి, బహుశా తన సొంత పేరును కూడా వ్రాయలేనివాడు. కానీ దేవుడు జీవమార్గమునకు కొనిపోవు ఒక మార్గమును కలిగియున్నాడు, దానియొద్దకు అతడిని నడిపించడానికి. మరియు, సహోదరులారా, మనము జీవవృక్షముపై వ్రేలాడుచున్నాము. మరియు ఒక రోజు ఈ పాత ఆకు రాలిపోబోతున్నది.

కానీ ఒక రోజు ఒక పునరుత్థానము వచ్చును. ఒక గొప్ప వేయ్యేండ్లు మనముందు ఉన్నది, ఒక గొప్ప పునరుత్థానము. ఒక రోజు మనము వెనుకకు తిరిగి వచ్చెదము, ఎందుకనగా మనము నిత్యజీవమును కలిగియున్నాము. వాక్యము యొక్క మార్గము ద్వారా మనము దానిని అర్ధము చేసుకున్నాము. ఒకవేళ మనకు సమయము ఉన్నయెడల, మీకు తెలుసు, అది ఏ విధముగా ఉన్నది. దానిని అనేక విధములుగా మనము సమీపించవచ్చు. ప్రజలు… కొన్నిసార్లు ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళుటకు మనము అనేకమైన పద్దతులను ఉపయోగించవలసి వచ్చును.

67గత సంవత్సరము నేను వెళ్ళాను, నేను తలంచాను, "ఆ వృద్దుని యొక్క స్థలమునకు వెళ్ళి వేటాడెదను. ఆ స్థలము వరకు కారు నడిపించాను, మరియు దానిచుట్టూ గచ్చపొదలు పెరిగిపోయినవి. వరండాలో ఒక వృద్ధ స్త్రీ కూర్చొవడము నేను చూచాను, అదే చెట్టు యొక్క ఆపిల్ పండ్ల తొక్కను వలుస్తూ ఉన్నది. నేను అక్కడకు నడిచాను. నేను అడిగాను, "నీవు ఎలా ఉన్నావు?"

ఆమె చెప్పినది, "అయ్యా, నువ్వు ఎలా ఉన్నావు?"

మరియు నేను చెప్పాను… నేను అక్కడకు వచ్చుటకు ముందు చుట్టూ అంతా పెద్ద చిహ్నపు బోర్డులను చూశాను. మరియు నేను అడిగాను, "ఒకవేళ నేను ఉడుతలను వేటాడుటకు అది సాధ్యమా అని నేను ఆశ్యర్యపడుచున్నాను."

ఆమె చెప్పినది, "అయ్యా, నా భర్త జీవిస్తూ ఉన్నప్పుడు, అతడు చాలా కఠినుడు. ఆయనే ఆ బోర్డులను పెట్టియున్నాడు." మరియు చెప్పినది, "కెంటకీ, లూయిస్ విల్లోని కెంటకీలో నివసిస్తున్న కొంతమంది బాలురను నేను కలిగియున్నాను. మరియు వారు వేటాడుటకు వచ్చెదరు."

నేను చెప్పాను, "అది నాకు అర్ధమైనది. అది ఆయన నాకు చెప్పాడు. నేను ఆయనను చూడవచ్చా?"

ఆమె చెప్పినది, "ఆయన చనిపోయెను."

నేను అన్నాను, "మీరు అలా అనవద్దు."

"అవును."

నేను చెప్పాను, "మంచిది, ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు నేను వేటాడవచ్చును అని ఆయన నాకు చెప్పాడు."

ఆమె అడిగినది, "నీవు ఎవరవు?"

నేను చెప్పాను, "నేను సహోదరుడు బ్రెన్హాం."

ఆమె తన పళ్ళెమును వదిలివేసినది. ఆమె నా చేయి పట్టుకొని లాగినది. ఆమె చెప్పినది, "సహోదరుడా బ్రెన్హాం, ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నాడు." ఆమె చెప్పినది, "ఆయన ఆ ఘడియ నుండి ఒక విధేయతతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించాడు."

నేను అడిగాను, "మరియు అదే ఆపిల్ చెట్టు నుండి నీవు కాయలు కోసుకొనుచున్నావా." నేను అన్నాను, "ఆ ఆపిల్ పండ్లు తిరిగి వచ్చుచున్నవో, అవి వచ్చుచున్నాయి కదా?" నేను చెప్పాను, "కనుక అతడు కూడా ఆ గొప్ప పునరుత్థానములో ఒక సమయమున తిరిగి వచ్చును."

PS 16:11

 

68మరియు సహోదరుడా, సహోదరి, క్రీస్తు ఎవరి కొరకు చనిపోయెనో, ఈ జీవితము నుండి దూరముగా, నిత్యజీవము లేకుండా చనిపోవుట కొరకు, మనము ప్రేమించినట్లుగా ప్రజలను కూడా అనుమతించుటను మనము సహించలేము. వారు పునరుత్థానములో లేచుటకు వారిని ఆ స్థలములోనికి తీసుకొని వచ్చుటకు మనము చేయగలిగినదంతా చేద్దాము. "జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు."

సహోదరులైన మీరు దానిని మీ సంఘాలలో చేయుటకు సమర్థులు, ఎందుకనగా మీలో చాలా మంది సేవకులుగాను మరియు వేదాంతవేత్తలు గాను చదివియున్నారు. నాకు సామర్థ్యము లేదు, కానీ నాకు ఇవ్వబడిన ఒక చిన్న వరము, ఒక సరైన దారిలోనికి నన్ను లాగుకొని వచ్చుటకు, ఎక్కడ ఆ ప్రజలు, వారేమి ఆలోచిస్తున్నారు, వారేమి చేస్తున్నారు, మరియు ఏమి చేయబడాలి, అది నా పరిచర్య యొక్క చిన్న విధానము. దేవుడు తన బిడ్డలను ఆవలి గట్టుకు తీసుకొని వచ్చుటకు నన్ను ఉపయోగించుకొనుచున్న దానిలో ఇది అనేక చిన్న మార్గములలో ఒకటి.

మరియు ఇప్పుడు నన్ను మీతో కలుపుకొనుచున్నాను. మరియు ప్రభువు యొక్క మార్గమును కనుగొనునట్లుగా ప్రజలకు జీవమార్గమును చూపించెదము. మరియు అతడు ఇక్కడ చెప్పాడు, "ఏలయనగా దేవుని యొక్క సన్నిధిలో సంతోషమున్నది." సంతోషమున్నది, ఈ మార్గములో మనము నడుచుచుండగా, ఆ వైపు నుండి ఈ వైపుకు చూస్తూ, చెట్ల యొక్క పునరుత్థానము, ఆకులు, ప్రతీది, దేవుని గూర్చే మాట్లాడుచున్నది. కాబట్టి మనము మాట్లాడేదానిలో లేక చేసే ప్రతీ దానిలో దేవుని గూర్చే మాట్లాడుతూ, మనము దేవుని యొక్క ప్రాణులుగా ఉందాము. ఆయన మహిమ వరకు దానిని ప్రకాశింపనిద్దాము. దేవుడు మిమ్మును దీవించును గాక. ఇప్పుడు ఒక్క క్షణము మన యొక్క శిరస్పులు వంచెదము.

69ప్రభువైన యేసు, మందకు గొప్ప కాపరి, ప్రభువా, నీవు నాకు జీవమార్గమును చూపించినందుకు నేను చాలా ధన్యుడను. మరియు తిరిగి ఈ పాత రాజమార్గమున నడుస్తూ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సహోదరులతో ఈ రోజు నా యొక్క చేతులు కలిపినందుకు నేను చాలా కృతజ్ఞుడను, మేము రాజమార్గము ప్రక్కన నిలువబడియుండగా, నీవు ఎవరికొరకైతే చనిపోయావో - అక్కడ ఆ మానవజాతిలో నశించిపోతున్న ప్రజలకు మీరు మాకిచ్చిన తలాంతులన్నిటిలో మా స్వరములతో గట్టిగా అరచుచున్నాము. ప్రభువా, మాకు సహాయము చేయండి, దయచేసి మీరు చేయుదురు కదా?

మా అందరి జీవితాలు ఒక చెట్టువలె ఉండును గాక, లేక అవిశ్వాసికి మరియు పాపికి అటువంటి ఒప్పుకోలును తీసుకొని వచ్చేదిగా ఉండును గాక, ఆ ప్రజలు… వారు ప్రభువు యొక్క మార్గమును చూసి మరియు ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించుదురు గాక. తండ్రి, దానిని అనుగ్రహించండి. మా బలహీన ప్రయత్నములో మా అందరిని దీవించండి. ఈ అద్భుతమైన సహవాస సమయమును బట్టి నీకు వందనములు, ఈ యొక్క గొప్ప అల్ఫారము. మరియు తండ్రి, మేము అనుభూతి చెందుచున్నాము మేము ఇప్పుడే… మా ప్రాణములు మరియు మా శరీరములు దేవుని యొక్క మంచితనముతో పోషింపబడినవి.

ఇప్పుడు మాతో ఉండుము, ఇంకా ఎక్కువ కూడికల కొరకు మేము ముందుకు కొనసాగుచుండగా, ఈ రాత్రి మాతో ఉండుము, మరియు పాపులు త్వరగా బలిపీఠము వద్దకు వచ్చి, రక్షిపబడునట్లు ఏదైనా జరుగనిమ్ము. రోగులు స్వస్థపడును గాక.

పరిశుద్ధాత్మను కలిగిలేని వారు, క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మము పొందుదురు గాక, ప్రభువా. మమ్ములనుమేము నీకు సమర్పించుకొనుచున్నాము. మేము మా ప్రార్ధనలను, మా విశ్వాసమును తీసుకొని, మరియు వాటిని కలిపి ఉంచి, నీ బలిపీఠముపైన ఉంచుచున్నాము. మరియు ప్రభువా, మేము వాటిని నీకు పంపించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క నామములో, మమ్ములను స్వీకరించుము. ఆమెన్.

70నా సహోదరులారా, దేవుడు మిమ్ములను దీవించును గాక. మరియు ఇప్పుడు నేను ఊహించుచున్నాను, సహోదరులలో ఒకరు సంఘమును పంపించివేయుటకు వచ్చును, లేక సమాజము, సాధారణముగా, వారు చేయునట్లుగా.

మరియు ఎవరు వచ్చెదరని వారు నిర్ణయిస్తున్నప్పుడు, నేను చెప్పగోరుచున్నాను: మీ యొక్క మంచి హాజరు కొరకు వందనములు, మరియు మిమ్ములను తిన్నగా మధ్యాహ్న సమయము వరకు ఇక్కడ ఉంచినందులకు నన్ను క్షమించండి, ఇక్కడ నా వాచీని బట్టి దాదాపుగా పదకొండు దాటి అయిదు నిమిషములు. మరియ అవి జరగడం నేను చూచియున్న గొప్ప సంగతులు, దేవుడు చేస్తున్నవి, ఆ సువార్త పొలములలో మరియు గొప్ప గొప్ప వాటి యొక్క సంగతులు నేను కూర్చొని మరియు మీతో మాట్లాడగలను. ఎన్నడూ భయపడవద్దు. కేవలం గుర్తించుకొనండి, దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడే ఆ వాగ్దానము నిలబెట్టుకొనువాడై యున్నాడు. ఆయనే తన వాగ్దానమును నిలబెట్టుకొనవలసి యున్నది. ఇప్పుడు దేవుడు మిమ్ములను దీవించును గాక. మరియు సహోదరుడు బోర్డర్స్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...