సంపూర్ణత
ఈ ఉదయమున ఇక్కడ ఉన్నందుకు, మరియు సరిగ్గా వేదిక పైకి వస్తుండగా ఈ హెచ్చరికను విన్నందుకు, ఎంతగానో ఆనందిస్తున్నాను. ఆలస్యమైనందుకు మన్నించండి. కానీ ఆ వెనకాల, కార్లలో, అంబులెన్సులలో, రోగులున్నారు, మరియు—మరియు నేను లోపలికి రావడానికి ముందే, మీరు చూడండి, లోపలికి రాలేనివారి వద్దకు నేను వెళ్ళవలసి వచ్చినది.
2 ఇప్పుడు, ఆ—ఆ చిన్నబిడ్డను ఎత్తుకొనియున్న ఆ సహోదరి, ఈ మధ్యాహ్నము ఆమె తిరిగి రాలేకపొతే అని ఆలోచించాను. ప్రభువు చిత్తమైతే, ఈ సాయంత్రము కూడా, నేను బోధించగోరుచున్నాను. ప్రతిష్టించుటకై ఆమె తిరిగి రాలేకపోయిన యెడల అప్పుడు, నేను ఈ సమయంలో ఎక్కువసేపు నిలబడియుండగానే, సరే, ఆ బిడ్డను ఇప్పుడే తీసుకొనిరమ్మని, ఆమెకు చెప్పండి. కానీ ఒకవేళ, ఆమె తిరిగి, ఈ రాత్రికి రాగలిగితే, అది మనకు కొంచెము మెరుగుగా ఉంటుంది. కానీ ఆమె ఏమి చేయగలిగితే అలాగే చేయనియ్యండి, అది ఏమైనా సరే. ఎందుకు, ఆమె తిరిగి రాలేనట్లయితే, మనము ఆ చిన్న బిడ్డను ఇప్పుడే ప్రతిష్టించుటకు తీసుకొనివద్దాము. మరియు ఇప్పుడు, ఇవన్నియూ, నేను మాట్లాడుచుండగా, ఆమె ఇప్పుడు రావాలనుకొంటే, మరి ఇదే అనుకూల సమయము.
3 ఇప్పుడు, ఈ రాత్రి, ఒక ప్రత్యకమైనది, నేను—నేను ఈ రాత్రి ఒక అంశముపై మాట్లాడగోరుచున్నాను, ఒక ప్రవచనాత్మక వర్తమానము: అయ్యా, ఇదేనా ఆ సమయము? కావున ప్రభువు చిత్తమైతే, నేను ఈ రాత్రి ఆ అంశముపై మాట్లాడగోరుచున్నాను. ఇదేనా ఆ సమయము, అయ్యా? లేక, అయ్యా, ఇదేనా ఆ సమయము? అయ్యున్నది. మరియు పిదప ఈ సంఘము యొక్క సముఖములో, నేను ఈ అవకాశమును తీసుకొనగోరుచున్నాను. ఏమిటంటే, గత కొన్ని దినములలో చాలా సంగతులు జరిగాయి, అవన్నియూ నేను గ్రహించలేని ఒక—ఏదో ఒక గొప్ప కార్యమువైపు చూపిస్తున్నాయి. కానీ మనము, మనము ఎల్లప్పుడూ…దేవుని మార్గములు మనుష్యుడు గ్రహించలేడు, కావున మనము విశ్వాసము ద్వారా నడువవలసియున్నది. ఎవరైనా దేవుణ్ణి వివరించగలిగితే, అప్పుడిక విశ్వాసమును కలిగియుండాల్సిన అవసరము ఉండదు, ఎందుకనగా నీవు—నీవు దానిని ఎరుగుదువు. కానీ మనము విశ్వాసము ద్వారా నడచుచున్నాము.
4 మరియు ఈ ఉదయము, నేను ఒక సాధారణ సువార్తపరమైన కూటమును కలిగియుండాలని తలంచాను, ఎందుకనగా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకులు నిలబడి, మరియు చాలాసేపటి నుండి నిరీక్షించుటను చూసిన తర్వాత నేను నా ఆలోచన మార్చుకున్నాను. మరియు పిదప, ఈ రాత్రి, బహుశా ఇక్కడ కొద్దిమందే ఉన్నపటికీ, నేను చెప్పగోరిన దానితో ముందుకు సాగిపోయెదను.
5 వారిలో అనేకులు కూడియుండగా, మీలో అనేకులు కూడియుండగా, నేనొక విషయమును ప్రకటించగోరుచున్నాను. దానిని గూర్చి నేను కొన్ని వారములనుండి ప్రకటించకుండా ఆగిపోయాను. అదేమిటనగా, ప్రభుత్వముతో నాకున్న పన్నుల కేసు విషయంలో మీ ప్రార్థనలకు జవాబు వచ్చినది. అది పరిష్కరించబడినది. మరియు కావున మనము…అది—అది ఇప్పుడంతా అయిపొయినది. మీలో అనేకులు గ్రహించినట్లుగా వారు నాకు వ్యతిరేకంగా కలిగియున్నది కూటముల నిమిత్తము ఇవ్వబడిన ఆ చెక్కుల విషయమైయున్నది, మరి అయినను అవి నావి అని చెప్పుటకు వారు ప్రయత్నించారు. మరియు అది నా సొత్తు అని మూడు వందల యాభైవేల-డాలర్లు నా పైన జరిమానా వేయాలనుకున్నారు, కానీ అది నాది కాదు. అది సువార్త బృందానికి చెందినది. మరియు దానిని గూర్చి సంఘానికి తెలుసు. దానిని గూర్చి మీ అందరికీ తెలుసు. మరియు చివరికి వారు ఎలాంటి చోటుకి వచ్చారంటే…
6 జరిగినదాని గూర్చి నేను మీకు కొంచెము వివరణ ఇస్తాను. వారు మూడు నుండి ఐదు సంవత్సరాలుగా, దాదాపు, ఐదు సంవత్సరాలుగా, ఈ కేసులోనే ఉన్నారని, నేను ఉహిస్తున్నాను, మరియు ముందుకు వెనుకకు, మరియు అన్ని విధములుగా త్రిప్పారు. కానీ నాకు వ్యతిరేకంగా వారు ఏమి కనుగొనలేకపోయినందుకు నేను చాలా కృతజ్ఞుడను, తద్వారా దాని విషయమై వారు నా మీద నేరారోపణ చేయలేకపోయారు. కావున అక్కడ, నేరము మోపుటకు ఏమీ లేదు, ఒక్కటే, అది కేవలం, నా—నా అజ్ఞానము, అని వారు అన్నారు, చట్టము గూర్చి ఎక్కువగా తెలియకపోవుటవలన అని నేను ఉహించుచున్నాను. వారు నా పేరున చెక్కులు పంపారు మరియు నేను వాటి మీద సంతకాలు చేశాను, వాటి మీద నా పేరు వ్రాశాను, వాటిని కూటములకు ఇచ్చాను. కానీ పిదప, నేను వాటిమీద నా పేరు వ్రాసినంతకాలము, అవి నావే, మీరు చూడండి. ఏది ఏమైనా…వారిట్లన్నారు, “అది ఆ విధంగా, చేయుట మీకు చాలా బాగున్నది. కానీ అవి నీవే, మరియు తర్వాత నీవు వాటిని సంఘమునకు ఇచ్చావు. కానీ దాని మీద నీవు నీ పేరు వ్రాసిన వెంటనే, అది నీదవుతుంది, అవి దేనికొరకు కేటాయించబడినప్పటికీ ఫర్వాలేదు. అవి నీకు వ్రాయబడినవి.” కాబట్టి…ఒకవేళ వారు దాని మీద వ్రాసియుంటే…దాని మీద ఎవరైనా, “వ్యక్తిగత కానుక,” అని వ్రాసియుంటే అది బాగానే ఉండేది. కానీ వారు కేవలం, “విలియం బ్రెన్హామ్,” అని వ్రాశారు. చూశారా? మరియు నేను దాని మీద నా పేరు వ్రాసినప్పుడు, అది జరిగినది. దానిలోని విషయమంతా అదే. కాబట్టి వారు…మరియు పిదప చివరిగా ప్రార్థనతో…
7 మరియు ఇటీవల కాలములో, మీకు తెలుసు, వారు…ఒక గొప్ప, నల్లటి, పొగ, పొగచూరిన, పొలుసులతో, ఒక మొసలివంటి, వ్యక్తి ఇనుప వ్రేళ్ళతో, నా వైపుగా కదులుచూ వస్తున్నట్లు, నాకు ఒక దర్శనము వచ్చినది. నా దగ్గర ఒక చిన్న కత్తి ఉన్నది, అలాటిది. మరియు అతని మీద ఈ విధంగా ఉన్నది, “అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వము.” మరియు నేనేమి చేయలేకపోయాను. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మరియు అప్పుడు ప్రభువు రంగము మీదికి వచ్చాడు, మరియు అది జయించబడినది. మరియు చాలా కాలం క్రితమే, దానిని నేను మీతో చెప్పినది మీకు జ్ఞాపకమున్నది గదా.
8 మరియు ఒక దినమున, వారు రాజీపడుటకు వచ్చారు. మరియు న్యూ ఆల్బనిలోని, శ్రీ. ఆర్బిసన్ అనే నా లాయరు, మరియు ఇండియనాపొలిస్ లోని ఐస్&మిల్లరువారు, పన్నుల కేసు విషయమై, నాకు ఫోను చేసి, మరియు “ఇక్కడికి రమ్ము,” అని నాతో చెప్పారు. మరియు నేను అక్కడికి వెళ్ళాను, సహోదరుడు రాబర్సన్ మరియు నేను, మరియు నా భార్య, మరియు ఈ సంఘానికి చెందిన ధర్మకర్తలు, మరియు మేము అందరమూ వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళాము. మరియు ప్రభుత్వము, రాజీపడుటకు ఇష్టపడ్డారు, అని వారు మాకు చెప్పారు.
9 మరియు నేను చెప్పాను, “నేను, ఎవరికైనా ఏదైనా ఋణపడియుంటే, నేను దానిని చెల్లిస్తాను. నా శాయశక్తులా చేస్తాను. కానీ,” నేను ఇట్లన్నాను, “నేను దానికి ఋణపడిలేను.” మరియు నేనిట్లన్నాను, “నేను—నేను…అది, యధార్థమైయున్నది. దేవుడు దానిని ఎరిగియున్నాడు. మరి నేను దోషినైతే, వారు ఎందుకని, నా మీద నేరారోపణ చేయడంలేదు?” నేను చెప్పాను, “దానిని చేయుటకు వారు ఐదు సంవత్సరాలు ప్రయత్నించారు, కానీ దానిని చేయడానికి వారు ఏమి కనుగొనలేకపోయారు.” కాబట్టి నేను చెప్పాను, “లేదు, నేను తిరస్కరించుచున్నాను. నేను ఋణపడియున్నానని నిరూపించబడే వరకు నేనసలు దానిని చెల్లించను.”
10 మరి అప్పుడు ఆ లాయరు నన్ను లోపలికి తీసుకెళ్ళి నాతో మాట్లాడినాడు, మరియు నాతో ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు, మనం కేసును వాదించవచ్చును. ప్రభుత్వం దానిని ప్రయత్నిస్తుంది.” ఇంకా ఇట్లన్నాడు, “వారు చేసినప్పుడు, వారు నీకు వ్యతిరేకంగా కనుగొనగలిగే ఒకే ఒక్క విషయమేదనగా, అది నీవు…” అది నేను, ఏమిటంటే, అది నేను దానిని చేసిన విధానమైయున్నది. నేను ఊరకే చేయలేదు…
11 లెక్కలను పుస్తకాలలో వ్రాయడం గూర్చి నాకు ఏమీ తెలియదు, కావున నేను నిజాయితీయని భావించిన విధానములోనే నేను దానిని చేయవలసియుండెను. మరియు అది—అది నా పేరు మీద బ్యాంకులో వేయబడలేదు. అది ఎల్లప్పుడూ సంఘముయొక్క కూటముల పేరు మీద, మరియు అటువంటి వాటి మీదనే బ్యాంకులో వేయబడినది, చూడండి, కావున నేను దాని గూర్చి చేయగలిగినది ఏమీలేదు. మరియు నేను…
12 అతడు చెప్పాడు, “మంచిది, పదివేల డాలర్ల జరిమానాతో, పదిహేనువేల డాలర్లకు వారు రాజీపడుటకు సిద్ధంగా ఉన్నారు.” మరియు లాయరు ఫీజు పదిహేను వేలు. దానితో నాకు నలభై వేలు అయినది. మరియు వారు మరొక ఐదు ఎక్కువ కోరారు, అది ఇప్పుడని నేను తలంచాను. కాబట్టి నేను వెళ్ళాను…
13 నేను చెప్పాను, “ఈ లోకములో నలభై వేల డాలర్లు నాకు ఎక్కడనుండి వస్తాయి?” నేను ఇట్లన్నాను, “మీకు తెలుసు, ఇక్కడ నా బ్యాంకు ఖాతాలో, వంద డాలర్లు, లేక అంతకంటే తక్కువే ఉంటాయి.” నేను చెప్పాను, “నలభై-మరన్ని వేల డాలర్లు నాకు ఎక్కడి నుండి వస్తాయి?” మరియు నేను చెప్పాను, “బదులుగా ఇచ్చుటకు నాకేమియు లేదు. నా వద్ద అసలేమియు లేదు. అంతే.”
14 మరియు అతడున్నాడు, “మిస్టర్. బ్రెన్హామ్,” అతడిట్లు చెప్పాడు, “ఇదీ సంగతి. ఒకవేళ మనము కేసును వాదించినట్లయితే,” అతడు చెప్పాడు, “మనము కేసును గెలవగలము అనుటలో ఎటువంటి సందేహములేదు.” అతడు చెప్పాడు, “కానీ విషయం ఏమిటంటే. నేను ఈ విధంగా చేస్తాను, గనుక మనము దానిని గెలవగలము. నీవు దానిపై నీ పేరును సంతకము చేశావు గనుక అది అంతా నీదేనని వారు వాదించబోవుచున్నారు. మరియు అది ప్రచార బృందము, సంఘము, బ్రెన్హామ్ సువార్త బృందం, మరియు పిదప ఒక సంఘము, అను పేరు మీద బ్యాంకులో వేయబడినప్పటికి అది నీదేనని వారు చూపించబోవుచున్నారు.”
15 మరియు ఒక్కసారి కూడా, ఒక్క సెంటైనా నా కొరకు ఖర్చుపెట్టినట్లు వారు కనుగొనలేకపోయారు. అది నిజం. దేవునికి తెలుసు. ప్రారంభము నుండి నాతో కూడా ఉన్నవారు, సరిగ్గా ఇప్పుడు ఇక్కడే కూర్చొనియున్నారు. ఒక్క రూపాయి కూడా నా స్వంతానికి నేను ఎన్నడూ ఖర్చుపెట్టలేదు. ప్రతీది, ప్రతీ చెక్కును, ప్రతీచోట, అంతయు దేవుని రాజ్యము కొరకే ఖర్చుచేశాను.
16 అయితే, దానిని చూడండి, కానీ అది లెక్కకు రాదు. అది—అది మొదటిగా, నాదన్నట్లు, తర్వాత సంఘము, మరియు ప్రచార బృందానికి చెందునన్నట్లు చేసారు. మరియు వారు దానిని చేయుటకు ఒక మార్గమును కలిగియున్నారు, మీకు తెలుసు, అన్ని రకాలుగా వారికి తప్పించుకునే మార్గాలు కలవు. కావున పిదప నేనిట్లన్నాను, “మంచిది, నేను—నేను దానిని చేయను.”
17 మరియు అతడు చెప్పాడు, “మంచిది, నేను—నేను వారికి అవి ‘వ్యక్తిగత కానుకలు’ అని ప్రకటించడంవలన, మనము ఆ కేసును ఆ విధంగా గెలవగలిగితే, చూశారా? నేను ప్రభుత్వము ద్వారా, దానిని ప్రకటిస్తాను, ‘వ్యక్తిగత కానుకలు.’” మరియు చెప్పాడు, “పిదప, నేను దానిని చేసినప్పుడు, మొత్తం పదివేల డాలర్లు స్వాస్థ్యముగా వస్తాయి. మరప్పుడు నీవు మరలా తిరిగి అందులోనికే వస్తావు, మరియు వాటన్నిటినీ పరీక్షించుకుంటూ, వారు మరొక ఐదు సంవత్సరములు నిన్ను పట్టుకుంటారు.” చూశారా? మీరు ఒక చెక్కు వ్రాసినప్పుడు, అది చెల్లింపుల కార్యాలయం నుండి వెళ్తుంది. వారు ఆ చెక్కును, ఫోటో కాపీ తీస్తారు. అవును, దానిగుండా వెళ్ళిన, చెక్కులన్నీ, నా దగ్గర ఉన్నాయి. కావున వారిట్లన్నాారు, “అక్కడే వారు, తిరిగి మరలా నిన్ను పట్టుకుంటారు.”
18 మరియు అతడు చెప్పాడు, “మరొక సంగతి, మిస్టర్. బ్రెన్హామ్, నీవు, ప్రభుత్వము ద్వారా, మారలా ఆ విధంగా, విచారణ నిమిత్తము పిలువబడినట్లైతే, నీవు ఏమి చేసినప్పటికీ, ప్రజల దృష్టిలో, ‘నీవొక మోసగాడివౌతావు.’ చూశారా? కానీ అది అంతే.”
19 మిసిస్సీపిలో ఉన్న ఆ చిన్న, బాప్టిస్టు సేవకుడిని చూడుము. అతడు లోపలికి వచ్చి తనను అవమానించాడని ఒక స్త్రీ చెప్పినది. మరియు ఆ వ్యక్తి దేశవ్యాప్తంగాను మరియు ప్రతి స్థలము నుండి ఋజువులు తీసుకువచ్చాడు, ఆ దినమునకు, ముందుగానీ, లేదా దాని తర్వాతగానీ, అతడు కనీసం ఆ నగరానికి చుట్టుప్రక్కలలో లేడు, ఆ కుంభకోణం నిమిత్తము తిరిగి ఆమె మీద కేసు పెట్టమని న్యాయమూర్తి చెప్పారు. అతడు చెప్పాడు, “ఆమెను వెళ్ళనీయండి.”
20 మరియు అది విచారణ కాలములో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా, ఏమి జరిగినదో మీకు తెలుసా? డెభై-ఐదు శాతము అమెరికా ప్రజలు ఇట్లు చెప్పారు, “నిప్పులేనిదే, పొగ రాదు.” మరియు పాపం ఆ చిన్న వ్యక్తి, నా వలె లేదా మరొకరివలె, అతడు కూడా నిర్దోషి, అతడికి దానితో ఏమీ సంబంధము లేకపోయినప్పటికీ, తన శేష జీవితం అంతయూ దానితో ప్రయాసపడతాడు.
21 నేను కొంత సమయము, చాలా బాధపడ్డాను, నా జీవితమును దేవుని రాజ్యము నిమిత్తము అంకితము చేశాను, చూశారా, ప్రజలు పన్నులు చెల్లించునట్లు చేయుటకు, మరియు మంచిపనులు చేయునట్లుగా ప్రయత్నము చేశాను, మరియు మోసగాళ్ళు మంచివ్యక్తులుగా అగునట్లు చేశాను; కానీ ఇప్పుడు, స్వయంగా నేను ఒక మోసగానివలె చూపించబడ్డాను. నేనిట్లు అనుకున్నాను, “ఈ లోకములో నేను ఏమి చేశాను?”
22 అప్పుడు అది నా దగ్గరకు వచ్చినది, మరియు నేను బైబిలులో చూశాను. ఎట్టి మినహాయింపు లేకుండా, పరిశుద్ధ గ్రంథములో, ఒక ఆత్మీయ కార్యాలయం కలిగిన ప్రతీ వ్యక్తీ, నైతిక విలువలు లేదా ఇంకే విషయాలలోనైనా సాతానుడు వారిని పట్టుకొనలేకపోతే, ప్రభుత్వము వారిని పట్టుకుంది. ప్రారంభం వరకు, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి: మోషే, దానియేలు, హెబ్రీ బాలురు, బాప్తిస్మమిచ్చు యోహాను. యేసుక్రీస్తు గవర్నరు ద్వారా మరణ శిక్ష విధించబడి, మరణించెను. పౌలు, పేతురు, పెద్ద యాకోబు, చిన్న యాకోబు, వారిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వము ద్వారా మరణించారు.
23 ఎందుకనగా, అది, ప్రతీ ప్రభుత్వము, సింహాసనము—సాతాను యొక్క సింహాసనమైయున్నది. యేసు అలా చెప్పెను. పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నది. చూశారా? ప్రతీ ప్రభుత్వము అపవాది చేత నియంత్రించబడుతుంది. క్రీస్తు ద్వారా నియంత్రించబడు ప్రభుత్వము ఒకటి రాబోవుచున్నది, కానీ అది వెయ్యేండ్ల పాలనలో ఉంటుంది. కానీ ఇది, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు, అవి ఎంత బాగున్నవని మనము అనుకున్నను, ఇంకను, వాటి వెనుక, అవి—అవి సాతానుడి ఆధిపత్యములో ఉన్నాయి. “ఈ రాజ్యములు,” వాడు ఇట్లన్నాడు, “అవి నావి. నేను కోరినట్లుగా వాటితో వ్యవహరిస్తాను. నీవు నన్ను ఆరాధించినట్లైతే, నేను వాటిని నీకు ఇస్తాను.”
24 యేసు ఇట్లు చెప్పెను, “సాతానా, ఇక్కడి నుండి పొమ్ము. ‘నీ దేవుడైన ప్రభువును ఆరాధించి, మరియు ఆయనను మాత్రమే నీవు సేవించవలెను.”’
25 అప్పుడు నేను నిరూత్సాహపడ్డాను. నా భార్య నా మాటలు వినుచున్నది. నేనింకా చెప్పుకుంటూ పోయాను, నేను ఇలా అన్నాను, “లేదు, అయ్యా, నేను, నేను బాకీపడి ఉంటే, నేను చెల్లిస్తాను. నేను బాకీపడి లేను, మరియు నేను దానిని అస్సలు చెల్లించను. అంతే.” నేనిట్లు చెప్పాను, “అసలు, దానిని నేను ఎలా చెల్లించగలను?”
26 కాబట్టి, నేను ఇంటికి వెళ్ళాను. నేను అన్నాను, “మేడా, పిల్లల ముఖము కడుగుము. వారి దుస్తులు సిద్ధము చేయుము. నేను వెళ్ళిపోతున్నాను.” ఇంకా నేనిట్లు చెప్పాను, “వారు కనీసం…ప్రతీది, అది సరిగ్గా తలక్రిందులైనది.”
27 నేను ఇట్లన్నాను, “నేను ఏమి చేశాను? నాకు చెప్పుము.” నేను చెప్పాను, “ఇంకను, నేను, నలభై వేల డాలర్లా? వ్యూ! నాకది ఎంత కష్టమో నీకు అర్థం కావడంలేదు.”
మరియు ఆమె ఒక మంచి దీనమైన భార్యవలె, లోపలికి వచ్చినది, చెప్పెను…
“నేను వెళ్తున్నాను,” అని నేను చెప్పాను.
28 అందుకామె ఇట్లన్నది, “అది ఏదైనా మేలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? దానిని గూర్చి ప్రార్థన చేశారా?”
29 “సరి, మరలా నేను దాని విషయమై ప్రార్థన చేయడం మంచిది,” అని అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళాను. ఒక లేఖనము, అని ఆయన నాతో చెప్పినట్లుగా అన్పించినది.
30 దానిని గూర్చి దేవుడు ఏమి చేశాడు, అని మనము ఎల్లపుడూ లేఖనమును గమనించగోరుచున్నాము, మీరు చూడండి.
31 మరియు ఒక దినమున, వారు ఆయనను అడిగారు, మీకది తెలుసు, ప్రభుత్వము ఎదుట ఆయనపై నేరారోపణ చేయుటకు ప్రయత్నించారు—ప్రయత్నించారు. వారిట్లన్నారు, “స్వతంత్ర యూదులమైన మనము కైసరుకు కప్పము లేదా పన్నులు చెల్లించుట న్యాయమా?”
అందుకాయన ఇట్లన్నాడు, “మీ దగ్గర ఒక నాణెము ఉన్నదా?” ఇట్లన్నాడు, “దాని మీద వ్రాత ఎవరిది?”
“కైసరుది,” అని వారు చెప్పారు.
32 అందుకాయన ఇట్లు చెప్పెను, “అట్లైతే మీరు కైసరుది కైసరునకు చెల్లించడి. మరియు దేవునిది దేవునికి చెల్లించండి.”
33 నేను దానిని గూర్చి ఆలోచన చేశాను. నేను బైబిలును తెరచి దానిని చదివాను. నేనిట్లు తలంచాను, “నిజమే, ప్రభువా, అది వాస్తవం. కానీ ఇది కైసరుకి చెందినది కాదు. ఇది నీది. అది కైసరుది కాదు. ఒకవేళ అది నాదైయ్యుంటే, నేను ఇంకా అదనంగా పన్ను చెల్లించవలసియుండేది, సరి, అది కైసరుకి చెందినదైతే, అది భిన్నంగా ఉంటుంది. కానీ, ఇది, ఇది నీదైయున్నది. చూశారా? మరియు మొదటిగా, అసలు అది—అది కైసరుది కాదు.”
34 మీకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ వాక్యములో జవాబును కలిగియున్నాడు. నేను ఇంకా కొంచెము ముందుకు చదివాను, మరియు ఆయన ఇట్లు చెప్పెను, “సీమోనూ, నీ జేబులో చేపల గాలము లేదా?” చూశారా? “నీవు ఎల్లపుడూ ఒక చిన్న గాలము మరియు ఒక తీగెను తీసుకువెళ్తావు. మరియు నేను ఈ ఉదయమే ఆ—ఆ నది వద్దనున్న, ఫిష్ బ్యాంకులో కొంత జమ చేశాను, నీకు తెలుసు.” ఆయన చెప్పెను…“నేను కొంత జమ చేశాను, మరియు ఆ బ్యాంకు అధికారి తాను కలిగియున్నదానిని తప్పకుండా చెల్లిస్తాడు. నీవు కేవలము అక్కడికి వెళ్ళి మరియు ఆ నదిలో గాలము వేయుము. మరియు నీవు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు, అతని నోరు తెరువుము, మీరు చూశారా, మరియు అతడు—అతడు నాణెమును ఇచ్చును. మనం వారికి అభ్యంతరము కలిగించవద్దు. వారికి అభ్యంతరాన్ని కలిగించకండి. చూశారా? సీమోను, వెళ్ళి దానిని చెల్లించుము. అది నా కొరకు మరియు నీ కొరకైయుండును.”
35 నేను ఇట్లనుకున్నాను, “నిజమే, దేవా. నీవు దేశవ్యాప్తంగా, ఫిష్ బ్యాంకులను మరియు సమస్తమును కలిగియున్నావు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు.”
36 అయితే మేము క్రిందకి వెళ్ళాము. నేను చెప్పిన దానిపై నిలబడిన సహోదరులను సరిగ్గా ఇక్కడ సంఘములో నేను కలిగియున్నాను, మరియు నేనొక బ్యాంకు పత్రాన్ని ఉంచాను, మరియు నలభై వేల డాలర్లు తీసుకొని, దానిని చెల్లించాను.
37 నేను ఇంటికి వెళ్ళాను. అవి గనుక మళ్ళీ ఎన్నడైన నా మీదకు వస్తే, నేను ఆ చెక్కును వ్రాసిన విధానాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను చెప్పాను, “ఇది నేను పన్నులన్నిటి నుండి విడుదల పొందాను అని చెప్పుటకైయున్నది. సరి, వారు దానిని ఆమోదించుట మంచిది, దాని తర్వాత వారు నిశ్చయంగా ఒక గందరగోళంలో పడిపోతారు.” వారు దానిని చేశారో లేదో తెలుసుకొనుటకు, నేను విడవకుండా, బ్యాంకుకు ఫోన్ చేస్తూనే ఉన్నాను.
మరియు, చివరికి, బాబ్ నాతో చెప్పాడు, ఇలా అన్నాడు, “బిల్లీ, వారు దానిని చేశారు.”
38 నేను లోపలికి వెళ్ళి మరియు నా భార్యను కౌగిలించుకొని, “ప్రియా, నేను స్వతంత్రుడను,” అని నేనన్నాను. స్వతంత్రులవ్వడం అనేది, ఎటువంటి ఒక అనుభూతి కదా!
39 కాబట్టి ఇప్పుడు నేను దానిని తిరిగి చెల్లించగలను, వారు దానిని నాకు చాలా సులభతరము చేశారు. నేను దానిని సంవత్సరమునకు నాలుగు వేల డాలర్లుగా చెల్లించగలను. ఇప్పుడు, ప్రజలారా, నేనిక ఎంతమాత్రము బద్దకంగా ఉండలేను. నేను బయటకి వెళ్ళి మరియు పనికి వెళ్ళవలసియున్నది. కాబట్టి నేను—నేను…దానిని తిరిగి చెల్లించుటకు నాకు పది సంవత్సరములు పట్టును. మరియు ఒకవేళ—ఒకవేళ యేసు రానియెడల. మరియు అప్పుడు, ఆయన వచ్చినపుడు, అప్పుడు ఎలాగైనను ఆ అప్పులన్నియూ పరిష్కరించబడతాయి. చూశారా? కావున, పిదప, కావున నేను—నేను ఆశిస్తున్న ప్రకారం మీరందరు…మీ ప్రార్థనలు…మరియు, ఈ రాత్రి, కొద్దిగా దానికి వర్తించు ఒక చిన్నదానిపై నేను కొనసాగిస్తాను. కానీ నాకు సహాయము చేసినది మీ ప్రార్థనలే. మీకు, చాలా వందనములు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. మనము ఎక్కడ ఉన్నప్పటికీ నేను దానిని ఎన్నటికీ మరచిపోను.
40 ఈ రాత్రి, దేవుని చిత్తమైనయెడల, నాకు తెలిసిన కొన్ని సత్యములను నేను చెప్పగోరుచున్నాను. మరియు తప్పకుండా రండి. ఇప్పుడు, గుర్తుంచుకొనండి: అయ్యలారా, ఇది ఏ సమయము?
41 ఇప్పుడు మనము…వారు ఈ మిగతా వారమంతా, పూర్తిగా కార్యక్రమాలు కలిగియున్నారని…నేను నమ్ముచున్నాను. మరియు సోమవారము రాత్రి…ఈ రాత్రి, ఈ రోజు మరియు ఈ రాత్రి, మరియు సోమవారం కూటములు కలవు. సోమవారం రాత్రి సంపూర్ణ రాత్రి కూడిక కలదు. మరియు—మరియు మంగళవారం, నూతన సంవత్సర దినము; మీరు గనుక పట్టణము వెలుపల ఉన్నట్లయితే, ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.
42 మరియు ఆ కూటముకొరకు మనమిక్కడ కొందరు చక్కని సేవకులను మనతో కలిగియుంటాము. మనము, ఒక—ఒక మంచి ప్రసంగికుల బృందము, మరియు మధ్యరాత్రి వరకు, ప్రతియొక్కరు విరామ సమయాలలో మాట్లాడటాన్ని కలిగియుంటాము. మరియు ఒకవేళ వరుసలో ఉన్నట్లయితే, కొన్ని సార్లు వారు ప్రభురాత్రి భోజనము తీసుకుంటారు. ఈ సారి వారు దానిని చేస్తారో లేదో, నాకు తెలియదు. వారేమో కేకలు వేయుచూ, అరచుచూ, పేల్చుకొనుచూ, త్రాగుచు, మరియు అట్లు కొనసాగుతుంటారు, కానీ మనము ప్రభురాత్రి భోజనము తీసుకుంటాము. ఆమేన్. నూతన సంవత్సరమును సరిగ్గా ప్రభురాత్రి భోజనముతో, ప్రారంభించెదము. ఇప్పుడు, మీరందరూ ఆహ్వానించబడ్డారు. మరియు, మీకు, పరలోకపు దేవుడు మీకందరికీ ఇక్కడ ఉండే అవకాశమును ఇచ్చునని నేను ఆశిస్తూన్నాను.
43 ఇప్పుడు, మనకు వాక్యమును సమీపించడానికి ముందు, నేను దీనిని కూడా చెప్పగోరుచున్నాను, అదేమిటంటే, నేను నిశ్చయంగా ఈ సంఘమునకు, దాని సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, అది మీరు నా కొరకు ఈ సూటు దుస్తులను తెచ్చినందుకైయున్నది. మీకు చాలా, వందనములు. అది నాకు ఎంతో విలువైనది. మీరు పంపిన కార్డులు మరియు ఆ—ఆ—ఆ క్రిస్టమస్ సమయములోని కార్యములు, మరియు మీరు కుటుంబమునకు పంపిన బహుమతులు, మరియు, ఓ, నేను, అవి నాకు లెక్కకు మించినవైయున్నవి. మరియు అవి మీ దగ్గర నుండి వచ్చాయని తెలుసుకొనుటవలన, ఆ చిన్న చిన్న గురుతులు నా హృదయములోని ముద్రను తాకకుండా, ఏవియూ ఆపలేవు. మరియు వారిలో కొందరు వారి క్రిస్టమస్ బహుమతులను డబ్బు రూపములో పంపారు.
44 మరియు కొందరు అటువంటివి పంపారు. ఒక సహోదరుడు జేబులో పెట్టుకొనే పుస్తకమును పంపాడు, మరియు దాని మీద నా పేరు ముద్రించాడు. మరియు మీరు చూడగలుగునట్టిది ఒకటి అతికించబడియున్నది; దానిలో ప్రభువుయొక్క ప్రార్థనను అది కలిగియున్నది. మరియు, ఓ, అటువంటి కార్యములు, అవి సరిగ్గా, అవి మాకు చాలా విలువైనవి. నా భార్య మరియు నేను, మరియు పిల్లలు అందరము మీకు, “చాలా వందనములు,” అని చెప్పగోరుచున్నాము. అది చాలా చిన్నది. కానీ నేను దీనిని చెప్పుచున్నాను, ఇది ఎవరైనా చెప్పగలిగిన గొప్ప పదమైయున్నది, “దేవుడు మిమ్మును దీవించును.” దాని కంటే గొప్పదేదియు ఉండదు.
45 ఇప్పుడు, మరి ఆ తుపాకీని నాకొరకు కొన్నటువంటి, ఇక్కడ ఈ సంఘములోని సహోదరులకు, నేను—నేను నా సూటును ధరించాను, కానీ నేను—నేను సంఘమునకు ఆ తుపాకీని తీసుకురాలేకపోయాను. అయితే అది…అప్పుడు వారు నిజంగా నామీద ఏదైనా వ్యతిరేకతను కలిగియుండవచ్చును, కాదా? కావున సహోదరులారా, నేను—నేను—నేను మీకు నిశ్చయముగా కృతజ్ఞతలు చెప్పుచున్నాను. మరియు నేను వారు పేర్లు ఒక చిన్నదానిపై చదువబోవుచున్నాను…కానీ నిన్న సహోదరులలో ఒకరు వచ్చి, ఇలా చెప్పారు, “ఓ, సహోదరుడా బ్రెన్హామ్, నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు—వద్దు—వద్దు. అది దానిలోని సంతోషాన్నంతటిని తీసివేస్తుంది.” చూశారా? కావున ఆ మిగతా వారు కూడా అలాగే అనుకొనుచున్నారని నేను తలంచాను. కానీ నాకు నీ పేరు తెలుసు. వారు దానిపై టైపు చేశారు. నేను ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకముంచుకుంటాను. మరియు దేవుడు మిమ్మును గొప్పగా దీవించునుగాక.
46 మరియు నేను ఎక్కడ విశ్రాంతి తీసుకొంటానో మీకు తెలుసు, మరి అది ఆ గుహలోనికి వెళ్ళి, అక్కడ కూర్చొని మరియు అక్కడ నివసించడమైయున్నది. నాకు బాధ కలిగినప్పుడు, నేను ఇక ముందుకు వెళ్ళలేనప్పుడు, అప్పుడు నేను ఏదైనా వేటాడిన పర్యటన గూర్చి, లేదా ఏదైనా చేపల వేట గూర్చి ఆలోచిస్తాను. నేను దానిని అభినందిస్తాను. దేవుడు మిమ్మును దీవించును గాక.
47 ఇప్పుడు, మనము దేవుని వాక్యమును సమీపించుచుండగా, మనము ఒక్క క్షణము తలలు వంచుదామా. ఈ ఉదయమున ఇక్కడున్న విన్నపములు, సరిగ్గా ఇప్పుడు లెక్కించలేనంత సంఖ్యలో ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. కావున నేను ఆశ్చర్యపోవుచున్నాను, మనము తలలు వంచియుండగా, మీ ప్రత్యేక విన్నపములు, మీ హృదయములలో ఉన్నట్లైతే, కేవలం మీ చేతులు పైకి ఎత్తండి, మరియు ఇట్లు చెప్పండి, “దేవా, నేనిప్పుడు ఏమి తలంచుచున్నానో నీవు ఎరిగియున్నావు.”
48 ప్రభువైన యేసు, ప్రతి హస్తమును నీవు చూస్తున్నావు. మరియు దాని వెనుక ఏమి ఉన్నదో నీవు ఎరిగియున్నావు. ఆ హస్తము క్రింద ఒక విన్నపము ఉన్నది. మరియు ఇప్పుడు మేము, కాలము అంతటా వ్యాపించియున్న, ఆ గొప్ప తెల్లని ముత్యము వంటి, ఆ జీవముగల దేవుని సింహాసనమును భక్తిగౌరవములతో సమీపించుచున్నాము, అక్కడ యెహోవా దేవుడు దాని మీద ఆశీనుడైయున్నాడు, మరియు క్రీస్తు రక్తము ఆ బలిపీఠము పైన ఉండియున్నది. మరియు “నా నామమున తండ్రిని ఏది అడిగినను, అది అనుగ్రహించబడును,” అని చెప్పిన ఆయన ద్వారా, ఆ రక్తముగుండా మేము మాట్లాడుచున్నాము. దేవా, ఈ ఉదయమున, నీవు ఆలకించి, మరి వారి విన్నపములకు జవాబు దయచేయవా? నీవు వాటిని అనుగ్రహిస్తావని, ఈ దినమున, వారి ప్రార్థనలతోపాటు నా ప్రార్థనను కూడా ఉంచుచున్నాను.
49 ప్రభువా, వ్యాధితో మరియు బాధతో ఉన్నవారి కొరకు, చేతిరుమాళ్ళు ఇక్కడ పెట్టబడియున్నవి. మరియు బైబిలులో మాకు ఇట్లు బోధించబడినది, “వారు పరిశుద్ధ పౌలు నుండి చేతి రుమాళ్ళను మరియు పై వస్త్రములను తీసుకున్నారు, మరియు వాటిని రోగుల మీద ఉంచినప్పుడు, అపవిత్రాత్మలు వారి నుండి బయటకు పోయినవి, మరియు రోగములు వారిని విడిచిపోయాయి.” మరియు, తండ్రీ, ఎంతోకాలంగా మాకు తెలిసిన దానినిబట్టి, మేము పరిశుద్ధ పౌలు కాదని మేము నిశ్చయంగా ఎరిగియున్నాము. అయితే, చివరికి, అది పరిశుద్ధ పౌలు కాదని మాకు తోచుచున్నది. అది అతనిలోనున్న క్రీస్తే. మరియు లేఖనం ప్రకారము నీవు “నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా,” ఉన్నావు. ఇప్పుడు, ప్రభువా, ఈ ప్రజలు, మేము దేవుని అడిగినట్లైతే, మరియు ఈ చేతి రుమాళ్ళు తీసుకొని మరియు వాటిని వారి రోగుల మీద ఉంచినప్పుడు, వారు స్వస్థత పొందుతారని, నమ్ముచున్నారు. ప్రభువా, ఈ చేతి రుమాళ్ళు రోగులు మీద ఉంచిన్నపుడు ఆలాగు జరగాలని నేను ప్రార్థించుచున్నాను.
50 మరియు ఒక సారి చెప్పబడినదాని ప్రకారం, ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి ప్రయాణిస్తూ, వారి విధి నిర్వహణలో యున్నారు, మరియు విధి నిర్వహణ మార్గములో, ఎర్రసముద్రము వారికి అడ్డుగా వచ్చినది. అయితే ఆ అగ్ని స్తంభములో నుండి దేవుడు, కోపముతో నిండిన కన్నులతో క్రిందకి చూశాడు, మరియు ఆ సముద్రము భయపడినది. మరియు దాని అలలు, దాని నీరు వెనుకకు వెళ్ళిపోయాయి. మరియు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీదుగా, ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళారు.
51 ఇప్పుడు, ప్రభువా, ఈనాడు, యేసుక్రీస్తు రక్తము ద్వారా చూడుము. మరియు ఈ ఉదయము మేము ఇక్కడ చేయుచున్న ఈ విశ్వాసపు కార్యమును మీరు చూడండి. మరియు సాతానుడు భయపడి పారిపోవును గాక. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాత్రికుడు, మరియు ఈ రాత్రి చేతిరుమాలు పైన ఉంచినప్పుడు, బహుశా వారు…మార్గము తెరువబడి, మరియు వ్యాధి తొలగిపోవును గాక, మరియు వారు పరిశుద్ధాత్మచేత, ఆ అగ్నిస్తంభముచేత నడిపించబడుచు, వాగ్దాన దేశమునకు ప్రయాణించుదురు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి.
52 ఇప్పుడు, ఈ కూటములను, చదువుచున్న ఈ వాక్యములను, ఈ పాఠ్య సందర్భమును, ఆశీర్వదించండి. ప్రభువా, అదేమిటో మాకు తెలియని, ఒక గొప్ప కార్యమునకు, మేము సమీపముగా ఎదుగుచుండగా, ఈ ఉదయమున పరిశుద్ధాత్మ ఈ వాక్యమును తీసుకొని మరియు మాలో ప్రతి ఒక్కరికి మాధుర్యంగా పంచిపెట్టునుగాక. ప్రభువా, మా హృదయములు వింతగా కదిలింపబడినవి. మరియు మేము భక్తిగౌరవముతో నిన్ను మరియు నీ వాక్యమును సమీపించుచుండగా, నీవు దాని భావమును మాకు అనువదించవలసిందిగా, ఇప్పుడు మేము ప్రార్థించుచున్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు, ఈ రాత్రి, దీనిని మరచిపోవద్దు…సమయము, ఇది ఏ సమయము?
53 మరియు ఇప్పుడు, ఈ ఉదయము, మీ బైబిళ్ళు మీ దగ్గర ఉన్నవారు కూడా, దీనిని తీయాలని కోరుచున్నాను. లేదా, మీకు కావాలంటే, కొద్ది నిమిషాలలో, మేము ఎక్కడనుండి చదువగోరుతామో, ఆ లేఖనములను వ్రాసుకొనండి, అవి అపొస్తలుల కార్యములలో ఉన్నవి. మనము రెండు లేక మూడు చోట్ల నుండి చదవవచ్చును. మొదటిగా, అపొస్తలుల కార్యములు 26:15. అపొస్తలుల కార్యములు, 25వ అధ్యాయము 15వ వచనము, నుండి ప్రారంభించుదాము.
54 తర్వాత మనము అపొస్తలుల కార్యములు 23:11 చదువగోరుచున్నాము. మరియు మీరు కోరినట్లయితే, మీరు దీనికి, ఫిలిప్పీ 1:20 కూడా కలపండి, బహుశా దానిని చదువుటకు నాకు సమయము ఉండకపోవచ్చును. అదంతయు ఒకే సంగతి గూర్చి, ఒకే మాటలైయున్నవి.
55 ఇప్పుడు, అపొస్తలుల కార్యములు, 26:15, అది ఈలాగున చదవబడుచున్నది:
మరియు నేను, ప్రభువా, నీవేవడవు? అని అడిగితిని, అందుకాయన నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పెను.
…లెమ్ము, మరియు నీ పాదములు మోపి నిలువుము: ఈ ఉద్దేశ్యము కొరకే నేను నీకు ప్రత్యక్షమైతిని, నిన్ను ఒక పరిచారకునిగాను మరియు నీవు చూచిన ఈ సంగతులకు, మరియు నేను నీకు ప్రత్యక్షమవ్వబోవు సంగతులకు ఒక సాక్షిగా నియమించుటకై యున్నది;
నేను ఈ ప్రజలవలనను, మరియు అన్యజనుల,… వలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను,
వారి కన్నులు తెరచి, మరియు వారిని చీకటిలోనుండి వెలుగులోనికి, సాతాను అధికారమునుండి దేవుని వైపుకును త్రిప్పుటకు నేను నిన్ను పంపియున్నాను, తద్వారా వారు నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుదురని చెప్పెను.
కాబట్టి, ఓ…అగ్రిప్పా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు:
కానీ మొదట దమస్కు వద్ద ఉన్నవారికిని, మరియు యెరూషలేములోను యూదయ దేశమంతటను, మరియు వారు ఆ…తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి, మారుమనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.
56 అపొస్తలుల కార్యములు 23లో, మరియు మరలా 11వ వచనము:
ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, పౌలు: ఎట్లనగా…యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి యున్నదని చెప్పెను.
57 మనముందున్నట్టి ఈ చదువబడిన అంత్యంత కృపాభరితమైన పరిశుద్ధ వాక్యమునకు, దేవుడు తన పరిశుద్ధ ఆశీర్వాదములను జతపరచునుగాక.
58 ఇప్పుడు, కొంత కాలము క్రితం ఒక వ్యక్తి ఒక బోధ చేయుటను, లేదా మాట్లాడుటను నేను విన్నాను, మరియు అతడు ఈ మాటను ఉపయోగించాడు: సంపూర్ణత. మరియు నేను ఇట్లు తలంచాను, “అది చాలా మంచి మాట.” అది చాలా సార్లు ఉపయోగించబడుటను నేను విన్నాను, “సంపూర్ణత.” అది…
59 నేను వెబ్ స్టర్, నిఘంటువులో చూశాను. వెబ్ స్టర్ నిఘంటువు ప్రకారము, అది “దానికదే సంపూర్ణమైనది; అపరిమితమైన శక్తిగలది; ప్రధానముగా అదే అంతిమము.” మరియు ఒక అంతిమము అనగా “ఆమేన్. అంతే.” అదొక, సంపూర్ణతైయున్నది. సంపూర్ణత అనే పదానికి, అది “అపరిమితమైన శక్తి.” అది—అది, “దానికదే పరిపూర్ణత గలది. అది సమస్తమును కలిగియున్నది. అది దానిని స్థిరపరుస్తుంది.”
నేను తలంచాను, “అదొక మహిమకరమైన కార్యము. అదొక అద్భుతమైన పదము.”
60 మరియు ఇప్పుడు, ఒక మాట అనగా వ్యక్తపరచబడిన తలంపైయున్నది. మొదటిగా అదొక తలంపై ఉండాలి, మరియు పిదప, అదొక మాటగా మారుతుంది. ఎందుకనగా, తలంపు లేకుండా నీవు నీ మాటలు పలుకలేవు.
61 మనము భాషలలో మాట్లాడుచున్నప్పుడు, మనకు ఎటువంటి తలంపు ఉండదు. అది దేవుడు ఆ తలంపులను తీసుకొనుచున్నాడు. అది దేవుని ఆలోచనలు మన పెదవులను వాడుకొనుటయైయున్నది. అది ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుచున్నట్లయితే, నీవు భాషలలో మాట్లాడుచున్నప్పుడు నీవేమి చెప్పుచున్నావో మేము ఆలోచించము లేదా మేము ఎరుగము. నీవు అనువాదం చేస్తున్నప్పుడు, నీవేమి చెప్పుచున్నావో నీకు తెలియదు. నీవు కేవలం దానిని పలుకుతావు. అంతే. చూశారా? అది దేవుడు. మరియు ప్రవచించుట, నీవు నీ సొంత తలంపులను ఉపయోగించుట లేదు. అది దేవుడు, ఎందుకనగా సహజంగా నీవు చెప్పాలని తలంచనివాటిని నీవు చెప్తావు. చూశారా?
62 కానీ సంపూర్ణత అనే మాటకు అర్థం “ఒక అంతిమము.” మరియు, కావున, ప్రతియొక్కరు ఒక అంతిమమును కలిగియుండాలని నేను తలంచుచున్నాను. మరియు ఇప్పటి వరకు సాధించిన ప్రతి గొప్ప విజయము వెనుక, ఒక సంపూర్ణత ఉండియున్నది. అది ఏదైనప్పటికీ, దాని వెనుక ఒక సంపూర్ణత ఉంటుంది. మరియు ప్రతివ్యక్తి, దేనినైనా సాధించుటకుగాను, మొదటిగా ఒక సంపూర్ణతను కలిగియుండాలి. మరియు మీరు దీని ద్వారా, దాని ద్వారా, తిరిగి ఆ ఇంకొక దాని ద్వారా వచ్చి, ఆ సంపూర్ణతకు, ఆ ఆమేన్ వద్దకు, లేక ఆ అంతిమమునొద్దకు వచ్చేంతగా అదే చివరిదైయుంటుంది. మీరు దేనిని గూర్చి…ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు కట్టుబడియుండుటకు మీరొకదానిని కలిగియున్నారు. ప్రతి విజయ సాధనకు, అదే చివరి గమ్యమైయున్నది. అది ఎక్కడో ఉండియున్నది. అది ఆ గమ్యము నొద్దకు వచ్చువరకు అది అనేక కార్యములగుండా తిరిగి రావచ్చును, అయితే వాటన్నిటికి ఒక ఆమేన్ అనునది ఉన్నది. ఖచ్చితంగా అటువంటిది ఒకటి ఉండవలసియున్నది. అటువంటిది ఒకటి లేకుండా జీవితములో నీవు ముందుకు సాగలేవు.
63 నీవు, నీవు పెండ్లి చేసుకున్నప్పుడు, నీవా గమ్యమును చేరువరకు, నీ మనస్సులో ఏదోయొకటి యుంటుంది. మరియు అది నీ భార్య, లేక నీ భర్త కొరకైన ప్రేమయైయుండవచ్చును. సరే, బహుశా ఆమె జాన్ భార్య వలె అందముగా లేకపోవచ్చును; లేక ఆమె, సరే, ఆమె ఆ—ఆ అది, ఇది కాకపోవచ్చును. కానీ ఆమె విషయమై ఏదో ఉండియున్నది, అది, అది నిన్ను తాకుతుంది. నీవు—నీవు—నీవు ఇట్లు చెప్తావు, “ఆమె ఇతరులవలె అందముగా లేకపోవచ్చును,” లేదా, “అతడు ఇతరులవలె అందముగా లేకపోవచ్చును.” కానీ ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైనవాడు, అనే ఒక సంపూర్ణత అక్కడ ఉండవలసియున్నది, మరి అక్కడే నీవు దానిని పట్టుకొనియున్నావు. అది గనుక అక్కడ లేనట్లైతే, నీవు వివాహము చేసుకొనకపోవుట మంచిది. ఆ గమ్యస్థానం! ఆ సంపూర్ణత!
64 బైబిలులో, సంపూర్ణతలు కలిగిన అనేకులను గూర్చి మనము తలంచగలము. ఓ, మనము ఆ బైబిలుయొక్క ప్రవాహము నుండి ఎంతగా తీసుకొని, మరియు ఇప్పటినుండి, రెండు వారాలు సరిగ్గా ఇక్కడే ఉండగలము కదా; మరియు బైబిలులోని సంపూర్ణతల గూర్చి ఆలోచిస్తే, మనము దాని అంచును కూడా తాకలేము. ఉదాహరణకు, నేను ఒకరిని లేక ఇద్దరిని తీసుకొని, సంక్షిప్తముగా వివరించనివ్వండి.
65 యోబును చూడండి. ఇప్పుడు, అతడొక సంపూర్ణతను కలిగియున్నాడు. నీతిమంతుడైన, ఆ వ్యక్తికి సమస్తము కీడు సంభవించినది. ఇప్పుడు, అతడు నీతిమంతుడు కాడని చెప్పే ధైర్యము మనం చేయలేము, ఎందుకనగా అతడు నీతిమంతుడని దేవుడే చెప్పాడు. భూమి మీద యోబు వంటి వారెవ్వరూ లేరు. అతడు దేవుని దృష్టిలో, పరిపూర్ణుడు. మరియు అతడు దానిని ఎరిగియున్నాడు, ఎందుకనగా అతడొక అంతిమమైన దానిని కలిగియున్నాడు. ప్రతీది వ్యతిరేకముగా కనిపించినప్పుడు, అతడొక సంపూర్ణతను కలిగియున్నాడు.
66 అకస్మాత్తుగా వ్యాధి వచ్చినది. అతని స్నేహితులు ఇలా చెప్పియుండవచ్చును, “ఇప్పుడు, యోబు, నీ పరిస్థితి ఇలా ఉంది. నీవు పాపము చేస్తున్నావని అది నిరూపిస్తున్నది. నీవు తప్పిదస్తుడవు.” మరియు అప్పుడు బిషప్పులు వచ్చారు. వారు యోబుకు ఆదరణకర్తలు అని చెప్పుకున్నారు. మరియు అతణ్ణి ఆదరించుటకు బదులు, వారు అతని జీవితములో పాపము తప్ప మరి దేనిని చూడలేదు, ఎందుకనగా దేవుడు అతనితో ఆ విధంగా వ్యవహరించాడు.
67 మరియు అతడి పిల్లలు చనిపోయారు. అతడి—అతడి ఆస్తి దహనమైపోయినది. అతనికి—అతనికి ప్రతీది విరోధముగా జరిగినది. మరియు స్వయంగా అతని జీవితం సైతం అపాయములో ఉండగా, ఒక బూడిద కుప్ప మీద కూర్చున్నాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, పుండ్లతో నిండిపోయినది. మరియు అతని ప్రియమైన, మధురమైన భాగస్వామి, ఆ పిల్లల తల్లి ఇట్లు చెప్పినది, “నీవు దేవుని శపించి చావరాదు.” కానీ వాటన్నిటి సమక్షంలో, యోబు ఒక సంపూర్ణతను కలిగియున్నాడు.
68 ఓ, అనారోగ్య సమయములో, మనం కేవలం ఆ సంపూర్ణతకు కట్టివేయబడియుంటే చాలు!
69 యెహోవా యొక్క పందెమును తాను నిలబెట్టాడని యోబుకు తెలుసు. మరియు అతడు తాను చేసిన దానియందు విశ్వాసమును కలిగియున్నాడు, ఎందుకనగా యెహోవా దానిని కోరియున్నాడు. మనము కేవలం దానిని చేయగలము. అతని పాపము నిమిత్తము యెహోవా ఒక దహనబలిని కోరియున్నాడు. మరియు యోబు, తన కొరకు మాత్రమే కాదు గానీ, తన పిల్లల నిమిత్తము కూడా, దహనబలిని అర్పించాడు, మరియు దేవుడు కోరినదంతా అదేయైయున్నది.
“ఓ,” మీరు ఇట్లనవచ్చును, “ఈనాడు కూడా ఆయనకు కావాల్సినది అదేయైయుండాలని నేను ఆశీస్తున్నాను.”
70 ఇది అంతకన్నా తక్కువ. కేవలము ఆయన వాక్యమందు విశ్వాసముంచుట! మరియు నీవు, నీవు ఆయన వాక్యమును నీ సంపూర్ణతగా చేసుకుంటే, నీవు చేసుకొనగలవు. బైబిలులోని ఏ దైవిక వాగ్దానమునకైనా, నీవు నీ ప్రాణమును దానికి ముడి వేసుకొనవచ్చును. నీ చుట్టూ అలలు ఎంతగా కొట్టుచున్నపట్టికినీ, నీవింకనూ నీ సంపూర్ణతకు; కట్టబడియున్నావు.
71 మరియు అతడు దానిపైన ఆనుకొనియున్నాడు. మరియు అతని ఆదరణకర్తలు “నీవు పాపము చేశావు,” అని చెప్పినప్పుడు, తాను పాపము చేయలేదని అతడు ఎరిగియున్నాడు. అతడు నీతిమంతుడు, ఎందుకనగా అతడు యెహోవా యొక్క పందెమును నిలబెట్టాడు. మరియు అతడి ప్రతి…
72 ఆ మనుష్యుడు లోపలికి వచ్చి, ఇట్లు చెప్పాడు, “నీ పిల్లలు మరణించారు.” మరొకడు లోపలికి వచ్చి ఇట్లు చెప్పాడు, “నీ ఒంటెలన్నీ కాల్చబడ్డాయి. ఆకాశములో నుండి అగ్ని వచ్చి కాల్చివేసినది.”
73 అతనికి బాధ కలిగించువారు ఎటువంటి వాదన కలిగియున్నారో చూడండి. “నీవు చూశావా? ఆకాశమునుండి అగ్ని వచ్చినది. ఇప్పుడు, యోబు, అది ఏమని నిరూపిస్తుందంటే.” అది దేనిని నిరూపించదు. “ఇప్పుడు, యోబు; నీవు నీతిమంతుడవైతే, ఆయన నీ బిడ్డలను చంపియుండేవాడు కాదు.”
74 “కానీ,” యోబు చెప్పాడు, “నేను సరైనదే చేసానని నాకు తెలుసు.” అతడు ఇంకనూ పట్టుకొనియున్నాడు. అతడు లోతునకు దిగ్గొట్టునదేదో అతడు కలిగియున్నాడు. అంతే. అతడు దానిని అంగీకరించాడు. దేవుడు అతనికి ఏమి చేయమని చెప్పాడో సరిగ్గా అతడు అలాగే చేశాడు, మరియు అతడు ఖచ్చితమైన నిశ్చయతను కలిగియున్నాడు. అది సరియే.
75 ఆ సంపూర్ణత పట్టుకునే స్థానానికి అతడు వచ్చినప్పుడు, అప్పుడు చివరకు ఆ ఒత్తిడి ఇంకా బిగుసుకొనడాన్ని అతడు అనుభూతిచెందటం మొదలైనది. వదులుగా, చుట్టూ ఊగుచున్నట్లుండేది, కానీ అది బిగుసుకొనడం మొదలైనది. మరియు ఆత్మ అతని పైకి దిగివచ్చినది. మరియు అతడొక ప్రవక్తయైయుండుటను బట్టి, అతడు లేచి నిలబడి, మరియు అతడిట్లు చెప్పెను, “నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును.” ఆమేన్. చూశారా? అతడు తన సంపూర్ణతకు గట్టిగా కట్టబడియున్నాడు. అతడు దానితో సంబంధము కలిగియున్నాడు. తాను సరియైన దానినే చేసియున్నాడని అతడు ఎరిగియున్నాడు, మరియు ఏదో ఒక దినమున అతడు దానివైపుకు లాగబడవలసియున్నది. “నా విమోచకుడు సజీవుడనియు, మరియు అంత్య దినములలో, ఆయన ఈ భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయినప్పటికినీ, అయిననూ నా శరీరముతో నేను దేవుని చూచెదను.” అప్పుడతడు తెలుసుకున్నాడు. అప్పుడతని సంపూర్ణత లంగరు వేయబడినది.
76 అబ్రాహాము, ఒక సంపూర్ణతను కలిగియుండి, బబులోనులోని, ఆ గోపురము వద్దనుండి వచ్చుచున్నాడు, మరియు ఎక్కడైతే అతడు తన తండ్రితో కలసి పరవాసిగా ఉన్నాడో, ఆ షీనారు నుండి అతడు వచ్చుచున్నాడు, బహుశా అతడు ఒక రైతు కావచ్చును. కానీ ఒక దినమున ఆ అడవిలో ఎక్కడో, బహుశా పండ్లను కోయుచు ఉండవచ్చును, లేదా—లేదా తన ఆహారము నిమిత్తము, ఏదైనా జంతువును చంపబోవుచుండవచ్చును; మరియు అతనికి డెబ్బది-ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అక్కడే ఎక్కడో, దేవుడు అతనితో మాట్లాడినాడు. మరియు అతడు…అతడు మరియు అతని భార్య, శారా, ఆమె వయస్సు అరువది-ఐదు సంవత్సరాలు, వారికి పిల్లలు లేరు—పిల్లలు లేరు. వారికి అసలు సంతానమే లేదు. అప్పుడు దేవుడు అతనితో ఇట్లు చెప్పెను, “నీవు శారా ద్వారా కుమారుని పొందుకొనబోవుచున్నావు. కానీ, దానిని పొందుకొనుటకు, నిన్ను నీవు వేరుచేసుకోవలెను.”
77 దేవుని వాగ్దానములు ఎల్లపుడూ షరతులపై ఆధారపడి ఉంటాయి. నీవు తప్పక, ఖచ్చితంగా. వాగ్దానములతో ప్రాథమికంగా నీవెంత సరిగా ఉన్నపటికీ, అది ఎల్లపుడూ, షరతులతోనే ఉంటుంది. మనము ఇక్కడ ఆగి ఆ లేఖనముగుండా, ముందుకు వెనుకకు, కొన్ని గంటల తరబడి ధ్యానించవచ్చుగదా, చూడండి, షరతులు మరియు వాటి భావమును చూడవచ్చును. నీవు ప్రాథమికంగా ఎంత సరిగానైనా ఉండవచ్చును, అయితే ఆ వాగ్దానము, ముందు నిర్ణయము మరియు మొదలగు షరతులతో, కూడియున్నది. గమనించండి.
78 ఇప్పుడు, “అబ్రాహాము, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.” ఇప్పుడది, ఎటువంటి ఒక—ఒక భయంకరమైన విషయము ఒక—ఒక నాగరిక ప్రపంచమును, డెబ్బది-ఐదు సంవత్సరాల వ్యక్తి, ఒక అరవై-ఐదు సంవత్సరాల స్త్రీతో కలసి ఎదుర్కొనుట, మరియు వారు యవ్వన కాలమునుండి దంపతులుగా కలసి జీవించారు, ఏలయనగా ఆమె అతనికి సగము సహోదరియైయున్నది, మరియు ఇప్పుడు ఆమె ద్వారా అతడు కుమారుని కనబోవుచున్నాడు. కానీ అతడొక సంపూర్ణతను కలిగియున్నాడు. ఏదియూ అతణ్ణి కదిలించలేదు.
79 మరియు పిదప, మొదటి నెలలో, అది జరుగలేదు, అప్పుడతని సంపూర్ణత పట్టుకున్నది, ఎందుకనగా తాను దేవునితో మాట్లాడినాడని అతడు ఎరిగియున్నాడు. రెండవ నెల, రెండవ సంవత్సరము, పది సంవత్సరాలు, మరియు ఇరవై-ఐదు సంవత్సరాల తర్వాత, అతనికి వంద సంవత్సరాలు, మరియు శారాకి తొంభై సంవత్సరాలప్పుడు, అతని సంపూర్ణత ఇంకను పట్టుకొనియున్నది.
80 మరియు బైబిలు చెప్పినది ఏమిటనగా, అతని చరిత్ర వ్రాయబడినప్పుడు, ఇట్లు చెప్పబడెను, “అబ్రాహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు, కానీ దేవునిని స్తుతించుచూ, బలమునొందెను.”
81 ఎందుకు? ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు సంపూర్ణ నిశ్చయతను, కలిగియుండెను. మరియు అతడు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా తన ప్రజలనుండి తననుతాను వేరుచేసుకోవలెను. మరియు అతడు దానిని చేసే వరకు దేవుడు అతడిని ఆశీర్వదించనేలేదు. అతడు తన తండ్రిని తీసుకువచ్చాడు. అతని తండ్రి మరణించాడు. అతడు లోతును తీసుకువచ్చాడు. మరియు లోతు, అబ్రాహాము నుండి వేరైన తర్వాత, అప్పుడు దేవుడు అతని వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను, “ఇప్పుడు ఈ దేశములో నడువుము.” చూశారా?
82 విధేయత, వాగ్దానము, షరతుల క్రింద, ఎల్లప్పుడూ దేవుడు మరియు ఆయన వాక్యముతో వెళ్ళును. ఇప్పుడు దానిని చూడండి…
83 ఇప్పుడు మోషేను తీసుకుందాము. ఆ—ఆ పారిపోయిన దాసుడగు-ప్రవక్త, మోషేయైయున్నాడు, దేవుడు అతడిని ఫరో రాజభవనంలో పెంచి మరియు అతనికి విద్యనభ్యసింపజేసెను. మరియు—మరియు మోషే తన వేదపాండిత్య తర్ఫీదుతో బయటికి వెళ్ళి, మరియు అతడు మొదటిగా ఒక వ్యక్తిని చంపాడు. తర్వాత, మొదటి చిన్న లోపము వచ్చినది, అప్పుడు మోషే మరణానికి భయపడినాడు.
84 ఎందుకు? అతనికి సంపూర్ణత లేదు. అతడు కేవలం తన జన్మను గూర్చి తన—తన తల్లియొక్క సాక్ష్యాన్ని కలిగియున్నాడు. అతడొక వింతైన శిశువు. దాని విషయమై అతడు తన తల్లియొక్క మాటను కలిగియున్నాడు. దేవుడు తన పిల్లలను దర్శించబోవుచున్నాడన్న దానిని గూర్చి, వారు వ్రాసియుంచి, వారితోపాటు తీసుకెళ్తున్న, బహుశా ఎక్కడో కాగితంలో దేవుడు పొందుపరచిన ఆ గ్రంథపు చుట్టలు అతని వద్ద ఉన్నవి. అదే ఆ సమయమని అతడు ఎరిగియున్నాడు.
ఇప్పుడు మనము చేస్తున్నట్లే ఉన్నది, ఏదో జరుగబోవుచున్నదని మనము ఎరిగియున్నాము.
85 ఇప్పుడు, అదే ఆ సమయమని మోషే ఎరిగియుండెను, మరియు దాని కొరకు అతడు ఎన్నుకొనబడినాడని అతడు ఎరిగియుండెను, కానీ అతడొక సంపూర్ణతను కలిగిలేడు. చూశారా?
86 మరియు ఒక దినమున, అతడు తన దర్శనమును పోగొట్టుకున్నపుడు, ఆ ఎడారి వెనుక భాగమున, ఒక మండుచున్న పొదలో, దేవుడతనికి ప్రత్యక్షమయ్యెను. మరియు ఆయన ఇట్లు చెప్పెను, “మోషే, నేను నా ప్రజల బాధలు చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టువారిని బట్టి, వారు పెట్టు మూలుగులను మరియు ఏడ్పును వినియున్నాను. మరియు నేను నా వాగ్దానమును జ్ఞాపకము చేసుకున్నాను. నేను వారిని విమోచించుటకు దిగివచ్చాను. ఇప్పుడు ఐగుప్తునకు వెళ్ళుము.” ఓ, మై!
87 అందుకు మోషే, సాకులు చెప్తూ, ఇట్లన్నాడు, “నేను సరిగా మాట్లాడలేను. నా—నా ఉచ్ఛరణ ఏమంత మంచిగా ఉండదు. వారు నన్ను నమ్మరు.”
“నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని ఆయన అన్నాడు.
“ఒక కర్ర,” అని అతడు చెప్పాడు.
88 “దానిని నేల మీద పడవేయుము,” అని ఆయన చెప్పాడు. అది ఒక సర్పముగా మారినది. ఆయన చెప్పాడు, “దాని తోక పట్టుకొనుము.” అది తిరిగి మరలా ఒక కర్రగా మారిపోయినది. ఆయన అతడికి ఒక నిశ్చయతను, ఒక నిర్ధారణను ఇచ్చుచుండెను.
89 దేవుడు ఒక సంపూర్ణతను ఇచ్చినప్పుడు, ఆయన ఎల్లపుడూ ఆ సంపూర్ణతకు, ఒక నిర్ధారణను కూడా అనుగ్రహించును.
90 పిదప మోషే, అతను అక్కడకి వెళ్ళినప్పుడు, ఆ మాంత్రికులు మరియు ఫరో ఎదుట అతడు తన కర్రను పడవేశాడు, మరియు ఆ మాంత్రికులు వచ్చి మరియు వారు తమ కర్రలను కూడా క్రింద పడేశారు, మోషే పరిగెత్తుకొనిపోయి, “ఓ, సరి, నేను తప్పు చేశాను. ఓహ్, అది కేవలం ఒక మాంత్రికుడి చవుకబారు తంత్రం, మరియు నేనే తప్పైయుండవచ్చును,” అని ఎన్నడూ చెప్పలేదు.
91 కానీ అతడు ఎరిగియున్నాడు. తాను దేవుడిని కలుసుకున్నాడనే నిశ్చయతను అతడు కలిగియున్నాడు, మరియు అతడు స్థిరముగా నిలబడినాడు. సరిగ్గా దేవుడు అతనికి చేయమని చెప్పినట్లే అతడు చేశాడని మనము అనుకుందాము. అలాగే దేవుడు ఏమి చేయమని తనకు చెప్పాడో యోబు ఖచ్చితంగా అలాగే చేశాడు. మోషే ఆయన ఆజ్ఞలను వెంబడించినాడు. పిదప, స్థిరంగా నిలబడి మరియు దేవుని మహిమను చూశాడు. మోషే తన సంపూర్ణతకు, తాను పొందిన ఆజ్ఞకు కట్టబడియుండెను, మరియు అతడు స్థిరంగా నిలబడెను. మరియు అతడట్లు చేసినప్పుడు, అతడి సర్పము ఆ మిగతా సర్పములను మ్రింగివేసినది. చూశారా? అతడు ఆ సంపూర్ణతకు కట్టబడియున్నాడు.
92 దేవుడు ఇట్లు చెప్పెను, “నీవు ఆ ప్రజలను విడిపించిన తర్వాత, నీవు మరలా ఈ పర్వతము మీద నన్ను ఆరాధిస్తావు.”
93 ఇప్పుడు, నిన్ను ఆ సంపూర్ణత నుండి దూరము చేయుటకు, శత్రువు, వాడికి వీలైన ప్రతి మార్గములో ప్రయత్నము చేస్తాడు.
94 వారు ఐగుప్తు నుండి బయలుదేరిన వెంటనే, వారు ఆ—ఆ ఎర్ర సముద్రము వంపు దగ్గర చిక్కుకుపోయారు, ఇరువైపులా పర్వతములున్నాయి. ఒక లోయ గుండా వచ్చిన వెంటనే, ఎర్ర సముద్రము ఎదురైనది. ఆ పర్వతాలు దాటి తప్పించుకొను మార్గము లేదు, ఈ మార్గములో తప్పించుకొనుటకు దారి లేదు, మరియు ఫరో సైన్యము ఈ మార్గములో వచ్చుచున్నది. నిలబడుటకు అది ఎటువంటి ఒక స్థలము కదా!
95 మీరేమి చేయాలో తెలియనటువంటి ఒక స్థలానికి దయ్యం మిమ్నల్ని ఎలా తీసుకువెళ్తుందో చూశారా? అయితే గుర్తుంచుకొనండి, మీరు ఆ సంపూర్ణతకు ముడివేయబడియుంటే, అది దానిని ముగిస్తుంది.
96 దేవుడు తనకు వాగ్దానము చేసెనని మోషే ఎరిగియున్నాడు, అదేదనగా, “నీవు వారిని వెలుపలికి తీసుకువచ్చినప్పుడు మీరు ఈ పర్వతము మీద ఆరాధిస్తారు. మరియు నీ హస్తము ద్వారా వారిని విమోచించి, మరియు వారిని ఆ వేరొక దేశములో ప్రవేశపెట్టుటకు నేను దిగివచ్చియున్నాను.” అతడు దానితోనే నిలబడియుండెను. మరియు దేవుడు తూర్పు గాలిని రేపి, మరియు ఆ సముద్రపు అడుగునుండి, ఆ నీటిని తేలిపోజేసెను, మరియు వారు ఆరిన నేల మీద నడిచిపోయారు. ఒక సంపూర్ణత!
97 మనము ఇంకా ఎన్నో లేఖనములు చూడవచ్చు: దానియేలు, అతని సంపూర్ణత; షద్రకు, మేషాకు, మరియు అబేద్నెగోలు, వారి సంపూర్ణత; దావీదు, అతని సంపూర్ణత; అంతా సంపూర్ణతయే.
98 పౌలు కూడా ఒక దానిని కలిగియున్నాడు, దానిని గూర్చియే మనము చదువుచున్నాము. అతడు క్రీస్తే-కేంద్రంగా ఉన్న పిలుపును కలిగియున్నాడు, మరియు అదే అతని సంపూర్ణతైయున్నది. ఆ కారణముచేతనే అగ్రిప్ప ఏమీ చెబుతాడో అని అతడు భయపడలేదు. అక్కడ నిలబడియున్నాడు, మరియు మనకు తెలిసిన ప్రకారం, అగ్రిప్ప ఒక యూదుడు. మరియు పిదప అతడు ఈ విషయాలు మరియు రాజుల ఎదుట నిలబడియున్నప్పుడు, అతడు అక్కడ నిలబడతాడని దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు. కావున, అతడొక సంపూర్ణతను కలిగియున్నాడు, కనుకనే ఆ పరలోక దర్శనాన్ని అతడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అతడిట్లు చెప్పెను, “నేను ఒక…నేను దానికి అవిధేయుడను కాలేదు. నేను…నేను దానిని తప్పుడు అంచనా వేయలేదు. నేను తప్పుగా ప్రవర్తించలేదు.” అతడు అవిధేయుడు కాలేదు కానీ, దానిని హత్తుకొనియుండెను. అతడు ప్రతి నిమిషం, దానిని పట్టుకునియుండెను, ఏలయనగా అదొక సంపూర్ణతైయుండెను.
మరియు క్రీస్తే-కేంద్రంగా ఉన్న ఏ జీవితమైనా, అది మీ సంపూర్ణతైయుండును.
99 ఇప్పుడు, దమస్కు మార్గమున, ఆయనను ముఖాముఖిగా కలిసినప్పటి నుండి, పౌలుకు, అది ఎంతో విలువైనది.
100 ఇప్పుడు, గుర్తుంచుకొనండి, అతడు ముందుగానే ఒక వేదపండితుడు. అతడు లేఖనములలో చాలా ప్రవీణుడైయుండెను. కానీ తనని బలపరచే ఆ సన్హేద్రిన్ సభ, మరియు ఒక—ఒక గొప్ప బోధకునియొద్ద నుండి ఒక—ఒక—ఒక డిప్లమా తప్ప, అతడెట్టి సంపూర్ణతను కలిగిలేడు. అతడు తన రంగములో ఒక గొప్ప వ్యక్తియైయుండెను. కానీ అతడు వేచియుండెను. అతడు కలిగియున్నది ఒక్కటే, అతని సంస్థ ఎంత బలమైనదో అతని సంపూర్ణత కూడా అంతే బలాన్ని కలిగియుంటుంది. అతడు అంత బలమునే కలిగియుండగలడు. మరియు అతడు దానికి నమ్మకముగా పనిచేయుచుండెను, మరియు క్రైస్తవులను పట్టుకొని, వారిని బంధించి, వారిని హింసించాడు, మరియు స్తెఫనును రాళ్ళతో కూడా కొట్టించాడు.
101 నేను ఆలోచించాను, తన జీవితంలో తర్వాత అతడు యెరూషలేమునకు వెళ్ళడానికి గల కారణము: ఆ ప్రవక్త, అతనితో ఇట్లు చెప్పియున్నాడు, “పౌలా, నీవు అక్కడికి వెళ్ళవద్దు, బంధకములు మరియు చెరసాల నీకొరకు కాచుకొనియున్నవి.”
102 అందుకు పౌలు ఇట్లన్నాడు, “అది నాకు తెలుసు. అయితే నేను యెరూషలేమునకు కేవలం ఒక సాక్షిగా మాత్రమే వెళ్ళడం లేదు. కానీ, యేసుక్రీస్తు కొరకు మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి అక్కడికి వెళ్ళుచున్నాను.” ఏలయనగా అతడేమి చేసాడో అతనికి తెలుసు, మరియు ఒక హతసాక్షిగా మరణించి, తన స్వరక్తము చేత తన సాక్ష్యమును ముద్రించవలెనన్నది అతని ఆశయమైయున్నది, ఎందుకనగా అతడు దేవుని హతసాక్షులలో ఒకరిని చంపాడు.
103 మరియు ఇప్పుడతడు తాను కలిగియున్న విద్యంతటితో, దమస్కు మార్గంలో ఉన్నాడు. గొప్ప బోధకుడైన గమలియేలు వద్ద కూర్చుండి, మరియు యూదా మతమంతటిని గూర్చి ఎంతగానో బోధించబడాడ్డు. మరి అయిననూ, దానంతటితో, అతడు కొదువతనంలో ఉన్నాడు, మరియు కొన్ని కార్యములు చేయుటకు అతనికి సామర్ధ్యము లేకుండెను. మరియు అకస్మాత్తుగా, ఒక వెలుగు వచ్చినది, మరియు ఒక గర్జన, బహుశా, ఒక ఉరుము కావచ్చును. మరియు అతడు మొత్తబడి, నేల మీద పడిపోయాడు.
104 మరియు అతడు పైకి చూశాడు. అక్కడ ఒక వెలుగు ప్రకాశించుచున్నది, అది అతడి కన్నులకు గ్రుడ్డితనం కలుగజేసినది. మరియు అది ఎటువంటి ఒక వింతైన కార్యము. కేవలం సౌలు తప్ప, మరెవ్వరూ ఆ వెలుగును చూడలేదు. అది ఎంతగానో వాగ్దానము చేయబడి, అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసేంత వాస్తవముగా అది ఉండెను. అతడు చూడలేకపోయాడు. ఆ అగ్నిస్తంభపు వెలుగు నేరుగా అతని ముఖము మీద ప్రకాశించుటవలన, అతడు పూర్తిగా గ్రుడ్డివాడైనాడు. ఒక స్వరము అతనితో ఇట్లు చెప్పుటను విన్నాడు, “సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?”
అందుకతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నీవెవరవు?”
105 మరియు ఆయనిట్లు చెప్పెను, “నేను యేసును. మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. నీవు లేచి, దమస్కునకు వెళ్ళుము, మరియు అక్కడ ఒక వ్యక్తి నీ దగ్గరకు పంపబడును.” మరియు అతడు అక్కడినుండి లేచినప్పుడు…
106 మరియు అక్కడ, ఆ పట్టణంలో, ఒక ప్రవక్త ఉండెను, అతను ప్రార్థించుచుండగా ఒక దర్శనమును చూసి, మరియు అతడు వచ్చెను. అననీయ వచ్చెను, మరియు సౌలు దగ్గరకు వచ్చెను. అతనిపై తన చేతులుంచగా, మరి దైవిక స్వస్థత ద్వారా అతడు స్వస్థపరచబడెను. తర్వాత అతడు లేచి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి, బాప్తీస్మము పొంది, తన పాపములను కడిగివేసుకొనెను. మరి అప్పుడు అతడొక సంపూర్ణతను కలిగియుండెను. ఇక అప్పటినుండి అతడు పూర్తిగా మారిపోయెను. అతడు తిన్నగా, సంఘము నుండి సంఘమునకు, ఒక చోటునుండి మరొక చోటునకు వెళ్ళుచు, అతడు దేనినైతే పడద్రోయుటకు ప్రయత్నించెనో దానిని కట్టుటకు ప్రయత్నించుచుండెను.
107 ఈ ఉదయమున, ఈ దేశమునకు, క్రైస్తవ ప్రపంచానికి, అటువంటి ఒక సంపూర్ణత ఎంతగా అవసరమైయున్నది గదా. ఎవరైతే…?…వారు ఆచారాలు, మరియు సాంప్రదాయాలు, మానవ సిద్ధాంతాలతో, దేవుని వాక్యము నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండుటలో విఫలమైనదని ఎంచుటకు ప్రయత్నించుచున్నారు. వారికొక సంపూర్ణత అవసరమైయున్నది, రోగులను స్వస్థపరిచి, మరియు మృతులను లేపి, మరియు దయ్యములను వెళ్ళగొట్టగల జీవముగల దేవుడిని, దమస్కు మార్గములో, కలుసుకొనే అనుభవం అవసరమైయున్నది. ఒక నిజమైన సంపూర్ణత!
108 ఏదో జరిగినదని పౌలు ఎరిగియున్నాడు. అతనియొద్ద నుండి దానిని ఎవ్వరూ తీసివేయలేరు. ఏదియూ లెక్కలోనికి రాదు. అతడు కట్టబడియున్నాడు, మరియు అది అదేయైయున్నది. ఏది జరిగినా గానీ అతడు కట్టబడియున్నాడని అతడెరిగియున్నాడు, క్రీస్తే-కేంద్రమైయున్న జీవితం. ఓ!
109 అతడు జీవించిన ఆ జీవితము వ్యత్యాసమైనది. ఇప్పుడు గుర్తుంచుకొనండి, అతడొక మత సంబంధమైన వ్యక్తిగా, జీవించియుండెను.
110 మరియు ఈ ఉదయమున మీలో కొందరికి (మరియు ఇది టేపు చేయబడిందని మీరు గ్రహించారని నాకు తెలుసు, ఆకాశము క్రిందనున్న ప్రతీ దేశములో, దాదాపు, ప్రపంచవ్యాప్తంగా ఇది వినిపించబడుతుంది); మరియు ఇక్కడ ఉన్న, మీలో కొందరు ప్రజలు; మరియు మీలో కొందరు ఎక్కడైతే ఇతర దేశాలలో ఈ టేపులు వినిపించబడతాయో అక్కడ (ఆఫ్రికాలో ఉన్న తెగలు అనాగరికులు, మరియు—మరియు చుట్టుప్రక్కలవారు, ఒక అనువాదికుని ద్వారా వింటారు); మరియు కేవలం బైబిలును గూర్చిన విద్యాభ్యాసము కలిగిన మతనాయకులైన మీకు:
111 మీరు చారిత్రాత్మిక కోణములో దానిని పొందుకున్నారు, మరియు బహుశా మీరు వీటన్నిటిని వివరించగలరు, కానీ మీరు ఒక సంపూర్ణతను కలిగిలేనియెడల, ఒక—ఒక అనుభవమును కలిగిలేనియెడల, మరియు ఒకవేళ మీరు కలిగియున్నామని చెప్పుకొనుచున్న ఆ—ఆ అనుభవము దీనిలోని ప్రతీ మాట అది ఎప్పుడు ఉన్నట్లుగా ఈ దినపు సంఘమునకు వాస్తవంగా లేదని నిరాకరింపజేసినయెడల, మరియు మీరు మీ డిగ్రీ పట్టాను లేక మీరు కలిగియున్న దేనిమీదనైనా నమ్మిక ఉంచుచున్నయెడల, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి, మనకు దైవిక స్వస్థత లేదు, పెంతెకోస్తు దినమున వారు పొందుకొనిన పరిశుద్ధాత్మ బాప్తీస్మము, నేటి దినపు ప్రజలకు కాదు,” అని మీ మత సంస్థ చెప్పిన తలంపులను మీరు నమ్ముచున్నయెడల, మీరు కలిగియున్నదంతా అదే అయితే, నా ప్రశస్తమైన సహోదరుడా, సహోదరీ, నీకు ఒక దమస్కు-మార్గపు అనుభవము అవసరమైయున్నది!
112 నీ మనస్సులో కేవలం ఒక కల్పితమైన తలంపుతో కాదు, ఏదో వణుకుట కాదు, లేదా ఒక విధమైన ఉద్రేకముతో కాదు, కానీ ఒక నిజమైన, వాస్తవమైన, అనుభవముతో కూడిన ఒక బోధతో, నీవు ఈ జీవముగల దేవుడిని కలుసుకోవలసియున్నది. గలలియ తీరమున నడిచిన ఆ యేసే ఈ దినమున జీవించుచున్నాడు, మరియు నిరంతరము సజీవునిగా ఉన్నాడు. ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరమూ ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఒక సంపూర్ణత, ఎవరో చెప్పినది నీవు తీసుకోవాల్సిన అవసరము లేదు. నీవు స్వయంగా దానిని ఎరిగియున్నావు, అది ఏదో ఉద్రేకము కాదు.
113 మరియు నీవు కలిగియున్న, ఆ ఉద్రేకము, అది నిజమైన బైబిలు ఉద్రేకము కావచ్చును, మరియు ఎవరైనా ఆ కార్యములు మరొక దినమునకు చెందినవని చెప్పి, దానిని నీనుండి తీసివేయుటకు ప్రయత్నించినట్లైతే జాగ్రత్త. అది నిజము. జాగ్రత్తగా ఉండుము. కానీ తెలుసుకొనుటకు ఒక మార్గమున్నది. దానిని వాక్యముతో పరీక్షించండి. మరదే నమూనాయైయున్నది.
114 ఒక ఇల్లు ఆ నమూనా ప్రకారం కట్టబడకపోతే, ఆ కాంట్రాక్టరు దానిని పడగొట్టి మరియు దానిని మరలా కడతాడు. అయితే అది నమూనా ప్రకారం కట్టబడాలి.
115 నీ అనుభవము ఏదైనా కానీ, ఇక, బైబిలు సత్యము కాదని నీలో ఏదైనా చెప్పినట్లయితే, ఆ దేవునియొక్క శక్తి, అపొస్తలులు, ప్రవక్తలు, మరియు ఉపదేశకులు, మరియు కాపరులు, మరియు పెంతెకోస్తువద్ద అపొస్తలుల ద్వారా ప్రవహించినట్లుగా ఆత్మ వరములు ఇప్పుడు లేవు అని చెప్పినట్లయితే, నీ సంపూర్ణతలో ఏదో లోపము ఉన్నది. అది దేవుని వాక్యానికి బదులు మతశాఖ సిద్ధాంతమునకు కట్టబడియుంటుంది. ఆయన, ఇట్లు చెప్పెను, “ఆకాశము మరియు భూమియు గతించునుగాని నా మాటలు ఎన్నడూ గతించవు.” అప్పుడు మీ సంపూర్ణత ఏమిటో గమనించండి.
116 నీవు సంఘ కాపరితో మంచి సహవాసమును కలిగియున్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగియుండవచ్చును. మరియు జిల్లా ప్రేస్బిటేరియనుతో సహవాసమును కలిగియున్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగియుండవచ్చును. మరియు బిషప్పు లేదా నీ సంఘములోని ఒక గొప్ప వ్యక్తితో సహవాసమును కలిగియున్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగియుండవచ్చు. కానీ నీవు…నీ సంపూర్ణత యేసు క్రీస్తు కాదు.
117 “ఈ బండ మీద నా సంపూర్ణతను ఉంచెదను, మరియు పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు.” ఆయన ఎవరనే దాని గూర్చి ఆత్మీయ ప్రత్యక్షత, మరియు ఆయనను ఎరుగుట! అది సరియే. ఓ!
118 ఇప్పుడు, నీవు పౌలు వలె మారినప్పుడు, అతడు కలిగియున్న అదే సంపూర్ణతను కలిగియుంటావు, మీరు ఒకప్పుడు కలిగియున్నదానికంటే క్రీస్తే-కేంద్రీకృతమైన జీవితము ఒక భిన్నమైన జీవితమై ఉంటుంది. మరియు అది నీవు జీవించిన చాలా భక్తిపూర్వకమైన జీవితమైయుండవచ్చును.
119 ఓ, ప్రజలు ఇట్లు చెప్పుటను నేను విన్నాను, “ఇప్పుడు, వారు చాలా భక్తిగలవారు.” దానితో ఎటువంటి సంబంధం లేదు.
120 ఈనాడు క్రైస్తవ ప్రజలు చెప్పుకొనే దానికంటే, చాలా రెట్లు ఎక్కువ యధార్థంగా ఉన్న అనేక మతాలను, అనేకమంది భక్తిపరులను నేను చూసాను. ఒక తల్లి లావుగా, నల్లగా, అంత పొడవు ఉన్న తన బిడ్డను తీసుకొని, మరియు తన దేవుని మీద ప్రేమతో, దానిని ఒక మొసలి నోటిలోనికి విసరివేయగలిగినది. అప్పుడు క్రైస్తవ్యము యొక్క యధార్థత ఏది అని నేను ఆశ్చర్యపోయాను. ఒక మనిషి, నీటిబుగ్గలు వ్రేలాడదీయబడిన వెయ్యి కొక్కెములను, తన శరీరములో ఆ విధంగా గుచ్చుకొని, అవి అతణ్ణి ఇలా క్రిందకి లాగుచుండగా, తన దేవునికి అనగా కెంపు రంగు కళ్ళుగల ఒక విగ్రహానికి మరియు అటువంటివాటికి బల్యర్పణగా, ఇక్కడినుండి ఆ ఆలయం చివరి వరకు ఉన్న, ఒక అగ్ని-చార గుండా, మరది గాలితో అధికంగా అలా వేడి చేయబడుచుండగా, దాని మీద, అటు ఇటు తిరుగుతూ, అంతగా తనను తాను బాధపరచుకొనుచుండగా. అప్పుడు క్రైస్తవ్యము ఎక్కడా అని నేను ఆశ్చర్యపోయాను. అహ్-హ. అహ్-హ. కాబట్టి “యధార్థత” గూర్చి ఆలోచించవద్దు. యధార్థత అంటే అది కాదు. యధార్థత అనేది సరియైన దాని మీద పెట్టినట్లయితే అది మంచిదే.
121 ఒక వైద్యుడు మందులు ఇచ్చినట్లే అది ఉన్నది. అతడు యధార్థంగానే, మీకు కషాయాన్ని ఇవ్వవచ్చును, మరియు అతడు యధార్థంగానే, మీకు సల్ఫ్యూరిక్ అమ్లమును ఇవ్వవచ్చును. బహుశా నీ మందుల చీటిలో తప్పిదం ఉండవచ్చు, మరియు నీవు దానిని యధార్థంగా తీసుకొనవచ్చును, కానీ అది నీ ప్రాణమును కాపాడదు. చూశారా? లేదు, అయ్యా. నీవేమి చేయుచున్నావో నీవు తెలుసుకొనవలసియున్నది. మరియు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనాగానీ, అదేమైనాగానీ, మరియు అది ఎంత కాలము నుండి ఉన్నాగానీ నేను లెక్కచేయను, అది ఇంకను తప్పేయైయున్నది.
122 పెంతెకోస్తు దినమున పేతురు వారికి ఒక నిత్యత్వపు మందుల చీటిని ఇచ్చెను. అతడిట్లు చెప్పెను, “మీలో ప్రతీఒక్కరూ, పశ్చాత్తాపపడుడి, మరియు మీ పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమును బాప్తీస్మము పొందుడి, మరప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏలయనగా ఈ మందుల చీటి మీకును, మీ పిల్లలకును, మరియు దూరస్తూలందరికినీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికినీ చెందును.” అది వాస్తవం. అది నిత్యమైన మందుల చీటియైయున్నది.
123 ఇప్పుడు, ఎవరో ఒక బూటకపు వైద్యుడు దానిని తీసుకొని మరియు మిమ్మల్ని చంపివేయవచ్చును. అవును. నిశ్చయంగా. మీకు తెలుసా, ఆ క్రిమిని చంపుటకు, సరిపడిన మోతాదు గల విషం ఆ మందుల చీటిలో ఉంటుంది, మరియు ఆ—ఆ వైద్యుడు మాత్రమే, సరిగ్గా నీ శరీరము ఎంతవరకు తట్టుకొనగలదో ఎరిగియున్నాడు. అతడు ఎక్కువ-విషము కలిపితే, అది నిన్ను చంపుతుంది. దానిలో సరిపడునంత నీవు వేసుకోనట్లయితే, అప్పుడది ఏమి చేస్తుంది? అప్పుడా మందు తీసుకొనుటవలన ఏ మేలు కలుగదు. నీ శరీరము ఎంతవరకు తట్టుకోగలదో అతడు ఎరిగియున్నాడు.
124 ఇప్పుడు, దేవునియొక్క మందుల చీటి కూడా ఆ విధముగానే ఉన్నది. అది ఈ విధముగా, లేదా ఆ విధంగా, చేయవలసియున్నదని ఎవరు ఎంతగా చెప్పినను లెక్కలేదు, దానిని మీరు నమ్మకండి. నీవు అక్షరాల వాక్యమును ఖచ్చితంగా వెంబడించినప్పుడు, అది చాలు. దానిని పట్టుకొనియుండుము. ఇప్పుడు, మనకు…“మీరు తప్పక చిలకరింపబడాలి,” అని చెప్పేవారు ఉన్నారు. కావున, “మీరు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అను బిరుదులను తప్పక వాడవలెను.” అని చెప్పేవారిని వారు కలిగియున్నారు. బైబిలులో అటువంటి కార్యములు లేవు. బైబిలులో, యేసుక్రీస్తు నామములో కాకుండా వేరే ఏ విధముగానైనా ఎవరైనా ఎప్పుడైనా బాప్తీస్మము పొందినట్లు ఎక్కడా లేదు. అది రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారా కలపబడిన ఒక మత సిద్ధాంతమైయున్నది, అది పారంపర్యాచారముగా కొనసాగినది. ఈ రాత్రి దానిని మనం సంధించెదము.
125 అయితే గమనించండి, వీటన్నింటి మధ్యన, ఆ మందుల చీటి నిలిచియుంటుంది. అందునుబట్టియే మనము అనేకమంది వ్యాధిగ్రస్తులను మనము కలిగియున్నాము, ఎందుకనగా వైద్యుడు చెప్పిన దానిని వారు వినుటలేదు. ఆ సంపూర్ణత, మీరు దానికి కట్టబడియున్నప్పుడు, అది అంతే. అది దేవుని వాక్యమైయున్నది. అది విఫలమవ్వదు.
126 క్రీస్తే-కేంద్రీకృతమైన జీవితం! ఎంతో భక్తిపరమైనది కావచ్చును, కానీ అది క్రీస్తు-కేంద్రీకృతమైనది కాదు. ఈనాడు మనలో చాలామంది దానిని కలిగియున్నారు.
127 మరియు ఈ క్రీస్తే-కేంద్రంగా ఉన్న జీవితాన్ని మీరు కలిగియున్నప్పుడు, అది సాధారణంగా చేయని కార్యములను మీతో చేపిస్తుంది. సాధారణంగా మీరు ప్రవర్తించే దానికి భిన్నంగా మిమ్మల్ని ప్రవర్తింపజేస్తుంది. అవివేకంగా ప్రవర్తించడం అని నా భావం కాదు. ఆత్మలో, ఏదో నిజంగా, ఏదో వాస్తవంగా, ప్రవర్తించడం అని నా భావమైయున్నది. మరియు ఎవరైనా అవివేకంగా ప్రవర్తించడాన్ని మీరు చూసినప్పుడు, వారు కేవలం ఏదో నటిస్తున్నారని మీకు తెలుస్తుంది. వారు కేవలం ఆ అసలైన కార్యమును అనుకరించుటకు ప్రయత్నించుచున్నారు.
128 మీరొక నకిలీ డాలరును చూసినప్పుడు, అది ఒక అసలైన డాలరు నుండి తయారుచేయబడినదని మీరు గుర్తుంచుకొనండి. చూశారా? మీరొక నకిలీ దానిని చూసినప్పుడు, అది- సంపూర్ణంగా ఒక నిజమైన దానియొక్క ఛాయయైయున్నది. అది ఆ—ఆ అసలైన దానిని, అనుకరించినదైయుండును.
129 గమనించండి, సాధారణంగా మీరు చేయలేని కార్యాలను అది మీ చేత చేయిస్తుంది. ఓ, అది ఏదోయైయున్నది. మీరు నిశ్చయత కలిగియుంటారు. మీరు ఈ సంపూర్ణతను పొందుకున్నప్పుడు, దాని విషయమై మీరు ఎంతో నిశ్చయతను కలిగియుంటారు. దానిని గూర్చి మీరు సానుకూలముగా ఉంటారు. మీరు వేరొకరి అనుభవము మీద ఆధారపడరు.
130 ఆ కారణముచేతనే క్రైస్తవ్యము బైబిలులోని చిన్న పిల్లలవలె అయిపోయినది, లేదా, మరి, నన్ను క్షమించండి, అది పాఠశాలలోని చిన్నపిల్లలవలె అయినది. వారు ఒకరిని ఒకరు అనుకరించడానికి ప్రయత్నిస్తారు. మరియు ఆ వ్యక్తి తప్పయినయెడల, మొత్తం విషయమంతా తప్పవుతుంది. చూశారా? ఆ గుంపంతా తప్పైయుండుటను మీరు చూస్తారు. ఓ, మై! అనుకరించకండి. మీకు మీరుగా, ఆయనను కలుసుకొనండి.
131 నా మంచి స్నేహితుడు ఒకరు, ఇక్కడ వెనుక నిలబడియున్నాడు, అతడొక పాత…అతడు నా చిన్ననాటి స్నేహితుడు, చిర-కాల మిత్రుని యొక్క కుమారుడైయున్న, చిన్న జిమ్ పూల్. అంతేకాదు, అతని తండ్రి మరియు నేను పాఠశాలలో కలిసి పెరిగాము. మరియు, ఓ, ఎటువంటి ఒక మంచి వ్యక్తి! ఆ పెద్ద జిమ్ ఒక క్రైస్తవుడిగా, ఒక నిజ విశ్వాసిగా మారవలెనని నేను మరియు లిటిల్ జిమ్ నిరంతరం ప్రార్థిస్తున్నాము. మరియు నిన్నటి దినమున లిటిల్ జిమ్ మరియు నేను అడవులలో మేము దేవుడిని కనుగొని మరియు ప్రకృతిలో ఆయనను చూసిన దాని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. అక్కడే మీరు ఆయనను కనుగొంటారు. ఎందుకనగా, ఆయన సృష్టికర్తయైయున్నాడు, మరియు ఆయన తన సృష్టిలో ఉండియున్నాడు.
132 మరియు నాకు గుర్తున్నది, జిమ్ మరియు నేను వెళ్ళే—వెళ్ళే, వేటకు వెళ్ళాలని అనుకునేవాళ్ళము. మరియు రాత్రి అవ్వగానే, సరి, మేము ఆ దిగువన, మా సైకిళ్ళు తీసికొని, సరిగ్గా ఇక్కడ ఈ వీధిలో నడుపుకునేవారము, చీకటి పడిన తర్వాత సమాధులు దాటుకుంటూ వెళ్ళి, మరియు మా కోసం కోన్ ఐస్ క్రీమ్ తెచ్చుకోడానికి చచ్చేంత భయపడేవాళ్ళము.
133 మరియు జిమ్ నీటిలోకి దూకడానికి ఇష్టపడేవాడు. అప్పుడు, మేము కేవలం చిన్నపిల్లలము, పది, పన్నెండు, పద్నాలుగు ఏండ్ల వయస్సుగలవారము. పిదప జిమ్ తీరికగా కూర్చుని వేటాడటం మరియు ఉచ్చువేయడం గురించి కథల పుస్తకాలు చదువుటను ఇష్టపడేవాడు.
134 మరియు నేను కూర్చుని పగటి కలలు కనేవాడిని. చూశారా? గురించి…ఇప్పుడు కొందరు అబ్బాయిలు నన్ను చూడగలరు. మరియు నేను ఎక్కడో ఒక చిన్న గుడిసెను చూసేవాడిని. నేను ఇలా అనేవాణ్ణి, “అబ్బాయి, పర్వతాలలో ఉండటానికి అదొక మంచి గుడిసె అవుతుంది.” మరియు ఏదో ఒక రోజున నేను ఆ పర్వతాలలో ఒక గుడిసెను, ఒక పెద్ద వేట కుక్కల గుంపును, మరియు—మరియు కొన్ని తుపాకులను కలిగియుంటానని నేనెప్పుడూ కలలు కనేవాడిని. మరియు నేను ఎల్లప్పుడూ ఇట్లు అనుకునేవాణ్ణి, “ఎప్పటికైనా నేను .30-30, తుపాకీని కలిగియుంటేచాలు.” ఇట్లు ఆలోచించేవాడిని, “ఈ లోకములో నేను ఒక చిన్న .30-30 తుపాకీని ఎలా సంపాదించగలను?”
135 మరియు ఒకరోజు, నిలబడి, నా గోడ మీద చూస్తున్నాను, మరియు నేను పొందుకొనగల కొన్ని మంచి తుపాకులను అక్కడ చూసి, నేను ఇట్లునుకున్నాను, “అద్భుతమైన కృప.”
136 నేను ఇట్లనుకున్నాను, “తుపాకీ పేల్చుట గూర్చి నాకు నేను తర్ఫీదు ఇచ్చుకోవాలి, మరియు చక్కగా పేల్చాలి. మరియు అటు తరువాత బహుశా, ఎవరైనా ఒక మంచి వేటగాడు నన్ను తనతో తీసుకెళ్తే, ఆ పర్వతాలలోనికి ప్రయాణం చేయాలి. కేవలం ఒక రకంగా…ఎందుకనగా, బహుశా, ఒక దాడి చేస్తున్న ఎలుగుబంటి నుండి, అతడు తన ప్రాణమును కాపాడుకోవాలని అనుకోవచ్చు. అతనికి ఖచ్చితంగా తెలియదు. లేదా ఒక ధనవంతుడు, నన్ను తనతోపాటు, తనకు అంగరక్షుడిగా ఉండుటకు, నన్ను తనతో పాటు తీసుకొని వెళ్ళవచ్చును. బహుశా ఏదో ఒక రోజు నేను ఆఫ్రికాలో, ఒక అంగరక్షుడిగా వేటాడవచ్చు. నేను కేవలం శిక్షణ పొందితే చాలు! నేను చేయగలిగిన ఒకేఒక కార్యమేదనగా మంచిగా, స్థిరముగా కాల్చుటలో నేను తర్ఫీదు పొందాలి.”
137 ఓ, నేనిట్లు ఆలోచించాను, “దేవా, నీవు నన్ను ప్రపంచములో వేటాడనిస్తావా, ఆలోచన చేయుము.” ఎంత అద్భుతమైన కార్యము!
జిమ్ కూర్చుని పుస్తకములు చదివేవాడు. నేను అన్నాను, “జిమ్…”
అందుకతడు, “నాకు—నాకు దాని గూర్చి చదవడం ఇష్టము,” అని అనేవాడు.
138 నేను ఇట్లన్నాను, “జిమ్, అది వేరొకరు చేసినది. నేను స్వయంగా దానిని చేయాలని కోరుచున్నాను. ఆ అనుభవం నాకు కావాలి.” నేను క్రీస్తువద్దకు వచ్చినప్పుడు, నేను వేరొకరి అనుభవాన్ని తీసుకోలేను. నామట్టుకు నాకు, అది కావలెను.
139 నేను జేన్ గ్రే వ్రాసిన లోన్ స్టార్ రేంజర్ అను పుస్తకమును చదివినప్పటి విషయం నాకు జ్ఞాపకమున్నది. అప్పుడిక ఈ చీపురుకట్టల గుఱ్ఱముపై స్వారీ చేయుచున్నప్పుడు, ఇంటి చుట్టూ వేగంగా తిరుగుచూ, అమ్మవి రెండు మూడు చీపురుకట్టలు విరగొట్టాను. బిగ్ బెండ్ ప్రాంతానికి అతడెట్లు న్యాయం చేసాడనే, లోన్ స్టార్ రేంజర్, అనే ఆ—ఆ కథను నేను—నేను చదివాను.
140 పిదప ఎడ్గర్ రైస్ బురోయొక్క టార్జన్, ది ఏప్స్ అను కల్పిత కథను నేను చదివాను. వెచ్చదనం కొరకు శ్రీమతి. వాతెన్ ఆమెకు ఇచ్చినటువంటి, బూరుతోనున్న ఒక పాత రగ్గు, ఒక సీలు చర్మపు రగ్గు, లేదా అటువంటిది అమ్మ దగ్గర ఉండేది. అది ఆమె గదిలో ఉన్నది, మరియు నేను—నేను ఆ రగ్గును బయటకి తీశాను. గాలికి అది బయటకు కొట్టుకొనిపోలేదని అమ్మకు తెలుసు. మరియు నేను దానిని బయటకు తీసి, దానిని కత్తిరించి, మరియు నాకు ఒక టార్జన్ సూటును తయారు చేసుకుని, మరియు ఒక చెట్టుపైన ఉంచాను. ఇక ఈ టార్జాన్ సూటులో, నా—నా సగం సమయాన్ని ఆ చెట్టు మీదనే గడిపేవాణ్ణి. ఎందుకనగా అతడు ఏమి చేశాడో నేను చూసాను, నేను కూడా దానిని చేయాలని అనుకునేవాణ్ణి.
141 అయితే ఒక దినమున, దేవుని కృపనుబట్టి, అసలైన పుస్తకమును నేను పట్టుకున్నాను, అదే ఈ బైబిల్ గ్రంథము. అప్పటినుండి, “యేసువలె ఉండుట, భూమి మీద నేను ఆయనవలె ఉండగోరుచున్నాను,” అనేదే నా పాట మరియు నా కథ అయినది. నేనొక బిషప్పు లాగానో, లేదా—లేదా సంఘములో ఏదో ఒక గొప్ప వ్యక్తిగానో, ఏదో పోప్ లాగానో, లేదా ఏదో ఒక యాజకునిగానో ఉండగోరుటలేదు. నేను యేసువలె ఉండగోరుచున్నాను. ఒక సంపూర్ణత, అది మిమ్మల్ని భిన్నంగా చేస్తుంది. దాని విషయమై ఏదో ఉండియున్నది, ఆయన వాక్యమును చదవాలని ఉంటుంది, మరియు మీ హృదయంలో ఏదో ఉంటుంది, ఆయనవలె ఉండాలని మీరు కోరుకుంటారు. మీరు నిశ్చయతతో ఉంటారు.
142 అది, క్రీస్తుకు సంపూర్ణతవలె, క్రైస్తవునికి ఒక సంపూర్ణతవలె ఉన్నది, అది ఎలా ఉన్నదంటే…అది, అది ఓడకు లంగరువలె ఉన్నది. అవును. మీరు, మీరొక సంపూర్ణతను కలిగియుండవలసియున్నది. మరియు క్రీస్తు మీ సంపూర్ణతైనయెడల, అది ఒక లంగరువలె ఉంటుంది. అప్పుడు, నీవు…సముద్రము చాలా భీభత్సంగా ఉండి, మరియు ఓడ మునిగిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, మరి, అప్పుడు, మీకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఏదనగా, లంగరు వేయటమే. మరియు పిదప ఆ ఓడ అటు ఇటు కొట్టుకొని పోవుచున్నయెడల, ఆ లంగరు ఓడను పట్టివుంచుతుందో లేదో చూడండి. మీకు తెలుసుకదా, మనకొక పాట ఉన్నది, ఆ రచయిత పేరు నేనిప్పుడు మర్చిపోయాను కానీ, అది, నా లంగరు పట్టివుంచుతుంది అనే పాటయైయున్నది.
143 మనము చాలా సార్లు అనుకున్నట్లే, అది పతంగిని ఎగరవేయుచున్న ఆ చిన్న పిల్లవాడివలె ఉన్నది. మీకేమియు కనబడదు, కానీ అతడు దారాన్ని కలిగియున్నాడు. మరియు అటుగా వెళ్ళుచున్న ఒక వ్యక్తి ఇట్లన్నాడు, “బాబు, నీవేమి చేస్తున్నావు?”
అతడు ఇట్లన్నాడు, “నేను నా పతంగి ఎగురవేస్తున్నాను.”
అందుకతడు, “నీ చేతిలో ఉన్నది ఏంటి?” అని అడిగాడు.
“దారం,” అని ఆ పిల్లవాడన్నాడు.
144 మరి, “ఆ పతంగి ఏది?” అని అడిగాడు. ఇంకా ఇట్లన్నాడు, “నాకది కనబడటం లేదు. సరే, నువ్వు ఒక పతంగిని ఎగురవేస్తున్నట్లు నీకైనా ఎలా తెలుస్తుంది?”
145 అందుకా పిల్లవాడు, “ఆ అనుభూతి నాకు తెలుస్తుంది. అది లాగుచున్నది,” అని అన్నాడు. చూశారా? ఆ దారం చివరన, ఒక సంపూర్ణత ఉన్నది. అతని విధానంలో, ఆ పతంగే అతనికి సంపూర్ణత, కాబట్టే అతడొక పతంగిని ఎగురవేయుచున్నాడని అతడు చెప్పగలిగాడు. అతడు దానిని చూడలేకపోయినప్పటికీ, దానిపై పట్టును కలిగియున్న దేనిపైనో, అతడు పట్టును కలిగియున్నాడు.
146 ఒక మనుష్యుడు తాను పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు, అతడి విషయం అలాగే ఉండును, ఆ ఆవలిన ఒక లంగరు కలిగియున్నట్టి ఏదో ఒకదానిపైన అతడు ఒక పట్టును కలిగియున్నాడు, మరియు ఆ తుఫానులు అతణ్ణి కుదిపివేయవు. తాను మంచిగానే ఉన్నాడని అతడు ఎరిగియున్నాడు. అతడు లంగరు వేయబడియున్నాడు. అది సరియే.
147 ఆ గొప్ప కవి చెప్పినట్లుగా, ఇప్పుడు, మనము చిన్న బెరడులో ఉండి, జీవితయాత్రలో, తేలుచున్నాము:
జీవితమనేది వట్టి కల కాదు!
మరియు కునుకుపాటుపడే ఆత్మ మరణించును,
మరియు అగుపించే విధంగా సంగతులు లేవు.
జీవితం వాస్తవమైనది! మరియు జీవితం విలువైనది!
మరియు దాని గమ్యం దాని సమాధి కాదు;
నీవు మన్నే గనుక, తిరిగి మన్నైపోవుదువు,
అని ఆత్మను గూర్చి చెప్పబడలేదు.
148 ఓ, అది ఎంతో అందమైనదని నేను తలంచుచున్నాను! ఇప్పుడు, లాంగ్ ఫెలో దానిని వ్రాశాడు, జీవితపు కీర్తన. చూశారా?
జీవితం యొక్క గంభీరమైన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు,
ఓడ పగిలి మరియు నిరాశ్రయుడైన ఒక సహోదరుడు,
చూడటంతో, మళ్ళీగుండె నిబ్బరాన్ని పొందుతాడు.
149 చూశారా? ఇప్పుడు మనం, జీవిత ప్రవాహంలో క్రీస్తనే ఓడను ఎక్కి, మరియు కాలమనే తుఫానులగుండా ప్రయాణించుటను ప్రారంభించాము. తుఫానులు ఎక్కువగుచు, మరియు అవి ఎగసిపడుచున్నప్పుడు, దూరాన ఆ తెరలోపల పట్టుకొనియున్న ఒక లంగరును నేను కలిగియున్నందుకు, నేను సంతోషించుచున్నాను. మరణము సైతం దాని నుండి నిన్ను ఎడబాపనేరదు. నీవు నీ సంపూర్ణతకు కట్టబడియున్నావు. క్రీస్తే మన లంగరు. ఆయన ఏమైయున్నాడు? ఆయన వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించెను.”
150 పిదప, మన క్రియలు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉన్నాయని మనము ఎరిగినప్పుడు, మన బోధ సంపూర్ణముగా వాక్యానుసారంగా ఉన్నదని మనకు తెలుస్తుంది, ఏదీ కలుపుట లేదు, ఏదీ తీసివేయుట లేదు, కేవలం వాక్యము మాత్రమే. అదే వాక్యమునకు ఎవరైతే లంగరు వేయబడియున్నారో, వారెట్టి ఫలాలు పొందియున్నారో, వాటినే మన జీవితంలో జీవించుటను మనము చూస్తాము, అప్పుడు నీ లంగరు నిన్ను పట్టుకుంటుంది. క్రీస్తులో ఉన్నట్లుగానే, క్రీస్తుయొక్క జీవము దాదాపు అవతారమెత్తినట్లుగా, మీ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది, ఎందుకనగా, “లోకమును తనతో సమాధానపరచుకొనుచు, క్రీస్తులో ఉన్నది దేవుడే.” మరియు సరిగ్గా యేసు చేసినట్లే, మీలో కూడా దేవుడు వాక్యముపై అదే దూలాన్ని పట్టుకొనియుండుటను మీరు చూస్తారు. మీరు ఆయన జీవితాన్ని చూడండి. “నమ్మినవారు, నేను చేయు క్రియలు మీరును చేతురు.” నమ్ముచున్నట్లు-నటించువాడు కాదు, తాను నమ్ముచున్నానని అనుకొనువాడు కాదు, కానీ, “విశ్వసించువాడు.” “నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడును చేయును.” ఎందుకు? అతడు కూడా అదే బండకు లంగరు వేయబడియున్నాడు. బండ అనగా ఏమిటి? అది ఎల్లపుడూ, వాక్యమే. నీవు అక్కడ లంగరు వేయబడియున్నావు. సముద్రములో నీవు తప్పిపోయినప్పుడు అది నీకు ఉత్తర నక్షత్రమైయున్నది.
151 మీకు తెలుసా, మనకు చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ కదలకుండా ఉండే, ఒకే ఒక నిజమైన నక్షత్రము కలదు. అది ఉత్తర నక్షత్రమైయున్నది, ఎందుకనగా అది భూమికి మధ్యలో ఉంటుంది. మీరు పైన ఉన్నప్పటికీ, మీరు వెనకాల ఉన్నప్పటికీ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ ఉత్తర నక్షత్రము ఒకే విధంగా ఉంటుంది. అది మీ ఉత్తర నక్షత్రమైయున్నది. ఇప్పుడు, మీరు చూశారా, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తరలిపోయే నక్షత్రములు ఎన్నోకలవు. కానీ మీరు ఒకవేళ…సముద్రము మీద ఉన్నప్పుడు, ఎందుకు, ఏ నావికునికైనా అది తెలుసు, లేదా అడవులలో సంచరించు ఏ వేటగానికైనా, మీ ఉత్తర నక్షత్రమే మీ—మీ చోటు అని తెలుసు. అంతే. పిదప, అది మీ—మీ—మీకు దిక్సూచివలె ఉన్నది. మీ దిక్సూచి బుధుడు, లేదా అంగారకుడు, లేదా మొదలైన గ్రహాలవైపు చూపించదు. అది ఉత్తర నక్షత్రము వైపు చూపిస్తుంది. ఎందుకు? అది మీ సంపూర్ణతైయున్నది.
152 ఓ, మై! గమనించండి, మీ సంపూర్ణత! ఓ, నేను ఒక విషయాన్ని చెప్పబోవుచున్నాను! అది వస్తున్నట్లుగా నేను అనుభూతి చెందుచున్నాను. గమనించండి. ఈ సమయంలో నేనెంతగానో భక్తిపార్వశాన్ని పొందుచున్నాను, ఎందుకనగా ఇది నిశ్చయతైయున్నది. గమనించండి.
153 మీ దిక్సూచి, ఉత్తర నక్షత్రమును మాత్రమే చూపించగలదు. ఆ ఒక్క వైపును మాత్రమే అది సూచించగలదు. అది ఒక నిజమైన దిక్సూచియైతే, ప్రతిసారి అది ఉత్తర నక్షత్రమును చూపిస్తుంది. అది నిజమేనా?
154 అలాగైతే, మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నయెడల, అది కేవలం వాక్యమును మాత్రమే చూపిస్తుంది. అది ఎన్నడూ మతశాఖల వైపు చూపించదు. అది ఎన్నడూ ఒక సిద్ధాంతము వైపు చూపించదు. అది ఎప్పటికీ ఏదో ఒక స్థలమును చూపించదు. అది నేరుగా వాక్యము వైపు చూపిస్తుంది. నాకు కేకలు వేయాలని అనిపిస్తుంది. గమనించండి, వాక్యమైయున్న యేసుక్రీస్తు, అనే మీ నక్షత్రము, అచ్చట ఉండుటను మీరు చూసినప్పుడు, అది—అది ఒక మనుష్యుని లోపల, ఏదో స్పందించుటయైయున్నది. మరియు మీలోనున్న ఆత్మ దానిని కుడికైనను ఎడమకైనను తొలగకుండునట్లు చేయుటను మీరు చూస్తారు. ఆయన మాత్రమే దానిని చేయగలడు. ఆయన దేవుని కార్యములను తీసుకొని, మరియు వాటిని చూపుటకు, ప్రత్యక్షపరచుటకు వచ్చియున్నాడు.
155 మరియు యేసు ఇట్లు చెప్పెను, “ఆయన సరిగ్గా నేను చెప్పిన ఆ కార్యములనే చేయును. సంభవింపబోవు సంగతులను ఆయన మీకు తెలియజేయును,” సమయమింకా రాకముందే, అవి జరుగకముందే వాటిని మీకు చూపించును. చూశారా? “ఆయన నా కార్యములను తీసుకొని మరియు వాటిని మీకు చూపించును, మరియు పిదప జరుగబోవు సంగతులను ఆయన మీకు చూపించును.” యోహాను 15.
156 ఆయన సంగతులను చూపించునని మనము చూశాము. మరియు ఆయన దేవుని కార్యములను తీసుకొని వాటిని మీకు చూపించును. మరియు యేసు చెప్పిన సంగతులను ఆయన మీకు బయలుపరచును. మరొక మాటలో చెప్పాలంటే, ఆయన కార్యమును తేటపరచును. ఈ రాత్రివేళ దానిని ఒక మూలకి ఉంచండి, ఎందుకనగా కొద్దిసేపట్లో, దానిని మనం వినియోగించబోవుచున్నాము. అది వాస్తవమైనదని, దానిని రూఢీపరచెదము, చూడండి, అప్పుడు మీరు ఎరుగుదురు. మీరు గనుక…మీ ఉత్తర నక్షత్రము, అది ఏ క్రైస్తవునికైనా వాక్యమేయైయున్నది.
157 వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనను! చూడండి. నన్ను మీకొక సంగతిని చెప్పనివ్వండి. దీనిని జాగ్రతగా వినండి. ఇది దేవునియొక్క పూర్తి దైవిక ప్రత్యక్షత, ఆయన చిత్తము, మరియు క్రీస్తు యొక్క రాకడయైయున్నది. మరియు ప్రతీది పూర్తిచేయబడి, ఈ గ్రంథములో ఉన్నది. మరియు ఏదైనా దానినుండి మిమ్మల్ని దూరంగా లాగివేసినట్లయితే, ఆ దిక్సూచిని పారవేయండి, ఎందుకనగా అది కేవలం ఒక సిద్ధాంతమైయున్నది. అది కేవలము ఒక సంస్థ-…అది కేవలం మీరు మీ జేబులో పెట్టుకున్న ఒక కాగితము మాత్రమే, అది చట్రములో బిగించబడి మీ గదిలో వ్రేలాడదీయబడినది. అది ఒక సిద్ధాంతమైయున్నది. మరప్పుడు, మిమ్మల్ని వాక్యము వైపునకు త్రిప్పే ఆ దిక్సూచిని కనుగొనండి. ఆమేన్.
158 మీరు గమనించండి, ఈ అనుభవము పౌలును తాకినప్పుడు, అతడు ఐగుప్తు మరియు అరేబియాలో, ఎక్కడికో వెళ్ళి, మరియు మూడు సంవత్సరాలు ధ్యానించాడు. మహిమ! వ్యూ! అతడు నిశ్చయతను కలిగియుండవలసియున్నది. మరియు అతడు చూచినప్పుడు, వాక్యము వెంబడి వాక్యముతో, పరిశుద్ధాత్మ అతణ్ణి నడిపించినప్పుడు, అతడు ఆ హెబ్రీ పుస్తకమును వ్రాసి మరియు యూదులకు చూపించగలిగెను. నిశ్చయంగా. ఎందుకని? అతడు కేంద్రీకృతుడైనాడు. పరిశుద్ధాత్మ అనే ఆ దిక్సూచి అతణ్ణి నేరుగా ఆ ఉత్తర నక్షత్రము వద్దనే ఉంచినది.
159 ఇప్పుడు, ఏదైనా నిన్ను దాని నుండి దూరముగా లాగుచున్నట్లయితే, నీవు దానిని విడిచిపెట్టుట మంచిది. కుమారుడు, అది ఆయన వాక్యమువైపుకు చూపిస్తుంది, మరియు కేవలం ఆయన వాక్యమువైపుకు మాత్రమే, ఎందుకనగా దేవుని వాగ్దానములను ప్రత్యక్షపరచుటకు, లేదా నిర్ధారించుటకు, పరిశుద్ధాత్మ వచ్చెను. ఏ సిద్ధాంతము దానిని చేయదు. ఏ మతసంస్థ దానిని చేయదు. ఏ శక్తులు లేదా ఏదియూ దానిని చేయలేదు. కేవలం వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ మాత్రమే చేయును. మరియు ఆయనే ఆ బీజమైయున్నాడు.
160 ఇప్పుడు, మీరొక గోధుమ గింజను తీసుకొనండి, ఒక మంచి గోధుమ గింజ, కానీ అది ఏమీ చేయలేదు. ఆ మొలక వచ్చే వరకు అది చచ్చినదే. అప్పుడు అది అనేక గోధుమ గింజలను ఉత్పతి చేస్తుంది.
161 మరియు క్రీస్తే ఆ జీవము, ఆ సంపూర్ణతైయున్నాడు. ఆ గోధుమ గింజ దానిలో ఆ సంపూర్ణతను కలిగిలేనియెడల, అది ఎప్పటికీ మొలకెత్తదు. ఆ గోధుమ ఆ సంపూర్ణతను కలిగిలేనట్లైతే, అది బాహ్యంగా ఎంతో అందముగా ఉండవచ్చును, కానీ అది జీవించలేదు, ఎందుకనగా జీవించుటకు దానిలో ఏదియు లేదు. అయితే అది ఆ సంపూర్ణతను పొందుకున్నప్పుడు, అది విమర్శకులందరి మొఖం మీదనే ఇట్లు చెప్పగలదు, “నేను మరలా లేచెదను.” ఎందుకు? ఎందుకనగా అది ఆ సంపూర్ణతను కలిగియున్నది. అది దానిలో ఉన్నది. అది తిరిగి మొలకెత్తవలసి యున్నది. మరియు అది…“నాయందు మీరును, మీయందు నా మాటలును నిలచియుండినయెడల, అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి.” అదే ఆ సంపూర్ణత.
162 కానీ మీరు సిద్ధాంతములు మరియు ఇతర కార్యములను దానితో కలిపినట్లయితే, మీరు నీటిని మరియు నూనెను కలపలేరు. మీరు దానిని తీసుకొని మరియు మీకు కావలసిన విధంగా విచ్ఛిన్నం చేయండి, అవి ఎప్పటికీ కలవవు, ఎందుకంటే అవి రెండు వేర్వేరు రసాయనాలైయున్నవి. మరియు మీరు బైబిలుకు వ్యతిరేకంగా, సిద్ధాంతమును మరియు బైబిలును, కలపలేరు. మీరు మతశాఖను మరియు స్వేచ్చగా-జన్మించిన మతమును, లేదా స్వేచ్చగా-జన్మించిన రక్షణను తీసుకొని, వాటిని మిళితము చేయలేరు. ఎందుకనగా, నిశ్చయంగా, దేవుడు వ్యవహరించేది…
163 ఏ విధంగానైనా, నేను దీనిని చెప్తాను. దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను బ్రద్దలు చేయడు. ఆయన దానిని బ్రద్దలు చేయలేడు, ఎందుకనగా ఆయన అనంతుడు. మరియు నేను గ్రహించాను, మీకు తెలుసు, నేను, అది అనేకమంది ప్రజల దగ్గరకు వెళ్తుంది. చూశారా? కానీ దేవుడు తన ప్రణాళికను భంగపరచలేడు. ఆయన ఒక రోజు ఒక కార్యమును చేసి, మరియు దానిని మార్చివేసి, ఆ రోజు అది తప్పని చెప్పుచూ, వేరొక దానిని చేయలేడు.
164 దేవుడు మనుష్యుల గుంపులతో వ్యవహరించడు. దేవుడు ఒక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు, ఎందుకనగా మనుష్యులు భిన్నమైన ఆలోచనలు కలిగియుంటారు. అతడు స్వాభావికముగా, భిన్నముగా నిర్మించబడ్డాడు. దేవుడు ఆ మనుష్యుని తీసుకొని, అతణ్ణి ఆయన యొక్క స్వభావములోనికి తెచ్చువరకు, అతడిని అల్లకల్లోలము చేసి, స్వయంగా తన నుండి తననే, బయటకు లాగవలసియున్నది. చూశారా? మరియు అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో వ్యవహరిస్తాడు. యుగములన్నిటి గుండా చూడండి, నోవహు మరియు మోషే, ఆ ప్రవక్తలు, వారిలో ఏ ఇద్దరు కూడా ఒకే సమయంలో లేరు. ఆ కాలమంతటికి, నిరంతరమూ ఒక్కరే యుండిరి.
కావున, మీరిట్లు చెప్పవచ్చు, “ఆలోచన చెప్పువారు అనేకులుండుట క్షేమము.”
165 చూడండి, ఈ మందిరములో కొద్ది కాలం క్రితం, నేను ప్రసంగించిన విధంగా ఉన్నది. అక్కడ ఆహాబు మరియు యెహోషాపాతు ఉన్నారు. మరియు వారు రామో-త్గిలాదు మీదికి, దండెత్తి వెళ్ళుచుండిరి. ప్రాథమికంగా, వారు సరియే, ఆ దేశము వారికి చెందినదే. మరియు ఆ—ఆ శత్రువులు, అక్కడున్న ఆ సిరియనులు, ఇశ్రాయేలీయులు భుజించవలసిన గోధుమలతో వారి పిల్లల కడుపులను నింపుచుండిరి. అది దేవుడు-అనుగ్రహించిన ఆస్తి, కాబట్టి, ప్రాథమికంగా, అది సరిగానే కనిపించినది. “నాతో రమ్ము, మనము అక్కడికి వెళ్ళి, మరియు వారిని దేశములో నుండి తరిమివేద్దాము.” సరే, వినడానికి అది చాలా బాగుంది. ప్రాథమికంగా, అది సరియే, కానీ దాని షరతులు.
166 ఒక మంచి వ్యక్తియైయుండి, యెహోషాపాతు, ఇట్లు చెప్పెను, “అయితే మనం ప్రభువుయొద్ద విచారణ చేయవద్దా?”
167 అవును, ఆహాబు, ఆ పడిపోయిన వ్యక్తి, ఇట్లన్నాడు, “మంచిది, నిశ్చయంగా.” మీకు తెలుసు కదా, అతడొక సరిహద్దు విశ్వాసి. ఇట్లన్నాడు, “ఓహ్, ఖచ్చితంగా, నేను దానిని గూర్చి ఆలోచించియుండవలసినది. నా దగ్గర నాలుగు వందల మంది హెబ్రీ ప్రవక్తలు ఉన్నారు. వారు నాలుగు వందల మంది యున్నారు, నేను వారిని పోషించుచూ సంరక్షించుచున్నాను. ఈ దేశములోనే వారు శ్రేష్ఠమైనవారు. మనము వారిని తీసుకువద్దాము.”
168 మరియు వారందరూ కలసి, ఒక్క అభిప్రాయముతో, ఇట్లు చెప్పిరి, “నీవు వెళ్ళుము. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు.” ప్రాథమికంగా, వారు చెప్పినది నిజమే, కానీ వారు ఆ సంపూర్ణతను పట్టుకొనలేదు.
అప్పుడు అతడు ఇట్లడిగాడు, “ఇంకెవరైనా ఉన్నారా?”
169 అతడన్నాడు, “ఔను. ఇంకొక్కడు ఉన్నాడు, కానీ నేను అతడిని ద్వేషించుచున్నాను.” అతడిట్లు చెప్పాడు, “అతడు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీడునే పలుకుతాడు, చూడండి, ఎల్లప్పుడూ చెప్తుంటాడు.”
170 వాక్యము అంతయు అనగా అతడికి ముందున్న ఏలీయా, “కుక్కలు నీ రక్తమును నాకును,” అని ఆహాబుతో చెప్పినప్పుడు, అతడు ఎలా మేలును ప్రవచించగలడు? ఇప్పుడు, ఆ నిర్ధారించబడిన ప్రవక్త దేవుని చిత్తముకాని దేనినైనా ఎలా చెప్పగలడు? మరియు, ఇట్లు చెప్పబడెను, “కుక్కలు యెజెబేలును తినును, మరియు, ‘యెజెబేలు ఇక్కడ పడియున్నది,’ అని ఎవరూ చెప్పకుండునట్లు ఆ పొలములో పెంట పడియుండును.” ఒక మనుష్యుడి మీద అటువంటి ఒక శాపము ఉండగా, వేరెవరైనా గాని ఎలా ఆశీర్వదించగలరు?
171 ఈనాడు ఆ విధంగానే ఉన్నది. ఎల్లపుడూ దేవుని నుండి ప్రజలను దూరంగా తీసుకొనిపోవుచున్న ఈ కార్యములను ఒక వ్యక్తి ఎలా ఆశీర్వదించగలడు? నీ కొరకు నీవు నిలబడాలంటే, చేయవలసినది ఒకే ఒక్కటి ఉన్నది: నీవు సంపూర్ణతను కలిగియుంటే, ప్రభువు నామములో ఆ కార్యమును శపించి, మరియు దీనితో నిలిచియుండుము.
మీరు ఇట్లు అనవచ్చు, “మంచిది, సహోదరుడా బ్రెన్హామ్, ప్రజలు నిన్ను ద్వేషించులాగున నీవు చేయుచున్నావు.”
172 దేవుడు నన్ను ప్రేమిస్తాడు. అదే నా సంపూర్ణత. శరీరులపై ఆధారపడలేరు. దేవుడు ఏమి చేయమని చెప్పాడో, అట్టి వాక్యము మీద మీరు ఆధారపడాల్సియున్నది.
173 తాను సరియేనని మీకాయాకి ఎలా తెలుసు? అతడు కనిపెట్టాడు. అతనికి ఒక దర్శనము కలిగినది. వారికి కూడా దర్శనము వచ్చినది, కానీ ఆ దర్శనము వాక్యముతో సరిపోల్చబడలేదు. మరియు ఈ దినమున కూడా, అదే సంగతి. మీకాయా తన దర్శనమును వాక్యముతో పోల్చి చూశాడు, మరప్పుడు తాను మరియు ఆ వాక్యము కలిసియుండుటను అతడు చూసెను. ఈనాడు, ఒకవేళ మీ దర్శనము వాక్యమునకు విరుద్ధముగా ఉన్నట్లయితే, దానిని విడిచిపెట్టండి, ఎందుకనగా అది తప్పుడు సంపూర్ణతైయున్నది. మీకాయా యొక్క సంపూర్ణత ఖచ్చితంగా వాక్యానుసారమైయున్నది, కావున అతడు నిలబడి ఏమి చెప్పాడో, దానిని అతడు చెప్పి, మరియు—మరియు దానిని నమ్మగలిగాడు.
174 వారు, అతణ్ణి నోటి మీద కొట్టి, ఇట్లడిగినప్పుడు, “దేవుని ఆత్మ ఏ మార్గమున పోయెను?”
175 అతడు ఇట్లు చెప్పెను, “నీవు లోపలి గదిలోనికి వెళ్ళినప్పుడు దానిని తెలుసుకొందువు.” నిజము.
176 అతడు చెప్పాడు, “నేను సురక్షితంగా వచ్చినప్పుడు…మీరు ఈ వ్యక్తిని కారాగారములో బంధించండి, మరియు నేను సురక్షితంగా తిరిగి వచ్చినప్పుడు,” ఆహాబు ఇంకా ఇట్లన్నాడు, “ఈ వ్యక్తి సంగతి నేను చూస్తాను.”
177 ఓ, ఇప్పుడు, మీకాయా, దాని సంగతి ఏమిటి? అతడు తిరిగి వచ్చిన తర్వాత నీ తల నరికివేయబడుతుంది. మీకాయా స్తెఫను నిలబడినట్లుగానే స్థిరంగా నిలుచున్నాడు. ఆమేన్. నా ప్రభువు ఇష్టపూర్వకముగా సిలువనొద్దకు వెళ్ళినట్లుగానే యున్నది. ఎంత సులభంగా దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళాడో, లేదా షద్రకు, మేషాకు మరియు అబేద్నెగో ఆ అగ్నిగుండములోనికి వెళ్ళారో అంతే సులభంగా అయ్యున్నది. ఖచ్చితంగా! అతడు అక్కడ నిలబడి ఇట్లు చెప్పెను, “నీవు అసలు తిరిగివస్తే…” ఎందుకు? అతడు సంపూర్ణతను కలిగియున్నాడు. “నీవు అసలు తిరిగివస్తే, దేవుడు నాతో మాట్లాడనే లేదు. అప్పుడు నా తలను నరికివేయుము.” అతనికి సంపూర్ణత కలదు. అతణ్ణి ఈ దర్శనమునకు నడిపించిన, తన దిక్సూచి, సరిగ్గా ఆ ఉత్తర నక్షత్రముతో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు. అవును, అయ్యా. అతడి లంగరు పట్టుకొనియున్నది, అవును, అది వాక్యము మరియు అది మాత్రమే.
నీ సంపూర్ణత, నీ జీవితములో ఒక సంపూర్ణతను నీవు కలిగియుంటే…
178 మీకు తెలుసా, ఒకానొక సమయంలో ఆచార వ్యవహారాలకు కూడా, ఒక సంపూర్ణత ఉండేది. నాకు ఆ స్త్రీ పేరు గుర్తుకు రావడం లేదు, కానీ ఆమె చెప్పిన మాటను దేశమంతా విశ్వసించినది. ఆమె పేరు నేను మర్చిపోయాను. నేనిక్కడ ఒక నోట్సు వ్రాశాను. ఆ స్త్రీ పేరు ఏమైయున్నదో, నేను ఆలోచించలేకపోవుచున్నాను. కానీ ఇక్కడ, కొన్ని సంవత్సరాల క్రితం, ఆ స్త్రీ, మరి ఆమె చెప్పినట్లే, వారు ఉండవలసియున్నది. ఆ కత్తిని ఎడమ చేతితో వాడండి అని ఆమె చెప్పినట్లయితే, అది—అది అంతే, అదొక సంపూర్ణత. ఆమె వాటన్నింటికి ఆ—ఆ జవాబైయున్నది. మరియు మీరు ఎడమ చేతితో ఫోర్కు పట్టుకున్నట్లయితే, అప్పుడు మీరు ఖచ్చితంగా తప్పు. ఆమె పేరు ఏమిటి? [సంఘము, “ఎమిలీ పోస్ట్,” అని చెప్తున్నారు—సంపా.] ఓ, అంతే. నిశ్చయంగా. అవును. అది ఆమేయైయున్నది. ఇప్పుడు, మీరు—మీరు సంపూర్ణతైయున్నారు…ఆమె—ఆమె ఆచార వ్యవహారాలకు సంపూర్ణతైయున్నది. “అది ఆ విధంగా ఉండవలసియున్నది.” అటువంటివి, ఓ, మనము అనేక సంగతులు అలాంటివి కనుగొంటాము. కానీ, ఇప్పుడు అవి గతించిపోయాయని మనం కనుగొన్నాము. మీరు కావాలనుకున్నట్లు తినండి. అవును, అయ్యా. సరే మంచిది. అయితే అది మర్యాదల యొక్క సంపూర్ణత. “దానిని ఆ విధంగానే చేయాలి.”
179 ఒకానొక సమయంలో అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ యొక్క సంపూర్ణతైయున్నాడు, అతడు ఏది చెబితే అదే. అతడు, “దూకండి,” అని చెబితే, వారు దూకారు. అతడు, “చంపండి,” అని చెబితే, వారు చంపారు. అతడు తల ఊపినప్పుడు, లక్షలాదిమంది యూదులను చంపారు. ఆ విధమైన సంపూర్ణతకు ఏమి జరిగినదో మీకు తెలుసా? అది శక్తిలా కనిపించినది, కానీ అది వాక్యమునకు విరుద్ధమైయున్నది.
“అది వాక్యమునకు విరుద్ధమైయున్నదని మీకు ఎలా తెలుసు?”
180 దేవుడు చెప్పాడు. బిలాము ఇశ్రాయేలీయులను చూసి, వారిని శపించుటకు ప్రయత్నించినప్పుడు, అతడు ఇట్లు చెప్పాడు, “నేను అతడిని ఒక గురుపోతువలె చూస్తున్నాను. నీ గుడారములు ఎంత నీతిగలవి! నిన్ను శపించువారు శపించబడుదురు. నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడుదురు.”
181 హిట్లర్ దానిని చూడగలిగి ఉండాల్సినది. ఆ జర్మను క్రైస్తవులు దానిని చూడగలిగి ఉండాల్సినట్లు అనిపించుచున్నది, చూడండి, ఆ సంపూర్ణత. అది ఖచ్చితంగా ఆ వాక్యమునకు విరుద్ధమైనది. మీకు తెలుసా, అది ఇలాగు చెప్పబడినది, “మనుష్యుడు…దేవుడు మానవుడిని సృజించాడు, కానీ మానవుడు బానిసలను తయారుచేశాడు.” ఒకరు మరొకరిని ఏలుటకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఒకేఒక పరిపాలకుడున్నాడు, ఆయన దేవుడే.
182 అయితే హిట్లర్ జర్మనీ యొక్క సంపూర్ణతైయున్నాడు. ఈనాడు దానిని చూడండి. ఇప్పుడు, ఏమి జరిగినదో చూశారా? అది తప్పుడు సంపూర్ణతైయున్నది. ఎందుకు? అది వాక్యమునకు విరుద్ధముగా ఉన్నది. మరియు ఇప్పుడు అదంతా ఎక్కడికి వెళ్ళినదో మీరు చూడండి: అవమానము.
183 మరియు మీ సంపూర్ణత ఏదో మతశాఖ మీద, లేదా ఏదో ఉద్రేకము మీద ఉన్నట్లయితే, లేదా యేసుక్రీస్తు అనే వ్యక్తి మీద కాకుండా మరి దేని మీదనో ఉన్నట్లయితే, మీరు కూడా అదే అవమానకరమైన స్థితికి, కేవలం హీనమైన స్థితికి వెళ్తారు, చూడండి, మీ సంపూర్ణత క్రీస్తు కానిచో అట్లుండును. మానవ జీవితానికి అదే కేంద్ర స్థానమైయున్నది, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు; మీ సంఘము కాదు, మీ మాట కాదు. వాక్యము! చూశారా? “ఈ సంపూర్ణత మీద నా సంఘమును నేను కట్టుదును,” వాక్యమైయున్న, క్రీస్తు మీద.
184 ఒకానొక సమయంలో ముస్సోలిని రోము యొక్క సంపూర్ణతగా ఉన్నాడు. నాకు తెలియదు, బహుశా నేనొక సంచికను చదివియుండవచ్చును, లేదా దానిని నేనొక పుస్తకములో చదివియుండవచ్చును, లేదా ఎవరో నాకు చెప్పియుండవచ్చును, కానీ ఎవరో ముస్సోలిని ద్వారా ఇంటర్వ్యూ చేయబడుచున్నప్పుడు. అతడు…
185 అతడు రోమును క్రీడలలోనికి, తీకుసురావాలని కోరు—కోరుకున్నాడు. మరియు అక్కడ, అతడిది క్రీడకు సంబంధించిన, ఒక పెద్ద విగ్రహము ఉండేది. అది సరియే. గ్రీకువారికి చాలా ఏండ్ల నుండి ఆ ఆలోచన ఉన్నది. రోము ఎల్లప్పుడు దానిని కలిగియుండుటకు ప్రయత్నించినది. క్రీడలు మంచివే, కానీ—కానీ క్రీడలు. అయితే—అయితే గుర్తుంచుకొనండి, అవి క్రీస్తు యొక్క స్థానమును తీసుకోలేవు. నీవెంత దృఢముగా ఉన్నప్పటికీ, దానితో ఏ సంబంధము లేదు. ఆయనే సర్వ-శక్తిమంతుడు. మరియు అతడు రోమును దేని మీద నిర్మించడానికి ప్రయత్నిచాడో చూడండి. మరియు అతడు ఒక సంపూర్ణతపై రోమును కట్టాలని ప్రయత్నించాడు, మరి తానే ఆ సంపూర్ణతగా ఉన్నాడు.
186 మరియు వారు చెప్పారు, ఒక దినమున, అతడి—అతడి—అతడి డ్రైవరు ఒక నిమిషం ముందు వచ్చాడని, అతడు వాణ్ణి కాల్చివేశాడు. అతడు అన్నాడు, “నేనిట్లు చెప్పలేదు, ‘తొమ్మిదికి ఒక నిమిషము ముందుగా రమ్ము.’ నేనన్నాను, ‘తొమ్మిది గంటలకు ఇక్కడ ఉండుము.”’ పౌ! మరియు అతడిని కాల్చివేశాడు. చూశారా? చూశారా? “నీవు ఇక్కడికి ఒక్క నిమిషము ముందుగా రావడం నాకు ఇష్టము లేదు. నీవిక్కడికి తొమ్మిది గంటలకు రావడం నాకు కావాలి.” చూశారా? అతడు తనను తాను ఎటువంటి సంపూర్ణతగా చేసికొనుటకు ప్రయత్నించాడో చూడండి. అయితే ఏమి జరిగినదో మీరు చూశారా?
187 ఇక్కడున్న మీలో చాలామంది, పాత-కాలపు వారు, మీకు గుర్తుంది కదా, రాయ్ స్లాటర్, బహుశా, మరియు ఆ వెనుక ఉన్నవారు, నేనక్కడ ప్రవచనమును గూర్చి చెప్పినది మీకు గుర్తుండియుంటుంది. ఒక దినమున, మనము అసలు ఇక్కడికి రాకముందు, అక్కడ ఆ ఆడ్ ఫెలోస్ భవనము వద్ద, నేనిట్లు చెప్పాను, “ముస్సోలిని ఒక అవమానకరమైన అంతమునకు వస్తాడు.” నేను అన్నాను, “అతడు తన మొదటి దండయాత్ర, ఇథియోఫియా మీద చేస్తాడు, మరియు ఇథియోఫియా అతని కాళ్ళ వద్ద పడుతుంది. కానీ అతడు తన అంతమునకు వస్తాడు, మరియు ఎవ్వరూ అతడికి సహాయము చేయరు. అవమానకరముగా అతడు పాతిపెట్టబడతాడు.” అతడు అలాగే అయ్యాడు.
188 నేనిట్లు చెప్పాను, “మూడు ఇజములు లేస్తాయి. నాజీయిజం, ఫాసిజం, మరియు కమ్యూనిజం.” నేనిట్లు చెప్పాను, “ఆ ఇజములు అన్నియు తిరిగి ఒక్కటిగా కలసిపోతాయి, మరది కమ్యూనిజం అవుతుంది. గమనించండి. కమ్యూనిజం రోమును తగలబెడుతుంది.” చూశారా?
189 మీరు దానిని గమనించండి. అహ-హ. అది దేవుని చేతిలో ఒక సాధనమైయున్నది. తాము దేవునికి వ్యతిరేకమని వారు తలంచుచున్నారు. వారు ఎల్లపుడూ, నేరుగా దానిలోనికే పని చేయుచున్నారు, కానీ దానిని ఎరుగకయున్నారు. ఆయన వారిని కేవలం కీలుబొమ్మవలె వాడుకొనుచున్నాడు, అహ-హ, ఆయన చేతిలో ఒక సాధనము, ఆయన నెబుకద్నేజరుకు మరియు అనేకులకు ఆ విధంగానే చేసియున్నాడు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, చూశారా.
190 ఐగుప్తునకు ఫరో ఒక సంపూర్ణతగా ఉన్న కాలము ఒకటి యున్నది, కానీ ఇప్పుడది ఎక్కడ ఉన్నదో చూడండి. చూశారా? అదంతా విఫలమైనది.
191 ఓ, అవి ఒక తప్పుడు విధానమైనవి, కాబట్టే అవి ఎప్పుడూ విఫలమవుతుంటాయి. అవి మానవ-నిర్మితమైన సంపూర్ణతలు. మీరొక మానవ-నిర్మితమైన సంపూర్ణతను తీసుకోలేరు. ఒకవేళ అది ఒక—ఒక అధ్యక్షుడైనా, ఒక నియంతయైనా, ఒక రాజైనా, ఒక సంఘమైనా, ఒక మతశాఖ అయినా, ఒక సిద్ధాంతమైనా, నేను లక్ష్యపెట్టను. సరిగ్గా యుగములన్నిటిలో అటువంటి సంపూర్ణతలన్నీ నశించిపోయినట్లుగానే, వాటిలో ఏదైననూ నశించిపోవును.
192 మనం వెనక్కి చూడవచ్చు. వెనుకకు చూడండి. చక్రవర్తులను నమ్మిన మనుష్యులను చూడండి. నియంతలను నమ్మిన మనుష్యులను చూడండి. అటువంటి సంపూర్ణతల మీద తమ ఆశలు పెట్టుకున్నమనుష్యులను చూడండి, మరియు ఈనాడు వారు ఎక్కడ ఉన్నారో చూడండి.
193 ఇప్పుడు మనము వెనుకకు తిరిగి మరియు తమ నిరీక్షణను బైబిలు మీద పెట్టుకున్నవారిని, దేవుని వాక్యము మీద పెట్టుకున్నవారిని మరియు దానిని ఒక సంపూర్ణతగా తీసుకున్నవారిని చూద్దాము. వారు ఇప్పుడు ఎక్కడున్నారో చూద్దాము.
194 వారేమి చేసారని, హెబ్రీ 11వ అధ్యాయంలో, పౌలు వారిని గూర్చి, మీకు కొంచెము క్లుప్తముగా చెప్పాడు. “వారు రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, మరియు మొదలగువాటిని చేసిరి. మరియు వారు గొర్రె చర్మములను మరియు మేక చర్మములను ధరించుకొని సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.” [టేపుపై ఖాళీ యున్నది—సంపా.] ఆ శ్రేష్ఠమైన పునరుత్థానము కొరకు మహిమలో వేచియుండిరి. చూశారా? అది సరియే. ఏలయనగా, వారిలో కొందరు, ఈ—ఈ అద్భుతములను పొందలేదు, మరియు ఆ పునరుత్థానము కొరకు ఎదురుచూస్తూ, ఎలాగైనా వారు తమ శరీరాలను సమర్పించారు. వారు తమ ప్రాణాలను కోల్పోవుటను, వారు ఎంత మాత్రము లక్ష్యపెట్టలేదు. వారు ఆ పునరుత్థానమును పొందునట్లు, వారు వెళ్ళి తమను తాము బలియర్పణగా చేసుకొనగోరారు, మరియు వారు దానినే చేశారు.
ఇప్పుడు, సంపూర్ణతలు, మనము సంపూర్ణత గూర్చి మాట్లాడుచున్నాము.
195 మీకు తెలుసుకదా, మన సుప్రీం కోర్టు ఒక సంపూర్ణతైయున్నది. అదొక సంపూర్ణత. ఈ దేశములోనున్న వివాదాలన్నిటికి అది—అది తుది ముగింపు. అది నిజము. మన సుప్రీం కోర్టులో, వారి నిర్ణయమే ఒక సంపూర్ణతైయున్నది. అవును. ఓ, కొన్నిసార్లు మనము దానిని ఇష్టపడము అని నాకు తెలుసు, అయితే ఏదేమైనాగానీ, అది—అది ఒక సంపూర్ణతైయున్నది. అవును, అయ్యా. అది మనకు లేనియెడల ఏమగును? అప్పుడు ఏమిటి? కానీ అదొక సంపూర్ణతైయున్నది. అవును నిశ్చయంగా. ఎందుకు? అది, మన దేశము, దానికి ముడివేయబడియున్నది. ఆ సుప్రీం కోర్టు చివరికి వారి తుది నిర్ణయమును తీసుకున్నప్పుడు, ఇక అంతే. ఇంకేమీ లేదు. దాని తర్వాత నీవెక్కడికి వెళ్తావు? నీవు కేవలం వారి నిర్ణయమును అనుసరించాలి. అంతే. మీరు తప్పకుండా అనుసరించాలి. వారే చివరి మాట. వారే ఆమేన్.
196 మీరు స్థానిక పట్టణ న్యాయస్థానాలలో ప్రయత్నించవచ్చు. నీవు మేజిస్ట్రేట్ వద్ద ప్రయత్నించవచ్చు, తర్వాత ఫెడరల్ కోర్టుకు వెళ్ళవచ్చు, అన్ని రకాల కోర్టులకు, మరియు ఫెడరల్ కోర్టులకు వెళ్ళవచ్చు. కానీ మనము సుప్రీం కోర్టుకు వచ్చినప్పుడు, ఇక అంతే. అవును. కొన్నిసార్లు, “మంచిది, వారి నిర్ణయం నాకు నచ్చలేదు,” అని చెప్పుటకు మనం ఇష్టపడము, కానీ ఒక్కసారైనా మీరు దాని నుండి తప్పించుకొనుటకు ప్రయత్నిస్తారు. అది దేశముయొక్క సంపూర్ణత. మరియు మనము దానిని కలిగిలేనిచో ఏంటి పరిస్థితి? అవును.
197 మనమొక సంపూర్ణతను కలిగియుండవలసియున్నది. ప్రతి ఒక్కరూ ఒకటి కలిగియుండాలి. మీరు ఒక దానిని కలిగియున్నారు. అయితే ఈ నేపథ్యంలో, సంపూర్ణతలు అంటే ఏమిటో మీకు చూపించుటకు నేను ప్రయత్నిస్తున్నాను.
198 ఇప్పుడు ఒక దేశముయొక్క సుప్రీం కోర్టు ఆ దేశముయొక్క సంపూర్ణతైయున్నది. ఏ రకమైన వివాదములోనైనా అదే చిట్టచివరి కార్యము. వారు దానిని పరిష్కరిస్తారు. వారేమి చెబితే, అదే.
199 ఒక బంతి ఆటలో ఒక సంపూర్ణత కలదు. అది ఆ అంపైర్. ఓ, అవును. కొన్నిసార్లు, మనము కూడా అతడి నిర్ణయమును ఇష్టపడము, అయితే ఏదేమైనా కానీ, అది—అది—అది అంతే. ఇతరులు ఏమి చెప్పినా సరే, ఆ అంపైర్ యొక్క నిర్ణయమే, అంతిమ నిర్ణయము, అది నిజము. అది తప్పిపోయెను అని అతడు చెబితే, అది తప్పిపోవడమే. అది నిజము. నిశ్చయంగా. ఇతరులు ఏమి చెప్పినా సరే, దానితో ఎట్టి సంబంధము లేదు. మరియు మనం కేవలం దాని గూర్చి ఆలోచించుదాము. ఒకవేళ నీవు…నేను బంతి ఆటలకు వెళ్ళను, కానీ దాని గూర్చి వ్రాసుకొనుట జరిగినది. ఒక అంపైరు, బంతి ఆటలో తానే ఆ సంపూర్ణతైయున్నాడు.
200 వారిలో ఒకరు ఇట్లంటారు, “అది ప్రక్కకు వెళ్ళిన బంతి.” మరొకరు ఇట్లంటారు, “నీవొక అబద్ధికుడవు.” ఇతడు చెప్తాడు, “ఇది ఆ విధంగా ఉన్నది. నీవు ఇటుగా ఉండవలసియున్నది.”
201 అంపైరు, “తప్పిపోయినది!” అని చెప్పాడు. చూడండి ఆ మిగతావారు వారి చోటులోనికి వెళ్ళి మరియు కూర్చుంటారు. అది వారిలో కొందరికి చిరాకు పుట్టిస్తుంది. అయితే వారు తమ హృదయములో, అతడిని తిట్టుకుంటారని, మరియు అట్టివి చేస్తారని నేను ఉహించుచున్నాను, కానీ ఏది ఏమైనప్పటికినీ అది “తప్పిపోవుట” అయ్యున్నది. ఎందుకు? అతడిదే చివరిమాట.
202 మొదటి ఆటగాడు ఇట్లన్నాడు, “అది ప్రక్కకు పోయినదని మీకు తెలుసు.” మరొకరు ఇట్లంటారు, “మీకు తెలుసు అది ఒక…”
203 అతడు ఇట్లు చెప్పును, “తప్పిపోయినది.” అహ-హ. అది అంతే. అప్పుడు నోరు మూసుకొని, తిరిగి మీ స్థలానికి వెళ్ళడమే.
204 మరి ఆ బంతి ఆటలో అంపైరు లేనియెడల ఏమగును? మై! అది ఎటువంటి ఒక ఆట అవుతుందో మీరు ఉహించగలరా? వారిలో ఒకరు ఇట్లంటారు, “అది తప్పిపోయినది.” మరొకరు ఇలా అంటారు. మరొకరు అలా అంటారు. మరొకరు, “నీవొక అబద్ధికుడవు,” అని అంటారు. అక్కడ గొడవలు మరియు పోట్లాటలు జరుగుతాయి.
205 ఒక బంతి ఆట కావాలంటే, మీరొక సంపూర్ణతను కలిగియుండవలసియున్నది. మరియు అతనక్కడికి వస్తాడు, మరియు నీవు అతణ్ణి ఇష్టపడకపోయినా, లేక ఏదైనా ఫర్వాలేదు, ఏమైనాగానీ, అతడు—అతడే సంపూర్ణతైయున్నాడు. అతడే ఆ సంపూర్ణతైయున్నాడు. దాని గూర్చి నీవు ఏమి చెప్పినా గానీ, అతడి మాటే చివరిమాట. అది ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు, వారు అలా చేయకపోతే, ఆట మొత్తం గందరగోళంగా తయారవుతుంది. అది నిజమేనా?
206 ఒక ఫెడరల్ కోర్టు అనేది లేనట్లయితే దేశము ఏమవుతుంది? ఈ దేశములో సుప్రీం కోర్టు లేనట్లయితే, అది ఏమవుతుంది? వారు ఎక్కడికి వెళ్తారు? దేశము ఒక గందరగోళంలో ఉంటుంది. ఒకవేళ లేకుంటే…
207 ఒక బంతి ఆటలో ఒక అంపైరు లేనియెడల, అది గందరగోళమౌతుంది, నీవు మొదటిగా బంతి విసరకముందే ఎవరో ఒకరు గొడవ చేస్తారు. అక్కడ ఎవరో ఒకరు నిలబడి, మరియు బహుశా నిజంగానే సరిగ్గా ఆ పలక మీదుగా వెళ్ళియుండవచ్చును, మరియు మరొక వ్యక్తి ఇట్లంటాడు, “ఓ, లేదు. లేదు, లేదు. అది అలా జరగలేదు.” అప్పుడు, ఇక మొదలవుతుంది. మొదటి బంతి వేయబడినది, ఇక వారు దానిని గూర్చి వాదించుకుంటారు. వారిలో ఒకరు అంటారు, “అది తప్పిపోయినది.” మరొకరు అంటారు, “అది తప్పిపోవుట కాదు.” చూశారా?
208 ఆ ఆట ఎవరికైతే కట్టుబడియున్నదో అతణ్ణి మీరు కలిగియుండాలి, మరి అతడే ఆ అంపైరు. అతడు, “తప్పిపోయినది,” అని చెప్పినప్పుడు అది తప్పిపోవడమే. అతడు, “ప్రక్కకు వెళ్ళిన బంతి” అని చెప్పినప్పుడు, అది ప్రక్కకు వెళ్ళిన బంతి. అతడు ఏది చెప్తే, అదే చెల్లుతుంది. అంతే. మరియు మీరు కలిగియుండకపోతే, మీకు ఏ ఆట ఉండదు.
209 నన్ను మరొక సంపూర్ణతను మీకు చూపించనీయండి, అది ఎర్రని లైటు. ఒక ఎర్రని లైటు, అది “ఆగుము,” అని చెప్పినప్పుడు దాని భావము ఆగండి అని. నీవు దానిని దాటిపోయినట్లయితే, దానికి నీవు వెల చెల్లించాలి. అయితే ఒకవేళ ఈ పట్టణములో బయట ఇక్కడ ఎటువంటి లైట్లు, ఏ ట్రాఫిక్ లైట్లు లేనట్లయితే, అది ఎలాంటి ఒక పట్టణము అవుతుంది? చూశారా? అది ఒక సంపూర్ణతను కలిగియుండవలసి యున్నది. అక్కడ నిలబడియున్న, పోలీసు కానీ, ఇంకెవరైనా గానీ ఏమి చెప్పినా నేను లెక్కచేయను. వారిది ద్వితీయస్థానము. పచ్చ లైటు వెలుగుచున్నప్పుడు మీరు వెళ్ళారని ఎవరైనా నిరూపించగలిగితే, పోలీసు చెప్పినదానిని నేను లక్ష్యపెట్టను, వారు చెప్పినది తప్పే. ఆ లైటు “వెళ్ళుము,” అని చెప్పినప్పుడు వెళ్ళమని దాని అర్థము. అదే సంపూర్ణతైయున్నది. ఆ లైటు “వెళ్ళుము,” అని చెప్పినదని మీరు నిరూపించగలరు. పోలీసు ఎక్కడో నిలబడియుండవచ్చును, ఆ నగర మేయరు, ఎక్కడో నిలబడి యుండవచ్చును, అది రవ్వంత భేదమునైనా కలిగించదు. అది “వెళ్ళుము,” అని మీరు ఋజువును కలిగియున్నయెడల మీరు వెళ్ళండి. మరియు ఎవరైనా మిమ్మల్ని గుద్దినట్లయితే, అది వారి తప్పు. మీరు దానిని నిరూపించగలరు. అది నిజము.
మరియు మనము దేనిని గూర్చి మాట్లాడుచున్నామో దానిని మనము నిరూపించగలము. అవును.
210 ఇప్పుడు, అక్కడ ఎర్రని లైటు అనేదే లేనట్లయితే ఏమిటి? ఆ కూడలి దగ్గరకు ఒకరు వెళ్ళగా, మరియు అది…అది ఎలా ఉంటుందో చూడండి. ఒక వ్యక్తి ఇట్లంటాడు, “హే! దారికి అడ్డు తొలుగుము. నేను త్వరగా వెళ్ళాలి. నేను పనికి వెళ్ళాలి. నేను ఇప్పటికే ఆలస్యము అయ్యాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను.” మరొక వ్యక్తి ఇట్లన్నాడు, “నీవు కేవలం అట్లు అనుకొనుచున్నావు అంతే. ఎందుకనగా, నేనే ఇక్కడికి ముందుగా వచ్చాను కాబట్టి, నేనే వెళ్తాను.” మరియు ఒక స్త్రీ బయటకి వచ్చి మరియు తన జుట్టును సరిచేసుకోవడం నేను చూడగలను. మనకు ఒక ఎర్రని లైటు లేకపోతే ఏమవుతుంది? వాహనములతో క్రిక్కిరిసిపోదా!
211 సంఘముల సంగతి అలాగే యున్నది. చూశారా? అది నిజము. ఆ కారణముచేతనే సంఘశాఖలతో ఇంతగా క్రిక్కిరిసిపోవుటను మనం కలిగియున్నాము. అవును. అది ఖచ్చితంగా సత్యము. ఎవరూ ఎక్కడికీ వెళ్ళుటలేదు. వారు నిలబడి, గొడవలు పడుచున్నారు.
212 ఇక్కడ దేవుని యొక్క వెలుగు ఉన్నది. అది “వెళ్ళుము,” అని చెప్పినప్పుడు వెళ్ళండి. అది “ఆగుము, ఇంత దూరం చాలును,” అని చెప్పినప్పుడు అప్పుడు ఆగిపొండి. అది నిజము. మనము దాని మీదనే, ఆ వాక్యము మీదనే ఆధారపడియున్నాము, ఏదో కొంతమంది ప్రజల గుంపు చెప్పిన దానిపై కాదు, లేక మరొక గుంపు ప్రజలు చెప్పిన దానిపై కాదు. యేసు ఇట్లు చెప్పెను, “నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడించును.” మనము వెళ్దాము. “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.”
213 మీకు తెలుసు, విద్య ఎంతో మంచిది, కానీ యేసు ఎన్నడూ దానిని కోరలేదు. అది నిజము. సంఘములు మరియు భవనములు ఎంతో మంచివైననూ, ఆయన ఎన్నడూ వాటిని కోరలేదు. ఆసుపత్రులు మంచివే; సంఘములైన మనము, ఆసుపత్రులను నిర్మిస్తాము. అది మంచిదే. మనము వాటిని అభినందిస్తాము. కానీ ఆయన వాటిని ఎన్నడూ కోరలేదు.
214 “సువార్తను ప్రకటించండి,” అని ఆయన సంఘమునకు చెప్పాడు. మరియు సువార్త కేవలము మాట ద్వారా మాత్రమే కాదు గానీ, వాక్యము యొక్క శక్తి ద్వారా మరియు ప్రత్యక్షత ద్వారా వచ్చినది. పౌలు ఆ విధముగా చెప్పెను. ఓ, మై, ఒకవేళ అది ఆ విధంగా ఉన్నట్లయితే, అప్పుడు వెళ్ళి, సువార్తను ప్రత్యక్షపరచండి.
215 ఓ, ఈనాడు, ఎన్నడూ లేనటువంటి ఉత్తమమైన వైద్యులను కలిగియున్న కాలంలో, మనము జీవిస్తున్నాము. ఎన్నడూ వాడనటువంటి ఉత్తమమైన ఔషధాలను నేడు మనం కలిగియున్నాము. అది మీకు తెలుసు. మరియు మనము వారికి గౌరవ వందనం చేస్తాము. మనము వారి కొరకు ప్రార్థిస్తాము. నేను చేస్తాను, మరియు మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ మనుష్యులు, వారు తమ అనుభూతుల యొక్క అవగాహనతో…వారు పని చేయుటకు రెండు జ్ఞానేంద్రియములను కలిగియున్నారు, అవి చూచుట మరియు స్పర్శ, మరియు వారు…మరియు వినుట. వారు ఒక గుండెచప్పుడును బట్టి పని చేస్తారు, లేక ఒక—ఒక కణితి యొక్క స్పర్శ ద్వారా, లేక మరొక దానిని బట్టి, లేక వారు చూడగలిగిన ఒక దృశ్యాన్ని బట్టి, ఒక వ్యాధి సోకుటనుబట్టి, లేక—లేక ముఖము మీద ఉన్నదానిని బట్టి, లేక ముఖము మీద లేదా శరీరము మీద వ్యాపించిన దానిని బట్టియైయున్నది. వారు—వారు వాటి మీద పనిచేస్తారు. చూశారా? ఎందుకనగా అది…మరియు మిమ్మల్ని చంపకుండా, దానిని మాత్రమే చంపునంత మందును తీసుకొనుటకు, వారు ప్రయత్నిస్తారు, మరియు—మరియు ఆ విధముగా చేస్తారు. వారు…దాని మీద పనిచేయుట వారి యొక్క కర్తవ్యమైయున్నది. మనము దానిని అభినందించుచున్నాము. అది చాలా మంచిది. అయితే, మనకు ఉత్తమమైన వైద్యులున్నారు, ఉత్తమమైన ఔషధములు, ఉత్తమమైన ఆసుపత్రులు ఉన్నవి, మరియు ఎన్నడూ లేనంత రోగములు ఉన్నవి.
216 మనకు ఎన్నడూ లేనటువంటి అవిశ్వాసము ఉన్నది. అవునండి. ఖచ్చితంగా. సేవకులు తమకు తాము సంస్థాగతమైపోయి, పెద్ద మత సంస్థలను కలిగియున్నారు, మరియు దేనినైనా తీసుకొనుచున్నారు, మరియు అట్లున్నారు, మరియు కేవలం దేనినైనా తీసుకుని, ఒక సంఘ సభ్యునిగా చేయుచున్నారు. మరియు యంత్రములో పొదగబడిన కోడిపిల్లలవలె, వారు ఏదో వేదాంత కళాశాలకు వెళ్ళినారు, మరియు ఆ విధంగా వారిని బయటకు తీసుకువచ్చునట్టి తిరుగలి క్రింద వారిని పొదుగుచున్నారు, మరియు కొన్నిసార్లు ఒక ఐగుప్తు రాత్రి గూర్చి దక్షణాఫ్రికాలోని అనాగారికునికి ఎంత తెలుసో, వీరికి దేవుని గూర్చి అంతకన్నా ఎక్కువేమి తెలియదు. మరియు వారిని ఆవిధముగా తీసుకువస్తున్నారు, మరియు మీరు అక్కడే ఉన్నారు. చూశారా?
217 ఓ, మన సంఘములో మనకు అవసరమైనది ఏదనగా ఒక సంపూర్ణత కలిగియున్న వ్యక్తియే. మెథడిస్టు సంఘములో, బాప్టిస్టు సంఘములో, పెంతుకోస్తు సంఘములో, ప్రేస్బిటేరియను సంఘములో మనకు అవసరమైనది ఏమిటంటే, ఒక సంపూర్ణత, క్రీస్తుకు మరియు వాక్యమునకు కట్టుబడి నిలబడియుండే ఒక దైవజనుడు, మరియు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడి, వారిని వెంబడించుచున్నదని చూచుట ద్వారా ప్రతీ ఒక్కరూ ఈ వాక్యప్రకారంగా నడిచేటటువంటి పరిస్థితికి, సంఘమును తీసుకువచ్చే ఒక దైవజనుడు అవసరమైయున్నది. “ప్రపంచమంతటా, విశ్వసించిన వారిని సూచక క్రియలు వెంబడించును.”
“అవి గతించిపోయాయి,” అని వారన్నారు.
218 యేసు ఇట్లన్నాడు, “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి.” మనము ఇంకనూ సర్వలోకమునకు చేరుకోలేదు, మరియు ప్రతీ జీవి అనుదానికి ఇంకా చాలా దూరములో ఉన్నాము. ఎంత దూరము? “సర్వలోకమునకు.” ఎవరికి? “ప్రతీ ఒక్క జీవికి.” ఏమి జరుగును? “విశ్వసించిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాటలాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” వాక్యమగు సంపూర్ణ నిశ్చయత వారిని పట్టుకొనియున్నది, అదే ఉత్తర నక్షత్రము, ఆ దిక్సూచి సరిగ్గా దానితో నిలిచియుండును. మనకు కావలసినది అదే.
219 కానీ మనము బయటికి వెళ్ళి సంస్థలను నిర్మించాము, ప్రజలను సంస్థగా మార్చాము, సభ్యులను చేర్చుకున్నాము, మరియు మనము విశ్వసించినట్లు వారు విశ్వసించలేదు గనుక, బాప్టిస్టులతో గొడవపడ్డాము, మరియు వారు ఈ విధముగా చేయలేదు గనుక, మెథడిస్టులతో గొడవపడ్డాము. మరియు—మరియు మనము మరింత పెద్ద శిక్షణ సంస్థను ఉత్పతి చేశాము, ఇంకా పెద్ద సంఘములను నిర్మించాము, మరింత ఉత్తమమైన పట్టుతో చేయబడిన బెంచీలు, మరియు మరింత పెద్ద వాద్య పరికరము, మరియు మొదలైనవి, మరియు చక్కటి-దుస్తులు ధరించిన ఒక గుంపు, మరియు మేయరు మరియు అందరూ సంఘములో ఉన్నారు. అయితే మనమేమి కలిగియున్నాము? సంఘశాఖల సంపూర్ణతకు కట్టబడియున్న ఒక చచ్చిన గుంపు. మరణము! ఓ, అది మనకు దూరమగును గాక!
220 ఒకవేళ సరిగ్గా నేను ఉన్న చోటునే నేను మరణించినా గానీ, యేసు క్రీస్తే నా సంపూర్ణత, ప్రతీ ఒక్కరు నన్ను విడిచిపోయినా సరే, నేను నమ్మికయుంచేది దాని మీదనే. ఎవరో నాతో చెప్పారు, డా. డేవిస్ నాతో ఇట్లన్నాడు, “బిల్లీ, నీవు అలాటి దానిని బోధిస్తే, నీవు సంఘములోని స్తంభాలకు ప్రసంగించాలి.”
221 నేను చెప్పాను, “అట్లయితే, నేను దేవుని వాక్యమును స్తంభాలకే బోధిస్తాను, ఎందుకనగా దేవుడు ఈ స్తంభాల ద్వారా అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు.” అవును. దేవుని వాక్యము సత్యము.
ఇట్లన్నాడు, “వారు నిన్ను నమ్ముతారని నీవు అనుకొనుచున్నావా?”
222 నేను చెప్పాను, “లేదు…అది నా పని కాదు. ఆ వాక్యమునకు నమ్మకంగా ఉండటం నా కర్తవ్యమైయున్నది.” అది నిజము.
223 అతడన్నాడు, “దైవిక స్వస్థత అనే—అనే వేదాంతముతో ఇటువంటి ఒక విద్యావంతమైన ప్రపంచమును నీవు ఎదుర్కొనగలవని నీవు అనుకొనుచున్నావా?”
224 నేనిట్లు చెప్పాను, “అది నా దైవిక స్వస్థత కాదు. అది ఆయన వాగ్దానము. ఈ ఆజ్ఞను ఇచ్చినది ఆయనే.” ఓహ్!
225 మరియు దూరాన్న ఆ నదిలో నేను నిలబడియున్నప్పుడు, ఆయన ఆ పెద్ద వెలుగులో క్రిందకి దిగివచ్చి, 1933, జూన్ లో, ఆయన ఇట్లు చెప్పినది నాకు జ్ఞాపకమున్నది, “క్రీస్తుయొక్క మొదటి రాకడకు ముందు బాప్తీస్మమిచ్చు యోహాను పంపబడినట్లు—అలాగే, క్రీస్తుయొక్క రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచమునకు ఒక వర్తమానముతో నేను నిన్ను పంపుచున్నాను.” మరియు పదిహేను సంవత్సరాలుగా దాదాపు ప్రతీ పర్వతము మీద ఉజ్జీవపు మంటలు నిర్మించబడినప్పుడు, అది ప్రపంచమంతటికి వెళ్ళినది. దేశములంతటా దైవిక స్వస్థత, మరియు ఆ శక్తి, మరియు పునరుద్ధరణ వ్యాపించినది.
226 మరియు అది ఇప్పుడు ఆవలిన ఆ చివరి ఘట్టమును తాకుటకు సిద్ధంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను, మహిమలోనికి సంఘమును కొనిపోవు విశ్వాసము తెచ్చుటకైయున్నది. మరియు అది వర్తమానములలో ఉన్నది. మనం నిజంగా అంత్యకాలంలో ఉన్నాము. మనం దాని గూర్చి మాట్లాడియున్నాము, మరియు ప్రతీది చేసాము, కానీ ఆ కార్యము ఇప్పుడు మన మీదికి వచ్చియున్నది. అవును, అవునయ్యా. ఇక్కడ ఒకటి ఉన్నది. అది నిజము.
227 నేను చెప్పినట్లుగా, ఆ—ఆ—ఆ ఎర్రని లైటు, ఆ సమస్యను పరిష్కరించును. అంతే. ఎవరు వెళ్తారో ఆ ఎర్రని లైటు మీకు చెప్తుంది. మిగిలినవారు ఏమి చెప్పినా లెక్కలేదు, ఆ ఎర్రని లైటు చెప్పినదే ముఖ్యము. నీవు ఆ ఎర్రని లైటును లక్ష్యపెట్టకపోతే—లక్ష్యపెటకపోతే నిజముగా వాహనములన్నీ క్రిక్కిరిసిపోతాయి. ఖచ్చితంగా ఒక సంపూర్ణత ఉండవలసియున్నది. అవును, అయ్యా.
228 అదే విధంగా సంఘమునకు, ఒక సంపూర్ణత ఉండవలసియున్నది. సంఘములోని ప్రజలకు, మీరు మీయొక్క సంపూర్ణతను కలిగియుండవలసియున్నది.
229 కానీ, ఈనాడు, ప్రతీ సంఘము దాని స్వంత సంపూర్ణతను కలిగియున్నది. చూశారా? మరియు దీనిని తీసుకొనుటకు ప్రయత్నించకండి, “బాప్టిస్టులమైన మేము దీనిని నమ్ముతాము. మెథడిస్టులమైన మేము దీనిని నమ్ముతాము. ప్రేస్బిటేరియన్లమైన మేము దీనిని నమ్ముతాము. పెంతెకోస్తులమైన మేము దీనిని నమ్ముతాము.” అది మంచిదే, కానీ ఆ మిగిలిన దానిని మీరు ఎందుకు తీసుకొనరు? ఆ మిగిలిన దానిలోని తప్పేమిటి?
230 “బాప్టిస్టులమైన మేము ముంచడాన్ని నమ్ముతాము.” అది మంచిదే. మరిప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తీస్మము సంగతేమిటి? భాషలలో మాట్లాడుట గూర్చి ఏమిటి? స్వస్థతా వరముల సంగతేమిటి? ప్రవచనముల సంగతేమిటి? “ఓ, లేదు. మేము నమ్మము. అది, అది మరొక కాలమునకు చెందినది.” ఓ, అబ్బాయి!
231 పెంతెకోస్తువారులారా, మీరు ఇట్లంటారు, “మంచిది, మేము భాషలతో మాట్లాడుటను ఋజువుగా నమ్ముచున్నాము.” నిశ్చయంగా, భాషలలో మాట్లాడుట మంచిదే, కానీ ఇప్పటికీ అది ఋజువు కాదు. అనేకులు భాషలలో మాట్లాడుచున్నారు, అది నిజము, అది వారు వెళ్ళగలిగినంత వరకు. ఉన్నటువంటి ఏ వరమునైనా, పరిశుద్ధ గ్రంథములోనున్న ఏ వరమునైనా అపవాది అనుకరించగలడు.
232 పౌలు ఇట్లు చెప్పెను, “నేను మనుష్యుల మరియు దేవదూతల భాషలతో మాటలాడినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, బీదల పోషణకొరకు నా ఆస్తియంతటినీ అమ్మివేసినను, కొండలను పెకిలింపగల విశ్వాసాన్ని నేను కలిగియున్నను, నేను వేదాంత కళాశాలకు వెళ్ళి మరియు నేర్చుకోవాల్సిన జ్ఞానమంతటినీ నేర్చుకున్నను, నేను ఇంకను వట్టివాడనే.”
233 అది క్రీస్తు యొక్క వ్యక్తి. క్రీస్తు, ఆయనను స్వీకరించండి, మరియు ఆయన వాక్యమును స్వీకరించకుండా మీరు ఆయనను స్వీకరించలేరు. వాక్యము మొదటిగా రావలసియున్నది, పిదప ఆ వాక్యములోనికి జీవము వచ్చి మరియు ఆ వాక్యమును ఋజువుచేస్తుంది.
234 “నేను నా తండ్రి క్రియలను చేయనియెడల, అప్పుడు నన్ను నమ్మకండి,” అని యేసు చెప్పలేదా? అది ప్రత్యక్షపరచబడిన దేవునియొక్క వాక్యమైయుండెను. దేవుడు క్రీస్తులో నుండి, తానేమైయున్నాడన్నది లోకమునకు బయలుపరచుకొనుచు, సమాధానపరచుకొనుచుండెను. అది—అది సంపూర్ణతైయున్నది. అది అక్కడ నిత్యమైన సంపూర్ణతైయున్నది.
235 ఇప్పుడు మీరు ఇట్లనవచ్చు, “సహోదరుడా బ్రెన్హామ్, అది నిత్యమా?” అవును. “అయితే ఈ రోజు సంగతేమిటి?”
236 యేసు చెప్పెను, “నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను అతడు కూడా చేయును.” అది అదే సంపూర్ణత. అది సరియే.
237 ప్రతీయొక్కరు తమ స్వంత సంపూర్ణతను కలిగియున్నారు. ఓ, మై! న్యాయాధిపతుల కాలంలో ఉన్నట్లే అది ఉన్నది, “ప్రతి ఒక్కరు తమ దృష్టికి ఏది సరియైనదో అదే చేశారు.” న్యాయాధిపతుల దినములలో, ప్రతియొక్క వ్యక్తి, తమ—తమ స్వంత సంపూర్ణతను కలిగియున్నారు. అతడు ఏమి చేయాలనుకొన్నాడో కేవలం దానినే చేశాడు. మరియు ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నది. “ప్రతి వ్యక్తి తన దృష్టికి ఏది మంచిది అని తోచినదో దానినే చేశారు.” ఇప్పుడు, న్యాయాధిపతుల దినములలో వారు ఆ విధముగా చేయుటకు కారణము మీకు తెలుసా? ఇది కొంచెము విస్మయము కలిగించవచ్చు. కానీ న్యాయాధిపతుల దినములలో వారు ఆ విధంగా చేయుటకు కారణమేదనగా, దేవుని వాక్యము వచ్చుటకు ఆ దినములలో ప్రవక్త లేడు. కాబట్టి ప్రతి వ్యక్తి, తన దృష్టికి తోచినది తాను చేయగలిగాడు.
238 మరియు నేటి దినమున ఖచ్చితంగా అదే జరిగింది. ఈ మతశాఖల దినములలో మనకు ప్రవక్తలేడు, కానీ దేవుడు మనకు ఒకరిని వాగ్దానము చేశాడు. చూశారా? చూశారా? మరియు ఆయన చేశాడు. చివరి దినములలో, ఆయన ఏలీయాను లేపి మరలా రంగము మీదికి పంపుతాడు, “మరియు అతడు పిల్లల హృదయములను తండ్రుల విశ్వాసము వైపు త్రిప్పును,” తిరిగి నిజమైన పెంతెకోస్తు వైపుకు త్రిప్పును. ఆయన దానిని చెప్పెనని మీకు తెలుసు.
239 ఇప్పుడు, ఆయన యోహాను గూర్చి చెప్పినదానిని, మీరు సూచిస్తారని నాకు తెలుసు, అది మత్తయి 11వ అధ్యాయము, 6వ వచనము లో—లో ఉన్నదని నేను నమ్ముచున్నాను, “యోహాను అను ఈ వ్యక్తిని గూర్చి నీవేమి తలంచుచున్నావు?” అని వారు అడిగినప్పుడు.
240 ఆయనిట్లు చెప్పాడు, “మీరు దీనిని స్వీకరించగలిగితే, ‘నాకు ముందుగా నా దూతను పంపుదును,’ అని చెప్పబడినది ఇతని గూర్చియే.” అది మలాకీ 3, మలాకీ 4 కాదు.
241 కానీ, గుర్తుంచుకొనండి, అది మలాకీ 4 అయితే, అప్పుడు వాక్యము విఫలమైనట్లే, ఎందుకనగా ఆయనిట్లు చెప్పెను, “అయితే సరిగ్గా ఈ సమయానికి, సర్వలోకము దహించబడి ఉండును, మరియు దుర్మార్గుల ధూళిపై నీతిమంతులు నడచిపోవుదురు.” వద్దు. సహోదరుడా, దానిని కలపవద్దు. అది ఏమి చెప్పుచున్నదో ఖచ్చితంగా దానినే చెప్పనీయండి. అది నిజము. ఆయన దానిని అంత్యదినములో వాగ్దానము చేశాడు, మరియు అది సరిగ్గా అక్కడ ఉంటుంది.
242 గుర్తుంచుకొనండి, న్యాయాధిపతుల కాలములో, ప్రతీ ఒక్కరూ వారు కోరినట్లు చేశారు. అక్కడ ఒక్క వ్యక్తియు లేడు, ఆ వాక్యమును జీవింపచేయు వ్యక్తి ఒక్కరైనా లేరు. అక్కడ ప్రవక్త లేడు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్త వద్దకు వచ్చును. అవును. మరియు అతడు ఎల్లప్పుడూ ద్వేషించబడతాడు. కేవలం చిన్న గుంపు మాత్రమే అతడిని ప్రేమించును, చూశారా. కానీ, నా భావము ఏమిటనగా, అది ఎల్లప్పుడూ అట్లే ఉండెను.
243 దేవుడు తన విధానమును మార్చుకొనడు, ఆయన అలా మార్చుకొని, దేవుడిగా ఉండలేడు. దేవుడు ఏదైనా చెప్పినా లేదా ఏదైనా చేసినా, మరుసటి సమయము ఆయన దానినే చేయవలసియున్నది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, మొదటిసారి చేసినట్లుగానే ఆయన రెండవసారి చేయకపోతే, ఆయన మొదటిసారి చేసినది తప్పగును. మరియు దేవుడు తప్పు చేశాడని ఎవరు నేరారోపణ చేయగలరు? దేవునిపై పాపమును ఆరోపించుటకు, నీవు ఎవడవు? యేసు చెప్పినది అదే, “నాలో పాపమున్నదని మీలో ఎవరు ఆరోపించగలరు?”
244 పాపము అంటే ఏమిటి? అవిశ్వాసము. “విశ్వసింపనివాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను.”
245 “మెస్సీయా చేయవలసిన ప్రతీదానిని నేను నెరవేర్చలేదని మీలో ఎవరు నాకు చూపగలరు?” చూశారా? ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మెస్సీయా ఒక ప్రవక్తయైయుండెను, మరియు తాను అదేనని ఆయన ఋజువు చేసుకొనెను. మలాకీ తర్వాత, కొన్ని వందల సంవత్సరాలుగా వారికి ప్రవక్త లేడు, మరియు ఇక్కడ ఆయన రంగము మీదికి వచ్చెను. ఆయన ప్రజలకు ఒక మర్మముగాను, మరియు వారి సంఘమునకు ఒక అడ్డుబండగా యున్నాడు.
246 ఎందుకనగా, ఆయన చెప్పాడు, “ఇదిగో, అమూల్యమునగు మూలరాతిని, పరీక్షించబడిన, ఓ, ఒక అడ్డురాతిని నేను సీయోనులో స్థాపించుచున్నాను.” అవును. “ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు.” అది నిజము. ఆయన అక్కడ ఉన్నాడు. మరియు ఖచ్చితంగా అది లేఖనమును నెరవేర్చినది. కానీ ఆయన యందు విశ్వాసముంచిన వారు ఒక సంపూర్ణతను కలిగియున్నారు.
247 లాజరు సమాధిలో నుండి బయటికి రావడం, మార్త చూసినప్పుడు, ఆయన ఎవరో ఆమె ఎరిగియున్నది. మరియు అది జరుగకముందే, దానిని తెలుసుకునే సంపూర్ణతను ఆమె కలిగియున్నది. “నీవు లోకమునకు రానున్న, దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, నా సహోదరుడు మరణించియున్నాగానీ, కేవలము ఒక్క మాట పలుకుము. దేవుడు దానిని చేయును.” ఆమేన్. ఆమె నిశ్చయంగా నమ్మకంతో ఉన్నది. అది నిజము. ఆయన…దానిని చెప్పినప్పుడు, ఆమె తన హృదయములో నుండి దానిని చెప్పినది.
ఆయన ఇట్లడిగెను, “మీరు అతణ్ణి ఎక్కడ పాతిపెట్టారు?”
ఇట్లు చెప్పారు, “వచ్చి చూడుము.”
248 ఆయన ఒక దర్శనముతో, అక్కడ నిలబడియున్నాడు. ఎందుకనగా, ఆయన చెప్పాడు, “మొదటిగా నా తండ్రి నాకు చూపించనిదే, నేను ఏమియూ చేయను,” యోహాను సువార్త 5:19.
249 ఆయనను దూరంగా పంపెను, లాజరు ఇంటికి దూరంగా వెళ్ళిపోయెను. వచ్చి, ప్రార్థన చేయమని వారు ఆయనకు కబురు పంపారు. లాజరు చనిపోవునని ఆయనకు తెలుసు. మరియు కొంత సమయము తర్వాత, “మన స్నేహితుడు, లాజరు, నిద్రించుచున్నాడు,” అని ఆయన చెప్పాడు.
“అతడు బాగుపడును,” అని వారన్నారు.
250 ఆయన ఇట్లు చెప్పెను, “అతడు చనిపోయాడు. మరియు మీ నిమిత్తము నేనక్కడ లేనందుకు, నేను సంతోషించుచున్నాను.” అతడి కొరకు ప్రార్థించమని వారు ఆయనను అడుగుచుండిరి.
251 పిదప ఆయన తిరిగివచ్చి, ఇట్లు చెప్పెను, “అయితే నేను వెళ్ళి అతణ్ణి మేల్కొల్పుదును.” ఓ, మై! (“నేను అక్కడకి వెళ్ళి ఏమి చేయగలనో చూస్తాను,” కాదు.) “నేను వెళ్ళి అతడిని మేల్కొల్పుతాను.” ఎందుకు? “ఏమి చేయవలెనో తండ్రి ఇదివరకే నాకు చూపించెను.”
252 సమాధి వద్దకు వెళ్ళెను. అక్కడ ఒక మనిషి నిలబడియున్నాడు. అక్కడ దేవుడు మానవ శరీరములో నిలబడియున్నాడు, “కరిగిపొమ్ము,” అని ఆ రాతితో ఆయన చెప్పగలడు, అలా చెబితే అది కరిగిపోయేది. కానీ ఆయన ఆ స్త్రీలకు ఇట్లు చెప్పెను, దీనులైన, ఆ చిన్న యవ్వన స్త్రీలకు ఇట్లు చెప్పెను, “ఆ రాయిని తొలగించండి.”
253 మీరు కూడా, ఏదో ఒకటి చేయవలసియున్నది. చూశారా? మరియు వారు ఆ రాయిని దొర్లించారు. మరియు అది వారికి ఇబ్బంది కలిగించినది; అతడు ఎంతో కంపు కొట్టుచున్నాడు.
254 అక్కడ, ఆయన అక్కడ నిలబడియున్నాడు. ఓ, మై! ఆయన ఆ బలహీనమైన శరీరమును తిన్నగా నిలుపుకొనుట నేను చూస్తున్నాను. ఎందుకనగా, బైబిల్ చెప్పినది, “మనమతని చూచి ఆపేక్షించునట్లు ఆయనలో సురూపము లేదు.” ఆయన చూచుటకు అంత ఆకర్షణీయముగా లేడు. చూశారా?
255 సరిగ్గా దావీదు వలెనే యున్నది, అతడు కేవలం ఒక చిన్న ఎర్రనివాడిగా ఉన్నప్పుడే రాజుగా ఎన్నిక చేయబడినాడు. చూశారా?
256 “వారందరూ పెద్దవారు,” అని చెప్పెను, “అతని తలపై ఒక కిరీటముతో అతడు అందముగా కనిపించడా? ఈ పెద్ద కుమారుని తీసుకొనుము,” అని యెష్షయి అనెను.
257 “దేవుడు అతణ్ణి నిరాకరించెను,” అని సమూయేలు చెప్పెను. అతని కుమారులందరినీ తీసుకొనివచ్చెను. అతడు ఇట్లడిగెను, “నీకు ఇంకా కుమారులు లేరా?”
258 “అవును, ఇంకా ఒకడు ఉన్నాడు, కానీ అతడు రాజువలె కనిపించడు. ఎందుకు, అతడు వంగిపోయిన-భుజములు కలిగి, ఎర్రగా-అగుపించు ఒక చిన్న బాలుడు.”
“వెళ్ళి, అతణ్ణి తీసుకొనిరమ్ము.”
259 మరియు అతడు వచ్చి, ఆ ప్రవక్త ముందు నడిచిన వెంటనే, ఆత్మ అతనిపై కుమ్మరించబడెను. అతడు ఆ నూనెతో పరుగెత్తుకొని వెళ్ళి, అతడి తలపై దానిని కుమ్మరించి, ఇట్లు చెప్పాడు, “ఇతడే మీ రాజు.” అది అంతే. అవును, అయ్యా.
260 యేసు అక్కడ, వంగిన-భుజాలతో నిలబడియున్నాడు, బహుశా, ఇంకా ముప్పై సంవత్సరాల వయస్సైనా రాకుండానే వెంట్రుకలు తెల్లబడుచుండెను. “ఆయన నలభై సంవత్సరాల వ్యక్తిగా కనిపించియుండవచ్చును,” అని బైబిలు చెప్పెను. యూదులు ఆయనతో ఇట్లనిరి, “నీకు ఇంకా—ఇంకా యాభై ఏళ్ళైనా లేవు, మరి నీవేమో నీవు ‘అబ్రాహామును చూసితివి,’ అని చెప్పుదువా?”
“అబ్రాహాము కంటే ముందు, నేను ఉన్నవాడను,” అని ఆయన చెప్పెను. మై! ఓ, మై! పరిశుద్ధ యోహాను 6.
261 పిదప, ఆయన ఇక్కడ, సమాధి వద్ద నిలబడుట, మనము కనుగొంటాము. ఆ దర్శనము రావలసియుండెనని ఆయన ఎరిగియున్నాడు. అది రావలసియుండెనని ఆయనకు తెలుసు. “రాయిని తీసివేయండి.” ఆయన…
262 అతడు కంపుకొట్టుచున్నాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడియున్నాడు, అతడు చనిపోయి నాలుగు దినములు గడిచిపోయాయి. అతని ముక్కు కూడా ఊడిపోయినది, అంత సమయము గడిచిపోయినది.
263 అక్కడ, ఆయన అక్కడ నిలబడి, తన శరీరాన్ని సవరించుకున్నాడు. “నేనే పునరుత్థానమును, మరియు జీవమును.” హుమ్! “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును.” అటువంటి ఒక ప్రకటన చేయగల మనిషి ఉంటే నాకు చెప్పండి. “బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ మరణించడు. నీవు దీనిని నమ్ముచున్నావా?”
264 ఆమె ఇట్లన్నది, “నమ్ముచున్నాను, ప్రభువా.” ఆయన ఆమెను విఫలపరచినట్లు కనిపించినప్పటికీ, అట్లు చెప్పినది. ఆమె కబురు పంపినప్పుడు, ఆయన వెళ్ళలేదు. ఆమె మరలా కబురు పెట్టినది; ఆయన వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఆమె ఇట్లు చెప్పుచున్నది, “నీవు ఈ లోకమునకు రావలసిన క్రీస్తువు అని నేను ఎరుగుదును.”
265 ఆయన పిలిచాడు, “లాజరూ, బయటకు రమ్ము.” మరియు ఆ వ్యక్తి చనిపోయి నాలుగు దినములు గతించాయి. ఎందుకు? ఏమిటి? క్రీస్తు సంపూర్ణతను కలిగియున్నాడు. ఆయన దర్శనమును చూసియున్నాడు. అది విఫలము కానేరదు. అది నిజం. అది విఫలము కానేరదు. ఆయన ఖచ్చితంగా నిశ్చయతను కలిగియున్నాడు.
266 మరియు మార్త కూడా సంపూర్ణ నిశ్చయతతో ఉన్నది. ఆయన ఏమైయున్నాడని ఆమె నమ్మినదో ఆయన దానిని గుర్తించునట్లు ఆమె చేయగలిగితే, ఆమె అడిగినది ఆమె పొందుకొనును. నిజం. వారక్కడ ఉన్నారు. ఆ సంపూర్ణత, అది వాక్యంతో ముడివేయబడియున్నది, మరది అదేయైయున్నది.
267 ఈనాడు ప్రతి మనిషి, తమ దృష్టికి ఏది మంచిదో, అదే చేస్తున్నారు, ఎందుకంటే ప్రవక్త లేడు కాబట్టి. న్యాయాధిపతుల దినములలో చూడండి.
268 ఏలీ-…దినములలో చూడండి, అది ఏలీయా లేక ఎలీషా అని నేను నమ్ముచున్నాను, వారిలో ఒకరు. అవును. ఆ, చనిపోయిన బిడ్డ. ఆ—ఆ షూనేమీయురాలు, ఆమె…
269 ఏలీయా ఆ దినపు దైవజనుడు, కేవలం ఏదో ఒక మంచి, జ్ఞానము కలిగిన ఉపాధ్యాయుడు కాదు. ఎందుకు, అతడు మార్గమున వెళ్ళిన ఒక వృద్ధుడు. మీరు…వస్తే, ఈ దినమున అతడు గనుక నీ గుమ్మము వద్దకు వస్తే, బహుశా మీరు అతణ్ణి వెళ్ళగొడతారు. ఒక దేశమంతా అతణ్ణి ద్వేషించినది. యెజెబేలు మరియు ఆ మిగిలిన వారందరూ అతణ్ణి ద్వేషించారు.
270 ఎందుకనగా, ఆమె వైట్ హౌసులో కూర్చునియున్నది మరియు ఆమె చేసే కార్యములు మిగిలిన స్త్రీలందరి ద్వారా చేయించినది, మరియు వారందరూ ఆమెను మాదిరిగా తీసుకొన్నారు. మరియు ఆహాబు త్రిప్పబడ్డాడు, ఆమె శక్తి ద్వారా అతడి తల త్రిప్పబడినది. ఈనాడు అది ఎంతో దూరములో లేదు. సరిగ్గా అదే విధంగా, మరి మీరు అక్కడే—అక్కడే ఉన్నారు. మరియు వారందరూ ప్రజాదరణ పొందారు. మరియు, ఓ, వారంతా అటువంటి వాటిలో మునిగిపోయారు.
271 కానీ ఆ చిన్న, వృద్ధురాలైన షూనేమీయురాలు! షూనేము స్త్రీ కాదు, కానీ చిన్న…అవును. ఆమె ఒక షూనేమీయురాలు అని నేను నమ్ముచున్నాను. ఆమె వచ్చి మరియు ఏలీయాలో ఆ శక్తి ఉన్నదని చూసినప్పుడు, ఆమె ఇట్లన్నది, “అతడు పరిశుద్ధుడని నేను గ్రహించుచున్నాను.” మరియు ఆ బిడ్డ చనిపోయి పడియున్నప్పుడు, ఆమె ఇట్లు చెప్పినది, “గాడిదకు గంత కట్టుము, మరియు నీవు మధ్యలో ఆపకుము.” ఆమె అక్కడికి వెళ్ళినది. ఆమె ఎరిగియున్నది. మరియు ఆమె వచ్చిన విధానమును, నేను ఇష్టపడుచున్నాను. ఆమె తన సంపూర్ణత వద్దకు, తాను కట్టుబడియుండే దాని వద్దకు వచ్చినది.
272 ఏలీయా ఇట్లన్నాడు, “ఇదిగో ఆ షూనేమీయురాలు వచ్చినది. ఆమె దుఃఖపడుచున్నది. కానీ సమస్య ఏమిటో నాకు తెలియదు.” చూశారా? దేవుడు తన దాసులకు అన్నిటినీ చూపించడు; వారు ఏమి తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడో వాటిని మాత్రమే తెలియపరచును. కాబట్టి అతడిట్లన్నాడు, “ఆమె హృదయము దుఃఖముతో ఉన్నది, కానీ నాకు తెలియదు.” అతడింకా ఇట్లు చెప్పాడు, “గేహజీ, నీవు పరుగునపోయి, ఏమి జరిగినదో తెలుసుకో.”
273 అతడు ఇట్లడిగాడు, “అంతా క్షేమమేనా? నీ భర్త క్షేమముగా యున్నాడా? నీ కుమారుడు క్షేమముగా యున్నాడా?”
274 ఆమెను చూడండి. ఓ, మై! ఇదీ సంగతి. ఆమె ఇట్లు చెప్పినది, “అంతా క్షేమమే.” ఎందుకు? ఆమె తన సంపూర్ణత వద్దకు వచ్చినది. “అంతా క్షేమమే.”
275 మరియు ఆమె మోకరిల్లింది. మొదటిగా, అతని పాదముల మీద, పడినది. మరియు గేహజీ ఆమెను, అతడి—అతడి యజమానుని వద్ద నుండి పైకి లేపాడు, “అది సరికాదు.” ఆమెను పైకి లేపెను. మరియు ఆమె అతనికి చెప్పడం ప్రారంభించినది.
276 ఇప్పుడు, ఇప్పుడతనికి సంపూర్ణత లేదు. ఆమెకు బిడ్డను ఇచ్చుటకు, అతనికి శక్తి ఉన్నదని, దర్శనము ద్వారా అతడు ఎరిగియున్నాడు. కానీ ఇప్పుడు అతడు ఏమి చేసెను? అతడు తన కర్రను తీసుకొని మరియు గదిలోనికి వెళ్ళి, తలుపులన్నిటినీ మూసివేసి, అందరిని బయటకి పంపివేసెను. అతడు ఆ గదిలో పైకి-మరియు-క్రిందికి తిరిగాడు. అతడు ఒక సంపూర్ణతను కలిగియున్నాడు, అతడు కేవలం దానిని సంధించగలిగితే చాలు. ఆ గదిలో అటూ ఇటూ, పైకి-మరియు-క్రిందికి తిరుగుచున్నాడు! ఓ, మై! నేరుగా ఏదో అతణ్ణి తాకినట్లుగా అతనికి అనిపించినది. అతడు వెళ్ళి ఆ బిడ్డ మీద పడుకున్నాడు. అతడు మరలా పైకి లేచి, వెళ్ళిపోయెను. ఆ—ఆ బిడ్డ కొంచెము కదిలాడు, వేడి పుట్టుకొచ్చింది. అతడు లేచి వెళ్ళిపోయాడు. అతడు ఆ సంపూర్ణతతో సరియైన సంబంధాన్ని పొందలేదు. “ప్రభువా, అది ఏమిటి? నన్ను ఏమి చేయమంటావు?”
277 అతడు తిరిగిన వెంటనే, అతడు ఒక దర్శనమును చూసాడనుటలో సందేహము లేదు, ఆ చిన్న పిల్లవాడు పరుగెత్తుచూ, ఆడుచున్నాడు, తాడుతో గెంతుచూ, అటువంటి దేనితోనో, ఆడుకొనుచున్నాడు. అతడు తన్నుతాను చూచుకొని బిడ్డ మీద పడుకొనెను. తన ముక్కు అతని ముక్కుపైన, తన పెదవులను అతని పెదవులపైన పెట్టాడు, మరియు దేవుని శక్తి ఆ బిడ్డను బ్రతికించినది.
278 అదేమిటి? ఆ స్త్రీ యొక్క సంపూర్ణత ఆ ప్రవక్తయే! ఆ ప్రవక్త యొక్క సంపూర్ణత దేవుడేయైయున్నాడు! అవి రెండూ, వాక్యముతో కలిసిపోయాయి, “నేనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాను.” దేవుని శక్తిని నేను చూస్తున్నాను. సృష్టికర్త సమస్తమును చేయగలడు. ఆమె ఆ బిడ్డను మరలా, లేవనెత్తినది. ఖచ్చితంగా.
279 ప్రతి వ్యక్తీ తన ఇష్టప్రకారము చేయుటకు కారణమేదనగా, ప్రభువు యొక్క వాక్యము రావడానికి వారికి ప్రవక్త లేడు. ఆ దినములలో వాక్యము మరియు ప్రవక్తలు లేరు.
280 ఓ, నేను మార్పుపొందిన సమయములో, మనము జీవించుచున్న దినమును చూశాను. సంఘము నన్ను పట్టుకొనక ముందే దేవుడు నన్ను పట్టుకున్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. బహుశా నేనొక నాస్తికుణ్ణి అయ్యేవాడిని. అవును, అయ్యా. నేను…ఈ సమస్త కలగలుపు, ఒక గందరగోళము, మరియు ప్రతియొక్కరూ, “మంచిది, వచ్చి మాలో చేరుము. మరియు లేనియడల, సరి, నీవు నీ పత్రమును తీసుకువెళ్ళి మరొక దానిలో చేరుము.” ఓహ్! “మా సహవాసములోనికి నీ పత్రమును తీసుకొని రావా?”
281 ఒక పత్రము ఉందని నేను నమ్ముచున్నాను, అది క్రీస్తు నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాసినప్పుడైయున్నది. అది దానిపైన మాత్రమే ఉంటుంది.
282 నేను మతశాఖలన్నిటిని చూసినప్పుడు! మా పూర్వీకులు ఐరిష్ వారు, అది గతంలో క్యాథలిక్ సంఘమైయున్నది. మరియు అది చెడిపోయి, కుళ్ళిపోవుటను నేను చూశాను. నేను ఇక్కడ ఈ పట్టణములో ఉన్న ఒక ఫలానా సంఘశాఖకు వెళ్ళాను, వారు ఇట్లు చెప్పారు, “ఓ, మేమే మార్గము, సత్యము, వెలుగు. మేము దానంతటినీ పొందుకున్నాము.” న్యూ ఆల్బనీలో నేను మరొకదానికి వెళ్ళాను, “ఓ, మై! అక్కడున్నవారు దేనిగూర్చి మాట్లాడుచున్నారో వారికే తెలియదు.” క్యాథలిక్కులు ఇట్లన్నారు, “మీరందరూ తప్పు.”
నేననుకున్నాను, “ఓ, మై!”
283 నేనొక లూథరన్ అబ్బాయితో ఆడుకున్నాను. మరియు నేను అనుకున్నాను…ఒక చిన్న జర్మనీ లూథరన్. నేను అక్కడికి వెళ్ళి, మరియు ఇట్లు అడిగాను, “నీవు చర్చికి ఎక్కడికి వెళ్తావు?”
“నేను ఆ చర్చికి వెళ్తాను.”
284 నేనక్కడికి వెళ్ళాను, మరియు వారు తామే మార్గము అని చెప్పుటను నేను కనుగొన్నాను. నేను ఇమ్మానుయేలు బాప్టిస్టు సంఘము లేదా ఫస్ట్ బాప్టిస్టు సంఘములోనున్న, సహోదరుడు డేల్ దగ్గరికి వెళ్ళాను. “ఇదే మార్గము,” అని వారు చెప్పారు. తర్వాత నేను ఐరిష్ సంఘమునకు వెళ్ళాను, అది ఇట్లు చెప్పినది, “మంచిది, ఇదే ఆ మార్గము.”
285 “ఓ, మై! నేను చాలా గందరగోళంలో పడిపోయాను. ఏమి చేయాలో నాకు తెలియదు. అయితే నేను సరియైనది పొందాలనుకొనుచున్నాను.” ఏమి చేయాలో నాకు తెలియలేదు. మరియు ఏ విధంగా పశ్చాత్తాపపడాలో నాకు తెలియలేదు.
286 నేనొక ఉత్తరము వ్రాశాను. నేను తలంచాను, “నేను ఆయనను అడవిలో చూశాను.” నేను ఆయనకు ఒక ఉత్తరము వ్రాశాను. నేను అన్నాను, “ప్రియమైన అయ్యా, నీవు ఈ మార్గమున వెళ్తావని నాకు తెలుసు, ఎందుకనగా నేనిక్కడ ఉడతలు వేటాడుతుంటాను. నీవు ఇక్కడకు వస్తావని నాకు తెలుసు. నీవిక్కడ ఉన్నావని నాకు తెలుసు. నాకు నీవు కావాలి. నేను నీకొక సంగతి చెప్పగోరుచున్నాను.”
287 నేనిట్లు తలంచాను, “ఇప్పుడు ఒక నిమిషం ఆగుము. నేను—నేను ఎన్నడూ ఎవరిని చూడలేదు. లేదు. నేను దానితో మాట్లాడగోరుచున్నాను. నేను—నేను ఆయనతో మాట్లాడగోరుచున్నాను. నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను.” నేను తలంచాను, “మంచిది, ఇప్పుడు, దానిని ఎలా చేయాలో నాకు తెలియదు.”
288 నేను నీటితో, తడిగా ఉన్న ఆ పాకలోనికి వెళ్ళి, మరియు మోకరించాను. అక్కడ పాడైపోయిన, ఒక చిన్న, పాత కారు ఉన్నది. నేను అన్నాను, “నేనొక చిత్రమును చూశాను అని నేను నమ్ముచున్నాను, వారు తమ చేతులు ఈ విధంగా పెడతారని, నేను నమ్ముచున్నాను.” మరియు నేను మోకరించాను. మరియు నేనిట్లు చెప్పాను, “ఇప్పుడు నేను చెప్పబోవునది ఏమిటి?” నేను చెప్పాను, “నీవు దీనిని చేయుటకు ఏదో ఒక విధానము ఉండియున్నది, కానీ అది నాకు తెలియదు. ప్రతి దానిని సమీపించు మార్గము ఒకటి ఉన్నదని నాకు తెలుసు. మరియు నాకు…” నేను అన్నాను, “నేను నా చేతులను ఈ విధంగా పెడతాను.”
289 నేను ఇట్లన్నాను, “ప్రియమైన అయ్యా, మీరు వచ్చి, ఒక్క నిమిషము నాతో మాట్లాడాలని నేను కోరుచున్నాను. నేను ఎంత చెడ్డవాడినో మీకు చెప్పగోరుచున్నాను.” నా చేతులు ఇలా పెట్టుకున్నాను. నేను ఆలకించాను.
290 “దేవుడు నాతో మాట్లాడాడు,” అని ప్రజలు చెప్తారు. మరియు ఆయన మాట్లాడునని నేను ఎరుగుదును, ఎందుకనగా నేను ఒక పిల్లవానిగా ఉన్నప్పుడు నేను దానిని విన్నాను, “మద్యము త్రాగవద్దు,” అని మొదలైనవి నాతో చెప్పాడు.
291 ఆయన నాకు జవాబు ఇవ్వలేదు. నేను అన్నాను, “బహుశా, నేను నా చేతులను ఈ విధంగా పెట్టాలేమో.”
292 కాబట్టి నేను చెప్పాను, “ప్రియమైన అయ్యా, దీనిని సరిగా ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ నేను—నేను నమ్ముచున్నాను మీరు…మీరు నాకు సహాయము చేస్తారా?”
293 మరియు ప్రతి ఒక్క బోధకుడు, వచ్చి వారి దానిలో చేరమనియు, మరియు లేచి నిలబడి యేసు క్రీస్తును స్వీకరించామని చెప్పండి అని చెప్పుదురు, మరియు వారు “యేసు దేవుని కుమారుడని నమ్ముతారు.” దయ్యములు కూడా దానినే నమ్ముతాయి.
కాబట్టి నేనిట్లు అనుకున్నాను, “నేను—నేను దానికంటే శ్రేష్ఠమైన దానిని కలిగియుండాలి.” లేదు.
నేను ఈ విధంగా కూర్చునియున్నాను.
294 పేతురు మరియు యోహాను శృంగారమను దేవాలయపు గవిని దాటి వెళ్ళుచుండగా, తల్లి గర్భమునుండి, కుంటివాడైన ఒక వ్యక్తి కూర్చునియుండుటను గూర్చి నేను చదివాను. ఇట్లు చెప్పాడు, “వెండి బంగారములు నాయొద్ద లేవు, కానీ నేను కలిగిన దానిని…” ఓ, అది నాయొద్ద లేదని నాకు తెలియును.
295 కాబట్టి దానిని ఎలా—ఎలా చేయాలో కనుగొనుటకు నేను ప్రయత్నించుచుంటిని. ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియలేదు. నా చేతులు ముడుచుకొని, పిదప ఇలా పడుకున్నాను.
296 మరియు, సాతానుడు రంగము మీదికి రానే వచ్చాడు, ఇట్లన్నాడు, “ఇటు చూడు, నీవు చాలాసేపు కనిపెట్టావు. నీకు ఇప్పటికే ఇరవై సంవత్సరాలు. ఇప్పుడు దానిని ప్రయత్నించవలసిన అవసరము లేదు. అవును.”
297 అప్పుడు నేను కృంగిపోయాను, మరియు ఏడ్వటం మొదలుపెట్టాను. మరియు పిదప, నేనిక పూర్తిగా కృంగిపోయినప్పుడు, నేను ఇట్లు చెప్పాను, “నేను మాట్లాడబోవుచున్నాను. నీవు నాతో మాట్లాడకపోయినను, ఎలాగైనా, నేను నీతో మాట్లాడబోవుచున్నాను.” కావున నేను—నేను ఇట్లు చెప్పాను, “నేను మంచివాణ్ణి కాను. నన్ను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. మిస్టర్. దేవుడా, ఎక్కడినుండైనా, నీవు నా మాటలు వింటావని నాకు తెలుసు. నీవు నా మాటలు వింటావు. మరియు నన్ను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. నేను నిన్ను నిర్లక్ష్యము చేసినందుకు సిగ్గుపడుచున్నాను.”
298 ఆ సమయములో, నేను పైకి చూశాను, మరియు ఒక వింతైన అనుభూతి నాకు కలిగినది. ఆ గదిలోనికి ఒక వెలుగు వచ్చినది, అది ఈ విధంగా, ఒక సిలువవలె ఏర్పడినది. మరియు నా జీవితంలో, నేనెన్నడూ వినని ఒక స్వరము, నాతో మాట్లాడినది. నేను దాని వైపు చూశాను. అంతా చల్లబడిపోయాను, భయంతో మొద్దుబారిపోయాను. నేను కదలలేకపోయాను. నిలబడి, దానివైపు చూసాను. అది వెళ్ళిపోయినది.
299 నేను ఇట్లన్నాను, “అయ్యా, నాకు—నాకు నీ భాష అర్థం కావడంలేదు.” నేను చెప్పాను, “నీవు నా భాషలో మాట్లాడలేకపోతే, మరియు నాకు—మరియు నాకు నీ భాష అర్థం కాకపొతే, మరియు నీవు నన్ను క్షమించినట్లయితే…నేను అక్కడున్న సిలువలో లెక్కించబడవలసిన వాడననియు, అక్కడే ఎక్కడో, నా పాపములు ఉంచబడవలెననియు నాకు తెలుసు. మరియు—మరియు నీవు నన్ను క్షమించినట్లయితే, కేవలం వెనుకకు వచ్చి నీ స్వంత భాషలో మాట్లాడుము. మరియు నీవు నా భాషలో మాట్లాడలేనియెడల, దానిని బట్టి నేను అర్థము చేసుకుంటాను.” నేను చెప్పాను, “కేవలం మరొక్కసారి తిరిగి, దానిని రప్పించుము.”
300 అది మరలా వచ్చినది. ఓ, మై! అదెంత ఆశీర్వాదము! అక్కడ నేనొక సంపూర్ణతను పొందుకున్నాను. ఆమేన్. అవును, అయ్యా. ఒక—ఒక నలభై టన్నుల బరువు నా భుజముల మీద నుండి తొలగిపోయినట్లు అనిపించినది. నా పాదములు నేలను అంటుకోలేనంతగా, నేను ఆ నేల మీద నడుచుకుంటు వెళ్ళాను.
అమ్మ చెప్పినది, “బిల్లీ, నీవు నరాల ఉద్రిక్తతలో ఉన్నావు.”
నేను ఇట్లన్నాను, “లేదు, అమ్మా, ఏమి జరిగినదో నాకు తెలియదు.”
301 అక్కడ వెనుక వైపున రైలు పట్టాలున్నాయి. నేను ఆ పట్టాల మీదికి పరుగెత్తుకుని పోయి, నా శక్తి కొలది, గాలిలోకి గంతులు వేశాను. నా భావాలను ఎలా బయటకు వ్యక్తపరచాలో నాకు తెలియలేదు. ఓ, ఎలా అరవాలో నాకు తెలుసుంటే బాగుండును! నేను అరుస్తున్నాను, కానీ నా స్వంత విధానంలో అరుస్తున్నాను, మీరు చూడండి.
302 అది ఏమిటి? విశ్రాంతి తీరములో నేను నా ప్రాణమునకు లంగరు వేశాను. అది దానిని స్థిరపరచినది. అదే నా సంపూర్ణత. అక్కడ నేను ఒక దానిని కనుగొన్నాను, అది ఏదో కల్పితమైనదో లేక ఏదో ఒక ఆలోచనో కాదు. నేను ఆ మనిషితో మాట్లాడాను. నేను ఆ మనిషితో మాట్లాడాను “ఎన్నడూ మద్యము త్రాగవద్దు, లేక పొగ త్రాగవద్దు, లేక నన్ను నేను స్త్రీలతో మరియు అటువంటి వాటితో అపవిత్రపరచు దేనిని చేయవద్దు,” అని ఆయన నాతో చెప్పెను. అదేమిటనగా, నేను పెద్దవాడనైనప్పుడు, నేను చేయవలసిన పని ఒకటి యున్నది. నేను ఆయనను కలుసుకున్నాను; సంఘమును కాదు. నేను ఆయనను కలిసాను, ఆయనను! అవునండీ. ఆయన ఒక్కడే.
303 ఇక్కడ కివానిస్ దగ్గర ఉన్న ఒక వ్యక్తివలె లేక…మాట్లాడుచుండెను, కాదు…మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన వెంటనే. సహోదరుడు ఫంక్, అక్కడ ఒక సైనికుడిగా నిలబడియున్నాడు. అతడు చెప్పాడు…అది కొంచెము, హాస్యంగా అనిపిస్తుంది. ఇది హస్యమాడే స్థలము కాదు, కానీ అతడు ఇలా చెప్పాడు. అతడిక్కడ న్యూ ఆల్బనీలో ఉన్నాడు.
304 మరియు అతడు చెప్పాడు, “సైన్యాధిపతి మమ్ములను బయటికి తీసుకొనివెళ్ళి, ఇట్లన్నాడు, ‘ఈ దేశమంతా జపాను సైనికులతో నిండిపోయినది. అబ్బాయిలు, రేపు ఉదయము మనము అక్కడికి వెళ్ళుచున్నాము. మనము వారిని స్వాధీనపరచుకోవాలి.’ అతడు ఇట్లన్నాడు, ‘అబ్బాయిలారా, గుర్తుంచుకొనండి, ఈ దినమున, ఇక్కడ నిలబడియున్న మనలో అనేకులు, రేపు ఉండరు. వారు రేపు ఇక్కడ ఉండరు. మనము ఉదయమున, తెల్లవారగానే వెళ్తాము.’ ఇట్లు చెప్పాడు, ‘ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ స్వంత మతమును, భక్తిని కలిగియుండండి.’” ఈ వ్యక్తి చెప్పాడు, “మరియు నాకు ఏ మతము లేదు.” మరియు చెప్పాడు, “నేను అన్నాను…”
305 ఇట్లన్నాడు, “నేనక్కడ నిలబడియున్నాను. మరియు ఆ మిగిలిన వారందరూ…” చెప్పాడు, “ఒక మతగురువు వచ్చి, ఇటు వైపు వెళ్ళాడు; మరియు ఒక ప్రొటెస్టెంటు ఇటు వైపు వెళ్ళాడు; మరియు ఒక యూదుడు ఈ వైపు వెళ్ళాడు; మరియు క్యాథలిక్కులు; వారి మత గురువుతో ఆ వైపు వెళ్ళారు.” అతడు చెప్పాడు, “నేనక్కడ నిలబడియున్నాను.”
306 మరియు ఇట్లన్నాడు, “ఆ—ఆ సైన్యాధికారి నాతో చెప్పాడు, ‘అబ్బాయ్, నీవు నీ స్వంత మతమును కలిగియుండుట మంచిది.’”
అతడు చెప్పాడు, “నాకు ఏదీ లేదు.”
307 అతడు చెప్పాడు, “నీవు ఏదో ఒకటి పొందడం మంచిది, ఎందుకనగా నీకు వెంటనే ఒకటి అవసరం పడుతుంది. నాకు ఖచ్చితంగా తెలుసు.”
308 మరియు, ఆ సమయానికి ఒక గుంపు అటుగా వెళ్ళుట చూశాడని, అది క్యాథలిక్ గుంపని అతడు చెప్పాడు. అతడక్కడికి నడిచివెళ్ళి మరియు ఈ యాజకునితో, “నీవు నాకు ఏదైనా మతమును ఇవ్వగలవా?” అని అన్నాడని చెప్పాడు.
మరియు అతడిట్లు చెప్పెను, “రమ్ము.”
309 ఇట్లన్నాడు, “అతడు లోపలికి వెళ్ళి మరియు నన్ను ఒక క్యాథలిక్కుగా మార్చెను.” మరియు మీకు తెలుసా, అక్కడ న్యూ ఆల్బనీలో, ఈ వ్యక్తి ఈ విషయాలను చెప్పుచున్నప్పుడు జాన్ హోవార్డ్ మరియు నిజమైన రాచరికపు, క్యాథలిక్కుల గుంపు అక్కడ కూర్చునియున్నది.
310 మరియు అతడు చెప్పాడు—అతడు ఇట్లన్నాడు, “మరుసటి రోజు యుద్ధంలో…” అది ఎలా ఉన్నాదో, ఓ, అతడు దానిని గూర్చి చెప్పుచున్నాడు. మరియు అతడొక ఆజానుబాహుడని అతడు చెప్పెను, మీకు తెలుసు. మరియు చెప్పెను, “వారు చెయ్యి చెయ్యి పట్టుకొని పోరాడుచున్నారు, మరియు వారు కత్తులతో పొడుచుకొనుచున్నారు, మరియు కేకలు వేస్తూ, పొడుచుకొనుచూ మరియు నరుకుకొనుచున్నారు.” అతడన్నాడు, “వారి వరుసలు చెదిరిపోయాయి. జపాను వారు ఎందులోనికైతే వారిని వెళ్ళేటట్లు చేసారో, నేరుగా అక్కడికే, వారు ఆ విధంగా వచ్చారు, మరియు ఆ పెద్ద మెషిన్ గన్నులు, ప్రతి వైపు నుండి పేలుచున్నాయి. ఒక ముఖాముఖి యుద్ధము!”
311 ఇట్లన్నాడు, “నేరుగా, నేను ఈ విధంగా ఆగిపోయాను.” మరియు చెప్పాడు, “ప్రతిచోట అరుపులు మరియు ఆ విధంగా ఉన్నది, నీ మాటలు నీకు కూడా వినబడవు.” చెప్పాడు, “అక్కడ రక్తము ఉన్నది.” చెప్పాడు, “నేను చూశాను, మరది నా రక్తమే.” అతడు చెప్పాడు, “నేను ఇక్కడ చూశాను. నా ప్రక్కలో ఒక రంధ్రమున్నది.” అతడు చెప్పాడు, “అది నా రక్తమే.” మరియు చెప్పాడు, “నేను, మీకు తెలుసు, నేను—నేను—నేను…”
మరియు ఒక నిజమైన…ఒక క్యాథలిక్కు స్నేహితుడు, ఇప్పుడు నేను దీనిని తమాషా కొరకు—కొరకు చెప్పుటలేదు, కానీ ఒక నిజమైన క్యాథలిక్కు అడిగాడు—ఇట్లన్నాడు, “నీవు మరియా నీకు జయము అని చెప్పావా?”
312 అతడు చెప్పాడు, “లేదయ్యా.” అతడు చెప్పాడు, “అది నా రక్తము. నాకు ఏ కార్యదర్శి అక్కరలేదు. నేను చెప్పాను, ‘నేను ఆ ప్రధానమైన వ్యక్తితో మాట్లాడగోరచున్నాను.’ అది—అది నా రక్తము.”
313 అది ఆ విధంగా యుండునని నేననుకుంటున్నాను. అవునయ్యా. అది ఆ విధంగానే జరుగును. మనము కట్టుబడియుండే ఒక దానిని, ఒక సంపూర్ణతను కలిగియుండవలసియున్నది.
“నాకు ఆయన కార్యదర్శి కొరకు ఏమాత్రం సమయం లేదు.” అతడు చెప్పాడు, “నేను ఆయనతో మాట్లాడగోరుచున్నాను.”
314 మరియు సహోదరుడా, అది అంతే. ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, నీవు ఒక బోధకుని మాటనో, లేక ఎవరో కార్యదర్శి మాటనో, లేక ఏదో వేరొక దానిని తీసుకోవాలని అనుకొనవు. ప్రొటెస్టెంటులైన మీరు, దీనిని, దానిని లేక మరొక దానిని తీసుకోకండి. తిరిగి జన్మించి మరియు పరిశుద్ధాత్మతో నింపబడి, నూతన జన్మ ద్వారా మీరు లంగరు వేయబడువరకు, ఆ సంపూర్ణత నొద్దకు సాగిపోవుడి, మరియు మీ జీవితంలో దీనత్వము మరియు ప్రేమ ద్వారా బైబిలు ప్రత్యక్షపరచబడుటను మీరు చూస్తారు. ఓ, అప్పుడు, అదీ మీ యొక్క సంపూర్ణత. అవునండీ.
315 ఆయన వాక్యమైయున్నాడు అనుదానిని నేను వాక్యములో చదివాను. అయితే, జర్మనీ సంఘము ఇది మార్గము అని చెప్పుచున్నది; మరియు మెథడిస్టలు, మరియు బాప్టిస్టులు, మరియు క్యాథలిక్కులు. కానీ ఆయన ఇట్లు చెప్పిన దానిని నేను వాక్యములో చదివాను, “ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.”
ఇప్పుడు, ముగింపులో వినండి. ఇప్పుడు ప్రొటెస్టెంటువారు చెప్పుచున్నారు…
316 ఇప్పుడు, క్యాథలిక్కులు ఇట్లంటారు, “ఆయన దానిని పేతురు మీద నిర్మించాడు, ‘నీవు పేతురువు, మరియు ఈ బండ మీద…”’ లేదు, ఆయన ఎన్నడూ చేయలేదు. అది అట్లయినచో, అది అప్పుడే పడిపోయేది. వారు దానిని ఒక మనుష్యుని మీద నిర్మించారు.
317 ఆయన ఏమి చేశాడు? ప్రొటెస్టెంటువారు ఇట్లన్నారు, “ఆయన తన మీదనే దానిని నిర్మించుకున్నాడు.” లేదు. ఆయన అలా చేయలేదు. దానిని తన మీద నిర్మించుకొనలేదు.
318 ఆయన ఏమి చేశాడు? ఏమిటి? “మనుష్యకుమారుడనైన నన్ను గూర్చి ప్రజలు ఏమి చెప్పుకొనుచున్నారు?”
“కొందరు నీవు ‘ఏలీయా,’ అనియు మరియు ‘మోషే’ అనియు చెప్పుకొనుచున్నారు.”
“మరి మీరేమని చెప్పుకొనుచున్నారు?” అని ఆయన అడిగాడు.
అందుకు పేతురు ఇట్లు చెప్పెను, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.”
319 ఇప్పుడు ఆ మాటలను గమనించండి. “సీమోను, బర్ యోనా, నీవు ధన్యుడవు. రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవు ఒక యాజకుని ద్వారా దీనిని నేర్చుకొనలేదు. ఏదో వేదాంత కళాశాల ద్వారా నీవు దీనిని నేర్చుకొనలేదు. కానీ పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. మరియు ఈ బండ మీద,” వాక్యము యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద, “నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.”
“ప్రభువా, అదే అది,” అని నేను అనుకున్నాను.
320 నేనిక్కడ ప్రకటన గ్రంథములో చదివాను, 21వ అధ్యా-…22వ అధ్యాయంలో, అక్కడ ఆయనిట్లు చెప్పాడు, “ఎవడైననూ…” ఇది సంపూర్ణ కార్యమైయున్నది. “ఎవడైనను దీనితో మరి ఏదైనను కలిపినయెడల; ఎవడైనను దానిలోనుండి ఏదైనను తీసివేసినయెడల, దానిని తృణీకరిస్తే; లేదా ఎవడైనను దానిని మెరుగుపరుచుటకు, ఆ దినమునకు అనుగుణంగా దానిని దిద్దుటకు ప్రయత్నించినయెడల. ఎవడైనను దానికి ఏదైనా కలిపినా, లేక తీసివేసినా, జీవ గ్రంథములో నుండి అతడి పేరు తీసివేయబడును.”
321 నేను చెప్పాను, “అట్లైన, నాకు కావలసిందల్లా అదియే, ప్రభువా, దీనిని విశ్వసించడమే.” మరియు ఇంతలో, దూరాన్న ఆ సిలువలో, క్రీస్తు వచ్చాడు. ఆయన చెప్పిన ప్రతీ మాట, వాక్యమునకు అనుగుణంగా ఉన్నది. గ్రంథమును ఈ చేతిలోనికి తీసుకొనెను, చరిత్రను ఈ చేతిలోనికి తీసుకొనెను, మరియు నేరుగా వాటిని పరిపూర్ణముగా, ఋజువుపరచెను. మరియు నేను చెప్పాను, “అప్పుడు, ప్రభువా, నన్ను స్వీకరించుము.” మరియు నేనట్లు చేసినప్పుడు, నా సంపూర్ణతైయున్న క్రీస్తును, ఆ పరిశుద్ధాత్మను, నా హృదయములోనికి స్వీకరించాను. అది నేను కాదు.
322 ఒకసారి నేను అనారోగ్యముతో ఉన్నాను, అప్పుడు నా…నా భార్యను నేను కోల్పోయాను. నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను. ఓ, నా తండ్రిని పోగొట్టుకున్నాను, మరియు నా సహోదరుణ్ణి పోగొట్టుకున్నాను, మరియు నా మరదలను పోగొట్టుకున్నాను. మరియు బిల్లీ అక్కడ మరణావస్థలో పడియున్నాడు, మరియు—మరియు నేను దాదాపు వెళ్ళిపోయాను. నేను దారినపడి పోవుచున్నాను, ఏడ్చుకుంటూ, ఆమె సమాధి వద్దకు వెళ్ళుచున్నాను; ఆమె మరియు బిడ్డ, మరియు బిడ్డ ఆమె చేతి మీద పెట్టబడినది. సమాధి దగ్గరికి వెళ్ళుచున్నాను. నేనక్కడికి నడుస్తూ ఉన్నాను. శ్రీ. ఐస్లర్ అక్కడికి వచ్చి ఆడుకునేవాడు, మీకు తెలుసు కదా, అతడు ఇండియానా రాష్ట్రము యొక్క శాసనసభ్యుడు. అతడు ఆ దారిలో వచ్చుచున్నాడు. అతడు నన్ను ఆపాడు. అతడు పరుగెత్తి వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. అది 37 లోని వరదల తర్వాతైయున్నది. అతడు ఇట్లన్నాడు, “బిల్లీ, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? అక్కడికా?”
మరియు, “అవును,” అని నేను చెప్పాను.
అతడు చెప్పాడు, “నీవు అక్కడికి ఏమి చేయుటకు వెళ్ళుచున్నావు?”
323 నేను చెప్పాను, “నేను ఒక పాత పావురము స్వరమును వింటాను.” నేను ఇట్లన్నాను, “నేను ఆమె మరియు పాప సమాధి దగ్గర కూర్చుంటాను. ఒక పాత పావురము అక్కడికి వస్తుంది, మరియు అది నాతో మాట్లాడుతుంది.”
“ఓ,” అతడు చెప్పాడు, “బిల్లీ!”
324 నేను చెప్పాను, “అవును. అవి దానిని వాయించినప్పుడు ఆ ఆకుల గుసగుసలు నేను వింటాను. మిస్టర్. ఐస్లర్ అవి నా కొరకు సంగీతమును వాయిస్తాయి.”
“అవి ఎలాంటి సంగీతమును వినిపిస్తాయి?” అని అతడన్నాడు.
నది ఆవల ఒక దేశము ఉన్నది,
అది ఎల్లప్పుడూ మధురము అని వారు పిలుచుదురు,
కేవలం విశ్వాసము ద్వారానే మనము ఆ తీరమునకు చేరుదుము;
ఒకరి తర్వాత ఒకరికి ఆ ద్వారము తీయబడును,
అక్కడ అమరత్వముతో నివసించుదుము,
నీ కొరకు మరియు నా కొరకు ఎవరో అక్కడ బంగారు గంటలు మ్రోగిస్తారు.
325 అతడన్నాడు, “బిల్లీ, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను.” అతడు అడిగాడు, “ఇప్పుడు క్రీస్తు నీకేమైయున్నాడు? ఇప్పుడు క్రీస్తు నీకు ఏమైయున్నాడు?”
326 నేను చెప్పాను, “ఆయన నా జీవము, నా సమస్తము. శ్రీ. ఐస్లర్, నేను కలిగియున్నదంతయు ఆయనే. ఆయనే నా—నా తుది గమ్యము. నేను పట్టుకొనగల సమస్తమును ఆయనే.” ఎందుకు? అక్కడ ఏదో జరిగినది, “ఈ బండ మీద!”
327 అతడు ఇట్లన్నాడు, “నీవు ఇక్కడ మూలన నిలబడి, మరియు చనిపోయేంతగా ప్రసంగించుటను నేను చూశాను. నీవు రాత్రంతా వీధులలో పైకి-మరియు-క్రిందకి తిరుగుచూ, రోగులను దర్శించుటను, నేను చూశాను. ఆయన నీ స్వంత భార్యను, మరియు నీ స్వంత కుమార్తెను తీసుకున్న తర్వాత కూడా, నీవు ఆయనకు సేవ చేస్తావా?”
328 అందుకు నేనన్నాను, “ఆయన నన్ను చంపినను, నేను ఆయనయందు విశ్వాసముంచుదును.” ఎందుకు? నా లంగరు తెర లోపల పట్టుకొనియున్నది. నేను ఒక సంపూర్ణతను కలిగియున్నాను. నన్ను నేను ఆయన వాక్యమునకు కట్టుకున్నాను, మరియు ఆయన వాక్యము పట్టుకొనియున్నది. ఆయనే నా సంపూర్ణత. ఈ ఇతర కార్యములన్నీ విఫలమవ్వవచ్చు గానీ, క్రీస్తు ఎన్నటికీ విఫలమవ్వడు అని నేను కనుగొన్నాను.
329 క్యాథలిక్కు సంఘము పోపును తమ సంపూర్ణతగా కలిగియున్నారు. ప్రొటెస్టంట్లు తమ బిషప్పులను, మరియు తమ సిద్ధాంతములను మరియు తమ అధ్యక్షులను కలిగియున్నారు.
330 కానీ, నేను, పౌలు వలె…మీ దగ్గర పెన్సిల్ ఉన్నదా? ఇది వ్రాసుకొనండి. లో…అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో పౌలు చెప్పెను, “ఇవి ఏవీయు నన్ను కదల్చలేవు.” ఓ, నీవు సిద్ధాంతములను కలిగియుండవచ్చును, నీవు కోరుకున్న దేనినైన నీవు కలిగియుండవచ్చును, కానీ అవేవియు నన్ను కదల్చలేవు.
నా ఆత్మను నేను విశ్రాంతి తీరమున లంగరు వేసుకొనియున్నాను,
భీకరమైన సముద్రాలలో పయనించుటకు (మరియు నీవు ఎక్కడ ఉన్నవో తెలియదు, ఈ మార్గము, ఆ మార్గము) ఇక లేదు;
భయంకరమైన అలలు, తుఫానులో చుట్టుముట్టవచ్చును,
సమస్తము తలక్రిందులైపోవచ్చును.
కానీ యేసులో నేను నిరంతరము క్షేమమే.
331 అవును. వీటిలో ఏవీయు నన్ను కదల్చలేవు, ఎందుకనగా నేనొక లంగరుకు కట్టబడియున్నాను. “ఓ, నేను ఆయనను కలసినప్పటినుండి,” పౌలు ఇట్లు చెప్పెను, “ఆ మార్గంలో, నేను ఒక లంగరుకు కట్టబడియున్నాను. ఆయన నన్ను త్రిపివేసాడు. ఆయన నన్ను మరలా సరిగా ప్రారంభించాడు.” గుర్తుంచుకొనండి, పౌలు కూడా దేశములో అతిపెద్ద మత సంస్థకు చెందినవాడు, కానీ అతడు సంపూర్ణతకు కట్టబడవలసియున్నాడు.
332 వినండి. నేను మీకొక సంగతి చెప్పగోరుచున్నాను. నన్ను రక్షించుటలో ఆయనకు ఒక ఉద్దేశ్యము ఉన్నది. నిన్ను రక్షించుటలో ఆయనకు ఒక ఉద్దేశ్యము ఉన్నది. మరియు ఆయన చిత్త ప్రకారము, దానిని చేయవలెననియు; దానికి ఏదీ కలపకూడదనియు, లేదా దానిలోనుండి ఏదియూ తీసివేయకూడదనియు నేను నిశ్చయించుకున్నాను. ఒకవేళ, మీరు దానిని వ్రాసుకోవాలంటే ప్రకటన 22:19. సరే మంచిది. “ఎవడైనను ఏదైనా తీసివేసినట్లయితే…” నేను నిశ్చయించుకున్నాను. నేను మందిరమును విడిచిపెట్టుటకు నిర్ణయించుకున్నాను, మరియు మీకది తెలుసు. మరియు నేను జీవించినంత కాలం, దేవుని సహాయము వలన ఈ సువార్తతో నిలిచియుండాలని నేను నిశ్చయించుకున్నాను. హ! గుర్తుంచుకొనండి, ఇక్కడ కృప ఉన్నది. ఆయన నన్ను రక్షించినప్పుడు, లక్షలాదిమంది పాపములోనే మరణించారు. ఆయన నన్ను రక్షించుటకు నేను ఏపాటివాడను? ఆయన రక్షించుటలో ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడు, మరియు ఆ ఉద్దేశ్యమును నెరవేర్చాలని నేను నిశ్చయించుకున్నాను. నేను లెక్కచేయను. అది నా అంతము కావచ్చు, బహుశా ఇప్పుడది చాలా సమీపంగా ఉండవచ్చును. కానీ, అది ఏమైనప్పటికీ, నేనింకనూ లంగరు వేయబడియున్నాను. అది ఎన్నడూ మారదు.
333 నేను ఆ రోడ్డు మీద వెళ్ళుచుండగా, ఆ దినమున శ్రీ. ఐస్లర్ నాతో ఇట్లన్నాడు, అతడన్నాడు, “బిల్లీ, ఈ శ్రమలన్నింటి మధ్యలో, నీవు నీ భక్తిని కాపాడుకున్నావా?”
334 నేను చెప్పాను, “లేదు, అయ్యా. అదే నన్ను కాపాడినది.” హ-మ్. నా లంగరు పట్టుకొనియున్నది. అది నిజము. నేనెన్నడూ దానిని కాపాడలేదు. అదే నన్ను కాపాడినది. నేను దానిని కాపాడలేను. నేను దానిని చేయగల మార్గమే లేదు. కానీ అదే నన్ను కాపాడినది. అవును, అండీ.
335 నన్ను రక్షించుటలో ఆయన ఒక ఉద్దేశ్యాన్ని కలిగియున్నాడు. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లక్షలాదిమంది పాపములో ఉన్నారు, కానీ ఆయన నన్ను రక్షించాడు. ఆయనట్లు చేయుటలో ఒక ఉద్దేశ్యాన్ని కలిగియున్నాడు.
336 మరణ భయమునకు, క్రీస్తు యొక్క మరణము ఒక సంపూర్ణతైయున్నది. మరణమనే ఆ కందిరీగ ఆయనను కుట్టి మరియు ఆ ముల్లును గుచ్చినప్పుడు, క్రీస్తు యొక్క మరణము ఆ ప్రశ్నను పరిష్కరించినది. మీకు తెలుసా, ఒక కందిరీగ, ఏదైనా ఒక ముల్లున్నటువంటి ఒక కీటకము, అది గనుక దాని ముల్లును, లోతుగా గుచ్చినట్లయితే, అది బయటకు లాక్కున్నప్పుడు, అది ఆ ముల్లును దానినుండి వదిలిపెడుతుంది. మరణము ఎల్లపుడూ ఒక ముల్లును కలిగియున్నది. మరణము ఎప్పుడూ ఒక ముల్లును కలిగియున్నది.
337 మరియు ఒక దినమున, కల్వరికి వెళ్ళుచున్నప్పుడు, ఆ రాళ్ళయొక్క గతుకులను బట్టి, రక్తము ఆ రాళ్ళ మీద చిందుచున్నది, గోల్గోతాకు వెళ్ళు దారిలో, అది కల్వరి పై ఆ మట్టిని తాకుచున్నప్పుడు, ఆ సిలువ యొక్క వెనుక భాగము, అక్కడ నడుచుకుంటూ వెళ్ళుచున్న, ఆ బలహీనమైన శరీరము యొక్క, రక్తపు అడుగుజాడలను ఈడ్చుకొని పోవుచుండెను. ఆయన కొండపైకి వెళ్ళుచుండగా, వారు కొరడాలతో కొట్టుచూ మరియు ఆయనను నలగగొట్టుచుండిరి, కానీ ఆయన ఒక సంపూర్ణతను కలిగియున్నాడు. తాను ఎక్కడ నిలబడియున్నాడో ఆయన ఎరిగియున్నాడు, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము, దావీదు ద్వారా ఇట్లు పలికినది, “నా పరిశుద్ధుని నేను కుళ్ళుపట్టనీయను, ఆయన ప్రాణమును నేను పాతాళములో విడిచిపెట్టను.”
338 డెబ్బై-రెండు గంటల్లో కుళ్ళిపోవుట ప్రారంభమగునని ఆయనకు తెలుసు. ఆయన ఇట్లు చెప్పాడు, “ఈ దేవాలయమును పడగొట్టుడి, మరియు మూడు దినములలో నేను మరలా దానిని లేపుదును.” ఆయన ఒక సంపూర్ణతను కలిగియున్నాడు.
339 ఎగతాళి మాటలతో, తాగిన సైనికులచేత ఉమ్మి వేయబడి, ఆయన ముఖము చుట్టూ ఒక చింపిరి గుడ్డ కప్పబడి, అదిగో, ఆయన ఆ కొండపైకి వెళ్ళుచున్నాడు, మరియు ఆయన తల మీద కొట్టి, “నీవు ప్రవక్తవా? నిన్ను కొట్టింది ఎవరో చెప్పు,” అని అన్నారు. అక్కడ, ఆయన అవమానము, మరియు సిగ్గుతో ఆ పర్వతము ఎక్కుచున్నాడు. ఉండుటకు…ఆయన వస్త్రములు లాగివేయబడినవి, అవమానమును తృణీకరించకుండా, ప్రజల యెదుట ఆ సిలువపై దిగంబరిగా వ్రేలాడినాడు. ఏ పాపము చేయని ఒక మనుష్యుడు, రోమా ప్రభుత్వము యొక్క మరణశిక్షతో అవమానకరముగా మరణించుచుండెను.
340 ఒకసారి ఒక చిన్న కథ చెప్పబడినది, మగ్దలేనే మరియ అక్కడికి పరుగెత్తుకొని వెళ్ళి మరియు ఇట్లన్నది, “ఆయన ఏమి చేశాడు? రోగులను స్వస్థపరచాడు, చనిపోయిన వారిని లేపాడు, మరియు బంధకాలలో ఉన్నవారికి, విడుదలను అనుగ్రహించాడు. ఆయన ఏమి చేశాడు?”
341 మరియు ఒక యాజకుడు రక్తము కారునంతగా, ఆమె నోటి మీద కొట్టి, మరియు ఇట్లన్నాడు, “మీరు ఆమె మాట వింటారా లేక మీ ప్రధాన యాజకుడి మాట వింటారా?”
342 ఓ, ఆ మతశాఖల ప్రపంచము, అది అంతయు ఒక శాపము. అంతే.
343 అవును, వారాయనను, అక్కడికి తీసుకెళ్ళారు. కానీ, ఆయన ఈడ్చుకొనుచూ, ఆ కొండ మీదికి ఎక్కుచుండగా, ఆయన ఏమైయున్నాడన్న దానిని, అపవాది ఎల్లప్పుడూ సందేహించాడు. ఇట్లన్నాడు, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము. నీవు అద్భుతములు చేయగలవని నీవు చెప్పుకొనుచున్నావు. నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము.”
344 అదే పాత దయ్యము నేడు జీవించుచున్నాడు. అది నిజము. “నీవు దైవిక స్వస్థతలు చేయువాడవైతే! వృద్ధుడైన జాన్ ఇక్కడ ఉన్నాడు ఫలాన-మరియు-ఫలాన మూలన కూర్చున్నాడు. అతడు కుంటివాడని నాకు తెలుసు. అతణ్ణి స్వస్థపరచుము.” అది అదే పాత దయ్యమని మీకు తెలియదా?
యేసు చెప్పెను, “నేను కేవలం…”
345 చూడండి, ఆయన బెతస్ద కోనేరు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కుంటివారు, గ్రుడ్డివారు, ఊచకాలుచేతులు కలవారు వేలమంది పడియున్నారు, మరియు ఆయన నడవగలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతడు అటు ఇటూ తిరగగలడు. బహుశా అతడికి పౌరుష గ్రంథి సమస్య ఉండవచ్చును. అది ఏమైనప్పటికీ, అది మందగించినది. అతడు ముప్పై-ఎనిమిది సంవత్సరాలుగా దానిని కలిగియున్నాడు. అతడు ఇట్లు చెప్పాడు, “నేను కోనేరు వద్దకు వచ్చునంతలో, నాకంటే ముందు వేరొకరు దిగుచున్నారు.” అతడు నడవగలడు.
346 అక్కడ పడియున్న వారందరినీ విడిచిపెట్టి, ఆ ఒక్కడి దగ్గరికే వెళ్ళి, మరియు అతణ్ణి స్వస్థపరిచాడు. ఎందుకు? అతడు ఆ స్థితిలో ఉండియున్నాడని తాను ఎరిగియున్నట్లు ఆయన చెప్పాడు. తర్వాత వారు ఆయనతో చెప్పారు, వారు ఆయనను కనుగొన్నప్పుడు, ఆయనను ప్రశ్నించారు. పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయము, ఆయన చెప్పాడు, “నిశ్చయంగా, సరిగ్గా, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో, అదే కానీ ఆయన తనంతట తాను ఏదియు చేయనేరడు.” అక్కడే ఆయన సంపూర్ణత ఉన్నది. అది ఇప్పటికీ సంపూర్ణతైయున్నది.
347 ఆ దినమున ఫిన్లాండ్ లో అక్కడ నిలబడియున్నాను, మరియు అక్కడ చిన్న బాలుడు పడియున్నాడు, నేను నడచివెళ్ళాను, అతడు అరగంట క్రితం, మరణించి, అక్కడ పడియున్నాడు. మీరు దానిని పుస్తకంలో చదివారు. నేను అక్కడి నుండి దూరంగా నడుచుట మొదలుపెట్టాను, ఏదో వారు చేతులు వేసినట్లయినది. నేను వెనక్కి తిరిగి, “అది ఏమిటి?” అని ఆలోచించాను. నేను మరలా చూసాను. నేననుకొన్నాను, “ఒక్క నిమిషము ఆగుము.”
348 నేను బైబిలులో ఉన్న కాగితమును చూశాను. “మరియు అది జరుగుతుంది, తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న ఒక చిన్న బాలుడు, అతడు ఒక కారు ప్రమాదంలో మరణించును. అక్కడ ఆకుపచ్చ రంగులో పొడవైన చారలుగల, రాళ్ళు కుప్పగా ఉంటాయి. అక్కడ కారు ధ్వంసమైపోయి రోడ్డుకు అడ్డముగా పడియుంటుంది. అతడు అలా పైకి, చిన్న మేజోళ్ళు వేసుకొనియున్నాడు; తలవెంట్రుకలు కత్తిరించియున్నవి. అతడి చిన్న కన్నులు వెనక్కి తిరిగియున్నాయి. అతని శరీరములోని ఎముకలు విరిగియుండును.”
నేను చూశాను. నేను అనుకున్నాను, “ఓ దేవా!”
349 నేను చెప్పాను, “మీరందరూ, ఊరకుండుడి.” అక్కడ నగరు మేయరు నిలబడియున్నాడు. నేను అన్నాను, “ఆ అబ్బాయి రెండు నిమిషాలలో లేచి తన కాళ్ళ మీద నిలబడనట్లైతే, నేను ఒక అబద్ధ ప్రవక్తను; నన్ను, ఫిన్లాండ్ నుండి వెళ్ళగొట్టండి.” నిశ్చయంగా. “కానీ అతడు లేచినట్లైతే, మీరు మీ జీవితములను క్రీస్తుకు సమర్పించండి.” సరేనా. వారు నిశ్చలంగా నిలబడ్డారు.
350 నేనిట్లు చెప్పాను, “పరలోకపు తండ్రీ, ఆ సముద్రపు ఆవలిన, రెండు సంవత్సరాల క్రితం, ఈ చిన్న బాలుడు ఇక్కడ పడియుంటాడని నీవు చెప్పావు.”
351 అక్కడ సహోదరుడు మూర్ మరియు సహోదరుడు లిండ్సే ఉన్నారు, వారు దానిని చూస్తున్నారు. మరియు, ప్రతి చోట, వారు దానిని బైబిలులో వ్రాసుకున్నారు. మరియు దేశవ్యాప్తంగా వేలకొలది బైబిళ్ళలో అది వ్రాయబడినది. అది ఏమైయున్నది? ఒక సంపూర్ణత. ఏమి జరుగుతుందోయని తండ్రి చూపించాడు. అక్కడ అసలు, భయమే లేకుండా, అక్కడ నిలబడ్డాను. ఖచ్చితంగా, నిశ్చయంగా, అతడు లేస్తాడు.
352 సరిగ్గా అక్కడ ఫిన్లాండులో, రాత్రులు వేలాదిమంది ప్రజలు వచ్చారు, మరియు కొందరిని బయటకు పంపి నన్ను మాట్లాడనిచ్చారు, వారిని బయటకు పంపి మరియు వేరే వారిని లోపలకు పంపవలసివచ్చెను. దానంతటితో, అతడు అక్కడ నిలబడ్డాడు. ప్రజలు నన్ను ప్రేమించారు, మరియు స్వస్థతలు జరుగుటను వారు చూశారు, కానీ ఒక బాలుడు చనిపోయి, అక్కడ పడియున్నాడు. సంపూర్ణత అంటే ఏమిటి? ఆ దర్శనము. “తండ్రి చేయమన్న దానినే నేను చేయుచున్నాను. నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను అతడు కూడా చేయును.” అక్కడే మీ సంపూర్ణత ఉన్నది.
353 నేను చెప్పాను, “మరణమా, నీవు ఇక ఎంత మాత్రము అతణ్ణి పట్టుకోలేవు. దేవుడు పలికియున్నాడు. తిరిగి రమ్ము. అతడిని విడిచిపెట్టుము.” మరియు ఆ చిన్న పిల్లవాడు పైకి లేచాడు, చుట్టూ ఈ విధంగా చూశాడు. ప్రజలు మూర్చిల్లిపోయారు, అంతా జరిగినది. అది అక్కడ ఉన్నది, సరిగ్గా అక్కడే, ఆ నగర మేయరు చేత, లేదా, ప్రభుత్వ నోటరీ చేత సంతకం చేయబడియున్నది. అది నిజము.
354 అది ఏమిటి? ఒక సంపూర్ణత, యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నాయీను స్త్రీని, ఆమె యొక్క కమారుడిని పాతిపెట్టకుండా ఆపినది, అదే దేవుడు కదా. ఆ రోజుల్లో ఎవరైనా మరణించినట్లైతే, వారు వెంటనే వారిని సమాధి చేస్తారు. వారిని అలా ఉండనీయరు. వారు వారిని సమాధిలో పెడతారు. నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న దేవుడు అక్కడ ఉన్నాడు. అవును.
355 అక్కడ మెక్సికోలో ఉన్న, ఆ చిన్న బిడ్డను చూడండి. మీలో కొందరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చునియున్నారు. మరియు ఆ బిడ్డ, వైద్యుడు ఒక వాంగ్మూలం మీద సంతకము చేశాడు, అది క్రైస్తవ వ్యాపారవేత్తల పత్రికలో వ్రాయబడినది. “ఆ బిడ్డ ఆ ఉదయం తొమ్మిది గంటలకు మరణించెను, మరియు ఇది ఆ రాత్రి పది గంటలప్పుడైయున్నది.”
356 ఆ చిన్న స్త్రీ ఆదరణ పొందలేదు. నా కుమారుడైన, బిల్లీ అక్కడ నిలబడి, ఆమెను నిలుపుటకు ప్రయత్నించుచున్నాడు. మరియు అతడు, మంచిది, అక్కడ రెండు వందల మంది ద్వారపాలకులు ఉన్నారని నేను అనుకొనుచున్నాను, మరియు ఆమె వారిని దాటుకుంటూ వచ్చినది. అంతకు ముందు రాత్రి, ఒక గ్రుడ్డివాడు తన చూపుపొందెను, మరి అది ఆమెకు తెలుసు. ఆమె క్యాథలిక్కైయున్నది.
357 అప్పుడు, చివరికి, నేనిట్లు చెప్పాను, “వెళ్ళు, సహోదరుడా మూర్, మరియు ఆమె కొరకు ప్రార్థన చేయుము. ఎందుకనగా, ఆ బిడ్డ…”
358 వర్షము, విపరీతంగా కురుస్తున్నది. వారు ఎడ్ల పందాలు జరుగు ఆ పెద్ద మైదానంలో ఉదయం తెల్లవారుజాము నుండి అక్కడే నిలబడియున్నారు. మరియు నేను చెప్పాను…తాళ్ళతో నన్ను వెనుక నుండి, ఆ స్థలములోనికి దింపండి. అక్కడ కేవలం మూడు రాత్రులవరకైయున్నది.
359 నేను అక్కడ నిలబడ్డాను. నేను ఇట్లు చెప్పాను, “నేను చెప్పుచుండగా…” బోధించుచున్నాను. మరియు చూశాను, నేను ఇక్కడ నా ఎదురుగా ఒక చిన్న బిడ్డను చూశాను, ఒక చిన్న మెక్సికన్ బిడ్డ, పళ్ళులేవు, కేవలం అక్కడ కూర్చుని నన్ను చూస్తూ నవ్వుచుండెను, సరిగ్గా ఇక్కడ నాకు ఎదురుగా కూర్చునియుండెను.
360 నేను చెప్పాను, “సహోదరుడా మూర్, ఒక్క నిమిషం ఆగుము. ఆమెను ఇక్కడికి తీసుకురమ్ము.” ఓ, సంపూర్ణత!
361 అక్కడున్న కార్యకర్తలు ఆ స్థలమును ఖాళీ చేశారు. ఆమె అక్కడికి వచ్చినది. ఆమె మోకరించి, “పాడ్రే, పాడ్రే,” అని అన్నది.
“లేచి నిలబడు,” అని నేను చెప్పాను.
362 మరియు సహోదరుడు ఎస్పినోజా, “లేచి నిలబడు,” అని చెప్పాడు మరి అతడు స్ప్యానిష్ భాషలో ఆమెతో చెప్పాడు. ఆమె అక్కడ లేచి నిలబడినది.
నేను చెప్పాను, “పరలోకమందున్న తండ్రీ, నేను ఇక్కడ ఈ వర్షములో నిలబడియున్నాను.”
363 ఇరవై మూడు సంవత్సరములు లేదా అంత వయస్సుగల ఆ అందమైన, చిన్న స్త్రీ అక్కడ అలా నిలబడియున్నది, ఆమె తలవెంట్రుకలు క్రిందికి వ్రేలాడుచున్నాయి. ఆమె చిన్న ముఖము అలా పైకి చూస్తున్నది, ఆమె చూపులో, ఆశ కనిపించుచున్నది. దాదాపు నలభై సంవత్సరాలుగా పూర్తిగా గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి, వేదిక మీద అతని కన్నులు తెరవబడుటను ఆమె చూసినది. దేవుడు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరవగలిగితే, ఆయన ఆమె బిడ్డను కూడా స్వస్థపరచగలడని ఆమెకు తెలుసు. ఆమె అక్కడ ఉన్నది, ఆ దుప్పటిలో ఆ విధంగా ఒక చిన్నది గట్టిగా బిగుసుకుపోయి ఉన్నది, మరియు అది తడిచిపోవుచున్నది. ఆమె ఉదయమంతయూ, మరియు ఆ మధ్యాహ్నము కూడా అక్కడ నిలబడియున్నది. అప్పుడు రాత్రి పది లేక పదకొండు గంటలు అయినది, ఆమె బిడ్డను అలా పట్టుకొనియున్నది. క్రిస్టియన్ బిజినెస్ మెన్ పత్రికలో ఆ వ్యాసమును మీరు చూశారు. అక్కడ, ఆ బిడ్డను అలా పట్టుకొనియున్నది.
364 నేను చెప్పాను, “పరలోకపు తండ్రీ, దీని భావము ఏమిటో నాకు తెలియదు. నేను కేవలం నీ సేవకుడను. కానీ ఆ బిడ్డ అక్కడ నిలబడియుండుటను నేను చూశాను. అది సజీవముగా ఉన్నది. ప్రభువైన యేసు నామములో, నేను నా చేతులను ఆ బిడ్డ మీద పెట్టుచున్నాను.”
“వ్యా!” అని, మరియు ఏడ్వటం మొదలుపెట్టినది.
365 ఆ తల్లి ఆ బిడ్డను ఒక్కసారిగా హత్తుకొని మరియు కేకలు వేయడం మొదలుపెట్టినది. మరియు అక్కడున్న ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు, స్త్రీలు స్పృహ కోల్పోయారు మరియు అటువంటివి జరిగాయి. నేను ఇట్లు చెప్పాను, “దానిని గూర్చి మీరు ఏమియూ చెప్పవద్దు. ఆ బిడ్డతో, ఆ తల్లితో ఒక వ్యక్తిని పంపి, మరియు ఆ వైద్యుడి దగ్గరకి వెళ్ళి, మరియు అతని వద్ద ఒక నిర్ధారణ సంతకము తీసుకోండి, అదేమనగా, ‘ఆ బిడ్డ చనిపోయినది. ఆ ఉదయమునకు ముందు, లేక ఆ ఉదయము తొమ్మిది గంటలప్పుడు, అది ఊపిరితిత్తుల వ్యాధితో మరణించినది.’”
366 మరియు వైద్యుడు సంతకము చేసిన వాంగ్మూలం మా దగ్గర యున్నది, ఆ ఉదయము వైద్యుని కార్యాలయంలో “ఆ బిడ్డ ‘చనిపోయినది’ అని ప్రకటించబడెను,” మరియు ఆ తల్లి ఆ రోజంతా బిడ్డను ఎత్తుకొనియున్నది.
367 అది ఏమిటి? ఒక సంపూర్ణత. అది ఏమిటి? దేవుడు గ్రుడ్డివాని కన్నులు తెరవగలిగితే, (ఏమిటి?) దేవుడు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడని ఆమె విశ్వసించినది, ఎందుకనగా, ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.
368 నాకు రూఢీగా తెలియదు. నేను చూసే వరకు నాకు తెలియదు. మరియు నేను ఆ బిడ్డను చూసినప్పుడు, అది ఒక సంపూర్ణతైయున్నది, ఖచ్చితంగా సరైనది. అదీ సంగతి. మరణము దాని బాధితుడిని వదిలిపెట్టాల్సివచ్చెను.
369 దేవుని కుమారుడు వెళ్ళాడు. ఆ మరణపు కందిరీగ ఆయన చుట్టూ బజ్జుమనుట ప్రారంభించినది. “ఆహా, ఆయన ఎలా ప్రవక్త అవుతాడు? ఆయన అక్కడ నిలబడి తన ముఖము మీద ఉమ్మి ఎలా వేయనిస్తున్నాడు? వారు ఆయనను ఎగతాళి చేయుచుండగా ఏమి చేయకుండా ఆయన అక్కడ ఎలా నిలబడియున్నాడు? అది ఇమ్మానుయేలు కాదు. అది ఒక సాధారణమైన మానవుడు మాత్రమే. ఆ త్రాగుబోతు సైనికులు ఉమ్మివేయుటను చూడండి. రక్తము కారుచున్న అతని ముఖమును చూడండి.”
370 దయ్యము చెప్పాడు, “నేను ఆయనను పట్టుకుంటాను. నేను ఆయనను పట్టుకుంటాను.” వాడు, కందిరీగలాగా, మరణపు ముల్లుతో, ఆయన చుట్టూ చప్పుడు చేయుచున్నాడు. కానీ, సహోదరుడా, ఎప్పుడైతే ఆ కందిరీగ ఆ ఇమ్మానుయేలులో దాని ముల్లును గుచ్చినదో, అది బయటకి వచ్చినప్పుడు, మరణము సైతం, అది దాని ముల్లును కోల్పోయినది.
371 అటు తర్వాత, పౌలు, దాని ముఖములోనికి చూచి, ఇట్లు చెప్పగలుగుటలో ఆశ్చర్యము లేదు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సమాధి, నీ విజయమెక్కడ? మనకు విజయమును అనుగ్రహించిన, దేవునికి స్తోత్రము!” మరణమునకు భయపడు ప్రతి వ్యక్తికి క్రీస్తు యొక్క మరణము ఒక సంపూర్ణతైయున్నది.
372 ఆయన గ్రంథములోని ప్రతి మాటకు నా హృదయము “ఆమేన్” అని చెప్పుచున్నది. నేనిప్పుడు, ఖచ్చితంగా ముగించబోవుచున్నాను. నేను దీనిని ఇక్కడ ఆపివేయాల్సియున్నది. చూశారా?
373 అందుచేతనే నన్ను నడిపించే నా దిక్సూచి పరిశుద్ధాత్మే అని నాకు తెలుసు. ఆయన వాక్యము సత్యము అని నాకు తెలియపరచేది ఆయనే. ఆయనే నా సంపూర్ణత. ఆయనే నా సూర్యరశ్మి. ఆయనే నా జీవితము. ఆయనే నా లంగరు. సమస్యలు చుట్టుముట్టిన్నప్పుడు, ఆయనే నా ఉత్తర నక్షత్రము. నేను తప్పిపోయినప్పుడు, తిరిగి నన్ను సరియైన స్థలమునకు నడిపించే నా దిక్సూచి ఆ పరిశుద్ధాత్మయే.
374 మతశాఖలు మిగిలిన నక్షత్రములవలె ఉన్నవి, అవి లోకంతో పాటు కదలిపోతాయి. లోకము కదులుచున్నాకొద్ది ఆ మిగిలిన నక్షత్రములు మారిపోతాయి, కానీ ఆ ఉత్తర నక్షత్రము అలా కాదు. లోకము దానికి ఇష్టం వచ్చినట్లు కదిలిపోతుంది కానీ, అది మాత్రం అలాగే ఉంటుంది. ఓ, సహోదరుడా, ఉత్తర నక్షత్రము లంగరు వేయబడినది. మిగిలినవి అంతటా తిరుగుతుంటాయి, వాటిని మీరు ఇక్కడ, మరియు అక్కడ, మరియు అన్నిచోట్లా చూడవచ్చు. మతసంస్థల యొక్క సంఘముల తీరు అలాగే ఉన్నది.
375 కానీ క్రీస్తు సంపూర్ణతైయున్నాడు. ఆయన ఒక్కడిలో మాత్రమే మీరు విశ్వాసము ఉంచగలరు. మతశాఖలు మిమ్ములను గందరగోళంలో పడవేసినప్పుడు, కేవలం ఆ ఉత్తర నక్షత్రము వైపు చూడండి. పరిశుద్ధాత్మయే మీ దిక్సూచి. ఆయన ఎప్పుడూ తన వాక్యమునకు కట్టుబడియుండును.
376 ఇటువంటి ఆధునికమైన దినములో ఆ కార్యములు జరగనేరవు అని వారు నాకు చెప్పినప్పుడు, నేను ఎరిగియున్నాను. ఒకవేళ—ఒకవేళ—ఒకవేళ దేవుడు లేకపోతే, అప్పుడు తినుము, త్రాగుము, జీవించుము మరియు సంతోషించుము. దేవుడు ఉన్నాడు, గనుక మనము ఆయనను సేవించుదాము. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసినట్లుగా, ఇప్పుడు సమస్తమును చేయుటను, చివరికి మరణించిన వారిని కూడా బ్రతికించుటను చూచు దినము వరకు నేను జీవించాను. మరియు ధృవపత్రం ఋజువుల ద్వారా, అది సత్యము అని మనము ఎరిగియున్నాము. అవును, అయ్యా.
377 ఆయనే నా సంపూర్ణత. ఇప్పుడు ఆయనను మీ సంపూర్ణతగా చేసికొనండి. తీసుకొనండి…నా శ్రమల సమయములో, ఆయన ఎల్లప్పుడూ ఆ సంపూర్ణతైయున్నాడు. ఇప్పుడు గమనించండి. దేవుని కృప ద్వారా…
378 ఇప్పుడు నేను ఆపివేయుట మంచిది. ఆలస్యం అగుచున్నది. మంచిది, ఇటు చూడండి, పదకొండు గంటలు అయ్యిందని నేను అనుకున్నాను, మరి పన్నెండు-న్నర అగుచున్నది.
379 స్నేహితులారా, దినమంతా, రాత్రంతా, సంవత్సరమంతా, నిత్యత్వమంతా అయినాగానీ, దానిగూర్చి మాట్లాడలేము. దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించవద్దు. నీవు చేయలేవు. దానిని కనుగొను మార్గమే లేదు. మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, ఒకవేళ—ఒకవేళ నీవు…”
380 నాకు తెలియదు. నేను కేవలం విశ్వసించుచున్నాను. నేను ప్రయత్నించుటను లేక దాని గూర్చి ఏదైనా చేయుటను మానివేశాను. నేను దానిని కేవలం విశ్వసించుచున్నాను, అంతే. చూశారా? “యిచ్చయించు వారివలనైన గాని, పరుగెత్తువాని వలనైనగాని కాదు గాని, దయ చూపువాడు దేవుడు.” చూశారా? క్రియలను బట్టి కాదు. అది కృప ద్వారాయైయున్నది. చూశారా? నేను కేవలం దానిని నమ్ముతాను. మిగిలిన దానిని చేయుట, అది దేవుని వంతైయున్నది. కేవలం దానిని నమ్మండి, దాని ప్రకారము కార్యము చేయండి.
381 ఈ ప్రఖ్యాతిగాంచిన పాటను, ఇక్కడో లేక ఎక్కడో వాయించుటను నేను విన్నాను:
ఓ, దేవుని ప్రేమ, ఎంత పవిత్రమైనది, ఎంత ఐశ్వర్యవంతమైనది!
ఎంత బలమైనది మరియు అసమానమైనది!
అది ఎప్పటికీ నిలచియుండును,
పరిశుద్ధులు మరియు దూతల యొక్క పాట.
382 గణితశాస్త్రము తెలిసిన వ్యక్తి, దానిని విభజించి లేదా తన విద్య ద్వారా చూపుటకు ప్రయత్నించినప్పుడు, అతడు మిమ్మల్ని పిచ్చివారిగా చేయును. మీరు దానిని చేయలేరు. దానిని చేయుటకు ప్రయత్నించకండి. దానిని గుర్తించుటకు ప్రయత్నించకండి. దేవుడు గుర్తించుటకు ఆవలిన ఉన్నాడు. మీరు దేవుడిని తెలుసుకోరు. మీరు కేవలం దేవుడిని నమ్ముతారు. అదే రహస్య-…అదే ఆ రహస్యము. దానిని కనుగొనకండి. కేవలం దానిని నమ్మండి. దాని భావము ఏమిటో నేను మీకు చెప్పలేను. దానిని ఎలా చేయాలో నేను మీకు చెప్పలేను. నేను కేవలం దానిని నమ్ముచున్నానని మాత్రమే నాకు తెలుసు. అంతే.
383 మీరు ఒక చిన్న పిల్లవాడికి దేనినైనా వాగ్దానం చేసినట్లే అది ఉన్నది, అతడు దానిని నమ్ముతాడు. మీరు మీ మాటను నిలబెట్టుకోవలసియున్నది. మీరు దేవుని బిడ్డలు. ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. కేవలం దానిని నమ్మండి. మీరు కదల్చబడకండి. మీరు కేవలం అక్కడే నిలిచియుండండి. దేవుడు ఒకసారి దానిని చేశాడు, ఆయన దానిని మరలా చేయవలసియున్నది. ఆయన చేయకపోతే, ఆయన దానిని ఎందుకు చేయలేడో ఆయన మీకు చెప్తాడు. మరియు అది నిజము. ఇప్పుడు, కేవలం దానితో నిలిచియుండండి.
384 మీకు తెలుసు, అక్కడ ఆ ఒక వచనము…గత రాత్రి బాప్తీస్మము పొంది, ఇక్కడున్న మన ప్రశస్తమైన సహోదరుడు, “ఓ, దేవుని ప్రేమ,” అనే ఆ పాటను పాడుతాడని నేను నమ్ముచున్నాను, ఆ వచనము, ఆ పాటలోని ఈ భాగమును ఒక పిచ్చి ఆసుపత్రి గోడ మీద వ్రాశారు అని నాకు వారు చెప్పారు. అది ఇలా చెప్పుచున్నది:
మనము సముద్రమునంతా సిరాతో నింపి,
ఆకాశమంతటిని తోలు కాగితము వలె చేసి;
భూమి మీద ప్రతి కొమ్మ ఒక కలముగా మారి,
మరియు ప్రతి మనిషి వృత్తిరీత్యా లేఖకుడు అయితే;
పైన ఉన్న దేవుని ప్రేమను రాయడానికి
సముద్రము ఇంకిపోతుంది;
ఆకాశము నుండి ఆకాశము వరకు విస్తరించినా,
ఆ కాగితము మొత్తం చాలదు.
385 దాని గూర్చి ఆలోచించండి. భూమిలో మూడువంతులు నీరు ఉన్నది. మరియు గాలిలోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, మరియు ఆ తేమ మొదలైనవాటిని చూడండి. చూశారా? తేమ అంతా సిరాగా మారినట్లయితే. మరియు కలములుగా మారే, వందల కోట్లు, మరియు లక్ష కోట్ల గడ్డి పరకల గూర్చి ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న లక్షల కోట్ల మంది మనుష్యులు, వారిలో ప్రతీ ఒక్కరూ వృత్తిరీత్యా లేఖకులుగా మారుటను గూర్చి ఆలోచించండి. ఆ కలములను సముద్రములో ముంచి, మరియు దేవుని ప్రేమను వ్రాయుటకు ప్రయత్నించిన యెడల, సముద్రము ఇంకిపోతుంది; నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆ కాగితపు చుట్ట వ్యాపించినా, అది సరిపోదు.
386 దానిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించవద్దు. మీరు దానిని చేయలేరు. దానిని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ, మీరు మీ మతిని కోల్పోతారు. కేవలం దానిని నమ్మండి. ఆయనను మీ సంపూర్ణతగా చేసుకొనండి. ఆ మధురమైన సమాధానము మరియు మీరు ఎన్నటికీ మరవజాలని ఆ అనుభవం వద్ద, నిలిచియుండండి. దానికి లంగరు వేయబడండి, మరియు మీ లంగరు తెరలోపల పట్టుకొనియుంటుంది.
మనము మన తలలు వంచుదాము.
“నీవు ఎంత గొప్పవాడవు! నీవు ఎంత గొప్పవాడవు!”
387 ఈ ఉదయము, ఇక్కడ తలలు వంచియున్నవారిలో…ఇప్పుడు నూతన సంవత్సరము సమీపించుచున్నది. మీరెంతో భక్తితో యుండవచ్చును, అది మంచిదే. దానిని బట్టి, నేను మీలో ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. మరియు దేవుడు కూడా అట్లు చేయునని నేను నిశ్చయత కలిగియున్నాను. అయితే నిజంగా ఆ సంపూర్ణత యొక్క అనుభవమును కలిగిలేనివారు ఎంతమంది ఉన్నారు?
388 అది ఏదో మీరు నమ్మేటట్లు చేసుకునేది కాదు, మీరు ఊహించినది కాదు, కానీ అది మీతో తిరిగి మాట్లాడినదైయున్నది, మరియు అప్పటినుండి మీ జీవితము మారిపోవుటను మీరు చూశారు. చూడండి, దేవుని యొక్క ప్రతీ వాక్యమునకు, ప్రతీ వాగ్దానమునకు “ఆమేన్,” అని చెప్పబడినప్పుడు, అప్పుడు మీరు ఆ సంపూర్ణతను పట్టుకొనియున్నారు. ఎందుకనగా, గుర్తుంచుకొనండి, ఆయన ఇట్లు చెప్పాడు, “ఆకాశం మరియు భూమి గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు.”
389 ప్రతి ఒక్క వాక్యమునకు “ఆమేన్,” అని చెప్పు స్థితికి మీరు ఇంకా రాలేదు, అది మీ సిద్ధాంతమునకు వ్యతిరేకమైతే, అది మీ మతశాఖకు వ్యతిరేకమైయున్నది, కానీ మోషే వలె, ఆ మిగిలిన వారివలె మీరు కూడా ఆ స్థలమునకు రావాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణతను పట్టుకునే వరకు వారు అది చేయలేకపోయారు. మరియు ఈ ఉదయమున అది మీ జీవితంలో ఉండాలని కోరినట్లయితే, దానికి సూచనగా మీ చేతులను దేవుని వైపు ఎత్తుదురా? దేవుడు మిమ్మును దీవించునుగాక. మంచిది, అయ్యా. భవనమంతటా ఉన్నవారు.
390 కృపగల తండ్రీ, ఒక సమయమున మేము వేరు అవ్వవలెనని నాకు తెలుసు. మేము ఈ లోకమును విడిచిపెట్టు ఒక సమయము ఉండవలసియున్నది. ఆ సమయము ఏదో మాకు తెలియదు, మరి అదేమంత వ్యత్యాసము కలిగించదు. మా సమయము పూర్తయితే, అప్పుడు మేము రాగోరుచున్నాము. ఇక్కడ ఉండుటలో మా ఉద్దేశ్యము నిన్ను సేవించుటయే.
391 ఒక దినమున నాశనము చేయుటకు వెళ్ళే దారిలో, పౌలు దమస్కు మార్గములో, సంఘమును నాశనము చేయుటకు వెళ్ళుచుండగా, ఒక వెలుగు అతనికి గ్రుడ్డితనము కలుగజేసినది. మరియు, ఓ దేవా, ఆ వెలుగు అతణ్ణి వెంబడించినది, ఏలయనగా అది క్రీస్తే. మరియు అక్కడ అతడు ఒక సంపూర్ణతకు లంగరు వేసుకున్నాడు, చివరికి అతడు స్వయంగా మరణము యొక్క ముఖం మీదనే నవ్వగలిగాడు, మరియు చెప్పాడు, “యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక.”
392 ఆ యొక్క అపొస్తులునికి నీవు ఒక నిండైన సంపూర్ణతవైనావు. అతడు…ప్రతీ వాక్యములో నీవే అతనికి ఆమేన్ అయ్యుంటివి. అతని జీవితమునకు నీవు నక్షత్రమైయున్నావు, ఆ మైలు రాయివైయున్నావు. తుఫానులో అతడిని నడిపించిన దిక్సూచివి నీవే. నీవే ప్రత్యక్షతవైయున్నావు. నీవే దర్శనమైయున్నావు. నీవే అతని నిరీక్షణ, మరియు అతని రక్షణ. మరణ సమయంలో కూడా, అతడు వెళ్ళిపోవుచున్నాడని అతనికి తెలిసినప్పుడు కూడా, నీవు అతనికి సంపూర్ణతగా ఉన్నావు.
393 నీవు దానియేలు యొక్క సంపూర్ణతవైయున్నావు. ప్రవక్తలందరికీ నీవే సంపూర్ణతవైయున్నావు. సంఘశాఖల వ్యత్యాసములలో, సద్దూకయ్యులు మరియు పరిసయ్యుల వలన, వారి దినపు ఇబ్బందుల మధ్య, ఇంకనూ నిన్ను తమ సంపూర్ణతగా తీసుకొన్న ప్రజలు ఉన్నారు.
394 మరియు నేడు ప్రభువా, కనికరము, ప్రేమ కలిగిన స్త్రీ, పురుషులు, మరియు—మరియు ప్రభువా, వారి హృదయములు, దేవుని ఎరుగుటలో ఒక నిజమైన అనుభవము కొరకు, మరియు ఒక—ఒక—ఒక సంపూర్ణతను గూర్చిన నిశ్చయత కొరకు స్రవించుచున్నవి. ప్రభువా, ఇంతకముందు, ప్రజలకు తెలిసినదంతా, సంఘములో చేరుట మాత్రమేయైయుండవచ్చును. నేను యధార్థంగా, ప్రయత్నించగా, మేము గ్రహించాము, భిన్నంగా ఉండుటకు కాదు; నీవు నా హృదయమును ఎరిగియున్నావు; కానీ వారికిట్లు చెప్పాను, “మీరు సంఘములో చేరలేరు. మీరు సత్రములో చేరుతారు, ఆ మెథడిస్టు, బాప్టిస్టు, క్యాథలిక్కు, పెంతుకోస్తు సత్రాలలో చేరుతారు. కానీ, మీరు సంఘములో, క్రీస్తు యొక్క మర్మయుక్తమైన ఆ శరీరములోకి జన్మిస్తారు, మరియు ఆత్మ యొక్క వరములతో, చర్యలో మరియు శక్తిలో ఆయన గొప్ప శరీరమును కదిలించుటకు ఆయన శరీరములో మీరు అవయవములవుతారు.”
395 దేవా, ఈ ఉదయమున ఆ హస్తములు పైకెత్తబడినప్పుడు, వాటి భావము అదేయైయున్నది. “నన్ను స్థాపించుము, ఓ ప్రభువా, నన్ను తీసుకొనుము, నన్ను మలచుము, నన్ను తయారు చేయుము. క్రీస్తుకు ముడివేయబడిన, ఒక సంపూర్ణతను నా జీవితంలో ఉంచుము, తద్వారా నేను ఆ సంపూర్ణతను గూర్చి తప్ప మరిదేనిని గూర్చి ఆలోచించకుందును.” ప్రభువా, దానిని అనుగ్రహించండి. వారిని ఆశీర్వదించండి. వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచండి. నశించినవారిని రక్షించండి.
396 ఇప్పుడు ప్రభువా, ప్రజలను బలిపీఠము వద్దకు పిలవడం ఒక వాడుక అని మాకు తెలియును, కానీ అది మాకు ఒక సంప్రదాయంగా మారిపోయినది. మరియు ఈ ఉదయం, ఆ—ఆ చిన్న పిల్లలు మరియు—మరియు అందరితో బలిపీఠములు నిండిపోయాయి, కానీ, ప్రభువా, ఏదో ఒక విధంగా మీరు వారితో మాట్లాడియున్నారు. వారు తమ చేతులు పైకెత్తియున్నారు. వారు—వారు, ఒక నిర్ణయముగా, దానిని చేసియున్నారు. వారు కోరుచున్నారు. వారు—వారు—వారు ఒక నిజమైన దానిని కోరుచున్నారు. వారి పక్షముగా నా ప్రార్థన నేను అర్పిస్తున్నాను. ప్రభువా, ప్రతి ఒక్కరికి దానిని అనుగ్రహించండి. మా పాపములను క్షమించుచూ, రోగములను స్వస్థపరచుచూ, మాకు అవసరమైయున్న విడుదలను అనుగ్రహించుచూ మాతో ఉండండి.
397 మరియు, ప్రభువా, అన్నింటి కంటే ఎక్కువగా, ఈ దినమున మేము, ఆ సంపూర్ణతకు, ఉత్తర నక్షత్రమునకు, కల్వరికి, క్రీస్తునకు ముడివేయబడినామని ఎన్నడూ మరువకుందుము గాక. మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములను తీసుకొని మరియు రోగులను స్వస్థపరచుట ద్వారా, మాకు దర్శనములు చూపించుట ద్వారా, చనిపోయిన వారిని లేపుట ద్వారా, మరియు ఆయన ఏమి వాగ్దానము చేసెనో వాటిని ఖచ్చితంగా నెరవేర్చుట ద్వారా, వాటిని మాకు అక్షరాలా ప్రత్యక్షపరచుచున్నాడు.
398 మరియు ఈ సంఘము, ఈ ప్రజలు లేదా, ఈ ఉదయమున ఇక్కడ కూడియున్న క్రీస్తు శరీరములోని భాగము, యేసు జీవించమని చెప్పినట్లుగా జీవించుదురు గాక. “మీరు లోకమునకు ఉప్పైయున్నారు.” తమ ఇరుగు పొరుగువారు దప్పిగొనునంతగా వారు ఉప్పువలె మారెదరు గాక. ఉప్పు దాహము పుట్టించును. మరియు ఉప్పు అది ఇమిడినప్పుడు మాత్రమే రక్షించగలదు. మరియు దేవా, ఈ ప్రజలు కూడా, ఆత్మల-సంపాదకులుగా ఉండునట్లు, వీరికి దీనిని దయచేయమని, నేను ప్రార్థించుచున్నాను.
399 ప్రభువా, ఈ దీన సేవకుడైన మా సంఘ కాపరి, సహోదరుడు నెవిల్ ను దీవించండి. క్రీస్తు శరీరములోని ఒక అవయవముగా అతడు గౌరవప్రదముగా, తన కర్తవ్యంలో నిలబడియున్నాడు, నీవు అతడికి చెప్పిన సమస్తమును నెరవేర్చుటకు తన శాయశక్తులా ప్రయత్నించుచున్నాడు.
400 ఈ కటిక చీకటి సమయము గుండా నేను వెళ్తున్నప్పుడు, ఎంతో దయతో నాతో నిలబడియున్న ధర్మకర్తలను ఆశీర్వదించుము.
401 శ్రమల సమయాలలో నాతో కలిసి ప్రార్థించి మరియు నాతో నిలబడిన సంఘముతో నీవు నిలబడుము. ప్రభువా, నేను వారిని ప్రేమించుచున్నాను. మరియు ప్రభువా, వారు నీవైపు చూడాలని, నేను నా ప్రార్థనను అర్పించుచున్నాను. ఒక సేవకుని యొక్క మర్త్యమైన ఈ మట్టిని వారు చూడకుందురు గాక. వారు సర్వశక్తిమంతుడైన ఆయన వైపు చూసెదరుగాక. మరియు ప్రభువా, మేము పరిమితి గలవారమని మేము ఎరుగుదుము. మేము ఏమైనప్పటికినీ, మేము ఇంకా మర్త్యులమే. అయితే ఆ వర్తమానికుడు కాదు గానీ, ఆ వర్తమానము. ప్రభువా, దానిని అనుగ్రహించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వైపే మేము చూపించుచున్నాము. ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ, చిన్న పిల్లలకు కూడా ఆయన ఎంతో వాస్తవముగా యుండునట్లు, తద్వారా ఈ సమాజమంతటికీ ఆయన ఒక సంపూర్ణతగా మారునట్లు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను
మరియు కల్వరి వృక్షముపై
నా రక్షణను కొనెను.
402 ఇప్పుడు, మనము మరలా దానిని పాడుచుండగా, మీ ముందు, మీ వెనుకవైపు, మీ ప్రక్కన ఉన్నవారితో కరచాలనము చేయండి, ఇప్పుడు అందరూ కరచాలనము చేయండి. కేవలం కూర్చుని యుండండి. సాధ్యమైతే ప్రక్కకు తిరిగి కరచాలనము చేయండి. చూశారా?
నేను…(…?…)
…కొనెను…?…
“సోమవారము రాత్రికి, మధ్యరాత్రి, ప్రభురాత్రి భోజనము,” ఉంటుందని వారు ఇప్పుడే ప్రకటించారు.
403 ఇప్పుడు మనము మన చేతులను ఎత్తి మరియు ఆయనకై పాడుదాము. ఆయన మీ సంపూర్ణతైయున్నాడని (మీలో) ఎంత మందికి అనిపించుచున్నది? [సంఘము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] వాక్యము, ఆయన వాక్యమైయున్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? [“ఆమేన్.”] ఆయన వాక్యమైయున్నాడు. మరియు ఆ వాక్యము యొక్క వెలుగును, మీలో జీవింపజేయుటకు, పరిశుద్ధాత్మ ఆ వాక్యమును మొలకెత్తింపజేసెను, అదే వాక్యము యొక్క నిర్ధారణయైయున్నది. వాక్యమును మీ హృదయములో పెట్టుకొనండి. పరిశుద్ధాత్మను లోపలికి రానీయండి, మరియు ఆ వాక్యము కదలాడుటను గమనించండి. విశ్వసించండి. దీనముగా ఉండండి. ఏదో గొప్పవాడిగా ఉండాలని ఆశించకండి. దేవుడు మిమ్మల్ని ఏదో ఒకటిగా చేయుటకు, ఏమి కానివారిగా ఉండండి. చూశారా? మంచిది. ఇప్పుడే దానిని చేయండి.
404 అందరూ ఆయనను ప్రేమించుచున్నారా? “ఆమేన్,” అని చెప్పండి. [సంఘము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] ఆమేన్ అనుమాటకు అర్థము మీకు తెలుసా? “ఆలాగు జరుగునుగాక.” ఆమేన్. అది సరియే.
405 అందరము, “హల్లేలూయా!” అని చెబుదాము. [సంఘము “హల్లేలూయా!” అని చెప్పుచున్నది.—సంపా.] దాని భావము మీకు తెలుసా? “మన దేవుని స్తుతించండి.”
406 ఈ మధ్యకాలములో నేను జర్మనీలో ఉన్నప్పుడు, ఆ దినమున, అక్కడ, దాదాపు ముప్పై లేక నలభై వేలమంది ప్రజల యెదుట నేను నిలబడి, మరియు ఇట్లు చెప్పాను, “జర్మను ప్రజలైన మీరు అర్థము చేసుకోలేకపోవడం ఒక వింతైన కార్యముగా ఉన్నది.” నేను చెప్పాను, “ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుచుండగా, రోడ్డు మీద ఒక కుక్క నన్ను చూసి ఇంగ్లీషులో మొరిగినది. అది నిజము.” నేను చెప్పాను, “దానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మరియు అక్కడ ఒక పక్షి ఉన్నది, మరియు అది నా కొరకు ఇంగ్లీషులో పాడినది. నేను వీధిలోనుండి వచ్చుచుండగా, ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొనియున్నది, నేను అక్కడ వెనుకకు వచ్చినప్పుడు, మరియు,” నేను చెప్పాను, “ఆ బిడ్డ ఇంగ్లీషులో ఏడ్చుచున్నది. ప్రజలారా మీతో ఉన్న సమస్య ఏమిటి?” అది నిజము. ఓ, మీరు చుట్టూ చూసినట్లయితే, ఆయన ప్రతిచోటా ఉన్నాడు. ఆయన లేడా? నిశ్చయంగా, ఆయన ఉన్నాడు.
407 ఇప్పుడు ముగించుటకు ఇక్కడికి రమ్మని మనం సంఘకాపరిని అడుగుచుండగా, మనము మన చేతులు ఎత్తి మరియు మన కన్నులు మూసుకొని మరియు పాడెదము.
మొదటిగా, మనము లేచి నిలబడదాము. ప్రతీయొక్కరూ తమ స్వంత పాదముల మీద, అందరూ నిలబడండి.
408 మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు మరలా ఇట్లు చెప్పండి, “ఆమేన్.” [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]
409 మరియు హల్లేలూయా అనే పదము ప్రతి భాషలోనూ ఒకేరీతిగా ఉన్నదని మీకు తెలుసు. ఆఫ్రికాలో అనాగరికులు నివసించు అడవులకు వెళ్ళండి, హల్లేలూయా అనేది ఒకే పదము. హల్లేలూయా, అనేది క్రైస్తవులకు ఒక అభివాదనగా ఉండాలి. కాదా? హల్లేలూయా, అను పదమునకు “మన దేవుని స్తుతించండి,” అని అర్థము. మరియు ఆయన దానికి యోగ్యుడు, ఆయన కాడా? ఆయన నిశ్చయంగా నా రక్షకుడు. ఆయన నాకు సంపూర్ణముగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. ఖచ్చితంగా ఆయన నాకు, “నిన్నా, నేడు, మరియు నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడు.” ఆయన మీకునూ అలాగే ఉన్నాడా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను
మరియు కొనెను…(సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక.)