అవరోహణ లెక్కింపు

అవరోహణ లెక్కింపు

VGR COUNT-129 1నెవిల్ సోదరుడా వందనములు. దేవుడు మిమ్మును దీవించును గాక. నేనెప్పుడు తొందరపడుచునేయుందును. నేనిప్పుడే లోపలకు వచ్చుచుండగా, సోదరులు ఫోన్ చేసి, వారి పెంతెకోస్తు యాబై-సంవత్సరపు-జూబిలీని తెలియచేసారు. అప్పుడు నేను సేవా వ్యాపార మనుష్యులతో ఇతర స్థలములలో తేదీలు నిర్ణయించుటకు ప్రయత్నించుచుంటిని అప్పుడు నేను ఆ స్టోనును ఇటు త్రిప్పి, "'ఓన్లీ బిలీవ్' అను పాటను వినుచున్నారా? దాని భావమేదో మీకు తెలియునని" చెప్పాను. నేను ఆ ఫోనును బిల్లీకి ఇచ్చివేసి తలుపు మూసికొన్నాను. అందువలన, వారక్కడ నుండి ఎలా తిరిగి వచ్చారో నాకు తెలియదు, అయితే నిజముగా నేను లూసియానాకు వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను. అక్కడ వారు పూర్వపు మంచి దక్షిణ ప్రాంతపు ప్రజలై యున్నారు. అయితే ఆ తేదీలతోనే మరలా నేను ఫ్లోరిడాలో ఉండవలసియున్నది, అక్కడ పాంత్రీయ వ్యాపారుల సమావేశములో కలసికొనవలసియున్నది. ఈ విధముగా రెండింటిని జత చేసినప్పుడు అది ఒక రకమైన క్లిష్టపరిస్థితిని ఒక్క క్షణములో ఆ విధముగా ఏర్పరచుచున్నది.

2ఈ ఉదయము మనమందరము ఇక్కడ ఉండుటలో ఎంతో సంతోషించుచున్నాము. మనము సజీవులలో లెక్కింపబడి, "ఆమేన్" అనుచున్న వారి మధ్య ఉన్నాము. అది మంచిది. ఇప్పుడు, ఇక్కడ మనమందరము క్రిక్కిరిసి యున్నందుకు నేను చింతించుచున్నాను. కొందరు వచ్చి వెంటనే వెళ్ళిపోయారని అతడు చెప్పాడు, అయితే ఈ సమయములో ఇంత వరకే మనము చేయగలిగిన స్థితి ఉన్నది. మీరు గ్రహించారని నేను నమ్ముచున్నాను. నన్ను మన్నించండి, మీరు క్రమముగా వినగలుగుచున్నారా? దీని ద్వారానా, లేక దాని ద్వారానా (అక్కడున్న మైకులను చూపుచు చెప్పుచున్నాడు) ఇక్కడున్న దీని ద్వారా? మంచిది. ఈ చుట్టును బాగుగా వినబడులాగు చూచుకొనండి. నేను ముగించుచున్నాను. (ఇక్కడున్న మాటలను పదిలపరచు రికాడర్లు బాగున్నాయా? మంచిది. అయ్యా, బాగున్నాయి.)

3మంచిది, గత రాత్రి మీరు సంతోషించారా? నిశ్చయముగా మనము దానిని (ఆత్మను) పొందితిమి, దేవుడు మనలను దీవించెను. అక్కడ అనేక కార్యములలో ఈ వర్తమానములను గురించి చెప్పబడినది. మీరు కూడ వాటిని గమనించియుందురని నేను తలంచున్నానని, మీకు తెలియును గదా, వాక్యములలో మనము జీవించుకాలమును, మీరు గ్రహించారు, మనమిప్పుడు చివరి కాలములో ఉన్నాము. నేను దానిని నమ్ముచున్నాను. బహుశా ప్రతి వ్యక్తి దానిని గురించి తలంచుచున్నారని నేను ఊహించుచున్నాను. యేసు తిరిగి వచ్చెదనని చెప్పినప్పటి నుండి జరుగుచునేయున్నది. అయితే ఈ రోజులలో ఒక దినమున ఆయన రానున్నాడని, అది ఎట్లయినను జరుగునని మీకు తెలియును, చూచారా. అందువలన జరుగవలసినదేదియు విడిచి పెట్టబడలేదని నేను చూచుచున్నాను, మిగిలినది సంఘము ఎత్తబడుట మాత్రమే.

4ఇప్పుడు మనము వర్తమానమును చేరుటకు ముందు ఈ ఉదయ కాలము "అవరోహణ లెక్కింపు" అను అంశమును తీసికొనవలెనని నేను ఇష్టపడుచున్నాను. ఇప్పుడు మనము, ఈ రాత్రికి జ్ఞాపకముంచుకొనండి. ఈ రాత్రి ఆరాధనలో "ఆయన సన్నిధిలో జీవించుట" అను దానిపై మాట్లాడనున్నాను, చూశారా. మనము త్వరపడుటకు ప్రయత్నించెదము. అందువలన మీరు త్వరగా వెడలిపోయి రేపు సోమవారము ఉదయము మన పనులలో చేరవచ్చును. మీ అందరి నిమిత్తము నేనేమౌదునో నాకు తెలియదు. మీరు లేనిదే నేను ముందుకు వెళ్ళలేను.

MATT 25:40

 

5ముఖ్యముగా సోదరి విలియమ్సుకు ప్రత్యేక వందనములు తెలుపుటకు ఇష్టపడుచున్నాను. ఆ స్త్రీ ఎవరని నాకు తెలియదని నేను ఊహించుచున్నాను. నేను ఈ ఉదయము లేచినప్పుడు, నా సోదరుడు చార్టీ కాన్స్ అక్కడ ఉన్నాడు. ఆ ద్వారపు పిడిపై ఆహారము పడియుండినది. బెత్తపు సామానులతోను ఇతర వస్తువులతోను నిండియుండినది. ఏ విధముగా ఆ పేద స్త్రీ ఈ వేసవిలో ఆ వస్తువులను చేసినది, మరియు టమాటోలు ఇతర ఆహార వస్తువులను తెచ్చినది. అది నాకెంతో అధికముగా ఉన్నది. సోదరి విలియమ్స్, ప్రార్ధి౦చుట కొరకు వారు నీ బైబిలును అక్కడ విడచి వెళ్ళారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఆమెను (దీవించునట్లు) ప్రార్థించమని చెప్పారు. నేను వర్తమానమును సిద్ధపరచుకొనుచుండగా ఉదయము నేను ప్రార్ధించాను. దేవుడు ఆ పరిశుద్ధ గ్రంధములోని సారాంశమును తీసికొని మీ హృదయములో ఉంచునట్లు ప్రార్ధి౦చాను. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థించాను. నేను నీకు దాని ఖరీదును చెల్లించాలని ఆశించుచున్నాను సోదరి. నీకు ఎంతగానో చెమటలు పట్టి యుండునని నాకు తెలియును. దాని నిమిత్తము ఎంతో వందనస్తుడను. అలా చెప్పుటకు ఇదంతయో స్వల్పము, అయితే నీకొక లేఖనమును ఇచ్చెదను, మనకది తెలిసినదే, గత రాత్రి నేను చెప్పినట్లు, అది తప్పిపోదు. యేసు ఇలా చెప్పెను, "ఈ చిన్న వారికి మీరెంతో చేశారు," అది అలాగే వున్నది చూశారా, "నా వారైన ఈ చిన్న వారికి మీరు చేసినప్పుడు, అది నాకు చేసినట్లే." అది వున్నట్లే అది నీకు తిరిగి వచ్చును గాక. నీవు సూటిగా ఆయన చేతులకు ఇచ్చివేశావు. దాని నిమిత్తము దేవుడు నిన్ను దీవించును గాక.

6మీకందరికి వందనములు. మీరిక్కడ ఉండినప్పుడు మీరు చెల్లించిన కానుకలును, దశమ భాగములును, మాలో మీరు కలిగిన నమ్మకముగా ఉన్నది. అది దేవుని రాజ్యము నిమిత్తము వెళ్ళును. ఇప్పుడు మనము దాని నిమిత్తము బాధ్యులమైయున్నాము, చూశారా, దానికి లెక్కచెప్పవలసి యున్నది. కాబట్టి మనము చేయు ప్రతి కార్యమును మనము గమనించవలసియున్నది. మనము చేయగలిగినంత ఖచ్చితముగా, మన ప్రభువు దానిని ఇష్టపడిన విధముగా దానిని చేయవలసియున్నది, ఎందుకనగా ఆయన మనలను ఎప్పుడు పిలచునో మనకు తెలియదు. మనము అప్పుడు జవాబు చెప్పవలసిన వారముగా ఉన్నాము. మరియు మన మార్గములో వచ్చు ప్రతి దానికి మనము లెక్క చెప్పవలసియున్నది.

ఆ కారణము చేతనే గత రాత్రి పౌలును గురించి నేను యోచించినప్పుడు, ఆయనకు ఒక అంగీ మాత్రమే ఉండినది, చూశారా. అతడు అధికముగా కలిగియుండవచ్చును గాని, అలా చేయలేదు. ఆ ఒక్క అంగీని అతడు ఒక్కసారి వాడుకొనగలడు. అందువలన అతడు ఆ ఒక్కదానిని ఉంచుకొనెను. ఇప్పుడు అతడు ఈ లోక సంపదల కొరకు ఆశించెనని నేను తలంచుట లేదు. అతడు పలుకుబడి కొరకు ఆశించెనని నేను తలంచుట లేదు. నేను దేనిని భావించుచున్నానో మీరెరిగి యున్నారు. ప్రతి ఒక్కరు వారి వారి మతపు ముందడుగులో ఈనాడు ఉన్నట్లే, ఆనాడు ఉండిరి. ఎందరో ప్రజలు…

7ఇది టేపగుచున్నదని నేను ఎరిగియున్నాను. నేనిక్కడ ఆ కార్యములను చెప్పునప్పుడు, నేను ఇక్కడున్న ఈ సమాజములో మాత్రమే మాట్లాడుటలేదని నేను ఎరిగియున్నాను, అయితే ప్రపంచమదంతట నున్న ప్రజలతో మాట్లాడుచున్నాను. ఎందుకనగా, ఈ టేపులు ఎన్ని దేశములకు వెళ్ళవలెనో అన్ని దేశములకు వెళ్ళుచున్నవి. వారు ఆ టేపులను ఆఫ్రికా దేశములోని జాతులకు కొనిపోవుచున్నారు. ఆ దేశపు వెనుక భాగాలలో కూర్చిని, ఆ సేవకులు ఆ ప్రజలకు వాటిని తర్జుమా చేసి చెప్పుచున్నారు. అక్కడి ప్రజలకు మంచి చెడ్డలు ఏవి తెలియవు, చూశారా. ఆస్ట్రేలియా దేశమునకు కూడా వెళ్ళుచున్నవి. అక్కడ కూడా ప్రజలున్నారు. వారికేదియు తెలియదు. వారు భోజనము చేయునదేమనగా… వారు చక్కెరను (పంచదారను) తీయు విధమేదనగా, వారొక గవ్వను తీసికొని చీమల పుట్టను త్రవ్వి వాటి వెనుక భాగమును నలిపి తీయుదురు. ఆ విధముగా వారు చక్కెరను తీయుదురు. వారికి బట్టలు లేవు, వారికి ఏదియు లేదు. వారు ఒక ముసలి కంగారును తీసికొని, దానిని నిప్పులో వేసి, దాని లోపటి భాగాములు అన్నియు, వాటిని కాల్చి తినెదరు. అది ఎంతో ఘోరమైన కార్యము.

జ్ఞాపకముంచుకొనండి, ఈ టేపులు అక్కడి వారి మధ్య వేయబడును. మీరు ఇక్కడ వినుచున్న ఈ వర్తమానము వారి మధ్య వేయబడును. వందలాది మిషనరీలు ఈ టేపులును తీసికొని వెళ్ళి, అక్కడ వాటిని వేసి వినిపించుచు, ఆ ప్రజలకు దానిని తర్జుమా చేయుదురు. అందువలన మీరు చూచినట్లయిన, నేనక్కడ తీర్పు దినమున వెళ్ళినప్పుడు - నా భుజములపైన ఏది ఉంచబడునో మీరు చూడగలరు. నేను కొందరిని దారి తప్పించిన, ఏమగును? చూశారా? మీరక్కడే ఉన్నారు. ఆ ఆత్మలను గురించి యోచించి చూడండి, వారిని తప్పు త్రోవకు నేను నడిపించినయెడల ఏమగును?

8అందువలన ఇక్కడ ఈ సంస్థలలో ఉన్న నా సోదరులకు వినిపించవలసియున్నది. వారిలో అనేకులు ఎంతో మంచివారు. వారిలో అధికముగా మంచి వారున్నారు. నేను దానిని గురించి సంతోషించుచున్నాను. అయితే కొందరు ఎంతో … సాధారణముగా వారిని నడిపించువారు, ఒక స్థలమునకు వచ్చి అక్కడ కట్టి వేయబడుచున్నారు (ఆ సిద్ధాంతములతో) ఆ విధముగా వారు చేయుచున్నారు. ఓ, అది రాజకీయ వ్యవహారముగా మారిపోవుచున్నది. వారు దానిలో రాజకీయమును నడుపుచున్నారు. అక్కడ వారు దానిలో చిక్కుబడి, దేవుని వాక్యము నుండి దూరమైపోవుచున్నారు.

నేను వాక్యముపై నిలిచి యుండవలసియున్నది. నేనక్కడ నిలచి యుండవలసియున్నది. అది దీనికి రావలసియున్నది. నేను దానితో వెళ్ళవలసియున్నది, అంతే. అందువలన… మీకు తెలియును, మన మీ చిన్న పాటను పాడెదము, "మనమా కాలమును సెలయేరులో తేలుచూ వెళ్ళుచున్నాము. మనమక్కడ ఎంతో కాలము నిలచియుండము." మీరు దానిని వినియుందురు. "ఆ తుఫాను చీకటి మేఘములు వెలుగు దినములుగా మారును." అది నిజము. "మనమందరము ధైర్యమును పొందెదము. మనమొంటరిగా విడువబడము." అది నిజము. "ఆ జీవ నావ త్వరలో వచ్చును, ఆభరణములను అలంకరించి ఇంటికి కొనిపోవును." నేను ఎదురుచూచునది ఆ సమయమునే, అప్పుడు నేను చినిగిపోని అంగీని ధరించెదను, అది ఇదే, ఆ నిత్యమైనది. నేను దేవునికి నమ్మకముగా ఉండవలసియున్నది. నేను ఈ భూమిపై నున్న కార్యములపై నా గమనమును నిలుపుట కాదు. మనమక్కడకు వెళ్ళునంత వరకు అలా చేయలేము. అపుడు మనము… చివరికి వెళ్ళువారు వారే.

9అందువలన నేను ఈ ముప్పది… ఈ ముప్పది-రెండు సంవత్సరముల సేవలో, వాక్యమునకు నమ్మకముగా నిలుచుటకు నేను ప్రయత్నించాను. ఈ బలిపీఠము పైన నేను మరొక దానిని తెలిసియుండ లేదు, ఎందుకనగా నేను ఈ పరిశుద్ధ గ్రంధము నుండియే చదువుచు ఈ గ్రంధము దేనిని చెప్పుచున్నదో, దానిని మాత్రమే చెప్పుచూ వచ్చాను. ఆ విధముగా దానిని వెళ్ళనిచ్చెదను. అందువలన ఒక దానిని మరలా తీసికొనుటయే గాని, లేక మరలా చక్కబెట్టుటయే గాని నేను చేయలేదు, ఎందుకనగా బైబిలు ఏమి చెప్పుచున్నదో - దానిని మాత్రమే చెప్పాను. నేను కనుగొన్నది, దేవుడు దేనినైనను మాట్లాడినయెడల, అది నెరవేరబడునట్లు మనము దానితో వెళ్ళవలసియున్నది. మనము దానిని చూచాము. గత రాత్రి నేను మీతో చెప్పినట్లు, ఈ మధ్యలో నేనొక దర్శనమును చూచాను. చూడండి. ఆది నేనక్కడ ఉండవలసి యున్నది. ఒక హెచ్చరిక అక్కడ ఉండవలసియున్నది. ఆ స్థలములో నిలచుటకు ఆరునెలలు ముందుగా అది చెప్పబడినది. అప్పుడు అక్కడ నిలచి, నేను ఈ విధముగా చెప్పాను, "అక్కడికి వెళ్ళుము, మూడు పర్యాయములు వారితో వెళ్ళుము." నేను ఆ ఇతర మనుష్యులతో నడిచి వెళ్ళాను. ఆ దర్శనము ఖచ్చితముగా నెరవేరినది. దేవుని భాగముగా అది జరిగినది, నేనక్కడ నిలువబడియున్నాను. అందువలన మనము దానిని జ్ఞాపకము చేసికొనవలసియున్నది, మీరు వాక్యముపై నిలచి యుండవలసియున్నది, కేవలము నిజాయితీగా వాక్యముపై నిలచియుండుము. వాక్యము నడిపించు స్థలమునకు మీరు నేరుగా ఆ వాక్యముతో వెళ్ళుడి, అప్పుడది మిమ్మును వెలుపలకు తెచ్చును, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.

10ఇప్పుడు మీరిక్కడ ఎనిమిది గంటల నుండి ఉన్నారని నాకు తెలియును. ఇప్పుడు పదిగంటలు కావచ్చుచున్నవి. అది అలాగే ఉన్నది. అందువలన మన ప్రభువునకు ప్రార్థించెదము. ఇక్కడ ఏవైనా ప్రత్యేక విన్నపములున్నవా? అక్కడ అనేక చేతి గుడ్డలు పడియున్నవి. విన్నపముల కొరకు మీ చేతులను పైకెత్తుడి. దేవుడు మిమ్ము దీవించును గాక. ఇప్పుడు నేను దీనిని ఎరుగుటకు గాను, ఆయనను ఎంతో కాలముగా ఎరిగియున్నాను. ఆయన ప్రతి చేతిని, ప్రతి హృదయమును ఎరిగియున్నాడు. మీరు ఆయనను అడుగవలసినదొక్కటే మిగిలి యున్నది. మీరు దానిని నమ్మినప్పుడు, అది నెరవేరును. ఇప్పుడు మనము ప్రార్థించుచుండగా మీరు విశ్వసించండి.

MATT 21:21,22•

MARK 11:23,24•

JOHN 14:14

 

11పరలోకపు తండ్రి, ఇప్పుడు మేము ఆ గొప్ప దేవుని శక్తిగల సింహాసనమును సమీపించుచున్నాము. మేము మరణించని వారముగా ఒక ప్రకృతి శరీరములో నుండి ఈ కార్యమును చేయుచున్నాము. అయినను మా స్వరములు ఆ గొప్ప సింహాసనము నుండి, దేవుడు కూర్చునియుండు ఆ పరిమాణము నుండి వచ్చు మాటలనే పలుకుచున్నవి. ఎందుకనగా, యేసు ఇలా సెలవిచ్చెను, "నా నామములో తండ్రిని దేనినడిగినను అది మీకు దయచేయబడును." మేము సందేపడకుండవలెనని ఆయన కోరెను, అయితే మేము ప్రార్ధించినప్పుడు, కోరిన దానిని పొందితిమనియు - అది మాకు దయచేయబడినదనియు నమ్మవలెనని చెప్పెను. "ఈ కొండను చూచి, 'కదలి పొమ్మని' చెప్పునప్పుడు, నీ హృదయమందు సందేహించకుము, అయితే అది నెరవేరునని నమ్ముము. నీవు కోరిన దానిని నీవు పొందెదవని చెప్పెను." తండ్రి, అది సత్యమని మేమెరిగియున్నాము. మేము దిన దినము దానిని గమనించుచున్నాము. నీ వాక్యమందు ఏ పొరపాటు కూడ లేదు. మేము దానియందు నిలువలేకపోవుట వలననే, కొన్ని సమయములలో మా విశ్వాసము మమ్ములనక్కడికి తీసికొని వెళ్ళలేకపోవుచున్నది. మేము ఉద్రేకము చెంది, సందేహపడుచున్నాము. అయితే ఈ ఉదయము ప్రభువా, క్రొత్త నమ్మకముతో, క్రీస్తు జీవధారను చేపట్టి ఆయన వాగ్దానమును చేపట్టుటకు, ప్రయత్నించుచున్నాము. యేసు నామము ద్వారా మేము దేవుని సన్నిధికి వచ్చుచున్నాము.

ప్రభువా, ఈ ఉదయ కాలము పైకెత్తబడిన ఈ చేతుల క్రింద నున్న ప్రతి కోరికను నీవు ఎరిగియున్నావు. నా చేతులు కూడ ఎత్తబడి ఉన్నాయి. ప్రభువా, అవి స్థిరముగా నీ తట్టుకు ఎత్తబడినవి, ఎందుకనగా నేను అక్కరగల వ్యక్తిగా ఉన్నాను. ప్రతి వారి కోరికను మన్నించవలెనని ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, వారిని చూడుము. వారిలోనున్న యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు వారి ప్రార్ధనా కోరికలను తీర్చుము. వాటిలోని చిన్న కోరిక నుండి అధికమైన కోరిక వరకు మన్నించుము. వారిలోని ప్రతి వారికి జవాబును దయచేయుము. యేసు నామములో దీనిని నేను అడుగుచున్నాను. నన్ను జ్ఞాపకము చేసికొనుము, ప్రభువా.

12మా శరీరాలలో పూర్తి విశ్రాంతి ననుగ్రహించినందుకు మేము నీ వాక్యమందు కలిగియుండు జ్ఞానము కొరకును, ఆత్మ ద్వారా మాకు కలిగిన గ్రహింపు కొరకును వందనములు తెలుపుకొనుచు ప్రార్ధించుచున్నాను. ఇంకనూ అధికమైన గ్రహింపును నీవు ఇచ్చుట ద్వారా, మేము వృధా కాకుండునట్లు స్థిరముగా ప్రార్థించుచున్నాము. దాని ద్వారా ప్రజలను ఆయత్తపర్చుము, అయితే వారు సాత్వీకము గల ప్రజలుగా, పరిశుద్ధాత్మ దేవుని వాక్య నెరవేర్పునకు మమ్ములను ఉపయోగించుకొనునట్లు చేయుము. ఈ ఘడియలో మేమెక్కడ నిలచి యుండవలసిన అవసరమున్నదో, అక్కడ మమ్ములను ఉంచునట్లు సహాయము చేయుము. అది నెరవేరునట్లు, ఆ ఖచ్చితమైన స్థలములో మేముండవలసియున్నది. ప్రభువా, మేము అలా ఉండుటకు ఇష్టపడుచున్నాము. ఒక ఇల్లాలు భోజనపు బల్ల వెనుక నిలచునట్లును, ఒక కర్మాగారములో పనిచేయు మనిషి తన చేత ఇనుప కొరడాను పట్టుకొని ఉండునట్లును, మరియు ఒక సాక్ష్యము కొరకును, ఒక సేవకుడు ప్రసంగ వేదికపై నిలచునట్లును, లేక ఒక సంఘ పెద్ద లేక సంఘ బాధ్యతను వహించు వ్యక్తిగాను, లేక పాఠశాలలోని ఒక బిడ్డగాను, తరగతిలో వ్యవహరించు ఒక యవ్వనునిగాను వారెక్కడ ఉండవలసియున్నను - ప్రభువా, అక్కడ సకాలమునకు ఉండునట్లు నడిపించుము. నీవు దానిని వాగ్దానము చేశావని మేము ఎరిగియున్నాము, నీవు ఆ విధముగా చెప్పినందున అది నెరవేరనున్నది, మరియు అక్కడ మా విశ్వాసము కట్టబడుచున్నది.

DAN 12:3,13

 

13ఇప్పుడు, ప్రభువా, మాకెంతో సమయమున్నదని మేము తలంచుట లేదు. కాలము సమీపముగా వచ్చుచున్నది. అది లోనికి ప్రవేశించుచుండగా, వెలుపల విశాలము నుండి మంచు దిగి వచ్చుటను మేము గ్రహించుగలుగుచున్నాము. దేవుని తీర్చు మరియు ఉగ్రత వచ్చుటకు సిద్ధముగా ఉన్నదని మేము ఎరుగుచున్నాము. ఇప్పటికే దాని పరిణామమములను మేము ఎరుగుచున్నాము. ప్రభువా, మాకు సహాయము దయచేయుమని మేము ప్రార్ధి౦చుచున్నాము.

ప్రభువు, ఈ ఉదయకాలము ముప్పది నిమిషముల పాటు, "అవరోహణ లెక్కింపు" అని పిలువబడు ఈ వర్తమానమును ప్రసంగించవలసియుండగా, నాకు సహాయము దయచేయము. మేమెక్కడ ఉన్నామని గ్రహించుటకు సహాయము దయచేయుము, ప్రభువా.

ప్రభువా, మమ్ములను ఇప్పుడు శుద్ధి చేయుము. మా పాపములను అపరాధములను తీసివేసి, మమ్ములను శుద్ధి చేయుము. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పిపోకుండునట్లు, ఈ ఉదయకాలమందు, ప్రతి ఒక్కరు సిద్ధపడి, ఆ పెద్ద వృత్తముగా ఉన్నదానిలో, ఆవలి తీరాన మేము కలసికొందుము గాక. ఆ వరుసలో పేర్లు పిలుచునప్పుడు, ఒక పేరు తరువాత మరొక పేరు "హజరు" పలుకుటను నేను విందును గాక. ప్రభువా, దాని కొరకే మేము చూచుచున్నాము. వృద్ధులు, ఒక క్షణములో మరు రూపమును చెంది, అక్కడ నిత్యముగా యవ్వనులై యుండెదరు, అక్షయత గలిగి ఆయనవలె నిలచెదరు. సూర్యుడు, నక్షత్రములు ఇక వెలుగు నియ్యవు. దానియేలు చెప్పినట్లు, "నీతి మార్గము ననుసరించి, నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతము ప్రకాశించెదరు." అయితే నీవు ఆ ప్రవక్తతో చెప్పిన దానిని మేము విన్నాము. "దానియేలు, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన యెడల, విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు."

ఓ దేవా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మేము యోగ్యులముగా లెక్కించబడనియ్యుము. మేము దానిని పొందుటకు మాకేలాంటి అర్హతలు లేవు గాని, ఆయన అర్హతల ద్వారా ఆ దినమందున నిలచుటకు మేము యోగ్యులముగా నుండునట్లు ఇష్టపడుచున్నాము. ఆ గొప్ప ప్రవక్త దానియేలుతోను, ఆ బహుమానములను ఇచ్చునప్పుడు వాటిని గైకొను వారితో నిలచెదము. ప్రభువా, అప్పటి వరకు నీ చేతిలోని సాధనములుగా చేసికొనుము. ఈ ఉదయ కాలమందు, మా చెవులను నీ వాక్యమును సాధనములుగా చేయుము. నా పెదవులు దానిని మాట్లాడునట్లు చేయుము. యేసు నామమున అడుగుచున్నాము. మా గ్రహింపు, దేవుని చిత్తమును గ్రహించును గాక. ఆమేన్.

14దీనిని ప్రారంభించుట ఎంతో కఠినముగా ఉన్నది. మీకు చెప్పుటకు ఎంతో ఉన్నట్లు మరియు చెప్పుటకు ఇష్టపడుచున్నట్లు అది కనబడుచున్నది. దానిని చెప్పుటకు చాలా కొద్ది సమయమున్నట్లు తోచుచున్నది. నేను విడచి వెళ్ళునంతలో జరిగిపోవచ్చును. గత రాత్రి నేను చెప్పినట్లు, బైబిలులో ఒక గ్రంధమును మనము తీసికొని ఈ చలికాలము గతించుటకు ముందు, దాని ద్వారా వెళ్ళు అవకాశమును కలిగియున్నాము. నేను బయటి దేశములకు వెళ్ళవలసియున్నది. ప్రభువు చిత్తమయితే, రానున్న క్రిస్మసు తరువాత వెళ్ళుదును.

HEB 11:1-3

 

15ఈ ఉదయ కాలమందు మనము చదువుకొను భాగముగా హెబ్రీ 11వ అధ్యాయమును త్రిప్పుటకు ఇష్టపడుచున్నాను. చదువబడనున్న ఈ భాగమును చాలా దగ్గరగా వినవలసియున్నది. 3వ వచనమును అతి ముఖ్యముగా తీసికొనుటకు ఇష్టపడుచున్నాను.

విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి.

ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్ధములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము.

ఇప్పుడు, ఇది మన అంశమునకు వింతైన పాఠ్యభాగముగా ఉన్నది నేను దీనిని తీసుకొనుచున్నాను కనబడెడు పదార్దములచే, నిర్మింపబడ లేదు. ఇప్పుడు ఈ ఉదయ కాలము నేను ఈ భాగమును "అవరోహణ లెక్కింపు" అను అంశముగా తీసికొనుటకు ఇష్టపడుచున్నాను, ఎందుకనగా నేను దానిని ప్రవచనాత్మక మార్గముతో సమాంతరము చేయుటకు ఇష్టపడుచున్నాను. గత రాత్రి ఒక చిన్న వాక్యముపై మాట్లాడుటకు ఇష్టపడితిని; ఈ ఉదయకాలము ఒక ప్రవచనాత్మక వర్తమానమును మాట్లాడుచున్నాను; మరియు ఈ రాత్రికి సువార్త వర్తమానమును మాట్లాడెదను.

16ఇప్పుడు దృశ్యమగునవి కనబడెడు పదార్ధములతో చేయబడినవి కావు. ఇప్పుడు, ఈ సంవత్సరములన్నింటిలో నేను నేరుకొనినదేమనగా, ప్రకృతి సంబంధమైన ప్రతిదియు, ఆత్మ సంబంధమైన వాటికి పోలికగా ఉన్నది, ప్రతిది ప్రకృతిలోనే ఉన్నది. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, మీరెప్పుడైనను ప్రకృతిలో, ఒక దానిని చూచినప్పుడు అది ఆత్మీయ కార్యమునకు ఛాయగా ఉన్నది. ఒక దానికి పోలికగా ఉన్నది, చూశారా. కనబడని పదార్ధములచేత సమస్తమును నిర్మించబడినవి. చూడండి, అప్పుడు ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానిని ప్రతిబింబింపజేయుచున్నది.

ఇప్పుడు, నేను కొన్ని రోజాల క్రితము చదువుచూ ఉన్నప్పుడు, గత రాత్రి దానిని గురించి కొద్దిగా చెప్పానని నేను నమ్ముచున్నాను. నేనెక్కడ చదువుచుంటిననగా… కెనడా నుండి వచ్చుచున్న రేడియోను వినుచుంటిని, అప్పుడు అమెరికాలోని ఒక డాక్టరు 1 కోటి 40 లక్షల సంవత్సరములలో ఉనికి లోనికి వచ్చాడని" చెప్పాడు. వారు ఇటలీలో త్రవ్వకాలు జరిపినప్పుడు, ఒక ఎముకను కనుగొనిరి. అది 1800 సంవత్సరములలో జరిగినది. అది ఒక మానవ ఎముకగా ఉండినది. వారావిధముగా దానిని పరీక్షించుచున్నప్పుడు, అది ఎన్ని సంవత్సరముల ఎముకగా ఉన్నదని చెప్పుటకై ఆ డాక్టరు - ఒక వృద్ధుడు, తన జీవితమంతటిని ఎముకను పరీక్షించుటలో వినియోగించాడు. అతడు చెప్సినదేమనగా, "ఈ ఎముక 1 కోటి 40 లక్షల సంవత్సరముల క్రితముండిన ఒక మనిషిదని" చెప్పాడు.

17అది ఎంత బుద్ధిహీనతగా ఉన్నది! ఏ విధముగా ఒక మనిషి, ఏమి లేని దానికొరకు తన జీవితమును పాడు చేశాడో చూడండి. అతడు దేవుని వాక్యమును అసత్యమని నిరూపించుటకు ప్రయత్నించాడు. అతడు ముగింపు దూరమును పొందాడే గాని మరేమి లేదు. ఎవ్వరైనను దీనిని ఎరిగియున్నారు, ఒక ఎముకను భూమిలో పాతిపెట్టినప్పుడు ఇరువది సంత్సరములలో ఆ ఎముక మారిపోవును. వంద సంవత్సరాలకు అది లేక పోవును, అది పొడియైపోవును. దానిలో మీరేది ఉంచినను ప్రయోజనము లేదు, చూశారా. అంతట వెయ్యి సంవత్సరములకు ఆ ఎముక ఏమై యుండును? పది వందల సంవత్సరములకు అది ఏమగును? మంచిది, దానికి పది పదిరెట్లు ఏమగును. అది పది లక్షలగును? పదునాలుగు పదిలక్షలు ఏమగును ఓ, మై! అటువంటి దాని యోచించుట తెలివిగల కార్యము కాదు. ఒక ఎముక 1 కోటి 40 వది లక్షల సంవత్సరములు ఉండనేరదని. ఎవ్వరైనను దానిని ఎరిగి యున్నారు. అతడేదో ఎముక వలె కనబడు దానిని తీసికొని దానిని పరీక్షించి 1 లక్ష 40 వేల సంవత్సరములని వారు చెప్పుచున్నాడు? చూశారా? ఏమి లేదు, దైవుడు మనిషిని ఆరు వేల సంవత్సరములు క్రితమే నిర్మించాడు, అది దానిని స్థిరపరచును.

GEN 1:1,2•

2TIM 3:16

 

18కొంత కాలము క్రితము ఎవరో దీనిని గురించి నాతో నా కూడికలలో ఒక దానిలో మాట్లాడుచుండిరి. నేను మానవుని ఉనికిని గురించి మాట్లాడుచుంటిని. అప్పుడు అతడు నిర్మించబడి ఆరువేల సంవత్సరములు మాత్రమే అని చెప్పాను. అప్పుడతడు "మంచిది, బ్రెన్హాం సోదరుడా, ప్రపంచము 10 లక్షల సంవత్సరముల వయస్సు గలిగి యున్నదని మేము నిరూపించగలము. అందువలన మీరు మాట్లాడుచుండు ఈ కార్యము పొరపాటుగా ఉన్నది" అని చెప్పారు.

అందుకు నేను, "మీరు బైబిలును నమ్మరా?" అని అడిగాను.

అందుకతడు "మనిషి బైబిలును వ్రాశాడని నేను నమ్ముచున్నాను" అని చెప్పాడు.

అప్పుడు నేను, "మానవ హస్తము అక్షరములను వ్రాసినది, నిజమే. అయితే పరిశుద్ధాత్మ ఆ చేతి వెనుక నిలచి వ్రాయించినది." చూశారా, ఆయన ఆ అక్షరములను రూపుచెందించెనని బైబిలు చెప్పుచున్నదని చెప్పాను.

అయితే అతడు "మంచిది, ప్రపంచములో పొరపాటున్నదని నీవు అంగీకరించవలసియున్నదని" చెప్పాడు.

అందుకు నేను, "బైబిలు పొరపాటు కానేరదు, పొరపాటు కానేరదని" చెప్పాను.

అందుకతడు, "మంచిది, ఈ ప్రపంచములోని కొ౦డలు భూకంపము చేత ఏ విధముగా నశించిపోవుచున్నవో నీవు చూడగలవని" చెప్పాడు.

అందుకు నేను, "అయితే నీవు కొంచెము…"

అందుకతడు, "దేవుడు ఆరు దినములలో ఈ ప్రపంచమును సృష్టించాడు" అని చెప్పాడు.

అందుకు నేను, "ఇప్పుడు బైబిలు అలా చెప్పుటలేదు. అది చెప్పినట్లు నీవు తలంచుచున్నావు, మనము వెనుకకు వెళ్ళి మీ వాదమును ముగించుకో౦దము. ఆదికాండములోని మొదటి అధ్యాయము, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" అని చెప్పబడియున్నది. ఎంత కాలము! ఆయన కాలముగా దానిని చేశాడు, నాకు తెలియదు. ఆయన మనకు దానిని చెప్పలేదు. అయితే ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అంతే! అంతట, "భూమి శూన్యముగా ఉండినది" దేవుడు దానిని వాడుకొనుటకు ప్రారంభించినప్పుడు, అది ఆ విధముగా ఉండినది, చూశారా. అందువలన వారు వారి మెదడులను ఏమిలేని దాని కొరకు చెరుపుకొనుచున్నారు, చూశారా. చూశారా?

GEN 1:1•

GEN 1:11,24,26,27

 

19దేవుడు ప్రపంచమును నిర్మించెను. ఆయన దానిని నిర్మించుటకు ఎన్నో వందల సంవత్సరములను తీసికొని యుండవచ్చు; అది ఎంత కాలమో నాకు తెలియదు, అయితే ఆయన దానిని చేశాడు. ఆయన దానిని చేయుటకు ఎంత కాలమో చెప్పలేదు. అది ఎంత కాలమునునది తెలిసికొనుట మన పని కాదు. ఆయన చెప్పినదేమనగా, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. కాలము అది అంతటితో ముగించిపోయినది. దానిని గురించినదంతయు అంతే. అయన ఎంతకాలము దానిని చేయుచుండెనని, అది… ఆ తరువాత కాలములో సృష్టి చిగురించుటకు ప్రారంభమైనది. ఆయన ప్రారంభించినప్పుడు, అది ప్రారంభమైనది.

నేను నమ్మునదేమనగా, అందులో ఉన్నదంతయు పరలోకమును ప్రతిబింబింపజేయుచున్నది. నేను దానిని నమ్ముచున్నాను. ఎందుకనగా ప్రతిది, జీవము కొరకు పోరాడుచున్నది, ఎందుకనగా అది దేనిని ప్రతిబింబింపజేయుచున్నదో అక్కడ జీవమున్నది. ఆయన మనిషిని చేసినప్పుడు చిన్న కార్యములు కూడ ప్రతి బింబించునట్లు చేశాడు. జంతు జీవితము, ఆ తరువాత మరొక దానిని, ఆ విధముగా ఆయన సృష్టి చేసెనని, బైబిలు ఖచ్చితముగా చెప్పుచున్నది. ఆయన మొదటిగా, వృక్ష జీవమును చేసెను. ఆ తరువాత ఆయన మనిషిని చేసెను. చివరిగా భూమిపై నుండి వచ్చినది మనిషి మాత్రమే. ఆ తరువాత మరొక అధికమైన జీవి రాలేదు. కారణమేమి? అది పరలోకములో ఉన్నతమందున్న దానికి ఖచితమై ప్రతిబింబిముగా ఉన్నది. అదేదనగా, దేవుడు ఒక మనిషిగా ఉన్నాడు, చూశారా. దేవుడు ఒక మనిషిగా ఉన్నాడు, అందువలన అది నిరూపించబడినది. దేవుడు మన మధ్య నివాసము చేయుటకు దిగి వచ్చినప్పుడు, ఆయన ఒక మనిషిగా ఉన్నాడు, చూశారా. ఒక మనిషి! అందువలన అది దేవుని సంపూర్ణ పరిణామమును చూపుచున్నది, అది ఒక మనిషిగా ఉన్నది.

HEB 11:3

 

20మీరొక వృక్షమును తీసికొనుడి. (మీరు గడ్డిని, మిగిలిన వాటిని తీసికొనిన యెడల), ఒక వృక్షమును తీసికొనండి, అది పరలోకమందున్న వృక్ష జీవమును ప్రతిబింబించుచున్నది. సమస్తమైనవి పరిపూర్ణము కొరకు పోరాడుచున్నవి. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో చెప్పినట్లు, ప్రకృతిలోని సమస్తమును, కనబడని వాటి చేత నిర్మించబడినవి. మరో విధముగా చెప్పాలంటే, అవన్నియు సహజాతీతమైనవిగా ఉన్నాయి. మరియు సహజాతీతమైననది ప్రకృతిని ప్రతిబింబించుచున్నది, చూశారా. అందువలన ప్రకృతి నిత్యమైనదిగా ఉన్నది, లేక అతీతమైన దానితో నిత్యముగా ఉండునదిగా ఉన్నది, అయితే పాపము ఆ ప్రకృతిని చెరిపివేసినది, అందువలన అది అలాగున్నయెడల, భూమిపై జరుగు ప్రతిది ఆత్మీయముగా జరుగుచున్న కార్యములకు మాదిరిగా ఉన్నది, చూశారా. అది దేనినో ప్రతిబింబించవలసి యున్నది, అవి మానవుడు చేయు ప్రయత్నములే.

1JN 5:8

 

21ఇప్పుడు, మనము కనుగొన్నదేమనగా, ఒక ఆత్మ శరీరము వలె, ఇక్కడొక ప్రకృతి శరీరమున్నది. ఆ శరీరము దానిలాంటి శరీరమును చేయవలసియున్నది, వారు బిడ్డలుగా ఉన్నారు. ఒక ప్రకృతి శరీరమందు, ఒక ప్రకృతి సంబంధమైన బిడ్డ యొక్క జన్మలో మనము మొదటిగా చూచునది, నీరు ఆ తరువాత రక్తము, ఆ తరువాత జీవము. అదే విధముగా క్రీస్తు యొక్క ఆత్మయు శరీరములో మొదటిగా వచ్చినది నీరు, రక్తము, జీవము; నీతికరణ, శుద్దీకరణ, ప్రరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది ఏ విధముగా ప్రతిబింబించుచున్నాదో సమస్త ప్రకృతి కార్యములు ఆత్మీయ కార్యములను ప్రతిబింబించుచున్నవో చూడండి. అది ప్రకృతి జన్మ.

ఉదాహరణకు తీసికొనిన యెడల వివాహమనునది ఐక్యత కొరకు జరుగునదని మనము కనుగొన్నాము. మొదటిగా ఉపచరణలు, రెండవదిగా ఒప్పందములు, తరువాత వివాహము అంతటితో ఆమె కాలమంతయు అతనితో ఉండిపోవును. ఆ విధముగానే క్రీస్తునకు సంఘము అర్చించబడుచున్నది, చూశారా. మొదటిగా ఉపచరణ, దేవుడు మన హృదయములకు పిలువబడుచున్నాడు; మనము మనలను అప్పగించుకొనుచున్నాము; ఆ తరువాత వివాహ కార్యక్రమము, వధువు వరుని పేరును ధరించుచున్నది, చూచారా. చూచారా? చూచారా? అక్కడది ఉన్నది, అది వధువును రూపించుచున్నది. ఎప్పుడు గాని వధువు వరుని నామమును ధరించుకొనుచున్నది.

1JN 5:7,8

 

22ఇక్కడ మాట్లాడగలిగినవి మనకెన్నో ఉన్నాయి. నా వద్ద ఉన్న ఈ పట్టీని చదువుటకు సుమారు రెండు గంటల సమయము తీసికొనును. మనము మాట్లాడు దానిని బలపరచుటకు కావలసిన లేఖనములే అవి. మీరు వాటిలో కొన్నింటిని కోరినయెడల దానిని బలపరుచుట కొరకు వ్రాసికొన వచ్చును. I యోహాను 5:7 ప్రకృతి జన్మను, ఆత్మీయ జన్మను చూపుచున్నది, అలాగుననే అనేక కార్యములు, "నీరు, రక్తము, ఆత్మ," ఆ విధముగానే పరలోకమందును మూడున్నవి, "తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ," ఈ మూడు ఏకమైయున్నవి. భూమి పైన ఏకీభవించునవి మూడు కలవు, అయితే ఆ మూడు ఒక్కటిగా లేవు, కానీ అవి ఏకీభవించగలవు - అవి "నీరు, రక్షము, ఆత్మ." చూడండి, "నీరు, రక్తము, ఆత్మ" అది ప్రకృతి సంబంధ జన్మకు మాదిరియై యున్నది.

23అందువలన ఒక మనిషి తన తలంపును తీర్పు నిరూపణపై ఉంచి, దానిని మాత్రము చేసిన, చాలుననిన చెప్పిన యెడల అది పొరపాటగును. అది పొరపాటు, అతడు పొరపాటై పోవును. ఆ విధముగానే పెంతెకోస్తు వారు నమ్మునట్లు అది పరిశుద్ధాత్మగా ఉన్నది, "అంతే, మారుమనస్సును పొంది పరిశుద్ధాత్మను పొందిన చాలును" అనునది కూడ పొరపాటుగానే ఉన్నది, ఎందుకనగా పరిశుద్ధాత్మలోనికి వచ్చుటకు ముందు వారు శుద్దీకరణలో ప్రవేశించవలసియున్నది, వారు కడుగబడవలసియున్నది. నీవు కడుగబడకున్నయెడల నీవు రక్తమును విడిచిపెట్టుదువు, చూశారా. ప్రజలు మాట్లాడుచుండు పరిశుద్ధాత్మ బాప్తిస్మమే, క్రొత్త జన్మగా ఉన్నది. అందువలన వారు చెప్పునది కూడా పొరపాటుగానే యున్నది. నిజమునకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకును, క్రొత్త జన్మకును వ్యత్యాసమున్నది. నీవు మరలా జన్మించినప్పుడే క్రొత్త జన్మ, అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మమనునది జన్మించిన తరువాత సేవ కొరకై అతనిలోనికి వచ్చు శక్తియై యున్నది. అది ఖచ్చితము, చూశారా. పరిశుద్ధాత్మ అనునది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటయే.

యోహాను 5:24

JOHN 5:24•

ACTS 1:8

 

24క్రొత్త జన్మ అనునది, నీవు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు క్రొత్త జన్మను పొందెదవు, చూశారా. విశ్వాసము కలిగి ఆయనను రక్షకునిగా అంగీకరించినప్పుడు, అది క్రొత్త జన్మ, చూడండి, ఎందుకనగా మీరు మరణము నుండి జీవము లోనికి దాటియున్నారు. ఇప్పుడు, మీరు దానిని అగీకరించవలెనన్న - యోహాను 5:24 తీసికొనండి. "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు; వాడు తీర్చులోనికి రాక మరణములో నుండి జీవము లోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." చూడండి, అతడు నమ్మినందున అతడు జీవము గలిగియున్నాడు. ఆ భాగములో ఉన్నవారు అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటకు పెంతెకోస్తుకు ఖచ్చితముగా వెళ్ళవలసియున్నది.

సేవ చేయుటకు కావలసిన శక్తి, పరిశుద్ధాత్మగా ఉన్నది. నీవు క్రొత్తగా జన్మించినట్లు మాట్లాడుచున్నప్పుడు, దానిని పరిశుద్దాత్మకు అన్వయించుడి. అక్కడే అనేకులైన మెథడిస్టు వారు, మిగిలిన వారు పొరపాటు చేయుచున్నారు. అది ఆ విధముగా ఉండనేరదు. అది ఇక్కడ వాక్యములో ఐక్యపడదు. నీవు ఆ కార్యమును ప్రక్కగా తీసికొనుచున్నాను. లేఖనములో అది ఎట్లున్నదో, ఆ విధముగానే మీరు దానిని తీసికొనవలసియున్నది, చూశారా. పరిశుద్ధాత్మ అనునది ఒక… వీరు దీని తరువాత క్రొత్త జన్మను పొందెదరా?" ఏమిటి? లేదు. "మీరు శక్తిని పొందెదరు. [అ.పొ, కార్య. 1:8] "అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు," చూశారా. వారు అంతకు మునుపే నిత్యజీవము కొరకు విశ్వసించియున్నారు, అయితే వారు శక్తికొరకు పరిశుద్ధాత్మను పొందవలసియున్నది. మీదికి పరిశుద్ధాత్మ వచ్చునప్పుడు మీరు నాకు సాక్షులై యుండెదరు," ఎందుకనగా పరిశుద్ధాత్మ పునరుద్దానమునకు సాక్ష్యముగా ఉండి, క్రీస్తులో నీవు వయస్సుకు వచ్చిన వాడవని చెప్పుచున్నది.

25ఇప్పుడు, అది ప్రకృతి సంబంధమైనది. సమస్త కార్యములు ఆత్మీయమైనవి. జరుగుచున్న సమస్తమును ఆత్మ కార్యములకు మాదిరిగా ఉన్నది. ప్రకృతి అనునది అతీతమైన దానికి మాదిరియై యున్నది.

ఇప్పుడు, మేము "స్పోకేన్" అను ప్రా౦తమునకు సమీపముగా ఉన్నప్పుడు, నేను అక్కడ జరుగుచుండు ప్రపంచ ప్రదర్శనకు వెళ్ళాను. నేను ఆ ప్రపంచ ప్రదర్శనకు వెళ్ళునప్పుడు నేను నా కుటుంబమును కూడ తీసికొని వెళ్ళాలని తలంచాను.

ఎందుకనగా నేను అమెరికా దేశములో ఒక్క ప్రపంచ ప్రదర్శనకు మాత్రమే వెళ్ళాను. అది చికాగోలో జరిగినప్పుడు వెళ్ళాను. నేను మరియు "హోప్" కలసి వెళ్ళాము. అక్కడ ఒక్క దినమునకు పైబడిలేము. అక్కడ జేబు దొంగలు మరియు ఇతర కార్యములు అధికముగా ఉండినవి. నా బంధువు ఇచ్చిన ఒక చిన్న పిన్ను ఆమె యొద్ద ఉండినది. నేను ఆమె ప్రక్కలోనే నడుస్తూ వస్తూ వున్నాను. ఎవరో ఆ పిన్నును దొంగలించారు. అది చాల భయంకరముగా ఉండినది. అందువలన నేను అక్కడ ఒక్క రోజు మాత్రము నిలచి ఆ తరువాత వచ్చెశాము.

26అయితే ఈ ప్రపంచ ప్రదర్శనకు, నా కుటుంబముతో వెళ్ళాము. అది ఇక్కడ లూయిస్ విల్లో జరిగిన ప్రదర్శనలాంటిదే. వారు మాట్లాడు "స్పేస్ నీడిల్" అని వారు పిలచు దానిని మీరు చూచారంటే, అది ఎల్స్బి కట్టడమునకే లేక, బ్రౌన్ కట్టడమునకే వెళ్ళి దానిపై ఎనిమిది లేక పది అంతస్తులు అక్కడను ఎలివేటరు (పైకి తీసికొని వెళ్ళు సాధనము)లో వెళ్ళి తిరిగి వచ్చుటయే కాక మరొకటి కాదు. అదియే అది. జెనరల్ ఎలక్టిక్ వారు దానిని చేసి అక్కడ ఉంచారు. అయితే అక్కడ ఒక ఆకర్షణీయముగా ఒకటుండినది. జర్మని వారు దానిని ప్రదర్శించారు, రష్యా కూడ అటువంటి వాటిని ప్రదర్శించినది, ఎందుకనగా అది ప్రపంచ ప్రదర్శనగా ఉన్నది. జర్మనులు, ప్రాన్స్ వారి ప్రదర్శనలు ఇక్కడున్న ఈ ప్రసంగ వేదిక ఉన్న ఈ స్థలము కన్నా పెద్దది కాదు.

27అయితే శాస్త్రజ్ఞులు వారి ప్రయత్నములను వారు చేశారు. వారు ముఖ్యముగా వాటిపై ప్రయోగాలు చేయుచున్నారు. పొగాకును ఏలా ఉపయోగించాలోనని ప్రయత్నములు చేయుచున్నారు. ఎవరైనను సిగరెట్టు త్రాగి అక్కడకు వచ్చినట్లయిన అతడు వెలుపలకు వచ్చి మరలా సిగరెట్టు త్రాగినట్టయిన, అతనిలో ఏదో పొరపాటున్నదని అర్థము, నా కండ్లతో నేను చూచినదేమనగా - ఆ సిగరెట్టును పీల్చి ఒక గొట్టము ద్వారా ఒక య౦త్రములో ఉంచి, ఆ పొగను ఒక రసాయనిక గొట్టము లోనికి పంపునప్పుడు, ఆ ఒక్క సిగరెట్టు పొగలో తెల్ల కాన్సరు ఏర్పడినది. అప్పుడతడు చెప్పినదేమనగా, "అనేక ప్రజలు చెప్పున దేమనగా, అధిక ప్రయోగములు దానిపై జరిగినవని చెప్పుకొనుచున్నారు." ఆ శాస్త్రజ్ఞులు ఆ సిగరెట్టు పొగను పీల్చి మరలా ఆ రసాయనిక గొట్టములోకి ఊదినప్పుడు, అక్కడ తెల్ల కాన్సరు కనబడలేదు. అప్పుడు వారు "అదెక్కడికి వెళ్ళినది?" అను ప్రశ్నను వేశారు. నా నోటి ద్వారా నేను దానిని మ్రి౦గినప్పుడు, అది నా కడుపులోనికి వెళ్ళినది, అవును" అని అతడు చెప్పాడు.

28అప్పుడు ఈ తలంపు నాకు వచ్చినది, "ఎందుకు ఈ డాక్టర్లు సిగరెట్ల హానికరము కాదని చెప్పుచున్నారు?"

అందుకతడు, "ఏ మనుమ్యడైనను తన జ్యేష్టత్వమును అమ్ముకొనునా! ఆ విధముగా చెప్పు ఒక డాక్టరు విశ్రాంతి నొందగలడా, ఎందుకనగా అతడు తన ఉద్యోగము నుండి విరమించుకొనినప్పుడు - ఆ సిగరెట్టు కంపెనీ వారు కావలసినంతగా ధనమును ఇచ్చెదరని" చెప్పాడు. అతడు (ఆ డాక్టరు) నిజమునకు తన జ్యేష్టత్వమును అమ్ముకొనుచున్నాడు, ఎందుకనగా అటువంటి కార్యములను నేను చేయనని అతడు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. అయితే ఏదో ఒక విధముగా వారు దానిని చేయుచున్నారు.

మరలా అతడు ఇలా చెప్పాడు, "ఇక్కడ ఆ యంత్ర సామాగ్రియున్నది. శాస్త్రీయ ప్రయత్నములతో మేము దానిని నిరూపించెదము." అక్కడ వారికి సినిమా తార "యల్ బైనర్" (అను వ్యక్తి) యున్నాడు. ఆ చిన్న మృదువైన "నికోటిన్" (సిగరెట్టులోని విషము) పార్సీలు… "ఇప్పుడు మీరు "ఫిల్టరు టిఫ్" అని చెప్పవచ్చు. అలా చేయు ప్రతి వ్యక్తి తన మానసిక స్థితిని చూపుచున్నాడు. నీవు ఏదైనను పొగను పీల్చునప్పుడు దానిలోని తారు ( Tar) నీకు తగలదు. ఆ తారు పొగను కలుగజేయుచున్నది. నీవు ఓ ఫిల్టరు మొన కలిగిన సిగరెట్టును పీల్చిన యెడల, ఒక సాధారణ సిగరెట్టు నిన్ను తృప్తి పరునట్లు చేయుటకు నీవు రెండు, మూడు సిగరెట్టు కాల్చవలసియున్నది… ఎందుకనగా, అప్పుడే నిన్ను తృప్తి పర్చు తారు ఏర్పడును. నీవు పొగ పీల్చని యెడల అక్కడ ఎలాంటి తారు ఉండదు. తారును కలిగి యుండ వలెనన్న, పొగను పీల్చవలసి యున్నది. అది అలాగే యున్నది. "నీవు పొగ పీల్చవలెనన్న ఆ ఫిల్టరు లేని దానిని పీల్చవలసియున్నది. అప్పుడు ఆ మూడు ఫిల్టరు ఉన్న వాటిలో తక్కువ తారు వచ్చునని" అతడు చెప్పెను.

అది ఒక వ్యాపార తంత్రము! ఇప్పుడు ఈ దేశము ఆలాంటి తంత్రములతో నిండి యున్నది. సమస్తమైన కల్మషముతో నిండి యున్నది."

29మరియు ఆ చిన్న పార్సీలులోని విషము గొంతు నందును లేక ఊపిరితిత్తుల యందును చేరుచున్నదని చూపాడు. తొలుత అది తెల్లగా ఉండినది. ఆ తరువాత అది రోజా రంగునకు తిరుగుచున్నది. ఆ రోజా రంగు నుండి నీలి రంగు లోనికి మారిపోవుచున్నది. ఆ చిన్న ధాతువులు అద్దముల ద్వారా చూచినప్పుడు, పెద్దవిగా కనబడుచున్నవి. అయితే వాటిని చూచుటకు శక్తిగల పెద్ద అద్దములు కావలసియున్నది. వారు ఇంకనూ మాట్లాడుచు "అది ఆ నీలి రంగునకు తిరిగినప్పుడు కాన్సరుగా మారుచున్నది. ఒక మనిషి ఒక దినములో ఒక్క పాకెట్టు సిగరెట్టు కాల్చిన యెడల, సాధారణముగా కాన్సరు వచ్చు వ్యక్తి కంటెను 70 శాతము అధికముగా కాన్సరుతో మరణించు అవకాశమేర్పడుచున్నదని" చెప్పుచున్నారు. అటువంటి అవకాశమును తీసికొనుట బుద్ధిహీనముగా ఉన్నది.

30అంతట అతడు మరొక దానిని తీసికొని నిరూపించాడు. అతడొక తెల్లని ఎలుకను తెచ్చాడు. అతడొక సిగరెట్టును తీసికొని ఒక యంత్రములో ఉంచి, ఒక తెల్లటి చలువరాతికి పైగా దానిని (ఆ పొగను) ఊదాడు. అతడొక తుడుచు, సాధనమును తీసికొని - ఆ సిగరెట్టులోని నికోటిన్ తీసికొని ఆ ఎలుక వెనుక ప్రక్క రాశాడు. ప్రతి ఏడు దినములకు ఒకసారి ఎలుక వెలుపలకు వచ్చుచుండును. ప్రతి దానిని ఆ దిన పాఠమునకు వాడుకొనెదరు. ఆ ఎలుకను ఏడు దినములుంచి ఆ తరువాత దానిని తీసి వేయుదురు. ఆ ఏడు దినములలో కాన్సరు అధికముగా వాటిపై నుండును. కొన్ని ఆ ఏడు దినములలో మరణించును. ఆ ఎలుక కదల లేదు. ఆ దరిద్రపు కార్యమును చూచినప్పుడు నేను రెండు, మూడు రోజులు భోజనము చేయలేకపోయను - అవి ఆ విధముగా కాన్సరుతో బాధపడుచుండినవి. ఆ ఎలుక కాళ్ల యందును వీపు మీదను, కాన్సరు వాపు అంగుళమునకున్నది. ఒక్క సిగరెట్టులో నుండి వచ్చు నికోటిన్ వలన అది ఏర్పడినది. అది వాటిని నిలుపునని మీరు తలంచుచున్నారా? నా ప్రక్కన కూర్చోనియున్న ఒక గొప్ప వ్యక్తికి చెమటలు కారిపోయినవి. అప్పుడతడు, "దాని చూచునప్పుడు ఒక విధముగా ఉన్నది, అట్లు లేదాయని అడిగెను.

అందుకు నేను, "నీవు పొగ త్రాగుదువా?" అని అడిగితిని.

అందుకతడు, "అవునండి నేను త్రాగుదనునని" చెప్పాడు.

అప్పుడు నేను "మంచిది. అప్పుడు మీరు దానిని నిలుపవలసియున్నదని" చెప్పాను. అది వారు కనిపెట్టినది. వారు నిరూపించగలిగినది అది.

31ఇప్పుడు, నేను ముందుగా చెప్పునదేమనగా, ఈ ప్రపంచము నిలచియుండిన యెడల మరియు ఈ నాగరికత అలాగే ఉండిన యెడల, ఆ వెనుక నిషేద కాలమందుండినట్లు ఒక విస్కీ బాటిలు అమ్మిన యెడల గొప్ప అపరాధము చెల్లించవలసి యుండినది. అలాగే ఈ నాగరికత ఇంకనూ కొన్ని సంవత్సరములు ఇలాగే ఉండిన యెడల, ఆ అపరాధమునకు పదిరెట్లు ఒక్క సిగరెట్టు పాకెట్టునకు విధించబడను. ఆ విస్కీ కన్నను ఇది పదిరెట్టు అధ్వాన్న స్థితిలో ఉన్నది. అది నిజము. అది హత్య చేయునదై యున్నది. మీరు ప్రజలతో దీనిని చెప్పవచ్చు, కాని వారు ఏ మాత్రమును శ్రద్ధ తీసికొనరు, "పరిశుద్ధతలో మునిగిపోయిన బోధకుడని వారు పిలచెదరు," అది అలాగే వెళ్ళనిమ్ము. మీరు చూచారా, అది మరణమైనప్పటికిని వారు గమనించరు.

32అయితే, నా ఉద్దేశము ఇదే, శాస్త్రీయ కార్యములు సాధించగలిగినవి ఇవియే. అవి అక్కడ ప్రపంచ ప్రదర్శనమందు ఉంచబడి, ప్రకృతి కార్యములలో శాస్త్రీయ పరొశోధనలు వేటిని సాధించినవో వాటిని చూపుచున్నది. ఇప్పుడు మనము ఆత్మీయ పరొశోధనతో దేవుడు తన వాక్యమును నమ్ము ప్రజలతో సాధించినదేమిటని చూపుచున్నాము. ఇప్పుడు శాస్త్రీయ కార్యములను సాధించుటకు, మీరు శాస్త్రీయ విధానములో పనిచేయవలసియున్నది. అదే విధముగా ఆత్మీయ కార్యములను సాధించుటకు మీరు ఆత్మీయ విధానములో పనిచేయవలసి యున్నది. ఇప్పుడు, ఆ ఎలుక చూచుటకు భయంకరముగా ఉన్నదని మీరు తలంచుచున్నారు. అది చేయబడిన విధానములో మీరు దానిని చూచారు! మీకు చూపుటకు ఒక చిత్రము నా యొద్ద ఉన్నది. నేను దానిని ఎలాగో పొందాను, అయితే దానిని మీకివ్వరు. అయితే గమనించండి. బహుషా, ఆ ఎలుక ఇంక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకును. మరికొన్ని ఆ ఏడు దినములు కూడా బ్రతుక లేవు. దానిని తలంచి చూడండి!

33అది ఒక రకమైన పుండని మీరు తలంచవచ్చు. అట్లయి సువార్తను త్రోసివేసిన ఆత్మ ఎటువంటిదో మీరు చూడవలసియునది వారు చూడనొల్లని వారుగా ఎలా ఉన్నారోనని మీరు చూడవలసియున్నది. దయ్యము ఒక మనిషిని ఎలాగు పట్టియున్నదో, దేవుని కుమారుని సహితము చూచుటకు భయంకరకార్యముగా ఉ౦డునట్లు చేయును, అతడు దేవుని కళ్లలో ఉన్నట్లే ఉండును. ఓ, అతడు ఆరడుగుల పొడవుండవచ్చు, ఎత్తైన భుజములు కలిగి, క్రూరమైన వెంట్రుకలు కలిగియుండినను ప్రయోజనము లేదు. అది లోపలి మనిషి నశింపచేయడముగా ఉన్నది. ఏ విధముగానైనను వెలుపలది ధూళిగా కలసిపోవుచున్నది.

అందువలన, అది వారి సాధనలుగా ఉన్నాయి. అట్లయిన దానిని వారు చూపవలసియున్నది. వారు ఈ శూన్యములోని సూదులను, మరి ఇతరమైన వాటిని కలిగియున్నారు. వారు సాధించినది చూపుటకు ప్రయత్నించినప్పుడు, వారు చేయగల దానిని, వారు అణు సాధనములను మరి ఇతరమైన వాటిని చూపుచున్నారు. చెవర్లెట్టు కారు ఎలా ఉండునో వారు చెప్పుచున్నారు. జెనరల్ మోటారు కారు వారు దానిని చూపుచున్నారు. ఇంక రాబోవు నూరేళ్లలో ఏమై యుండునో, ఇంక ఇరవైయ్యో శతాబ్దములో ఆ చెవర్లెట్టు ఎలా ఉండునో చెప్పుచున్నారు. నాకైతే అది ఒక వాయువు గొట్టము వలె ఉండి, దానిపై పట్టుకొను ఒకటున్నది. ఇప్పుడు అది అణుశక్తితో ఎలా పని చేయునో చూపుచున్నారు. ఒక రకమైన రెక్కదానిని మరొక వైపునకు మార్చుచు, అదుపులో ఉంచుకొని యున్నది. అదొక గొప్ప అవకాశముగా ఉండును.

34అయితే నేను ఆశ్చర్యపడునదేమనగా, మనము దేవుని గ్రంధములోని పేజీలను త్రిప్పగలిగిన యెడల, ఈ ఉదయకాలము, అటువంటి కాలములో సంఘము ఏ విధముగా ఉండునో చూడవచ్చు. దేవుడు చేసిన గొప్ప సాధనలను చూడవచ్చు. ఓ, ఈ భూమిపై జరుగు ప్రతి కార్యము, మరెక్కడో నుండి వచ్చు కార్యములకు ప్రాతినిధ్యముగా ఉన్నది; అయితే అది భూమిని తాకినప్పుడు, సాధారణముగా అది చెడిన స్థితిలో ఉండును, ఎందుకనగా అది ఈ ప్రపంచపు చీకటిలోను పాపములోను ఉండును, చూశారా. అయితే అప్పుడు వేరు పరిమాణములోని ఆత్మీయ పరిధి యొక్క ప్రాతినిధ్యము అక్కడుండును. ఆ మూడు పరిమాణములలో నుండి కలుగునప్పుడు, ఆరవ పరిమాణము తన ప్రాతినిధ్యతను కలిగియుండును. దానిని గురించి నేనెంతో సంతోషించుచున్నాను.

35ఇప్పుడు గత కొద్ది సంవత్సరములలో మనము సాధించిన వాటిని తీసికొందము. ఇప్పుడు మనము జరిగిన ఒక దానితో ప్రారంభించుకొందము. ప్రభువు చిత్తమైతే, నేను మిమ్మును అధిక సమయము ఇక్కడ ఉంచను, అయితే మీరు దీనిని త్వరగా చూడవలెనని ఆశించుచున్నాను. ఓ, అది నా యొద్దకు వచ్చినప్పుడు, నేను ఎగిరిపోవు అనుభూతిని పొందుచున్నాను. ఇప్పుడు గమనించండి. కొన్ని సంవత్సరాల క్రితము, ప్రయాణ సౌకర్యముల కొరకు గుర్రములును, గాడిదలును ఉండినవి. అది ఎంతో కాలము కూడ కాదు, కొద్ది కాలము క్రిందటనే. నేను ఆ గుర్రపు బండిలోను, గాడిద బండిలోను వెళ్ళాను. వాటిపై ఆసనములుండును (జీను). నేను చిన్నవానిగా ఉండునప్పుడు, పదిహేను లేక పదహారు సంవత్సరాల వయస్సులో నేనొక గుర్రమును స్వారి చేయుచుంటిని. నేను పట్టణములోనికి ఈ ఆలయపు మార్గమందే ప్రయాణము చేయుదును. ఇక్కడ ఆ మార్గము బురదగా ఉండును. అధికముగా తుంగ ఎదిగి యుండును. అప్పుడు నేను ఒక గుర్రపు బండిలో ఫారములో ఎదుగు బటర్ బీన్స్ మరియు ఇతర వస్తువులను తీసికొని వెళ్ళుచుండెదను.

ఇప్పుడు నేను ఒక నాజూకైన కారులో వెళ్ళుచున్నాను. ఎంతటి వ్యత్యాసము!

GAL 3:11

 

36అది గుర్రపు బండిలో వెళ్ళిన దినముగాను ఇప్పుడు యంత్రము ద్వారా నడుపబడు బండ్లలో వెళ్ళు దినముగాను ఉన్నది.

దాని వెంట విమాన దినము వచ్చును. అది భూమిపై నుండి గాలిలోకి ఎగిరిపోవును. ఇప్పుడు మీరు గమనించినట్లయిన, ఆ సాధనలు శాస్త్రీయము ద్వారా నిశ్చయముగా జరిగినను, ఆ వ్యక్తి ఆత్మ మనస్సును కలిగియున్నాడు. అది ఆయన సంఘముతో చేయబడిన దేవుని కార్యమును గుర్తించుచున్నది. ఇప్పుడా దినములు…

జ్ఞాపకముంచుకొనండి, వర్తమానికుడెప్పుడును వర్తమానమునకు చివరగా వచ్చును. అక్కడ సంఘ కాలములలో మనము దానిని చూచాము.

ఇప్పుడా గుర్రపు బండ్ల కాలము ఎవరిది? అది లూథరు కాలపు ముగింపు భాగముగా ఉన్నది. చూడండి, ఆ గుర్రపు బండ్ల కాలము వారు తీర్చునందు విశ్వాసముంచారు. దేవుడు సంఘమును రోమనిజము నుండి, క్యాథలిజము నుండి తెచ్చుచున్నాడు, ఆయన దానిని ఆత్మ మొదటి సాధనలోనికి తెచ్చాడు. "నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును." అది ఆ గుర్రపు బండి కాలము. వారు ఆ గుర్రపు బండి కాలమునకు వచ్చినప్పుడు, అది ముగించినది.

37ఇప్పుడు, ఆ తరువాతిగా మానవుడు ప్రయాణ విధానములో చేసిన సాధన యంత్రములతో వెళ్ళు బండ్లను చేశారు. మీరు గమనించిన యెడల, ఆ యంత్ర విధానము కాలమంతటిలో దాని శక్తి యందు అధికమగుచుండినది.

ఇప్పుడు, వెస్లీ కాలపు చివరిలో, ఆత్మీయ సాధన ద్వారా తెచ్చినదేమనగా శుద్దీకరణము, దాని భావమేదనగా సంఘము తీర్పు నుండి శుద్దీకరణ లోనికి తేబడినది.

ఇప్పుడు, మనము వెళ్ళుచుండగా దీనిని జ్ఞాపకముంచుకొనవలెనని నేను ఇష్టపడుచున్నాను. అదేమనగా "సంఘము" అని పిలువబడినది సంఘము కాదు. ఆత్మీయ సంఘమే నిజ సంఘము వేలాది వేల మంది లూథరనులు సంఘములో చేరి, తీర్పు తప్ప మరొక దానిని తెలిసి యుండలేదు. ఒక పంది తను ప్రక్కనెరుగుట కంటె మరేమి ఎరుగదు. వారికి మరేమి తెలియదు. వెస్లీ కాలములో వేలాదిమంది శుద్దీకరణను నేర్చుకొన్నారు. వారికి దేవుని శుద్దీకరణ శక్తి తప్ప మరేది తెలియదు. కుందేలునకు మంచులోని గుర్తులు తప్ప మరేమి తెలియదు. చూడండి. వారికది నిజముగా తెలియదు.

GAL 3:11

 

38అయితే దానిని సాధించిన ప్రజలున్నారు. హల్లెలూయ! నేనెక్కడికి వెళ్ళుచున్నానో మీరు చూడండి. "తీర్పు తీర్చబడుట" అ౦టే దేవుని ధృష్టిలో ఏమిటో ఎరిగినవారు కొందరున్నారు. "మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుండుట." కొందరు నిజాయితీపరులైన లూథరులున్నారు. వారు దానిని నమ్మారు. క్యాథలిక్ సంఘము దేనిని చెప్పినను వారు దేవుని వాక్యమును నమ్మారు. దానియందు నిలచారు, ఎందుకనగా ఆ కాలమునకైన వర్తమానికుడు దానిని బోధించాడు. "నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించెదరు. వారా తీర్పు తీర్చబడిన స్థితిని నమ్మారు. వారు దేవుని కృప చేత తీర్పు తీర్చబడిన దానిని సాధించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము.

39ఇప్పుడు మరలా మనము గమనించుచుండగా, మెథడిస్టులు శుద్దీకరణతో వచ్చారు. మెథడిస్టులు అనేకులు నిజముగా శుద్ధి చేయబడిరి. అనేకులు దానిని పొందియున్నామనుచున్నారు, అయితే దానిని గురించి వారికేమియు తెలియదు. మెథడిస్టు సంఘము శుద్దీకరణను బోధించెను. వారు మోకరించి, ఆక్రందన చేసి, పైకి లేచి "దేవునికే మహిమ, నేను శుద్ధి చేయబడితిని!" అని చెప్పుచున్నారు. అంతట వారు జీవించుచుండిన జీవితమునకే తిరిగి వెళ్ళుచున్నారు. అయితే వారిలో కొందరు స్త్రీ, పురుషులు నిజముగానే ఈ లోక సంబంధమైన కార్యముల నుండి శుధీకరించబడి, నీతిగా ప్రత్యేకమైన జీవితమును జీవించుచున్నారు. ఎందుకు? అది అధిక శక్తిని పొందిన యాంత్రిక కాలముగా ఉన్నది. మోటారు వాహనములు, పురాతనమైన టి-మాడెల్ కార్లు పదిహేను ఇరువది గుర్రముల శక్తిగలిగినవై యుండినవి. చూడండి, కేవలము పదిహేను లేక ఇరువది గుర్రముల శక్తి గలిగిన చిన్న ఇంజనుతో అమర్చబడియుండినవి. శుద్దీకరణము విజ్ఞాన శాస్త్రము ఏదో ఒక దానిని సాధించినప్పుడు, ప్రకృతి సంబంధమైన దానితో సాధించినప్పుడు, దేవుడు తన ఆత్మతో దేనినో సాధించుచున్నాడు. చూడండి, కాలమంతయు ఏదో జరుగుచున్నది. ఆ శుద్దీకరణకాలము తరువాత…

40ఇప్పుడు మనము మనిషిని ఆ పూర్వపు "బేవరింగ్టన్" వలె తీసికెళ్ళు చున్నాము. ఏ మనుష్యుడు ఆ పూర్వపు బేవరింగ్టన్ సోదరునివలె ఉన్నాడు? జాన్ వెస్లీని చూడండి. జార్జ్ వైట్ ఫీల్డు, ఫిన్నీ, నాక్స్ అనేకులైన ఆ మెథడిస్టులు దానిని చెమటలు పట్టునట్లు చేశారు. వారు ఈ భూమిపై నున్న నరకము ద్వారా వెళ్ళారు. బాధను ఎదుర్కొన్నారు, ఎందుకనగా వారు దేవుని వాక్యము బోధించిన శుద్దీకరణను విశ్వసించారు. అది కృప యొక్క రెండవ మెట్టుగా ఉన్నది. వారు దానితో నిలచారు. వారు దానిని విశ్వసించారు. వారు దానితో ఆశ్చర్య కార్యములను చేశారు. అదెట్లున్నదనగా, హెన్రీ ఫోర్డ్ మరియు ఇతరులు ఆ పూర్వపు టి-మాడల్ ఫోర్ట్ కారును, ఆ గుర్రమునకు పైగా ఒక దినమున నడిపించిరి. మరియు వెస్లీ లూథరను దినమునకు పైగా వెళ్ళారు.

HEB 11:3

 

41దాని వెంట వచ్చినది పెంతెకోస్తు, విజ్ఞాన శాస్త్రము మోటారు యంత్రమును సాధించినట్లు. (రైటు సోదరులు విమానమును కనిపెట్టారు) ఈ భూమి మీద ఎగురు యంత్రము ఈ మోటారు కారును దాటి వెళ్ళినది, ఎందుకనగా అతడు దానిని గాలిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ రైటు సోదరులు వారి సాధనాల ద్వారా, విజ్ఞాన శాస్త్రమును తీసికొని ఈ భూమి మీద రూపుదిద్దారు. అదేమి చూపుచున్నదనగా, భూమి మీద ఒక గొప్ప ఆత్మీయ కార్యము జరుగబోవుచున్నదని చూపుచున్నది. ఆ రైటు సోదరులు మానవుని పాదములను భూమి మీద నుండి పైకెత్తునప్పుడు, పెంతెకోస్తు దిగి వచ్చి ఆత్మీయ వరములతో మధ్యాకాశములోనికి తీసికొని వెళ్ళినది. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా జరిగినది. ఆయన దానిని మధ్యాకాశములోనికి తీసికొని వెళ్ళాడు! ఓ హల్లెలూయ! ఆకాశములో ఈదునట్లు అతని పాదములను పైకెత్తాడు. అతడు గాలిలోనికి వెళ్ళిపోయాడు. అతడు తట్టుచు, గుద్దుచు, లాగుచూ ఉన్నప్పటికిని, గాలిలో ఎగిరిపోయాడు. చూడండి, భూమిపైన మనిషి దేనిని సాధించాడో అవి కనబడని వాటితో చేయబడినవి. దేవుడు ఆత్మ చేత నింపబడిన వారిచే, అనగా వారు ఆకలిగొని, దాహమును పొందువారు, వారు వాక్యముతో నిలచియుందురు. దేవుడు వారిచే దేనినైనను సాధించగలడు.

ACTS 2:38,39•

GAL 3:11

 

42ఇప్పుడు, వెస్లీ వాక్యము నుండి తొలగిపోకయుండెను గాని, అతని వెనుక అతని దూషించారు, పిచ్చివాడని పిలచారు. ప్రతిది ఆయనకు వ్యతిరేకముగా నిలచినందున ఆయన దేనిని సాధించలేకపోయాడు. అయితే వెస్లీ దేవుని యొక్క గొప్ప శాస్త్రవేత్త, లూథరు కూడ దేవుని యొక్క గొప్ప శాస్త్రవేత్త, సంఘములు చెప్పుదానిపై వారు శ్రద్ధ తీసికొనలేదు. సంస్థలు చెప్పుదానిని కూడా పట్టించుకోలేదు. లూథరు క్యాథలిక్ ఏమంటున్నారని పట్టించుకోలేదు గాని, నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించుదురని నమ్మెను! హల్లెలూయ! అతడు దేవుని వాక్యములోని రసాయనిక పదార్ధములను తీసికొని ఏకపరచెను మరియు సంఘము విశ్వాసముతో కదలినది. వెస్లీ దానితో రక్తమును చేరాడు, దానిని రక్తము ద్వారా నిరూపించాడు, సంఘము శుద్ధినొందినది. పెంతెకోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమందు విశ్వాస ముంచారు. "ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును దూరస్థులందరికిని," వారు వాక్యము నుండి రసాయనములను తీసి ఏకపరిచారు. వారు మధ్యాకాశమునకు కదలిపోయారు. హల్లెలూయ! వారు వెలుపలకు కదిలి వచ్చారు. వారు అటువంటి దానితో చేరగలిగారు.

43ఇప్పుడు, ఈ మనుష్యులు దీనిని ఎందుకు చేశారు? లూధరు దానినెందుకు కనుగొన్నాడు? వెస్లీ ఎందుకు దానిని కనుగొన్నాడు. ఇతరులెందుకు కనుగొన్నారు? ఎందుకనగా వస్తు సామాగ్రి భూమి మీదనే ఉన్నది. దానితో ఒక టి-మాడల్ ఫోర్డు కారును తయారు చేయవచ్చు. ఒక కారు నడపబడుటకు విద్యుత్తు శక్తి అక్కడున్నది. భూమిలో ఇంధనమున్నది. యంత్ర సామాగ్రి పూర్తిగా ఇక్కడున్నది. జనరేటరుకు కావలసిన కార్బను, ప్రతి దానిని వారు తయారు చేశారు. గమనించండి అది ప్రారంభమైనది… దానిని తయారు చేశారే గాని, సృష్టించలేదు. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఆయనే వాటిని ఇక్కడుంచాడు. అయితే మానవుడు ప్రకృతిపరముగా, శాస్త్రీయ పరిధిలో దానిని నమ్మాడు. దానిని ప్రయత్నము చేశాడు. వారు "లేదు" అను జవాబును పొందలేదు. వారు దానిని నమ్మారు. అది వారి హృదయములో కలిగిన ప్రత్యక్షత, అది వాస్తవము అని రుజువు చేయువరకు వారు దానితో నిలచారు.

44ఆ విధముగానే జాన్ వెస్లీ శుద్ధీకరణమును నిరూపించాడు. ఆ వస్తువులు. అక్కడుండినవి. దేవుని వాక్యము దానిని తెచ్చినది. ఆతడు దానిని నమ్మాడు. ఏది జరిగినను, ఆ పూర్తి సంఘము అతనికి ఎదురు తిరిగినను, ఆనాటి ఆంగ్లికన్ సంఘము మరియు అతడు ఒప్పుకొనిన దానితో నిలచి, దానిని నిరూపించాడు. ఆ తరువాత పెంతెకోస్తులు వచ్చి దానిని నిరూపించారు. వారికి కావలసిన వస్తు సామాగ్రిని వారు కలిగియుండిరి. అదేమనగా పరిశుద్ధాత్మ నిజమైనదని వారు నమ్మారు. వారు ఆకాశమునకెత్తబడినారు.

45మీరు దీనిని గమనించారా, ఒకానొక శాస్త్రీయ సాధనము మరొకదానితో కలసి వెంటాడినది. మరొక దానిని బహుకరించినది. అది దానికన్నను ఉన్నత స్థితి యందుండినది, చూశారా. గుర్రపు బండి కన్నను మోటారు వాహనము ఉన్నత స్థితి కలిగిన ప్రయాణ సాధనము. మోటారు వాహనము కన్నను విమానము ఇంకనూ అధిక స్థితి కలిగినది, అయితే అవి ఒకదానినొకటి కలసి వెళ్ళినవి. గుర్రపుశక్తి ఆమెన్ అది గుర్రపు శక్తి అయినప్పుడు, దేవుని శక్తిని గురించి ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తిని గురించి ఏమిటి? నిన్ను తీర్పు తీర్చగల ఆ పరిశుద్ధాత్మ శక్తి, నిన్ను శుద్ధి చేయగలదు. ఆయన సన్నిధితో నిన్ను అభిషేకించగలదు. మరియు ఆ కొద్ది విజ్ఞాన శాస్త్రము అ, ఆ లు తెలియనిది దానిని కనిపెట్టినది. ఎందుకు? వారు ఆత్మీయ శాస్త్రవేత్తలు. ఆమేన్. వారు ఆ కార్యమును చూచి దానిని నమ్మారు. మనిషి తన విద్య ద్వారా చేయును. అతడొక ప్రకృతి సంబంధ శాస్త్రజ్ఞుడుగా ఉన్నాడు. ఆత్మీయ శాస్త్రజ్ఞుడు ప్రత్యక్షత ద్వారా దానిని చేయును. ఒకరేమో విద్య ద్వారా మరొకరేమో ప్రత్యక్షత ద్వారా చేయుచున్నారు. ఓ, మనము దానిని తెరువగలిగితే సమస్తమును, అన్ని రకముల వస్తువులు అక్కడున్నవి. అది నిజము.

HEB 11:3

 

46ఇప్పుడు మనము అదెట్లు వెళ్ళినదో గమనించాము. దేవుడు దానిని సాధించగలిగెను. పెంతెకోస్తులో, ఆకాశమునకు తీసికొని వెళ్ళెను. వారెట్లు దానిని సంఘమునకు మరలా తెచ్చారో అనగా స్వస్థతలు, భాషలతో మాట్లాడుటయు, ప్రత్యక్షతలు, ఆత్మ వరములు ఇవన్నియు సంఘమునకు ఇవ్వబడినవి. లూథరునకు వీటిని గురించి ఏమియు తెలియదు. వెస్లీకి కూడ వీటిని గురించి ఏమియు తెలియదు, వారు దానిని బోధించలేదు. వారికి దానిని గురించి ఏమియూ తెలియదు, అది వారి కాలమునకు సంబంధించినది కాదు. అది తరువాతి కాలమునకు సంబంధించినది.

ఎందుకు, హెన్రీ ఫోర్డునకు తన దినములలో విమానమును గురించి రైటు సోదరులకు ముందు ఏమైనను తెలియునా? చూడండి, దానిని వారు తెలిసికొనలేదు. ఆ విధముగానే అంతకు ముందున్న వారు గుర్రపు బండిని తోలుచు మోటారు వాహనములను తెలిసికొనలేదు. అది ఐదు వందల సంవత్సరములకు ముందు కాలములో వారికి గుర్రపు బండి కూడ తెలియదు. అయితే బైబిలు మాత్రమే అది వచ్చునని తెలిపినది. అందువలన వారు విజ్ఞాన శాస్త్రము ద్వారా దానిని సాధించగలిగారు, అది భూమిపైన జరిగినప్పుడు, దేవుడు తన సంఘముతో దానిని చూపించెను. దృశ్యమైనది, కనబడని పదార్ధముల చేత నిర్మించబడినవి." చూచారా, దాని ప్రతిబింబము.

47ఇప్పుడు, పెంతెకోస్త కాలమైయున్నది, ఈ చివరి ఏబది సంవత్సరములు ఒక ఉజ్జీవమును లోకమంతటికి పంపినది. దానిలో అన్ని రకములును, సమస్తమును ఉన్నవి. వారి యొద్ద స్వస్థతలుండినవి, రోగములు పోయినవి, కుంటివారు స్వస్థతనొందారు, గ్రుడ్డివారు మరలా వారి చూపును పొందారు, ప్రపంచము దానిని నమ్మినదని మీరు నమ్ముచున్నారా? లేదండి. వారు లూథరును నమ్మలేదు. వారు వెస్లీని నమ్మలేదు. వారు పెంతెకోస్తువారిని నమ్మలేదు. అయితే దేవుడు తన పరిశుద్ధ గ్రంథమును తీసికొని, తన పరిశోధనలో, ఆ విధముగా చేయుటకు ఇష్టపడు ఒక మానవుని తీసికొని, బైబిలును చేతపట్టి అది నిజమని నిరూపించెను. ఆమేన్. మనము దానిని జ్ఞాపకముంచుకొనవలసియున్నది. దానిని మనము నమ్మవలసియున్నది. అవన్నియు మాదిరిగా ఉన్నాయని చూడగలుగుచున్నాము. ఇప్పుడు మన పెంతెకోస్తు కొలము లవోదికయ కాలములోనికి ప్రవేశించుచున్నది.

48అయితే ఇప్పుడు ఏదో జరిగినది. ఇప్పుడు అంతరిక్షములో వెళ్ళు మనిషిని మనము కలిగియున్నాము. జాన్ గ్లెన్ మన మొదటి అంతరిక్ష యాత్రికుడై యున్నాడు. అది విమానమున కన్నను పైనున్నదని మనము కనుగొన్నాము. విమానము తన ఒత్తిడి శక్తి యున్నంత వరకే పైకి వెళ్ళును. అయితే ఇది (రాకెట్) అణు శక్తి ద్వారా, విమానముకన్నను అధిక ఎత్తునకు వెళ్ళునట్లు ఒత్తిడి చేయబడుచున్నది. విమానము దానితో లెక్కకు రాదు. అది నిజము. ఆయన దానిని చేయగలడు. మంచిది. మనకొక అంతరిక్ష యాత్రికుడున్నాడు. ఇది ప్రకృతి కాలమైయున్నది.

జ్ఞాపకముంచుకొనండి, అన్ని సమయములలో ఆ ముందు వర్తమానము యొక్క చివరిలో వర్తమానికుడు వచ్చుచున్నాడు. మనము దానినక్కడ నిరూపించాము. ఇప్పుడు మనము అంతరిక్ష యాత్రికుని మార్గమందున్నాము. ఆమేన్ మరియు ఆమేన్!

HEB 13:8

 

49విజ్ఞాన శాస్త్రము దానినెంత వరకు నిరూపించినదనగా, ప్రకృతి సంబంధమైన మన కండ్లు చూడలేనంత దూరమునకు వెళ్ళు ఒక అంతరిక్ష యాత్రికుడొకడున్నాడని నిరూపించినది. భూమ్యాకర్షణను దాటి అది వెళ్ళగలదు. ఒక ఒత్తిడి గల తొట్టి లాంటిది వెలుపలకు త్రోయబడుట వలన అతడు పైకి వెళ్ళి, లోకములను చుట్టి చూడగలిగెను. ఒక అంతరిక్ష యాత్రికుడు! ఓ మై, ఎటువంటి కాలము ముందు వచ్చుచున్నది. అవునండి, ప్రకృతి సంబంధ కారణములన్నింటిని దాటి వెళ్ళుచున్నది. వాటన్నింటిని దూసికొని వెళ్ళిపోవుచున్నది.

అది దేనిని సూచించుచున్నది? ఒక ఆత్మీయ కాలమును సూచించుచున్నది. దేవుడు తన ఆత్మీయ అంతరిక్ష యాంత్రికులను కలిగియుండు ఒక ఆత్మీయ కాలముగా ఇది ఉన్నది. ఆమేన్! వారిప్పుడు ఇక్కడే ఉన్నారు! హల్లెలూయ! ఆకాశము లోని పక్షిరాజులు మిగిలిన పక్షులన్నింటి కన్నను దూరమునకు ఎగిరి పోవుచు ప్రతి దానికి పైగా ఎగిరిపోవుచున్నవి. ఆత్మీయ అంతరిక్ష యాత్రికులు (మహిమ) వారు దేవుని వాక్యమును తీసికొని వెళ్ళుచూ, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నిరూపించబడుచున్నది. ఒక ఆత్మీయ అంతరిక్ష యాత్రికుడు! ఓ మై! మహిమ! నేను ఈ కాలములో జీవించుచుండగా, అది నన్నెంతో సంతోషింపజేయుచున్నది! ఇప్పుడు ఒక అంతరిక్ష యాత్రికునికి ఎంత అద్భుతముగా అది ఉన్నది! చూడండి? ఏమిటది? ఈ ప్రకృతి సంబంధమైన శాస్త్రవేత్తలు ఏమి చేయుచున్నారు. వారు దాని సాధించగలిగారు. మరియు దేవుడు బైబిలుతో నిలచు వ్యక్తి ద్వారా, అనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పు వ్యక్తి ద్వారా, మరియు ఎవ్వరేమి చెప్పినను - ఆ వాగ్దానము నుండి తప్పిపోని వారి ద్వారా, ఆ కార్యమును చేయుచున్నాడు. అది ఏమిటి? అదేమనగా, నీవొక అంతరిక్ష యాంత్రికుడవై, సంస్థాగతమైన తలంపుకు ఏంతో దూరముగా వెళ్ళిపోగలవు. అది ప్రతి దానికి ఎంతో దూరముగా ఉన్నది. అది సంఘ కార్యములకు దూరముగా ఉన్నది. ఆ తీరమున దేవునితో మరియు ఆయనతో మాత్రము నిలుచునదైయున్నది. అంతరిక్ష యాత్రికులు!

50ఒక అంతరిక్ష యాత్రికుడగుటకు, వారొక తొట్టిలాంటి దానిలోకి వెళ్ళవలెను. వారికై వారు తమ్మను స్వాధీనము చేసికొనలేరు. అది ఒక రాడారు శక్తిని తీసికొని, తనను వాయుమండలమున కావలి తీసికొని వెళ్ళుటకు అణు శక్తిని తీసికొనును. మరియు అతడు అదుపులో ఉంచు గోపురము ద్వారా నడిపించబడును. మహిమ! దేవుని ఆత్మీయ అంతరిక్ష యాత్రికులు కూడ అలాగే ఉన్నారు! వారొక తొట్టిలోనికి వచ్చుచున్నారు. ఒక స్థలమునకు, ఒక శరీరములోనికి, అది క్రీస్తు శరీరమైయున్నది. అంతట, వారు కాదు గాని, అది కాదు. అది జాన్ గైన్ కాదు గాని, అతడు ఉన్న ఆ టాంకు (తొట్టి) అతనిని తీసికొని వెళ్ళుచున్నది. ఆ యంత్రము అతనిని తీసికొని వెళ్ళుచున్నది. అతడు మౌనముగా కూర్చిని యున్నాడు. అతడేమియు చేయుట లేదు. అందులో ప్రవెశి౦చుటకు అతనికి స్వచ్చమైన, నిజ ధైర్యము కావలసియున్నది. అతడా విధముగా అందులోనికి వెళ్ళి "అంతా బాగున్నదని" చెప్పవలెను, ఎందుకనగా విజ్ఞాన శాస్త్రము దానిని నిరూపించినది.

HEB 13:8

 

51క్రీస్తు లోనికి వచ్చి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని విశ్వసించు మనిషిని దేవుడు కోరుచున్నాడు. వారు తమ స్వంత తలంపులను తీసికొనరు. వాయు మండలములోనికి వెళ్ళిపోవుదురు. వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదురు. ఆమేన్. అంతరిక్ష యాత్రికులు! వ్యూ! గుర్రముల కన్నను గాడిదల కన్నను అది ఎంత దూరమో! విమానమున కన్నను అది ఎంతో దూరముగా ఉన్నది! ఆ విధముగానే తీర్పునకును, శుద్దీకరణకును, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకును ఎంతో దూరములో ఉన్నది! వారు పక్షిరాజులోనికి వచ్చుచున్నారు. మొదటిగా వారు బల్లులవలె ఉండిరి, ఆ తరువాత కోడి పిల్లలుగా మారి, ఆ తరువాత కాకులుగా మారారు. అయితే ఇప్పుడు పక్షిరాజులుగా ఉన్నారు. మరెవ్వరూ వారిని వెంటాడలేరు!

52పక్షిరాజు ఒక ప్రత్యేక పక్షిగా ఉన్నది. మిగిలిన పక్షుల కన్నను అది ఎంతో ఎత్తునకు వెళ్ళును. అతడక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి సూక్ష్మముగా చూడగలడు, తన తలను నేరుగా ఉంచగలడు. కొందరు ప్రజలేమో అక్కడికి ఎగిరి వెళ్ళి, ఆ తరువాత వారెక్కడున్నారో తెలియక పోయెదరు, ఎందుకనగా అతడు ఎగిరిన దాని కన్నను పైకి అతడు చూడలేడు. అయితే కొందరు వెనుదిరిగి చూడగలరు మరియు ఏమి జరుగుచున్నదో చూడగలరు. అదియే పక్షిరాజు. ఇంకనూ ఎత్తునకు చూడగలుగనట్లు అతడక్కడ నిలువగలడు. ఏమి చెప్పాలోనని తెలియపరచు ఒక వర్తమానమును వినునంత వరకు అతడక్కడ వేచియుండును. దేవుని అంతరిక్ష యాత్రికుడై అతడున్నాడు, చూశారా. మిగిలిన సమస్త సాధనాలను అది వెంటాడును. అది ఎందుకు ఈ సాధనను వెంబడించుచున్నది?

53యేసు కొరకు అంతరిక్ష యాత్రికులు. ఆమేన్. తమ స్వంత శక్తితో వారు వెళ్ళరు. అతడు ప్రేల్చబడవలసి యున్నది. (ఒక రాకెట్టు బయలుదేరుటకు ముందు దాని క్రిందుగా పేల్చెదరు, అప్పుడది దూసికొని పైకి వెళ్ళును - తర్జమాదారుడు). అతడు చేయునదంతయు అందులోనికి ప్రవేశించుట మాత్రమే. లోపలకు వెళ్ళుట మాత్రమే, అతడు చేయవలసియున్నది. పేలుటను దేవుడు చేయును. ఆయనే ఉంచవలసిన స్థలమున దానిని ఉంచును. ఇక దానికి ఇంధన శక్తి అక్కర లేదు, లేక ఏదో సంఘ సిద్ధాంతము అక్కర లేదు. దేవుని అణుశక్తి చేత అది త్రోయబడుచు దూరముగా వాయుమండలము లోనికి వెళ్ళిపోవును. ఆమేన్. ఓ! ఎందుకు, ఈ అంతరిక్ష యాత్రికులలో ఏమున్నది? వారు తీర్పును మాటను తీసికొని, శుద్దీకరణ అను మాటను తీసికొని, అతడు సమస్త బైబిలులో ప్రవేశించును. ఆమేన్. అతడు దానంటిలోనికి వెళ్ళును, ఎందుకనగా దేవుడు తాను చేసిన ప్రతి వాగ్దానమును నెరవేరగలడని ఎరిగియున్నాడు. అతడక్కడ కూర్చిని వేచియుండును. ఓ, మై! వాక్యము తానే రూపుదాల్చుచున్నది. నీవు వ్యాధి కలిగియున్నను, ఒక అంతరిక్ష యాత్రికుడు జ్ఞాపకముంచుకొనవలసినదేమనగా, క్రీస్తు లోనికి చేరి, ఆ క్రింది వరుస లెక్కింపు కొరకు వేచి యుండవలసియున్నది. అంతే. ఆయన ఆ తూటాను ప్రేల్చును, చింత పడవద్దు. ఇప్పుడు, దేవుడే దానిని వాగ్దానము చేసెను గనుక వారు దానిని సాధించి పొందగలరు.

54ఇప్పుడా అంతరిక్ష యాత్రికుడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడు. ఈ కార్యములన్నియు ఆ పూర్వపు గుర్రపు శక్తి నుండి, మోటారు శక్తికిని, ఆ తరువాత విమాన శక్తికిని, కదలి వచ్చినది! మీరు చూస్తున్నారా, ఆ అంతరిక్ష యాత్రికుడు ఎంతో ఎత్తుగా పైకి వెళ్ళి, గుర్రపు బండి కాలములోని మనిషి చూడలేని దానిని చూచుచున్నాడు. అతడెంత పైకి వెళ్ళాడనగా, మోటారు వాహనపు కాలపు మనిషి చూడలేని దానిని చూడగలుగుచున్నాడు. అతడింకనూ ఎంత ఎత్తుగా ఉన్నాడనగా, ఒక విమానములో ఎగురు మనిషి చూడలేని దానిని చూడగలుగుచున్నాడు. అతడు ఆలోచించుటను దాటి వెళ్ళిపోయాడు. ఆమేన్! మహిమ! అదే కావలసి యున్నది. మానవుడు సాధించుటకు తలంచు ప్రతి తలంపును దాటి ఎంతో దూరము వెళ్ళిపోయాడు. మానవుడు సంస్థను గురించి ఆలోచించుటకు దాటి అతడు వెళ్ళిపోయాడు. శాఖలను దాటి వెళ్ళిపోయాడు. "నీవు ఒక వేళ ఒక మెథడిస్టుగానో, బాప్టిస్ట్ గానో, లేక ఏకత్వమునకు సంబంధించిన వానిగానో, లేక ద్వందమునకు సంబందించిన వానిగానో, లేక మరొకటి గానో ఉండవచ్చు." అతడొక అంతరిక్ష యాత్రికుడు, అతడు వాయుమండలము లోనికి దూసికొని వెళ్ళిపోవుచున్నాడు. ఆమేన్. నేను ఎంతో కృతజ్ఞుడను!

JOHN 15:16•

JOHN 16:23

 

55మరియు ఈ అంతరిక్ష యాత్రికుడు ఒక రాడారు శక్తి ద్వారా నడిపించబడుచున్నాడు. జాన్ గ్లెన్ అను అంతరిక్ష యాత్రికుని వారు లోపలికి తెచ్చుచున్నారు. నేను అక్కడ క్రింద నున్న కేస్ కానవరెల్ అను స్థలమును చూచినప్పుడు, ఆ పెద్ద రాడారు అక్కడుండినది. ఇక్కడ మీరు దానిని చూడలేరు, కాని ఆ రాకెట్టు ఎక్కడున్నదని, ఆ రాడార్ చూపించు దానిని బట్టి చెప్పగలరు. అక్కడే అతడున్నాడు, చూశారా. మనకొక రాడారున్నది, అది ప్రార్థనగా ఉన్నది. ఆ అంతరిక్ష యాత్రికుని నడిపించు రాడారు శక్తి ప్రార్ధనగా ఉన్నది. "నా నామమున తండ్రిని మీరేది అడుగుదురో, నేను మీ కొరకు దానిని చేయుదును," చూశారా. ఆ ప్రార్ధన వెళ్ళు విధమును మాత్రము గమనించియుండుడి. అతడు చూపించు మార్గమును మీరు చూడవచ్చు. ఆమేన్. సంఘము ప్రార్ధించు విధానమును గమనించండి. ఆ అంతరిక్ష నౌకలు ఎగురుచుండుటను మీరు చూడవచ్చు. ఆ రాడారు ద్వారా ఆ అంతరిక్ష యాత్రికులు ఏ ప్రక్కకు వెళ్ళుచున్నారని మీరు చెప్పగలరు. సంఘము ప్రార్ధి౦చు విధానములో మీరు చెప్పవచ్చును.

అతడిలా ప్రార్ధించవచ్చు, "ప్రభువా, బహుశా మేము ఆ కార్యములను విశ్వసించలేకపోవచ్చు." ఉహ్! ఆ అంతరిక్ష యాత్రికుడు క్రిందికి దిగి వచ్చుచున్నాడు. అంతే. ఓ సోదరా!

అయితే ఈ కార్యములన్నియు నెరవేరునప్పుడు, "ప్రభువా, సంఘముపై నీ ఆత్మను కుమ్మరించుము, మాకు కావలసినదేదో దానిని దయచేయము, మాపై పరిశుద్ధాత్మను కుమ్మరించుము. ప్రతి ఆలోచన నుండి మమ్ము దూరపరుచుము. వాక్యము సత్యమని విశ్వసించునట్లు చేయుము. మేము దానితో నిలువబోవుచున్నాము." తెర పైకి లేచుటను మీరు చూడగలుగుదురు, చూడండి. ఆ అంతరక్ష యాత్రికుడు పైపైకి వెళ్ళిపోవును. ఆకాశములోనికి దాటి వెళ్ళిపోవును. అద్భుతము! ప్రతి సంస్థ నుండి దాటి దూరముగా వెళ్ళిపోవును. ప్రతి సిద్దాంతమును దాటి వాటినుండి దూరముగా వెళ్ళిపోవును.

56ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, నీతికరణ ఒక సిద్దాంతమును తెచ్చినది, అది నిజము, లూధరులనుల వలె మీరును నీతికరణ నమ్మెదరు. వారి అంతరిక్ష నౌకలను (satellites) నమ్మెదరు. వారు ఆ నౌకలుగా ఉన్నారు, అయితే వారు భూమి నుండి ఎగురలేకపోయారు. మీరు శుద్దీకరణను, వారి నౌకలను తీసికొనెదరు. మీరలా చెప్పవచ్చు. "లూధరనుల అంతరిక్ష నౌకలేవియని?" మంచిది, క్రీస్తు సంఘము వారి గుంపు అక్కడున్నవి. "వెస్లీ అంతరిక్ష నౌకలేవీ, మెథడిస్టు లాంటి వారి నౌకలేవి? నజరేయులు, పరిశుద్ధ యాత్రికులు, వారి అంతరిక్ష నౌకలేవి? అంతట పెంతెకోస్తు వారు వారి అంతరిక్ష నౌకలు, ఆ విమానము, నిజమే, ఏకత్వపు వారు, ధ్వంధులు, ముగ్గురు, నలుగురు వీరందరు దానిపై యున్నారు. నాలుగు మూలల దేవుని సంఘము, అవియన్నియు సిద్దాంతములచే నింపబడి సంస్థలలో ఉన్నవి.

HEB 6:20

 

57అయితే అంతరిక్ష యాత్రికులు ఆ శబ్ద తరంగిణిని చీల్చుకొని పోయెదరు. అతడు సూటిగా వెళ్ళిపోవును. అతడు దేనిని వినడు. ఓ, మై! అతడు అన్నింటిని దాటి వెళ్ళిపోవును. సమస్త కార్యములను దాటి పైకి వెళ్ళును… ఆతడు దేవుని సన్నిధిలో నివాసము చేయును. అవునండి. ఆయనే దానిని వాగ్దానము చేశాడు. ఆయన ప్రధాన యాజకుడని ఆయన మాటలు చెప్పుచున్నవి. అక్కడ ఆ గొప్ప రాడారు కదలుచూ ఉండుటను చూశారా? ఆ కూడికలో మీరాయనను గమనించండి. ఆయన వాగ్దానము చేసినట్లు, పరిశుద్ధాత్మ అగ్నిస్తంభము రూపములో దిగి వచ్చుటను మీరు చూడగలరు. అక్కడ ఒక మనిషి ఆలోచించుచు కూర్చొనడు. ఒక విజ విశ్వాసి దానిని సైన్సుతో పోల్చి చూడడు. అతడేమై యున్నాడు? అతడొక రాడారు తెరగా ఉన్నాడు. ఆ రాడారు చూపించు దానిని ఈ తెరపై చూడవచ్చు. అతనిని గమనించండి. అతడు ఆ చుట్టు చూపించును. ఆమేన్. అక్కడ ఒకదానిని పట్టుకొనును. అతడు ఒక అంతరిక్ష యాత్రికుడై యున్నాడు. "నీకు కాన్సరున్నదా, నీకు మరేదైనా ఉన్నదా. మీరు ఫలాని-ఫలాని వారై అలాంటి విమానమునకు సంబంధించి యున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము స్వస్థపరును." హల్లెలూయ! అతడు వెళ్ళిపోవును. అంతరక్ష యాత్రికుడు! ఓ మై, అది ఎలాంటి సంఘముగా ఉండునో! అది ఇక్కడే ఉన్నది.

1COR 15:52•

HEB 11:3

 

58ఈ సాధననములన్నియు విజ్ఞాన శాస్త్రము ద్వారా నిరూపించబడినవి. అక్కడ ప్రపంచ ప్రదర్శనలో అవన్నియు చూపబడినవి. మనము వాటిని కలిగియున్నాము. ఆమేన్. ప్రతి స్థలమందును అది నిరూపించబడినది. మనము అంతరిక్ష యాత్రికుని కాలమందు జీవించుచున్నాము. చూడండి, అది పరలోకమునందున్న దానితో చేయబడినది. దేవుడు తానే ఈ ఆరవ పరమాణమందున్నాడు. అది దేవుని శక్తియైయున్నది. మనము ఆ పరిమాణములోనికి ఎత్తబడు వరకు మనమా స్థలములో ఉంటిమి, సమాధి మరియు ఏడుపు స్థితిని దాటియున్నది. పెట్టెలో ఉంచి చీలలు బిగించి ఎల్లప్పటికి గుడ్-బై అని చెప్పు విధముగా ఉన్నది. హల్లెలూయ! మనమా అంతరిక్ష యాత్రికునిగా ఉన్నాము. దూరముగా సాగిపోయాము మరియు అదెక్కడున్నదోనని చూచి, వెనుకకు తిరిగి వచ్చాము. మహిమ! ఆకాశమును దాటి మన ఇంటికి వెళ్ళిపోవుచున్నాము. మానవుని ఊహను దాటి వెళ్ళిపోవుచున్నాము. ఏ విధముగా పూర్వము౦డినది, కనురెప్ప పాటున మార్పు చెంది, ఒక్క క్షణములో రూపాంతము చెందుచున్నది. మనము వారినక్కడ చూడగలము. వృద్ధ, స్త్రీ, పురుషులను యవ్వనులుగా చూడవచ్చును. "మీరెలా ఎరుగుదురు?" బైబిలు దానిని బోధించుచున్నది. మరియు దేవుడొక అంతరిక్ష యాత్రికుని అక్కడకి పంపియున్నాడు, అదేమిటో - మనకదంతయు తెలియును, అతడు మరలా వెనుకకు వచ్చెను. అక్కడ మరణ చింత లేదు. మరణమనునది లేదు. ఖచ్చితముగా, అక్కడ జీవించెదము. అవునండి. మనము వెళ్ళిపోవునట్లు భూమిపై నుండి మన కాళ్ళను పైకెత్తునట్లుగా ఉన్నది. ఓ, ఎంత అద్భుతము!

HEB 13:8

 

59ఆయన తన వాక్యమందు దీనినంతటిని వాగ్దానము చేసియున్నాడు, ఎందుకనగా హెబ్రి 13:8 ఇలా చెప్పుచున్నది - "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." ఆయన చేయగలిగిన కార్యములను, దేవుడు ఆయనకు సమర్పించుకొనిన ఒక మనిషి ద్వారా, నెరవేర్చగలడు, ఎందుకనగా అతడు వాక్యమునకు తనను సమర్పించుకొని, గత రాత్రి నేను చెప్పినట్లు, అతడు ఎల్లప్పుడు వాక్యముతో నిలచును.

ఇప్పుడు, అది ఏమని నీకు తెలియునా, అంతరిక్ష యాత్రికులనునదీ క్రొత్త కార్యము కాదు. ఏలీయాను గురించి ఏమిటి? అతని వలె అంతరిక్ష యాత్రికుని నేను ఒకరిని కూడ చూడలేదు. జాన్ గ్లెన్ వెళ్ళుదునని తలంచని స్థలమునకు అతడు వెళ్ళాడు.

మంచిది, ఒకప్పుడు ఒకరిని నెమ్మదిగా పైకి తీసికొని వెళ్ళారని మీకు తెలియునా, ఆయన పేరు హానోకు. అతడు నడిచి పైకి వెళ్ళిపోయాడు, అయితే అతడు కూడ ఒక అంతరిక్ష యాత్రికుడే. నిజము. అతడు ఒత్తిడి చేయబడెను. అతడు మరు రూపము చెందలేదు, మరేదియు లేదు, లేదు. అతడు నడచుచుండగానే ఒత్తిడి చేయబడెను. సమస్త పరిమాణముల ద్వారా అతడు నడిచి పైకి వెళ్ళిపోయాడు. ప్రతి దానిని దాటి దేవుని సన్నిధిలోనికి నడచి వెళ్ళిపోయాడు.

ఆ విధముగానే ఒక వృద్ధుడు ఆయాసముతో, బాగుగా నడువలేక అలసిపోయాడు. అతడు యొజెబెలుతో, అనగా, ఆమె పొట్టి వెంట్రుకలతో మరియు రంగుల ముఖముతో, ప్రతి అలంకారముతో ఉండగా ఆమెతో పోరాడుచుండినప్పుడు, దేవుడు క్రిందికి ఒక రధమును పంపి, "నిన్ను ఈ మధ్యాహానము ఈ మేఘముల ద్వారా సవారి చేయనివ్వబోవుచున్నానని" చెప్పెను. అతడొక అంతరిక్ష యాత్రికుడు.

ACTS 1:11•

PHIL 3:21•

1JN 3:2

 

60ఒకప్పుడు ఒకరు ఈ లోకములోని తన వారి కొరకు మరణించుటకు గాను వచ్చారు, దేవుడాయనను మూడవ దినము లేపెను. ఐదు వందల మంది ఆక్కడ నిలచి చూచుచుండగా, ఆయన మేఘములపై కొనిపోబడెను. అతడు వెళ్ళుచు౦డగా, ఒక స్వరము ఇలా పలికినది, "నేను మరలా వచ్చెదను." ఒక దేవదూత తిరిగి వచ్చి ఇలా చెప్పెను, "పైకెత్తబడిన ఈ యేసు, ఆ ప్రధాన అంతరిక్ష యాత్రికుడు, ఆ విధముగానే తిరిగి వచ్చును. ఆయన ఉన్న అలాంటి రూపముతోనే, అక్షయమైన శరీరముతో తిరిగి వచ్చునని చెప్పెను." హల్లెలూయా! ఆయన స్వంత మహిమ శరీరమును మనము కలిగియుండెదము, ఎందుకనగా ఆయన ఏ విధముగా ఉన్నాడో, ఆ విధముగా మనము కూడ ఉందుము." ఓ, హల్లెలూయా! ఆయన సమస్త శబ్ద తరంగములను చీల్చుకొని, సమస్త కారణములు వెతుకుటను చీల్చి, మరియు సమస్తమైన దానినంతటికి పైగా దాటి వెళ్ళిపోయాడు.

61దేవుని కొరకు జీవించు ఏ మనిషియైనను, ఈ ఐదు ఇంద్రియములను దాటి వెళ్ళును. ఎటువంటి విద్యయైనను, మానవుడు సాధించగల మరి ఏది యైనను, దాటి వెళ్ళుచు, దేవుని విశ్వసించి, ప్రతి దానిని చీల్చి వేయుచు ప్రక్కన ఉంచుచు వరలోకమునకు వెళ్ళిపోవును. ఆమేన్. ఓ, ఆ అంతరిక్ష యాత్రికులు మరి ఇతరులు ప్రకృతి సంబంధముగా దానిని సాధించారు, అయితే దేవుడు ఆయన సంఘము ద్వారా సాధించాడు. ఆత్మ ద్వారా విశ్వసించగలిగిన ఆత్మీయ ప్రజల ద్వారా, సాధించగలిగెను. స్త్రీ లేదా పురుషులు, ఏ సమయమందైనను వాక్యమందు దేవుని అంగీకరించి ధైర్యముతో నిలువగలవారెవరైనా, ఒక అంతరిక్ష యాత్రికుని వలె ఉన్నారు.

వారిలా చెప్పెదరు. "ఓ, అది నమ్మశక్యము కానిది. ఆ ప్రజల ఆక్రందనను వినుము, వారి ఘోషను వినుచున్నారా? ఓ, అది నమ్మశక్యము కానిది." దానిని గ్రహించుటకు వీలు కాదు.

62కొందరు నాతో ఇలా చెప్పారు, "బ్రెన్హాం సొదరుడా, నీవా స్థలమును చూచినప్పుడు, నీకొక కల వచ్చినది." నాకే కలయు రాలేదు. నేనక్కడ పైన నిలచి, క్రింద పడకపై పడియున్న నా శరీరమును చూచాను. నేను పడకపై కలగనుచూ ఉండవచ్చు, అయితే నేను పైన నిలచి నన్నునేను క్రింద చూస్తూ ఉండిపోయాను. ఓ, ఆయన నాకు కొద్దిగా అంతరిక్ష యాత్రికుని అవకాశమును ఇచ్చాడు. ఆ ఉదయకాలము నేను ఎక్కడికి వెళ్ళాలో చూపించాడు. మీ రాడారు దానిని సూచించుచున్నదని అది చూపుచున్నది, అది ఖచ్చితముగా ఎక్కడున్నదో చూపించుచున్నది. ఇప్పుడు అది నేను కాదు, అది ఆయనే. నీలోని ఆత్మ ఆ వర్తమానమును నమ్ముచున్నది. నేను ఉన్న స్థలములో పరిశుద్ధాత్మ నిలచి ఉన్నాడు. మీరు ఆ విధముగా విశ్వసించుట ద్వారా అది మిమ్మును సంధించుచున్నది; ఇప్పుడది ఇక్కడికి నేరుగా వచ్చుచున్నది, అది మీ జవాబుగా ఉన్నది. అంతరిక్ష యాత్రికుడు! ఆమేన్. ఓ, ఎంత అద్భుతము! అవునండి.

63ఆ గొప్ప విజ్ఞాన శాస్త్రము గొప్ప కార్యమును చేసినది. వారు దానిని ఎంత గొప్పగా చేశారనగా, వారిని గురించి వారే దుఃఖపడిరి. అది నిజము. వారెంత గొప్పతనమునకు వెళ్ళారో దానిని చూచి వారే బయపడిరని మీకు తెలియును. వారు రెండు సంవత్సరముల క్రితము ఈ విధముగా చెప్పారు, అది అర్థరాత్రికి ముందు మూడు నిమిషములుగా ఉండెను. వారెంతో బయపడిరని మీకు తెలియును, వారేమి చేయుచున్నారు? ఇప్పుడు మానవుడు ప్రకృతి సంబంధముగా ఒక ప్రకృతి అంతరిక్ష యాత్రకుని సాధించగలిగెను. ఇప్పుడీ అంతరిక్ష యాత్రికుని సాధించగలిగెను. రష్యా ఈ దేశమును (అమెరికాను) ప్రేల్చి వేయుటకు ప్రారంభించినప్పుడు, లేక మరొక దేశమును ప్రేల్చి వేయుటకు ప్రారంభించినప్పుడు, అతడు చంద్రునిలోకి పయనించుటకు యోచించుచుండెను.

64గత దినమందు ఆ చిన్నదైన తెలివిగల కార్యమును చూచాను. అది నిజముగా ఎంతో ప్రియముగా ఉండినది. అక్కడ ఇద్దరు ఇండియన్లు నిలచి ఒకరితో ఒకరు మాటలాడుచుండిరి. వారి తలకు పాగాలు ధరించి, ఈకలను బిగించియుండిరి. వారు ఒకరి హస్తమును మరొకరు పట్టుకొని కరచాలనము చేయుచుండిరి. అప్పుడు వారు, "సోదరా, తెల్లమనిషి చంద్రునిలోకి వెళ్ళుచున్నాడు, కావున మన దేశమును మనము మరలా పొందెదము." చెప్పెను, "త్వరలో మన దేశమును మనము పొందెదము, తెల్ల మనిషి చంద్రునిలోనికి వెళ్ళుచున్నాడు, కావున మన దేశమును మనము మరలా పొందెదము" అని మాట్లాడుచుండిరి. అదంతయు మంచిదే.

DAN 3:19,27•

1COR 12:13

 

65ఓ, ఇప్పుడు వారందరు, ఈ అంతరిక్ష యాత్రికుల పెట్టెలను లేక తొట్లను అధికముగా కోరుచున్నారు. ఆ విధముగా వారు దాని లోనికి వెళ్ళుటకు ఇష్టపడుచున్నారు. అణుయుగము వచ్చినది, వారు దానితో లోకమునే ప్రేల్చి వేయుటకు చూచుచున్నారు, వారు కేవలము దీనిని చేయుట ద్వారా చంద్రుని లోనికి ప్రయాణమును కొనసాగించుచున్నారు. దానితో సమస్తమును చేయగలమన్నారు. ఆ విధముగా మరొక జీవనమును చంద్రునిపై చేయుటకు ప్రయత్నించుచున్నారు. వారక్కడకు వెళ్ళలేరు. నా హృదయమంతటితో నేను దానిని నమ్మలేను, వారక్కడకు వెళ్ళలేరు, చూశారా.

అయితే అదే సమయములో క్రీస్తునందున్న ఒక నిజ విశ్వాసి తన అ౦తరిక్ష నౌకలోనికి ప్రవేశించుచున్నాడు. ఆమేన్. "ఒక్క ఆత్మ చేత మనమందరము ఆ అంతరిక్ష యాత్రికునిలోనికి బాప్తిస్మము పొందియున్నాము." ఓ, ఒక్క శరీరము! అది ఎటువంటి ఒత్తిడినైనను భరించగలదు. వారు దానిని కొలిమిలో వేసి చూచారు, అది ఆ అగ్ని నిలచినది, అది కాలిపోదు; ఏడుమార్లు ఆ అగ్ని అధికము చేయబడినది. వారు ప్రయత్నించారు గాని, ప్రతిది వెలుపలకు వచ్చివేసినది. అందువలన ఆ ఆత్మీయ శాస్త్రజ్ఞులు దేనికైనను నిలువగలరని నిరూపించుకొన్నారు. అందువలన ఒక నిజ ఆత్మీయ క్రైస్తవుడు తనను సిద్ధపరచుకొని దేవుని అంతరిక్ష యాత్రికునితో కలసి పోవుచున్నాడు, ఆయనే క్రీస్తు, సమస్త కార్యములను నమ్ముచు ఆయనలోకి వెళ్ళిపోవును; సమస్త సిద్ధాంతములను ప్రక్కనుంచి, ఆ పెంతెకోస్తు సిద్ధాంతములను గాని, బాప్టిస్టు సిద్ధాంతములను గాని, మెథడిస్టు సిద్దాంతములను గాని, ప్రక్కనుంచును. అతడు కేవలము ఆ అంతరిక్ష యాత్రికునిలోకి ప్రవేశించి ఇలా చెప్పును, "ప్రభువా, అదెప్పుడు సిద్దమగును?" ఓ, మై! అతడేమి చేయుచున్నాడు? అతడు చిన్న కూడికలకు వచ్చుచు, దేవుని వాక్యపు క్రింది వరుస లెక్కింపును వినుచున్నాడు.

66ఆ ఉదయకాలము జాన్ గ్లెన్ ఆ రాకెట్టులో కూర్చున్న తరువాత వారా క్రింది వరుస లెక్కింపును వినుచుండిరి. "పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు ఆరు, ఐదు, నాలుగు, మూడు రెండు, ఒకటి, సున్న," చూచారా. "ఇంక మూడు నిమిషములలో ఏదో ఎత్తబడబోవుచున్నది" అని చెప్పు ఒక స్థలమునకు అతడు వచ్చియున్నాడు. అదేమిటో వారికి తెలియదు. "సున్న గంటకు ఇంకనూ మూడు నిమిషములున్నవని దాని భావము.

ఇప్పుడు గమనించండి, నిజ క్రైస్తవుడు క్రీస్తునందున్నాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వాక్యమును ప్రకటించుము, వాక్యముతో నిలచియుండుము. సంస్థలు ఏమి చెప్పినను అది నాకక్కరలేదు. క్రీస్తునందున్న వారు దానిని ఎట్లయినను నమ్మెదరు. వారక్కడే వాక్యముతో నిలచియుందురు. అది వాక్యమై యున్నది. సంస్థలు ఒక పెద్ద అల్లకల్లోల మరియు త్రోపుడుతో వారిని వెలివేయును, వారిని త్రోసివేయును, మరియు "వారు పిచ్చివారని" చెప్పును. ప్రతిది అలాగే ఉండును. అయితే వారు ఆ వాక్యముతో నిలచియుండెదరు. దేవుడు దానిని వాగ్దానము చేయునంత వరకు, వారక్కడ నిలచియుండెదరు, ఎందుకనగా వారు అంతరిక్ష యాత్రికులైయున్నారు. వారు వాక్యమును నమ్ముదురు. వారిని తొలగించగలిగిన వారెవ్వరూ లేరు. వారు నిన్ను ఏలాగు విడిచి పెట్టుదురు, అందువలన వారిని కొంత సమయము ఒంటరిగా ఉండనివ్వండి.

EPH 2:6

 

67అయితే వారు క్రీస్తు యేసునందు పరలోక్ష స్థలముల యందు కూర్చొనియున్నారు. వారా క్రింది వరుస లెక్కింపును వినుచున్నారు. ఆ సంఘకాలములు మరియు ఇతర కార్యములను ఆలకించుచుండును. మహిమ! అది మిమ్మును ఎంతో సంతోషింపజేయుచున్నది. కాదా? ఆ క్రింది వరుస లెక్కింపును వినుము! క్రింది వరుస లెక్కింపు అనగా ఏమిటి? "చేయబడిన వాగ్దానపు కార్యములన్నియు, ఇక్కడే నెరవేరినవి. ఒక వాగ్దానమున్న యెడల అది ఇక్కడే నెరవేరినది. ఈ కార్యములన్నియు వాగ్దానము చేయబడి ఇక్కడే నెరవేరినవి. ఆయన ఈ దినమునకు చేసిన వాగ్దానము నెరవేర్చు ఇక్కడ మనమధ్య ఉన్నది." వారేమి చేయుచున్నారు? క్రింది వరుస లెక్కింపును వినుచున్నారు. అదెంత వరకు వచ్చియున్నది? లూథరు నుండి మార్గమంతయు వచ్చియున్నది. అది క్రింది వరుస లెక్కింపు! "నీతికరణ, శుద్దీకరణ… పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు…" ఊ! వారేమి చేయుచున్నారు? ఎత్తబడుట కొరకు వేచియున్నారు, చివరి సున్న ఘడియ. ఆమేన్.

68ఆ గొప్ప తిరుగు మార్గములోనికి సంఘము వెళ్ళుటకు సిద్ధపడుచున్నది, మరియు ఇది గొప్ప క్రింది వరుస లెక్కింపు, అనగా నేనేమి తలంచుచున్నానో దానిని మీకు వివరించుటకు ఇష్టపడుచున్నాను. మనము దాని ద్వారా ఈ సంఘమందున్నామని నేను తలంచుచున్నాను. ఇపుడు మీరు దానిని గమనించారు. ప్రకృతి సంబంధ అంతరిక్ష యాత్రికుడు భూమిని విడిచి వెళ్ళుటకు సిద్దముగా ఉన్నప్పుడు, అక్కడొక క్రి౦ది వరుస లెక్కింపు ప్రారంభమై, పది నుండి సున్నకు లెక్కించబడుచున్నది. ఇప్పుడు నేను ఈ వర్తమానమును వివరించుటకు ప్రయత్నించుట లేదు గాని, ఆత్మీయ అనువాదమును ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాను. ఈ ఉదయ కాలము అధిక సమయము తీసికొన్నది. అయితే నేను దీనిని మీకు వివరించుటకు ఇష్టపడుచున్నాను. "పది" అను సంఖ్య "లోకత్వపు" మనిషిగా ఉన్నాడు. అయితే "ఏడు" "దేవుని పరిపూర్ణతగా" ఉన్నది. ఆరు దినములలో ఆయన భూమ్యాకాశములను చేసెను. "ఏడవ దినమున ఆయన విశ్రాంతి తీసికొనెను." ఆరువేల సంవత్సరములు ఈ ప్రపంచము పాపమును నెదిరించి శ్రమపడవలసియుండినది, ఏడవది వెయ్యేండ్ల పరిపాలనగా ఉన్నది, అదియే సబ్బాతు.

69ఏడు దేవుని పరిపూర్ణ సంఖ్యగా ఉన్నది. ఇప్పుడు ఆయన మనకు ఖచ్చితమైన క్రింది వరుస లెక్కింపును అనుగ్రహించియున్నాడు. ఆయన క్రింది వరుస లెక్కింపు పది అను సంఖ్య నుండి కాదు, అయితే ఏడు అను సంఖ్యతో ప్రారంభమగుచున్నది. మనము దాని ద్వారా ఏడు సంఘ కాలములలో వచ్చాము. ఇప్పుడు మనము, ప్రకటనలో కనుగొనినదేమనగా, ఆ క్రింది వరుస లెక్కింపు ఆ మొదటి కాలముగా ప్రారంభమైనది. రెండవ క్రింది వరుస లెక్కింపు రెండవ కాలముగా ఉన్నది. ఆ విధముగా ఏడవ క్రింది వరుస లెక్కింపునకు వచ్చాము. ఇక్కడ మనకు కనబడునదేమనగా, పటములో గీయబడి చూపించబడినట్లు, మన మీ క్రింది వరుస లెక్కింపును కలిగియున్నాము. ఆ మొదటిగా లెక్కించబడిన సంఖ్య ఎఫెసు. రెండవదిగా లెక్కించబడినది స్ముర్న. ఆ తరువాతది పెర్గమము. ఐదవది సార్ధీసు. ఆరవది ఫిలదెల్ఫియా, లవోదికయ ఏడవదిగా ఉన్నది, అది చివరి సంఘ కాలము. చివరిగా ఇది సంఘము విడచి వెళ్ళుటకు సిద్ధముగా ఉండు సున్న సమయముగా ఉన్నది. అప్పటికి సంఘ కాలములన్నియు వాటి క్రమమును నెరవేర్చినవి. ఇప్పుడు తుయతైర సంఘ కాలము వచ్చి వెళ్ళినదని మనము ఎరుగుదుము. ఎఫెసు సంఘ కాలము వచ్చి వెళ్ళినది. ఫిలడెల్ఫియా కాలము వచ్చి వెళ్ళినది. మనమిప్పుడు ఏడవ సంఘకాలములో ఉన్నాము. దాని చివరిలో ఉన్నాము, అది లవోదికయ సంఘ కాలము. అదియే ఆ క్రింది వరుస లెక్కింపు.

REV 1:16

 

70మీరు గత సంఘముల పాఠములను గమనించిన యెడల, ఆయన ఏడు నక్షత్రములను తన చేత పట్టియున్నాడు. ఆ నక్షత్రములు "ఆ ఏడు సంఘములకు గాను పంపబడిన ఏడుగురు సేవకులు." దేవుడు తన క్రింది వరుస లెక్కింపును ప్రారంభించినప్పుడు వారిలో ప్రతి ఒక్కరు ఖచ్చితముగా గుర్తించబడిరి. ఆయన (సింహాసనమును) విడిచిపెట్టినప్పటి నుండి, తిరిగి ఆయన (తన సింహాసనమునకు) వచ్చువరకు, ఆయన తన నామము కొరకు ఒక ప్రజను సమకూర్చుకొనెను. ఆయన దానిని పెంతేకోస్తు దినమున ప్రారంభించెను. ఆ మొదటిది, ఎఫెసు సంఘము, ఆ నక్షత్రము మరియు ఆ సంఘ సేవకుడు, పరిశుద్ధ పౌలని మనము విశ్వసించుచున్నాము. ఆయన (పౌలు) వచ్చినప్పుడు ఒకటన సంఖ్య లెక్కించబడినది. రెండవ సంఘ కాలము, అది స్పుర్న, ఆ సేవకుడు ఐరేనియస్, ఆయన ఒక గొప్ప దేవుని పరిశుద్దుడైయుండి చివరిలో ఆ సంఘ కాలమును నడిపించెను. మూడవది పెర్గమము, దాని సేవకుడు పరిశుద్ద కొలంబా, ఆయన కూడ దేవుని గొప్ప సేవకుడైయున్నాడు. చీకటి యుగమునందు హింసించిన కాలము నాల్గవ కాలముగా ఉండి, నాల్గవ సంఖ్య లెక్కించబడినది, దాని సేవకుడు పరిశుద్ధ మార్టిన్ - అతడొక గొప్ప పరిశుద్ధుడుగా ఉండి, ఫ్రాన్సు దేశము నుండి వచ్చెను. ఐదవ సంఘ కాల సేవకుడు లేక వర్తమానికుడు, మార్టిన్ లూథరు లెక్కింపు క్రమములో ఉన్నాడు. ఆరవ కాలమునకు జాన్ వెస్లీ తన లెక్కింపు క్రమములో ఉన్నాడు.

GEN 6:16•

MAL 4:5

 

71ఇప్పుడు మనము ఏడవ కాలమందున్నాము. అది లవొదికయ సంఘ కాలముగా ఉన్నది. రెండవసారి తన లెక్కింపు క్రమములో కనబడనున్న ఆ గొప్ప వర్తమానికుడైన ఏలీయా కొరకు మనము చూచుచున్నాము. ఆయన కనబడిన వెంటనే, అప్పుడు సున్న కాలమందున్నందున, సంఘము తన గృహమునకు ఎత్తబడుచు, అంతరిక్షము ద్వారా ఆకాశములలోనికి చంద్రుని, నక్షత్రములను మిగిలిన వాటన్నిటిని దాటి వెళ్ళి యేసును కలిసికొనును.

ఇదెక్కడి నుండి వచ్చుచున్నది, వారెక్కడికి వెళ్ళుచున్నారు? ఈ అంతరిక్ష యాత్రికుని లోనికి మొదటి మెట్టుగా వారెలా వెళ్ళెదరు? ఆ విధముగానే వారు ప్రతి స్థలమందును, ప్రతి సమయమందును దాని లోనికి వెళ్ళవలసియున్నది. అది నిజము. మనము లోనికి వెళ్ళుటకు ఆ మొదటి వారు చేసినట్లే చేయవలసియున్నది, ఎందుకనగా అది ప్రజల యొక్క గొప్ప శరీర పరిధిగా ఉన్నది. అది నోవహు కాలమందుండినది, అక్కడ ఒక్క ద్వారము మాత్రమే ఉండినది. అదొక్కటి మాత్రమే ప్రవేశించు ద్వారముగా ఉండినది. ఆ ద్వారపు మార్గములో వచ్చిన ప్రతిది, అది తీర్చు నిరూపణయైనను, క్రింది భాగము, రెండవ అంతస్తుగా ఉన్నను లేక మూడవ అంతస్థుగా ఉన్నను, వారందరు ఒక్క ద్వారము నొద్దకు వచ్చారు. వారందరు ఆ విధముగానే వచ్చారు.

72ఈ అంతరిక్ష యాత్రికుని దినము కూడ ఆ విధముగానే ఉన్నది. మనము ఆ మార్గమున మాత్రమే రావలసియున్నది. ఆ మార్గములో మాత్రమే రావలసియున్నది. ఆ వర్తమానము ద్వారా మాత్రమే లోపలకు రాగలము, క్రీస్తు ద్వారా, వారు పెంతెకోస్తు దినమున పొందిన ఆ శక్తి ద్వారా మాత్రమే రాగలరు. ఆ మార్గము ఒక్కటి! అది అన్ని వేళలలో ఒక్కటిగానే ఉన్నది, ఎందుకనగా ఆ ద్వారము పూర్వపు ద్వారమే. మరియు మనము ఏలాగు ఈ శరీరములో ప్రవేశించగలము? ఆ ద్వారమున మాత్రమే. ఈ శరీరమునకు యేసు ద్వారముగా ఉన్నాడు. అందులన మనము దీనిలోనికి వచ్చి, దేవుని రాజ్యములోనికి జన్మించుచున్నాము. యేసుక్రీస్తు అను ఆ ద్వారము ద్వారా వచ్చుచున్నాము. ఈ ద్వారము లవోదికయలో మూసివేయబడుటకు సిద్ధముగా ఉన్నది. అది చివరి వరుస లెక్కింపుగా ఉన్నది. సంఘము సిద్ధపడి, తన పరిధిలో సమస్తమైన శ్రమలకు పైగా ఎత్తబడనున్నది. తన మార్గమును, ఆకాశమహాకాశముల ద్వారా పైకి ఎత్తబడుటకు, దేవుని రొమ్మునకు సంఘము మోసికొని పోబడుచున్నది. ఆమేన్. [టేపు పై ఖాలీ స్థలము.]

HEB 13:8

 

73ఆమేన్.

ఆ ఉదయ కాలమందు జాన్… గ్లెన్ పైకి ఎత్తబడినప్పుడు, ప్రతి ఒక్కరు తమ ముఖములను పైకెత్తి, ఏడ్చుచు, ప్రార్ధి౦చుచు, ఆశ్చర్యపడుచు, అతడేమి సాధించనైయున్నాడని ఎదురుచూసారు. మొదటి కార్యముగా అగ్ని ఆ అణువులను ప్రేల్చినప్పుడు, ఆ పెద్ద రాకెట్టు అక్కడ కేప్ కానవెరల్ దగ్గర పైకెత్తబడినది. అలా గాలిలోకి పైకి వెళ్ళిపోయినది. ప్రజలు దానిని చూచుచుండగా, కొందరు ఏడ్చుచు, కొందరు ఆక్రందన చేయుచు, పైకి వెళ్ళుచున్న వారి అంతరిక్ష యాత్రికునికి ఏమి జరుగునోనని ఆశ్చర్యపడుచుండిరి. ఓ, అయితే సంఘము, దేవునికే మహిమ, ఆమె కూడ కొంత అగ్నిని వెదజల్లుచున్నది. ఆమేన్. ఆ క్రింది వరుస లెక్కింపు వచ్చుచున్నది! ఆమేన్! "తీర్చు నిరూపణ శుద్దీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, లవొదికయ సంఘ కాలము," మనము చివరిలో ఉన్నాము! యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఏమిటి సంగతి? "పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు… సున్న!" వారు ఏడ్వరు, అయితే వారు పాడుచు, చప్పట్లు కొట్టుచు, దేవుని స్తతించుచు, సంఘము తన అంతరిక్ష యాత్ర కదలికలో, క్రీస్తు యేసుతో ఉండుటకు ఆకాశములలోనికి వెళ్ళిపోవుచున్నది. ఆమేన్.

JOHN 14:2

 

74ప్రకృతి సంబంధమైన సాధనలో వారు చంద్రుని లోనికి వెళ్ళారు. ఆత్మ సంబంధమైన సాధనలో మనము పరలోకము వైపునకు వెళ్ళిపోవుచున్నాము. ఆమేన్! ఆ ప్రకృతి సంబంధమైన అంతరిక్ష యాత్రికుడు చంద్రునిలో తనకొక స్థలమును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. మనకు ముందుగానే పరలోక మందు స్థలము సిద్దము చేయబడినది. "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకొక స్థలమును సిద్ధము చేయుదును. మీ కొరకు ఒక అంతరిక్ష యాత్రికుని పంపి మిమ్మును తీసికొని వెళ్ళుదును." క్రింది వరుస క్రమములో తెక్కింపు జరిగిపోవుచున్నది! మీరు దానిని విశ్వసించారా? ఆమేన్. క్రింది వరుస లెక్కింపు! "పది, తొమ్మిది, ఎనిమిది. ఏడు, ఆరు, ఐదు నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్న!" హల్లెలూయ! ఆ పూర్వపు రాకెట్టు పైకి వెళ్ళుటకు ప్రారంభించినది. చ౦ధ్రుని వైపునకు కాదు గాని, మహిమ వైపునకు వెళ్ళుచున్నది. అగ్ని వ్యాపించుటకు ప్రారంభించినది. ఆ సేవకు మహిమలో కిరీటము దాల్చబడినది. ఆమె ఆవలికి వెళ్ళుటకై, దేవుని అగ్ని వ్యాపించుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకెత్తుచున్నది. చంద్రుని దాటి, నక్షత్రములను దాటి, మానవుడు సాధించగల మరిదేనినైనను దాటి వెళ్ళిపోవుచున్నది. సంఘము పరలోకమందున్న దేవుని రొమ్మున ఆనుకొని ఉండునట్లు పైకెత్తబడుచున్నది. అది ఈ ఉదయకాలములలో ఒకదాని యందు జరుగబోవుచున్నది. స్నేహితులారా, మానవుడు తనకున్న ప్రకృతి సంబంధమైన, వస్తువుల ద్వారా సాధించగలిగెను, మరియు దేవుడు (నేను దానిని ఇక్కడ నిరూపించాను) దానిని ఆత్మీయ మాదిరిగిగా చూపెను.

75మనము త్వరగా ఆ అంతరిక్ష నౌక లోనికి వెళ్ళిపోయెదము, త్వరగా! ఇంకా కొద్ది సేవపటిలో ద్వారము మూయబడబోవుచున్నది. లెక్కింపు క్రమము జరుగుచున్నది! విజ్ఞాన శాస్త్రము చెప్పునదేమనగా, వారి లెక్కింపు ఇంక మూడు నిమిషములున్నవి. మనది ఇంకనూ దానిని దాటియుండును. అది "ఒకటిగా" ఉండునేమో, "సున్న" కు సిద్ధముగా ఉండుడి. మనమందరము వచ్చుదము. లెక్కింపు క్రమము జరుగుచున్నదని మీరు నమ్ముచున్నారా? ఒక్క క్షణము మనము తలలు వంచుదము.

తండ్రి! "పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు…" దేవా!

రాజ్యములు విడిపోవుచున్నవి. ఇశ్రాయేలు మేలుకొనుచున్నది.

అవి ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు.

అన్యుల దినములు లెక్కించబడినవి, భారముతో సాగలేకున్నవి;

చెదరిపోయినదానా, నీ స్వంతమునకు తిరిగి రమ్ము.

ఏమా దినము! సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి. ఓ దేవా, ప్రతి అవిశ్వాసి తన పాండిత్యపు తలంపులను ప్రక్క నుంచి, నీ వాక్యమునకు వ్యతిరేకమైన ఊహాలను ప్రక్క నుంచి, ఈ ఉదయకాలము ఆ మహిమకరమైన అంతరిక్ష నౌక లోనికి ప్రవేశించునట్లు సహాయము చేయుము, ఎందుకనగా మేము అక్కడ ఆ అంతరిక్ష నౌకలో భాగమై యుండులాగున దానిలో జన్మించాము.

76పరలోకపు తండ్రి, ఈ దినమున, ఈ గొప్ప క్రీస్తు శరీరమునందున్న విశ్వాసులకు ఆ పరిశుద్ధాత్మలో, నీవు వారికి బాప్తిస్మమివ్వవలెనని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఈ తొట్టి ఈ ఉదయ కాలము ప్రజలతో నింపబడి, వారి పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో సమాధి చేయబడుదురు గాక, ప్రభువా, ఆ విధముగా ఆ పూర్వపు అంతరిక్ష యాత్రికునిలో విడిది చేయుదురు గాక, అది చంద్రుని దాటి నక్షత్రములను దాటి, సిద్ధాంతములను, సంస్థలను దాటి వెళ్ళుచున్నది. మేమా క్రింది వరుస లెక్కింపును వినుచున్నాము. ఆ మూడేమిటో నీవు మాకు చెప్పావు. ఇవి దీని యొక్క మూడు స్థానములుగా ఉన్నాయి. సంఘ కాలములను మాతో చెప్పావు . మూడు, నాలుగు, ఐదు, ఆరు సంఘ కాలములు ఈ లెక్కింపు ఏడుగా ఉన్నది. ఆ ఏడు తరువాత, ఈ కాలము మేము దీనిలో ముందుగానే ఉన్నాము. ఇది చివరి సంఘకాలము. ఇప్పుడు లెక్కింపు ప్రారంభమైనది. ఆ కాలములు లెక్కించబడినవి. లూధరను కాలము, వెస్లీ కాలము, పెంతెకోస్తు కాలము. ఇప్పుడు ప్రభువా, మేము ఆ అంతరిక్ష నౌకలోకి సమకూడుచున్నాము. దాని ముందు గొప్ప విజృంభీకరణ అద్దమున్నది. మేము మహిమను చూడగలము, యేసును చూడగలము. ఆయన సర్వ శక్తిలో ఆయనను చూడగలము, ఆయన సమస్త వాగ్దానములలో ఆయనను చూడగలము, ఆయన వాగ్దానము చేసిన సమస్తము మాలో ప్రతిబింబించుచున్నది. దాని నిమిత్తము నీకు వందనములు తెలుపుచున్నాము.

77దేవా, ఈనాడు సంఘము అతి త్వరగా ఆ సురక్షిత మండలము లోనికి ప్రవేశించును గాక, ఎందుకనగా ఆ సున్న ఘడియ చేరువైన వెంటనే ఆ గొప్ప అంతరిక్ష నౌక ద్వారము మూయబడును. అది అంతరిక్ష విమానముగా ఉన్నది. నోవహు తన అంతరిక్ష నౌకలో ప్రవేశించినట్లు మేము కూడా ప్రవేశించుచున్నాము. అతడు సమస్త తీర్పు జలముల మీదుగా తేలిపోవునట్లు మేము పైకి వెళ్ళెదము. తండ్రి, మేము కూడ నీలో ప్రవేశించి, కాలపు సెలయేరుల ద్వారా, మార్పు, జూపిటర్, వీనస్ ఇంకను మిగిలిన గ్రహములను దాటి, పాలవలె ఉండు తెల్లటి మార్గములో పైకి, పైకి ఇంకనూ పైకి తేలిపోదుము గాక, దానిని గురించి ఈ ప్రకృతి సంబంధ అంతరిక్ష యాత్రికునకు ఏమియు తెలియదు. అతనిని ఒక సూచనగా ఉండునట్లు చేయుచున్నావని మేము చూచుచున్నాము. దాని వలన వెళ్ళిపోవుటకు మేము సిద్ధపడగలము. మేము భూమి నుండి కదలుచున్నాము. దయచేయుము ప్రభువా, యేసుక్రీస్తు నామమున దీనిని నేను అడుగుచున్నాను.

JOHN 15:16•

JOHN 16:23•

ACTS 19:12

 

78ప్రభువా, ఇక్కడ చేతిగుడ్డలున్నవి. వీటిని వ్యాధి గల ప్రజలు పంపించారు. ప్రభువా వారు నమ్ముచున్నారు. వారు కూడా ఈ ఉదయ కాలము పూర్తి అంతరిక్ష సభ్యులుగా మారెదరు గాక. సర్వశక్తిగల దేవుడు తన బైబిలును దీనిపై ప్రతిబింబింపజేయును గాక. పరిశుద్ధ పౌలు వద్ద నుండి వారా వస్త్రములను పొందినట్లు వీరును పొందెదరు గాక. చేతి గుడ్డలు, రూమాలులు, వ్యాధి గలవారు, వేదనములు, స్వస్థత నొందారు. ఆ అంతరిక్ష విస్వాసి, ఆయనను తాకినప్పుడు, ప్రభువా, అతనిని తీసికొని వెళ్ళుము. వ్యాధి విడచిపోవును! ఇప్పుడిక్కడున్న ప్రతి రకమైన వ్యాధి గలవారు, ఇప్పుడే స్వస్థత నొందెదరు గాక, ప్రభువా. వారు క్రీస్తు యేసులోనికి, ఆయన వాక్యమునకు, ఆయన వాగ్దానమునకు వచ్చెదరు గాక. "నా నామమున తండ్రిని దేనినడుగుదురో, దానిని మీకు చేసెదను," అని చెప్పబడినది. వారు లెక్కించుట ప్రారభించెదరు గాక, "పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు… సున్న ప్రభువా, ఆ విధముగా వెళ్ళి నిలచినది!" వారు తమ పడకల నుండియు, చేతి కర్రల నుండియు, మరి దేని నుండియైనను లేచి నిలచెదరు గాక. మరణపు వ్యాధుల నుండి లేచి నిలచి, ఈ అంతరిక్షమున ఆవలిగా, డాక్టర్లు గాని, శాస్త్రజ్ఞలు గాని, మరెవ్వరూ గాని, ఎరుగని స్థలమునకు వెళ్ళుటకు విడుదల పొందుదురు గాక. ఈ పరిశుద్ధ గ్రంధము ద్వారా జరుగు శాస్త్రీయ పరొశోధనలో వెలువడు దేవుని శక్తిగల వాగ్దానమున్న చోటికి వెళ్ళిపోవుదురు గాక, లేక ఈ పరిశుద్ద గ్రంధము యొక్క ఆత్మీయ పరిశోధన ద్వారా - దేవుడు నిరంతరము దేవుడుగా ఉన్నాడని ఇంకనూ దేవుడుగా నిరూపించుచున్నాడని, ఆయన ఎల్లప్పుడు దేవుడుగా ఉన్నాడని, ఆయన అనంతమయుడని, సర్వాంతర్యామియై యున్నాడని, సర్వజ్ఞుడుగా ఉన్నాడనియు చూపించుచున్నది. ఆయన తన వాక్యము నిలుపుకొనుననియు చూపించుచున్నది. ఆయన సమస్త కార్యములను చేయును. విశ్వసించిన వారి వలన సమస్త కార్యములు సాధ్యములని ఆయన వాగ్దానము చేసియున్నాడు. దేవా, దయ చేయుము.

79తమ మార్గమున పయనించు స్త్రీ, పురుషులు గాని, బాల- బాలికలు గాని, ఈ ఉదయకాలము దేవుని వాక్యపు ఈ క్రింది వరుస లెక్కింపును వినని వారు, మనము ఖచ్చితముగా అక్కడే ఉన్నామని తెలిసికొ౦దురు గాక, ఆ చివరి కార్యము కూడా లెక్కించబడినదని తెలిసికొందురు గాక. ఏ సమయమందైనను "సున్న" ను చెప్పుటకు సిద్ధముగా ఉన్నది. సంఘము వెళ్ళిపోవుటకు సిద్ధముగా ఉన్నది. వర్తమానము ముగించి పోవుటను మనము చూస్తున్నాము. శ్రమలు పైకి వచ్చుటను మనము చూస్తున్నాము. గత రాత్రి మనము వాటిని గూర్చి మాట్లాడుచుంటిమి. కాలము సమీపమైనదని మనము ఎరిగియున్నాము. ఆ లెక్కింపు అయిపోయినది. ఈ వేదికపై సంఘ కాలములను వచ్చునట్లు నీవు మాకు సహాయము చేశావు. ప్రతి కార్యము నిరూపించబడినది. ఇక్కడే అది నెరవేరుటలో జరిగినది. సర్వ శక్తిగల దేవా, నీవు భూమ్యాకాశములను చేసి, ప్రజలపై నీ కృపలను పంపావు. వారి కొరకు నీవు నిలువ చేసిన దానిని వారికిచ్చావు. దీనిని యేసు నామమున మేము అడుగుచున్నాము.

80ప్రతి స్త్రీ, పురుషులు తమ శిరస్సులను వంచియుండగా, ఈ ఉదయ కాలము కొందరు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించని వారున్న యెడల, ఆయనను తెలిసికొనుటకు ఇష్టపడిన యెడల, దేవుని కృపతో కూడిన అంతరిక్ష యాత్రికుని స్థితి లోనికి ప్రవేశించుటకు ఇష్టపడుచున్న యెడల, ఎత్తబడుటలో వెళ్ళుటకు ఇష్టపడిన యెడల, మీ చేతులను పైకెత్తి, "నేను సిద్ధముగా ఉన్నాను, ఎత్తబడుటలో వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను. నా కొరకు ప్రార్ధించండి బ్రెన్హాం సోదరా," అని చెప్పండి. దేవుడు మిమ్ము దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. నిన్ను, దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను, వెలుపలను, లోపలను, మీరెక్కడ ఉండినను, మీ చేతులెత్తండి. దీని ద్వారా, "దేవా, నన్ను లోపలకు తీసికొనుమని" చెప్పుము. దేవుడు నిన్ను దీవించు గాక, "నేనా వరుస లెక్కింపును వినుటకు ఆశించుచున్నాను. నేను దానిని వినుటకు ఇష్టపడుచున్నాను. నేను సురక్షితముగా ఉన్నానని తెలిసికొనుగోరుచున్నాను. ఆ అగ్ని ఆరిపోవునప్పటికి, నేనిక్కడ ఆ గుర్రపు బండిలో కూర్చుని యుండలేదనియు తెలిసికొనగోరుచున్నాను. నేను ఒక మోటారు బండిని తోలుచు ఒక సంఘమందు కూర్చునియుండను. మరొకదానిలో నేనుండుటకు ఇష్టపడుటలేదు. నన్ను ఈ చంద్రుని, గతములను దాటి ఆవలికి తీసికొని వెళ్ళు దాని యందుండుటకు ఇష్టపడుచున్నాను. నేనా లెక్కింపును వినుటకు ఇష్టపడుచున్నాను. నేనా లెక్కింపును వినుటకు ఇష్టపడుచున్నాను; ఏదో ఒక సిద్ధాంతమును కాదు, లేక ఏదో ఒక సంస్థను కాదు. అయితే నేను క్రీస్తునందుండుటకు ఇష్టపడుచున్నాను. అయితే నేను ఎక్కడికైనను, మనుష్యుల తలంపులను దాటి వెళ్లగలను. నేను వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను."

HEB 13:8

 

81మనము ప్రార్థించుటకు ముందు మరెవ్వరైనను ఉన్నారా? దేవుడు నిన్ను దీవించు గాక, ఓ యవ్వన స్త్రీ. ఓ యవ్వనుడా, దేవుడు నిన్ను దీవించు గాక. అక్కడ ఆ వెనుక దేవుడు నిన్ను దీవించు గాక, నా సోదరుడా, సోదరుడా నీవు! "నేనా లెక్కింపులో ఉండుటకు ఇష్టపడుచున్నాను. దేవా, ప్రతి భారమును నేను ప్రక్కనుంచ నిమ్ము." సోదరా, దేవుడు నిన్ను దీవించు గాక. "ప్రతి పాపమును ప్రక్కనుంచుటకు ఇష్టపడుచున్నాను. సోదరుడా, నాకు ఆవేశమున్నది. ఓ, నేను అలాగే వెళ్ళలేకున్నాను. దేవా, నాలో నుండి తీసివేయమని ప్రార్థించుచున్నాను. బ్రెన్హాం సోదరుడా, నేను త్రాగుదును, నేను పొగ పీల్చుదును - ఇకపై నేను వాటిని చేయుటకు ఇష్టపడుటలేదు. నేను వాటిని చేయుటకు ఇష్టపడుట లేదని దేవునికి తెలియును. ఆ కార్యము నన్ను బంధించి వేసినది, అందువలన దానిని చేశాను. నేను దాని నుండి విముక్తుని కాలేకపోవుచున్నాను. అది పొరపాటని నేనెరుగుదును, నేను దానిని చేయకూడదు. నేను చేయను! మరొక కార్యమేదనగా, నేను వాక్యమును సందేహించుచువచ్చాను. అది నిజముగా సత్యమై యున్నదని నేను ఆశ్చర్యపడుచున్నాను. దేవా, సహాయము చేయుము. అదంతయు నిజమేనని నన్ను జ్ఞాపకము చేసికొననిమ్ము, నేను దాని నమ్ముచున్నాను. నేనా లెక్కింపును వినుటకు ఇష్టపడుచున్నాను. ప్రతిసారి దేవుని వాక్యమును నేను "ఆమేన్" అని చెప్పులాగున, "దేవా అది నీదేనని" చెప్పులాగున సహాయము దయచేయము. ఇప్పుడు అంతయు… దేవుడు నిన్ను దీవించు గాక. దేవుడు నిన్ను దీవించు గాక, మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించు గాక.

82ఇక్కడ ఎవ్వరైనను వ్యాధితో ఉన్నారా, వారు "బ్రెన్హాం సోదరుడా, ఈ ఉదయ కాలమందు నేనొక క్రైస్తవునిగా ఉన్నాను. నేను పరిశుద్ధాత్మను కూడా పొందాను. నేనా విమానమున దిగి వచ్చి ఆ లెక్కింపునకు సిద్దముగా ఉన్నాను. నేను ప్రతి సంస్థ నుండి, ప్రతి కార్యము నుండియు, దిగి వచ్చి ఆ లెక్కింపును వినుచున్నాను. అయితే ఇప్పుడు ఒక్కటి మాత్రము చెప్పుటకు ఇష్టపడుచున్నాను, బ్రెన్హాం సోదరుడా, ఈ ఉదయ కాలము నేను వ్యాధితో ఉన్నాను. నేను ప్రభువు కొరకు చేయవలసినది ఇంకనూ ఉన్నది. నేనా లెక్కింపును వినుచున్నాను, అయితే నేను స్వస్థత నొందగోరుచున్నాను. ఈ ఉదయ కాలము నేను దానిలో అడుగిడగోరుచున్నాను. ఆ లెక్కింపును వినగోరుచున్నాను." ఆ లెక్కింపు ఏమిటి? దేవుని వాక్యమై యున్నది. అది క్రిందికి లెక్కించబడుచున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. "నేను నన్ను స్వస్థపరు ఆయన స్వరమును నేను వినగోరుచున్నాను. నేను నా చేతులెత్తి "బ్రెన్హాం సొదరుడా, నా కొరకు ప్రార్ధించుమని" చెప్పుచున్నాను. దేవుడు నిన్ను దీవించు గాక. లోపలికి ఇప్పుడే అడుగిడుము. బలిపీఠము నిండిపోయినది. ఆ చుట్టూ నేలంతయు నిండిపోయినది. మనము ప్రార్ధన వరుసను నడుపలేము. వారు గోడలకు ఆనుకొనియున్నారు. మనము ఒక ఏకమైన కూడికను కలిగియున్నాము. మీరు దానిని చేయవలసిన అవసరము. మీరు దానిలో… మీరు అంతరిక్ష యాత్రికులై యున్నారు.

MATT 8:8•

MATT 9:18,25•

MARK 5:23,41•

LUKE 7:6

 

83మీరొక అంతరిక్ష యాత్రికులైయున్నారు. మీరు లూథరును దాటి వెళ్ళియున్నారు. లూథరు వీటన్నిటిలో నమ్మకముంచలేదు. వెస్లీ చేతులుంచాడు, పెంతెకోస్తు వారు నూనెతో అభిషేకము చేశారు. అయితే మీరు ఒక అంతరిక్ష యాత్రికులైయున్నారు. ఆలోచనకు ఎంతో దూరముగా వెళ్ళిపోయారు. ఎందుకనగా వాక్యము ఆ విధముగా చెప్పుచున్నది. నేను అలాగే వెళ్ళుచున్నాను. మంచిది. "లూధరు నమ్మలేదా? అది వాక్యము కాదా?" అని నీవు చెప్పవచ్చు. నిజమే. అయితే వెస్లీ దానిని దాటి వెళ్ళాడు. "మంచిది, వెస్లీ నూనెతో అభిషేకము చేశాడు, లేక మరెదో చేశాడు, దాని మీరు నమ్ముచున్నారా?" నిజమే, అది సత్యము, "పెంతెకోస్తు వారు దయ్యములను పారద్రోలారు." నిజమే. అది నిజమని నేనెరుగుదును, అయితే అలాగే పైకి వెళ్ళుము. వెళ్ళుము వెస్లీ లూథరును తిరిగి చూడలేదు. పెంతెకోస్తు వెస్లీని తిరిగి చూడలేదు, లేక మనము పెంతెకోస్తును చూడబోవుట లేదు. మనము అంతరిక్ష యాత్రికులమై యున్నాము. మనము దాని నుండి ఎంతో దూరములో ఉన్నాము. మనమలాగే వెళ్ళెదము. క్రీస్తు ఆ విధముగా చెప్పెను!

దానిని మీరెలా చేయుదురు? "రండి, వచ్చి నా కుమార్తెపై చేతులుంచండి, ఆమె స్వస్థత నొందును" అని ఆ యూదుడు చెప్పాడు. యేసు వెళ్ళి వాని కొరకు అలా చేశాడు. అది మంచిదే. అయితే అది ఆ రోమియునికి వచ్చినప్పుడు అతడొక అంతరిక్ష యాత్రికుడై యున్నాడు, అతడేమి చెప్పాడంటే, "నీవు నా యింటికి వచ్చుటకు నేను అర్హుడను కాను. ప్రభువా, మాట మాత్రము సెలవిమ్ము," అని అడిగెను. ఆయన ముందుగానే దాని చెప్పాడు. అది అంతే.

EPH 2:6

 

84ఇప్పుడు మన హృదయాలను దేవుని వైపునకు ఎత్తుదము. దేవుని వైపునకు మన చేతులెత్తేదము. మన హృదయాలను దేవుని వైపునకు ఎత్తుదము. మీకు కావలసినదేమైనను, రక్షణ, శుద్దీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, దైవీక స్వస్థత - మరేదైనను మీ చేతులను పైకెత్తి ఉంచుడి. దేవుని సన్నిధిలో మీ హృదయాలను ఎత్తి పట్టుకొనండి. పరలోక స్థలముల యందు క్రీస్తు యేసుతో కూర్చోని యున్నారని గ్రహించండి. మీరా విశ్వాసమునకు ఒక అంతరిక్ష యాత్రికుడై యున్నారు. ఏమిటి? ఇలక్కడే ఆ లెక్కింపు వచ్చుచున్నది! "పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు…" ఓ యేసూ, ఇప్పుడే రమ్ము! మనమాయన నామము యొక్క శక్తిని ఉంచుచున్నాము. గత రాత్రి మనము చూచినట్లు, పౌలు ఒక మనిషిని గ్రుడ్డివానిగా చేశాడు. అతనిని (పౌలును) దాటి వెళ్ళినప్పుడు యేసు తాను చేయ గలిగినదంతయు చేయుచున్నాడు. ఆయన అన్ని రకముల అద్భుతములను చేశాడు. ఆయన మార్గము చివరిలో కూడా చేశాడు. ఆయన కొట్టబడి, ఉమ్మివేయబడుచుండుట ప్రతిది ఆయన చూచాడు. ప్రజలు దానిని గ్రహించలేదు. అది నిజమని దేవుడే దానిని నిరూపించెనని తలంచారు. అంతట ప్రజల విశ్వాసమును పరీక్షించెను.

JOHN 15:16•

JOHN 16:23

 

85ప్రభువా, మేమిక్కడ నిలచి, గ్రడ్డివారు చూపు పొందటయు, వ్యాధి గలవారు, కాన్సరుతో బాధపడువారు, మరణఛాయలో ఉండు ప్రజలు స్వస్థత నొందుచున్నారు. మరణించి నాలుగు గంటల తరువాత, జీవముతో వారు లేచు దానిని మేము చూచాము. అది మరొకటి కాదు గాని, ఆ గొప్ప క్రీస్తునకు అంతరిక్ష యాత్రికులముగా ఆయన శరీరమందున్నాము. ఇప్పుడు ఆ లెక్కింపు ప్రారంభమైనది. మనము ఈ ఉదయ కాలము, మన స్వస్థత కొరకును, మన రక్షణ కొరకును మనకు కావలసిన సమస్తము కొరకును ఆయన మనకున్నాడని యెరుగుదుము. ఎందుకనగా మనము వాటిని యేసుక్రీస్తు నామములో అడిగినప్పుడు, ఆయన ఈ విధముగా ప్రమాణము చేసియున్నాడు. "నా నామమందు తండ్రిని దేనిని అడిగినా, నేను మీకు దానిని చేయుదును." మనకు కావలసినదంతయు ఇప్పుడు ఆయన నామమును పిలచుట మాత్రమే, మరియు అప్పుడది చేయబడును. మనమా లెక్కింపును వినుచున్నాము.

86ప్రభువా, కొందరు పాపులుగా ఉన్నవారు వారి చేతులను పైకెత్తి యున్నారు. వారా లెక్కింపు కొరకు వేచి యున్నారు. వారి హృదయాలలో వారికొక అవకాశము దొరికినప్పుడు, వారిలో నున్న ఆ పూర్వపు నీచమైన చెడునంతటిని తీసివేయును. అనేకులు సిగరెట్టు పీల్చు వారున్నారు. వారు దానిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉన్నారు. వారు దానిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉన్నారు. అనేక చెడు కార్యములను చేసిన వారు ఇకపై చేయక విడిచిపెట్టుటకు సిద్దముగా ఉన్నారు, ఎందుకనగా మనము సర్వశక్తి గల దేవుని యేసుక్రీస్తు నామములో వాటిన్నిటికి, ఈ ఉదయ కాలము సంఘమునకు ఆటంకము కలుగజేయు ప్రతి కార్యము, అనగా వ్యాధుల నుండి పాపముల వరకు ఆటంకము కలుగజేయు ప్రతి కార్యముల నుండి ఈ వధువు విడుదల పొందును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ శక్తి మరియు ఆ సువార్త శక్తి, అనగా ఆ పరిశుద్ధాత్మ అగ్ని వ్యాపించుటకు ప్రారంభమైనది. ఆ గొప్ప దేవుని అంతరిక్ష యాత్రికులు ఈ దినము వారి హృదయమందు లేచిపోవుటకు ఆశపడుచున్నారు. సర్వశక్తిగల దేవా, దయ చేయుము. వారు నీ వారు. వారు వారి స్వస్థతను, రక్షణను, మరి వారి అవసరత ఏదైనను దానిని వారు పొందెదరు గాక. నేను వారిని నా ప్రార్ధనతో, ఈ ఉదయ కాలము, ప్రభువైన యేసుక్రీస్తు శుద్ద రక్తము నిలిచియున్న ఈ బలిపీటముపై సమర్పించుచున్నాను. ప్రభువువైన యేసుక్రీస్తు నామములో వారు అడుగు దానిని దయచేయుము. ప్రజలు ఇలా చెప్పుచున్నారు. [బ్రెన్హాం సోదరుడు మరియు సమాజము "ఆమేన్" అని చెప్పుచున్నారు.]

87అందువలన దానిని విశ్వసించుము! అది అలాగే జరుగును గాక! నేను దానిని నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఆయన దేవుడని నాకు తెలియును, దేవుని ఆ గొప్ప సాధింపునకు మనము సిద్ధముగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. ఆయన సాధన ఏమిటి? ఈ భూమిని విడిచిపెట్టుట. ఆ అంతరిక్ష యాత్రికులు చంద్రుని లోనికి వెళ్ళుచున్నారు. అది మరొక భూమిగా ఉన్నది. మరియు దేవుని సంఘము (గుర్రముపై నుండి, విమానమునకు ఆ విధముగా) ఒక అంతరిక్ష యాత్రికునివలె మనము, మరొక ప్రపంచమునకు ఈ భూమిని విడిచి వెళ్ళుచున్నాము. అది పరలోకముగా ఉన్నది. ఆ లెక్కింపు ప్రారంభమైనది. మీరాయనను ప్రేమించుచున్నారా? అట్లయిన మన చేతులెత్తి పాడుదము, "నేనాయనను ప్రేమించుచున్నాను. నేనాయనను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా…" దేవుని స్తుతించుము! ఈ రాత్రి నేను మిమ్మును మరలా చూచునంత వరకు దేవుడు మిమ్ము దీవించు గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...