ఒక మార్గదర్శి
VGR COUNT-173 1నెవిల్ సోదరుడా, ప్రభువు నిన్ను దీవించు గాక. ఈ రాత్రి మరలా ఈ సంఘములో చేరుట ఎంతో సంతోషము. స్వరములో కొద్ది రాపిడున్నది. ఈ ఉదయ కాలము అతి దీర్ఘ ప్రసంగము చేయుట వలన ఏర్పడినది. అయినను అది ఇక్కడుంటలో నేనెంతో సంతోషించుచున్నాను. ఆ ప్రసంగమును తెచ్చుటలో ఎంతగానో సంతోషించాను. మరియు దానిని విమటలో మీరును సంతోషించుదురని విశ్వసించుచున్నాను.
MATT 7:16,20•
EPH 4:30•
2PET 1:5
2ఇప్పుడు మరచిపోకండి, అయితే ఎల్లప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనండి. ఈ కార్యములే క్రీస్తు సేవకుని కట్టునవిగా ఉన్నవి. చూడండి, మొదటిగా విశ్వాసము, అంతట సద్గుణము. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, ఈ కార్యములు పరిశుద్ధాత్మ చేత జరుపబడకున్న యెడల పరిశుద్ధాత్మ దేవుని కట్టడముపై అమర్చబడుటకు వీలు లేదు, చూశారా. మీరు ఏమి చేశారని కాదు, చూడండి, ఆ కార్యములు క్రీస్తు శరీరమును కట్టునవిగా ఉన్నవి, చూచారా, ఆ కార్యములే. ఇక్కడ మొదటిదిగా విశ్వాసమని మరచిపోకుడి. సద్గుణము, జ్ఞానము మొదలగునవి దానితో చేర్చబడవలసియున్నది. క్రీస్తు పరిపూర్ణ స్వరూపము రూపించబడు వరకు ఇవి చేర్చబడవలసియున్నది. ఆ తరువాత పరిశుద్ధాత్మ ఆ శరీరముపై వచ్చి దానిని ఒక్క శరీరముగా ముద్రించుచున్నది. ఇవి ఖచ్చితముగా ఉండవలసి యున్నది.
అందువలననే యేసు ఇలా చెప్పెను, "వారి ఫలముల వలన వారు తెలియబడుదురు." చూశారా, ఫలము! ఈ క్రియలు లేకున్నయెడల ఫలములను నీలో కలిగి యుండలేవు. ప్రపంచపు స్థానములను దైవభక్తి లేని ఆయా స్థానములను గైకొనినప్పుడు సమస్త అవిశ్వాసము త్రోసివేయబడును. అప్పుడు ఈ ప్రపంచపు కార్యములన్నియు తొలగిపోవును. అంతట క్రీస్తులో కొత్త జీవితము గాక మరొకటి యుండదు.
అప్పుడు ఎఫెసి 4:30 చెప్పునదేమనగా, "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు, ఆయన యందు మీరు ముద్రింపబడియున్నారు." దేవుని రాజ్యములోనికి ముద్రింపబడియున్నారు! ఇప్పుడు, దీనిని మరచిపోకుడి. దీనిని మనస్సునందుంచుకొని, వీటిని మొదటిగా గైకొనుడి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు ముద్రగా ఉన్నాడు. ఈ శరీరము నందు మనలను ముద్రించు ముద్రగా ఉన్నాడు. మంచిది.
3చికాగో పట్టణము నుండి వచ్చిన లిటిల్ సోదరి యొక్క విన్నపమున్నది. ఆమె భర్త ఒక కారు ప్రమాదములో చిక్కుబడి మరణ స్థితిలో పడియున్నాడు. సోదరి లిటిల్ మరియు ఎడిత్ రైట్ అను సోదరి ఎంతో కాలముగా మనకు తెలిసినవారు. ఈ రాత్రి ఆమె తన ఇంట్లో కష్టస్థితిలో ఉన్నది. మనమందరము కలసి ప్రార్థించునట్లు వారి విన్నపములను సంఘమునకిచ్చారు. ఇప్పుడు ఒక్క క్షణము మనము తలలు వంచుదము.
4మా ప్రియమైన పరలోకపు తండ్రి, మేము దేవుని సింహాసనము చుట్టూ విశ్వాసముతో చేరియున్నాము. మేము ఈ విన్నపముల కొరకు దైవిక కృపను కోరుచున్నాము. సోదరుడు లిటిల్ కారు ప్రమాదములో మరణమును సమీపించియున్నాడు. దేవా, అతనికి సహాయము చేయుము. పరిశుద్ధాత్మ అతని పడక ప్రక్కగా నిలచి అతనిని మరలా మా మధ్యకు కొనివచ్చును గాక, ప్రభువా. అదే విధముగా ఎడిత్ రైట్ అక్కడున్నది. దేవా, నేను ప్రార్థించుచున్నాను. పరిశుద్ధాత్మ ఆమె పడక ప్రక్క నిలచి ఈ రాత్రి ఆమె ఆరోగ్యమును ఆమెకు మరలా దయచేయును గాక. దయచేయుము తండ్రి. ఈ కార్యములన్నింటిని నీవు మాకు వాగ్దానము చేశావు, మేము వాటిని నమ్ముచున్నాము. ఈ ఉదయ కాలము మేము తలంచుచుండినట్లు దూరమనునది నీకేదియు లేదు. నీవు ప్రపంచపు ఒక ప్రక్క ఎంత గొప్పవాడవో మరో ప్రక్క కూడా అంత గొప్పవాడవే, ఎందుకనగా నీవు సర్వవ్యాప్తివిగాను, సర్వాంతర్యామివి గాను మరియు నిత్యుడవుగా ఉన్నావు. తండ్రి, ఈ విన్నపములను యేసుక్రీస్తు నామములో దయచేయుమని ప్రార్థించుచున్నాము. ఆమేన్.
5ఈ రాత్రి ఇక్కడుండుట కూడా ఎంతో సంతోషముగా ఉన్నది. చాలా వేడిగా ఉన్నదని నేనెరుగుదును. ఇవి ముందు కొనసాగు కూడికలుగా ఉన్నవి. మరియు అవి… మీలో అనేకులు ఇప్పటి నుండి ఉదయము వరకు ఎన్నో మైళ్ల దూరము, ఐదు వందల మైళ్ల దూరము కూడా ప్రయాణించవలసి యున్నది. రేపటి దినము తరువాత నేను పదు నాలుగు వందల మైళ్ల దూరము ప్రయాణము చేయవలసి యున్నది. అందువలన, నేను నమ్మునదేమనగా ఇది మనకు ఒక గొప్ప సమయముగా ఉన్నది. మిమ్ములను దర్శించుటలో నాకును ఒక గొప్ప సమయమై యున్నది. అక్కడ ఒక కార్యమును మాత్రము మనకు విన్నపము, చేశారు. అదేమనగా అనేకులు, స్థలము లేనందున తిరిగి వెళ్లిపోయారు. మనము ఆ (కుర్చీలను) ఎక్కువ దగ్గరగా క్రిక్కిరిసి వేయలేము. అగ్నిమాపక దళము అందుకు అంగీకరించదు, అందువలన దీనికన్నను పెద్దవిగా నుండు స్థలము కొరకు ప్రయత్నించుచున్నాము. అందువలన మనము లోపలకు వచ్చినప్పుడు గదిలో కూర్చొనుటకు ప్రజలకు కావలసిన కుర్చీలుండును.
6ఇప్పుడు, ఎప్పుడైనను, ఏ సమయమందైనను మీరు ఈ గుడారమునకు (ఆలయమునకు) ఆహ్వానించబడుచున్నారు. ఇక్కడ క్రీస్తు కాక మరొక సిద్దాంతము లేదు, ప్రేమ తప్పు చట్టమనునది లేదు (కట్టడలు లేవు). బైబిలు కాక మరొక గ్రంథము లేదు, అందువలన ఇక్కడ మన కాపరి సహోదరుడు ఆర్మన్ నెవిల్ అనేక స్థలముల నుండి వచ్చు ప్రజలు అన్ని సంస్థల వారు కలిస్తే గుడారముగా ఇది యున్నది. ఇక్కడ మీ మనసాక్షి ప్రకారము మీరు దేవుని ఆరాధింప వచ్చును. మీరు ఇక్కడుండుటలో మేమెంతో సంతోషించించుచున్నాము. కావున మీకు వీలు కలిగినప్పుడెల్ల మీరు రావచ్చును. మిమ్మును ఆహ్వానించుటలో, మేము సంతోషించుచున్నాము.
నాకు తెలిసినంత వరకు సంఘము పూర్తిగా కట్టబడిన తరువాతనే మరొకసారి మనమందరము కలిసికొను సమయముగా ఉండునని నాతో చెప్పబడి యున్నది. ఆ తరువాత అనగా సంఘ కాలముల తరువాత ఆ చివరి ఏడు ముద్రలకు వెళ్లుదము. ఆ చివరి ఏడు ముద్రలు ప్రకటన గ్రంథమందున్నవి. వాటిని బోధించవలసి యున్నది.
7ఇప్పుడు అనేక సమయముల యందు వ్యాధి గలవారు బాధలలో ఉన్నవారు వచ్చుచుందురు. మరియు ఈ కూడికలలో దర్శనములు చూచువారు వాటి వివరములు కోరుచు వచ్చెదరు. కొందరు ప్రత్యేక పరిచయులు కొరకు వచ్చెదరు. ఆ కార్యములలోకి నేను వెళ్లినప్పుడు, వారి మధ్య ఆ వత్యాసమును కనుగొనలేను. ఆ తరువాత మాట్లాడుట ఎంత కష్టమో మీరెరుగుదురు. మీ యొక్క స్వస్థత కూడికలలో జరుగు దానిని ప్రతి ఒక్కరు ఎరుగుదురు. సహోదరుడు బాక్స్టెర్ లేక ప్రసంగించు మరికొందరికి ఇది తెలియును. నేను వ్యాధిగా ఉన్నవారి కొరకు వచ్చాను. ఎందుకనగా, అది కొంచెము శౌర్యముతో కూడినది. కొంత సమయమునకు ముందు నేను కొందరి కొరకు ప్రార్థించుచుంటిని. అప్పుడు నేను ఒక చిన్న బిడ్డను చూచాను. ఆ బిడ్డను డాక్టర్లు … ఆ బిడ్డ వెనుక ప్రక్క ఏదో ఏర్పడినది. ఏదో ఒక విధముగా ఏర్పడి వెలికి వచ్చినది. ఒక విధముగా అది అక్కడుండుట నేను చూచాను. ఆ బిడ్డ ఆ విధముగా అవిటితనముతో ఉండనేరదు, ఆ బిడ్డ స్వస్థత పొందనున్నది. నిశ్చయముగా, స్వస్థత పొందును, చూశారా. అది నాకు తెలియును. చూడండి, నేను నిజస్థితిని తెలుపుచున్నాను. అందువలన మన విశ్వాసమును దేవునిపై ఉంచి ఆయనను నమ్మవలసి యున్నది.
8మీలో ప్రతి ఒక్కరు, లేక మీలో అనేకులు నాకు కొత్తవారుగా ఉండవచ్చు, సేవకులందరు మరియు మొదలగువారు. నేను పొరబడుతున్న యెడల ఈయన సహోదరుడు కేస్ అని తలంచెదను. అది నిజమేనా? కేస్ సహాదరుడా నేను మీతో క్షమాపణ చెప్పుకొనవలసి యున్నది, ఎందుకనగా ఆ అభిషేక ఆరాధనకు నేను కలసికోలేకపోయాను. బహుశా వారపు చివరి కూడికలకు నేనక్కడకు వచ్చెదను. అది మంచిదిగా ఉండును. ఇక్కడున్న కొందరు, సేవకులని నేను తలంచెదను.. మీరు ఒక సేవకులా? అవునా. దేవుడు మిమ్ము దీవించు గాక. ఇక్కడ ఈ కట్టడములో ఎందరు సేవకులున్నారో మీ హస్తములను చూపుడి. మంచిది. అది చక్కగా ఉన్నది. మీరు ఇక్కడుండుటలో మేము ఎంతో సంతోషించుచున్నాము. అది ఎంతో సంతోషము. దేవుడు మిమ్మును ఎల్లప్పుడు దీవించును గాక!
9"ఇప్పుడు, మనము త్వరగా ముగించుకొని వెళ్లిపోదము. మీలో కొందరు జార్జియా, పట్టణమునకును, టెన్నెస్సీ పట్టణమునకును, న్యూయార్కు పట్టణమునకును, మరి అనేక స్థలములకు వెళ్లవలసియున్నది. ఈ రాత్రి నుండి మీ ప్రయాణములను కొనసాగించవలసి యున్నది. రహదారులలో వెళ్లునప్పుడు జాగ్రత్తతో కారును నడపండి. మీరు నిద్రావస్థలో ఉన్న యెడల విడిదికి వెళ్లుటకు ఇష్టపడని యెడల, రోడ్డు ప్రక్కగా కారును నిలిపి కొంత విశ్రాంతి తీసికొని నిద్రించి (ఆ తరువాత ప్రయాణమును కొనసాగించండి). నేను ఆ విధముగానే చేయుదును. చూశారా, ప్రయాణమును నిలిపి నిద్రించండి. మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు కారును నడపకండి. అది కాని కార్యము. మీరు కాదు మీ వెనుక వచ్చు వారిని మీరు గమనించవలసి యున్నది, చూశారా. మీరెక్కడకు వెళ్లుచున్నారో మీరెరిగి యున్నారు. అతడెక్కడకు వెళ్లనై యున్నాడో మీరెరుగరు. కావున మీరు ఆ వెనుక వచ్చు వారిని గమనించవలసి యున్నది, అందువలన అన్నివేళలలో మీరు మెలుకవగా ఉండి దానిని గమనించవలసి యున్నది.
JOHN 16:7-15
10ఇప్పుడు, పరిశుద్ధ యోహాను గ్రంధములోని వాక్యమందు ఒక భాగమును చదువుదుటకు నేను ఇష్టపడుచున్నాను. ఇప్పుడు, మనము చదువు ఈ కొద్ది లేఖన భాగములు, మనము చెప్పుదానికి ప్రారంభముగా ఉన్నవి. ఎప్పుడైనను నేను ఈ వేదిక దగ్గరకు వచ్చునప్పుడు ఏదో చెప్పుటకు గాను వచ్చుట లేదు. నేను అన్ని సమయముల యందు వేచియుండి గమనించుచు, వాక్యమును చదివి ప్రార్థించి, ప్రజలకు ఇది సహాయపడునని తలంచు వరకు ధ్యానించెదను. నేను మీకు ఒక సహాయముగా లేకున్న యెడల, నేనిక్కడ నిలుచుటలో ఏ ప్రయోజనము లేదు, చూశారా. కేవలము సహాయపడుటకు మాత్రమే నేనున్నాను! బహుశా ఈ రాత్రికి అనేకులు వెళ్లిపోయెదరు. వారి వారి గృహములకు వారు వెళ్లవలసి యున్నది. అయితే ఈ రాత్రి మీరు ఇక్కడ నిలచి ఉన్నట్లయిన ఒక నలుబది-ఐదు నిమిషములు మాత్రమే నేను మీతో చెప్పినట్లు, మీకు సహాయముగా ఉండునట్లు కొంత మాట్లాడవలసి యున్నది. ఇప్పుడు, మనము యోహాను 16వ అధ్యాయమును ఆధారముగా చేసికొని మాట్లాడనై యున్నాము. 16వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రారంభించేదము. 15వ వచనము వరకు చదువుదము.
"అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను; నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీ యొద్దకు పంపుదును.
ఆయన వచ్చి పాపము గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును.
లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు,
నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరికి నన్ను చూడరు;
గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును.
నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియుజేయును.
ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.
తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెయజేయునని నేను చెప్పితిని."
JOHN 16:13•
HEB 4:12
11ఇప్పుడు 13వ వచనమందు, "అయితే ఆయన, అనగా - సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును." సత్యమనగా ఏమిటి? వాక్యమైయున్నది. "ఆయన తనంతట తానే యేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగులను మీకు తెలియజేయును." మరొక విధముగా చెప్పవలెననిన, ఆ కార్యమును బయలుపరచువాడు ఆయనే. మీరు చూశారా. హెబ్రీ 4వ అధ్యాయములో బైబిలు చెప్పెను, "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలముగలదై, రెండచులుగల యెటువంటి ఖడ్గము కంటెను, వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది," చూశారా. దానిని చేయునదేమిటి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చు పరిశుద్ధాత్మయే వాటిని చేయుచున్నది.
12అందువలన రానున్న కొద్ది నిమిషములు, "మార్గదర్శి" అను వాక్యముపై మీ మనస్సును ఉంచవలసినదిగా నేను కోరుచున్నాను. "ఒక మార్గదర్శిగా'' అడవులలో నాకు చాలినంత అనుభవమున్నదని మీకు తెలియును. ఆ చుట్టు ప్రక్కలను చూపుటకు మార్గదర్శి ఒకరుండెదరు. మీరెక్కడకు వెళ్లవలెనని మీరెరుగునప్పుడు మీకొక మార్గదర్శి కావలసియున్నది. వేటలో అలవాటు పడియున్నందున ప్రపంచమంతట తిరుగునప్పుడు అనేకమంది మార్గదర్శకులను కలసికొను అవకాశమును నేను కలిగియుంటిని. కోలరాడో అడవులలో నేనొక మార్గదర్శిగా ఉంటిని, ఎందుకనగా ఆ దేశపు పరిధులను ఎరిగినందున కొలరాడోలో ఒక మార్గదర్శిగా నుండగలిగితిని.
13ఇప్పుడు, ఒక మార్గదర్శి మార్గమును ఎరిగినవాడై యుండవలెను. అతడెక్కడకు వెళ్లుచున్నాడో అతడేమి చేయుచున్నాడో, దారి వెంబడి ఎట్టి జాగ్రత్తను తీసికొనవలెనో ఎరిగియుండవలసి యున్నది, చూశారా. మీరు దేనిని పోగొట్టుకొనకుండునట్లు అతడు చూడవలసియున్నది. ఒక మార్గదర్శి ఎన్నుకొనబడినవానిగా ఉన్నాడు. అతడొక మార్గదర్శియైనయెడల ఆ రాష్ట్రమతనిని ఎన్నుకొనును.
అడవిని చుట్టి చూచుటకు వెళ్లునప్పుడు, మీరు వెళ్లని స్థములకు ఒకరితో కలసి వెళ్లుట మంచిది. విశదముగా చెప్పవలెనన్న కొన్ని స్థలములకు ఒకరు తోడు లేకుండా వెళ్లలేరు. ఉదాహరణకు కెనడా దేశమును తీసికొనవచ్చు. ఆ మార్గదర్శి, వేటాడు అధికారితో సంతకము చేయవలసి యున్నది, అతడు తన కొరకును, మీ కొరకును సంతకము చేయవలసి యున్నది. అతడు మీ యెడల బాధ్యుడై యుండును. మీకేదైనను సంభవించిన యెడల అతడు "ఆ బాధ్యత వహించవలసి యున్నది. అతడు మీ కొరకు అక్కరను తీసికొనవలసి యున్నడు." మీరు తప్పిపోకుండునట్లు అతడు జాగ్రత్తపడవలసి యున్నది. మీరు తిరిగి రాహదారులకు అతడు మిమ్మును తీసుకొని వెళ్లుట లేదను నిశ్చయతను కలిగియుండ వలసియున్నది. మీరు తప్పిపోయినను మిమ్మును మరలా తెచ్చునట్లు అతడు ఆ దేశమునంతటిని ఎరిగియుండవలసి యున్నది. అతడు వీటన్నిటిని తెలిసియుండవలసి యున్నది. లేకున్న అతడు మార్గదర్శిగా ఉండజాలడు. అతడు మార్గదర్శిగా ఉండుటకు అనుమతి ఇవ్వరు.
ఈ కార్యములన్నింటికిని మీరు ముందుగా పిలువబడి అన్నిటిని ఏర్పాటు చేసికొని సిద్దపడవలసియున్నది. ఒకవేళ అతడు తీసికొని వెళ్లుచున్న వారి సంఖ్య పూర్తియైనయెడల, మీరు కొంతసేపు వేచి యుండవలసి యున్నది, ఎందుకనగా నియమించిన సంఖ్యకు మించి ఎక్కువ మందిని అతడు తీసికొని వెళ్లకూడదు. అది భూసంబంధ మార్గదర్శికి అన్వయించును గాని, దేవుని మార్గదర్శితో అలా కాదు, అతడు ఎప్పుడును సిద్దముగా ఉండును, ఎల్లవేళల యందును సిద్దముగా ఉండును.
14నీవు ఈ సిద్దపాట్లను చేసికొనకనే, అరణ్యములో ఇంతకు ముందు నీవు వెళ్లని స్థలమును కోరుకొనినయెడల, నీవు తప్పిపోయెదవు. అంతటితో నశించి పోయెదవు; ఆ అరణ్యము మిక్కిలి దట్టముగా లేకున్నయెడల, ఒక్క శాతము మాత్రము నీవు తప్పించుకొను అవకాశముండును. నీకై నీవు ఒక్క శాతము మాత్రము తప్పించుకొందువు, అయితే ఒకవేళ అది బహు దట్టమైన అరణ్యముగా ఉండిన యెడల, నీవు వెనుకకు తిరిగి రాలేవు. నీవు అలా వెనుకకు తిరిగి వచ్చుటకు మార్గమే లేదు, ఎందుకనగా నీవు మరణములోకి నడచునట్లు నీ మార్గమును ఎన్నుకొన్నావు. నీవు అలా చేసినందు వలన నీకు అంతము సంభవించినది, అందువలన ఆ దేశములో ఏ విధముగా వెనుదిరిగి రావలెనో ఆ మార్గమును ఎరిగిన మార్గదర్శి ఒకడు లేకున్న యెడల నీవు నశించిపోదువు.
15మీలో అనేకులు గత సంవత్సరములో టుసాన్ న్, ఆరిజోనా పట్టణము నందు జరిగిన సంభవమును ఎరిగినవారైయుందురు. వారు స్కౌట్ బాలురైయున్నారు. అయినను, వారు వారిని గురించి ఏ విధముగా జాగ్రత్తను తీసికొనవలెనని తర్ఫీదును పొందిరి. వారు స్కౌట్స్ గా ఉన్నారు. వారు ప్రారంభ స్కౌట్స్ కాదు. వారు పూర్తిగా, తర్ఫీదయిన వారు. ఆ కొండలలోకి వెళ్లారు. అక్కడ వాతావరణము తన స్థితిని మార్చుకొనినందున ఒక పెద్ద మంచు తుఫాను వచ్చినది. వారందరు తప్పిపోయి నశించిపోయారు, ఎందుకనగా అక్కడ సహజ స్థితిలో మార్పు వచ్చినది. ఆ మార్పుల నుండి తప్పించుకోలేక పోయారు, చూశారా. అక్కడ కొండలలో ఎందరు నశించిపోయారో నేనెరుగను గాని, వారికి అన్ని విధముల మిలటరీ సహాయము, విమాన సహాయము, తక్కిన సహాయములెన్నో కలిగి యుండినప్పటికిని వారు తప్పిపోయారు. వారెక్కడ ఉన్నారని ఏ ఒక్కరు తెలిసికొనలేకపోయారు. వారు వారిని గురించి జాగ్రత్త తీసికోలేక పోయారు. ఆ మంచులో అందరు నశించిపోయారు, ఎందుకనగా వారు ఏ దశలో వెళ్లుచున్నారో ఎరుగలేకపోయారు. తూర్పు పడమరలను, ఉత్తర దక్షిణములను గాని పైకి వెళ్లుచున్నారా, లేక క్రిందికి దిగుచున్నారా అని గాని, ఎరుగలేక పోయారు, ఎందుకనగా సమస్తము ఒకేరీతిగా కనబడెను.
HEB 13:8
16ఇప్పుడు, ఒక మార్గదర్శి వాతావరణము ఎట్లున్నను తానెక్కడ ఉన్నాడో ఎరిగియున్నాడు. అతడా విధముగా ఉండునట్లు సమస్త సాధనములు కలిగియుండును. అతడేమి చేయుచున్నాడో తానెరిగియుండును. ప్రతి స్థితిని ఎరిగియుండును. ప్రతి దాని చూపులను అతడు ఎరిగియున్నాడు, కావున అతడు చీకటిలో ఉండినను కొన్ని స్థితులను ఎరుగును.
ఉదాహరణకు, ఇక్కడ ఆ మార్గదర్శికి ఒక పురాతన తంత్రమున్నది. మీకు తెలియునా, మీరు నక్షత్రములను చూచినట్లయితే ఒక్క నిజ నక్షత్రమును గమనించుటకు ఇష్టపడుదురు. అక్కడ ఒకే ఒక నిజ నక్షత్రమున్నది. అది ఉత్తర నక్షత్రముగా ఉన్నది. చూశారా, అది ఒక్కటే, అది క్రీస్తును గుర్తించు స్థానములో ఉన్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మిగిలినవి తిరుగుచుండును, అయితే ఆయన ఏకరీతిగా ఉన్నాడు. సంఘములు నిన్ను దీని నుండి దూరపర్చవచ్చును, లేక మరి కొందరు వేరొక మార్గమునకు ఆకర్షించ వచ్చును; అయితే ఆయన ఆ విధముగా చేయడు, ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు.
17మంచిది, ఇప్పుడు మీరు ఈ ఉత్తర నక్షత్రమును చూచినన, అది మబ్బుగా ఉన్నది. మీరు దానిని గమనించిన యెడల అది పగలు కాలముగా ఉన్నది, కాని దానిని చూడలేక పోయినందున మీరు తప్పి పోవుదురు. మీరు చెట్లను గమనించినయెడల, ఆ చెట్టు కరడు ఉత్తరము ప్రక్కగా ఉండును, ఎందుకనగా ఉత్తర దశకన్నను దక్షిణ దశలో సూర్యుడు అధికముగా ప్రకాశించును. అయినను చీకటిగా ఉన్నప్పుడు ఆ కరడును (చెట్టుకు అంటియుండు పచ్చటి నాచు) ఏ విధముగా చూడగలరు. ఆ విధముగా "మీ కండ్లు మూయబడి ఆ కరడును చూడలేక పోయినప్పుడు నెమ్మదిగా చెట్టు యొద్దకు వెళ్లి ఆ చెట్టును కౌగలించుకొని ఆ పచ్చటి కరడును స్పర్శించు వరకు దాని చుట్టు తిరుగుము. నెమ్మదిగా అలా తీరుగుచు ఆ కరడును స్పర్శించునప్పుడు అదియే ఉత్తర దిశయని గుర్తించుము. అప్పుడు నీవు ఉత్తరముగా వెళ్లుచున్నావా లేక దక్షణముగా వెళ్లుచున్నావాయని చెప్పవచ్చును. ఆ విధముగా అనేక కార్యములున్నవి. అయినను వాటి చేయు విధానమును యెరగుటకు మార్గదర్శి కావలసియున్నది. ఒక సాధారణ వ్యక్తి ''నాకేమీ వ్యత్యాసము కనబడుట లేదని చెప్పును," చూడండి. ఆ మార్గమున నడిపించుటకు మీరు తర్ఫీదు పొందినవారై యుండవలసియున్నది.
18ఈ బాలురు, వారు మంచి స్కౌటులని చెప్పుటలో ఏ సందేహము లేదు, వారు ముడులను వేయవచ్చు, రాళ్లతో నిప్పును ఏర్పరచవచ్చు. ఆ విధముగా అనేక కార్యములు చేయవచ్చు. అయితే మీ మార్గమును తెలిసికొనుటకు అదియే ఆలోచనగా ఉన్నది! వారు మార్గమును తెలిసికోలేక పోయారు. అందువలన వారందరు నశించిపోయారు, ఎందుకనగా వారితో ఒక మార్గదర్శిని వారు తీసుకొని వెళ్లలేదు.
ఒక ఆలోచన లేని తండ్రి, రెండు సంవత్సరముల క్రితము కొలొరాడో అడవులలో ఆ కొండపై వెళ్లుచుండెను. అతనికి ఆరు లేక ఏడు సంవత్సరముల వయస్సుగల కుమారుడున్నాడు. అతడు తనతో ఆ బాలుని మొదటిగా తన జింకల వేటకు తీసికొని వెళ్లుచున్నాడు. ఆ విధముగా ఆ కొండ శిఖరమునకు వారు వెళ్లిపోయారు. ఆ చిన్న పిల్లవాడు తన తండ్రితో, ''నేను చాల నీరసముగా ఉన్నానని," చెప్పాడు.
19''నా వీపుపై కెక్కుము, మనమింకను చాలినంత ఎత్తునకు వెళ్లలేదు, ఆ ఎత్తైన ప్రాంతములోనే ఆ జింకలుండునని," చెప్పెను. ఆ విధముగా పైకి, పైకి వెళ్లిపోయాడు. అతడొక పట్టణవాసియని అతడు మరచి పోయాడు. అతనికి వేటను గురించి గాని ఎక్కడకు వెళ్లి వేటాడవలయునని గాని తెలియదు. అడవులను గురించి తెలిసిన ఏ వ్యక్తియైనను జింకలు ఎత్తున నివసించవని ఎరిగి ఉండును. అవి అంత ఎత్తుకు వెళ్లవు. మేకపోతులు ఆ ఎత్తుల్లో నిలసించునేగాని, జింకలు నివసించవు. అవి పోషింపబడు స్థలము క్రిందిగానే ఉండును. పాటికి ఆహారము దోరుకు స్థలములను అవి ఏర్పరచుకొనును, అయితే ఈ మనిషి ఏమి తలంచెననగా, "అక్కడ ఆ ఎత్తులో ఆ బండల చాటుగా నేను ఉండి, ఒక పెద్ద గుంపును కనుగొందునని" తలంచాడు. ఆ కొండపై నున్న బండ పై నిలచి చూచినయెడల వాటిని కనుగొందునని తలంచా డు. ఈ దృశ్యమును అతడు ఒక వార్తాపత్రికలో చూచాడు, అవి చూపునదేమిటను వాటిని పట్టించుకోవద్దు, మై, ఓ మై, మీకు అది పీడకలను పుట్టించును. మీరు చేయవలసిన దంతయు మీరెక్కడ ఉన్నారని తెలిసికొనునట్లు మీతో ఒక మార్గదర్శిని తీసికొని వెళ్లవలసియున్నది.
20ఇప్పుడు ఆ తండ్రి అలా వెళ్లుచుండగా అనుకొనని రీతిగా వర్షము వచ్చినది. ఆ విధముగా హఠాత్తుగా వచ్చుట సహజమే. ఆ మనిషి చీకటి పడునంత వరకు వేటాడినందు వలన వెనుదిరిగి రాలేకపోయాడు. అంతలో భయంకరమైన గాలులు ఆ కొండలకు అడ్డముగా వీచుటకు ప్రారంభించాయి. అతడు త్వరపడి కదలుచున్నాడు…
మీరు చిక్కుకొనినప్పుడు ఏ విధముగా బ్రతికి తప్పించుకొనవలెనని ఎరిగియుండవలెను. మరొక కార్యమేదనగా, ఏ విధముగా కాపాడుకొనవలెననియు తెలిసికొనవలెను! నేను చెట్లెక్కి క్రిందికి జారియున్నాను. మరలా ఎక్కి క్రిందికి జారుదును. ఆ విధముగా మన జీవమును కాపాడుకొనవలసి యున్నది. నాలుగడుగుల ఎత్తుల మంచు గడ్డలు ఏర్పడినప్పుడు, ఆకలితో అలాగే ఉండి పోవలసివచ్చింది. అక్కడున్న ఆ ఎండు పుల్లలను మంటబెట్టి అ మంచును కరిగించవలసి యుండును. రాత్రి ఒకటి లేక రెండు గంటల ప్రాంతములో ఆ మొద్దులను ఆ వెచ్చటి స్థలములపై ఉంచి, ప్రాణమును కాపాడుకొన వలసియున్నది. ఈ కార్యములన్నింటిని ఏ విధముగా చేయవలెనని ఎరిగియుండవలసి యున్నది.
21ఈ మనుష్యుడు తానేమి చేయుచున్నాడో తనకు తెలియదు. అతనిని నడిపించుటకు అతనితో ఎవ్వరూ లేరు. అతడు తన కుమారుని దేహము చల్లబడి మరణించునంత వరకు వానిని తన గుండెకు హత్తుకొని యుండెను. అది ఒక అనాలోచన! అతడు ఒక మార్గదర్శిని తనతో కొనిపోయి ఉండినయెడల, ఎంత వేళయైనను ఆ కొండల నుండి దిగి వచ్చి యుండవచ్చు, చూశారా. అయితే అతడు చీకటి పడువరకు వేచియుండెను. అప్పుడు తాను వచ్చిన బాటను అతడు చూడలేకపోయాడు.
ఈ దినము క్రైస్తవులతో ఉన్న చిక్కు అదే. చీకటి కమ్ము వరకు వారు వేచియుందురు. అప్పుడు మార్గదర్శి లేకనే వచ్చానని తెలిసికొందురు. మార్గదర్శి!
22ఇంతెందుకు, తప్పిపోయిన మనిషిని మీరెప్పుడైన చూచారా? తప్పిపోయిన మనిషిని కనుగొని తెచ్చిన అనుభవము మీలో ఎవరికైనను ఉన్నదా? మీరు చూచిన దానిలో అది ఎంతో విచారకరమైన దృశ్యముగా ఉన్నది. ఒక మనిషి తప్పిపోయినప్పుడు, అతడు క్రూరముగా మారిపోవును. అతడేమి చేయుచున్నాడో తానేరుగడు. ఒకసారి అడవులలో తప్పిపోయిన బాలుని మేము పట్టుకొన్నాము. అతడొక వేటగాడైనప్పటికిని, అతడు పొరపాటైన పరిధిలో (స్థలము నందు) ఉన్నందున తప్పిపోయాడు. మూడు దినముల తరువాత వారతనిని కనుగొన్నప్పుడు, అతడొక అడవి మనషి వలె తన స్వరమెత్తి అరచుచు పరిగెత్తుచుండెను. అతని పెదవులు తినివేయబడినవి. అతడు తన తుపాకిని క్రింద పడవేసి ఏమి చేయవలెనో తెలియక అలాగే నిలబడిపోయాడు. అతని స్వంత సహోదరుడు అక్కడకు వచ్చినప్పుడు, వారు అతనిని పట్టుకొని కట్టివేయవలసి వచ్చింది. తన స్వంత సహోదరుడు, అతని యొద్దకు వచ్చినప్పుడు, అతడు మృగము వలె తన సహోదరునితో పోరాడెను. అతనిని కొరుకుటకు ప్రయత్నించెను. అతడెక్కడున్నాడని కూడ అతనికి తెలియలేదు. ఎందుకు? అతడు తప్పిపోయాడు. ఒక మనిషి తన స్థితిని పోగొట్టుకున్నప్పుడు అతడు క్రూరుడుగా మారిపోవును. అతడా స్థితిలో ఉన్నాడని అతనికి తెలియదు, ఎందుకనగా అడవిలో తప్పిపోయిన అతనిపై ఒక రకమైన జ్వరము వచ్చును. అందువలన అతడెక్కడున్నాడని గాని, ఏమి చేయుచున్నాడని గాని అతనికి తెలియదు.
23ఆ విధముగానే ఒక మనుష్యుడు దేవుని నుండి దూరమైపోయినప్పుడు అలాగే జరుగును! అతడు సాధారణముగా చేయని క్రియలను చేయును. ఒక మనుష్యుని తలంపునకు వ్యతిరేకముగా ఉండు కార్యములను చేయును. దేవుని నుండి తప్పిపోయిన ఒక మనిషి గాని, దేవుని నుండి తప్పి పోయిన ఒక సంఘము గాని, దేవుని నుండి దూరమైన ఒక సంఘముగా ఉండును. దేవుని బైబిలు సిద్దాంతముల నుండి దూరమై పోయిన ఒక సంఘములో ఒక సజీవ దేవుని సంఘమందు జరుగకూడని కార్యములు జరుగుట చూడగలము. ఆ సంఘము వాటిని చేయును. వారు అసహ్యమైన ఆటల ద్వారా ధనమును సమకూర్చుకొందురు. లాటరీలు, జూదము మరేదైనను, వారు చేయగల వాటినన్నింటిని చేయుదురు. వారికి కావలసిన దానిని పొందుటకు దేనినైనను బోధించెదరు. సంఘములో ధనమును అధికముగా ఇచ్చు మనిషి వీపును తడిమెదరు. ఆ విధముగా వారు కార్యములను చేయుదురు. అది నిజము. కేవలము కొనసాగుటకు మరియు కర్చులను భరించుటకు నాలుగు లేక ఐదు పర్యాయములు పెండ్లి చేసికొన్న వారినైనా డీకన్లుగా నియమించెదరు. నిజమునకు మీరు చేయవలసినది ఒకటే, అది, దేవునికి నీ యొక్క బాధ్యత. నిలచి సత్యమును చెప్పుము! తప్పిపోయిన, తప్పిపోయిన మనిషి ఒక క్రూర స్వభావపు స్థితిలో ఉండును, అతడొక పిచ్చివాడు.
24ఆ మార్గదర్శి తాను ఏ విధముగా ఎక్కడకు వెళ్లవలెనో దేనిని చేయవలెనోయను గ్రహింపును కలిగియుండును. దేవుడు ఎల్లప్పుడు తన ప్రజల కొరకు ఒక మార్గదర్శిని పంపును. దేవుడెప్పుడైనను ఆ కార్యమును చేయుటలో తప్పిపోలేదు. ఆయన ఒక మార్గదర్శిని పంపునప్పుడు మీరు ఆయనను అంగీకరించవలసియున్నది, చూశారా. మీరు దానిని నమ్మవలసియున్నది. మీరు అరణ్యములో ప్రవేశించునప్పుడు మీ మార్గదర్శి "మనము ఈ మార్గమున వెళ్లుదము," అని చెప్పునప్పుడు, మీరు ఆ మార్గమును సందేహించి యోచించినప్పుడు, మీరు తప్పిపోవు స్థితికి వచ్చెదరు. దేవుడు మనలను నడిపించుటకు ఒక మార్గదర్శిని పంపునప్పుడు, మన మార్గదర్శిని వెంబడించ వలసియున్నది. మనము దేనిని తలంచుచున్నామని కాదు, మనము మన ముందు దేనిని చూచుచున్నామని కాదు, అది పరిహాసముగా కనబడుచున్నదని కాదు, మనము దానిని పలు విధములుగా యోచించుటకు కాదు గాని, ఆ మార్గదర్శి మాత్రమే దానిని చేయవలసినవానిగా ఉన్నాడు.
AMOS 3:7•
MATT 15:14•
MATT 23:16•
LUKE 6:39•
HEB 1:1
25పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను పంపాడు. వారు మార్గదర్శకులుగా ఉండిరి, ఎందుకనగా దేవుని వాక్యము ఆ ప్రవక్తలకు వచ్చుచుండెను. వారు మార్గదర్శకులుగా ఉండిరి. మనము గత రాత్రి వినిన ప్రకారము యెషయా, ఉజ్జియా మొదలగువారు ఆ ప్రజలకు తెలియపరచుచుండిరి. వారు ఆ ప్రజలకు చెప్పుటయే కాక, వారిని నడిపించుచుండిరి. దేవుడు ఎల్లప్పుడు తన మార్గదర్శకులను పంపును. ఒక మార్గదర్శి లేనిదే ఆయన గడచిన కాలములన్నిటి యందు ప్రత్యక్షము కాలేదు. అన్ని కాలములలో దేవుడు తన కొరకు ప్రాతినిథ్యము వహించుటకు ఈ భూమిపై కొందరి పంపుచుండెను.
కొన్ని సమయములలో వారు ఆ మార్గదర్శిని నిరాకరించెదరు. మనము చెప్పునట్లు తమ దృష్టి నుండి త్రోసివేయుదురు. యేసు భూమిపై యున్నప్పుడు, ''గ్రుడ్డి మార్గదర్శకులైన మీరు,'' అని చెప్పినది మీకు జ్ఞాపకము లేదా. గ్రుడ్డి మార్గదర్శకులు, ఆత్మీయ కార్యములకు గ్రుడ్డివారై యున్నారు, చూశారా. వారు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు, ప్రజలను మార్గదర్శకులు గాను ప్రజలను రక్షణకు నడిపించవలసినవారైయున్నారు. అయితే "మీరు గ్రుడ్డివారైయున్నారని!" యేసు చెప్పెను. "వారిని అలాగే ఉండిపోనియ్యుడి, గ్రుడ్డి వారు - గ్రుడ్డి వానిని నడిపించిన యెడల వారిద్దరు గోతిలో పడరా?" అని యేసు చెప్పెను. గ్రుడ్డి మార్గదర్శకులు! ఓ, ఈ ప్రపంచము గ్రుడ్డితనముగా మార్గము నడిపించబడుటలో ఎంతగా చెడిపోయినదో. మీ స్వంత ఆలోచనపై ఆధారపడి యుండుటకు ఆయన ఇష్టపడుట లేదు. దేవుడు ఎప్పుడు మీ స్వంత ఆలోచనలపై గాని లేక మీ యొక్క తలంపులపై గాని, లేక మరేదైనను మానవ-కల్పిత తలంపులపై మీరు ఆధారపడి యుండుట ఇష్టపడడు.
JOHN 1:1,14•
JOHN 14:6,16,18•
JOHN 16:13
26దేవుడొక మార్గదర్శిని పంపును, ఆయన నియమించిన మార్గదర్శియని మీరు జ్ఞాపకము చేసికొనవలెనని దేవుడు ఇష్టపడుచున్నాడు. మనమాయనను జ్ఞాపకము చేసికొనవలసియున్నది. ఇక్కడ ఇలా చెప్పబడుచున్నది, "నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. మిమ్మును అనాధలనుగా విడువను, మీ యొద్దకు వత్తును," అని యేసు చెప్పెను. ఈ ఆదరణ కర్త, వచ్చునప్పుడు, ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించును. మరియు దేవుని వాక్యము సత్యమైయున్నది మరియు ఆ వాక్యము క్రీస్తుగా ఉన్నాడు. "నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నానని," యేసు చెప్పెను. ఆయనే వాక్యమై యున్నాడు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. అట్లయిన మనమా నిజ మార్గదర్శిని వెంబడించినట్లయిన, పరిశుద్ధాత్మ, ఆయన దేనిని చూచెనో, దేనిని వినెనో మనతో చెప్పును. రాబోవు వాటిని మనకు చూపును. ఆమెన్. మీరక్కడే ఉన్నారు. రాబోవు వాటిని ఆయన మనకు చూపును.
ఈనాడు సంఘములు దానిని నిరాకరించినయెడల, మనము పరలోకమును వెళ్ళగలమని ఎలాగు ఎదురు చూడగలము? పరిశుద్ధాత్మ మనకు ఒక మార్గదర్శిగా పంపబడిప్పుడు, ఒక కార్డినలునో లేక బిషప్పునో లేక ఒక పర్యవేక్షకుని, లేక మరోకరినో మన మార్గదర్శిగా అంగీకరించుచున్నాము. అయితే మన కొరకు పరిశుద్ధాత్మ మార్గదర్శిగా పంపబడియున్నాడు.
JOHN 14:12,13•
REV 10:7
27"పరిశుద్ధాత్మ" ఎల్లప్పుడు వాక్యమును గురించి మాత్రమే మాట్లాడును. ''నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని, యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును." అందునిమిత్తమే ముద్రలు వచ్చుచున్నవి. ఆ ఏడవ ముద్ర చివరిలో దేవుని మర్మము సమాప్తమగును, అదేమనగా దేవుడెవరు? ఆయన ఏమైయున్నాడు, ఆయన ఏ విధముగా జీవించుచున్నాడు? ఆయన స్వభావమేమిటి? ఆయన జీవము అనగా ఏమిటి? అను వాటిని ఎరుగుట జరుగును. మీరందరు ఆ సమయమునకు ఇక్కడుండవలసియున్నది, చూశారా. దేవుని కుమారులను, కుమార్తెలను వారి పరివూర్ణతకు కొనితెచ్చును. క్రీస్తు రక్తముతో కడుగబడిన సంఘముగా అది నిలచును, అది ధనముతో వచ్చునది కాదు, అది యేసుక్రీస్తు రక్తముచే వెలబెట్టి కొనబడినది.
28ఇప్పుడు, మనము ఒక మార్గదర్శి అను మాటను ధ్యానించుచున్నాము. అతడు దేవుడు ఏర్పరచిన మార్గదర్శిగా ఉన్నాడు. మనమిప్పుడు అరణ్యము ద్వారా ప్రయాణించుచున్నాము. మనమెక్కడో మన మార్గమందున్నాము. ఈ మార్గదర్శి లేనిదే మనము ముందుకు కొనసాగలేము. మరొక మార్గదర్శిని ప్రత్యామ్నాయముగా ప్రయత్నించుటకు మరొకరికి ధైర్యము లేదు. మీరు ఆ విధముగా చేసినట్లయిన, అతడు ఆ మార్గము నుండి మిమ్మును తొలగించును. అయితే ఈ మార్గదర్శి ఆ మార్గమును ఎరిగి యున్నాడు! అతడు ఆ మార్గపు ప్రతి అంగుళమును ఎరిగియున్నాడు. అతడు మీ హృదయమందున్న ప్రతి తలంపును ఎరిగియున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగియున్నాడు. మీరెవరో, మీరేమి చేశారో, మిమ్మును గురించిన సమస్తమును ఆయన ఎరిగియున్నాడు. ఆయన దేవుని మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన కార్యములను మీకు బయలుపరచును. ఆయన వినిన వాటిని చెప్పును. మీరు చెప్పినవాటిని మరలా మీతో చెప్పగలడు. ఆమెన్. మీరేమైయున్నారో చెప్పును, మీకు కలిగియున్నదేమిటో, మీరెక్కడకు వెళ్ళుచున్నారో దానిని తెలుపును. ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నాడు. ఖచ్చితమైన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును. ఆయన వాక్యము సత్యమైయున్నది.
29ఇప్పుడు, మానవ-కల్పిత సిద్దాంతములకు పరిశుద్ధాత్మ "ఆమెన్'' అని చెప్పనివ్వడు. దేవుని వాక్యమును మాత్రము "ఆమేన్'' అని గుర్తించును, ఎందుకనగా అది ఆ విధముగా ఉండును. పరిశుద్ధాత్మ మిమ్ములను మరొక మార్గమునకు నడిపించడు. ఇప్పుడా ఆశ్చర్య కార్యమేదనగా, మనమున్న ప్రతి సంస్థలు వాటి కార్యములు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నవని చెప్పుచున్నాము, అయితే దిన దినమునకు వాటన్నిటిలో భేదములు అధికమైపోవుచున్నవి.
ACTS 9:17,18•
GAL 1:17,18•
GAL 2:1,2
30అయితే ఆ చిన్నవాడైన, పరిసయ్యుడైన పౌలు అననియ ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందాడు. అప్పుడతుడు అరేబియాకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరములు చదివి, ఆ తరువాత తిరిగి వచ్చెను. పదునాలుగు సంవత్సరములు ఏ సంఘమును సంప్రదించలేదు. అతడు ఆ తరువాత అతడు పేతురును కలసికొనెను. అతడు ఆ దినపు యెరూషలేము సంఘమునకు పెద్దగా ఉండెను. వారు దేవుని సిద్ధాంతములో కంటికి కన్నైయుండిరి. ఇంతెందుకు? ఒకే పరిశుద్ధాత్మ ఆ కార్యమును చేయుచున్నది. పేతురు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చినట్లే, పౌలుతోను ఎవ్వరూ చెప్పకనే - ఆయన ఆ విధముగానే బాప్తిస్మమిచ్చెను. పేతురు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, శుద్ధీకరణము, ఇంకనూ అనేక కార్యములు చేసినట్లే - పౌలు కూడ ఏ సంఘమను సంప్రదించకనే అవే కార్యములను చేసెను, ఎందుకనగా వారిని నడిపించినది అదే మార్గదర్శిగా ఉన్నాడు. అట్లయిన ఈనాడు ఈ ప్రజలు ఈ సత్యములను ఏ విధముగా నిరాకరించెదరు? సంఘమును ఎటువంటి క్రమములో ఉంచవలెనని పేతురునకు బోధించబడెనో, ఆ సిద్దాంతమునే పౌలు నెరవేర్చెను, ఎందుకనగా వారు ఒకే మార్గదర్శిని కలిగియుండిరి.
31ఆ మార్గదర్శి ఒకరిని ఒక విధముగా మరొకరిని మరొక విధముగా నడిపించడు. ఒకరిని తూర్పునకును మరొకరిని పశ్చిమమునకును నడిపించడు. ఆయన మిమ్ములను ఏకపరచును, ఏకముగా ఉంచును. మనము ఏకముగా ఉండునట్లు పరిశుద్ధాత్మను అనుమతించినయెడల, మనము ఏకమైయుందుము. సాతాను మనలను పొరపాటైన మార్గమునకు ఈడ్వకుండునట్లు చేసినయెడల, మనము ఏక హృదయము కలిగి, ఏక మనస్సుతో, ఒక్క ఆత్మ ద్వారా ఒక విధానముపై యుందుము. ఆ పరిశుద్ధాత్మయైన దేవుని మార్గదర్శి మనలను సర్వసత్యములోనికి నడిపించును. అది నిజము. అయితే మీరు మీ మార్గదర్శిని వెంబడించవలసియున్నది. అవునండి.
JOHN 3:2
32నీకొదేము చూడండి, అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చెను. అతడు ఒక చక్కనివాడే. ఆతడు ఎనిమిది సంవత్సరముల అనుభవము గలిగిన బోధకుడుగా ఉన్నాడు. అతడు పరిసయ్యుల నుండి వచ్చినవాడు, లేక సన్హేద్రిను సభకు చెందినవాడు. సేవకుల సమావేశమునకు చెందినవాడు. అతడు ఆ గొప్ప వారిలో ఒకడై యున్నాడు. ఇశ్రాయేలులో ఒక బోధకుడు. వారికి ఒక మాస్టారుగా ఉన్నాడు. యోచించండి, అతడు ఒక పెద్ద బోధకుడు! మాస్టారు అవును. అతడు న్యాయప్రమాణమంతయు ఎరిగియున్నాడు. అయితే, అతడు క్రొత్తగా జన్మించవలసి వచ్చినప్పుడు అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చినది. అతడు దాని కొరకు ఆకలిగొని యుండెను. అక్కడ ఏదో వ్యత్యాసమున్నదని అతడెరిగియున్నాడు. క్రీస్తుతో మాట్లాడిన విధానము దానిని నిరూపించినది. మిగిలిన వారి తలంపులను కూడ అది నిరూపించినది, అయితే వారిలో ఎవ్వరికి అంత ధైర్యము లేకపోయినది. అతడు చేసినట్లు ఎవ్వరూ అక్కడకు వచ్చి ఆ విధముగా చేయలేదు.
నీకోదేము రాత్రులలో వచ్చినందుకు ప్రజలు అతనిని త్రోసివేయుచున్నారని మీరెరిగి యున్నారు. అయితే అతడక్కడకు వచ్చి చేరాడు. కొందరు ప్రజలు అది పగలు గాని రాత్రి గాని అసలు కదలనే కదలరని నాకు తెలియును. అయితే అతడక్కడకు వచ్చాడు. అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చినది. అతడు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరిగియున్నాము.'' [సన్హేద్రిను - సభలో వారు ఎరిగి, యున్నారు] ఇతడేందుకు ఎరిగియున్నాడు? ఆయన నిరూపించబడియుండెను. చూడండి, ఈ క్రొత్త జన్మ అనగా ఏమిటో అతడు తెలిసికొనగోరెను. అతడు నిజమైన వారి యొద్దకు వచ్చాడు, ఎందుకనగా దేవుడు ఆయనను (యేసును) అతని (నీకోదేము) యొక్క మార్గదర్శియని నిరూపించెను. యేసుతో అతడేమి చెప్పాడో చూడండి, ''బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని ఎరిగియున్నాము," ఎందుకనగా నీవు చేయు ఈ క్రియలను దేవుడతనికి తోడైయుండిననే గాని ఎవ్వరూ చేయలేరు.
JOHN 5:19•
JOHN 14:10
33అది అక్కడ ఒక నిరూపణగా ఉన్నది. జీవించు దేవుడు ఆయనలో నివాసము చేయుచున్నాడని నిరూపించబడినది. ఆయన దేనికి సాక్ష్యమిచ్చాడనగా, "ఈ క్రియలను చేయునది నేను కాదు, నాలో జీవించు నా తండ్రి చేయుచున్నాడు. తండ్రి చేయునదేమిటో కుమారుడు చూచి దానిని చేయుచున్నాడే గాని, కుమారుడు తనకు తాను ఏదియు చేయుట లేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. చూచిన దానిని కుమారుడు ఆలాగుననే చేయుచున్నాడు. తండ్రి క్రియ చేయుచున్నాడు, నేనును క్రియ చేయుచున్నాను." మరొక విధముగా చెప్పవలయుననిన, ఆయన చేయవలసినదేమిటో దేవుడు ఆయనకు చూపుచున్నాడు. ఆయన వెళ్లి ఆ విధముగానే చేయుచున్నాడు. దేవుడు చేయమని చెప్పనిదే ఆయన దేనిని చేయడు. ఆమేన్. అవి ఆ నిజ స్థితులుగా ఉన్నవి. మనము కూడ ఆత్మ నడిపించు వరకు వేచియుండి, ఆ తరువాత ముందుకు వెళ్లవలసియున్నది. దానిలోనే ఇప్పుడు మనమున్నాము. అంతట ఎంతగా క్రీస్తులో కలసిపోయావనగా, ఆయన మొదటగా తన తలను ఆడించినప్పుడు (సమ్మతమును తెలియజేసినప్పుడు) నీవు సిద్దముగా ఉన్నావనియు, ఏదియు నిన్ను అడ్డగించబోవుట లేదనియు నిరూపించబడెను, ఎందుకనగా అది దేవుని చిత్తమని నీవెరిగియున్నావు.
JOHN 10:37,38
34అతనికి ఒక మార్గదర్శి కావలసి యున్నది. ఆయన నిరూపించబడిన మార్గదర్శిగా ఉన్నాడు. ఈ మార్మదర్శి దేవునిచే ప్రేరేపించబడెనని ఎరిగియుండుట ద్వారా అతడు ఆయన చేత నడిపించగలడు. తాను అనుసరించుచూ వచ్చిన పారంపర్యములు పరిసయ్యులవనియు, సద్దూకయ్యులవనియు అతడు ఎరిగియున్నాడు. అతడు ఆ పారంపర్యములతో సేవ చేశాడే గాని ఏమియు జరుగలేదని చూచాడు. అయితే ఇక్కడ ఒక మనిషి తెరకు వచ్చియున్నాడు, బైబిలులో వాగ్దానము చేయబడిన మెస్సీయాను నేనేనని చెప్పుచున్నాడు. అంత మాత్రమే గాక, దేవుని ప్రతి క్రియను ఆయన చేయుచున్నాడు. యేసు ఇలా చెప్పెను, "నేను నా తండ్రి క్రియలను చేయకున్నయెడల నన్ను నమ్మకుడి, అయితే మీరు నన్ను నమ్మకున్నను, నేను చేయు క్రియలను నమ్ముడి, ఎందుకనగా అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి."
JOHN 3:2
35అట్లయిన నీకోదేము ఇలా చెప్పుటలో ఆశ్చర్యము లేదు, "బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరిగియున్నాము, ఎందుకనగా దేవుడు నీకు తోడైయుంటేనే గాని, నీవు చేయు ఈ క్రియలు ఎవ్వరును చేయలేరని,'' చెప్పెను. చూడండి, అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చినది. అతడు ఈ కార్యములకు ఒక బోధకుడై యుండినను, అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చినది. అతడు ఒక సంఘమునకు బోధకుడుగా ఉన్నాడు. అతడు ఘనత వహించియున్నాడు. అతడు ముఖ్య స్థలములను కలిగి యున్నాడు. అతడొక గొప్ప వ్యక్తి, అందులో ఏ సందేహము లేదు. దేశమంతటను ప్రజల మధ్య గౌరవ-మర్యాదలున్నాయి. అయితే కొత్తగా జన్మించవలసి వచ్చినప్పుడు అతనికి ఒక మార్గదర్శి కావలసి వచ్చెను! అందువలన మనకు కూడ కావలసియున్నది. కావున మనకు కొరకు కూడా, మనకొక మార్గదర్శి కావలసి యున్నది.
MATT 10:19,20•
ACTS 10:44,47
36కొర్నేలియనునతడు ఒక గొప్ప మనిషి, ఒక గౌరవనీయుడు. అతడు సంఘములను కట్టినవాడు. యూదుల మతము నిజమైనదని ఎరిగి వారిని గౌరవించును. తన కానుకలను సమర్పించి, ప్రతి రోజు ప్రార్థించును. అయితే పరిశుద్ధాత్మ ఒక దినమున వచ్చినప్పుడు, (సంఘమునకు ఏదో కొంత చేర్చబడినది.) అతనికొక మార్గదర్శి కావలసి వచ్చినది. దేవుడు పరిశుద్ధాత్మను అతనికి పంపించాడు. ఆయన దానిని పేతురు అను వ్యక్తి ద్వారా పంపించాడు. "పేతురు ఈ మాటలను ఇంక చెప్పుచుండగా, అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను." [టేపుపై ఖాళి ఉన్నది.]
దేవుడు పేతురు ద్వారా ఆ మార్గదర్శిని వాడుకొనెను. ఆయన దానిని వాడుకొనెను, ఎందుకనగా ఆయన కొర్నేలిని సరియైన మార్గమునకు నడిపించెను. అతడు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ అక్కడ చేరియున్న అన్యజనులపై దిగెను. అప్పుడతడు, "మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా?" అని చెప్పెను. చూశారా, అక్కడ మాట్లాడునది పేతురు కాదు గాని, ఆ మార్గదర్శి ఇంకనూ మాట్లాడుచున్నాడు. ఎందుకనగా అది ఒక యూదుల … లేక అన్యుల గుంపుగా ఉన్నది. "వారు అశుభ్రముగా మురికిగా పేతురునకు కనబడుచున్నారు. వారి యొద్దకు వెళ్లుటకు అతడు ఇష్టపడలేదు. అయితే ''నేను నిన్ను పంపుచున్నానని," ఆ మార్గదర్శి చెప్పెను.
ఆ మార్గదర్శి నిన్ను నడిపించునట్లు నీవు ఆయనకు సమస్తమును స్వాధీనపరచావంటే, నీవు చేయగలనని అనుకొనని కార్యములను నీవు చేయగలవు. ఓ, పరిశుద్ధాత్మనే నడిపించబడుట ఎంత ఆశ్చర్యమైనదో, ఆయన ఆ మార్గదర్శి. ఆయన పేతురుతో మాటలాడి అతను చేయవలసినదేమిటో సెలవిచ్చాడు. వారందరు పరిశుద్ధాత్మ పొందిన తరువాత అతడు (పేతురు) ఇలా చెప్పెను, "మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా!" అంతట వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చెను. ఇప్పుడు, అలా చేయునట్లు ఎవరు వారిని నడిపించిరి? అతనిలో ఉండు ఆ మార్గదర్శి ఆదేశించాడు. వారితో యేసు ఇలా చెప్పలేదా, "మీ స్వంత తలంపులతో వెళ్లకుడి, ఎందుకనగా, మాట్లాడునది మీరు కాదు; మీలో నివసించు నా తండ్రి, ఆయనే మిమ్ము మాట్లాడనిచ్చుచున్నాడు." ఆమేన్.
37యెరూషలేము నుండి ఆ నపుంసకుడు, దిగి వచ్చుచున్నాడు. అప్పుడు ఈ ప్రపంచములో దేవుడొక మార్గదర్శిని కలిగియున్నాడు. ఈ మార్గదర్శిచే నింపబడిన ఒక మనిషిని ఆయన అక్కడకు పంపుచున్నాడు. అతడొక బోధకుడు కాడు, అతడు పెద్దలలో ఒకడు. వ్యాధి గలవారిని స్వస్థపరచుచు, దయ్యములను పారద్రోలుచు అతడక్కడ ఉండెను. అక్కడ ఒక గొప్ప కదలికను ఏర్పరచుట ద్వారా ఆ పట్టణములో గొప్ప సంతోషముండెను. వందలాది ప్రజలు అతని చుట్టూ చేరి యుండిరి, అప్పుడు "అది చాలును, మనమిప్పుడు వేరొక మార్గమునకు వెళ్లుదము," అని ఆ మార్గదర్శి సెలవిచ్చాడు. అప్పుడతుడు ఆ మార్గదర్శితో వాదము చేయలేదు.
మీ మార్గదర్శిని వాక్యముతో వాదము చేయవద్దు. ఆయనను వెంబడించుము. నీవు అలా చేయలేదనిన నీవు నశించిపోవుదువు, నీవు ఆయనను విడిచి వెళ్లునప్పుడు, నీవు నీ స్వంత మార్గమందు పయనించుచున్నావని జ్ఞాపకముంచుకొనుము. అందువలననే ఆయనకు దగ్గరగా ఉండుటకు మనము ఇష్టపడుచున్నాము.
ACTS 8:29-31
38అందువలన మార్గములో ఆయన చెప్పినదేమనగా, ''ఫిలిప్పు, ఇప్పుడా గుంపును విడిచిపెట్టుము, ఎవ్వరూ లేని ఆ ఎడారిలోనికి వెళ్లుము. అయితే నేను నిన్ను అక్కడకు పంపుచున్నాను. నీవు అక్కడకు వెళ్లునప్పుడు ఎవరో ఒకరు అక్కడుండెదరు." ఇక్కడ ఒంటరిగా ఒక నపుంకుడు వచ్చుచున్నాడు. ఇతియోపియా రాణి దగ్గర అతడొక గొప్ప వ్యక్తి. అతడు యెషయా పుస్తకమును చదువుచూ వచ్చుచున్నాడు. అప్పుడు ''ఆ రథము దగ్గరకు వెళ్లుము,'' అని ఆ మార్గదర్శి ఆదేశించాడు.
అతడు వెళ్లి, "నీవు చూచు దానిని నీవు గ్రహించావా?" అని అడిగినప్పుడు.
అతడు, "ఎవరైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని?" చెప్పెను. ఓ, మై! అయితే ఫిలిప్పు ఆ మార్గదర్శిని కలిగియున్నాడు. ఆమేన్. ఆయన (ఫిలిప్పు) ఆ నపుంసకుడు చదువుచున్న అదే లేఖనమును తీసికొని క్రీస్తును బోధించుటకు మొదలు పెట్టెను, ఆమేన్. మార్గదర్శి! అతనికి ఏదో ఒక సిద్ధాంతమును బోధించుట లేదు. అతడు ఆ మార్గదర్శిని గురించి బోధించుచున్నాడు. ఆయనే క్రీస్తు! అక్కడే నీటిలో అతనికి బాప్తిస్మమిచ్చాడు. నిజము. అదలా జరిగినది. ఓ, నేను దానిని ఎంతోగానో ఇష్టపడుదును.
EXOD 13:21
39నిర్గము కాండము 13:21లో ఇశ్రాయేలు వాగ్దాన భూమిని చేరుటకై ఐగుప్తును విడిచినప్పుడు వారా మార్గములో అంతకు ముందెన్నుడును ప్రయాణము చేయలేదని దేవుడు ఎరిగియున్నాడు. అది కేవలము నలువది మైళ్లు మాత్రమే. అయినను వారిని నడిపించుటకు ఏదో కావలసి వచ్చినది. లేకున్న వారు తమ మార్గమును తప్పిపోవుదురు. అందువలన దేవుడు, వారికొక మార్గదర్శిని పంపెను. నిర్గమ కాండము 13:21 అక్కడ ఇలా వ్రాయబడియున్నది, "నేను నా దూతను మీకు ముందు పంపుదును. ఆ అగ్నిస్తంభము మీరు వెళ్లవలసిన మార్గమందు మిమ్మును నడిపించును." వారిని ఆ వాగ్దాన భూమికి నడిపించుటకు గాను ఆ దూతను పంపెను. ఇశ్రాయేలు పిల్లలు రాత్రులలో ఆ అగ్నిస్తంభమైన మార్గదర్శని వెంబడించిరి. పగలు మేఘమును వెంబడించిరి. అది నిలచినప్పుడు, వారు నిలచిరి. అది సాగునప్పుడు, వారును సాగిపోయిరి. ఆయన వారిని ఆ వాగ్దాన భూమికి సమీపముగా తీసుకు వెళ్లాడు. అయితే వారు అక్కడకు వెళ్లుటకు యోగ్యులు కాకపోయినప్పుడు వారిని మరలా అరణ్య మార్గమునకు త్రిప్పవలసి వచ్చెను. అతడు వారితో వెళ్లలేక పోయాడు.
EXOD 15:1,4,5,19,20,24•
EXOD 16:2•
EXOD 17:3•
NUM 14:2•
NUM 16:41
40ఈ దినము సంఘ స్థితి ఆ విధముగానే యున్నది. దేవుని దీర్ఘశాంతము తప్ప మరొక సందేహము లేక ఇవి నోవహు దినముల వలెనే యున్నవి. సంఘము తనను తాను చక్కదిద్దుకొని, క్రమపరచమకొనినయెడల అది వెళ్ళిపోయి ఉండును. అయితే ఆయన మనలను, చుట్టుర త్రిప్పి, త్రిప్పి, త్రిప్పి నడిపించవలసి వచ్చినది.
ఆ ఐగుప్తును సైనికులు గుర్రములతో సహా నీట మునిగి మరణించినప్పుడు, ఫరో రధములు తలక్రిందులైనప్పుడు, దానిని చూచి కేకలు వేసిన ఇశ్రాయేలుకు కొద్దిగానే తెలిసినది. మోషే ఆత్మలో నిలచి, ఆత్మలో పాడుచుండగా, వారు జయమును పొందిరి. మిర్యాము ఆత్మలో నాట్యమాడినది. ఇశ్రాయేలు కుమారైలు ఆ యోర్దాను గట్టు పైన పైకి క్రిందికి ఎగురుచు, నాట్యమాడుచు, కేకలు వేయుచు, పాలు తేనెలు ప్రవహించు భూమిని కొద్ది రోజులలో చేరనైయుండిరి. అయితే నలువది సంవత్సరములు ముందున్నదని వారెరుగలేదు, ఎందుకనగా దేవునికిని మరియు ఆ మార్గదర్శికిని విరోధముగా సణిగిరి.
41మరియు ఆ విధముగానే మనలను కూడ చూడగలుగుచున్నాము. ఇక్కడ నుండి నేను ష్రీవ్-పోర్టునకు వెళ్లనై యున్నాము. ఏబది సంవత్సరములకు ముందు కృతజ్ఞత దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చినది. అది లూసియానాలో కృతజ్ఞత దినమందు జరిగినది. అప్పటి నుండి సంఘము ఏ విధముగా పడిపోయినది! ప్రారంభములో రోమను కాథలిక్ సంఘము ఒక పెంతెకోస్తు సంఘముగా ఉండినదని మీరు ఎరిగియున్నారా? అది సత్యము. అది నిజము. అది పెంతెకోస్తు సంఘముగా ఉన్నది, అయితే బిగుసుకుపోయిన ఉన్నతాధికారులు దేవుని వాక్యమును తమ సిద్దాంతములకు మార్చి వేశారు. వారి ఆచారములకు మార్చుకొని వారితో చేర్చుకొనిరి. ఇప్పుడు వారేమి కలిగి యున్నారో చూడుడి. దేనిలోనైనను ఒక్క ముక్క లేఖనము లేకపోయినది. వారు దేనినో మరొక దానితో చేర్చి వేశారు. చివరకు పరిశుద్ధాత్మను ఒక రొట్టె ముక్కకు పోల్చి వేశారు. చిలకరింపు బాప్తిస్మమును అలవాటు చేశారు. వారు "ప్రభువైన యేసుక్రీస్తు" కు బదులుగా "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను,'' తెచ్చారు. దేవుని సమస్త కార్యములను వారు త్రోసివేసి, ఇంకనూ, ఇంకనూ, ఇంకనూ లేఖన సిద్ధాంతమునకు దూరమైపోయారు.
42ఏబది సంవత్సరములకు ముందు లూసియానాలో, పెంతెకోస్తు దిగి వచ్చినది. అది ఇంకనూ రెండు వందల సంవత్సరములు నిలచినదైతే ఆ కాథలిక్ సంఘము కన్నను దూరమైపోతుంది. ఈ ఏబది సంవత్సర ములుగా అది పడిపోవుచునే వచ్చుచున్నది, ఎందుకనగా ప్రతిసారి దేనినో ఒక దానిని వారు చేర్చుకొనుచూ వచ్చుచున్నారు. ఆ పురాతన విధపు బోధకులు మరుగైపోయారు. ఏ ఒక్క వీధి కూడికను గురించి (ఆ దినములలో వీధుల చివరలలో కూడికలు జరుగు చుండినవి) మీరు వినలేరు. మనకున్నదంతయు దానికి బదులుగా నిలచిన హాలీవుడ్ గుంపు ఒక్కటే. పొట్టి దుస్తులను వేసికొని, పొట్టివిగా వెంట్రుకలను కత్తిరించుకొను స్త్రీలు పెదవులకు రంగులు, గోళ్లకు రంగులు ఇంకేవేవో ధరించుకొనుచు తమ్మును ఒక క్రైస్తవులుగా పిలచుకొనుచున్నారు. ఒక చిన్న 'రిక్కీ' గిటారు తీసికొని పైకి క్రిందికి గంతులు వేయుచు, పైన చెప్పినట్లు దుస్తులను ధరించి తన దేహమంతటిని వేలుపలకు చూపుకోనుచు, వేదికలపై నటనమాడుచు, షేక్ డాన్సులను వేయుచు చెవులకు జారే కమ్మలను తగిలించుకొని పనికిమాలిన వేషధారణను ధరించి తమ్మును క్రైస్తవులని పిలచుకొనుచున్నారు.
ఈ దినము మనకు కావలసినదంతయు ఆ పురాతన నాగరికత గల, దేవునిచే పంపబడిన కాల్చునటువంటి మతము అనగా సంఘము నుండి ఆ లోక స్థితిని కాల్చివేయు మతము మనకు కావలసియున్నది. మనము ఆ పరిశుద్ధాత్మ అగ్నికి తిరిగి రావలసిన వారిమైయున్నాము. మనలోని చెత్తను కాల్చివేయు దానికి మనము తిరిగి రావలసియున్నది. మరలా ఆ పురాతన ఉపదేశమును తెచ్చి, పరలోకమును ఎత్తు చేయుచు (లోకము నుండి పైకెత్తుచు) పాతాళమును వేడి చేయుచు, తుపాకీని గురిలో ఉంచునది మనకు కావలసియున్నది. అయితే ఈ దినము మీరలా చేశారంటే మీ సభ మిమ్మును వేలుపలకు నెట్టివేయునట్లు వోటు వేయును.
43కొన్ని సమయములలో మంచి బోధకులు సహితము తమ సభికులచే త్రోవ తప్పించబడుచున్నారు. అందు నిమిత్తమే ఎటువంటి సంస్థ నాకు లేదు. నాకు ఒక్కటే ఒక ప్రధాన శిబిరమున్నది. అది పరలోకము నుండి వచ్చుచున్నది. ఆయన నన్ను ఎక్కడకు పంపున నేనక్కడకు వెళ్లుదును. ఆయన దేనిని చెప్పుతో దానినే నేనును చెప్పెదను. మనకు ఎటువంటి సంస్థలు అక్కర లేదు. మీ సంఘము ఎప్పుడు సంస్థను గురించి మాట్లాడునో అప్పుడే మీరు మీ బోధకుని పోగొట్టుకొందురు. నేను వాటి చుట్టు తిరుగలేను. ఐదు నిమిషములు కూడా వాటిని భరించలేను. ఏ సంఘమైనను సంస్థగా మారిన తరువాత విత్తనములోకి వెళ్లినదని చెప్పగలరా? ఏదైనను మరలా పైకి వచ్చినట్లు చెప్పగలరా? సంఘమును నడిపించుటకు గాను పరిశుద్ధాత్మ పంపబడెనే గాని ఒక గుంపు మనుషులను కాదు. పరిశుద్ధాత్మ జ్ఞానమై యున్నాడు. అయితే మనిషి బిగుసుకుపోయి, వ్యత్యాసమైనవారిగా మారుచున్నారు.
JOSH 3:4,5
44వారికొక మార్గదర్శిని పంపెదనని దేవుడు చెప్పెను, ఆయన వారిని మార్గమందు నడిపించును. వారు అగ్నిస్తంభమును వెంబడించునంత వరకు వారు చక్కగానే వెళ్లారు. ఆయన వారిని వాగ్దానపు ద్వారము నొద్దకు నడిపించాడు, అంత వరకు ఆయన వెళ్లాడు. ఆ తరువాత యెహోషువ, అను గొప్ప వీరుడు లేచాడు. ఆయన వారితో "మిమ్మును శుద్ది చేసికొనుడి, మూడవ దినమున దేవుడు ఈ యోర్దాను నదిని పాయలు చేయనైయున్నాడు, మనము దాటి వెళ్లనై యున్నాము,'' అని చెప్పిన దానిని జ్ఞాపకము చేసికొనుడి. ఆయనేమి చెప్పాడో గమనించండి. (నేను దానిని ఇష్టపడుచున్నాను) వాక్యభాగమందు అతడు చెప్పినదేమనగా "మందసమునకు సమీపముగా నిలువుడి, ఎందుకనగా ఈ మార్గము మీరు ఇంతకు ముందు వెళ్లినది కాదు."
JOSH 3:4
45ఆ ముందసము ఏమైయున్నది? అది వాక్యమైయున్నది. మీ సంస్థల మార్గమందు ప్రయాణము చేయకుడి. వాక్యముతో నిలచియుండుడి. ఇది మీరు ఇంతకు ముందు వెళ్లిన మార్గము కాదు. సోదరా, క్రైస్తవ సంఘము తనను పరీక్షించుకొను సమయము ఏదనగా, 'అది ఇప్పుడే.' రోములో ఇప్పుడే జరుగుచుండు కూడికల కాలములో మనమున్నాము. బేధములు ఏర్పడినని, సంఘ సమాఖ్య ఏర్పడుచున్నది. ఈ సంస్థలన్నియు ఏకముగా చేరి ఆ మృగమునకు ప్రతిమగా ఏర్పడుచున్నవి. బైబిలు దానినే ఖచ్చితముగా చెప్పుచున్నది. ఈ ఉదయ కాలపు వర్తమానములలో మనమేమి మాట్లాడితిమో మీరెరిగియున్నారు. ఇక్కడే మనమున్నాము. ప్రతిది, ద్వారము నొద్ద నిలచియున్నది. ప్రజలు ఇంకనూ సిద్దాంతములను వెంబడించుచున్నారు, అయితే మీరు వాక్యముతో నిలచి యుండుట మంచిది! వాక్యము మిమ్ములను దాటించును, ఎందుకనగా వాక్యము క్రీస్తుగా ఉన్నాడు. క్రీస్తు దేవుడుగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు.
వాక్యము వెనుక నిలచి యుండుడి! ఓ అవునండి! మార్గదర్శితో నిలచియుండుడి. దాని వెనుకనే నిలచియుండుడి. దానికి ముందుగా వెళ్లకుడి. మీరు దాని వెనుక నిలువుడి. అది మిమ్ములను నడిపించనియ్యుడి. దానిని (వాక్యమును) మీరు నడిపించకుడి. మీరు దానిని వెళ్లనియ్యుడి.
''ఇప్పుడు, ఇది మీరింతకు ముందు వెళ్లిన మార్గము కాదు. మీకా మార్గమును గురించి ఏమియు తెలియదు,'' అని యెహోషువ చెప్పుచున్నాడు.
46ఈ దినము మనకు వచ్చిన సమస్య అదియే. ఆ విశాల మార్గమందు వెళ్లుటకు మీకొక మార్గదర్శిని మీరు కోరుట లేదు. ఓ, మీరు సమస్తమైన ముట్టడి సందులన్నింటిని ఎరిగియున్నారు. పాపమునకు వెళ్లు మార్గమంతటిని ఎరిగియున్నారు. అక్కడ ఏదియు లేదు. ఓ, ఎంతో కాలము ఆ విధముగా ఉండెదరు. దానిని గురించి మరొకరు మీకు చెప్పనవసరము లేదు. మీకు వంకర మార్గములన్నియు బాగుగా తెలియును. అది నిజము. ప్రతి పాపమును గురించి సమస్తమును మీరెరిగియున్నారు. ఎలా దొంగలించవలెనని మీకు ఎవ్వరు చెప్పనక్కర లేదు; అది మీకు తెలియును. ఎలా శపించాలో మీకెవ్వరూ చెప్పనక్కర లేదు; అది మీకు తెలియును. ఈ దుష్ట కార్యములు చేయవలెనని ఎవ్వరూ మీకు తెలుపనక్కర లేదు, ఎందుకనగా ఆ ప్రతి కార్యము వీధులలోని చెట్లకు ప్రకటన పలకలుగా అతికించబడియున్నది.
అయితే క్రైస్తవులైన మీరు జ్ఞాపకముంచుకొనండి, మీరు దానిని దాటి వెళ్లిపోయారు. మీరు మరొక దేశమందున్నారు. మీరు మరలా జన్మించినవారు. మీరు ఆ భూభాగమందున్నారు, అది ఒక పరలోక దేశము. మీరు వాగ్దాన భూమిలో ఉన్నారు.
MARK 16:17,18
47మీ చుట్టూ ఉన్న మార్గమును మీరెరిగియున్నారు, మీరు అలా వెళ్లవచ్చు. ఓ, మై, అవునండి. మీరు పాచికలను ఎరిగియున్నారు. అవి ఏ విధముగా దొర్లుతాయోనని కూడ ఎరిగియున్నారు. వాటికర్థమేమని కూడ మీరెరిగియున్నారు. ప్రతి కార్యమును మీరు ఎరిగియున్నారు. అయితే పరిశుద్ధత, నీతి, దేవుని శక్తి మరియు పరిశుద్ధాత్మ ఎలా క్రియ చేయుచున్నదో, అది ఏమి చేయుచున్నదో అను కార్యములకు మీరు వచ్చినప్పుడు, మీరు వాక్యము వెనుక నిలచియుండుట మంచిది. వాక్యము మార్గగదర్శిగా ఉన్నాడు, చూశారా. ఈ మార్గము మీరు ముందు వెళ్లినది కాదు.
మంచిది, మీరిలా చెప్పవచ్చు, ''నేను ఒక చక్కని వ్యక్తిని, కాలేజిలో రెండు డిగ్రీలను చదివాను.'' మీరు దానిని మరచిపోవుట మంచిది. అవునండి.
''నేను సెమినరీ చదువుకున్నాను," అని చెప్పుతావేమో, దానిని మరచిపోవుట ఎంతైనా మంచిది. మీరు కేవలము ఆ మార్గదర్శిని వెంబడించి ఆయన మిమ్ము నడిపించునట్లు మీరు ఆయన వెనుక ఉండుట మంచిది. ఆయన ఆ మార్గమును ఎరిగియున్నాడు. మీకది తెలియదు. మీరు ఇంతకు ముందు ఈ మార్గమున వెళ్లలేదు. ''మంచిది, వారు వెళ్లారని," మీరు చెప్పవచ్చు.
వారు వెళ్లారేమో చూడండి. "ఈ మార్గమున వెళ్లిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని," యేసు వారితో చెప్పెను. వారిలో అనేకులు దానిని నిరాకరించి త్రోసివేశారు. అది ప్రేరేపించబడినది కాదని కూడా చెప్పారు. వారా మార్గదర్శిని వెంబడించుట లేదు. వారు మానవ-కల్పిత సిద్ధాంతమును వెంబడించుచున్నారు. మీరు వాక్యము వెనుక నిలచుట ఎంతైనా మంచిది, ఎందుకనగా మీరీ మార్గమన ముందు వెళ్లలేదు, మీకు తెలిసినదా.
JOHN 16:13
48అయితే మీరు మరలా జన్మించినవారైయున్నారు, మీరు పరిశుద్ధతలోనికి జన్మించియున్నారు. ఈ మార్గము మీరు ముందు నడచినది కాదు. మీరు పరిశుద్దత ద్వారా రావలసియున్నది, ఎందుకనగా అది ఒక నూతన దేశము, ఒక క్రొత్త జీవితము, ఒక క్రొత్త జనసమూహము.
మీరు సంఘమునకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు లేచి నిలచి "హల్లెలూయ! దేవునికే మహిమ!" అని చెప్పుట మాత్రము విని యుందురు.
ఇంత ఎందుకు, మీరు ''ఓ, నా సంఘములో వారలా చేయరు. నేను లేచి వెళ్లిపోవుదును," అని చెప్పవచ్చు. చూశారా? జాగ్రత్తగా ఉండుడి.
ఇప్పుడీ వాక్యము వెనుక నిలచి యుండుడి. ఆ మార్గదర్శి మిమ్మును నడిపించనియ్యుడి. "ఆయన మిమ్మును సత్యములోనికి నడిపించును. నేను మీతో మాట్లాడిన అనేక కార్యములు బయలుపరచును. ఆయన దానినంతటిని చూపును. రాబోవు కార్యములను తెలుపును. ఆయన నిజ మార్గదర్శిగా ఉన్నాడు. బిషప్పుల దగ్గరకు వెళ్లవద్దు. మార్గదర్శి యొద్దకు కాక మరి ఎవ్వరి దగ్గరకు వెళ్లవద్దు. మిమ్మును నడిపించుటకు పంపబడినది ఆయనే. ఆయనే ఆ కార్యములను చేయును. దేవుడే మీకొక మార్గదర్శిని ఏర్పాటు చేసియున్నాడు. దేవుడేర్పరచిన మార్గమును గైకొనుము.
ఈ దినము వచ్చిన సమస్య ఏమనగా, సంఘమునకు వచ్చిన ప్రజలు కొన్ని నిమిషములు కూర్చొని, వారికి అలవాటు లేనివాటిని చేయుచుందురు.
49ఒక నామకార్థ సంఘము నుండి వచ్చిన ఒక స్త్రీని నేను అభినందించుచున్నాను. ఆమె తన కొరకు ప్రార్థన చేయించుకొనినది, దేవుడా స్త్రీని స్వస్థపరచనున్నాడు. ఆమెకది గ్రహింపు కావడము లేదు. ఆమెకు దానిని గురించి ఏమియు తెలియదు. ఆమె లోపలకు వచ్చి ఆమెకేమి తెలియదని ఒప్పుకొన్నది. అయితే నేనామెతో నీవు వచ్చి నన్ను చూడుము అని చెప్పాను. ఆమె వెనుకంజ వేయు చుండినది. అయితే ఆ మార్గదర్శి ఆమెతో ''ముందుకు వెళ్లుము,'' అని చెప్పుచూ వచ్చాడు. ఆమె దానిని పొందినది. అది అంతే. చూశారా, ఎందుకనగా పరిశుద్ధాత్మ మనలను ఆ కార్యములకు నడిపించుచున్నాడు. చూశారా, దేవుడు సిద్దపరచిన మార్గమును కలిగియున్నాడు.
50అడవి (గూస్) బాతులు దక్షిణముగా వెళ్లుటను మీరెప్పుడైనను గమనించారా? మంచిది. ఇప్పుడు జ్ఞాపకము చేసికొనండి. ఆ చిన్న ముసలి బాతు ఆటు ప్రక్కగా సమీపమందున్న ఒక కొలనులో జన్మించినది. దానికి తూర్పు దిక్కు తెలియదు, లేక ఉత్తరమో, పడమరయో లేక దక్షిణమో ఏదియు తెలియదు. దానికేదియూ తెలియదు గాని, ఆ కెనడా దేశములోని కొండలలో ఉన్న ఆ చిన్న కొలను మాత్రమే ఎరిగియున్నది, ఆ కొలను నుండి ఎప్పుడు గాని దూరముగా వెళ్లలేదు. అది పుట్టకతోనే ఒక నాయకునిగా ఉన్నది.
ఆ చిన్న మగ బాతు, ఒక నాయకుడిగా జన్మించాడు. మొదటిగా ఒక గొప్ప మంచు ఆ కొండల మీదుగా ఒక రాత్రి వచ్చినది. అప్పుడేమి జరిగినది? అక్కడ ఆ చల్లటి గాలులు వీచుటకు ప్రారంభమైనది. అప్పుడది చలిలో వణకిపోవుచు, "అమ్మా, ఇది ఏమిటి?" అని అడిగి యుండవచ్చునని నేను ఊహించుచున్నాను. చూశారా, అటువంటి చల్ల గాలులను అదెప్పుడు చూచియుండలేదు. అతడా చుట్టు ప్రక్కలుగా చూచినప్పుడు, ఆ కొలను అంచులు మంచుతో గడ్డగట్టుచుండినది. అతనికది తెలియదు, అయితే అనుకోకుండనే…
అతడు ఆ బాతుల సమూహమునకు మార్గదర్శిగా జన్మించుట వలన, అతడా కొలను మధ్యకు ఎగిరి పోయి నిలచెను. మీరు దానిని ఎలాగైనను పిలువ వచ్చును గాని. మేమైతే దానిని అనుభూతిగా పిలచేదము, లేక మీరును అలా పిలువ వచ్చు, ఓ, అది కేవలము సహజ స్వభావముగా ఉన్నది. అది ఏమైనను గాని, వెంటనే ఆ కొలను మధ్యకు వెళ్లి తన పొడుగైన మెడను గాలిలోకి పైకెత్తి "హాంక్, హాంక్, హాంక్, హాంక్!" అని అరచుటకు ప్రారంభించాడు. అప్పుడు ఆ కొలనులో ఉన్న ప్రతి బాతు అతని దగ్గరకు వచ్చి చేరినవి. ఎందుకు? ఆ నాయకుడు వాటి కొరకు కేక వేసిన విధము వాటికి తెలిసినది.
1COR 14:8
51"బూర శబ్దము స్పష్టము కానిదే ఎవరు యుద్దమనకు సిద్దపడుదురు?" అది నిజము. నిశ్చయత లేని ఒక శబ్దమును వినినయెడల యుద్దమునకు ఎవరు సిద్దపడగలరు?
మంచిది, ఆ చిన్న బాతు స్పష్టముకాని కూతను వేసినయెడల, ఎగిరిపోవుటకు ఎవరు సిద్ధపడగలరు? అయితే ఆ చిన్న బాతు తన మెడను చూచి "హాంక్, హాంక్ - హాంక్, హాంక్'' అంటూ కూత వేయసాగింది. ఇప్పుడు అవి గుంపుగా కలసి చేరవలసిన స్థలమునకు ఎగిరి పోయినవి. ఆ కొలను మధ్యన అటువంటి జూబిలిని అవి కలిగియుండినది. మెల్ల మెల్లగా అవి ఒకటగుచున్నవి. ఆ మంచు గడ్డ కట్టుచు వారిని సమీపించుచుండగా అవి అక్కడ నుండి వెళ్లిపోవలసియున్నదని గ్రహించినవి. అప్పుడు ఆ మార్గదర్శిగా ఉన్న ఆ బాతు తన రెక్కలను చూచి ఎగురుటకు ఆరంభించినది. ఆ విధముగా మిగిలిన బాతులు దానిని వెంబండించుచుండగా, లూసియానా పట్టణము వైపునకు అవి ఎగిరిపోవుచున్నవి. "హాంక్, హాంక్, హాంక్, హాంక్!'' అనుచు అతడు వచ్చుచున్నాడు. ఎందుకు? అతడొక మార్గదర్శిగా ఉన్నాడు! ఆమేన్! బాతులు తమ మార్గదర్శిని ఎరిగియున్నవి. అయితే ఈ నాటి సంఘము దానిని ఎరుగుట లేదు. అవును, అతనికి చేయవలసినదేదో తెలిసియున్నది.
52ఆ ముసలి బాతును చూడండి. అలస్కా పట్టణము నుండి ఎగిరిపోవుచున్నవి. ఎప్పుడు గాని ఒక వృద్ద మొగబాతు ఎల్లవేళల వాటిని నడిపించుటకు గాను అక్కడుండును. ఆ వృద్ద మొగబాతు మాట్లాడునదేమిటో తక్కినవి ఎరిగియుండవలసియున్నది. నాలుగు సంవత్సరముల క్రితము, ''లుక్ పత్రికలో'' మీరు ఆ కార్యమును చూచారా? ఒక వృద్ద మొగబాతు ఏమియు ఎరుగక మిగిలిన వాటినన్నిటిని ఇంగ్లాండు వైపునకు తీసుకొని వెళ్లిపోయాడు. అది నిజము. అవి అంతకు ముందెప్పుడైనను ఇంగ్లాండుకు రాలేదు. ఎందుకు? అవి వాటిని నడిపించువానిని గమనించలేదు. ఆ వృద్ద మొగబాతు ఎక్కడకు వెళ్లుచున్నాడో అతనికే తెలియుట లేదు. అవి అక్కడకు చేరి తిరిగి రాలేక పోయినవి.
MARK 16:17
53ఈనాటి ఈ బాతులతో వచ్చిన సమస్య కూడ ఆ విధముగానే యున్నది, అవి ఇంకను గుంపుగా చేరుచునేయున్నవి. వారేమి చెప్పెదరనగా, ఆ ''లుక్ పత్రిక'' చెప్పునదేమనగా, ఆ బాతు బాతుల గుంపు ఇంగ్లాండునకు ఎగిరిపోయినవి, అయితే ఎందుకు తిరిగి రాలేదని తెలియలేదు. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని బాతు స్థితి అలాగే ఉన్నది. మీరు ఒక గుంపుగా చేరారు. ఒక గొప్ప కూడికను ఏర్పరచి, కొందరు ఉజ్జీవకారులను ఏర్పాటు చేసికొని కొంత సమయము ప్రసంగము చేయనిచ్చుచున్నారు, అయితే మీరెక్కడకు పోవుచున్నారో మీరెరుగకున్నారు. తిరిగి, తిరిగి గుంపు చేరుచు, మిమ్ములను సంస్థలలోకి నడిపించుటకు అనుకూలమైన మార్గదర్శకులను సమకూర్చుకొనుచున్నారు; అయితే దేవుని వాక్యమునకో లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకో మరలి వచ్చుట లేదు. అప్పుడు వారు ఎందు నిమిత్తము మన దినములలో ఉజ్జీవము కలుగుట లేదని ఆశ్చర్యపడుచున్నారు, చూశారా. వీవు ఆ శబ్దమును స్పష్టముగా వినవలసియున్నది! ఆ శబ్దము సువార్త నుండి స్తంభించిన సువార్త బూరగా ఊదబడుచున్న దేవుని వాక్యమైయున్నది. అదేదో ఒక సిద్ధాంతము కాదు లేక సంస్థ కాదు; అయితే అది బైబిలుగా ఉన్నది. అది పరిశుద్ధాత్మగా ఉన్నది. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును,'' చూశారా. అక్కడ ఆ విధముగా వారు ఆ బాటలో సాగిపోయారు.
54ఒకప్పుడు ఒక ముసలి బాతు చీకటిలో ఒక గుంపు బాతులను నడిపించినందున అవి చచ్చినవని వారు చెప్పారు. ఆ ముసలి మగబాతునకు తాను ఎక్కడకు వెళ్లుచున్నాడోనని తెలియకపోయినది. ఆవన్నియు అక్కడున్న కొండలకు కొట్టుకొని మరణించినవి. కొన్ని చెదరి పోయినవి, అది వాస్తవము! అవి వాటి శబ్దమును స్పష్టముగా ఎరిగియుండవలసియున్నది. ఆ చిన్న ముసలి బాతునకు ఆ శబ్దము బాగుగా తెలియును. ప్రతి ఒక్కరికి అది బాగుగా తెలియును. అయితే వారు ఒక రకమైన జూబిలి గుంపును ఏర్పాటు చేశారు. ఆ విధముగా ముందు చెప్పబడిన కొలను మంచుతో గడ్డకట్టుకొనుట ప్రారంభమైనప్పుడు ఆ బాతులు పైకి ఎగిరిపోయి దక్షిణముగా వెళ్లిపొయినవి. ఎందుకొరకు అక్కడకు వెళ్లారు? అక్కడ ఏలాంటి చలిగాలులు లేవు.
ఇప్పుడు, ఒక బాతునకు దేవుడు ఆ భయంకర చలిని తప్పించుకొనుటకు కావలసిన జ్ఞానమును దయచేసి యున్నప్పుడు, సంఘమునకు ఆయన ఏమి చేసియుండవలెను? ఒక బాతు తనకున్న శబ్దమును గ్రహించు సహజ స్వభావము ద్వారా కనుగొనగలిగినప్పుడు, సంఘములో ఉన్న పరిశుద్ధాత్మను గురించి ఏమిటి? ఆ పరిశుద్ధాత్మ ఈ పురాతన సిద్ధాంతముల నుండి పారంపర్యముల నుండి ఇతర కార్యముల నుండి వెలుపలకు నడిపించవలసియున్నది. మనలను మహిమకరమైన, ఆశ్చర్యకరమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు నడిపించవలెను. సద్గుణము, జ్ఞానము, సహనము, దైవభక్తి మరియు పరిశుద్ధాత్మ అక్కడున్నవి. ఒక నిజ మార్గదర్శి ఆ విధముగా నడిపించును, ఎందుకనగా అతడు దేవుని వాక్యమైయున్న సువార్తను కాక మరొక దానిని తెలియపరచడు. వాస్తవము, మీకొక మార్గదర్శి అవసరమైయున్నది!
MATT 2:2
55ఆ జ్ఞానులకు దేవుని గురించి తెలియదు, వారు మాంత్రికులై, తంత్రములు చేయువారై యున్నారు. వారు తూర్పు దేశస్థులైయుండిరి. "తూర్పున ఆయన నక్షత్రమును కనుగొంటిమి, కావున ఆయనను ఆరాధింప వచ్చామని,'' వారు చెప్పినట్లు బైబిలు చెప్పుచున్నదని మీరెరిగియున్నారు. వారు పడమరలో ఉండి తూర్పున నక్షత్రమును చూచారు… లేక, వారు తూర్పున ఉండి పడమరకు చూచారు. "మనము తూర్పున ఉన్నప్పుడు నక్షత్రమును చూచాము." చూడండి, వారు తూర్పున ఉన్నారు. "మేము తూర్పున ఉన్నప్పుడు మేమానక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చాము.''
MATT 2:2
56వారు బయలుదేరుటకై సిద్దపడుటను నేను ఊహించి చూడగలను. వారి భార్యలలో ఒకరు ఇలా చెప్పుటను ఊహించగలను, "ఏమండి, సమస్తమును సిద్ధపర్చబడినవి, అయితే మీ ''దిక్చూచి" ఎక్కడ? అని అడిగియుండవచ్చు.
అందుకతడు ''నేను ఈ పర్యాయము దిక్చూచిని ఉపయోగించడము లేదు.
''మంచిది, ఆ కొండలను ఎలా దాటగలరు? జ్ఞాపకముంచుకొనండి, వారు ఆ గొప్ప 'టైగ్రస్' నదిని దాటవలసియున్నది. ఆ సమ భూముల ద్వారా ప్రయాణము చేయవలసి యున్నది. ఇంతెందుకు, ఒంటెల మీదుగా రెండు సంవత్సరములు సాగిపోవలసి యున్నది. వారెలా సాగిపోగలరు? ''మంచిది, మీరు దిక్చూచిని తీసుకొని వెళ్లుట లేదు,'' ఆమె అడిగింది.
అందుకతడు ''అక్కర లేదు'' అని బదులిచ్చాడు.
"మీరెలా వెళ్లనైయున్నారు?"
''దేవుడు ఏర్పాటు చేసిన మార్గమందు మేము ప్రయాణము చేయనైయున్నాము. అదిగో ఆ సమీపమున ఉన్న నక్షత్రము ఆ రాజు నొద్దకు మమ్మును నడిపించును." అది అసలు సంగతి.
"తూర్పున మేమాయన నక్షత్రమును చూచి, పడమరగా ఇక్కడ వరకు మార్గమంతటను దానిని వెంబడించుచు, ఆయనను పూజింప వచ్చితిమి. ఆయన ఎక్కడున్నాడు?'' దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును వారు వెంబడించారు. వారేదో కొన్ని సిద్ధాంతములతో కట్టబడి, యెరూషలేము పట్టణమునకు వచ్చి వీధుల వెంబడి పైకీ, క్రిందికీ తిరుగుచు, "ఆయన ఎక్కడున్నాడు? యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు?" అని అడుగుటకు ప్రారంభించారు. మంచిది, ఆ యెరూషలేము శిరస్సుగా ఉన్నది. అక్కడున్న ఒక గొప్ప సంఘమునకు దీనిని గురించి తెలిసియుండవలసియున్నది. ''ఆయన ఎక్కడున్నాడు? యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఆయన ఎక్కడున్నాడు?'' అని అడుగుటకు ప్రారంభించారు.
వారు ఒక గొప్ప బోధకుని దగ్గరకు వెళ్లి, ప్రధానయాజకుని దగ్గరకు వెళ్లి అడిగారు, కాని ఎవ్వరూ ఈ కార్యమును ఎరిగియుండలేదు. "ఏమిటీ, యూదులకు రాజుగా ఒకరు పుట్టియున్నాడు, ఆయన ఎక్కడున్నాడు?" వారికి తెలియుదు.
HEB 4:12
57అయితే అక్కడ ఆ కొండల ప్రక్కగా, గొర్రెల కాపరులు చలి కాచుకొనుచూ ఉన్నారు. అవునండి, వారును దేవుడేర్పరచిన మార్గమున వచ్చిన వారే.
అందువలన యేరుషలేము నందున్న ఆ గొప్ప బోధకులు ఒక్కటిగా చేరి, "మనమేమి చేయవలెనో చెప్పెదను. మనమొక బోర్డు మీటింగ్ ను ఏర్పాటు చేయవలసి యున్నది,'' అని మాట్లాడుకొని సన్హేద్రిను అను సభను ఏర్పాటు చేశారు. అప్పుడు అక్కడు చేరిన వారిని ఈ కార్యమును గురించి అడిగినప్పుడు, వారిలో ఒక్కరికి కూడ దీనిని గురించి తెలియలేదు.
ఈ నాటి స్థితి కూడ ఆలాగుననే ఉన్నది. ఈ మార్గదర్శిని గురించి వారికేమియు తెలియదు. మనలను స్వస్థపరచుచు, మనలను అభిషేకించుచు, రక్షించుచున్న పరిశుద్ధాత్మ మరలా వచ్చుచున్నాడు. ఈ కార్యములన్నియు జరుగునని ఆ మార్గదర్శి సెలవిచ్చుచున్నాడు. ఆ కార్యముల మధ్య ఇప్పుడు మనమున్నాము. ఆయన మన తలంపులను గ్రహించువాడైయున్నాడు; ఆ బోధకులకు దాని గురించి ఏమియు తెలియదు, వారు దానిని ఆలోచనలను చదువుట లేక మరేదో అనుచున్నారు. దానిని గురించి ఏమి చెప్పాలో వారికి తెలియుదు.
MATT 2:2
58మీరు చూడండి, అందువలన ఆ జ్ఞానులు… జ్ఞాపకమంచుకొనండి, వారు యెరూషలేములోనికి ప్రవేశించిన వెంటనే ఆ నక్షత్రము మరుగైపోయినది. మీరు, మీ సిద్దాంతములు, మీ సంస్థలలోని మనుష్యులు మిమ్మును, దేవుని యొద్దకు నడిపించవలెనని చూచినంత కాలము, దేవుని సహాయము మీకు దూరమైయుండును. అయితే ఆ జ్ఞానులు తెలియక యెరూషలేములో ఉన్న వారితో అతికి ఉన్నంత వరకు ఏదియు తెలియక పోయినది, కాని వారు యెరుషలేమును విడిచి, ఆ యూదుల సిద్దాంతములను, సంస్థలను విడిచి యెరుషలేము వెలుపలకు వెళ్లినప్పుడు, ఆ నక్షత్రము మరలా కనబడినది. వారు గొప్ప సంతోషముతో ఉల్లసించారు. ఆ మార్గదర్శిని వారు మరలా చూచారు! ఓ, ఒక పురాతన నులువెచ్చని సంఘ స్థితి నుండి, ఒక మంచి వేడియైన స్థితికి వచ్చారు, చూడండి ఆ మార్గదర్శి వారిని నడిపించుచున్నాడు. ఏమా వ్యత్యాసము! అవునండి, "తూర్పున మేమాయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింప వచ్చితిమి.''
JOSH 3:4
59యెహోషువా ఇలా చెప్పెను, "మీరిప్పుడు ఈ నిబంధన మందసమును దగ్గరగా రండి, ఎందుకనగా ఇది ఇంతకు ముందు మీరు వెళ్లిన మార్గము కాదు." ఆ మందసము నేరుగా వెళ్లవలసినదే గాని వేరు మార్గములో వెళ్లుటకు దేవుడు అనుమతించడు. ప్రతి ఒక్కరు దానిని వెంబడించారు. అతడు నేరుగా యోర్దానుకు అడ్డముగా వెళ్లాడు.
ఈనాడును పరిశుద్ధాత్మ ద్వారా అదే కార్యము జరుగుచున్నది. అవునండి. మనకు తెలిసినదంతయు అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుచున్నదా లేక కాదా అనునది మాత్రమే, దాని నిరూపణలన్నిటిని మనము చూచాము. ఆ నిరూపణలు దేవుని వాక్యపు గుర్తింపుతో నెరవేరినవి.
60ఇప్పుడు, కొంత కాలము క్రితము కొందరు సోదరులు రక్తమును, నూనెను కలిగియుండిరి. అది మంచిదే. అయితే నాకది నిరూపణ కాదు. అది వాక్యపు నిరూపణగా ఉండవలసి యున్నది. చూశారా, దేవుడు చెప్పిన దానిని నిరూపించినంత కాలము అది మంచిదే. ''మీరు పరిశుద్ధాత్మను పొందినందుకు ఇదే కారణము, మీ చేతులలో నూనే ఉన్నది," అని వారు చెప్పారు. నేను దాని యొద్దకు వెళ్లలేను, చూశారా. దానితో నూనెకు ఎలాంటి పని ఉన్నదని నేను నమ్మను. ఆ రక్తము మిమ్ములను రక్షించునట్లయిన యేసుక్రీస్తు రక్తము గురించి ఏమిటీ? ఆ నూనే మనలను స్వస్థపరచినయెడల, ఆయన పొందిన గాయముల మాటయేమిటి? చూశారా? మీరు చూశారా?
ఆ మార్గదర్శి వచ్చుటను నేనిష్టపడుచున్నాను, వాక్య సత్యమునకు మనలను నడిపించవలెననిన మనము ఖాళీ కావలసియున్నది. మన సంఖ్య "సున్నా'' (O, zero) కు రావలసియున్నది. అప్పుడు నీవు లెక్కింపబడుటకు సిద్దముగా ఉన్నావని అర్థము. అది నిజము. ఎగిరిపోవుటకు సిద్ధపడుచున్నాము. అవునండి. నిజము. ఎందుకు? ఆ మార్గమును సరాళము చేయువాడు ఆ మార్గదర్శిగా ఉన్నాడు.
JOHN 8:57,58•
2PET 1:21
61ఇక్కడ నేనొక లేఖనమును వ్రాసికొని యున్నాను. నాకీ లేఖనములు ఇవ్వబడినవి, అయితే దీనిని మాత్రము చదువుటకు ఇష్టపడుచున్నాను: II పేతురు 1 వ అధ్యాయము 21వ వచనము.
''ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగ లేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి."
ప్రవచనము ఏలాగు వచ్చినది? మనుష్యుని ఇచ్ఛను బట్టి కాదు, సంస్థల సిద్దాంతములను బట్టి కాదు, అయితే దేవుని ఇష్టమును బట్టి అది వచ్చినది. అప్పుడు పరిశుద్దులు పరిశుద్ధాత్మచే కదలింపబడిరి. అతడు అన్ని వేళల దేవుని మార్గదర్శిగా ఉండును. అదియే పరిశుద్ధాత్మ, అదియే అగ్నిస్తంభము. ఆ పరిశుద్ధాత్మ క్రీస్తుగా ఉన్నాడని ఏ మనుష్యుడైనను ఎరిగియున్నాడు. మోషే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచెను. క్రీస్తు ఆ ఒక్కడుగా ఉన్నాడు! మంచిది. వారక్కడ నిలచి ఇలా చెప్పినప్పుడు, ''మంచిది, నీవు అబ్రాహామును ఎరిగియున్నానని చెప్పుచున్నావు, నీకు ఏబది సంవత్సరములైనను కాలేదే మరి అబ్రాహామును ఏ విధముగా చూచియుందువు?''
అందుకాయన, "అబ్రాహాము కంటే నేను ముందున్నాను,'' అని చెప్పెను. ఆ మండుచున్న పొదలో మోషేను కలసికొన్నది నేనే, అవునండి, ఆయన శరీర రూపమును దాల్చిన దేవుడు మూడవ వ్యక్తి కాదు; ఒకే వ్యక్తి వివిధ కార్యాలయములలో ఉన్నాడు. అవి ముగ్గురు దేవుళ్ళు కాదు; ఒక్క దేవునిలో ఉన్న మూడు కార్యాలయములు. అది నిశ్చయము.
GEN 2:17
62మంచిది, ఇప్పుడు లేఖన భాగము, ఎల్లప్పుడు దేవుడు నిర్ణయించినట్లే ఉండును. ఆయన మంచి దానిని ఏర్పాటు చేయును. దేవుడు తన సంఘమను శుద్ధి చేయుటకు గాను ఒక మార్గమును ఏర్పరచియున్న యెడల, ఆయన అతి మంచి దానిని ఏర్పాటు చేయును. ఆయన ఏదేను తోటలో ఆదాము హవ్వలకు ఇచ్చినప్పుడు, ఆయన వారికి దేనినివ్వగలడనగా ఆయన వాక్యమును మాత్రమే ఇవ్వగలడు. "నీవు ఈ వాక్యము వెనుక నిలచి యుండ వలసియున్నది. అది నిన్ను రక్షించును. అయితే నీవు దాని నుండి దూరమైనప్పుడు, నీవు దానిని తినిన దినమున చచ్చెదవని చెప్పెను." దేవుడు ఎప్పుడు కూడా తన విధానమును మార్చుకొనలేదు. సాతాను కూడా తన స్వభావమును మార్చుకోనలేదు. వాడు ఆనాడు ఏ విధముగా ఆదాము హవ్వలో ప్రవేశించెనో ఆ విధముగానే ఈనాడు వీరిలో ప్రవేశించుచున్నాడు. ఎందుకు? దేవుని వాక్యమును యోచించుచు కారణమును వెదకుట ద్వారా ఆ కార్యమును చేయుచున్నాడు. "ఇప్పుడు, దేవుడలా చేయడనుట న్యాయముగా ఉన్నది. ఓ, దేవుడలా చెప్పెను,'' సాతాను చెప్పినదేమనగా, "అయితే నిశ్చయముగా దేవుడలా చేయడు." అయితే నిశ్చయముగా ఆయన చేయును, ఎందుకనగా ఆయన చేసెదనని చెప్పెను!
63దానినే ఈనాడు ఈ ప్రజలు చెప్పుచున్నారు, "ఓ, ఇప్పుడు ఆగండీ! దానిని ఇప్పుడు మీరు నమ్మరు, నేను సంఘమునకు వెళ్లినయెడల, నేను నా దశమ-భాగములను చెల్లింతును, ఇది, అది చేయుదును. దేవుడు నన్ను తోసివేయునా?" ఒకడు క్రొత్తగా జన్మించనిదే అతడు దేవుని రాజ్యమును ప్రవేశింపలేడు! చూశారా? సాకులు లేవు! "మంచిది, ఆ వృద్ద పేదవాడు, ఆ పేద వృద్దురాలు, అక్కడ ఒక మంచి ఆత్మ ఉన్నది." దేవుని చూడగలుగు ఒకే ఒక మార్గము. కొత్తగా జన్మించుటయే. అంతే. వారెంత యవ్వనులైనను, వృద్దులైనను, నేను లెక్క చేయను. వారేమి చేసినను, వారెంతగా సంఘమునకు వెళ్లినను, వారికెన్ని సంస్థలతో సంబంధమున్నను, వారెన్ని సిద్దాంతములను అలవాటు చేసికొని యున్నను, దానితో ఏ సంబంధము లేదు. నీవు క్రొత్తగా జన్మించవలసి యున్నది. లేకున్న నీవు పునాది పైన కట్టబడుట లేదు. నీ ప్రారంభము పొరపాటైనది. అది ఖచ్చితముగా వాస్తవమై యున్నది.
MARK 16:15-18,20
64అందువలన, మీరు చూడండి, మీకొక మార్గదర్శి అవసరమై యున్నాడు. అతడు మిమ్మును సత్యములోనికి నడిపించును. వాక్యము సత్యమైయున్నది. అతడు మిమ్ములను నడిపించును. అది అన్ని సమయముల యందును ఆ విధముగానే యున్నది. దేవుడేదియు మార్చవలసిన పని లేదు, ఎందుకనగా ఆయన నిత్యుడైయున్నాడు. ఏది మంచిదో ఆయన ఎరిగియున్నాడు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన సర్వములోను ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయనే. అది నిజము, దేవుడలా ఉన్నప్పుడు, ఆయన దేనిని మార్చవలసినది లేదు. మంచిది.
ఆయన నడిపించు ఆ మార్గమును ఆయన నిశ్చయించును. మార్గదర్శిగా ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఆయన నేర్పించిన అదే వాక్యమును నిర్ణయించు వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు లూక ఆ మార్గదర్శి ద్వారా నడిపింపబడి, "మీరు సర్వ లోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మమును పొందువాడు రక్షింపబడును. నమ్మనివాడు నశించిపోవును. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలను మాట్లాడెదరు, పాములను పట్టుకొందురు, విషకరమైన వాటిని త్రాగెదరు, రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థపడెదరు." మరియు బైబిలు ఇలా చెప్పుచున్నది. "వారు ప్రతి చోటికి వెళ్ళిరి," ఆ మార్గదర్శి ద్వారా నడిపింపబడిరని మీరెరుగుదురు కదా! "వాక్యమును ప్రకటించిరి, సూచనలు వెంబడించెను." అది ఏమిటి? అది సత్యమని ఆ మార్గదర్శి నిరూపించుచున్నాడు!
MAL 3:6
65అది దేవుని విధానమై యున్నది. ఆ విధముగానే అది నడిపించును. అది అలా ఉంచబడినది. అది ఆయన కార్యక్రమమైయున్నది; దానిలో నుండి ఆయన మారడు, ఎందుకనగా ఆయన నిత్యుడైయున్నాడు. ఆమేన్. ఆయన దాని నుండి తనను మార్చుకొనడు; ఆయన దేవుడైయున్నాడు. నేను మారిపోవుదును; నేనొక మనిషిని. నీవు మారవచ్చు; నీవు ఒక స్త్రీగానో, ఫురుషునిగానో ఉన్నావు. అయితే దేవుడు మారలేడు. నేను అంతము గల మనిషిని; నేను పొరపాట్లను చేయగలను, పొరపాటుగా కార్యములను చెప్పవచ్చు, మన మందరము అలాగే చేయుదుము. అయితే దేవుడలా కాదు, ఆయన దేవుడై యున్నాడు. ఆయన మొదటి తీర్మానమే ఖచ్చితమైనది. దేవుడు దృశ్యములో కనబడు రీతిగానే ఆయన అన్నివేళల చేయువాడై యున్నాడు. "పాపిని రక్షించుటకు గాను ఆయన దృశ్యమునకు పిలువబడినప్పుడు, ఆయన ఒక క్రియపై ఆధారపడి చేయును. ఆ తరువాత ఒక పాపి వచ్చినప్పుడు, ఆయన ఆ విధముగానే చేయవలసియున్నది, లేకున్నయెడల ఆయన మొదటి పర్యాయము పొరపాటుగా నడచుకొనియుండును. ఆమేన్. నేనాయనను ప్రేమించుచున్నాను. అది సత్యమని నేనెరుగుదును.
JOHN 1:1,14
66నాకు ఏబది-మూడు సంవత్సరముల వయసగుచున్నది. ఇక్కడ ముప్పది-మూడున్నర సంవత్సరములుగా సువార్తను ప్రకటించుచున్నాను. అది తప్పిపోవడము నేనెప్పుడూ చూడలేదు. నేను ఏడు పర్యాయములు ప్రపంచమును తిరిగి పరీక్షించాను. అన్ని రకముల మతములలోనికి వెళ్లాను. ప్రతి స్థలమందును, ఒక్క పర్యాయములో కూడిన ఐదు లక్షల ప్రజల యొదుట గాని, అది ఓడిపోలేదు. ఏదో ఒక పుస్తకము నుండి నేను మాట్లాడుటలేదు. నా స్వంత అనుభవము నుండి మాట్లాడుచున్నాను. దేవుడు తన వాక్యమునకు వెనుక నిలిచి, దానిని గౌరవించును. ఇప్పుడు, నీవేదైనను ఒక రకమైన సిద్ధాంతమును కలిగియుండినయెడల, నీవు దానిని గమనించుట మంచిది. అయితే పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును బలపరచును.
పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్తలో 1వ అధ్యాయము, 1వ వచనములో ఆయన చెప్పునదేమనగా, "ఆయన వాక్యమైయున్నాడు. ఆయన మార్గదర్శిగా యున్నాడు. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.'' మై!
ACTS 2:38•
2PET 1:5-7
67పేతురు ఈ విధముగా చెప్పుటకు నడిపించబడెను, అపోస్తలుల కార్యములు 2:38 పై మాట్లాడుచు పరిశుద్ధాత్మను పోందుట ఎలాగని చెప్పుచు - మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, మరియు ఆ మార్గదర్శియైన పరిశుద్ధాత్మ ఇకపై నిన్ను నడిపించును." అవును, దానిని మనము చేయవలసి యున్నది. మొదటగా, మీ పాపముల నిమిత్తము మారుమనస్సు పొందుడి. మీ అవిశ్వాసమును గురించి, అనగా ఈ కార్యములను మీరు విశ్వసించకపోవడమే అవిశ్వాసము. మారుమనస్సు పొంది, బాప్తిస్మము పొందుడి, అక్కడ నుండి ఆ మార్గదర్శి మిమ్మును నడిపించును. చూశారా, అది మీ పనియై యున్నది. మారుమనస్సు పొందుట మీ పనియై యున్నది. బాప్తిస్మము పొందుట మీ పనియై యున్నది. అంతట మిమ్ములను నడిపించుట ఆ మార్గదర్శి పనియై యున్నది. మిమ్ములను సద్గుణము నుండి జ్ఞానమునకు నడిపించును, ఆశానిగ్రహమునకు నడిపించును, సహనమునకు నడిపించును, దైవ భక్తికి నడిపించును, సహోదర ప్రేమకు నడిపించును, అంతట పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించును, చూశారా. అప్పుడు నీవు దేవుని పరిపూర్ణ స్వరూపమగుదువు, నిజమైన దేవుని మనిషివగుదువు, ఒక నిజ దేవుని యొక్క స్త్రీగా జీవింతువు, క్రీస్తులో లంగరు వేయబడినవారమై యుందుము. నేను దానిని ప్రేమించుచున్నాను, క్రీస్తులో లంగరు వేయబడుట.
REV 22:18,19
68అవును, మార్కు పరిశుద్ధాత్మచే నడుపబడి బహుశా మార్కు 16వ అధ్యాయము వ్రాసెను.
యోహాను ప్రకటన గ్రంధమును వ్రాయునప్పుడు ఆ విధముగానే నడిపించబడెను. ఆయన ఆ మార్గదర్శిచే నడిపించబడెను. ''ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల, దేవుడు ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండ చేయును,'' అని చెప్పునట్లు ఆయన (యోహాను) ఆ మార్గదర్శిచే నడిపించబడెను.
ఇప్పుడు, ఏ విధముగా మరొక దానిని దేవుని వాక్యముతో చేర్చగలము? ఆ విధముగా చేర్చుచునే పరిశుద్ధాత్మచే నడిపించబడుచున్నామని ఎలాగు చెప్పగలము? అదేమన్నా అర్థమున్న కార్యమేనా? లేదండి. అది అర్థము లేనిది.
69నా జీవితమంతటను ఆయన నా మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే నన్ను జీవములోనికి నడిపించును. ఆయన నా జీవమైయున్నాడు. ఆయన లేకుండా నాకు జీవము లేదు. ఆయన గాక మరొకటి నాకు అవసరము లేదు. ఆయన నా సర్వములో సర్వముగా ఉన్నాడు. నా శ్రమలో ఆయన నాతో నిలచును. నిన్నటి దినము ఆయన నన్ను ఆశీర్వదించెను. ఈనాడును అదే జరిగినది. నేనేమి ఎదురుచూడగలను? ఎల్లప్పుడు ఆయన నామమును స్తుతించెదను! ఆమేన్. అవునండి. ఆయన దానిని వాగ్దానము చేసెను. ఆయన దానిని నెరవేర్చును. ఆయనే నా జీవము. ఆయనే నా మార్గదర్శి. సమస్తములోను సమస్తమై యున్నాడు. నేనాయన యందు నమ్మిక యుంచెదను. నాకెన్నో కఠినమైన శోధనలు వచ్చినవి. నేను ఎక్కడికి వెళ్లినను ఆయన యందు నమ్మకముంచెదను. మిమ్ములను కూడ ఆ విధముగానే చేయమని నేను కోరుచున్నాను. స్త్రీలారా, మీ గృహపు పనులను చేయునప్పుడు మీరాయన యందు నమ్మిక యుంచుడి. మీరు వస్తువులను కొనుటకు పట్టణములోనికి వెళ్లునప్పుడు ఆయన యందు నమ్మికయుంచుడి.
70ఒకప్పుడు నేనొక మంచి వేటగానిగా ఉంటినని నేను తలంచుచున్నాను. మీకు బాగుగా తెలియును, నేనెంతో వేటాడితిని. అప్పుడు నేను తలంచినదేమనగా, ''నేనొక బుద్దిహీనుడను, నాకెవ్వరూ సహాయపడరు… మీరు నన్ను విడిచిపెట్టకూడదు. నా తల్లి సగము ఇండియన్ గా ఉన్నది, మరియు దానిని నేనెంతో ప్రేమించాను. ఓ, మై! అడవులలో మీరు నన్ను వదలి పోలేరు, నేనెక్కడున్నానో నేనెరిగి యున్నాను."
మరియు నా హనీమూన్ సందర్భములో నేను కొద్దిగా మోసపర్చబడితిని. నేను నా భార్యతో చెప్పినదేమనగా, "హనీ, నీకు తెలియును, అక్టోబరు 23వ తేది మనము పెండ్లి చేసికొనుట మంచిది." బహుశా అప్పుడే ప్రభువు నన్ను పెండ్లి చేసికొనుమని చెప్పెను.
అప్పుడు నేను తలంచినదేమనగా, "ఇప్పుడు ఒక చిన్న హనీమూన్ కు వెళ్లుచున్నాము! దాని కొరకు కొంత పైకమును సమకూర్చుకొన్నాను. నేనామెను "నయాగారా జలపాతము'' యొద్దకు తీసికొని వెళ్తాను. అక్కడ "అడిరోన్ డాక్ అను స్థలమునకు వచ్చినప్పుడు కొద్దిగా వేటాడుదును," చూశారా. కావున నేను ఆమెను మరియు బిల్లీని తీసికొని వెళ్లాను. బిల్లీ చిన్న బిడ్డగా ఉన్నాడు. ఆ విధముగా ఆమెను ''హనీమూన్'' కు తీసికొని వెళ్ళాను. అది ఒక వేటాడుటకు వెళ్లినట్లుగా ఉండినది. అది మీకు బాగుగా తెలియును. అందువలన, అలా చేయుట మంచిదని నేను తలంచాను. అందువలన ఆమెను తీసికొని వెళ్లాను.
71శ్రీయుతులు డెన్టన్ అను ఫారెస్టు అధికారికి ఉత్తరము వ్రాయుచు, మేము "హరికేన్'' కొండకు వచ్చుచున్నామని తెలిపాను. నేను చెప్పిన దేమనగా, ''మిస్టర్ డెన్టన్, నేనక్కడకు పైకి వచ్చుచున్నాను. నేను మీతో ఎలుగు బంటును వేటాడవలయునని ఇష్టపడుచున్నాను," అని వ్రాశాను.
అప్పుడాయన, ''సరే, బిల్లీ, నీవు రావచ్చు, నేను నిర్ణయించిన దినములో అక్కడుండెదను,'' అని జవాబిచ్చాడు. మంచిది, నేను నా భార్య ఒక దినము ముందుగా అక్కడకు చేరాము, బిల్లీ కూడ మాతో వచ్చాడు. అడవలలో సహాయము కొరకు గల ఆ చిన్న కాబిన్ ను బిగించాను.
కొద్దికాలము క్రితము నేను, సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ కలసి అక్కడకు వెళ్లాము. అక్కడ నిలచి యున్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ నిలచియుండుటను నేను చూచాను, ఆ పసుపు పచ్చ వెలుగు ఆ పొద చుట్టూ తిరుగుచుండినది, ఫ్రెడ్ అక్కడే నిలచియున్నాడు. అప్పుడాయన, ''రేపు నీతో మాట్లాడనై యున్నాను పక్కకు రమ్ము. జాగ్రత్తగా ఉండుము వారు నీ కొరకు ఒక ఉచ్చు పన్నియున్నారు. మేలుకువగా ఉండుము!" అని సెలవిచ్చెను. ఫ్రెడ్ సోదరుడా, అది వాస్తవమేనా? అప్పుడా రాత్రి నేను వెళ్లి వందల సంఖ్యలో అక్కడ చేరియున్న ప్రజలకు తెలిపాను. అక్కడ వెర్మౌంట్ అను స్థలములో, వారితో వారు నా కొరకు ఒక ఉచ్చు పన్నియున్నారు. నేను దానిని ఎదుర్కొనబోవుచున్నాను. అదెక్కడున్నదో నాకు తెలియదు. ఆ మరుసటి రాత్రి ఆ వెలుగు అక్కడకు వచ్చినది, అది అక్కడకు వచ్చి నిలచినది. "ఇదిగో ఇక్కడ ఆ ఉచ్చు వేయబడి యున్నది," అని చెప్పాడు. అవునండి. అయితే ఏమి చేయాలో ఆ విధముగా పరిశుద్ధాత్మ నన్ను నడిపించెను. ఓ, మై, అది వాస్తవము! ఓ, అదేమని మీలో అనేకులకు తెలియును. దానిని వివరముగా చెప్పుటకు సమయము లేదు.
72అయితే ఆ స్థలములో నిలచినప్పుడు, అక్కడ ఎక్కువ చలిగా తోచినది. మిస్టర్ డెన్టన్ మరుసటి దినము రాబోవుచున్నాడు. అప్పుడు నేను "హనీ, ఒక పెద్ద మగ జింకను ఇంటికి తీసికొని వెళ్లుట మంచిదని నీకు తెలియును. మనమలా చేయుదము. నేను ఈ పెన్నీలను భద్రపరచవలసి యున్నది. మనకిప్పుడే పెండ్లయినది. చలి కాలములో మన ఆహారమును సిద్దపరచమకొనవలసియున్నది. ఇప్పుడు కొద్దిగా వేటాడిన యెడల అది బాగుండునని," అని చెప్పాను.
అప్పుడామె, ''బీల్లీ అలాగే వెళ్లుము, జ్ఞాపకముంచుకొనుము, నేనింతకు ముందు ఈ అడవులకు వచ్చియుండలేదు," అని చెప్పినది. ఆమె కొండలలో 25 మైళ్ల దూరముగా ఉన్నది, నీకు తెలుసా, మరియు ఆమె, "దీనిని గురించి నాకేమి తెలియదని," చెప్పినది.
మరియు ఆమె చెప్పెను, కావున నేను…
73"మంచిది, జ్ఞాపకముంచుకొనుము, రెండు సంవత్సరముల క్రితము ఆ రెండు ఎలుగుబంటులను వేటాడితిని. ఆ కొండపైన అది జరగినది. ఇప్పుడు ఒక పెద్ద మగ జింకను మరియు కొన్ని ఎలుగు బంట్లను తీసికొని వెళ్లవచ్చు. దానిని మనము చలి కాలములో ఆహారముగా వాడుకొనవచ్చును," అని చెప్పాను. అది బాగున్నదనిపించినది. (మరియు కొన్ని బెర్రీస్, బొగ్గును చలికాలము కొరకు సేకరించుకొన్నాము. వాటిలో కొన్నింటిని బిల్లి అమ్ముకొనవచ్చును. ఆ సాయంకాలమే నేను మరియు మీడా వాటిని తీసికొని దిగి వచ్చాము.) అప్పుడు నేను, "నా తుపాకిని తీసికొని అక్కడకు వెళ్లనైయున్నానని చెప్పాను." అక్కడ అనేక జింకలున్నాయి, వాటిలో ఒక దానిని కనుగొన్నాను. దానిని తీసికొని త్వరగా వచ్చెదను,'' అని చెప్పాను.
ఆమె ''సరే" అని చెప్పినది.
74అందువలన, నేను బయలుదేరాను, అది పల్లముగా ఉండినది. ''న్యూ హంప్ షైర్'' ప్రజలలో ఎవ్వరైనను, న్యూజిలాండు దేశములో ఉన్నవారు మంచు దిగి వచ్చుచున్నప్పుడు ఏమి జరుగునో ఎరిగి యుందురు, లేక కొండలలో ఎక్కడైనను సరే ఆ విధముగా మంచు దిగి వచ్చునప్పుడు, మనమెక్కడ ఉన్నామో గ్రహించుట కష్టము. అంతే. నీ యెదుట నీ చేతిని నీవు చూడలేవు. అలా పైకి వెళ్లినప్పుడు అక్కడొక జంతువును చూచాను. ఈ దేశములో దానిని పాన్తెర్ (చిరుత) అని పిలిచెదరు. కాని పడమటి దేశాలలో దానిని "కూగర్'' అని పిలిచెదరు. అక్కడి వారు దానిని కొండ పింహము అని పిలిచెదరు. అదంతయు ఆ ఒక్క జంతువే. అది ఒక అడవి పిల్లగా ఉన్నది, ఆ పిల్లి తొమ్మిది అడుగుల పొడవు కలిగి, నూట-ఏబది లేక రెండు వందల పౌండ్ల బరువు కలిగియుండును. అది బాట దాటి వెళ్లుచుండినది. నేను నా తుపాకీని త్వరగా సిద్ధపరిచాను, అయితే దానిని కాల్చునంత త్వరితముగా చేయలేదు.
75మంచిది, ఈ జంతువును వెంటాడుచు కొండ పైకి వెళ్లాను. అది ఏ దారిలో వెళ్ళుచున్నదని ఆకుల కదలికను బట్టి వెళ్లాను. దాని శబ్దమును నేను వినగలుగుచున్నాను. దానికి నాలుగు పాదములున్నవి. అయితే అది రెండు పాదముల జంతువు గాని జింక గాని కాదని నేనెరిగియున్నాను. అది గంతులు వేయును. అది సులభముగా తప్పించుకొనును, ఆ పిల్లిలాగే అది యున్నది. ఒక ఎలుగు బంటి తన పాదములతో దొర్లిపోవును. కావున అది ఒక చిరుతగా ఉండును. ఒక మొద్దు వెనుకగా నిలచియుండినది. నేను దానిని చూడలేదు. నేను చూచునంతలో అది వెళ్లిపోయినది.
అది ఆకులను కదిలించిన మార్గమును గమనించాను. అది ఆ కొండ పైగా వెళ్లినది. ఆ క్రిందుగా ఆ మంచు దిగి రావడమును నేను గమనించలేదు. అనుకోకుండానే అది వచ్చినది. నేను తప్పించుకొని అక్కడ లోయలోకి దిగి వెళ్లిపోయాను. ఆ పొదలలోకి ఈ చిరుతను వెంబడించుచూ వెళ్లాను. "ఇంక కొంత సమయమునకు నేను దానిని పట్టుకొందునని," తలంచాను. అక్కడ ఒక స్థలమును చూచాను. అక్కడ ఆ ఎతైన స్థలమనకు పరుగెత్తి అక్కడ నిలచి, చుట్టూర చూచాను. దానిని చూడగలనేమోనని చుట్టూ చూచాను; జాగ్రత్తగా వినండి, అక్కడ నుండి దిగి మరలా అక్కడ నుండి వచ్చేశాను. ఆ చిరుత ఆ విధముగా వెళ్ళునప్పుడు, ఆ పొదలను రాసుకొంటూ వెళ్లునప్పుడు ఆ శబ్దను వినగలను. అంతట అది చెట్టు నెక్కి చెట్టు నుండి చెట్టుకు దాటి వెళ్ళుచున్నది. నేను దానిని గుర్తుపట్టలేకపోవుచున్నానని అది తెలిసికొన్నది. "ఓ, ఎలాగైనా గుర్తు పట్టవచ్చని!" నేను తలంచాను.
76నేను మరలా వెనుకకు తిరిగి పైకి ఇచ్చాను. ఆ క్యాన్యన్ కొండల నుండి వచ్చుచుండగా, ఒక వృద్ద మగ ఎలుగుబంటి ఎదురుపడినది. "దానిని పొందెదను, అది మంచిగా ఉన్నదని" తలంచాను. మరలా గురి చూచాను. నేను ఇంకను కొంచెము ముందుకు వెళ్లాను. ప్రతి రకమైన అలికిడి కొరకు ఎదురు చూచాను. నేను ఏదియు చూడలేకపోయాను. అలా వెనుకకు తిరిగి ఆ కొండ మరో ప్రక్కకు వెళ్లాను. అక్కడ మంచు ఏర్పడుటను చూచాను. మరలా నేను చూచినప్పుడు, ఆ మంచు కొంత దూరమున గాలిలో వచ్చుచుండినది. అప్పుడు నేను, "లేదు. ఇప్పుడేమి జరిగినది, ఆ గాలి ఇటు వైపే వచ్చుచున్నది. అప్పుడు నేను ఆ ఎలుగుబంటు వాసన ఆ వైపుగా వచ్చుటను గమనించాను. అప్పుడు నేను దాటి వెళ్లినప్పుడు, గాలులు వేరే ప్రక్క నుండి వచ్చుచుండినవి. కాబట్టి నేను మొదటిగా ఎలుగుబంటును వాసన పట్టిన స్థలమునకు తిరిగి వెళ్ళాను. అక్కడ నుండి దానిని చూచెదనని'' తలంచాను.
77ఆ అడవులలో నా మార్గమునకు మధ్యగా నేను చూచినప్పుడు, అక్కడ ఆ పొదలు కదలికను చూచాను. నేను చూచినప్పుడు నల్లటిది ఒకటి కదలినది. ''అదక్కడ ఉన్నదని'' నేను తలంచాను. అప్పుడు నేను తుపాకిలో తూటాను నింపి, మౌనముగా నిలచాను. ఆ జంతువు ఒక పెద్ద మగ జింకగా ఉండినది, గొప్పది. దాని కొరకే నేను నిలచియున్నానని తలంచి దాని కాల్చాను.
అప్పుడు నేను తలంచినదేమనగా, "మంచిది!" అది ఒక రకమైనది నేను గమనించలేదు.. నేను దాని కొరకు సిద్ధపడితిని, నేను నా చేతులను కడుగుకొని, నా వద్ద ఉన్న కత్తిని తీశాను. మరలా వెనుకకు పెట్టి వేశాను. అప్పుడు నేను తలంచినదేమనగా, "దేవునికి స్తోత్రము! ప్రభువైన యేసు నీకు వందనములు, నీవు నా కొరకు చలికాలపు ఆహారమును దయచేశావు. దేవునికి స్తోత్రములు!'' అంతట నా తుపాకీని తీసికొని ఇలా తలంచాను, "ఆ కొండలలో మరలా తిరిగి నా స్థలమునకు వెళ్ళెదను. ఎక్కడ చూచినను పెనుగాలి వచ్చుచున్నది. నేను ఇక్కడ నుండి వెలుపలకు వచ్చి నా భార్యను కలిసికొనుట మంచిది, నేను త్వరగా వెళ్లవలసియున్నదని," తలంచాను.
78ఆ కొండల పైగా నేను వెళ్లుచుండగా, నేను వేసికొనియుండు నా పెద్ద ఎర్రటి కోటు గుండిలను విప్పి వేశాను. నేను ఈ విధముగా ఆ పైకి పరిగెడుచుండగా మొదటిగా నేను తలంచినది, "ఏ వైపుకు తిరుగ గలను?'' ఆ పేనుగాలి అప్పటికే క్రిందికి వచ్చి వేసినది. చెట్లు ఒకదానితో నొకటి పెనుగులాడుచున్నవి. ''నేను ఏ ప్రక్కకు తిరుగుదును?'' అని తలంచాను, ఆ చుట్టూ వెళ్లాను. నేను నేరుగా హరికేన్ కొండకు వెళ్లుచున్నానని గ్రహించాను, అయితే అక్కడ ఆలాగే నిలచాను. నాకు చెమటలు పట్టుచున్నవి. "ఏంటి సంగతి? నేను ఒక అర్దగంట లేక ముప్పావు గంట ప్రయాణము చేశాను. నేను ఆ స్థలమును గుర్తించలేకపోవుచున్నాను," అని తలంచాను. నేను పైకి చూచాను. అక్కడ ఆ జింక వ్రేలాడుచున్నది. నేను మరలా ఆ స్థలమునకే వచ్చియున్నాను. "నేనేమి చేశాను?'' అని తలంచాను.
79మంచిది, నేను మరలా తిరుగుటకు ప్రారంభించాను. "ఈ పర్యాయము నేను దానిని కనుగొందునని,'' తలంచాను. నేను ప్రతి స్థలములో చూచాను. ప్రతి చిన్న కదలికను గమనించాను. దానిని గమనించుచు, వెదకుచు, వెదకుచు, వెదకుచూ ముందుకు వెళ్లాను. అప్పుడు మేఘములు వచ్చుచుండినవి. మంచు తుఫాను బాటలో ఉన్నదని గ్రహించాను. మంచు క్రిందికి దిగుచున్నది. దానిని గమనించుటకు ప్రారంభించాను, "అప్పుడు నేను ఇంక కొంచెము ముందుకు వెళ్ళెదనని," తలంచుకొనుచు ముందుకు, ముందుకు, ముందుకు, ముందుకు, ముందుకు, ముందుకు ఇంకను ముందుకు వెళ్లాను. "మంచిది, ఇది ఆశ్చర్యముగా ఉన్నది. ఇది ఇంతకు ముందు నేను చూచిన స్థలముగా ఉన్నది," అని తలంచాను. అక్కడ చూచినప్పుడు అక్కడ నా జింక వేలాడుచున్నది, చూశారా.
నేనెలా వెళ్లుచున్నానో మీరెరుగుదురా? ఇండియనులు దానిని "మరణపు నడక" అని చెప్పుదురు. చూడండి, అక్కడ చుట్టూ తిరిగి వచ్చుచున్నానే గాని, మంచిది, నేను తప్పిపోకుండుటకు నేను ఒక (గైడు) మార్గదర్శిగా ఉన్నాను. ఈ అడవులను గురించి నాకేమి చెప్పనవసరము లేదు. నా చుట్టు ప్రక్కలు బాగుగా తెలియును, చూశారా.
నేను మరలా మొదలు పెట్టాను. "ఈ పర్యాయము నేనీ పొరపాటును చేయకూడదని,'' చెప్పి మరలా తిరిగి వచ్చాను.
80నేనా కొండల పైకి కొద్దిగా ముందుకు కదిలాను, అప్పుడు ఆ తుఫాను వచ్చుటకు ప్రారంభమైనది. ఓ, మై, ఎక్కడ చూచినను మంచుమయముగా ఉన్నది! మొత్తానికి కటిక చీకటీ ఏర్పడినది, నా భార్యా ఆ రాత్రి అక్కడ మరణించునని నేను తెలిసికొంటిని. ఆమె ఎలా జాగ్రత్త తీసికోవలెనని ఆమెకు తెలియదు. బిల్లీ, నాలుగు లేక మూడు సంవత్సరాల బాలుడు. చాలా చిన్నవాడు. "వారేమి చేయగలరని?'' నేను తలంచాను. మంచిది. నేనింత దూరము వచ్చేశాను. నాకేదో ఎత్తుగా తగిలినది. ''నేను ఒక సమభూమిలో ఉన్నానని," తలంచాను. మంచిది, నేనింత దూరము వచ్చేశాను. నాకేదో ఎత్తుగా తగిలినది. ''నేను ఒక సమభూమిలో ఉన్నానని,'' తలంచాను. ''నేను దానిని చూడలేకపోవుచున్నాను. ఎక్కడ చూచినను మంచు ఆవరించి యున్నది.'' నేను మరలా చుట్టూ తిరుగుచున్నాను.
సాధారణముగా, నేనొక స్థలమును చూచుకొని ఎవరైనను నాతో ఉన్నప్పుడు అక్కడ నిలచియుందును. అక్కడ నిలచి ఆ తుఫాను వెళ్లిపోవునంత వరకు వేచియుండును. ఒకటి లేక రెండు దినములైన తరువాత వెలుపలకు వచ్చెదము. ఆ జింకను ముక్కలుగా నరికి, వీపుపై మోసికొని పోయి లోపలకు వెళ్లి తిని మరచిపోదుము. అయితే ఇక్కడ అలా చేయలేను, భార్య, బిడ్డ అక్కడ అడవిలో నశించుపోవుచున్నారు, చూశారా.
81అందువలన నేను ఆలోచించుటకు ప్రారంభించాను. నేను ఏమి చేయుదును?" అందువలన కొంచెము ముందుకు వెళ్లాను. అప్పుడు నేనిలా తలంచాను, "ఇప్పుడు వేచియుండి, ఆ మొదటి లోయను దాటునప్పుడు, ఆ తుఫాను నా ముఖము వైపుగా వీచును, అందువలన నేనీ మార్గమున రావలసియున్నది. నేను ఆ మార్గమున రావలసియున్నది. ఆ పెద్ద బండల మద్య ఎంతగానో తిరిగాను, కాని నేనెక్కడ ఉన్నానో తెలియుట లేదు. అప్పుడు నేను, "ఓ, నాకు నరములు సడలుటకు ఆరంభించినవి, అప్పుడు నేను తలంచినదేమనగా, ''బిల్ ఒక నిమిషము వేచి యుండుము. నీవు నశించిపోవు," అన్నట్లుగా నన్నునేను సర్దుకొంటున్నాను. మీరా విధముగా మోసపుచ్చుకొలేరు. లేదు, లేదు. నీ అంతరాత్మ నీవు పొరబడుచున్నావని చెప్పుచున్నది. "
''ఓ, నేను సంఘమునకు వెళ్లుచున్నాను. నేను రక్షించబడితినని," అని మీరు చెప్పుటకు ప్రయత్నించవచ్చు. త్వరపడకండి, మరణ పడక వచ్చు వరకు వేచి యుండుడి. అది, వేరైనదని మీరెరుగుదురు. ఆ విధముగా మీ మనసాక్షి చెప్పుచున్నది. నీవు తప్పు చేయుచున్నావని నీలో ఏదో చెప్పుచున్నది, చూశారా. మీరు మరణించినప్పుడు ఆ పరిశుద్ధ దేవుని కలిసికోలేరని మీకు బాగుగా తెలియును. ఆయనను గత రాత్రి మనము చూచినట్లు, ఆయన ముందు నిలచునప్పుడు ఆ పరిశుద్ద దేవదూతలే తమ్మును తమ రెక్కలతో కప్పుకొనవలసియున్నది. అట్లయిన యేసుక్రీస్తు రక్తమునకు వెలుపల నిలచి ఏ విధముగా, నిన్ను కప్పుకొందువు?
PS 46:1
82అప్పుడు నేనిలా తలంచాను, ''ఓ, నేను దానిని చేయగలను,'' అన్న తలంపులతో ముందుకు నడిచాను. ఏదో వినుచున్నట్లు కనుగొన్నాను. అప్పుడు నా నరములన్నియు బిగించుకొనిపోయినవి. అప్పుడు నేను ''నేనిలా ముందుకు వెళ్లానంటే ముక్కలై పోదును," అని తలంచాను. ఆ విధముగా అడవులలో తప్పిపోయిన వ్యక్తికి జరుగును. అప్పుడు ఆ గాయపడ్డ వ్యక్తి తన తుపాకిని తీసికొని తనను కాల్చుకొనును, లేనియెడల ఏ పల్లములోనైనను పడి కాళ్లు విరుగగొట్టుకొని, అక్కడ నుండి లేవలేక అలాగే మరణించవలసిన దుస్థితి ఏర్పడును. "ఇప్పుడు నేనేమి చేయగలనని," తలంచాను. అలాగే నడచుకొనుచూ ముందుకు వెళ్లాను.
అప్పుడు నాతో ఏదో మాట్లాడుటను నేను వినుచున్నాను. ''ఆపదలలో నేను అనుకూలమైన సహాయకుడను,'' అను శబ్దము వినబడినది. ఆ విధముగానే నడచుకొనుచు వెళ్లాను.
మరలా ఇలా తలంచుటకు మొదలుపెట్టాను, "ఇప్పుడు నేను కొంచెము సమీపమై యున్నాను. ఆ శబ్దము నాతో మాట్లాడుటను నేను వినగలుగుచున్నాను." అలాగే ముందుకు వెళ్లుచూ, ఆ శబ్దము '' వీ, వీ, వ్యీ" అనుచు ఈల వేయుచున్నది. "ఓ, నేనిప్పుడు నశించిపోలేదు, అని తలంచాను. నీవెక్కడ ఉన్నావో నీవెరిగి యున్నావా, యువకుడా! నీ సంగతీ ఏమిటి? నీవు నశించిపోకూడదు. నీవు మంచి వేటగాడివి. నీవు నశించిపోకూడదు," అని నాకు నేను తలంచుకొనుచున్నాను. అది స్వార్ధ సర్దుబాటని మీకు తెలుసా, ఆ విధముగా నన్నునేను మోసపర్చుకొనుచున్నాను.
నిన్ను నీవు ఆ విధముగా మోసపర్చుకొనకూడదు. ఆ మార్గములో క్రిందగా ఒక చిన్న తిరుగుడున్నది. అదేమి చెప్పుచున్నదనగా "అబ్బాయి, నీవు నశింపపోయావని నీకు తెలియునా, చూడుము, నీవు ఇంతటితో నశించిపోయావు."
PS 46:1
83ఆ విధముగానే నడచుకొంటూ వెళ్లాను. ''ఓ, నేను నశించను! నేను బాగుగానే యుందును. నేను ఏలాగైనను ఆ దారిని కనిపెట్టుదును." కార్యములు వింతగా కనబడుటకు ఆరంభమైనవి. గాలులు నిలచినవి, మంచు ఎగురుటకు ఆరంభమైనది. ఆ చిన్న పొడి మంచు పడుటకు ఆరంభమైనది, దానిని మనము "కుమ్మరించబడుట" యని పిలచెదము. అప్పుడు నేను నా భార్య, బిడ్డను గురించి తలంచాను. "నేను … ఓ, మై!''
మరలా ఆ శబ్దమును నేను వినుచున్నాను, ''ఆపత్కాలములో నేను నీకు అనుకూలమైన సహాయమును." అప్పుడు నేనొక సువార్త సేవకుడను. ఈ సంఘములో సేవ చేయుచు బోధించుచుంటిని.
అందువలన నేనిలా తలంచాను, "మంచిది, నేనేమి చేయగలను?" నేనక్కడ నిలచి చుట్టూ చూచాను, పొగ మంచు అంతలోనే ఆ స్థలమంతటిని నింపివేసినది. ఆ విధముగా ఉన్నది. అప్పుడు ఏమీ చేయలేని స్థితి. "ఓ, నేనేమి చేయగలను? అయ్యా, నేను జీవించుటకు యోగ్యుడను కాను, నాకు అధికముగా స్వంత నమ్మకమున్నది. నేను ఒక మంచి వేటగానినని తలంచాను, కాని నేను ఆ స్థితిలో లేను,'' అని తలంచాను.
PS 46:1
84మరియు సోదరా, నేనెప్పుడును ఆయనను నమ్మెదను. కాల్చుటలో నేను చేసిన రికార్డులు నా యొద్ద రికార్డులు ఉన్నవి. చేపలు పట్టుటలో అంత నేర్పరిని కాను, అయితే నేనెల్లప్పుడు ఆయన యందు నమ్మికయుంచియున్నాను. కాల్చుటలో నేనొక సాధారణమైన గురిగలవాడిని, అయితే ప్రపంచ రికార్డును స్థాపించుట్లు ఆయన నన్ను చేసెను, చూశారా. జింకను కల్చితిని, ఏడు, ఎనిమిది వందల గజములు. నేను అక్కడ ఒక తుపాకిని కలిగియున్నాను, దానితో ముప్పై-ఐదు జంతువులను ఒక్కసారి కూడా గురి తప్పకుండా దానితో కల్చితిని. మీరు దానిని ఎక్కడైనా చదవండి, చూచారా. నేను కాదు, అది ఆయనే. నేను ఆయనను నమ్మియుంటిని.
నేనక్కడ నిలచి, ఇలా తలంచాను, "నేనేమి చేయగలను? నేనేమి చేయగలను?"
నేను సిద్దముగా … అది సమీపముగా, ఇంకను సమీపముగా వచ్చుచున్నది. " ఆపత్కాలములో నేను నీకు అనుకూలమైన సహాయమును, అప్పుడే కలుగు సహాయమును," అనుచు ఆ శబ్దము సమీపమగుచున్నది.
"దేవుడు నాతో మాట్లాడుచున్నాడా?'' అని నేను తలంచి, నా టోపీని తీసి ప్రక్కనుంచాను, ఎప్పుడును నేను నా గస్తీ టోపీని వేసికొనియుందును, దాని చుట్టూ ఎర్రటి రుమాలును చుట్టియుందును. నా కోటను విప్పేశాను. అది తడిచిపోయినది. నా కోటను క్రింద పెట్టి ఒక చెట్టుకు నా తుపాకీని తగిలించాను. అప్పుడు నేను ఇలా ప్రార్థించాను, "పరలోకపు తండ్రి, ఇప్పుడు నా స్థితి నన్ను దాటి వెళ్లినది, నాతో ఒక శబ్దము మాట్లాడుటను వినుచున్నాను. అది నీవేనా? ప్రభువా?"
నేను అన్నాను, "నేను ఒక వేటాడువానిని కాదని నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. నేను కాదు. నేను మార్గమును కనుగొనలేక పోవుచున్నాను. నీవే నాకు సహాయము చేయవలెను, నేను జీవించుటకు యోగ్యుడను కాను. ఇక్కడకు వచ్చి ఇంత వరకు నేను చేసిన కార్యములను చేయవలసినవాడను కాను. దానిని గురించి అధికముగా తెలియుననుకొని నశించిపొవుటకు సిద్దమైయ్యాను. ప్రభువా, నీవు నాకు అవసరమై యున్నావు, నా భార్య ఒక మంచి స్త్రీ. నా బిడ్డ, నా చిన్న బిడ్డ. అతని తల్లి చనిపోయినది, ఈమె వాని తల్లిగా, ఉండటకు ప్రయత్నించుచున్నది. అక్కడ ఆమెయు, ఆ చిన్న బిడ్డయు ఉన్నారు. వారిరువురు ఈ రాత్రికి మరణించెదరు. ఈ అడవిలో వారివురు ఉన్నారు. ఆ గాలి సున్నా డిగ్రీకు, క్రింద 10 డిగ్రీలకు దిగుచున్నది. ఎలా తప్పించుకోవాలో వారికి తెలియదు. వారీ రాత్రికి మరణించెదరు. వారిని మరణమునకు అప్పగించకుము దేవా. నన్ను వారి యొద్దకు తీసికొని పొమ్ము, వారు మరణించకుండ చూడగలను. నేను నశించుచున్నాను! దేవా, నేను నశించిపోవుచున్నాను. నేను బాటను కనుగొనలేకపొవుచున్నాను. నీవు నాకు సహాయము చేయవా? నా స్వంత మార్గమును నేను కలిగియుండినందుకై నన్ను మన్నించుము. నీవు లేనిదే నేనేమి చేయలేను, నీవు నా మార్గదర్శివై యున్నావు. ప్రభువా, నీవు నాకు సహాయము చేయుము."
85నేను పైకి లేచి "ఆమేన్" అని చెప్పాను. నా రుమాలును తీసికొని, నా కోటును కూడ తీసికొన్నాను. నేను టోపిని వేసికొని, నా తుపాకీని చేత పట్టుకోన్నాను. ఇప్పుడు నేను మంచి మార్గములో, నేను ఒకే మార్గమున నాకున్న గ్రహింపుతో వెళ్ళెదను, ఎందుకనగా నేను తిరిగి, తిరిగి అక్కడికే వచ్చుచున్నాను. నేను ఎక్కడున్నావో ఎరుగకున్నాను. ప్రభువైనా దేవా, నీవు చెప్పు మార్గములో వెళ్ళెదను. నీవు నా మార్గదర్శివై యున్నావు," అని ప్రార్థించుకొన్నాను.
ఆ విధముగా నేను ఈ దారిలో నడచుటకు ప్రారంభించాను. అప్పుడు నేను, "అదియే ఇది. దానిని నమ్మునట్లు నన్నునేను చక్కబెట్టు కొనవలసి యున్నది, నేనీ దారిలో వెళ్ళుదును. నేను దారిలో నేరుగా వెళ్ళెదను. నేను మార్చబోవుట లేదు. నేను ఈ దారిలోనే వెళ్ళెదను. నేను సరియైన మార్గమున ఉన్నానని, ఎరిగి యున్నాను. నేను ఇలా ఈ మార్గమున వెళ్ళెదను," అని చెప్పాను. నేను ఆ దారిలో వెళ్లినట్లయిన, నేను కెనడా దేశము ప్రక్కకు వెళ్ళుదును, చూశారా.
86అప్పుడు ఎవ్వరో నా భుజమును తాకినట్టు తెలిసినది. అది ఒక చేయి, అది ఒక మానవ చేయిగా తెలిసినది. వెంటనే అటు ప్రక్కకు తిరిగి చూచాను. అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు నేను, "అది ఏమైయుండును?'' ఇక్కడ నా బైబిలు నా ముందుంచబడియున్నది. దేవుడు, నా మార్గదర్శియు, నా తీర్పరియైయున్నాడు. ఆయన ఇక్కడ నిలచి యున్నాడు. నేను పైకి చూచాను. ఇటు వైపు కుడి ప్రక్కగా, ఆ మంచు తొలగిపోయి - ఆ కొండపై నున్న గోపురమును చూడగలిగాను. ఆ హరికేన్ కొండ నుండి నేరుగా వెళ్లుచు, నా వేటాడు చాతుర్యమునంతటిని ఉపయోగించుచు, దాని నుండి దూరముగా వెళ్లుచున్నాను. అప్పటికే సాయంత్రమై ఎంతో ఆలస్యమైపోయినది. నేను త్వరగా నన్ను సరిచేసికొనుచు, ఈ విధముగా వెళ్లుచున్నాను. నేను నా టోపిని తీసి నా చేతులెత్తి, "దేవా, నన్ను నడిపించుము, నీవు నా మార్గదర్శివై యున్నావు," అని ప్రార్థించాను.
ఆ ఎత్తు పల్లములను నేరుగా దాటి వెళ్ళుచున్నాను. ఆ తరువాత చీకటి పడిపోయినది. జింకలు నా ముందు గంతులు వేయుచున్నవి. నేను నా దారి చూచుకొనుచు నడచుటలో తప్ప మరి దేనిని చూచుట లేదు, నేరుగా కొండ వైపుకు వెళ్లాను.
87నేను ఆ కొండపై నున్న గోపురమునకు వెళ్లినట్లయిన మిస్టర్ డెన్టన్ మరియు నేను కలసి ఆ మార్గమన వసంత కాలములో తీగలను వేయుటకు సహాయము చేసితిమి. ఆ హరికేన్ కొండ నుండి టెలిఫోన్ తీగలను బిగించితిమి. ఆ మార్గము క్రిందికి మూడున్నర లేక నాలుగు మైళ్లుండును. అక్కడ ఆ తీగల జాడ కొద్దిగా కనబడుచున్నది, కాని అది మంచుతో నిండియున్నది. ఆ జాడను మీరు చెప్పలేరు, చూశారా. గాలులు వీచుచున్నవి, చీకటై పొయినది. ఆ ఈదురు గాలులలో నీవెక్కడున్నావో చెప్పుటకు వీలులేదు. చేయుటకు నాకు తెలిసినదొక్కటి, ఏదనగా ఎక్కువ చీకటైనప్పుడు, నాకు తెలియుట లేదు… నేను ఒక మార్గమున వెళ్లుచున్నానని తెలియును. అది నేరుగా ఆ కొండ పైకి వెళ్లుచున్నది. ఎందుకనగా నేను ఆ కొండ పైకి వెళ్లవలసి యున్నది. ఆ గోపురము చక్కగా ఆ కొండపై అమర్చబడియున్నది. దానిని చేరుటకు ఇంకనూ ఆరు మైళ్లున్నవి. ఆ మంచు తొలగిపోవుచున్నది, ఒక రంద్రము వలె ఆ ఆరుమైళ్ల దూరము, ఆ గోపురమును చూడ గలుగునట్లు ఆ మంచు తొలగిపోవుచున్నది.
88అప్పుడు నేను నా తుపాకీని చేతిలో తీసికొని, మరొక చేతిని పైకెత్తి పట్టుకొన్నాను. ఆ విధముగా ఆ చెట్లలో వెళ్లుచున్న టెలిఫోన్ తీగ జాడను కనుగొన్నాను. ఆ టెలిఫోన్ తీగలు క్రింద నున్న కాబిన్ కు నేరుగా వెళ్లుచున్నవి, అందువలన అతడు తన భార్యతో మాట్లాడునట్లు, ఆ కొండ నుండి వారిని ఫోనులో పిలచి మాట్లాడునట్లు తీగలను వేసితిని. ఆ విధముగా చేతిని పైకెత్తి, ''ఓ దేవా, ఆ తీగను నన్ను తాక నిమ్ము,'' అనుచు నడిచి వెళ్లాను. నా చేయి ఎంతో తిమ్మిరిగా అయిపోయినది. ఆ విధముగా ఎత్తి పట్టి ఉంచుకొనలేకున్నాను. నా చేతిని దించవలసి వచ్చినది. నా తుపాకీని మార్చి అక్కడ ఉంచాను. రెండడుగులు వెనుకకు వేసి, దానిని తప్పిపోకుండునట్లు నా చేతిని పైకెత్తి ముందుకు నడచుకొంటూ వెళ్లాను. అధికముగా ఆలస్యమగుచున్నందున, చీకటైపోవుచున్నది. గాలులు వీచుటకు ప్రారంభమైనవి. ఓ, అప్పుడు నేనొక దానిని పట్టుకొని, "ఇదేనా అది! లేదు! లేదు, ఇది అది కాదు,'' అని చెప్పాను. ఓ, దానిని నిశ్చయతలేని శబ్దముగా మీరు విడిచి పెట్టకూడదు.
89కొంతసేపటికి నేను దానిని విడిచిపెట్టుటకు సిద్ధమైనప్పుడు, ఏదో నా చేతిగి తగిలినది. ఓ. మై! నేను నశించిపోవునప్పుడు, దానిని కనుగొన్నాను. ఆ తీగను పట్టుకొన్నాను. అప్పుడు నా తుపాకీని క్రింద పెట్టి, నా టోపీని తీసి, అక్కడ నిలచి, ఓ దేవా, నేను నశించుచున్నప్పుడు అది (ఆ తీగ) దొరిగినప్పుడు నాకు కలిగిన ఈ అనుభూతి ఎటువంటిదో, ఈ తీగ చివరి వరకు దీనిని విడిచిపెట్టను. ఆ తీగను గట్టిగా పట్టుకొందును. నా ప్రియులు అక్కడ దూరములో ఉన్న వారి యొద్దకు ఇది నన్ను నడిపించును. నిజమునకు నా భార్య, నా బిడ్డ నేనెక్కడ ఉన్నానో తెలియక అక్కడున్నారు. నిప్పును ఏ విధముగా రగల్చవలెనో తెలియక ఉన్నారు. ఈ చలి గాలులు వీచుచుండగా, ఏమి చేయుటకు తెలియక, చేతులు బిగించుకొని పోవుచుండగా, చెట్లు పడిపోవుచుండగా, దరి తోచక అక్కడున్నారు. నేనా తీగను ఏ కారణము చేతనైనను విడిచిపెట్టను. భూమిపై నా ప్రియులున్న స్థలమునకు ఆ తీగ నన్ను నడిపించును. అంత వరకు నేను ఆ తీగెను పట్టియుందును.
JOHN 16:13
90అది ఒక భయంకరమైన అనుభవము, వెలుపలకు వచ్చుటకు అది ఒక గొప్ప అనుభవమై యున్నది, అయితే అది సగము మటుకైనను లేదు. ఒక దినము నేను పావములో నశించాను. నేను సంఘము వెంబడి సంఘమునకు వెళ్లాను. దేనినైనను కనుగొందామని అలా వెళ్లాను. సెవెన్త్-డే- అడ్వెన్టిస్ట్ (శనివారమును సబ్బాతుగా ఆచరించువారు) సంఘమునకు వెళ్లాను. వారేమి చెప్పారనగా, వెళ్ళు సబ్బాతును అనుసరించుము, మాంసమును తినుట మానుకొనుము." ఆ తరువాత నేనొక బాప్టిస్టు సంఘమునకు వెళ్లాను. ఆ మొదటి బాప్టిస్టు సంఘము వారు, "లేచి నిలిచి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముచున్నానని చెప్పుము నేను నీకు బాప్తిస్మమిచ్చెదను,'' అని చెప్పారు. వారిది అంతే, అక్కడ ఏది లేదు.
అయితే ఒక దినము, ఆ బొగ్గు నిలువయున్న ఆ చిన్న స్థలములో, నేను నా చేతులెత్తి యుండగా, నేను దేనినో పట్టుకున్నాను; లేక నేను ఇలా చెప్పవచ్చు. ఏదో నన్ను పట్టుకొన్నది. అది జీవాధారమై యున్నది. అది నా మార్గదర్శి. ఇంతవరకు ఆయన నన్ను సురక్షితముగా నడిపించాడు. నేనా తీగను విడచిపెట్టబోవుట లేదు. నేను నా చేతులెత్తి ఆయనను పట్టుకొనియున్నాను. సంస్థలు సంస్థలలోని సిద్ధాంతములు, ఆచారములు, అవి దేనిని చేసినను, నేను నా మార్గదర్శిని చేపట్టి యుందును. ఎందుకనగా భూమి మీద ఉన్నవి గాని, పరలోక మందున్నవి కాని, నాకు అతి ప్రియమైనవి గాని, ఆయన యొద్ద ఆ తీగ చివరన ఉన్నవి. ఆయనే ఇంత వరకు నన్ను సురక్షితముగా నడిపించెను, తక్కిన మార్గమంతటను నేనాయనను నమ్ముదును. "పరిశుద్ధాత్మగా ఉన్న ఆయన వచ్చినప్పుడు, ఆయన సర్వ వెలుగులోనికి మిమ్మును నడిపించును, మీకు మార్గము చూపును.''
91స్నేహితులారా, ఈనాడు నేనెక్కడు ఉన్నానో అక్కడకు ఆయన నన్ను నడిపించాడు. నేనేమై యున్నానో అది ఆయనే చేశాడు. ఆయనను సంతోషముగా మీకు పరిచయము చేయుదును. నాకు తెలిసినదంతయు ఆ ఒక్క మార్గదర్శి మాత్రమే. ఇక్కడైనను లేక పైన అక్కడైనను ఆయనను గురించి మాత్రమే ఎరుగుదును. నేను వేటకు వెళ్లునప్పుడు, ఆయనే నా మార్గదర్శి. నేను చేపలు పట్టుటకు వెళ్ళునప్పుడు, ఆయనే నా మార్గదర్శి. నేను ప్రసంగించుచున్నప్పుడు, ఆయనే నా మార్గదర్శి. నేను నిద్రించునప్పుడు, ఆయనే నా మార్గదర్శి.
నేను మరణించవలసి వచ్చిప్పుడు, ఆ నది గట్టున ఆయన నిలిచి, ఆ మార్గమున ఆయన నన్ను నడిపించును. ఏ ఆపదకు నేను భయపడను. నీవు నాకు తోడైయున్నావు. నీ దండమును నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించును. అవి నన్ను క్రమపరచి, నన్ను ఆ నదిని దాటించును. మనము ప్రార్థించుదము.
92పరలోకపు తండ్రీ, మమ్ము నడిపించు మార్గదర్శి కొరకు నేను నీకు ఎంతగానో వందనములు చెల్లించుచున్నాను. ఓ, తండ్రి, కొన్ని సమయములయందు, నా చుట్టూ ఎక్కడ గాని ఆయన స్వరమును వినలేకపోవుచున్నాను. నేను ఏ సమయములో ఆ నది దాటవలసియున్నదో నాకు తెలియదు. కావున ఆయన నా సమీపముగా ఉంచునట్లు నేను నిన్ను వేడుకొనుచున్నాను. ఆయన నా సమీపముగా ఉండవలెనని కోరుచున్నాను. ప్రభువా, నన్ను విడచి పెట్టకుము. నీవు లేకుండ, నేను మాట్లాడలేను, ప్రసంగించలేను, అడవులలో వేటాడలేను, కొలను గట్టులపై చేపలు పట్టలేను, నా కారును నడుపలేను. నీవు లేనిదే నేను చేయగలిగినది ఏదియు లేదు. నీవు నా మార్గదర్శివైయున్నావు. ఈ రాత్రి ఈ జనముతో ఆ కార్యములను చెప్పుటకు నేనెంతో సంతోషించుచున్నాను. ఈ కార్యములన్నిటిలో నీవు నన్నెంతగానో నడిపించావు, ఏ విధముగా నన్ను పెంచావో ఇవన్నియు వీరితో చెప్పుటకు సంతోషించుచున్నాను!
గత దినములో నేను ఆలోచించుచుండగా; కొన్ని సంవత్సరముల క్రితము, ఆ వీధిలో నిలచియుండగా, ఎందుకనగా నా కుటుంబము తప్పుచేసినందున నాతో ఎవ్వరూ మాట్లాడుట లేదు. నేను తోడు లేక ఒంటరివానినైయుంటిని. నాతో ఎవ్వరికి ఎలాంటి అవసరము లేక పోయినది. "వాని తండ్రి త్రాగుడు వస్తువులను తయారు చేయువాడు" అని చెప్పేవారు. ప్రభువా, ఆ కారణము చేత ఎవ్వరూ నాతో మాట్లాడరు. అయితే నేను ప్రజలను ప్రేమించుచున్నాను. అయితే ఒకనాడు నేనా తీగను పట్టుకొన్నప్పుడు! ప్రభువా, నేను ఇప్పుడు ఆలోచించునదేమనగా, నేను తప్పించుకొని అడవులలో కొంత విశ్రమించుటకు వెళ్లవలెనని ఆశించుచున్నాను. దానిని చేసినదేమిటి? వ్యక్తిత్వము కాదు, విద్య కాదు, నాకు ఎలాంటి అర్హతయు లేదు; అయితే ప్రభువా, అదంతయు నీవైయున్నావు. ప్రభువా, నీవే. నీవు ఆ గురిని సున్నాకు తెచ్చావు. ఆ పెద్ద చేపను నేను పట్టుకొనునట్లు చేశావు, ఎందుకనగా దానిని చేయవలెనని నేను ఇష్టపడుచున్నానని నీవు ఎరిగియున్నావు. నీవు నాకు తండ్రులను, తల్లులను ఇచ్చావు. నీవు నాకు అన్నదమ్ములను, అక్క చెల్లిండ్రను ఇచ్చావు. నీవు నాకు ఆరోగ్యమునిచ్చావు. నాకొక భార్యనిచ్చావు. నాకొక కుటుంబము నిచ్చావు. ప్రభువా, నీవు నా మార్గదర్శివై యున్నావు. నన్ను నీ చేయి పట్టుకోనిమ్ము. నిన్ను విడిచి పెట్టనియ్యకుము. ఒక చేయి అలసిపోయినయెడల మరొక చేతితో పట్టుకొనియుందును. ప్రభువా, సహాయము చేయుము.
93మరియు ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఆ జీవధారను పట్టుకొందురు గాక, ప్రభువా, మా జీవమైయున్న ఆ పరిశుద్ధాత్మ, మాకు జీవమునిచ్చు స్థావరముగా ఉన్నాడు. ఆ సంతోష భూమికి మమ్ములందరిని ఆయన నడిపించును గాక, అక్కడ మా శ్రమలన్నియు ముగిసి పోయినవి. భూమిపై మా పనులన్నియు ముగిసినవి. అక్కడ వృద్దాప్యము లేదు, బలహీనులు ఉండరు. భారమైన రాత్రులంటూ ఏవి ఉండవు. అక్కడ ఆక్రందన గాని విన్న వించుకొనుట గాని ఉండదు. బలిపీఠపు పిలుపులుండవు, అక్కడ నిత్య యవ్వనముండును. అక్కడ దుఃఖముండదు. వ్యాధి లేదు. పాపమనునది లేదు. అక్కడ దేవుని నీతి యందు రానున్న సర్వకాలములు జీవించెదము. ముగింపు లేని నిత్యత్వములో ఉండెదము. తండ్రి అనుమతించుము.
తండ్రీ, ఇక్కడ ఎవ్వరైనను ఇంకనూ ఆ జీవధారను పట్టుకొనకుండినయెడల, ఇప్పుడే వారు దానిని కనుగొననిమ్ము. మరియు మమ్ములను మార్గము నడిపించు ఆ పరిశుద్ధాత్మ… దానిని నా హృదయమును మరియు నా చేతిని నీ వాక్యముపై యుంచి, ఆయన ఎల్లప్పుడు ఖచ్చితముగా సత్యమైయున్నాడని చెప్పగలను. నేను ఎన్నోసార్లు తప్పులను చేయుచునే యున్నాను, అయితే ఆయన సత్యమై యున్నాడు. ప్రభువా, ఆయనను నాతో ఉండనిమ్ము. నేను ఆయనతో ఉండనిమ్ము. ఈ రాత్రి ఇక్కడ ఆయనను ఎరుగని వారున్నయెడల, ఆయన మారని హస్తమును పట్టుకొననిమ్ము. ఆయన వారిని నడిపించునట్లు ఆయనను అంగీకరించనిమ్ము.
94ఒక దినమున ఆ నది యొద్దకు రావలసియున్నది. ఆ ఉదయ కాలము ఎంతో మంచుగా ఉండును. ఆ పురాతన సముద్రము ఘోషించుచుండును. ఆ పురాతన యోర్దాను విడిపోవును. మరణము మాలో నుండి జీవమను తెచ్చును. అయితే దేవా, నేను తక్కువ కాను. ఎంతో కాలము క్రితము నేను దానిని పూర్తి చేశాను. ఈ తలపై వేసికొన్న కవచమును, తీసివేసి, ఒక సైనికునిగా, యుద్ధ వీరునిగా, వెనుదిరిగి నన్ను నడిపించిన ఆ మార్గమును చూచెదను. చూడుము. నేను వచ్చిన ఈ అరణ్యమంతటను ప్రతి ముండ్ల బాటలోను, నేను నడిచి వెళ్లిన ప్రతి రాతి మార్గములోను ఆ తీగను పట్టుకొని వెళ్లాను. "కొందరేమో నీటి ద్వారా, కొందరేమో వరదల ద్వారా, కొందరేమో అధిక శోధనల ద్వారా, అయితే అందరు ఆయన రక్తము ద్వారా అని నీవు చెప్పినట్లుగా ఒక కవి వ్రాశాడు. ఆ విధముగా ఆ పురాతన ఖడ్గమును మేము పట్టుకొనియుండగా, అది మమ్ములను మార్గమంతటను కాపాడుచుండగా, దానిని ఒరలో పెట్టి, "తండ్రి, నేను వచ్చుచున్నాను, ఆ పడవను పంపించుము," అని ఆక్రందన చేయుచున్నాను. ప్రభువా, నీవక్కడ వున్నావు. నీవు దానిని వాగ్దానము చేశావు. నీవు తప్పిపోవు.
ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. ఈ తీగను ఎలా పట్టుకోవాలో వారికి తెలియకున్నయెడల, ఇంత వరకు దానిని పట్టుకొనకుండినను, ఆ పరిశుద్ద చేతులను పైకి ఎత్తుము. అక్కరగొన్న హస్తములు, వాంఛించు హస్తములు, ఆ జీవధారను తాకనిమ్ము. అది వారి హృదయ వాంఛలను తీర్చును, పరిపూర్ణ సమాధానము, తృప్తి కలుగునట్లు క్రీస్తునందు విశ్రమించునప్పుడు కలుగును.
JOHN 5:24
95మనము తలలు వంచియుండగా, ఎవ్వరైనను చేతులెత్తి, "నా చేతిని పట్టుకొనుము. నన్ను పట్టుకొననిమ్ము,'' అని చెప్పెదరా. ఓ, దేవుడు, మిమ్మును దీనించు గాక.
ఆ బాట మధురముగా ఎదిగినప్పుడు
ప్రియ ప్రభువు దరిచేరినప్పుడు
నా జీవము నన్ను విడచినప్పుడు,
ఆ నది యొద్ద నేను నిలచెదను.
నా చేతిని పట్టుకొని నా పాదములను నడిపించుము,
అందుకొనుము నా చేతిని,
ప్రియ ప్రభువా నడిపించుము నా జీవితాన్ని.
ఇంకెవరైనను చేతులెత్తుటకు ఇష్టపడువారున్నయెడల "ప్రభువా, ఈ రాత్రికి ఆ జీవధార యొక్క స్పర్శను నేను కోరుచున్నాను. నా పాపములను క్రీస్తు మన్నించాడను అనుభూతిని పొందుటకు ఆశించుచున్నాను. ఈ ఘడియ నుండి కొత్త జీవిగా జీవించుటకు ఆశపడుచున్నాను?" దేవుడు మిమ్మును దీవించును గాక. ఇంకెవరైననూ, "ప్రభువా, నిన్ను తాకనిమ్ము. నన్ను విడుదల పొందనిమ్ము,'' అని చెప్పువారున్నారా? సోదరీ, దేవుడు మిమ్ము దీవించును గాక. ''ప్రభువా, నేను విడుదల పొంది, నీలో దానిని కనుగొననిమ్ము.'' దేవుడు మిమ్ము దీవించును గాక, సోదరా, "నన్ను అనుమతించుము…" సోదరీ దేవుడు నిన్ను దీవించును గాక. మానవ-కల్పిత పథకముల యందు నమ్మిక యుంచకుడి. ఆ మార్గదర్శిని వెంటాడుడి. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. "ప్రభువైన యేసు, నన్ను నడిపించుము, నన్ను నడిపించుము.'' వెనుకగా ఉన్న మిమ్మును.. దేవుడు దీవించును. గాక. ఓ, అక్కడ అనేక, చేతులు పైకెత్తబడియున్నవి. వారికి రక్షణ అవసరమై యున్నది. ఇప్పుడు మనము…
బలిపీఠము ఇక్కడున్నది, బలిపీఠపు పిలుపును పిలువలేము, ఎందుకనగా ఇక్కడ అనేక ప్రజలు కూర్చొని యున్నారు. అయితే ఆయన అక్కడే ఉన్నాడని, మీకు బాగుగా తెలియును. మీరు మీ చేతులెత్తినప్పుడు, నీ హృదయములో ఏదో కొంత ఉన్నది. యేసు చెప్పెను, ''నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవమును పొందియున్నాడు.'' దానిని మీరు గ్రహించారా? అట్లయిన ఇక్కడ ఒక చిన్న కొలను నీటితో నింపబడియున్నది. బాప్తిస్మము పొందుటకు కావలసినంత సమయమున్నది. మనము ప్రార్థింతుము.
96మా పరలోకపు తండ్రీ, బొంగరు పోయిన శబ్దముతో ఇవ్వబడిన, విడివిడిగా ఉన్న ఈ చిన్న వర్తమానము ద్వారా ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికో వెళ్లియుండును. ఆయన కార్యమెక్కడ ఉన్నదో అక్కడే ఆయన ఉండును. ప్రభువా, ఇక్కడ అనేకులున్నారు. పదిహేను, ఇరువది మంది వారి చేతులెత్తి యున్నారు. వారికి ఆ మార్గదర్శి కావలసి యున్నది. వారు తమ్మును బుద్దిహీనులుగా చేసికొన్నారని గ్రహించారు. ''నేను పొరబడకయున్నానని చెప్పుకొనుటకు ప్రయత్నించారు, అయితే ఆ సుదీర్ఘ మార్గములో వారు అలా లేరని కనుగొన్నారు. ప్రభువా, వారు నిన్ను స్పర్శించుటకు ఇష్టపడుచున్నారు. వారికి ఆ మార్గదర్శి కావలసి యున్నది. వారు దానిని అంగీకరించుటకు ఇష్టపడుచున్నారు. నీవు అధికముగా ఉంచుకొనవు. ఈ పర్యాయపు ప్రయాణము చేయుటకు ఇష్టపడుచున్నారు. అక్కడికి ఏ విధముగా చేరాలో వారికి తెలియదు. వారిని అక్కడకు ఏలాగు తీసికొనివెళ్లాలో ఎవ్వరికి తెలియదు. నీవొక్కడవు దానిని ఎరిగియున్నావు. దేవుడేర్పాటు చేసిన మార్గదర్శి కొరకు వారు వచ్చుచున్నారు. ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. వారు వారి చేతులెత్తారు.
JOHN 10:28,29•
ACTS 2:38
97ఓ, మార్గదర్శియైన పరిశుద్ధాత్మ, వారి పైకి దిగి రమ్ము, ప్రతి పాపమును క్షమించుము. వారి అపరాధములను మన్నించుము. ఈ రాత్రికే వారిని క్రీస్తు శరీరమునకు కొనిపొమ్ము. అక్కడ దేవుని జీవపు ప్రవాహమును వారు అనుభవించెదరు. అది వారిని యోర్దానుకు నడిపించును. ఆ యోర్దాను ద్వారా వాగ్దాన భూమికి నడిపించును. వారు వాక్యమును నేరుగా దాని వెనుక నిలిచి వెంబడించెదరు గాక. ఆ వాక్యము చెప్పినదేమనగా, "మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుము.'' వారు వేరే మార్గములో దానిని ప్రయత్నించకుందురు గాక. వాక్యమును సూటిగా వెంబడించెదరు గాక, ఎందుకనగా ఆయనే వారిని నడిపించు ఒక్కడుగా ఉన్నాడు. అదియే ఆ మార్గదర్శిని పటుకొను వరకు ఎక్కిపొవు మెట్టుగా ఉన్నది. ప్రభువా, అనుమతించుము. వారు నీవారై యుండనిమ్ము. వారు బహుమానముల వలె నీ చేతిలో ఇప్పుడున్నారు. ఏ మానవుడు వారిని ఎత్తుకొనిపోలేడు. వారిని రక్షించబడిన ప్రజలుగా నీవు అంగీకరించెదవని నేను నమ్ముచున్నాను. వారు వారి చేతులెత్తారు. ఆ కార్యము వారుగా చేసినది కాదు. ఏదో వారితో మాట్లాడి ఉండునని నేను నమ్ముచున్నాను. అది నీవే, పరిశుద్ధాత్మ మరియు మార్గదర్శి.
ఈ ఘడియ ముగియుచున్నదని వారు చూచుచున్నారు. మంచు భూమి పైకి వచ్చుచున్నది. గొప్ప సిద్దాంతములు మరి వేరు కార్యములు, ఒక్కటిగా ఐక్యపడుచున్నవి. సంఘములు సమకూడి ఐక్యపడుచున్నవి. ఓ దేవా, వారే విధముగా ఇలా చెప్పగలరు, "ప్రత్యేకత గల ప్రతిది ఈ స్థలమును విడిచి, అలస్కా పట్టణమునకు వెళ్లవలసియున్నది." వారు భయపెట్టబడు ఈ కార్యములన్నియు మాకు కొత్త కాదు, వాక్యము మార్గములో ఆ గొప్ప మార్గదర్శి దానిని మాకు చూపించాడు. ఆ వాక్యపు భాగమునే మేమిప్పుడు దాటి వెళ్లుచున్నాము.
తండ్రీ, నీవు వారితో మాట్లాడుము దేవా, యేసు నామములో వాక్యపు బహుమానములుగా వారిని నీకిచ్చుచున్నాను.
ACTS 19:12
98తండ్రీ, ఇప్పుడు ఈ బల్లపై ఉంచబడిన చేతి గుడ్డలు, అవి వ్యాధిగ్రస్తుల కొరకైనవి. కొన్ని చిన్న బిడ్డల కొరకును, కొన్ని తల్లులకును, కొన్ని సోదరీలకును, కొన్ని సోదరులకును, చిన్న చిన్న తల పిన్నులు, వాటికి గ్రుచ్చబడి యున్నవి. వాటిని నా దగ్గరగా ఉంచుకొని యున్నాను. బైబిలులో మేము నేర్పించబడినదేమనగా, పౌలు శరీరమును తాకిన చేతిగుడ్డలు, రుమాలులు, వ్యాధిగల వారిపై ఉంచినప్పుడు - వారు స్వస్థపడిరి. అపవిత్రాత్మలు ప్రజలను విడిచి వెళ్లినవి. ప్రభువా, ఇప్పుడు మేము గ్రహించినదేమనగా, పౌలు ఒక మానవుడు, అతడు కేవలము ఒక మనిషిగా ఉన్నాడు. అయితే అది పరిశుద్ధాత్మ అభిషేకమే గాని వేరొకటి కాదు. పరిశుద్ధాత్మ అతనిపై నిలిచి ఆ చేతిగుడ్డలను ఆశీర్వదించినది. అతడు నీ అపొస్తలుడని, ప్రజలు కలిగియుండిన విశ్వాసముగా ఉన్నది. పౌలు మా నుండి తీసివేయబడెను గాని మార్గదర్శి తీసివేయబడలేదు, ఆయన ఇంకనూ ఇక్కడున్నాడు. దేవా, ఈ చేతి గుడ్డలను ఆశీర్వదించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. తమ్మును పరిపూర్ణముగా సమర్పించుకొనిన వీరిని ఆ మార్గదర్శి ఆ స్థలమునకు నడిపించును గాక.
JOSH 3:1,16,17
99ఇశ్రాయేలు తమ మార్గదర్శిని వెంటాడునప్పుడు, వారు యోర్దాను యొద్దకు వచ్చి లేక ఎర్ర సముద్రము నొద్దకు వచ్చి నిలచారు. ఆ మార్గదర్శి వారిని అక్కడకు నడిపించాడు. ఎందుకు? ఆయన మహిమను చూపుట కొరకే, వారి కున్న సమస్త నమ్మకను గతించిపోయినది, అప్పుడు దేవుడు అగ్నిస్తంభము ద్వారా క్రిందికి చూచాడు. అప్పుడా పురాతన మృత సముద్రము కూడా తొలగిపోయినది. అది వెనుకకు మరలిపోయినది. అక్కడ ఇశ్రాయేలు వాగ్దాన భూమికి నడిచి వెళ్లుటకు మార్గమేర్పడినది.
నిజముగా, ప్రభువా, ఇంకనూ నీవు ఆ దేవునిగా ఉన్నావు. ఈ ప్రజలు క్రైస్తవులుగా ఉన్నారు. వారు వారి ధర్మమార్గములో ఉన్నారు, అయినను వారు వ్యాధిగల స్థలములకు చేరియున్నారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా క్రిందికి చూచునప్పుడు దయ్యము వదలిపోవును. అతడు వెనుకకు వెళ్లిపోవును. మీ పిల్లలు దేవునిచే వాగ్దానము చేయబడిన మంచి ఆరోగ్యమునకు దాటి వెళ్లుచున్నారు. దయచేయుము, తండ్రి. నా శరీరము నుండి వారి యొద్దకు యేసుక్రీస్తు నామములో పంపుచున్నాను.
100ఈ సమాజమును నీ ఎదుట ఎత్తి పట్టుచున్నాను. విశ్వాసముతో పరలోకమందున్న దేవుని మహిమగల బలిపీఠము నొద్దకు వారిని తెచ్చుచున్నాను. ప్రతి వ్యాధియు, వారిలో ఉన్న తప్పిదము వారి జీవితములో ఉన్న పొరపాట్లు ఎక్కడైనను దేవా, వారిని శుద్ది చేయుము. వారిని నీవారినిగా చేయుము. వారిని స్వస్థపర్చుము తండ్రి. యేసును సమాధి నుండి లేపిన ఆ శక్తి వారి శరీరములను జీవింపచేసి, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయును గాక. నిన్ను సేవించుటకు గాను వారికి మంచి ఆరోగ్యమును బలమును దయచేయుము.
ఓ, ప్రభువా, నన్ను జ్ఞాపకను చేసికొనుము. నేను నీ సేవకుడను. ప్రార్ధన అవసరతలో నిలచియుండగా, నాకు సహాయము చేయుము. పరిశుద్ధాత్మ మమ్మును నడిపించి వాడుకొనును గాక. యేసుక్రీస్తు ఆయన మహిమలో వచ్చుచుండగా ఆయనను ముఖాముఖిగా, మధ్యాకాశములో చూచుటకు ఎత్తబడు ఆ దినము వరకు నడిపించుము. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
1JN 4:20
101నేనాయనను ప్రేమించుచున్నాను
(నీవు ప్రేమించుచున్నావా?)
ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను;
నా రక్షణను కల్వరి
వృక్షముపై కొనెను.
ఇప్పుడు, మీరు చూచుచున్న ఒకరినొకరిని మీరు ప్రేమించలేకున్న యెడల ఆయనను ఏలాగు ప్రేమించగలరు. మీరాయనను చూడలేదు. మనము ''నేనాయనను ప్రేమించుచున్నానను," పాటను పాడునప్పుడు, మన ప్రక్క నున్న వారికి హృదయపూర్వకముగా మన ప్రేమ చేతినిచ్చెదము.
నేనాయనను ప్రేమించుచున్నాను…
[సహోదరుడు బ్రెన్హాం ప్రక్కనున్న వారితో కరచాలనము చేయుచు.]
(నెవిల్ సోదరుడా, దేవుడు మిమ్ము దీవించును గాక.)
ఆ కల్వరి వృక్షముపై.
ఇప్పుడు ఆయన ప్రక్కకు మన చేతులెత్తుదము.
నేనాయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను;
నా రక్షణను కల్వరి
వృక్షముపై కొనెను.
102ఒక మంచి పాటను మీరు వినుటకు ఆశపడుచున్నారా? ఇక్కడ సువార్త సేవ చేయుచున్న ఒక పాటను నడిపించు వ్యక్తి ఇండియానా పోలీస్ నుండి వచ్చియున్నారు. ఆయన కాడెల్ గుడారమందు పాడునని నేను నమ్ముచున్నాను. ఎందరు ఇ. హోవార్డ్ క్యాడెల్ ను ఎరిగి యున్నారు? ఓ మై! దేవుడు ఆయన ఆత్మకు సమాధానము దయచేయును గాక. ఆకాశములోని పక్షి, ఆమె పాడుటను వినుటలో నేను సంతోషించెదను, నేను నా జీవితములో అంత చక్కగా పాడుట నేను వినియుండలేదు, ఆ వ్యక్తి శ్రీమతి క్యాడేల్. "ఈ ఉదయము మీ గదులను విడచునప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన ఈ దినములో మనకొక కవచముగా ఉండునట్లు ప్రార్థించు తలంపు మీకు కలిగినదా?"
103ఒక ఉదయములో ఆ వీధి ద్వారా వెళ్లు స్థలములో రెండు పురాతన గదుల మధ్య, నేనున్నప్పుడు నిప్పును రగలుటకు లేచాను. ఆ పొయ్యి మండలేదు. దానిని ప్రారంభించుటకు ప్రయత్నించాను. గాలులు వీచుట ద్వారా, అవి నేరుగా నా ముఖమును తాకుచున్నవి. అక్కడెంతో చలిగా ఉన్నది. నేను గడ్డ కట్టుకొనిపోవు స్థితి ఏర్పడినది. నేలంతయు తడిచియున్నది. నేను చెప్పులు లేక వట్టి కాళ్లతో ఉన్నాను. ఈ చిన్న రేకు పొయ్యి వెలిగించుటకు ప్రయత్నించుచున్నాను. దానిపై ఒక చిన్న ఉష్ణ పైపు వున్నది. నా భార్య, నేను అప్పుడే పెండ్లి చేసికొని యున్నాము. నేను ప్రయత్నించుచున్నానే గాని ఆ పాత కొయ్య తడిసిపోయి వున్నది. అందువలన అది వెలుగకున్నది. అక్కడ కూర్చొని, నేను ఇలా తలంచాను, "ఓ, మై! నేను మరలా ప్రయత్నింతును.'' నేను ఉద్యోగమునకు వెళ్లవలసియున్నందున, ఆ పాత స్టవ్ ను (పొయ్యిని) విసరుచున్నాను. అప్పుడు నేను లేచి రేడియోను త్రిప్పాను. "ఈ ఉదయము నీ గదిని నీవు విడచునప్పుడు ప్రార్థించ తలంచావా?" నేనక్కడే నేలపై పడి, "ఒక కవచముగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఆయన నా రక్షకుడు,'' అను పాట పాడుచుండినది. ఓ, ఆమె పాడుచుండగా ఆ స్వరమును వినుటలో నేనెంత సంతోషించాను!
104నేనా నదిని ఒక దినములో దాటునప్పుడు, నేను శ్రీమతి. క్యాడెల్ స్వరమును అక్కడ విందునని నమ్ముచున్నాను. నేనిప్పుడు ముందుగా అనుమతి పొందుదునని మీకు తెలియును. ఆ నది ప్రక్కన ఆ నిత్య పచ్చని వృక్షమున్నదని మీకు తెలియును. అది జీవ వృక్షము. నదికి ఆవలి ప్రక్క దూతల సమూహము రేయింబవళ్లు పాడుచుందురు, ఎందుకనగా అక్కడ రాత్రి అనునది లేదు. పగలంతయు పాడెదరు, చూడండి. అక్కడ నేనొక స్థలమును చూచుకొని దానిని వినుటకు కూర్చొనియుందును. శ్రీమతి. క్యాడెల్ అక్కడ పాడుటను నేను విందునని నమ్ముచున్నాను.
సోదరా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన పేరును నేను మరచాను. సోదరా ఏమిటది? సోదరుడు నెడ్ వుల్మాన్. ఇప్పుడు మీ కొరకు పాడెదరు. సోదరులు వుల్మాన్, ఈ రాత్రి మీరు మాతో వుండుటలో మేమెంతో సంతోషించుచున్నాము.