యెహోవా-యీరే #3
VGR COUNT-230 1బార్డర్స్ సోదరుడా, వందనములు. మీరు కూర్చొవచ్చును. ఈ కూటమునకు అధ్యక్షుడైన, "హారెల్," తో కొంత సహవాసము చేసినప్పుడు అతడు ఒక మిషనరీ అని కనుగొన్నాము. మనము కొన్నిటిని ఒకే విధముగా చేయుచున్నాము. ఇప్పుడు ఆయన తిరిగి ఆఫ్రికాలోని గోల్డ్-కోస్ట్ నకు వెళ్ళుచున్నాడు. ఈ సంవత్సరము నేను అక్కడ వుండవలెనని ఉద్దేశించుచున్నాను. దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాత మేము కలిసి గోల్డ్-కోస్ట్ అను ప్రాంతమును దర్శించి అక్కడ కొందరిని పొందవలెనని ప్రయత్నించుచున్నాము.
నేనిలా తలంచుచున్నాను. నా దినమందు జరిగిన గొప్ప కూడికలలో దక్షిణ ఆఫ్రికాలో మనము జరిపినది ఒకటి, అక్కడ ఒక సమయమందు ముప్పై వేల మంది గ్రామ వాసులు క్రీస్తును అంగీకరించారని మనము చూచాము. ఆమేన్. వారు నిజముగా నమ్మినట్లయిన, తమ విగ్రహములను పగులగొట్టవలెనని అడిగినప్పుడు, పైకి ఎగయుచున్న ఒక ధూళి తుఫాను వలె, వారు తమ విగ్రహములను పగుటగొట్టి, ఒక్క కూటములోనే క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. అక్కడ వారు చక్కగా క్రమపరచబడినందున, అక్కడి క్రైస్తవులు వారిని చేపట్టగలిగారు.
2అయితే ప్రభువు మనకిచ్చిన గొప్ప వేదిక పిలుపు ఇండియా దేశమునందేనని నాకు జ్ఞాపకమున్నది. అక్కడ ఒక్క కూడికలో దాదాపు అయిదు లక్షల మందిని మనము పొందగలిగాము. చూడగలిగినంత దూరము ప్రతి చోట వారుండినందున దానిని నిర్ణయించడము కష్టతరమయినది. మరియు వారందరూ క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు, కాని అక్కడి క్రైస్తవులు వారిని క్రమపరచనందున, వారు మరలి జైనులు వారి యధాస్థితికిని, సిక్కులు వారి పూర్వపు స్థితికిని, ఆ విధముగా వెళ్లిపోయారు. అనేకులు అక్కడ దేవుడు చేసిన దానిని చూచియు అక్కడ జరిగినవాటిని చూచియు వెనుకకు వెళ్లారని నేను ఊహించుచున్నాను.
అమెరికాలో దేవుడు నాకిచ్చిన సేవ, పెంతెకోస్తు వారిలో అంతగా ఫలమివ్వలేదు. అమెరికాలోని సంఘములన్నీ అధిక వివేకము గల సంఘములు. మరియు వారు ఒక సిద్ధాంతమును నమ్ముచున్నారు. మరియు సిద్ధాంతమే వారున్నటువంటి స్థలమైయున్నది. దాని నుండి నీవు వారిని కదిలించలేవు.
కాని, నీవు ఒక సిద్ధాంతమును గ్రామవాసితో ప్రయత్నించినప్పుడు, "అతనికి కనీసము కుడి ఎడమలు ఏవో తెలియదు. అతనికి ఒక కరపత్రము నిచ్చుటలో కలుగు మంచి ఏది? అతడు ఏదో కొంత చూడవలసియున్నది. అతడు దానిని చూచినప్పుడు, దానిలో అతడు ఒప్పించబడును. మరియు అతని యొక్క మాంత్రికుడు లేచి దానిని సవాలు చేసినప్పుడు, అక్కడే పరిశుద్ధాత్మ దానిని త్రోసివేయడమును చూడుము. అప్పుడు ఆ కార్యము దేవుడెవరోనని చూపుతుంది. మరియు ఆ కార్యము దానిని స్థిరపరుస్తుంది.
3సోదరుడు హారెల్ ను కలిసికొనుటలో ఎక్కువ సంతోషము. నేను ఆఫ్రికాలోని గ్రామవాసులను గూర్చి మాట్లాడుచుంటిని. టి.యల్. ఆస్-బోర్న్ గారి కూటములను ఏర్పాటు చేయుటను గూర్చి మాట్లాడుచుండెను.
మీలో చాలామందికి ఆస్-బోర్న్ తెలిసియుంటారనుకొందును. ఓ, సోదరుడు ఆస్-బోర్న్ క్రీస్తు యొక్క ప్రశస్తమైన సేవకుడు. నా నమ్మకమైన స్నేహితులలో ఆయన ఒకరు. అలాంటి మిషనరీ అయిన సహోదరుడు ఆస్-బోర్న్ గారి పట్ల నా హృదయములో నిశ్చయంగా ఎంతో గౌరవము ఉన్నది. ఈ దినమున భూమి పై ఉన్న వారందరి కంటే సువార్త పొలములలో నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కువ సేవ చేశాడు. చాలా తియ్యని, చక్కని కుర్రవాడు. సోదరుడు ఆస్-బోర్న్ మరియు సహోదరి ఆస్-బోర్న్ ను నేను నిశ్చయంగా ప్రేమించుదును.
4మామా ఆర్గన్-బ్రైట్ ఈ రాత్రి కూటములో ఉన్నదని వారు నాకు చెప్పారు. ఆర్గన్-బ్రైట్ నా నుండి మీరు దాగుకొనుచున్నారా? మా మంచి ఫలమును నేను మెచ్చుకొనుచున్నాను. మరియు ఆమె ఎంత మంచి స్త్రీ అంటే, ఆశ్చర్యమేమి లేదు, ఆమె ఈ దేశములోని ఇక్కడ ఈ ప్రాంతము నుండి వస్తుంది. ఆమె ఎప్పుడు గ్రాన్-వాలీ ప్రాంతమును గురించి మాట్లాడుతుంది. "గ్రాస్-వాలీ లో ఉన్న శ్రీ మరియు శ్రీమతి. ఆర్గన్-బ్రైట్ ఎందరికి తెలియును? మంచిది. చాల బాగుంది. మామా ఆర్గన్-బ్రైట్ మీరు ఎక్కడ ఉన్నారు? చాలా కాలము నుండి నేను మిమ్ములను చూడలేదు. మీరు తప్పుకొనుచున్నారు… ఆమె అక్కడ ఉన్నది. అవును. దేవుడు ఆమె హృదయమును దీవించును గాక. ఇక్కడే "గ్రాస్-వాలీ దగ్గర ఉన్న ఆమె అద్భుతమైన స్త్రీ. ఆమె గృహము నాకు రెండవ గృహము. ఈ ప్రజల పట్ల ఆమె ఎల్లప్పుడూ భారము కలిగియుండును. సోదరుడా, ఆర్గన్-బ్రైట్, ఇక్కడకు మీరు రావడం ఇది మొదటి రాత్రియని తలంచెదను. మీరు నా భార్యను తక్కిన వారిని ఈ దినము దర్శించినప్పుడు, నేను అడవిలో ప్రార్థించుటకు వెళ్ళియుంటిని. మిమ్ములను చూచుటకు మా స్నేహితులను కలుసుకొనుటకు నేను రాలేకపోయినందుకు నన్ను మన్నించగలరు.
5అమెరికాలోని ఏ పట్టణములో ఎక్కడా చూడని దానిని ఇక్కడ ప్రజలైన మా మధ్యలో ఏదో జరుగుట చూశానని నేను చెప్పగలను. క్రైస్తవులు దేవుని వాక్యమునకు వేరుగా ఉన్నారని వారు గుర్తించడము, నిలబడి దేవుని కృప కొరకు వేడుకొనడము నేను చూశాను. అవును. ఇక్కడ ఒక ఉజ్జీవము వెలువడినదని నాకు అర్థమగుచున్నది. అది అద్భుతంగా వుంటుంది. ప్రపంచము అంతటా నేను బోధించగలిగినంత బోధించాను. మరి విశేషముగా అమెరికాలో, బోధించాను. వాక్యమును చూపించుటకు, వాక్యము తెచ్చినప్పుడు వారు లేచి సాక్ష్యమిచ్చి, వారు వేరుగా ఉన్నారని ఒప్పుకొనునటువంటి క్రైస్తవ సమూహములను ఇదివరకు నేను ఎన్నడునూ చూడలేదు. అది మాత్రమే కాదు, వారితో సేవకులు కూడా ఉన్నారు. అదియే యధార్థత. అది నాకు ఇష్టము.
సహోదరీ ఆర్గన్-బ్రైట్, బెన్ మిమ్మును లేపి నిలబెట్టారు.
6నేను నా భార్యను ఇబ్బంది పెట్టగోరుచున్నాను. ఆమె లోకములో మిక్కిలి పిరికియైన వ్యక్తి. ఆమె ఈ రాత్రి ఇక్కడ కూర్చొని యున్నది. హనీ, దీని కొరకు కూడా నీవు నాతో ఏకీభవింతువని నేను నమ్ముచున్నాను. నా భార్య లేచి నిలబడవలెనని నేను కోరుచున్నాను. ఈ లోకమంతటిలో ఆమే నాకు అతి ప్రియమైన స్త్రీ.
రిబ్కా, నా కుమార్తె, నా పెద్ద కుమార్తె. హానీ, నీవు ఎండలో అలసిపోయావని నాకు తెలుసు. ఎలాగైనా నీవు నిలబడాలని కోరుచున్నాను. మంచిది, ఆమె నా కుమార్తె, రిబ్కా. నీకు వందనములు, నీకు వందనములు.
సహోదరుడు, జువెల్-రోజ్, మీలో ఎందరు ఆయనను ఎరుగుదురు? ఒక రాత్రి అతడు నా భార్యను నేనున్న ప్రసంగ వేదిక యొద్దకు రమ్మని కోరెను. అప్పటికి కూడిక ప్రారంభమైనది. ఆమెకు దరిదాపు స్పృహ తప్పి పోయినంత పని అయినది. ఆమె ఆయనను చూచి, ప్రతిచోట తప్పించుకొనుచుండెను. ఆమె ఆయన ప్రక్కకు వచ్చుటకు తప్పించుకొనేది, ఎందుకనగా అతడు మరలా ఆమెను ప్రసంగ వేదిక యొద్దకు పిలుస్తాడనే భయంతో అలా చేయుచుండెను.
నేను ఆమెతో ఇలా చెప్పాను, "ఒక రాత్రికి నీవు లేచి, మాతో కొన్ని మాటలు మాట్లాడవలెనని నేను కోరబోవుచున్నాను.
ఆమె అందుకు ఇలా అన్నది, "ఒక బక్కెట్టు నీటిని సిద్దముగా వుంచండి, ఎందుకనగా నేను సృహ కోల్పోతాను."
నా భార్య చాలా ప్రియమైన వ్యక్తి, బ్రెన్హాం కుటుంబమునకు ఏదైనా ఘనతను ఇవ్వవలసి యున్నచో, అది ఆమెకే చెందును. నాకు మరియు ప్రజలకును మధ్యలో ఆమె ఒక్కతే నిలబడియున్నది. చక్కగా చేయబడిన పనులన్నియూ ఆమెయే చేసినది.
PROV 12:4•
PROV 18:22
7ఇక్కడ ఉన్న ప్రతి యవ్వనస్తునికి వివాహమైనపుడు అతనికి భార్య వస్తుంది. మీరు భార్యా, భర్తలుగా కలసి ఎంతో సంతోషంగా జీవిస్తారు అని నమ్ముచున్నాను. మరియు మాకు వివాహమైనప్పటి నుండి ఈ 22 సంవత్సరములు నేను ఆ రీతిగానే యున్నాను.
భార్య దొరికినవానికి మేలు దొరికెను," సొలోమోను రాజు చెప్పినట్లుగా, "ఒక మంచి స్త్రీ, పురుషుని కిరీటములోని ఒక రత్నము వంటిది. ఒక నీతి లేనిది అతని రక్తములో నీరు వంటిది." మరియు అతని రక్త ప్రవాహము అతనికి జీవమైయున్నది. కాబట్టి ఒక నీతిలేని స్త్రీ అతడు పొందియున్న చెడ్డ సంగతి. కాని ఒక నీతిగల స్త్రీ రక్షణ తరువాత అతడు పొందియున్న ఉత్తమమైన సంగతిగా ఉన్నది. దేవుడు భార్య కంటే మంచి దానిని ఇవ్వగోరినచో ఇచ్చియుండెడివాడే, ఎందుకనగా దేవుడు తన పిల్లలకు మంచివాటిని ఇచ్చును. మరియు ఆయన అతనికి ఒక భార్యను ఇచ్చెను. దానికొరకు నేను కృతజ్ఞుడనైయున్నాను.
గత రాత్రి ఈ స్త్రీలు ఆ విధముగా తల వెంట్రుకలను కత్తిరించుకొనటను చూచాను. ఈ పెంతెకోస్తు స్త్రీల యొక్క వస్త్రధారణ, వారు ఆలాగున జుట్టును ధరించు విధానము పై ఒక లేఖనము ఉన్నది. "అది ఏమి తేడా చేయదు," అని నీవు చెప్పవచ్చు. నిశ్చయముగా, అందులో తేడా ఉంది!
8ఇక్కడ ఉన్న మిషనెరీయైన సోదరుడు హారెల్ ను నేను కొంత అడుగగోరుచున్నాను.
దక్షిణ ఆఫ్రికాలోని డర్భన్ లో, స్త్రీలు వారు ఈ భూమి పైకి ఏ విధముగా వచ్చారో, అలాగే దిగంబరులుగా అక్కడ కూర్చుని యున్నారు. కుట్టిన దుస్తులు వారు ఎరుగరు. కేవలము 4 లేక 6 అంగుళముల చిన్న జాకెట్ ను ముందు వైపు ధరించారు. వారు దిగంబరులుగా ఉన్న రీతిగానే అక్కడ నిలబడియుండిరి. ఈ గొప్ప అద్భుతము ప్రసంగ వేదిక పై జరుగుచుండగా వారు అక్కడ అలాగే నిలబడియున్నారు. ఆ సమూహములో దాదాపు పదివేల మంది మహమ్మదీయులు ఒక్క సమయములో ఆ కూడికలోనే క్రీస్తును అంగీకరించారు. పురుషులతో పాటు ఈ స్త్రీలు లేచి క్రీస్తుని అంగీకరించారు.
సహోదరుడు బోస్వర్త్ ఇలా అన్నాడు, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఆ పిలుపును మరలా ఇవ్వవలసియున్నదని నేను నమ్ముచున్నాను, వారు దానిని శారీరిక స్వస్థతగా భావించారని నేననుకొనుచున్నాను."
1COR 14:7
9నేను పదిహేను వేరు, వేరు భాషల తర్జుమాదారుల ఎదుట నేను దాని చెప్పాను. నీవు ఏమి చెప్పావో దానిని నీవు వ్రాసుకొనవలసియున్నది. నీవిలా చెప్పావు, "దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చెను." మరియు ఇది ఇలా "బ్లూ, బ్లూ, బ్లూ, బ్లూ'' అంటూ వెళ్ళును. మరియు "యేసుక్రీస్తు, దేవుని కుమారుడు" అది "నిక్, నిక్, నిక్, నిక్" అనుచూ వెళ్ళును.
ప్రజలు భాషలతో మాట్లాడుట నేను వినుచుండేవాడిని, మాకు తెలియును. "ఓ, అది సరికాదని నేను తలంచాను." కాని బైబిలు ఇలా చెప్పుచున్నది, "అర్థము లేకుండా ఏ విధమైన శబ్దము లేదు." అర్ధము లేకుండా లేదు. వారిలో కొందరు పక్షుల వలె కోడి కూతలు వేస్తున్నారు. కొందరు బూచీల వలె ఈల వేయుచున్నారు. ఏమిటేమిటో చేయుచున్నారు. వారికది ఒక భావనగా ఉన్నది, ఎందుకనగా ప్రతి శబ్దమునకు ఒక అర్థమున్నది.
10అది మరలా అలా వెళ్ళినప్పుడు, "మంచిది అది భౌతికమైన స్వస్థత కాదని మీరు ఇప్పుడు దానిని ఎరుగవలెను. అది రక్షకుడైన క్రీస్తును అంగీకరించుట, పరలోకమునకు వెళ్ళుట, మీరు దేవుని కుమారుని యందు విశ్వాసముంచి, ఆయనను మీ స్వరక్షకునిగా అంగీకరించుడి. నేల మీద మీ విగ్రహములను పగులగొట్టుడి!'' అని నేనన్నాను. వారు వాటిని క్రింద పడవేశారు. "అక్కడే ఇప్పుడు, మీ చేతులను ఆ దేవుని వైపుకు ఎత్తండి. ఆయనను స్తుతించండి. ఆయన మీకు పరిశుద్ధాత్మను ఇచ్చును! అని నేనన్నాను."
ఆ స్థలమందు నిలువబడి యుండగా, స్త్రీలు బొత్తిగా దిగంబరులుగా వుండడం నేను చూశాను. క్రీస్తు వారిని తాకిన వెంటనే, వారు తమ చేతులను ముడుచుకొని ఆ స్థలము నుండి వెళ్ళిపోయారు. మరలా వారిని చూచినప్పుడు, వారు బట్టలు ధరించి యుండిరి.
క్రీస్తు అన్యులను (దిగంబరులను) తాను దిగంబరిగా వుండుట పొరపాటని గ్రహింప చేసినప్పుడు, క్రైస్తవులమని చెప్పుకునే స్త్రీలు ప్రతి సంవత్సరము తమ బట్టలను ఎక్కువగా తీసివేసికొనుచున్నారంటే, అది నాకు అర్థము కావడము లేదు. ఎక్కడో ఏదో పొరపాటున్నది.
ఒక పూర్తి అన్యురాలు అక్కడ నిలబడి యున్నది. ఆమె దిగంబరి అని ఆమెకు తెలియక ఈ లోకములోనికి పుట్టినది మొదలు తాను దిగంబరిగా ఉన్నానన్న సంగతి కనీసము ఆమెకు తెలియక, అక్కడ నిలువబడి యున్నది. కాని క్రీస్తు ఆమె సముఖమునకు వచ్చినప్పుడు, తాను దిగంబరినని ఆమె గ్రహించినది. కాబట్టి ఆమె తగినంతగా తన్ను తాను కప్పుకొనుటకు ప్రయత్నించినది. తన చేతులను మడచుకొని వెళ్లి పోయినది. రెండు మూడు దినముల తరువాత మరలా మీరు ఆమెను కనుగొన్నప్పుడు, ఆమె బట్టలు ధరించి యున్నది.
ఎక్కడో ఏదో పొరపాటున్నది, నిశ్చయమముగా అది క్రీస్తుతో కాదు. ఓ, వాక్యము పరిపూర్ణమైనదని నేను తలంచుచున్నాను!
11అబ్రాహాము ప్రయాణమును నేనెంతో ఇష్టపడుచున్నాను. మీరు ఇష్టపడరా? నేను చాలా సమయము దానితో నిలిచియున్నాను, ఈ రాత్రి "యెహోవా-యీరే" లోనికి వెళ్ళుదునని నమ్ముచున్నాను. మూడు లేక నాలుగు రాత్రులు క్రితము నేను నా అంశమును తీసికొన్నాను. దానిలోనికి ఇంకా వెళ్ళలేదు.
యోబు మీద మాట్లాడుతూ, ఒక సంవత్సరము పాటు నేను ఆ అంశమును ఇంటి యొద్ద తీసికొన్నాను. దాదాపు ఒక సంవత్సరము యోబు గ్రంధములోనే యుంటిని. ప్రతీ ఆదివారము, బుధవారము యోబు పై మాట్లాడుచుంటిని. చివరకు అతడు బూడిదలో కూర్చొనినప్పుడు అతనిని తీసుకొన్నాను. మూడు లేక నాలుగు వారములు అతనిని గురించి ఆ స్థలమందు మాట్లాడాను. మరియు ఒక ప్రశస్తమైన సహోదరి ఎంతో ధైర్యముతో నాకు వ్రాస్తూ ఇలా అన్నది, "బ్రదర్ బ్రెన్హాం, మీరు ఎప్పుడు యోబును బూడిద నుండి లేపబోవుచున్నారు?"
అబ్రాహాము యెహోవా-యీరేను చూచుటకు నేను ఎప్పుడు వెళతానని అని మీరు ఆశ్చర్యపోతున్నారని నేను ఊహించుచున్నాను.
JOB 19:25-27
12నాకా విషయము ఉన్నది. యోబు బూడిదలో కూర్చునియుండగా, ఎలీహూ మాట్లాడుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధుని పరిశోధించుచు తనకున్న సమస్తమును తెచ్చెను. నేను ఈ స్థలమునకు వచ్చి గురిని చూచు వరకు సమస్తమును సిద్ధపరచితిని. అప్పుడు దేవుడు సుడిగాలిలో దిగి వచ్చెను. మెరుపులు మెరయుట ప్రారంభమాయెను. ఉరుములు గర్జించెను. మరియు దేవుని ఆత్మ ప్రవక్త మీదికి వచ్చెను. అతడు లేచి నిలువబడి, "నా విమోచకుడు సజీవుడు, అని చెప్పెను. ["విమోచకుడు" అను మాట గమనించండి]. మరియు చివరి దినములలో ఆయన భూమి మీద నిలుచును. ఈలాగు నా చర్మము చీకిపోయినను, నా శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను." ఓ, ఎలాంటి పాఠము అక్కడ ఉన్నది! దానిని గ్రహించుటకు ప్రజలందరికి ఒక స్థానమునకు తెచ్చిన తరువాత దానిని సరియైన ఆత్మతో గ్రహించిరి. తరువాత బలిపీఠము బారులు తీరి మారుమనస్సు పొందుచున్న ప్రజలతో నింపబడినది.
13మీరు ఆత్మ చేత నడిపించబడినయెడల, నీవు గురిని ఖచ్చితముగా ఎక్కుపెట్టేవరకు నీ సమయమును తీసుకొనుము. నీవు అలా చేయనియెడల నీవు గురి తప్పెదవు. మనము దానిని సున్నా చేయుదుము. అది బైబిలు! మనము గురిని ఖచ్చితముగా ఎక్కుపెట్టాలనులని దేవుడు కోరుచున్నాడని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ, అపోస్తలుల గురిని ఖచ్చితముగా నిర్దేశించినది, మరియు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఖచ్చితముగా గురిని కొట్టుటకు ఎక్కుపెట్టిరి. అదే వాక్యము ద్వారా మనమును ఆ పనిని చేయగలమని నేను నమ్ముచున్నాను. అప్పుడు అది గురిని కొడుతుంది. మరియు అది కేంద్రమును ఒకసారి కొట్టినయెడల, మరలా దానిని మధ్యలో కొట్టగలవు. ముందు నీవు గురిని ఖచ్చితముగా ఎక్కుపెట్ట వలసియున్నది! నీ శ్వాస, నీ ఈడ్పు ప్రతీది సరిగ్గా ఉన్నదేమో ఖచ్చితంగా ఉన్నదేమో చూసుకొనుము. నేను గురిని చూచి కొట్టుదును; ఒక పందెములో ఉన్నప్పుడు, అది ఏమిటో నాకు తెలియును, తుపాకి గురిని ఖచ్చితాముగా ఎక్కుపెట్టవలెను.
JOHN 1:1
14ఒకసారి ఒక దినమున, నేను ఒక చిన్న .75 మోడల్ తుపాకిని తిరిగి విన్ చెష్టర్ కంపెనీకి పంపాను. దానితో నేను 50 గజముల దూరములో అంగుళములో నాల్గవ భాగమునకు పైన కొట్టలేకపోయాను. విన్ చెష్టర్ కంపెనీ దానిని తిరిగి పంపు అన్నారు, "రేవరెండ్ బ్రెన్హాం, ఆ తుపాకీ 5 షాట్ గ్రూఫ్ కి చెందినది. ఒక్క అంగుళమునకు 25 గజముల దూరమును కొట్టును. ఆ కంపెని దానిని తయారు చేసినది. నాకు దాని వ్యత్యాసము. తెలియును. 50 గజములకు, సున్నితముగా తొమ్మిది తిన్నని కార్పెట్ టాక్లను దానితో త్రిప్పాను. అది సరిగా ఎక్కుపెట్టును అని నాకు తెలిసినది. కావున నేను తిరిగి దానిని వెనుకకు త్రిప్పు వరకు దానితో తికమక పడుచుంటిని.
ఇప్పుడు, దేవుని వాక్యము కూడ అదే విధముగా యున్నది. ఆ అపోస్తలులు చేసిన ఆ కార్యములు - క్రీస్తు వాగ్దానము చేసిన ఆ కార్యములకు వాక్యమునకును, ఆత్మతోను మనము గురిపెట్ట వలసియున్నది. అది అలా ఒక్కసారి జరిగినయెడల, అది మరలా జరుగును, ఎందుకనగా దాని చేయునది దేవుడైయున్నాడు. మరియు దేవుడు వాక్యమైయున్నాడు, ఆయన ఎన్నడూ తప్పిపోడు.
15ఒక తుపాకి ముందు భాగము కొంచెము వదులుగా వుంటే, కొంచెం వదులుగానో లేక ఎక్కువ బిగుసుగానో, లేక దానిని ఏదైనా దాని బంధించినా తుఫాకి మీద నీ చేతి వ్రేలి బరువును వుంచినప్పుడు (దాని షూటింగ్ పరిపూర్ణముగా ఉన్నప్పుడు) నీ చేతి వ్రేలి యొక్క బరువు దానిని త్రోసివేస్తుంది. నీవు ప్రతీ దానిని పరిపూర్ణముగా ఉంచవలసి యున్నది.
ఆ రీతిగానే నీవు క్రైస్తవములో వాక్యమును నిజ స్థితికి తెచ్చుటకును దానిని ప్రత్యక్షపర్చుటకును మంచిగా జీవించుటకును నీవు వాక్యముతో దేవునితో పరిపూర్ణముగా వుండినప్పుడు, అది గురిపెట్టబడును. అది అలా వుండాలి! కాబట్టి ఉపదేశములో నీవు ఆత్మను సృష్టించవలసియున్నది, అప్పుడు నీవు గురిపెట్టుదువు; అప్పుడు అది ముందుకు వెళ్లి గురిని చేరుతుంది.
16ఆ చుట్టూ కూర్చొన్న ప్రజలు, అనేకసార్లు ఇలా అంటారు, "బ్రదర్ బ్రెన్హాం మీ కూడికల గురించి మాకు ఎక్కువగా తెలియదు."
ఇతర సోదరులు ప్రచారము చేయునట్లుగా, నాకు వెలుపల ప్రసార వసతులు లేవు. వారికి మేగజైనులు, రేడియో, టి.విలు ఉన్నవి. నేను కేవలము యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యం వహించుటకు ప్రయత్నించ వెళ్లుచున్నాను. ప్రజలు దానిని చూచి నమ్మునప్పుడు, వారు స్వస్థపడుచున్నారు. దేవునికి కావలసినదంతయు తెలియును, చూచారా. ఇది ఏ చరిత్రలో వ్రాయబోవుట లేదు. దాని గూర్చి మీరు ఏమి బాధ పడవద్దు. చరిత్ర వ్రాయుటకు ఇక సమయము వుండదు. యేసు వచ్చుచున్నాడని నేను నమ్ముదును. దానిని నేను నమ్ముదును. ఆయన ఈ రోజు లేక రేపు వస్తున్నాడన్నట్లుగా నేను ఈ రోజు జీవించగోరుదును. ఏదో గొప్ప పెద్ద పాఠశాలలతో మనమేమి చేయగలము. యేసు వచ్చుచున్నాడని బోధించుము. ఎందుకు, మన సొంత కార్యములు మనకు సాక్ష్యమిచ్చును. అది నిజము. యేసు వచ్చుచున్నాడు. దాని కొరకు సంఘమును సిద్ధము చేయుదుము! మనము స్థిరపడుదుము. ఓ, నేను ఆయనను ఏ విధముగా ప్రేమింతునో!
17ప్రార్థన కొరకు మనము ఇప్పుడు తలలు వంచదుము. ఓ, ప్రజలు భయభక్తులతో తమ తలలను వంచునప్పుడు దానిని చూచుటకు నేను ఎంతో ప్రేమించుచున్నాను. ఇప్పుడు కొన్ని క్షణములు మనము మౌనముగా ఉండి, వాక్యమును చదువుదము. ఇప్పుడు మన సమయమును తీసుకొందము. రేపు ఆదివారము అది సబ్బాతు, క్రైస్తవ సబ్బాతు దినము, ఈ విషయములతో మనము తొందరపడనక్కర లేనప్పటికి, సండే స్కూల్ కు ఆలస్యముగా రావటము నేను ఇష్టపడను.
ఇప్పుడు యోచించండి, "ప్రభువా, నీ చిత్త ప్రకారము ఈ రాత్రి నా కోరిక ఉన్నదా?" ఆలాగైతే, దాని గూర్చి ఆలోచించండి. ఇప్పుడు మీ కోరికను ఆలోచించినట్లయిన, దానిని దేవుని ప్రణాళికతో పరీక్షించండి. అది దేవుని ప్రణాళికతో సరిగా ఉన్నట్లు కనబడినట్లయిన, అప్పుడు మీరు దేవునికి మీ చేతిని ఎత్తి చెప్పండి, "దేవా, ఇదే నాకు కావాల్సినది. నన్ను జ్ఞాపకము చేసికొనుము. చాలా తీవ్రంగా ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించును గాక! అది మంచిది. మీ చేతులను ఎత్తిపట్టి యుండుడి. ఆయన అన్ని చూచుచున్నాడు. ఆయనకు అన్ని తెలియును. అది మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. అది మంచిది. ఆలోచిస్తు యుండుడి. మీ చేతిని ఎత్తి పట్టుడి. ప్రతి చేయి పైకి వెళ్ళుచుండగా, ఇప్పుడు నేను ప్రతీ చేయిని కనిపెట్టుచున్నాను. మంచిది. అది చక్కగా ఉన్నది.
18పరలోకపు తండ్రి, సర్వ సమృద్ధిగల ప్రభువైన యేసు నామములో కృపా సింహాసనము, యొద్దకు మరలా సమీపించుచూ, మేము ఇప్పుడు వచ్చుచున్నాము. ఆ కవి చెప్పినట్లుగా, "కృపా సింహాసనము యొద్ద నన్ను వుండనిమ్ము. కమ్మని విడుదలను కనుగొననిమ్ము. దేవా, వారి హృదయములు దేనికొరకో భారమును కలిగియున్నవి. మరియు కృపా సింహాసనము యొద్ద వారు ఉందురు గాక! దేవుడు వారికి విడుదల కలుగ చేసిన ఉపశమనమును ఆ గొప్ప వైద్యుని యొద్ద కనుగొందురు గాక. వారికి ఏది అవసరమో దాని కొరకు విశ్వాసమును పొందుదురు గాక.
నా రెండు చేతులను ఎత్తియున్నాను. ప్రభువా, నాకు అవసరములు ఉన్నవి. నన్ను జ్ఞాపకముంచుకొనుము.
ఈ చేతి గుడ్డలు ప్రాతినిధ్యం వహించుచున్న ఈ ప్రజలను జ్ఞాపకము చేసికొనండి. ఓ, ఈ విషయముల ద్వారా ఎన్ని సాక్ష్యములు లోనికి వచ్చియున్నవి. భయభక్తులుగా వుండండి. ఇక్కడ ఉన్న ఈ ఇసుక కొండలలో ఎక్కడో వ్యాధి గల తల్లులు, తండ్రులు, చిన్న బిడ్డలు, హాస్పిటల్ లో యున్న ప్రజలు, ముసలి వృద్ధ తండ్రి, తెల్లటి చేతి కర్రను పట్టుకుని ఇంటి యొద్ద కూర్చొని, ఈ చేతి గుడ్డలు కొరకు ఎదురు చూచుచున్నారు. దేవా! దయ చూపండి. ప్రభువా! దయ చేయుము. ఎవరు ఎక్కడ ఉంచబడినప్పటికీ, శత్రువు తన బలమును, శక్తిని కోల్పోయి, వారు స్వస్థత నొంది వెళ్ళుదురు గాక! ఇక్కడ ఒకరు "కాన్సర్" అని వ్రాశారు. ఈ శరీరముల నుండి సాతాను పారిపోవును గాక! మరియు ఇందు కొరకు చనిపోయిన తన సొంత కుమారుని రక్తము గుండా ఆయన చూచుచుండగా, పరిశుద్ధాత్మ యొక్క ఆ గొప్ప ప్రాయశ్చిత్తము ఈ రాత్రి సరిపోవును గాక! మరియు విశ్వాసము వారి మీద సంమృద్ధిగా ప్రవహించును గాక! వారు సంమృద్ధిగా స్వస్థతను నొందుదురు గాక. ప్రభువా! దయచేయుము.
GEN 22:14
19ఇప్పుడు నీ వాక్యమును దీవించుము. నీ సేవకునికి సహాయము చేయుము. ఈ పరిచర్య కొరకు మమ్ములను అభిషేకించుము. విను ప్రతి హృదయమును అభిషేకించుము. తండ్రి, ఇప్పుడు మేము మాట్లాడబోవుచున్నాము. ఏమి చెప్పాలో మీరు మాకు చెప్పండి. మరియు మేము ఏమి చేయాలో మాకు చెప్పండి. ఈ కూటములో మీరు మాతో వుండవలెనని మేము ఎదురు చూచుచున్నాము.
ఈ రాత్రి పాడిన చక్కని పాటలను బట్టి, కీర్తనలను బట్టి నీకు వందనములు. ఇక్కడ ఈ వెనుక నున్న యవ్వనస్తుడు, సహోదరుడు హైమర్ చక్కని కీర్తనను ఇప్పుడే పాడినాడు. ఆ గలతీయుడైన క్రొత్తవాడు ఈ రాత్రి లోనికి నడిచి వచ్చును గాక! ఆ కల్లోలముగా ఉన్న నీళ్ళతో "సమాధానముగా నిమ్మళించుము," అని చెప్పినట్లుగా ఆయన స్వరము కల్లోలముగా ఉన్న మనస్సులతో చెప్పును గాక. మరియు కల్లోలముగా ఉన్న ప్రతి హృదయము స్వస్థత నొందును గాక. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
GEN 22:14•
HEB 11:6
20"అబ్రాహాము ఆ చోటికి యెహోవా-యీరే అను పేరు పెట్టెను. అందుచేత — యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును."
ఇప్పుడు ఈ గొప్ప గుణలక్షణముతో మనము ప్రారంభించనైయున్నాము. ఈ రాత్రి అబ్రాహామును గూర్చి, ప్రభువు చిత్తమైన ముగించుటకు ప్రయత్నించుదము. మరియు రేపు దైవిక స్వస్థత అను అంశము మీద మాట్లాడవచ్చును.
ప్రభువు ఇక్కడ మనకు మంచివాడుగా యున్నాడు. ఎలాంటి సంగతులు జరిగినవో సాక్ష్యములను మనము వినుచున్నాము. ఎంతో సంతోషము! మరియు మనకు ఒక రాత్రి పూర్తిగా ప్రార్థనా వరుసకు వారిని పిలువనై ఉన్నాము. ఎక్కడా చక్రాల కుర్చీలు గాని, ఒక్క బలహీనమైన వ్యక్తిని గాని మనము ఈ కట్టడంలో చూడలేదు, కాని అందరునూ లేచి చుట్టూ నడచుచూ వెళ్ళుచున్నారు.
మరియు ప్రతి రాత్రి పరిశుద్ధాత్మ ఆయన దివ్యమైన, మహనీయమైన సన్నిధితో ప్రజల గుండా సంచరించి ఆయన ఇక్కడ ఉన్నాడని తన్నుతాను ప్రకటించుకొనుచున్నాడు. అప్పుడు మనము ఆయనను తప్పక నమ్మవలసియున్నది. చూడుడి, మీరు ఆయనను విశ్వసించాలని ఆయన కోరుచున్నాడు. నీవు దేవునికి చెల్లించగల ఉన్నతమైన ఘనత ఆయనకు విశ్వసించుటయే. నీవు తప్పక విశ్వసించాలి, "దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను గదా,'' ఇప్పుడు ఆయనను నమ్ముము!
21నేను అబ్రాహాము ప్రయాణమును తీసుకొనుచున్నాను, ఎందుకనగా ప్రజలు వారు ఎవరైయున్నది చూచుటకు, ఆ గొప్ప ఔన్నత్యము కొరకు నేను విశ్వాసమును నిర్మించ పూనుకొనుచున్నాను.
అదే ఇబ్బంది. మేము ప్రయాణము చేయుచుండగా, నేను రెండు తరగతుల ప్రజలను కనుగొందును. ఒకరు పెంతికోస్తు వారు, మరొకరు మూల సిద్దాంతవాదులు. ఇప్పుడు మూల సిద్దాంతవాదులు స్థానపరముగా వారు ఎక్కడున్నారో, వారేమైయున్నారో వారికి తెలియును, కాని దానితో వారికి ఏ విధమైన విశ్వాసము లేదు. పెంతెకోస్తు వారికి విశ్వాసమున్నది, కాని వారెవరో వారికి తెలియదు. ఇప్పుడు అది ఒక మనిషికి బ్యాంకులో డబ్బు ఉన్నట్లుగా ఉన్నది, కాని అతనికి చెక్కు వ్రాయటకు తెలియదు; మరొకడు చెక్కు వ్రాయగలడు కాని, అతనికి బ్యాంకులో డబ్బు లేదు. నీవు ఎప్పుడైనా వారందరిని ఐక్యపరచినయెడల ఏదో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా పెంతెకోస్తు విశ్వాసమును మరియు మూల సిద్ధాంతమును పొందగలిగితే… మూల సిద్ధాంతమును గాని మరియు పెంతెకోస్తు విశ్వాసమును గాని పొందితే, ఏదో జరిగి తీరుతుంది. అది నిజము.
22ఇక్కడ నేను ఎలాంటి సాక్ష్యమును ఇవ్వగోరుచున్నానో, నేను ఒక లూథరన్ స్కూలు వారిని చూచి దీని మీద మాట్లాడుతుండగా 400 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు. ఓ, వారికి దానిని తెలియనివ్వడము మహిమకరమైన దృశ్యము. వారు లూథరన్లుగా ఉన్నందున వారు లెక్కించబడలేదు.
లూథరన్, బాప్టిస్టు, మెతడిస్టు, కాథలిక్ మీరు ఏదైనప్పటికి దానికి వ్యతిరేకముగా ఏమి లేదు. ఆ విషయములకు వ్యతిరేకముగా నేను లేను. నేను ఆ ప్రజలకు వ్యతిరేకిని కాదు. వారిని పట్టుకొనియున్న ఆ క్రమమునకు నేను వ్యతిరేకముగా మాట్లాడుచున్నాను. వ్యక్తిగతముగా వారికి వ్యతిరేకముగా ఏమి లేదు, వారందరూ మనుషులు, క్రీస్తు వారి కొరకు చనిపోయెను. కాథలిక్, యూదుడు అతడు మరి ఎవరైనప్పటికి. ఆ క్రమము వారిని బంధించుచున్నది. మహ్మదీయుల వలె, సిక్కులు, జైనులు లేక అది ఏమైనప్పటికి, ఆ క్రమమునకు బంధించబడియున్నారు, చూడండి. బౌద్ధమత బుద్ధుని ఆరాధించే ప్రజలలో ఏమి లేదు గాని, వారిని ఆ బౌద్ధమత క్రమము ఆ ప్రక్కకు లాగివేయుచున్నది.
అదే సంగతి. యేసు ప్రజలకు వ్యతిరేకి కాదు, ఆయన వారి కొరకు చనిపోయెను, కాని ఆ క్రమములు ఆయనను దూరముగా వుంచుచున్నవి, ఆయన నుండి వారిని దూరముగా వుంచుచున్నవి. ఇప్పుడు అది సంగతి.
23అబ్రాహాము యొక్క సంతానము అబ్రాహాము తరువాత వాగ్దానము చేయబడినదని ఎరిగి అబ్రాహామును తీసుకొనుటకు తలంచుచున్నాను. ఇప్పుడు మనము కొంచెము వెనుకకు ప్రయాణము చేసి వెనుకటి వృత్తాంతమును చూచెదము. మరియు కొంచెము సేపటిలో ఈ రాత్రికి తిన్నగా అంశము నొద్దకు వచ్చెదము.
ప్రార్థన చేయబడగోరే ఎవరికైనా ప్రార్థనా కార్డులు ఇవ్వబడును. మీరు ఈ రాత్రి పొందనియెడల, మేము వాటిని రేపు వారికిచ్చెదము. ప్రార్థన చేయబడగోరే ఎవరైనా తప్పక ప్రార్ధన కార్డులను పొందియుండాలి. రేపు ఒకటిన్నర వరకు మీరు మీ ప్రార్ధనా కార్డును తీసుకొనుటకు ఇక్కడ వుండండి, ఏలయనగా మేము కూటమును ప్రారంభించగోరుదము. అప్పుడు మేము ప్రార్థనా కార్డు కలిగియున్న ప్రతి వ్యక్తికి ప్రార్థన చేయుదును. మేము ఈ రాత్రులన్నిటా ప్రార్థనా కార్డులు లేనివారికి ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాము. ఆ రీతిగా ప్రార్ధనా కార్డులు కలిగిన వారు ప్రార్థనా వరుసలో ఉండే ఆధికత్యతను కలిగియుండును. మరియు ఇతరులు ప్రార్ధనా కార్డులు లేకుండా బయటకు పిలువబడతారు. రెండు ప్రక్కలా ఇరువురిని తేవచ్చు. ప్రార్థనా కార్డు అనగా ఏమి లేదు, కాని నీవు ఒక వ్యక్తికి ప్రార్థనా కార్డును ఇచ్చినపుడు నలబై శాతము మంది అపుడే స్వస్థత నొందుతారు. ప్రార్థనా వరుస గుండా వచ్చుచున్నానని కేవలము తలంచుట ద్వారా నీవు దేనినో పట్టుకొని దాని వైపు చూడగలవు లేక ఏదో చేస్తావు. యవ్వనస్తులు రేపు ప్రార్థనా కార్డులను ఒకటిన్నరకు ఇస్తారు, రెండు గంటలకు వెళ్ళిపోతారు, కాబట్టి ఆ దినమునకు మిగిలిన చేయవలసినవన్నియు వారు తెలిసికొనెదరు.
24మరియు చిత్రములు, పుస్తకములు, టేపులు కావలసిన వారు తప్పక రాత్రికి పొందండి. ఆదివారము అమ్మబడవు; అలా ఎన్నడూ అమ్ముటకు అనుమతించము, ఆదివారము ఏ మాత్రము అమ్మరాదు. మేము ఆదివారమును గౌరవిస్తాము. ఈ పుస్తకములు, ఇవన్నీ నాకు ఏమి కాదు. నా సేవను గూర్చి అవి ప్రజలు వ్రాసిన పుస్తకములు. చిత్రములను అమెరికా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారు తీశారు. అది డగ్లస్ స్టూడియోకు చెందినది. వారికి ముద్రణాధికారము ఇయ్యబడినది. పుస్తకములు సోదరుడు గోర్డన్ లిండ్-సే మరియు చాప్లేన్ జూలియస్ స్టార్స్క్లేవ్ కు చెందినవి. వాటిని కొని కూటమునకు తెచ్చెదము మరియు మేము దాదాపు కొన్న ధరకే వాటిని అమ్ముతాము. వాటి మీద నష్టము ఉన్నది. మేము ఎల్లప్పుడు ఈ విధముగా చెప్పుదుము ఎవరైనా… పుస్తకములు అమ్ము వారితో నేను చెప్పాను, "పురుషుడు గాని స్త్రీ గాని డబ్బు లేని పేదవారు పుస్తకముల కొరకు వస్తే, ఎలాగైనా వాటిని వారికి ఇవ్వండి. దానిని గూర్చి జాగ్రత్త తీసుకొనుటకు నేను చూస్తాను. మరియు మీరు పుస్తకమును తీసుకొన్నప్పుడు, అది చేయవలసినంత విలువ చేయకపోతే, దానిని తిరిగి తీసుకుని రండి. చూడండి. మీరు డబ్బు తిరిగి పొందుట తప్ప, ఏ ఒకటి కూడా తిరిగి ఎన్నడూ ఇవ్వబడదు. మా విశ్వాసమునకు ఇది సహాయపడును. దానిని మేము అంత వరకే చేయుటకు ప్రయత్నించుచున్నాము, లేనిచో వాటిని ఇక్కడ వుండుటకు మేము అనుమతించము. ఆది అక్షరాలా సత్యము. కాబట్టి ఈ రాత్రికి వారు బస్టా౦డు దగ్గర వుంటారు. శ్రీయుతులు మరియు శ్రీమతి వుడ్ గారు నా యొక్క మంచి స్నేహితుడు. వారి కుమారుడు పోలియో జబ్బు నుండి ఎలా స్వస్థపడెనో నాకు సమయమున్నచో వారి సాక్ష్యమును మీకు చెప్పాలని వాంఛ ఉన్నది. మరియు ఎన్నో ఇతర విషయములు కూటములో ఉన్నవారి పట్ల జరిగినవి.
JOHN 15:16
25ఇప్పుడు అబ్రాహాము యొక్క వెనుకటి వృత్తాంతమును చూచెదము. మొదటిగా దేవుడు అబ్రాహామును షరతులు లేకుండా కలుసుకొన్నాడు. అబ్రాహాముతో నిబంధన చేశాడు. ఏ విధమైన షరతు లేదు; దేవుని నమ్ముట తప్ప అబ్రాహాము చేయవలసినది ఏమి లేదు. నిబంధన పూర్తిగా కృప ద్వార తప్ప మరి షరతులు లేనిదిగా వుండెను. "నీవు ఇది చేస్తే" అని కాదు; దేవుడన్నాడు, "నేను చేశాను!" ఇప్పుడు ప్రతీ మనిషి …
గుర్తుంచుకోండి, దేవుని యొద్దకు ఎప్పుడైనను వచ్చు అబ్రాహాము సంతానము అదే మార్గమున వచ్చును. నీవు చేయగలిగేది ఏమి లేదు. నీ బూటు పట్టీలు విప్పి చంద్రుని మీదికి ఎగురుట కాదు. నిన్నునీవు ఎంత మాత్రము రక్షించుకొనజాలవు. నిన్ను నీవు రక్షించుకొనలేవు. ఏ మనిషి ఎన్నడూ దేవుని వెదక లేదు; దేవుడు మానవుని వెదకుచున్నాడు. "మీరు నన్ను ఏర్పరచుకొన లేదు," అని యేసు అన్నాడు, "నేను మిమ్మును ఏర్పరచుకొన్నాను. మొదటి…
26నీవు బయటకు వెళ్ళి ఒక పందిని అది చెడ్డ స్థితిలో ఉన్నదని మురికిని తింటున్నదని దానితో చెప్పగలవా? అది నీకు నీ పనిని చూచుకోమని చెపుతుంది. కాని దాని స్వభావమును మార్చుటకు, అది పొరపాటులో వుందని గ్రహింపు చేయగలుగుటకు ఏదో జరుగవలసియున్నది. ముందు పందికి ఏదో జరుగవలసియున్నది.
అందుచేతనే నామకార్థ క్రైస్తవులు అనేకసార్లు బురదలో దొర్లుతారు. తిరిగి పాపము లోనికి వెళతారు. దానికి కారణము … నీవు పందిని కడగవచ్చు, దాని కాలి గోళ్ళకు రంగు చేయవచ్చు, దాని పెదవుల జాగ్రత్త కొరకు మందు రాసినా అది పొరపాటవుతుంది. అది ఎప్పుడు అలాగే వుంటుంది. పెదవుల రంగు లేక మరి ఏదో కాదు? నేను దానినంత కలిపి తెస్తాను. అయినప్పటికీ, అది ఏమిటో నీకు తెలుసా? నీవు పాత పందికి పెదవుల మీద రంగు పూసి, మిగిలిన పనులన్నీ చేయుము. నీకు తెలుసా! అది తిన్నగా బురదలోకి వెళుతుంది. మరలా వెళుతుంది. ఎందుచేత? అది ప్రారంభము నుండి పంది, నీవు దానిని ఏదైనా వేరుగా చేసే ఒకే మార్గము, దాని స్వభావమును మార్చుటయే.
ఒక పురుషుడు గాని స్త్రీ గాని ఎన్నడైనా దేవునితో జత చేయబడే ఒకే మార్గము, స్వభావమును మార్చుటయే, శుద్ధి చేయటం, ప్రాచీన పురుషుడు పాపమునకు చనిపోవటము మరియు దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించడము, అది క్రీస్తు, దేవుని ఆత్మయై యున్నాడు, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. అప్పుడు అది వాక్యముతో సాక్ష్యమిస్తుంది. దానిని మనము ఎప్పుడైనను చేయటకు అది మాత్రమే మార్గము.
PS 42:7•
HEB 11:10
27"దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో, ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను." మరియు ఈ దినమున మనము పరదేశులము, యాత్రికులమై యుండి దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడో ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాము. చూడండి! అబ్రాహాము, దానిని ఎన్నడైనా అతడు ఎరుగక ముందు, అతనిలో ఏదో సహజముగా గ్రహించు జ్ఞానము ఉన్నందుచేతనే అతడు ఆ పట్టణమును చూశాడు.
ఈ రోజు నా భార్యతో వచ్చుచుండగా, నేను ఇలా చెప్పుచుంటిని, "మూడు వందల సంవత్సరములకు పూర్వము, ఈ కొండ కూర్చొనుటకు ఒక చక్కని స్థలముగా ఉండినది; చక్కని అరణ్యము, గొప్ప ఉన్నతమైన మ్రానులు, మనిషి దీని లోనికి వచ్చి, వాటిని నరికి సెలయేరులను కలుషితము చేశాడు. అది జీవించుటకు అందమైన స్థలముగా వుండును." కాని మీరు చూచినట్లయిన అతడు ఇండ్లను నిర్మించాడు. ఆ తరువాత వారు విస్తరించడం ప్రారంభించారు. పాపము మరియు హింసలోనికి రావడం ప్రారంభమాయెను. హాలీవుడ్ అతనికి చేరువైనది. అది సినిమా, టెలివిజన్ ద్వారా లోనికి తెచ్చినది. ఇప్పుడు అది కలుషితమై పోయినది. ప్రతి పట్టణము పాపభరితమైనది.
నిశ్చయముగా, ప్రజలు పొరుగువారితో కలసి నివసించుటకు, నీతిగా వుండుటకు వారిలో ఏదో యున్నది. నిశ్చయంగా ఎక్కడో ఒక పట్టణమున్నది! మరలా కరడు కారడును పిలుచుచున్నది!
GEN 12:1•
HEB 11:10
28మరియు అబ్రాహాము తన దినమున ఉన్న కల్దీయుల ఊరను పట్టణములను చూచెను. ఆయన దానిని ఎరిగియుండెను, ఎందుకనగా ఆయనలో ఏదో ఉండి ఒక వేరైన పట్టణమున్నదని పిలచుచుండెను. దాని శిల్పి, నిర్మాణకుడు దేవుడు. మరియు దేవుడు అబ్రాహాములో దానిని చూచి, "ఇప్పుడు నిన్నునీవు వేరుచేసికొని బయటకు రమ్ము," అని అతనికి చెప్పెను.
ఒక విషయమును మీరు గమనించాలని కోరుదును. అబ్రాహాము దేవుని మాటను అక్షరార్థముగా నమ్మెను.
దానిని ఎల్లప్పుడు గుర్తుంచుకొనండి! అది నా వర్తమానమైయున్నది. నీవు తప్పక వాక్యమునకు లోబడవలయును. దానికి వ్యతిరేకముగా ఏమైనా ఉన్నదని ఎరిగియున్నప్పుడు, దానిని అలాగే విడిచి పెట్టుము. అది మంచిగా కనబడవచ్చు, కాని దేవుని మాటకు వ్యతిరేకముగా తర్కము చేయవద్దు.
అది సాతాను చేసిన మొదటి పని, హవ్వతో వాక్యమునకు వ్యతిరేకముగా ఆలోచించినది. ఆమె దానిని ఎన్నడూ అనుమానించలేదు. ఆమె కేవలము దానిని సాతానుతో ఆలోచించినది.
ఈ దినమున వారు అదే రీతిగానే చేయుదురు. "దీనిని మేము చేయడము సమంజసంగా లేదా? అది సమంజసంగా లేదా?" అది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నట్లయితే, దానిని అలాగే విడువుము! అది సాతాను స్వరము.
JOHN 15:7
29వాక్యము మీలో ఉన్నయెడల… "మీరు నాలో నిలిచియున్నయెడల నా మాటలు మీలో ఉన్నయెడల, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి." అదియే పరిశుద్ధాత్మ! "నా వాక్యము మీలోను, మీరు నా యందును నిలిచియుండుడి." అది శరీరమైన వాక్యము. "మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది జరుగుతుంది. అదే మార్గము. ఆచారములను, వాటి అన్నింటినీ తీసివేయండి. వాక్యమును పట్టుకొని యుండండి, ఏలయనగా అదియే క్రీస్తు. గమనించండి, అప్పుడు దానంతట అదే ప్రత్యక్షపరచబడుతుంది.
ఒకరు ఇలా అన్నారు, "సోదరుడా బ్రెన్హాం, మాకు ఆ విషయములు ఎలా తెలియును? ఎలా?"
ఇవి కూటములలో మీరు చూచే ఆసక్తికరమైన సంగతులు. ఇక్కడ కూటములకు వచ్చు వారు ఎవరైనా దానిని ఎరుగుదురు. వారములు మరియు నెలలు మధ్య కాలములో జరుగు ఈ సంగతులను పరిశుద్ధాత్మ బయలుపర్చును. ఎవరినైనా అడగండి, "ఎప్పుడైనను అది తప్పినదా? అది తప్పనేరదు, చూచారా. "అది మీకు ఎలా తెలియును?" ఎందుకనగా అది వాక్యము యొక్క వాగ్దానమై యున్నది; మరియు ఆ ఘడియ ఇక్కడ ఉన్నది. అది నెరవేరవలసి యున్నది. నాకేమో తెలియదు, అయితే చాలా కొద్దిమంది అల్ప సంఖ్యాకులు దానిని నమ్ముదురు. కాని అది కేవలము అదే రీతిగా ముందుకు వెళ్ళవలసియున్నది. మీరు ఎప్పుడైనా గమనించారా? అది ప్రజల యొక్క మీదుగా తిన్నగా వెళుతుంది. వారు దానిని గుర్తించునప్పటికి అది జరిగి గతించిపోతుంది. ఎల్లప్పుడు అదే రీతిగా ఉండును.
MATT 11:25•
MATT 16:3•
LUKE 10:21•
LUKE 12:56•
JOHN 5:39
30కాథలిక్ ప్రజలగు మీకు, మీ సంఘము ఏమి చేసినదో తెలుసా? ఏలయనగా జోనా-అఫ్-ఆర్క్, నిజమైన దేవుని పరిశుద్ధురాలు, అద్భుతములు చేసినది, దేవుని నామమున ప్రవచించినది. మీరు ఆమెను మంత్రకత్తె అని పిలిచారు, మరియు ఆమెను స్తంభమునకు కట్టి ప్రాణముతో కాల్చి వేశారు. ఆమె కనికరము కొరకు కేకలు వేయుచున్ననూ మీరు ఆమెను స్తంభమునకు కట్టి ప్రాణముతో కాల్చి వేశారు. వందల సంవత్సరముల తరువాత మీరు చేసినది పొరపాటని గ్రహించారు. తరువాత మీరు ఆమెను పరిశుద్ధురాలిని చేశారు. ఆమె మీ మీదుగా దాటి పోయినది, మరియు మీరు ఆమెను ఎరుగలేదు.
ఏలీయా ఆలా వెళ్ళాడు, వారు అతనిని ఎరుగలేదు. "వృద్ధునిగా మిగిలిపోయాడు."
క్రీస్తు అలాగే వెళ్ళాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానము వరకు వారు ఆయనను ఎరుగలేదు. దేవుడు దానిని నిశ్చయించాడు. మరియు అది సంపూర్ణముగా అవిశ్వాసి కన్నులకు బుద్ధిహీనతను కలుగజేయును. మరియు చూపించెను… ఆయన ఇలా అనెను, "నేను దానిని జ్ఞానుల యొక్కయూ, వివేకము గలవారి యొక్కయూ కన్నులకు మరుగు చేసి నేర్చుకునే పసి బాలురకు దానిని బయలుపర్చి యున్నాను. దానిని చేసినందుకు క్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను, చూచారా.
నిన్నునీవు తగ్గించుకొనుము. దానిని నమ్ముము. వాక్యమును పరీక్షించుము.
యేసు ఇలా అనెను, "లేఖనములను పరిశోధించుడి, వాటిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నీవు ఆ ఘడియను తప్పక ఎరుగవలసి యున్నది. ఆయన పరిసయ్యులతో ఇలా చెప్పెను, "వేషధారునిగా మీరు ఆకాశ వైఖరిని వివేచించగలరు, కాని ఈ కాలము యొక్క సూచనలను మీరు వివేచింపలేరు, ఏలయనగా మీరు నన్ను ఎరిగియుంటే నా దినమును మీరు ఎరిగి యుండెడి వారు." తిన్నగా వారి మీదుగా అది వెళ్లిపోయెను. అది జరిగి వెళ్ళిపోయే వరకు వారు దానిని ఎరుగలేదు. ఇప్పుడు గమనించండి. వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది!
GEN 19:17,22,26•
LUKE 17:32
31మనము దాని మీద వుండగా మరొకరిని లోతును గమనించండి. యేసు తానే స్వయంగా ఇలా అనెను, "లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి." వాక్యము అంత ప్రాముఖ్యము కానియెడల, దానిని గురించి ఆలోచించుట పరవాలేదు అన్నట్లయితే, దేవుని దూత లోతు మరియు లోతు కుటుంబముతో చెప్పినప్పుడు, "సోయరుకు వెళ్ళుడి, కాని వెనుకకు చూడ వద్దు!" మరియు లోతు భార్య కొంచెము చులకనగా తీసుకుని వెనుకకు తిరిగి చూచినది, కాని అది దేవుని వాక్యమునకు వ్యతిరేకము. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయినది.
ఇప్పుడు నీవంటావు, "స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుటను గూర్చి, వారి బట్టలను గూర్చి…? దేవుడు దానిని చెయ్యవద్దు అన్నాడు! మీరు వాక్యమును అనుసరించండి, సంశయము లేదు, లోతుకు మంచి భార్య ఉన్నది, కాని ఆమె దేవుని ఆజ్ఞగా ఉండు మాటను వెంబడించలేదు. లోతు! హవ్వ మంచి స్త్రీయే, కాని దేవుని ఆజ్ఞగా ఉండు మాటను వెంబడించలేదు; దానితో కొంచెము ఆలోచించినది.
HEB 12:1
32"సోదరుడా బ్రెన్హాం, దీనిని మనము చేయుట సమంజసము కాదా! నేను అమెరికా దేశ పౌరుడను. నాకిష్టము వచ్చిన దానిని చేయుటకు నేను హక్కు కలిగియున్నాను. అది నా అమెరికా భాగ్యము. అది నీ అమెరికా భాగ్యము, కాని క్రైస్తవ భాగ్యము కాదు. ఏలయనగా క్రైస్తవునిగా నీవు గొర్రెవు; మరియు గొర్రె దాని హక్కులను ఎరుగును. దానికున్న హక్కులన్నింటిని దాని నుండి నీవు తీసివేసిననూ, అది ఇంకనూ అలాగే వుంటుంది. కాని ఒక మేక వాటిని తన్ని వేయును. అది నిజము. కాని ఒక గొర్రె తన హక్కులను వదులుకొనును. మరియు ఒక క్రైస్తవుడు ఏదైనను తన క్రైస్తవ హక్కులకు వ్యతిరేకముగా ఉన్నచో, వారి యొక్క దేశ హక్కులను వదులుకొంటాడు.
లోతు భార్య, కేవలము వెనుకకు చూచినది. [బ్రదర్ బ్రెన్హాం చిటిక వేసెను.] అది అంతే! ఇప్పుడు అది ఏమి చేసినది. అబ్రాహాము మరియు లోతు విషయమలో చెపుతుంది. వారు అక్కడ, వుంచిన విషయము ఒక మాదిరి. మరియు మనము దాని నుండి దూరముగా వెళ్ళలేము.
హెబ్రీ 11వ అధ్యాయము ఇలా చెబుతుంది, "ఈ విషయములు మనకు మాదిరిగా ఉన్నవి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున, మనము ప్రతీ పాపమును ప్రక్కకు పెట్టవలెను. పాపమనగా ఏమిటి? అవిశ్వాసము! "మనలను సులువుగా చిక్కుల బెట్టు ప్రతి పాపమును, దేవుని వాక్యము పట్ల ప్రతి అవిశ్వాసము."
GEN 19:26•
LUKE 17:32•
ROM 10:17
33మనము దేని విషయములోనైనను వ్యతిరేకముగా లేచి, "అవును, వారు దానిని బోధించారు, దీనిని బోధించారు," అంటాము. అలా మీరు చేయవద్దు! దేవుడు ఏది చేయమని చెప్పాడో, నీవు కేవలము దానినే చేయుము. దానితో నిలిచియుండుము, అక్షరముతో నిలచి యుండుము!
"అది ఏమి తేడా చేయదు," అని నీవు చెప్పవచ్చు.
మంచిది, వాక్యము ఏమి చెపుతుందో అది మాత్రమే నేను చెప్పగలను. మరియు యేసు దానిని ఖండితముగా చెప్పెను, "లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి." ఆమె కారణము లేకనే తన భుజము పైగా చూసినది. హవ్వ కారణము లేకనే ఒక్క క్షణము ఆగినది. ఆమె చేసినది అంతవరకే. లోతు భార్య కేవలము వెనుకకు చూచినది. మరియు దేవుడు నీతిమంతుడైన లోతు భార్యను ఉప్పు స్తంభముగా మార్చెను. కేవలము చిన్న విషయమునకు, ఆ అగ్ని ఏమిటో చూచుటకు కేవలము వెనుదిరిగినందున, ఆయన ఆజ్ఞను ఆమె ఉల్లఘించినది. మరియు ఆమె ఉప్పు స్తంభముగా మారెను. ఆయన ఏమి చెప్పుతో దానినే దేవుడు భావించుననుటకు ఉదాహరణముగా ఇంకనూ అది ఈ దినము వరకు అక్కడ నిలబడియున్నది.
ఓ, నిజమైన విశ్వాసము ప్రజలలోనికి లంగరు వేయబడినచో! "వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని వాక్యమును వినుట వలన కలుగును."
34హవ్వ ఒక్క క్షణము ఆగినది. ఆమె చేయవలసినదంతా అంతవరకే సాతాను ఆమెను పట్టుకొన్నది. మరియు ఆమెతో కేవలము దానిని తర్కించినది. "అది సమంజసము కాదా? ఫలానా-ఫలానా సోదరి దానిని చేయగలిగినట్లయితే, నీవు కూడా దానిని చేయగలవా? ఆమె పాస్టరు గారి భార్య. ఆమె ఎవరైనప్పటికి, లేక అతడు ఎవరైనప్పటికి, నాకు లెక్క లేదు. అది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నట్లయితే, దానిని నీవు వినవద్దు! తిన్నగా వెళ్ళుము! ఇవి అన్నియు మాదిరులు!
ఆ విధముగానే అబ్రాహాము చేశాడు. ఆ బిడ్డ తనకు పుట్టబోడని ఆనాటి వైద్య శాస్త్రము వారు ఎంత ఆలోచనను అతనికి ఇచ్చియుండే వారంటారు? మీరు ఆలోచించండి. ఆయనకు డెబ్బై-అయిదు సంవత్సరాలు ఉన్నప్పుడు సంగతి ఏమిటి? తరువాత మనము ఆయనను వంద సంవత్సరాలు గలవాడిగా కనుగొంటాము. అతడు మొదటి స్థానములో, నమ్మిన దాని కంటెను ఇప్పుడు ఇంకనూ దానిని బలముగా నమ్మెను. దాని లోనికి ఇంకా ఎక్కువ విశ్వాసమును ఇరవై-అయిదు సంవత్సరములుగా కట్టుచూనే యుండెను. అది నాకు ఇష్టము. అవునండి.
JOHN 1:1•
EPH 5:23•
HEB 13:8
35మనము లేవక ముందు, ఇప్పుడు మీ దృష్టికి కొంత తెస్తాను. మీరు గమనించారా? మీరు దానిని పొందారని నమ్ముచున్నాను. రూఢి చేయబడిన ఆ నిబంధన మీద, ఆ నిబంధనను వ్రాయుట ద్వారా మరియు దానిని విడిగా చేయుట ద్వారా, మీరు దానిని గ్రహించారా? మీకు అర్థమైతే చేతులెత్తండి. దాని అర్థమేమిటో మీరు గ్రహించారు. నిబంధన వ్రాయబడినది. రెండుగ చించబడినది. దేవుడు తన త్రిత్వము యొక్క ప్రత్యక్షతను తీసుకొనుచు దానిని ఒకటిగా చేయుచు, విడిగా దానిని విడదీయుచున్నాడు. శరీరమును ఆ పైకి ఉన్నత స్థలమునకు తీసికొని, సంఘములో నివసించుటకు తిరిగి పరిశుద్ధాత్మను పంపెను. శరీరము ఉత్పత్తి చేసిన దానినే సంఘము ఒక భార్యగా, వధువుగా ఉత్పత్తి చేయును. అదే ఆత్మ, అదే కార్యములు, అదే సిద్ధాంతము, ప్రతీది ఖచ్చితంగా ఆయన దానిని చేసియున్నట్లుగానే జరుగును. అవే గురుతులు కలిగియుండును. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. గమనించండి!
ఒకవేళ అక్కడ ఒక యూదుడు కూర్చొని ఉన్నాడు.
చూడండి, దేవుడు ఆ కార్యములను చేశాడు, మరియు అది నేరుగా ప్రజల లోనికి వెళ్లినది, అయినను దానిని వారు గ్రహించలేదు.
స్త్రీలకు వివాహము జరుగనప్పుడు, ఎందుకు, వారి ముఖమునకు ముసుకు వేస్తారో దాని గూర్చి నేను వివరించాను. ఎందుచేత? వారు దానిని గ్రహించలేకపోవచ్చు. కాని వారు ఏమి చేయుచున్నారనగా, వారు కేవలము శరీరముగా ఉన్నారని తెలిసికొనుచున్నారు. వారికి శిరస్సు లేదు. పురుషుడే వారి శిరస్సు. ఆ కారణము చేతనే రిబ్కా తన ముఖమునకు ముసుగు వేసుకొనెను. అందుచేత సంఘము తనకుతాను ముసుగు వేసుకొని క్రీస్తుకు లొంగిపోవలసియున్నది, ఎందుకనగా ఆయన శిరస్సు, మరియు ఆయనే వాక్యమైయున్నాడు.
GEN 24:65•
JOHN 14:20
36ఇప్పుడు, యూదులు, యోమ్ కిప్పుర్, వారు సంస్కారమును, లేక పస్కాను తీసికొనునప్పుడు ఎవరికైనా అది తెలియును. అతడు యూదుడు, మరియు మూత క్రింద విరువబడిన కోషేరు రొట్టె ముక్క ఉన్నదని అతనికి తెలియును. మరియు నేనెరిగిన యూదులలో అందరునూ విరువబడిన కోషేరు రొట్టె ముక్కను గూర్చి వివరించగలరు. ఎందుకు, అది ఇక్కడ నిబంధనను రూఢి చేయడంలో ఉన్నది, విరువబడిన క్రీస్తు శరీరము, ఆయన మనిషి నుండి దేవుని విరిచినప్పుడు; ఆయన దేవుడు మరియు మానవుడై యున్నాడు. ఆయన ఆత్మను పైకి తీసుకొన్నప్పుడు… యేసు ఇలా అనెను, వినండి, "ఆ దినమున నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నాలో ఉన్నాడని; నేను మీ యందును, మీరు నా యందున ఉన్నారని మీరు తెలిసికొందురు." అది దేవుడు తన ప్రజలలో ఉన్నాడు! అదే దేవుడు!
నిన్న రాత్రి మనము మాట్లాడిన చోట, ఆయన ప్రతినిధిగా ఆక్కడ ఉన్నాడు, దేవుడు దిగి వచ్చాడు. పెద్ద అక్షరాలలో ప్రభువు, యెహోవా-యీరే! యెహోవా-రాఫా, యెహోవా-మనష్షె, ఎలోహిం అన్నిటికి సరిపోయినవాడు, బలవంతుడు, స్తనములు కలిగినవాడు, ప్రతిదీ సమస్తమూ ఆయన యొక్క బిరుదులు, అన్నియు మానవ శరీరములో ప్రత్యక్షమై మానవ ఆహారమును తిని, వారి దృష్టి నుండి అదృశ్యమాయెను. దేవుడు!
MATT 24:37•
LUKE 4:17,18,20•
LUKE 17:26,28,30
37మరియు యేసు వచ్చినపుడు, ఆయన చెప్పెను, "ఆ దినమున ఉన్నట్లు మరలా అది వుండును." దేవుడు!
"అది మూత క్రింద ఉన్న విరువబడిన కోషేరు రొట్టె, విరువబడిన ముక్క, వారు తీసుకునేది కాదు, కాని అది విడువబడినది, వారు దానిని ఎందుకు గ్రహించరు?
అదే రీతిగా యేసు గ్రంథపు చుట్టలను తీసుకొన్నప్పుడు ఆయన చదవటం ప్రారంభించాడు. ఆయన ఆ వచనములో ఒక భాగము చదివి మిగిలిన భాగమును విడిచి పెట్టెను, ఏలయనగా అది ఆ దినమునకు ఆయన కొరకై వుండెను. వచనములోని మిగిలిన భాగము ఆయన రెండవ రాకడకు సంబంధించినది.
ఆ కారణము చేతనే యూదులు దానిని గ్రహించలేకపోయారు, ఎందుకనగా వారు గ్రుడ్డివారు కావలసియున్నది. వారు వారి యొక్క మెస్సీయను చూడలేదు. అయినను ఆయన అక్కడ వుండెను. మరియు ప్రతిసారి వారు పస్కాను తీసుకొనునప్పుడెల్లా, అక్కడ విరువబడిన కోషేరు రొట్టె ఉన్నది. అది వారు ఎరుగరు.
నేను ఒక రబ్బీని అడిగాను, అతడన్నాడు, "ఆలాగు చేయుటకు మేము నేర్పించబడ్డాము."
నేనన్నాను, "ఎందుకు మీరు దానిని చేస్తారు?"
అతడన్నాడు, "నాకు తెలియదు. ఏ ఒక్కరికీ తెలియదు.''
చూడండి, ఒక స్త్రీ తన ముఖమునకు ముసుగు వేసుకొనును, అయిననూ ఆమె దాని గ్రహించదు. ఆమె లోనికి వచ్చి, ఆమె భర్తను ఆమెకు శిరస్సుగా వుంచుకొనుటకు బదులుగా, ఆమె భర్తకు శిరస్సుగా ఉన్నది. అది మార్చబడినది. ఇప్పుడు అదియే అమెరికా వారి యొక్క వైఖరి.
అయితే అది విరువబడిన కోషెరు రొట్టె. తరువాత మనము మరలా గమనించెదము. ఈ రాత్రి మనము మాట్లాడగొరే నిజమైన భాగములోనికి వెళ్ళక ముందు, వెనుకటి వృత్తాంతమును మీరు మరలా గుర్తించాలని కోరుచున్నాను.
GEN 17:7•
GEN 18:9,10•
JOHN 1:42,48•
JOHN 4:18,19
38అబ్రాహాము మరియు తరువాత తన సంతతితో చేసిన నిబంధన నిన్న రాత్రి మీకు గుర్తున్నది. అక్కడ సహజ సంబంధమైన అబ్రాహాము సంతానమున్నది, విస్వాసపు క్రియ ద్వారా దానిని ఉత్పత్తి చేసినది; కాని నిజమైన అబ్రాహాము సంతానము క్రీస్తు, బైబిలు… అది అబ్రాహాము యొక్క రాజ సంతానము. ఇప్పుడు గమనించండి.
అబ్రాహాము, తన దినమున అగ్నితో నాశనము కాక ముందు, అబ్రాహామునకు ఒక గురుతు చూపించబడినది, ఎన్నుకొనబడిన గుంపు. దేవుడు మానవుని రూపములో దిగి వచ్చి, శారా ఉన్న చోట తన వీపును గుడారము వైపు త్రిప్పి, శారా గుడారము లోపల ఏమి చేయుచున్నదో చెప్పెను. మరియు యుగాంతములో అదే విధముగా వుండునని యేసు మరలా వచ్చి చెప్పెను. ఇప్పుడు, అది అబ్రాహాముగా ఉన్నాడు.
తరువాత అతని సహజ సంతానమైన మెస్సీయ వచ్చినప్పుడు. సీమోను యేసు నొద్దకు వచ్చినప్పుడు, అతని హృదయ రహస్యమును ఎరిగినవాడై ఆయన అతని పేరు సీమోను అని, అతని తండ్రి పేరు యోనా అని చెప్పెను. ఫిలిప్పుకును చెప్పెను… లేక ఫిలిప్పును తీసుకొని వచ్చిన నతానియేలుకును అలాగే చెప్పెను, "నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని." బావి దగ్గర ఉన్న స్త్రీతో, "నీకు అయిదుగురు పెనిమిటిలు వుండిరి," అని చెప్పెను. ఆమె అన్నది, "అయ్యా! నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను." చూడండి, అబ్రహాము యొక్క ముగింపుగా ఉన్న సహజ సంతానము ఆ గురుతును పొందినది.
అది రాజ సంతానమైన క్రీస్తుగా ఉన్న, ఆయన ద్వారానే స్వయముగా ముందే చెప్పబడెను. తన ముగింపు దినములలో, రాజ సంతానము అదే గురుతును పొందును. ఇప్పుడు మనము దానిని పొందామని నేను నమ్ముచున్నాను.
GEN 17:5,15•
GEN 32:28•
ACTS 13:9
39దేవుడు అతనిని మార్చెను. గమనించండి. దేవుడు అబ్రాహాము యొక్క పేరును మార్చెను. నేను దానిని విడిచి పెట్టుట మంచిది. నేను తిరిగి పెద్ద ఉజ్జీవ కూటములకు వచ్చినప్పుడు మనము దానిలోనికి వెళదాము. అతని భూసంబంధమైన పేరు నుండి, దేవుని ద్వారా ఇవ్వబడు పేరునకు ఆయన మార్చవలసియుండెను.
నీవంటావు, "మనిషి పేరుతో మాకు ఏమిటి, ఏదైతేనేమి?" ఓ, సోదరుడా, నీవు కేవలము ఎరిగియుంటే! ఎందుకు, ఈ అధునాతన పేర్లు కొన్ని మనకు ఉన్నాయి! వాటిని పిలుచుట నాకు ఇష్టము లేదు, ఎందుకనగా అది మీ భావనలను గాయపర్చును. కాని దేవుడు పేర్లను కలిగియున్నాడు. అవి అర్థమిచ్చు సంగతులు. అది పూర్తి క్రమమును మార్చివేయును. ఓ, నీవంటావు, "బుద్ధిహినత!"
యాకోబు విషయము ఏమిటి? అతడు దేవుని ఎదుట రాకుమారుడు కాక ముందు, అతని పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుకు మారవలసియుండెను. అది నిజమేనా? నిశ్చయముగా. పౌలు; సౌలు పేరు పౌలుగా మారవలసియుండెను. ఓ, దేవుడు వారి పేరును మార్చాడని చెబుతూ మనము ఎంతమందిని అలా పిలువగలము! అబ్రాము నుండి అబ్రాహాము, శారయి నుండి శారా, వారి పేరును మార్చుచున్నాడు. ఓ, నా యొక్క ఏదో చిన్న సంఘము లోనికి వెళ్ళి ఒక ఎన్నుకొనబడిన సమూహముతో వుండుట ఎలాంటి దీవెను, మరియు దానిని బోధిస్తు వెళితే, దేవుడు ఏమి చేశాడో నీవు చూచినప్పుడు, హృదయాలలో హల్లెలూయలను చూడండి!
GEN 12:11•
GEN 18:11•
ROM 4:19
40నిన్న రాత్రి "పంక్తుల మధ్య," అను దానిని వివరించుచుంటిని, మరియు "దానిని రూఢి చేయడమును," వివరించుచుంటిని. నేను నా అంశము లోనికి వెళ్ళక ముందు, నేను దానిని చూడగోరెదను. అది, దేవుడు అబ్రాహాము మరియు శారాను, వారు వాగ్దాన కుమారుని పొందక ముందు, వారిని ముడతలు పడిన ముసలి మనుషుల నుండి యవ్వన జంటగా మార్చెను. వారి భౌతిక దేహములను మార్చెను. వారు పొందిన చివరి గురుతు, దేవుడు వారి శరీరములో బయలుపరచబడి, తన వెనుక గుడారములో ఉన్న స్త్రీ యొక్క హృదయమును చదవడము, ఆ తరువాతి విషయము వారి శరీరములు మార్పు చెందినవి. నిన్న రాత్రి నాకు చాలా ఆలస్యమైనది. దాని గూర్చి కొంత మాట్లాడి దానిని ఇంకా కొంచెము దగ్గరగా తేవాలని కోరుచున్నాము.
ఇప్పుడు, దాని యొక్క రుజువు అదే, వారిరువురు ఆ పెద్ద ప్రయాణమును చేసినపుడు, వారు పూర్తిగా మార్పుచెందియున్నారని బైబిలు చెప్పుచున్నది. "వారు ఇరువురూ వయస్సులో మిక్కిలి ముదుసలియైన వారు. అబ్రాహాము శరీరము మృతతుల్యమైనది, మరియు శారా గర్భము ఉడిగి పోయినది." అది నిజమేనా? వారు చనిపోయిరని మాకు తెలియును, కాని దేవుడు వారిని మార్చివేసెను. దానిని ఆయన చేశాడని ఇప్పుడు మీకు రుజువు చేయుటకు, మొదటగా పిలిష్తియ రాజు, ఆమెతో ప్రేమలో పడెను. ఆమె ఒక వృద్ధ స్త్రీయేనా? మరియు ఆమెను చూచుటకు అందముగా ఉన్నది.
GEN 24:67•
GEN 25:1,2•
2COR 1:20
41మరొక విషయము. ఇస్సాకు పుట్టినప్పుడు శారా మరియు అబ్రాహాము వయస్సులో మిక్కిలి ముదుసలియైన వారు, చనిపోవుటకు సిద్ధముగా వుండిరి. కాని ఆ తరువాత వారు ఇంకనూ జీవించారు, మరియు అతనికి 40 సంవత్సరములు వచ్చినపుడు ఇస్సాకుకు వివాహమైనది. శారా చనిపోయినది. తరువాత అబ్రాహాము కెతూరా అను స్త్రీని వివాహము చేసుకొనెను మరియు కుమార్తెలు గాక ఆరుగురు కుమారులను కనెను. తరువాత, మరియు ఇక్కడ 60 సంవత్సరముల క్రితము, అతడు మృతతుల్యుడుగా వుండెను. హల్లెలూయా! అక్కడే నీవున్నావు! దేవుని వాగ్దానము నిశ్చయమైనది. ఆమేన్. ఓ, నేను దానిని ప్రేమించుదును.
మీరు దానిని చదివి తెలిసికొనుటకు గాను చెప్పుచున్నాను. ఈ రోజు అడవులలో చదువుచుండగా ఏదో కొంత నేను చూడగలిగాను. దానిని వివరించ గోరుదును.
GEN 15:13•
ACTS 7:6
42ఇశ్రాయేలు ఒక దినమున దేవుని ప్రజలుగా ఐగుపులో ఉన్నారు. బానిసత్వమునకు అమ్మివేయబడ్డారు. అక్కడ వుండుటను బట్టి వారు సహాయము చేసుకోలేక పోయారు. దేవుని యొక్క గొప్ప ముందు నిర్ణయ ప్రణాళిక వారిని అక్కడకు పంపినది. ఆయన ఆబ్రాహాముతో వారు 400 యేండ్లు తమది కాని పరదేశమందు నివసింతురని చెప్పెను. మరియు వారు అక్కడ మిగిలిన వారి వలె మారవలెను. వారు బానిసలు. ఒక ఐగుప్తీయుడు హెబ్రీ యవ్వన బాలికలను బలత్కారముగా చెరుపగోరినచో, మరేమి మాట్లాడుటకు వీలు లేదు. వారు యవ్వనస్తుని చంపగోరినచో, వారిని చంపుతారు, ఏమి మాట్లాడుటకు వీలు లేదు. వారు బానిసలు. వారు బూజు పట్టిన రొట్టెను వీరికి విసిరి వేసేవారు. దానిని వారు తినాలి, లేక తినకుండా వుండాలి; ఫిర్యాదు చేసిన చంపడమే! దేవుని ప్రజలకు అది ఎలాంటి స్థలము!
43కాని ఒక దినమున, హల్లెలూయ, దేవుడు తాను అబ్రాహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. మహిమ! ఇప్పుడు మరలా నేను భక్తి అనుభూతిని పొందుటకు ప్రారంభించుచున్నాను. గమనించండి, దేవుడు అబ్రాహామునకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనెను. అగ్నిస్తంభముతో, ఆయన ప్రవక్తను ఆభిషేకించి, ఆయన ఆ దేశములోనికి వచ్చి ఎన్నడూ తప్పిపోని దేవుని వాగ్దానమును వారికి జ్ఞాపకము చేయుట ప్రారంభించెను. మరియు తన వాక్యమును రుజువు చేయుటకు దేవుడు హాజరైయుండెను. నిజము, దేవుడు వారికి అనుగ్రహించిన, పాలు తేనెలతో ప్రవహించుచున్న దేశమును గూర్చి ఆయన వారికి చెప్పెను. అగ్నిస్తంభము తన మీద ఉన్న ప్రవక్త యొక్క సాక్ష్యపు బలముతో వారు ఐగుప్తు నుండి బయటకు సేనలుగా పోయిరి, ఏలయనగా అతడు పంపబడియున్నాడు. మరియు దేవుడు అతనితో ఉన్నట్లు ఆయన రుజువు చేసెను.
NUM 13:26
44ఇప్పుడు వారు కాదేషు- బర్నేయా అను స్థలమునకు వచ్చిరి. ఒకసారి (కాదేషు-బర్నేయా) అది లోకము యొక్క తీర్పు పీఠముగా వుండెను. యెహోషువా అను పేరు గల యుద్ధ వీరుడు వారి మధ్య వుండెను. హెబ్రీ భాషలో యెహోషువా అనగా, "యెహోవా-రక్షకుడు" అని అర్థము. మరియు యెహోషువా గొప్ప యుద్ధ వీరుడు… ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఈ దేశమును వారు ఎన్నడూ చూడలేదు, దానిని గూర్చి వారు కేవలము విన్నారు. ఈ దేశమునకు వెళ్ళుటకు వారు సమస్తమును విడిచిపెట్టిరి, ఎందుకనగా దేవుని వాక్యము వారి యొద్దకు తేబడెను. మరియు వారు ఈ దేశమునకు వెళ్ళు మార్గములో ఉన్నారని రుజువు చేయబడినది. మార్గములో ఉన్న సంఘమునకు ఎలాంటి మాదిరి, దాని గూర్చి ఏమియూ తెలియదు. వారిలో ఎవరూ, ఎన్నడూ అక్కడకు వెళ్ళి యుండలేదు. కాని యెహోషువా, వారు సరిహద్దునకు దగ్గరగా వచ్చినపుడు, కాథేషు వద్దకు (తీర్పు పీఠము), అక్కడకు వెళ్ళి తిరిగి వచ్చిన ఒక మనిషి నుండి, తీర్పు ఇశ్రాయేలును తాకినది. యెహోషువా యోర్దానును దాటి, వాగ్దాన భూమి లోనికి వెళ్ళి, తిరిగి రుజువును తెచ్చెను. అది అక్షరాలా ఎలా వుండునని దేవుడు చెప్పెనో, అది అలాగే యుండెను. మరియు వారు పరమానందముతో నిండిన ఆ దేశము యొక్క ద్రాక్షలను వారు రుచి చూశారు.
JOHN 14:2
45వారికి అక్కడ ఇల్లు, వారు స్వతంత్రులుగా వుండుటకు వారు చక్కగా దేవుని భయములో పిల్లలను పెంచుటకు, సంఘమును కలిగి యుండుటకు మరియు ఇంకా అవన్నీ వారికి వాగ్దానము చేయబడినవి. బానిసల బ్రతుకు నుండి, వారు నది దాటి ఆ దేశము లోనికి వెళ్ళి, ఈ గృహమును పొందుటకు వారు ఎంత సంతోషముగా వుండాలి. గమనించండి. కాని వారు నదిని దాటినప్పుడు, వారి సొంత జీవితములను వారు జీవించారు, అది గొప్ప సంగతి. కాని చివరకు కొండ మెట్టల సమాధి బండలుగా గచ్చు చేయబడెను. వారు వృద్ధులై చనిపోయారు, ముసలివారై చనిపోయారు, దేవుని ప్రజలు..
తరువాత ఒక దినమున మరొక గొప్ప యుద్ధ వీరుడు వచ్చాడు, వారందరిలో గొప్పవాడు, యేసు, యెహోవా-రక్షకుడు, ఆయన వచ్చి ఇలా అన్నాడు, "మరణమునకు ఆవల జీవమున్నది! ఏలయనగా నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలమును సిద్ధపరుచుదును, మరియు మరలా తిరిగి వచ్చి నా యొద్దకు మిమ్మును కొనిపోదును." ఈ గొప్ప యుద్ధ వీరుడు తన కాదేషు-బర్నేయా నొద్దకు, మన అందరి తీర్పు పీఠము నొద్దకు, కలువరి నొద్దకు తీసికొని వచ్చెను! అక్కడ ఆయన మన అందరి దోషములను తన మీద వేసుకొనెను. మనము మరణము అని పిలిచే యోర్థాను నదిని ఆయన దాటెను. యెహోషువా వలె నదిని దాటి, తిరిగి వచ్చి, "చనిపోయిన మనిషి తిరిగి బ్రతుకునని" రుజువును తెచ్చినట్లుగా, మూడవ దినమున ఆయన తిరిగి లేచెను.
LUKE 24:49•
ACTS 1:4•
ACTS 2:2
46ఆయన అన్నాడు, దానిని మీకు ఖాయము చేయుటకు, "మీరు యెరుషలేము పట్టణమునకు వెళ్ళి, అక్కడ కనిపెట్టాలని నేను కోరుచున్నాను. నేను మీకు దాని యొక్క సంచకరువును ఇవ్వబోవుచున్నాను. నేను మీకు దాని బయానాను, నిదర్శనమును ఇవ్వబోవుచున్నాను. మరియు వారు యెరుషలేమునకు ఎక్కి వెళ్ళి, వేగముగా వీచు బలమైన గాలి వలె నిత్యజీవము వచ్చు వరకు వారు కనిపెట్టియుండిరి.
మరియు ఈ దినమున, రెండువేల సంవత్సరముల తరువాత, మనము మరణము నుండి జీవములోనికి దాటియున్నామని ఇంకనూ ఆ నిదర్శనమును కలిగియున్నాము. మన యెహోషువా ఆ నిదర్శనమును తిరిగి తెచ్చెను. మరియు ఆయన మనకు తిరిగి తెచ్చిన దేవుని పరలోకపు వరములను రుచి చూచినవారమై, మనము వాగ్ధాన భూమికి వెళ్ళు మార్గములో యున్నాము. దానిని గమనించండి, ఎంత అద్భుతము! ఒకప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు. త్రాగుబోతు…
47ఈ దినమున నేను ఒక సోదరుని కలుసుకొన్నాను; అతడు ఒక వీధి మలుపు తిరిగి వెళ్ళిపోవుటకు ఒక వింతైన అనుభూతిని కలిగియుండెను. ఆ మనిషి పేరు ఏమిటో నేను మరచిపోయాను. అతడు ఇక్కడ కూటములో వుండవచ్చు. అయిననూ, అతడు లేకపోయినను, ఎందుకో దేవుడు అతనికి మంచిగా ఉన్నాడు. అతడు ఇండియను, సగము ఇండియను. అతడు వర్జీనియావాడు. దానిని చెప్పకుండదు అని పరిశుద్ధాత్మ నాతో మాటలాడెను. నా భార్యను బయటకు వెళ్ళనిచ్చాను. ఆయన ఇలా అన్నాడు, "ఈ దారిగుండా వెళ్ళుము, మరియు ఈ మలుపు తిరుగుము." నేను అక్కడికి వెళ్ళాను. ఓ, అది ఎల్లప్పుడూ జరుగుతుంది. "ఇక్కడే వేచియుండుము." అప్పుడు కొన్ని నిమిషములు నేను వేచియున్నాను. ఆయన ఇలా అన్నాడు, "తిరిగి వెనుకకు ఈ మార్గము గుండా పైకి వెళ్ళుము." నేను అట్లు వెళ్ళినపుడు, అతనిని కలుసుకొన్నాను.
అతడన్నాడు "బ్రదర్ బ్రెన్హాం, నేను నిన్ను ఎరుగుదును, మిమ్ములను వెదకుటకు నేను ఒకసారి జెఫర్సన్-విల్ కు వచ్చాను. మీరు విదేశాలకు వెళ్ళారని చెప్పారు." అతడు తన జీవితములో ఒక త్రాగుబోతు. నేను ఏమి చేయుచున్నానో ఎరుగకయే, నేను అతని చేతిని పట్టుకొన్నాను. మరియు అతడు కాలేయములో వ్యాధిని కలిగియున్నాడు. నేను అక్కడ నిలబడియుండి అతని చేతిని పట్టుకొని యుండగా, కంపనము అతడిని విడిచినది. ఏమిటి? అతడు స్వస్థపడెను. ఆ వీధి మూలనే, ఇక్కడ ఈ పట్టణములోనే అతడు స్వస్థపడెను.
REV 1:18
48ఆ మనిషి ఎవరో నాకు తెలియదు… అతడు ఇక్కడ ఉన్నాడా? నాకు తెలియదు. అతడు ఇక్కడ వుంటే అది నాకు తెలియదు. అతడు తిరిగి ఇంటికి వెళ్ళాలని అన్నాడు. అతడు వెళ్లి యుండునని నేను నమ్ముదును. అతడు ఒక ఇండియను. శ్వేత జాతి స్త్రీని పెండ్లి చేసుకొన్నాడని తలంచుచున్నాను. మరియు అతడు వర్జీనియావాడు. అతని పేరేమిటో నేను మరచిపోయాను. అతడు ఇక్కడ లోడి లేక అలాంటిదేదో దాని ప్రక్కన జీవించును. అతడు ఎంతో దూరము నుండి జెఫర్సన్-విల్ కు వచ్చాడు. కాని అతడు ఆ మూలన నడవ వలెననే అనుభూతిని కలిగియుండెను; పరిశుద్ధాత్మ ఇలా చెప్పెను, "ఈ దారి గుండా వెళ్ళుము." ఓ, దేవా, కనికరము చూపుము! నీవు అక్కడే నీవున్నావు.
నేను గంటలు తరువాత గంటలు తీసుకుని ఈ సంగతులు చెప్పగలను, ఆ రీతిగా జరుగుట, సంభవించుట నేను చూశాను. ఎందుచేత? మన గొప్ప యుద్ధ వీరుడు, అవతలకు వెళ్ళి దేశమును జయించి, మరణమును జయించి, పాతాళమును జయించి, సమాధిని జయించి - మూడవ దినమున తిరిగి లేచెను. ఆయన ఇలా అన్నాడు, "మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై యున్నాను. మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి." జయశీలి అక్కడే ఉన్నాడు, తెరను రెండుగా చీల్చెను. అక్కడ ఆయన నిలబడి యున్నాడు!
49నల్లజాతి సహోదరి వలె ఇక్కడ ఉన్న నా నల్ల జాతి స్నేహితులారా, నన్ను క్షమించండి. ఆమె కూటములో సాక్ష్యము ఇచ్చుచున్నది. ఆమె తన మాటలో చాలా దక్షిణపు ఆమె వలె వుండెను. ఆమె ఇలా అన్నది, "మంచిది, మీ అందరికి ఈ రాత్రి నేను ఏదో చెప్పాలనుకొన్నాను. నిశ్చయముగా, నేను ఎలా వుండాలో అలా వుండలేదు. మరియు నేను నిశ్చయముగా ఎలా వుండాలని కోరుకొన్నానో అలా వుండలేదు. కాని ఒక విషయము నాకు తెలుసు, నేను సామాన్యముగా వుండవలసినట్లు వుండలేదు." అందువలన ఆమె ఎక్కడ నుండియో వచ్చినది!
నేను ఈ రాత్రికి చెప్పునదేమనగా! ఒకప్పుడు మనము పాపములో నశించిపోయాము. మరియు ఈ దినమున నిదర్శనమును అంగీకరించటం ద్వారా తిరిగి వచ్చిన వాగ్దానము (మన రక్షణ మిద చెల్లించబడిన బయానా), మనము మరణము నుండి జీవమునకు లేపబడ్డాము, మరియు దానికి పైగా జీవించుచున్నాము. మనము నదిని దాటి మనకై మనము, పూర్తి చెల్లింపును పొంది, మహిమగల దేశములోనికి వెళ్ళినప్పుడు, అది ఎలా వుండును?
HEB 12:5-8•
REV 3:19
50గొప్ప పరీక్ష! ఇప్పుడు అబ్రాహాము, ఈ అద్భుతమైన సంగతులు అన్నింటి తరువాత, దీవెన పొందిన తరువాత అతడు పరీక్షించబడెను. అబ్రాహాము పరీక్షించబడెను.
అక్కడే, ప్రజలు తప్పిపోయారు. ఇప్పుడు బాగా వినండి. దీనిని తప్పిపోవద్దు. బైబిలు చెప్పుచున్నది, "దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు తప్పక శిక్షించబడాలి, కొరడాతో కొట్టబడాలి. మరియు మనము ఆ శిక్షలను తట్టుకొననియెడల, మనము దుర్బీజులమవుతాము, దేవుని పిల్లలము కాము. మన విశ్వాసము ఎలా వుండునని మనము చెప్పితిమో, ఆ రీతిగా ఉండదు. అది రుజువు చేస్తుంది. మనము కలిగియున్నామని చెప్పుకొనునది మనము ఇంకా పొందలేదు. ఇప్పుడు మనము కొంత మంచి కాల్వినిజం లోనికి వెళ్ళుచున్నాము, కాబట్టి మనము దానిని కనిపెట్టాలి. ఇప్పుడు గమనించండి, "దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు, తప్పక శిక్షించబడాలి,'' కొరడాతో కొట్టు అను మాటలకు అర్థము, అతనిని ముక్కలుగా కోసి, ప్రతి ఆచారమును అతనిలో నుండి బయటకు నెట్టివేయుడము; చూడండి, అతడు దేవుని కుమారుడో, కాదో, అని పరీక్షించడమగును.
ఇప్పుడు అబ్రాహాము, అతడు దీవెన పొందిన తరువాత అప్పుడు పరీక్షించబడెను.
GEN 6:17•
MATT 24:37•
LUKE 17:26
51ఈ రాత్రి సమయము ఎక్కడికి వెళ్ళెను? నేను కనీసము నా అంశము లోనికి వెళ్ళలేదు, మరియు ఇది ముగించే సమయము. మీరు నాతో మరొక పదిహేను నిమిషాలు ఓపిక పడాతారా? వందనములు. గౌరవ మర్యాదతో వుండండి. (అబ్రాహాము. నోవహును చూడండి.) మనము ఒక్క క్షణము దానిని తీసుకొందాం. మనము తొందరపడలేము, అట్టి అవసరం లేదు. మనము దేనిగురించి తొందరపడుచున్నాము? నేను కొంచెము మెల్లగా వెళతాను, కొందరి వలె నిలుచుండి వేగముగా వెళ్లుట నాకు ఇష్టము లేదు. నేను నెమ్మదిగా వెళతాను. ఆయన దానిని నాకు ఇచ్చు వరకు నేను వేచి యుండవలసియున్నది.
నోవహును చూడండి, ఈ దినమున మనకున్నదానికంటే గొప్పదైన శాస్త్రీయ లోకము మధ్యలో 120 సంవత్సరములు దేవుడు నోవహును బోధించనిచ్చాడు. నిశ్చయంగా వారు పిరమిడ్లను కట్టారు. వాటిని మనము కట్టలేము. వారు స్త్రీ ముఖముగల సింహ శరీరము గల స్పినిక్స్ లను, నిర్మించారు. దానిని మనము కట్టలేము. సహజముగా కనబడునట్లు వారు శరీరములను క్రుళ్ళిపోకుండా పరిమళ ద్రవ్యములలో వేసి యుంచుదురు. అయిననూ ఈ దినమున మనము దానిని చేయలేము. వారు వస్తువులకు అద్దకము వేయుదురు. ఆ రంగు 400 సంవత్సరముల వరకు ఎన్నడూ మారేది కాదు. అది ఇప్పుడు మనకు లేదు. యేసు చెప్పినట్లుగా వారికున్న నాగరికత చూపుతుంది, "నోవహు దినములలో జరిగినట్లు మరియు నోవహు శాస్త్రీయ లోకములో బోధించాడు. "వర్షము ఆకాశము నుండి పడుతుంది, ఏలయనగా దేవుని వాక్యము ఆ రీతిగా చెప్పినది!" నోవహు ప్రవక్తయై వుండెను.
52నీవు ప్రవక్తలు లేచుట చూచినప్పుడు, నీవు గమనించుట మంచిది, తీర్పు దాని మార్గములో ఉన్నది.
అందువలన అప్పుడు నోవహు బోధించునప్పుడు, ప్రజలు దానిని క్రిందికి త్రోసివేయుచున్నారు. కొంతమంది ఈ రీతిగా చెప్పియుందురని నేను ఊహించగలను, "అది మా శాస్త్రీయ అంగీకారమునకు సరిపోదు." హు!
ఈ రోజున ఉన్నట్లే అది ఉన్నదని నేను ఊహించుచున్నాను. "దేవుని స్తుతించటయు మరియు బిగ్గరగా మాట్లాడటయు, కేకలు వేయటయు, మరియు ఇక్కడ ఫలానా పరిశుద్ధ ఉండ్రాళ్ళ జీవితము జీవించుట, మరియు ఈ సంగతులు అన్ని ఉద్రేకముతో కూడినవి," అని వారు చెపుతారు. అది వారి శాస్త్రీయ అంగీకారమునకు సరిపోదు, కాని అది దేవుని బైబిలుకు సరిపోతుంది. అది ముఖ్యమైన సంగతి. గమనించండి.
నేను ఇలా ఊహిస్తాను, శాస్త్రీయంగా వారు బయటకు వచ్చి ఇలా చెప్పారు. "చూడండి, మనుషులారా. మీకు ఒక విధముగా మతి పోయినది. ఇటు చూడండి. మాకు రాడార్ ఉన్నది. మేము చంద్రునికి గురి పెట్టి రాకెట్టులాంటి దానిని పైకి పంపగలము. ఇక్కడకు అక్కడకు మధ్య ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుంది?
నోవహు ఈ రీతిగా చెప్పుట నేను వినగలను, "దేవుడు ఆ రీతిగానే చెప్పాడు! మరియు దేవుడు అలా వుండునని చెప్పినయెడల, ఆయన యెహోవా-యీరే. ఆయన పైన నీటిని సమకూర్చగలడు. దేవుడు ఆ విధముగా చెప్పెను! అది ఎలాగైనను జరుగబోవుచున్నది! మరొకరు ఇలా అన్నారు…
MARK 16:17,18
53కాన్సర్ తో చనిపోవుచున్న మనిషిని తీసుకొనండి, మనిషి యొక్క నీడ, అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు; మరు సంవత్సరమున అతడు మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా వుంటాడు. అది ఎలా జరిగినది? అతనిని తిరిగి మంచి ఆరోగ్య స్థితిలో వుంచినది… ఆలాంటి సాక్ష్యములు నా దగ్గర వందల కొలదిగా యున్నవి. ఒక మనిషికి ప్రాణము పోయినప్పుడు డాక్టరు దానిని ధృవీకరించి ఇలా చెప్పెను, "అతడు చనిపోయెను. చనిపోయి ఎన్నో గంటలు అయినది. మరియు దేవుడు దర్శనమును ఇచ్చినప్పుడు, ఇప్పుడు అతడు బ్రతుకుచున్నాడు. ఎలా? నన్ను అడగవద్దు. అది నాకు తెలియదు. కాని దేవుడు చెప్పెను, "రోగులను స్వస్థపరుచుడి, చనిపోయిన వారిని లేపండి, దయ్యములను వెళ్ళగొట్టండి." అది నిజము.
నీవు ఎప్పుడైనా వ్యాధిగ్రస్థుడవైనప్పుడు మరియు నీవు స్వస్థత నొందుమని దేవుడు చెప్పినప్పుడు, నీవు తిన్నగా నీ డాక్టరు యొద్దకు వెళ్ళుము, నీవు ఎప్పుడు బాగుపడ్డావో అతనిని నీకు చెప్పునివ్వు. అతనికి అది సాక్ష్యము నిస్తుంది. "మంచిది, అది అంతా పోయినది," అని అతడు చెప్పినపుడు, "దేవునికి స్తోత్రము! మీ పరిచర్యలకు వందనములు డాక్టరు గారు," అని చెప్పుము. చూడండి. మీరు ఇంటికి వెళ్ళవచ్చు. అది మంచిది.
GEN 6:17•
GEN 7:9,16
54గమనించండి.
నోవహు ఇలా చెప్పాడు, "వర్షము రాబోవుచున్నది, లోకమంతా, దుర్మార్గులందరూ తుడిచి పెట్టబడుదురు."
"హ, బుద్ధిహీనత! మాకు సంఘములున్నవి. మా పాస్టరు గారు అలాంటి దానిని గూర్చి ఏమి చెప్పడు. ముసలి వానికి మతి పోయినది. అక్కడ ఒక ఓడను కట్టుచున్నాడు. ఎవరైనా దానిని నమ్ముతారని నీవు అనుకొందువా?
ఒక దినమున దేవుడన్నాడు, "నేను వారి అపహాస్యమును బాగా విన్నాను. ఇప్పుడు నేను సిద్ధముగా ఉన్నాను. లోనికి వెళ్ళుము!" మరియు జతలు జతలుగా ఇక్కడ జంతువులు వచ్చుచున్నవి, మగ మరియు ఆడ చిలుకలు, మగ మరియ ఆడ పిచ్చుకలు, మగ మరియు ఆడు మేకలు, మగ మరియు ఆడ గొర్రెలు, చిరుత పులి, భూమి మీద ఊపిరి పీల్చుచున్న ప్రతీది ఓడలో ప్రవేశించెను.
నోవహు ఇలా అన్నాడు, "అది నీ యొక్క చివరి గురుతు!"
మరియు వారు దానిని నమ్మలేదు. "పైకి వెళ్ళి వాసన కొట్టుచున్న నీ జంతువులతో జీవించుము."
అక్కడే అతడున్నాడు, నోవహు దేవునికి లోబడుచున్నాడు. లోకము ఏమి చెప్పినా లెక్క చేయలేదు, అతడు దేవుని మాటను వినెను; అతడు ప్రవక్తయై యున్నాడు. అతడు ఓడలో ప్రవేశించెను, మరియు దేవుడు అతని వెనుక ద్వారమును మూసివేసెను.
GEN 7:16
55సరిహద్దు విశ్వాసులైనవారిలో కొందరు, నోవహు చుట్టూ కూర్చొని అతని వర్తమానమును వినుచూ, అందులో ఒక భాగమును తీసికొని ఇలా అన్నారు, "ఇది మీకు తెలుసా, ఆ వృద్ధుడు చెప్పునది సరి కావచ్చును. మనము పైకి వెళ్లి చుట్టూర నిలుచుందుము. 'తలుపు మూయబడినప్పుడు వర్షము ప్రారంభమగునని' అతడు చెప్పాడు. ఆయనతో (నోవహు) దేవుడు వర్షించబోవుచున్నది గావున తలుపును మూయుదునని చెప్పెను. మనము పైకి వెళ్లి చుట్టూర నిలుచుందుము. వర్షము ప్రారంభించినయెడల మనము తలుపును తట్టుదము. ఎందుకనగా ఆయన సున్నితమైన హృదయము గల వృద్ధుడు, అతడు మనకు తలుపును తీయుననిరి."
గమనించుము, కొన్నిసార్లు వర్తమానమునకు బదులుగా వర్తమానికుని చూచెదరు. దేవుడు ద్వారము మూసెను. నోవహు ఎంత జాలి మనస్సు గలవాడైనప్పటికీ, దానిని మూయుట మరియు తెరచుటను చేయునది దేవుడు. ఆయన కోరినది ఏదైనా చేయును.
MATT 4:3•
MATT 26:67,68•
MATT 27:40•
MARK 14:65•
MARK 15:30•
LUKE 4:3•
JOHN 5:19
56"సహోదరుడా బ్రెన్హాం, అక్కడ ఒక మూలగా ఒక మనుష్యుడు కాన్సర్ వ్యాధిచే బాధపడుచున్నాడు. వెళ్లి స్వస్థపరచుము, మేము దైవిక స్వస్థతను నమ్ముచున్నాము." అది సాతాను.
అటువంటి ఒకరు ఆయన ముఖమును గుడ్డ వేసి మూసి, ఆయన తలపై కొట్టి, బహుశా అతడూ చెప్పియుండవచ్చు, నీవు ప్రవక్తవైతే నిన్ను కొట్టినదెవరో చెప్పుము. అప్పుడు మేము నమ్ముదుము.'' ఆయన ఎవ్వరి కొరకు ఆటలు ఆడలేదు. "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము!'' ఆయన దాని చేయగలడు, అయితే ఎవ్వరి కొరకును ఆయన ఆటలు అడలేదు. "నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగి రమ్ము." ఆ మత నాయకులు అలా చెప్పుచున్నారు, చూచారా. ఆయన ఎవ్వరికి కొరకును ఆటలు ఆడలేదు.
ఆయన తండ్రి తనకు చూపినట్లే చేసెను, ఇంకేమి చేయలేదు. అదే ఆయన చెప్పినది, పరిశుద్ధ యోహాను 5:19, "తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు." అక్కడే నీవున్నావు.
57గమనించండి.
"మనము పైకి వెళ్లి ఓడ చుట్టూ నిలుచుందుము, మరియు వర్షము ప్రారంభమైతే…"
నోవహు ఇలా చెప్పి యుండవచ్చును అని నేను ఊహించెదను… ఆయన మొదటి అంతస్తుకు వెళ్లి, తరువాతి అంతస్తుకు ఎక్కి వెళ్ళెను. ప్రాకు జీవుల నుండి పక్షుల యొద్దకు వెళ్ళెను, తరువాతి కార్యాలయము. నీతికరణము నుండి శుద్ధీకరణమునకును, (అనగా ఆ పక్షులు శుద్ధీకరణకు సాదృశ్యముగా ఉన్నవి), ఆ తరువాత అక్కడ నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు వెళ్ళెను; అక్కడ కిటికీ ఉన్నది, వెలుగు దాని ద్వారా లోనికి వచ్చును. "పరలోక సంబంధమైనదాని లోనికి నేను లేచి వెళ్లి అక్కడ కూర్చున్నాను,'' అని చెప్పియుండవచ్చును. "మంచిది, ఇక్కడకు నాతో వచ్చిన కుటుంబమైన మీరు ఉదయమున వచ్చారు. ఈ మధ్యాహ్నము అది ఆలస్యమగుచున్నది. ఇప్పుడు దేవుడు అక్కడే ద్వారమును మూసి వేసెను. ఉదయమున భూమి అంతయూ చీకటి కమ్మియున్నది. ఉదయమున వర్షము రాబోవుచున్నది. మరియు ఓడ తేలబోవుచున్నది. వర్తమానము నమ్మని ఆ క్రూరమైన పాపులను దేవుడు ముంచి వేయును." వారందరూ వేచియున్నారు.
GEN 7:11
58తరువాత ఉదయము లేచి, బయటకు చూశాడు, చక్కగా ప్రకాశముగా ఉన్నది. అతడు ఓడలోనికి వెళ్ళాడు, అతడు ఏ రోజున ఓడలోకి వెళ్ళాడో మీలో ఎందరికి తెలుసు? మే 17వ తారీఖు, అప్పుడు అతనికి 600 ఏండ్లు. మే 17వ తారీఖున అని బైబిలు చెప్పుచున్నది. అతడు లోనికి వెళ్ళినపుడు, 17వ తారీఖు గతించినప్పుడు, ఇదివరకు ఎప్పుడూ లేన్నట్లుగా సూర్యుడు వేడిగా ఉన్నాడు.
వారిని గూర్చి నేను ఊహించనట్లే సరిహద్దు విశ్వాసి ఇలా
చెప్పుచున్నాడు, "హ! అక్కడ చెప్పినది ఏమి జరుగలేదని నేను మీకు చెప్పాను! మీరంతా ఎందుకు పైన వ్రేలాడుతూ అక్కడ ఉన్నారు? ఆలాగున అరచువాని యొద్ద నుండి తొలగిపొండి!"
"అవును, అది మంచిదని నేను ఊహిస్తాను."
కాని మీరు చూడండి, విశ్వాసమునకు మరియు అవిశ్వాసమునకు మధ్య ఒక వేరు చేయబడిన గీత గీయబడినది. నీవు ఈ వైపునకైనను అటు వైపునకైనను వెళతావు. మరియు నీవు నీ చివరి పిలుపును పొందుటకు ఒక సమయమున్నది.
కాబట్టి రెండవ దినము, దేవుడు లోకమును నాశనము చేయబోవుచున్నాడని అతడు వారికి చెప్పినపుడు, అది నోవహుకు మరియు అతని సంఘమునకు ఎంతో నిరుత్సాహముగా ఉన్నది. అతడు ఎంత కాలము దానిలో కూర్చునియున్నాడని మీకు తెలియునా? ఏడు దినములు, ఏమియూ జరుగలేదు. అది పరీక్ష!
GEN 7:11
59తరువాత ఎనిమిదవ దినమున భూమి అంతయూ చీకటి వ్యాపించినది, గొప్ప పెద్ద నీటి బొట్లు ఆకాశము నుండి పడుటకు ప్రారంభమాయెను. ఆకాశము నుండి నీళ్ళు కుమ్మరించబడుట ఆరంభమాయెను. ఊటలు పెగలి పైకి వచ్చినది. వీథులు నీళ్ళతో నిండిపోయెను. ప్రజలు తలుపును తట్టుచున్నారు, కాని నోవహు కనీసము వారి మాటను కూడ వినలేకపోయాడు. మరియు ఓడ ఎత్తైయిన పర్వతముల మీదుగా తేలిపోయినది. ఆ ఓడలో లేనివారందరునూ నశించిరి.
అతడు కిటికీ గుండా బయటకు ఎక్కుతాడేమోనని లేక ఇంకేదైనా చేయునేమోనని చూచుటకు దేవుడు నోవహును పరీక్షించుచుండెను. ఆయన ముందే వాగ్దానము చేసిన తరువాత, నోవహు మౌనముగా కూర్చునియుండెను.
అది అంతే! నీవు వాగ్దానమును పొందినప్పుడు, అది వాగ్దానమని నీవు ఎరిగినపుడు, దానితో నిలిచియుండుము. అబ్రాహాము పరీక్షించబడవలసియుండెను. వాగ్దానముతో నిలిచియుండుము!
ఇపుడు, వారు వారి యొక్క చివరి గురుతును పొందిరి. తరువాత వారి శరీరములు మార్పు చెందెను. మరియు వెంటనే చిన్నవాడైన ఇస్సాకు దృశ్యమునకు వచ్చెను. ప్రియమైన చిన్నవాడైన యూదా బాలుడు. నేనునూ దానిని ఊహించగలను. అతనికి ఎనిమిది దినములు వచ్చినపుడు, అతడు సున్నతి చేయబడెను. ఆ తొంభై సంవత్సరాల యవ్వన తల్లి, నూరు సంవత్సరముల అబ్రాహాము, వారు ఇరవై సంవత్సరముల వయస్సులో ఉన్నవారి వలె సంతోషించుచున్నారు. ఈ చిన్న యవ్వనస్తుడు ఎంత ముద్దుగా వుండెనో!
GEN 17:4•
GEN 22:2
60ఇది మీకు తెలుసా! దేవుడు ఇలా అన్నాడు, "రానున్న దినములలోని ప్రజలు (అబ్రాహాము సంతానము) తెలుసుకొనునట్లు, నా వాక్యముతో ఉన్న ఏ మనిషికైనను, నా వాగ్దానము నిలబట్టుకొందునని నీ సంతానము తెలుసుకొనును, నేను అతనికి పరీక్ష ఇవ్వబోవుచున్నాను.''
ఆ చిన్న వానికి పద్నాలుగు సంవత్సరములు వచ్చినప్పుడు. నేను ఇలా ఊహించగలను. చిన్న చింపిరి వెంట్రుకలు మరియు చక్కని చిన్న కన్నులు. ఓ, తల్లి మరియు తండ్రి ఎంత సంతోషంగా ఉన్నారో! తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డతో (ఒకే బిడ్డతో) ఎలా వుంటారో మీకు తెలియును. తరువాత దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పెను…. దానిని అతడు శారాకు చెప్పలేదు, ఏలయనగా శారా బలహీనమైన ఘటము. కాబట్టి ఆయన ఇలా అన్నాడు, "అబ్రాహాము నేను నీకిచ్చిన ఆ చిన్న వానిని తీసుకొని, నేను అనేక జనములకు తండ్రిగా చేయబోవుచున్న ఆ చిన్న వానిని, ఈ రాత్రికి నేను నీకు దర్శనములో చూపబోవు కొండ మీదికి తీసుకుని వెళ్ళి, అక్కడ అతనిని వధించుము." జనములకు తండ్రిగానుండుటకు అతనికున్న ఒకే నిరీక్షణను నాశనము చేయుము, ఏలయనగా దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనును. దేవుడు ఇలా అన్నాడు, "నేను నిన్ను జనములకు తండ్రిగా చేయుదును." అతడు ఈ సంవత్సరములన్నియూ అతనికి వంద సంవత్సరములు వచ్చు వరకు నూట-పదునాలుగు సంవత్సరములు వచ్చు వరకు అతడు కనిపెట్టెను. "మరియు ఇక్కడ చిన్నవాడు ఉన్నాడు, నేను నా మాటను నిలబెట్టుకొందునని నీకు ఉన్న ఒకే రుజువును, నీవు పైకి వెళ్ళి దానిని నాశనము చేయుము. ఈ బిడ్డ ద్వారా నేను ఇంకనూ నిన్ను జనములకు తండ్రిగా చేయుదును."
ROM 4:20,21•
HEB 11:19•
REV 17:1,5
61మరియు అబ్రాహాము, "దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు," అని చెప్పబడెను. మృతులలో నుండి పొందినట్లు అతనిని పొందేనని అతడు ఎరిగియుండెను. దేవుడు ఆ రీతిగా వాగ్దానము చేసినట్లయితే, అతనిని మృతులలో నుండి లేపగలడు.
ఇపుడు మనము అబ్రాహాము సంతానమేనా? మరి ఒక్క వేదాంతము యొక్క తప్పు దారి గందరగోళమునకు దారి తీసి, మిగిలిన స్త్రీ, పురుషుల వలె ప్రసిద్ధిచెందాలనుకొనుచు, వాక్యముతో నిలిచియుండుటకు బదులుగా, నీవు దాని లోనికి వెళతావు. నీకు ఇది సిగ్గుకరము! ఏదో అది ఒక పెద్ద సంస్థ! దాని వలన దేవునికి ఏమున్నది? ఆయన దానిని ఆ రీతిగా తుడిచి వేయును! [బ్రదర్ బ్రెన్హాం చిటిక వేసెను.] ప్రతి ఒక్కటి సంస్థగా మారినప్పటి నుండి ఆయన దానికి దూరముగా ఉన్నాడు. ఎల్లప్పుడు దూరముగా వుండును. అక్కడ ఉన్న వ్యక్తులకు కాదు, కాని సంస్థాగతమైన క్రమమునకే, అది దేవునికి వ్యతిరేకమైనది. సంస్థగా మారిన ప్రతి సంఘము కాథలిక్ సంస్థకు కుమార్తెయైయున్నది. బైబిలు ఆ రీతిగా చెప్పుచున్నది. ప్రకటన 17, పూర్వపు వేశ్య, మరియు ఆమె యొక్క కుమార్తెలైన వేశ్యలు." అక్షరాల అది సత్యము.
GEN 22:2,4
62ఇప్పుడు ఆమెను మన దేశముపై కూర్చుండనిచ్చి యున్నాము. చక్కని ప్రజాస్వామ్యవారలారా, మీ జన్మహక్కును అమ్మి వేసుకొన్నారు. అది మీకు సిగ్గుకరము! మంచిది, నేను మరలా వచ్చు వరకు మనము దానిని విడచెదము. గమనించండి! నాకు ఆలస్యమగుచున్నది. మీ రాజకీయముల కంటే మీ క్రీస్తు మీకు ఎక్కువ కాదా? అప్పుడు అబ్రాహాం లింకన్ చెప్పినట్లు మీరు చేయవలసియున్నది. మంచిది. గమనించండి, మనము ముందుకు వెళదాము.
ఇప్పుడు దేవుడు చెప్పెను, "నీవు ఈ చిన్నవానిని తీసుకుని కొండ పైకి తీసుకుని వెళ్ళుము."
ఇప్పుడు అబ్రాహాము యవ్వనస్తుడా, కాడా? దానిని మీరు తెలుసుకోగోరుచున్నారా? అతడు ఆ చినవానితో, కట్టెలతో, సేవకునితో మరియు గాడిదతో మూడు దినములు ప్రయాణము చేసెను. నేను గేమ్-వార్డెన్ గా వుండినపుడు, పెట్రోలు ఫవర్-లైన్లు చూచుటకు నడచి వెళ్లేవాడిని; మరియు నేను సులభముగా ఒక రోజునకు, 30 మైళ్ళు నడవగలను. ఇప్పుడు మనకు ఇంధన సంబంధమైన కాళ్ళు ఉన్నవి. దానిని మనము అలా పిలుస్తాము. కాని ఆ రోజులలో మనుష్యులు, వారి ప్రయాణమును నడక ద్వారా మాత్రమే, లేక గాడిద మీద సవారి చేసేవారు. మరియు ఇక్కడ వారు మెల్లగా నడిచే చిన్న గాడిదతో అతడు ఉన్నాడు; మనము నడకలో దానిని మించి పోగలము. అతడు మూడు దినములు ప్రయాణము చేసిన తరువాత దూరము నుండి తన తల పైకెత్తి, ఆ కొండను చూచెను. అయిననూ అతడు నాగరికత ప్రపంచమునకు తప్పక 100 మైళ్ళ దూరములో వుండియుండును, ఎడారిలో ఉన్నాడు. ఇప్పుడు గమనించండి మరియు వినుడి.
GEN 22:6-8
63తరువాత అతడు కట్టెలు తీసుకుని ఇస్సాకు వీపు మీద వుంచెను; అనేక సంవత్సరముల తరువాత దేవుని కుమారుని పై సిలువ ఉంచబడెను. బలి అర్పణ కొరకు ఇస్సాకు, కట్టెలను కొండ పైకి తీసికొనిపోయెను. అది ముందస్తు ఛాయగా ఉన్నది!
ఒక ముగింపు వరకు దేవుడు దానిని ముందుగా సూచించుచున్నాడు. లోతు భార్యతో నీవు వెనుకకు తిరిగి లోకములోని విషయముల వైపు చూడవద్దు, అని చెప్పుచున్నాడు. ఈ మాదిరిలు, ఛాయలు అన్ని పరిపూర్ణమైనవి, చూచారా హవ్వను గుర్తుంచుకొనండి. లోతు భార్యను గుర్తుంచుకొనండి. ఓ మనిషీ! లోతును గుర్తుంచుకొనండి. గుర్తుంచుకొనండి, ఆదాము తన భార్య కొరకు విడిచి పెట్టాడు; అదే విధముగా లోతు కూడా చేశాడు. జాగ్రత్త పడండి. ఒక సోదరుడుగా నేను మీకు చెప్పుచున్నాను. నీవు ఆలోచించుట కంటే సమయము మించిపోయినది.
గమనించండి చిన్నవాడైన ఇస్సాకు కొండ పైకి వెళ్ళుచున్నాడు. మరియు అతనికి అనుమానము వచ్చినది. అతడు చుట్టూ చూసి ఇలా అన్నాడు, "నా తండ్రి."
అ౦దుకతడు ఇలా అన్నాడు, "నా కుమారుడా, నేను ఇక్కడే ఉన్నాను."
అతడు "ఇక్కడ కట్టెలు ఉన్నవి. సమస్తమునూ, అన్నియూ ఉన్నవి. కాని దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది?"
ఆ వృద్ధుడైన తండ్రి మాటలు వినండి, తన స్వరములో ఏ మాత్రము వణకు లేకుండా, అతడీలాగు చెప్పెను, "నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును." తన ఒక్కగానొక్క కుమారుడే వధకు వెళ్ళుచున్నాడు, అయిననూ ఆ వృద్ధుని నమ్మకమైన హృదయము, దేవుడు ఆబద్ధమాడడని ఎరిగియుండెను.
అదే ఈ దినమున అబ్రాహాము సంతానము! "సహోదరుడా బ్రెన్హాం, అది ఎలా సాధ్యము?" దేవుడు తన కొరకు తానే సమకూర్చకొనును! "ఆయన ఎలా చేయబోవుచున్నాడు?" నాకు తెలియదు. కాని ఆయన యెహోవా-యీరే!
GEN 22:9,10•
ROM 4:20•
HEB 11:19
64ఆ కొండ శిఖరమునకు వెళ్ళి, బండలను దొర్లించెను. బండల మీద కట్టెలు వుంచెను, మరియు వాటిని అగ్నితో ముట్టించెను అప్పుడతడు, "ఇస్సాకు, నా కుమారుడా, ఇటు తిరుగుము," అని చెప్పి, అతని నడుమునకు చుట్టు యున్న త్రాడును తీసి, అతని చేతులను, కాళ్ళను బంధించెను. క్రీస్తు మరణమునకు విధేయత చూపినట్లుగా, ఇస్సాకు విధేయుడాయెను. కట్టెలు మీద అతనిని వుంచెను. తన ఒర యొద్దకు వంగి తన పెద్ద ఖడ్గమును బయటకు లాగెను; దానిని కొన్నిసార్లు నూరి, ఆకాశము వైపు చూచుచుండెను.
"అతడు అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానమును సందేహించక, మృతులలో నుండి ఒకనిని పొందినవాని వలె, అతడు ఎరిగియుండి బలముగా వుండెను. దేవుడు చెప్పినట్లయితే దానిని ఆయన చేయుటకు, అతనిని మృతులలో నుండి లేపగలడని పూర్తిగా ఒప్పించినాడు. అది అబ్రాహాము, మరియు తరువాత అతని సంతానము. అది సహజ సంతానమైనయెడల, రాజ సంతానము ఎలా వుంటుంది? సందేహించదు! దేవుడు ఏమి చెప్పాడో, దానిని ఆయన చేయును. దానిని ఎరిగి యుండి, దేవుడు. దేనిని వాగ్దానము చేసినదానిని చేయుటకు సమర్థుడని అతడు పూర్తిగా ఒప్పింపబడెను.
GEN 22:11,12
65కత్తికి సాన పెట్టెను; చిన్న ఇస్సాకు యొక్క నల్లని కన్నులు ఆ పెద్ద పదునైన ఖడ్గము రాతి మీద సానపెట్టబడుచుండగా గమనించుచుండెను. వెనుకకు చొచ్చుకొని; తన ముఖము మీద నుండి వెంట్రుకలను వెనుకకు త్రోసి, తన చిన్న గడ్డమును వెనుకకు నిమురుకొనెను. పైకి లేచెను, మరియు తన ముఖము నుండి కన్నీరు కారుచుండెను. అతడు దేవుని వాగ్దానమును సందేహించలేదు అని ఎరిగియుండెను! తన సొంత కుమారుని గొంతునకు ఖడ్గమును ఉంచుటకు తన చేతిని ఎత్తెను.
అతడు అట్లు చేసినపుడు, దేవుని స్వరము అతనిని పిలిచెను. మరియు తన చేతిని పట్టుకుని ఇలా చెప్పెను, "అబ్రాహామా! అబ్రాహామా! నీ చేతిని అలాగే వుంచుము. నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును. అతడు ఏమి చేయుచుండెను? తన తరువాత అబ్రాహాము సంతానమునకు సాక్ష్యమును ఇచ్చుచుండెను. "నీ చేతులు తీయుము, ఈ చిన్నవానికి హాని చేయవద్దు! నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును.''
GEN 22:13
66అదే సమయంలో అబ్రాహాము తన వెనుక ఏదో శబ్దము వినెను. అతడు చూడగా, అక్కడ ఒక పొట్టేలు వుండెను. (అది మగ గొర్రె) పొదలలోని పిచ్చి మొక్కలలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వుండెను. అబ్రాహాము వెళ్ళి తన కుమారునికి మారుగా ఆ పొట్టేలును పట్టుకుని వధించెను.
ఆ పొట్టేలు ఎక్కడ నుండి వచ్చినది? ఆ పొట్టేలు నాగరికత ప్రపంచమునకు వంద మైళ్ళు దూరములో వుండెను. ఎందుకు? అది అక్కడ వుండి యున్నట్లయితే, క్రూర జంతువులు దానిని చంపివేసియుండెడివి. నిశ్చయముగా, అది పెంపుడు జంతువు. అది ఎక్కడ నుండి వచ్చెను. మరియు, అది కొండ శిఖరముగా ఉన్నది. అక్కడ గడ్డి మరియు నీరు ఏదీ లేదు. అబ్రాహాము బలి పీఠమును చేయుటకు చుట్టూ రాళ్ళను ఏరెను, మరి అది ఎక్కడ వుండినది, అది ఎక్కడ నుండి వచ్చెను? అది దర్శనము కాదు; అది రక్తము కారెను. దర్శనము రక్తము కారదు. హల్లెలూయ! యెహోవా-యీరే తన కొరకు బలి అర్చణను సమకూర్చకొనెను!
67వాక్యమును దేవుడు తీసుకొనబడినపుడు, ఆయనకు అవసరము ఉన్న దేనినయినా ఆయన సమకూర్చగలడు. దేవుడు, యెహోవా-యీరే, ఇంకనూ ఈ రాత్రికి ఆయన యెహోవా-యీరేగా ఉన్నాడు! ముందే సిద్ధపర్చబడిన బలి అర్పణ అతనికున్నది. సిద్ధము చేయబడిన సంఘము అతనికున్నది. సిద్ధము చేయబడిన వర్తమానికుడు పరిశుద్ధాత్మ ఆయనకు వుండెను. ఆయన ఇక్కడ ఉన్నాడు, యెహోవా-యీరే! ప్రభువు తన కొరకు బైబిలు, ఆత్మ, సంఘము, వర్తమానము, వర్తమానికుని సమకూర్చకొనెను. మరియు సంఘము ఎత్తబడుటకు గృహమునకు కొనిపోబడు ఘడియ ఇక్కడ ఉన్నది. ఈ బలహీనమైన మన శరీరములను రూపాంతరము చేయుట ద్వారా వారిని మహిమలోనికి తీసుకునిపోవును, ఈ లోకములో నుండి ఆ సంఘమును తీసుకొనుటకు యెహోవా-యీరే సాధనమును సిద్ధపర్చును. యెహోవా-యీరే! మనము జీవించుచున్నటు వంటి అధునాతన దినమున అది ఎలా నెరవేరుతుంది. ఈ సంగతులు ఎలా వుండును?
68నా కుమారుడైన బిల్లీ, అతడు ఎక్కడ ఉన్నప్పటికి, మేము ఈ మధ్యనే భారత దేశములో ఉన్నాము. నేను ఓడ దిగగానే పేపరును తీసుకొన్నాను. రాజ గృహము యొక్క గార్డులతో వేలమంది అక్కడ నిలబడియున్నారు. మేము తాజ్ మహల్ హోటలకు చేరుకోగానే, ఇంగ్లీషులో అక్కడ పేపరు వుంచబడి యున్నది. మరియు దానిలో నేను ఒక పెద్ద భాగమును చూశాను. "భూకంపము అయి పోయినదని, అది తప్పక గురుతైయుండెను," అని చెప్పబడెను. ఏమిటి సంగతి? అవును. మూడు, నాలుగు రోజులకు ముందు ఆ గొప్ప భూకంపమును గూర్చి మీరు చదివారు. బండలలో నివసించిన పక్షులన్ని…
ఇండియాలో — అమెరికాలోని, కాలిఫోర్నియాలో ఉన్నట్లుగా వారికి కంచెలు లేవు. వారు ఏరిన బండల నుండి వారు కంచెలను చేస్తారు. మరియు చిన్న పక్షులు వాటి గూళ్ళను దానిలో కట్టుకొనును. వారు పెద్ద గోపురములను కట్టుదురు. పక్షులు వాటి గూళ్ళు దానిలో కట్టుకొనును, మరియు చిన్న పక్షులన్నీ భూకంపము వచ్చుటకు కొన్ని దినములకు ముందు గోడల నుండి అవి పారిపోయెను. సాయంకాలపు సమయమున లేక… మధ్యాహ్నము బాగా వేడిగా ఉన్నపుడు సూర్యునివేడి నుండి తప్పుకొనుటకు, గొర్రెలు మరియు పశువులు గోడల నీడ క్రింద అవి నిలబడును.
కాని రెండు రోజుల వరకు, పశువులు మరియు గొర్రెలు గోడల యొద్దకు రాలేదు. అవి పొలము మధ్యలో బయట, ఆదరణ కొరకు ఒక దానికి ఎదురుగా మరొకటి ఆనుకొనును. అపుడు భూకంపము వచ్చి, ఆ గోడలను కుదిపివేసెను. మరియు తరువాత చిన్న పక్షులు మరియు పశువులు పొలము నుండి తిరిగి వచ్చుట ప్రారంభమాయెను. ఏమిటి అది? పక్షులను, పశువులను, గొర్రెలను ఓడలోనికి పిలచిన దేవుడే, తన జంతువులను దూరముగా పిలువగల, అదే దేవుడని అది చూపుచున్నాడు.
69మరియు ఆయన సహజ జ్ఞానము ద్వారా ఒక జంతువును నడిపించగలిగినయెడల, దేవుని సంఘమును ఈ పెద్ద మానవ-కల్పితమైన గోడలు మరియు సంఘముల యొక్క సిద్ధాంతముల నుండి దూరముగా ఇంకా ఎంత ఎక్కువగా తప్పక నడపగలడు. ఈ దినములలో ఒక దినమున బబులోను కూలబోవుచున్నది. యెహోవా-యీరే, తానే నీకు విశ్రాంతి స్థలములను సమకూర్చెను. లోకము యొక్క గోపురముల నుండి దూరంగా పారిపోండి!
హాలీవుడ్ యొక్క అందము నుండి పారిపోండి! సంఘములు వారిని వెక్కిరించుటకు ప్రయత్నించుచున్నవి. సువార్త ప్రకాశించదు. హాలీవుడ్ ప్రకాశించును; కాని సువార్త మండును. హాలీవుడ్ అందముతో ప్రకాశించును. పెద్ద సంఘము విద్యతో ప్రకాశించును. మరియు సజీవమైన దేవుని సంఘము దీనత్వముతో, తియ్యదనముతో మరియు పరిశుద్ధాత్మతో మండును. కాబట్టి ప్రకాశించుట మరియు మండుట మధ్యలో చాలా భేదమున్నది.
MATT 3:9•
LUKE 3:8
70ఆయన ఇపుడు ఇక్కడ ఉన్నాడు. యెహోవా-యీరే తన కొరకు సమకూర్చకొనెను. "దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు. దానిని సంఘ శాఖలు అంగీకరించనియెడల, దేవుడు తన పిల్లలను వీధులలో నుండి, సత్రములలోని వేశ్యల నుండి తేగలడు. ఆయన కోరినది ఏదైననూ ఆయన తేగలడు. దేవుడు ఒక వర్తమానమును సమకూర్చనయెడల, ఎవరో ఎక్కడో దానిని స్వీకరించవలసియున్నది. యెహోవా-యీరే! దేవుడు తన కొరకు ఒక వర్తమానమును సమకూర్చకొనును. దేవుడు తన కొరకు ఒక వర్తమానికుని సమకూర్చకొనెను. దేవుడు తన మార్గములోనే తన కొరకు సమకూర్చకొనును, సంఘమునకు సూచక క్రియలు; సంఘములో చేరుట కాదు, పుస్తకములలో నీ పేర్లు వుంచుట కాదు.
ఈ దినమున తీర్మానములను గూర్చి, ఎన్నో తీర్మానములను గూర్చి మనము వింటున్నాము. వాటిని పగులగొట్టి వాటి నుండి దేవుని కుమారులను మరియు కుమార్తెలను చెక్కుటకు రాతి పనివాడు నీకు లేనిదే, నీవు రాళ్ళను కుప్పగా పేర్చటంలో ఏమి లాభము? వేలకొలదిగా సంఘ శాఖలను నిర్మించుటలో అది ఏమి మంచిని చేస్తుంది. దేవుని నిజమైన కుమారులుగా వారిని చెక్కుటకు అక్కడ రెండంచుల ఖడ్గముతో ఎవరూ లేనియెడల, వారు ఎక్కడ ఉన్నారో ఉన్నట్లుగానే విడిచి పెట్టును. ఆమేన్. (మెతడిస్టు కాదు, బాప్టిస్టు కాదు, కాథలిక్ కాదు) దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా చెక్కుటకు దేవుడు తానే తన కొరకు ఖడ్గమును సమకూర్చకొనెను. ఆమేన్. యెహోవా-యీరే, "ప్రభువే తన కొరకు సమకూర్చకొనును. మరియు ఆయన సిద్ధము చేసెను! ఆయనను నమ్మండి మరియు జీవించండి.
71ఒక్క క్షణము తలలు వంచుదము.
కృపగల దేవా, సదా కాలము జీవించుచున్న దేవుడా! ఇపుడు మాకు కృప చూపుము! మీ కృపను మాకు దయ చేయుము. మేము అయోగ్యులము. తండ్రీ, మీరు మా కొరకు ఏదైనా చేస్తారు. మేము యోగ్యులమని చెప్పుకొనుట లేదు, కాని మేము దేవుని యొద్ద నుండి పిలుపును మాత్రమే లక్ష్యపెట్టుచున్నాము. తండ్రీ! దేవుని ఆలయమునకు సరిపోవు రాళ్ళుగా తన ఆలయమును ప్రభువైన యేసు యొక్క గొప్ప రాకడ కొరకు ఈ రాత్రి మమ్మును చెక్కుము. తండ్రి, దయ చేయుము. పాపులమైన మా లోటుపాట్లను క్షమించుము. నీ వాక్యమును మాకు బయలుపర్చుము. నడచుటకు మాకు మార్గమును చూపుము. తండ్రివైనా దేవా! మాకు నేర్పుము. మేము దానిని స్వీకరించుదుము గాక! మరియు అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నట్లయితే, అది తప్పు బోధయని మాకు తెలియును. పరిశుద్ధాత్మ మా బోధకుడైయున్నాడు. ఆయన వాక్యమును వ్రాసెను. మరియు ఆయన వాక్యమును తప్ప మరి దేనిని బోధించడు. మా హృదయములలో ఈ రాత్రి దానిని ఆయన ప్రత్యక్షపరచునని మేము ప్రార్థించుచున్నాము. దేవా, దానిని దయ చేయుము.
JOHN 3:3
72ఇపుడు మా కన్నులు మూసుకుని, మా తలలు వంచియుండగా, నా దీనమైన యధార్థ ప్రార్థన ఏమనగా, దేవుని కృప వీరిపై నిలిచియుండును గాక. ఇప్పుడు కేవలము నమ్మండి. అనుమానించవద్దు.
ఈ కట్టడములో ఎవరైనా ఆయనను ఎరుగని స్త్రీలు, పురుషులు వారు అక్కడ ఉన్నారని నాకు తెలియును. ఆయన యొక్క సమకూర్చబడిన అర్పణను, ప్రభువైన యేసును, మీ స్వరక్షకునిగా ఇంకనూ ఎన్నడూ అంగీకరించనివారు ఉన్నారా? మీరు ఆయనను ఎరుగరు! మీరు తెలివి ద్వారా ఎరిగియున్నామని అనుకొంటారు. అయితే ఒక మనిషి తిరిగి జన్మించనంత వరకు దేవుని చూడలేడు. "చూచుట" అనగా అర్థము… నీ కళ్ళతో గ్రహించలేవు; నీ కళ్ళతో నీవు చూస్తావు. చూచుట (See) అనగా "గ్రహించుట." నీవు తిన్నగా దాని వైపు చూచి, "దానిని నేను చూచుట లేదు," అంటావు. నీవు దానిని గ్రహించలేదని, నీ భావము. మేము దేనిగురించి మాట్లాడుతున్నామో నీవు తిరిగి జన్మించనంత వరకు నీవు ఎన్నడూ ఎరుగలేవు. నీవు ఎన్నడూ ఆ అనుభవమును పొందలేదు. మీ తలలు వంచియుండగా, మీ కన్నులు మూసుకుని యుండగా, మీరు మీ చేతిని ఎత్తి చెప్పండి, "బ్రదర్ బ్రెన్హాం, ఈ రాత్రి మా ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకొనండి. మనము మన చివరి వర్తమానము పొందుతున్నామని నేను నమ్ముదును. దినములు వేగముగా జారిపోవుచున్నవి. మరియు నీవు బైబిలులో ఏమి చెప్పావో, అది నిజమని నేను చూస్తున్నాను, కారణము నేను బైబిలును చదివియున్నాను. ఈ ఘడియలోనే మనము రావాలని నేను నమ్ముదును. మరియు నా మట్టుకైతే నేను క్రీస్తు కొరకు నిలబడుచున్నాను."
JOSH 24:15
73దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించు గాక, దేవుడు నిన్ను దీవించు గాక, నిన్ను, నిన్ను మంచిది. పైన బాల్కనీలో ఉన్న మీరు మీ చేతులు, మీ చేతులను ఎత్తి ఇలా చెప్పండి, "నా మట్టుకైతే, యెహోషువా చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. మంచిది. ఇంకా ఎవరయినా ఉన్నారా? నేను వేచియున్నాను. అక్కడ వెనుక ఉన్న మిమ్మును ప్రభువు దీవించును గాక! నేను మీ చేతిని చూస్తున్నాను. దేవుడు అక్కడ ఉన్న మిమ్మును దీవించును. దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన నిన్ను చూచును. బాల్కనీలో ఉన్నవారు, దేవుడు మిమ్మును దీవించును; మీ జీవితంలో మీరు ఎన్నడూ చేయని గొప్ప కార్యము. మధ్యలో ప్రక్కభాగమున ఉన్నవారు కావచ్చు, ఎవరో వారి చేతులు ఎత్తియున్నారు. అక్కడ ఒక్క చేతిని కూడా నేను చూడలేదు… మధ్య భాగములో, పైన ఎవరైనా మీ చేతిని ఎత్తండి. "బ్రదర్ బ్రెన్హాం, నా కొరకు ప్రార్థించండి," అని చెప్పండి. నేను ఆయనను సేవించగోరుచున్నాను. నేను యధార్థముగా ఉన్నాను." దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. దేవుడు ఆ చిన్న మనిషిని దీవించును. బాల్కనీలో కుడివైపునకు ఎవరైనా చేతిని ఎత్తి, "బ్రదర్ బ్రెన్హాం, నా కొరకు ప్రార్థించమని చెప్పండి. అది నిజమని నాకు తెలుసు. నేను దేవుని ఎరుగను, కాని నేను ఆయనను తెలుసుకోవాలనియున్నది. నేను నిశ్చయముగా ఉండగోరుచున్నాను. నేను మరొక అవకాశము కొరకు చూడలేను, నేను తిరిగి రాలేకపోదును."
ECCL 11:3
74"చెట్టు ఎటు వంగునో, అటే పడిపోవును," అని లేఖనము చెప్పుచున్నది. తప్పు మార్గములో నీవు పడవద్దు. నీవు దానిని ఈ రాత్రి సరిచేయగలవు. గుర్తుంచుకొనండి, ఒక నిత్యత్వము అక్కడ ఉన్నంతవరకు. అది ఎన్నడూ ప్రారంభము కాలేదు, ఎన్నడూ అంతము కాదు, కాని నీవు దానిలో భాగము అగుదువు. నీవు బాధ పడతావు లేక సంతోషముతో జీవిస్తావు. నీవు గృహమునకు వెళ్ళు వరకు నీవు జీవించుదువని నీకు ఎలా తెలియును?
నీవిలా చెప్పవచ్చు, "నేను ఎంతో యవ్వనస్తుడను."
కొన్ని క్షణముల క్రితము నాకు ఒక వర్తమానము వచ్చినది. ఒక యవ్వనస్తురాలు నా రాష్ట్రములోనే ఉన్నది, సిగరెట్లు త్రాగుతూ రోడ్లు తిరిగింది. ఇప్పుడు దానిని గూర్చి ఆమెకు చెప్పబడినది, కాని ఆమె వినలేదు. పదహారు సంవత్సరముల వయస్సు, లేదు, పద్దెనిమిది సంవత్సరములు. హైస్కులు విద్యను అభ్యసించినది. మంచి చేయుమని ఆమెకు చెప్పబడినది. ఈ పిల్లలు చేసినట్లుగా ఆమె చెడ్డవారితో చేరుట ప్రారంభించినది.
75ఈ మధ్యనే ఒక నల్లజాతి వ్యక్తి శ్రీవ్-పోర్టులో నిలబడి ఇలాగు చెప్పాడు, "దేవుడు అనువంటిది ఏదీ లేదు. కేవలము దూషించి చెప్పాడు, "వారు పరిశుద్ధ గుండ్రాళ్ళు తప్ప మరేమి కారు." పిడుగు అతనిని చంపెను. వారు అతనిని సమాధికి తీసుకుని వెళ్ళిరి. వారు ఆ మనిషిని సమాధి చేస్తున్నప్పుడు, చిన్న మేఘము మరియు మెరుపు ఆ పెట్టెను తాకెను. అవి అతని ఆ పెట్టెలో నుండి చెదరగొట్టినది.
యెహోవా దేవునికి కోపము వచ్చును. ఆయన మంచి దేవుడని నాకు తెలియును, కాని ఆయన తీర్పు తీర్చే దేవుడు కూడా. ఆయన ఇంకనూ చూచును. ఆయనకు ఇంకనూ తెలియును.
మీరు దేవుడు లేనివారయితే, మీ చేతిని ఎత్తి చెప్పండి, "బ్రదర్ బ్రెన్హాం, మీరు ప్రార్థించుచుండగా నన్ను జ్ఞాపకము చేసుకొనండి." ఓ స్త్రీ ప్రభువు నిన్ను దీవించును గాక. కుమారుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. అది మంచిది. తిన్నగా ముందుకు రండి. దేవుడు నిన్ను దీవించును గాక. యవ్వనస్తుడా, అది మంచిది. ఆ వెనుక భాగములో ఉన్న మిమ్మును దేవుడు దీవించును గాక. మనము ప్రార్థించుచుండగా, మీరు సర్వశక్తిగల దేవుని అడగండి.
MATT 10:32•
LUKE 12:8•
JOHN 5:24
76మా పరలోకపు తండ్రి, మీరు వారిని చూచియున్నారు. అది మీకు తెలియును. ఇరవై లేక ముప్పై చేతులు ఎత్తబడి యున్నవి. వారి రక్షకుడివిగా నీవు వారికి కావాలి. దేవా, ఇప్పుడే దానిని దయచేయుము. ఈ వాక్యమును నేను వారికి ఇచ్చాను. నీవే స్వయంగా చెప్పావు, "నా మాటలు వినువాడు." ప్రభువా, దానితో నేను చేయగలిగిన ఉత్తమమైన దానిని చేశాను. "నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, మరియు వాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు." దానిని గూర్చి ఆలోచించడం ఎలాంటి అద్భుతమైన సంగతి. ఆ చేతుల వెనుక ఉన్న యదార్థమైన హృదయములు నిజముగా దానిని కోరుకొనినది. ఇపుడే ఏదో జరిగినది. నీవు అన్నావు, "మనుషుల యెదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో, వానిని నా తండ్రి ఎదుటను ఆయన పరిశుద్ధ దూతల ఎదుటను ఒప్పుకొందును." ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నావని గ్రహించుదురు గాక! మీరు దానిని దయచేయమని ప్రార్థించుచున్నాను. మా ప్రార్థన వినండి. ప్రభువా, మేము మీ సేవకులము. యేసు నామములో అడుగుచున్నాము.
77మంచిది, మీ చేతులెత్తండి. ఆయన యెహోవా-యీరే అని మీరు నమ్ముదురా? లోతు దినములలో యున్నట్లు, మనము ఆ దినములలో యున్నామని మీరు నమ్ముచున్నారా? నోవహు దినములు? చివరి వర్తమానము గుర్తున్నదా?
ఎవరైన మొదటిసారి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారా? మీ చేతిని ఎత్తండి. చాలామంది! సోదరుడు బార్డర్స్ కు వివరించాడని నేను ఊహిస్తాను. ఏమి జరిగినదో ఇదివరకు మీరు దాని గురించి విన్నారు. విన్నచొ, మీ చేతులెత్తండి; మీరు దానిని ఎన్నడూ చూడకున్నను దానిని విన్నారు. మంచిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారికి నేను క్రొత్తవాడను.
ACTS 3:4•
HEB 4:15•
HEB 13:8
78మీలో కొందరు బాధలో ఉన్నవారు. దేవునికి ప్రార్థన చేయండి. "దేవా! నా మీద కృప చూపుము. నేను వ్యాధిగ్రస్థుడను అని చెప్పండి! బ్రదర్ బ్రెన్హాం, నన్ను ఎరుగరు. కాని నీవు ప్రధానయాజకుడవై యుండి మా రోగములను భరించువాడవైయున్నావని నాకు తెలియును. మీలో ఎంత మందికి తెలియును? "మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అది మీకు తెలుసా? మంచిది, ఇప్పుడు, ఆయన అదే ప్రధానయాజకుడైన, నీవు ఆయనను ముట్టుకొనినయెడల, ఆయన ఎలా ప్రవర్తించును? ఆయనను రక్తస్రావము గల ఆ స్త్రీ ముట్టినపుడు, ఆయన అదేరీతిగా చేసెను. ఆయన తిరిగి చూచి, రక్తస్రావము ఏమిటో చెప్పెను. మరియు ఆమె విశ్వాసము ఆమెను రక్షించెనని చెప్పెను. అది నిజమేనా? అదే రీతిగా ఆయన అపుడున్నట్లు నీవు ఆయనను నమ్మగలిగినట్లయితే, ఈ రాత్రికి ఆయన అదే దేవుడైయున్నాడు. నీవు ఆయనను ఆ రీతిగా నమ్ముదువా?
ఇపుడు మీరు నా వైపు, ఇటు చూడండి. పేతురు మరియు యోహాను శృంగారమను దేవాలయము నొద్ద చెప్పినట్లుగా, "మా వైపు చూడండి." అది వారి వైపు, దేని కొరకో చూచుట కాదు కాని, "వారు ఏమి చెప్పుచున్నారో చూచుట.
79ఎక్కడ నుండి అయినా మనము ప్రార్ధించుదము. ఈ వైపు చూడండి. మరియు మీ హృదయమంతటితో నమ్మండి. మరియు ఇలా చెప్పండి, "ప్రభువైన యేసు, నేను నమ్ముచున్నాను. నేను నీ వస్త్రమును ముట్టగోరుచున్నాను. మీరు బ్రదర్ బ్రెన్హాం గారితో మాట్లాడండి. నా బాధ ఏమిటో ఆయనను ఎరుగనివ్వండి. మీరు దానిని చేసినయెడల, నేను నిన్ను నమ్ముదును." మీరు దానిని చేస్తారా?
ఇప్పుడు అది ఇక్కడే ఉన్నది. అలాంటి కార్యమును చేయుటకు నేను తెగించగలనా? అలాంటి సవాలును చేయుట నాకు ఏదో తప్పుగా వుంటుంది. నేను దానిని అయిదు లక్షల ప్రజల ముందు ఒకసారి సవాలు చేశాను, వారి భాషను ఏ మాత్రమును మాటలాడలేను. కాని ఆయన నన్ను ఎన్నడూ ఓడి పోనీయలేదు. ఎందుకు? ఆయన దానిని వాగ్దానము చేసెను! ఇవి అంత్యదినములు, మరియు ఆయన దీనిని వాగ్దానము చేసెను, ఆ వాగ్దానము ఇక్కడ ఉన్నది.
80స్నేహితులారా, నాకు తెలియును, మిమ్ములను నొప్పించుటకు మీరు ఎన్నో కలిగియున్నారు. ఎంతో శరీర సంబంధమైన అనుకరణను మీరు కలిగియున్నారు. కాని ఒక విషయము మీకు చెప్పనివ్వండి, నా ప్రయోజనము కొరకు కాదు గాని, మీ స్వంత ప్రయోజనము కొరకు, వారు ఎల్లపుడు అలాగే యుండిరి. కాని దేవుడు ఎన్నడూ భూమి మీద ఒక్కసారిగా ఇద్దరిని ఉంచలేదు. ఎన్నడూ అలా చేయలేదు. కావున కేవలము గుర్తుంచుకొనండి, ఎన్నో అనుకరణలు ఉన్నవి. నిజమైన దేవుడు ఉన్నాడు. నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నది, మరియు నిజమైన దేవుని వర్తమానమున్నది, అది యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు, మరియు మృతులలో నుండి లేచాడు. ఆయన శరీరధారిగా ఉన్నపుడు చేసినట్లుగా, అవే కార్యములను సంఘములో చేయుటకు పరిశుద్ధాత్మ అనే వ్యక్తిగా తిరిగి వచ్చియున్నాడు.
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 4:18,25•
HEB 4:12
81ఇప్పుడు, దేవుని వాక్యము దీనిని చెప్పుట లేదా? హెబ్రీ 4లో అది చెప్పబడెను, బైబిలు దానిని చెప్పుచున్నది, "దేవుని వాక్యము వాడిగలదై రెండు అంచుల ఖడ్గము కంటెను శక్తిగలదై విభజించుచూ కోసి వేయును. [వచ్చుటను మరియు వెళ్ళుటనూ రెంటిని అది కోసివేయును.] ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచూ హృదయం యొక్క తలపులను ఆలోచనలను శోధించుచున్నది." అది నిజమేనా?
"ఆ కారణము చేతనే యేసు ప్రజల ముందు నిలబడి, వారి గురించి చెప్పెను. పరిసయ్యులు, "అతడు బెయెల్జిబూబు," అన్నారు. యేసు చుట్టూ తిరిగి చూచెను. వారు దానిని బయటకు బిగ్గరగా చెప్పలేదు, కాని ఆయన వారితో ఇలా చెప్పెను; రక్తస్రావము గల స్త్రీ గురించి ఆయన చెప్పినట్లుగా. ఆమెకున్న భర్తలను గురించి ఆయన చెప్పెను; మరియు దానిని ఆమె చేయుచున్నప్పుడు… ఆయన ఎరిగెను, "ఎందుచేత, అదియే మెస్సీయ యొక్క గురుతు!
మెస్సీయ తన ప్రజల మధ్యకు వచ్చుట, ఆ స్థితి తిరిగి రావటం ఇప్పుడు మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ సంఘమును సిద్ధము చేయుచున్నది.
82మీరు మీ తలను అటు వైపుకు త్రిప్పవలెనని నేను కోరుచున్నాను. ఆక్కడికి దాటుచున్న ఆ చిన్న స్త్రీని చూడండి. తన వీపును పైకి లేపుచున్నది. అక్కడే కూర్చునియున్నది. ఆమెపై ఉన్న ఆ వెలుగును చూడండి? ఆమె అధిక రక్తపోటుతో బాధపడుచున్నది. అది నిజము. ఆమె నీలము రంగు బట్టలను వేసుకుని యున్నది. ఒక విధమైన కళ్ళ జోడును తన ముఖమునకు పెట్టుకొని యున్నది. గత ఒకటి లేక రెండు సెకన్లుగా ఆమె చుట్టూ ఒక నిజమైన వింతైన వేడి అనుభూతిని ఆమె పొందుచున్నది. అది నిజము. ఇపుడు ఎంతగానో నిన్ను బాధించుచున్న, నీ అధిక రక్తపోటు నిన్ను విడిచినది. నీవు దానిని అంగీకరించుదువా? మీరు అంగీకరించినట్లయితే, మీ చేతులను ఎత్తండి.
ఆమె దేనిని తాకినది, ఆ ప్రధానయాజకుని తాకినది. ఇప్పుడు వెళ్ళి, ఆ స్త్రీని అడగండి. నా జీవితంలో ఆమెను ఎన్నడూ చూడలేదు. ఆ స్త్రీని గూర్చి ఒక విషయము కూడా నాకు తెలియదు; అయితే, అది నిజము. జన సమూహము మీద అది కదులుచుండగా, నేను ఆ వెలుగును గమనించుచున్నాను. తిన్నగా అవతలకు వెళ్ళి, తిరిగి వచ్చెను. ఒక మండుచున్న వెలుగు.
83మీరు నమ్ముతున్నారా? కీళ్ళ నొప్పి, మూత్రాశయము, బాధ, చిక్కులు, నరముల బలహీనత, బలహీనత. అది నిజము. నీవు ఇక్కడ వ్యక్తివి కావు. వెస్ట్-పాయింట్ అను చిన్న స్థలమునకు చెందియున్నావు. నీవు ఎవరవో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? శ్రీమతి. హార్డ్ విక్, అది నిజము. అది నిజమైతే లేచి నిలబడుము. అది నిన్ను విడిచిపోయెను. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచెను.
మీరు నమ్ముతున్నారా? ప్రజలు నీ కొరకు వెనుకకు చూచుచున్నారు. కాని ఆ స్త్రీ ఇక్కడే ఉన్నది. చూడండి, ఆ వెలుగు ఇంకనూ ఆమె పై నిలిచియున్నది. మీరు దానిని చూడలేరా? అది ఇక్కడే ఉన్నది. గమనించండి.
అక్కడే కూర్చునియుండి, నా వైపు చూస్తున్న ఆ మనిషితో, అది అక్కడే ఉన్నది. కీళ్ళ నొప్పి, నీ హృదయముంతటితో నమ్ముము. దేవుడు నిన్ను స్వస్థపరుచును. ఏమండి, మనము ఒకరినొకరము క్రొత్తవారము, కాని దేవునికి అలా కాదు.
84ఇక్కడే ఆ వెనుక నున్న స్త్రీ, తల నొప్పితో బాధపడుచున్నది. దేవా, ఆమె దానిని తప్పిపోవుటకు అనుమతించవద్దు. ఓ దేవా, దయచేసి శ్రీమతి. మోర్టన్, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము. ఆయన నిన్ను ఆ తలనొప్పి నుండి స్వస్థపర్చెను. చూడండి, ఆయన ఆమెను దాటిపోనియ్యలేదు. మిమ్మల్ని నేను కొంత అడుగగోరుదును. నిన్న రాత్రి ఈ బిల్డింగులో ఉన్న ఎవరితోనో వారి యొక్క తలనొప్పిని గూర్చి మాట్లాడినపుడు, నీకు ఒక వింతైన అనుభూతి వుండెను. మరియు అది నీవా, లేక నీవు కాదని నీవు ఆశ్చర్యపోయావు. అది నిజమేనా? నీ చేతిని ఎత్తుము. నేను నీ మనస్సును చదువుట లేదు, కాని నీవు ఏమి ఆలోచన చేయుచున్నావో దానిని నీకు చెప్పుచున్నాను. దానిని అంగీకరించుము. ఈ రోజు అది నీవైయున్నావని నీవు నిశ్చయము చేసుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాను. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. హల్లెలూయా!
85నానా వర్ణములు గల బట్టలు వేసికొన్న ఇక్కడ ఉన్న స్త్రీని చూడండి. ఓ స్త్రీ, నీకు ప్రార్థనా కార్డు ఉన్నదా? మీకు లేదు. చీలిక నిన్ను విడిచినదనియు నీవు స్వస్థత నొందగలవని నమ్ముచున్నావా? నీవు నమ్ముగలవా! నీలో ఉన్న బాధ అదే అయితే, నీ చేతిని ఎత్తుము. మంచిది. నీ హృదయమంతటితో నమ్ముచు స్వస్థత నొందుము. నీ అవసరమేదో చూడుము?
ఆమె వెనుకనే ఉన్న స్త్రీ, తన చేతిని ఎత్తినది, అక్కడ ఉన్న రెండవ వ్యక్తి, కొంచెము పచ్చ రంగు బట్టలు ధరించియున్నది. గుండె జబ్బుతో బాధపడుచున్నది. అవును. దేవుడు నిన్ను బాగు చేయునని నమ్ముచున్నావా! అది మంచిది. సిద్ధపడుటలో శ్రద్ధగల దానవు. దానిని కేవలము నీవు నమ్మినట్లయితే, ఆయన నిన్ను బాగుచేయును.
మీ నుండి పైగా ఉన్న, రెండవ స్త్రీ శ్రీమతి. డిల్మన్ అక్కడున్నది. మీ కడుపు బాధను దేవుడు స్వస్థపరగలడు. నీవు నమ్మినట్లయితే శ్రీమతి. డిల్మన్, నమ్ముము. నీ కడుపు బాధ పోవును. అది నరములకు సంబంధించిన కడుపు బాధ. అది ఎప్పటి నుండో నీకు ఉన్నది. నీ ఋతుస్రావము నుండి అది నీయందున్నది. ఇంకా బాధ ఎక్కువగుటకు నీవు ఎన్నో చేశావు. ఇపుడు అదంతా అయి పోయినది. ఆ విషయములు సత్యమైనయెడల, ప్రజలకు మీ చేతిని చూపండి. అపుడు ప్రజలు మిమ్ములను చూస్తారు. నేను మీకు క్రొత్తవాడనయితే, మీ చేతిని చూపుతూ వుండండి. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చును.
86మీరు నమ్ముచున్నారా? ఏమిటది? యెహోవా-యీరే, దేవుడు తానే అర్పణను సమకూర్చకొనును! ఇప్పుడు ప్రజలందరూ ఒక విధమైన అస్పష్టముగా నాకు అగుపించుచున్నారు. యెహోవా-యీరే ప్రతి ఒక్కరికి అర్పణను సమకూర్చెను. దానిని మీరు నమ్ముచున్నారా?
ఇక్కడ చేతిని ఎత్తినవారు, ఇక్కడకు వచ్చి ఒక నిమిషము నిలబడండి. మీరు దానిని చేస్తారా? యెహోవా-యీరే ఆర్పణను సమకూర్చెను. మీరు దానిని నమ్మారని మీ చేతిని ఎత్తారు. మీరు ఇక్కడ చూసియున్నారు. మరియు దానిని ఎరుగుదురు. అసాధ్యము… అది ఏదోయై యున్నది! ఈ ప్రజలను చూడండి, ఎంతమంది పిలువబడ్డారో, ఇప్పుడు నాకు తెలియదు. 7, 8, 10 కావచ్చు, అది ఏన్నైనప్పటికీ పిలువబడియున్నారు. అది ఆ రీతిగానే వెళుతూనే వుంటుంది. కాని నాకు శక్తి వుండగానే మీరు వచ్చి క్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించండి. మనము పాడుచుండగా, ఇప్పుడు మీరు లేచి వస్తారా? "ప్రభువా, నేను వచ్చుచున్నాను. ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను? మీరు లేచి ఇక్కడకు పైకి వస్తారా? కొన్ని క్షణముల క్రితము చేతులెత్తిన మీరు? ఈ వేదిక చుట్టూ నిలబడండి. మరియు మీరు క్రీస్తును గూర్చి సిగ్గుపడువారు కాదని చూపండి. మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు వచ్చి నిజముగా దానిని ఉద్దేశించుచున్నారని, దేవుని చేత మీరు జ్ఞాపకము చేసుకోబడాలని, మరియు మీరు ఆయనను మీ స్వరక్షకునిగా అంగీకరించారని, ప్రజలకు రుజువు చేయండి. మనము నిలబడి పాడుచుండగా, పైకి రండి.
ప్రభువా! నేను వచ్చుచున్నాను!
ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను!
నన్ను కడుగుము, నీ రక్తములో శుద్ధి చేయుము.
కలువరి నుండి కారిన రక్తములో!
ఇప్పుడు బయటకు రండి, ఇక్కడే క్రిందకు రండి. మేము ప్రార్థించబోవుచున్నాము. నీకు అవసరత ఉన్నప్పుడు తప్ప ఎన్నడూ ఆయనకు నీవు సమీపంగా వుండలేవు.
ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు!
నన్ను కడుగుము, శుద్ధి చేయుము!
MATT 10:32•
MARK 8:38•
LUKE 9:26•
LUKE 12:8
87బాల్కనీ నుండి తిన్నగా దిగి రండి. అవును. తిన్నగా క్రిందకు రండి, ఇక్కడే నిలబడండి. ఆయన అన్నాడు, "మనుష్యుల ముందు నన్ను ఒప్పుకొనువాడెవడో, నా తండ్రి ఎదుట అతనిని నేను ఒప్పుకొందును. కాని మీరు నన్ను గూర్చి సిగ్గుపడినచో, నేను మిమ్ములను గూర్చి సిగ్గుపడుదును." ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిలును జ్ఞాపకముచేసుకొనండి. యవ్వనస్తులు, వృద్ధులు రండి. మీరు వస్తారా? సంఘ సభ్యుడవో, కాదో, ఇప్పుడు రమ్ము. మీరు వస్తారా? మీరు ఆయన సన్నిధిలో యుండగా క్రీస్తును అంగీకరించండి.
ప్రభువా, నేను వచ్చుచున్నాను!
ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను!
నన్ను కడుగుము, నీ రక్తములో శుద్ధి చేయుము!
కలువరి నుండి కారిన రక్తములో!
మరలా దానిని పాడుదము. [బ్రదర్ బ్రెన్హాం, ఆలపించుటకు ప్రారంభించుచున్నారు. "ప్రభువా, నేను వచ్చుచున్నాను"- సంపా!]
88వినండి. ఆయన ప్రవక్తగా నన్ను మీరు నమ్ముతున్నారా? దానిని ఇదివరకు నేను ఒప్పుకొనలేదు. కాని అది చెప్పుట ద్వారా, ప్రజలు గ్రహించి నేను ఏమి ఇచ్చుటకు ప్రయత్నించుచున్నానో తెలుసుకొందురని నేను నమ్ముచున్నాను. క్రైస్తవులమని చెప్పుకునే ప్రజలు ఇక్కడ వీరిలో ఉన్నారు. తప్పక ఇక్కడే యున్నారు. రండి, మీరు రారా? మిమ్ములను అడగనివ్వండి. మీరు ఎన్నడైనా ఎలా పొందుతారు? మరొక గురుతును మీరు ఎన్నడూ పొందలేరు. ఇదే ఆ గురుతు! "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది సత్యము కానియెడల దేవుని ప్రవక్త ఆలాంటి దానిని చేస్తాడా? మీరు మీ యొక్క గొప్ప గురుతును పొందుచున్నారు. మీ యొక్క ఆఖరి గురుతు, క్రీస్తు వచ్చుటకు ముందు. రండి! ఈ విషయములు చెప్పుటలో కారణం వుంది. ఏ ఇతర కూటములోనూ ఎన్నడూ నేను దీనిని చెప్పలేదు. అది ఏదో జరుగుటకు, ఇక్కడే అవకాశము ఉన్నదని నేను భావించుదును. అందుచేతనే నేను ఉన్నట్లుగా చెప్పుచున్నాను. మీరు దానిని గ్రహించుదురు, అని నేను నమ్ముదును. " మీరు వెళ్లి, ఏదో ఒక విధమైన మతపరమైనది చేసి, "బ్రదర్ బ్రెన్హాం దేవుడు," అని చెప్పవద్దు, లేక అలాంటిది ఏదో చేయవద్దు. నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నాచో మీరు గ్రహించండి. ఇప్పుడు రండి, రండి, క్రీస్తు నామములో నేను మిమ్ములను ఒప్పించనివ్వండి. రండి!
89నీవు ఎక్కడ నిలబడి యున్నావో తెలియదు, నీకు దాని గూర్చి నిశ్చయత లేదు, కేవలము స్వబుద్ధి వల్లనైనది, లేక ఏదో ఒక ఉద్రేకముతో కూడినది. నీవు కేకలు వేశావు, నీవు ఏడ్చావు, నీవు ఏదో ఒక విధమైన అనుభూతిని కలిగియున్నావు. దాని మీద లోనికి వెళ్ళుటకు ప్రయత్నించవద్దు. గుర్తుంచుకోండి, ప్రభువు నామములో నేను మీకు చెప్పుచున్నాను, నీవు నశించనివాడివే, దిక్కుమాలినట్లుగా నశించావు, అది నీకు తెలియదు. స్నేహితులారా, అవకాశమును తీసుకోవద్దు. నేను కేవలము విత్తనము చల్లుచున్నాను. వలను లాగుచున్నాను. అభివృద్ధిని దేవుడు తీసుకొనును. నాకు తెలియదు.
తలలు వంచుదాము, చూడండి ఆయనకు ఏమీ లేకపోతే… [ఒక సహోదరి అన్యభాషలలో మాట్లాడుచున్నది. ఆ తరువాత అనువాదమును ఇచ్చుచున్నారు - సంపా.] మీరు దానిని విన్నారా.
నీ యొద్దకు ఇప్పుడు వచ్చుచున్నాను!
(మీ హృదయములని పరీక్షించుకొనుడి.)
నన్ను కడుగు, శుద్ధి చేయుము…
90సంఘ సభ్యుడా. ఎక్కడో సంఘములో చేరియున్న అనుభవముతో మాత్రమే నీవు కేవలము అక్కడ నిలబడియుంటే, నేను ఇక్కడకు వచ్చుటకు నా దారిని ఎంత త్వరగా నేను చేయగలనో, అంత త్వరగా చేసుకొందును.
గుర్తుంచుకోండి, మనము అంతములో ఉన్నామని ఆత్మ సాక్ష్యమును ఇచ్చుచున్నాడు. "అర్థరాత్రికి ఇంకా మూడు నిమిషములున్నదని," సైన్సు చెప్పుచున్నది. వర్తమానము మరియు బైబిలు చెపుతుంది. "అది ఇక్కడ ఉన్నది, ఆఖరి సంగతి!" ఉజ్జీవము ముగియుచున్నది, ద్వారము మూయబడుచున్నది. నీవు బయట వుండి తట్టుతావు, లోనికి రాలేవు. రమ్ము!
యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక.
నేను [స్పష్టత లేని మాటలు] దానిని చేయుము.
ప్రభువా, నేను వచ్చుచున్నాను!
ఇప్పుడు వచ్చుచున్నాను…
ప్రభువు నిన్ను దీవించును. అది నిజమండి. అదే విధానము, బాల్కనీ నుండి తిన్నగా దిగి రండి. వరుసలుగా రండి.
2PET 3:9
91ఇక్కడ వాక్యమున్నది, ఇక్కడ రుజువున్నది. అక్కడ ఆత్మ ఉన్నది, అక్కడ సాక్ష్యమున్నది. మనము అంతములో ఉన్నామని దానిని చూపుటకు ఇక్కడకు ప్రజలు వచ్చారు.
ప్రభువా, నేను వచ్చుచున్నాను!
ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను!
నన్ను కడుగుము, నీ రక్తములో శుద్ధి చేయుము!
కలవరి నుండి కారిన రక్తములో.
ప్రభువా, నేను వచ్చుచున్నాను!
వేచియున్నాము, దీర్ఘ శ్రమలు, ఎవ్వరు నశించవలెనని లేదు, కాని అందరు మారుమనస్సునకు వచ్చెదరు గాక. రండి, ఇక్కడ నిలబడుము.
ఒకవేళ నీ హృదయములో అనుమానము వుండ వచ్చును నీవు రూఢిగా వుండవలసియున్నది, స్నేహితులారా, పరిపూర్ణమైన విశ్వాసము.
… కలువరి నుండి
… ప్రభువా!
ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను.
రండి. యాబై నుండి డెబ్బై-అయిదు మంది చుట్టూ నిలచియున్నారు. ఇప్పుడు రండి. రావలసియున్న మిగిలిన వారు కొంచెము ఎక్కువ సమయము నిలుపుచున్నాము. ఏలయనగా రేపు అది దైవిక స్వస్థత మీద ఉండబోవుచున్నది. కొద్దిసేపటి క్రితము పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్పెను, "ఆ వరుసను పిలువ వద్దు, వేదిక యొద్దకు పిలువుము." ఆయన చెప్పినట్లుగా చేయుటకు నేను ఆయనకు లోబడుదును. ఆయనకు లోబడవలసియున్నది.
నీ యొద్దకు వచ్చుచున్నాను!
నన్ను కడుగుము, నీ డ్రముతో శుద్ధి చేయుము!
కలువరి నుండి కారిన రక్తములో.
92మనము కనిపెట్టుచుండగా, మన తలలు వంచుదము. ఓ, దేవా, పరిశుద్ధాత్మ వీరి పై కదులును గాక! వేదిక ముందుకు పైకి వచ్చుటకు ఇష్టపడగోరువారు, దీవెన కొరకు నడిపింపబడుగోరు ప్రజలకు ప్రభువైన దేవుని నామమున అది దయచేయుము. దేవుని ఆత్మ, కదులుచున్నది.
లోనికి జరగండి, లోనికి జరగండి. ప్రతి ఒక్కరూ దగ్గరగా రండి. "పాపములో పీడించబడు ప్రతీ ఆత్మ, ప్రభువు దగ్గర కనికరమున్నది." ఇప్పుడు రండి. "శుద్ధి చేయు ప్రవాహము క్రిందికి రండి, వారి దోషపు మరకలను పోగొట్టుకొందురు. ఇమ్మానుయేలు యొక్క రక్త నాళము నుండి తీయబడిన, రక్తముతో ఒక ఊట నిండియున్నది." భక్తిగా రండి.
93ఇపుడు కూటము మీద ఆ శాంతిని అనుభవించండి? ఏమిటది? అది మరణము, పాపులకు మరణము. ఇప్పుడు వ్యక్తిగతముగా పని చేయువారు వారి చుట్టూ కదలండి. అది మరణము, ఈ ప్రజలు చనిపోవుచున్నారు. బైబిల్ లేవు, వారు వివరించుచున్నారు. మరణము వేదిక చుట్టూ తిరుగుచున్నది. మరియు మరణము తరువాత నూతన జీవము వచ్చును.
రక్తముతో నింపబడి ఊట ఒకటున్నది,
అది తీయబడినది …
(ఓ, నీ గుండె కొట్టుకొనుట ఆగిపోయినపుడు,
దానిని ఎలాగు వినగలవు!)
పాపులందరూ ప్రవాహము క్రింద మునుగుదురు!
వారి దోషపు మరకలన్నీ పోగొట్టుకొందురు!
వారి దోషపు మరకలన్నీ పోగొట్టుకొందురు!
(అదియే ఇది, యవ్వనస్తుడా.
ప్రభువు నీ హృదయమును దీవించును.
అది మంచిది. దాని కొరకే ఆయన వేచియున్నాడు)
పాపులందరు ప్రవాహము క్రింద మునుగుదురు!
వారి దోషపు మరకలన్నీ పోగొట్టుకొందురు!
94మనము తరువాత వచనము పాడుచుండగా, ఉపదేశించబడిన క్రైస్తవులందరూ పైకి వచ్చెదరు. గాక! "చనిపోవుచున్న దొంగ ఆ ఊటను తన దినమున చూచుటకు సంతోషించెను; అక్కడ నేనునూ, అతని వంటి క్రూరుడనైననూ, నా పాపములన్నీ కడిగి వేయును. ఉపదేశించబడిన ప్రజలు పైకి దగ్గరగా కదలిరండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందని వారు దగ్గరగా కదలి రండి. ఒక్క నిమిషములో దేవుడు ఏమి చేయునో నీకు తెలియదు. మనము తరువాత వచనము పాడుచుండగా, పైకి కదలిరండి.
చనిపోవుచున్న దొంగ సంతోషించెను…
(వాక్యము ప్రత్యక్షపర్చబడెను)
ఆయన దినమున వున్న ఊట.
(ఓ, అది మంచిది, తిన్నగా బయటకు రండి.
నీరు కలవరంగా ఉండగా రండి)
నేను అతని వంటి క్రూరుడనైననూ…
నా పాపములన్నీ కడిగి వేయును!
నా పాపములన్నీ కడిగి వేయును!
నా పాపములన్నీ కడిగి వేయును!
ఇప్పుడు, సేవకులారా, అది అంతే. తిన్నగా లోనికి రండి. అందరూ, ఇప్పుడు, నీటిని కలవర పెట్టుట కొరకు, పైకి తిన్నగా రండి.
… ఎటువంటి క్రూరుడైననూ,
నా పాపమునంతా కడిగి వేయును.
JOHN 14:12
95ప్రార్థన చేయగోరువారు దగ్గరగా కదలి, సిద్ధముగా వుండండి. దేవుడు దీనిని గుర్తించబోవుచున్నాడని మేము నమ్మబోవుచున్నాము. ఆయన తప్పక హృదయము యొక్క ఆలోచనలను వివేచింపగల అదే దేవుడని గుర్తుంచుకోండి. పట్టణములో ఒక్కసారే దానిని చేసెను. కాని ఆయన అన్నాడు, "వీటికంటే ఎక్కువ మీరు చేయుదురు." చూడండి, తన లేఖనము సరిగా రుజువు చేసెను. లోనికి కదలిరండి. ఇక్కడున్న ఈ ప్రజల కొరకు మనమంతా ప్రార్థన చేయుదుము. ఎలా ప్రార్థించాలో, అది ఎరిగిన ప్రతి ఒక్కరు ఈ కట్టడములో ఎంత మంది తిరిగి-జన్మించిన క్రైస్తవులున్నారు? మీ చేతులెత్తండి. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరము ఈ ప్రజల కొరకు వందనములు చెల్లించుదుము.
96మా పరలోకపు తండ్రీ, ఈ ప్రజల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. వారు నీ వారు, వారు వచ్చి, ఒప్పుకొనుచున్నారు. వారు పాపమునకు, స్వార్థమునకు చనిపోవుటకు వచ్చియున్నారు. క్రీస్తులో నూతన వ్యక్తులుగా వారు తిరిగి వెళ్ళుచున్నారు.
సాతానా, నీవు యుద్ధములో ఓడిపోయావు! దేవుడు యెహోవా-యీరే! ప్రభువు జునుల కొరకు అర్పణను సమకూర్చెను, వేదిక పిలుపును ఇచ్చెను, వర్తమానమును ఇచ్చెను, కృపను ఇచ్చెను. యేసుక్రీస్తు నామములో సాతాను యుద్ధములో ఓడిపోయినది, వాడు యుద్ధములో ఓడిపోయెను!