ద్వారమునకు తాళపుచెవి
VGR COUNT -151 1ఆలయములో ఉండుట మనకు ఎంతో భాగ్యముగా ఉన్నది. నాకు కూడా కొద్దిపాటిగా ఇదొక అనుకొననిదైయున్నది. ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము ఉన్నదని నేనెరుగుదును; నేను దగ్గరలో ఎక్కడ వున్నాగాని, వచ్చి పాలుపొందుటకు నేనెల్లప్పుడును, దానిని ఇష్టపడెదను. ఎందుకనగా క్రైస్తవులందరును ప్రభురాత్రి భోజనమును తీసికొనుటను గురించి ముందుగానే తెలుసుకొనవలెనని నేను అనుకొంటున్నాను; ఎందుకంటే "మీరు తిననియెడల, మీతో నాకు పాలులేదని?" యేసుక్రీస్తు చెప్పెను. అందుచే, ఎల్లప్పుడును ఆలయమునకు వచ్చుట ఒక మహత్తరమైన భాగ్యమైయున్నది. సహోదరుడు నెవిల్ తనకు కొద్దిగా గొంతుకు బొంగురు పోయినదని చెప్పెను, మరియు నేను మన సభతో మాటలాడుటకు ఇష్టపడుచున్నాననెను. దానిని చెయ్యుటకు నాకు కూడా ఎంతో సంతోషకరమైనదని నేను అతనితో చెప్పితిని. దానిని ప్రకటించుటకు కూడా నేను ఇష్టపడుచున్నాను, ఒకవేళ…
JOHN 6:53
2రేపు రాత్రికి వ్యాపారస్తుల కూడికయున్నది; ధర్మకర్తలు, రేపు రాత్రికి మరియు వ్యాపారస్తులు ఇక్కడ ఈ సంఘములో వుండెదరు, సోమవారము రాత్రికి వారికి క్రమముగా జరుగు కూటము కోసము మరియు వారు… (కట్టడము కట్టు) కార్యక్రమము కోసము కాంట్రాక్టరుతో ఒక నిర్ణయమును తీసికొందురు. మన పత్రములన్నియు చేరుకున్నవని మీరందరు అర్థము చేసుకున్నారని నేను ఊహించగలుగుచున్నాను. మరియు మనము సంఘమును (కట్టడము) కట్టగలము. మరియు కావున అంతా సవ్యముగా జరిగిన యెడల, మరియు ఈ వారములోనే పని ప్రారంభమవును. ఆలయ నిర్మాణపు పని, నాకు తెలిసినంతవరకు ఈ వారములోనే ప్రారంభమగును. మరియు వారు దీనిని నిరాకరించిరి, ఇక్కడ జైపర్సన్విల్ లో, కాని మేము ఇండియానాపోలిస్ అనే రాష్ట్రమునకు వెళ్ళాము, మరియు వారు మనకు అనుమతిని యిచ్చారు, అందువలన మనము ఆలయమును నిర్మించబోవు చున్నాము. అందుచే, అది బహుశా ఈ వారంలో ప్రారంభం కావచ్చును. రేపు రాత్రి కూడిక అయిన తర్వాత అది మనకు తెలియును. రేపు రాత్రి కూటము ముగించిన తర్వాత, ఒకవేళ వారు ఈ వారము ప్రారంభం చేయకపోయినయెడల, ఏదైనా జరిగినయెడల, ఆ కాంట్రాక్టరు దానిని ఈ వారములో ప్రారంభించలేడు, మరుసటి వారమున అతడు దానిని ప్రారంభించును.
3మరియు ఈ వచ్చే వారపు చివరలో, శనివారము రాత్రి, ఆదివారము ఉదయుము మరియు ఆదివారము రాత్రి, వచ్చే వారమున, ఈ వచ్చే శనివారమున, మరియు ఆదివారమున, దేవునికి చిత్తమైనయెడల, మరల కొన్ని వారముల క్రిందట మనము చేసిన విధముగానే మూడు కూటముల కూడికను జరపాలని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకు… అది శనివారము రాత్రి, ఆ తర్వాత ఆదివారము ఉదయమున, ఆ తర్వాత ఆదివారము రాత్రి కూటములు ఉండును. దీని తర్వాత, అనగా అవి ఈ నెలలో పదమూడు, పద్నాలుగు తేదీలలో జరుగును.
ఆ తర్వాత నేను మరియు కొంతమంది సహోదరులం ఇవన్నియు ముగించిన పిదప కొలరాడో అనే స్థలమునకు వేటాడుటకు వెళ్ళుదము, తర్వాత తిరిగి వచ్చెదము. ఒకవేళ ఆలయ నిర్మాణము, ఎప్పుడైతే పని పూర్తవుతుందో, దేవునికి చిత్తమైనయెడల ఒక వారమంతయు నేను సెలవు తీసుకొని మరల కూడుకొని మరియు బహుశా నేను ప్రకటన గ్రంథములోని "ఏడు ముద్రలను" గురించి మాట్లాడవలెనని అనుకుంటున్నాను. దీనికి ముందు "ఏడు సంఘ కాలములను" గురించి తెలుసుకున్న విధముగానే యుండును, ఇప్పుడు ఏడు ముద్రలను గురించి కూడా దానిని వెంబడించునట్లుగానే యుండును.
మరియు బహుశా రెండు లేదా మూడు వారములలో, ఎందుకంటే నేననుకుంటున్నాను దానికోసమై వారు ఒక వ్యక్తిని అందుకు నియమించి ఆ పనిని ప్రారంభించిరి, ఒకవేళ వారివలన అది సాధ్యమైనయెడల, ఇంకో పది లేదా పదిహేను దినములలో మనము ఆలయమును కట్టి ముగించెదము, అది ఆ విధముగానే యుండును. ఆ తర్వాత రెండు లేదా మూడింతల జనము పట్టునంత స్థలము కూర్చుండుటకు యుండును, ఒకవేళ అంతకంటే ఎక్కువ జనము కూడా పట్టవచ్చును. మరియు ఆ సమయుము కొరకే నేను ఇంతకాలము వేచియున్నాను.
4ఎందుకనగా, గత శనివారము మరియు ఆదివారములలో, అది భయంకరముగా యున్నదని (కిక్కిరిసిన జనము) మీరెరుగుదురు. అస్సలు ఆలయమును తెరవకముందే, ఆలయమంతా నిండిపోవునను కారణముచేత జనులు మధ్యాహ్నము రెండు గంటల నుండే బయట నిలబడియుండిరి. మరుసటి రోజు ఉదయమున మా యింటికి ప్రక్కన వుంటున్న ఒక నుర్సు ఆలయము దగ్గర నుండి వచ్చినామె యిలా చెప్పింది, "ఆలయమంతట ఉదయము ఐదు గంటలకే అనేకమంది జనులు అక్కడ కిక్కిరిసినట్టుగా గుమికూడియున్నారనెను." కావున, అటుపిదప జనులు లోపలకు వెళ్ళిన తర్వాత, అక్కడ స్థలమే లేదు, మరియు అనేకులు నిరుత్సాహముతో మరియు అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయిరి. మరియు నిలబడియున్నవారు, బల్లల మధ్యలో ఇరుక్కునిపోయి వున్నట్లుగా యుండిరి, మరియు వాళ్ళ కాళ్ళన్నియు తిమ్మిరెక్కిపోయినట్లుగా అయిపోయినది. మరియు అనేక మ౦ది స్త్రీలు కూడా అక్కడ నిలబడి యుండుటను నేను చూచాను. మీకు తెలుసు, ఉక్కపోస్తూ మరియు వాళ్ళపై చెమటలు కారిపోవుచున్నవి. మరియు కొంత మంది పురుషులు లేచి తమ కుర్చీలను నిలబడియున్న వారికి ఇచ్చుచుండిరి, స్త్రీలు కూడా అలాగే చేయుచుండిరి. మరియు ఒకరి కాళ్ళ నొప్పులు తీరువరకు ఇంకొకరు కూర్చుందురు మరియొకరు లేచి నిలబడుదురు. మీకు తెలుసు, అది ఆ విధముగా మరియు అది బాధాకరమగు విషయము, మరియు కొంత మంది తల్లులు తమ చిన్న అనారోగ్యపు బిడ్డలను మరియు వ్యాధిగ్రస్తులను ఎత్తుకొని నిలబడియుండిరి, అది విచారకరము.
5కావున, దానిని తొలగించడానికి పెద్ద ఆలయమును కట్టుటకు మేము ప్రయత్నించుచున్నాము. మరియు మనకు పిల్లలకోసము ఒక మంచి స్థలమున్నది, కొన్ని సమయములలో ఆట౦కముగా వుండును, చిన్న పిల్లలు ఏడ్పులు వలన; మంచిది, అందు కోసమై వారికొక గది అమర్చబడును, కావున చంటి బిడ్డల తల్లులు దానిలోపలికి వెళ్ళవచ్చును, మరియు ఆ గదిలో శబ్దము వినబడునట్లుగా ప్రసార సాధనము అమర్చబడును. ఆరాధన అయ్యేవరకు వారు దానిలోనే వుండవచ్చు, మరియు ఆరాధనను వీక్షించవచ్చును. మరియు ఆదివారపు పాఠశాలకై ఒక గది కలదు మరియు సమస్తమును సవ్యముగా క్రమము ప్రకారము జరుగుచుండును. మరియు అది, ఒకవేళ దేవుని చిత్తమైతే, ఈ వచ్చే వారమే అది ప్రారంభమగును.
6మీరందరూ అందుకొరకు నూరు శాతం ఓటు వేసిరి. కావున దానిని మన గట్టిగా పట్టుకొని యున్నావు, చూడండి. సంఘము సార్వభౌమాధికారము గలది. సంఘము చెప్పినదే శిరసావహించుదము. ట్రస్టీలు, తదితరులు, వారికి ఒక్క ఓటున్నది. సంఘకాపరికి ఒక ఓటున్నది. ఇది సంఘము, సంఘము యొక్క ప్రజాస్వామ్యము. సంఘము యొక్క సార్వభౌమాధికారము. మొత్తానికి సంఘమే మాట్లాడును. అంతే. మరియు మనము దానిని ఇష్టపడుచున్నాము, ఎందుకనగా మనకు బిషప్పులు గాని, లేదా పెద్ద గురువు గాని, లేదా పై నాయకుడు గాని, మరొకరు గాని లేరు. ఇది, అది లేదా ఇంకొకటి ఏదెనా చెయ్యండి అని మనకు చెప్పుటకు సంఘములో పరిశుద్దాత్మయున్నది, పరిశుద్దాత్మ మాట్లాడుచున్నది. ఆ నియమము నాకు చాలా ఇష్టము, మరియు అది చాలా మంచిది.
7"మనము అంతా సమకూర్చుకొని గుడారమును మరో చోటుకు తరలించి మరియు ఒక పెద్ద సంఘమును నిర్మించే వరకు మీరు వేచియుండుటకు ఇష్టపడుచున్నారా?" అని నేను అడిగాను, అది ట్రస్టీల బోర్డులోయున్నది, మరియు అది ఇంకా నిర్ణయించబడలేదు. వారు అప్పుడు నా యొద్దకు వచ్చి అడిగిరి, ఎందుకనగా నేను ఆలయపు ప్రధాన పర్యవేక్షకునిగా యున్నాను. సంఘమునకు వచ్చి అడుగవలెనని అనుకొన్నాము. కావున నేను చెప్పాను, "మనకు వున్నదానికంటే సంఘము యొక్క పరిమాణమును పెంచుకొనుటకు మరియు పలురకములుగా అమర్చుకొనుటకు మరియు సమస్తమును చేయుటకు ఇప్పుడు మనకు చాలినంత ద్రవ్యమున్నదని," నేను చెప్పాను, "ఇప్పుడు మనము చేయుటకు ఇది మంచి తరుణము లేదా ఏదైనా ఒక క్రొత్త స్థలములో సంఘమును పూర్తిగా నిర్మించుకొనుటకు మనకు కావలసినంత డబ్బు సమకూర్చుకొను వరకు వేచియుండ వలయును."
"ఇప్పుడు సంఘమును పునర్నిర్మాణము చేయుటకును, మరియు వెంటనే ఒక పెద్ద సంఘమును ఇప్పుడే కట్టుటకును ఏకగ్రీవంగా అందుకొరకై ఓటు వేసిరి." మరియు దానితోనే మేము నిలచియున్నాము. మరియు ఆ విషయుములో సంఘము యొక్క ఓటును మేము తీసుకొన్నాము
8మరియు ఇక్కడ జెఫర్సన్విల్లోని బోర్డు మమ్మును నిరాకరించినది, దానిని మేము చేయరాదన్నది. మరియు మేము ఇంకా పైకి వెళ్ళాము, మరియు ఇండియానాపోలిస్ కు మేము వెళ్ళి దాని మీద ఆ రాష్ట్రపు అనుమతిని పొందాము, అటు పిదప వారు ఒక పదమును వ్రాసి పంపిరి, అది "కొనసాగించండి," అని వున్నది. మాకు సక్రమముగా దానిని నిర్మించు అవకాశము కలిగినది. కాబట్టి ఇప్పుడు ఈ పట్టణము మమ్మును ఆటంకపరచజాలదు, ఎందుకనగా రాష్ట్రము యొక్క అనుమతి దొరికినది. కావున మాకు అనుమతి దొరికినది, మరియు కాంట్రాక్టరు చేతిలో ఇప్పుడు ఆ అనుమతి పత్రమున్నది, కావున వారు ఏ సమయములోనైనా దానిని ప్రారంభించుటకు సిద్దముగా యున్నారు.
రేపు రాత్రి, ఒకవేళ కాంట్రాక్టరు వచ్చే వారములోనే పనిని ప్రారంభించవలెనని చెప్పినయెడల, ఏడు ముద్రలకు మనము వచ్చేంత వరకు నేను ఈ కూటములను కొంచెం రద్దు చేయుదును. మరియు ఒకవేళ వచ్చేవారం గాని కంట్రాక్టరు పనిని ప్రారంభించినచో, ఆ మరుసటి ఆదివారం, శనివారం మరియు ఆదివారం కూడా కూటములుండును. ఆ తరువాత నేను వెళ్ళుదును.
అటు తరువాత ఈ ఆదివారమే నేను దీనిని చెప్పవలెను, ఎందుకనగా ఈ రాత్రి ప్రభురాత్రి భోజన కార్యక్రమమున్నదని తెలుసుకున్నాను, కావున ఈ ఆదివారము దానిని రద్దు చేసికొన్నాను. ఎందుకనగా, అంత పెద్ద జన సమూహమున్నప్పుడు, ప్రశాంతంగా ప్రభురాత్రి భోజన కార్యక్రమము జరుగదు. అటు పిదప ఎప్పుడైతే మనకు పెద్ద ఆలయము ఏర్పడుతుందో, అప్పుడు అది మనకు సాధ్యమగును.
మత్తయి 19:13
MATT 19:13
9ఇప్పుడు, మనకు కాబోవు దేశాధ్యక్షుడు యున్నాడు. ఓ, నా భావము మీకు తెలియునా, అది కొద్దికాలము క్రితమే హిక్కర్సన్ కుటుంబములో జన్మించెను. మరియు పియానో వాయించే మన సహోదరి, ఆమె వచ్చినట్టయితే, "వారిని లోపలకు తీసుకొని రండి," అనే పాటకు పియానో పై చిన్నగా సంగీతమును మనకై వాయించును, మీకు ఇష్టమైన యెడల లేదా ఏదైనా అటువంటి చిన్న పాటను పాడవచ్చును. ఇక్కడకు హిక్కర్సన్ కుటుంబములో నుండి వచ్చిన చిన్న చక్కని వ్యక్తిని చాలా చాలా కాలము నుండి ఎదురు చూచాను, చాలా మంచి ఒక చిన్న వ్యక్తి, మరియు నిశ్చయంగానే హిక్కర్సన్ కుటుంబమునకు అతడొక ఆణిముత్యము వంటివాడు. మరియు వారందరును మనకు ఆణిముత్యముల వంటివారే. వారిని మనము ప్రేమించుచున్నాము మరియు వారు మన సోదరీ, మరియు సోదరులైయున్నారు. వారి కుటుంబములో జన్మించిన ఆ చిన్నవానిని బట్టి మనందరము వందనములు చెల్లించుచున్నాము. అది నిజంగా కుటుంబములో గొప్ప మార్పును తీసికొని వచ్చినది. తల్లిదండ్రులు ఆ బాలుని ఇప్పుడు ప్రతిష్ఠ కొరకై తీసికొని వచ్చెదరు. "ఆయన యొద్దకు వారు పిల్లలను తీసికొనిరాగా, ఆయన వారిమీద చేతులుంచి ఆశీర్వదించెను," అని లేఖనములో తెలుపబడెను.
10ఇప్పుడు, కొందరు లోకపు జనులు అందురు, "శిశువు బాప్తిస్మము" మరియు అటువంటి దానిని నమ్మెదరు. ఈ చిన్నపిల్లలను వారు తీసుకొని వెళ్ళి మరియు పూర్తిగా ముంచే బాప్తిస్మమును ఇవ్వరు, ఎందుకనగా కొద్దిగా నీటిని వారు తీసికొని వారిపై చిలకరించెదరు. ఇప్పుడు, పెద్దలకైనా, మరి ఎవరికైనా కూడా ఎన్నడునూ వారు చిలకరించినట్లుగా, పరిశుద్ద గ్రంథములో ఎక్కడనూ మనము ఆ విధముగా చేసినట్టుగా కనుగొనలేము. చిన్నపిల్లలను కేవలము ప్రతిష్టించిరి.
అందువలన బాప్తిస్మము అనునది ఒక పశ్చాత్తాపము (ఒప్పుదల) అది కృప ద్వారా అంతరాత్మలో జరిగిన కార్యమైయున్నది. మరియు చిన్నపిల్లలు పాపము అంటే ఏమిటో తెలియనివారైయున్నారు. అందుచే ఎప్పుడైతే యేసు సిలువలో మరణించెనో, ఆయన మరణము ద్వారా లోకము యొక్క పాప కార్యములను తుడిచి వేసెను. పిల్లవాడు మనుష్యునిగా పెరిగినప్పుడు అది లెక్కకు వచ్చును, ఈ లోకములో పుట్టిన శిశువుకు పాపము లేదు, వారియొక్క స్వంత పాపము లేదు, కావున వారికి ఆ సమయములో మారుమనస్సు అవసరము లేదు. కాని పెరిగి పెద్దవాడైనప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తము దానిని పరిహరించును. శిశువు పాపములో జన్మించినాడని మీరందురు. అవును. పాపములోనే అతడు రూపించబడెను, అబద్దములాడుచూ లోకములోనికి వచ్చెను, స్వభావ రీత్యా వారు పాపులు, కాని అందుకు పరిహారముగా యేసుక్రీస్తు రక్తమున్నది. కాని పిల్లవాడు లెక్క అప్పగించు వయస్సులోనికి వచ్చినప్పుడు, మురియు మ౦చి - చెడులను వివేచించు జ్ఞానములోనికి వచ్చినప్పుడు, చేసిన దాని విషయములో పశ్చాత్తాపపడవలెను. అది పాపమే, ఇప్పుడు, ఆ పాపము పాపముతోనే జన్మించియున్నట్లున్నది, అది మానవ పాపము. ఆ పాపము ఇప్పుడు ఆదాము మరియు హవ్వ చేసిన పాపమైయున్నది; అది దేవుని ద్వారా కొట్టివేయబడినది, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడెను. ఆ తరువాత మారుమనస్సు పొందవలెను, చూచారా. ఇప్పుడు తాను పాపము చేసి వాటికొరకై పశ్చాత్తాపముతో మారుమనస్సు పొందువరకు, ఆ బిడ్డలో పాపము లేదు, ఆ తరువాత మారుమనస్సు పొందవలెను. చూచారా? మరియు అతడు ఎప్పుడైతే పశ్చాత్తాపము చెందునో, అప్పుడు అది అతడు బాప్తిస్మము పొందుటకు సమయమైయున్నది. అటు తరువాత అతనికి ముంచుట ద్వారా బాప్తిస్మము ఇచ్చెదరు.
మత్తయి 19:13
MATT 19:13
11ఆ సమయము వచ్చువరకు మనము బైబిలు యొక్క ఉపదేశమును వెంబడించవలెను. "వారు చిన్న పిల్లలను యేసునొద్దకు తీసికొని వచ్చిరి, ఆయన వారిమీద చేతులుంచి వారిని ఆశీర్వదించవలెనని వారు కోరిరి." ఈ చక్కని తల్లిదండ్రులు ఈ రాత్రి బిడ్డను సంఘకాపరి యొద్దకును, నా యొద్దకును ప్రతిష్ఠ నిమిత్తమై తీసికొని వచ్చుచున్నారు. మరియు వారు క్రీస్తుయొక్క ప్రతినిధులమని ఎంచబడిన మా చేతులలో ఉంచుచున్నారు, వారు క్రీస్తు చేతులలోనే పెట్టబడుచున్నారు. విశ్వాసము ద్వారా బిడ్డను దేవుని యొద్దకు తీసికొని వెళ్ళుచున్నాము, ఇక్కడికి తీసికొని వచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము, మరియు దీవించమని ప్రభువును అడుగుచున్నాము, దీనిని మనము "శిశువు ప్రతిష్ఠ" అందుము.
12నా స్వంత పిల్లల విషయములో నేనెట్లు౦దునో మీరెరుగుదురు. ఈ రాత్రి నా చిన్నబిడ్డ మహిమలోయున్నది, ఇప్పుడు, మరియు ఆమె (ఆ బిడ్డ) ఈ బలిపీఠము యొద్ద దేవునికై ప్రతిష్ఠ చేయబడినది. నాకు ఒక చిన్న కుమారుడు మరియు కుమార్తె గలరు వారు ఈ రాత్రి వెనుక కూర్పునియున్నారు, వారింకా బాప్తిస్మము పొందలేదు. పదకొండు సంవత్సరాల బాలికతో నేను ఈ దినం మాట్లాడుచూ వుంటిని. శారాను బాప్తిస్మము గూర్చి అడిగాను. జోసెఫ్ కు ఏడు సంవత్సరములు మాత్రమే. ఇంకా చాలా చిన్న వయస్సు, అయినాగాని అతడు కోరినచో, అతని హృదయంలో దేవుడు భారముంచినచో, అప్పుడు నేను ఆ ప్రకారమే చేయుదును. కాని, పిల్లలుగా ఉన్నప్పుడే వారిని నేను ప్రభువుకు ప్రతిష్టించాను, ఎందుకనగా అది లేఖన సంబంధమగు బోధయై యున్నది.
13నెవిల్ సోదరుడా, ఈ బాలుని యొద్దకు నీవును నాతోపాటు రమ్ము, అతడేనా హాలిన్? హాలిన్? అవును, హాలిన్, జూనియర్. స్టీఫెన్ హాలిన్ చాలా మంచిది. అతడు నిద్రపోవుచున్నాడని తలంచాను. ఏమి జరిగినాగాని హికర్సన్ యొక్క స్వభావము అదే. ఒక రోజు అతనిని చూచి నేను, "అధ్యక్షుడు," అన్నాను. అయితే అదింకా అతనికి చాలా చిన్న బిరుదే, అతడొక "అధ్యక్షుడు" అన్నట్లుగానే అతడితో నేను మాట్లాడాను. మంచిది, మీరు ఎలాగున్నారు? మంచిది, ఏ భక్తిగల తల్లికైనా సరే అటువంటి వారు ఒక నిధియే. మీరు ఆలాగు తలంచుట లేదా? చాలా మాధుర్యము. మరియు ఇప్పుడు, సోదరుడు హికర్బన్ మరియు సోదరి హికర్బన్లు వచ్చిరి, క్రీస్తు దాసునిగా, మీ సంఘకాపరిగా, విశ్వాసముతో ఈ శిశువును యేసుక్రీస్తు హస్తములలో భద్రపరచుచున్నాను. ఆయన చేతులలోనే మనం ఉంచగోరుచున్నాము.
14శిశువును చేతులలో ఎత్తుకొని నేను మరియు సంఘకాపరి నిలబడి యుండగా, మన శిరములు వంచుదము.
మా పరమ తండ్రీ, నీ యొద్దకు వారు చిన్నపిల్లలను తీసికొని వచ్చినట్లు మేము బైబిలులో చదివియున్నాము. నీవు వారిమీద చేతులుంచి ఆశీర్వదించి యున్నావు. మరియు నిజముగా, ప్రభువా, వారు ఆశీర్వదించబడిరి. మరియు ఇప్పుడు, నీ మాదిరిని, నీవు చేసిన పనులను మేము అనుసరించుచున్నాము. ప్రభువా, మేము దగ్గరగా వీటిని పరీక్షించియున్నాము. బైబిలు చదివి, నీవు చేసిన మాదిరిని మేము అనుసరించుచున్నాము. మరియు ఈ తండ్రి మరియు తల్లి, సహోదరుడు మరియు సహోదరి హికర్సన్, ఇక్కడున్న మా ఆలయంలోని ప్రియమైన శిష్యులు, నీవు వారికి అనుగ్రహించిన దానిని ఈ చిన్న ఆనందమును వారు మా యొద్దకు తీసుకొని వచ్చియున్నారు. ప్రభువా, నీ యొద్ద నుండి ఇది వచ్చెను. నీవే వీరికి ఈ బిడ్డను అనుగ్రహించావు. మరియు ఇప్పుడు ఈ చిన్న జీవమును నీకే అర్పించుటకై నిర్ణయించుకొన్నారు, నీకు సేవ చేయుటకై నీకు సమర్పించుచున్నారు. నీవు ఈ బిడ్డను ఆశీర్వదించుమనియు, దీర్ఘజీవితమును దయచేయుమనియు నేను ప్రార్థించుచున్నాను. వీలైతే, ప్రభువు యొక్క రాకను చూచువరకు ఈ బిడ్డ జీవించు గాక. ఈ బిడ్డ ఏ చోటునుండునో, ఆ ప్రతి చోటును దీవెనను రానిమ్ము, క్రైస్తవ గృహములో ఈలాగున కొనసాగును గాక. వీలైతే ఈ బిడ్డ సువార్తను బోధించుచు బలిపీఠము పైన ఉండగలుగునట్లు కృప చూపుము. తల్లిదండ్రులు దీనిని చూచెదరు గాక! ప్రభువా, వైట్ హౌస్లో సింహాసనము మీద కూర్చొనియుండుటను వారు చూచుటకంటే దీనినే వారు చూచెదరు గాక! ఎందుకనగా వీరు నీ సేవకులు. మరియు ఈ బిడ్డయొక్క జీవితము నీకు ఒక ప్రతిష్టించబడినదై మరియు దేవునికొరకై ఒక సేవచేయు అంకితమగునట్లు జీవితములో వుండునట్లు కృప చూపుము.
తండ్రీ, నీవు బిడ్డను దీవించుమని ఇప్పుడు నేను ప్రార్థించుచున్నాను. మరియు దేవుని యొక్క కృప బిడ్డ మీదికి వచ్చును గాక, జీవితమంతా ఆరోగ్య, ఆనందములతో ఉండును గాక, తల్లిదండ్రులు ఈ బిడ్డ ఎదుగుదలను చూచెదరు గాక, మరల అడుగుచున్నాము. నీ నామములో దీవించుము.
15మరియు ఇప్పుడు, చిన్న స్టీఫెన్ హాలిన్ హికర్సన్, నిన్ను యేసుక్రీస్తుకు సమర్పించుచున్నాను, మేము కోరిన దీవెనలు నీ మీదికి వచ్చును గాక. నా చిన్న సోదరుడా, ఆరోగ్యంగా మరియు బలంగా జీవించుము, మరియు దేవుని మహిమ కొరకు మరియు జీవించుము. దీనిని యేసుక్రీస్తు నాముములో అడుగుచున్నాము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును.
అక్కడ మనకిక ముసలితనము లేదు, ఎన్నడూ వృద్దులము కాము,
ఆ దేశములో ఎన్నడునూ ముసలివారము కాము;
ఎన్నడూ వృద్దులము కాము, ఎన్నడూ వృద్దులము కాము,
ఆ దేశములో ఎన్నటికినీ వృద్దులము కాము.
అది ఆశ్చర్యము కాదా? చిన్నవారు యవ్వస్తులగుదురు, మరియు వృద్దులు ఇప్పుడు, మరియు యవ్వస్తులగుదురు. ఇప్పుడు అది ఆశ్చర్యము కాదా? లేదా ఎన్నడునూ మనకు వ్యాధియుండదు, లేదా ఎన్నడునూ దుఃఖము వుండదు, లేదా ఎన్నడూ మరణము లేదు.
16ఇప్పుడు, ఆరాధనల గురించి నెవిల్ సోదరుడు ప్రకటనలను చేసెను. నేను కూడా ఇప్పుడు ఆ, ఆ కూటము గురించి ప్రకటించ గోరుచున్నాను. దానిని గూర్చి మరచిపో వద్దు, మరియు ఆ కూటముల గూర్చి సోదరుడు మాట్లాడెను. చాలా సంవత్సరాల క్రితం శ్రీమతి ఫోర్డు, ఈ ఆలయమునకు వచ్చుచుండేది. కొన్ని రోజుల క్రితమే ఆమెను నేను ఆమె కుమార్తె యొద్దకు తీసుకొని వెళ్ళాను. ఆమెకు ఎనభై సంవత్సరములు, మరియు గతరాత్రి ఎనిమిది గంటలకు ఆమె ప్రభువు సన్నిధికి వెళ్ళినదని నేను తలంచుచున్నాను. బుధవారం రాత్రి కూట్స్ యొద్ద నేను, సంఘకాపరి కలసి ఆమెకు సమాధి కార్యక్రమము జరిగించెదము. వచ్చే బుధవారం పదిన్నర గంటలకు ఉండును. శ్రీమతి…. నేను మరచిపోయాను అనుకుంటున్నాను ఆమె పేరు… లీవై, శ్రీమతి లీవై ఫోర్డ్. ఆమె లాయడ్ ఫోర్టు యొక్క తల్లి, నా పుస్తకంలో మీరు చూచారు, అతడు నా కొరకు బాయ్ స్కవుట్ సూట్ దాయగోరెను, నాకు కేవలము దాని ఒక్క కాలు మాత్రమే మిగిలెను. అతని తల్లి ఆమె. ఒక రోజున ఆమెను నేను తీసికొని వెళ్ళి ఆమెకు ప్రార్థన చేశాను. చాలా వృద్ధురాలు. ఆమె ప్రభువైన యేసుతో నుండుటకు వెళ్ళినది.
17ఇప్పుడు, ప్రభుని చిత్తమైన యెడల, ఇక్కడ నేను కూటముల గూర్చి ప్రకటించవలసియున్నాను, అవి వచ్చే వారం జరుగు కూటములైన యెడల, వాటిని ఇక్కడ నేను జరిపినయెడల, లేదా వచ్చే కూటములలో దేని విషయమై మాట్లాడ వలయునో, నేను ఆలోచించియున్నాను, వచ్చే వారములో జరుగు ఆరాధనలను గురించి. ఒకవేళ నేను… ఈ పుస్తకములో వ్రాసియుంచాను అనుకుంటున్నాను, నాకు తెలియదు ఒకవేళ వ్రాశానో లేదో అని. అవును, ఇందులో వ్రాశాను. ప్రభువు చిత్తమైన యెడల, వచ్చే శనివారం రాత్రికి, "ఎందుకని ఒకరి జీవితం మీద మరియొకని ప్రభావము," అనే అంశంపై ప్రసంగించెదను. మరియు ఆదివారము ఉదయమున "పిరమిడ్ పై తలరాయి," అను అంశముపై నేను ప్రసంగించెదను. మరియు ఆదివారం రాత్రి "నా మార్గదర్శి" అను అంశముపై ప్రసంగించెదను, "నా మార్గదర్శి అను అ౦శము, ఈ వచ్చే ఆదివారం రాత్రి. ఇప్పుడు ప్రభువు దీనిని ఆశీర్వదించి మరియు నాకు సహాయము చేయవలెను, నేను బయటకు వెళ్ళుచుందును, తగిన సందర్భమును బట్టి ఎంచుకొందును.
18ఇప్పుడు ఈ రాత్రికి, మనం కొన్ని సంగతులను త్వరగా చెప్పుకొనవలెను. ఒక ఉత్తరము నాకు వచ్చియున్నది, బిల్లీ దానిని కొంతసేపటి క్రితం నాకు ఇచ్చెను. కొందరు సోదరులు మిచిగాన్లో యున్నారు, మరియు ఇది సేవక సమాఖ్య నుండి వచ్చినది, చాలా సంగతులున్నవి. అందువలనే చాలా విషయములలో సంశయములు తెచ్చును, మీరు చూచారా. కొందరు సోదరులు అచ్చటికి వెళ్ళి వారు నాచే పంపబడినట్లుగా చెప్పుకొనుచున్నారు, మగవారు తమ భార్యలను విడిచి పెట్టి ఆత్మీయ భాగస్వామి కొరకు వెదకవలెనని వారు ప్రసంగించుచున్నారు, మరియు నేను పరిపూర్ణమైన తప్పిపోలేనివాడిని అని వారు ప్రకటించుచున్నారు. అటువంటిది అస్సలు ఏమీ లేదు… మరియు, ఓ, అటువంటి భయంకరమైన విషయములను మీరు వినవద్దు. సేవకుల సమాఖ్యవారు దానిని పట్టుకొనిరి, వారు దానిని గూర్చి నాకు ఒక లేఖ వ్రాసిరి, మరియు వారిని నేనే అక్కడికి పంపినట్లుగా చెప్పుకొనిరి, దానివలన ఎంతో గందరగోళము ఏర్పడినది. అందులో కొందరు ప్రవచించుచూ, ఒక వ్యక్తి ఈ భార్యను విడిచిపెట్టి మరి యొకరిని పెండ్లి చేసికొనవలెనని వారు చెప్పుచున్నారు. ఇప్పుడు, ఈ సంఘము అటువంటి తప్పుడు బోధలకు చేయూతనివ్వదని మీరెరుగుదురు.
బైబిలును మనము నమ్ముచున్నాము. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహము చేసుకొనినయెడల, ఆమె అతడి భార్యయగును, మరియు మరణము మాత్రమే వారిని వేరుపరచునని మనము నమ్ముచున్నాము. అది అంతే. మనము అటువంటి వాటిని నమ్మము. స్వేచ్చాయుత ప్రేమ అను బోధను కూడా మనం నమ్మము, అటువంటి వాటియందు మనకు విశ్వాసము లేదు. సంపూర్తిగా మనం బైబిలునే నమ్ముచున్నాము, అది ఒక్కటే చాలును. కావున ఈ ఉత్తరమును నేను నకలు తీసి దానికి జవాబును ఇచ్చి వార్తా పత్రికలలో ప్రచురించెదను, అది చాలును, దానిని అదే చర్య తీసికొనును. అలా చేయునని నేను విశ్వసించుచున్నాను, ఏలాగయినా వారికి నేను జవాబునివ్వవలెను.
ఖచ్చితంగా ఘోరమైన తప్పు.
JOHN 5:24
19ఇప్పుడు ఈ రాత్రి, మనం లేఖనమును తెరువకముందు, మన ప్రభునితో మాట్లాడుదము.
మా పరలోకపు తండ్రీ, దేవుని యొక్క గొప్ప ధననిధులను మాకు అందించుటకై మహిమలో నుండి క్రిందికి దిగివచ్చిన ఆ మహామహుడగు ప్రభువైన యేసు నామములో నీ కృపా సింహాసనమును మేము సమీపించుచున్నాము. దేవుని ప్రత్యక్షతయగు ఈ గొప్ప యేసును బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు మా కొరకై వ్యక్తిగతంగా ప్రత్యక్షమాయెను, మరియు ఆయన ద్వారా మాకు మా పాపముల నుండి విడుదల దొరుకుచున్నది. మేము ఆయనను నమ్ముచున్నాము, అందువలన మేమిప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటబడి యున్నాము. ఆయన ఇట్లు చెప్పెను, "నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు."
20ప్రభువా, ఈ రాత్రి, నీ మాటలను ఆశీర్వదించుము. మరియు కొద్ది సమయములో మేము ఇచ్చట ప్రభురాత్రి భోజనము తీసికొందుము. క్రైస్తవులు, రాజ్యము యొక్క సహ-పౌరులు బలిపీఠము చుట్టూ చేరెదరు, అక్కడ వారు ప్రభురాత్రి భోజనమును భుజించుదురు. నీవు మా పాపముల కొరకు మరణించినావని మాకు విశ్వాసమున్నట్లు సూచించుటకు మరియు నీవు మూడవ దినమున తిరిగి లేచి, సదా జీవించి యున్నావనుటకు, నీవు తిరిగి వచ్చువరకు దీనిని మేము చేయుచుండవలెనని, లేఖన ప్రకారము మాకు ఆజ్ఞాపించబడినరీతిగా, నీవు మాకు విడిచిపెట్టిన "ప్రభురాత్రి భోజనమును" తీసికొందురు. చెడు తలంపుల నుండి నీవు మా హృదయమును పరిశుద్దపరచుము, మరియు నీ చిత్తమునకు విరోధముగా మేము చేసిన సమస్తమును నీవు పరిహరించుము. తండ్రి, మమ్మును క్షమించుము, మరియు ఈ రాత్రి నీ కృపను మా కనుగ్రహించుము. నీ వాక్యమును జీవాహారమును నీవు మాకు విడిచిపెట్టుము, దానిని మేము చదివి, దానిని గూర్చి చెప్పుకొనుచున్నాము. ప్రభువైన యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
REV 20:1
21ఇప్పుడు ప్రకటన గ్రంథములో, ఒక వచనముతో ప్రారంభించెదము, 20వ వచనమును నేను చదివెదను, లేదా 20వ అధ్యాయములోని 1వ వచనము.
మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.
వ్యాఖ్యానమునకు మూలగ్రంథము నుండి లేదా పూర్వోత్తర సంబంధమైన దానినుండి ఈ మూల గ్రంథమును తీసుకొనినట్లుగా దీనిని నేను ఒకవేళ అనవచ్చు. ఇంకో ఇరవై లేదా ఇరవై-ఐదు నిమిషములు, ద్వారమునకు తాళపుచెవి అని నేను దీనిని పిలుచుటకు ఇష్టపడుచున్నాను. దీనిని "తాళపుచెవులు" అనను. ఎందుకనగా పేతురుకు "రాజ్యము యొక్క తాళపుచెవులు" ఇయ్యబడినవి. కాని దీనిని ఇట్లు పిలచుచున్నాను: "ద్వారమునకు తాళపుచెవి." ఇది అయిపోయిన వెంటనే, నేను ప్రభురాత్రి భోజనము గూర్చి కొన్ని మాటలు చెప్పెదను.
22ఇప్పుడు, ఒక తాళపుచెవి. మనము చదువుచుండగా ఇక్కడ దీనిని నేను గమనించాను; ఈ దేవదూత పరలోకము నుండి దిగి వచ్చినది, తన చేతిలో తాళపు చెవి యున్నది. నేను నమ్ముచున్నాను, అది ప్రకటన గ్రంథములో 13 లేదా 19, వేరొక దేవదూత ఒక తాళపు చెవితో వచ్చుటను మరల మనము కనుగొంటిమి, మరియు ఒక తాళపుచెవి, ఒక తాళపుచెవి ఉపయోగమేమనగా, మూసియుంచబడిన దేనినైననూ తీయుట లేదా దేనికైననూ తాళము వేయుట. అయితే ఒక తాళపుచెవి అందుకొరకే ఇవ్వబడినది.
ఇప్పుడు, చాలా రకముల తాళపుచెవులున్నవి, ఎందుకనగా తాళపుచెవులతో మనకు చాలా ఉపయోగం ఉన్నది. గిడ్డంగులకు తాళపు చెవులున్నవి, మీ స్వంత ఇండ్లకు తాళపు చెవులున్నవి, మీ కార్లకు తాళపుచెవులున్నవి. వాటిని మనం తాళపుచెవులు అనుచుందుము, అవి తాళపుచెవులే. మరియు చాలాసార్లు వాటికి నకిలీ తాళపుచెవులుండును, లేదా ఇండ్లకు మనం చాలాసార్లు వేరే తాళపుచెవులను చేసియుంచుదుము, మునము ఎముకల గూడులాంటి తాళపుచెవి ఏమని పిలచెదము. వేరే మాటలలో చెప్పాలంటే, అటువంటి ఒక విధమైన లీవర్ తో ద్వారమునకు తాళపు చెవి చేయబడిన ఒక తాళపుచెవి, అది ఒక విధమైన రీతిగా త్రిప్పలు వలన తాళము వేయుటకు అది పనిచేయును మరియు దాదాపు అది ఏ తలుపునైనా తెరుచును, దానినే "అస్థిపంజరపు తాళపు చెవి," అని పిలిచెదరు. అటువంటి ఒక అస్థిపంజరములాంటనీ చట్రుమువలె చేయబడిన అనేక తాళపుచెవులు కలవు, మరియు అది ఆ విధముగా తెరుచును, మన యిండ్లకు లేదా మన మోటారు బండ్లకు కూడా అటువంటి నకిలీ తాళపుచెవులు మనకు ఉండును. అటు పిదప అక్కడ…
23చేతిని ఉపయోగించకుండా ఏ తాళపుచెవితోనైనా గాని మనం తాళమును తెరువలేము. తాళపుచెవిని వాడుటకు మరొక సహాయము కావలెను. ఎందుకనగా తాళపు చెవి దానికదే పనిచేయజాలదు. దానిని మరొకటి ఉపయోగించవలెను.
అది ఈ మైక్రోఫోను వలెయున్నది, దానిద్వారా నేను మాట్లాడుచున్నాను. ఈ మైక్రోఫోను ఒక మూగది. దానిద్వారా ఏదైనా మాట్లాడనియెడల దానికదే మాట్లాడజాలదు, దానిద్వారా మరేదో మాట్లాడవలసియున్నది. కావున, అది మైక్రోఫోను గొప్పతనము కాదు, అది స్వరమును లేదా శబ్దమును ఆ మైక్రోఫోను గాలిలోనికి ప్రసారము చేయుట ద్వారా చెవికి వినబడుచున్నది.
ఇప్పుడు సువార్త బోధించుట కూడా ఆ రకంగానేయున్నది. సేవకులమైన మనం గొప్పవారము కాము, మనము సువార్తగా లేము. కాని, దేవుని స్వరమును మనము వినువారికి ప్రసారము చేయువారము మాత్రమే అయివున్నాము, మనం వినిపించగల మానవ ప్రతినిధులముగానే యున్నాము.
24దర్శనము కూడా ఆ విధంగానే యున్నది. ఈ సమయములో నేను దర్శనము గురించి సంఘముతో చెప్పదలంచుకొనలేదు. కాని పరిశుద్దాత్మ మొదలు నాకు దర్శనము చూపించినయెడల, దానిని నేను ఉద్దేశించబడినవారికి ప్రసారము చేయుదును. కావున దర్శనము నాది కాదు, ఆ దర్శనము నాకు కాదు, నేను కాదు. ఆ దర్శనమును దేవుడే ఇచ్చెను, మరియు నేను ప్రసారకునిగా మాత్రమే పనిచేయుచున్నాను, ఆ దర్శనము యొక్క వర్తమానమును నేను ప్రజలకు అందించెదను.
ఇప్పుడు తాళపు చెవికూడా అలాగేయున్నది. (దగ్గు) నన్ను క్షమించండి. తాళపుచెవిని నేను పట్టుకొన్నప్పుడే తలుపు తెరువబడును. చూడండి, చేయి యొక్క అవసరము ఉన్నది. ఇప్పుడు, మరియు ఈ రాత్రి నేను ఆ చేయి గురించియే మాట్లాడుచున్నాను, ఒకే ఒక హస్తము దానిని పట్టుకొనగలదు. మరియు అది విశ్వాసము అను హస్తము. ఈ తాళపుచెవిని అది మాత్రమే పట్టుకొనగలదు. మరియు ఇతర తాళపుచెవులను పట్టుకొను ఇతర హస్తములు చాలా గలవు, మరియు దేనికైనా గాని విశ్వాసపు హస్తమే అవసరము.
25ఇప్పుడు, జ్ఞానమునకు ఒక తాళపుచెవిలాంటిది యున్నది. ఇప్పుడు, ఒక వ్యక్తి తాను, ఒకవేళ అతడు జ్ఞానమును వృద్ధి చేసుకోవలెననినచో, చూడండి, ఇప్పుడు అక్కడ దానికి ఒక తాళపుచెవి కలదు. తన పుస్తకములను అతడు సంపాదించుకొనవలెను, మరియు అతడు అభ్యసించవలెను, కాని అతడివలన కాదు… ఏ ఒక్కరూ అతనికి నేర్పించలేరు. వారు అతనికి ఉపదేశింపవచ్చును, కాని తనంతట తాను స్వయంగానే నేర్చుకొనవలెను. మరియు ఆ విధముగా మాత్రమే అతడు దానిని చేయగలడు, ఆ తాళపుచెవిని అతడు పట్టుకొనగలడు, అది ఏదైనా కొంత వులుకు అక్కడ అతడు అపేక్షించుదానిని అది వికసింపజేయును లేదా తెలుపును.
మరియు కొంతమంది పియానో వాయించుటకు, లేదా సంగీతము నేర్చుకొనుటకు ప్రయత్నించుదురు. ఎలా దానిని వాయించాలో వారికి తెలియదు, కాని వారు వెళ్ళి మరియు ఉపాధ్యాయుని యొద్ద పాఠముల తరువాత పాఠములును నేర్చుకొందురు, మరియు వారు దానిని ఎప్పటికిని నేర్చుకొనకపోయినచో, అనగా ఆ మర్మమును విప్పు తాళపుచెవిని అతడు పట్టుకొనక పోయినచో, ఏలాగు గ్రహించగలడు? శృతి మరియు రాగము మొదలగునవి ఎట్లు గ్రహించగలడు? ఆ తాళపుచెవిని తీసికొనవలెను.
26మరియు గణిత శాస్త్రము కూడా ఆ విధంగానే యున్నది. లెక్కలు నేర్చుకొనుటకు ఒక తాళపుచెవి యున్నది, దానిని నీవు పొందుకొని దానిని కలిగియుండవలెను. నాలుగు వరుసలు గల చిత్రములను తీసుకొని మరియు వారి చేతి వ్రేళ్ళను వుంచి లెక్కలను వేయుటను నేను చూచాను. ప్రతి ఒక్కొక్కరు వారి చేతి వ్రేళ్ళను ఆ వరుస యొక్క బొమ్మలపై వుంచి, మరియు అలా కొద్దిగా క్రిందకు ఆ చేతి వ్రేళ్ళను తీసుకొనివచ్చి నాలుగు లేదా ఆరు వరుసలను కూడి వాటియొక్క జవాబులను వాటి క్రింద వ్రాయుదురు. ఒకే సమయమున నాలుగు వరుసల కూడికలను ఎచ్చటినుండైనా సరి ఒకటి నుండి తొమ్మిది లోపల గల ఏ సంఖ్య యిచ్చినా, సునాయాసంగా లెక్కలు వేయుదురు. మంచిది, అలా కూడికలను చేయటం నాకు చాలా కష్టంగా వుండును. ఒక వరుస లేదా దానికన్నా తక్కువైనా కూడా వాటిని కూడుటకు ఆ ఒక్క వరుస కూడిక యొక్క జవాబును పొందుకొనుటకు నాకు చాలినంత చేతి వ్రేళ్ళ, మరియు కాలి వ్రేళ్ళ అన్నింటినీ చూచుకోవలెను. నాకింకా ఆ తాళపుచెవి దొరకలేదు. కాని మీరు చూడండి, కొందరికి ఆ తాళపుచెవి దొరికినది. మరియు అదెట్లు చేయవలెనో వారికి తెలియును.
మరియు ఇక్కడ జ్ఞానమునకు ఒక తాళపుచెవి కలదు, జ్ఞానమును ఒకడు వెదకును. సైన్సుకు ఇప్పుడు ఒక తాళపు చెవియున్నది, శాస్త్రీయ పరిశోధకులు వున్నారు. ఇక్కడ గొప్ప తాళపుచెవియున్నది. జనులు ఆ తాళపుచెవి కొరకు వెదకుచున్నారు.
27కొంతకాలం క్రిందట ఇక్కడ వారు ఒక అణువును కనుగొనిరి, అణువులున్నవని వారికి తెలిసినది. ఇప్పుడు, అణువులవలన పరమాణువుల ఉనికి తెలిసినది. మంచిది, వారు తర్వాత దానిని వెదకసాగిరి, అణువే సమస్తమును నిలిపి యుంచుచున్నదని వారు విశ్వసించిరి, ఆ అణువును స్థానభ్రంశము చేసినయెడల, అంతా చెల్లాచెదురగునని వారికి తలంపు కలిగినది. ఎందుకనగా ప్రతిది నిలచి యుండుటకు అణువే కారణము, అది మనకునూ తెలియును. మరియు ఆ స్తంభము అణువులతో నిలబడియున్నది. నీవు అణువుల మూలముగానే నిలబడి యున్నావు. మరియు ఆ అణువును ఒక చోటుకు రప్పించినచో, సమస్తమూ తిరగబడి తునాతునకలుగా విడిపోవును. ఇప్పుడు, ఆ వస్తువు నాశనమగును. మరియు అది జరుగునని గొప్ప శాస్త్రజ్ఞులు నమ్మిరి. మరియు వారు ఎంతగానో పరిశోధనలు చేసిరి. గంటల కొలది మరియు వారముల తరబడి, సంవత్సరముల కొలది పరిశోధనలు జరిపి, చివరికి దానిని జయించిరి.
28అది థామస్ ఎడిసన్ అని నేను నమ్ముచున్నాను. లైటు గురించి పరిశోధించెను, విద్యుత్ దీపమును తయారు చేయగల జ్ఞానము అతనికి ఉండినట్లు వారు గ్రహించిరి. వెలిగే బల్బును కనుగొనిన వాడు అతడే. మరియు అతడు రాత్రిలో పరుండెడివాడుకూడా కాదు. చిన్న అప్పమును తిని కూర్చొని నిర్విరామముగా పని చేయుచుండెడివాడు. అతని మనస్సులో ఎక్కడో లోతున అది చేయగలనను ధీమా దాగియున్నది, ఏదో ఒకటి తాను అది చేయగలనని అతడితో చెప్పుచుండేది. అది ఏమిటి? అది మార్గమును తెరచు ఒక తాళపుచెవి.
29కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది, హాస్య రచనలను వ్రాయగల తలాంతు తనలోయున్నదని ఒకతను నమ్మెను. ఆ తాళపుచెవి తన చేతిలో యున్నదని అతడు నమ్మెను. అతడు కాన్సాస్లో నివసించెడివాడు. కాన్సాస్ పట్టణములోని ఒక పెద్ద వార్తా పత్రిక సంపాదకుని యొద్దకు వెళ్ళేను, తాను వ్రాసిన కొన్ని రచనలను తీసికొనిపోయెను. మరియు ఆ సంపాదకుడు ఇట్లనెను, "అయ్యా! ఇంకా మీ రచనలు సరిగ్గా లేవు, మీరింక ఏమీ ప్రయత్నము చేయనవసరం లేదు, నీకది సాధ్యము కాదు. అయినా గాని ఇతడు ఆ మాటలను లెక్క చేయలేదు, ఎందుకనగా ఆ తలాంతు తనలోయున్నదని ఎరుగును. అతడు వెళ్ళి మరల మరలా దానిని ప్రయత్నించసాగెను, కాని అతడు (సంపాదకుడు) తిరస్కరించుచుండెను.
చివరకు అతడు మరొక స్థలములకు వెళ్ళెను, "అయ్యా, నీ రచనలు చక్కగా లేవు, నీ వలన అది సాధ్యము కాదు," అని చెప్పెడి వారు. అయినను దానిని తాను చేయగలనని అతడు నమ్మెను. తాను పొందాలనుకున్న దానిని పొందుటకు అతడి చేతిలో ఆ నమ్మకమే అతనికి యున్నది! చివరికి అతనికి చిన్న పని దొరికినది. కొద్దిపాటి రచనలు చేయవలసివచ్చెను, పత్రిక సంపాదకీయములోనో లేదా సంఘమునకై ఏదో కొన్ని రకాల హాస్యపు రచనలను వ్రాయమని ఇచ్చారని నేను నమ్ముచున్నాను. అతడు అద్దెకు చిన్న గదిని తీసికొనెను. అందులో ఎలుక లుండెడివి… ఎలుకలు, చుంచులు ఆ గదిలో నిత్యమూ పరుగిడెడివి. పేపరు తినివేస్తుండెడివి. చివరకతడు ఒక చిన్న ఎలుక యొక్క వింతను కనుగొనెను. మిక్కీ మౌస్ గాథ అక్కడే జన్మించెను. ఇప్పుడతడు కోట్లాది కోట్ల రూపాయల కోటీశ్వరుడైన వాల్ట్ డిస్నీ ఎందువలన? అతని హస్తములో అది ఉన్నదని అతడు ఎరిగియుండెను, మరియు అతడు దానిని తాను పొందెనని ఎరిగియుండెను, తనకు తెలుసు దానిని తాను చేసెదనని, మరియు ప్రతి గొప్ప కార్యము కూడా అలాగే నెరవేరినది.స్త్రీ మరియు పురుషుడు ఎప్పుడైతే తమ హస్తములలో ఏదో ఒకటియున్నదని గ్రహించెదరో, వారికి తెలుసు వారు దానిని చేయగలరని.
30దేశములో పోలియో వ్యాపించినప్పుడు మనమందరము దానికి విరుగుడుగా మందు తీసికొనవలెనని శాసనమైనది. నిన్న నేను కారు నడుపుకొని వచ్చుచుండగా ఒక వైద్యునితో ముచ్చటించుచున్నాను, అతడు లూయిస్విల్ డాక్టరు. అతడిట్లు చెప్పెను, "కొన్ని సంవత్సరాల క్రితం లూయిస్విల్ ను ఆ వ్యాధి తాకినది. నేను నిలబడిన చోటు మీరు నిలబడినప్పుడే అది మీకర్ధమగును. ఒకేసారి ఏబది-ఏడు ఊపిరినిచ్చు యంత్రములు పనిచేయుచుండెను. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు పోలియోతో చచ్చుబడిపోవుచుండిరి. ఎప్పుడైతే పోలియో వ్యాపించునో, దానికి ఏమీ విరుగుడు లేదు. దానినే "పోలియో" అని పిలచుదురు. మరియు "అట్టిది మరెన్నడూ నేను చూడగోరను," అని చెప్పెను.
కాని ఇంత కీడు కలిగించు పోలియో అను వ్యాధియున్నప్పుడు దానిని నిరోధించు విరుగుడు కూడా యుండునని సైన్సు తలంచినది. వారు పోరాడిరి, వారు బూటు ధరించి వీధుల్లో నిలబడిరి, అగ్నిమాపక బృందమువారు టోపీలు ధరించి తిరిగిరి, వారు అన్ని రకములుగా ప్రయత్నములు సలిపిరి, స్వేచ్చ యొక్క ద్వారమును తెరచుటకు వారు ఎంతో శ్రమించిరి. చివరకు, సాక్ అను ఒక క్రైస్తవ పెద్ద మనిషి ఈ వాక్సిన్ను కనుగొనెను. ఎందువలన? ఒక కీడు ఆవరించి యున్నది, ఒక చెడు వచ్చి చంపుచున్నది, మానవునికి మరల స్వాతంత్ర్యము నివ్వగల ఒక తాళపుచెవి ఎక్కడోయున్నది అని గ్రహించిరి, సాక్ వాక్సిన్ బహుగా పని చేసినది. మరియు తాళపుచెవి ఎంతగా పనిచేయునో చూడుడి! వాక్సిన్ కనుగొనబడినది. ఈ వాక్సిన్ ద్వారా పోలియో అణచి వేయబడినది, ఎందుకనగా వారు నిర్విరామముగా ప్రయత్నములు చేసిరి. ఆ తాళపుచెవి ఎక్కడో పడియున్నది. దానినుండి ఏదో వచ్చునని వారెరిగియుండి మరియు దానిని కనుగొనుటకు తీర్మానించుకొనిరి.
31పోలియో, డిప్తిరియా, మశూచి, ఎల్లో ఫీవర్, ధనుర్వాతము లాక్జా మొదలగు చాలా భయంకరమైన వ్యాధులు గలవు, మరియు అటువంటి కీడును కలిగించు రాత్రింబగళ్ళు వారు మందును కనుగొనువరకు దానికై పోరాటము జరుపుచున్నారు, ఎందుకనగా అది చెడ్డది, అది ఒక చంపునది. పాపమనే బంధీ గృహములోనున్న ఒక మనిషికి రక్షణ కలిగించు తాళపుచెవి ఎంత అవసరమై యున్నదో కదా? అక్కడ ఒక తాళపుచెవి ఆ ద్వారమునకై యున్నది, అది మనిషిని దానినుండి విముక్తి కలిగించునదై యున్నది. దానికి ఒక విరుగుడును తుదకు వారు కనుగొనిరి,
ఆ విజ్ఞానము ఈ కీడును నివారించును.
ఒక తాళపుచెవి, వాడుకగా, దాని లోపల కొంత నిధి వున్నను, ఏదైన విలువైనది కలిగియున్నప్పుడు అది తాళం వేసియున్నట్లయితే మరియు, నీవు అప్పుడు ఒక తాళపుచెవిని కనుగొనవలెను. ఒకవేళ దానిలో విలువైనదేమీ లేనియెడల తాళం వేయుము, అలాగే వదలి వెళ్ళిపోతాము. కాని విలువైనది దానిలో వున్నయెడల తాళం వేయుదుము! కావున ఒక తాళంచెవి సాధారణముగా - అది ఏదైనా ఒకదానికోసమైన లేదా విలువైన దానిని దేనినైనా తెరచుటకు అది ఉపయోగపడును. తాళపుచెవి, అది ఇప్పుడు ఎందుకొరకైయున్నది, ఇప్పుడు, అది యోగ్యమైన దానిని (విలువైన) బయట పెట్టుటకు (తెరచుటకు) అది ఉపయోగపడును.
JOHN 10:7,9•
JOHN 14:6•
ACTS 2:38•
ACTS 4:12
32ఇప్పుడు మనము యోహాను 10వ అధ్యాయములో, యేసు చెప్పిన దానిని చదువుదము, "గొర్రెలు పోవు ద్వారమును నేనే! నేనే ద్వారమును!" [ఒక ద్వారము కాదు. ఒకే ద్వారము], కేవలము ఒకే ద్వారము. నేనే మార్గమును. ఒకే మార్గము. నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ శత్రువులే దొంగలును, దోచుకొనువారునై యున్నారు. గొర్రెలు పోవు ద్వారము ఆయనే. రక్షణ ద్వారము ఆయనే.
ఏ సంఘము, ఏ శాఖ, ఏ ఆచారము, ఏ సిద్దాంతము, ఏది కూడా నిన్ను రక్షించదు, యేసు నామము ద్వారానే నీవు రక్షించబడుదువు. అది మాత్రమే అదే తాళపుచెవి. అందులో ఒక దానిని పేతురు పెంతెకోస్తు దినమున వాడెననుటలో ఆశ్చర్యము లేదు! ఆ ద్వారములోనికి ఎట్లు ప్రవేశించవలెనో వారు తెలిసికొనుచున్నారు. అతడు తాళపుచెవిని వాడుకొనెను. మరియు ఒకే ఒక తాళపుచెవి కలదు, ఎందుకనగా ఒకే ఒక ద్వారమున్నది. "నేనే ద్వారమును." దానియొక్క తాళపుచెవి పేతురుకు దొరికెను. మరియు అతడిట్లు పలికెను, "ప్రతివాడును మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు దేవుని ధననిధులను పొందెదరు." అదే ద్వారమునకు తాళపుచెవి, మరియు యేసే ఆ ద్వారము.
EXOD 15:26•
PS 103:3•
JOHN 14:27
33స్వస్థతకు కేవలము ఒకే ఒక ద్వారమున్నది, మరియు యేసే ఆ ద్వారము.
సమాధానమునకు ఒకే ఒక ద్వారమున్నది. "నా సమాధానమునే మీకిచ్చుచున్నాను." నిజమైన సమాధానమునకు ఆయన మాత్రమే ద్వారమై యున్నాడు. నీకు సమాధానమున్నదని నీవు తలంచవచ్చును. నీవు చాలినంత డబ్బును కూడబెట్టి నీ ఇంటిని కొనుక్కోవచ్చును, నీవు చాలినంత డబ్బును కూడబెట్టి, నీ పిల్లలకు బట్టలను కుట్టించవచ్చును, తినుటకు ఆహారమును సమకూర్చవచ్చును, జనుల మధ్య నీకు ఎంతో పేరు-ప్రతిష్ఠలు ఉండవచ్చును. కాని నీవు చెప్పులు విడిచి రాత్రి పడకకు వెళ్ళేముందు ఒక్కటి మాత్రమే నీకు శాంతిని ఇవ్వగలదు. ఈ రాత్రి నీవు చనిపోవుట జరిగినచో, ఒకే ఒక సమాధానమున్నది. మరియు, అది యేసే ఆ సమాధానము. ఆయనే మనయొక్క శాంతి.
ఆయనే మన స్వస్థత. "నేనే నీ దేవుడనగు యెహోవాను. నీ వ్యాధులన్నియూ స్వస్థపరచెదను."
పరలోకమునకు ద్వారము ఆయనే. మరే ఇతర ద్వారము గాని, మరే ఇతర మార్గము గాని లేదు, యేసుక్రీస్తు ద్వారానే. పరలోకమునకు ఆయనే ద్వారము.
వీటన్నింటినీ మార్గము యేసే, మరిప్పుడు ఆ ద్వారమును తెరుచు తాళపుచెవి విశ్వాసమే. మరియు దేవుని యొక్క వాగ్దానములన్నింటికి ద్వారము యేసే. ఇప్పుడు, అట్లయినయెడల ఆయన ముగించిన విశ్వాసమనే క్రియ దేవుని యొక్క రాజ్యములోగల ప్రతి ధననిధులను మరియు ప్రతి ద్వారములను అది (విశ్వాసము) తెరుచును. దానిని చూచారా? ఆయన చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చు తాళపుచెవి విశ్వాసమే, విశ్వాసపు తాళపుచెవి దానిని చేయును, ఆయన చేసి ముగించిన క్రియయందు విశ్వాసముంచవలెను. ఆ తాళపుచెవి గూర్చియే మనం మాట్లాడుకొనుచున్నాము.
34ఇప్పుడు హెబ్రియులకు వ్రాసిన పత్రికలో, 11వ అధ్యాయము. నేను ఇక్కడ గొప్ప భాగములను వ్రాసియు౦చాను, విశ్వాస వీరులున్నారు. అదే ద్వారము యొక్క తాళపుచెవి, సింహముల నోళ్ళను మూయించినది. ఆ విశ్వాసపు తాళపుచెవి, అగ్ని గుండములను చల్లార్చినది, ఖడ్గములను తప్పించుకొనినది, మరణించిన వారిని మరల జీవముతో లేపినది. అది విశ్వాసము, సజీవుడగు దేవుని యందు గల విశ్వాసమనే తాళపుచెవి. పురుషులు, దేవుడు ఎవరైతే తమ హస్తములలో ఈ విశ్వాసమనే తాళపుచెవిని కలిగియుందురో, దేవుడు వాగ్దానము చేసిన ప్రతి ద్వారములను వారు తెరచుదురు. నీకు ఆ తాళపుచెవి లేనియెడల ఎన్నడునూ దానిని తెరువలేవు. దానిని నీవు ఎంత త్రోసినా అది నీకు తెరువబడదు.
సరిగ్గా తయారు చేయబడిన ఏ తాళపుచెవికయినా గాని ఒక క్రమ రూపముండును. మరియు ఆ తాళమునకు లోపల లీవర్ యుండును, ప్రత్యేకముగా తయారుచేయబడిన తాళపుచెవి మాత్రమే వాటిని నెట్టగలదు. మరియు చిన్న లీవరు గాని పొరపాటుగా పడినయెడల, మొత్తం తాళమంతా గందరగోళమగును.
35అందువలననే, నేను సంపూర్ణ సువార్తను నమ్ముచున్నాను, దేవుని ప్రతి వాక్యమును నమ్ముచున్నాను, దేవుని యొక్క శక్తిని అది తెరచును, అది ప్రజలను దేవుని దీవెనలవైపుకు మళ్ళించును. అదియే ఆ ద్వారమునకు తాళపుచెవి, దానిని తెరచునది ఇదియే. ఓ, ఆ గొప్ప వీరులు, ఆ ప్రవక్తలు మరియు పరిశుద్ద గ్రంథములోని మహానుభావులు, వారు ఈ తాళపుచెవినే కలిగియుండిరి. ఆ కారణముచేతనే వారు సింహముల యొక్క నోళ్ళను మూయగలిగిరి, అగ్నిని ఆర్చగలిగిరి, ఖడ్గమును తప్పించుకొనగలిగిరి, చనిపోయినవారిని మరల బ్రదికించుకొనగలిగిరి, మరియు ఎన్నో రకముల అద్భుతములను చేయగలిగిరి, ఎందుకనగా వారు ఆ తాళపుచెవిని పట్టుకొనగలిగిరి. మరియు దానియొక్క క్రియను వారెరుగుదురు, ఎందుకనగా అది లేఖనపూర్వకముగా జన్మించిన తాళపుచెవి.
ఇప్పుడు, ఒకవేళ నేను మతమనే (ఆచారవు) తాళపుచెవిని పట్టుకొనియున్నయెడల, అది ఏమి చేసియుండునో నాకు తెలియదు. "నా సంఘము పలికినదే వేదవాక్కు," అని వారనవచ్చును. దానిని గూర్చి నాకు తెలియదు.
COL 3:17
36కాని ఎప్పుడైతే దానిని పరిశుద్ద గ్రంథము బోధించుచున్నదో, మరియు నా హృదయములోనో లేదా నా చేతిలోనో ఆ విశ్వాసమనే తాళపుచెవిని కలిగియుండిన, "అది దేవుని యొక్క వాక్యము," అని అది చెప్పును, అది అగ్ని జ్వాలలను ఆర్పును, అది రోగులను స్వస్థపరచుటకు తెరచును, అది నశించినవారిని రక్షించుటకు తెరచును. నేను ద్వారమునొద్దకు వచ్చియున్నాను, అంతా ఆయన నామములోనే జరుగును. "మీరు క్రియలోను, మాటలోను ఏది చేసినాగాని సమస్తమూ ఆయన నామముకొరకే చేయుడి." విశ్వాసమే నీ యొక్క తాళపుచెవి అని ఎరుగుము. ఎందుకనగా అది లేఖనప్రకారము-తయారుచేయబడిన తాళపుచెవి. అది సిద్ధాంతమనే తాళపుచెవి అయినచో, శాఖకు చెందిన తాళపుచెవి అయినచో, అదేమి చేయునో నేనెరుగను. కాని అది లేఖన సంబంధమగు తాళపుచెవి అయినయెడల, అది తెరచును, ఎందుకనగా దేవుడు ఆలాగున చెప్పెను. ఇపుడు, ఓ, వారు అగ్ని జ్వాలలను ఆర్పగలిగినందుకు ఆశ్చర్యపడనవసరము లేదు, ఎందుకనగా మరియు వారి యొద్ద తాళపుచెవి యున్నది.
37దేవుడు ఆ ప్రవక్తలతో చెప్పిన దానిని వారు చేయకుండా ఎవరూ ఆపలేకపోయిరి. ఆయన ఒకప్పుడు నాకు చేసిన విధంగా వారికి చేయనవసరము లేకపోయెను. వెళ్ళి దీనిని చేయుమని పదే పదే నొక్కి చెప్పనవసరము లేనే లేదు. (నేనది ఆశించను) "వెళ్ళి దీనిని చేయుము," అటు పిదప నీవు తొట్త్రిల్లుచుందువు, "తర్వాత వెళ్ళి దీనిని చేయుము," మరియు "వెనుకకు వెళ్ళుము మరియు మరల దీనిని చేయుము, నీవు దానిని సరిగ్గా చేయలేదు." ఒక చిన్న మాట మాత్రమే! కొద్దిగా వారితో ఆత్మ చిన్నగా పలుకుచున్నట్టుగా వారికి అనిపించును, "దానిని ఇలానే చేయవలెను, మరియు వారిని ఏదియూ ఆపజాలదు. సహోదరుడా, వారు సింహముల నోళ్ళను మూయగలిగిరి, ఖడ్గధారలను తప్పించుకొనిరి, అగ్నిజ్వాలలను ఆర్పిరి, వారు అన్ని కార్యములు చేసిరి. దేవుని మాటను చిన్నగా వినినందునే వీరు చేయకలిగిరి, ఎందుకనగా వారు తమ చేతులలో ఆ తాళపుచెవిని కలిగియుండిరి. ఆ గొప్ప విశ్వాసము! వారు దేవుని కొరకు కార్యములు చేసిరి, ఎందుకనగా ఏదియూ వారిని ఆపజాలకపోయెను. ఓ, ఎంత మహిమకరము!
38ఒకసారి ఒక యువకుడు ఒక వృద్దాప్య సహోదరుని యొద్దకు అనగా, భక్తిగల ఒక వృద్దాప్య దైవప్రవక్త యొద్దకు వచ్చెను. అతడు నిరంతరము దేవుని యొక్క మ౦చితనమును గూర్చి చాటించుచూ సాక్యమిచ్చుచుండుటను ఇతడు వినుచుండెను, మరియు క్రీస్తు ఎవరో ఏమిటో మరియు అలా చెప్పుకుంటూ ముందుకు సాగిపోవుచుండెను. దేవుడు చేసిన దాని గూర్చి చెప్పెను. క్రీస్తు ప్రేమను వివరించెను. ఎవరినీ లెక్క చేయక సాగిపోవుచుండెను. చివరకు ఈ యువకుని సేవకై అభిషేకించగోరెను. ఈ యువకుడు అందుకే ఈ వృద్దుని యొద్దకు వచ్చి ఇట్లు ప్రశ్నించెను, "అయ్యా! మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను.
"అతడు యవ్వనుడా, అడుగుము!" అనెను.
అతడు, "నీవు చెప్పుకునేటంత వాస్తవంగా క్రీస్తు నీ పట్ల చేయుచున్నాడా?" అని అడిగాడు.
అతడు "నేను మాటలలో చెప్పలేనంత అధికముగా ఆయన పని చేయుచున్నాడు," అని చెప్పెను. అక్కడే నీవు వుండవలెను. అదేమిటది? అతడు తాళపుచెవిని కనుగొనెను.
మరియు అవి వాస్తవములని ఘోషి౦చుచున్నావు. అట్లయిన నేను అదే యేసును, అంతే వాస్తవంగా తెలిసికొనగోరుచున్నాను." అది ఏమిటి? ఆ ముసలివాడు ఒక తాళపుచెవిని పట్టుకొనియున్నాడని అతడు గ్రహించెను. దానిద్వారా అతడు తెరువగలడు మరియు మూయగలడు.
39తాళపుచెవి తెరువగలదు మరియు మూయగలదు అని మీరెరుగుదురు. చూచారా? మీరు విప్పగలరు మరియు బంధించగలరు. అది నిజము. ఒకే తాళపుచెవి తెరచును మరియు మూయును. తెరువగల తాళపుచెవియే మూయ గలదు. ఇది అక్షరాలా నిజము. అది రెండు విధముగా పనిచేయును. దాని యొక్క దర్శనమును సంఘము పోగొట్టుకొన్నదని ఎరుగుట ఎంత విచారకరము! చూడండి, ఈనాడు సంఘము ఆచారముల కొరకు దానిని అమ్ముకొనినదని ఎరుగును, ఎంతటి విచారకరమైన కార్యమైయున్నది, మరిప్పుడేమో ఏకమగుటకు పిలచుచున్నారు, నేడు అదే మనము చేశాము.
ఆ గొప్ప రోమను వంశమువారు ఏమి చేసిరో మనము చూచాము. వారు ఎలాగయినా మనలను ఎదుర్కొందురు, మరియు కొన్ని కార్యక్రమములను మార్చుదురు. వారు మార్చరని నేను తలంచాను; కాని దానిని చేయుదురు, ప్రతి గురువునకు పోపు యొక్క అధికారమును ఇచ్చెదరు, ఎంత విచారకరము! సంఘము వాక్యమును విడిచిపెట్టి ఆచారములను హత్తుకొనినది, కాని వారు ఏలాగయినా గాని వాటికొరకు అమ్ముడుపోయినది, చూచారా? వారు తాళపుచెవిని అక్కడే పోగొట్టుకొనిరి. ఆ కారణముచేతనే ఈనాడు జనులముధ్య ఇంతకు ముందు జరిగెవిధముగా ఆ గొప్ప అద్భుతములు సూచక క్రియలు జరుగుట లేదు, వారు తాళపు చెవిని పోగొట్టుకొనిరి! వారికి ద్వారము తెలియును, కాని ఆ తలుపును తెరచు తాళపుచెవి కావలెను. ఆ ద్వారము లోపటనే నిధులున్నవి. అవి తాళము వేయబడినవి, అవిశ్వాసికి కనబడుటలేదు. కాని విశ్వాసి, ఎవరైతే విశ్వాసమును కలిగియున్నారో మరియు విశ్వాసమనే తాళపుచెవితో, ఆ తలుపులను తెరచుదురు. అవును, అయ్యా.
40ఒక సమయమున ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం, ఒక మిషనరీ సహోదరుడు వుండెడివాడు, మరియు అతడిని ఆఫ్రికాకు వెళ్ళమంటున్నట్లుగా పిలుపు వినినట్టుగా అనుభూతిని పొందెను. అతడొక యవ్వనప్రాయపువాడు; భార్య మరియు ఇద్దరు పిల్లలు, చాలా అందమైన ఆడపిల్లలుగలరు; ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వయస్సులోనివారు. ఈ యువకునికి వీరిని విడిచి వెళ్ళుట అసాధ్యముగా యుండెను. అతడు బోధకుడు, ఆ ప్రాంతములో అతనికి సంఘమున్నది. కాని ఆ పిలుపును అణచలేకపోవుచున్నాడు, అతడు తప్పకుండా ఆఫ్రికాకు వెళ్ళవలెను. అతడు దివారాత్రులు ప్రార్ధి౦చెను. వెళ్ళుటకు అతనికి మనస్సులేదు. కాని దేవుడు మాట్లాడుట ఆపలేదు, "నీవు తప్పకుండా వెళ్ళవలెను!" అని చెప్పుచుండెను. చివరకు అతడు ఎచ్చటికి వెళ్ళవలెనో నిర్ణయించుకొను స్థాయికి వచ్చెను.
41కావున అతడు తన సంఘము యొక్క మిషను బోర్డు యొద్దకు వచ్చెను. మరియు వారితో ఇట్లనెను, "రోడేషియాలోని అరణ్యములోనికి మిషనెరీగా దేవుడు నన్ను పిలచుచున్నాడు. ఆ అరణ్యములలో జీవించువారికి మలేరియా, విషజ్వరము, ఎండవలన కలిగే వ్యాధులు, కుష్టరోగము, మరియు, ఇంకా ఆయా అడవి వ్యాధులు వచ్చుచుండెను, అచ్చటికి అతడు వెళ్ళవలెను. మిగిలిన జీవితమంతా అక్కడే అతడు గడపవలెను. తన ఇంటిని అమ్మివేసెను, తనక ఉన్నదంతయూ అమ్ముకొనెను. మిషను బోర్డు అతనిని పరీక్షించగోరెను, వారిట్లు అతనిని ప్రశ్నించిరి, "ఇప్పుడు నీవు నిశ్చయంగా వెళ్ళుదువా?"
"తప్పకుండా!" అన్నాడు.
వారతనికి ఈలాగున చెప్పిరి, "అయ్యా! ఈ విషయములో నీవు ఆలోచించుకొనుము. నీకు అందమగు ఇద్దరు ఆడపిల్లలున్నారు, చక్కని భార్యయున్నది. కావున, అసలు నీవు ముందు వెళ్ళి అక్కడ ఎట్లున్నదో చూచి రమ్ము?"
"లేదు, ప్రభువు నాకు చెప్పెను. ఓ, అది చాలా వాస్తవము!" ప్రభువు నన్ను పిలచెను అని అతడు చెప్పెను. నా గృహమును విడిచిపెట్టుటకు నేను ఇష్టపడలేదు. నా సంఘమును, నా జనులను విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు, కాని ఆ అరణ్యములోనికి వెళ్ళమని ప్రభువు నన్ను పిలచియున్నాడు," అనెను
42వారిట్లనిరి, "అయ్యా! నీ చిన్న కుమార్తెలకు విషజ్వరము లేదా నల్లని నీటి వలన వచ్చే జ్వరములతో మరియు ఒక్క రాత్రిలోనే చనిపోవచ్చును." మరియు ఆ విధంగా చనిపోయినవారి జాబితా మా యొద్ద యున్నది. అంత భయంకరమగు వ్యాధులకు వారు గురి కావచ్చును. వాటికి మందు లేదు. చాలా మంది పిల్లలు ఆలాగే మృతిచెందిరి. "కుష్టురోగము గురించి ఆలోచించు, నీ అందమైన భార్యకు, నీ చక్కని కుమార్తెలకు కుష్టురోగము వచ్చినదనుకొనుము. ఆ మండే సూర్యుని మీరు భరించలేరు, అని చెప్పిరి. అటువంటి గొప్ప ప్రమాదభరితమగు స్థలమునకు నీ భార్య, పిల్లలను నీవు తీసికొని వెళ్ళుటకు ఇష్టపడుదువా?" అని వారు అడిగిరి.
ఆ యువకుడు మిషనరీ అచ్చట నిలబడియుండెను, మరియు అతని బుగ్గల మీద కన్నీరు కారుచుండెను. అతడు వారివైపు తిరిగి ఇట్లనెను, "సోదరులారా, దేవుని దర్శనము నాకున్నది. ఆయన నన్ను పిలచెను. దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలచెను గనుక నా కుటుంబము, నా పిల్లలు ప్రపంచములో మరే చోటును లేనంత క్షేమముగా ఆఫ్రికాలో యుందురు." ఆమేన్! అది ఏమిటి? అతని పిలుపునకు తాళపుచెవి యున్నది, అతడు మాట్లాడుచున్నాదానిపై అతడికి విశ్వాసము యున్నది. ఓ, నేను అనుకున్నాను, ఎంత గొప్ప మాటలవి! దానిని మొదట నేను వినినప్పుడు, నా గుండె గంతులు వేసినది. చూడండి, "దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలచినయెడల, అక్కడ కుష్టురోగమున్నా మరెన్ని రకముల వ్యాధులున్నా, నా పిల్లలు, నా కుటుంబము భూమిమీద మరే ఇతర స్థలములోను ఉండనంత క్షేమముగా అచ్చట ఉందురు." అతని యొద్ద తాళపుచెవి యున్నది. దానికి అదే కావలెను.
43ఎపుడైతే నీవు తాళపుచెవిని కలిగియుందునో, నీకు భయముండదు, నీకు సందేహము రాదు, నీకు ప్రశ్న రాదు, దానిని గూర్చి ఎవరినీ నీవు అడుగవలసిన పనియుండదు, నీకు ఖచ్చితంగా తెలియును. నీ చేతులలో అదియున్నది, ఏమి చేయవలెనో నీకు తెలియును. ఆమేన్. ఏమి జరుగునో నీకు తెలియును, ద్వారము తెరువబడునని నీవెరుగుదువు. నీవు లీవర్లను పరీక్షించియున్నావు, మరియు అదే సరియైనదని నీకు పూర్తిగా తెలియును, నీవు తాళపుచెవిని ఉపయోగించగానే తలుపు తెరచుకొనునని నీకు తెలియును.
ఓ, సంఘమునకు తాళపుచెవులు ఉండినయెడల చాలును! విశ్వాసపు తాళపుచెవిని సంఘము కలిగియుండినయెడల, ఏ తలుపునైనా, ఏ వ్యాధినైనా, ఏ తెగులునైనా, ఏ రుగ్మతనైనా మనము నిరోధించగలము. ఈ తాళపుచెవి మనకు ఉండినయెడల దానిని మనము తెరువగలము. అతడికి తన పిలుపు విషయములో తాళపు చెవియున్నది.
44వ్యక్తిగత సాక్ష్యమును మీరు వినవలెని కోరుదును. ఇప్పటికి పదిహేను లేదా పదిహేడు సంవత్సరములైనది, నాకు గుర్తున్నది. ఆ నది యొద్ద దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఆ అగ్ని స్తంభమునుండి ఎప్పుడైతే ఆయన క్రిందికి దిగివచ్చెనో, ఎవరి పటమును (ఫోటోను) మీరు చూచితిరో, మరియు ఆయన నాతో చెప్పెను, మరియు "నీవు ఈ వర్తమానమును ప్రపంచమంతటికి కొనిపోవలెను," అని ఆయన చెప్పెను.
మరియు గ్రీన్స్ మిల్ వద్ద ఆయన నాతో మాట్లాడినది నేను మరువజాలను.
మరియు నేను వెళ్ళి సంఘకాపరితో చెప్పాను, అతడు నాతో ఇట్లనెను, "బిల్లీ! ఆ రాత్రి నీవేమి తిన్నావు? నీకు పీడకల వచ్చినది," అని చెప్పెను, "నీ ఉద్యోగమునకు తిరిగి వెళ్ళుము. సర్వీస్ కంపెనీలో నీవు పని చేయుచున్నాము, అది చాలా మంచి ఉద్యోగము; మరియు వెళ్ళి నీ పనిని చూచుకొనుటలో శ్రద్ద వహించు, కుమారుడా," "నీకు ఒక పీడకల వచ్చినది. దేనినో నీవు భుజింతివి?" అనెను. ఆ మాటలు నన్ను ఒక్క అంగుళము కూడా చలింపచేయలేదు.
స్వస్థతాకూటములను నేను ప్రారంభించినప్పుడు, ఆ ఉదయమున నా వర్తమానమును మీరందరూ గుర్తుంచుకొనియుందురు, "గొల్యాతు మీదికి దావీదు వెళ్ళినట్లుగా," అను అంశముపై నేను ప్రసంగించాను.
45వారు నాతో ఇట్లనిరి, "ఆధునిక సైన్సు కాలమిది, అన్ని రకముల శాస్త్రీయ, వైద్య పరిశోధనలు జరుపుచున్నప్పుడు, అత్యుత్తమ వైద్బులు మనకున్నప్పుడు, సంఘము ఎప్పుడో దైవిక స్వస్థతను మరచిపోయి మరియు చాలా సంవత్సరముల క్రితమే దానిని విడిచిపెట్టిన ఇటువంటి పరిస్థితుల్లో వారిమీదికి నీవెట్లు వెళ్ళగలవు? ఆ మెథడిస్టుల, బాప్టిస్టుల, ప్రెస్బిటేరియనుల, మరియు పెంతెకోస్త వారి గుంపులమీదికి నీవెట్లు వెళ్ళగలవు? దానిని వారు మరచిపోయి, చాలా కాలమైనది. వారు ఆచారములను పట్టుకొనియున్నారు. నీకు ఏ శాఖ యొక్క ప్రోద్బలము లేదు మరియు ఇతర కార్యములు కూడా నీ వెనుక ఏమి లేకుండ వారినెట్లు ఎదుర్కొనగలవు, బిల్?" అని వారు చెప్పిరి. "ఎవరూ నిన్ను నమ్మరు. నీవు దానిని చేయజాలవు. ఎవరూ నిన్ను నమ్మరు," అని వారు చెప్పిరి. ఏది ఏమైన, ఏదైనగాని, అది నన్ను ఒక్క అంగుళంకూడా కదిలించలేకపోయినది, ఎందుకనగా నా చేతిలో విశ్వాసమనే తాళపుచెవి కలదు," అని నేను చెప్పితిని.
నేనిట్లు పలికాను, "నేను లెక్క చేయను. ఒకటి మాత్రము నిశ్చయము; దేవుడు నన్ను పిలచెను, మరియు దేవుడు నన్ను పిలచెను గనుక తప్పక నేను వెళ్ళవలెను." నేను తాళపుచెవిని పట్టుకొనియున్నాను. ఆయన నన్ను పిలచియున్నాడు, ఆయన నాకు చూపించెను, ఆయన నాకు చెప్పెను, మరియు పలుకబడిన వాక్కు ఆయన నన్ను పిలచినప్పుడు ఆయన యొక్క ప్రసన్నతను నేను చూచాను, ఆ తాళపుచెవులు అచ్చట యున్నవి!
సంఘకాపరి ఇట్లనెను, "ఏడవ తరగతి చదువుతో, మరి నీవు వెళ్ళి ప్రసంగించుటకు, మరియు ప్రార్థించుటకు రాజుల యెదుట, వరియు చక్రవర్తుల యెదుట ఏలాగు నిలబడగలవు?"
"దేవుని వాక్యానుసారముగానే ఇది జరుగును!" అని నేనన్నాను.
46గత సంవత్సరం ఇదే సమయములో లేదా ఒక వారము లేదా రెండు వారములముందు, ప్రభువైన దేవుడు నాకొక దర్శనము అనుగ్రహించెనని, ఎప్పుడైతే దానిని నేను పొందుకున్నానో, ఈ సంఘమునకు వచ్చి మీతో దానిని చెప్పితిని. వేటాడుటకు వెళ్ళు పర్యటన దర్శనము, మరియు ఒక ప్రత్యేకమైన జంతువును నేను వెదుకుచూ వెళ్ళుచున్నాను, మరియు ఆ రహదారిపై ఈ జంతువులను వెదుకుచుంటిని. దాని కొమ్ములు నలుబది-రెండు అ౦గుళముల పొడవైనవి. (అది ఎక్కడ వుండునో, ఏ స్థానములో అది వుండునో అని చూచాను), ఆ రహదారిపై వెండికొన మూతిగల ఒక ఎలుగు బంటిని నేను చంపబోవుచున్నాను. మరియు నేను ఈ పత్యేకమైన స్థలమునొద్దకు వెళ్ళాను, మరియు నేను ఒక వ్యక్తితో మాట్లాడుచున్నాను, మరియు "నాకు తెలియదు ఏ జంతువైన దీనిలా వుంటాదని, మరియు అసలు ఇలాంటి ఒక ఎలుగుబంటిని నేను ఎన్నడునూ ఒక్కటైననూ చూడలేదు," అని అతడు చెప్పెను.
నేనిట్లు పలికాను, "అది ఇక్కడే ఎక్కడో ఉండవలసియున్నది."
కావున, అతడిట్లు జవాబిచ్చెను, "మేమసలు ఎలుగుబంటి వుండే ప్రాంతములోనికే వెళ్ళుటలేదు. మనము గొర్రెలకొరకు వెళ్ళుచున్నాము, ఆ కలపను దాటి వెళ్ళుదుము." సరే, అతనితో నేను వెళ్ళాను.
47మరియు రెండు రోజులు గడిచాక, సరిగ్గా, ప్రభువు చెప్పిన స్థలంలోనే ఆ జంతువున్నది. నేను వెళ్ళి ఆ జంతువును వేటాడి తెచ్చాను, మేము దాని చర్మమును, కొమ్ములను ఒలిచాము, అప్పుడా వ్యక్తి నన్ను ఇట్లు అడిగెను, "నేను ఒక దానిగురించి నిన్ను అడగాలనుకుంటున్నాను. మూడు రోజుల క్రితం మనం ఆ శిబిరమును వదలి వచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన జంతువును నీవు చంపిన తరువాత, ఆ రహదారి నుండి తిరిగి వచ్చుచున్నప్పుడు, ఒక వెండికొన మూతిగల ఎలుగుబంటిని చంపుతావని, నీవు నాతో చెప్పితివి. నీకేలాగు అది తెలియును?"
"అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు?" అని నేను అన్నాను.
అతడు చెప్పెను, "నేను ఏమాత్రము సందేహించుట లేదు," "ఎందుకనగా నా సోదరునికి మూర్చరోగము, మరియు నీ జీవితంలో ఎన్నడునూ అతనిని నీవు చూడలేదు. ఒకసారి నీవు అచ్చటికి వచ్చినప్పుడు, మరియు ఆ బాలుడు స్వస్థత పొందుకొనునని నీవు చెప్పినప్పుడు, నేను ఆ ప్రత్యేకమైన కార్యమును చేసితిని, మరియు అతడు స్వస్థతను పొందెను," అని అతడు పలికెను. ఇంకా అతడిట్లనెను, "కాని, ఇప్పుడు, బ్రన్హాం సహోదరుడా, నేను నిన్ను అడగాలనుకుంటున్నాను, ఆ కొండ క్రిందనుండి ప్రతీ చోటను ఆ కలప ఉన్నంతవరకు చూచుకొంటూ వచ్చితిని, అక్కడ గుర్రములు నిలబడియున్నవి, మరియు అక్కడ ఏమీలేదు. ఒక్క గడ్డిపోచ కూడా లేదు, ఒక్క రాయికూడా లేదు, అసలు ఏమియూ లేదు, అని అతడు అడిగెను." కారిబో మోస్, రెండు అంగుళాల ఎత్తులోగలదు, ఆ కలపగల స్థలములో పైన ఉన్నది, (ఆ స్థలం జంతువులు దాగుకొనుటకు, వుండుటకు వీలులేనిది). ఒక మైలు లేదా కొన్ని మైళ్ళ దూరములో ఆ కలప వరుసయున్నది, "ఆ ఎలుగుబంటి ఎక్కడనుండి అది వచ్చినది," అని అడిగెను.
నేనిట్లు పలికాను, "దేవుడు యొహోవా యీరే అయివున్నాడు. అక్కడ ఒక ఎలుగుబంటి యుండునని ఆయన నాతో చెప్పెను, గనుక అక్కడ ఒక ఎలుగుబంటి వుండును."
JOHN 10:9
48ఆ కొండకు దిగువగా, ప్రతిసారి దాదాపుగా అరమైలు దూరమున ఉన్నప్పుడు లేదా దానికి చాలా దగ్గర అవుతున్నకొలది అతడు ఇట్లు నాతో అనెను, "బ్రన్హాం సోదరుడా, ఆ ఎలుగుబంటి కనబడవలసిన సమయము ఇదే?"
"నీకెందుకు చింత? అది ప్రత్యక్షమగును," అన్నాను.
మరియు ఆ గుర్రములు వుండు చోటికి దాదాపు అయిదు వందల గజముల దూరములో మేమున్నప్పుడు విశ్రాంతికి ఉపక్రమించాము, ఎందుకనగా మా భుజముల మీద ఆ కొమ్మలు మొదలగు వస్తువులు చాలా భారముగా యున్నవి. మరియు అతడు మరల నావైపు తిరిగి చూచెను, మరియు నేను అతనివైపు తిరిగి అతని ముఖమును చూచాను. అతడు కూడా నావైపు చూచెను, అతని హృదయాంతరంగములో ఏదో ఆశ్చర్యము కానవచ్చుచున్నది. చూడండి, ఎందుకనగా అది ఇచ్చట కనబడునని ఆశించాడు, అయినా అతని చేతిలో తాళపుచెవి లేదు.
కాని ఎలాగైతేనేమి, దేవుని కృప ద్వారా, ఆయన నాకు ఎన్నడును ఓటమిని కలుగజేయడు. ఆయన అక్కడ వెండికొన మూతిగల ఎలుగు బంటియుండునని నాతో చెప్పెను, నా యొద్ద తాళపుచెవి యున్నది. ఏ మాత్రమూ నేను సందేహించలేదు. అతనివైపు నేను తిరిగాను, మరియు "బడ్, అది అక్కడ వున్నది," అని నేను చెప్పాను. మరియు కొంచెంగా నేను తిరిగి చూచాను, ఒక అర మైలు దూరములో ఆ ఎలుగుబంటి సరిగ్గా అక్కడే మాకు దగ్గరలో అది నిలబడి యున్నది.
అతడు కండ్లద్దములను తీసివేసి నాతో ఇట్లనెను, "బిల్లీ, అది ఒక పెద్ద ఎలుగుబంటి! కావున నాకు సహాయము చేయుము."
చూడండి, తాళపుచెవి, ఒక దర్శనము, ప్రభువు యొక్క వాక్యము, దానిని ఏదియూ మార్చజాలదు లేదా దానిని ఆపజాలదు. ఈనాడు సంఘమునకు కావలసినది విద్య కాదు. ఈనాడు సంఘమునకు కానలసినది ఒక శాఖ కాదు. ఈనాడు సంఘమునకు కావలసినది ఆచారము కాదు. ఈ రాత్రి సంఘమునకు అవసరమైనది లేఖనమును ద్వారము యొక్క తాళపుచెవియే. క్రీస్తే ద్వారము మరియు ఆయనే వాక్యమై యున్నాడు. సజీవుడగు దేవుని వాక్యమందు విశ్వాసము కలిగియున్నప్పుడు ప్రతి ద్వారము తెరువబడును.
దేవా, మాకు తాళపుచెవిని దయచేయుము. మాకు తాళపుచెవిని దయచేయుము.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
HEB 12:1
49హెబ్రి 12వ అధ్యాయము ఇట్లు చెప్పుచున్నది, "ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము సుళువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, విశ్వాసముతో మనముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము." "పాపము అనగా అవిశ్వాసమే," చూచారా? ఒకే ఒక పాపమున్నది, అదే విశ్వాసము.
మరియు పాపము అనగా "ఆనవాలును (లక్ష్యమును లేదా గురిని) తప్పి పోవుటయే." నీవు తుపాకీని ప్రేల్చునప్పుడు, గురిని నీవు తప్పినావనుకొనుము, నీవు మరల తుపాకీని సరిచేసికొనవలెను, చూడండి, ఎందుకనగా అక్కడ ఏదో తప్పిదమున్నది. గురిని నీవు తప్పిపోయావు. చూడండి, తిరిగి వచ్చి మరియు మరలా ప్రయత్నించుము. చూడండి, దాని అర్ధము, వెనకకు తిరుగుము, నీవు గురిని తప్పితివి. నీవు ఒక క్రైస్తవునిగా వుండాలని ఎప్పుడు కోరుకుంటావో, మరియు నీవు సంఘమున చేరుదువు, నీవు గురిని తప్పిపోయినట్లే. నీవు ఒక క్రైస్తవునిగా కాగోరినప్పుడు, మరియు నీవు "తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములో చిలకరించుకొందువు. అనగా గురిని తప్పినట్లీ, మరల సరి చేసికొనుట మంచిది. నీవు గురిని కొట్టలేవు. లోకము వాలే నీవు చెదిరిపోదువు. పరిపూర్ణమగు వరుసయందు నిన్ను నిలబెట్టునది ఒకే ఒకటి కలదు, అది లేఖనము, బైబిలు, వాక్యము. ఏలయనగా, భూమ్యాకాశములు గతించును గాని దేవుని వాక్యము ఎన్నడునూ గతించదు.
కావున, తాళపుచెవిని కలిగియుండుడి, వాక్యమందు విశ్వాసముంచుము! మరియు వాక్యమందలి ప్రతి దానియందు నీవు విశ్వాసముంచుము, ఏ మాత్రము సంశయించవద్దు. నీవు ప్రతి ద్వారమును తెరువగలవు, మరియు దేవుడు నీకొరకు దాచియుంచిన ప్రతి ఆశీర్వచనమును నీవు పొందుకొనగలవు. ఆ తాళపుచెవిని పట్టుకొనియుండు భాగ్యమును కలిగియుండునట్లు దేవుడే కృప చూపవలెనని, నా ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనకు తలలు వంచుదము.
50మా పరలోకపు తండ్రీ, మా రక్షణను తెరచుటకు నీవు మాకొక తాళపుచెవిని అనుగ్రహించినందులకు మేము మీకు ఈ రాత్రి వందనములు చెల్లించుచున్నాము. నేను దానికొరకై కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, ప్రభువా, మేము రక్షించబడియున్నాము, మరియు ఇంతవరకు మేము ఆ తాళపుచెవిని ఎంతగానో ఉపయోగించుకొని యున్నాము. కాని, దేవా, మాకు విశ్వాసము దయచేయుము, నీ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలన్నియూ చిన్న కొక్కెములుగా యున్నవి. ఈ యేసే… ఈ ద్వారమైయున్నాడు, నా భావము, ద్వారమనే క్రీస్తు; మరియు విశ్వాసమనబడే తాళపుచెవి, ప్రతి వాక్యమును తాకును, మరియు తెరువును. అది ఆ చిన్న కొక్కెమును (లివరును) కదలించు (ప్రక్కకు త్రోసి) మరియు మనము ఆ ఆశీర్వచనములోనికి ప్రవేశించుదుము. పరలోకపు తండ్రీ, మాకు తాళపుచెవి దయచేయుము, అప్పుడు మేము దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించునట్లు, అప్పుడు మా విశ్వాసము తప్పిపోదు, మేము నీకు సేవ చేయగలము మరియు మాతో కలసియున్నవారికి ఉపయోగపడగలము.
ప్రభువా, మా ప్రతి పాపమును, అవిశ్వాసమును క్షమించుము. మరియు నీ వారిగా యుండునట్లు సహాయము చేయుము. ఇప్పుడు మేము సహవాసపు బల్లయొద్దకు వచ్చుచున్నాము. మరియు పరలోకపు తండ్రీ, మా అపరాధముల నన్నింటినీ క్షమించుమని నీకు ప్రార్థించుచున్నాము, అప్పుడు మేము దేవుని బల్లయొక్క సహవాసపు సంతోషములో ప్రవేశించగలము. దీనిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
1COR 11:29
51నా సోదరీ సోదరులారా పరలోకరాజ్యపు తాళపుచెవులను, ద్వారము యొక్క తాళపుచెవులను, రక్షణ తాళపుచెవులను, మీరు కలిగియుండుడి, ద్వారములను తెరచుటకు దేవుడు మీకు సహాయము చేయును గాక, యేసు లోనికి ప్రవేశింపనిమ్ము. మీరెంతగానో ఆకాక్షించుచున్న వాటిని ఆయన మీకనుగ్రహించనిమ్ము!
ప్రభురాత్రి భోజనమును గూర్చి వాక్యము చదువుటకు ముందుగా ఒక్క విషయమును నేను చెప్ప గోరుచున్నాను, ఎందుకనగా ఇది ప్రభురాత్రి భోజనసమయము. ఈ బలిపీఠమునొద్దకు వచ్చుటకు ఒకే ఒక మార్గమున్నది, మన చేతులలో విశ్వాసపు తాళపుచెవులను పట్టుకొనవలెను, మన పాపములు క్షమించబడినట్లుగా మనకు తెలియును. ఆ ద్వారమును తెరచు తాళపుచెవిని మనము కలిగియుండనియెడల, మన పాపములు క్షమించబడవు, అప్పుడు ప్రభుని బల్లయెద్ద మనకు ఏ పనియూ లేదు. ఎందుకనగా దానిని అయోగ్యముగా తినినవాడు మరియు త్రాగినవాడు, ప్రభుని శరీరమని వివేచించింపక తినువాడు మరియు త్రాగినవాడు తనకు తాను శిక్షావిధి కలిగించుకొనుచున్నాడు. ఇప్పుడు, అది సత్యము.
52ఈ రోజు జాతీయ సహవాసపు దినమని మీరందరునూ ఎరుగుదురని నాకు తెలియును. అన్ని సంఘములవారు ప్రభురాత్రి భోజనము ఈ దినముననే స్వీకరించెదరు. దేశమంతటా ఈ దినమును జాతీయ సహవాసపు దినముగా వారు పాటించుచున్నారు. కావున మనము ఈ ప్రభురాత్రి భోజనమును తీసుకొను ముందుగా ఒక మాట లేదా రెండు మాటలు దానిని గూర్చి చెప్పుకొనవలెను. ఈలోగా సంఘకాపరి క్రమమైన పద్దతిలో ప్రభురాత్రి భోజనమును గూర్చిన లేఖనములను చదివి దానిని గూర్చి వివరించుటకు సిద్దపడును. ఇప్పుడు, ఈ ప్రభురాత్రి భోజనము… ఇప్పుడు, నేను ఎక్కువ సమయము తీసుకొను, కాని దీని విషయమై పది నిమిషములు తీసుకొందును.
53ఈ ప్రభురాత్రి భోజనమును దానిని తీసికొనుటకై మనము సిద్దపర్చబడుచున్నాము, బైబిలులోని మరే ఇతర సిద్దాంతము విషయములో లేనంత గొప్ప వివాదము దీని విషయములోయున్నది. ఆది సంఘములో వారియొక్క మొదటి వివాదము ఇదే. ఈనాడు ప్రొటెస్టంటువారు, ఎపిస్కోపలియనువారు, మెథడిస్టువారు, మరియు ఇంకా చాలామంది ప్రొటెస్టంటు సంఘములవారు, ఈ ప్రభురాత్రి భోజన విషయములో మరియు రోమను కాతలిక్కువారి సిద్దాంతమును సంతోషముగా అంగీకరించెదరు. మతగురువులు పెండ్లి చేసికొనినా గాని సేవకులుగా కొనసాగవచ్చునని కాతలిక్కు చర్చి తమ కూటములు మరియు సమావేశములలో తీర్మానించినది. ఆ విషయమునకు వారు సమ్మతించుచున్నారు. ఇతర ప్రార్ధనలు మరియు మొదలుగునవి, ప్రొటస్టంటు సంఘము దానికి సమ్మతించుచున్నది, వారియొక్క విశ్వాస ప్రమాణములను, వారియొక్క చిన్న బలిపీఠములను ఇక్కడ మరియు అక్కడ చూడండి, మరియు కాతలిక్కు సంఘము దానిని చేయుటకు సమ్మతించును. కాని వారు ప్రభురాత్రి భోజనము యొద్దకు వచ్చినప్పుడు, అక్కడే వారు తొట్రిల్లుచున్నారు. చరిత్రను చదివిన వారెవరైనా దీనిని ఎరుగుదురు. కాని నా ఆలోచన ప్రకారము, దానిని నేను అంగీకరించు ముందు, వారు తప్పిపోవుటకు చాలా విషయాలు ఉన్నవి, ఎందుకనగా వారు సమ్మతించినది అది పరిశుద్ద గ్రంథములో లేనిది.
54కాని కాతలిక్కు సంఘము గూర్చి ఒక సంగతి నేను చెప్పగోరుచున్నాను. కాతలిక్కు సంఘమును గూర్చి మీరెరుగుదురా, ప్రారంభపు దశలో, అది అది అపోస్తలుల పెంతెకోస్తు సంఘమని? నిశ్చయంగా అదే! అది సంఘము యొక్క ప్రారంభము. మరియు మీరు చూడండి వారు ఎక్కడికి వచ్చారో, వారు వాక్యము తీసివేసి మరియు సిద్ధాంతమును చొప్పించిరి.
మరియు ఒకవేళ ఈ పెంతెకోస్తు సంఘముగాని మరో వంద సంవత్సరములు నిలచియుండినచో, ఇప్పుడు కాతలిక్కు సంఘము వాక్యమునకు ఎంత దూరముగా యున్నదో, అంతకంటె ఎక్కువ దూరముగా అది పోవును.
కాతలిక్కు సంఘము ఈ స్థితికి చేరుటకు కొన్ని వందల సంవత్సరములు పట్టినది. ఆది సంఘము నుండి రోమను కాతలిక్కు సంఘము ప్రారంభమైన కాలమునకు మధ్య వ్యవధి మూడు వందల సంవత్సరములు. మరియు పట్టుబడి మరియు వారు అధికార పదవులను కల్పించిరి, మరేవేవో సృష్టించిరి. మరియు వారు కొన్నింటిని ఖండించిరి మరియు మరి కొన్నిటిని చొప్పించిరి మరియు కొన్నింటిని వెలుపలికి తీసివేసి మరియు మరికొన్నింటిని వారి కార్యములను చేర్చిరి. అన్య విగ్రహములను తీసివేసి క్రైస్తవ విగ్రహములను మరియు మొదలగు కార్యములను నెలకొల్పిరి. అన్ని విషయములలోను రాజీపడుచు, చివరకు వారు దేనినైతే పొందుకొనియున్నారో ఇప్పుడు వున్నది అదే, ఈనాటి రోమను కాతలిక్కు సంఘము.
నురియు ప్రొటెస్టంటు పెంతెకోస్తు సంఘము ఇప్పటికి ఏబది సంవత్సరముల నుండి ఉనికిలో యున్నది. మరియు అవి ప్రారంభించిన నాటి స్థితిలో ఇప్పుడు లేవు, దిగజారిపోయి ఇది కాతలిక్కు సంఘముకంటెను అధ్వాన్న స్థితిలో యున్నది. ఇంకా వంద సంవత్సరములకు ఎట్లగునో మీకే తెలియును. అది నిజము. ఇది చెప్పుటకు పెద్ద మాటగా వినబడును, కాని వారెచ్చటనుండి పడిపోయిరో చూడండి. వారు సంస్థగా మారిరి, వారు అన్ని విషయములలోను రాజీపడిరి. వారు ఏ స్థితికి దిగజారిపోయిరో గమనించండి. వారు ఈ విషయములో మరియు సమస్త విషయములలో రాజీపడే స్థితికి దిగజారిపోయిరి, చూడండి, అదే స్తితికి మరలిరి.
55కాని, "సహవాసము," దీనినే "ప్రభురాత్రి భోజనము," అని అందురు. ఇప్పుడు, అనేకమంది ప్రజలు, దీనిని వారు ఉదయమున తీసుకొనగోరుదురు. పరిశుద్ద గ్రంథములో దీనిని ఆయన ఉదయకాలపు అల్పాహారముగా చెప్పబడలేదు. మరేలాగ ఈ ప్రజలు ఈ దినములలో, వారేలాగ దీనిని ఇంకా "ప్రభురాత్రి భోజనము," అని చెప్పుచున్నారు, మరియు వారికది తెలియుట లేదు. వారు "రాత్రి భోజనము" అనే మాటను సగముగా ఖండించి, మరియు దానిని తీసివేసినారు. "రాత్రి" అనే మాటను తీసివేసి, మరియు దానిని "విందు" అందురు. బుద్ధిహీనత! ఇది రాత్రి భోజనము!
ఇప్పుడు, అది ఎల్లప్పుడూ ఒక వివాదముగానే యున్నది, బైబిలు కాలములోనూ ఆ విధంగానే యున్నది. ప్రభురాత్రి భోజనమును జనులు అపార్దము చేసికొనిరి. బల్ల యొద్దకు అర్దము కాని పరిస్తితిలో వచ్చిరి. పౌలు ఆ కొరింథీయులతో చెప్పెను. వారు వచ్చి ప్రభుని బల్లయొద్ద త్రాగుచుండిరి. చూడండి, వారు ఆనాడే దీనిని అపార్థము చేసుకొనిరి. అతడు చెప్పెను, "ఎవడైనను ఆకలిగొనిన యెడల తన యి౦టనే భోజనము చేయవలెను."
56మరొక విషయము, అది అపార్ధము చేసుకోబడినది, అది ఏమనగా. పాపులు, మరియు పాపములో నివసించు పురుషులు వచ్చి ప్రభురాత్రి భోజనము తినెను. అది అపార్ధము చేసుకోబడినది. తన (పెంపుడు తల్లి) తల్లితో జీవించుచున్న పురుషుడు వచ్చి దీనిలో పాలుపొందెను, మరియు సంఘము దానిని గూర్చి అతనితో చెప్పినది; అయినాగాని అతడు వచ్చి సహవసములో పాలుపొందెను.
మరియు వారి మధ్య భేదములుండెను, అయినాగాని వారు ప్రభురాత్రి భోజనము తీసికొనుచుండిరి. అందుకే మరియు అక్కడే, "మీరు అన్యజనులవలె నడుచుకొనుచున్నారు. మరియు మీలో భేదములున్నవి, ముఖ్యంగా కేఫా ఇంటిలో ఇదియున్నది, మరియు అనేక ఇతరేతర కార్యములను నేను గ్రహించుచున్నాను," అని చెప్పెను. "మీరు అన్యజనులవలె నడచుకొనుచున్నారు," అనెను. చూడండి, అది అపార్ధము చేసుకోబడినది.
57ప్రభురాత్రి భోజనమును వారెల్లప్పుడూ అపార్ధము చేసికొనుచునే యున్నారు. నేను గంటల తరబడి దీనిని గురించి చెప్పగలను, కాని మనము ప్రభురాత్రి భోజనములోను, పాదశుద్ధిలోను పాలుపొందవలసియున్నాము. వారు పూర్తిగా పాదశుద్ధిని ప్రక్కకు పెట్టియున్నారు. కొన్ని శాఖలవారు మాత్రమే దీనిని అనుసరించుచున్నారు. చాలామంది పెంతెకోస్తు వారు పూర్తిగా దానిని విస్మరించిరి, చూచారా. అది బైబిలులో వ్రాయబడియున్న విధముగానే ఇంకా ఉన్నది, చూచారా.
ఇప్పుడు, రోమ్ దానిని "ప్రభురాత్రి భోజనము," అని పిలచుటలేదు. దానిని వారు "మాస్, అది ఒక పరిశుద్ద మాస్ అనుచున్నారు. వారు ప్రభురాత్రి భోజనము తీసికొనరు కాని వారు ఒక మాస్ తీసికొందురు. అది ఒక మాస్. వారు మాస్ తీసికొందురు, నిజమైన ప్రభురాత్రి భోజనమును వారు ప్రక్కకు పెట్టిరి. నిజ భావమును వారు విస్మరించిరి. మాస్ అనగా "ఆశించును," అని అర్థము. వారు మాస్ తీసికొని, దేవుడు తమ పాపములను మన్నించెనని నమ్మెదరు (అందుకొరకే ఈ మాస్ ఆచరించెదరు). "మత గురువు వచ్చి యేసుక్రీస్తు యొక్క శరీరమును మరియు రక్తమును వారికందించునని నమ్మెదరు, అది అక్షరాలా క్రీస్తు శరీరమేనని నమ్ముదురు," ఆలాగు చేయుట ద్వారా, దేవుడు తమ పాపములను క్షమించెనని ఆశించెదరు. అది ఒక మాస్.
58ప్రొటెస్టంటువారు దానిని "సహవాసము," అందురు. సహవాసము అనగా "కృతజ్ఞత చెల్లించుట." మాస్ తీసికొనుటు వలన తాము చేయుచున్న తప్పిదమైన కార్యములను దేవుడు మన్నించుననే విశ్వాసముతో కేథలిక్ వారు మాస్ తీసికొనుచున్నారు. వారు ఇంతకుముందే దేవునితో సహవాసము పొందియున్నారనే భావముతో ప్రొటస్టంటువారు దానిని కృతజ్ఞతా భావముతో తీసికొనుచున్నారు; ఆయనతో వారికి సంబంధము ఏర్పడినదని, అది ఎప్పుడో జరిగిపోయిన కార్యముగావారు భావించుచున్నారు. కాతలిక్కులు నిశ్చయంగా దానిని ఆశించుచున్నారు; ప్రొటస్టంటులయితే అది ఎప్పుడో జరిగిపోయినదని వారు చెప్పుదురు.
కాతలిక్కులకు తమ పాపములు క్షమించబడినవో లేదో తెలియదు; ప్రొటస్టంటు వారైతే పాపములు క్షమించబడినవి అని ఒప్పుకొనుచున్నారు, అది వారిని స్వతంత్రునిగా చేయుచున్నది అనిరి. ప్రభురాత్రి భోజనమనగా దేవునితో సహవాసము చేయుట. మరియు మనము ఈ అంశములను తీసికొనిన, ఆశించుట ద్వారానో లేక నమ్మకము ద్వారానో మన పాపములు మన్నించుట కాదు గాని వారేమో మన్నించబడినవి అనడం ద్వారానో కాదు. ఎందుకనగా అది… ఒక ఆశించును (నమ్మకము); మరొకటి విశ్వాసము. తన నమ్మకమే తనకు సరియైనదిగా ఒకరికి ఉండును, ఇంకొకరికి తనకు తెలిసినదే అతడికి సరియైనదిగా యుండును, చూచారా. ఇంకొకరు నమ్మకము మాత్రము యుంచును; ఎందుకనగా అతడు ఎక్కడ నిలబడెనో ఖచ్చితంగా తెలియదు, మరియొకనికి తానెక్కడ నిలబడియున్నాడో నిశ్చయంగా తెలియును, ఎందుకనగా దేవుడు చెప్పిన దానిని అతడు ఎరుగును. అది అదే. ఆ తేడా అక్కడ అదే. కావున, ఎప్పుడైన నీవు నమ్మకముతో మాత్రము ఉంటావో, చాలా జాగ్రత్తగా వుండవలెను. కాని ఎప్పుడైతే నీవు ఎరుగుదువో, ఇక తర్వాత ముందుకు సాగిపో. చూడండి, నీవు దేవునితో సంబంధము (సహవాసము) కలిగియుండవలెను. ప్రొటస్టెంటు, అతడు చెప్పును, అతడు మన్నించబడెనని మరియు అతడు దానిని ఎరిగియున్నాడు; కాతలిక్కులకు మాటే కలదు, వారు క్షమాపణ పొందుకున్నట్లుగా ఆశించుదురు. ఇది ఈ విధముగా యున్నది. ఒకడు ఆశించుట (నవ్ముకము) ద్వారా సమస్తము అంతా సరిగ్గా యున్నదని తలంచు ఒక భిక్షగాడు, చూడండి, ఇంకొకడేమో ఎప్పుడో తాను పొందుకున్న దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు భిక్షగాడు. వారిద్దరూ భిక్షగాళ్ళే. కాని ఒకడేమో ఎప్పుడో తాను పొందుకుంటాననే ఆశిస్తూ అడుగుచున్నాడు, మరియు ఇంకొకడేమో తాను దానిని పొందుకున్నాడని తెలిసి మరియు కృతజ్ఞతాస్తుతులు దానికై అతడు చెల్లించుచున్నాడు.
ఇప్పుడు, అక్కడే తేడా వున్నది. అది సహవాసము. అవునయ్యా, ఒకడు తాను మన్నించబడితినని ఆశించుచున్నాడు; మరొకడు అతడు మన్నించబడెనని ఎరిగియున్నాడు, మరియు దానికొరకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు.
59కావున దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారికే ఈ ప్రభురాత్రి భోజనములో పాలుపొందు హక్కుగలదు. తిరిగి జన్మించుట అనగా నీవు పరిశుద్దాత్మతో నింపబడినట్లుగా చెప్పుట కాదు. ఇప్పుడు గుర్తుంచుకొనుడి. ఇప్పుడు ఆలాగని చాలామంది బోధించుచున్నారు. "ఈ విధముగా ఎవరన్నా బోధించుచున్నారన్న సంగతి నాకు తెలియదని," గతరాత్రి వేదిక మీదినుండి ఆర్గన్ బ్రైట్ సోదరుడు చెప్పెను, చూచారా. క్రొత్తజన్మ అనగా పరిశుద్దాత్మ బాప్తిస్మము కాదు. అందుకు లేఖనము దానిని ఒప్పుకొనదు, నేను అలా అనుకొనుట లేదు, చూచారా, నేను చూచే విధానము అది, చూచారా. మీరు తిరిగి జన్మించారని నేను నమ్ముచున్నాను…
60మరియు ఆ కారణముచేతనే బాప్తిస్మమును ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు అను నామమున అనే పదమును నేను ఉపయోగించుచున్నాను, కాని పునర్జన్మించుట కాదు. పెంతెకోస్తు, యునైటెడ్ పెంతెకోస్తు, యేసుక్రీస్తు నామములో క్రొత్త జన్మ కొరకు బాప్తిస్మమిచ్చుచున్నారు. దానిని నేను నమ్మను. మరియు దానిని వారికి ఇష్టమొచ్చినట్టుగా వారు చేయుచున్నారు. కాని, పేతురు చెప్పిన దానిని నేను నమ్ముచున్నాను, "మారుమనస్సు పొందుట," మొదటి పని. నీటి వలన పాపము పోదు. క్రీస్తు సంఘము వారు ఆ విధముగా బోధించుచున్నారు. కాని నేను మారు మనస్సు అనే దానిని విశ్వసించుచున్నాను, దైవచిత్తానుసారమైన దుఃఖము; మారుమనసు (పశ్చాత్తాపము) అనగా "వెనుకకు మళ్ళుట," అని అర్థము. నీవు గురిని తప్పిపోయావు, "మరల ప్రారంభించు." మొదలు దానిని చేయవలెను! నీ అంతరంగములో జరిగిన ఒక కార్యమునకు సూచనగా క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావనుటకు అది బాహ్య రుజువుగా మాత్రమే బాప్తిస్మమును పొందుచున్నావు.
61నాకు తెలిసినంతవరకు ఈ రాత్రి ఇచ్చట సంఘము మాత్రమేయున్నది. ఎవరు వచ్చారో ఎవరు రాలేదో నేనెరుగను. కొంతకాలం క్రిందట ఇచ్చట కొలనులో ఒక ముసలివానికి నేను బాప్తిస్మమియ్యగా కొందరు నన్ను విమర్శించిరి. అతడు చాలా మంచిమనిషి నేనతనియొద్దకు వెళ్ళాను. అతని కుటుంబమునంతటినీ క్రీస్తునొద్దకు నడిపించు భాగ్యము నాకు దొరికింది, వారందరూ క్రైస్తవులైరి. ఈ ముసలివాడు చక్కని మనిషి, నాకతడంటే ఇష్టము, నేనతని యొద్దకు వెళ్ళి మరియు అతనితో ఇట్లు పలికాను "పాపా, నీవెందుకు క్రైస్తవునిని కాకూడదు?" అతడు నన్ను ప్రేమించును.
అతడు ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, ఎప్పుడైతే నేను చూచినంత మంచివానిగా కాగలుగుతానో, అప్పుడు నేను ఒక క్రైస్తవునిగా అవుతాను."
నేనిట్లు పలికాను, "పాపా, నీవేమి చేయవలెనో చెప్పెదను వినుము. నీవు అన్వేషించి చూడు ఎక్కడ నీకు చాలినంత మంచితనము కనబడువరకు, తర్వాత చెప్పుము ఆ స్థలము ఎక్కడున్నదో, నేను కూడా అక్కడికి వెళ్ళాలని తలంచుచున్నాను." "క్రీస్తు ఎన్నడునూ మంచివారిని రక్షించుటకొరకై రాలేదు, ఆయన పాపులను రక్షించుటకొరకే వచ్చెను," అని నేను చెప్పితిని. నీవు మంచిగా ఉన్నానని తలంచుచున్నయెడల ఆయన నీ యొద్దకు రాలేడు. చెడ్డవారిని రక్షించుటకే ఆయన వచ్చెను, ఆయనకు తెలుసు వారు చెడ్డవారని, చూచావా. పాపులను రక్షించుటకు క్రీస్తు చనిపోయెను. చూచావా. మరియు నేను చెప్పాను, "పాపా, ఇక్కడే ఒక సరియైన గీత యున్నది."
అతడు "మంచిది, నేను సిగరెట్లు త్రాగుచున్నాను," అన్నాడు.
నేను "నేను వాటిని గురించి ఏమీ మాట్లాడుట లేదు," అన్నాను.
అతడు "బ్రన్హాం సోదరుడా, వాటిని మానివేయాలని ప్రయత్నించాను," అన్నాడు.
నేను "మంచిదే, కాని నేను సిగరెట్టును గూర్చి ఏమీ మాట్లాడుట లేదు," అన్నాను.
అతడు చెప్పెను, "మంచిది, నా వలన ఎప్పుడు సాధ్యమవునో… అన్నాడు.
"ఇక నాకు దానిగురించి ఎక్కువగా చెప్పవద్దు. ఒక ప్రశ్న నిన్ను అడగగోరుచున్నాను," అని నేను పలికితిని.
అతడు "సరే మంచిది, అయితే అది ఏమిటి?" అన్నాడు.
నేను "దేవుడొకడున్నాడని నీవు నమ్ముచున్నావా?" అనడిగాను.
అతడు "నిశ్చయంగా దానిని నేను నమ్ముచున్నాను." "బ్రన్హాం సోదరుడా, ఆ సంగతిని నీవెంత గట్టిగా నమ్ముచున్నావో, నేనూ అంతే గట్టిగా నమ్ముచున్నాను," అన్నాడు.
నేను "నీవు నమ్ముచున్నావా అదే, నీవు నమ్ముచున్న అదే దేవుడు మానవుని రక్షించుటకొరకై శరీరధారియై మరియు యేసుక్రీస్తు అనే వ్యక్తిలో నివసించి మరియు శిలువపై బాధలననుభవించెను," అని చెప్పితిని.
అతడు చెప్పెను, "అవును, దీన్ని నేను నమ్ముచున్నాననెను".
''నీవంటి మరియు నావంటి పాపిని రక్షించుటకు ఆయన చనిపోయెను," చూచావా?
"అవును, దానిని నేను నమ్ముచున్నాను."
"అది ఇప్పుడు, ఈలాగున్నది. మనందరము ఒక పెద్ద భవనములో ఇచ్చటున్నాము, లేదా మనం జైలులోయుండి, మరియు నేను ఈ మూలన నిలబడి మరియు "నేను చెరశాల నుండి బయటపడుటకు ఇది నాకు సహాయము చేయును," అని చెప్పలేను, ఆ మూలలోనే నేను నిలబడి మరియు "నేను చెరశాల నుండి బయటపడుటకు అది నాకు సహాయము చేయును," అని అనినంత మాత్రాన, నేను బయటపడలేను. మనమందరము అదే రీతిలోనేయున్నాము. మరియు ప్రపంచమున జన్మించిన ప్రతి మనిషి పాపములోనే జన్మించెను, అక్రము మార్గముననే రూపొంది, అబద్దములాడుచు ఈ లోకములోనికి వచ్చియున్నాడు, ఆరంభమునుండియూ తిరుగుబాటు చేయువానివలెనెయున్నాడు," అని చెప్పాను.
62ఒక రోజున ఎవరో ఒకరు దీనిని అడిగెను, అతడు "బ్రన్హాం సోదరుడా, ఆదామవ్వలకును, వారి పిల్లలకును మధ్య ఈనాడు ఏదైనా తేడాయున్నదా? వారి శరీరములు ఒకేలా ఉన్నవా?" అని అడిగెను.
"అయ్యా, లేదు," అని చెప్పాను. మేము ఉడుతలను వేటాడి ఇంటికి వచ్చుచున్నాము. నేను, ఫ్రెడ్ సోదరుడు, మరి కొందరున్నారు. "లేదు, వారు ఆ విధముగా ఉ౦డలేరు," అని చెప్పాను.
"హవ్వ తన కుమార్తెలవలెను, ఆదాము తన కుమారులవలెను లేరా?" అనడిగాడు.
"చాలా రీతులుగా అలాగేయున్నారు గాని, శరీరసంబంధముగా మాత్రము అలాగున లేరు," అన్నాను.
"తేడా ఏమిటి?" అనడిగాడు.
"వారికి బొడ్డు లేదు. వారు సృజింపబడిరి. వారు మరి దేనికిని అతుకబడి లేరు," అన్నాను.
ఈ లోకములోనికి జన్మించిన ప్రతివారికి అదియున్నది, వారు ప్రారంభమునుండియూ తిరుగుబాటు చేయువారే. అది నిజము. నేను చెప్పాను, "ఖచ్చితంగానే, అక్కడొక బేధమున్నది. వారికి బొడ్డు లేదు. వారు ఇక్కడకు వచ్చుటకు, ఏమాత్రము వారు అతుకబడియుండలేదు." చూడండి, దేవుడు వారిని సృజించెను.
JOHN 6:37
63ఇప్పుడు, ఈ బంధీగృహములోనున్న ప్రతీ వ్యక్తి, ఎవరు పరిశుద్దుడు? ఒక్కడైనా శరీరసంబంధము ద్వారా పుట్టనివాడున్నాడా? ఇంకా ఇట్లన్నాను, "ఒక సంగతి నీతో చెప్పగోరుచున్నాను. మరియు శరీరసంబంధము ద్వారా కాకుండా పరిశుద్ద రక్తము ద్వారా ఆయన తన్ను తానే సృజించుకొనెను; మరియు ఎవరైనాగాని మరొకరికి సహాయపడు స్థితిలో వున్నారా? అతడెంత గొప్పవాడైనా కావచ్చును. కాని అందరం ఒకే బంధీగృహములో వున్నాము, దేవుడు తన్నుతాను సృజించు కొనెను, మరియు తన రక్తముద్వారా ఆయన మనలను విమోచించెను. "దానిని నీవు నమ్ముచున్నావా, పాపా?" అని నేను అడిగాను.
"దానిని నమ్ముచున్నాను," అని అతడు చెప్పెను.
నేనిట్లు చెప్పాను, "క్రీస్తు నీవంటి చెడ్డవానికొరకు చనిపోయెను. ఇప్పుడు, ఒకే ఒక పని ఇప్పుడు చేయవలసియున్నావు. నీవు చేయకలిగినది ఏదియూ లేదు. ఆయనే ఉచితముగా నీకు దీనిని అనుగ్రహించుచున్నాడు. ఇది నీ ప్రతిభ వలన కాదు. దీనిని పొందుకొనుటకై నీవు ఏమియు చేయలేవు. ఆయన దానిని నీకు అనుగ్రహించెను. నిన్ను నరకము నుండి కాపాడుటకై, ఆయన నీకు చేసిన దానిని నీవు అంగీకరించెదవా?"
అతడు చెప్పెను, "నేను దానిని అంగీకరించెదను." "కాని ఈ సిగరెట్టు నుండి నేను విమోచన (విడుదల) పొందినట్లయితే," అని చెప్పెను.
"సిగరెట్టు వాటంతట అవే పోవును. నీవు ఊరకే… నేను నిన్ను అడుగుట లేదు, నేను నిజముగా ఇప్పుడు, నేనొక సిద్దాంతవాదిని కాదు, నేను కృప యందు నమ్మికయుంచుచున్నాను, "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరని ఆయన చెప్పెను." "నీ పూర్ణ హృదయముతో దానిని నీవు నమ్ముచున్నావా!" అని నేను అడిగితిని.
"నా పూర్ణ హృదయముతో, నేను దానిని నమ్ముచున్నాను," అని అతడు చెప్పెను.
"అయితే నీవు దానిని ఆ ఆధారముతోనే అంగీకరించుము, దానికి నీవు అర్హుడవు కావు, కాని ఆయన మాత్రమే అందుకు అర్హుడు. నీవైపు చూచుకొన వద్దు; ఆయనవైపు చూడుము, ఎందుకనగా నీకొరకు నీవేమియూ చేసికొనలేవు. నీ కొరకు ఆయన చేసిన క్రియను చూడుము. ఆయన సంగతి ఏమిటి?"
"ఓ, ఆయన యోగ్యుడు," అని అతడు చెప్పెను.
"అంతే, ఆయన నీకు యిచ్చు దానిని అంగీకరించుము," అన్నాను.
"తప్పకుండా," అన్నాడు.
మరియు యేసుక్రీస్తు నామములో నేను అతనికి బాప్తిస్మమిచ్చాను. అతడు బయటకు వెళ్ళి సిగరెట్లు వెలిగించెను.
64కొన్ని వారముల క్రితం అతని నివసించు ప్రదేశమునకు నేను వెళ్ళాను. ఒక రాత్రి నేను దర్శనం చూచాను, ఒక పచ్చని చెట్టు నరుకబడినది, తలక్రిందులుగా పడద్రోయబడినది. దానికి కొన్ని బోర్డులు తగిలించుట నేను చూచాను. చివరి బోర్డు ప్రక్కన ఒక గమనించదగు బోర్డు కనిపించింది. ఆ బోర్డుకు దిగువన, అనగా చివర వైపు చెట్టు కొద్దిగా బ్రద్దలయినది. ఒక స్వరము నాకు వినబడినది, "అది నీవే కావచ్చునను." ఆ పాపా కాక్స్ పడిపోయెను, అతని నడుము దీని క్రింద నలిగిపోయెను. ఆ మరుసటి ఉదయమున వారు అతని పడకయొద్దకు సిగరెట్లు తీసికొని వచ్చిరి, కాని వాంఛ అతనిలో లేదు. వారములు గడచినవి! ఒక్క దానిని కూడా అతడు తాకలేదు, ఆ కోరిక పోయెను, చూచారా. కొన్ని రోజుల ముందు ఆయనను నేను చూచినప్పుడు, సిగరెట్లు వలన అతని చేతులంతా గోధుమ రంగుగా మారిపోయినవని. కొన్ని వారములు గడచి పోయినవి, ఇప్పుడాయన కనీసం ఒక సిగరెట్టును కూడా ముట్టించుటకు నిలబడియుండలేడు. మొదట చేయవలసిన కార్యములు మొదటిగా పెట్టండి! మంచిగా ఉండవలెనని మీరు స్వంతగా ప్రయత్నించవద్దు; నీ ప్రారంభమే చెడ్డది, మరియు నీవేమియూ చేయజాలవు. ఒక వేరుచేయు గీతయున్నది, మరియు మానవులందరూ ఆ వైపునే యున్నారు.
65ఇప్పుడు, నా తల్లిదండ్రుల యొక్క పరిశుద్ద వివాహము ద్వారా నేను ఈ లోకములో జన్మించితిని. ఆమె గర్భములో నేను అండమునైయుంటిని, నా తండ్రి యొక్క రక్తకణములో యుంటిని. నా ప్రాణము ఆ రక్త కణమునకు చెందినది. ఆ రక్తకణము, నా తండ్రిది. (నా తల్లి యొక్క అండము కాదు), ఆ రక్తకణము సరియైన స్థానములోనికి వెళ్ళి, ఆ అండమును కలిసికొనినది. అప్పుడు ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపించగా, నాకు శరీరము ఏర్పడినది, ఎప్పుడైతే అది జరిగినదో, అప్పుడు నేను మానవ జాతిలోనికి పుట్టియున్నాను. మానవులవలె తెలివి తేటలుగలవానిగా నేనుండు అవకాశము ఇవ్వబడినది, నేను కారును నడుపగలను, లేదా నేను మానవునివలె పనులన్నింటటిని చేయగలను, నడువగలను, మాట్లాడగలను, వాహనము నడుపగలను, మరియు మొదలగు పనులన్నియు చేయగలను. నాకది దయచేయబడినది, ఎందుకనగా నేను మానవ కుటుంబములో జన్మించియున్నాను, మరియు తెలివితేటలను శక్తి నాకును ఇవ్వబడినందున మానవుడనైతిని.
66ఇప్పుడు, నేను దేవుని కుటుంబములో జన్మించియున్నాను, రక్తము ద్వారానే వచ్చియున్నాను, రక్తము నాకు జీవమునిచ్చినది. అటపిదప క్రీస్తులో నేను సజీవుడనైతిని. ఆయన పరిశుద్దాత్మతోను, శక్తితోను నాకు బాప్తిస్మమును ఇచ్చెను, దేవుని కుమారుడనైతిని. ఇప్పుడు మానవునివలె నేను నడచుట, మానవునివలె మాట్లాడుట, మానవునివలె కారు నడుపుట ఎట్లు చేయకలుగుచున్నానో, అలాగే ఇదియున్నది. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్దాత్మను పొందుకున్నానో, నేను శక్తినిపొంది దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను, క్రొత్త భాషలతో మాట్లాడ గలుగుచున్నాను, సువార్తను ప్రసంగించుచున్నాను, వ్యాధిగ్రస్తులను స్వస్థత పరచుచున్నాను. నేను బాప్తిస్మమును పొందితిని! జన్మించుట కాదు; బాప్తిస్మమును పొందితిని! "వారు మేడగదిలో కూడుకొనియుండిరి, వారందరూ ఆయన నాముములో ప్రార్థన చేయుచుండిరి; వారు పరిశుద్దాత్మతోను, శక్తితోను బాప్తిస్మముపొంది సేవ చేయుటకు వచ్చిరి." ఆమేన్.
MARK 16:17•
JOHN 5:24
67మీరు నిత్య జీవమునందు విశ్వాసముంచుచున్నారు, మరియు మీరు మీ విశ్వాసముద్వారా తిరిగి జన్మించియున్నారు. యోహాను సువార్త 5:24లో యేసు చెప్పెను, "నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు." పరిశుద్దాత్మ కాదు గాని, నిత్యజీవము. అతడు దేవుని యొక్క కుటుంబములోనికి జన్మించియున్నాడు మరియు ఆ తరువాత పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందియున్నాడు, విశ్వాసము యొక్క మేధాశక్తిని అతడు పొందెను. సువార్తను నమ్ముటకు, మరియు దానిని క్రియాపూర్వకముగా చేయుటకు, దానిని పని చేయించుటకు అతడు శక్తిని పొందెను. ఆమేన్. అప్పుడతడు దేవుని కుమారునివలె ప్రవర్తి౦చును. అతడు దయ్యములను వెళ్ళగొట్టును. యేసు చెప్పెను, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును!" చూచారా? "నా నాముమున వారు దయ్యుములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములను ఎత్తి పట్టుకొందురు, విషకరమైనది త్రాగినా హాని చేయదు." చూచారా, ఈ కార్యములన్నియూ చేయుటకు అతడు పరిశుద్దాత్మ ద్వారా శక్తిని పొందును.
JOHN 16:7,13
68ఇప్పుడాయన దూరంగా వెళ్ళిపోయెను, ఆయనిట్లు చెప్పెను, "నేను వెళ్ళిపోవుట మీకు మంచిది. ఎందుకనగా, నేను వెళ్ళిపోనియెడల పరిశుద్దాత్మ మీయొద్దకు రాడు," చూచారా. ఆయన వచ్చినప్పుడు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేయును, రాబోవు సంగతులను మీకు బోధించును (అవి దర్శనములు). "నేను మీకు బోధించిన సంగతులను తీసుకోని, మరియు వాటిని మీకు బయలుపరచును." ఈ అనేక మాటలు ఆయన వచ్చి…. ఈ మాటలను పరిశుద్దాత్మ బాప్తిస్మమును వెలుపల వుండు ఏ ఒక్కడును అర్ధము చేసుకొనజాలడు. ఒకడు తాను పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందియున్నానని చెప్పి వాక్యము విషయములో సరియా? అని వివాదపడిన యెడల, ఎక్కడో పొరపాటు అతనిలో దాగియున్నదని గమనించవలెను.
ACTS 2:38
69పౌలు క్రొత్త నిబంధనను విమర్శించినవాడు కాడు. అప్పటికి క్రొత్త నిబంధన వ్రాయబడలేదు. పౌలుగా మారకముందు సౌలు క్రైస్తవ్యమును విమర్శించినవాడు. ఎప్పుడైతే ఆయన పరిశుద్దాత్మ బాప్తిస్మమును పొందెనో, ఆసియాలో మూడు సంవత్సరములు వుండి మరియు వాక్యములను అధ్యయనము చేసెను, ఎందుకనగా అంతకు ముందు అతడు గొప్ప అధ్యాపకుడగు గమలియేలు దగ్గర విద్యనభ్యసించెను. పద్నాలుగు సంవత్సరముల తరువాత అతడు తిరిగి వచ్చి, యెరూషలేములోనున్న పేతురునొద్దకు వెళ్ళి కలుసుకొని మరియు ఒక్కొక్క వాక్యమును పరిశీలించి వారిద్దరును ఒకే సువార్తను ప్రసంగించుచున్నట్లు కనుగొనెను. అదే దేవుని గురించి పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి మరియు వారితో మారుమునస్సు పొంది మరియు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడని ప్రసంగించెను, అదే పరిశుద్దాత్మ పౌలుకు కూడా బయలుపరచెను. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయములో అతడు వారికి చెప్పినది చూడండి. వారు ఒకసారి యోహాను చేత బాప్తిస్మము పొందిరి, వారితో అతడిట్లు పలికెను, "మీరు యేసుక్రీస్తు నామములో మరల బాప్తిస్మము పొందవలెను."
1JN 5:7
70చూడండి, పరిశుద్దాత్మ ఎల్లప్పుడు ఖచ్చితంగా లేఖనముతోనే నిలిచియుండును. దానియుందు విశ్వాసముంచినయెడల ప్రతి మర్మమును అది బయలుపడును. ఆమేన్. I యోహాను 5:7లో బైబిలు ఇట్లు చెప్పెను, "సాక్ష్యమిచ్చువారు పరలోకమందు ముగ్గురున్నారు. వారు తండ్రి, వాక్యము (అనగా క్రీస్తు), మరియు పరిశుద్దాత్మ: ఈ ముగ్గురూ ఒక్కటైయున్నారు. మరియు భూమిమీద సాక్యమిచ్చువారు ముగ్గురు: నీరు, రక్తము, మరియు ఆత్మ. ఈ మూడు ఒకటి కాదు గాని, ఒకటిగా ఏకీభవించుచున్నారు." ఇప్పుడు కుమారుడు లేకుండా తండ్రి లేడు, పరిశుద్దాత్మ లేకుండా కుమారుడు లేడు; వారు ఏకమైయున్నారు. కాని మేము పరిశుద్దపరచబడకుండా నీతిమంతునిగా తీర్చబడవచ్చును, ఇప్పుడు పరిశుద్దాత్మను పొందకుండా నీవు శుద్దీకరణ పొందవచ్చును. రక్తము ద్వారా శుద్దీకరణ జరుగుచున్నది, రక్తము ద్వారా జీవము వచ్చుచున్నది, చూచారా. మరియు పరిశుద్దాత్మ దేవుని యొక్క శక్తియై యున్నది, చూచారా, మరియు ఆ శక్తి సంఘమునకు ఇయ్యబడినది.
MATT 7:16,20•
MATT 12:33•
LUKE 6:44•
ACTS 1:8
71"మీరు పొందవచ్చును? [దేనిని] 'శక్తిని', [అపో, కా. 1:8.] "పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు శక్తిని పొందెదరు!" ["మీరు తిరిగి జన్మించెదరని చెప్పలేదు"] "పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు శక్తిని పొందెదరు. అపుడు మీరు యెరూషలేములోను, యూదయలోను మరియు సమురయలోను, భూదిగంతములన్నిటి వరకు నాకు సాక్షులైయుందురు," చూచారా. పరిశుద్దాత్మను పొందిన తరువాత మీరు శక్తిని పొందెదరు. కాని "మొదలు మీరు పరిశుద్దాత్మను తప్పక పొందవలెను, మరియు అది బయలుపరచి విశదపరచును. మరియు చూడండి, అది దేవుని యొక్క శక్తి. మీరు… నీవు ఒక మనిషిని, మరియు మాట్లాడుటను మరియు నడచుటను మరియు ఒక మనిషి చేయు కార్యము లన్నియును నేర్చుకున్నావు. మీరు పరిశుద్దాత్మ ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు, మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలవలె ప్రవర్తించునట్లు శక్తిని పొందెదరు. ఈనాడు జనులు ఈ విధంగా ప్రవర్తించుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు, ఎందుకనగా వారు పరిశుద్దాత్మతో నింపబడలేదు. వారది పొందినయెడల, మరో విధంగా ప్రవర్తించెదరు. పొందామని వారు చెప్పుకొందురు, గాని యేసు ఇట్లు పలికెను, "వారి ఫలములను బట్టి మీరాయనను తెలిసికొందురు." కావున మీరది ఎలా చేయగలరు, మీరు చూచారా, అది అంతా సంకోచములోయున్నది, చూచారా. అయితే వాస్తవముల యొద్దకు తిరిగి రండి!
1COR 11:23-32
72ఇప్పుడు, నీవు యదార్థముగా నడచుచూ క్రైస్తవునిగా చెప్పుకొనుచున్నయెడల, ఈ రాత్రి నిన్ను ప్రభువు బల్లయొద్దకు ఆహ్వానించుచున్నాము. ఈ దినము, దేశమంతట జనులు ప్రభురాత్రి భోజనమును తీసికొనుచుందురు, సందేహము లేదు. కొంతమంది ఒక విధముగాను, మరి కొందరు వేరే విధముగా, కాని దానిని చేయుటకు లేఖనములను వెంబడించుటయే ఉత్తమ విధానమని నేను తలంచుచున్నాను, వారు వాక్యములో ఏ విధముగా చేసిరో ఆలాగే చేయుదము. అది మనకు చాలునని నేను తలంచుచున్నాను.
నెవిల్ సోదరుడా, నీ యొద్ద బైబిలున్నదా? ఇప్పుడు నెవిల్ సోదరుడు లేఖనమును చదువును. [I కొరింథి 11వ అధ్యాయము 23వ వచనము నుండి అని నెవిల్ సోదరుడు చెప్పెను మరియు లేఖనములను చదువుచుండెను.]
"నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి — దాని విరిచి — ఇది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని — ఈ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
మీరు ఈ రొట్టెను తిని, ఈ పాతలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.
కాబట్టి ప్రతి మనుష్వుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను.
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునాయి యున్నారు; చాలామంది నిద్రించుచున్నారు.
అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.
మనము తీర్పుపొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. [చదువబడిన ఆయన వాక్కును ప్రభువు దీనించును గాక!]
73ఇది ఎల్లప్పుడూ పరిశుద్దమైన విషయమే, పవిత్ర కార్యము, ఇప్పుడు మనము మౌనముగా ప్రార్థనలో శిరములు వంచుదము. మీరు నా కొరకు ప్రార్థించుడి, నేను మీ కొరకు ప్రార్థించెదను. అయోగ్య జీవులమగు మనము మన ప్రభువు యొక్క మరణమును జ్ఞాపకము చేయు ఈ గొప్ప పవిత్ర కార్యములో పాలుపొందనైయుండగా, దేవుడు కృప చూపునట్లు మనము ఒకరికొరకు ఒకరము ప్రార్థించుదము.
[సహో, బ్రన్హాం మౌన ప్రార్థనకు ఆగియున్నారు. టేపు మీద ఖాళీయున్నది] మా తండ్రీ, నీ బంగారు బలిపీఠము మీద మా బలియగు యేసు ప్రభువునుంచి ఈ ఒప్పుకోలు ప్రార్థనను నీకు సమర్పించుచున్నాము. ఆయన నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
74ఇప్పుడు పెద్దలు తమ స్థానములను తీసికొందురని నమ్ముచున్నాను. వారు… సంఘము యొక్క, మరియు వారు ప్రజలను వరుసలు - వరుసలుగా ప్రభురాత్రి భోజనము కొరకై తీసుకొని వచ్చెదరు. నాకెల్లప్పుడూ ఈ పాట గుర్తుకు వచ్చును, "ప్రియ చనిపోవుచున్న గొర్రెపిల్లా, నీ ప్రశస్త రక్తము ఎన్నడూ శక్తిని కోల్పోదు, దేవుని సంఘము రక్షించబడువరకూ, పాపము పూర్తిగా పరిహరించబడువరకు అది పనిచేయును." మన శిరములు వంచుదము.
కృప గల మరియు పరిశుద్దుడైన తండ్రీ, మరియు ఇప్పుడు మేము ఈ సంస్కారమును, ఈ ద్రాక్షా రసమును మీకు సమర్పించుచున్నాము; యొహోవా, సర్వశక్తిగలవాడా, ఈ కనిపెట్టుచున్న జనుల మీదికి నీ ఆశీర్వచనములను పంపించుము. మా పాపములను కమించుము. ఈ ద్రాక్షలు పెంచబడినవి, సేవకుల హస్తములు కలిపి పిండినవి. ఈ పిండబడిన ద్రాక్షారసమును నీ కార్యము కొరకు ఇపుడు మేము దీనిని తీసికొని వచ్చుచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమునకు ఇది సాదృశ్యముగా యున్నది. ఈ పని నిమిత్తము ద్రాక్షారసమును పవిత్రపరచుమని తండ్రి, ప్రార్థించుచున్నాము. మా ప్రతి పాపమును క్షమించుము. ఈ ద్రాక్షారసమును తమ శరీరములో చేర్చుకొను ప్రతి వ్యక్తియూ ఆరోగ్యమును, బలమును, రక్షణను పొందునట్లు సహాయము చేయుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
1COR 11:24
75ఆయన దానిని తీసుకున్నప్పుడు విరిచి మరియు దానిని ఆశీర్వదించెనని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. "దీనిని తీసికొని తినుడి, ఈ నా శరీరము మీ కొరకు నిరువబడియున్నది. నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి." చిన్న రొట్టె ముక్కలను మనము తీసికొనుచున్నాము, ఇది కోషెరు, ఇది పులియని రొట్టె. దీనిని క్రైస్తవులు తయారు చేసిరి. కావున తయారు చేయబడినది, ఎందుకనగా క్రీస్తు యొక్క శరీరమునకు ఇది సాదృశ్యము. క్రీస్తు యొక్క శిష్యులు, లేదా ఆనాటి సంఘము ఆ రోజున చివరి రాత్రి భోజనమును సిద్దపరచిరని మనకు అర్థమగును. బైబిలులో మనము దీనిని శిష్యులు చేసినట్లు గ్రహించగలము, క్రీస్తు యొక్క చివరి భోజనము ప్రజలకు వారు పెట్టిరి. ఈనాడు ఆధునిక-శిష్యులగు ఈ మన సంఘ సోదరులు దీనిని చేయుచున్నారు, ఈ శిష్యులు ఈ హేతువువలననే జనులకు సేవ చేయుచున్నారు. మరియు దీనిని వారు విరిచి జనులకు పంచి పెట్టుచున్నారు.
76మరిప్పుడు మీరు ఈ రొట్టెను తీసుకున్నప్పుడు, గుర్తుంచుకొనండి, ఇది గొర్రెపిల్లకు సాదృశ్యము. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు యొక్క గొర్రెపిల్ల అగ్నిలో కాల్చబడినది, చేదు కూరలతో వారు దానిని తినిరి, జనులు బలము పొందిరి, వారి చెప్పులు ఎన్నడూ పాతగిలలేదు, వారి వస్త్రములు ఎన్నడూ మాసికలు వేయబడలేదు, వారు వాగ్దాన దేశమును చేరువరకు, ప్రయాణమంతటిలో అవి పాతబడలేదు. దేవుడు మనకనుగ్రహించిన వాగ్దాన దేశమును మనము చేరువరకు ఆరోగ్యముగా, సంతోషముగా ఆయనను సేవించు కృప మనకిచ్చును గాక!
ISA 53:5•
1PET 2:24
77మనము ప్రార్ధి౦చుదము.
కృపగల పరమ తండ్రీ, ఈ రాత్రి నేను ఆ పరిశుద్దమగు, పవిత్రమగు ప్రభువు శరీరము గూర్చి మాట్లాడుచున్నాను, ఆయనయందు దైవత్వము యొక్క సంపూర్ణత నివసించుచున్నది. ఆ శరీరము నలుగగొట్టుబడుటను నేను తలంచునపుడు, మరియు విరువబడి, మరియు రక్తము వెలుపలకు కారుచుండెను, ఆయన వీపు మరియు ఆయన ప్రక్కటెముకలు బయటపడుచున్నవి, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టిరి; ఈ ముడతలను నేను తలంచునపుడు, పిండి రొట్టెగా అది తెలియజేయుచున్నది, అది మా హృదయములలోనికి నూతనముగా వచ్చుచున్నది. ప్రభువా, ఈ రాత్రి మా హృదయములను నీ బలిపీఠము మీద ఉంచుచున్నాము. ఓ దేవా, మమ్మును క్షమించుము. ఈ విరువబడిన రొట్టె నోటిలోనికి వెళ్ళచుండగా, అది నీ ప్రశస్త శరీరమనియు, అది నలుగగొట్టబడి, చీల్చబడినదనియు నీ సేవకులు గ్రహించుదురు గాక! ఆ దెబ్బల వలన మాకు స్వస్థత కలిగియున్నది. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. ఉద్దేశించబడిన పని నిమిత్తము ఈ రొట్టెను పవిత్రపరచుము. దీనిని యేసు నామములో అడుగు చున్నాము. ఆమేన్.
ఇది అంతర్గత ప్రభురాత్రి భోజనము కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసియు ఈ ప్రభుని బల్లయొద్దకు రావలెనని ఆహ్వానించుచున్నాము, మాతో పాటు ఈ సహవాసము పొందవచ్చును.