ప్రభువును జ్ఞాపకము చేసికొనుట

ప్రభువును జ్ఞాపకము చేసికొనుట

VGR COUNT-105 1నెవిల్ సోదరుడా, వందనములు. ఇక్కడున్నందుకు ఎంతో సంతోషముగా ఉన్నది నెవిల్ సోదరుడా, తిరిగి ఈ పరలోక స్థలములలో యేసుక్రీస్తులో కూర్చొను అవకాశము కలిగినది. సంఖ్య నన్ను ఎన్నడూ తొందర చేయదు, అదెల్లప్పుడూ నన్ను ఉత్తేజితుని చేయును. ఒక తక్కువ సంఖ్యతో నేను యున్నప్పుడు అది నాకెంతో ఇంటి దగ్గర యున్నట్లుగా యుండునని మీరెరుగుదురా, ఎందుకనగా సంఘము అలాగే ఉన్నదని నేను అనుకొనుచున్నాను. అవును. దానికొరకు నాకు ఒక వాక్యభాగమున్నది. "చిన్నమందా, భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుట మీ తండ్రి యొక్క మంచి చిత్తమైయున్నది." నేను ఆ దినమున నేను ఆ చిన్న మందతో లెక్కించబడగోరుచున్నాను, "భయపడకుడి" అని చెప్పినవాడు ఆయనే.

2ఈ రాత్రి ఇక్కడకు వచ్చు భాగ్యము కలిగినందుకు ఎంతో సంతోషించుచున్నాను.

మాట్లాడవలెనను అభిప్రాయముతో నేను రాలేదు. కొద్ది క్షణముల క్రితము ఎవరో తలుపు యొద్దకు వచ్చిరి. ఆ సమయమున నేను వెనుకటి సందర్భములను తీయుచూ అచ్చట ఫీనిక్సు మరియు టుసాన్ లో రాబోయే కూటములలో వాటిని తీసి మాట్లాడుటకు ఉపయోగించుటకై నేను ఏదో అంశమును అధ్యయనము చేయుచున్నాను. ముగింపు అనే దానిని గురించి అనగా, "ముగింపు" అనే ఒక అంశము మీద నేను అధ్యయనము చేయుచుండగా, దేవుని యొక్క మంచి కార్యములను బట్టి నిజంగా నేను ఆత్మలో ఎంతగానో పోషించబడితినని మీరెరుగుదురా! నా భార్య వచ్చి ఎవరో నన్ను చూచుటకు వచ్చారని చెప్పెను, దానిని నేను సరిగ్గా గ్రహించలేదు, ఆ తరువాత ఇట్లడిగినది, "ఈ రాత్రికి నీవు ఆలయమునకు వచ్చెదవా?"

"ఆలాగనుకొనుచున్నాను," అని చెప్పాను. నేను చేయుచున్న దానిని ఆలాగే ఆత్మలో ఉండి కొనసాగించుటకు నేను ప్రయత్నించుచున్నాను. ఆమె మరల వచ్చి, ఒక వ్యాధిగ్రస్తుడు ప్రార్ధన కొరకు వచ్చియున్నాడని చెప్పినది. "సరే, ఏలాగయినా నేను సంఘమునకు వెళ్ళి చూచి వ్యాధిగల వానికి ప్రార్ధించుదును," అని నేను చెప్పాను. ప్రజలు రోగులై, అవసరతలో యున్నప్పుడు మనకు సాధ్యమైన౦త త్వరగా వారిని చేరుకోవాలి. దేవుని యొక్క గొప్ప స్వస్థతను మహిమపరచుటకు రోగిగా యున్నవారికి బాగుగా తెలియును. అది చాల అద్భుతమైన సంగతి, ఎంత గొప్ప భాగ్యము.

3ఇప్పుడు, వచ్చే ఆదివారము, ప్రభుని చిత్తమయితే, సహో. నెవిల్ మొదలగు వారికి ఏదీ ప్రత్యేకమైనది లేనిచో, వచ్చే ఆదివార ఉదయము నేను జనులకు క్రిస్మస్ వర్తమానమును అందించుదును, ఎందుకనగా వారు, కొందరు చాలా దూరము నుండి వచ్చుచున్నారని, మీకు తెలియును, జార్జియా, ఇంకా ఆయా ప్రదేశముల నుండి వచ్చుచున్నారు, వారి క్రిస్మస్ కొనుగోళ్ళు, కార్యములు చేసికొని తిరిగి వచ్చుటకు దాని వలన సమయము కుదురును.

బిల్లీ ఇప్పుడే బయటకు వచ్చి నాతో చెప్పినదేమనగా, నా సోదరి డిలోరిస్, వచ్చే ఆదివార సాయంకాలము, అనగా ఆరాధనకు కొద్ది ముందుగా, పిల్లలకు ఒక రకమగు చిన్న బహుమతులు తీసికొని వచ్చినదట, ఇక్కడ చిన్న కార్యక్రమము వారు ఏర్పాటు చేయుదురని తెలియచేయుచున్నాము, ఆరాధన ప్రారంభమగు ముందుగా ఒక చిన్న క్రిస్మస్ ప్రదర్శనను వారు చూపగోరుచున్నారు. "సరే, అది ఆదివారము సాయంకాలము, కదా?" నేను అన్నాను.

"అవును" అనెను.

"అది ఏ మాత్రమూ ఆటంకము కలుగజేయదు," అని నేనన్నాను.

4ఇప్పుడు, చూడండి, వచ్చే మంగళవారము క్రిస్మస్ వేడుక, అయితే… లేక మరుసటి మంగళవారము, ఒక వారమునకు క్రిస్మస్ వచ్చును. కాబట్టి ప్రజలకు అది ఒత్తిడి కలుగజేయును, మీరు చూడండి, తదుపరి వారు క్రిస్మసు ఉత్సవమునకు సోమవారమున తిరిగి ఇంటికి వెళ్ళవలెను, కనుక నేను తలంచాను. అవును. రెండు వారములు. అది నిజమే. రెండు వారములు నిజమే. కనుక ఈ రాత్రి నేను వచ్చి సహో, నెవిల్ కు ఏదీ ప్రత్యేకమైనది లేదని ప్రభుని చిత్తమయితే జనులకు చెప్పవలెనని నేను తలంచితిని. మామూలుగా క్రిస్మసు సందేశము, మరియు ఈస్టరు వర్తమానము నేను సంఘమునకు ఇచ్చుటకు ఇష్టపడుదును. దేవుడు ఏదైతే ఇవ్వమని నా హృదయములో ఉంచునో దానిని నేను ఇచ్చెదను. వచ్చే ఆదివారము, ప్రభుని చిత్తమయితే, వచ్చే ఆదివారపు ఉదయాన నేను ఇచ్చెదను…

5సాయంకాల మునకు బదులుగా ఉదయమున నేను దానిని తీసికొనుటకు కారణము ఏమనగా దూరము నుండి వచ్చిన జనులు మధ్యాహ్నమంతా ప్రయాణించి ఇంటికి చేరగలరు, మీరు చూడండి. రాత్రియందు ఉంటే బాగుండుననుకొన్నాను, సాయంకాలమయితే ఇంకా మంచిదనుకొన్నాను. నాకు సాయంకాల ఆరాధన ఇష్టము, సూర్యుడు అస్తమించునప్పుడు, ఏదో మరొకటి యుండును. ఏదెను తోటలో దేవుడు చల్లపూట సమయమందు, సాయంకాలమున ఆదాము యొద్దకు వచ్చి ఆదాముతో మాట్లాడుచుండెను. చూడండి, నాకు సాయంకాల అరాధన ఇష్టము. కాని ఇక్కడున్న పరిస్థితులను బట్టి దానిని ఉదయాన కలిగియుండుటయే మంచిది. కాబట్టి ప్రజలు వెళ్ళిపోగలరు.

ఈ ఆలయ ప్రాంగణమును దీని ప్రక్కననున్న స్థలమువరుకు ఇంకా కొంచెము పెద్దదిగా విస్తరించబడిదానికి మరికొంత గదిని కలిపినందులకై నేను వందనములు చెల్లించుచున్నాను. సమస్త గలిబిలి, గందరగోళములన్నింటి తరువాత ఏలాగైతేనేమి చివరకు దానిని మనము పొందితిమి. ఆ వృద్ధ సోదరుడు బోస్వర్త్ తరుచుగా నవ్విస్తూండేవాడని మీరెరుగుదురు. అతడిట్లు అనేవాడు, "బిగ్గరగా అరిచే బిడ్డ ఎక్కుమంది దృష్టిని ఆకర్షించును." కాబట్టి అప్పుడప్పుడు మనము బిగ్గరగా అరవవలయునని నేను తలంచెదను. మీరాలాగు తలంచుట లేదా?

6కాబట్టి ఆ చక్కని సంగీతమును బట్టి సహో. అంథోనీ మరియు వారి బృందమును ఇక్కడ నేను ప్రస్తావించగోరుచున్నాను. నేను నడిచి వస్తుండగా దానిని విన్నాను. ఆ వాయిద్యములు ట్రంపెట్స్, నా పిల్లలు, కనీసము వారిలో ఒకరయినా ఒక ట్రంపెట్ (బూర వాయిద్యము) ఊదవలెనని కోరాను. మీకు తెలుసా, నేను.. వారు ట్రంపెట్స్ ఊదుట నా అభీష్టము.

బెక్కీ పియానో సేర్చుకొనుటకు ప్రారంభించినది, మీకు తెలుసు, ఆమె కొద్దిగా యుక్త వయస్సులో ఉన్నది, ఆమె ఇప్పుడు దానిని విడిచిపెట్టగోరుచున్నది. ఆమె ప్రారంభించెను, ఎందుకనగా ఆమెయొక్క సంగీత ఉపాధ్యాయుడు మొదట శాస్త్రీయ సంగీతమును అభ్యసించవలెనని చెప్పెను. నా అర్థము అది కాదు . నా భావమేమనగా శాస్త్రీయ సంగీతము యొక్క ధ్వనులను మొదలగు వానిని నేర్చుకొన్నచో దానికి మత సంగీతము అనుసంధానము చేయవచ్చును. ఆమె అందులో ఉన్నత శ్రేణికి వెళ్ళినప్పుడు ఆ సమయములో "సరే, నేను మానివేయుదును," అని ఆమె అనుకొనెను. పిల్లలు ఒక సమస్య. ఏమయినా గాని, అసలు ఆదిలో అది దేవుని పిలుపు అయి యుండవలెను. ఆమె సోదరి, శారా, వెనుక వెళ్ళి ఒక పాఠము కూడా లేకుండా ఆమెను ఓడించుచున్నదని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆ విధముగా తలాంతు పొందినప్పుడు దేవుని పిలుపు శ్రేష్టమైనదిగా ఉండును.

కాని ట్రంపెట్స్ నాకు ఇష్టము. అక్కడ ఆ మూలన వారు ఈ ఆలయమును ప్రతిష్టించినప్పటి రోజు నాకు గుర్తున్నది, ఇక్కడ ఆ ట్రంపెట్స్ అర్థ దినము పాటు మ్రోగినవి. "నా రక్షకుడు చనిపోయిన ఆ సిలువ యొద్ద పాప క్షమాపణ కొరకు నేను మొర పెట్టితిని, అక్కడనా హృదయమునకు రక్తము అన్వయించబడినది," మూలరాయి లోనికి నేను నా అంశమును జారవిడుచుచుంటిని.

7ట్రినిటి మెథడిస్ట్ చర్చి యొద్ద వృదుడైన డాక్టర్ మారిసన్ తో ఒక రాత్రి నాకు గుర్తున్నది. పూర్వపు నా దినములో జీవించిన మీలో అనేకులకు డాక్టర్ మారిసన్ గుర్తుండును, ఒక వృద్ధ పరిశుద్ధ వ్యక్తి. డాక్టర్ మారిసన్, తన కాలములో చనిపోయినప్పటి నుండి, ఆస్బరీ అను ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకొన్నది. ఒక భక్తిగల దైవజనుడు. నేను ఎల్లప్పుడూ ఆయన ప్రసంగమును వినుటకు ఇష్టపడుదును. అక్కడున్న మెథడిస్ట్ ట్రినిటి సంఘమునకు ఆయన ప్రసంగమును వినుటకు నేను వెళ్తూండేవాడిని. ఆ రాత్రి నేను, నా భార్య నడిచి వచ్చుచుండగా చిన్న బాల్కానీలోనికి ఇద్దరు బాలురు అడుగుపెట్టిరి. ఆ వాయిద్యములతో అక్కడ వారు "సిలువ యొద్ద నా రక్షకుడు చనిపోయెను," అని పాడిరి. ఆ పైన పెద్ద సిలువ తిరుగుచున్నది. నేను వీధిలో నిలబడి విన్నాను, గాలిలో నా చేతులుంచాను, అక్కడే దేవుని స్తుతించనారంభించాను, ఇక దానిని నేను ఆపు చేయలేకపోయాను.

తిరిగి జన్మించిన క్రైస్తవునిలో ఒక విధమగు ఉద్రేకము ఉండును, అదిపెల్లుబికినప్పుడు ఏదో జరుగవలసియున్నది, దానంతటికి అదే మూలము, ఓ, నేను, పాతకాలపు క్రైస్తవ అనుభవము వంటిది ఏదియూ లేదు! దానివంటిది ఏదియూ లేదు, నా అనుభవమును లోకములోని ఏ ధనమునకు పణంగా పెట్టలేను, సర్వలోకమునకు, సౌర కుటుంబమంతటికి, మరి దేనికీ నేను దానిని ఇయ్యజాలను, ఎందుకనగా యేసు తన్ను గూర్చి నాకు నేర్పించినది అదియే.

8మనతో నమ్మకము గల ఒకాయన కూర్చొనును, ఆయనను వెనక్కి తిరిగి చూచినప్పడెల్లా, నా హృదయము గంతులేయును. చేతి కర్రల ఊతతో నడుచుచూ ఆయన ఒక రాత్రి ప్రభురాత్రి భోజనము తీసికొనుట నేను చూచాను. నీవు ఓరల్ రాబర్ట్ వలె కనబడుచున్నావని ఎప్పుడైనా ఎవరైనా నీకు చెప్పారా? నేను మీకు చెప్పుచున్నాను. ప్రతిసారి నేను… ఎందరు?… దాదాపు మీరెందరూ ఓరల్ రాబర్ట్ ని చూచుట జరిగినది. ఓరల్ కంటె కొద్దిగా ఆయన పెద్దవాడు అని నేననుకొంటున్నాను. కాని అతడు తల దువ్వుకొను తీరు, అతని నుదురు, లక్షణములు, ఎల్లప్పుడూ హోదా కలిగిన వ్యక్తివలె, ఓరల్ వలె కూర్చొనును. అందుకే నేను ఎల్లప్పుడూ "సహోదరుడు ఓరల్" అనుకొంటాను. సుమారు అతనివలె కనిపించును.

సహో, ఓరల్ అక్కడ బైబిలు స్కూలు లేదా అట్టిది ఏదో అక్కడ ప్రారంభించెనని నేను నమ్ముచున్నాను. ఒక రోజున దానిని గూర్చి నేను విన్నాను. ఏమిటి? విశ్వవిద్యాలయము. అవును. సహో, కార్ల్ విలియమ్స్ దాని వ్యవస్థాపకులలో ఒకరు. అట్టిది మరేదైనా అయియుండును. ఇప్పుడేమిటో అది నాకు తెలియదు.

9ఇప్పుడు గురుంచుకొనండి, ప్రభుని చిత్తమయితే, ఆదివారము మనము ఆరంభించుదుము. నాకు ఈస్టరు… లేదా క్రిస్మసు వర్తమానమున్నది. ఆలయము ఆరంభించబడినందులకు నాకు కృతజ్ఞత యున్నది. ఇది కేవలము ఎక్కువ మంది, అనగా సంఖ్యను పెంచుటకు మాత్రమే కాక, మన సంఘము, మన ఉద్యమము లేదా ఉద్యమము కాదు గాని, మనము కూడుకొనిన సంఘమునకు దేవుడు కృపను అధికము చేయునని ఆశించుచున్నాను. దానిని మనము ప్రేమించుదుము.

మరియు - నేను ఇది చెప్పగోరుచున్నాను, ఎక్కువ సమయము నేను తీసికొనను. కాని నేను చెప్పవలసినవి చాలా ఉన్నవి, కాని అవి సమయము చాలా పట్టును. కాని ఇది నేను చెప్పగోరుచున్నాను, ఇది నేను చెప్పజాలను. కొన్ని సంగతులు మీరెరుగుదురు. (అందరూ గ్రహించుదురు) అది ప్రభువు నామమును బట్టి అయినను మీరది చెప్పజాలరు. చూడండి. దానిని మీలోనే ఉంచుకోవలసియున్నారు, చూచారా? కాని ఒక ప్రత్యేక సంఘటన పైకి లేచుచున్నది, కొంత కాలమునుండియే ఉంటూనే యున్నది, అది జరుగనైయున్నది. అంత ఇదిగా పరిశుద్దాత్మ ప్రజల మధ్య సంచరించుట గమనించుచుండగా, నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. వారు లోక సంబంధమగు ఒక్క దానిని కూడా ఎరుగరు. చూడండి. కాని అంతగా పరిశుద్ధాత్మ కదలుటను చూడండి. దానిని నేను బయలుపరచుదును, ప్రభుని చిత్తమయితే, అనుకూల సమయములో ఏదో ఒకప్పుడు తెలియచేతును. ఇప్పుడు, గుర్తుంచుకొనండి, దేవుడు వారి మధ్య ఉన్నాడని అది చూపించుచున్నది.

NUM 24:5

 

10కొందరు, అవును, సోదరుడు చెప్పినట్లుగా, కొద్దిసేపటి క్రితం సహో. నెవిల్ చెప్పాడనుకొంటున్నాను, "దేవా, మా మధ్య ఉన్న అక్రమమును, లేదా ఆయన దృష్టిలో, మా తప్పుడు ప్రవర్తనను లెక్కించకుము." ఇశ్రాయేలీయులను చూచుటకు వెళ్ళిన ప్రవక్త వారెంత ఆక్రమముగా ఉన్నారో, వారెంతటి తప్పిదము చేసితిరో, వారెంతగా శాపము పొందవలసియున్నారో, దానిని తన సహజ నేత్రముతో చూడగలిగెడివాడు. కాని బిషప్పు చూచుటకు తప్పినది ఏమిటి? అది కొట్టబడిన బండ, మరియు ఇత్తడి సర్పము, చూచారా, ప్రాయశ్చిత్తము చేయుట. కావున మీరు చూడండి, ఎప్పుడైతే బిలాము ఇశ్రాయేలును చూచెనో, వారిని శపించుటకు ఒక కారణమును వెతికెను. అయితే వారిని దేవుడు చూచినపుడు, ఆయన ఒక ప్రాయశ్చిత్తమును చూచెను. ఆయన చెప్పెను, "దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను." ఆమెన్. "నీ మార్గములో ఎవరు వచ్చును? ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి!" ఆ విధముగా దేవుడు వారిని చూచెను, చూడండి. మనుష్యుడు చూచిన విధముగా కాదు, గొప్ప అన్నతాధీకారులు చూచిన విధముగా కాదు; అయితే ఆయన చూచువిధముగా.

మరియు, ఓ, దేవా, అదే నా భాగముగా ఉండనిమ్ము! అదే నా వంతుగా ఉండనీ, ఎందుకనగా నాకు నేనుగా చెప్పుకొనునది ఏదియూ లేదు. "నా చేతులలో ఏదియూ తేలేదు, కేవలము నీ సిలువకు నేను హత్తుకొన్నాను." చూడండి, అదే మనకున్నదంతయూ.

11సరే, ఇది ప్రార్ధనా కూటపు రాత్రి, లేక ప్రార్ధనా కూటము రాత్రి కాదు గాని, ఇక్కడ ఒక రకమగు సువార్త గుంపు ఉన్నది. మేము వాక్యము ఉంచగోరుచున్నాము. వీలయితే కొద్ది నిమిషములు ఈ రాత్రి నేను మీతో మాట్లాడొచ్చును. వాక్యము చూడగోరువారు మీలో అనేకులు… మంచిది, మీకు తెలుసా, ఆశ్చర్యకరమైన సంగతేమనగా, ఏదైతే నేను తెరచి చదువవలెననుకుంటున్నానో, ఆ అంశమే తెరువగా ఖచ్చితముగా అదే వచ్చినది. అవునండీ. వింత. అది I కొరింధీ 11వ అధ్యాయము, దాని యొక్క వివరణముగా కొంచెం ఇక్కడ నేను వ్రాసియుంచాను, ఎక్కడో ఇక్కడే ఉందనుకొనుచున్నాను, ఇప్పుడే నేను కనుగొందునని నేను తలంచుచున్నాను. I కొరింధీ - 11వ అధ్యాయము ఇక్కడే ఉన్నది. ఇక్కడే ఉన్నది. అవునండీ.

ఇప్పుడు, మనము వాక్యము సమీపించు ముందుగా, దాని గ్రంథకర్తను సమీపించుదము, చూడండి, ఆయనే వాక్యము, కృప కొరకు మరియు ఆయన దీవెనల కొరకు ఆయనను మనము అడుగవచ్చును. మరియు వాక్యమైయున్న ఆయనను చదువుచుండగా, ఆయన దీవెనల కొరకు అడుగుదుము. మనము ప్రార్ధించుదుము.

12ఓ ప్రభువైన దేవా, కృపా, దయా సంపూర్ణుడా, మానవుడు పాపము చేసిన తరువాత అతనికి నీకు మధ్య గొప్ప అగాధము పెట్టబడినప్పుడు, తనకుతానుగా వెనుకకు తాను దాటలేకపోయినప్పుడు. నీవు యుగమంతటిలోను ఇష్టము చూపించావు. అతడు తిరిగి వచ్చుటకు బొత్తిగా ఒక మార్గమనేది లేకుండా సంపూర్తిగా నశించెను, కాని కృపా సంపూర్ణుడగు దేవుడు. అతని స్థానములో ఒక ప్రత్యామ్నాయమును ఇష్టపూర్వకముగా తీసికొని అతనిని తిరిగి తీసికొని వచ్చెను. ప్రభువా, నిన్ను ఎరిగిన వారందరి హృదయము పులకరించి, నీ గొప్ప ప్రేమ, కృపలలో ఎంతగా నీవు ఒక ప్రత్యామ్నాయమును తీసుకున్నావని ఆశ్చర్యపడుదురు! దానిని మేము ఇప్పుడు వ్యక్తపరచుకొనుచుండగా ప్రభువా, ఆ ప్రత్యామ్నాయము మీద ఈ రాత్రి మేము ఆనుకొందుము గాక. పాపులమగు మాకు బదులుగా నీవు చనిపోయావు. మా నీతి హీనతను నీతిమంతుడవగు నీవు పైనవేసికొన్నావు. ఆయన యందు మేము నమ్మిక ఉంచియున్నాము.

గౌరవము, మర్యాద కృతజ్ఞలతోమా తలలు, హృదయములు వంచుచూ సవినయంగా మేము ఆయన వాక్యము యొద్దకు వచ్చుచున్నాము. పరిశుద్దాత్మ ద్వారా కృపను మాకు ఈ రాత్రి పంపమని నిన్ను అడుగుచున్నాము. మేము బ్రదుకుటకు జీవాహారమును మాకు ఇమ్ము ఏది మాకు అవసరమో సరిగ్గా నీకు తెలియును, మేము అడిగినయెడల దానిని మేము పొందుకొనెదమని నీవు వాగ్దానము చేసిన దానిని మేమెరుగుదుము.

13ప్రభువా రోగులు, అక్కరలు గల వారందరికి ఈ రాత్రి గొప్ప సమృద్ధితో దేవుని కృప అనుగ్రహించబడునని మేము గుర్తుచేసికొనుచున్నాము. మరియు తండ్రీ, త్రోవ తప్పి దూరమైన వారి కొరకు మేము ప్రార్ధించుచున్నాము. రానున్న పరిశుద్ధ దినము వారి హృదయమునకు ఒకప్పుడు తాము ఎక్కడున్నామో దానిని, నీ సహవాసము నుండి త్రోవ తప్పి వెలుపల స్థలములో ఉన్నదానిని తిరిగి జ్ఞాపకమునకు తెచ్చును గాక. దేవా, వారు తిరిగి రావలెనని (దానిని అనుగ్రహించు ప్రభువా), సంఘమునకు తిరిగి రావలెననియు, మొదటగా జన్మించిన కూడికలోనికి తిరిగి రావలెననియు, ప్రార్ధించుచున్నాము. కృప, దయ, ప్రేమ, కనికరము, మా ఆత్మలకు స్వస్థత, మా మనస్సు, శరీరములకు స్వస్థత ఎక్కడున్నదో అక్కడకు తిరిగి వచ్చునట్లు కృప చూపుము. ప్రభువా, దాని అనుగ్రహించుము. ఈ రాత్రి వాక్యమును దీవించుము. మా అందరినీ బలపరచుము, నీ దీవెనలను మాకు అనుగ్రహించుము. దీనిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

1COR 11:23-25

 

14ఇప్పుడు, కొన్ని నిమిషముల పాటు మీ దృష్టిని కోరింథీయులు 11వ అధ్యాయము 23, 24, 25 వచనముల మీదికి పోనీయుడి.

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి,

ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరచి - ఇది మీ కొరకైన నా శరీరము. నన్ను జ్ఞాపకముచేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తమువలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

నేను ప్రస్తావించు ఈ చిన్న అంశమును ఈలాగు పిలుచుటకు ఇష్టపడుచున్నాను, అది ఏమనగా: "ప్రభువును జ్ఞాపకము చేసికొనుట," భుజించుచూ గత ఆదివారము ప్రభురాత్రి భోజన సమయమందు ప్రసంగించిన వర్తమానమువలె వినబడును. కాని దానిని కొన్ని నిమిషముల పాటు వేరయిన కోణములో దానిని నేను సమీపించగోరుచున్నాను, ప్రభువులో ఆరాధించుచు మనము మన ఆలోచనలను సమకూర్చుకొనెదము.

1COR 11:24,25

 

15ప్రభుని బల్లతో మనము ప్రారంభించగలము, ఎందుకనగా మనందరము జ్ఞాపకము చేసికొనుటకు అది మంచి స్థలముగా యున్నది. ఆయన బల్ల యొద్ద ప్రభువును జ్ఞాపకము చేసికొనుట - నిజంగా అంశము దానినే ప్రస్తావించును. కాని పౌలు చెప్పినదేమనగా, మనము గిన్నెను ఎత్తికొని - ఆ రక్తమును త్రాగి, ఆ రొట్టెను భుజించుచూ, ఆయన మన కొరకు చేసినదానికి జ్ఞాపకార్ధముగా అది చేయవలయును. ప్రతి దినము మామూలుగా చేయు ఒక దానివలె దానిని నీవు చేయకూడదు, భయభక్తితో నీవు వచ్చి, ప్రభువును జ్ఞాపకము చేసుకొనవలయును. చూచారా? అది ఆయన కృప మాత్రమే. ఆయన దయ మాత్రమేనని గుర్తుంచుకొనండి. అది నీవు కలిగియున్న ఒకే నిరీక్షణను అది నీకు యిచ్చుచున్నది. నీవు ఎప్పుడు ఏది చేసినా ఏమీలేదు, క్రీస్తు నీ కొరకు చేసినది దగ్గరకు వచ్చునది ఎన్నడూ మరేదియూ ఎక్కడునూ లేదు.

16ఈ వారములో ఒక విచారమగు అనుభవము నాకు కలిగెను, అయినను అది మహిమకరమైనది అని నేను అనగలను, ఇక్కడ ఒకప్పుడు మనతో కూర్చొనియున్న ఒక సోదరుని సమాధి చేశాము. ఆ సంగతిని మీలో చాలా మంది ఎరుగుదురు. అది దయాళుడైన మన సోదరుడు రోజర్స్, బస్టీ రోజర్స్, అతనిని మనము ఎవరెట్ అని పిలుచుదుము. ఇక్కడున్న సోదరుడు బాంక్స్ ఉడ్, సోదరుడు సాద్ మన్ మేము కలిసి సమాధి కార్యక్రమమునకు వెళ్ళాము.

సుమారు పాతిక సంవత్సరముల క్రిందట ఆయనను మొదటగా సమాధి చేసిన పాత స్థలమునకు నేను మంచులో స్వారీ చేయుటకు వెళ్ళాను. నేనతనిని సమాధిచేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ మురికి నీటిలోనే పాతిపెట్టాను. టాటన్ ఫోర్డ్ వద్ద ఆ తెలిసిన పాత వంతెనను నేను దాటినప్పుడు నేను నా సోదరులతో మాట్లాడుచూ ఈలాగు చెప్పాను, "ఒకనాడు ఒక ప్రత్యేక శాఖను చెందిన సేవకుడు - అక్కడ ఒక పెద్ద గుడారము వేసి, ఆ బాప్టిస్టూ సంఘము దగ్గరున్న 'ఆ చిన్న తీవ్రవాది' యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చుచున్నాడు," అని అతడు చెప్పెను. "ఆ విధంగా బాప్తిస్మము పొందిన ఏ వ్యక్తి అయినా సరే నా గుడారము క్రిందికి వచ్చుటకు నేను అనుమతించను," అని అతడు అన్నాడు.

ఆ సమయాన ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందిన కొందరు అక్కడ కూర్చొనియుండుట జరిగినది, అది సహో జార్జి రైట్, మరియు అతని కుటుంబము, వారు కేవలము తిరిగి వెళ్ళిపోకుండుట ఒక్కటియే వారు చేయగలిగిరి.

ACTS 2:38

 

17కనుక ఆ రోజున ఫోర్డు యొద్ద, ఓ, అతడు తన కూటమును విడిచిపెట్టి ఒక విధమగు తనిఖీ చేయుటకు అక్కడికి వచ్చెను, అతని సంఘము అక్కడ నిలబడి యుండెను, బాప్తిస్మమిచ్చుటకై నేను ఆ స్థలము యొద్దకు చేరాను. కొండలు యుండే ఆ ప్రాంతములో అప్పుడే అక్కడ వర్షము పడినది, అది పొలములలో యున్న బురదనంతా కొట్టుకొని వచ్చినది. దాని చిన్న కాలువలు ఆ బురదను మోసుకొని వచ్చుటచే, నీల రంగులో యుండే ఆ నదిని అది మురికిగా చేసినవి. దాదాపు నడుము లోతుగానున్న నీటిలోనికి నేను నడిచి వెళ్ళాను. ట్రస్టీలలో ఒకరు లేదా పెద్దలు బైబిలు నా చేతికిచ్చిరి. నేను పెంతెకోస్తు దినమున పేతురు చెప్పిన మాటలు తీసి చదివాను, "ప్రతివాడును, మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు."

18ఆ దినమున జార్జి కార్టర్ అక్కడ పడియుండెను, ఆమె చేతులు ఎత్తుటకు ప్రయత్నించుచున్నది. అరవై పౌండ్ల బరువు మాతమే యుండెను, పడకలో తొమ్మిది సంవత్సరముల ఎనిమిది నెలలు పడియున్నది, అసలు కదలిక లేదు. ఆమె వారు, ఆమెకు చెందిన సంఘపు వారు, చెప్పినదేమనగా, ఎవరైనా గాని నా కూటమునకు వారి సహవాసము నుండి వచ్చి హాజరయినచో వారు బహిష్కరించబడుదురని వారు చెప్పిరి. అయితే అదే సాయంకాల సమయాన ఆమె వెంటనే బాగయినది. అటు పిదప ఆమె అక్కడున్న ఆ చిన్న నేల్ పిల్లవలె ఆమె బాప్తిస్మము పొందగోరెను. దానిని నేను దర్శనము చూచాను. ఆ కథ మీరెరుగుదురు. ఆమె కాళ్ళు చేతులు బిగదన్నినవి; దర్శనములోను, ఆత్మశక్తిలోను వెళ్ళి ఆమె మీద చేతులుంచాను, ఆమె వచ్చి బాగుపడినది. ఆమె కూడా దానికే చెందినది. అది ఒక మెథడిస్ట్ సంఘము. మెథడిస్టు సేవకుడు, సహోదరుడు స్మిత్ తన సంఘము వారుతో వెనుక నిలబడియున్న ఒకడు. పరిశుద్ధ గ్రంథము ప్రకారము నేను బాప్తిస్మము ఇచ్చుట ఆరంభించాను, క్రైస్తవ బాప్తిస్మము.

అప్పటికి అయిదుగురు ఆరుగురుకు బాప్తిస్మము ఇచ్చాను. హఠాత్తుగా ఆ కొండ మీద వరుసలు, ఫైలు విరుచుకుపడినవి. ఆ మెథడిస్టు గుంపు వారి మంచి వస్త్రములు ధరించియుండగానే, వారు ప్రభువగు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు ఇక్కడికి వచ్చారు. ఒకరు తరువాత ఒకరు, స్త్రీలు తమ అందమగు సిల్కు, ఎండాకాలపు దుస్తులలో ఆ బురద గుండా నడిచివస్తూ కన్నీరు కార్చుచుండగా, పెదవుల రంగు చెరగిపోతుండగా ఒప్పుకొనుచూ బాప్తిస్మము పొందగోరిరి.

19ఆ గుంపు వెంబడి ఒక బలమగు విశాల భుజములు కలిగి, ఒక విధముగా జిఐ జట్టు కత్తిరింపు కలిగియుండి, వెడల్పు ముఖముతో, చూచుటకు ఒక ధృడమైన వ్యక్తి అక్కడికి తన అందమగు నీలపు రంగు సూటు ధరించి వచ్చెను. "నేనునూ నా నిర్ణయము చేసికొన్నాను," అన్నాడు. అతడే బస్టీ రోజర్స్, ఎవరూ ఏమీ అతడితో చెప్పకుండానే అతడే వచ్చాడు. అతని ఒప్పుదలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అక్కడ నేను అతనిని పాతిపెట్టాను.

గత వారము మిల్ టౌను వద్దు నున్న మట్టి క్రింద నేనతనిని ఉంచాను. నేను మాట్లాడిన వర్తమానము: "పునరుత్థానము యొక్క పరిపూర్ణత." నేను మిషనైరీగా యున్నాను, వివిధ దేవుళ్ళను, తత్వజ్ఞానులను చూస్తున్నాను; క్రైస్తవ్యమునకు వెలుపల ఉన్నదతంయూ ఒక వేదాంతమే తప్ప మరేమీ కాదు. దానిని, దీనిని, మరోదానిని వారెట్లు నమ్మదురో అర్థం కాదు. కాని గొప్ప సృష్టికర్త సృష్టిని చేసెను! సృష్టి అనునది ఒకటి ఉన్నప్పుడు సృష్టికర్త ఉండవలసియున్నాడు. సృష్టి అనునది ఉండినచో అది సృష్టికర్త ద్వారా చేయబడును. ఏ మనిషి పని అయినా గాని అతనిని ప్రతిబింబించును. అతడు మంచి వడ్రంగి, అతడు మంచి పనిచేయును. అతడు నిర్మించును. అతడు మంచి మెకానిక్ అయినచో అతడు మంచి పనిచేయును. నీ పని నిన్ను మాత్రమే ప్రతిబింబించును. దేవుని సృష్టి దేవుని ప్రతిబింబించును. దేవుడు ప్రతి దానిని ఒక ఉద్దేశ్యము కొరకు చేసెను. ప్రతీదియు దేవుని యొక్క ఉద్దేశ్యము కొరకు సేవ చేయుచున్నవి, అది చనిపోయినప్పుడు, దానికి ఒక పునరుత్థానముండును. ఒక్క మాట నాకు చెప్పండి.

20పుష్పములు మరియు చెట్టు వంటివి ఎన్నో నేను తెచ్చాను.

ఉదయాన సూర్యుడు ఎట్లు పైకి వచ్చునో చూడండి, పుట్టిన ఒక చిన్న బిడ్డవలె యుండును. దాని కిరణము బలహీనముగా నుండును. పది గంటల ప్రాంతములో అది యుక్త వయస్సులో ఉండును. పండ్రెండు గంటలకు స్త్రీ సౌందర్యములో - లేదా పురుషత్వములో అది బలముగా ప్రకాశించుచుండును. మధ్యాహ్నము రెండు గంటల ప్రాంతములో అది నా వలె అగును. మధ్యాహ్నము అయిదు గంటలకు అది తాతవలె మారిపోవును. ఆమె అస్తమించుచుండును, చివరగా ఆమె కిరణములు భూమి నుండి చల్లబడి, ఆమె మరణించును. అదే దాని అంతమా? ఆమె దేవుని యొక్క ఉద్దేశ్యము కొరకై సేవ చేసినది. ఆమె భూమి మీదికి వచ్చినప్పుడు, వృక్ష జీవమును ఆమె లేవనెత్తెను. సంవత్సరము ముందు మొక్కలన్నియూ మరణించును, ఆమె వాటిని మరల లేవనెత్తును. దేవుని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటకై ఆమె సేవ చేయుచున్నప్పుడు దానికి అంతము అదేనా? ఆమె క్రొత్త జీవముతో మరల మరుసటి ఉదయము ఉదయించుచున్నది! ప్రతి చెట్టూ ఆలాగే చేయును, ప్రతీది, ఉన్నవన్నియూ, చంద్రుడు, నక్షత్రములు, సూర్య కుటుంబము, ప్రతిదియూ వాగ్దానము కలిగియున్నది.

దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుటకై ఒక మనిషి సేవ చేసినయెడల, నిశ్చయముగా అన్నింటివలె, అచ్చట ఒక పునరుత్థానము గలదు. ఆయన ఇప్పుడు చేయుచున్నట్లుగానే దేవుని కనిపెట్టు సమయము వరకు నీవు వేచి చూడుట మాత్రమే నీవు చేయవలెను.

21చెట్టు నుండి గొప్ప ఆకులు రాలిపోవుచున్నవి, రాలిపోయిన మరొకటి, ఎరుపు, పచ్చ నీలము, గోధుమ రంగు, అయా వివిధ రంగులు భూమి యొక్క గొప్ప రొమ్ములో దేవుని యొక్క సృష్టి అంతయూ మరణించిన స్థితిలో ఆ భూమి క్రింద దాచబడచున్నవి. దేవుడు తన పూల గుత్తిని తయారుచేసి నాటెను. ఆ పూలగుత్తిని ఆయన నాటినప్పుడు వసంత కాలములో ఒక పునరుత్థానము వచ్చునని ఆయన ఎరుగును! మరల సూర్యుని యొద్దకే తిరిగి వచ్చువరుకు భూమి తన కక్ష్యలో చుట్టూ తిరుగుచూ రావలయును, అప్పుడు మరణించి సమాధి చేయబడియున్న ఆ పుష్పములు మరల జీవముతో లేచును.

"ఇది అంతము" అని ఎన్నడూ చెప్ప వద్దు. చెట్లపైనే ఆకులు గోధుమ రంగుగా మారిపోయినప్పుడు, అదే అంతము అని చెప్పుట లేదు. అది చేయవలసిన కార్యము ఏమనగా, దేవుని యొక్క కాల చక్రము తిరుగుచున్నంత వరుకూ, దేవుని కుమారుని యొక్క రాకడ వచ్చు వరుకు వేచియుండుట మాత్రమే అది చేయవలసిన కార్యముగా యున్నది. క్రీస్తులో మరణించిన ప్రతీ సృష్టియు మరలా పునరుత్థానముతో ఆయన సన్నిధిలో ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు వచ్చును. ఓ! నేను నా మార్గాంతమునకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో, ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు నేను మరణించుటకు ఆశించుచున్నాను. ఆయనే పునరుత్థానము, మరియు జీవమునైయున్నాడు. అది ఆయనే.

22ఆయితే మనము ప్రభువు యొక్క బల్ల యొద్దకు వచ్చుదము. ఇంతకు ముందు నేను వివరించినట్లుగా, ప్రభువు యొక్క బల్ల. రొట్టెను తీసికొనుట "సహవాసము" అని మనము నమ్ముచున్నాము. మనము తప్పును. మనము మంచి దానిని స్థానములో వుంచుటకు తప్పైన దానిని స్థానములో ఉంచుచున్నాము. పని చేయునది రొట్టె కాదు, పని చేయునది ద్రాక్షారసము కాదు, అది కొషెరు రొట్టె మరియు ద్రాక్షారసము. కాని సహవాసము అను మాటకు "మాట్లాడుట" అని అర్థము, ఆయనతో మాట్లాడుటలో, ఆయనను గుర్తుచేసికొందుము. ఆరాధనలన్నింటిలో అది అతి ధన్యకరమగు కాలమని నేను తలంచున్నాను. గమనించారా? మన జీవితములో ప్రతి ఘడియ ఒక సహవాసముగా ఉండవలెను.

23ప్రభువుతో ఒక సహవాసము అనునది క్రమము ద్వారా ఆయన బల్లయొద్దకు వచ్చి, ఒక ఎడారిలోని ఒయాసిస్సు వంటిది. చెరువు క్రింద ఉన్న ఊట వంటిది - యాత్రికుడు దగ్గరకు వచ్చి, ఆగి, తృష్ణ తీరు వరకు నీరు త్రాగును. అది ప్రభువును జ్ఞాపకము చేసికొనుట. క్రమము ద్వారా ఆయన బల్ల యొద్దకు వచ్చి, ఈ దేశములో యాత్రికులుగా సంచరించుచుండు ప్రయాణికులగు మనమందరము ఒక్కటిగా ఏకమై ఆయనతో బల్ల యొద్దకు వచ్చి అచ్చట దేవుని యొక్క వాక్యమనే దానితో సహవాసము చేయువారమై, దాహముతో యున్న మన ఆత్మలు తృప్తిపొందుకొను వరకు ఆయన ఆశీర్వాదములను, ఆయన కృపను మరియు ఆయన యొక్క వాక్యమును త్రాగుచున్నాము. అప్పుడు మనము సేదదీర్చబడి, తృప్తినొంది, ఎడారి సమస్యలను మరల ఎదుర్కొనుటకు, జీవిత ఎడారి సమస్యలను ఎదుర్కొనుటకు ఆరాధనా స్థలమును విడిచి వెళ్ళుదము. అవును, ఎడారిలో ఒక ఒయాసిస్సు మనలను సేదదీర్చును, మనము దాహముగొన్నప్పుడు చల్లార్చును.

24ప్రతి ఆరాధకునితోను అది ఆలాగే ఉండవలెను. దేవుని ఆరాధించుటకు వాంఛించే ప్రతీ నిజ-విశ్వాసియు ఒక్కటిగా ఏకమై కూడి సహవాసము చేయుటకు ఆశించును. ఆ సహవాసములో ఏదో ఒకటి యున్నది, అది దైవీకమైనది. అది దేవునిచే ఆజ్ఞాపించబడినది, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నీతిమంతులు దాని కొరకు ధాహముగొందురు.

"దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది," అని దావీదు చెప్పిన విధంగానే ఉండును. వేట కుక్కలు తమ పంజాలతో ఆ చిన్న దుప్పిని ప్రక్కలందు గాయపరచినవి — అది దాని నుండి తప్పించుకొని వచ్చినది. అది నిలబడి, దప్పికతో కనిపెట్టి చూస్తున్నది. దేవుడు దానికిచ్చన వాసనతో పసిగట్టగల శక్తితో ఎన్నో మైళ్ళ దూరములో ఉన్న నీటిని వాసన చూడగలదు. అది తన రక్తము కార్చుచూ ప్రాణమును పోగొట్టుకొను స్థితిలో ఉండగా, దాని చిన్న తలను పైకెత్తి చూచును. ఏలాగయినా గాని ఆ ప్రవాహమునొద్దకు చేరినచో బ్రతుకుదునని దానికి తెలియును. అప్పుడు దానిని ఏదియూ పట్టుకొనలేదు.

25ఆ స్థలమునకు సంఘమునకు వచ్చినప్పుడు, అనగా క్రీస్తే సర్వస్వమయి ప్రతి ఒక్కరితో కలిసి ఆయన సన్నిధికి వెళ్ళవలెనను దాహము మనము కలిగియున్నప్పుడు, అది ఒక ప్రాణము పోయు ఆధారమైయున్నది. ఏ సాతాను నిన్ను అధిగమించజాలదు. మరణము సహితము అక్కడ ఓడింపబడినది. ఓ! ఎంతటి ఒక నిరీక్షణ! ఎట్టి ఒక స్థలమైయున్నది! మనలను మనము సేదదీర్చుకొందుము. ఈ సంగతులు మన కొరకు చేసినవాడు ఆయనే. తప్పక ఆయనను మనము జ్ఞాపకము చేసికోవలెను. ఎందుకనగా ఒకప్పుడు దూరస్తులము, దేవుడులేనివారము, అన్యులము, మూగ విగ్రహములచే మోసపుచ్చబడితిమి. కాని గుర్తించుకోండి, యూదుల కొరకు మాత్రమే క్రీస్తు చనిపోలేదు, కాని ఆదాము యొక్క పతనమయిన జాతికి, ప్రతి సృష్టి కొరకు క్రీస్తు చనిపోయెను.

NUM 20:11

 

26ఈ సహవాస ఊట యొద్ద ఆయనను జ్ఞాపకము చేసికొనుటకు మనము వచ్చుచుండగా, అది ఇశ్రాయేలు వారు తమ యాత్రలో నుండగా గుర్తుచేసికొన్నట్లుగానే వెనుకటి కాలమును మనకు అది జ్ఞాపకము చేయవలెను. వారు వచ్చి, వారు విధి నిర్వహణలోనే యున్నప్పటికి, వారు ఐగుప్తు నుండి విడుదల పొందుకొని వారు విధి నిర్వహణలో యుంటూనే, వాగ్దానము చేయబడిన దేశమునకు వచ్చు మార్గ మధ్యలో, వారికి నీళ్ళు లేకపోయెను. ఎచ్చట చూచినా అది ఎండిపోయి కనిపించినది, ప్రతీ స్థలములోను నీటి ఊటలు ప్రవహించవలసిన ప్రతి కొండలు నీరు లేకనే యుండెను. వారు ఎడారిలో నశించుచుండిరి, అప్పుడు అక్కడ బండ కనబడెను. మోషే ఆ బండను కొట్టగా అందులో నుండి సమృద్ధిగా నీరు పారెను. దాహముతోనున్న ప్రతి పురుషుడు, ప్రతి దాహముగొన్న స్త్రీయు, బిడ్డయు, లేదా దాహముగొన్న ప్రతి జంతువు కూడా సమృద్దిగా నీరు త్రాగగలిగెను.

ISA 55:1•

JOHN 3:16

 

27యోహాను 3:16, పరిశుద్ధ గ్రంథము యొక్క సువర్ణ భాగముగా నున్నది, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. విశ్వసించు ప్రతివారు, (నమ్మి సహవసించి, ఆయనను గుర్తుచేసికొనువారు) నశింపక నిత్యజీవ జలము పొందుదురు." నశించిపోతున్న ప్రపంచమును, నశించిపోవుచున్న అన్యులను, నశించుచున్న యూదుని, నశించుచున్న లోకమును రక్షించుటకు కొట్టబడిన ఆ బండ క్రీస్తేనని జ్ఞాపకము చేసికోవలెను. "రండి, ఉట యొద్దకు రండి. రూకలు చెల్లించకయే పాలు, తేనెలు నా యొద్ద కొనుడి," అని ప్రవక్త చెప్పినట్లుగా ఆకలిదప్పులు గల ప్రతివారికి క్రీస్తు తన జీవమును సమృద్ధిగా అనుగ్రహించెను. రండి, ఎందుకనగా అది సహవాసము. ప్రభువును జ్ఞాపకము చేసికొనుచూ రండి.

GEN 16:14

 

28సేదదీర్చు మరియొక స్థలము యొద్ద ప్రభువును జ్ఞాపకము చేసికోవలెనని మరల నేను తలంచాను. అది బేర్లహయ్ రోయి అను బావి, హెబ్రీ భాషలో దానికి ఇది అర్ధము: "సజీవుని నన్ను చూచుచున్న సజీవుని యొక్క బావి." హాగరు అపార్థము చేసికొనెను, విధి నిర్వహణలో యున్నప్పటికిని, అపార్థము చేసుకొనెను, తప్పిదముగా న్యాయము తీర్చుకొనెను, మరియు బయటకు త్రోయబడెను, వెళ్ళుటకు ఏ స్థలమూ లేదు, నశించిపోవుచున్న బిడ్డతో, నీళ్ళ బుడ్డి ఖాళీ అయినది. చిన్నవాడు ఏడ్చుచుండెను. నీటి కొరకు దుఃఖించుచున్న ఆ బిడ్డ కేకను విని అర్థము చేసికోగలిగినది తల్లి హృదయము మాత్రమే, అతని చిన్న నాలుక ఎండిపోయినది, అతడి పెదవులు తడి ఆరిపోయినవి, ప్రతి నిమిషము అతడి బిడ్డ బలహీనమగుచుండెను. బయటకు వెళ్ళగొట్టబడినది, విధి నిర్వహణలోనే యున్నది, వెళ్ళుటకు ఏ దారి లేదు. ఆ చిన్న వాడు ఎండిపోవుచున్న పెదవుల మీద ఆఖరి నీటి చుక్కను కూడా ఆమె పిండినది. ఆమె యొద్ద ఏమీ లేదు, సీసా ఎండిపోయెను, అటుపిదప ఆమె దానిని క్రింద పడవేసి ముందుకు కొనసాగించినది. చిన్నవాడు నీరు కొరకు గగ్గోలు పెట్టుచుండెను. ఎంతో బలహీనమగుచుండెను; ఆమె ఒక్కగానొక్క కొడుకు.

29ఆమె అమాయక హృదయము ఈలాగు కేక వేసెననుటలో సందేహములేదు. "ఓ దేవా, నేమేమి చేశాను? నేనేమి చేశాను?" ఆ బిడ్డ తన చేతులలో చనిపోవుట చూచి ఆమె భరించజాలకుండెను, కనుక ఆమె బిడ్డను ఒక పొద క్రింద విడిచినది. ఒక బాణము వెళ్ళు దూరమంత దూరము వరుకు ఆమె వెళ్ళినది. బహుశా ఒక వంద గజములు లేక ఎక్కువ ఉండవచ్చును, చిన్న చెట్టును చూచెను, ఆమె మోకరించి, అక్కడ ఆమె దుఃఖించసాగెను. ఆమె ఆశ్చర్యపోతున్నది, "ఏమిటి?" అమె సరయినది చేసినచో ఎందుకీలాగు ఆమెకు సంభవించి యుండును? చాలాసార్లు, మనము మన వ్యాధులు, బాధల గూర్చి ఆలాగే తలంచుదుము, చూడండి, కాని అదంతయూ కృప, దయ చూపుటకు వచ్చినదేమో. ఆమె ఆలాగు తలంచుచుండగా, నీరసపడి మరుగవుచున్న ఆ చిన్నవాని కేకలను ఆమె వినెను. చివరకు నీటి కొరకు స్పృహ తప్పెను.

ఒక స్వరము ఈలాగు పలుకుట ఆమె వినెను. "ఎందుకు నీవు ఏడ్చుచున్నావు? ఎందుకొరకు నీవు ఏడ్చుచున్నావు?"

ఆమె పైకి చూచెను, పొంగిపొరుచున్న బావిని చూచెను. సేదదీర్చుకొనుటకు అది ఎట్టి ప్రవాహము! బేర్లహాయ్రోయి! నేను బహశా తప్పుగా ఉచ్చరించియుందును, బేరీలహాయ్రోయి అనగా, "నన్ను చూచుచున్న సజీవుని బావి? అని అర్ధము! ఆయన మరణము లేనివాడు! మొల్కీసెదెకు! ఎల్ షద్దాయి! సజీవునిగా యుండి నన్ను చూచుచున్నవాడు. నా అవసరతలు ఎరుగును. ఆయన నన్ను జ్ఞాపకముచేసికొనెను. నేను ఆయనను జ్ఞాపకము చేసికొనగా, అక్కడ ఆయన నన్ను జ్ఞాపకము చేసికొనెను. ఆయన సజీవుడుగా యుండి మరియు ఇక్కడ ఈ ఎడారిలో, ఈ బావిని ఆయన ఉబకచేసెనని? నేనెరుగుదును."

JOHN 4:10

 

30ఇప్పుడు, ఈ దినమున, ఇప్పుడే, ఈ ఘడియలోని వర్తమానమునకు, ఓ! మనము దానిని అన్వయించుకోవచ్చును. ఎడారులనే సంఘములు, శాఖలు, మరియు సాంఘిక సువార్త బోధకులు, లోకపు నాజూకులు లోనికి చొచ్చుకొని వచ్చినవి, మరియు శాఖలుగా విభాగింపబడి ముక్కలయినది. సజీవునిగా యుండి మరియు నన్ను చూచుచున్నవాని బావి మరల ఈ రాత్రి అక్కడ నిలచియున్నదని తలంచుట ఎంత గొప్ప విషయము! దేవుని ఆరాధించు వారికి క్రీస్తు ఏమైయున్నాడో దానినే వారికి జ్ఞాపకము చేయవలెను. అవును. ఓ, ఆమె అపార్ధము చేసికోబడినది, బయటకు వెళ్ళగొట్టబడెను. ఈ భూమిమీద ఉండగా యేసు ఇట్లనెను, "నేనే జీవజలమును, నేను జీవిమిచ్చు జలమును."

31నా మనస్సుకు వచ్చుచున్న మరో చిన్న ఆలోచనను ఇక్కడ నేను చూపగోరుచున్నాను. యేసును నేర విచారణ చేయబడుచున్నప్పుడు, ఆయనలో ఏమీ లేదు గాని కేవలము హేళన చేయుటకు ఆయనను పిలాతు నుండి హేరోదు యొద్దకు పంపిరి. పిలాతు అది చేయవలసిన పని లేదు, మీకు తెలుసు, దానిని చేయకుండా అతడు తన చేతులు కడుగుకొనుటకు ప్రయత్నించెను. కాని ఒకసారి నీ చేతుల్లో ఉన్నప్పుడు నీవు నీ నిర్ణయము చేసికొనవలెను. మరొకరి మీదికి నీవు దానిని త్రోసివేయజాలవు. అది నీ వ్యక్తిగతముగా నీదే. కాని అతడు, ఆయనను హేరోదు యొద్దకు పంపించెను, కేవలము హేళన చేయబడుటకే; ఎందుకనగా ఆయనకు అద్భుతములు చేయువానిగా, ఇంకా ఏవేవో గొప్ప పేరును కలిగియుండెను. అతడు సంఘము నుండి వెలివేయబడినవాడు, కనుక పిలాతు తాను కూడా ఆయనను హేరోదు యొద్దకు పంపించుటవలన వారికి ఒకరి మీద ఒకరికున్న పాత కక్షను ఒకరకంగా సరిదిద్దుకొన వచ్చునని అతడు తలంచెను.

32కావున ఉన్నత న్యాయస్థానమును అనగా హేరోదును కలిసికొను వరకు యేసును వీధులగుండా, ఆయా స్థలముల ద్వారా కొనిపోయిరి. అతడు హేరోదును కలిసికొన్నప్పుడు, అతడి ఒకే అవకాశమును హేరుదు ఎదుర్కొనెను. మనుష్యడెంత వెర్రివానిగా ఉండగలడు? తన ఎదుట నిలువబడిన ఆయన ఎప్పటి నుండియో హెబ్రీ ప్రవక్తలు ప్రవచించిన దానికి నెరవేర్పు అనియు, ప్రపంచ సంఘము ఎదురు చూచుచున్నవాడు ఆయనే అనియు హేరోదు ఎరిగియుండినచో ఎంత బాగుండును! ప్రతి జ్ఞాని మరియు, ప్రతి ప్రవక్త యొక్క ప్రవచన నెరవేర్పు తన ఎదుట నిలువబడియుండెనని ఎరిగియుండవలసినది. తన పాప హృదయమును కృప, దయతో సంతృప్తిపరచుకొనగల అవకాశమది. అతడు ఎంతటి ఒక బుద్ధిహీనమైన మనిషిగా యుండును!

అదే అవకాశము నేడు ఇవ్వబడుచున్న మానవుడు మరెంత బుద్ధిహీనుడో గమనించండి! ఎందుకనగా రెండువేల సంవత్సరముల కంటే ఇంకా అధికముగానే ఆయన యొక్క కృప, మరియు ఆయన యొక్క బోధనలను మనము కలిగియున్నాము. కాని హేరోదు ఎంత బుద్ధిహీనపు పని చేశాడు? తన ఎదుట నిలబడిన ఆయనను కృప, కనికరముల కొరకును, పాపక్షమాపణ కొరకును ఎన్నడూ అతడు అడుగలేదు. తన ముందు నిలువబడిన మనిషి, తన ఎదుటనిలబడియున్న ఆయన అటువంటి ఒక మహా వ్యక్తి అనే దానిని గురించి అతడు గ్రహించలేదని నేననుకోను. ఒక్క నిమిషము అది ఆలోచించుదము, ఎందుకనగా ఆయనకు గొప్ప సాంఘిక పేరు గాని, వివిధ సంస్థలలో గాని, సమాజములో గాని మరియు మొదలగువానియందు ఆయనకు అంతగా పేరుప్రఖ్యాతులు లేవు. ఆయన అట్టివానిలో చేరనే లేదు, అటువంటి పేరు ఆయనకు లేదు.

33కాని పరిశుద్ధ గ్రంథమును ఎరిగి, వాగ్దానము తెలిసిన జనుల మధ్య ఆయనకు ఆ పేరుండెను. ఇంకా బలంగా నేను చెప్పాలంటే, నిత్యజీవమునకు నిర్ణయించబడినవారు దానిని గుర్తించి, ఆయన నిలువబడిన క్షణమును గ్రహించిరి.

కాని హెరోదు దీనిని నేర్చుకొనలేదు, దానిని ఎన్నడూ అతడెరుగడు. అది ఎంత విషాదకరమగు సంగతి! నాలుగువేల సంవత్సరములు ప్రవక్త పలికిన ప్రతిదియు, ప్రపంచపు మొర్ర యొక్క నెరవేర్పు అతని ఎదుట నిలువబడియుండెను. అక్కడ అతని స్థలములోనే ఆ ప్రవచన నెరవేర్పు అంతయూ నిలబడియుండెను. నేను మరల దీనిని చెప్పుదును, అతడు బుద్ధిహీనుడని మనము తలంచుచున్నాము, ఎందుకనగా అతడు బుద్ధిహీనపు నిర్ణయము చేసెను. మీరు గమనించండి, ఎన్నడూ ఆయన కృప కొరకు జ్ఞానులు అడగలేదు. తనను వినోదపరచమని అతడు ఆయనను అడిగెను. "ఓ! నీవు అద్భుతములు జరిగించువాడవని నేనువిన్నాను." కృపకు బదులుగా వినోదము కొరకు అతడు అడిగెను.

ఈ నాడు లోకము ఆలాగే యున్నది. హేరోదు యొక్క అదే నిర్ణయమును తిరిగి వ్యక్తపరచుచున్నది. అద్భుతములు జరిగించు క్రీస్తు అప్పుడు చేసినట్లుగానే నేడును అదే క్రియలు చేయుటవారు చూచి ఆలాగు అడుగుచున్నారు. ఆ కార్యములను మాత్రమే వారు అడుగుచున్నారు, "పలానిది-పలానిది నీవు జరిగించుట నన్ను చూడనీ." హేరోదు చెడ్డ స్థలములో నిలబడునని నీవంటున్నావా? నేటి మానవుడు అంతకంటె చెడ్డ స్థలములో నిలబడవలసి యుండును! హేరోదునకు నాలుగువేల సంవత్సరముల అనుభవముండెను, ప్రవక్తలు, జ్ఞానులు, మనకు ఆరు-వేల సంవత్సరముల అనుభవమున్నది, అప్పుడు వారికున్న దానికంటె శ్రేష్టమైన బోధ మనకుయున్నది, నిశ్చయంగా, ఎంతపని అది చేసినది! ఈనాడునూ అది ఆలాగే యున్నది, అదే సంగతి!

MATT 23:37•

LUKE 13:34

 

34ఏమిటి సంగతి? హేరోదు ఎన్నడూ దానిని తీవ్రంగా ఆలోచించలేదు. యోచించుటకు ఎన్నడూ అతడు ఆగలేదు.

నేడు ప్రజలు కూడా అదే రీతిగా ఉన్నారు. వారు ఈ గొప్పదానిని చూస్తున్నారు. అది వారిని ఉలిక్కిపడ చేస్తున్నది, కాని ఎంతోసేపు వారు నిలిచియుండుట లేదు. దానినంతటినీ దూరపరచుటకు ఏదో వివరించుచున్న, రబ్బీ, లేదా ఏదో వేదాంత పండితుని మాట వినుటకు వారు ప్రయత్నించుచున్నారు. అయినను, జెఫర్సన్ విల్ గురించి నేను ఆలోచించునప్పుడు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచునట్లుగా ఎన్నిసార్లు నిన్ను నేను దాచాను, అయినను నీవు వినలేదు. ఎన్నిసార్లు నిన్ను నేను సమకూర్చాను? నిన్ను నేను ఎన్నోసార్లు ఒక అందమైన ఉద్యావనముగా చేసియుండెదను, కాని నీవు వినలేకపోతివి. అప్పుడు సమస్త దేశముల నుండి నీ యొద్దకు ఆకాశ విమానములో ఎగిరి వచ్చియుండెడివారు కాని నీవు వినలేదు.

ఇప్పుడు, ఆ దినమున హేరోదు ఏమి జ్ఞాపకము చేసికొనవలసియుండునో చూడండి. గొప్ప అవకాశమును అతడు కాలదన్నుకొనెను, ఎచ్చటో ఒక చోట క్రిందకు అవతల ఎక్కడో విడువబడినవారు యుండు స్థలముకు తిరిగెను. ఈ రాత్రి దానిని గూర్చి ఏమిచేసెనో అతడు జ్ఞాపకము చేసికొనుచుండెను. ఇప్పుడు ఇక సమయము లేదు.

HEB 13:8

 

35అది మనకు జరుగనీయవద్దు. ఇది మనలను దర్శించు కాలము. క్రీస్తును గుర్తుచేసికొందము, హెబ్రీ 13:8 లో ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని గుర్తుంచుకొందము. దేవుని సన్నిధి ఎచ్చటైతే యుండునో, ఆ పరిమాణములోకి నీవు వెళ్ళలేని స్థితి వచ్చు వరుకు, నాశనమైన వారువుండు ప్రదేశములోకి నీవు వెళ్ళేంత వరుకు నీవు వేచియుండవద్దు. మరియు భూమిమీద నీ సమయముండగానే, రాత్రి నిద్ర యందు కలుగు భయకంపితమైన ఆ స్థలమునకు నీవు చేరుటకు ముందే, నీకు ఉండిన అవకాశమును నీవు గుర్తుచేసికొనుము. మరియు దానిని త్రోసివేయవద్దు, యవ్వన జనులు దీనిని శ్రద్ధగా తీసుకొనుటకు గమనించండి. దానిని మనందరమూ గమనించుదము, హేరోదు ఎన్నడూ తీవ్రంగా దానిని ఆలోచించలేదు. అతనికి ఒకే తరుణము యుండినది, అతడు ఏదో వినోదము చూచుటకు అడిగెను, టోపిలో నుండి ఒక చెవుల పిల్లిని తీయుమని, లేక మరేదో ఒక విధమగు గమ్మత్తు చేయమని యేసును కోరెను. ఒక మాంత్రికునిగా లేదా ఇంకో విధముగా దేనినైనా యేసును గురించి అతడు ఊహించుకొని యుండవచ్చును. "నీవు పరిహాసపు కృత్యములు చేసెదవని మేము వింటిమి. నీ పరిహాసపు కృత్యమును ఇప్పుడు మమ్మల్ని చూడనివ్వు"

MATT 4:3•

MATT 26:68•

MATT 27:40,42•

MARK 14:65•

MARK 15:30,32•

LUKE 4:3•

LUKE 22:64

 

36దీనిని నేను గౌరవముతో చెప్పవచ్చును. కాని ఎందరు ఈనాడు సేవకులుగా పిలువబడుచున్నవారు ఎన్నిసారు ఇట్లనలేదు, "పరిశుద్దాత్మ అనేది ఒకటి ఉండినచో, ఆ ఆదిలో ఉండినట్లుగానే పరిశుద్దాత్మ ఉన్నదని నీవు నమ్మనిచో, నీవు పలాని-పలాని ఆ వృద్దున్ని, లేక ఇక్కడున్న దీనిని, ఈ మనుష్యుని, ఈ స్త్రీ తీసికొని నాకు చూపించు. నేను వెళ్ళి వారిని చూచెదను. అది నీవు జరిగించుట నన్ను చూడనీ."

"నీవు దేవుని కుమారునివైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా చేయుము. నీవు దేవుని కుమారునివైనచో నీ తలపై ఎవరు కొట్టారో చెప్పుము. నీవు ప్రవక్తమైనచో నిన్నెవరు కొట్టిరో చెప్పు, అని ఆయన ముఖమును గుడ్డతో బంధించిరి, యేసును ఆలాగు అనిన అదే ఆత్మవారు కలిగియున్నారని గ్రహించారా? (లేదు, వారు కలిగి లేరు) ఆయనను తల మీద కొట్టి, ఆ కర్రను ఒకరి నుండి ఒకరు తీసికొని, "నీవు ప్రవక్తమైనచో, నిన్ను ఎవరు కొట్టిరో చెప్పుము, అప్పుడు నిన్ను మేము నమ్మొదము. నీవు దేవుని కుమారునివైనచో, మాతో చెప్పుము, మేము మా హృదయాలలో యధార్ధవంతులము. నీవు దేవుని కుమారుడవైనచో, సిలువ మీద నుండి దిగి రమ్ము, అప్పుడు నీవుదేవుని కుమారుడవని మేము నమ్ముదుము," అనిరి.

37ఈనాడు చాలా మంది పురుషులు, స్త్రీలు, వృద్ధులు, యువకులు అదే స్థలములో నిలబడియుండుటను బట్టి నేను ఆశ్చర్యపోతున్నాను. ఒక దినమున మీరు ఆయన సన్నిధానములో ఉన్నట్లను, ఆయన ప్రవాహము వద్ద ఉన్నట్లను మీరు జ్ఞాపకము చేసికోనైయున్నారు, అయితే ఏదో ఒక సూచక క్రియ, ఏదో ఒక గమ్మత్తు, లేక మరేదో చూడవలెనని మీరు కోరారు. "అది నన్ను నమ్మునట్లు చేయును, నా వీపు మీద ఒక వణుకు పుట్టనీ, దీనిని లేదా దానిని చేయనీ అప్పుడు దానిని నేను నమ్ముదును." చూడండి. ఏదో అనుభూతి, తేటతెల్లమగు విగ్రహారాధన!

LUKE 6:46

 

38మీకు తెలుసా, యేసు ఒక సందర్భములో ఒక ప్రశ్న వేసెను, ఈ రాత్రి సంఘమును నేను దీనిని అడుగగోరుచున్నాను. యేసు చెప్పెను, "ఎందుకని? ఎందుకు? నేను మీకు చేయమని ఆజ్ఞాపించిన కార్యములు చేయకుండా నన్ను 'ప్రభువా,' అని మీరునన్నెందుకు పిలచుచున్నారు? నా మాట గైనకుండా ఎందుకు మీరు నన్ను 'ప్రభువా' అని పిలచుచున్నారు? నేను మీకు బోధించమని, నేర్పించమని చెప్పిన ఆజ్ఞలు గైకొనకుండా, ఆ కార్యములు తిరస్కరించుచూ ఎందుకు నన్ను మీరు 'ప్రభువు' అని పిలచుచున్నారు?" అది ఏమిటి? అది ఏమి చేయును? కారణమేమనగా వారికిని, వాక్యమునకును మధ్య ఏదో ఒక శాఖా సంప్రదాయము నిలచియున్నది. దేవునికి, నీకు మధ్య నిలబడునది ఏదయినా గాని అది ఒక విగ్రహమే. అది దేవుని యొక్క స్థానమును ఆక్రమించును, ఎందుకు మీరు నన్ను "ప్రభువా" అని పిలచుదురు? ప్రభువు అనగా, "యాజమాన్యము" అని అర్థము. ప్రభువు ఆస్తికి కర్త, దేవుడు నన్ను సొత్తుగా కలిగియున్నచో, నేనాయన వాడినయినచో, నేను మార్గమధ్యములో ఒక దినమున త్రోవ తప్పియున్నప్పుడు మరలా నన్ను సరియైన త్రోవలోకి త్రిప్పి, ఒక ఉద్దేశ్యము కొరకు ఆయన నన్ను పిలిచెను; నేను చేయవలసినది ఏమనగా ఆయన కోరికను నెరవేర్చుటయే, ఆయన పేతురుకు చేసినట్లుగానే, ఆయన మాటను గైకొనుట తప్ప మరేమయినను నేను ఎట్లు చేయగలను? "నన్నెందుకు 'ప్రభువా!' అని పిలచుచున్నారు?"

39ఇక్కడకు మరో వ్యక్తిని నేను పిలువగోరుచున్నాను, అతని గూర్చి చూద్దాం. యూదా మాట ఏమిటి? ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏమి గుర్తుచేసికొనును? ప్రభువును జ్ఞాపకము చేసికొనుటను గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. ఈ రాత్రి యూదా, ఓ, అతడు ఇక లేని సమయము వరకు, అతడు తన జేష్టత్వమును అమ్ముకొనినట్లుగా గుర్తు చేసికోవలసి యున్నాడు. స్వలాభము కొరకు అతడు యేసును అమ్మెను. మనము యూదాను ఎగతాళి చేయుదుము - యూదా, అతడు అపవిత్రుడు, చెడ్డవాడు అని మనము చెప్పెదము, ఏ స్థలానికి, లేదా ఏ సమాజమునకు అతడు అమర్చబడలేడు. అతడు పరలోకమునకు అమర్చబడలేడని అందుము. ఎందువలన? అతడు తన ప్రభువును అమ్మెను. ఒక శిష్యునిగా, ఒక అపోస్తలునిగా, పరిశుద్ధ గ్రంథములోని ఉన్నత పిలుపును, ప్రవక్తకంటె శ్రేష్టమైన దానిని కలిగియుండు అవకాశమును కలిగియుండెను. ఒక అపోస్తలునిగా ఉండు అవకాశమును అతడు కలిగియు తన స్వలాభము కొరకు అతడు ఆ హక్కును అమ్ముకొనెను. ఇప్పుడు దానిని అతడు జ్ఞాపకము చేసికోవలసియున్నాడు. యేసును అతడు ఆలాగే జ్ఞాపకము చేసికొనెను: స్వలాభము కొరకు అమ్మివేసెను.

వేదికపై నిలబడియుండియూ, సంగీతము పాడు బృందపు దుస్తులు ధరించియూ, పెద్దల పీఠములలో కూర్చుండియూ, లేదా కోశాధికారి, ట్రస్టీ, స్థానములో ఉంటూ, లేక సంఘములో అతని స్థానము ఏదయినప్పటికిని, లేక వేదిక యొద్ద సేవకుడుగా యుండియూ ఎందరు ఈ రాత్రి "డాక్టర్, బిషప్పు, పలాని-పలాని," అను వ్యక్తిగత ప్రశంసల కొరకు, స్వలాభము కొరకు తన అవకాశమును అమ్ముకొనుట లేదు? స్వలాభము కొరకు.

LUKE 16:19,20,23

 

40ఒకప్పుడు ఒకాయన ఇట్లు చెప్పెను, "అది సత్యమని నేను నమ్ముదును. కాని దానిని నేను బోధించినచో, నేను వీధిలో బిక్షమెత్తుకొనవలెను."

ధనికుడు మరియు లాజరు మీకు గుర్తున్నారా? తమ నిత్యత్వ దశలో వారు చివరిగా ఎక్కడ నిలబడిరో గుర్తున్నదా? ఒకడు భిక్షగాడయిననూ, మరొకడు ధనవంతుడయిననూ, ఒక దినమున స్వరూపము మారిపోయినది, ఇద్దరూ గుర్తుచేసికో కలిగిరి, కాబట్టి తన వ్యక్తిగత సంపాదన కొరకు ఆయనను అమ్మిన యూదాను గూర్చి ఈ రాత్రి కేకలు వేయుచున్న ప్రజలు ఈనాడు అదే పనిచేయుటలేదా? వ్యక్తిగత సంపాదన కొరకు ఆయనను అమ్ముచున్నారు.

ఆయనను కలిగియుండవలసిన అవకాశమును, ఆయనకు దాసునిగా ఉండవలసిన తరుణమును, ఆయనకు శిష్యునిగా ఉండవలసిన అవకాశము, ఆయనచే మార్పుపొందినవానిగా నుండు అవకాశమును అమ్ముకొంటిమని ఆనాటి యాజకులు కూడా జ్ఞాపకము చేసికోవలసియుండును. అసూయ అను పచ్చటి విషమునకు వారు దానిని అమ్మివేసిరి. ఆయన సిద్ధాంతమును గూర్చి వారు ఆసూయపడిరి. ఎందుచేత, ఆయన పండ్రెండు సంవత్సరముల వయస్సులో ఉండగానే చెట్టును కొట్టి మొద్దుగా చేసినట్లు ఆయన వారిని ఖండించెను; ఆయనే మెస్సీయా అనే దానిని వారు గుర్తించనేలేదు. వారు గుర్తించలేదు. ఆయన చేసిన క్రియలు వారు చేయజాలకపోయిరి. ఉన్నత శ్రేణి ప్రజల ఎదుట తమ కీర్తిని పోగొట్టుకొందుమని వారు భయపడి తమ తరుణమును అమ్ముకొనిరి. వారు హేరోదు వలె దోషులుగా యుండిరి.

JOHN 1:1

 

41ఈనాటి సంఘ సభ్యుడును ఆలాగే యున్నాడు. ఆ దినములలో వారు తమ శాఖను, మొదలగు వాటిని, తమ కీర్తిని గూర్చి భయపడి, సమాజ మందిరములలో నుండి గెంటివేయబడుదుమని భీతి చెందిరి. అది ఏమిటి? అది విగ్రహారాధనగానే యున్నది! వారి ఎదుట బయలుపరచబడిన సజీవ వాక్యమును అంగీకరించుటకు బదులుగా ఒక విగ్రహమనే మత విశ్వాసమును లేదా సంఘమత విశ్వాసమనే విగ్రహమును వారు ఆరాధించిరి.

వారు దేవుని వాక్యమును చూచిరి. "మనము ఆయనను చూచి, మరియు తాకితిమి," అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అక్షరాలా సజీవముగా, బయలు పరచబడిన సజీవ దేవుని వాక్యమును మానవ హస్తములు తాకినవి. ఆచారములు, మరియు విశ్వాసములు వారి మధ్యను నిలబడినవి. మరియు కడుగబడిన కుండలు, పెనములు మొదలగు పారంపర్య పద్ధతులు వంటి మురికి విషయములు వారికిని, సజీవ దేవునికిని మధ్య నిలబడియుండెను. అవును.

అది ఏమైయుండెను? వారు పక్షపాతము గలవారు. ఆయన యొక్క పవిత్రమగు, నిక్కచ్చియగు సువార్త వాక్యబోధ, తండ్రి వాక్యమునకు వ్యతిరేకముగా వారు పక్షపాతమును చూపిరి, వారాయనపై కక్షపూనిరి, వారాయనపై అసూయపడిరి. వారాయన మీద పగపూనిరి. వారికి జ్ఞాపకము నిలిచియుండు వరకూ, ఇంకా వారు పాతాళములో జ్ఞాపకము కలిగియున్నారు, వారు ఆ విధంగానే జ్ఞాపకము చేసికోబడుదురు. వారాయనను ఆ విధంగానే గుర్తు చేసికోవలసియున్నారు.

"ఓ, వారు పరిసయ్యులు," అని నీవనవచ్చును.

ECCL 11:1•

MATT 25:40

 

42ఈ ఆలయమునకు ఒకామె వచ్చుచుండెడిది. ఓ, మీలో చాలామంది ఆమెను ఎరుగుదురని నేను అనుకొనుచున్నాను, ఇక్కడికి దూరంలో ఉన్న ఒక వీధిలో ఆమె జీవించెడిది. ఆమె తన ఆత్మీయ జీవితము నుండి త్రోవ తప్పినది. నేనామెను చూచునప్పుడెల్లా, ఆమె నా యొద్దకు పరుగిడి వచ్చి నా మీద చేతులుంచి, "సహో, బిల్, నా కొరకు ప్రార్ధించు, నేను వెనక్కు జారిపోయాను," అనెడిది. ఆమె భర్త… కాదు, ఇక్కడున్న వీధిలోనే వారు జీవించేవారనుకొంటాను. ఆమె ఆత్మలో ఉండుట నేను చూచాను. ఆమె మీద దేవుని ఆత్మ యుండి, మరియు ఆమె నాట్యమాడుట, సంతోషించుట, అవన్నీ నేను చూచాను. ఆమె పడిపోయినది. ఆమె ఈ మధ్యనే ఇక్కడి వైద్యశాలలో చేర్చబడి, ఆమె చనిపోవుచున్నదని వారనుకొన్నారు. ఆమె నన్ను వచ్చి ప్రార్థించమని కబురు పంపినది.

ఆమె, మరియు ఆమె భర్త నా భార్యకు ఎంతో మేలుచేసెడివారు. నా భార్య ఒక చిన్న మురికి ముఖపు పిల్లగా ఉన్నప్పుడు వారు అప్పుడప్పుడు ఆమెకు మంచి వస్త్రములను లేదా ఏదో ఒకటి కొని మరియు, ఆమె బడికి వెళ్ళుటకు సహాయము చేసెడివారు. అది ఎంత అల్పమైనదయిననూ, నీవు చేసిన ఏ ఒక్క సహాయమునైనను, దేవుడు దానిని మరిచిపోడు. "మిక్కిలి అల్పులగు ఈ చిన్నవారిలో మీరేది చేసినను, అది నాకు చేసినట్లే," నీటి మీద ఆహారము వేయబడినట్లుగా అది తిరిగి వచ్చును.

43దీన స్థితిలో ఉన్న ఈ వెనుకకు జారిన స్త్రీ అక్కడ పడియుండి, నా చేయి పట్టుకొని ఏడ్చుచున్నది. నేను ఇట్లన్నాను, "సరే, సోదరీ, నీ కొరకు నేను ప్రార్ధించెదను."

ఆమె తరువాత పడక మీద చేతులు కట్టుకొని ఒకామె పడియుండినది, నా వైపు చూస్తుండెను. సుమారు ఇరవై ఏండ్ల వయస్సు గల ఆధునిక బాలునివలె కనబడుచున్న ఆమె యొక్క యవ్వన కుమారుడు ఆమె ప్రక్కనే కూర్చొనియుండెను.

కావున, రిక్కీ అని ఎవరి పేరైనా యున్నయెడల వారిని కించపరచుటకు నేను చెప్పలేదు. కాని నా భావము అటువంటి ఒక పేరును ఆ దినములలో మీరెన్నడూ వినేవారు కారు. ఎల్విస్, మరియు రిక్కీ అనునవి ఈ కాలపు పేరులు మాత్రమే, మీరు చూడండి. అటువంటి పేరు గల బిడ్డ మీకు ఉన్నచో మధ్య పేరుగా గాని ఒక్కటిగా ఉండునట్లు గాని చేయండి.

44ఆ విధంగా ఆమె అక్కడ కూర్చొని బయటకు చూస్తుండగా, నేను నా తలను వంచనారంభించాను, ఆమె నిజంగా చూచుట గమనించాను. "ఒక్క నిమిషము ఆగు, ఆ తెరను లాగు," అని ఆమె అనెను.

"నేను ఆమె కొరకు ప్రార్థించుట మాత్రమే చేయగోరుచున్నాను. నీవు విశ్వాసివి కావా" అని నేను అడిగాను.

ఆమె ఇట్లన్నది, "ఇప్పుడు నేను చెప్పెదను, మేము మెథడిస్టులము, ఆ తెరను నీవు లాగమని మేము కోరుచున్నాము."

"సరేనమ్మా, దానిని లాగుదును."

చూడండి, అదే కార్యము, నేడును అదే సంగతి, ఎంత చిన్నచూపు! నేను ఎటువంటి సేవకుడనో అమెకు ఎట్లు తెలిసినది! నేనా స్త్రీని ఎన్నడూ చూడలేదు. రోగులను బాగు చేయుటలో నేను విశ్వాసముంచుచున్నానని ఎవరో చెప్పుట ఆమె వినియుండును, దానికి వ్యతిరేకముగా ఆమెకు నేర్పించబడినది. దానితో ఆమెకు ఏమీ సంబంధము లేదు. ఆమె దాని నుండి తన చేతులను కడుగుకొన్నది. అది ఆమె పై పడునని ఆమె భయపడినది. బాధపడవద్దు, పిలాతు తన చేతులను కడుగుగొన్న దానికంటె అది ఎక్కువేమీ కాదు.

45ఇప్పుడు మెథడిష్టు వారిని గూర్చి చెడ్డగా చెప్పుట కాదది; ఒక్క స్త్రీ ఆలాగు చేసినది, చూడండి. అది ఆమె అభిప్రాయమై యుండును. మెథడిస్టువారు వారందరూ ఆలాగుందురని నేను అనుకోను, ఎందుకనగా వారిలో ఎందరికో నేను ప్రార్ధించాను. ప్రార్ధించుటకు రమ్మని వారు నన్ను పిలిచారు, మరియు వారి మధ్య అద్భుతములు, మరియు సూచక క్రియలు జరిగినవి. ఆ సంఘములలోనున్న ప్రజలలో ఏమీ లేదు; కాని వారు అలాంటి విధానము క్రింద ఉన్నారు, అది ఆలాగు చేయుచున్నది. కాని ఆమె అటువంటి వారిలో ఒకామె. ఏమిటది? శుద్ధమగు పచ్చగా కనబడు విషము. అసూయ అనే విషమును దయ్యము ఎక్కించినది.

మరోసంగతి చెప్పగలను. ఒకసారి ఇక్కడి పట్టణములో ఒకసారి జరిగిన కూటములో నన్నెందుకు పిలవలేదో వారు చెప్పారు. కాని నేను ఇంటి యొద్ద ఉన్నందున దానిని నేను దాటవేశాను. ఏమయినా గాని, కారణమేమీ లేదు, అది కేవలము అసూయ, మత విశ్వాసము, అది విగ్రహారాధన. అందరినీ కలుపుకొనవలెనని వారి చుట్టూ చేతులుంచుచున్నాము గాని, వారు నిరాకరించుచున్నచో…. యేసు ఆలాగు దానిని చేయగోరెను. గుర్తుంచుకొనండి, ఒకనాడు దానిని నీవు జ్ఞాపకము చేసికోవలసియుందువు. దానిని నీవు గుర్తు చేసికోవలసియుందువు.

46ఈ మధ్యనే విన్న ఒక సాక్ష్యము నాకు గుర్తుకొస్తున్నది, ఇక్కడున్న హేబర్న్ భవనంలో ఒక సేవకుడు ఎలివేటర్లో పైకి వెళ్ళుచున్నాడు. ఆ ఎలివేటర్లో ఈ సేవకునితో పాటుగా ముగ్గురు వ్యక్తులు ఎలివేటర్ మీద ఉన్నారు. ఈయన ఒక సేవకుడని వారికి తెలియదని నేను తలంచుచున్నాను. వారు వెళ్ళుచూ ఎనిమిదవ అంతస్తులో ఆగిరి. ఒక వ్యక్తి సేవకుని పైపు చూస్తూ ఇట్లన్నాడు, "ఏమిటో నీకు తెలియునా? మనము ఇంతకంటె దగ్గరగా పరలోకమునకు ఎన్నడూ వెళ్ళలేము."

"మంచిది," అని అంటూ సేవకుడిట్లు పలికెను, "నీవన్నది సరియేనని నేను అనుకొనుచున్నాను, నీవన్నది నిజమని నేను భావించుచున్నాను. మన స్వంత ప్రతిభయందు మనము నమ్మిక ఉంచినంత కాలము ఇంతకంటె దగ్గరగా ఎన్నడూ మనము ఉండలేము." అది సరియే. నీవు చేయు దానియందు నీవు నమ్మకమును ఉంచునంత వరకు నీవు చేసినదానిని నీవు గుర్తుచేసికొనుచున్నాము. మనలో చాలా మందిమి ఏమీ చేయలేదని ఎరుగుదుమని నేను నిశ్చయంగా చెప్పగలను, కాబట్టి ఏదియూ పొందుకొనుటకు మనకు అర్హత లేదు. "మన స్వంత ప్రతిభలను మనము నమ్మినంత కాలము మనము వెళ్ళగలిగినది ఇంతవరుకే," అన్నాడు. సరే, మనము నమ్మిక యుంచినచో, మనము పొందునది అదే.

ISA 43:25•

EPH 2:6•

HEB 10:17

 

47కాని, ఓ, నేను ఒక్క సంగతి చెప్పగోరుచున్నాను. నేనేమైయున్నానో దానిని నేను మరచిపోయి, ఆయనేమై యున్నాడో దానిని గుర్తుచేసికొని, యేసును నేను జ్ఞాపకము చేసికోగలిగినచో, సిలువ యొద్ద ఆయనను నేను గుర్తుచేసికొన్నచో, నా కొరకు ఆయన చేసిన దానిని నేను గుర్తుచేసికోగలిగినచో, నా పాపములను ఆయన కడిగివేసిన ఘడియను నేను గుర్తుచేసికో కలిగినచో, నన్ను నడిపించుటకు ఆయన తన పరిశుద్దాత్మను ఇచ్చిన సమయమును గుర్తుచేసికొన్నచో, దీనికి పైకి వెళ్ళకుండా పట్టుకొనియుంచిన ప్రతి దాని నుండి నేను పైకి ఎత్తబడగలను. ప్రతి భూసంబంధమైన దాని నుండి పైగా నేను లేవనెత్తబడి, ఎచ్చట నేను ఆయనతో సహవాసము చేయగలనో, ఆ ఉన్నత స్థలమగు క్రీస్తునందు నేను లేవనెత్తబడుదును. అక్కడ ఆయన సన్నిధిలో, నేనేమైయున్నానో ఆ ప్రతిదియు మరచి, నా పాపములు మరియు సమస్తము మరచిపోదును, ఎందుకనగా అవి అన్నియు మరుపు అను సముద్రములో పడవేసెను. గుర్తు౦చుకొనుము, ఆయన నన్ను తన స్వంతవానిగా చేసుకోనెను, ఆయన యొక్క స్వంత మరణము ద్వారా. ఆయన నా స్థానమును తీసుకొనెను.

మరియు నేను పాతాళానికి తప్ప వేరేచోటికి వెళ్ళే అర్హత నాకు లేనప్పుడు, ఆయన నా స్థలమును తీసుకొనెను, మరియు నన్ను పాతాళము నుండి లేవనేత్తెను. ఆయన నా కొరకు అక్కడికి వెళ్ళెను. మరియు ఆయన యొక్క సమృద్ధి గల కృపతో లేవనేత్తెను. మనము దేవుని కుమారులము, మరియు కుమార్తెలమైయుండి, మనము ఉన్నతమైన పరలకపు స్థలములలో క్రీస్తుతో కూర్చు౦దుము, ఇక్కడి వరకు మనలను క్షేమముగా తెచ్చిన వానిని స్తుతిస్తూ మరియు ఎల్లప్పుడూ ఆనంది౦చెదము. మరియు మన అంతరాత్మలో స్థిర విశ్వాసముతో, ముందుకు సాగుతూ, మరియు ఆయన కృపతో నన్ను తిసుకోనును.

ROM 8:29,30

 

48విశ్వాస నేత్రముల ద్వారా నెరవేర్చబడిన ఆయన లేఖనమును నేను చూచుచున్నాను, "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలచెను, ఆయన ఎందరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎందరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను," కాబట్టి ఈ ఆలోచనతో జనసమూహములో నేను నిలబడి యుందును. అక్కడ దేవుని యొక్క ఆత్మ ఉన్నది, యేసు క్రీస్తునందు పరలోక స్థలములందు కూర్చొనుటకు పైకెత్తిబడియున్నాము. మర్త్య హృదయస్పందన కలిగి, ఒక రోజున ఆగిపోనైయుండు మానవ జీవితము యొక్క ఈ నికృష్టమైన ఆకారము మార్పునొంది ఆత్మయొక్క హృదయమును అనుగ్రహించబడి అంతము లేని కాలమునకు అవతలగా అది స్పంధించుచూ, వ్యాధి లేని, దుఃఖము లేని, వృద్ధాప్యము లేని మరియు మరేదిగాని లేని ఆ ఘడియ కొరకు ఎదురుచూచుచున్నాము. మరేదీ గాని లేకుండాయుండును.

ACTS 1:11

 

49యేసును గుర్తుచేసికొనండి. ఇంటిలోని తొట్టె ఖాళీ అయిపోయి ఇక పిండి ఏమీ లేనప్పుడు, యేసును గుర్తుచేసికొనండి. ఇక అవకాశము లేదని వైద్యుడు చెప్పినప్పుడు, యేసును గుర్తుచేసికొనండి. దయ్యము నిన్ను శోధించుచున్నప్పుడు; ముగింపు గీతము మనము పాడుచుందము, "మన చుట్టూ శోధనలు కమ్ముకొనినపుడు, ప్రార్థసలో ఆ పరిశుద్ధ నామమును శ్వాసించండి"

యేసును గుర్తుంచుకొనుడి, ఆయన తిరిగి వచ్చునని గుర్తు చేసికొనుట. మన యొద్ద నుండి ఏరీతిగా కొనిపోబడెనో, ఏ రీతిగా ఆయన పరలోకమునకు ఎక్కి పోయెనో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. గుర్తుంచుకొనండి, ఆయన తన స్వకీయుల కొరకు తిరిగి వచ్చును.

మనము తలలు వంచి ప్రార్ధించుదము. ఈ ముక్కలుగా నున్న వర్తమానము ఇంకా మీ హృదయములలో ఉన్నది, ఆయన ఇప్పుడు మిమ్ములను జ్ఞాపకము చేసికోవలెనని మీరు కోరుచున్నారా? ఆలాగు కోరినచో చేతులెత్తండి, ఏదైనా ప్రత్యేక విన్నపమున్నచో, "ప్రభువా, నన్ను గుర్తుచేసికొనుము," అని చెప్పండి. ఆ కవి చెప్పినటుగానే, "కన్నీళ్ళు క్రిందికి జారుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము."

50మా అతి పరిశుద్ధ తండ్రీ, మాకు జీవవాక్యమును ఆయన చూపించుచుండగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మేము ఎంతగానో అనుభవించియున్నాము. ఏ గోతి నుండి తీయబడి మేము మలచబడితిమో దానిని మేము గుర్తుచేసికొన్నాము. ఇప్పుడు, మేము ఆ గోతి నుండి లేపబడి యేసుక్రీస్తు కృప ద్వారా దేవుని యొక్క బిడ్డలముగా మలచబడియున్నాము. ఒక వైద్యుడు నా ముఖములోనికి చూచి ఈలాగు చెప్పినప్పుడు, నేను ఆయనను గుర్తుచేసికొన్నాను. "ఇక కొద్ది నిమిషములు మాత్రమే," నేను యేసును జ్ఞాపకము చేసికొన్నాను. కృప కొరకు బలిపీఠము నొద్ద నేను మొర పెడుతూ, నా ఆత్మ భారముతో యుండగా నేను యేసును గుర్తుచేసికొన్నాను. నన్ను విడిచిపెట్టిన భారమును నేను గుర్తుచేసికొన్నాను. యేసు నా భారమును తీసివేసెను.

కొన్ని నెలల క్రితము, బల్ల మీద కూర్చొనియుండి, ఒక లక్ష్యమును కొట్టుటకు తుపాకీ గొట్టము నుండి చూస్తున్నాను. "ఇప్పుడే నా అవకాశమని," సాతాను తప్పక తలంచియుండును. ఆ తుపాకీ ప్రేలినప్పుడు, గొట్టము, మొదలు, తుపాకీ కదలిక ప్రతి చోటకూ వెళ్ళేను. నా చుటూ అగ్ని ఆవరించెను. నేను నా కాళ్ళ మీద నిలబడవలెనని తలంచాను. రక్తము చిమ్ముచున్నది, అది యేసేనని నేను గుర్తుచేసికొన్నాను. ఏ హానియు జరుగలేదని వైద్యుడు చూచినపుడు, అతడు ఇట్లనెను, "తన దాసుని రక్షించుటకు ప్రభువు కూడా తప్పక అక్కడ కూర్చొనియుండునని మాత్రమే నేను తెలుసుకొనుచున్నాను. లేనిచో అట్టి ప్రేలుడు వలన అతడు ముక్కలు ముక్కలుగా ఎగిరిపోవలసినదే." ఓ, దేవా, మేము ఆ సంగతులన్నింటినీ ఎట్లు గుర్తుచేసికొనగలము!

JOHN 14:13,14

 

51ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి ప్రవహించిన రక్తముతో నిండిన ఊట యొద్దకు మేము వచ్చుచున్నాము. ప్రభువా, ఈ రాత్రి మా అందరినీ దీవించుము. చేతిని ఎత్తిన ప్రతి హస్తము వెనుక ఉన్న గురిని, మరియు ఉద్దేశ్యమును నీవెరుగుదువు. వారి కోరికను మరియు అవసరతను నీవెరుగుదువు. ప్రభువా, నీ దాసునిగా, నేను వారితో వచ్చుచున్నాను. ఇప్పుడు, ఈ ఆలయము నుండి పైగా (విశ్వాసముతో) మేఘములు, చంద్రుడు, నక్షత్రములు, పాలపుంత దాటిపోయి, ఇప్పుడు మేము దేవుని సన్నిధిలోనికి చేరియన్నాము. నా ఎదురుగా సువర్ణ బలిపీఠము చాపబడియున్నది, అక్కడ మేము గుర్తుచేసికొను బలి ఉంచబడియున్నది. యేసు, అది చెప్పెను, "నా నామమందు తండ్రిని ఏమి అడిగినను దానిని నేను అనుగ్రహించుదును." ప్రభువా, మా విశ్వాసమును విఫలము కానీయవద్దు, కాని మేము నమ్మినచో అడిగియున్న దానిని పొందియున్నామని గుర్తుచేసికొననిమ్ము. మా కొరకు దానిని సంపాదించుటకు యేసు మృతిపొంది, దానిని నిశ్చయముగా చేసెనని మేము గుర్తుచేసికొనుచున్నాము.

52ప్రభువా, మా భవనమును నీవు విస్తరించుచున్నట్లుగా మేము చూస్తున్నాము. మాకు దీనిని చేసినది నీవే, మా సంఘమునకు విస్తరణ కలుగజేసినది నీవే. ప్రభువా, ఆదిలో ఈ సంఘమును మాకు ఇచ్చినది నీవెనని మేము ఎరుగుదుము. ఈ ప్రయత్నములను నీవు దీవించమని మేము ప్రార్ధి౦చుచున్నాము.

నీ యొక్క దీనుడగు, దయాళుడగు, నమ్మకమగు దాసుడను, మా సంఘ కాపరియునగు సహో. నెవిల్ కోరకు ప్రభువా మేము ప్రార్ధి౦చుచున్నాము. అది వెనుక కుర్చీలో కూర్చొనియుండవలసి వచ్చినను లేదా అది సంఘమును బాగుచేయుట అయినా గాని, ఏ స్థితిలో అయిననూ సేవ చేయుటకు అతడు ఇష్టపడుచున్నాడు. అతడు నీకు ఎచ్చట అవసరమై యున్నాడో, అచ్చట నీకు ఒక సాధనముగా యుండి నీవెక్కడికి పిలిచినా అతడు నీకు సేవచేయుటకు ఇష్టపడుచున్నాడు. అతడిని నీవు దీవించమని దేవా, మేము ప్రార్ధించుచున్నాము. దేవా, ఈ గొప్ప శోధన నుండి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. ఈ ట్రస్టీలు నా తరపున నిలబడిరి, ఈ సంఘము నా కొరకు ప్రార్ధించినది, చివరగా జయము వచ్చెను. ఓ దేవా, వారికొరకు నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, వారిని కూడా జ్ఞాపకము చేసికొనుచున్నాను. నిశ్చయముగా నీవును జ్ఞాపకము చేసుకొందువని నమ్ముచున్నాను.

ISA 49:15,16•

HEB 13:5

 

53నీవు మాకు అనుగ్రహించిన దీవెనలను మేము గుర్తుంచుకొనుచున్నాము. నీ మాటను మేము గుర్తుచేసికొనుచున్నాము. ఎన్నడూ మమ్మును విడువననియు, ఎడబాయననియు చెప్పియున్నావు. వృద్ధాప్యము వలన ఏమీ కలుగదు. ఇంకా మమ్మును నీవు జ్ఞాపకము చేసికొందువు. లోకము నశించినా, సమయము నిత్యత్వములోనికి ఎగిరిపోయినా సరే. ఈ విధముగా వ్రాయబడియున్నది, "తల్లి తన పాలు త్రాగు బిడ్డను మరచునా? నిన్ను నేను ఎన్నడూ మరువను. మిమ్మును నా అరచేతులలో చెక్కుకొనియున్నాను." ఆ మేకులు మన పేర్లు అక్కడ చెక్కినవి. ప్రభువా, నీవు మమ్మును గుర్తుచేసికొందువని మాకు తెలియును. నీవెల్లప్పుడు మా రక్షకునిగా, మా వైద్యునిగా, మా రాజుగా, మా ప్రియునిగా, మా జీవముగా, మా సూర్యకాంతిగా, మా స్వరములో స్వరముగా, ఆదాము కుటుంబము యొక్క పతనమయిన మానవులమగు మాకు దేవుని కృప, ప్రేమల యొక్క ఎండిపోని ప్రవాహముగా మా ప్రేమ స్మృతులలో ఉండిపోదువు గాక ప్రభువా, దీనిని మాకు అనుగ్రహించుము, యేసును జ్ఞాపకము చేసికొనుచూ, ఈ రాత్రి ఆలయము నుండి వెళ్ళుచుండగా, ఇప్పుడు మమ్మునుమేము నీకు అప్పగించుకొనుచున్నాము. ఆమేన్.

54మీరాయనను గుర్తుంచుకొందురా? మీరు ఆయనను ప్రేమించుదురా? చిన్న ముక్కలుగా యున్న ఈ వర్తమానములో ఇది చెప్పవచ్చునని నేను అనుకొనుచున్నాను. పౌలు చెప్పెను, "మనమేమి చేసినను, మన ఆత్మయందే చేయుదము." అన్నింటిలోను ఆయనను మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఆయనను జ్ఞాపకముంచుకొను వరకూ మనము ఏమియూ తీర్మానము చేసికొనవద్దు, ఏమియూ చేయకుందము, ఎందుకనగా అది జ్ఞానముగలదిగా ఉండును. శత్రువు ఒక చెంప మీద కొట్టినట్లయితే, తిరిగి మనము కొట్టు ముందుగా ఆయనేమి చేసెనో మనము జ్ఞాపకము చేసికొందము. ఆయన కార్యమును మనము గుర్తు చేసికొందము. చేయవలసిన తీర్మానము ఒకటి ఉన్నచో మనము వేచియుందుము, ఆయన ఎట్టి తీర్మానము చేయునో మనము ఆలోచించి, అప్పుడు మనము అట్టి తీర్మానము చేయుదము. మనము తొందరపడినచో, ఆయన ఎన్నడూ తొందరపడడని మనము జ్ఞాపకము చేసికొందుము. చూచారా! మనము దేనిగురించైనా అతిగా చింతించుచున్నయెడల ఆయన నిత్యత్వములో నివాసము చేయుచున్నాడని జ్ఞాపకము చేసికొందము. కాలము ఆయనకు ఏ మాత్రమూ లెక్కలేదు. ఆయనను జ్ఞాపకము చేసుకొనుటయే మన హృదయము యొక్క ఉద్యేశ్యము, మరియు గురి అయివున్నది.

1COR 14:4,5,8•

1JN 4:8

 

55"నేనాయనను ప్రేమించుదును," అనే పాటను ఆయన యొక్క ఆత్మ ప్రసన్నతలో ఇప్పుడు మనము పాడుచుండగా, ఆయనను మనము జ్ఞాపకము చేసుకొనెదము. ప్రేమ నీలో నివసించినయెడల, ఆయన నీలో నివసించును, దేవుడు ప్రేమై యున్నాడు. దేవునిలో నివసించువారు ప్రేమలో నివసించుదురు. చూచారా? ప్రేమకు ద్వేషము లేదు, ప్రేమకు అసూయ లేదు. ప్రేమకు గర్వము ఉండదు. ప్రేమ తప్పుడుగా ప్రవర్తించదు. ప్రేమ ఎల్లప్పడూ మృదువుగా, మధురముగా, మన్నించునదిగా, దయగలదిగా యుండును. ఇతరులు ఎంతటి కఠినమైన వారుగా యున్నను ప్రేమ మారనిదై నిలచియుండును. ప్రేమ అనునది కృప యొక్క ముగింపుగా యుండును. మన ప్రవచనము, మన అన్య భాషలు, మన అనువాదములు, మనము ఎప్పుడూ చేయని సమస్త కార్యములన్నియూ మరేమైనా గాని, ఇతర వరములన్నియు మరియు ఆ కార్యములన్నియూ అదృశ్యమైపోయిన తరువాత ప్రేమ వచ్చినప్పుడు, అదియే ముగింపుగా యుండును. అది అన్నింటికంటే శ్రేష్టమైనదిగా యున్నది, ఎందుకనగా ఇతర కార్యములన్నియు విఫలమగును. ప్రేమయే ప్రధాన న్యాయస్థానము యొక్క తీర్పుగా యున్నది. అది కట్టివేయు (tie post) స్తంభముగా యున్నది. అది నావికులు దిక్కులను కనుగొను ఉత్తర నక్షత్రముగా యున్నది. మనలను దిక్కులు చూపించుచూ నడిపించు సాధనము అదియే. ప్రేమయే సమస్తమునకు ముగింపు. "నేనాయనను ప్రేమించుదును," అని మనము పాడుచున్నప్పుడు. దానిని మనము జ్ఞాపకము చేసుకుంటూ పాడెదము.

నేనాయనను ప్రేమింతును,

నేనాయనను ప్రేమించుదును.

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను,

ఆ కల్వరి మ్రాను మీద,

నేనాయనను ప్రేమింతును,

నేనాయనను ప్రేమించుదును,

ఎందుకనగా ఆయనే మొదట. (ఇప్పుడు గుర్తుంచుకొనండి.

ఆయన నన్ను ప్రేమించి తన కుమారుని ఇచ్చెను)

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

56మన సోదరీలు మన కొరకు ఈ పాట యొక్క కొసలు ఇప్పుడు అందించుచుండగా, [సహో, బ్రన్హం ఆలపించుట ప్రారంభించెను] సహవాస మాధుర్యములోకి ప్రవేశించుదము. క్రీస్తునందు అందరమూ కలిసి పరలోక స్థలములందు మనము కూర్చొనియుండగా, ఇప్పుడు అందరూ, మీ హృదయములో నుండి అంతయూ తీసివేయండి. మరియు గుర్తుంచుకొనండి. దేవుని వాక్యము ఆలాగు చెప్పుచున్నది. నేనాయన దాసుడను. ఆయన ఇక్కడ ఉన్నాడు, అయితే మనము ఎవరో ఒకరితో చేతులు కలిపి ఈలాగు చెప్పదము, "సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును." మీకెవరయినా విరోధులున్నచో అతని యొద్దకు వెళ్ళి చూచి, "సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును," అని చెప్పండి. ఈ పాటను మరల పాడి పరస్పరము కరచాలనము చేయుచుండగా, నిజంగా ఆత్మలో మాధుర్యముతో దానిని ఇప్పుడే మీరు చేయరా?

నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమింతును,

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను

నా రక్షణను కొనెను

ఇప్పుడు మనము చేతులు పైకెత్తుదము.

నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమించుదును,

ఎందుకనగా… (యేసును గుర్తుంచుకొనండి!)

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

57ఇప్పుడు మనము తలలు వంచి దానిని ఆలపించుదము. [సహో, బ్రన్హం ఆలపించసాగారు.] యేసును జ్ఞాపకముచేసుకునుట!

ఇప్పుడు, మన సహోదరి మధురముగా మరియు నెమ్మదిగా వాయిధ్యము ఆలపించుచుండగా. నేను మన మంచి సహోదరుని అడుగుతాను… సహోదరుడా నేవిల్, మీరు ఏమైనా చెప్పవలెనా? కొల్లిన్స్ సహోదరుడు వెనుక వున్నారు అడుగుతాను. మాతో కలిసి ఉన్నటువంటి గౌరవమైన సహోదరుడా, మీరు ప్రార్దించి ముగించేదరు. మనము మన తలలు వంచుదాం, కొల్లిన్స్ సహోదరుడా.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...