ఆయన సన్నిధిలో

ఆయన సన్నిధిలో

VGR COUNT-110 1నెవిల్ సోదరుడా, వందనములు, నిజమగు ఐశ్వర్యముతో ప్రభువు నిన్ను దీవించును. స్నేహితులారా, శుభసాయంకాలము! ఈ రాత్రి మరల ఈ ఆలయములోనికి తిరిగి వచ్చుట మహా భాగ్యముగా ఎంచుచున్నాను. ఆయన వాగ్దానము ఇచ్చుచుండగా ఎన్నడూ తప్పిపోని మన ప్రభువు యొక్క సన్నిధిని అనుభవించుచున్నాను. ఈ రాత్రి చిన్న వర్తమానము కొరకు మీలో చాలా మంది ఉండిపోయిరని నాకు తెలిసి మీకు చాలా వందనములు చెల్లించుచున్నాను. మీలో చాలా మంది ఇండ్లకు వెళ్ళుటకు చాలా దూరము ఈ రాత్రి కార్లు నడుపుకొని వెళ్ళవలసియున్నారు. కొందరు మీరు బస చేయుచున్న గదులను ఖాళీ చేసి వచ్చారని నాకు అర్థమయినది. ఎక్కువ సేపు మిమ్మునుంచకుండా ఉండుటకే ప్రయత్నించుచున్నాము. తొందరగా వెళ్ళిపోవలెనను తలంపుతోనే పెందలకడ ఇక్కడికి చేరాము.

DAN 12:4,9•

REV 5:1•

REV 10:4

 

2ఈ పుస్తకములు లేదా ఈ అధ్యాయములను ఎప్పుడు ప్రారంభించుదుమో నేను వీలయినంత త్వరలో ప్రకటన చేయుదును, ఎందుకనగా అది తెలిసికొనవలెనని ఈ మధ్యాహ్నము కొందరు ఫోనులో అడిగిరి. ప్రభుని చిత్తమయిన యెడల వచ్చేసారి ప్రకటన యొక్క ఏడు ముద్రలు మరియు ఏడు సహజ ముద్రలు గూర్చి చెప్పుకొనుట ప్రారంభించుదుము. సమయములో దానిని మనము ముగించిన యెడల గ్రంధము వెనుకనున్న ఏడు ముద్రలను తీసికొందము. చూడండి, అది కొద్దిగా సమయము తీసికొనవచ్చును. చూడండి, విప్పబడిన ఏడుముద్రలు అక్కడున్నవి. ఏడు తెగుళ్ళు, ఏడు బూరలు; అన్ని ఏడే, మొదట ఆ ముద్రలను మనము తీసికొందము, కాని ఆ గ్రంధము వెనుక ఏడు ముద్రలతో ముద్రింపబడినది. ఉరుము శబ్దము వినబడగా దానియేలు స్వరమును వినెను, దానిని వ్రాయకూడదని చెప్పబడినది. యోహాను దానిని వ్రాయ అనుమతి పొందలేదు, కాని అది గ్రంధమువెనుక ముద్ర వేయబడియున్నది. గ్రంధములోని మర్మములన్ని బయలుపరచబడి తెలియ చేయబడిన తరువాత అది జరుగును.

దానియేలు అక్కడ చెప్పుట మీరు గమినించిరి, ''ఈ స్వరముల యొక్క దినములలోని మర్మములు ఆ కాలము నాటికి దేవుడు బయలుపరచును.'' చూడండి, ''ఆ మర్మము'' దేవుడెవరో, ఆయనేలాగు శరీరధారి అయ్యెనో ఇవన్నియూ ఆ కాలములో బట్టబయలగును. అపుడు మనము గ్రంధము వెనుక నున్న ఏడు ముద్రలకు సిద్ధమగుము. అవి మానవునికి బయలుపరచబడలేదు. బైబిలులో సహితము వ్రాయబడలేదు, కాని అవి తక్కిన బైబిలు అంతటితో అక్షరాలా సరిపోవుచున్నవో లేదో పోల్చి చూడవలెను. అది ఒక గొప్ప సంగతి అని నేను తలంచుచున్నాను.

3ముగించుటకు ఇపుడు మనము త్వరపడి ప్రయత్నించుచున్నాము. మీ దయ మరియు మీ రాక, మీరు చేసిన ప్రతిదానిని బట్టి మీకు ఒక్కొక్కరికి వందనములు చెల్లించుచున్నాము. ఈ రాత్రి ఎంతో సేపు మిమ్మును ఉంచమని నమ్ముచున్నాము, ఎందుకనగా కూర్చొనుటకు, నిలబడుటకు మీరెంతో సహనము చూపిరి. ఆ వెనుక అక్కడ కూర్చొనియున్న నా భార్య గత-రాత్రి గూర్చి నాతో ముచ్చటించినది. ఎంతో స్థూలంగా ఉన్న ఆడవారు సహితము అక్కడనిలబడిరి. ప్రతి మాటను వారు పట్టుకొనుచూ నిలబడి వినుచున్నందున వారి బట్టలు చెమటతో తడిసినవి,'' అని చెప్పెను. ఆ కారణము చేతేనే నేను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము క్రింద ఉండగోరుదును. అలాగున్నప్పుడు ప్రజలకు యధార్ధముగా సత్యమే తప్ప మరొకటి చెప్పుట జరుగదు. వారు దానిని ఆనుకొనియుందురు, అది మంచిది.

4కొద్ది క్షణముల పాటు నేను మిమ్మును ఇపుడు క్షమాపణ అడుగగోరుచున్నాను. ఈ ఉదయమున కొద్దిగా ముందుగానే నేను వెళ్ళిపోయాను. ఇపుడు టేపులు ఆపు చేసిరని తలంచుచున్నాను, టేపు ఎపుడు పనిచేయించవలెనో నేను చెప్పెదను. నేను విడచి వెళ్ళుముందుగా క్రింద నుండి లెక్కించుట కొరకు అయిదు నిమిషములు తీసికొన్నాను, దానిని ముగించగోరాను గాని మరచిపోయి వెళ్ళిపోయాను. దీనిగురించి ఏమీ చెప్పకుండానే ఈ ఉదయము నేను వెళ్ళిపోవు ''ఆ క్రిందికి లెక్కించుట ఏమిటి?'' అను ప్రశ్నను మీలో విడిచిపెట్టాను. చూచారా? ఇపుడు మనము క్రిందికి లెక్కించుటలోనే యున్నామని ఎరుగుదుము, కాని క్రిందికి లెక్కించుట అనగా ఏమిటి? చూడండి? క్రిందికి లెక్కించుట ఏమిటో మీరెరుగని యెడల మీరు ఒక విధమగు గందరగోళములో యుందురు. కాబట్టి దానిని నేను ముగించగోరుచున్నాను… "క్రిందికి లెక్కించుట" (Countdown) అను ప్రసంగ టేపును ముగించుట కొరకు మరల అదే కొంత స్థాయిని కొనసాగించెదను. ఒక్క క్షణము పాటు మీరందరూ నన్ను క్షమించండి. ఆ టేపును నేను ముగించగోరుచున్నాను. మరియొకటి ప్రారంభించు ముందుగా ఇది చేయుటకు మీరు సహకరించెదరా? ఇపుడు టేపును పనిచేయించండి.

[ట్రేపు మీద ఖాళీ యున్నది.]

5వివిధ స్థలములు దర్శించి వచ్చాము, గత మూడు వర్తమానములలో గొప్ప సమయమును ప్రభువు నొద్ద మనము పొందాము. వివిద సిద్దాంతముల గూర్చిన అంశముల మీద మాట్లాడుకొన్నాము. ఇపుడు, మీరు టేపులు మార్చుట కొరకు కొద్ది వ్యవధిని ఇవ్వవలెనని తలంచుచున్నాను. ఎపుడు త్రిప్పబడి సిద్దముకావలెనో మీకు చెప్పెదను. మంచిది, దీనిని నేను గమనించవలసియున్నాను. ఇది ఒక గజిబిజిగా కనబడును గాని, ఆ బాలురు టేపును తయారు చేయవలసియున్నారు. వారు దానిని దీనిని కలగలుపు చేయకూడదు, అలాగు వారు చేసిన యెడల దానిని ప్రజలు అర్థము చేసికొనలేరు. కాబట్టి దానిని మనము ఈ రీతిగా తీయవలెను. ఎవరో ఒకరు గదిలో నుండి బయటకు వచ్చి నాకు సూచించిన యెడల వారు టేపులు ఎపుడు మార్చి సిద్దముగా యున్నారో నాకు అర్ధమగును. జనులారా, మీ దయ, సమస్తము కొరకు మరల వందనములు తెలియచేయుచున్నాను. మంచిది, ఇపుడు మనము సిద్ధపడినాము. టేపులు పని చేయించవచ్చును, ప్రభువు మిమ్మును దీవించును.

6ఈ రాత్రి మరల ఈ ఆలయములో నుండుట బట్టి మేము సంతోషించుచున్నాము. మరల ఈ రాత్రి జనులతో క్రికిరిసియున్నది, చాలా మంది నిలబడిరి… మూడుసార్లు ఆరాధన. ఈ టేపును వినుచున్న వారెవరయినా గాని ఇష్టపడినచో గత రాత్రి టేపును తెచ్చుకొనుటకు వీలగునని తెలియచేయుచున్నాను. మీ ఇంటిలో దానిని అధ్యయనం చేయండి. అది ప్రభువు నాకిచ్చిన ప్రస్తుత సేవా దశ. నేను వచ్చి వారి సంఘములు, గృహములు దర్శించు ముందుగా, ముఖ్యంగా సేవకులు ఈ ఉదయము "క్రింది నుండి లెక్కించుట" గూర్చి మాట్లాడుకొన్నాము. సంఘము వెళ్ళుటకు సిద్ధముగా యున్నది.

ISA 6:1-8

 

7ఈ రాత్రి ప్రభువు చిత్తము బట్టి "ఆయన సన్నిధిలో" అను అంశము మీద మాట్లాడుకోనై యున్నాము. ఓ! ఆయన సన్నిధిలోనికి రాగలుగు భాగ్యము మనకిచ్చినందులకు ఎంతగా దేవుని మనము స్తుతించవలసి యున్నాము! కాని మొదట మీరందరూ నాతో పాటుగా మీ బైబిలును ప్రవక్తయగు యెషయా, 6వ అధ్యయము. మనందరికీ తెలుసు ప్రవక్తయగు యెషయా ఒక పెద్ద ప్రవక్తగా అతడుండును. సాక్ష్యము కొరకు రంపములతో కోయబడి అతని జీవితము సమాప్తమయినది. సర్వశక్తుడుగా దేవుని యొక్క శక్తికి హతసాక్షి అయ్యెను. యెషయా గ్రంధము 6 అధ్యాయము 5 వచనము నుండి చదువుదము. "అయ్యో, నాకు శ్రమ అని నేను పలికితిని." నేను మొదటి వచనముతో ప్రారభించుదును. క్షమించండి, 1 వచనము నుండి 8 వచనము వరకు చదువుదుము.

రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను; ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

వారు - సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

వారికంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచూ మందిరము ధూమము చేత నిండగా.

నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను, నేను నశించితిని. రాజును, సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

అప్పుడు ఆ సెరాపులతో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి:

నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పావమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ దోషము తొలగిపోయెను.

అప్పుడు - నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను - చిత్తగించుము, నేనున్నాను; నన్ను పంపుము అంటిని.

8ప్రభువు తన వాక్యమును దీవించునుగాక! అది చాలా గొప్ప లేఖనమని తలంచుచున్నాను. దేవుని సన్నిధిలో మానవులు తాము పాపులమని గుర్తించుట మనము కనుగొందుము. వివిధ స్థలములలో యున్నపుడు మనము మంచిగా యున్నామని తలంచుదుము. మనము చాలా మంచిగా ఉన్నామని భావించుదుము, కాని దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడయినా మనము వచ్చిన యెడల మనమెంతో అల్పులుమో చూడగలము.

9కొద్ది కాలము క్రిందట నా స్నేహితుడొకరితో ఒకచోట నిలబడియున్నాను, అతనిని క్రీస్తు నొద్దకు నడిపించు భాగ్యమునాకు కలిగినది. బర్ట్ అనునతడు న్యూహాంప్ షైర్ వాసి, వేట-సహచరుడు. అడిరోండాక్ యొద్ద కోల్డు బ్రూక్ ఫాల్స్ యొద్ద నిలబడితిమి. దానిని చూచుటకునా కుటుంబమును గత ఏడాది నేను తీసికొని వెళ్ళాను. రహదారి గుండా దాని చేరునప్పుడు ఎత్తయిన పల్లము ఎక్కవలెను. పర్వతముల నుండి అంత గొప్ప శక్తితో నీలపు, పచ్చని నీరు, రాళ్ళ మీదికి పడుట చూచాము. బర్ట్ అక్కడ నిలబడి నా వైపు చూచి ఇట్లనెను, "చూడు బిల్లీ, ఇది మానవుని చిన్నవాడు అను భావనకు నడిపించును." అతడు తన వ్రేళ్ళ మీద పావు అంగుళమున కొలిచెను. నేనిట్లు చెప్పాను, "అది నిజమే బర్ట్," ఇప్పుడు, దేవుని యొక్క సృష్టిని చూచుట ద్వారానే అతడు ఆయన సన్నిధిలోనికి వచ్చెను. అతనికి తెలిసినదంతయూ అదే.

10"నీవెంత గొప్పవాడవు," అని వ్రాసిన వానిని గూర్చి నేను ఆశ్చర్యపడుచుందును. ఒక రాత్రి అతడు నక్షత్రముల వైపు చూచి అవి ఎంతో దూరములో యుండుట చూచి అలాగని యుండును! కొన్ని నెలల క్రితము సహో. ఫ్రెడ్, సహో. ఉడ్స్, నేను అరిజోనా ఎడారిలే సహో. మెక్‌నెల్లీతో నిలబడియున్నాను. అతడు ఒక నక్షత్రము మరియొక దానికి ఎంత సమీపములో యున్నదో లెక్కించుటకు ప్రయత్నించుచుండెను. అవి మిలియనులు, బిలియనులు మైళ్ళ దూరములోయున్నవి గాని ఒకదానికొకటి పావు-అంగుళము దూరములో యున్నట్లు మాత్రమే చూపించును. నక్షత్రములకు మనమెంత దూరమున్నామో అంతకన్న ఎక్కువ దూరములో అవి అక్కడయున్నవని శాస్త్రీయ రుజువు వలన మనకు తెలియును చూడండి అవి ఎట్లున్నవో!

11ఆయనెంత గొప్పవాడో మనము గ్రహించినపుడు మనమెంత అల్పులమో గ్రహించగలము. ఆయన సన్నిధికి ఎంత దగ్గరగా వచ్చుదుమో అంత ఎక్కువగా అది గ్రహించుదుము. దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రజలు వచ్చినప్పుడు, అది వారి మీద ఏదో ఒక విధమగు ఫలితమును చూపును. నా సేవలో అట్టి సమయమును చూచాను. దేవుని యొక్క సన్నిధి అంత పెద్ద స్థలము లోనికి వచ్చి ఒక వ్యక్తి యొక్క జీవితమును బయలుపరచి, వారు జరిగించిన అవినీతి క్రియలన్నింటినీ మరియు సమస్త పాపమును బయటపెట్టును. ప్రార్థించుకొనుటకు వరుసలో వచ్చి నిలబడిన వారు ఆ వరుసలో నుండి తప్పుకొనునట్లు చేయు పరిశుద్ధ భావనను అది తెచ్చును. ఆయన సన్నిధిలోనికి వచ్చుముందుగా వేదిక మీదికి పరుగిడి వెళ్ళి దేవునితో సరి చేసికొనునట్లుగా అది చేయును. చూడండి, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చుట వలన సంగతులు జరుగును. మంచములలోను, పడకల మీదను పడియున్న వారిని నేను చూచాను.

12మెక్సికోలో ఒక రాత్రి చనిపోయిన చిన్న బిడ్డను దుప్పటి క్రింద యుంచి స్పానిష్ తల్లి తీసికొని వచ్చెను. చెప్పాలంటే ఆ మెక్సికను తల్లి వచ్చెను. ఎన్నో వేలమంది జనులు అది చూచిరి, ఒకే కూటము నందు బహుశా ఏబది లేదా డెబ్బది-ఐదు-వేల మంది యుండిరి. ఆ చిన్న బిడ్డ జీవము పొందుట వారు చూచిరి. ఆ స్త్రీ మూర్ఛిల్లినది. ప్రజలు చేతులెత్తి కేకలు వేసిరి. ఎందుకు? ఒక మానవ మాత్రుడు అది చేయలేడని వారు గ్రహించిరి. వారు సర్వశక్తుడగు దేవుని సన్నిధి యున్నట్లు కనుగొనిరి. అందుమూలముగ ఏదో జరిగెను.

13భక్తిగల దైవజనులు మాట్లాడగా విను భాగ్యము నాకు దొరికినది. ఒకసారి ఛార్లెస్ ఫిన్ని గూర్చి చెప్పబడిన సంగతి ఇది. అతడు చాలా చిన్న మనిషి. ఎన్నడూ అతడు నూట పౌనుల కంటె ఎక్కువ బరువు తూగలేదు, కాని అతనికి అంత బలముగా మాట్లాడు ధోరణి యున్నది. ఒకనాడు అతడు భవనములో ధ్వనిని బిగ్గరగా చేయు పరికరమును ప్రయత్నించుచుండెను. అపుడు ఈ నాడున్న యంత్రములు లేవు, పైన బాల్కనీలో ఒక వ్యక్తి దానిని మరమ్మత్తు చేయుచుండెను. ఆ వ్యక్తి లోనికి వచ్చుట ఈయన వినెను గాని వారెవరో తెలియనందున మౌనముగాయుండెను. శ్రీ ఫిన్నీ, ఆ ధ్వని యంత్రమును ప్రయత్నించుచుండెను. తాను జరుపనైయున్న ఆ ఉజ్జీవము కొరకు ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపియుండెను, ఆయన తన స్వరము ఎట్లుండునో చూడ ప్రయత్నించుచుండెను. ఆయన వెంటనే వేదిక యొద్దకు వెళ్ళి ఇట్లనెను, ''మారు మనస్సు పొందుడి, లేనియెడల నశించెదరు!'' అతడు దానిని ఎంతో బలముగా పలికెను, దేవుని యొక్క అభిషేకము క్రిందనుండిన తరువాత అది పలికెను, ఒక వ్యక్తి బాల్కనీ మీద నుండి నేల మీదికి పడెను; భవనపు పై నుండి నేల మీదికి పడెను.

14అతడు సువార్తను బోధించిన తీరు ఎంతో గొప్పగా యుండెను. అతడు ముస్సాచుసెట్సులోని బోస్టన్‌లోని ఒక చిన్న కిటికీ యొద్ద నిలబడియుండెను, ఎందుకనగా అతని బోధ వినుటకు వచ్చిన జనులకు ఏ చర్చి చాలకుండెను. అతడు ఎంతో శక్తితో నిలబడి నరకము ఎట్టిదో బోధించెను. పని చేయుచున్న మగవారు తమ చేతులతో బుట్టలతోనే వీధిలో పడిపోయి కృప కొరకు కేకలు వేయుచుండిరి. దేవుని యొక్క సన్నిధి! గొప్ప ప్రసంగీకులు దేవుని యొక్క వాక్యపు శక్తిని బట్టి దేవుని సన్నిధిని ప్రజల యొద్దకు తెచ్చిరి. దేవుని యొక్క సన్నిధిని గుర్తించలేకుండా తమ హృదయములతో వాతవేయబడిన వారు దానికి దూరముగా లేకుందురు గాక! అది దూరమగును గాక!

GEN 3:7,8

 

15మొదటి మానవుడు పాపము చేసి ఏదో తప్పు చేసిన వెంటనే దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడలేకపోయెను. ''ఆదాము,'' దైవ సన్నిధిలో ఉండలేక పోయెను. అతడు పరుగెత్తి వెళ్ళి పొదలో దాగొనెను. ఒక అంజూరపు ఆకుతో తన్ను కప్పుకొన ప్రయత్నించెను. ఎందుకనగా సృష్టికర్తయగు యెహోవా సన్నిధిలో తాను నిలబడియున్నానని అతడు ఎరిగియుండెను. పాపము చేసి తన ఆత్మలో పాపము నిలచియుండగా దేవుని సన్నిధిలోనికి రా ప్రయత్నించిన మొదటి మానవుని యొక్క స్థితి అది. అతడు దాగుకొనజాలడు, ఎందుకనగా ఇంకా మెత్తబడిపోయెను. ఈనాడు ప్రజల హృదయములలో పాపము ఎంతగానో వ్రేళ్ళూని కొనిపోయినది, కాని అతడు సృష్టికర్త ఎదుట నిలబడియున్నానన్న ఎరుకను బాగుగా కలిగియుండును. అతడు పొదలో దాగుకొని బయటకు రాలేకపోయెను. అతనికి దేవుడు ఒక సిద్ధపాటు ఏర్పరచునంతవరకు బయటకు రాలేకపోయెను.

GEN 17:3

 

16మనము వెనక్కు వెళ్ళి ఆదికాండము 17 అధ్యాయము 3 వచనము చూద్దాం. గొప్ప పితరుడగు అబ్రహాము, దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు సర్వశక్తుడగు దేవుని పేరట దేవుడతనితో మాట్లాడెను (17 అధ్యాయములో) అబ్రహాము సాష్టాంగపడెను. ఆ గొప్ప పితరుడు, దేవుని సేవకుడు, దేవుని యొక్క సన్నిధిలో నిలువజాలకపోయెను. అతడు నమ్మకముగా ఇరవై-అయిదు సంవత్సరముల పాటు దేవునిని సేవించిన వాడే. కాని దేవుడు అతని సముఖములోనికి కదిలి వచ్చినపుడు, పితరుడు సాష్టాంగపడెను; ఎందుకనగా దేవుని సన్నిధి యందు అతడు నిలువలేకపోయెను.

EXOD 3:5,6

 

17దేవుని యొక్క ప్రవక్త మరియు గొప్ప దాసుడును అగు మోషే ఎడారి యొక్క వెనుక వైపు ఉండుట మనము నిర్గమకాండము 3లో చూతుము; అతడు పరిశుద్ధుడు. అతడు ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించెను. ప్రవక్తగా నుండుటకే తన తల్లి గర్భమందు అతడు పుట్టెను. తన జనులను విమోచించుటకు తాను విద్యను నేర్చుకొని చేయకలిగినదంతయూ చేయ ప్రయత్నించెను, ఎందుకనగా తాను ప్రజలను విమోచించవలసియున్నానని అతనికి అర్థమయ్యెను, కాని దానిని అతడు వేదాంతపు ధృక్కోణములో నుండి చూచెను. అతడు శిక్షణ పొందెను. అతడు బాగా పాండిత్యము నేర్చెను. ప్రపంచములో అతి తెలివిగలవారైన ఐగుప్తీయుల జ్ఞానమును అతడు బోధించగలడు. అతనికి అన్ని మెళకువలు తెలియును. అతనికి ఆది నుండి అంతము వరకు లేఖనములు తెలియును. దేవుడు చేసిన వాగ్ధానములు అతనికి తెలియును. అతడు వాటిని మేధా ధృక్కోణములో ఎరిగియుండెను. అతడు ఒక గొప్ప సైనికుడు.

కాని ఒక దినమున అతడు వెనుక వైపున దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినపుడు తన కాళ్ళ చెప్పులను విడిచెను. తాను పరిశుద్ధ స్థలము మీద నిలబడియున్నానని ఎరిగియుండెను. అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు కాళ్ళ మీద నిలబడజాలక పోయెను. అబ్రహాము వలె అతడును సాష్టాంగపడెను. దేవుని యొక్క సన్నిధిలో అతడు నిలబడజాలలేకపోయెను.

EXOD 19:10,11,18•

EXOD 20:19

 

18నిర్గమ కాండము 19:19. అబ్రహాము దినములలో నుండి దేవుడు ఏర్పాటు చేసికొనిన ఒక జనాంగమున్నది. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి పితరులు వచ్చిరి. సంవత్సరముల తరబడి పరిశుద్ధులు, గొప్పవారు, ఒక ఏర్పరచుకోబడిన జనాంగము, ఒక ఎన్నుకొనిన జాతి, ఒక పరిశుద్ధమగు పవిత్ర జనము ఉద్భవించుచూ తమ జీవితకాలమంతయూ దేవుని సేవించుచునే యుండిరి. ఒకనాడు దేవుడు ఈలాగనెను, ''ఇశ్రాయేలు వారిని పోగు చేయుము, నేను వారితో మాట్లాడనైయున్నాను.''

సీనాయి కొండ మీదికి దేవుడు దిగి వచ్చినపుడు పర్వతమంతయూ అగ్నితో చుట్టుముట్టబడెను, దాని నుండి పొగ ఒక కొలిమి నుండి లేచినట్లుగా లేచెను. దేవుని యొక్క స్వరము గర్జించెను. ఇశ్రాయేలీయులు సాష్టాంగపడి ఇట్లనిరి, ''దేవుడు కాదు, మోషే మాట్లాడితే చాలును, లేని యెడల మేము చనిపోదుము." మానవుడు దేవుని యొక్క సన్నిధిలోతాను పాపినని గుర్తించెను. అయినాగాని వారందరూ ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందిరి. వారు ఆజ్ఞలు మొదలగు వాటన్నింటిని పాటించిరి, కాని దేవుడు మాట్లాడి వారి మధ్యకు తన సన్నిధితో కదిలి వచ్చినపుడు వారు తాము సరిగా లేమని గుర్తించిరి. ఏదో లోపమున్నట్లు వారు కనుగొనిరి, ఎందుకనగా వారు దేవుని సన్నిధానములో యుండిరి. అవును. వారు ఇట్లనిరి, ''దేవుడు కాదు, మోషే మాతో మాట్లాడవలెను. లేనియెడల మేము చనిపోదుము. మోషేను మాతో మాట్లాడనిమ్ము. ''

LUKE 5:4-9

 

19లూకా 5:8లో పేతురును చూద్దాం. అతడు ఒక మొండి మనిషి, గొప్ప పలుకుబడిగల వ్యక్తి, గొప్ప శక్తియున్నదని మనకు తెలియును. అతడు ఒక పోట్లాడు గిత్తవంటి వాడు, ఒక పేరుపొందిన జాలరి. ఒక సాధారణ మనుష్యుని ద్వారా జరిగించబడిన దేవుని యొక్క అద్భుతమును చూచెను. అతడు తన చేపలు పట్టు విద్య మరియు జ్ఞానమంతటితో రాత్రంతయూ చేపలు పట్టెను, కాని ఏమియూ దొరక లేదు; కాని అటువంటి సమయములో చేపలు దొరుకునట్లు చేసిన ఆయన మానవుని కంటె అధికుడని గుర్తించెను. ''నీ వలను వేయుము'' అని ఎవరో చెప్పుట అతడు వినెను.

అతడు వలను లాగనారంభించినపుడు గొప్ప చేపలు పడుట చూచెను. తాను పాపినని అతడు గ్రహించెను. ''ఓ ప్రభువా, నేను పాపాత్ముడను, నా యొద్ద నుండి తొలగిపోమ్ము,'' అని పలికెను. దానినెవరు పలికిరి? పరిశుద్ధ పేతురు దేవుని యొక్క సన్నిధిలో తన నుండి దేవుని తొలగిపొమ్మని చెప్పెను, ఎందుకనగా తాను పాపినని అతడు గ్రహించెను.

తాను ''తప్పు'' చేసితినని అబ్రహాము గుర్తించెను. ఆదాము తాను చేసినది ''తప్పు'' అని గుర్తించెను, ఆయన దేవుని కుమారుడే, తాను తప్పు చేసితినని గుర్తించెను. మోషే తాను ''తప్పు'' చేసితినని గుర్తించెను. ఒక సంఘముగా, ఒక దేశముగా ఇశ్రాయేలు తాను ''తప్పు'' చేసినట్లు గుర్తించెను. నేను పాపాత్ముడను నా యొద్ద నుండి తొలగిపొమ్ము." దీనిని పొందుటకు ఇపుడు నేను యోగ్యుడను పరిశుద్ధుడను, అని అతడు చెప్పలేదు. ''నేను పాపాత్ముడను,'' అని అతడు పలికెను.

ACTS 9:3,4,6

 

20ఒకసారి తనకు తాను గొప్ప మతాసక్తిగలవాడినని చెప్పుకొనిన వ్యక్తి యుండెను, గమనియేలు అను ఒక గొప్ప ఉపదేశకుని యొద్ద తాను నేర్చుకోకలిగినదంతయూ నేర్చుకొనెను. అతని పేరు తార్సు వాడగు సౌలు, సౌలుగా మనకు తెలియును. మచ్చలేని మతాసక్తిగల వ్యక్తి, తమ మతము యొక్క లోతుపాతులన్నియూ అతనికి తెలియును. అతడు పరిసయ్యులకు పరిసయ్యుడు, హెబ్రీయులకు హెబ్రీయుడు. అతడు పేరు గలవాడు, పండితుడు, తెలివిగలవాడు, చురుకైనవాడు, విద్యగలవాడు, పసితనము నుండియే దేవుని ఎరిగినవాడినని చెప్పుకొనినవాడు. కాని ఒక రోజున దమస్కునకు పోవు దారిలోయుండగా అతని మీద అగ్ని స్తంభము ప్రకాశించుచుండెను. అతడు నేల మీద ధూళిలో పడెను. ప్రభువా, నీవు నన్నేమి చేయమందువు?'' అనడిగెను. అతని యొక్క గొప్ప శిక్షణ, అతని యొక్క గొప్ప వేదాంతపు తర్ఫీదు, అతని యొక్క విద్య యావత్తు దేవుని యొక్క సన్నిధిలో నిలబడినపుడు ఎందుకూ కొరగాకుండెను.

ACTS 9:4

 

21ఇక్కడ నేను ఒక క్షణము ఆగి అదే సంగతిని చెప్పగోరుచున్నాను. నీకు డి. డి., పి.హెచ్.డి. లేదా మరేదో ఉండియుండవచ్చును. చిన్న బిడ్డగా యున్నప్పటి నుండియూ నీవు చర్చికి వెళ్ళుచుండవచ్చును. ఉన్న మత కార్యములున్నియూ నీవు జరిపించి యుండవచ్చును, కాని ఒక్కసారి దేవుని సముఖములో నీవు ఎంతో అల్పునిగాను, లెక్కలేని వానిగాను కనబడెదవు.

పౌలు తాను సరయిన వాడిని కానని గ్రహించి, శక్తి యొక్క ప్రభావము వలన నేల మీద పడిపోయెను. అతడుపైకి చూడగా, తాను ఏ దేవునికి వ్యతిరేకముగా బోధించుచున్నాడో ఆదే వునినే కనుగొనెను. తనకు తెలిసినదంతయూ తప్పు అని ఎరిగి నేలమీద పడెను, ఎందుకనగా అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండెను. అతడు ఆ అగ్ని స్తంభమును చూచెను.

REV 1:12-15,17

 

22ప్రకటన 1:7 లోని మహా పరిశుద్ధుడగు యోహాను మాట ఏమిటి? అతనికి దర్శనము చూపించబడినపుడు చూచెను. ఒక స్వరము మాట్లాడుటకు వినెను. ఆ స్వరము ఎవరిదోనని చూడ వెనుదిరగగా, అతడు ఏడు సువర్ణ దీప స్తంభములను చూచెను. ఆ ఏడు బంగారు దీప స్తంభముల మధ్య ఒకాయన నిలబడియుండెను. అతని జుట్టు ఉన్నిని పోలియు, అతని కండ్లు అగ్ని జ్వాలలవలెను, పాదములు ఇత్తడి స్తంభముల వలెను ఉండెను. అతడు బంగారు దట్టి కట్టుకొని యుండెను. దేవుని వాక్యమను పేరు ఆయనకుండెను. ఆ గొప్ప పరిశుద్ధ యోహాను క్రీస్తుతో కూడా నడిచి ఆయన రొమ్మున ఆనుకొని యుండెను. ఈ క్రియలన్నియూ అతడు చేసెను! ఈ ఉదయమున నేను చెప్పినట్లు, పౌలు యొక్క పరిచర్య వారినందరినీ అతిక్రమించెను. ఇక్కడ యోహాను యేసుతో నడిచి, మాట్లాడి, నిద్రించి, భోజనము చేసినవాడే, కాని ఆయన అక్కడ నిలబడియుండుట చూచి, ఆ మహిమాన్విత దశ చూచి, చనిపోయిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితినని చెప్పెను. ఆమేన్. దాని గూర్చి ఆలోచించుము!

REV 1:17

 

23మనము చర్చికి వచ్చి, మాట్లాడి దేవుని స్తుతించి మరి ఏవేవో చేయ వచ్చును, కాని ఓ సోదరుడా, ఆయన వచ్చుటకు చూచినపుడు మన హృదయములు మరో రీతిగా యుండును. చర్చికి వెళ్ళుట ద్వారాను, దశమ భాగములు ఇచ్చుట ద్వారాను మన మత విధిని మనము నెరవేర్చుచున్నామని తలంచుచుండవచ్చును. సంఘము యొక్క చట్టములు పాటించుచూ, మతవిశ్వాస ప్రమాణములు వల్లించుచున్నామని తలంచుచుండవచ్చును, కాని ఒక్కసారి ఆయనవైపు చూచుటకు ఆశించుదము. మొత్తము పరిస్థితి మారిపోవును. అవును. అది నిశ్చయము.

ఈ గొప్ప వ్యక్తియగు పరిశుద్ధ యోహాను, ''చచ్చిన వాని వలె పడినట్లుగా,'' చెప్పెను. బైబిలులోని ప్రకటన 1:7లో ఆ గొప్ప వ్యక్తియే అలాగనెను. క్రీస్తుతో మూడున్నర సంవత్సరముల సహవాసము తరువాత, పత్రికలను రచించిన వారిలో ఒకడగు అతడు, ఆయన వెనుక నడిచి, ఆయనతో బల్లయొద్ద భోజనము చేసి, పరుపు మీద ఆయనతో పరుండిన వాడు, అయనెక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్ళి సహవాసము చేసిన వాడు ఆయనను చూడ వెనుదిరిగినపుడు అతనిలో శక్తి ఏమియు మిగులలేదు. అతడు చచ్చిన వాని వలె నేల మీద పడిపోయెను. సరే మంచిది.

24యెషయా 6:5 లో, ఇపుడు మనము యెషమా గూర్చి చదివితిమి. ఇతడు మహాశక్తి గల ప్రవక్త. బైబిలులో గల గొప్ప ప్రవక్తలలో ఇతడు ఒకడు. బైబిలులో అరువది-ఆరు గ్రంధములున్నవి, యెషయా గ్రంధములో అరవై-ఆరు అధ్యాయములున్నవి, యెషయా ఆదికాండముతో ప్రారంభమగును, యెషయా మధ్య భాగమున క్రొత్త నిబంధన వచ్చును, యెషయా చివరన వెయ్యేండ్ల పాలనయున్నది. ఆదికాండము, క్రొత్త నింబంధన, ప్రకటనయున్నట్లుగానే అక్షరాలాయున్నది. ఖచ్చితము! యెషయా పెద్ద ప్రవక్తలలో ఒకడు, కాని ఒక దినమున అతడు రాజగు ఉజ్జీయా చేతి మీద ఆనుకొనెను. గొప్ప రాజగు ఉజ్జియా అతని యొద్ద నుండి తీసికొనబడెను. అతడు చాలా మంచివాడు, మంచి మతాసక్తిగలవాడు, ఆ నీతిమంతుడగు రాజు (ఒక మంచి రాజు) అతనిని ఒక పరిశుద్ధునిగా గుర్తించి తన ఆలయమందు నియమించుకొనెను.

ISA 6:2,3,5

 

25యెషయా దర్శనములను చూచెను. అతడు ఒక ప్రవక్త యెషయా వాక్యమును బోధించెను. అతడు ఒక సేవకుడు. యెషయా పరిశుద్ధుడు. కాని ఒక దినమున, ఆలయములో నిలబడియుండగా దర్శనములో పడి దేవుని యొక్క మహిమను చూచెను. తమ రెక్కలతో ముఖమును కప్పుకొని, ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వశక్తుడగు యెహోవా పరిశుద్ధుడు,'' అని రెక్కలతో ఎగురుచున్న దేవదూతలను చూచెను.

తాను ఏమియూ కానని ఆ ప్రవక్త చూచి గ్రహించెను. ''అయ్యో, నేను అపవిత్రమగు పెదవులు గలవాడను,'' అని అతడు పలికెను. అతడు ఒక ప్రవక్త బైబిలులోని బలముగగల ప్రవక్తలలో అతడు ఒకడు. ''నేను అపవిత్రమగు పెదవులు గలవాడను. అపవిత్రమగు పెదవుల గల జనుల మధ్యను నేను జీవించుచున్నాను. అయ్యో, దేవుని యొక్క మహిమను నేను చూచితిని.''

ISA 6:4,5•

REV 6:16

 

26ఆ దేవదూత కేక వేసినపుడు ఆలయము యొక్క కమ్ములు ముందుకు వెనుకకు వణకినట్లుగా అతడు చెప్పెను. సోదరుడా, అది నిన్ను అలాగే చేయును! ఆలయము యొక్క గడప కమ్ములు కదలుట మాత్రమే కాదు, ఆయన తిరిగి వచ్చునపుడు భూమ్యాకాశములు గడగడలాడనై యున్నవి. పర్వతములు పారిపోవును, సముద్రము కనుమరుగవును, ''సింహాసనము మీద ఆసీనుడై యున్న వాని సముఖము నుండి మమ్మును దాయుడి,'' అని కేకలు వేయును. అది భయంకర కాలముగా ఉండబోవుచున్నది. పాపాత్ముడవగు స్నేహితుడా, ఇపుడే నీవు పరీక్షించుకొనుట మంచిది, అని చెప్పుచున్నాను. అది నిజము.

యెషయా ఇట్లనెను, ''అయ్యో, నేను అపవిత్రమగు పెదవులు గలవాడను. అపవిత్రమగు జనాంగము మధ్యను నేను నివసించుచున్నాను, నేను, ఈ జనులు అపవిత్రమగు పెదవులు గలవారము.''

ISA 6:5•

1PET 4:18

 

27ఇపుడు గుర్తించుకొనండి, దేవుని యొక్క సన్నిధిలో అట్టి పరిశుద్ధులే తాము ''పాపులము,'' అని గ్రహించినపుడు, ఆ దినము పాపి మరియు భక్తిహీనుని గతి ఎట్లుండును? కూటములలో కూర్చొనియున్న ప్రజలు ఏమి చేయుదురు? దేవుని యొక్క శక్తి చూచిన జనులు, వాక్యము యొక్క ఆఖరి హెచ్చరికను వినిన వారు, దేవుడు తన్ను తాను బయలుపరచుకొనుటను చూచిన వారు (నిస్సందేహముగా) ప్రతి లేఖనము నెరవేరుట చూచినవారు, ఏమి చేయుదురు? ఇంకా తిరిగి జన్మించకుండనే, పరిశుద్ధాత్మను పొందకుండనే, పరలోకమునకు వెళ్ళుదుమనుకొనుచున్న వారు ఏమి చేయుదురు?

''నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైన యెడల పాపియు, భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు?'' అని బైబిలు ప్రశ్నించుచున్నది. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని, వారు చూచిన ప్రకారమే మనమును దేవుని యొక్క మహిమను చూచుట జరిగినపుడు, ఏ విధమగు స్థలములో మనము నిలబడవలసియుందుము? అట్టి ప్రవక్తలు, పరిశుద్ధులే, వాక్యమును వెల్లడి చేసిన వారే ఆ విధముగా మొరపెట్టిరి గదా? వారు కేకలు వేయుచూ, సాష్టాంగపడి, ''నేను అపవిత్రమగు పెదవులు గలవాడను, అపరిశుద్దుడను,'' అనిరి. అలాగయితే, కనీసము పాపము కూడా ఒప్పుకొనని మానవుని సంగతి ఏమిటి? తమ పాపములు ఒప్పుకొనని యువతీ-యువకుల సంగతి ఏమిటి? దేవుని కంటె ఎక్కువగా తనకే ఈ సృష్టిని గూర్చి తెలియునని తలంచుచున్న కఠిన హృదయుల సంగతి ఏమిటి? బైబిలును తప్పుగా నిరూపించు ప్రయత్నములోనే తన జీవితమంతయూ ధారపోసిన వానికి ఏమి సంభవించును? ఎక్కడ ఆ వ్యక్తి నిలబడగలడు? దాని గూర్చి ఆలోచించుము!

MATT 16:18•

MATT 24:29,35•

MARK 13:25,31•

LUKE 21:26,33•

HEB 12:28

 

28ఇది సువార్తీకరణ. ఇది జనులను కుదుపు సమయము. ఒక కాలము వచ్చునని దేవుడు చెప్పిన కాలము ఇదే. ఒక్కసారి ఆయన సీనాయి కొండను కదిపెను గాని, మరల కదుపు సమయము వచ్చును. అపుడాయన సీనాయి కొండను మాత్రమే కాదు గాని, కదలగల ప్రతి దానిని ఆయన కదుపును. ''కాని ఆ తక్కిన లేఖనమంతయూ మీరు గ్రహించారా?'' కాని కదల్చబడని రాజ్యమును మనము పొందుదుము! హల్లెలూయ! కదలుటకు వీలున్న ప్రతిదియు కదల్చబడును. ఆకాశములు కదల్చబడును, భూమి కదల్చబడును. ''భూమ్యాకాశములు గతించును గాని నా మాట లేమాత్రమును గతించవు. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువజాలవు.'' కదల్చబడుటకు వీలున్న ప్రతిదియు కదల్చబడును, కాని మనము ఒక రాజ్యము పొందుదుము. అది దేవుని యొక్క వాక్యమే. ఆయన వాక్యమనగా దేవుడే, ఆయన తన్ను తాను కదల్చుకొనడు. ఆమేన్! ఓ! ''కాని కదల్చబడని ఒక రాజ్యమును మనము పొందుదుము.'' హెబ్రీ రచయితయగు పౌలు అది కదల్చబడనిది, అని చెప్పెను.

29అటువంటి వ్యక్తులు, అటువంటి వారు, అటువంటి కాలములో ఎట్లు భావించిరో చూడండి! మనము కూడా అట్టి వారమే. వీరివలెనె మనమును దేవుని యొక్క మహిమను చూచాము. నిశ్చయంగా, దానిని మనము చూచాము. అబ్రహాము చూచినట్లుగా, దేవుని యొక్క మహిమను మనము చూచాము. మోషే చూచినట్లుగా, దేవుని యొక్క మహిమను మనము చూచాము. అదే అగ్ని స్తంభము, అదే దేవుని శక్తి, అదే క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుట; తన్ను తాను చూపించుకొనుట, చివరి దినములలో తన మాటను నెరవేర్చుకొనుట చూచాము. అయితే దానిని మనము తేలికగా త్రోసిపుచ్చి ఏలాగు వెళ్ళిపోగలము? వెళ్ళిపోయి ఇంకా విశ్వాస ప్రమాణములు మరియు శాఖలకు ఏలాగు అంటి పెట్టుకొని యుండగలము? దేవుని వాక్యమును తీసికోకుండా ఎట్లుండగలము? ఆ దినమున మన గతి ఎట్లుండును? దేవుని యొక్క మహిమను చూచునపుడు మనకేమి జరుగును?

PS 14:1•

PS 53:1

 

30కొందరు జనులు నిలబడి దానిని హేళన చేయుచున్నారు. కొందరు దానిని చూచి నవ్వుచున్నారు. కొందరు దానిని ఉన్మాదము అని పిలచుచున్నారు, కొందరు అది మానసిక వివేచన అనుచున్నారు, కొందరు అది బయల్జెబూబు అనుచున్నారు, కొందరు దానిని ఇంకేదో అని పిలచుచున్నారు. ''దేవదూతలు భయముతో త్రొక్కలేకపోవుచున్న స్థలములను, బుద్ధిహీనులు మేకుల జోళ్ళతో త్రొక్కుచున్నారు,'' అను పాత సామెత మాదిరిగానే యున్నది. అది నిజము. ''దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనెను.'' దేవుడు తన స్వంత వాక్యము ద్వారా పరిపూర్ణ క్రియలు చేయుట చూచియూ దానిని హేళన చేయుచూ నడిచిపోవుచున్నాడు, అతడు బుద్ధిహీనుడు. (ఆయన ఒక విశ్వాస ప్రమాణము ద్వారా కాక; తన వాక్యము ద్వారానే చేయుచున్నాడు) ఎందుకనగా ఆ వాక్యమే దేవుడు, దేవుడు తన్ను తాను వారికి తేటగా బయలుపరచుకొనెను, అతడు బుద్ధిహీనుడు అని బైబిలు చెప్పెను. అట్టివాడు ఆ స్థలములో నిలబడి యున్నప్పుడు అతనికేమి జరుగును? భక్తిహీనునికి ఆ దినము భయంకరముగా ఉండును.

31పశ్చత్తాపపడిన పాపులకు ఎట్టి భయము ఉండదు. ఓ! లేదు. మారు మనస్సు పొందిన పాపి తన కొరకు తన స్థానములో రక్తపు బలి నిలబడియున్నదని ఎరుగును, అది ఎదురు చూచుచున్నది. అతనికి ఓదార్పును అదే ఇచ్చుచున్నది. ''నేను దేవుని యొక్క మహిమను చూచియున్నాను. ఆయన శక్తిని నేను తాకితిని. ఆయన హస్తము యొక్క తాకిడిని నేనెరుగుదును. ఆయన యొక్క శిక్షను తాకితిని. ఆయన దేవుడని నాకు తెలియును. నేను ఎందుకూ పనికిరానివాడినని నాకు తెలియును, కాని అక్కడ ఒకాయన నా కొరకు నిలబడియున్నాడు. ఆమేన్. అక్కడ నిలబడి ఒకాయన ఇట్లు చెప్పుచున్నాడు, 'తండ్రీ, అతని యొక్క దోషమంతటినీ నా మీద మోపుము, ఎందుకనగా అతడు నా కొరకు భూమి మీద నిలబడియున్నాడు.' హల్లెలూయ! అపుడు నేను ధైర్యముగా, హృదయములో కృపను ఉంచుకొని దేవుని సింహాసనము యొద్దకు నడిచి వెళ్ళెదను. మంచి క్రియల వలన కాదు గాని, ఆయన కృప వల్లనే రక్షించబడితినని ఎరుగుదును. నేను చేయకలిగినది, నేను చూడకలిగినది, నేను చెప్పకలిగినది కాదు గాని, ఆయన తన కృప చేతనే నన్ను రక్షించెను.''

పట్టుబడిన ఆ కవి ఈలాగు కేక వేయుటలో ఆశ్చర్యము లేదు, ''వింతయిన ప్రేమ, ఎంత మాధుర్యముగా వినబడుచున్నది! నా వంటి నీచుడను రక్షించెను. ఒకప్పుడు నేను నశించితిని, కాని ఇప్పుడు కనుగొనబడితిని. ఒకప్పుడు గ్రుడ్డివాడను కాని, ఇప్పుడు చూచుచున్నాను.''

MATT 7:16,20•

MARK 16:17•

JOHN 14:12•

1COR 12:13

 

32ఎన్నడయినా ఏలాగు నేను పరలోకము వెళ్ళగలను, మీరు ఎలాగు పరలోకము వెళ్ళగలరు? మన వలన అది కాదు, దానిని చేయు ఏ మార్గము మనకు లేదు, కాని ఒకాయన మార్గమును ఏర్పాటు చేసెను. ఆయన మార్గము, ఆయన యొద్దకు ఎట్లు మనము చేరగలము? ఒకే ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ వలన, ఒకే శరీరములోనికి మనము బాప్తిస్మము పొందితిమి. ఒక కక్ష్యవలె అది పైకి లేపబడును. ఈ చివరి దినపు వ్యోమగాముల వలె, దేవుని సముఖమందు మనము భూమి మీద నుండి పైకి లేచిపోదుము. ఆమేన్. నిశ్చయంగా. మారుమనస్సు పొందిన పాపులు చింతపడనవసరము లేదు, వారి స్థానములో అక్కడ ఒకాయన గలడు.

ఓ! ఇపుడు ఆయన సన్నిధిలోనికి మనము వచ్చియున్నాము. మనము ఆయన సన్నిధిలో యున్నట్లు మనకు తెలియబడెను. ఆయన భూమి మీద ఉండగా చేసిన కార్యములు ఇపుడు చేయుట మనము చూచాము. నీవు చూచుచున్నది ద్రాక్షా తీగె అని, నీకెట్లు తెలియును? దాని ఫలములను బట్టి. యేసు ఇట్లు చెప్పెను, ''నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును. నా యందు విశ్వాసముంచు వారి వలన ఈ క్రియలు కనబడును.''

REV 22:18,19

 

33ఇప్పుడు, వెళ్ళి శాఖలను తయారు చేయుడి అని ఆయన ఎన్నడూ మనలను అభిషేకించలేదు. వెళ్ళి మత సిద్ధాంతములను తయారుచేయుడని ఎన్నడూ ఆయన మనలను అభిషేకించలేదు. కాని అట్టి వాటికి దూరముగా ఉండుడని హెచ్చరించెను. ''దానిలో నుండి ఏదయినా తీసివేసినా, దానికి ఏదయినా కలిపినా, అట్టి వానికి జీవ గ్రంథములో పాలు లేకుండా చేయుదును,'' అని చెప్పెను. చూచారా.

కాబట్టి ఆ వాక్యముతో నిలచియుండుటకు తప్ప మరి దేనికిని మనము అభిషేకించబడలేదు. ఒకడు దేవుని చేత పంపబడిన యెడల, అతడు ఆ వాక్యముతో నిలచియుండును, ఎందుకనగా దేవుడు తన వాక్యమునకు మాత్రమే కట్టుబడి యుండును. చూచారా? చూడండి. ఆయన తన వాక్యమునకు తప్పక కట్టుబడి యుండవలెను. అపుడు మనము ఆయన సన్నిధిలోనికి వచ్చినపుడు, ఒక మనిషి ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినపుడు, ఇతడు నిత్య మార్పును పొందును, మారవలసియున్నది మారును. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చియు ఎట్టి లక్ష్యము చూపని వారున్నారు. అట్టి వాడు జీవమునకు నిర్ణంపబడలేదు. కాని అతడు దేవుని వలన ముందు నిర్ణయించబడినపుడు, మొదటి తాకిడి తాకగానే దానిని అతడు తెలిసికొనును. అగ్ని అంటుకొనును.

DEUT 18:15,18•

JOHN 4:19,25•

JOHN 4:26•

JOHN 4:28,29

 

34సమరయలో నుండిన ఆ స్త్రీని చూడండి. మానసికంగా, శారీరకంగా ఆమె దుస్థితిలో యుండెను. అది మనమెరుగుదుము. కాని ఆమె ఆ సూచనను చూచిన వెంటనే, ''మెస్సీయా వచ్చి దీనిని చేయునని మేమెరుగుదుము. నీవు తప్పక ఆ ప్రవక్తవే అయియుందువు,'' అన్నది.

''రానున్న వాడనని వ్రాయబడిన మెస్సీయాను నేనే,'' అని ఆయన చెప్పెను.

దానిని ఆమె గుర్తించినది. ఆమె మరే ప్రశ్న వేయలేదు. ఆమె వెంటనే బాధ్యతతో వెళ్ళసాగినది. దేవుని యొక్క సన్నిధిలోనికి తాను వచ్చితినని ఎరిగియున్నది. దానిని గూర్చి ఇతరులకు చెప్పవలసిన బాధ్యతను గుర్తించినది. హల్లెలూయా! మంచిది. దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఏ వ్యక్తి అయినా గాని ఆ నిమిషము నుండి ఇతరులకు చెప్పవలసిన బాధ్యతను దేవుని ఎదుట కలిగియున్నాడు. అబ్రహామును చూడండి, మోషేను చూడండి, పేతురును చూడండి, పౌలును చూడండి; దేవుని సన్నిధిలోనికి వచ్చి క్షణమందే తాము ''పాపులమని'' గుర్తించిరి. తమ జీవితముతో తమ సాక్ష్యమును ముద్రించిరి.

ఆమెను చూడండి, ఏ మాత్రము తడవు చేయలేకపోయినది, పట్టణములోనికి వెళ్ళి, ''రండి, చూడండి, నేను చేసినవన్నియూ నాతో చెప్పి ఈయన మెస్సీయా కాడా?'' అన్నది. దానిని వారు కాదనలేకపోయిరి, ఎందుకనగా అది లేఖనానుసారమై యుండెను. నిశ్చయంగా! అవును. వారది అంగీకరించవలసియుండిరి. మోషే వలె, పేతురు వలె, పౌలు వలె, మనము ఇతరులకు చెప్పవలసిన బాధ్యతను కలిగియున్నాము. ఈ కార్యములన్నియూ మీరు చూచారు. ఆయన సన్నిధిలోనిక వచ్చారు, ఇపుడు ఈ వర్తమానమును ఇతరుల యొద్దకు కొనిపోవలసిన బాధ్యత మీపై యున్నది. దానిలో మీరు ఊరక కూర్చుండలేదు. దానిని తప్పకుండా ఇతరుల యొద్దకు మీరు మోసికొని పోవలెను.

MATT 5:16

 

35ఒక వృద్ధ సోదరి ఇక్కడకు వచ్చుచుండుట నాకు గుర్తున్నది. సహో. గ్రాహం స్నెల్లింగ్ యొక్క తల్లి. ఆమె ఈ చర్చిలోనే కూర్చొనిడెది, ఈ పాట పాడెడిది, ''ఇప్పుడే నేను పొందాను! అది పొంగి, పొంగి, పొంగి పారుచున్నది. నేను కూర్చొనియుండలేదు." ఆమె ఒక దానిని కనుగొన్నది. ఇక్కడి లూయిస్ విల్‌లో ఒక వర్ణపు ఆలయమునకు వెళ్ళాను, వారందరు నిలబడి పాడుచుండిరి, ''రాజ మార్గములో నేను పరుగిడుచున్నాను, ఇప్పుడే అది కనుగొన్నాను, రాజమార్గమును స్వీకరించాను.''

క్రీస్తును నీవు కనుగొన్నపుడు ఒకటి జరుగును, నీవు ఇక ఏ మాత్రము నెమ్మదిగా కూర్చొనజాలవు, నీ తక్కిన దినములన్నియూ నీవు మారిన వ్యక్తిగానే యుందువు. జీవము, జీవము ఏకమయినపుడు ప్రకాశమగు కాంతి వచ్చును. నిజము. బల్బును వైరుకు కలిపినపుడు, అది సరయిన బల్బు అయినచో అది వెలుగును ఇయ్యవలసియున్నది. విద్యుత్తు మరియు బల్బు ఒక చోటకు వచ్చినపుడు, వెలుగు విరజిమ్మబడుట తప్ప మరేమీ జరుగదు. అది ఆ విధముగా చేయవలసియున్నది. ఒక స్త్రీ లేక పురుషుడు, నిత్య జీవమునకు ముందే ఏర్పాటు కాబడినపుడు, దేవుని యొక్క విద్యుత్తు ఆ బల్బును అంటుకొనుట వారు చూతురు. అది తనకు వీలున్న చోటకు కాంతిని వెదజల్లును. నీవు పది వాట్‌ల వెలుగు విరజిమ్మకపోవచ్చును గాని, నీకున్నదే నీవు విరజిమ్ముదువు. నీకు అయిదు-వందల వాట్ లేకపోయినా గాని, పది వాట్‌ల వెలుగునే వెదజల్లెదవు. నీ వెలుగును ఇమ్ము! ''మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా, మనుష్యులయెదుల మీ వెలుగును ప్రకాశింపనీయుడి.'' అవునండీ!

36ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, తనలో ఏ మంచియు లేదు అని గుర్తించును. ఏమీ లేని ఒక మనిషి తానెంత పెద్దవాడనో, తానెన్ని కార్యములు చేసితినో అని గొప్ప చెప్పుకొనుట ఎట్లుండును? అసలు అతని ప్రారంభమే శూన్యము.

టెన్నిసీ లోని మెంఫిస్‌లో అనుకొంటాను లేదా అక్కడున్న ఒక స్థలములో ఒకనాడు జరిగినది ఇది. నేను సహో. డేవిస్‌తో యున్నాను, ఒక ఉజ్జీవ కూటము జరుగుచున్నది, మెంఫిస్‌లో అనుకొనుచున్నాను. మేము ఒక చిత్రకళా-మందిరము వంటి ఒక దానిలోనికి వెళ్ళాము. భూమి మీద వివిధ ప్రాంతముల నుండి విగ్రహములను అక్కడ సమకూర్చిరి, గొప్ప కళాకారులు చిత్రించిన హెర్కులిస్ తదితర కళాఖండముల వంటివి. నూట-ఏబది పౌనులు బరువు గల ఒక మనిషి యొక్క విశ్లేషణ అక్కడుంచిరి. అతడెంత విలువ చేయునో మీరెరుగుదురా? ఎనభై-నాలుగు-సెంట్లు. అతని మొత్తం విలువ అదే అతనిలో నుండి నీవు పొందు రసాయనముల విలువ ఎనుబది-నాలుగు-సెంట్లు మాత్రమే. ఒక కోడిగూటిపై చల్ల కలిగిన సున్నమును అతడు కలిగి యుండును. కొద్ది పాటి కాల్షియం, కొద్దిపాటి పొటాష్‌యం, అతనిలో యున్నవి. అవన్నియూ కలిపి ఎనుబది-నాలుగు-సెంట్లుకు అమ్ముడుపోవును. కాని ఆ ఎనుబది నాలుగు సెంట్లు మనము తీసికొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుచున్నాము.

ISA 21:11•

EZEK 33:1,2,6

 

37అక్కడ ఇద్దరు బాలురు నిలబడియుండిరి, ఒకడు మరొకని వైపు చూచి ఇట్లనెను, ''జిమ్, మనము పెద్ద విలువ చేయము కదా?''

''అవును. జాన్, మనవిలువ బహు తక్కువ,'' అన్నాడు.

''బాలులారా, ఒక్క నిముషము ఆగండి. పదివేల ప్రపంచముల కన్న ఎక్కువ విలువయిన ఆత్మను మీరు మీలోపట కలిగియున్నారు. మీరు ఇష్టపడి ఇచ్చినచో దేవుని శక్తి వలన అది విమోచించబడును,'' అని చెప్పాను. ఈ సంగతులు జరుగుట చూచిన మనిషికి ఇతరులకు చెప్పవలసిన బాధ్యత యున్నది. నేను బాలునిగా నున్నప్పుడే వాటిని చూచాను. నా జీవితమంతయూ దాని కొరకే నేను ఖర్చు చేసాను. ఒక్క జీవితమే నాకున్నందుకు విచారించుచున్నాను, పదివేలు ఉంటే బాగుండునని కోరుచున్నాను. నాకు ఒక నిత్యత్వమున్నయెడల కూడా ఇంకా నేను ప్రజలకు దాని గూర్చి చెప్పుచునే యుందును, ఎందుకనగా నాకు దొరికిన వాటన్నింటిలో అంతకన్న గొప్పదేదియూ లేదు.

యెహెజ్కేలు 33వ అధ్యాయము మీరు చదివినయెడల, ప్రాకారము మీద ఒక కావలివాడుండుట గమనించెదరు, యావత్తు పట్టణమునకు ఆ కావలివాడే బాధ్యుడు. ఆమేన్. ఇపుడు, లేవండి ఒక్క నిమిషము పాటు మీ ఆత్మీయ మేల్కొలుపును పొందండి, ఈ లోపు నేను ఈ లేఖనము తీసికొందును. ఆ కావలివాడు శిక్షణ పొందిన వాడై యుండవలెను. తాను చేయుచున్న దానిని అతడు ఎరుగవలసియుండెను. శత్రువు ఎంత దూరములో లేచినా గాని దానిని అతడు పసిగట్టగలడు. వారు ముందుకు చొచ్చుకుని వచ్చుట అతడు కనిపెట్టగలడు, వారి రంగును అతడు చెప్పగలడు, వారి యొక్క పదవి ఔన్నత్యము చెప్పగలడు. మానవ కండ్లు ఎంత దూరము చూడగలవో అంత దూరము అతడు చూచును. తక్కిన వారందరికంటెను అతడు ఎత్తయిన వాడు, ఎందుకనగా శత్రువును తెలిసికొను శిక్షణ వారందరి కంటెను అతడు ఎత్తయిన పట్టణము యొక్క లెక్క అతనిని అడుగును. ''కావలివాడా, రాత్రి ఎంత వేళయైనది?'' హల్లెలూయా!

38నేడు దేవుని యొక్క సైనికులు అలాగే యున్నారు. వారు వాక్యము కొరకు శిక్షణ పొందిరి. దానికి చిన్న మెరుగు దిద్దుట జరిగినయెడల, వాక్యము కానిది దానికి చేర్చినయెడల వారు తమ సమాజము వారిని హెచ్చరించెదరు. బైబిలునకు సంబంధించని ఏదయినా గాని, దేవుని పోలనిది ఏదయినా యున్న యెడల, విందులు, నాట్యములు, సంఘ కాపరులకు చెల్లింపులు మున్నగునవి ఏవికనబడినా గాని వారు హెచ్చరిక చేయుదురు. ఆ క్రియలు తప్పు. సంఘములలో ఇంకో ఆటలు, కార్డు విందులు తప్పు!

ప్రాకారము పైనున్న నిజమగు కావలివాడు. ఒక్కసారి దేవుని సన్నిధిలో నిలబడినవాడు హెచ్చరించగలడు. కాని అలాగు లేనివాడు గోడ మీద ఉన్ననూ, క్రింద ఉన్ననూ ఒకటే, వాడు తన సమాజము వారికంటె ఏ మాత్రము ఎత్తుకు చూడలేడు. కాని అతడు సరయిన కావలివాడయిన యెడల, దేవుడతనిని ఏ కాపరులు చూడలేనంత ఉన్నత ప్రదేశమునకు లేపును. అతడు మందను కాయును, దేవుడతని నుండి కోరునది అదే! దేవుని సన్నిధలో నిలబడి యుండు దైవజనుడు దేవుడు దేవుడే అని ఎరుగును. దేవుడు తన మాటకు కట్టుబడి యుండునని ఎరుగును. దేవుడు కార్యములు జరిగించుట, తన కర్తవ్యము నెరవేర్చుట, తన మాట నిలబెట్టుకొనుట గమనించును. ఎన్ని సంస్థలు, ఎన్ని శాఖలు దానిని ధ్వంసము చేయ ప్రయత్నించినా గాని, అతనికి శత్రువు యొక్క లోతుపాతులన్నియూ తెలియును. ఆమేన్. ఒక నిజమగు కావలివానికి తన జనులకు ఏమి చెప్పవలెనో తెలియును.

JER 31:34•

HEB 8:12•

HEB 10:17

 

39ఆయన ఉన్నాడనియు, ఆయన సన్నిధిలో మనము ఉన్నామనియు మనము ఒప్పుకొనిన యెడల, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల అవి ఆయన జ్ఞాపకార్థ గ్రంథములో నుండి తుడిచివేయబడును. దానిని దేవుడు తప్ప మరెవరునూ చేయలేరు. మీరు ఇపుడు నాకేమిచేసినా గాని మిమ్మును నేను క్షమించెదను, కాని అది నాకు జ్ఞాపకముండును. నేను మిమ్మును ఏదయినా చేసినచో మీరు నన్ను క్షమించెదరు గాని, అది మీరు మరువరు. కాని దేవుడు క్షమించి, దానిని మరువగలడు. ''దానిని అసలు జ్ఞాపకమే చేసికొనడు!'' దాని గూర్చి ఆలోచించండి. ఆమేన్! అది నాకు మంచిగా తోచుచున్నది. మరి దానిని ఎ్నడూ జ్ఞాపకము చేసికొనకపోవుట అనునది దేవుని వలన మాత్రమే సాధ్యమగును. దానిని దేవుడు మాత్రమే చేయగలడు. తన జ్ఞాపకార్థ గ్రంధములో నుండి దానిని తుడిచి పెట్టుదునని ఆయన చెప్పెను. నేను అది చేయలేను, మీరు అది చేయలేరు. ఎందుకనగా మనకు ఈ పరిమితి గల జ్ఞానేంద్రియములు మాత్రమే యున్నవి. కాని ఆయన అంతము లేని దేవుడు, అనంతుడు. అసలు అది ఎన్నడు చేయలేదు అను రీతిగా, ఆయన పూర్తిగా మరచును. ఆమేన్.

40ఒక యువతి గ్రామ సంఘము నుండి వచ్చునది. ఆమె తండ్రి పాతకాలపు కేకలు వేయు బోధకుడు, లేదా ఒక సంఘ సభ్యుడు కావచ్చును. ఆమె పట్టణములోనికి తరలి వచ్చినది, అక్కడున్న స్త్రీలను చూచి ఆమె పూర్తిగా అయోమయ స్థితిలో యుండినది, వారివలె నాజుకులు చేసికొని ప్రవర్తించసాగినది. ఒకనాడు వారి ఇంటికి వచ్చిన తండ్రిని చూచి సిగ్గుపడినది, ఆమె తల్లి చనిపోయినది. కాబట్టి ఈ ముసలి తండ్రి ఒక ఉదయాన లేచి, అల్పాహారము తిని, బైబిలు తీసి చదివి దినమంతయూ గట్టిగా కేకలు వేయుచూ ప్రార్థించుచుండెను. గదిలో అటుఇటు పరుగిడుచుండెను, దానిని గూర్చి ఆమె కొద్దిగా సిగ్గుపడసాగినది. రాత్రంతయూ అతడు బైబిలు పట్టుకొని చదువుచూ, మధ్యలో పడక మీద నుండి లేస్తూ, ''దేవునికి మహిమ, హల్లెలూయ! ఓ! దేవునికి మహిమ,'' అనుచుండెను. అర్థరాత్రి వరకు ఆ విధంగా గోల చేయుచుండెను.

41ఒక దినమున ఆమె ఎప్పటివలెనె తన సంఘ సభ్యులకు చిన్న తేనీటి విందును ఇయ్యగోరెను. తన తండ్రిని ఏమిచేయవలెనో ఆమెకు తెలియలేదు. ఏమైనా గాని తన తండ్రి గదా! కాబట్టి ఆమె అతనిని మేడపైన ఉండమని ఈలాగు చెప్పెను, ''నాన్నా, ఈ స్త్రీలు వచ్చినపుడు నీవేమీ గోల చేయవద్దు.''

''లేదు, నేను అలాగు చేయగోరుట లేదు,'' అన్నాడు.

''ఈ రోజు, మా సంఘ స్త్రీలు ఇక్కడికి వచ్చుచున్నారు. ఒక చిన్న ప్రార్థనా కూటము మాకున్నది. కాబట్టి, నీవు కాస్త పైకి వెళ్ళిపోయియండు నాన్న,'' అన్నది.

"నేను అలాగే చేయుదును," అని అన్నాడతడు.

''ఈ చక్కని పుస్తకము చదువు,'' అని ఆమె ఒక భౌగోళిక పుస్తకము ఇచ్చెను. అతడు గోల చేయకుండునట్లుగా అతని వద్దనున్న బైబిలును లాగి వేసికొనెను. బైబిలు చదువుచూ ఉన్నయెడల చాలా గొప్ప గోల చేయునని ఆమెకు తెలిసినది. కాబట్టి విందు జరుగుచున్న చోటకు పైగా అతడు ఎక్కిపోయెను. ఆమె అతనికి భూగోళమునకు చెందిన ఒక పుస్తకము ఇచ్చి, ''ఇది చక్కనిది. నాన్నా, ఇది నీవు చదివి తీరాలి; ఎందుకనగా ఇది ప్రపంచమును గూర్చిన సత్యమంతయూ చెప్పును,'' అన్నది.

''అయితే సంతోషముగా చదివెదను,'' అన్నాడతడు.

''ఇపుడు నీవు ఆ పైకి వెళ్ళి, ఈ స్త్రీలు వెళ్ళు వరకు బహు నెమ్మదిగా యుండు. నీవు క్రిందికి దిగి వచ్చిన తరువాత నీ ఇష్టమొచ్చినట్లు చేయుదువులే,'' అన్నది. దానికతడు సమ్మతించెను. అతడు పైకి వెళ్ళి కూర్చొనెను.

JER 31:34•

HEB 8:12•

HEB 10:17

 

42వారు విందులో మునిగిపోయి యుండిరి, ఏదేదో మాట్లాడుకొనుట మీకు తెలియును గదా, సమయము సరదాగా గడుపుచుండిరి. ఆ సమయములో పై నుండి అకస్మాత్తుగా పైకప్పు ప్లాస్టరు పెచ్చులుగా పడ సాగినది. పైన గంతులు, కేకేలు వినబడినవి. ఈ ముసలివాడు శక్తి మొత్తము కూడగట్టుకొని పైన గంతులు వేయుచూ, ''దేవునికి మహిమ! దేవునికి మహిమ!'' అని గావుకేకలు పెట్టుచుండెను. ఆ పైన ఏమున్నదో, ఏమి జరిగినదో ఈ స్త్రీలకు తెలియదు. అతడు గట్టిగా గంతులు వేయుచూ తిన్నగా మెట్ల మీది నుండి క్రిందికి దిగివచ్చెను.

''నాన్నా, నీకు ఒక భూగోళ పుస్తకము చదువమని ఇచ్చాను గదా?'' అన్నది.

''అవును, నాకది తెలియును. ఈ భూగోళ పుస్తకములో అడుగులేని కొన్ని సముద్ర స్థలములున్నుట్లు చదివాను. నిన్న బైబిలులో నేను ఏమి చదివానో తెలుసా? ఆయన నా పాపములను మరపు అను సముద్రములో పడవేసినట్లు చదివాను. దేవునికి మహిమ! అవి ఇంకా వెళ్ళిపోవుచునే యున్నవి. వాటికి అంతము లేదు, అవి వెళ్ళిపోవుచునేయుండును,'' అని చెప్పెను. అది నిజము. దాని గూర్చి అతడు కేకలువేయుచుండెను. అవును. అది నిజమే.

JER 31:34•

HEB 8:12•

HEB 10:17

 

43దేవుడు మరపు అను సముద్రములో మన పాపములను పడవేసి యున్నాడు, వాటిని తుడిచి వేయును, అవి ఎన్నడూ అసలు చేయబడనట్లుగా యున్నవి. ఓ! మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను బట్టి మనము నిలబడియున్నాము. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు; అపవిత్రత ఆయనలో లేదు, అక్కడికి నేను వెళ్ళినపుడు ఆయన నన్ను చూడడు గాని, తన స్వంత కుమారుని చూచును. ఆయన చూచు మార్గము అదొక్కటే. నన్ను ఆయన చూడడు, ఎందుకనగా నేను ఆయన కుమారుడను, మరియు ఆయన కేవలము ఆయన కుమారుడినే చూచును. అది అద్భుతము కాదా? మనము ఇక మీదట పాపముల గూర్చి ఏ మాత్రము ఆలోచించనవసరము లేదు, అవన్నియూ పోయినవి, అది రక్తము క్రింద యున్నది. అవునండీ! ఏ మాత్రము వాని గూర్చి చింతించే అవసరము లేదు. అదంతయూ బయటకు పోయినది. దేవుని జ్ఞాపకములో లేదు. ఆయన ఇక దానిని జ్ఞాపకము చేసికొను అవసరమే లేదు.

ISA 6:2,3,5

 

44బలము గల యెషయా ప్రవక్త తన పాపములను ఒప్పుకొన్నపుడు, ఇట్లనెను, ''అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,'' ఒక ప్రవక్త! ''నేను అపవిత్రమగు పెదవులు గలవాడను. నా జనులు అపవిత్రులు.'' చూడండి? ''నేను ఎవరికి బోధించుచున్నానో వారు అపవిత్రులు. నేను అపవిత్రుడను. అయ్యో! నాకు శ్రమ. కాని ఇక్కడ దేవుని యొక్క మహిమ నుండి ఒక గుంపు దేవదూతలు వచ్చుచుండిరి, గాలి విసరుచుండిరి, పరలోకమంతయు వాటి ప్రభావముతో నిండియుండుట నేను చూచాను. పాపమును ఎన్నడూ ఎరుగని ఈ దేవదూతలను నేను పరికించాను. పాపమనగా ఏమిటో వాటికెన్నడూ తెలియదు, అది దేవుని యొక్క సన్నిధిలో ఉండెను, వాటికి ముఖము మీద రెండు రెక్కలు మరియు పాదముల మీద రెండు రెక్కలు, ఎగురుటకు రెండు రెక్కలు ఉండెను. ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, దేవుడగు యెహోవా పరిశుద్ధుడు,'' అని అవి దివారాత్రులు కేకలు వేయుచుండెను. వాటిముందు నీవు అపవిత్రముగానున్న భావన నీకు కలుగును కాదా? ''అయ్యో! నాకు శ్రమ!'' అని అతడనెను.

ISA 6:5-8

 

45అతడు తన పాపములను ఒప్పుకొన్నపుడు, ''అయ్యో! నాకు శ్రమ!'' అనెను. దేవదూత వెళ్ళి పట్టకారుతో నిప్పును తీసికొని వచ్చెను, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ అగ్నిని ప్రవక్త యొక పెదవులకు తగిలించి, ''నిన్ను శుద్ధి చేసితిని,'' అని చెప్పెను. అంతట అవి ఆ విధంగా రెక్కలను విదిలించుచూ కాలపు తెరలకవతలకు వెళ్ళిపోగా, దేవుడీలాగు చెప్పుట వినెను. ''మా నిమిత్తము ఎవడు పోవును?''

పాపము నిర్మూలించబడు మార్గము ఒకటున్నదని, అతడు కనుగొనెను. ఇపుడు దేవుడు మా నిమిత్తము ఎవడు పోవును? అనగా ''ఇదిగో, నేనున్నాను పంపుము,'' అనెను. అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండెను, తన పాపములు ఒప్పుకొనెను, మరియు తన పాపముల నుండి శుద్ధి పొందెను, సేవ చేయుటకు సిద్ధముగా నుండెను. ఆమేన్!

పట్టబడిన కవి చెప్పినది అదే, ''ఇపుడు మిలియనుల మంది పాపము మరియు సిగ్గులో చనిపోవుచున్నారు, వారి యొక్క విషాదపు, చేదు కేక వినుము. సాదరుడా, త్వరపడి వారిని రక్షించ వెళ్ళుము; త్వరగా జవాబు ఇమ్ము." "యజమానుడా, ఇదిగో నేనున్నాను,'' అని చెప్పుము.

46నేను ఆఫ్రికా, ఇండియా, ప్రపంచ ఇతర దేశముల గూర్చి ఆలోచించుచున్నాను. మిలియనుల కొలది అన్యజనులు కృప కొరకు కేకలు వేయుచూ మొర పెట్టుచున్నారు. ఎవరు వెళ్ళుదురు? వారికి ఒక కరపత్రిక విసరుట కాదు. వారిని యేసుక్రీస్తు నొద్దకు తీసికొని రా. ఆయన సిన్నధిలో నున్న మోషే వలె, ఎవరో ఒకరు వెళ్ళి నిజ విమోచనను చూపవలెను. ఒక సంఘములో చేరునట్లుగా వారిని చేయుట కాదు. కరచాలనము చేయుట, విశ్వాస ప్రమాణము చేయుట కాదు; వారి ఆత్మకు విడుదల తీసుకొని రా; ఎవరో మంచి దైవజనులు లేవ వలెను. అవును. యెషయా తన పాపములు ఒప్పుకొని శుద్ధి పొందెను.

GEN 32:24,26,28,30

 

47యాకోబు రాత్రంతయూ పోరాడిన తరువాత, తన పాపములను ఒప్పుకొనెను. అతడున్న చోటు గుర్తున్నదా? అది పెనూయేలు అని పిలువబడెను. ''సర్వశక్తుడగు దేవుని యొక్క ముఖము,'' అని హెబ్రీ భాషలో పెనూయేలునకు అర్థము. "యాకోబు," అనగా మోసగాడు. దేవుని నుండి దూరమై ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోవుచుండెను, కాని పెనూయేలు యొద్ద ఒక్కసారి దేవుని సన్నిధి లోనికి వచ్చినప్పుడు, దేవుని సముఖమును పట్టుకొనెను. దేవా, మాకు ఇంకా ఎక్కువ మంది యాకోబులు కావలెను. సూర్యోదయమగు వరకు అతడు అక్కడే, దేవుని సన్నిధిలో నిలచియుండెను. "సూర్యోదయమగుచున్నది గనుక నన్ను పోనిమ్ము,'' అని దేవుడు పలికెను. అతడు నీతిమంతునిగా తీర్చబడి, రక్షింపబడు వరకు, సూర్యోదయమగు వరకు దేవుని సముఖమందు నిలచియుండెను. సరి.

GEN 33:20

 

48ఓ! అదెంత గొప్ప సంగతి! చివరి వరకు పోరాడెనని తెలిసికొనుడి. దేవుడి యొక్క సూచనలను అతడు చూచెను. దేవుని గురించిన కలలు అతడు కనెను, కాని దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో యుండుట ఈ ఒక్కసారే జరిగెను. ఇపుడు మనము తొందరపడుచుండగా, స్నేహితులారా, దానిని గూర్చి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి మార్పు పొందెను. యాకోబు మార్పు పొందెను. ఇపుడతడు దేవునితో నడువగలడు. అవును, అతడు అక్కడికి వెళ్ళినపుడు ఎలాగుండెనో ఇపుడు అందుకు వేరుగానున్నాడు. ఇపుడు పోరాటము ముగిసినది. అవునండీ! అతడు ఒక బలిపీఠము కట్టనారంభించెను. మీకు తెలుసు గదా, బలిపీఠములు నిర్మించుట అతనికి అలవాటు లేదు. కాని మీకు చెప్పునదేమనగా, మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు, ఎక్కడో ఒక బలిపీఠము కట్టవలెనని కోరిక కలుగును. నీవు ప్రార్థించుటకు ఒక చోటును కనుగొనగోరుదువు. అతడు ఒక బలిపీఠము కట్టెను. అతడు శుద్దీకరించబడెను, మరియు దేవుడు గెలిచెను.

GEN 25:31-33•

GEN 30:39-42•

GEN 32:28

 

49యాకోబు "మోసగాని" నుండి "ఇశ్రాయేలుగా" మార్పు పొందెను. అనగా "రాజకుమారుడు — దేవునితో పాటు శక్తిగలవాడు" అని అర్థము. యాకోబునకు జరిగినది అది. మోసగాడు, దుర్నీతిపరుడు, అపవిత్రుడు, తన సోదరుని మోసగించిన వాడు, జ్వేష్ఠత్వపు హక్కును దొంగిలించినవాడు. తన సోదరుని మోసపుచ్చుటకు యుక్తి పన్నినవాడు మారిపోయెను. అతడు తన మామను మోసము చేసెను. నిరవంజి చువ్వలు వేసి గర్భముతో నున్న మందల ముందు నీటిలో వేసినపుడు అవి చారలు గల వానిని ప్రసవించునుట్ల చేసి మోసము చేసి గొర్రెలను, పశువులను సంపాదించెను. తన స్వంత మామనే మోసము చేసిన మోసగాడు. తన తల్లిని, తన తండ్రిని, తన అన్నను, మోసము చేసిన వాడు, అతడు దేశ దిమ్మరి. ఎల్లప్పుడూ దేవుని నుండి పారిపోవుచుండువాడు. తన సోదరునికి జడిసి పారిపోవుచుండెను.

కాని దేవుని సన్నిధిలోనికి అతడు వచ్చినపుడు, తాను పాపినని అతడు గుర్తించెను. అతడేమి చేసెను? ఏమి చేసెను? తన అవకాశమును అతడు చూచెను. ఇంతకు ముందు అసలు ఆలోచనలో కూడా లేని దానిని అతడు ఎదుర్కొనెను. పాపములన్నియూ పోవువరకు, అతడు అక్కడే నిలచియుండెను. ఓ, మై! దేవుడతనిని తన స్వంత సన్నిధిలోనికి తీసికొనివచ్చెను.

PROV 28:13

 

50మానవుని తన సన్నిధిలోనికి తీసికొని వచ్చుటకు దేవునికి ఒక మార్గమున్నది, అప్పుడు వారు తీర్మానము చేసికొందురు. కొందరు ఆయన నుండి పారిపోదువురు, కొందరు ఆయన వద్దకు పరిగెడుతూ వచ్చుదురు. వారు జీవమునకు ముందుగా నిర్ణయించబడిన వారయితే, దానిని నమ్ముదురు, దానికి వారు పట్టుకొని వ్రేలాడుదురు. వారాలాగు లేనియెడల, వారు పోయి, ''అందులో ఏమీ లేదు,'' అందురు. చూచారా. అట్టివాడు నశించిన వాడే, ''పాపమును ఒప్పుకొనిన వ్యక్తి క్షమాపణ పొందును. నీవు పాపమును దాచినట్లయిన వర్థిల్లవు.'' లేదు.

యాకోబు మరుసటి దినము తన సోదరుడగు ఏశావును కలిసికొనెను. అపుడతనికి ఏ అవసరత అతని నుండి లేదు. అతని సైన్యములు అక్కరలేదు. అతడు బలిపీఠములు కట్టు పనిలోయుండెను. ఏశావు గూర్చి ఎంతమాత్రమూ ఇక భయపడలేదు.

PS 16:8

 

51కీర్తనలు 16:8లో దావీదు చెప్పెను, ''నా ఎదుట యెహోవాను ఉంచుకొనియున్నాను.'' అది చేయవలసిన మంచిపని. కీర్తనలు 16:8, ''నా ఎదుట యెహోవాను ఉంచుకొనియున్నాను." కాబట్టి దాని గూర్చి అతడేమీ కలవరపడడు. ఆయన సన్నిధి యొక్క ఎరుకను అతడు కాంక్షించెను. అందుకే దావీదు, ''నా ఎదుట యెహోవాను ఉంచుకొనియున్నాను,'' అని చెప్పెను. తన ఎదుట యెహోవాను ఉంచుకొనిన దావీదు ఎల్లపుడూ ఆయన సన్నిధి యొక్క ఎరుకను కలిగియుండెను. ఈ రాత్రి మనందరకు అది ఒక మంచి పాఠము కాదా? ఆయన సన్నిధి యొక్క ఎరుకను మనము కలిగియుండునట్లుగా మన ముఖము ముందే ఆయనను నిలుపుకొందము. ఆయనను మొదట ఉంచుము. ఎందువలన? నీ ముందుగా ఆయననే మొదట ఉంచుకొనుము. ఎందుకు? నీవు నిరంతరము దేవుని సన్నిధిలో యున్నానను చింతన కలిగియుండి పాపము చేయవు. నీ చుట్టూ దేవుడావరించియున్నాడని నీవు గ్రహించినపుడు నీవు జాగ్రత్తగా మాట్లాడెదవు.

PS 16:8•

ACTS 13:22

 

52దేవుడు లేడని తలంచు వ్యక్తి, పాపపు చూపు చూడగలడు, అట్టివాడు దొంగలించగలడు, మోసము చేయగలడు, అబద్ధమాడగలడు. దేవుడు తనను చూచుట లేదని తలంచు వ్యక్తి ఏమయినా చేయగలడు. కాని అతడిని దేవుని సన్నిధిలోనికి తీసికొనిరండి, వెంటనే అవన్నియూ మానివేయును. చూచారా? ''ప్రభువును ఎల్లపుడూ నా యెదుట ఉంచుకొనియున్నాను,'' అని దావీదు పలికెను. అది మంచిది. అతడు దేవునికిష్టానుసారుడగు వాడు అని పలుకుటలో అశ్యర్యము లేదు. దేవుడు దగ్గర లేడు అనుకొన్నపుడు మనిషి ఏమయిననూ చేయగలడు. కాని దేవుడు దగ్గరున్నాడని అతడు గ్రహించినపుడు, పాపి ఏమి చేయునో ఎన్నడయినా గ్రహించారా? ఒక దైవజనుడు వెళ్ళుట చూచి అతడు తగ్గిపోవును, మర్యాదగల వాడు అలాగు చేయును. చూచారా? చెప్పవలెననుకొన్న అసహ్యపు సరసోక్తులు చెప్పడు. చూచారా? చూడండి. వాటిని అతడు విడిచిపెట్టును, ఎందుకనగా తాను దేవుని సన్నిధిలో యున్నానని అతనికి తెలియును. దేవుడు తన ప్రజల యొక్క గుడారములలో నివసించును. చూచారా.

PS 16:9,10•

MATT 6:33

 

53దావీదు ఈలాగు చేసిన తరువాత, ''నా హృదయము సంతోషించును.'' నా శరీరము నిరీక్షణలో విశ్రమించును.'' ఎందువలన? ఎల్లవేళలా దేవునిని నా యెదుట ఉంచుకొనియున్నాను గనుక నా హృదయము సంతోషించును. నా శరీరము నిరీక్షణలో విశ్రాంతి పొందును; నేను చనిపోయినను మరల లేచెదను. "ఏలయనగా ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు.'' చూచారా? దావీదు దేవుని తన యెదుట ఉంచుకొని తాను నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటినను ఎరుక కలిగియుండెను. "మొదట మీరు దేవుని రాజ్యము వెదకుడి.''

PS 16:8,9•

PS 34:7

 

54ఇపుడు వినండి, సంఘమా, మిమ్ము ప్రేమించుచున్నాను. ఇపుడు నా మాట వినుమని కోరుచునాన్నను. సహో. మెక్ కల్లీ తరచుగా ఈలాగు చెప్పుచుండెడివాడు, నేను మీకు ఒకటి చెప్పబోవుచున్నాను. ఎల్లపుడు ప్రభువును నీ ఎదుట ఉంచుకొనుము, ఆయన సన్నిధిలో చేయకూడని దానిని చేయవద్దు, ఎందుకనగా ఆయన నిన్ను గమనించుచున్నాడు. చూచారా? ఆయన యెడల భయపడువారి చుట్టూ ఆయన యున్నాడు. ఆయన నీ ప్రక్కనే నిలచియున్నాడు. నీవు చేయుచున్న సమస్తము ఆయనకు తెలియును, దానిని నీవు తప్పక గుర్తించవలెను. నీవు అబద్ధము చెప్పనారంభించునపుడు ఆగి దేవుడు నీ మాట వినుచున్నాడని జ్ఞాపకము చేసికొనుము. చిన్న మోసము చేయుటకు నీవు ప్రారంభించినపుడు ఆగి, దేవుడు నిన్ను చూచుచున్నాడని గుర్తుకు తెచ్చుకొనుము. ఆయన నామమును వ్యర్ధముగా ఉచ్చరించనారంభించినపుడు, ఆయన నీ మాట వినుచున్నాడని మరువకుము. నీవు సిగరెట్టు త్రాగనారంభించినపుడు, దేవుడు నిన్ను చూచుచున్నాడని ఎరుగుము. చూచారా.

మనము ఒక పాట పాడెడివారము, ''ఆత్మ నిజ నివాసమునకు చేరు వరకు మార్గమంతటిలో ఒక కన్ను చూచుచున్నది. నీవు వేయు ప్రతి అడుగులో ఆ గొప్ప నేత్రము మేల్కొనియున్నది. ఒక కన్ను నిన్ను గమనించుచున్నది.'' గుర్తుంచుకొనండి. దావీదు వలె ప్రభువును ఎల్లపుడూ మీ యెదుట ఉంచుకొనుడి, అపుడు మీ హృదయము సంతోషించును మరియు మీ శరీరము నిరీక్షణలో విశ్రమించును, అది ఆయన వాగ్దానము చేసెను. అవునండీ! తాను తిరిగి లేచుదునని తనకు తెలియును, ఎందుకనగా అది దేవుడు వాగ్దానము చేసెను. మంచిది.

ఆయన సన్నిధిలోనికి మనము వచ్చినపుడు మనము మారుదుము, ఎప్పటివలె యుండము. ఏ కాలములోనయినా గాని చూడండి, మానవుని ప్రతి నడకను చూడండి. అబ్రహామును చూడండి. ''సేవకులకు మాత్రమే మారిన జీవితము కావలెను అని నీవనవచ్చును." అలాగు కాదు. ప్రతి ఒక్కరికి మారిన జీవితము కావలెను. చూచారా.

GEN 13:9,14•

HEB 11:10,13

 

55అబ్రహాము ఒక వ్యవసాయదారుడు, అయితే దేవుని స్వరము తనతో మాటాలడుట విని, దర్శనము చూచి, ఆ సమయము నుండియూ మారిన మనిషి అయ్యెను. తన బంధువుల నుండి, తన సహవాసుల నుండి వేరయ్యెను. ఒక క్రొత్త దేశములో పరదేశిగా, యాత్రికునిగా నడిచెను. తన శేష జీవితమంతయూ గుడారములలో నివసించెను; ఎందుకనగా దేనికి దేవుడు నిర్మాణకుడును, శిల్పియునై యున్నాడో ఆ పట్టణము కొరకు వెదకుచున్నానని స్పష్టముగా అతడు ఒప్పుకొని చెప్పెను. దేవుడొకడున్నాడనియు, దేవుడు శిల్పి మరియు నిర్మాణకుడుగా గల పట్టణమొకటి ఉన్నదనియు అతనికి తెలియును. హెబ్రీ 11 మనకు చెప్పుచున్నది, దేవుడు శిల్పిగాను, నిర్మాణకుడుగాను ఉన్న పట్టణమును అతడు వెదకుచుండెను. అతడు మారినమనిషి, అయిననూ అతడు కేవలము ఒక వ్యవసాయదారుడు. కాని అతడు ఒక దర్శనము చూచి, దేవుని సన్నిధిలోనికి వచ్చెను, మరియు అప్పటి నుండి అతడు మారిన మనిషి అయ్యెను.

EXOD 2:15•

EXOD 4:20•

MATT 16:19•

LUKE 5:4-6,8

 

56మోషే ఒక గొర్రెల కాపరి, కాని దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు అతడు ఒక మారిన మనిషి అయ్యెను. అతడు ఒక పిరికి వాడు. ఫరో యెదుట నుండి పారిపోయెను, సైన్యమంతయూ అతని వెనుక ఉండెను. కాని చేతిలోని ఒక కర్రతో అతడు తిరిగి వెళ్ళి, దేశమునంతటినీ విడిపించెను. చూచారా. ఎందువలన? అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చెను. అతడు ఒక మారిన మనిషి, గొర్రెల కాపరి.

పేతురు ఒక జాలరి, దేవుని గూర్చి ఏమియూ ఎరుగని వాడు… చేపలు పట్టుట ఒక్కటే అతనికి తెలియును. కాని అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చెను, చేపలను సృష్టించగల మహాసృష్టికర్తను చూచెను. వలలు వేయుడని ఆయన చెప్పుట వినెను. అక్కడేమీ చేపలు లేవు, అయినా అతడు వల విసిరెను, ''ప్రభువా, నీ మాట చొప్పున, వలను వేయుదును. నీవు దేవుని కుమారునివని నమ్ముచున్నాను, నీవు వేయుమని చెప్పితివి గనుక నీ మాట చొప్పున వేయుచున్నాను, నీవు నీ మాట ఒక్కటే గదా, వలను వేయుదును.'' అతడు లాగుటకు ప్రారంభించి ఇట్లనెను, ''ప్రభువా, నేను పాపాత్ముడను, నా యొద్ద నుండి తొలగిపొమ్ము.'' ఒక జాలరి, పేతురు క్రీస్తును కలిసికొనిన తరువాత ఇంతకు ముందు వలె ఇక లేడు. ఆ తరువాత అతడు దేవునికి ఎంతో నమ్మకముగా యుండెను గనుక రాజ్యము తాళపు చెవులు అతనికి ఇయ్యబడెను. అవును.

ACTS 9:3-5

 

57పౌలు గర్వము గల పరిసయ్యుడు, మతము నందు విద్య, మరియు శిక్షణ పొందెను, ఆనాడు లోకములో ఉన్న మతములను చదివెను, గొప్ప పండితుడని పేరు పొందిన వాడు. కాని ఒక దినమున ఆ అగ్నిస్తంభము ఎదుటికి రాగా, తెలియక హింసించుచుండినది ఆ దేవునినే, అని ఎరిగెను. అతడు ఒక పరిసయ్యుడు, దేవుడు ఒక నరునిగా నమ్మడు. దేవుడు అగ్నిస్తంభముగా ఉండునని అతనికి తెలియును, అది తన ప్రజలను ఐగుప్తులో నుండి నడిపించి, మార్గమంతట వారికి తోడై యుండెను. కాని అతడు ఈ అగ్నిస్తంభమును చూచి, సాష్టాంగపడెను. సౌలా, నన్నేల హంసించుచున్నావు?''అని ఒక స్వరము పలుకుట వినెను.

''ప్రభువా, నీవెవరవు?'' అనడిగెను.

"నేను యేసును,'' అని ఆయన చెప్పెను. అతడెట్లు బాప్తిస్మము పొందవలెనో ఆయనే చెప్పెను. అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండెను. అప్పటి నుండియు అతడు ఒక మారిన మనిషి. అతడు దేవుని సన్నిధిలో యుండెను. అది అతనిని మార్చెను.

58ఛార్లెస్ జి. ఫిన్నీ, ఒక లాయరు, ఒక గొప్ప ఫిలదెల్పియా న్యాయవాది, కాని అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు తన న్యాయ శాస్త్రమును విడిచిపెట్టి దేశంలో ఎన్నటికీ తిరుగులేని శక్తిగల ఒక బోధకుడాయెను. [టేపు పై ఖాలీ.]

''మీరు పరిశుద్ధాత్మను పొందవలెనని మేము ప్రార్థించుచున్నాము.''

''నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను ఒక బోధకుడిని,'' అనెను.

''ఫిన్నీ, నీవు గొప్ప వ్యక్తివే, వాక్యము మీద నీకు గొప్ప పట్టుయున్నది, కాని నీకు పరిశుద్ధాత్మ అవసరము. నీ కొరకు మేము ప్రార్థించుచున్నాము,'' అనెను. చక్కని చిన్న స్త్రీ.

అలాగే అతడు కొనసాగుచుండెను. ప్రతి దినము అతడు తన ఆఫీసుకు వెళ్ళుచుండెను. తన యజమాని, ఇంకా ఇతరులందరితో కలిసి పని చేయుచుండెను, తన న్యాయవాద కార్యాలయము నుండి ప్రార్థనకు బయటకు వెళ్ళెడి వాడు. ఒక రోజున అతడు బయట ప్రార్థించుచుండగా అతడు ఒక సవ్వడి వినెను. తనను వెదకుకొనుచూ తన యజమానుడు వచ్చుచున్నాడనుకొనెను. త్వరపడి లేచెను. ''ప్రభువగు దేవా, నిన్ను నేను నమ్ముచున్నాను,'' అని అతడు ఆగిపోయెను. ''ఉ! ఉ!'' అని తడుముచుండెను. లేచి ఆ సవ్వడి ఎందుకు కలిగెనా, అని చుట్టూ చూచెను.

ఆ సమయములోనే అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చెను. ఆ సవ్వడి ఒక ఉద్దేశ్యముతోనే కలిగినది, అని అతడు గ్రహించెను. అక్కడతడు నిలబడెను, కన్నీరు అతని బుగ్గల మీద నుండి కారుచుండెను. ''ఆమె చెప్పినది నిజమే అయియుండును. నేను దేవునితో మాట్లాడుట ఎవరైనా చూచెదరేమోనని సిగ్గుపడితిని, కాని నా యజమానునితో నేను మాట్లాడుట ఎవరైనా చూచెదరేమోనని సిగ్గుపడితిని. కాని నా యజమానునితో నేను మాట్లాడుట ఎవరైనా చూచిన యెడల ఘనముగా ఎంచుదును. నా యజమానుని కంటె నా ప్రభువు ఎంతో గొప్పవాడు కదా?" "ప్రభువా, నన్ను క్షమించుము మరియు పరిశుద్ధాత్మతో నన్ను నింపుము,'' అని చెప్పి గట్టిగా ఏడ్వ నారంభించెను. అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండెను. అతడు బహు త్వరగా పట్టణ శివారులోని తన ఆఫీసునకు వెళ్ళెను. ఇతడు ఎంతగానో దుఃఖించుచున్నందున తలుపు వెనుకకు వెళ్ళి ఈలాగు చెప్పుచుండెను, "ప్రభువా, నీకు నేను అవమానము తెచ్చెదను. ఇదంతయూ అయిపోవు వరకు నన్ను దాయుము.'' ఎందువలన? అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చియుండెను. అతడు ఒక మారిన మనిషి. ఇంతకుముందు వాడుకగా బోధించిన అవే ప్రసంగములను బోధించెను గాని, ఆత్మలు బలిపీఠము నొద్దకు వచ్చెను. చూచారా, అతడు దేవుని సన్నిధిలో యుండెను.

59మూడీ, ఒక చిన్న చెప్పులు కుట్టుకొను వ్యక్తి, అ, ఆలు కూడా సరిగా రావు. అది సత్యము. అతని వ్యాకరణము గొప్పగా ఉండదు. ''మూడీ, నీ వ్యాకరణము చాలా భయంకరముగా యున్నది,'' అని ఒక రోజున ఎవరో అతనితో చెప్పారు.

''కాని దానితోనే నేను ఆత్మలను సంపాదించుచున్నాను,'' అన్నాడు.

ఒక రోజున వార్తా పత్రిక సంపాదకుడు వ్రాయుటకు అతని యొద్దకు వెళ్ళెను. కొద్దిగా ముసలి వాడయిన, బట్టతల కలిగి, చెంపల నిండా వెండ్రుకలు, కుండ వంటి కడుపు కలిగి వికారముగా కనిపించుచున్న ఈ వ్యక్తి ఎట్టి పరిస్థిలలోనయినా గాని, జన సమూహములను ఏలాగు ఆకర్షించుచున్నాడో చూద్దామనుకొనెను. ఈ పత్రిక నిజంగా ఉన్నదే వ్రాసెను, ''ప్రపంచములోని మనుష్యులు డ్వయిట్ మూడీలో ఏమి చూచుచున్నారో నాకేమీ కనబడలేదు; అతడు అందహీనుడు, కీచు స్వరము, మీసములు వికారంగా వ్రేలాడుచున్నవి, గుమ్మడి కాయవలె నున్నటి బట్టతల. మూడీలో జనులు ప్రపంచంలో లేనిది ఏముందని చూచుటకు వెళ్ళుచున్నారో అర్ధం కాదు,'' అని వ్రాసెను.

మూడీ యొక్క మేనేజరు దానిని చూచుట జరిగెను, ''మూడీ, ఇది చూడు, దీనిని చదువుదును విను,'' అనెను. మూడీ తనకు తానూ చదువలేదు. "ఆ సంపాదకీయమును నేనే చదువుదును వినుమని," అతడు చెప్పెను.

మూడీ తన భుజములు కుదిపి ఇట్లనెను, ''నిశ్చయంగా కాదు, వారు క్రీస్తును చూచుటకు వచ్చుచున్నారు.'' అవును. ఎందువలన? అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండెను. చెప్పుల మడిమలను తయారు చేసి, ప్రజలు ధరించుకొనుటకు ఇచ్చిన వ్యక్తి; ప్రజలను ఇపుడు సువార్త సిద్దపాటుతో అలంకరించెను. ఎందువలన? అతడు దేవుని సన్నిధిలో యుండెను. నిజము.

60ఒక సమయములో ఒకామె దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆమె ఉండగలిగిన బహు దోషముతో వచ్చెను. తాను దేవుని సన్నిధిలో ఉన్నానని గ్రహించిన క్షణమందే, ఆమె యొక్క ప్రతి పాపము క్షమించబడి లిల్లీ పుష్పమ౦త తెల్లగా పవిత్రీకరించబడెను. ఓ, మై! ఇక్కడ ఎందరి గూర్చియో చెప్పగలను గాని, సమయము అనుమతించదు.

కాని నా గూర్చి నేను, కొద్దిగా మాట్లాడుకోగోరుచున్నాను. నా కంటె అధములు ఎవరూ ఉండరు? నేనెక్కడి వాడను? త్రాగుబోతుల, హంతకుల, దుష్టుల కుటుంబములో నుండి నేను వచ్చాను. దానిని మీ ప్రతి ఒక్కరు ఎరుగుదురు, ఇక్కడ మాకు ఎట్టి విధమగు పేరున్నదో మీకు తెలియును. ప్రజలు వీధిలో మాతో మాట్లాడరు. నేను పట్టణములోనికి వెళ్ళునపుడు ఎవరైనా నాతో మాట్లాడవలెనన్నయెడల, ప్రక్కన ఎవరూ చూడనపుడే మాట్లాడెడి వారు. నాతో వారు మాట్లాడుచుండగా ఎవరైన వచ్చుట గమనించినయెడల నన్ను విడిచిపోయెడివారు. ''ఈలాగు ఉండరాదు, ఇది తప్పు,'' అని నేను అక్కడ నిలబడి కేకవేసెడి వాడను.

ISA 6:5

 

61కాని ఒక దినమున నేను దేవుని సన్నిధిలోనికి వచ్చాను. ఆయన నన్ను మార్చి, మరొక రకమగు కుమారునిగా చేసెను. ఆయన కృప ఆయన సన్నిధిలోనికి నన్ను తీసికొని వచ్చెను. దానిని ఎన్నడూ నేను విడిచిపెట్టగోరలేదు. ముప్పది ఏండ్లకు పైగా ఇక్కడ నేనున్నాను గాని దానిని నేను విడిచిపెట్టగోరుట లేదు. ఎల్లపుడూ అక్కడే నేనుందునను నిశ్చయత నాకున్నది. మరణము సహితము ఆయన సన్నిధి నుండి నన్ను వేరు చేయలేదు. నేను సదా ఆయనతో ఉందును.

మొదటిసారి ఆయన సన్నిధిని నేను చూచినపుడు, యెషయావలె ఏడ్చాను, ''అయ్యో, నాకు శ్రమ!'' అపుడాయన తన కృపతో నన్ను తాకెను. నేను మారిన మనిషిని. ఇక్కడ తిరుగుబోతుగా ఉండి అవి ఇవి చేసినవాడు మార్పునొందెను, అప్పటి నుండియు నేను ఆయన బిడ్డగా ఉన్నాను. అప్పటి నుండియు నా జీవితమంతయు ఆయన సేవకొరకు ఇయ్య ఆశ కలిగియున్నాను, నాకు పదివేల జీవితములున్నను అవి ఆయనకే ఇయ్యగోరుచున్నాను. ఇప్పుడు ఈ ఒక్క జీవితము త్వరగా అయిపోవుచున్నది. ఏబది-మూడు సంవత్సరములు అయిపోయినవి. దాదాపుగా ముప్పై-మూడు లేక ముప్పై-రెండు సువార్తలోనే గడిచిపోయినవి.

మరో వేయి జీవితములు ఖర్చు చేయుటకున్నచో బాగుండునని తలంచుచున్నాను. ఎందుకు? ఒక్కసారి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, నేను గ్రహించినది ఏమనగా: ప్రేమకు పాత్రుడు కాని వానిని ప్రేమించువారొకరున్నారు; ఎవరూ నన్ను ప్రేమించనపుడు, ఒకరు నన్ను ప్రేమించిరి; ఎవరూ నా పట్ల శ్రద్ధ వహించనపుడు, ఒకరు నా పట్ల శ్రద్ధ వహించిరి. నేను నా చేతులతో ఆయన సిలువను కౌగలించుకొని హత్తుకొన్నాను. అపుడు, ఆయన నేను ఏకమయ్యాము. అప్పటి నుండియూ ఆయనను నేను ప్రేమించుచున్నాను. ఆయన తన రక్తముతో నా భుజమును, నా హృదయమును కడిగెను. నన్ను తాకి, నా పాపములను క్షమించెను. నేను ఆయన వానిగా ఉన్నందుకు, ఈ రాత్రి సంతోషించుచున్నాను. శోధకుడు తరచుగా నన్ను వెంటాడి శోధించినా గాని, ఈ పరలోక స్థలమును ఎన్నడూ విడిచిపెట్టుటకు ఇష్టము లేదు; కాని దేవుని యొక్క ప్రాంగణములో నేను క్షేమముగా యున్నాను, మరియు ఆయన ప్రేమ కృపలలో ఆనందముగా యున్నాను. నేను హల్లెలూయా పక్షమున జీవించుచున్నాను. మై! అది నా హృదయమునకు సంతోషము కలుగజేయుచున్నది.

62ప్రతి మారిన వ్యక్తికి ఆయనను నేను సిఫారసు చేయుచున్నాను. నిరీక్షణ లేని మీకు ఆయనను నేను సిఫారసు చేయుచున్నాను. ఆయన సన్నిధిలో ఎన్నడూ లేనివారికి చెప్పుచున్నాను. మీ పాపములు ఒప్పుకొని, తప్పు చేసితిమని గ్రహించండి, మీరు చేయవలసినది అదే. దేవుడు, ఈ రాత్రి తన దేవదూతను ఏర్పాటు చేసియున్నాడు, మీ పాపములన్నియూ తీసివేయుటకు పరిశుద్ధాత్మను పిలచును. అపుడు నీవు, ''ప్రభువా, ఇదిగో నేనున్నాను, పంపుము'' అని కేక వేయగలవు. అపుడు, నీవు చేతులెత్తి ''నేనాయనను స్తుతించెదను! నేనాయనను స్తుతింతును! పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు వందనములు. ప్రజలారా, మీరందరూ ఆయనకు మహిమ చెల్లించుడి, ఏలయనగా ఆయన రక్తము ప్రతి మచ్చను కడిగివేసెను.'' ఆయనను నేను ప్రేమించుదును. మీరు ప్రేమించరా?ఆయన సన్నిధిలో జీవించుట!

63ఈ ఉదయ కాలమున ఎంతో బలహీనత, అనారోగ్యముతో ఈ వేదిక యొద్దకు వచ్చి యున్నాను. ఇక్కడ కూర్చొనియున్న నా వ్యక్తిగత స్నేహితులు కొందరితో, గత వారము కెంటాకిలో యున్నాను. ఇంకా ఎక్కువ దినములు అక్కడ నేను ఉన్నయెడల వారు నన్ను, నా జీవితములో ఎన్నడూ ఎరుగని మంచి భోజనముతో చంపెడి వారే. నిశ్చయంగా, దయతో వారు నన్ను చంపియుందురు. నేను పూర్తిగా తినిన తరువాత వారు వచ్చి, ''సహో. బ్రన్హం, ఇది కొద్దిగా తీసికొనవా?'' అనెడివారు. అది చాలా బాగున్నది, లోనికి తీసికోవాలనుకొన్నాను. నేను కదలలేనంత ఎక్కువగా తిన్నాను. నేను నిద్రపోలేకపోయాను, నేను లేచి కొంతసేపు నడిచెడివాడను. ఈ ఉదయము ఇక్కడికి వచ్చినపుడు నాకంత బాగాలేదు. కాని ఆయన సన్నిధికి వచ్చిన వెంటనే, అది బాగయినది. వెంటనే అదంతయూ అదృశ్యమైనది. అది నిజము. ఓ! ఆయన సన్నిధిలో జీవించుట! [సహో. బ్రన్హం, పాటను పాడుట అరంబించెను.]

నేను ఆయనను స్తుతింతును, నేను ఆయనను స్తుతింతును,

పాపుల కొరకు బలియైన గొర్రెపిల్లను స్తుతి౦చుడి.

సమస్త జనులారా, ఆయనకు మహిమను ఇవ్వుడి.

ఆయన రక్తము ప్రతి పాపమును కడిగెను.

ఇప్పుడు మనము మన తలలు వంచుదము,

ఎందుకనగా ఆయన నా కొరకు ఎంతో చేసెను.

నా అతిక్రమములను క్షమించెను,

మరియు ఆయన రక్తము, నా పాపములను కడిగెను.

నేను ఆయనను స్తుతింతును, నేను ఆయనను స్తుతింతును,

పాపుల కొరకు బలియైన, గొర్రెపిల్లను స్తుతి౦చుడి.

సమస్త జనులారా, ఆయనకు మహిమను ఇవ్వుడి.

ఆయన రక్తము, ప్రతి పాపమును కడిగెను.

64ఆయన సన్నిధి ఇచ్చటున్నదని నాకు తెలియును. కొద్దిసేపటి క్రితం, చర్చి-ఆఫ్గా-డ్ కు చెందిన ఒక చిన్న బాలికకు నేను ప్రార్థించుచుండగా, పరిశుద్ధాత్మ నా మీదికి కదిలి వచ్చెను. ఆ తల్లిదండ్రులు అండర్సన్-చర్చి-ఆఫ్-గాడ్-కేంప్-గ్రవుండ్ నుండి వచ్చిరి. అక్కడున్న పర్యావేక్షకుడు ఆ బిడ్డను ఎరుగును, లూకిమియా వ్యాధితో ఆమె చనిపోవును, అని వైద్యులు చెప్పిరి. ఆ చక్కని చిన్న బాలిక, ఇపుడు చివరి దశలో యున్నది. ఆ వెనుక ఆమె నన్ను తన చిన్న చేతితో పట్టుకొన్నది, సూదులు గుచ్చినందున, ఆ చెయ్యి వాచియున్నది, నీలముగా యున్నది. ఆమె వైపు నేను చూడగా, ఒక దర్శనము వచ్చెను. తల్లిదండ్రులు ఆ బయట అప్పుడే ఒక పుస్తకము చదువుచుండిరి. దాని గూర్చి వారికేమియూ తెలియదు. ఆ కేంపు యొద్దనున్న పర్యావేక్షకుడు ఆ బిడ్డను "ఇక్కడికి తీసికొని వెళ్ళమని వారికి చెప్పెను." మనకు స్వస్థతా కూటము జరుగునపుడు వారు మరల వచ్చెదమనుకొనిరి. ''ఆ బిడ్డను ఇపుడే తీసికొని రండి,'' అని నేను నడిపింపుతో చెప్పాను.

65అక్కడ నేను నిలబడియుండగా, పరిశుద్ధాత్మ ఆ బిడ్డ యొక్క చరిత్రను తీసికొని వచ్చెను. జరిగిన దానంతటి గూర్చియూ, వారు చేసినదంతయూ చెప్పెను. ఆ చిన్న బాలిక పియానో వాయించు వ్యక్తిగా నుండవలెనను ఆశ కలిగి యున్నట్లు చెప్పెను. ఆ తల్లి కేకలు వేసినట్లు కనబడినది, "అది దేవుని సత్యము,'' అని ఆ తండ్రి పలికెను. ఇపుడు లోనికి వచ్చుటకు వీలులేక, ఇపుడు, కారులో కూర్చొని వినుచున్నాడు.

ఆ బిడ్డ మీద ఒక పెద్ద నీడ ముసుగు వలె వ్రేలాడుచున్నది. ''సాతానా, నీవు ఓడిపోయినదానవు,'' అని చెప్పాను. ''దేవా, నీవు పక్షపాతివి కావు. నీ పునరుద్ధాన శక్తిని బట్టి నీ దాసునిగా, ఈ బిడ్డ నుండి ఈ దయ్యమును నేను వెళ్ళగొట్టుచున్నాను.'' ఒక పెద్ద ప్రకాశమగు వెలుగు, ఆమె మీద మెరిసినది, అది అయిపోయినది. ఆమేన్! ఏమిటి? నిశ్చయంగా, ఆయన సమస్త స్తుతికి పాత్రుడు!

66ఆయన సమస్తమును ఎరుగును. నీ హృదయమును ఆయన ఎరుగును. నీవేమి ఆలోచించుచున్నావో ఆయన ఎరుగును; ఆయన కూడా ఎరుగును. ఈ రాత్రి, నీ మీద ఎంత చిన్న పాపము వ్రేలాడుచున్నా గాని, దానిని ఉంచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు నీవు ఇష్టపడవు గదా. నీవు మరల ఒకసారి నీ చేతిని ఎత్తి ఈలాగు చెప్పెదవా? ''బ్రన్హం సోదరుడా, నా కొరకు ప్రార్థించుము. నేను ఆ దినమున దోషరహితముగా ఆయన సన్నిధిలో ఉండగోరుచున్నాను.'' దేవుడు నిన్ను దీవించును. చాలా చేతులు లేచినవి. దేవుడు వానిని చూచుచున్నాడు. ఆయన సన్నిధిలో.

ఇపుడు మీరు చేయవలసినది చెప్పెదను. జాగ్రత్తగా ఇపుడు వినండి. దావీదు చేసినట్లుగా చేయండి. ఇప్పుడే, ప్రభువును మీ యెదుట ఉంచుకొనుడి. నీకు ఆ పాపమునకు మధ్య ప్రభువును ఉంచుడి. అది ఎంత చిన్న సుళువుగా చిక్కులు బెట్టు పాపమయినా కావచ్చు. అది అబద్ధము, దొంగతనము, చెడు ఆలోచన, కోపము, త్రాగుడు, పొగత్రాగుట, జూదము కావచ్చు. నాకు తెలియదు. అది శరీరాశ, మరేదయినా కావచ్చు. అదేమిటో నాకు తెలియదు. అది ఏమయినా గాని మీ యెదుట దేవుని ఉంచుకొనుడి. అపుడు మీ హృదయము సంతోషించును. మీ శరీరము నిరీక్షణతో విశ్రాంతిని పొందును. అంత్య దినమున ఆయన నిన్ను తిరిగి లేపుదునన్న వాగ్దానము నీకు తెలియును. ఆయన వచ్చునపుడు మనము ఆయనను పోలియుందుము. మనము ఇపుడు ప్రార్థించుచుండగా, నీవాలాగు చేయవా?

67మా పరలోకపు తండ్రీ, అలసిపోయిన దాసుని ద్వారా ఒక చిన్న కుదింపు వర్తమానము అందించబడినది. "దేవుని యొక్క సన్నిధిలో నివాసము చేయుటను," గూర్చిన ఆలోచన అంశము అది. నీ సన్నిధిలోనికి వచ్చిన పరిశుద్ధుల మీద ఎట్టి ఫలితము కనబడినదో, ఈ రాత్రి మేము చూచాము. ఎట్టి ప్రభావమును వారిమీద చూపినది! పరిశుద్ధులు, దేవునిచే అభిషేకించబడిన గొప్ప శక్తిగల ప్రవక్తలు, వాక్యమునకు బోధించుటకు పంపబడిన వారు; అయినా గాని ముఖముఖిగా ఆయనను కలిసికొనినప్పుడు, వారు చచ్చిన వారివలె నేల మీద పడిరి. ప్రభువా, ఆ దినమున మేము ఏమి చేయుదుము? దాని గూర్చి మేము ఆలోచించాము. దానిని గూర్చి మేము ఆలోచించుచున్నాము. ప్రభువా, నలుబది లేదా ఏబది చేతులు దానిని ఆలోచన చేయుటకు సాదృశ్యముగా పైకి లేచినవి. మేము మాట్లాడుట ప్రారంభించిన సమయము నుండి ఆయనను కలిసికొనుట గూర్చి వారి హృదయములు ఆలోచించుచున్నవి. ఆయనను వారు కలిసికొనవలసియుండిన యెడల వారేమిచేయుదురు?

68ప్రభువా, నా చేతులు పైకెత్తబడియున్నవి. నేనేమి చేయుదును? ఇపుడు, తండ్రీ, నేను అనేక విషయములలో తప్పు చేశాను. ఒక ఉదయమున కొండ మీద నీ ఎదుట ఒప్పుకొనిన రీతిగా, ఈ ఉదయ కాలము సంఘము ఎదుట నా పాపమును ఒప్పుకొన్నాను. గాలి వీచుచూ, మంచు పడుచూయున్న సమయమున ఆ కొండపై భాగమున నేనెట్లు మొరపెట్టి నా మూర్ఖత్వమును క్షమించమని అడిగానో నీకు తెలియును. నా సోదరుల ఎదుటికి వచ్చుటకు ఎంత భయపడితిని! అందులో కొందరు నీ ప్రవక్త-దాసునిగా నన్ను ఎంచుచున్నారు. ప్రభువా, వారి ఎదుటికి వచ్చి నేను అటువంటి బుద్ధిహీనపు పని చేసితినని ఏలాగు చెప్పుదునా అని ఎంతో వ్యధ చెందాను, కాని దేవా, నా పాపములు ఒప్పుకొని వాటిని దాచకుండుట, నా ఆత్మకు లాభము. కాబట్టి నీపట్ల యధార్థతతో నుండుటకు, ప్రజల ఎదుట సరిగా నుండుటకును, ప్రభువా, అది ఒప్పుకొంటిని. నేను తప్పు చేశాను. పూర్తిగా తప్పు చేశాను. క్షమించమని ప్రార్థించుచున్నాను.

JER 31:34•

HEB 8:12•

HEB 10:17

 

69తండ్రీ, నీ గూర్చి నేను ఆలస్యము చేశాను. నీకు సేవ చేయుటకు రావలసినంత త్వరగా నేను రాలేదు. తండ్రీ, నా పాపములు ఒప్పుకొనుచున్నాను. యేసు రక్తము ద్వారా దేవుని యొక్క దూత నన్ను శుద్ధిపరచవలెనని కోరుచున్నాను. ఈ రాత్రి కొన్ని చేతులు ఎత్తబడినవి. అందులో కొందరు నిన్ను ఇంతకు ముందెన్నడూ క్షమాపణ అడిగియుండక పోవచ్చును. కాని ఈ ఒక్క విషయములో నేను నిశ్చయత కలిగియున్నాను. మేము మా పాపములను ఒప్పుకొనినయెడల దేవుడు వాటిని తుడిచివేసి, మరచిపోవుట అను సముద్రములో పడవేసి, మరెన్నడును వాటిని జ్ఞాపకము చేసికొనడు.

తండ్రి, నావి నేను ఒప్పుకొనుచున్నాను. ప్రజల ఎదుట నా ప్రవర్తన బాగాలేదని, క్రీస్తు దాసునిగా నేను ప్రవర్తించలేదనియు ఒప్పుకొనుచున్నాను. ప్రజలు నన్ను చూచి కోపపడుదురని, వారి భావములకు బాధ కలుగచేయుదునని నేను అలాగు చేయలేదు. అయితే ప్రభువా, నీకు నేను ఏమిచేయుచున్నానో దాని గూర్చి ఆలోచించలేదు. నన్ను క్షమించమని ఇపుడు ప్రార్థించుచున్నాను. తండ్రీ, నేను క్షమాపణ అడిగినయెడల క్షమాపణను పొందునని నాకు తెలియును. నీవు వాటిని మరపు అను సముద్రములో పడవేసియున్నావు. ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసికొనవు. దేవా, దానిని బట్టి వందనములు.

70పాపము లేదా చిక్కులు పెట్టు తేలిక పాపములో ఇక్కడ ఏ వ్యక్తి యున్నప్పటికిని అది తొలగించబడి, వారు ప్రభువును దావీదువలె ఎదుట ఉంచుకొనునట్లుగా ప్రార్థించుచున్నాను. ఇపుడు, మేము ఈలాగు మొర పెట్టుదుము, ''అయ్యో, నాకు శ్రమ. నేను దేవుని యొక్క మహిమను చూచాను. నేను అపవిత్ర పెదవులు గలవాడను. అపవిత్ర పెదవులు గల స్త్రీని, లేదా బాలికను లేదా బాలుడను. మనము ఎవరిమైనా సరే, అపవిత్రులము. యేసుక్రీస్తు యొక్క రక్తము కొరకు అడుగుచున్నాము. అది తగిన బలి. మా పాపమంతటి నుండియు పవిత్రపరచును. ఆయన సన్నిధిలో అపుడు నిత్యమూ నివాసము చేయగలము.

మన హృదయములు సంతోషించుచుండగను, మన శరీరమునిరీక్షణతో విశ్రమించుచుండగను, ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళుదము గాక! యేసు వచ్చునపుడు, మనము ఆయన పోలికలో తిరిగి లేపబడి, ఆయనను మధ్యాకాశములో కలిసికొని పైకెత్తబడుదుమని ఎరుగుదుము. తుది కేక వినబడిన పిదప అది జరుగును. ఏడవ సంఘకాలము ఇప్పటికే లెక్కించబడుట మనము చూచాము. ఇపుడు మనము వెడలిపోవుటకు సిద్ధముగాయున్నాము.

దేవా, నీవు తలుపు మూయు ముందుగా, ఇంకా లోనికి రాని వారు ఇంకా ఒక్కరయినా గాని ఇపుడిచ్చటున్న యెడల, వారు త్వరపడి వచ్చునట్లుగా ప్రార్థించుచున్నాము. ఎందుకనగా కృప మరియు తీర్పునకు మధ్యనున్న తలుపు మూయబడుచున్నట్లు మేము భావించుచున్నాము. కృపను అంగీకరించు వారు లోనికి అడుగుపెట్టుదురు, లోనికి రాని వారు తీర్పులో శ్రమపడెదరు. దేవుడే తలుపును మూయును. పాపములను ఒప్పుకొనుచున్న ఈ ప్రతి పాపికి ఈ రాత్రి ద్వారము మూయబడకుండు గాక! మేమందరము క్షమాపణ మరియు కృప పొందుదుము గాక! యేసుక్రీస్తు నామమున.

PS 16:8•

ISA 53:5•

MATT 21:22•

1PET 2:24

 

71తండ్రీ, ఇపుడు రోగులు, బాధపడుచున్నవారు, అక్కరలోనున్న వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారికి అసరమగునదంతయూ నీ కృప వారికి సరఫరా చేయుగాక. వారు క్రీస్తు లోనికి, ఆయన సన్నిధిలోనికి అడుగిడుదురు గాక. క్రీస్తు యొక్క వాగ్దానమును ఉంచుము, ''ఆయన నా అతిక్రమముల కొరకు గాయపరచబడెను,'' అది నా పాపమే. ''ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొందితిని,'' నా వ్యాధికి ముందు ప్రభువును ఉంచెదను. ''ఆయన నా కుడి ప్రక్కను యున్నాడు గనుక నేను కదల్చబడను.'' నేను స్వస్థత పొందియున్నానని అంగీకరించచూ ధైర్యముగా నడిచిపోయెదను. ''ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొందితిని. ప్రభువా, దానిని ప్రతి ఒక్కరికి దయచేయుము. మా హృదయములందు విశ్వసించినయెడల మేము అడిగినది పొందెదము.

''నీవు ఏదయినా చెప్పి అది జరుగునని విశ్వసించినయెడల నీవు చెప్పినది జరుగును,'' అని నీవు చెప్పావు. తండ్రీ, అది మేము నమ్ముచున్నాము. మా పాపమంతటి నుండియు నీవు మమ్ము పవిత్రపరచుము. మా వ్యాధులన్నింటినీ స్వస్థపరచుము. ప్రభువా, నిన్ను సేవించు కృపను మాకు దయచేయుము.

PS 16:8

 

72ఈ ప్రజలతో ఉండుము. చాలా మంది ఈ రాత్రి చీకటి-రహదారుల గుండా ప్రయాణించవలసియున్నారు. అందులో చాలా మంది చాలా మైళ్ళు వెళ్ళవలసియున్నారు. ప్రభువా, వారికేమియూ జరుగనీయకుము. ఆఖరి హెచ్చరికను వినుటకు, అంత్యకాలమునకు మేము ఎంత దగ్గరలోనున్నామో చూచుటకు వారు ఎంతో దూర ప్రాంతముల నుండి వచ్చి ఇక్కడ కూర్చొనిరి. దేవునిని తమ ముందుంచుకొని తిరిగి వెళ్ళుడని వారికి ఇపుడు నేను చెప్పియున్నాను. దేనికంటెను ముందుగా నిన్నుంచుకొనమని చెప్పితిని. వారి ప్రయాణమునకు ముందు, వారి కదలికకు ముందు, వారు లేచుటకు ముందు, వారు పరుండుటకు ముందు, నిద్రించుటకు ముందు, అన్నింటికి ముందు దేవుని ముందు పెట్టుకొనవలెను. ''ఆయన నా కుడి ప్రక్కన నున్నాడు గనుక, నేను కదల్చబడను.'' వారడిగినది పొందియున్నామని నమ్మి, వారి హృదయములందు సంతోషముండును గాక! ఎందుకనగా దేవుడు అది వాగ్దానము చేసెను. వారి శరీరము నిరీక్షణయందు విశ్రమించును. ప్రభువా, అది అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమున ఇది అడుగుచున్నాము. ఆమేన్.

నేను ఆయనను స్తుతింతును, నేను ఆయనను స్తుతింతును,

పాపుల కొరకు బలియైన గొర్రెపిల్లను స్తుతి౦చుడి.

సమస్త జనులారా, ఆయనకు మహిమను ఇవ్వుడి.

ఆయన రక్తము ప్రతి పాపమును కడిగెను.

PS 16:8

 

73మీకును, మీ పాపమునకును మధ్య, మీకును మీ వ్యాధికిని మధ్య, మీకును మీ తప్పుకును మధ్య, మీకును మీ మార్గములకును మధ్య ప్రభువునుంచి యున్నారని మీరు నమ్ముచున్నారా? ''ప్రభువు ఎల్లపుడు నా యెదుటనే యున్నాడు. నేను ఆయన సన్నిధిలో యున్నాను. ఇక మీదట నేను సిగరెట్టు వెలిగించునపుడు, ప్రభువు నా ముందుండును. మరుసటి సారి నేను ఏదయినా తప్పు చెప్పకముందే, ప్రభువు, నా ఎదుట ఉండును. వచ్చేసారి ఒక చెడ్డ సంగతి నేను పలుకక ముందు, ప్రభువు, నా ఎదుట ఉన్నాడు. నేను కదల్చబడను. ఆమేన్. నేను ప్రతి దినము నా పనులుతోను, ప్రతి దినము నా మాటతోను ఆయన సన్నిధిలో నేను జీవించెదను. నా యెదుట ప్రభువు ఉన్నాడు అన్నట్లుగా నేను నడిచెదను, ఎందుకనగా ఈ రాత్రి ఆయనను నా ఎదుట ఉంచుకొన్నాను. నేను కదల్చబడను.'' మీరాయనను ప్రేమించుచున్నారా?

74ఇపుడు, మనము లేచి నిలబడుదుము. ఓ! నాకు ఎంతో మంచి అనుభూతి కలుగుచున్నది. నాకు ఇంటికి వెళ్ళవలెననిపించుట లేదు. ఇపుడు ఇరవై నిమిషముల తక్కువ తొమ్మిది మాత్రమే అయినది. దాదాపు రెండు గంటలు పెందలకడ ముగించాను. అది అద్భుతము కాదా? ఓ! కాని ఇపుడు మనము వెళ్ళుచుండగా, తప్పక మనము మనతో కూడా యేసు నామమును తీసికొనిపోవుటను మరచిపోకూడదు. ప్రతి ఉరి నుండి రక్షించు కేడెము అది. మన చుట్టూ శోధనలు కమ్మినపుడు మనలను నిజముగా కాపాడును. ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుట మరువ వద్దు.

యేసు నామము మీతో తీసుకు వెళ్ళండి,

బాధ మరియు దుఃఖము గల కుమారుడా;

అది నీకు సంతోషము మరియు ఆదరణ ఇచ్చును,

ఓ, నీతో ప్రతిచోటికి తీసుకోని వెళ్ళుము.

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ, ఎంతో మధురమైనది,

భూమి యొక్క నీరీక్షణ మరియు పరలోకము యొక్క ఆనందము;

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ, ఎంతో మధురమైనది,

భూమి యొక్క నీరీక్షణ మరియు పరలోకము యొక్క ఆనందము;

75మన సంఘ కాపరి సహో. నెవిల్ బోధను ఎందరు అనుభవించుచున్నారు? ఒక మంచి, యాదార్థపరుడు, ఎల్లపుడూ సిద్దముగా నుండువాడు, సువార్తను నమ్మువాడునగు ఆయనను ప్రభువు అనుగ్రహించినందులకు కృతజ్ఞత కలిగి లేరా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుట ద్వారాను, వాక్యము బోధించుట ద్వారాను ఎల్లవేళలా ఈ గొప్ప ఆత్మీయ వాతావరణమును ఉంచుట ద్వారాను అతడు గొప్ప అద్భుతమగు పనిచేయుచున్నాడు. గుర్తుంచుకొనండి, నేను తూర్పు-తీరానికి వచ్చి దక్షిణాది గుండా వెళ్ళాను. పశ్చిమ-తీరము ఎక్కి కెనడా ద్వారా వెళ్ళాను. ఇక్కడున్న ఇట్టి ఆత్మీయ సంఘము వంటి దానిని ఏ ఒక్కదానిని నేను చూడలేదు. వారు పాతుకొని పోయిరి. అవును. అది ఉన్మాదము లేక మరేదో లేక పూర్తి చల్లదనము. ఏమి వచ్చినా గాని వారు మాత్రము కదల్చబడరు. అంతే! ఇపుడు మీరు ఒకని నొకడు ప్రేమింతురా? ఓ! ఒకరితో ఒకరు కరచాలనము చేయుచు ''ప్రభువుకు స్తోత్రము,'' అని చెప్పండి. [స్రహో. బ్రన్హం కూడా ప్రభువును స్తుతించుచూ కరచాలనము చేయుచూ జనులతో మాట్లాడుచున్నారు.]

యేసు నామము మీతో తీసుకు వెళ్ళండి,

ప్రతి యొక్క చిక్కుల నుండి కవంచంలా;

ఎప్పుడైతే శోదనలు నిన్ను చుట్టుముట్టినపుడు.

(మీరు ఏమి చేయుదురు?)

ఆ పరిశుద్ధ నామమును ప్రార్ధనలో పెట్టుడి.

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ, ఎంతో మధురమైనది,

భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ, ఎంతో మధురమైనది,

భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;

76ఇపుడు మన తలలు వంచుదుము. ఎంతో నెమ్మదిగా, ఇపుడు దానిని మరువద్దు. ఆ వచనము మరల పాడుదము.

యేసు నామము మీతో తీసుకు వెళ్ళండి,

(దేనికొరకు?) ప్రతి యొక్క చిక్కుల నుండి కవంచంలా;

ఎప్పుడైతే శోదనలు నిన్ను చుట్టుముట్టినపుడు.

(మీరు ఏమి చేయుదురు?)

ఆ పరిశుద్ధ నామమును ప్రార్ధనలో పెట్టుడి.

("ప్రభువును నా ఎదుట ఉంచియున్నాను,

నేను కదల్చబడను,")

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ, ఎంతో మధురమైనది!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...