దేవదూషణకరమగు నామములు
VGR COUNT-329 1నెవిల్ సోదరుడా! వందనములు. ఇది నాకొక విధమగు ఆశ్చర్యంగా యున్నది. ఈ రోజు ఇక్కడ నేనుండవలసింది కాదు; కాని ఈ రాత్రి ప్రభు రాత్రి భోజనముండును, కాబట్టి ఉదయమున ఇచ్చటకు వచ్చాను. నేను సహో. నెవిల్ ను పిలచినప్పుడు అతడు నాతో, "మీరెలాగు వచ్చుచున్నారు గనుక కొద్దిసేపు మాట్లాడండి," అని అడిగెను.
"మంచిది, నేను సాధ్యము చేసికొని వచ్చినా ప్రసంగించకుండా సంఘమును బలపరచుటకు కొన్ని సంగతులు మాట్లాడవలెనని అనుకొన్నాను."
2ఆకురాలు కాలములో వేటకు వెళ్ళి ఈ మధ్యనే తిరిగివచ్చాము. (నేను, సోదరులు కలిసి వెళ్ళాము) గొప్ప సమయమది. మేము చాలా కృతజ్ఞలము. మాకు వేట సమృద్ధిగా దొరికినది. అందరం తృప్తి చెందాము. మన సంఘకాపరి, నేను కూడా అది ఎంతో బాగున్నదని చెప్పగలము. మాకు చక్కని కొన్ని దుప్పులు దొరికినవి. నాకయితే ఒక ఎలుగుబంటి, రెండు దుప్పులు దొరికినవి.
మేము తిరిగి వచ్చాము. ఆ ఏడు ముద్రల గూర్చి నేను మాట్లాడవలసిన సమయము ఇదే. వారింకా ఆలయమును సిద్ధపరచలేదు. కొన్ని అడ్డంకుల వలన ఆలాగు జరిగినది. సంఘమునకు హాజరగువారందరూ కార్లు నిలుపుకొనుటకు చాలినంత స్థలమును పట్టణపు వారు ఇవ్వలేకపోవుచున్నారు.
3ఇక్కడ ఒక క్రొత్త సంఘము నిర్మించవలెనని కోరుచున్నాము. ఎక్కువ భాగము డబ్బు ఇప్పటికే మాకు వచ్చియున్నది. పెద్ద ఆలయము నిర్మించవలెను. ఈ ఆరాధనల గూర్చి మీరు బాగుగా ఎరిగెదరు; జనులు గోడల ప్రక్కన వర్షములో కూడా నిలబడి యున్నారు, చాలా దయనీయ విషయము. నా స్నేహితులయొద్ద నుండి దీనిని గూర్చి కొంత విమర్శ కూడా వచ్చుచున్నది.
నా స్నేహితుడగు ఒక వైద్యుడు కూడా ఈ చోటు చాలని స్థితి గూర్చి విచారించెను.
మా ఇంటి ప్రక్కనేయున్న ఒక నర్సు ఇట్లన్నది, "ఒకనాడు ఉదయము 5 గంటలకు నేనచ్చటికి వచ్చాను. ఆ ఉదయం 5 గంటలకే జనులు గుమికూడియున్నారు. మీరు 9:30కు రావలసియున్నారు." చూచారా? చాలా కష్టమేర్పడుచున్నది.
4చాలినంత స్థలముండు ఆలయమును నిర్మించవలెను. అందరూ కూర్చొనుటకు స్థలముండవలెను. చివరి దినములలో మనము జీవించుచున్నామని నమ్ముచున్నాము. సమకూడి జరుగుచున్న ఈ సంగతుల గూర్చి సంఘమునకు బోధించవలెను. వేల సంవత్సరముల క్రితం ప్రవచించిన సంగతులు నెరవేరుచున్నవి. ఈ సంఘములో ఇరవై అయిదు లేదా ముప్పయి సంవత్సరాల క్రితం ప్రవచించిన సంగతులు నెరవేరుచున్న కాలమిది. దానిని మనమిక్కడ చూచుచున్నాము. కాబట్టి ఈ సంగతులను గూర్చి తాజాగా మనము చర్చించుకోవలెను, కాని చాలినంత చోటు లేదు.
నిన్ననేను మాట్లాడవలసిన వారితో మాట్లాడాను, ఈ మధ్యాహ్నము మరి కొందరితో మాట్లాడవలెను. కొందరు ఇక్కడికి రావలెనని యున్నారు. ఒక చక్కని యువ దంపతులు ఉద్రిక్త పరిస్థితులలో యున్నారు, సేవచేయుచున్న పరిచారక సోదరుడు వేచియున్నాడు; అట్టి వారు చాలామంది యున్నారు; నార్వే నుండి ఒక సోదరుడు పిలచెను. ఆ వెనుక గదిలో కొందరితో మాట్లాడాను. ఇప్పటికి ఇక ఇంతే అని చెప్పి వచ్చేశాను.
సంఘమును కొద్దిగా బలపరుచుటకు కొన్ని మాటలు చెప్పవలెనని సహో. నెవిల్ కోరెను.
5చెప్పవలసిన కొన్ని సంగతులు నేను కాగితము మీద వ్రాసియుంచాను. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పవలెనని ఆశించాను. మేమిక్కడ లేని సమయంలో గతించిన సహో, టేలర్ గూర్చియు చెప్పవలెనని ఆశించుచున్నాను.
అనేక సంవత్సరముల నుండి సహో టేలర్ ఇచ్చటకు వచ్చుచుండెను. మనందరము తప్పకుండా అతనిని ఎరుగుదుము. ఇక్కడికి ఎవరైనా క్రొత్తవారు వచ్చినప్పుడు వారు కూర్చొనునట్లుగా సహో, టేలర్ లేచిపోయెడివాడు. అతనిని యవ్వనము నుండి ఎరుగుదును. గతసారి నేను చూచాను, దాదాపు నాలుగు ఆదివారముల క్రితం అతడు ఆ తలుపు నొద్ద నిలబడియుండెను. "బ్రెన్హాం సోదరుడా, నాకు కొన్ని పుస్తకములు కావలెను. వాటిని నేను పంచెదను," అని చెప్పెను.
6అతనికి చక్కెర వ్యాధి వలన సృహ తప్పిపోయినట్లు నాకు తెలిసినది. అతనికి చక్కెర వ్యాధి యున్నట్లుగా తెలియదు. అతడు మరణించలేదు; ప్రభువైన యేసుతో ఉండుటకు వెల్లెను.
అతడు నమ్మకమగు, అద్భుతమగు సోదరుడు. ఇతరుల గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించెడివాడు. ఎవరైనా సంఘమునకు వచ్చినప్పుడు వారు కూర్చొనుటకు చోటు చూపించి ఆనందించెడివాడు. మనము అవతలకు దాటి వెళ్ళినప్పుడు అక్కడ సహో, టేలర్ ను చూతుము. అక్కడ మనము కూర్చొనుటకు అతడు చోటు చూపించును.
సహో, టేలర్ జాపకార్థమైన కొన్ని మాటలు చెప్పవలెనని తలంచాను. అతని సమాధి సమయములో సహో, నెవిల్ తో కూడా నేను లేను, కాని అతని భార్యకు నా మాటలు కొన్ని చెప్పవలెనని ప్రయత్నించుచున్నాను. సహోదరి టేలర్ ఈ ఉదయమున ఇచ్చటే ఉన్నదని తలంచుచున్నాను. ఆమె దీన హృదయము దీవించబడు గాక!
ఒక రోజున సహో, టేలర్తో ఇట్లనెను, "వచ్చి నన్ను చూడు. ఇక్కడ ఒక చిన్న చెరువు త్రవ్వాను, నీవు వచ్చి చేపలు వేటాడునట్లుగా అందులో చేపలు పెంచాను." ఎప్పుడూ ఇతరుల గూర్చి తలంచేవాడు. అతనిని గూర్చి ఆలోచించు ఒకాయన ఉన్నాడు; ఆయన క్రీస్తు, అతనికి రక్షణను ఇచ్చెను. ఆయనను జ్ఞాపకము చేసికొనుచూ ఈ ఉదయమున ఒక శరీరముగా కూడిన మనము లేచి దేవుని యెదుట తలలు వంచుదము.
ROM 8:28
7మా పరమతండ్రీ, మానవులమగు మేము ఈ ఉదయమున ఆరాధనకు వచ్చియున్నాము. గొప్ప హస్తము మా మధ్య సంచరించి మాలోని ఒక సోదరుని ఎత్తికొని తీసికొని వెళ్ళినది. నీవాయనను ప్రేమించితివని మాకు తెలియును. ప్రభువా, దీనంతటికి ఒక కారణముండును, లేనియెడల ఈ విధంగా జరిగియుండదు. దేవుని ప్రేమించువారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని బైబిలు చెప్పుట మాకు తెలియును; అదే జరిగెను.
ఈ లోకములో ప్రకృతిని చూచినప్పుడు మాకర్థమగును. సమాధి అతనిని నిలిపియుంచజాలదు. ఏ పనికొరకు నీవతనిని భూమి మీదికి పంపితివో, ఆ పని నెరవేర్చెను. అతడు మంచివాడు, విధేయతగల సోదరుడు.
వృక్ష జీవములో దీనిని మేము చూడగలము. ఉదయించుచున్న సూర్యునిలో దీనిని చూడగలము. ఉదయమున అది వెలుగిచ్చును. మధ్యాహ్నమునకు అది మధ్య వయస్సులోనికి వెళ్ళును. సాయంకాలము చనిపోవును. అయితే మరుసటి ఉదయాన నూతనముగా, తాజాగా లేచును. అది దేవుని పనిని నెరవేర్చుచున్నది.
భూమికి అందమిచ్చుటకు పూలు వికసించుచున్నవి, సమాధులను అవి అలంకరించును, పెండ్లి స్థలములను అవి అలంకరించును, మరియు ఒక పనిని అవి నెరవేర్చుచున్నవి: తమ హృదయములను విప్పి ఉచితముగా తేనెను తేనెటీగలకు ఇచ్చుచున్నవి, సువాసనను వెదజల్లుచున్నవి, అందమును అనుగ్రహించుచున్నవి. దేవుని పని కొరకు పూర్తిగా అంకితమై పోయినవి, తరువాత అది తన చిన్న తలను పంచును. కాని వసంత కాలము వచ్చినప్పుడు, అది తిరిగి లేచును, ఎందుకనగా అది దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చును.
MATT 5:7
8సృష్టి యావత్తులోను, బైబిలులోను, వాగ్దానములోను, పరిశుద్దాత్మలోను మన హృదయములకు ఆనందము దొరకుచున్నది, ఆ విధంగానే మన సోదరుడగు టేలర్ కూడా దేవుని పని నెరవేర్చెను. అతడు తిరిగి లేవడని చెప్పుట మన బైబిలును, మన దేవుడ్ని, దేవుడు మనకు చూడమని ఇచ్చిన ప్రతిదానిని తిరస్కరించుటయే. పునరుద్దానమును గూర్చిన వాగ్దానము మనమెరుగుదుము, కాబట్టి అతనిని మరల చూచు సమయము కొరకు ఎదురుచూచుచున్నాము, అప్పుడతడు యువకునిగా, ఆరోగ్యవంతునిగా యుండును, మరెన్నడూ వ్యాధికి గురికాడు లేదా వృద్దుడు కాడు లేదా .
అతని యొక్క దీన సహధర్మచారిణిని దీవించుము. ప్రభువా, వారు కలిసి వెళ్ళి ఆ చిన్న చెరువు యొద్ద బల్లల మీద కూర్చొని చేపలు పడుతూ, ముచ్చటించుచూ యుండేవారు. ఇప్పుడు అతడు లేకుండా ఆమె ఉండవలెను. వారెంతో మాధుర్యంగా కలిసి జీవించిరి.
విశ్వాస యోధులందరూ గొప్ప జయోత్సవముతో కదిలివచ్చు గొప్ప దినమొకటున్నదని మేమెరుగుదుము. గీతములతో దూతలు గాలిని నింపును. ఆ స్థలములో మరల వారిని చూస్తాము.
ప్రభువా, అంతవరకు మాకు ధైర్యము ఇమ్ము మమ్మును దీవించి మాకు సహాయము చేయుము. సహో, టేలర్ మా మధ్య లేకుండుట లోటుగానే యుండును, ఈ ఆలయమునకు వచ్చు వారందరికి అది లోటుగానే యుండును, ఎందుకనగా అతడు లేచి దేవుని వాక్యము వినుటకు వచ్చువారికి చోటిచ్చెడివాడు, ఇతరులు హాయిగా కూర్చోవలెనని కోరెడివాడు.
ప్రభువా, అతడు గతించిపోయిన ఆ దినమున నేను ఆలాగే ప్రార్ధి౦చాను. ఆ గొప్ప దేవుని దూత ఆ తలుపు నొద్ద నిలబడి అతడు కూర్చొనుటకు చోటు చూపించును గాక! "కనికరము చూపు వారు కనికరము పొందెదరని," బైబిలులో వ్రాయబడియున్నది. ప్రభువా, అతనిని మరల చూచువరకు ఆ తీయని జ్ఞాపకములు మా హృదయములలో కొనసాగును గాక, అవతలి రాజ్యములో ఒక రోజున అతనిని మేము కలిసికొందుము. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
9అతడు మా మధ్య లేకుండుట వెలితిగానే యుండును. ఆరాధనకై ఈ ఆలయమునకు వచ్చు క్రొత్తవారికి అతడు లేని లోటు కనబడును. ఆ దినము వరకు అతని ఆత్మ దేవుని యెదుట విశ్రాంతి పొందును గాక. ఒక దినమున మనలోని ప్రతి ఒక్కొక్కరము ఆ విధంగానే వరుసలో ప్రవేశించవలసియున్నాము. మనకు సమయముండగానే, అవకాశముండగానే ఆ సమయము కొరకు సిద్ధపడుదుము. అదెప్పుడు వచ్చునో మనమెరుగము. తరువాత ఎవరో మనకు తెలియదు. అదెప్పుడు వచ్చినా ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండవలెను.
10ఇప్పుడు మేమొక ప్రకటన చేయగోరుచున్నాము. ఈ భవన నిర్మాణము గూర్చి కూటములు గూర్చి స్థలము గూర్చి నేను ట్రస్టీలతో మాట్లాడలేదు. (క్షమించండి) ఆ తరువాత నేను ఏడు ముద్రల గూర్చి చెప్పెదను. ఇంకా మనము ఏడు పాత్రల గూర్చియు చెప్పుకోవలసియున్నాము.
వచ్చే ఆదివారం ఉదయము ఒక ప్రతిష్ఠ ఆరాధనకొరకై సహో, ఎల్.జి. హూవర్ తో కలసి కెంటకీలోని ఎలిజిబెత్ టౌన్ లోని ఆలయమును వారు కొని ప్రతిష్ఠ చేయుదురు. టర్న్ పైక్ నుండి 31 నంబరు రోడ్డులో ఎలిజిబెత్ టౌన్ కి రావలెను. ఒక మలుపు తిరిగితే మీరు ఎలిజిబెత్ టౌన్ చేరెదరు. ఒక గంట ప్రయాణము. ముప్పది-అయిదు లేదా నలుబది నిమిషములు పట్టును. 31 నంబరు ద్వారా అయితే దాదాపు నలుబది మైళ్ళనుకొంటాను, మరో దారినయితే ముప్పది-అయిదు మైళ్ళుండును. అది మల్బరీ వీధిలో యున్నది.
ప్రతి ఆదివారము 10 గంటలకు సహో. హూవర్ ఆదివారపు-బడి నడుపును. 11:00గంటల నుండి 12:00వరకు నేను ప్రతిష్ఠ ఆరాధనలో ప్రసంగించెదను. ఈ వచ్చే ఆదివారము, అనగా, నవంబరు 11న ఇది జరుగును.
11వార్తల బోర్డు మీద దీనిని గూర్చి తెలియచేయబడినది. మీరు దారి తేలికగా కనుగొందురు. అది మల్బరీ వీధిలో యున్నది. చర్చి ముందున్న బోర్దు మీద ఆ మార్గము చూపబడినది.
నవంబరు 22, 23, 24, 25, 26 న లూసియానాలోని ష్రీవ్ పోర్టులో యుందును. లూసియానాలోని, ప్రీన్పోరు లైఫ్ టెబర్నికల్లో అయిదు రోజులుండును. సహో, మూర్ తో ఉండును. వారు స్వర్ణోత్సవము జరుపుకొనుచున్నారు. ఇదే నెల 22వ తేదీని ఏబది సంవత్సరాల క్రితం లూసియానాలోని, ష్రీవ్పోర్టులో పెంతెకోస్తు దీవెన దిగినది. ఏబది సంవత్సరములు పాటు పెంతెకోస్తు వర్తమానమందించబడినది, లూసియానాలో పరిశుద్ధాత్మ దిగినది. దానికి జ్ఞాపకార్థముగా ఈ స్వర్ణోత్సమును వారు జరుపుకొనుచున్నారు. ష్రీవ్ పోర్టులో ని లైఫ్ టాబర్నికల్ లో సహో, మూర్ తో కలిసి అయిదు రాత్రులు ఆ కూటములలో మాట్లాడుదును.
12ఆ చుట్టుప్రక్కల మీకెవరైనా స్నేహితులున్నచో, వారిని సంతోషంగా ఆహ్వానించుచున్నాము. (మీరు వారికి తెలుపండి), ఈ రానున్న కూటముల గూర్చి వారికి చెప్పండి.
సహో, మూర్ తో లైఫ్ టెబర్నికల్లో ఎప్పుడయినా మీరున్నారా? అతడు చక్కని వ్యక్తి, వారందరూ అద్భుతమైన వారే. ఆ పాత దక్షిణాది వారు చాలా గట్టివారు, కాబట్టి ష్రీవ్ పోర్టులో ని లైఫ్ టెబర్నికల్ గూర్చి మీకు ఎవరయినా చెప్పెదరు. ష్రీవ్ పోర్టులో జనాభా 200,000. అది చక్కని పట్టణము మరియు చాలా చోటున్నది.
అది చాలా పెద్ద ఆలయము, దానికి పై అంతస్తులు, బాల్కనీలు ప్రధాన-గదులు ఇంకా ఆ పైన గదులు ఉన్నవి; చాలా చోట్లు౦డును, సిటీ ఆడిటోరియంకు ఎదురుగా యున్నది — అందులో అయిదు వేలమంది కూర్చొందురు.
13రెవరెండు జాక్, టి. మూర్ లేదా ష్రీవ్ పోర్టులోని లైఫ్ టెబర్నికల్ అని అడుగవలెను, 22న ఆరంభమగును. అనగా, అది గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము జరుగును; అయిదు రోజులకు బదులుగా నాలుగు రోజులు, నన్ను క్షమించండి. అయిదు రోజులు కాదు. అంటే 22, 23, 24, 25 నవంబరు. (నాకా విధంగా గుర్తున్నది)
ఇక్కడి ఈ భవనము ఎట్లు నిర్మించబడినదో చూడండి, పది రోజులలో దానిని నిర్మించునట్లుగా కంట్రూక్టు వారు కావలసినంత మందిని నియమించిరి. అంత త్వరగా అయిపోయినది. పట్టణాధికారుల సంతకము కొరకు వేచియున్నాము, చూచారా. మీకు తెలుసా, మనకు కారు నిలుపుటకు చాలా స్థలము కావలెను; మరియు ఓ, మై, ఏదైనా కట్టుట ప్రారంభించవలెనన్న, అది చాలా ప్రయాసపడవలెను.
14నేను విదేశములకు వెళ్ళముందుగా మరల సంఘమునకు వచ్చెదను. టాంగ్యానికా, ఉగాండాలకు నాకు పిలుపు వచ్చినది. ఫిబ్రవరిలో కూటములనేర్పాటు చేయుటకు జోసెఫ్ ఏర్పాటు చేసెను.
నిన్న నేను వచ్చేసరికి కొందరు సోదరులు, సోదరి టామ్స్ విదేశముల నుండి వచ్చిరి. దక్షిణాఫ్రికా నుండి నాకు ఆహ్వానము వచ్చినట్లు వారు వ్రాసిన కాగితమును తలుపునొద్ద పడవేసిరి. ఏమి చేయాలో వారికి వ్రాయుచున్నాను. ఏలాగు అంత దూరం వెళ్ళుచున్నాను గనుక దక్షిణాఫ్రికాలో ఆగుదును, ఫిబ్రవరి చివరలో లేదా మార్చిలో గాని అచ్చటుందును.
చర్చి తయారయితే ఈ శీతాకాలమునకు ముందే సంఘ కాలములను పూర్తి చేయుదును, లేనియెడల ప్రభువు రాకడ ఆలస్యమైనచో, అక్కడ నుండి తిరిగి వచ్చి చెప్పెదను.
15మొన్న నేను ఒక టేపు వినుచున్నాను, ఈ ఉదయము దానిని ఇచ్చట విన్నాను. ఒక దక్షిణాది సోదరుని యొక్క తల్లి కూటమునకు రావలసియుండెను, ఆమె రొమ్ము మీద కురుపు వచ్చి మరణావస్థలో యున్నది. దక్షణ పైన్స్ లో ఈ మధ్య జరిగిన కూటములలో ఆమె ఎవరో, ఎక్కడ నుండి వచ్చినదో, ఆమె వ్యాధి ఏమిటో పరిశుద్దాత్మ చెప్పెను. ఆమెకు విశ్వాస-భ్రష్టుడైన ఒక కుమారుడున్నట్లు చెప్పెను. అతనికి ప్రమాదము రానున్నట్లు చెప్పెను.
ఆమె కాన్సరు రోగము పోయినది. (అది కాన్సరే) అంతా ఆ పరిశుద్దాత్మ చెప్పినట్లే ఆ కుర్రవాని విషయములో జరిగినది. అతడు తిరిగి క్రీస్తు యొద్దకు నడిపించబడెను. అతడు టేపు చేసినది నేను విన్నాను. ఆ దక్షిణాది సంభాషణ మీరు విని ఆనందించారా? (దక్షిణాది వారి ఉచ్ఛారణను సహో, బ్రెన్హాం అనుకరించిరి.) ఓ! దక్షిణాది వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రభువు ఆ విధంగా అతనిని దీవించెను. "బ్రెన్హాం సోదరుడా, నీవు సిద్దాంతము బోధించనని చెప్పావు. నీ చర్చి వారికి మాత్రమే అది బోధించెదనని చెప్పావు, "మేము అందులో భాగమైయున్నాము," అని అతడు పలికెను. అతడు చాలా ఆసక్తిగా అది చెప్చెను.
16ఈ ఉదయమున అది బహుశా వార్తల బోర్డు మీద ఉండియుండును. లేనియెడల బిల్లీ దానిని పెట్టను. చాలాసార్లు దాని గూర్చి చెప్పబడెను. నేను దానిని మొదట చెప్పనారంభించగానే వారిట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, అదిగో వెలుగు ఆ పటము తీయబడక ముందు చూచిన వారెవరైనా ఆ పాతకాలపు వారిక్కడ ఉండవచ్చును."
చాలాకాలము క్రిందట దానిని చెప్పగా విన్నవారెవరైనా యున్నారా? చూడండి, నాలుగు లేదా అయిదు చేతులు లేచినవి. స్పెన్సర్ సోదరి, స్లాటర్ దంపతులు ఇక్కడున్నారు. ఆ పాతకాలపు వారు అయిదుగురు లేదా ఆరుగురు మాత్రమే మిగిలి యున్నారు.
17ఆ తరువాత కెమెరా యొక్క యాంత్రిక కన్ను దానిని తీసినది. అది వాషింగ్టన్ డి.సి. లోనికి వెళ్ళినది, ఎందరో పరీక్షించిరి, రెండుసార్లు ముద్రపడుట కాదని చెప్పిరి. "లెన్సును వెలుగు తాకినది," అన్నారు. జార్జి జె. లాసీ సంతకము చేసెను. చూచారా.
అనేక సార్లు నేను ఈ విధంగా చెప్పుట మీరు విందురు. "ఈ వ్యక్తి మీద మరణ ఛాయ యున్నది. మరణము కమ్ముకొన్నది." ఆ విధంగా నేను చెప్పుట మీరు చాలాసార్లు విన్నారు. (చూచారా), ఆ కెమెరా దానిని పట్టుకొన్నది. అది ఇక్కడ యున్నది. కరోలినాలోని దక్షణ పైన్స్ లో అద్భుతమగు కూటములు జరిగినవి.
రెండు రొమ్ముల మీద కాన్సరు వచ్చి ఒకామె చనిపోవుచున్నది, వైద్యులు ఆమె చనిపోవునని చెప్పి ఆశ వదలిరి. ఆ స్త్రీ అచ్చటికి వచ్చినది. ఆమె ఫోటో మా యొద్ద ఉన్నది. ఆమె ఎవరో, ఎక్కడి నుండి వచ్చినదో చెప్పాను, "నిన్ను నల్లని ఛాయ కమ్ముకొన్నది. నీవు మరణనీడలో యున్నావు," అని చెప్పాను. ఆమె ఈ పటమును తీసినది. మరణ ఛాయను కూడా ఆ కెమేరా యొక్క యాంత్రిక కన్ను తీసినది.
18"పది ఆజ్ఞల చిత్రమును" మీలో ఎవరైనా చూచినచో వారికి మరణ దూత గూర్చి అర్థమగును. నల్లని నీడగా అదెట్లు వచ్చినదో చూచారా? అది ఈ బొమ్మలో యున్నది. ఇప్పుడది ఆ ప్రకటనల బల్ల మీద యున్నది, ఇక్కడిప్పుడు అది లేనియెడల దానిని బిల్లీ అక్కడుంచును. ఆ వ్యక్తిని చూపించు గురుతు అందులో యున్నది. ఆ నీడ ఆమెను విడిచిపోయి, ఆమె ఆశ్చర్యంగా స్వస్థత పొందినది. కాని ఒక నల్లని పొగవంటిది ఆమెను కమ్మినట్లు కనబడినది, కాన్సరు వచ్చుచున్నట్లు అది కనిపించినది, అది కాన్సరు వలన ఆమెకు రానున్న మరణమును చూపించుచున్నది.
ప్రజలకు మీరెంత సత్యము చెప్పినా గాని, వారా సత్యమును నమ్మక సందేహించెదరు. నీవు ఎల్లప్పుడూ సత్యము చెప్పుము, అప్పుడు నీవు సరైనవానివగుదువు.
19పశ్చిమాన నాకు ఒక స్నేహితుడున్నాడు, అతడు ఒకపశుల పర్యవేక్షకుడు. ట్రబులుసం లోయలోనికి తిరిగి వెళ్ళు పెద్ద జింకల మందను లెక్కించుటకు గాను సంరక్షకులు ఒక మంచులో నడచు వాహనమును అతనికి 4000 డాలర్లు ఇచ్చి సమకూర్పుదురు. అతని పేరు జెఫ్రీ, అతనిని నేను క్రీస్తునొద్దకు నడిపించాను. అతడు పూర్తిగా నాస్తికుడు. మేమిద్దరం కలిసి స్వారీ చేయుట గూర్చి మీతో చెప్పాను. డార్విన్ సిద్దాంతము తప్ప మరేదీ అతడు నమ్మడు. కన్యకకు బాలుడు పుట్టుట బుద్ధిహీనమని చెప్పాడు, అయితే ఒక రాత్రి మేము బస చేసిన చోట అతడు క్రీస్తునంగీకరించెను.
"ఆ మంచులో నడిచే వాహనము," కొనకుండానే అక్కడ ఎన్ని పశువులున్నాయో చెప్పగలనని అతడు పలికెను. "అక్కడ ఇరవై-ఒక్కటి ఉండేవి గాని అందులో రెండు నేను చంపాను గనుక పందొమ్మిది మిగిలినవని," అతడనెను. అతడు తన పై అధికారికి ఈ మాట చెప్పెను, ఒక్కటికన్నా ఎక్కువ వాటిని చంపరాదు, "అయితే ఇరవై-ఒకటిలో రెంటిని చంపానని," అతడు చెప్పెను. "పందొమ్మిది ఇంకా ఉన్నవి."
"జెఫ్! నీవు రెండింటిని చంపావని నాకు తెలియును?" అని అధికారి అనెను.
"అవును, చంపాను," అని ఇతడు చెప్పెను.
వారు ఆ మంచులో నడచు బండిని తీసికొని అచ్చటికి వెళ్ళిరి. అక్కడ పందొమ్మిది పశువులే ఉన్నవి. "బిల్లీ, మనుష్యులు సత్యము నమ్మరు," అని నాతో అన్నాడు. అవును. అది నిజమే. నీవు నిజము చెప్పినచో, వారు అపార్ధము చేసికొని నీవు చెప్పినది సత్యము కాదందురు. మీరు చూచారా?
20కాని సత్యమును స్థిరపరచు ఒక పరలోక తండ్రి మనకున్నందుకు ఎంతో వందనములు చెల్లించవలెను. ఇది సత్యము. ఈ సంగతుల గూర్చి నేను సత్యమే చెప్పితినని శాస్త్రీయ పరిశోధనలు కూడా నిరూపించినవి, కాబట్టి ఇది ఆ బయట బోర్డు మీద ఉండును. బిల్లీ, నీవిచ్చట ఉన్నావా? నీ చేతిలో ఆ పటమున్నదా? అది నీయొద్ద ఉన్నచో, దానిని అందరూ చూచునట్లు ఇక్కడ తెచ్చి ఉంచు. నాకు తెలియదు గాని ఆ బోర్డు మీద ఒక దీపము నుంచెదరు.
ఈ పటమును చూడండి. మీకు సరిగ్గా కనబడదనుకొంటాను, అయితే ఆ స్త్రీ తల మీద ఉన్న మరణ నీడను చూడండి. ఆమె ఆ ఫోటో ఎక్కడ తీసినదో ఆ వెనుక వ్రాయబడినది. నిజంగా దానిని పరిశీలించి చూడండి, మరణ నీడ ఆమెను కమ్మినది. మీరది చూచారని తలంచుదును. నెవిల్ సోదరుడా కనబడినదా?
బిల్లీ దీనిని బహుశా, ఆ బోర్డు మీద ఉంచును, మీరు చూడవచ్చును. బిల్లీ దానిని మీ ముందుకు తెచ్చును. ఆ తరువాత దానిని అందరూ చూచునట్లు బల్లమీద ఉంచును, కాని ఆ పటములో చీకటి యున్నది. మీరు తేటగా చూడలేరు, అయినా గాని దానిని మీరు చూడండి. అన్ని ప్రకటనలను మీరు గుర్తుంచుకొనండి.
21సంఘమును ప్రోత్సాహపరచునట్లు కొద్ది సందేశమును ఈ ఉదయమున నేను అందించవలెనని తలంచుచున్నాను.
[సహో, బ్రెన్హాం దేనిగూర్చియో తన సోదరుడు ఎడ్గారితో మాట్లాడుచున్నారు] దానిని ఇక్కడ ఉంచవలెనని కోరుచున్నాను, ఎందుకనగా చాలామంది దానిని చూడలేదు. నా సందేశము కూడా ఆ సోదరికి వచ్చిన స్వప్నము గూర్చియే.
22ఈ ఉదయము సోదరి షెపర్డ్ ఇక్కడ ఉన్నదనుకొంటాను. గత రాత్రి ఆమెను నేను కలిసికొన్నాను. ఆమెను ఇదే తొలిసారి చూచుట. ఆమె ఎవరో కూడా వాస్తవానికి నేనెరుగను. ఆ కలను నేను చెప్పవచ్చునా?
షెపర్డ్ సోదరీ, నీకేమీ అభ్యంతరము లేదు గదా? సరే మంచిది. దానిని మనము చెప్పు ముందుగా, ఇప్పుడు మరల తలలు వంచుదము.
23కృపగల పరమతండ్రీ, నీ కృప మరియు మంచితనము బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, సజీవ దేవుని యొక్క వాక్యమును అధ్యయనము చేయునట్లుగా మమ్మును నిమ్మళపరచుము. అది దర్శనము ద్వారా వచ్చుచున్నది. పరిశుద్దాత్మ ద్వారా అది బలపరచబడుచున్నది. ఇప్పుడు మా చుట్టూ దుష్టశక్తులు కమ్ముకొని యుండగా, ఈ చివరి దినములలో మేమేమి చేయవలెనో ఎరుగునట్లుగా మాకు అవగాహన దయచేయుమని ప్రార్ధించుచున్నాము. చివరి యుద్ధము చేయవలసిన సమయము వచ్చినది. ప్రభువా, మాకు సహాయము చేయుము. నిజమైన యోధులవలె బలవంతులమై దేవుని వాక్యమును ఖడ్గమును, విశ్వాసమును డాలును పట్టుకొని ముందుకు కదిలిపోవునట్లు మాకు సహాయము చేయుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్!
24యుద్దములో ముందుకు సాగిపోవుట ఏమిటో తెలియునా? క్రియ చేయుటకు సిద్ధపడవలెను. ఇది విశ్వాస పోరాటము.
షెపర్డ్ దంపతులు ఇచ్చటున్నారు, వారు మనకు చాలా మంచి మిత్రులు. ఈ ఆలయమునకు వచ్చిరి. వారు దేవుని యొక్క ప్రశస్తమగు బిడ్డలు, నాకు వచ్చిన వ్యక్తిగత ఉత్తరములను చూచాను. (తక్కిన వాటికి బిల్లీ జవాబు ఇచ్చును. "కొందరు ప్రార్ధనా వస్త్రములు పంపమని కోరుదురు." కాబట్టి ఆ వస్త్రములను ప్రార్ధించెదను. అతడే వాటికి జవాబు ఇచ్చును. నా వ్యక్తిగత ఉత్తరములకు నేనే జవాబు ఇచ్చెదను. చూచారా?)… నేను నా ఉత్తరములను తీసికొని ఇంటికి వెళ్ళి చదువుచున్నాను. అందులో "సోదరి షెపర్డ్ నుండి వచ్చిన ఉత్తరమున్నది." కొన్ని నెలల క్రితం ఆమెకు వచ్చిన కల వ్రాసినది, రెండు లేదా మూడు వారముల క్రితం నేను ఏడు సంఘ కాలముల గూర్చి బోధించాను, అప్పుడు ఆమె దీనిగూర్చి అర్థము చేసికొన్నదని విన్నాను. మన విశ్వాసమునకు కలుపుకొనవలసిన ఏడు ఫలములను గూర్చి ( II పేతురు 1) నుండి ఎత్తి చెప్పాను. చూచారా.
2PET 1:5-7
25మొదటిది: విశ్వాసము, అది పునాది. రెండవది: విశ్వాసమునకు, సద్గుణమును కలుపుకోవలెను; సద్గుణమునుకు, జ్ఞానమును; జ్ఞానమునకు, సహనమును; సహనమునకు, ఆశానిగ్రహమును; ఆశానిగ్రహమునకు, భక్తిని; భక్తికి, సహోదర ప్రేమను - సోదరుల పట్ల దయ అమర్చుకొనండి. ప్రేమయే తలరాయి — ఇవి ఏడు ఉన్నవి (చూచారా), ఏడు సంఘకాలములున్నవి. ఏడు సంఘ కాలములకు ఏడు నక్షత్రములున్నవి, ఇవన్నియు పరిశుద్దాత్మచే తేటపరచబడినవి.
క్రీస్తు దాసునిగా మారుటకు ఇవన్నియు కావలెను. క్రీస్తు తన సంఘమును ఏడు కాలములలో నిర్మించును, ఆయన వధువు, స్త్రీ సంఘము. ఏడు సంఘ కాలముల వలన వధువు ఏర్పడుచున్నది; ఈ కాలములో కొందరు, ఆ కాలములో కొందరు, ఆ విధంగా అందరూ కలిసి పిరమిడ్ ఆకారము పొందెదరు.
26పిరమిడ్లను నిర్మించిన హనోకు వలె యుందురు. వాటి మీద ఎన్నడూ తలరాయి ఉంచబడలేదు, ఎందుకనగా ఆ మూలరాయిని విసర్జించిరి.
ఇక్కడున్న సంఘము దానిని అర్ధము చేసుకొనునట్లు చెప్పెదను, ఒక సిద్ధాంతము వలె బోధించను…
దేవుడు మూడులో పరిపూర్ణుడగును. ఒకే దేవుని యొక్క మూడు కార్యాలయములే తండ్రి, కుమార, పరిశుద్దాత్మ. నీతీకరణ శుద్దీకరణ, పరిశుద్దాత్మ బాప్తిస్మముల ద్వారా ఆయన తన్నుతాను సంపూర్ణునిగా చేసికొనెను; అవి కృప యొక్క పరిపూర్ణ క్రియలు. మూడు రాకలలో ఆయన తన్ను పరిపూర్ణునిగా చేసికొనును. మొదటిసారి తన వధువును విమోచించుటకు వచ్చెను. రెండవసారి తన వధువును స్వీకరించ వచ్చును. మూడవసారి వెయ్యేండ్ల పాలనలో తన వధువుతో ఉండును. సమస్తము మూడులోనే సంపూర్ణమగును. ఏడు అను సంఖ్య దేవుని ఆరాధనా సంఖ్య; ఏడులో దేవుని ఆరాధన సంపూర్తియగును. ఇప్పుడు పరిపూర్ణత, సంపూర్ణత చూచాము.
గత చివరిసారి నేను వేటాడిన లేడికి ఒకవైపు అయిదు గుర్తులు, మరోవైపు మూడు గుర్తులు యున్నవి. ఇది చాలా వింత. (మీకు చూపించుటకు తేవలెననుకొన్నాను) (చూచారా): కృప మరియు పరిపూర్ణత!
27దేవుడు మూడు బైబిలులను వ్రాసెను. మొదటి బైబిలు, ఆకాశములో వ్రాసెను, అది రాశి చక్రమందురు. మీకు యోబు గ్రంథము తెలియనిచో, ఇది తెలియదు, ఎందుకనగా యోబు దానిని వివరించెను: అతడు పైకి చూచి ఆకాశమందున్న వాటిని పేర్లతో పిలచెను.
చూడండి, ఇప్పుడు రాశి చక్రములో ప్రారంభము ఏది? రాశి చక్రములో మొదటిది, కన్య రాశి మరియు చక్రములో చివరిది సింహము. క్రీస్తు మొదటిసారి కన్యక ద్వారా వచ్చెను, రెండవసారి యూదా గోత్రపు సింహముగా వచ్చును.
28హనోకు తన దినమున పిరమిడ్ ను పూర్తిచేసెను. ఆ పిరమిడ్ నిర్మాణ విధానము, దానిలోని గదులు చెప్పుకొను సమయము మనకు లేదు. అది ఈ అంత్యకాలమును గూర్చి చెప్పుచున్నది, అవి కొలతల ప్రకారము. ఇప్పుడు రాజ గదులలో యున్నవి, కాని ఆ పిరమిడ్ మీద తలరాయి ఉంచబడలేదు. వాటినెట్లు నిర్మించిరో ఎవరికీ అర్థము కాదు, సున్నము లేకుండా ఆ రాళ్ళను అమర్పిరి. అందులో బ్లేడు కూడా దూరదు, అంత ఖచ్చితంగా ఎట్లు చెక్క కలిగిరో ఎవరికీ అర్థము కాదు.
క్రీస్తు మరియు సంఘము ఒక్కటి అయినప్పుడు, అలాగే ఉండును. మధ్యలో ఏ సున్నమూ ఉండదు — దేవుడు, క్రీస్తు, ఆ వ్యక్తి తప్ప మధ్యలో ఎవరూ ఉండరు.
29కాని ఆ మూలరాయిని ఎక్కడ వారు కనుగొనలేకపోయిరి. ఇంగ్లాండులో రాజులను అభిషేకించుటకు స్కోన్ శిల ఉన్నది.
అమెరికా డాలరు నోటును చూడండి; దానిని మీరు అమెరికా డాలరు నోటు మీద చూడగలరు. ఎడమ వైపు అమెరికా ముద్ర యున్నది. పక్షిరాజు, దాని చేతిలో ఖడ్గము ఉన్నది. దీనిని అమెరికా ముద్ర అందుము, కాని మరోవైపు పిరమిడ్ యున్నది. దానికి పైన పెద్ద కన్ను యున్నది. దాని క్రింద "మహా ముద్ర?" అని వ్రాయబడినది. అదెందుకు ఈ దేశములో అత్యున్నతమగు ముద్రగా యున్నది? మన దేశపు ముద్ర కంటె గొప్పది. చూడండి, మీరేమి చేసినా, ఏమి చెప్పినా ఆ విషయంలో దేవుని అర్థము వేరుగా ఉన్నది. దాని గూర్చి ఒక పాపి గ్రహించగలుగునట్లు ఆయన చేయును. దానిగూర్చి దేశములు మాట్లాడునట్లు ఆయన చేయును; ప్రతిధీ ఆయన గూర్చి మాట్లాడుచున్నది, మీరది నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. అది అక్కడే యున్నది.
అందులో ఒక నేత్రమున్నది చూడండి — అది దేవుని నేత్రము. తలరాయి ఇంకా రాలేదు, ఎందుకనగా అది నిరాకరించబడినది. ఆ తలరాయి దేవుని కుమారుడే. అదే పిరమిడ్ యొక్క పై మూత.
30ఇప్పుడు, కొన్నిసార్లు ఈ సంగతులను వారు టేపు చేయుదురు, అది ఇతర సంఘముల లోనికి వెళ్ళును — కొన్నిసార్లు దానిని వినిన సోదరులకు తప్పు అభిప్రాయము కలుగును. సోదరుల గూర్చి నేను ఏదో చెప్పుచున్నానని వారనుకొందురు. కాని నేనందుకు ఇది చెప్పుట లేదు. ఏ సోదరునికి విరోధంగాను నేను చెప్పుట లేదని మీరు అర్థము చేసికొనండి. (చూచారా?) ఎందుకనగా సోదరులు ఆలాగు ఉండకూడదు. మనము ఒకరి పక్షముగా మరొకరము మాట్లాడవలెనే గాని, విరోధముగా మాట్లాడరాదు. కాని కొన్నిసార్లు నేను ప్రెస్బిటేరియను, మెథడిస్టు మొదలగు కొన్ని సంస్థల గూర్చి చెప్పినప్పుడు, "నేను వాటికి వ్యతిరేకినని" వారనుకొనుచున్నారు. అందులో ఉన్న సోదరీ సోదరులకు నేను వ్యతిరేకిని కాను. సోదరత్వమును వేరుచేయుచున్న ఆ పద్ధతికి నేను వ్యతిరేకిని. అందుకు వ్యతిరేకముగా నేను మాట్లాడుచున్నాను. దేవుని పిల్లలు ఒక్కటే కుటుంబము గాని, వేర్వేరు గుంపులు కారు.
31"నేను మెథడిస్టును, వారు ప్రెస్బిటేరియనులు గనుక నాకు వారితో ఎట్టి సంబంధము లేదని కొందరందురు," చూచారా. సోదరత్వమును విచ్ఛిన్నము చేయునది ఆ సంస్థల పద్ధతియే, చూచారా.
నేనింతకు ముందే చెప్పాను: నీవు ఒక పాత, బ్రద్దలగుచున్న దోనెలో నదిగుండా వెళ్ళుచున్నామనుకో, నీవు వెళ్ళలేవని నాకు తెలియును, కాని నేను నిన్ను చూచి కేకలు వేయక తిట్టుచున్నాను; నిన్ను ఆ నావలో నుండి బయటకు రప్పించగోరుచున్నాను. (చూచారా?); ఎందుకనగా అది బ్రద్దలగును, నీవు నీటిలో మునిగెదవు. కాబట్టి నేను ఆ సోదరుని వైపు చూచి కేకలు వేయుటకు కారణము, ఆ దోనె మంచిది కాదనియే, ఏమి జరుగునో నాకు తెలియును.
ఈ పద్ధతులన్నియూ మానవులు తయారు చేసినవి, బ్రద్ధలయిపోవును. అంతే. మనము సోదరత్వము నందు ఏకమగుట అవశ్యము. ఒక సంస్థను బ్రద్ధలు చేయుట కాదు గాని, జనులను ఏకము చేయుటయే నా జీవిత ఉద్దేశ్యము. వారు తమ అభిప్రాయములను విడిచిపెట్టి, తిరిగి జన్మించిన క్రైస్తవులు కావలెను. అది నా ఉద్దేశ్యము; అందుకొరకు నేను నిలబడ్డాను.
HEB 11:40
32మంచిది ఇప్పుడు, సంపూర్ణ సువార్త సత్యములోనున్న అనేకమంది సోదరులు కూడా బాప్టిస్టులును, మెథడిస్టులను, లూథరనులను నమ్ముట లేదు. వారికి ఒక తరుణమున్నది. ఒకవేళ, వారు సరిగా యున్నను, వారితో నేను ఏకీభవించను, లూథరను యుగము ఒకటున్నది, దీనిని సార్ధీస్ కాలమని పిలిచాము. మెథడిస్టులకైన ఫిలదెల్ఫియా సంఘకాలము, పెంతెకోస్తులకైన లవొదికయ సంఘకాలము. ఆ కాలములను నేను నమ్ముచున్నాను. దేవుడు ప్రతి యుగములోను కొందరిని ఏర్పాటు చేసికొనెను. వారు లేకుండా మనము సంపూర్ణులము కాలేదని హెబ్రీ 11 చెప్పుచున్నది, చూచారా. పెంతెకోస్తు కాలము వరకు వచ్చుచున్న సంఘము అల్ప సంఖ్యలోనే యున్నది.
33దీనిని ఒక కారణము చేత నేను చెప్పుచున్నాను: ఆ సోదరి కలను గూర్చి మీకు ఒక అభిప్రాయమేర్పడవలెను. నేను బోధించుచున్న దానికి నిశ్చయంగా ఆమె కల ఒక స్వారూప్యము.
చూడండి, I పేతురు 6, 7 వచనములు మీకు అదే చెప్పుచున్నవి. విశ్వాసము మొదటిది. జనులు తిరిగి జన్మించకుండానే ఈ సద్గుణములన్నియూ కలిగియున్నామని చెప్పుకొనుచున్నారు. కాకి కొన్ని నెమలి వెంట్రుకలు తగిలించుకొని నెమలినయిపోయానని తలంచినట్లు ఇది ఉన్నది. ఎన్నడూ అది నెమలి కానేరదు, దానిలో నుండి సహజంగా ఆ వెంట్రుకలు పుట్టుకు రావలెను. ఆ వెండ్రుకలు లోపట నుండి పుట్టుకొని బయటకు రావలెను.
MATT 7:16,20
34జట్టు కత్తిరించుకొనుట, ముఖమునకు రంగులు పూసికొనుట, మొదలగు విషయములలో సోదరీల పట్ల నేను చాలా కఠినంగా ఉంటున్నానని జనులు తిట్టుచున్నారు. ఆడవారంటే నాకు గిట్టదని అనుచున్నారు. నేను వారికేమీ విరోధిని కాను. ఆ స్త్రీ మంచిది కాదని నేను అనుట లేదు. అది నా దృక్పధము కాదు. కాని ఆమె బయట ఎంతో కృతిమమైనవి ధరించుకొనుచున్నది, లోపట కూడా అంతే కృత్రిమమున్నదని చూపించుచున్నది (చూచారా?), క్రీస్తుతో నింపబడవలసియున్నది. ఎందుకనగా లోపట ఉన్నదానినే బయట ఎల్లప్పుడూ వ్యక్తము చేయుట జరుగును. "వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు." చూచారా? అక్కడ క్రీస్తు ఉండవలసియున్నాడు, దేవుని కొరకు వెదుకవలసినదానికి బదులు ఎంతో ఆడంబరము, కృత్రిమము వ్యక్తపరచుచున్నారు. పచ్చటి కనురెప్పలు చూస్తుంటే అసలు మానవ రూపముగా కనబడుట లేదు. బైబిలు దానిని అనుమతించదు, నేను కూడా అనుమతించను. మనము ఎట్లున్నామో ఆ రీతిగానే ఉండవలెను.
35చూడండి, వ్రేలుకు గోరు లేకపోయినచో, ఆ గోరును కృత్రిమంగా పెట్టుకొనుట వేరు. పళ్ళు లేనియెడల, అవసరము కొరకై కృత్రిమ పళ్ళు పెట్టుకొనుట వేరు. జుట్టు లేనప్పుడు, నీ అవసరము కొరకు జుట్టు పెంచుకొనుట వేరు. కాని నీ మంచి పళ్ళు పీకి వేసినచో తప్పు. నీ ఎర్రని జుట్టుకు నల్లని రంగు వేయుట తప్పు. దానికి వాక్యమేమీ లేదు, కాని నీ జుట్టు కత్తిరించుకొనుటకు వాక్యమున్నది. దానిని మనము జాగ్రత్తగా పాటించవలెను.
36మన సోదరి కల వలన కలత చెందినది: "మనము పరిశుద్ధాత్మను పొందవలెనని దేవుడు కోరుచుండగా, దానిని మనము పొందనియెడల, ఈ జీవిత పోరాటము వలన లాభమేమిటి?" అని ఆమె తలంచినది.
దీనిని వారు టేపు చేయుచున్నారనుకొంటాను, అయితే కేవలము సంఘము కొరకు ఇది చెప్పుచున్నాను, చూచారా. ఎవరైనా గాని ఈ నా స్వరమును విన్నచో జ్ఞాపకముంచుకొనవలసినదేమనగా, దీనిని నా సంఘమునకు బోధించుచున్నాను. మీ సంఘములోని వారు వినకుండా యుండవలెనని మీరు కోరినయెడల ఈ టేపులను పరీక్షించుకొనండి, వీటిని వారిని విననీయవద్దు. ఇక్కడున్న చిన్న గుంపుకు దీనిని చెప్పగోరుచున్నాను. సహో, నెవిల్ ఈ సంఘమునకు కాపరి, పరిశుద్దాత్మ ద్వారా వీటిని మేము బోధించుచున్నాము.
37మీరు అసలు ఏకీభవించని కొన్ని సంగతులు ఇందులో ఉండవచ్చును. వేపిన కోడి మాంసము తినినట్లుగా ఇది యుండునని నేను ఎప్పుడూ అనుచుందును. అందులో మీకు ఎముక దొరికినందున మొత్తం మాంసమును విసిరివేయరు గదా? కాబట్టి ఈ విషయములోను ఆ విధంగానే చేయండి. ఒక ఫలమును తినుచున్నప్పుడు, అందులో విత్తనములు తగిలినప్పుడు ఫలమును విసిరివేయరు గదా? కాబట్టి దీనిని వినునప్పుడును ఆ ప్రకారమే చేయండి.
ఈనాడు "పరిశుద్ధాత్మ" గూర్చి చాలా గందరగోళముండుటకు కారణమేమిటి? సరిగ్గా నేర్పింపకపోవుటయే అందుకు కారణము. ఒక "వాహనము," అని చెప్పినట్టు, కేవలము "బాప్తిస్మము," అని చెప్పుదురు. అయితే ఇప్పుడు, సంఘములో ఎందరో మెకానిక్లను నేను కలిగియున్నాను, మరియు దాని గురించి ఒక్క సంగాతి కూడా నాకు తెలియదు, కావున నేను ఒక పొరపాటు చేసినట్లయితే, సోదరులారా, నేను మెకానిక్ ను కాను అని గుర్తుంచుకొనండి.
ఒక కారులో ఎన్నో కాయల్స్ ప్లగులు, పాయింటు, వాల్వులు మొదలగునవి యుండును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము గూర్చి మీరేదో అందురు, కాని అందులో చాలా సంగతులున్నవి. పరిశుద్దాత్మ ఇక్కడ ఉన్నట్లు దేవుడు రుజవు చేయుచున్నాడు, చూచారా.
LUKE 12:38•
2PET 1:5-7
38మొదట విశ్వాసమని పేతురు చెప్పెను. ఇప్పుడు దీనిని జాగ్రత్తగా గమనించండి. కొద్ది నిమిషముల పాటు దీనిని బోధించెదను. విశ్వాసము మొదటిది. మీ విశ్వాసమునకు, సద్గుణమును కలుపుకొనుడి; మీ సద్గుణమును, జ్ఞానమును; మీ జ్ఞానమునకు, ఆశానిగ్రహమును; మీ ఆశానిగ్రహమునకు, సహనమును; సహనమునకు, భక్తిని; భక్తికి, సోదర ప్రేమను; సోదర ప్రేమకు, దయను అమర్చుకొనుడి. ప్రేమయే దేవుడైయున్నాడని మీరెరుగుదురు. దేవుడు ప్రేమా స్వరూపి, చూచారా.
దీనిని ఏడు సంఘ కాలముల లోనికి తీసికొనివద్దాం, దేవుడు ఏడు సంఘ కాలములను నిర్మించుచున్నాడు, క్రీస్తు కొరకు ఒక వధువు తయారగుచున్నది. ఫిలడెల్ఫియ, తుయుతైర, పెర్గెమ, స్ముర్న ఎఫెసు, మొదలగు సంఘ కాలముల ద్వారా యేసు ఇట్లు చెప్పెను, "పెండ్లి కుమారుడు మొదటి జాము లేదా ఏడవ జాము రావచ్చును, ఈ కన్యకలందరు మేల్కొనిరి." వారు మేల్కొనిరి, ఎఫెసు, స్ముర్న పెర్గెము, తుయుతైర, సార్ధీస్, ఫిలడెల్ఫియ మరియు లవొదికయ సంఘములలోని కన్యకలు మేల్కొనెదరు. దానిని మీరు గమనించారా? ఆయన ఏడవ సంఘ కాలములో వచ్చెను. ఆ నిద్రించుచున్న కన్యకలు మేల్కొనిరి. ఆ యా కాలములలో ఉన్నవారందరు తిరిగి లేచిరి. ఆయన ఒక వధువును నిర్మించెను. ఒక వధువు జన్మించెను. క్రీస్తు కొరకు భూమి మీద ఒక వధువు ఉద్భవించెను. ఈ వధువును ఆయన పుట్టించిన రీతిగానే, వ్యక్తిగతముగా అనేకులను ఆయన పుట్టించెను.
39ఆ సోదరి యొక్క కలకు ఇదే నేపద్యము, మీరిది గ్రహించునట్లుగా దీనిని చెప్పుచున్నాను.
ఇప్పుడు, క్రైస్తవునిలో ఈ సంగతులు తప్పక ఉండి తీరవలెను, పరిశుద్దాత్మ వీటిని ముద్రించును, ఇది పైకి వచ్చినప్పుడే పూర్తి రూపము ఏర్పడును.
ఇప్పుడు, మన సోదరి కల చూద్దాం. ఆమె తనకు పరిశుద్దాత్మ ఉన్నదో లేదో అని కలవరపడసాగినది. ఆమె భర్త వార్తాపత్రిక చదువుచుండగా, ఆమె ప్రక్కనే యున్నది. (నా వలె ఆమెకును చిన్నపిల్లలుండిరి, వారు అల్లరి చేయుచుండిరి), ఆమె దాదాపు పది లేదా పదిహేను నిమిషముల పాటు నిద్రలోనికి జారినప్పుడు ఈ కలను కన్నది. సంవత్సరము నుండి ఆమెకు ఈ కల అర్ధము కాలేదు మరియు ఈ వర్తమానమందించినప్పుడు, ఆమె దానిని గ్రహించినది. నేనది బోధించుచుండగా, ఆమెకు అదంతయు గుర్తుకు వచ్చినది.
ఆమె ప్రార్ధించుచున్నట్లుగా కలకనెను. ఆ కలకు ముందు ఆమె నేల మీద నడచుచూ ఇట్లు తలంచెను, "ప్రభువా, నాకు పరిశుద్దాత్మ యున్నదా? నాకు రుజువు చేయుదువా? నేను చప్పట్లు కొట్టుచున్నాను గనుక, నేను భాషలతో మాట్లాడుచున్నాను గనుక దానిని నేను పొందినట్లే, అని కొందరు చెప్పుచున్నారు. (అవన్నీ మనము నమ్మదుము.) కాని నిజంగా నాకు ఉన్నదా?"
40ఆ సద్గుణములన్నింటినీ మనము నమ్ముదుము: భాషలలో మాట్లాడుట, చప్పట్లు కొట్టుట, మొదలగునవన్నీ నమ్ముచున్నాము. నేను ప్రతిదీ నమ్ముచున్నాను, కాని ఇది లేకుండా అవన్నీ ఉన్నా లాభము లేదు. చూచారా? మీరు పై గుల్లను కలిగియున్నారు.
చూడండి, ఆమె దానిగూర్చి కలవరపడసాగినది, కావున ఆమె మంచము మీద పరుండినది, ఆ ప్రక్కనే ఆమె భర్త పేపరు చదవుచుండెను. ఆమెకు నిద్రపట్టినది. ఆమె ఆ కలలో ఒక కొండపైన ఉన్నది. ఆమె వ్రాసి పంపిన పేపరు నా యొద్ద లేదు గాని, నాకు గుర్తున్నది. ఆ కొండ మీద ఒక రాతితో చేసిన పెట్టె వంటిది యున్నది. ఆమె భర్త ఆమె వెనుకనే యున్నాడు. పని బట్టలు వేసికొనిన ఒక పెద్ద వ్యక్తిని ఆమె చూచెను. చొక్కా చేతులు మడుచుకొనెను. ఆమె ఎన్నడూ చూడని స్వచ్చమగు నీటిని ఈ కొండపైనున్న రాతి పెట్టిలో పోయుచున్నాడు.
కాని ఆ నీరు ఆ రాతిపెట్టెలో నిలుచుట లేదు; అది అక్కడ నుండి దొర్లి క్రిందికి వచ్చి అక్కడున్న చెత్త, పుల్లలు మొదలగువాటినన్నింటినీ కాల్చివేసెను. అది పర్వతము మీద నుండి దొర్లి వచ్చెను. అది ఆమె పాదముల యొద్దకు వచ్చినది. అప్పుడా వ్యక్తి ఇట్లనెను, "అది నీరు కాదు. అది పరిశుద్ధాత్మ," దానిని "ఏదియూ నిలుప జాలదు?"
41"అతడు తిరిగి వెళ్ళి మరొక పెద్ద బక్కెటు తీసికొనివచ్చెను — దాని నిండా తేనె ఉన్నది — ఆ తేనెను అందులో పోసి, ఇప్పుడు ఇది అందులో నిలుచునని," అతడు చెప్పెను. రాతి పెట్టె బ్రద్దలయి తేనె ఒలికిపోవునని ఆమె తలంచినది, కాని ఆలాగు జరుగలేదు. చివరకు అది అందులో నిలచినది.
ఆమెకొండ దిగి వచ్చినది. కొండ దిగుచూ ఆమె ఆ కొండ దిగువ భాగమున ఆగి వెనక్కు చూచినది. ఈ స్ఫటికమువలె స్వచ్చముగా నున్న జలము గల అయిదు కాలువలను ఆమె చూచెను. వీటి వలన ఆ నీరు చెడిపోకుండా ఇంకా స్వచ్చముగాను, నిర్మలముగాను యున్నది. అది వేగముగా ప్రవహించుచూ వచ్చి వేగము తగ్గినది. ఆ తరువాత దాదాపు అది కనుమరుగాయెను. అయిదు కాలువలు ఎన్నడైనా ఆ కొండ దిగువ భాగమునకు చేరునో లేదో అని ఆమె ఆలోచించసాగినది. అంతలో ఆమెకు మెళుకువ వచ్చెను,షెపర్డ్ సోదరీ, అంతేకదా?
42ఆమె ఉత్తరము అందుకొని దానిని విప్పి చదువక ముందే, ఆ కలను నేను చూచాను. ఆ విధంగానే కలల భావము చెప్పబడును. మీలో చాలామంది నా యొద్దకు వచ్చి కలలు చెప్పి, వాటి భావము అడుగుచుందురు. అప్పుడు నేను, "ఒక్క నిమిషము ఆగండి! మీరు కల చెప్పవద్దు" అందును. (చూచారా?); మీరు కనిన కలను నేను చెప్పలేనియెడల దాని భావమును ఎట్లు చెప్పగలను? నేను చెప్పిన భావము నిజమో లేక అబద్ధమో ఎట్లు తెలియును? చూచారా? మీ కలను నేను చూడవలెను. దర్శనములో ఆ కలను చూచెదను. ఒక వ్యక్తి యొక్క కలను మీరు ముందే చూచినయెడల, దాని భావము మీకు తెలియును.
43వాక్యములో కూడా ఆలాగే యున్నది. దానియేలును చూడండి. (అవును గదా?) దానిని గూర్చి నేను ఆలోచించాను, చూచారా. నీవు కలను చూచినప్పుడే భావము నిజమని అర్థమగును? ఒక వ్యక్తి తన కలను నీకు చెప్పుచున్నప్పుడు, వారిని ఆపుము, అప్పుడు నీవే ఆ కల పలానీ-పలానీ విధంగా వచ్చినది కదా? అని చెప్పగలరు.
"అక్షరాలా అంతే," అని అతడనును. చూచారా.
ఒకరోజున ఒక వ్యక్తి తనకు వచ్చిన కలను నాకు చెప్పగోరెను.
"సోదరుడా! నీ కల నాకు చెప్పవద్దు," అన్నాను.
"ఏమిటది?" అనడిగాడు.
"నీవు ఒక రాయిని గాలిలోనికి విసిరావు. దానిని నేను గురి చూచి కొట్టగా, ఆ ముక్కలు నా కంటిలో పడినవి," అన్నాను.
"అది అక్షరాలా నిజము బ్రెన్హాం సోదరుడా!" అన్నాడు.
ఆ కలలోని చివరి భాగము నిన్ననే నాకు తెలిసిపోయినదన్నాను. చూచారా? దాని సత్యము చెప్పండి. నీకు వచ్చిన కలను నేను చెప్ప కలిగినప్పుడే, నా అర్థము నిజమగును. అప్పుడు అది నిజమని నీకు తెలియును.
MATT 16:13-16
44ఆమె కలకు భావము ఇది. ఆమె పరిశుద్దాత్మ గూర్చి కలవరపడుచున్నది. ఆమె కొండ మీద "రాతి పెట్టెను" చూచినది. అది ఒప్పుదలకు సూచనగాయున్నది. "నేనెవరినని మనుష్యులు చెప్పుకొనుచున్నారు?" అని యేసు శిష్యులనడిగెను.
"కొందరు నీవు ఏలియావని, కొందరు నీవు మోషేనని చెప్పుకొనుచున్నారు" అని ఒకరు చెప్పిరి.
"నేనెవరినని మీరు చెప్పుచున్నారు?" అనడిగెను.
"నీవు సజీవ దేవుని కుమారుడవగు క్రీస్తువు," అని చెప్పెను.
MATT 16:13,16-18
45అప్పుడు యేసు, "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని యెదుట పాతాళ లోక ద్వారములు నిలువజాలవు," అని పలికెను. ఆ బండ పేతురు అని రోమను కాథలిక్కు సంఘము చెప్పుచున్నది, ఎందుకనగా "పేతురు" అను మాటకు "చిన్న బండ" అని అర్థము. "ఈ చిన్న బండ మీద ఆయన తన సంఘమును కట్టునని," వారు తలంచిరి.
అది తప్పు అని ప్రొటస్టెంటు సంఘము చెప్పుచున్నది. "ఆయన తన మీదనే తన సంఘమును కట్టుకొనునని వారు చెప్పుచున్నారు."
నా దృష్టిలో రెండునూ తప్పే, ఎందుకనగా ఆయన ఎప్పుడును పేతురు మీద కట్టలేదు, లేదా తనపై తానూ కట్టుకోలేదు; అయితే ఆయన ఎవరైయున్నాడో అని పేతురు ప్రత్యక్షత పైన.
"నీవు క్రీస్తువు, సజీవ దేవుని కుమారుడవు."
"యోనా కుమారుడవగు సీమోనూ, నీవు ధన్యుడవు. రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు." [ఏదో సెమినరీ వలన రాలేదు]; కాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. నీవు పేతురువు, ఈ బండ మీద [ఈ ఒప్పుదల, ఈ ప్రత్యక్షత మీద] నేను నా సంఘమును కట్టుదును."
46ప్రతి సంఘ కాలమునకు ఆ బండ ఒప్పుదల ఒక్కటున్నది. లవొదికయ సంఘమునకు ఆ బండ ఒప్పుదలయున్నది. మీరు ఒక పరిశుద్ధ సంఘమును తయారు చేయజాలరు. పరిశుద్ధ సంఘము గాని పరిశుద్ధ సంస్థ గాని లేదు. పరిశుద్దాత్మ గూర్చి అందులో మీరు బోధించవచ్చును; కాని అందులోను మీరు మంచివారిని, చెడ్డవారిని, అవిధేయులను, భేదములు పెట్టు వారిని కనుగొందురు. కాబట్టి ఏ సంస్థ మేము కలిగియున్నాము; వేరే ఎవ్వరును కలిగిలేరు అని చెప్పుకొను వీలులేదు. లేదండి! పరిశుద్ధాత్మ వ్యక్తుల మీద కుమ్మరించబడును. అది వ్యక్తిగతము.
ఈ కడవరి దినపు పెంతెకోస్తు సంఘము మొదటివారివలెనె పరిశుద్దాత్మను పొందుకొనిరి. అన్ని యుగములలోని వారు పరిశుద్దాత్మను పొందుకొనిరి, కాని కొలతలు వేరు; ఎందుకనగా మొదట పునరుద్ధరణ జరిగినది. దీప స్తంభమును, అల్ఫా, ఓమేగాను చూడండి. వారెట్లు మొదటి క్రొవ్వొత్తిని వెలిగించిరో చూడండి. అది బాగా వెలిగి, వెలిగి చివరకు క్షీణించి మొదటి స్థితికి వచ్చినది. (చూచారా), మొదటిది మరియు కడపటిది అనగా అదే.
47కాని ఈ సంఘ కాలములో వర్తమానము సంఘములో కుమ్మరించబడుచున్నది. కాని సంఘము శరీరము, ఒక్కటిగా… ఈ ఆలయమునే చూడండి, ఇక్కడే ఆమె సంఘమునకు వచ్చుచున్నది. ఇది పరిశుద్ధాత్మ నిలయము కాదు. అటువంటిది ఎక్కడా లేదు. ఈ ఆలయము లోనికి వచ్చు వ్యక్తులే పరిశుద్ధాత్మ నిలయములు. వారే పరిశుద్ధాత్మను కలిగియుండు ఆలయములు. ఒక గుంపు గల సంఘము అట్టిది కాదు. కావున దాని నుండి కారిపోవుచున్నది.
ఈ నీటిని పోయుచున్న వ్యక్తి, ఆ సంఘ వర్తమానికుడు, సంఘములో వర్తమానమును పోయుచున్నాడు… అయితే ఆ నీరు ఏమి చేయును? అందులో ఉన్న చెత్తనంతటినీ దహించును. పరిశుద్ధాత్మ చేయు పని ఇదే: దానిని దహించును.
ఇప్పుడు, ఆ తేనె సోదర ప్రేమకు గురుతుగా యున్నది. సోదరుల పట్ల దయ, ఇదే ఆ కాలము. సోదర ప్రేమ అను కాలములో ఇప్పుడు మనము జీవించుచున్నామని నేను చెప్పాను.
48"చూడండి! నాకు నెవిల్ సోదరుడంటె అసలు ఇష్టములేదు. నాకు సహో, జోన్స్ అంటే ఇష్టము లేదు, పలానీ సోదరుడంటే నాకు ఇష్టము లేదు," అని మీరనుచుందురు. కాని వారికి ఏదయినా జరుగనీయండి; సహోదరుడా, మీ గుండె బ్రద్ధలగును. దాదాపు మీరు చనిపోయినట్లగుదురు, చూచారా, మనము ఒకరిపట్ల ఒకరము సోదర ప్రేమను, కనికరమును చూపుదుము, చూచారా. కాని ఒక గుంపులో చాలా సమస్యలుండును.
ఆ సోదరుని గూర్చి మీరెందుకు చింతించవలెను? మీరా బల్లయెద్ద ఆ సోదరునితో కలిసి రొట్టె విరచుదురు, ఈ రాత్రి మీరది చేయుదురు; అతనితో మీరు సహవాసము చేయుదురు; అతని చేతులు కలుపుకొందురు; అతనితో ఆరాధన చేయుదురు. అతడు మీ సోదరుడు. నీకు సమ్మతి కానిదేదో అతడు శరీరరీత్యా చేయవచ్చును, ఎందుకనగా అతనిని నీవు కొద్దిగా దూరముగా (ఆలాగు నీవు చేయరాదు! కాని) — కొద్దిగా అతనిని నివారించుము. నీ హృదయాంతరంగములో ఆ సోదరునికి లేదా ఆ సోదరికి ఏదయినా జరిగితే ఎంతో బాధపడుదువు.
నేను ఒక ముసలివాడను. ఒకప్పుడు నేను యువకుడను, కాని ఇప్పుడు వృద్దుడను. ఈ కాలమంతటినీ నేను చూచాను. "అతనితో నాకెట్టి సంబంధము లేదని జనులు చెప్పుట," నేను విన్నాను. కాని అతనికి ఏదయినా జరిగినచో, వారెంతో అల్లాడిపోదురు. "ఓ దేవా! నా ప్రశస్త్ర సోదరుని రక్షించుము? అందువు. (చూచారా?) అదే సోదర ప్రేమ. అతుకనట్లుగా కనబడును గాని, అతికియుండును. అది తేనె, అతుకుకొనును.
49ఆమె కొండ దిగువ భాగమునకు వచ్చినది. ఈ మహిమకరమగు నీరు అయిదు కాలువల గుండా ఉబికి ఆ కొండపై ప్రవహించుచున్నది. అయిదు, అనునది కృపా సంఖ్య యేసు విశ్వాసము, కృప (J-E-S-U-S) ( F-A-I-T-H) (G-R-A-C-E) అయిదు అనగా కృపా సంఖ్య. అయిదు కాలువలు అక్కడ ప్రవహించుచున్నవి. ఈ ప్రతి కాలములోను బండ ఒప్పుదల యున్నది. పరిశుద్దులు నిద్రించి, ఎంతో కాలము నుండి ఎదురుచూచుచున్నారు. (చూచారా) ఈ కాలము వరకు ఎదురుచూస్తూ ఉన్నారు, కాని వెంటనే పరిశుద్దాత్మ క్రీస్తు యొద్ద నుండి పోయబడినది. సంఘమును అది ముద్రించును, అప్పుడు సంఘము ఎత్తబడును. అది దేవునియొక్క విభాగము. క్రీస్తు కొరకు ఒక వధువు తయారగుచున్నది. ఆయనే దీనంతటికీ శిరస్సు. మీరిప్పుడు నన్ను అనుసరించుచున్నారా?
ఆమె తన కలలో ఈ కాలువ ఏమిటా అని ఆశ్చర్యపడినది. ఈ చిన్న కాలువ ఎప్పటికైనా అడుగునకు చేరునా? అది ఎండిపోవుచున్నది. ఇక్కడ మీరొక సంగతి గ్రహించవలెను. ఆమె తన గూర్చి కూడా తలంచుకొనినది. ఆమెకు పరిశుద్దాత్మ యున్నదా?
MATT 7:16,20,22,23•
LUKE 10:17
50కొద్ది రోజుల క్రితం దీనిని నేను చెప్పగూడదనుకొన్నాను, సంఘము దానిని గ్రహించగల ఆత్మీయ స్థితిలో యున్నదని తలంచుచున్నాను (ఇది బయట సోదరులకు వినబడకుండా ఉండాలంటే ఈ టేపును ఆపివేయండి); కాని మీరు భాషలతో మాట్లాడవచ్చును, చప్పట్లు కొట్టవచ్చును, డాన్సు వేయవచ్చును, మీరు దయ్యములను వెళ్ళగొట్టవచ్చును, ఏదయినా చేయవచ్చును, కాని పరిశుద్దాత్మ లేకుండానే ఉండవచ్చును.
దయ్యములు వారికి లోబడుచున్నవని చెప్పి, శిష్యులు ఆనందముతో కేకలు వేయుచూ తిరిగి వచ్చిరి. వారిలోనే యూదా ఉండెను గదా? అందుకే యేసు ఇట్లు చెప్పెను, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున గొప్ప కార్యములు చేయలేదా, అని చెప్పినప్పుడు. అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి తొలగిపోవుడి, అని చెప్పెదను. నేను మిమ్మును ఎన్నడును ఎరుగను." అవి పరిశుద్దాత్మకు సూచనలు కావు. వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు.
51"బ్రెన్హాం సోదరుడా, మేము భాషలలో మాట్లాడవలెనా?" అని ఇప్పుడు మీరు నన్ను అడుగుదురు. ఖచ్చితముగా, తప్పకుండా అది దేవుని వరము. కాని ఆ దేవుని వరములు కలిగియుండి ఈ సద్గుణములను కలిగియుండనియెడల, అ విశ్వాసికి ఆటంకముగా మీరుందురు. దేవుని ద్వారా అది అంగీకరించబడదు. ఇది మొదట ఉండవలసియున్నది. నీవు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి సహోదర ప్రేమ కలిగియున్నప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిన్ను ముద్రించును. సంఘ కాలములను ఒక భాగము వలె అది ముద్రించినట్లే ఇది యుండును. ఆయన తన వధువునును తయారుచేసిన విధంగానే ఒక్కొక్క వ్యక్తిని కూడా తయారుచేయును. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి హవ్వ తయారుచేయబడెను. మీరు పొందవలసిన కార్యములు ఇవి. వాటిని మీరు అనుకరించజాలరు; వాటిని మీరు కాపీ చేయలేరు; అవి దేవుని చేత పంపబడవలెను మరియు దేవుని మూలముగా పుట్టవలెను. అనుకరణ వలన గందరగోళము మాత్రమే ఏర్పడును.
ఒక కాకి పావురపు వెండ్రుకలు తగిలించుకొని నేను పావురమునైయున్నాను అని చెప్పినంత మాత్రమున, అది పాపురము కానేరదు. దాని స్వభావము మారదు, అది కాకిగానే ఉన్నది.
నల్లని కాకి, నెమలి వెండ్రుకలు అంటించుకొన్నంత మాత్రమున అది నెమలి కాదు, "చూచారా…?" అది లోపట నుండి రావలెను, ఆ విధంగానే క్రైస్తవ్యము వచ్చును. దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా…
52మన సోదరి యొక్క కాలు ఆ అడుగు భాగమునకు వెళ్ళినందున తడిసినది. షెపర్డ్ సోదరి ఎంతో ప్రేమగలదిగా యున్నదని మనందరికి తెలియును. ఆమె ఇల్లు అందరికీ తెరచియుండును. ఎవరినయినా గాని ఆ దంపతులు పోషించుదురు, కావలసిన సహాయము చేయుదురు. ఓ! దేవుడు ఆమెను అంగీకరించును.
ఇప్పుడు, ఈ పాఠము వినండి: (దీనిని నేను చెప్పకూడదు) బ్రెన్హాం టెబర్నికల్ యొక్క తప్పు ఇదే. మీరు చూచారా? రెండు రకముల విశ్వాసమున్నది; రెండు రకముల సద్గుణమున్నది, ఒక రోజున మీతో చెప్పాను; రెండురకముల జ్ఞానములున్నవి; రెండు రకముల ఆశానిగ్రహములున్నవి. అది నిషేధించబడినదని కొందరను కొందురు. అది ఆశానిగ్రహము కాదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనపు, వశములో-లేని-కోపము నీకున్నది — అట్టివి గందరగోళము కలిగించును.
MATT 16:18•
JOHN 1:1,14
53సహనము, మరియు మొదలుగునవి, దానిని పరిహాసము చేయుదురు, సహజమైన-విశ్వాసము మరియు సహజమైన-సద్గుణము కలిగినట్లు నటించువారు కొందరుందురు. సహజముగా వచ్చిన ఆశానిగ్రహము ఉన్నది. మరియు ఇవన్నీ సహజముగా వచ్చును.
మన విశ్వాసములోని అతి పెద్ద భాగము మానసిక నమ్మకము (Mental Faith). వాక్యము వినుట ద్వారా దేవునిని నీవు మనస్సులో గుర్తించెదవు. ఓ సోదరుడా! ఇది పైనుండి రావలెను. అది భక్తి, ఆత్మ సంబంధమగు విశ్వాసము. ఆ విశ్వాసము వలన ఏమి వచ్చును? ఆ విశ్వాసము వాక్యమును మాత్రమే గుర్తించును. ఎవరు ఏమన్నాగాని అది వాక్యమును మాత్రమే నమ్మును, ఎందుకనగా "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. [వాక్యము ఇంకను దేవుడై యున్నది.] ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను."
మన విశ్వాసము లోనికి ఆ విశ్వాసము పోయబడినప్పుడు, మన మానసిక విశ్వాసము ఆత్మసంబంధ ప్రత్యక్షతను పొందును. "ఈ పునాది మీద నేను నా సంఘమును కట్టుదును," చూచారా, సంఘములో చేరుట వలన కాదు, మానసిక అనుభూతి వలన కాదు, కాని ఈ ప్రత్యక్షత మీద కట్టును. ఆ కృపా జలధారలు నీకున్న మానసిక విశ్వాసములోనికి ప్రవహించినప్పుడు, ఒక ఆత్మీయ ప్రత్యక్షత వచ్చును. "నా సంఘమును నేను కట్టుదును. పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువజాలవు," చూచారా. దానికి వారు వ్యతిరేకులని అందువలన మనకు అర్థమగుచున్నది, కాని వారెన్నడూ జయించలేరు. ఓ! ఎంత మహిమకరమగు సంగతి.
2PET 1:5,6
54ఇప్పుడు విశ్వాసమును చూడండి! ఇక్కడ ఒక సుద్ద ముక్క యున్నది. అయిదు కాలువలు ఇచ్చట ఉన్నవి. ఎఫెసు సంఘమును పరిశుద్దాత్మ కట్టెను. స్ముర్న సంఘమును దహించినది పరిశుద్దాత్మ అంధకార యుగములలో పెర్గము సంఘమును, తుయుతైర సంఘమును వెలిగించినది పరిశుద్దాత్మ వధువును నిర్మించినది పరిశుద్దాత్మ అన్ని యుగములలోను ఆ సంస్థల నుండి కొందరిని ఎన్నుకొనెను. ముందుగా నిర్ణయించబడి, ఎన్నుకోబడిన ఒక వధువును పరిశుద్ధాత్మ బయటకు పిలచినది. అన్ని యుగములలోను పైన ఉన్నది పరిశుద్దాత్మయే.
వ్యక్తిగతముగా ఈ సద్గుణములను కలిగియుండవలెను. (జ్ఞానము, ఆశానిగ్రహం) — మన విశ్వాసమునకు వీటిని కలుపుకొనవలెను. తలరాయి వచ్చినప్పుడు, పరిశుద్దాత్మ అను సిమెంటు దానిని అతుకును. అదే పరిశుద్దాత్మ బాప్తిస్మము. ఈనాడు అందుకే ఇంత కొరత ఏర్పడినది.
55ఇక్కడ నేను కొన్ని వచనములు వ్రాసియుంచాను. వీటిని చూడనీయండి. ఆమె కలను గూర్చి ఒక చిత్రపటము గీశాను. అక్కడ నుండి మీరు దీనిని చూడలేరు.
పరిశుద్దాత్మ వలన మీకు వచ్చునదేమి? అందువలన మీకు సహజాతితమైన విశ్వాసము ఇచ్చును, ఆత్మీయ విశ్వాసము, అది ఈ అడుగున యున్నది. ఆత్మీయ విశ్వాసము వాక్యమును మాత్రమే గుర్తించును. ఎవరేమి చెప్పినా ప్రయోజనము లేదు, అది వాక్యమును మాత్రమే ఎరుగును. "అద్భుతములు జరుగు రోజులు అయిపోయినవని," ఎవరైనా చెప్పినా గాని విశ్వాసమునకు వాక్యము మాత్రమే తెలియును.
"పరిశుద్దాత్మ బాప్తిస్మము లేదని ఎవరైనా చెప్పినా గాని, విశ్వాసము కేవలము వాక్యమునే ఎరుగును." అదే నిజమగు ఆత్మీయ విశ్వాసము, చూచారా. అది వాక్యమును మాత్రమే ఎరుగును.
అది మొదటిది. నీ మానసిక విశ్వాసములోనికి పరిశుద్ధాత్మ వచ్చును, దానిని ఆత్మ సంబంధ విశ్వాసముగా మార్చును, ఆ ఆత్మ సంబంధ విశ్వాసము వాక్యమును మాత్రమే గుర్తించును.
JOHN 14:20
56ఇప్పుడు, నీవు పరిశుద్దాత్మను కలిగియున్నప్పుడు, ఈ సంగతులన్నీ నీలో ముద్రించబడును. దీనిని పరిశుద్దాత్మ బయలుపరచును. నీ విశ్వాసము పరిశుద్దాత్మతో కలిసి నిన్ను క్రీస్తులో ముద్రించును. అప్పుడు నీవు వాటితో ఏకమగుదువు. ఆమేన్! (దీనిని నాకు చెప్పవద్దు. ఇది నా చేతులకు కష్టముగా నున్నదందువు.) నీవు, క్రీస్తు ఒక్కటిగా కలిసి జీవించెదరు. "ఆ దినమున నేను తండ్రియందును, తండ్రి యందు నేనును, నాయందు మీరును ఉన్నారని మీరు తెలిసికొందురు." అది ప్రభువగు దేవునియొక్క ముద్ర. ఎందుకు? అవి నీకు బయలుపరచబడి ముద్రించబడినవి. ఆ సమయము వచ్చినప్పుడు వారు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా ప్రత్యక్షపరచబడుదురు.
MATT 17:2•
MARK 9:2•
LUKE 9:29•
EPH 1:5
57మత్తయి 17వ అధ్యాయము 1 నుండి 5 వచనములు మీకు గుర్తున్నవా? రూపాంతరపు కొండ మీద యేసు చెప్పెను. "ఆయన మాట వినుడి" అను నా ప్రసంగమును మీరు వినియుందురు, ఒక సంవత్సరం క్రిందట బోధించాను, అది చాలా ఆసక్తిగా యుండినది. "ఆయన మాట వినుడి." ఎఫెసీ 1:5లో కూడా కుమారుని యొక్క చోటు చూతుము. "దత్తపుత్రులముగా యుండుటకు దేవుడు మనలను ముందుగా నిర్ణయించెను."
కుమారుడు జన్మించినప్పుడు, కుమారుడుగా పిలువబడును. కాని ఆ కుమారునికి విద్యాబుద్దులు కొందరు నేర్పించుదురు. ఆ కుమారుడు సరైన రీతిలో ఎదుగనియెడల అతడెన్నడూ వారసుడు కాడు. అతడు సరిగ్గా ప్రవర్తించి తండ్రికి లోబడినచో, ఆ కుమారుని ఒక స్థానములో యుంచును. అతని తండ్రి ఆస్తికి అతడు వారసుడగును. రూపాంతరపు కొండమీద ఆయన అదే చేయుచున్నాడు. ఆయన తన స్వంత కుమారుని తీసికొనెను. ఆ కుమారుడు సరయినవానిగా రుజవు చేయబడెను. (చూచారా), అన్ని శోధనలను అతడు జయించెను, ఆయనను రూపాంతరపు కొండ మీదికి తీసికొని వెళ్ళి కప్పెను.
58పాత నిబంధనలోని సంగతులు మీరెరుగుదురా? కుమారునికి అందమగు వస్త్రములు తొడిగి జనుల ముందర కూర్చోబెట్టెడివారు. దానికి ఒక ఉత్సవము జరిగెడిది, దానిని దత్తత అనెడివారు. దత్తత పుత్రుల గూర్చి పరిశుద్ధ పౌలు ప్రస్తావించెను.
సేవకులు గ్రహించగలరు, ఆత్మ సంబంధముగా బైబిలు చదువువారు గుర్తించగలరు. ఇంకో మాటలో చెప్పవలెనన్నచో, కుమారుడు జన్మించుట వల్లనే కుమారుడగును.
మన పెంతెకోస్తువారు ఇక్కడే తప్పు చేయుచున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా కుటుంబము లోనికి జన్మించుట సరియే, కాని మనము సరియైన వారియొద్ద శిక్షణ పొంది సరైన పిల్లలముగా ఎదుగవలెను, చూచారా.
59ఇప్పుడు, ముసలివాడగు తండ్రి తన కుమారుని గూర్చి ఆలోచించును, అతడు సరైన కుమారునిగా ఉండవలెనని కోరును, అతనికి మంచి ఉపాధ్యాయుని నియమించును; ఎందుకనగా తన కుమారుడు తనవలె ఉండవలెనని కోరుకొనును, చూచారా. కాబట్టి ఒక మంచి ఉపాధ్యాయుని నియమించును.
ఈ భూసంబంధమైనవారే అట్టి మంచి ఉపాధ్యాయుని గూర్చి ఆలోచించుచుండగా, మన తండ్రియగు దేవుడు ఇంకెంతగా ఆలోచించును? బిషప్పులు, కార్డినల్స్, మతగురువులు ఆయన యొద్ద లేరు; మనకు ఉపాధ్యాయునిగా ఆయన పరిశుద్ధాత్మను పంపును. పరిశుద్దాత్మయే మన గురువు. ఆయన సంఘములో యున్నాడు, మరియు
తండ్రి యొద్దకు తన వర్తమానమును తీసికొనిపోవును.
ఆ కుమారుడు విధేయత చూపక ఎదురు తిరుగుచున్నప్పుడు, ఆ ఉపాధ్యాయుడు వెళ్ళి ఆ తండ్రితో పరిస్థితి అంతయూ చెప్పును. "కాని ఆ ఉపాధ్యాయుడు ఆ తండ్రికి బాధ్యతను అప్పగించడు, ఎందుకనగా ఉపాధ్యాయుడే ఆ బాలుని క్రమశిక్షణలో పెంచవలెను, లేనియెడల అతడు మంచి ఉపాధ్యాయుడు కాడు. సరియైన ఉపాధ్యాయుడు సత్యమును దాయక చెప్పును. పరిశుద్దాత్మ దేవుని యెదుట మనగూర్చి సత్యమునే చెప్పును."
MATT 17:3-5•
MARK 9:4,5•
LUKE 9:30,33,35
60ఆయన వచ్చుచున్నాడు. నీవేమి తలంచుచున్నావు? ఈ రోజు ఆయన సిగ్గుపడుచున్నాడు, ఎందుకనగా "ఆయన కుమార్తెలు జుట్టు కత్తిరించుకొనుచున్నారు, ఆలాగు చేయరాదని ఆయన హెచ్చరించెను. ఆయన కుమారులు సంస్థలలో తలదూర్చియున్నారు, వారు ఒకరినొకరు చూచుకొనుట లేదు. వారు ఏదేదో దత్తత చేసికొనుచున్నారు." ఆయన ఎంతో సిగ్గుపడుచున్నాడు. ఆ ఉపాధ్యాయుడు ఎంతో ప్రేమతో చెప్పుచున్నాడు, "ఓ, మై! తండ్రివలె నిజమగు కుమారునిగా ఎదుగమని చెప్పుచున్నాడు." ఓ, అతడు ఆలాగు చెప్పుటకు ఏంటో ప్రేమించును, చూచారా.
నీవు సరైన కుమారునిగా ఉన్నప్పుడు తండ్రి గర్వముతో, "ఇతడు నా కుమారుడు," అని చెప్పును.
రూపాంతరపు కొండ మీద, దేవుడు, అదే చేసెను. అక్కడ మీరు మోషే మరియు ఏలియాలను చూచిరి. పేతురు ఎంతో ఆనందముతో, ఆయనకు ఒకటి, మోషే, ఏలియాలకు ఒక్కొక్కటి చొప్పున మూడు పర్ణశాలలు కట్టదుమని చెప్పెను. ఇంకా అతడు మాట్లాడుచుండగానే దేవుడతని నోరును మూసెను, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను. ఈయన మాట వినుడి," అని ఆయన చెప్పెను. చూచారా. దేవుడే "ఈయన నా ప్రియకుమారుడు," అని చెప్పెను.
MATT 17:5•
MARK 9:7•
LUKE 9:35
61మోషే ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా ఉన్నాడు. ప్రవక్తలు ఆయన న్యాయమునకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆయన ధర్మశాస్త్రము వలన మనము జీవించలేము. ఆయన న్యాయము వలన మనము జీవించలేము. న్యాయము నేను అడుగుట లేదు. నాకు కృప కావలెను, న్యాయము కాదు. ఆయన ధర్మశాస్త్రమును నేను పాటించలేను, ఆయన న్యాయమును నేను నెరవేర్చలేను; కాని ఆయన కృప నాకు అవసరము. ఆయనలో ధర్మశాస్త్రము మరియు న్యాయము కలిసికొన్నవని దేవుడు చెప్పెను. "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుడి."
పాత నిబంధనలో కుమారుని కుటుంబములోనికి దత్తత చేసికొనునప్పుడు అతడు అతని తండ్రి వంటి పేరును కలిగియున్నాడో లేదో చూచెడివారు. ఆ రోజులలో ఒక ఉంగరము యుండెడిది, దానిమీద వారు ఉమ్మివేసెడివారు. [సహో, బ్రెన్హాం వేదికను తన పిడికిలితో గుద్దెను.] కుమారుడు తండ్రి వంటి పేరు పొందినప్పుడు, ఆ తండ్రి యొక్క ఉంగరమును అతనికి ధరింపచేసెడివారు, అతడి ముద్ర.
యేసు దేవునికి విధేయుడైనప్పుడు దేవుడాయనను తగిన స్థానములో యుంచెను: "ఈయనే ఆయన."
పరిశుద్దాత్మ ద్వారా ఒక సభ్యుడు దేవుని కుటుంబములోనికి జన్మించినప్పుడు అతనిలో ఈ సద్గుణములన్నియూ కనబడును. అతనిలో దేవుడు సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, సహనమును, సహోదర దయను, మంచితనమును చూచును. అప్పుడు దేవుడతనిని ముద్రించును, తగిన స్థానములో యుంచును. అప్పుడు వారు దేవుని కుమారులు, కుమార్తెలుగా కనబడెదరు.
EPH 4:30
62ఎపెస్సీ 4:30 లో ఇట్లున్నది, "దేవుని యొక్క పరిశుద్దాత్మను దుఃఖపరచకుడి, మీ విమోచనా దినము వరకు మీరు దానితో ముద్రించబడియున్నారు." కొందరు బాప్టిస్టులు నిత్య భద్రత గూర్చి మాట్లాడుచున్నారు. మీరు ఆ దశకు వచ్చినట్లయితే, నేను మీ తరపున నిలబడుదును. నిత్య భద్రతను ఆమోదించుదును. కాని ఎవరైనా వచ్చి "బాప్టిస్టుల సంఘములో లేదా ప్రెస్బిటేరియను సంఘములో చేరుచున్నాను," అని చెప్పితే తప్ప. అందులో "నిత్యభద్రత లేదు." నీకది లేదని నీ స్వంత జీవితమే రుజువుచేయుచున్నది. అది నీలో యున్నప్పుడే దేవుడు నిన్ను తన కుమారునిగా స్వీకరించి, పరిశుద్దాత్మతో ముద్రించి పరలోక రాజ్యములో చేర్చును. దానిలో నుండి నీవు బయటకు రావు. నీవు నిత్యము క్షేమముగా యుందువు. "దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దాని వలన మీ సద్గుణములన్నియూ, మీ భక్తి అంతయూ విమోచనా దినమువరకు ముద్రించబడియున్నవి."
EPH 4:30•
EPH 5:27•
PHIL 2:12
63ముందుగా నిర్ణయించబడిన ఒక వధువు యున్నదని నేను నమ్ముచున్నాను. ముడత, మచ్చలేని సంఘమును దేవుడు కలిగియుండునని చెప్పబడెను. ముందుగా నిర్ణయించుటలో నాకు నమ్మకమున్నది. వధువు ముందే నిర్ణయించబడినది; ఆమె అక్కడ ఉండును. ఆమెతో నేనుందునని తలంచుచున్నాను. అది… చూచారా. ఆమెతో నేనున్నాను. ఇప్పుడు, ఈ సంగతులన్నియూ దేవునితో పరీక్షించబడు వరకు దేవునితో కలిసి నేను నా స్వంత రక్షణను కొనసాగించవలసియున్నాను, అప్పుడు దేవుని రాజ్యములో ముద్రించబడెదరు. అదియే పరిశుద్దాత్మ దేవునియొక్క నిజ క్రియలు అచ్చటున్నవి. విమోచనా దినము వరకు అది ముద్రించబడియున్నది.
అది ఆమె కల. అది చాలా చక్కగా ఉన్నదని తలంచుచున్నాను.
1COR 12:13
64సంఘము లేదా ఒక వ్యక్తి ఆ స్థాయికి రావలసియున్నది. మీరిది చక్కగా గ్రహించునట్లు నేను చెప్పెదను: సంఘము అక్కడుండుటకు ముందే నిర్ణయించబడినది. దానితో సేనుండగోరుచున్నాను. దానిలో నేను భాగమైయున్నప్పుడే అక్కడుండగలను.
నేను ఎలా దానిలో బాగము అవ్వగలను? దానిలో ఉండుటవల్ల. దానిలోనికి ఎలా వెళ్ళగలను? బాప్తీస్మము ద్వారా, ఒక్క ఆత్మలో. I కోరింధీ 12: "ఒక్క ఆత్మ ద్వారా మనమందరమూ ఒక్క శరీరములోనికి బాప్తీస్మము పొందితిమి," ఒక్క శరీరములోనికి బాప్తీస్మము పొందుట.
65కాని ఈ చిన్న సంగతులను మనము అతుకలేము, "నేను భాషలతో మాట్లాడుచున్నాను గనుక దానిని నేను పొందాను," అని చెప్పుటకు వీలు లేదు. నీలో కోపము, కలహము, జగడము పోలేదు. (చూచారా). అది, కాకి, నెమలి వెంట్రుకలను తగిలించుకొన్నట్లే యున్నది. ఆ విధంగా మీరేమి చేయలేరు. అది మీరు పొందలేదని మీ స్వంత జీవితమే నిరూపించుచున్నది. కాని ఎప్పుడయితే ఈ క్రియలు దేవుని ద్వారా నీలో కనబడుచుండునో, అప్పుడు నీవు ముద్రించబడెదవు. అప్పుడిక నటన యుండదు. నీవు నీవేగా యుందువు. అప్పుడు నీకు దర్శనములు వచ్చును. దేవుని యొక్క పరిశుద్దాత్మ క్రియలు నీలో సంపూర్ణముగా కనబడును. సమస్తము ప్రత్యక్షమగును. ఎందువలన? నీవు మరియు క్రీస్తు ఒక్కటయిరి. (దీనిని మీరు గ్రహించారనుకొంటాను.)
నేను ఆలోచించినవి కొన్ని ఇక్కడ వ్రాసియుంచాను. జీవ స్థానము నొద్దకు మనలను తెచ్చును, అప్పుడు మనము నిత్యజీవము పొందుదుము.
JOHN 3:16
66ఇక్కడ గ్రీకు లెక్సికను ఉన్నది, దానిని ది ఎంఫటిక్ డయాగ్లాట్ అందురు. ఒక మాట గూర్చి ఒక రోజున దానిని చదివాను.
యోహాను 3:16లో "నిత్యజీవము" అను పదము మనము చూచుదుము. మరొక చోట "శాశ్వత జీవము" అను పదము వాడబడినది. కాని హెబ్రీలో దానికి "అంతము లేని జీవము," అని చెప్పబడినది. గ్రీకులో దానిని "అయినోయన్" అందురు. దాదాపు అది ఏయన్ వలె యున్నది. అనగా అది లెక్కించలేని సంఖ్య అది మిలియనులు, బిలియనులు, ట్రిలియనులను మించినది. కాని ఇది కాలపు అయినోయన్: అదే నిత్యజీవము. దానికి ఆంగ్ల పదము నిత్యత్వము. అనగా అది అంతము లేని జీవమని మనమెరుగుదుము. అయినోయన్ చూచారా?
నీవు అంతములేని జీవము పొందినప్పుడు ఎట్లు నశించెదవు? నిత్యత్వములో ఒక భాగముగా అవుదువు, నిత్యమైనది ఒకే ఒకటున్నది. సాతాను నిత్యమైనది కాదు. లేదు! వాడు సతనుగా మారెను. పాతాళము నిత్యమైనది కాదు. పాతాళము సృజించబడినది; కాబట్టి అది నిత్యము కాదు. ఈ శరీరములు నిత్యమైనవి కావు; ఇవి సృజింపబడినవి. అయితే దేవుని ఆత్మ నిత్యమైనది. దానికి ఆది లేదు, అంతముండదు. దేవునిలో మనము భాగమై యుండినప్పుడు మాత్రమే మనము నిత్యజీవము పొందగలము. ("జో(zeo)" అను గ్రీకు మాటకు "దేవుని స్వంత జీవము," అని అర్థము.) మనము దేవుని కుమారులము, కుమార్తెలము అయితిమి. మనకు అయినోయిన్ జీవమున్నది. కాబట్టి మనలోని జీవము వాక్యమును గుర్తించును. అదియే అయినోయిన్ జీవము, అనగా, అంతములేని జీవము. దేవుని జీవమే మనలో యున్నది. ఆమేన్.
67ఒక యెహోవా సాక్షితో నా పర్యటనలో చర్చించాను. ఎవరి నమ్మకమును నేను కించపరచుట లేదు. ఇక్కడ చాలామంది యెహోవా సాక్షులు కూర్చొనియున్నారు. మన సంఘ ట్రస్టీలలో ఒకరు యొహోవా సాక్షిగా ఉండి మార్పు చెందెను — అతడు, అతని కుటుంబము రక్షించబడిరి. అతని తండ్రి, ఆ ఉడ్ సోదరుడు తదితరులు మన వర్తమానములు చదివెడివారు. ఇప్పుడు అతని సోదరులు, సోదరీలు అందరూ పరిశుద్దాత్మను పొందిరి. వారి గూర్చి దేవుడు దర్శనములో చెప్పినందున వారు మారిరి, చూచారా. ఆలాగు జరిగినది.
GEN 2:7
68ఇప్పుడు, నీవు పీల్చుచున్న గాలియే ఆత్మ అని యెహోవా సాక్షుల పుస్తకములో యున్నది. అది సరి కాదు. నీవు పీల్చు ఊపిరి ఆత్మ కాదు. ఒకప్పుడు నీవు ఒక రకమగు ఆత్మగా యున్నావు; ఆత్మలోనికి ఒకరు వాయువును ఊదిరి. నీవెక్కడుందువో ఆలోచించుము. ఊపిరి అనగా గాలి, ఆ గాలిని నీవు నాసికా రంధ్రముల ద్వారా పీల్చుకొందువు.
అయితే వారు ఒక లేఖనమును తీసికొందురు, "దేవుడు వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా, అతడు జీవించు ఆత్మ ఆయెను." ఇప్పుడొక సంగతి మిమ్మును అడిగెదను. అతనిలోనికి జీవ వాయువును ఊదకముందు అతడు దేనిని పీల్చుచుండెను? అతడు ఒక ఊపిరి గల మనిషి, ఆ ప్రకారమయితే, ప్రతి జంతువు జీవాత్మయగును, ఎందుకనగా అవి కూడా మనవలె ఊపిరి పీల్చుచున్నవి. అయితే యేసు చనిపోనవసరము లేదు. జంతు బలి చాలదు, చూచారా. సోదరులారా, వాదము నిలబడదు.
కాని దేవుడు చేసినది ఏమిటి, ఆయన నిత్యజీవమును ఊదెను. (ఆమేన్!) అప్పుడతడు జీవించు ఆత్మ అయ్యెను, ఆత్మకు చావు లేదు. ఇప్పుడు చూడండి. మీ మోచేతుల దగ్గరకు తేనెను పోయుచున్నాము. గమనించండి, నాసిక రంధ్రముల లోనికి జీవవాయువును ఊదెను. అప్పుడతడు జీవించు ఆత్మ అయ్యెను, ఎందుకనగా దేవుడు అతని నాసికా రంధ్రములలోనికి జీవవాయువును ఊదెను. అతడు జీవించు ఆత్మ అయ్యెను. (ప్రకృతి వలన పుట్టినవాడు కాడు గాని, దేవుడు చేసిన కార్యమిది.)
ROM 8:29,30
69"బ్రెన్హాం సోదరుడా! ఆదాము చనిపోయెను గదా?" అని నీవందువు. కాని మరువవద్దు, ఆదాము చనిపోక ముందు ఒక గొర్రెపిల్ల అతనిని విమోచించుటకు చనిపోయినది. హల్లెలూయా! ఆయనెవరిని ముందుగా పిలచెనో వారిని పిలచెను. వారిని విమోచించుటకు ఆయన ఒక గొర్రెపిల్లను ఇచ్చెను.
ఆయన ఒక మాదిరి. ఆదాము పడిపోయెను. అప్పుడు ఆదాము కొరకు ఒక గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడెను, ఎందుకనగా అప్పటికే అతని నాసికా రంధ్రములలో నుండి లోనికి జీవవాయువు ఊదబడెను. అతడు జీవించు ఆత్మ అయ్యెను. అతడు దేవుని కుమారుడు. (దానికి గ్రీకు పదము ఏమిటో నాకు తెలియదు.) ఆఫ్రికను భాషలో దానిని "అమోయా" అందురు, అనగా "గాలి, అదృశ్యశక్తి," అని అర్ధము. జంతువులు అమోయాను పీల్చును. పాపులు అమోయాను పీల్చుదురు.
JOHN 10:34-36
70మనలోనికి జీవవాయువు ఊదబడినది గనుక ఇక నిత్యజీవము కొరకు మనమెందుకు సతమతము కావలెను? ఎందుకు నిత్యజీవమును ఆదాము లోనికి ఊదెను. అతడు దేవునితో ఒక నిత్య వ్యక్తి ఆయెను. దేవుని వంటి శక్తి అతనికి ఉండెను; అతడు భూలోకమునకు దేవుడే. పరలోకపు దేవుడు కాడు, భూమికి దేవుడు.
దేవుని కుమారులు ఒక దినమున దైవములగుదురు. ఆలాగని యేసు చెప్పెను: "మీరు దైవములని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడలేదా? దేవుని చేత దర్శింపబడిన వారిని మీరు దైవములని పిలచుచున్నారు గదా? నేను దేవుని కుమారుడనని చెప్పుచున్నందుకు ఏల నన్ను ఖండించుచున్నారు?" ఇప్పుడు ఇంకా లోతైన దానిలోనికి మనము వెళ్ళుచున్నాము.
JOHN 6:37,44•
1TIM 2:14•
REV 13:8•
REV 21:27
71గమనించండి, ఆయన దేవుని కుమారుడు, కాని ఆయన ఒక తప్పు చేయుచున్నాడు. తప్పు ఆయన తెలిసి చేసెను. చూడండి, ఆదాము మోసపుచ్చబడలేదు. ఆ విధంగా బైబిలు చెప్పెను, 1 తిమోతి 3: "ఆదాము మోసపుచ్చబడలేదు గాని, స్త్రీ మోసపుచ్చబడెను. ఆమె పాపము చేసెను." ఆదాము హవ్వతో కూడా నడిచెను, ఎందుకనగా ఆమె అతని భార్య. క్రీస్తు కూడా ఆలాగే సాతాను ద్వారా మోసపుచ్చబడలేదు, కాని పెండ్లి కుమార్తెతో కలిసి మరణములోనికి నడిచెను. ఆయన పెండ్లికుమార్తెతో ఉండుటకు వెళ్ళెను, ఆ విధంగా ఆయన సంఘమును విమోచించగలడు.
తాను తప్పు చేయుచున్నానని ఆదాము ఎరుగును, హవ్వతో ఆలాగే అతడు నడిచెను, చూచారా. కాని వారి కొరకు, వారి విమోచన కొరకు ఒక గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడెను. ఈనాటి గొర్రెపిల్లలను చూడండి, అవి దేవునిచే ముందుగా ఎరుగబడి పిలువబడినవి, ఒక విమోచకుడు ఇచ్చటున్నాడు. "నా తండ్రి మొదటగా ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు; తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చుదురు." అది నిజమేనా?
జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవగ్రంథములో పేరు వ్రాయబడిన వారి కొరకు ఒక గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడినది. వారిలోని ప్రతిఒక్కరు పునరుద్దానములో ప్రవేశించుట కొరకు ఒక కృపా మార్గముగా గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడెను. ఆదామునకు ఒక గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడెను.
72ఇప్పుడు చూడండి, ఆదామునకు ఒక గొర్రెపిల్ల ఏర్పాటు చేయబడెను. అదే ఈనాటి సంఘము. ఎవరి అభిప్రాయములను కించపరచుటకు నేను దీనిని చెప్పుటలేదు. అందుకొరకు నేను ఇచ్చటకు రాలేదు, ఎందుకనగా ఇంతకు ముందే నా గూర్చి నేనుచెప్పుకొన్నాను. నేను సహాయము చేయుటకే ఇచ్చటికి వచ్చియున్నాను, కాని నా ప్రయత్నమేమిటో మీకు తెలియునా? అసలు ఈ సంఘములు సంఘములు కావు. ఒకే ఒక సంఘమున్నది. ఇవి నివాస (lodges) స్థలములు. (చూచారా); అవి నివాస స్థలములు. అవి కేవలము నివాస స్థలములని కొద్ది క్షణములలో నేను మీకు నిరూపించెదను. మీరు ఒక మెథడిస్టు నివాసమునకు, ప్రెస్బిటేరియను నివాసమునకు, లేదా పెంతెకోస్తు నివాసమునకు చెందియున్నారు. చూచారా? నివాస స్థలములు! ఒకే అభిప్రాయము గల వ్యక్తులు కలిసికొనిన నివాస స్థలమే ఈ సంఘము. కాని సంఘము ఒక్కటే. సంఘములో నీవు చేరలేవు; అందులో నీవు జన్మించవలెను. అందులోనికి నీవు జన్మించినప్పుడు, నీవు సభ్యునివగుదువు.
నా కుటుంబమును చూడండి. ఏబది మూడు సంవత్సరముల నుండి బ్రెన్హాం కుటుంబములో నేనున్నాను; వారు నన్నెన్నడూ ఆ కుటుంబములో చేరమని కోరలేదు. ఎందువలన? నేను ఆ కుటుంబములో చేరవలసిన పనిలేదు. ఒక బ్రెన్హాంగా నేను పుట్టాను. మీరు ఆలాగే సంఘములో జన్మించవలెను. తక్కినవన్నియూ నివాస స్థలములే. దానిని గూర్చి మీరెన్నడైనా ఆలోచించారా? అవునండి!
73ఒకరోజున నేను గడ్డి కోయుచూ ఆలోచించాను, వారు ఆ గొప్ప కాథలిక్కు సంఘమని దానిని పిలచుచున్నారు. నేను గడ్డి కోయుచూ ఉండగా, నన్ను ముందుకు పోనీయకుండా ఏదో గట్టిగా ఆపినది. "దానిని ఆ విధంగా పిలువవద్దు," అని నాతో చెప్పెను. నేను చుట్టు చూచాను. మరల నేను గడ్డి కోయసాగాను, అది మరల నన్ను ఆపి, "ఆ విధంగా దానిని పిలువవద్దు, అని చెప్పెను. అవి సంఘములు కావు, అవి నివాస స్థలములు. ఒక్కటే సంఘమున్నది." చూచారా? "వారు ఒక నివాసములోని సభ్యులు." ఒక నివాసములో నీవు చేరవచ్చును, కాని సంఘములో నీవు చేరలేవు. సంఘములోనికి నీవు జన్మించవలెను. క్రొత్త జన్మ ద్వారా అందులో నీవు సభ్యునివగుదువు. ఒక కుటుంబములో సోదరునిగా, సోదరిగా నీవున్నట్లే అది ఉన్నది.
REV 17:1
74"అపోకరిప్స ఆఫ్ ది ఎంఫటిక్ డయాగ్లట్" నుండి చదివెదను. ప్రకటన 17:3లోని దానిని దానితో ఇది ఎంత చక్కగా సరిపోలునో చూడండి. ప్రకటన 16-17. ఒక్క నిమిషము చదువుదము. ప్రకటన 17:3 జాగ్రత్తగా చూడండి.
ఆ ఏడు పాత్రలను పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాడలాడుచూ ఈలాగు చెప్పెను. [లెక్సికను నుండి మీకు చదివి వినిపించుచున్నాను] నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చొన్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. [అది వాటికన్ అని మనందరకు తెలియును.]
REV 17:1-3,15
75ఇక్కడ మనకు కాథలిక్కు చర్చి నుండి వచ్చిన ఒక దర్శకుడు ఉన్నాడు, అదేమిటో అక్షరాల వివరించెను, చూచారా. దీనికి జవాబు చెప్పెను, "ఎన్నో రకముల పేర్లున్నవి," "వాటి సంఖ్య 666."
"ఒక్క నిమిషము ఆగండి!" అన్నాను.
"నీ పేరు ఆరు వందల, ఆరు కావచ్చును…"
"నేను ఏడు కొండల మీద కూర్చొని ప్రపంచమును ఏలుట లేదు? అన్నాను. చూచారా? అది నిజము. చూడండి?
… విస్తార జలముల మీద కూర్చొన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. [జలములు, ప్రకటన 17:15, ప్రజలను, జన సమూహములను చూపించుచున్నవి, చూచారా.]
భూ రాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమెవ్యభిచార మద్యములో మత్తులైరి. [ఇప్పుడు చూడండి.]
[ఇప్పుడు ఎంఫటక్ డయాగ్లట్ చదువుచున్నాను] అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును, పది కొమ్ములును గల ఎర్రని మృగము మీద కూర్చొండిన ఒక స్త్రీని చూచితిని.
ఇప్పుడు, కింగ్ జేమ్సు తర్జుమా చూడండి: "దేవదూషణ నామములతో నిండుకొని అని యున్నది." (ప్రకటన 3వ వచనము ఒక్క క్షణము ఆగి చూద్దాం) 17:3, చూడండి.
అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును, పది కొమ్ములును గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని.
ఇంగ్లీషులో ఆలాగున్నది, కాని అది గ్రీకులో అనగా 'డయాగ్లట్' లో ప్రకటన 17:3 ఇట్లున్నది. ఇప్పుడు వినండి.
ఆత్మవశుడైన నన్ను అరణ్యము లోనికి కొనిపోయెను. ఎర్రని మృగము మీద కూర్చుండియున్న ఒక స్త్రీని చూచితిని. ఆమె దేవదూషణ నామములతో నిండుకొనియున్నది.
"దేవదూషణ నామములు" మరియు "దేవదూషణకరమగు నామములు" అను దాని మధ్య ఎంతో భేదమున్నది. ఏమిటది?
76ఆమె వేశ్యలకు తల్లి, దానిని మనందరము ఎరుగుదుము. ఏమిటది? రోమను కాథలిక్కు సంఘము. అది పూర్తిగా దేవదూషణ నామములతో యున్నది. మెథడిస్ట్, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను, అను వివిధ నామములతో వారు పిలుచుకొనుచున్నారు. అవి "దేవదూషణ నామములు." తాము దేవుని సంఘమని చెప్పుకొందురు, కాని లోకములోని విందులు, వినోదములు, జూదములు, త్రాగుడు వారికి కావలెను. ఒకే ఒక సంఘమున్నది. అందులోనికి నీవు జన్మించవలెను. గొర్రెపిల్ల రక్తములో నీవు కడుగబడి, పరిశుద్దాత్మచే ముద్రించబడితేనే గాని నీవు అందులోనికి రాజాలవు.
77ఎంతభేదమున్నదో చూడండి? "దేవదూషణ నామములు" మరియు "దేవదూషణకరమగు నామములకు." గ్రహించారా? వచ్చుచుండగా దీనిని నేను చదివి గ్రహించాను. నాతో ఎవరు ఇట్లనిరి, "నీ గదిలోనికి వెళ్ళి డయాగ్లట్ తీసి చదువుము." దానికి నేను లోబడితిని. వెళ్ళి ప్రకటన 17 తీసి చదివాను. "దీనినెందుకు చదువమనెనో, నాకు తెలియలేదు." నేను చదువ నారంభించాను. వెంటనే "అది నాకు తెలిసినది." పెన్సిలు తీసి వ్రాశాను. "ఇది అక్కడున్నది."
78నేను సంస్థలను దుయ్యబట్టుచున్నానని వారు గోల చేయుచున్నారు. దేవుని సంఘము, క్రీస్తు సంఘము, మెథడిస్టు సంఘము అని వారు పేర్లు పెట్టుకొనుచున్నారు. కాని అవి దేవదూషణ నామములు. అవి సంఘములు కావు, నివాస స్థలములు. ఒకే ఒక సంఘమున్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము. అది ఏమిటి? అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మర్మయుక్తమగు శరీరము. అది భూమి మీద పనిచేయుచున్నది, ఈ సంస్థలలో యున్న ఎవరైనా గాని అందులో సభ్యులు కాగలరు, అనగా క్రీస్తు శరీరములో సభ్యులు కాగలరు. అందులో నీవు జన్మించవలెను; చేరుట కాదు. అందులో చేరుట అనగా దేవదూషణ నామము ధరించుటయే.
79ఈ స్త్రీ యొక్క శక్తి చూడండి, మతమును గూర్చి వింత అభిప్రాయములు గల వారినందరినీ వారు ఎక్కడికి పంపబోవుచున్నారని చూడండి. వారిని అలస్కాకు పంపుచున్నారు. మీరది చూచారు. మన యొక్క విచిత్రమైన నమ్మకములన్నింటిని. ఏమిటది? ప్రపంచ సంఘ సమితి. కాథలిక్కులు ఇప్పుడీ వాటికన్లో చాలా సందడి చేయుచున్నారు. ఈ బిషప్పులు మొదలుకొని అందరూ కమ్యూనిజం కొరకు పోరాడుటకు ఒక ఒప్పందమునకు రాగోరుచున్నారు. ప్రపంచమంతా కమ్యూనిజంతో పోరాడుటకు కాథలిజంతో చేతులు కలుపుచున్నారు.
80నేడు ఈ పరిస్థితులలో యున్నాము: "మనం దాదాపు దివాళా తీసాము. మనము అప్పుచేయుచూ డబ్బు ఖర్చు చేయుచున్నాము. ఇప్పటి నుండి పధ్నాలుగు సంవత్సరములు పన్ను చెల్లించినా, ఆ అప్పు తీరదు." అంతవరకు మనం వచ్చాము. ప్రపంచ డబ్బు ఎవరి యొద్ద ఉన్నది? కాథలిక్కు చర్చి యొద్ద ఉన్నది. ఆమెరికా దేశమునకు ఏ రూపంలో అప్పు ఇవ్వబడినది? పోగాకు మరియు విస్కీ కంపెనీలను ఉండనిచ్చుట ద్వారా అప్పు చేయుట ద్వారా రోమను కాథలిక్కు చర్చికి వీరు తమ జన్మహక్కును అమ్ముకొనుచున్నారు. దానిని మేము బలపరచుచున్నాము. ఎందుకనగా, వార్తాపత్రికలను చదువుట కంటే కూడా, నిష్కపటముగా అదిక్కడ యున్నది, చూచారా.
81వారు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, చర్చి-ఆఫ్-గాడ్ ఇంకను మరికొందరు, తమను దేవుని యొక్క సభ అని పిలుచుకొనుచున్నారు. కాథోలిక్కు మరియు అలాంటి వారు కొందరు, ఈ మృగమునకు పూర్తి శక్తి, దేవదూషణ నామములు ఉన్నవి. మిమ్మల్ని మీరు అటువంటి పేర్లతో పిలుచుకొంటూ, "నేను - నేను అనుచున్నారు.
ఒక వ్యక్తి కొరకు ప్రార్ధించుటకై కొంతకాలం క్రితం ఆస్పత్రికి వెళ్ళాను. ఆమె నా తల్లి, నా తల్లికి ప్రార్ధించవలెనని చెప్పెను.
"అయితే ఆ తెరదించు," అని ఒకామె అన్నది.
"నీవు క్రైస్తవురాలవు కావా?" అనడిగాను.
"మేము మెథడిస్టులము," అన్నది.
"వందనములు. నీవు విశ్వాసిననుకొన్నాను?" అని చెప్పి తెర క్రిందికి దించాను, చూచారా. నీవు క్రైస్తవునివి కాకపోతే, అది వ్యత్యాసమైన ఒకటి. (చూచారా), కాని "మేము మెథోడిస్టులము" అది "దేవదూషణ నామము."
1JN 3:9
82ఇప్పుడు సంఘములని పిలువబడుచున్నవి, అవి సంఘములు కావు. దానిని రికార్డు చేయుట అవసరము. అవి సంఘములు కావు; అవి నివాస స్థలములు. వాటిలో జనులు చేరుచున్నారు, కాని సజీవుడగు దేవుని సంఘములో నీవు చేరలేవు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా అందులో నీవు తిరిగి జన్మించెదవు. నీవు పరిశుద్దాత్మతో బాప్తిస్మము పొందినప్పుడు, ఈ సద్గుణములన్నియూ పరిశుద్దాత్మ ద్వారా నీలో ముద్రించబడును; కాబట్టి "దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడు, చేయజాలడు." అక్కడే మీరున్నారు. ఓ, మై! దానిగూర్చి దినమంతయూ మనము మాట్లాడుకోవచ్చును, కదా?
JOHN 20:19-22•
JOHN 20:22
83సంఘమనగా యేసుక్రీస్తు యొక్క మర్మయుక్తమగు శరీరము, దేవుని ఊపిరి వలన పుట్టినది. అది గ్రహించరా? దేవుని సంఘము దేవుని ఊపిరి వలన పుట్టినది. దేవుడు ఆదాము నాసికా రంధ్రములలోనికి ఆత్మ సంబంధమగు ఊపిరిని ఊదెను. అతడు జీవించు ఆత్మ ఆయెను. నిజమగు పెంతెకోస్తు సంఘము దేవుని ఊపిరి వలన జన్మించినదని మీరెరుగుదురా?
దానిగూర్చి ఒక్క సంగతి మీకు చదివెదను. యోహాను సువార్త 16, 19, 20లలో ఉన్నదనుకొంటాను. ఆదిలోని ఆదాము వలె సంఘము దేవుని ఊపిరి వలన జన్మించినదోలేదో చూద్దాం.
ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొని యుండగా, యేసు వచ్చి మధ్యను నిలిచి - మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను.
ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
అప్పుడు యేసు - మరల మీకు సమాధానము కలుగును గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
గమనించండి! ఆయనను పంపిన తండ్రి ఆయన లోనికి వెళ్ళెను. యేసు ఒక శిష్యుని పంపినప్పుడు, అతనితో కూడా వెళ్ళెను. ఆలాగే ఆయన పంపును.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది - పరిశుద్దాత్మను పొందుడి అని చెప్పెను… [సంఘము దేవుని ఊపిరి వలన జన్మించెను.]
JOHN 20:22
84ఈ విగ్రహము ఈ విధంగా మలచబడినప్పుడు, దాని మీద దేవుని ఊపిరి ఊదబడెను. వారు పరిశుద్దాత్మను పొందిరి. అప్పుడు నీవు దేవుని కుమారుడవగుదువు. నీవు నీ ఇష్టమొచ్చిన దానిలో చేరవచ్చును, కాని సజీవమగు దేవుని సంఘములోనికి నీవు దేవుని ఊపిరి ద్వారా జన్మించవలసియున్నావు. "దేవుడు వారి మీద ఊది పరిశుద్దాత్మను పొందమని చెప్పెను." ["సహో, బ్రెన్హాం ఊదిన శబ్దము చేసెను."] "వెళ్ళి చేరి, నీ పేరు వ్రాయించుకొనుట కాదు." విందులు, వినోదములు కాదు. అది ఒక నివాసము. అది ఒక బాప్టిస్టు నివాసము, మెథడిస్టు నివాసము, ప్రెస్బిటేరియను నివాసము, కాథలిక్కు లేదా పెంతెకోస్తు నివాసము. వాటిలో ఎందులో అయినా నీవు చేరవచ్చును. కాని దేవుని కుమారునివి కావలెనన్నచో, దేవుని ఊపిరి ద్వారా జన్మించవలసియున్నావు. ఆమేన్! ఇప్పుడే నీవది విడిచిపెట్టుట మంచిది!
యోహాను 10:33,38 యోహాను 15:5
JOHN 8:46•
JOHN 10:33,37,38•
JOHN 15:5•
2COR 5:19
85అప్పుడు దేవుని జీవము నీలో యుండును. (ఒక్క నిమిషం) — యేసు చెప్పినది విందాం, "నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు." చూడండి. యేసు మానవుడై యుండి దేవునిగా చెప్పుకొనుచున్నాడని వారు మండిపడిరి. ఆయన దేవుడు. క్రీస్తులో దేవుడుండెను, చూచారా. "నా వైపు చూడవద్దు. నేను కాదు; నాలో తండ్రి నివాసము చేయుచున్నాడు," అని ఆయన చెప్పెను.
మరియ మూలముగా పుట్టిన చిన్న శరీరమును వారు చూచుచున్నారు, చూచారా. అది దేవుడు కాదు; ఆయన దేవుని కుమారుడు, కాని ఆ శరీరములో దేవుడుండెను. ఆయన దేవుడు. "నా తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? [వాక్యమును నమ్మకుండుటయే పాపము] దేవుడు పలికిన ఏ వాక్యము నేను నెరవేర్చలేదు? [అవిశ్వాసమే పాపము.] నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? [అవిశ్వాసమే పాపము.] నాకు చూపించండి. నా తండ్రి క్రియలు నేను చేయనియెడల, నన్ను నమ్మకుడి. నన్ను నమ్మనియెడల, నా క్రియలను నమ్ముడి, అవి నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." తండ్రి నాలో ఉండి సాక్ష్యమిచ్చుచున్నాడు, ఎందుకనగా క్రీస్తులో దేవుడుండి లోకమును సమాధానపరచుచున్నాడు. దానిని మీరు గ్రహించారా? ద్రాక్షావల్లిలో యున్న జీవమే తీగెలో కూడా ఉండును. దానిలో మీరెట్లు చేరుదురు? చేరలేరు.
86ఆరిజోనాలోని సహో. పెర్రెట్ ఆవరణలో కొంతకాలం క్రిందట ఒక చెట్టును చూచాను. దానిలో తొమ్మిది వివిధ ఫలములున్నవి. అది ఒక నారింజ చెట్టు, కాని అందులో నిమ్మ, దబ్బ, కమలా, నారింజ మొదలగు ఫలములున్నవి. నేను నిలబడి దానివైపు చూచాను. శార్రిట్ సోదరుడా! ఇది నారింజ చెట్టా? అనడిగాను.
"నిశ్చయంగా," అన్నాడు.
"ఇదెట్లు సాధ్యము?" "ఒక ప్రక్క దబ్బ కాయ, ఒక ప్రక్క కమలాకాయ, మరోప్రక్క నిమ్మకాయ ఏలాగు కాసినవి?" అనడిగాను.
"వాటిని అంటుగట్టాము." అన్నాడు.
"ఓ!" "అయితే ఒక్క సంగతి నిన్ను అడిగెదను. నీవు ఈ దబ్బ మరియు నిమ్మ కొమ్మలను నరికివేసినచో, నారింజ వచ్చునా?" అనడిగాను.
"ఓ! రాదు. మరల నిమ్మయే వచ్చును," అన్నాడు.
"ఓ!" "దేవా, వందనాలు," అనుకొన్నాను. చూచారా.
87నీవది చేయలేవు. అందులో చేరలేవు. ఆ చెట్టు ప్రతి సంవత్సరము ముసలిదగుచుండినప్పుడు క్రొత్త కొమ్మను వేయును, అది నారింజను కాయునని అతడు చెప్పెను, ఎందుకనగా అంటుకట్టబడిన కొమ్మను బట్టి కాయలు వచ్చును.
మనము క్రైస్తవ్యము అను పేరు క్రింద ఆయనలో సభ్యులుగా చేరవలెనని ప్రయత్నించాము, "మనము పుల్లని చెట్లు ఫలమువలె యున్నాము." (మామూలుగా చెప్పుచున్నాను) క్రైస్తవ సంఘము ఆ విధంగానే యున్నది. ద్రాక్షావల్లిలో నుండి వచ్చిన ఫలములు ఆ మొదటి ద్రాక్షావల్లినే పోలియుండును. ఆ విధంగానే అపోస్తలుల కార్యముల గ్రంథము వ్రాయబడినది. మరో కొమ్మ అసలు ద్రాక్షావల్లిలో నుండి వచ్చినప్పుడు మరో అపోస్తలుల కార్యముల గ్రంథము వ్రాయబడును. ఇది నిజము.
2TIM 3:5,6•
REV 17:3
88కాబట్టి మీరు నివాసములలో చేరుచున్నారు. ద్రాక్షావల్లిలో నిలచియుండనియెడల మరో రకమగు ఫలమును ఫలించెదరు, కాని ఆ ఫలముతో మీరేమి చేయుదురు? మీకు పైపైన భక్తి యున్నది గాని దానిలోని శక్తిని తిరస్కరించుచున్నారు. మీరు సూచక క్రియలను తిరస్కరించుచున్నారు; అద్భుతములను మీరు తిరస్కరించుచున్నారు; పరిశుద్దాత్మను మీరు తిరస్కరించుచున్నారు; భాషలతో మాట్లాడుటను మీరు తిరస్కరించుచున్నారు; దర్శనములను మీరు తిరస్కరించుచున్నారు; ప్రవచనములను మీరు తిరస్కరించుచున్నారు; స్వస్థతను మీరు తిరస్కరించుచున్నారు, అయినా మీకు ఒక పేరున్నది. పరిశుద్దాత్మ ఈలాగు చెప్పుటలో ఆశ్చర్యము లేదు, "దేవదూషణ నామములు గల జనుల గుంపు క్రైస్తవులమని చెప్పుకొనుచూ పైకి భక్తి ఆచారములు కలిగి దాని శక్తిని తిరస్కరించుచున్నారు. అట్టి వారినుండి దూరమగుము. ఇటువంటి వారే ఆయా దురాశలకు ఈయనను
నడిపించెదరు."
అన్నివిధముల సంస్థలు, సంఘములు ఈ విధమగు వాటితో నిండిపోయి యున్నవి. యేసుక్రీస్తు సమాజము మాట ఏమిటి? చూచారా? మనము ఎన్నో రకమగు కార్యక్రమములతో సంఘమును బరువుగా చేయుచున్నాము, క్రిందికి లాగుచున్నాము.
MATT 5:15•
MARK 4:21•
LUKE 11:33•
JOHN 14:12
89ఒక నివాస స్థలములో నీవు చేరవచ్చును గాని, సంఘములో ఎన్నడూ చేరలేవు. ఒక నివాస స్థలములో ఎందరో జనులుందురు, అందులో నీవును ఒక సభ్యునిగా చేరవచ్చును. "మేము దీనిని నమ్ముదుము; మాకు మా ఆజ్ఞలున్నవి, మాకు మా రహస్యములున్నవి." ఒక నామకార్థ సంఘములో మీరు చేరినప్పుడు, మీరు ఆ విధంగానే చేయుదురు, కాని సంఘములో మీరు చేరలేరు. కొందరు సభ్యులున్న సత్రములో మీరు చేరవచ్చును గాని, సంఘములో చేరలేరు, ఎందుకనగా సంఘములో మీరు జన్మించవలసియున్నారు. ఒక్క నిమిషము ఆగండి. కొద్దిసేపటిలో ముగించెదను.
చూడండి! నేను చెప్పవలెనని ఇది చెప్పుట లేదు. క్షమించండి. చూడండి. దేవుడు ఈ వధువును ఆత్మతో ఏకము చేసెను. ఆలాగే ప్రతి వ్యక్తియూ ముడివేయబడవలెను, చూచారా. దేవుని రాజ్యములో మీరు జన్మించవలెను, అప్పుడు ఆ సంఘములోని జీవము నీదగును. ద్రాక్షావల్లియగు యేసులోయున్న జీవమే ఆయనలో నుండి వచ్చు తీగెలోను యుండును. హల్లెలూయా! నేను చేయు క్రియలు మీరును చేయుదురు." అదియే క్రీస్తు యొక్క నిజ శరీరములోని భాగము; దానికి మరో పేరుండదు. ఒక వ్యక్తి యొక్క క్రియలే అతనిని రుజవు చేయును. అతని జీవితమే అతనిని నిరూపించును.
"ఏ శరీరమునకు నీవు చెందియున్నావు?"
"క్రీస్తు శరీరమునకు!"
"అందులో నీవెట్లు చేరుదువు?"
"చేరుట కాదు; అందులో జన్మించుదును." చూచారా. నేను అందులో జన్మించాను."
వారికి నీవు చెప్పనక్కరలేదు. జరిగినది వారికి తెలియును. "ఒక దీపమును వెలిగించి కుంచము క్రింద ఎట్లు పెట్టగలవు?" పెట్టలేము. చూడండి? లేదు, లేదు!
90దేవుని రాజ్యములో నీవు జన్మించినప్పుడు, యేసులోనున్న జీవము నీదగును… అప్పుడు నీకు ఆత్మలయందు ఆసక్తి కలుగును. అప్పుడు నీవు జనులను వేదిక యొద్దకు రమ్మని అడుగనక్కరలేదు, అన్నీ వాటంతట అవే జరుగును, ఎందుకనగా అది నీలో ముద్రించబడియున్నది. నీవు దేవునిలోని ఒక భాగము. నీవు పరిశుద్దాత్మతో ముద్రించబడియున్నావు.
పరిశుద్దాత్మ యొక్క భావము నీవెరుగుదువా? గంతులు వేసి, చప్పట్లు కొట్టి ఏదో వింత అనుభూతి పొందుట కాదు. అవన్నీ సరియే. నేను గంతులు వేశాను, గోల చేశాను, వింత అనుభూతి పొందాను. నేను భాషలతో మాట్లాడాను, పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడునని నేను నమ్ముచున్నాను. నిశ్చయంగా! నేను భాషలకు అర్ధము చెప్పాను. అవునండి! దానిని కూడా నేను నమ్ముచున్నాను. కాని అది కాదు. దానిని గూర్చి నేను మాట్లాడుట లేదు. ఎక్కడో రంధ్రమున్నది. నీ సహనమునకు రంధ్రము పడినది. నీ చెంప మీద ఎవరైనా కొట్టినప్పుడు, ఏమి చేయుదువు? మరొక దానిని త్రిప్పుదువా? కాని నీవు "వాడు దొంగ, వేషధారి" అని తిట్టుదువు. కాబట్టి నీకు ఎక్కడో రంధ్రమున్నది. దానిని మనము విడిచిపెట్టుట మంచిది. కాని నా భావము మీరు గ్రహించారా? క్రీస్తు శరీరములో మీరు ముద్రించబడినప్పుడు, మీరు ఆత్మనింపుదల కలిగియుందురు, దేవుని కుమారులగుదురు.
JOHN 3:1-13
91ఓ! నాకు పది నిమిషములున్నచో ఇది చదువుటకు సరిపోవును. నాతో మరో పది నిమిషములుండగలరా? ఒక సంగతి చదువగోరుచున్నాను. కొద్దిగా చదివెదను. ఆలస్యం చేయనని నిజంగా చెప్పుచున్నాను. (చూచారా), దీనిని కొద్ది నిమిషముల పాటు చదువుదము. వెళ్ళిపోవుట చాలా బాగుండును. నా మనస్సులోనికి చెప్పుటకు కొన్ని సంగతులు వచ్చినవి.
యోహాను సువార్త 3వ అధ్యాయములో నిత్యజీవము గూర్చి యున్నది. నిత్యజీవము గూర్చి మరియు దేవుని జీవము గూర్చి ఏమి చెప్పబడినదో, ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీనిని గమనించండి.
యూదుల అధికారియైన నికోదేమను పరిసయ్యడొకడుండెను.
అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి — బోధకుడా, నీవు దేవునియొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
ఇప్పుడు, ఆయన దేవుని కుమారుడని ఆ సన్హేద్రిను కోర్టు వారు గుర్తించిరి. అది వారికి తెలియును. వారి అధికారి ఇక్కడ ఏమి చెప్పెనో చూడండి. "నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, ఎందుకనగా దేవుని జీవము నీలో నుండి ప్రవహించుచున్నది," చూచారా. "నీవు నీస్వంత బోధ చేయుట లేదని మాకు తెలియును; అది దేవునికి సంబంధించినది, దానిని దేవుడు రుజువు చేయుచున్నాడు," చూచారా. "నీ ద్వారా దేవుని జీవము ప్రవహించుచున్నది."
JOHN 3:5-12
92ఇప్పుడు చూడండి!
అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. [నా సంఘములో చేరితేనే గాని అనలేదు.]
యేసు ఇట్లనెను, ఒకడు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దమువిందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. [మరల చూడండి?] ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
అందుకు నికోదేము - ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయననడిగెను.
యేసు ఇట్లనెను - నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా? [సోదరుడా చూడు, నీకు డి.డి.పి. హెచ్.డి.ఎల్.ఎల్.డి యుండవచ్చును.]
మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [ఈ సంగతులు మేమెరుగుదుము. వాటిని మేము చూచాము; వాటిని మేమెరుగుదుము, సంఘములో చేరువారు మా సాక్ష్యమును కూడా అంగీకరించరు.]
భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? [దీనిని వినండి.]
మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
దానిని మీరు గమనించండి.
PS 110:1•
MATT 22:43,44•
MARK 12:36•
JOHN 3:13•
REV 22:16
93ఆయన ఒక్కసారి చెప్పినది మీరెరుగుదురా? "క్రీస్తును గూర్చి మీరేమనుకొనుచున్నారు? ఆయనెవరు కుమారుడు?"
"దావీదు కుమారుడు," అని వారనిరి.
"నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని, ప్రభువు నా ప్రభువుతో చెప్పెను? అని దావీదు ఆత్మలో ఆయన గూర్చి చెప్పెను. ఆయన ప్రభువనియు, కుమారుడనియు ఎందుకు చెప్పవలెను? ఎవరూ ఆయనను చేర్చుకొనలేదు.
ప్రకటనలో ఆయన ఇట్లు చెప్పెను, "నేను దావీదు యొక్క వేరు మరియు చిగురునై యున్నాను," చూచారా. "నేనే ద్రాక్షావల్లిని, నేనే తీగెను. నేనే ఆదియై యున్నాను. ఆదికి ముందే నేనున్నాను. ఆయనకు కూడా నేను చిగురునై యున్నాను."
ఇక్కడ ఆయన ఇట్లు చెప్పెను, "మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు."
ఒకసారి ఒకామె నన్ను ఒక ప్రశ్న అడుగగా నేను ఎదురు ప్రశ్న వేశాను.
"గెత్సమనె తోటలో యేసు ఎవరికి ప్రార్థించెను?" అనడిగాను.
"పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు?" ఆయనెవరని అడిగాను.
94ఆయన మేడపై నిలబడి నికోదేముతో మాట్లాడుచుండెను, "నేను పరలోకములో యున్నాను," అనెను. అది నిజమేనా? ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీరేమందురు? మనకు ఆలస్యమగుచున్నది. ఈ మధ్యాహ్నము ఇంకొద్దిగా నాకు చెప్పవలెనని యున్నది.
సంఘములోనికి నీవెట్లు రాగలవు? జన్మించుట ద్వారా, దేని ద్వారా? దేవుని ఊపిరి ద్వారా!
నాపై ఊదుము, నాపై ఊదుము;
సజీవ దేవుని ఆత్మా, నాపై ఊదుము.
అదే నా ప్రార్థన. పరిశుద్దాత్మను ఊదనీయుడి. దేవుని ఊపిరి. ఏమిటది? దేవుని రాజ్యములో ముద్రించబడియున్నది. యేసుక్రీస్తును నమ్మినట్లు మొదట నేను ఒప్పుకొన్నాను.
95నా విశ్వాసమునకు సద్గుణమును, భక్తిని చేర్చుకొందును. నా సద్గుణమునకు వాక్యజ్ఞానమును కలుపుకొందును. నా జ్ఞానమునకు సహనమును, స్వయం నియంత్రణను చేర్చుకొందును. అది నాకిష్టము, "ఆయన రాజ్యమే నాది… నా ఆత్మకు స్వయం నియంత్రణ అను కిరీటము ధరింపచేయుము. ఈ సాగరము నుండి ఆ సాగరము వరకు అది ప్రకాశించును." సహనము. ఓ, మై! పరీక్షించబడినది: మీరు చింతించకండి, సాతాను మీ కొరకు వాటిని పరీక్షించును.
ఇప్పుడు నేను నిచ్చెన ఎక్కుచున్నాను, చూచారా. నేను సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును అమర్చుకొన్నాను; ఇప్పుడు నేను సహనమును అమర్చుకొనవలసియున్నాను. అంతవరకు నాలో పరిశుద్దాత్మయుండదు. సహనమును నేను అమర్చుకొనిన తరువాత భక్తిని అమర్చుకొందును. అదేమిటో మీరెరుగుదురా? అదెట్లుండునో మీకు తెలియునా? దేవుని పోలికలో యుందుము. దానిని నేను అమర్చుకొందును. నేను తప్పుగా ప్రవర్తించరాదు; ఒక క్రైస్తవ పెద్ద మనిషివలె నడువగోరుచున్నాను. వేషము ధరించుట కాదు. నాలో దేవుని ప్రేమ మరుగుచున్నది. చూచారా? "నేను చేయవలెననుకొన్నది చేయకుండుట మంచిది." చూచారా? అది అక్కడే యుండును. అది జన్మ నేను దాని లోనికి జన్మించాను. దేవుని ప్రేమ, క్రీస్తు, నన్ను ముద్రించి ఆయన సేవ కొరకు సిద్ధపరచెను.
96ఆయన నాకు పరిశుద్దాత్మను ఇచ్చినప్పుడు, ఏమి చేయును? నిన్ను ఒక ప్రత్యేక స్థలములో యుంచి ముద్రించును. అప్పుడు నీవు వేరే వ్యక్తివిగా ఉందువు. ఇక ఈ లోకపువానివిగా ఉండవు. (చూచారా), నీవు వేరుగా దుస్తులు ధరించెదవు. వేరుగా కనిపించెదవు. ఈ బాహ్య దుస్తులు కాదు. లేదు, లేదు! నీవు ఏదో వింతగా, క్రొత్తగా కనిపించనవసరము లేదు. కాలరు తిరిగినది ధరించుకోనక్కరలేదు. లేదు, లేదు! నీవు ఆ వేషములు ధరించవద్దు. ఆత్మ సంబంధమగు దుస్తులే లెక్కలోనికి వచ్చును. నీవు పెండ్లీ వస్త్రము ధరించుకొందువు. నీవెట్లుందువు? క్రీస్తువలే యుందువు.
MATT 17:2,4,5•
MARK 9:3,5,7•
LUKE 9:29,30,35
97చూడండి, ఆయన వారి యెదుట రూపాంతరము చెందెను. ఆయన వస్త్రము సూర్యుని వలె ధగధగ మెరిసెను. దేవుని కుమారునిగా యేసు కనబడెను. ఆ తరువాత మోషే వచ్చెను. ఆ తరువాత ఏలియా వచ్చెను. "ఇక్కడ ఉండుట మంచిదని," పేతురు పలికెను. "ఓ, సహజాతీతమైనది చేయబడినప్పుడు." మానవుడు ఎలా తలంచునో చూడండి? "ఇక్కడ మూడు పర్ణశాలలు నిర్మించ తలచెను. ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు, ఒకటి మీకు," అనెను.
ఆతడింకా ఆలాగు మాట్లాడుచుండగానే, దేవుడు దానినంతటిని మూసెను, "ఈయన నా ప్రియ కుమారుడు. మోషే ద్వారా నేను ధర్మశాస్త్రమును అనుగ్రహించాను, అందుకు మోషే నాకు అవసరమాయెను, ప్రవక్తల ద్వారా న్యాయము కనుపరచితిని, అయితే ఈయనలో అవన్నియు నెరవేరినవి. ఈయన మాట వినుడి. ఇప్పుడు నేను రంగము మీద నుండి మరుగవుదును. ఆయన మాట వినండి. అంతే చాలును" ఓ, మై! ఎంత చక్కగా యున్నది!
98ఈ షరతులను మనము పాటించి దేవుని యొక్క సద్గుణములను, దేవుని యొక్క కార్యములను పూర్తిగా మనము అమర్చుకొన్నప్పుడు పరిశుద్దాత్మ దిగివచ్చి దేవుని రాజ్యములో మనలను ముద్రించును. మీరు చింతించవద్దు. దానిని మీరు పొందితిరని అందరూ ఎరుగుదురు. "దేవునికి మహిమ! దానిని నేను పొందానని నేనెరుగుదును; నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను," అని నీవు చెప్పవద్దు. దానిగూర్చి ఒక్క మాట కూడా నీవు చెప్పనవసరము లేదు; దానిని నీవు పొందినట్లు అందరికీ తెలియును. మీరు చింతించకండి; దానికదే సాక్ష్యమిచ్చును. మనుష్యుల మధ్య ఆయన దానిని తెలియపరచెను.
99దేవుడు మిమ్మును దీవించును. ఈ ఉదయము మీతో యుండి ఈ సహవాసము ననుభవించినందుకు ఎంతో సంతోషించుచున్నాను. వినండి! మనది చిన్న సంఘము వచ్చు వారందరికి చోటు చూపించలేకపోవుచున్నాము. మనది ఒక సంస్థ కాదు. మనము విశ్వసించి అన్ని సంస్థల వారితో సహవాసము చేయుచున్నాము. మీరు ఇష్టపడి ఇక్కడికి వచ్చిరి. మేము మిమ్ము ప్రేమించుచున్నాము. ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి మాకిష్టమే.
ఆ సంస్థలన్నిటిలో క్రైస్తవులున్నారని నేను నమ్ముచున్నాను. వారు క్రీస్తునందు సోదర సోదరీలు. కాబట్టి ఏ అడ్డుగోడలు లేవు, క్రైస్తవులుగా ఉండండి, ఎందులోనూ చేరుట కాదు.
PHIL 3:13,14
100ఇ. హవర్డ్ కాడిల్ ఇట్లు చెప్పెడివాడు, "మాకు ప్రేమ తప్ప మరో చట్టము లేదు. బైబిలు తప్ప, మరో గ్రంథము లేదు. క్రీస్తు తప్ప మరో విశ్వాసము లేదు." అది నిజము. రండి మమ్మును దర్శించండి. మాకు ఆనందమే. వాక్యములోని ప్రతి చిన్న మాటను, అనగా సంపూర్ణ సువార్తను మేము నమ్ముచున్నాము. ఉన్నది ఉన్నట్లుగా మేము నమ్ముచున్నాము. దానికి ఏ ఒక్కటి చేర్చము, దానిలో నుండి ఏదియూ తీసివేయము. ఏ సంస్థ యొక్క సంగతులు దానికి చేర్చము. దానిని మేము ఉన్నట్లే వెంబడించుదుము. అంతే. మిమ్మును సదా ఆనందముతో చేర్చుకొందుము. మీకు వీలయినప్పుడు వచ్చి మాతో ఉండండి. రోగులకు మేము ప్రార్ధించెదము. బైబిలు చేయమని చెప్పు ప్రతిదానిని మేము నమ్మదుము. "మేము గతంలోని మా బలహీనతలను మరచిపోయి ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకు పరుగిడుచున్నాము."
101ఇప్పుడు, మరో సంగతి. మీరు చెప్పుటకు అనుమతించెదరా? ఆ బోర్డు మీద మీరు దర్శనమును గమనించియుందురు. నాకు ఒక దర్శనము వచ్చెను. అప్పుడు దాదాపు 5 గంటలగును లేదా 6 గంటలగును. అక్కడున్న నా భార్యకు అది తెలియును. నేను మేల్కొన్నాను. పిల్లలను లేపి బడికి పంపుటకు సిద్ధపరచుచున్నాము. అప్పుడప్పుడు నాకీలాగు వచ్చుచుండును; అవి ఎన్నడూ తప్పిపోవని మీ అందరికీ తెలియును. అవి పూర్తిగా సత్యములు. (చూచారా), ఎన్నడు తప్పిపోలేదు.
నేను అతి ఆనందకరమగు వ్యక్తిగా కనిపించాను. నేను ఎండలో నిలబడి గొప్ప జన సమూహమునకు బోధించుచున్నాను. (ఇది టేప్ అగుచున్నదేమో అని కోరుచున్నాను) చాలా పెద్ద జన సమూహము. వారు ఒక అరణ్యములో కూర్చొనియున్నారు, వారి మీద ఎండ పడుచున్నది, వాక్యమును వినుచున్నారు.
102నేను నా మామూలు ధోరణిలోనే, దీర్ఘ ప్రసంగం చేశాను. నేను చాలా సేపు ప్రసంగించాను, జనులకు శారీరకంగా ఆకలి వేసెను. కొందరు అలసిపోయారు, కాబట్టి వారు బయటకు వెళ్ళి భోజనము కొనగోరిరి. నేను వారికి "వెళ్ళవద్దని" చెప్పాను.
ఆ ప్రసంగములో రెండు సంగతులు నేను చెప్పదలచాను. దానిని ప్రభువే నాకు ఇచ్చెను. ఏ ప్రసంగికుడికైన నిజంగా, దేవుడు ఆ ప్రసంగము నీకిచ్చెనని నీవు ఎరిగినప్పుడు, నీ హృదయములో అది జనులకు చెప్పవలెనని మండుచుండును. నేను ఎంతో గట్టిగా బోధించుచున్నాను. దేవుడు చేయుచున్న "గొప్ప కార్యములను.. దేవుడు ఏమి చేయచున్నాడో, దీనిని చూడుడని," చెప్పాను. ఆయన హృదయాలోచనలను వెలికితీయునని చెప్పాను. అది ఏమిటి? వాక్యమే ఆ విధంగా బోధించబడెను."
103ఓ! నేను బోధించిన అంశము నాకు గుర్తుండిన ఎంత బాగుండును? అది నాకు జ్ఞాపకము లేదు, చూచారా. నేను బోధించాను, అప్పుడు నన్ను నేనే పరిశీలించుకొన్నాను. నేనెట్లు బోధించుచున్నానో చూచుకొన్నాను… "దేవుడు చేసిన గొప్ప కార్యముల కొరకు దేవునిని ఆ తరువాత మహిమపరిచాను."
జనులు శారీరకంగా ఆకలిగొనుట నేను ప్రత్యక్షంగా గమనించాను. వారికి చాలినంత ఆత్మీయాహారమిచ్చాను, కావున కొందరు లేచి వెళ్ళిపోసాగిరి. [సహో, బ్రెన్హాం దానిని వివరించుటకు ఆవులించిరి] లేచి పోవుచుండిరి. "ఏమిటి వీరంతా ఎందుకిట్లున్నారు? అనుకొన్నాను." నేను చూస్తుండగా ఒక యువ జంట నా ప్రక్కనుండి వెళ్ళుచుండిరి, మరియు నేను ఆగాను; "స్నేహితులారా, ఒక్క నిమిషం! సాయంకాల నీడలు పడేసరికి మీరు మరల చేరుకొందురు గాక!" అన్నాను. చూచారా. "మీరు మరల తిరిగి వచ్చెదరు," అన్నాను. కాని ఈ మొదటి సంగతి చెప్పనీయండి అన్నాను. "నేను చూపించిన ఈ సంగతులన్నీ ఎక్కడ నుండి వచ్చినవి?" అని అడిగాను. ఎక్కడ నుండి అవి వచ్చినవి? "అవి దేవుని వాక్యములో యున్నవి. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని," చెప్పాను. అది దేవుని వాగ్దానము. "వాక్యముతో నిలిచియుండమని," నాకు ఆజ్ఞాపించబడినది. "ఆలాగు ఉన్నానో లేదో అందుకు మీరే సాక్షులు." అయితే "మీ సంగతి ఏమిటి? మీరు వాక్యము అర్థము చేసికోలేరా? దానిని మీరు తప్పక అర్థము చేసికొనవలెను."
"అంతలోనే ఎవరో, "నాకు కొన్ని బిస్కెట్లు కావాలి… అలాంటిది," అని చెప్పిరి.
104మంచిది, నేను అనుకొన్నాను, "వారికి తినుబండారములు కావలసినచో, వెళ్ళి తెచ్చుకోనీయండి." నేను తిరిగి చూడగా కొద్దిసేపటికి నీడ రానున్నది. కాబట్టి ఈ రాత్రికి మరల జనులు కూడునప్పుడు వారికి చెప్పవలసినది చెప్పుదుననుకొన్నాను. దేవుని వాక్యములోని క్రియలనే నేను చేయుట వారు చూడవలెనని ఆశించాను. ఏదో ఒక పురాణ గ్రంథము లేదా ఒక సంస్థ బోధించినది కాదు, వాక్య ప్రకారమే నేను చేయుట వారు చూడవలెను, ఎందుకనగా ఆ పని నాకు అప్పగించబడినది." వారందరూ ఈ రాత్రికి మరల వచ్చెదరు గనుక ఆ విధంగానే నేను వారికి చెప్పవలెనని తలంచాను. ఈ సంఘకాలముల వర్తమానములను ఎట్లు అందించానో మీరెరుగుదురు. వాక్యమునే తీసికొని ఆ గొప్ప సంగతులు చెప్పాను. అది గొప్ప సమయము గనుక దేవునికి స్తుతులు చెల్లించాను. నేను చిన్న పిల్లవానివలె "దేవునికి వందనములు చెల్లించాను." నేను నిలబడియున్నప్పటికిని, నేను అదృశ్యుడనగుచుండుట నాకు అర్ధమయినది.
MATT 24:37•
LUKE 17:26•
1PET 3:20
105ఇప్పుడు, దాని అర్థము చూచారా? నా ద్వారా జరిగిన కార్యములు జనులకు మొదట వింతగా కనబడినవి. సంపూర్ణ సువార్త పరిశుద్దులను దృష్టిలో నేను పెట్టుకొని ఇది చెప్పుట లేదు. చాలామందికి ఇది వింతగా ఉండెను. ఈ ప్రపంచము, ("కాస్మోస్,") అనగా సృష్టి దేవుని యొక్క వర్తమానమేనని మీరు గ్రహించండి.
"చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక దర్శనంలో ఛికాగో కదిలిపోయినట్లు కనిపించెను. దేవుడు నన్ను ఛికాగోకు పంపును, దేవుని మహిమార్థమై ఇది జరుగును."
"జోసెఫ్! దీనిని ఆయన ఎప్పుడో చేసెను," అన్నాను.
"మూడీ కాలము నుండి అది ఆలాగే యున్నది గదా?" అనడిగాడు.
నేను సంఘము గూర్చి మాట్లాడుచున్నాను. అక్కడున్నది భూమి యొక్క ధూళి. ఆ వీధులలోని గుంపును చూడు. "రంగులు పూసికొనిన యెజెబెలులు అక్కడున్నారు. ఆ పెద్ద నివాసములు, మొదలగునవన్నియూ పడిపోవును." "ఆయన సంఘము గూర్చి మాట్లాడుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను సంఘము చూచినది, దానిని వారు గుర్తించిరి. ఛికాగో అంతటిలో పదిహేను మంది కూడా లేకపోవచ్చును. ఛికాగోలోని ఈ తరమంతటిలో పదిమంది కూడా ఇప్పుడు లేకపోవచ్చును."
దానిగూర్చి మీరెన్నడైనా ఆలోచించారా?
106నోవహు దినములలో ఉండినట్లుగానే, మనుష్య కుమారుని రాకడలోను ఉండును, అప్పుడు ఎనిమిది ఆత్మలు రక్షించబడినవి. సోదొమ నుండి ఎందరు బయటకు వచ్చిరి? నా భావము గ్రహించారా? అయిదుగురు కూడా ఉండరేమోనని నాకు సందేహము కలుగుచున్నది.
"సంఘము ఇప్పటికే కుదపబడినది. దానిని వారు గుర్తించిరి. వారికి వాక్యము తెలియును. వాక్యము నెరవేరుట వారు చూచిరి. దానిని వారు పట్టుకొనిరి. ఒక్క నిమిషము దానిని చూడండి."
ఇప్పుడు వారు మొదటి వర్తమానము చూచి వెంటపడిరి. అందరూ దేవునిని మహిమపరచిరి. అయితే వారు వచ్చినట్లే వెళ్ళిపోయిరి, చూచారా. మరియు ఇప్పుడు, వారు ఇలా అనుకోనుచున్నారు, "మంచిది, నాకు తెలియదు. మనము ఎక్కడ చేరుదుము? ఒకవేళ దినితో నేను రాకపోతే, అది ఈ విధముగా ఉన్నది; మరియు నేను అక్కడ బయటకు నెట్టబడుదును, మరియు నాకు అక్కడ చేయుటకు ఏమియు మిగులదు."
2TIM 4:3-5
107వాగ్దానము చేయబడిన దేవుని వాక్యము బయలుపరచబడినదని వారికి తెలియదు మరియు గుర్తించరు (చూచారా), వారు దూరంగా పోవుచున్నారు. కాని చింతించవద్దు, ఛాయలు కమ్ముకొనుచున్నవి, చూచారా.
మూలరాయిని వేసినప్పుడు ఆయన నాకిచ్చిన ఆ రాత్రి సందేశము మీకు గుర్తుండియుండును. ఆ దర్శనము అయిపోయిన తరువాత II తిమోతీ 4 చదువమని ఆయన నాకు చెప్పెను. "ముప్ఫయి-మూడు సంవత్సరాల క్రితం ఆ మూలరాయి అచ్చట వేయబడినది." "సువార్తికుని పనిచేయుము. నీ సేవను పూర్తిగా రుజువు చేసికొనుము, హిత బోధను సహించని కాలము వచ్చును; వారు తమ స్వకీయ దురాశల చొప్పున బోధించు బోధకులను ఏర్పాటు చేసికొందురు, దురద చెవులుగలవారై సత్యమును విసర్జించి, కల్పనా కథల వైపు తిరుగుదురు. ఆ కాలము వచ్చును." అక్షరాలా వచ్చినది.
LUKE 4:21•
2TIM 4:10,14
108అయితే గమనించండి, నేను ఆ తక్కినదంతయూ చదువలేదు. ముప్పది సంవత్సరాలకు పైగా ఈ సంఘములో బోధించాను, నాకు తెలియదు గాని నేను అంతకన్నా ముందుకు వెళ్ళలేకపోయాను. తరచుగా ఆశ్చర్యపడేవాడిని, కాని ఒక రోజున యేసు కాగితపు చుట్ట పట్టుకొని చదివిన భాగమును చూచాను. ఆయన సగం ప్రవచనము చదివి ఆగెను. (కపెర్నహోములో), "ఈ దినము ఈ ప్రవచనము నెరవేరినది," అని ఆయన పలికెను." తక్కిన భాగమును ఆయన ఎందుకు చదువలేదు? అది ఆయన రెండవ రాకడకు చెందినది, చూచారా.
నాకు తెలియకుండానే దానిని చూచి చదివాను… దక్షిణ కరోలినాలోని దక్షిణ పైన్స్ లో అది జరిగెను. ఆ ఉదయమున నిలబడి లేదా కారుకు ఆనుకొని జోసెఫ్ బొజ్ తో మాట్లాడాను. [సహో, బ్రెన్హాం తన వ్రేళ్ళను విరిచెను.] అప్పుడు నాకు ఇది కనబడెను. "అందరూ నన్ను విడిచిపెట్టిరని పౌలు చెప్పెను. ఏ మనుష్యుడు నాతో లేడు. ఇహలోకమును ప్రేమించి, దేమా నన్ను విడిచిపెట్టెను. (చూడుము!) కమ్మరివాడు నాకెంతో కీడుచేసెను," అని పౌలు వ్రాసెను.
ACTS 13:11
109దేమా ఏమనుకొనియుండును? "పౌలు సువార్త బోధించుట, రోగులను బాగు చేయుట చూచాను; కాని ఇప్పుడు అతడే శ్రమపడుచున్నాడు, తనతో కూడా లూకా అను వైద్యుని తీసికొని వెళ్ళుచున్నాడు. ఇతడు దైవిక స్వస్థత గూర్చి బోధించతగడు. ఇతడు ఒకనిని గ్రుడ్డివానిగా చేయుట చూచాను. ప్రభువు నిన్ను గద్దించి కొంతకాలము మట్టుకు అంధునిగా చేయును గాకని చెప్పగానే, ఆ ప్రకారము జరిగెను; కాని ఇతనిని ఆ కమ్మరివాడు తరిమివేసెను. అతనిని గ్రుడ్డివానిగా చేయగల శక్తి పౌలులో లేదు. చివరకు దైవిక స్వస్థతా శక్తియు పోగొట్టుకొనెను. దేవుడీతనికి విరోధియాయెను," అని తలంచెను.
MATT 26:68•
MARK 14:65•
LUKE 22:64
110దేమా చరిత్ర మీరు చూడండి, అతడు చాలా ధనికుడు, పెద్ద కుటుంబము; అతడు ఇతర గుంపుతో వెళ్ళాలని అనుకొన్నాడు.
కాని పౌలు, బీదవాడు. అది ఏమిటి? దేవుడు ఎన్నడూ అట్టి వారి సేవను ఆ విధంగానే అలంకరించును. యేసును ఆలాగే ఉంచెను. (చూచారా!) ఆయన మృతులను లేపగలడు, ఏదైనా చేయగలడు, కాని ఒక రోమా సైనికుడు ఆయన గడ్డమును పెరికెను. [సహో, బ్రెన్హాం ఉమ్మివేసిన శబ్దము చేసెను.] ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి. ఆయన కళ్ళకు గంత కట్టి, తల మీద రెల్లులతో కొట్టుచూ, "నిన్నెవరు కొట్టిరో చెప్పగలవావు ప్రవక్తవు గదా," అని హేళన చేసిరి. ఆయనను ఎవరు కొట్టిరో ఆయనకు తెలియును. నిశ్చయంగా ఆయనకు తెలియును. చూచారా? కాని ఆయన సేవకు కిరీటము ధరించబడును. చాలా బలహీనంగాను, ఇక పని ముగిసినట్లుగాను కనబడు సమయములోనే దేవుడు తన కిరీటమును పెట్టును. ఓ, దేవా! దానిని జరుగనిమ్ము! ప్రభువా! దానిని జరుగనిమ్ము! మన తలలు వంచుదము.
నేనాయనను ప్రేమించెదను
నేనాయనను ప్రేమించెదను
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.
(ఇప్పుడు ఆయనను ఆరాధించండి; గట్టి బోధ మనం విన్నాము!)
కల్వరి మ్రాను మీద, నా రక్షణను కొనెను.
మన చేతులను ఆయన వైపు చూపుదము.
నేను ఆయనను ప్రేమించెదను, (ఇప్పుడు, ఆత్మలో ఉండుడి.)
నేను ఆయనను ప్రేమించెదను,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను…