ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము
VGR COUNT -453 1ఈ ఉదయ కాలము మరలా మనమందరము ఈ మందిరమందు చేరుట ఎంతో బాగున్నది. మీకందరకు కృపతో కూడిన ఉదయకాల అభివందనములు. ప్రభువు సన్నిధిలో ఈ దినము మనకొక గొప్ప దినమని నేను నమ్ముచున్నాను.
ఈ ఉదయము నా యొద్ద ఒక పాఠమున్నది. ఈ పాఠములోనికి సూటిగా వెళ్లుటకు ఇష్టపడుచున్నాను. అది చాలా ముఖ్యమైనదని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఇక్కడ చేరిన ఈ కూడికలోని ప్రజలు ఎంతో సమయము నిలబడుచు, అలాగే ఉండి పోవుచు, తారుమారగుటను కొంత తప్పించవచ్చు.
2ఇప్పుడు, ఈ రాత్రి ''నా జీవితపు మార్గదర్శి,'' అను అంశముపై మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను. ఎందరు మీలో హాజరు కాగలరో వారందరును ఈ రాత్రికి సమయమునకు రాగలరని నేను నమ్ముచున్నాను. అయినను మీకని ఒక సంఘమున్న యెడల, మీరు మీ సంఘములో ఉండవలయునని మేము ఇష్టపడుచున్నాము. అది మీ విధియైయున్నది. నీ వుండవలసిన స్థలములో నీవుండవలసి యున్నది. అక్కడ నీ వెలుగు ప్రకాశింపవలసియున్నది.
ప్రతిసారీ మనమిక్కడ మరలి వచ్చునప్పుడెల్లా ఇక్కడ కొన్ని గదులు అధికముగా ఉండునని మీ నమ్మకమును కొనసాగించుచున్నాము. అయితే ప్రతి స్థలమందు మనకెన్నో క్లిష్ట పరిస్థితులున్నాయి. ఈ విధముగా ఆ విధి నిర్వాహకులు ఖచ్చితముగా దీనిని ఆలోచించెదరు. ఒక స్థలమునకు దీనిని తెలియజేసినప్పుడు వారు అంగీకరించారు. మరొక స్థలమునకు తెలిసినప్పుడు అక్కడను వారు అంగీకరించారు. ఈ విధముగా దానిని మనకు జవాబులు తిరిగి పంపించారు. ఇక్కడను అది అంగీకరించ బడినది…. ఓ, ఎంత మంచి సమయమును మనము కలిగియున్నాము! అయితే ఇది మీకు తెలియును, వాస్తవమైన దానికి ఎదురుగా సాతాను ఎప్పుడూ పోరాడుచుండును. జ్ఞాపకముంచుకొనుడి, మీరు ఎప్పుడును వానిని గురించి ఎరిగి యుండవలసియున్నది.
3ఆంటోని, మీరెక్కడున్నారోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. నేను అతనిని చూడలేకయున్నాను… నేను మీ తండ్రిని కలిసికొన్నాను, నేను ప్రేక్షకుల నందరిని చూచాను. నీవక్కడ కూర్చొని యున్నావని అతడు చెప్పాడు. మాతో నిన్నును, మరియు మీ తండ్రిని కలిగియుండుటలో మేము ఎంతో సంతోషించుచున్నాము. అతడు సహో॥ మీలానో, న్యూయార్క్ నుండి వచ్చి యున్నాడు. నేను బయటి దేశములకు వెళ్లునప్పుడు న్యూయార్క్‌లో మరొక "వసంతకాలమును" గడిపెదను. దేవుని చిత్తమైతే అప్పుడు అక్కడుందును.
కావున మీలో ప్రతి ఒక్కరి నిమిత్తము మేము సంతోషించుచున్నాము. మీరిక్కడ ఉండుట ఎంతో మంచిది. గత రాత్రి గొప్ప సమయముగా అది మనకుండినది, లేక కనీసము నేను కలిగియున్నాను. ''ఆలయములో యెషయా.
ఈ ఉదయ కాలము ''సజీవ మందిరమును కట్టుట,'' అను అంశముపై మాట్లాడుటకు లేక ఉపదేశించుటకు నేను ఇష్టపడుచున్నాను. ''సజీవ దేవుడు నివాసము చేయు సజీవ మందిరమును కట్టుట: పరిపూర్ణ మానవుడు — సజీవ దేవుని, సజీవ మందిరమైయున్నాడు, ఆయన అక్కడే నివాసము చేయును.
4నేను వినలేదు గాని, ఇక్కడ వారు మంచి పాటలు పాడుచుండిరని నేను గ్రహించుచున్నాను. ఈ రాత్రి ఇక్కడే దిగుచున్నాను. సహో. అన్‌గ్రెన్ గురించి చెప్పినది, (అతని పేరు అదేనని నేను నమ్ముచున్నాను), టెన్నిస్సీ పట్టణము నుండి వచ్చారు. గతరాత్రి ఇక్కడున్నారు. ఈ ఉదయము నేనతనిని చూడలేదు, అయితే అతడు ఇక్కడెక్కడో ఉండి యుండును. అతడు పాడుచుండగా నేను నినుటకు ఇష్టపడుచున్నాను. వీలు పడితే వీటిలో దేనినైనను, ''ఆయన మహిమలో నుండి'' లేక ''నీవెంత గొప్పవాడవు'' అను పాటను పాడవచ్చు. నేను దానిని వినుటకు ఇష్టపడుచున్నాను.
సహో॥ అన్‌గ్రెన్ పాడుచుండగా, వినుటకు ఎందరు ఇష్టపడుచున్నారు. ఓ, చక్కగా పాడుటను నేను ఇష్టపడుదును. అతడు ఒక రకమైన బారిటన్ అను దానిని కలిగియున్నాడని ఆమె చెప్పినది. ఆ విధముగా చెప్పునప్పుడు సహో॥ బాక్‌స్టర్‌ను జ్ఞాపకము చేయుచున్నది. అతడు చక్కగా పాడగలడని మనకందరికి తెలియును. ''ఆయన మహిమ నుండి క్రిందికి'' లేక ''నీవెంత గొప్పవాడవు'' అను పాటను చక్కగా పాడెదరు.
ఇప్పుడతనిని కనుగొన్నానని తలంచెదను. అది సరియేనా, సహో॥అన్‌గ్రెన్, మీరిక్కడ ఉండినట్లయిన ఈ రాత్రికి పాడుటకు మీరు ఇష్టపడుదురా? ఈ రాత్రి ఆరాధనకు ఉండుటకు ప్రయత్నించెదరా? అప్పుడు దీనిని గురించి నేను మీతో చెప్పుదును. ఎవ్వరిని ఇబ్బంది పెట్టుటకు నేను ఇష్టపడను. మనము ఏడు ముద్రలను ప్రకటించునప్పుడు, మీరు వచ్చినట్లయితే దానిని టేపు చేయుటకు ఇష్టపడుచున్నాను. మీరు గమనించారా, ''నీవింత గొప్ప వాడవు'' మరియు ''ఆయన మహిమలోనుండి క్రిందకు'' అను పాటలను ఆ సమయములో పాడవచ్చు, కాదా?
5ఓ, దేవునికి సేవ చేయుట ఆశ్చర్యము కాదా. నేను క్రైస్తవుని కాని యెడల నేనేమి చేయుదునో నాకు తెలియదు. క్రైస్తవునిగా ఉండుట ఓం ఎంతో మంచిది. పైకి, క్రిందికి, ఎగురుచు నా స్వరపు ఉశ్చస్థాయిలో ఆక్రందన చేయుదును. ఒక క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటో దానిని గురించి తలంచి చూడుడి. సమస్తమును క్రీస్తు నందు లంగరు చేయబడినవి.
ప్రతిసారి సహో॥ సమ్‌నర్ యొక్క పేరును పొరపాటుగా పిలచుచున్నాను. (అది ''ఎస్.టి.,లేక ''టి.ఎస్'' లేక మరేదో అలాంటిదై యుండవలెను), సమ్‌నెర్. అతనికిని అతని భార్యకును నేను వందనములు తెలుపుటకు ఇష్టపడుచున్నాను, ఆమె ఈ ఏడు సంఘ కాలముల (వర్తమానమును) ఆరు నెలలుగా టైపు చేసినది. పరిశీలించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ "ఏడు సంఘ కాలములు" పుస్తక రూపమునకు వెళ్లుచున్నది.
సహోదరి. సమ్‌నెర్ మీరు ఎక్కడ కూర్చుని యున్నను, నిశ్చయముగా మేము దాని కొరకు ఋణస్తులమై యున్నాము. మీరు దాని కొరకు ఎంతో శ్రమను తీసికొనవలసి వచ్చినది, ఎందుకనగా అది చాలా పెద్దది. నేను దానిని చదువుటకు ఆరు నెలల కాలము తీసికొన్నది. ఒంటరిగా ఆ టేపుల నుండి వర్తమానమును తీయవలసి వచ్చినది. ఏడుమార్లు దానిని వేయుచు ఒక పుస్తకముగా చేయబడినది. అది సిద్ధము చేయబడి ముద్రణకు వెళ్లియున్నది. ఇప్పుడు ప్రజలు దానిని తమతో కలిగియుండవలసియున్నదని మేము తలంచుచున్నాము. అందుమూలముగా మీరు దానిని చదువగలరు. కొన్ని నిముషములకు ముందు నేను తిరిగి వచ్చినప్పుడు బిల్లీ, ముద్రణకు వెళ్లుచున్న (ఆ పుస్తకమును) నాకు చూపాడు.
అందువలన సోదరీ, దాని కొరకు ఈ మందిరము మీకు ఋణపడి యున్నది. ఏమియు లేకనే మీరు దానిని చేశారని నేను ఎదురు చూచుట లేదు. లేక మేము ఆ పుస్తకమును పొందిన తరువాత మేము ఒక వెలను నిర్ణయించినప్పుడు లేక మరేదైనను చేసినప్పుడు వారు (ఆ పుస్తకములను) అమ్మునప్పుడెల్లా మీకును కొంత వచ్చునట్లు ఒక వెలను నిర్ణయించెదము. మీరు (సంఘ కర్తలతో) మాట్లాడవచ్చు. ఇక్కడ వారిలో కొందరు ఉన్నారు. వారు మీ కొరకు జాగ్రత్తను తీసికొనెదరు. మిమ్మును మంచిగా ప్రభువు దీవించును గాక.
6ఆ చక్కని వృద్ధ దంపతులైన సహో. కిడ్ మరియు సోదరి కిడ్ తమ శత సంవత్సరాలలో ఉన్నారు. (కొద్దిగా అటు, ఇటు ఉండవచ్చు) కొద్ది సమయమునకు ముందు ఆమెను కలిసికొన్నాను. అప్పుడు ఆమె ఇలా చెప్పినది. "సహో॥ బిల్లీ బహుశా మిమ్ములను చూచుట ఇదే కడసారిగా ఉండవచ్చు. నేను వృద్దిరాలినగుచున్నాను."
''ఓ, మీరలా చెప్పుటకు నేను వినుటకు ఇష్టపడుట లేదు,'' అని నేను చెప్పాను. ఒక వృద్ద తల్లిదండ్రులుగా ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరు ''కిడ్'' దంపతులను ప్రేమించుచున్నాము. ఆ విధముగా ఆ వృద్ధ దంపతులు అలా నడచుకొంటూ ఆలయములోనికి వచ్చునప్పుడు నేనేదొలాగు భావిస్తాను. ఆలోచించండి. నేను జన్మించుటకు ముందే వారు సువార్తను ప్రకటించుచుండిరి. ఇప్పుడు ఇక్కడ నేనున్నాను. నేనిలా తలంచుచున్నాను. ''నేను వృద్ధుడనైపోవుచున్నాను.'' నేను వెడలు కాలము సిద్ధమైనది, అయినను సహోదరీ, సహోదరుడు ''కిడి'' లోపలకు వచ్చుటను నేను చూచుచున్నాను. ''దేవునికే మహిమ!" ''నేను చక్కని అనుభూతిని కలిగి యున్నానని,'' నేను చెప్పాను.
అవునండి వారిని చూచుటలో, వారు ఎలా… మిమ్ములను నెంతగా ఉత్తేజపరచుచున్నారు. నా వయస్సును మీరు తలంచి చూడండి. వారు ఇంకను సేవ చేయుచున్నారు. ఈ ఉదయము వారు పుస్తకముల కొరకు అడిగారు — వారా పుస్తకములను విక్రయించెదరు. వారు టేపులను కూడ అడిగారు. వాటి ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించుచున్నారు. వారి వయస్సు వంద సంవత్సరాలు దగ్గర పడుచున్నవి. ఇప్పుడు గతరాత్రి మనము మాట్లాడుకొన్నట్లు మీ "రెండు రెక్కలు ఎక్కడున్నాయి?'' అవును దాని గురించి నేనిలా తలంచెదను అవి ఎక్కడున్నాయి.
సహోదరి కిడ్ మీ వయస్సెంత? [ఎనుబది-ఒకటి] సహో॥ కిడ్ మీ వయస్సెంత? [ఎనబది-రెండు] ఎనుబది-ఒక్కటి మరియు ఎనుబది-రెండు సంవత్సరాలు, వారి రెక్కలను కదలించి ఉపయోగించుచు ఇంకను వెళ్లుచున్నారు.
7ఓహియోలో ఎవరైన బలహీనతకు గురియైన సంగతి సహోదరి కిడ్''నకు తెలిసినప్పుడు వెంటనే నా యింటికి ఫోను చేయుదురు. గత దినము ఒక చిన్నబిడ్డ (ఒక బాలిక అని నేను నమ్ముచున్నాను) జన్మించినదని ఆమె ఫోను చేసినది. ఆ బిడ్డకు నీటి తిత్తి బయటకు వచ్చి యున్నది. దానిని ఏమి చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. శస్త్ర చికిత్సను చేయుటకు ఆయన భయపడుచున్నాడు. అప్పుడు మేము ప్రార్థించాము… [సభలో నుండి సహోదరి కిడ్ దానిని తెలుపుచున్నారు] మరలా ఈనీటి తిత్తిని లోపల ఉంచి శస్త్ర చికిత్సను చేసిన ఆ బిడ్డ జీవించునని తలంచాము. ఆ బిడ్డ జీవించును గాని మార్గము లేనందున ఆసనము ద్వారా ఆహారమును శరీరములోనికి పంపవలసియున్నది. సహోదరి కిడ్ మరలా పిలిచినది. మేమును మరలా ప్రార్థించాము, ఇప్పుడు విధిగా మార్గము ఏర్పడినది.
ఇక్కడ ఆమె ఒక సాక్షిగా ఇప్పుడు జీవించుచున్నది ఆ డాక్టరు కూడా ఒక సాక్షిగా వున్నాడు. యేసుక్రీస్తు సృష్టికర్తగా ఉన్నాడనుటకు అది ఒకసాక్ష్యముగా ఉన్నది… సాతాను ఏమి చేయుటకు ప్రయత్నించినదో చూశారా? ఆ బిడ్డ జీవితమును తీసివేయచూచినది. అంతట ఆ బిడ్డకు ఈ గొప్ప సూచక క్రియ జరిగిన తరువాత ఆ బిడ్డ యొక్క తల్లి ప్రభువునొద్దకు మరలి వచ్చినది. సహోదరి కిడ్ ఆమెను క్రీస్తు వైపునకు నడిపించినది.
8నిన్నటి రోజున కాలిఫోర్నియా నుండి నాకొక పిలుపు వచ్చినది. కొన్ని సంవత్సరముల క్రితము నేను కాలిఫోర్నియాకు వెళ్ళినపుడు అక్కడ నేను అతనితో ఉంటిని. అక్కడ అతడు ఒక మంచి సేవ చేయు సహోదరుడు. ఆయనయొక్క మనువడు, గుండెలోని మూడు కవాటములు ''మూయబడిన స్థితిలో జన్మించాడు. నేను దానినిగురించి అతనితో చెప్పాను. తక్కిన వాటిని సృష్టించు దేవుడు దానిని బాగు చేయును. నీ మనుమడిని నిశ్చయముగా స్వస్థపరచగలదు'' అని నేను చెప్పాను. ఆ బాలుని ధైర్యముగా ఉండుమని చెప్పండి.
పదునెనిమిది సంవత్సరములు క్రితము, నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు అప్పుడా కూటములు ఆ బాలుని ఎంతగానో ఆకర్షించినవి. ఆ బాలుడు జన్మించినప్పుడు, వారు ఆ బాలునిలో ఏదో పొరపాటు ఉన్నట్లు కనుగొన్నారు.
ఆ బాలుడు నీలి రంగులో కనబడెను. బ్రతుకునట్లు కనబడనందున ఆ డాక్టర్లు పరిక్షించి హృదయములో మూడు కవాటములు మూయబడి యుండుటను కనుగొన్నారు — అవి తెరువబడలేదు, చూడండి — కేవలము ఒక్క కవాటము మాత్రము పనిచేయుచున్నది.
అప్పుడు ఆ బాలునితండ్రి తన తండ్రిని పిలిచి ''నాన్నా, సహో॥ బ్రెన్‌హామ్ వెంటనే పిలువండి. క్రీస్తును అడుగుమని'' ఆయనతో చెప్పండి; అతను దానిని చేయగలడు'' ఇది ఆ సందర్భమే. ఓ, ఎంత ఆకర్షణ చూడండి — వారేమి చూచిరో దానిచే ఆకర్షించబడ్డారు. చూడండి, గతరాత్రి ఏది మాట్లాడబడినదని: ఖచ్చితమైన కార్యము సకాలములో జరిగినది.
9మనమిలా మాట్లాడుకుంటూ వెళ్ళుచుండిన పాఠములోకి వెళ్ళలేము. వెళ్ళగలమా అది కేవలము ఒక చల్లని ఉదయకాలపు బెల్లపు పాగు వలె ఉన్నది. అది ఎంతో దట్టముగా ఉన్నది. అది మీకు తెలియును. అదంతయు ఒకదాని కొకటి అతికి యుండును. అటువంటి సహవాసమును కలిగియుండుటలో మనమెంతో సంతోషించుచున్నాము. అవునండి.
కావున ఇప్పుడు మనము నెమ్మదిగా ఉండి, పాఠములోనికి వెళ్ళుదము. నేనిప్పుడు… మీరిప్పుడు ఆ నల్ల బల్లపై వ్రాసిన దానిని చూడగలుగుచున్నారో లేదో నాకు తెలియదు. బహుశా కొన్ని నిముషములు ఇటు వైపుకు త్రిప్పుట ద్వారా మీరు చూడగలుగుదురు. (సహో॥ బ్రెన్‌హామ్ ఒక నల్ల బల్ల కొరకు అడుగుచున్నారు - సంపా॥)
10ఇప్పుడు వారు దానిని సిద్దముచేయుచుండగా….. నేను ఈ ఉదయము ఆలస్యముగా బయలుదేరాను… లేదు, లేదు పదిహేను నిముషములు ముందే నేనిక్కడ ఉన్నాను. అప్పటి నుండి మన సమయమును తీసికొన్నాము. ఎందుకనగా త్వరితముగా వెళ్లుటకు మనము ఇష్టపడుట లేదు. మీరు త్వరపడినప్పుడు మనము చెప్పదలచుకొన్నది పాడైపోవును. గత దినమందు మీతో చెప్పిన దానిని ఒక టేపు నందు వినుచుండినప్పుడు, నాకు నేను ఎంతో సిగ్గుపడ్డాను. అది నేను చెప్పినది కాదు గాని, నేను చెప్పుచుండిన విధానము — అది చాలా త్వరితముగా ఉండినది. అది కంపనగా ఉండినది. నేను నిలచియుండు అనుభూతిని కలిగియుంటిని.
11గత దినములలో వారు లూయిస్విల్ పట్టణములో ఒకపెద్ద జంతు ప్రదర్శన శాలను నిర్మించుటను చూశారు. సహో॥ బ్రౌన్ ఒక లక్ష డాలర్లను ఆ జంతు ప్రదర్శన శాలకు ఇచ్చాడు. (అతనే అని నేను నమ్ముచున్నాను) మంచిది. నేనైతే ఆ జంతువులను విడిచిపెట్టి యుందును. ఆ విధముగా బంధించుటను నేను ఇష్టపడను. నేను ఆ జంతుప్రదర్శన శాలకు వెళ్లినప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధ జంతువులను చూచినప్పుడు ఎలుగుబంటులు, సింహములు అలా ముందు వెనుకల తిరుగుచూ, జీవితాంతము బంధింపబడియున్నవి. మీరు చూడండి. ఆ దృశ్యము మిమ్ములను వ్యాకులపర్చును, అవి వాటికన్న అందముగా ఉండు మానవుని తెలివిచే పట్టబడినవి, చూడండి. వారు వాటిని బంధించి దాస్యమందుంచారు.
నేను దానిని తలంచినప్పుడు… దయ్యమే దానిని చేసియున్నది. వాడు దేవుని గొప్ప స్థలములో, పొలములో తిరుగుచుండు మంచి వారిని తీసికొని సంస్థల యొక్క సిద్దాంతములయొక్క లేక మరి కొన్నింటికి సంబంధించిన చెరసాల గృహములయందు బంధించి, వారిని గ్రుడ్డివారినిగా చేయుచున్నాడు. అది ఘోరమైన కార్యముగా ఉన్నది.
జంతు ప్రదర్శన శాలలను నేను ఇష్టపడను. కాని ఆ జంతువులలో ఒక దానిగా నన్నునేను భావించుకొందును. మీరందరు బంధించబడినప్పుడు, మీరు విడుదల పొందుటకు ప్రయత్నింతురని, మీకు తెలియును గదా, దేనినో చేయుటకు గాను వెలుపలకు వచ్చుటకు ప్రయత్నింతురు.
12ఇప్పుడు, మనము వాక్యమును సమీపించుటకు ముందు ఈ వాక్యమును వ్రాసిన ఆయన చెంతకు చేరి, మనము తలలు వంచి యుండగా ప్రార్థింతుము.
మా గొప్ప కృప కలిగిన పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరలా ఈ ఉదయకాలము మేము సమకూడి యున్నాము. నీ ప్రియ కుమారుడు — దేవుడు శరీరధారియై మా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఈ భూమికి వచ్చి మరణించి, నీతికొరకు ఆయన నీతి ద్వారా, అనీతిమంతులుగా ఉన్న మేము ఆయనలోసంపూర్ణులుగా చేయబడితిమి.
మేము యోగ్యులము కామని ఒప్పుకొనుచూ, ప్రభువు మీ యొద్దకు వచ్చుచున్నాము. మా నుండి ఏ మూల ఉన్నను, మేమందరము చెరసాలలోనే ఉన్నాము. ఒకరు మరొకరికి సహాయపడలేని స్థితిలో ఉన్నాము. అయితే దేవా! ఆయన నిత్యత్వపు కృపలో దిగివచ్చి, మేము విడుదల పొందినట్లు చెరసాల తలుపులు తెరిచాడు. ఇకపై మేము బంధించబడి యుండలేదు. మేము ఈ ప్రపంచపు జంతు ప్రదర్శనశాలలో లేము. అయితే మేము విడుదలను పొంది వెలుపలకు వచ్చాము.
MATT 25:21,23
13ఓ, ఎంతగా ఆయనను ప్రేమించి, పూజింపవలసిన వారమైయన్నాము. ఆయన వాగ్దాన భూభాగములను ద్వారా నడచునప్పుడు, అవి మా కళ్ల యెదుటనే రూపుదాల్చుటను చూచుచున్నాము. ఆ నిత్యత్వపు దేవుడు మా యెదుట తానే ప్రత్యక్షమగుచూ, పూర్వకాలమందు ప్రవక్తలను చేసిన విధముగా మాకును ఆయన నిజస్థితిలో బయలుపరచుకొనుచున్నాడు. దీనిని ఎరిగిన వారై (ఆ ప్రవక్తలు) అనగా ఒక దినము, ఈ జీవము గడచిన తరువాత పునరుత్థానులమై మరుగు కాని నిత్య జీవమునకు మేమందరము మరలా సమకూర్చబడుదుమని ఎరిగిన వారై స్థిర విశ్వాసముతో వారు నిద్రించారు.
మా శరీరములు మృతములు కావు, మేము మరణించము. మాకు (అక్కడ) ఆకలి యనునది ఉండదు, మాకేలాంటి అవసరతయు ఉండదు. అయితే ఆయనతో మేము నడచెదము. ''భూమి పునాదులు వేయబడుటకు ముందే సిద్ధపరచిన ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించుడి,'' అని ఆయన చెప్పుటను వినగోరుచున్నాము.
అది పాపమనేది ప్రవేశించుటకు ముందున్న స్థితి. ఆయన ఆదాము, హవ్వలను ఎలా సిద్ధపరచాడో ఆ విధముగానే అనగా వారు శ్రమను చూడలేదు, వారికి వ్యాధి రాలేదు. అప్పుడు మాకును ఆయన అలాగే సిద్ధపరచియున్నాడు. మేము వచ్చుచున్నామని ఆయన మమ్మును ముందెరిగి యున్నాడు. పాపము ఆ పెద్ద అడ్డు బండను చేసినది. అయితే పాపమిప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా తీసివేయబడినది. ఇప్పుడు దేవుని వాగ్దానమును బట్టి మేము వాగ్దాన భూమి వైపునకు ప్రయాణించుచున్నాము. అది నిత్యత్వమైయున్నది.
14నీ వాక్యమును చదువుచుండగా తండ్రీ మమ్ములను దీవించుము, అక్కడ మేము ఎలాంటి వారముగా ఉండవలసి యున్నదో తెలిసికొనగోరుచున్నాము. ఈ దినమున ఈ బడిలో ఆ గొప్ప ఉపాధ్యాయుని మేము కలిగియుండినట్లు మాకు సహాయము చేయుము. పరిశుద్దాత్మ దిగి వచ్చి తనను నిజ స్థితిలో తన వాక్యము ద్వారా మాకు బయలుపరచుకొనునట్లు సహాయము చేయుము. ఆయన నామములో ఆయన మహిమ కొరకు మేము అడుగుచున్నాము. ఆమేన్.
15ఇప్పుడు, నేను మొదటిగా II పేతురు, 1వ అధ్యాయమును మిమ్ములను త్రిప్ప గోరుచున్నాను. ఆ వాక్యమందు ఒక భాగమును చదువుటకు ఇష్టపడుచున్నాను. II పేతురు 1వ అధ్యాయము,పేపరు, పెన్సిలు కలిగి యున్న మీరు గుర్తుంచుకొనుడి. ఈ ఉదయ కాలము నేను మీతో చెప్పినట్లు నేను ఈ మైక్ దగ్గర నుండి అటువైపుకు తిరిగినప్పుడు, టేపులు యందు శబ్దము తగ్గిపోవును. అది నా భావము కాదు. అయితే కొంత కాలమునకు ముందు ఒక మైక్‌ను ఇక్కడ పై భాగమందుంచవలయునని తలంచాము. అప్పుడు మీరెక్కడ ఉన్నను పరవాలేదు….. ఈ గది అంతయు వినబడును. ఈ పై భాగమున ఒక మైక్ ఉండవలసియున్నది.
16ఇప్పుడు మనము… మాట్లాడుచుండగా లేక ఆరాధన ముగించిన తరువాత ఇక్కడ బల్లపై నేను గీచిన దానిని మీరు వ్రాసికొనవచ్చును. టైపు చేయబడినది కూడా నా యొద్ద ఉన్నది. దానిని ఈ విధముగా మా ముందుంచెదను. మీరు దానిని తరువాత వ్రాసికొనవచ్చును. (ఈ మధ్యాహ్నము కొంచెము త్వరగా రండి), అందువలన చక్కగ గ్రహించగలము.
17మనమిప్పుడు ఏడు ముద్రలను సమీపించుచున్నాము. ఇప్పుడే మనము ఏడు సంఘ కాలములను ముగించాము. ఈ వర్తమానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన మనిషి, ఆ సంఘ కాలములో ఉండుటను, జతచేయుచున్నది. ఏడు ముద్రల తరువాత ముగింపులో ఉండు నిత్య సంఘకాలముగా అది ఉన్నది.
ఏడు బూరలు, ఏడు తెగుళ్లు, ఏడు పాత్రలు ఈ విధముగా కొన్ని ఉన్నాయని మనమెరుగుదుము. మనము వెళ్ళుచుండగా వాటిలోనికి వెళ్ళుదము. అయితే ఈ ప్రజలు కూర్చొనుటకు పెద్ద గది కొరకు ఎదురు చూచుచున్నాము.
నేను ఎక్కడ ఎదురు చూచుచున్నానో అక్కడే అది జత చేయునని తలంచుచున్నాను. ఈ గీతలతో నిండిన చిత్రమును వ్రాయుటకు నేను ఎదురు చూడలేదు, కాని గత దినమందు నా స్నేహితులైన సహో॥ కాక్స్, కెంటకీలో ఉన్నారు. అతనితో మాట్లాడుచున్నప్పుడు మేము అలా వెళ్లుచూ ఇంకనూ ఆ ఉడుత వేటను, ఆ కాలము ముగించుటకు ముందు ఒక రోజు కొనసాగించ వలయునని తలంచాను. అక్కడ ఆ అడవులలో నా స్నేహితులతో ఉన్నప్పుడు చార్లీ అక్కడ నిలుచుని ఉన్నాడు. అతని సహోదరుడు రోడ్‌నే అక్కడున్నాడు. నేను ఒక ఉడుతను కూడ చూడలేదు. నేను ఆ పొదలో అరచుచుండినప్పుడు అవన్నియు పారిపోయి వుండునని తలంచాను.
అప్పుడు ఇది (ఈ తలంపు) నాకు కలిగినది. నాకు మాత్రము కాక, నా స్నేహితులకు సోదరి నెల్లి మరియు మార్గీకి కూడా ఈ తలంపు కలిగినది. దానినే, నేను ఆదివారము మీతో చెప్పాను. అదియే వర్తమానముగా మీతో మాట్లాడుటకు నాకు వచ్చినది. మిగిలినది ఏ విధముగా దానితో జత చేయబడినవో తెలిసినది. ఓ, అప్పుడు ఆ పొదలలో నిజ ఆత్మను పొంది కేకలు వేయుటకు ఇష్టపడితిని.
2PET 1:1-4
18అందువలన ఇప్పుడు మనము II పేతురు 1వ ఆధ్యాయములో (ఒక భాగమును చదువుదుము).
''యేసుక్రీస్తు దాసుడను అపొస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు, నీతినిబట్టి మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది''.
అది ప్రారంభమైన విధమును నేను ఇష్టపడుచున్నాను, ఎందుకనగా నా పూర్తి అంశము, ఈ ఉదయకాలమందు ''విశ్వాసము'' అను దానిపై అధారపడి యున్నది. దానిని మరలా చదువుదుము; జాగ్రత్తగా వినండి.
''యేసుక్రీస్తు దాసుడను అపొస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు, నీతిని బట్టి మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది.''
గమనించండి, ''విశ్వాసమును నేను పొందినట్లు, అమూల్యమైన విశ్వాసమును పొందిన వారితో మాట్లాడుచున్నాను'' అని అతడు (పేతురు) చెప్పుచున్నాడు. నేను ఇష్టపడునది… ఇది బాహ్య ప్రపంచమునకు కాదు; ఇది సంఘమునకు, క్రీస్తునందున వారికి మాత్రమే.
''తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. జీవమునకు భక్తికిని, వాటినన్నింటిని మనకు దయచేయుచున్నందున, దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చి నట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.
ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములునై వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు.''
2PET 1:4
19ఇప్పుడు, నిజముగా కొంత లోతుకు వెళ్లుదము. ప్రసంగించుట కాదు గాని, ఈ ఉదయ కాలము, ఈ దైవీక స్వభావమును బోధించవలసియున్నది. ఆ నాల్గవ వచనమును మరలా చదువుదును, అందువలనే మీరు దానిని విడచిపెట్టరు.
''ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.''
ఈ ప్రపంచమును చూడుడి — ఇప్పుడు మనము దానిని తప్పించుకొన్నాము. ఆయన దీనిని సంఘముతో చెప్పుచున్నాడు. అందువల్లనే మనము ఈ ఉదయకాలము మార్గమేదని కనుగొనుటకు చేరియున్నాము. దేవుడు దేనిని కోరుచున్నాడు? దేవుని ప్రేమించిన వాడు ఒక్కడును లేడు, అయితే క్రీస్తు వలె ఉండుటకు కావలసినదేమి — అది ఇక్కడ ఉంచబడియున్నది — ప్రతి క్రైస్తవుడు,
నేను వృద్ధుడను. సహో మరియు సోదరికిడ్‌ను చూడండి; ఈ కట్టడములో వారే పూరాతనమైనవారు. ''మీ హృదయ వాంఛ ఏమిటని?'' వారిని అడిగినప్పుడు, అది ''దేవునికి సమీపమై యుండుటేనని,'' చెప్పారు. క్రీస్తును గురించి నీవు ఎరిగినప్పుడును, ఆయనను ప్రేమించగలిగినది ఏదో అక్కడున్నది. నీవు కేవలము ఆయనలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించుము.
20ఈ ప్రబోధమును మన్నించండి: నేను నా భార్యతో కొద్ది దినముల ముందు ఇలా చెప్పాను. (ఇద్దరము వృద్ధులగుచున్నాము) నీవు నన్ను ప్రేమించినట్లే ఇప్పుడును ప్రేమించుచున్నావా? అని అడిగాను.
అందుకు ఆమె ''నిశ్చయముగా నిన్ను ప్రేమించుచున్నాను,'' అని చెప్పినది.
''నేను కూడా నాలో నిన్నే ఉంచుకొనునట్లుగా ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు. అందువలన మనము ఏకమై యుండగలము'' అని చెప్పాను.
ఇప్పుడు దానిని వేయి లక్షలతో పెంచుము, ఒక విశ్వాసి క్రీస్తులో ఎంత ప్రేమయందున్నారని అప్పుడు నీవు కనుగొందువు, ఎందుకనగా అది ప్రేమయైయున్నది. క్రీస్తు యొక్క దైవిక స్వభావము ద్వారా, మనమాయన వాగ్దానములో పాలివారమగుటను ఆయన మనకు చూపుచున్నాడు. ఈ మృత శరీరాలు — ఏ విధముగా మనకు భాగస్తులము కాగలము.
EPH 5:31
21ఇక్కడ నేను కొంత చెప్పవలసియున్నది. నేను నమ్ముటకు కారణము…. కొద్ది దినములకు ముందు నన్ను ఒక పొరపాటైన మనిషిగా కొందరు చేశారు. ఒక సేవకుల సమావేశము నుండి ఒక ఉత్తరము నాకు వచ్చినది. అదేమనగా ''మన భార్యలతో ఏకాత్మ లేకయున్నయెడల వారిని విడిచిపెట్టవలెను. తరువాత ఎవరితో ఏకాత్మ కలిగియుందుమో వారిని పెండ్లాడవలెను,'' అని వ్రాయబడి యున్నది. ఓ, మై!
దానిని వినుట ద్వారా నేను "నేరస్తుడను కాకుందును," అని నేను చెప్పాను. నేనెప్పుడును దానికి వ్యతిరేకిని. దానిలో నాకేలాంటి విశ్వాసము లేదు. నిశ్చయముగా లేదు. దేవుడు తోటి సహాయమును మనకిచ్చాడని నేను నమ్ముదును. అది సత్యము. అప్పుడు ఇద్దరు ఒక భాగమై యున్నారు. అది నిజము. ఒక మనిషి పెండ్లాడుటకు ముందు, వీటన్నింటిని యోచించవలెను, దానిని గ్రహించవలెను.
22ఒక దినమున ఒక యౌవ్వనస్తుడు నన్నిలా అడిగాడు. ''సహో॥ బ్రెన్‌హామ్. నీవు చెప్పిన విధముగా పెండ్లాడెదనని నీవు తలంచుచున్నావా?''
అప్పుడు నేను ''నీవు ఎలా తలంచుచున్నావు?'' అని అడిగాను
అందుకతడు ''ఓ, నేనామెను ప్రేమించాను,'' అని చెప్పాడు.
అందుకు నేను, ''నీవు ఆమెను విడచిపెట్టి జీవించలేని స్థితిలో ఉన్నట్లయిన ఆమెను పెండ్లాడుము. అయితే నీవు ఆమె లేకున్నను జీవించగలిగినట్లయిన, అలాగే ఉండుము. అయితే అది నిన్ను చంపునట్లయితే నీవు ముందుకు వెళ్ళిపెండ్లాడుము,'' అని చెప్పాను.
అందువలన అతనితో నేను చెప్పుటకు ఇష్టపడున దేమనగా అతడు ఆమెను అంతగా ప్రేమించినయెడల… ఇప్పుడు నీవు పెండ్లి చేసికొనుటకు ముందు అంతయు బాగుందును గాని, ఆ తరువాత జీవితము యొక్క శోధనలు, బాధలు లోనికి వచ్చును. మీరు అంతగా ప్రేమించుకొనునప్పుడు ఒకరినొకరు అర్థము చేసికొనవలసియున్నది. నీవు ఆమెలో అసంతృప్తిని పొందినప్పుడు లేక ఆమె నీతో నిరుత్సాహపడినను మీరు ఒకరినొకరు గ్రహించవలసియున్నారు.
2PET 1:4
23క్రీస్తులోను ఆ విధముగానే ఉండవలసి యున్నది. మనమాయనతో ఎంత ప్రేమగా ఉండవలయునంటే మనమడుగు దానిని ఆయన ఇవ్వనప్పటికిని మనము కొద్దిగానైను కదిలింపబడకూడదు. ఎందుకో చూశారా? దానికి ఒకే ఒక మార్గము ఆయన దైవిక స్వభావముతో భాగస్తులమగుటయే; అప్పుడు ఆయన ఎందుకో దానిని నీకివ్వలేదో గ్రహించెదవు. ఆయనతో దైవీక స్వభావమునందు భాగస్తులమైయుండుట.
ఇక్కడ చూడండి: "దురాశను అనుసరించుట వలన లోక మందున్న భ్రష్టత్వమును, మీరు తప్పించుకొని" — దానిని తప్పించుకొన్నారు. అది ఎవ్వరికో చూడండి? అది సంఘము కొరకైనది. క్రీస్తునందున్నవారు, ఈ కార్యముల కన్నను ఉన్నతముగా ఉన్నారు. అతడు గొప్పవాడైనాడని కాదు, గాని క్రీస్తు వారిని పైకి తెచ్చును.
24ఇక్కడున్న నా యొక్క నల్ల (నీగ్రో) సోదరీ, సోదరులకు నేను చెప్పునదేమనగా… మిమ్ములను దీనిని బాధించుటకు గాను చెప్పుటలేదు. కొంత కాలమునకు ముందు మనమొక కూడికలో ఉన్నాము. (ఈ మందిరములో నేను చెప్పానో లేదో తెలియదు గాని, అనేక స్థలములలో అనేకసార్లు దీనిని చెప్పాను.), ఒక నల్ల సోదరి ఇలా అడిగినది ''నేను సాక్ష్యము చెప్పవచ్చా.''
''నిశ్చయముగా సోదరీ, ముందుకు వెళ్లండి.''
అప్పుడామె, ''దేవుని మహిమార్థము నేను ఈ సాక్ష్యమును చెప్పుచున్నాను'' అని అన్నది. అప్పుడామె ''నేనేమై యుండవలెనో అలా లేదని, నేనిష్టపడునట్లు కూడా లేనని మీకు తెలియును, అయితే ఒక్కటి మాత్రము వాస్తము: నేనేమైయుంటినో అలా లేనని'' చెప్పినది.
25ఆమె ఎక్కడ నుండో వచ్చినది. ఆమె అలా పెంచబడినది. ఆ విధముగానే మనము మరణము నుండి జీవమునకు దాటుదమని తెలిసికోగలము. మనము తీయబడిన స్థలమును వెను తిరిగి చూచెదము. చూడండి, మనమేమై యుండాలో అలాగే ఉండుటకు ఇష్టపడుట లేదు. మనమేమై యున్నామో, ఇప్పుడు మనలా లేము. మనము రహదారిలో వెళ్లుచున్నాము. ఈ లోక చెడుతనమును భ్రష్టత్వమును తప్పించుకొనిన వారమై యున్నాము. మీరు దానికి పైగాఉన్నారు.
2PET 1:5-7
26అలాంటి వ్యక్తితోనే ఆయన మాట్లాడుచున్నాడు, ఆ వ్యక్తి ఈ కార్యములన్నింటిని తప్పించుకొనినవాడై యున్నాడు — ఈ లోక దురాశను తప్పించుకొన్నవాడైయున్నాడు.
''పూర్ణ జాగ్రత్తగలవారై మీ విశ్వాసమందు సద్గుణమును; సద్గుణము నందు జ్ఞానమును;
జ్ఞానమునందు ఆశానిగ్రహమును; అశా నిగ్రహము నందు సహనమును; సహనము నందు భక్తిని;
భక్తియందు సహోదర ప్రేమను; సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి.''
27ఇప్పుడు, మన మిక్కడ చేయవలసినదేమిటో దాని రూపమును చూపుచున్నాడు; దానిని ఎలా చేయాలో తెలిసికొనుము. ఇప్పుడు, నేను చెప్పినట్లుగా మన మందరము దేవునికి సమీపముగా వచ్చుచున్నాము. అందువల్లనే ఈ ఉదయకాలము ఈ వర్తమానమును నేను ఎన్నుకొన్నాను. ప్రజలు అనేక మైళ్ల దూరము ప్రయాణము చేసి వచ్చియున్నారని ఎరిగియున్నాను…… గత రాత్రి నేను ''ఈ పట్టణమునకు వెలుపల నుండి వచ్చినవారెందరు'' అని అడిగాను. సుమారు 98% ప్రజలు వెలుపల నుండి వచ్చినవారే, ''ఎందుకు వంద మైళ్ల నుండి వచ్చారు?'' ఎందుకు, అది 80% పైగా వెళ్లినది. ''ఐదు-వందల-మైళ్ల నుండి వచ్చు వారెందరు?'' సుమారు మూడవ భాగము ప్రజలు వంద… ఐదు-వందల-మైళ్ల దూరము నుండి వచ్చియున్నారు. దానిని తలంచి చూడండి, ప్రజలు అలా ప్రయానము చేయుచున్నారు.
మంచిది, ఆ ప్రజలు తమ్మును చూపుకొనుటకు అలా వచ్చుట లేదు. అటువంటిదేది లేదు… వెలుపటి లోకము ఈ ప్రజలలో ఎలాంటి అందమును చూడలేకయున్నది. వారందరు సర్వ సాధారణమైన పేద ప్రజలైయున్నారు, సాధారణమైన దుస్తులను ధరించియున్నారు. ఇక్కడ ఎటువంటి గొప్ప కీర్తనలు గాని, దేవదూతలలాంటి క్వయర్ల్ గాని, లేక ఆధునిక వాయిద్యములు గాని, వినోదమైన అద్దపు కిటికీలు గాని లేవు. ఇక్కడ ఒక బెంచీపై కూర్చొనుటకు స్థలముండుటయే కష్టముగా వున్నది. కేవలం గోడలకు ఆనుకొని యుండవలసి యున్నది.
వారు వినోదాల కొరకు వచ్చుట లేదు. కాని వారి ప్రకృతి కండ్లు చూడలేని దాని చూడగలుగుచున్నవి. వారి ఆత్మీయ నేత్రమే క్రీస్తు అందమును చేపట్టుచున్నది. అందుకొరకే వారు వచ్చుచున్నారు.
28ఈ ఆరాధనకు ముందు అనేక దినముల ఈ ఆరాధనకు ముందు అనేక దినములు ఆ అడవులలోని పొదల దగ్గరకు వెళ్లి నిత్యము నేను ప్రార్థించుచుందును. ఒక పెన్సిలును, కాగితమును తీసికొని నా భార్యతో ''ఈ ఉదయము ఉడుతల వేటకు వెళ్లుచున్నాను'' అని చెప్పి వెళ్లుదును. చూచుటకు కొద్ది వెలుగుండగానే ఏదో ఒక చెట్టెక్కి అక్కడ కూర్చొని, చేతులు పైకెత్తి ఇలా ప్రార్థింతును ''ప్రభువా, ఈ దినము నేనేమి చేయవలసి యున్నది? నీ బిడ్డలకు నీవేమి ఇవ్వనై యున్నావు?''
అలా ప్రార్థించుచుండగా ఏదో క్రింద మండునట్లు కనబడును. అది అలా వచ్చుచుండును. ఆయన సన్నిధి సమీపించుకొలది దూరమున ఏదో వినబడినట్లుండును. అది ఇలాగే ఉండును.
రెండు - రెండ్లు -నాలుగు
(సమీపముగా.)
రెండు - రెండ్లు -నాలుగు;
రెండు - రెండ్లు - నాలుగు;
ఆ విధముగానే మరలా, మరలా ఆయన సన్నిధి దగ్గరకు వచ్చుచుండెను.
29మీరు ఫలించిన తరువాత నీకు నీవు దూరమగుదువు. అప్పుడు దర్శనము వచ్చును: ''పలాన-పలాన స్థలమునకు ఈ, ఈ కార్యములకై వెళ్లుము.'' చూడండి, అప్పుడు ఈ ప్రపంచమును విడిచి నీ మనస్సులో దేవుని ధ్యానించుట ప్రారంభమగును. దూరమున ఆ అరణ్యములో ఈ లోకము నుండి దూరమైనప్పుడు, అది వచ్చుటకు ప్రారంభమగును. ''ఒకటి… ఒకటి….'' నేను ఏదో అంకెను చెప్పుచున్నాను, కాని ఏదో ఒకటి అలా వచ్చుటకు ప్రారంభమగును.
అలా అది వేగమును పొందును. అక్కడ కూర్చొని నీ చేతులెత్తి ఒక్క మాటైనను మాట్లాడక ఊరకుండుము. మొదటిగా నీ జీవము పైకి విప్పబడును. అప్పుడు దేనిని మనము తెలిసికొనవలయునని ఆయన ఇష్టపడుచున్నాడో నీవు చూడగలవు, రాబోవు కార్యములను ఆయన తెలుపును.
కొన్ని పర్యాయములు ఒక బిందువుకు వచ్చి ఆగిపోవును, అది ఒక దర్శనములోకి వెళ్లదు. అప్పుడ లేఖనములు కుమ్మరించబడును. నేను నాపెన్సిలు తీసికొని వాటిని మరచిపోకుండా వ్రాసికొనెదను. ఇంటికి వచ్చి మరలా ఆ లేఖనభాగమును చదివి, వాటినిజాగ్రత్తగా చూతును. కొన్నిసార్లు వాటిని చూచినప్పుడు ఏమియు అర్థము కాదు.
కొంతసేపటికి అది విశదమగును. అది తట్టి మరలా అది తప్పిపోవును! అప్పుడు నేను ఒక చిన్న పుస్తకమును తీసికొని నేను వినినట్లే దాని రూపమును గీతును. ఆయన దేనిని చెప్పుచున్నాడో, దానిని అలాగే గీతును. అప్పుడు నేనిలా తలంతును, ''ప్రభువా, నేను మందిరమునకు వెళ్లి వారికి చెప్పనైయున్నాను. ''నీవు దిగి రమ్ము వారి కొరకు నేను కొంత (వర్తమానము) కలిగియున్నాను. అది ఆ విధముగా వచ్చును. ఖచ్చితముగా అది వుండును. ఆయన నాకు ఇచ్చువరకు నేను ఏదియు చెప్పను.
అందువలన మీరు చూచు ఈ చిన్న గీతలు, దీనిని నేను మొదటిగా ప్రారంభించాను. ఇక్కడ ఈ భాగము నాకు రాలేదు, అందువలన ఒకటి రెండు రోజులు అడవిలోనే ఉండిపోయాను.
2PET 1:4
30ఇప్పుడు, ఈ ప్రజలు… ఏ విధముగా ఆయన దైవీక స్వభావమందు పాలివారమగుదుమో పేతురు చెప్పుచున్నాడు. ఇప్పుడు, మనలో ప్రతి ఒక్కడు దేవుని స్వరూపమునకు ఎదుగుటకు ప్రయత్నించుచున్నాము.
మనము ఏడుముద్రలను ముగించిన తరువాత, ఆ ఏడు ముద్రలు పలుకు కాలమందు లేక విప్పబడు సమయములో బహుశా, ఒక ముద్ర అనునది ఒక పరిచర్యను విప్పునదై యున్నది. అలాగున ఏడు ముద్రలను విప్పవలసియున్నది. పఠములో మనము దానిని చూచుచున్నాము. అది ఒక వర్తమానమును విప్పుచున్నది — ఏదో ముద్రింపబడిన దానిని, అది విప్పుచున్నది.
31గత ఆదివారము రాత్రి ''తాళపు చెవి'' అను అంశముపై మాట్లాడితిని. ఆ ''చెవి'' విశ్వాసముగా ఉన్నది. విశ్వాసము ఆ తాళపు చెవిని పట్టుచున్నది. ఆ తాళపు చెవి వాక్యముగా (లేఖనముగా) ఉన్నది. క్రీస్తు ద్వారముగా ఉన్నాడు. అందువలన విశ్వాసము ఆ చిన్న లేఖన ఆధారమును తీసికొని, దేవుని మహిమలను, మంచిని ఆయన ప్రజలకై విప్పునదై యున్నది. అందువలన విశ్వాసము ఆ తాళపు చెవిని గట్టిగా పట్టి క్రీస్తును ప్రజలకు బయలుపరచునదై యున్నది — విప్పునదై యున్నది. ప్రత్యక్షపరచునదిగా వున్నది. కావున ఈ దినమున మనము ఆ తాళపు చెవిని గైకొని దేవుని రూపములో శీలము గల ఒక క్రైస్తవునిగా ఉండుటకు మార్గమును ఏర్పడుటకు ప్రయత్నించుచున్నాము; మరియు జీవించుచున్న దేవుడు నివసించుటకు మనమొక జీవముగల మందిరముగా ఉండుటకు ప్రయత్నించుచున్నాము.
జ్ఞాపకముంచుకొనుడి, దేవుడు మూడు విధములుగా తనను బయలు పరచుకొనుచున్నాడు. మొదటిగా ఆయన అగ్ని స్థంభములో తనను ప్రత్యక్షపరచుకొనెను. అది తండ్రిగా పిలువబడెను. ఆ తరువాత ఆ దేవుడే యేసుక్రీస్తుగా రూపొందెను… ఆయన ఒక శరీరమును నిర్మించుకొని — అందులో నివసించెను. మూడవదిగా ఆ శరీరపు మరణము తరువాత ఆయన నివాసము చేయగలుగునట్లు ఒక సంఘమును పరిశుద్ధ పరచెను. మనపై నున్న దేవుడు; మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు; - ఆయన ఆ ఒక్క దేవుడే. అందువలననే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయని పిలువబడు చున్నాడు. ముగ్గురు దేవుళ్లు కాదు, గాని అవి ఒక దేవుని మూడు కార్యాలయములుగా ఉన్నవి.
వారు దానిని ఆ నైసీన్ సభలోనే తలంచారు. మనమలా మిళితమై పోకూడదు. పోకుండెదమా? అది నిజము. ముగ్గురు దేవుళ్లు కాదు.
32యేసు తండ్రితో మాట్లాడుచు మరలా ఆయనయు తండ్రియు ఏకముగా ఎలా ఉండగలరు. మంచిది, అక్కడే సమస్తము ఉన్నది. వాస్తవముగా, నిశ్చయముగా అది బయలుపరచుకొనుచున్నది. చూడండి, ముగ్గురు దేవుళ్లు కారు గాని మూడు కార్యాలయములైయున్నవి. అవి ఏమై యున్నవి? దేవుడు తన సృష్టికి దయచూపుచున్నాడు.
దేవుడు ఆరాధించబడుటకు ఇష్టపడుచున్నాడు. "దేవుడు" అను పదమునకు, ''ఆరాధించబడునది'' అను అర్థము. దేవుడు ప్రజలను ఏ విధముగా ఉంచుటకు ప్రయత్నించుచున్నాడనగా, వారినెందు కొరకు సృష్టించాడో దానిని వారు పొందుటకే. మిమ్ములను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా కాక మరొకరుగా ఉండుటకు ఆయన చేయలేదు. మీరు దానిని పోగొట్టుకున్నారంటే, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండుటను, మీ గురిని పోగొట్టుకొన్నట్లే. పా-ప-ము అను పదమునకు అర్థము ఆ గురిని తప్పిపోయామనుటయే.
అప్పుడు, నేను ఏబది అడుగుల దూరములో నున్న ఒక గురిని కాల్చుటకు నా తుపాకిని తీసికొని కాల్చాను — మరియు నాలుగు లేక ఐదు అంగుళముల వ్యత్యాసములో అది తప్పిపోయినది. అప్పుడు జరిగినదేమి? నా తుఫాకిని కొద్దిగా సరిచేయవలసియున్నది. అక్కడేదో పొరపాటైపోయినది. ఆ విధముగా నేను దేవునిలో విశ్వాసమును పోగొట్టుకొన్నానంటే, నేను ఒక క్రైస్తవునిగా ఉండుటకు తప్పిపోయానన్న మాటే… దేవుడు నన్నొక క్రైస్తవునిగా ఇక్కడ ఉంచి యున్నాడు. నీవు ఒక ప్రక్కగా పరుగిడినప్పుడు, తిరిగి పైకి వచ్చి దానిని సరిచేసుకొనుము. నిన్ను సరిచేయునది ఒక్కటే — అది లేఖనమైయున్నది. లేఖనములోని పరిశుద్ధాత్మ నిన్ను సరిచేయును, మరలా నిన్ను గురి యొద్దకే తెచ్చును. అది నిజము.
ACTS 7:44-49
33ఇప్పుడు, మనము ఆయన వాక్యమును చదువబోవుచున్నాము.
అపొస్తులుల కార్యములు 7వ అధ్యాయములో స్తెఫను ఇలా చెప్పుచున్నాడు… దానిని చదువుదము. ఇప్పుడు మనము దేవుని గుడారమును గురించి మాట్లాడుచున్నాము.స్తెఫను, జీవించు దేవుని నివాసమైన గుడారమైనందున అపొ॥ కార్యములు 7వ అధ్యాయములో, అది అపొ॥ కార్యములు 7వ అధ్యాయమేనని నమ్మెదను. 44వ వచనము నుండి చదువుదము…
అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సోక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను.
మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమయెదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచు కొన్నప్పుడు యెహోషువాతో కూడా ఈ దేశములోని దానిని తీసికొని వచ్చిరి. అది దావీదు దినములవరకుండెను.
అతడు దేవుని దయనుపొంది, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను.
అయితే సొలోమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను.
అయినను ఆకాశము నా సి౦హాసనము భూమి నా పాద పీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్త కృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు, అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు.
EXOD 19:12•
ISA 6:2•
JOHN 1:14•
HEB 10:5
34ఇప్పుడు, ఆలయము మనము విశ్రాంతి తీసుకొను స్థలముగా ఉన్నది. మనము క్రొత్తదనమును పొందెదము. అది మనము నిద్రించి లేచినప్పుడు ఉన్నట్టుగా ఉండును. ఇప్పుడు హెబ్రీ 10:5లో పౌలు ఇలా చెప్పుచున్నాడు.
''కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలి [అది క్రీస్తు], బలియు, అర్పణయు నీవు కోరలేదు గాని, నాకొక శరీరమును అమర్చితివి.''
ఇప్పుడా గుడారము ఏది? అది ఒక శరీరము — దేవుడు ఒక శరీరమందు నివసించాడు.
దేవుడు ఇష్టపడునది… ఆ శిఖరమందు, దేవుడు ఆ కొండ శిఖరమందు దిగి వచ్చినప్పుడు, ఒక ఆవుగాని, ఎద్దు గాని ఆ కొండను ముట్టినట్లయితే ముట్టినవారు మరణించిరి. దేవుడు పరిశుద్ధుడు. గత సాయంత్రము ఆ దేవదూతలు తమ ముఖములను కప్పుకొనగా - పరిశుద్ధ సెరాపులు తమ పరశుద్ధ ముఖములతో (వారు పాపమనగా ఏమిటో ఎరుగరు), అయినను దేవుని సన్నిధిలో ముఖములను కప్పుకొనవలసియున్నది; వినయముతో వారి పాదములను కప్పుకొనిరి.
పరిశుద్ధ దేవుడు పాపమును సహించలేడు. అందువలన దేవుడున్న కొండను ఏదియు తాకలేదు. అంతట దేవుడు శరీరధారియై యేసుక్రీస్తు రూపములో మన మధ్య నివసించెను. ఆయన కుమారుడు, ఆయన సృష్టియైయున్నాడు. ఆ కుమారుడు తన ప్రాణమునిచ్చెను, మరియు ఆ రక్తములో నుండి జీవము మనకు వచ్చునట్లు దేవుని రక్తకణము విరువబడెను.
ఆ రక్తము ద్వారా మనము కడుగబడితిమి. ఇప్పుడు మన రక్తము, మన జీవము (కామవాంఛ వలన జన్మించినదై, ఈ లోకములోనికి జీవమును తెచ్చినది), యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి, పరిశుద్ధాత్మను మనపై పంపుట ద్వారా మన స్వభావమును మార్చుచున్నది. అప్పుడు మనము దేవుని దైవీక స్వభావములోనికి వచ్చుచున్నాము. అప్పుడు మనము దేవునికి ఒక నివాస స్థలమగుచున్నాము.
MATT 28:20•
JOHN 14:11,12,19,20
35యేసు ఇలా చెప్పెను, "ఆ దినమున నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నేను మీ యందును, మీరు నా యందును ఉందుమని మీరు తెలిసికొనెదరు," — దేవుడు తన సంఘ మందు ఎలా ఉన్నాడో తెలుసుకొనుడి.
ఇప్పుడు సంఘము క్రీస్తు స్థానమును గైకొని ఆయన పరిచర్యను కొనసాగించుచున్నది. ''నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడుననూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో ఉందును, ఈ లోకపు ముగింపువరకు మీలో ఉందును." అదే ఇప్పుడు ఆయన కార్యమును కొనసాగించుచున్నది.
ACTS 7:48,49•
HEB 10:5
36ఇప్పుడు దేవుడు… స్తెఫను సొలొమోను కట్టిన దేవాలయమును గురించి మాట్లాడుచు, మహోన్నతుడు చేతులతో నిర్మించిన దేవాలయములలో నివసింపడు. ఎందుకనగా ''ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. నా విశ్రాంతి స్థలమేది? నీవు నాకొక శరీరమునిచ్చి యున్నావు,'' అని చెప్పెనని బైబిలు చెప్పుచున్నది. [ఆమేన్. అక్కడే మీరున్నారు.] ''నీవు నాకొక శరీరము నిచ్చియున్నావు.''
దేవుడు మానవ రూపములో నివాసము చేసెను, ఆయనను ఆ శరీరములో ప్రతిబింబింపచేసెను — పరిపూర్ణ ఆరాధన. ఆయన నివాసముగా దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు తనను రూపించుకొనుచున్నాడు. ఓ, మీరు ఈ ఉష్ణములో బాధపడనట్లయితే దానిపై మనమెంతగానో ధ్యానింపగలము.
EXOD 1:16,22•
MATT 2:16•
MATT 5:27,28
37గమనించండి, ఎల్లప్పుడు దేవుడు అన్ని సమయములలోను, అన్ని వేళలలోను మనిషిలో తనను ప్రతిబింబింప చేయుచున్నాడు. మోషేలో దేవుడుండెను. ఆయనను చూడండి, నడిపించువానిగా జన్మించాడు, మోషే జన్మించిన దినములలో ఆయనను కనుగొనుటకు చిన్న పిల్లలను చంపబడుట జరిగినది; అలాగే క్రీస్తు జన్మించినప్పుడు జరిగినది. ఆయన ఆ సమయములో విడిపింపబడెను. ఆ విధముగానే క్రీస్తుకూడా ఉన్నాడు. అతడు ధర్మ శాస్త్రము నిచ్చినవాడు. క్రీస్తుకూడా ఆ విధముగానే ఉన్నాడు. మోషే నలువది దినములు పైకి వెళ్లి దేవుని ఆజ్ఞలను పొంది దిగివచ్చెను. అలాగే క్రీస్తు కూడా నలువది దినములు అరణ్యములోనికి వెళ్లి తిరిగి వచ్చెను. అప్పుడు ఆయన ఇలా చెప్పెను. ''పితరులు వ్యభిచరించవద్దని చెప్పుట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు, ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.'' ఈ వ్యత్యాసమైన కార్యము లన్నింటిలో దేవుడు తనను ప్రతిఫలింపచేసెను.
GEN 37:5-10,24,28•
GEN 41:43,44•
JOHN 14:6•
ROM 14:11
38యోసేపును చూడండి, తన సహోదరులలో ఒక ఆత్మీయ బాలునిగా జన్మించాడు. వారందరు మంచివారే. వారందరు గోత్రకర్తలు. అయితే యోసేపు వారి మధ్య వచ్చినప్పుడు అతడు వ్యత్యాసముగా ఉండెను. అతడు దర్శనములను చూడగలడు, కలలను వివరించగలడు. అందువలన తన సహోదరులకు అతనిపై ద్వేషభావము ఏర్పడినది. ఈ భూమిపై చేయుటకు దేవుడు అతనిని నియమించిన కార్యములు నిమిత్తము వారతనిని అసహ్యించుకొనిరి, చూడండి. అదంతయు సిలువను సూచించుచున్నది.
అతడు ముప్పది వెండి నాణెములకు అమ్మబడెను, అతడు మరణించునట్లు తన సహోదరులతో గోతిలోకి త్రోయబడి, మరలా పైకెత్తబడి ఫరో కుడి పార్శ్వమున కూర్చొనెను. ఎవ్వరూ ఫరోను నేరుగా చూడలేరు. (అతడు ఈ ప్రపంచంనే తన స్వాధీనమందుంచుకొన్నాడు), యోసేపు ద్వారా తప్ప ఎవ్వరూ ఫరో నొద్దకు రాలేరు. ఎవ్వరును క్రీస్తు ద్వారా తప్ప, దేవుని యొద్దకు రాలేరు.
యోసేపు అంతఃపురమును విడిచినప్పుడు, బూర ఉదబడును. ముందుగా నడచువారు ముందుకు వెళ్ళి ''యోసేపు వచ్చుచున్నాడు, మోకరించండి,'' అని కేకలు వేసిరి. వారు ఎక్కడ ఉన్నను పరవాలేదు. వారేమి చేయుచున్నను, ఎంతటి ముఖ్యమైన కార్యములు చేయుచున్నను యోసేపు వచ్చువరకు మోకాళ్లపై ఉండవలసినదే.
ఈ దినములలో ఒక దినమందు బూర ఊదబడినప్పుడు ప్రతి మోకాలు వంగవలెను. ప్రతి నాలుక ఒప్పుకొనవలెను! క్రీస్తు, మన యోసేపు తన మహిమను విడిచి వచ్చునప్పుడు నీ కార్యములు ముఖ్యము కాదు. ప్రతి మోకాలు వంగి, ఆయనను దేవుని కుమారునిగా ఒప్పుకొనవలెను. చేయవలసినదియు అదే. అది సరియైనది.
2SAM 15:30•
MATT 23:37•
LUKE 13:34•
LUKE 19:41
39ఓ, దావీదులో ఆయనను ఎలా చూడగలము. దావీదు ఏ విధముగా, ఒక నిరాకరింపబడిన రాజుగా, తన స్వంత వారిచే, తన సహోదరులచే త్రోసివేయబడి తన స్వంత కుమారునిచే వెళ్లగొట్టబడి ఓలీవల కొండపై కూర్చొనెను. అతడు అలా ఒలీవల కొండ పైకి వెళ్లుచుండగా యెరూషలేము తట్టుకు వెను దిరిగి చూచి ఏడ్చెను. ఎందుకనగా తాను సేవ చేసిన తన సొంత ప్రజలు అక్కడున్నారు… వారికి దేవుని గురించి చెప్పాడు, తన స్వంత ప్రజలు అతనికి ఎదురు తిరిగి, అతనికి వ్యతిరేకముగా తమ కార్యములు చేయుచు; అతనిపై ఉమ్మివేసి మరియు పరిహాసము చేశారు, అతడు కొండను ఎక్కుచుండగా, అతడు నిరాకరించబడిన వాడాయెను.
ఓ, ఎనిమిదివందల సంవత్సరముల తరువాత దేవుని కుమారుడు ఆయన ప్రజల మద్య ఒక నిరాకరింపబడిన రాజుగా కొండపై కూర్చుని యెరూషలేము తట్టు చూచి ఏడ్చెను. ఒక నిరాకరింపబడిన రాజుగా అది ఎంత ఖచ్చితముగా ఉన్నది. అదియేమిటి? దేవుడు తనను ప్రతిఫలింప చేయుచున్నాడు. ఆ ప్రవక్తలలో క్రీస్తును ప్రతిఫలింపజేసెను.
అంతట దేవుని పరిపూర్ణతగా ఉన్న ఒకరు వచ్చారు. అది (ఏదో కాదు) దేవుడు మనలో ఉండుటయే. అప్పటి నుండి కల్వరికి ఇటు ప్రక్కగా ఆయన తన సంఘములో తనను ప్రతిఫలింప చేసికొనుచున్నాడు. అందువలన, మీరు చూడండి, సజీవ దేవుని గుడారమైన నివాస స్థలమునకు మనమందరము వచ్చుటకు ప్రయత్నించుచున్నాము.
2PET 1:5-8
40ఇక్కడ కొందరిని మనము గమనించామంటే… ఆయన (పేతురు) ఏమి చెప్పుచున్నాడనగా ''మొదటిగా మనము విశ్వాసమును, సద్గుణమును, జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమ కలిగి యున్నాము.'' మంచిదే: సహోదరుల పట్ల దయను, దానితో ప్రేమను చేర్చుట మంచిది. మీరు ఖచ్చితముగా దీనిని తెలిసికొనునట్లు దానిని మరలా చదివెను. మనము 5వ వచనము నుండి ప్రారంభించెను.
''ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై, మీ విశ్వాసము నందు సద్గుణమును; సద్గుణము నందు జ్ఞానమును;
జ్ఞానము నందు భక్తిని; భక్తియందు సహోదర ప్రేమను; సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి;
అవి మీరు కలిగి విస్తరించినయెడల, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను, నిష్పలులైనను కాకుండ చేయును.''
ఇప్పుడు, పేతురు, మనమేలాగు అక్కడకు చేరగలమని ఒక వెలుపలి కార్యమును చూపుతున్నాడు.
41ఇప్పుడు దీనిని నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను: కొందరు ఈ సద్గుణములోను, జ్ఞానములోను, తెలివిలోను, ఓర్పులోను మరి కొన్నింటిలో కొంత భాగమును మాత్రము కలిగియున్నారు. అటువంటి వారు క్రైస్తవులుగా ఉండుటకు అర్హులు కారు. ఇప్పుడు మనము ఆదివారపు-బడి పాఠమును బోధించుచున్నాము, మరియు అది వాస్తవము. కొందరైతే వీటిలో ఒక భాగమును కలిగి క్రైస్తవులుగా ఉన్నామని నటించలేరు. అది అక్కడ చెల్లుబడికాదు.
అది ఎలాగున్నదనగా ఒక నల్ల పక్షి నెమలి ఈకలను తన రెక్కల యందు ఉంచుకొని, తనను ఒక నెమలిగా చేసికొనవలెనని ప్రయత్నించినట్లుందును. అట్లు చేయుట వలన అది తనను కించపరచుకొనుచున్నదే గాని మరేది కాదు. అది నల్ల పక్షిగా ఉండుటయే మేలు, చూశారా. ఒక క్రైస్తవుడు కాకుండ వీటిని ప్రయత్నించిన యెడల, అతడు తన స్థానమును పోగొట్టుకొనిన వాడగును. ఒక మేడి చెట్టు ఆపిల్ పండ్లను ఫలించుటకు ప్రయత్నించుటకు ప్రయత్నించినట్లే యుండును. అది ఒక చెట్టయినప్పటికిని అలా జరుగనేరదు. అది ఆపిల్ ప౦డ్లను ఫలించదు.
అది ఎట్లున్నదనగా ఒక కంచర గాడిద తనలో ఉన్నిని ఉత్పత్తి చేయునట్లుండును. అది ఒక గాడిదగా ఉంటూ, గొర్రెవలె ఉండుటకు ప్రయత్నించుచున్నది. మీరు చూడండి, అది ఉన్నిని తనలో ఉత్పత్తి చేయజాలదు. అది అలా చేయలేదు. ఉన్ని, గొర్రెకున్న ఒక బహుమానమే గాని, గాడిదకు కాదు. అది గొర్రెవలె ఉండుటకు ప్రయత్నించవచ్చు గాని అయినను అది ఒక గాడిదయే. ''నేను గొర్రెవలె గడ్డి మేయుదును. గొర్రెవలె అన్ని కార్యములు చేయుదునని,'' చెప్పవచ్చు. అయితే నీవేమి చేసినను ప్రయోజనము లేదు, నీవు గొర్రెగా ఉన్నప్పుడే ఉన్ని నీయగలవు.
42ఇక్కడ నన్ను ఒక నిముషము ఆగనివ్వండి. గొర్రె ఉన్నిని తయారు చేయదు. స్వభావ సిద్ధముగానే దానికి ఉన్ని ఉన్నది ఎందుకనగా అది ఒక గొర్రె. ఈనాడు అనేకులు ఇలా చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. ''మంచిది, నేను బాగుగా ఉండుటకు ప్రయత్నించుచున్నాను. నేను దీనంతటిని చేసెదను.'' అయితే ఏదియు ఉత్పత్తి కాజాలదు. లేదు, నీవు దానిని చేయలేవు. ఒక గొర్రెను అడుగవలసిన అవసరత లేదు, అది ఉన్నిని ఉత్పతి చేయును. అది స్వభావసిద్ధముగా ఉన్నిని కలిగియున్నది, ఎందుకనగా అది గొర్రెగా ఉన్నంది.
మరి నీవు ఒక క్రైస్తవునిగా ఉన్నప్పుడు, నీవు ఆత్మ ఫలములను కలిగియుందువు. నీవు దానిని ఉత్పత్తి చేయవలసినది లేదు. దానిని చేయుటకు ప్రయత్నించవలసినది లేదు. నీవలా లేనప్పుడు, ఆ విధముగా ఉన్నట్టు నిన్ను చేసికొనవద్దు. నీవు ఏమిగా ఉండవలయునో, ఆ విధముగా ఉందువు. అప్పుడు అది తనను గురించి తానే శ్రద్ధ వహించును.
43ప్రజలు ఇలా చెప్పుట మీరు విన్నారు, ''మంచిది, నేను చెప్పునదేమనగా, నేను ఈ సంఘములో చేరాను. నేను అబద్ధమునుచెప్పుట మానివేశాను'' అయితే నీవు మరలా దేనినో ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించుచున్నావు. నీవు అలా చేయలేవు. నీవలా చేయుటకు ప్రయత్నించడములో ఏ అవసరతయు లేదు — అది ఒక గాడిద ఉన్నిని తనలో తయారు చేసికొనుటకు ప్రయత్నించినట్లే ఉండును. అయితే అది దానిని చేయలేదు. లేక ఒక రాబందు పావురముతో మేయగలదా — లేక ఒక రాబందు పావురము వలె ఉండుటకు ప్రయత్నించుటగా ఉన్నది. మీరు ఊహించండి, ఒక రాబందు, ''నేను ఒక పావురమని మీకు తెలియునా,'' అని చెప్పగలదా. కొన్ని ఈకలను తన రెక్కలలో ఉంచుకొని ''ఇప్పుడు చూడండి, నేనే విధముగా ఉన్నానో… '' అని చెప్పుచున్నది, చూశారా. దాని స్వరూపమే వేరు.
అలాగే ఒక మనిషి తాను అది కానప్పటికిని, ఏదో కొంత ఉన్నట్లు చెప్పుకొనుటగా ఉన్నది. చూడండి మీరు అలా చేయలేరు. ''ఇప్పుడు చూడండి. నేను సద్గుణమును కలిగియుండవలసియున్నది, కావున నేను సద్గుణమును కలిగియున్నాను. నేను భక్తి కలిగియుండవలసియున్నది, కావున నేను భక్తిగా ఉన్నాను,'' అని నీవు చెప్పలేవు. నీవు నీ పరిదిలో ఉన్నను వేరైన ఈకలను ఉంచుటకు ప్రయత్నించుచున్నావు, కాని ఒక పక్షిలో మరొక రకమైన ఈకలను ఉంచలేవు. అది కుదరదు. అది కేవలము ఆ పక్షి ఎంత భక్తిహీనమైనదని చూపుచున్నది.
JOHN 3:7•
1PET 1:23
44దీనిని నీవు ఊహించుము. ఒక ముసలి రాబందు రెండు పావురపు ఈకలను ఉంచుకొని ''ఇటు చూడండి, నేను ఒక పావురమును,'' అని చెప్పిన ఎలా ఉండును. చూశారా? అంతెందుకు అది రాబందని మనకందరికి తెలియును. అంతే, అది రాబందని మనము చెప్పగలము.
మంచిది ఇప్పుడు క్రైస్తవ్యమును ఉత్పత్తి చేయుట అనగా అలాగే ఉండెను. నీవు అలా చేయలేవు. మొదట నీవు క్రొత్తగా జన్మించవలసి యున్నది. నీలో మార్పు రావలసియున్నది. నీలో మార్పు వచ్చినప్పుడు, నీవు క్రొత్త సృష్టి వగుదువు. ఇప్పుడు, నీవు అలాగే అగుచున్నావు. ఇప్పుడు, నీవు ఆ ఈకలను గురించి బాధ చెందవలసినది లేదు. నీవు క్రొత్తగా జన్మించినప్పుడు, అదే దానిని గురించి అక్కర తీసికొనును. అవునండి.
నేను ఎప్పుడును ఈ విధముగా చెప్పుదును: ''ఒక పందిని తీసికొని, చక్కగా కడిగి ఒక అందమైన సూటు (మంచి దుస్తులు) నువేసి విడిచి పెట్టుము. అది నేరుగా బురద గుంటలోనికి వెళ్ళును,'' ఎందుకనగా దాని వలన ఏ మంచి జరుగదు. అది ఒక పంది, అది దాని స్వభావము. మీరు దాని స్వభావమును మార్చవలసి యున్నది, మరియు మిగిలినది తనంతట అదే జరుగును.
JOHN 3:3,5•
JOHN 3:7
45ఇప్పుడు గమనించండి, మీరు క్రొత్తగా జన్మించవలసి యున్నది. అక్కడ ఒక మార్పు రావలసియున్నది. నీవు ఇలా చెప్పవచ్చు, ''సహో॥ బ్రెన్‌హామ్ ఇక్కడ నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎప్పుడు గాని ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆమె ఒక మంచి స్త్రీగా ఉన్నది, లేక ఈ మనుష్యుడు, అతడొక మంచివాడు. అతడు ఎప్పుడు ఏమి చేయలేదు. అతడు ఎవ్వరికిని ఏ హానియు చేయలేదు.'' దానిలో అర్థమేలేదు. అతడు ఒక మంచి పొరుగువానిగా ఉండవచ్చు గాని, అతడు క్రొత్తగా జన్మించినంత వరకు అతడు క్రైస్తవుడు కానేరడు.
''ఒక మనుష్యుడు క్రొత్తగా జన్మించితేనే గాని (యోహాను 3) అతడు దేవుని రాజ్యమును చూడలేడు,'' అని యేసు సెలవిచ్చెను. ''చూచుట'' అనగా ''గ్రహించుట,'' అను భావము. నీవు దేనినైనను చూచియు ''నేను దానిని చూడలేకున్నాను," అంటే నీవు గ్రహించలేకున్నావని భావము.
46ప్రజలు ఎందుకు గోల చేయుచున్నారోనని ఒక మనిషి గ్రహించలేడు. ఎందుకు మానవ భాష మారుచున్నదని ఒక మనిషి గ్రహించలేడు. అతడు భాషలతో మాట్లాడవచ్చు. ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని మహిమ మానవుని వెదకి వచ్చుటను చూడలేదు. అతడు దర్శనమును చూచి ఒక మనిషికి కొన్నికార్యములను చెప్పవచ్చును. కొన్ని కార్యములు జరుగనై యుండగా ఏమి చేయాలో చెప్పవచ్చు. దేవుడు గతరాత్రి మనకు చేసినట్లు రాబోవు కార్యములను చెప్పవచ్చు.
ప్రకృతి సంబంధమైన మనస్సు వీటిని గుర్తించవచ్చును. ''అతడేమి చేయుచున్నాడో'' మరి ''అతడేమాయను ఉపయోగించుచున్నాడో'' లే ''ఏ మంత్రమును అతడు కలిగియున్నాడు,'' అని తెలుసుకొనవచ్చును. ఒకమనిషి భాషలతో మాట్లాడుటను చూచినప్పుడు, మరెవరో దానికి అర్థము చెప్పుచున్నారు. ఖచ్చితముగా ఆ సభలో ఉన్న వ్యక్తి ఏమి చేశాడో, వారేమి చేయ కూడదో ఇవన్ని చెప్పినప్పుడు చూడండి.
వారు దీనిని ఒక రకమైన మాయగా తలంచెదరు. ''వారి మధ్యన ఏదో కొంత ఉంచబడి యున్నది'' కాని వారు దానిని గ్రహించలేదు. అతడు క్రొత్తగా జన్మించినంత వరకు దానిని గ్రహించలేడు. అతడు క్రొత్తగా జన్మించినప్పుడే అతడు సహవాసము లోనికి వచ్చును, ఎందుకనగా అతడు నూతన సృష్టియైయున్నాడు. అతని పాతదైన సందేహ స్వభావమునకు అనుమానపడు స్వభావమునకు మరణించిన వాడగుచున్నాడు. ఇప్పుడతనొక నూతన సృష్టి. అందువలన మీరు చూడండి, అతని స్వభావమునకు మరొక దానిని చేర్చవలసిన అవసరత లేదు, ఎందుకనగా ఇప్పుడది తనంతట తానే అతనిలో చేర్చబడినది.
JOHN 3:7•
HEB 11:6
47గమనించండి, మీరు క్రొత్తగా జన్మించవలసి యున్నది. నీవు క్రొత్తగా జన్మించినప్పుడు, విశ్వాసము లేనిదే నూతనముగా జన్మించలేవు. అది నిజము. అందువలన ఇక్కడ నేను వ్రాసిన దానిని చూచినప్పుడు (సహో॥ బ్రెన్‌హామ్ ముక్కోణాకారములో గీతలు గీచి ఈ ఏడు స్వభావములను అనగా విశ్వాసము మొదలు దయవరకు, ఏ విధముగా ఒకదాని తరువాత ఒకటి వచ్చినదని చూపుచున్నారు). అక్కడ పునాది వేయబడి యున్నది. విశ్వాసము వాటన్నిటికిని పునాదిగా ఉన్నది, ''ఎందుకనగా విశ్వాసము లేనిదే దేవుని సంతోషపెట్టుటకు వీలు లేదు. ఎందుకనగా దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని విశ్వసించవలసి యున్నది, మరియు ఆయనను వెదకు వారికి ఆయన తన బహుమానమిచ్చునని విశ్వసించవలసి యున్నది. అతడు ఖచ్చితముగా విశ్వసించవలసియున్నది.'' నీవు బైబిలును సందేహించువాడైతే నీవు నిజ వాక్యమును సందేహపడువానిగా ఉన్నావు. నీవు దానిని విశ్వసించునంత వరకు దానికి దూరముగా ఉండుట మంచిది.
పాపమనగా ఏమిటి? - అవిశ్వాసము. మానవుని స్వాధీనపరచునవి రెండు. అవి సందేహము లేక విశ్వాసము — ఒకటి లేక మరొకటి నీ జీవితమును పాలించుదానిని నీవు కలిగి యుందువు. నీవు ఎంత విశ్వాసము కలిగి యున్నావో అను దానిపై అది ఆధారపడి యున్నది. నీవు ఎంత పైకి రాగలవో అదియు దానిపై ఉన్నది. అయితే మొదటిగా విశ్వాసము ఉండవలసి యున్నది. ఆ పునాదిపై కొంత సమయము కొనసాగెదము.
HEB 11:1
48విశ్వాసమనునది నీవు నమ్మవలసిన ఒకటై యున్నది. విశ్వాసమనగా… ''విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపము…'' నీవు విశ్వాసమును కలిగియున్నప్పుడు, వాటిని ముందుగానే పొందియున్నావు, ఎందుకనగా విశ్వాసము ద్వారా ఆ నీతి బయలుపరచరబడినది. ''విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము [హెబ్రి 11] రుజువునైయున్నది. అది ఎలాంటి రుజువై యున్నది? అది పరిశుద్ధమైన రుజువైయున్నది.
''సహో॥ బ్రెన్‌హామ్ దేవుడు స్వస్థపరచువాడై యున్నాడని నేను నమ్ముచున్నాను,'' అని నీవు చెప్పినప్పుడు, దానిని నీవు నమ్ముచూ ఆయన నిన్ను స్వస్థపరచువాడని అంగీకరించుము. అబద్ధమాడుట కాదు గాని, ''ఆయన పొందిన గాయముల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని,'' నిశ్చయముగా నమ్ముచున్నయెడల, నిన్ను కదిలించునది ఏదిలేదు. అది ముగించిపోయినది. నీవు నమ్మకము కలిగియుండవచ్చు, అయినను దీని తట్టు, దాని తట్టు ఉండుచు నమ్మకము కలిగియుండవచ్చు; అయితే నీవు విశ్వాసమును కలిగియున్నప్పుడు, దానిని యెరిగి యుందువు, ఎందుకనగా దానిని నీవు ముందుగా పొందినట్లు అది ఒక రుజువుగా వున్నది.
ROM 10:17
49ఈ ఉదయ కాలమందు, ''ఓరల్ రాబర్ట్స్'' మాట్లాడుటను మీరు విన్నారు. ఆయన ఈ ఉదయ కాలమందు మాట్లాడుచుండగా…. ఆయన ఓరల్ రాబర్ట్స్ కాదా? ఆయన విశ్వాసము ద్వారా విడుదలను గురించి మాట్లాడుచుండెను. విడుదల విశ్వాసమును గురించి ప్రార్థించుచుండెను. అప్పుడాయన ''మీరు రేడియోలను తాకుట ద్వారా మీ సంబంధమును కలిగియుండిడి,'' అని చెప్పెను. ఆయన అలా ఎందుకు చెప్పుచున్నాడనగా, "ప్రజలు నమ్మకముతో రేడియోపై చేతులుంచి, ఆయన నా రేడియోను తాకమన్నాడు కావున, నేను దానిని పొందితిని, అని చెప్పును," చూశారా. అది మంచిదే.
నిజవిశ్వాసము అటువంటి దానిని తాకనవసరము లేదు. నేను సహో॥ ఓరల్ రాబర్ట్స్‌ను గురించి వేరు విధముగా మాట్లాడుటలేదు. అలా కానే కాదు. ఆయన దేవుని మనిషిగా వుండి ఎంతో గొప్ప కార్యములను చేసాడు. నేను ఓరల్ రాబర్ట్స్ గురించి ఎంతో గొప్పగా తలంచెదను. వాటిని మనము పొందలేదనుట మంచిది కాదు.
అయితే నేను చెప్పుటకు ప్రయత్నించునదేమనగా, విశ్వాసమునకు మరొకటి అవసరములేదు. విశ్వాసము దేవుని వాక్యమును నమ్మును, విశ్వాసము దేనినైన తాకుట వలన వచ్చుచున్నదా, లేదు. ''వినుట వలన విశ్వాసము కలుగును,'' అది లంగరునై యున్నది. అక్కడే అది ఉన్నది. (నేను చెప్పినట్లు) విశ్వాసమునకు దూరమనునది లేదు. విశ్వాసము ఇప్పుడిక్కడ ఉన్నది విశ్వాసము ఇక్కడే ఉన్నది.
50ఆ విధముగానే ఇప్పుడు ఎవ్వరైనను ఉండిన యెడల - గత దినములలో ఆ చిన్న బిడ్డ ఉండినది. ఆ తల్లి మరియు సోదరి కిడ్ మాట్లాడుకొనుచు, ఆ చిన్నప్రేగులు వెలుపలకు వచ్చాయని దాని ద్వారా ఆహారము నెక్కించుటకు ఆసనము దగ్గర ద్వారము లేనందున ఇప్పుడు ఈ స్త్రీ వినుచున్న సోదరి కిడ్ మరియు సాక్ష్యమిచ్చిన వారు నన్ను కలసికొని నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థించవలెనని విశ్వసించారు…
దేవుడు, ప్రజలకు దయ చేయుటను చూడండి. మనలో కొందరు నిజ అనుభవమును దేవునితో కలిగియున్నారు. ఇక్కడ సహో॥ నెవిల్‌తో మాట్లాడుచుండగా లేక మీలో ఎవరో పరిచయము చేసికొనన వారు ఆ నిజ అనుభవమును పొందిరి. కొన్ని సమయముల యందు మేము వారిని మా కొరకు ప్రార్థించమని కోరుదము. అదియే మనము చేయవలయునది. మనము విశ్వాసము కలిగియున్నప్పుడు, ఆ స్త్రీ లేక ఆ పురుషుడు మరిఎవ్వరినైనను మా కొరకు ప్రార్థించునప్పుడు, వారు దేవునితో మాట్లాడుచున్నారు. అప్పుడ మన విశ్వాసము స్థిరపడుచున్నది. అది గట్టిపడి స్థిరపడుచున్నది.
MATT 8:8•
LUKE 7:6,7•
JOHN 4:49-52
51ఇక్కడ ఆ రోమా అధిపతి ఒకడు యేసును కలిసికొనుటకు వెళ్ళుచున్నాడు. ''నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. నేను అందుకు అర్హుడను కాను, నేను ఆ విధముగా నన్ను లెక్కించుకొనుట లేదు.'' అయితే ''నా కుమారుడు రోగియై ఉన్నాడు. నీవు మాట మాత్రము సెలవిచ్చిన యెడల [చూచారా], నా కుమారుడు జీవించును,'' అని చెప్పెను.
అదేమిటి? దూరమందు ఏ వ్యత్యాసము లేదు, చూడండి, ఎందుకనగా దేవుడు అంతటను ఉండువాడు. ఆయన అంతటను ఆవరించియుండును. దేవుడు జర్మని దేశమందు ఎంత గొప్ప వాడో, స్విడ్జర్లాండునందు ఎంత గొప్పవాడో, ఆఫ్రికా దేశమందును ఈ నిముషములో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడను ఉన్నాడు. అక్కడే మీరున్నారు!
అందువలన ఆ (అధిపతి) ఇలా చెప్పాడు, ''నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. మాట మాత్రము సెలవిమ్ము. అది ఏమిటి? అది ఆ రోమీయుని విశ్వాసము. అతడు దానిని ఆ విధముగా నమ్ముచున్నాడు.
అప్పుడు యేసు ఇలా సెలవిచ్చెను, ''నీవు తిరిగి వెళ్లుము. నీ కుమారుడు జీవించియున్నాడు.''
అతడు రెండు దినముల ప్రయాణమును కొనసాగించి, మరుసటి దినము ఇల్లు చేరుట ముందు తన పని వారు కొందరు అతనిని కలిసికొనుటకు వచ్చుచుండిరి. అప్పుడు వారు ''నీ కుమారుడు జీవించియున్నాడు,'' అని తెలిపిరి.
అప్పుడా రోమీయుడు ఆశ్చర్యపడి, ''వాడు ఏ సమయములో స్వస్థపడుట జరిగినది.'' ఆ దినములో ఏ సమయమందు? అని అడిగాడు.
అందుకు ఆ పనివాడు ''సుమారు పదకొండవ గంటలో స్వస్థపడుట జరిగినదని తెలిపాడు." అప్పుడు ఆ రోమీయుడు, అది యేసు ''నీ కుమారుడు జీవించునని,'' చెప్పిన ఘడియయని గ్రహించెను మరియు అతడు నమ్మెను. ఆమేన్.
MATT 8:8•
LUKE 7:7
52సర్వశక్తిగలవాడు, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడైనవాడు, అంతములేనివాడు. ఆయనే దేవుడు. అందువలన ఫోను ద్వారా ప్రార్థించుమని కోరినప్పుడు దానితో సంబంధపడుచు, మీ విశ్వాసము దేవుని తెచ్చుచున్నది! అది ప్రార్థనను, మరియు దేవుని ఒక దృశ్యమందు జతపరచు కార్యమై యున్నది! ప్రార్థన విశ్వాసము అక్కడక్కడ వ్యత్యాసపడును. అదిజతపరచునదై యున్నది!
''మాటను మాట్లాడుము. నేను కోరునదంతయు ఏదనగా, మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు ప్రతిది చక్కగా జరుగును.'' ఆయన అక్కడ ఉండవలసిన అవసరము లేదు — మాట మాత్రము సెలవిచ్చిన చాలును. ఎందుకు? దేవుడు సర్వశక్తిగలవాడు. ఆయన భూమండలమునకు పైన ఎంత శక్తిగలవాడో, భూమి పైన కూడా అంతశక్తిగలవాడై యున్నాడు. ''ఆయన దేవుడై యున్నాడు. కావున మాట మాత్రము సెలవిచ్చిన చాలును,'' అని ఆ రోమా అధిపతి పలికాడు.
విశ్వాసము మిగిలిన దానిని చేయునదై యున్నది. మిగిలిన దానిని విశ్వాసము చేయునదై యున్నందున నీవు పునాదిగా విశ్వాసమును కలిగియుండవలెను. క్రైస్తవ్యమంతయు, మీరందరును, మరెవ్వరైనను ''వాక్యమందు విశ్వాసము,'' అను పునాదిపై ఉండవలసియున్నది.
53నేను వాక్యమును నమ్ముటకు అదే కారణము. నేను మరో దానిపై నా విశ్వాసమును ఉంచలేను. ఒక వేళ నేను ఒక సంఘముపై నా విశ్వాసమును ఉంచుదుననుకొంటినా ఏ సంఘముపై ఉంచవలసి యున్నది? క్యాథలిక్ సంఘమునా, లేక లూథరన్ సంఘమునా, లేక మెథడిస్టు సంఘమునా, లేక బాప్టిస్టు సంఘమునా, లేక పెంతెకోస్తు సంఘమునా, ఏ సంఘముపై నుంచగలను? నేను దేనిపై ఉంచగలను? నాకైతే తెలియదు. వారందరు సందేహపరులై — ప్రతి దానియందు తారుమారై యున్నారు. అయితే నేను వాక్యముపై నా విశ్వాసముంచినప్పుడు, అది లంగరువలె అగుచున్నది. మరెవ్వరూ దానిని వ్యాఖ్యానించలేరు; అది ఇక్కడే ఉన్నది. అది ''యెహోవా సెలవిచ్చినది'' గా ఉన్నది. అప్పుడు నేను దానిని విశ్వసించెదను. అక్కడే ఆ పునాది ఉన్నది.
54ఒక చక్కని డాక్టరు (ఈ పట్టణములో ఉన్నాడు) అతడు నా స్నేహితుడు డాక్టర్ శ్యామ్ అడైర్. మేము బాలురముగా జతగా ఉండేవారము. మీరందరు శ్యామ్‌ను ఎరిగి యున్నారు. ''బిల్….
ఆ దర్శనము వచ్చిన తరువాత అతడెక్కడ తన స్థలమును కట్టునో, అది ఏ విధముగా కనబడుచున్నదో (ఇప్పుడు వెళ్లి అది సత్యము కాదాయని అతనిని అడుగవచ్చు. అది జరుగుటకు రెండు లేక మూడు సంవత్సరములు క్రితము, అది జరుగక ముందే అది ఎక్కడుండునో చెప్పాను. ''నీవు ఆ పట్టణపు వరుసనంతటిని తీసికొనెదవు,'' అని చెప్పాను. అతనికిని, దానికిని మధ్య ఒక్కటి కూడా వ్యత్యాసము లేదు. అది మరలా పూర్వపు స్థితికి తేబడిన స్థలముగా ఉండినది. డాక్టర్ అడైర్ మిగిలినదంతటిని కలిగియున్నాడు. ఆ మందుల అంగడి వానికి కూడా తెలియును. అంతే.
డాక్టర్ అడైర్ ఆ దర్శనమును పూర్తి చేశారు. అప్పుడతడు ఇలా చెప్పాడు. ''అది ఒక ఇరువది ఐదు సంవత్సరముల కూడా తాకనవసరము లేదు? అది మైదానముగా ఉండినది.''
అందుకు నేను డాక్టర్ దేవుడు నీకు దానినిచ్చాడు, ఎందుకనగా నీవు నమ్రత కలిగియున్నావు అని చెప్పాను.
అందుకతడు, ''నాలో ఏ మంచి లేదని,'' అన్నాడు.
అప్పుడు నేను, ''నీవు తాబేలువు. పై భాగమందు నీవు గుల్లను కలిగియున్నావు. వెలుపలకు నీ స్నేహితులకు కఠినుడివిగా అగుపడుదువు గాని, నీవు అమాయకుడివి. ఆ గుల్ల నుండి వెలుపలకు రమ్ము, దేవుడు నీకు దానినిచ్చాడు,'' అని చెప్పాను.
అందుకతడు ''బిల్లీ, నేనే మాత్రము నిన్ను సందేహపడుట లేదు. నేను మరొక దానిని గురించి సందేహపడుచున్నాను,'' అని చెప్పాడు.
అందుకు నేను ''నీవు నీ కార్యలయమునకు వెళ్ళుము,'' అని చెప్పినప్పుడు అతడు వెళ్లిపోయాడు.
మరుసటి ఉదయము అతడు నన్ను పిలిచి, ''నేను మరణించునంత చల్లగా ఉన్నాను,'' అని చెప్పాడు.
అందుకు నేను ''ఏమి జరిగినది? ఏమి జరిగినది డాక్టర్,'' అని అడిగాను. (అది జూలై మాసములో జరిగినది)
''బిల్లీ నేనా స్థలమునుకొన్నాను. హూస్టన్‌లో గత రాత్రి వారు కూటమును జరిపిరి. నేను ఈ ఉదయము ఆ స్థలమును కొన్నాను,'' అని అతడు చెప్పెను.
''నేను చెప్పాను గదా,'' అని పలికాడు.
ఇదంతయు ఆ దర్శనము వచ్చిన తరువాత అతనితో చెప్పినట్లే జరిగినది. గత దినమందు అతనితో అక్కడ మాట్లాడుచున్నప్పుడు, (ఆ తుపాకి ఏ ఎదుటనే ప్రేలినది) ''ఇక్కడ వేయిమంది వచ్చెదరని నేను ఊహించుచున్నాను,'' అని అతడు చెప్పాడు. ఏమిటది? దేవుడు దేనినైనా మాట్లాడినప్పుడు అది నెరవేరవలసి యున్నది!
55గత సాయంత్రము కొందరు స్నేహితులు వచ్చారు. వారు ఆ నలువది రెండు అంగుళముల పొడవు గల అడవి జింక కొమ్మునుమరియు వెండిలాంటి క్రూరపు ముఖము గలిగిన ఎలుగుబంటు దర్శనము గురించి విన్నారు. వాటిని చూచుటకు ఎందరు ఇంటికి వచ్చారో నాకు తెలియదు. ''ఇక్కడ ఆ కొమ్ముల కొలత ఖచ్చితముగా ఉన్నది'' మీరు అది జరుగక మునుపే మీరు విన్నారు. చూడండి. ఎందుకు? దేవుడేదైనను చెప్పిన యెడల అది నెరవేరవలసి యున్నది! అక్కడ పునాది వేయబడుటకు అదే కారణము.
ఇప్పుడు ఇక్కడ రక్షణ ఏర్పాటున్నది. అయన యొక్క దర్శనము ఆయన చె ప్పినట్లే అదే విధముగా జరిగినట్లయితే, సంఘము జరిగినదంతయు వాస్తవమని ఎరిగి యున్నది, ఆయన వాక్యమును గురించినదేమి? ఆ దర్శనములు కన్నా అది ఇంకను నిశ్చయత గలది. దర్శనము వాక్యముతో సరిపోని యెడల, ఆ దర్శనము వట్టిదే. అయితే వాక్యమే మొదటిది. ఎందుకనగా వాక్యము దేవుడై యున్నాడు. అందువలన ఆయన సర్వవ్యాప్తిగా ఉన్నాడు. ఆయన ఇచ్చట మాట్లాడి కెనడా దేశమందు నెరవేర్చువాడుగా ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయన సర్వవ్యాప్తి.
JOHN 3:7
56మంచిది, మొదటిగా మీరు నూతనముగా జన్మించవలసి యున్నది. మీరు నూతనముగా జన్మించినప్పుడు, మీరు విశ్వాసమును కలిగి యుందురు. వాక్యమును మీరు నమ్మెదరు. మీరు క్రొత్తగా జన్మించనంతవరకు దానిపై మీరు తర్కమాడుచుందురు. మీరు కొంత మతవాదిగా ఉండి మానవ జ్ఞానము కలిగి నిజాయితీగా ఉన్నారని తలంచినప్పుడు, మీరు దేవుని వాక్యమును అంగీకరించరు. మీరు అంగీకరించలేరు. మీరు క్రొత్తగా జన్మించవలసి యున్నది; మరియు క్రొత్తజన్మ విశ్వాసమును ఉత్పత్తి చేయును. మీరు విశ్వాసమును పొందిన తరువాత వి-శ్వా-స-ము (విశ్వాసము) మీరు ఎదుగు స్థితిలో ఉండెదను.
57అనేకులు బలిపీఠము నొద్దకు వెళ్లి, ''ప్రభువా, నన్ను క్షమించుము,'' అని చెప్పదురు. వారిపై గొప్ప అనుభవముతో కూడి శుద్ధీకరణము వచ్చును. అంతట వారు అక్కడ నిలచి కేకలు వేయుదురు. వెనుకకు వెళ్లి, ''దేవుడు స్తుతింపబడును గాక, నేను దానిని పొందాను,'' అని చెప్పుదురు. అయితే అలా కాదు. నీవు కేవలము ప్రారంభస్థితిలోకి వచ్చావు. నీవు ఇంకనూ ఏమియూ చేయలేదు. నీవు కేవలము పునాదిని మాత్రమే వేశావు.
ఇకపై నీవు ఒక చక్కటి ఇంటిని కట్టవలసియున్నది. నీవు పునాదిని వేసి ''అబ్బాయి, నేను దానిని పొందాను,'' అని చెప్పినను, నీవు కేవలము ఇంటిని కట్టుటకు పునాదిని మాత్రమే వేశావు. దానిపై ఇంటిని కట్టవలసి యున్నది. ఈ ఉదయ కాలము మనము మాట్లాడు కార్యములు అక్కడనుండియే వచ్చుచున్నవి. మంచిది.
ఒక ఇల్లు దానిలో పునాది మొదటిది. క్రైస్తవ్యము యొక్క పునాది ఏది? దేవుని వాక్యమందు విశ్వాసమే. అదియేమి పునాది. అప్పుడు నీవు ఎదుగుటకు ప్రారంభింతువు. అది మొదలు ప్రతి దానిని ఈ పునాదితో చేర్చుకొనుటకు మొదలు పెట్టుదువు.
58ఇప్పుడు, ఒక కట్టడము కట్టుటకు, నీవు నీకున్న ప్రతి ప్రామాణికలమును పెట్టెదవు. సహో॥ వుడ్ లేక ఇతర వడ్లపని చేయువారు, గుత్తదారులైన మీరు ఎలా మీ ఇండ్లను కట్టుదురో చక్కగా వివరించగలరు, చూడండి. మీ ఆత్మీయ గృహమును ఎలా నిర్మించవలెనో నేను చెప్పబోవుచున్నాను. అది దేవుడు నివసించు స్థలమైయున్నది. ఆయన నీలో నివాసము చేయుటకు ఇష్టపడుచున్నాడు. నిన్ను ఆయనవలె చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జీవమును నీ ద్వారా ప్రతిబింబింపబడవలయునని కోరుచున్నాడు.
JOHN 14:12
59పూర్వకాలమందు బంగారము చేయుటకు ఏమి చేయుదురో మీకు తెలియును. ముందుగా దానిని కాల్చుదురు. దాని పలుమార్లు కొట్టెదరు. దానిలోని మట్టి పోవునంత వరకు దానిని ఆవిధముగా చేయుదురు. అలా కొట్టుచుండగా దానిలోని ఇనుము, రాగి తక్కినవన్నియు వెలుపలకు వచ్చును. ఆ విధముగా దానిని (ఆ బంగారమును) మార్చి మార్చి త్రిప్పుచూ కొట్టెదరు. ఇప్పుడు ఇండియను వారు అలా చేయుచున్నారు. బంగారును కొట్టుట, వారు దానిని కొట్టుదురు.
దానిలోని ఇనుము తక్కిన మట్టి అంతయు పొయినదని ఎలా చెప్పెదరో తెలియునా? దానిని కొట్టువాడు దానిలో తన బింబమును అద్దములో చూచినట్టు చూడవలెను. ఆ కొట్టువానిని అది ప్రతిబింబించినప్పుడు చాలినంత శుభ్రముగా ఉన్నదని గ్రహింతురు.
దేవుడు ఆ విధముగానే మనలను చేయును. ఆయన భూమిలో కనుగొనిన బంగారమును తీసికొని, ఆయన తన పరిశుద్దాత్మతో కొట్టును. దానిని మార్చి మార్చి త్రిప్పుచూ, దానిలో తన బింబమును చూచునంత వరకు కొట్టుచుండును. అదియే మనము చేయవలసియున్నది — దేవుని కుమారుని ప్రతిబింబింపచేయవలసి యున్నది.
60ఇప్పుడు మనము ఆయన కార్యములను చేయవలసిన వారముగా ఉన్నాము. ''నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను అతడును చేయును'' [యోహాను 14:7(12)].
మీరు క్రీస్తు క్రియలను ప్రతిబింబింప మొదలు పెట్టి యున్నారు. అయితే అనేకులు క్రీస్తు మనలో ప్రతిబింబించుటకు ముందే క్రీస్తు క్రియలను చేయుటకు ప్రయత్నించుచున్నారు. ఇప్పుడక్కడే తొందర ఉన్నది. ఆ కార్యములు జరుగుట మనము చూచుచున్నాము. అది మీకు తెలియును. నేను దానిని ఎరిగియున్నాను. మనము ఈ ఆటంకమును మార్గమంతటిలో చూచుచున్నాము. పనికిరాని సేవకులు, క్రైస్తవుల యొక్క దారి పొడుగున నాటబడియున్నారు. వారు నిజమైన దానిలోనికి వెళ్లకపోవడమే దాని కారణము.
అందునిమిత్తమే నేను ఈ ఉదయకాలము ఇక్కడ నిలచియున్నాను — ఈ చిన్న సంఘమునకును, నా కొరకును, బోధించుటకును ప్రయత్నించుచున్నాను. ఏ విధముగా మనము సజీవ దేవుని నివాస స్థలము కాగలమో దానిని నేర్పుచున్నాను. ఎందరా విధముగా ఉండుటకు ఇష్టపడుచున్నారు? సజీవ దేవుని స్థలముగా ఉండుటయైయున్నది.
MARK 5:30•
LUKE 6:19•
LUKE 8:46•
2PET 1:5
61ఇప్పుడు మనమేమి చేయవలెనో అది ఇక్కడున్నది. ఆ మొదటిది ఏది? విశ్వాసము కలిగి నూతనముగా జన్మించవలసియున్నది. అది పునాదిని వేయుచున్నది. అంతట మనము పునాదిని వేసిన తరువాత రెండవదిగా, ఆ పునాదికి చేర్చవలసియున్నది. ''మీ విశ్వాసమునకు సద్గుణమును చేర్చుడి,'' అని పేతురు చెప్పుచున్నాడు. మొదటిగా విశ్వాసము కలిగియుండి దానితో, అనగా మీ విశ్వాసముతో సద్గుణమును చేర్చుడి. అది రెండవది. మొదటిగా మీరు పునాదిని వేయుడి — అది విశ్వాసమైయున్నది. దానితో సద్గుణమును చేర్చుడి.
అక్కడ అనేకులు పడిపోవుదురు. అవునండి. మీ విశ్వాసమునకు సద్గుణమును చేర్చుడి. అది కేవలము శీలము గల జీవితమును మాత్రము జీవించుట కాదు. ఒక పురుషుడు లేక స్త్రీ జీవించునట్లు కాదు. దానితో ఈ సద్గుణమునకు ఎలాంటి సంబంధము లేదు. బైబిలు ఇలా చెప్పుచున్నది… మనము లూక వ్రాసిన సువార్తను చదివినప్పుడు అక్కడ ఇలా చెప్పబడుచున్నది, ''ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్లెను.'' అది నిజమేనా? ఆయన వలె మనము ఉండవలసియున్నది. అప్పుడు ఆ ప్రభావము (సద్గుణమ) మనలో కూడా ఉండవలసియున్నది.
2PET 1:5
62కీర్తన పుస్తకములోని మొదటి పాటను నేనెప్పుడు ఇష్టపడుదును. (గొప్పవాటిలో అదొకటి) ''యేసువలె ఉండుట మంచిది. నేను యేసు వలె ఉండదలచిన, నాకొక ప్రభావము ఉండవలసి యున్నది. అది నాలో నుండి ప్రజలకు వెళ్లవలెను, ఎందుకనగా ప్రభావము ఆయనలో నుండి ప్రజలలోకి వెళ్లినది. ప్రభావము (సద్గుణము) దాని నీలో నుండి బయలు వెడలనిచ్చుటకు ముందు దానిని నీవు పొందియుండవలెను. నీవు పొందనిదే అది నీలో నుండి రాలేదు. అది వచ్చుటకు అక్కడ దాని కొరకు ఏదియు లేదు.
ఇతరులు మనలో నుండి సద్గుణమును చూచుటకు ప్రయత్నించినయెడల మనలో ఏదిలేనప్పుడు, అది వెనుదిరిగిన ''బ్యాంకుచెక్'' వలె నుండును. చాలినంత డబ్బు బ్యాంకులో లేనందున, ఆ చెక్‌నకు విలువ లేకపోయినది. కొందరు ఈ దినము నిన్ను ఒక క్రైస్తవునిగా చూచి, రేపటి దినమున ఒక పాపిగా చూచిన యెడల నీలో నుండి సద్గుణము వెడలదు. చూడండి, అది నిజమే. మనలో సద్గుణము ఉండవలసి యున్నది. మనము నిజ సద్గుణమును పొందినప్పుడు దానిని మన విశ్వాసముతో చేర్చగలము. అది పునాదికి తరువాత దానిపై కట్టబడిన గోడయైయున్నది.
MARK 5:30•
LUKE 8:46•
2PET 1:5
63మొదటిగా నీవు విశ్వాసమును కలిగియుండవలెను. విశ్వాసము ఒంటరిగా దానిని చేయదు. పేతురు ఇలా చెప్పుచున్నాడు, ''విశ్వాసమందు సద్గుణమును,'' మీ విశ్వాసముతో చేర్చుటకు సద్గుణము కలిగియుండవలసియున్నది.
ఈనాడు అనేక సంఘములలో అలా ఉండలేకపోవుటకు అదే కారణము, ఎందుకనగా అవి అలా ఉపదేశించుచున్నవి. ''నీవలా నుండవలసిన అవసరత లేదు. మా సంఘములో చేరిన లేక మా సహవాసమందు చేరినచాలు. అవును, ఆ దినములు గతించిపోయినవి అని చెప్పుదురు. సద్గుణము అను పదమునకు అర్ధము ప్రతి ఒక్కరికి తెలియును. దానిని మనము కలిగియుండవలయును.
ఆయనలో నుండి ఆ ప్రభావము వెడలి ఆ రోగము గల స్త్రీని స్వస్థపరచినది. అదే ప్రభావమును ఆయన తన సంఘమందు ఎదురు చూచుచున్నాడు, ఎందుకనగా ఆయన మనకు ఉదాహరణముగా ఉన్నాడు. ఆయన తన ప్రభావమును ప్రజలకివ్వగలిగినప్పుడు. మనలను అదే విధముగా ఆప్రభావమును ప్రజలకు ఇచ్చుటకు ఎదురు చూచుచున్నాడు.
ప్రభావము (లేక) సద్గుణము అనగా ఏమిటి? ప్రభావము (సద్గుణము) బలము, శక్తి. కొందరైతే దేవునిశక్తినే నమ్మరు. వారిలా చెప్పుదురు. ''అదంతయు గడచిపోయినది. నీ పేరు ఆలయ పుస్తకమందు వ్రాసియుంచిన చాలును. చిలకరింపు లేక ముంచడము లేక మరొకటి ఏదైనను మంచిదే. ఏదో ఒక విధముగా బాప్తిస్మము పొందిన చాలును,'' అని చెప్పుదురు.
అయితే పేతురు ఇక్కడ చెప్పునదేమనగా, ''సద్గుణము చేర్చుము''.
MATT 6:28,29•
LUKE 12:27
64ఇప్పుడు, పేతురు దేవుని ఇంటిని కట్టు విధానమును మాట్లాడుచున్నాడు, అది దేవుని ఆరాధన స్థలము… ఒక స్థలమును గుర్తించుచున్నది… విశ్వాసమునకు తరువాత సద్గుణము కలిగియుండవలయును, దానితో సద్గుణము కలిగియుండవలెను. అది నిజము. ప్రపంచమంతటి కొరకు సద్గుణమును కలిగియుండుము.
ఇరవై సంవత్సరముల క్రితము — ఒక ప్రసంగమును నేను ప్రసంగించాను — రెవరెండ్ ''లిలీ'' పై ఆ ప్రసంగమును చేశానని తలంచెను. ఆయన ఒక పాస్టరు. యేసు చెప్పిన ''అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.'' అవి కష్టపడవు, వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడి సొలోమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు, అను అంశముపై మాట్లాడాను.
అడవి పువ్వును చూడుడి. అవి విస్తారముగా ప్రతి నిముషము భూమిలో నుండి వచ్చును. అవి పొందు ప్రభావము నుండి అవి ఏమి చేయును? అవి వెలుపలకు దానిని ఇచ్చుచున్నవి. తమ అందమును చూచు వారి కన్నులకు ఇచ్చుచున్నవి. తేనెటీగలను తమ రెక్కలను విరచుచున్నవి, అప్పుడా తేనెటీగ తనలో నున్న తేనెను తీసికొనుచున్నది. అవి ఏ ఫిర్యాదును చేయవు. అది ఇచ్చుటకు దాని కలిగియుండును, అక్కడకు తేనెటీగ వచ్చి దానిలో తేనె లేదని చూచినప్పుడు ఆ చిన్న తేనెటీగ తన తలను గీరుకొనుచు ''ఏ రకమైన లిల్లీ ఇది, అని చెప్పును కదా. ''చాలని నిలువలు.''
65రక్షణను వెదకుచూ వచ్చు ఒక మనుష్యుడు సూచక క్రియలు గతించిపోయినవనుచున్న సంఘమునకు వెళ్లినట్లయితే… ఒకప్పుడు ''ఝూక్ కోయి'' చెప్పినట్లు ఒక భోజన శాలకు వెళ్లి అక్కడ గొప్ప భోజనము చేసినట్లుండును. అతడక్కడ కూర్చొని ఆ ఫలహారముల పట్టీని చదువుకొనుచు, ''నేను పలాని ఫలహారమును తీసికొందునని'' అతడుచెప్పును.
''మంచిది, అది గతించిపోయిన దినమునకు సంబంధించినది. అదినా క్కర లేదు'' అని నీవు చెప్పినయెడల దానిని అక్కడ విడచిపెట్టి వెళ్లిపోవడము మంచిది. అది మంచిది, ఎందుకనగా వారికి తినుటకు మరేది దొరకదు. తినుటకు మంచి ఆహారము దొరకు ఒక విడిదికి నీవు వెళ్లుట మంచిది.
ఒక ఆత్మీయ మనుష్యుడు వాడు ఎదుగుటకు గాను ఏదో కొంత భుజింపవలసియున్నది. అది దేవుని వాక్యమై యున్నది. దానిలోని ప్రతి వాక్యమును నేను నమ్ముచున్నాను.
దేవుడు తన బల్లను పరచియున్నాడు,
దేవుడు తన పరిశుద్ధులను భుజింపజేయుచున్నాడు.
ఆయన తన ఎన్నికైన ప్రజలను ఆహ్వానించుచున్నాడు,
''రండి భోజనము చేయండి.''
ఆయన తన మన్నాతో పోషించుచున్నాడు;
మన ప్రతి అవసరతను ఆయన తీర్చుచున్నాడు.
ఓ, అన్ని వేళల యేసుతో భోజనము చేయుట ఎంతో మనోహరము!
అతడు దానిని పొందియున్నాడు. అవునండి. సంఘము దానిని పొందియున్నది. సజీవుడైన దేవుని సంఘము పరిపూర్ణుడైన క్రీస్తు యొక్క జ్ఞానముపై కప్పబడియున్నది.
2PET 1:5
66ఇప్పుడు, మీరు సద్గుణము కలిగియుండవలసియున్నది.
అప్పుడు నేను చెప్పునదేమనగా, కొందరు ఆ మంచి సువాసనను ఆగ్రాణించుటకు ఇష్టపడుదురు. అతడు స్వార్ధపరుడుగా ఉండడు. అతనిలో సువాసన ఉన్నది. ఆ సువాసనను ఇచ్చుటకు ముందు అతడా సువాసనను కలిగియుండవలసియున్నది. అతడు ఆ తేనెను వెలుపలకు తెచ్చుటకు ముందు అతడు దానిని కలిగియుండవలసియున్నది. అతడా అందము నిచ్చుటకు ముందు, దానిని కలిగియుండవలసి యున్నది. ఆ విధముగా సద్గుణమును (ప్రభావమును) వెలువరించుటకు ముందు నీవు దానిని కలిగియుండవలసియున్నది. అందువలన విశ్వాసమునకు సద్గుణమును చేర్చుము. ఆమేన్. గ్రహించారా? మనము దానిపై ఎంతో సమయము కొనసాగవచ్చును, అయితే మన కాలము గడచిపోవుచున్నది… విశ్వాసముతో సద్గుణమును చేర్చుట.
ROM 3:4•
2PET 1:5
67ఇప్పుడు, మొదటిగా విశ్వాసము, ఆ తరువాత సద్గుణము మూడవదిగా జ్ఞానమును చేర్చుము. జ్ఞానము అది లోకసంబంధ జ్ఞానము కాదు, ఎందుకనగా అది దేవునికి బుద్ధిహీనమగును. అయితే తీర్పుతీర్చుటకు కావలసిన జ్ఞానము. దేనిని తీర్పు తీర్చుట? చెడునుండి మంచివి.
మీరు మీ విశ్వాసముతోను, సద్గుణముతోను క్రైస్తవ జ్ఞానమును చేర్చిన యెడల ఏలాగు తీర్పు తీర్చగలరు. వాక్యము సరియైనదా కాదా అని మీరు తీర్పు తీర్చుకొనవలసి యున్నది…. మీరు మీ సిద్ధాంతములను, మీ అవిశ్వాసమును ప్రక్కనుంచినప్పుడు, నీవు కోరిన దానిని పొందుచు, దేవుడు అబద్దమాడని వాడని విశ్వసించు జ్ఞానమును పొందగలవు. ''ప్రతి వాని మాట అబద్దముగాను నా మాట సత్యముగాను నుండును,'' అని ఆయన చెప్పుచున్నాడు, చూడండి. ఇప్పుడు మీరు జ్ఞానమును పొందుచున్నారు.
అది ఉన్నతమైన జ్ఞానము దాని కొరకు కాలేజీలో నాలుగు డిగ్రీలను పొందనవసరము లేదు, ఎందుకనగా నీ విశ్వాసపు పునాదిపై నుంచుటకు ఇవన్ని దేవునిచే నీకు ఇవ్వబడినప్పుడు, నీవు పరిపూర్ణమైన దేవుని సజీవ మానవునిగా ఉండగలవు. అవునండి.
GEN 17:17•
ROM 4:19,20•
2PET 1:5
68జ్ఞానమును చేర్చండి, ఎందుకనగా ఆయన వాక్యము యొక్క జ్ఞానము. మీరు ఆ విధముగానే దానిని విశ్వసించవలసి యున్నది. మీరు ఈ దినము వాక్యమును విశ్వసించి, సూచక క్రియల దినములు గడచిపోలేదని నమ్మవలసియున్నది. దేవుడేమి చెప్పుచున్నాడో, ఆ జ్ఞానమును కలిగి యున్నప్పుడు దేవుడు ఆ కార్యమును చేయగలడు.
అబ్రాహామునకు నూరేండ్ల వయస్సుండగా అతడు దానిని (కుమారుడు జన్మించునని) విశ్వసించాడు. అవిశ్వాసము ద్వారా దేవుని వాగ్దానమును అనుమానించలేదు, చూడండి. చూచుటకు వాక్యము ఎంత పరిహాసముగా ఉన్నదో! ఇక్కడొక మనుష్యుడు నూరేండ్ల వయస్సుగలవాడు. తొంబై ఏళ్ల తన భార్య ద్వారా తన ఇంటిలో కుమారుడు జన్మించునని ఎదురుచూచుచున్నాడు, చూడండి. అప్పటికే యాభై సంవత్సరములు గడచిపోయినవి, పిల్లలు లేరు; ఆమె యవ్వనము నుండి ఆమెతో కాపురము చేయుచున్నాడు, ఇప్పుడిక్కడున్నాడు.
అతని జీవపు టేరు మరణించినది మరియు శారా గర్భము మృతమైనది, ఉన్న నమ్మకములన్నియు పోయినవి. (నమ్మకమునకు సంబంధించినంత వరకు). అయినను ఆ నమ్మకమునకు వ్యతిరేకమైన నిరీక్షణతో విశ్వసించుచున్నాడు, ఎందుకనగా ఎన్ని వున్నను దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని నెరవేర్చగలడను జ్ఞానమును అతడు కలిగియుండెను.
69నీవు ఆ విధముగా పొందినప్పుడు దానిని నీ విశ్వాసమునకు జతచేర్చుము. నీవు అసలైన సద్గుణమును కలిగియున్నప్పుడు, దానిని నీ విశ్వాసముతో చేర్చుము.
నీవు వీధిలో నడుచునప్పుడు, ఒక క్రైస్తవునిగా జీవించుము; ఒక క్రైస్తవునివలె నడచుకొనుము; ఒక క్రైస్తవుని వలె ఉండుము; దానిని విశ్వాసముతో చేర్చుము. నీవు జ్ఞానమును కలిగి యున్నప్పుడు… నీవిలా చెప్పవచ్చును, ''మంచిది, ఈ లేఖనము నాకు గ్రహింపు కాలేదు. అపొ.కా. 2:38 అదేదో అర్థము కావడము లేదు. అపొ.కా. [మత్తయి] 28:19…''
మంచిది అయినను దానితో మరొక దానిని చేర్చవద్దు, ఎందుకనగా అదింకనూ నీవు పొందలేదు. నీవేమి చేయబోవుచున్నావు? ఎందుకనగా దేవుని తెలిసికొనుటకు చాలినంత జ్ఞానమును నీవింకనూ పొందలేదు. అయినను బైబిలు దానిలోని వాక్యముతో వ్యతిరేఖించదు. దానిని అలాగే విడచి పెట్టుము. దానిని గురించి మరేదియు మాట్లాడకుము, దానిని అలాగే ఉండనిమ్ము.
అయితే లేఖనములు వ్యతిరేఖమైనది కాదని నీవు చూడగలిగినప్పుడు, దేవుని ప్రత్యక్షత ద్వారా నీవు దానిని చూడగలవు. వాక్యమంతయు మర్మములుగా వ్రాయబడియున్నది. దేవుని జ్ఞానము మాత్రమే దానిని బయలుపరచగలదు. దానిని నీవు పొందినప్పుడు దేవుని యొక్క ప్రతి వాక్యమును ''ఆమేన్," అని చెప్పగలవు. అప్పుడు నీ విశ్వాసముతో దానిని చేర్చుము.
HEB 13:8
70ఓ, ఇప్పుడు నీవొక అందమైన మంచి మనిషిగా మారుచున్నావు, చూడండి. మీరు ఎదుగుచున్నారు. దేనితో ఎదుగుచున్నారు. దేనితో ఎదుగుచున్నారు? విశ్వాసములో, ఆ తరువాత సద్గుణములో, ఆ తరువాత జ్ఞానములో ఎదుగుచున్నారు. చూడండి, అది ఏ విధముగా ఈ మనిషిని కట్టుచున్నదో? తప్పించుకొనుటకు మార్గము లేదని మీరు అక్కడ చూడవచ్చు. క్రీస్తు యొక్క నిండు రూపమునకు వచ్చుటకు అదియే మార్గము అవునండి.
తీర్పు తీర్చుట, నీతిని తీర్పు తీర్చుట. దేవుని వాక్యమును విశ్వసించుట నిజమా, కాదా అని తీర్పు తీర్చుట. అది సరియైనదా లేక సరికానిదా అనియు నేను దేవునికి సేవ చేతునా లేక సిద్దాంతమును సేవింతునా అవి తీర్పు తీర్చుకొనవలసియున్నది. ''నేను నూతనముగా జన్మించవలయునా లేక ఒక సంఘములో చేరిన చాలునా,'' అని గ్రహించవలసియున్నది. అప్పుడు నీవు సరియైన దానిని ఎరుగుదువు.
బోధకుడు, ''సూచక క్రియల దినములు గడిచిపోయినవని చెప్పుచుండగా బైబిలు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు,'' అని చెప్పుచున్నది. ఇప్పుడు నీవు దేనిని నమ్మనైయున్నావు.
''నేను దేవుని గైకొందునని,'' నీవు చెప్పిన యెడల అది ఉన్న రీతిలోనే గైకొందునని నీవు చెప్పినప్పుడు, అది నీలో ఉండు విశ్వాసము దానిని వెలుపలకు తెచ్చుచున్నది. అక్కడే నీవున్నావు. ''ఆయన ఏకరీతిగా ఉన్నాడని నేనెరుగుదును. ఆయనేనని నేను సాక్ష్యమిచ్చుచున్నానని,'' నీ విశ్వాసము చెప్పును. నీలో నుండి దానిని మరేది తీసివేయలేదు. ''ఆయన నిజ దేవుడని ఎరుగుదును,'' అని నీవు చెప్పునప్పుడు, దానితో నీ విశ్వాసమును చేర్చుము. దానిని ఆ పునాదిపై నుంచుము.
71నీవు దేవుని రాజ్యము వైపుకు వచ్చుచున్నావు. ఆ స్థలమును చేరావు. మంచిది.
ఇప్పుడు మరొక కార్యము బోధించువారు అనేకులు మరియు ఇతర ప్రజలు ఇలా చెప్పెదరు. ''బైబిలులో మీరు చదువు ఈ కార్యములు, మరొక దినమునకు సంబంధించినవి, ఎందుకో మేము చెప్పెదము: ఈ దినములో అవి మనకు అక్కరలేదు. మనకు అవసరము లేదు. చూడండి, వీటిని మేము చేయుము. దైవీక స్వస్థతను, భాషలలో మాట్లాడుటను మా సంఘములలో అలవాటు చేయము, ఎందుకనగా మా సంఘములను చక్కగా సూటిగా నడిపించవలెనే గాని, మేము వాటిని చేయము,'' అని చెప్పుదురు; (దానిని గురించి కొన్ని లేఖనములను వ్రాసియుంచాను — వాటిని ఇప్పుడు మనము చేయవలసియున్నదా లేదా అని చూచెదము.)
ఇప్పుడు, వారిలా చెప్పెదరు, ''నాకు తెలియదు. మనము ఈ దినములలో వాటిని చేయకూడదు. మనము చేయవలసినదంతయు ప్రజలతో చక్కగా మాట్లాడుటను నేర్చుకొనుటయు, డాక్టర్ యొద్దకు వెళ్లిమన మనఃస్థితిని పరీక్షించుకొనుటకు మనము చక్కగా మాట్లాడుచున్నామా లేదా అని తెలిసికొనుటకు, అలవాటు చేసినట్లయిన మనము అధిక సంఖ్యలో సమాజమును సమకూర్చగలము. ఆ విధముగా మన సమాజములను స్థిరపరచగలమని,'' చెప్పెదరు.
2PET 1:5
72మనము ఒక సంస్థను నిర్మించుట లేదు. ఒక సంస్థను నిర్మించుటకు ఈ ఉదయ కాలము నేను ఇక్కడ నిలుచుట లేదు. ఒక సంస్థను నిర్మించుటకు క్రీస్తు నన్ను పంపలేదు! యేసుక్రీస్తు స్వరూపమునకు వ్యక్తులను మార్చుటకు ఆయన వాక్యము ద్వారా వారు శక్తి గల గృహముగా ఉండునట్లు చేయుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన వాక్యముతో, ఒక వ్యక్తిని ఆ స్థలము నందు స్థిరపరచవలసియున్నది. సంస్థను నిర్మించి మరొక పెద్ద శాఖతో చేర్చుట కాదు, గాని వ్యక్తులను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రూపించుటకే. అదియే ఆయన తలంపు.
మీ విశ్వాసమునకు సద్గుణమును చేర్చుడి. మీ సద్గుణమునకు, జ్ఞానమును చేర్చుడి. ఇప్పుడు, మీరు ఒక స్థలమునకు వచ్చుచున్నారు.
73''మంచిది ఈ దినమున వాటిని మనము అంగీకరించవలసిన అవసరము లేదు'' అని వారు చెప్పుటకు ప్రారంభించారు, అయితే అది ఖచ్చితముగా మనము చేయవలసియున్నది. లేఖనములు అబద్దమాడనేరవు. ''ప్రత్యేకమైన అనువాదములు ఏవి లేవు,'' అని బైబిలు చెపుచున్నది. అది వ్రాయబడిన రీతిగానే నీవు దానిని విశ్వసించుము. చూడుము, వీటన్నింటిని నీవు కలిగియుండవలసియున్నది. పరలోకపు జన్మ ద్వారా వచ్చు జ్ఞానము ద్వారానే వాటిని నీవు కలిగియుందువు. పరలోకపు జన్మ ద్వారా వచ్చు జ్ఞానము వాక్యమును నిరూపించును.
చూడుము, నీవు దానిని విశ్వసించవలసియున్నది — వేషదారణ విశ్వాసము కాదు. వీటిలో ఒకటైనను వేషధారణ విశ్వాసమునకు సంబంధించినది లేదు. చూడండి, ''నేను వాటిని కలిగియున్నానని,'' నీవు చెప్పినట్లయితే ఒక నల్ల పక్షి నెమలి ఈకలను తన రెక్కల యందు ఉంచుకొన్నట్లే ఉండును, ఎందుకనగా అవియన్నియు పడిపోవును. అవి స్వాభావికముగా అక్కడ ఎదిగినవి కావు. కేవలము అక్కడ అతికించబడినవి.
PS 1:3
74దావీదు తన కీర్తనలలో 1వ కీర్తన యందు చెప్పిన దానిని ఆలోచించుచుండగా ''అతడు నీటి కాలువ యోరన నాటబడిన వాడై… '' అని చెప్పుచున్నాడు. నాటుట అనగానేమో అక్కడ ఉంచబడుట అనగానేమో ఆయనకు బాగుగా తెలియును, ఆ పురాతన కేదారు చెట్టు వలె అది నాటబడి ఆకులు వేయుచు ఎదుగును. అక్కడ అందముగా అతికించబడినది ఒకటున్నది, దానికేమి జరుగనై యున్నదో నీకు తెలియదు. దానికి వేర్లు లేవు, పునాది అనునది లేదు చూశారా?
అది ఎలా ఉన్నదనగా కొందరు ప్రజలు సెమినరీల నుండి బైబిలు కాలేజీల నుండి వచ్చినవారు మాట్లాడునట్లు అది ఉన్నది. దానిని కలిగియుండకుము… ''మంచిది ఫలాని ఫలాని డాక్టరు సేవకు నన్ను అభిషేకించాడు. ఈ సేవలో ఎలాంటి వ్యత్యాసము లేదు. క్రీస్తు దానిలో నిన్ను జన్మింప చేయును. అది నీ విశ్వాసము ద్వారా జరుగును. నీవు క్రొత్తగా జన్మించి దానిలో ఉత్పన్నమైయ్యావు. నీవు దానిలో జన్మించిన తరువాత ఈ కార్యములు జరుగును. నీ విశ్వాసముతో దానిని చేర్చుటకు ఆయన ఎదురుచూచుచున్నాడు. కేవలము వాటిని చేర్చుకొంటూ వెళ్లుము. మనము ఆ క్రమములోనే వెళ్లుచున్నాము,'' అని ఆ (సెమినరీ) భోదకులు చెప్పెదరు.
JOHN 1:1,14
75ఇప్పుడు. ఈ జ్ఞానముపై మనము మరొక కార్యమును మాట్లాడవలసియున్నది, అది దేవుని జ్ఞానము. ఈ దినమందు బైబిలు తన భావమును పోగొట్టుకొన్నదా? ఈనాడు అనేకులు ''బైబిలు ఆ విధముగా చెప్పుట లేదు,'' అని చెప్పుచున్నారు. దేవుడు నన్ను గమనించుచు, నా పాపములో నన్ను సరి చేయుచున్నాడు.
నేను ఒక దేవుని కుమారుడనైతే ఆయన అలా చేయును. దేవుడు నిన్ను గురించి అంత శ్రద్ద తీసికొనుచూ, అనగా నీవు ఏదైనా పొరపాటు చేయునప్పుడు నిన్ను సరి చేయుచూ నిన్ను చక్కబెట్టునప్పుడు. ఆయన తన వాక్యమును గురించి ఎంత శ్రద్ధతీసికొనును. అది నీకు ఉదాహరణముగా ఉన్నది. ఆయనే వాక్యమై యున్నాడు. ''ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.''
76వాక్యము యేసుక్రీస్తు ప్రత్యక్షతగా (బయలుపాటుగా) ఉన్నది. బైబిలు అలా చెప్పుచున్నది. క్రీస్తు తన వాక్యమందు బయలు పడెను. నీవు ఈ ఆజ్ఞలను మీరునప్పుడు ఆయన నిన్ను గమనించుచు, నిన్ను త్రోసివేయును. దాని నిమిత్తము నిన్ను నిరాకరించును. నిన్ను నిరాకరించు పట్టుదల కలిగియున్నప్పుడు ఆయన తన ఆజ్ఞల నిమిత్తము ఎంత జాగ్రత్త కలిగియుండును? ఆమెన్!
అలా ముందుకు వెళ్లుచున్నప్పుడు. అదంతయు నాతో చెప్పకుము పరిపూర్ణ పరిశుద్ధాత్మ జ్ఞానమందు నేను నమ్మిక యుంచుచున్నాను. పరిశుద్ధాత్మ జ్ఞానము ఎల్లప్పుడు వాక్యమును ''ఆమేన్ అనుచు గుర్తించును. బైబిలులో ఈ కార్యములు వ్యతిరేఖముగా నీకు కనబడినప్పుడు, కూర్చొని ప్రార్ధన పూర్వకము దానిని చదువుము. ఆ విధముగా చేయునప్పుడు, మొదటిగా పరిశుద్ధాత్మ నీయందు సంచరించుటకు ప్రారంభించును. ఆ తరువాత అది ఏ విధముగా సమకూర్చబడియున్నదో దానిని చూడగలవు. అప్పుడు నీవు దానిని పొందగలవు అదియే జ్ఞానము.
MATT 28:20•
JOHN 14:12,19•
JOHN 15:4,5•
HEB 13:8
77కొందరిలా చెప్పెదరు, ''మంచిది, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని బైబిలు చెప్పుచున్నది. సంఘమేమో, ఒకే రీతిగా ఆయన ఏకముగా ఉన్నాడను చున్నది,'' ఎవ్వరేమి చెప్పినను ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఓ, హో మీరెక్కడ ఆ చీలికను చేశారు, చూచారా. అవునండి.
లేదండి, ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అవునండి. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో ఏ వ్యత్యాసము లేదు. ఆయన తన సంఘమందు నివసించుచు అవే కార్యములను చేయుచున్నాడు.
''కొంతకాలము'' ఆ మాటను ఇంతకు ముందు ఉదహరించియున్నాను. ''కొంత కాలము లోకము నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూతురు….'' ఆయన ఇలా చెప్పాడు, "ఈ లోకపు అంతము వరకు నేను మీతో ఉందును, మీలో ఉందును అనెను." ఆయన మరలా ఇలా చెప్పెను, ''నేను చేయు ఈ కార్యములు మీరును చేయుదురు.'' మరియు ఆయన ఇలా చెప్పెను, ''నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు.'' తీగలు వల్లిలో ఉన్న జీవము ద్వారా జీవించును. వల్లిలో ఏమున్నదో, అది కొమ్మల ద్వారా వచ్చును. మహిమ! అట్లయిన క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు జీవమునే అది ఉత్పత్తి చేయును, ఆమేన్.
LUKE 24:49•
ACTS 2:1•
2COR 10:5•
HEB 11:7,27
78జ్ఞానము. లోకములోనిది కాదు — అది ఆలోచించును. ఏరకమైన లోక జ్ఞానమైనను అది ఆలోచించును, చూచారా. విశ్వాసమునకు ఆలోచన అనునది లేదు. ఏదో ఒక నిర్ణయించిన కార్యము నెరవేరునని దేవుడు నీకు బయలుపరచును. అప్పుడు ప్రపంచములో ఉన్న ప్రతి జ్ఞాని, లేక శాస్త్రవేత్త అది అలా కానేరదు, అది జరుగదు అని చెప్పినప్పుడు నీవు దానిని నమ్మెదవు. అవునండి. వారు ఆలోచించరు.
మనము కూడా ఆలోచించుటను త్రోసివేశామని బైబిలు చెప్పుచున్నది. మీరు దానిని విశ్వసించుట ద్వారా ఆలోచించరు. విశ్వాసమునకు ఆలోచన అనునది లేదు. అదెక్కడున్నదో దానిని విశ్వాసము ఎరిగియున్నది. విశ్వాసము క్రియ చేయును! విశ్వాసము గట్టిగా చేపట్టును. అది చలించదు. మరొకటి దానిని కదిలింపలేదు. ఎవ్వరేమి చెప్పినను దానిని అక్కరకు తీసికొనదు; ఒక ముక్కయైనను అది కదలదు. వేచి వేచి వేచి యుండును — అది ఎలాంటి మార్పును చేయదు. అదక్కడే నిలిచియుండును.
ఈ కార్యములు జరుగనున్నవని నోవాహుతో దేవుడు చెప్పెను. ఆయన దానిని నమ్మెను. ఈ కార్యములు జరుగునని మోషేతో దేవుడు చెప్పెను. ఆయన దానిని నమ్మెను. కొన్నికార్యములు జరుగనున్నవని దేవుడు తన శిష్యులతో చెప్పెను. పెంతుకొస్తు నాడు పైకి వెళ్లి అక్కడ వేచియుండుడి అని చెప్పెను. వారక్కడ వేచియుండిరి. అవునండి.
79మంచిది.
ఇప్పుడు జ్ఞానమును గురించి చూచెదము. అది ఈ ప్రపంచ జ్ఞానము కాదు. అయితే అది పరలోక జ్ఞానము. మరియు పరలోక జ్ఞానము, దేవుడు సమస్తజ్ఞానమునకు ఊటగా ఉన్నాడు, మరియు దేవుడు వాక్యమై యున్నాడు, అందువలన నీవు పరలోక జ్ఞానమును కలిగియున్నప్పుడు నీవు వాక్యమును నమ్మెదవు. మరి దేనినైనను నీవు వాక్యముతోనే ధ్యానించెదవు.
ఆ పన్ను దావాలో సంఘముండినప్పుడు లేక నండినప్పుడు వారిలో ఒకరు నాతో చెప్పినదేమనగా, ''దానిలో ఏ నేరము మేము కనుగొనలేదు,'' అప్పుడు నేను ఇలా అడిగాను. ''మంచిది, ఏ నేరము లేకున్నయెడల నన్నెందుకు వెళ్లనివ్వకూడదు?''
80అప్పుడతడు చెప్పుకుంటూ ముందుకు వెళ్లి కొన్ని లేఖనములను నాతో చెప్పాడు, (అతడు ఒక గొప్ప వ్యక్తి తన చేతిలో ఒక సిగరెట్టును ఉంచుకొని) ''మిస్టర్ బ్రెన్‌హామ్, నేనొక బైబిలు విద్యార్ధిని,'' అని చెప్పాడు.
అప్పుడు నేను, ''దానిని వినుటను బట్టి నేను సంతోషించుచున్నాను,'' అని చెప్పాను.
అందుకతడు, ''మీరు చేతి గుడ్డలను ఒక ఖరీదు నుంచి వెలుపలకు పంపించుటలోని మూఢభక్తిని తెలిసికొనగోరుచున్నాను. ఆ చేతి గుడ్డలను ప్రార్ధించి వెలుపలకు పంపుటలోని మూడ భక్తి ఏమిటి.'' ఆ అభిషేకించబడిన చేతి గుడ్డలు ''వస్త్రములని'' పిలువబడుచున్నవి. మీరు దానికి ఖరీదును ఉంచుచున్నారని అడిగెను.
అప్పుడు నేను ఇలా చెప్పాను, ''లేదండి, వాటికి ఏలాంటి వెలయు లేదు.''
అందుకతడు, ''మంచిది ఈ మూఢ భక్తి ఏమిటి?'' అని అడిగాడు.
అందుకు నేను, ''మీరు దానిని మూఢ భక్తిగా తలంచుచున్నారా? కొన్ని నిముషములకు ముందు మీరొక బైబిలు విద్యార్ధినని తెలిపారు,'' అని అడిగాను.
అందుకతడు ''అవును నేను ఒక బైబిలు విద్యార్థిని,'' అన్నాడు.
81అప్పుడు నేను, ''అపొ.కా. 19:11ను నాకు చెప్పండి,'' అని అడిగాను. అదే జ్ఞానము. అందులో అతడు తనకు తానే చిక్కుకున్నాడు. అంతట అతడు ఆ అంశమును మార్చుటకు ప్రయత్నించాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను, ''యోహాను 5:14 నాకు చెప్పుము అని అడిగినప్పుడు అతడు చెప్పలేకపోయాడు. యాకోబు 5:14 చెప్పగలరా, అతడు చెప్పలేకపోయాడు. ''యోహాను 3:16 మీకు తెలియునా? '' అని అడిగాను. జ్ఞానము, అందము, ప్రపంచము అయితే…..
అందుకతడు, ''అయితే మిస్టర్ బ్రెన్‌హామ్ వీటిని నీవు బైబిలుతో జతపర్చుటకు యత్నించుచున్నావు. అయితే మేము ఈ దేశపు చట్టాలతో దానిని చేర్చుటకు ప్రయత్నించెదము,'' అని చెప్పాడు.
అప్పుడు నేను, ''అయ్యా, ఈ దేశపు చట్టములు బైబిలుపై ఆధారపడినవి కావా? అప్పుడది తీర్పుగా ఉన్నది'' ఆమేన్!!
82నిజమే, జ్ఞానము అయితే ఈ లోక జ్ఞానము కాదు; వాక్యపు ఆత్మీయ జ్ఞానము, అది దేవుడేమి చెప్పుచున్నాడని తెలిసికొనుటగా ఉన్నది. దేవుడేమి చెప్పుచున్నాడో దానిని చేయుము. అది మంచిది. నీవు దానిని పొందినప్పుడు ఈ కార్యములన్నింటిని నమ్మగలవు. ఆయన వీటన్నింటిలో ఏకరీతిగా ఉన్నాడని నమ్మగలవు. వాక్యము చెప్పనదే సత్యము. దానిలో ప్రతిదానికి నీవు ఆమేన్ అని ముగింతువు, అదంతయు ఖచ్చితముగా ఉన్నది — దానిని నీ విశ్వాసముతో చేర్చుకొనుము. అది మంచిది.
ఎవరో కొందరు మీతో ''బైబిలు తన శక్తిని పోగొట్టుకొన్నది అని చెప్పినయెడల, పరిశుద్ధాత్మ బాప్తిస్మమనునది ఏదియు లేదు,'' అని చెప్పినయెడల దానికి చేర్చవద్దు. అది పని చేయదు. అది పడిపోవును. ఒక బండపై మన్ను ఉంచినట్లుండును. అది నిలువదు, అది పడిపోవును.
83అప్పుడు ప్రజలు మీతో ఇలా చెప్పెదరు, ''ఈనాడు బైబిలు నమ్మజాలనిది. మీరు జాగ్రత్తగా ఉండవలసియున్నది. మీరక్కడకు వెళ్లకండి….. '' ఇలాంటి దానిని మీరు అన్ని సమయముల యందును వినుచునే యుందురు.
కొద్దిగా చెప్పవలయుననగా: ''మీరు బైబిలును నమ్మలేరు'' మంచిది. నీవు అలాంటి తలంపును నీ మనస్సును కలిగియున్నయెడల దానితో మరొక దానిని చేర్చుటకు ప్రయత్నించకు, ఎందుకనగా అది క్రియ చేయదు. ఆ కట్టడమంతయు అక్కడే పడిపోవును. ఆమె పరిశుద్ధాత్మ చేత కట్టబడవలెను. అనగా జత చేర్చబడవలెను, ఆ ఐక్యత దానిని ముద్రించును. అదే కార్యము దానిని ముద్రించును.
అతికించబడిన దానికన్నను ఉష్ణము చేత జత చేర్చబడిన రబ్బరు ట్యూబు చాలా రోజులుండును. ఆ కొద్ది ఉష్ణము ఆ అతుకును బలపరచును. మెదటిగా ఆ ట్యూబును లేక టయరును ఉష్ణపర్చవలయును. అధికముగా ఉష్ణపర్చినప్పుడు అది కరిగిపోవును. అవునండి. చూశారా, ఈనాడును అధికమైన ప్రజలతో వచ్చిన చిక్కు అదే వారు వారి జ్ఞానమును లోక సంబంధమైన జ్ఞానముతో అతికించుటకు ప్రయత్నించెదరు, చిన్న పాత భూసంబంధమైన జిగురుతో అతికించి చూతురు, అయితే శోధనలు విచ్చినప్పుడు, ''మంచిది, నేను ఒక వేళ పొరపాటున ఉండవచ్చు,'' చూశారా, అప్పుడు గాని వెడలిపోవును. కొద్ది నిముషములలో నీవు త్రోసివేయబడుదువు. నీ కేకలు పైకి క్రిందకు ఎగురుట నీకు ఏ మంచిని చేయవు. మరలా ప్రజలు నిన్ను నీళ్ళు నిలుచు పల్లములో చూచెదరు. అది నిజము!
అయితే అక్కడ చాలినంత పరిశుద్ధాత్మ అగ్ని చేత నిలిచినప్పుడు నిన్ను ఆ ట్యూబుతో ఐక్యపరచును. అదియే కావలసినది! నీవును ఆ ట్యూబును ఏకమగుచున్నారు. నీవును, దేవుని ప్రతి వాగ్దానమును ఏకమగునంత వరకు నిలిచియున్న ఎడల దానిని నీ విశ్వాసముతో జతపరచుము. నీవు నిలువని ఎడల దానితో జత చేయకుము.
2KGS 15:5•
2CH 26:19,21
84మీరిలా చెప్పవచ్చు ''ఆ వాక్యము నమ్ముటకు వీలు లేకున్నది.'' అయితే దానితో చేర్చుటకు ప్రత్నించకు. ''పరిశుద్ధాత్మ బాప్తిస్మ వాగ్దానములు కేవలము ఆ పండ్రెండు అపొస్తులుకు మాత్రమేనని'' కూడా మీరు చెప్పవచ్చు. ఆ విధముగా ఈ రోజు కొన్ని సంఘములు చెప్పుచున్నవి. అలాంటి తలంపులను చేర్చుటకు ప్రయత్నించకండి. అక్కడే వారి పునాది యొక్క సమస్తము కూడియున్నది.
గత రాత్రి ఉజ్జీయాను గురించి మాట్లాడునప్పుడు, అతని యొక్క పునాదిని చూచినప్పుడు విశ్వసించినదంతయు మరొక దానితో చేర్చబడి యుండినది, కుష్టుతో అతడు మొత్తబడెను. అది మంచిది కాదు.
ఇప్పుడు, ''అది కేవలము ఆ పండ్రెండుగురు అపొస్తులులకే, ఆ పండ్రెండుగురు అపొస్తులులకు మాత్రమే,'' అని మీరు చెప్పవచ్చు.
85సహో॥ రైటుతో నేనుండినప్పుడు (వారు ఎనుక ఎక్కడో ఉండవచ్చు) ఒక రాత్రి అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు — నేను ఆ నలుగురు, ఐదుగురు సేవకులతో కలిసి మాట్లాడుచుంటిని. అప్పుడు ఈ సేవకుడు లేచి, ఇలా చెప్పాడు, ''ఇప్పుడు నేను మీతో కొంత చెప్పుటకు ఇష్టపడుచున్నాను. సహోదరులారా, ఓ, మీరు మంచి వారని నేను తలంచుచున్నాను.''
అప్పుడు నేను (మరొకరితో ఇలా చెప్పాను), ''అక్కడ కూర్చొని యున్న అతనిని గమనించుడి,'' అని చెప్పాను. అందువలన జూనియర్ జాక్సన్ అక్కడ మాట్లాడుచూ ఇలా చెప్పాడు. (దేవుని కృపపై మాట్లాడుచు)…. ఓ,మై, అతడు వేచి యుండుటలో దహించుకొని పోవుచున్నాడు. అతడు లేచి, ఇలా చెప్పుటకు ప్రయత్నించాడు…
నేనిప్పుడు ఇక్కడున్న మిస్టర్. బ్రెన్‌హామ్ గురించి మాట్లాడబోవుచున్నాను. అతడు ఒక క్రీస్తువిరోధి అని మీకు చెప్పుచున్నాను అని చెప్పుచూ, ఆ విధముగా అతడు మాట్లాడుటకు ప్రారంభించాడు.
మంచిది, కొందరు సేవకులు మాట్లాడుటకు ప్రారంబించిరి… అప్పుడు నేను ''ఇప్పుడు ఒక్క నిమిషము ఆగండి, సహోదరులారా, మీరేమి చెప్పకండి. అతడు ఒక్కడే ఉన్నాడు, మనము అనేకులము ఉన్నాము. అతనిని అలాగే ఉండనియ్యండి అతడు నన్నుగూర్చి ఏదో మాట్లాడుచున్నాడు,'' అని చెప్పాను. అది నాకెంతో ఆయాసముగా ఉండినది. ఏమి చేయుటకు పాలుపోలేదు, చూడండి.
ACTS 1:15
86అతడు, ''మిస్టర్ బ్రన్హం, ఒక క్రీస్తువిరోధి,'' అని చెప్పుచూ ముందుకు వెళ్ళాడు. ''పరిశుద్దాత్మ బాప్తిస్మము… బైబిలు చెప్పునదేమనగా ఆ పండ్రెండుగురు మాత్రము పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు. దైవిక స్వస్థతను ఆ పండ్రెండుగురు అపొస్తలులు మాత్రమే కలిగియుండిరి. బైబిలు మాట్లాడుచున్న దానినే మనము మాట్లాడుచున్నాము. బైబిలు చెప్పని దానిని చెప్పుట లేదు,'' అని అతడు చెప్పి ముగించాడు.
అతడు అర్థగంటసేపు అలా మాట్లాడు వరకు వేచియున్నాను. అప్పుడు నేను ''ఆగండి ఇక్కడ అనేకములైన (లేఖన భాగములను) వ్రాసియున్నాను. మీకు జవాబిచ్చుటకు నాకొక అవకాశమివ్వండి,'' అని నేను చెప్పాను. అప్పుడు నేను లేచి ఇలా చెప్పాను, ''అయ్యా! అతడు ఏమి చెప్పాడంటే, బైబిలు మాట్లాడుచున్న దానినే అతడు మాట్లాడునని చెప్పాడు — అతని సంఘము అలానే చేయును — బైబిలు మాట్లాడని దాని యందు మనమును మౌనముగా ఉందుమని అతడు చెప్పిన దానికి మీరే సాక్షులు.
"అవును."
"నిజమే అతడు చెప్పినదేమనగా, పండ్రెండుగురు మాత్రము పరిశుద్ధాత్మను పొందారని చెప్పాడు. అయితే నా బైబిలు ఏమి చెప్పుచున్నదనగా ఆ మొదటి నూట-ఇరువది-మంది పరిశుద్ధాత్మను పొందారని చెప్పుచున్నది,'' అని చెప్పాను. ఆమేన్. అటువంటి జ్ఞానమును త్రోసివేయండి, మీరు దీనిని చూడగలిగారా! అతడు దానినే చెప్పుటకు ప్రయత్నించాడు….
ACTS 6:8•
ACTS 8:5•
ACTS 9:17•
ACTS 10:44•
ACTS 13:9
87అప్పుడు నేను, ''పౌలు పరిశుద్ధాత్మను పొందితినని,'' చెప్పినప్పుడు అతడు పొందలేదనుకున్నాను. మరియు ఫిలిప్పు సమరయులకు బోధించినప్పుడు, వారు యేసుక్రీస్తు నామమున మాత్రమే బాప్తిస్మము పొందారు. పరిశుద్ధాత్మ వారిపైకి రాలేదు. పేతురు, యోహానుల కొరకు వర్తమానమును పంపి వారు వచ్చి వారిపై చేతులుంచిన తరువాత వారు పరిశుద్ధాత్మను పొందారు. వారు పండ్రెండుగురేనా."
నేను చెప్పాను, "అపొ.కా. 10:49 పేతురు మిద్దెపై ఉన్నప్పుడు కోర్నేలి యొద్దకు పోవలసినదిగా అతడు దర్శనమును చూచాడు. 'పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా, వాక్యము విను వారిపై పరిశుద్ధాత్మ దిగెను.'" నేను చెప్పాను, "బైబిలు ఇంకనూ మాటలాడుచున్నది. మీ సంఘమెక్కడున్నది?'' ఏమైనను ఉండవచ్చు అను స్థితిలో వెనుక ఉన్నది.
అప్పుడు నేనిలా చెప్పాను, ''దైవీక స్వస్థత ఆ పండ్రెండుగురు అపొస్తలులు మాత్రమే పొందారని,'' మీరు చెప్పుచున్నారు. బైబిలు చెప్పునదేమనగా, స్తెఫను సమరయకు వెళ్లి దయ్యములను వెళ్లగొట్టి, రోగులను స్వస్థపరచెను, మరియు అక్కడ ఆ పట్టణములో గొప్ప సంతోషము కలిగినది. అతడు ఆ పండ్రెండుగురిలో ఒక్కడు కాదు. అతడు అపొస్తులుడు కాదు; అతడు ఒక ''డీకను.'' ఆమేన్!
1COR 12:9,28•
HEB 13:8
88"ఆ మేడ గదిలో ఉన్న ఆ పండ్రెండుగురిలో పౌలు కూడా ఒకడై యుండలేదు, అతడు స్వస్థత వరమును పొ౦దియుండెను. ఆ విధముగా ఆ స్వస్థత వరములను చూడండి. మారలా ముప్పది సంవత్సరముల తరువాత అతడు కొరింధీలోనే ఉండుచూ శరీరమందు స్వస్థత వరము అభిషేకమును పొంది యుండెను.
ఒక పుస్తకము ద్వారా మీరు నేర్పిన ఆ రకపు జ్ఞానమును చెత్తకుండిలోకి విసరివేయుట మంచిది. ఈ జ్ఞానమునకు రండి, ఒక్కడైన దేవుడు చెప్పునదేమనగా, ''ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.'' ఆమేన్! అవునండి. అవునండి. ఆ పండ్రెండుగురికి మాత్రమే కాదు, అది అందరికొరకై యున్నది. అటువంటి విశ్వాసమును మీరు పొందినప్పుడు, మీ విశ్వాసము దానిలోని ప్రతిదానిని "ఆమేన్," అని గుర్తించినప్పుడు, ''మంచిది,'' అని మీరు చెప్పుచు దానిని (విశ్వాసమును) దానితో (వాక్యముతో) చేర్చుడి.
2PET 1:5,6
89నాల్గవదిగా….. మనము త్వరపడవలసి యున్నది, ఎందుకనగా నేను కొద్దిగా నిముషములను మాత్రమే కలిగియున్నాను. ఇక్కడ నిలచి దానిని గురించి మాట్లాడుటలో ఎంతో మంచి అనుభూతి కలుగుచున్నది. నాల్గవదిగా… దానితో ఆశానిగ్రహమును చేర్చుము. మనము సహనమునకు వచ్చియున్నాము. ఇప్పుడు మొదటిగా విశ్వాసమును కలిగియుండవలసి యున్నది. ఆ తరువాత విశ్వాసము నందు సద్గుణమును, అది మంచి రకపు సద్గుణముగా ఉండవలసి యున్నది. సద్గుణము నందు జ్ఞానమును చేర్చుకొనుడి, అది మంచి రకపు జ్ఞానముగా ఉండవలసియున్నది. ఇప్పుడు మీరు ఆశా నిగ్రహమును చేర్చనై యున్నారు.
ఆశానిగ్రహమునకు భావము, నేను సారాయి త్రాగుట లేదు అని కాదు, సారాయి నుండి బాగుపడుట ఆశానిగ్రమునకు భావము కాదు. ఈ విషయములో అలా కాదు. ఇది బైబిలు ఆశానిగ్రహము, పరిశుద్ధాత్మ ఆశానిగ్రహము. ముందు చెప్పినది శరీర దురాశలలో ఒకటి. అయితే ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ఆశానిగ్రహమును గూర్చి మాట్లాడుచున్నాము, అనగా, నాలుకను ఎలా స్వాధీనపర్చు కొనవలెను; ఒక వదరుబోతుగా ఉండుట కాదు, ఏ విధముగా నీ ఆశానిగ్రహమును స్వాధీనపర్చుకొనవలెననగా, మీకు విరోధముగా మాట్లాడువారి నుండి ఎగిరిపోవుట కాదు. ఓ, మై! బాలుడా, మనలో అనేకులు ప్రారంభించుటకు ముందే పడిపోవుచున్నారు, మనము అలా పడిపోవుట లేదా? అయితే ఎందుకు దేవుడు తన సంఘమందుండి ఆయన మొదట చేయుచుండినట్లు మహత్కార్యములను సూచనలను చేయుట లేదని మనము ఆశ్చర్యపడవలసియున్నది.
MATT 4:3•
MATT 12:24,31,32•
MATT 27:30,40,42•
MARK 3:22,28•
MARK 15:19,30,32•
LUKE 4:3•
LUKE 11:15•
LUKE 12:10•
LUKE 23:34•
2PET 1:6,7
90అవునండి!
ఈ కార్యములను చేర్చుడి. దానితో ఆశా నిగ్రహమును చేర్చుకొనుడి. ఆశానిగ్రహము — పై ఉగ్రత చూపబడినప్పుడు, ఏ విధముగా నీవు దయతో మాట్లాడవలసియున్నది. కొందరు ఇలా, "మీరు పరిశుద్ధతలో పొర్లు గుంపుగా ఉన్నారని చెప్పునప్పుడు." నీ షర్టు చేతులు పైకి మడచి పైకి ఎగురుట కాదు. అది కాదు, అయితే దైవ ప్రేమతో మాట్లాడుము. ఆశానిగ్రహము, దయ. మీరు ఆ విధముగా ఉండుటకు ఇష్టపడుచున్నారా?
నీవు ముందుకు వెళ్లినప్పుడు వెనుక తీయవద్దు. ఆయన (యేసు) నీకు ఉదాహరణగా ఉండనిమ్ము. వారు ఆయనను నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలు చేయమనిరి. ఆయన అలా చేయుచు తాను దేవుడని చూపగలడు, అయితే ఆయన ఆశానిగ్రహమును కలిగియుండెను. వారాయనను ''బెయల్జెబూబు'' అని పిలచినప్పుడు, ఆయన ''దాని నిమిత్తము మిమ్ములను మన్నించుచున్నాననెను.'' అది నిజమేనా? వారు తమ చేతుల నిండుగా ఆయన గడ్డమును పట్టి ఆయన ముఖము నుండి పీకి వేశారు, మరియు ఆయన ముఖమును ఉమ్మివేశారు. ''సిలువ నుండి దిగి రమ్మని'' చెప్పారు.
అప్పుడాయన, ''తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, వీరిని క్షమించమని,'' చెప్పెను.
MATT 26:67,68•
MARK 14:65•
COL 2:9
91ఆయనకు ఆ వరమున్నప్పుడు… ఆయనలో దైవత్వము యొక్క పరిపూర్ణత శరీరమై యున్నందున, ఆయన సమస్తమును ఎరిగియున్నాడు. ఆయన ప్రజలతో వారిలో ఉన్న తప్పులను చెప్పుచు, వారి మధ్య సూచక క్రియలను చేయుచుండినది వారు చూచారు. ఈ విధముగా అనేకములు జరిగినవి. వారాయనపై ముసుగును వేసి, ఆయనను కొట్టిరి. అలా చేయుచు, ''ప్రవచించుము. నిన్ను కొట్టిన వారెవరో మాతో చెప్పుము. అప్పుడు నిన్ను నమ్మెదము,'' అని చెప్పిరి. అయితే ఆయన ఆశానిగ్రహమును కలిగియుండెను.
ఇప్పుడు, ఈ విధముగా నీవు కలిగియున్నయెడల దానిని నీ విశ్వాసముతో చేర్చుకొనుము. అయితే నీవింకను అతి వేడిమిగలిగిన వాడివై అవేశపరునిగా ఉన్నయెడల, అలాగే ఉండుము. ఓహో, నీవు దానిని పొందలేదు… నీవు దానిని చేర్చలేవు, ఎందుకనగా అది దానితో కలువదు.
చూడండి, అది దానితో స్థిరముగా అతుకదు. నీవు ఒక రబ్బరు ముక్కను తీసికొని, ఇనుముతో అతికించినయెడల, అది అతుకదు. వీలుపడదు. అది అతుకుటకు రబ్బరు లాంటి సాగు స్వభావము దానికుండవలసియున్నది, చూశారా. మీ విశ్వాసము, మీ ఆశానిగ్రహమును ఆయన కలిగియుండిన పరిశుద్ధాత్మ ఆశానిగ్రహముగా ఉండినయెడల, అప్పుడు ఆయనతో అది అతుకును. మీరు దానితో చేర్చబడుదురు.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
JOHN 5:30
92మీ సద్గుణము ఆయన సద్గుణమువలె ఉండిన యెడల, అప్పుడది దానితో కలిసిపోవును. మీ జ్ఞానము ఆయన జ్ఞానము వలె ఉన్నయెడల, ''ఓ దేవా, నీ చిత్తమును చేయుటకు వచ్చియున్నాను,'' అని చెప్పుదువు. తండ్రి యొక్క వాక్యముతో ఆయన ప్రతి దయ్యమును ఓడించెను. భూమ్యాకాశములు గతించును గాని వాక్యము (దేవుని వాక్యము) తప్పిపోదు. చూడండి, అటువంటి జ్ఞానము మీరు కలిగియుండినయెడల, అది మీ విశ్వాసముతో స్థిరముగా అతుకును. మీరు నిజమైన ఆశానిగ్రహమును ఆయన కలిగియుండినట్లు కలిగియున్నయెడల, అది కలిసిపోవును.
నీవు ఆ విధముగా లేక మానవ కల్పిత మార్గములో వెళ్లుచూ, ఊగిపోయిన విశ్వాసమును గాని, ఆశా నిగ్రహమును గాని కలిగియుంటే, ''నేనతనిని కొట్టి పడవేసి యుందును గాని, నేను అలా చేయలేదు, ఎందుకనగా వారు నా పేరును పత్రికలో వేయుదురు.'' అలాంటి ఆశానిగ్రహము గురించి ఆయన మాట్లాడుట లేదు. అలాంటి దానిని చేర్చుటకు ప్రయత్నించకండి, అది పని చేయదు.
అయితే నీ హృదయపూర్వకముగా ప్రతి మనిషిని మన్నించగలిగితే, నీవు సమాధానమును చేపట్టగలవు. అది నీలో నుండి తొలగిపోనిమ్ము, చూశారా, అప్పుడది అతికిపోవును. దానిని నీ విశ్వాసముతో చేర్చగలవు. వ్యూ! సంఘము వీటి విషయములో చాలా కొదువగా ఉన్నదనుటలో ఆశ్చర్యము లేదు. అది నిజము కాదా! ఆశ్చర్యమే లేదు.
ACTS 2:38
93నేను, ''మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందుడని," అలా బైబిలు చెప్పుచున్నది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడని'' చెప్పినప్పుడు, ఒక నిష్ఠ త్రిత్వపు వ్యక్తి దానిని విశ్వసించడు. అతడేమి చెప్పెననగా, ''అది పూర్వపు క్రీస్తు విరోదనియు; అతడు యేసు నామమును మాత్రము అంగీకరించువాడనియు అతడు యేసు ఒక్కడేనని చెప్పుచున్నాడనియు,'' చెప్పును. యవ్వనుడా, అటు చూడుము! ఇప్పుడు నీ ఆశా నిగ్రహమెట్లున్నదో నాకు తెలియదు.
''దీనిని మనము కలిసి ఆలోచింతము, సహో॥ బ్రెన్‌హామ్ గారు,'' అని నీవు వచ్చి ఎందుకు చెప్పకూడదు. ''నేను దీని వివరణను వినగోరుచున్నాను,'' ఆ విధముగా వచ్చి దానిని వినుము. అప్పుడది నీ ముందు ఉంచబడును, అంతట నీవు వెళ్లవచ్చు. ఇంక కొద్ది నిమిషములలో దానిని చేరుదుము, అది భక్తి యుందున్నది.
అయితే, నీవు దానిని విడిచి పెట్టి, ప్రతి తీర్మానమునకు దాటి వెళ్లవలయునని, ఓహో - అది ఆ విధముగా జరుగదు, చూశారా. మీరు దానిని చేయునప్పుడు బైబిలులోని ఆశానిగ్రహమును కలిగియుండుట లేదు. ఏ విధముగా జవాబు చెప్పుదము. మీరు దీనినంతటిని కలిగియున్నప్పుడు, దీనిని మీ విశ్వాసముతో చేర్చవచ్చును.
JAS 1:3•
2PET 1:6
94నాల్గవదిగా దీని తరువాత సహనమును మీ విశ్వాసముతో మీరు చేర్చవలసి యున్నది. ''మీకు విశ్వాసమున్నయెడల అది సహనమును కలిగించును,'' అని బైబిలు చెప్పుచున్నది. అందువలన ఇది సహనముగా ఉన్నది. ఇప్పుడు, ఈ కట్టడమును లేక రూపమును కట్టుటకు ఆ తరువాత కావలసినది అదియే. దేవుడు నిజ వస్తువులను తన కట్టడమందు కలిగియున్నాడని మీరెరుగుదురు. చూడండి, సహోదరులారా, మనమెంత కొదువగా ఉన్నాము? మనమెక్కడ ఉన్నామో. అవునండి.
చూడండి, మనకు మహిమ ఉన్నది, మనము కేకలు వేయుచు అనేక కార్యములను కలిగి యున్నాము, ఎందుకనగా మనకు విశ్వాసమున్నది. అయితే మనము ఈ కార్యములకు వచ్చినప్పుడు, దేవుడు ఆ రూపములో మనలను కట్టలేడు. అటువంటి స్థలముగా మనలను చేయలేదు. మనకు అన్ని కార్యములుండవచ్చు. అయితే దాని నుండి జారిపడిపోయెదము, చూచారా. ఆయన సంఘమును నిర్మించలేడు.
JAS 1:3
95దేనితో సహనము కలిగియుండవలెను? ఏ రకమైన సహనమును కలిగియుండవలెను? మొదటిగా దేవునితో సహనము కలిగియుండుము. నీకు నిజ విశ్వాసమున్నయెడల, నీకు నిజ సహనమున్నయెడల, ఎందుకనగా విశ్వాసము సహనమును ఏర్పరచును. దేవుడేదైనను చెప్పిన యెడల మీరు దానిని నమ్ముడి. అంతే, అప్పుడు మీకు సహనము వచ్చును. ''మంచిది, గతరాత్రి నన్ను స్వస్థపర్చుమని నేను కోరాను.
ఈ ఉదయము కూడా అలాగే రోగినై యున్నాను,'' అని నీవు చెప్పిన యెడల ఓ, మై! ఏది సహనము!
అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, ఇరువది-ఐదు స౦వత్సరములైనను ఒక్క సూచన కూడా లేదు. అయినను అతడు దానిని నమ్మెను. అతడు దేవునితో సహనము కలిగియుండెను. ఎల్లప్పుడును ఆయనను మీ ముందుంచుకొనుడి. మనము దాటి వెళ్లుటకు ముందు ఆయనను ఉంచుడి. ఆయనను మీరు దాటి వెళ్లలేరు, అందువలన ఆయనను మీ ముందుంచుకొనుడి. ఇప్పుడది నెరవేరనై యున్నదని ఆయన చెప్పెను. ఆయనను మీ ముందుంచుకొనుడి. అది మంచిది.
GEN 6:3,17,19•
GEN 7:1
96నోవహు ఓర్పును కలిగియుండెను. నోవహు నిజమునకు దైవీక ఓర్పును కలిగియుండెను. "ఈ ప్రపంచమును నేను వర్షముతో నాశనము చేయబోవుచున్నాను," అని దేవుడు చెప్పెను. మరియు నోవహు 120 సం॥లు ప్రకటించెను. ఎంతో సహనము కలిగియుండెను. ఆ 120 సంవత్సరములలో ఒక్క మంచు బిందునైనను ఆకాశమునుండి పడలేదు. ఏదియు లేకుండినది. పూర్వమున్నట్లే ధూళిగా వుండినది, అయినను అతడు ఓర్పుతో ఉండెను.
దేవుడు నీ ఓర్పును శోధించును. అది నిజము. దేవుడు వారిని శోధించెను. దేవుడు నోవహుతో చెప్పిన తరువాత, "నోవహు నీవు ముందుకు వెళ్లుము. ఓడను సిద్ధము చేయుము. నేను జంతువులన్నిటిని అక్కడకు పంపబోవుచున్నాను. నీవు అక్కడ లోపలకు వెళ్లి పై భాగమును చేరుము, అందువలన నీవు ఆ పై కిటికి ద్వారా వెలుపలకు చూడగలవు. నీవు అక్కడకు చేరాలని నేను కోరుచున్నాను. ఈ ప్రజలతో చెప్పుము, రేపటి దినమున నేను ఈ 120 సంవత్సరములుగా ప్రకటించినది జరుగనైయున్నది. మంచిది, నీవు వారి యొద్దకు వెళ్లి వారితో చెప్పుము."
ఆ మొదటి సూచన ఏమి? నోవహు ఓడలోనికి వెళ్లెను. అప్పుడు వర్షము రాలేదు.
97నోవహు సిద్ధపడుచున్నాడు, అతని వర్ణపు కోటును తీసికొని, ప్రతి దానిని చక్కపెట్టుకొనెను, అప్పుడప్పుడు వెలుపల చూచుచుండెను — ఈ విధముగా సిద్ధపడుచుండెను. అయితే ఆ మరుసటి రోజు…
తన కుటుంబముతో, తన కోడళ్లతో ''ఓ, మై రేపటి దినమున ఇంతకు ముందు ఎన్నడూ చూడని దానిని చూడబోవుచున్నారు. ఆకాశములో కారు మబ్బులు కమ్మనై ఉన్నవి. ఉరుములు మెరుపులు రానై యున్నవి. దేవుని గొప్ప ఖడ్గము ఆకాశమును చీల్చనై యున్నది. ఈ 120 సం॥లు మన వర్తమానమును నెట్టి వేసిన ఈ పాపులను ఆయన తృణీకరించనై యున్నాడు. మీరు వేచి యుండి చూడుడని,'' చెప్పెను.
చూశారా, కొందరు మార్గమధ్య విశ్వాసులు చుట్టూ ఉన్నారు, వారు లోపలకు రారు, అది (అటువంటి వారిని ఈ కాలమందును మనము కలిగియున్నాము) మీకు తెలియును. అప్పుడు వారు వచ్చి, ''మంచిది ఈ ముసలి వాడు చెప్పునది ఒక వేళ నిజముగా ఉండవచ్చును. అందువలన ఈ ఉదయకాలమున మనము పైకి వెళ్లి కొన్ని రోజులు లేక కొన్ని గంటలు వేచియుండి చూచెదము,'' అని చెప్పిరి.
98మరుసటి రోజు, కారు మేఘములనకు బదులుగా యధావిధిగా సూర్యుడు ఉదయించుచున్నాడు. నోవహు వెలుపలకు చూచాడు. "అరే, అక్కడ ఏ మేఘములును లేవే!" అని చెప్పెను.
అప్పుడు పరిహాసకుడు వెలుపలకు వచ్చి, "ఆహాహా! నీవు వారిలో ఒక్కడివి అని నేనెరుగుదును. నీవు దాని చుట్టూ వ్రేలాడచుండుటను నేను చూచుచున్నానని," చెప్పెను.
''మంచిది నన్ను మన్నించండి. అయ్యలారా, ఆహా ఒక వేళ నేను…. సరదాకు జరిగినది హ, హ, హ'' అని వారు చెప్పుదురు.
అయితే నోవహు ఎంతో ఓర్పు కలిగియుండెను. "అది ఈ రోజు రాకున్న యెడల రేపటి దినమున అది వచ్చును," అని చెప్పెను. అది నిజము. ఎందుకు? దేవుడెలా సెలవిచ్చాడు.
''నోవహు, ఆయన ఎప్పుడు దానిని నీతో చెప్పాడు?'' అని వారడిగినయెడల.
''120 సంవత్సరములు క్రితము నేను ఇంత దూరము వచ్చి దాని కొరకు నేను వేచి యున్నాను,'' అని చెప్పును.
చూడండి, ఈ సంఘము కొరకు దేవుడు కూత ఇంత కాలము వేచి యున్నాడని మనమెరిగియున్నాము. అది ఇప్పుడు అక్కడున్నది కలత చెందవద్దు, ఆయన దానిని వాగ్దానము చేశాడు. పునరుత్థానము కొరకు ఈ కాలమంతయు వేచియుంటిమి. అది జరుగును. చింతపడవద్దు, దేవుడు దానిని వాగ్దానము చేశాడు. ఓర్పుతో వేచియుండుము.
JOB 13:22
99నీవు నిద్రించవచ్చు. అది జరుగకముందే నీకు స్వల్ప నిద్ర రావచ్చు, అయితే ఆ సమయమందు నీవు నిద్ర మేల్కొనెదవు. ఆయన దానిని వాగ్దానము చేశాడు. స్వల్ప మరణమని మనము పిలుచునదేమని మీకు తెలియునా? మరణమును ఏమని పిలచెదమో తెలియునా? కేవలము స్వల్ప నిద్రలేక క్రీస్తునందు నిద్రించుట అని పిలచెదము. క్రీస్తులో మరణించుట అనునది ఏది లేదు. జీవ మరణములు ఏకముగా ఉండవు. మనము స్వల్ప నిద్రలోకి వెళ్లుదుము; మన స్నేహితులు మనలను పిలువలేనిది ఆ నిద్ర. ఆయన ఒక్కడే పిలువగలడు. ''ఆయన నన్ను పిలుచును, నేను ఆయనకు జవాబిచ్చును,'' అని యోబు చెప్పుచున్నాడు. నాలుగువేల సం॥ల క్రితము యోబు నిద్రించాడు. ఆయినను కలవరపడవద్దు. అతడు మేల్కొనును, కలవరపడవద్దు. అతడు ఇంకనూ వేచియున్నాడు.
100నోవహు వేచియున్నాడు. నాల్గవ దినము గడచిపోయినది — వర్షము లేదు. "పరవాలేదు. అది జరుగనైయున్నది."
నోవహు భార్య అక్కడకు వచ్చి, ''తండ్రి నీవు నిశ్చయముగా చెప్పుచున్నావా?'' అని చెప్పుట నేను వినగలను.
''ఆ విధముగా మాట్లాడవద్దు,'' అని ఆయన చెప్పుచూ, ఎంతో ఓర్పుతో ఉండెను, ఎందుకనగా ఆయన విశ్వాసము కలిగియుండెను. అవునండి అతడు సద్గుణమును కలిగియుండెను. దేవుడు సత్యవంతుడును, జ్ఞానమును కలిగియుండెను. అతడు ఆశానిగ్రహమును కలిగియుండెను. అతడు వదరబోతుగా ఉండి, ''మంచిది, దానిని గురించి నాకేమి తెలియదు. నా పలుకుబడియంతయు పొగొట్టుకున్నాను,'' అని చెప్పలేదు. లేనేలేదు. మరియు ''ప్రజలు ఇంక నన్ను గౌరవించరు. నేను బయటకు వెళ్లి మరలా దానిని క్రొత్తగా ప్రారంభించెదను,'' అని చెప్పలేదు, లేనే లేదు. అతడు ఓర్పును కలిగియుండెను. దేవుడు వాగ్దానము చేశాడు, దేవుడు దానిని చేయును. దేవుడు దానిని చెప్పాడు గనుక దేవుడు దానిని చేయును.
101అతని (నోవహు) కుమారుడు వచ్చి (తన రంగు తిరిగిన వెంట్రుకలను తడుముకొంటూ ఎన్నో వందల సం॥ల వయస్సు గలవాడై అక్కడ కూర్చొని), నీవు వయస్సు గతించిన గోత్రికుడవని నేనెరుగుదును. తండ్రీ, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అది జరుగుటకు వీలున్నదో లేదో, నీవు కొంత పొరబడి యుండవచ్చునేమో? అని చెప్పినప్పుడు.
''ఓ, లేదు, లేదు.''
''ఎందుకు?''
''దేవుడలా చెప్పాడు.''
"మంచిది, తండ్రీ మనమిక్కడకు చేరి యుండి ఆరు దినములగుచున్నవి. ఈ ఎండిపోయిన పాత ఓడలో కూర్చొని యున్నాము, ఇదంతము లోపల వెలుప కీలు పూయబడి యున్నది. మనమీ సంవత్సరములన్నియు దీనిని కట్టుచూ వచ్చాము. నీవు వయస్సు గతించి, నీకు బట్టతల వచ్చు వరకు ప్రకటించావు. ఇప్పుడు నీవు మరేదో కూడా చెప్పుచున్నావు. ప్రజలేమో నవ్వుచూ చెడిపోయిన టమోటాలను విసరుచున్నారు. వెలుపట అన్నియు నీకు విరోధముగా ఉన్నవి నీవేమి చేయుచున్నావో చూడుము. ఎందుకో తెలుసా…. అని చెప్పెను.
''కుమారుడా, ఓర్పు వహించుము.''
''నీవు నమ్ముచున్నావా?''
''అది వర్షించును!''
అతని కోడలు వచ్చి ''తండ్రీ నీకు తెలియును నేను….'' అని చెప్పినది.
''అది వర్షించును.''
''అయితే మన మీ సంవత్సరము లన్నిటను వేచియున్నాము. మనము సిద్దపడుచున్నాము.'' ఒక్క వారమునకు ముందు వర్షించునని నీవు చెప్పావు. మనమిక్కడే ఉన్నాము, తలుపులన్నియు మూయబడినవి. మనము లోపల నడుచుచూ ఉన్నాము. సూర్యుడు యథావిధిగా ఉన్నాడు, అని వారు చెప్పునప్పుడు."
''అయినను అది వర్షిచును!''
''నీకేలా తెలుయును?''
''దేవుడలా చెప్పెను.''
102ఆ విధముగా నీవు పొందినప్పుడు దానిని చేర్చుకొనుము. ఆ విధముగా నీవు పొందనప్పుడు దానిని చేర్చుటకు ప్రయత్నించకుము. అది క్రియ చేయదు. స్వస్థతపై అది క్రియ చేయదు, మరొక దానిపై అదిక్రియ చేయదు, చూశారా. అది దానికి సంబంధించిన దానితోనే అతుకవలసియున్నది. అది మంచిది. అప్పుడు నీవు దానిని చేర్చుకొనుము. దేవుని వాగ్దానముతో ఓర్పును చేర్చుము. అవునండి. నోవహు దానిని నమ్మెను, 120 సంవత్సరములు దేవునితో సహవాసము కలిగియుండెను.
EXOD 4:2-8
103మోషే దేవునితో సహవాసము కలిగియుండెను. అవునండి. ''మోషే నా ప్రజలు అక్రందనలను నేను విన్నాను. నేను వారి బాధలను చూచాను. వారని విడిపించుటకు నేను దిగి వచ్చుచున్నాను. నేను నిన్ను అక్కడకు పంపబోవుచున్నాను,'' అని దేవుడు చెప్పెను.
వారిరువురి మధ్య ఆ కొద్ది సంబంధము దేవుడు తన మహిమను అతనికి చూపాడు. అప్పుడు అతనికి, ''అదిగో నేను వెళ్ళుచున్నాను,'' అని చెప్పాడు అతడు ఒక్కసారి దేవుని మహిమను చూచినప్పుడు మీరు చూడగలిగారా అతడు విశ్వాసమును పొందాడు.
''మోషే, నీ చేతిలో ఉన్నదేమి?'' అని ఆయన అడిగినప్పుడు
''ఒక కర్ర,'' అని అతడు చెప్పాడు.
''దానిని క్రిందపడవేయుము,'' అని ఆయన చెప్పాడు.
అప్పుడది ఒక సర్పముగా మారిపోయినది.
''ఓ,మై'' అని అతడు చెప్పాడు.
''మోషే దానిని తీసికొనుము,'' అని ఆయన చెప్పెన. ''నేను దానిని సర్పముగా చేయగలిగినప్పుడు, దానిని మరలా (కర్రగా) మార్చగలను.'' ఆమేన్! దేవుడు నాకొక ప్రకృతి సంబంధ జీవము దయచేసిన యెడల, ఆయన ఆత్మ సంబంధ జీవమును కూడా దయ చేయగలడు! దేవుడు నాకు మొదటి జన్మను దయచేసిన యెడల, ఆయన నాకు రెండవ జన్మను కూడా ఇవ్వగలడు! ఆమేన్! దేవుడు తన దైవిక స్వస్థతలో స్వస్థపర్చగలడు. చివరి దినములలో దానిని ఆయన తన మహిమలోకి తిరిగి పైకి తేగలడు!
''నేను ఒక కర్రను క్రింద వేసిన అది సర్పమగును, దానిని మరలా కర్రగా మార్చగలను.'' ''దాని తోకను పట్టుకొనుము,'' మోషే వెళ్లి పట్టుకొనెను. అది కర్రగా మారిపోయినది. అప్పుడతడు తన జ్ఞానముతో దాని చేర్చుకొనెను.
''నీ చేతికి ఏమైనది మోషే? ''
''ఏమి కాలేదు.''
''నీ రొమ్మున ఉంచుకొనుము.''
''మంచిది, ఏమైనది?'' తెల్ల కుష్ఠు వచ్చినది.
''ఓ దేవా, నా చేతిని చూడుము.''
''మోషే మరలా (నీ చేతిని) నీ రొమ్మున ఉంచుకొనుము, అలా ఉంచుకొన్నప్పుడు — ముందున్నట్లే మారిపోయినది.
అప్పుడు అతడు ఈ విధముగా దానిని చేర్చుకొనుటకు ప్రారంభించాడు అవునండి.
EXOD 5:1•
EXOD 7:10
104అతడు దానిని అక్కడ పొందెను. మొదటి సంబంధము… అప్పుడతడు దానిని పొందాడు. అంతట అతడు వెలుపటకు వచ్చి, "ప్రభువైన దేవుడు సెలవిచ్చినదేమనగా 'ఫరో, నా ప్రజలను పోనిమ్ము' నీవు దీనిని తెలిసికొనగోరుచున్నావు: నేను దేవుని ప్రతినిధిగా వచ్చి యున్నాను. నీవు నాకు లోబడవలయును," అని చెప్పినప్పుడు
అప్పుడు ఫరో, ''లోబడుటయా? నేనెవరో నీకు తెలియునా? నేను ఫరోను. బానిసవైన నీకు లోబడుటయా?''
అప్పుడు మోషే ఇలా చెప్పాడు, "లోబడకున్న యెడల నశించెదవు. నీవు దేనినైనను ఒకదానిని కోరుకోమ్ము." ఎందుకు? అతడు మాటలాడు చున్నదేమిటని అతడు ఎరిగియున్నాడు. అతడు దానిని నెరవేర్చవలసి యున్నది. అతడు అక్కడ దేవునితో మాట్లాడెను. అతడు విశ్వాసము కలిగియుండెను. అతడే స్థానమందున్నాడో అతడెరిగియున్నాడు.
నీకు లోబడుటయా? ఇక్కడ నుండి వెళ్లిపొమ్ము!
''నేను నీకు చూపించెదను.''
''నాకు ఒక సూచనను చూపుము,'' అని ఫరో అడిగినప్పుడు. అతడు కర్రను క్రింద వేశాడు; అప్పుడది ఒక సర్పముగా మారినది.
EXOD 7:11,12
105అందుకతడు ''అదేమి, అదొక తక్కువ రకపు తంత్రము! ఎన్నే, ఎంబ్రే అనువారలారా, ఇక్కడకు ఒక నిమిషము రండి, మీరు కూడ మీ కర్రలను క్రింద వేయుడి.'' వారు వాటిని క్రింద వేసినప్పుడు అవి సర్పములుగా మారిపోయినవి.
అప్పుడు ఫరో స్వల్పుడవైన నీవు ఐగుప్తీయుడైన నా యొద్దకు వచ్చావా? నేను ఈజిప్టునకు ఫరోగా ఉన్నాను. నీవు నీ అల్పమైన తంత్రముతో ఇక్కడకు వచ్చావు. ''ఒక రకమైన తలంపులను గ్రహించు కార్యముగా ఉన్నది. (నేను చెప్పుచున్నదేమిటో వారు గ్రహించారను కుంటాను) తలంపులకు సంబంధించినది. అటువంటి వారితో మీరు ఇక్కడకు వచ్చారు. వాటిని మేము కూడా చేయగలము,'' అని ఫరో చెప్పాడు.
మోషే ఏమై యున్నాడు? ''ఓ, మన్నించండి ఫరోగారు నేను మీ బానిసగా ఉండిపోయెదను,'' అని అతడు చెప్పలేదు. లేదండి. అతడు స్థిరముగా నిలచెను! ఆమేన్! అక్కడే నిలచెను!
అతని హృదయములో ఏ సందేహము లేదని దేవుడు చెప్పెను. నీ సమాధానమును చేపట్టుము, నేను నీకు ఒకటి చూపెదను అని ఆయన చెప్పెను.
EXOD 7:12
106ఆయన చేయుమని చెప్పినట్లు నీవు ఖచ్చితముగా చేసినయెడల, అది పొరపాటుగా వెళ్ళుచున్నట్లు కనబడినను, స్థిరముగా నిలుపును. ఓర్పుతో ఉండుము. మోషే ఇలా చెప్పెను, "నేను ఆ పునాదిపై ఉంచబడినప్పుడు అక్కడ ఓర్పు ఉంచబడినది, అందువలన దేవుడు ఏమి చేయనై యున్నాడో నేను వేచి చూచెదను."
అక్కడ పురాతన సర్పములు తమ్ముతాము చుట్టుకొని ఒకదానికొకటి పెనవేసికొని యున్నవి. మొదటిగా ఏమి జరిగినదో తెలియునా, మోషే సర్పము వెళ్లి మిగిలిన సర్పములన్నింటిని మ్రింగి వేసినది. అతడు ఓర్పును కలిగియుండెను.
''యోహోవా కొరకు ఎదురుచూచు వారు
నూతన బలము పొందుదురు
వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.''
……………………
ప్రభువు నందు వేచియుండి, ఓర్పు కలిగి యుందురు.
ACTS 7:36
107అవునండి,
అప్పుడే ఇశ్రాయేలు వెలుపలకు తేబడును. ఆ గొప్ప భేదము అక్కడ ఏర్పడినది. మోషే వేచి యున్నాడు. అంతట అతడు అరణ్యములోనికి వెళ్ళెను. అది కేవలము మూడు లేక నాలుగు రోజులు ప్రయాణమై యున్నది. అతడు దాటిన స్థలము నుండి నలువది మైళ్లు మాత్రమే ఉన్నది. అయితే మోషే అక్కడ అరణ్యములో నలువది సంవత్సరములు ఓర్పుతో వేచి యుండెను. అది నిజము అతడు నలువది సంవత్సరములు వేచియుండెను. ఓ, అవునండి.
108మనము కూడా ఒకరితో ఒకరము ఓర్పు కలిగియుండవలయును. ఒక్కొక్క పర్యాయము మనము ఒకరితో ఒకరము ఓర్పును కోల్పోవుదుము. మనము మోషే వలె ఉండవలయునని తలంచెదము. ఆ ప్రజలతో మోషే ఓర్పు కలిగియుండెను. చూడండి, వారు అది గమనించకుండుటకు అదియే కారణము.
చూశారా, మీరు దేనినైనను చేయుటకు ప్రయత్నించినయెడల, నేను ఈ వర్తమానమును ఆలయమునకు తీసికొని వచ్చుట ద్వారా ప్రతి విశ్వాసి చూడగలుగును — అలా ఉండుట కఠనమే. నేను కూడ ఓర్పు కలిగియుండుటకు ప్రయత్నించాను. ఇప్పటికి 33 సంవత్సరములు కావచ్చుచున్నవి. ఓర్పు కలిగియుండుడి. స్త్రీలు ఇంకను తమ తలవెండ్రుకలను కత్తిరించుకొనుచున్నారు. అది అలాగే ఉన్నది, అయితే ఓర్పు కలిగియుండుడి. ఓర్పు కలిగి వేచియుండుడి. అలా ఉండవలసియున్నది. నీవు ఓర్పును కలిగియుండకున్నయెడల దీనిపై కట్టుటకు ప్రయత్నించకు. ఓర్పు కలిగియుండుము.
EXOD 32:11,12•
NUM 16:21•
PS 106:23
109ఒకసారి ఆ తిరుగుబాటు ప్రజలు ఓర్పును కోల్పోయి మోషే పొరపాటు చేయుటకు కారకులైరి. అయితే అది బయలు పడినప్పుడు వారి క్రియలను గురించి దేవుడు సంతాపపడెను. అప్పుడాయన సెలవిచ్చినదేమనగా, ''మోషే మిమ్ములను వేరుపరచుకొనుడి, ఈ ప్రజలందరిని చంపి క్రొత్త తరమును ప్రారంభింతును.''
అప్పుడు మోషే ఆ మధ్యన నిలచి ఇలా చెప్పెను. ''దేవా, అలా చేయకుము,'' ఎందుకలా చెప్పాడనగా తిరుగుబాటు చేసిన ఆ ప్రజల పట్ల ఓర్పు కలిగియుండెను.
మనమా విధముగా చేసినట్లయిన నేనెంత ఆశ్చర్యపడుదును? మీరలా చేయలేకున్న, దీనిపై దానిని నిర్మించకుడి, ఎందుకనగా అది మారనిది. ఆ విధముగా ఆ మొదటిది దీనితో అతుకబడును. ఆ విధముగానే ప్రతిది అతుకబడవలసియున్నది. మీరలా కాకున్నయెడల, దేవుని సజీవ నివాస స్థలము యొక్క పరిపూర్ణతలోనికి రాలేరు. మీరు ఓర్పును కలిగియుండవలసి యున్నది, ఒకరితో ఒకరు ఓర్పు కలిగియుండవలసియున్నది.
EXOD 20:4,5•
DAN 3:17,18•
JOHN 6:39
110మంచిది.
ఆ హెబ్రీయులైన పిల్లలు ఓర్పు కలిగియుండిరి. నిశ్చయముగా వారలా ఉండిరి. దేవుడు వారికి వాగ్దానము చేసి ఇలా చెప్పాడు, "ఏ రూపమునకు తలవంచకుడి."
వారు ఓర్పు కలిగియుండి, మా దేవుడు మమ్ములను విడిపించగలడు. ఆయన అలా విడిపించకున్నను, మేము ఆ విగ్రహమునకు నమస్కరించము. దేవుడు వారిని చివరి దినములో లేపునను నిశ్చయతగలవారై, ఓర్పు కలిగియుండిరి. ఈ జీవితమునకు ఏమంత అర్థములేదు. దేవుడు దీనిని మరలా లేపనై యున్నాడు. అది చివరి దినములలో జరుగనైయున్నది. "అయితే ఒక ప్రతిమకు నమస్కరించుమని చెప్పినయెడల, దానిని మేము అలా చేయము. ఇప్పుడు, కైసరుకు ఇచ్చెదము. అయితే కైసరు దేవుని కార్యములకు వచ్చిన, దేవుడు మొదటిగా నిలుచును. దేవుడిలా చెప్పెను, ''ఆ ప్రతిమకు నమస్కరించకుము.'' అందువలన మేము అలా చేయము. మా దేవుడు మమ్ములను విడిపించును. ఆయన అలా చేయకున్నను, మేమా ప్రతిమకు నమస్కరించము.
అప్పుడతడు (రాజు) "మంచిది. వేడిమి గల అగ్నిగుండము అక్కడున్నది."
"మంచిది," "వర్షము వచ్చుట ద్వారా అదంతయు ఆరిపోవును." అయితే అలా కాలేదు. ఓర్పు కలిగియుండుము.
DAN 3:15,25,27
111మరుసటి ఉదయము సభకు వచ్చినప్పుడు అక్కడ నెబుకద్నెజరు కూర్చుని యుండెను. అప్పుడతడు, ''మంచిది పిల్లలారా, నేను రాజునని మీరు జ్ఞాపకముంచుకొనుటకు సిద్ధముగా ఉన్నారా?''
''ఓ, రాజా నీవు నిశ్చయముగా శాశ్వత కాలము జీవింతువు గాక.''
''ఇప్పుడు ఆ విగ్రహమునకు తలవంచుడి.''
''ఓ, అలా వీలుపడదు.''
"మంచిది, మీరు కాల్చి వేయబడుదురు. మీరు జ్ఞానముగా ఉన్నారు, మీరు అందమైన వారై మాకెంతో ఉపయోగకరముగా ఉన్నారు. మా రాజ్యమునకు ఒక ఆశీర్వాదకరముగా ఉన్నారు. నేను దానిని చేయుటకు ఇష్టపడుట లేదని మీరెరిగియున్నారు. అయితే నేను దీనిని తెలియపరిచాను, అది నెరవేరవలసియున్నది. మిమ్ములను అక్కడ వేయుటకు ఇష్టపడుట లేదు. ఓ, మనిషి నీ సంగతేమిటి?
''అది చక్కగా పలుకబడుచున్నదని ఎరుగుదును, అయినను మా దేవుడు మమ్ములను విడిపించగలడు ఓర్పును కలిగియుండుము.
ఆ విధముగా ఒకరినొకరు చూచుకొనుచూ, ఆ స్థలమునకు వెళ్లారు. ''అది నిజమేనా?''
"మంచిది. మనము ఓర్పును కలిగియున్నాము.''
ఒక్క అడుగు ముందుకు వెళ్లారు, ఆయన అక్కడ లేడు. రెండడుగులు ముందుకు వెళ్లారు, ఆయన అక్కడ లేడు. మూడడుగులు వేశారు, నాలుగు, ఐదు అలా వెళ్లుచూ ఉన్నారు. అయినను ఆయన అక్కడ లేడు. తిన్నగా మండుచున్న అగ్ని గుండములోకి ప్రవేశించారు. వారు ఓర్పు కలిగియున్నారు. అయితే ఆయన అక్కడ ఉన్నాడు. చూడండి, ఆ అగ్ని వారిని వారి దుస్తులను కాల్చివేయునంతగా ఉన్నది. వారు అలా అడుగునకు వెళ్లిపోయారు, ఆయన అక్కడ ఉన్నాడు, వారు ఓర్పును కలిగియుండిరి.
DAN 6:10,16•
JOHN 6:39
112దానియేలు కూడా అదే విధముగా ఉన్నాడు. దానియేలు ఓర్పును కలిగియుండెను, నిజము అతడు విడచిపెట్టువాడు కాదు. లేదండి. అతడేమి చేసాడు? ఆ కిటికీలు తెరచి ఎలాగో ప్రార్థించాడు. అది దేవునికొరకు అవసరమై యున్నది. అతడు ఓర్పును కలిగియుండెను. దేవుడు తన వాక్యమును నిలబెట్టునని ఎరిగి, దేవుని కొరకు అతడు వేచియుండెను. వారు అతనిని సింహపు గుహలో వేశారు. ''నిన్ను సింహములకు ఆహారముగా వేసెదము,'' అని చెప్పారు.
అందుకతడు మంచిది అనుచు ఓర్పును కలిగియుండెను. ఎందుకు? ''మంచిది ఈ కాలమంతకు నేను దేవునిపై వేచియుంటిని. నేనింకనూ కొన్ని వేల సంవత్సరములు వేచి యుండవలసియున్నను, నేను అంత్యదినములలో మరలా లేచెదను. అందువలన నేను ఓర్పు కలిగియుందును. కేవలము వేచి యుందును.
అపొ॥ పౌలు ఓర్పు గలిగియుండెను. నిజముగా ఆయన అలాగే ఉండెను. పౌలు చేయవలసినదేమిటో చూడండి.
ISA 28:11,12•
LUKE 24:49
113ఓర్పును గురించి మాట్లాడుచుండగా, ఈ పెంతుకొస్తు ప్రజల స్థితి ఏమిటి? ఆ కట్టడనువారు కలిగియున్నంత వరకు ''అంత వరకు వేచి యుండుము, మీరు శక్తిని పొందువరకు వేచి యుండుడి.''
''ఎంత కాలము?''
అది ఎంత కాలము అని ప్రశ్నించుటకు వీలుపడదు. వారు ఆ జవాబును పొందిరి. అంతవరకు వేచి యుండుము… అక్కడకు వారు వెళ్లి ఇలా చెప్పి యుండవచ్చు. మంచిది యవ్వనస్తులారా, ఇంక పదిహేను నిముషములలో పరిశుద్దాత్మ మనపై రానున్నది. మన సేవను మనము కలిగియుందుము, కాని ఆ పదిహేను నిముషములు గడచి పోయినవిగాని, ఏదియు రాలేదు. ఒక దినము గడచిపోయినది మరేది లేదు. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు గడచిపోయాయి. వారిలో కొందరు ఇలా చెప్పియుండవచ్చు, ''హే! మనము ఇంతకు ముందే దానిని పొందామని మీరు తలంచుట లేదా!
''లేదు, లేదు, లేదు, లేదు.''
''ఓ, మీరు వెలుపలకు వచ్చుట మంచిది''
అప్పుడా దయ్యము ఇలా చెప్పును, ''మీకు కావలసినదేదో మీరు ఇంతకు ముందే పొందియున్నారు. మీరు పోయి మీ సేవను ప్రారంభించుడి!''
లేదు, లేదు మనమింకనూ దానిని పొందలేదు. ఆయన ఇలా చెప్పెను, ఒక దినము వచ్చును. [చివరి దినములలో ఏమి జరుగును]. ''నత్తివారి పెదవుల చేతను, అన్య భాషతోను, ఈ జనులతో మాట్లాడుచున్నాను.'' (యెషయా 28:12) ''ఇదేనని'' ఆయన చెప్పెను. అది వచ్చునప్పుడు మీరు దానిని పొందెదరు.
''అది ఎప్పుడు వచ్చునో మనము ఎరిగి యున్నాము. తండ్రి వాగ్దానము మనము ఎరిగియున్నాము.'' వారు అలా తొమ్మిది రోజులు వేచియుండిరి. అంతట పదియవ దినమున వచ్చినది, ఇప్పుడు మీరు అక్కడే యున్నారు. వారు వేచి యుండుటకు ఓర్పు కలిగియుండిరి.
114దేవుడు తన వాగ్దానమును మీకు ఇచ్చిన తరువాత, మీరు దానిని బైబిలు నందు చూచునప్పుడు, మీరు ఆ రకపు ఓర్పును కలిగియున్నయెడల ''అది నాదై ఉన్నది,'' అని వేచి యుండుడి. మీరు అటువంటి ఓర్పును కలిగియున్నప్పుడు, మీ విశ్వాసముతో దానిని చేర్చుడి. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమునకు వెళ్లుచున్నారో చూచారా? ఇక్కడ మీరు పైకి వెళ్లుచున్నారు. మంచిది. (గడియారములోని ముండ్లు కూడ తిరిగిపోవుచున్నవి.) మంచిది.
దీనిని విశ్వాసముతో చేర్చుకొనుడి, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసికొనుచూ మీ ముందుంచుకొనుడి. ఆయనే దానిని వాగ్దానము చేశాడు, వాగ్దానము చేసినది నేను కాదు. పాస్టరు వాగ్దానము చేయలేదు. (మన సహో॥ నెవిల్) మరొక సేవకుడు వాగ్దానము చేయలేదు. మరొక యాజకుడు గాని లేక ఒక పోపు దానిని వాగ్దానము చేయలేదు. భూమిపై ఏ మనుష్యుడు లేడు. ఆ వాగ్దానము చేసినది దేవుడే. తాను వాగ్దానము చేసిన ప్రతి దానిని ఆయన నిలుపుకోగలడు.
MARK 9:23
115మంచిది, మీరు అలాంటి విశ్వాసము కలిగియున్నప్పుడు, దేవుడు దానిని వాగ్దానము చేశాడని ఎరిగియున్నప్పుడు… ''సహో॥ బ్రెన్‌హామ్ నేను వ్యాధితో ఉన్నాను. నాకు స్వస్థత కావలసి యున్నది,'' అని చెప్పినప్పుడు దానిని అంగీకరించుము. అది నీకివ్వబడిన బహుమానము. అవునండి. దానిని విశ్వసించుము. అది నీకివ్వబడిన బహుమానము. అవునండి. దానిని విశ్వసించలేరా.
''మంచిది, నేను దానిని విశ్వసించుచున్నానని,'' మీరు చెప్పిన యెడల ఇక మరచిపొండి. అంతే. అదంతయు ముగించి పోయినది. చూశారా, ఓర్పును కలిగియుండుడి.
మీరు ఓర్పు కలిగియుండవలెను… మీరు కలిగియుండకపోయిన యెడల ఈ కట్టడమునే కూల్చివేయుచున్నారు. ఆ ఒక్క కార్యము మిగిలిన దానినంతటిని కూల్చివేయును. మీరు దానిని కలిగియుండవలసియున్నది. మరొక దానిని చేర్చకండి, ఎందుకనగా అది మీ కట్టడమును విరచివేయును. మీరు ఓర్పు లేకున్న యెడల మీ విశ్వాసముతో సద్గుణమును చేర్చకున్న యెడల (మీరు కలిగి యున్నామని చెప్పుకొనిన యెడల) మరొక విశ్వాసము కలిగి, మీ సద్గుణమును దానితో చేర్చుటకు ప్రయత్నించిన యెడల అది మీ విశ్వాసమును విరచి వేయును.
అందువలన మీరిలా చెప్పవచ్చు, ''మంచిది, ఒక్క నిముషము ఆగండి. ఇది ఏదో ఒక విధముగా పొరపాటుగా ఉండవచ్చు. దేవుడు దేవుడు కాకపోవచ్చు. దేవుడు లేడు,'' అని మీరు చెప్పవచ్చు. చూశారా, అప్పుడు మీరా కార్యమును రెండుగా విరచుచున్నారు.
PS 82:6•
MATT 5:48•
JOHN 10:34•
2PET 1:5-7
116అయితే మీరు నిజ విశ్వాసమును కలిగియుండినప్పుడు, దానితో నిజ సద్గుణమును చేర్చుడి. అంతట దానితో నిజ జ్ఞానమును, నిజ ఆశా నిగ్రహమును, అంతట నిజ సహనమును చేర్చుడి. మీరు ఆ వరుసలో ముందుకు వెళ్లుచున్నారు.
మంచిది, ఐదవదిగా భక్తిని చేర్చండి. ఓ, మై. భక్తి దానితో చేర్చవలసియున్నది. భక్తి అనగా భావమేమిటి? నేను నాలుగు లేక ఐదు నిఘంటువులు పరిశీలించాను. దాని భావమేమో తెలియలేదు. చివరిగా, నేను సహో॥ జెఫరీస్ వద్ద ఉన్నప్పుడు ఒక నిఘంటువులో కనుగొన్నాము. భక్తి అనగా దేవుని వలె ఉండుట అను భావముగా ఉన్నది. ఓ,మై. మీరు విశ్వాసమును పొందిన తరువాత సద్గుణమును, ఆశా నిగ్రహమును, సహనమును పొందిన తరువాత దేవుని వలె ఉండుట.
మీరిలా చెప్పవచ్చు, ''సహో॥ బ్రెన్‌హామ్ నేనలా ఉండలేను.'' ఓ, నిజము నీవు ఉండగలవు. ఒక్క నిముషము కొన్ని లేఖనములను మీకు చదివి వినిపించనీయ్యుడి. మత్తయి 5:48 ఈ ఒక్కదానిని తీసికొని అది చెప్పుచున్నదేదో చూచెదము. ''మీరు దైవములని'' యేసు చెప్పుచున్నాడు ఎందుకు? దేవునిలో ఉన్నవన్నియు మీలో ఉన్నవి అలా బైబిలు చెప్పుచున్నది. మత్తయి 5:48. ''మీ పరలోకపు…'' (యేసు పరలోక స్థితిలో మాట్లాడుచున్నాడు) ''మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి."
మీరు దానిని చేయుటకు ముందు ఇక్కడ మీకు మార్గము ఏర్పడి యున్నది. ఇవన్నియు మొదటిగా చేర్చబడవలసి యున్నవి. అప్పుడు మనము పైకివచ్చెదము, ఇప్పుడాయన మిమ్మును పూర్ణులుగా ఉండుడని ఆయన అడుగుచున్నాడు. దైవభక్తి దేవుని కుమారులుగాను, కుమార్తెలుగాను ఉండుట మంచిది. ఈ విధముగా మరెన్నో కార్యములను ఈ వరుసలో చెప్పగలను.
EPH 4:11-13
117ఎఫెసి 4వ అధ్యాయమును మనము త్రిప్పుదము. ఇక్కడ ఎఫెసీయుల గ్రంథమందు చెప్పబడినదేమిటో చూచెదము. అక్కడ ఈ కార్యమును గూర్చి కూడా చెప్పబడుచున్నది. మనము చేయవలసిన దానిని గురించి చెప్పబడుచున్నది. ఎఫెసీ 4:12 వచనము నుండి చదువుదము. ఎఫెసీ 4వ అధ్యాయము మనము 11వ వచనము నుండి ప్రారంభింతుము.
ఆయన కొనదరిని అపోస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను [జ్ఞాపకము౦చుకొనండి, నిన్నటి రాత్రి, వేరొకరి కార్యాలయలమును తీసుకొనుటకు ప్రయత్ని౦చకుడి.], కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను.
''దేవుని సంపూర్ణత కొరకు'' [ఆ విధముగా చెప్పబడినదా? దేనిని సంపూర్ణము చేయుటకు? పరిశుద్ధులను - ఎవరా పరిశుద్ధులు - శుధ్దీకరించబడిన వారు] పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, [యేసుక్రీస్తు పరిచర్యను, క్షేమాభివృద్ధి చెందుటకు, దానిని నిర్మించుటకు గాను.]
''మనమందరమును విశ్వాసము యొక్క ఐక్యతకు వచ్చు వరకు మరియు దేవుని కుమారునిగా సంపూర్ణ జ్ఞానమునకు వచ్చు వరకు, ఆ విధముగా ఒక సంపూర్ణ మనిషిగా మారు వరకును [అనగా సంపూర్ణత గలవారమగునంత వరకు, ఓ, మై] అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునంత వరకు.''
ISA 53:7•
JOHN 8:29•
2PET 1:5-7
118సంపూర్ణత. అది దైవభక్తి కలిగియుండునదైయున్నది. దైవభక్తిని నీవు నీ విశ్వాసముతో చేర్చవలసియున్నది. చూడండి, మీరు సద్గుణముతో ప్రారంభించి, జ్ఞానములోనికి ప్రవేశించుచున్నారు. అంతట ఆశానిగ్రహములోనికి ప్రవేశించుచు, ఇప్పుడు దైవభక్తి యందున్నారు. దైవభక్తి. ఓ, మై! మన సమయము అయిపోవుచున్నది, అయితే దైవభక్తి అనగా ఏమిటో గ్రహించారు. మీరీ పాటను పాడుడి.
''యేసు వలె ఉండుటకు, యేసు వలె ఉండుటకు,
భూమిపై ఆయన వలె దీర్ఘకాలము నేనుండుటకు,
జీవిత యాత్ర అంతటి యందును;
ఈ భూమి నుండి మహిమకు,
ఆయన వలె ఉండుటకు మాత్రమే నేనడిగెదను.''
అదే దైవభక్తి. ఆయన ముఖముపై ఒక ప్రక్క కొట్టినప్పుడు, ఆయన మరొక చెంపను చూపించాడు. కఠినముగా ఆయనను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన ఎదురు తిరుగలేదు, చూశారా. ఆ దైవత్వమును ఒక్కదాని కొరకు అన్ని వేళల ఎదురుచూచును. ''ఎల్లప్పుడు నా తండ్రిని సంతోషపెట్టు దానిని నేను చేయుదును,'' అవునండి, ఎల్లప్పుడు చేయుట, అదియే దైవభక్తి.
119చూడండి, దీనిని మీరు చేసిన తరువాత ఇక్కడ నుండి ఇక్కడకు, ఇక్కడ నుండి ఇక్కడకు, మరియు ఇక్కడకు అలా మీరు సంపూర్ణు స్వరూపములోనికి వచ్చుచున్నారు. ఇప్పుడు, దేవుని కుమారునిగా వచ్చుచున్నారు. అయితే ఇదంతయు మీకు ఉండవలసియున్నది, ఇదంతయు కలిగియుండవలసియున్నది. మరియు దీనిని పొందనిదే మీరు ప్రారంభించలేరు.
ఇప్పుడు, నెమలి ఈకలతో ఉండు నల్ల పక్షని జ్ఞాపకము చేసికొనండి. చూడండి, మరచిపోవద్దు. మీరు మరలా జన్మించునంత వరకు దీనితో మరొక దానిని చేర్చకండి, ఎందుకనగా అది క్రియ చేయదు. మీరు దానిని చేయనివ్వలేరు. అది దేనితోనైనను వెళ్లి అది ఎక్కడో తుత్తునీయులై పోవును. అయితే మీరిక్కడకు అనగా క్రొత్తగా జన్మించిన పావురము నొద్దకు వచ్చినప్పుడు, మీరు మరి దేనిని చేర్చుకొనరు. అది మీతో చేరిపోవును, ఆ విధముగా పైకి ఎదుగుదురు.
MATT 18:21,22•
2PET 1:7
120మంచిది, ఇప్పుడు సంపూర్ణతకు వచ్చుచున్నది.
మంచిది, ఇప్పుడు ఆరవదిగా, (బైబిలు ఇక్కడ చెప్పు దానిని చేర్చుచున్నాము), సహోదర ప్రేమను చేర్చుదము. సహోదర దయ, ఇప్పుడు అది మంచిదై ఉన్నది. ఇక్కడ ఆరవదిగా అది ఉన్నది. (అది ఏడవదా), మంచిది. సహోదర ప్రేమను చేర్చుట మంచిది. మనము దానియొద్దకు వచ్చునప్పుడు — సహోదర ప్రేమ — ఆ విషయములో నిన్నునీవు అతని స్థానములో ఉంచుకొనుము. ఇప్పుడు నీవు ఇలా చెప్పవచ్చు, ''నా సహోదరుడు నాకు విరోధముగా పాపము చేశాడు,'' పేతురు ఇలా చెప్పాడు. ''నేనతనిని మన్నించెదనా?" "ఒక దినములో ఏడు మార్లు మన్నించెదనా?''
అందకు ఆయన ''డెబ్బది ఏడు మార్లని,'' సెలవిచ్చెను, చూడండి.
సహోదర ప్రేమ. ఇప్పుడు, మీరు చూచారా, ఒక సహోదరుడు తన స్థితిని తప్పినప్పుడు, అతనిపట్ల ఓర్పును కోల్పోవద్దు. వీలుపడదు. అతనితో దయకలిగిదుకు కొనసాము.
2PET 1:5-7
121కొంత కాలమునకు మునుపు ఒకరు ఇలా చెప్పారు, నీవు చేయుచున్నట్లు ఇంకనూ ''అసెంబ్లీ ఆఫ్ గాడ్‌కి'' వెళ్లుచూ, ఏకత్వపు సహవాసములకు వెళ్లుచూ, ఇంకనూ మిగిలిన స్థలము వెళ్లుచూ ఈ కార్యములను ఎలాగు నమ్మగలవు?
సహోదర ప్రేమ ఒక దినమున అతనిని తెచ్చునని ఎదురు చూచుచు… అతనితో సమానమును కలిగియుండి, ఆశా నిగ్రహముతో - అతనితో ఓర్పును కలిగియుండి అతడ విశ్వసించు దానిని గ్రహించు జ్ఞానమును కలిగియుండి అతని హృదయమందున్నదని జ్ఞాపకము చేసికొనుము. అదే అక్కడ ఉండినది. అది దయతో కూడి బయలు వెల్లునదై యుండునట్లు, నీలో సద్గుణము కలిగియుండుము. అతని పట్ల దీనుడవై యుండుము. అతనిని ఒకరోజు దేవుడు వర్తమానములోనికి తెచ్చునని విశ్వాసము కలిగియుండుము. సహోదర ప్రేమ, అది ఏడవదిగా ఉన్నది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏడు కార్యములు.
ఇప్పుడు నీవు (పరిపూర్ణతకు) వచ్చుచున్నావు. ఈ తరువాత దాతృత్వమును చేర్చుము. అది ప్రేమయై యున్నది. అదియే తలరాయి. ఈ దినములలో ఒక దినమందు సంఘములో…..
122దయచేసి ఇప్పుడు, దానిని టేపుపై తెలుపబడనియ్యుడి, దీని కంటే నేను ఎక్కువగా ఉపదేశించుట లేదు, దీనిని ఒక సిద్దాంతముగా ఇప్పుడు చెప్పబోవు దానిని ఉపదేశించుట లేదు. అయితే దానిని మీకు చూపుటకు మాత్రమే ఇష్టపడుచున్నాను, దానిని దేవుని సహాయముతో మాత్రమే చేయగలను.
దేవునిచే వ్రాయబడని నిజ మొదటి బైబిలు ఆకాశములోని ''రాసులు'' గా ఉన్నవి. అది కన్యరాశితో ప్రారంభించి, సింహరాశితో ముగించును. నేను ఆరవ, ఏడవ ముద్రలోకి వెళ్లునప్పుడు, ఆ మరో ముద్ర విప్పబడునప్పుడు, రాసి మండలములో కర్కాటకము మరియు మీనము (చేప)ను గుర్తించుటను మీరు కనుగొందురు. మనము జీవించు కాలము కర్కాటక కాలముగా ఉన్నది, అది బయలుపడినది. ఆ ముద్రను వెలికి తెచ్చిన మరొక కార్యము సింహముగా ఉన్నది. అది యేసు క్రీస్తు రెండవ రాకడగా ఉన్నది. ఆయన మొదటిగా కన్యకు(జన్మించెను), ఆయన రెండవ పర్యాయము సంహాముగా వచ్చును.
వీటి ద్వారా (ముద్రల ద్వారా) వీటిని నేను తెచ్చాను. ఇప్పుడు ఈ ఉదయము మనకు సమయము లేదు. ఈ మెట్లు ''పిరమిడ్నందు ఖచ్చితముగా ఉండుటను నేను మీకు చూపగలను — అది దేవుడు వ్రాసిన రెండవ బైబిలుగా ఉన్నది. హానోకు వాటిని వ్రాసి ఒక ''పిరమిడ్'' నందుంచెను. (పిరమిడ్ అనగా ఈజిప్టు దేశములో చనిపోయిన రాజులను ఉంచు గొప్ప ముక్కోణ గోపురములు).
123మూడవది (ఎప్పుడును దేవుడు మూడవ దానియందు సంపూర్ణుడగును) అంతట ఆయన తనను తానే వాక్యముగా చేసికొనెను. ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుడి, పిరమిడ్‌లో…. (మీలో అనేక సిపాయలుగా పనిచేయునప్పుడు ఈజిప్టు దేశములో వీటిని చూచి యుందురని నేను ఊహించుచున్నాను), పిరమిడ్‌నకు తలరాయి ఉండదు ఉండనేరదు. ఆ బండ చదరముగా ఒక్కొక విధములుగా ఉండును, అయినను…
మీ జేబులో ఒక డాలరు నోటు ఉన్నట్లయినను, ఆ డాలరు నోటును చూడండి, అందులో కుడిప్రక్కగా అమెరికా పతాకముతో కలసి ఒక పక్షిరాజు ఉండును. ''అది ఐక్య రాష్ట్రములు యొక్క ముద్రయని,'' అది తెలుపుచున్నది. ఆ నోటు మరో ప్రక్కన గొప్ప తలరాయితో ఉన్న పిరమిడ్‌ను మరియ మనుష్య కంటిని చూడగలము. ''అది గొప్ప ముద్రయని,'' అది తెలుపుచున్నది. మంచిది, ఇది ఒక గొప్ప దేశముగా ఉండి, ఈ గొప్ప ముద్రను వారి దేశపు ముద్రలుగా కలిగియుండుటకు కారణమేమిటి? వారెక్కడకు వెళ్లినను దేవుడు వారిని సాక్ష్యముగా చేయుచున్నాడు.
EXOD 15:26•
NUM 21:9•
PS 103:3
124ఒకప్పుడు ఒక డాక్టరుతో నేను మాట్లాడుచుండగా దైవీక స్వస్థతపై అతడు నాతో తర్కించుచుండెను. అప్పుడు మేము వీధిలో నిలిచి మాట్లాడుచున్నాము. అప్పుడతడు ఇలా చెప్పాడు, ''సహో॥ బ్రెన్‌హామ్ గారు మీరు ప్రజలను తారుమారుగా చేయుచున్నారు." "అటువంటి స్వస్థతలు ఏమి లేవు, మందుల ద్వారా మాత్రము అది జరుగును,'' అని చెప్పాడు.
అప్పుడు నేను ప్రక్కకు తిరిగి చూచుట తటస్థపడినప్పుడు — అతని కారుపై ఒక కమ్మిపై సర్పపు గుర్తును చూచాను. అప్పుడు నేనిలా చెప్పాను, "అట్లయిన మీరు ఆ కారు పైనున్న చిహ్నమును తీసివేయుట మంచిది, ఎందుకనగా మీ స్వంత గురుతు, దేవుడు స్వస్థపరచునని చూపుచున్నది." ఒక నిజ డాక్టరు దానిని నమ్మును. బూటక వైద్యులు నమ్మలేరు. ఆ కొయ్యపై ఉన్న సర్పము, మోషే ఆ కొయ్యపై సర్పమును ఎత్తిపట్టినప్పుడు. దేవుడు ఇలా పలికెను, ''మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేను,'' వారు దైవిక స్వస్థత కొరకు ఆ సర్పమును చూచారు. అయినను వారు దానికి విరోధముగా సాక్ష్యమిచ్చారు. వారి స్వంత సూచన దానికి విరోధముగా సాక్ష్యమిచ్చుచున్నది.
ACTS 4:11•
EPH 2:20•
1PET 2:7
125ఇక్కడ మన దేశము ఉన్న కార్యములను చెప్పుచున్నప్పుడు, ఆ కార్యములను పరిహాసము చేయుచున్నది. వారి స్వంత డబ్బు (చెలామణిలో ఉన్న వారి సొంత డాలర్లు) సమస్తమును ముద్రగా దేవుడున్నాడని సాక్ష్యమిచ్చుచున్నది. ఆ డాలరు కాగా తమ పైనున్న కన్ను అక్కడ ఎందుకున్నదో చూచారా? అదే గొప్పముద్ర. ఆ పిరమిడ్‌పై (తలరాయి) ఉంచబడ లేదు. దానిని వారు గ్రహించలేక పోయారు. ఎందుకు? తలరాయి నిరాకరించబడినది. అది శిరస్సు క్రీస్తు అయితే అది ఒక దినమున వచ్చును.
2PET 1:5-7•
1JN 4:8,16
126ఇప్పుడు సద్గుణమును నిర్మించుటలో ఉన్నాము. ఈ (గొప్ప) కళాఖండమును నిర్మించుచున్నాము. ఈ స్వరూపమును నిర్మించుచున్నాము, చూడండి, అది ప్రారంభించబడినప్పుడు దాని పునాది విశ్వాసముగా ఉన్నది. సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఇప్పుడది ఏమి చేయుచున్నది? అట్లయిన వారు ఆ తలరాయి కొరకు వేచియున్నారు. ఆ తలరాయి ప్రేమగా ఉన్నది, ఎందుకనగా దేవుడు ప్రేమయైయున్నాడు. ఆయన తన స్వాధీనమున ఉంచుకొని నడుపుచున్నాడు. ఆయన ఈ కార్యములలోని శక్తిగా ఉన్నాడు. అవునండి.
ఇప్పుడిక్కడ ఉన్నాడు. నిజమే ఇప్పుడిక్కడ ఉన్నాడు, చూశారా? అవన్నియు ఇక్కడ క్రియ చేయుచుండగా, వాటి మధ్య నేను నిలచియున్నాను. ఇక్కడ ఆ చిన్న అలలు అలాగే వచ్చినవి. అది ఏమై యున్నది? క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దీనంతటిపై నుండుచు, వీటన్నింటిని ఒకదానితో మరొక దానిని అతికించుచున్నాడు. దేనిని నిర్మించుచున్నాడు? తలరాయి దానిపై ఉంచబడునట్లు, ఒక సంపూర్ణ సంఘమును నిర్మించుచున్నాడు. ఇంకనూ ఆయన చేయుచున్నది ఏమిటి? ఏడు సంఘ కాలములలో ఏడుగురు వర్తమానికుల ద్వారా రూపొందించుచున్నాడు.
ROM 1:17
127ఇక్కడది ప్రారంభించబడి….ఆదిలో సంఘము ఎక్కడ స్థాపించబడినది. పెంతుకొస్తు సంఘము ఎక్కడ స్థాపించబడినది? అపొస్తులుడైన పౌలు ద్వారా ''ఎఫెసు'' లో స్థాపించబడినది. ఎఫెసు సంఘ కాల నక్షత్రముగా (పౌలు) ఉన్నాడు, ఎఫెసు. రెండవ సంఘ కాలమైన ''స్ముర్న'' సద్గుణముగా ఉన్నది — ఐరేనియస్, ఆ గొప్ప మనుష్యుడు పౌలు సువార్తకు సహాయపడెను. ఆ తరువాత సంఘ కాలము ''పెర్గము'' గా ఉన్నది. అక్కడ నిలచిన గొప్ప వ్యక్తి మార్టిన్… పౌలు, ఐరేనియస్, మార్టిన్. ఆ తరువాత తుయతైర, అప్పుడు కొలంబా (సంఘ కాలపు దూతగా) వచ్చాడు. కొలంబా తరువాత చీకటి యుగము ప్రవేశించినది.
అంతట సార్దీస్ సంఘకాలము వచ్చినది. ''సార్దీస్'' అనగా మరణము అను భావము. అది లూథరు కాలముగా ఉన్నది. హల్లెలూయ! అంతట ఏమి జరిగినది? ఆ తరువాత వచ్చినదేమి? సార్దీసు తరవాత, అనగా లూథరు తరువాత, ఫిలదెల్పియ కాలము వచ్చినది — దైవభక్తిగా ఉన్నది; వెస్లీ (ఆ కాలపు దూత), పరిశుద్ధతగా ఉన్నది; ''నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించుట'' ను, లూథరు తెలిపాడు; శుద్ధీకరణము వెస్లీ ద్వారా వచ్చినది. అంతట సహోదర ప్రేమ వచ్చినది, అది లవొదికయ ద్వారా వచ్చినది. చివరి దినములలో ఏలియా యొక్క రెండు ప్రత్యక్షతలో గొప్ప వర్తమానమును మనము నమ్ముచున్నాము. ఈ చివరి దినములలో దేశమంతటను ఆ వర్తమానము దేశమంతటిని తుడిచివేయును.
JOEL 2:25•
ZECH 14:7
128ఇక్కడే మీరున్నారు: ఏడు సంఘకాలములు ఏడు మెట్లుగా ఉన్నది. ఒక వ్యక్తి వ్యక్తిగతముగ నిర్మించబడునట్లు దేవుడు తన సంఘమును నిర్మించుచున్నాడు. తనలో దానిని నిర్మించుచున్నాడు. దీని ద్వారా (ఈ వర్తమానము ద్వారా) దేవునికే మహిమ. అనగా, దేవుని శక్తి దిగి వచ్చుచున్నది, మనలను ఏకముగా అతికించుచున్నది.
అందువలన, పెంతెకొస్తు ప్రజలు, లూథరనులను, వెస్లీయనులను ఇతర కార్యములను త్రోసివేసి వారేమి మాట్లాడుచున్నారో దానిని గ్రహించకున్నారు. వారు ఈ ఆలయములోని భాగముగా జీవించారని మీరు చూచారు. ఆ విధముగా కొందరు అంత వరకు వచ్చి ఆ తరువాత పడిపోయారు. అయితే ఒక నిజ భాగము దానిని అనుసరించుచు ఆ కట్టడమును నిర్మించుచున్నది. రండి. ''నేను దానిని ఇత్తును,'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
మీకు జ్ఞాపకమున్నదా? '' ఆ వధువు వృక్షము'' పై ప్రసంగమును మీరు జ్ఞాపకము చేసికొనుడి. వారు దానిని తినివేశారు, కాని దేవుడు దానిని త్రుంచివేసెను. అది సంస్థాగత కొమ్మలను కలిగియుండినది; ఆయన వాటిని త్రుంచివేసెను. వారు మరొక సంఘమునకు పైకి తెచ్చారు, సంస్థాగత కొమ్మలు; ఆయన వాటిని త్రుంచి చక్కపరిచాడు. అయితే ఆ వృక్ష హృదయ భాగము ఎదుగుచూ వచ్చినది.
''సాయంకాల సమయమున వెలుగు కలుగును.'' అప్పుడే పరిశుద్ధాత్మయైన క్రీస్తు వచ్చుకాలము ఉన్నది. యేసు దిగివచ్చి సంఘ శిరస్సుగా తనను అమర్చుకొనును. అప్పుడాయన తన స్వంత శరీరమైన ఈ సంఘమును లేపును. అక్కడే ఆ శరీరమున్నది. వ్యక్తిగతముగా మనము ఎదుగుటయే దేవుడు ఇష్టపడిన మార్గముగా ఉన్నది, తన సంఘమును ఆయన పెంచిన మార్గముగా ఉన్నది. ప్రతి సంఘకాలము అది ఒక పెద్ద సంఘముగా వచ్చినది.
2PET 1:5-7
129చూచారా?
వీరికున్నది, వారిక్కక్కరలేదు. ఇది ఏమైయున్నదో దీనికి అక్కరలేదు, చూశారా. అయితే ఆయన తన సంఘమును ఆ విధముగానే పైకి తెచ్చును. ఆ విధముగానే ఆయన తన ప్రజలను తెచ్చుచున్నాడు. పేతురు మొదటిగా ఇక్కడ చెప్పునదేమనగా (ఏడు కార్యములు) విశ్వాసము, సద్గుణము (ఏ విధముగా పైకి వచ్చుచున్నదో చూడండి), జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ మరియు సహోదర దయ; తరువాత దేవుని ప్రేమ అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చుటయై యున్నది.
క్రీస్తు, పరిశుద్ధాత్మ ద్వారా నీలోనికి వచ్చి, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీలోనికి వచ్చునప్పుడు, మరియు ఈ సద్గుణములన్నియు నీలో ముద్రింపబడును. అప్పుడు దేవుడు ఒక గుడారమందు నివాసము చేయును, అది సజీవ కట్టడమని పిలువబడును, సజీవదేవుడు నివాసముచేయు సజీవ గుడారముగా ఉన్నది.
130ఒక మునుష్యుడు ఈ రకమైన కార్యములను కలిగి యున్నప్పుడు పరిశుద్దాత్మ అతనిపైకి వచ్చును. నీవు భాషలతో మాట్లాడినను, దేవుడు కలిగియున్న మరే వరమునైనను కలిగియున్నట్లు నటించినను ప్రయోజనము లేదు. నీవు వీటిని చేయవలసి యున్నది. ఈ సద్గుణములునీ లోనికి వెళ్లునంత వరకు నీవు ఆ నిజ విశ్వాసపు పునాదిపైన లేవు. అయితే ఇవి నీలో ఎదిగిన యెడల నీవు వాటిని చేర్చుకొనవచ్చు, అప్పుడు నీవు ఒక జీవించు కళాఖండముగా ఉందువు. నీవు జీవించుచు, కదిలే రూపమై యుందువు.
అన్యులు (దేవుని యెరుగని ప్రజలు) విగ్రహములు యెదుట సాగిల పడుదురని మీరు ఎరిగి యున్నారు. (విగ్రహము అనునది ఊహ దేవతగా ఉన్నది.) ఒక ఊహ మార్గములో, ఆ ఊహించుకొనిన దేవత తమతో మరలా మాట్లాడునని వారు విశ్వసించెదరు, అది అన్యుల మతము. అది రోమా మతముగా ఉన్నది. రోమనులు అన్ని రకముల పరిశుద్ధుల ఎదుట సాగిలపడుచు, ప్రతి దాని ఎదుట వంగెదరు. వారి పరిశుద్ధ సిసెలియ అనియు, దేవుని ఇల్లు అనియు ఇంకనూ అనేక రకములైన విధానములున్నవి. వారు ఊహ మార్గములో నమ్ముచు వాటికి తలలు వంచెదరు. జీవించు నిజ దేవునికి మాదిరిగా అది ఉన్నదని తలంచెదరు.
131ఇటువంటి ఊహ మార్గములో గాక, సజీవ దేవుని యెదుట మనము నిజముగా సాగిలపడిన యెడల ఆ జీవించు సద్గుణమును, ఆ జీవించు జ్ఞానమును, జీవించు ఓర్పును, జీవించు దైవభక్తియు, జీవించుశక్తియు, జీవించు మనిషిగా చేయుచున్నది. అది దేవుని స్వరూపమైయున్నది.
ఆయన ఏమి చేయుచున్నాడు? యేసు చేసిన కార్యములనే చేయుచున్నాడు: ఆయన నడిచినట్లే నడచుచున్నాడు, ఆయన చేసిన ఆ క్రియలనే చేయుచున్నాడు, ఎందుకనగా అది ఒక ఊహ కార్యము కాదు! దానిని నిరూపించుటకు అక్కడ ఒక నిజత్వమున్నది! నేను భావించునదేమిటో చూచారా? ఈ సద్గుణములు, ఈ కట్టడపు పనిముట్లు, సంఘ కాలములో, సంఘ వర్తమానికులతో ఎలా పోలియున్నవో చూశారా?
ఇప్పుడు రానున్న దినములలో వీటిలో ఒక్కొక్క దానిని తీసికొని, వాటిని పరిశీలించుచు, అవి నిరూపించబడుటను చూపెదను. అవన్నియు ఒక్కటిగా వెళ్లుచున్నవి. అది వాస్తవము. చూచారా? ఓ,మై! అవి చేయు వాటిని చూచుట ఎంత ఆశ్చర్యము.
PS 37:23•
2COR 3:2•
HEB 10:5
132ఇప్పుడు అది దేవుడు నివాసము చేయు స్థలముగా ఉన్నది. ఒక గొప్ప కట్టడముగా దాని చివరన పెద్ద గంటగా ఉండు దానిలో దేవుడు నివాసము చేయుట లేదు. ''నాకొక శరీరమును నీవు ఏర్పరచియున్నావు'': దేవుడు నివాసము చేయునట్లు, దేవుడు దానిలో నడచునట్లు, దేవుడు దాని ద్వారా చూచునట్లు దేవుడు దాని ద్వారా మాట్లాడునట్లు, దేవుడు దాని ద్వారా పని చేయునట్లు అది ఒక శరీరముగా ఉన్నది. ఆమేన్! అది జీవించు దేవుని ఆయుధముగా ఉన్నది. దేవుడు నీ ద్వారా రెండు కాళ్ళతో నడచుచున్నాడు. దేవునికి మహిమ! నీతిమంతుల పాదపు అడుగులు దేవునిచే ఆజ్ఞాపించబడుచున్నవి. దేవుడు నీలో ఉండి, నడచుచున్నాడు. ''మీరు మనుష్యులు చదువు పత్రికలుగా ఉన్నారు.'' క్రీస్తులోని జీవము మీలో ఉన్న యెడల క్రీస్తు కలిగియున్న జీవితమును మీరును కలిగి యుందురు.
133నేను ఎల్లప్పుడు చెప్పునట్లు ఎర్రని మంచి పండ్ల చెట్టు సారమును తీసి, ఒక ఆపిలు చెట్టునకు ప్రసరణ చేసిన యెడల, ఆ ఆపిలు చెట్టు ఆ ఎర్రని ''పీచ్'' పండ్లును ఫలించును. అది వాస్తవము. అది ఖచ్చితముగా జరుగును. ఆ కొమ్మలు ఏ విధముగా కనిపించినను పరవాలేదు. అది ఆపిలు చెట్టు సారమును కలిగియున్నది, చూడండి, అది ఏ చెట్టయిననుగాని.
ఆ విధముగానే ఒక ఆపిలు చెట్టు సారమును పూర్తిగా తీసి ఒక ఎర్రని ''పీచ్'' చెట్టునకు ప్రసరణ చేసినయెడల ఏమి జరుగును? ఇకపై ఆ చెట్టు నందు ''పీచ్'' పండ్లు ఫలించవు. లేదండి. అది అలా జరుగదు. ఆ విధముగానే ఆ పీచ్ చెట్టు సారము మరలా ఆపిలు చెట్టునకు ప్రసరణ చేసినను ఇకపై ఆ చెట్టు ఆపిలు పండ్లను ఫలించదు. అది ''పీచ్ అను ఎర్రటి పండ్లను మాత్రము ఫలించును, ఎందుకనగా ఆ జీవమును అది కలిగి యున్నది.
JOHN 1:14•
ACTS 4:12•
EPH 2:1
134ఆ విధముగానే మనలను తీసికొనినయెడల, మనమొక అడవి గుమ్మడి కాయవలె తెలివి తక్కువ వారమైయున్నాము, మనలో ఏ మంచియు లేదు, ఎందుకనగా మనమందరము పాపములో అపరాధములోను మరణించినవారమైయున్నాము. మనమందరము ఇటువంటి స్థితిలో ఉన్నాము, అందువలన ఏదో ఒక రూపములో పాపమునకు గురియైయుండగా, మనలను పైకి అప్పగించుకొనుచు దేవుడు తన ప్రసరణ చేయు మార్గమైన యేసు క్రీస్తు నామమున ద్వారా మనలను తీసికొనునంత వరకు కొనసాగుదము. (ఎందుకనగా ఆకాశము క్రింద మనుష్యుడు రక్షింపబడు మరో నామము ఏదియు లేదు) — అంతట క్రీస్తు జీవమును మనలోకి మార్చును.
అప్పుడు మనము ఈలాంటి విశ్వాసమును కలిగి ఉందుము. అది క్రీస్తు కలిగియుండు విశ్వాసమైయున్నది. ఆ పరిసయ్యులలో గాని, సద్దూకయ్యులలో గాని, లేక వారి ఆచార క్రమములో గాని, లేక వారిశుద్ధీకరణములో గాని క్రీస్తు యొక్క విశ్వాసము పునాదిగా వేయబడలేదు. (విశ్వాసము) దేవుని వాక్యముపై వేయబడియున్నది. ఆమేన్! క్రీస్తు ఎంత వాక్యమై ఉండెననగా, ఆ వాక్యము శరీరధారి ఆయెను.
మరియు మనము మన తలంపులను మరణించునంతగా ఆయన శక్తి ద్వారా ప్రసరణము చేయబడినప్పుడు మన విశ్వాసము నిజవిశ్వాసమగుచున్నది (హల్లెలూయ!) అప్పుడు క్రీస్తు జీవము మనలోనికి ప్రసరణ చేయబడుచున్నది. ఆ విధముగా మనము సజీవ దేవుని జీవులమగుచున్నాము — ఆయన ప్రకాశమానమైన ఆశీర్వాదములను పరిశుద్దాత్మ ద్వారా పంపగలుగునట్లు ఒక నివాసస్థలమగుచున్నాము. మనము క్రీస్తు స్వరూపమందున్నాము.
PS 82:6•
MATT 10:19,20•
JOHN 10:34,35
135''నేను దేవుని కుమారుడనని చెప్పినప్పుడు, మీరు నన్ను నిరాకరించుదురని వ్రాయబడి యుండలేదా?'' అని యేసు చెప్పెను. ''మీరు దైవములని వ్రాయబడియుండలేదా? మీ స్వంత ధర్మశాస్త్రము ఆ విధముగా చెప్పుటలేదా?'' మోషేవలెను, ఏలియా వలెను, దేవునితో అతి సమీపముగా జీవించిన ఆ ప్రవక్తల వలెను, కేవలము దేవుడు తనను వారిలోకి మార్చుకొనినప్పుడు వారు మాట్లాడిరి — వారు వారి స్వంతముగా మాట్లాడుట లేదు గాని దేవుడే మాట్లాడెను. ''మీరు ఏమి మాట్లాడవలెనని మీ స్వంత తలంపును కలిగి ఉండకుడి, ఎందుకనగా మాట్లాడునది మీరు కాదు గాని, మీలో నివాసము చేయు తండ్రీ మాట్లాడుచున్నాడు; ఆయనే మాట్లాడుచున్నాడు.'' అతనిలోని మాటలు అతనివి కాదు, ఎందుకనగా అతని జీవము, అతడు మరణించినవాడై యున్నాడు.
2PET 1:5-7
136(మీరు) మరణించినప్పుడు, మనిషిలో నుండి రక్తము తీసివేయబడును. అతనికి ఒక జ్ఞాపకార్థ చిహ్నముగా చేయుదురు. వచ్చిన చిక్కేదనగా, అనేకులు చిహ్నముగా చేయబడరు. మనిషిలో నుండి రక్తము తీసివేయబడినప్పుడు ఇతడు లేకపోవును. అప్పుడు వేరొక రక్తము అతనిలో ఉంచుట మాత్రమే మీరు చేయగలదు. అతడు జీవించవలయుననిన ఆ విధముగా చేయవలసియున్నది.
అతని రక్తమును వెలుపలకు తీసివేసి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తమును అతనిలో ఉంచవలయును! అప్పుడది యేసుక్రీస్తు యొక్క విశ్వాసమును తెచ్చునదై యున్నది. అది యేసుక్రీస్తు యొక్క సద్గుణముగా ఉన్నది, అది యేసుక్రీస్తు యొక్క జ్ఞానమై యున్నది, యేసుక్రీస్తు యొక్క ఆశానిగ్రహమై యున్నది, యేసుక్రీస్తు యొక్క సహనమును కలిగియుండును, యేసుక్రీస్తు దైవభక్తిని కలిగియుండును, యేసుక్రీస్తు యొక్క సహోదర ప్రేమను కలిగియుండును, అది యేసుక్రీస్తుగా ఉన్న దేవుని ప్రేమైయుండును. ఆయన శిరస్సుగా నిన్ను తన స్వాధీనమందుంచుకొనును! అప్పుడు నీ పాదములు విశ్వాసమును పునాదిగా ఉండును. ఆమేన్! శిరస్సు ద్వారా నడిపించబడును. దానిని తీసికొనుము, అక్కడే మీరున్నారు. ఈ సద్గుణములను పొందినప్పుడు అక్కడే దేవుని పరిపూర్ణ మనిషిగా ఉండగలుగును.
137అప్పుడు దేవుడు ఆయన సంఘమునకు ఒక వధువుగా ప్రాతినిధ్యము నిచ్చును. ఆమె ఓ స్త్రీగా ఉన్నది. ఒక వధువుగా ఆయన సంఘమునకు దేవుడు ప్రాతినిధ్యమును ఇచ్చుచున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని తన కుమారునిగా తెచ్చుచు వధువులోనికి వెళ్లుట ఆయన యొక్క మార్గముగా ఉన్నది. ఆయనే ఈ పరిపూర్ణ సంఘమునకు అందులోనికి తెచ్చుటకు ఆ వధువును ఈ (సంఘ) కాలముల ద్వారా తెచ్చుచున్నాడు.
నా పాదములు కదులుచున్నవి ఎందుకు? నా శిరస్సు ఆ విధముగా చెప్పుచున్నది. అది నా చేతుల వలె కదలుటకు వీలు లేదు, ఎందుకనగా అవి నా పాదములుగా ఉన్నవి. మనము చేయు ఈ కార్యములు లూథరు చేయుటకు వీలుపడదు, ఎందుకనగా వారు మరొక రకముగా ఉన్నారు. చూశారా, శిరస్సు ఇలా చెప్పుట ద్వారా పాదములు కదులుచున్నవి. పాదములు కాదు మీరు చేతులుగా ఉండుడని (లేక) చెవితో, మీరు కళ్లుగా మారిపోవుడని శిరస్సు చెప్పదు.
అయితే దేవుడు ప్రతి కాలములో ఈ కార్యములను ఆయన సంఘములో ఉంచెను. ప్రతీ వ్యక్తి ఈ గుణలక్షణములను కలిగియుండి వాటిని చూపునట్లు దానిని రూపొందించెను. మరియు ఈ ''జీవి'' సంపూర్ణమైనప్పుడు, ఎత్తబడుటలో వెళ్లు దేవుని సంఘమై యుండును. దేవునికి మహిమ! నేను భావించునదేమిటో చూడుడి. అక్కడ అది పరిపూర్ణముగా ఉన్నది.
138ఇక్కడ ఒక మనిషి వచ్చుచున్నాడు, అతడు అపొ॥ పౌలు ఒక పునాదిని వేయుచున్నాడు. ఇరేనియస్ దానిపై మరొకదానికి కుమ్మరించుచున్నాడు, ఆ తరువాత వారు దీనిని పోశారు. ఆ విధముగా తరువాతి వారు పోయుచు వచ్చి చివరకు, ఈ చివరి కాలము వచ్చినది. అయితే ఇది ఏమిటి? ఇది అదే ఆత్మగా ఉన్నది. నాలో నివసించు అదే ఆత్మ, ''చేతులారా, ఆ కేక దగ్గరకు వెళ్లండి,'' అని చెప్పుచు, అదే ఆత్మ ''పాదములారా, మీరు అడుగు ముందుకు వేయండి,'' అని చెప్పుచున్నది. నా భావమేమిటో చూశారా?
అప్పుడు మీ జీవి యొక్క పూర్తి స్వరూపమును ఈ క్రియలచే పాలన చేయబడుచు, తన స్వాధీనమందుంచుకొనుచున్నది. అయితే అది ఈ గుణలక్షణములన్నింటిని పొందువరకు దానిని పరిపూర్ణముగా తన స్వాధీనమందుంచుకొనలేదు.
139దీనిని ఎప్పుడైనను విన్నారా? ఇప్పుడు దీనిని నన్ను చెప్పనిచ్చుచూ, నిజముగా అలవరచుకొనుచు, మీ వినుచున్న చెవుల యందుంచుకొనండి. ఒక గొలుసు తన బలహీనసంధి యందు బలమైనదిగా ఉన్నది. అది నిజమా? దాని బలహీనమైన లింకు కన్నను ఆ గొలుసు బలమైనది కాదు. అవి ఎంత బలమైనవిగా కట్టబడినను ప్రయోజనము లేదు, అది ఒక బలహీనమైన లింకును కలిగియుండినయెడల, అక్కడే అది విరిగి పోవును లేక తెగిపోవును. అందువలన ఆ బలహానమైన లింకు కన్నను ఆ గొలుసు బలమైనది కాదు.
ఇప్పుడు మీరు దేనిని కలిగియున్నను…. మాకు అది ఉన్నది, అది ఉన్నది అని మీరు చెప్పవచ్చు. మీకు ఏదున్నను ఇది లేకున్న యెడల అక్కడే అది తెగిపోవును. మీరు దీనిని కలిగి యున్నను, దానిని కలిగి యున్నను అక్కడే అది తెగిపోవును. మీరు దీనిని కలిగియుండి దానిని కలిగియుండకున్నయెడల అక్కడే అది తెగిపోవును. ఇది ఉన్నది. అదిలేదు. అక్కడే అది విరుగు స్థలముగా ఉన్నది, చూశారా. మీకు ఇదిలేనిదే అది ఉండదు. మీరు మీ పూర్తి జీవమును సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ ఈ సద్గుణముల ద్వారా పోయబడును. అప్పుడు నీవొక జీవించు గుడారమగుదువు.
అప్పుడు ప్రజలు దానిని చూచి ఇలా చెప్పెదరు, ''ఇదిగో ఈ మనిషి పరిపూర్ణ సద్గుణములను కలిగి యున్నాడు. జ్ఞానమును కలిగి యున్నాడు. వాక్యమును నమ్మును, ఓర్పును, సహవాసమును, దైవభక్తిని కలిగి, సహోదర దయయందును, పరిశుద్దాత్మ యొక్క పరిపూర్ణ ప్రేమ యందు నింపబడి నడచుచున్నాడని,'' చెప్పుదురు. అది ఏమై యున్నది? అవిశ్వాసులు చూడగలుగు స్వరూపముగా ఉన్నది. అప్పుడు వారు, ''ఇదిగో ఒక క్రైస్తవుడు, వారు మాట్లాడునది ఏదో దానిని వారెరిగి యున్నారు. ఇలాంటి దయ గలిగిన, మృదువైన దైవభక్తి కలిగిన వ్యక్తిని చూడలేదు,'' అని చెప్పుదురు.
COL 3:3
140నీవు ముద్రించబడియున్నావు. ఒక ముద్ర రెండు ప్రక్కలను చూపును. నీవు వెళ్లుచున్నను లేక వచ్చుచున్నను, వారా ముద్రను ఒక్కటిగానే చూచెదరు. మీరక్కడే ఉన్నారు, ఒక స్త్రీ లేక ఒక పురుషుడు వీటిని కలిగి యున్నప్పుడు, అప్పుడు తలరాయి దిగివచ్చి వారిని పరిశుద్ధాత్మగా ఉన్న దేవుని రాజ్యములో ముద్రించును.
అప్పుడు ఇక్కడ నుండి వచ్చు వాక్యము ఈ జీవుల ద్వారా (ఒక్కొక్కరి) ద్వారా రూపు చెందును. ఆ విధముగా ఈ పరిపూర్ణ జీవిని సజీవ దేవుని గుడారముగా చేయును. నడచుచున్న, జీవించుచున్న ఒక క్రైస్తవ మాదిరిగా ఉన్నది.
క్రీస్తు ఏమై యుండునో వారు ఆ విధముగానే యుందురు, ఎందుకనగా ఆయన జీవము ఇక్కడున్నది. వారు క్రీస్తునందున్నారు, వారి స్వజీవితము (జీవము) మరణించినది. క్రీస్తు నందు దేవుని ద్వారా భద్రపరచబడినది. అక్కడ పరిశుద్ధాత్మచే ముద్రింపబడినది — I కొరింథీ 12. అది నిజము. నీకు నీవు మరణించినవాడవు. అప్పుడే నీవు విశ్వాసము ద్వారా జన్మించగలవు, సద్గుణము ద్వారా జన్మించి, నీవు దేవుని యొక్క జీవించు పరిపూర్ణ రూపముగా మారు వరకు ఇవి ఒక దానితో ఒకటి చేర్చబడవలెను.
HEB 11:32-40
141అది ఆశ్చర్యముగా లేదా? ఈ ఆయన దాని ద్వారా ఆ ఏడు సంఘ కాలములను తెచ్చును. ఆయన తన వారిని తన స్వరూపములో ఆ ఏడు మెట్ల ద్వారా ఏ విధముగా నిర్మించి తెచ్చెనో, దానిని ఆ సంఘ కాలములయందు చూపెను. ఆయన తన స్వరూపమందు ఒక పరిపూర్ణ సంఘమును నిర్మించి పునరుత్థానమందు ఆయనతో నిత్యము జీవించుటకు లేపుచున్నాడు, ఎందుకనగా అది ఒక వధువుగా ఉన్నది. అందువలన అది ప్రతి కాలమందు చెక్కబడినదై (మలచబడినది), ప్రతి కాలములోను ఆ విధముగానే జరిగినది.
ఇంకను అధికముగా కాలవసి యున్నదని జ్ఞాపకముంచుకొనుడి. హెబ్రీ 11లో పౌలు చెప్పినదేమిటో జ్ఞాపకము చేసుకొనుడి. మనము ముగించుటకు ముందుగా దానిని చదివెదము. నేను దీనిని చదువునప్పుడెల్ల… దయతో కూడిన వింతైన అనుభూతిని పొందెదను. నేనిప్పుడు హెబ్రీ, 11 మరియు 32వ వచనము నుండి నేను ప్రారంభించబోవుచున్నాను.
ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వీరిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సంహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారను తప్పించుకొనిరి, బలహీనముగా వుండి బలపర్చబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి.
స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడితిరి.
మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి.
రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడి ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని, దరిద్రులై యుండి, శ్రమపడి హింస పొందుచూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను సొరంగములోను, తిరుగులాడుచు సంచరించిరి.
అట్టి వారికి ఈలోకము యోగ్యమైనది కాదు. వీరందరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండ సంపూర్ణులుగా కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు.
142మీరు దీనిని గ్రహించారా? మరణించిన వీరు మన మీద ఆధారపడుచు మన కొరకు వేచి యున్నారు. అందువలన ఈ సంఘము పునరుత్థానమును తెచ్చుటకు గాను పరిపూర్ణతకు రావలసి యున్నది. వారు బలిపీఠము క్రింది ఆత్మలుగా ఉన్నారు. సంఘము తన సంపూర్ణతకు వచ్చుటకు గాను వేచి యున్నారు, అయితే క్రీస్తు వచ్చినప్పుడు…
మరియు ఈ సంఘము, మీరు చూడండి, ఈ సంఘము చిన్నదై తక్కువ సంఖ్యలో వచ్చును. అది మొత్తము దాని కన్నను పదునైనదిగా ఉండును. అది నేను అక్కడ వ్రాసినట్లు ఉండును, చూచారా, అది ఒక సూది చివరి భాగమునకు వచ్చుచున్నది. ఆ కొద్ది సంఖ్యలో ఉండు సంఘము తన స్థానమునకు రావలసియున్నది. ఇది విడిచిపెట్టిన అదే పరిచర్యగా ఉండునట్లు అది వచ్చుచున్నది; ఎందుకనగా ఈ తలరాయి మరలా వచ్చునప్పుడు…
అది ఒక పాకెట్ ఆకారముతో ఆ పిరమిడ్ పై దానికుండు స్థానములో అమర్చబడును. అది ఒక చిన్న పలకవలె ఉండును. అది అక్కడ కూర్చొనవలసియున్నది, ఎందుకనగా అది నీళ్లును కుమ్మరించునదిగ ఉన్నది. అది వచ్చినప్పుడు, సంఘము మెరుగుపరచబడవలసియున్నది.
పిరమిడ్‌లోని మిగిలిన రాళ్లన్నియు చక్కగా అమర్చబడి, చివరకు వాటి మధ్యకు ఒక రేజర్ బ్లేడు సహితము ప్రవేశించలేని విధముగా అవి అనేక టన్నులు బరువు గలిగి అమర్చబడియున్నవి. వాటిని ఏ విదముగా పైకి తీసుకు వెళ్లారో, ఎవరూ ఎరుగరు, అయినను వారు వాటిని నిర్మించారు. ఇక్కడ ఆ పిరమిడ్ యొక్క తలరాయి అమర్చబడిన తరువాత ఈ పిరమిడ్ యేసుక్రీస్తు యొక్క శరీరమువలె రూపుచెందవలసియున్నది. ఒక సిద్ధాంత విధానములో కాదు గాని పరిపూర్ణ క్రీస్తువలె ఉండవలసియున్నది. ఆయన వచ్చు పర్యంతము ఆయనయు ఆ సేవయు ఏకము కావలసియున్నది. అప్పుడు ఎత్తబడుట వచ్చుటయు పరమునకు వెళ్లుటయు జరుగును.
REV 3:20
143ఇప్పుడు మనమెక్కడ జీవించుచున్నామో చూడండి — లవొదికయలో ఆ సంఘ కాలమందు ఎక్కడ లేనంత నీచ స్థితిలో ఉండును. బైబిలు గ్రంథమందు యేసుక్రీస్తు సంఘము వెలుపల ఉండు ఒకే ఒక్క సంఘ కాలము ఇది ఒక్కటే. ఆయన తలుపు తట్టుచు తన స్వంత కట్టడములోని ప్రవేశించుటను ప్రయత్నించుచున్నాడు. సిద్ధాంతములును, సంస్థలును, ఆయనను తన స్వంత సంఘము నుండి వెలుపల పంపివేసినవి.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో భోజనము చేయుదును. ఇక్కడ ఈ సంఘకాలములో క్రమేణముగా ఆయనను వెలుపల నెట్టేశారు. వారు ఆయనను పూర్తిగా త్రోసివేశారు. ఆయనతో కలిసి చేయుటకు వారు ఇష్టపడుటలేదు.
ఇప్పుడు, ఈ దినమందు మనమెక్కడకు వెళ్లుచున్నామో మీరు గమనించండి. చివరకు ఈ లొవొదికయ సంఘ కాలము నులువెచ్చనిదై క్యాథలిక్ సంఘమునకు అతి సమీపమగుచు (ఇక్కడే ఆ లవొదికియ సంఘము చీల్చబడినది), ఏకముగా ఒక గొప్ప సంఘమగుచున్నది. అవి అన్నియు కలిసి ఒక సంఘ సమాఖ్యను ఏర్పరచినవి, అవి ఆ క్యాథలిక్ సంఘములై పోయినవి.
144ఒకే ఒక్క వ్యత్యాసము, ఏదనగా ప్రభువు బల్ల సంస్కారము మాత్రమే. క్యాథలిక్‌ను, ప్రొటస్టెంటును ఐక్యపడుటలో అడ్డుగా నిలుచునది ఇది ఒక్కటే. సంస్కార విధానము మాత్రము క్యాథలిక్ సంఘము చెప్పునదేమనగా, ''అది ఆ శరీరము.'' ప్రొటెస్టెంట్లు, ''అది ఆ శరీరమునకు సాదృశ్యముగా ఉన్నదని,'' చెప్పెదరు.
క్యాథలిక్‌లు దాని నుండి ఒక ఆరాధనను తెచ్చెదరు. ఆ ఆరాధన ఏదనగా వారు క్షమించబడుదురని నమ్ముచు ఆ రాత్రి "భోజన సంస్కారమును" తీసికొనెదరు. ప్రొటెస్టెంట్లు విశ్వాసముతో తీసికొందురు. వారు క్షమించబడినందుకు, దేవునికి వందనములు చెల్లింతురు. ప్రొటెస్టెంట్లు ఆ రాత్రి భోజన సంస్కారములో, ''మనము క్షమించబడితిమని'' అని చెప్పుదురు. క్యాథలిక్‌లు, ''మనము క్షమించబడితిమని ఎదురు చూచుచున్నామని,'' చెప్పెదరు. అదియే మాస్ (ఆరాధన) మరియు ప్రభువు బల్ల సంస్కారము గాను ఉన్నది. వారు (క్యాథలిక్‌లు) దానిని మాస్ అని పిలిచెదరు. మనము దానిని సంస్కారము అని పిలిచెదము. మాస్ (ఆరాధన) అనునది అలా ఉండునని ఎదురు చూచునదిగా ఉన్నది. సంస్కారము అది ఆ విధముగా ఉన్నదని ఎరిగి, దాని కొరకు ఆయనకు వందనములు చెల్లించుటగా ఉన్నది. ఆ ఒక్క విషయములోనే వారిరువురు ఐక్యపడరు.
అయితే వారు దానిని చేయుచునే యుందురు.
PS 37:9•
ISA 40:31
145ఓ, అది ఎంతో అందముగా కనబడును. వారు ఐక్యపడుటకు పరుగిడుదురు. అది అలాగే మార్గమంతయు కొనసాగును, బైబిలు చెప్పునదేమనగా, ''ఆ మృగములు ఈ వేశ్యకు అధికారము నిచ్చునవి.'' వారిరువురు ఐక్యపడుటను చూడండి. వారేమి చేయుదురని బైబిలు చెప్పెనో, అలాగే ఇప్పుడు చేయుచున్నారు. ఈ వారములోనే ఆ ఊరేగింపు జరుగనైయున్నది.
క్యాథలిక్ ప్రజలపై నాకు మరో విధమైన అభిప్రాయము లేదు, ప్రొటెస్టెంటుల పైనను ఏదియు లేదు మొథడిస్టులు, బాప్టిస్టులు మరియు పెంతెకోస్తులు అని చెప్పుకొను మీరు మీ సంఘములు ఈ సంఘ సమైఖ్యలోకి వెళ్లినప్పుడు, న్యూయార్క్ పట్టణములో ఆ గొప్ప భవనమును నిర్మించినప్పుడు అది ఐక్యరాజ్య సమితి వలె ఇతర కార్యములు వలెను ఉన్నది వారు సమస్త ప్రొటెస్టెంటులను ఏకముగా ఐక్యపరచుటకు ప్రయత్నించుచున్నారు.
ఇప్పుడు, ఆ క్యాథలిక్ ఎంతో జ్ఞానము కలిగి పోప్ జాన్ 23 లేక 22 (మరెవరైనను) అతి వినయముగా ప్రొటెస్టెంట్ విశ్వాసమును, క్యాథలిక్ విశ్వాసమును, ఒక విశ్వాసమును తెచ్చుటకు ప్రయత్నించుచున్నారు, వారా విధముగా చేయుదురని బైబిలు చెప్పినట్లు జరుగుచున్నది. మీరు కూడా అక్కడ ఉన్నారు.
ప్రొటెస్టెంట్లు వారి చిక్కులో పడిపోవుచున్నారు. ఎందుకు? ఎందుకు? ఎందుకనగా వారు ఈ కార్యములను కలిగియుండలేదు. జ్ఞానము — వాక్యము సరియైనదిగా ఉన్నది. సహనము — "ప్రభువు కొరకు ఎదురు చూచువారు…" నా భావమును చూశారా?
146ఆ మెథడిస్టు బిషప్ చెప్పినట్లు గత దినములో వారు దానిని, అంగీకరించినప్పుడు, వారిని ఆవేశపరచినదేదో మీలో ప్రతి ఒక్కరు ఎరిగి యున్నారు. ఒక నిర్ణయ ప్రార్థనను సంఘములోను, పాఠశాలలోను చెప్పుటకు ప్రయత్నించారు. మరియు దానిని చేయుటకు ఇష్టపడిరి….. అది ప్రెస్బిటేరియన్ ప్రార్థన పుస్తకమని తలంచెదను, అప్పుడు తల్లిదండ్రులు పాఠశాలలో ఫిర్యాదు చేశారు, ఎందుకనగా పాఠశాలలో ఈ ప్రార్థనను చెప్పుటకు వారనుమతించలేదు.
ఆ మెథడిస్టు బిషప్ అధిక జ్ఞానము గల వృద్ధుడు. అతడు లేచి నిలచి ఇలా చెప్పాడు. ''అది పొరపాటు. అది చట్ట విరోధమైనదని'' చెప్పెను. అతడు దాని విధమును చేపట్టి ఇలా చెప్పాడు, ''మా మెథడిస్టు సంఘములో అధికులైన ప్రజలు హాలివుడ్ అక్రమమును గురించి మాట్లాడెదరు. వారిలో 95 శాతము ఎలాగైనను దానిని చూడ వెళ్ళెదరు.'' వారికేమైనది? వారు ఆ విశ్వాసమును విడచి పెట్టారు. ఖచ్చితముగా వారు దానిని విడచిపెట్టారు.
147గత దినములో నేను ఈ గదిలో ఉండగా మెథడిస్టు సంఘ ఉన్నత అధికారి ఒకరితో సంభాషించాను. ఆ సంఘము ఈ ''ఫాల్స్ పట్టణములో'' ఉన్నది. పెంతెకోస్తు కాలమునకు ముందు, మెథడిస్టు కాలమును గురించి మాట్లాడెను. అతడిలా చెప్పెను, సెయింట్ లూయిస్, మిసోరి పట్టణములో ఉన్నది. అక్కడ వారు ఆ సంఘములోని స్థితులను లెక్కవేశారు. (అవి మూడు లేక నాలుగు నెలల క్రితము జరిగినది), అప్పుడు వారు కనుగొన్నదేమనగా, ఆ మనుష్యుడు ఈ ఉదయము ఇక్కడ కూర్చొని యుండవచ్చు. మంచిది, అతడు మనకొరకు ఈ కట్టడమును కట్టుటకు నిర్ణయించబడిన కాంట్రాక్టరుగా ఉన్నాడు. అతడు ''ప్రధాన వీధి మెథడిస్టు సంఘమునకు'' చెందినవాడు. అక్కడ సోదరుడు, లమ్ కాపరిగా ఉన్నారు.
అక్కడే మనము దానిని కనుగొనుచున్నాము, 70% మెథగిస్టులు ఉన్నారని అంచనా వేయబడినది. అక్కడ సేయింట్ లూయిస్‌లో రమారమి 68% ప్రజలు మధ్యపానము సేవించెదరు. 70% ప్రజలు సిగరెట్లు త్రాగుదురు. ఒక మెథడిస్టు.
అలాగున్నాడా! అక్కడ ఆశ్చర్యకార్యమేదనగా ఆ అంచనా వేయునప్పుడు, అది స్త్రీ పురుషుల మధ్య వేయబడినది. అక్కడ అధిక శాతము స్త్రీలు సిగరెట్లు త్రాగుదురు, మధ్యపానము సేవించుటయు జరిగినది. 70% పురుషులు కన్నను స్త్రీలు ఆ స్థితిలో ఉండిరి.
148ఇప్పుడు మనము బైబిలు దగ్గరకు వచ్చామంటే పొట్టి బట్టలు వేయు సిద్ధాంతము. వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకొనుటను, అటువంటి సిద్ధాంతములన్నియు భక్తి హీనమైనవి. స్త్రీలు దైవభక్తియు, పరిశుద్ధతయు కలిగియుండవలసియున్నది — కార్డు పార్టీలు అధికముగా వదురుబోతు తనమును కలిగియుండుట తిరుగుబోతును కలిగియుండుట, ఇవన్నియు భక్తిహీనమైన కార్యములు, అప్పుడు మనిషి యొక్క స్థితి గతి ఏమిటి? కార్డు పార్టీలు, గోల్ఫ్ ఆటలు వెలుపల వెళ్లునప్పుడు — సగము దుస్తులను అసహ్యముగా ధరించుట, ఇవన్నియు స్త్రీలపై ఉన్న కార్యములు. ఇందులో ఆశ్చర్యము లేదు!
ఆ బోధకునిపై (జైలు బోధకుడు), ఆ అసహ్య పథకము ఈ ఉదయకాలము తీసుకురాబడినదా? అవునండి. ఆ వ్యక్తి దాని వలన నేరస్తుడని నేను నమ్మను. అతడా విధముగా చేయునట్లు చేసినదేమి? ఒక సహోదరునిగా…. అతని పేరును జ్ఞాపకుము చేసికొన లేకున్నాను. అవును, ''డాన్ గిల్‌బర్ట్'' ఆయన ఖైదీల మధ్య సేవకునిగా ఉన్నాడు. ఆ మనుష్యుడు పరుగున వచ్చి ''డాన్'' అను ఆ వ్యక్తి హత్య చేశాడు. అది కొన్ని నెలల క్రితమే జరిగినది. ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉన్నది. ''కోర్సుడాన్'' (అను ఆ వ్యక్తి) మరణించాడు. ఇప్పుడు అతని రక్తమును ఆ చిన్న బిడ్డకు మార్చలేరు. అప్పుడామె ''డాన్, ఆమెను బలవంతపరిచాడు, ఇది డాన్ యొక్క బిడ్డేనని'' చెప్పినది. దానిని నేను నమ్మలేను. అదెట్లున్నదనగా కోకిల ఈకలను కాకి ఉంచుకొన్నట్లున్నది. లేదండి. అది ఒక అబద్ధముగా ఉన్నది. ''డాన్ గిల్ బర్ట్'' దేవుని మనిషిగా ఉన్నాడు. అది సాతాను (దయ్యము) యొక్క తంత్రముగా ఉన్నది.
ACTS 17:26
149ఆ విధముగా ఆ కార్యములు వారి ప్రార్థనల యందుంచారు. ఆ వృద్ధ మెథడిస్టు బిషప్ దానిని తెలిసికోగలిగాడు. అది అలా వెళ్ళినట్లైతే… అది మరియొక దాని వలన ప్రేరేపించబడినది. అది నిజము.
అదే విధముగా దక్షిణ ప్రాంతములో ఏకాంతముగా ఉండు సమస్య ఉన్నది. ఆ కార్యము అదే విధముగా ఉన్నది. మనిషి స్వతంత్రునిగా ఉండవలయునని నేను నమ్ముచున్నాను. ఈ దేశము స్వతంత్రం కొరకు నిలుచుచున్నదని నమ్ముచున్నాను. కెనడి సైన్యమును పంపినందుకు నేను ఆయనను నిదించుట లేదు. నేను ఒక క్రైస్తవునిగా ఉండినను నేను దాని యందు నమ్మికయుంచలేదు. నేను ఒక క్రైస్తవునిగా యున్నాను దాని యందు నమ్మిక యంచలేను.
లేక నల్లరంగు వాళ్లు అలాంటి దానికి తన జన్మ హక్కును అమ్ముకోవలయునని నేను నమ్మను. ఒక రిపబ్లికన్ పార్టి ఉన్నది. అబ్రాహాము లింకన్ రక్తము వారిని విడిపించినది, ఎందుకనగా అతడు దేవుడు మనిషిగా ఉన్నాడు. మీరు ఓటు వేయ తలచిన యెడల మీరు ఆ పార్టితో ఉండవలసి యున్నది.
అయితే నేనొక కార్యమును చెప్పెదను. పాఠశాలల కొరకు అతడు అక్కడ లేడు. అతడు ఈ దేశస్థుడుగా ఉన్నాడు. అతడు ఒక అమెరికనుగా ఉన్నాడు. అది అందరి స్వాతంత్య్రము. ఒక మనుష్యుని రంగు అతని వ్యత్యాసమును చూపును. ''మనమందరము ఒక్క మనుష్యుని రక్తము నుండి సమస్త దేశములుగా వచ్చిన వారము,'' అని దేవుడు చెప్పెను. మనమందరము ఒక్కటై యున్నాము.
150అయితే ఆ బాలుడు, ఒక సిపాయిగా ఉన్నాడు. అతడు ఒక వృద్ధ సిపాయి నిజమైన దాని కొరకు అతడు పోరాడెను. అతనికి పాఠశాలకు వెళ్లు హక్కున్నది. అది నిజము. అతడు వెళ్లుటకు అనేక పాఠశాలలున్నవి. అదే నిజమైన సంగతి. నీవు దాని వెనుక నిలిచావంటే, అది ఈనాటి సంస్థాగత విధానముగా ఉన్నది. అదియే దానిని ప్రేరేపించుచున్నది. ఎందుకు? వారా నల్లజాతి ప్రజల ఓట్లను రిపబ్లిక్ నుండి డెమోక్రటిక్ పార్టీకి మార్చుచున్నారు. దాని ద్వారా వారు తమ జన్మహక్కును అమ్ముకొనుచున్నారు. అది ఖచ్చితమైన సత్యముగా ఉన్నది. అక్కడ పరిశుద్దాత్మ నివాసము చేయుట లేదు. ''వారిని తెలివి కలిగియుండనిమ్ము వారిని జ్ఞానము కలిగియుండనిమ్ము,'' అది ఖచ్చితముగా నిజమైయున్నది.
ఈ కాలములోని ఈ సంఘము వలె తనను అమ్ముకొనుచున్నది. ఏమి జరుగనైయున్నదో చూడలేరా? ఈ కార్యము టేపు చేయబడినను నేను చింతించను. యిక్కడ అది వచ్చుచున్నది. ఆ సంగటేమిటి? నా స్వంత తల్లి ఏమి చెప్పెననగా ''సాతాను యొక్క బాకీలు ఇచ్చి వేయుము.''
ఒకప్పుడు ఒక మనిషి తెలివిగా ఒక కార్యము చేశాడు. అక్కడుండిన అతని పేరు ''కాస్ట్రో'' అవునండి. అతడు అక్కడి పెట్టుబడిదారుల దగ్గరకు వెళ్లి ప్రతి దానిని పొందాడు. సంయుక్త రాష్ట్రముల వలె అది ఒక బంగారునకు స్థానమును కలిగియున్నది. అతడు ఏమి చేశాడు? అక్కడున్న పత్రములన్నింటిని తెచ్చాడు. ఏదో ఒక విధముగా ఆ డబ్బును తారుమారు చేసి మార్చివేశాడు. వాటిని మరలా అక్కడుంచాడు. ఆ ఒక్క కార్యమును మాత్రమే ఈ దేశము చేయగలదు.
151గత ఉదయము వెలుపడిన లైఫ్ పత్రికను మీరు విన్నారా? ఎందుకో మీకు తెలియునా, అది కేవలము బంగారముపై మీరు అమ్ము పత్రములుగా ఉన్నది. ఆ పత్రములు ముందుగానే తీసికొనబడినవి. ప్రస్తుత ప్రభుత్వము దేని కొరకు ధనమును వ్యయపర్చుచున్నది? వారు పన్ను రూపములో నలువది సంవత్సరములకు రావలసిన ధనమును సేకరించియున్నారు. ఆ దేశము అలా చేసియున్నది. ఆ కార్యములను గురించి వాషింగ్‌టన్, డి.సి. నుండి వెలువడు ''లైఫ్ లైన్'' అను పత్రికలో వివరముగా వ్రాయబడినది. అది దేశమంతయు వెలువడినది.
పన్నులు — వారు అధికముగా ఖర్చు చేసి బయటి దేశపు (బంగారమును కొనుటకు) ప్రయత్నించుచున్నారు, ఎందుకు వారు ఏదో ఒక విధముగా దానిని ఇచ్చి వేయుచున్నారు. వారు చేయదలచినది దానినేనని మీరు చూడరా? చూడండి. అది ఏమిటి? ఇప్పుడీ దేశము అర్థాకృతి ప్రతిమగా పోవుచున్నది. ఆ విధముగా అర్థాకృతి ప్రతిమగా మాత్రమే పోగలదు. అది దివాలా తీయు స్థితిలో యున్నది. అది చేయు తెలివి గల కార్యమేదనగా దాని ధనమును మార్చి వేయవలసి యున్నది.
అయితే వారు అలా చేయరు. ప్రస్తుత ప్రభుత్వ విధానములో రోమను కాథలిక్ సంఘము ఆ బంగారమునంతటిని అనగా ప్రపంచంలోని బంగారము నంతటిని తన స్వాధీనము చేసికొన్నది. వారేమి చేయుదురనగా, దానిని అమ్మి వేయుదురు. బైబిలులో చెప్పబడినట్లు ఈ భూలోక ధనవంతులు, వారు పోగొట్టుకొనుటకు ముందు వారలా చేయుదురు. బ్రౌన్ మరియు విల్లియంసన్ అను పొగాకు కంపెనీ (వారిలో అధికులు కాథలిక్కులు) వారు రోము నుండి ధనమును (డబ్బును) పొందెదరు. వారు అలా దానిని అంగీకరించెదరు. మరియు అమెరికా దాని జన్మ హక్కును అమ్మి వేయును. రోము దాని వెనుక నిలుచును. అవునండి. ఆమె (రోము) దాని వెనుక నిలుచును.
ఇప్పుడు వారు చాలినంత పాలసీలను పొందుచున్నారు. వారి చుట్టు ప్రక్కల అధికముగా పొందుచున్నారు. అతని సభలోనికి దానిని తెచ్చుచున్నాను. శ్రీ కెనడీ దేని కొరకు అడుగుచున్నారో చూడండి.
152గత దినములలో మీరు దానిని చూచినప్పుడు ఓటు వేయవలసిన అవసరమే లేదు. ఓటు వేయుటలో ప్రయోజనమేమి? వారు దానిని ఋజువు చేసి పత్రికలలో వెలువరించినప్పుడు, దానిని గురించి ఏదైనను చేయుటకు వారు నిరాకరించారు. యంత్రములు దేశమంతటను ఉంచబడినవని వారు తెలిపినప్పుడు, వారు కెనడీని (అమెరికా దేశ అధిపతి) దొంగ ఓట్లు వేసి ఎన్నుకున్నారు. అతడు మోసముతో వచ్చునని బైబిలు చెప్పుట లేదా? ఒక అబద్ధ స్థితి.
నేనిప్పుడు డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకిని కాను — మరి రిపబ్లికన్ పార్టీకిని అలాగే అయితే బైబిలులోని సందర్భములను నేను తెలుపుచున్నాను. ఓటు వేయుటలో ప్రయోజనమేమి? ఎవరు వచ్చెదరని వారికి బాగుగా తెలియును.
153ఇద్దరు స్త్రీలు లేచి నిలచి, వారిలో ఒకరు, ''నేను మిస్టర్ కెనడీకి ఓటు వేయనున్నాను,'' అని రేడియోలో చెప్పుటను ఎందరు జ్ఞాపకముంచుకొని యున్నారు. ఆమె ఒక ప్రొటెస్టెంటు స్త్రీగా ఉన్నది.
అందుకు వారు ''ఎందుకని?'' అడిగారు.
అప్పుడామె ''ఎందుకనగా నిక్స్‌న్ కన్నా కెనడీ అందగాడని,'' చెప్పినది. ''అతడు ఒక చక్కని అధిపతిగా ఉండగలడని,'' చెప్పినది.
అప్పుడు వారు, ''ఈ స్త్రీ కాథలిక్ స్త్రీ, అమ్మా, నీవు ఎవరికి ఓటు వేయనై యున్నావని,'' అడిగారు.
అందుకామె ''నేను ఒక క్యాథలిక్, రోమను క్యాథలిక్‌ను, నీతి గల క్యాథలిక్‌ను, నేను మిస్టర్ నిక్స్‌న్‌కు ఓటు వేయనైయున్నాను,'' అని చెప్పినది.
''ఎందుకు?''
అప్పుడు ఆమె, ''ఎందుకనగా మిస్టర్ నిక్స్‌న్ ఒక మంచి అధిపతిగా ఉండగలడు, ఎందుకనగా ఆయన అనేక కార్యములకు ప్రయోజముగా ఉండగలడు. అతడు కమ్యూనిజముతో అధికముగా పరిచయము గలవాడు,'' అని చెప్పినది. ఆ స్త్రీ అలా ఒక అబద్ధమును చెప్పినది.
154''మా విశ్వాస సత్యములు,'' అని వారు పిలుచు గ్రంథము నా యొద్ద ఉన్నది. కొనకలిగిన దానిలో గొప్ప క్యాథలిక్ పుస్తకమది. అక్కడ చెప్పబడినదేమనగా, ''ఎవ్వరైనను ఒక క్యాథలిక్ సభ్యునిగా ఉన్న యెడల, అతడు ప్రొటస్టెంటుకు వ్యతిరేకముగా ఉండవలసినదే గానీ, ఒక క్యాథలిక్ సభ్యుడు ఒక ప్రొటెస్టెంటుకు ఓటు వేసిన యెడల, అతడు క్యాథలిక్ సంఘ సహవాసము నుండి వెలివేయబడును.'' అది నిజము! ఒకవేళ ఇద్దరు క్యాథలిక్‌లు ఒకే కార్యాలయము వెళ్లుచుండినయెడల, ''తల్లి సంఘము'' నకు విశ్వాసపాత్రుని ఎన్నుకొని, వారికి ఓటు వేయవలెను.
ఆ మోసము ఎలాగున్నదో చూశారా? వారు దేనిని చేయుటకు ప్రయత్నించుచున్నారు? దేనిని కొనుటకు ధనము ఇచ్చుచున్నారు? వారు దానిని వేరు చేయుచున్నారు! మరియు వారే దానిని చేయుచున్నారు. అది దానిని విరచి వేయుచున్నది.
అది ఏమిటి? బంగారముపై గల స్థానమును కలిగి యున్నది. ప్రపంచపు బంగారమును క్యాథలిక్ సంఘము తన స్వంతము చేసికొన్నది. 1,68,000,000,000 డాలర్ల బంగారమున్నది. అక్కడే మీరున్నారు.
1COR 1:21•
1COR 3:19
155బంగారపు స్థాయిలోకి అది నెట్టివేయబడినది. మీరు మీ ఇండ్లను మరియు మీకు కలిగిన వాటిని ఉంచుకొని యున్నారు, అయితే మీరు క్యాథలిక్ సంఘమునకు చెందియున్నారు. ఈ దేశము క్యాథలిక్ సంఘమునకు చెందినది. సమస్తమును ఆ విధముగా వారి ధనముతో పట్టబడినది.
బైబిలు దాని గురించి మాట్లాడుట లేదా? బైబిలు ఆ చిత్రమునే తెచ్చుచున్నదా? సోదరా, నేను చెప్పుటకు ప్రయత్నము చేయునదేమనగా, ఈ రోజు వారు (క్యాథలిక్) చెప్పునదేమనగా, ''అది ఒక చక్కగా సంఘమును ఏర్పరచుచు ప్రొటెస్టెంటిజమును ఐక్యపరచును.'' అని చెప్పుచున్నారు. శారీరక కంటికి అది బాగానే కనిపించును, అయితే ఈ ప్రపంచ జ్ఞానము దేవునికి వెర్రితనముగా ఉన్నది. తప్పిపోయిన వారిని దైవీక కార్యాలయము ద్వారా రక్షించు సువార్త ప్రకటించుట అను వెర్రితనము దేవుని సంతోషపరచునదిగా ఉన్నది. ఆయన తన సంఘమును అభిషేకించెను. ఆ సంఘము ఈ ఆత్మీయ లక్షణములపై నిర్మించబడినదే గాని ఈ లోకపు మరో స్థితులపై కాదు.
2PET 1:1-4•
2PET 1:4
156పేతురు ఇలా చెప్పెను, ''ధనాశ అను ఆ లోకపు అవినీతి నుండి మీరు తప్పించుకొనిన వారై, గొప్ప కాలముల దురాశలు, సంతోషములు, తినుటయు, త్రాగుటయు మనకు కలిగిన ఈ అవినీతిని విడచి — మీరు తప్పించుకొంటిరి. మరియు ఇప్పుడు జీవ స్థితిలో కట్టబడితిరి. నేను దానిని సంఘముతో చెప్పుచున్నాను.''
అక్కడే మీరున్నారా. మీరు దానిని చదివారా? II పేతురులో అక్కడ ఆయన చెప్పినదేమిటో వినుడి. ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడియున్నది, ఆయన దానిని ఎలా సంబోధించుచున్నాడు. అతడు మాట్లాడుచుండగా వినుడి. మంచిది.
''యేసుక్రీస్తు దాసుడు అపొస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
తన మహిమ బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలచిన వాని గూర్చిన అనుభవజ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును, భక్తికిని కావలసిన వాటినన్నింటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు, మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని [దానిని వినండి] దైవస్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.
EPH 4:11,12•
2PET 1:5-7
157ధనమునకై దురాశ, గొప్ప వాటి కొరకు దురాశ, పలుకబడి కొరకు దురాశ — విశ్వాసికి ఈ కార్యములు చచ్చినవిగా ఉన్నవి. ఒ గుడారమో లేక కుటీరమో, మనము చింతించము. నేను ఎందుకు చింతించవలెను? జీవించినను మరణించినను, మునిగినను, తేలినను, నేను ఈ కార్యమందే అక్కడ నిలిచి యున్నాను. అది దేవుని యొక్క రాజ్యము! నా కుటుంబమును నేను నడిపించినను, నా ఇంటిని నడిపించినను, మరి దేనినైనను నేను నడిపించినను, ముఖ్యముగా క్రీస్తును నా జీవితములో కలిగియుండువలసియున్నది. అదియే మహిమ యొక్క నిరీక్షణ!
ఓ, ప్రభువా, దీనిలో నన్ను నిర్మించుము. క్రీస్తు నా శిరస్సుగా ఉండనిమ్ము! నా ద్వారా నా పునాదిపైనను, ఆయనయందు విశ్వాసము పైనను ఆయనను క్రియ చేయనిమ్ము. సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, ఓర్పును, దైవభక్తిని, సహోదర ప్రేమను నాలో క్రియ చేయనిమ్ము. క్రీస్తు సద్గుణమును ఆయన జ్ఞానమును బోధించునట్లు వాటిని నాపై కుమ్మరించుము. ఓ, ప్రభువా, అదియే నా ప్రార్థన. నేను జీవించినను లేక మరణించినను, మునిగినను అగాదమునకు వెళ్లినను, సంస్థలో ఉన్నను, లేకున్నను, స్నేహితునిగా ఉన్నను, లేకున్నను, దానిని నాలో క్రియ చేయనిమ్ము. క్రీస్తు యొక్క సద్గుణమును, ఆయన జ్ఞానమును, నేను వారికి బోధించునట్లుగా కుమ్మరింపబడనిమ్ము. ఎందుకనగా దేవుడు తన సంఘములో అపొస్తులులను, ప్రవక్తలను, బోధకులను, కాపరులను, సేవకులను ఉంచెను. వీరందరు ఈ సద్గుణములను తెచ్చుచూ దానిని చక్కపెట్టుదురు. దేవుని కుమారుని రాకడ యొక్క పూర్ణతకు తెచ్చుచున్నారు.
158ఈ రాళ్లలో ఒక్కొక్కటిని దానిలో ఒక వస్తువైయున్నది. దీనిలో ప్రతి ఒక్క సద్గుణము ఆయనకు చెందినదే. వాటి ద్వారా ఆయనలో నుండి వారు కుమ్మరింపబడుచున్నారు. ఆమేన్!
ఇప్పుడు 12 గంటలైనది. మీరు ఆయనను ప్రేమించుచున్నారా! మీరు దానిని నమ్ముచున్నారా? చిన్న పిల్లలారా వినుడి….
సహోదరి కిడ్ ఆ ఉదయ కాలము చెప్పినదేమనగా ''సహో॥ బిల్ నిన్ను మరలా చూడగలనో లేదో తెలియదు.'' ఆ మాటలు నన్ను చంపివేశాయి, చూచారా. ఆమె వృద్ధురాలై పోతుందని తలంచినది; ఆమె అదే. ఆమెను మరియు సహో॥ కిడ్‌ని అధిక కాలము ప్రత్యేకించుమని నేను దేవుని ప్రార్థించాను. దీని మీకు చెప్పనివ్వండి. ఒకరికొకరము ఎంత కాలముందుమో మనకు తెలియదు. నేను మీతో ఎంత కాలముందునో, నాకు తెలియదు. దేవుడు నన్ను ఈ ప్రపంచము నుండి పిలువచ్చును. ఆయన నన్ను మరొక సేవకై పిలువవచ్చును. ఆయన మిమ్మును మరెక్కడికో పిలువ వచ్చును. మనకు తెలియదు.
అయితే పిలచిన దానిని కలిగి యుందుము. దీనిని మన తలలకు పైగా పోనివ్వకుడి. దానిని మనము అంగీకరించెదము. అది అక్కడ బైబిలునందున్నది. అది ఇక్కడ ప్రతి స్థలమందు రూపు చెందుచున్నది. దానిని చేయుటకు మాత్రము మనకు సమయమున్న యెడల, మీరు ఒక్క దినములో దానిని చేయలేరు. అది నాకు తెలియును. నేను ఆ కార్యమంతటిని ఏకపర్చగలను. అక్కడ ఆ వర్తమానము ద్వారా మనము పొందిన దానిని చూడండి. ఆ గోడపై పరిశుద్ధాత్మ చేసినదేమిటో మీరు చూచారు. మీరు చూడలేదా? అప్పుడు ఎందరు అక్కడ ఉన్నవారు? ప్రభువు యొక్క ఆ దూత దిగి వచ్చి అదే కార్యమును అక్కడ వ్రాసెను.
2PET 1:5,6
159చూశారా, అది సత్యము. దానిని మిమ్మును దాటి వెళ్లనియ్యుకుడి. దానిని గట్టిగా పట్టియుండుడి. చిన్న పిల్లలారా దానిపై నిలచియుండుడి. జ్ఞాపకముంచుకొనుడి, మీ విశ్వాసముపై కట్టబడి, సద్గుణముపైనను, జ్ఞానముపైనను, సహనము పైనను కట్టబడవలసియున్నది.
ఇక్కడ కాగితపు ముక్క ఒకటి నా యొద్ద ఉన్నదని తలంచెదను. నేను ప్రసంగించుచుండగా దానిని ఎక్కడో పడవేయలేదు. అదిక్కడే ఉన్నది. (వందనము సహో॥ నిండైన వందనములు.) మీరు దానిని చూచుటకు ఇష్టపడిన యెడల చూడండి. మీరు చూడగలిగినది ఇక్కడ కొంత వున్నది. అక్కడ ఉన్నదాని కన్నను మెరుగైన రూపు గలిగియున్నది. మీరు దానిని చూచి వ్రాసికొనవచ్చు. నేను దానిని ఇక్కడ గ్రుచ్చియుంచెదను. మీరు దానిని ఖచ్చితముగా చూచి వ్రాసికొనుడి.
160ఇప్పుడు మీరు దానిని తీసికొని, చదివి సరి చూడవలెనని నేను కోరుచున్నాను. ఆ తరువాత దాని ప్రకారము నడచుకొనవలెనని కోరుచున్నాను. కేవలము చదువుట మరియు సరి చూచుట కాదు గాని, జీవించవలసియున్నది. ఆ విధముగా చేయునప్పుడు నమ్మకముగా మీ కొరకు దానిని గైకొనుడి. ''ఓ, నేను దానిని వినుటలో సంతోషించాను,'' అని చెప్పకుడి. నేను కూడా చేశాను, అయితే వినుట అనునది, దానిని గైకొనుట అనునది వేరువేరుగా ఉన్నవి. చూడండి, అది వ్యత్యాసమైనది.
దేవుని రూపమును చేయుటకు ఏడు అర్హతలు కావలసియున్నది. దేవుడు ఈ సంఘమును ఆ ఏడు అర్హతలకు తెచ్చుటకై ఏడు సంఘకాలములుంచెను. ఆయన వాటిని చేయుటకు ఏడుగురు వర్తమానికులను కలిగియుండెను. అక్కడ ఎప్పుడు ఏడు, ఏడు, ఏడు అని ఉన్నవి. ఏడు దేవుని ముగింపునకు సంఖ్యగా ఉన్నది. మూడు దేవుని ఖచ్చిత సంఖ్యగా ఉన్నది, అందువలన అక్కడ మూడు మరియు మూడు ఏళ్లు ఉన్నవి. అందువలన గణితముగా, ఆత్మీయముగా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ సాక్ష్యము ద్వారా సమస్తమును ఏకమై దానిని ముగించునవి.
161మనము దానిని చదివి మన విశ్వాసముతో ఈ కార్యములను చేర్చుకొందుము. అప్పుడు మనము క్రీస్తు పూర్ణ స్వరూపమునకు రాగలము. దేవుని ప్రేమలో చేర్చబడి, దేవుని భయములో, మర్యాదలో మన హృదయములలో ఒకరికొకరము ఏకమగుదము. ఒకరికొకరము ఏకమగుదము. ఒకరికొకరము లోతైన మర్యాదను కలిగి సోదర మరియు సోదరిల పట్ల దయతో ఉండి — వికారముగా నడచుకొనకుందము — పరిశుద్ధాత్మ జీవించు పరిశుద్ధతను గాక మరొక దానిని జీవింపకుందము. ఏకముగా జీవించి ఒక క్రైస్తవునిగా ఉందాము. విశ్వాసముతో నడచెదము. దేవుని సద్గుణము మన ద్వారా ప్రవహింప చేయుదము. మంచి, చెడులకు వచ్చినప్పుడు దేవుని జ్ఞానము కలిగియుందాము…. వాక్యము కాని దానిని దయ్యము ముందుంచినప్పుడు, దాని నుండి దూరముగా వెడలిపోదుము. అది ఖచ్చితముగా చేయవలసి యున్నది.
162అపోస్తలులు మనవలె జీవించలేదని నేను ఊహించుచున్నాను. వారు ప్రపంచమంతటను వెళ్లారు గాని కొన్ని వాక్యములతో మాత్రము ప్రసంగ వేదికలపై నిలిచారు. వారు లోపలకు నడచి వారు చేయవలసిన దానిని మాత్రమే చేశారు. అంతట వెలుపలకు నడచి వెళ్ళారు. అవునండి వారు శక్తి కలిగియుండిరి. వారికి సద్గుణముండినది. మనిషితో వారికి ఎలాంటి వివాదములు లేవు, వారెక్కడ నిలచియున్నది వారెరిగియుండిరి. అంతే. వారెవరిని విశ్వసించారని ఎరిగి యుండిరి. వారు ఆత్మలో ముందుకు నడచి వెళ్లిరి. ఆత్మ ప్రకారము క్రియలు చేశారు….
గత రాత్రి నేను చెప్పినట్టు కేవలము తలలు ఊపడము మాత్రమే, మిగిలినది దేవుడు చేయును, దానిని నిలుపునది ఏదియు లేదు. వారు ఆమేన్ అని చెప్పుదురు. మనవలె అలసిపోదురు. దీనిని దానిని చేయుదురు వారు ముందుకు వెళ్లి ఎలాగునను దాని చేసి ముగింతురు. కేవలము దేవుని నుండి ఒక్క మాట చాలు, అదే దానిని చేయును, ఇదియు అలాగే యున్నది.
ఎందుకు? అది దేవుని నుండి వచ్చిన సంకేతమని వారు ఎలా తెలసికొందురు? వారికి ఈ సద్గుణములన్నియు ఉండినవి. ఈ అర్హతలన్నింటిని వారు కలిగియుండిరి. ఆ మొదటి దేవుని సంజ్ఞ వీటన్నింటిని చేయును. ఆయన వాక్యముతో సరిపోల్చుదురు. అది దేవుని వాక్యమని వారు గ్రహించెదరు. వారు మరొక దానిని గురించి చింతించవలసినది లేదు. దేవుడు మాట్లాడినప్పుడు వారు నడచి ముందుకు వెళ్లారు.
163మనము మాట్లాడిన… దేవుడు మనతో మాట్లాడును, ''మంచిది, మనము దీనిని ప్రారంభించెదము, ఈ జీవితమును జీవించగలమా అని చూతుము అని మనము చెప్పవచ్చు. మొదటిగా ఎవరో ఒకరు మిమ్మును తారుమారు చేయవచ్చు మంచిది ఖచ్చితముగా అది దయ్యమే.
ఈ ఉదయకాలము అతడు (దయ్యము) ఈ కూడికలు నుండి నన్ను దూరపర్చుటకు ప్రయత్నించుటను మీరు చూచి యుండవచ్చు. ఒకప్పుడు అది మీకును కలుగవచ్చు. ఓ, కృప కలుగును గాక! ఒక్కొక్క కూడికలో నేను పోరాడవలసియున్నది. నేను వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించవలెనన్న, మరియు కొందరు మరణించుచున్నట్లు లేక రక్షించబడలేదని, పది నిముషములలో ముప్పది ఫోను పిలుపులు వచ్చును. ''ఓ, సహో॥ బ్రెన్‌హామ్, నీవు దానిని చేయవలసి యున్నది,'' ఆ విధముగా నన్ను ఈ కూడికల నుండి దూరపర్చుటకు గాను అలా జరుగును. అయితే అక్కడొక ఆత్మ వేచి యుండును.
164గత రాత్రి నన్నొక స్థలమునకు పిలిచారు, ఒక యవ్వనస్తుడు. అతనితో సూపర్ మార్కెట్ అని మీరు పిలచు ఆ స్థలమందు మాట్లాడుచున్నప్పుడు అది కొన్ని సంవత్సరముల క్రితము జరిగినది. అతడొక త్రాగుబోతు, నాకు ఆ బాలుడు తెలిసినవాడు. అతడొక మంచి పిల్లవాడే, అయితే అతడొక పాపిగా ఉండెను. అందునిమిత్తము అతని తల్లి నాకు కబురు చేసినది. ఆమె సహో॥ డాక్‌ను మొదటిగా పిలిచినది, ఆ తరువాత బిల్లీని పిలిచినది, చివరిగా నాకు కబురు చేసినది.
నాకు ఆ సందేశము అందినప్పుడు నేను బాలుని చేరుటలో నా జీవితములో ఎప్పుడు గాని అంత పోరాటము ఏర్పడినది లేదు. చివరికి నేనా స్థలము చేరినప్పుడు, ఆ పేద బాలుడు నన్ను మరచిపోయాడు. అక్కడతడు స్మారకము లేని స్థితిలో పడియున్నాడు, ఆ విధముగానే పోవుచున్నది; అతని తండ్రి ఆ బాలును సర్దుచూ ఇలా చెప్పుచున్నాడు, ''హనీ'' ఈ మనుష్యుడు సుమారు 51 సం॥ల వయస్సుగల వ్యక్తి. ''హనీ, అలాగే పడియున్నావు,'' అని చెప్పుచూ అతనిని లేపుటకు ప్రయత్నించుచున్నాడు.
ఆ బాలుని చుట్టు తన వృద్ధ చేతులుంచి ఎత్తుచున్నాడు. ఆ బాలుని క్యాన్సర్ ఎంతగా ఆవరించి యున్నదనగా, అంతయు క్యాన్సర్ మయముగా ఉన్నది. అతని శరీరమందున్న సమస్త భాగములకు క్యాన్సర్ ఆవరించి యున్నది. అతని రక్త ప్రసరణలో కూడా క్యాన్సర్ ఏర్పడినది. అక్కడ ఆ విధముగా ఆ వృద్ధుడు అతనిని మోయుచు ప్రయత్నించుచున్నాడు.
165నేనా బాలుని నా చేతిలోనికి తీసికొని ''ఉడ్‌రో, ఉడ్‌రో నేను బ్రెన్‌హామ్‌ను వచ్చి యున్నాము,'' అని చెప్పాను.
అప్పుడతని తండ్రి, ఉడ్‌రో, సహో॥ బిల్, నీకు తెలియదా, ఇదిగో సహో॥ బిల్ ఇక్కడున్నాడు'' అని చెప్పాడు.
అప్పుడతడు ''ఆ, ఆ, ఆ,'' అంటూ పలికాడు.
అప్పుడతని తండ్రి, నా ప్రక్కగా చూచి ఇలా చెప్పాడు. ''బిల్లీ, నీవు కొద్దిగా ఆలస్యము చేశావు.''
అప్పుడు నేను ''ఆలస్యము కాలేదు'' అతడిక్కడే వున్నాడు, అని చెప్పాను. అప్పుడు మరి కొందరు యవ్వనులతో నాకు పోరాటమేర్పడినది. (వారు పాపులుగా ఉన్నారు) వారక్కడ నిలచియున్నారు. వారు అతని బంధువులుగా ఉన్నారు. అప్పుడు నేను, ''ఇదిగో పిల్లలారా, మిమ్ములను సిద్ధపర్చుకొనుడి, ఎందుకనగా మీరీ స్థలమునకు వచ్చియున్నారు. మీరిక్కడకు క్యాన్సర్ వ్యాధితో వచ్చి యుండకపోవచ్చు. అయినను మరేదో మరణకరమైనది మిమ్ములను ఆవరించి యున్నది. మీరా స్థితికి వచ్చి యున్నారు,'' అని చెప్పాను.
మేము వారితో మాట్లాడుచు, ఆత్మ ఏమి చేయబోవుచున్నాడని మౌనముగా వేచి యున్నాను. మొదటిగా నేను గ్రహించనదేమనగా, ఆ మెల్లని స్వరమును విన్నాను. అప్పుడు, ''నీ చేతులను అతనిపై ఉంచుము.''
అప్పుడు నేను లేచి వెళ్లి ''మీరందరు తలలు వంచుడి,'' అని చెప్పాను. వారందరు తలలు వంచారు. (అక్కడ ఇద్దరు లేక ముగ్గురు యవ్వనస్థులున్నారు) నా చేతులను అతనిపై ఉంచి, నేనిలా చెప్పాను ''ప్రభువైన దేవా, ఈ బాలుడు తాను చేయునదేమిటని ఎరుగునట్లు స్మరణను దయచేయుము. అతడు దానిని ఎదుర్కొనవలసి యున్నది. అతడు మరణించుచున్నాడు. దయ్యము అతనిని ఆవరించి స్వాధీనము చేసికొన్నది, అతడు వెళ్లిపోవుచున్నాడు. అతడు తనకు మరణము కలుగనంత వరకు త్రాగియున్నాడు. అతడిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు. అతనికి కృప చూపుమని నేను ప్రార్థించుచున్నాను.'' నేను అతని కొరకు ప్రార్థించిన తరువాత, మరుసటి ఉదయము, అతడు తన తండ్రితో కూర్చొని మాట్లాడుచుండెను.
166బస్టీ రాడ్‌గెర్ అను సహోదరుడు కొంతకాలము క్రితము ఇక్కడ ఈ హాస్పిటలుకు నన్ను పిలిచినప్పుడు, ఆ రోజు మిడిల్ టౌన్‌లో ప్రసంగించి మరొక చోటికి వెళ్లియంటిని. అక్కడే ఆ చిన్న జార్జియా కార్టర్ అను అమ్మాయి (9 సం॥లుగా పడకపై ఉండి) స్వస్థతను పొందినది. అది మీకందరికి జ్ఞాపకమున్నది.
అక్కడ సహో॥ స్మిత్ కూడా ఉండెను, ఆయన ఒక మెథడిస్టు ప్రసంగీకుడు. ఆయనిలా చెప్పాడు, ''ఎవరైనను ఎప్పుడైనను యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందారా? నా గుడారము నుండి వెళ్లిపొమ్ము,'' అని చెప్పాడు. ఆ విధముగా అక్కడ 'టోటెన్స్ ఫోర్డ్ లో కూడికలు జరుగుచుండినవి. ఓ, మీరు తలంచు ప్రతిదానికైనన్ను త్రోసి వేయుచున్నారు, అయితే నేను ఒక్క మాటయైనను పలుకలేదు. మౌనముగా ముందుకు వెళ్లాను.
నేను చేయవలసిన కార్యము దేవునిచే చెప్పబడియుండినది. దేవుడు నాకు ఒక దర్శనము చూపినప్పుడు అక్కడ ఒక గొర్రెపిల్ల ఆ అడవిలో ఒక చోట చిక్కుకొని యుండినది. మీకందరికి ఆ దర్శనము జ్ఞాపకముండవచ్చునని నేను తలంచుచున్నాను. మీకు జ్ఞాపకమున్నదా?
167మంచిది, మేము వేటాడుకొంటూ అడవిలోకి వెళ్లాము.
మేము టోటెన్స్ ఫోర్డ్ అను స్థలములో ఉన్న సహో॥ రైట్ దగ్గరకు వెళ్లాము. ఏమి చేయుటకు తోచలేదు. నేనొక చిన్న సబ్బు పెట్టె కొన్నాను. నేను బయటకు వెళ్లుటకై అక్కడ నిలుచున్నాను. ఆ మెట్టుపై నిలిచి ప్రసంగించాను. అతడు ఆ కొండ పైకి కొంత పనికై వెళ్లాడు. ఆయనతో నేను కూడా వెళ్లాను. అక్కడ ఒక పెద్ద బాప్టిస్టు సంఘము ఖళీగా ఉండినది. ''అక్కడ నిలువుము,'' అని ప్రభువు చెప్పెను.
అప్పుడు నేను, ''సహో॥ రైట్ నన్నిక్కడ ఉండనివ్వండి,'' అని చెప్పి, అక్కడే నిలిచాను. అతడేమో పైకి వెళ్లి తన కార్యమును ముగించుకొని వచ్చాడు. నేను ఆ సంఘము నొద్దకు వెళ్లానేగాని దాని తెరువలేకపోయాను, అప్పుడు నేను, ''ప్రభువా, ఇక్కడ నీవుండి, నన్ను ఆ సంఘములోకి వెళ్లమనిన యెడల నా కొరకై దానిని తెరువుము,'' అని చెప్పాను. అక్కడే క్రింద కూర్చొని నేను చింతించుచు ఉండిపోయాను.
నా ప్రక్కగా ఎవరో నడచుకొంటూ వస్తున్నారు. అప్పుడా వచ్చిన వ్యక్తి ''ఏలాగున్నావు, ఈ సంఘములో ఉండుటకు ఇష్టపడుచున్నావా?'' అని అడిగెను.
అప్పుడు నేను ''అవునండీ,'' అని చెప్పాను.
''నా వద్ద తాళపు చెవి ఉన్నదని,'' అతడు చెప్పాడు.
అంతట అక్కడ ఒక కూడికను ప్రారంభించాను, ఆ మొదటి వారములో ఎవ్వరూ రాలేదు. ఆ మొదటి రాత్రి సమాజముగా కూడినవారు, సహో॥ రైట్ మరియు అతని కుటుంబము మాత్రమే. మొదటిగా మీరు తెలిసికొనవలసినది ఆ వారపు చివరలో వారు పొలములలో నిలువలేకపోయారు. అయినను ఆ గొర్రెపిల్ల రాలేదు. ఆ సమయములోనే సహో॥ హాల్ రక్షింపబడెను. అతనే ఇప్పుడు అక్కడ కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎక్కడున్నదో నేను కనుగొనలేక పోవుచున్నాను.
ఆ తరువాత ఆ కొండ క్రింద వున్న క్రీస్తు సంఘములో గత తొమ్మిది సంవత్సరముల ఎనిమిది మాసములుగా కదలలేక పడియుండిన చిన్న అమ్మాయి ఉన్నది. ఆ కథ మీకందరికి తెలియును.
ACTS 2:38
168అవునండి.
ఆ మధ్యహానము సహో॥ బస్టీ రాడ్‌గెర్ (ఒక గొప్ప, బలమైనవాడు) అక్కడ నిలచియుండెను. నేను వెలుపలకు వచ్చినప్పుడు నన్ను పరిహసించుటకై సహో॥ స్మిత్ తన సమాజముతో అక్కడ నిలచియుండెను, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుచున్నందుకు ఆయన ఆ విధముగా పరిహసించెను.
ఆ విధముగా అక్కడున్న అడుసు నీళ్లలో నడచి వెళ్లాను, అక్కడ వారు సందడిగా అధిక శబ్దముతో మాటలాడుచుండిరి. ఇద్దరు సంఘ పెద్దలు నాతో నడచివచ్చిరి. నేను దేవుని పరిశుద్ధ గ్రంధమునకు ప్రతినిధిగా ఇక్కడ నిలచియున్నాను," అని చెప్పుచూ, బైబిలులో పేతురు చెప్పిన స్థలమందు చదివాను, ''మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు,'' అని వ్రాయబడిన భాగమును చదివి, బైబిలును మూసి, ప్రక్కనున్న పెద్ద చేతికిచ్చాను.
అక్కడ నిలచి వారి పాపముల నిమిత్తము ఎవ్వరు మారుమనస్సు పొందుదురో వారు వచ్చెదరు, అని చెప్పి ఆ నీటిలోనే నడచి వచ్చాను. అప్పుడు నేను, ''దేవదూతలు ప్రతి కొమ్మపై యుండి చూచుచున్నారని," చెప్పాను.
169ఓ, మై! నేను ఇద్దరు ముగ్గురికి బాప్తిస్మమిచ్చు సమయములో అతని సమాజమంతయు ఆ పట్టుబట్టలు ధరించిన స్త్రీలు అక్రందన చేయుచు నీటి యొద్దకు వచ్చారు. (బాప్తిస్మము పొందుటకు) అతని సమాజము నంతటికిని నేను యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మమిచ్చాను! అది మీకును తెలియును. నా యొద్ద ఆ చిత్ర పఠమున్నది.
అక్కడది ఉన్నది అది ఏమిటి? మీ సద్గుణముతో చేరునదైయున్నది. దానిని అలాగే ఉండిపోనియ్యుడి. దానిని ఎలా చేయాలో దేవుడెరిగి యున్నాడు. ఈ కార్యములను ఏ విధముగా నెరవేర్చవలెనని దేవుడెరిగి యున్నాడు. వారికేమి కావలెనో, వారిని చెప్పనివ్వండి. ఏ వ్యత్యాసము చేయవద్దు. దానిని అలాగే వెళ్లనివ్వండి.
బస్టీ రాడ్‌గెర్ సోదరుడు అక్కడే నిలచి దానిని చూచునప్పుడు, అతడిలా చెప్పాడు, ''నేను నా పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను.'' మంచి బట్టలు ధరించి నీటి నుండి వెలుపలకువచ్చాడు. అతడు యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందెను.
ISA 53:5•
1PET 2:24
170మూడు, నాలుగు సంవత్సరముల క్రితము న్యూ ఆల్బ్‌నీలోని ఆసుపత్రికి నేను పిలువబడినప్పుడు. అక్కడ అతడు కాన్సర్ వ్యాధి చేత మరణించుచున్నాడు, కేవలము అది అతనిని తినివేసినది. మరసటి ఉదయము వరకు బ్రతుకవచ్చునని డాక్టర్లు సమయమిచ్చారు. ''అతడప్పుడే మరణించుచున్నాడు, తక్షణమే రావలసినదని,'' అతడు తెలియజేశాడు.
ఆ గదికి నేను వెళ్లాను. అప్పుడు నేను అక్కడ నిలచి ప్రార్థించుచున్నప్పుడు ''బిల్లీ, ఆ మూలముగా ఒక వర్షధనస్సు కనబడుచున్నది,'' అని చెప్పాడు.
చూచుటకు అటుగా నేను తిరిగినప్పుడు ''బస్టీ, అది ఒక నింబంధన నీవు మరణించవు. ఆ రక్త నిబంధన నిన్ను రక్షించును,'' అని చెప్పాను. అతని పైగా చేతులుంచి ''ప్రభువైన దేవా, ఆ సమీప దర్శనము ద్వారా నీవిక్కడ ఉన్నావని నిరూపించబడినది. అది నీ నిబంధనగా ఉన్నది. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది'' అని ప్రార్థించాను. అతనిపై చేతులుంచినప్పుడు అతడు స్వస్థతను పొంది ఇంటికి వెళ్లిపోయాడు.
171నాలుగు లేక ఐదు సంవత్సరములు క్రితము - నాలుగు సంవత్సరముల క్రితము - అక్కడ నదిలో చేపలు పట్టుచుండగా అంతయు సాఫీగా వెళ్లుచుండినది. మరియు క్యాన్సర్ వ్యాధి గర్భములోని ''ఇసొఫాగస్'' భాగమంతటిని చుట్టుకొని, కలిసిపోయినది. అది ఒక పెద్ద ముడిగా ఏర్పడి ఉన్నది. ఆసుపత్రిలోని మేధావులు కోబాల్టు చికిత్స ఇవ్వాలని చెప్పారు, అధిక ఆహారమును ఇవ్వవలసి యున్నదని చెప్పారు. (అతడు నిదానముగా భోజనము చేయవలసియున్నది. అందువలన అది అతనికి కష్టమనిపించినది) దానిని చేయుటకు అతడు వెళ్లాడు. అతడక్కడ ఉండెనని నాకు తెలియదు.
వారు అతనికి ఆపరేషన్ చేసి దానిని కనుగొనినప్పుడు అతడు విలవిలలాడిపోయాడు. అతనికి గుండె పోటు ఏర్పడినది. అతని ప్రక్క పక్షవాతముతో దెబ్బ తిన్నది. అతడు సగము మాత్రము ఆక్రందన చేయగలిగాడు. అతడు (డాక్టరు) ఒక పెన్సిలు లాంటి దానిని గైకొని అక్కడకు వెళ్లాడు. ''ఉహ్, ఉహ్, ఉహ్'' అంటూ వెళ్లి, వ్రాయుటకు ప్రయత్నించాడు. అతని చేతిని విదిలించాడు. అతని చేయి…. ''యేసు పందొమ్మిది వందలకు పైగా రక్షించాడని,'' చెప్పాడు గాని, అతడు దానిని పొందలేకపోయాడు.
అప్పుడు అతని భార్య ఇలా చెప్పినది, ''సహో॥ బ్రెన్‌హామ్ దాని ద్వారా అతడు దేనిని భావించుచున్నాడో తెలియకున్నది.'' అప్పుడు నేను ''శ్రీమతి. రోడ్‌గెర్స్'' అతడు భావించునదేమనగా 1900 మంది రక్షించబడి యేసు (క్రీస్తు) నామములో అక్కడ బాప్తిస్మము పొందారు. అదే. ఇప్పుడు ఇక్కడ చెల్లించబడుచున్నది. అతడు మరణించుటకు భయపడుట లేదు.
అప్పుడు నేను ''ప్రభువైన దేవా, అతనికి జీవము నిమ్ము! యేసు నామములో అతనికి జీవము నిమ్మని ప్రార్థించుచున్నాను,'' అనుచు నా చేతులను అతనిపై ఉంచాను. ఆ గుండె పోటు అతనిని విడచిపోయినది, ఆ కంపన తగ్గిపోయినది. అతడు తన పడకనుండి లేచాడు, మరియు ఇప్పుడతడు తన సాక్ష్యములను ఇచ్చుచు అక్కడున్నాడు.
2PET 1:5-7
172మీ విశ్వాసముతో సద్గుణమును చేర్చుడి; మీ సద్గుణముతో జ్ఞానమును చేర్చుడి; మీ జ్ఞానముతో, ఆశానిగ్రహమును చేర్చుడి; మీ ఆశానిగ్రహముతో, సహనమును చేర్చుడి; మీ సహనముతో, దైవభక్తిని చేర్చుడి; మీ దైవభక్తి సహోదర ప్రేమను; మీ సహోదర ప్రేమతో పరిశుద్దాత్మను చేర్చినప్పుడు క్రీస్తు వచ్చును; ఎందుకనగా ఆయన క్రిందుగా పరిశుద్దాత్మ ఉన్నది, అది యేసుక్రీస్తు యొక్క ఆత్మయై యుండి, సంఘము లోనికి ఈ సద్గుణములను తెచ్చుచున్నది.
(ఓ, మై. ఇప్పుడు సమయము 12:15 గం॥లయినది.)
నేనాయనను ప్రేమించుచున్నాను.
నేనాయనను ప్రేమించుచున్నాను.
ఏలయనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను.
(మీరు జన్మించుటకు మునుపే)
మరియు నా రక్షణను ఆకల్వరి వృక్షముపై కొనెను.
(ఆయన ఏమి చేసెను?)
నా రక్షణను కొనెను.
అదెలా నాకు తెలియును? ఎందుకనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను.
నేనాయనను ప్రేమించుచున్నాను.
నేనాయనను ప్రేమించుచన్నాను.
ఏలయనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను.
(అక్కడే ఆ కారణమున్నది.)
నా రక్షణను ఆ కల్వరి వృక్షముపై కొనెను.
173ఈ ఉదయము నా హృదయమంతటితో నేనాయనకు ప్రమాణము చేయునదేమనగా, ఆయన కృప చేతను, ఆయన సహాయము చేతను నశింపక, అనుదినము బలము పొందుచు, ప్రతి ఒక్కరి అవసరతలు, ఈ నా చిన్న వృద్ధ స్వరూపము ద్వారా ప్రవహించునంత వరకు ప్రార్థించెదను. ఒక జీవించు క్రీస్తు రూపమునకు వచ్చు వరకు ఎందుకనగా అతడు నా కొరకు పాపమాయెను, దానిని బట్టి నేను దేవుని నీతిగా మార్చబడితిని. ఆయన నా స్థానమును తీసికొనెను. ప్రభువా, ఇప్పుడు నన్ను ఆయన స్థానమును తీసికొననిమ్ము, అందు నిమిత్తమే ఆయన మరణించెను.
ఎందరు దేవుని కృప చేత ఋణపడియున్నారు? ఇప్పుడు మనము చేతులెత్తి ప్రార్థించుదము.
నేనాయనను ప్రేమించెదను (నేను దానిని పణముగా
ఉంచుచున్నాను. ప్రభువా, ఈ పూర్తి సంఘము
పణముగా ఉంచుచున్నది; ఆ పూర్తి యేసు స్వరూపము.)
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను;
నా రక్షణను ఆ కల్వరి వృక్షముపై కొనెను.