వాక్యము నిమిత్తము నింద

వాక్యము నిమిత్తము నింద

నెవిల్ సోదరుడా, నీకు వందనములు. [సహోదరుడు నెవిల్ “ఆమేన్” చెప్పుచున్నాడు—సంపా.]

నేను సోదరుడు నెవిల్‌కు చెప్పాను, “నిశ్చయముగా ఈ ఉదయమున నీపై రవ్వంత అభిషేకము లేదు?”

2 నేను రోగుల కొరకు ప్రార్థన చేయుటకు వచ్చాను. ఆదివారము ఉదయమున పెందలకడ, అక్కడ కొంతమంది ప్రజలు ప్రోగైయున్నారు. వారినే నేను అక్కడ పట్టుకోవాలి, వారిని సంఘము నొద్దకు రానిచ్చాను. ఆలయము చుట్టూ రోగుల కొరకు ప్రార్థించుట, అది ఎల్లప్పుడు శ్రేష్టమైనదని నేను అనుకొంటాను. నాకు తెలియదు. ఆలయము అంటే నాకు ఇష్టము, మరియు సంఘము యున్న చోటికి వచ్చి, బయట ప్రజలకు ప్రార్థన చేయుట నాకు ఇష్టము.

3 ఆ వెనుక ఒక చిన్న బాలిక యున్నది, ఎంతో చక్కని చిన్న పాప, ఎందుచేత, ప్రజలు వారి గృహమునకు వెళ్లకపోయినట్లైతే, ఆమె ఇక్కడే ఎక్కడో కూర్చొని యుంటుందని నేను అనుకొంటాను. ఓ, ఇప్పుడు నేను చూస్తాను. మరియు అది ఎంతో చక్కనిదై యున్నది. ఆమె చాలా రోగిగా యున్నది. భాషలతో వచ్చిన వర్తమానమును, మరియు దానియొక్క అనువాదమును మేము వినుచుంటిమి. మేము వింటూయుండగా, ఆ చిన్న బాలికను గూర్చి ఏదో చెప్పబడినదని మేము గ్రహించియున్నాము. అక్కడ ఏమి చెప్పాలో అని, ప్రభువు ఒక వర్తమానమును ఇచ్చినట్లైతే, చూడాలని మేము కనిపెట్టుచున్నాము. అయితే ఆ చిన్న బాలిక బాగుగానే యుండబోవుచున్నది, ఆరోగ్యముగా ఉండబోవుచున్నది. మరియు ఆ విధముగా…

4 అక్కడ ఒక స్త్రీ కూడా యున్నది. ఆమె తన దృష్టిని కోల్పోయియున్నది, మేము ఆమె కొరకూ ప్రార్థించుచున్నాము. అక్కడ బయట అంబులెన్స్‌లో ఒక మనిషి, ఒక సేవకుడు యున్నాడు. ఆ మనిషి ముప్పయి ఐదు లేక నలభై పౌండ్ల కంటే ఎక్కువ బరువు యుండడు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేయుటకు క్రిందకు వచ్చాను.

5 నేను ఒక రకముగా సంకోచించిన కారణమేమనగా, నా పళ్ళలో నుండి, ఎంతో నింపబడియున్న సున్నము రాలిపోయింది. మరియు నాకై నేనుగా ఈల వేయుచున్నాను, ఈ ఉదయమున, ఆ ముందు యున్న పన్నును, నేను పీకించవేయవలసి వచ్చింది. ఆ స్థలములో వాటి మీద మూతలు ఉంచబడ్డాయి. కాబట్టి ఈ వృద్ధ వయస్సు పైకి ప్రాకుచుండగా, అది మాత్రమే నేను ఎరిగియున్నాను. దానిలో సున్నము నింపబడింది, దానిలో సగానికి. నేను మాట్లాడుట ప్రారంభించినపుడు, నీవు దానిని గ్రహించగలవు. గాలి ఒక రకముగా బయటకు నెట్టుతుంది, నా భావము నీకు తెలుసా, బయటకు నీ పెదవుల గుండా. అది ఒక రకముగా నోరు తిరుగకుండా చేస్తుంది.

6 ఈ ఉదయమున నిజానికి మనము సజీవులుగా యుండి ఒక ఆధిక్యత గల ప్రజలుగా ఆలయమునకు వచ్చాము. ఈ క్రిస్మస్ సందర్భమున, వారు కలిగియున్న ఉత్సవము కొరకు కనిపెట్టుచున్నాము, అదే నా నిరీక్షణ…ఈ ఉదయమున అక్కడ ఎంతోమంది చిన్న పిల్లలున్నారు, కాబట్టి నేను మౌనముగా యుంటాను. చూడండి? మనము పెద్దవారము, కొన్నిసార్లు మనము కనీసము పిల్లలు వినలేని విషయములను మాట్లాడతాము, నీకు తెలుసా.

7 అయితే, కొంచెము తరువాత చిన్న పిల్లల కొరకు సంఘము చిన్న కానుకను కలిగియున్నది. నేను ఆ వెనుక యుండి, దానిని పైగా చూస్తున్నాను. ఓ, నీవు ఉండాలనుకొనుచున్నావా? సండే స్కూలు తరువాత, మీరు కొంచెము వేచియుండండి, చూడండి, ’కారణమేమనగా, ఆ చిన్న పిల్లలకు ఇచ్చుటకు, ఈ ఉదయమున వారు కొన్ని బహుమానములను కలిగియున్నారని నేను అనుకొనుచున్నాను. చిన్న పిల్లలారా గుర్తుంచుకోండి, మనము దీనిని చేయుచుండగా, దీనిని నేను తేటపర్చగోరుచున్నాను, అది శాంతాక్లాస్ కాదు, ’కారణము అది ఒక కథయైయున్నది, దానికి ఏ అర్థము లేదని మీరు తెలుసుకుంటారు. అయితే అది యేసుక్రీస్తు నుండియై యున్నది. ఇది అన్ని సత్యములకు సత్యము, నీవు చూడు అది దేవుని యొక్క కుమారుడు. ఈ ఉదయమున, ఈ చిన్న బహుమానమును మేము మీకు ఇచ్చుచున్నాము, కారణము అది మీరు ఎరుగునట్లు, ఒకసారి దేవుడు మానవాళికి ఎన్నడైనా ఇవ్వబోవు అతి గొప్ప కానుకను ఇచ్చాడు: అది ఆయన కుమారుడే. మరియు దానిని వ్యక్తపర్చుటకు మేము ఒక దీనమైన విధానమును కలిగియున్నాము. దానితో అక్కడ పోల్చినట్లైతే, మేము మీకు ఏమియు ఇవ్వలేము. అయితే మర్త్యులముగా, ఒకరికి ఒకరము, దానిని చేస్తాము.

8 ఇపుడు, వచ్చే ఆదివారము వరకు కనిపెట్టబోవుచున్నాను. నేను చెప్పగోరే ఒక విషయము మీద, ఎలాగైనా, నేను బహుశా కనిపెడతాను. పైన గృహము నొద్ద, ఒక దర్శనమును గూర్చి, ఒకటి మాకు తెలియపర్చబడియున్నది, నేను తప్పక దానిని బయటకు వెంబడించాలి. అది ఒక రకముగా కరుకుగా యుంటుందని మనము ఎన్నడూ తలంచరాదు. ఆయన భారములు తేలిక.

9 అది తరువాత ఆదివారమై యున్నందున, ప్రభువు చిత్తమైన యెడల, ఈ కూటమును మనము కలిగియుండుటకు దేవుడు సంతోషించిన యెడల, క్రొత్త సంవత్సరము సందర్భముగా ముందు, ఇక్కడ మనము ఒక కూటమును కలిగి యుండబోవుచున్నాము. ఉదయము కూటమును మనము కలిగియుంటాము. రోగుల కొరకు ప్రార్థన చేద్దాము, మరియు బాప్తిస్మము కూటమును కలిగియుంటాము. తరువాత నేను అనుకొంటాను, వారునూ లోనికి వచ్చునట్లు మన స్నేహితులకు ప్రకటన చేద్దాము. అప్పుడు మనము ఆదివారము ఉదయము మరియు ఆదివారము రాత్రిని కలిగియుంటాము. తరువాత ప్రజలు నూతన సంవత్సర కూటము కొరకు, వేచి యుండగోరినట్లైతే, అప్పుడు మనము, ఈసారి కనిపెట్టే కూటమును కలిగియుందాము? [సహోదరుడు నెవిల్ “అవును” అని చెప్పుచున్నాడు—సంపా.]

10 నూతన సంవత్సరము రాత్రికి, అక్కడ మాట్లాడే అనేకమంది సేవకులు అర్థరాత్రి వరకు మాట్లాడతారు. అలాటి సేవకులను వచ్చి మాట్లాడమని మనము ఆహ్వానిద్దాము. ప్రభువు చిత్తమైన యెడల, నూతన సంవత్సరము రాత్రికి మాట్లాడే వారిలో, నేనును వారిలో ఒకడిగా యుండగోరుచున్నాను.

11 మరియు తరువాత ఆదివారము, దేవుడు ఎలా తన ప్రజలతో వ్యవహరిస్తాడో, జరిగిన ఒక వరుస సంగతులను, జరుగుచున్న సంగతులను నేను పైకి తెస్తాను. మరియు దానిని తిన్నగా, సంఘము నొద్ద ఒక ముమ్మరానికి తెచ్చి చూపెడతాను.

12 మనము వెళ్లుచున్న ఆదాయపు పన్ను వ్యవహారమును గూర్చి, మీలో కొందరు ఆశ్చర్యపోవుచున్నారు. అది పరిష్కరించబడింది. కాబట్టి అది ఎలా సంభవించి యున్నదో కూడా నేను మీకు చెపుతాను. నేననుకొంటాను, అది మరలా నేను తిరిగి చెప్పాలి, వచ్చే ఆదివారము, కాబట్టి వచ్చే ఆదివారము వరకు నేను కనిపెట్టాలి. ఈ ఉదయమున, వాక్యములో నుండి నేను కొంచెము మాట్లాడుతాను, చూడండి? వచ్చే ఆదివారము, ప్రభువు చిత్తమైన యెడల, ప్రభువు చెప్పిన విషయములను ప్రతి ఒక్కటి మీకు తెచ్చుటకు ప్రయత్నము చేస్తాను. దాని స్థానమును అది ఖచ్చితముగా తాకుటను గమనించండి, ఖచ్చితముగా సరిగ్గా అది దాని స్థానములో యుంచబడింది. చూడండి? ఆయన ఏదియు తప్పు చెప్పడు.

13 కాని, ఇప్పుడు, ఒక విషయమును నేను ఈ ఉదయమున చెప్పగోరుదును, నిన్న జరిగిన ఒక సంగతిని గూర్చి, బహుశా నేను వచ్చే ఆదివారము చెప్పను. ఈ ఉదయమున నేను వస్తూయుండగా కొంచెము అయిష్టముగా యున్నాను, కారణము నేను నిజముగా ఒక రకముగా చీల్చివేయబడ్డాను. కాబట్టి నేను దానిని ఎక్కువ ఇష్టపడను. కాని, నేను ఇక్కడ యున్నందున, మంచిది, నేను చేయగలిగిన శ్రేష్టమైన రీతిలో ప్రయత్నిస్తాను.

14 మొన్నటి రాత్రి, ఇక్కడ మీరు ఎరిగియున్నట్లుగా, సోదరుడు మరియు సహోదరి సాత్‌మన్‌తో నేను సహవాసమును కలిగియున్నాను, ఆయన మన సంఘ ధర్మకర్తలలో ఒకరు, ఆయన, ఆయన భార్య, నన్ను నా భార్యను దర్శించటానికి వచ్చారు. ప్రభువు చిత్తమైన యెడల, ఫినిక్సు మరియు ఆ చుట్టు ప్రక్కల కూటములను గూర్చి మేము మాట్లాడుచుంటిమి. మేము పదిన్నర వరకు పైన యున్నామని నేను అనుకొంటాను, మరియు నేను నా పడకకు పదకొండు గంటల సమయములో వెళ్లాను.

15 రాత్రి ఒక సమయములో, నేను ఒక కలను కన్నాను. మరియు ఈ కలలో నేను ఒకరిని చూశాను, అతడు నా తండ్రి వలె యున్నాడని అనుకొందాము; ఒక బలమైన ఎత్తైన మనిషి, అలంకారముగా నా తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని మాట్లాడతాను. నేను ఒక స్త్రీని చూశాను, ఆమె నా తల్లి వలె కనబడుట లేదు, కాని, ఇంకనూ, ఆమె నా తల్లి వలె యున్నదనుకొందాము. ఈ మనిషి (నా తండ్రి వలె యున్నాడనుకొందాము, ఈ స్త్రీ యొక్క భర్త) క్రూరముగా ఆమెను హింసించుచున్నాడు, ఎంతమట్టుకనగా అతని చేతిలో ఒక గొప్ప చెక్కపేడున్నది, మరియు అతడు ఆమెను రీతిగా పట్టుకొని, ఆ పెద్ద కర్రతో ఆమెను కొట్టుచున్నాడు, ఆమె క్రింద పడిపోవుచున్నది, తరువాత, మళ్ళీ, కొద్ది సేపటి తరువాత, ఆమె తిరిగి పైకి లేచి నిలబడింది. మరలా అతడు, ఆమె చుట్టూ వెళ్లి, ఆమెను అతడు మరలా కొట్టాడు, మరలా కొట్టాడు. నేను దూరములో యుండి దానిని గమనిస్తున్నాను.

16 చివరగా, నేను దానిమీద విసిగిపోయాను. నేను ఈ మనిషి కంటే చాలా చిన్నవాడిగా యున్నాను, అతడు నా తండ్రి వలె యుంటాడనుకొందాము. కాబట్టి నేను అతని యొద్దకు నడచి వెళ్లి, అతని ముఖముపై నా వ్రేలు చూపి, నేనన్నాను, “మళ్ళీ ఆమెను కొట్టవద్దు.” చూడండి? నేను ఆలాగు చేసినప్పుడు, ఏదో సంభవించుట ప్రారంభమైనది, నా చేతులు బాగా ఉబ్బిపోయి, నా కండరాలు, బలముగా లావుగా మారినవి. ఆలాటి కండరాలను నేను ఎన్నడూ చూసియుండలేదు. నేను సరిగ్గా అతని కాలర్ పట్టుకొని, “మళ్ళీ ఆమెను కొట్టవద్దు, నీవు మళ్ళీ కొట్టినట్లైతే, నీవు ఇక నాతో తేల్చుకోవాలి, మళ్ళీ ఆమెను కొట్టినట్లైతే.” అప్పుడు ఆ మనిషి నన్ను చూసి భయపడ్డాడు. నాకు మెళుకువ వచ్చింది.

17 మంచిది, అక్కడ పరుండియుండగా, సరిగ్గా ఒక్క క్షణములో, నిజానికి, దానియొక్క అనువాదము వచ్చింది. అది నిజానికి, అలంకార భాషలో మాట్లాడితే, అది సంఘమైయున్నది, అది ఒక విధముగా తల్లి. మరియు తండ్రి ఆమెపై యున్న సంఘశాఖ, భార్య మీద భర్త ఏలుబడి చేసినట్లుగా, అది సంఘము పైన ఏలుబడి చేస్తుంది. ఈ సంఘశాఖలు ఆ సంఘమును కొట్టుచున్నవి, కనీసము ఆమెను తన పాదముల మీద నిలబడనియ్యుట లేదు. సరిగ్గా, ప్రతిసారి ఆమె పైకి లేచుటకు ప్రయత్నించినపుడు, లేక ఏదైనా చేయుటకు ప్రయత్నించినపుడు, అక్కడయున్న ప్రజలు, సంఘశాఖలు ఆమెను క్రిందకు పడవేయుచున్నవి. దాని భావము కొన్ని విశ్వాసపు కండరములు నా వ్రేలికి అతుక్కొనుచునే యున్నవి, నేను ఇట్లు చెపుతున్నాను, “నీవు నాతోనే పెట్టుకొంటున్నావు. చూశారా?” కారణము, అక్కడ కొందరు ప్రజలు దేవునికి చెందిన వారున్నారు. అది బాగున్నది.

18 అక్కడ రెండు లేక మూడు గంటలు దరిదాపుగా మేము యుండియున్నామని నేననుకొంటాను. వారిలో ఒకరు, నా కుమార్తె రిబ్కా, ఆ వెనుక ఉన్నది, లూయిస్‌విల్‌లోని మెథడిస్టు హాస్పిటల్‌లో పని చేస్తుంది. ఓ, అది, ఒక చిన్న నర్సు ట్రైనింగ్. అది “జీతము లేకుండా ఆసుపత్రి సహాయకుల ఉద్యోగము చేసేవారు,” అని వారిని పిలుస్తారు లేక ఆ విధముగా పిలుస్తారు. ఆ ఉదయమున వారు ఆమెను రమ్మని పిలిచియున్నారు, దానిని బట్టే నేను మేల్కొన్నాను. ఉదయమున పెందలకడ, ఆమె మరియు స్కూలులో ఆమెతో పనిచేసే సహచరురాలితో, వారిద్దరూ కలిసి పని చేస్తారు, వారిని లూయిస్‌విల్ తీసుకొని వెళ్లబోవుచున్నారు. వారు అక్కడ పది గంటలకు ఉండవలసియున్నది. ఆమె ఎందుకు పడక గదిలోనికి రాలేకపోయిందోనని నా భార్య ఆశ్చర్యపడింది. నేను దానికి గడి వేసియున్నాను.

19 ఇప్పుడు, నా జీవితములో ఎన్నో సంగతులు సంభవించియున్నవి, కాని అలాటి దానిని నేను ఎన్నడూ కలిగియుండలేదు. నేను ఒక చిన్న మైకములోకి వెళ్లాను. దాని అనువాదము నాకు తెలియదు. అలాటి దానిని ఎన్నడూ నేను నా జీవితములో కలిగియుండలేదు. కాని, నా ముందు, అది ఒక దర్శనము అని నేను గ్రహించాను మరియు నేను ఆ దర్శనములో యున్నాను. అయితే నేను నా కుమారుడైన యోసేపుతో మాట్లాడుచున్నాను. అతడు ఆ సమయములో గదిలో లేడు. కాని ఎలాగో అది నన్ను తాకియున్నది, నేను యోసేపుతో మాట్లాడుచున్నాను.

20 నేను పైకి చూశాను. నా ముందు ఒక రకమైన పిరమిడ్ ఆకారములో అది ఉన్నది, అవి చిన్న పక్షులు, అవి అంగుళము పొడవున్నవి. అవి పైన కొమ్మలపై యున్నవి, అక్కడ ఒక కొమ్మ మీద మూడు లేక నాలుగున్నాయి. తరువాత కొమ్మ మీద, ఎనిమిది లేక పది ఉన్నాయి. మరియు క్రింద పదిహేను లేక ఇరవై యున్నాయి.

21 వారు చిన్న సైనికులై యున్నారు, కారణమేమనగా వాటి రెక్కలు నలిగిపోయినవి, మరియు అవి నాతో మాట్లాడి ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నట్లుగా కనబడినది. నేను పశ్చిమాన యున్నాను. ఆరిజోనాలోని టుసాన్‌లో యున్నట్లు కనబడుచున్నది. ఆ పక్షులు తూర్పునకు చూస్తున్నాయి, మరియు నేను జాగ్రత్తగా వింటున్నాను, అవి నాతో ఏదో చెప్పుటకు ప్రయత్నిస్తున్నట్లు కనబడింది, అవి చిన్న రెక్కలను కలిగియున్నవి, అవి నలిగిపోయినవి. అవి ఎంతో యుద్ధ గాయములతో యున్నాయి. తరువాత అకస్మాత్తుగా, రీతిగా ఎగిరి ఒక పక్షి మరొక పక్షి స్థానమును తీసుకొన్నది. ఆ చిన్న పక్షులు తూర్పు వైపునకు వేగముగా ఎగిరిపోయినవి.

22 మరియు అవి దానిని చేసినప్పుడు, అచ్చట నుండి ఒక పొడుగైనటువంటి పక్షి వచ్చెను, అవి పావురముల వలే ఉండెను, చాలా పదునైన రెక్కలు కలిగి ఉండెను. మరియు అవన్నియు కూడా గుంపుగా చాలా వేగముగా వచ్చెను, చిన్న పక్షుల కంటే వేగముగా వచ్చి, తూర్పు వైపుగా అవి ఎగిరి వెళ్లెను.

23 నేను ఇంకనూ…నా రెండు మనస్సాక్షులతో ఏకముగా యున్నాను, నేను ఇక్కడ నిలబడి యున్నానని ఎరిగియున్నాను, ఆలాగే మరొక చోట కూడా యున్నట్లుగా ఎరిగియున్నాను. చూడండి? నేననుకొన్నాను, “ఇప్పుడు, ఇది దర్శనమై యున్నది, దీని భావము ఏమిటో నేను తప్పక తెలుసుకోవాలి.”

24 అవి వెళ్లిపోగానే రెండవ గుంపు పక్షులు వచ్చాయి, నేను పశ్చిమ దిశగా చూశాను. అది ఒక పిరమిడ్ రూపములో యున్నది, రెండు ప్రక్కల రెండు, ఒకటి పైగా, ఎంతో బలమైన ఐదుగురు దూతలు వచ్చారు. నా జీవితములో నేను ఎన్నడూ వాటిని చూడలేదు. ఎలాటి అద్భుతమైన వేగము, నేను ఎన్నడూ చూసి యుండలేదు. వాటి తలలు వెనుకగా, వాటి మొన రెక్కలతో, త్వరగా ప్రయాణము చేయుచున్నవి! మరియు సర్వశక్తిగల దేవుని యొక్క శక్తి, ఎలా నన్ను తాకియున్నదనగా, అది నన్ను నేల మీద నుండి తిన్నగా పైకి లేపినది.

జోసెఫ్ ఇంకా మాట్లాడుటను నేను వినగలను.

25 శబ్ద అవరోధమును బ్రద్ధలు చేసినట్లుగా అది శబ్దము చేయుచున్నది. ఒక గొప్ప గర్జన, దూరములో దక్షిణమునకు పైకి వెళ్లింది. నేను పైకి లేపబడినపుడు…అక్కడ దూతల యొక్క ఎలాటి అద్భుతమైన వేగము యున్నదో! వారు వచ్చుచుండగా, తిన్నగా నాలోనికి ఊడ్చివేసుకొంటూ, ఆకారములో నేను చూడగలను.

26 ఇప్పుడు, నేను కలగనుట లేదు. లేదు. ఇప్పుడున్నంత ఎంతో మెళకువగావున్నానో, అక్కడ నేను అంత తిన్నగా యుండియున్నాను. చూడండి?

27 అయితే అది ఇక్కడకు వస్తుంది. వారు ఎంత అద్భుతమైన వేగముతో యున్నారనగా, చివరకు, అది పైకి లేపబడినపుడు, నేననుకొన్నాను…ఆ ప్రేలుడును నేను విన్నాను, ఒక ప్రేలుడు వలె, ఒక శబ్ద అవరోధము వలె బయటకు వెళ్లింది. అది సంభవించినపుడు, నేననుకొన్నాను, “మంచిది, దీని భావము తప్పక నేను చంపబడబోవుచున్నాను, చూడండి, ఏదో ఒక విధమైన ప్రేలుడులో.” నేను ఆ విషయములను గూర్చి ఆలోచించుచుండగా, “కాదు, అది కాదు, కారణము అది ఒక ప్రేలుడై యున్నట్లైతే, అది జోసెఫ్‌ను కూడా కలిగియున్నది, ఏలయనగా అతడు అక్కడ యున్నాడు, నేను అక్కడ యున్నానని అనుకొంటూ, ఇంకా అతడు మాట్లాడుచునే యున్నాడు. నేను అతని మాటలు వినగలను. అది అదియై యుండలేదు.”

28 ఇప్పు ఇదంతయూ దర్శనములో యున్నది. అది అది కాదు…చూడండి? అది దర్శనములో యున్నది.

29 తరువాత అకస్మాత్తుగా, వారు నాతో యున్నట్లుగా నేను గ్రహించియున్నాను. నేను వారిని చూడలేకపోయాను, కాని ఒక పిరమిడ్ వలె వారున్న నక్షత్ర రాశిలోనికి, ఐదుగురు దూతల నక్షత్ర రాశిలోనికి నేను తేబడియున్నాను. నేననుకొన్నాను, “ఇప్పుడు, మరణ దూత వాటిలో ఒకటైయుంటుంది. ఐదు కృపా సంఖ్య.” దానిని నేను ఆలోచన చేయుచున్నాను. నేననుకొన్నాను, “ఓ! అది నా వర్తమానముతో వచ్చుచున్నది. అది నా యొక్క రెండవ ముమ్మరము. వారు ప్రభువు నుండి నాకు వర్తమానము తెచ్చుటకు వస్తున్నారు.” నా బలమంతటితో, నేను, ఎంత బిగ్గరగా అరవగలనో అంత బిగ్గరగా అరిచాను, “ఓ, యేసు నీవు నన్ను ఏమి చెయ్యమంటావు?” నేను ఆలాగున చేసినపుడు, అది సరిగ్గా నానుండి దూరముగా వెళ్లిపోయింది.

30 నేను అప్పటి నుండి బాగుండ లేదు. చూడండి? నిన్న రోజంతా నేను దరిదాపుగా భయముతో నింపబడినవాడనై, ఇంటి యొద్దనే యుండవలసి వచ్చింది. నా మనస్సును నేను తేటపర్చుకొనలేకపోయాను. దేవుని యొక్క మహిమ మరియు శక్తి! అది నన్ను విడిచిపెట్టినప్పుడు, నాకు అంతా తిమ్మిరి పట్టింది. నా చేతులను నేను రుద్దుకొనుటకు ప్రయత్నించాను. “నేను నా శ్వాసను పీల్చలేననుకొన్నాను.” క్రింద చుట్టూ ముందుకు వెనుకకు నేను నడిచాను. నేననుకొన్నాను, “ప్రభువా, దాని భావము ఏమిటి? దాని భావము ఏమిటి?” తరువాత నేను ఆగాను, నేనన్నాను, “ప్రభువైన దేవా, నీ సేవకుడు…దానిని గ్రహించలేకపోవుచున్నాడు. ఎందుచేత? అది ఏమైయున్నది? ప్రభువా, దానిని తెలియజేయండి.” మంచిది, అప్పుడు…

31 “ప్రభువు యొక్క శక్తి” అని నేను చెప్పినపుడు, నేను దానిని గూర్చి చెప్పలేను. దానిని వివరించే మార్గము అక్కడ లేదు. ఇక్కడ దీవెనలలో నీవు స్పృశించినట్లుగా కాదు. అది ప్రభువు యొక్క దీవెన. అది పవిత్రమైనది! ఓ, అయ్యో! కనీసము ఒక మర్త్యుడు ఊహించే దానికి అది అవతల యున్నది. చూడండి? అది ఎంతగానో నన్ను బాధించుచున్నది. అది ఒక దీవెన కాదు. అది బాధింపబడుట. నీవు కలవరపడ్డావు. చూడు? అది అదియే.

32 అది ఏమైయున్నదో దానిని ప్రజలకు చెప్పగలిగే మార్గమును నేను కేవలము పొందగలిగినట్లైతే…దాని యొక్క భావన ఎలా యుంటుందో! అది ఇక్కడ కూర్చున్నట్లుగా, ఆనందించునట్లుగా కాదు. అది ఎలాంటిదనగా నీలోని ప్రతీ నరము, అది భీతికంటే ఎక్కువగా ఉంటుంది. అది భయపడుట కంటే ఎక్కువగా యుంటుంది. అది ఒక పవిత్రమైన గౌరవము. నేను…దానిని అక్కడ వివరించే మార్గము లేదు. కనీసము చివరకు, నా పూర్తి వీపు భాగము, పై నుండి క్రిందకు నా వెన్ను అంతా, పైకి క్రిందికి నా బొటన వ్రేళ్ళ గుండా, నా పాదముల గుండా, నా మొత్తము తిమ్మిరి ఎక్కిపోయింది. చూడండి, ఈ ప్రపంచములో నుండి నీవు ఎక్కడకో వెళ్లినట్లుగా యుంది. మరియు అది, క్రమేణా నన్ను విడిచిపెట్టుచున్నది, నేను ప్రభువుతో చెప్పాను, “ఓ దేవా, నీవు దానిని నన్ను తెలుసుకొననిస్తావా?”

33 ఎన్నడైనా, ఎంతో దగ్గరగా, ఎంతో బలముగా తిరిగి ఆ జీవి వచ్చియున్నది. స్విట్జర్‌లాండ్ లోని జురిచ్చిలో నేను యున్నప్పుడు, ఆ సమయములో ఆఫ్రికా గుండా గుర్రంపై స్వారీ చేసే ఆ ఇంగ్లీషువాడిని, ఆ జర్మనీ పక్షిరాజు గమనించుచున్నది. మరియు ఆయన అన్నాడు, “అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.”

34 నాకు సహాయము చేయుమని ప్రభువుకు నేను మొర్రపెట్టుచుంటిని. దాని అనువాదమును ఆయన నాకు ఇవ్వాలని కోరుచున్నాను, ఎందుకంటే దాని భావమును గూర్చి నేను ఆశ్చర్యపోతాను. దాని భావము నేను వెళ్లిపోవుచున్నానా, లేక నేను చంపబడబోవుచున్నానా. అది ఆలాగు యైయున్నట్లైతే, నా కుటుంబమునకు దానిని గూర్చి నేను ఏమియు చెప్పను. అది నేను ఇంటికి వెళ్లే సమయమైయున్నది, ఎందుకని, నేను వెళ్లిపోతాను, దానికున్నదంతా అదియే. కాని దాని భావము అదేయై యున్నట్లైతే, నేను నా కుటుంబమునకు చెప్పుట నాకు ఇష్టము లేదు. దానిని గూర్చి వాళ్లు ఏమియు తెలుసుకొనుట నాకు ఇష్టము లేదు. సరిగ్గా దానిని జరగనివ్వండి, దానికున్నదంతయూ ఆలాగున యుంటుంది.

35 నేనన్నాను, “ప్రభువా, నాకు సహాయము చేయుము. ఇది, గృహమునకు నా పిలుపు యైయున్నట్లైతే, కుటుంబమునకు చెప్పుట నాకు ఇష్టము లేదు, మంచిది, నేను వెళ్లిపోవుచున్నాను.” నీవు చూడు…

36 నీవంటావు, “మంచిది, నీవు దర్శనములో ఏమి చెప్పావో, దర్శనము ఏమి చెప్పియున్నదో, దానిని గూర్చి నీవు ఎందుకు ఆలోచన చేయకూడదు?”

37 కాని ఆలాటి సంగతులను అప్పుడు నీవు ఆలోచించలేవు. ఎలాగైనా, నేను చేయలేను. నేననుకొన్నాను…నేను కలవరపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఎలా ఆలోచన చేయాలో నీకు తెలియదు, నీవు ఆలోచించలేవు.

38 నేనన్నాను, “పరలోకపు తండ్రీ, దాని భావము ఒక ప్రేలుడు నన్ను తీసుకొని వెళ్లబోవుచున్నట్లైతే, ఇప్పుడు నన్ను తెలుసుకొననిమ్ము, ఆ ప్రకారము దానిని గూర్చి నేను ఏమియు చెప్పను. నీ మహిమ మరియు నీ శక్తి మరలా నా పైకి వచ్చి, మరలా నన్ను పైకి లేపనిమ్ము. లేక నీ మహిమ నా మీదికి రానిమ్ము, అప్పుడు నేను తెలుసుకుంటాను, అది దాని యొక్క భావమని, ఆ ప్రకారము నేను దానిని నాకై దాచుకొంటాను.” మరియు ఏమియు సంభవించలేదు.

39 కాబట్టి, అప్పుడు నేనన్నాను, “అలాగైతే, ప్రభువా, నీవు నీ వర్తమానికుని నీ పనిమీద పంపబోవుచున్నట్లైతే, అప్పుడు, మరలా నీ శక్తిని రానిమ్ము.” అది నన్ను గదిలో నుండి తీసుకొని వెళ్లినట్లుగా యున్నది!

40 అయినను, నాకు తెలివి వచ్చింది, అప్పుడు, బైబిలును నా చేతిలో పట్టుకొనియున్నాను, చూడండి, దేవుడు నాకు సహాయము చేయమని అడుగుచున్నాను, నేను ఆలాగున చేసినపుడు, లేఖనములో ఒకదానిని ఆయన నాకు చూపించాడు, తిన్నగా దానికి సంభవించినదే, అక్కడే యున్నది. నేననుకొన్నాను, “నిజానికి అది అదేనా? నేను దానిని ఎలా చేశాను?” జనులారా, ఆ విషయములను నేను వివరించలేను. అది నేను ఎరిగిన దేనికైనా దూరముగా యున్నది. చూడండి?

41 నా భార్య ఒక వింతైన స్త్రీ యైయున్నది; ప్రపంచములోనే ఒక శ్రేష్టమైన స్త్రీ. కాని కొద్ది సమయము, దానిని గూర్చి నేను ఏమియు చెప్పలేదు. నేను ముందుకు వెళ్లాను. అక్కడ ఏదో సంభవించియున్నదని ఆమె ఎరిగియుండెను. కాబట్టి నేను ఆమెకు చెప్పినపుడు, ఆమె అన్నది, “నీకు తెలుసా, బిల్, అలాటి సంగతులెన్నో నేను వింటాను మరియు చూస్తాను.” “నా హృదయమంతటితో నిన్ను నమ్ముతాను” అన్నది. “కాని అది నిజముగా ఒకదానిని కలిగియున్నది,” అని అన్నది.

42 ఆ ప్రేలుడు మరియు, ఒక రాశిగా వేగముగా వచ్చుచున్న ఆ ఐదు దూతలు, అది నన్ను కదిలించి వేస్తుంది. అలాటి పిరమిడ్‌ను నేను ఒక దానిని గీచియున్నాను. చూడండి, వారు ఎలా ఉన్నారనగా, మొదటగా వారు దూరములో యున్నట్లు కనబడ్డారు. వారు పావురము వంటి రంగులో యున్నారు. మరియు వారు మార్గము నుండి వస్తున్నారు. వారు, ఎలా కనబడియున్నారనగా, ఒకటి, రెండు, మూడు, నాలుగు; మరియు ఒకటి తిన్నగా పైన యున్నది, చూడండి, మొత్తము ఐదు. వారు ఎంత వేగముతో వస్తున్నారో! వాటి వేగములో ఏ జెట్ విమానముతోను, మరియు దేనితోను పోల్చలేము.

43 నేను వారిని చూడగలను, వారి తలలు ఒక విధముగా ప్రక్కకు తిరిగి ఉన్నవి. ఆ రెక్కలు మొనలు వలె వెనుకకు ఉన్నవి, సంపూర్ణ, సర్వాంగ కవచముతో, వారు ఇక్కడకు వస్తారు, కాబట్టి, “అయ్యో!” ఆ రీతిగా యున్నారు. వారు తిన్నగా కిందికి వచ్చి, పిరమిడ్ వలె యున్నవారి నక్షత్ర రాశిలోనికి నన్ను తీసుకొని వెళ్లారు. నేను భూమి మీద నుండి లేపబడుట చూశాను. బహుశా దూరములో, ఆ గర్జనను నేను విన్నాను, “వూమ్!” ఒక విమానము శబ్ద అవరోధమును దాటుచున్నప్పుడు, అది సంభవించుటను మీరు చూశారు, సరిగ్గా దూరములో ఒక గర్జన వలె యున్నది.

44 నేననుకొన్నాను, “ఇప్పుడు దీని భావము ఏమనగా, ఈ దర్శనము నన్ను విడిచినపుడు, నేను ఏదో ఒక ప్రేలుడులో చంపబడబోవుచున్నాను.” నేననుకొన్నాను, “ఇక్కడ నేనున్నాను, నేను పైకి లేపబడ్డాను. వారు ఇక్కడే ఎక్కడో యున్నారు, నేను దూతల యొక్క పిరమిడ్‌లో యున్నాను. కాని నాకు తెలియదు, ప్రభువు నన్ను గృహమునకు తీసుకొని వెళ్లుటకు వస్తున్నాడేమో.”

అప్పుడు క్రింద ఉన్న జోసెఫ్, “నాన్న?” అంటున్నాడు.

“లేదు, అది ఆలాగునయైతే, అది అతనిని కూడా తీసుకొనియుండేది.”

45 ఏదో చెప్పింది, “మీరు…” గుర్తుంచుకోండి, అది ఎల్లప్పుడు ముందుకు కనబడుచున్న ఏదో ఒక వర్తమానము కొరకు నేను కనిపెట్టుచున్నాను.

46 మొన్నటి దినమున దర్శనము, మీకు తెలుసా, మీ మధ్యనే నేను ఇక్కడ ఏమి సంభవించబోవుచున్నదో చెప్పుచుంటిని; ఎలా నేను సూర్యుని నుండి, ఈ స్థలమునకు ఎలా బోధించుచున్నానో. తరువాత ఆయన అన్నాడు, “ఇప్పుడు గుర్తుంచుకో, రెండవ మర్మము ఇంకనూ రావలసియున్నది.”

“అక్కడ ఒక వర్తమానము ఉన్నదని,” నేను అనుకొన్నాను.

47 ఇక్కడ నా వర్తమానమును గుర్తుంచుకోండి? ఆ తలరాయిని తెరచుట, అక్కడ, ఆ ఏడు స్వరములు మరియు ముద్రలు కనీసము దేవుని వాక్యములో వ్రాయబడియుండలేదు. గుర్తుంచుకోండి? అది నన్ను పిరమిడ్‌లోనికి తీసుకొని వెళ్లింది.

48 జూని జాక్‌సన్, నీవు ఇక్కడ యున్నట్లైతే, అది ఎంతో కాలము క్రితము అది నీవు నాకు ఇచ్చిన కలయై యున్నది. ఈ ఉదయమున నేను దానిని చెప్పను. దేవుడు ఎంతో పరిపూర్ణముగా యున్నాడు. మరియు దాని అనువాదమును నీకు ఇవ్వనందుకు నన్ను మన్నించుము; ’ఏలయనగా ఏదో కదులుటను నేను చూస్తాను.

J.T. ఇదే సంగతి, చూడండి, నాకు అది తెలుసు.

కాలిన్స్ సహోదరీ, ఖచ్చితముగా అదియే. చూడండి?

వాటిలో ఆరు, తిన్నగా అదే కార్యమునకు నడుపుచున్నవి.

49 తరువాత, దర్శనములు, ఎన్నో సంవత్సరముల క్రితము మీ అందరికి నేను చెప్పాను, ఇది సరిగ్గా నిన్నటి దినమున సంభవించింది. చూడండి? అది సంభవిస్తుంది.

50 అది అక్కడ యున్నది, తిన్నగా సమస్తము అక్కడ యుంచబడియున్నది. అది ఏదో కదులుచున్నది. అది ఏమిటో నాకు తెలియదు. దేవుడు నాకు సహాయము చేయాలని నా ప్రార్థన.

ప్రార్థన చేసుకొందాము.

51 పరలోకపు తండ్రీ, మేము కేవలము మర్త్యులమై యున్నాము, మరియు ఈ ఉదయమున ఇక్కడ నిలబడియున్నాము. ప్రభువా…ఈ చిన్న మందను, ఈ సంఘమును నడిపించుటకు నీవు నన్ను పంపావు. నేను నా అంతములో యున్నాను, ఏ మార్గమో, ఏమిటో, ఎక్కడ నుండి వచ్చుచున్నదో నాకు తెలియదు. కాని ఈ ఒక్క విషయము నాకు తెలుసు, అదేమనగా, నీవన్నావు, నీ చిత్త ప్రకారము పిలవబడిన వారికి, నిన్ను ప్రేమించువారికి “సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి.” దేవా, ఆ గొప్ప కృపా హస్తము మాపై యుండవలెనని నేను ప్రార్థిస్తాను.

52 నీవు నిజముగా దేవుడవై యున్నావని మాకు తెలుసు. నీవు ఎప్పుడో గతించిన దినములలో జీవించినవాడవు కాదు, కాని ఇంకనూ ఈరోజు నీవు జీవించుచున్నావు. నీవు ఎల్లప్పుడు దేవుడవైయున్నావు. నీవు ఎల్లప్పుడు దేవుడుగా యుంటావు. నీవు కాలమునకు ముందే దేవుడవై యున్నావు, అక్కడ ఇక ఎంతమాత్రము కాలము లేనపుడు, నీవు దేవుడుగా యుంటావు. నీవు ఇంకనూ దేవుడుగా యుంటావు.

53 మేము నీ చేతులలో యున్నాము ప్రభువా. మేము కేవలము జిగట మన్ను, ప్రభువా, నీవు మా కుమ్మరివాడవు, మమ్మును మలచేవాడవు. మరియు మా యొద్ద నుండి శ్రేష్టమైన పరిచర్యను పొందునట్లు, ఆ మార్గములోనే మా జీవితములను మలచండి. తండ్రీ, దానిని దయచేయుము. మేము సరిగ్గా నీ చేతులలో యున్నాము.

54 ఇక్కడకు మమ్ములను మేము తెచ్చుకునే ఏ మార్గమును లేదు, లేక మేము ఎలా బయటకు వెళతామో మాకు తెలియదు. దేవా, మాకు జీవితమునిచ్చావు, మరియు మరలా మా జీవితములను నీకిస్తాము, ఆ ప్రకారము దానికి మారుగా నీవు మాకు నిత్యజీవమునిచ్చావు. మా సొంత జీవిలోనికి, మా విశ్వాసము శ్వాస పీల్చుకొంటుంది. దీనిని బట్టి మేము నిన్ను ప్రేమిస్తాము, కారణము ఒక దినమున మేము నిన్ను చూస్తాము, మరియు నీవు నీ యొక్క మహిమలో యుంటావు. మేము నిన్ను చూస్తాము. ఆ మాటలను వినుటకు మేము ఎదురుచూస్తాము, “భళా నమ్మకమైన, నా మంచి దాసుడా, జగత్తు పునాదికి ముందునుండే సిద్ధపరచబడిన, నీ యజమానుని యొక్క సంతోషములో ప్రవేశించుము.” ఆ సమయము వరకు, ఓ దేవా, మేము కలుసుకొను వరకు, మమ్మును నడుపుము.

మేము నీ సేవకులము, మా పాపముల కొరకు మేము క్షమాపణ అడుగుచున్నాము.

55 ఈ బలమైన దర్శనములు, ప్రభువా, నీ సేవకునికి ఎంతో ఎక్కువైయున్నవి. నేను ఏమిచేయాలో నాకు తెలియదు. వాళ్లు వచ్చారనే నాకు తెలుసు. అది ఏమి చెప్పబడిందో, నేను ఏమి చూసియున్నానో, అంతవరకే నేను చెప్పగలను. కొన్నిసార్లు అది నన్ను భయపెడుతుంది, ప్రభువా. నేను ఏమిచేయాలో నేను ఆశ్చర్యపోతాను.

56 తరువాత, ఆ దేవదూతలు మోకాళ్ళ వరకు వాటి రెక్కలతో కప్పుకొని యుండుటను యెషయా చూసినపుడు, ఎలా యెషయా భావించియున్నాడో, నేను బైబిలు తీసుకొని అక్కడ చదివాను. ఆశ్చర్యము కాదు, అతడు బిగ్గరగా మొర్రపెట్టాడు, “నా కన్నులు ప్రభువు యొక్క మహిమను చూసియున్నవి, అయ్యో నాకు శ్రమ!”

57 అప్పుడు, ప్రవక్త బిగ్గరగా మొర్రపెట్టినపుడు: నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివాసము చేయుచున్నాను, అని అన్నప్పుడు, ఆ దూత నిప్పు కొరివి తీసుకొని, అతని పెదవుల మీద యుంచినపుడు, అతడు ఆలయములో శుద్ధి చేయబడ్డాడు, అయినను అతడు ఒక ప్రవక్త. దేవదూత ఆ నిప్పు కొరివెలను తీసుకొని అతని పెదవులపై యుంచి శుద్ధిచేసి, ఈలాగన్నాడు, “ఇప్పుడు, వెళ్లి ప్రవచించు.”

ప్రభువైన దేవా, అని యెషయా మొర్రపెట్టాడు, “ప్రభువా, నేను ఇక్కడ యున్నాను, నన్ను పంపుము.”

58 ఈ దుర్మార్గపు, వ్యభిచారపు తరము కొరకు, “మా కొరకు ఎవరు వెళతారు?” అని ఆయన అన్నప్పుడు!

59 ఓ, దేవా, అది తిరిగి చెప్పబడనిమ్ము. అది మరలా రానిమ్ము, ఓ ప్రభువా. శుద్ధి చేయుచున్న అగ్నితో పరిశుద్ధాత్మను పంపుము. ఏలయనగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య జీవించుచున్నానని నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నీ దృష్టిలో మేము అపవిత్రులము. అయితే, శుద్ధిచేయు శక్తిని పంపుము, పరిశుద్ధాత్ముడా! ప్రభువా, మమ్మును శుద్ధి చేయుము. ప్రభువా, నీ సేవకుని శుద్ధిచేయుము.

60 అలాగైతే మాట్లాడుము, ప్రభువా. నీ సేవకుడు వినుచున్నాడు, ఆ స్వరమును వినుటకు నేను కోరికతో యున్నాను. నేను నీ వాడను. నీ బలిపీఠముపై నన్ను నేను యుంచుకొనియుండగా, నీవు చూచునట్లు, తగినట్లుగా వాడుకొనుము. పరిశుద్ధాత్ముడు నన్ను శుద్ధి చేయునుగాక, ప్రభువా; ఇది అదే ఘడియ యైయున్నట్లైతే, ఇది అదే సమయమై యున్నట్లైతే, ఎవరైనా వెళ్లాలని నీవు కోరినట్లైతే, వారిని అభిషేకించి ముందుకు పంపుము.

61 ప్రభువా, నాకు తెలియదు. ఆ దూతలను నేను చూసియున్నాను, అంతవరకే నాకు తెలుసు. అవి, ఖచ్చితముగా సత్యమైయున్నవని నీకు తెలుసు. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, “అయ్యో, నాకు శ్రమ,” కాబట్టి నాకు సహాయము చేయుము.

62 ఇప్పుడు, ఈ ప్రజలను దీవించుము, ప్రభువు యొక్క జన్మదినము యొక్క పండుగకు ముందు, ఈరోజు మేము ఇక్కడ యున్నాము. మాకు సహాయము చేయుమని ప్రార్థిస్తాము.

63 ఈ ఉదయమున, నీ సేవకుడైన మా సోదరుడు నెవిల్, బహుశా కొన్ని క్షణములు అతడు విశ్రాంతి తీసుకోవాలని, ఇది ఆ సమయమై యున్నదని అతడు భావించియున్నాడేమో, బహుశా నేను మాట్లాడవలసియున్నదేమో. ఇప్పుడు, నీవు నాకు సహాయము చేయుమని ప్రార్థిస్తాను.

64 ఇక్కడయున్న వారు, మేమందరము, ప్రభువా, అవసరతలో యున్నాము. కాబట్టి ఇప్పుడు మేము నీ వాక్యమును చదివి, కొద్దిసేపు ధ్యానించుచుండగా, మమ్మును దీవించుమని మేము ప్రార్థిస్తాము. ప్రభువా, నీ ఆత్మ మా మీదికి వచ్చునుగాక. ఆ గొప్ప నిత్యుడైన దేవుడు రాకముందు, ఈ చనిపోవుచున్న ప్రపంచమును కదిలించునట్లు, దేవుని యొక్క వర్తమానముతో, తాజాగా నీ బలిపీఠము నుండి, నీ పరిశుద్ధాత్మతో, మమ్మును శుద్ధిచేసి, నీ అగ్నితో మండించుము. ఏలయనగా యేసు నామములో, ఆయన ప్రియ కుమారుడు, మా రక్షకుని నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

65 మీ దృష్టిని కొన్ని లేఖనముల వైపు నేను పిలువగోరుచున్నారు, కొంత నోట్సు, నేను వ్రాసుకున్నాను.

66 డాక్ లేక బిల్లీ, లేక వారిలో ఒకరు నాకు చెప్పారు అని నేను నమ్ముతాను, పిల్లలను బట్టి కొంచెము పెందలకడ విడిచిపెట్టాలని కోరారు. దానికొరకు వారు కొన్ని బహుమానములను కలిగియున్నారు.

67 సండే స్కూలు నుండి ఇప్పుడే బయటకు వచ్చిన పిల్లలైన మీరు, కొంచెము సేపు ఇక్కడ నిలిచియుండండి. మేము ఇక్కడ నుండి ఏమి చెపుతామో, అది మీకు కొంచెము లోతుగా యుంటుంది, కాని మీరు ఇంకనూ కొన్ని నిముషములు మీ అమ్మ, నాన్నతో కూర్చొని యుండండి. నేను వారితో మాట్లాడతాను.

68 ఇప్పుడు కీర్తనలు, 89వ కీర్తన. కీర్తన 89వ అధ్యాయము నుండి ఒకటి లేక రెండు వచనములు నేను చదువుతాను. కీర్తన 89వ అధ్యాయము నుండి 50, 51, 52 వచనములను నేను చదువుతాను.

69 ఇప్పుడు, ఆ వెనుక, ఇంకా వెనుక మీరు బాగా వినగలుగుచున్నారా? మీరు వినగలుగుచున్నట్లైతే, మీ చేతులను ఎత్తండి? ఈ మైకులన్నీ చక్కగా పనిచేయుచున్నవా? [ఎవరో ఒకరు చెప్పుచున్నారు “నాకు తెలియదు,” అని—సంపా.] ఇది బాగుందా, లేక ఇదా? ఇదా? ఇదా? [“ఈ ప్రక్కన ఉన్న రెండు పనిచేయుచున్నవి.”] ఇక్కడే, రెండూ ఉన్నవి? [“ఇది, ఇది మరియు ఇది.”] మంచిది.

70 వారు దీనిని టేపు చేయబోవుచున్నారో లేదో నాకు తెలియదు. ఇది ఈరోజు ఉదయమున ఒక ఎదురుచూడని సంఘటన.

71 ఇప్పుడు మరచిపోవద్దు, మీ స్నేహితులందరిని కలిగియుండండి. నిశ్చయముగా, ఇంచుమించు, వచ్చే ఆదివారము కూటానికి హాజరవటానికి ప్రయత్నించండి.

72 త్వరలో వారు సంఘము యొక్క పనిని ముగిస్తారని నేను అనుకొంటాను. అప్పుడు, నేను మరలా వచ్చి, ప్రభువు చిత్తమైన యెడల, లేఖనములలో నుండి, నేను ఏడు ముద్రలను గూర్చి బోధిస్తాను.

73 కీర్తనల గ్రంథము, 89వ అధ్యాయము 50వ వచనము నుండి ప్రారంభము. ఇప్పుడు చదువుచున్న వాక్యమును జాగ్రత్తగా వినండి.

ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరి చేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.

యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు.

యెహోవా నిత్యము స్తుతినొందును గాక. ఆమేన్ ఆమేన్.

74 కొన్ని క్షణములు నేను మీతో మాట్లాడతాను…మీరు ఆ మొదటి వచనమును గుర్తుపెట్టుకోండి, మరియు మరలా మరలా, చాలా చక్కగా దానిని చదవండి. బహుశా, ఇప్పుడే తిన్నగా మరలా అది చదవబడుట భరించబడాలి. ఇప్పుడు దగ్గరగా వినండి. చూడండి?

ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరి చేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.

యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు.

యెహోవా నిత్యము స్తుతినొందును గాక. ఆమేన్, ఆమేన్.

75 దావీదు దానిని మాట్లాడియుండగా, దానిని జాగ్రత్తగా చదవండి. నేను ఒక అంశమును ఉపయోగిస్తాను…అది చాలా వింతైనది, మరలా ఒక క్రిస్మస్ అంశము యైనట్లైతే; గత ఆదివారము నేను ఒక వింతైన అంశముపై బోధించినట్లుగా యుంటుంది. అది ఏమిటో ఇప్పుడు నేను మర్చిపోయాను. అది…[“చిన్నా భిన్నమై పడిపోవుచున్న ప్రపంచము” అని ఒక సహోదరుడు చెప్పుచున్నాడు—సంపా.] మన్నించండి? [“చిన్నా భిన్నమై పడిపోవుచున్న ప్రపంచము.”] పడిపోవుచున్న: చిన్నా భిన్నమై పడిపోవుచున్న ప్రపంచము.

76 ఈ ఆదివారము, నేను ఒక అంశము కొరకు తీసుకొనేది: వాక్యము నిమిత్తము నింద. మరలా దానిని నన్ను తిరిగి చెప్పనివ్వండి, చాలా చక్కగా…వాక్యము నిమిత్తము నింద.

77 ఆయన తన మాటలను నెరవేర్చుటకు, దేవుడు, ఒక సమయమును, ఆ సమయమునకు ఒక కారణము కలిగియున్నాడు. దేవుడు ఖచ్చితముగా ఏమి చేయబోవుచున్నాడో ఆయనకు తెలుసు. మనకు తెలియదు. ఆయన దానిని సరిగ్గా మనకు ఇచ్చిన రీతిగానే మనమును దానిని తీసుకోవాలి. కాని, ఆయనకు తెలుసు, ఆయన ఏమి చేయుటకు ప్రణాళికను వేసియున్నాడో, దానితో ఏదియు తప్పుగా వెళ్లదు. అది అంతయూ నెరవేరాలి. కొన్నిసార్లు అక్కడ కరుకైన, కఠినమైనవి మాత్రమే ఆ నిజమైన వస్తువు యొక్క నిజమైన స్వభావమును బయటకు తెస్తాయి.

78 నీకు తెలుసా, గర్జించుచున్న ఆకాశములు, చెదరగొట్టుచున్న మెరుపులు, వాటిని కత్తిరించి, చించివేయుట ద్వారా వర్షము పుడుతుంది. మరియు వర్షము లేనట్లైతే మనము జీవించలేము. కాని వర్షమును తెచ్చుటకు అది ఏమి తీసుకొంటుందో నీవు చూడు? ఉరుములు, మెరుపులు, ప్రకాశము, కోపము. దాని నుండి వర్షము వస్తుంది.

79 క్రొత్త జీవమును తెచ్చుటకు గాను ఒక విత్తనము చనిపోయి, క్రుళ్ళిపోయి, మురిగిపోయి, దుర్వాసనతో తిరిగి భూమి యొక్క ధూళిలోనికి వెళ్లిపోవాలి.

80 దానిలోనుండి చిట్టము తీసివేయబడువరకు, బంగారము ముందుకు వెనుకకు దంచుటను తీసుకొంటుంది, త్రిప్పి, త్రిప్పి దానిని దంచుతారు. అది ప్రకాశించుట వలన కాదు, ’కారణము అది అగ్నిశిల వలన, అది వెర్రి బంగారము అని పిలవబడుతుంది, అది కూడా నిజమైన బంగారము వలె ప్రకాశిస్తుంది, కాని రెండింటిని ఏకముగా కలిపి చూడండి. వాటిని ఒకే ప్రక్కగా త్రిప్పి యుంచండి, నీవు కనీసము విడివిడిగా వాటి బేధమును చెప్పలేవు. కాని వాటిని ఒక్కటిగా కలిపి చూడండి, నీవు చెప్పగలవు. ఆ దంచువాడు ఎల్లప్పుడు, తన సొంత రూపము బంగారములో ప్రతిబింబించు వరకు దానిని దంచుతాడు.

81 ఆయన చేయు సమస్తమునకు దేవుడు, ఒక సమయమును, ఒక ఉద్దేశ్యమును నియమిస్తాడు. ఆయన చిత్తానుసారముగా పిలవబడేవారికి, ప్రభువును ప్రేమించేవారికి అనుకోకుండా ఏదియు జరుగదు. చూడండి? మనము ముందుగా నిర్ణయించబడినవారము. సమస్తమూ, దానికొరకు సరిగ్గా జరుగుతుంది. కారణము ఆయన అబద్ధమాడలేడు. ఆయన ఆ ప్రకారము చెప్పియున్నాడు, అదేమనగా సమస్తమూ దాని సమయమును, దాని ఋతువును, దాని మార్గమును కలిగియున్నది. మరియు దేవుడు ప్రతి కదలిక వెనుకయున్నాడు. కొన్నిసార్లు ప్రతీదీ తప్పుగా వెళుతుందని నీవు అనుకొంటావు. అది మన ఇష్టము. తిరుగులాడుట, పరీక్షలు, మనము వాటిమీద ఎలా ప్రతిస్పందిస్తామో చూచుటకు, అవి మనపై యుంచబడినవి.

82 కొద్దికాలము క్రితము, సోదరుడు ఫ్రెడ్ మరియు నేను, న్యూయార్క్‌లోని వెర్మంట్‌లో చాంప్‌లైన్ సరస్సు గుండా వెళ్లాము, మేము న్యూయార్క్ వైపు వెళ్లాము. నేను సాధారణముగా వేటాడే పర్వతము, హరికేన్ పర్వతము మీదికి వెళ్లాను. ఒకసారి నేను తప్పిపోయిన సంగతి అక్కడ గుర్తుంచుకొన్నాను, దేవుడు ఎలా నన్ను వెనుకకు నడిపించాడో, ఒక తుఫాను గుండా, సరిగ్గా పరిశుద్ధాత్ముడే నడిపించాడు. అక్కడే నేను చనిపోయి నశించి పోయేవాడిని, ఆలాగునే నా భార్య, బిల్లీ కూడా ఆ చిన్న కుటీరము నొద్ద, ఎన్నో మైళ్ళ దూరములో, చనిపోయేవారు. కాని నేను చుట్టూ త్రిప్పబడ్డాను.

83 మేము గుడారములోనికి వెళ్లటానికి, దానిగుండా మంచును బయటకు లాగాము, అది ఆకురాలే కాలము ప్రారంభములో. నేను అక్కడ నిలబడి సహోదరుడు ఫ్రెడ్‌తో మాట్లాడుచున్నాను, మరియు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, “ఒంటరిగా బయటకు వెళ్లు.” మరియు నేను కొద్ది సమయము ఒక స్థలములో ఒక పొదలోనికి వెళ్లాను. అప్పుడు ఆయన నాతో చెప్పాడు, “అక్కడ నీ కొరకు ఒక వల పన్నియున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా యుండుము.” కాని అది ఏమిటో, ఎలాగో ఆయన నాకు చెప్పలేదు. నేను తిరిగి వచ్చి, సోదరుడు ఫ్రెడ్‌కి చెప్పాను.

84 ఆ రాత్రి ఆడిటోరియంలోని సంఘము నొద్దకు వెళ్లాను, దానిని ప్రజలకు ప్రకటించాను. తరువాత రాత్రి అది సంభవించింది. అక్కడ నిలబడియుండగా, కొందరు అపహాసకులను గూర్చి ఆయన నాకు చెప్పాడు, “అది నీ చేతులలో యున్నది. నీవు వారితో ఏమి చేస్తావో, నీవు ఏమి చెపితే, అది తిన్నగా ఇప్పుడే సంభవిస్తుంది.”

85 నీవు అక్కడేయున్నావు. అక్కడ ఒకరు అగౌరముగా, భక్తిహీనతగా, ఒక యౌవ్వనస్థుడు, ఒక యౌవ్వన స్త్రీ, తమాషాగా, ఎగతాళి చేయుచు కూటమును గూర్చి మాట్లాడుచున్నారు. అతడు ఆ కట్టడములోనే అసభ్యముగా ఆమెతో ప్రేమ-కలాపము చేస్తున్నాడు; నేను బోధించుటకు ప్రయత్నించుచుండగా, అందరి దృష్టి వారిపై పడింది. ఆమె తలను వెనుకకు లాగి, ఆమె ఒడిలోనికి ఎక్కుతున్నాడు, మరియు ఆమె తలను వెనుకకు త్రోసి, ఆమెను ముద్దాడుటకు ప్రయత్నము చేస్తున్నాడు, కూటములో ఆలాగు జరుగుచుండగా, అందరి దృష్టి మళ్ళించబడింది.

86 పరిశుద్ధాత్ముడు చెప్పాడు, “ఇప్పుడు…వారు నీ చేతులలో యున్నారు. నీవు వాళ్ళతో ఏమి చేస్తావు?”

87 అక్కడ ఒక పవిత్రమైన నిశ్శబ్దము ఏర్పడింది. ప్రతియొక్కరు మరణమగునంతగా నిమ్మళముగా యున్నారు. నేనుకొన్నాను, “ఓ దేవా, నేను తప్పక ఏమిచేయాలి?”

88 అప్పుడు నేను గుర్తు చేసుకొన్నాను, రెండు రోజుల క్రితము, అది పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక కాకున్నట్లైతే, నేనన్నాను, “నేను మిమ్ములను క్షమిస్తాను.” ఇప్పుడు నేను దానినే చెప్పాలని ఆయన కోరియున్నాడు. చూడండి?

89 కారణము, అన్నిటి తరువాత, నేను దోషారోపణతో యున్నాను, బహుశా దానిని బట్టి కాదు, కాని దోషారోపణతో యున్నాను. “మరియు చిన్న వాటిలో దోషిగా యుంటే మొత్తానికి దోషిగా యుంటావు.”

90 కాబట్టి నేనన్నాను, “నేను నిన్ను క్షమిస్తాను.” అప్పుడు యున్నవారు, దానికి సాక్ష్యులు ఇక్కడ కూర్చొని యున్నారు, తరువాత పరిశుద్ధాత్ముడు దానిగుండా క్రుమ్మరించబడ్డాడు.

91 ఇప్పుడు, నీవు చూడు, ఈ సంగతులన్నియు ఒక భావమును కలిగియున్నవి. ఒక శక్తితో నీవు ఏమి చేస్తావు? నీవు ఎలా చేస్తావు, చూడు, ఒక చర్యకు నీ ప్రతిచర్య? ఒక చర్యగా ఏదో వచ్చింది, అప్పుడు ఆ చర్యకు నీ ప్రతిచర్య ఏమిటి? నా భావమును మీరు గ్రహించారా? నీవు ఏమి చేస్తావు? బహుశా ఇప్పుడు మనము ఎక్కడ యున్నామో అక్కడకు ఇదంతయు తయారైంది. నాకు తెలియదు. నేను సరిగ్గా చెప్పలేను. కాని ఎల్లప్పుడు ఏదో మార్గము యుండియున్నది.

92 దానిని గుర్తుంచుకోండి, వాక్యము నిమిత్తము నింద…వాక్యము ఎల్లప్పుడును ఒక నిందను భరించియున్నది. అన్ని యుగముల గుండా, అభిషేకించబడిన దేవుని వాక్యము ఎల్లప్పుడును నిందించబడియున్నది. ఆ కారణము బట్టియే, ఎలా ఆ నిందను తెలుసుకోవాలో, గ్రహించలేని ప్రజలకు అది కఠినముగా యుంటుంది.

93 మీకు గుర్తున్నదా, శిష్యులు ఆనందముతో తిరిగి వస్తూ, కారణము ఆయన నామము కొరకు నిందను భరించుట, ఒక గొప్ప భాగ్యముగా వారు ఎంచుకొన్నారు? ఆయనన్నాడు, “క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించువారందరూ హింస పొందుదురు,” వాక్యము నిమిత్తము నింద.

94 నీకు పరీక్ష ఇవ్వబడుటకు గాను, నీవు ఎల్లప్పుడు నిందను తట్టుకొనవలెను, నీవు చూడు, దేవుడు నిన్ను నిర్ణయించిన ఉద్దేశ్యము కొరకు కారణము క్రీస్తు యొద్దకు వచ్చు ప్రతి మనిషికి, తప్పక మొదటగా, బాల శిక్షణ కావాలి. గుర్తుంచుకోండి, నీవు సరిగ్గా నెమ్మదిగా యున్నట్లైతే! గుర్తుంచుకో, దీనికొరకు ఆయన నిన్ను పిలిచియున్నట్లైతే, అది సంభవించకుండా దానిని ఆపేది అక్కడ ఏదియు లేదు. అక్కడ బాధించే ఎన్ని దయ్యములున్నా కాదు, కాని దేవుని వాక్యము ఏమి చెప్పిందో అది ప్రత్యక్ష పరచబడుతుంది. నీవు ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించావు, మరియు ఎవ్వరూ నీ స్థానమును తీసుకొనలేరు. అనుకరణలు చేసేవారిని సమస్తమును నీవు కలిగియుండవచ్చు, కాని ఎన్నడూ వారు నీ స్థానమును తీసుకొనలేరు. నిజము. దేవుని యొక్క వాక్యము జయిస్తుంది. అది తప్పిపోదు. దానిని ఎరిగినవారై, అక్కడే ప్రతి క్రైస్తవుడు నిలబడవలసి యున్నాడు. మరియు పరీక్షలు పైకి వస్తాయి, ప్రతి దారి గుండా నీ యొద్దకు వచ్చినట్టుంటుంది. కాని గుర్తుంచుకో, దేవుడు ఒక ఉద్దేశమును కలిగియున్నాడు, అవన్నియూ సరిగ్గా పనిచేస్తాయి.

95 ఇప్పుడు, వారి యుగములో వాక్యమును కలిగియుండుట ద్వారా, ఎలా దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడియున్నదో, కొన్ని సంఘటనలను మనము, జ్ఞాపకము చేసుకుందాము.

96 ఈ మధ్య కాలములోనే, ఎవరో నన్ను విమర్శించుటను, నేను ఆత్మలో గుర్తించాను. అది టేపులను వినుచున్న దేశములో యైయున్నది. మీరు వెనుకకు వెళ్లి, నేను ఏమి చెప్పుచున్నానో, బైబిలులో ఆ గుణశీలములుగల వ్యక్తులను ఏరుకొనమని, నేను ఎంతో సూచించుచున్నాను. మంచిది, అది ఒక ఉద్దేశ్యము కొరకే నేను చేస్తాను. మనము వాటి వైపు చూడాలని ఈ విషయము వ్రాయబడినవని బైబిలు చెప్పింది. మరియు నేను విద్య లేకుండా, నేను చేయగలిగే ఒకే పని, దానిని గూర్చి వెనుకకు సూచించుటయే, అదొక్కటే మార్గము, “నీవు చూడు ఇది ఎక్కడ నిలబడిందో, దాని ద్వారా ఏమి సంభవించిందో, ఎక్కడ అది సంభవించియున్నదో,” చెప్పుటయే. చూడండి? అప్పుడు నిన్ను నీవు సరిగ్గా అక్కడ యుంచుకొంటావు.

97 ఈ మధ్యనే నేను బోధిస్తున్నట్లుగా, ఒక చిన్న బాలుడు ఓడలో యున్నాడు, నీకు తెలుసా, ఆ వృద్ధ ఓడ నావికుడు చనిపోవుచుండెను. అతడు రోగిగా యుండెను. ఎవరి దగ్గరైనా ఓడలో ఒక బైబిలు లేదా అని అతడు అడిగాడు. అప్పుడు వారు బైబిలును కలిగియున్న ఒక చిన్న బాలుని వారు పట్టుకొన్నారు, మరియు అతడు వచ్చి, యెషయా 53:5 చదివాడు, “మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను.” అతడన్నాడు, “ఓ, నావికుడా నన్ను నీకు దానిని చెప్పనివ్వు, నా తల్లి దానిని ఎలా చదివేదో.” అతడన్నాడు, “ఈ విధముగా ఆమె దానిని వ్రాసింది. ‘ఆయన విల్లీ ప్రూట్ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను. విల్లీ ప్రూట్ దోషముల కొరకు నలుగగొట్టబడెను. మరియు ఇవన్నియు ఆయన విల్లీ ప్రూట్ కొరకు చేసియున్నాడు.’” అది అతని పేరు.

ఆ వృద్ధ నావికుడు అన్నాడు, “నాకు అది ఇష్టము. నీవు దానిలో నా పేరును యుంచి చదువుతావా?”

98 అతడన్నాడు, “నేను ప్రయత్నము చేస్తాను,” “జాన్ క్వార్జ్ యతిక్రమముల కొరకు ఆయన గాయపర్చబడెను, జాన్ క్వార్జ్ దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మరియు ఆయన పొందిన దెబ్బల చేత జాన్ క్వార్జ్ స్వస్థత పొందియున్నాడు, అని చదివాడు.”

అతడన్నాడు, “నేను దానిని చూస్తాను.” అప్పుడు ప్రభువు అతనిని స్వస్థపర్చాడు. చూశారా?

99 నీ పేరును దానిలో యుంచి చదువుము. ఆయన విలియం బ్రెన్‌హాం అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపర్చబడెను. విలియం బ్రెన్‌హాం దోషముల కొరకు ఆయన నలుగగొట్టబడెను. ఆయన నా కొరకు దానిని చేశాడు, మరియు నీ కొరకు దానిని చేశాడు. దానిలోని నీ పేరును ఉంచి చదువుము.

100 మంచిది, ఆ మార్గములోనే నేను నా ప్రజలకు లేఖనములను తెస్తాను, ఆయనకు లోబడిన ఎవరికో ఆయన ఏమి చేశాడో చూడండి. ఆయన ఎవరికో చేసినది, ఆ కారణమునకు నిజమైయున్నట్లైతే, మరియు ఎవరికో ఆయన దానిని చేసియుండకపోయినట్లైతే, అప్పుడు నీవు నీ పేరును దానిలో యుంచి చదువుము. నీవు అక్కడ నిలబడియుంటే, నీవు ఏ నిర్ణయము తీసుకొనేవాడవు? గుర్తుంచుకో, అదే నిర్ణయమును తీసుకొనుటకు, ఈ రోజున, నీవు తప్పక ఆధిక్యతను కలిగియున్నావు.

101 దేవుని యొక్క వాక్యము నోవహుతో మాట్లాడినపుడు, అది వాక్యమును బట్టి నింద. నోవహు, అక్కడ ఒక నిందయున్నది. నోవహు ఒక శాస్త్రీయ యుగములో జీవించాడు, ఈ రోజున మనము ఉత్పత్తి చేసిన వాటికంటే, ఆనాటి శాస్త్రీయ ఘన కార్యములలో నేడు యున్న దేనికంటెను దాటి వారు ఘనమైన వాటిని ఉత్పత్తి చేసియున్నారు. వారు ఎంతో చురుకైనవారు, ఎక్కువ తెలివైనవారు. మన దానికంటే వారి శాస్త్రీయ పురోగతి ఎంతో వృద్ధి చెందియున్నది. కొంచెము జ్ఞాపకము చేసుకోండి, ఒక నూట ఇరవై సంవత్సరములు, అపహాసకులను ఎదిరించి వారికి బోధించి, అతడు బోధించిన వాక్యమును బట్టి, అతడు నిందను తట్టుకొనవలసి యుండెను. వారి గొప్ప శాస్త్రీయ పద్ధతులు, ఆకాశములలో వర్షము లేదని వారికి ఋజువు చేసినవి. కాని, ఇంకను, నోవహు ప్రభువు యొక్క మాటను వినియున్నాడు, మరియు అది, దానిని గూర్చి వారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకముగా యుండెను. కాబట్టి, అతని యొక్క ప్రాణము రక్షించబడుటకు ముందు, ఈ అపహాసకులు నిందించిన నిందలను బట్టి, వారిని ముఖాముఖిగా ఎదుర్కొని దానిని భరించెను.

102 ఓ, అక్కడ సందేహము లేదు, ఆ దీన, వృద్ధ, బోధకుని బట్టి వారు తప్పక చింతించి యుండిరి. వారు అతనిని దూరముగా ఉంచుట గాని లేక మరేదైనను చేయలేదు, కారణమేమనగా ఆ మాదిరి ఇండ్లు ఆ దినమున ఎక్కువ లేకుండెను. అతడు హాని చేసేవాడు కాదు. అతడు ఎవరిని గాయపర్చబోవుటలేదు, కాబట్టి వారు అతనిని ఒంటరిగా వదిలిపెట్టిరి. “ఓ, మూఢ భక్తిగలవాడా, ఆ కొండ ప్రక్కన నీళ్ళు లేనిచోట, ఒక ఓడను కట్టుచున్నాడు. ఓ, బాగుంది, దీన వృద్ధుడు! కాని” వారంటున్నారు, “నోవహు, నీ ఓడ తేలటానికి నీవు ఎక్కడనుండి నీటిని పొందబోవుచున్నావు?”

“అవి ఆకాశములో నుండి క్రిందికి వచ్చుచున్నవి.”

103 “బుద్ధిహీనత. మేము రాడార్‌తో చంద్రుడు మరియు నక్షత్రములకు కిరణములను పంపగలము,” వారు కలిగియున్న దానితో. “అక్కడ వర్షము లేదు.”

కాని అతడన్నాడు, “దేవుడు అక్కడ కొంత ఉంచబోవుచున్నాడు.”

“ఆయన ఎలా దానిని చేయబోవుచున్నాడు?”

104 “అది ఆయన పనియైయున్నది. నేను తప్పక చేయవలసిన పని యేదనగా, ఇక్కడ నుండి బయటకు రమ్మని హెచ్చరించుటయే.”

105 ఇప్పుడు సరిగ్గా దరిదాపుగా ఆలాగునే యున్నది. “ఎక్కడ నుండి అగ్ని వస్తుంది?” సోదరుడా, అది నోవహు కాలము కంటె ఇంకా కొంచెము తేటగాయున్నది. అది ఎక్కడయున్నదో ఇది వరకే మనము చూశాము. అది దానిని కొట్టుటకు సిద్ధముగా యున్నది, అంతే. ఈసారి అక్కడ ఏ సాకు, ఏ మాత్రము లేదు, ’ఏలయనగా సైన్సు ఇదివరకే దానిని కనుగొన్నది. అవునండి.

106 కాబట్టి, ఇప్పుడు మనము కనుగొనేదేమంటే, అది ఒక పెద్ద విషయమై యున్నది. కాబట్టి వారు ఆ దీన బోధకుని పట్ల చింతించి, అతనిని వెళ్లనిచ్చారు. అది ఒక వింతైన సంగతి, బహుశా, ఆ ప్రజలకు, ఒక జ్ఞానము గల మనిషి తప్పక, ఆ దేవునిని నమ్మి, భూమ్యాకాశముల సృష్టికర్త, ఏదో చెప్పిన దానిని చేస్తాడా అనే సంగతి, వారి ఆలోచనకు వ్యతిరేకముగా వున్నది. వారు దేనిని కలిగియన్నారో, బహుశా నీవు దానిని పొందలేదు. చూడండి…వారి సైన్సు ద్వారా, సహజమైన ప్రతిదానిని వారు రుజువు చేయగలమని అనుకొన్నారు. ఈరోజున, అతి తెలివిగల, సంపూర్ణముగా సైన్సుతో నిండిన, చదువుకొన్న ప్రపంచములోనే కదా మనము జీవించుచున్నది! అది తప్పు అని వారు దేనినైనా రుజువు చేయగలరు. “లేదు, దేవుడు ఎన్నడైనా దేనినైనా మాట్లాడి, అది శాస్త్రీయముగా అక్కడ లేదని రుజువు చెయ్యనియ్యగలడా…”

107 ఇప్పుడు, ఈరోజున వారు అదే ఆలోచనను కలిగియున్నారు. నీ వైద్యుడు, నీవు కాన్సర్‌ను కలిగియున్నావని, నీవు తప్పక చనిపోతావని వైద్యుడు చెప్పినపుడు, మరియు అది బాగా వ్యాపించిన దశలో యుందన్నప్పుడు, అప్పుడు దానికి భిన్నముగా దేనినైనా ఆలోచించుట వెర్రితనము, కారణమేమనగా నీవు చనిపోబోవుచున్నావు. అంతే. నీవు చనిపోబోవుచున్నావని సైన్సు చెప్పింది. వారు నిన్ను పరీక్షించారు. దానికున్నదంతా అంతే. నీవు చనిపోబోవుచున్నావు. మరియు దేవుడు నిన్ను స్వస్థపర్చుటకు వాగ్దానము చేసియున్నాడని చెప్పుటకు ప్రయత్నము చేస్తే, అది వెర్రితనము అని వారు అనుకొంటారు. చూడండి, అది ఇదివరకు యున్నట్లుగా, నీవు నిందకు నిలబడవలసి యున్నది.

108 వారంటారు, వైద్యుడు ఈ రీతిగా చెప్పినట్లైతే, “మేము అంతా పరీక్షించాము, మరియు కాన్సర్ ముదిరిపోయింది. మేము నిన్ను కోసి చూశాము, అది నీ శరీరమంతటా, నీ గుండె గుండా, నీ ఊపిరితిత్తుల గుండా, నీ కాలేయము గుండా అంతా వ్యాపించింది. అది అసంభవము.”

కాబట్టి, నీవు చూడు, “ఎలాగైనా అతడు జీవించబోవుచున్నడని,” నీవు చెప్పినప్పుడు.

వారంటారు, “భలే, దీన మనిషి, అతనిని ఒంటరిగా విడవండి.”

109 ఆ రాత్రి నాకు గుర్తున్నది. బిల్‌హాల్, మిల్‌టౌన్ సంఘము నొద్దయున్న బిల్‌హాల్ అతని సంగతి మీలో అనేకులకు గుర్తుంటుంది. వాళ్లు నన్ను బయటకు పిలిచారు. నా భార్య, నా అత్త గారు, నేను, అక్కడకు వెళ్లాము. అతడు ఒక బాలికను వివాహం చేసుకొన్నాడు, ఆమె జార్జ్‌కప్ కు సహోదరి, అతడు ఆ పట్టణ మేయరు లేక న్యాయాధిపతి కావచ్చు. అది అతని బావమరిది. అతడు చనిపోవుచుండగా వారు అతనిని ఇక్కడకు తెచ్చారు. మిల్‌టౌన్‌లోని వైద్యుడు, న్యూ ఆల్బనీలోని వైద్యుడు, అది కాలేయపు కాన్సర్‌గా గుర్తించాడు. కాబట్టి శ్రీమతి హాల్‌ను దర్శించుటకు నేను వెళ్లాను. అతనికి కామెర్లు యైనవి, అతడు అంతా పసుపుగా యున్నాడు. నేనన్నాను, “సరే, అతడు చనిపోబోవుచున్నాడు అని నేను అనుకుంటున్నాను.”

110 ఆమె అన్నది, “బిల్ సోదరుడా, ఏదైనా మార్గము యున్నదా…నీవు దేవుని నుండి వినగలవా?”

నేనన్నాను, “సహోదరి హాల్ నాకు తెలియదు. నేను ప్రార్థన చేయగలను.”

111 నేను ప్రార్థించాను. నేను తిరిగి ఇంటికి వెళ్లాను, ప్రభువు నాకు ఏమీ చెప్పలేదు. తరువాత రోజు, నేను వెళ్లి తిరిగి ప్రార్థించాను.

ఆమె అన్నది, “నీకు ఎవరైనా మంచి వైద్యుడు తెలుసా?”

112 నేనన్నాను, “సరే, ఇక్కడ జఫర్‌సన్‌విల్‌లో మా కుటుంబ వైద్యుడైన, శామ్ అడైర్ యున్నాడు. ఆయన తండ్రి మా కుటుంబ వైద్యుడు. యౌవ్వనస్థుడైన శామ్ మరియు నేను ఎల్లప్పుడు మంచి స్నేహితులమై యున్నాము. ఒకే సమయములో మేము పాఠశాలకు వెళ్లేవారము, మేము కలిసి పెంచబడ్డాము. ఏదైనా పొరపాటు సంభవించినపుడు, మేము ఎల్లప్పుడు అతని యొద్దకు వెళతాము.”

ఆమె అన్నది, “అతడు వచ్చి తన భర్తయైన బిల్‌హాల్‌ను చూడగలడా?”

నేనన్నాను, “నేను అతనిని అడుగుతాను.”

113 సరే, శామ్ నాతో అన్నాడు, “బిల్లీ, అతడు కాన్సర్‌ను కలిగియున్నాడని, డాక్టర్ చెప్పినట్లైతే,” “నేను చేసే పని ఒక్కటే, నాకంటే పెద్ద వైద్యుడు, ఒక స్పెషలిస్ట్ దగ్గరకు అతనిని పంపుతాను. మేము ఎక్స్-రే లు తీస్తాము; మరియు ఇంకా ఏ ఇబ్బంది క్రింద మేము అతనిని ఉంచము.”

114 మేము న్యూ ఆల్బనీకి పంపి, ఆ వైద్యుని నుండి ఎక్స్-రే లు తీసుకొన్నాము. ఒక అంబులెన్స్‌లో అతనిని లూయిస్‌విల్ తీసుకొని వెళ్లి, పరీక్షించి, మరలా అతనిని వెనుకకు తీసుకొచ్చాము.

115 సరే, నిజానికి, అతని ఇబ్బంది ఏమిటో శ్రీమతి. హాల్‌కు చెప్పలేడు. కాబట్టి అతడు నన్ను పిలిచి, “అతడు చనిపోతున్నాడు,” అని అన్నాడు, “నీ స్నేహితుడైన బోధకుడు.” “లూయిస్‌విల్‌లోని స్పెషలిస్ట్ ఇప్పుడే నన్ను పిలచి, ఇలా అన్నాడు, ‘మిల్‌టౌన్‌లోని వైద్యులు పరీక్షించిన దానికంటే, న్యూ ఆల్బనీలోని వైద్యుడు సరిగ్గా ఆరోగ్యాన్ని నిర్ధారించాడు.’” “అది కాలేయపు కాన్సర్, బాగా విస్తరించిపోయింది, బిల్లీ, ఆ మనిషి యొక్క కాలేయమును మేము కత్తిరించలేము, అలాగైతే అతడు బ్రతుకడు,” “అతడు చనిపోతున్నాడు. అతడు ఒక బోధకుడై యున్నట్లైతే, అతడు తప్పక సిద్ధపడాలి.”

116 నేనన్నాను, “అది ప్రశ్న కాదు. కాని అతనికి ఇంకా యాభై ఐదు సంవత్సరములు మించలేదు, కాబట్టి, ఇంకా, బోధించటానికి అతడు ఎంతో జీవితమును కలిగియున్నాడు.” నేనన్నాను, “సరే, అతడు చనిపోతున్నట్లైతే, అప్పుడు అది దానిని పరిష్కరిస్తుంది. డాక్టర్. శామ్ నీకు వందనములు.”

117 నేను వెళ్లి, శ్రీమతి హాల్‌ను పిలిచి, ఆమెతో చెప్పాను. నేనన్నాను, “శ్రీమతి హాల్, లూయిస్‌విల్‌లో వారి రోగ నిర్ధారణ, న్యూ ఆల్బనీ మరియు మిల్‌టౌన్‌లోని వారి వలే అతడు కాలేయపు కాన్సర్‌ను కలిగియున్నాడు, అది ముదిరిపోయింది.”

118 కాబట్టి ఆమె ఏడ్వడం ప్రారంభించింది. నేను చుట్టూ తిరిగి, అతనితో ప్రార్థించాను. అతడు ఎంతగా తన్ను తాను మరచిపోయాడంటే, చివరకు నేను గదిలో యున్నట్లు అతనికి తెలియదు.

119 కాబట్టి, నేను తిరిగి వచ్చాను. ఆ రోజులలో చాలామంది ప్రజలు ఇంటికి వచ్చేవారు. అక్కడ పొలములో ఎవ్వరూ లేరు, మరియు ప్రతి చోట నుండి ప్రజలు వచ్చేవారు, అయినా ఎంతో ఆ స్థలము కిక్కిరిసిపోయేది కాదు.

120 నేను కొంచెము విశ్రాంతి తీసుకొనగోరాను. కాబట్టి నేను పెందలకడ, రెండున్నర, మూడుగంటల సమయములో, నేను లోనికి వెళ్లిపోయాను. ఇంకా సోదరుడు ఉడ్, ఆ వీధిలోనికి మారియుండలేదు. నేను వీధి బయటకు చూశాను, అక్కడ బయట ఎవరునూ లేరు, కాబట్టి నేను నా డెన్ రూములోనికి వెళ్లి, నా పాత టోపీని తీసుకొని, నా పాయింట్ ఇరవై రెండు తుపాకీ తీసుకొన్నాను. నేను ఉడుతల వేటకు బయటకు వెళ్లబోవుచున్నాను, ఎనిమిది గంటల వరకు అవి లేచువరకు, తరువాత ఎక్కడో ఒక చిన్న చెట్టుకు ఆనుకొని చిన్న నిద్రపోతాను. ఇంటి చుట్టుప్రక్కల నీవు దానిని పొందలేవు.

121 నేను నా టోపీని పెట్టుకొని, గదిలో నుండి బయలుదేరాను. ఆ గోడపై ఒక ఆపిల్ పండు వ్రేలాడుచున్నది. అది ఎంతో క్రుళ్ళిపోయిన ఆపిల్ పండు. దానిని పురుగులు తినివేసినవి, బొడుపులతో, అంతా పాడైయున్నది. నేననుకొన్నాను, “ఎందుకు మిడా దానిని గోడకు వ్రేలాడదీసింది?”

122 నేను మరలా గమనించాను, అది గోడ మీద లేదు. అది గాలిలో వ్రేలాడుతుంది. నేను నా పాత టోపీని తీసివేసి, తుపాకీని ఒక ప్రక్కన పెట్టి, నా మోకాళ్లపై పడ్డాను. నేనన్నాను, “ప్రభువా, నీ సేవకుడు ఏది తెలుసుకోవాలని నీవు కోరుచున్నావు?”

123 మరొక ఆపిల్ క్రిందకు వచ్చింది, మరొక ఆపిల్ క్రిందికి వచ్చింది, ఆలాగున నాలుగు లేక ఐదు ఆపిల్ పండ్లు అక్కడ (ఎన్నో నేను మర్చిపోయాను), వ్రేలాడుచున్నవి. అప్పుడు ఒక పెద్ద, చారలతో యున్న, చక్కని ఆపిల్ పండు, క్రిందికి దిగివచ్చి, ఆ మురిగిపోయినట్లుగా కనబడుచున్న ఆపిల్ పండ్లను, కరకరమని శబ్దము చేస్తూ నమిలి వేసింది. ఆయనన్నాడు, “నీ పాదములపై లేచి నిలబడు,” “వెళ్లి, అతడు చనిపోవటం లేదని, అతడు జీవించ బోవుచున్నాడని బిల్ హాల్ కు చెప్పు,” అని అన్నాడు.

124 ఓ, నేను పరుగెత్తవలసినంత వేగముగా పరుగెత్తాను, నేనన్నాను, “శ్రీమతి. హాల్, నేను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును, కలిగియున్నాను, అతడు జీవించబోవుచున్నాడు.” అతడు నా మాట విన్నాడు. అతడు ఏడ్చుటకు ప్రయత్నించాడు, మరియు ఎంతమాత్రము అతడు మాట్లాడలేకపోయాడు.

125 నేను తిరిగి వచ్చి శామ్‌ను పిలిచాను, నేనన్నాను, “శామ్, మన సోదరుడు జీవించబోవుచున్నాడు.”

అతడన్నాడు, “ఆ విధముగా అతడు ఎలాగు జీవించగలడు?”

126 నేనన్నాను, “దానిని కనుగొనుట నా పని కాదు. దేవుడు ఆ విధముగా చెప్పాడు, అది దానిని పరిష్కరిస్తుంది.”

127 ఈ రోజున అతడు జీవిస్తున్నాడు. అది దరిదాపుగా పది సంవత్సరముల క్రితము. సరిగ్గా బలముగా, ఆరోగ్యముగా యున్నాడు. అతడు మరలా వివాహము చేసుకొన్నాడు.

128 జార్జిరిట్‌కు అది ఎలా సంభవించబోవుచున్నది, ఇంకా ఎందరినో, ఎన్నో మనము చెప్పగలము? అది ఏమిటి? అది నిందకు నిలబడుటయై యున్నది. వాళ్లు నవ్వి దానిని ఎగతాళి చేశారు.

129 ’పందొమ్మిది వందల ముప్పై ఏడు వరదకు ’ముందు నాకు గుర్తున్నది. నేను అక్కడ ఫాల్స్‌సిటీ ట్రాన్స్‌ఫర్ కంపెనీతో నిలబడియున్నాను, ముప్పై రెండు అడుగుల నీరు స్ప్రింగ్ వీధిలోనికి రాబోవుచున్నదని దానిని గూర్చి వాళ్లకు చెపుతున్నాను. వాళ్లు నన్ను చూసి నవ్వారు. వాళ్లన్నారు, “దీన బిల్లీ, అతడు బాలుడని, నేను ఊహిస్తాను.” అప్పుడు నేను బాలుడను. అతడన్నాడు, “బిల్లీ ఒక మంచి బాలుడు, అయితే అతడు అంతా కలగలుపైపోయాడు, అది ఒక అవమానము.” నేను కలగలుపైపోలేదు. నేను లోనికి బాప్తిస్మము పొందాను, కలగలుపు కాలేదు. నేను సరిగ్గా “లోనికి” వెళ్లాను, అది సరిగ్గా ఆలాగునే సంభవిస్తుంది.

130 నేను మాట్లాడుచున్నప్పటి నుండి, నేను సహోదరి హత్తీ రైట్‌ను గమనించాను, ఆ వెనుక కూర్చొని యున్నదని నేను నమ్ముతాను. బిల్‌హాల్ గురించి, ఆ సంగతి ఆమెకు గుర్తుంటుంది. చాలా. ఈ ఉదయమున, ఇక్కడ హాజరైన ఎంతమందికి ఆ సంగతి తెలుసు? ఓ, అయ్యో! నిశ్చయముగా. అక్కడ అనేకమంది యున్నారు.

131 ఇప్పుడు, అపహాసకుల కాలములో, దేవుని వాక్యమును పట్టుకొనియుండే ఏ మనిషి పట్లైనా వారు చింతిస్తారు. కాని, గుర్తుంచుకోండి, నింద తప్పక రావాలి. అది ఎల్లప్పుడు ఆ విధముగానే యుండియున్నది. వారు అప్పుడు చేసియున్నట్లుగానే, వారు తప్పక తలంచియున్నారు. శాస్త్రీయముగా రుజువు చేయబడని దేనిని గూర్చియైనా, సైన్సుకు వ్యతిరేకముగా యున్న దేనిని గూర్చియైనా, దేవుడు మాట్లాడడని వారు అనుకొన్నారు. మంచిది, అదే ఆయనను దేవునిగా చేస్తుంది. ఆయన సైన్సు ప్రకారము వెళ్లినట్లైతే, అప్పుడు ఇక ఎంతమాత్రము ఆయన మనిషి సాధించిన దానికంటే ఎక్కువ సాధించినవాడు కాదు. కాని ఆయన దేవుడై యున్నాడు. ఆయన సైన్సును సృజించిన సృష్టికర్తయై యున్నాడు. ఆయన తాను కోరిన దానిని ఆయన చేయగలడు.

132 వారు తప్పక ఈలాగు తలంచారు, “దీనుడైన వృద్ధ నోవహు, బాగుంది, ఆ ముసలివాడిని ఒంటరిగా ఉండనివ్వండి. ఈ దినములలో మనము కలిగియున్న తమాషానంతా, అతడు పోగొట్టుకొంటున్నాడు, కాబట్టి అతనిని ఒంటరిగానే వదిలెయ్యండి.” ఇప్పుడును అది ఆలాగునే యున్నది.

133 కాని, ఇప్పుడు, మరొక విషయాన్ని నేను ఇక్కడే చెప్పాలనుకొన్నాను. ఇప్పుడు, మనము వెనుకకు చూసి అతని విశ్వాసము మెచ్చుకొంటాము. కాని నేను ఆశ్చర్యపోయేదేమంటే మనము ఆ దినమున జీవించియుంటే, నోవహు తీసుకొన్న అదే నిర్ణయాన్ని మనమును తీసుకొనియుండేవారమా? అతడు వెళ్లిన సత్యముతో నిందను, మనమును తీసుకొనుటకు ఇష్టత చూపి నిలబడేవారమా? అప్పుడు అక్కడయున్న కోట్ల మంది ప్రజలలో, నోవహు మరియు అతని కుటుంబము మాత్రమే సత్యము కొరకు నిలబడింది. నీవు దానిని గూర్చి ఆలోచించావా? ఆ మనిషి, అతని ముగ్గురు కుమారులు, అతని కోడళ్ళు, అతని భార్య మాత్రమే ఆ సత్యము కొరకు నిలబడ్డారు. వారు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నారు. మనము వెనుకకు చూసి వారిని మెచ్చుకుంటాము. మనము దానిని మరలా ఆలోచిద్దామా?

ఈ పిల్లల’ యొక్క బహుమతులను బట్టి నేను తప్పక త్వరపడాలి.

134 అబ్రాహాము, అబ్రాహాము అను మాటకు భావము, “అనేకులకు తండ్రి,” అతనిని, “జనములకు తండ్రిగా,” చేస్తుంది.

135 ఇప్పుడు, అబ్రాహాము దేవుని యొక్క వాక్యమును విన్నాడు. అబ్రాహాము ఒక ప్రవక్త, అతడు దేవుని యొక్క వాక్యమును విన్నాడు. దేవుని యొక్క వాక్యమును అబ్రాహాము పట్టుకొని యుండుటను బట్టి మనము అతనిని మెచ్చుకొంటాము; ఎలా అతడు తన రక్త సంబంధుల నుండి వేరైయున్నాడో; అది అబ్రాహాముకు ఎంత కఠినముగా యున్నదో. అతడు అక్కడ పెరిగియున్నాడు. బాబెలు నుండి వచ్చాడు, షీనారు దేశములో, కల్దీయుల ఊరు అను పట్టణము నుండి వచ్చాడు, అక్కడే అతని ప్రజలు, అతని సహచరులు, అతడు సంఘమునకు కలిసి వెళ్లినవారు, సమస్తమూ అక్కడయున్నారు. కాని దేవుడు అన్నాడు, “నిన్ను నీవు వేరు చేసుకో.” ఓ, అయ్యో! అతడు ప్రియముగా ఎంచిన వాటన్నిటిని విడిచిపెట్టుట, ఎలాటి భయంకరమైన సంగతి, అతడు కలిగియున్న సమస్తము అతనికి ఎంతో ప్రియముగాను యథార్థముగాను యున్నది. కాని దేవుడు అతనితో, “నిన్ను నీవు వేరు చేసుకొమ్మని,” చెప్పాడు.

136 దేవుడు అతనికి ఒక వింతైన విషయాన్ని ఇచ్చాడు, “నీవు, నీ భార్య ద్వారా ఒక బిడ్డను పొందబోవుచున్నావు.” అతనికి డెబ్బది ఐదు సంవత్సరములు, ఆమెకు అరవై ఐదు సంవత్సరములు. ఒక స్త్రీగా బిడ్డలను కనే క్రమము ఆగిపోయి ఎన్నో సంవత్సరములు గతించినవి. ఇక్కడ, అతడు ఆమె ఒక యౌవ్వన బాలికగా యున్నప్పటి నుండియు ఆమెతో జీవిస్తున్నాడు, ఏలయనగా ఆమె అతనికి సగము సహోదరియై యున్నది, అప్పుడు ఏలాగు అతడు ఆ బిడ్డను తేగలడు? ఇప్పుడు నీవు ఊహించగలవా, అబ్రాహాము బయటకు వచ్చి తన స్నేహితులతో ఇలా చెప్పుతున్నాడు, “మేము ఒక బిడ్డను పొందబోవుచున్నాము, శారా మరియు నేను?” నీవు దానిని ఊహించగలవా?

137 ఎందుచేత, ప్రజలన్నారు, “దీనుడైన వృద్ధుడు, అతనిలో ఏదో లోపమున్నది.”

138 అది ఒక నిందయై యున్నది, కాని అబ్రాహాము దానిని పట్టుకొని యున్నాడు. అతనికి నూరేళ్ళు వచ్చినపుడు, అతడు దేవుని యొక్క వాగ్దానమును గూర్చి సందేహించలేదు. అతడు ఇంకనూ దానిని పట్టుకొని యుండి, నిందకు నిలబడ్డాడు, నిశ్చయముగా.

139 అక్కడయున్న భేదమును నీవు గమనించావా? శారా అబ్రాహామునకు, లేక దేవునికి, తనకైతానుగా, కొంచెము సహాయము చేయాలనుకొన్నది. ఆమె అనుకొన్నది, నీకు తెలుసా, దేవుడు వాగ్దానము చేసిన దానికంటే వేరుగా. “ఇప్పుడు నీకు తెలుసా, నేను ఒక వృద్ధ స్త్రీని, కాని హాగరు ఒక అందమైన స్త్రీ. అబ్రాహాము ఆమెను కూడా వివాహము చేసుకొనుటకు పట్టించుకొనడు. కాబట్టి, మీకు తెలుసా, అది దేవునికి సహాయ పడుతుంది. అది దేవునికి సహాయపడుతుంది, ’కారణము బహుశా, హాగరు ఇరవై సంవత్సరముల వయస్సు గలది. ఆమె నా పనికత్తె. నేను ఏమి చేస్తానో మీకు తెలుసా? ఆమెను భార్యగా నా భర్తకు ఇస్తాను,” ’ఏలయనగా ఆ రోజులలో బహుభార్యత్వము చట్టసమ్మతమైనది. “నేను ఆమెను ఇస్తాను, అప్పుడు నా భర్త ద్వారా ఆమె ఒక బిడ్డను కంటుంది, మరియు నేను ఆ బిడ్డను తీసుకొంటాను, మరియు దేవుడు వాగ్దానము చేసినది అదియే.”

140 నీవు చూడు, మనము ఎల్లప్పుడును ఏదో చేయాలనుకొంటాము; ఆయన కొరకు మనము కనిపెట్టలేము. మనము మనకై మనముగా తప్పక ఏదో చేయాలి అనుకొంటాము. అది బాగుగానే యుండవచ్చు. ఆమె అందముగా యుండియున్నది. అది చక్కగా కనబడవచ్చు, కాని అది వాక్య ప్రకారము కాదు. దేవుడు అబ్రాహాముతో అన్నాడు, “ఆ బిడ్డ శారా ద్వారా వస్తున్నాడు.”

141 గుర్తుంచుకోండి, ఆ చిన్న మందను గూర్చి ఆయన ఏమి చెప్పాడు? “నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” “నోవహు దినములలో జరిగినట్లు, మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును, అక్కడ కొద్దిమంది, కనీసము ఎనిమిది ఆత్మలు రక్షించబడినవి.” ఆ మాటలు ఎన్నడును తప్పిపోవు, కాబట్టి మనలను మనము జాగ్రత్తగా గమనించుకొని, వాక్యముతో నిలబడదాము. మంచిది. చూడండి?

142 ప్రజలు ఎల్లప్పుడు, దేవుని యొక్క సృజనాత్మకమైన చిత్తమును తీసుకొనుటకు ఏదో ఉత్పత్తి చేయాలనుకొంటారు. మీరు చూడండి, నేను తరచుగా చెప్పాను, సంఘమునకు ముందు, ముందు, నీకు తెలుసా, “నాకు కొంచెము ఉన్నిని ఉత్పత్తి చేయగలవా?” అని నీవు గొఱ్ఱెను అడగలేవు. లేదు. వాడు దానిని చేయలేడు. ఇప్పుడు, ఒక మేక ఉన్నిని ఉత్పత్తి చేయలేదు, ఎందుకంటే, వాడి స్వభావము దానిని చెయ్యనివ్వదు. నీవు మేక మీద ఎంత ఉన్నిని కట్టుటకు ప్రయత్నించినను, అది పనిచేయదు. మేక ఉన్నిని ఉత్పత్తి చేయలేదు, ఆలాగునే ఒక గొఱ్ఱె వెంట్రుకలను ఉత్పత్తి చేయలేదు, కాని వాడు ఒక గొఱ్ఱెయై యున్నందున వాడు ఉన్నిని కలిగియున్నాడు. అదే అతనిని తయారుచేస్తుంది. వాడు దానిని ఉత్పత్తి చేయడు.

143 మనము ఆత్మ యొక్క ఫలములను తప్పక ఉత్పత్తి చేయవలసిన పనిలేదు. మనము తప్పక ఆత్మ యొక్క ఫలములను ఫలించాలి. ఆపిల్ చెట్లు ఆపిల్ పండ్లను ఉత్పత్తి చేయదు. కాని అది ఒక ఆపిల్ చెట్టుయైనందున, అది ఆపిల్ పండ్లు ఫలిస్తుంది.

144 మనము దేనినైనా ఉత్పత్తి చేయుటకు ప్రయత్నము చేస్తే, “నేను ఆ కారణానికి సహాయపడతాను. నేను పది సంవత్సరములు వేదాంత పాఠశాలలో చదువుతాను. నేను ఇది, అది మరొకటి నేర్చుకొని, నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీని, డాక్టర్ డిగ్రీని పొందుతాను. నేను ప్రభువుకు ఒంటరిగా సహాయము చేస్తాను,” అనుకొంటే అది పనిచేయదు.

145 దేవుడు తన ముందు నిర్ణయము ద్వారా, ఆయన కిష్టమైన వారిని పిలుస్తాడు. ఆయనకు ఇష్టమైన వారికి ఆయన రాజ్యమును ఇస్తాడు. నెబుకద్నెజరు ద్వారా మనము దానిని నేర్చుకొన్నాము.

146 దానిని యిర్మీయా ద్వారా మనము నేర్చుకొన్నాము. ప్రభువు యొక్క మాట ద్వారా, దేవుడు అతనితో చెప్పాడు, అదేమనగా అక్కడ ఒకే కాలము ఉండబోవుచున్నది, అప్పుడు, ఇశ్రాయేలు డెబ్బది సంవత్సరములు బబులోనుకు కొనిపోబడతారు. ఇక్కడ మరొక ప్రవక్త పైకి వచ్చాడు. ఆయన ఇదివరకే చెప్పాడు, “మీరు ప్రవక్తలను కలిగియుంటారు, వారు పైకి లేస్తారు. మరియు మీరు వారిని బబులోనులో కలిగియున్నారు, వారు ప్రవక్తలు, కలలు కనేవారు, వారు లేచి ఈ ప్రవచనమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తారు. అయితే ఆ ప్రవక్తల మాటలు వినవద్దని ప్రజలతో చెప్పు.”

147 ప్రవక్తలలో ఒకరు, హనన్యా పైకి వచ్చాడు. మరియు యిర్మీయా తన మెడ మీద ఒక కాడితో నిలబడియుండగా, హనన్యా పైకి వచ్చి అన్నాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; రెండు సంవత్సరములలో, ప్రభువు యొక్క పాత్రలన్నీ…” ఇప్పుడు, మూల సిద్ధాంతముగా, అది చక్కగా కనబడింది. “దేవుడు తన ప్రజలను దీవించబోవుచున్నాడు, ఆయన రెండు సంవత్సరములలో ఖచ్చితముగా సమస్తమును వెనుకకు తెస్తాడు.”

148 బైబిలు చెప్పింది, యిర్మీయా సహితము చెప్పాడు, “ఆమేన్. ఆమేన్, హనన్యా, ప్రభువు నీ మాటలను నెరవేర్చును గాక. కాని హనన్యా, మనము ఒక విషయము ఆలోచిద్దాము. మనముందు ప్రవక్తలు యుండియున్నారు, మరియు ఆ గొప్ప దేశముల యొక్కయు యుద్ధములను గూర్చి, వాటికి వ్యతిరేకముగా ప్రవచించియున్నారు. కాని, గుర్తుంచుకోండి, అతని యొక్క ప్రవచనము ప్రత్యక్ష పరచబడిన తరువాత, ప్రవక్త గుర్తించబడతాడు.” చూడండి?

149 అప్పుడు హనన్యా పైకి వచ్చి, సమాజము ముందు, యాజకులందరి ముందు, పది లక్షలు లేక ఐదు లక్షల ప్రజల ముందు, యిర్మీయా మెడ మీదయున్న కాడిని లాగుకొన్నాడు. యిర్మీయా మెడ మీద దేవుడు యుంచిన కాడిని తీసుకొని, ఒక గురుతుగా దానిని ముక్కలుగా విరిచి, అతని పాదముల ముందు పడవేసి, ఉద్రేకముతో అన్నాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; రెండు సంవత్సరములలో వారు తిరిగి వస్తారు.”

150 యిర్మీయా కొంచెము అతని వైపు చూశాడు. అది వాక్యమునకు వ్యతిరేకముగా యున్నది, కాబట్టి అతడు నడిచి వెళ్లిపోయాడు. దేవుడు అన్నాడు, “నీవు తిరిగి వెళ్లి అతనితో చెప్పు,” చెప్పు, “నేను అతనితో ఎన్నడూ మాట్లాడలేదు.”

151 అతడు కొంచెము ఉద్రేకభరితుడయ్యాడు. అతడు తన సొంత ముద్రను తీసుకొన్నాడు. చూడండి? అతడు దానిని నిజముగా చూచువరకు అతడు కనిపెట్టియుండలేదు, మరియు అది చెప్పినది అతడు కాదని, అది దేవుడై యున్నాడని అతడు తెలుసుకొనలేదు. అంతా ఉద్రేకముతో, అతడు తిరిగి వెళ్లిపోయాడు.

152 ఈ రోజున దేశమంతటి గుండా, మనము దానిని కనుగొంటాము. మన టేపులలో ఒకటి, ఈ మధ్యనే ఒక గృహములో వినిపించబడింది, అక్కడ ఒక చిన్న గుంపు సేవకులు, తిన్నగా అప్పుడే ఒప్పించబడి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు వచ్చుచుండిరి, మరియు ఒక మనిషి ఆ గదిలో లేచి, భాషలతో మాట్లాడి, అన్నాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు పొందిన దానిని పట్టుకొని యుండండి, సరిగ్గా ముందుకు కొనసాగుచు, ముందుకు వెళ్లండి, మరియు నేను మిమ్మును దీవిస్తాను.”

153 వాళ్లన్నారు, “బాగున్నది, అది ప్రభువు చెప్పినట్లైతే, అది అంతే అని మేమంటాము.” మీరు చూడండి, అది వాక్యముతో పరీక్షించబడలేదు. అది తప్పక మొదట, వాక్యమును తీసుకొనవలసియున్నది, అక్కడే నీవున్నావు. అది వాక్యమునకు భిన్నముగా యున్నది.

154 యిర్మీయా మరలా తిరిగి వచ్చాడు, ఆ అభిషేకించబడిన ప్రవక్త. దేవుడు అతనితో అన్నాడు, “నీ మీద యుంచిన చెక్క కాడిని హనన్యా విరుగగొట్టాడని నాకు తెలుసు, కాని నేను ఒక ఇనుప కాడిని తయారు చేయబోవుచున్నాను.” ఆయన అన్నాడు, “ఈ దేశములన్నియు, నా సేవకుడైన నెబుకద్నెజరును సేవించుటకు అక్కడకు వెళ్లియున్నవి,” మరియు అతడు ఒక అన్యుడు. చూడండి? ఇశ్రాయేలు, వారి బలి అర్పణలన్నిటిని పాటించుచున్నారు, కాని వారు పాటించుటలేదు…చూడండి?

155 ఆయన దీవిస్తానని, దేవుడు ఒక వాగ్దానము చేశాడు, కాని ఆ దీవెనలు షరతుల క్రిందయున్నవి. అది పనిచేయుటకు నీవు షరతులకు లోబడాలి.

156 కొన్ని క్షణముల క్రితము ఒక చిన్న, చక్కని బాలికతో కూర్చొనియున్నాను. మొదటగా, అక్కడ ఏదైనా తప్పు యున్నదా అని, ఆ కుటుంబమును చక్కగా దువ్వియున్నాను. దేవుడు స్వస్థపర్చుతాడు, కాని అది షరతుల క్రింద యున్నది. చూడండి? నేను కనుగొన్న ఒకే విషయము ఏమనగా, మందులు తీసుకొనుట తప్పు అని తల్లి భయపడుతుంది. నేనన్నాను, “నీవు ఆలాగున ఆలోచన చేయవద్దు, సహోదరీ. దానిని నీ మనసులో నుండి తీసివేయుము. తిన్నగా ఆ బిడ్డతో ముందుకు వెళ్లుము. మందులు ఇమ్ము. దేవుడు దానిని తెలియపర్చుతాడు.” చూడండి?

157 ఇప్పుడు, విషయము ఏమనగా, కనుగొని తెలుసుకోండి. మరియు అప్పుడు అది, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” యైతే, పరవాలేదు.

158 మనము ఇక్కడ కనుగొనేదేమంటే, ఈ ప్రజలు, వారు ఏదో ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించుచున్నారు; హాగరు మరియు శారా, అబ్రాహాముకు సహాయము చేసి, ఆయన వాగ్దానము సత్యముగా నెరవేరుటకు, దేవునికి సహాయము చేస్తున్నారు. నీవు దానిని చేయలేవు. దానిని చేయుటకు ఏ మాత్రము దారిలేదు. అది సమస్తమునకు వ్యతిరేకముగా యున్నది. ఎలాగైనా దేవుని యొక్క వాక్యము నెరవేరబోవుచున్నది. నీవు తప్పక దేవుని యొక్క వాక్యముపై నిలబడాలి, చెప్పు, “ఇది దారియై,” యున్నది, మరియు వాక్యమును పాటించుము. ఇప్పుడు గమనించండి, దేనినైనా ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించుట, ఆయన వాక్యము యొక్క స్థానమును తీసుకొనుటయే!

159 బహుశా అబ్రాహాము యొక్క స్నేహితులు కూడా అతనికి నూరేళ్ళు వచ్చినప్పుడు, మనము ఎన్నడైనా గమనించినట్లైతే, అతని దగ్గరకు వచ్చి, అన్నారు, “మంచిది, జనములకు తండ్రీ, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు?” అన్నారు, “జనములకు, అనేకులకు తండ్రీ, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు?” అపహాసకులు!

160 ఇప్పుడు, ఆ కాలమును మీరు చూసియుండలేదా? కొన్నిసార్లు మనము ఒకదాని కొరకు ప్రార్థించినపుడు, అది సంభవించుట, మీరు దానిని చూసియుండలేదా?

161 “ఇక్కడ ఒక వృద్ధుడు, కూర్చొన్నాడు,” వారన్నారు, “అతడు గ్రుడ్డివాడు, అతడు చెవిటివాడు, అతడు మూగవాడు. అతడు రోగిగా యున్నాడు, ఆయన దానిని చేశాడు. మీరు అక్కడు వెళ్లి అతనిని బాగు చెయ్యండి, దైవిక స్వస్థత చేయువారలారా, మేము దానిని నమ్ముతాము.”

162 ఆ దయ్యమే దానిని చెప్పిందని వారు గ్రహించారా, “సిలువ మీద నుండి దిగిరమ్ము. అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఈ రాళ్ళను రొట్టెలుగా చెయ్యి అప్పుడు, నేను దానిని నమ్ముతాను.” చూడండి? ఆ దయ్యమే, మన ప్రభువు యొక్క కన్నులకు గుడ్డ కట్టి, ఒక కర్రతో ఆయన తల మీద కొట్టి, అన్నది, “ఇప్పుడు నీవు ఒక ప్రవక్తవైతే, నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు, మేము నిన్ను నమ్ముతాము.”

163 బాగుంది, ఆయనను ఎవరు కొట్టారో ఆయనకు తెలుసు. ఆ రాళ్ళను ఆయన రొట్టెలుగా మార్చియుండేవాడే, లేక ఆయన సిలువ మీద నుండి దిగి వచ్చియుండేవాడే. కాని ఆయన దానిని చేసియుంటే, మనము ఈ రోజున ఏమయ్యేవారము? చూడండి? వారికి దేవుని యొక్క ప్రణాళిక తెలియదు. దేవుడు ఏమని వాగ్దానము చేసియున్నాడో, నీవు తప్పక దానిని కనుగొనాలి.

ఇప్పుడు నేను తప్పక త్వరపడాలి.

164 ఇప్పుడు, వారు ఇలా అన్నారు, “జనములకు తండ్రీ, ఇరవై ఐదు సంవత్సరముల క్రితము, నీవు శారా ద్వారా ఒక బిడ్డను పొందబోవుచున్నావని, మరియు దాని నుండి జనములు వస్తాయని, మేము విన్నాము. ఈ సమయములో నీవు ఎంతమంది పిల్లలను కలిగియున్నావు, జనములకు తండ్రీ?” హా! చూడండి? అదే పాత క్లిష్టమైన ఆత్మ, విమర్శిస్తుంది.

165 అబ్రాహాము ఏమి చేశాడు? “అతడు వాగ్దానము పట్ల అవిశ్వాసముతో సందేహించలేదు” అని చెప్పబడింది.

“ఎందుచేత, ఇక్కడ నీవు పలానా, పలానా వారి కొరకు ప్రార్థించావు, మరియు వారు స్వస్థపడలేదు.”

166 అది లెక్క కాదు. ఈ రాత్రి నేను పదివేల మంది కొరకు ప్రార్థన చేసినట్లైతే, మరియు ఆ పదివేలమంది రేపు ఉదయమున చనిపోయినట్లైతే, మరలా రేపు రాత్రికి, నేను ఇంకనూ నూనె రాసి రోగుల కొరకు ప్రార్థిస్తాను. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. అది రవ్వంత దానిని ఆపదు. దేవుడు దానిని వాగ్దానము చేశాడు. నేను దానిని నమ్ముతాను. నిశ్చయముగా. వాళ్లు ఏమి చెపుతారో, ఇంకనూ అది ఏ భేదమును చేయదు. కాని వాళ్లు, అపహసిస్తారు. అది వాక్యము నిమిత్తము నిందయైయున్నది.

167 అబ్రాహాము దేవుని యొక్క వాక్యము మీద నిలబడ్డాడు, చివరగా అది నెరవేర్చబడింది. ఓ, అయ్యో!

168 గొడ్రాలని అపహాస్యము చేయబడుటను గమనించండి. అపహసించబడింది, మొదటగా, గొడ్రాలు అనే నింద, ఆ సంవత్సరములన్నిటి గుండా, గొడ్రాలు అను నిందకు ఆమె నిలబడింది. ఆమెకు దరిదాపుగా వంద సంవత్సరములు. దేవుని యొక్క వాక్యము చెప్పినట్లు ఆమె రాణిగా కూడా ఉంటుందని చెప్పబడింది, ఈ బిడ్డ యొక్క తల్లి. ఆమె మరియు అబ్రాహాము, ఫలించని వారుగా యున్నారు. వారిద్దరి శరీరములు మృతమైనవి, కాని, ఇంకనూ, ఒక్క రవ్వంత కూడా దేవుని వాక్యమును ఎన్నడూ సందేహించలేదు. మొదట, వారు దాని కొరకు నిలబడవలసి యున్నది. అప్పుడు, హల్లెలూయ, ఆ చీకటి ఘడియలో, దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనెను: ఇస్సాకు జన్మించెను. “మరియు అతని సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువల వలెను, ఆకాశ నక్షత్రముల వలెను యుంటుంది.” చూడండి? దేవుడు ఎల్లప్పుడు ఆయన వాక్యమునకు జవాబిస్తాడు. అవును. మొదట గొడ్రాలు, తరువాత ఇస్సాకు.

169 ఆలాగునే జెకర్యా మరియు ఎలీసబెతులు, ఆ వృద్ధుడు మరియు వృద్ధ స్త్రీ, ఇంకను పట్టుకొనియున్నారు. జెకర్యా అక్కడకు వచ్చినపుడు, అతడు పలక మీద వ్రాసి చెప్పాడు, “ఒక దూత నన్ను కలుసుకొన్నది, ఇక్కడయున్న నా వృద్ధురాలైన భార్య ఎలీసబెతు ద్వారా, నేను ఒక బిడ్డను కంటానని చెప్పాడు. నేను ఇక ఎంతమాత్రము మాట్లాడలేకపోయాను. నేను మూగ వాడనయ్యాను. ఆ బిడ్డ పుట్టే వరకు నేను మూగవాడిగానే యుంటాను. కాని అక్కడ ఒక బిడ్డ రాబోవుచున్నాడు, మరియు అతడు సర్వోన్నతుని ప్రవక్తగా యుండబోవుచున్నాడు. అతడు ఉదయ నక్షత్రాన్ని పరిచయము చేస్తాడు. అతడు మెస్సీయాకు ముందు ఆయన రాకడను సూచిస్తాడు.” అది ఎన్నడైనా ఎలా యుంటుంది?

170 కొందరు అన్నారు, “దీనుడైన వృద్ధుడు, ఓ, అతనికి కొంచెము మతిపోయిందని నేననుకొంటాను, నీకు తెలుసా, అక్కడ ఏదో చిన్నది యున్నది. కాని అక్కడయున్న ఎనభై సంవత్సరముల వయస్సులోయున్న వృద్ధ ఎలీసబెతు వైపు చూడండి. మరియు జెకర్యా వైపు చూడండి, ఎంతో వృద్ధుడు, వణుకుచున్నాడు, మరియు ఆలాగైతే అలాటి విషయమును అతడు చెప్పబోవుచున్నాడు. బాగుంది, దీన వృద్ధుడు.”

171 కాని అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడు, ఎలాటి ఒక నింద, చివరకు ఆమె ఎన్నో దినములు దాగియుండెను. కానీ ఆయన వాక్యముతో నిలబడి యుండెను. ఓ, అయ్యో!

172 పేరు ప్రతిష్ఠలను నిరాకరించుట, పేరుగాంచిన ఉద్దేశ్యమును నిరాకరించుట, ఆ దినము యొక్క మెరుగును, వారి దినము యొక్క శైలిని, వాటన్నిటిని నిరాకరించుట. వారు దానిని నిరాకరించారు. అవిశ్వాసుల గుంపుతో నడుచుటకు వారు నిరాకరించారు, వారు లోక సంబంధమైన కార్యములను నిరాకరించారు. వాక్యముతో నిలిచి యుండుటకు, వారు దానిని చేయవలసి యుండిరి. వారు దానిని చేయవలసి యుండిరి.

173 అది ఈ రోజున ఆలాగునే యున్నది, నీవు మరియు దేవుడు తప్ప, నీవు సమస్తము నుండి నిన్ను నీవు వేరు చేసుకొనుము. అది సంఘము చేసేది ఏదో కాదు. అది నీవు దేవునితో చేయునదై యున్నది. చూడు? అది ఒక వ్యక్తిగతముగా, నీవై యున్నావు. అవును.

174 కాని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో చూడండి. యేసే స్వయముగా వచ్చినపుడు, జెకర్యా చనిపోయాడు, ఎలీసబెతు కూడా చనిపోయింది. కాని వారి కుమారుడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో అరణ్యము నుండి వచ్చాడు, యేసు అన్నాడు, “స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు.” ఆమేన్. ఏమిటి? ఆమె గొడ్రాలు యొక్క నిందను భరించింది. ఆమె వాక్యముపై నిలబడి, ఆలాటి కుమారుని కన్నది.

175 వృద్ధురాలైన శారా వలె, వృద్ధుడైన అబ్రాహాము వలె, ఆ వృద్ధ దంపతులు దానిని పట్టుకొనియున్నారు. చూడండి, ఎన్నడైనా ఆలాగున జన్మించిన అధికమైనవారు, “సముద్రము యొక్క ఇసుక రేణువుల వలె యున్నారు,” ప్రపంచములో యూదులున్నంత ఎక్కువమంది ఏ తెగలోను లేరు. “సముద్రము యొక్క ఇసుక రేణువుల వలెను, ఆకాశ నక్షత్రముల వలె యున్నారు.” ఏమి సంభవించింది? అది అల్ప సంఖ్యాకులలో జరిగింది, ఒకే బిడ్డ.

176 ఇప్పుడు నేను ఎటు వెళ్లుచున్నానో చూడండి, ఒకే బిడ్డ, అది అంతవరకే తీసుకొంది. దేశములను కదిలించుటకు మరియు మెస్సీయా వైపు గురి చూపుటకు, అది ఒక బిడ్డను తీసుకొన్నది. విధేయతగల ఒకరు. అది నిజము. దేవునికి సరిగ్గా ఒక్క మనిషి కావాలి. ఆయనకు అవసరమైనది అంతవరకే, ఎక్కడో ఆయన ఒక స్వరమును కలిగియుంటాడు. ఆయన కోరేది అంతమట్టుకే, ఒక్క మనిషిని తన నియంత్రణలోనికి తీసుకొనుటయే. ఓ, ఒక్క మనిషిని పొందుటకు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో!

177 ఒకసారి, నోవహును కలిగియున్నాడు. ఒకసారి ఆయన మోషేను కలిగియున్నాడు. ఆయన యిర్మీయాను కలిగియున్నాడు. ఆయన ఏలీయాను కలిగియున్నాడు. ఆయన ఎలీషాను కలిగియున్నాడు. ఆయన యోహానును కలిగియున్నాడు. ఆయన ఒక సమ్సోనును కలిగియున్నాడు. ఆయన ఒక మనిషిని ఆయన నియంత్రణలో కలిగియున్నంత వరకు, అది ఆయన స్వరమైయున్నది. ఆయన దానిగుండా మాట్లాడగలడు. ఆయన లోకమును దోషిగా తీర్పు తీర్చగలడు. ఓ, అయ్యో!

178 ఆయన ఒక మనిషిని ఆయన నియంత్రణలో కలిగియుండుటకు, ఆయన ఎలా ఎక్కుచూ, ఆకలిగొనుచున్నాడో, “ఆ ప్రకారమే నేను అతని ద్వారా మాట్లాడగలను. నా స్వరమును తెలియబడనిస్తాను. అతను ఒక నిందగా నిలబడతాడు, కానీ నేను నా స్వరమును తెలియజేస్తాను.” చూడండి? ఓ, అవును.

179 మొదట, ఫలించని స్థితి, గొడ్రాలు అను నిందకు నిలబడవలసియున్నది. శారా దాని కొరకు నిలబడవలసి యుండెను. ఆలాగునే జెకర్యా, ఎలీసబెతులు నిలబడిరి.

180 ఈ రోజున చూడండి. ఇప్పుడు నేను ఒకదానిని చెప్పబోవుచున్నాను. ఈ రోజున వేశ్య యొక్క పిల్లలను చూడండి. సంఘశాఖ యొక్క రాజకీయ పాలన క్రింద, ఆ వేశ్య మరియు ఆమె కుమార్తెలు దేశములను పట్టుకొన్నవి. ఎలాటి శాఖా సంబంధమైన తరము లేచియున్నదో చూడండి, నీతిమంతులు ఎంత తక్కువగా యున్నారో. నీవు కలత పడవద్దు. వాక్యముతో నిలబడి యుండుము. అది బాగుంటుంది.

181 నీవు వెక్కిరించబడి, పరిశుద్ధ రోలరుగా పిలవబడతావు. అన్ని రకములుగా, ఏ రకమైన చెడ్డపేరుతోనైనా నీవు పిలవబడతావు. అయితే అక్కడే తిన్నగా నిలబడుము, అది వాక్యమైయున్నది, వాళ్లు నిన్ను గూర్చి చెప్పేది, వాక్యమును బట్టి నిందయైయున్నది.

182 ఒక యౌవ్వనస్థుడు, ఈ ఉదయమున అతడు ఇక్కడ బహుశా యుండవచ్చు. అతడు నా స్నేహితుడు; జిమ్‌‌పూల్, యౌవ్వనస్థుడైన జిమ్, అతని యొక్క ప్రజలు. మొన్నటి దినమున అతడు అడగబడ్డాడు, బాగుంది, అతడు ఇక్కడ బాప్తిస్మము పొందాడు. ఎవరో అతనితో ఇలా అన్నారు, “నీవు బాప్తిస్మమును పొందబోవుచున్నట్లైతే, నీవు ఒక పెద్ద సంఘమునకు ఎందుకు వెళ్లకూడదు?” చూడండి? కాని అతడు వెలుగును చూశాడు. అది అంతే. చూడండి?

183 “నీతిమంతుల యొక్క పిల్లలు కంటె, అనీతిమంతుల పిల్లలు ఎక్కువగా యున్నారు.” అవును. మంచిది. నీతిమంతులు ఎలాయున్నారు! నోవహు దినములలో ఎలా ఒక చిన్న గుప్పెడు మంది యున్నారో చూడండి. సొదొమ దినముల వైపు చూడండి, నీతిమంతులు ఎంత కొద్దిగా యున్నారో!

184 వేశ్య ఎంతమంది పిల్లలను కలిగియున్నది! ఏ పాత మార్గములోనైనా, ఆమె పిల్లలను కనగలదు, కాని వారందరూ దుర్భీజులైన పిల్లలు. వేశ్య, వేశ్యనే కంటుంది, కుక్క, కుక్కనే కంటుంది.

185 క్రీస్తు అభిషేకించబడిన వారిని కంటాడు. బైబిలు నీతిమంతులను కంటుంది, ఆ చిన్న గుంపు అనే తలంపునకు మనము నిలబడాలి. అది ఎలాటి దయగల విషయమై యున్నది!

186 ఆ గొప్ప ఎఫెసీ సంఘమును చూడండి, దానిలో అక్కడ పన్నెండు మంది మాత్రమే యున్నారు. అవును. ఈ రోజున మనమును ఏలాటి గుంపును కలిగియున్నామో, వారివైపు చూడండి. అవును.

నోవహు దినములలో అక్కడ ఎనిమిది ఆత్మలేయున్నవి.

187 లోతు దినములలో ఐదు మంది మాత్రమే యున్నారు, కాదు, నలుగురు; లోతు అతని భార్య, అతని ఇద్దరు కుమార్తెలు. మరియు ఆమె బయటకు వచ్చి, వెనుకకు చూచుట ద్వారా, ఆమె ఒక ఉప్పు స్థంభముగా మారిపోయింది. నిజానికి, ఆ దినమున ముగ్గురు బయటకు వచ్చారు.

188 యేసు అన్నాడు, “ఆ దినములలో జరిగినట్లు జరుగుతుంది.” మనము గమనించి, జాగ్రత్తగా యుండుట మన బాధ్యతయై యున్నది. నీతిమంతులు ఎంతకొద్దిగా యున్నారు! ఎప్పటివలెనే, అపహాసకులు తప్పక నిందించాలి. మొదట గొడ్రాలు అనే నిందకు నిలబడుము. అయ్యో!

189 నేను త్వరపడాలి. ఆ పిల్లలకు సహాయము చేయుటకు వెళ్లాలి, కొంచెము నాలో భరించండి. చూడండి?

190 మనుషులు ఎల్లప్పుడు, ఎప్పుడైనా ఒకే రీతిగా యున్నారు. నేను మరలా ఒక విషయాన్ని చెప్పబోవుచున్నాను. అది టేపు చేయబడుతుందో లేదో నాకు తెలియదు. కాని అది టేపు మీద యున్నట్లైతే టేపు వినే మీరు నా మాటలు వినండి, దానిని తప్పిపోవద్దు. కాని దానిని చదవండి. మనిషి ఇదివరకు యుండి యున్నట్లుగానే ఉన్నాడు. దేవుడు ఇదివరకు చేసిన దానిని బట్టి, అతడు దేవునిని స్తుతిస్తున్నాడు; ఆయన భవిష్యత్తులో ఏమి చేయబోవుచున్నాడో దానిని చూస్తున్నాడు; మరియు ఆయన ప్రస్తుతం ఏమి చేయుచున్నాడో దానిని మర్చిపోవుచున్నాడు. ఆయన చేసిన దానిని బట్టి అతడు దేవునిని స్తుతిస్తాడు; ఆయన భవిష్యత్తులో ఏమి చేయబోవుచున్నాడో దానికొరకు ఎదురుచూస్తాడు, కాని ఇప్పుడు ఆయన చేయుచున్న దానిని మరచిపోతాడు, అక్కడ అతడు సమస్తమును పోగొట్టుకొనుచున్నాడు. వారికి అర్థమైనదని నా నిరీక్షణ. చూడండి? ప్రస్తుతము ఆయన ఏమి చేస్తున్నాడో మరచిపోవుచున్నాడు! ఆయన ఏమి చేసియున్నాడో అతనికి తెలుసు; ఆయన ఏమి చేయబోవుచున్నాడో, ఆ వాగ్దానము అతనికి తెలుసు; కాని ఆయన ప్రస్తుతం చేయుచున్న దానిని చూచుటలో తప్పిపోతాడు.

191 ఓ, పెంతెకొస్తు వారైన మీరు, మీరు దానికి మాదిరియై యుండలేదా! ఏదో సంభవించబోవుచున్నదని మీరు ముందుకు చూస్తున్నారు: ఎల్లప్పుడు జరుగుచున్నట్లుగా, తిన్నగా అది మీ క్రిందనే జరిగింది, కాని మీకు అది తెలియదు. “కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” ఆయన యొక్క వాక్యము కంటే మరియు ఆయన యొక్క ఆత్మ కంటే, మీ ఆచారములను గూర్చి, మీ సంఘశాఖలను గూర్చి ఎక్కువ తలంచారు, అవును.

192 మరియకు ఎలాటి నింద! (మనము ముగించుచుండగా), ఆయన వాక్యమును బట్టి మరియ మరియు యోసేపులకు ఎలాటి నింద. ఇది క్రిస్మస్ సమయమైయున్నది. మరి కొంచెము సేపు నేను మిమ్ములను నిలిపి యుంచాలని అనుకొనుచున్నాను, కాని దానిని గూర్చి మీరు ఎక్కువగా కాపరుల ద్వారా వింటారు. దేవుని వాగ్దాన వాక్యమును పట్టుకొని యుండుట, మరియ, యోసేపులకు ఎలాటి నిందగా యుంటుంది. గుర్తుంచుకోండి, ఇప్పుడు, ఆ చిన్న మరియ, యోసేపుతో వెళ్లుచున్నప్పుడు, ఆ అపహాసకులు తమ కను బొమ్మలను పైకి లేపారు, “నీవు ఒక వేశ్యను వివాహము చేసుకొనుచున్నావు?” చూడండి? మరియు గుర్తుంచుకోండి, సోదరుడా, ఆ రోజులలో వ్యభిచారము, మరణమైయున్నది. “ఇప్పుడు, ఆమె చంపబడకుండా నీవు ఆమెను కాపాడుచున్నావు. ఆమె నీ ద్వారా తల్లిగా యుండవలసియున్నది.” కాని, గుర్తుంచుకో, అన్నివేళలా, దేవుడు వారితో పనిచేయుచున్నాడు, మరియు అది వాక్య ప్రకారమై యున్నది. మరియు వారికది తెలియదు. చూడండి?

193 “కన్యక ఒక కుమారుని కంటుంది.” అది యోసేపునకు తెలుసు. మరియకు అది తెలుసు, కారణమేమనగా, వాక్యము వ్రాయబడిన తరువాత, అక్కడ దేవుని దూత వారితో మాట్లాడుచున్నది, సంభవించబోవు కార్యమును సత్యమని రుజువు చేయుచు, ప్రత్యక్ష పర్చుచున్నది. ఇప్పుడు కల కనవద్దు. ఆలోచించు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు; సంఘము మొత్తముతో ఎన్నడూ మాట్లాడలేదు. కాని ఆయన వారితో మాట్లాడాడు.

194 యోసేపు చూశాడు. దూత అతనిని దర్శించక ముందు, అతడన్నాడు, “సరే, ఇప్పుడు, నేను ఆమెను ప్రేమిస్తాను. కాని, నేను నీతిమంతుడను. అలాటి స్త్రీని నేను పెండ్లి చేసుకొనలేను.”

195 ప్రభువు యొక్క దూత, కలలో అతనికి ప్రత్యక్షమై, ఇలా అన్నాడు, “దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను తీసుకొనుటకు భయపడవద్దు. ఏలయనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది.” ఓ, అయ్యో! ఎలాటి ఆదరణ! చూడండి?

196 మరియ, బావికి వెళ్లు దారిలో యున్నది. పదిహేడు లేక పద్దెనిమిది సంవత్సరాల ఒక చిన్న కన్యక, మరియు ఆమెను వివాహము చేసుకొనే మనిషికి, ఇదివరకు వివాహమైంది మరియు నలుగురు పిల్లలు. ఒక ముసలివాడు. ఆమె అతనిని ప్రేమించింది, ఎందుకో ఆమెకు తెలియదు. అతను ఆమెను ప్రేమించాడు, ఎందుకో అతనికి తెలియదు. వారు అక్కడ యుండిరి. నీళ్లు తెచ్చుటకు ఆమె బావినొద్దకు వెళ్లుచున్నది, ఆమె చదివియున్న లేఖనములను గూర్చి, ఆమె తలపోయుచున్నది, సందేహము లేదు, అప్పుడు ఒక వెలుగు ఆమెముందు ప్రకాశించింది. ఆ వెలుగు ప్రకాశించినపుడు, అక్కడ దూత నిలబడ్డాడు!

197 చిన్న మరియ ఎలాటి అనుభూతి చెందిందోనని నేను ఆశ్చర్యపడతాను. నీవు ఎన్నడైనా దానిని గూర్చి ఆలోచించావా? నేను నిన్న ఎంతగా భయపడ్డానో ఆమెయు అంతగా భయపడియుంటుందని నేను ఆశ్చర్యపడతాను.

198 “మరియా, శుభము!” శుభము అనగా భావము, “ఆగుము.” “నేను నీకు ఏమి చెప్పబోవుచున్నానో జాగ్రత్తగా వినుము. స్త్రీలలో నీవు ధన్యురాలవు, కారణము నీవు దేవుని దయపొందావు, నీవు ఒక బిడ్డను కనబోవుచున్నావు. పురుషుని వలన కాదు, కానీ నీవు ఒక బిడ్డను కలిగియుండబోవుచున్నావు. మరియు నీ తోడు కోడలైన వృద్ధురాలు ఎలీసబెతు కూడా గర్భము ధరించింది, ఒక బిడ్డను కనబోవుచున్నది, మరియు ఈ సూచనలు సంభవిస్తాయి.”

ఆమె అన్నది, “నేను పురుషుని ఎరుగని దానను, అది ఎలా సాధ్యము?”

199 అతడన్నాడు, “పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, మరియు నీకు పుట్టబోవు పరిశుద్ధమైనది, దేవుని కుమారుడని పిలవబడతాడు.”

200 అపహాసకులు ఏమి చెపుతారో చెప్పనివ్వండి. ఆమెకు అది తెలుసు. అది ఆలాగున యుంటుందని ఆమెకు తెలుసు, ఏలయనగా దేవుడు ఆ రీతిగా చెప్పాడు.

201 ఆ ప్రతిష్ఠ దినమున, లేక ఆ బిడ్డ సున్నతి దినమున, ఆ బిడ్డను చేతులలో పట్టుకొని ఆమె పైకి నడుస్తుండగా, ఆమె తప్పక ఎలాటి అనుభూతి చెందిందో, ఆ విధముగా, మిగిలిన ఆ స్త్రీలందరూ వారి బిడ్డలను ప్రతిష్ఠించుటకు మరియు సున్నతి చేయుటకు, అందరు గొఱ్ఱెపిల్లను లాగుచుండగా, ఆ స్త్రీలందరూ ఆమెకు కొంచెము దూరముగా నిలబడ్డారు. కాని ఆమె తన సొంత శుద్ధీకరణ కొరకు, రెండు పావురపు పిల్లలను కలిగియుండెను. ఆ చిన్న బిడ్డ పొత్తి బట్టలతో చుట్టబడియుండెను, అవి ఎద్దు మెడకు కట్టే, కాడికి కట్టే మెత్తని గుడ్డలైయున్నవి. అవే తొట్టిలో యున్న పొత్తి బట్టలు. ఆయనకు వారి యొద్ద ఏమియు లేవు. వారు పేదవారు కూడా. మరియు ఇక్కడ ఆమె నిలబడి యున్నది.

202 సందేహము లేదు, స్త్రీలందరూ ఆ కన్యకకు కొంచెము దూరములో నిలబడ్డారు. వారన్నారు, “మీరు చూడండి, ఒక అక్రమముగా పుట్టిన బిడ్డను ఆమె కలిగియున్నది.” చూడండి, దేవుడు కార్యములను ఎంతో మూలముగా కనబడునట్లు చేస్తాడు. ఓ, అయ్యో! ఆయన తిన్నగా సాతాను కన్నుల మీద నుండి వెంట్రుకలను లాగుతాడు. “ఎంత మురికిగా యున్నది! వ్యభిచారము. ఆమె అదేయైయున్నది. ఆమె ఒక వ్యభిచారిణి అన్నారు.” అది ఆ చిన్న మరియలో తన గుండె కొట్టుకొనుటను ఆపలేదు. వారు ఆయనకు దూరముగా యున్నారు.

203 వాళ్లు ఇంకనూ అదే పని చేయుచున్నారు, ఇప్పుడు ఆయనను, “పరిశుద్ధ-రోలరు, లేక పిచ్చివాడు,” అని లేక ఇంకేదో అని పిలుస్తున్నారు.

ఆ బిడ్డ ఎవరి బిడ్డయై యున్నాడో మరియకు తెలుసు. ఆమె ఆలాగునే ముందుకు వెళ్లింది.

204 కాని, ఓ, సుమెయోను ఆ గదిలో కూర్చొనియుండగా, అతనికి వాగ్దానము చేయబడినది, వారు తప్పక గమనించి యుండలేదా? అతడు చుట్టూ వెళ్లి ప్రవచిస్తున్నాడు. అతడన్నాడు, “ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యాడు,” మరియు ఆయనన్నాడు, “నేను మరణము చూడను…” అతనికి అప్పుడు ఎనభై సంవత్సరములు, “ఆయన రక్షణను చూడక ముందు నేను చనిపోను.”

205 “ఓ, సుమెయోను, నీవు వృద్ధుడవు, కుమారుడా. ఆ వృద్ధునికి కొంచెము మతి భ్రమించినట్లుగా యున్నది, అతనిని ఒంటరిగా విడవండి. అతడు హాని చేయనివాడు. అతడు ఎవరినీ గాయపరచడు.”

206 కానీ సుమెయోను ప్రభువు యొక్క మాటను కలిగియుండెను, అతడన్నాడు, “దేవుని యొక్క ఆత్మ నా మీదికి వచ్చింది. నేను నిలబడి ఆయన వైపు చూశాను. ఆయన నాతో అన్నాడు, ‘సుమెయోను, నీవు ఒక నీతిమంతుడవై యున్నావు. దాని నుండి నేను ఒక సాక్ష్యమును తయారు చేయబోవుచున్నాను.’” హ-హ. అది అంతే.

“ప్రభువా, నీవు దానిని ఎందుకొరకు చేయబోవుచున్నావు?”

“అది, నా పని.”

207 నా ఉద్దేశ్యము ఏమనగా, ఆ దినమున నిశ్చయముగా, వారి మీద నిప్పులు వేస్తాడు. “మీరు ఒక సాక్ష్యమును కలిగియున్నారు. మీరు ఎందుకు దానిని వినలేదు?”

208 అక్కడ ఒక వృద్ధురాలైన అన్న యున్నది, ఆలయములో కూర్చొని ప్రార్థించుచున్నది. “సుమెయోను రైటుయై,” యున్నాడని ప్రభువు ఆమెకు బయలుపర్చాడు. ఆమేన్. ఆమె చీకటి నుండి వెలుగును చూడలేదు, కాని ఆమె ఈ దినమున కన్నులు ఉండి చూసేవారికంటే, ఆమె ఎక్కువ దూరము చూడగలదు. ఆమె ఆత్మలో చూసింది, మెస్సీయా రాకడ సమీపమైనది, ఆత్మ ఆమె హృదయములో కదులుచుండెను.

209 అక్కడ ఎలాటి చిన్న సంఘమున్నదో చూడండి? జెకర్యా, ఎలీసబెతు, మరియ, యోసేపు, అన్నా, సుమెయోను; మిలియనుల మందిలో ఆరుగురు. నోవహు దినములలో వలె. వారిలో ఆరుగురు. దేవుడు వారిలో ప్రతి ఒక్కరితో విచారించాడు. వారందరు సఖ్యతతో యున్నారు. వారందరు కలిసియున్నారు. ఆమేన్.

210 ఇక్కడ వృద్ధుడైన సుమెయోను యున్నాడు. ఇక్కడ చిన్న బిడ్డ లోనికి వచ్చాడు. దానిని గూర్చి అతడు ఏమియు విని యుండలేదు. ఇక్కడ బిడ్డ యున్నాడు. సుమెయోను తన గదిలో కూర్చొని యున్నాడు, మరియు ఆత్మ అతని మీదికి వచ్చి అన్నాడు, “సుమెయోను బయటకు కదులు.”

211 ఇక్కడ అతడు నడుచుకొంటూ వెళుతున్నాడు, ఎటు వెళుతున్నాడో అతనికి తెలియదు. అబ్రాహాము వలె, అతడు ఒకదాని కొరకు వెతుకుతున్నాడు. అతడు ఎక్కడయున్నాడో అతనికి తెలియదు, కాని అతడు వెళుతూనే యున్నాడు. కొంచెము తరువాత, అతడు ఆగాడు మరియు పరిశుద్ధాత్ముడు తప్పక అతనితో చెప్పియుంటాడు, “అక్కడ ఆయన యున్నాడు.”

212 అతడు అక్కడకు వెళ్లి మరియ చేతులలో నుండి ఆ బిడ్డను తీసుకున్నాడు. పైకి చూసి అన్నాడు, “ప్రభువా, నీ సేవకుడు, సమాధానముతో ఈ జీవితము నుండి వెళ్లిపోనిమ్ము. నా కన్నులు నీ రక్షణను చూసియున్నవి.” ఎవరైతే దానిని గూర్చి ఎగతాళి చేయుచున్నారో, స్త్రీలు ఎవరినైతే విసర్జించియున్నారో దానిని “అది నీ రక్షణ, ప్రభువా,” అని సుమెయోను అన్నాడు.

213 దరిదాపుగా ఆ సమయానికి, చుట్టూ దారిగుండా తిరుగుచూ శ్రోతల గుండా తడబడుచూ వృద్ధురాలైన గ్రుడ్డి అన్న అక్కడకు వచ్చింది. ఆమె ఆయన యొద్దకు వచ్చి, ఆమె కూడా ప్రవచించింది, ఏలయనగా ఆమె ఆయన కొరకు ఎదురుచూచుచుండెను. మరియు ఆమె కూడా ప్రవచించెను, “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొనిపోవును, మరియు అనేక హృదయాలోచనలు బయలుపర్చబడును.” చూడండి? అది ఏమైయున్నది?

214 ఇప్పుడు, నేను ఊహిస్తాను, అక్కడ కొందరు స్త్రీలు అన్నారు, “ఇప్పుడు అది చూడండి! వాళ్లు ఏ తరగతి వాళ్లో మీరు చూడండి? అక్కడే నీవున్నావు. చూడు? అది అంతే. అది ఎక్కడ యుందో చూడండి? ఆ ముసలివాడు, తలలో పగుళ్ళు ఏర్పడినవాడు. అక్కడే నీవున్నావు. ఆ అక్రమముగా పుట్టిన బిడ్డ. ఆ ముసలి అన్న ను చూడండి, మరణమగునంతగా ఆకలితో బాధపడుచున్నది, మరియు ఆలాగునే ముందుకు వెళ్లుచున్నది. మనము చేయునట్లుగా, ఏ తమాషా ఆమెకు లేదు, కాని నీవు అక్కడే యున్నావు, చూడు. ఈ దేశములో యున్న అన్ని సొసైటీలకు ఆమె చెంది యుండవచ్చు, ఆమె ఒక మంచి చక్కని కుటుంబము నుండి వచ్చింది. చూడండి, ఆమె వీటికి చెందవచ్చు. కాని ఆమె అక్కడ యున్నది. చూడండి, ఆ గుంపు ఎలా ఏకమవుతారో?” ఓ, అవును. ఆమేన్.

215 ఈ రోజున కూడా అదే సంగతి. “పరిశుద్ధాత్మ ద్వారా లేపబడిన వారమై, క్రీస్తు యేసుతో పరలోకపు స్థలములలో కూర్చొండియున్నాము.” నిశ్చయముగా అవునండి.

216 ఓ, మనకు కొంచెము సమయమే యున్నదా? నేను తప్పక ఒక విషయము చెప్పాలి. [సమాజము “అవును” అని చెప్పుచున్నది.—సంపా.]

217 ఆ సమయములో వాక్యము ప్రతక్షపరచబడుచుండగా, నాకు మరొక గుణశీలము ఇక్కడ యున్నది. వారే జ్ఞానులు.

218 నీవు చదవటానికి నాకు సమయముంటే బాగుంటుంది, ఫ్రెడ్. నీ జేబులో యున్నదా? [సహోదరుడు ఫ్రెడ్ సాత్‌మన్ “అవును” అని చెప్పుచున్నాడు—సంపా.] మీలో అనేకమంది మాగజైన్‌లో చూసియుంటారని నేననుకొంటాను.

219 పరిశుద్ధాత్ముడు ఆ నదియొద్ద, ముప్పయి మూడు సంవత్సరముల క్రితము, మాట్లాడిన దానిని, వారు సరిగ్గా పైకి తవ్వారు. డిసెంబరు 9, ఆ వ్యోమగామిని గూర్చి, ఆ జూపిటర్, ఆ నక్షత్రములు, వాటి యొక్క రాశిలో దానిని ఋజువు చేయుచున్నది’!

220 వారు ఒక పాత వ్యోమగామి యొక్క కాలెండర్‌ను దాని గురుతులను కలిగియున్నారు…వారు దానిని పైకి తవ్వారు. అది ఖచ్చితముగా ఆ సమయములోనే, ఆ నక్షత్ర రాశి’, బబులోను వైపు క్రిందికి వచ్చియున్నవి. గుర్తుంచుకోండి, అవి వాటి కక్ష్యలు దాటి, కోట్ల వెలుగు సంవత్సరములకు దూరముగా, క్రిందికి వ్రేలాడుచున్నవి. మరియు బబులోనుకు వెళ్లిన ఆ యూదా జ్ఞానులు, ఆ నక్షత్రములు ఏకరాశిగా’ వచ్చుటను చూశారు. వాటిలో మూడు ఏకమై, ఆ ఉదయ నక్షత్రమును తయారు చేస్తాయి. దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆ నక్షత్రములు ఏకముగా వచ్చినపుడు, మెస్సీయా భూమి మీద యుండవలసియున్నదని వారు ఎరిగియుండిరి.

221 ఆ కారణమును బట్టియే వారు బయలుదేరారు, “యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన ఎక్కడ యున్నాడు? ఎక్కడోయున్నాడు! ఏలయనగా, ఆ నక్షత్రములు లోనికి వచ్చినపుడు, వారి పరలోకపు సైన్యము, ఒక పెద్ద పరలోక సైన్యముగా మారింది, అప్పుడు ఆ మూడు ఏకముగా కదిలాయి, ఆ సమయములో మెస్సీయా భూమి మీద యుంటాడు.” మరియు అవి వాటి కక్ష్యలోనికి కదిలినపుడు, మెస్సీయా భూమి మీద యుండి యున్నాడని వారు తెలుసుకొన్నారు.

222 వారు వారి యొక్క పొలములో పండితులై యున్నారు, వారు గొప్ప మనుషులు. వారు వారి యొక్క మత శాస్త్రములోని పొలములో పండితులై యున్నారు, దాని యొక్క మత సంబంధమైన కోణమును వారు చూచుచుండిరి. అదిగో, ఆ నక్షత్రములు బయటకు కదులుటను వారు చూశారు, జూపిటర్ మరియు సార్గస్, వాటి వరుసలోనికి కదిలియున్నవి. మరియు వారన్నారు, “మెస్సీయా ఎక్కడో యున్నాడని మాకు తెలుసు. కాబట్టి ఆయన తప్పక యెరూషలేములో యుంటాడు, కారణమేమనగా, అది మెస్సీయా మతమునకు, ప్రధాన కార్యాలయము. అది వారి ప్రధాన కార్యాలయమై యున్నది. అది సంఘశాఖా ప్రధాన కార్యాలయమై యున్నది. అక్కడే మత సంబంధమైన గుంపు కూర్చొంటుంది.”

223 వారు ఒంటెల మీద బయలుదేరారు, రెండు సంవత్సరములు టైగ్రిస్ నదిగుండా, అడవుల గుండా, తడి నేలల గుండా, ప్రయాణము చేస్తూ, ఆ పట్టణమునకు వెళ్లుచున్నారు, వారి హృదయములు సంతోషముతో నిండిపోయినవి.

224 ఆ నక్షత్రములు వ్రేలాడుచుండగా వారికి తెలిసియున్నది, మరియు, ఈ దినమున వ్యోమగాములు సహితము చెపుతున్నారు, “నిజానికి ఆ నక్షత్రములు తిరిగి ఆ స్థానములోనికి వచ్చినట్లైతే, వారు ఎక్కడ నిలబడి యున్నారో, అక్కడ నుండి చూస్తున్నప్పుడు, అది ఒకే నక్షత్రమును చేస్తుంది.” కాని దానిని చూడటానికి, ఆ స్థలములో నిలబడవలసి యున్నది. ఆమేన్. ఆమేన్.

225 నీవు ఎక్కడ నిలబడియున్నావో దానిపై అది ఆధారపడియున్నది. నీవు దేని వైపు చూస్తున్నావో దానిపై అది ఆధారపడియున్నది. హ, హ, అవును.

226 కాబట్టి వారు దానిని చూశారు, దానిని వెంబడించారు, మరియు వారు తిన్నగా వరుసలో యున్నారు. వారు దానిని ఎక్కడ కలిగియున్నారో అది లెక్క కాదు, అది తిన్నగా వారితో వరుసలో యున్నది. అది వారిని నడిపించింది. చూడండి?

227 ఆ విధానములోనే నీవు తప్పక అన్ని లేఖనములతో వరుస కట్టవలసి యున్నది, సమస్తము, అప్పుడు లేఖనములతో ఆ వరుసలో నిలిచియుండుము. కేవలం అదియే మార్గము. అది సరిగ్గా నేరుగా ఆయన యొద్దకు నిన్ను నడిపిస్తుంది. నిశ్చయముగా.

228 ఇప్పుడు గమనించండి, వారు ఇక్కడకు కేకలు వేస్తూ వచ్చారు, “యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ?” నక్షత్రము తిన్నగా వారిని యెరూషలేము లోనికి నడిపించింది, తిన్నగా సంఘశాఖా ప్రధాన కార్యాలయానికి నడిపించింది. కాని వారు దాని నుండి ప్రక్కకు తిరిగినపుడు, నక్షత్రము వారిని విడిచిపెట్టింది. వారు పట్టణములోనికి వెళ్లి, పైకి క్రిందికి తిరుగుతున్నారు. పట్టణమంతా ఎంతో సంతోషముగా యుంటుందని వారనుకొన్నారు. సంతోషముతో వీధులలో పైకి క్రిందికి తిరుగుచూ వెళ్లి, కేకలు వేస్తున్నారు, “యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పున యున్నప్పుడు ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించుటకు వచ్చాము.”

229 గుర్తుంచుకోండి, నక్షత్రము, వారు పశ్చిమానికి వెళ్లారు. వారు తూర్పున యుండిరి. “పశ్చిమము నడిపించుచున్నది, ఇంకా ముందుకు వెళ్లుచున్నారు. మమ్మును నడిపించుము…” చూడండి? వారు పరిపూర్ణముగా, బాగుంది, బబులోను మరియు ఇండియా పాలస్తీనాకు తూర్పులో ఆగ్నేయముగా యున్నవి. కాని వారు పశ్చిమానికి వెళ్లుచున్నారు. “పశ్చిమానికి నడుపు,” ఆపాట మీకు తెలుసా, “ఇంకనూ ముందుకు సాగిపోవుచున్నారు. ఆ పరిపూర్ణమైన వెలుగు నొద్దకు మమ్మును నడిపించుము.” చూడండి. ఆ జ్ఞానులు, పశ్చిమానికి వస్తున్నారు. తూర్పును విడిచి, పశ్చిమానికి వెళ్లుచున్నారు, మరియు వారు నక్షత్రమును చూశారు. ఇప్పుడు వారు పశ్చిమాన యుండి, వెనుకకు చూసి, వారు దానిని చూడలేదు. చూడండి?

230 వారు అక్కడకు వెళ్లినపుడు, అది తిన్నగా వారిని అక్కడకు నడిపించింది, తరువాత అది వారిని విడిచిపెట్టింది. వారనుకొన్నారు, “అది ఇక్కడ యున్నది, నక్షత్రము వారిని విడిచిపెట్టింది, కాబట్టి అది ఇక్కడ యున్నది.” వారు పట్టణములో ఉన్నారు, “ఓ, అయ్యో!” “ప్రతి ఒక్కరూ సంతోషముగా పాడుచున్నారు. దేవుని యొక్క మహిమ సమస్తమును వెలిగించింది. కాబట్టి మనము ఇక్కడ యున్నాము. మన ఘన కార్యము మనకు తెలుసు, మనము ఆ నక్షత్ర రాశిని’ గమనించుచుండగా, ఎవ్వరూ, ఏ పండితుడు, ఆ నక్షత్రములను ఏకముగా అక్కడకు లాగలేదు. మనకు తెలుసు, ఆ నక్షత్రములు పరలోక సైన్యములోనికి వచ్చినపుడు, ఆ సమయములోనే మెస్సీయా భూమి మీద యుంటాడు. మెస్సీయా భూమి మీద యున్నాడు.”

231 కాబట్టి కొన్ని వందల సంవత్సరములకు, ప్రతిసారి, వాటి రాశిగుండా’ తిరిగి దాటతాయి, నీవు చూడు, అప్పుడు భూమి మీదకు ఒక బహుమానము వస్తుంది. గమనించండి.

232 “ఆ గుంపు నక్షత్రములు ఏకముగా మారినపుడు, మెస్సీయా భూమి మీద ఉన్నాడు.” ఆయన అక్కడ యున్నాడని వారికి తెలుసు, కాబట్టి వారు మతసంబంధమైన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు, ఆ ఒంటెల మీద వీధులలో పైకి క్రిందికి తిరుగుచూ, “ఆయన ఎక్కడ యున్నాడు? ఆయన ఎక్కడ యున్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ వున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూశాము. ఆయన ఇక్కడ ఎక్కడో యున్నాడు. ఆయన ఎక్కడ యున్నాడు? ఆయన ఎక్కడ యున్నాడు? ఆయన ఎక్కడ యున్నాడు?” హ! ఎలాటి నింద!

233 వారు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లారు, అతడన్నాడు, “మీతో యున్న విషయము ఏమిటి? ఎందుకు, మూఢ భక్తి గుంపువారలారా!” చూడండి? వారి శాస్త్రీయ ఘన కార్యము మీద ఎలాటి నింద! దేవుని యొక్క శక్తి ద్వారా, వారు నక్షత్రాన్ని చూశారు. వారు జ్ఞానులు, తెలివైనవారు. వారు మత శాస్త్రపు పొలములో యున్నారు. వారికి తెలుసు, ఆ నక్షత్రము అక్కడకు వెళ్లినపుడు, మెస్సీయా ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ ఈ స్థలము దానిని తప్పక ఎరగవలసియున్నది, కాని దానిని గూర్చి వారికి ఏమియు తెలియదు.

234 నేను ఊహించగలను, అక్కడ పిల్లలు వీధిలో నిలబడి, అన్నారు, “హ! దానివైపు చూడండి. హ! వాళ్లు ఒక మూఢ భక్తిగల గుంపు, వాళ్లు చెప్పుచున్న మాటను వినండి, ‘యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ యున్నాడు?’ అక్కడ యున్న హేరోదు రాజు వారికి తెలియదు. పలానా బిషప్ వాళ్లకు తెలియదు.” ఓ, అయ్యో!

235 “యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ? తూర్పున మేము ఆయన యొక్క నక్షత్రాన్ని చూశాము.”

236 వారన్నారు, “మీరు ఇక్కడకు రండి, ఇక్కడ యున్న జ్ఞానులందరూ,” హ-హ. “ఇక్కడకు రండి. మీరందరూ ఎక్కడైనా ఏ నక్షత్రాన్నియైనా చూస్తారా?”

“ఓ, అలాటి దానిని నేను ఎన్నడూ చూసియుండలేదు.”

237 “నక్షత్ర శాస్త్రజ్ఞులు, మీరందరూ ఇక్కడకు రండి. మీరందరూ ఎక్కడైనా, ఏ నక్షత్రాన్నైనా చూశారా?”

“లేదు. లేదు.”

“ఒక మర్మమైన ఏ విధమైన సూచననైనా మీరు చూశారా?”

“లేదు. అలాటి దానిని మేము చూడలేదు. లేదు.”

238 ఇంకా, దానిని చూడలేదు కూడా, అదే సంగతి. వారు ఏమియు చూడరు. వారు దానిని చూడలేరు.

“హ, అలాగైతే సేవకులను పిలుద్దాము. మీరందరూ ఏమంటారు?”

“లేదు. మేము ఎన్నడూ ఏ నక్షత్రాన్ని చూడలేదు.”

239 “బాగుంది, ఆ గోడమీద యున్న, కాలమును కాయు అబ్బాయిలు, మీ సంగతి ఏమిటి? మీరు నక్షత్రములను గమనిస్తారు. ఆకాశములో యున్న ప్రతి నక్షత్ర రాశి’ మీకు తెలుసు, మీరు ఏదైనా చూస్తారా?”

“లేదు. మేము అలాటి దానిని చూడలేదు.” కాని అది అక్కడయున్నది.

240 దేవునికి మహిమ! ఓ, మీరు దానిని చూడలేదా? ఇప్పుడు అది అక్కడ యున్నది, కాని వారు దానిని చూడలేరు. వారి చుట్టూ అది వెళ్లుచున్నది, కాని వారు దానిని చూడలేరు.

241 “లేదు. మేము ఏమియు చూడలేదు. ఓ, నేను అక్కడకు వెళ్లాను. నాకు ఏమీ కనబడలేదు.” నిశ్చయముగా. నీకు కనబడదు. సరిగ్గా ఎంతో గ్రుడ్డివారు. అది నీవు చూచుటకు కాదు. చూడు? నీవు ఆ గ్రుడ్డివాడవైతే, ఎందుకు, నిశ్చయముగా, నీవు దానిని చూడవు.

242 అది సరిగ్గా దేవుడు బయలుపర్చేవారికై యున్నది. వారే దానిని చూస్తారు. అది ఎల్లప్పుడు ఆ మార్గములోనే యున్నది. నిశ్చయముగా.

243 పైన ఆకాశములలో వర్షమున్నదని నోవహు మాత్రమే చూడగలిగాడు, నీకు తెలుసా, కాని మిగిలిన వారందరూ దానిని చూడలేకపోయారు. చూడండి? పైన అక్కడ వారు వర్షమును చూడలేకపోయారు, కాని నోవహు దానిని చూశాడు.

244 శారా ఆ బిడ్డను పట్టుకొని యుండుటను అబ్రాహాము చూశాడు. అది నిజము. “ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలున్నారు, జనములకు తండ్రి?” అని అన్నవారు కాదు.

245 ఎలా మనము బైబిలు దిగువ వరకు రాగలమో, జ్ఞానులు, ప్రవక్తలు, మార్గమంతటిగుండా! “అదృశ్యమైనవి యున్నవనుటకు విశ్వాసము రుజువైయున్నది.” వాక్యము దానిని మాట్లాడియున్నదని వారికి తెలుసు, మరియు అది అక్కడ యున్నది. దాని సాక్ష్యము ఇక్కడ యున్నది. వారు దానిని చూస్తారు. ఇప్పుడు గమనించండి. ఓ, అయ్యో!

“మన జ్ఞానులు ఆ నక్షత్రమును చూడరు, దానికి అక్కడ ఏమీ లేదు.”

246 ఎందుచేత? నిజానికి, వారు చూస్తూ, అలాటి గుంపు యొద్దకు వెళ్లినపుడు, నక్షత్రము బయటకు వెళ్లిపోయింది.

247 ఈరోజు కూడా అదే సంగతి. అదే అనేకమందికి వెలుగును బయటకు తీసివేయును, అది నిజము. అలాటి గుంపువారితో జతచేరుట, మొదటి స్థానములో వారు కనీసము నమ్మరు. మరియు సంఘముల సమాఖ్యను మనము ఎలా కలిగియుంటాము? “సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు?” ప్రపంచ సంఘముల సహవాసము ఎలా యున్నది, ప్రపంచ ఐక్య సంఘముల సమాఖ్య? మనము లక్షల కొలదిగా లక్షల మైళ్ళు, ఒకరితో ఒకరము దూరముగా యుండగా, మనమందరము ఏకముగా ఎలా ఐక్యమవుతాము? చూడండి? మనము దానిని ఎలా చేస్తాము? మనతోయున్న సువార్తిక సంఘములు, ఇది, అది, మరియు అది అంటూ, ఇంకను అందరూ అలాటి రోతతో ఎలా ఒక్కటిగా ఐక్యమవుతారు?

248 శుద్ధమైన, పవిత్రమైన, కల్తీలేని, వాక్యముతో నిలబడే భార్యను దేవుడు పొందబోవుచున్నాడు. మంచిది.

249 యేసు’ వాక్యము కొరకు నింద. (తరువాత ఒక్క నిముషము మనము ఆగుదాము.) వాక్యమును బట్టి యేసు నిందించబడ్డాడు. ఇక్కడ చూడండి. ఆయన దేవుడై యుండి, శరీరధారియైన దేవుడై యుండి, ఆయన ఎలా నిందను భరించాడు? ఆయన దేవుడై యున్నాడు, తానే స్వయముగా శరీరధారియైనాడు.

250 నీకు తెలుసా, బైబిలు ఆ రీతిగా చెప్పింది. “మేము ఆయనను తాకియున్నాము. దూతలు ఆయనను చూశారు.” దానిని కొంచెము ఆలోచించండి. తిమోతి పత్రికలో అలాటి విషయము వ్రాశాడని నేను నమ్ముతాను. చూడండి, అదేమనగా, “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, దేవదూతలకు కనబడెను.”

251 ఆయన జన్మించినపుడు అక్కడ దూతలు యున్నారు. వారు క్రిందికి తొట్టెలోనికి శరీరధారియైన దేవునిని చూసినపుడు, దూతలు క్రిందికి చూసి ఎలా ఆనందించియుంటారో, ఆమేన్. వారు కేకలు వేయుట ప్రారంభించుటలో ఆశ్చర్యము లేదు, “దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఆయనే రక్షకుడైన క్రీస్తు.” యూదయ కొండల మీదుగా, వాటి పెద్ద రెక్కలను ఆడించుచూ, దూతలు ఆనందించినవి, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక.” వారు కాచియున్న, దేవుని యొక్క వాక్యము ప్రతక్షపరచబడుటను వారు చూశారు. అది అక్కడే యున్నది.

252 ఇప్పుడు, సాతాను దానిని నమ్మలేదు, నీకు తెలుసా, వాడన్నాడు, “నీవు అదియైయుంటే…”

దూత అన్నాడు, “ఆయన అదేయైయున్నాడు,” అదే భేదము.

“నీవు పలానా, పలానా అయితే. నీవు దానిని చేయుట మమ్మును చూడనియ్యి.”

కాని దూత అన్నాడు, “ఆయన అక్కడ యున్నాడు.”

253 జ్ఞానులు వారి మత శాస్త్రముతో, “ఆయన అక్కడ యున్నాడు,” అని అన్నారు. ఆమేన్.

254 ఆ కారణము చేతనే భూగర్భ శాస్త్రవేత్తలు, ఎన్నో సంవత్సరముల క్రితము ప్రవచించబడి నెరవేరియున్న వీటిని, ఈ దినమున త్రవ్వి పైకి తీయుచున్నారు. ఇక్కడ వారు వాటిని పైకి త్రవ్వుచున్నారు. కనీసము వారికి ఎన్నడూ…

255 పొంతు పిలాతు భూమి మీద యున్నాడని, అక్కడ ఎన్నడైనా చెప్పబడిన ఏ చరిత్రయు లేదు. నీకు అది తెలుసా? బడికి వెళ్లే పిల్లలైన మీరు, పొంతు పిలాతును గూర్చి చరిత్రలో ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ చెప్పబడి యున్నవో నాకు చెప్పండి. అవిశ్వాసులు, దానిని ఎగతాళి చేసి నవ్వుతారు, “అక్కడ ఎన్నడూ పొంతు పిలాతు అను పేరుగల రోమా చక్రవర్తి, ఒక గవర్నరు ఎన్నడు అక్కడ లేడని” వారంటారు. కాని ఆరు వారముల క్రితము, వారు ఒక మూలరాయిని త్రవ్వారు; దాని మీద పొంతు పిలాతు, గవర్నర్, అని యున్నది. ఓ, అయ్యో! ఎలాటి బుద్ధిహీనత!

256 వారన్నారు, “చరిత్రలో, ఐగుప్తు మీద రామసేసు అను వ్యక్తి ఎన్నడూ లేడు.” కాని వారు త్రవ్వకాలలో ఒక రాయిని పైకి తీసారు: రెండవ రామసేసు, అని దానిమీద యున్నది. గమనించండి.

257 ఆ గోడలు ఎన్నడూ క్రింద పడలేదని వారన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు చుట్టూ త్రవ్వుచూ యున్నారు, మొదటి సంగతి నీకు తెలుసా, ఆ యెరికోలో కూలిపోయిన గోడలు, బూరలు ఊదినపుడు అవి క్రిందకు కూలిపోయినవి. వారన్నారు, “అది కేవలము ఒక కట్టు కథ, అది అక్కడ ఎవరో పాడిన ఒక పాటయైయున్నది.” అవును. అపహాసకులు దానిని చెప్పారు. “అది ఒక కట్టు కథ అని అన్నారు. గోడలు పడిపోవుట అనేది ఎన్నడూ అక్కడ లేదన్నారు, యెహోషువా, బూరలు ఊది, గోడలు చుట్టూ పరుగెత్తినపుడు అవి పడిపోయినవి. కాని అలాటి సంగతి అక్కడ లేదు,” అన్నారు. ఒక గొప్ప క్రైస్తవ పురావస్తు శాస్త్రవేత్త, అతడు త్రవ్వుచూ యున్నాడు, ’కారణము ఏమనగా అది ఆలాగున యుండవలసియున్నది. అతడు ముప్పయి అడుగులు లోతునకు త్రవ్వగా, వాక్యము చెప్పినట్లుగా, గోడలు ఒకదాని మీద ఒకటి గుట్టలుగా పడియున్నవి.

258 వారన్నారు, “అక్కడ దావీదు ఎన్నడైనా వాయించిన తీగలతో చేయబడిన సితార, అనునది ఎన్నడూ లేదు, ’కారణమేమనగా తీగల ద్వారా వాయిద్యము పదిహేనవ శతాబ్దము వరకు తెలియదు.” “అలాటి వస్తువు అక్కడ ఎన్నడూ లేదన్నారు.” కాని క్రైస్తవ పురావస్తు శాస్త్రవేత్తలు, ఐగుప్తులో త్రవ్వి పైకి తీశారు, నాలుగు వేల సంవత్సరముల క్రితము తీగలతో చేయబడిన వాయిద్యమును వారు కనుగొన్నారు. ఆమేన్. ఓ, అయ్యో!

259 వారన్నారు, హెబ్రీ పిల్లలు గడ్డితో ఇటుకలను తయారు చేయుట, “అనునది అక్కడ లేదు.” అన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు దానిమీద త్రవ్వుచున్నారు, వారు దేనిని కనుగొన్నారు? అది సైన్సు. వారు ఏమి కనుగొన్నారు? హెబ్రీ పిల్లలు కట్టిన గోడలు, మొదటి వరుస రాళ్ళు, పొడవైన గడ్డి; రెండవ వరుస చిన్న చిన్న ముక్కలుగా నరకబడిన మొద్దులు; మరియు మూడవ దానిలో ఏ మాత్రము గడ్డిలేదు. ఓ, అయ్యో!

దేశములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు.

260 అవునండి, సోదరుడా, సోదరీ, అదంతయూ తిన్నగా మనపైకి కదిలియున్నది. అది ఎందుచేత? గత కొన్ని సంవత్సరములలో, ఎన్నడూ అది చేసిన దానిని సినిమా ప్రపంచము చేసియుండలేదు. తెరమీద సిసిల్‌ డెమిల్ ద్వారా పది ఆజ్ఞల కథ వచ్చింది. తరువాత తెరమీద బెన్‌ హర్ ద్వారా, యేసుక్రీస్తు కథ వచ్చింది. మరలా తెరమీద, పెద్ద జాలరియైన పేతురు మారుమనస్సు. ఈ మతసంబంధమైన చిత్రములన్నీ, సినిమాలవారు వాటిని నిరాకరించారు, మురికివని, దూరముగా విసిరివేశారు. కాని, దేవుడు, ఆయన బలమైన శక్తితో, సరిగ్గా ఆలాగునే, బ్రద్దలు చేశాడు.

261 ఇప్పుడే కొన్ని సంవత్సరముల క్రితము చెప్పబడియున్న సంగతులు, అది నేనే. ఒక దీన, చిన్న దేవుని సేవకుడు. నేనన్నాడు, “అక్కడ ఒక వెలుగు నిలబడి నాతో మాట్లాడింది మరియు నేను చేయవలసిన పనులను గూర్చి చెప్పింది.” ప్రజలు నవ్వి ఇలా అన్నారు, “అతనికి కొంచెము మతి భ్రమించింది.” అక్కడ దాని యొక్క చిత్రమున్నది. సైన్సు దానిని తీసింది. అది అక్కడ యున్నది, అది సత్యమై యున్నది.

నేనన్నాను, “ఆ స్త్రీ మరణమగునంతగా నీడతో ఆవరించియున్నది.”

262 వారన్నారు, “ఒక నీడగా యుందా. అది వెర్రితనమన్నారు. అతడు దానిని ఇప్పుడు మనస్సులో ఊహించాడు.”

263 అక్కడ దాని యొక్క చిత్రమున్నది. దేవుడు ఆ రాళ్ళను కేకలు వేయునట్లు చేస్తాడు. ఆయన కోరిన దానిని, ఆయన చేయగల సమర్ధుడు.

264 యేసు, వాక్యము కొరకు నిందను భరించుట. దేవుని యొక్క దైవ కుమారుడు, అక్కడ నిలబడి యున్నాడు, ఇమ్మానుయేలు, ఎలాటి అవమానము! అవిశ్వాసియైన పాపి ఆయనను బంధించనియ్యండి, ఆయన ముఖముపై ఉమ్మివేసి, చేతినిండా ఆయన గడ్డమును పీకి, దానిని గూర్చి ఏదైనా చెయ్యి అని సవాలు చేస్తున్నాడు. వాక్యము నిమిత్తము నింద! హ—హ. ఏమిటి? తండ్రి మాటను నెరవేర్చుట. ఓ! అయితే గుర్తుంచుకోండి, మరణము యొక్క నిందకు ఆయన తప్పక నిలబడాలి. దేవుడు, ఆయన చనిపోలేడు, ఒక పాపిని రక్షించుటకు, ఆయన ఒక్కడే చనిపోగలడు. ఇంకా ఎవ్వరును లేరు, రెండవ వ్యక్తి, లేక మూడవ వ్యక్తి దానిని చేయలేడు. ఆయన ఒక్కడే దానిని తనకు తానుగా చేయవలసి యున్నాడు. ఆయన ఇక్కడ యున్నాడు.

265 ఆయన అన్నాడు, “పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడే తప్ప, మరి ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు.” ఆమేన్.

266 వారన్నాడు, “మా పితరులు అరణ్యములో మన్నా తిన్నారు.”

ఆయనన్నాడు, “వారు చనిపోయారు.”

“మరియు నీవు జీవాహారమై యున్నావని చెపుతావా?”

267 ఆయన అన్నాడు, “అబ్రాహామునకు ముందే యున్నాను, నేను. జీవాహారమును నేనే. నేను ఉన్నవాడను, అనువాడనైయున్నాను.”

268 వారన్నారు, “నీకు ఇంకా యాభై సంవత్సరములైనా లేవే, మరియు నీవు ‘అబ్రాహామును చూశానంటున్నావు’?”

269 ఆయన అన్నాడు, “నేను, అబ్రాహామునకు ముందే యున్నాను.” అప్పుడు పాపులు ఆయనకు బంధించనివ్వండి, సంఘశాఖలు ఆయనను బంధించనివ్వండి.

270 మీకు గుర్తున్నదా, చివరి దినమున, ధనికమైన లవొదికయ సంఘము, వారు ఆయనను సంఘమునకు బయట సహితము యుంచారు. ఇప్పుడు అది ఎక్కడయున్నదో నీవు చూస్తావా? ఆ పద్ధతులకు వ్యతిరేకముగా నేను ఎందుకు కేకలు వేయుచున్నానో, నీవు చూడలవా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—సంపా.]

271 ఎందుకు యేసు, పాపులు ఆయనను బంధింపనిచ్చాడు? వాక్యమును నెరవేర్చుటకే, చనిపోవుచూ, దేవునికి ఒక నిందను తెచ్చుటయే. దేవుడు చనిపోవలసియున్నది. చనిపోవుటకు గాను ఆయన శరీరధారిగా యుండాలి. యేసు దానిని ఎరిగియుండెను. దానిని గూర్చి ఆయన వారికి చెప్పాడు. ఆయన అన్నాడు, “ఈ ఆలయమును పడగొట్టండి, నేను దానిని తిరిగి లేపుతాను.” ఎవరో దానిని లేపుటకాదు. “నేను దానిని లేపుతాను. మూడు దినములలో, నేను తిన్నగా దానిని వెనుకకు తెస్తాను. మీరు దానిని నాశనము చెయ్యండి; నేను దానిని తిరిగి లేపుతాను. మూడు రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో యోనా యున్నట్లుగా, ఆ ప్రకారమే మనుష్యకుమారుడు భూగర్భములో యుంటాడు.” కనీసము అది వారికి అర్థము కాలేదు. చూడండి? వాక్యము కొరకు ఒక నిందను, ఆయన కలిగియుండెను.

272 ఇప్పుడు, ఆయన నిత్యజీవమునకు తిరిగి లేచుటకు, మరణమునకు హాస్యము చెయ్యబడ్డాడు. మొదట ఆయన మరణమునకు అప్పగించబడవలసియుండెను, ఆ ప్రకారము ఆయన నిత్యజీవమునకు లేచి, దానిని అంగీకరించు, ప్రతి ఇతర మనిషిని (ఆయన రూపములో యుండి యున్నవారు) నిత్యజీవానికి తెస్తాడు. చూడండి? సరిగ్గా ఆయనకు ముందు యున్న సహ దాసులకు జరిగినట్లుగా, ఆయన అపహాస్యపు నిందకు భరించవలసి యుండెను, అందుచేత ఆయన మానవుడయ్యాడు, ఒక రక్త సంబంధియైన విమోచకుడయ్యాడు. మోషే వలె, నోవహు వలె, మిగిలిన వారందరూ అపహాస్యమునకు నిలబడినట్లుగా, ఆయన కూడా అపహాస్యమునకు నిలబడవలసియుండెను. ఎందుచేత? ఆయన వాక్యమును కలిగియుండెను, ఆయన వాక్యమై యుండెను. ఆ కారణమును బట్టియే ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఆయన వెక్కిరించబడ్డాడు. ఆయన దేవుడై యున్నాడు మరియు దానికై అది వాక్యము. హల్లెలూయ! అదే ఆయనను తయారు చేసింది.

273 యేసు అన్నాడు, “వేషధారులారా,” అన్నాడు, “మీరు ప్రవక్తల సమాధులను కట్టారు, కాని వారిని వాటిలో యుంచినవారు మీరే. వారు దేవుని యొక్క వాక్యముతో వచ్చారు. మరియు మీరు వారిని నమ్మలేదు. వారందరిని బట్టి మీరు దోషులు.”

274 ఫినిక్స్ నొద్ద, ప్రభువు చిత్తమైన యెడల, మొన్నటి దినమున నేను ఒక వాక్యమును చూశాను. యేసును చంపినందుకు, ఆయనను తాజాగా సిలువవేసినందుకు, ఈ తరముపై నేను నేరారోపణ చేస్తాను. ప్రభువు చిత్తమైన యెడల, సేవకుల సమాఖ్య ముందు, వారిపై నేను నేరారోపణను తెచ్చుచున్నాను. ఆయనను తాజాగా సిలువ వేసినందుకు, యేసుక్రీస్తు రక్తమును బట్టి వారు దోషులై యున్నారు. అవునండి. మొత్తము పై నేరారోపణ!

275 పెంతెకొస్తు దినమున పేతురు వారిపై నేరారోపణ చేసాడు, అతడన్నాడు, “మీ దుష్ట హస్తములతో మీరు జీవాధిపతిని సిలువవేసిరిగాని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మేము దానికి సాక్ష్యులము.” అతడు ఒక నేరారోపణను తెచ్చాడు.

276 నేను దేవుని యొక్క వాక్యమును తీసుకొని, అక్కడయున్న ప్రతి సంఘశాఖను, ఈ భూమి మీద యున్న ప్రతి మనిషిని, యేసుక్రీస్తు రక్తము విషయమై దోషులై యున్నారని, వారిపై నేను నేరారోపణ చేస్తాను. దేవా, ఆ దినమున, ఆయన న్యాయవాధిగా యుండుటకు, నాకు సహాయము చేయుము. ఆమేన్. అవును.

277 ఓ, అపహాసకులు ఆయనను ఎగతాళి చేశారు. వారు ఆయనను నిందించారు. ఆయన తిన్నగా దానితో నిలబడ్డాడు. ఆమేన్. ఓ! ఆయన ఏమి చేశాడో గమనించండి, పాపమును మరణమునకు అప్పగించుటకు, ఆయన మరణమును అనుభవించాడు, ఆయన దేవుని కుమారుడై యున్నాడు. ఆయన దానిని చేయవలసియుండెను. ఆ విధానములోనే, అది మరణమునకు అప్పగించబడగలదు. ఆయన దానిని చేశాడు, దానికొరకు నిలబడ్డాడు, ’ఎందుకంటే మిగిలిన వారందరు దానిని చేశారు.

278 కారణము ఏమనగా, ఆ వెనుక వారందరూ, దేవుని యొక్క వాక్యములో, ఒక సూక్ష్మమైన దానిని కలిగియున్నారు, ఏలయనగా యేసు అన్నాడు, “దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చింది.” ఆయనన్నాడు, “మీ తండ్రులు, మీ శాఖామతము, వారిలో ఎవరిని రాళ్ళతో కొట్టి చంపలేదు? ప్రవక్తలను పొందినవారు వారే? తరువాత వారు, చనిపోయిన తరువాత, మీరు వారి సమాధులను కట్టుచున్నారు.” అన్నాడు, “వారిని సమాధులలో యుంచినందుకు దోషులు మీరే.”

279 తరువాత కాపునకు ఇచ్చిన ఉపమానమును ఆయన వారికి ఇచ్చాడు. అయితే వారు వారిని హింసించారు, తరువాత చివరగా వారన్నారు, “కుమారుని చంపుదాము, ఎందుకంటే అతడు వారసుడు.” చూడండి? ఓ, వారు దానిని చూసినపుడు, వారు కోపపడ్డారు. చూడండి?

280 కాని, ఆయన నిందకు నిలబడవలసియుండెను. ఇక్కడ ఆయన తానే బంధించబడి, తిరిగి నిత్యజీవమును తెచ్చుటకు, మరణము విధించబడుటకు, మరణమునకు నడిపించబడ్డాడు. దేవునికి మహిమ! ఓ, నేను ఆయనను ఎలా ప్రేమిస్తానో! ప్రతి యుగము గుండా వాక్యముతో నిలబడి, నిందను భరించిన వారందరిని, ప్రతి దేవుని యొక్క కుమారునికి తిరిగి నిత్య జీవమును తెస్తున్నాడు. అది నిజము.

281 ఆయన వచ్చి యుండకపోతే, నోవహు లేచేవాడు కాదు. ఆయన వచ్చియుండకపోతే, ఏలీయా తిరిగి వచ్చేవాడు కాదు. ఆయన వచ్చియుండకపోతే, నోవహు ఎన్నడూ లేచేవాడుకాదు, ఆయన వచ్చియుండకపోతే, అతడు లేచేవాడు కాదు. కారణమేమనగా, ఆయనే ఆ ముందుగా నిర్ణయించబడిన గొఱ్ఱెపిల్ల, తనపై యున్న నిందను తీసివేయుటకు, ప్రకటించబడిన ప్రతి దేవుని మాటకొరకు, మరియు దానికొరకు నిలబడిన ఈ నీతిమంతుల కొరకు, మరణమునకు చనిపోవలసినది ఆయనే. ఆయన ఆలాగున యుండవలసియున్నది. మరెవ్వరూ దానిని చేయలేరు. వారిని విమోచించి, ప్రతి కుమారునికి నిత్యజీవమును ఇచ్చుటకు, అదే వాక్యము కొరకు నిందను అనుభవించిన వారికొరకు దేవుడే స్వయముగా వచ్చి, ఆ స్థానమును తీసుకొనెను. ప్రతి దేవుని కుమారుడు, యుగములన్నిటి గుండా, ఆ నింద కొరకు నిలబడినవారు, విమోచకుడు వస్తున్నాడని విశ్వాసము ద్వారా చూసిన వారు తప్ప, వారిలో ఏ ఒక్కరూ విమోచించబడలేరు.

282 యోబు ఆయనను చూశాడు. యోబు అక్కడ నిలబడియుండగా, వారన్నారు, “ఓ, నీవు ఒక రహస్య పాపివి. నీవు రహస్య పాపివి ’అయినందున, దేవుడు నిన్ను బాధిస్తున్నాడు.”

283 అతడన్నాడు, “నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. మరియు అంత్య దినములలో ఆయన భూమి మీద నిలబడతాడు. నా దేహమును పురుగులు తినివేసినను, ఇంకనూ నా దేహముతో నేను దేవునిని చూస్తాను.”

284 అతని భార్య అన్నది, “నీవు ఆయనను దూషించి, ఎందుకు చనిపోకూడదు?” అతడన్నాడు, “నీవు ఒక దౌర్భాగ్యురాలవలె కనబడుచున్నావు.”

285 అతడన్నాడు, “నీవు ఒక మూర్ఖురాలువలె మాట్లాడుచున్నావు.” ఆమేన్. అక్కడే అతడున్నాడు, “ఆయన జీవిస్తున్నాడని నాకు తెలుసు, మరియు అంత్య దినమున ఆయన నిలబడతాడు.”

286 యేసు వచ్చియుండకపోతే, యోబు విమోచించబడి యుండేవాడు కాదు, ’ఏలయనగా, ఆయన జగత్తు పునాదికి ముందే వధింపబడిన గొఱ్ఱెపిల్ల. ఆయన స్థానము ఆయనకు తెలుసు. ఆయన హోదా ఆయనకు తెలుసు.

287 ఆ కారణమును బట్టియే ఆ రోజు ఆమె అక్కడ నుండి బయటకు వచ్చినపుడు, మరియ ఆయన స్థానమును గుర్తించింది. ఆమె అన్నది, “నీవు ఇక్కడ యుండియుంటే, నా తమ్ముడు చనిపోయి యుండేవాడు కాదు.”

ఆయన అన్నాడు, “నీ తమ్ముడు మరలా లేస్తాడు.”

ఆమె అన్నది, “అవును, ప్రభువా, పునరుత్థానములో లేస్తాడు. అతడు ఒక మంచి బాలుడు.”

యేసు అన్నాడు, “అయితే నేనే ఆ పునరుత్థానమును. నీవు దీనిని నమ్ముచున్నావా?”

288 ఆమె అన్నది, “అవును, ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవని నాకు తెలుసు.”

ఆయన అన్నాడు, “మీరు అతనిని ఎక్కడ పాతిపెట్టారు?” ఓ! అక్కడే నీవున్నావు. హా!

289 ఆమె దానిని గుర్తించింది. ఆ చిన్న స్త్రీ దానిని చెప్పుట లేదు. ఆమెలో నుండి ఏడు దయ్యములు వెళ్లగొట్టబడినాయి. ఆమె దేవుని యొక్క శక్తిని ఎరిగియుండెను, ఆమెలో నుండి ఆ గర్వమును, ఒత్తిడిని, ఆ చిన్న స్వార్ధపరమైన ఉన్నత పాఠశాల ఆత్మను సమస్తమును తీసివేసి, ఆమెను ఒక నూతన సృష్టిగా చేయగలిగిందని ఆమెకు తెలుసు. ఏడు దయ్యములను ఆయన వెళ్లగొట్టాడు. ఆయన ఏమైయున్నాడో, ఎవరు ఆయనను అంగీకరించారో, ఆ స్త్రీలు ఎరిగియుండిరి.

290 ఆయన వారికొరకు ఏమి చేశాడో వారు ఎరిగియుండిరి. ఈరోజున కూడా వారు అదే చేస్తున్నారు. సరిగ్గా దానిని అంగీకరించుము. అదే తరువాత విషయము.

291 ఆయన అక్కడ యున్నాడు. ఆమె దానిని చెప్పింది. ఏమి సంభవించిందో నీకు తెలుసా. ఓ!

292 అదే వాక్యము కొరకు అందరూ శ్రమపడతారు. ఆ కారణము చేతనే ఆయన చనిపోయాడు. దానిని చేయుటకు, చనిపోగలిగినవాడు ఆయన మాత్రమే, కారణము ఆయన వాక్యమైయున్నాడు. ఆయన వాక్యమైయున్నాడు, ఆ వాక్యము ప్రత్యక్షపరచబడింది. ఇతరులందరూ చిన్న ముంపులను కలిగియున్నారు, కాని ఇక్కడ ఆయనలో, దేవుని యొక్క పరిపూర్ణత యున్నది. ఈరోజున ఒకేరీతిగా యున్నాడు, హెబ్రీ 13:8, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా ఉన్నాడు.” వినండి.

293 నేను నిజముగా ముగిస్తున్నాను. నేను చేయబోవుచున్నాను, నేను చేయవలసియున్నది. నా సమయము గతించిపోయింది.

294 ఆయన ఎన్నడూ ఒక్కమాట వ్రాయలేదు. ఆయన వ్రాశాడా? [సమాజము “లేదు” అని చెప్పుచున్నది.—సంపా.] ఎన్నడూ ఒక్కమాట వ్రాయలేదు. ఎందుచేత? ఆయన వాక్యమైయున్నాడు. ఆయన ఎవరు? వ్రాయబడియున్న మాటలకు, ఆ వాక్యమునకు ఆయన ప్రత్యక్షత యైయున్నాడు. మహిమ! అయ్యో! ఇప్పుడు నాకు మంచి అనుభూతి కలుగుతుంది. ఆయన వాక్యమై యున్నాడు. ఆయన ఏమియు వ్రాయవలసిన పనిలేదు. ఆయన వాక్యమై యున్నాడు, ఈ వ్రాయబడిన మాట ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు. ఆయన వాక్యమై యున్నాడు, బయలుపరచబడిన వాక్యము.

నీవంటావు, “అది నిజమేనా, బ్రెన్‌హాం సోదరుడా?”

295 అక్కడ నిలబడియున్న యెహోవాను గమనించండి, ఆ అలల గుండా, అదిగో ఆయన ఒక గీతను గీచాడు, మరియు దానిగుండా నడవటానికి ఇశ్రాయేలుకు దారిని తయారుచేశాడు.

296 శరీరములో యున్న యెహోవాను గమనించండి, “నిమ్మళించుము,” అన్నాడు. అలలు, తుఫానులు ఒడ్డును కొట్టుచున్నాయి, మరియు దయ్యము ప్రతివైపున నాకుచున్నాడు, ఆయన, “నిమ్మళించును,” అనగానే గాలులు అన్నీ అవి ఆయనకు లోబడినవి. ఆయన యెహోవా. ఆమేన్.

297 అదిగో, ఆ యెహోవా అక్కడ నిలబడి, కొన్ని మంచు ముక్కలను చిలకరించగా, అది భూమి మీద, ప్రజలను పోషించుటకు, రొట్టెగా తయారుచేయబడింది.

298 ఆయన నిలబడి, అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలను తీసుకొని అయిదు వేలమందికి ఆహారము పెట్టాడు.

299 ఆయన వాక్యమై యున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన వాక్యమై యున్నాడు, ఆయన ఎన్నడూ వాక్యముగానే యుంటాడు. మరియు నేనును నా ఇంటివారును వాక్యమును సేవిస్తాము.

ఓ, నేను ఆయనను చూడగోరుదును, ఆయన ముఖమును చూడగోరుదును,

ఆయన రక్షించు కృపను గూర్చి, అక్కడ శాశ్వతముగా పాడతాను;

మహిమ వీధుల మీద, నా స్వరమును పైకెత్తనివ్వండి;

చింతలన్నియూ గతించిపోయినపుడు, చివరగా గృహము చేరి, సదాకాలము ఆనందిస్తాను.

300 ఓ, అయ్యో! అవును. వాక్యము కొరకు నిందను భరించుము. వాక్యముతో అక్కడ నింద వెళుతుంది. వాక్యముతో తిన్నగా నిలిచి యుండుము, మరియు నిందను భరించుము.

ప్రార్థన చేసుకొందాము.

301 యేసు మొన్న రాత్రి, ప్రభువా, నేను మొర్రపెట్టాను, “ఓ, యేసు, నన్ను నీవు ఏమి చేయమంటావు? నేను ఏమి చేయగలను, ప్రభువా? ఈ సంగతులను చూస్తూ, మరియు మేము జీవించుచున్న ఘడియను ఎరిగినవాడనై, నేను ఏమి చేయగలను, ప్రభువా? నేను ఏమి చేయగలను?”

302 ప్రభువా, ఇక్కడయున్న నా చిన్న సంఘము కొరకు ప్రార్థిస్తాను. జరిగియున్న సంగతులు, ఆ చిన్న పక్షులను నేను దర్శనములో చూస్తాను; మరియు మిగిలిన పక్షులు, అవి గొప్ప సంగతులు. కాని అవి మూడు అంతస్థులుగా యున్నవి, ప్రభువా? కాని ఆ దూతలు లోనికి వచ్చినపుడు, అక్కడ ఏ పక్షులు లేవు. ఆ చిన్న వర్తమానికులు, అద్భుతముగా యున్నవి, ప్రభువా, అయితే ఏదో సంభవించుటకు సమయమైయున్నదని నేను నమ్ముతాను. ప్రభువా, దానిని జరుగనిమ్ము. నీ మార్గములో మమ్మును తయారు చేయుము, మమ్మును మలచుము, మేము జిగట మన్ను. నీవు మా కుమ్మరివి.

303 ప్రభువా, క్రిస్మస్ సందర్భముగా, దేవుడు మా కొరకు ఇచ్చిన బహుమానమును బట్టి మేము కృతజ్ఞులము. మేము మా హృదయములలో నమ్మినట్లుగా, ఇక్కడ కొందరు, ఈ దినమున ఒక అన్య మూఢ నమ్మకముగా, దీనిని వారు ఒక మాస్‌గా, క్రిస్మస్‌గా మలచాలని అనుకొనుచున్నారు. కాని మేమైతే, ఆ శాంతాక్లాజ్ మార్గములో, క్రిస్మస్ చెట్లతో, అలంకరణములతో రాగోరుట లేదు. కాని, మమ్మును విమోచించుటకు, మా మధ్య నివసించి, మావలె శరీరముగా మారి, శరీరధారిగా మారిన పరలోకపు దేవునిని ఆరాధించుటకు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము వస్తున్నాము; మాకు నిత్యజీవమును తెచ్చుటకు సిలువ నిందను భరించి, ఆ నామము కొరకు నిందను భరించి, లోక సంబంధమైన విధి ప్రకారము, ఇమ్మానుయేలును మరణమునకు అప్పగించనిచ్చాడు.

304 మేము ఎవరము, ప్రభువా? ఏ నిందనైనా వద్దనుటకు మేము ఎవరము? దేవా, మమ్మును సాహసము గల సైనికులుగా చేయుము. తండ్రీ, ఈ మాటలను నీకు అప్పగిస్తాను. వారును విరిగిపోయి యున్నారు; నావలె అలసిపోయి, వ్యాకులముతో యున్నారు. కాని, తండ్రీ, ఇక్కడ కూర్చొని, వినినందుకు, ఈ ప్రజలకు బహుమానము నిమ్ము. ఈ చివరి దినములో, నా ప్రభువును పైకి తెచ్చిన ఆ శక్తి, ఇక్కడ మా కొరకు రక్షకుడిగా హాజరు పర్చిన ఆ శక్తి, ప్రభువా, ఇక్కడయున్న ప్రతి ఆత్మను, ప్రభువైన యేసు రాకడకు సమీపముగా, ప్రతి ఆత్మను అది బ్రతికించును గాక. ఆలాగున జరుగనిమ్ము తండ్రీ.

305 మా మధ్యయున్న రోగులను, వ్యాధిగ్రస్థులను బాగుచేయండి. విరిగిన హృదయములను కట్టండి. ప్రభువా, మేము ఎన్నో వాటిగుండా వచ్చియున్నాము, కఠిన పోరాటములను బట్టి, నా గుండెపై ఎన్నో గాయములున్నవి, నేను ఒక పాత సైనికుడను. ప్రభువా నాకు సహాయము చేయుము, నీ సహాయము నాకు కావాలి. ఈ తర్ఫీదంతయూ ఒక ఉద్దేశ్యము కొరకైయున్నది. అది యుండియున్నదని నేను నమ్ముతాను, ప్రభువా. ఓ దేవా, నాకు సహాయము చేయుము. ఈ సంఘమునకు సహాయము చేయుము. మమ్మును ఏకముగా దీవించుము.

306 ఈ చిన్న పిల్లలను దీవించండి. ఆ చిన్న, దీనమైన చిన్నవారిని గూర్చి నేను ఈ రోజున ఆలోచిస్తున్నాను, అక్కడ వారు ఏమియు పొందలేదు. నా ప్రార్థన ఏమనగా, వారితో యుండండి, వారికి సహాయము చేయండి. ప్రభువా వారికి నిత్యజీవమును ఇవ్వండి. అదే గొప్పది…అదే మేము కోరియున్న క్రిస్మస్ బహుమానము, అదే యేసుక్రీస్తు యొక్క జీవము, మా హృదయమును ఏలి, పరిపాలించుటయే. ప్రభువా, అదే నేను కోరేది.

307 ఇప్పుడు, మమ్మును ఏకముగా దీవించండి. ఈ మాటలను మేము మీకు అప్పగిస్తాము. ప్రభువా, అవి కోరిన చోట అవి పడును గాక. ఎక్కడైతే హృదయములు తెరవబడియున్నవో అక్కడ అవి ఒక గొప్ప రక్షణ కాలమును తెచ్చును గాక, యేసు నామములో, ఆమేన్.

308 ఎంతమంది ఆయనను ప్రేమిస్తారు? [సమాజము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] ఎలాగైనా, ఎంతో తొందరలో యున్నాను? ఓ, నేను ఆయనను ప్రేమిస్తాను! నేను ఆయనను ప్రేమిస్తాను! “ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు?”

309 ఈ రాత్రి కూటమును మర్చిపోవద్దు. క్రిస్మస్ అనగా భావము ఏమిటో ఇప్పుడు మీరు తెలుసుకొన్నారు? ఓ, ఇది నా క్రిస్మస్ బహుమానము. ఇదే ఆ వాక్యము. ప్రభువా, నన్ను నేను మార్గములో నుండి వెళ్లనిచ్చినట్లైతే, ఆ ప్రకారము నీ మాట, ఇక్కడ దానికై అది బయటకు దానిని వ్యక్తపర్చగలదు. నేను ఎరిగిన వాటిలో అదే అతి గొప్ప విషయము.

310 ఇప్పుడు పిల్లలకు ఇవ్వటానికి, వారు కొన్ని వస్తువులను కలిగియున్నారని నేననుకొంటాను. ఇప్పుడు తిరిగి కూటమును నేను నెవిల్ సోదరునికి అప్పగిస్తాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.

సోదరుడు నెవిల్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...