నా సేవ యొక్క ప్రస్తుత దశ

నా సేవ యొక్క ప్రస్తుత దశ

VGR COUNT-148 1… ఉజ్జీవము చాలా అలసిపోయి సొమ్మసిల్లినట్లుగా అయినది. మార్గములో మాకు చాలా మంచి సహవాసము దొరికినది. అద్భుతమగు కూటములు; ఆయా స్థలముల నుండి అనగా, తూర్పు తీరపు ఎగువ దిగువల నుండి, అలాగే పశ్చిమ తీరము నుండి కెనడా వరకు గల క్రైస్తవుల నుండి అభినందనలు వెలువడుచున్నవి. వేర్వేరు శాఖా సంఘముల నుండి అనగా అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, యునైటెడ్ పెంతెకోస్తు, చర్చి-ఆఫ్-గాడ్, ఫోర్-స్క్వేర్ ఇంకా చాలా ఇతర సంస్థల నుండి చక్కని సహకారము లభించుట వలన గొప్ప కూటములు జరిగినవి. అదొక గొప్ప విజయము. ఈనాడు విజయము అని చెప్పుకొనుదానికి అది ఏ మాత్రమూ తీసిపోదు. బహుశా చాలా మంది దానిని "గొప్పది" అని పిలుచుదురు. కాని నేను నా మట్టుకు ఒక ఉజ్జీవకర్తను. ఉజ్జీవము పరిసమాప్తమగుచున్నదని జాతీయ దృష్టితో చెప్పుచున్నాను. హృదయములు అగ్నితో మండే ఉజ్జీవమును నేను చూడగోరుచున్నాను. సభ్యులు పోగవుట కాదు. మన ప్రభువు రోగులను స్వస్టపరచు అద్భుతములను ఎన్నో చేసెను, చాలామంది రక్షించబడిరి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను. కొంత సమయము విశ్రాంతి తీసికొందును. ప్రభుని చిత్తమైతే కొద్దివారములలో మరల సేవలోనికి వెళ్ళెదను.

2ప్రపంచమంతటనూ చెదరియున్న నా యొక్క స్నేహితులకు మరియు విస్తారమగు జనులకు ఇది చెప్పుచున్నాను. ఇక్కడున్న ఈ ఆలయములో ఈ రాత్రి నేను చెప్పగోరుచున్నాను. ఇక్కడకు వచ్చిన మీరెవరయినా గాని ఈ రాత్రి ఆలయము వేడిగా నుండుటను చూడగలరు. ఎటు చూచినా జనులు క్రిక్కిరిసియున్నారు. తలుపుల యొద్ద నిలబడియున్నారు, బయట కార్లలో నిలబడియున్నారు, చాలా వేడిగా యున్నది. జనులకు, నాకు కూడా చాలా కష్టముగా యున్నది.

ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్య ప్రకారము మనము ఎట్టి దశలో జీవించు చున్నామో వివరించగోరుచూ ఈ స్థలమునకు నేను వచ్చియున్నాను. దానిని ఆలయమునుండియే రికార్డు చేయగోరుచున్నాను. గత వసంతకాలములో అది నా హృదయములోనికి వచ్చినది, కాని ఇక్కడకు నేను వచ్చువరకూ దానిని చెప్పకుండాయున్నాను, ఎందుకనగా ఇక్కడయితే దానిని రికార్డు చేయగలవు, దానిని ప్రపంచములోని ప్రజలకు పంపవచ్చును.

3ఇది ముప్పై-రెండు సంవత్సరముల క్రితం జరిగినది, నేను ఇప్పుడు నిలబడియున్న స్థలమునకు నూట-ఏబది గజముల దూరములో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, జెఫర్సన్-విల్ లోని నెంబరు ఎనిమిదిన మరియు పెన్ వీధిలో, ఉదయ కాలమందు నేను ఈ ఆలయమునకు పునాది రాయిని వేసినప్పుడు, అప్పుడు ఇది ఒక చిత్తడి నేల. దీని ఎడమవైపున నేను నివసించాను. అది నాకు పెండ్లికాక మునుపటి సంగతి. నేను నా తల్లిదండ్రులతో జీవించుచుంటిని. మూలరాయిని వేయునైయున్న ఆ రోజు ఉదయము, సుమారు ఆరు గంటలకు, ప్రభువగు యేసు నన్ను మేల్కొలిపెను. నేను పడకమీద కొంతసేపు పరుండియున్నాను. నా హృదయము ఆనందముతో నిండియున్నది, నేను బోధించుటకు ప్రభువగు దేవుడు అనుగ్రహించబోవుచున్న ఈ ఆలయము గూర్చి ఆలోచించుచున్నాను. అప్పుడు నేను ఒక యువకుడిని మాత్రమే. మేము మూలరాయిని వేయనైయున్న ఆ దినమున ఆ మరుసటి సంవత్సరము నేను పెండ్లి చేసుకొనబోవుచున్న బాలికయు అచ్చట నుండెను.

4నేను మేల్కొని గదిలో యుండిన ఆ ఉదయము నాకు జ్ఞాపకమున్నది. ఏడవ వీధిలో యున్న పై మెట్లు ఎక్కాను. "లేచి నిలబడుము" అని ఎవరో చెప్పిరి. నేను లేచి నిలబడ్డాను. నేను చూచాను, అది ఒక గొప్ప స్థలము, మరియు అది ఒక పెద్ద లోయలోనికి నది ప్రవహించుచున్న స్థలమువలె అది ఉన్నది, నేను ఆ నది యొద్దకు దిగి వెళ్ళాను, మరియు అది బాప్తిస్మమిచ్చు యోహాను జనులకు బాప్తిస్మమిచ్చుచున్న స్థలము. దానిని వారు పందుల శాలగా మర్చిరి. దానిని గూర్చి నేను చాలా విమర్శించాను, అలాగు చేయరాదని చెప్పాను.

నేను అక్కడే ఉండగా, ఒక స్వరము నాతో మాట్లాడి నన్ను పైకి తీసికొని వెళ్ళినది. ఆలయము ఇప్పుడు ఏ విధముగా యున్నదో అదే విధముగా యుండుటను నేను చూచాను. ఇప్పుడు ఆలయము ప్రజలతో నిండిపోయి ఇది ఈ రాష్ట్రములో ఇప్పుడు ఏలాగున్నదో అలాగే యుండుటను అప్పుడు చూచాను. నేను ఆనందముతో నిండిపోయి వేదిక వెనుక నుండి ఈలాగు చెప్పాను, "దేవా, నీవెంత మంచివాడవు! నాకు ఒక ఆలయమును (tabernacle) ఇచ్చావు."

మరియు ఆ సమయములో, ప్రభువు యొక్క దూత నాతో మాట్లాడి, మరియు ఈలాగు పలికినది, "కాని ఇది నీ ఆలయము కాదు."

5మరియు నేను అన్నాను, "అయితే ప్రభువా, మరి నా ఆలయము ఎక్కడ?"

ఆయన మరల నన్ను ఆత్మలో పైకి కొనిపోయి, ఒక తోటలో యుంచెను. అక్కడ చెట్టు సమాన వరుసలో యున్నవి, అవి దాదాపు ఇరవై లేక ముప్పయి అడుగుల పొడవున్నవి. అవి పండ్ల చెట్లువలె కనిపించెను. మరియు అక్కడ చాలా పెద్ద పచ్చని బక్కెట్లు గలవు.

అటు పిదప నా కుడిచేతి వైపు మరియు ఎడమచేతి వైపులకు పరిశీలించి చూడగా, రెండు వైపులా ఖాళీ బక్కెట్లున్నవి. "వీటి మాట ఏమిటి?" అని నేను అన్నాను.

"నీవు వాటిలో నాటవలసియున్నావు" అని ఆయన చెప్పెను. అప్పుడు నేను నా కుడివైపు నున్న చెట్టు కొమ్మను తెంపి కుడి వైపునున్న బక్కెట్లో ఉంచాను, ఎడమవైపునున్న చెట్టుకొమ్మను తెంపి ఎడమవైపునున్న బక్కెట్లో యుంచాను. అవి వెంటనే ఆకాశమునంటునంత పైకి ఎదిగిపోయినవి.

"నీ చేతితో ఆ ఫలములను సమకూర్చుము" అని ఆయన చెప్పెను. ఒక చేతిలో ఒక పెద్ద పసుపు యాపిల్ పడినది, పండిపోయి చక్కని రంగులో యున్నది. మరో చేతిలో ఒక పెద్ద పసుపు ఫ్లమ్ ఫలము పడినది, అది పండి పరిపక్వమాయెను. "అవి చక్కగానున్నవి గనుక తినుము," అని చెప్పెను. నేను వాటిని ఒకదాని వెంబడి ఒకటి తినసాగాను. అవి చాలా మధురముగా యున్నవి. ఆ దర్శనమును మీరెరుగుదురు, "జీవిత గాధ" లేక "ఆఫ్రికాను దర్శించిన ప్రవక్త" అను పుస్తకములో ఒకదానియందు దాని గురించి వ్రాయబడియున్నది.

6అప్పుడు, నా చేతులెత్తి దేవుని యొక్క మహిమను కొనియాడాను. అకస్మాత్తుగా అగ్నిస్తంభము ఈ చెట్ల మీదికి దిగి వచ్చినది, మెరుపులు, ఉరుములు వినబడినవి. గాలి చాలా బలముగా వీచెను. చెట్లు నుండి ఆకులు రాలసాగినవి. నేను క్రిందికి చూచాను. ఈ ఆలయము యొక్క స్వరూపము నిలబడియుండినది, ఇప్పుడున్నట్లుగానే అది యున్నది. వేదికయుండు చివరి భాగము, మూడు చెట్లు ఉండు స్థలము చూచాను, ఆ మూడు చెట్లు మూడు సిలువలవలె ఆకారము పొందినవి. మధ్య సిలువలో ప్లమ్ మరియు యాపిల్ పండ్ల గుత్తులు గుత్తులుగా యుండుట నేను చూచాను. నేను బహు త్వరితముగా పరుగిడి వెళ్ళి, నా స్వరమంతటితో అరచుచూ, సిలువ యొద్ద లేదా సిలువ ముందు నా చేతులు జోడించాను, సాష్టాంగముగా పడితిని. గాలి వీచుచు వాటిని కదల్చుటకు ప్రారంభించగా సిలువ మీద నుండి ఆ ఫలములన్నియు జారి, నా పైన పడినవి. నేను అమితానందముతో సంతోషించుచున్నాను. "చక్కగానున్నవి గనుక ఆ ఫలములను తినుము" అని చెప్పెను.

MATT 9:37•

LUKE 10:2

 

7అప్పుడు ఈ అగ్ని వలయము ఈలాగు చెప్పెను, "కోత విస్తారముగా యున్నది గాని పనివారు కొద్దిమందే." మరియు ఆయన చెప్పెను, "ఇప్పుడు, నీవు మరల యధాస్థితిలోనికి వచ్చినప్పుడు II తిమోతి 4 చదువుము." అప్పుడు నేను యధాస్థితిలోనికి వచ్చియున్నాను. నేను నిలబడి నా ముఖమును మరియు చేతులను రుద్దుకొన్నాను. అదే సమయములో, గది మూలన సూర్యుడు ఎంతగానో ఉన్నతముగా ప్రకాశించుచున్నాడు. నేను ఒక గంట లేదా అంతకన్న ఎక్కువసేపు ఆ దర్శనము క్రిందయున్నానని అర్ధమయినది, "II తిమోతి 4" అని నాకు చెప్పబడెను. నేను వెంటనే నా బైబిలు తీసికొనివచ్చి II తిమోతి 4 చదివాను.

2TIM 4:1-5

 

8ఇప్పుడు, దానిని ఇప్పుడు నేను చదువగోరుచున్నాను. II తిమోతి 4 చదువుచుండగా, అక్కడ నాకు ఎంతో వింతగా అనిపించినది. ఆ వాక్యము మీద ఈ ఆలయములో ఎన్నోసార్లు నేను బోధించాను. నేను ప్రతిసారి దానిని, ఆగి, చదువుట నాకు వింతగానే తోచినది. ఇప్పుడు II తిమోతి 4 మొదటి అయిదు వచనములు చదువుదము. అయిదు అనునది "కృప" యొక్క సంఖ్య. దీనిని చదువుదును:

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున దేమనగా,

వాక్యమును ప్రకటించుము; సమయమందును, అసమయమందును ప్రయాసపడుచు; సంపూర్ణమైన దీర్ణశాంతముతో, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.

ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక, కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును.

అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.

2TIM 4:2-5

 

9మీరెపుడయినాగాని గమనించారో లేదో, నేను మాత్రము ఈ గత 'మే' నెల వరకు దానిని గమనించలేదు. అక్కడ చదివినట్లుగా ఆ లేఖనమును నేనెప్పుడూ చదువలేదు? దానిగూర్చి నేను సంపూర్ణముగా చదివినది అప్పుడే, ఎందుకనగా అది తగినదిగా అది కనబడుచున్నది, ఎందుకనగా వాక్యమును బోధించి, శ్రమలు సహించి, దీర్ఘశాంతముతో యుండమని నాకు చెప్పబడెను, ఎందుకనగా జనులు హితబోధను సహించని కాలము ఒకటి వచ్చును, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన భోధకులను పోగుచేసికొందురు, దురద చెవులు గలవారైయుందురు. సత్యమునకు చెవినియ్యక కల్పనాకథల వైపునకు తిరుగుదురు. కాని ఇప్పుడు, నేను సువార్తికుడను అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. "సువార్తికుని పనిచేయుము," అని ఆయన చెప్పెను. పౌలు తిమోతీకి చెప్పుచున్నాడు, చూచారా. అదెట్లు చెప్పబడినదో మీరు గమనించారా? "నీవు సువార్తికునిగా ఇంతకు ముందే పిలువబడియున్నావని" ఆయన చెప్పలేదు. "సువార్తికుని పని చేయుము," అని చెప్పెను, చూచారా. ఇప్పుడు, అక్కడ దానిని మనము గమనించగలము. ఇప్పుడు, నా పూర్ణహృదయముతో నేను దానిని చెప్పగలను మరియు నాకు తెలిసినంతవరకూ అది అక్షరాలా నెరవేరినది, పూర్తిగా ఖచ్చితముగా యున్నది. అది ముప్పది సంవత్సరముల క్రితం మాట.

10నాకు తెలిసినంతవరకు ఆయన నాకు ఇచ్చిన ప్రతి దర్శనమును నెరవేరినది. నా సేవలో మార్చుకు సంబంధించిన ఈ దర్శనము ఒక్కటే వాటికి మినహాయింపు. ఒక గుడారము క్రింద లేదా ఒక పెద్ద ఆడిటోరియం లేదా అటువంటి దాని క్రింద ఒక చిన్న గది వంటి దానిలో నేను జనులకు ప్రార్ధించుట ఎట్లుండునో చూశాను. అది నాకు ఒక గుడారమువలె కనిపించినది. రెండు మూడు సంవత్సరముల క్రితం జరిగినది మీకు గుర్తున్నదా? అందులో ఎక్కువ భాగము నెరవేరినది. నేను మెక్సికోకు వెళ్ళనై యున్నాను. ఆ రాత్రి వర్షము ఎట్లు కురియునో, అక్కడ ఏమి జరుగునో చూపించెను. ఆయన నా మొదటి ఈడ్పు యొక్క పరిచర్యను గూర్చి చెప్పెను. చిన్న చేపను పట్టబోయి ఎట్లు విఫలమయ్యానో మీకు గుర్తున్నదా? రెండవది చిన్న చేప, కాని నాకు ఆయన ఈలాగు చెప్పెను, "మూడవ ఈడ్పులో తప్పిపోవద్దు, చూచారా. మరియు జనులకు చెప్పవద్దు." నేను ఏమి చేయ ప్రయత్నించుచున్నానో దానిని ఎప్పుడూ ప్రజలకు వివరించ ప్రయత్నము చేయుచున్నాను. అయితే ఆయన నేను చేయబోవు దానిని జనులకు చెప్పవద్దని చెప్పెను. ఆయన నన్ను ఏది చేయమని చెప్పునో దానిని చేయుచూ ఊరకుండుటయే, చూచారా.

11అయితే నా దగ్గర రహస్యము లేమియు లేవు, కావున నాకు తెలిసినదంతయూ నేను చెప్పుచుందును, నేను ఆ రకము వ్యక్తిని. కావున, అది నా జాతిలో ఉంది అని నేను అనుకుంటున్నాను. కాని నేను ప్రయత్నము చేస్తాను.. జనులను నేను ప్రేమించుచున్నాను, మరియు ప్రజలు రక్షించబడవలెనని నేను కోరుచూ, నాకు తెలిసినదంతయూ వారికి చెప్పుదును, ఆయన నాకు చెప్పవద్దని అన్నప్పుడు మాత్రమే చెప్పను. వారు ఏదీ తప్పిపోరాదని నా అభిమతము, చూచారా. దానిని వారు పొరపాటు లేకుండా అత్యంత సమీపముగా దానిని వారు చూడవలెనని నేను కోరుదును.

2TIM 4:1,2

 

12ఇప్పుడు, అది అక్షరాలా నిజము. ఇప్పుడు గుర్తుంచుకొనండి, అప్పగించబడిన పనిని గూర్చి ఒక క్షణము చూద్దాం. "దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా," చూచారా. "…దేవుని యెదుటను, క్రీస్తు యెదుటను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును బోధించుము." మరియు, కాబట్టి నాకు సహాయము చేయుటవలన, ఈ రాత్రివరకు, నా మట్టుకు నాకు తెలిసినంతవరకు, వాక్యమును తప్ప మరేదియు నేను ప్రసంగించలేదు, చూడండి, దానితోనే నేను నిలచియున్నాను. అది ఎంతో కష్టముగా నుండెను, మరియు నేను ఎన్నో హింసలు, ఎన్నో శ్రముల ద్వారా వచ్చాను. ఎందరో ప్రశస్తమగు స్నేహితుల నుండి నేను దూరము కావలసివచ్చెను, ఎందుకనగా ఆ విశేషమైన వివరమును బట్టి, "వాక్యమును ప్రకటించుము."

13ఆ దర్శనము గుర్తుండియుండవచ్చును, లేదా, దానిని నేను చిన్న తర్జుమా అందును. ఈ మధ్యనే నేను కొనిపోబడి మరియు అక్కడ ఆ జనులను చూచాను. మరియు నా వైపునకు నేను తిరిగి చూచుకున్నాను మరియు అక్కడ మిలియనుల మంది యున్నారు. "నేను యేసును చూడగోరుచున్నాను" అన్నాను.

"ఆయన మహోన్నతుడు," అని ఆయన చెప్పెను.

సరే, చూడండి, ప్రజలు చనిపోయినప్పుడు, వారు వెంటనే దేవుని యొద్దకు వెళ్ళరు. ఇప్పుడు, మీరు దానిని తప్పక అర్థము చేసికొందురని నేను నమ్ముదును. బహుశా దానిని నాకు తెలిసిన శ్రేష్టమైన రీతిలో నేను దానిని వివరించవలెనని కోరుచున్నాను. మీరు తొందరలో యున్నారా? మనము కొద్దిగా సమయము తీసికొని, పిదప మరియు దానిని వీలయినంత తేటగా వివరించుటకు నేను ప్రయత్నించెదను.

14ఇప్పుడు, మనమిక్కడ వచ్చునప్పుడు మూడు పరిమాణములలో, మనమిక్కడ జీవించుచున్నామని మనము గుర్తుంచుకొనవలయును. వాటికి నేను పేరు చెప్పగలనో లేదో నాకు తెలియుట లేదు. అందులో ఒకటి వెలుగు, మరియొకటి పదార్థము. టామీ, ఆ మూడవది ఏమిటో నీకు గుర్తున్నదా, హు? అణువు? కాలము. అవును. ఇప్పుడు వెలుగు, పదార్ధము, మరియు కాలము. మన అయిదు జ్ఞానేంద్రియములు ఆ పరిమాణములను స్పందించును. మన దృష్టి వెలుగును తాకును, మన స్పర్శ పదార్ధములను తాకును, మరియు ఆలాగున.

15కాని ఇప్పుడు మనకు సైన్సు ద్వారా ఒక సంబంధము ఏర్పడుచున్నది, అదియే నాలుగవ పరిమాణము. ఎందుకనగా ఈ ఆలయము ద్వారా రూపములు, రేడియో స్వరములు, టెలివిజను చిత్రములు వచ్చుచున్నవి. కాని దానిని మన జ్ఞానేంద్రియములు గ్రహించుట లేదు. కాని ఈధరు తరంగములను పట్టుకొని ప్రసారము (ప్రత్యక్షము) చేయు ఒక నాళిక లేక స్ఫటికము యున్నది. కాబట్టి, మీరు చూడండి, ఇప్పుడు - ఇక్కడ ఈ భవనములో జనుల యొక్క నటనలు మరియు స్వరములు గాలిలో కలిసియున్నవి, అవి ఇక్కడే యున్నవి, దానిని మనము ఎరుగుదుము. అవి అక్షరాలా సత్యములే. నీవు చేయవలసిన ఒకే ఒక్క కార్యమేమనగా, వాటిని నీవు పట్టుకున్నచో చాలును…. సైన్సు కనిపెట్టిన ఆ యాంత్రిక సంగతులు నాకు అర్ధము కావు, కాని నాలుగవ పరిమాణమున్నదని అది మనకు రుజువు చేయుచున్నది.

ఇప్పుడు, అయిదవ పరిమాణము పాపియుండు స్థలము, అవిశ్వాసి మరణించి మరియు అచ్చటకి వెళ్ళును. అయిదవ పరిమాణము. అదొక విధమైన, సరే, భయంకరమైన పరిమాణము. ఇప్పుడు, ఈ మనిషి…

ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు, అతడు ఆరవ పరిమాణములోనికి వెళ్ళును.

దేవుడు ఏడవ పరిమాణములో యున్నాడు.

తర్వాత ఇప్పుడు, మీరు చూడండి, క్రైస్తవుడు చనిపోయినప్పుడు, అతడు

దేవుని యొక్క బలిపీఠము క్రిందకు వెళ్ళును. తిన్నగా బలిపీఠము క్రింద దేవుని సన్నిదిలోకి వెళ్ళును. అతడు అక్కడ విశ్రాంతిలో యుండును.

16దానిని మరియు విపులముగా చూద్దాం. ఒక వ్యక్తికి పీడకల వచ్చిన సమయములో అతడు పూర్తిగా నిద్రలోనూ యుండడు పూర్తిగా మేల్కొనియూ ఉండడు. అతడు నిద్ర, మేల్కొలుపుల మధ్యలో యుండును. అందు మూలముగానే అతడు భయంకరముగా వణుకుచూ కేకలు వేయును, ఎందుకనగా అతడు పూర్తిగా నిద్రలో లేడు, మేల్కొనియు లేడు. మార్పు పొందకుండా చనిపోయిన వ్యక్తి ఎచ్చటికి వెళ్ళునో అది చూపించుచున్నది. అతడు తన కాలమును పూర్తి చేసికొని అతడు భూమి మీద చనిపోయిన ఎడల, దేవుని యొక్క సన్నిధిలోనికి అతడు వెళ్ళజాలడు, ఎందుకనగా రక్తము లేకుండా అక్కడికి వెళ్ళుటకు అతడు తగడు. అతడు పట్టుబడెను. అతడు తిరిగి భూమి మీదకు రాలేడు, ఎందుకనగా ఈ భూమి మీద అతని కాలము చెల్లిపోయినది. అతడు మధ్యస్థముగా చిక్కుకొనియున్నాడు, అతడు ఒక పీడకలలో యున్నాడు, చూచారా. విశ్రాంతి కొరకు అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేడు, అతడు భూమి మీదకు తిరిగి రాలేడు, ఎందుకనగా అతని కాలము అయిపోయినది. అతడు ఒక పీడకలలో యున్నాడు, మరియు తీర్పు దినము వరకు అతడు అక్కడనే నిలచియుండును. అది జీవించుటకు ఒక భయంకరముగానున్న పరిస్థితి, చూచారా.

మరిప్పుడు ఈ దర్శనములో, నేను ఆరవ పరిమాణములోనికి కొనిపోబడితిని నేను నమ్ముచున్నాను, అక్కడి నుండి ఇక్కడికి నేను తిరిగి చూడగలిగాను. చూడండి, ఆ చూపు ఈ భూసంబంధ నేత్రములతో చూచినట్లుగా అసలు లేదు. కాని అది… ఆ దృష్టి దానికంటే అది ఒక గొప్పదై యున్నది. మన స్వాభావిక జ్ఞానేంద్రియములు కలిగియుండు సంపర్కము కన్న అక్కడున్న వారు కలిగియున్న ఆ దృష్టి ఎంతో మిన్నయైనది.

HEB 11:1

 

17ఇక్కడే కొంతకాలము క్రితము దానిని నేను వివరించుచుంటిని. ఒక టెలివిజనులో నేను బొమ్మ చూచుచుంటిని. అందులో ఒక మనిషిని సముద్రములో ఒకటి, రెండు మైళ్ళ లోతుకు పడవేసిరని నేను నమ్ముచున్నాను. ఆ లోతుకు వారు కిరణములను పంపుదురు. వారు సాగర జీవితము గూర్చి చూపించుచుండిరి. భయంకరముగా కనబడుచున్న జీవరాశులు, చేపలు అక్కడివి వచ్చినవి. అది అర్ధరాత్రి, అక్కడ బహు చీకటిగా యున్నది. వాటి ముక్కుల మీద ఫాస్పరసు యున్నది, వాటికి కండ్లు లేవు. ఇప్పుడు అవి ఆహారమును తినవలెను, కాబట్టి అవి తమ ఆహారమును వెదకుట కొరకు మరొక జ్ఞానేంద్రియము ద్వారా నడిపించబడినట్లుగా కనబడినది, దృష్టితో కాదు, ఎందుకనగా వాటికి కండ్లు లేవు. కండ్లను అక్కడ అవి ఉపయోగించుకోజాలవు. కాని అవి తను తిండిని సంపాదించుకొనుటకు మరొక జ్ఞానేంద్రియము కలిగియున్నవి, "నా దృష్టితో నేను ఆ చిన్న చేపల మీద అదుపు కలిగియున్నచో బాగుండును అని నేననుకొన్నాను, వాటికి ఎంతో ఆహారము సమకూర్చి ఎన్నో స్థలములకు నడిపించుదును కదా అనుకున్నాను, అవి సంబంధము కలిగియున్న ఆ రాడారు కంటె నా నేత్రములు ఎంత గొప్పవి. "నేను నడిపించకలిగినచో ఎంత బాగుండును!" అని నేననుకొన్నాను.

అప్పుడు నాకు ఈ తలంపు వచ్చినది, "నన్ను నేను దేవునికి అప్పగించుకొనినచో, నాకు దేవుని యొక్క దృష్టి మరియు జ్ఞానేంద్రియములు సంక్రమించి మరెంత గొప్పగా నడిపించబడుదునో గదా! మనము చూచుచున్న ఈ సంగతులకంటె మిన్నయైన వాటిని చూడగలము, ఆలాగు ఆయన నడిపించగలడు, ఎందుకనగా ఆయన మనకు ఇచ్చు విశ్వాసము మనము కండ్లతో చూడలేని వాటికి నిదర్శనమై యున్నది." ఆ చిన్న చేప తక్కిన ఇతర చేపలవలె ఎన్నడునూ బయటకు, అనగా, నీటి పైకి రాలేదు, ఎందుకనగా అది ఒత్తిడితో అణచబడియున్నది. దానిని నీవు పైకి తెచ్చినయెడల అది విలవిలలాడును. మనము ఎక్కువ పైకి పోయినయెడల ఎట్లు విలవిలలాడుదుమో అంతే. మనము జీవించు ఈ చోటునకు మనము నిర్దేశించబడియున్నాము.

18కాని, ఇప్పుడు ఆ చిన్న చేప ఇక్కడకు వచ్చి నావలె అయినచో అది మరల ఎన్నడయినా ఆ కటిక చీకటివలె నున్న అగాధములోనికి వెళ్ళి జీవించగోరునా? మర్నెడునూ చేపగా ఉండగోరదు, ఎందుకనగా అది చేప కంటె ఇప్పుడు గొప్పది అయినది, అది ఒక మనిషి, అతని యొక్క జ్ఞానేంద్రియములు ఇదివరకటి కన్న గొప్పవి, అతని యొక్క అవగాహన గొప్పది, అతని యొక్క తెలివి అమోఘమైనది. దానిని పది మిలియనులతో గుణించండి, దీనిలో నుండి ఆవలనున్న దేవుని యొక్క సన్నిధిలోనికి మీరు దాటిపోయినప్పుడు ఆలాగుందురు, ఇక్కడ మనమున్న స్థితి కంటె ఎంతో మెరుగయిన స్థితిలో ఆ మానవుడుండును. ఇక్కడున్న మానవునివలె మరెన్నడును నీవు ఉండవలెనని కోరవు. ఇక్కడి ఈ నివాసము వ్యాధి మరియు కలుషితముల గృహమువలె నున్నది. దానిని నా హృదయములో దాచుకొనియున్నాను, ఈ ముప్పది సంవత్సరముల నుండి ప్రపంచమంతట నా ఆ సువార్తను ప్రకటించ ప్రయత్నించాను, సంపాదించుకోవలసిన ఒక పరలోకము, తప్పించుకోవలసిన ఒక నరకము ఉన్నదని ప్రజలకు చెప్పగోరాను, మిమ్మును ప్రేమించు దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పాను, నీవు పొందుటకు సిద్దపడిన ఏ క్షణములోనయినా గాని నిన్ను లేవనెత్తుటకు సిద్దముగా యున్న ఒక విమోచన శక్తి కాచుకొని చూస్తున్నది అని చెప్పాను.

19మునిగిపోవుచున్న వ్యక్తి అక్కడ వ్రేలాడుచున్న త్రాడును గూర్చి అతడు ఈలాగనుకొన్నట్లుండును, "అదిగో త్రాడు! నన్ను నేను రక్షించుకొందును, కాని ఆ త్రాడును అందుకొను యోగ్యత నాకు లేదు." ఆ త్రాడు ఆ ఉద్దేశ్యము కొరకే అక్కడ పెట్టబడినది, నిన్నునీవు అక్కడి నుండి రక్షించుకొనుట కొరకే అది ఉన్నది. ఆ కారణము కొరకే యేసుక్రీస్తు చనిపోయెను, పాపులను రక్షించవలెనను హేతువు కొరకే, ఆయన నిత్యజీవము అను త్రాడు వేసెను, ఈ రాత్రియందే ఇక్కడ ప్రతి పాపియొక్క శిరస్సు మీద నుండి అది వెళ్ళుచున్నది. దానిని పట్టుకొనుడను ఒక సుస్వాగతపు చిహ్నము కనబడుచున్నది, "దానిలో నుండి బయటకు రండి." దానిని మీరు చేయుటకు ఇష్టపడినయెడల, సిద్దపాటు జరిగియున్నది.

20ఇప్పుడు, అతడు ఆ స్థలమును, అక్కడున్న ఆ ప్రజల యొక్క పరిస్థితిని నేను చూచాను. ఈ ప్రపంచము ఎన్నడూ దానిని ఆలోచించి అవగాహన చేసికోజాలదు, అది మహిమాన్వితముగా యున్నది. అక్కడ పాపము ఉండజాలదు, ఆ చోటులోనికి మరణము గాని మరేది గాని ప్రవేశించజాలదు. స్త్రీ, పురుషుల మధ్య ఎట్టి తేడా అక్కడ లేదు. వారి నుండి లైంగిక గ్రంధులు వెడలిపోయెను, అక్కడ మరెన్నడూ వ్యభిచారము గాని, అట్టిది మరేదియూ ఉండదు. కాని రూపము మాత్రము ఇంకా స్త్రీ రూపములోనే ఆమె ఉన్నది, పురుషుడు కూడా ఇంకా తన రూపమును కోల్పోలేదు, వారు సదాకాలము ఆ విధముగానే యుందురు. ఎందుకనగా దేవుడు…

21ఇప్పుడు, పరిణామక్రమము గూర్చి చదువుకొనుచున్న ఉన్నత పాఠశాల విద్యారులకు ఇక్కడ, మీకు ఇది చాలా మ౦చిదే. ఇప్పుడు నాకు పరిణామ క్రమములో నమ్మకమున్నది, కాని మానవుడు మరేదో నీచజాతి నుండి పరిణామము చెందెనన్నది మాత్రము నేను నమ్మను. అయితే వారు దేనినయినా సంకరము చేయ ప్రయత్నించినప్పుడు వారి స్వంత సిద్దాంతమే వారికి ఎదురు తిరుగుచున్నది, అది తిరిగి తనంతట తాను సంతానోత్పత్తి నెరపజాలదు, కాబట్టి చూడండి. వారి సిద్దాంతము వారినే తిరిగి తప్పు పట్టినది.

22ఇప్పుడు, దేవుడు భూమిని నీటితో ముంచ నారంభించినప్పుడు బహుశా ఆయన ఒక జెల్లీ చేపను మొదటగా సృష్టించియుండునని నేను నమ్ముచున్నాను, దాని ద్వారా ఒక కప్ప ఇంకా తదితరములన్నివియూ వచ్చినవి. కాని, మీరు చూడండి, అవి మానవ స్వరూపమునకు సన్నిహితముగా, చేరువుగా కొనసాగుచూ వచ్చుచున్నవి. మానవుడయితే దేవుని యొక్క ప్రతిబింబము. ఆ కారణము చేతనే గడ్డి పరిణామము పొంది పూవులుగా మారుచున్నది. పూలలో నుండి పొదలు, పొదలలో నుండి చెట్లు వచ్చినవి. ఎందువలన? అది అవతలివైపున నిలబడియున్న జీవవృక్షము యొక్క సాదృశ్యము, ఈ ప్రక్కనే యున్న స్వాభావికమగు ప్రతిదియు ఆవల వైపునున్న సహజాతీతమగు దానికి లేదా నిత్యమైన దానికి ఛాయయైయున్నది. కాబట్టి భూమి మీద తిరిగి జన్మించిన క్రైస్తవుడున్నంత కాలము, మనకు ఈ విధమగు శరీరముండును, అది ఆవలవైపు ఎదురుచూచుచున్నవాని యొక్క ప్రతిరూపమే, అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు. మన హృదయములను ఆకలిగొనునట్లు చేయునది అదియే. మనలో ఏదో యుండి అట్టి దానికొరకు మనలను పిలచుచున్నది. అది అక్కడున్నదని మనలో ఏదోయుండి చెప్పుచున్నది. ఈ సంవత్సరములందంతటను నేను దానిని నమ్ముచున్నాను… నేను బుద్ధిలేనివానిగా యుండి ఇక్కడ ఇన్ని సంవత్సరములపాటు చేసిన తప్పులకు దేవుని యెదుటను, ప్రజల ఎదుటను క్షమాపణ చెప్పుకొనుచున్నాను. కాని జరిగిన ఈ చాలా సంవత్సరములలో ఎన్నో మిలియనుల మంది జనులు దేవుని యొక్క రాజ్యములోనికి వచ్చుటను చూచు భాగ్యము నాకు దొరికినది, వారిని అక్కడకు నడిపించు భాగ్యము దేవుడు దయచేసినందుకు వందనములు చెల్లించుచున్నాను. ఆ దినమున వారు అచ్చటుందురని నేను నమ్ముచున్నాను.

23ఇప్పుడు ఆ దర్శనము నెరవేరినది. ఆ 5వ వచనను నేను ఎన్నడూ తెలియకుండానే ఆగి చూచుట జరిగినది. నేను ఎప్పుడూ అది చదువుదును. ఆ అధ్యాయములో ఇంకా చాలా వచనములున్నవి. మీరు ఇప్పుడు, కూటము అయిన వెంటనే మీ హోటలు గదిలో లేదా ఇంటిలో ఆ తక్కిన వాక్యభాగమంతయూ చదవండి, ఎందుకనగా నేను ఎత్తిచూపవలెనని ఎన్నో వాక్యములు ఇక్కడ నేను వాటిని వ్రాసికొన్నాను, చెప్పవలసిన నోట్సు చాలాయున్నది. మీరు ఇంటికి వెళ్ళి అది చదువవలెనని నేను కోరుచున్నాను. దానిని నేను ప్రస్తావించెదను. మీరు టేపు మీద అది వినగలరు. మీరు వాటిని కొన్నింటిని గుర్తించుకోవాలనుకుంటే వ్రాసుకోండి, ఎందుకు, ఆలాగు చేయుట మంచిది.

LUKE 4:14-20

 

24ఇప్పుడు, నేను మీరు ఎరిగిన స్త్రీ, పురుషులు దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యములన్నియూ చేయుచున్నారని నమ్ముచున్నారా? చూచారా? యేసే మనకు మాదిరి. మీరు దీనిని గమనించినయెడల, నేను త్రిప్పాలనుకుంటున్నాను, మీరు కూడా నాతో ఒక్క నిమిషము పరిశుద్ద లూకా 4వ అధ్యాయమునకు త్రిప్పవలెనని కోరుచున్నాను. ఒక సంచలనము కలుగచేయు దానిని మీకు నేను చూపించగోరుచున్నాను. ఈ వచనములను మరీ ఎక్కువ నేను మీకు చెప్పగోరుట లేదు. గమనించినయెడల, కొద్ది కణముల పాటు ఈ ఒక్క దానిని మీరు నాతో చదువగలరని ఆశించుచున్నాను. పరిశుద్ద లూకా 4వ అధ్యాయము 14వ వచనము నుండి ఆరంభించుదము. ఇది ఎట్లు సమానాంతరముగా యున్నదో మీరు బహు జాగ్రత్తగా గమనించండి. ఒక సంగతి జరుగుటను మీరు చూడగోరినచో ఆలాగు గమనించండి. ఇప్పుడు గమనించండి.

అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను: … ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది వారి సమాజమందిరములో బోధించుచు వచ్చెను.

తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకచొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి, చదువుటకై నిలుచుండగా,

ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను, ఆయన గ్రంథము విప్పగా -

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగినవారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను.

ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చొండెను.

ISA 61:2

 

25ఇప్పుడు, మీకు ఆ వాక్యభాగము ఎక్కడున్నదో కావలసినయెడల నా యొద్ద అది ఇచ్చట ఉన్నది, ఒక్క క్షణము ఆగండి. ఇక్కడున్న దానిలోనుండి చూచి చెప్పెదను. మీరు గమనించిన యెడల, మార్కు, ఇంకా ఇతర భాగములందు కూడా దానిని మీరు కనుగొనగలరు. కాని యెషయా 61:1 మరియు 2. ఆయన అక్కడ ఆగుట వింతగా లేదా? దాని తరువాత వచనమును గమనించండి. అది ఆయన మొదటి రాకడకు, మరియు రెండవది, తరువాత వచనము ఆయన యొక్క రెండవ రాకడకు, తీర్పునకు వర్తించును. ఆయన ఆగి గ్రంథమును మూసెను. మీరు ఎవరయినా స్కాఫీల్డు బైబిలు చదివినయెడల, ఆ క్రింద వ్రాయబడినది గమనించియుందురు, చూచారా. మార్కు 2, వేసి ఆ అడుగున వ్రాసినది గమనించండి. క్రింది భాగమున వుండే గమనిక అనే దానిని చూచారా, యెషయా 61:1-2లో వ్రాసిన వర్తమానమునకు అది సరిపోల్చబడుటను మీరు కనుకొనగలరు. ఇక్కడ వున్న ప్రసంగించబడుచున్న ఈ వాక్యములు దానికి ఉదాహరణముగా కనబడుచున్నవి. ప్రభువు యొక్క హితవత్సరమును యేసు ప్రకటించనైయున్నట్లు చెప్పబడెను. తరువాత వచనము ఆయన రాకడ మరియు తీర్పును గూర్చి చెప్పుచున్నది, చూచారా. ఆయన సరిగ్గా అక్కడే ఆగుట మీరు చూచారా?

2TIM 4:2-5

 

26నేను ఎన్నడూ అది గమనించకుండానే ఆ 5వ వచనము యొద్ద ఆగుట జరిగెను, "హితబోధను సహించని కాలము వచ్చును, మనుష్యులు దురద చెవులు గలవారై తమ కొరకు అనుకూలముగా బోధించువారిని పోగుచేసికొని సత్యమును వినుట మాని కల్పనా కథలవైపు తిరుగుదురు. అయితే నీవు సువార్తికుని పనిచేయుము. నీ సేవకు పూర్తి రుజువును చూపించుము," చూచారా. దేవుని సహాయము మరియు కృపను బట్టి దానిని చేయుటకు నేను ప్రయత్నించాను. వాక్యము కొరకు ఈ విధముగా నేను నిలబడి యుండుటకు కంకణను కట్టుకొన్నాను. అందువలనే ఇక్కడ మరియు ఈ టేపును ఎక్కడెక్కడో యుండి వినుచున్న నా స్నేహితులందరికి చెప్పుచున్నాను. "వాక్యమును ప్రకటించుము." ఆ కారణము చేతనే ఏ ఇతర విశ్వాస ప్రమాణములు మరియు శాఖలతో ఏకీభవించుట లేదు, ఎందుకనగా వాక్యముతోనే నిలచియుండవలెనను ఆజ్ఞను దేవుని వలన నేను పొందాను. ఇప్పుడు, ఎవరయినా ఏదయినా చేసినయెడల దానికి వారే బాధ్యులగుదురు.

27నా పరిచర్యను గూర్చిన నా దర్శనమును మీరు గమనించినయెడల, నేను ఆ చెట్లను దాటిపోవుట జరుగలేదని గ్రహించగలరు. నేను ఎన్నడును అన్య మతమును ప్రవేశపెట్టలేదు. "త్రిత్వవాదులందరూ ఏకత్వవాదులు కండి" అని గాని "ఏకత్వవాదులందరూ త్రిత్వవాదులుకండి" అని గాని నేను ఎన్నడూ చెప్పలేదు. వారి స్వంత పాత్రలలోనే నేను వాటిని నాటితిని. అక్షరాలా అలాగే చేసితిని. నేను త్రిత్వవాది యొద్దకు వెళ్ళాను, ఏకత్వవాది యొద్దకు వెళ్ళాను, ప్రతివారి యొద్దకు నేను వెళ్ళాను, వారి మధ్యనే నిలబడియున్నాను. వారిలో ఎవరితోనూ ఎన్నడూ నేను చేరలేదు, కాని ఒక సోదరునిగా వారి మధ్యలోనే నిలబడియుంటిని. ఆ దర్శనము ఏమి చేయమని చెప్పెనో అదే ఖచ్చితంగా చేశాను. ఇరుప్రక్కల నుండి నేను ఫలములు భుజించాను, రెండు ప్రక్కలా రక్షణ ఇచ్చినది.

28ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ చాలామంది త్రిత్వము వారు కూర్చొనియున్నారు, చాలామంది ఏకత్వము వారున్నారు, ఇంకా చాలామంది వివిధ రకముల వారున్నారు. కాని దాని గూర్చి మీరు చాలా అల్పముగా యోచించుచున్నారు, ఎందుకనగా ఆ దర్శనములో ఒక భాగము సత్యమైనయెడల, తక్కినది కూడా సత్యమే. ఆ రెండు ఫలములును సిలువలో కనుగొనబడినవి, చూచారా. ఆ రెండును సిలువలో యుండినవి, అన్నియు కలిసికట్టుగా యున్నవి, అక్కడ నా మీద ప్లమ్ పండ్లు, యాపిలు పండ్లు లేదా పియర్ మరియు పీచ్ ఫలములు రెండూనూ పడినవి. అవి రెండూనూ వర్శి౦చినవి. అందరూ సిలువయొద్ద కనుగొనబడిరి, ఎందుకనగా వారందరును దేవుని యొద్ద విశ్వాసముంచి పరిశుద్దాత్మపూర్ణులై, క్రైస్తవ క్రియలు మరియు సూచనలను కలిగియుండిరి.

ఇప్పుడు, శాఖకు దానితో ఎట్టి సంబంధము లేదు. తిరిగి జన్మించిన వారికి మాత్రమే దానితో సంబంధమున్నది. దేవునితో మీకు గల అనుభవమే లెక్కలోనికి వచ్చును. దానిని ఎంతగానో ఇప్పుడు మనము చూచాము. ఎన్నో వాక్యములు ఇక్కడ నేను చూపించవలెనని కోరాను. ఇంకొద్దిసేపటి తరువాత బహుశా చూపించెదను.

2TIM 4:6-10,13,16

 

295వ వచనము నుండి 18వ వచనము వరకు మీరు చూడవలెనని కోరుచున్నాను. మరియు, ఇప్పుడు సమయమును ఆదా చేయుటకు ఆదంతయూ నేను చదువను. ఇక్కడ పౌలు మరల తిమోతికి వ్రాయుచున్నాడు, అతడు మాట్లాడుటను ప్రారంభించిన దానిని మీరు గమనించిన యెడల అది చాలా విషాదకరముగా కనిపించును. ఇప్పుడు, మీరు 5వ వచనము తరువాత చూడండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. [రంగము మీదినుండి వెళ్ళిపోవుట జరుగును. గమనించండి.] నేను సిద్దముగా యున్నాను. వెడలిపోవు కాలము సమీపమై యున్నది.

మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టి౦చితిని, విశ్వాసము కాపాడుకొంటిని:

ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించువారికందరికి అనుగ్రహించును.

ఆ తరువాత అతడు, "ఇవన్నియూ చేయుము" అని చెప్పుచున్నాడు.

ఏమిటి? తన కొరకు వస్త్రము తీసికొని రమ్ము అని చెప్పెను. తరువాత వెంటనే అతడు ఈలాగు పలుకుచున్నాడు.

… దేమా నన్ను విడిచిపెట్టెను, …

అతడు ఒక యువ సువార్తికుడు. ఒక యువ ప్రవక్త. అంతా అతనికి అనుకూలముగానే యుండెను గాని అతని సేవలో ఈ విధముగా జరిగిన ఒక సమయము వచ్చెను. కాని ఇప్పుడు, ఇక్కడ ఈ క్రింద మీరు గమనించండి, అతడు చెప్పెను:

… అందరునూ నన్ను విడిచిపోయిరి: … [ఎందుకొరకు? వాక్యము కొరకే.]

JOHN 6:10,13,66-68

 

30గలిలయు యువ ప్రవక్తయుగు యేసునకు కూడా విడనాడవలసిన ఒక సమయము వచ్చెను. దేవుని యొక్క వాక్యముతో నిలచియున్న వారందరూ లోకము వలనను మరియు మత ప్రపంచము వలనను విడనాడబడు ఒక స్తితి వచ్చును. ఒక రోజున యేసు అయిదు వేలమందికి ఆహారము పెట్టెను, అయిదు రొట్టెలు, రెండు చేపలవలన ఇంకా మిగిలిన ముక్కలు గంపలు నిండా ఎత్తిరి, ఆ మరుసటి రోజునే అని నేను దానిని నమ్ముచున్నాను, ఆయన వాక్యమును చెప్పసాగెను, అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోసాగిరి. ఆయన తన శిష్యులవైపు చూచి "మీరును వెళ్ళగోరుచున్నారా?" అని అడిగెను. ఆయనచే స్వంతగా అభిషేకించబడిన డెబ్బదిమంది సువార్తికులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. "మీరును వెళ్ళగోరుచున్నారా?" అని ఆయన ప్రశ్నించెను.

అప్పుడు పేతురు ఆ గుర్తించదగు మాటలను పలికెను, "ప్రభువా, మేమెక్కడి వెళ్ళుదుము? నీవు మాత్రమే నిత్యజీవపు మాటలు గలవాడవు."

1COR 15:32•

2TIM 4:7,17

 

31గమనించండి. అందరూ విడిచిపెట్టు కాలము ఒకటి వచ్చును, అది రావలసియున్నది. అది తప్పక వచ్చును. మరిప్పుడు, నేను ఎందరో ప్రవక్తలను, ఎన్నో సందర్భములను ఇచ్చట ఆ సమయమును మీకు ఎత్తి చూపి దానిని రుజువు చేయుదును. అది నాకు వచ్చియున్నది. దానిని తుడిచిపెట్టవలసిన అవసరత లేదు. అదిప్పుడు వచ్చియున్నది, మరియు దానిని నీవు తప్పక స్వీకరించవలెను. వారు దానిని తమ నుండి దూరముగా తరిమివేయలేదు, వారు నిలబడి దానిని స్వీకరించి, సువార్తను గూర్చి సిగ్గుపడలేదు.

పౌలును మీరు గమనించండి, "నేను మంచి పోరాటము పోరాడితిని, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. నా పరుగును కడముట్టించితిని." ఓ, మై! ఇంకా క్రింద అతడు ఈలాగు చెప్పెను, "నేను మృగములతో పోరాడితిని, సింహముల నోటనుండి నేను విడిపించబడితిని," అతడు ఎదుర్కొనిన వాటన్నింటిలోనూ దేవుడాతనికి మేలు చేసెను. కాని అతడు వెడలిపోవు కాలము వచ్చెను.

32పౌలుతో సహవాసము కలిగియున్న దేమా వంటి వ్యక్తి, ఒక సేవకుడు పౌలును ఎందుకు విడిచిపెట్టవలసిన వచ్చేనా? అని మనము ఆశ్చర్యపడుదుము.

మీకు సహోదరుడు బాక్స్టర్ తెలియును, మీలో చాలా మందికి అతడు గుర్తుండియుండును. అతడు దేమాగూర్చి తరచుగా చదువుచుండెడివాడు. "బ్రెన్హాం సోదరుడా, నేను పరలోకమునకు వెళ్ళినప్పుడు మొదటిగా ఏమి చేయుదునో తెలియునా?" అని చెప్పెను.

"ఏమిటి?" అని నేను అన్నాను.

"నేను తిన్నగా వెళ్ళి దేమా ఎక్కడున్నాడో వెదకుదును. నా శక్తియంతటితో అతనిని గుంజుదును," అపుడతడు, "బాక్స్టర్, నీవెందుకు నన్ను ఆలాగు చేశావు?" అని అడుగును. అప్పుడు నేను, "అందరూ పౌలును విడిచి వెళ్ళినప్పుడు నీవు కూడా అతనిని ఆలాగు ఎందుకు విడిచి వెళ్ళావు?" అని అడుగుదును. అది చేయమని నేను కోరను అక్కడ కొన్ని పోరాటములు ఉండునని నేను అనుకొనను, కాని పౌలు గూర్చి సహో, బాక్స్టర్ ఎంతో చింత కలిగియుండి అలాగు తలంచెడివాడని నేను నమ్ముచున్నాను.

1COR 14:36,37•

1TIM 2:12

 

33పౌలు ఏమి చేసెను? ఎంతో దీనముగా బోధించెను, పరిశుద్దాత్మ అతని మీదికి వచ్చెను. స్త్రీలు బోధచేయుట గూర్చి ఇంకా ఆయా సంగతులగూర్చి పౌలు చెప్పినప్పుడు ఆ తిరుగుబాటు వచ్చెనని నేను ఊహించుచున్నాను. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలసినదే. వారు మాట్లాడకూడదు,"అని చెప్పెను. ఆ వెంటనే వారతనిని చెరసాలలో వేసెను.

వారిలో కొందరు బిషప్పులు ఏమి చెప్పిరో ఊహించగలరా? "హు! ఆ మనిషి చెరసాలలో ఉన్నాడు, మనతో కూడ ఇక్కడ అతడు వ్రాయవలసిన పని ఏమి ఉన్నది? చూచారా? అతడు ద్రాక్షారసముతో సంబంధముగల తిమోతీని జతచేసికొనియున్నాడు. కావున ఇక్కడ ఇప్పుడతడు తిమోతీని ద్రాక్షారసముతో పోషించుచున్నాడు. జైల్లో కూర్చొని ఇప్పుడు ఏదో వ్రాయుచు పరిశుద్దాత్మ మనలను ఈలాగు చేయుమని చెప్పుచున్నట్లుగా ఆజ్ఞాపించుచున్నాడు."

కాని, అతడు చెప్పునది ఇది, "ఏమిటి? … మీలోనుండి దేవుని యొక్క వాక్యము బయలు వెళ్ళుచున్నదా? అది నాయొద్దకు మాత్రమే వచ్చును. ఒకడు తాను ఆత్మ సంబంధినని లేక ప్రవక్తనని తలంచినయెడల నేను వ్రాసిన ఇవ్వనియు దేవుని ఆజ్ఞలని ఒప్పుకొనవలెను," చూచారా.

34చూడండి, స్నేహితులారా, ఆ సమయము వచ్చును. ఈ టేపును ఆయా స్థలములలో ఉండి వినుచున్న జనులు వేరుచేయు కాలము వచ్చియున్నదని మరువవద్దు. అది తప్పక రావలెను. నేను అంత్యకాలమునకు ఎంత దూరములో యున్నానో నాకు తెలియదు, మార్గము యొక్క అంతము. నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. రేపు ఏమిటి అనేది నాకు తెలియదు, దానిని ఏది పట్టుకొనియున్నదో నాకు తెలియదు, కాని దానినెవ్వరు పట్టుకొనియున్నారో నాకు తెలియును. కాబట్టి దానిమీదనే నా విశ్వాసము కట్టబడియున్నది.

ఇప్పుడు, దేమా అతనిని విడిచిపెట్టి రాత్రి క్లబ్బులకు వెళ్ళనారంభించెనని నేను అనుకొనను. దేమా ఆలాగు చేసెనని ఊహించలేను, ఎందుకనగా దేమా ఆత్మ నింపుదల కలిగిన ఒక వ్యక్తి, అతడు ఒక గొప్ప సహాయకుడు. దేమా చరిత్రను మీరు ఎప్పుడైనా చదివినచో అతడు ఒక గొప్ప పేరుగల బోధకుడు, ఒక చక్కని నాగరికతగల వ్యక్తి, ఉన్నతముగా మెరుగు దిద్దబడినవాడు, విద్యగలవాడు అని తెలియును. అతడు ఒక తెలివిగల వ్యక్తి, కాని అతడు పౌలును ఎందుకు విడిచిపెట్టెను? అదే చిక్కు ప్రశ్న. అతడు పౌలును విడిచిపెట్టుటకు ఏది కారణము? అతడు రాత్రి క్లబ్బులకో మరెక్కడికో వెళ్ళగోరెనని నేను తలంచను. కాని దేవుడు పౌలును వేరు చేసెనని నేను నమ్ముదును. ఇప్పుడు ఉహించుకొనండి దేమా…

2TIM 4:10

 

35దేమా యొక్క కొన్ని ఆలోచనలను చూద్దాం. కొండ ప్రక్కను కూర్చొని ఒక రోజున వెలుగులో ఈలాగు ఆలోచించుచున్నాను. "దేమా ఎందుకు ఆతనిని విడిచి వెళ్ళగోరెను? తనను ప్రభువు యొద్దకు నడిపించిన ఆ దీన సేవకుని అతడెందుకు విడిచిపెట్టెను? అన్యుల మధ్య ఉజ్జీవమునకు కారకుడు పౌలు, నిశ్చయముగా అతడు "ప్రవక్త" ఎవ్వరును అతడు ప్రవక్త కాడని చెప్పలేరు. అతడు ప్రవక్త కంటె గొప్పవాడు. అపోస్తలుడు, అన్యులకు ఒక గొప్ప శక్తిగల అపోస్తలుడు, దేమా పౌలుతో సంబంధము కలిగియుండెను, సహవాసము చేయుచుండెను, అతని మీద దేవుని ఆత్మ కదలుట చూచెను. క్రీస్తు దాసుడుగా బయలుపరచబడిన అటువంటి వ్యక్తిని ఎందుకతడు విడనాడెను? ఇక్కడ పౌలు చెప్పినది గమనించండి, "ఇహలోకమును ప్రేమించి." ఇప్పుడు, దేమా వెనుకకు జారెనని నేను తలంచను. ఆలాగు చేసెను అని నేను అనుకొనను. కాని పౌలు గూర్చి అతనికి ఒక తప్పు అభిప్రాయము కలిగెను.

MATT 8:20•

LUKE 9:58

 

36ఇప్పుడు, దేమా ఒక ధనిక కుటుంబము నుండి వచ్చెను, అతడు సంపన్నుడు, కొన్నిసార్లు ధనమే ప్రజలకు మతమగును. కాలిఫోర్నియాలో వారు ఇలాగు అందురు, "నీకు మూడు కాడిలాక్ కార్లు లేనిచో నీవు ఆత్మ సంబంధివి కావు." అనగా నీవు విజయవంతము కానిచో నీ సంఘము పట్టణమంతటిలో మిన్నగా లేనిచో ప్రజలు రారు. దాదాపు ఇక్కడ కూడా అలాగే యున్నది. ఋజువగుచున్నది… ప్రాంతమంతటిలో అతడు చక్కని సంఘము నీవు కలిగియుండవలెను, లేనియెడల వారీలాగు అందురు, "మీరు అటువంటి చిన్న గుంపుతో కలిసిపోయారా?"

మన ప్రభువునకు తలవాల్చుటకు కూడా స్థలములేదని మీరెరుగుదురా? ఆయనకు ఒకే ఒక అంగీ ఉండెనని ఎరుగుదురా? చూచారా? ఆయన బయటకు త్రోయబడిన వ్యక్తివలె ఉండెను. ఆయనకు తలవాల్చు స్థలము లేదు. అయితే వారు ఆయన గురించి కూడా ఆలాగే తలంచుకొనియుండవచ్చు, మరియు చేసియుండవచ్చు.

2COR 12:7•

GAL 4:15•

GAL 6:11

 

37ఇప్పుడు, పౌలు యొక్క పరిచర్యలో అపజయమును దేమా గమనించెనని నేను నమ్ముచున్నాను. ఆ ముసలివాడు దేవుని ఎదుట కొట్టుకొనిపోయెను అని అతడు తలంచెనని అనుకొనుచున్నాను. ఒకప్పుడు పౌలు కొరకు జనులు తమ కండ్లను తీసి ఇవ్వగోరిరి.

ఇప్పుడు, పౌలు దానిని చెప్పెను, అతడు చెప్పెను, "మీరు నా కొరకు మీ కండ్లు పెరికి ఇచ్చుటకు సిద్దముగా ఉన్నారు." ఎందుకనగా పౌలు జబ్బు కండ్లు కలిగియున్నట్లు అతడు చెప్పిన దానిని బట్టి తెలియును. ఎందుకనగా అతడు చెప్పెను, "అంత పెద్ద అక్షరములతో వ్రాసితిని." అతడు చెప్పెను, "నాయొద్ద వున్న నిఘంటువు ద్వారా "పెద్ద అక్షరములతో" మరియు "పెద్ద అక్షరములతో" అని చెప్పెను. అతడు రోమాలో చెరసాలయందుండెను. ఏదో పొరపాటు జరిగినది. పరలోక దర్శనము చూచినప్పటి నుండి తన కండ్లు బాధకు గురి కాబడినట్లు అతడు చెప్పెను. ప్రజలు తమ కండ్లు పీకి అతనికిచ్చియుందురు. కావున అతడు పౌలు బాధపడుటను చూచి, అతడి కండ్లచే అతడు శ్రమపడుచుండెను, మరియు అతడు బాధపడుచుండెను. తనను బాగుచేయమని ప్రభువును మూడుసార్లు అడిగెను. అతడిట్లనెను. "ప్రత్యక్షత యొక్క సమృద్దికి పైగా నేను హెచ్చింపబడవలెను. అపవాది యొక్క దూత నన్ను శోధించుటకు పంపబడెను." ఇప్పుడది చాలా మంచిగా యుండెను, మరల దానిని అతడు కొట్టెను. అతడు మరల బాగై దానిని కొట్టగలిగెను.

ACTS 9:3•

2COR 12:7

 

38మీరు చూడండి, అపోస్తలులందరిని కలిపినచో పౌలుకు గల పరిచర్య వారందరి కన్న గొప్పది. అందులో కొందరు, "మంచిది, నేను యేసుతో నడిచాను," అని చెప్పగలరు. ఆయన ఇక్కడ వున్నప్పుడు మనుష్యులు ఆ వీధులలో ఆయన కూడ నడచిరి. పెద్ద వింత కాదు. కాని ఆయన చనిపోయి, పాతిపెట్టబడి, పరలోకమునకు ఎక్కిపోయిన తరువాత మరల ఆయన అగ్నిస్తంభములో వచ్చుటను పౌలు చూచెను. దమస్కునకు పోవు దారిలో యున్న పౌలును ఆయన పిలిచెను, చూచారా, లేదా మత్తయి, మార్కు, లూకా, లేదా ఇంకా తక్కిన వారందరి కన్నను గొప్పదగు సేవను అతడు కలిగియుండెను. అతడు వారందరిని మించిపోయినవాడు, మరియు అతడు చెప్పెను, "నేను మరింత హెచ్చింపబడకుండునట్లుగా అని చెప్పెను, 'మీకు దానిగూర్చి అంతగా ఏమి తెలియదు,' ప్రభువును పునరుత్దానము తరువాత నేను చూచాను."

మంచిది, "మేము ఆయనతో నడిచాము" అని వారనిరి. మంచిది, కావున గలిలయ, నజరేతు ఇంకా ఆ ప్రాంతముల వారందరూ ఆలాగే చెప్పిరి. వారందరూ ఆయనతో నడిచిరి.

2COR 12:7-10

 

39కాని, మీరు చూడండి, పౌలు ఆయనతో మాట్లాడెను మరియు ఆయన శరీరధారి కాక ము౦దు రూపములో యుండునో ఆ రూపమును అతడు చూచెను, చూచారా. మరియు ఆ స్థితిలోనే ఆయన పౌలుకు ఆజ్ఞాపించెను. ఆయన వెలుగులో వున్నప్పుడు, ఆయన పౌలుకు ఆజ్ఞాపించెను. మరియు ఆయనను చూచెను. "ఈ సోదరులు కొందరి కంటె అధికముగా నేను హెచ్చింపబడకుండు నిమిత్తము ఆయన నన్ను సాతాను దూతకు అప్పగించెను," అని అతడు చెప్పెను. అది అతనిని క్రిందికి త్రోసెను. మరియు అతడు చెప్పెను, "దానిని నాయొద్ద నుండి తీసివేయమని మూడుసార్లు ప్రభువును వేడితిని. అందుకాయన, 'సౌలా లేదా పౌలా నా కృప నీకు చాలును'" అని చెప్పెను. అప్పుడు పౌలు ఈలాగు పలికెను, "నా బలహీనతలయందే నేను అతిశయించెదను, ఎందుకనగా నేనెపుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. చూడండి, దానియందు నేను అతిశయించుదును!"

ACTS 9:3,15•

2TIM 4:13

 

40ఇప్పుడు, సేవను చేయుచున్న అందరికంటెను ఉన్నతమైన సేవను కలిగియున్న ఆ మనిషిని మీరు గమనించండి, వారందరికంటెను ఎక్కువ పరిచర్య కలిగియుండిన పౌలు, వారందరి కంటెను గొప్ప సేవకుడు. అతడు అగ్నిస్తంభము యందు యేసును చూచెను, మరియు తనకు ఏది అప్పగించబడినదో దానినే అతడు చేసెను. అదే దేవుని ద్వారా అదే శక్తితో బయలుపరచబడినది, సూచక క్రియలు, అద్భుతకార్యములు నిస్సందేహముగా వెంబడించినవి, మరియు అతడు చాలా పేదవాడై ఒక్క అంగీని మాత్రమే కలిగియుండెను, తమ కండ్లను పెరికి ఇవ్వగలిగే ఒక సమూహపు ప్రజలకు అతడు బోధించుచుండెను, మరియు వారిలో కొందరు లక్షాధికారులు గలరు. అయినను పౌలుకు ఒక్క అంగీ మాత్రమే గలదు. "ఆ అంగీని నా కొరకు తెమ్ము. ఇక్కడ చలిగాయున్నది," అని అతడు చెప్పెను. పౌలు పర్వత ప్రాంతములో యుండెను. అతనికి కేవలము ఒక్క అంగీయే యుండెను.

ఉన్నత ప్రమాణము, ఉన్నత సామర్థ్యము, సంస్కృతి, చదువు కలిగినవాడు ఈ దేమా, అనేక దుస్తులను మార్చుకొనగల సంపన్నుడు. "ఇతనిలో ఏదో పొరపాటున్నది. తమ కండ్లను పెరికి ఇయ్యగల ఎందరో స్నేహితులు ఇతడు కలిగియుండియూ ఇంత పేదరికములో ఎందుకున్నాడు? ఒక్క అంగీయే యున్నది. పౌలులో ఏదో పొరపాటున్నది," అనుకొనెను.

41ఓ, మీరు తెలిసికొనండి, ఆ ఆత్మలోకమును ఇంకా విడిచిపెట్టలేదు. వారింకా అదే రీతిగా యున్నారు. డబ్బు దేవుడు కాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, చూచారా. నీవు ఎక్కువ సేవ కలిగియున్నావు గనుక నీవు అది, ఇది స్వంతముగా కలిగి యుండవలసియున్నావు మరియు ప్రజలు ఈ సమస్త పెద్ద కార్యములు, మరియు పెద్ద పాఠశాలలు, మరియు ఫలానా-ఫలానా. ఏవేవో కలిగియుండవలెనని ప్రజలు తలంచుదురు. దేవుడు అట్టి వాటిని లక్ష్యపెట్టడు. అది నా యొక్క అభిప్రాయము. దేవుడు వ్యక్తిగతముగా వ్యవహరించును. అట్టి పనులు వెళ్ళి చేయుడని దేవుడెన్నడూ మనలను అభిషేకించలేదు.

కాని పౌలు, ఒక అంగీ మాత్రమే కలిగియుండి, మరియు దానిని అతడికి తెమ్మని తిమోతీకి చెప్పుచుండెను, ఎందుకనగా అక్కడ చలిగాయున్నది. పదివేల కొలది మందికి ప్రసంగించే సేవగల మనిషిగా పౌలు యుండెను, మరియు అనేక రకములైన అద్భుత కార్యములను చేయగల ఒక సేవను కలిగియుండెను, మరియు ఒక అగ్నిస్తంభములో యేసును చూచినవాడై, ఆయన వలన ఆజ్ఞను పొందినవాడై యుండి కూడా, మరియు అయినా గాని ఒక్క అంగీయే స్వంతగా కలిగియుండెను. "ఇటువంటివాడా?" అని చెప్పి దేమా అతని విడిచి వెళ్లిపోయెను.

2TIM 4:14,15

 

42ఇప్పుడు, త్రోయకు వెళ్ళుచూ ఇక్కడ అతడు బోధించుచుండగా ఒక కమ్మరివాడు అతనియొద్దకు వచ్చుట మనము కనుగొందుము. అతడు ఒక పనికిమాలిన వాడు. మరియు అతడు క్రైస్తవ్యమును ద్వేషించెను. అతడు తాను చేయగలిగిన కీడును పౌలుకు చేసెను, పౌలును చెరసాలలో వేయించెను. "అతడిని గూర్చి జాగ్రత్త పడును," అని పౌలు తిమోతికి హెచ్చరిక ఇచ్చెను. మరియు దేమా ఈలాగన్నాడు. ఓ దేవా, జనులు దానిని విందురు గాక తనతో వివాదపడినందుకు ఒకనిని గ్రుడ్డితనముతో మొత్తిన ఒకతని ప్రక్కన ఇక్కడ దేమా నిలబడి యున్నాడు. ఇప్పుడు క్రీస్తు సంఘ బోధకులారా, ఇప్పుడు మీరు మీ అంగీలు ధరించుకొనుడి. ఒక రోజున ఒకతను నాతో ఇట్లనెను, "నన్ను గ్రుడ్డివానిగా చేయుము! నన్ను అంధత్వముతో మొత్తము! నీకు పరిశుద్దాత్మ యున్నది గదా! నన్ను గ్రుడ్డివానిగా చేయుము!"

"నీవు ఇప్పటికే గ్రుడ్డివాడవు" అన్నాను, చూచారా.

ఇప్పుడు, ఆ కమ్మరి వానిని పౌలు గ్రుడ్డివానిగా ఎందుకు చేయలేదు? ఏ రకమైన ఆత్మను కలిగి ప్రజలు ఆ కార్యములను తలంచుచున్నారో, అదే విధమైన ఆత్మను దేమా కలిగియుండెను. తనతో వివాదమాడినందుకు ఒకనిని గ్రుడ్డితనముతో మొత్త కలిగిన వ్యక్తి, ఒక కమ్మరివాడు తన సేవను పాడుచేయగా ఊరుకొనెను, దేమా నిస్సందేహముగా ఇట్లనుకొనెను, "అతడు కొట్టుకొనిపోయెను. అతని యొక్క వరములన్నియూ పోయినవి. గ్రుడ్డితనముతో మొత్తు వరమును అతడు పోగొట్టుకొనెను."

అదే ఆత్మ ఇంకా జీవించుచూ ఈలాగు చెప్పుట మీరు చూడలేదా, "నీవు కొట్టుకొనిపోయావు, సహోదరుడా.'' ఓ! అది జనుల యొక్క తలలు మీదనుండి పోవుచున్నది. వారికది తెలియుట లేదు, వారికి తెలిసినదంతా అదే, చూచారా. దానిని ఏ మాత్రము వారు చూడలేరు, చూచారా. వారది అర్థము చేసికోలేరు.

JOHN 5:19

 

43ఇప్పుడు, దేమా దానిని ఇష్టపడుటచే పౌలు ఆ మనిషిని గ్రుడ్డివానిగా చేయలేదు. "మొదట తండ్రి నాకు చూపించితేనే గాని నాయంతట నేను ఏమియూ చేయలేను" అని యేసు చెప్పలేదా? కొన్ని సంవత్సరముల క్రితము నా తల్లి మరణ శయ్యపై వున్నప్పుడు "బిల్, నా ఫలితము ఏమిటి?" మొదటగా దేవుడు నాకు చెప్పితేనే గాని నేను ఏమియూ చెప్పలేనని చెప్పలేదా? అదే జరిగినది. మానవుడు చేయలేడు, మానవుని ప్రారంభమే ఒక అపజయము, దేవుడు పనిచేయుటకు అతడు ఒక ప్రతినిధి మాత్రమే, మరియు దేవుడు తన స్వచిత్తమును జరిగించును. కాని ప్రజలు ఎల్లప్పుడును మంత్ర-తంత్రములచే ఇది మరియు అది మరియు ఇతర కార్యములను కలిగియుండుటను నీవు చూచినప్పుడు, నీవు దానినుండి దూరముగా యుండుట మంచిది, చూచారా. యేసే తనకుతానుగా ఏమీ చేయలేదు. ఆయన ఇట్లు చెప్పెను, "తండ్రి చేయు క్రియలే నేను చేయుదును. ఏమి చేయవలెనో ఆయన నాకు చూపించును, అప్పుడు నేను అవి చేయుదును. అది కాక మరొకటి చేయలేను."

ACTS 13:11•

2TIM 4:13

 

44మరియు ఇక్కడ దేమా పౌలును చూచెను, ఇటువంటి ఒక సేవను కలిగియున్న ఒక వ్యక్తి, మరియు ఎంతో పేదవాడై ఒకే ఒక కోటును (అంగీని) కలిగియుండెను, మరియు దానిని తిమోతి అతడియొద్దకు తీసుకొని వచ్చెను. ఒక్క అంగీ మాత్రమే. ఒక్క అంగీ! కాని పౌలు, క్రీస్తువలె ఒక మాదిరిని నెలకొల్పెను, ఆయన ఒకే అంగీని కలిగియుండెను. అట్లయినయెడల, ఎందుకు ఇంతటి గొప్పలు మరియు ఇంతటి డబ్బు మరియు ఈనాడు జనులు ఎందుకని ఎన్నో కార్యములను కలిగియున్నారు? తాను ప్రకటించిన దానికి విరోధముగా ఎవరయినా బోధించినయెడల, అతడు వారివైపు తిరిగి, "నీవు కొంతకాలము గ్రుడ్డివాడవగుదువు గాక!" అని చెప్పు శక్తి కలిగియుండెను. వెంటనే ఆ వ్యక్తి గ్రుడ్డివాడగును.

ఇక్కడ ఒక కమ్మరివాడు పది రెట్లు అపకారము చేసినా గాని ఏమీ ప్రతీకారము చూపలేదు. దేమా ఈలాగు తలంచియుండును, "మంచిది, చూడు, ఆ ముసలివాడు కొట్టుకొనిపోయాడు. అతని సేవ నశించిపోయినది." కాదు, కాదు, అతడు తన సేవను కోల్పోలేదు; ఆలాగు కానేకాదు. దేవుడు అట్టి పనులు చేయడు. దేవుడు ఇచ్చి, తిరిగి తిసుకొనువాడు కాడు. అవును.

1KGS 18:38,40,42,45•

1KGS 19:2,3

 

45ఇప్పుడు గమనించండి. పౌలు ఒక విధంగా ఏలియావంటి క్రమమును కలిగియుండెను. ప్రవక్తయగు ఏలియా దేవుని ఆజ్ఞను బట్టి పర్వతము పైకి ఎక్కి వెళ్ళి, ఆకాశమునుండి అగ్ని పడునట్లుగా ప్రార్ధించునప్పుడు అగ్ని దిగి వచ్చెను. మరియు అతడు నీళ్ళ కొరకు పిలిచెను, మరియు అది వచ్చెను. అంతట దేవుని యొక్క వర్తమానము ద్వారా ఆజ్ఞాపించబడి, నాలుగు వందలమంది ప్రవక్తలను వధించెను, వారి తలలు నరికెను. వాటిని కొండమీద నుండి దొర్లించెను. అయితే ఒక ఒక స్త్రీ యొక్క బెదిరింపునకు పారిపోయెను, ఒక నయవంచకురాలైన స్త్రీ మరియు ఆమె దేవునియందు నమ్మకములేనిది. యేజెబెలు, ప్రతీ ఒక్కొక్క దానికి ఆ ఒక చిన్న స్త్రీయే మూల కారణము. దానంతటికి ఆమె కారకురాలు. మొదట ఆమెను అతడు పట్టుకొన్నట్టే కనిపించెను. కాని దేవుడు తన విధానములలోనే పనిచేయును, ఆయన దాసులు దేవుని చిత్తప్రకారము పనిచేయవలెనన్నయెడల ఆ విధముగానే పని చేయవలెను.

46స్నేహితులారా, దేవుని విధానములో మీరు కదలవలసియున్నారని మీరు చూచుట లేదా? ఎన్నిసార్లు నేను సోదరులను సమావేశపరచి సమాలోచన చేశాను, "సహోదరులారా అది ఏ బేధము తిసుకొని రాదు, మనము కేవలము సహోదరులుగా ఉందాము," అని నేనెలా కలసి నడవగలను మరియు కరచాలనను చేస్తూ వారితో సాగిపోవుదుము అని ఎలా చెప్పగలను, "వాక్యమును ప్రకటించుము," అను ఆజ్ఞను కలిగియున్నవాడనైన నేను దానిని నేనెలా చెయ్యగలను. దానిని వారు చెయ్యగోరరు.

నేను సేవకుల మధ్యను నిలబడియున్నప్పుడు వారిట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, ఇక్కడ మా పినతల్లి ఉన్నది. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక ప్రవక్తవని నేనెరుగుదును. వెళ్ళి ఆమెకు చూపును తిరిగి ఇమ్ము." ఆలాగు చేయుట ఇష్టమే. నేను దానిని చేయుదును, ఆయన నాకు చేయమని చెప్పువరకు చేయలేను, చూచారా. ఎవరును అది చేయలేరు. ఏలీయా దానిని చేయలేడు, ఎవరును దానిని చేయలేరు.

ACTS 14:9,10•

2TIM 4:14,15,20

 

47దేమా పౌలుతో బోధించుచు యున్నప్పుడు పడియుండిన ఒక కుంటివానిని పౌలు లేపుట చూచెను. "స్వస్థపడుటకు కావలసిన విశ్వాసము మీకున్నదని నేను ఎరిగితిని. లేచి నీ కాళ్ళపై నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును," అని చెప్పెను. అతడు రోగులను బాగుచేయుట చూచెను, అయినను అతడు జబ్బుగానున్న థియోఫిలస్ అను తన స్నేహితుడిని విడిచి వెళ్ళెను.

"పౌలు తన సేవను కోల్పోయెను. దేమా తప్పక ఆలాగే అనుకొని యుండును. "అతనికి స్వస్థత వరము ఉండిన ఎడల ఎంతో నమ్మకముగా అతని పక్షమున నిలచినవానిని ఎందుకు బాగుచేయడు? "నేను అతనిని వ్యాధిగ్రస్తునిగానే విడిచి వచ్చితిని. నా అంగీ కూడా తేలేదు, మరియు నీవు ఆ అంగీని వచ్చునప్పుడు తెమ్మని కోరుచున్నాను. ఆ కమ్మరి వాని గురించి జాగ్రత్తపడుము, పట్టణములో కూటమును అతడు పాడుచేసెను. నేను పట్టణమును విడిచి రావలసి వచ్చెను. నన్ను అతడు చెరసాలలో ఉంచెను" అని చెప్పెను. దేమా ఈలాగు తలంచియుండును అనుకొనుచున్నాను, "ఈలాగు త్రోసివేయబడిన ఈ బోధకుడు ఎట్టివాడై ఉండును?" చూచారా?

సోదరుడా ఈనాడు లోకములో ఆలాటి దేమా ఆత్మలు చాలా ఉన్నవి. అదంతా ఏమిటో వారికి తెలీదు, చూచారా. దానిని వారికి వివరించవలసిన అవసరత లేదు, ఎందుకనగా ఎలాగైనను వారు దానిని గ్రహించరు, చూచారా. చూచారా? క్రీస్తు యొక్క దాసుడు అడుగుజాడలను వెంబడించును.

48ఇక్కడ మన డీకన్లో ఒకాయన, అతడు ఈ రాత్రి ఇచ్చట ఉన్నాడో లేదో నాకు తెలియదు, అతడు టోని జాబెల్. ఈ రాత్రి ఆయన మామూలుగా అతడు ఇక్కడే యుండును. కొద్దికాలము క్రితము అతడు నాయొద్దకు వచ్చి ఈలాగు చెప్పెను. అతడు ఇక్కడకు వచ్చు ముందు కలను కనెను, అతడు చెప్పెను, "నేను ఒక స్వప్నమును కంటిని, ఒక వింతైన స్వప్నము." అతడు చెప్పెను, "నేను ఆ కలలో పరలోకము వైపుగా దారిని నేను కనుగొనుటకు ప్రయత్నించుచున్నాను. అతడు చెప్పెను, "ఒక పుస్తకమును చదువుచు, నల్లని అంగీని ధరించుకొనియున్న ఒక వ్యక్తి వచ్చుటను నేను చూచితిని." మరియు చెప్పెను, "నేను అతని యొద్దకు వెళ్ళి, మరియు 'పరలోకమునకు దారి ఎటు?' అని నేను అతడిని అడిగితిని. 'నాకు ముందున్న మనిషిని అడుగుము' అని అతడు చెప్పెను." అతడు తానింతకు ముందు వెళ్ళిన సంఘము యొక్క కాపరి.

49అతడు కొద్ది దూరము వెళ్ళి మరియొకని కలిసికొనెను, అతడొక నల్లని అంగీ ధరించి ఆపకుండా పాటలు పాడుచుండును. అతడు మరియొక సంఘ కాపరి. ఆ ఇరువురు సంఘ కాపర్లు నా వ్యక్తిగత స్నేహితులు. మరియు అతడు చెప్పెను… మరియు చక్కనివారు. "ఈ కొండపైకి చేరుటకు ఏ దారిన నేను వెళ్ళవలెను?" అని అడిగాను. అతడిట్లనెను, "ఇటు చూడు" కొండపైన నిలబడియున్న, ఆ చిన్న వ్యక్తిని చూచావా? అనెను. "అవును" అని నేను చెప్పితిని. చెప్పెను, "అక్కడ దుస్తులు దరించి, కౌ-బాయ్ టోపీ పెట్టుకొని ఒక వ్యక్తి నిలిచియున్నాడు."

కెంటకీలోనున్న వారెవరో చెప్పిరి, అక్కడ నా గురించి మాట్లాడుతూ, చెప్పిరి, "ఆ వ్యక్తిని చూచుటకు ఏదోలా ఉన్నా కాని అతడొక బోధకుడు." ఒక వ్యవసాయకుడు గానో లేదా మరొక దానివలై కనిపించవచ్చు, కాని, నీకు తెలుసా, వస్త్రధారణ కాదు…

50మరియు పైన అచ్చట నిలబడియున్నది నేనే అని చెప్పెను. మరియు అతడు అతడు పైకి ఎక్కి నా యొద్దకు వచ్చెను, అతని చేతిని పట్టుకొని కొండపైకి చేరువరకు నడిపించాను, అక్కడ ఒక అరణ్యమును దాటవలసి వచ్చెను. "టోనీ, నిన్ను ఇక్కడ విడువక తప్పదు, నీ అంతట నీవే దీనిలో నడువవలెను" అని చెప్పాను.

"బ్రెన్హాం సోదరుడా, ఇక్కడ నుండి నేనేమి చేయవలెను?" అని అడిగాడు.

నేనిట్లు అన్నాను అని అతడు చెప్పెను, "ఇక్కడకి రా, టోనీ, అటు చూడు. ఆ వట్టి కాళ్ళ జాడలు రక్తసిక్తముతో యున్నవి చూచావా?" "నేను ఇప్పటి వరకు ఆ దారినే వెంబడించి వచ్చాను. కేవలము ఆ మర్గాముననే నిలచియుండు," అని చెప్పాను. మనుష్యులకు నేను ఎప్పుడూ గురి చూపి నడవమని చెప్పునది అదియే; ఒక ఆచారము లేదా ఒక రకమగు భావోద్రేకమును నేను చూపించుట లేదు, గాని బైబిలు యొద్దకు నడిపించు అడుగుజాడలను చూపించుచున్నాను, యేసుక్రీస్తు యొక్క రక్తము వైపు.

2TIM 4:16

 

51ఇప్పుడు, ఎందరో వేలాదిమంది స్నేహితులను కలిగియున్న ఒక వ్యక్తి ఒకే అంగీని కలిగియుండుట చూచి అతడెట్లు తలంచెనో గదా! ఒకనిని గ్రుడ్డి తనముతో మొత్తగల మనిషి తనను ఒకడు పట్టణములో నుండి తరిమి వేయగా ఏమీ మాట్లాడకుండా, నెమ్మదిగా లేచి వెళ్ళిపోయెను. రోగులకు ప్రార్ధించిన వ్యక్తి, తన స్నేహితుడు రోగియై యుండగా విడిచివచ్చెను. అందుకే దేమా అతనిని విడిచి వెళ్ళెను. మిగతా వారందరూ విడిచి వెళ్ళిపోయిరి. "మనుష్యులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిరి. ప్రతీ ఒక్కరు అతడిని విడిచి వెళ్ళిపోయిరి," అని పౌలు చెప్పెను. ప్రతీ ఒక్కరు అతడిని విడిచి వెళ్ళిపోయిరి.

నేను ఈలాగు చెప్పెదను. ఒక మనిషి, వాక్యమునకు సత్యముగా కట్టుబడి యున్నప్పుడు, ఊరకే ఒక కూటములో మాత్రము కాదు కాని ప్రతీ కూటములో, సత్యముగా వాక్యమును బోధించవలెను. ఒక మనిషి వాక్యమునకు సత్యముగా నిలబడి యున్నప్పుడు, వారు అతనిని విడిచిపెట్టి వెళ్ళు కాలము వచ్చును. ఖచ్చితముగా దానిని చేసెదరు. మన ప్రభువుకు వారు ఆలాగు చేసిరి. అతడు సత్యమునకు నిలబడినప్పుడు వారతనిని విడిచిపెట్టుదురు. "వారందరూ నన్ను విడిచిపెట్టిరి." లూకా ఒక వైద్యుడనియు, పౌలు వెళ్ళు స్థలములకు ఈ వైద్యుడ్ని తీసుకు వెళ్ళెనని మనకు వాక్యముల ద్వారా, అది మనము తెలుసుకుంటిమి. దైవిక స్వస్థతను గూర్చి ప్రసంగించుచు, రోగియగు తన స్నేహితుని విడిచి వచ్చెను. చాలా పేదవాడై, ఒక్క అంగీయే కలిగియుండెను. మరియు ఒక మనిషిని అంధునిగా చేయకలిగి యుండియు, మరొకనికి భయపడి పట్టణము నుండి పారిపోయెను. చూడండి, అతడు కొట్టుకొనిపోయెను అని వారు తలంచిరి. కాని ఆలాగు అతడు లేదు! అతడు అక్షలారా రక్తపు అడుగుజాడలనే వెంబడించుచుండెను. అతడు వెంబడించుట మానలేదు. మీరు గ్రహించుచున్నారని తలంచుచున్నాను. "అందరూ నన్ను విడిచిపోయిరి" అని అతడు చెప్పెను.

MATT 23:6,7,14•

2TIM 4:10,11

 

52దేమా, ఈ లోకమును ప్రేమించి మానవుల కీర్తి సంపాదించగోరెను. "హల్లో డాక్టర్ దేమా, నీకు పి.హెచ్., వచ్చిందనుకొంటాను."

ఓ, నిశ్చయంగా, వారది ప్రేమించుదురు. యేసు చెప్పెను, "మీరు సమాజ మ౦దిరులలో నిలబడి "రబ్బీ" లుగా ఎందుకు పిలిపించుకొనుచున్నారు? అందువలన మీకు ఎక్కువ శిక్ష కలుగును," చూచారా.

ఇప్పుడు, మనకు తెలుసు, ఈ వైద్యుడు పౌలును వెంబడించుట లేదా అతనితో వుండుటను చూచినప్పుడు, మరియు పౌలు లూకాను తీసుకు వెళ్ళెను, అతడు, "లూకా మాత్రమే నన్ను విడిచి వెళ్ళలేదు" అని ఇక్కడ చెప్పెను. లూకా అతనికి మేలు రకముగా ఉండెను, లూకా అతనికి ప్రయోజనకరముగా ఉండెను. అతనికి సేవలో లూకా అవసరమైయుండెను. ఈ వైద్యుడు ఎక్కడికి వెళ్ళినా గాని ఒక మనిషిని వెంబడించుచునే యుండెను, దైవిక స్వస్థతను ప్రకటించెను. దైవిక స్వస్థతను బోధించి, కుంటివానిని బాగుచేసి, చనిపోయినవానిని లేవనెత్తి, గొప్ప దర్శనములు చూచి భవిష్యత్తులో తన స్వంత సహ పనివాడు జబ్బుగా యుండినప్పుడు విడిచిపెట్టి పోయెను. మిలియనుల డాలర్లు సంపాదించి, వేలాది డాలర్ల విలువగల భవనములను నిర్మించుకొనగల సామర్ధ్యమున్న వ్యక్తి, పెద్ద స్కూళ్ళు మొదలగునవి నిర్మించుకొనగల శక్తి గల వ్యక్తి కాని, అతనికి ధరించుకొనుటకు ఒక అంగీని మాత్రమే కలిగియుండెను.

53దేమా చెప్పెను, "అటువంటి వానితో నాకు ఎట్టి సంబంధము వద్దు. అతడు క్రింది స్థాయి వ్యక్తి. నేను శాఖాసంబంధమగు సోదరులతో వెళ్ళెదను. నాకు ఒక స్థానముండు చోటుకు నేను వెళ్ళెదను." అటువంటి దీన సేవకుని అలాంటి పరిస్థితిలో విడిచి వెళ్ళినందుకు బాక్స్టర్ వలె నేను కూడా అడుగుటకు సంశయించను. అతడు పౌలు పక్షమున నిలబడియుండవలసినవాడు. అతనిని క్రీస్తు యొద్దకు పౌలు నడిపించెను. కాని, మీరు చూడండి, అతడు ఆత్మ యొక్క నడిపింపును ఎరుగకుండెను, అతడు ఆ దేవుని యొక్క చిత్తమేమిటని ఎరిగి, ఆ తర్వాత ఆ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చవలెననే దానిని అతడు ఎరిగియుండలేదు, చూచారా. ఇప్పుడు, వారతనిని అట్టి స్థితిలో నుండి విడిచిపెట్టిపోయిరి. విడిచిపెట్టిరి! అందరూ అతనిని విడిచి వెళ్ళిరి.

54దానిగూర్చి ఎంతగా నేను ఆలోచించెదను, దేవుని వాక్యము పట్ల యదార్ధముగా నిలచియుండిన ఒక దైవదాసుని జనులు, త్వరలోనే లేదా ఆలస్యంగానో విడిచిపెట్టిపోయెదరని మీరు జ్ఞాపక ముంచుకోండి. ఇప్పుడు, కొద్ది నిమిషముల పాటు జనులు దానిని ఆలోచించవలెనని కోరుచున్నాను, ఎక్కువసేపు మిమ్మును ఉంచను, మీరు మరల ఉదయము ఇక్కడికి రావలెను. దేవుని యొక్క దాసుడు, దేవుని వాక్యము పక్షముగా నిజముగా నిలబడినప్పుడు అందరూ అతనిని విడిచిపెట్టుదురు. ఇప్పుడు, బైబిలులో లేదా చరిత్రలో ఎక్కడైనా గాని ఏ సమయములో అయినా గాని చూడండి, ఒక వ్యక్తి సత్యమునకు నిలబడియున్నప్పుడు, అతడెంత గొప్పవాడైనా గాని, అతడు వాక్యమునకు సత్యముగా నిలబడినప్పుడు, మతసంబంధమైన ప్రపంచము అతడిని విడిచిపెట్టి మరియు అతడి నుండి వేరుపడు సమయము వచ్చును. వాక్యము పట్ల యదార్ధముగా నిలచియుండుటయే దీనికి కారణము. ఇప్పుడు, ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిలును తీసి చదవండి, నైసియా ఆలోచన సంఘమునకు ముందు యుండిన కాలములోను, నైసియా తండ్రులను మీరు చూడగలరు. దేవుని వాక్యముతో నిలిచియుండిన ప్రతి మనిషిని, ప్రతి పరిశుద్దుని, ప్రతి ప్రవక్తను, ప్రతి నిజ దైవజనుని మత ప్రపంచము విడిచిపెట్టి విడనాడుట జరిగినది. అట్టివారిలో పౌలు ఒకడు.

55ఈనాడు అట్టి వ్యక్తి ఒకడున్నయెడల, అతనికి అలాగే జరుగును. అది అక్షరాలా నిజము. తప్పక ఆ స్థితిని ఎదుర్కొనవలెను. అది రావలసి ఉన్నది. అటువంటి సేవ కలిగిన మనిషి తన బొటన వ్రేలి క్రింద ప్రపంచమును ఉంచుకొనవలసియున్నాడని వారు తలంతురు, కాని వారు మాత్రము అతని బొటన వ్రేలి క్రిందికి రారు, చూచారా. అటువంటి మనిషి తన బొటన వ్రేలి క్రింద దానిని పెట్టును, ఎందుకనగా అతడిక్కడ తనంతట తానుగా పనిచేయుట లేదు గాని తన యజమానుకి ప్రతినిధిగా ఉన్నాడు.

JOHN 14:10

 

56మనిషి ఒకరి నుండి మరొకరు ఘనత పొందగోరుదురని మీరు తెలుసుకొనుడి. వారు ఒకరినొకరు ఘనపరచుట ద్వారా దేవునిని అగౌరవించుచున్నారు, చూచారా. మనమధ్య మనము పెద్ద వారిని తయారుచేయ ప్రయత్నించుచున్నాము. అసలు మనము పెద్దవారము కాము, చిన్నవారము మాత్రమే. మనమందరము అల్పులము, మనమధ్య పెద్ద వ్యక్తి ఒక్కరే ఉన్నారు, ఆయన మన ప్రభువు, చూచారా. మనము మన సంస్థను దేవునికంటె ఎంతో పెద్దదిగా చేయుచున్నాము, "గొప్ప పరిశుద్ద సంఘము ఇది, అది లేదా ఇతరవి, గొప్ప పరిశుద్ద బిషప్పులు," మరియు మొదలగునవి. అటువంటివి అస్సలు లేనే లేవు. అది మానవుని ఘనపరచుట. ఒక్కరు మాత్రమే పరిశుద్దుడుగా యున్నాడు, ఆయనే దేవుడు, పరిశుద్దాత్మ అయిన దేవుడు మన మధ్యన యున్నాడు. పరిశుద్దులము మనము కాదు గాని, మనలోనున్న పరిశుద్దాత్మయే. అది మనము కాదు… కార్యములు జరుగుట చూచునప్పుడు, అవి చేయుచున్నది మనము కాదు గాని పరిశుద్దాత్మయే అని గ్రహించవలెను. "ఈ క్రియలు నేను చేయుట లేదు, నా తండ్రియే వీటిని చేయుచున్నాడు. ఆ క్రియలు చేయువాడే నాలో నివసించుచున్నాడు" అని యేసు చెప్పెను. కావున ఆ క్రియలను చేయుచున్నది అతడు (పౌలు) కాదు. సరే. కాని ఆయా కాలములలో నిజ దాసులను మనము కనుగొందుము.

57ఇప్పుడు కొద్ది క్షణముల పాటు ఇక్కడ ఒక విధమగు సాధకము చేయవలసిన సంగతి ఒకటున్నది. ఇప్పుడు మనుష్యులందరూ ఒకనిని విడిచిపెట్టిన సమయములోనే ఒక వ్యక్తి వాక్యము పక్షమున నిజముగా నిలిచియుండవలసియున్నాడు. ఆ వ్యక్తిని పరిరక్షించుటకు దేవుడు దిగి వచ్చును, అతని సేవకు బహుమానము ఇచ్చును. అది నిజము. ఎంత ఆదరణ! దేవుని యొక్క వాక్యపు వాగ్దానములోనే ఒక ఆదరణ ఉన్నది. లోకము ఏమి చెప్పినా, లోకము ఏమి చేసినా అక్కరలేదు, అది మన నిరీక్షణ కాదు, లోకపు పోకడలో మన ఆశలు నిర్మించబడలేదు,

ISA 40:31

 

58ఆ పాట చాలా అందముగా ఉన్నదని నేను తలంచుచున్నాను. నాకు పాడుట వచ్చినచో బాగుండును. ఎప్పుడూ నేను పాడగోరుదును, చూచారా. "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజువలె పైకెగిరి పోవుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోయెదరు. ప్రభువా, ఎదురు చూచుట నాకు నేర్పుము. ప్రభువా, నా మోకాళ్ళ మీద కనిపెట్టుట నాకు నేర్పుము." నాకది ఇష్టము. "నీవు నీ స్వంత అనుకూల సమయములో నా మొర్రకు జవాబు ఇచ్చెదవు. ఇతరులు చేయుదానిమీద ఆధారపడకుండుట నాకు నేర్పుము. నీ నుండి ప్రార్థనకు జవాబు పొందుటకు కనిపెట్టుట నేర్పుము. అది నిజ దాసుడు తన యాజమానుడు జవాబిచ్చు వరకు ఎదురుచూచును. ఏమి జరిగినా గాని లేఖనములు తప్పిపోవని అతడు ఎరుగును. లేఖనములు సత్యములుగా నిలబడవలసియున్నవి. అటువంటి సమయములోనే వారికి సహాయము చేయుటకు దేవుడు అడుగిడును.

1KGS 19:14,19•

2TIM 4:16

 

59ఏలియా విడిచిపెట్టబడినప్పుడు ఏమి జరిగెనో మనము చూద్దాం. ఎందుకు? అతడు వాక్యము పక్షమున నిజముగా నిలచియుండుటే కారణము. "నన్నందరూ విడిచి వెళ్ళిరి," అని అతడు చెప్పెను. అతడు సమాజము నుండి బహిష్కరించబడెను. సంస్థ నుండి, జాతీయ సంస్థ నుండి కూడా, ఇశ్రాయేలు యొక్క దేశపు సంఘము నుండి కూడా అతడు వెలివేయబడెను, యాజకులు మొదలగు వారందరూ అతనిని బయటకు త్రోసివేసిరి, పౌలుకున్న ఒక్క అంగీ కూడా అతనికి లేదు, చిన్న గొర్రె చర్మము, లేదా చిన్న తోలు చుట్టుకొనియుండెను, కొండ మీద కూర్చొని యుండి - పక్షులచే పోషించబడెను. అవునండీ. ఎందుకు? దేవుని వాక్యము నిమిత్తమే, "యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు" అను దానిని అతడు నిజముగా హత్తుకొనెను. ఇప్పుడు వారందరూ ఆధునికత వైపు మొగ్గిరి. దేశపు ప్రథమ మహిళయగు యెజెబెలు అన్ని నాజూకులు ప్రవేశపెట్టెను, యాజకులు అందుకు ఏకీభవించిరి. బోధకులు మొదలగు వారందరూ అందుకు సహకరించిరి. కాని ఏలియా, ఆ విధముగా చేయలేదు, అతడు వాక్యము పట్ల యదార్ధముగా ఉండెను. దానిని బట్టియే అతడు విడనాడబడెను. "ప్రభువా, నేను ఒక్కడినే మిగిలియున్నాను. వారు నా ప్రాణమును కూడా తీయ వెదకుచున్నారు" అని చివరకు మొర్ర పెట్టెను.

కాని దేవుడు ఒక ఆదరణను ఇచ్చి ఇట్లనెను, "ఇంకా ఏడువేలమంది నాకున్నారు."

2KGS 2:23

 

60చూడండి, అతడు ఒక్కడే యున్నాడు అను దానిని గురించి ఏలియా ఉబ్బిపోయెనని నేను తలంచను, అతడు విడనాడబడెను అని అనుకొందును. ఒక కూటమును ఏర్పాటు చేయుటకు యాజకుని యొద్దకు వెళ్ళిన ప్రతిసారి వారతనిని తిరస్కరించుచునే యుండిరి. "ఓ పిచ్చివాడా, ఇక్కడ నుండి పో, వెళ్ళి ఇది చేయుము!" అని వారతను వెళ్ళినప్పుడు చీదరించుకొనుచుండిరి. వారేమి చేసిరి? ఆ యువకుడు బట్టతలవాడు, "బోడివాడా" అని ఎగతాళి చేయమని వారు తమ పిల్లలను పంపించిరి. వారిద్దరినీ వారు ఇంకా పిచ్చివాని క్రింద జమ కట్టరి. "ముసలివాడైన బోడివాడా, ఏలియావలె నీవెందుకు ఎక్కిపోలేదు, అతడు పిచ్చివారిలో ఒకడని తలంచిరి. అయితే వారు దేవుని వాక్యము పట్ల యదార్ధముగా యుండిరి, వారిది ఒక రుజువుచేయబడిన పరిచర్య. ఏలియా నిలబడెను. మంచిది.

DAN 3:5,6•

DAN 6:10,16

 

61దానియేలు ఒక నిజమగు రీతిలో నిలబడెను. దానిని దానియేలు 12 లేదా 9లో నుండి పొందుకున్నాను అని నమ్ముచున్నాను. దానియేలు వాక్యము పట్ల నిజమగు పక్షము వహించెను. అతనికేమి జరిగినది? అతడు రాజునకు కుడి భుజముగా ఉండెను, కాని అతడు వాక్యము కొరకు సత్యముగా నిలబడినప్పుడు బహిష్కరించబడి సింహము యొక్క బోనులో వేయబడెను. వాక్యము పక్షముగా నిజంగా నిలబడిన ఒక దైవజనుడు!

బూరలు ఊదబడినప్పుడు లేక ప్రకటన చేయబడినప్పుడు, "మా విగ్రహమునకు ఎవరు నమస్కరించరో వారు మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడుదురు" అని రాజశాసనము బయలు వెడలినప్పుడు ఆ హెబ్రియులు నిజముగా వాక్యము పక్షము వహించిరి. వారు ప్రతిమకు తమ వీపులు త్రిప్పిరి. వారెంత పేరు లేనివారైనను సమాజము నుండి వెలివేయబడినను వాక్యము పక్షముగానే నిజంగా వారు నిలబడిరి. అది నాకు ఇష్టము.

GEN 31:3•

GEN 32:6

 

62యాకోబు మరో ఉదాహరణ అతడు ఇంటి నుండి చాలాకాలము దూరమాయెను, తన ప్రజలను చూడరమ్మని అతనికి ఒక పిలుపు వచ్చెను. తన పిలుపును నిజంగా నమ్మి ఇంటికి పోవుచుండెను, నిజంగా కలిసికొన బయలుదేరెను. అతనికి ఆ ఉన్నచోట అన్నియూ చక్కగానే యున్నవి, కాని దేవుడు అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పుచుండెను. తాను ఇంటికి పోవు మార్గములో యుండగా, రెండు ఇరుకు మార్గముల మధ్య అతడు చిక్కుకొనెను. అతని భార్య, పిల్లలు ఇటువైపు ఉండిరి, అతని కలిసికొనుటకు అతని ద్వేషించుచున్న సోదరుడు ఏశావు సైన్యముతో వచ్చుచుండెను. అక్కడున్న పెనూయేలు అను చిన్న యేటియొద్ద అతడు నిలబడెను. ఎట్టి పరిస్థితి! ఏశావు అతనిని ద్వేషించుచూ సైన్యముతో వచ్చుచుండెను, ఏటికి ఇవతలివైపు యాకోబు అతడి భార్య, ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు, మరియు ఒక ఇరుకు స్థలము నందు అతడు చిక్కుకొనెను. ఎందువలన? ఎందుకనగా అతడు తన స్వంత స్థలములో నిలబడియుండినయెడల ఏ సమస్య లేదు. కాని దేవుడు రమ్మని పిలచెను, తన స్వదేశమునకు రమ్మని దేవుని యొక్క వాక్యము అతనిని పిలచెను. హల్లెలూయా! దేవుడు ఒక మనిషిని దీవించెను. అతనికి ఒక మార్పు కూడా కలిగినది. అవునండి.

DEUT 8:3•

MATT 4:4•

MATT 26:68•

MARK 14:65•

LUKE 4:4•

LUKE 22:64•

JOHN 12:50

 

63యేసు, తన తండ్రి యొక్క వాక్యము పట్ల యదార్ధముగా ఉండెను, "తండ్రి చెప్పునది మాత్రమే నేను చేయుదును." ఈలాగు వ్రాయబడియున్నది, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." యేసు నిత్యమూ వాక్యము పట్ల యదార్ధముగా ఉండెను. ఆయన తనకున్న స్నేహితులందరిని పోగొట్టుకొను ఒక సమయము వచ్చెను. ప్రతి ఒక్కరు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోయిరి. ప్రజలు ఆయనను వెక్కిరించి, హేళన చేసి, ఆయనలో నమ్మకమును కోల్పోయిరి. "సమాధిలో నుండి ఒక చనిపోయిన వానిని, మాట ద్వారా, తిరిగి లేపినవాడు; ము౦దు జరుగబోవు సంగతులను నిక్కచ్చిగా, తప్పిపోకుండా చెప్పకలిగినవాడు; గడ్డము పెరికి వేయబడుట వలన రక్తము కారుచుండు ఆయన ముఖము, మద్యం త్రాగిన సైనికుడు ఆయనపై ఉమ్మివేయగా - ఆ జిగట ఉమ్మి ఆయన ముఖముపై నుండి కారుచుండెను, ఆయన తలపై ఒక వస్త్రమును కప్పి, తలను ఒక కర్రతో కొట్టుచు, మరియు వారు, "నిన్నెవరు కొట్టిరో ప్రవచించుము, దానిని మేము నమ్ముదుము" అనిరి. శిష్యులైతే "ఆహో" అని చెప్పి నడిచి వెళ్ళిపోయిరి.

EXOD 8:6,17,24•

EXOD 12:29•

EXOD 14:12•

HEB 3:17-19

 

64చూడండి, దేవుడు చేసిన దానిని వారు ఎంత తొందరగానో మరచిరి! ఎర్ర సముద్రము నొద్ద మోషే నిలబడినప్పుడు ఎట్లు చెప్పెనో చూడుడి. దేవుడు పది అసామాన్యమగు అద్భుతములను చేసెను. ఇంకా ఆయన దేవుడు కాడని నమ్ము బలహీన స్థితిలోనే మీరు యున్నారా?" అతడు వెళ్ళి భూమి మీద శాపములను పలికెను. కప్పలను, కందిరీగలను, ఈగలను, ప్రథమ సంతానమును చంపు ఒక ప్రేలుడును, మరణ దూతను అతడు దేశము మీదికి రప్పించెను. అయినా ఆ జనులు ఎర్ర సముద్రము నొద్ద మోషేను వెంబడించగోరలేదు. మెరయుచున్న గొప్ప ఈటెలను ధరించి వచ్చుచున్న వందలు, వేల సైనికులను చూచి, రథముల గర్జన విని, ఎగయుచున్న ధూళిని చూసి, ధైర్యము విడిచి వెనుకకు పడిరి. "మోషే మేము అక్కడ ఎందుకు చావలేదు?" అనిరి. చూచారా. అవిశ్వాసమును బట్టి, వారిని అరణ్యములో చావనిమ్ము అని దేవుడు చెప్పెను. "మోషే, నీ సేవ కొట్టుకొనిపోయినది, అంతే. ఇక నీ పని అయిపోయినది." చూడండి, వారు అర్ధము చేసికొనరు. వారది గ్రహింపలేరు.

MATT 26:67•

MATT 27:30•

MARK 14:65•

MARK 15:19•

LUKE 7:12,14,15•

LUKE 22:63,64•

JOHN 11:25,26,43,44

 

65మరియు ఇప్పుడు అదే విధముగా ఆ యువ రబ్బీ లేదా గలిలయ ప్రవక్తయగు యేసు ఆ అద్భుత కార్యములు, క్రియలు జరిగించుచున్నప్పుడు ఆలాగే పరిస్థితి ఉండెను. అటువంటి ఆయన ఇటువంటి స్థితిలో ఎందుకు నిలబడియుండెను? మరొకడు ఆయనను గొలుసులతో బంధించుటకు ఎట్లు కుదిరెను? సమాధి యొక్క ముద్రను బద్దలు చేసి నిత్యత్వములో నుండి చనిపోయిన ఒక మానవుని ఈయనే గదా బయటకు లేపెను. దీనిని ఆయన ఏలాగు చేయనిచ్చెను? ఎండిపోయి, చనిపోయిన ఒక కుమారుని ఆయన తిరిగి సజీవునిగా లేపెను గదా?" "పునరుత్దానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు," అని ఆయన ఎట్లు చెప్పకలిగెను? ఇప్పుడు ఈయన సంకెళ్ళతో బంధింపబడి ముఖము మీద ఉమ్మివేయించుకొనుచూ కూడా నోరు విప్పుట లేదు. ఎందువలన? "ఆయన యొక్క సేవను కోల్పోయెను" అని శిష్యులు అన్నారు. అవును, అలాగే అది ఉండును. దేవా, ఈ దీన ప్రపంచము!

66ఆయన సంఘము, అనగా పండ్రెండు మందియూ వారికి ఆయన చెప్పిన ప్రతిదాని యందు ఎంతో సంతోషించిరి. అయితే వారిని ఎంతో ప్రేమించి, వారికి అంతయూ చెప్పినా, ఆయనను వారు విడిచి వెళ్ళిపోయిరి. యోహాను అను ఒక్కడు మాత్రమే ఆయనతో పాటుగా నిలబడియుండెను. సమస్తమూ గతించిన ఆ ఘడియలో, ఆశలన్నీ ఉడిగిపోయిన ఆ సమయములో - ఆయన బధింపబడి, హేళన చేయబడి, ఉమ్మివేయబడి తన వీపును చూపినట్లు కనబడెను. కాని, అది లేఖనములను నెరవేర్చుట అని తెలియలేదు.

EXOD 9:16•

MARK 8:18•

LUKE 8:10•

ROM 9:17

 

67మంచిది, ఈనాడు జరుగుచున్న సంగతులు అక్షరాలా వాక్య నెరవేర్పులు అని మీకు తెలియదా? ప్రజలెందుకు ఈ సంగతులు పలుకుచున్నారు? ఈ శాఖలెందుకు ఉవ్వెత్తున లేచుచున్నవి? వారది ఎందుకు చేయుచున్నారు? వారది చేయుదురని వాక్యములో వ్రాయబడియున్నది. వారు తిన్నగా, అందులోనికే నడచి వెళ్ళుదురు, తమకు తామే అది చేయుదురు, కాని దానిని తాము చేయుచున్నట్లుగా ఎరుగరు. యూదా తాను యూదా యొక్క పాత్రను పోషించుచున్నట్లు ఎరుగునని మీరు తలంచుచున్నారు? ఫరో తన పాత్రను పోషించుచున్నాడని ఎరుగునా? దేవుడు ఆ పని కొరకే అతనిని పుట్టించెనని అతనికి తెలియునని మీరనుకొనుచున్నారా? ఏశావు తన క్రియలు తనకు తెలిసి ఉండియే చేసెనా? నిశ్చయంగా ఆలాగు కాదు. వారికి కళ్ళండియూ చూడరు, చెవులుండియు వినరు" అని చెప్పెను. కాని లేఖనము గమనించండి, అది విడమరచబడియున్నది, చూచారా. మనము అంత్యకాలములో యున్నాము, ఈ విధముగానే ఇది ఉండవలసియున్నది.

68ఇప్పుడు, ఆయన సంఘము ఆయనను విడిచిపెట్టి యున్నది. మానవులందరూ, ప్రకృతి ఆయనను విడిచిపెట్టిరి. ఎవరయినా ఏదయినా విడిచి పెట్టినారంటే, పౌలు తనకు కలిగినదంతయూ విడిచిపెట్టెనని తెలిసికొనుడి. ఆయన సృష్టించిన సృష్టియే ఆయనను విడిచిపెట్టెను, సూర్య, చంద్ర, నక్షత్రములు, మరియు సమస్థము. మనుష్యుడు, దేవుడు, ప్రకృతి మరియు సమస్తము ఆయనను విడిచిపెట్టెను. ఏదియు అక్కడ నిలబడలేదు, ఆయన ఒంటరిగా చనిపోయెను. ఆయన తన సేవ పోగొట్టుకొనెనా? ఆయన తన సేవను నెరవేర్చుచుండెను, దానిని పోగొట్టుకొనలేదు. అది దానితో బయలు వెళ్ళును. అదియే జరుగును. అది దానితో పాటుగా వెళ్ళును.

JOHN 1:10

 

69ఇప్పుడు, సమస్తమూ ఆయనను విడనాడెను. కాని ఆ సమయములోనే దేవుడు రంగము మీదికి అడుగిడెను, ఎందుకనగా వాక్యమును ఎరిగిన ఏ వ్యక్తి అయినా గాని వాక్యముతో నిలచియుండును, వాక్యమే దేవుని ఎరుగును, చూచారా. వాక్యము తన్నుతాను బయలుపరచుకొనవలసియున్నది. తప్పిపోని వాక్యము తన్నుతాను తప్పక విప్పుకొనవలసియున్నది. అది ఆలాగు కావలసియున్నది, ఎందుకనగా వాక్యమే దేవుడు. గత కాలములలో ఇతరులపై అదెట్లు పనిచేసెనో ఇప్పుడును అదే రీతిగా అది పని చేయవలసియున్నది, ఎందుకనగా అది దేవుడు. దానిని ఎన్నడునూ మరచిపోవద్దు. తాను ఆ వాక్యమును పరిపూర్ణము చేయుచున్నానని యేసు ఎరిగియుండెను. ఆయన ప్రవక్త మాత్రమే కాదు గాని వాక్యము యొక్క సంపూర్ణతయై యుండెను, ఆయన తానే దేవుడైయుండెను. ఆయన వాక్యమైయుండెను. ఆ కారణము చేతనే మనుష్యులు మాత్రమే ఆయనను విడిచిపెట్టుట కాదు గాని ప్రకృతి కూడా ఆయనను విడిచిపెట్టెను. సర్వసృష్టి ఆయనను విడిచిపెట్టెను - సమస్తము, నక్షత్రములు, చంద్రుడు, సమస్తమూ ఆయనను విడిచిపెట్టెను. ఆయన మృతి చెందినప్పుడు వెలుగు లేకపోయెను. సమస్తమూ ఆయనను విడిచిపెట్టెను, చూచారా, ఎందుకనగా ఆయన సర్వమునకు సృష్టికర్త. "ఆయన లోకములో ఉండెను, మరియు లోకము ఆయన ద్వారా చేయబడెను, మరియు లోకము ఆయన ఎరుగలేదు," చూచారా. ఆయన సమస్తమును సృష్టించినవాడు. సమస్తము! అది ఒక్క సంగతి ఏమనగా మనము సృష్టించలేదు, కాని మార్చుటకు ప్రయత్నించుచున్నాము, ఎవరిని మనము మార్చుటకు ప్రయత్నించుచున్నామో వారే విడిచి పెట్టి వెళ్ళిపోవుచున్నారు, చూచారా. వాక్యము తన అసలు రూపమును చూపు సమయము వచ్చినప్పుడు, అది ఆ విధముగానే యుండును. ఇప్పుడు గుర్తుంచుకొనండి, అప్పుడే దేవుడు రంగము మీదికి అడుగిడును.

70మన ప్రభువగు యేసు తన జీవితములోని మొదటి సంవత్సరమున్నర కాలములో గొప్ప అద్భుత కార్యములు జరిగించెను. ఓ, అతడు ఎంత శక్తిగలవాడు! భూమి మీద ఎన్నడూ అట్టి వారు లేరు, అప్పటి నుండి ఇప్పటి వరకు లేరు ఇక ఉండరు. అయితే ఏమి జరిగినది? అందరి కంటే ఎక్కువ హేళనను ఆయన పొందెను. అందరూ పొందిన దానిని కలిపిన దానికంటె ఎక్కువే పొందెను. ప్రకృతి ద్వారా వెక్కిరింపబడెను, అన్నింటి ద్వారాను వెక్కిరించబడెను, ఎందుకనగా అది అంతయు వంకర స్థితిలో యుండెను. ఆ కారణమును బట్టియే మానవుల హృదయములు దేవుని యొక్క నిజ దాసులను హేళన చేయుట జరుగుచున్నది, ఎందుకనగా అది వంకర చేయబడినది. ప్రకృతి వంకర చేయబడినది, అదియే కారణము.

NUM 13:23•

ISA 35:1,6,7

 

71వంకరగా చేయబడిన ప్రకృతియే ఇంత అందముగానున్న యెడల, అది మార్పుపొంది తిరిగి మొదటి స్థితికి వచ్చినయెడల మరెంత అందముగా ఉండును! అది దేవుని చిత్తమునొద్దకు తిరిగి వచ్చిన ఎట్లు౦డును? అసలు స్థితిలో లేని భూమిలోని ద్రాక్షఫలముల గెలలను ఇద్దరు మనుష్యలు తమ వీపుల మీద మోసికొని వచ్చినప్పుడు, అది దేవుని వైపుకు మళ్ళిన భూమియైనచో, మరెంత గొప్పగా కాయును? క్రీస్తు వచ్చును, అప్పుడు ఎడారిలో పుష్పములు పూయును. అది ఒక మార్పుగా ఉండును. ఎండిన స్థలములలో నుండి నీటి ఊటలు ఉబుకును, భూమి పుష్పించును. వికసించును. ఓ, మానవుల హృదయములు దేవుని జనులుగా మార్చబడు కాలము అది. ఇప్పుడు వారు ఎన్నిక చేసికొనుట మీదనే ఆ స్థలములో జీవించుట ఆదారపడియుండును. ఆమెన్.

72"ఆ చీకట్లకి ఘడియలో, రాళ్ళను చీల్చు ధ్వని మరియు ఆకాశములలో కటిక చీకటి మధ్య నా రక్షకుడు తలను వంచి చనిపోయెను; చినిగిన తెర పరలోకపు ఆనందములు మరియు అంతము లేని పగలునకు మార్గమును బయలుపరచినది," అని ఆ కవి పలికెను. మనకు ఒక త్రోవ ఏర్పరచుటకు ఆయన ఆలాగు చేయవలసివచ్చెను. అది నిజము. కాని దేవుడు ఏమి చేసెను? ఆయన వాక్యము పట్ల నమ్మకముగా ఉండెను, మరియు ఆయన సిలువను కౌగలించుకొనెను. కాని ఆయన పరిచర్యకు అది అంతమా? ఆయన సేవ కొట్టుకొనిపోయెనా? ఎన్నడూ ఎవరూ పొందలేని కిరీటముతో దేవుడు ఆయన సేవను అలంకరించెను. ఆయన దానిని ఈస్టరు ఉదయాన, పునరుత్థాన దినమందు ధరింపచేసెను. మన ప్రభువగు యేసు యొక్క సేవకు ఆయన కిరీటము ఇచ్చెను. ఆయన మృతులలో నుండి తిరిగి లేచి సదా జీవించుచున్నాడు. ఆయన కొట్టుకొనిపోలేదు, ఎందుకనగా మనుష్యులందరూ ఆయనను విడిచిపెట్టిరి. కాని దేవుడాయనకు కిరీటము ధరింపచేసెను! అవును, అవునండీ! అవునండీ. ఆయన విడనాడబడెను, గనుక ఆయనకు కిరీటము ధరింపచేయబడెను. మృతులలో నుండి ఆయనను లేపిన తరువాత దానిని ఆయన తప్పక చేయవలెను.

GEN 5:24•

1KGS 17:6•

2KGS 2:11•

HEB 11:5

 

73ఏలియా విషయములో కూడ ఆలాగే యుండెను. కొద్ది క్షణముల క్రితం అతని గూర్చి మనము మాట్లాడుకొన్నాము. పేదవానిగా, ముసలివానిగా నుండిన ప్రవక్తయగు ఏలియా అక్కడ అరణ్యములో ఉండెను, మరియు పక్షులు తెచ్చు భోజనముతో అతడు పోషించబడుచుండెను. గోధుమ వర్ణపు శరీరముతో కనబడే వృద్ధుడైన అతని చర్మము కృశించిపోయినది మరియు ఒక ప్రక్కన చిన్న తైలపు బుడ్డి వ్రేలాడుచుండెను, గడ్డము కూడా బాగా ఎదిగియుండవచ్చును, బహుశా ఆ బట్టతల ఎండకు మాడియుండవచ్చును, ఒక కర్ర మీద ఆనుకొని ఈ విధంగా కుంటుచూ యుండవచ్చును. కాని, ఆ ముసలి హృదయాంతరంగమందు దేవుని యొక్క ఆత్మ కొట్టుకొనుచుండెను. ముసలివాడై, అలసిపోయిన ఆ ప్రవక్త మార్గాంతమునకు వచ్చుట దేవుడు చూచెను, అందరూ అతనిని విడిచిపెట్టిరి, సమస్తమూ పోవుచుండెను. కాని, ఆయన ఆలాగే చూస్తూ ఉండెనా? అలసిపోయిన తను దాసుని పైకి ఎత్తికొని వచ్చుటకు ఆయన ఒక రథమును పంపెను, "నీవు హనోకు నడిచినట్లుగా నడువవలసిన అవసరత కూడా లేదు. నిన్ను ఒక రథములో గృహమునకు తీసికొని పోయెదను." అది నిజము. ఇంటికి రధములో కొనిపోవు కిరీటముతో అతని సేవను దేవుడు అలంకరించెను. అది ఎంతో బాగుండునని మీకు తెలియును. అవును, అతడు ఇంటికి నడచి వెళ్ళు అవసరము లేదు, ఒక రథమును పంపి అతనిని పైకి కొనిపోయెను, ఎందుకనగా అతడు అలిసిపోయెను. అది నాకు ఇష్టము. దీన, చిన్న వృద్దుడై, అలసిపోయిన ప్రవక్తను ఆయన పైకి ఎత్తికొని గృహమునకు కొనిపోయెను.

దానియేలు 6:10,25-27

DAN 6:10,25-27

 

74దానియేలు దేవునికి ఎంతో విధేయునిగా ఉండిన కాలము అటువంటిదే. అతడు లోపలికి ప్రవేశించి… వారిట్లనిరి, "ఆ వ్యక్తి ఒకప్పుడు ఈ రాజ్యములో ఒక గొప్ప వ్యక్తి. అతడు ఎన్నో సంగతులు చెప్పెను. సోదె చెప్పువారికి అతడు నేర్పించెను." మధ్య పారశీకులకు అతడెట్లు చేసెనో చెప్పుకొనిరి. కాని, దర్యావేషు పాలన క్రింద దేవుని పక్షమున నిజంగా నిలబడినవాడు దానియేలే దేవుని వాక్యముతోనే దానియేలు నిలచియుండెను. మరిదేనితోనూ కలువలేదు, మరియు అతడు చెప్పెను, "మంచిది, అతని సేవ కొట్టుకొనిపోయినది, ఎందుకనగా స్థానిక పత్రికలో అది నేను చూచాను. కొద్ది రోజులలో అతడు సింహపు బోనులో పడద్రోయబడును." ప్రభుత్వ చెరసాల లేదా ఏదో విధమైన దానిలోనికి త్రోయబడును. మీరు చూచారా?" అతనిని మనము సింహముల బోనులోనికి త్రోసివేయనై యున్నాము." కాని దేవుడు ఏమి చేసెను? రాజు యొక్క హృదయమును మార్చుట ద్వారా దేవుడతని సేవకు ముద్ర వేసెను, దానియేలు యొక్క దేవునికి ప్రతి ఒక్కరు భయపడవలెనని ప్రపంచమంతటికి, ప్రతి భాషలోను, దర్యావేషు తాకీదు పంపెను, ఎందుకనగా ఆయన తప్పించకలిగిన దేవుడు. ఆమేన్.

కాబట్టి మీరు చూడండి. మనుష్యులు ఒకనిని విడిచిపెట్టినప్పుడు, అనగా ఆ సమయములోనే నిజముగా వాక్యము పక్షముగా నిలచియున్న దైవదాసులను, వారి సేవను దేవుడు కిరీటమును ధరింపజేయు సమయముచే ముద్రించును.

EXOD 20:5•

DEUT 5:9•

DAN 3:12,19,21,27,29

 

75అవును, నెబుకద్నెజరు పరిపాలన కాలములో హెబ్రీయ పిల్లలు, ఆ ప్రతిమకు వారు నమస్కరించలేదు. వారు దేవునికి యదార్ధముగా నుండిరి, ఎందుకనగా దేవుని వాక్యము ఈలాగు చెప్పెను, "ఏ ప్రతిమ ఎదుట వంగరాదు, దానికి పూజ చేయరాదు." వారు వాక్యము పట్ల సత్యముగా యుండిరి. స్థానిక పత్రిక, వార్తలు మొదలగువానిలో దానిని గూర్చి వచ్చెను. వారి దినములలో వారికి ఏదియున్నదో అది. వార్తలను తెలుపుటకు వారు వేర్వేరు విధములను అనుసరించిరి, కాని వారికి ఆ కాలమున వార్తాపత్రికలు లేవు, మీకు ఒక అభిప్రాయము కలుగుటకు అది చెప్పాను. కాని, అక్కడవున్న వానికి అగ్నిగుండమును ఏడురెట్లు వేడి చేయుమని శాసనమాయెను. దానికి అనేక దినములకు ముందే వారు ఆ అగ్నిగుండమును ఏడురెట్లు వేడిచేయుటకు సమస్త పదార్ధములను దాని లోపల వేసిరి. దానిని ఇంకా ఏడురెట్లు వేడి చేయసాగిరి. అటువంటి ఒక అగ్నిగుండము యొద్ద మీరు దానికి వంద గజముల దూరములో వుండగానే అది మిమ్మల్ని దహించివేయును. కాని వారు తిన్నగా ఆ అగ్నిగుండములోనే విసరబడిరి. కాని, అగ్ని వాసన అంటుకొనకుండానే వారు బయటకు వచ్చిరి. నెబుకద్నెజరు ఇట్లనెను, "ఈ దేవుని ఆరాధించని వ్యక్తి, అతని పిల్లలు చంపబడుదురు. అతని ఇల్లు కాల్చివేయబడి పెంట పోగుగా చేయబడును." అది నిజము, చూచారా. అతడు విశ్వవ్యాప్త ఉజ్జీవము వారికి కలిగెను, ఎందుకనగా వారు వాక్యము పక్షమున నిజముగా నిలచిరి. అదే జరుగును. అవునండి, వాక్యముతో నిజముగా నిలచియుండుడి, అవును, దాని ఫలితము అద్భుతముగా ఉండును.

GEN 31:3•

GEN 32:28•

GEN 33:1

 

76యాకోబును గూర్చి కొద్దిసేపు క్రితం ప్రస్తావించాము. అతని పేరును ఇక్కడ నేను వ్రాసియుంచాను. ఇతడు కొద్దిగా పిరికివాడు, కాని అతడు స్థిరుడు, అక్కడ ఏశావును గూర్చి అతడు భయపడెను. తాను దేవునినుండి దూరంగా యున్నానని అతనికి తెలియును. ఇన్ని సంవత్సరములు దేవునికి దూరముగా ఉండెను, కాని వాక్యము పట్ల నిజముగా నిలచియుండుటకే ఆయన ప్రయత్నించెను. ఇక్కడ దేవుడు అతనిని పిలచి, అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పెను. అతడు ఆ చెప్పిన రీతిగానే వచ్చుచుండెను, ఏశావు సైన్యముతో అక్కడే యుండెను. ఆ సమయములోనే అతడు మోసగాడు అను భావముగల "యాకోబు" పేరు నుండి "దేవుని యెదుట రాజకుమారుడు" అను భావమిచ్చు పేరునకు మార్చబడెను, ఆ మరుసటి ఉదయాన అతడు తన సేనకు బహుమానము పొంది వెళ్ళుచుండెను. తిన్నగా వెళ్ళి ఏశావును కలిసికొనెను, అతని నుండి ఏ సహాయము కోరలేదు. ఆమెన్. వాక్యముపట్ల యదార్ధముగా నుండెను. దేవుడు మనలను ఆ విధముగానే చేయును, కాదా? ఆయన తన స్వరీతిలోనే కార్యములను ఆయన చేయును. మంచిది.

77నా సోదరులలో చాలామంది ఈనాడు వారి వారి శాఖల మధ్య శాఖా సోదరుల మధ్య గొప్ప పేరును కలిగియున్నారు. ఒక వ్యక్తి పేరు చెప్పితే చాలు, అది అగ్నివలె పని చేయును. అది నిజము. ఆ ప్రత్యేకమైన వ్యక్తి యొక్క పేరును మీరు ప్రస్తావించాక మరియు తర్వాత సమస్తము, దేవుడు ఒక దినమున నదియొద్ద నాతో మాట్లాడినప్పుడు, ప్రపంచవ్యాప్త ఉజ్జీవమునకు అదే నాంది అయ్యెను, ఆ గొప్ప సువార్తికులలో ప్రతి ఒక్కరూ అందులోనుండియే వచ్చిరి.

వారు తిరిగి తమ సోదరుల యొద్దకే వెళ్ళిరి, చూచారా, ఏ శాఖల నుండి వచ్చిరో అందులోనికే వెళ్ళిరి. వారిక్కడికి వచ్చి కూటములు ఏర్పాటు చేసి శాఖలతో కలిసిపోయి, తిన్నగా వెళ్ళి, వాటిలోనికే మరల చేరుచున్నారు. వారికి గొప్ప అభిమానులున్నారు, రేడియోలలోను, పత్రికలలోను పెద్ద పేర్లను వారు సంపాదించిరి. వారిని గూర్చి అందరూ గొప్పగా, మంచిగా చెప్పుకొనుచున్నారు.

78నేను నిజ వాక్యమును స్వీకరించాను గనుకను, ఆ వాక్యము పక్షముగా నిలబడియున్నాను గనుకను జనులందరూ నన్ను విడిచిపెట్టిరి. ఆయన నాతో చెప్పిన దానికి నేను కట్టుబడి ఇక్కడ ఉన్నాను. వాక్యమును ప్రకటించాను, ఒక శాఖ యొక్క వేదాంతమును కాదు. "వాక్యమును ప్రకటించుము," అనునది నాకియ్యబడిన ఆజ్ఞ, "వాక్యముతో నిలచియుండుము." ఈ టేపును వినుచున్న సోదరులారా, మీ మధ్యకు వచ్చినప్పుడు నేను గొప్ప వ్యక్తినని మీరు తలంచెదరు. రోగులను బాగుచేయుట, దర్శనములను చెప్పుట, జరుగబోవు సంగతులను తెలియచేయుటయే అందుకు కారణము. కాని వాక్య సత్యమును గూర్చి నేను మీతో చెప్పినప్పుడు, మీరెందుకు నా వైపు వీపు త్రిప్పుచున్నారు? లేఖనము చెప్పిన దానిని మీరు నెరవేర్చుచున్నారని గమనించుచున్నారా? అవును, అది ఆ రీతిగానే యున్నది. ఇప్పుడు, ఏ స్థలమునకు వెళ్ళలేకపోవుచున్నాను.

JOHN 1:29,36

 

79ఉత్తరములు ఎప్పుడూ వచ్చుచుండును. ఒక రోజున ఒక దానిలో ఇట్లున్నది, "బ్రెన్హాం సోదరుడా, నీలో నాకు ఎనలేని నమ్మకమున్నది. కాని నేను ఏ శాఖలో యున్నానో ఆ శాఖ వెనుకకు జారుచున్నదని నీవు చెప్పుట విన్నాను. అప్పటి నుండి ఇక నీలో నాకు నమ్మకము తొలగిపోయినది. నా శాఖలోని దాదాపు పాతికమంది సోదరులు నీ కూటములలో ఒక కూటమునకు హాజరయిరి. నీవు ఆ కూటములో ఆ మాట చెప్పిన వెంటనే మేము లేచి వెళ్ళిపోయాము."

సరే, మనుష్యులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిరి, కాని ఒక్క సంగతి, ఆయన నా పక్షమున నిలబడెను! (ఒక్క సంగతి.) ఆ నదియొద్ద నాకు ప్రత్యక్షమయిన పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాను. దానికి నేను నమ్మకముగా లోబడి నిలచియున్నాను. ఆయన నా పట్ల నమ్మకముగాయున్నాడు, ఆయనయందు నేను నమ్మికయుంచుచున్నాను. ఏదో ఒక దినమున, ఎప్పుడో నాకు తెలియదు. ఒక దినమున నా సేవకు కిరీటము ఇవ్వబడును. అది ఎప్పుడో నాకు తెలియదు. నేను నమ్మకముగా ఉండుటకు శాయశక్తులా ప్రయత్నింతును. అదెట్లు౦డునో నాకు తెలియదు, అదెప్పుడో నాకు తెలియదు. ఆయన సిద్దపడినప్పుడు నేను సిద్దముగా యున్నానని చెప్పెదను. నేను [స్పష్టతలేని మాటలు] దీనితో ఆయన నా సేవకు కిరీటము ధరింప చేయునని నిరీక్షించుచున్నాను, వాక్యపు వస్త్రమును నన్ను తీసికొననిచ్చి, ఆయన పెండ్లి కుమార్తెను వాక్యపు వస్త్రముతో ముస్తాబు చేసి ఆయన నీతి కొరకు సిద్దపడునట్లుగా చేయును. ఆయన నాకు కిరీటమును ధరింపచేసి, ఆ దినమున నన్ను నిలబెట్టును అని నిరిక్షించుచున్నాను, అప్పుడు నేను, "ఇదిగో, లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల" అని చెప్పుదును.

80పైకి ఎక్కవలసిన పర్వతములు, ఎన్నో ఉన్నవి, శ్రమతో కూడినదే, కొన్ని సార్లు కష్టముగా ఉండును, కాని ఆ బాటను చూపించుచున్న ఆయనకు ఏది ఉత్తమమైనదో నాకు తెలియును. ఆయనకు తెలుసు ఏది ఉత్తమమైనదో. "ఆ మార్గా౦తమునకు మనము వచ్చినప్పుడు దారిలోని శ్రమలు లెక్కకు రావు." ఆ రక్తసిక్తమైన కాలిబాట కొరకు మనము వెదుకుదము. స్నేహితులారా, గుర్తుంచుకొనండి, ఆ గలిలయ తీరమున పరదేశిగా ఆయన వేసిన అడుగుజాడలను బట్టి ఆ ఇసుక కడుగబడినది; మరియు ఆ కరుకు అలలను జయించిన స్వరము ఇక యూదాలో ఇంకెప్పటికిని వినబడదు. కాని ఆ ఒంటరి గలిలయుని యొక్క మార్గమును, సంతోషముతో నేడు నేను వెంబడించెదను; మరియు మార్గాంతమునకు నేను వచ్చినప్పుడు, ఆ త్రోవలోని శ్రమలు నాకు ఏ మాత్రము లెక్కకు రావు.

81ఆయన నాకిచ్చిన వాక్యభాగములో మొదటి దానిని నేను చదివాను, ఆ సమయములో నేను యువకునిగా ఉన్నాను, ఒక బాలుడను మాత్రమే, భుజములు నిటారుగా నిలిపియున్నాను, గుండె ముందుకు చాపియున్నాను, జుట్టు నల్లగా యుండెను. ఇప్పుడు నేను భుజములు వంచియున్నాను, బట్టతలతో, నెరసిన జుట్టుతో యున్నాను, ఏబది సంవత్సరముల ఒక వృద్దునిగా యున్నాను. కాని దినములు గతించుచుండగా ఆయన మరింత మాధుర్యముగా ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను మీకు ప్రకటించుటకు నేను వెనుకాడలేదు. ఆయన ఏ సంఘము కొరకు చనిపోయెనో, ఆ సంఘము యొక్క అక్కర తీర్చవలెననియే నా హృదయవాంఛ, ఆయన స్వంత రక్తము యొక్క నీతితో దానిని ధరింపచేయవలెను, ఆయన వాక్యముతోను, ఆయన వాక్యము యొక్క నీతితోను దానిని ధరింపచేయవలెను, ఎందుకనగా ఆయన వాక్యము ఎన్నడూ తప్పిపోదు. కాబట్టి, ఆ వాక్యము పక్షమున నేను నిలబడి, ఆ వాక్యము పట్ల నమ్మకముగా యున్నచో, వాక్యము నాలో నివసించినచో నేను ఆయనయందున్నచో ఆ దినమున యదార్ధముగా నిలచియున్నందుకు సంతోషించెదను.

భవిష్యత్తు ఎట్లు౦డునో నాకు తెలియదు, కాని మనము ఎచ్చట యున్నామో మీరు చూచుట లేదా? అందరూ ఏమి చెప్పుచున్నారో చూడండి, నా స్వంత సహవాసులు కూడా కొందరు చెప్పుచున్నారు గదా, "ఎందుకు? సహోదరుడు బ్రెన్హాం యొక్క సేవ కొట్టుకొనిపోయినది," చూచారా. అవును. "అంతా కొట్టుకొనిపోయినది," చూచారా. "ఓహ్, ఎక్కువగా జరుగుచున్నట్లుగా మేము నినుట లేదు," చూచారా. మంచిది, వారికి అది అర్ధము కాదు, అంతే, అది అర్ధము కాదు, చూచారా.

1COR 15:55,57•

2TIM 4:7,8

 

82పౌలు కోరిన అతి గొప్పది ఏదో అతని మాటలను బట్టి నేనిట్లు తలంచుచున్నాను, "ఇప్పుడు నా సమయము అయిపోయినది," అని అతడు చెప్పెను. ఒక హతసాక్షి కావలెననుదియే పౌలు హృదయము యొక్క అతి గొప్ప వాంఛ. ఆ దినములలోని వారందరి హృదయములలోను ఉన్న వాంఛ అదే. మీరు ఎప్పుడైనా "ఫాక్స్ యొక్క హతసాక్షుల గ్రంథమును," చదివారా? నైసీన్ ఆలోచన సభ గూర్చి కూడా చదవండి. అదే అతి గొప్ప ఘనత (పొలికార్పు తదితరులు ఆలాగే ఎంచిరి) వారు సింహముల యొక్క గుహలోనికి నడిచి వెళ్ళిరి. అగ్ని కొయ్యలకు కట్టబడి కాల్చబడుటకు వారు ఆనందముతో కేకలు వేసి నడిచి వెళ్ళిరి, ఒక హతసాక్షిగా ఘనత పోందగోరిరి.

పౌలు ఆ చెలశాల నుండి శిరచ్ఛేదనము చేయబడుటకు నడిపించబడెను, అది ఒక అసహ్యమైన, పాత స్థలము, గోడకు ఒక రంధ్రముండెను, అతనిని అక్కడే వారుంచిరి, ఆ స్థలమునకు వెళ్ళి దానిని చూచాను. అత్తి వెనుకనేయున్న ఒక చిన్న ఏటిలో అతని శరీరమును వారు త్రోసివేసిరి. ఇప్పుడు అతనిని ఒక పరిశుద్ధునిగా లేదా మరేదో మహా వ్యక్తిగా చిత్రించుచున్నారు. అదే గుంపు ప్రజలు! అతడు అక్కడికి నడిచి వెళ్ళెను. అతడిట్లు పలికెను, "ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయమెక్కడ? ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి వందనములు. నేను మ౦చి పోరాటము పోరాడితిని. నా పరుగును తుదముట్టించితిని. నా విశ్వాసము కాపాడుకొంటిని. నా కొరకు ఒక కిరీటము దాచబడియున్నది, నాకు మాత్రమే కాదు గాని, ఆయన ప్రత్యక్షతను ప్రేమించువారందరికి అది దాచబడియున్నది."

83ఇప్పుడు మనము 6వ వచనము నుండి 18వ వచనమునొద్దకు వచ్చి యున్నాము. అది నా కొరకు ఎట్లు వర్తించుచూ చదువవలెనో నాకు తెలియదు గాని, ఇతరుల కొరకు దానిని చదివి ఎట్లు వర్తింపచేయవలెనో చెప్పెదను. ఆయన పని పూర్తియగు వరకు వాక్యము పట్ల నమ్మకముగా యుండుటను నేను కొనసాగించెదను. ఈనాడు సేవ యొక్క దశ అక్కడే యున్నది. నేను కొట్టుకొనిపోలేదు. నేను ఇప్పుడు రాజ్యములోనికి కొట్టుకొని వచ్చాననుకొనుచున్నాను. అది నిజము. మనము ప్రార్థనకు తలలు వంచుదము.

84ఈ రాత్రి సింహాసనము నుండి క్రిందికి ఒక త్రాడు వ్రేలాడుచున్నది, దానిని జీవనదారి అని పిలచుదుము. నేను ప్రార్ధించుచుండగా, అది ప్రతి మార్పు పొందని ప్రతి వ్యక్తిని ఇక్కడ పట్టుకొనుటకు వచ్చును. పాపియగు స్నేహితుడా, నీవు లేచి మరియు దానిని పట్టుకొనవా?" "బ్రెన్హాం సోదరుడా, నీవు ముసలివానివి అయిపోవుచున్నట్లు చెప్పుచున్నావు, మరియు అందువలన ఈలాగనుచున్నావా?" అని మీరడుగవచ్చును. కాదు, సోదరుడా, సోదరీ, నేను ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడే, దానిని నేను నమ్మాను. దానికొరకు నేను నా జీవితమును ఇచ్చాను. ఒకే ఒక చింత నాకున్నది, అదేమనగా, నాకు ఇచ్చుటకు ఒకే ఒక జీవితమున్నది. నాకు పదివేల జీవితములున్నచో వాటినన్నిటినీ దానికొరకు ఇవ్వగోరుదును, అవును.

ఈ రాత్రి నీ మార్గము ద్వారా ఆ గీత దాటిపోవుచుండగా, దానిని నీవు పట్టుకొనవా? నీవిట్లు అనవచ్చు, "బ్రెన్హాం సోదరుడా, దానిని పట్టుకొను యోగ్యత నాకు లేదు. బిడ్డా, నీకు లేదని నాకు తెలియును. కాని యోగ్యత పొందుటకు నీవు ఏదో ఒక పనిచేయవలెను. నీవేమి చేశావో నాకు చెప్పుము, దానిని నేను కూడా చేయగోరుచున్నాను. యోగ్యత పొందుటకై నీవు చేయకలిగినది ఏదియూ లేదు. నీవు అయోగ్యునిగానే జన్మించావు. నీవు చేయకలిగినది ఒక్కటి మాత్రమే యున్నది, నీ కొరకు తయారుచేయబడిన మార్గమును పట్టుకొనుము. నీవు మునిగిపోవుచున్నావు, దానిలో నీవు మునిగిపోవద్దు. దేవుడు జీవనాధారమును విసరియున్నాడు, ఈ రాత్రి దానిని చేరుకొని పట్టుకొనుము.

ROM 1:16

 

85మా పరమతండ్రి, ఆ ఉదయమున ఇదే స్థలములో, ఇదే బల్లయొద్ద నేను చెప్పిన దానిని జ్ఞాపకము చేసికొనుచున్నాను, అప్పుడు నేను ఇదే నేలమీద సంఘమును ఇక్కడ ప్రతిష్టించాను. ఆ మూలరాయి అక్కడే యున్నది, బైబిలులోని ఒక పేజీ మీద నేను వ్రాసినది ఇంకా ఆలాగే యున్నది. నేనిట్లు చెప్పాను, "ప్రభువగు యేసూ, నీ కృపను బట్టి వాక్యమునకు నేను నమ్మకముగా యందును." ఇతర సమయములో అది ఎట్టి ఫలితమునిచ్చెనో, అదే ఫలితమును ఇప్పుడిచ్చట నేను ఇచ్చుచున్నాను.

ప్రపంచ పర్యటన జరిపిన తరువాత మరల తిరిగి ఈ రాత్రి ఈ ఆలయములో నేనున్నాను, ఆ చిన్న మూలరాయి ఇంకా ఇచ్చట పడియున్నది, దానిలో ఆ పేపరు ఉన్నది. ప్రభువా, నన్ను పరిశోధించుము. నేను చాలా తప్పులు చేశాను. ప్రభువా, నేను పొరపాటు చేశాను. నేను చాలాసార్లు తప్పిపోయాను. కొద్దిసేపటి క్రితం ఒక వైఫ్యలము గూర్చి నేను చెప్పాను. దేవా, నేను దానిని చేయుటకు త్వరపడుచున్నాను, నాకు క్షమాపణ కావలెను. నా హృదయములో నిన్ను నేను ప్రేమించుచున్నాను. మేము వెళ్ళుచున్న చోటును ఈ మధ్యనే నీవు నాకు చూపించితివని నాకు తెలియును, ప్రభువా, ఎప్పుడు నీవు నాతో పని ముగించుకొందువో నాకు తెలియదు. నేను ఈ రాత్రి ఇక్కడయున్నాను, నేను నీ కృపను బట్టి, మరియు నీవెప్పుడు ముగించెదవో నాకు తెలియదు, కాని ఇది ఇక్కడకు రావలసియున్నదని నాకు తెలియును. కాని ఆ సమయము వచ్చినప్పుడు పిరికివానిగా నేనుండగోరుటలేదు. వారందరివలెనె నేనును నిలబడగోరుచున్నాను.

కాని, దేవా, నా సాక్ష్యమును నా స్వంత జీవితముతో ముద్రించవలసివచ్చినా, లేక మరేమి జరిగినా, అప్పుడు దానికి కిరీటము ధరింపచేయుము. నాకు కిరీటము ఇచ్చుట కాదు, ప్రభువా, నేను బోధించిన సేవకు కిరీటము దయచేయుము, ప్రభువా, అది నీ వాక్యము. ఆ వాక్యము నన్ను పునరుత్దానమందు లేపుటకు కావలసిన శక్తి కన్న ఎక్కువ శక్తిని కలిగియున్నదని నేనెరుగుదును. నేను బోధించిన వాక్యమును గూర్చి సిగ్గుపడను, ఎందుకనగా అది నమ్మువారందరినీ రక్షించు దేవుని శక్తియై యున్నది.

MATT 16:18

 

86నేటికిని ఇంకా నిలబడియున్న ఈ చిన్న సంఘమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాను. వాక్యము పట్ల ఆలాగు నేను నిలబడినప్పుడు ప్రవక్తలు ఈలాగు ప్రవచించి మరియు చెప్పిరి, "ఆరు నెలలలో ఇది గ్యారెజిగా (పాత మోటారు వాహనములను సరిచేయు స్థలముగా) తయారగును." కాని ముప్పది సంవత్సరములు గతించాయి. గత సంవత్సరములలో ఉన్న దానికంటె మరింత మంటతో నేడు ఇది యున్నది. "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును." మా సంఘ కాపరిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాను. డీకన్లు, ట్రస్టీల కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము అందరమూ ఒక చిన్న పాత్రను పోషించవలసియున్నాము. దానిని మేము నమ్రతతో నిర్వర్తించవలెను, దానిని సరిగ్గా మేము నిర్వహించగోరుచున్నాము.

ప్రభువా, ఈ రాత్రి మాతో చేరగోరువారు కొందరు ఇక్కడ ఉండియుండ వచ్చును, అయితే వారు ఈ చిన్న జీవనాధారముగు పట్టుకొని, లాక్కొని, తమ మణి కట్టుకు కట్టుకొని తమ హృదయుములో ఈలాగున పలుకుట ద్వారా మాతో చేరుదురు గాక, "ప్రభువా, ఇప్పుడు నన్ను లాగుము. పైకి ఎత్తుము." వారు ముందుకు వచ్చి బంగారమువలె మెరయుదురు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మేము ఆ సమయము కొరకు ఎదురు చూచుచున్నాము.

JOHN 1:29,36

 

87దాని అంతము సమీపములో ఉన్నదని మనము నమ్ముచున్నాము. ఇక్కడ మనము బోధించుచుండగా దానిని మనము చూచుచున్నాము. లవొదికయ సంఘ కాలము గూర్చి ఇప్పుడు బోధించుచున్నాము. ప్రభువా, రాకడ తప్ప మరేదియూ జరుగబోవునది లేదని మేము చూచుచున్నాము. ప్రభువా, కిరీటియైన ఆయనే తిరిగి వచ్చుటను చూచుట, వాక్యమునకు గొప్ప కిరీటము కాదా? నేను నిలబడి ఈలాగు చెప్పగోరుదును, "అదిగో గొర్రెపిల్ల అక్కడ ఆయన ఉన్నాడు." యోహాను వలె చెప్పెదను. "ఇదిగో మనము కనిపెట్టి ఎదురుచూచిన గొర్రెపిల్ల ఈయనే." ప్రభువు తన ఆలయమునకు త్వరగా వచ్చును, ఎత్తబాటులో తన ప్రజలను తీసికొనిపోవును.

తండ్రీ, మమ్మును సిద్దపరచుము. నీ రక్తములో మా హృదయములను కడుగుము. నీ వాక్యము మాలో నివాసము చేయునట్లుగా మమ్మును పవిత్రముగాను, శుభ్రముగాను చేయుము. వాక్యము మీద మేము తప్పక పని చేయవలెనని మాకు జ్ఞాపకము చేయుము, అప్పుడే క్రమముగా దానిని పట్టుకొనునప్పుడే అది సార్ధకమగును. ప్రతి పాపియు పశ్చాత్తాపపడునట్లు చేయుము. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించుము. పరిశుద్ధులు, వృద్ద ప్రశస్తమైన యోధులు కొందరు, ప్రభువా సంవత్సరాల తరబడి పోరాడుచూ యున్నారు, హేళన చేయబడిరి, వెక్కిరించబడిరి, దూషించబడిరి. వారింకా ముందుకు సాగిపోవుచున్నారు, ఎందుకనగా వారు జీవమును పొందిరి, తాము నమ్మిన వానిని వారెగుదురు. ఆయనకు తాము అప్పగించిన దానిని ఆయన కాపాడగల సమర్ధుడని వారెరుగుదురు. దానికై మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. మా మధ్యనున్న రోగులను నీవు బాగుచేయుమని ప్రార్ధించుచున్నాము. మా రోగములను, సమస్త పాపమును తీసివేయము. తండ్రియగు దేవా, నీవే మహిమ పొందుము.

88ప్రభువా, చాలామంది ప్రశస్త స్నేహితులు నాకున్నారు, వారిని నేను ప్రేమించుచున్నాను. గడచిన కాలములలో కూడా ఉండిన ఇతరులను నేనెరుగుదును. ప్రశస్త స్నేహితులు, చక్కని స్నేహితులు, యువకులు మరియు వృద్ధులు ఉన్నారు, మా హృదయమ౦తటితో వారిని నేను ప్రేమించుచున్నాము. ప్రభువా, ఇప్పుడు మమ్ము యధార్దవంతులుగా చేయుము, దుఃఖము మరియు వేదన ఎన్నడూ ఉండని ఒక శ్రేష్టమగు దేశములో ఒక దినమున మేము వారిని కలిసికొనునట్లుగా వాక్యముపట్ల యదార్ధముగా నిలబడునట్లు సహాయము చేయుము. త్వరలో జరుగు ప్రభువు రాకడ కొరకు మేము ఎదురు చూచుచున్నాము. ఆయన వచ్చునని మేము నమ్ముచున్నాము.

ప్రభువా, ఈ రాత్రి ఇక్కడున్న అవిశ్వాసిని ఆశీర్వదించుము, అతడు ఒక విశ్వాసియై ఈ రాత్రి నిన్ను తన రక్షకునిగా అంగీకరించును గాక.

89నేను తలలు వంచియుండగా, మాతో పాటుగా తలలు వంచిన వారెరవయినా ఈలాగు చెప్పవచ్చును, "బ్రెన్హాం సోదరుడా, నా హృదయాంతరంగమందు నేను మార్గాంతమునకు మంచి పోరాటముతో రావలెనని కోరుచున్నాను. నేను క్రైస్తవుని కాగోరుచున్నాను. నా చేతిని ఎత్తగోరుచున్నాను." దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. అది మంచిది. దేవుడు నిన్ను, మిమ్మును దీవించును. "నా వెనుక మంచి పొరాటము పోరాడి, నేను నా మార్గాంతమునకు రాగోరుచున్నాను. ఇప్పుడే నేను క్రీస్తును అంగీకరించుచున్నాను. ఆయనను నా సహాయకునిగా నేను కోరుచున్నాను." మంచిది, ప్రభువు నిన్ను దీవించును. ఆ వెనుకనున్న స్త్రీని దీవించును ప్రభువు నిన్ను ఎరుగును. ఈ సంవత్సరములన్నింటిలో నేను ఆయన గూర్చి నేర్చుకొనియున్నాను, సుమారు ముప్పది సంవత్సరములు ఈ వేదిక వెనుక నిలబడియున్నాను, చాలినంత ఇప్పుడు నేనాయన గూర్చి నేర్చుకొనియున్నాను. నీ ప్రతి కదలికను ఆయన ఎరుగునని నాకు తెలిసినది. ఆయన పిచ్చుకను చూచును. నీ తల వెంట్రుకలు లెక్కించబడియున్నవి. చూడండి, మీ గూర్చి అంతయూ ఆయనకు తెలియును. నీవు నీ చేతిని ఎత్తి అర్ధవంతముగా దానిని భావించుము, నీవు చేయవలసినదంతయు అదే. అక్కడ నీరు సిద్దముగా యున్నది.

ACTS 2:38

 

90గుర్తుంచుకొనండి, మీరేమి చేయుదురు? మీరు మారుమనస్సు పొంది సువార్తను నమ్మి, బాప్తిస్మము పొందుడి. ఎందుకొరకు? మీ పాపక్షమాపణ కొరకు యేసు నామములో బాప్తిస్మము పొందుడి. మీరేమైయున్నారో అందుకు అది సాక్ష్యము. మీరు బాప్తిస్మము పొందినప్పుడు, మీ పాపములు పోవును. మీరు వాటిని ఒప్పుకొనియున్నారు, మీరు విశ్వాసముంచియున్నారు. మీ హృదయము మీదుగా ఆ జీవపు గీత వచ్చుచుండగా దానిని మీరు పట్టుకొనుడి. "యాత్రికుడా, ఇటువైపు రమ్ము. నాతో ప్రయాణము చేయుము. నా సిలువను ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుము, ఎందుకనగా నేను స్వాతికుడను, దీనమనస్సుగలవాడను, నా భారము తేలికగా యున్నది," అని ఆయన చెప్పుచున్నాడు. దానిని అందుకొని పట్టుకొనండి.

91చాలా కాలము క్రితమే ప్రారంభించియున్నామని, ఈ రాత్రి సంతోషముగా యున్నామని చెప్పగల క్రైస్తవులు ఎ౦దరున్నారు? మీరు ప్రారంభించారు, మార్గములో వచ్చుచున్నారు, ఇంకా మార్గాంతమునకు రావలసియున్నారు, మీ సేవ ఏ విధమైనదయినాగాని దేవుడు దానికి కిరీటమును ధరింపచేయవలెనని నేను ప్రార్ధించుచున్నాను. అది ఒక గృహిణిగా సేవ కావచ్చును. మీ సేవకు దేవుడు కిరీటము ధరింపచేయవలెననియే నా ప్రార్థన. మీరు ఒక బోధకులు కావచ్చును, ఒక పెద్ద కావచ్చును, ఒక విశ్వాసి కావచ్చును, ఒక వ్యవసాయదారునిగా ఉండవచ్చును, అది ఏమిటో నాకు తెలియదు. అది ఏమయినా గాని దేవుడు మీ జీవితమును తన వాక్యము యొక్క మహిమతో కిరీటము ధరింపచేయును గాక. తన రెండవ రాకడలో మిమ్మును కొనిపోవును గాక, మిమ్మును మరొక దేశమునకు తీసికొని వెళ్ళును గాక. అక్కడ మీరు నేను కొద్దిసేపటి క్రితం చెప్పిన ఆ చేపవలె అనుభూతి పొందెదరు, ఆ అంధకారము నుండి బయటకు వచ్చెదరు. అంతరిక్ష యాత్రికులవలె మీరు వెళ్ళలేరు, చూచారా, మీరు ఒక ఒత్తిడితో నింపబడిన టాంకులో ఉండవలసియున్నారు. మీరు దానికొరకు ఒత్తిడితో నింపబడనవసరము లేదు. అయితే దేవుడు మిమ్మును మార్చినప్పుడు, అప్పుడు మీరు ఒత్తిడి పొంది రాకడలో ఎత్తబడుదురు. ఈ పాత భూలోకపు అనుభూతులు నశించినప్పుడు మీరు ఆ మహిమకరమగు సిలువ దారిలోనికి వెళ్ళెదరు. యేసుతో గృహమునకు వెళ్ళుచున్నారు.

92ఇప్పుడు, తండ్రియగు దేవా, క్రైస్తవులుగా ఉండగోరుటకు పైకెత్తబడిన ఈ హస్తములను బట్టి నీకు మేము వందనములు చెల్లించుచున్నాము. వారు తమ హృదయములలో దీనిని అర్ధవంతముగా గ్రహించి చెప్పిరని మేము నమ్ముచున్నాము. వారు ఎన్నడు తప్పిపోరాకూడదు అని నేను వారికొరకు ప్రార్థించుచున్నాను. వారొక వేళ తప్పిపోయిన యెడల, వెంటనే వారు తండ్రిని వేడుకొందురు గాక. ఏ సమయములోను వారు తండ్రి, నేను తప్పిదములు చేసినప్పుడు, తండ్రియొద్ద నేనొక గొప్ప సంగతిని నేర్చుకొనియున్నాను, యేసుక్రీస్తు ద్వారా ఆయన నాకు ఉన్నాడు (వెనువెంటనే) వేడుకొనుటకు ఒక ప్రతివాది నాకున్నాడనే దానిని నేను కనుగొంటిని, మరల నేను కృపలోనికి తీసికొని రాబడుదును. ప్రభువు యొక్క ప్రేమ హస్తము తుడిచివేయుము. ఆయనను నా రక్షకునిగా అంగీకరించినప్పుడు ఒక రుధిర బలి అక్కడ నా కొరకు యున్నది.

వ్యాధి, అక్కరలలో ఉన్న వారందరూ తమ రోగములకు స్వస్థతను, అక్కరలకు జవాబును పొందుదురు గాక! నీవే తీర్చమని ప్రభువా ప్రార్థించుచున్నాను. మహిమ కరమగు పరిశుద్దాత్మ యొక్క అభిషేకము క్రింద ఇప్పుడు ఇక్కడ కూర్చొనియున్న వారు, అది మా ఆత్మలలో, మధురమైన అనుభూతిని క్రుమ్మరించుటను మేము గ్రహించుచున్నాము.

93తండ్రియగు దేవా, ఒక రోజున కెనడా నుండి వచ్చుచూ ఏమి ఆలోచించుచుంటినో నీవెరుగుదువు. ఇట్లు తలంచాను, "ఓ! పాత-కాలపు ఉజ్జీవమును మరల పొందినచో ఎంత బాగుండును! దేవుని పరిశుద్ధులు పాడుచుండగా దేవుని శక్తి దిగి వచ్చుచుండెను." ప్రభువా, నా హృదయము దానిని ఎంతగా ఆకాంక్షించుచున్నది! ఈ ఆలయములో అట్టి ఉజ్జీవము కలుగును గాక! దేవుని యొక్క శక్తి కృపా ప్రవాహములుగా కుమ్మరించబడి ప్రతి హృదయములోనికి వెళ్ళును గాక.

ప్రభువా, ఈ చిన్న స్థలము కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాను. దీనిని ఈ విధముగా ఉంచు సామర్థ్యము మాకు లేదు, నీ కృపయే దానిని ఆత్మ సంబంధముగా ఉంచినది, ఇప్పుడు ప్రభువా, నేను నమ్ముచున్నాను. దేశములోని అతి గొప్ప ఆత్మ సంబంధ స్థలము, నాకు తెలిసినంతవరకు, ఈ ఎనిమిదివ పెన్ వీధిలోనే ఉన్నది. ప్రభువా, దీనిని బట్టి ఎంతగా నీకు వందనములు చెల్లించుచున్నాను! సంఘములోనికి వెళ్ళి చూచుచున్నాను, అవి చల్లగా మరియు విభేదములతో యున్నవి, స్త్రీలు బహు ధైర్యముగా యున్నారు, కనీసము వారికి సిగ్గు కూడా లేదు. ఒక "ఆమేన్" గాని లేదా ఒక కన్నీరు గాని వారి బుగ్గల మీద లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు, కేవలము సంఘములో చేరి తమ విశ్వాస ప్రమాణము వల్లించుచున్నారు. ఓ దేవా, చిన్న ఈ మాధుర్య స్థలములోనికి వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఉంటున్నది, ప్రతి హృదయ బలిపీఠము మీదను అగ్ని రాజకొనుచున్నది. తండ్రీ, ఇది ఎంత ఆదరణ! ఎంత ఆదరణ తండ్రీ! నీకు వందనములు, ప్రభువగు యేసు రాకడవరకు అది అలాగే నిలిచియుండును గాక! మా అందరినీ ఇప్పుడు దీవించుము.

94రేపు సబ్బాతు, "అవరోహణ లెక్కింపు" (Countdown) అను ప్రసంగము చేయుట నా అంశము అయిన యెడల, ప్రభువా, ఉదయమున నాకు సహాయము చేయుము. దేవా! దానిని ప్రజలు చూడగలుగు రీతిగా నేను తీసికొనిరాగల శక్తిని నాకు దయచేయుము. మరిప్పుడు సేవయొక్క దశ ఏమిటో, అది ఎక్కడున్నదో, దేనికొరకు మేము ఎదురు చూచుచున్నామో, ఎందువలన ఇదంతయూ ఇలాగు కొనసాగుచున్నదో వారు చూచెదరు గాక. వారు 5వ వచనము నుండి ముందుకు చదివి, మేము నిలబడియున్న చోటును గ్రహించెదరు గాక.

ఇప్పుడు తండ్రీ, నీవు మమ్మును దీవించి మా శరీరములకు మంచి విశ్రాంతిని ఇచ్చి, రేపు మరల తీసికొని రమ్మని ప్రార్థించుచున్నాను. ఈ గోడల చుట్టు నిలబడియున్న వారిని, ఒక కాలి మీద ఆనుకొని నిలబడియున్న వీరందరినీ ఆశీర్వదించుము. స్త్రీలు, పురుషులు వానలో అక్కడ నిలబడిరి, కిటికీల ప్రక్కన నిలబడిరి, వారు వారి కార్లలో కూర్చొనిరి, ప్రభువా, వారిని దీవించమని ప్రార్ధించుచున్నాను. వారు తమ హృదయములో దేవుని కృపను ఉంచుకొని ఇంటికి వెళ్ళుదురు గాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.

95ఇప్పుడు మీకు అర్ధమయినదా? II తిమోతి 2:4 మొదట, ఆ తరువాత II తిమోతి 4, 5వ వచనము నుండి, ఈ రాత్రి పడకలను మీరు వెళ్ళకముందు సాధ్యమైనయెడల చదవండి. మనము ఎక్కడున్నామో మీరు చూడగలరు. ఆ జనులు ఎందుకు ఆయనను విడిచి పెట్టిరి? ఆయన పరిచర్యను ఈనాడు మనము చేయుచున్న సేవతో సరిపోల్చి చూడండి. పరిశుద్ద, పౌలు యొక్క ఉపదేశమును పోల్చి చూడండి. నేను చూచిన ఆ చిన్న పరలోక దర్శనములోనిది గుర్తుంచుకొనండి. "పౌలు జనులతో పాటు నిలబడవలసియుండునా?" అని నేనడిగాను.

"అవును" అని వారనిరి.

"అతడు బోధించిన వాక్యముతోనే నేను బోధించాను. అదే సువార్తతో నేను నిలచియున్నాను" అని చెప్పాను.

"దానిమీదనే మేము విశ్రమించియున్నాము" అని వేలాదిమంది చేతులు ఊపియున్నారు.

ప్రభువు మిమ్మును దీవించును. మీరాయనను ప్రేమించెదరా? "మనము కలుసుకొను వరకు! మనము కలిసికొనువరకు! యేసు పాదముల యొద్ద మనము కలిసికొనువరకు!"

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...