సమర్పణ
VGR COUNT-111 1అందరికీ శుభోదయము. పునఃప్రతిష్ఠ కార్యక్రమము కొరకై, ఈ ఉదయకాలమునందు ఇచ్చట ఈ మంచి చిన్న మందిరములో ఉండుట ఒక భాగ్యమై ఉన్నది. ఆ వెనుక గదిలో సహోదరి హూవర్ తో నేను మాట్లాడుచుండగా, "ఇది ఒకప్పుడు పరిశుద్ధ యాత్రికులు లేదా సహోదర (సమాఖ్య సంఘము) సంఘముగా యున్నదని నేను నమ్ముచున్నాను" అని ఆమె చెప్పినది. అవును, పరిశుద్ధ యాత్రికులుగా యుండెనని నేను నమ్ముచున్నాను, మరియు ఇప్పుడు సంపూర్ణ సువార్త కొరకై పునఃప్రతిష్టించబడుచున్నది, మరియు ఇది పునఃప్రతిష్ఠ కార్యక్రమము.
మరియు దీనియొక్క చక్కని కాపరి, మనకందరికీ తెలిసిన సహోదరుడు హూవర్ ఒక చక్కని నిజాయితీ గలిగిన, సమర్పించుకొన్న బాలుడు. ఆయన తల్లి, నేను ఆమెను ఎరుగుదును, ఏళ్ళ క్రిందట, ఆమె మరియు నా కుటుంబము కలిసి ఆ విధముగా… పిల్లలు, వారందరూ ఆమెను "మమ్మీ హువర్" అని పిలిచేవారు, ఎందుకంటే ఆ రకంగా ఆమె… ఆ పిల్లలు యవ్వనులుగా ఉన్నప్పుడు ఆమె మాతో చాలా కాలము నివసించినందు వలన దైవీకమైన మరియు మంచి పరిశుద్ధురాలైన ఒక వృద్ధ తల్లిగా ఆమెను వారు ఆ విధముగా ఎరిగియుండిరి. తనయొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించాలని మరియు అతడు సర్వశక్తిగల దేవునియొక్క సేవకొరకై తన జీవితమును ప్రత్యేకించుకోవాలని బాలుడైన ఈ చక్కని ప్రసంగీకుని కొరకై ఆమె ఎంతో చక్కగా ప్రార్థించెను. మరియు ఇప్పుడు, ఎంతో కాలముగా నిద్రాణ స్థితిలో ఉన్న ఈ సంఘమును లేదా ఇక్కడి భవనమును పట్టుకొని, దీనిని సువార్త కొరకై కొనసాగింప బడునట్లుగా నేడు సంపూర్ణ సువార్త రీతిగా కొలవబడుటకు నిలువబడెను.
2"కేవలము నమ్ముము" అనే పాటను వినుటకు ఎంతో చక్కగా ఆ సంగీతమును వాయించినది ఎవరో కాదు తనయొక్క చిన్న బాలికయే అని కొద్దిసేపటి క్రితము సహోదరి ఎల్. జి. హూవర్ నాతో చెప్పినది. మరియు ఆమె ఇక్కడ ఆ పియానో వాయించు వాద్యకారిణి. మూడు నెలల క్రితము, వారు లోనికి వచ్చినప్పుడు, ఆమెకు అసలు సంగీతమంటే తెలియదు. కానీ ఇప్పుడు ఆమె వాయించుచున్నది. అది చాలా, చాలా మంచిది.
ఇక్కడే వెనుక కూర్చొన్న ఒక బాలిక ఉన్నది, అయిదు లేక ఇంకా ఎక్కువ సంవత్సరముల నుండి సంగీత పాఠములు నేర్చుకొనుచున్నది, అలా నేర్చుకొనుటకు ఎంత ఖర్చు పెట్టినదో నాకు తెలియదు, ఒక క్రొత్త పియానోను కూడా కొనుక్కొని తర్ఫీదు చేసెడిది. ఆ చిన్న బాలిక ఎంత తర్ఫీదు చేసినా గాని ఏమియు ప్రయోజనము లేకపోయినది. ఆమె ఒక్క రాగమునూ పలికించలేదు. కావున దీనిని బట్టి ఏమి అర్థమవుచున్నదంటే స్వయముగా మీ శక్తి సామర్ధ్యాలతో ఎంత ప్రయత్నించినా వ్యర్ధము. కాని దేవుడు మీకు ఆ తలాంతును ఇస్తేనే అది చక్కగా ఉండును, మీరు చూడండి!
3ఇప్పుడు, ఈ స్థలమును ఈ జనులకు ఇచ్చినందులకు దేవునికి కృతజ్ఞత తెలుపుచున్నాము. మరియు దేశములోని ఈ యొక్క భాగమునకు ఇది ఒక గొప్ప దీపస్తంభముగా ఉండగలదని నేను నమ్ముచున్నాను.
ఒక సంఘమును జనులు చూసినప్పుడు అనేకసార్లు వారు ఈ విధముగా తలంచెదరు. "ఈ చిన్న సంఘములోకి ఎంతోమంది జనులు రారని వారు తలంచెదరని నేను నమ్ముచున్నాను. అది తన యొక్క సంఘము డెభ్బై లేదా ఎనభై మంది జనులని మరియు ఆ యొక్క క్రమములో కొంచెము తక్కువ లేదా కొంచెము ఎక్కువ మంది ఉండవచ్చును. కానీ అది దానికి కొంచెము దగ్గరగా అటు, ఇటు ఇంచుమించుగా జనులు ఉందురని సహోదరుడు ఎల్. జి. నాతో చెప్పెను.
"మంచిది, నేడు దేశములోని సంఘములను చూసిన ఎడల, వాటి యొక్క గుంపు వేలల్లో ఉండును," అని వారు అనుకొనెదరు. మరియు ఒక్కొక్క ఆరాధనా దినమున వారు వేలమంది జనులను ఒకవేళ కలిగియు౦దురు.
కానీ, ఈ చిన్నగుంపును ప్రోత్సాహపరచుటకు ఎంతమంది సంఖ్య ఉన్నదనే దానిని గూర్చి ఖచ్చితముగా దేవుడు లెక్కచూడడు. కాని ఆయన చూచునదేమనగా. ఆయన ఎల్లప్పుడును తాను నివాసమై ఉండు స్థలమును, సంఖ్యను ఆధారము చేసుకొని నివాసము ఉండడు.
కాని ఆ సంఘమునందుండు నాణ్యతను ఆధారము చేసుకొని ఆయన నివాసమైవుండును. దేవుడు చూచునది ఖచ్చితముగా సంఖ్య కాదు, ఆయన చూచునది. ఆయన ప్రతీసారీ తనయొక్క నివాసము ఏర్పరచుకొనునది సంఖ్యమీద కాదు గానీ గుణము (Quality) మీద, చూశారా?
ACTS 19:1,7
4పరిశుద్ధ గ్రంథములోని అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము మనము చూచినయెడల "పౌలు, పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి మరియు అక్కడ ఒక సంఘమును కనుగొనెను. క్రీస్తుయొక్క ప్రత్యక్షతననుసరించి, అది ఎఫెసు సంఘము, సంఘ కాలములలో అది మొదటిది. మరియు ఇక్కడ ఈ సంఘములో లెక్కింపును బట్టి పన్నెండు మంది జనులు ఉన్నారు, పన్నెండు మంది సంఖ్యగా ఉన్నారు.
కానీ ఈ సంఘము కేవలము పన్నెండు మందిని కలిగియుండెను లేక ఆ విధముగా చేయునట్టి సంఘము, మరియు దేవునికి పరిపూర్ణముగా లోబడిన ఎడల, మిగతా ప్రప౦చమంతటితో ఆయన చేయు దానికన్నా ఆ పన్నెండు మందితో ఆయన ఎక్కువ చేయగలడు. మనకున్న దానిని సంపూర్ణముగా మనము సమర్పించుకున్న దానినిబట్టియే అది ఆధారపడి వుండును. సువార్త యొక్క సత్యము, కేవలము బలిపీఠము నుంచే వెళ్ళడం కాదు గానీ, జనుల హృదయాలలో అది నివాసమేర్పరచుకొని మరియు దానికొరకై వారు క్రియా రూపమున క్రియ చేయవలెను. కనుక ఈ ఉదయ కాలమున ఇది ఒక సంతోషమని నేను ఎంచుచున్నాను.
ROM 5:1
5ద్వారమునుండి నేను లోపలికి ప్రవేశించుచుండగా సహోదరుడు బీలర్ చేయుచున్న కానుక ప్రార్థనను నేను ఆలకించితిని. ఎంతో దీర్ఘ అనుభవశాలియైన ఆయన గురించి నేను ఆలోచించుచుంటిని. నేడు సమాధానపడు దినమైయున్నది. ఈ సమాధానపడు, లేక సంధిచేసుకొను దినమును ఒక దినము కలిగియుండుటకై మనమందరము సంతోషించవలయును. ఇచ్చట సంఘములో కూడా సమాధానపడు ఒక దినము ఉండినయెడల జనులు తమకు తామే దేవునికి విరుద్ధముగా యుద్ధము చేయుచున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో వారు సమాధానము పడుటకై లేదా సంధి చేసుకొనుటకై ఈ సమాధానపడు దినమున వారు సంతకము చేయుదురు. రోమా 5:1 ఇలా చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను, "కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము."
గుడారము (Tabarnacle) లేదా ఆలయము నుండి వచ్చిన కొంతమంది స్నేహితులను, బ్రయాంట్ సాహోదరుడును మరియు సహోదరిని, ఇంకా కొంతమంది జనులు ఇచ్చట కూర్చుని వుండుటను నేను గమనించితిని.
6ఇప్పుడు, ఈ ఉదయకాలమందు ఆ గుడారమునందు ఆదివారము పాఠశాల పాఠముపై ఒక అంశమును నేను మాట్లాడవలసి ఉండినది. కాని దానిని ఈ రాత్రికి వాయిదా వేశాను. ఎందుకనగా దీనిని ప్రతిష్టి౦చు కార్యక్రమము కొరకై రావలసియుండెను. ఆలయమునందు ఈ రాత్రి కూటములు ముందుగా ప్రారంభమగును. ఏడు గంటలకే సభా వేదిక యొద్దకు వెళ్ళి మాట్లాడాలని గురి కలిగియున్నాను. కనుక మేము ఆలస్యము చేయుము. మరియు దీర్ఘమైన వర్తమానమును నేను కలిగియున్నాను. అంశమేదనగా "సంస్థగా స్థాపించబడిన మత మార్గమును నేనెందుకు వ్యతిరేకించుచున్నాను" మరియు అది లేఖనములో చెప్పబడినది. కావున, గుడారము యొద్ద ఉన్న జనులారా, మంచిది, మీరు త్వరగా రండి.
MATT 22:9•
LUKE 14:23
7ఇప్పుడు, బ్రదర్ హూవర్, ఈ ఉదయ కాలమున ఈ యొక్క జనుల మధ్యకు క్రీస్తు యొక్క ఈ మహిమ వర్తమానమును తీసికొని వచ్చుటకు తనను తానుక్రీస్తుకు అర్పించుకొన్న ఒక యవ్వనస్తుని గూర్చి నేను ఏ విధముగా కృతజ్ఞత తెలుపవలెనో నాకు తెలియదు.
నేను ఒక కెంటికీవాడను. ఇక్కడ చిన్న దారులు కలిగిన, బర్కస్ విల్లీ అనే చిన్న ఊరు నుంచి నేను వచ్చియున్నాను. మరియు నేను, ఇక్కడ జనులను అడుగుడి, ఒక కెంటకీ వారిని గూర్చి మరి యొకరు, ఈ బాలుడు చెప్పినది వినండి. ఇక్కడ జనుల నుండి బయటకు వచ్చి ప్రతీ చోటికీ సువార్తను వ్యాపింపచేసి లోనికి రండి. వారిని లోనికి తీసుకొని రండి. పరిశుద్ధ గ్రంథము ఇలా చెప్పుచున్నది. అవసరమైతే ఆజ్ఞాపించండి, లోపలికి రావడానికి బలవంతము చేయండి, "రాజ మార్గములలోనికిని, కంచెల లోనికిని వెళ్ళి లోపలికి తీసుకొని వచ్చుటకు బలవంతము చేయుడి," అది బలవంతము. లోపలికి రండి.
8మరియు బ్రదర్ హూవర్, గత కొన్ని సంవత్సరముల నుంచి ఆయన నాకు తెలుసు. మరియు నాకు తెలిసినట్లుగా ఆయన ఒక దైవికమైన, సమర్పించుకొన్న బాలుడు. ఆయన యొక్క ప్రతీ పనిని ప్రభువు ఆశీర్వదించును గాక, మీ చిన్న పాటలు పాడు గుంపును గూర్చి నేను విన్నాను. నేను ద్వారము వైపు చూచుటకు ప్రయత్నించినప్పుడు, నాకు చిన్న గాన బృందము పాడుచున్న పాట, "మరింత నిశ్చయత కలిగి యుండు" అనే పాట వినబడినది. అది నిజము. మీ జీవితములో ఏ విషయములోనైనా నీవు అలక్ష్యముగా వుండవచ్చును గాని నీవు వెళ్ళి చేరు గమ్య స్థానమగు నిత్యత్వమును గూర్చి వచ్చినపుడు నీవు బహు జాగ్రత్తగా, ఎంతో నిశ్చయతను కలిగియుండుట చాలా మంచిది, గమనించారా? దానిని నీ తలంపులో ఉంచుకో, "చాలా, చాలా నిశ్చయముగా" దానియందు ఎటువంటి అలక్ష్యమును కలిగి యుండవద్దు.
నీవు ఏదైనా ఒక బోజనశాలకి వెళ్ళి "ఒక గిన్నెతో సూప్ (Soup) కావాలి తీసుకురా" అని చెప్పినప్పుడు, దానిని తయారుచేసి తీసుకొనివచ్చి నీ ముందు పెట్టినప్పుడు దానిలో ఒక పెద్ద సాలీడు ఉన్న ఎడల, నీవు దానిని ఖచ్చితముగా త్రోసివేసెదవు. నీవు ఎటువంటి స్థితిలోనూ దానిని ముట్టుకొనవు, లేదండీ, ఎందుకంటే అది నిన్ను చంపివేయును. ఈ సూప్లో ఉడికించబడిన ఆ సాలీడు యొక్క విషము, నీకు మరణమును సంభవింపజేయును. కనుక మర్త్యమై నశించిపోయే ఈ దేహము విషయములో నీవు అంత జాగ్రత్తను కలిగియుంటే, మరి గమనించండి, అమర్త్యమైన లేదా నిత్యమైన నీ ఆత్మ విషయమై ఇంకా ఎంత జాగ్రత్తను నీవు కలిగియుండవలెను. కనుక సంపూర్ణ సువార్త రూపములో ఉన్న సమస్త దేవుని యొక్క వాక్యమంటే నాకు ఎంతో ఇష్టం, మరియు బ్రదర్ హూవర్ అతడికి యున్న మంచి జ్ఞానముతో ఈ సంపూర్ణ సువార్తను ప్రసంగించు పరిచర్య విషయములో అతడు దేవునికి చేసిన వాగ్దానమును నిలబెట్టుకుంటాడని నేను ఎరుగుదును. మరియు ఆ నమ్మకమును, విశ్వాసమును నేను అతడిపట్ల కలిగియున్నాను.
9అక్కడ కూర్చొని, చిన్న పియానో వాద్యకారిణి వాయించుచున్న "కేవలము నమ్ముము" అను రాగమును వినుచున్నాను. నా కుమారుడు, బిల్లీపాల్, ఆ సమయములో ఇక్కడ ఉన్నాడని నేను అనుకోవట్లేదు. కానీ నేను చెప్పాను. "బిల్లీ, ఆ చిన్న పియానో నుంచి వచ్చుచున్న కేవలము నమ్ముము? అను రాగమును వినుము," ఆకాశము క్రిందనున్న ప్రతీ భాషలోనూ నేను ఆ చిన్న పాటను వినియున్నాను, ఆ పాటను పాడుచు నన్ను వేదిక మీదకు పిలిచెదరు. ఆర్కిటిక్ లోనున్న అతి శీతల విశాల భూభాగముల నుండి మొదలుకొని దక్షిణాన ఉన్న ఉష్ణ సంబంధమైన అడవుల వరకు, భూమి అడుగున, భూమి చుట్టూ అనేక రకములగు స్వరములలో కేవలము నమ్ముము అనే పాటను నేను విన్నాను. ఆ పాటను పాడుచు నన్ను వేదిక మీదకు పిలిచెదరు. ఒక రోజు, భూమి మీద నా జీవితము ముగించబడినప్పుడు, వారు ఆ పాటను పాడెదరని నేను ఆశించుచున్నాను. ఆయన రాకడను చూచుటకు గనుక నేను బ్రతికిలేనట్లయితే, వారు నన్ను ఆవల పెట్టుచుండినప్పుడు ఆ పాటను పాడెదరు. నేను యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
10ఇప్పుడు, ఈ భవనమును పునఃప్రతిష్టించుట కొరకు పరిశుద్ధ గ్రంధము నుండి నేను సూచించుటకు ఇష్టపడుచున్న కొన్ని లేఖనములు ఇక్కడ నాకు ఉన్నవి. మరియు నేను అనుకొనుచున్నాను, ఇప్పుడు ఈ సంఘము ఒక శాఖ కొరకు ప్రతిష్టపరచబడుటలేదు. ఇది దేవుని యొక్క సేవ కొరకు ప్రతిష్టపరచబడుచున్నది. ప్రార్థించుట కొరకు, ఒక్క క్షణము మనము ఇప్పుడు తలలు వంచెదము.
HEB 4:16
11మహిమగల పరిశుద్దుడవైన తండ్రీ! మేము ఈ గదిని విడిచిపెట్టి నీ సన్నిధి యొద్ధకు వచ్చుచుండగా ఆకాశమునుండి ఆకాశము వరకు ఎచ్చటైతే ఆ బంగారు బలిపీఠము అమర్చబడియున్నదో విశ్వాసము ద్వారా మేము ఆ దేవుని యొక్క సింహాసనము యొద్దకు వచ్చుచుండగా, ప్రతి జీవికొరకు, ప్రతి మర్త్యుడు, ప్రతి తెగ, ప్రతి జాతి లేక రంగు వారి కొరకు క్రీస్తు చనిపోయి మనపాపముల నిమిత్తము పాప పరిహారబలిగా తనను తాను ఏ బలిపీఠము మీద సమర్పించుకొనెనో ఆబలిపీఠము యొద్దకు వచ్చుటకు మేము హక్కును కలిగియున్నాము. కృపాసింహాసనము యొద్దకు ధైర్యముగా వచ్చు హక్కు మనకు ఉన్నది. ఈ రోజు మేము పొందబోవు మరియు పొందియున్న గొప్పభాగ్యము కొరకు మేము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ గొప్ప సింహాసనము యొద్దకు వచ్చినందుకు, సమాధాన బలి అర్పణను అంగీకరించినందుకు, సువార్త యొక్క గ్రహింపుతో సమాధానముతో, ముందుకు కొనసాగిపోవునట్లు చూచినందుకు మరియు ఈ భూమిపైనున్న మీ శరీరము యొక్క ప్రతి సభ్యుడనుబట్టియు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.
ఇప్పుడు మేము ప్రార్థించుచున్నాము, దేవా, దేవుని ఆరాధించుటకై ఏ స్థలమునకు వెళ్ళాలో ఆ స్థలమగు ఈ ఆలయమును ఒక ఆరాధనా స్థలముగా నిర్ణయించుకొని ఇచ్చటకు వచ్చిన ఈ జనులు, వారు తమను ప్రేమ పూర్వకముగా తమ చేతులను, హృదయమును నీ కొరకు ప్రతిష్ఠించు కొనుటకు ఈ ఉదయ కాలమున ఈ చిన్న భవనమునకు ఒక గురుతుగా వచ్చిన ఈ గుంపు జనులను మరియు వారి అభిలాషను నీవు దీవించమని దేవా, మేము ప్రార్థించుచున్నాము. మరియు కాపరిని నీవు దీవించుమని మేము ప్రార్థించుచున్నాము, మా దయగల సహోదరుడు, మరియు అతని భార్య, అతని కుటుంబము, పెద్దలు, ధర్మకర్తలు, కార్యాలయపు సభ్యులను, అందరిని కలిసి దీవించుమని ప్రార్థించుచున్నాము.
MATT 22:9•
LUKE 14:23
12మేము చేయుచున్న ఈ కార్యములు వాక్యాను సారముగా క్రమముగా ఉన్నవా లేవా అని తెలుసుకొనుటకై మేము ఆలోచించు దానికన్నా త్వరితముగా మేము నీ వాక్యముతో సమాధానపడుటకై, నేడు ఈ వాక్యమును తెరుచుచుండగా, దినములు గతించుపోతూ సమయము ఇక లేదని నేడు మేము గ్రహించవలయును. కాబట్టి త్వరితముగా దానిని మేము చేసి తీరవలయును. ప్రతిఒక్కొక్క సభ్యుడు క్రీస్తుయొక్క శరీరముగా నియమింపబడుటకై మేము త్వరపడి మరియు బలవంతముగా దానిని చేయవలసియున్నది. ఎందుకనగా ఈ వర్తమానమును వ్యాపింపజేయుటకై మరియు ప్రతి ఒక్కొక్కరికి ఈ వర్తమానమును వినిపించుటకై మాకున్న సమస్తమైన వాటితో మరియు మాకు ముందున్న వాటితో సాధ్యమైనంత వరకు మేము ఖచ్చితముగా ఈ వాక్యము కొరకై మేము దానిని చేసి తీరవలయును.
తండ్రీ, నీ వాక్యమును దీవించుము, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుము, ఆసక్తితో గ్రహించగల హృదయముతోను మరియు వినగల చెవులతోను నీవు చేసిన దానిని మేము తెలుసుకున్నట్లుగాను మరియు దానిని సంతోషముతో స్వీకరించునట్లుగాను చేయుమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
1CH 17:1-5
13ఇప్పుడు, కొన్ని సార్లు మీలో చాలామంది జనులు లేఖనములను గురుతు పెట్టుకొందురు లేదా వ్రాసుకొందురు లేదా నోట్స్ తీసుకొనెదరు. అది ఒక అలవాటు, మరియు నేనూ అదే చేయుదును. మరియు మొదటి లేఖనము చదువుటకు మీరు ఇప్పుడు నాతో త్రిప్పిన ఎడల, ఈ ఉదయము చదువుటకు నాకు మూడు చోటులు కలవు. మరియు అది I దినవృత్తాంతములు 17: 1-2, మరియు అపోస్తలుల 7:44-49 మరియు హెబ్రీ 10:1-5. మరియు మొదట మనము దినవృత్తాంతముల నుంచి చదివెదము. I దినవృత్తాంతములు 17, మొదటి వచనము నుండి మరియు తరువాత రెండవదిగా, అపోస్తలుల కార్యములు గ్రంథములో నుండి చదివెదము 7వ అధ్యాయము నుండి 44వ వచనము చదువుటకు ప్రారంభించెదము, ఆలయ ప్రతిష్ఠకు సంబంధించి అన్నీ వరుసగా మరియు తరువాత హెబ్రీ 10:5.
"దావీదు తన ఇంటనుండి ప్రవక్తయైన నాతానను పిలిపించి - నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరలచాటుననున్నదని చెప్పగా.
నాతాను - దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను.
ఆ రాత్రియందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.
నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము. యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయము కట్టించుట నీ చేతకాదు.
ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని."
ACTS 7:44-50•
HEB 10:5
14ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి, 7వ అధ్యాయము 44వ వచనము,
"అతడు చూచిన మాదిరి చొప్పన దానిచేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను.
మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యొహోషువతో కూడ ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను.
అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను.
అయితే సాలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.
అయినను ఆకాశము నా సింహాసనము భూమి నాపాదపీఠము మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది.
ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.
మరియు హెబ్రియల గ్రంథములో నుండి, 10వఅధ్యాయము 5వ వచనము.
కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. "బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి,"
1CH 17:1
15మనము కొద్దిసేపు మాట్లాడనైయున్న ఈ లేఖనములన్నీ మనకు బాగా తెలిసియున్నవే. ఇప్పుడు, దావీదు, ప్రత్యక్షత మరియు కోరిక ద్వారా, తన హృదయములో ఒక గొప్ప విషయమునకు ఆలోచించెను. దావీదు నిజాయితీగల మనుష్యుడై యుండి జనులందరి చేత ప్రేమించబడి మరియు అనేక రకములుగా దేవునిచేత ఆశిర్వది౦పబడెను. మరియు అతడు చెప్పెను. "నా దేవుని యొక్క నిబంధన మందసము అక్కడ గుడారములలో నుండగా, దేవుడు నాకిచ్చియున్న అందమైన గృహములో నేనిక్కడ కూర్చొని యుండుట మంచిదేనా?" అది ఒక చాలా గొప్ప సంగతి.
దావీదు దీనిని తెలుసుకొనుటకు అది ఒక ప్రత్యక్షత, ఎందుకంటే, "నాకు ఇవన్నియూ ఇచ్చిన నా దేవుని యొక్క నిబంధన మందసము, ఇంకా ఆ గుడారములోనే ఉండియుండగా," ఎంతో మనోహరమైన మరియు చాలా విలువైన దేవదారు వృక్షముతో చేయబడిన ఇంటిలో ఉండుట అతనికి ఎంత మాత్రము సరైనది కాదు.
1CH 17:2,4,5,7,8
16మరియు నాతాను, ప్రవక్త దావీదుతో దేవుడున్నాడని తెలిసి, "దావీదు, నీ హృదయమందున్నదంతయూ చేయుము, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు" అని చెప్పెను. మరియొక విధంగా, దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చు కానీ, అదంతయూ క్రియ చేస్తున్నది.
మరియు ఆ రాత్రి, దేవుడు ఆ ప్రవక్త యొద్దకు వచ్చి, ప్రవక్త నాతాను, "నా సేవకుడైన దావీదుతో చెప్పుము" అని చెప్పెను, చూశారా? నేనది ఇష్టపడుచున్నాను. ఓ! మరో మాటలో, "నాకు ఒక స్థలమును నిర్మించదలచిన అతని ధైర్యమునకు మరియు నా కొరకైన అతని ఆలోచనలను మెచ్చుకొనుచున్నాను," కానీ, ఆయన చెప్పెను, "నేను ఒక గృహములో నివసింపలేదు. నేను భూమి మీదకు వచ్చినప్పుడు నేను నివసించుటకు ఒక స్థలము లేదు, నా జనులను చూచుకొనుటకు, ఇశ్రాయేలును నేను వెలుపలికి తీసుకొనివచ్చినప్పుడు నుండి నాకు ఉండుటకు ఒక స్థలము లేదు. నేను ఏ ఒక్క న్యాయాధిపతిని కూడా నాకొక దేవదారు గృహమును నిర్మించమని ఆజ్ఞాపించలేదు. కానీ నేను ఒక గుడారము నుండి ఇంకొక గుడారమునకు వెళ్ళాను."
అది నేటి దినమునకు సారూప్యముగా లేదా!
"నేను గుడారము నుండి గుడారమునకు, మరియు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు, నా జనులను కలుసుకొనుటకు వెళ్ళితిని." అతడు చెప్పెను. "వెళ్ళి దావీదుకు చెప్పుము," [లేఖనము ముందుకు చదివినచో], "నీ తండ్రి యొక్క గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసికొనియున్నాను. లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేసియున్నాను."
కుడివైపు నుండి ఎడమ వైపునకు నీ శత్రువులను నిర్మూలము జేసితివి. దావీదు, నేను నిన్ను ప్రేమించియున్నాను. మరియు నీ యొక్క కోరికలు నిజమని నేను ఎరిగి యున్నాను. నీ యొక్క ఆశయములు విశ్వాసము గలవి. మరియు నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును."
1CH 17:8,11,12•
1CH 28:3
17దావీదు ఏ విధముగా నిరంతరము దేవుని గూర్చి తలంచుచున్నాడో మీరు కీర్తనలను చూడవచ్చు. ఈ రోజు మనలో చాలామంది వారు చేసిన ఘనకార్యములను బట్టి ఆలోచించుచూ వారిని వారే పొగుడుకొంటూ ఘనపరచుకొందురు. కానీ దావీదు, దేవుని కొరకు ఏమి చేయుదునా అని నిరంతరము ఆలోచించుచుండెను.
"దావీదూ, నీ కోరికలు నేను ఎరుగుదును," మరియు "నేను నీ కొరకు ఏమి చేశాను" అనే దానిని నీవు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. నీవు ఒక చిన్నబాలునివి, ఎవరికి తెలిసియున్నవాడివి కాదు, మరియు నీ.. యొక్క తండ్రి కూడా నీవు మేపుటకు కొన్ని గొర్రెలు నీకు అక్కడ ఇచ్చియున్నాడు. కానీ నేను నీకు తోడై యున్నాను. మరియు నీ కుడి ఎడమ వైపుయున్న నీ యొక్క శత్రువులను నిర్మూలము జేసితిని. నీ యొక్క కోరికలు సరైనవి.
"కానీ దావీదు, నీవు యుద్ధ సంబంధమైన వ్యక్తివి. నీవు రక్తము చిందించిన వాడివి. దీనిని నీ చేత నేను చేయింపజాలను, కానీ నీ నడుములో నుండి జన్మించబోవు వాని ద్వారా నేను దానిని వాగ్దానము చేసెదను. నీ కుమారుని నేను లేపెదను, మరియు అతడు ఆలయమును కట్టును."
1KGS 3:9,12•
1CH 28:3
18ఇప్పుడు, భూ సంబంధమైన కార్యములు పర సంబంధమైన వాటినే సూచించునని మనందరము ఎరిగియున్నాము. స్వాభావికమైన విషయములు ఆత్మీయమైన విషయములకు సాదృశ్యముగానున్నవి. ఆ నిజముగా, ఆ ఆలయము కొరకే, ఆయన క్రీస్తు అను ఒకరి కొరకు మాట్లాడుచున్నాడు. కానీ అతడు సొలొమోను, స్వాభావికమైన శరీరములో, దావీదు యొక్క కుమారుడు. తరువాత, మొదటి రాజులలో మనము చదివెదము, మీరు గనుక చదువుటకు ఇష్టపడిన ఎడల, దావీదు నిర్మింపదలచిన మందిరమును అతడు కట్టెను. ఎందుకంటే సొలొమోను సమాధానము మరియు జ్ఞానము కలిగిన వ్యక్తి అతడు దావీదు వలె యుద్ధమునకు వెళ్ళలేదు. మరియు రక్తము చిందించలేదు. అతడు కేవలము ఒక సమాధానము కలిగిన వ్యక్తి, మరియు ఏమి కావలెనని దేవుడు అతడిని అడిగినప్పుడు, దేవుడు అతడికి జ్ఞానమును ఇచ్చెను. దేవుని ఎదుట, తన జనులను ఏ విధముగా నడిపించవలెను అని తెలుసుకొనుటకు అతడు జ్ఞానమును మాత్రమే అడిగెను. మరియు ఎప్పుడునూ అతడు గొప్ప బహుమానములను తీసుకొనలేదు, కానీ దేవుని యొక్క జనులను మరింత మంచిగా నడిపించుట తెలుసుకొనవలెనని కేవలము జ్ఞానమును మాత్రమే అడిగెను.
19దేవునియందు ఇంకా మంచి దేవుని పిల్లలుగా మనము వుండునట్లుగా, ఇంకా ఆ కార్యములను గ్రహించుకొనుటకై, మనము జ్ఞానము గలవారమై వుండుటకై మన ప్రార్ధనలలో మనము జ్ఞానము కొరకై దేవుని యందు అడిగి పొందుకొనిన యెడల మంచిదని నేను ఆలోచించుచున్నాను. జ్ఞానమనే దాని యొద్దకు ఒక నిజ సంఘకాపరి తన సంఘమును నడిపించవలెననే ఆలోచన కలిగియుండును, గ్రహించారా, అందుకొరకే ఈ పాత సంఘమును తీసుకొని ఈ రోజు మరలా దీనిని పునఃప్రతిష్టించుచుండెను. వర్షము, మంచు మరియు మొదలగునవి లేని స్థలము యొద్దకు తీసుకొని వెళ్ళుటకు అతడు ఈ దేవుని జనుల కొరకై ప్రయత్నించుచున్నాడు. దావీదును ఏ విధముగా అయితే దేవుడు గౌరవించాడో అదే విధముగా ఈ బాలునిలో కూడ జరుగునని నేను తలంచుచున్నాను.
1KGS 5:5
20ముఖ్యముగా నేను సూచించుటకు ఇష్టపడుచున్న ఒక గొప్ప ఆత్మీయ కార్యము ఇచ్చట వుండుటను ఇప్పుడు మనము కనుగొనబోవుచున్నాము. మొదటి రాజుల గ్రంధమును చదివిన యెడల మీరు దానిని కనుగొనగలరు. సొలోమోను ఒక యువకునిగా, తన తండ్రికి దేవుని చేత వాగ్దానము చేయబడి ఈ ఆలయమును నిర్మించుటకు ప్రారంభించెను. మీరు చూడండి, అతను లేఖనములతో మరియు వాగ్దానములతోనే నిలిచియుండెను.
మనము విజయవంతముగా వాక్యమందు కొనసాగాలంటే మనము ఖచ్చితముగా చేయవలసిన కార్యమేదనగా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాగ్దానములనే గీతయందే నిలిచియుండవలెను. ఈ వైపునకు లేదా ఆ వైపునకు వెళ్ళుట నీకు ఎంత గొప్పగా అగుపించిననూ, లేఖనములనే వాక్య క్రమములోనే నీవు నిలిచి యుండవలెను. తన తండ్రియైన దావీదుకు దేవుడు ఆ ఆలయమును తాను నిర్మించునని వాగ్దానము చేసెనని సాలోమోను ఎరిగియుండెను.
21ఇప్పుడు, మీరు గమనించినట్లయితే, ఆ ఆలయము నిర్మించుటకు కావలసిన సామాగ్రి కేవలము పాలస్తీనాలో మాత్రము కనుగొనబడలేదు. ఎందుకంటే అక్కడ మాత్రమే అది లేదు. అతడు ఈ ఆలయమును నిర్మించుటకు కావలసిన సామాగ్రిని కనుగొనుటకు మిగతా ప్రపంచమంతటికీ వెళ్ళవలసియుండెను. తెలిసిన ప్రపంచమునకు
ఎంతగొప్ప అందమైన కార్యమది, దేవుడు తన యొక్క ఆలయమును నిర్మించుటకు కావలసిన సామాగ్రిని కేవలము యూదుల నుండి మాత్రమే కోసి తీయలేదు లేదా తెల్ల రంగు వారినుండి మాత్రమే కాదు గాని లేదా గోధుమ రంగుగల వారి నుండి కాదు గాని లేదా ఎరుపు, లేదా నల్ల లేదా ఎన్నెన్ని రంగులు గలవారు ఉన్నారో లేదా ఏ రంగు గలవారినుండైనా గానీ లేదా ఏదైనా కేవలము అమెరికా నుండి మాత్రమే కాదు గాని, లేదా కేవలము కెనడా మాత్రమే కాదు గానీ, తన సామాగ్రిని సర్వ ప్రపంచము నుండి కోసి తీయును.
1KGS 5:9,16
22మరియు ఒకవేళ ఒక్క దేశములో మాత్రమే లభించే ఒక మంచి రకమగు రాతిని వారు కోయుచుండగా, మరియు ఇంకొక రాతిని ఇంకొక దేశములో కోయుచుండగా, ఆ దేశము మరియొక దేశములో కోయబడిన ఆ రాయితో ఈ రాయిని అమర్చబడవలెను.
ఇప్పుడు, కోయబడుచున్న ఈ వింత రకమగు రాళ్ళను చూచుచున్న వ్యక్తులకు మరియు జనులకు చాలా వింతగా ఉండవచ్చును. కానీ దేవుడు, తన యొక్క సొంత మార్గములో, ఏదో ఒక దానిని చేయుచున్నాడు. మరియు ఆ పాత సారూప్యమగు దానిని పోలినట్లుగా ఈ రోజు ఆయన దానినే చేయుచున్నాడని నేను తలంచుచున్నాను. ఆయనకు ఇష్టమగు రీతిలో ఆయన వాటిని కోయుచున్నాడు.
ఒకరి స్వదేశములో కోయబడుచున్న సామాగ్రి మరొక దేశములో కోయబడుచున్న సామాగ్రికి మరి విశేషముగా ఉన్నదని ఇప్పుడు మనము కనుగొన్నాము, మరియు అవన్నీ కూడా ఎద్దుల బండ్లతో మరియు మొదలగు వాటిద్వారా రవాణాచేయబడుచున్నవని మనము కొనుగొని యున్నాము. కొన్ని సముద్రము ద్వారా వచ్చినవి, మరియు కొన్ని ఎద్దుల బండి ద్వారా వచ్చినవి, మరికొన్ని యొప్పాకు బల్లకట్టు ద్వారా తేలుతూ వెళ్ళినవి, మరియు ఆ విధముగా బలముతో ఈడ్చుకొని వెళ్ళిరి. దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణము చేయుట కొరకు, ఒక ఉద్దేశము కొరకు, అవన్నియూ ఒక చోటికి వచ్చుచున్నవి.
1KGS 5:6
23ఆ కేదారులు లెబనానులో కోయబడినవి. లెబనాను కేదారులు ప్రపంచమంతా ఉన్న కేదారుల కంటే చాలా శ్రేష్టమైనవి ఈ రోజు ఉన్నట్లుగా, ఎర్రచందనం దొరకు ఒకే స్థలము, అది కాలి ఫోర్నియాలో, మరియు ఆఫ్రికాలోని మోసెల్బై అని పిలువబడు ఒక స్థలములో, ఒక ప్రఖ్యాతమైన చెక్క అది స్టింక్ వుడ్ (Stink Wood) అని పిలువబడుచున్నది. దానిని ఎక్కడా కనుగొనలేము గాని అక్కడ మాత్రమే లభించును. మరియు వివిధ రకములైన కలప అంతా వేర్వేరు దేశములలో దొరకును. కేదారు వృక్షములు లెబనానులో దొరకును, చాలా ఎత్తైన, పొడవాటి, ధృడమైన, కేదారు వృక్షములు అచ్చట లభించును. ఎందుకంటే అది ఒక ఉష్ణదేశము. దేశము ఎంత వేడిగా ఉంటే, కొయ్య అంత ధృడముగా ఉండును. మరియు దేశము ఎంత చల్లగా ఉంటే అది అంత మెత్తగా ఉండును. దానికి ఒక ఆత్మీయ కార్యము కూడా సాదృశ్యముగా ఉన్నది, చల్లగా మరియు విభిన్నముగా (ఆత్మయందు) ఉండిన, అది మెత్తబడి మరియు తేలికైపోయి కొట్టుకొనిపోవును. కానీ అది వెచ్చగా ఉండి, ఆత్మతో నింపబడినప్పుడు, అది గట్టిగా పట్టుకొని యజమానుని చేతిలో చక్కగా ఉపయోగపడును.
EXOD 25:9•
HEB 8:5
24ఇప్పుడు ఈ గొప్ప కేదారులు నరుకు వారిచే నరికివేయబడుట మనము కొనుగొనుచున్నాము. మరియు వారు నమూనాను కలిగి యున్నారు. ప్రపంచములోని వేర్వేరు ప్రదేశముల నుండి వాటిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము గమనించినట్లయితే, సీనాయి పర్వతము మీద మోషే చూచిన ఆ పరలోకమందున్న మాదిరి (నమూనా)కి విరుద్ధముగా ఒక్క చిన్న మార్పును కూడా సొలోమోను మార్చలేదు, పరలోకములో మోషే తన యొక్క దర్శనము నుండి తిరిగి వచ్చినప్పుడు, తను పరలోకములో చూసిన విధముగా మాత్రమే ఆ గుడారమును వేసెను.
మరియు సొలొమాను ఆలయమును నిర్మించుచున్నప్పుడు, తను చూసిన మాదిరిగానే ఖచ్చితముగా అదేవిధమైన పద్ధతిలోనే దానిని అతడు నిర్మించెను. మోషే ఒక శాశ్వతమైన మాదిరిగా నుండుదాని కొరకు గుడారమును వేసెను. ఎందుకంటే అది ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశమునకు మార్చబడినది. కానీ, సాలొమాను, మోషే పరలోకములో చూసిన విధముగా మాత్రమే ఆ ఆలయమును తయారు చేసెను. వాటన్నిటిని ఏకము చేసి ఖచ్చితముగా ఒకదానితో మరొకదానిని ఒక క్రమ పద్ధతిలో వాటిని అమర్చెను.
ఏ విధమైనట్టి ఆత్మీయ కార్యమును మనము ఇచ్చట అన్వయించ గలము. ఎందుకంటే మనము లేఖనములను విడిచిపెట్టుటకు కాదు. ఖచ్చితముగా ఆ మాదిరితోనే మనము నిలిచియుండవలయును. ఆ కారణము చేతనే, నేను నమ్ముచున్నాను, ఆదిలో ఉన్నట్లుగానే, ఆ మొదటి సంఘము ఆ మాదిరిగానే నిర్మించబడినది, అదే విధమైన మాదిరితోనే తదుపరిది కూడా నిర్మించబడవలయును. మరియు అదే విధమైన మాదిరితోనే ప్రతి ఒక్కొక్కరు నిర్మించబడవలయును. ఒక నిజమైన సంఘము కూడా అదేవిధమైన మాదిరిని దేవుడు కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మంచిది.
1KGS 6:7
25తమ స్వదేశములో కోయబడిన ఆ సామాగ్రి ఒక ప్రదేశమునకు తేబడెను. వారు వాటన్నింటిని ఒక్కటిగా సమకూర్చినప్పుడు. ఇప్పుడు నేను 16వ అధ్యాయము నుండి చదువుచున్నాను లేదా దానిలో నుండి దీనిని చెప్పుచున్నాను. ఇప్పుడు వారు వాటన్నింటిని ఒక్కటిగా సమకూర్చి అచ్చటికి తెచ్చినప్పుడు, అవన్నియు ఒకదానితో ఒకటిచక్కగా ఖచ్చితముగా సరిపోయెను. అది నిర్మించుటకు నలువది సంవత్సరముల వ్యవధి పట్టినది, కానీ ఒక్క రాయి. ఏ ఒక్కరాయి కూడా మరలా కోయబడలేదు. నలువది సంవత్సరముల వరకూ, ఒక రంపపు శబ్దము, లేదా ఒక సుత్తి దెబ్బ కూడా వినిపించలేదు. రాళ్ళతో నిర్మించిన ఒక రాతి కట్టడము పని గురించి వ్రాయబడిన మాటలు ఇవి.
ఇప్పుడు మనము దేనినైనా చేయుచున్నట్లైతే, అది దేవుడు మనకొరకు ఏర్పరచిన ఆ విధానమైన మాదిరితోనే దానిని చేయవలెనని అది చూపించుచున్నది. అందులో చాల రాళ్ళు చాల వింతగా మరియు భిన్నముగా కనిపించే ప్రతీ రాయి అమర్చబడుటకు ఆ ఆలయములో ఒక స్థానమున్నది. వాటి కొరకు దేవుడు ఒక స్థలమును కలిగియున్నాడు.
మన పరిచర్యలు మరియు మనము ప్రత్యేకమైన శైలిలో ఆరాధించే మన విధానము ఒక చక్కటి అందమైన మాదిరిని కలిగినదై ఉన్నట్లుగా లేదా ఒక ప్రత్యేకమైన మాదిరిని కలిగియున్నట్లుగా అది చూపించును. ఆ ఆలయము నిర్మించినప్పటికీ, అందరూ ఏకముగా కూడి, వింతగా ప్రవర్తించు ప్రతీ వ్యక్తికి ఒక స్థలమును కలిగియుండును. ఒక నిజమైన ఆలయము గూర్చి పిదప మనము కొన్ని నిమిషములలో రాబోవుచున్నాము. కొంతమందికి మనలను చూస్తే కొద్దిగా హేళనగా కనిపించవచ్చును, మన ప్రవర్తన వారికి వింతగా ఉండవచ్చును. అయినా గాని గుర్తుంచుకోండి, ఆ స్థలమందు మనకొక స్థానము కలదు. దేవుడు తన సంఘమును దానిని నుండి కోసి తీయుచున్నాడు. ప్రతి చిన్నరాయి అది ఏ స్థలమందు అమర్చబడవలయునో అది ఖచ్చితముగా ఆ స్థలమందే అమర్చబడవలెను.
1KGS 6:7
26మరియు గుర్తుంచుకొనండి, అవి ఒకదానితో ఒకటి ఖచ్చితమైన స్థానమందు సరియైన విధానముగా అమర్చబడుటకై ఆ స్థలము నుండి అవి కోసి తీసుకొనిరాబడినవి. కాని అవన్నియు ఏకముగా సమకూర్చినప్పుడు ఏ ఒక్కరాయిని కూడా మరలా చెక్కవలసిన అవసరము లేకపోయెను. అవి అప్పటికే కోయబడెను. వాటి యొక్క స్థానములో అవి అమర్చబడుటకు సరిగ్గా సరిపోవునట్లు దేవుడే దానిని కోసి తీసెను. ఓ! ఆత్మ సంబంధమైన దానికి ఎటువంటి ఒక మాదిరిని మనము కనుగొని యున్నాము, దేవుని యొక్క ప్రతీ వరము, తిరిగి జన్మించబడిన క్రైస్తవుల యొక్క ప్రతీ వింత ప్రవర్తన, వారియొక్క ప్రత్యేకమైన శైలి, అది దాని స్థానమందు దానిని కలిగియుండెను. అది ఆ శరీరములో సరిగ్గా సరిపోయెను. అది దాని యొక్క సరైన స్థానమునకు వెళ్ళెను.
మరియు మనలో చాలామంది ఇలా చెప్పుటకు ప్రయత్నించెదరు, "ఇప్పుడు, అది దేవునిది కాదు," ఒక మంచి, పరిశుద్ధమైన, ప్రత్యేకపరచబడిన సిలువయొక్క సైనికుడుగా ఉండవలయును. "ఇప్పుడు, మనము క్రితము రాత్రి చర్చిలో నిలబడియున్నప్పుడు ఒకానొక విషయము విన్నాము. అది దేవునిది కాకపోవచ్చు." అని మనము చెప్పెదము, కానీ అది ఆ విధానమైన మాదిరితో ఏకీభవించిన యెడల, అది లేఖనములతో ఏకీభవించిన యెడల అది వింతగా ఉన్నట్లుగా ఉన్నను, కాని అది ఏ స్థానమును కలిగియున్నదో ఆ స్థానము యొద్దకే అది వెళ్ళును. గమనించారా? అది ఖచ్చితముగా దానియందు అది ఇమిడిపోవును. దానిని మరలా కోయుట లేదు. మెరుగు పెట్టుట అవసరము లేదు. వింతగా ఉండు వీటిని ఒకదానితో ఒకటి అమర్చుటకు అవి ఏది ఏ స్థలమందుయుండవలయునో ఆ స్థలము యొద్దకు తీసుకుని వచ్చుచు ఇప్పుడు గొప్ప నిర్మాణకుడగు ఆ క్రీస్తే వాటిని సిద్ధపరచుచున్నాడు.
PS 118:22•
MATT 21:42•
MARK 12:10•
LUKE 20:17
27ఇప్పుడు మనము గమనించిన ఎడల, ఇక్కడ ఈ భవనములో, తరువాత అధ్యాయము, అది, ఈ భవనములో, (క్రీస్తు సంఘమనే ఆలయ భవనములో- తర్జుమాదారుడు) భవనమును కట్టువారికి వాస్తవముగా చూచుటకు వింతగాను మరియు పనికిరాని రాయిగా కనిపించు ఒక రాయి అచ్చట ఉండగా, "ఈ వింతగా కనిపించే రాయిని ఎక్కడా ఉపయోగించుటకు దీనికి ఏ స్థలము లేదు, ఇది పనికిరానిది" అని భవనమును కట్టువారు ఆ రాయిని ఒక మూలకు విసిరివేసిరి. వాస్తవముగా చాలా వింతగా ఉన్నవట్టిదైన ఒక రాయి ఉన్నది, కనుకనే ఆ భవనము దానిని నిరాకరించిరి. కనుక వారు దానిని ఒక మూలకు గెంటివేసిరి "ఉపయోగించుటకు ఆ రాయి చాలా వింతగా ఉన్నది. దానిని ఉపయోగించుటకు అటువంటి స్థలము ఏదియును లేదు." ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ భవనము నిర్మించువారు మాత్రమే దానిని గూర్చి వ్యత్యాసముగా తెలుసుకొనవలసియున్నది. యేసు దానిని గూర్చిపలికెను.
కానీ, వారు వచ్చి ఆ రాయిని వెతికినా కనుగొనలేనంతగా దానిని త్రోసివేసిరి. ఆ యొక్క భవనమును చాలా ఎత్తుగా నిర్మించెను. ఆ రాయి ఎక్కడ ఉందో వారు ఎరుగక యున్నారు. వారు బహుశా అన్ని ఓడలను వెతికియుండ వచ్చును. వారు ప్రతీ ఎడ్లబండి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళి వెదికి వుండవచ్చు, వారు యొప్పా మరియు ఇతర ప్రాంతములంతా వెదుకుటకై దూతలను పంపి యుండవచ్చును. ఇంకా ఏమైనా సరుకు బండ్లు రావలసియున్నదా? లేదా "ఏదైనా ఒక బండి దారితప్పి వెళ్ళిపోయినదా?" అని వారి అడిగి వుండవచ్చును. ఎక్కడో తప్పు జరిగినది. ఈ స్థలమునందు పెట్టవలసిన ఆ రాయి ఎచ్చట ఉన్నదో మనము కనుగొనలేక పోవుచున్నాము.
వారు ఆ రాయిని వెదకి కనుగొన లేకపోయినప్పుడు, అలా వారు వచ్చిదానిని వెదకుచూ ఉండగా, అది ఎక్కడో లేదు, వారు ఎచ్చటైతే దానిని విసిరివేసిరో సరిగ్గా అచ్చట ఆ మైదానమందే అది పడియుండెను. వారు త్రోసివేసిన ఆ రాయే వారికి మూలకు ప్రధానరాయి అయ్యెను.
యేసు దాని గూర్చి మాట్లాడుతూ, "ఆ భవన నిర్మాణకులు నిరాకరించిన ఆ రాయి గూర్చి మీరు చదువలేదా?" అదే అన్నింటికి తలరాయియై ఆ భవనము అంతటికి ఆధారముగా నిలచియుండు ప్రధాన మూలరాయిగా అది వారికి మారెను.
28ఈ రోజు దేవుడు ఆరాధింపబడుచున్న ఆ ఆత్మీయమైన భవనములో, ఈ రోజు ఆ భవన నిర్మాణకులలో ఒక గొప్ప పెద్ద వైఫల్యము ఉన్నదని నేను అనుకొనుచున్నాను. మనము మన యొక్క సంఘ శాఖలతో వచ్చియున్నాము, మరియు వాటిని ఒక నిష్కపటమైన వాటిగా ఉంచాము. మనము మన బాలురను సంఘము ఎదుట ఏ విధముగా నేర్పుగా మాట్లాడవలయునో నేర్చుకొనుటకు బైబిలు పాఠశాలకు పంపియన్నాము, వారికి తత్వశాస్త్రము మరియు బైబిల్ చరిత్ర నేర్పియున్నాము. మరియు మనము సమస్తమును చేశాము, అందమైన ప్రత్యేక స్థలములను నిర్మించాము. ఎత్తైన పొడవాటి గోపురములను కట్టియున్నాము, మరియు అందమైన సంగీతము, అలాంటివాటితో దానిని మనము నిర్మించి యున్నాము. కానీ ఏదో తప్పు జరిగినదని మనము కొనుగొనియున్నాము.
ఒక మానవ కల్పితమైన వాటి ద్వారా నిర్మింపజేయుటకు మనము ప్రయత్నించాము, విద్య దేనినయితే తయారు చేయుచున్నదో, బైబిలు పాఠశాలలనే ఈ సెమినరీలు వారు ఇచ్చు జీతములు వారిని దేనినుండి దూరముగా తీసుకొనిపోవుచున్నాయో, అవన్నియు మనము కల్పించుకొన్న మానవ కల్పిత మార్గములు. విద్యా విధానము మీదను, భత్యము చెల్లించే జీతాల మీదనూ మరియు సంఘ శాఖల మీదనూ మనము దానిని కట్టుటకు ప్రయత్నించితిమి. ఆ వింతయైన రాయిని, ప్రత్యేకమైన ఆ రాయిని మనము అంగీకరించనంతవరకు ఇవన్నీ ఏమియు పనిచేయవు.
కానీ ఆ భవనము నిర్మించుట ఆరంభించినప్పుడు, వారు వదిలివేసిన ఆ ఖాళీలో, ఆ వింతరాయి, సరిగ్గా సరిపోవుటను వారు గుర్తించియున్నారు. ఆ ఆత్మీయమైన నిర్మాణికులు ఈ రోజు కూడా అలానే ఉన్నారు. కనుకనే క్రీస్తు యొక్క ఆ వధువు భవనము వరుని కొరకు ఇంకా సిద్ధముగా లేదు, ఎందుకంటే పెంతుకోస్తు దినాన పునాది వేయబడిన ఆ ముఖ్యమైన మూలరాయిని ఆభవన నిర్మాణికులు నిరాకరించుట వలననే, అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. చూశారా?
29అది వింతయైనది. ప్రజలు వింతగా ప్రవర్తించెదరు. మన తత్వశాస్త్రము, మన విద్య, మన బోధన, మన సిద్దాంతములతో వారు ఆ క్రమములోకి రాలేరు. అది అచ్చట అమర్చుటకు కుదరదు. అది అక్కడ సరిపోదు. వారు దానిని తన్నివేసిరి, ఎందుకంటే అది చాలా వింతగా ఉన్నది, చాలా ప్రత్యేకముగా ఉన్నది, మనుష్యులమైన మన ప్రణాళికలయందు గానీ, సంఘము ఏమై ఉండునో అను ఒక ఆలోచనయందు గానీ అది అంగీకరింపబడు దానిగా ఉండదు.
"సానపెట్టబడిన జ్ఞానుల గుంపుగా అది ఉండినను, చక్కని దుస్తులు ధరించిన ఒక జనుల గుంపుగా అది ఉండినను, ఏదో ఒక దానిని కలిగియున్న జన సమూహముగా అది వుండిననూ అచ్చట వారు విద్యా కార్యక్రమములు ఏర్పాటు చేయుటకు ప్రయత్నించిననూ లేదా మన ఐదు ఇంద్రియములను తృప్తిపరచుకొనే విధముగా ఏదైనా ఒకదానిని కలిగి యుండిననూ, ఏదో చూస్తూ లేదా రుచి చూస్తూ అనుభూతిని చెందుతూ లేదా ఏదో ఒక దానిని ఉల్లాసముగా కలిగియుండు ఒక సమూహముగా వారు ఉండవచ్చును. దానిలో చాలావరకు కళ్ళు చూస్తూ ఆనందించుచూ, కేరింతలు కొట్టుచూ ఉండు కార్యక్రమము కలిగి యందురు. "మా చక్కటి జనులను చూడండి. నగరంలోని మా యొక్క ఉత్తమ గుంపును చూడండి. మేయర్ మా దగ్గరకు వచ్చును. మా నగరంలోని ముఖ్య అధికారులు, ముఖ్యపోలీస్ అధికారి మా సంఘమునకు వచ్చెదరు."
కాని అది నిజస్థితికి వచ్చినప్పుడు, అప్పుడువారు, "ఓ మన భవనము మరియు మనము కలిగియున్న సమస్తము పనికిరాని సున్నపు మిశ్రమము మరియు అది ఒట్టి రాయి మాత్రమే" అని వారు కనుగొనెదరు. ఆ భవనము పనికిరానిదై యున్నది. వారు ఆ మార్గమును తిరస్కరించిరి, దేవుడు దాని కొరకు సిద్ధపరచిన ఆ రాయిని వారు తిరస్కరించిరి. వారు దానిని తిరస్కరించిరి.
30ఇప్పుడు, తరువాత అధ్యాయములో, తామెచ్చట తప్పిదమును చేసితిరో కనుగొన్నప్పుడు వారికి కావలసియున్న అన్ని రకముల రాళ్ళన్నీ అచ్చట ఉన్ననూ వారు వాటిని ఒకదానితో ఒకటి జతకూర్చలేక పోయిరి. ఇంకా అచ్చట పెట్టవలసిన సరియైన ఒక రాయి అచ్చట లేనిదాని వలన ఆ స్థలమందు ఒక ఖాళీ ఏర్పడినది.
మనము ఇప్పటికే రాళ్ళను కలిగియున్నాము, దేవుడు ముందుగా ఏర్పరచిన రాళ్ళు చూశారా? ఎఫెసు నుంచి లవొదికయ వరకూ మనము వాటిని కలిగియున్నాము. ఆ భవన నిర్మాణికులు నిరాకరించిన తలరాయి కొరకు మాత్రమే మనము ఎదురు చూచుచున్నాము. తలరాయి అగు ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము, మరియు ఎప్పుడు… ఈ గొప్ప రాళ్ళు ఏవనగా ఒప్పుకోలులు. ఇప్పుడు, మనము చేసే తప్పిదములను ఒప్పుకొనటము అనునదియే ఒకరాయి అని మనము ఎరిగియున్నాము.
MATT 16:13-18
31మన కేథలిక్ ప్రజలు ఏమి చెప్పెదరనగా… యేసు మాట్లాడుచూ, ఇలా చెప్పెను, "ఈ బండమీద లేదా ఈ రాయి మీద, నేను నా సంఘమును కట్టెదను." కేథలిక్ యొక్క రోమా సంఘము ఏమి చెప్పుతుందంటే ''అది పేతురు, ఎందుకంటే అతను ఒక రాయి, అక్షరార్ధముగా, దానికర్థము ఒక మానవుడని, అతడే సీమోను పేతురు." కొన్ని దినముల తరువాత అతను వెనుకడుగు వేసెను. ఇప్పుడు మనము కనుగొనినచో, ప్రొటెస్టెంట్లు ఏమి చెప్పెదరనగా, "ఆ రాయి, క్రీస్తే,"
"అది తిరస్కార యుక్తమైనది కాదు గానీ, మీరు లేఖనము పరిశీలించినచో, అది వారిరువురిలో ఎవరో ఒకరు" అని చెప్పెదరు. క్రీస్తు ఎవరై యున్నారనే దాని విషయమై అది పేతురు యొక్క ఒప్పుకోలు మరియు ప్రత్యక్షత అయి ఉన్నది, ఎందుకనగా ఆయన ప్రశ్న అడిగెను, దానికొక సంబంధము కలిగిన ఒక ప్రశ్న అది. "మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారు?" "కొందరు, మోషే అనియూ, కొందరు ఏలియా అనియు, మరి కొందరు, ఎవరో ప్రవక్త ఎముకలు తగిలి లేచెననియు, లేదా మరేదో, అది ఆయనే."
కానీ ఆయన చెప్పెను, "మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు? ఆయన అడిగిన ప్రశ్న.
అదే పేతురు చెప్పెను, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవు."
"సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, రక్తమాంసములు ఎన్నడునూ నీకు దీనిని బయలుపరచలేదు. నీవు ఒక గ్రంథము ద్వారా దీనిని నేర్చుకొన లేదు. నీవు ఒక సెమినరీలో దీనిని వినలేదు. కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను. మరియు ఈ బండమీద, దేవుని వాక్యము యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద," ఏమనగా ఆయనే వాక్యము, "నేను నా సంఘమును కట్టుదును. మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు."
32అదే నిజమైన సంఘము; సిమెంట్ మిశ్రమము కాదు, ఇటుక కాదు, రాయి కాదు, మరియు అలాంటివి కావు, అవి నశించిపోవును. కానీ నిజమైన సంఘము వాక్యము యొక్క ప్రత్యక్షత మరియు దేవుని యొక్క చిత్తము మీద నిర్మించబడియున్నది. ఎఫెస్సు సంఘ కాలము నుండి లవోదికయ వరకూ వారు శరీరమనే స్థలమందు అమర్చబడి ఉన్నారు.
కానీ ఏమిటి. ఒకానొక దినమున సొలొమోను మందిర నిర్మాణము సమాప్తమైనది మరియు ఆ ప్రధానమైన మూలరాయిని, నిరాకరించబడిన దానిని ఆ భవన నిర్మాణికులు అంగీకరించినప్పుడు, అప్పుడు ఆ భవనము పైకి వెళ్ళుట ప్రారంభించినది.
ప్రతీ సంఘములోనున్న ప్రతీ సభ్యునికి, మరియు ఆలోచించు ప్రతి మానవునికి ఎంతో గౌరవముతోనూ మరియు గొప్ప వినయముతోనూ నన్ను చెప్పనివ్వండి. తిరస్కరించబడిన దానిని ఈ రోజు మన భవన నిర్మాణికులు అంగీకరించినదానికి బదులుగా ఆనాడే పరిశుద "బండరాళ్ళ గుంపు ఎప్పుడూ తప్పులను ఒప్పుకుంటూ ఉండే వింత వ్యక్తుల గుంపు" అని హేళనగా పిలిపించుకుంటూ, వెలుపలకు గెంటివేయబడిన వారుగా అప్పుడే వారు ఉండిన యెడల ఆ భవనము ఎంతో త్వరితముగా పూర్తియై యుండెడిది.
DEUT 10:8•
2CH 5:1,2,4
33కానీ మీరు గమనించారా? భవన నిర్మాణము పూర్తి అయిన తరువాత కూడా, అది ఇంకా ఖాళీగానే యున్నది. కేవలము కలపతో చేయబడిన వస్తువులు తప్ప దానిలో ఏమీ లేదు. కనుక సొలోమోను తాను చేయగలి గినదంతా చేసెను. ఇప్పుడు దానిని ప్రతిష్ఠించు ఆ గొప్ప రోజు వచ్చెను. ఏదో ఒకదానిని ఆరాధించుటకై ఆరాధించువారి కొరకు ఇప్పుడు ఆ భవనమును వారు అచ్చట ప్రతిష్టించబోవుచున్నారు. ఇప్పుడు వారు ఆరాధించుటకు అందులో ఏమీ లేని ఎడల ఆ భవనము వ్యర్థమైనదిగా వుండును. కానీ ఆ భవనము ఇప్పుడు ప్రతిష్ఠ కొరకై సిద్దపడియున్నది.
లేవీయులు మరియు యాజకులు, వేల కొలది బూరలు ఊదుచూ ఆకాశమును బ్రద్ధలు చేయుచుండగా, పాపము బలి అర్పణకొరకు గొర్రె తరువాత గొర్రె చనిపోవుచుండగా, మరియు లేవీయులు వారి స్థానములు వారు తీసుకొనగా, మూలకు వెళ్ళి వారి యొక్కకర్రలు తీసుకొని, ఎక్కడైతే లోపల ఆ రాతి పలకలు ఉంచబడినవో ఆ మందసము యొక్క ఉంగరములలో వాటిని దూర్చెను. రెండు రాతి పలకలు, (ఒక్కటే రాయి. "ఈ రెండు ఒక్కటే," ఒకే ఆజ్ఞ ఒకే నిబంధన.)
కెరూబూలు మరియు వాంటి రెక్కలు ఒక దానితో ఒకటి తగులుకొనుచున్నప్పుడు, ఈ రెండు రాతి పలకలు.
2CH 5:5,7,12,13
34ప్రత్యేకపరచబడి మందసమును మోయగలిగిన ఆ లేవీయుల గుంపు మాత్రమే ఆ మందసమును మోయవలెను. ఏ మనుష్యుడు దానిని తాక కూడదు. బయటవారు తాకినచో, అతను చనిపోవును. ఈ ప్రత్యేకమైన దానికొరకు సేవ చేయుటకు ప్రత్యేకించబడిన వారమని వారు ఎరిగి, వారు ఆ కర్రలను ఎత్తుకొనిరి. దేవుడు (మోషేకు) చెప్పినట్లుగా ఆ మందసమును నిర్మించుట కొరకు, ఆ ఉంగరములలో ఆ కర్రలను దూర్చిరి. వాటియొక్క గుడారములలో నుండి దానిని పైకి లేపెను.
వారు ఆ మందసము ఎదుట నడుచుట ప్రారంభించిరి. బూర ఊదసాగిరి. తంబురలు వాయించసాగిరి, యెహోవా ముందు బలి అర్పించబడిన మృత జంతువుల యొక్క కళేబరముల నుండి పొగ పైకి వెళ్ళుచున్నది. ప్రతిష్ఠ చేయబడవలసిన భవనము గుండా వారు వచ్చిరి, ఆ మందసము విశ్రాంతి తీసుకొనవలసిన స్థలమునకు దానిని తీసుకొని వచ్చిరి, దాని కొరకు సిద్ధము చేసిన పెద్ద స్థలముల యొక్క రంధ్రములలో అది అమర్చబడినది. అది అమర్చబడినప్పుడు, చివరిగా అది రావలసిన స్థలమునకు ఆ మందసము వచ్చినప్పుడు, బైబిల్ చెప్పినది, "దేవుడే ఆ స్థలము పైకి దిగి వచ్చెను, ఆ మందిరమంతా ఆయన నిండుకొని యుండెను. ఆ అగ్ని స్తంభముఎంత గొప్ప మహిమతో వచ్చెననగా, ఆ దేవుని యొక్క మహిమ వలన యాజకులు ఇంక ఎంత మాత్రము అక్కడ సేవ చేయలేకపోయిరి."
2CH 5:13,14
35చివరగా ఆ మందసము దాని యొక్క విశ్రాంతి స్థానమును అది కనుగొనినప్పుడు, ఆ స్థలమంతటిని ఆ షెకీనా మహిమ ఆవరించి యుండెను. తలరాయి, మూలరాయి కాదు; ఆ తలరాయే ముఖ్యమైన రాయి. ఈ ముఖ్యమైన రాయినిపెట్టేంతవరకు మిగతా రాళ్ళు అన్నీ కూడా అప్పటి వరకూ ప్రభావము లేకుండెను. కానీ ముఖ్యమైన రాయియగు ఈ తలరాయి లోపలికి వచ్చినప్పుడు ఆ తరము కొరకు అది తీసుకోవలసిన స్థానమగు ఆ విశ్రాంతి స్థానమును అది తీసుకొనెను. వారందరూ కూర్చొని ఉన్న స్థలమును దేవుని యొక్క మహిమ ఆవరించెను, మరియు ఆ భవనమంతా షెకీనా మహిమతో నిండుకొనెను. దాని యొక్క ప్రభావము ఎంతో గొప్పదిగా ఉండెను. ఎట్లనగా అచ్చట సేవచేయుచున్నయాజకులు కూడా అచ్చట సేవ చేయలేకపోయిరి.
1CH 17:12•
ACTS 7:46-49•
HEB 10:5
36ఆలయ ప్రతిష్ఠ నుండి దానిని తీసుకొని ఇప్పుడు మనము చదివితిమి. మరలా మనము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనమునకు వెళ్ళెదము. సైఫను, గుర్తింపదగిన ఒక ప్రసంగము బొధి౦చినప్పుడు, అతను చెప్పెను, "సొలోమోను ఆయనకు ఒక ఆలయమును నిర్మించెను, ఎందుకంటే అతను నిర్మించునని దావీదు ద్వారా అతనికి వాగ్దానము చేయబడెను." తాను ఆలయమును నిర్మించెదనని దేవుడు దావీదునకు వాగ్దానము చేసెను. మరియు దేవుడు… మాదిరిలో, మూలమగు మాదిరిలో నుండి, తీయబడవలసిన ఒక మాదిరిలో నుండి దానిని తీయవలయును. ప్రతిష్ఠ కొరకు బలి అర్పణకు కావలసిన గొర్రెల మాదిరిగా ఒక నిజమైన గొర్రె బలి అర్పణ కొరకు రావలెను. ప్రతీ సహజ సంబంధమైనది ఆత్మీయమైన దానికి మాదిరిగా వున్నది.
మరియు ఇది జరుగుట మనము కనుగొనినప్పుడు, సైఫను దాని కొరకు మాట్లాడుచున్నాడు. "మన పితరులు దేవుని చేత దయను పొందిరి, మరియు సొలోమోను ఆయనకు ఒక మందిరము కట్టించెను. కానీ సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు, ప్రవక్త పలికిన ప్రకారము, "ఆకాశము నా సింహాసనము, భూమినా పాద పీఠము, మరియు మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మరియు మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు?" అని ఆయన చెప్పెను.
మరియు (హెబ్రీ 10:5ల) ఎంత అందముగా ఉన్నది, "కానీ నాకొక శరీరమును అమర్చితివి," దేవుడు ఒక శరీరములో నివసించునని అది చూపించుచున్నది." "… అమర్చితివి." ఓ!
ACTS 1:15•
ACTS 2:1
37నిజమైన గొర్రె బలిగా అర్పించబడినట్లుగా ఈ శరీరము ఒక బలి అర్పణముగా అర్పించిన పిదప అచ్చట రావలసియున్న ఆయన యొక్క వధువుయగు దేవుని యొక్క సొంత శరీరము కొరకు ఆయన వచ్చెను. తమలో వున్నసమస్త అవిశ్వాసమును బయటికి ప్రాలద్రోలి, దేవుని కొరకు తమను ప్రతిష్ఠించుకొనుటకై దేవునిచే సృష్టించబడిన ఆలయముగా వారు తమను ప్రతిష్టించుకొనుటకై వారందరు అచ్చట ఏకముగా కూడుకొని పది దినములు ఎదురుచూసిరి. ఎప్పుడైతే వారు సంపూర్తిగా దేవునికి వారు సమర్పించుకొన్నారో అప్పుడు దేవుడు మరల షెకీనా మహిమతో అచ్చటకు దిగి వచ్చి వారు కూర్చునియున్న ఆ గది అంతటిని ఆయన తన మహిమతో నింపివేసెను.
JOEL 2:28•
ACTS 2:16,17
38ఆ దినము యొక్క వర్తమానమునకు తగిన విధముగా దేవుని మందసము ఎచ్చట ఉంచవలయునో ఆ స్థలమందు సరిగ్గా అది అమర్చబడినట్లుగా దేవుడు మరలా అదే విధముగా తనయొక్క సరియైన మార్గమునందే అచ్చటకు దిగివచ్చెను. ఒక సంఘశాఖ లోనికి కాదు లేక చేతులతో నిర్మించిన ఒక భవనములోనికి కాదు, కానీ మనుష్యుల యొక్క హృదయములలోనికి ఆయన దిగివచ్చెను. ఈ అంత్య దినముల కొరకు ఆయనకు చెందిన ఆయన యొక్క స్థలమందు ఆయన దిగెను. ప్రవక్త యోవేలు చెప్పినట్లుగా, "ఆ దినములలో నేను సర్వజనుల మీద నా ఆత్మను క్రుమ్మరింతును; మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు." ఆయన విశ్రాంతిని పొందునట్లుగా ఏ స్థలమును ఆయన కనుగొనునో, దేవుడు ఆ విశ్రాంతి స్థలమ యొద్దకు విశ్రాంతిని తీసుకొనుటకు వచ్చెను. ఒక భవనములో ఆయన దానిని కనుగొనలేదు గాని మానవుల హృదయమందు ఆయన విశ్రాంతిని తీసుకొనుటకు ఒక స్థలమును కనుగొనెను.
GEN 11:4,7•
ACTS 2:11
39ఎంతటి సిగ్గు, ఎంతటి హీనము, నిమ్రోదు యొక్కమానవ కల్పిత పద్ధతి అక్కడికి వచ్చెను. నిమ్రోదు ఎప్పుడైతే పరలోకమును తాకెడి ఒక భవనము లేదా ఒక సంస్థ కట్టుటకు ప్రారంభించెనో, దేవుడు దానిని తారుమారు చేసెను. అది మనుష్యులకు మంచి చేయుటకు బదులుగా అది సిగ్గుపడునట్లుగా చేసెను. మనుష్యుల యొక్క భాషను ఆయన తారుమారు చేసెను. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుటలేదు. అది సహోదరత్వమును విరిచివేసెను.
సంఘమను ప్రజలగు ఆయన యొక్క స్వంత ఆలయము యొద్దకు దేవుడు వచ్చునప్పుడు, ప్రతిష్టించబడిన ఆలయములు (మానవ హృదయములు) అచ్చట యుండగా, వారి యొద్దకు ఆయన వచ్చినప్పుడు, వారిని ఆయన నింపెను. ఆయన సొలొమోను దేవాలయములో చేసిన విధముగా వారి హృదయములను నింపెను. సిద్దాంతముల ద్వారా కాదు, సంఘ శాఖలద్వారా కాదు గానీ తనకు తానే ఆయన వారియందు నింపుకొనెను. ఆయన యొక్క షెకీనా మహిమతో ఆ దేవాలయమును ఆయన నింపెను. పెంతుకోస్తు దినమున ఆయన అలాగుననే చేసెను. అక్కడ ఉన్న నూట ఇరవై దేవాలయములను (మానవ హృదయములలో) దేవుడు తనకు తానుగా, పరిశుద్ధాత్మ రూపముతో వారిలో నిండుకొనియుండెను. షెకీనా మహిమ బలముగా వారిపై క్రుమ్మరింపబడెను.
ఒక గొప్ప గోపురమును కట్టుచుండగా ఒకరు మాట్లాడు మాటలు ఒకరికి అర్ధము కాకుండా తారుమారుగా మారిపోయిన పిదప నిమ్రోదు ఏమిచేయాలని ఆశించాడో దానిని అతడు చేయలేకపోయెను. అప్పుడు దేవుడు దిగివచ్చెను. ఆయన ఏమి తీసుకొని వచ్చెనో దానిని వారు ఎరుగునట్లుగా ఆయన ఏమి మాట్లాడుచున్నాడో దానిని ప్రతి ఒక్కొక్కరు అర్ధము చేసుకొనునట్లుగా ఒక్క గలీలయ భాషతో మాట్లాడుచూ ఆయన దిగివచ్చెను. ఆయనే దేవుని ఆలయముగా ఉండెను. దేవుని కొరకు ప్రతిష్టించబడిన ఆలయముగా ఆయన ఉండి, మానవ కల్పితమైన వాటియందు కాదు, మానవుడు చేసిన కార్యములయందు కాదు గాని దేవుడు తనకు తానే చేసుకొనిన దానియందు నివాసమై ఉండెను.
40జనులకు అది హాస్యముగా నుండవచ్చును. వారికి అది అర్థము కాదు. దానిని పొందుకొనుటకు వారు జన్మించలేదు, కనుకనే వారు దానిని పొందుకోలేరు. బైబిల్ అలాగే చెప్పుచున్నది. మంచిది. దేవుడు తప్పక తన ఆలయమును నింపును. ప్రతిష్ఠ దినమున ఆయన తన యొక్క ఆలయమును నింపును. తనతోనే దానిని ఆయన నింపును. ఈ రోజు కూడా అదే అయివున్నది. తన కొరకు ఏ మనుషులైతే ఇష్టపూర్వకముగా ఆయన కొరకు తరచుగా తనను ప్రతిష్టించుకొనునో అటువంటి ప్రతీ ఆలయమును దేవుడు నింపును.
ఆలయమనగా ఇక్కడ ఉన్న ఈ చిన్న భవనము కాదు. సాల్ట్ లేక్ నగరములో ఉన్న ఆ యొక్క ఆలయము కాదు. రోమ్లో ఉన్న ఆ యొక్క ఆలయము కాదు. దేశములన్నీ ఆయనను ఎరుగునట్లుగా మీ ద్వారానే ఆయన తనను తాను వ్యక్తపరచుకొనునట్లుగా నీలోనే ఒక ఆలయముగా ఆయన నివాసము చేయుటకు ఇష్టపడుచున్నాడు, ఆ ఆలయము నీవే. మీరు దేవుని యొక్క సజీవ ప్రతిమలై యున్నారు. దేవుడు మీ ద్వారా పనిచేయుటకు ఇష్టపడుచున్నాడు. మరియు ఏ పురుషుడైనా లేదా ఏ స్త్రీ అయినా వారీ లోకమందున్నవి సమస్త తప్పుడు బోధలన్నింటిని మరచిపోయి ఏ సమయమందైనా ఈ వాక్యానుసారమైన క్రమము యొద్దకు వారు తిరిగి వచ్చినప్పుడు అది వారిని వాక్య క్రమములో ఉంచును. మోషే చేసినట్లుగానే సొలొమోను చేసెను. దేవుడు చేసినట్లుగానే మోషే చేసెను. దేవుడు ఎల్లప్పుడూ దానినే గౌరవించును.
1THS 4:17
41మనలను మనము ఆయనకు సమర్పించుకొని, మనలను మనము ఖాళీ చేసుకొని మరియు మన హృదయములను తెరచి దేవునికి సమర్పించుకొని ఆ అసలైన విధానములో చక్కగా మనలను ప్రతిష్ఠించుకొనుటకు మరలా మనము తిరిగి వచ్చినప్పుడు ఆయన తన షెకీనా మహిమ మన హృదయమనే ఆలయములో ఆయన నింపును. అప్పుడు సజీవ సంఘములోను, సజీవ జనుల మధ్య ఆ సజీవుడగు దేవుని మహిమ కదలాడుచు ఆయన తన మహిమను వ్యాపింపచేసికొనును. పిదప, ఒకానొక దినమున ఒకరు ఈ మార్గము నుండి, ఇంకొకరు వేరొక మార్గము నుండి ఆ విధముగా అనేక దేశములలో ఒక్కొక్క భాగములో నుండి వధువుగా మనము ఏకముగా సమకూర్చబడి ఆయనను సంధించుటకు మనము ఆ మధ్య ఆకాశమునకు కొనిపోబడుదుము.
ఇప్పుడు, ఈ అందమైన సంఘము, ఈ భవనపు జనులు, సజీవ ఆనవాలుగా వారు జీవిస్తూ, క్రీస్తు ఎడల వారికియున్న ప్రేమనుబట్టి ఈ యొక్క ఆరాధనా స్థలమునకు జనులు వచ్చి ఆరాధించునట్లుగా ఈ రోజు వారు ప్రతిష్ఠించుకొనుచున్నారు. ఇప్పుడు నా యొక్క నిజమైన ప్రార్ధన ఏదనగా, ప్రతీ ఆరాధన. ఆరాధన కొరకు ఈ ఆరాధనా మందిరము ప్రతిష్టించబడుచుండగా ఈ మందిరముతో పాటు ఆరాధించు ప్రతీ భక్తిపరుడు తన హృదయమనే సొంత ఆలయమును ప్రతిష్ఠించుకొనవలయును అదే నిజమైన ప్రతిష్ట.
42కనుక, మన సమయము అయిపోయినది, కాని దేవునికి సమయము అనేది లేదు. మనందరము గుర్తించుకొందాము. ఎంత ఆలస్యమైనది? నేను వృద్ధులను చూస్తున్నాను. మీరు అనుకొన్నదానికన్నా అది త్వరగానే ఉండును. నేను యవ్వనస్తులను మరియు యవ్వన బాలికలను చూస్తున్నాను. చూడండి, ఒకానొక దినమున చిన్న బాలికలగు వారిని చెరచి, వారి జీవితములను నాశనము చేసినటువంటి చిన్న పిల్లలను మనము కనుగొంటిమి. ప్రతీ సంవత్సరము ఎంతమంది చనిపోవుచున్నారు? వేలల్లో గుండె నొప్పి ద్వారాను, కేన్సర్, పోలియో, వారిని చంపు ఏదైననూ, రోడ్డు మీద జరుగు ప్రమాదాలవలన చనిపోవుచున్నారు. మనకు తెలియదు, ఎంత యవ్వనస్తులమైనగాని లేదా వృద్దులమైనా గాని.
సమయము ఎప్పుడు వస్తుందో? అరలోనుండి తీయబడిన నీ కారు ఎప్పుడు పిలువబడుతుందో? దేవునికి తప్ప ఎవనికిని తెలియదు. అది మంచిది.
ప్రతిష్టించుకొనుటకై ఇచ్చటవున్న ప్రధాన పదార్ధముగా ఆ దినమున మనము ఇచ్చట వుండగా, సజీవ దేవునిని ఆరాధించుటకు ఆరాధికులుగా మనము వచ్చియుండగా, ఆ సజీవ దేవునిని ఆరాధించుటకై మనలను మనమెందుకు ప్రతిష్టించుకోకూడదు? ఆయనతో మనలను మనము ఎందుకు నింపుకొనకూడదు?
ఆ విధముగా చేసిన పిదప, మానవ శరీరమగు ఈ ఆలయములోనికి మరియు సజీవ దేవుని గృహములోనికి దేవుని యొక్క షెకీనా మహిమ మరల తిరగి వచ్చుటను మనము చూడగలము. సజీవ దేవుని ఆలయము మరియు మానవ శరీరము ఏకమైనప్పుడు అది ఒక గొప్ప ఉజ్జీవమై దేశములలో, పట్టణములంతటనూ, ఇచ్చట ఉండు ప్రతి స్థలమందు సమస్తమును తుడిచిపెట్టును. అచ్చట అటువంటి ఒక గొప్ప శబ్దమును అది కలిగియుండును. ఎందుకు, వారు దానిని ఆపలేరు. ఆ విధముగా చేయునది ఏదీ లేదు.
43సైఫనును మీరు ఆపగలరనుకొనుచున్నారా? ఎందుకు, భయంకరమైనగాలి వీచుచున్నప్పుడు ఎగసిపడుచున్న మంటలతో మండుచున్న గృహమువలె అతను ఉన్నాడు. ఏ ఎందుకని? మీరతనిని ఆపలేరు. సహెడ్డ్రిన్ కూడా అతనిని ఆపలేకపోయెను. మీకు తెలుసా, మరణము కూడా అతనిని ఆపలేకపోయెను. అతను జీవిస్తూ ఉన్నాడు. మరియు అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. అతను నిరంతరమూ జీవించును, ఎందుచేతననగా అతనికి నిత్య జీవమున్నది, మరియు దేవుని సేవకై ప్రతిష్ఠ చేయబడిన ఒక గృహముగా అతడుండెను.
ఈ ఉదయము, చేయబడినదానినంతటిని బట్టి, ఈ యొక్క సంఘము చేయవలెనని నేను అనుకొనుచున్న ఒక విషయమేమనగా సేవ కొరకై దేవునికి ప్రతిష్టించబోవుచున్న ఈ భవనముతో పాటు, మనలను కూడా మనము ప్రతిష్టించుకొందాము. ఒక్క క్షణము లేచి నిలబడుదాము
ప్రతీ ఒక్కరూ మీ యొక్క స్వంత విధానములో నీవు కోరుకొను రీతిలో ఎంతో మర్యాదతో ప్రార్ధించుము. దేవుని యొక్క సేవకొరకు, బలిపీఠము ఎదుట, నన్ను నేను ఈ రోజు మరలా ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మీరందరూ కూడా ఆ విధముగా చేసుకొనవలెనని కోరుచున్నాను. దేవుని కొరకు ఈ భవనము ప్రతిష్ఠ చేయుచుండగా, మనలను కూడా మనము ప్రతిష్ఠ చేసుకొందాము.
MATT 16:18•
ROM 3:4
44మా పరలోకపు తండ్రీ, ఈ ఉదయకాలమున ఎంతో దీనత్వముతోనూ మరియు నిష్కపటముగానూ మేము ఇక్కడ కూడుకొని యున్నాము. ఆరాధన చేయుట కొరకై నీవు వీరికి ఇచ్చియున్న ఈ భవనము, ఈ యొక్క సమూహము మీద నీవు చూపించుచున్న గొప్ప ప్రేమ మరియు వాక్యము యొక్క సేవకుడైన ఈ కాపరిని ఈ సంఘమునకు ఇచ్చినందుకు గొప్ప ఘనత అయి ఉన్నది.
ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఆరాధన కొరకు ఒక స్థలము ప్రతిష్ఠ చేయబడుచుండగా, ఆరాధికులుగా మేము సమస్తాన్నీ ప్రక్కకు పెట్టెదము, ప్రతీ అవిశ్వాసాన్నీ ప్రతీ క్రూరమైన ఆలోచననూ, నీవంటే ఇష్టపడని ప్రతీ దానినీ, మరియు నీ యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా మాలోనున్న ప్రతీ దానిని. ఏ మత సిద్దాంతమునైనా, ఏ మతశాఖ ఆలోచననైనా, లేదా పొరుగువారు లేదా ఎవని ఆలోచననైనా, అవి అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఉన్ననూ, అది ఈ వ్యక్తి యొక్క ఆలోచనగా మా యొద్దకు వచ్చినప్పుడు, బయటకు వెళ్ళునట్లుగా ఉన్ననూ, పరిశుద్దమైన ప్రత్యేకపరచబడిన పాత్రగా ఉన్ననూ, ఏదైనా.
ఏ వ్యక్తిదైనా గాని లేదా దూతదైనా లేదా మానవునిదైనా, ప్రత్యక్షమైనా లేదా ఈ యొక్క వాక్యములో పలుకబడిన విధముగా ఈ దినములలో నీ యొక్క ప్రణాళికకు అది వ్యతిరేకముగా నున్నదేదైనా, దానిని మాయొద్ద నుండి దూరము చేయుము. ఎవరో చెప్పినది కాదు గానీ; నీవు చెప్పినది! ఎందుకనగా అది ఇలా వ్రాయబడినది, "ప్రతీ మనుష్యుని యొక్క మాట అబద్ధము మరియు నా మాట సత్యము." క్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలుసుకొనుటకు మరియు నిజమైన వాక్యమును మేము నమ్ముటకు దూరముగా ఉంచుచున్న మాలో ఉన్నదేదైనా…
ఆయన పేతురుకు చెప్పినట్లుగా, "ఈ బండ మీద, నా సంఘమును కట్టుదును." దానికి వ్యతిరేకముగానున్నఏదైనా మాలో నుంచి తీసివేయుము, ప్రభువా, మాకు మేముగా దానిని ప్రక్కన పెట్టెదము. దానిని త్రోసివేయుచున్నాము. మరియు దాని స్థానములో ఆ ముఖ్య మూలరాయిని, ఆ పరిశుద్ధాత్మను అంగీకరించునట్లుగా, ఎందుకనగా నిజమైన దేవుని సంఘమునకు అదే పునాది అయి ఉన్నది. మేము దానిని అంగీకరించెదము.
1THS 4:17
45తండ్రీ, ఈ చిన్ని సంఘమును దీవించుము. ప్రతీ ఆరాధన కొరకు ఆరాధికులు ఇక్కడ కూడుకొనునట్లుగా, ఈ భవనము తలుపులు ఎప్పుడూ తెరచివుంచుము. ఒకరినొకరు విడిచివుండలేనంతగా ప్రతి ఒక్కొక్కరు హృదయములు ఏకమై ఒకరినొకరు కలిసికొని ఏకముగా కూడుకొని ఈ దేవుని గృహమునకు వచ్చునట్లుగా, అటువంటి దేవుని ప్రేమతో వారు నింపబడి ఉండునట్లుగా చేయుము ప్రభువా, దానిని దయచేయండి.
"మీరు లోకమునకు ఉప్పు అయి వున్నారు," అని మీరు చెప్పినట్లుగా, వారు మరింత ఉప్పుగా ఉంటూ వారు జీవిస్తున్న ప్రాంతమందున్న జనులు వారిలోవున్న ఉన్నతమైన గుణమును మరియు పరిశుద్ధాత్మతో నిండివున్నవారి జీవితములను చూసి అందునుబట్టి అచ్చట వున్నవారు వారినిష్టపడుచు, వారిని విడిచి ఉండలేనట్లుగా వారు ఉందురు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. వారిని మాదిరిగా చేయండి. తండ్రీ, దానిని దయచేయుము.
ఇప్పుడు, సంఘమును, భవనమును నీకు ఇచ్చుచుండగా మా అందరినీ తీసుకొనండి. పవిత్రమైన సమర్పణతో మమ్ములను మీకు ఇచ్చుకొనుచున్నాము. మరియు ఆయన యొక్క సమస్త దైవీక శక్తితో కూడిన పరిశుద్ధాత్మ ఆయన యొక్క షెకీనా మహిమలో, ఆ నిత్యత్వములోనుండి దొర్లుకుంటూ మా హృదయములలోనికి వచ్చును గాక! ప్రభువా, ఈ చివరి దినములలో ఆయన నివాసము చేయు స్థలముగా దీనిని కనుగొనుము మరియు, మమ్ములను సేవకొరకై పిలవండి, వర్తమానికులుగా, బలపీఠము కొరకు కాదు గానీ, పెట్రోలు నింపు పెట్రోలు బంకులు దగ్గర, స్నాన వాటిక దగ్గర, ఎక్కడైనా గానీ, పాలవానికి, పేపర్ వేయు వానికి, లేదా ఎవరికైనా గాని.
వారికి సాక్ష్యమిచ్చు సాక్ష్యులుగా మార్చుము, షెకీనా మహిమతోను, పరిశుద్ధాత్మతోను నింపబడిన వారుగాను, మిమ్మల్ని మాలో కలిగియున్న వారముగాను, జీవించు రాళ్ళుగాను మరియు మీ కొరకై సాక్షులుగాను, మమ్మల్ని మార్చుము తండ్రీ, మా హృదయములను మరియు జీవితములను మీ మహిమతో నింపండి. ఈ భూమి మీద జరుగు ఆరాధనలన్నీ సమాప్తమగు సమయము ఆసన్నమగుచుండగా, మేము ఒకరికొకరు వేరు చేయబడకుండా, దేవుడు మనలను చేసినట్లుగా మన యొక్క మార్గములలో చెక్కబడుదుము, వధువు అనబడెడి ఆ గొప్ప సంఘములో అందరము ఏకముగా సమకూర్చబడెదము. ఆమె జీవించుచున్న ఈ భూ సంబంధమైన గుడారము నుండి ఎత్తబడి, మరియు రెప్ప పాటు కాలములో ఆమె మార్చబడును. మరియు గొర్రె పిల్ల వివాహం విందు కొరకు మధ్యాకాశములో ఆయననను కలుసుకొనుటకు, ఆయనతో పాటు ఆమె ఎత్తబడును. తండ్రీ నీ యొక్క సేవకొరకై, మమ్ములను మేము, మరియు ఈ సంఘమును యేసుక్రీస్తు నామములో పరిశుద్ధమైన ప్రత్యేకపరచబడిన వారముగా మమ్ములను సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
46"దేవుని కృప చేత, మరియు దేవుని సహాయముతో నా హృదయమును సమర్పించుకొందును. రండి, ప్రభువైన యేసు, నీ యొక్క మంచితనముతో నన్ను నింపుము. నన్ను ఏ విధముగా నీవు కోరుకొనుచున్నావో ఆవిధముగా చేయుము. నేను వ్యతిరేకముగా ఉన్నట్లయితే మరియు కదలబడుచున్న విధముగా, నీవు నన్ను పెట్టిన దానిలో, ఆ మార్గములో లేదా ఈ మార్గములో పోవు హక్కు నేను కలిగియుండగా, నన్ను ఒక చెక్కబడని రాయిగా ఉంచకుము. కానీ, నేను ఏమై ఉన్నానో, నేను ఏమై ఉండాలని నీవు కోరుచున్నావో ఆ విధముగా కోయుచున్న ఆ రంపానికి (Saw) నేను లొంగియుండులాగున? అని ఎంతమంది అడిగెదరు? ఆ విధముగానే మేము కోరుకొనుచున్నాము, కాదా?(సంఘము "ఆమెన్" చెప్పుచున్నది - తర్జుమాదారుడు)
మనందరము మన చేతులు ఎత్తి ఈ సంఘముయొక్క మహిమకరమైన ఈ పాత కీర్తనను పాడెదము, నేను మీ సమయమును మీ కాపరికి అప్పగించుచున్నాను.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను
మరియునా రక్షణను కొనెను
కల్వరి వృక్షముపైన.
ఇప్పుడు మనమందరము పాడెదము. నీ ప్రక్కనున్న వారితో చేయి కలుపుము,"సంఘములో ఒక రాయిగా వుండు సహోదరుడా! దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక" అని చెప్పుము.
…ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను;
మరియు నా రక్షణను కొనెను
కల్వరి వృక్షముపైన
ఇప్పుడు మన కన్నులను మూసుకొని, తలలు వంచుకొని మరియు ఆయనకు మన రెండు చేతులను ఎత్తెదము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను;
మరియు నా రక్షణను కొనెను
కల్వరి వృక్షముపైన.