యెహోవా-యీరే #2

యెహోవా-యీరే #2

VGR COUNT-222 1సహోదరుడా, రాయ్. నీకు వందనములు. మనము ప్రార్ధించుచుండగా ఒక్క క్షణము అలాగే నిలబడి, మన తలలు వంచుదము. ఈ రాత్రి మీ హృదయములో ఏదైనా వున్న యెడల, దానికి దేవుడు జవాబు ఇవ్వవలెనని కోరినయెడల, మరేదైనా విన్నపము వున్న యెడల, చేతులెత్తి చూపండి. "దేవుని ముందు నాకొక విన్నపము వున్నదని," చెప్పండి. మనము ప్రార్థించుచుండగా, మన తలలను వంచుదము.

2మా పరలోకపు తండ్రి, నీ యొద్దకు వచ్చుటకు ఇది ఒక గొప్ప భాగ్యమని మేము భావించుచున్నా ము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము నీ యొద్దకు వచ్చినప్పుడు, మేము అడిగినది మాకు దొరుకునని వాగ్దానము చేయబడినదని మేము ఎరుగుదుము. ఇప్పుడు మేము తీర్పు సింహాసనము వద్దకు వచ్చుట లేదు. న్యాయ పీఠము వద్దకు వచ్చుటకు మాకు నిజముగా ఇష్టము లేదు. కాని కృపా సింహాసనము యొద్దకు వచ్చుచున్నాము, మా విన్నపములు తప్పక అనుగహించబడునని నమ్ముచున్నాము. ఏలయనగా, నీ తీర్పుకు మేము నిలబడలేము. నీ న్యాయమును బట్టి కూడా జీవించలేము, కాని నీ యొక్క కనికరము కొరకు వేడుకొనుచున్నాము. ప్రభువా, మా పాపములను క్షమించుము. వీరి ఎత్తబడియున్న చేతులను చూపుచున్న ప్రతి విన్నపమును అనుగ్రహించుము. మరియు ఈ రాత్రి మాతో ఉండుము. ఆ చేతుల వెనుక వారి హృదయములో ఏమున్నదో నీకు తెలియును. దేవా, సందేహము లేకుండా అది వ్యాధి కావచ్చు, రక్షణ కావచ్చు, మరియు వారి ప్రియుల నిమిత్తమైనది కావచ్చు. తండ్రీ, ఈ రాత్రి వారి కొరకు మరి విశేషముగా ప్రార్థించుచున్నాము. వారి యొక్క మనవులను వారికి దయచేయండి.

3ఇప్పుడు మేము ఈ రాత్రి నీ రాజసేవకుడైన అబ్రాహామును గూర్చి మాట్లాడుచున్నాము. ఆయన ప్రయాణములో కొనసాగుచు ఎన్నో వందల సంవత్సరముల క్రితము నీ వాక్యమును నమ్మిన నీ విశ్వాసమైన సేవకునితో మేము వెళుతుండగా, మమ్ములను మీరు దీవించండి. అబ్రాహాము ఏమైయున్నాడో, పౌలు హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా, అది మాకొక మాదిరిగా వుండును గాక. దేవుని వాక్యమును నమ్ముటకు, ఒక్క మాటను కూడా అనుమానించక, అంతటిని ఆయన చెప్పిన సమస్తమును నమ్ముటకు ఆయన కలిగియున్న విశ్వాసము ఈ రాత్రి మాకు బయలుపరబడవలెనని మేము ప్రార్థించుచున్నాము. మరియు ఆయన మాకు చేసిన వాగ్దానములతో క్రీస్తులో వుండి అబ్రాహాము పిల్లలముగా యుందుము గాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్ (మీరు కూర్చొవచ్చు.)

4సహోదరుడు బార్టర్ గారూ, నా కంటె కొంచెము ఎత్తుగా వున్నారు కాబట్టి నేను మైక్రోఫోను దగ్గరకు కొంచెము ముందుకు జరగాలి, మరలా ఈ రాత్రికి, ఈ కూటములో ఇక్కడ వుండుట, రోగుల కొరకు ప్రార్ధించుటకు మరియు పరిశుద్ధాత్మ ఏమి ఆజ్ఞాపించినదో అది చేయుట ఒక భాగ్యముగా వున్నది. అభినందనగా దీనిని చెప్పగోరుచున్నాను. అమెరికా, కెనడా దేశములలోని నా ప్రయాణములన్నింటిలో, చక్రాల కుర్చీలు ఖాళీ చేయుట, చేతి కర్రలను క్రింద పడ వేయుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడుట, చెవిటి వారు వినుట, మృతులు లేపబడడము, డాక్టరు "ఆ వ్యక్తి చనిపోయాడని ధృవీకరించడము, అతడు తిరిగి లేవడము," జరిగినను నిన్న రాత్రి చూచినది నన్ను పరవసింపచేసినది. అది అంతా పరవశముగా వున్నది. నిన్న రాత్రి నేను సంఘ సభ్యులుగా నున్న ప్రజలను చూచినప్పుడు, వారు సత్యమును స్వీకరించి, ప్రజల మధ్యలో నిలబడి, వారు అపరాధులు అని ఒప్పుకోవడము మరియు మంచిని చేయుటకు ఇష్టపడడము, నేను ఎరిగిన వాటిలో అతి శ్రేష్టమైన విషయము.

5సంఘము, లేక వధువు ఎన్నుకోబడి యున్నది. ఇప్పుడు ఆమె సిద్ధపడుచున్నది.

ఉజ్జీవము ముగిసినది. మనకది తెలియును. ఉజ్జీవపు ఆత్మ ఎంత మాత్రమును ఇక లేదు. కూటము రెండు గంటలుగా జరుగుతున్నదని ప్రతివారు పిర్యాదు చేయుచున్నారు. ఒక ఉజ్జీవములో, అది ఎల్లపుడూ రాత్రీ, పగలు ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఉజ్జీవము అయిపోయినది. కాబట్టి ఇప్పుడు మనము పంటను సేకరించుకొనుచున్నాము.

గుణలక్షణమును కనుగొనునంత వరకు అతడు కష్టపడవలసియున్నది. అతడు గుణలక్షణమును కనుగొన్న తరువాత సంగతి ఏమనగా, అతడు ఆమెను పెండ్లికుమారుని కలుసుకొనుటకు సిద్ధపడుట. దాని తరువాత అతడు ఆమెను ఎప్పుడు కనుగొన్నాడో మీకు గుర్తున్నదా? సాయంకాలపు వేళలో, సాయంకాలపు వెలుగు.

నిన్న రాత్రి స్త్రీల, పురుషుల తలంపులను తట్టుచున్నప్పుడు, వాక్యము పట్ల వారి గౌరవమును, వారు లేచి నిలబడి తప్పులను ఒప్పుకోవడము, దేవుని పాపక్షమాపణ కోరడము ఇంకా ముందుకు వెళ్ళడము చూస్తున్నాను. ఉజ్జీవమును పొందుటకు ఇదే స్థలము. నేను ఎరిగిన ఉజ్జీవము ఏదైనను వుంటే, యదార్ధ హృదయములన్నిటికి అది ఇక్కడే జరుగుతుంది. ఎందుకు? నీలో పని చేయుటకు నీవు దేనినో కలిగియున్నావు. ఏదో వున్నది… వారిలో అనేకులు గర్విష్టులుగా వుంటారు. దాని గురించి నీవు వారికి చెప్పుట వారికి ఇష్టము లేదు; కేవలము గుర్తుంచుకొనండి, అది సంఘ శాఖ సంబంధమైన విత్తనము, అబ్రాహాము సంతానము కాదు. ఒక అబ్రాహాము సంతానము వాక్యమును చూస్తుంది, మరియు త్వరగా వాక్యమును నమ్ముతుంది.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 4:19,25,26,29

 

6ఆ వేశ్యయైన ఆ స్త్రీ బావి దగ్గర వున్నప్పుడూ… అక్కడ చుట్టూ యాజకులు మరియు రబ్బీలు నిలబడి యేసు వారికి లేఖనానుసారమైన మెస్సీయా గుర్తు చూపించడము చూస్తున్నారు. కాని వారేమో, "అతడు బెయెల్జెబూబు, ఒక దయ్యము, అదృష్టాన్ని చెప్పేవాడు," అనుచున్నారు.

కాని ఆ వెలుగు ఆ స్త్రీపై ప్రకాశించగానే, ఆమె ఏమి చేసినదో ఆయన చెప్పినప్పుడు, ఆమె ఇలా అన్నది, "అయ్యా, నీవు ప్రవక్తవని గుర్తించుచున్నాను. మరియూ మెస్సీయ వచ్చుచున్నాడని మాకు తెలియును. ఆయన వచ్చినప్పుడు, ఆ విషయములను మాకు చెప్పును." చూడండి, వెంటనే ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము దానిని పట్టుకొన్నది, ఎందుకనగా అది నిజముగా అబ్రాహాము సంతానము. ఆమె వెలుగును చూచినది. అది వాక్యమై యుండెను. వాక్యము దానిని వాగ్దానము చేసినదని ఆమెకు తెలియును. మెస్సయా వచ్చినప్పుడు, అతడు ఆ కార్యములను చేయును, మరియు ఆమె దానిని గుర్తించినది.

యేసు ఇలా అన్నాడు, "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను."

ఆమె పట్టణములోకి పరుగెత్తుకుని పోయి ఇతరులను ఒప్పించుటకు ప్రయత్నించినది. ఆమె ఇలా అన్నది, "నేను చేసిన ఈ సంగతులను గూర్చి చెప్పిన ఈయనను వచ్చి చూడండి. ఈయన మెస్సీయ కాడా?" చూచారా?

ISA 4:2

 

7ఇప్పుడు సహోదరీలకు ఒక మాట. నేను ఎల్లపుడూ స్త్రీ ద్వేషకుడనని భావించుతారు, కాని నేను అలా కాదు. చూడండి, నేను చిన్న బాలుడుగా వున్నప్పుడు, నాకు ఒక రకమైన అనుభవము కలిగినది; కాని నాకు ఎల్లప్పుడూ స్త్రీల పట్ల అనగా ఒక నిజమైన స్త్రీ పట్ల, గొప్ప గౌరవము వున్నది. కాని మంచివారమని చెప్పుకుంటూ, అలా ఉండని వారి పట్ల నాకు ఏ మాత్రం గౌరవము ఉండదు. ఒక స్త్రీని ఒక నిజమైన స్త్రీని నేను చూడగోరుదును. ఆమె నిజమైన మాణిక్యమై యున్నది.

ఈ దినమున, స్త్రీలు చెడిపోయి యున్నారు. అధికమైన వారు వ్యత్యాసముగా వున్నారు. లేఖనము ఆ రీతిగా చెప్పుచున్నది. ఎందుకు? ఈ కాలము దాటిపోవునదై యున్నది. మొదటిగా తప్పిపోయినదేదో మీకు గుర్తున్నదా? ఒక స్త్రీ అయి వున్నది. అది నిజము. ఈ చివరి దినమున! ఈ విధముగా మనకు ఎన్నడూ లేదు: మనకున్న 6000 సంవత్సరములలో స్త్రీలు, స్త్రీలుగానే వుండుటకు ప్రయత్నించారు. ఇప్పుడు వారు పురుషుని వలె ప్రవర్తించగోరుచున్నారు. పురుషుని వలె బట్టలు వేయుచున్నారు, పురుషుని వలె జట్టు కత్తిరించు కొనుచున్నారు. వారు అలా ఏ ఇతర యుగములలోనూ చేసియుండలేదు. చివరి దినములలో వారు ఆ రీతిగా చేయుదురని బైబిలు ముందుగా చెప్పియున్నది. స్త్రీలలో చెడుతనమున్న ఈ కాలములో మనమున్నాము. బైబిలు ఈలాగు చెప్పడంలో ఆశర్యం లేదు, "ఆ దినమున సీయోనులో నుండి తప్పించుకొనిన వారు ప్రభువు దృష్టిలో మహిమకరముగా వుందురు." ఆ తప్పించుకునే వారి సంగతి!

GAL 1:8

 

8"అది ఏ వ్యత్యాసము చూపించందు," అని నీవనవచ్చు. అది వ్యత్యాసము చూపించును. కొంతకాలం క్రితం నాతో ఒకరు ఇలా అన్నాడు "సహోదరుడా బ్రెన్హాం, ఆ చిన్న సంగతి ఏ వ్యత్యాసము చూపించదు."

నేనన్నాను, "అది పౌలుకు వ్యత్యాసముగా వుండినది." మరియు పౌలు ఇలా అన్నాడు, "పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతయైననూ మరొక దానిని బోధించిన యెడల వాడు శాపగ్రస్తుడు అగును గాక." వారు సేవకులైనను, దేవదూతయైనను, బిషప్ అయినను, పోప్ అయినను, అతడు ఎవరైనప్పటికి, దీనికి భిన్నముగా భోదించినచో అతడు శాపగ్రస్తుడు." చూడండి, అది ఖచితం. మీరు చదువగోరన యెడల గలతీ 1:8.

అతడన్నాడు, "మంచిది, నేను అలా అనుకోను…" "పొట్టి జట్టుతో వున్న స్త్రీలు ఎంతో దీనముగా అందముగా వున్నారు," అన్నాడు.

"అది అక్షరాల నిజమే, దానిని కూడా నేను చూశాను. కాని అది ఇలాంటిది కాదు, అని నేనన్నాను. చూడండి, బైబిలు ఏమి చెప్పుచున్నదో దాని యొద్దకు నీవు రావలసియున్నది!"

దేవుడు మోషేతో, "నీ చెప్పులు విడువము" అన్నప్పుడు, అతడు "దానికి బదులుగా ప్రభువా! నేను నా టోపీని తీసివేయుదును" అని అంటే ఎలా ఉండునో చూడండి? దేవుడు చేయమని చెప్పినదే నీవు చేయవలసియున్నది. మరియు దాని చిక్కంతా నేను ఆలోచించినప్పుడు, దానిని గూర్చి ఏది నన్ను బాధించునంటే, సేవకులు అలాంటి వాటితో వుంటారు. ఏమిటది? అది చూపేదేమంటే అధునాతన ఆదాము తన భార్యతో వెళ్ళడమే, చూశారా. వాక్యముతో మాత్రమే, ఆయనతో మాత్రమే నిలబడే మరొక ఆదాము ఆయనకు కావాలి. ఏది ఏమైనప్పటికి వాక్యమే సత్యము! కాబట్టి ఆ దారి గుండా వెళ్ళవద్దు.

GEN 3:16•

GEN 24:64,65

 

96000 సంవత్సరములలో ఎన్నడూ స్త్రీలు జట్టు కత్తిరించుకోవాలనే కోరికను కలిగియుండడము, పురుషుని వలె బట్టలు ధరించడము, వక్రమైన రీతిగా ఉండడము అది ఎప్పుడునూ లేదు. మనము అంత్యకాలములో యున్నాము. అమెరికా గురించి ప్రవచనము ఎరిగిన వారికెవరికయినా అది తెలియును. అమెరికా దేశమునకు స్త్రీ ప్రాతినిథ్యం వహించుచున్నది. ఇది "స్త్రీ స్వేచ్చ," అని పిలువబడినది. దేనికి స్వేచ్చ? ఆమెకు ఇష్టమైన దానిని చేయడము — పాపము.

తన కిష్టమైన దానిని ఒక స్త్రీ చేయరాదు. చెయ్యకూడదని బైబిలు చెప్పుచున్నది. స్త్రీ మానవుని యొక్క ఉప-ఉత్పత్తి. ఆది సృష్టిలో ఆమె ఎంత మాత్రమునూ లేదు. అది అక్షరాలా సత్యము. ఆమె పురుషుని నుండి తీయబడినది. మానవుడు రెండుగా అనగా, స్త్రీ, పురుషుడుగా వుండెను. ఆయన స్త్రీ ఆత్మను తీసి, అతని ప్రక్క నుండి వచ్చిన ప్రక్కటెముకలో ఉంచెను. వినండి! రిబ్కా ఇస్సాకును కలుసుకొనుటకు వెళ్ళినప్పుడు, మీరు గమనించారా, ఆమె ఒంటె మీద నుండి దిగి తన ముఖమునకు ముసుగును వేసుకొనెను. ఎందుకు? ఆమె శిరస్సు యొద్దకు వచ్చుచున్నది.

అది వారికి తెలియదు. ఏమైనప్పటికి దానిని వారు చేయవలసియున్నది, మీరు ఎప్పుడైన స్త్రీని గమనించారా? ఆమెకు వివాహము కాబోయేటప్పుడు, ఆమె తన ముఖమును కప్పుకొనును. ఎందుకు? ఆమె తన శిరస్సు నొద్దకు వచ్చుచున్నది. మరియు సంఘము వధువుగా ప్రతి విధమైన ఆచారమునకు తన ముఖమును కప్పుకొనవలెను, ఏలయనగా ఆమె తన శిరస్సు, అనగా వాక్యము నొద్దకు వచ్చుచున్నది. క్రీస్తు వాక్యమైయున్నాడు, మరియు శిరస్సై యున్నాడు.

ROM 10:14,15

 

10ఇప్పుడు, స్నేహితులారా, దాని మీద ఇప్పుడు ప్రారంభించడం నాకు ఇష్టము లేదు. ఈ దినమున అక్కడ నేను, బైబిలు మీద లోతైన బోధలలో "500" పుస్తకములను బైబిలు పాఠములపై చూచుచుంటిని. కాని, ఏదో ఒక విధంగా అబ్రాహాముతోనే ఈ కూటములో నేను నిలిచి యుండాలని ఆశించాను.

మన సహోదరులందరూ, ప్రతి ఒక్కరూ ఏమి అనుకొనని ఎడల నేను మరలా ఇక్కడకు తిరిగి వచ్చి, ప్రభువు చిత్తమును బట్టి ఉజ్జీవ కూటములను నడుపుతాను. మీరు కొంచెము సమయము అక్కడ వుండి నిజ స్థితుల లోనికి వెళ్లి చూడవచ్చును. మీకు తెలుసా, ప్రభువు దానిని మనకు ఇచ్చునని, నేను నమ్ముదును. [సమాజములో చప్పట్లు కొట్టుచున్నారు.] మీకు వందనములు. మీకు వందనములు. ఇక్కడ చేపలు వున్నవని నాకు తెలియును, అది నాకు బాగా తెలియును. మరియు చేపలు పట్టుట నాకు ఇష్టము. యదార్ధముగా వున్న వారితో పని చేయుట మీకు కావలసినది వున్నది. ఎవరైన తప్పు చేయగలరు, అది మీకు తెలియదు, నేను నా తప్పులతో ప్రతి దినము చనిపోవుచు క్రీస్తునందు జీవించుటకు నేను ప్రయత్నించుచున్నాను. మరియు ఎవరైనా పెద్దవారు, తగినంత దేవుని ఆత్మను కలిగి ముందుకు వచ్చి, తాము తప్పుగా వున్నామని ఒప్పుకొనుచు, "నాకు నిజమైనది కావలయునని చెప్పుట." అక్కడ నాకు చాలినంత నమ్మకము వున్నది, ఏలయనగా అది నిజముగా అబ్రాహాము సంతానము. దానిని వారు తెలుసుకొనగోరుచున్నారు. వారు దానిని విననిదే తెలుసుకొనలేరు. కాని అది ముందుగా వినవలసి యున్నది, చెప్పెను, "బోధకుడు లేకుండా ఎలా మనము వినగలము? మరియు దేవుడు పంపనిదే ఒక బోధకుడు ఎలా బోధించగలడు?" అది అక్షరాలా సత్యము.

11ఇప్పుడు, దానిని గమనించండి.

ఇప్పుడు మనము అబ్రాహాము దగ్గరకు తిరిగి వెళ్ళుచున్నాము. మనము ఆయన యొద్దకు మరలి, దానిని కొనసాగించుదము, మీవారందరూ నా మాటలు వినగలుగుచున్నారా, పైన బాల్కనీలలో యున్నవారు? ఇంత చక్కని సమూహమును, ఈ రాత్రి చూచుటకు చాలా బాగున్నది. మీరు ఎంతో చక్కని ప్రేమ గల ప్రజలు. నిజముగా…

ఈ దినమున కెనడా నుండి వచ్చిన ఒక స్నేహితునితో మాట్లాడుచుచుంటిని. ఏదో జరుగుటను, కనిపెట్టుటకు, ఒక నిర్ణీత స్థలమునకు ప్రభువు నన్ను నడిపించారు. మరియు అక్కడ నిలుచుండి యున్నప్పుడు… నేను కలుసుకున్న ఈ స్నేహితుడు అమెరికా ప్రజలు ఎంత స్నేహముగలవారో మాట్లాడుచుండెను. అప్పుడు నేను ఇలా అన్నాను, "అవును, ఇంత దుష్టత్వముతో నిండిన ఈ స్థలములో, దాని చుట్టూ కొంత ముందుగా నిర్ణయించబడిన దేవుని విత్తనములున్నవి." ఇక్కడున్న మీ పట్టణము మాత్రము కాదు. నేనున్న నా పట్టణము గూడ మీ పట్టణమంత చెడ్డది. కాని లోకమంతా దుష్టత్వములో నున్నది, కాని ఈ చెత్త మూక అంతా తేలి ఆడుకుంటూ పశ్చిమానికి వచ్చినది. అది మనకు తెలుసు. నాగరికత దానితో పాటు ప్రయాణము చేసినది. మరియు నాగరికత ఎక్కడ వున్నదో అక్కడ పాపము జతయైనది. అది నిజము. ఇక్కడ దానిని పైన, క్రింద చూడండి! లాస్ ఎంజలీస్ ను చూడండి, ప్రతిది, ప్రతి ఆరాధనా పద్ధతి దానిలోనికి తిన్నగా దిగిపోతుంది. మరియు ప్రతి ఒక్కరికి ఒక ఆచారము, ఒక సిద్ధాంతము వున్నది. దానిలోనికి నీవు వాక్యమును తీసుకుని వెళ్ళ వలెనంటే, నీవు దానిని చేయ లేవు. అది ఎంతో కలుషితమై పోయినది. అది నిజము. దయ్యములు, దయ్యపు శక్తులు, సాతాను పీఠము నొద్దనే వున్నవి. అయినప్పటికీ వాటన్నింటి మధ్యలో, కొన్ని విత్తనములు కూడా అక్కడ వున్నవి. నీవు చేయ గలిగినది ఒక్కటి వున్నది, అది వెలుగును ప్రసరించుట మాత్రమే. అక్కడ విత్తనము వున్నట్లయితే దానిని వెలుగు తాకిన వెంటనే అది మొలకెత్తుతుంది. నీవు కేవలము వెలుగును ప్రసరింపజేయవలెను. అంత వరకే, మరియు ఆయన సాయంకాలపు వెలుగైయున్నాడు, అది ఆయన వాక్యమని మనకు తెలుసు.

GEN 15:9,10

 

12నిన్న రాత్రి మనము అబ్రాహామును విడిచిపెట్టాము. నేను ఆదికాండము 22వ అధ్యాయములో మొదలు పెట్టాను, కాని దాని లోనికి వెళ్ళలేకపోయాను, ఎందుకనగా అబ్రాహాము ప్రారంభములో దేనిమీద ఆధారపడి వున్నాడో ఆ వెనుకకు వెళ్ళాడు. దేవుడు ఆయనతో నిబంధనను రూఢి చేయడము దగ్గర నిన్న రాత్రి ఆయనను మనము వదిలిపెట్టాము. ఓ, అదంటే నాకు ఇష్టము. ఆతిధ్యమియబడిన జంతువులను ఖడించుచు అబ్రాహాముతో నిబంధన చేసెను. ఆయన అబ్రాహామును పిలిచినప్పుడు, అతని నిబంధనను రూఢి చేయుచుండెను. మూడు సంవత్సరముల జంతువులను తీసుకుని, వాటిని వేరు చేయమని అతనితో చెప్పుట మనము చూశాము. మనము త్రిత్వమును కలిగియున్నాము. దానిలోనికి వెళ్ళుటకు మనకు సమయము లేదు. మీరు ఆ ఒకే ఒక అంశము మీద అక్కడే ఉదయము వరకు నిలబడియున్ననూ దానిని మీకు వివరించలేను. కాని మనము కొన్ని ఉన్నత స్థలములను తాకుచూ పరిశుద్ధాత్మ ఈ సమయములో మిగిలిన దానిని బయలుపర్చవలెనని ఎదురు చూద్దాము.

JOHN 1:14•

JOHN 14:12•

COL 2:9•

1TIM 3:16

 

13ఆ పరిపూర్ణత, పరిపూర్ణ బలియర్పణ, ఆయన చేయబోవుచున్న దానిని మానవ జీవితంలో ఆయన పరిపూర్ణుడు కావడం ఎలా వున్నదో చూడండి. మనకు తండ్రియైన దేవుడున్నాడు. ఆయన సర్వశక్తిగల యెహోవా. అప్పుడు ఆయన వెలుగు స్తంభముగా యుండెను, ఇశ్రాయేలును ఆరణ్యము గుండా తీసుకుని వెళ్ళెను. మరియు ఆ యెహోవాయే శరీరధారియై, తన అద్వితీయ కుమారుని రూపములో మనమధ్య నివసించాడు. తాను నివసించడానికి ఒక గుడారమును సృజించుకొనెను. దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమాయెను. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా ఆయనయందు నివసించెను. పరిపూర్ణమైన ప్రత్యక్షత, తరువాత (నిబంధన ద్వారా) ఆయనలోని శరీర భాగము తీసివేయబడి, ఉగ్రతకు గురికావడము ద్వారా, చనిపోయిన మానవ శరీరమును వేరు చేసి, పాపక్షమాపణ కొరకు రక్తము కార్చి, దానిని తిరిగి లేపి, తన కుడి పార్శ్వమున కూర్చుండ బెట్టుకుని, పెంతెకోస్తు దినమున ఆ ఆత్మను తిరిగి మన మధ్యకు పంపెను. క్రీస్తు యేసులో జీవించిన ఆ జీవమే నిబంధన ప్రజలలోను జీవించవలసియున్నది. అదే జీవము అదే కార్యమును చేయును. యోహాను 14:12లో యేసు చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను చేయును." ఇప్పుడని నిజమైనవిగానో, లేక అబద్దవైనవిగనో ఉండాలి. నాకైతే దానిలోని ప్రతి మాట నిజమైయున్నది. ప్రతి మాట పరిపూర్ణముగా నిజమైనదే. దేవుడు ఎంత మహిమకరముగా పనిచేయుచున్నాడో గమనించుడి.

GEN 15:17•

MATT 28:19•

HEB 13:8

 

14మత్తయి చెప్పినట్లుగా, "మీరు సర్వలోకమునకు వెళ్ళి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మమును ఇయ్యుడి," చూడండి. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు వున్నారని అర్థం కాదు. ఒకే దేవుడు మూడు కార్యములలో వున్నాడు; పితృత్వము, కుమారత్వము, పరిశుద్ధాత్మ; అదే దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు. అది ఖచితము.

అబ్రాహాముకు బయలుపరబడినది ఎంత మహిమకరముగా వున్నదో గమనించండి. దేవుడు ఈ వెలుగులో, వాటిని ఖండించుకుంటూ, ఈ ఖండముల మధ్యన వెళ్ళెను. నిన్న రాత్రి వారు ఏ విధముగా ఆ ఒప్పందమును చేశారో చూశాము, దానిని వ్రాసి మధ్యకు చింపేవారు. అవి రెండును తప్పక ఒకదానితో ఒకటి సరిపోవాలి. ఆ ఒప్పందము తప్పక ఒకదానితో ఒకటి సరిపోవాలి.

MATT 7:16,20

 

15ఇప్పుడు మీరు చూడండి, స్నేహితులారా, అదే నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నది. మన పెంతెకోస్తు ప్రజల మధ్యలో కూడా, అది తెలివిగల దయ్యముగా మారుతున్నది, ప్రజలను నమ్మించుటకు ప్రయత్నము చేయుచున్నది… నేను దేవుని వరములన్ని నమ్ముదును. నేను కేకలు వేయుట నమ్మదును. భాషలలో మాట్లాడుట నమ్మదును. దేవుడు చెప్పిన సంగతులన్నిటిని నేను నమ్ముదును. అయినను నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావని చెప్పుటకు, వీటిలో దేని పైనను నీవు ఆధారపడుటకు వీలులేదు. నీ జీవితము సత్యమైన దానితో వెళ్ళవలసియున్నది, చూశారా. "మీరు మీ ఫలము వలన తెలియబడుదురు," చూశారా. ఈ దినమున నన్ను బాధించేవి ఆ సంగతులే, ఎందుకనగా నేను నా సొంత సంఘమును చూచుచున్నాను. పెంతెకోస్తు సంఘమును చూచుచున్నాను. అది "పైకి భక్తిగలదిగా" వుండి, సత్యమునకు దూరముగా వెళ్ళిపోయినది. మరియు వారికి వాక్య సత్యమును తీసుకొని వెళ్ళినప్పుడు, వారు దాని నుండి వెనుకకు వెళ్ళిపోతున్నారు. వారిని "వచ్చి నాతో కూర్చొండి," అని అడిగినప్పుడు వారు రారు. చూశారా, అక్కడ ఏదో తప్పు వున్నదని అది చూపుతుంది. అదే నన్ను బాధించేది. అది ఆ సంఘమునకు నేను వ్యతిరేకము అని కాదు.

16నేను క్రిస్తును ప్రేమించినయెడల, ఆయన మీద నేను ఆయన కంటెను అధికముగా చెప్పుకొనుట కంటే సంఘమును గురించి చెప్పుట నాకు ఎంతో మంచిది. మీరు నన్ను అధికము చేసి పలుకుట కంటే నా పిల్లలను అధికులను చేసి పలుకుట మంచిది. గుర్తుంచుకోండి, నేను తరచు ఇలా తలంచేవాడిని. నాకు రెండు చుక్కల యేసుక్రీస్తు రక్తము సిలువలో వున్నట్లయితే, నేను దానిని ఎలా జాగ్రత్తగా పట్టుకుంటానో, దానిని క్రింద పడనీయను. నేను చాలా జాగ్రత్తగా నడుస్తాను. కాని ఈ రాత్రికి, ఆయన దృష్టికి దాని కంటే ఎక్కువగా నా దగ్గర వున్నది. నా దగ్గర ఆయన రక్తము ద్వారా కొన్నది వున్నది. చూడూ, నీ కొరకు ఆయన తన రక్తమును చిందించెను. ఇక్కడ ఈ రాత్రి దానిని ఒక సేవకునిగా దానిని పట్టుకుని మీ నిత్యత్వ గమ్యమును చూపుచూ నిలబడియున్నాను. కాబట్టి నేను మిమ్మును ఏ ఆచారమునకు, ఏ సిద్ధాంతమునకు నడుపుట లేదు. అది వాక్యమై యుండవలసి యున్నది, కారణము అది ఒక్కటి మాత్రమే తుదివరకు నిలుచునది. నా విశ్వాసము వాక్యముపై నిర్మించబడియున్నది. మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. మరియు క్రీస్తు వాక్యమైనప్పుడు, అపుడు వాక్యము మన మధ్యలోనే ప్రత్యక్షపర్చబడవలసి యున్నది. చూడూ, అది ఆ రీతిగా వుండవలసినది!

MATT 28:20•

JOHN 14:19

 

17అందుచేత, పాత నిబంధనలోని దేవుడు తన్ను తాను తన కుమారుడైన యేసులోనికి కుమ్మరించుకొనెను. మరియు క్రొత్త నిబంధనలోని యేసు, తన్ను తాను తన స్వరక్తముతో కొన్న సంఘములోనికి కుమ్మరించుకొనెను, చూశారా. "కొంచెము కాలము లోకము, [అనగా లోకములో వున్న దాని స్థితి], నన్ను చూడదు. అయిననూ మీరు నన్ను చూతురు," [మీరు అనగా సంఘము], యుగ సమాప్తి పర్యంతము నేను మీతో ఉందును. మీలో ఉందును అప్పుడు జీవము, ఆ ఒప్పందము కలువరిలో యేసు నుండి తీసిన ఆ ఆత్మ తిరిగి వచ్చి దేవుడు వాగ్దానము చేసిన అబ్రాహాము సంబంధమైన తన ప్రజల పైన కుమ్మరించబడెను. గుర్తుంచుకొనండి, అది అతని సంతానములన్నిటికి కాదు, కాని "సంతానమునకు."

ROM 8:29•

ROM 9:13

 

18ఇక్కడ, ఒక ముందు నిర్ణయము అను చెడిపోయిన వెర్రి సిద్దాంతము వున్నది. కాని నిజమైన ముందు నిర్ణయము వున్నది. దేవుడు తన పూర్వజ్ఞానము ద్వారా, ఆయనకు పూర్వజ్ఞానము వున్నందున, ముందుగా నిర్ణయిస్తాడు. ఎవ్వరూ నశించుట దేవుడు కోరుట లేదు గాని, ఆయన అనంతుడైన దేవుడు, కావున ఎవరు నశిస్తారో మరియు ఎవరు నశించరో ఆయనకు తెలియును.

ఆ కారణము చేతనే యాకోబు మరియు ఏశావులు పుట్టక ముందే ఆయన ఏశావును ద్వేషించాడు. మరియు యాకోబును ప్రేమించాడు. ఏశావు జంకుగలవాడని, యాకోబు ఆ జ్యేష్టత్వమును గౌరవించాడని ఆయన తన పూర్వజ్ఞానము ద్వారా ఎరిగెను. అతడు దానిని ఎలా పొందినప్పటికిని, దానిని అతడు కోరుకున్నాడు. ఈ ఇద్దరు యవ్వనులు కవలలు, అదే పరిశుద్ధ తల్లిదండ్రుల నుండి పుట్టారు, కాని ఒకడు భ్రష్టుడు, మరొకడు విశ్వాసి. ఇప్పుడు దేవుడు తన పూర్వజ్ఞానము ద్వారా దానిని ఎరిగెను.

HEB 6:7,8

 

19విడిపోయిన ఆకుపై మీరు ఏ కార్యములను చేయరు. దేవుడు తన కార్యమును ఆ విధముగా చేయడు గాని తన పూర్వజ్ఞానముతో ఎరిగినవాడై, రక్షించబడుటకు ఆయన ముందుగా చూచిన వారిని పట్టుకొనుటకై యేసును పంపెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చదవండి. దానిని మీరు చూస్తారు, చూచారా. ఇప్పుడు, అక్కడ.

తరువాత ఆయన తన సువార్తను పంపి, దానిని చల్లి, దాని జీవింపచేయుటకు తన ఆత్మను పంపెను. ఇప్పుడు అవి రెండూ కలసి ఆ పొలములోనే ఎదుగును. హెబ్రీ 6వ అధ్యాయములో మనము దాని చూడగలము. "వర్షము పలుమార్లు భూమిపై కురియును," అని యేసు అన్నాడు. "భూమిపై [మరియు మీరు అక్కడ గమనిస్తే], భూమిని సిద్ధము చేయుటకు గాను; అయితే ముండ్ల పొదలు, గచ్చ తీగెలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాక విసర్జించబడును. దాని అంతము కాలివేయబడుట." దానిని కనుగొనిరా? ఇప్పుడు గుర్తుంచుకోండి.

MATT 7:16,20

 

20మనము గోధుమ పొలమును తీసుకొందము. మీరు ఇక్కడ గోధుమలను పండిస్తారు. కరవు ఏర్పడిన యెడల కలుపు మొక్కలు, ప్రాకే తీగలు ఒక రకమైన కలుపు మొక్కలు పొలములో పెరుగుచుండును; పొలములోని ప్రాకే తీగలు, పాలకలుపు, ముండ్లపొదలు పొలములో ఎదుగుచుండును. మరియు గోధుమలు కూడా పొలములో ఎదుగుచుండును. ఆ రెంటికి దాహమగును కదా. మరి వర్షము వచ్చునప్పుడు కలుపు మొక్క కొరకు కాక గోధుమ కొరకైనను, ఆ చిన్న కలుపు మొక్క కూడా అక్కడే నిలబడి గోధుమ సంతోషించినంతగా సంతోషిస్తుంది.

కాని వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అదే ఆత్మ వేషధారి మీద పడును, మరియు అతడు కేకలు వేసి, మిగిలిన వారి వలెనె ముందుకు సాగిపోవును, కాని అతడు ఏమైయున్నాడో అతని జీవితము రుజువు చేయును, చూడండి. మనము ఉద్రేకము మీద ఎక్కువ ఆధారపడుచున్నాము. ఈ దినమున క్రైస్తవ పొలమంతా పూర్తిగా అన్ని రకముల ఉద్రేకములతో, లేఖనానుసారము కాని అనేక విధముల ఉద్రేకములతో, ఇంకను అనేకమైన వాటితో నిండిపోయినది. అది నిశ్చయంగా వున్నది. అయితే మనము వాక్యమునకు, అనగా వాక్య సత్యమునకు, తిరిగి రావలసియున్నది. చెప్పబడినది వాక్యమై యున్నది.

21దేవుడు అబ్రాహాముతో మాట్లాడుచు ఆయన ద్వారానే ఆ మూడవ నిబంధనను, ఆ ఒకే నిబంధనను చేసెదనని చెప్పుచున్నాడు, అబ్రాహాముతో చేసిన నిబంధనలో రాజసంతానమును, ఆత్మ సంతానమును, యేసు స్థిరపరచువాడుగా యున్నాడు.

మరియు నా ప్రశస్తమైన కాథలిక్ స్నేహితులారా, మీరు "దేవుని తల్లియైన మరియా, నీకు వందనములు" అన్నప్పుడు, మీరు సిగ్గుపడుట లేదా? మరియు దేవునికి ఎలా తల్లి కాగలదు. ఆమె కాజాలదు, కాని మీరు తల్లి అని అంటారు. మంచిది…

నేను నిన్నటి దినమున ఒకరితో మాట్లాడుచుండగా, వారు ఒక రకమైన క్రైస్తవులు, యేసు మరియ సంతానము అని అన్నారు. ఒకవేళ ఆయన మరియ సంతానమైతే, ఆ గర్భము గుండా సంతానము రాక ముందు, దానిని తెచ్చుటకు ఒక స్పర్శ (Sensation) ఉండవలసియున్నది. అప్పుడు మీరు యెహోవాను… ఆయనను ఏమి చేయాలని మీరు చూస్తున్నారు?

దేవుడు సృష్టికర్త, గ్రుడ్డును దాని రక్త కణమును రెండింటిని సృష్టించి, శరీర గుడారమును బయటకు తెచ్చాడు, మానవునికి దానితో సంబంధము లేదు. అది చేసినది దేవుడు మాత్రమే. అది నిజము.

నిశ్చయముగా, ఆమె ఒక మంచి స్త్రీ. చాలామంది స్త్రీలు ఈ రాత్రి ఇక్కడ కూర్చునియున్నారు. మరియు దేవుడు దేనినైన వాడుకొనగానే, అది దృశ్యములో నుండి మరుగైపోతుంది. ఆమె మధ్యవర్తి కాదు. ఆమె దేవునికి తల్లి కాదు. ఆమె ఒక మంచి, మహిమలో వున్న పరిశుద్ధమైన స్త్రీ, ఎందుకనగా ఆమె దేవుని పనిని నెరవేర్చినది. మరియు ఇక్కడ వున్న ప్రతి స్త్రీకి అదే అవకాశము వున్నది, బహుశా అదే విధానముతో కాకపోవచ్చు, కాని దేవునికి సేవ చేయుటకు అవకాశమున్నది, చూశారా. దేవుడు నిన్ను వాడుకొంటాడు.

JOHN 1:1

 

22దేవుడు, ఆమెను కేవలము గర్భము ధరించుటకు గాను పొదుగు సాధనముగా (incubator) వాడుకున్నాడు, కాని కనిన బిడ్డ దేవునికి సంబంధించినవాడు. ఆయన శరీరము మరియూ రక్త కణమును రెండింటిని సృష్టించినాడు. మరియు రక్తములోని కణము పురుషుని నుండి వస్తుంది; మరియు దాని సృష్టికర్త ఆయనే. మరియు ఏ విధమైన స్పర్శ లేకుండా ఈ బాలుని తెచ్చాడు. పరిశుద్దాత్మ ఆమెను కమ్ముకుని ఆమె గర్భములో అండమును, రక్త కణమును సృజించగా, ఆమె క్రీస్తు యేసు అను నరుని కనెను.

మరియు ఆ నిబంధననే దేవుడు వ్రాయుచుండెను. తరువాత దేవుడు మన మధ్య మానవుడైనప్పుడు, ఆయన విడిగా చీల్చబడెను. చూడండి, మూడు సంవత్సరముల ఈడు గల మూడు జంతువులు, విడివిడిగా చీల్చబడెను, మరియు దేవుడు ఒక భాగమును ఇక్కడకు పంపెను. ఇప్పుడు ఆ శరీరము మరలా కలుసుకొన్నపుడు, ఆ శరీరమును పాలించిన అదే జీవము ఈ శరీరమును పాలించిన జీవముగా వుండును. ఆయన వాక్యమై యుండెను. మరియు ఆయన వాక్యముగా యున్నాడు! చూచారా? మరియు ఆ దినమున వాక్యము చేసిన అదే పనులు ఈ దినమున చేయును. ఆయన వాక్యమైయున్నాడు. నిత్యమైన వాక్యము. మరియు దేవుని వాక్యము నిత్యమైనది. మంచిది.

23ఇప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడు? సహజ సంతానమైన ఇశ్రాయేలు ఆయనను తిరస్కరించునని, ఎరిగి ఆయన ఒక మార్గమును చూపించుచున్నాడు; కాని ఆ రాజసంతానము, శారాతో లైంగిక సంబంధము ద్వారా కాక, అబ్రాహాము కలిగియున్న విశ్వాసము నుండి కలిగినదని ఆయన ఎరుగును. అది క్రీస్తును తెచ్చినది. సకల జనముల నుండి ఒక రాజసంతానము, ,మిశ్రమము, అన్ని దేశముల నుండి వధువు ప్రోగుచేయబడుచున్నది. అబ్రాహాము జనములకు తండ్రియైయున్నాడు. అతడు తన భార్యయైన శారాతో నివసించి కుమారుని కన్నందువలన కాదు గాని, అతడు వాక్యమును విశ్వసించినందు వల్లనే. ఆమేన్. అది అంతే.

JOEL 1:4•

JOEL 2:25,28

 

24దీని తరువాత, ఈ గొప్ప అనుభవము. ఇప్పుడు మనము కనుగొందుము, మనమిప్పుడు ఆదికాండము 17వ అధ్యాయములోనికి వచ్చుచున్నాము. సాధ్యమైతే ఆదికాండము 22వ అధ్యాయములోనికి వెళ్ళుటకు ప్రయత్నించుదము. 17వ అధ్యాయమును చూచెదము. అబ్రాహాముతో ప్రయాణమును మీరు ప్రేమించుచున్నారా? దాని గమనించడము నాకు ఇష్టము. ఎందుకు? అతడు చేసిన సమస్తమూ సంఘము యొక్క పరిపూర్ణ మాదిరియై యుండెను. మీరు దానిని నమ్ముచున్నారా? గమనించండి, లేఖనములన్నీ దానికి మాదిరి చూపుచున్నవి.

యోవేలును చూడండి, "అంత్యదినములలో దేవుడు తన ఆత్మను క్రుమ్మరించును," అని చెప్పెను. పసర పురుగు వచ్చి ఆయన సంఘమును ఎలా తిని వేయునో! "గొంగలి పరుగులు విడిచిన దానిని, పసర పురుగులు తినివేయును, మరియు పసర పురుగు, చీడ పురుగు." ఒకే రకమైన ఆ పురుగు, నాలుగు విధములైన దశలలో వున్నది. ఒక్కొక్క భాగమును తినివేయుచున్నది. ఇక్కడ చీడ పురుగు, పసర పురుగు వచ్చి బెరడును తినివేయును. మరొకటి ఫలమును తినును తరువాత మరొకటి వచ్చి జీవమును పీల్చివేయును.

JOHN 6:31,48-50

 

25ఏదెను తోటలో వున్న ఆ వృక్షము క్రిస్తే! ఏదెను తోటలో రెండు చెట్లు వున్నవి! ఈ రెండు చెట్లు ఒక జన్మ నిమిత్తము అక్కడ వుంచబడినవి. హవ్వను ముట్టినచో, ఆమెయే ఆ మరణ వృక్షమైయున్నది. మరియు క్రీస్తు జీవవృక్షమై యుండెను. స్త్రీ ద్వారా మరణము వచ్చును; పురుషుని ద్వారా జీవము వచ్చును.

ఆయన యూదులతో మాట్లాడుచున్నప్పుడు, ఆయన ఇలా అన్నాడు, "నేను…"

అందుకు వారు ఇలా అన్నారు, "మా పితరులు అరణ్యములో నలుబది సంవత్సరములు మన్నాను తినిరి."

ఆయన వారితో, "వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయిరి! అయితే నేను జీవాహారమునై యున్నాను. పరలోకమును దేవుని నుండి వచ్చు జీవవృక్షమును నేనే. ఈ రొట్టెను తినువాడు ఎన్నటికి చనిపోడు."

PS 1:3

 

26ఆ వృక్షమును ఎవరూ ముట్టకుండా కావలి కాయుటకు దేవుడు సెరాపులను అక్కడ వుంచెను. ఇప్పుడు వారు ఆ వృక్షములోనికి ప్రవేశించునట్లు ఆయనకు సెరాపులను తీసివేసెను. ప్రాయశ్చిత్త బలి లేకుండా వారు తిరిగి ఆ వృక్షమును సమీపించుటకు ఆశించునట్లు వారు ఆ దర్శనములో చూశారు. కాని ఇప్పుడు ప్రాయశ్చిత్తము జరిగిన తరువాత సాతాను వారిని గ్రుడ్డివారిగా చేయుచూ, వారిని ఆ వృక్షము నుండి త్రిప్పివేయుచున్నది. గమనించండి.

క్రీస్తు, భూమి మీదికి వచ్చినప్పుడు, ఆయన దేవుని పరిపూర్ణమైన వృక్షమై యుండును. దావీదు ఆయనను మొదటి కీర్తనలో చూశాడు, "నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు," అని అన్నాడు. ఒకే నీరు అయితే అనేకమైన నదులు, ఒకే ఆత్మ, అనేకమైన వరములు. "అతని ఆకులు ఎన్నడునూ వాడిపోవు."

ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు ఏమి జరిగినది? రోమా ప్రభుత్వ శక్తి ఆ వృక్షమును నరికి, మానవ-నిర్మితమైన చెట్టుపై ఆయనను వ్రేలాడదీసినది. అప్పుడు దేవుడు ఆ వృక్షమును లేపి, తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని, ఆదాము ఏదేను తోటలో తనకు ఒక వధువును కలిగి యుండినట్లు, ఒక వధువును సిద్ధపరచుటకు ఆయన తన ఆత్మను తిరిగి పంపెను. మరియు ఆ వృక్షము ఎదుగ నారంభించినప్పుడు, అది పెంతెకోస్తు చెట్టు అయి యుండెను.

JOEL 1:4•

JOEL 2:25

 

27"సంఘములన్నియు తిరిగి తల్లి సంఘమైన రోమ్ నొద్దకు ప్రారంభము వలె రావలెను," అని పోప్ చెప్పుటను మనము విన్నాము.

ఏ ఒక చరిత్రకారుడు గాని, ఒక సేవకుడు గాని, మరి ఎవరైనా గాని నా ముందు నిలబడి, నా వైపుకు చూచి సంఘము రోమ్ దగ్గర ప్రారంభమైనదేమో నాకు చూపమనండి. సంఘము యెరుషలేములో పెంతెకోస్తు దినమున అక్కడే ప్రారంభమైనది! తరువాత 300 సంవత్సరములకు రోమ్ లో ఒక శాఖ ప్రారంభమైనది. కాని సంఘము పెంతెకోస్తు దగ్గర ప్రారంభమైనది; క్రీస్తులో యున్న ఆ ఆత్మతోనే, దేవుడు క్రీస్తు కొరకు ఒక వధువు వృక్షమును లేపుచున్నాడు. అయితే ఏమి జరిగెను? ఆ వృక్షము మూల్గులతో ఎదుగుట ప్రారంభించినప్పుడు, రోమను పురుగు దానిపై పడి దానిని ముక్కలు చేయడము ప్రారంభించినది. గొంగళి పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తిని వేసినది, చివరకు అది తిన్నగా మొద్దుగా మారినది.

కాని "నేను సమస్తమును పునరుద్ధరిస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు." ఆ వృక్షము మరలా రానైయున్నది, ఏలయనగా వధువు వృక్షము వధువు తరువాత వచ్చుచున్నది.

JOHN 17:17

 

28లూధర్ వెలుపలకు వచ్చాడు, అతడేమి చేశాడు? నీతికరణమును అనుసరించాడు.

ఆ విధముగానే ఖచ్చితంగా సంఘము వచియున్నది, యోహాను నీతికరణమును బోధించెను, యోహాను సువార్త 17:17, "సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము." మరియు ఆయన వాక్యమై యున్నాడు. అది నిజము. ఆయన బలియర్పనయై యుండెను. తరువాత పెంతెకోస్తు దినమున, పరిశుద్ధాత్మతో వచ్చెను. నీతికరణము, శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మమును పొందినప్పుడు అది పూర్తి వధువు వృక్షమైయుండెను.

రోమనులు దానిని తినివేశారు. అది క్రిందికి వెళ్ళిపోయిన రీతిగానే, అది పైకి వచ్చెను! మరియు లూధర్ ద్వారా అది పైకి రావటం ప్రారంభమైనప్పుడు ఏమి జరిగింది? లూధర్ మరణము తరువాత దానిని సంస్థాగతము చేసిరి. యజమాని ఏమి చేశాడు? పాత చచ్చిన ద్రాక్షా కొమ్మలను నరికి వేశాడు.

ఆమె వెళ్ళిపోగానే, వృక్షము యొక్క లోపలి భాగము ముందుకు పెరుగుచు వచ్చినది. అది ముందు నిర్ణయించబడిన వృక్షము. ఆ విత్తనము అక్కడ పడియున్నందున, అది రావలసి యున్నది. మరియు అది పైకి రాగానే, వెస్లీ దానిని ప్రారంభించాడు. శుద్దీకరణము క్రింద వారు గొప్ప ఉజ్జీవమును కలిగియుండిరి. ఆ తరువాత ఏమి జరిగింది? వారు సంస్థగా మారగానే ఆయన మరలా దాని కొమ్మ నరికెను. ఎన్నడూ ఒక సంస్థగా మారినది తిరిగి పైకి లేవలేదు. పడిపోయినది ఏదీ కూడా ఎన్నడూ తిరిగి పైకి రాలేదు.

JOEL 2:25

 

29దాని వెంబడే వరముల పునరుద్ధరణతో పెంతెకోస్తు వారు వచ్చారు. వారు ఏమి చేశారు? శాఖగా మారారు! అప్పుడు దేవుడు ఏమి చేశాడు? దాని యొక్క కొమ్మలను నరికి వేశాడు!

కాని, ఆయన చెప్పెను, "నేను పునరుద్ధరిస్తాను అని ప్రభువు సెలవిచుచున్నాడు." ఆ మిశ్రమములో నుండి, రక్తములో కడుగబడి, బైబిలుతో కొనబడిన మరియు వాక్య స్థిరత్వముగల వధువును, తన సంఘమును బయటకు తెచ్చుచున్నాడు. సాయంకాలపు వెలుగులు బయటకు వచ్చుచున్నది. పండు ఎక్కడ పండుతుంది? నేరుగా చెట్టుపై భాగములో. నేను మరలా అక్కడికి వెళ్ళుదును!

అబ్రాహాము దగ్గరకు తిరిగి వెళ్ళెదము. ఇక్కడ అతడు వచ్చుచున్నాడు, సాయంకాల సమయపు రాజ సంతానము ఇప్పుడు వచ్చుచున్నది. జనములు… ఆదికాండము 17వ అధ్యాయము నుండి గమనించండి, సర్వశక్తి గల దేవుని నామములో అబ్రాహామునకు దేవుడు ప్రత్యక్షమాయెను.

ROM 4:18,19

 

30అబ్రాహామునకు 99 సంవత్సరములు, ఈ కాలమంతయూ అతడు ఎన్నడూ సందేహించలేదు, కాని దేవుని వాక్యమును నమ్మెను; మరియు లేనివాటిని వున్నట్లుగానే పిలిచెను, ఎందుకనగా దేవుడు ఆ రీతిగా ఆయనతో చెప్పెను. దేవుని వాగ్దానముపై నిలచి కుమారుడు పుడతాడని ఇంకనూ నమ్మెను. ఎలాంటి మనిషి! ఎలాంటి సోదరుడు! "అబ్రాహాము నిరీక్షణకు వ్యతిరేకముగా వున్నాడు…" శారా గర్భము మృతతుల్యమైనదని అతడును ఫలించనివాడుగా వున్నాడు. అతని శరీరము మృతతుల్యమైనది. బైబిలు చెప్పుచున్నది, ఆ రీతిగా అతని శరీరము మృతతుల్యమైనది అని చెప్పునంతగా వున్నది. మరియు శారా గర్భము కూడా మృతమైనది. మరియు ఆమెకు ఋతుస్రావము ఆగిపోయి 40 సంవత్సరములు అయినవి. అయిననూ అబ్రాహాము దానిని నమ్మెను, ఎందుకనగా దేవుడు అలా చెప్పాడు. కాబట్టి ఆమె బిడ్డను పొందును. అక్కడే నీవును ఉన్నావు. వాక్యముపై గట్టిగా ఉండాలి, ఎందుకనగా దేవుడు ఆ రీతిగా చెప్పాడు! ఆచారములు దానిని పైకి కప్పివేసినా లెక్కలేదు. ఇంకనూ వాక్యము అక్కడ వుంచబడి వున్నది. అది రావలసియున్నది. మరియు వాక్యము అబ్రాహాము హృదయములో వుంచబడియున్నది.

"ఆ రోజులు గడిచిపోయినవని ఎందరు చెప్పినా, అది అక్కడ వున్నది." వాక్యము అక్కడ వున్నంత కాలము అది సృజనాత్మకమైనది. అది ఫలదీకరణము చెందిన వాక్యము, ఏలయనగా దేవుడు వాక్యమై యున్నాడు. మరియు దేవుని జీవము ఆయన వాక్యములోనే యున్నది. గమనించండి, ఆ వాక్యము దేవుని జీవములోనికి పోయబడినప్పుడు ఏదో జరుగును, అది నెరవేరుతుంది.

ISA 53:5•

1PET 2:24

 

31ఇప్పుడు గమనించండి.

తరువాత ఆయన సర్వశక్తి గల దేవుడు అను నామములో ప్రత్యక్షమాయెను. దేవుడు ఏడు మిశ్రమ విమోచనాత్మకమైన పేర్లు కలిగియున్నాడు. ఇక్కడ సర్వశక్తిగల దేవుని పేరట ప్రత్యక్షమాయెను. దాని అర్ధము "ఏల్- షద్దయి," హెబ్రీ భాషలో "ఏల్" అనగా "బలమైనవాడు." షద్దాయి అనగా "స్థనములు" స్త్రీ స్థనముల వలె అని అర్ధము. ఇక్కడ 'షద్' అనే ఏకవచనమునకు బదులుగా, "షద్దయి" బహు వచనము వ్రాయబడినది. వాక్యమును తన హృదయములో దాచుకొనియున్న, నూరు సంవత్సరముల వృద్ధునికి అది ఎలాటి చక్కని ఆదరణ మరియు ఇక్కడ దేవుని స్వరము అతనితో ఇలా చెప్పుచున్నది, "నేను ఏల్ షద్దయిను, నేను పాలిచ్చి పెంచు దేవుడను.

ఎలాంటి ఆదరణ మనకు వున్నది! గమనించండి, "స్థనము" అని కాదు, కాని "పాలిచ్చునటువంటి" అను భావన. "మన అతిక్రమములను బట్టి గాయపర్చబడెను; ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొందితిమి."

32వ్యాధితో తొందర పెట్టుచున్న తన చిన్న బిడ్డను తల్లి ఏమి చేయును? ఆమె ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆమె బిడ్డను తన స్థనముల యొద్దకు తీసుకున్నప్పుడు, ఆ చిన్న బిడ్డ తన తల్లి బలమును (పాలను) స్థనముల ద్వారా తన సొంత శరీరము లోనికి తీసుకొనును. అప్పుడు ఆ బిడ్డ తృప్తి పర్చబడుటయే కాక, నిమ్మలించబడును. ఆ బిడ్డ పెద్దగ అరుస్తూ, ఏడుస్తున్నప్పుడు, అతడు కలత చెందును; కాని తల్లి ఆ బిడ్డను ఎత్తుకుని, స్థనముల యొద్ద పెట్టుకుని అతనిని "జో" కొట్టి నిద్రపుచ్చినప్పుడు, అతడు తన తల్లి స్పర్శను అనుభవించును. అతడు తన తలను తన తల్లి స్థనము మీద ఉంచి, పాలు త్రాగుచూ, తన తల్లి బలమును తన శరీరములోనికి లాగుకొనును. అతడు తన్ను తాను నూతనపరుకుని, బలమును పెంచుకొనును. మరియు తృప్తి పరచబడి, రోజు రోజుకూ అధిక బలమును పొందుచూ ఎదుగుచుండును.

ISA 53:5•

1PET 2:24

 

33అబ్రాహాము సంతానమునకు ఎలాంటి అనుభవము! ఆయన ఇంకనూ సర్వశక్తి గల దేవుడు, ఏల్ షద్దయి! ఆయన బైబిలులో సిద్ధము చేసిన ఏ వాగ్దానమునైనా మనము పట్టుకుని యుండవచ్చు. ఆయన సంతానము, ఆయన పిల్లలు, నీవు వ్యాధిగ్రస్తుడవైతే, కేవలము వాక్య వాగ్దానము యొక్క స్థనములను పట్టుకుని అది చెప్పినట్టుగా, "ఆయన పొందిన దెబ్బలు వలన మనము స్వస్థత నొందితిమి," అని చెప్పినప్పుడు, అది మనలను తృప్తిపర్చును మరియు మనము ఎడతెగకుండా ఆయన బలమును, బలవంతుని యొద్ద నుండి పొందుకొనుచున్నాము. ఏల్, బలవంతుడు, నిత్యుడగు వాడు, ఆయన వాగ్దానము ద్వారా ఆయన జీవమును ఆయన యొద్ద నుండి పొందుకొనుచున్నాము.

మనము క్రీస్తు యొక్క శక్తిని, మన లోనికి తీసుకొనుచున్నామని ఎరుగుట, ఏల్ షద్దయి రొమ్ముల మీద ఉంచబడియున్నామని నమ్ముట, ఒక వ్యక్తికి ఎంత చక్కని అనుభూతిని కలిగించునో గదా!

సంవత్సరముల క్రితము అబ్రాహాము, ఏల్ షద్దయి రొమ్ము మీద ఆనుకొనినప్పుడు, ఒక 75 సంవత్సరముల వృద్ధుడు, మరియు అతని భార్యకు 65 సంవత్సరములు. అయినను ఆ స్థనములను అతడు ఎన్నడూ విడువలేదు. అతడు ఒక ఎరుగని దేశములోనికి, దేవుని ఎరుగని దేశములోనికి, దేవుని ఎరుగని వింతైన ప్రజల మధ్యకు నడుచుకొంటూపోయెను. దేవుని స్తుతించుచూ, విశ్వాసములో బలముగలవాడై, ఎడతెగని సాక్ష్యమిచ్చుచూ, ఆ వాగ్దానము నుండి అతడు బలమును పొందుచున్నాడని ఎరిగియుండెను.

1TIM 4:1•

2TIM 3:4,5

 

34మూఢభక్తి, ఉద్రేకము, తెలివి, మరియు చీకటితో నిండిన ఈ ఘడియలో, ఈ రాత్రి సంఘమునకు అది ఎలాంటి నిరీక్షణ. పరిశుద్ధాత్మ ఇలా చెప్పుచున్నాడు, "చివరి దినములలో ఒక తెలివిగల సంఘము వస్తుందని. ఆత్మ తేటగా మాట్లాడుచున్నాడు [1వ తిమోతి 4], అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును లక్ష్యముంచి విశ్వాస బ్రష్టులు అగుదురు. నిజముగా, పైకి భక్తిగలవారుగా నందురు [వారు ఏమి చేయుచున్నారు?] మూర్ఖులు, గర్వాంధులు." డాక్టర్ పి.హెచ్.డి, ఎల్.ఎల్.డి, క్యూ.యస్.టి, ఈ బిరుదులన్నీ, "ఫలానా, ఫలానా, డాక్టర్ ఫలానా ఫలానా మా పాస్టరు అంటారు."

నా కుటుంబములో ఒక వ్యక్తిగాని, లేక నా బిడ్డ గాని, బద్దలు చేయబడిన చిక్కుడు గింజలకు మరియు కాఫీకి గింజలకు బేధము ఎరుగకపోయినా, మరియు క్రీస్తును ఎరుగినత్లయితే! అది నిజము. ఒక చెట్టు వద్దకు తీసుకొని వెళ్లి మోకరింపచేసి, అతనిలోనికి పరిశుద్దాత్మ వచ్చువరకు అతనితో కలిసి ప్రార్ధించుదును. డాక్టరు డిగ్రీ ద్వారా అతనిలోనికి ఆ మానసిక వేదాన్నంతా కుమ్మరించుట కంటే, అది నాకు ఇష్టము. అతనికి దేవుని వాక్యమును చెప్పడము నా కిష్టము! అవును.

2TIM 3:3-7

 

35"కాని మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించువారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు!"

ఓ, "వారు కమ్యూనిస్టులు" అని మీరంటారు. కాదు, కాదు! వారు నామకార్ధ క్రైస్తవులు.

"పైకి భక్తిగలవారై యుండి, దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. అట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితుడై నానా విధములైన దురాశల వలన నడిపించబడి, యెల్లప్పుడునూ, నేర్చుకొనుచున్ననూ, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరిన వారు." అది నిజము. ఇప్పుడున్నది అదే. ఆ దినమును మనము చూస్తున్నాము.

36అవిశ్వాసము నుండి దైవభక్తి లేని ఆచారముల నుండి, దైవభక్తి లేని సిద్ధాంతముల నుండి తన్ను తాను వేరు చేసికొని, క్రీస్తు వైపు తిన్నగా చూస్తూ వాక్యమును తీసుకొని, అది ప్రత్యక్షపరచబడువరకు, ఆ వాక్యముతోనే నిలిచియుండుట, విశ్వాసికి ఎలాంటి ఆదరణ. నీవు ఎంత కాలం వేచి యుండవలసినప్పటికిని పరవాలేదు, అక్కడే ఉండుము! దేవుడు దానిని వాగ్దానము చేసెను. దానిలోనే నిలిచియుండుము, దానిలోనికి ఆయన నడిపించును! అక్కడే యుండుము. దానిని వెనుకకు తిరుగవద్దు. అక్కడే నిలిచి యుండుము! దాని విషయమై నీవు నిశ్చయత కలిగియున్నప్పుడు, నీకు అక్కడే నిలిచియుందువు. కాని నీవు సందేహపడుతున్నట్లయితే, ఏ చిన్న విషయము సమీపమున ఉన్నను నీవు పట్టు తప్పిపోతావు. "కోతి" మెరిసే వాటిని చూచి లాగుకొంటుంది, కాని ఎలుగబంటి నిలకడగా ఉంటుంది. కాబట్టి, నీవు అక్కడే నిలచియుండము! అవును, మంచిగా దానిని చేపట్టి యుండుము!

PS 103:3

 

37ఏల్ షద్దయి! ఆయన ఇలా అన్నాడు, "నేను ఏల్ షద్దయి. నేను బలవంతుడను, అబ్రహామూ! నీవు ముసలివాడవు. నీకు నూరు సంవత్సరములు. నీ బలమంతా పోయినది; కాని నేనే నీ బలమును! నీ నిరీక్షణ అంతా పోయినది; కాని నేను నీ నిరీక్షణయైయున్నాను."

ఓ, ఇప్పుడు నీవు కాన్సర్ తోనో మరి దేనితోనో బాధపడుచున్నావు. నీ బలము ఎక్కడ నుండి వచ్చెనో నీవు చూడలేవా! శస్త్ర చికిత్స వైద్యుని కత్తి నుండి కాదు, కాని దేవుని వాక్యము నుండి! "నేను నీ భాగము! నేను నీ బలము! నీవు నా నుండి నీ శక్తిని పొందుచున్నావు!"

ఇప్పుడు శస్త్ర వైద్యుని అగౌరపరచుట లేదు; అతని భాగమును అతడు చేశాడు. కాని దేవుడే స్వస్థపర్చువాడు. శస్త్ర వైద్యుడు కాదు, డాక్టరు కాదు, ఏ మందూ ఎన్నడూ స్వస్థపర్చదు. లేదండి, స్వస్థపరిచే ఒక్క మందు కూడా వారి యొద్ద లేదు. ఏ వైద్యుడైనా దానిని మీకు చెప్పగలడు. వారు వైద్యమును కలిగియున్నారు, కాని దేవుడే స్వస్థపరుచువాడు. వారు నీ చేతిలో గాయము చేస్తారు, కాని దేవుడు దానిని స్వస్థపరచవలసి యున్నది. కణములను వారు ఉత్పత్తి చేయలేరు. అట్లు చేయగలిగిన వారు మనిషినే తయారు చేయగలరు. చూడండి, దేవుడే స్వస్థపరచువాడు. నీవు ఎముకను జోడు చేయగలవు, కాని దేవుడే దానిని స్వస్థపరచవలసియున్నది. దేవుడే స్వస్థపరచువాడు, "నీ రోగములన్నింటిని బాగుచేయు యెహోవాను నేనే." దేవుని మాటను అబద్ధము చేయజాలవు; అది ప్రతిసారి తిరిగి తిన్నగా సత్యము నొద్దకు వచ్చును. దానిని నీవు అబద్ధము చేయజాలవు.

38బైబిలు దానికై అది విభేదించునని వారంటారు. అలాగైతే నా ఒక సంవత్సరపు రాబడిని వారికిస్తాను. నేను చేయగలిగినదంతా చేస్తాను. కాని ఒక్క మాట మరొక మాటతో విభేదించడము నాకు చూపమనండి. అది నిజము. ఆ విధముగా అక్కడ లేదు. దానికి కారణమేమంటే నీ శరీరమనస్సు దానిని ఆ రీతిగా చూస్తున్నది. పరిశుద్ధాత్మయే వాక్యమును అనువదించే వాడు. ఆ వాక్యము సత్యము, జతగా వుంచబడినది. అది అక్కడ రకరకాల ఆకారము గల ముక్కలుగా పడి యున్నప్పటికి, దేవుని విమోచనా చిత్రమును, ఆయన ప్రజల కొరకైన ఆయన దీవెనలను, ఒక దృశ్యముగా చూపుటకు, వాటన్నిటిని జత చేయుట పరిశుద్ధాత్మ పనియైయున్నది. ఆమేన్. అది దానితో విభేదించదు! దానితో అది విభేదించే ఒక లేఖనము గాని, ఒక వచనము గాని లేదు. అది అలా వున్నచో అది వ్రాయబడిన పేపరు విలువ కూడా వుండదు, అది మోసగించునదై యుండును. దేవుడు ఎన్నడూ మోసగించడు. దేవుడు నిజమైనవాడు, యదార్థవంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు. ఆయన దేవుడైయున్నాడు.

GEN 17:5,15

 

39"నేను ఏల్ షద్దయిను" అను ఈ మాటను అబ్రాహాము పొందెను. నేను నీకు బలమునిచ్చువాడను! నీ భార్య యొక్క గర్భము వడిగి పోయినది. ఆమెకు ఋతుస్రావము ఆగిపోయి 40 సంవత్సరములయినది. నీ శరీరము మృతమైనది; కాని "నేను ఏల్ షద్దయిను" అబ్రాహాము అప్పుడే ఇష్మాయేలును కన్నాడు, కాని ఆయన ఇలా అన్నాడు, "అతడు వాగ్దాన పుత్రుడు కాదు, అతడు గొప్పవాడు అవుతాడు. అతడు ఎందరో రాజులను కనబోవుచున్నాడు. అయితే నీకు మరియు శారాకు జన్మించువాడే, నేను వాగ్దానము చేసినవాడు." అది అంతే. ఆమేన్. అబ్రాహాముకు ఎంతో మంచిగా అనిపించింది.

ఆయన అలా అన్నాడు, "అబ్రాహామా, నేను నీకు కొంత చెప్పబోవుచన్నాను. నేను నీ పేరును మార్చబోవుచున్నాను." "నీవిక ఎంత మాత్రము అబ్రాము అని పిలువబడవు కాని, అబ్రాహాము అని పిలువబడుదువు." అబ్రాము అనగా "ఉన్నతమైన తండ్రి." కాని "అబ్రాహాము" అనగా "జనములకు తండ్రి." మరియు శారయి కాదు; ఆమె "శారా," "రాకుమార్తె." వారి పేరును మార్చెను! ఎలాంటి మార్పు చెందిన పేరు! ఏదో జరిగినది, ఎందుకనగా సంగతులు జరుగక ముందు ఒక మార్పు వుండవలసి యున్నది. వారి పేర్లు అలా మిగిలియున్నంత కాలము దేవుడు వారికి బిడ్డను ఇవ్వలేదు.

GEN 17:5,15

 

40పరలోకపు గ్రంథములో నీ పేరు లేనంత వరకు, నీవు తిరిగి జన్మించలేవు. నీ పేరును మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ అను ప్రతి సంఘములో వుంచవచ్చు; వారందరితో వాదములాడుచూ, ఈ స్థలము నుండి ఆ స్థలమునకు నీ పేరు మోసికొనిపోవచ్చు; కాని క్రొత్త సృష్టి రావాలంటే, ఏదైనా జరగాలంటే, పరలోకపు గ్రంథములో నీ పేరు వుండవలసియున్నది. క్రొత్త జీవము రాకముందు వారి పేర్లు మార్పు చెందవలసి యుండెను. మీరునూ, మీ పేర్లను ఈ మానవ-కల్పితమైన పుస్తకముల నుండి, పరలోక పుస్తకము లోనికి మార్చు చేసుకోవలసియున్నది.

"మరియు అక్కడ నీ పేరు ఇక ఎంత మాత్రము అబ్రాము, 'ఉన్నతమైన తండ్రి,' కాదు; కాని అది అబ్రాహాము, 'జనములకు తండ్రి.' ఇక ఎంతమాత్రము శారాయి కాదు; కాని శారా, 'రాకుమార్తె.'

41ఓ, మనము ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము లోనికి వస్తున్నాము. 19వ అధ్యాయము నుండి మనము తిన్నగా 15వ అధ్యాయములోనికి వెళ్ళుదము. ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడ వుంచి, దాని నుండి చాలా దూరము మిమ్ములను తీసుకొని వెళ్ళుట నాకు ఇష్టము లేదు, ఎందుకనగా రేపు రాత్రికి తిరిగి మీరు రావాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు గమనించండి. మనము వెళ్ళగలిగినంత త్వరగా ఆదికాండము 22వ అధ్యాయము లోనికి వెళ్ళుదుము. ఇప్పుడు వినండి, ఒక రోజు అయ్యేటప్పటికి లేక రెండు మూడు రోజులు తరువాత అబ్రాహాము మరియు శారా యొక్క గుడారములు వేయబడినవి.

అక్కడ ఆ పట్టణములో అని నేను అనుకుంటాను, శ్రీమతి. లోతు అక్కడ వున్న క్రొత్త శైలి బట్టలు ధరించుచూ వున్నది. అక్కడ వారు చేయుచున్న జట్టు కత్తిరింపులు మరియు సమస్తమూ ఆమె చేయుచున్నది. ఆమె, ఆమె కుమార్తెలు అందరు సుఖభోగములను అనుభవించుచున్నారు. ఈ దినమున ఆ సొంత తల్లి వేశ్య చేసినట్లుగానే, ఆ పనినే ఆమె కుమార్తెలు చేయుచున్నారు.

కాని శారా, ఆ దేశములో మిక్కిలి సౌందర్యవతియై యుండి, ఫలించని భూభాగములో యున్నది, ఎందుకనగా వాగ్దానము కలిగియున్నవానిని చేపట్టుకుని యున్నది. ఇప్పుడు, ఇక్కడే నేను దీనిని విడిచిపెట్టుట మంచిది, ఎందుకనగా నేను ముందుకు వెళితే మిమ్ములను ఇక్కడే మధ్యరాత్రి అంతయూ వుంచాలి. ఆమె అబ్రాహాముతోనే యున్నది. అది నిజము. అతడు వాగ్దానమును కలిగియున్నాడు.

క్రీస్తును పట్టుకుని యుండండి, ఆయనే వాగ్దానమును కలిగినవాడు! ఆయనే వాగ్దానము. ఆయనే వాగ్దానము! గమనించుడి.

GEN 18:2-5•

GEN 19:2

 

42ఒక దినమున సూర్యని ఎండ తీవ్రముగా నున్నది. అబ్రాహాము సింధూరపు వృక్షము క్రింద గుడారపు ద్వారమందు కూర్చునియుండెను. అది బహుశా 11 గంటల వేళ కావచ్చు. అతడు చూచుచుండగా ముగ్గురు మనుష్యులు నడుచుకుంటూ వస్తున్నారు. వారి బట్టల మీద ధూళి వున్నది. మరియు అబ్రాహాము పరిగెత్తుకుని వెళ్ళాడు. అతని హృదయములో ఏదో వుంది, ఏదో చక్కగా అనిపించింది. అతడు పరుగెత్తి పోయి, వారి పాదముల మీద పడెను. మరియు గమనించండి, అతడిలా అన్నాడు, "నా వ్రభువా!" అది వింతగా లేదా? వారు ముగ్గురు, కాని అతడేమో "నా ప్రభువా!" అని అనుచున్నాడు.

లోతును చూడండి. వారిలో ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఇద్దరు మాత్రమే. అతడు దారిని చూచి "నా ప్రభువులారా," అని అన్నాడు. లోతు వారిని ప్రభువులు అని పిలచుచున్నాడు. లోతు "ప్రభువులు" అని ఆ ఇద్దరిని పిలుచుచున్నాడు. వారు ముగ్గురుని అబ్రాహాము "ప్రభువా, నా ప్రభువా!" అని పిలిచాడు. ఆమేన్! ఓ కాలము సమీపించి యున్నది. గమనించండి. అతడన్నాడు, "నా ప్రభువా, నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే వచ్చి ఈ సిందూరపు వృక్షము క్రింద కూర్చొనుము. కొంచెం నీళ్ళు తెచ్చెదను. మీ పాదములు కడుగుకొనండి, మరియు కొంచెం ఆహారము తీసుకొనండి. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను." వారు నడిచి వచ్చారు.

GEN 18:6,7

 

43అతడు గుడారపు వెనుకకు పోయి ఇలా అన్నాడు, "శారా, కొంత పిండి పిసికి రొట్టెలను సిద్ధము చేయుము." వెళ్ళి మరియు లేత దూడను తీసుకుని, దానిని చంపి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి, సిద్ధము చేసి, కొంత వెన్నను, పాలను తెచ్చి వారి ముందు వుంచెను, వారు భోజనము చేసిరి.

వారిలో ఒకరు స్వయముగా దేవుడే! బైబిలు అదే చెప్పి యున్నది. ఇప్పుడు మీరు దానితో వాదించగోరితే వెళ్ళండి. అతడు ఆయనను, "ఎలోహిం," దేవుడు, అని పిలిచాడు. అతడు ఎరుగవలసి యుండెను. అతడు ఆయనతో మాట్లాడుచుండెను. గమనించండి, "ప్రభువైన దేవుడు!" ఇప్పుడు, వారిలో ఒకరు దేవుడు. అతడు వారి వైపు చూశాడు. అబ్రాహాము దానిని గుర్తించాడు. దానిని అక్కడ చూడండి.

GEN 1:1

 

44ఒకసారి ఒక సేవకుడు నాతో అన్నాడు, "సహోదరుడా బ్రెన్హాం, ఆ మనిషి దేవుడు అని నేను నమ్ముతానని నాతో చెప్పవద్దు?"

నేనన్నాను, "ఆయన దేవుడని అబ్రాహాము అన్నాడు. తర్జుమా చేసే వారందరూ కూడా దానిని అదే రీతిగా పెద్ద అక్షరాలలో ప్రభువు అని తర్జుమా చేశారు. బైబిలు చదివే ప్రతి ఒక్కరికి అది తెలియును. పెద్ద అక్షరాలలో 'ప్రభువు' అనగా ఎలోహిం, ఎలోహిం అనే అదే మాట నుండి వస్తుంది! ఆదియందు దేవుడు, దేవుడు ఎలోహిం! సర్వశక్తిగల దేవుడు. తనకై తాను ఉన్నవాడు, భూమ్యాకాశములను సృజించెను. ఆయన మరల ఇక్కడ, అతని ముందే నిలబడి యున్నాడు."

అతడన్నాడు, "అది కేవలము ఒక మానవుడే," అన్నాడు.

నేనన్నాను, "నిజము, ఆయన మాంసము తిన్నాడు, పాలు త్రాగాడు. రొట్టె తీన్నాడు." "నిజముగా, ఆయన దేవుడై యున్నాడు."

అతడన్నాడు, "అది ఎలా సాధ్యము?"

నేనన్నాను, "మిస్టర్, నీవు…"

"నీ భావనలు వారిని గాయపర్చరని నేను భావించుచున్నాను; వారు యెహోవా సాక్షులు." మరియు అతడు నాతో ఇలా అన్నాడు, "మంచిది, మిస్టర్ బ్రెన్హాం, ఇక్కడ చూడండి, నేను మీకు కొంత చెప్పగోరుచున్నాను. దేవుడు దానిని చేయజాలడు."

అందుకు నేనన్నాను, "నా దేవుని గూర్చి నీకు తెలియదు. అంతే." మానవ శరీరము దేని నుండి తయారయినది? పెట్రోలియం, పొటాష్ మరియు కాస్మిక్ వెలుగు, పదహారు మూల పదార్థాలు. దేవుడు చేయవలసినదల్లా తాను దిగి వచ్చి, సొదొమను పరిశీలించి, తన చేయి చాచి గుప్పెడు నిండా, కాస్మిక్ వెలుగు మరియు పెట్రోలియం తీసుకుని ఊది "గాబ్రియేలు వచ్చి ఇక్కడ అడుగుపెట్టుము," అన్నాడు. అది నిజము. మరలా చేతి నిండా దుమ్ము తీసుకుని, "మిఖాయేలు ఇక్కడకు వచ్చి అడుగుపెట్టుము. మరియు తన కొరకు ఒక దానిని చేసుకొనెను." ఆయన చివరి దినములలో ఏమి కాబోవుచున్నాడో, దానిని ఆయన సూచించవలసి యున్నది. కాబట్టి ఆయన తిన్నగా దిగి వచ్చి, మానవ శరీరములో మాట్లాడుచున్నాడు. అక్షరాల అది సత్యము. ఓ, ఆయన ఆ రీతిగా దయగలవానిగా వున్నందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను.

LUKE 21:18•

JOHN 6:37,40,44,54•

HEB 11:10

 

45ఒక దినమున నేను ఏమియు మిగలను. నేను కూడా పదహారు మూల పదార్ధములతో చేయబడ్డాను. నిన్నటి దినమున నేను నా తల మీద మిగిలిన 2, 3 వెంట్రుకలను దువ్వుచున్నప్పుడు. నా భార్య నా వైపు చూచి "బిల్లీ, నీది బట్టతల అగుచున్నది," అన్నది.

నేనన్నాను, "హనీ, వాటిలో నేను ఒకటి కూడా కోల్పోలేదు."

''మీరు ఉంగరాల జట్టును కలిగి యుండేవారు," అని ఆమె అన్నది.

నేనన్నాను, "అవును, అయితే వాటిలో నేను ఒకటి కూడా కోల్పోలేదు."

ఆమె, "ఇప్పుడవి ఎక్కడున్నవో దయచేసి చెప్పండి," అని అన్నది.

నేనన్నాను, "హనీ, నేను వాటిని పొందక ముందు అవి ఎక్కడ నుండి వచ్చాయో చెప్పుము. నేను వాటిని పొందక ముందు అవి ఎక్కడ వుండినవో, అవి అక్కడ వుంది, నేను వాటి యొద్దకు వచ్చుటకు అవి ఎదురు చూచుచున్నవి."

ఆమేన్! మహిమ! బైబిలు ఇలా చెప్పుచున్నది, "మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు! హల్లెలూయా! అది అక్షరాలా సత్యము. అది అలా కాదు, కాని అది అలాగే అగును. అది అలా కానప్పటికిని అది వున్నది. నిజముగా, నిశ్చయముగా పెట్రోలియం, కాస్మిక్ వెలుగు, కాల్షియం, పొటాష్ ఇంకా అవన్నీ దేవుడు… నేను ఏమి లేనప్పుడు నేను దేనిని చూడలేను. కేవలము బూడిద మాత్రమే. ఆ పొటాష్ ను మరియు ఆ పెట్రోలియంను విసరుతూ ఆయన మాట్లాడినప్పుడు, హల్లెలూయ, మరలా నేను ఆయన సన్నిధిలో జీవింతును. హల్లెలూయా! ఆయన మనకు నిత్య జీవము నిచ్చును. ఆమేన్! "తండ్రి నాకు అనుగ్రహించిన వారిలో ఎవరునూ నశించరు, మరియు అంత్యదినమున నేను వారిని లేపుదును. నేను దానిని నమ్మదును! అబ్రాహాము సంతానముగా, నేను ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నాను! దేవుడు దేనికి శిల్ఫియు నిర్మాణకుడో, ఆ పట్టణము కొరకు వెదకుచున్నాను. ఆమేన్. నిశ్చయముగా, ఇది ముడతలు పడిపోయి, చిక్కి పోయినప్పటికి, వెంట్రుకలు రాలిపోయినప్పటికి, ఏమి జరిగినప్పటికి మరలా నవ యవ్వన ప్రకాశముతో అంత్యదినమున ఆయన మరలా నిన్ను లేపును. దానిని చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు, మరియు నేను ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాను! ఆమేన్.

46ఓ, దేవా! ఆ శుభప్రదమైన నిరీక్షణ నా కొరకు ఎదురు చూచుచున్నదని ఎరుగుట, ఇప్పుడే నాకు ఎంతో భక్తిగా అనిపించుచున్నది. నేను ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాను. దాని వైపు నా గుండె కొట్టుకొనుచున్నది. ఓ, నేను ఒక ప్రక్కకు కూడా తొలగను, కాని ఆ స్థలము వైపు తిన్నగా చూచుదును. ప్రతీ చోట జీవాధారమును వారి ముందు విసరుచూ మార్గము గుండా వెళ్ళుటకు అలసిన ప్రతి యాత్రికునిలోనికి తెచ్చుచూ, అక్కడే నిలబడి నమ్మకముగా, యధార్థంగా వుండుటకు దేవుడు సహాయము చేయును.

అవును, ఈ మధ్యనే దానిని గూర్చిన దర్శనము వచ్చినది. నేను దానిని చూశాను. నా ప్రియులు తిరిగి యవ్వనస్తులు కావడం నేను చూశాను. అది అక్కడ వున్నది. అది అక్కడ వున్నదని నాకు తెలియును. అవునండి. మీరు దానిని బహుశా క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ వాయిస్ లో మరియు అనేక ప్రతికలు దానిని ప్రచురించినవి. స్నేహితులారా, అది దర్శనము కాదు. నేను దర్శనములు చూశాను, ఆయన నా కిచ్చిన వేలకు వేలు దర్శనములు ఏమైయున్నవో నాకు తెలియును. కాని ఇది దర్శనము కాదు. నేను అక్కడే నిలబడి యుండి వెనుకకు చూచుచున్నాను. అది అక్కడ వున్నదని నాకు తెలియును. అవును! నేను ఇక్కడ నిలబడి యున్నంత ఖచ్చితముగా, నేను ఇక్కడే బలిపీఠము మీద నా సరియైన మనస్సుతో నిలబడి యున్నంతగా, అది అక్కడ వున్నది! కావున నాకు సహాయ పడండి. దేవుడు తన వాగ్దానమును చేశాడు, మరియు అది నిజము, ఎంతో నిజము! అవునండి. అది అక్కడ వున్నది.

GEN 18:16-18

 

47గమనించండి.

వారు కూర్చుని భోజనం చేయడము మనము చూస్తాము. మరియు వారిలో ఇద్దరు లేచి సొదొమ లోనికి వెళ్ళిరి. ఒకరు అబ్రాహాముతో నిలచిపోయారు. వారి సంభాషణను గమనించుదాము. వారు సొదొమ వైపు తేరి చూచుచున్నారు. అక్కడ ఏదో వున్నదని, అది ఒక వింతైనదని అబ్రాహాము తెలుసుకున్నాడు. ఆయన వెళ్ళుటకు సిద్దపడుచుండగా, ఆయన ఇలా అన్నాడు, "అబ్రాహాము జనములకు తండ్రి కాబోవుచున్నాడు. నేను చేయబోవు కార్యములను అబ్రాహాముకు దాచెదనా?" అతడు తన పిల్లలను ఎలా పెంచునో నాకు తెలియును. నేను చేయబోవు కార్యమును దాచెదనా? ఆయన ఇలా అన్నాడు, "సొదొమ పాపము ఎంత క్రూరమైనదనగా చివరకు అది ఆయన చెవులలోనికి జొచ్చెను." ఆయన పరిశీలించుటకు దిగి వచ్చెను.

GEN 19:2

 

48జ్ఞాపకము చేసికొనుడి, నిన్న రాత్రి నేను చెప్పినట్లుగా, వారిలో ఇద్దరు వర్తమానికులు సోదెమ లోనికి వెళ్ళి, సొదొమియులకు బోధించారు. వారు ఆ రాత్రి వాక్యమునకు వారిని గ్రుడ్డివారినిగా చేశారు. కాని గమనించండి, అక్కడ ఒకాయన వున్నాడు; వారికి గురుతు వున్నది, వారి మధ్య ఒక క్రొత్త వ్యక్తి ఉన్నాడు.

లోతును చూడండి. లోతు గవిని యొద్ద కూర్చొని, "నా ప్రభువులారా," అన్నాడు. ఆ రీతిగా జీవించుచున్నారు! "నా యింటి లోనికి రమ్మని," అతడన్నాడు. వారన్నారు, "మేము వీధిలోనే నిద్రపోతాము." ఎలాంటి గృహము!

కాని అబ్రాహామును కలుసుకొన్నప్పుడు, "ఈ పని కొరకే మేము వచ్చి యున్నాము. మేము నీ ప్రక్కన కూర్చుంటాము."

LUKE 1:6

 

49అదే మార్గము. ఆ రీతిగా జీవించండి. దేవుడు నిన్ను వాడుకొనగోరిన యెడల, ఎక్కడకు వచ్చి నిన్ను సరిగ్గా తీసుకోవాలో ఆయనకు తెలియును. నీవు ఒక స్థితిలో వున్నావు. దేవుని ముందు శుద్ధమైన జీవితమును జీవించుచున్నావు. నీ మాటలు యధార్ధముగా వున్నవి. నీ జీవితము యధార్థంగా నున్నది. అలాంటి స్థలములకు దేవుని దూతలు వచ్చును, జెకర్యా, ఎలీసబెతులను చూడండి. యదార్ధ వంతులు, నీతిమంతుడు మరియు దేవుని ఆజ్ఞలన్నింటి ప్రకారము నడుచుచున్న వ్యక్తి, ఆ రీతిగా మనము జీవించవలసియున్నది. కాబట్టి, దేవుడు మనలను వాడుకొనుటకు సిద్ధమయినప్పుడు, "వీరు నా ప్రజలు అని ఆయన అనును. నేను చేయగోరునది ఈ సంఘము ద్వారా చేయుదును. వారు నన్ను నమ్ముదురు. వారు నా మాటలు మీద నిలబడుదురు." చూడుము, ఆ రీతిగా నీవు చేయవలసియున్నది, నీ జీవితమును జీవించవలసియున్నది.

GEN 18:9,10,14

 

50ఈ దేవదూత, "అబ్రాహాముకు ఈ సంగతి నేను దాయనని" చెప్పడము మనము చూచెదము. కాని నేను నిన్ను నిర్ణయకాలములో దర్శింతును." గమనించండి, ఆయన అతనిని "అబ్రాము" అని పిలువలేదు. కాని "అబ్రాహాము" అని పిలిచాడు. అతని పేరు మార్పు చెందియున్నదని అతనికి ఎలా తెలియును. దానిని మార్పు చేసినది ఆయనే. నిశ్చయముగా. గమనించండి, "శారాయి అని ఆమెను పిలువలేదు గాని శారా అని పిలచెను." "నీ భార్య అయిన శారా ఎక్కడ వున్నది?" అని అడిగెను. అబ్రాహాముకు వివాహమయినదని ఆయనకు ఎలా తెలియును? ఆతనికి భార్య వున్నదని, ఆమె పేరు శారా అని ఆయనకు ఎలా తెలియును?

మరియు అబ్రాహాము ఇలా అన్నాడు, "ఆ వెనుక నున్న గుడారములో వున్నదనెను."

51ఎలాంటి నిజమైన స్త్రీ!

ఈ దినమున కొందరు స్త్రీలు ఎంతో సిగ్గుమాలినవారై యున్నారు. వారి భర్తలు కనీసం మాట్లాడలేరు. పొట్టి బట్టలు ధరించుకుని, సిగరెట్ చేత పట్టుకుని, వ్యర్ధమైన మాటలన్నీ మాట్లాడుతూ అక్కడే అతుక్కుపోయి వుంటారు. ఎలాంటి చెడిపోయిన ప్రజలు, తాను ప్రధాన వంట మనిషిగా, సీసాలు కడుగుచూ, ఇంకా సమస్తమును చేయుచు వుండవలసి యున్నది. ఆమె వంట ఇంటిని విడిచిపెట్టినప్పుడు, తన బాధ్యతా స్థానమును విడిచిపెట్టుచు ఒక తల్లిగా ఉన్నది.

మనము ఇప్పుడు కనుగొన్నాము, వెనుక ఉన్న స్త్రీలు, ఆడవారి వలె ప్రవర్తించుచూ నిర్ణయములు చేయుచున్నారు, కాని వారి శిరస్సు ఆ నిర్ణయములను, కార్యములను చేయుచున్నది.

మరో పురుషుడు తన భార్య తనకు చెప్పుటకు అనుమతినిచ్చుచున్నాడు; ఆమె ఇలా అంటుంది, "ఇప్పుడే నేను నీకు దాని గ్రహింపునిస్తాను!" [సహోదరుడు బ్రెన్హాం ఊదుచున్నారు.] అనుచు తన నోటిలో నుండి పొగను ఊదుతుంది. ఎంత భీకరమైన దృశ్యములు. నేను అలాంటిది ఎన్నడునూ చూడలేదు! నీవు అక్కడ ఊహించగలవు. నీవు అక్కడ ఎలాంటి ఆత్మ వున్నదో, ఆ పనులేమిటో నీవు వివేచించగలవు. ఏదో గాన కచేరీలో వారు పాటలు పాడుచూ వుండవచ్చు. ఓ, ఎలాంటి దినమున మనము జీవించుచున్నాము? ఆశ్చర్యము లేదు మనము ఆ దినముననే వున్నాము! ఈ వాక్యముల ద్వారా నా భావమేమిటో మీరు పట్టుకొనగలరని నేను నమ్ముచున్నాను.

GEN 18:10,12,13

 

52గమనించండి, అది అక్కడే యున్నది. శారా గుడారములో వుండి మర్యాదగా వినుచున్నది. అబ్రాహాము దేవదూతలను సంతోషపరుచున్నాడు. ఆయన ఇలా అన్నాడు, "నేను నిన్ను దర్శించబోవుచున్నాను."

మరియు శారా దీనిని వినుచున్నది. ఆమె లోలోపల నవ్వుకుని, ఇలా అన్నది, "నేను వృద్ధురాలను, నా యజమానుడు కూడా వృద్ధుడు, మరలా భార్య భర్తులుగా మేము ఎలా సంతోషమును పొందగలము?" ఆమె నవ్వుకున్నది.

గుడారము వైపు తన వీపును త్రిప్పి ఉన్న దూత ఇలా అన్నాడు, "శార నవ్వనేల?"

గుర్తుందా, సంఘమునకు మాదిరిగా అబ్రాహాము సంతానము పొందిన చివరి గుర్తు అది, సంఘమునకు మాదిరి. ఆయన పొందిన గురుతులన్నింటిలో, సొదొమను దేవుడు తుడిచి వేయక ముందు పొందిన గురుతు అది. అది నిజము. చివరి గురుతు!

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 4:12

 

53అబ్రాహామును వెంబడించిన ఇశ్రాయేలు సంతానము వలె, మరియు సమరయులు వెలివేయబడిన మిశ్రమ జనాంగము. అయినను, "మా తండ్రియైన యాకోబు ఈ బావిని మాకిచ్చెను," అని సుఖారులోని బావి దగ్గర ఉన్న ఆ స్త్రీ అన్నది, చూడండి. "మా తండ్రియైన యాకోబు, తన కుమారుడైన యోసేపుకు ఈ బావిని ఇచ్చెను, మేము దాని నీరు త్రాగాము, మరియు అతడు తన ఒంటెలకు నీరు పెట్టెను. నాకు నీరు వున్నదని ఇంకేదో నీవు చెబుతావు?" చూడు? సహజ సంతానమైన ఇశ్రాయేలు సంతానము, అదే చివరి గురుతును పొందినది! అయ్యో! నీవు దానిని చూడలేదా? ఒక నిముషము ఆలోచించుము!

నిబంధనను కలిగిన అబ్రాహాము, నులివెచ్చని సంఘము తిరస్కరించబడుటకు ముందు, దాని (సంఘము) నాశనమునకు ముందు అబ్రాహాము పొందిన చివరి సూచన, మానవ శరీరములో దేవుడు ప్రత్యక్షము కావడము, హృదయ ఆలోచనలను, మనస్సును వివేచించడము.

ఇశ్రాయేలు, చెదరి పోవుటకు ముందు అదే సూచనను పొందినది. "నీవు బయెల్జెబూబువు, అదృష్టము చెప్పువాడవు" అని వారన్నారు.

54ఇదే ఆ ఘడియ! దేవా, ఇది మీలోనికి నాటనియ్యండి. అబ్రాహాము సంతానమునకు ఇదే ఆ ఘడియ! మీరు దానిని చూడగలుగుచున్నారా? నులివెచ్చని సంఘము నాశనమునకు ముందు, దేవుడు మానవ శరీరములో ప్రత్యక్షమగుచున్నాడు. అది చేసినట్లే అది వెళ్లిపోవుచున్నది. అది చివరి సూచనగా వున్నది. చివరిగా, వెనుకజారిన లోతు యొక్క చివరి వైభవము! ఒక నిమిషము దానిని నాటనివ్వండి.

ఒకటి, అబ్రాహాము! రెండు, అబ్రాహాము సహజ సంతానము; మూడు, అబ్రాహాము యొక్క రాజ సంతానము.

గమనించండి, అక్కడి నులివెచ్చని గుంపునకు వర్తమానము వెళ్ళలేదు. కనీసము అది ఎవరి యొద్దకు వెళ్ళినది? ఎన్నుకోబడి, బయటకు పిలువబడిన నిజ పెంతెకోస్తు వారి యొద్దకు పంపబడినది.

అప్పుడు ఇశ్రాయేలు చేసినట్లుగానే… చూడండి, ఎంత మంది ఇశ్రాయేలీయులు దానిని అంగీకరించారు. వారు అక్కడకు వెళ్ళుటకు సమయము వచ్చినప్పుడు నలభై లక్షల ఇశ్రాయేలీయులలో 120 మంది మాత్రమే వున్నారు.

LUKE 17:28,30

 

55ఇప్పుడు రాజసంతానాన్ని గమనించండి. మీరు ఎక్కడ తీసుకున్నను అది మూడుసార్లు రావలసియున్నది. హాము, షేము, మరియు యాపెతు యొక్క ప్రజలు. అబ్రాహాము రాజ సంతానము; అబ్రాహాము సహజ సంతానము; రాజ సంతానము. ప్రతి రాజ సంతానము క్రీస్తు ద్వారా వచ్చును. దేవుడు అతనికి ఇచిన వాగ్దానమును బట్టి మనము అబ్రాహాము నొద్దకు వచ్చెదము. చివరి దినములలో ఆయన పునరుద్ధరించుచున్నదే రాజ సంతానము. ప్రభువైన యేసు నిజ సంఘము రాజ సంతానము! గమనించండి, ఆ గురుతును అతడు పొందాడు. మరియు అది రాజ సంతానమే. ఆయన ఇక్కడ వున్నప్పుడు ఇలా చెప్పాడు, "లోతు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని రాకడ యందును జరుగును." రాజ సంతానము బయటకు పిలువబడినది. అబ్రాహాము యొక్క సంతానము తన సోదరుడైన లోతు సొదొమలో వున్న ఒక నులివెచ్చని సంఘము మరియు సొదొమీయులు, లోకము. ఈ దినమున లోకము; సంఘ లోకము; మరియు రాజ సంతానము. ఖచ్చితంగా, క్రమము ప్రకారము వాటి స్థానములో వుంచబడినది. మరియు దేవుడు తన వాగ్దానముతో దిగి వచ్చి అదే సంగతిని ప్రత్యక్షపరచుచున్నాడు. ఆమేన్. ఆది పరిపూర్ణత కాని యెడల మరి పరిపూర్ణమైనదేమిటో నాకు తెలియదు. అది లేఖనమైయున్నది.

56నీవు ఆత్మలో నాట్యమాడి భాషలతో మాట్లాడియుండవచ్చు, ఈ ఉద్రేకములన్నీ నీవు కలిగియుండవచ్చు. మరియు నీవు అద్భుతములు, స్వస్థతలు, చక్రాల కుర్చీలలో వారిని స్వస్థపర్చటం ఇంకా అలాంటివి చూచియున్నావు. అవన్నీ మనము చూచియున్నాము. కాని ఇక్కడ చివరి గురుతు ఇప్పుడు పైకి రావటం జరిగింది. మార్గమంతటిలో దేవుడు అబ్రాహాముకు చేయు కార్యములనన్నింటిని నిజముగా అతడు చూశాడు. కాని వాగ్దాన కుమారుడు రాక ముందు, ఇక్కడ చివరి గురుతు వస్తుంది. హల్లెలూయా! మనము వాగ్దాన కుమారుని కొరకు చూచుట లేదా? దేవుని కుమారుడు తిరిగి వచ్చుట! హల్లెలూయా! ఓ అది నన్ను కేకలు వేయునట్లు చేస్తుంది. చూడండి! రాజసంతానము వాగ్దాన కుమారుని కోసము ఎదురు చూచుచున్నది. సంవత్సరములన్నిటి గుండా అబ్రాహాము ఎదురు చూచినట్లుగా, వాక్యమును పట్టుకొని యున్నట్లుగా, రాజ సంతానము కూడా అట్లే చేయుచున్నది. మరియు విత్తనము ఈ రానున్న కుమారుని కోసము ఎదురు చూచుచున్నది. ప్రభువు యొక్క రాకడ కొరకు, మొదటి జాము గుండా, రెండవ జాము గుండా, మూడవ జాము గుండా, ఏడవ జాము వరకు, మరియు రాజ సంతానము కొరకు ఇంకా ఇక్కడ మనము ఎదురు చూచుచున్నాము. ప్రభువు రాకకు ముందుగా మనము దేనిని చూస్తాము? ఏమి జరుగును? దేవుడు మన మధ్యకు దిగి వచ్చి, అబ్రాహాము సంతానమునకు చేసినట్లుగానే రాజ సంతానమునకు చూపుచున్నాడు. అది అబ్రాహామునకును మరియు అబ్రాహాము సంతానమునకు, ఇక్కడ అది రాజ సంతానముతో, పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మన మధ్య నివాసము చేయుచున్నాడు. ఇది వరకు అక్కడ చేసిన కార్యములను చేయుచూ, స్పష్టముగా అదేనని చూపుచున్నాడు.

ROM 4:19

 

57ఆ చిత్రము మీద శాస్త్రీయ పరిశోధన జరిపిన తరువాత అది సత్యమని శాస్త్రీయ లోకమునకు తెలిసింది. లోకమంతా అది సత్యమని ఎరిగింది.

సంఘమునకును అది సత్యమని తెలియును, ప్రపంచ వ్యాప్తముగా.

ద్వారము మూయబడుటకు సిద్ధముగా నున్నది. ముందు నిర్ణయించబడిన ప్రతి విత్తనము ఇప్పుడే లోనికి రావాలి, మరియు తీర్పు తీర్చుటకు సిద్ధపర్చబడి యున్నది. అది నిజము. దేవుడు ఎల్లప్పుడూ నరులతో వాదించడు. ఆయన చేయగలిగినతంతా చేస్తాడు. కాని స్నేహితులారా, ఆ ఘడియ సమీపించుచున్నది. గమనించండి.

మీకు సహాయము చేయుటకు నేను కొంత తెలుపబోవుచున్నాను. గుర్తుంచుకోండి, దీని తరువాత జరుగవలసిన విషయము ఏమిటి? వారు రాజ సంతానమును పొందక ముందు, భౌతికంగా అబ్రాహాము మరియు శారాకు ఒక అద్భుతము జరుగవలసియున్నది, ఆ రాజ సంతానము రాక ముందు… ఆ సంతానము పుట్టక ముందు. బైబిలు చెప్పుచున్నది, "అబ్రాహాము శరీరము మృతతుల్యమైనది." కాదా? ఆమె గర్భము ఉడిగిపోయినదని," అని బైబిలు చెప్పినది. వాగ్దాన కుమారుడు, అనగా రాజ సంతానమును పొందక ముందు, అక్కడ ఒక భౌతికమైన మార్పు జరుగవలసియున్నవి. వాగ్దాన పుత్రుడు ప్రత్యక్షము కాకముందు వారి శరీరములో ఒక భౌతికమైన మార్పు జరుగవలసియున్నది. వాగ్దాన పుత్రుడు ప్రత్యక్షము కాక ముందు ఆయన ఏమి చేశాడో గమనించుడి. కొంత నేను మీకు తెలుపబోవుచున్నాను.

1JN 4:8

 

58బైబిలు చదువుచున్నప్పుడు దేవుడు తన సంఘమునకు వ్రాసిన చక్కని కథ ఇది. అది దేవుడు. దేవుడు ప్రేమ అయి యున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? మరియు చదువుకున్న వారు, తెలివిగలవారు దానిని గ్రహించుటకు ఎప్పుడు దేవునితో, ప్రేమలో యుండవలసి యున్నది. దేవుడు నీలో యుండవలసి యున్నది. ఆయన తానే నీకు అనువధించును.

అది నాకు ఒక భార్య వున్నట్లు గానే యున్నది. ఓ, నేను ఆమెను ఎలా ప్రేమింతునో! నేను నా హృదయమంతటితో ఆమెను ప్రేమింతును, మరియు నేను ఎక్కడైన విదేశములలో యున్నప్పుడు ఆమె, పిల్లలందరూ నిద్రపోయిన తరువాత నాకు ఉత్తరము వ్రాస్తూ అంటుంది, "ప్రియమైన బిల్లీ, నేను ఈ రాత్రి ఇక్కడ కూర్చుని, నీ గురించి ఆలోచించుచున్నాను. నేను వ్రాయుచున్నాను." చూడండి! ఆమె పేపరు మీద ఏమి వ్రాయుచున్నదో నాకు తెలుసు. నేను ఆమె స్వభావమును ఎరిగినంత వరకు నేను ఆమెను ఎరుగుదును. మరియు ఆమెను మిక్కుటముగా ప్రేమింతును. ఆమె భావము ఏమిటో నాకు తెలియును. కాబట్టి నేను పంక్తుల మధ్య చదువగలను, చూశారా.

తన సంఘము పంక్తుల మధ్య చదువ వలెనని దేవుడు కోరుచున్నాడు. దానిలో నుండి ఇప్పుడు ఏదైనా చదువుట కాదు! దాని భావమేమిటో నీవు పంక్తుల మధ్య చదువవలసియున్నది. ఇప్పుడు గమనించండి, అది కాదేమో కనుగొనండి.

దేవుడు అబ్రాహాము మరియు శారాతో ఏమి చేశాడో, తన సంఘము యొక్క మాదిరిని వారికి చూపుచున్నాడు. ఆయన వారిద్దరినీ యవ్వనస్తుడు గానూ, యవ్వనురాలు గానూ మార్చి వేసెను. నిశ్చయముగా, అబ్రాహాము యొక్క ప్రతి బీజమునకు ఆయన చేయబోవుచున్నట్లుగా ఆయన వారిని తిరిగి యవ్వనస్తులుగా చేసెను. నీవు ఎంత వృద్ధుడవైనప్పటికిని, నీవు ఎంత విరిగి పోయినప్పటికిని పరవాలేదు. ఒక దినము రాబోవుచున్నది, నీవు మరలా అందముతో ప్రకాశించుచున్న యవ్వనస్తుడువుగా వుంటావు, అది నిజము.

59ఈ మధ్య నేను ఒక డాక్టరును అడిగాను, "అయ్యా, నాకు చెప్పండి. నేను భోజనము చేసినపుడెల్లా నా జీవితమును నూతనపర్చుకుంటాను."

ఆయన అన్నాడు, "అవునండి, అది నిజము."

నేనన్నాను, "ఇప్పుడు, మనము భూమి యొక్క ధూళిలో నుండి చేయబడినామని దేవుడు అన్నాడు."

అతడన్నాడు "అది నిజము. మీరు తిను కూరగాయలు, మాంసము మరియు తదితరమైనవి అన్నీ మట్టే అక్కడి నుండి నీవు నీ విటమినులలోని పొటాష్ ను, కాల్షియంను మరియు మిగిలిన వాటన్నింటినీ పొందుచున్నావు. వాటిని నీవు తిన్నగా భూమిలో నుండియే తెచ్చుచున్నావు. మరియు నీవు భూమి యొక్క మట్టి నుండి చేయడినావు." నేను మౌనముగా అనుకొన్నాను, "దేవుడు ముందు దానిని ఆ రీతిగా సృజించాడు."

ఆయన అన్నాడు, "దాన్ని గూర్చి నాకు ఏమి తెలియదు, కాని నీవు ఆహారము తినుచున్నావని నాకు తెలియును. అది నీ శరీరమును నిర్మించుచున్నది," అన్నాడు.

నేనన్నాను, "నేను మిమ్మును అడుగుచున్నాను." "మీరు కన్యక పుట్టుకను గురించి నన్ను ప్రశ్నించుచున్నారు?"

ఆయన అన్నాడు, "అవునండి."

నేనన్నాను, "డాక్టరు గారూ, నేను మిమ్మును ఒకటి అడుగగోరుచున్నాను. దానిని మీరు నాకు వివరించండి."

అతడన్నాడు, "మంచిది, శాస్త్రీయంగా రుజువు కానిది ఏదైననూ నిజమము కాదు."

నేనన్నాను, "నేను దానికి వ్యతిరేకముగా తీసుకొంటాను, శాస్త్రీయంగా రుజువు కానిది సత్యము కాదని కాదు, ఆ విధముగా ఏమి లేదు. జీవితంలోని నిజమైన సంగతులు మాత్రమే శాస్త్రీయంగా రుజవు చేయలేము. అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, సహనము, విశ్వాసము. శాస్త్రీయంగా దీనిని నాకు రుజవు చేయండి? అయినను అది యదార్ధము! దేవుడు, పరిశుద్ధాత్మ, దేవుని దూతలు!" ఆమేన్! "విశ్వాసము ఈ కార్యములను చేస్తుంది. మీరు చూచే ప్రతిది భూమి నుండి వచ్చినదే! తల్లి భూమి నుండి వచ్చి, తిరిగి అదే విధముగా వెళుతుంది."

60నేనన్నాను, "మిమ్మును కొంత అడుగగోరుచున్నాను. ఇప్పుడు నేను తినుచున్న ఆహారము 16 సంవత్సరముల వయస్సులో తినియుంటిని. నేను చిక్కుళ్ళ, దుంపలు, రొట్టె మరియు మాంసమును తింటిని. నేను తినునప్పుడెల్లా నేను పెద్దవాడనగుచు, బలిష్టుడనగుచున్నాను."

అతడన్నాడు, "నిజముగా, నీవు నీ జీవితమును నూతనపరుకొనుచున్నావు."

నేనన్నాను, అది ఎందుకని, 22 సంవత్సరములు దాటిన తరువాత ఎవరైనప్పటికి, నీవు ఎంత తినినప్పటికీ, నీవు బలహీనుడవగుచూ, ముసలివాడవగుదువు? దానిని ఆలోచించండి. నేనన్నాను, "నా దగ్గర ఒక జగ్గుడు నీరున్నది. మరియు ఒక గ్లాసు నీరున్నది. నేను ఈ పెద్ద సంమృద్ధియైన జగ్గులో నుండి నీటిని ఈ చిన్న గ్లాసులోకి నింపడం ప్రారంభించినప్పుడు, అది సగము వరకు నిండి, పూర్తిగా నిండిపోతుంది, మరియు అప్పుడు దానిలోనిది ఏమి క్రింద పారబోయకుండా దానిలోనికి నేను ఎంత ఎక్కువ పోస్తే అది అంత క్రిందకు దిగిపోతుంది. నేను ఎంత తిన్నప్పటికి, ఎంత బాగా తిన్నప్పటికి, ఇది వరకు కన్నా నేను బాగా తినుచున్నాను. నూరు రెట్లు బాగా తినుచున్నాను."

రాత్రంతా మాంసమున్ను నములుట అనగా ఏమిటో నాకు తెలియును, మరియు అల్పాహారమునకు కొంత సార్గమ్ మొలాసిస్ లో జాన్న రొట్టెను తిందును, మరియు అదే భోజనము మధ్యాహ్నము మరియు రాత్రి తినుటను నాకు తెలియును. కష్టముగా జీవించుట ఏమిటో నాకు తెలియును. మరియు ఇప్పుడు నేను బాగా తినగలను. ప్రభువుకు స్తోత్రములు. నేను ఎంత తిన్నప్పటికి లెక్క లేదు. నేను ఇంకానూ బలహీనుడనగుచూ, వృద్ధుడనగుచున్నాను. చివరకు నేను ఎండిపోయి చనిపోవుదును. ఎందుకు? అది దేవుడు చేసిన నిర్ణయము. అది నిజము. అవునండి.

GEN 18:11•

GEN 20:1,2•

ROM 4:19

 

61గమనించండి అబ్రాహాము శారాలు తిరిగి 22 లేక 25 సంవత్సరముల యవ్వనస్తులుగా మారారు.

ఓ, నీవంటావు, "అది బుద్ధిహీనత, సహోదరుడా బ్రెన్హాం!" మంచిది, ఒక్క క్షణము నెమ్మదిగా కూర్చొనండి, మరొకసారి వాక్య పంక్తుల మధ్య చదువుదాము.

ఆ దేవదూతలు వారిని విడిచి వెళ్ళిన వెంటనే, సొదొమ దహించబడెను. మరియు అబ్రాహాము, శారాలు గెరారు వరకు పెద్ద ప్రయాణమును చేసిరి. ఆ వృద్ధ దంపతులకు అది ఒక పెద్ద ప్రయాణము. మీ మ్యాప్ మీద దానిని కొలవండి. వారు గెరారుకు వెళ్ళారు. ఇక్కడ శారా 90 ఏళ్ళ అమ్మమ్మ, ఎండ దెబ్బకు గుడ్డ కట్టుకుని వణుకుచున్నది. మరియు అబ్రాహాము యొక్క పొడవైన గడ్డము వ్రేలాడుచున్నదని బైబిలు చెప్పుచున్నది, "వారు వయస్సులో మిక్కిలి ముదుసలియైనవారు. వారు దీర్ఘకాలం జీవించారని చెప్పుటకు ప్రయత్నించవద్దు, మరియు బైబిలు చెప్పుచున్నది, "వారి శరీరము మృతతుల్యమైనది. వారు వయస్సులో ముదుసలియైనవారు." మరియు ఇక్కడ వారు గెరారు లోనికి వెళ్ళినారు. అక్కడ అబీమెలెకు అను పేరు గల యవ్వనస్తుడైన రాజు వుండెను, మరియు అతడు ఒక ప్రియురాలు కొరకు ఎదురు చూచుచున్నాడు. అతడు శారాను చూచినప్పుడు, అతడు ఆమెను ప్రేమించెను. అది నిజమేనా? అమ్మమ్మ?

GEN 12:11,13•

GEN 20:12

 

62"నీవు ఎంతో…!" అబ్రాహాము అన్నాడు, "నీవు చూచుటకు ఎంతో చక్కనిదానవు." ఆమేన్. "నిన్ను బ్రతిమాలుచున్నాను. నీవు నా సోదరివని అతనితో చెప్పుము." హల్లెలూయా! అబ్రాహాము సంతానమంతటికి ఆయన ఏమి చేయబోవుచున్నాడో ఆయన అక్కడ చూపుచున్నాడు. శారా అందముగా వుండెను. అబ్రాహాము యవ్వనస్తుడుగా వుండెను. అబ్రాహాము అంటున్నాడు, "ప్రియమైన శారా, అదేమిటో నీకు తెలుసా, నీ వెంట్రుకలలో నుండి బూడిద వర్ణము పోవుచున్నది."

"అబ్రాహాము, మీ వీపు నుండి గూని పోవుచున్నది, మీరు చక్కగా నిలబడుచున్నారు. వారు యవ్వనస్తుడుగా మరియు యవ్వనురాలుగా మారిపోయారు. దేవుడు చూపుచున్నాడు! ఓ, దేవా!

GEN 20:3-7

 

63అబీమెలెకు ఆమె ప్రేమలో పడి, వెళ్ళి ఆమెను తీసుకుని వివాహము చేసుకుని యుండేవాడే. అతడు స్నానము చేసి పైజమా వేసుకుని కూర్చుండి, తన చేతిని పైకి లేపి, తన ప్రార్థనలు వల్లించిన తరువాత అనుకున్నాడు, "రేపు నేను ఓ అందమైన నూరు సంవత్సరముల ఆమెను వివాహము చేసికొంటాను"? నవ్వదగిన సంగతి! "ఆమె అందమైన హెబ్రీ బాలిక, ఓ, ఆమె సోదరుడు యవ్వనస్తుడు! ఆమె ఎంత అందముగా వున్నది!"

మరియూ దేవుడు అతనికి కలలో కనపడి, "నీవు చచ్చినవాడవు సుమా!" అని చెప్పెను.

"ప్రభువా, ఏమిటి ఇది?" అన్నాడు.

ఆయన ఇలా అన్నాడు, "ఆమె ఒక పురుషుని భార్య."

అతడన్నాడు, "ప్రభువా, నా హృదయములోని యధార్థత నీవు

ఎరుగుదువు." ఆమె, "అతడు నా సోదరుడు" అని అన్నది, మరియు అతడు, "ఆమెనా సహోదరిని," అన్నాడు.

ఆయన ఇలా అన్నాడు, "అవును, నీ హృదయము యొక్క యధార్థత నాకు తెలుసు. ఆ కారణమునే, నాకు వ్యతిరేకముగా నీవు పాపము చేయకుండా నిన్ను అడ్డగించితిని." కాని వినుము, "నీవు చచ్చినవాడవే, నీ దేశమంతా పోయినట్లే, ఆమె భర్త నా ప్రవక్త. నీవు ఎంత పరిశుద్ధుడవైనప్పటికీ నీవు ఎంత ప్రార్ధించినప్పటికి నాకు లెక్కలేదు. నీ ప్రార్థనలు నేను వినను. ఆమె భర్త నా ప్రవక్తయైయున్నాడు. వెళ్ళి అతని భార్యను తిరిగి అప్పగించుము. మరియు అతడు నీ కొరకు ప్రార్ధించనిమ్ము. నీవు అది చేయని యెడల నీవు చనిపోవుదువు." హల్లెలూయా!

1COR 15:52•

1THS 4:17

 

64అది ఏమిటి? వాగ్దాన కుమారుని పొందుటకు దేవుడు అబ్రాహాము మరియు శారాను సిద్ధము చేయుచున్నాడు. దేవుని దూత యొక్క ప్రత్యక్షత తరువాత, ఈ విషయమును చూపుచున్నాడు; పరిశుద్ధాత్మ తన చివరి గురుతును చూపుచున్నాడు. తరువాత సంగతి ఈ మర్త్యమైనది, అమర్త్యమైన దానిని ధరించును. మరియు మనము వాగ్దాన కుమారుని కలుసుకొనుటకు మేఘముల మీద కొనిపోబడుదుము. అబ్రాహాము రాజ సంతానము. దేవునికి మహిమ! హల్లెలూయా! "ఏలయనగా వారు రెప్పపాటులో మార్పుచెంది, మేఘముల మీద ఆయనను కలుసుకొనుటకు కొనిపోబడుదురు. ఆ రీతిగా సదా కాలము మనము వాగ్దాన కుమారునితో యుందుము." హల్లెలూయా!

COL 2:9•

1THS 4:16,17

 

65ఓ, నేనింకా… బహూశా రేపు రాత్రికి నేను ఆదికాండము 22వ అధ్యాయములోనికి వెళ్ళుదును, చూడండి.

ఓ, నేను దానిని ప్రేమింతును, మీరు ప్రేమించరా? ఈ విషయములన్నింటి బట్టి నాకు ఎంతో సంతోషము. ఈ కృపగల బంగారు ముక్కలతో బైబిలు నిండియున్నది. మీరు చేయి చాచి, దానిని తీసికుని దాని మీదనున్న దుమ్మును దులిపి వాటి వైపు చూడండి. వాటిలో ప్రతిదీ, ప్రతి మనిషి క్రీస్తునకు ప్రాతినిధ్యముగా వున్నాడు. ఏలయనగా, దేవుని సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించెను. ప్రతిదీ ఆయన వైపు చూపుచున్నది. పాత నిబంధన నుండి ప్రతిదీ సిలువ వైపు చూపుచున్నది. మరియు క్రొత్త నిబంధనలో ప్రతిదీ సిలువ వైపు చూపుచున్నది. అది నిజము. ఓ, అదంతా అక్కడ వున్నది.

మనలను బంధించువాడు దీవించబడు గాక

క్రైస్తవ ప్రేమలో మా హృదయాలను;

పిల్లల హృదయ సహవాసమందు

పరలోకము వలె ఉండుటకు.

నేను ఆయనను ఎంత ప్రేమింతునో! నేను ఆయనను ఎంత చూడాలనుకొనుచున్నానో! ఈ పాతదైన కొట్టుకొనుచున్న, చితుక కొట్టబడిన, పగిలిన గుండె, చించివేయబడిన ఈ శరీరము ఒక ఉదయమున మార్పుచెందవలెనని నేను ఎంత ఎదురు చూచుచూ కనిపెట్టుచున్నానో గదా! బూర మ్రోగును మరియు క్రీస్తునందున్న మృతులు తిరిగి లేతురు. మనము వారితో పాటు ప్రభువును ఎదుర్కొనుటకు మేఘ మండలము మీద కొనిపోబడుదుము.

GEN 24:11•

ZECH 14:7

 

66రీబ్కా ఆ చల్లని పూట ఒంటెలకు ఎలా నీళ్ళు పెట్టిందో చూడండి! ఎలియాజరు ఆమెను ఉదయమున కనుగొనలేదు. మధ్యాహ్నము ఆమెను ఎన్నడూ కనుగొనలేదు. అతడు సాయంకాలపు వెలుగులో ఆమెను కనుగొనెను. "సాయంకాలమున వెలుగు కలుగును!" నిజము. అక్కడే అతడు ఆమెను కనుగొనెను. ఆమె తన ముఖమునకు ముసుగు వేసికొనెను. ఆమెకు శిరస్సు లేదు. ఆమె తన శిరస్సు యొద్దకు వెళ్ళుచుండెను. ఆమేన్. పురుషునికి తన్ను తాను అప్పగించుకోవడం. అది స్త్రీ యొక్క స్వభావము. అలాగే క్రీస్తుకు, ఆయన చిత్తమునకు తన్ను తాను అప్పగించుకోవడమే సంఘము యొక్క స్వభావము. కేవలము అప్పగించుకో! ఆమెకు తన సొంత ఆలోచన లేదు. మరొకరి మాట కాక, ఆయన మాటనే ఆమె తీసుకొనును. హవ్వ అది చేసి యుండినట్లయితే మనము ఎన్నడూ చనిపోవలసియుండే వారము కాదు. ఆమె తర్కములు విన్నది. కాని నిజమైన క్రీస్తు వధువు, క్రీస్తు యొక్క నాయకత్వమును, వాక్యమును తీసుకొనును, మరియు దేవుని మాటను మాత్రమే నమ్మెను. అది నిజమైన పునరుద్ధరించబడిన వధువు. హల్లెలూయా! స్నేహితులారా, ఇది దగ్గర సమయము. నీవు ఆలోచించడం కంటే అది ఆలస్యమైయున్నది. మనము సాయంకాలపు సమయంలో వున్నాము. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఇక్కడ వున్నది. నాకు తెలుసు, అది ఒక చిన్న గుంపుగా వున్నది.

67"ఓ, అలాంటిది ఏదైనను జరిగినట్లయితే, దేవుడు దానిని రోమ్ లో బిషప్పులకు, పోపులకు ప్రత్యక్షపరచుతాడని, నీవు అనుకొంటావేమో, ఆయన మెతడిస్టు, బిషప్పు దగ్గరకు వెళతాడు, అదే నీవు ఆలోచించేది. కాని ఆయన ఎన్నడూ దానిని ఆ రీతిగా చేయడు.

ఆయన కొరకు ఎదురు చూచుచున్న దీన హృదయముల దగ్గరకు ఆయన వచ్చును. మరియు ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధాత్మ, దేవుడు, ఆ దేవుని దూత వున్నాడు. ఇక్కడ శాస్త్రజ్ఞుల ముందు రుజవు చేస్తూ తీయబడిన చిత్రము, ఆయన అక్కడ వున్నాడు. జార్జి, జే. లేసి, ఎఫ్. బి.ఐ. ఫింగర్ ఫ్రింటింగ్ డాక్యుమెంట్సు అధికారి ఇలా అన్నాడు, "వెలుగు కెమెరా అద్దములను తాకినది." "మిస్టర్ బ్రెన్హాం, నేను అనేకసార్లు అది మనస్తత్వశాస్త్రమని, ఆ ప్రజల మనస్సులను చదువుతున్నావని చెప్పాను. కాని "ఈ కెమెరా యొక్క యాంత్రిక కన్ను మనస్తత్వ శాస్త్రమును ఫోటో తీయలేదు. వెలుగు అద్దములను తాకినది. అది అక్కడ వున్నది!" అక్కడ అది వున్నది. వాటిలో ఒకటి వాషింగ్టన్ డి.సి. లో వ్రేలాడుచున్నది. ప్రచురణాధికారము చేయబడినది, "ఫోటో తీయబడి మరియు శాస్త్రీయంగా రుజువు చేయబడిన ఒకే ఒక సహజాతీతమైన వ్యక్తి." (Supernatural Being.)

68ఎందుకు? నేను ఈ రాత్రి చనిపోయినట్లయితే, రేపు రాత్రికి ఈ ప్రసంగ వేదికను నేను ఎన్నడూ సమిపించకపోయిననూ, నా మాటలు సత్యము. ఎందుకనగా అవి నా మాటలు కావు. అవి ఆయన మాటలు. "నా అంతట నేను," అని ఎన్నడూ చెప్పలేదు. అది నేను కాదు. నేను ఏమియు చేయలేను. నేను మీలాంటి మనిషిని, కృప ద్వారా రక్షించబడిన పాపిని, కాని దేవుడు ఈ చివరి దినములలో ఈ సంగతులను వాగ్దానము చేసెను. మరియు అది ఇక్కడ వున్నవి. అది వాక్యమై యున్నది. అది కట్టు కథ అయితే అది వేరైనది. కాని అది వాక్యమై యుండి, వాక్యము ద్వారా వాక్యమును రుజవు చేయుచున్నది. బైబిలు అంతటా రూఢి చేయుచున్నది. శాస్త్రజ్ఞుల చేత రూఢి చేయబడియున్నది. ఆత్మ ద్వారా రూఢి చేయబడి వున్నది. సంఘము ద్వారా రూఢి చేయబడి యున్నది. దేవుడు మన మధ్య వున్నాడు! హల్లెలూయా. దానిని బట్టి నేను ఎంతో ఆనందించుచున్నాను. నిన్న రాత్రిని బట్టి మీరు ఆనందించరా, మీరు నిలబడి ఆ నిర్ణయం చేశారు? అది నీకు భిన్నమైన అనుభూతిని కలిగించుట లేదా? నీవు దేవుని వాక్యము కొరకు నిలబడినప్పుడు, అది ఎల్లప్పుడు అదే చేస్తుంది. క్రీస్తు కొరకు నిలబడుము. దాన్ని గూర్తి సిగ్గుపడవద్దు.

HEB 13:8

 

69ప్రార్ధన చేసికొందాము.

ఈ రాత్రి ఇక్కడ తమ చేతులను ఒక్క క్షణము ఎత్తి చూపి, "సహోదరుడా బ్రెన్హాం, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసికొనుము, అనే వారు ఎవరైనా వున్నారా! నేనున్నాను, అబ్రాహాము సంతానములో ఒకరిగా వుండుటకు నేను ఎంతో ఆశగొనియున్నాను. పరలోకమును పోగొట్టుకొనుట నాకు ఇష్టము లేదు. సహోదరుడా బ్రెన్హాం ప్రార్ధించండి. ఎల్లప్పుడు నా హృదయాంతరంగములో దేనినో అందుకోవాలని నాకు వుంటుంది. నేను దానిని ఎన్నడూ పొందలేకపోవుచున్నాను. దేవుడు దానిని నాకిచ్చునట్లు, సహోదరుడా బ్రెన్హాం నా కొరకు ప్రార్థన చేయండి?" దేవుడు నిన్ను దీవించును. ప్రతి చోట చేతులను చూడండి, అవి పైకి వచుచున్నది.

బాల్కనీలలో వున్న వారి సంగతి ఏమిటి? ఆయన ఇక్కడ క్రింద వున్నట్లుగానే బాల్కనీలలో కూడా ఆయన అంత గొప్పవాడు.

మీరు నిజముగా యధార్ధముగా నున్నారా? అది నిజముగా? మీ చేతులెత్తండి. దేవుడు నిన్ను దీవించును. నేను ఒక్క క్షణము పరిశీలించుదును. మీ తలలు వంచి ప్రార్థన చేస్తుయుండండి.

ఒక పాపి ఈ రాత్రి చేతులెత్తగోరనయెడల, "ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుమని చెప్పండి. నేను నా చేతిని ఆ బోధకుని కొరకు ఎత్తుట లేదు. నేను నా చేతిని నీకు ఎత్తుచున్నాను. ఈ దినమున నీవు జీవించుచున్నావని నేను నిజముగా నమ్ముచున్నాను. నీవు ఎన్నడూ చనిపోలేదు. నీవు చనిపోయి, తిరిగి లేచావు. మరియు నీవు సదా కాలము జీవించుచున్నావు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావు. నేను నా చేతిని నీ తట్టుకు ఎత్తుచున్నాను, ఎందుకనగా నీవు ఇక్కడ వున్నావని నేను నమ్ముచున్నాను. మీ చేతులెత్తి, "ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుమని చెప్పండి, ప్రార్ధిస్తూ యుండండి. దేవుని యందు విశ్వాసముంచుడి.

నీవొక వెనుకజారిన విశ్వాసివా? దేవుడు నిన్ను దీవించును గాక, ఆయన నీ చేతిని చూస్తున్నాడు.

MATT 13:3-8•

MATT 24:36•

MARK 4:3-8

 

70మా పరలోకపు తండ్రి, మీరు ఆ చేతులను చూస్తున్నారు. వాటి వెనుక వున్నది నీకు తెలుసు. నీవు చెప్పావు, "విత్తువాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని త్రోవ ప్రక్కన పడినవి, ఏమి లాభము లేకపోయినది; కొన్ని రాతి నేలను పడినవి; కొన్ని ముండ్ల పొందలలో పడినవి; కొన్ని నూరంతలుగా ఫలించినవి." విత్తువాడు విత్తనములు చల్లుట వరకే బాధ్యుడు. పరిశుద్ధాత్మ ఇప్పుడే ఆ విత్తనమును పట్టుకొనును గాక ప్రభువా, నేను నమ్ముచున్నాను.

నీవు ఎప్పుడు వచ్చుచున్నావో ఏ మనిషికి తెలియదు. అది మాకు తెలియదు. నీవన్నావు, "కనీసము దూతలకు కూడా తెలియదు; కేవలం తండ్రికి మాత్రమే." యేసు నాకు తెలియదని చెప్పెను. "కేవలం తండ్రికి మాత్రమే!" తండ్రీ! ఇప్పుడు చేతులు పైకి ఎత్తిన వారు ఆ వుద్దేశ్యమును కలిగి యున్నారని నమ్ముచున్నాను, ఆత్మ వారిని చేతులు ఎత్తమని చెప్పింది, వారు చేతులెత్తారు. వారు యధార్థముగా ఉన్నారు. ఒకవేళ నీవు వారితో మాట్లాడుట ఇదే వారితో మొదటిసారి కావచ్చు, మరియు ఇది ఆఖరి సారి కావచ్చు. నీవు ఇతర సమయములలో మాట్లాడావు, మరియు ఎన్నడూ తిరిగి మాట్లాడవు. నాకు తెలియదు. కాని పరలోకపు తండ్రి, నమ్ము ప్రతివానికి నీవు రక్షణ దయచేయుమని ప్రార్ధించుచున్నాను.

71నీ పరిశుద్ధ నామము ప్రజల ముందు పూజించబడుటకు తేబడును గాక, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ప్రతి హృదయములో కుమ్మరించబడును గాక, ప్రభువా. ఈ సోదర సేవకులను దీవించుము. ఈ ప్రశస్తమైన ప్రజలు, పోరాటము మధ్యలో నన్ను ఆహ్వానించారు. ఏమైనప్పటికి కూటములకు హాజరుగుచున్న ప్రజలను దీవించుము.

ప్రభువా, మూర్ఖముగానో లేక వ్యత్యాసముగానే నుండుట నా భావన కాదు. కేవలము యధార్థముగా వుండుటకు ఇష్టపడుచున్నాను. మరియు నీవు గుర్తించేది అది ఒక్కటి మాత్రమే. ఒక వ్యక్తిలోని సత్యమునే, ఏలయనగా నీవు సత్యమైయున్నావు. తండ్రి, నా ప్రార్ధన ఇప్పుడు వినుము. ఏ విధముగానైనా ఇక్కడ చేతులెత్తని అనేక మంది రక్షణ పొందుటకు సహాయము చేయుము. యేసు నామములో దానిని దయచేయుము. ఆమేన్.

72ఇప్పుడు వినయముగా మనము కూర్చునియుండగా, ఒక్క క్షణము ప్రార్ధనా వరుసను ప్రారంభించుట వలన మనకు కొంచెం ఆలస్యమైనది, కాని మనము దానిని చేయుదుము. ప్రతి ఒక్కరు మీకు ప్రార్థనా చీటి ఉండినయెడల మీ చీటిని పట్టుకొని యుండండి. మీకు చీటి లేనియెడల ఒకటి అడిగి తీసికొనుము. మేము అయిదు దినముల కంటే ఎక్కువగా ఇక్కడ వుండగలిగితే, మేము వారిలో ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయబోవుచున్నాము. అది నిజము.

ప్రజలకు వర్తమానము అందించుటకు నేను ప్రయత్నించుచున్నాను. మీరు ముఖ్యమైన దానిని చూడవలెనని నేను యత్నించుచున్నాను… మీరు స్వస్థపడినట్లయితే, ఒక వేళ మీరు ఎక్కువ కాలం జీవించినట్లయితే, మరలా మీరు ఎప్పుడో వ్యాధిగ్రస్తులవుతారు. కాని మీరు శాశ్వతంగా రక్షణ పొందినట్లయితే, మీకు నిత్యజీవమున్నది, చూశారా. నీవు స్వస్థపడవచ్చు, మరియు నీ మార్గములో వెళ్ళి నీ రక్షణను పోగొట్టుకుంటావు. దాని కంటే నీ జీవితాన్ని పోగొట్టుకోవచ్చు; కాని నీవు రక్షణ పొందినప్పుడు, నీకు నిత్యజీవమున్నది, ఎన్నడూ నీవు వ్యాధి గ్రస్తుడవుకావు.

73ఈ రాత్రి నేను ఏమి మాట్లాడుచున్నానో మీకు అర్ధము అయితే నేను ఆశ్చర్యపడుదును, దేవుడు అబ్రాహాము, శారాకు ప్రత్యక్షమై వారికి చివరి గురుతును ఇచ్చెను, ఆ దేవుని దూత, నాశనము రాక ముందు వాగ్దాన కుమారుడు ఇవ్వబడినాడు. సంఘమునకు అది రానున్న కుమారుని గురుతు. లోకమునకు అది నాశనము. ఇప్పుడు అబ్రాహామునకు ఏమి చేశాడో అవి మాదిరులుగా వున్నవి.

అబ్రాహాము రాజ సంతానమైన యేసు భూమి మీదకు వచ్చి అదే గురుతును చూపించెను. అది ఆ రీతిగా వుంటుందని ఎంతమందికి అది తెలియును, "ఆమేన్" చెప్పండి. నిజముగా, మరియు వారు దానిని తిరస్కరించిరి. అది నిజమేనా?

ఆయన దానిని అన్యులకు ఎన్నడునూ చేయలేదు, ఎందుకనగా రాజ సంతానము బయటకు వెళ్ళి యుండలేదు. సంఘము ఇంకా జన్మించి యుండలేదు. సంఘము జన్మించి ఇప్పుడు 2000 సంవత్సరములైనవి. గుర్తుంచుకొనండి, అది అబ్రాహాము ఎదురు చూచుట యొక్క ముగింపులోనై వున్నది. అది మెస్సీయ కొరకు సహజ సంతానము ఎదురు చూచుట యొక్క ముగింపై యున్నది, ఎందుకనగా మెస్సీయా అక్కడ ఉన్నాడు.

1COR 1:7•

1THS 2:19•

1TIM 6:14•

2TIM 1:10•

2TIM 4:1,8•

TIT 2:13•

1PET 1:7

 

74ఇది రాజ సంతానమును ఎదురు చూచుట యొక్క ముగింపైయున్నది. ఆయన ఇక్కడ వున్నాడు. క్రీస్తు ప్రత్యక్షము కావడము, మీరు ఎన్నడైనా విభజించుటకు ప్రయత్నించారా… బైబిలులో ఒక స్థలము వున్నది. మీకు తెలుసా, దానిలోనికి వెళ్ళుటకు నాకు సమయము లేదు. "క్రీస్తు ప్రత్యక్షము కావడము." మరియు, "క్రీస్తు యొక్క రాకడ." పూర్తిగా అవి రెండు వేర్వేరు సంగతులు. "ప్రత్యక్షం కావడము," మరియు "రాకడ" ఆయన ఇప్పుడు ప్రత్యక్షమగుచున్నాడు. పరిశుద్ధాత్మ రూపములో మనతో పనిచేయుచున్నాడు, సంఘమును పరిపూర్ణము చేయుచున్నాడు. అది పరిపూర్ణము కావలసియున్నది.

మీ జేబులో ఒక డాలరు నోటు వున్నట్లుగా, దానిని బయటకు తీసి చూడండి. ఒక వైపు అమెరికా ముద్ర వుంటుంది. మరొక వైపు ఐగుప్తు ముద్ర ఒక కన్ను చూస్తున్నట్లుగా, పిరమిడ్లో తలరాయి పైన వుంటుంది. "ఆ గొప్ప ముద్రను దాని క్రింద అమెరికా ప్రభుత్వము ఎందుకు ఉంచినది? అమెరికా ముద్ర ఇక్కడ గొప్ప ముద్రగా కనబడుతుంది. ఈ గొప్ప ముద్రను అమెరికా ప్రభుత్వము వారికి ఇష్టము వున్న, లేకున్నా దానిని గుర్తించినది.

దాని ఆకారము పైకి వెళ్ళుచుండగా పిరమిడ్ ను (సంఘమును) గమనించండి, నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు తరువాత అది పదునుగా చేయబడవలసియున్నది. తలరాయి పిరమిడ్ మీదకు ఎన్నడూ వచ్చి యుండలేదు, మూలరాయి వలె అది తిరస్కరించబడినది, కాని తలరాయి వచ్చినప్పుడు… నేను పిరమిడ్ వద్దకు వెళ్ళియున్నాను. అది ఎంత పరిపూర్ణముగా అతుకబడినదంటే ఆ సున్నపు గచ్చువున్న చోట వాటి మధ్యలో నీవు రేజరు బ్లేడును కూడా దూర్చలేవు. క్రీస్తు తన సంఘమును తీసికొనుటకు వచ్చినప్పుడు, సంఘము అదే రీతిగా ఖచ్చితమైన సేవను కలిగియుండును. మరియు ఆ కృప ద్వారా సమస్తమునూ లేపి, తీసుకొనిపోవును. తలరాయి రావటం; "కృప కలుగును గాక" అని కేకలు వేయుట.

JOHN 16:28•

ACTS 9:3-5

 

75నా హృదయంలో ఒకటి వున్నది. హల్లెలూయా! మన దేవుడు ఇంకనూ దేవుడై యున్నాడు, ఆయన తన దాసులకు రహస్యమును బయలుపరచును. తన వీపును గుడారము వైపు త్రిప్పిన దేవుని దూతను గూర్చి నేను చెప్పాను, శారా లోపల వుండి ఏమి తలంచుచున్నదో చెప్పాను, ఆ దేవుని దూత ఇక్కడ వున్నదని నేను ముందుగా చెప్పుచున్నాను, పరిశుద్ధాత్మ, అదే అగ్నిస్తంభము, క్రీస్తులో వున్న అదే వ్యక్తి, అగ్నిస్తంభము ఇశ్రాయేలీయులను నడిపించెను. ఆ అగ్నిస్తంభము శరీరధారియై మన మధ్య నివసించెను. ఆయన అన్నాడు, "నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని యొద్దకు వెళతాను."

ఆయన మరణము, భూస్థాపన పునరుత్థానము, ఆరోహణము తరువాత ఆయన దమస్కుపోవు మార్గమున సౌలును కలుసుకొనెను. మరియు ఆ వెలుగు అతనిని తాకినప్పుడు, "ప్రభువా, ప్రభువా!" అని అతడు పిలిచాడు.

ఆయన మొదట "సౌలా, సౌలా," అని పిలచుచు "నీవెందుకు నన్ను హింసించుచున్నావు?" అని అడిగెను.

"ప్రభువా, నీవెవడవని?" సౌలు మరలా అడిగెను.

అన్నాడు, "నేను యేసును," ఆయన వెనుకకు వెళ్ళిపోయాడు! (ఆయన దేవుని స్థానమునకు వెళ్లిపోయాడు)

2KGS 2:14

 

76సంఘము ద్వారాను, శాస్త్రీయముగాను రుజువు చేయబడి, ఆయన ఈ రాత్రి ఇక్కడ వున్నాడు, ఓ, స్నేహితులారా, ఎందుకు మనము అంత నీరసంగా వున్నాము? ఎందుకు మనము అంత కూలిపోయి కూర్చున్నాము? వాక్యమును పలికిన ఆ దేవుడే.. ఎలీషా చెప్పినట్లుగా, ఎలీషా వలె రెండు పాళ్ళతో ఎవరు తిరిగి వస్తారు? అతడు తన దుప్పటిని మడచి, "ఏలీయ యొక్క దేవుడు ఎక్కడ వున్నాడు?" అనెను. వాక్యమును వ్రాసిన ఆ దేవుడే వాక్యమును నిరూపించును గాక! ఇది ఆయన వాక్యమైనచో, దాని ప్రక్కన ఆయన నిలబడును. దానిని చేయుదునని ఆయన నాగ్దానము చేసెను. మనము దానిని నమ్మినయెడల ఆయన దానిని చేయును.

ఇప్పుడు, ఇది తేటగా మీకు తెలియబడనీయుడి. నేను ఆ వ్యక్తిని కాదు. ఆ వ్యక్తికి నేను సేవకుడను. నీవు అబ్రాహాము సంతానమైనచో, నీవు కూడా!

77కాని, ప్రతి సంఘము నన్ను త్రోసి వేసిన దినమున, సంస్థలు ఒక చోట నుండి మరొక చోటుకి నన్ను నెట్టి వేసిన దినమున నేను నిలబడి ఆయన వాక్యమును బోధించుచున్నాను. మరియు సంస్థలలో వున్న వెలుగును చూచిన ప్రశస్తమైన సోదరులు, వారి ప్రధాన కార్యాలయములు ఏమి చెప్పినప్పటికిని దానితోనే వారు నిలబడియున్నారు. అలాంటి మనుష్యులను ప్రభువు దీవించును. నిన్న రాత్రి నిలబడిన స్త్రీ పురుషులను ప్రభువు దీవించును. నేను మీ కొరకు ఏమి చేయగలను. నేను ఏమి చేయాలో నన్ను అడగండి. నేను చేయగలిగినది ఏదైనా మీ కొరకు చేస్తాను. మీరు దేవుని ప్రజలు, ఏ స్త్రీ అయినా లేక పురుషుడైనా పోరాటం మధ్యలో అలాంటి తీర్మానం చేస్తే, మీ పట్ల నాకు గౌరవము వున్నది.

MATT 28:20•

JOHN 14:12

 

78ఇప్పుడు ఆ దూత… యేసు క్రీస్తు వాక్యము ముందుగా చెప్పబడినచో, మనుష్యకుమారుడు రాక ముందు సొదొమలో జరిగిన అదే సంఘటన సంఘములో జరుగుతుంది. ఆయనను రంగము మీదకు రానివ్వండి.

నేను నా వీపును త్రిప్పుదును. మీరు మీ తల వంచి ప్రార్ధించండి. నేను దానిని చేయుటకు నడిపించబడని యెడల నేను ఎంత మాత్రము అది చెప్పను. అలాంటి వ్యాఖ్య చేసినందుకు నేను వెర్రివాడనగుదును. కాని దేవుని కుమారుడైన క్రీస్తు నందు విశ్వాస ముంచుచూ ఆయనే వాక్యమని నమ్ముచున్నాను. మనము వాక్యమును తీసికొన్నప్పుడు, మన శరీరములో వాక్యము యధార్థమైనది, ఎందుకనగా అది ఆయన వాగ్దానము, "యుగ సమాప్తి పర్యంతము నేను మీలో వుంటాను. మరియు నేను చేయు క్రియలు మీరునూ చేయుదురు."

HEB 13:8

 

79పరలోకపు తండ్రి, నా వీపును ప్రజల వైపుకు త్రిప్పియున్నాను. నేను ఈ వర్తమానము మీద బోధించాను. ఈ రాత్రి నీకు ప్రార్ధించుచున్నాను. నీవు ఇంకనూ దేవుని కుమారుడవైన యేసు క్రీస్తువని, నీవు ఇంకనూ యెహోవా దేవుడవని తెలియబడును గాక, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నావు. మరియు అబ్రాహాముతో అక్కడ ఆ దినమున గుడారము యొద్ద మాట్లాడినది నీవైయున్నావు. గుడారములో వున్న ఆ స్త్రీ ఏమి ఆలోచించుచున్నదో నీవే వివేచించి చెప్పావు. మరియు అప్పుడే, అక్కడ, ఆమె దానిని కాదన్నందుకు, నీవు ఆమె ప్రాణమును తీసుకొని యుండేవాడవు, కాని ఆమె అబ్రహాముతో భాగమై యున్నది, అతని వధువు. ప్రభువా, మా అవిశ్వాసమును బట్టి నీవు మా జీవితములను తీసివేసి యుందువు, కాని మేము క్రీప్తులో భాగమైయున్నాము. అబ్రహామును గాయపర్చకుండా నీవు శారాను తీసుకొనలేవు. క్రీస్తును గాయపర్చకుండా నీవు సంఘమును అంగీకరించలేవు. ప్రభువా, సహాయము చేయుము. నాకు విద్య లేదు. నేను కేవలము… దేవా, నా యొద్ద ఏమి లేదు, కాని కేవలము నిన్ను నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. ప్రభువా, సహాయము చేయుము.

1COR 14:4,5

 

80[ఒక సహోదరి అన్యభాషలలో మాట్లాడుచున్నది. మరొక సహోదరి దానికి తర్జుమా చెప్పుచున్నది.] ఆమేన్. సజీవ దేవునికి వందనములు. ఇప్పుడు ఆయన ఇక్కడ వున్నాడు. గౌరవంగా, భక్తిగా వుండండి.

మీరు కోరినచో మీ తలను ఎత్తవచ్చు. చూడండి, బైబిలు చెప్పుచున్నది, దానికి అనువాదము లేనియెడల భాషలతో మాట్లాడడం కేవలము నీ క్షేమాభివృద్ధి కొరకే. మరియు దానికి అర్థము చెప్పినయెడల సంఘమునకు ప్రవచనము. అప్పుడు తర్జుమాను నేను ఏ రీతిగా అర్ధము చేసికొన్నానంటే "ప్రభువును నమ్ముము, ఆయనే ఆ వాక్యమును పంపినవాడు." తరువాత నేను ఎన్నడూ నా సొంత పేరులో రాను, కాని ఆయన నామములో వస్తాను. మరియు అప్పుడు ఆయన తన క్రియలను, ఆయన వాక్యమును ప్రకటించుట ద్వారా, ఆయన మాటను రుజువు చేయుట ద్వారా, అది నా ద్వారా చేయును. నిశ్చయంగా, నేను దానిని నమ్ముదును. మీరును అదే నమ్ముచున్నారా? ఎంతమంది ఇప్పుడు దానిని నమ్ముతారు. ఆయన ముందు…? దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు, ఆ విధముగానే ఆ క్రమమును అలాగే ఉంచినప్పుడు ఏదో జరగడం మీరు చూస్తారు.

81నేను నా వీపును ప్రజల వైపు త్రిప్పబోవుచున్నాను, ఎందుకనగా ఆ విధముగా పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమి చేయాలో ధైర్యముగా వుండండి. సమూహములోని మీలో కొందరు దానిని నమ్ముచున్నారా? ఎవరైనా, నేను ఒక వ్యక్తిని కూడా చూచుట లేదు… మీలో ఎంతమంది వ్యాధిచేత, మనో వేదనల లేక బాధించబడుచున్న వారిగా వున్నారు, లేక ఎవరో బాధపడుచుండగా అలాంటి వారి కొరకు మీరు ప్రార్థించు వారున్నారా! అది మీకు మాత్రము తెలియును. దానిని గురించి నాకు ఏమి తెలియదు చేతులెత్తండి. మంచిది, ప్రతి చోట చేతులెత్తి యున్నారు. మంచిది, ఇప్పుడు మనము కేవలము నమ్మదుము. ఎవరూ వెళ్ళవద్దు, ఇప్పుడు సమయము పది గంటలకు 12 నిమిషాలు తక్కువగా వున్నది. నాకు పన్నెండు నిమిషాలు ఇవ్వండి. దయచేసి ఇస్తారా? ఎవరూ కదల వద్దు. ఎవరూ ఈ స్థలమును విడువవద్దు. ఇప్పుడు ప్రశాంతముగా కూర్చోండి. ఒక్కసారి మీ హృదయములను తెరువండి.

2SAM 6:19•

1CH 16:3

 

82[ఒక సహోదరుడు అన్య భాషలతో మాట్లాడుచున్నాడు. మరొకరు దానికి తర్జుమా ఇచ్చుచున్నారు.] ఆమేన్! ప్రభువా! నీకు వందనములు. వందనములు. భక్తితో మన హృదయమంతటితో దానిని గౌరవించుదము, అది సంఘములో ఒక వరమైయున్నది. మర్యాదగా, ప్రార్థనలో వుండండి.

గుర్తున్నదా, ఒకసారి వారు యుద్ధమునకు వెళ్ళుచున్నారు. ఆ గొప్ప యుద్ధమును ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియదు. దావీదు అక్కడ నిలబడియున్నాడు. వారికి కొంత ఆహారమును, ద్రాక్షారసమును విభజించి ఇచ్చెను. కాని దేవుని ఆత్మ ఒక మనిషి మీద వచ్చినప్పుడు అతడు ప్రవచించి శత్రువును ఎక్కడ ఎదుర్కొవాలో వారికి చెప్పెను. అది ఆలాగే జరిగెను.

సోదరుడా, మనము గొప్ప యుద్ధమును ఎదుర్కొనుచున్నాము. మరియు ఇప్పుడే మనము గొప్ప యుద్ధముతో నిలబడియున్నాము. దేవుని ఆత్మ ఒకరి మీద వ్రాలి నీవు ఏమి చేయాలో చెప్పినది, కేవలము "నమ్ముము." ఆయన నా నుండి మీ మనస్సును త్రిప్పుటకు ప్రయత్నించుచున్నాడు, చూడండి. మీలో కొందరు సహోదరుడు బ్రెన్హాం తప్పక అది ఏదో చేయుటకు ప్రయత్నించుచున్నాడని తలంచుచున్నారు. అది నేను కాదు; అది ఆయనే. ఒక వరమనగా నీవు దానిని లోపర్చుకొనుటకే నిన్ను ఒక చక్రములోనికి లాగు విధముగా ఉన్నది. ఈ మైక్రోఫోను వలె దానిని త్రిప్పండి; దాని ద్వారా ఏదో మాట్లాడవలసి యుంటుంది. అది కేవలము నేను త్రిప్పు ఒక చక్రము వంటిది! అది ఒక చిన్న విషయము. అది పరిశుద్ధాత్మ! నేను దానిని త్రిప్పును. ఆయన దానిని త్రిప్పును. తరువాత ఆయనే మాట్లాడును; అది నేను కాదు. మీలో ప్రతి ఒక్కరూ ప్రార్ధించండి, భయభక్తులతో ఆయనను నమ్మండి.

JOHN 15:5•

HEB 4:15

 

83మనలో ప్రతి ఒక్కరికి బైబిలు చెప్పినది తెలుసు, అది, "యేసుక్రీస్తు ఇప్పుడే మన రోగములతో ఆయనను తాక కలుగునట్లు మన ప్రధానయాజకుడుగా వున్నాడు." అది నిజమేనా? సంఘము "ఆమేన్" చెప్పండి. ఆయన అదే ప్రధానయాజకుడా? "ఆమేన్" చెప్పండి. ఆయన అదే ప్రధాన యాజకుడైతే, ఆయన అదే రీతిగానే పని చేయును. అది నిజమేనా? ఆమేన్. ఇప్పుడు మీరు ఏమి చేయాలి?

ఇప్పుడు, నన్ను ముట్టుట వలన ఏమి జరుగదు; నేను కేవలము ఒక మనిషిని. కాని అది ఆయనను ముట్టుటయై యున్నది. ఆయన ఇక్కడ వున్న పరిశుద్దాతయై వున్నాడు. అప్పుడు ఆయన దానిని చేయుచూ మానవ పెదవులను వాడుకొనును. ఎందుకనగా ఆయన ద్రాక్షవల్లి, మనము కొమ్మలమై వున్నాము; ఆయన ఫలములు ఫలించడు, కాని కొమ్మలకు శక్తిని మాత్రమే ఇచ్చును.

నేను వెనుకకు తిరుగుదును. అప్పుడు నేను చెప్పిన సంగతులను మీరు చూడగలరు.

84ఇక్కడ మేడ పై వున్న సేవకులు ప్రార్థించుచున్నారు. మీరు కోరినట్లయితే నా వైపు చూడవచ్చు. అది మంచిది. కేవలము చూడడం. మీరు తెలుసుకోవాలి… ఎందుకనగా మీరు కాపరులై యుండి ఈ గొర్రెలను కాయు వారుగా వున్నారు. కాబట్టి మీకు అది తెలియాలి. సోదరులారా, మీరు నా కొరకు ప్రార్ధన చేయండి. ఎందుకనగా నేను ఏమై యున్నానో మీరు చూస్తున్నారు. మీరు సేవించుచున్న క్రీస్తుకే నేను ప్రాతినిధ్యం వహించుచున్నాను. మరియు నేను మీ సోదరుడను. మీ సోదరులతో దేవుని రాజ్యములో మీ తోటి పౌరుడను. నేను కేవలము ఇక్కడ వున్నాను…

చూడండి, ఇప్పుడే నేను బోధించిన వాక్యము పణ౦గా యున్నది. ఇప్పుడే అపజయము, సాతానుదాని చూడాలని ఆశించుచున్నాడు. వాడు దాని కొరకు మాత్రము చూచుచున్నాడు. కాని దేవుడుఎన్నడూ తప్పిపోడు. భయముతో వుండండి.

85నా వెనుక ప్రక్క కొందరు నాకు కావలసి యున్నది… దానిని త్రిప్పనివ్వండి, ఆది ఈ చుట్టూరా నిండి వున్నది. మొదటిగా ఈ వైపునకు తిరుగుదును. తరువాత మరొక వైపునకు వచ్చెదను. ఈ వెనుక ఎవరోవున్నారు. అక్కడ చాలా మంది ప్రార్థించుచున్నట్లుగా వున్నారు. మరలా ఇటువైపుగా ఎవరో ప్రార్థించుచున్నారు. దేవుని నమ్మాలనుకొనుచున్నారు. ఇక్కడ వెనుక వున్న వారైన మీరు మీ హృదయమంతటితో నమ్మండి.

పరలోకపు తండ్రి, మి వర్తమానములన్నింటిలో నీవు చేసిన సమస్తమును బట్టి, నేను మిమ్మును కొనియాడుచున్నాను. ప్రభువా, ఇపుడు నాకు సహాయము చేయుము. విశ్వాసము ద్వారా నీ వాక్యమును మరియు నిన్ను నమ్ముచున్నాను. దీనిని చేయుటకే నీ ఆత్మ నన్ను పిలిచినదని నేను నమ్ముచున్నాను. ఇపుడు నేను సత్యము చెప్పితినని తెలియబడును గాక!నిన్ను గురించి సాక్ష్యమిచ్చాను, దేవా, ఇపుడు నేను సత్యము చెప్పితినని సాక్ష్యమిమ్ము. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

1COR 14:27

 

86[ఒక సహోదరి అన్యభాషలో మాట్లాడుచున్నది.]

తండ్రియైన దేవా, బైబిలులో నీవు మూడు గమనములు వున్నవని చెప్పావు. దాని యొక్క అనువాదము కొరకు మేము ఎదురు చూచుచున్నాము. మరియు ఇపుడు నీవు ఆ మూడవ దానిని అనువాదము చేయు వరము గల ఎవరికైనా దానిని తెలియపర్చుమని ప్రార్థించుచున్నాము. యేసు నామములో దానిని మీకు విడిచిపెట్టుచున్నాను.

[ఒక సోదరుడు ప్రవచనము చెప్పుచున్నాడు.] ప్రభువా, వందనములు.

ఇప్పుడు, అది ప్రవచనము, అనువాదము కాదు. చూడండి, ఆయన ఆ స్త్రీ చెప్పిన దాని కంటే ఎక్కువ చెప్పాడు. అక్కడ ఒక అనువాదము వచ్చుచున్నది. చూడండి, ఆ మనిషి ప్రవక్తయై యున్నాడు.

[ఒక సోదరుడు తర్జుమా ఇచ్చుచున్నాడు.] ఆమేన్. ప్రభువా, వందనములు.

నా వెనుక నుండి నేరుగా వచ్చుచున్నది… [సమాజములో ఒక సాహోదరి ప్రార్థించుచున్నది.] దేవా, ఆమె అడిగిన దీవెనను ఆమెకు దయ చేయుము. కేవలము అలాగే …

ఇప్పుడు మీరందరు వినయముగా మీ హృదయమంతటితో నమ్మచూ ఉండుడి. పరిశుద్ధాత్మ ద్వారా నేను భోదించిన వాక్యమును మరొకసారి తెచ్చుటకు ప్రయత్నించుచున్నాను. దాని యందు ఆయన సాక్ష్యమిచ్చినది నెరవేరనైయున్నది. మా హృదయమంతటితో ఇప్పుడు దానిని నమ్మండి.

87నా వెనుక వైపుగా వున్న ఒకరు ఇప్పుడు నా ముందు నిలబడియున్నారు. అది నా వెనుక వున్నది. అది ఒక స్త్రీ. మరియు ఆమె గుండె జబ్బుతో బాధపడుచున్నది. అనేక ఎదిరింపులతో ఆమె బాధించబడుచున్నది. ఆమె నా వెనుక వున్నది. ఆ స్త్రీ ఇంకనూ నిలబడక పోయినచో… ప్రేక్షకులు చూస్తున్నారు. నేను నా కన్నులు మూసుకునియున్నాను. ఆమె తన ప్రక్కనే కూర్చున్న భర్తను గూర్చి కూడా శ్రద్ధ కలిగియున్నది. అతడు పక్షవాతముతో బాధపడుచున్నాడు. అతని చేత కర్ర వున్నది. ఆ స్త్రీ పేరు శ్రీమతి. బ్రుమ్లీ. నీ హృదయమంతటితో నమ్ము. నీవు దేని కొరకు ప్రార్థించావో నిలబడి దానిని అంగీకరించుము. నీవు అడిగిన దానిని పొందుదువు. నీవు లేచి నిలబడుము. ఆమె లేచినదా? [సంఘము "అవును," అన్నారు.]

దేవుడు నిన్ను దీవించును గాక. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. మనము ఒకరికొకరము క్రొత్తవారము. ఇపుడు వెళ్ళి ఆమెను అడగండి. ఆది నిజమేనేమో. సొదొమ ముందు అక్కడ వుండిన ఆ దేవుడే కాదా, ఆది ఏమిటో నాకు తెలియదు.

88ఈ భాగములో ఎవరైనా మా హృదయమంతటితో ప్రభువైన యేసును నమ్ముతున్నారా. అక్కడ ఒక స్త్రీ నా ముందే కూర్చొనియున్నది. ఆమెకు లోతైన ఆశ వున్నది. దేనినో దేవుడు ఆమెకు ఇవ్వాలని ప్రార్థించుచున్నది. ఆమె బిడ్డ కొరకు ప్రార్ధించుచున్నది. ఆమె ఇక్కడే నా వెనుక వున్నది. శ్రీమతి. హోమ్ మీరు నిలబడి ప్రభువైన దేవుని నమ్మండి. మరియు నీవు నీ హృదయమంతటితో నమ్మినట్లయితే, నీవు ప్రార్ధించుచున్నట్లుగా ఆ బిడ్డను పొందగలవు.

ఒక స్త్రీ లోనికి వచ్చియున్నది, ఆమె ఒక అవిటి మనిషి. ఆమె చక్రాల కుర్చీలో కూర్చుని యున్నది. ఆమె నా వెనుకగా వున్నది. ఆమె ఈ దేశము నుండి వచ్చినది కాదు. ఆమె సాక్రమెంటో, ఉత్తర సాక్రమెంటో నుండి వచ్చినది. ఆమె చాలా వ్యాధిగ్రస్తురాలిగా వున్నది. డాక్టర్లు ఆమెకు సహాయము చేయలేకపోయారు. ఆమె ఒక హాస్పటల్లో వుండి యున్నది. ఆమెకు చాలా ఆపరేషనలు జరిగినవి. ఆమెకు మూత్ర పిండముల వ్యాధి వున్నది. ఎముకలలో బాధ వున్నది. ఆమెకు వూరకనే భయము కలుగుచుండును. ఇంకా ఎన్నో సమస్యములున్నవి. ఆమె చాలా బాధలో వున్నది. శ్రీమతి. బీలర్, మీ చేతిని పైకెత్తి పట్టుకుని ప్రభువైన యేసు నన్ను స్వస్ధపరచాడని నమ్ముము. దేవుడు నిన్ను దీవించును.

89మీరు నమ్ముచున్నారా? దేవుడు ఇంకను జీవించుచూ ఏలుచున్నాడు. మీ హృదయమంతటితో మీరు నమ్మవలసియున్నారు!

ఇక్కడ ఒక స్త్రీ వున్నది, ఇక్కడ కూర్చుని యుండగా నేను ఆమెను చూస్తున్నాను. ఆమె పెద్ద ప్రేవులోని జబ్బుతో బాధపడుచున్నది. ఆమె పేరు, ఆమెవరో నాకు తెలియదు. ఓ స్త్రీ, నీవు ఎవరవో దేవుడు నాకు చెప్పగలడని నమ్ముచున్నావా? శ్రీమతి. బెర్గ్-మాన్, నీవు నీ హృదయమంతటిదో నమ్మినచో, నీవు స్వస్థత నొందగలవు. మీరు నమ్ముచున్నారా?

ఇక్కడే ఒక స్త్రీ కూర్చునియున్నది. చెదిరిన ఒక స్నేహితుని కొరకు ప్రార్థించుచున్నది. నీవు నీ హృదయమంతటితో నమ్మినట్లయిన, నీవు అడిగిన దానిని పొందుము.

అక్కడ కూర్చొనియున్న స్త్రీ తల నొప్పితో బాధపడుచున్నది. నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు స్వస్థత పొందుదువు. అనుమానించకు. కేవలము నమ్ముము. ఆయన ఆ దేవుడు కానియెడల, ఆయన మరి ఎవరో నాకు తెలియదు. మీరు దానిని అంగీకరించి మరియు నమ్మినట్లయితే ఆయన దానిని చేయుటకు ఇక్కడ వున్నాడు.

90[ఒక సహోదరి అన్య భాషలలో మాట్లాడుచున్నది. మరొక సోదరుడు దానికి తర్జుమా చేయుచున్నాడు-సంపా.] ఆమేన్. ప్రభువుకు స్తోత్రము.

మీరు దేవుని సన్నిధిలో యున్నారని గుర్తించలేరా? మీరు గుర్తించారు. ఇప్పుడే మనము చేయవలసిన దానిని తలంచుచున్నాను. "నా యొద్దకు రండి, నా ప్రజలారా నన్ను నమ్మండి" అని ఆత్మ మాట్లాడుచుండగా ఇప్పుడే మనము వేదిక పిలుపు కొరకు నిలబడవలసి యున్నదని నేను తలంచుచున్నాను. మరియు క్రీస్తును ఎరుగని వారు వేదిక చుట్టూ ఇక్కడకు వచ్చి ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. మీరు పరిశుద్ధాత్మను పొంది యుండకపోతే, పరిశుద్ధాత్మను పొందుటకు మీరు రండి. ఎందుకనగా అది జరుగబోవుచున్నది. శ్రుతి చేయుచుండగా మీరు రారా, పాటలను ఎవరో నడిపించబోవుచున్నారు. పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక, అది మంచిది. ఎవరో ఒక స్త్రీతో బయటకు వెళ్లారు. మీరు దానిని పొందినచో పైకి రండి… సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన సమక్షంలో, బైబిలు వున్న చోట, వాక్యము దాని రుజువు, వరములు, ప్రతీది చేరి పని చేయుచున్నది. అదెంతో ఆశ్చర్యము కదా? వేదిక యొద్దకు తిన్నగా రండి. బాల్కనీల నుండి దిగి రండి. దేవుడు లేక వుండు వారు, పరిశుద్ధాత్మతో నింపబడని వారు, మనము పాడుచుండగా రండి.

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు,

ఈ దినమున ఈ దారిలో,

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు.

ఆయన ఈ దినమున ఈ దారిలో వెళ్ళుచున్నాడు.

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు.

(ఆయన వెళ్ళుచుండగా, ఇప్పుడు నీవు రావా,

ఆయన ఆత్మ కదులుచున్నది. "రమ్మని" చెప్పుచ్చునది.)

… ఈ దినమున,

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు.

ఆయన ఈ దినమున ఈ దారిలో వెళ్ళుచున్నాడు.

91ఆయన వెళ్ళుచుండగా నీవు రావా? ఆయన మీ మధ్యన ఏమి చేయుచున్నాడో చూడండి. ఆయన ఏకరీతిగా వున్నాడని చూపుచున్నాడు. ఆయనను ఎరుగక క్రొత్తగా జన్మించని ప్రతి ఆత్మయు వెలుపలకు రావలసియున్నది. ఆయనను వెదకుటకు ఇప్పుడు నీవు రావా? గుర్తుంచుకోండి, అదే పరిశుద్ధాత్మ నిన్ను ఎరుగును. "ఈ రోజు అదే…"

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు,

ఈ దినమున ఈ దారిలో,

యేసు ఈ దారిలో వెళ్ళచున్నాడు,

ఆయన ఈ దినమున ఈ దారిలో వెళ్ళచున్నాడు.

ఎక్కడ యున్నామని నిశ్చయత లేనివారు దేవుని ఎరుగని ప్రతి ఆత్మ ఇప్పుడు రండి. క్రిందకు రండి. సోదరుడా, సోదరీ, తెలివికి సంబంధించిన భావన వద్దు. అలా చేయవద్దు. ఏ విధమైన ఉద్రేకమునైనా నీవు కలిగియుండవచ్చు. నీ ముఖములో, నీ చేతులలో రక్తము కలిగియుండవచ్చు, వణుకులు ఇంకా అలాంటివి నీవు కలిగియుండవచ్చు. అది మంచిదే. దానికి వ్యతిరేకము ఏమి లేదు. నీవు భాషలతో మాట్లాడియుండ వచ్చు, ఆత్మలో నాట్యమాడి యుండవచ్చు, అయినను తప్పిపోవచ్చు. అది నిజము. అది నీలో జన్మించిన జీవమైయుండ వలసియున్నది. అది ఈ వాక్యమును తీసికొని తిరిగి దానిని నూతనముగా జీవింపచేయును. చూడండి, క్రీస్తు వాక్యమైయున్నాడు. మరియు ఆ వాక్యము లోనికి వెళ్ళుటకు మరియు దానిని నమ్ముటకు నీకు విశ్వాసము లేనియెడల నీవు ఇప్పుడు రావా.

MAL 4:5,6

 

92దేవుని సంఘముగా, సాయంకాలపు వెలుగులు ప్రకాశించుటకు ప్రారంభించుచుండగా, చెట్టు తన పంటకు వచ్చుచున్నది; దేవుడు ఆ చెట్టును పునరుద్ధరించుననెను, అదే పెంతెకోస్తు చెట్టు అయి యున్నది. ఆ రకమైన విశ్వాసమునే వారికి కలిగియున్న సమస్తమును ఆ విధముగానే ఆ చెట్టు తిరిగి పునరుద్ధరించబడుతుంది. సంఘ శాఖలు ఏవియు లేక మరొకటి లేక అది పరిశుద్ధాత్మ యొక్క అతి సాధారణ శక్తితో వస్తుంది, అది పూర్వము చేసిన విధముగానే ఖచ్చితంగా బైబిలును బోధిస్తుంది. మీకు తెలుసా, చివరి దినములలో ఒకరు వచ్చి ఆ విశ్వాసమును పునరుద్ధరిస్తారను వాగ్దానము మనకు చేయబడియున్నది. పరిశుద్ధాత్మ రూపంలో ఆయన ఈ రాత్రి ఇక్కడ వున్నాడని నేను నమ్ముచున్నాను. మేము మరలా పాడుచుండగా రండి, కాబట్టి తప్పక మనము దానిని ఉత్పత్తి చేయదము.

93ఇప్పుడు గుర్తుంచుకోండి, పెంతెకోస్తు ప్రజలారా, భాషలు మాట్లాడుట, దానికి అర్ధములు చెప్పుట, అనే మీ వరములను నిశ్చయముగా నమ్ముచున్నారు. ఆయన ఇక్కడ ఏమి చేశాడో మీరు నమ్మని ఎడల, మిమ్ములను వేదిక యొద్దకు పిలుచుచున్న మీ భాషలను వాటి అర్ధములను నమ్మండి. అది పని చేయుటయు, ఇది పని చేయుటయు మీరు చూచినట్లయితే. ప్రతి ఒక్కరూ రండి. దేవుడు ఈ కార్యములను చేయుచున్నాడు, ఎందుకనగా ఆయన దేవుడై యున్నాడు! ఎంత అధికముగా ఇక్కడ అది సత్యమని వాక్యము స్థిరపరచుచున్నది. రండి. మరకసారి మీరు రండి.

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు,

ఈ మార్గమున, ఈ రోజు,

యేసు ఈ దారిలో వెళ్ళుచున్నాడు,

ఈ దినమున ఈ దారిలో ఆయన వెళ్ళుచున్నాడు.

94ఇప్పుడు దేవుని యందు విశ్వాసముంచిన వారు, నిజమైన పరిశుద్ధమైన సేవకులు, క్రిస్తు పరిచారకులు రండి, మనము మరలా పాడుచుండగా బయటకు కదలి వచ్చెదము. ఇక్కడ, ఈ చుట్టూ, వేదిక దగ్గరకు రండి. వారితో కలసి మనము ప్రార్థించుదాం. రండి. మీరు దగ్గరకు రారా! నా చేతులతో ప్రతి ఒక్కరిని నేను సమీపించలేను. మీరు రావాలని కోరుచున్నాను. సేవక సహోదరులు కొందరు వారి దగ్గరకు దిగి వెళ్ళి వారిని తాకి, వారి మీద చేతులుంచండి. ఈ చుట్టూర రండి. స్త్రీలు - స్త్రీలతో కలసి, పురుషులు - పురుషులతో కలిసి రండి. ఇక్కడకు కదలిరండి. ఇది దేవుని క్రమమై యున్నది. ప్రజలారా, పైకి కదలిరండి. అలాగే. ఇదే సమయము. దైవభక్తి గల తల్లులు కొందరు, దైవభక్తి గల సహోదరులు కొందరు ఈ చుట్టూర వచ్చి నిశ్చయతతో, వారి మీద చేతులుంచండి. వారు పరిశుద్ధాత్మను పొందునట్లు మీ చేతులను వారి మీద వుంచండి. మంచిది. అది అంతే. అది అంతే.

95ఇప్పుడు. మీరు ఎందుకు వచ్చారు? మీరు నమ్మినందున. మన మధ్య దేవుడున్నాడని మీరు ఒప్పించబడినారు. ఈ రాత్రి ఆయన ఇక్కడ వున్నాడు. ఆయన ఇక్కడ గొప్ప అద్భుతములను, సూచక క్రియలను చేయుచున్నాడు.

ప్రతి ఒక్కరు దగ్గరకు రండి, ప్రజలకు ఎక్కువ స్థలము వుండునట్లు లోనికి కదలి రండి. దగ్గరగా రండి. ప్రక్కల నుండి చాలామంది దగ్గరగా వచ్చుచున్నారు. దగ్గరకు కదలి రండి.

జనసమూహములో, ఈ ఆత్మల రక్షణ కొరకు శ్రద్ధ కలిగియున్నారు, మీ చేతులేత్తండి. మంచిది. మనమంతా కలసి చేతులెత్తి, ప్రార్థనలో అడుగుదాం.

96మా పరలోకపు తండ్రి, మా మధ్య ఉన్న పరిశుద్ధాత్మతో, ఆయన వాక్యమును క్రొత్తగా జీవింప చేయుటను బట్టి, ఈ రాత్రి ఈ సమూహమును నీ యొద్దకు తెస్తున్నాము. ప్రభువా, ప్రతి హృదయమును నింపుము. ఆత్మ శక్తితో రమ్ము, ప్రభువా! దయచేయుము. ప్రతి దయ్యమును, భయమును వెళ్ళగొట్టుము. దేవుని శక్తితో కదలి ఈ ఆత్మలను స్వాధీనపరచుకొనుము. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. నీ మహిమ కొరకు వారిని నీ చేతులకు అప్పగించుచున్నాము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...