యెహోవా-యీరే #1

యెహోవా-యీరే #1

VGR COUNT-232 1మనమందరము అలాగే నిలచియుండగా ప్రార్థన కొరకు ఒక్క క్షణము తలలు వంచుదము. మనము తలలు వంచియుండగా, మిలో ఎందరు ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనబడవలెనని, మీ హృదయ వాంఛను దేవుడు తీర్చవలెనని కోరుచున్నారో, అట్టివారు దయచేసి చేతులు ఎత్తండి. ఇప్పుడు మన హృదయములను, మన తలలను ఆయన ముందు వంచియుండగా, ప్రభువు మన మనవులను దయచేయును గాక!

ISA 53:5•

1PET 2:24

 

2మా పరలోకపు తండ్రీ, గొప్ప దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మరలా మేము నీ కృపా సింహాసనాన్ని సమీపించుచున్నాము. నీవు మా ప్రార్థన అంగీకరిస్తావని, మేము అడిగిన దానికి జవాబు దయచేయుదువను నిశ్చయతతో మా కిచ్చిన అవకాశమును బట్టి వందనములు. తండ్రీ, మా పాపములను అనగా మా అవిశ్వాసమును క్షమించుము. మరియు తండ్రి విశ్వాసమును, సమృద్ధియైన విశ్వాసమును ఈ రాత్రి మాకు దయచేయము. ప్రతీ చేయి వెనుక వారి హృదయములో ఏమి వున్నదో నీకు తెలియును, ప్రభువా. వారికి ఏదో అవసరమై యున్నది. నీ నుండి ఏదో ఆశిస్తూ వారు తమ యొక్క చేతులను ఎత్తియున్నారు. పరలోకపు తండ్రి, అది ఏదయినప్పటికి, అది ప్రజలకు దయచేయమని నేను ప్రార్ధించుచున్నాను.

గత సాయంత్రము మమ్ములను దర్శించినందుకు మీకు వందనములు. ఆయన మన హృదయ వాంఛలను మనకు దయచేయుననియూ, మరియు ఈ రాత్రికి సమృద్ధియైన శక్తితో, కృపతో తిరిగి మా యొద్దకు వచ్చుదువనియూ మేము ప్రార్థించుచున్నాము, ఏలయనగా నీ చిత్తమును జరిగించుటయు, నీ చిత్తమును నెరవేరుటయు మా వాంఛయైయున్నది. వ్యాధిగ్రస్టుల పట్ల నీ చిత్తము ఏమిటో మేము ఎరిగియున్నాము. మా స్వస్థత కొరకు నీ వీపున గాయములను పొందితివి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరియు తండ్రి, నిన్ను సమృద్ధిగా నమ్మగలిగినంత విశ్వాసమును, ప్రతీ వ్యాధిగ్రస్తుడు బాగుపడునట్లునూ, నశించిన ప్రత్తి వ్యక్తియు వారి అతిక్రమముల నిమిత్తము నీవు నలుగగొట్టబడి యున్నావని గుర్తించునట్టుగా నీ గొప్ప చిత్తము నెరవేరునట్లు ప్రార్ధించుచున్నాము. ప్రభువా, దయచేయుము.

వారి కొరకు ఒక రక్త అర్పణ అక్కడ వున్నంత వరకు వారి పాపములను దేవుడు చూడడని వారు తెలుసుకొందురు గాక. అయితే వారు దానిని బహిరంగముగా ఒప్పుకొనక దానిని అంగీకరించక తిరిగి-జన్మించక చనిపోయినచో వారు దేవుని రాజ్యములో ప్రవేశించుటకు వేరు మార్గము లేదు. మరియు ఈ రాత్రి రక్తము వెలుపల వున్న ప్రతి వ్యక్తి త్వరగా రక్తము క్రిందకు, ప్రభువైన యేసు నామంలోనికి వెళ్ళుదురు గాక. నీకు మేము స్తుతి చెల్లించుచున్నాము. ఆమేన్.

3ఈ రాత్రికి ఇక్కడ నుండి, మరలా మాట్లాడుట ఎంతో గొప్ప భాగ్యము. నిన్నటి సాయంత్రము మనము గొప్ప ఆశ్చర్యమైన సమయమును, దేవుని సందర్శనమును కలిగియుంటిమి. అయితే నేను మిమ్ములను ఎక్కువసేపు వుంచాను. ఏలాగైనను, నేను సమయమునకు ముగించలేకపోయను.

ఈ రోజు ఎండ త్రీవత కొంచెము ఎక్కువగానే యున్నది. నా చిన్న కుమారుడగు జోసఫ్, ఈతకు తీసుకొని వెళ్ళుమని నా వెంట పడుచున్నాడు. మేము బస చేయుచున్న చోట వెనుక కంచె వేయబడిన ఒక కొలను వున్నది. మరియు అతడు "నాన్న గారూ, వచ్చి చూడండి, నేను ఈదగలను" అని చెప్పెను.

అందుకు నేను "మంచిది" అని చెప్పాను.

ఈ ఉదయమున నేను అక్కడికి వెళ్ళి, నా బైబిలును తీసుకొని కొన్ని నోట్సును వ్రాశాను. నేను చదువుచుండగా, అతడు తన ఈత బట్టలను వేసుకుని వచి, "నాన్న, నన్ను చూడండి, నేను పైనుండి దుముకగలను," అన్నాడు. నేను ఎప్పుడయినా కప్పగంతులు చూచానంటే అదే మొదటిసారి! అతడు నీటిలో నుండి పైకి లేచాడు. తన నోటిలో నుండి, ముక్కులో నుండి నీటిని ధారగా చిమ్ముకుంటూ, "నేను ఎలా చేశాను," అన్నాడు!

"నీవు బాగా చేయుచున్నావు" అని నేనన్నాను.

4నా తండ్రితో నేను ఒకసారి ఇదే సంగతిని చెప్పినట్లు నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. మేము నదికి వెళ్ళటకు ముందు ఒక చిన్న నీటి గుంట వున్నది. మా పిల్లలు అందరం నీటిపై యున్న ఆ పచ్చని తెట్టును వెనుకకు త్రోసేవారము. అక్కడ నీరు ఆరు అంగుళాల లోతు కంటే ఎక్కువ వుండేది కాదు. మరియు నా తండ్రితో, "నేను ఈదగలను" అని చెప్పుచుండెదను.

కాబట్టి ఒక ఆదివారము మధ్యాహ్నము ఆయన అక్కడకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక చిన్న సబ్బు పెట్టెను వారు పెట్టి యుంచారు. అప్పుడు నేను ఆ పొదల వెనుకకు వెళ్ళి నా బట్టలను అక్కడ తగిలించాను. మీకు తెలుసా. అది కేవలము ఒక జత పూర్తిగా తొడుగు బట్టలు, మీలో ఎంతమంది అలాంటి దానిని చూశారు. ఆలాగు కేవలము పైన వేసుకునేవి, మరో విధమైనవి లేకుండా ఉండును. మరియు చిన్న మేకు వుంటుంది. కేవలము ఆ మేకును లాగి, నీవు చేయవలసినదంతా లోనికి దూకుటయే. నేను ఆ పెట్టి మీదకు వెళ్లి, నా ముక్కును పట్టుకున్నాను, మీకు తెలుసా, మెరుపు వలె నేను దాని లోనికి వెళ్ళిపోయాను. మరియు బురద దానంత ఎత్తు లేచినది. నా తండ్రి అచ్చట కూర్చుని నన్ను గమనించుచున్నారు. "నేను ఎలా చేస్తున్నాను" అని అడిగాను.

"అక్కడ నుండి బయటకు వచ్చి మరియు నీవు వెళ్లి స్నానము చేయి," అని చెప్పాడు. అది ఎంత కాలము అయినదని తలంచుచుంటిని!

5కాలము మన యొద్ద నుండి గతించిపోవునని మీకు తెలియును, కాదా? అలా వుండుటకు ఇకపై అలాంటి పనులు చేయుటకు మనకు సమయము లేదు. మరియు సమయము ఎవరి కొరకు వేచియుండదు. కాబట్టి మనము పని చేయగలిగినప్పుడే పని చేయాలి, ఎందుకనగా ఈ తరము వెళ్లిపోయి మరొక తరమున్న ఎడల అది వచ్చు సమయమైయున్నది. నా హృదయపూర్వకముగా సత్యమును చెప్పుచున్నాను. (ఆయన ఎప్పుడు వచ్చుచున్నాడో నాకు తెలియదు; మనలో ఎవరికిని తెలియదు), కాని నిజముగా మరొక తరము వుంటుందని నేను నమ్మను. క్రీస్తు ఈ తరములోనే వచ్చునని నేను నమ్ముచున్నాను. అది ఏ సమయమో నాకు తెలియదు. అది ఈ రాత్రికే కావచ్చు, లేక ఇప్పటి నుండి 10 సంవత్సరములకు కావచ్చు, లేక 20 సంవత్సరములకు కావచ్చు, కాని ఆయన ఈ తరములో వచ్చునని నేను నమ్ముచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. ఒకవేళ ఆయన రాకపోతే, ఏ విధముగానైనను నేను ఆయన వలె జీవించుటకు ఇష్టపడుదును, ఎందుకనగా అది నా చివరి దినము లేక నీ చివరి దినము కావచ్చునని నాకు తెలియును.

1COR 15:52•

1THS 4:16,17

 

6ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆయన రాకకు ముందు మనము వెళ్ళిపోయినట్లయితే, మనము ఆయన సన్నిధికి కొనిపోబడి ఇతరులు మార్పు చెందక ముందే మనము లేచెదము. "దేవుని బూర మ్రోగుతుంది. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము, ఒక నిమిషములో, ఒక రెప్పపాటున, మార్పుపొంది వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము." పునరుత్థానము యొక్క క్రమమును చూడండి. చూచారా, మన ప్రియులను చూచుటకు మనము మిక్కిలి ఆశించుచున్నామని ప్రభువుకు తెలియును. ఆయనను కలుసుకొనుటకు మొదటగా మనము అక్కడికి వెళ్ళినట్లయితే మన తల్లిని గాని, తండ్రిని గాని మరియు అక్కడున్న మిగిలినవారిని చూచుటకు అంతటా చూస్తుంటాము. ఆయన జ్ఞానములో ఉన్న పరిశుద్దాత్మను మీరు చూడండి. మొదటగా మనము ఒకరిని ఒకరము కలుసుకుంటాము. ఆ తరువాత మనము అక్కడికి చేరుకున్నప్పుడు "అద్భుతమైన కృప" అని పాడెదము. అప్పుడు అక్కడ అది ఆరాధనా సమయముగా వుండును. నేను తమాషాగా ప్రవర్తిస్తున్నానని మీరు అనుకుంటున్నారా, నన్ను అక్కడ గమనించండి! మనము అక్కడికి వెళ్ళినప్పుడు అది నాకును మరియు మనందరికిని ఒక అద్భుతమైన సమయంగా వుండబోవుచున్నది.

ROM 4:17-25

 

7దీవించబడిన పురాతన బైబిలులో నుండి ఈ రాత్రి మనము కొన్ని వచనములను చదువుకొందము. మనము రోమా పత్రికను త్రిప్పుచూ 4వ అధ్యాయము చదువుకుందాము. ఈ రాత్రికి నేను ఆదికాండములో నుండి మరియు రోమా పత్రికలో నుండి రెండు స్థలములలో చదువగోరుచున్నాను. ఇప్పుడు రోమియులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుండి:

తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులును, సజీవులుగానూ చేయువాడును లేనివాటిని ఉన్నట్టుగానే, పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియై యున్నాడు. (ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.)

నీ సంతానము ఈలాగు వుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి;

ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేరుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము నొందెను.

ఆందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను.

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

8ఓ, దానిని నేను ఎంత ప్రేమించుచున్నానో! అది నాకు ప్రీతికరమైన బైబిలు లేఖన పఠనములలో ఒకటైయున్నది, ఏలయనగా దేవుడు ఎంతో నిజమైనవాడు. ఆయన దేనిని వాగ్దానము చేసెనో దానిని సిద్ధపరచియున్నాడు. మరియు ఇప్పుడు నేను ఈ అంశమును ఎన్నుకునియున్నాను, ఎందుకనగా గత రాత్రి మనము విశ్వాసమును చూపించు క్రియలను చూచాము. ఒక్క బలహీనుడు కూడా మన మధ్య లేకుండా అందరు స్వస్థపడినట్లు కూటములన్నింటిలో అలాగే జరగాలని నేను యోచించాను. దేవుని శక్తి అంటే ఏమిటో ఆయన వచ్చి ఏమి చేశాడో, అప్పుడు నేను గ్రహించాను. మనము ఒక నిజమైన దాని చుట్టూ మనలను నిర్మించుకుని, మన జయమును ఒక గురిగా చేసుకొనినప్పుడు మనమా రాత్రిని లేక అంతిమ ఘడియను చేరినప్పుడు ఎంత అద్భుతముగా వుండునో.

HEB 4:14•

HEB 11:6

 

9మరియు విశ్వాసము లేకుండా ఏదియూ జరుగదని మొదట మనము గుర్తుంచుకోవాలి, మొదటిగా అది ఒప్పుకొనవలసియున్నది. ఏలయనగా ఆయన విశ్వాసమునకు కర్త, మనకు అది తెలియును. మరియు విశ్వాసము లేకుండా ఏదియూ జరుగదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా వుండుట అసాధ్యము.

మన ఒప్పుకోలుకు ఆయన ప్రధానయాజకుడై యున్నాడు. హెబ్రీ పత్రికలో అక్కడ కింగ్ జేమ్స్ దానిని బహిరంగముగా "ఒప్పుకొనుటగా" వుంచాడు. బహిరంగముగా చెప్పుకొనుట లేక ఒప్పుకొనుట అనునది ఒకే మాట అయి వున్నది. ఒప్పుకొనుట అనగా "దానినే చెప్పుట"; "ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపడియున్నాను," చూశారా, ఇప్పుడు ఆయన జీవము ద్వారా నేను రక్షించబడితిని. మొదటగా మనము దానిని ఒప్పుకొనవలసియునది, మరియు ఆయన ఒక మధ్యవర్తిగా వున్నాడు. దేవునికిని, మానవునికిని మధ్య ఒకే ఒక మధ్యవర్తి, మరియు ఆయన జరిగించిన కార్యమును ఒప్పుకొనుట యందు మన పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఆయన అచ్చట యున్నాడు. ఎలాంటి సంగతి అది, దృఢమైనది యున్నది!

GEN 22:7-14

 

10మరొక లేఖన భాగమును ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుటను ఇష్టపడుచున్నాను.

"ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను: అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును, కట్టెలునూ ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా

అబ్రాహాము - నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను: అలాగు వారిద్దరునూ కూడి వెళ్ళి,

దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై వున్న కట్టెల మీద ఉంచెను.

అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా,

యెహూవా దూత పరలోకము నుండి అబ్రాహామా, అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకుము; అతనినేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.

అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.

అబ్రాహాము ఆ చోటుకి "యెహోవా-యీరే," అను పేరు పెట్టెను. అందుచేత యెహూవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

ROM 4:20•

GAL 3:16,29

 

11నేను ఇక్కడ తీసుకును అంశము ఏదనగా "యెహోవా-యీరే" అను అంశముగా అది పిలువబడును. దాని అర్థము ఏమనగా "ప్రభువు తన కొరకు తానే ఒక అర్పణను సిద్ధపరచుకొనును." ఆయనకు ఒకటి లేనట్లయితే, ఆయన ఒక దానిని సిద్ధపరచగలడు. దానిని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడను. ఇప్పుడు ఇది ఒక గొప్ప అంశము! మరియు అక్కడ చదువుచుండగా అబ్రాహాము, "అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్తి సందేహింపక, విశ్వాసము వలన బలము పొంది దేవునిని మహిమపరచెను" అని వ్రాయబడియున్నది.

ఇప్పుడు, దేవుడు నిబంధన చేసి వాగ్దానము చేసినవాడు అబ్రాహాము; అబ్రాహాముతోనే కాదు, అతని తర్వాత అతని సంతతిని చేసెను, "అబ్రాహాము మరియు అతని సంతానమునకు," అని చెప్పెను. ఇప్పుడు మీరు దీనిని జ్ఞాపకము చేసికొనుడి. మనము క్రిస్తులో చనిపోయి తిరిగి జన్మించినట్లయితే మనము అబ్రాహాము సంతానమై యుందుము. మనము ఈ పాఠమును చదువుచుండగా దీనిని గూరి ఎక్కువ జాగ్రత్త కలిగియుందుము. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినినట్లయితే పరిశుద్ధాత్మ దానిని మీకు బయలుపరచునని నమ్ముచున్నాను. నీవు ఆ నిరీక్షణను కలిగియుందువు. మరియు మనము సమయమును తీసుకొని పరిశుద్ధాత్మ మనకు ఏమి ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాడో ఆ ఉద్దేశమును చేపట్టుకొనినయెడల, అప్పుడది ఈ పట్టణమును నీ చుట్టూ వున్న సమస్తమును వెలిగించును. అబ్రాహామునకు అతని సంతానమునకు ఆ వాగ్దానము ఇవ్వబడుటకు ఇక్కడ పిలువబడ్డాడు.

12ఇప్పుడు, స్నేహితులారా, ఈ దినమున క్రైస్తవ్యము కానిది క్రైస్తవ్యము అని పిలువబడుచున్నది.

ఇప్పుడు, దీనిని చెప్పుట నేను అసహ్యపడుచున్నాను. ప్రజల మధ్య పలుకబడి కలిగినవానిగా ఇక్కడ నిలువవచ్చు. ప్రతి ఒక్కరు మిమ్మును ప్రోత్సహించవచ్చు గాని తీర్పు దినమున ఆ సమూహమును నేను కలుసుకొనివారి విషయమై లెక్క అప్పగించవలసియున్నది. కాబట్టి నేను యదార్థంగా ఉండాలి.

ఇప్పుడు మనము సంఘముల వైపు చూచినప్పుడు, లోకమును చూచినప్పుడు క్రైస్తవ్యము అని పిలువబడుచున్న దాని చూచినప్పుడు అది క్రైస్తవ్యమునకు ఎంతో దూరములో వున్నట్లు మనము కనుగొనుచున్నాము. అది ఆ రీతిగా వుండునని బైబిలులో ముందుగా తెలియచేయబడినది. ఇప్పుడు అనేకులు, "మంచిది, నేను ఆయనను నమ్ముచున్నాను," అనే విధానములో క్రీస్తును అంగీకరించుచున్నారు. ఏమిటి, దయ్యము కూడా నమ్ముచూ ఉన్నది, చూడండి. వారిలో అనేకులు ఉద్రేకము మీద దానిని అంగీకరించుటకు ప్రయత్నించుచున్నారు. "నేను భాషలతో మాట్లాడగలను, నేను ఆత్మలో నాట్యమాడగలను" అని చెప్పెదరు. ఆఫ్రికాలో మాంత్రికులు అలాగే చేయడమును, దయ్యపు నాట్యమును వేయడమును నేను చూశాను. భాషలతో మాట్లాడుచు మానవ పుర్రెల నుండి రక్తము త్రాగి, దయ్యమును పిలుచుచున్నారు. నా తల్లి ఒక ఇండియను, సగము ఇండియను ఆమె ప్రజలు కూడా ఒక పెన్సిల్ ను తీసుకొని అక్కడ ఉంచినప్పుడు పెన్సిల్ పరుగెత్తుతూ, అన్య భాషలలో వ్రాయడము గమనించగలము. వారు అచ్చట నిలబడి దయ్యమును పిలవడము, దానిని అనువదించడము నేను చూశాను. నిశ్చయంగా.

MATT 12:33•

MATT 15:8•

LUKE 6:44

 

13చూడుము, నీవు ఉద్రేకము ద్వారా వెళ్ళలేవు. నీవేమై యున్నావో నీవు జీవించు జీవితము దాని రుజువు చేయును. అది ఏలాటి అనుభూతి అయినప్పటికి, నీవు క్రైస్తవ్యమును ఏ అనుభూతి పైనను నిలుపలేవు.

అది జీవమైయున్నది! యేసు ఇలా చెప్పెను, "మీరు వారి ఫలముల ద్వారా వారిని తెలుసుకొందురు. వారు ఒప్పుకొను దాని మీదనో లేక వారు చెప్పు దాని మీదనో కాదు. యేసు ఇంకా ఇలా చెప్పెను, "మీరు మీ పెదవులతో నన్ను సమిపించుచున్నారు గాని, మీ హృదయము నాకు ఎంతో దూరముగా వున్నది." అది వారి యొక్క ఒప్పుకోలు. చూడుము, అదేమిటో నీ జీవితము చెప్పుతుంది. ఒక మనిషీ నేను దేవుని నమ్ముచున్నానని చెప్పుచు బైబిలులో ఒక్క మాటను తిరస్కరించినా, లేక ఆ రీతిగా అయిన మార్చినా అది తప్పు చేయునట్లున్నది.

14"ఈ చిన్న విషయములలో ఏమి తేడా లేదు" అని నీవు చెప్పవచ్చు. నిశ్చయముగా ఎంతో తేడా వున్నది.

ఒక చిన్న మాటను మారుట బట్టయే ఈ బాధంతా మనకు వచ్చినది; దానిని నమ్మనందున కాదు, కాని దానిని కేవలము తప్పుగా వుంచుటను బట్టియే. హవ్వ తప్పుటకు అక్కడ సాతాను నుండి ఆమెకొక తలంపు వచ్చినది. సహోదరుడు విలియమ్స్ వద్దకు అక్కడ శాంత మారియ, మార్గం గుండా నేను వెళ్లాను. అదే మనలను ఏదేను తోట నుండి బయటకు తెచ్చి ప్రతి విధమైన వ్యాధి పిల్లలగుటకు కారణము అయినది. కొన్ని క్షణముల క్రితము నేను ఒక ఈడ్పు రోగము గల ఒక చిన్న బిడ్డ కొరకు ప్రార్ధించాను. దానికి కారణమేమి? ఏలయనగా హవ్వ ఎన్నడూ అవిశ్వాసముంచలేదు, కాని ఒక ఆలోచనను తీసుకొన్నది, ఇలా ఆలోచించడము సమంజసమే అని అనుకున్నది. అది ప్రతి విధమైన మరణమునకు, రోగమునకు, ప్రతి బాధకును, ప్రతి గుండెపోటుకును కారణమైనది. అలాగయితే మనము అందులోనికి ఏ విధంగా వెళ్ళగలము ద్రాని పర్యవసానమునకు 6000 సంవత్సరములు పట్టినప్పుడు దాని కంటే ఎంత మాత్రము తక్కువగా వ్రాయబడని ప్రతీ పరిపూర్ణమైన మాట ప్రకారము గాక, ఎలా తిరిగి వెళ్ళగలము?

15మానవాళితో ఆలోచించుట ద్వారా సాతాను యుద్ధమున మానవాళిపై గెలుపొందినది. కేవలము ఆలోచించుట వలన, అది ఎందుకు ఆలోచించబడవలెను? ఆలోచించబడినది. ఆ ఆలోచన, వాక్యమునకు భిన్నముగా వున్నట్లయితే ఆ ఆలోచన తప్పుగును. అది వ్రాయబడి వున్నట్లు ఆ వాక్యము సరియైనదే. వ్రత్యేకమైన అనువాదము చేయవద్దు. అది వ్రాయబడి వున్నట్లుగానే చెప్పి, అది వున్నట్లుగానే నమ్ముము, చూశారా. దేవుడు దానిని గూర్చి శ్రద్ధ వహించును. అది ఉండవలసిన రీతిగా ఖచితముగా వున్నది కాబట్టి అది ఉన్న విధముగానే నమ్ముము.

అది వాక్యమైయున్నది, ప్రతి మాటయు! ప్రతియొక్క… మానవునిలో పరిశుద్ధాత్మ; బైబిలులోని ప్రతీ వచనమునకు మీలోని పరిశుద్ధాత్మ "ఆమేన్" అను చెప్పును, ఏలయనగా పరిశుద్ధాత్మయే బైబిలును వ్రాసినది. మరియు ఆయన నీలో వున్నప్పుడు అది మరొక యుగమునకు సంబంధించినది, అది దానికి సంబంధించినది, దీనికి సంబంధించినది అని ఏలాగు చెప్పును. ఆయన నీతో అలా చెప్పుచు, నీలో పరిశుద్ధాత్మగా ఏ విధముగా ఉండగలడు? ఆ విధముగా చేయలేడు. ఆయన దానికి "ఆమేన్" అని చెప్పవలసి యున్నాడు!

16నేను గత దినమున చెప్పినట్లుగా మొదటిగా దేవుడు తన ప్రజలను భద్రపరచుటకు తన వాక్యము నిచ్చెను. ఆయన ఎన్నడూ మారలేదు. ఆయన ఎన్నడూ మారడు. ఇప్పుడు, ఆచారములు పనిచేయవు. సంఘ శాఖలు పని చేయవు. విద్య పని చేయదు, వీటిలో మరి ఏదీ పని చేయదు. వాటిలో ప్రతీ ఒక్కటి పూర్తిగా విఫలమై పోయినది. మరియు విఫలమై పోవును. క్రియ చేయునది ఒక్కటే, అది వాక్యమై యున్నది.

వాక్యము ద్వారా మనము వచ్చుటకు ఒక మార్గమున్నది, అది రక్తము ద్వారా మాత్రమే. ఎవరైనా ఎప్పుడైనను దేవుని ఆరాధించవలసిన ఒక్క స్థలముగా రక్తము క్రిందికి రావలసియున్నారు, మరొక సిద్ధపాటు ఏమి లేదు. నీవు మెతడిస్టు అను నామములో రాలేవు, పెంతెకోస్టు అను నామము క్రింద రాలేవు, కాథలిక్ అను నామముతో రాలేవు. కాథలిక్ సంఘంలో ఒక డజను వ్యత్యాసమైన గుంపులు ఉన్నవి. వారు ఒకరితో ఒకరు విభేదించుదురు. కొందరు ఆర్థోడాక్సు అని, గ్రీకు అని మరియు రోమన్ అని, ప్రొటస్టెంటుల వలె చీలికలు గలిగి వున్నారు. మరల ప్రొటస్టెంటు అని, మెతడిస్టు అని, బాప్టిస్టు అని, ప్రెష్బిటేరియన్ అని, లూధర్ అని, కాథలిక్కు అని, ఓ, అవన్నీ రకరకాల గుంపులు. చూడండి! వారు ఆ రీతిగా వున్నారు. కాని సహవాసమునకు ఒకే ఆధారము వున్నది, అది రక్తము క్రిందనే! మరియు రక్తము జీవమైయున్నది. అది ఎల్లప్పుడు వాక్యముతో సమ్మతించును, ఎల్లప్పుడు వాక్యముతో సమ్మతించును.

17మనకు తెలుసు, జీవము పురుష వీర్యములో వున్నది, అది రక్తములోని "హెమోగ్లోబిన్," లో వున్నది, దాని ద్వారా కోడిపెట్ట గ్రుడ్డును పెడుతుంది, కాని అది మగ పక్షితో కలియనట్లయితే అది ఎన్నడునూ పిల్లలను పెట్టదు. నిశ్చయంగా, అది ఫలించదు. అందుచేతనే నేను అనేకమైన, కఠినమైన ప్రకటనలను చేశాను. ఒక ఆడ పక్షి తన గూటి నిండుగా గ్రుడ్లు పెట్టి తాను వుండవలసినంత నమ్మకంగా వాటిని పొదుగవచ్చు. తన రెక్కలతో ఆ గ్రుడ్లను కప్పుచూ వుండవచ్చును. మరి కొన్ని నిముషములకు అవి పిల్లలు అవుతాయని ఆ గ్రుడ్లను ఇటు, అటు కదుపుచూ వుండవచ్చును. మరియు ఆ పక్షి ఎంతో ఆకలిగొని ఉపవాసముండి, తన గూటిలో ఆ గ్రుడ్డ పట్ల ఎంతో నమ్మకంగా వుండును. చిట్ట చివరిగా, అది ఎంతో బలహీనమై గూటిలో నుండి బయటకు ఎగురలేని స్థితికి రావచ్చు. అయితే అది మగ పక్షితో జీవించనియెడల ఆ గ్రుడ్లు ఫలించవు. అది తన జత పక్షితో వుండనప్పుడు ఆ గ్రుడ్డు అక్కడే ఆ గూటిలోనే క్రుళ్ళిపోవును. అది సత్యము.

కేవలము చల్లని నామకార్ధ విశ్వాసము క్రింద, ఏదో కొంత ఉద్రేకమును క్రింద, కొంత గూఢమైన డాన్సుతో, మన సంఘములు ఇప్పుడు అదే స్థితి లోనికి వచ్చినవి. మరియు వారు ఏమి చేయుచున్నారు. వాక్యమును నమ్మక గూటి నిండుగా వున్న కుళ్ళిపోయిన గ్రుడ్డ వలె వున్నారు. గూటిని శుద్ధి చేసి తిరిగి ప్రారంభించుటకు ఇది సమయమై యున్నది. వాక్యములో తిరిగి జన్మించుటకు క్రీస్తు యేసు అను పురుషునితో అది సంబంధము కలిగియుండవలసియున్నది. అప్పుడు పొదుగ వలసియున్నవి, ఎందుకనగా అది జీవమై యున్నది.

18కొద్ది కాలము క్రితము నేను ఒక మెతడిస్టు బోధకునితో రాత్రి భోజనము చేయుచుంటిని. లూయిస్ విల్ 4-H క్లబ్ నుండి వ్యవసాయపు వేళను గూర్చి విన్నాను. వారు చెప్పిరి, "వారి దగ్గర ఒక యంత్రము వున్నది. పొలములో ఎదిగిన మొక్కజొన్న వంటి గింజను అది బయటకు తెస్తుంది. అది అదే రకమైన మొక్కజొన్న బొరుగులను తెస్తుంది. అదే విధమైన జొన్న రొట్టి అది. అది అదే జొన్న గింజ. మీరు దానిని కోసి వెలుగులో పెట్టి లేబరేటరీకి తీసుకుని వెళ్ళినట్లయితే, ఆ గింజ గుండె భాగము దాని సరియైన స్థానములో వుంటుంది. మొక్కజొన్న గింజలో వున్న సమస్తము అదే విధమైన చెమ్మ, కాల్షియం, పొటాష్, మరియు సమస్తము ఖచ్చితముగా నిజమైన గింజలో వున్నట్లు వున్నది. మీరు ఎప్పుడైన పొలములో పెరిగిన మొక్కజొన్నను సంచిలో నుంచి చేతి నిండుగా తీసుకుని, మిషను ఉత్పత్తి చేసిన మొక్కజొన్నతో ఆ రెండింటిని కలిపినట్లయితే, నీవు ఎంత మాత్రము వాటి మధ్య భేధమును నీ సహజ నేత్రముతో చెప్పలేవు, లేక నీవు దానిని కోసినా, లేక ఏ విధమైన సైన్సు ద్వారా నీవు బేధమును కనుగొనలేవు. వాటి బేధమును నీవు చెప్పుటకు ఒకే ఒక మార్గము వున్నది. వాటిని పాతిపెట్టుము." అప్పుడు అది చెప్పుతుంది.

19ఒక మనిషి క్రైస్తవుని వలె కనబడవచ్చు, క్రైస్తవుని వలె నటించవచ్చు, అతడు క్రైస్తవుని పోలి వుండవచ్చు. కాని అతనిలో ఆ జీవబీజము లేనిదే అతడు పైకి లేవలేడు; జీవబీజము అక్కడ ఉండవలసియున్నది. నిత్యజీవము ఉండాలి.

గ్రీకు భాష చదివినవారికి ఎవరికయినా, "నిత్యత్వము" అను మాట "జో" (Zoe) నుండి వస్తుందని తెలుసు, అనగా దేవుని సొంత జీవము. అది ఆయనలోని భాగము. నీవు నీ తండ్రిలోని భాగము వలె, దేవునిలో ఒక భాగం అగుచున్నావు. మరియు దేవుని సొంత జీవము విభజించబడి, నీతో వుంచబడి వున్నది, అది మరణించదు, ఎందుకనగా అది నిత్యమై యున్నది. ప్రారంభము గల దానికి ఒక ముగింపు వున్నది; కాని ఆయనకు ప్రారంభము లేదు, కాబట్టి ఆయనకు అంతము లేదు. ఆయన నిత్యుడైయున్నాడు, నీవూ ఆయనతో నిత్యుడవైయున్నావు. ఆయన మరణించడు, కావున నీవును మరణించవు, ఎందుకనగా నీవు ఆయనలో భాగమైతివి. నీవు ఆయనయందు జన్మించావు. "ఆమేన్." దాని గురించి మాట్లాడుకుంటూ వెళితే నేను ఈ పాఠములోనికి ఎన్నడూ రాలేను.

ఓ, ఒక క్రైస్తవునిగా వున్నందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను. ప్రెసిడెంటులతో గాని, రాజులతో గాని, ఈ లోకములోని ఎవరితోను ఈ స్థానములను భేరము చేయను. ఈ లోకమంతటిని వారు నా కిచ్చినను ఒకవేళ నేను 10 లక్షల సంవత్సరములు జీవించినా; ఆ 10 లక్షల సంవత్సరముల తరువాత నేను చనిపోవుదును. కాని ఇక్కడ 10 లక్షల సంవత్సరములు అంటే, ఎందుకు, మనము జీవిస్తూనే వుంటాము, మరణం లేదు. అందువలన క్రైస్తవుడుగా వుండుట ఒక గొప్ప భాగ్యమైయున్నది!

20మనము తిరిగి వెనుకకు వెళ్ళుదము. అబ్రాహామును గూర్చి మాట్లాడుకొనుచున్నాము! మనము క్రీస్తులో వున్నట్లయితే, ఇప్పుడు మనము అబ్రాహాము సంతానము. మరియు నీవు అబ్రాహాము సంతానమైతే, అబ్రాహాము కలిగియున్న విశ్వాసమునే నీవు కలిగియున్నావు, ఏలయనగా ఇప్పుడు మనము మాటలాడుచున్నది ఆయన విశ్వాసమును గూర్చియే, మరి విశేషముగా ఇప్పుడు సంఘమందు అది అబ్రాహాము యొక్క రాజ సంతానమైయున్నది. అబ్రాహామునకు రెండు సంతానములున్నవి. ఒకటి ప్రకృతి సంబంధమైనది, అనగా ఇస్సాకు, మరొకటి క్రీస్తు. అందువలన ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు దీవించబడినది. క్రిస్తు ద్వారా, ఆయన జనములకు తండ్రి అయ్యాడు, చూశారా. కాబట్టి ఆ రాజ సంతానము సహజ సంతానమైన అబ్రాహాము సంతానము కంటే ఎంత గొప్పదో చూడండి. కావున నీవు క్రీస్తులో వున్నట్లయితే అబ్రాహాము వున్నదాని కంటే అధికమైన సంతానముగా వున్నావు, ఎందుకనగా నీవు రాజ సంతానమైన క్రీస్తు ద్వారా వచ్చియున్నావు. నీవు క్రీస్తులో వున్నట్లయితే అబ్రాహాము కంటే అధికమైన సంతానంగా వున్నావు, ఎందుకనగా నీవు రాజ సంతానమై యున్న క్రీస్తు ద్వారా వచ్చియున్నావు. నీవు క్రీస్తులో మరణించినట్లయితే, నీవు అబ్రాహాము సంతానమై అబ్రాహాము విశ్వాసమును కలిగియున్నావు. జరిగిన పరిస్థితులకు భిన్నముగా అబ్రాహాము విశ్వాసము దేవుని వాక్యమునందున్నది. అతడు లేని వాటిని వున్నట్లుగా పిలిచాడు, ఎందుకనగా దేవుడు అలాగే చెప్పాడు. అది ఎలాంటి వాగ్దానము!

21ఇప్పుడు మన తలంపులను ఆధారము చేసికొని వెళ్ళుదము. మనము 'యెహోవా-యీరే' యొద్దకును, అబ్రాహాము యొద్దకు వెళ్ళక ముందు కొంచెము వెనుకకు వెళ్ళదం. కొంచెము వెనుకకు వెళ్ళి, లేఖనమును చూచెదము. 12వ అధ్యాయములోకి వెళదాము. ఇక్కడ 22వ అధ్యాయములో చదివాము. అబ్రాహాముతో చేయబడిన నిబంధనను 12వ అధ్యాయములో చూచెదము. అక్కడ రెండు నిబంధనలు వున్నవి.

దేవుడు మూడులో పరిపూర్ణమగుచున్నాడు. మనకు దేవుని యొక్క సంఖ్యలు తెలియును. మూడు పరిపూర్ణత; ఏడు ఆరాధన; మరియు పన్నెండు ఆరాధన; నలుబది శోధనైయున్నది; ఏబది, సునాద సంవత్సరము; ఆ రీతిగా వున్నాయి. దేవుడు తన సంఖ్యలో వున్నాడు. దేవుడు మూడులో పరిపూర్ణుడగుచున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మవలె; నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మొదలగునవి.

22ఇప్పుడు, ఇక్కడ రెండు నిబంధనలున్నవి. ఒకటి ఆదాము నిబంధన. దేవుడు మానవునితో ఈ విధముగా నిబంధన చేశాడు. "నీవు యిది చేసినట్లయిన దానిని చేసెదను." అయితే దానిని అతడు బద్దలు చేశాడు. తరువాత దేవుడు నోవహుతో నిబంధన చేశాడు; అది నోవహు నిబంధన, మరియు అది కూడా బ్రద్దలైపోయింది.

ఇప్పుడు ఆయన అబ్రాహాముతో నిబంధన చేయుచున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము ప్రకారము అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన షరతులు లేనిది. "నీవు ఇది చేసిన నేను దానిని చేయుదునని కాదు, నేను చేశాను, నేను ముందే దానిని చేశాను," అన్నాడు. "నేను అది చేస్తానని," కాదు. "నేను దానిని చేసియున్నాను!" ఇప్పుడు అది విశ్వాసమును ఆధారం చేస్తుంది. దేవుడు మానవాళిని రక్షించాలని సంకల్పించాడు, నీవు యిది చేస్తే, నేను చేస్తా," అని నిబంధన చేస్తున్నాడు. దానిని అతడు విరుగగొట్టాడు. మరొక నిబంధన "నీవు చేస్తే, నేను చేస్తా," దానిని అతడు విరుగగొట్టాడు. మానవుడు దేవుని నిబంధనను పాటించలేడు, కాబట్టి షరతులు లేని నిబంధన క్రింద మానవుని దేవుడు తన కృప ద్వారా రక్షించుచున్నాడు. ఓ మై! దానికి అంతము లేదు, అది పరిపూర్ణమైనది; మూడు పరిపూర్ణత. ఆదాము, నోవహు, మరియు అబ్రాహాము. ఇప్పుడు, ఆ కారణము చేతనే మనము అబ్రాహాము సంతానమైయున్నాము. ఆ నిబంధన ఎన్నడును రద్దు కాదు, ఎందుకనగా అది షరతులులేనిది. అది నీవు ఏదో చేసినందువలన కాదు, కాని అది దేవుడు చేసినదైయున్నది. నీవు దేవుని ఎన్నుకున్నావని కాదు; దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు! నీవు దానిని నమ్ముచున్నావా?

JOHN 6:44•

JOHN 15:16

 

23ప్రజలు, "ఓ, సహోదరుడా బ్రెన్హాం, నేను దేవుని వెదికాను, మరియు దేవుని వెదికాను!" నీవు వెదకలేదు! దానిని నీకు చెప్పుటకు నేను అభ్యంతరపడుచున్నాను, కాని నీవు వెదక లేదు. దేవుడు నిన్ను వెదికాడు. దేవుడు నిన్ను వెదుకుచున్నాడు.

యేసు చెప్పెను, "మీరు నన్ను ఎన్నుకొనలేదు; నేను మిమ్మును ఎన్నుకున్నాను. నా తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. మరియు నా తండ్రి నాకు అనుగ్రహించువారందరు నా యొద్దకు వత్తురు." ఇప్పుడు చూడండి, అది అలాగుండలేదు… ఏ విషయంలోనూ ఏ మనిషియు మహిమ పొందలేడు. దేవుడు మాత్రము దాని పొందగలడు! ఓ, దేవుని నిజమైన కృపను చూచుట ఎలాగున్నది, ఎంత అద్భుతమైన విషయమో గదా!

మరియు ప్రజలు కృపా వర్తమానమును తీసుకుని మరియు దానినుండి కృప లేనిదిగా చేశారు. నా ప్రశస్తమైన సంఘము మరియు ప్రశస్తమైన బాప్టిస్టు ప్రజలైన మీరు, కృపను ఆ రీతిగా కలగలుపు చేసినప్పుడు, మీరు నిజముగా కలగలుపులోనికి వెళ్ళారు.

ACTS 19:2

 

24ఈ మధ్య ఎవరో నాతో, "సహోదరుడా బ్రెన్హాం, నీవు ఒక మంచి బాప్టిస్టువని నీకు తెలుసా," అని అన్నారు.

అందుకు నేను, "నేను ఇంకా ఆ అనుభూతిని కలిగియున్నాను, కాని నేను దానికంటే కొంచెము పైగా లేచియున్నాను," అని చెప్పాను.

అందుకు ఆయన, "మంచిది చూడుము, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మట కంటెను, అబ్రాహాము ఇంకా ఎక్కువ ఏమి చేయగలడు," అని అన్నాడు. "మేము దేవునిని నమ్మునప్పుడు పరిశుద్దాత్మను పొందెదమని," ఆయన అన్నాడు.

నేను ఇలా అన్నాను, "ఇది పౌలునకు ఎంత భిన్నముగా వున్నది! అపోస్తుల కార్యములు 19వ అధ్యాయములో, "మిరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా!" మీరు "విశ్వసించినందున" కాదు, "మిరు విశ్వసించినప్పటి నుండీ" అని పౌలు చెప్పుచున్నాడు.

అతడు, "మంచిది అబ్రాహాము దేవుని నమ్మెను. దానినే అతడు చేయగలడని" చెప్పెను.

అందుకు నేను, "నిజమే, ఆ తరువాత అతడు తన విశ్వాసమును పొందెనని రూఢి చేయుటకు దేవుడు అతనికి సున్నతి క్రమమును ఇచ్చెను" అని చెప్పితిని.

JOHN 15:7

 

25ఆయన పరిశుద్దాత్మ ద్వారా నిన్ను ఇంకా సున్నతి చేసియుండకపోతే, ఆయన నీ విశ్వాసమును అంగీకరించియుండలేదు. అది నిజము. అదియే మనస్సు యొక్క హృదయము యొక్క సున్నతి అయి యున్నది. దేవుడు విశ్వాసమును అంగీకరించినట్లు, "రూఢి" చేయుచూ నీకు పరిశుద్దాతను ఇచ్చును. నీవు విశ్వసించుట మానివేసి, అనుమానముతో వుంటే, దేవుని విశ్వసించుము. అప్పుడు దేవుడు హృదయమును సున్నతి చేయును. మరియు అది అవిశ్వాసమునంతటిని తీసివేస్తుంది. నీ నుండి లోకమును మరియు అవిశ్వాసమును సున్నతి చేస్తుంది. అప్పుడు నీవు వాక్యముతోనే నిలచియుందువు. యేసు, "నా యందు మీరునూ, మీ యందు నా మాటలును నిలిచియుండినయెడల, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును," అని అనెను.

26ఇప్పుడు సంఘముతో వచ్చిన చిక్కంతా అదే. అది ఉద్రేకము క్రిందను, విద్య క్రిందను, ఆచారము క్రిందను వున్నవి. ఆశర్యము లేదు, అది ఊపిరి తిరుగకుండా క్రిందకు అణచివేయబడి యున్నది! చూచారా? కాబట్టి సమస్తమునూ దూరంగా చేయుటకు మనకు సున్నతి కావాలి. దేవుని యొద్దకు ఆయన వాక్యము నొద్దకు తిరిగి రావాలి. వాక్యముతో వాదించక, అది అక్కడ వ్రాయబడిన రీతిగా దానిని నమ్మాలి. దానితో అలాగే నిలచియుండాలి. దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు ఆయన వాగ్దానమును నిలబెట్టుకొనును. ఆయన తన వాగ్దానమును నిలబెట్టుకొనుట తప్ప మరొక దానిని ఆయన ఏమియూ చేయడు, మరియు ఆయన దేవుడుగానే ఉంటాడు.

ROM 8:30•

REV 13:8

 

27ఇప్పుడు ఈ షరతులు లేని నిబంధన. అనగా "నీవు ఇది చేస్తే, నేను చేస్తాను, లేక తరువాత చేస్తాను" అనునది కాదు; గాని "ముందే నేను నీకు ఆ దేశమును ఇచియున్నాను. మరియు నీ తరువాత నీ సంతానమునకును ఇచ్చియున్నాను." ఆమేన్. చూశారా, ముందే దానిని చేశాడు. అది ముగించబడిన కార్యము.

"అబ్రాహాముకు ఆయన అది చేశాడు" అని నీవంటావు. అబ్రాహాముకు మాత్రమే కాదు, ఆయన తరువాత ఆయన సంతతకి కూడా దాని చేశాడు.

మరియు మనము అబ్రాహాము సంతానమైతే, అది పూర్తి చేయబడిన ఉత్పత్తిగా వున్నది. "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో, వారిని పిలచెను; ఎవరిని ఆయన పిలచెనో, వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, వారిని మహిమపరచెను." నీవు దేనిని బట్టి భయపడుదువు? అది సత్యము. "చివరి దినములలో క్రీస్తువిరోధి," ప్రకటనలో వ్రాయబడిన ప్రకారము, "గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధములో, వ్రాయబడక భూమి మీద నివసించువారినందరినీ మోసగించును." [గడచిన ఉజ్జీవము నుండి? కాదు.] "జగత్తు పునాది వేయక ముందే." అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడియున్నది. దేవుడు వాక్యమును పలుకగా, గొర్రెపిల్ల వధించబడినది. అది ఆయన ఆలోచనలో, ఆయన తలంపులో, ఆయన వాక్యమును పలుకగా, ప్రతిది ఆ సమయములోనే జరిగింది. ఇది దేవుడు తన విత్తనాన్ని భౌతికమైనదిగా చేయుటయే, అంతే, ఆయన మాటలు క్రిందికి దిగి వచ్చుట. దేవుని వెలుగు దానిపై ప్రకాశించినప్పుడు, వెంటనే ఆ విత్తనము దానిని గ్రహించుచున్నది, ఎందుకనగా అది దేవుని వలన జన్మించినది. అది దేవుడు ముందుగా ఎరిగిన అబ్రాహాము సంతానము, అందుచేతనే విత్తనమును కనుగొనుటకు వెలుగు ప్రకాశించును.

28యోవేలు ఇలా చెప్పాడు. మనకు ఉజ్జీవము వున్నది. మనము కడవరి వర్షమును గూర్చి ఎంతో గలిబిలి చేయుచున్నాము. "కడవరి వర్షము" ఉద్యమము అని, తొలకరి వర్షము, బయటి వర్షము, లోపల వర్షము అని పిలచుచున్నాము. గత దినమున నేను ఇలా చదువుచుంటిని. హెబ్రీ మాటలో "తొలకరి వర్షము" అనగా అర్థము ఏమిటో మికాకు తెలుసా? ఇప్పుడు నేను దానిని చెప్పలేను; నేను దానిని వ్రాసుకోలేదు, అది నా మనస్సు నుండి దాటిపోయింది. కాని "తొలకరి వర్షము," మొదటి వర్షము అనగా, "ఉపదేశపు వర్షము." రెండవ వర్షము ఏమి బోధించబదినదో దాని మీదకు వచ్చి పంటను పండించు ఆత్మయై ఉన్నది. ఎందుచేత మనకు అలాటి ఉజ్జీవము కావలసి వచ్చినది? పెంతెకోస్తు, బాప్టిస్టు, మిగతా చెట్లన్ని వాటి మొగ్గలు తొడిగినవి. ఆ విధముగా వుందురని యేసు చెప్పెను. మరియు మనము పొదిగిన దేమిటి? బాప్టిస్టులు '44' లో పది లక్షల మంది ఎక్కువయ్యారు అని చెప్పుచున్నారు. కాథలిక్ వారిని చూడండి, వారు ఎలా ఎక్కువ అయ్యారు. సంఘ శాఖలను చూడండి. పెంతెకోస్తును చూడండి. మనము ఏమి చేశాము? మనము శాఖా సంబంధమైన విత్తములను చల్లి, శాఖా సంబంధమైన పంటను కోసియున్నాము. సంఘము ఇప్పుడే దేవుని కొరకు అగ్నిపై వుండవలసియున్నది. అక్కడ వాక్య విత్తనము చల్లబడియుంటే, అక్కడ అద్భుతములు, సూచక క్రియలు ఉంటాయి. మరియు అప్పుడు సంఘము అంతా కలసి, ఏక మనస్సుతో, ఏక హృదయముతో క్రమముగా అడుగులు వేయుచూ సియోనుకు ఎత్తబడుటకు నడుస్తుంది. అది నిజము. మనము ఏమి చేయాలి? వాక్యమునకు బదులుగా, మానవ మేధస్సుతో కూడిన ప్రసంగాలు చేయుచున్నాము. మనము వాక్యమునకు వ్యతిరేకముగా ఆలోచన చేయుచున్నాము, మరియు అలాంటివన్నీ చేయుచున్నాము.

JOEL 2:25•

MAL 3:1•

MAL 4:6•

MATT 11:14

 

29మనము వాక్యము నొద్దకు తిరిగి వెళ్ళవలసియున్నది. మనము వెళ్ళుదుము! దేవుడు చెప్పెను, "గొంగలి పురుగులు, పసర పురుగులు తిని వేసిన సంవత్సరముల పంటను మరలా మికిత్తును," అని ప్రభువు చెప్పుచున్నాడు. అది సాయంకాల సమయంలో వికసించబోవుచున్నది. ఒకరు ఒక వర్తమానముతో వచ్చి, పిల్లల హృదయములను తిరిగి తండ్రుల విశ్వాసమునకు త్రిప్పును. ఆయన, "మలాకీ 4లో" దానిని చేయుదునని వాగ్దానము చేసెను, వారిని వెనుకకు మరలా త్రిప్పును.

బైబిలు మాటలాడినట్లు అక్కడ ఆ ఏలీయా కాదు; మత్తయి 11లో యేసు, "మీకు అంగీకరిరచుటకు మనస్సుంటే, రాబోయే ఏలీయా ఇతడే, మలాకీ 3 లోని యోహాను," అని చెప్పెను. "ఇదిగో నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను," మలాకీ 3, మీరు దాని కనుగొన్నారు.

JOEL 2:25•

MAL 4:1,3

 

30అయితే గుర్తుంచుకొనండి, మలాకీ 4, వర్తమానము వచ్చినప్పుడు, "ప్రభువు యొక్క భయంకరమైన దినము వస్తుంది మరియు భూమిని కాల్చి వేస్తుంది, మరియు నీతిమంతులు దుష్టుల బూడిద మీద నడచిపోవుదురు." యోహాను తరువాత అది ఎన్నడునూ జరుగలేదు. లేదు, అదే అయితే, లేఖనము దాని నిజస్థితిని పోగొట్టుకున్నట్లుండును, కాని అది మరేదో చెప్పినట్లున్నది. అప్పటి నుండి మనకు రెండు వేల సంవత్సరములు గడచినవి. లోకము ఎంత మాత్రము కాలిపోలేదు, లేక నీతిమంతులు దుష్టుల బూడిదపై మీద నడిచియుండలేదు. ఆ పసర పురుగు మరియు రోమన్ గొంగళి పరుగు తినివేసిన ఆ అసలైన పెంతెకోస్తు వధువు చెట్టు నొద్దకు, పిల్లల విశ్వాసమును త్రిప్పబడుటకు, ఇంకా ఏదో జరుగుటకు మనము ఎదురు చూచుచున్నాము. వారి యొక్క సంఘ శాఖల ఆచారములు దానిని తినివేసియున్నవి. దేవుడు "చివరి దినములలో దానిని నేను పునరుద్ధరిస్తాను," అని చెప్పెను. మరియు అది పునరుద్ధరించబడును! నాటబడిన వాక్యముపై దేవుడు పరిశుద్ధాత్మను పునరుద్ధణ కొరకు పంపును, అదే పునరుద్ధరించును. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన విత్తనమే దేవుని వాక్యము.

EXOD 3:7

 

31ఇప్పుడు, నిబంధన షరతులు లేకుండా ఇవ్వబడినది! అయితే శరీర సంబంధమైన ఇశ్రాయేలు దానిని నిర్గమకాండము 19లో పోగొట్టుకున్నది. వారు తొందరపడి కృపను త్రోసివేసినప్పుడు దాని స్థానములో ధర్మశాస్త్రమును అంగీకరింపవలసి వచ్చినది. అక్కడ ఇశ్రాయేలు చేసినది ఎంత తొందరపాటు చర్యగా వున్నది.

చూడండి! దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసిన తరువాత దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన మాటను నెరవేరుటకు "కృప" వారి కొరకు ప్రవక్తయైన విమోచకుని ఐగుప్తు నందు సిద్ధము చేసెను. పొద దగ్గర వున్నప్పుడు, మోషేను గుర్తుంచుకొనండి. దేవుడిలా అన్నాడు, "నా ప్రజల మూల్గులను వినియున్నాను, నా వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనుచున్నాను." ఏ విధమైన ధర్మశాస్త్రము లేనప్పుడే, కృప దానిని సిద్దపరచినది. కృప వారి దోషము నిమిత్తము ఒక బలి అర్పణను సిద్ధము చేసెను. కృప నిబంధనను, సున్నతిని వాటన్నిటికినీ ముందే సిద్ధము చేసినది. వారిని నడిపించుటకు ప్రవక్తను, వెంబడించుటకు అగ్నిస్తంభమును సిద్ధము చేసినది. ఆ అగ్నిస్తంభము, ఆ ప్రవక్త వారికి సత్యము చెప్పాడనుటకు భద్రతగా ఉన్నది. ఆయన మాట్లాడుచున్నది వాక్యమును గురించియే. దానిని దేవుడు వాగ్దానము చేశాడని వారు నమ్మారు. మరియు ఇక్కడ అగ్నిస్తంభము దానికి రుజువుగా వున్నది. ఎలాటి రెండింతల భద్రత ఇక్కడున్నది! ఆమెన్. కృప దానిని చేసెను!

కాని వారు వారి కొరకు చేయగలిగినది ఏదో చేయాలనుకున్నారు. తమ సొంత ఆచారములను, సంఘ శాఖలను, ఇంకా ఏమిటేమిటో పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరియు వారి కొరకు వారు చేయగలిగినవి చేసుకొన్నారు.

మానవుడు ఎల్లప్పుడూ తన్ను తాను రక్షించుకోవాలని ప్రయత్నించుచున్నాడు. నీవు దానిని చేయలేవు! దేవుడు ముందే దానిని చేశాడు. నీవు కేవలము దానిని అంగీకరించి మరియు నమ్మవలసియున్నది.

32వారిని మార్గములో నడిపించుటకు, మార్గదర్శిగా వుండుటకు, అగ్నిస్తంభమున్నది. వారిని స్వతంత్రులుగా చేయుటకు, వారి శత్రువును ఖండించుటకు, కృప ఒక శక్తిని సిద్ధపరచినది. ఆ శక్తి ముందే ఇవ్వబడినది. వారు ఎర్ర సముద్రమును దాటిరి. వారు ఫరోను మొత్తిరి. ఈ కార్యములన్ని వారు కృపతో చేసిరి. తరువాత వారు కృపను ధర్మశాస్త్రమునకు మార్చిరి, కాని అబ్రాహాము యొక్క రాజసంతానమునకు దానితో పని లేదు.

రాజ సంతానము కూడా ఆ విధముగనే వెనుకకు వెళ్ళి వాక్యమును మరియు కృపను అంగీకరించి నమ్ముటకు బదులుగా ఏదో ఒక విధమైన ఆచారమును తీసుకొనుటకు ప్రయత్నించినది. వారు వెనుకకు వెళ్లారు. అయితే మరొక రాజ సంతానము వచ్చును, కొంచెము ముందుకు వెళ్ళిన తరువాత దానిని మనము చూస్తాము.

GEN 17:4•

ROM 4:20

 

33ఇప్పుడు మనము ఆదికాండము 12వ అధ్యాయమునకు వెళ్ళుదము, దేవుడు అబ్రాహామును కృప ద్వారా పిలిచాడు. అతడు ఏదో ప్రత్యేకమైన వ్యక్తి అయినందున కాదు కాని, అతడు కేవలము అబ్రాహాము, ఒక సామాన్య మానవుడు. అతడు ఒక యాజకుడు లేక ఏదో హోదా కలిగిన వ్యక్తియైనందున కాదు, అతడు కేవలము ఒక వ్యవసాయదారుడు. అతడు బబులోను గోపురపు పట్టణపువాడై తన తండ్రితో కల్లీయుల 'ఊరు' ఆను ప్రదేశమునకు వెళ్ళెను. అక్కడ, అతడు వ్యవసాయదారుడుగా, బహుశా పగటి వేళ తన ఆహారమును పండిస్తూ వుండేవాడు. అతడు తనకు సగము సహోదరి అయిన శారాను వివాహము చేసుకొనెను. మరియు వారికి పిల్లలు లేరు. దేవుడు వారిని పిలిచినప్పుడు అబ్రాహామునకు 75 సంవత్సరములు, మరియు శారాకు 65 సంవత్సరముల వయస్సు గలిగి యుండిరి.

దేవుడు అతనిని పిలచినప్పుడు, అబ్రాహాముతో చెప్పాడు, "నేను నిన్ను జనములకు తండ్రిగా చేయబోవుచున్నాను." శారా ద్వారా నీకు బిడ్డను ఇవ్వబోవుచున్నాను. ఇప్పుడు, అతడు గొడ్డుబోయిన వాడుగా వున్నాడు. మరియు ఆమెకు 65 సంవత్సరములలో ఋతుస్రావము ఆగిపోయి 10, లేక 15 సంవత్సరములు గడిచినవి. అతడు ఆమెతో 16 లేక 18 సంవత్సరముల వయస్సు నుండి కాపురము చేస్తునే వున్నాడు. ఆమెకు 65 సంవత్సరములు మరియు అతనికి 75 సంవత్సరములు వచ్చు వరకు అతడు ఆమెకు భర్తగానే జీవించాడు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి ఇలా అనెను, "నేను ఆమె ద్వారా బిడ్డను ఇవ్వబోవుచున్నాను." అతడు దేవుని వాగ్దానమును సంశయించక, దానిని నమ్మెను.

ACTS 24:14

 

34ఒక 75 సంవత్సరముల ముసలి వ్యక్తి, 65 సంవత్సరముల ముసలి స్త్రీ ఊగులాడుకొంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి "డాక్టర్ గారూ, ఇప్పుడు మీరు మా కొరకు హాస్పిటల్ ను సిద్ధము చేయండి." మేము ఏ రాత్రిలోనైనా మిమ్ములను పిలువవచ్చు, కారణము మీకు తెలుసా, మేము బిడ్డను పొందబోవుచున్నామని చెప్పుటను మీరు ఊహించగలరా?

డాక్టరు అంటాడు, "అవునయ్యా, … ఉ, ఊః ఊః!" "వారు ఆయనకు ఫోను చేయగానే, "మీరు అతని కొరకు వెళ్ళండి, ఏదో తప్పిపోయినది," అంటాడు.

ఆయన వాగ్దానముల ప్రకారము దేవుని స్వీకరించే ప్రతివారు లోకము చేత 'పిచ్చివారు'గా పరిగణించబడతారు. పౌలు చెప్పెను, "వెర్రితనము అని పిలువబడు విధానములోనే, నేను మన పితరుల దేవుని ఆరాధించుచున్నాను." ఇది ఒక "వెర్రితనముగానే" ఉంటుందని మనకు తెలియును. శరీరిక మనస్సుకు బుద్ధిహీనముగా వుంటుంది. దేవునికి మరియు ఆ విశ్వాసము పొందినవానికి తప్ప, విశ్వాసము అనునది ప్రతివానికి వెర్రితనముగా వుంటుంది. అది నిజము.

ROM 4:20

 

35దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేశాడు, మరియు అబ్రాహాము దానిని నమ్మాడు. "దేవా, అది ఎలా జరుగుతుంది?" అని అతడు ఎన్నడూ చెప్పలేదు. "అలాగే ప్రభువా, నేను దానిని నమ్ముతున్నాను," అన్నాడు. అతడు ఇంటికి వెళ్ళి, "శారా, మనము సున్నితమైన బట్టలను, కొన్ని పిన్నులను, బూటులను తెచ్చుకొందము. ఓ, మనము బిడ్డను పొందబోవుచున్నాము," అని చెప్పుట నేను చూచుచున్నాను.

మొదటి 30 దినములు గడిచినది, లేక 28 దినములు గడచినవి. ప్రియమైనదానా, నీవు ఎలా ఉన్నావు?"

"తేడా లేదు."

"దేవునికి స్తోత్రము. ఎలాగైన మనము పొందబోవుచున్నాము."

"మీకు ఎలా తెలుసు?"

"దేవుడు అలా చెప్పాడు!"

పరిశుద్దాత్మ కుమ్మరించబడుచు యున్న కూటములో కూర్చునియుండగా, మనలో కొంతమందికి ఆ రాత్రి ప్రార్థన చేసియుండవచ్చును. మరియు మరుసటి ఉదయము "నా కడుపులో ఇంకా కొంచెము బాగో లేదు; నా చేతులను నేను ఏ మాత్రము కదుపలేను," అని నీవు నీరసముగా చెప్పవచ్చు. అబ్రాహాము సంతానమగు నీవు, అవిశ్వాసము ద్వారా వాగ్దానమును సందేహించవద్దు."

MATT 13:47

 

36సంఘములో ఏదో లేచి, సాతాను ఒక మంచి గుంపు ప్రజలలో ప్రవేశించి, ఆ సంఘమును కొరడాతో కొడుతుంది. మొదటి సంగతి ఏమిటంటే, "ఓ, నేను ఈ పాతదాన్ని వదిలిపెట్టబోవుచున్నాను, అది మొదట్లో వున్నట్లుగా అసలు ఏమి లేదు," అని కొందరు అనెదరు. అబ్రాహాము సంతానమా? మొదటగా చిన్న దోషమును సాతాను నీకు చూపగలదు. తరువాత నీవు దాని ద్వారా వెళ్ళెదవు. అది నీకు చూపించు దానిని ప్రారంభముననే నమ్మవద్దు.

యేసు, "దేవుని రాజ్యము ఒక మనిషి వలను తీసికొని దానిని సముద్రము లోకి విసిరినట్లుగా వున్నది. అతడు దానిని లాగినప్పుడు, దాని లోనికి అన్నీ వచ్చినవి." అది నిజము.

ఒక ఉజ్జీవములో ఇదియే జరుగుతుంది. వలలో ఏమున్నవి? కప్పలు, సాలె పురుగులు, తాబేళ్ళు, పాములు, గాజు రొయ్యలు. కొంత సమయము కాక ముందే తాబేలు అన్నది, "ఇది నా స్ధలము కాదు," తిరిగి బురదలోకే అది వెళ్ళిపోతుంది. ఆ పాత నీటి సాలె పురుగు అటు ఇటు చూచి, "ఓ, నాకు ఇక్కడ కార్డు గేమ్ లేదు." కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు, అది కూడా తిరిగి బురదలోనికి వెళుతుంది. అది నిజము. ఇప్పుడు నీవు అబ్రాహాము సంతానమెనా? ఓ, మై! ఎలాటి అవమానము!

అబ్రాహాము సంతానము దేవుని వాక్యమును నమ్మును!

37దేవునికి స్తోత్రము, "నేను పెంతెకోస్తును" అని అక్కడ కూర్చుని చెప్పుతారు. మరియు వాక్యము మీద ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, అది అక్కడే వ్రాయబడియున్నను "హల్లెలూయ, నేను దానిని నమ్మను. లేదండి," అని అంటారు. నీవు అబ్రాహాము సంతానమా? హు!

ఇప్పుడు, అది ఒక బుద్ధిహీనతగా నీవు దానిని నమ్మవు. అయితే అది వాక్యమైయున్నయెడల, అది సత్యమైయున్నది! అది నిజము. అబ్రాహాము సంతానము వాక్యముపై తప్ప మరి దేని మీదను ఆధారపడదు.

ROM 4:20

 

38మరొక నెల గడచినది. "శారా, ప్రియమైనదానా, నీకు ఎలా వున్నది? చూడండి, మరొక 28 దినములు గడిచినవి, నీకు ఎలా వున్నది?"

"ఏ భేదము లేదు, ప్రియా."

"దేవునికి మహిమ!" అది గడచిన నెల జరిగినట్లయితే, అది రెండు నెలలు గొప్ప అద్భుతముగా వుండి వుండును.

ఒక సంవత్సరము గడచినది. "ఈ చిన్న బూట్లను ప్రక్కకు పెట్టనా?"

"లేదండి, వాటిని మీరు అక్కడే వుంచండి. మనము ఆ బిడ్డను పొందబోవుచున్నాము!"

''మీరు పొందబోవుచున్నారని మీకు ఎలా తెలుసు?"

దేవుడు ఆ రీతిగా చెప్పాడు! అది దానిని నెరవేర్చును."

25 సంవత్సరములు గడచిన తరువాత, "శారా, ఎలా వున్నది."

"ఏమి భేదము లేదు."

"దేవునికి మహిమ!" ఇప్పుడు అది 25 సంవత్సరములు పై బడిన అద్భుతము!" అతడు దేవుని వాగ్దానమును గూర్చి అవిశ్వాసముతో సందేహింపక, బలము కలిగి, దేవుని వాక్యముపై నిలచి యుండెను. మరియు లేనివాటిని వున్నట్లుగా పిలచెను. ఎందుకు? దేవుడలా చెప్పాడు! ఓ, మై!

MATT 24:35

 

39ఈ దినమున పిలువబడుచున్న అబ్రాహాము సంతానము, ఆకలితో చనిపోవుచున్న కోడి పెట్ట నుండి తాయారు చేసిన చారు వలె బలహీనంగా వున్నది. అవునండి.

జీవమైనను, మరణమైనను దేవుని వాక్యమును తీసుకొను కరుకైన క్రైస్తవులు దేవునికి కావాలి. అది ఆ విధముగనే వున్నది. ఆమేన్. "దేవుడు అలా చెప్పాడు!" అది ఆత్మ మూలముగా, దేవుని వాక్యము మూలముగా జన్మించిన అబ్రాహాము సంతానము. అదే నిలబడుతుంది.

భూమ్యకాశములు గతించిననూ, నా మాటలెన్నడూ గతించవు…" అది అంతే. దేవుడు ఏమి వాగ్దానము చేశాడో దానిని చేయుటకు ఆయన సమర్ధుడు. దేవుడు ఎన్నడూ తప్పిపోడు. దేవుడు చేయలేనిది ఒక్కటి వుంది, అది తప్పిపోవడము మాత్రమే. ఆయన తప్పిపోడు, అది ఒక్కటి మాత్రమే ఆయన చేయలేడు. కాని ఆయన ఎన్నడూ తప్పిపోడు. దేవుడు దానిని వాగ్దానము చేసినప్పుడు, అది సత్యమైయున్నది. అది ఎల్లప్పుడూ అక్కడుంటుంది. అది ఎప్పటికి పూర్తిగా స్థిరపరచబడియున్నది. దేవుడు ఒక మాటను మాట్లాడినప్పుడు, అది ముందే స్థిరపరచబడినది.

HEB 6:13

 

40ఈ ప్రపంచము దేవుని వాక్యము చేత చేయబడినది. ఆయన కేవలము "కలుగును గాక," అని చెప్పినంత మాత్రమున అది కలిగినది. ఆమేన్. ఈ రాత్రి నీవు ఏ దుమ్ము మీద కూరున్నాచో, నీవు ఏ చెక్క మీద అయితే కూరున్నావో, అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము తప్ప మరొకటి కాదు. హల్లెలూయా!

అబ్రాహాము సంతానము యొక్క వాగ్దానములతో మనము ఆయన సంతానమగుదుమని నేను అబ్రాహామును గూర్చి యోచించునప్పుడు నాకు ఎంతో భక్తిగా వుంది. దానిని నిశ్చయము చేయుట మాత్రమే కాదు. దేవుడు తన చేతిని పైకెత్తి దానిని చేస్తానని తనతో ఒట్టుపెట్టుకున్నాడు. నిబంధన ఎల్లప్పుడూ ప్రమాణము చేత, "రూఢి" చేయబడును. కారణము ఆయన కంటే ఉన్నతమైనవాడు లేడు కాబట్టి, దేవుడు తనతో తాను ప్రమాణము చేసియున్నాడు. ఆయన చేస్తానని దేవుడు తనకైతాను ఒట్టు పెట్టుకున్నాడు.

ఇప్పుడు ఈ ప్రపంచము ఏమై యున్నది. మన సంగతి ఏమిటి? అలాంటి వాగ్దానము పట్ల! అలాటి దాని చుట్టూ విశ్వాసమును నిర్మించుకోవడం, విశ్వాసమును నిర్మించడము. చివరి దినములలో ఈ విషయములను వాక్యము వాగ్దానము చేసినది. మరియు ఇక్కడ వాటిని మనముందే నెరవేరుటను చూస్తూ వున్నాము. ఇంకనూ వేటి చుట్టూ వంగుచున్నాము. అబ్రాహాము సంతానమా? ఓ మై! మీరు దానిని పట్టుకొని యుండుండి, "అబ్రాహాము సంతానమా."

GEN 12:1

 

41ఆదికాండము 12లో అబ్రాహాము పూర్తి వేర్పాటును దేవుడు కోరాడు.

ఈనాడు, వారికి మిశ్రమములు కావాలి. "ఓ, మనము సంఘ కాపరిని ఎన్నుకొనునప్పుడు, అతనికి ఉంగరాలు జట్టు వుండాలి, హాలీవుడ్ నుండి అప్పుడే వచ్చినవాడై ఉండాలి, ఆ "హామెన్" అని నాజూకుగా చెప్పాలి. చక్కటి ఉన్నత శ్రేణి బట్టలు ధరించాలి, మంచి కాడిలాక్ కారును నడపాలి, ఇంకా ఆ రీతిగా వుండాలి. అతడు మంచి కలయికగా వున్నాడు. దానిని అతడు చేయగలడు. మరియు అతడు అప్పుడప్పుడు, మాతో సరదాగా వుండుటకు కొంచెము మందు త్రాగుతాడు, అతడు ముసలి స్త్రీల కార్డు పార్టీలకు వస్తాడు. మరియు వారు కుట్టుచూ, నేస్తూ ఫలానా, ఫలానా మిస్ గురించి చెప్పుకొంటారు. వారు అలాటి మిశ్రమముగా ఉండవలసియున్నారు."

GEN 12:1•

ACTS 13:2•

REV 18:4

 

42దేవుడు చెప్పెను, "పౌలును, బర్నబాను నా కొరకు వేరు చేయుము!" ఆమేన్. వేరు చేయుట! ''మీరు వారి మధ్య నుండి బయటకు వచ్చి, వారి అపవిత్ర కార్యములలో పాలుపొంద వద్దు!" దేవునికి ప్రత్యేకింపబడుట కావాలి, పాపము పూర్తిగా ధ్వంసము కావాలి. ఈ దినమున వున్న చిక్కంతా అదే. అందుచేతనే మనము అబ్రాహాము సంతానముగా ఉండలేకపోవుచున్నాము. మనము క్రైస్తవ్యము అని పిలువబడే దాని నుండి, ఆచారముల నుండి, పద్ధతుల నుండి, ఇంకా అలాటి వాటి నుండి వాక్యమునకు వేరు చేసుకొనలేకపోవుచున్నాము. అవిశ్వాసము నుండి నిన్నునీవు వేరుపరచుకుని దేవుని వాక్యమును నమ్ముము. దేవుడు దానిని నీకు ప్రత్యక్షపర్చును. అవును.

ఆదికాండము 12లో దేవుడు, "నీ బంధువుల యొద్ద నుండియూ, నీ చుట్టూ వున్న సమస్తము నుండియూ నిన్నునీవు వేరు చేసికొనుము," అని చెప్పెను. ఓ, పేకాట నుండి మనలను మనము వేరుపరచుకోలేకపోవుచున్నాము.

43ఈ రోజు ఒక సోదరుడు వచ్చినప్పుడు, అతనితో నేను ఒక బోజన శాలకు వెళ్ళాను. ఒక బాధ్యత లేని కుర్రవాడు లోనికి రావడము నేను గమనించాను. నేను, నా భార్య, ఆహారము తీసికొనబోవుచున్నాము. "దేవునికి స్తోత్రము!" అని నేననుకున్నాను. ఎవరైనా లోనికి రాకముందే మనము త్వరపడుదాం. మరియు ఒక కుర్రాడు దూషించుకొంటూ లోనికి వచ్చాడు. ఆ కుర్రాడిని చీకటిలో చూచుటకు నేను భయపడితినిని. అతడు తన రికార్డును ప్రారంబించి, "బూగీ-ఊగీ" చెడ్డ పాటలు పాడుతున్నాడు. అతడు అటు వెళ్ళుచూ తన్ను తాను గుద్దుకొనుచూ ఉన్నాడు. "దేవా, కనికరము చూపుము" అన్నాను.

అందుకామె, "మీరు ఆ బిల్లును కట్టడానికి అక్కడికి వెళ్ళవద్దు, మీరు ఇక్కడే వుండండి. మీతో కూడా నన్ను రానివ్వండి," అని చెప్పినది. ఆమెకు భయము వేసినది.

44ఒక క్రైస్తవ దేశముగా మనము ఆలాటివాటిని కలిగి వుండడము, ఓ, ఎలాటి సంగతి! వేర్పాటును! ఆ గాయక సమూహంలో పాడే తొంబై శాతము మంది, ఎల్విస్ ప్రిస్లీ మరియు పాట్ బూన్, పిబడీ ఎర్ని, ఇంకా వీళ్ళందరినీ యుదా ఇస్కరియోతు కంటే చెడ్డవారని అక్కడ పిలుస్తాడు. యూదా '30' వెండి నాణములకు యేసుని అమ్మాడు; ఎల్విస్ అతనిని ఓడిపో చేశాడు, అతడు ఎన్నో కాడిలాకులు మరియు ఎంతో కీర్తిని సంపాదించాడు. మరియు ఈ చిన్న పిల్లలు దీనినంతా చూచి, "అతడు చాలా భక్తిగలవాడు," అంటారు. కాని అది దయ్యము! ఖచ్చితముగా! దేవుడు అలాంటి దానిని సహించడు. అది ఈ చివరి దినములలో అది గ్రుడ్డితనము.

వాక్యము యొద్దకు తిరిగి రండి, "ఆ భక్తిహీనపు వాటన్నింటి నుండి మిమ్ములను వేరుపరచుకొనండి, మరియు వారి యొక్క విషయాలను తాకవద్దు. నేను మిమ్ములను చేర్చుకొంటాను."

45సువార్తను మనము వట్టి చేతులతో పట్టుకొనవలసియన్నది! సంస్థాగతమైన చేతి తొడుగులతో కాదు, ఎవరినో వీపు మీద నిమురుతూ ఒకరిని జిల్లా అధికారిగానూ, లేక ప్రెస్బిటేరియన్ గానూ, బిషప్ గానూ, ఇంకొకరిని మరేదోగానూ చేయట అనగా గూటి నిండా మురిగిపోయిన గ్రుడ్లతో నింపడమే. ఒకరి నుండి ఒకరు గౌరవాన్ని పొందినప్పుడు, నీకు కీర్తి వున్నప్పుడు నీవు ఎలా విశ్వాసమును కలిగి యుందువు? మనము దేవుని వైపు చూస్తాము, ఆయన వైపు మాత్రమే! కీర్తి దేవుని యొద్ద నుండి వస్తుంది. ఆయనే దానికి ఆధారము, ఆయన వాక్యమును టార్చి లైటు వలె పట్టుకొని, స్త్రీ, పురుషుల వలె దేవుని ముందు నడుస్తూ మనము ఆయనను గౌరవించుదుము.

[టేపుపై ఖాలీ.] … నదిని దాటి ఆ భూ భాగములో ప్రవేశించాడు. దేవుడు అబ్రాహాముతో చెప్పెను, ఇప్పుడు దీనినంతటిని నీకు ఇస్తాను, కాని నీవు పూర్తిగా నాకు లోబడలేదు."

GEN 13:8,9

 

46మొట్ట మొదటి సంగతి మీరు గమనించండి. ఆదికాండము 13వ అధ్యాయములో అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు చిన్న తగాదా ఏర్పడినది (ఏమి జరిగింది?), అబ్రాహామును గమనించండి, సహోదర ప్రేమతో ఇలా అన్నాడు, "మన మధ్య ఏ విధమైన తగాదాలు వుండ కూడదు. మనము సహోదరులము." లోతు నులివెచ్చని సంఘమునకు ప్రాతినిధ్యం చూపుతున్నాడు. అబ్రాహాము ఇలా అన్నాడు, "చూడుము, ఎన్నిక నీదే, నీకు ఏది కావాలో వెళ్ళి దానిని తీసికొనుము. నీవు తూర్పు తట్టున వెళ్ళితే, నేను పడమరకు వెళ్ళుదును. లేక నీవు పడమర వైపుకు వెళితే, నేను తూర్పు తట్టుకు వెళ్ళుదును. నీవు ఉత్తరమునకు వెళ్ళితే, నేను దక్షిణమునకు వెళ్ళుదును. నీది నీవు ఎన్నుకొనుము." మరియు లోతు కన్నులు అప్పటికే ఐగుప్తు మీద పడినవి, తన కన్నులను పేరు ప్రతిష్టలు మీద నిలిపాడు, తన జేబులో కొంచెము డబ్బున్నది.

47అక్కడే సంఘము తన యొక్క తప్పు చేసినది. సహోదరులారా, నేను దీనిని గౌరవముగా చెప్పుచున్నాను. పెంతెకోస్తు సంఘము, ఈ పెద్ద పెద్ద దైవ పీఠముల వంటి శవముల గదులలో ఉండుట కంటే ఒక మూలన కంజరను పట్టుకుని, పాత కాలపు స్త్రీ, పురుషులతో, పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నిలుచుండిన బాగుంటుంది. వారు ఈ దినమున కడుపు కుళ్ళిపోయే ఆహారము క్రింద బ్రతుకుతున్నారు. అది నిజము. వారు తక్కినవారి వలె ప్రవర్తించ కోరుచున్నారు. మనము అక్కడికే దానిని పొందుకున్నాము. నీవు ఇదివరకు వున్న రీతిగా, దేవుడు నీతో ప్రారంభించిన రీతిగా నీవు ఎందుకు నిలచియుండవు? నీవు దేనిని గూర్చి వాదించావో, మరలా నీవు తిరిగి అదే కార్యము చేశావు.

లోతు అలాగే చేశాడు, మొదటి విషయమేమిటో మీకు తెలుసా, అతని కన్నులను ఐగుప్తు మీద నిలపి, ఐగుప్తు లోనికి వెళ్ళాడు. అప్పుడు పైకి చూచి, సుఖ భోగమైన సొదొమను చూచి దానిని తేలికగా తీసుకున్నాడు. ఆ రీతిగా అతడు తూర్పునకు ప్రయాణమైపోయాడు. గుర్తుంచుకొనండి, అబ్రాహాముతో పశ్చిమానికి వెళ్ళుటకు బదులుగా తూర్పునకు వెళ్ళాడు. అతడు తూర్పునకు వెళ్లి అక్కడ సుఖ భోగమైన మార్గమైయున్నదని చూచి, ఇంకనూ తూర్పుగా ప్రయాణము చేశాడు.

ZECH 14:7

 

48ఈ దినమున సంఘము ఆ రీతిగానే చేసినది, చూడండి, వారు వెనుకకు వెళ్ళారు. నేను నిన్న రాత్రి చెప్పినట్లుగా, సూర్యడు తూర్పున ఉదయించి పశ్చిమానికి వెళతాడు. దేవుని కుమారుడు మొదట తూర్పును దర్శించి, పశ్చిమానికి వెళతాడు. రెండు వేల సంవత్సరములుగా వారు అమ్ముడు పోయారు. "కాని అస్తమయ కాలమున వెలుగు కలుగునని," ఆ ప్రవక్త చెప్పెను. కుమారుని వెంబడించుటకు బదులుగా, వారు వెనుకకు కుమారుడుండిన చోటికి వెళ్ళారు, ఈ దినమున నీవు దైవిక స్వస్థత గురించి ప్రవచనమును గూర్చి, తొమ్మిది ఆత్మ వరములు లేక అలాటి వాటి గూర్చి మాట్లాడుట జరిగినప్పుడు; మనము వెనుకకు వెళ్ళి "మూడీ" ఏమి చెప్పాడో, "సాంకీ" ఏమి చెప్పాడో, "నాక్స్" ఏమి చెప్పాడో, "కాల్విన్" ఏమి చెప్పాడో చూద్దాం." కుమారుడు ప్రకాశించు చుండిన దినమున వారు జీవించారు; మనము పరిపూర్ణత వైపు వెళ్ళుచున్నాము!

49మూడు వందల సంవత్సరముల క్రితము ఒక ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు, గోళము చుట్టూ బంతిని దొర్లించి దానిని నిరూపించాడు. అతడు, "ఒక వ్యక్తి గంటకు 30 మైళ్ళ వేగము చొప్పున వెళ్ళగల్గితే, ఆకర్షణ శక్తి వారిని భూమి నుండి విడిచి పెడుతుందని" చెప్పుచు, శాస్త్రీయంగా దానిని రుజువు చేశాడు. సైన్సు దాని వైపు ఎన్నడునూ చూడలేదని మీరు ఉహించారా? లేదండి, వారు గంటకు 2000 మైళ్ళు వెళ్ళడం చూశారు. వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించుచున్నారు. వారు వెనుకకు తిరిగి దానిని చూచుట లేదు.

అయితే సేవకులారా, "మూడీ" ఏమి చెప్పాడో, "సాంకీ" ఏమి చెప్పాడో, అని మనము వెనక్కి చూస్తాము. కుమారుడు అప్పుడు అక్కడ వుండెను. ఇప్పుడు ఈ దినమున ఆయన ఎక్కడ వున్నాడు? సాయంకాలపు వేళలో ఇప్పుడు అది పశ్చిమ తీరమున వున్నది. హల్లేలూయ, సాయంకాలపు వెలుగులను ఇచ్చుచున్నది. మరలా వెనుకకు లూధరు యొక్క నీతీకరణమునకు, లేక వెస్లీ యొక్క శుద్దీకరణమునకు కాదు; కాని మనము చివరి దినమున ఉన్నాము, ఆమేన్, మనము చివరి దినములో వుండగా సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నది. కుమారుని వెంబడించండి.

కాని లోతు వెనుకకు వెళ్ళాడు. అవి సుఖభోగము గానూ, సుళువు గాను వుండుటయే దానికి కారణము. అక్కడకు వెళ్ళినప్పుడు శ్రీమతి. లోతును చూడండి. ఆ పట్టణములోని సమాజములకు ఆమె తప్పక రాణి అయి వుంటుంది. లోతు మేయరు అయ్యాడు. ఓ, సోదరుడా, నేను ఎందుకు చెప్పుచున్నానంటే వారు దానిని అలా చేసుకున్నారు.

ఆ రీతిగానే ఈ దినమున ప్రజలు శ్రీమతి. లోతును తీసుకొన్నారు. మన ప్రజలు ఆ దినమున ఎలా ప్రవర్తించుచున్నారో చూడండి. సంఘములలో వున్న ప్రజలను చూడండి. కేవలము దానిని చూడండి. ఈ దినమున వున్న స్త్రీలను చూడండి.

50లాస్-ఏంజలీస్ లోని హాలీవుడ్ లో ఈ మధ్య నేను వుంటుండగా, సహోదరుడు ఆర్గాన్ బ్రైట్ కొరకు నేను ఎదురు చూచుచుంటిని, అప్పుడు అక్కడకు ఒక అమ్మాయి వచ్చి నిలబడినది. నేను ఆమె వైపు చూచి తడబడినాను. నేను ఇలా అనుకున్నాను, "నేను ఒక మిషనరీనీగా అంటు రోగములను చూశాను, కుష్టుగల వారిని చూశాను, కాని ఇలాంటి దానిని నేను ఎన్నడునూ చూడలేదు." ఆమె మొదట స్త్రీ యైన యెజబెలు వలె నీటి పొంగుల వలె కత్తిరింపు జుట్టును కలిగియున్నది. మీరు దానిని ఏమని పిలుస్తారు. నీటి తల వలె కనబడుచున్నది. చూడండి, ఆమె చక్కగా కనబడుచున్న స్త్రీ వలె నీలముగా, పచ్చగా వున్నది, ఆ చెత్తనంతా తన మీద వేసుకుని, ఆఫ్రికన్ హాటెన్-టాట్ (ఒక జాతి) వలె కనబడుచున్నది. నేను నడుచుకుంటూ వెళ్ళి, ఆ స్త్రీ కొరకు ప్రార్ధించబోయాను. "ఓ స్త్రీ, నీవు ఏమిగా అనుకోకపోతే నేను రోగుల కొరకు ప్రార్ధిస్తాను. కాని ఇలాంటిది నేను ఎన్నడునూ చూడలేదు. అదేమిటో నాకు చెప్పండి," అని అడుగబోయాను. అప్పుడు మరొక స్త్రీ వచ్చి, అమెతో మాట్లాడుచున్నది, ఆమె కూడా అలాగే యున్నది. ఓ, మై!

ఓ, మిరంటారు, "అది ప్రెస్బిటేరియన్." పెంతెకోస్తు! నిజమే.

DEUT 22:5•

1COR 11:5

 

51మరియు బైబిలు, "స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకొనుట ఆమెకు అవమానము" అని చెప్పుచున్నది. ఆమె అది చేసినది. ఆమె తలను అవమానపరుచుచున్నది. వెలుగునిచ్చు దూతను ఆమె అవమానపరుచుచున్నది. ఏడవ సంఘ దూత, వెలుగును తెచ్చువాడై వాక్యముతో నిలచును. అవమానకరము! ఆమె తన తల మీద వెంట్రుకలను పెంచుకొనవలసియున్నది. ఓ, అలా చేయడం! అది వారికి పొరపాటు, మొదటి పెంతెకోస్తులో అది తప్పగా వుండినది. ఏమి జరిగింది? మీ బాగా పరుగెత్తారుగా, మరి ఏమి జరిగింది?

మన పెంతెకోస్తులోని స్త్రీలలో కొందరు శరీరము కనబడునట్లు ఉల్లి పొరలాంటి బట్టలు ధరించుచున్నారు. అది నిజము. తమాషాగా నేను దానిని చెప్పుట లేదు. ఇది తమాషాగా చెప్పే స్థలము కాదు. ఇది బలిపీఠమైయున్నది.

కొందరు స్త్రీలు ఒక రాత్రి నాతో ఇలా చెప్పారు, వారు ఎలాటి బట్టలు ధరించుచున్నారో వారికి చెప్పాను. ఆమె అలా అన్నది, "నేను పొట్టి బట్టలు ధరించను, కాని వదులైన ప్యాంటు లాంటి బట్టలు ధరిస్తాను."

నేనన్నాను, "అది అన్నిటి కంటేను చెడ్డది. దేవుడన్నాడు, పురుషుని దుస్తులు ధరించిన ఒక స్త్రీ దేవుని దృష్టిలో హేయమైనది." అది నిజము.

ఓ స్త్రీ, ఓ యవ్వన స్త్రీ, నన్ను మీకు ఒక విషయము చెప్పనివ్వండి, అలా బట్టలు ధరించుకొను నీవు, వ్యభిచరించినందుకు తీర్పు దినమున నీవు జవాబును ఇవ్వవలసియున్నది.

నీవంటావు, "నేను లిల్లీ పుష్పమంత పవిత్రంగా వున్నాను."

MATT 5:22,28•

1JN 3:15

 

52అవును, కాని యేసు అన్నాడు, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును." నీవు ఆ కార్యములను చేయనక్కర లేదు. "కారణము లేకుండా తన సహూదరుని మీద కోపడు ప్రతివాడు, అతనిని ముందుగానే చంపినవాడు అగును." చూడూ, నీవు చేసే పని అది మాత్రమే. ఆ పాపి నీవు ధరించిన బట్టలు చూచి, నీవు నడుము త్రిప్పుకుంటూ, ముందుకు వెనుకకు ఉగులాడు వస్త్రములు. వినండి, అది తమాషా కాదు! ఇది సువార్త, నీవు దానిని చేయునప్పుడు, ఎవరో పాపి నిన్ను చూసి మోహించును. తీర్పు దినమున అతడు వ్యభిచరించినందుకు జవాబు చెప్పాలి; దానికి కారణము ఎవరు? నీవే చేశావు. నీవు దానికి జవాబు చెప్పాలి, ఏలయనగా ఆ రీతిగా నిన్ను నీవు కనపర్చుకున్నావు.

53ఎందుకు, మీరు చెప్పుదురు, "వారు ఆ బట్టలు తప్ప మరే బట్టలు తయారు చేయుట లేదు." వారు కుట్టు మిషన్లు తయారు చేసి ఇంకనూ బట్టలు అమ్ముచున్నారు. అది ఎంత మాత్రము మన్నించదగినది కాదు! దానికి కారణము నీవు వాక్యము నుండి ప్రక్కకు వెళ్ళిపోయావు! అది జన సమ్మతమైనది కాదు. అది కఠినమైనది.

నిన్నటి దినమున పేరు గాంచిన బోధకుడు వచ్చి నా మీద చేతులుంచి ఇలా అన్నాడు, "నేను నీ మీద చేతులుంచి దుష్టుని వెళ్ళగొట్టుదును."

నేనన్నాను, "ఏమిటి?"

"స్త్రీలను ఆ రీతిగా మాట్లాడుట గురించి," అన్నాడు, "ప్రజలు నిన్ను ప్రవక్తగా పరిగణించుచున్నారు."

నేనన్నాను, "నేను ప్రవక్తను కాదు."

అతడున్నాడు, "సహోదరుడా బ్రెన్హాం, వారు నిన్ను ఆ రీతిగా పరిగణించుచున్నారు." "ఆ స్త్రీలకు గొప్ప ఆత్మీయ దీవెనలు ఎలా పొందుకోవాలో నీవు ఆ ప్రజలకు బోధించవలసి యున్నావు. కాని వారి జట్టు కత్తిరింపులు గురించి, ఇంకా అలాటి సంగతులు గూర్చి ప్రతిసారి చెప్పుచున్నావు. దానిని వారు వినరు."

అందుకు నేను, "అది నాకు తెలియును" అన్నాను.

అతడన్నాడు, "వారికి గొప్ప సంగతులు గూర్చి ఎందుకు బోధించవు?"

నేనన్నాను, "వారికి అ, ఆ లే రానప్పుడు, కనీసం సభ్యత ఏమిటో తెలియనప్పుడు, నేను వారికి బీజగణితం ఎలా నేర్పగలను?"

54మరియు స్త్రీలను ఆ రీతిగా ప్రవర్తించుటకు అనుమతించుచున్న పురుషులారా, అబ్రాహాము సంతానముగా, క్రైస్తవులుగా మీ పట్ల నాకు కొంత గౌరవము వున్నది. ఆమేన్! నేను దానిని అలాగే విడచి, మీ అందరిని లేపి, ఇంటికి పంపడం మంచిది. ఈ దినములలో ఒక దినమున నీవు ఏదో తప్పిపోయినట్లు అక్కడ దానిని కనుగొనబోవుచున్నావు.

నీవంటావు, "అది ఏమి తేడా చేయదు." అది పౌలునకు తేడా కలిగించినది. దేవునికి ఏదేను తోటలో తేడా కలిగించినది. స్త్రీ పొడవైన వెంట్రుకలను కలిగియుండాలని బైబిలు చెప్పుచున్నది. అది లేకుండా, నీవు ఎక్కడున్నావు? మంచిది, నీవు చెప్పవచ్చు, "అది ఏమి తేడా కలిగించదు." అది తేడాగా వున్నదని బైబిలు చెప్పుచున్నది. "అది పరవాలేదని అది అధునాతనమైనదని, సాతనుని నీతో తర్కించి అలా చెప్పనియ్య వద్దు. అది మంచిది కాదు. నీవంటావు, "ఇదివరకు నాకు తెలియదని." నీవు ఇప్పుడు తెలుసుకో. అది నిజమని పరిశీలించి తెలుసుకొనుము. మంచిది, దానిని మికే విడిచి పెట్టుచున్నాను.

55ఆదికాండము 13, అధునాతనమైన, ఉ-ఉహు; వెనుకకు వెళ్ళి కుమారుడు ఎక్కడ ఉండేనో కనుగొనుము; కుమారుడు ఎక్కడ ఉన్నడో కాదు; కుమారుడు ఎక్కడ వుండెనో అన్నది: భార్య… నేను ఉహించగలను, లోతు భార్య, ఆమె ఎలా సమాజం లోనికి వెళ్ళినదో!

ఆ రీతిగానే మనమును సమాజములోనికి వెళ్ళినాము. అదే రీతిగా పెంతెకోస్తువారమైన మనము దానిలోనికి వెళ్ళాము. మనము మారాము, ఒక చిన్న సంస్థను మనము ఇక్కడ చేశాము, మరియు ఒక చిన్న… దానికి వ్యతిరేకముగా మరొకటి, ఒక దానికి వ్యతిరేకముగా మరొకటి, నీవు దేనిలోదైనా తీసుకొంటావు. అది అక్షరాలా సత్యము.

1SAM 8:19•

1SAM 12:3,4

 

56ఇశ్రాయేలీయులు సౌలును వారికి రాజు కావాలన్నప్పుడు, సమూయేలు ఏమి చెప్పాడు? సమూయేలు వారి యొద్దకు వచ్చి అన్నాడు, "నేను నా జీవనానికి ఎప్పుడైనా మీ డబ్బు తీసుకొన్నానా? నేను ఎప్పుడైన యెహోవా నామములో ఏదైనా చెప్పినప్పుడు, అది జరుగకుండా వున్నదా?"

ఓ, వారన్నారు, "నిశ్చయముగా, నీవు దేవుని ప్రవక్తవు. నీవు మాకు సత్యము చెప్పావు మరియు నీవు చెప్పినది జరిగినది, కాని ఎలాగైనా మాకు రాజు కావాలి."

నీవు ఎప్పుడు ప్రారంభించినా ప్రామాణికములను క్రిందికి వెళ్ళి పోనిచ్చుచున్నావు. మరియు ఇది కావటం, అది కావటం మరియు ప్రతిది ఆ రీతిగా రావటం, నీవు అధునాతనముగా వెళ్ళటం, మరియు సంఘము ఈ దినమున లోకములోని వారి వలె సరిగ్గా వున్నది. మనకు కావలసినది ఏమనగా పెంతెకోస్తు అనుభవంతో ఇంటిని శుభ్రము చేయడం. అది ఖచ్చితంగా నిజము. ఆమేన్. దానిని ఒక బాప్టిస్టు మాకు చెప్పడం అవమానం, కాదా? కాని అది సత్యము. అవును! నేను బైబిలును నమ్ముచున్నాను, దేవుని వాక్యము నిజమనే నమ్ముచున్నాను. మంచిది.

GEN 13:14

 

57అబ్రాహాము… 13వ అధ్యాయము, 14వ వచనము. లోతు వేరైన తరువాత అబ్రాహాము దేవునికి పూర్తిగా విధేయుడయ్యాడు, అప్పుడు దేవుడు అతని దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఆయన అబ్రాహామును దీవించుటకు సిద్ధముగా నున్నాడు.

మరియు పెంతెకోస్తు సంఘము దాని ఆచారములు, సిద్ధాంతములు మరియు లోకస్థుల వలె ప్రవర్తించడం, లోకస్థుల వలె కనబడుట, లోకస్థుల వలె మాట్లాడుట మరియు బుధవారం రాత్రి ప్రార్థనా కూటము మానివేసి "మేము సుసీని ప్రేమించుచున్నాము," అనే ప్రోగ్రాం టీ.విలో చూడటం, ఇంకా ఇలాంటి వాటన్నిటి నుండి వేరుకానంత వరకు; మీ దశమ-భాగాలను రేడియో ప్రోగాంలో మాట్లాడే బోధకులకు చెల్లించడము, వారు నీవు దేనికొరకు నిలబడుచున్నావో, దానిని గూర్చే వారు ఎగతాళి చేయడం, అది నిజము, ఈ రకపు చెత్తంతా పెంతెకోస్తు పేరున కొనసాగడం, అది అవమానము!

58అంతర్జాతీయంగా క్రిస్టియన్ బిజినెస్ మెన్ తో నేను మాట్లాడుదును. వారిలో అనేకమంది ఇప్పుడు ఇక్కడ కూర్చునియున్నారు. ఒక సంవత్సరం క్రితం నేను జమైకాలో వున్నప్పుడు ఒక రాత్రి జరిగిన సంగతి. ఆ రాత్రి ఆ ద్వీపముల నుండి వచ్చిన ప్రసిద్ధిగాంచిన వారందరూ అక్కడ వున్నారు, ఈ మనుషులు లేచి, దేవునికి మహిమ, నేను ఒక మూలన చిన్న వ్యాపారస్థుడుగా వున్నాను. హల్లెలూయా, నాకు నాలుగు కాడిలాక్స్ కార్లు వున్నవి, "దేవునికి మహిమ" అని చెప్పుచుండిరి.

మరియు ఆ రాత్రి నేను ప్లేమింగో మోటెల్ కు తిరిగి వెళ్ళి, అక్కడ నిలబడి, "మిమ్మను గూర్తి నేను సిగ్గుపడుచున్నాను!" అని చెప్పాను. "మీరు క్రీస్తునకు ప్రాతినిధ్యం వహిస్తూ, వ్యాపారస్థుడుగా నీకెంత వున్నదో, నీ కంటే అతనికి ఎక్కువ వున్నది, నాకు ఎల్లప్పుడు ఎక్కువ వుంటుందని చెప్పుటకు ప్రయత్నించుచున్నారు." ఆ మొదటి పెంతెకోస్తు వారికి మీకు ఎంతో తేడా వుంది. మొదటి పెంతెకోస్తు వారు వారికి కలిగిన దానిని అమ్మి, పేద వారి మధ్య దానిని పంచి పెట్టి, వెళ్ళి సువార్తను ప్రకటించారు. అది నిజము!

ACTS 4:34,35

 

59చికాగో నుండి వచ్చిన ఒక చిన్న స్వీడిష్ గాయకుడు, అతని పేరు నేను మరచిపోయను. అతడు నాకు ప్రశస్తమైన సోదరుడు. అతడు నిలబడి ఇలా అన్నాడు, "సహోదరుడా బ్రెన్హాం, మీరు ఒక ప్రవక్త అని మేము నమ్ముచున్నాము, కాని నేను ఇప్పుడే చెప్పుచున్నాను, మీరు పొరపాటు చేయుచున్నారు."

నేనన్నాను, "సోదరుడా, ఎక్కడో చెప్పు."

అతడన్నాడు, "మంచిది, ఆ ప్రజలు తమకు కలిగిన సమస్తమును అమ్మి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టి, దానిని పంచిపెట్టిరి. అది వారు చేసిన చెడ్డ పని."

నేనన్నాను, "పరిశుద్ధాత్మడు తప్పు చేశాడని మీరు నాకు చెప్పుచున్నారా?"

అతడన్నాడు, "అది పొరపాటు, నేను దానిని నీకు రుజవు చేస్తాను."

నేనన్నాను, "ఎందుకు?"

అన్నాడు, "హింస అధికమైనప్పుడు, వారికి తలదాచుకొనుటకు స్థలము లేదు, వారు ప్రతిచోటుకి తిరుగులాడారు."

"దేవుని చిత్తములో ఖచ్చితంగా, వారు వెళ్ళు ప్రతి స్థలములో సువార్తను ప్రకటించారు. వారు మరలా తిరిగి వచ్చుటకు వారికి స్థలము లేదు." దేవుడు తప్పు చేయడు. అవును! ఓ, అది ఎంత తేడాగా వున్నది; అది అప్పటి పెంతెకోస్తు, మరియు ఇప్పటి పెంతెకోస్తు. అవును, అదే తేడా.

GEN 13:14,15•

JOHN 5:24•

JOHN 15:7

 

60అబ్రాహాము, లోతు నుండి తన్ను తాను వేరు చేసుకొనిన తరువాత, ఖచ్చితంగా దేవుడు అతనిని ఏమి చేయమన్నాడో అదే. "సుళువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి వేరు కమ్ము; ప్రతిది బయటకు తీసి వేయుము!" అక్కడ అప్పుడు దేవుడు చెప్పెను, "అబ్రాహాము ఇప్పుడు నీవు అన్నింటికినీ వారసుడవు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముల వైపు చూడు, ఆ భూమి గుండా నడువుము, అదంతా నీదే!" ఆమేన్.

పాపము నుండి, అవిశ్వాసము నుండి నిన్నునీవు వేరు చేసుకొనుము. ఒకే పాపమున్నది, మరియు అదే అవిశ్వాసము. వ్యభిచరించుట, త్రాగుట, అబద్దములు చెప్పుట పాపము కాదు. అవి అవిశ్వాసము యొక్క గుణలక్షణములు. నీవు నమ్మినట్లయితే, నీవు ఆ పనులు చేయవు. నిశ్చయంగా, యోహాను 5:24 లో యేసు చెప్పెను, "నా మాటలు విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు." ఆ "జో" (Zoe) పరిశుద్ధాత్మ, ఏలయనగా అతడు విశ్వసించియున్నాడు. సత్యముగా. ఇప్పుడు, నీవు దానిని అంగీకరించనంత వరకు నీవు నటించే విశ్వాసుల గుంపులో వుంటావు. కాని వారు యధార్ధముగా నమ్మినప్పుడు, నిన్నునీవు పూర్తిగా అవిశ్వాసము నుండి వేరు చేసుకుని దేవుని నమ్ముదువు. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, యదార్ధముగా ప్రతి దానిని చేయుచూ ఖచ్చితముగా నడుచుకొందువు. అప్పుడు దేవుడంటాడు, "ఈ గ్రంధములోని ప్రతి వాగ్దానము నీదే." అమేన్. "అంతా నీదై యున్నది! ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు త్రిప్పుము, ఇదంతా నీదగును!" ఆమేన్. "మీరు నా యందును, నా మాటలు మియందును నిలచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడది మీకు దొరుకును." ఎందుకు? ముందు అవిశ్వాసము నుండి నిన్నునీవు వేరు చేసుకొనవలసియున్నది.

LUKE 17:26•

1PET 3:20

 

61నీవంటావు, "సహోదరుడా బ్రెన్హాం, మీరు దానిని భయంకరముగా ముగించుచున్నారు."

యేసు చెప్పెను, "నోవహు దినములలో ఎనిమిది మంది రక్షణ పొందిరి. నోవహు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములలో జరుగును."

"అది ఎంతమంది, సహోదరుడా బ్రెన్హాం?" అది ఎనిమిది వేలు కావచ్చు, ఎనబై లక్షలు కావచ్చు, అది ఎంతో నాకు తెలియదు. కాని అది అల్ప సంఖ్యగా వుంటుంది. వంద, వేలలో నుండి ఒక్కడు, లేక ఆ రీతిగా వుండవచ్చు అనుకొంటాను. మంచిది.

MATT 10:20

 

62తిరిగి-జన్మించిన అనుభవం లేకుండా, ఏదో మానసిక విశ్వాసము లేక సంఘ గురువు నేర్చిన విశ్వాసము! అక్కడ నిజమైన, సరియైన పరిశుద్ధాత్మ వున్నట్లయితే, అది ఆ వాక్యమునకు సరి అని చెబుతుంది, మరియు అది ఎలా వుండెనని చెప్పబడెనో, ఖచ్చితంగా ఆ రీతిగానే ఆ వాక్యము జీవిస్తుంది, ఏలయనగా అదే ఆత్మ దానిని మాట్లాడెను. నీ ద్వారా అది మాట్లాడుచున్నది. అది జీవించ వలసియున్నది. నిశ్చయముగా, అది జీవించును. మాట్లాడునది నీవు కాదు, కాని నీలో నివసించు తండ్రి. మాట్లాడునది ఆయనే. మంచిది.

63"అబ్రాహాము అన్నింటికి వారసుడు."

మీ వలె నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఒక పెద్ద ఆర్కేడ్ వలె కోట్లతో నిండిన బిల్డింగులో నేను నడువగోరుదును. అక్కడున్న సమస్తమునూ నాకు చెందును. దానిలోని ప్రతి అంగుళమునకు నేను వారసుడను. అలాంటి ఆర్కేడ్నకు వారసుడును అయినప్పుడు, నేను ఏమి కలిగియున్నానో నేను తెలుసుకొన గోరుచున్నాను. నేను క్రైస్తవుడను అయినప్పుడు నేను ఏమి కలిగియున్నానో దానిని తెలుసుకొనవలసి యున్నాను. కాబట్టి నాకు ఆర్కేడ్ వున్నప్పుడు నేను దాని గుండా నడుస్తూ, ఒక చెక్క బల్ల యొక్క అరను లాగి దానిలో ఏముందో చూస్తాను, ఇక్కడ, అక్కడ దానిలో ఏముందో చూస్తాను మరియు ఏదైనా కొంచెం ఎత్తుగా వున్నప్పుడు, నిచ్చెన తెప్పించి దాని దగ్గరకు ఎక్కుదును. అది ఏమైయున్నదో నేను తెలుసుకుంటాను. ఏదైననూ అక్కడ నాకు అందకుండా వున్నచో, నేను నా మోకాళ్ళ మీద నిలబడి దాని ఎత్తుకు పైకి లేచు వరకు నేను ప్రార్థనను చేయుదును. అది నాకు చెందినది! దేవుడు దానిని వాగ్దానము చేసెను. దైవిక స్వస్థత, దేవుని శక్తి, ఈ అద్భుతములు మహత్కార్యములు, సూచక క్రియలన్నింటిని, ఆశ్చర్య కార్యములను, ఆయన వాగ్దానము చేసెను.

"సహోదరుడా బ్రెన్హాం, ఈ కార్యములు ఎలా జరుగును?" చెప్పండి. దేవుని వాగ్దానము ద్వారా. ఆమేన్.

అబ్రాహాము సంతానము! దేవునికి మహిమ! నాకు చాలా బాగునది. నేను పిచ్చివాడిలా కనబడవచ్చు మరియు పిచ్చివాడిగా ప్రవర్తించవచ్చు, అయితే నన్ను ఒంటరిగా వుండనివ్వండి. ఆ రీతిగా వుండుట కంటే ఈ రీతిగా వుండుట నాకు ఇష్టము, చూశారా.

GEN 13:15•

MATT 4:7-9•

MATT 5:5•

LUKE 4:8

 

64ఆదికాండము 14వ అధ్యాయములో మనము అబ్రాహాము దగ్గరకు వెళ్ళి ఏమి జరిగినదో చూద్దాం. దేశములోని వేరు వేరు భాగముల నుండి రాజాలు వచ్చి, సొదొమ రాజులతో, ఏకమై సొదొమలోనికి వెళ్ళి, లోతును పట్టుకొన్నారు. అబ్రాహాము వారితో వెళ్ళి, నులివెచ్చని సంఘ శాఖ సోదరుడైన, ప్రభువులో తనకు సోదరుడైన లోతును విడిపించి బయటకు తెచ్చెను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, దేవుడు అబ్రాహాముతో ఆ భూభాగములో వున్న సమస్తము నీదే అని అప్పుడే చెప్పెను.

"సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు." మనము పిచ్చివారందురా? భూమిని స్వతంత్రించుకోబోతున్నారు, భూమి మీద ఏమున్నది! నిజముగా, దానికి మనము వారసులము అగుదుము.

సాతానుని చూడండి, యేసుతో ఇలా అన్నది, "నీవు సాగిలపడి నాకు నమస్కరిస్తే ఈ లోకమును నేను నీకిస్తాను." రాజ్యములన్నీ, ప్రతీ రాజ్యము సాతాను చేత నడుపబడుచున్నది. యేసు ఆ రీతిగా చెప్పాడు. బైబిలు దానిని చెప్పుచున్నది. ప్రతి దేశము, ప్రతి రాజ్యము సాతాను చేత పాలన చేయబడుచున్నది. మరియు సాతానన్నది, "నేను వీటిని కలిగియున్నాను, ఇవన్నీ నావి, నీవు నాకు నమస్కరిస్తే వాటిని నీకిస్తాను."

వెయ్యేండ్లపాలనలో ఆయన వాటికి వారసుడు అవుతాడని యేసుకు తెలియును, కాబట్టి ఆయన చెప్పెను, "సాతానా, నా వెనుకకు పొమ్ము." ఆయన దానికి వారసుడని ఆయనకు తెలియును.

65ఈ దినమున వారు పిచ్చివారు దేవుని ఆరాధించుట మరియు తిరిగి జన్మించిన వారి గురించి మాట్లాడుచున్నారు. తిరిగి జన్మించుట, అనుదాని గురించి వారు భయపడుచున్నారు. ఆ ఆలోచనే వారికి నచ్చదు, దానికి ప్రత్యామ్నాయంగా మరొక దానిని తీసుకున్నారు. ఒకరు కరచాలనము చేయడాన్ని ప్రత్యామ్నయంగా తీసుకున్నారు. మరొకరు కొంచెము నీళ్ళ చిలకరించడం, మరొకరు నాలుకను బయటకు చాపి - రొట్టె ముక్కను తీసుకోవడము, మరొకరు నేల మీద చుట్టూ నాట్యం చేయడము. అది వారికి జన్మించుటయైయున్నది! నిన్న రాత్రి నేను చెప్పినట్లుగా, "పుట్టుక ఒక గందరగోళము, అది ఎక్కడైనప్పటికి నాకు లెక్కలేదు. అది పందుల దొడ్డిలోనైనా, హాస్పటల్ గదిలోనైనా, అది పుట్టుక, అది ఒక గందరగోళము." అలాగే నూతన జన్మ కూడా అంతే, అది నిన్ను చీల్చివేస్తుంది, కాని ఆ గందరగోళము నుండి నూతన జీవము వస్తుంది. ఆమేన్. అవును.

GEN 14:12,14-16

 

66సమస్తము తనకే చెందునని అబ్రాహాముకు తెలుసు, కాబట్టి లోతు లోనికి వచ్చినప్పుడు అతడు అన్నాడు, "ఇప్పుడు ఒక నిమిషము అగుము." లోతు క్రూరమైన శత్రువు యొక్క హస్తము ద్వారా చెరపట్టబడినాడు. అతడన్నాడు, "అతడు నా సోదరుడు, నేను అతని కొరకు వెళతాను." ఇప్పుడు, గుర్తుంచుకొనండి, దరిదాపు 7 లేక 8 మంది రాజులు కలసి లోనికి వచ్చి సమస్తమును తీసుకొనిపోయారు. వారు వెళ్ళిపోయిన తరువాత, అబ్రాహాము తన దాసులను తీసుకుని, వారిని తరిమి, తప్పిపోయిన తన సోదరుడిని వెనుకకు తెచ్చాడు. అతడు నిజమైన క్రైస్తవుడు, తప్పిపోయిన తన సోదరుని కొరకు వెళ్ళాడు! అతనిని కనుగొన్నప్పుడు అతడు ఏమి చేశాడు? అతడు రాజలను సంహరించాడు; యుద్ధము తరువాత తన సోదరుని తిరిగి తెచ్చాడు.

GEN 14:18•

MATT 26:29•

MARK 14:25•

LUKE 22:18

 

67చూడండి, అక్కడ మరొక రాజు అబ్రాహామును కలుసుకొనుటకు వచ్చాడు. మెల్కీసెదెకు. మెల్కీసెదెకు, ఆయన ఏమై యున్నాడు. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణము లేదు. అతడు తండ్రి లేక, తల్లి లేక, వంశావళి లేనివాడునూ, జీవితకాలమునకు ఆదియైననూ, జీవమునకు అంతమైననూ లేనివాడునై యుండి, (దేవుని కుమారుడు కాడు; ఎందుకనగా ఆయనకు తల్లి, తండ్రి వున్నందు వలన ఆయన పుట్టి, చనిపోయి తిరిగి లేచాడు.) కాని ఈ మనిషికి తల్లి మరియు తండ్రి లేరు, ఆయన దేవుడు! నిశ్చయముగా, అది మాత్రమే నిత్యమైనది.

యుద్ధము అయిపోయిన తరువాత ఆయన అబ్రాహామును కలుసుకుని, అబ్రాహాము సంతానమునకు దానిని చూపుచూ, మన పడిపోయిన మన సోదరుని కొరకు మనము వెళ్ళిన తరువాత మరియు యుద్ధము అయిపోయినది. మెల్కీసెదెకు ఇచ్చినదేమిటి? ద్రాక్షరసము మరియు రొట్టె, సహవాసము. ఆమేన్. యుద్ధము అయిపోయిన తరువాత తన తప్పిపోయిన సోదరుని మరలా యింటికి తిరిగి తెచ్చి పునరుద్ధరించుచున్నాడు. మరియు యుద్ధము అయిపోయిన తరువాత, మెల్కీసెదకు ఆయనను కలుసుకుని సహవాసమును ఇచ్చెను. యేసు "మరలా నా తండ్రి రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగువరకు ఇకను దానిని త్రాగనని," చెప్పెను. అవునండి. ఇప్పుడు యుద్ధము అయిపోయింది, అబ్రాహాము వెనుకకు త్రిరిగి వచ్చాడు, 14వ అధ్యాయములో; అతడు జయశీలిగా తిరిగి వస్తున్నప్పుడు ఆయనను జయశీలుడు కలిసెను.

GEN 15:2,4,8

 

68ఇప్పుడు మనము ముగించక ముందు, ఆదికాండము 15వ అధ్యాయము, ఎందుకనగా ఇది ఇప్పుడు ముగించే సమయం. మనము వెళ్ళక ముందు ఇంకొక్క విషయమును విందాము.

మరలా రేపు రాత్రికి దీనిని నేను తీసికొనవలసియున్నది, ఎందుకనగా నేను ఇంకనూ నా అంశములోనికి రాలేదు. నా స్థానమునకు అనగా "యెహోవా-యీరే" అను దానికి రాలేదు. ప్రభువు చిత్తమైన దానిని అక్కడకు నేను తీసుకొని రావాలి.

ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయములో, అబ్రాహాముతో ఒక నిబంధన స్థిరపరచబడినది, నిబంధన స్థిరపరచబడుట. మరొక మాటలో దేవుడు ప్రమాణము చేసినప్పుడు, ఆ వాగ్దానమును అబ్రాహాముకు స్థిరపరచెను. 15వ అధ్యాయములో దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచడం మనం చూస్తాము.

అబ్రాహాము దేవునితో చెప్పెను, "దమస్కు ఎలీయెజెరే నా యింటి ఆస్తికర్త యగును గదా," అనెను.

మరియు ఆయన అబ్రాహాముతో "ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను." ఆయన అతనికి వాగ్దానము చేశాడు.

అందుకతడు, "ఇది నాకు ఎట్లు తెలియును?" అనెను.

GEN 15:9

 

69ఓ, ఇప్పుడు, సోదరులారా, ఇక్కడ మిమ్మును మేల్కొలుపునది ఒకటి వున్నది! అతనిని గమనించండి. ఆయన, "మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును నా యొద్దకు తెమ్ము," అనెను. అబ్రాహాము వాటిని తీసుకుని వెళ్ళాడు, మరియు తెల్ల గువ్వను, పావురపు పిల్లను తీసికొని వచ్చెను.

ఇక్కడ పావరపు పిల్లకు, తెల్ల గువ్వకు ప్రాతినిధ్యం వున్నది. మరియు మూడు సంవత్సరముల జంతువులు మూడు. ఇక్కడ ఆయన నిబంధనను స్థిరపరచబోవుచున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దీనిని పోగొట్టుకోవద్దు. తరువాత ప్రభువు చిత్తమైతే, రేపు రాత్రికి ఆయన అతడిని కలుసుకున్నప్పటి సంగతి తీసుకెందాం. గమనించండి.

ఆయన ఇలా చెప్పెను, "మూడేండ్ల పెయ్య, మూడు సంవత్సరముల ఆడు మేక, మూడు సంవత్సరముల పొట్టిలు, పావురపు పిల్ల, మరియు తెల్ల గువ్వ."

అబ్రాహాము వెళ్ళి మరియు జంతువులను తెచ్చి, వాటిని నడుముకు ఖండించి, దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా వుంచెను. తెల్ల గువ్వను, పావురపు పిల్లను అతడు ఖండించ లేదు. తెల్ల గువ్వ మరియు పావురపు పిల్ల ఒకే కుటుంబము. కాబట్టి అది దైవిక స్వస్థతకు ప్రాతినిధ్యముగా వున్నది, అది రెండు నిబంధనలలోనూ విశ్వాసము ద్వారా ఉన్నది, చూశారా, అవి స్వస్టపడినవి; ఒకటి మరొక దానికి. పాత నిబంధన దైవిక స్వస్థతను కలిగియున్నట్లయితే, దీనిలో మరి ఎంత ఎక్కువగా వున్నది! చూడండి, ఆ పాత అర్పణ స్వస్థతను కలిగియున్నప్పుడు, మరి శ్రేష్టమైన దీని సంగతి ఏమిటి! చూశారా?

GEN 15:10•

HEB 13:8

 

70ఇప్పుడు, ఆయన ఇక్కడ ఏమి చేశాడో గమనించండి. అతడు ఆ మూడు జంతువులను తీసుకుని, వాటిని నడుముకు ఖండించి, దేని ఖండమును దానికి ఎదురుగా వుంచెను. తరువాత అబ్రాహాము వెనుకకు తిరిగెను. అది బలి అర్పణ సమయమైయుండెను, మరియు అతడు సూర్యడు అస్తమించువరకు కనిపెట్టియుండెను. అబ్రాహాము బలి అర్పణ మీదికి ఆకాశము నుండి గ్రద్దలు దిగి వఛెను. అబ్రాహాము వాటిని తరిమివేసెను, దూరముగా తరిమి వేసెను.

ఇది దేనికి మాదిరియైయున్నది? చివరి దినమున అబ్రహాము సంతానము దయ్యములను, బలి అర్పణ మీది నుండి తరిమి వేయడం. దేవుడు దానిని వాగ్దానము చేశాడు, బలి అర్పణ, క్రీస్తు - నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడు, మరియు ఈ అవిశ్వాసపు ఆత్మలు అన్నీ, దానిని మ్రింగి వేయుటకు ప్రయత్నించుచున్నవి. దైవజనుడు, అబ్రహాము సంతానము, అక్కడ నిలువబడి దాని మీద నుండి దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు! ఇప్పుడు నిబంధనను స్థిరపరుస్తూ, రాజ సంతానమైన అబ్రాహాము సంతానమునకు చూపుచున్నాడు. గుర్తుంచుకొనండి, సహజ సంబంధమైన సంతానము కృపా వాక్యమునకు బదులుగా ధర్మశాస్త్రమును అంగీకరించి తప్పిపోయినది. ఈ చివరి దినమున అన్య జనాంగములతో "అల్లరి మూకను గురించి" అది ఆలాగే వున్నది. కాని వాక్యముతో అక్కడ నమ్మకముగా రాజ సంతానమున్నది. దయ్యములను వెళ్ళగొట్టుచున్నది, గొప్ప అద్భుతములు, సూచక క్రియలు చేయుచూ, వాక్యము నుండి అవిశ్వాసమును పారద్రోలుతూ, వాక్యమును శుద్ధము చేయుచూ, వాక్యమును పవిత్రముగానూ, గౌరవముగానూ ఉంచుచున్నది. దానికి ఏదీ కలుపుట లేదు, దాని నుండి ఏదీ తీసివేయుట లేదు; దానిని ఎత్తి పట్టుకుని, కాపలాగా దానికి నిలబడి, దానిని ఏదీ ముట్టకుండా చూచుచున్నది.

GEN 15:12,17

 

71ఇప్పుడు గమనించండి, అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. అది మరణమైయున్నది. గాఢ నిద్ర తరువాత అతడు కొలిమి వంటి అగ్నిని చూచెను, అది నరకాగ్నియై యున్నది, పొగలేస్తున్నది, ప్రతి పాపి అక్కడకు వెళ్ళవలసి యున్నది. కాని దానికి ముందు చిన్న తెల్లని వెలుగు వెళ్ళినది. ఈ బలి అర్పణలను వేరు చేస్తూ వాటి మధ్య గుండా వెళ్ళిన ఆ తెల్లని వెలుగును గమనించండి. వాటి మధ్య గుండా వెళ్ళినది. దేవుడు అబ్రాహాము సంతానము ద్వారా ఏమి చేయబోవుచున్నాడో దానిని దేవుడు స్థిరపరచుచున్నాడు.

యూదులు ఎల్లప్పుడు దేవుడు ఒక్కడేనని నమ్ముతారు. మరియు దేవుడు ఒక్కడే. ఈ పరిశుద్ధమైన మూడు బలి అర్పణల ద్వారా ఒకే దేవుని మూడు ప్రత్యక్షతలు శరీరములో ఉన్న ఒక్క దేవత్వము ప్రాతినిధ్యము వహించుచున్నది.

72ఇప్పుడు గమనించండి, పూర్వపు దినములలో తూర్పు నాగరికత దినములలో, ఒక నిబంధన చేసినప్పుడు వారు ఈ విధముగా చేయుదురు. మనము జంతువును చంపి, దానిని రెండుగా విభజించి, దాని మధ్య నిలబడి అక్కడ నిబంధనను వ్రాస్తాము. ఇప్పుడు చైనాలో…

జపాను దేశములో వారు నిబంధన చేసినప్పుడు, వారు కొంత ఉప్పును తీసుకొని నిలబడి వాగ్దానము చేసి, వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకొందురు. జపానులో పద్ధతి అది, నిబంధన చేసినప్పుడు ఉప్పును చల్లుదురు, మీరు చూడండి. ఉప్పు రుచి అయి వున్నది. మరియు వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకొందురు, అది నిబంధన.

అమెరికాలో, మనము ఎలా నిబంధన చేస్తాము. మనము బయటకు వెళ్ళి ఏదైనా తిని కరచాలను చేసి, "నీ చేతిని నాకు ఇవ్వు, అది అంగీకరించబడినది?" అది ఒక నిబంధన.

73కాని పాత కాలములో, అబ్రాహాము కాలములో వారు నిబంధనను చేసే విధము ఏదనగా, ఒక బలి అర్పణను చంపి, ఈ అర్పణ మధ్య వారు నిలబడతారు. తరువాత వారు నిలబడి యుండగా, వారు గొర్రెపిల్ల చర్మము మీద ఆ నిబంధనను వ్రాసి దానిని మధ్యకు చించుతారు. అప్పుడు ఒకరు ఒక ముక్కను మరొకరు మరొక ముక్కను తీసుకుంటారు. ఇప్పుడు ఆ నిబంధన స్థిరపరచబడి మరియు రెండూ దగ్గరకు తేబడినప్పుడు, ఎవ్వరునూ దానిని అనుకరించ లేరు. చూడండి, ఖచ్చితంగా అది వున్న రీతిగా మాటతో మాట ఏకీభవించాలి. అది చూపేది ఏమంటే, ఈ ముక్క యొక్క నిజమైన హక్కుదారుడు ఒక భాగమును కలిగియున్నాడు. అది అదే నిబంధన. అతడు వచ్చి రెండింటినీ ఒకదానితో ఒకటి చేరవలసియున్నది మరియు అది ఖచ్చితముగా ఒక దానితో ఒకటి సరిపోతుంది.

JOHN 14:12•

HEB 13:8

 

74మరియు దేవుడు అబ్రాహాముకు అక్కడ చూపుచున్నాడు, అతని సంతానము ద్వారా దేవుడు తానే శరీరధారియై మరియు కల్వరిలో వేరు చేయబడవలసియున్నాడు. క్రీస్తు దేవుడుగా భూమి మీద వున్నప్పుడు ఆయన వేరు చేయబడెను, దేవుడు ఆయనను విడిగా విభజించి అబ్రాహాము రాజ సంతానమును, ఆయన జీవము నుండి తీసెను. మరియు పరలోకములో తన సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన శరీరమును లేపి, ఆయన ఆత్మను తిరిగి తన సంఘము లోనికి పంపెను. అప్పుడు సంఘము క్రీస్తులోని ఆత్మను కలిగి దానితో ఏకమై క్రీస్తు నిన్న, నేడు, నిరంతరరము ఏకరీతిగా వున్నాడని చూపుచున్నది. దేవుడు తన నిబంధనను స్థిరపరచుట క్రీస్తులోని జీవమును చీల్లి, వేరు చేసి, తన కుమారునిలో నుండి ఆత్మను తీసెను. ఈ జంతువులను రెండుగా కోసి ఆ జంతువుల మధ్య నిలువబడుచు దీనిని చేసెను. వెలుగు అనగా దేవుడు తానే వాటి మధ్యకు వెళతూ, శరీరమును వేరు చేశానని చూపెను: అదియే విత్తనము, రాజ సంతానము; ఆత్మను తీసుకొని సంఘములోనికి పంపెను. మరియు క్రీస్తును కలిసికొనుటకు వెళ్ళు ఈ నాటి సంఘము కూడా, ఆయన కలిగియున్న ఆత్మను కలిగి యుండవలసియున్నది. ఎందుకనగా అది అక్షరమునకు అక్షరముగా, వాక్యమునకు వాక్యముగా వుండాలి. మరియు ఆయన వాక్యమై యున్నాడు. యేసు చెప్పెను, "అతడు" [వ్యక్తిగత సర్వనామము] "నా యందు విశ్వాసముంచు వాడు, నేను చేయు కార్యములను అతడునూ చేయును." క్రీస్తులోని జీవము సంఘములో ఉండునని తన నిబంధనను అబ్రాహాము రాజ సంతానములో స్థిరపరచుచున్నాడు.

ACTS 2:2,3

 

75సోదరులారా, పెంతెకోస్తు నందు జరిగిన దానిని ఒక్క నిమిషము చూచెదము. వారు మేడ గదిలో వున్నప్పుడు… మీరు ఎన్నడైన అక్కడ వుండి, అది గీయబడిన విధమును దాని రేఖా చిత్రమును నిజముగా చూచినట్లయితే, వారు బయట నుండి మెట్లు మీదుగా మేడ గది లోనికి ఎక్కి వెళ్ళారు. అక్కడ ఒలీవ నూనె దీపములు వెలుగుచున్నవి. వారు తలుపులన్నీ మూసికుని పది పగలు మరియు రాత్రులు అక్కడ వున్నారు. "అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, వారిలో ఒక్కొక్కని మీద విభాగింపబడినట్లుగా వారికి కనబడి వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి, ఆవరణములోనికి పరుగెత్తుకుని వచ్చి, అన్యభాషలతో మాటలాడసాగిరి.

గమనించండి, కూర్మములైన ఈ అగ్నివంటిది ఏమిటి? పరిశుద్ధాత్మయు, దేవుడును, అగ్నిస్తంభమను. వారి ముందు ప్రత్యక్షపరచబడి వారిని అరణ్యము గుండా నడిపించిన దూతయు ఒక్కటై యున్నారు. దేవుడు తనను తాను వేరు చేసుకొని తన ప్రజల మధ్య పరిశుద్ధాత్మగా తన్ను తాను విభజించుకొనెను. మరియు దానితో మనము జీవించుచున్న దేవుని సంఘముగా వున్నాము. అది ఒక నిబంధన! "అబ్రాహాము మరియు ఆయన తరువాత ఆయన రాజ సంతానము." క్రీస్తులోని జీవమే సంఘములో ఉండి క్రీస్తు చేసిన కార్యములనే చేయును. ఆమేన్. ఎలాంటి అద్భుతమైన సంగతి, స్నేహితులారా!

76ఇప్పుడు నేను ముగించవలసిన సమయమైయున్నది. అవును, నేను చాలా ఆలస్యముగా వెళ్ళుచున్నాను. మరలా రేపు రాత్రికి ఇక్కడే దీనిని తీసుకుంటే పరవాలేదంటారా? ఎంతో త్వరగా నేను "యెహోవా-యీరే" లోకి వెళ్ళాలి. కాని క్రైస్తవులమని చెప్పుకొనడము ఏమిటో మీరు చూడాలని నేను కోరుచున్నాను, సోదరులారా, సంఘము దీనిని చూడవలసిన సమయము. దేవుడు ఈ వాగ్దానములను చేసినట్లయితే అవి సత్యముగా వున్నవి. అవి తప్పక నెరవేరును.

ఒక్క క్షణం మనం తలలు వంచుదము, ఇది కరుకుగానూ మరియు కఠినముగానూ వుండును. అది చేధించునదైయున్నది. ఆ పని చేయుటకు నాకు ఇష్టము లేదు. ఆ సేవకుడు నాతో ఇలా చెప్పాడు, "సహోదరుడా బ్రెన్హాం, ఈ విధముగా మీరెందుకు చేయుచున్నారు?"

అందుకు నేనన్నాను, "ఎవరు నాకు స్పాన్సర్ చేయడానికి నాకు టెలివిజన్, రేడియో ప్రోగ్రాము లేవీ లేవు. నేను ఎక్కడికి వెళ్ళినను నేను ఈ రీతిగానే వెళతాను. మరి వారికి ఎవరు తెలియ చేయుదురు?" దానిని చేప్పే స్వరము ఎక్కడో వుండ వలసి యున్నది."

77స్నేహితులారా, దేవుడు ఇక్కడ వున్నాడు. మరియు అబ్రాహాము సంతానమని నిన్ను నీవు పిలచుకొన్నట్లయితే, దానిని ఆలోచించుము. స్నేహితుడా, వినుము, అది నీ ఆత్మ, స్నేహితుడా, అది నీ ఆత్మ, దానితో మరో అవకాశమును తీసికోవద్దు, ఎందుకనగా నీవు దానిని పొందుటకు ఈ రాత్రి ఆఖరి తరుణము కావచ్చు, దేవుని బిడ్డవని పిలవబడడానికి, నీవు జీవించే విధానాన్ని బట్టి, నీ జీవితాన్ని గూర్చి, నీవు సిగ్గుపడుతున్నట్లయితే, మరియు దేవుని వాక్యము సత్యమనియు, నీవు తప్పుగా వున్నావని నమ్మినట్లయితే, నీవు ఒక్క క్షణము ప్రార్థన చేసి, దేవుడు నీ జీవితమును పరీక్షించునట్లు అడగమని నేను కోరుచున్నాను. ప్రార్థించండి.

78పరలోకపు తండ్రి, మాలో అనేకులకు ఇది చివరి రాత్రి కావచ్చు. లాస్-ఏంజలీస్ లో కొన్ని రాత్రుల క్రితము, అక్కడ కూర్చునియున్న 70 సంవత్సరముల వృద్ధురాలు, బలిపీఠము యొద్దకు నడిచి వచ్చి, తన జీవితమును క్రీస్తుకు ఇచ్చినది. ఆ రాత్రే ఆమె తన పడకలో చనిపోయినది. ఆ చివరి ఘడియలో దేవుని కృప, ఇన్ని సంవత్సరములు ఎరుగకుండా జీవించిన తరువాత, అప్పుడు చివరి ఘడియలో ఆమెను పిలచినది అద్భుతమైన కృప.

తండ్రివైన దేవా, ఈ రాత్రి ఈ హృదయములతో మాట్లాడుము. దీని ఉద్దేశ్యము మీరు ఎరుగుదురు. తండ్రి, ఏదో జరుగవలసిన ఒక సమయము రావలసి యున్నది. అయితే అది చెడ్డగా మారుచున్న స్థితిని మేము చూస్తున్నాము. పెంతెకోస్తు సంఘ కాలము అనగా ఈ చివరి దినములలో లవొదికయ సంఘ కాలముగా వున్నది. ఇది క్రీస్తును సంఘమునకు వెలుపల ఉంచినది. ఆయన నిలబడి, లోనికి వచ్చుటకు ప్రయత్నించుచు తలుపు తట్టుటను మేము గ్రహించాము, ఓ, దేవా, కనికరించుము.

79ప్రభువా, ఈ రాత్రి నేను మన సహోదరీలను గద్దించినట్టుగా, ఆరంభములో అది "హవ్వ" తో ప్రారంభమైనదని వారు గ్రహించుదురు గాక, అది మరలా ఇక్కడ వున్నది. సువార్త వాక్యము ద్వారా లోనికి వచ్చియున్నది, ఆమె కారణము వెతుకుట ద్వారా దానిని (ఈ దినమున చూడండి) చేసినది; ఆమె తల్లిని చూడండి, ఆమె తలంచినది వేరుగా వున్నది, అదే బైబిలు.

దేవా, మా సోదరులతో నేను కరుకుగా మాట్లాడవలసి వచ్చెను. ప్రభువా, నేను రోషము గల వాడను. నేను వారిని ప్రేమించుచున్నాను. ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీకు తెలుసు. నేను వారి కొరకు 31 సంవత్సరాలు వెచ్చించాను. మరియు నీవు నీ మాటను స్థిరపరచి సమస్తమును చేశావు. ప్రభువా, నేను ఇంకా ఏమి చేయాలో నాకు తెలియును. కాని నన్ను ప్రేమించిన ఆ సంఘమును, నా వెనుక నిలబడి నన్ను బలపరచిన పెంతెకోస్తు సంఘమును చూచినప్పుడు; దేవా, దాని నుండి దుష్టుని తీసివేయుము. అది క్రైస్తవ ప్రేమ, ప్రేమే నిన్ను దానిని చేయనిచ్చుచున్నది. దేవా, అది ప్రేమ అని నీకు తెలియును. "వారు వెలుపలకు వెళ్లకూడదని, ఈ కార్యములు చేయకూడదని," ఈ ప్రజలకు చెప్పుటకు నేను ప్రయత్నించుచున్నాను. ప్రామాణికములు తీసివేయబడినవి, మరియు మేము వివిధమైన సిద్ధాంతములను, నానా విధమైన వాటిని పొదిగి పిల్లలు చేసి సంఘములోనికి తెచ్చిచున్నా ము. మరియు మేము బట్టలు ధరించవలసిన విధానము నుండి, ప్రవర్తించవలసిన విధానము నుండి, దైవిక స్వస్థత నుండి, అద్భుతములు చేయు దినముల నుండి ప్రక్కకు వెళ్ళిపోయాము.

80మరియు నీవు ఆదాముతో నిబంధన చేశావు, హవ్వతో కూడా ఒకటి చేశావు; నీవు వారితో వేర్వేరు నిబంధనలు చేశావు, అవి పూర్తిగా వేరైనవి, పురుషుని వలె ప్రవర్తించడం స్త్రీకి మంచిది కాదని నీవు చెప్పావు. ఆమె స్త్రీ, స్త్రీ వలె వుండాలి, పురుషుని వలె వుండరాదు. కాని ఈ దినమున, ఆమె - పురుషుని వలెనూ, పురుషుడు - స్త్రీవలెనూ వుండుటకు ప్రయత్నించుచున్నారు.

ప్రభువా, అటువంటిది దినము ఈ చివరి దినములతో ఇక్కడ జరుగుచున్నది. ఇక్కడే, పశ్చిమ తీరమున జరుగుచు వున్నది. నాగరికత అంతములో అది ఇక్కడ వున్నది. ఆదిలో చేసినట్లు ఖచ్చితంగా స్త్రీలు చెడును చేయడము మేము చూస్తున్నాము. మరియు అది ఇక్కడ వున్నది, మా సహోదరీల మధ్యలో ప్రవేశించినది. ఓ దేవా, ప్రభువా, అది నా హృదయమును కేవలము బ్రద్దలు చేయుచున్నది. ఒక (పాపిగా) నాకే అది అలా వున్నప్పుడు, అది దేవతగా మారడం చూస్తున్నప్పుడు, అది నీకు మరెంతగానో వుండునో గదా. ఈ కృత్రిమమైన పాపపు హాలివుడ్ సౌందర్యం! సినిమాలకు వారు వెళ్లటం ఎప్పుడూ అది అపరాధమే అన్ని రకముల సెన్సార్ చేయని ప్రోగ్రాములు, బజారులోని అసభ్యమయిన చెత్తనంతా సాతాను వారి ఇండ్లలోనికి త్రోసినది.

ఓ దేవా, ఇది ఒక వెర్రి కాలము. ఇది మనో వ్యాకులత కాలము. ఇది మనిషి నిలువకుండా, వినకుండా, పరీక్షించుకొనకుండా వుండే సమయము. మరియు ఏదో ఉద్రేకము క్రింద వారు ఇంకనూ అబ్రాహాము సంతానమని చెప్పుకొనుచున్నారు. దేవా, నీవు ఎలా ఉండుననిని చెప్పావో, ఆత్మలు చివరి దినములలో ఎంతో దగ్గరగా అలాగే వున్నాయి. అది ఇక్కడ వున్నది. దేవా, వారిని వెళ్ళనీయ వద్దు. ఎవ్వరూ దానిని చేయ్యనియ్యవద్దు. దయచేసి, తండ్రి. నేను వారిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దాని దయ చేయుము.

81ఇప్పుడు మనము తలలు వంచియుండగా. మీ కొరకు నేను ఏదైనా చేస్తాను. మరియు నేను ఏదో తక్కువగా వారి మీద అరచినట్లయితే, దేవుడు ఎన్నడూ నాతో ఉండడు. నేను ఇక్కడ ఉండుటకు తగను. ఎక్కడో బయట వుండి కట్టెలు నరుకుటకు తగును. కాని, స్నేహితులారా, అది నిజము, లేఖనములో వున్నదో లేదో పరిశీలించండి. మరియు ఈ చివరి దినమున అది బయలుపరబడవలసియున్నది.

మీరు చాలినంత యధార్థంగా వున్నారా? మీరు నిజముగా వెలుపల వున్న దాని క్రింద వుండుచు, నేను తప్పులో యున్నానని నా కొరకు ఏదో ఉన్నదని, ఒప్పుకునే వారున్నారా? ప్రతి శిరస్సును, ప్రతి హృదయమును వంచి యుండగా, లోతుగా తమ్మును పరీక్షించుకొనుటకు, ఎవరైనా మీ చేతులను ఎత్తగలరా? సోదరుడా బ్రెన్హాం, "నా కొరకు ప్రార్దించుము. నేను తప్పైన దానిలో ఉన్నాను. దేవుని కృప ద్వారా నేను సరి కాబోతున్నాను." ప్రభువు నిన్ను దీనించును గాక, అది మంచిది. మి చేయిని పైకి ఎత్తండి. ఆయన దానిని చూస్తాడు. బాల్కనీలలో వున్న వారు, దేవుడు మిమ్మును చూస్తున్నాడు. మీ చేతులను పైకి ఎత్తండి. మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారా?

82ఇక్కడ మీలో కొంతమంది స్త్రీలు పొట్టి జట్టుతో కూర్చుని యున్నారు, గాని మీ చేతులను పైకెత్త లేదు. మరి మీ సంగతి ఏమిటి? మీరు తప్పుగా వున్నారు! ఆ రీతిగా దేవుని కలుసుకొనుటకు ప్రయత్నము చేయవద్దు! నేను ఈ బలిపీఠము మీద నిలబడి యున్నంత ఖచ్చితంగా మీరు ఖండించబడతారు. అంతగా మొద్దుబారిపోయి, చివరకు తప్పు అని ఒప్పుకొనుట చూచి సిగ్గుపడుచూ అంత అథోగతి పాలైనది, పెంతెకోస్తు సంఘము, కాదంటారా? మీరు ఆ పని చెయ్య వద్దు. దేవుడు మీకు దయ చూపును గాక.

నమ్మండి, విశ్వాసముంచుడి. మరలా నేను వేచియుందును. హానీ, ప్రభువు నిన్ను దీవించును గాక. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును గాక. అది మంచిది. చేతులెత్తండి… ప్రభువు నిన్ను దీవించును గాక! అది మంచిది. ఇప్పుడే దానిని ఒప్పుకొనండి; ఉదయమునకు ఎంతో ఆలస్యము కావచ్చు. ఇప్పటి నుండి ఒక గంట కూడా చాలా ఆలస్యం కావచ్చు. ప్రభువు నిన్ను దీవించును గాక, అదియే యదార్థత, ప్రభువు నిన్ను దీవించును. "నేను తప్పులో ఉన్నానని," ఒప్పుకొనండి. వారు తప్పని ఒప్పుకోవడం ఒక యదార్థవంతుడు చేస్తాడు. అది నిజమైనది. ప్రభువు నిన్ను దీవించును గాక, సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును గాక, ప్రభువు నిన్ను దీవించును. అది నిజము. ప్రార్థన చేస్తూ వుండండి. ప్రభువు నిన్ను దీవించును. నేను మీ చేతిని చూడడంలో తప్పిపోతే, ఆయన తప్పిపోడు. మీ మనస్సులో వున్న ప్రతీ తలంపు ఆయనకు తెలుసు. అది ఖచ్చితంగా యధార్ధము. దేవుడు నిన్ను దీవించును గాక, మీ చేతిని నేను చూస్తూ యున్నాను. అది మంచిది. ఓ, యవ్వన స్త్రీ, నిన్ను ప్రభువు దీవించును గాక. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును. అది మంచిది.

అక్కడ ఉన్న ఓ, యవ్వన స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును గాక. అవును, జీవిత దారులలో మలువుము. మీ యవ్వన హృదయమును ఈ పాత సంగతులు మొద్దుబారినట్లు చేయక ముందు, ఇప్పుడే దేవుని వైపు తిరగండి. అది మంచిది. దానిని మీరు చేయండి. నీ వయస్సంత చిన్న కుమార్తె నాకున్నది. హనీ, ప్రభువు నిన్ను దీవించును గాక, ప్రభువు నిన్ను దీవించును గాక. అవును. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును గాక.

PROV 28:13

 

83నీ సంగతి ఏమిటి సోదరుడా? నీ భార్య ఆ రీతిగా ప్రవర్తించడం, పొట్టి బట్టను వేయడం, మరియు ఆ రీతిగా వస్త్రములు ధరించి బజారులో నడవడం, నీకు సిగ్గు, ఒక దేవుని బిడ్డనని నిన్ను నీవు పిలుచుకొంటావా? నిన్ను గూర్తి నీవు సిగ్గుపడుట లేదా? దేవుడు నిన్ను దీవించును. ప్రభువు మిమ్మను దీవించును. ప్రభువు నిన్ను దీవించును. అది మంచిది. నీవు తప్పులో ఉన్నావని ఒప్పుకో. ఒకవేళ నీవు…

"అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరం పొందును." ప్రభువు నిన్ను దీవించును. వెనుక బాల్కనీలో, పైన బాల్కనీలో ఇంకా ఎవరైనా వున్నారా? అక్కడ వున్న మిమ్ములను, మీ హృదయములోని ప్రతి తలంపును ఆయన ఎరుగును.

ఇప్పుడు మీ తలలు ఒక్క నిమిషము పైకి ఎత్తండి.

యవ్వనస్తులు గాని, వృద్ధులు గాని దరిదాపు 50 లేక 60 మంది ఈ గదిలో తమ చేతులను ఎత్తియున్నారు. మీకు వందనములు. వారు నిజమైన స్త్రీలు, మరియు పెద్ద మనుషులు. నేను మిమ్మును అభినందించుచున్నాను. మీరు తప్పు అని ఒప్పుకున్నప్పుడు మీకు నిరీక్షణ యున్నది.

2KGS 4:29•

ACTS 19:12

 

84నేను బలిపీఠపు పిలుపు ఇవ్వక ముందు నేను ఈ చేతి గుడ్డల కొరకు ప్రార్థించుబోవుచున్నాను.

పరలోకపు తండ్రి, ఈ చేతి గుడ్డలు వ్యాధితో బాధపడుచూ వున్న తల్లులు, తండ్రులు మరియు పిల్లలను చూపుచున్నది. ఒకసారి వారు పౌలు శరీరము నుండి చేతి గుడ్డలు మరియు నడికట్టు గుడ్డలు తీశారని బైబిలులో మేము నేర్చించబడ్డాము. ప్రజలు అతని చూశారు. దేవుని ఆత్మ అతని మీద వున్నదని వారు గ్రహించారు. ఎలీషా షూనేమియురాలితో చెప్పినది పౌలుకు గుర్తున్నది. అతడు గెహజీతో, "ఈ దండము తీసుకుని వెళ్ళి అతని మీద పెట్టుము." అతడు ముట్టినది దీవించబడినదని అతనికి తెలియదు. వారు పౌలు శరీరము మీద నుండి చేతి గ్రుడ్డలను, నడికట్టు గుడ్డలను తీసి వారిపై ఉంచినప్పుడు, ప్రజలలో నుండి దురాత్మలు వ్యాధులు వెడలిపోయెను. ప్రభువా, ఇప్పుడు మేము పరిశుద్ధుడైన పౌలు లాంటి వారము కాదు, కానీ నీవు ఇంకనూ దేవుడవు. అదే దేవుడవు.

ఒక దినము ఇశ్రాయేలు వారి మార్గము గుండా వారి బాధ్యతగా వాగ్దాన భూమికి వెళ్ళుచున్నారు. అయితే వాగ్దాన భూమి నుండి ఒకటి వారిని వేరుచేసినది. అది ఎర్ర సముద్రము. ఒక గ్రంధకర్త ఇలా చెప్పాడు, "దేవుడు కోపపు కన్నులతో అగ్నిస్తంభము గుండా క్రిందికి చూశాడు. సముద్రమునకు భయము వేసినది. మరియు అది తన గోడలను వెనుకకు త్రిప్పి, ఇశ్రాయేలు వాగ్దాన భూమిని చేరుటకు ఆరిన బాటను తెరచినది."

దేవా, ఈ చేతి గుడ్డలు వ్యాధిగ్రస్తుల యొద్దకు, పీడించబడుచున్న వారి యొద్దకు తీసుకుని రాబడినప్పుడు, పరలోకమందున్న దేవుడు తన సొంత కుమారుని రక్తము గుండా చూచును గాక, మరియు వ్యాధితో వారిని నిలిపిన దయ్యము వాక్య సత్యమును నెరవేర్చిన ఈ కూటము యొక్క చేతి గుడ్డల గుర్తులను చూచినప్పుడు, భయపడి వారిలో నుండి పారిపోవును గాక; వ్యాధిగ్రస్తులు, బాధించబడుచున్న వారు బాగుపడుదురు గాక; విరిగిన హృదయాలు కొన్ని నిమిషములలో కుమ్మరివాని ఇంటికి వెళ్ళుచున్నవి; ప్రజలలో నుండి దయ్యములు పారిపోయి, దేవుడు వారిని వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టనిమ్ము. ఆ పని కొరకు యేసుక్రీస్తు నామములో ఈ చేతి గుడ్డను పంపుచున్నాను. ఆమేన్.

MATT 13:30

 

85దేవుడు నీ హృదయమును ఎరుగును. నీ స్థితి ఆయనకు తెలియును. మీకు చూపుటకు దానిని నేను చెప్పుదును. ఇక్కడ ఒక పెద్ద గుంపు తమ చేతులను ఎత్తలేదు. వారు ఎత్తవలసియున్నది. ఇప్పుడు నేను ఈ బలిపీఠము నుండి మీరెవరో చెప్పినిచో అది ఇతరుల భావములను గాయపరచును. అనేకసార్లు నేను అది చేయుట మీరు చూచారు. యేసు ఇలా అనుటను చూచాను, "గురుగులను గోధుమలను కలసి ఎదగనియ్యుడి. దేవదూతలు వచ్చి మొదటగా గురుగులను కట్టలుగా కట్టి కాలివేయుదురు."

మరియు ఇదియే కట్టలు కట్టు సమయము. వారిలో ప్రతి ఒక్కరూ సంఘ శాఖలన్నీ ఐక్య సంఘములలోనికి వెళ్ళిపోవుచున్నారు. అది నిజము. అది నిజము. ప్రపంచ సంఘముల సమైక్యత, ప్రతి సంఘ శాఖ దానిలోనికి తన్ను తాను ఈడ్చుకొనుచున్నది. అది ఇప్పుడు జరుగుచున్న పెద్ద సంగతి. "వారిని గురించి వాగ్దానము చేయబడినట్లుగానే," వారందరూ రోమాకు తిరిగి వచ్చి, "మృగమునకు ఒక ప్రతిమను," సంఘముల సమైక్యతను, ఒక శక్తిని, దేవుడు ఏమి జరుగుచున్నదని చెప్పాడో ఖచ్చితంగా అదే చేయుచున్నారు. వారు అక్కడ వుండి నిన్ను వెళ్ళనిచ్చుచున్నారు. మరియు ఆ విధముగా చేయుట పరవాలేదులే అని చెప్పుచున్నారు. దానిని గురించి ఏదైనా చెప్పుటకు భయపడుచున్నారు. ఎక్కడ అది వారి భోజనపు టికెట్టును తీసి వేయునేమోయని భయపడుచున్నారు.

86నా సోదరుడా, సోదరీ, నన్ను కొంత చెప్పనియ్యుడి. నేను మిమ్మును ప్రేమించుచున్నానని దేవుడు నీకు బయలుపర్చును. అది భేదములుగా వుండుట కాదు; అది యదార్ధముగా వుండుట. మరొక అవకాశము తీసుకొనవద్దు. నీ శరీరముతో వ్యతిరేకమైన దాని గుండా పరుగెత్త లేవు. నీ ఆత్మ సంగతి ఏమిటి? దేవుని ఎర్ర దీపమును దాటుటకు ప్రయత్నించకు.

మిలో కొంతమంది రోగులుగా వున్నారు. ఎవరైనా, ఏదైనా నిరాశలో వున్నారా, కేవలము విశ్వాసము కలిగియుండుడి. మీ హృదయమంతటితో నమ్ముడి. ఆయన నిజముగా సత్యమో, కాదో నేను మీకు చూపుదును. అబ్రాహాము సంగతి గుర్తున్నదా? దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఏమి చేశాడు? అదే కార్యమేమో చూడుడి.

87ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని యున్నది. ఆమె కాన్సరుతో బాధపడుచువున్నది. ఆమెకు ఒక గడ్డ వున్నది. మరియు ఆమె ఆపరేషన్ కొరకు వెళ్లవలసివున్నది. ఆమె నా వైపు చూచుచున్నది. ఆమె మెడ చుట్టూ ఎర్రని పూసలు వున్నవి. నీవు పోర్టులాండు నుండి వచ్చావు. అది నిజమైతే, నీ చేతిని ఎత్తుము. అది నిజము. నీవు నాకు తెలియదు. మనము క్రొత్తవారము. అది నిజము. దేవుని కృప మరియు ఆయన వెలుగు దూత నీ దగ్గరకు ఆ రీతిగా వచ్చినప్పుడు, చాలినంత విశ్వాసముతో మౌనముగా నీవు అక్కడ ఎలా వుండగలవు? అమ్మా, దానిని అంగీకరించుము. దానిని నమ్ముము. అది మత్రమే కాదు, అయితే సువార్తనంతటిని నమ్ముము.

ఇక్కడే వెనుక ఒకామె కూర్చునియున్నది. ఇటు చూడమ్మా. నీవు పెద్ద ప్రేగుతో సమస్యతో బాధపడుచున్నావు. మీ హృదయమంతటితో నమ్మండి. అవును, నాకు నీవు క్రొత్త వ్యక్తివి. నీ హృదయమంతటితో నమ్ముము. స్వస్థతను పొందుము.

88ఈ ప్రక్కన ఒకాయన కూర్చుని వున్నాడు, ఆయన ఇంటికి వెళ్ళవలసియున్నది. ఆయన ఎక్కువ సేపు వుండలేడు. ఆయనకు చెవులలో బాధ వున్నది. ఆయనకు జలుబు వలన దగ్గు వచ్చినది. ఆయన దానిని జయించలేకపోవుచున్నాడు. ఇంకా ఎన్నో చిక్కులు ఆయనకు వున్నవి. అది నిజమండి. మీరు మిసైలుకు సంబంధించిన ఫ్యాక్టరీలో పని చేస్తారు. మరలా మీరు పనికి తిరిగి వెళ్ళాలి. నేను మీకు క్రొత్తవాడను. ఈ సంగతులన్ని నిజమైనచో, చేతులను ఎత్తండి. మంచిది. ప్రభువైన యేసును ముట్టుటకు మీకు చాలినంత విశ్వాసం వుంటే మీ హృదయమంతటితో నమ్మి ఎందుకు నిజమైన మనిషిగా కాకూడదు?

అక్కడ ఒక స్త్రీ కూర్చునియున్నది, ఆమె తన చేతుల మీద చర్మపు రోగమును కలిగియున్నది. కనీసము అది ఏమిటో ఆమెకు తెలియదు. డాక్టరుకు కూడా అది ఏమిటో తెలియదు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా దానిని కలిగియున్నది. ఓ, లోకము వలె నిశ్చయముగా, ఆమె దానిని కోల్పోనై యున్నది. మీ పేరు మిస్. మెక్ దానియేలు. అవును. ఇడ్రా మెక్ దానియేలు. మీ హృదయమంతటితో నమ్మండి. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. కాని ఆమె మీద వెలుగున్నది.

89ఏమిటిది? ఆయనకు మీరు ఎవరో తెలియును, మరియు మీరు పొరపాటులో వున్నారనియు ఆయనకు తెలియును. ఆ రీతిగా నా ద్వారా మాట్లాడుచున్న దేవుడు, వాక్యముతో నా ద్వారా మాట్లాడుచున్నాడు.

ఇక్కడ దేవుని సన్నిధిని గుర్తించిన ప్రతీ ఒక్కరూ పొరపాటులో వున్నామని తెలుసుకున్నవారు, బలిపీఠము దగ్గరికి రండి. ఒక నిమిషము ఇక్కడకు రండి. మీ కొరకు నన్ను ప్రార్ధించనివ్వండి. ఇప్పటి నుండి ఒక నిజమైన క్రైస్తవునిగా వుండాలనుకొన్నవారు, బలిపీఠము చుట్టూ రండి. మీ పేరు పిలవడం నాకు ఇష్టం లేదు, అది క్రైస్తవునిగా వుండదు. పైన బాల్కనీలో వున్నవారు, దిగి రండి. ఇది మీ అవకాశము. ఇప్పుడు దిగి రండి! బలిపీఠము దగ్గరికి వస్తూ చెప్పండి! "ప్రభువా నేను వచ్చుచున్నాను!" పాపములో ఉన్నవాడా, బలిపీఠము నొద్దకు దారి చేసుకొనుము. ఇది నీ చివరి అవకాశము కావచ్చు. ఆర్గన్ చక్కగా పాడుచుండగా, మీరు ఇప్పుడు రండి, "ప్రభువా, నేను వచుచున్నాను, మీ దగ్గరకు ఇప్పుడు వచుచున్నాను!" మంచిది, అందరూ పాడండి.

ప్రభువా, వచుచున్నాను!

నీ దగ్గరకు వచుచున్నాను!

90మీరు రారా? బాల్కనీల నుండి దిగి రండి. దిగి రండి. మీ సంగతి ఏమిటి? క్రైస్తవులమని చెప్పుకొనుచూ మీరు, అబ్రాహాము సంతానమా? అమ్మా. ప్రభువు నిన్ను దీవించును గాక. నా సహోదరులారా, ప్రభువు మిమ్మును దీవించును గాక. అవును, దేవుడు నిశయంగా దానిని గౌరవించును. మీరు యదార్థముగా నున్నారు. ఒకవేళ మీ కాపరి మీకు దానిని చెప్పడంలో తప్పిపోయి వుండవచ్చు. ఇంటికి వెళ్ళి నీ బైబిలు తీసుకుని, అది నిజమో, కాదో కనుగొనండి. నేను చెప్పక ముందే మీరు దానిని సత్యమని తెలుసుకుంటారు. పెంతెకోస్తు స్త్రీలారా, మీరు ఇకపై ఈ మేకప్ ను చేయకుందురు గాక. బైబిలులో మేకప్ చేయడం అనేది లేదు; యెజెబెలు మాత్రమే ఆ విధముగా చేసినది, ఆమె తన ముఖమునకు రంగు వేసికొనెను. కాని బైబిలులో మీరు పొడవైన వెంట్రుకలు కలిగి వుండాలని యున్నది. పొట్టి వెంట్రుకలతో, జట్టు కత్తిరించుకుని స్త్రీ ప్రార్ధించడం ఒక అసహజమైన సంగతి.

ఆయన ఇక్కడ వుండగా, ఆయన సన్నిధిలో మీరు దేవునితో సరి చేసుకోవాలని కోరుచున్నారా? రండి! ఆయన కొరకు నిలువబడుడి. దిగి వచ్చి, మీ కాళ్ళపై నిలబడి చెప్పండి. నేను వచుచున్నాను, నేను దానిని చూపగోరుచున్నాను. నేను దేవునితో సరిచేసికోవాలని కోరుచున్నానని, నేను తప్పులో వున్నానని లోకము అంతయు తెలుసుకోవాలని నేను కేరుకొనుచున్నాను. ఇప్పుడే రండి!

ప్రభువా, నేను వచ్చుచున్నాను!

నీ యొద్దకు వచ్చుచున్నాను!

కల్వరి నుండి కారిన రక్తంలో నన్ను కడుగుము,

శుద్ధి చేయుము.

ప్రతి ఒక్కరు మరలా పాడుడి.

నేను వచ్చుచున్నాను … (రండి. బయట చాలామంది వున్నారు.

గుర్తుంచుకొనండి. అవునూ, అది నిజము.)

నన్ను నీ రక్తములో కడుగుము.

కల్వరి నుండి కార్చిన రక్తములో.

91ఇంకా ప్రజలు వచ్చుచున్నారు, ప్రార్ధిస్తూ వుండండి. ఇప్పుడు స్నేహితులారా, నేను ఎక్కువ ఒప్పించలేను. వాక్యము బయలు వెళ్ళినప్పుడు ఆ కార్యమును చేయునని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఇది నీవు ఎన్నడూ పొందని చివరి అవకాశము కావచ్చు. నీవు తప్పును ఒప్పుకున్నప్పుడు, అది చూడడానికి ఎలా వుంటుందని తెలుసుకొనేది నీవు కాదు. అది నాకు ఏమి చెబుతుందంటే, ఇక్కడ నిజమైనది వున్నదని, మీకు నిజముగా మంచి చేయాలని వున్నదని నాతో చెబుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుచుండగా, మీరు చిన్నగా, ఆర్గన్ తో కలసి పాడండి. రండి, ప్రజలారా, తిన్నగా రండి. మీరు వస్తూనే వుండండి. ఈ ప్రజలు ఏమి చేశారో మీకు తెలుసా? వారిలో అనేకమంది అధికారము పొందిన సంఘ సభ్యులు. మరియు వారికి నేను సత్యము చెప్పానని తెలుసు.

ఇది నేను కాదు. మోషే అక్కడకు వెళ్ళి, ప్రభువును గూర్చి ప్రజలకు చెప్పినప్పుడు; అగ్నిస్తంభములో నున్న ప్రభువు అది సత్యమేనని ఆ వాక్యమును రుజువు చేసెను. అదే అగ్నిస్తంభము ఇక్కడే మనతో వున్నది. అదే క్రీస్తు తాను చేస్తానని వాగ్దానము చేసినట్లుగా అన్యుల యుగమునకు అదే కార్యము చేయుచున్నాడు.

EPH 4:11,12

 

92నన్ను నమ్మునట్లు చేయునదేమి? మీరు హృదయములో యధార్ధముగా వున్నారనేది. ఏది మిమ్ములను మీ కాళ్ళ మీద నిలబడునట్టు చేసినది? ఏదో నీ చుట్టూ వుండి, "నీవు తప్పు" అని చెప్పినది. అది దేవుడైయున్నాడు. మీలో కొందరు ఒప్పుకొన్న తరువాత ప్రజల ముందు అలాగే నిలబడి యుండుటకు పూనుకొనుచున్నారు. అది చూపేది ఏమంటే, అది నిజమైనది, "నీవు తప్పు" అని చెప్పుచున్నది. మరియు అది వాక్యము ద్వారా వస్తుంది. దానిని వివేచించుట ద్వారా వస్తుంది.

ఈ వరములు సంఘమునకు ఎందుకొరకు పంపబడ్డాయి? మొదటి వరము ఏమిటి? మొదటి సంగతి ఏమిటి? అపోస్తలులు (అనగా మిషనరీలు), ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వారంతా కలసి సంఘమును పరిపూర్ణము చేయుటకు వున్నారు.

ISA 40:3•

JER 1:5•

MATT 3:3•

MARK 1:3•

LUKE 3:4

 

93మరియు దేవుని వాక్యము ఎవరి యొద్దకు వస్తుంది? దేవుని వాక్యము ఎల్లప్పుడు ప్రవక్తల యొద్దకు వస్తుంది, ఎన్నడూ ప్రశ్నింపబడలేదు. ప్రవచన వరము కాదు; ప్రవచన వరములు ఒకరి నుండి మరొకరికి వెళ్లును. ప్రవక్త ముందుగా దేవుని చేత నిర్ణయించబడి జన్మించును. యేసుక్రీస్తు దేవుని కుమారుడైయుండెను, ముందుగా నిర్ణయించబడిన దేవుని కుమారుడు. యెషయా, "అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని," 712 సంవత్సరములకు ముందే, యోహాను పుట్టక ముందే బాప్తిస్మమిచ్చు యోహాను గూర్తి చెప్పెను. దేవుడు యిర్మియాతో ఇలా చెప్పెను, "నీవు నీ తల్లి గర్భములో రూపించబడక ముందే నిన్ను ఎరిగితిని, పవిత్రపరచితిని, మరియు జనములకు తండ్రిగా నిన్ను నియమించితిని." ప్రవక్తలు కనబడుటను నీవు చూచినప్పుడు తీర్పు సమీపించియున్నదని తెలిసికొనుము.

1PET 4:17

 

94"తీర్పు దేవుని ఇంటి నుండి, దేవుని ప్రజలతో ప్రారంభమగును." ఇప్పుడు మనము తప్పు చేశాము. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న అబ్రాహాము సంతానము మీద దేవుని వెలుగు ప్రకాశించుటకు నిజముగా వారు ముందు నిర్ణయించబడియున్నారు; వెలుగు వారిని తాకినప్పుడు, వారు నిలబడుదురు. ఏదో జరుగవలసియున్నది, నీవిక్కడ వున్నావు! నీవు ఇక్కడ వున్నావు. మన తలలు వంచి మన తప్పులను ఒప్పుకొందుము.

పాపివైన స్నేహితుడా, ఈ గుంపులో నీవు నిలబడియున్నట్లయితే, అది నీకు సిగ్గుకరము; కాని నీవు ఆయనను అంగీకరించి, నీ హృదయమంతటితో నమ్మినట్లయిన నీకు దీవెనలు.

క్రైస్తవులులారా, మంచి స్త్రీలైన మీరు దానిని ఎరిగినవారని, నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మును దీవించును. నేను దానిని నమ్ముదును. నా హృదయములోని భావమును దేవుడు మీకు తెలియజేయును. మీ పట్ల అల్పముగా నుండుట నాకు ఇష్టము లేదు. నాకునూ భార్య, ఇద్దరు యవ్వన బాలికలు వున్నారు. నా సహోదరిగా నేను మిమ్ములను ప్రేమించుచున్నాను.

మరియు సోదరుడా, మీ భావనలు గాయపర్చుట నాకు ఇష్టము లేదు. కాని కొన్నిసార్లు వాక్యముతో కొంత కదిలించడము మీకు సహాయపడుతుంది.

PROV 28:13

 

95ఇప్పుడు, నీవు తప్పులో వున్నట్లయితే, మనము తప్పులో వున్నామని ఒప్పుకొందము. అక్కడ ఈ రాత్రి కృప సమృద్దిగా మన కొరకు వున్నది. "తన తప్పులను ఒప్పుకొనువారికి, కృప వున్నది. తన పాపమును దాచువాడు, ఎన్నడూ వర్ధిల్లడు." మీ యొక్క పాపము ఏమిటి? మీ యొక్క అవిశ్వాసము. నీవు దానిని క్రింద దాచి, వారందరివలె నేనునూ మంచివాడను అని చెప్పుకొనినయెడల, నీవు ఆ తప్పిదములో నుండి ఇప్పుడు కదలనిదే ఎన్నడూ ఇకముందుకు కదలలేవు. నీవు ఆ రీతిగానే వుంటావు. నీవు ఆ అడ్డమును దాటి దానిని సరిచేసుకోనంత వరకు నీవు ఇంకముందుకు ఎంత మాత్రమును వెళ్ళలేవు. గుర్తుంచుకొనండి, నీవు దానిని చేయలేవు; నీవు వాక్యము మీదగా నడిచి వెళ్ళవలసియున్నది.

నీవు జీవించినంత కాలము దానిని మీరు ఎల్లప్పుడు గుర్తుంచుకుంటారు. నీవు జీవించు దీర్ఘమైన దినము ఈ రాత్రే, అది నీవు గుర్తుంచుకోవలసి ఉన్నది. నేను మీకు చెప్పుచున్నది, "యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు." నేను ప్రార్థన చేస్తూ ఈ మధ్యాహ్నము అడవిలో వున్నాను. ఇక్కడ దానిని గూర్చి ఆయన నాతో ఇలా మాట్లాడెను, "దానిని చెప్పుము మరియు దానిని పిలువుము, నేను నీ కొరకు దానిని చేసెదను," అన్నాడు. అది ఇక్కడే వున్నది.

96ఇప్పుడు మనము ప్రార్ధించుకుందాం.

పరలోకపు తండ్రి, గౌరవముగా మరియు యదార్ధముగా ఇక్కడే ఈ జనాంగములో పాపులు నిలబడియున్నారు. వారు తమ స్థలములలో నుండి లేచి తమ పాపమును ఒప్పుకొనుటకు ఇక్కడకు నడుచుకుంటూ వచ్చారు. తమ పాపమును ఒప్పుకొనుటకు కొందరు క్రైస్తవులు వచ్చారు.

ఇక్కడ కొంతమంది ప్రశస్తమైన సహోదరీలున్నారు. దేవుని వెలుగు వారి గుండా ప్రకాశించినది. వారి హృదయంలో వారు తప్పుగా వున్నారని గ్రహించారు. బైబిలు ఆ విషయములను బోధించుచున్నదని వారు గ్రహించారు. మరియు వారు వాటన్నింటినీ వదిలివేయుటకు ఇష్టపడుచున్నారు.

ఇక్కడ ప్రశస్తమైన సహోదరులు, సజీవ దేవుని కుమారులు నిలువబడియున్నారు. వారు ఆచారముల ద్వారా, నులివెచ్చని పరిస్థితుల ద్వారా లోకముతో తిరుగులాడారు. తండ్రి, ఈ రాత్రి వారు తిరిగి వచ్చుచున్నారు. వారు తిరిగి వచ్చుచున్నారు. వారు ఇక్కడ వున్నారు.

97తండ్రి,వారు తమ పాదముల మీద నిలబడియున్నప్పుడు, వారు విరిగి… అందరు శాస్త్రజ్ఞులు, నీవు కూలబడినప్పుడు నీవు కదలలేవని చెప్పారు. వారు తమ చేతులను పైకి ఎత్తి ఈ దారి గుండా నడిచినప్పుడు వారిలోని ఆత్మ ఆ తీర్మానము చేసినదని వారు నిరూపించారు. వారు క్రీస్తు కొరకు తీర్మానం చేశారు.

యేసు, ఇక్కడ నీ సొంత మాటలున్నవి, వాటిని కేవలము మీకు చూపుచున్నాను.

నీ దాసునిగా, ఈ రాత్రి ఈ ప్రజలను నీకు ఇచ్చుచున్నాను. ఈ రోజు అడవిలో నేను ఏమి చేయమని నీవు నాకు ఆజ్ఞాపించితివో నేను అదే చేశాను. మరియు ఇక్కడ నీవు చెప్పినదే ఖచ్చితముగా జరుగనున్నది. మరియు ఇక్కడ నిలబడియున్నవారు ఈ సంగతలకు సాక్షులుగా వున్నారు. నీ సన్నిధిని రుజవు చేయుటకు నీవు జనసమూహము గుండా వెళ్ళావు. వారెవరో, ఎక్కడవారే, వారు ఏమి చేశారో, వారు పేర్లేమిటో వారు ఎవరో, వారు ఏమి చేశారో, వారిలోని తప్పు ఏమిటో చెప్పావు.

PROV 28:13•

MATT 9:6•

MATT 10:32•

MARK 2:9•

MARK 8:38•

LUKE 5:24•

LUKE 9:26•

LUKE 12:8

 

98మరియు నీవు నీ వాక్యములో ఇలా చెప్పావు, "మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువానిని నేను నా తండ్రి ఎదుటను ఆయన పరిశుద్ధ దూతల ఎదుటను ఒప్పుకొందును. మనుష్యుల యెదుట నన్ను గూర్చి సిగ్గుపడువాడెవడో, అతని గూరి నేనునూ నా తండ్రి ఎదుటను ఆయన పరిశుద్ధ దూతల ఎదుటను సిగ్గుపడుదును." ఇప్పుడు ఈ సహోదరీలు మరియు సోదరులు, వారి కాపరులు, వారి సభ్యులు మరియు వారు ప్రేమించిన వారి సమక్షంలో నిలబడి, వారు నిన్ను గురించి సిగ్గుపడుటలేదని చెప్పుచున్నారు. వారు చేసిన దానిని గూరి సిగ్గుపడుచున్నారు. నీవు వారిని క్షమిస్తావను నిశ్చయతతో వున్నాను. నీవు వాగ్దానము చేసి చెప్పావు, "తన పాపములను ఒప్పుకొనువాడు కనికరము పొందును." మరియు వారు దానిని ఒప్పుకొనుచున్నారు, కృపను పొందెదరు గాక. మరియు రోగిని బాగు చేయు నీవు ఇలా చెప్పుచున్నావు, "నీ పడక ఎత్తుకుని నడువుము అనుట కంటే 'నీ పాపములు క్షమించబడియున్నవని,'" చెప్పుట సులభము కాదు కదా?

99ప్రభువా, ప్రతి ఒక్కరిని, నీ వారని ప్రకటించుచున్నాను (claim). ఈ సంవత్సరములన్నియు నేను నీ కొరకు, నీ వాక్యము కొరకు నిలబడుటకు ప్రయత్నించాను. మరియు ఈ రాత్రి వారు నీ కొరకు నిలబడియున్నారు. మరియు వారు నీ వారని నేను ప్రకటించుచున్నాను. లోకము యొక్క కోరలు నుండి వారిని బయటకు తీసి, ప్రభువైన యేసు నీ కొరకు వారిని బహుకరించుచున్నాను. ఈ రాత్రి ఈ వర్తమానమునకు దేవుని వాక్యమునకు వారు జయ సూచికంగా వున్నారు. సర్వశక్తిగల దేవా, మీ పరిశుద్ధమైన శక్తి క్రింద వారిని కాయుము. వారు ఎదుగుదురు గాక, వారి జీవితములో దేవుని వెలుగు ప్రకాశించును గాక, ప్రభువా. ఆ పురుషులు మరియు స్త్రీలు పరిశుద్దాత్మ శక్తితో బలంతో ఎదుగుట ప్రారంభించుదురు గాక, వారిలో ఏదో కార్యము జరిగి వారి సంఘమునంతా, వారుండే స్థలములో పొరుగువారినంతా మారును గాక, ప్రభువా. దయచేయము. వారు నీ వారు. వారిని నీకిచ్చుచున్నాను. బోధించబడిన వాక్యమునకు, ఈ రాత్రి కూటమునకు వారు జయసూచికలు. యేసుక్రీస్తు నామములో వారి జీవితము నీది అని ప్రకటించుచున్నాను. వారు అమర్త్యులుగా మారి, యవ్వన స్త్రీగా, యవ్వన పురుషుడిగా, ఎల్లప్పుడు యవ్వనంలో చక్కగా వుంటారు. వారిని అద్దరిని కలుసుకోవాలని నేను ఆశించుచున్నాను. తండ్రి, వారు నీ వారు. దేవుని సన్నిధి ద్వారా, ఆయన వాక్యము ద్వారా దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసునకు ఇచ్చిన జయసూచికలు. తండ్రి, వారు నీ వారైయున్నారు. యేసుక్రిస్తు నామంలో నేను వారిని నీకిచ్చుచున్నాను; మరియు ఇక్కడ నిలబడియున్న ప్రతి ఒక్కరి జీవితము నీదని ప్రకటించుచున్నాను. ప్రతి ఒప్పుకోలు అంగీకరించబడి, ప్రతి పాపము క్షమించబడును గాక.

100ఇక్కడ నిలబడియున్న ప్రతి ఒక్కరు ముందుకు సాగుటకు, యదార్థమైన దానిని చేయుటకు, ఈ మాయ మబ్బుతో పూర్తిగా నిండిన లోకములో, ఈ చీకటి ఘడియలో, వారికి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్ధించుచున్నాను. ఓ, దేవా, రేపు రాత్రికి దానిని వారికి తేటగా సృష్టపరచుము. ప్రభువా; ఆయన రాకడలో క్రీస్తును కలుసుకొనుటకు సిద్ధపడునట్లుగా, ఈ లోక మాయ నుండి వేరు చేయుము. దయ చేయుము, తండ్రి. ఇప్పుడు మేము నిన్ను నమ్ముచున్నాము.

JOHN 6:44

 

101మరియు మనము తలలు వంచి యుండగా, నిలబడియున్న ప్రతి ఒక్కరూ, మీరు ఏదో తెలిసికోవాలని వచ్చారని నేను నమ్ముట లేదు. కారణము మీరు కరుకైన, కోత వంటి, కఠినమైన సువార్త క్రిందకు వచ్చారు. యేసు చెప్పిన దానిని మీరు నమ్మండి. "నా తండ్రి ఆకర్షించనిదే ఎవడూ నా యొద్దకు రాడు; మరియు తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు." ఇప్పుడు అది ధ్రువీకరించబడిన దేవుని వాక్యము. ఆయన అబ్రాహాములో వాగ్దానము చేసి ఒట్టు పెట్టుకున్నాడు. మరియు దేవుని స్వరమును ఇక్కడ విని, ఆ ఆధారము మీద వచ్చారు. మీరు క్షమించబడవలసియున్నది! మీరందరూ దానిని అంగీకరించి, దేవుడు మీ ప్రతీ తప్పును క్షమించునని నమ్మండి. మరియు ఈ రాత్రి నుండి దేవుని కృప ద్వారా తక్కిన మీ జీవితము అంతా ఆయన కొరకు మీరు జీవించాలి. బైబిలు మీరు ఏమి చేయమని చెబుతుందో ఆ సమస్తమును మీరు చేయాలి. మరియు దేవుడు మీ గతమునంతా క్షమించి దానిని ఇప్పుడు మీరు చేయుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునని నమ్మండి. మీ చేతులెత్తి, "నా హృదయమంతటితో నేను దానిని నమ్ముచున్నాను" అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును.

102ఇక్కడున్న క్రైస్తవులందరూ వారిని గురించి అతిశయముతో వారి నిమిత్తము, "దేవునికి స్తోత్రము," అని చెప్పండి. [సంఘము "వారి నిమిత్తము దేవునికి స్తోత్రము" అని చెప్పారు.] మరలా దానిని చెప్పుదము. [వారి నిమిత్తము దేవునికి స్తోత్రము అని సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘమును కలిసి చెప్పుచున్నారు.]

ప్రతి ఒక్కరు లేచి నిలబడండి, నాకొక శ్రుతి కావాలి:

నేను ఆయనను ప్రేమించుదును,

నేను ఆయనను ప్రేమించుదును,

ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను.

మరియు కల్వరిలో నా రక్షణను కొనెను.

ఇప్పుడు, మనమంతా కలసి చేతులెత్తి పాడుదము. మంచిది.

నేను ఆయనను ప్రేమించుదును,

నేను ఆయనను ప్రేమించుదును

ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను.

మరియు కల్వరిలో నా రక్షణను కొనెను.

103మీకు నిజంగా శుద్ధిచేయబడితిమని అనిపించుట లేదా? వాక్యము మిమ్ములను తాకినందున మీకు మంచిగా అనిపించుట లేదా? అది అలా లేదా?

మీరు నన్ను నకిలీవాడనని అనుకోవద్దు, అనుకుంటారా? నేను సత్యమైనవాడనని నమ్ముతారా?

దేవుని దూత ప్రజలను గమనిస్తూ ఒక గుండ్రని వెలుగుగా ఆ గుంపు మీద సిలువ రూపంలో వ్రేలాడుట నేను గమనించుచున్నాను. పరలోకములోని దేవుడు! అదే చిత్ర పఠము… ఆ చిత్రములో మీరు చూచే దేవుని దూత ఇక్కడే ఈ ప్రజల మీద చుట్టూ ఒక స్థలము నుండి మరొక స్థలమునకు సంచరించుచూ వుండడం నేను గమనించాను. ఈ సమూహంలో వున్న ప్రతి రోగము వెళ్ళిపోయినదని కూడా నేను నమ్ముచున్నాను. ప్రతి పాపము క్షమిచబడియున్నదని నా హృదయమంతటితో నమ్ముచున్నాను.

104"నేను ఆయనను ప్రేమించుదును" అను పాట పాడుచుండగా మనము ఒకరితో ఒకరము చేతులు కలుపుదము. "ప్రభువుకు స్తోత్రము" అని చెప్పండి.

నేను ఆయనను ప్రేమించుదును,

నేను ఆయనను ప్రేమించుదును

ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను;

మరియు కల్వరి మ్రాను మీద

నా రక్షణను కొనెను.

"ప్రభువుకు స్తోత్రము" అని చెప్పి ఆయనను స్తుతించుదము, ప్రభువైన యేసు నీకు వందనములు. నీ వాక్యమును బట్టి, నీవు తెచ్చిన ప్రజలను బట్టి వందనములు. అది రెండంచులు గల ఖడ్గము వలె హృదయములోని తలంపులను వివేచించును. అది లోకమును శరీరమును, లోక సంగతులను ప్రజల నుండి సున్నతి చేసి, క్రీస్తులో నూతన సృష్టిగా చేయుము. తండ్రి, నిన్ను ఎలా స్తుతించాలి? మా హృదయమంతటితో నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, వారిని బట్టి నీకు వందనములు. వారు ఆత్మలో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ వారిని తన స్వాధీనము లోనికి తీసుకొనును గాక, మరియు పాత కాలపు ఉజ్జీవము ఈ సంఘములో బ్రద్దలవును గాక, ప్రభువా, దేవుని శక్తి ప్రతిచోట అగ్ని వలె వివిధ జాతులు గుండా అంతా తుడిచిపెట్టును గాక! ప్రభువా, నిజమైన పెంతెకోస్తును, నిజమైన ఆత్మ శక్తిని ప్రజల జీవితం లోనికి పంపుము. తండ్రి, దానిని దయ చేయుము.

వారు నీ వారు. దేవుని కృప ద్వారా వారు నీ వారు. వాగ్దానము ప్రకారము అబ్రాహాము సంతానము. ప్రభువా, వారికి దయచేయుము. వారు నీ వాక్యమును నమ్ముచున్నారు. ఏది వ్యతిరేకంగా వున్ననూ, అది వ్యతిరేకంగా వుండదు. వారు వాక్యమును నమ్ముచున్నారు, ఎందుకనగా వారు అబ్రాహాము సంతానమైయున్నారు. వారు నీ వారు. ఈ చివరి దినమున ప్రకాశించుటకు ముందుగా నిర్ణయించబడిన సంఘము. వారిని బట్టి తండ్రి, నీకు వందనములు.

నేను ఆయనను ప్రేమించుదును

(ఆయనను స్తుతిస్తూ మీ చేతులను ఎత్తండి)

(బాల్కనీలో పైన వున్నవారు. అది మంచిది)

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను;

మరియు………

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...