వేరొకని ప్రభావము
VGR COUNT -204 1సహోదరుడా, నెవిల్ మీకు కృతజ్ఞతలు. ప్రభువు మిమ్ములను దీవించును గాక.
స్నేహితులారా శుభసాయంకాలము. మనమందరము ఎవరితో ప్రేమలో ఉన్నామో, ఆ మన ప్రభువు మరియు రక్షకుడు గురించి మరలా మాట్లాడుటకు ఈ రాత్రి మరలా ఇచ్చట దేవుని మందిరములో ఉండుట చాలా మంచిది. మనము ఆయనను ప్రేమించనట్లయితే ఇచ్చట ఈ వేడిగా ఉన్న భవనములో, ఈ రీతిగా కిక్కిరిసి కూర్చొనమని నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకనగా మనము ఆయనను ప్రేమించుచున్నామని ఆయనకు వ్యక్తపరచుటయే ఇక్కడ కూడుకొనుట యొక్క మన ఉద్దేశ్యము. ఆయనను సమీపించు సమయము గురించి ఆలోచించినప్పుడు మన తలంపులు గొప్పగా కదిలింపబడును. మనము ఆయన రాకడ సూచనలు ప్రత్యక్షమవుట చూచినప్పుడు, ఆయనను ఎప్పుడు చూచుదుమో అని ఆ గొప్ప ఘడియ కొరకు మనము తీవ్రముగా ఆశించుచున్నాము.
2ఒక వారములో మొన్న ఆదివారమున నేను ఇక్కడ ఉన్నప్పుడు అనేకమంది ఆయనను కలుసుకొనుటకు వెళ్ళిరి. ఒకరు శ్రీమతి. ఫోర్డ్, శ్రీమతి. లెవి ఫోర్డ్. ఆమెకు ఎనభై సంవత్సరాల వయస్సు, ఆమె ఒక ప్రశస్తమైన స్త్రీ, కొద్దికాలము క్రితం ఆమె భర్త చనిపోయెను. ఆయన స్పెయిన్ అమెరికా యుద్ధములో పాల్గొనిన బహుకాల యుద్దానుభవము కలిగిన వ్యక్తి, మరియు నా జీవిత చరిత్రలో ఆమె కుమారుని పేరును నేను ప్రస్తావించాను. అతను సూటును కొంతకాలము ధరించిన తరువాత నా కొరకు ఉంచేవాడు, అది బాలుర స్కాట్ ధరించే సూటు అని నేను నమ్ముచున్నాను. నేను దానిని తీసుకొనడానికి వెళ్లినప్పుడు, కాలిభాగము మాత్రమే మిగిలియున్నది.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
3ఆ బాలుడైన లాయిడ్ బహుశా ఈ రాత్రి ఇక్కడ ఉండియుండవచ్చు. నేను అతని తల్లియొక్క అంత్యక్రియలను మొన్న నిర్వహించాను. "నా తల్లి తిరిగి లేచును అను దానిని రుజవు చేయు విషయము గురించి మీరు ప్రసంగిస్తారని నేను ఆశిస్తున్నాను బిల్లీ" అని ఆయన కోరెను. మరియు ప్రభువు దాని గురించిన ఖచ్చితమైన, అనుకూలమైన దానిని అనుగ్రహించెను… బైబిలు, సమస్త ప్రకృతి, దేవుడు సృష్టించిన ప్రతిదియు ఆమె తిరిగి లేచును అని చెప్పుచున్నాయి. అప్పుడు ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడబోవుచున్నారు? దేవుడు ఆలాగున పలుకుచూ, ఆయన స్వభావము చేత రుజువుచేయును, ఆయన వాక్యము చేత రుజువుచేయును, ఆమె యొక్క జీవితము ద్వారా రుజవు చేయును, మరియు అంతా ఆమె లేవవలసియున్నది. అక్కడ ఏ మార్గము లేదు, అక్కడ ఏది లేదు…. ఆకాశము, భూమియు గతించిపోవచ్చు గాని, అది విఫలమవదు. ఆమె మరలా రావలసియున్నది.
4ఒకప్పుడు నాతో ఉండిన ఒక కార్యనిర్వాహకుడైన శ్రీ బాక్స్టర్ (మీలో అనేకులు ఆయనను జ్ఞాపకముంచుకొనియున్నారు; ఆయన ఈ వేదిక మీద నుండియే మాట్లాడెను), ఆయన భార్య గుండె పట్టేసిన కారణముగా అకస్మాత్తుగా చనిపోయినది. మరియు ఆయన చాలా ఇరుకునపడినవాడై చాలా విచారముగా ఉన్నాడు; మీరు ప్రార్ధి౦చుచుండగా మీ ప్రార్ధనలలో సహో, బాక్స్టర్ను జ్ఞాపకము చేసుకొంటారని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా ఆయన మన సహోదరులలో ఒకరు. మరియు ఆయన బ్రిటిష్ కొలంబియా, వాంకూవర్లో నివసి౦చుచున్నాడు. మరియు ఇప్పుడు ఆయన నాతో కొన్ని సంవత్సరములుగా ఉండుట లేదు. ఆయన భార్య నరముల ఉద్రిక్తతలాంటి వ్యాధి లేక ఏదో ఒక వ్యాధితో బాధపడుచూ యున్నప్పుడు, మరియు తరువాత ఆకస్మాత్తుగా ఆమె గుండె పట్టేసి చనిపోయినది అని నేను విన్నాను. ఏ సమయములో పిలుపు వస్తుందో మనము చెప్పలేము. ఆయన పిలిచినప్పుడు, మనము తప్పకుండా సిద్ధముగా ఉండాలి. ఆ కారణము చేతనే మనము ఈ రాత్రి ఇక్కడ కూడుకొనియున్నాము.
5నేను కార్యాలయములో చదువుకొనుచూ కూర్చొండి. సహో, మూర్ తో మాట్లాడుచున్నాను. ఆయన నన్ను ఒప్పించాడు… నేను కృతజ్ఞతలు చెల్లించు పండుగ దినమునకు దూరముగా ఉండుటకు ప్రయత్నిస్తూ ఉన్నాను; కృతజ్ఞతలు చెల్లించు పండుగ దినమున ఇక్కడ కూటము నిర్వహించవలెనని నేను కోరితిని. మరియు ఆ తరువాత ష్రెవ్-పోర్ట్ కు వెళ్ళవలెనని అనుకొన్నాను. కానీ, నేను దానిని చేయలేకపోయాను. చివరకు ఆయన, "మంచిది మీరు ఇప్పుడు మూడు కూటములలో పాల్గొనిన తరువాత ఏడు ముద్రలను ప్రసంగించిన తరువాత అప్పుడు మీరు ఆ ఒక్కరోజును ఏలాగైనా మాకు కేటాయించగలరు" అని అనెను. కావున చివరకు ఆయనకు శుక్రవారం, శనివారం, మరియు ఆదివారం మేము కేటాయించబోవుచున్నాము. మరియు ఇప్పుడు ఆయనకు గురువారం, శుక్రవారం, శనివారం, మరియు ఆదివారం కేటాయిస్తానని వాగ్దానము చేశాను. లూసియానాలో జరుపబడిన పెంతెకోస్తుకు యాభై సంవత్సరాల కృతజ్ఞతలు చెల్లించు పండుగ దినము. లూసియానాలో యాభై సంవత్సరాల క్రితం అది వచ్చినది.
6ఆదివారపు-బడికి హాజరు కాని ప్రతిఒక్కరిని మీరు హాజరు కావలసినదిగా రేపు ఉదయము మేము నొక్కి చెప్పబోవుచున్నాము. నా ప్రశస్త సహోదరుడైన డాన్ రద్దేల్ ను ఇక్కడ నేను చూచుచున్నాను. ఆయన ఆదివారపు-బడిని ఉదయమున నిర్వహిస్తాడని నేను ఎరుగుదును. చుటుప్రక్కల నుండి వచ్చిన ఆదివారపు-బడిని నిర్వహిస్తున్న ఇతర సేవకులు బహుశా ఇక్కడ ఉండవచ్చు. మరియు ఇప్పుడు, మీకు గనుక ఒక ఆదివారపు-బడి ఉన్నత్లైతే మీరు అక్కడికి వెళ్ళాలని మేము ఆశించుచున్నాము. మీరు ఆదివారపు-బడిని నిర్వహించనట్లయితే మరియు మీరు మాతో ఉండుటకు ఇష్టపడినట్లయితే, నేను ఉదయమున మాట్లాడగోరుచున్నాను, మరియు నల్లబల్లను అక్కడ ఉంచి, "పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము" గురించి బోధిస్తాను. నల్లబల్లపై దానిని గీసి, దేవుని యొక్క అవసరతలను మరియు దేవుని ముందు పరిపూర్ణ మానవుని యొక్క సంపూర్ణ ఎదుగుదలకు మనము ఎలా రాగలము అను దానిని చూపిస్తాను.
7ప్రభువు చిత్తమయితే రేపు సాయంత్రం, "నా మార్గదర్శి" అను అంశము పై మాట్లాడగోరుచున్నాను. మీలో కొంతమంది పట్టణము వెలుపల ఉన్నవారైతే, మరియు మేము ఈ కూటములను పెందలకడ ప్రారంభించవలెనని కోరుచున్నాము. సంఘ కాపరితో నేను ఇంకను మాట్లాడలేదు, కాని మీరు ఉదయమున పెందలకడనే ఆదివారపు-బడిని ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. సాధ్యమయితే రేపు సాయంత్రం 6.30 గంటలకే లేక ఏదో ఒక సమయములో ఆరాధన ప్రారంభమవును, కనుక వారు ఇక్కడ ఉండిపోదలచినట్లయితే… అది ప్రజలకు ఒక అవకాశమును కలుగజేయును, మనము బయటికి 8.30 గంటలకల్లా వెళ్ళిపోగలము. మరియు వారిలో కొంతమంది…
8మూడు లేక నాలుగు గంటలు ప్రయాణించి వస్తున్న ఒక స్త్రీని ఈ రోజు నేను కలిసాను. 8 లేదా 8.30 గం.లకు మేము బయటికి వెళ్లినచో, మరుసటి ఉదయమున 2.30 లేక 3.00 గంటల వేళ మేము ఇంటికి చేరెదము, మరియు ఆవిడ భర్త ఉద్యోగమునకు వెళ్ళవచ్చును, అని ఆవిడ అన్నారు. కాలము గడుపుట తప్ప మనము ఏమియును ఏలాగున చేయుట లేదు, కనుక ఆలయమునకు మనము పెందలకడ వద్దాము అని అనెను. దీనిని గురించిన రూపము మనము కలిగియుండవలసిన అవసరం లేదు అని మీకు తెలియును; దేవుడు రూపము లేనివాడు, మీకు బైబిల్ తెలియును [స్పష్టతలేని మాటలు]. కావున ఉండగలిగినవారంతా మరియు మీరంతా ఇక్కడ ఉన్నారని మేము ఆశిస్తున్నాము.
మీరు స్వంత ఆరాధనలు కలిగియున్నత్లైతే ఇది శాఖాభేదం లేని సంఘమని గుర్తు౦చుకొనండి. మన జనసమూహములలో అత్యధిక భాగము పట్టణము వెలుపల నుండి వచ్చినవారు.
9ఇప్పుడు, క్రొత్త వ్యక్తి ఇక్కడ ఉండుట జరిగినట్లైతే, మీకు ఒకటి చూపించదలచాను. మరియు నేను వేదిక యొద్దకు నడిచివెళ్ళినప్పుడు, నేను ఎరిగిన పది మంది వ్యక్తులను కూడా చూడలేదు. ఎంతమంది జెఫర్సన్-విల్ పట్టణము వెలుపల నుండి వచ్చినవారు? మీ చేతులు పైకెత్తండి. చూడండి, 99 శాతం మంది ప్రజలు చూడండి, చూడండి. మనము స్నేహితులము మాత్రమే. ఎంతమంది వందమైళ్ళ దూరం నుండి వచ్చినవారు, మీ చేతులు పైకెత్తండి. వందమైళ్ళ దూరం నుండి వచ్చినవారు యాభై శాతం ప్రజలు. ఇక్కడ ఉన్న ఎంతమంది రెండు వందల మైళ్ల పైగా దూరము నుండి వచ్చినవారు, మీ చేతులు పైకెత్తండి. అక్కడ చూడండి! నాలుగు వందల మైళ్ళ దూరము నుండి వచ్చినవారు, మీ చేతిని పైకి ఎత్తండి. అక్కడ చూడండి! ఐదు వందల మైళ్ళ దూరము నుండి వచ్చినవారు, మీ చేతిని పైకి ఎత్తండి. సమాజములోని మూడవ-వంతు ఐదు వందల మైళ్ల పైగా దూరము నుండి వచ్చినవారే!
చూడండి, చుట్టుప్రక్కల నుండి వచ్చిన స్నేహితులు మాత్రమే ఇక్కడ కూడుకొంటారు [స్పష్టతలేని మాటలు]. మనము ఇక్కడ ఉండబోవుచున్నాము. కావున మీకు మేము కృతజ్ఞలమైయున్నాము, మరియు మీకు సహాయము చేయుటకు మేము ఇక్కడ ఉన్నాము. మీ కొరకు చేయగలిగినదంతా చేయుటకు మేము ఇక్కడ ఉన్నాము.
10ముప్పై ఐదుసార్లు వందల మైళ్ల దూరము ప్రయాణించి ఒక స్త్రీ వచ్చినది. ప్రార్ధన చేయించుకోవలెనన్న ఆశతో ఆమె ఈసారి వచ్చుట తన ముప్పై-ఐదవ పర్యటన. ఆ స్త్రీ గురించి చెప్పబడిన ఒక లేఖను నా కుమారుడు ఇప్పుడే నాకు అందించెను. నేను అక్కడ దానిని చదువుచుంటిని.
మరియు ఆరువందల మంది అక్కడ ఎదురుచూస్తున్నారని గుర్తు౦చుకొనండి. ప్రపంచం నలుదిక్కుల నుండి ఇంటర్వ్యూలను పొందడానికి ప్రయత్నిస్తున్న వారి జాబితాను మీరు చూశారా? బహు క్లిష్టమైనది. మనము ఎప్పుడైతే దానిని గురించి ఇక్కడ ఆలోచిస్తామో, అది అధికముగా ఉండదు. మనము దానిని వినగలము. చూడండి, అది ప్రపంచం చుట్టూ ఉన్నది. మరియు మనము ఆలాగే యున్నాము [స్పష్టతలేని మాటలు].
11రేపు ఇక్కడ ఉంటానని ఒక ఉత్తరం వ్రాసిన (ముప్పై-ఐదవ పర్యటన), ఆ స్త్రీ ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా అని ఆశ్చర్యపడుచున్నాను? ఆమె ప్రార్ధన చేయించుకోలేకపోయినా, ముప్పై-ఐదు సార్లు ఇక్కడకు వచ్చినది. ఆమె ఇప్పుడు భవనములో లేదని నేను ఊహిస్తున్నాను, బహుశా రావలసియున్నది. కాని అక్కడ నేను ఆమె ఉత్తరమును అలా చదువుచూ ఉంటిని.
నేను ఇక్కడకు వచ్చినప్పుడు, ఏదో మాట్లాడాలి కాబట్టి అని లేక ప్రజలను తృప్తిపరచాలి అని నేను మాట్లాడను… దేవుని సంతోషపెట్టి, ప్రజలకు సహాయము చేయుదాని గురించి మాట్లాడుటకు నేను ప్రయత్నించాను (మీరు చూచారా?) మీరు ఏ సంఘమునకు, ఏ సంఘశాఖకు చెందినవారైనప్పటికీ, మీరు దేవునితో సన్నిహితముగా నడువగలుగుటకు మీకు మేము సహాయము చేయగలము. ఆ కారణము చేతనే మేము ఇక్కడ ఉన్నాము; దేవునితో అతి సన్నిహితముగా నడుచుటకు.
మరియు ఆ దినము ఎంతగా ఆలస్యమవుచున్నది అని మనము కనుగొనినప్పుడు, మనము అంతగా ప్రభువుకు దగ్గరవుచున్నాము. "ఏదో ఒక ప్రాంతంలో నేను ఉజ్జీవములో ప్రవేశించకపోతే, నేను నశించిపోవుదును; నేను దానిని సహించలేను. ఏదో నా అంతరంగమున మండుచున్నది," అని ఈ రోజు నేను నా భార్యతో చెప్పియున్నాను.
12ఓ! వేల ప్రజలు హాజరగుచున్న వరుస కూటముల నుండి మేము ఇప్పుడే వచ్చాము. రెండు లేక మూడు మిలియన్ల ప్రజలు హాజరయినప్పటికీ, అక్కడ ఉజ్జీవము లేకపోతే అది ముఖ్య విషయము కాదు. ఒక ఆలస్యమవుచున్న కూటము అని మేము దానిని కెంటకీలో పిలచెడివారము. మరియు ఎక్కడైతే దేవుని రాజ్యము కొరకు ఒక కార్యమును సాధించుటకై గొప్ప సంగతులు జరుగుచుండునో, మరియు జనులు రక్షించబడుచుందురో, ఎక్కడైతే ప్రభువు యొక్క ఆత్మ జనులపై కదలాడునో అక్కడ మనము ఒక ఉజ్జీవమును కోరుచున్నాము.
HEB 13:8
13సాధారణముగా ప్రార్ధన కూటములలో మనము ఎందుకు ప్రార్ధనా వరుసను పెట్టలేకపోవుచున్నామో మీరు చూడగలరు. చూడండి, అది ఎంతగా కిక్కిరిసిపోతున్నదంటే, మీరు దానిని చేయలేరు, చూడండి. కాని సాధారణంగా ప్రార్ధనా వరుసలలోనికి వచ్చు జనులు ప్రభువు నిజమైనవాడుగా కనుగొనుటకు వచ్చుచున్నారు. మరియు ప్రభువైన యేసు ఒక్కింతయూ మారలేదని మనము కనుగొనుచున్నాము. ఆయన ఏమైయున్నాడో, ఈ దినము ఆలాగే యున్నాడు, మరియు ఎల్లప్పుడు అదే రీతిగా యుండును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని హెబ్రి 13:8లో బైబిల్ చెప్పుచున్నది. ఆ దినాలలో ఆ సమాజములలో ఆయన మాటలు వినవలెనని కూడుకొనే ప్రజలు ప్రార్ధన వరుసలోనికి రాలేకపోయియుండవచ్చు; కానీ నమ్ముటకు వారు విశ్వాసము కలిగియుండవలసియున్నది. వారి విశ్వాసము ఆయనను తాకగానే, మన ప్రభువు తిరిగి, వారు చేసిన తప్పిదమైన కార్యములను జనులకు చెప్పి వెళ్లి స్వస్థత పొందుడి అని చెప్పేవాడు, లేక వెళ్లి ఒక దానిని సరిచేసుకొనమని చెప్పేవాడు.
JOHN 15:5•
HEB 3:1
14బావియొద్ద ఉన్న స్త్రీని, రక్తస్రావము గలిగిన స్త్రీని మరియు గ్రుడ్డివాడైన బర్తిమయి ఓ చాలామందిని మనము ఎరుగుదుము, మరియు వారి విశ్వాసము ఆయనను తాకినది. మరియు ఈ రాత్రి ఆయన ఇంకనూ మన ప్రధాన యాజకుడని మనము ఒప్పుకొనవలెను మరియు ఎన్నడు ఉన్నంత గొప్పవానిగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన సేవకులుగా ఉండాలి. ఆయన ద్రాక్షావల్లి, జీవమునకు మూలము. మనము ఆ జీవమును పొందుచున్న తీగెలు. ద్రాక్షావల్లి ఫలమును ఫలించదు గాని, తీగెలు ఫలించును. ఇప్పుడు క్రీస్తు ఆయన సంఘము ద్వారా పనిచేయుచున్నాడు. మరియు క్రీస్తునందు మన విశ్వాసములో పరిశుద్దాత్మ మనలను సంపూర్ణముగా నియంత్రించగలిగిన రీతిలో మనలను మనము అర్పించుకొన్నచో, ఆయన అదే కార్యమును చేయును, ఎందుకనగా ఆయన క్రీస్తు.
JOHN 14:12•
HEB 13:8
15నీవు క్రొత్త వ్యక్తిగా ఇక్కడ మాతో ఉన్నట్లయితే. సాధారణంగా ఇక్కడ ప్రజలు [స్పష్టతలేని మాటలు] గుడారములో… మన సంఘకాపరి ఇక్కడ ప్రతి రాత్రి రోగుల కొరకు ప్రార్ధన చేయును, ప్రియమైన మరియు కృపగలిగిన సంఘకాపరి, సహో, నెవిల్ చేత నీవు ప్రార్ధన చేయించుకొనుము. ఆ వ్యక్తి యొక్క ప్రార్ధనలను దేవుడు వింటూ, అతని ప్రార్థనలకు జవాబులను ఇచ్చుచున్నాడు, ఆ వ్యక్తి సహో, ఆర్మన్ నెవిల్ మరియు సహో, డాన్ రద్దేల్ మరియు ఇతర సహోదరులు రోగుల కొరకు ప్రార్ధి౦చుచున్నారు. హోవార్డ్ పార్క్ లోని సహోదర సంఘము నుండి వచ్చిన సహో జాక్సన్ ఇక్కడ ఎక్కడో ఆయన ఉన్నాడని నేను తలంచుచున్నాను.
ఈసారి ఇది ఎంతగానో జనులతో నిండిపోయినది, నీవు కేవలము దేవునిని నమ్మగలిగిన. నీ అవసరత ఏమైనప్పటికీ… నీవు ఒక క్రొత్త వ్యక్తివైనను మరియు నేను నిన్ను ఎరుగనప్పటికీ, నీవు కేవలము దేవునిని అడుగుము, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడో లేదో చూడుము. ఆయన నేరుగా మాట్లాడగలడో లేదో చూడుము. ఆయన నిన్ను ఎరుగును; నీ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు; ఆయనను నమ్ముటయే నీవు చేయవలసిన ఏకైక కార్యము. అప్పుడు ఆయన నిన్ను ఒక పనిముట్టుగాను, నన్ను మరొక పనిముట్టుగాను వాడుకొంటాడు. పరి. యోహాను 14:12లో "నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును" అని యేసు చెప్పెను. ఇప్పుడు, అది అర్పించుకొన్న పాత్ర.
JOHN 15:5
16ఇప్పుడు, నీవు ఆ పాత్రగా ఎలా అవ్వగలవో రేపు మేము బోధించబోవుచున్నాము, ఆ దేవుడు, పరిశుద్దాత్మ, నీ ద్వారా పనిచేయుచున్నాడు. చూడండి, దేవుడు అగ్నిస్తంభములో ఉన్నాడు, ఆ తరువాత క్రీస్తు యేసనబడిన ఆయన కుమారునిలో నివసించాడు; ఇప్పుడు ఆయన సంఘములో ఉన్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి అని పిలువబడియున్నాడు, తరువాత కుమారుడని, ఇప్పుడు పరిశుద్దాత్మ అని పిలువబడుచున్నాడు. అది దేవుడు స్వయముగా ఈ లోకానికి చూపించుకొనుటయే. సంఘమును శుద్దీకరించుటకు దానికొరకు మొదట చనిపోవుట ద్వారా మాత్రమే సంఘములోనికి ప్రవేశించుటకు ఆయనకున్న ఏకైక మార్గము, అప్పుడు ఆయన సంఘము ద్వారా తన్నుతాను ప్రదర్శించుకొనగలడు. మరియు పరి. యోహాను 15లో, "నేను ద్రాక్షావల్లిని, తీగెలు మీరు" అని ఆయన చెప్పెను. (చూడండి), తీగె ఫలమును ఫలించును. ప్రభువు మిమ్ములను దీవించును గాక.
17మరియు ఇప్పుడు, ఈ రాత్రి పాఠమునకు ముందు. మిమ్ములను ఎక్కువసేపు ఉంచుటకు ఇష్టపడుట లేదు, ఎందుకనగా జనులు నిలబడియుండుట, ఒకరు కొద్దిసేపు కూర్చొనిన తరువాత మరియొకరికి ఆ స్థలము ఇచ్చుట ఆ విధముగా జరుగుట నేను చూస్తున్నాను. మూడు వందల మంది లేక నాలుగు వందల మంది కంటే ఎక్కువమంది ప్రజలు కూర్చొనుటకు అనుమతి సంపాదించుటకు మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాము, కాని మనకు చాలినంత వాహనములను నిలుపు ప్రదేశము లేనందున పట్టణము మనకు అనుమతి ఇచ్చుట లేదని అగుపించుచున్నది. ఇండియానా పోలీస్ నుండి మనము అనుమతి పొందినాము. అప్పుడు మనము తప్పనిసరిగా వాహనములను నిలుపు ప్రదేశము కలిగియుండలెను. ఓ, ఎప్పుడైతే మనము నలుగురిని ఇక్కడ ఉంచినయెడల ఒక కారును నిలుపు చేయుటకు చాలినంత స్థలమును మనము కలిగియుండవలెను. కాని నిజానికి ఈ వాహనములను నిలుపుచేయు ప్రదేశము పట్టణానికి చెందినది. కనుక, చూడండి, ఇక్కడ ఉన్న మన సంఘము, పట్టణ సరిహద్దునకు ఒక్క అడుగు ఇవతల ఉన్నది. అది నిజానికి ఒక ప్రధాన రహదారి, అక్కడ కట్టుటకు ఒక కారణము…
బహుశా మీలో కొంతమంది యవ్వనస్తులు దీనిని అర్ధము చేసుకొనలేరు, కానీ ఇది ఒకప్పుడు చెరువు. నేను బాలునిగా యున్నప్పుడు మేము ఇక్కడకు స్వారీ చేసుకొంటూ వచ్చేవారమని నాకు జ్ఞాపకమున్నది. మేము చుట్టూ తిరిగి పొలములోనికి వెళ్లి, చెరువు చుట్టూ చేరేవారము. వారు చెరువు చుట్టూ రహదారిని నిర్మించారు.
ఇక్కడ ఈ స్థలమును నేను కొన్నాను. ఎక్కడైతే ఇది ఉన్నదో అక్కడ ప్రార్ధన చేయుచున్నప్పుడు ముపై-రెండు లేక ముప్పై సంవత్సరాల క్రితం దీన్ని కొనమని ప్రభువు నాకు చెప్పెను, అదే నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడనే ఒక విశాలమైన బురద నేలలో నా తలపైగా పసుపు పూల కలుపు మొక్కలు ఉండేవి. నూట-అరవై డాలర్లకు నేను ఈ స్థలమును కొన్నాను. ఇక్కడ ఈ మూలన, సంఘమును నిర్మించాను.
18ఇప్పుడు, ప్రభువు మిమ్మును దీవించును గాక. పాఠ్యా౦శములో ఉన్న సందర్భములోని కొన్ని విషయములను నేను చదువగోరుచున్నాను. (అది ఒక పాఠ్యాంశముగా పిలువబడితే…) వేరొకని ప్రభావము? అను పాఠ్యాంశము మీద ఈ రాత్రి సభికులతో నేను మాట్లాడతాను. మనము మాట్లాడుటకు లేక వాక్యము చదువుటకు ముందు మన తలలు వంచి వాక్య గ్రంథకర్తతో మాట్లాడుదాము.
మన తలలు, మన హృదయములు వంచియుండగా, ఆయన పట్ల పరిశుద్ధమైన భయభక్తులతో ఎవరైనా వారి హృదయములో మండుచున్న విజ్ఞాపన ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుని ముందు మీ హస్తమును పైకెత్తి చెప్పుడి, "ప్రభువైన యేసూ, నాకు అవసరత ఉన్నది, ఈ రాత్రి నాతో మాట్లాడుము. నన్ను స్వస్థపరచుము. నా ఆర్థిక అవసరతను అనుగ్రహించుము," లేక ఏమైయున్నప్పటికీ. ఆయన మన సమస్త అవసరతలను అనుగ్రహించును. దేవుడు మిమ్ములను దీవించును. తొంబై శాతం మంది చేతులు ఎత్తియున్నారు.
19మా పరలోకపు తండ్రి, మేము నిన్ను సమీపించుచున్నాము. మేము నివసించుచున్న ఈ మట్టి గుడారమును, జీవితము యొక్క ప్రధానమైన ప్రయాణము చేయుచున్న ఈ దోనెను విడిచిపెట్టి, బుధ, గురు, శుక్ర, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రముల, పాలపుంతలకు పైగా, విశ్వాసమును బట్టి వచ్చుచూ, తండ్రి సింహాసనము నొద్దకు విశ్వాసముతో వచ్చుచున్నాము. అక్కడ ఉండి ఆయన గాయపరచబడిన చేతులను, ఆయన పాదములను చూస్తున్నాము. ఆయన సింహాసనము చుట్టూ యున్న బంగారు బలిపీఠముపై మన అర్పణలను ఉంచుచుండగా, ఆ రక్తము ఇప్పుడు విజ్ఞాపన చేయును గాక.
మనము అడుగబోయే వాటిని మన విశ్వాసమును బట్టి ఈ సమస్త కార్యములను మనకు సాధ్యపరచిన యేసు నిమిత్తము మొదట నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నీవు హస్తములను చూచుచున్నావు, జనుల హృదయములలో దిగువున ఏమి కొట్టుకొనుచున్నదో నీవు ఎరిగియున్నావు. ఎక్కడైతే అనుదినము ధూపము మండింపబడుచున్నదో, ఆ గొప్ప దేవుని బంగారు బలిపీఠముపై ఉన్న అర్పణపైనా విశ్వాసమును ఉంచుచున్నాను. తండ్రి, వారి ప్రార్థనలు నీవు విని, జవాబు ఇవ్వమని నేను ప్రార్ధిస్తున్నాను. వారి హృదయ వాంఛలను వారికి దయచేయుము.
ISA 40:31•
LUKE 24:32
20ఈ రాత్రి మూడు కూటముల కొరకు ఇప్పుడు మేము కూడుకొనియుండగా, ఈ రాత్రి ఈ వేడిగాయున్న భవనములో ఇక్కడ ఉండుటకు, నీతో సన్నిహితముగా నడచుటకు తప్ప వేరొక ఉద్దేశము లేదు. ఏమి చేయవలెను [స్పష్టతలేని మాటలు] ప్రభువా, ఏమి చేయవలెను… ప్రవక్త చెప్పిన ప్రకారముగా, "యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు; సొమ్మసిల్లక నడిచిపోవుదురు." ప్రభువా, మేము అడిగిన తరువాత ఏ విధముగా కనిపెట్టాలో మాకు బోధించుము. నీవు విన్నావు అని తెలిసికొనే విశ్వాసము మాకు కలుగజేయుము. మరియు మాకు జవాబును నీ యుక్త కాలమందు పరలోకపు ఆవరణముల నుండి బంగారు మెట్ల మీదుగా మా ఆత్మలోనికి నేరుగా నీవు పంపుము. మేము ఏమైతే అడిగినామో దానిని మేము పొందుకుంటాము, ఎందుకనగా మేము దానిని నమ్ముచున్నాము.
ఈ రాత్రి వినుటకు మా చెవులను, పొందుకొనుటకు మా హృదయములను శుద్దీకరించుము; మరియు కూడిక ముగిసిన తరువాత "ఆయన మార్గములో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా" అని ఎమ్మాయి నుండి వచ్చినవారు చెప్పినట్లు, మేము చెప్పుదుము గాక. ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్.
21యెషయా గ్రంథములోని ఈ లేఖన భాగమును ఈ రాత్రి చదువగోరుచున్నాను. రేపు ఒక కాగితము మీ యొద్ద ఉండినట్లయితే, ఇక్కడ ఒక చార్ట్ ను వ్రేలాడదీసి, లేక నల్లబల్లపై ఆ పాఠమును చిత్రీకరిస్తాను. మరియు మీకు సాధ్యమయితే దానిని పొందుకొనవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను, ఎందుకనగా మీరు గృహములకు చేరిన తరువాత దానిని అధ్యయనం చేయగలరు.
ISA 6:1-8
22యెషయా 6వ అధ్యాయము, ఈ అధ్యాయము నుండి కొన్ని లేఖనములను సందర్భమును రాబట్టుటకై ఈ రాత్రి చదువగోరుచున్నాను.
రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.
వారు - సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా.
నేను - అయ్యో, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను; అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠము మీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి -
ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను.
అప్పుడు - నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని సెలవియ్యగా వింటిని. అంతట నేను - చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా.
23మనము యెషయా యొక్క దర్శనము అధ్యయనము చేయుచుండగా, దానియొక్క ఉద్దేశ్యము ఏమైయుండబోవుచున్నదో అని మనము తలంచినప్పుడు అది పూర్తిగా ఒక గొప్ప కార్యముగా ఉన్నది.
నేను యెషయాను ఎల్లప్పుడు ఇష్టపడుదును. ఆయన పెద్ద ప్రవక్తలలో ఒకడు. బైబిల్ మొత్తమును యెషయా వ్రాశాడు. బైబిల్లో అరవై-ఆరు పుస్తకాలు ఉన్నాయి. మరియు యెషయా అరవై-ఆరు అధ్యాయములను వ్రాసెను. సృష్టి ప్రారంభముతో ఆయన ప్రారంభించి; గ్రంథము మధ్యలో క్రొత్త నిబంధనను, బాప్తిస్మమిచ్చు యోహానును తీసుకు వస్తాడు; మరియు 56వ మరియు 60వ అధ్యాయములో గొప్ప వెయ్యేండ్ల పరిపాలనతో ముగిస్తాడు: ఆదికాండము నుండి క్రొత్త నిబంధనను ప్రకటన గ్రంథములోనికి వ్రాశాడు. ఈ యెషయా గొప్ప వ్యక్తి. మరణశిక్ష విధించబడుట ద్వారా హతసాక్షిగా చివరకు చనిపోయెను.
24బైబిల్లోని ప్రతి ఆత్మపూర్ణుడైన వ్యక్తి సమాఖ్య ప్రభుత్వము క్రింద చనిపోయెను లేక హింసించబడెను. వారిలోని ప్రతి ఒక్కరి గురించి నీవు తలంచగలవు. మోషే, హెబ్రి పిల్లలు మరియు దానియేలు. యెషయా రంపముతో ముక్కలుగా కోయబడెను. దిగువ భాగమున బాప్తిస్మమిచ్చు యోహాను, అపోస్తులలో ప్రతి ఒక్కరు, యేసే స్వయముగా, అందరూ మరణశిక్షకు గురై చనిపోయిరి, లేక సమాఖ్య ప్రభుత్వము విధించిన శిక్ష వలన చనిపోయిరి. సంగతులు ప్రోగు చేయబడుచుండిన రీతిగా ఈ దినాలలో ఒకానొక దినమున ఇంకను మరిన్ని సాక్ష్యములు జతచేయబడబోవుచున్నాయి. మరియు మనము ఒకటిగా కలిసియుండవలసిన సమయము ఏదైనా ఉన్నట్లయితే, అది ఇప్పుడే.
రోమ్ లో జరుగబోయే కూటము గురించి మీరు విన్నారని నేను తలంచుచున్నాను, మరియు వారు అక్కడ గొప్ప సమయమును గడుపుచుండిరి. మరియు వారు ఒక ఉజ్జీవమును ప్రారంభించబోవుచున్నారు. అది నిశ్చయముగా ప్రపంచ-వ్యాప్త ఉజ్జీవము.
25అంశము నొద్దకు వెనుకకు వచ్చుదము. (మనము దానిని ఏడు ముద్రలలో పొందుతాము) — ప్రభావితము చేయబడుట అను ఈ అంశము నొద్దకు.
రాజైన ఉజ్జియా ఒక గొర్రెలను కాయు బాలుడు. ఆయన పెంచబడెను… మరియు ఆయన బయట ప్రదేశాలను ప్రేమించాడు. యెషయా ప్రవచన కాలములో ఆయన పరిపాలించెను. ఇతర పెద్ద ప్రవక్తలలో ఒకనియొద్ద యెషయా నేర్చుకొనియున్నాడు, ప్రవక్తయైన జెకర్యా యొద్ద యెషయా విద్యనేర్చుకొనినాడని నేను నమ్ముచున్నాను. యెషయా రంగము మీదికి వచ్చుచుండగా, జెకర్యా ప్రవక్తగా నుండెను. మరియు యెషయా పిలువబడిన ఒక ప్రవక్త. ప్రవక్తలు మానవునిచే నిర్మించబడరు; ప్రవక్తలు పుట్టుకతోనే ప్రవక్తలు.
ఇప్పుడు, సంఘములోనికి వచ్చుచున్న ఒక ప్రవచన వరము ఉన్నది, అది జనులు ప్రవచించుదురు. అనేక అవయవములున్న క్రీస్తు దేహము దానిని చేయగలదు, అది ప్రేరణ వలన కలుగును. కాని ఒక ప్రవక్త సంఘములో దేవుని చేత ఉంచబడును, ప్రవక్త వరమును పొందుటకు ముందుగా నిర్ణయించబడును, లేక ప్రవక్తగా ఉండే వరము అనుగ్రహించబడినవాడు, జోస్యము చెప్పువానిగా కాదు.
2KGS 14:3,4,19,21•
2KGS 15:3•
2CH 25:2,14,27•
2CH 26:1,4
26ఈ యవ్వనస్తుడు సింహాసనమును అధిష్టించుట మనము ఇప్పుడు కనుగొంటున్నాము. మీరు లేఖనములలోని కొన్నింటిని వ్రాసుకొనగోరిన, II దినవృత్తాంతములు 26వ అధ్యాయము. రాజైన ఉజ్జియా తన తండ్రియైన అహజ్యా చనిపోయిన తరువాత రాజుగా తన స్థానమును భర్తీ చేసాడని చెప్పబడిన దానిని మీరు చదువగలరు. అహజ్యా నీతిమంతుడిగా ఉండి, ప్రభువు యొద్దనుండి మళ్లినప్పుడు తన సొంత ప్రజలచే చంపబడెను. మరియు యెషయా కేవలము బాలునిగా యున్నప్పుడు, పదహారు సంవత్సరాల వయస్సులో సింహాసనమును అధిష్టింపజేసి ఆయనను అభిషేకించిరి. రాజు అగుటకు వరుసలో ఉన్నప్పటికీ, అప్పటికి ఆయన కేవలము బాలుడు. మరియు ఆయన బాగుగా చేసియున్నాడు. ఆయనకు దైవభక్తిగలిగిన తండ్రి మరియు దైవభక్తి గలిగిన తల్లి ఉన్నారని బైబిల్ మనకు చెప్పుచున్నది. అలాంటి ప్రభావముతో అతను దైవభక్తిగలిగిన బాలునిగా యుండుట తప్ప మరేదియూ కాలేడు, ఎందుకనగా అదియే ఎల్లవేళలా ఆయన ముందు ఉంచబడినది.
PROV 22:6
27నేను ఏమి అనుకొంటున్నానో మీకు తెలుసా? ప్రతిఒక్కరికి వారి స్వంత అభిప్రాయం ఉన్నది. కాని నా అభిప్రాయం ప్రకారం, మనము అత్యంత గొప్పవారిలో ఒకరిగా ఈ దేశము ఎన్నడు కలిగియున్న అత్యంత గొప్ప అధ్యక్షుడు అబ్రహాంలింకన్, ఆయన రిపబ్లికన్ అని కాదు కానీ ఆయన దైవభక్తి కలిగిన మనిషి దేవునికి సేవ చేయుటకు ఆయన పెంచబడెను. "నేను మెచ్చుకొనేది ఏదైనా యున్నయెడల, అది యేసును నా సొంత రక్షకునిగా ఎరుగుటకు మరియు ప్రార్ధి౦చుటకు నాకు బోధించిన దైవభక్తి గలిగిన నా తల్లి," చెప్పెను, "ఆమె చేత నా జీవితము ప్రభావితమైనది" అని ఆయన చెప్పెను.
ఓ! నీవు ఏమైయున్నావో నీ కుటుంబము అదే అయి యున్నది. ఫలానా వాతావరణములో నీ పిల్లవానిని నీవు పెంచుతావు. నీవు తప్పు మార్గములో పెంచకపోతే సరియైన మార్గములో వెళ్ళుటకు తొంభై-ఎనిమిది శాతం మంచి అవకాశమున్నది. "బాలుడు నడువవలసిన త్రోవలో వానిని పెంచుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు." సరిగా పెంచండి. సరియైనది చేయుటకు మీ పిల్లలకు బోధించుడి. యధార్ధముగా ఉండమని, వారు పాఠశాలలో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండమని మరియు సత్యము చెప్పుచూ ఉండమని వారికి బోధించుడి.
28అనేకసార్లు పిల్లలు ఒకరినుండి మరియొకరు చూచి వ్రాసి పాఠశాలలో ఉత్తీర్ణులగుటకు అవకాశము గలదు. కానీ మీకు తెలుసా, నీవే సొంతముగా పరీక్ష వ్రాసినట్టెతే మంచి మార్కులు పొందిన నీ పరీక్షా పత్రమును చూచి నీవు ప్రశంసించగలవని నేను తలంచుచున్నాను.
మరుసటి రోజు నీవు పరీక్ష వ్రాయబోవుచుండగా, రాత్రంతయూ చుట్టూ పరుగెత్తి, మరుసటి ఉదయమున లేచి "మంచిది ఫలాని వారి ప్రక్కన కూర్చుంటాను; వారు తెలివైనవారు; అప్పుడు వారినుండి చూచి వ్రాయగలను," అని అనుకొనుటకు బదులుగా. అల్పాహారమునకై భోజనపు బల్లయొద్ద ఉన్నప్పుడు తండ్రి ముందు, "నాన్నా నేను ఈ ఈ రోజు రసాయన శాస్త్రములో పరీక్ష వ్రాయబోవుచున్నాను, కావున నన్ను జ్ఞాపకము చేసుకొనండి" అని చెప్పినట్లయితే. మరియు నీవు ప్రార్ధిస్తున్నప్పుడు, "దేవా మరియ, యోహానులను వారి పరీక్షనందు దీవించండి" అని తండ్రి చెప్పినప్పుడు, అది పరిస్థితిని మార్చివేయును అని నేను మీకు చెప్పుచున్నాను.
MARK 9:23•
JOHN 16:24•
JAS 4:2
29మనము విశ్వాసమునందు నమ్ముచూ అడిగినట్లయితే మనము అడిగిన వాటిని పొందగలమని జ్ఞాపకముంచుకొనండి. "నమ్మినవారికి సమస్త కార్యములు సాధ్యమే, మీరు అడుగుట లేదు కాబట్టి మీరు పొందలేకపోవుచున్నారు, మీరు నమ్ముట లేదు కాబట్టి మీరు అడుగుట లేదు" అని యేసు చెప్పెను. "మీ సంతోషము సంపూర్ణమగునట్లు సమృద్ధిగా అడుగుడి" అని ఆయన చెప్పెను. నేను దానిని ఇష్టపడుచున్నాను.
మనము సరియైనది బోధించవలెను. సరియైనది చెప్పండి, సరియైనది చేయండి; సరియైన దానిని ఆలోచించండి; ఎల్లప్పుడు సరియైన దానిని ఆలోచించండి. నేను ఒక చిన్న నినాదమును చెప్పుచున్నాను: "సరియైనది చేయుము, అది దేవునిపట్ల నీ కర్తవ్యము. సరియైనది ఆలోచించుము, అది నీ ఎడల నీ కర్తవ్యము; మరియు సరియైన విధముగా నీవు బయటకు రాగలవు.
తూర్పునకు, పశ్చిమమునకు నీవు ఒకేసారి వెళ్లలేవు. ఆలాగుననే సత్యము వైపునకు, అబద్ధము వైపునకు నీవు ఒకేసారి వెళ్లలేవు. మరొక మార్గములో వెళుతున్నానని నీవు ఎంతగా తలంచినా ముఖ్య విషయము కాదు, ఒకవేళ నీవు పశ్చిమానికి వెళ్ళనట్లైతే… ఒకవేళ నీవు నీవు పశ్చిమమునకు వెళుతున్నట్లైతే, నీవు తూర్పునకు వెళ్ళుట లేదు.
2KGS 14:3,4,19,21•
2KGS 15:3•
2CH 25:2,14,27•
2CH 26:1,4
30కావున ఈ యువకుడైన రాజు, యువకునిగా ఉన్నప్పుడు తన తండ్రిచేత ప్రభావితుడై దేవుని కట్టడలను ఇశ్రాయేలుకు బోధించెను. మరియు ఆయన చివరి దినములలో ఒక్కసారిగా దేవునికి వ్యతిరేకముగా బోధించెను. తన స్వంత ప్రజలచే చంపబడెను. ఒక గొప్ప పాఠముగా ఉజ్జీయాకు ఉండి యున్నదిగా ఇది కనిపించినది. కానీ ఉజ్జీయా సింహాసనమును అధిష్టించినప్పుడు, ఇశ్రాయేలును దేవుని ఆరాధన వైపునకు మరలా త్రిప్పుచూ, దేవుని కార్యములను మరలా ప్రవేశపెట్టుచూ, తన తండ్రి మార్గములో ఆయన ఆరంభించెను. ఆయన తన్నుతాను బలపరచుకొనియున్నాడు.
తన యవ్వన దినములలో ఎటువంటి రాజకీయాలు చేయనందుకు అతనికి నేను ఎల్లప్పుడు కృతజ్ఞునిగా ఉండగోరుచున్నాను. రాజకీయములు అతనికి వ్యతిరేకముగా ఉండి యున్నప్పటికీ, దేవుని వరుసలోనే అతను అక్కడ నిలిచియున్నాడు. అది ఈ చిన్న యవ్వన ప్రవక్తను, కథానాయకునిగా అయ్యేంతవరకు పులకింపజేసినది. అతను యెషయా ప్రవక్తకు ఒక ఉదాహరణగా ఉండెను.
2CH 26:5•
MATT 6:33
31అతనితో ఉండుటకు యెషయా కోటకు, రాజ భవనమునకు వెళ్ళెను. అతను యెషయాను లోపలకు పిలిచెను; అతను యెషయాను ఇష్టపడెను. యెషయా కూడా యువకునిగా ఉన్నాడు, వారిరువురు స్నేహితులుగా ఉన్నారు. ఆయన బయటకు వెళుచున్నప్పుడు, వారిలో ఒక రాజకీయనాయకుడు లోపలికి వచ్చి "మనము తప్పకుండా ఫలానా-ఫలానా పనిచేయవలెను" అని చెప్పినప్పుడు రాజైన ఉజ్జియా మొదట ప్రభువుయొద్ద "ప్రభువా ఫలానా-ఫలానా కార్యము చేయుట నీ చిత్తమేనా?" అని విచారణ చేసెను. దేవా అలాంటి అధ్యక్షుడని ఇవ్వండి. అది మాత్రమే కాదు గాని అలాంటి ప్రసంగీకులని అనుగ్రహించండి. "మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, మరియు సమస్తమును మీకు అనుగ్రహించబడును."
ఇది ఒక గొప్ప ప్రభావముగా తప్పక యుండవలెను, ఎందుకనగా యెషయా ఆయనను ప్రేమించెను, ఎందుకనగా ఆయన ఒక గొప్ప వ్యక్తి అని అతను చూచియున్నాడు, మరియు ఆయన దేవుని కొరకు స్థిరముగాను, ధృడముగాను నిలబడియున్నాడు. మరియు మీకు తెలుసు, ప్రతి సమయము మనం జీవించుచున్న ఈ దినాలలో, మనం చేయుచున్న కార్యములను, ప్రజలు సంఘకాపరిని చూచుట మాత్రమే గాక, ఆయన ఏ విధముగా జీవించుచున్నాడని, విశ్వాసులను కూడా వారు చూస్తున్నారని జ్ఞాపకముంచుకొనుడి.
32ఓ, మనము సంఘము గురించి ఆలోచించినప్పుడు అది ఎంత చెడుగా యున్నది. కొన్నిసార్లు సంఘకాపరి ఒక సంఘ శాఖకు లేక ఒక తెగకు చెందినవాడయితే ఈ సంఘ శాఖ ఆయనను ఒకానొక సంఘమునకు పంపించును. కొన్నిసార్లు సంఘకాపరి చేతులు ఆ సంఘ శాఖ చేత కట్టివేయబడియుంటాయి. మరియు ఆ చిన్న వ్యక్తి ప్రభువును సేవించాలని కోరినట్లైతే ఆ విధముగా చేయుటకు ఏకైన మార్గము సంఘ శాఖకు సేవ చేయుటేనని బోధించబడినదని ఆయన తలంచుతాడు. ఆయన లేచి వాక్యము ఏమి బోధించుచున్నదో, దానిని బోధించినయెడల సంఘము ఆయనకు వ్యతిరేకముగా ఓటు వేసి బయటకు పంపును. అప్పుడు ఆయనకు సువార్తను బోధించే అవకాశం ఉండదని ఆయన భయపడును.
కాని ఓ, ఈ రోజు మనకు ప్రసంగ వేదికలపై ఉజ్జియా వంటి వ్యక్తులు అవసరము. అతని సంఘము యొక్క రాజకీయాలు లేక దేని రాజకీయాలతో అతనికి నిమిత్తము లేదు, దేవుని హస్తము ద్వారా అతను పనిచేయును. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు?" అని కనుగొను వరకు అతను వేచియుండి, అప్పుడు దానిని అతడు చేసియున్నాడు.
ఆ చిన్న ప్రవక్త (అతని వయస్సు కలిగిన యువకుడు) అతనితో దేవాలయములో ఉన్నాడు, వారు ఇద్దరు కలిసికొని ప్రార్ధి౦చి, సందేహము లేకుండా, ప్రభువు చిత్తమును అడిగి అప్పుడు దానిని బైబిల్ ధర్మశాస్త్రముతో పోల్చుదురు. అప్పుడు సమస్తము సరిగా ఉన్నట్లయితే, ఉజ్జియా దానిని జారీచేయును. అది సమస్తము సరిగా లేనట్లైతే ఆయన దాని గురించిన రాజకీయాలను ఖండించును. అలాంటి వాటిని దేవుడు మనకు ఎక్కువగా అనుగ్రహిస్తాడు! అది యెషయాను పులకింపజేసినది, ఎందుకనగా ఆయన ప్రవక్తగా జన్మించెను.
ఉజ్జీయా యెషయాకు కథానాయకుడయ్యాడు. ఆయన దేవుని కొరకు నిలబడినందున నీతిమంతుల దృష్టిలో కథానాయకుడగుట మీరు చూస్తున్నారు. మరియు అక్కడ అనేకమంది నీతిమంతులు లేకపోయి యుండవచ్చు, చూడండి. మనము మన జీవితములను దేవుని కొరకు లెక్కించబడేలా చేయుటయే మనము చేయగోరుచున్న కార్యము. ఎవరో ఒకరు నిన్ను గమని౦చుచున్నారు.
33క్రిందట రోజున నేను ఎవరితోనో మాట్లాడుచున్నాను. ఒక పొరుగువారి ప్రాంతములో ఒక గొప్ప సంఘము శాఖా రాక్-ఎన్-రోల్ నృత్యముతో కూడిన విందును జరుపుకొంటున్నారు. మరియు ఉదయమున 1 గంటవరకు వారు నాట్యమాడుచూ యున్నారు. ఆలయమునకు వచ్చు ఎవరినో వారు, ఇక్కడకు వచ్చి పరిశుద్ధ గుడ్రాళ్ళు అని వేధించుచున్నారు, ఎందుకనగా మనకు సంఘశాఖ లేదు. ఓ, అది నాకు అవకాశమిచ్చినదా. ఏమి జరిగినదో నీవు ఊహించగలవు. కానీ సంగతి ఏదనగా… ఇప్పుడు, ఆ జనులు నిస్సందేహముగా పరిహాసమాడిన ఆ యవ్వన స్త్రీ మాత్రమే, కేవలము ఏది సత్యము అని తెలుసుకొనినయెడల!
34కొన్ని వారముల క్రితం నేను పర్వతాల మీద యున్నాను. నేను ఇంటికి వచ్చుచున్నప్పుడు (నేను మరియు కుటుంబం) మేము కొద్దిగా విశ్రాంతిని తీసుకొనుటకు వెనుకకు వెళ్లినాము. ప్రభువు చిత్తమయితే, వచ్చే వారము మేము అక్కడికి మరలా వెళ్ళుచున్నాము. అక్కడ ఒక రాత్రి, నేను ఒక దర్శనమును చూచినాను. ఒక నాజూకైన, సొగసైన స్త్రీ, యవ్వన స్త్రీ పరిగెత్తుట చూచాను; ఆమె ఇక్కడ తన చేతిని ఉంచినది, గుండెపోటుతో ఆమె నశించిపోవుచున్నది, ఒక అందమైన స్త్రీ. ఆమె కుప్పకూలి చనిపోయినది. అప్పుడు ప్రభువు దూత, "ఇప్పుడు నీవు దీనిని వినినప్పుడు వారామె ఆత్మహత్య చేసుకొన్నదని చెప్పబోవుచున్నారు, కానీ ఆమె గుండెపోటుతో చనిపోయినది. అది ఇంచుమించు 4 గంటల సమయం, కావున నీవు 4 గంటలు అని మాత్రము చెప్పుము" అని చెప్పెను. అప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయెను.
35ఆ చిన్న పశువుల కాపరుల గుడారములో పడుకొనియున్న (లేక ఎక్కడైతే పశువుల కాపరులు ఉంటారో, ఎక్కడైతే మన చుట్టూ పశువులు ఉంటాయో), కుటుంబమును నేను నిద్రలేపలేదు, ఉదయము వరకు వారిని నిద్రపోనిచ్చాను. మరుసటి దినమున దానిని నేను ప్రస్తావించాను, "చాలా ఆకర్షణీయమైన, ఒక యవ్వన స్త్రీ గుండెపోటుతో చనిపోబోవుచున్నది," అని నేను అన్నాను. రెండు రోజుల తర్వాత రహదారి మీద శ్రీమతి. మన్రో (ఆమె పేరును నేను ఆలోచించలేను) అది ఆమె రంగస్థల పేరు అని నేను తలంచుచున్నాను, లేక ఏమైనప్పటికీ; ఆమె పేరు మరొక పేరు అయి ఉండవచ్చు. మరియు ఆమె చనిపోయినది, ఆమె ఆత్మహత్యకు పాల్పడినదని వారు రేడియోలో చెప్పిరి.
36ఇప్పుడు, దానిని నేను ఎంతగా చెప్పినను అది ఏ వ్యత్యాసమును కలిగించదు; ఆమె ఆత్మహత్యకు పాల్పడినదని వారు ఇంకను చెప్పబోవుచున్నారు. కాని ఆమె ఆలాగు కాదు; ఆమె గుండెపోటుతో మరణించినది! మరియు మీరు గమనించినట్లయితే, ఆమె తన చేతితో ఆమె హస్తములో ఉన్న ఫోన్ను పట్టుకొనటానికి ప్రయత్నించుచున్నది. ఆమెకు గుండెపోటు సంభవించినది. అక్కడ నిద్ర మాత్రలు ఉన్నాయని వారు చెప్పిరి; ఆమె వాటిని నెల రోజులుగా (చూచారా?) లేక ఎక్కువగా, ఆ సీసా నుండి తీసుకొంటున్నది. ఆమె గుండెపోటుతో చనిపోయినది, మరియు ఆమె ఖచ్చితముగా 4 గంటలకు 4 లేక 5 సెకనుల ముందు మరణించినది.
మరియు ఆమె జీవిత చరిత్రను నేను మాస పత్రికలో చదివినాను… ఆమె అక్రమ సంతానము; ఆమె ఎలా చాలా అంట్లు తోమినదో; ఆమె తల్లి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నది; ఆమె ఆశించినది (ఆమె ప్రపంచంలోనే అత్యంత పరిపూర్ణమైన దేహము కలిగిన స్త్రీ అని నేను ఊహించుచున్నాను) — కానీ డబ్బుతో కొనలేని దానికొరకు ఆమె ఆశపడినది. "ఓ, ఆమె దగ్గరకు నేను వెళ్లగలుగుటకు ఆశపడుచున్నాను అని నేను తలంచాను. ఆమెకు ఏమి అవసరమో నాకు తెలియును." అక్కడే మీరున్నారు!
37ప్రసిద్ధమైన హాలివుడ్ యొక్క అత్యంత రమ్యమైన, ప్రసిద్ధిచెందిన సంఘముల యొక్క సభ్యులు అయి ఉండవచ్చు. ఎక్కడైతే సమస్త అలంకరణ మరియు వెండితెర ఉన్నదో…. కాని వారు ఆ ప్రజలను చూచారు…. ఆమె జీవించిన జీవితముకన్నా భిన్నమైన జీవితమును వారు జీవించలేదని ఆమె చూడగలిగినది. దానికి ప్రభావము అవసరము! క్రీస్తు భవనములో వేలాడే ఒక విగ్రహము కాదని వారు చూచుటకు ప్రజల మధ్య క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అవసరము, కాని ఆయన స్త్రీ మరియు పురుషులలో పరిశుద్దాత్మ రూపములో నివసించుచున్న, మరియు సంతోషమును, తృప్తిని, సమాధానమును తీసికొనివచ్చుచున్న సజీవుడు. ఓ, ఆమె లోకమును విడిచిపెట్టక మునుపు, ఆ యవ్వన స్త్రీ యొద్దకు మనము వెళ్లగలిగియుండినట్లైతే బాగుండేది.
2CH 26:6-8
38ఇప్పుడు, ప్రభావము. ఉజ్జియా గోడలను కట్టించి, మరియు తన్నుతాను బలపరుచుకొనియున్నాడు, మరియు ఫిలిస్తీయులకు చెందిన సొత్తును, భూములను ఫిలిస్తీయుల నుండి తిరిగి స్వాధీనపరచుకొనెను. మరియు ఆలాగున ఐగుప్తు వరకు అతని ప్రఖ్యాతి వ్యాపించినది. కావున ఉజ్జీయా యొక్క జీవితము ఈ ప్రవక్త యొక్క జీవితమును ప్రభావితము చేసినది అని మనము కనుగొంటున్నాము. మరియు నేను మీకు చెప్పుచున్నాను, రాజల యొక్క వృత్తాంతములన్నింటిలో సాలోమోను తప్ప మిగతావారిలో అతనివంటివాడు లేడు. ఉజ్జియా వలె వ్యాపింపచేసినవాడు లేడు. ఎందుకు? ఎందుకనగా అతను ఒక ఉదాహరణగా నిలిచెను. తన ప్రజలు ఏమి తలంచినను ఎవరు ఏమి అనుకొనినను, అతని రాజకీయ నాయకులు అతనిని ప్రభావితము చేయుటకు ప్రయత్నించిననూ, అతను దేవునితో నిలిచెను. అతడు దేవునితో నేరుగా నిలిచియున్నాడు, మరియు దేవుడు అతనిని దీవించెను. అది ఈ యవ్వన ప్రవక్తకు ఒక గొప్ప దీవెనగా ఉండినది.
JOSH 24:15•
ECCL 12:1
39దేవుని వాక్యము పట్ల నమ్మకముగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. ఇప్పుడు అతను ప్రసిద్దుడుగా ఉండకపోవచ్చు, కాని అతను దీవించబడతాడు. మరియు ఇప్పుడు నీవు ఇతర ప్రజల వలె ప్రవర్తించగోరుచున్నవా లేక నీవు దేవుని చేత దీవించబడగోరుచున్నావా, ప్రజలు వారి ఎంపికను చేసుకొనవలసియున్నది. ఇప్పుడు నీవు ఎన్నిక చేసుకొనగలవు. నీవు మిగతావారివలె జీవించినట్లైతే, నీవు వారితో దీవించబడుదువు; కానీ నీవు నీ సమస్త కోరికలను దేవుని వైపునకు త్రిప్పినట్లైతే, అప్పుడు నీవు దేవుని చేత దీవింపబడుదువు. కావున నీవు "ఈ దినమున ఎవరిని సేవించగోరుచున్నావో నీవు ఎన్నిక చేసుకొనుము." ప్రవక్త చెప్పిన ప్రకారముగా, "నీవు మొదటిగా ఎల్లప్పుడును, నీ సృష్టికర్తను జ్ఞాపకముంచుకొనుము."
40ఈ రాజు, ఒక గొప్ప వ్యక్తియై ఉండి, యెషయాను ప్రభావితం చేయుచూ, నీతిమంతుడిగా యుండి, బహుశా ఆయన రాజ్యములో, అతను ఒక స్థలమునకు వచ్చెను - అతను సొంత-భద్రత కలిగియున్నానని తలంచెను. అచ్చటనే నీవు నీ తప్పిదమును చేయుచున్నావు. అచ్చటనే అనేకమంది నీతిమంతులు అవమానపు ధూళిని కరచుచున్నారు, అపజయపు ధూళిని కరచుచున్నారు, ఎందుకనగా వారు సొంత-భద్రత కలిగియున్నామని తలంచుట ప్రారంభించుచున్నారు. నేను దేవుని కొరకు చాలా కాలము నుండి జీవించుచున్నాను అని తలంచుచున్నావు, ఆయన నీ ముందు ఏమి యుంచినాడో అది ముఖ్యమైన విషయం కాదు. నీవు కోరినా లేక కోరకపోయినా, నీవు నీ ఎన్నిక చేసుకొంటున్నావు. నీవు దేవుని సేవించుట తప్పనిసరిగా కొనసాగించవలెను. పది సంవత్సరాల క్రితము నీవు ఏమైయున్నావో అనునది విషయము కాదు, ఇప్పుడు నీవు ఏమైయున్నావు అనునది ముఖ్యము.
2CH 26:16
41రాజు తనలో తాను ఆలోచించుకొనే ప్రదేశమునకు వచ్చియున్నాడు, అతను హెచ్చించుకొనెను. గర్వము అతని హృదయములోనికి ప్రవేశించినది. అదియే మనకు జరుగుచున్నది. మీరు ఈ వ్యక్తీకరణను క్షమించినట్లయితే, దేశమంతటా మన సంఘములకు అదియే సంభవించుచున్నది. వారు అచ్చట చక్కని ప్రజలు. ప్రపంచములోని వారిలో అత్యుత్తమ వ్యక్తులైన కొంతమంది సంఘమునకు వెళ్ళుచున్నారు. ప్రపంచములోని అతిశ్రేష్టమైన వ్యక్తులు ఆలయమునకు వెళ్ళుచున్నారని నేను తలంచుచున్నాను. కాని విషయమేమిటి అంటే, సంఘ శాఖ వ్యవస్థ హెచ్చింపబడుచున్నది. అదియే మెథడిస్టలకు సంభవించినది; అదియే బాప్టిస్తులకు సంభవించినది; అదియే నాజరీను వారికి, పరిశుద్ధ యాత్రికులైన వారికి, పెంతెకోస్తు వారికి సంభవించినది — పైకి హెచ్చింపబడిరి, సొంత చిత్తమును కలిగినవారు, తాము చెప్పిన ప్రకారముగానే ఇతరులు నడుచుకొనాలి అనుకొనే (స్వీయ-కేంద్రీకృతమైన) వారు, గర్వము, నీవు వారికి ఏమియును చెప్పలేవు. దేవుడు వారి హృదయములలో ప్రవేశించటానికి ఒక మార్గమును కనుగొనలేడు. ఎందుకనగా ఎవరూ వారికి ఏమియు చెప్పలేనంతగా, వారు సర్వము తెలిసినవారుగా అయ్యారు. మరియు సహోదరులతో హేతు బుద్ధి చుట్టూ వారు తమనుతాము కట్టుకొనిరి. వారి సిద్దాంతము చుట్టూ వారు తమనుతాము కట్టుకొనిరి. మరియు ఎప్పుడైతే వారు చేసిరో దేవునిని వెనుక విడిచి పెట్టిరి.
అదియే వైద్యులకు సంభవించుచున్నది. వారు ఎప్పుడైతే తాము చెప్పినదే ఇతరులు వినాలని అనుకునే విధంగా మారినారో, వారికి దేవుని నుండి ఏ సహాయము అవసరము లేదు. నన్ను ఎవరూ హేళన చేయుట నేను కోరుకొనను. నీవు ఎందులోనైనా దేవునిని ఎప్పుడైతే విడిచి పెట్టినావో, నన్ను కూడా నీవు అచ్చట విడచి పెట్టమని నిన్ను కోరుచున్నాను, చూడుము. ఎందుకనగా నీవు ఎల్లప్పుడు మొదట దేవునిని జ్ఞాపకముంచుకొనుము! అతను హెచ్చించుకొనెను.
2CH 26:16-19
42ఈ రోజు అనేకమంది… ఆలయమునకు వెళ్ళుట ప్రారంభించిన ఒక కుటుంబమును నీవు తీసుకొనుము. దేవుడు ఆ చిన్న కుటుంబమును స్వస్థపరుస్తాడు. ఆయన వారిని దీవిస్తాడు, వారి జీవితములలో పరిశుద్దాత్మను ఇస్తాడు. చిన్నపిల్లలు బల్ల చుట్టూ ప్రార్ధన చేయుదురు. వారు నిద్రపోవటానికి ముందు వారు ప్రార్థన చేయుదురు. తల్లి మరియు తండ్రి చేతులను కలిపి ప్రార్థన చేయుదురు. వారు ఆలాగున కొనసాగినంతకాలము వారు ఒక కుటుంబముగా యుందురు; కానీ వారు పొందుకునప్పుడు…
మొదటి విషయం మీకు తెలుసా, వారికి ఏమియునూ లేదు, ఒక పాత కారు, దానిలో ప్రయాణము చేయుచూ యుండవచ్చు లేక నడిచి వెళుతూ యుండవచ్చు. చివరకు వారు ఒక మంచి కారును, ఒక మంచి ఇంటిని పొందుకుంటారు. మొదటి విషయం మీకు తెలుసా, అప్పుడు వారు ఈ లోకపు పిలుపులను పొందవలెనని కోరుచున్నారు. కలిసియుండుటకు ఒక ఉత్తమమైన తరగతి ప్రజలు, వారు ఒక భిన్నమైన పొరుగు ప్రాంతములోనికి మారతారు, అచ్చట వారు ఒక తప్పిదమైన ప్రభావముతో ప్రభావితమవుట కనుగొంటారు. నీవు ఎల్లవేళలా దేవుని రాజ్యము ఎచ్చట ఉన్నదో, దేవుని మహిమ ఎచ్చట కుమ్మరించబడుచున్నదో, అచ్చటనే ఉండుము. నీవు ఎచ్చట రాత్రింబగళ్ళు ఆత్మసంబంధముగా పోషించబడగలవో, అచ్చటనే ఉండుము. అప్పుడు నీకు మొదటిగా తెలిసే విషయము, ఇంటిలో వేర్పాటు జరుగును, మరియు ఈ లోక పతనము మరియు వారు హెచ్చించుకుంటారు.
ఉజ్జియా దానిని చేసియున్నాడు; అతను హెచ్చించుకొనెను, ఎక్కువ గర్వము.
2KGS 15:5•
2CH 26:19-21
43మరియు ఇప్పుడు, అతను ఏమి చేయుటకు ప్రయత్నించినాడో మనము చూద్దాము. ఇప్పుడు, అతని హృదయములో అతను ఎప్పుడైతే హెచ్చించుకొనినాడో అతనిని నిజముగా ఏది ఆవరించినది. (II దినవృత్తాంతములు 26 మనము కనుగొనుచున్నాము - బైబిలులో మనకు చెప్పబడుచున్నది.) అతను ప్రభువుకు ధూపమువేయుటకై ధూపార్తిని తీసుకొని ప్రభువు యొక్క దేవాలయములోనికి వెళ్లినాడని మనము కనుగొనుచున్నాము. మరియు అతను ఎప్పుడైతే చేసినాడో, దేవాలయపు పరిచారకుడు ఇతర నలభై పరిచారకులతో కలిసి అతనిని వెంబడించి, "దానిని చేయవద్దు; నీవు తప్పు చేయుచున్నావు. నీవు సేవకుడివి కాదు. నీవు ఒక రాజావు, సేవకునివి కావు" అని అతనితో చెప్పిరి.
అతను కోపోద్రిక్తుడై, మరియు మండిపడెను. అతని నిగ్రహము అతని నుండి వెళ్లిపోయినది, ఎచ్చటకైనా వెళ్ళుటకు అతను ధూపార్తిని వెలిగించెను. అతను తన కోపముతో అలా నిలిచియుండగానే, అచ్చటనే దేవుడు అతనిని కుష్టరోగంతో మొత్తెను. మరియు అతను ఒక కుష్టరోగిగా మరణించెను. వారు అతనిని దేవాలయము నుండి వెలుపలికి తీసుకొని వెళ్లవలసివచ్చినది.
44అచ్చటనే మనకు ఇప్పుడు ఒక పాఠము కావలెను. ఈ వ్యక్తిని దేవుడు అతని సామర్థ్యములో దీవించెను… కాని అతను దానితో సంతృప్తిచెందలేదు, అతను ఎవరో ఒకరి స్థానమును తీసుకొనగోరెను. నీవు ఏమియు అయి ఉండలేవు. శాసనసభ సభ్యుడైన అప్షా (మీరు అతనిని జ్ఞాపకముంచుకొనినారా, అరవై-ఎనిమిది సంవత్సరాలుగా కుంటివానిగా ఉండి, అచ్చట కూటములో స్వస్థపరచబడెను. మీకు తెలుసు, అతను అమెరికా సంయుక్త రాష్ట్రాల శాసనసభ సభ్యుడు), అతను చెప్పాడు, "నీవు ఏమియు కలిగిలేవు గనుక నీవు ఏమియు అయి యుండలేవు అని." కావున అది సత్యము. దేవుడు నిన్ను ఎచ్చట పిలిచియున్నాడో అచ్చట నీవు నీ పిలుపులోనే నిలిచియుండవలసియున్నది.
ఇప్పుడు, అతను రాజుగా ఉండినంత కాలము, రాజుగా అతను ప్రజలకు దీవెనగా ఉండెను. కాని అతను ఒక సేవకుడినని తలంచినప్పుడు, అప్పుడు… దేవుడు అతనిని దీవించెను కనుక అతను ఏమి అవ్వగోరితే అలా అవ్వగలనని అతను తలంచెను. కాని అతడు రాజాగా ప్రజలకు దీవెనగా ఉండెను, కాని అతడు సేవకుని స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించినప్పుడు అతను వారికి శాపముగా మారెను. మరియు మనము అలాంటి దానిని ఎక్కువగా కలిగియున్నాము. ప్రతి ఒక్కరు వేరొకరి స్థానమును తీసుకొనుటకు కోరుచున్నారు, చూడండి.
45నీవు ఒక బంతి ఆట అడుచున్నప్పుడు (ఇది ఫుట్ బాల్ ఆట ఆడే కాలము గనుక) మనము చేయగోరే కార్యము, బంతి ఉన్న వ్యక్తి దగ్గరి నుండి బంతిని తీసుకొనుటకు ప్రతి ఒక్కరు ప్రయత్నించుట కాదు; కాని ఆ వ్యక్తికి కావలి కాయుటకు ప్రయత్నించవలెను. అతనిని సంరక్షించండి; అతనిని వెళ్లనివ్వండి. మనము గోల్ చేయుటకు ప్రయత్నించుచున్నాము, చూడండి.
వారి సొంత ఆటగాడు గోల్ చేయడానికి బంతిని తీసుకొని పరిగెత్తుచుండగా అతని నుండి శత్రువును, ప్రతిపక్ష జట్టును దూరంగా నెట్టివేయుటకు బదులుగా, బంతిని తీసుకొన్న ప్రతి ఒక్క ఆటగాడు ముందుకు వెళ్ళుటకు అనుమతి ఇయ్యబడిన, అతని చేతినుండి ప్రతి ఒక్క ఆటగాడు బంతిని తీసుకొనుటకు ప్రయత్నించిన, అలాంటి వ్యక్తిని కలిగియుండి అంతగా శిక్షణ పొందని ఒక జట్టును నీవు ఊహించగలవా? ఎందుకనగా మీరు తప్పనిసరిగా ఓడిపోతారు.
ఈ రోజు మనము అదే స్థితిని కలిగియున్నాము. దేవుడు రంగము మీదికి వచ్చి ఒక ఫలానా దానిని దీవింపబోవుచుండుట మనము చూచినప్పుడు, దానినుండి సమస్త శత్రువులను మనం దూరముగా ఉంచుదాము. మన ప్రభావములను పరుగెత్తువారుగా కాక, శత్రువును అధిగమించేందుకు, పరుగెత్తువానిని రక్షించు, శత్రువును అటకాయించు ఆటగాళ్లగా మనము ఉపయోగించుదాము. అతనిని బంతిని తీసుకొని వెళ్లనిద్దాము, ఎందుకనగా ప్రతిఘటన లేదు, నీవు చేయవలసినదంతా పరుగెత్తుటయే. మీరు శత్రువును అధిగమించే ఆటగాళ్లగా ఉండవలెను.
46నేను సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల కొరకు సర్వసభ్య సమావేశములను, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నేను ప్రసంగిస్తూ ఉంటానని మీకు తెలియును. కొద్దికాలము క్రితము నేను జమైకా, కింగ్స్టన్ యొద్ద ఉన్నప్పుడు అని నేను నమ్ముచున్నాను. ఈ కూటములో క్యాస్టో మరియు వారందరూ అచ్చట ఉన్నారు. (లేక మేము ఆయన ప్రాంతమునకు వెళ్లినాము. అది ఆలాగు ఉన్నది), మరియు ఆ ద్వీపములలో ప్రసిదుడైన వ్యక్తి అచ్చట ఉన్నాడు. ఆ వ్యాపారస్తులు సువార్తను ప్రసంగించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన తన స్థానము నుండి లేచియున్నాడు. ప్రసంగీకులుగా ఉన్న మేము దానిని సరిచేయుటకు చాలినంత సమయము లేదు. వారికున్న పలుకుబడినంతా ఉపయోగించిరి. ప్రతి చిన్న తంత్రమును ఈ విధముగా, ఆ విధముగా ఉపయోగించిరి. అది ఎంత జంకేలా చేసినదంటే ఏమి చేయవలెనో నీకు తెలియదు.
47ఒక సంఘములో, ఒక చిన్న సంఘములో అనేకసార్లు ఉజ్జీవము కొనసాగుచూ యుండగలుగును; ఎవరో ఒకరు బయటకు వెళ్లి, ప్రార్ధనా కూటమును నడిపించగోరును. మరియు అప్పుడు బైబిలు నిజముగా చెప్పుదానికంటే భిన్నమైన తలంపు అతనికి వచ్చును, కాని అతను ఎలాగైనా దానిని నమ్మును; మరియు అతను ఒక ప్రభావమును ప్రారంభించి, దీనినుండి ఇతరులను దూరముగా లాగివేయును. ఈ వర్తమానము వెళ్ళుచున్న విధానములో దానిని సంరక్షించుటయే మనము చేయవలసిన కార్యము. దానితో నిలిచియుండుము, మనము లక్ష్యమునకు చేరు గీతను దాటిపోబోవుచున్నట్లయితే ప్రతిదానిని దానినుండి అడ్డగించుడి.
EPH 4:11,12
48మరియు నేను చెప్పాను, "సహోదరులారా, ఏదో తప్పిదము ఉన్నది, మీరు వ్యాపారస్తులు, మొదటిగా మీరు సమీపించు విధానమును అర్థము చేసుకొనలేదు. పరిచర్యను సమీపించు విధానము మీరు అర్థము చేసుకొనలేదు, ఎందుకనగా పరిచర్య అనగా దేవుడు పిలిచిన వరము."
"దేవుడు సంఘములో మొదటిగా అపొస్తులులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మరియు సంఘకాపరులను నియమించెను." దేవుడు వారిని సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము అక్కడ ఉంచెను. వ్యాపారస్తులు సాక్ష్యమివ్వవలెను. స్త్రీలు, గృహిణులు, నీవు ఎవరి ఇంట్లో పనికత్తెవయినా ముఖ్య విషయము కాదు, సాక్ష్యమివ్వండి. నీవు రాజ్యము కొరకు చేయగలిగినది చేయుము; కాని నీ సొంత తలంపులను ఎక్కించవద్దు; వర్తమానము ఏదైతే చెప్పుచున్నదో దానినే చెప్పి వెళ్ళుతూ యుండుము. (చూడండి), అప్పుడు నీవు ఒక ప్రభావమును కలిగియుండవచ్చు. మంచిది, దేవుడు నిన్ను పిలిచినాడని నీవు ఇప్పుడు తెలుసుకొను వరకు ప్రసంగించుటకు ప్రయత్నము చేయవద్దు. నీ సాక్ష్యముతో నిలిచియుండుము, ఎందుకనగా నీవు చేయనట్లయితే, నీవు తప్పుడు వర్గములోనికి వెళ్లిపోతావు; అప్పుడు నీవు ప్రతిదానిని తారుమారు చేస్తావు. అది అంతే. అది దేవునిని ఏ మాత్రమును సంతోషపెట్టదు. అది ఇచ్చట రుజువుచేయబడుతుంది
2CH 26:16,18,19
49ఎప్పుడైతే ఈ రాజు… ఇప్పుడు, అతను ఎప్పుడైతే గద్దించబడి, ఆలయపు సేవకుని చేత సత్యము చెప్పబడినాడో, అతను తప్పిదము చేయుచున్నాడని అతనికి చెప్పడానికి ప్రయత్నించెను, దానికొరకే దేవుడు అహరోను వంశస్తులను పిలిచెను, మరియు వారు ఆ పరిచర్య కొరకై ప్రతిష్టించబడిరి. వారు చేయవలసినదంతా అదియే, వారు దానికొరకు ప్రతిష్టచేయబడిరి. మరియు ఒక రాజు, అతను ఎంత నీతిమంతుడు అయినప్పటికి లేక దేవుడు ఆయనను ఎంతగా దీవించినప్పటికీ, అతనికి ధూపము మండించు హక్కు లేదు. అతను యాజకుని స్థానమును తీసికొనుచున్నాడు, మరియు అతను దానిని చేయకూడదు. అతను గద్దించబడినప్పుడు, అతను కోపోద్రిక్తుడాయెను; అతని నిగ్రహశక్తి ఎగిరి పోయినది. మరియు అతని నిగ్రహము ఎగిరిపోవుచుండగానే, అచ్చటనే అతని ముఖముపైన కుష్టు ప్రత్యక్షమాయెను. అతను కుష్టు రోగము కలిగినవాడాయెను, అప్పుడు అతను ధూపార్తిని జారవిడిచి, ఆలయము వెలుపలికి పరిగెత్తెను, చూడండి. ఎవరో ఒకరిని అనుకరించుటకు ప్రయత్నించుట, మనము దానిని చేయకూడదు.
అతని కోపములో అతను తప్పిదము చేసెను, మరియు అతను మొత్తబడెను. ఓ, ఇప్పుడు చూచుటకు ఈ యవ్వన ప్రవక్తకు నిశ్చయముగా ఇది ఒక పాఠముగా ఉన్నది. వ్యక్తి ఎంత గొప్పవాడు అనునది విషయము కాదు, అతను తన పిలుపులోనే నిలిచియుండవలెను.
50ఇది టేపు చేయబడుచున్నది అని నేను గ్రహించుచున్నాను, మరియు ఇది ప్రపంచమంతా, అడవులలోనికి మరియు హాటెస్టాట్ (ఆఫ్రికా అడవులలోని ఆదిమ జాతులు)లు మరియు ప్రతి ఒక్క స్థలమునకు వెళ్ళుచున్నదని నాకు తెలియును. ఇచ్చట ఈ రాత్రి ప్రసంగించబడుచున్న ఈ వర్తమానము భాషలలోనికి తర్జుమా చేయబడును. కాని దానిని నేను నా పూర్ణహృదయముతో చెప్పుచున్నాను, అనేకమంది, "మీరు ఫలానా సంఘశాఖలో ఎందుకు చేరకూడదు? మీరు పెంతెకోస్తు వారితో పాటు ఎందుకు రాకూడదు? మీరు ఈ గుంపుతో కలిసి ఎందుకు రాకూడదు? మీరు ఈ చిన్న విషయములను ఎందుకు కొనసాగనివ్వరు?" అని అడుగుచున్నారు. నేను దానిని ఎలా చేయగలను? నేను ఆ వర్తమానముతో నిలిచియుండవలసియున్నది!
మీరు చూచుచుండగా నదిపైన ఆ వెలుగులో ప్రభువు దూత అచ్చట ప్రత్యక్షమై, అది సత్యమని శాస్త్రీయ పరిశోధనతో ప్రతిచోట ప్రభుత్వము చేత రుజవు చేయబడెను. మరియు ఆయన నాతో ఈ వాక్యముతో నిలిచియుండమని చెప్పెను. అప్పుడు నేను ఒక సిద్దాంతము కొరకు దీనిని ఏలాగు అమ్మివేయగలను? ఆ వ్యక్తులు దానిని చేయుటకు బయట ఉన్నత్లైతే, దానిని వారు చేయనివ్వండి. కాని మేము వాక్యమును ప్రసంగించుటకు పిలువబడినాము. రాజీ పడవద్దు; వాక్యముపైన నిలిచియుండుము!
51కావున ఇప్పుడు, కారణమును మీరు చూచుచున్నారు. రాజీ పడుటకు ప్రయత్నించి ఏదో కార్యములు చేయుట, అది అపాయకరమైన కార్యములు, లేక నీలో నీవు హెచ్చించుట కొరకు ప్రయత్నించి, "ఓ, నేను దీనిని చేయగలను మరియు ఎక్కువ డబ్బు సంపాదించగలను. నేను దీనిని చేయగలను, అందరు సహోదరులు నాతో ఏకీభవించుదురు. నేను ఈ వాక్యమును గురించి రాజీపడగలను. మరియు తొంభై-తొమ్మిది శాతం సేవకులు సరియెన దానివైపు తిరుగుదురు," అని చెప్పుదువు. సరి, అది బాగుంది, అది మంచిది. ఇప్పుడు నాకు తెలుసు, వారిలో ఎంతమంది పిలుచుదురు. అది ఏమిటి? రొట్టెలు మరియు చేపలు, ప్రజలు బాగవుట చూచుట, వివేచనములు మరియు దేవుని శక్తులు ప్రత్యక్షపరచబడినవి. వారు నిన్ను కూటముల యొద్దకు, వారు సంఘములలోని ప్రజల యొద్దకు మరియు కార్యముల యొద్దకు తీసుకొని వెళ్ళుదురు. కాని వాక్యమును అంగీకరించే విషయము దగ్గరకు వచ్చేసరికి దానినుండి వెళ్లిపోవుదురు, చూడండి. నీవు దానిని చేయలేవు. వాక్యముతో నిలచియుండుము!
DEUT 22:5
52ఇప్పుడు, ఇది ఈ యవ్వన ప్రవక్తకు ఒక పాఠము, అతను ఏమై యుండుటకు ప్రయత్నించినప్పటికి అది ముఖ్య విషయము కాదు, అతను తన పిలుపులో నిలిచియుండవలెను. ఓ, మై, అతను మనుష్యులను గురించిన దేవుని క్రమమును నేర్చుకొనెను. మనుష్యులను గురించిన దేవుని క్రమము ఏది అనగా, అతని స్థానములో అతను నిలిచియుండుట. స్త్రీలకు దేవుని క్రమము ఏదనగా, వారు కూడా వారి స్థానములో నిలిచియుండుట. నీవు ఒక పురుషుని స్థానమును తీసికొనలేవు. వారు దానిని చేయుటకు ప్రయత్నించుచున్నారు, కాని దానిని చేయవద్దు. పురుషులారా, స్త్రీల స్థానమును తీసికొనవద్దు. స్త్రీలవలె దుస్తులను ధరించవద్దు. మరియు స్త్రీలారా పురుషుల వలె దుస్తులను ధరించవద్దు. అది చేయుట తప్పని బైబిల్ చెప్పుచున్నది. "ఒక స్త్రీ పురుషుని వస్త్రములు ధరించుట దేవుని యెదుట మురికి మరియు హేయమని" బైబిల్ చెప్పుచున్నది, చూడండి. కాని ఇప్పుడు నీవు ఒక వ్యక్తి పురుషుడో అని చెప్పుట కష్టము, చూడండి. ఇప్పుడు, నీవు ఎలాగు చేయబోవుచున్నావు. కాని వారికి వ్యతిరేకముగా ఎలుగెత్తి చాటింపుము? మంచిది, అప్పుడు నీవు అది చేసినప్పుడు…
53ఇండియానాలో ఇచ్చట ఈ వారము ఈ న్యాయస్థానపు ఉత్తర్వును మీరు చూచినారా? ఏమి అవమానము! ఇచ్చట పోర్ట్ ఫుల్టన్లో ఒక కుటుంబము పదిహేను సంవత్సరాల కంటే తక్కువ కాలము క్రితము (ఆ కుటుంబములోని కొంతమంది ఈ రాత్రి ఇచ్చట ఉన్నారని నేను తలంచుచున్నాను) — ఇచ్చట ఫోర్ట్ ఫుల్టన్లో, ఒక బాలిక పొట్టిలాగులు ధరించనందున పాఠశాల నుండి ఇంటికి పంపివేసిరి. ఈ వారము వారు న్యాయస్థానములో వ్యాజ్యము వేయుటకు ప్రయత్నించుచూ, ఆమెను పాఠశాలకు బయట ఉంచిరి. (వారు దానిని చేసిరి), పాఠశాలలోని పొట్టిలాగులు ధరించనని తిరస్కరించిన ఒక చిన్న బాలికను. మన దేశానికి ఏమైంది? ఈ దేశము స్వేచ్చను కలిగిన దేశమని నేను తలంచాను. మనకు హక్కు ఉన్నదని నేను తలంచినాను — మత స్వాతంత్ర్యము.
ఈ తండ్రి లేచి నిలువబడి, "మా పిల్లలు పొట్టిలాగులు ధరించుట మా మత విశ్వాసాలకు వ్యతిరేకము, పదహారు, పదిహేడు సంవత్సరాల మా చిన్నబాలిక పొట్టిలాగులు ధరించుట, ఇది మా మత విశ్వాసాలకు వ్యతిరేకము" అని అన్నాడు. వారు బాలికను తొలగించి బడి నుండి పంపివేసిరి.
54వారు సమస్త సంఘములను కలిపి, ఐక్యపరచి, సంఘముల సమాఖ్యగా చేసి, ఈ సహవాసములోనికి వచ్చుటకు అంగీకరించిన ప్రతి ఒక్కరిని, లోనికి వచ్చి వారితో ఐక్యపడని వారినందరికీ వారు ఒక చిన్న ప్రాంతమును తయారు చేయుచున్నారు. వారు వీరిని అలస్కాకు పంపబోవుచున్నారని నేను అర్ధము చేసుకొనినాను. నీవు చలి వాతావరణమునకు సిద్ధపడవలెను, ఎందుకనగా అది వచ్చుచున్నట్లుగా కనిపించుచున్నది. కావున ఏమి అవమానము!
55నా జీవితకాల స్నేహితుడైన జిమ్ పుల్, ఆయన కుమారుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్నాడు. ఆయన కుమారుడు ఏమి చేసినాడో, ఆయన తండ్రి వచ్చి చూస్తే బాగుండును అని నేను ఆశించాను. మరియు ఈ రోజు మేము ఇద్దరము ఫోన్లో మాట్లాడుకుంటూ యుండగా, వార్తా వ్యాఖ్యాత లేక ఎవరోనని నేను నమ్ముచున్నాను (అతను ఎవరో ఇప్పుడు నాకు గుర్తులేదు), అయితే చెప్పెను, "అమెరికా ప్రజలు ఒకప్పుడు వారానికి ఒకసారి స్నానం చేసేవారు మరియు ప్రతిరోజూ ప్రార్ధి౦చేవారు." "ఇప్పుడు ప్రతిరోజు స్నానం చేయుచున్నారు, వారానికి ఒకసారి ప్రార్థన చేయుచున్నారు,'' అని అన్నాడు. స్నానం చేయకుండా నేను ఉండగలనని నేను నమ్ముచున్నాను. కాని మనము ఎలా పతనము చెందామో అది చూపించుచున్నది. ఈ దేశానికి ఏమి సంభవించినది?
56ఐదు సంవత్సరాల క్రితం నేను ఒహాయోలో ఉన్నాను. నేను అక్కడ కూటము నిర్వహించినాను. (నేను కూటము నిర్వహించిన ఆస్థలము పేరేమిటి?) [ఎవరో "చాటాక్వా" అని చెప్పిరి.] చాటాక్వా నేను హోటలులో వార్తాసమాచారమును వినుచుండగా "ఇక్కడ ఓహయోలో న్యాయస్థానములో ఈ మధ్యాహ్నము స్వాతంత్ర్యమనే పుష్పము చనిపోయినది" అని చెప్పినది.
అమిష్ జాతిప్రజల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుటలో వారికి నమ్మకము లేదు. వారికి వారి సొంత పాఠశాలలు ఉన్నాయి. వారు ఉన్న సమీప ప్రాంతములో ఉన్నత పాఠశాలలు లేవు. పదహారు సంవత్సరాల వరకు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లవలెనని ఓహాయో మరియు ఇండియానా చట్టము. (అది దేశ చట్టము అని నేను తలంచుచున్నాను).
ఈ వ్యక్తికి ఇద్దరు పిల్లలు, బాలుడు మరియు బాలిక వారికి పదహారు సంవత్సరాల వయస్సు లేదు. డార్విన్ నీతిశాస్త్రము (అనగా మానవుడు ఏక కణము నుండి కోతిగా ఉండుటకు ఉద్భవించెను. అతని తత్వమంతా అదే ఒక గొప్ప చేయబడిన కోతి). బోధించే ప్రభుత్వ పాఠశాలలకు వారు తమ పిల్లలను పంపుటకు నిరాకరించెను. కావున వారు దానితో ఏకీభవించలేదు, వారి పిల్లలు దానిని వినుటకు వారు అనుమతించలేదు. కావున అవి వారిని న్యాయస్థానములకు ఈడ్చినాయి.
ఈ చిన్న తెలివైన అగౌరవముగా ప్రవర్తించునట్టి న్యాయాధిపతి కుండ బోర్లి౦చినట్టున్న జుట్టు మరియు పొడుగాటి దుస్తులు ధరించి, వృద్దుడైన తండ్రిని, తల్లిని అడిగెను. "అయ్యా ఈ ఓహయో రాష్ట్రంలో పిల్లవాడిని పదహారు సంవత్సరాల వరకు తప్పకుండా పాఠశాలకు పంపవలెనన్న చట్టము ఉన్నది" అన్నాడు. మీ పిల్లలను పంపుటకు మీరు నిరాకరిస్తున్నారు. మీరు ఏమి సమాధానం ఇస్తారు? అని అడిగెను.
MATT 22:21•
MARK 12:17•
LUKE 20:25
57"గౌరవనీయులైన అయ్యా! నేను నివాసిగా ఉన్న ఈ అందమైన రాష్ట్రము యొక్క చట్టాలను నేను గౌరవిస్తాను" అన్నాడు. "కాని సంవత్సరాల క్రితం మేము ఇక్కడకు వచ్చినాము. మా పితరులు మత స్వాతంత్ర్యమునకు అనుకూలురు, అందుచేతనే మత స్వాతంత్రము కొరకై మేము ఇక్కడ ఉన్నాము. మా మతము మాకు బోధించుచున్నది ఏమనగా, మేము మానవులుగా ఉండుటకు మేము జంతువుల నుండి వచ్చినామని మేము నమ్మము. దేవుని స్వరూపము నందు మేము సృష్టింపబడినామని మేము నమ్ముచున్నాము. అలాంటి వాటిని బోధించే పాఠశాలకు పిల్లవాడిని పంపుట మా మత విశ్వాసాలకు వ్యతిరేకము. కావున మా పిల్లలను పంపుటకు ఇక్కడ ఏ ఉన్నత పాఠశాల లేదు. మేము మిమ్ములను గౌరవించుట లేదు అని కాదు, మేము నమ్ముచున్నవాటిని మేము గౌరవిస్తున్నాము. మా విషయమైతే మేము దానిని నమ్మము, మా పిల్లలకు అది బోధించబడుట మేము కోరుకొనము" అని అన్నాడు.
"నీవు నీ పిల్లలను పాఠశాలకు పంపలేకపోతే నీవు మరియు నీ భార్య రెండు సంవత్సరములు రాష్ట్ర చెరసాలలో గడపాలి" అని చెప్పి నీ నిర్ణయము ఏమిటి? అని అడిగెను.
"తల్లి మరియు నేను రెండు సంవత్సరాలు గడుపుతాము" అని ఆయన అన్నాడు.
వారు తిరిగి బయటకు నడుచుట ప్రారంభించిరి. వృదుడైన న్యాయాధిపతి కొద్దిగా తప్పు చేసిన భావనకులోనై ఉంటాడు. కావున ఆయన "గుర్తు౦చుకొనండి, కైసరుది కైసరుకు చెల్లించమని మీ బైబిల్ చెప్పుట లేదా?" అని అడిగెను.
తండ్రి వెనుకకు తిరిగి "మరియు దేవునికి…?" అని అన్నాడు.
వార్తలను చదువు వ్యక్తి "మంచిది, అప్పుడు స్వాతంత్ర్యము…"
"అప్పుడు న్యాయాధిపతి మీకు రెండు సంవత్సరాల శిక్షను విధిస్తున్నాను" అని తీర్పు ఇచ్చెను.
ఆయన "ఈ మధ్యాహ్నము ఈ న్యాయస్థాన గదిలో స్వాతంత్ర్యమనే పుష్పము చనిపోయినది" అని అన్నాడు.
58డంకర్డ్ లు లేక అమిష్ జాతి ప్రజలు ఎంత వింతవారో ప్రాముఖ్యత కలిగిన విషయము కాదు కాని వారు పరిశుద్ధ జీవితమును నమ్మువారు. అమెరికాలో ఎక్కడను వారిలో బాల్య నేరము కనుగొనబడినట్లు నమోదు చేయబడలేదు. వారి మతము నుండి వచ్చిన ఒక్క వ్యక్తి ఒక్క పిల్లవాడు కూడా ఎన్నడును బాల నేరస్తుడు కాడు. వారు ఏ విధమైన వింతగా ఉండదలచుకొనిరో, వారిని ఆలాగే ఉండనియ్యుడి; వారు సరిగా పెంచబడిరి. నేను వారిని నిందించను.
కానీ వినండి, పుష్పము అక్కడ అప్పుడే చనిపోయినది, కానీ పది నిమిషముల తరువాత అది మరలా బ్రతికినది. ప్రభుత్వ న్యాయవాది, వారిలో అందరు వారి గ్రంథాలను వెనుకకు త్రోసివేసి, "మీరు రాజ్యాంగపరమైన హక్కు ఉల్లంఘించిన యెడల అప్పుడు మేము మా ఉద్యోగాలకు రాజీనామా చేస్తాము, ఎందుకనగా వారు మిగతావాటిని ఉల్లంఘిస్తారు" అని అన్నారు.
59జ్ఞానము గల వృద్దుడైన మెథడిస్తు సంఘ బిషప్, సంఘములో, పాఠశాలలో మొన్న ఆ ప్రార్థన చేయుటను గూర్చి అడుగుట మీరు గమనించినారా? అది మెథడిస్ట్ సంఘము కాదు. దానిని తెలుసుకొనునంత జ్ఞానము ఆ అధ్యక్షునికి కలదు. ఒక ప్రార్థనను ఎంత బలవంతముగా పాఠశాలలో చేయించగలరో చూస్తూ ఉన్న ఒక గుంపు అక్కడ ఉన్నది. వారు దానిని చేయిస్తే ఇంకొకటి వారు చేయగలిగినంత వేగముగా చేయించుదురు. ప్రతి మార్గమును వారు వెతకగలరు. చింతపడవద్దు, వారు దానిని కనుగొంటారు.
60ఓ, మనకు సిలువ కావలెను. మనము కలిగియుండగలిగినప్పుడే క్రీస్తు మనకు కావలెను! ఎక్కువ రసమును త్రాగించగలిగిన వ్యక్తిచేత ప్రభావితము కావద్దు. నివసించటానికి శ్రేష్టమైన గృహము ఇచ్చిన వానిచేత, ప్రయాణించటానికి శ్రేష్టమైన వాహనం ఇచ్చిన వానిచేత ప్రభావితము కావద్దు, మరియు నీ జన్మహక్కులను క్రీస్తుకు అమ్మివేయుము. నీవు ఆ కార్యమును చేయవా! నీవు ఏమి చేయుచున్నావో గమనించుము. దేవుని చేత బలపరచబడిన వానిని, ప్రభావితుడైన వ్యక్తిని ఎల్లప్పుడు వెంబడించుము, అప్పుడు దేవుడు వారితో ఉన్నాడని నీవు తెలుసుకుంటావు. చెడు ప్రభావమును వెంబడించవద్దు అవును! సరే, వేరొకని స్థానమును తీసుకొనుటకు ప్రయత్నము చేయవద్దు.
2KGS 15:5•
2CH 26:19
61దేవాలయములో దర్శనము, దేవుడు సింహాసనము మీద హెచ్చించబడుట ఆయన చూచెను, దేవుడు హెచ్చింపబడుట. ఇప్పుడు మీరు చూడండి, ఈ రాజు యెషయా ముందు తనను ఒక ఉదాహరణగా చేసుకొనియున్నాడు. రాజు తన పిలుపు నుండి బయటకు వెళ్లిన వెంటనే దేవుడు ఆయనను కుష్టరోగముతో మొత్తుట యెషయా చూచెను. అప్పుడు యెషయా "నేను ఏమి చేయవలెను?" ఉజ్జియా మరణించెను. ఆయన భుజము మీద అతను ఎక్కువగా ఆనుకొనెను అని ఆలోచించెను. ఆయన వెళ్లిపోయినాడని అతను తలంచెను; అతను ఏమి చేస్తాడు? అతని కొరకైన జీవము దరిదాపుగా వెళ్లిపోయినది. కావున ఈ యవ్వన ప్రవక్త ఏమి చేసాడు? ప్రార్ధన చేయుటకు దేవాలయమునకు మార్గము ఏర్పాటు చేసుకొనెను. అతను బలిపీఠముయొద్ద పడెను, మరియు బిగ్గరగా మొర్రపెట్టెను.
కొన్నిసార్లు దేవుడు మన క్రింద యున్న ఊతలను క్రిందపడిపోవుటకు అనుమతించును. రోగము మనలను కొన్నిసార్లు మొత్తుటకు ఆయన అనుమతించును. మనలను నిరుత్సాహములు, గుండెనొప్పులు కొట్టుటకు ఆయన అనుమతించును. సువార్త చేత నీవు ప్రభావితము చేయబడుటకు ఆయన కొన్నిసార్లు అది చేయును. దాని గ్రహించగలిగినంత జ్ఞానము కలిగియుండుము. దాని నుండి దూరముగా నడిచిపోయేటంత మూర్ఖునిగా ఉండకుము.
GEN 3:24•
ISA 6:1
62గమనించుము, భిన్నమైన దానిని అతను కనుగొనవలసినదని యెషయా తెలుసుకొనెను. కావున అతను ఏమి చేసెను? అతను దేవాలయమునకు వెళ్ళెను, అతను చేతులను పైకి ఎత్తేను, అతను దేవునికి మొర్రపెట్టెను. అప్పుడు అతనికి దర్శనము కలిగినది. అతను దర్శనములో దేవున్ని చూచాడు, ఇక్కడ సింహాసనము మీద కాదు గాని, అత్యున్నత సింహాసనముపై చూచెను. ఓ! ఆయన చొక్కాయి అంచులు ఆయన వెనుక వచ్చుచుండగా ఆకాశమందు ఆసీనుడైయున్నాడు.
అక్కడ దేవుని ఆలయములో, సెరాపులు ఎగురుచున్నాయి. ఓ! సెరాపు అనగా "కాల్చువారు" అని అర్ధము. సెరాపు అనగా బలిపీఠము ప్రక్కనే ఉండునది అని అర్థము. నిజానికి సెరాపు బలిని స్వీకరించి, ఆరాధికుడిని శుద్దీకరించి, ప్రభువుకు సమర్పించును, సెరాపు ఆ కార్యమును చేయును. ఇప్పుడు, ఈ సెరాపులు దూతల వంటివి, మరియు దేవుని ప్రక్కనే ఉండి, బలిపీఠము యొద్దనే ఉండును. అవి బలి అర్పణను స్వీకరించును. అది దేవుని న్యాయమును కనుపరచును. దానికొరకు ప్రాయశ్చితము చేయబడితేనే తప్ప పాపము ఆయన సన్నిధిలోనికి రాలేదు, చూడండి. ఈ సెరాపులు…
ఏడు సంఘ కాలములలో అవి ఎలాగు సువార్తలకు ఒక్కొక్కటి ఇరువైపుల ఉండి కావలి కాచినవో మీకు జ్ఞాపకమున్నది. మనము వాటిని వెనుక ఏదెను తోటకు తీసుకొని వెళ్ళాము అక్కడ మండుచున్న ఖడ్గము నిలబడియున్నది? అవి బలిపీఠమును కాయుచున్నవి.
ISA 6:1-4
63గొప్ప ప్రవక్త అయిన యెషయా, ఆత్మవశుడైనప్పుడు, ఏ భూరాజు కంటెను పైగా ఆకాశములో ఆసీనుడైయున్న దేవునిని మొదటగా ఆయన చూచియున్నాడు. "నేను రాజును చూచితిని. ప్రభువు అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడై యుండుట, ఆయన చొక్కాయి అంచులు ఆయనను వెంబడించుట చూచినాను" అని అన్నాడు. (అప్పుడు ఆయన నిజమైన రాజను చూచెను).
దేవాలయములో సెరాపులు ఎగురుచుండుట ఆయన చూచెను. అవి రెండు రెక్కలతో వాటి ముఖములను కప్పుకొని, రెండు రెక్కలతో తమ పాదములను కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచున్నాయి. "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని వారు గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏమి సంగీతము, ఏమి లయ! "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, అని వారు నెమ్మదిగా గానములు చేయుచుండిరి," అని మీరు చెప్పవచ్చు.
"వారి కంఠస్వరము వలన దేవాలయము యొక్క గడప కమ్ముల పునాదులు కదలుచుండెను" అని యెషయా అనెను.
వారు "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని చెప్పుట మాత్రమే కాదు గాని "వారి కంఠస్వరము వలన పునాదులు కదిలినవి" అని ఆయన అనెను. ఓ, ఏమి స్వరము. దేవుని ప్రక్కనే ఆ దేవదూతలు నిలువబడి అరచుచున్నాయి. "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు!" అని అరచుచున్నాయి. ఏమి దర్శనము! వ్యూ! ఓ, మై!
ISA 6:2,3
64మరలా గమనించండి, యెషయా ఉజ్జియా బాహువు మీద ఆనుకొని ఉండి దేవుని తీర్పు వలన ఆయన చనిపోవుట చూచెను. అప్పుడు దేవుని ప్రక్కన నిలువబడియున్న ఈ పరిశుద్ధ జీవులు, సెరాపులు "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని గానము చేయుచుండుట చూచెను. ఆ పరిశుద్ధ దూతలు వారి ముఖములను కప్పుకొనినవి. పరిశుద్ధ దేవుని సన్నిధి మధ్యలో పరిశుద్ధ దూతలు వారి ముఖములను కప్పుకొనినవి. అలాగైతే, మనము ఏ పాటివారము?
ఓ, బాప్టిస్టు, మెథడిస్తు, ప్రెస్బిటేరియన్లు మరియు పెంతెకోస్తు, మనము ఎవరము? దేవుని సన్నిధిలో నిలువబడుటకు పరిశుద్ధ దూతలు పరిశుద్ధ ముఖములను రెక్కల క్రింద మరుగుచేసుకొనుచున్నప్పుడు, ఈ జీవులు నిజానికి దూతలుకన్నా ఆతీతముగా ఉండు జీవులు, దూతలు అక్కడ నిలువబడవు, సెరాపు మాత్రమే నిలువబడును. వారు దూతలకంటే అతీతులు. దేవుని సన్నిధిలో వారు ముఖములను కప్పుకొనునంతగా పరిశుద్దుడు. మరియు వారు చెప్పునదంతయూ ఒక్కటే, "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని. వ్యూ! దేవుని సన్నిధిలో నిలువబడుటకు కావలసిన ప్రత్యేక ముసుగు. మనకు ఏ విధమైన ముసుగు అవసరమై యున్నది? అవి ముసుగు ధరించవలయును. మరియు, నేను దీనిని ఇప్పుడే చెప్పదలిచాను.
65యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్తానికి చాలును. చూడండి, క్రీస్తు ఎప్పుడు ఆ సెరాపుల కొరకు చనిపోలేదు. లేదు, లేదు! కానీ అవి సృజించబడిన జీవులు. ఆయన ఎప్పుడూ దూతల కొరకు చనిపోలేదు. ఆయన పాపుల కొరకు చనిపోయెను. ఆయన పరిశుద్దుల కొరకు ఎన్నడూ చనిపోలేదు; ఆయన అపవిత్రుల కొరకు చనిపోయెను. మరియు మీరు పరిశుద్దులని అనుకొనినంత కాలము, ఆయన మీకు ఏమియూ చేయలేదు. కాని మీరు ఏమి కాదని గుర్తించినప్పుడే, ఆయన మీ కొరకు చనిపోయెను, చూడండి. మీరు ఏమి కాదని గుర్తించినప్పుడే, అప్పుడే ఆయన మీ కొరకు ఆయన చనిపోయెను. దేవుడు సమస్త పరిశుద్దుడు. ఆయనకు పరిశుద్ధత తప్ప మరేమియూ లేదు; అంతయునూ అంతే, పరిశుద్ధత.
ISA 6:2-4
66ఇప్పుడు, ఈ రెక్కల కొరకు కొన్ని నిమిషములు చూద్దాము. అవి రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనుట మనము చూచాము. మై, ఆలోచించండి, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ దూతలే తమ పరిశుద్ధ ముఖములను కప్పుకొనినవి. మరియు అవి చెప్పగలిగినది ఒకే సంగతి, "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, సర్వోన్నతుడగు దేవుడు! పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు!"
మరియు రాత్రింబగళ్ళు అవి మొర్రపెట్టుట మనకు చెప్పబడినది. దేవునినుండి క్రిందికి వచ్చు మొదటి మెట్టు అదే. రాత్రింబగళ్ళు, విడువకుండా, మరియు మనము ఎక్కువ అల్లరి చేయుచున్నామని మీరు తలంచవచ్చు. "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని అరచినప్పుడు దేవాలయపు పునాదులు కదలగా సింహాసనము చూట్టూ యున్న లక్షల దేవదూతల గురించి నీవు ఏమి అనుకుంటున్నావు? ఆయన స్వరము దేవాలయమును కదిలించినదని నీకు తెలుసు. దేవుని సింహాసనము చూట్టూ అవి లక్షలకొలదిగా ఉండి "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని ముఖములను రెక్కలతో కప్పుకొని, పాదములను రెక్కలతో కప్పుకొని, రెండు రెక్కలతో గౌరవములతో, భయభక్తులతో గానము చేయుచు౦డిరి. ఓ, మై!
67ఇప్పుడు, పరిశుద్ధత గురించి మాట్లాడు దేనికి గౌరవములు కాని మర్యాదతో కూడిన గౌరవము కాని అక్కడ లేదు. పరిశుద్దాత్మ గురించి మాట్లాడు నీవు పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపులో సభ్యుడవని పిలువబడతావు. దేవుని పట్ల, మరియు ఆయన ప్రజల పట్ల, ఆయన వాక్యము పట్ల గౌరవము, లేదా భయభక్తులు లేవు.
ఇప్పుడు ఈ గుంపు ఎక్కడ అంతమై పోవును? (బెన్, నీవు సరియేనని నేను తలంచుచున్నాను. కుమారుడా, నీవు చెప్పుచున్న దానిని సూటిగా చెప్పుచున్నావు. అవును అది నిజము.) అప్పుడు ఈ భక్తిలేని గుంపు ఎక్కడ అంతమవును? ఎక్కడ ఈ భక్తిలేని గుంపు అంతమగును? (అది అంతే!), దేవుని పట్ల గౌరవము ఏ మాత్రము లేనివారు.
PS 34:7•
PS 34:7•
MATT 18:10
68ఒక స్త్రీగాని ఒక పురుషుడు గాని క్రైస్తవుడని వారు చెప్పినయెడల ప్రజలు దానిని గౌరవించారని మీకు తెలియును; కాని ఈ రోజు వారిని ఎంతగా ఎగతాళి చేయగలరో చూచుటకు వారు ఇష్టపడుచున్నారు, చూడండి! భక్తిహీనులైన గుంపు! ఎందుకు? ఎందుకో మీకు తెలుసా? ఇదియే కారణము. అది సత్యమనిన స్పృహ వారికి లేదు. దేవుని గురించిన మనస్సాక్షి వారికి లేదు. "ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దేవదూతలు ఆవరించియుండును" అని బైబిల్ చెప్పుచున్నదని వారు జ్ఞాపకముంచుకొనరు. వారు వచ్చి వారిని సందర్శించుట మాత్రమే కాదు గాని వారు వారి గుడారములను అతికించుకొందురు. ఆమేన్. అవి అక్కడ రాత్రింబగళ్ళు నిలిచియుండును.
వృద్దుడైన నల్లజాతి సహోదరుడు "దేవదూతలు నాకు కావలి కాయుచున్నాయి?" అనే పాటను పాడెను.
"దేవదూతలు రాత్రంతయు, పగలంతయు నాకు కావలి కాయుచున్నాయి."
నా పైన….
అది నిజము. నాకు దేవదూతలు పగలంతయు, రాత్రంతయు కావలి కాయుచున్నాయి. "వారిలో ఒకరినైనను అభ్యంతరపరచకుండ జాగ్రత్తపడుడి, ఎందుకనగా వారి దూతలు పరలోకమందు నా తండ్రి యెదుట ఉన్నాయి" అని యేసు చిన్నపిల్లల గురించి చెప్పెను. చూడండి! అవి ఎల్లప్పుడు వారిని ఆవరించియుండును. భక్తిహీనులు దానిని కూడా నమ్మరు. ప్రభువు చిత్తమయితే, భక్తి అనగా ఏమిటో, భక్తిహీనత అనగా ఏమిటో ఉదయమున తెలుసుకొందాము.
69ఇప్పుడు గమనించండి, వారు దానిని కూడా నమ్మరు. వారు సమస్త మర్యాదను, సమస్త గౌరవమును, సమస్త భయభక్తులతో కూడిన గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికి సంఘానికి వెళతారు. అక్కడ ఉన్న అత్యంత భక్తిహీన సమూహమే ఆలయమునకు వెళతారు. అది నిజము.
ఒక వృద్ధ దొంగ సారా వ్యాపారి, దొంగ సారా కాచు వ్యక్తి, సగం మత్తులో ఉండి, రహదారి మీద వచ్చుచూ, ప్రక్కన వెళ్ళుచూ యుండగా, నీవు అతనితో ప్రభువు గురించి మాట్లాడు, అతను నిలబడి నీతో మాట్లాడును. వారిలో కొంతమంది సంప్రదాయవాదులు, విశ్వాసులు అని పిలవబడేవారు, సంఘసభ్యులు, నీ ముఖము మీదనే నవ్వుదురు, ఎందుకనగా నీకు వారితో సంబంధము లేదు. నిశ్చయముగా వారు భక్తిహీనులు. నీవు వారి చిన్న వర్గానికి చెందియుండాలి అని నీవు అనుకుంటున్నావు లేదా నీవు వారి రహదారి వైపున కూడా నివసించవు, చూచారా. అది సత్యము. భక్తిహీనులు.
PS 16:8-10•
PROV 22:6
70ఇప్పుడు, ఈ దూతలు, వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, అవి విశ్వసించినాయి. దావీదు చెప్పెను (మనము ఇక్కడ కొన్ని రాత్రుల క్రితం ఉన్నప్పుడు నేను ఒకదానిని ప్రసంగించుచుండుట మీకు జ్ఞాపకము ఉన్నదా). మరియు అతను చెప్పెను — దావీదు చెప్పెను, "నేను ప్రభువును ఎల్లప్పుడు ముందు ఉంచుకొందును, కావున నేను కదిలింపబడను." ఇంతే కాకుండా "నేను అది చేసినప్పుడు, నా దేహము నిరీక్షణ కలిగి విశ్రాంతి పొందును" అని అతను చెప్పెను. అవును అయ్యా! "నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యవు. ఎందుకనగా ప్రభువు ఎల్లప్పుడు నా ముందు ఉన్నాడు."
నీవు ఎక్కడికి వెళ్లినా దేవునిని ఉంచుము. ఒక వ్యక్తి కోపపడి నిన్ను శపించినట్లైతే నీకు అతనికి మధ్య దేవునిని ఉంచుము. ఒక వ్యక్తి నిన్ను పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపులో సభ్యుడవు అని హేళన చేసినట్లయితే, నీకు అతనికి మధ్య దేవునిని ఉంచుము. భార్య నీ మీద కోపపడినట్లయితే, దేవునిని ఉంచుము. భర్త కోపపడినట్లైతే, దేవునిని ఉంచుము. పిల్లలు నీకు కోపము రేపినట్లయితే, దేవునిని ఉంచుము, చూడండి. నీవు ఏమి చేసినా, దేవునిని ఉంచుము. నిన్ను అమ్మ నాన్న కొద్దిగా కొట్టి, నిన్ను సరిదిద్దినట్లయితే, దేవునిని ఉంచుము. దాని గురించి దేవుడు ఏమి చెప్పినాడో జ్ఞాపకముంచుకొనుము. "బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము," చూడండి. దేవునిని ఉంచుటకు ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుము, నీ ముందు దేవునిని ఉంచుము. మరియు నీవు దేవుని పట్ల భయభక్తులు, ఆయన పట్ల గౌరవము కలిగియుండుము. అది నిజము.
EXOD 3:5•
ISA 6:2•
MARK 1:7•
JOHN 1:27•
ACTS 9:3,4
71ఇప్పుడు గమనించుము! అతను రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనెను… అది భక్తిని చూపుచున్నది, భయభక్తులు అని అర్ధము. దేవుని ముందు భయభక్తులతో కూడిన గౌరవము, గౌరవ వందనము — తన ముఖమును కప్పుకొనెను. ఇప్పుడు, మనము మన ముఖమును కప్పుకొనుటకు ఏ రెక్కలు మనకు లేవు. మనము మన తలలను ఆయన పాదముల యొద్ద వంచుతాము. గౌరవముతో, భయభక్తులతో మన తలలను వంచి ప్రార్ధి౦స్తాము. అవును అయ్యా! దానిని గుర్తించుము. అతను రెండు రెక్కలతో తన పాదములను కప్పుకొనెను. కప్పబడిన అతని పాదములు - గౌరవములకు మరియు తగ్గింపునకు ప్రాతినిధ్యముగా ఉన్నవి.
మోషే వలె, దేవుడు మోషేకు నీవు నిలబడియున్న స్థలము పరిశుద్ధ స్థలము అని చెప్పగానే, మోషే దేవునియందు ఉన్న గౌరవమును బట్టి, ఆయన తన పాదరక్షలను తీసివేసెను, చూడండి. ఆయన తన పాదములకు ఏదో చేసెను. ప్రభువు దూత అగ్నిస్తంభములో ఆయన ముందర ప్రత్యక్షమైనప్పుడు, పౌలు దేవునియందు యున్న గౌరవమును బట్టి, తన ముఖమును నేలమీద మోపెను. గౌరవములు! బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు వచ్చుచుండుట ఆయన చూచినప్పుడు "ఆయన పాదములను తాకుటకైనను నేను యోగ్యుడినికాను" అని చెప్పునంత గౌరవము ఆయన కలిగియున్నాడు. చూడండి, పాదములు, గౌరవములను చూపించుచున్నాయి, చూడండి.
2CH 26:16,18,19
72ఓ! స్పృహ కలిగియుండండి, నీవు స్పృహ కలిగియుండవలసినది ఒకే ఒకటి ఇక్కడ ఉన్నది: నీ అల్పత్వము. నీవు దేవునితో ఎక్కడో ఒకచోట ఉండగోరినట్లయితే, నీవు నిజముగా చిన్నవానిగా చేసుకొనుము. ఉజ్జీయా వలె నిన్నునీవు గొప్పవానిగా చేసుకోవద్దు. ఆయన అక్కడకు వెళ్ళెను, ఆయన "నాకు చెప్పే పని నీకు లేదు. నేను దీనిని ఎలాగయినా చేస్తాను" అని అన్నాడు, చూడండి. ఆయన తననుతాను తగ్గించుకొని యుండవలసినది. "అవును. క్రీస్తు సేవకులారా, నన్ను క్షమించండి." ఆయనకి ఎన్నటికీ కుష్టువ్యాధి కలిగేది కాదు. లేదు! "అది మీ పని అని నాకు తెలుసు; దేవుడు మిమ్ములను పిలిచెను. అది మీ కార్యాలయము, మీరు వెళ్లి దానిని చేయండి, అయ్యలారా. నన్ను క్షమించండి." వెనుకకు వెళ్ళెను, ఈ గ్రంథములో మరియొక విధముగా వ్రాయబడియుండేది. కాని ఆయన సరిదిద్దబడినప్పుడు, ఆయన కోపోద్రేకుడాయెను.
నీవు ప్రజలను ఒకదాని గురించి సరిదిద్దుము లేక వారి తప్పిదమైన కార్యము గురించి వారికి చెప్పుము, వారు సంఘమును విడిచిపెట్టుదురు. వారు పొట్టి జుట్టు ధరించకూడదని స్త్రీలకు నీవు చెప్పుము. "మంచిది, ఎక్కడైతే వారు దానిని ధరించగలరో, అక్కడకి నేను వెళ్తాను" అని వారు కోరుచున్నారు.
73కొంతకాలం క్రితం ఒక స్త్రీ ఇక్కడకు వచ్చినది. నేను నా భార్యను అక్కడికి పంపించినాను. మేము కూటములో ఉన్నాము. ఆమె జుట్టు కడుగుకొనుటకు సమయము లేదు, నేను ఆమెకు అక్కడ ఉన్న సౌందర్య పోషక కేంద్రములలో ఒకదానికి వెళ్లి జుట్టును కడిగించుకొనమని చెప్పాను. ఆమె అక్కడికి వెళ్లినది, ఆ స్త్రీకి ఆమె జుట్టును ఏ విధముగా పెట్టాలో కూడా తెలియదు. ఆమె తలపైన దానిని ఆమె చుట్టినది. "రమ్ము, పొడవాటి జుట్టు ఉన్నవారి ఎవరి జుట్టును నేను ఎన్నడు శుభ్రము చేయలేదు" అని ఆవిడ అనినది. దానిగురించి ఆమెకు ఏమియును తెలియదు. నాకు తెలియదు. ఓ, మై! చూచారా?
అది దేనిగురించి చెప్పచున్నదో వారికి తెలియదు. ఎందుకు? ఎందుకనగా బలహీనమైన ప్రసంగ వేదికల పైన వారు ఉన్నారు. అది సరి. అది ఖచ్చితముగా సరియే. సత్యమును చెప్పని బలహీనమైన ప్రసంగవేదికల పైన ఉన్నారు. వారు దానితో రాజీపడుచున్నారు, చూడండి. నీవు దానిని వినియుండినట్లయితే అది మంచిగా యుండేడిది… నీవు వారిలో ఒకరితో మాట్లాడువారు లేచి ప్రేలిపోయి "ఆ పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపులోని సభ్యుడు చెప్పు మాటలను నేను ఎన్నడును వినను" అని చెప్పును, చూడండి. కొనసాగించుము, ఉజ్జీయా. అది సరియే.
2KGS 15:7•
2CH 26:23
74కుష్టురోగము, ఎందుకు, ఆ రకమైన కుష్టురోగము కంటే ఏ సమయములోనైనా కుష్టురోగమును నేను కలిగియుండుటకు ఇష్టపడుచున్నాను; మంచిది, అది ఆత్మ యొక్క కుష్టురోగము, చూడండి. ఎప్పుడైతే లేచి మరియు బయటకు నడచి వెళ్లితివో… నీవు అక్కడనే కుష్టువ్యాధి తెచ్చుకొన్నావు — పాపము. కుష్టువ్యాధికంటే భయంకరమైనది. అది ఆత్మ యొక్క కుష్టువ్యాధి.
ఉజ్జీయా రక్షించబడినప్పుడు చనిపోయినట్లయితే బహుశా తన పితరులతో కూడా నిద్రించేవాడు, అని బైబిలు చెప్పుచున్నది. కాని ఆయన తప్పిదములు చేసెను. నీవు బాగుగా తెలిసియుండియు దానిని చేసినప్పుడు, నీకు ఆత్మ సంబంధమైన కుష్టురోగము సంభవించును. మరియు కుష్టురోగి ఆత్మను లోపలికి తీసుకొని వెళ్ళుటకు అక్కడ ఏ మార్గమును లేదు; అది నీకు తెలియును.
కావున, నిన్ను అల్పునిగా చేసికొనుము. దేవుని ముందు నిన్నునీవు తగ్గించుకొనుము. అతిశయపడవద్దు మరియు పేలవద్దు; లేఖనములు సరిగ్గా ఉన్నాయో లేవో అని పరిశోధించుడి.
ACTS 2:38
75కొద్దికాలము క్రితం నేను ఒక వ్యక్తితో చెప్పినాను… అతను, "సహో, బ్రెన్హాం నీవు యేసు మాత్రమే అను గుంపునకు చెందిన వ్యక్తివని నేను అర్ధము చేసుకొంటున్నా," అని అన్నాడు.
"నీవు తప్పుగా అర్థము చేసికొనినావు," అని నేను చెప్పాను. చూడండి. "నేను యేసు మాత్రమే గుంపునకు చెందిన వ్యక్తిని కాదు" అని చెప్పాను.
"మంచిది, నీవు యేసు నామములో బాప్తిస్మము ఇచ్చుచున్నావు కదా" అని అన్నాడు.
"అది నన్ను యేసు మాత్రమే గుంపునకు చెందిన వ్యక్తిగా చేయదు" అని నేను అన్నాను. "యేసు మాత్రమే అను సిద్దాంతపు వారు పునర్జన్మ నిమిత్తం బాప్తిస్మం ఇస్తారు, నేను దానియందు విశ్వసించను. యేసు నామమందు నీవు బాప్తిస్మం పొందిన వెంటనే, నీ పాపములు క్షమించబడినవి అంటే నేను నమ్మను. మొదటగా పశ్చాత్తాపపడుము, చూట్టూ తిరుగుము, నీవు గురుతును కోల్పోయినావు వెనుకకు వెళ్ళుము, అని పేతురు చెప్పిన దానిని నేను నమ్ముదును. పశ్చాత్తాపపడి అప్పుడు నీవు బాప్తిస్మము పొందినావని లోకమునకు చూపించుము.
తిరిగి జన్మించుటయే పరిశుద్దాత్మ బాప్తిస్మం అని నేను నమ్మను. అది పరిశుద్దాత్మ బాప్తిస్మం కాదు; అది తిరిగి జన్మించుట. మనము రక్తమును బట్టి తిరిగి జన్మించినాము. రక్త కణము దానినుండి వచ్చును - జీవకణము రక్తము నుండి వచ్చును అని నా యొక్క అర్థము. దేహములోనికి నీవు పరిశుద్దాత్మ ద్వారా బాప్తిస్మం పొందినావు, కానీ రక్తమును బట్టి జన్మించినావు. నిశ్చయంగా. నీవు నీ తండ్రి యొక్క రక్తమును బట్టి జన్మించినావు. నేను నా తండ్రి రక్తమును బట్టి తిరిగి జన్మించినాను - మన తండ్రి క్రీస్తును బట్టి, అవును, అయ్యా!
కాని మీరు చూడండి, మేము ఆ విషయమును నమ్మము. ఎందుకనగా మనము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తాము. మమ్ములను యేసు మాత్రమే గుంపు వారిగా చేయవద్దు; ఏ విధముగాను కాదు. లేదయ్యా!
EXOD 3:5•
MATT 11:11•
LUKE 7:28•
ACTS 9:4-6
76అవునయ్యా! దేవుని స్వరము ఆ విధముగా వచ్చినప్పుడు సన్నిధిలో మోషే తననుతాను తగ్గించుకొనెను. "నీ పాదరక్షలను తీసివేయుము" అని చెప్పెను. మోషే వంగి పాదరక్షలను తీసివేసెను. చూడండి. అది నిజము.
పౌలు, వెలుగు ఆయనను నేల మీద పడునట్లుగా కొట్టినది. "సౌలా, సౌలా నన్నెందుకు హింసించుచున్నావు" అని ఆయన పలికెను.
"ప్రభువా, నీవు ఎవరవు?" అని అడిగెను. నేల మీద పడి. "నీవు ఎవరవు?"
నేను యేసును" (ఆ అగ్నిస్తంభమును) - "నేను యేసును, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము" అని పలికెను.
"ప్రభువా నేను ఏమి చేయవలెను?" అని అనెను. అతను సిద్ధముగా ఉన్నాడు.
ఆయన వచ్చుచుండుట బాప్తిస్మము ఇచ్చు యోహాను చూచెను. అత్యంత గొప్ప వ్యక్తులలో ఒకడు. "స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను అంతటి గొప్పవాడు లేడు," అని యేసు అనెను. యోహాను ఆయనను చూచినప్పుడు, అతను చాలా అల్పుడని అతను గుర్తించెను, "ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను," అని అతడు అనెను. ఆమేన్!
MATT 23:12•
LUKE 14:11•
LUKE 18:14
77ఎల్లప్పుడు గమనించండి, ఒక గొప్ప వ్యక్తి తననుతాను తగ్గించుకొనును. పైకి వెళ్ళుటకు మార్గము ఎల్లప్పుడు క్రిందికి వచ్చుటయే. నిన్నునీవు అల్పునిగా చేసికొనుము, దేవుడు నిన్ను పైకి తెచ్చును. "తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును." ఓ, మై, నేను దానిని ఇష్టపడుదును.
నిన్నునీవు చిన్నవానిగా చేసికొనుము. ఎల్లప్పుడు చిన్నవానిగా ఉండుము. గొప్పవానిగా ఉండవద్దు; చిన్నవానిగా ఉండుము, చూడండి. ఎలాగైనను మనమధ్య ఉన్న ఏకైక గొప్ప వ్యక్తి దేవుడు. అది నిజము.
"ఇది పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ ప్రజలు" అని నీవు ఎల్లప్పుడు చెప్పుదువు. ఓ, లేదు! అది పరిశుద్ధ దేవుడు (అది నిజము). అపవిత్ర సంఘము, అపరిశుద్ధ ప్రజలు, అది నిజము. పరిశుద్ధ సంఘము అనునది లేదు; పరిశుద్ధ దేవుడు సంఘములో ఉన్నాడు. పరిశుద్ధ ప్రజలు కారు; ప్రజలలో ఉన్న పరిశుద్దాత్మ పరిశుద్ధమైనది. అప్పుడు నీవు ప్రజలను గూర్చి మాట్లాడవు; ప్రజలలో ఉన్న పరిశుద్దాత్మ గురించి నీవు మాట్లాడుచున్నావు. ఆమేన్. అవునండి, అది సరియైన మాట! ఆమేన్! ఈ విషయము మీకు అర్థమైనది; నేను ఆలాగున అనుభూతి చెందుచున్నాను! అవునయ్యా! ఆయన దానిని ఇష్టపడెను; నాకు అది తెలియును. మహిమ! అవునయ్యా! సమస్తమును సరియే.
ISA 6:2,3
78నిన్నునీవు చిన్నవానిగా చేసుకొనుము. అతను రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనెను. భయభక్తులతో కూడిన గౌరవము. అతను పాదములను కప్పుకొనుట ద్వారా తననుతాను తగ్గించుకొనెను. మూడవదిగా రెండింటితో అతను ఎగిరెను. వాటిలో రెండింటితో అతను స్వయముగా పనిచేసెను. అతను దేవుని ముందు భయభక్తులతో ఉండెను. అతను దేవుని ముందు వినయముగా ఉండెను. అది మాత్రమే కాదు కాని అతను అచ్చట ఆలాగున ఉండలేదు కాని, అతను స్వయముగా పనిచేసెను. ఒక సంఘమును గురించి మాట్లాడు. ఆమేన్! తాను స్వయముగా పనిచేసెను. అతను దేనిని కలిగియున్నాడో, దానితో వెళ్ళుటకు అతను సిద్ధముగా ఉన్నాడు. అవును అయ్యా! "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని మాత్రమే అతను చెప్పగలిగినది; కాని అతను స్వయముగా దానితో క్రియచేసెను. అది నిజము! అతను పనిలో నిమగ్నమయ్యెను. అదియే ఈ రాత్రి సంఘమునకు అవసరము, మొదట భయభక్తులు కలిగియుండుట, తరువాత వినయము కలిగియుండుము, అప్పుడు పనిలో నిమగ్నమయి ఉండుము. అవును, అయ్యా!
ISA 6:3,5
79ఆయన ప్రవక్తకు చూపించెను… ఆయన తన సేవకులకు ఎలా ప్రతినిధిగా ఉన్నాడో, ఆయన తన ప్రవక్తకు చూపించిన, ఆయన ఎలా చేయబోవుచున్నాడో, ఈ దేవదూత, ఈ వ్యక్తి ఏమి చేసినాడో ఆయన తన ప్రవక్తకు చూపించెను. "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని అతను అరచినప్పుడు, అతని స్వరము దేవాలయపు స్తంభములను వణికించుట ప్రవక్త చూచెను. మరియు దేవాలయమును వణికినది. "సర్వశక్తుడైన ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు!" అని అతను మరలా అరవగా, దేవాలయము కంపించినది.
"నాకు శ్రమ!" అని యెషయా అనెను. ఒక ప్రవక్త రుజవు చేయబడిన ఒక ప్రవక్త, ప్రవక్తగా జన్మించిన వ్యక్తి, బైబిల్ యొక్క పెద్ద ప్రవక్త; "దేవుని మహిమను నా నేత్రములు చూచినాయి, నాకు శ్రమ" అని ఆయన అన్నాడు. ప్రవక్త తననుతాను తగ్గించుకొనుటను చూడండి. ఒక ప్రవక్త, దేవుని వాక్యము అతని వద్దకు వచ్చిన వ్యక్తి కాని కార్యరూపము దాల్చిన ఒక దర్శనమును అతను చూచినప్పుడు "ప్రభువు సన్నిధిని చూచునంత సమీపముగా నేను నిలువబడినాను, కావున నాకు శ్రమ" అని అతను అనెను. మన ఆధునిక అమెరికా ప్రజలు అది సంభవించుట చూడగలిగి, నడిచిపోవుదురు, అది చూచి నవ్వుదురు. అది నిజము.
ISA 6:5•
ISA 6:5
80అతను ఒక దర్శనము ప్రత్యక్షపరచబడుట చూచినప్పుడు, ప్రత్యక్తపరచబడిన దర్శనము. (ఓ, దేవా, ఈ పాపపు లోకముపై దయచూపుము.) — ఒక ప్రత్యక్తపరచబడిన దర్శనము, "నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, నా గురించి మంచి ఏమియు లేదు" అని అతడు మొర్రపెట్టేను.
మంచిది, "దేవుడు దీవించబడును గాక, నేను ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, పెంతెకోస్తులకు చెందిన వ్యక్తిని, నేను అక్కడ ఉండి, అలాంటి విషయమును వినవలసిన అవసరం లేదు" అని నీవు చెప్పుతావు. అక్కడ ఎంత వ్యత్యాసమున్నది, ఎంత వ్యత్యాసము.
మరియు మీకు జ్ఞాపకమున్నది గదా ఈ ప్రవక్త జన్మించినప్పుడే పిలువబడెను, ధృవీకరింపబడెను, అతని కార్యాలయమునకై అనాదిగా సంకల్పించెను. సత్యమును వెదకుచూ యుండెను, మరియు అతను రాజాతో ఉన్నాడు. అతను దేవుని కార్యములు బయలుపరచబడుట చూచెను, కాని తెరువబడిన దర్శనము చూచినప్పుడు, తనను హెచ్చించుకొనుటకు బదులుగా "నాకు శ్రమ, నేను నశించితిని. నేను ఇప్పుడు దీనియందు, దీనికొరకై ఉన్నాను, ఎందుకనగా నా నేత్రములు దేవుని మహిమను చూచినాయి" అని అతను అనెను.
81మరియు మనము దేవుని మహిమను చూడగలము, మనము చుట్టు ప్రక్కలకు వెళ్లి, "పైకి క్రిందికి పిచ్చిగా ఎగురు గుంపు, పిచ్చి ప్రజలు" అని చెప్పుతాము, మనము ఎక్కడికి వెళ్లలేము అనుటలో ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, నేను ఇక్కడకు వచ్చి ఏదో ఒక విషయమును చెప్పిన, అది ప్రజలకు సహాయపడును అని మీకు చెప్పినాను. అవును, మనము దానిని గౌరవించవలెను. మనము ఇవ్వగలిగినంత గౌరవమును దానికి ఇవ్వవలెను. మనము దేవుని నుండి ఒక తెరవబడిన దర్శనము మాట్లాడుట చూచినప్పుడు, అది సత్యమని తెలుసుకొనవలెను.
ISA 6:5
82"నాకు శ్రమ," అని యెషయా అనెను. "నేను ఇచ్చట ఈ రాత్రి భవనములో ఉన్నాను (లేక ఈ రోజు లేక ఎప్పుడయినా నేను దేవుని మహిమను చూచినాను.) నేను దేవదూత మాట్లాడుట చూచినాను. నేను ఏదో కదులుట చూచినాను. నేను పైకి చూడగా, నేను దేవుడు ఇచ్చట ప్రత్యక్షపరచబడుట చూచినాను. నాకు శ్రమ, ఎందుకనగా నేను అపవిత్రమైన పెదవులుగలవాడను, అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్య నివసించువాడను."
ఏమి జరిగినదో గమనించుడి. ఓ, అతను ఏమి చేసెను? ప్రవక్తయైన యెషయాకు — మనుష్యుడు గౌరవప్రదముగా, భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉండవలసియున్నది అని అతను చూపించేను. భయభక్తులు కలిగి, వినయముతో అప్పుడు పనిని ప్రారంభించెను. అది నిజము! పనిని ప్రారంభించండి.
JOHN 4:19,25,26
83బావియొద్ద ఉన్న స్త్రీవలె, ఆమె ఏదో జరుగుట చూచినప్పుడు, సహోదరుడా, ఆమెకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆమె వాటితో వెంటనే వెళ్లినది. ఆమె బయటకు వచ్చి వారు వాదించుకొనుచున్న ఆ కలుషిత జలములో కొంత యాకోబు బావినుండి చేదుకొనుటకు అక్కడికి వచ్చినది; కాని ఆమె జీవపు ఊట నుండి నీటిని ఎప్పుడైతే పొందుకున్నదో, ఆమె వెనువెంటనే పని ప్రారంభించినది. "అయ్యా నీ విద్యను నీవు ఎక్కడ చదివినావో దయచేసి నాకు చెప్పుము. నీవు ఈ విషయమును ఎక్కడ నేర్చుకొన్నావు? నీవు ఎలా నేర్చుకొనినావు?" లేక "నాకు ఐదుగురు భర్తలు ఉన్నారని నీవు ఎలా తెలుసుకొనినావు? నీవు ఎలా నా యందు ఉన్న తప్పిదము తెలుసుకొనినావు? నేను సమరయ స్త్రీనని నీవు ఎలా తెలుసుకొనినావు? నీకు ఈ విషయములు ఎలా తెలుసు?" అని ఆమె అడుగలేదు.
ఆమె ఎన్నడు ప్రశ్నించలేదు; "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మెస్సయా వచ్చినప్పుడు, ఆయన ఈ సంగతులు మాకు బోధించును అని మాకు తెలియును" అని ఆమె అనెను. ఓ, మై! ఆమె లేఖనమును బట్టి గుర్తించినది. "మెస్సయా వచ్చినప్పుడు, ఆయన ఈ సంగతులు మాకు తెలియజేయును అని నాకు తెలియును" అని ఆమె అనెను.
"నేనే ఆయనను," అని ఆయన పలికెను.
JOHN 4:29
84ఆమె పనిని ప్రారంభించినది. ఆమె వెళ్లగలిగినంత తీవ్రముగా పట్టణములోనికి నేరుగా వెల్లెను. "రండి, నేను చేసిన కార్యములను నాకు చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయన మెస్సయా కాడా?" అని ఆమె చెప్పెను. ఆమె సత్యమును చూచినప్పుడు, తప్పించుకొనచూడలేదు, కానీ ఆమె నిశ్చయముగా ఎంతో గౌరవించినది. ఆమె నిశ్చయముగా దానికి మద్దతు ఇచ్చినది, ఎందుకనగా ఆమె పట్టణములోనికి వెళ్లి, "మీరు దానిని నమ్మనట్లయితే రండి, నాతో రండి, మీరు వచ్చి చూడండి" అని చెప్పెను. మహిమ!
నేను ఈ రాత్రి పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపులోని సభ్యునివలె అనుభూతి చెందుచున్నాను. అవును అయ్యా! మై, ఒక పైకి క్రిందికి పిచ్చిగా ఎగురు గుంపులోని సభ్యుడను అని నీవు ఆ విధముగా అనుభూతి చెందుచున్నట్టైతే, నన్ను అలాగే ఉండనిమ్ము. అవును అయ్యా! నేను ఆయన నిజమని ఎరుగుదును. ఆయన ఇచ్చట ఉన్నాడని నాకు తెలుసు. అదే మెస్సయా, అదే దేవుడు, అదే క్రీస్తు ఈ రాత్రి ఇచ్చట వేడిగాయున్న ఈ చిన్న పాతకాలపు భవనంలో ఉన్నాడని నేను ఎరుగుదును. నేను దానిని మీకు రుజువు చేయగలను. ఆమేన్!
85ఇచ్చట ఆ మూల అక్కడ వున్న వ్యక్తి పైన నిలుచున్న ప్రభువు దూతను చూడండి. అతని పేరు… అతను ఒక పరిశుద్దుడైన శ్రీ. విట్. అతను వర్జీనియా నుండి వచ్చెను. (సరియా!) నరముల ఉద్రిక్తతతో బాధపడుచున్నాడు. నీవు నీ పూర్ణహృదయముతో విశ్వసించినట్లయితే, నీవు ఇంటికి వెళ్లి స్వస్థపడగలవు. అయ్యా, నీవు దానిని నమ్ముచున్నావా? సరే, ఇంటికి వెళ్లి స్వస్థపడుము; నీ నరముల ఉద్రిక్తత పోయినది.
అచ్చట ఉన్నాడు; అతని పేరు మోర్రియా. అతను ఇల్లినాయిస్ నుండి వచ్చెను. అతనికి మలాశయమునకు సంబంధించిన సమస్య ఉన్నది. అయ్యా, నీవు దానిని నమ్మినట్లయితే. నీవు దానిని నమ్ముచున్నావా? నేను నీకు క్రొత్త వ్యక్తిని. నీవు దానిని నమ్మినట్లయితే, అది నిన్ను విడిచిపెట్టును. హల్లెలూయా!
కారుతో తీసిన నిప్పు ప్రవక్తను తాకినప్పుడు,
ఆయనను ఉండగలిగినంత పవిత్రముగా చేసినది;
దేవుని స్వరము, "మా కొరకు ఎవరు వెళ్ళుదురు?" అని పలికినప్పుడు,
ఆయన "నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము" అని ప్రత్యుత్తరమిచ్చెను.
ISA 6:8•
LUKE 5:4,5•
JOHN 21:6
86ఏ హింస అయినను, ఏ సిలువ అయినను, "ప్రభువా నన్ను పంపుము; నేను ఇచ్చట ఉన్నాను!" నిన్ను ఎంతమంది తిరస్కరించినను, ఎంతమంది ఇది లేదా అది లేదా మరియొకటి చేసినను, అంత ముఖ్య విషయము కాదు, "నన్ను పంపుము!"
ఆయన అదే మెస్సయా. ఆయన ఇప్పుడు ఇచ్చట ఉన్నాడు. నేను ఆయనను మరలా చూచుదును. ఆమేన్. అది ఏమిటి?
ఆ స్త్రీ పనిని ప్రారంభించెను. ఆమె రెక్కలను పొందుకొని, ఎగురుట ప్రారంభించెను. ఆమె వెనువెంటనే పని ప్రారంబించెను
అపోస్తలుడైన పేతురు, ఒక రోజు సముద్రము మీద దేవుని వాక్యమును నమ్మినప్పుడు. అతను రాత్రంతా వలవేసి, ఏమియు పట్టలేదు. యేసు అతనియొద్దకు వచ్చి "దోనెకు ఆవల నీ వల వేయుము" అని ఆయన చెప్పెను.
"ప్రభువా, నేను ఒక జాలరిని, అవి ఎప్పుడు ఎరను మ్రింగునో, ఎప్పుడు మ్రింగవో నాకు తెలుసు. అవి ఎక్కడ ఉండునో, అవి ఎచ్చట ఉండవో నాకు తెలుసు. నేను రాత్రంతయూ చేపలు పట్టినాను, కాని ఒక మంచి నీటి చేపను కూడా పట్టలేదు. ఇప్పుడు, నీవు అచ్చట వల వేయుమని చెప్పినట్లయితే, అచ్చట చేపలు లేవని నాకు తెలియును, కాని నీ మాట చొప్పున, ప్రభువా, నేను వల వేయుదును," అని అనెను. అతను ఏమి చేసెను? అతడు కార్యములోకి వెళ్ళెను. ఆమేన్!
87ఇచ్చట మడుగు నిండా నీళ్ళు యున్నాయి. నీవు ఎన్నడు యేసు నామములో బాప్తిస్మము పొందనట్లయితే, కార్యము చేయవలసిన సమయము ఇదే. నీవు సంఘ సభ్యుడిగా ఉండి, పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తును ఎరుగనట్లయితే, ఇది కార్యము చేయవలసిన సమయము. నిజము? భయభక్తులతో నీ ముఖమును కప్పుకొనుము. వినయముతో నీ పాదములను కప్పుకొనుము, నీ మోకాళ్లను వంచి కార్యమును ప్రారంభించుము. నీవు దేవుని ఎరుగనట్లయితే, కార్యమును ప్రారంభించుము.
చూడలేని గుడ్డివానితో, యేసు మాట్లాడి, బురద తీసుకొని ఉమ్మివేసి, అతని కళ్ల మీద ఉంచి, అతనిని స్వస్థపరచెను. ఆయన అది చేసినప్పుడు, అతను కార్యమును ప్రారంభించెను. అతను ఆయన కీర్తిని వ్యాపింపజేసెను. ఆయనతో సమ్మతించకుండా ఉండుటకు అతను ప్రయత్నించలేదు కానీ, సహోదరుడా, అతను ఆయన కీర్తిని చుట్టు ప్రక్కలనున్న అన్ని ప్రాంతములలో వ్యాపింపజేసెను. అతను ఏమి చేసెను? అతను కార్యమును ప్రారంభించెను.
JOHN 9:25
88ఒకసారి ఒక గ్రుడ్డివాడు స్వస్థపరచబడెను. "ఆ వ్యక్తి పాపి నీవు అతనిని ఎరుగనే ఎరుగవు!" అని అతనితో అనినారు."
"అతను పాపియో కాదో నేను ఎరుగను, కాని ఒకటి మాత్రం నేను ఎరుగుదును. అదేమనగా నేను ఒకప్పుడు గ్రుడ్డివాడను, కాని నేను ఇప్పుడు చూడగలుగుచున్నాను" అని అనెను. అతను ఏమి చేసెను? అతను కార్యమును ప్రారంభించెను.
అదే సంఘమునకు అవసరము. కార్యమును ప్రారంభించుట! మనకు అత్యధికమైన అధికారము ఉన్నది, మనకు అత్యధికమైన లోక హుందాతనము ఉన్నది; మనము పనిని ప్రారంభించవలెను. ఆమేన్! అతను ఆయన కీర్తిని విదేశాలలోను, ప్రతి చోటను వ్యాపింపజేసెనుసినాడు.
JOHN 9:24•
ACTS 1:8
89పెంతెకోస్తు యొద్ద ప్రజలు, వారికి ఎక్కువగా తెలియదు. వారిలో కొంతమంది వారి స్వంత పేర్లను సంతకము చేయలేరు. వారు భయపడినారు. వారు మేడ గదిలోనికి వెళ్లినారు. కాని ఒకరోజు వారు ఏమి చేసినారు? వాక్యమునకు విధేయత చూపుటకు అక్కడకు వెళ్లినారు. వారు ఆయన వాక్యమును అంగీకరించినారు. ఓ, ఈ రోజు ప్రజలు వాక్యమును అంగీకరించినట్లయితే, అప్పుడు వారు కార్యమును ప్రారంభించుదురు. "యెరుషలేము పట్టణములో వేచియుండుడి." లూకా 24:49.
ఈ వాగ్దాన ప్రకారముగా మీరు పరిశుద్దాత్మను పొందుదురు. ఈ పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు; మీరు నాకు సాక్షులైయుందురు." అపోస్తులుల కార్యములు 1:8.
LUKE 24:49•
ACTS 1:13,14
90లూకా 24:49 చెప్పుచున్నది, "ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను: మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను." ఎంత కాలము? ఒక ఘడియ, రెండు ఘడియలా, నాలుగు నెలలా, ఆరు నెలలా, ఏ వ్యత్యాసమును కలిగించదు. ఎంతవరకు? అది ఎంతకాలమొ? అప్పటి వరకు. నీవు దేవునిని దేనికొరకైన అడిగినప్పుడు, అప్పటి వరకు అచ్చట నిలిచి యుండుము. ఆమేన్, అప్పటి వరకు నిలచియుండుము. ఎప్పటి వరకు? అది జరుగు వరకు. దానిని గట్టిగా, నాది అని చెప్పుము. దానిని నమ్ముము! దానిని పట్టుకొనియుండుము! పనిని ప్రారంభించుము. దాని గురించి సాక్ష్యము చెప్పుము. మహిమ! అవును, సాక్ష్యమివ్వ భయపడవద్దు. పనిని ప్రారంభించుము.
వారు ఎందుకు మేడ గదిలో ఉన్నారు? దేవునిని స్తుతిస్తూ మరియు దీవిస్తూ యున్నారు. దేని కొరకు? వాగ్దానము; అది రావలసియున్నదని వారు ఎరిగియున్నారు. నీవు అచ్చట ఉన్నావు; పనిని ప్రారంభించుము. వాగ్దానము నెరవేర్చబడువరకు స్తుతిస్తూనే యుండుము. నీవు వాగ్దానము పొందియున్నావు.
ACTS 2:2
91దేవుడు స్వస్థపరచును, అని నీవు నమ్మినట్లయితే, పనిలో నిలచియుండుము. ఆయన నిన్ను ఇప్పుడు బయటకు పిలువబోవుచున్నాడు అని నమ్మినట్లయితే, మరియు నీవు ఆయనను హత్తుకొనియున్నట్లయితే, పనిలో నిలిచియుండుము. ఆమేన్! పనిలో నిలిచియుండుము. నీకు రెండు రెక్కలు ఇవ్వబడినవి. పనిలో నిలిచియుండుము. వాటిని ముందుకు, వెనుకకు అల్లాడించుము. "ప్రభువా, నేను నమ్ముచున్నాను, ప్రభువా నేను నమ్ముచున్నాను," నీవు అరచుట మాత్రమే చేయలేవు, "పరిశుద్దుడు, పరిశుద్దుడు" ఇంకను "ప్రభువా నేను నమ్ముచున్నాను" అని చెప్పుము. పనిలో నిలిచియుండుము! ఆమెన్!
వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక ధ్వని ఆకాశము నుండి వచ్చు వరకు వారు పనిలో నిమగ్నమైయుండిరి. అప్పుడు నిజముగా వారు పనిని ప్రారంభించితిరి. అప్పుడు వారు కార్యమును ప్రారంభించితిరి.
సహోదరుడా, సహోదరీ, ఈ అంత్య దినములలో ఏమి జరుగుచున్నదో మనము చూచినప్పుడు, ఆ కార్యము మనలను పనిలో నిమగ్నము చేయవలసియున్నది. ఆమేన్! మనము తప్పనిసరిగా పనిలో ఉండవలెను. అది ఖచ్చితముగా నిజము. అది ఏదో అని మనము చుట్టూరా ఉన్నాము. మంచిది. ప్రజలు చుట్టూ ఉన్నారు, పెంతెకోస్తు ప్రజలు; ప్రభువు ఏదో ఒక దానిని చేయును; "అది చాలా బాగున్నదని" వారు చెప్పుదురు. ఓ, నా యొక్క! దేవునికి చాలా సమీపముగా జీవించు సెరాపు వలె ఉండవద్దు. అది నిజము. ఒక వర్తమానికుడు, ఆయన చాలా దేవునికి చాలా సమీపముగా ఉన్నాడు. నీవు ఇత్తడి బలిపీఠము అవతల దేవుని పిల్లవాడివగుచున్నావు.
JOHN 14:12
92సెరాపు ఇత్తడి బలిపీఠము వద్ద ఉండును. కాని నీవు దేవుని కుమారుడిగా లేక కుమార్తెగా దేవుని సన్నిధిలోనికి నేరుగా వెళ్ళుదువు. నీవు ఏ యాజకుడి గుండా మరియు ఈ కార్యములన్నింటి గుండా వెళ్లవలసిన అవసరం లేదు. ఆయన నీ యాజకుడు. చూడండి, కుమారులుగా మరియు కుమార్తెలుగా ఆయన సన్నిధిలో ఉన్నారు. సహోదరుడా, మనము రెండు రెక్కల కంటే ఎక్కువ రెక్కలను కలిగియున్నాము. ఆమేన్! మనము పరిశుద్దాత్మను పొందినాము! అది నిజము.
కాని మనము భయభక్తులతో, వినయముతో పనిలో నిమగ్నమై యుండవలసియున్నది. ఏదో ఒకటి ఎవరి మీదో త్రోసివేయుటకు ప్రయత్నించుట పనిలో లేము, కాని ఆలాంటి భయభక్తులతో మరియు వినయముతో మనము పనిలో నిమగ్నమయి, "మాకు శ్రమ, మేము సర్వశక్తుని యొక్క సన్నిధిని చూచినాము, దర్శనములు కలుగుట మేము చూచినాము," అని చెప్పుదుము. "నేను చేయు కార్యములను మీరును చేయుదురు. నేను చేసిన దానికంటే మరియొక్కువగా మీరు చేయుదురు, ఏలయనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను," అని ఆయన చెప్పెను.
JOHN 13:3•
JOHN 16:28•
ACTS 9:5
93వ్రాయబడినవాటికంటే ఎక్కువ జరుగుట మనము చూచినాము. ఎందుకు? బైబిలులో వ్రాయబడినదానికంటే అధికముగా ఒక కూటములో జరుగుట మనము చూచినాము, అది నిజము. ఆయన జీవితము యొక్క ముప్పై-మూడున్నర సంవత్సరాలలో వ్రాయబడిన కార్యములు వాటన్నింటికంటే ఎక్కువగా ఒక్క కూటములో జరిగెను. అది నిజము. వాటి గురించి ఆలోచించుడి. మనము వాటిని మన కళ్లతో చూచినాము. అవి జరుగుట మనము చూచినాము. ముందుగా చెప్పబడినవి జరుగుట మనము చూచినాము. దానిని గమనించండి. కుంటి, గ్రుడ్డి, ఊచ, ఎండిపోయినవారు, ముందుగా చెప్పబడిన సంగతులు ఖచ్చితముగా, పరిపూర్ణముగా నెరవేరినవి, ఎన్నడునూ విఫలమవ్వలేదు. సహోదరుడా, అది మనలను వినయముతోను, భయభక్తులతోను పనిలో నిమగ్నము చేయును.
పూర్వమునుండియున్న బైబిల్ కాలములలో, అగ్నిస్తంభము ఇశ్రాయేలు మీద వ్రేలాడినది, మరియు అది శరీరధారియై మనమధ్య నివసించినది… "నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. దేవుని యొద్దకే మరలా వెళుచున్నాను." పరిశుదుడైన పౌలు దానిని చూచి ముఖమును నేల మీద మోపెను. గమలీయేలు దగ్గిర నేర్చుకొనిన పౌలువంటి ఒక గొప్ప బోధకుడు, ధూళిలో దొర్లి "ప్రభువా, ప్రభువా, నీవు ఎవరవు? నేను వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను" అని మొర్రపెట్టెను. ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఎవరు, ఒక పండితుడు, ఆయన తన్నుతాను తగ్గించుకొనెను, ఎందుకనగా ఆయన అగ్నిస్తంభమును చూచెను. అది మన మధ్య సంచరించుట మన నేత్రములతో చూచుటయే గాక శాస్త్రీయముగా దానిని మనము పొందుకొనినాము. అది మనలను పనిలో నిమగ్నము చేయవలసియున్నది.
అది అచ్చట, పూర్వము చేసిన అదే కార్యములను ఇప్పుడు చేయుట మనము చూస్తున్నాము. అది ఈనాడును దానిని చేయుచున్నది. తండ్రి యొక్క వాగ్దానము. మై, అది ఏమిటి? వాక్యమును రుజవు చేయుటకు అది వచ్చినది. వాక్యము ఆలాగున ఉన్నదని రుజవు చేయుటకు అది సంఘమును కార్యములో నిమగ్నము చేయవలసియున్నది, నీవు ఆలాగు తలంచుట లేదా?
ISA 6:2
94అతను భయభక్తులు కలిగి రెండింటితో తన ముఖమును కప్పుకొనెను. వినయము కలిగి, అతను రెండింటితో తన పాదములను కప్పుకొనెను. అతను రెండింటితో పనిచేయుటకు వెళ్ళెను. అతను వెళ్లిపోయెను, పనిని ప్రారంభించెను. ఇప్పుడు మనము వాక్యము నిమిత్తము పనిలో ఉండవలెను. మనము ప్రజలకు చెప్పుతూ యుండాలి. ఆయన రాకడ సూచనలు ప్రత్యక్షమవుచున్నవి. మనము చూచిన ప్రతిచోట అవి వాక్యము నుండి బయటకు వచ్చుచున్నవి. జరుగబోయే కార్యములను గురించి, పరిశుద్దాత్మ వచ్చి మనకు చెప్పుటను మనము వినుచున్నాము.
95ఈ ఆలయము నుండియే ఇరవై సంవత్సరముల క్రితం అధ్యక్షుడైన కెన్నడీ వచ్చుచుండుట గురించి అది చెప్పెను. ఖచ్చితముగా ఏమి జరుగునో అది చెప్పెను, స్త్రీలు ఈ వ్యక్తిని ఎచ్చట ఉంచుదురు, అతను ఖచ్చితముగా ఏమి అగునో అని అది ఖచ్చితముగా చెప్పెను. మనము అది ఏలాగు జరిగెనో, ఏమి జరుగును అని ఖచ్చితముగా చెప్పబడెను, అని మనము ఎరిగియున్నాము. మరియు అది ఈ రోజు ఇచ్చట ఉన్నది. మరియు ఇచ్చట ఆ సమావేశం ఆవిర్భవించుచున్నది. సంఘసమాఖ్య మరియు వారందరు కలిగి వచ్చుచున్నారు. అది ఎందుకు మనలను కార్యములో నిమగ్నము చేయదు? అది నిజము. అహా! ఆయన పలికిన వాక్యము వెంబడి వాక్యము, మనముందే నెరవేరియున్నది. అది మనలను పనిలో నిమగ్నము చేయును.
ప్రవక్తవలె, సంఘ శాఖలు వెళ్లిపోవుట, తిరస్కారము, హెచ్చించుకొనుట, వాటి స్థానములను కోల్పోవుట మనము చూచినాము.
2CH 26:21,23
96యెషయా అచ్చట నిలబడియున్నదానివలె, అతను ప్రారంభము నుండి సంఘశాఖ వ్యక్తి. అతను రాజు మీద ఆధారపడినవాడు, ఎందుకనగా అతను మంచివాడు. కాని స్వయంగా హెచ్చించుకొనుట అతనికి ఏమి చేసినదో అతను చూచెను. అది అతనిని శాశ్వతముగా తీసివేసినది. సంఘ శాఖ యొక్క సొంత హెచ్చింపు సంఘమునకు ఏమి చేసినదో మనము చూచినాము. అది సంఘ శాఖ అని పిలువబడే దానిని చక్రములో నుండి శాశ్వతముగా తీసివేసినది. ఏదైనా ఒక్కటి పడిపోయిన తరువాత తిరిగి లేచినదా నాకు చెప్ప౦డి. అది ఎక్కడ ఉన్నది? చరిత్రల గుండా వెనుకకు చూడండి, ఏ సంఘమైనా పడిపోయిన తరువాత మరలా తిరిగి లేచినదా నాకు చెప్ప౦డి. అది శాఖగా మారిన వెంటనే, అది పడిపోయినది. అది మరలా ఎన్నడునూ తిరిగి లేవలేదు. ఉజ్జియా ఎన్నడు ఆలయమునకు మరలా రాలేదు. తన శేష దినములన్నియు అతను కుష్టురోగిగా ఉండెను మరియు కుష్టరోగిగా పాతిపెట్టబడెను. అవును అయ్యా!
ISA 1:6
97అది ఇప్పుడు ఏమి చేసినదో ప్రవక్త చూచెను. అతను హెచ్చించుకొనుట ఏమి చేసినదో చూచెను. "మానసిక వైద్యుడు అతని ప్రజ్ఞా సూచి సరిగ్గా ఉన్నదో లేదో అని పరీక్ష చేస్తేనే గాని ఎవరునూ మన సంఘ శాఖలలోనికి రాలేరు. అతను మనతో మాట్లాడుటకు రావలెనంటేనే అతను డి.డి, పి,హెచ్.డి డిగ్రీలు కలిగి ఉండవలెను. అతనికి అది లేకపోతే, మన సమాక్య అతనిని కలిగి ఉండదు." ఓ, మై! "దేశంలోనే అత్యుత్తమ జనసమూహము వచ్చుచున్నది. మన స్థలముల చుట్టూ ఉంచబడిన కార్లను చూడండి. అవి కాడిలాక్ మరియు రిక్కిన్-బాకర్స్, మరియు మొదలుగునవి."
మనము అది చనిపోవుట చూచియున్నాము. అది చనిపోవుట మనము చూచుచున్నాము, కుళ్లిపోయిన పుండు, దానిని బైబిలు ఆలాగు పిలుచుచున్నది. అది మొత్తము పుండు. అది దుర్వాసన వచ్చుచున్నది. అది నిజము. (ఆత్మ సంబంధముగా మాట్లాడుచు నేను దీనిని చెప్పుచున్నాను, చూడండి.)
2CH 26:16•
JOHN 16:13
98వారు దేవుని వాక్యము పైన వారిపట్టు కోల్పోవుచూ, సిద్దాంతములను హెచ్చించుట మనము చూచుచున్నాము. ఏమి చేయుట మనము చూచుచున్నాము? కుష్టురోగముతో, అవిశ్వాసముతో మొత్తబడినది.
అహా! ఓ, మై!
అతనియొక్క అభిషేకించబడిన కార్యాలయము యొక్క స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించిన ఉజ్జీయా వలె, అతను మొత్తబడిన తరువాత, అతను దానిని విఫలపరచానని కనుగొనెను. దేవుని వాక్యమును బోధించుటకు సంఘములు అభిషేక కార్యాలయము యొక్క స్థానమును తీసుకొనుటకు ప్రయత్నం చేయుచుండుట మనము చూచియున్నాము. మరియు వారికి ఏమి చేయవలెనో తెలియదు. వారి ముందు దేవుని వాక్యమును ఉంచుము, ఏమి చేయవలెనో వారికి తెలియదు. అది భయంకరమైది. "అది మరియొక దినము కొరకు అని మేము నమ్ముచున్నాము." అది ఏమిటి? వారు గందరగోళమునకు గురైతిరి. ఆయనే స్వయముగా వాక్యరూపములో ఉన్నటువంటి ఆయన అభిషేక కార్యాలయమును నీవు ఏ విధముగా నిర్వహించగలవు? సత్యమైన వాక్యమును తిరస్కరిస్తూ, నీవు ఆత్మ చేత అభిషేకించబడినావని ఇంకను ఎలా చెప్పగలవు?
దేవుని వాక్యమును ప్రత్యక్ష్యపరచగలిగినది ఒకే ఒక్క పరిశుద్దాత్మ మాత్రమే. "పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, అతను ఈ సంగతులను మీకు చూపించును." అది నిజము. ఒక సిద్దాంతమునకు లేక ఒక శాఖకు చెందిన నీవు ఎలా అభిషేక కార్యాలయమును నిర్వహించగలవు? వారు చనిపోయిరి! చేయవలసిన కార్యము ఏదనగా, క్రిందపడి "ప్రభువైన దేవా, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను" అని మొర్రపెట్టుట. అవును అయ్యా!
JOHN 1:1,14•
1TIM 2:5
99ఈ సంఘ శాఖలు పరిశుద్ధ సంఘము యొక్క స్థానమును తీసికొనుటకు ప్రయత్నించుచున్నాము. "మనము భూమ్యాకాశముల సృష్టికర్తయైన, సర్వశక్తుడైన తండ్రియెన దేవునియందు, మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించుచున్నాము. మనము పరిశుద్ధ రోమన్ కెథలిక్ సంఘము నందు విశ్వసించుచున్నాము," మరియు ఇటువంటి వ్యత్యాసమైన కార్యములు. "మనము పరిశుద్దుల సహవాసమునందు విశ్వాసముంచుచున్నాము."
నేను క్రీస్తు సహవాసమునందు విశ్వసించుచున్నాను. అవును అయ్యా! పరిశుద్దులు మహిమలో ఉన్నారని నేను నమ్ముచున్నాను, నిశ్చయము. దేవునికి, మానవునికి మధ్య మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అవును అయ్యా! ఆ మాటలను ముందుకు త్రోయుము. ఇచ్చట, బైబిల్ దానిని విభేదించును. "మంచిది, అది బైబిలు" అని వారు చెప్పుదురు. అది దేవుడు! ఆ వాక్యము దేవుడైయున్నాడు, ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించుచున్నది. మరియు ఇప్పుడు, వాక్యము మన దేహములో ఉన్నది, మరియు తన్నుతాను ప్రత్యక్షపరచుచున్నది, పరిశుద్దాత్మ చేత అభిషేకించబడినది. పనిని ప్రారంభించుటకు సమయము. అది నిజము.
ISA 6:5
100ప్రవక్త మీద ఉన్న దర్శనము యొక్క ప్రభావములు అతను పాపియని ఒప్పుకొనే విధముగా చేసినవి. (అభిషిక్తుడైన ప్రవక్త). "నేను అపవిత్రమైన పెదవులుగలవాడను, నేను తప్పిదమైనవాడిని, నేను తప్పిదమును చేసియున్నాను. నాకు నేనే అపవిత్రుడను" అని అతను అన్నాడు. అతను ఒక పాపి. అతను తన పాపములను ఒప్పుకొనెను. అవును అయ్యా! తను పాపియని దేవుని ప్రవక్తను ఒప్పుకొనేలా చేసినది; దర్శనము అదే కార్యమును చేసినది. డి.డి., పి.హెచ్.డి., పట్టభద్రులు దానిని చూచి నవ్వదురు. ఒక సంఘము యొక్క విభిన్న స్థాయిలు కలిగిన వ్యవస్థగా ఉండవలసియున్నది.
ఈనాటి వార్తా ప్రసారములో ఆ మతాధిపతి ఏమి చెప్పినాడో మీరు విన్నారా? "ప్రభువు రాకడ త్వరలో వచ్చుచున్నదని బోధించుచున్న కొంతమంది అక్కడ ఉన్నారు" అని అతను అనెను. "నిశ్చయముగా మనము ఆ గుంపును వదిలించుకోవాలి, మనము ప్రపంచ మతమును ఏకము చేయగోరుచున్నాము" అని అతడు అన్నాడు. ఖచ్చితముగా. మీరు ప్రజలారా, మీరు ఇప్పుడు నిద్రలోనికి వెళ్ళకండి. మీరు అనుకునే దానికంటే సంగతులు చాలా సమీపముగా ఉన్నవి. ఈ వ్యక్తి ఖచ్చితముగా యేసేపును ఎరుగని ఆ వ్యక్తివలె ఉన్నాడు, మీకు తెలియునా.
101గమనించండి, ఉండగలిగినంత కుయుక్తితో లోపలికి వచ్చుచున్నది, ఆ ఆఖరి ప్రదేశములో ఇచ్చట వారు పట్టు కలిగియున్నారు. సంఘసమాఖ్యను తీసుకొనుటను బట్టి వారు దానికి ఒక ప్రతిమను రూపి౦చుచున్నారు. మృగము మాట్లాడిన రీతిగా వారు దానిని మాట్లాడి౦చుచున్నారు, భక్తులను హింసించుటకు దానికి అధికారము ఇవ్వబడినది, మరియు దేవుని చట్టములను, కాలములను అది మార్చును. అది ఖచ్చితముగా ఏమి చెప్పినది. మనము దానియొద్దకు తరువాత వెళ్ళుదాము. ఈ రాత్రి బాగా ఆలస్యమైనది. మీరు ఏలాగైనను దానిని తెలుసుకుందురు. అవును అయ్యా.
అతను ఒక పాపి అని తన్నుతాను ఒప్పుకొనేలా చేసినది. ఎందుకు, ఈ రోజు అది ఆలాగున పిలువబడుచున్నట్లయితే, "మంచిది నేను వైద్యుడైన ఫలానా-ఫలానా వాడిని" అని వారు చెప్పుదురు.
ఒక మతాచార్యుడు, "నేను పరలోకమునకు వెళ్లినప్పుడు, నేను ఏమి చేయబోవుచున్నానో మీకు తెలియునా?" "నేను యేసునొద్దకు వెళ్లి, నేను ఎవరో నీకు తెలుసా? నేను ఫలానా-ఫలానా బిషప్" అని చెప్పుదును అని అతడు చెప్పుట నేను వినియున్నాను.
"అవును నా తల్లి నీ గురించి చెప్పినది నేను విన్నాను" అని ఆయన చెప్పెను.
"ప్రజలు బైబిల్ ను నమ్ముట బురద నీటిలో నడుచుటవలె యున్నది; నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో నీకు తెలియదు" అని అతడు అనెను.
PS 16:8•
PS 23:4•
PS 139:8,9•
ISA 6:5,7
102ఆయన నా మార్లిదర్శి అని నీవు తలంచుట లేదా? (నేను రేపు రాత్రి దానిమీద ప్రసంగించబోవుచున్నాను.) అవును అయ్యా! మీరు ప్రయాణించవలసిన సమస్త మురికి జలముల గుండా సమస్త అపాయకరమైన లోతు తక్కువగా ఉన్న ప్రదేశములు మరియు సమస్త ఉన్నత స్థలములు, మరియు పల్లపు ప్రదేశముల గుండా ఆయన మిమ్ములను నడిపించును. అది ఏ ప్రదేశమైననూ, ఆయన నిన్ను మరణపు నది మీదుగా నడిపించును. ఆమేన్! ఓ, అవును అయ్యా! ఆయన నిన్ను విడిపించును. "మరణము సంభవించునప్పుడు నేను ఏ కీడుకు భయపడను, ఎందుకనగా నీవు నాతో ఉన్నావు. అవును, నేను మరణచ్చాయ కలిగిన లోయగుండా ప్రయాణించినను. నేను ఏ కీడునకు భయపడను; ఎందుకనగా నీవు అచ్చట ఉన్నావు."
"నేను నా పడకను పాతాళములో ఏర్పాటు చేసుకొనినను," "ఆయన అచ్చట ఉన్నాడు" అని దావీదు అనెను. "ఓ నేను వేకువ రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినను, ఆయన అచ్చట ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు నా ముందు ఉన్నాడు కనుక నేను కదలింపబడను." ఆమేన్! ఓ మై! ఆ రెక్కలు ధరించి ఇప్పుడు పనిలోనికి వెళ్ళుట. అవును అయ్యా!
ఈ ప్రవక్త వెంటనే కార్యము లోనికి వెళ్ళెను; అతడు మోకరించెను. "నేను అపవిత్రమైన పెదవులుగలవాడను" అని అతడు అన్నాడు. అతను ఒప్పుకొనిన వెంటనే, అప్పుడు శుద్దీకరణ వచ్చినది. నీవు మొదట ఒప్పుకొనవలెను.
ISA 6:5
103మీరు గమనించవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను, ఈ ప్రవక్త ఎప్పుడైతే… దానిని గురించి ఆలోచించుడి; సమాఖ్య ప్రభుత్వముతో నిలబడిన ఒక వ్యక్తి, ఒక రుజువు చేయబడిన ప్రవక్త, అతను మొట్టమొదటి దర్శనము చూచిన వెంటనే…. అతను అంతకు ముందు దర్శనములను చూడలేదు; అతను వేరే విధముగా కలిగియున్నాడు. అతను దేవుని నడిపింపు యొక్క అనుభూతిని కలిగి దేవుని వాక్యప్రకారముగా వెళ్లేవాడు. కాని ఈసారి తెరువబడిన దర్శనము, "నేను అపవిత్రమైన పెదవులుగలవాడను. ఈ ప్రజలందరూ అపవిత్రులు. నాకు శ్రమ, ఎందుకనగా నేను దేవుని మహిమ ప్రత్యక్ష్యపరచబడుటను చూచినాను" అని అతను అరచెను. మనము దానిని చూచుచున్నాము. మనము ఎగిరిపోవలెను. చూడండి, చూచారా?
ISA 6:4-7
104"నేను అపవిత్రమైన పెదవులుగలవాడను," అతను బలిపీఠము యొద్దకు వెళ్లి, "నేను అపవిత్రమైన పెదవులుగలవాడను, ప్రభువా. నేను ఏమి చేయగలను, నేను ఏమి చేయగలను, నీవు ఇచ్చట ప్రత్యక్ష్యపరచబడుట నేను చూచినాను? దేవదూత దానిని కంపింపచేయుట నేను చూచాను. అతను మాట్లాడగా, ఒకటి ముందుకు, వెనుకకు, కదులుట నేను చూచాను" అని అతడు అనెను. ఆమేన్! (మీరు నిద్రపోవుట లేదని నేను ఆశించుచున్నాను.) ఓ, మై! మాట్లాడగా ఒకటి సంభవించెను. మహిమ! ఏమి సంభవించెను?
అతను తన పాపమును ఒప్పుకొనుట మనము కనుగొనగలము, అతను దానిని చేసిన వెంటనే, మాట్లాడుచున్న ఆ గొప్ప స్వరము ఎగురుచూ క్రిందికి దిగినది. అతని చేతితో పట్టకారును తీసుకొని, నిప్పును తీసుకొని, తన చేతి మీద పెట్టుకొని యొషయా పెదవుల మీద పెట్టినది, అతనిని శుద్దిచేసినది.
105గమనించండి, ఆయన అతనిని ఎన్నడు ఒక పి.హెచ్.డి. పట్టా పొందుకొనమని పంపలేదు. ఆయన అతనికి నేర్చుకొనుటకు నియమాల పుస్తకమును ఎన్నడును ఇవ్వలేదు; కానీ దేవుడు ప్రవక్తకు బలిపీఠము మీద నుండి తీసిన అగ్నిచేతనే, తన శుద్ధిచేయు శక్తి అని చూపించుచున్నాడు. ఆమేన్! దేవుడు శుద్ధిచేయు శక్తి ఈనాడు ఒక సిద్దాంతమును ఉచ్చరించుట కాదు లేక ఒక సంఘములో చేరుట కాదు; అది పరిశుద్దాత్మ యొక్క శక్తి మరియు అగ్ని దిగివచ్చి తన సమస్త అవిశ్వాసము నుండి ఒక వ్యక్తిని శుద్ధిచేయును. ఆమెన్!
దేవుడు ఒక ప్రవక్తను శుద్ధిచేయు విధానము అగ్నిచేత, గాని సిద్దాంతము చేత కాదు. ప్రవక్తకు ఒక సిద్దాంతము గురించి ఏమి తెలియును? అతను దేవుని చేత వాడబడబోవుచున్నాడు. వాక్యము అతని ద్వారా ప్రత్యక్షపరచబడుచున్నది, కావున ఆయన అతనికి ఒక సిద్దాంతమును ఇవ్వలేడు. అతను ఆ సిద్దాంతమును పట్టుకొనియుండియున్నాడు. కావున ఆయన బలిపీఠము నుండి అగ్నిని తీసుకొని ప్రవక్తను శుద్ధిచేసెను.
MARK 16:16,17
106మొదట ఒప్పుకోలు, తరువాత అగ్నిచేత శుద్ధి, దేవునికి మహిమ! ఓ కనిపెట్ట౦డి మొదట ఒప్పుకోలు, తరువాత శుద్ధిచేయుట, మూడవది ఆజ్ఞ. ఆమేన్! నీవు అచ్చట ఉన్నావు. మొదట, "నేను తప్పిదమైన వ్యక్తిని" అని ఒప్పుకొనవలెను. రెండవది, శుద్ధిచేయుట. నీతీకరణము, శుద్దీకరణము మరియు పరిశుద్దాత్మ బాప్తిస్మము, చూచారా. ఒప్పుకోలు, శుద్ధిచేయుట, ఆజ్ఞను ఇచ్చుట. "సర్వలోకమునకు వెళ్లి మరియు సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును." ఆమేన్.
ఒప్పుకోలు తరువాత శుద్ధిచేయుట. శుద్ధిచేయబడిన తరువాత ఆజ్ఞను అనుగ్రహించుట. సువార్తను ప్రకటించుట, రోగులను స్వస్థపరచుట. జనులు ఏమి చెప్పిననూ అంత ముఖ్యము కాదు.
చివరకు ఆ ప్రశస్త చిన్న ప్రవక్త శ్రమవలన, రంపముతో ముక్కలుగా కోయబడుట ద్వారా చనిపోయెను.
ISA 6:8
107జ్ఞాపకముంచుకొనుడి, అతను తప్పిదమైన వ్యక్తి అని యెషయా తన ఒప్పుకోలును ఒప్పుకొనెను. అతను పూర్తిగా తప్పిదముగా యున్నాడు; అతను తన సిద్దాంతము మీద ఆధారపడియున్నాడు. (చూడండి), ఒక మానవుని మీద ఆధారపడియున్నాడు, మానవ-నిర్మిత వ్యవహారము. అతను రాజు గొప్పవాడని చూచెను; అతను మత సంబంధమైన వ్యక్తి. కాని మానవులందరూ విఫలమవుదురని అతను చూచెను, చూచారా.
కాని అతను దానిని మార్చివేసినప్పుడు, పైకి చూచినప్పుడు, దేవుడు ఏమైయున్నాడు అనే దర్శనమును చూచినప్పుడు, "నేను తప్పిదమైన వ్యక్తి అని నేను ఒప్పుకొనుచున్నాను" అని అతను అనెను. ఆ పాత సిద్దాంతములు ఇక పనిచేయవు, ఎందుకనగా వారు మరణించిరి మరియు విఫలమైతిరి. [చూచారా?] వారు కుష్టరోగముతో మొత్తబడెను, కాని నేను, దేవుని మహిమ ప్రత్యక్తపరచబడుట చూచాను." ఒక సిద్దాంతము దానిని ప్రత్యక్తపరచలేదు. ఒక సిద్దాంతము దానిని ఆలాగున చెప్పలేదు. ఒక సిద్దాంతము దానిని అలాగున చేయలేదు. ఆలాగున చేయుటకు క్రీస్తు కావలెను. అతను దానిని చూచిన వెంటనే, "ఇప్పుడు నేను పూర్తిగా తప్పిదమైన వ్యక్తిని ప్రభువా!" అని అతడు అనెను. అప్పుడు శుద్దీకరణ వచ్చినది; అప్పుడు ఆజ్ఞ వచ్చినది. ఓ, మై!
అప్పుడు శుద్ధిచేయబడిన యెషయా… "నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు," అని దేవుడు పిలచినప్పుడు, "ప్రభువా, నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము!" అని చెప్పిన యెషయా శుద్ధిచేయబడిన ప్రవక్త.
108ఓ, మీరు ప్రభావమును చూచుట లేదా? మార్తెల యొక్క ప్రభావము చేత నీవు ప్రభావితుడవు కావద్దు. (అది ఇక్కడ ఒక పేరు కాదు అని నేను ఆశించుచున్నాను.) నీతో ఉన్నత పాఠశాలకు లేక సాధారణ పాఠశాలకు హాజరగు చిన్న బాలిక లేక తన జట్టు కత్తిరించుకొను మరియు పొట్టిలాగులు ధరించుకొను నీ ఇంటి ప్రక్కనయున్న పొరుగు స్త్రీ యొక్క ప్రభావముచే నీవు ప్రభావితుడవు కావద్దు. దేవుని వాక్యమును తిరస్కరించి, నీకు సిద్దాంతమును బోధించే ఒక సిద్దాంత సంఘకాపరి యొక్క ప్రభావముచే నీవు ప్రభావితుడవు కావద్దు. ఆ ప్రభావమునకు గురికావద్దు, కాని దేవుని మహిమ దిగుట నీవు చూచు వరకు అచ్చటనే నీవు నిలిచియుండుము. దాని ప్రభావములచే ఒకటి కదులుట చూడుము. దేవుడు చెప్పిన ప్రకారమే అది జరుగుట చూడుము. అప్పుడు కేకవేయుము, "నాకు శ్రమ, ప్రభువా; నేను తప్పిదముగా యున్నాను. ప్రభువా, నన్ను ఇప్పుడు శుద్ధి చేయుము. నన్ను శుద్ధిచేయుము. జీవము గల దేవుని ఆత్మ నా మీద తాజాగా కుమ్మరించబడును గాక."
నిప్పుకణిక ప్రవక్తను తాకినప్పుడు,
ఆయనను చేయగలిగినంత పవిత్రముగా చేసి
"నా కొరకు ఎవరు వెళ్ళుదురు?" అని దేవుని స్వరము పలికినప్పుడు,
"యజమానుడా, చిత్తగించుము, నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము" అని అతను అప్పుడు జవాబిచ్చెను.
(అతను సిద్ధముగా ఉన్నాడు. అతను ఒక దానిని చూచెను. అవునండి!)
ఇప్పుడు లక్షలమంది పాపములో అవమానముతో చనిపోవుచున్నారు;
వారి విచారకరమైన మరియు బాధాకరమైన అరుపును వినండి.
సహోదరుడా త్వరపడుము, వారిని రక్షించుటకు త్వరపడుము.
"యజమానుడా, నేను ఇచ్చట ఉన్నాను!" అని త్వరగా జవాబు ఇమ్ము.
HEB 13:8
109ఏదో ఒకటి చేయబడవలసియున్నది. మనము తలంచుచున్నదానికంటే అది ఆలస్యమైపోయినది. యెషయా దేవాలయములో చూచిన అదే దేవుని వారు చూచునంతగా దేవుని దర్శనము ప్రజలను ప్రభావితము చేయును గాక. ఆ దేవుడే ఈనాడు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. ఆయన పరిశుద్దాత్మ యొక్క పరిశుద్ధ స్థలములో యున్నాడు. ఆయన పరిశుద్దాత్మయై ఉన్నాడు. ఒకప్పుడు ఆయన శరీరధారిగా యుండి, ఇప్పుడు తన ప్రజలమధ్య ఆయన ఆత్మగా సంచరించుచూ, సజీవునిగా తన్నుతాను కనబరుచుకొనుచున్నాడు. ఒక చనిపోయిన సిద్దాంతము కాదు, కాని ఒక సజీవుడైన క్రీస్తుగా; నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఓ "యజమానుడా, ఇచ్చట యున్నాను. నన్ను పంపుము" అని యెషయా త్వరితముగా జవాబు ఇచ్చెను.
మన తలలు వంచియుండగా ప్రార్ధి౦చుదము…
నిప్పుకణిక ప్రవక్తను తాకినప్పుడు
ఆయనను చేయగలిగినంత పవిత్రముగా చేసినది;
"మా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు?" అని దేవుని స్వరము పలికినపుడు
"నేను ఇచ్చట ఉన్నాను, నన్ను వంపుము" అని అతను జవాబిచ్చెను.
(కలిసి పాడుదాము.)
నా ప్రభువా, మాట్లాడుము; నా ప్రభువా.
మాట్లాడుము, నీకు జవాబిచ్చుటకు నేను త్వరపడుచున్నాను.
నా ప్రభువా, మాట్లాడుము; నా ప్రభువా మాట్లాడుము.
మాట్లాడుము, "ప్రభువా నన్ను పంపుము" అని నేను జవాబు ఇస్తాను.
110ఇప్పుడు, నీ ఇంటి ప్రక్కవాళ్ళు కావచ్చు, నీతో పనిచేయు ఎవరైనా స్త్రీ కావచ్చు నీతో పనిచేయు పురుషుడు కావచ్చు, కానీ వారు…
లక్షలమంది ఇప్పుడు పాపములో అవమానములో చనిపోవుచున్నారు;
(సిద్దాంతములలో మరియు సంఘశాఖలలో)
ఓ, వారి దుఃఖకరమైన మరియు విచారకరమైన అరువును వినండి.
త్వరపడుము, సహోదరుడా వారిని రక్షించుటకు త్వరపడుము.
"యజమానుడా నేను ఇచ్చట ఉన్నాను," అని త్వరగా జవాబిమ్ము,
నా ప్రభువా మాట్లాడుము; నా ప్రభువా మాట్లాడుము
(ప్రభువుయొద్ద నుండి వచ్చిన ఒక దర్శనమును నేను చూచాను; అది సంభవించుట నేను చూచినాను.)
మాట్లాడుము, మరియు నేను జవాబు ఇచ్చుటకు త్వరితముగా యున్నాను
(ఆయన ఇదివరకే మాట్లాడియున్నాడు.)
నా ప్రభువా మాట్లాడుము; నా ప్రభువా మాట్లాడుము.
మాట్లాడుము, నేను జవాబు ఇస్తాను, "ప్రభువా నన్ను పంపుము!"
111ఇప్పుడు, మీ తలలు వంచియుండగా, ఈ రాత్రి నేను ఆశ్చర్యపడుచున్నాను. నేను వచ్చుచుండగా మీకు చెప్పిన ప్రకారముగా మీకు సహాయపడును అని నేను తలంచిన ఒక విషయమును నేను అధ్యయనము చేయుటకు ప్రయత్నించాను. మీరు ఆ ప్రవక్తను చూచితిరి; అతడు ఒక గొప్ప మనుష్యుడు. ఒక ప్రవక్తగా యుండు ఉద్దేశ్యము నిమిత్తము అతను జన్మించెను. అతను తప్పు మార్గములో పయనిస్తున్నాడని అతను కొనుగొనెను. ఒక రాజైన ఉజ్జీయా బాహువు మీద అతడు ఆనుకొనియున్నాడు. నీవు మానవుని బాహువుల మీద ఆధారపడలేవని అతను చూచెను. అది నశించిపోవును. అది తప్పు. కాని పైకి చూచినప్పుడు, దేవుడు ఆయన సింహాసనముపై, అత్యున్నతముగా ఆసీనుడైయుండుట చూస్తావు. యేసు వైపు అచ్చట చూడుము. "నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నానని" ఆయన చెప్పెను. ఆయన నిన్ను ఆత్మలో ఎత్తుకొననిమ్ము. ఆయన నిన్న ఏకరీతిగా యున్నాడో లేదో కనిపెట్టి చూడుము…
112ఆ చిన్న యెషయా దేవుని దర్శనము క్రిందకు కదిలి, దేవాలయములోనికి వచ్చుట చూచినప్పుడు, అతని తప్పిదమును ఒప్పుకొనుటకు అతను సిద్ధముగా యున్నాడు. అతను ఏ సరియెన కార్యమును చేయలేదని ఒప్పుకొనుటకు అతను సిద్ధముగా యున్నాడు. మరియు అప్పుడు రాజ్యమునకు వెళ్ళెను; ప్రతి సరియైన కార్యమును అతను చేసెను. చివరకు అతను తన సాక్ష్యమును రక్తముతో ముద్రించు వరకు అతను చేయగలుగునంత చేసెను.
మనందరి భావన అదియేనని నేను తలంచుచున్నాను. "ఎంతమంది, నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము" అని దేవునికి చెప్పవలెనన్న అనుభూతి కలిగియున్నారు. మీ చేతులను ఎత్తండి. "నేను ఇచ్చట ఉన్నాను, పాలు అమ్మువానికి నన్ను సాక్ష్యమివ్వనిమ్ము. నేను చెప్పగలిగిన ప్రతివానికి నన్ను సాక్ష్యమివ్వనివ్వండి. ఒక దానిని చేయనిమ్ము ప్రభువా, నన్ను ఒక దానిని చేయనిమ్ము ఒక ప్రసంగీకునిగా యుండుటకు నేను అడుగుట లేదు. ఈ విధముగా ఉండుటకు నేను అడుగుట లేదు, కాని ప్రభువా, నేను ఒక రైతు అయినట్లయితే నా పొరుగు రైతుకు సాక్ష్యమిచ్చే ఒక రైతుగా నన్ను చేయుము. నా ధాన్యమును అమ్ముచున్నప్పుడు, ధాన్యపు గింజలను కొను దళారికి సాక్ష్యమివ్వగలిగే రైతుగా ఉండనిమ్ము. నన్ను ఒక రైతుగా ఉండనిమ్ము. నేను ఒక మహిళనైనట్లయితే భీమా చేయించు వ్యక్తికి నన్ను సాక్ష్యమివ్వనిమ్ము. పాలు అమ్మవానికి, వార్తాపత్రికలు వేయు బాలునికి, నన్ను సాక్ష్యమివ్వనిమ్ము. ప్రభువా, నన్ను ఏదో ఒకటి చేయనిమ్ము. నేను పొరుగు ప్రాంతమునకు వెళ్లి, తప్పిదముగా, చెడుగాయున్న నా ప్రక్క ఇంటిలో ఉన్న నా సహోదరి కటాక్షమును పొందనిమ్ము. మాధుర్యముతో ఆమెకు ఒక సాక్ష్యమును నన్ను ఇవ్వనిమ్ము. దీనత్వము యొక్క రెక్కలతో నా ముఖమును కప్పుకొననిమ్ము; నా పాదములను ఆలాగున కప్పుకొననిమ్ము. నీ సన్నిధిలో భయభక్తులతో ఉండనిమ్ము, ప్రభువా, ఎవరో ఒకరి దగ్గరకు త్వరితముగా మరియొక రెండు రెక్కలతో నన్ను పంపుము. "నేను ఇచ్చట యున్నాను, నన్ను పంపుము, నన్ను పంపుము," త్వరగా ఎవరో ఒకరియొద్దకు!
113ఈ గౌరవముతో, మనమందరము లేచి నిలువబడి, దేవునికి మనలను మనము ప్రతిష్ఠ కార్యక్రమము చేయదము. సర్వశక్తుడు ఇచ్చట ఉన్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా? మనము ఆయన దైవసన్నిధిలో ఉన్నాము. దానిని ఇప్పుడు మరిచిపోవద్దు. అంతకు ముందు ఉన్న రీతిగానే ఆయన సన్నిధి ఇచ్చట ఇప్పుడు ఉన్నది….
యధార్ధముగా, నేను ఇచ్చట నిలబడియున్నప్పుటి నుండి, నాలుగు లేక ఐదు దర్శనములు సంభవించుట ఇంతకు మునుపే చూచినాను. అది నిజము. అది నిజము, అచ్చట సంఘమునకు, చెందినవారు ఇద్దరు లేక ముగ్గురు అచ్చట యున్నారు. వారు ఏమియును చెప్పలేదు; కాని అది ఇచ్చట ఆలాగుననే యున్నది. మంచిది. ఇప్పుడు, మనము ఏమి చేయగోరుచున్నాము. మీలో ప్రతి ఒక్కరు, మీ స్వంత విధానములో, దేవునికి మనలను మనము ప్రతిష్టించుకొందాము.
ఆయన ధన్యకరమైన రాకడ యొక్క సూచన ప్రత్యక్షమవుట మనము చూచుచున్నాము.
ఇదిగో చూడండి, అత్తి ఆకులు ఇప్పుడు ఆకుపచ్చగా మారుచున్నాయి.
రాజ్య సువార్త ప్రతి దేశమునకు వెళ్ళినది.
మనము సమీపముగా ఉన్నాము; అంతము కనబడగలుగుచున్నది.
(అది నిజము. అది నిజమేనా?)
అప్పుడు సంతోషముగా వెళ్ళిపోవుదుము;
ఆయన ధన్యకరముగా ప్రత్యక్షమవుట గురించిన వర్తమానమును మనము ప్రకటి౦చుదుము.
ప్రతి ఒక్కరికి తెలియచేయుటకు
ఆయన తన మహిమతో త్వరగా వచ్చుచున్నాడు.
ప్రభువు యొక్క పరిశుద్దులైన మీరు అప్పుడు మేల్కొందురు.
అంతము సమీపించుచున్నప్పుడు ఎందుకు కునికి నిద్రించుట
మనము ఆ చివరి పిలుపునకై సిద్ధపడుదుము. (ఆమేన్!)
రాజ్యములు బ్రద్దలగుచున్నవి; ఇశ్రాయేలు మేల్కోనుచున్నది;
(ఆమె ఇప్పుడు ఒక రాజ్యము.)
ప్రవక్తలు ముందుగానే చెప్పిన సూచనలు,
అన్యుల దినములు లెక్కించబడినవి.
భయబ్రాంతులు భారముగా యుండినవి
(అది ఆవల వచ్చుచుండుట నీవు చూచుచున్నావు,
దేశములే కాదు గాని సంఘములు.)
ఓ చెదిరిపోయిన వారలారా మీ సొంత స్థలమునకు తిరిగి రండి
విమోచనా దినము సమీపముగా ఉన్నది;
మానవుని గుండెలు భయముతో ఆగిపోవుచున్నాయి;
ఆత్మ చేత నింపబడియుండుడి,
మీ దీపములను చక్కబరచబడి శుభ్రముగా ఉండినవై,
పైకి చూడండి, మీ విమోచన సమీపముగా యున్నది.
అబద్ధ ప్రవక్తలు అబద్ధములు ఆడుచున్నారు;
వారు దేవుని సత్యమును నిరాకరించుచున్నారు.
ఆ యేసుక్రీస్తు మన దేవుడై యున్నాడు
(వారు నీకు తెలుసు)
……………………..
కాని అపోస్తులులు నడిచిన చొట మనము నడుచుదుము.
ఎందుకనగా విమోచనా దినము సమీపముగా యున్నది;
మానవుని గుండెలు భయముతో ఆగిపోవుచున్నాయి;
ఆత్మ చేత నింపబడియుండుడి,
మీ దీపములు చక్కబరచబడి శుభ్రముగా ఉండినవై;
పైకి చూడండి, మీ విమోచన సమీపముగా ఉన్నది.
114సంఘశాఖల పొగను తుడిచివేయండి. లోకపు మసిని తుడిచివేయండి. నిన్ను శుద్ధిచేయుటకు యేసుక్రీస్తు యొక్క రక్తము చాలినంతకంటే అధికముగా యున్నది. పైకి చూడుము, మీ దీపములను ప్రకాశింపనియ్యుడి. ఆ రెక్కలను ధరించుకొని ఎవరో ఒకరి యొద్దకు ఇప్పడే ఎగిరి వెళ్లండి.
ఇప్పుడు మన చేతులను పైకెత్తి "దేవా, నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము" అని చెప్పుము.
115పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ రాత్రి గంభీరమైన, ధృడమైన ఈ వర్తమానము తరువాత "ప్రభువా, నేను ఇచ్చట ఉన్నాను; నన్ను పంపుము." నన్ను నేను ఈ సంఘముతో కలిసి మీకు ప్రతిష్టించుకొనుచున్నాను. ఇచ్చట నా సంఘము ఉన్నది. ప్రభువా, వారు వారి ముఖమును భయభక్తులతో కప్పకొందురు గాక. వారు వారి పాదములను దీనత్వముతో కప్పకొందురు గాక, ఎవరో ఒకరియొద్దకు వర్తమానముతో త్వరితముగా ఎగిరి వెళు ధైర్యము వారు కలిగియుందురు గాక. ప్రభువా దానిని అనుగ్రహించు వరకు సారము కలిగిన ఈ లోకపు ఉప్పుయి యుండి మాధుర్యముతో వారు సాక్ష్యమిచ్పుదురు గాక. ప్రభువైన దేవా, ఇది మా బలియర్సణ. ఇది మా అర్పణ. ఇది మా కృతజ్ఞతా అర్పణ ప్రభువా, మేము దీనికొరకై ఆకాంక్షించుచున్నాము. మమ్ములను తప్పిపోయిన ఎవరో ఒకరియొద్దకు ఈ రాత్రి పంపుము. మేము వారికి ప్రభువు మార్గమును బోధించుదుము గాక! మేము వారిని సంఘములోనికి ఎక్కడో ఒకచోట లాగుదము గాక వారు రక్షింపబడుదురు గాక ప్రభువా, మేము అనుకున్న దానికంటెను అది ఆలస్యమైనది, ప్రభువా, దానిని అనుగ్రహించుము.
ECCL 11:1
116మేము దానిని మా హృదయములలో తలంచుదుము గాక, ప్రభువా, మేము దానిని పలుకుచుండగా, కల్వరి యొద్దయున్న బలిపీఠము నుండి పరిశుద్దాత్మ అగ్నియొక్క నిప్పును తీసి, మేము అబద్ధములు పలుకకుండా, మేము సత్యమునే పలుకునట్లుగా ఈ రాత్రి ప్రతి హృదయమును, పెదవిని తాకుము, ప్రభువా. ఈ రాత్రి మేము ఏమై యున్నామో ఆలాగున మమ్ములను తీసుకొనుము, ప్రభువా. మేమందరము ప్రసంగీకులము కాము. మేమందరము ప్రవక్తలము కాము. మేమందరము భాషలతో మాట్లాడే వక్తలము కాము. మేమందరము అద్భుతములను చేయువారము కాము; కాని మేమందరము చేయుటకు ఏదో ఒక దానిని కలిగియున్నాము. ప్రభువా, అది ఎక్కడ ఉన్నదో మాకు చూపుము. సాక్ష్యమిచ్చుచూ, మీ స్తుతిని పాడుతాము. నీటి మీద వేయబడిన ఆహారము వలె ఒక మహిమకరమైన దినమున అది తిరిగి వచ్చును, ప్రభువా దానిని అనుగ్రహించుము. మేము ఇచ్చట ఉన్నాము. మా పొరుగువారి యొద్దకు మమ్ములను పంపుడి. మేము వెళ్ళగలిగిన ఏ చోటకైనా, మా తోటివారి యొద్దకు మా పొరుగువారి యొద్దకు ప్రభువు రాకడను గూర్చి వారికి చెప్పటకు మమ్ములను పంపండి, ప్రభువా తండ్రీ, దానిని అనుగ్రహించండి.
117ఇప్పుడు మమ్ములను దీవించుము. మేము ఈ దేహములయందు ఈ రాత్రి మంచి విశ్రాంతిని కలిగియుందుము గాక. మేము ఉదయకాలమున లేచి ఆలయమునకు వచ్చుదము గాక, ప్రతి మనిషి ఇందులోనికి ఎలా ప్రవేశించవలెనో తెలుసుకొనునట్లు మీరు ప్రతి ప్రయత్నమును చేయుచూ, మీరు రేపు చాలా శక్తివంతముగా మాట్లాడుదురు గాక. ప్రభువా, మాకు బోధించుము. మేము ఎదురు చూచుచున్నాము. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండుటకు సంపూర్ణ పరిమాణము లోనికి ఎలా రావలెనో మాకు ఉదయ కాలమున బోధించుము. మా పెదవుల పైన నిప్పును ఉంచుకొనుటకు ప్రభువా, మీ కొరకు కనిపెట్టుచున్నాము. తండ్రీ, యేసు నామములో కనిపెట్టుచున్నాము.
118ఇప్పుడు, మన తలలు వంచియుండగా సంఘకాపరి ముందుకు వచ్చి కూటమును ముగించవలసినదిగా కోరుచున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. మా మధ్య యున్న సమస్త రోగులను, బాధపడుచున్నవారిని స్వస్థపరచండి. ఇప్పుడే నేను ఆత్మతో నింపబడిన అనుభూతిని పొందుచున్నాను. నేను పరిశుద్దాత్మను స్పర్శించుచున్నాను. నేను ఆయన సన్నిధిని స్పర్శించుచున్నాను. ఆయన ఇచ్చట ఉన్నాడని నేను ఎరుగుదును. ఆయన ఇచ్చట ఉన్నాడన్న ఆశావహ ధృక్పధముతో నేను ఉన్నాను. నేను ఆయనను చూచుచున్నాను; ఆయన ఇచ్చట ఉన్నాడని నేను ఎరుగుదును. ఆ గొప్ప అగ్నిస్తంభమైన ఆయన కదులుట నేను చూచుచున్నాను. మహిమ! ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఆయన సన్నిధియొక్క దైవత్వము, ఆయన మహనీయమైన ఉనికి, దేవా, ఈ ప్రజలపై ఎగురుము. వారిలో ఒక్కరు కూడా తప్పిపోకూడదని నేను ప్రార్ధించుచున్నాను. దేవునికి మహిమ!