అయ్యా! అంతము యొక్క సూచన ఇదేనా?

అయ్యా! అంతము యొక్క సూచన ఇదేనా?

VGR COUNT-454 1సహోదరుడా నెవిల్ చాలా వందనములు. నా విలువైన స్నేహితులారా, మీకు నా శుభసాయంకాలము. ఈ రాత్రి మన దేవుడైన ప్రభువును ఆరాధించుటకు మరలా ఇక్కడకు వచ్చుటలో ఎంతో సంతోషముగా ఉన్నది. (సహోదరుడు నెవిల్ మైక్రోఫోను గురించి మాట్లాడుచున్నాడు "ఇది ప్రత్యక్ష ప్రసారం"- సంపా.) (ఇది ఒక. ఇదే అది. ఓ, అవును. అది బాగున్నది.) ఈ ఉదయకాలము నేను మిమ్మును అధిక సమయము ఉంచాను. అందువలన ఈ రాత్రి త్వరగా ముగించాలని ఆశించుచున్నాను. మై, మీరు నిలచియుండుట ఎంతో వేదనకరముగా ఉన్నది, ఈ రాత్రి కూడ ఆ విధముగానే ఉన్నది. అందువలన మీకు కావలసిన స్థలమేర్పరచుటకు ఎంతో కాలము తీసికొనదు — సంఘమును కట్టుట ముగించిన వెంటనే ఆ వసతులేర్పడును.

లేదు, మనము అధిక సమయము ఇక్కడ ఈ రాత్రికి ఉండబోవుట లేదు. అయితే రేపు రాత్రి మనము కొంత అధిక సమయమును తీసికొనబోవుచున్నాము. రేపు రాత్రి మీలో కొందరు రాగలిగితే మనము ప్రభువునందు అధిక సమయము గడుపగలము… దేవుని యందు గొప్ప సమయము పొందవచ్చును. రేపు రాత్రికి ఇక్కడకు కొందరు వ్యక్తులు రానున్నారు… మన మ౦దరము ఆ సమయమును కలిగియుందుము. [సహోదరుడు బ్రెన్హాం గారితో ఒకరు మాట్లాడుచున్నారు.] రేపు రాత్రి, అర్థరాత్రి ప్రభువు రాత్రి భోజనము మనకుండును. మీరు ఖచ్చితముగా దానిలో కలిసికొందురని నమ్ముచున్నాను. అనేక లోకసంబంధ కార్యములలో లోకము మునిగియుండగా, మనము దేవుని ముందు వినయముతో తలలు వంచి ప్రభువురాత్రి భోజన సంస్కారమును తీసికొందుము. ఈ సంవత్సరమును ఉన్నత ప్రమాణముతో ప్రారంభించునట్లు, మన హృదయాలను దేవునికిచ్చుచు, ఆయనకు మనలను సమర్పించుకొనుటలో గడుపుదుము.

రేపు రాత్రి ఇక్కడకు కొందరు మంచి బోధకులు రానైయున్నారు, నిశ్చయముగా అది జరుగును. ఒక సోదరుడు జార్జియా నుండి వచ్చుచున్నారు. సోదరుడు పామర్ ఒక అద్భుత ప్రసంగీకులు, సోదరుడు జూనియర్ జాక్సన్, రేపు రాత్రికి ఇక్కడుండెదరు. సోదరుడు బీలర్, సోదరుడు నెవిల్, ఓ మై, మై! మంచి దేవుని మనుష్యులు, రేపటి దినమందు ఇక్కడుండెదరు. సోదరుడు విల్లార్డ్ కాలిన్స్, ఆ సోదరులందరు మనకు గొప్ప వర్తమానములనివ్వనున్నారు. ఇంకను అనేకులు రానున్నందున రేపు రాత్రి ఒక గొప్ప సమయముగా ఉండునని ఎదురు చూచుచున్నాము.

2నా భార్య "దీనిని చెప్పవద్దని" చెప్పింది, అయితే దీనిని చెప్పుటకు నేనెంతో సంతోషించుచున్నాను. -ఈ ఉదయకాలము అంపైర్ అను మాటకు బదులుగా "ఎంపైర్" అని ఉచ్చరించాను. అందు నిమిత్తము క్షమాపణ కోరుచున్నాను. బిల్లి, ఆ వెనుక కూర్చొని "అదిగో ఆయన వెళుచున్నాడని" చెప్పెను.

నేను, "ఆ చక్రవర్తి ఒక గొప్ప సామ్రాజ్యము ఉ౦డవలసియున్నదని," చెప్పాను, కాని నేను అంపైర్ (ఆటలో మధ్యవర్తి) అను భావములో చెప్పాను. మంచిది, వారు ఆ డచ్ మనిషిని గురించి చెప్పారు, మీరు దీనిని తెలిసికొనవలెను: "నేను మాట్లాడుచున్నట్లుగా నన్ను తీసికొనవద్దు, నేను దేనిని భావించుచు మాట్లాడుచున్నానో, దానిని గ్రహించుడి." అందువలన వారు, "ఈ సంవత్సరములన్నిటిలో నన్ను బాగుగా గ్రహించియుందురని నమ్ముచున్నానని," చెప్పాను.

మీకు తెలియును గత ముప్పది సంవత్సరములుగా నేను ఇక్కడ ఈ ప్రసంగ వేదిక వెనుక నిలచియన్నాను. ఈ మందిరములో ముప్పది సంవత్సరములుగా ఉండుట వలన మీరు నన్ను బాగుగా ఎరిగియుండవలసియున్నది. మీరు ఎరుగలేదా? ఓ, మై! నా విద్య తగు మాత్రమే, నేను గొప్పగా మాట్లాడలేను, అయితే నేను ప్రభువుకు ఒక సత్యమైన స్వరమును ఇచ్చుచున్నాను.

3సోదరా… ఆయన డాక్టరు "లామ్సా?" అని నమ్ముచున్నాను, అది లామ్సా బైబిలులోనిదని తలంచుచున్నాను. ఆ తర్జుమాలోనిదని ఎవరో చెప్పారు… ఒకప్పుడు నేను మాట్లాడుచుండగా, ఆయన అక్కడున్నాడని నాకు తెలియదు. ఆయన (లామ్సా) ఆ తరువాత నా దగ్గరకు వచ్చి "ఊరీము తుమ్మీము"ను గురించి మాట్లాడుచూ, "ఈ దినములో ఈ ప్రజల సంగతి ఏమిటి?" (బైబిలు తర్జుమా చేసిన వారిని గురించి మాట్లాడుచున్నాడు.) "ఎందుకు ఆ ప్రజలు, అనగా తర్జుమా చేయువారు బైబిలును సరియైన విధముగా తర్జుమా చేయలేదు. ఎందుకనగా వారు ఉన్నత భాషలో, ఉన్నత-యిడ్డిష్-లో ( Yiddish - యుదుల వాడుక బాష), తర్జుమా చేయుటకు ప్రయత్నించారు. మరియు యేసు మాట్లాడినప్పుడు ఆయన సాధారణ ప్రజలు మాట్లాడు భాషనే మాట్లాడెను, అంటే వీధులలో జీవించు ప్రజలు మాట్లాడు భాషలో మాట్లాడెనని," చెప్పాడు.

మరియు, మీకు తెలియునా, లూకా సువార్తలో ఒక లేఖనమున్నది, "అక్కడ సామాన్య జనులు ఆయన చెప్పుదానిని సంతోషముతో వినిరి. ఆయన వారి భాషలోనే మాట్లాడెను. ఇప్పుడు కూడ అలాగే యుండునని నేను నమ్ముచున్నాను.

4ప్రభువు నిమిత్తము మనము ఎంతో సంతోషించుచున్నాము.

ఇప్పుడు నాకు తెలియును… స్త్రీలు అక్కడ చుట్టు నిలచియుండుటను చూచుచున్నాను. బాలికలు, బాలురు మరియు స్త్రీలు మొదలైన వారు గోడల చుట్టూ నిలబడియున్న — మరియు చిన్న పిల్లలు మినహా, పురుషుడు నిలబడియుండుట మంచిది కాదు. కూర్చొనుటకు చాలినంత స్థలము లేదు. ఈవారము గడిచిన తరువాత, మరలా మనము కూడికలను ఏర్పాటు చేయునప్పుడు, ఈ సమయము తరువాత…

మీకు తెలియునా, మరుసటి కార్యముగా, మనకు తెలిసింతవరకు, ఆ ఏడు ముద్రలు రాబోవుచున్నవి. మరియు ప్రభువు చిత్తమైతే ఈ సంఘము కట్టుబడుట ముగించిన వెంటనే ఆ ఏడు ముద్రలను ప్రారంభించెదము — అప్పుడు మనము ఇక్కడ చేరవచ్చును. మరలా ప్రతిష్టించుటకు మనము ఇక్కడకు రానున్నాము. బహుశా 1 నుండి 2 వారములకు లేక మూడు వారములకు నేరుగా ఆ కూడికలలో కలసికొని ఆ ఏడు ముద్రలలో ప్రవేశించుదుము, అందువలన మనము ప్రభువునందు ఒక గొప్ప సమయుమును అప్పుడు ఎదురు చూచుచున్నాము.

మీలో ఎందరు పట్టణము వెలుపల నుండి వచ్చుచున్నారో వారికందరికి మేము ఆహ్వాన పత్రికలను పంపెదము. ప్రతి కార్యక్రమమును వాటి సమయమును మీకు తెలియచేసెదము. అది ఇంకనూ ఒకటి లేక రెండు వారముల కాలమున్నది.

ఈ రాత్రి బిల్లీ నాతో చెప్పినట్లు, ఆ గుత్తదారుడు (కాంట్రాక్టర్) ఫిబ్రవరి 10వ తేదికి ముగించెదనని చెప్పియున్నాడు. మంచిది, అతడు 10వ తేది ముగించిన యెడల మనము 15వ తేది ప్రారంభించెదము. అందువలన వారు ముగించిన వెంటనే దానిపై (ఏడు ముద్రలపై) ప్రారంభించెదము.

5కొంత సమయమునకు ముందు, ఆ వృద్ధ సోదరి కిడ్ నన్ను పిలిచినది. అప్పుడు ఆమె కన్నీటితో నిండియుండినది. "బ్రెన్హాం సోదరుడా, మేము ఆ పాత కారును కదిలించలేకపోవుచున్నాము, ఎంతో కష్టముతో ప్రయత్నించుచున్నాము. కావున, దయయుంచి ఆ కారు కదులునట్లు ప్రార్ధి౦చుము, అప్పుడే మేము రేపటి దిన ఆరాధనకు రాగలము. నేను కూర్చొనుటకు ఇక్కడ స్థలమును కనుగొనగలనేమోనని ఆశ్చర్యముగా ఉన్నదని," ఆమె చెప్పినది.

అందుకు నేను, "మీరేమి బాధపడవద్దు. మీరిక్కడకు వచ్చిన వెంటనే మీరు కూర్చొనుటకు కావలసిన స్థలమున్నదని," చెప్పాను.

అందుకామె, "నీ హృదయము స్తుతించును గాక, నీవు 12.00 గంటలవరకు ఆరాధనను జరిపినట్టయిన, ఆ రాత్రి 12.00 గంటల సమయములో అక్కడ నుండి వెళ్ళుటకు నేనిష్టపడుటలేదని, నీకు తెలియునా," అని చెప్పినది.

మీకు తెలియునా, ఆమెయు మరియు సోదరుడు కిడ్ 85 సం. వయస్సు గల వృద్దులు. వారింకను పరిచర్యలో ఉన్నారు. వారేమి చేయుదురో మీకు తెలియునా? వారొక టేపు రికార్డును పట్టుకొని, నా వర్తమానములను తీసికొని హాస్పిటలు నుండి హాస్పిటలునకు, ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళుచు ఈ టేపులను వేసి వినిపించెదరు. ఇప్పుడు వారు దానిని విడిచిపెట్టలేదు! లేక విరమించుకొనలేదు. చివరి వరకు, చేతిలో ఖడ్గమును (వాక్యమును) కలిగి, దానితో మరణించునంత వరకు వారి విశ్వాసమును గట్టిగ పట్టియుండుటయై అది ఉన్నది. అదియే వెళ్లవలసిన మార్గము. ఆ విధముగానే చేయుటకు నేను ఇష్టపడుదును.

6అప్పుడామె, "నేను 12.00 గంటలకు రహదారిలోకి వచ్చెదనని నీకు తెలియునా. రాత్రి 12.00 గంటల తరువాత ఇంటికి వెళ్ళుటకు ప్రయత్నించినయెడల, ఆ త్రాగుబోతు దెయ్యములు, త్రాగి ఆ మార్గముల గుండా పరుగెత్తుచుందురు. ఆ భూతములు, చుట్టూ పరిగెత్తుచుండును. అప్పుడు, నేను చంపబడుదునెమోనని బయపడుదునని," చెప్పెను.

సోదరి పాట్, ఆమె కూడ ఇక్కడే వుండును. చాలా వృద్ధురాలు… ఎందరు సోదరి కిడ్ ను ఎరిగియున్నారు? ఆమె ఒక పరిశుద్ధ దృష్టి కలిగియుండును.

కొంచెం ఆలోచించుదాం, నేను జన్మించుటకు సంవత్సరముల ముందే (ఇప్పుడు నేనొక వృద్ధుడను) ఆమె ఆ కొండలలో జీవించుచుండినది —ఆమెయు మరియు సోదరుడు కిడ్, ఆమె 15 లేక 20 సెంట్ల (రూపాయలు) కొరకు దినమంతయు బట్టలు ఉతుకును. ఆ రాత్రి ఆయనను ఎక్కడికైనను ప్రసంగించుటకు పంపును… కెంటకీలోని బొగ్గు గనులలోకి పంపును. అక్కడ కొందరు తుపాకిని చేతపట్టుకొని ఆ కొండ ఎక్కి ప్రసంగించుటకు వెళ్ళు స్థలము వరకు కావలియుండవలసియున్నది. ఓ, మై! అప్పుడు నేనిలా తలంచాను.

"నేను తప్పక పరలోకపు ఇంటికి మోసికొని పోవలసియున్నది.

ఒక పుష్పముల సుఖ పాన్పును,

ఇతరులు పోరాడి బహుమతిని పొంది,

రక్తపు కడలిలో నడుపుకొనుచు వెళ్ళుచున్నారు?

నేను కూడ పోరాడుదును, నేను కూడ పాలింతును;

ప్రభువా, నా ధైర్యమును అధికపరచుము…

మరియు వాక్యము ద్వారా ఆయన ఆదరణ నాకు కావలిసియున్నది. ఈ రాత్రికి నాకు కావలసినది ఇదియే.

7ఇప్పుడు రికార్డులు పనిచేయుచున్నవని నమ్ముచున్నాను. ఓ, అవును. నన్ను మన్నించండి. ఒక సోదరి తన బిడ్డను ఈ ఉదయము ప్రతిష్టించుటకు ఇష్టపడుచున్నది. ఈ రాత్రికి ప్రతిష్టించెదమని ఖచ్చితముగా చెప్పియుంటిని. రేపు రాత్రికి బిడ్డలను ప్రతిష్టించుటయు, స్వస్థత కూడికలను, వీలుపడిన ప్రతి ఒక్కటి వాటితో జరుగును. మనము కావలసినంత సమయమును కలిగియుందుము…

మరియు, ఇక్కడ కొంతమంది ప్రజలు చాలా దూరము నుండి, ఈ ఉదయ కాలము ఒక ప్రత్యేక మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) మరియు కొన్ని విషయముల కొరకు వచ్చియుండవలసినది. మరియు ఈ ఉదయకాలము, అక్కడ కలువవలసినదై యున్నది, మరియు బిల్లీ వాళ్ళని రాత్రివరకు వేచియుండమని చెప్పవలసియున్నది. మరియు అతడు వారిని ఎక్కడా కనిపెట్టలేకపోయాడు, చూడండి, ఈ రాత్రికి, మీరు ఇక్కడ ఉండినట్లయితే, సహోదరి, నేను మరికొంత కాలములో అక్కడకు వెల్లెదము, వేచియుండి, మరియు ఆస్తిని కనిపెట్టెదవు. వారు ఇద్దరు, అది దేశమునకు దూరముగా ఒక ప్రత్యేక మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) అని నేను ఆలోచించుచున్నాను. అందువలన, మేము నమ్ముచున్నాము, నేను మిమ్ములను పోగొట్టుకొనినయెడల, సాధ్యమైనంత వరకు త్వరలో మీ దగ్గరకు రాగలను, రేపు రాత్రి కావచ్చును.

8ఇప్పుడు, ఒక చిన్న బిడ్డతో…నీలము రంగు అంగీతో వచ్చుచున్న ఆ స్త్రీ, ఈ స్త్రీయేనని నమ్ముచున్నాను. "అంగీ?" మీడా, హనీ, నా భావము అది కాదు — మరది ఏమిటి. అది ఒక వస్త్రం మాదిరి కనిపించుచున్నది. అంగీ. అంగీ అనగా ఎంత మ౦దికి తెలియును? ఎందుకు, ఖచ్చితముగా. అది నాకైతే ఒక పాత పూర్తి జాకెటర్. ఎందుకు, అది దల్లాసు నుండి వచ్చిన చిన్న బిడ్డ. మై, అది బాగుంది. సహోదరా, నీవు ఇక్కడకు నడువగలవా. నన్ను క్షమించండి.

మంచిది, మంచిది, మీరు వుంచిన ఆ రిబ్బను లాంటి త్రాడు నాకు నచ్చినది. దీని పేరేమి? రెబెక్కా లిన్, లి-న్ మరియు - మీ యొక్క చివరి పేరేమి! స్టేటన్, రెబెక్కాలిన్ స్టేటన్, అంతేనా? ఆమెను నాకు ఇవ్వగలరా? అది ఒక విధంగా కష్టమని నాకు తెలియును. ఆ తీయని? ఇక్కడ ఒక చిన్న మంచి పాప వున్నది. రెబెక్కా లిన్ స్టేటన్. ఈ కుటుంబము చాలా దూరము నుండి వచ్చినది. ఈ చిన్న స్త్రీ మరియు ఆమె భర్త, ఈ మధ్యనే రక్షణ పొంది, దేవుని యొక్క జ్ఞానము లోనికి తేబడినారు. మరియు ఇప్పుడు వారి కలయిక లోనికి, దేవుడు అందమైన, చిన్న రెబెక్కాను ఇచ్చెను. మరియు ఈమెను దేవుని దగ్గరకు తెచ్చారు.

9ఇప్పుడు, చాలామంది ప్రజలు — దీనిని బాల బాప్తిస్మము అని పిలుస్తారు. మెథడిస్టు సంఘము, మరియు చాలమంది, వాళ్ల మీద నీళ్ళు చల్లుతారు. అదంతా మంచిదే, నాకు సంబంధించినంత వరకూ, కానీ మనమందరము బైబిల్ చెప్పిన విధముగా వుండవలెనని ప్రయత్నిస్తాము. కాని బైబిలులో — అది బాప్తిస్మము అని ఎక్కడా లేదు, చరిత్రలో ఎక్కడా లేదు, కాథలిక్ చర్చి వచ్చినంతవరకూ, మాకు తెలిసినంత వరకు అది నైసియా కౌన్సిలు వారిది. [బిడ్డ ఏడ్చుచుండెను] ఎలాగైనను అది ఆ విధముగా చెప్పబడుట. చూడండి. మీరు చూడండి, మీకు వివరణ అవసరమైయున్నది. అయితే బైబిలు నందు వారు చిన్నబిడ్డలను యేసు యొద్దకు తెచ్చి ఆయన యొక్క ఆశీర్వాదములను పొందేవారు. మరి ఆయన తన చేతులను వారిపై ఉంచి వాళ్ళను ఆశీర్వదించును, మరియు మనము దానిని కొనసాగింతుము.

10ఇప్పుడు, మనము తలలు వంచెదము. మా పరలోకపు తండ్రీ, నీవు ఈ యవ్వన స్త్రీ మరియు యవ్వనస్తునకు చిన్న పాపను ఇచ్చియున్నావు. ఈ చిన్న రెబెక్కాతో ఈ రాత్రి ఇక్కడకు వచ్చియున్నారు. మరియు, దీనిని నీకు బహుమానముగా తెచ్చియున్నారు. మరియు, తల్లి తన చేతుల నుండి నాకు ఇచ్చినప్పుడు, నేను నా చేతుల నుండి ఈ రెబెక్కాను, నీకు సమర్పిస్తున్నాను. దేవా, ఆమెతో వుండి ఆమెను ఆశీర్వదించండి. ఆమె తండ్రిని, తల్లిని ఆశీర్వదించండి. వారు నీ దయతో, చాలా కాలము, సాధ్యమైతే యేసుక్రీస్తు రాకడ వరకూ, జీవించునుగాక, ఈ పాప దేవుని యొక్క జ్ఞానముతో ఎదుగును గాక, మరియు రేపటి దినము ఉంటే ఆమె నీకు మంచి సాక్షిగా వుండును గాక. దయచేయండి, దేవా.

నీవు ఈ భూమి మీద వుంటే, ఈ స్త్రీలు, పురుషులు వారి వారి పిల్లలను ఇక్కడకు తెచ్చేవారు. కానీ, సువార్త సేవకులమైన మేము, మీ యొక్క ప్రతినిధులము. కాబట్టి, ఈ పాపను నీకు సమర్పించుచున్నాము. నీ యొక్క కుమారుని నామములో, ప్రభువైన యేసుక్రీస్తు, నామములో. ఆమేన్.

ఆశీర్వదించును గాక, చిన్ని రెబెక్కా. ఎంతటి మధురమైనదానవు. మీ ఇద్దరినీ, మరియు ఈ చిన్నబిడ్డని, దేవుడు దీవించును గాక, దేవుని సేవలో చిరకాలము, సంతోష జీవితము ఇచ్చును గాక.

11కొన్ని మెట్లు పైకి రండి. నాకు తెలియదు నాకు తగినంత బలమున్నదా? లేదా? ఇది ఒక బాలుడు. ఇతని పేరేమి? స్టాన్లీ, విక్టర్ క్లీవ్లాండ్, క్లీవ్లాండ్, క్లీవ్లాండ్. క్లీవ్లాండ్ చిన్ని స్టాన్లీ, ఎంత మంచి చిన్న పేరు. మరియు ఎంత మంచి చిన్న బాలుడు! మంచిది, అక్కడ నుండి తెండి, స్టాన్లీ, అది మంచి బాబు? మేము దీనిని చేయము; కాని ఇప్పుడు చేస్తాము, మీకు తెలియునా. ఇందులో కొంత విషయము వున్నది. అది ఖచ్చితంగా చిన్ని మధురమైన బాబు — నేనతని ఆఖరి పేరు మరచినాను. నేను దానిని సరిగ్గా ఉచ్చరించుచున్నానని అనుకోవడం లేదు: "క్లీవ్లాండ్." మంచిది.

12మనము తలలు వంచెదము. పరలోకపు తండ్రీ, ఈ జంట ఈ బాబును ఈ చిన్న స్టీవన్ క్లీవ్లాండ్ను ప్రభువైన యేసుకు ప్రతిష్ఠ చేయుటకు ఇక్కడకు తెచ్చియున్నారు. ఒక సంఘమునకు సేవకునిగా, నేను ఐక్యముగా దేవుని పనులలో నిలబడుచున్నాను. ఒక జీవితకాల సేవ కొరకు నీకు ఇస్తున్నాము, నీవు అతనికి తల్లిని, తండ్రిని ఇచ్చియున్నావు, మరియు వారు నాకు ఇచ్చియున్నారు. తండ్రిని, తల్లిని ఆశీర్వదించండి. ఈ చిన్న బాలుని ఆశీర్వదించండి. వారందరు చిరకాలము, సంతోషముగా దేవుని సేవలో జీవించును గాక. దేవుని కృపతో ఈ బిడ్డ పెంచబడును గాక. ఆయన యందు ప్రేమతో, భయముతో, ఆయన జీవితకాలమంతా జీవించును గాక. ఇప్పుడు, వారా పిల్లలను నా దగ్గరకు తెచ్చియున్నారు, నీ యొక్క ఆశీర్వాదము కొరకు. మరియు మేము, మా చేతులను ఆ బాలుని మీద వుంచగా ప్రభువు నామముతో ఆశీర్వదించండి. అతను చిరకాలము జీవించును గాక. మంచి ఆరోగ్యముతో, బలముతో నీ సేవలో సుఖముగా జీవించును గాక, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

దేవుడు నిన్ను దీవించును గాక, చిన్న స్టాన్లీ. మీకు చక్కని బాబు ఉన్నాడు.

13ఇప్పుడు, ఈ చిన్నమంద యొక్క చిన్న దయను అడుగబోవుచున్నాను. ఆ యవ్వనస్తులను కూడ అడుగబోవుచున్నాను. అది కష్టమని నేనెరిగియున్నాను. మీరు ఎంతో సమయము ఆ విధముగానే నిలచియుండలేరు, ఎందుకనగా మీ మోకాళ్ళు పట్టుకొనిపోవును. అయితే ఈ రాత్రికి నేను దరిచేరబోవు కార్యము ఇంతకుముందు జరిగినది కాదు. ఏదో ఒక నూతనమైన దానిపై నేను మాట్లాడబోవుచున్నాను, అలాంటి కార్యమును మాటలాడుదునని నేను ఎన్నడూ తలంచలేదు.

ఈ ఉదయము ఆ కారణము చేతనే, వర్తమానమునకు ముందు కాలమును చెప్పలేదు. నా "ఖచ్చితమైన" అను వర్తమానము ద్వారా నేను ఇంకనూ వెళ్ళలేదు - నేను వెళ్ళుదునని తలంచుట లేదు. నేను దానిని చేయనని విశ్వసించుచున్నాను. ఆయన ఎంతో ఆశ్చర్యకరుడు! అయితే ఈ రాత్రికి, నేను ఎరుగని దానిని మాట్లాడబోవుచున్నాను, ఈ విధముగా చెప్పుటకు ఒక సేవకునికి తగదు, అతడు మాట్లాడబోవునది అతనికే తెలియదు. అయితే నేను దానిని సాహసించుచున్నాను, నా పూర్తి జ్ఞానముతో, నాకు తెలిసినంతవరకు ఈ సంఘము దానిని గ్రహించును. మీకు లాభకరమైన దేనినైనను, నేను ఏ కారణము చేత గాని, పట్టియుంచుట లేదు.

JOHN 21:20-22

 

14అట్లయిన ఈ టేపు… ఆ బాలురు ఆ టేపులను చేయుచున్నారని నమ్ముచున్నాను. మీరు ఆ టేపులను తీసికొని వెళ్ళుట జరిగినట్లయిన, (టేపును వినుచుండు ఎవ్వరైనను), జ్ఞాపకముంచుకొనండి, మిమ్ములను భ్రమపరచు ఏదైనను టేపులో వచ్చినయెడల, టేపులో ఉన్నదాని కన్నను తక్కువగా చెప్పకండి! టేపులయందున్న దానికి వ్యతిరేకముగా ఏదియు చెప్పకండి! "సర్ప సంతానము" పైన అనేకులు వ్రాశారు. నేను ఆ విధముగా చెప్పానని వ్రాశారు. నేను వెళ్లి టేపును వేసి చూశాను — నేను దానిని ఆ విధముగా చెప్పలేదు. చూడండి, ప్రజలు కొన్ని కార్యములకు తప్పుడు తీర్పులు చేయుచున్నారు.

మీకు తెలియును, ఆయన పునరుద్దానుడైన తరువాత, యేసు ఒక సమయములో అపోస్తలులతో సముద్రపు ఒడ్డున నడిచి వెళ్ళుచుండెను. యోహాను ఆయన రొమ్మునకు ఆనుకొనియుండెను, అప్పుడు వారు "ఆ మనుష్యుని సంగతి ఏమగును?" అని యోహానును గురించి అడిగిరి.

అందుకు యేసు, "నేను వచ్చువరకు అతడుండుట నా కిష్టమైతే నీకేమి?" కాబట్టి యోహాను, యేసు వచ్చుటను చూచువరకు మరణించడు అను మాట ప్రచురమాయెను.

వాక్యమేమి చెప్పుచున్నదనగా, "అతడు మరణించడని అతనితో చెప్పలేదు గాని — నేను వచ్చు వరకు అతడుండుట నా కిష్టమైతే అది నీకేమి?" అని చెప్పెను. చూడండి, ఆయన ఆ విధముగా చెప్పలేదు, ఆయన చెప్పినదేమనగా, "నేను వచ్చు వరకు అతడున్నయెడల నీకేమి?" అని చెప్పెను. అతడుండునని ఆయన చెప్పలేదు, అయితే వారు అపార్ధము చేసికొనిరి — అది ఎంతో సులభము.

JOHN 16:31

 

15ఇప్పుడు నేనెవరినో త్రోసివేయుచున్నానని అర్థము కాదు, ఎందుకనగా దానిని నాకు నేనే అపార్ధము చేసికొనవచ్చు. ప్రజలందరు ఆ విధముగా తప్పిపోవుదురు. మన ప్రభువుతో నడిచిన అపోస్తలులు ఆయనను అపార్ధము చేసికొన్నారు… ఆయనను ఎప్పుడు గాని స్పష్టముగా గ్రహించలేదు. చివరకు వారు చెప్పినదేమనగా, "చూడు, ఇప్పుడు మేము గ్రహించుచున్నాము! ఇప్పుడు మేము విశ్వసించుచున్నాము. ఏ మానవుడు నీకు చెప్పనవసరము లేదని నీవు సమస్తమును ఎరిగినవాడవని ఎరిగియున్నామని," చెప్పారు.

అందుకు యేసు, "ఇప్పుడు మీరు విశ్వసించుచున్నారా? ఈ కాలమంతటిలో చివరిగా… అది చివరిగా మిమ్మును చేరినదా? [చూచారా], అందువలన విశ్వసించుచున్నారా?"

అది కేవలము మానవత్వమునకు చెందినది, మనమందరము మనుష్యులమే. మనము అనేకసార్లు అపార్ధము చేసికొనెదము. అయితే అది ఒక రకమైన చిన్న భ్రమగా ఉండును. అప్పుడు ఆ టేపును మరలా వేసి వినండి. దగ్గరగా వినండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీకు దానిని బయలు పరచునని నమ్ముచున్నాను.

16ఆ తరువాత చిన్నపిల్లలైన మీరు, "ఆమేన్" అని చెప్పుటను కొనసాగించుము. కొంత సమయమునకు వేచియుండవలసియున్నది; ఎందుకనగా మీరు దీనిని (ఈ వర్తమానమును) పూర్తిగా గ్రహించవలసియున్నది, మీలో అనేకులకు టేపు రికార్డర్లు ఉండవు. అందువలన మీరు దీనిని ఖచ్చితముగా గ్రహించవలసియున్నది. నేను 35 లేక 40 నిమిషములలో ముగించెదనని చెప్పుచున్నాను. ఇప్పుడు మనము వర్తమానములోనికి సూటిగా వెళ్ళుదుము. మనము యధావిధిగా ఉండునట్టే భక్తితో నెమ్మదిగా ఉండెదము, ఎందుకనగా ఇది మనకొక మిక్కిలి అద్భుతమైన, కాలముగా ఉన్నది. నాకు తెలియనిది ఏదో జరుగు స్థలముగా అది ఉన్నది. నేనేమి చేయవలెనో తెలియకున్నది. నా యొక్క సేవా దినములలో ఒక భయంకర సంధిలో నేను నిలచియున్నాను. నాకు దానిని గురించి తెలిసినంతవరకు ఇటువంటిది జరుగలేదు. కావున, మనము వాక్యమును చేరుటకు ముందు మనము తలలు వంచుదము.

17పరలోకపు తండ్రీ, కొంత కాలము క్రితము, "పురిగొల్పు" (Presuming) అను అంశముపై మాటలాడితిని. "పురిగొల్పు" అనునది "అనధికార సాహసము"గా ఉన్నది. ప్రభువా, ఈ రాత్రికి ఒక దానిని గురించి ఏలాంటి దర్శనము లేకనే ప్రజలకు దానిని నా సొంతముగా వివరించనైయున్నాను. పరీక్ష చేయవలసిన ప్రతి అంశమందు నన్ను పరీక్షించుము. ప్రభువా, నా నోటిని మూసివేయుము.

దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు, అవి ఎలాంటి హాని చేయకుండునట్లు వాటి నోళ్లను మూశావు. ప్రభువా, నేను దేనినైను పొరపాటుగా వివరించినను, నీవు నా నోటిని మూయుటకు నీకు శక్తి గలదు. అయితే అది సత్యముగా ఉన్నట్టయిన, ప్రభువా, దానిని దీవించి ముందుకు పంపుము. నీవు ప్రతి స్థితిని ఎరిగియున్నావు, ఇప్పుడు ఏమి జరుగుచున్నదో కూడ ఎరిగియున్నావు. అందువల్లనే నేను ఈ చివరి క్షణమునకు వచ్చాను, ఈ కార్యములను వివరించుటకు ప్రయత్నించుచు, ఈ ప్రసంగ వేదికకు వచ్చి నిలిచియున్నాను. మాకు సహాయము చేయుమని నిన్ను ప్రార్థించుచున్నాను.

PROV 18:10•

EPH 5:26

 

18ఈ చిన్న సంఘమును దీవించుము. ఈ కప్పు క్రింద చేరుటకై వచ్చిన ఈ చిన్న కూడిక, మాతో కలసి ఆ పట్టణమునకు ప్రయాణము చేయుచున్నారు — వారు ఎన్నో రాష్ట్రముల నుండి వచ్చారు. ఓ, ఆ సాయంకాలపు నీడలు పడుచుండగా, అక్కడకు వచ్చుటకు ఒక స్థలమును మేము కలిగియున్నందుకు మేమెంతో సంతోషించుచున్నాము, ఈ ప్రపంచము తారుమారై వారెక్కడ నిలచియున్నారని ఎరుగని గందరగోళములో నిలచియుండగా, "ప్రభువు నామము మాకు ఒక శక్తిగల దుర్గముగా ఉన్నందుకు ఎంతో సంతోషించుచున్నాము. మరియు నీతిమంతులు దానిలోనికి పరుగెత్తెదరు, వారక్కడ క్షేమముగా ఉండెదరు." అది చాలా మాటలతో కూడినది కాదు గాని, అయితే ఒక ప్రత్యక్షతగా ఉన్నది!

అందువలన, తండ్రి, సూర్యాస్తమయములో సాయంకాలపు వెలుగులు వచ్చుచుండగా, అదే మేము జీవించు ఈ కాలమైయున్నదని నమ్ముచున్నాము. సూర్యాస్తమయములో, ప్రభువా మేము ఎంతో వినయముగా నీకు వందనములు తెలుపుచున్నాము. మాకు చేసిన ఉపకారములకై మా హృదయము నుండి వాటిని నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, ఈ కాలమంతటిలో నీవు దయచేసిన దర్శనముల కొరకు నీకు వందనములు తెలుపుచున్నాను. వాటిలో ప్రతి ఒక్కటి ఎంతో నిశ్చయముగా, ఉండుటయే గాక, అవి అంత ఖచ్చితముగా నెరవేరినవి. అందువలన ప్రభువా, నీవైయున్నావని నమ్ముచున్నాము, ఎందుకనగా మేము మర్త్యులమైయున్నాము — మేమందరము పాపములో జన్మించాము, మాలో ఒక్కటైనను మంచిది లేదు.

అయితే నీవు అటువంటి మానవుని తీసికొని, వారిని వాక్యముతోను, క్రీస్తు రక్తముతోను కడిగితివి; వారిని ముందుకు తెచ్చిన ఆ హస్తము వారిని వారి స్వంత తలంపుల నుండి దూరపరచినది. క్రీస్తు మనస్సును కలిగి జీవించునట్లు చేసినది, ఎందుకనగా ఆయన సమస్తమును ఎరిగియున్నాడు. కావున ఆయన వచ్చి మమ్ములను మాట్లాడజేసి ఒక గుడారముగా మమ్ములను వాడుకోనిమ్ము. తండ్రి, నీకు వందనములు.

19ఇప్పుడు మేము నీ పరిశుద్ద "నామమును" సుత్తించుచున్నాము. "నీ నామములో ఈ చిన్న కూడికను ఈ రాత్రి సమయమున దీవించుచున్నాము. సోదరుడు నెవిల్ గారిని దీవించుచున్నాము. ఆయన ఈ సంఘకాపరిగా ఉండుచు, ఒక గొప్ప శక్తిగల దేవుని సేవకునిగా ఉన్నాడు. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క పెద్దలను, క్రీస్తు శరీరముగా ఉన్న ఇతర సభ్యులను ఇక్కడ చేరిన వారిని ప్రపంచమంతటను, ఈ విధముగా సమకూడిన వారిని ఈ సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించుచున్నాము.

ఓ, మేము చూచుచుండగా, ఈ భయంకరమైన ఘోరమైన నీడ (మరణపు ఛాయ) క్రైస్తవ్యము యొక్క ముఖముపై పడుచున్నది. అప్పుడు కాలము సమీపమై యున్నదని గ్రహించుచున్నాము. మా కొరకు "ఎత్తబడుట" అనునది ఉన్నది, సంఘము ఎత్తబడును. ప్రభువా, మమ్ము ముందుకు కొనసాగించుము. దీనికి కర్తయు కొనసాగించువాడును, ముగించుచున్న క్రీస్తును చూస్తున్నాము. దయచేయుము, ప్రభువా. మరియు మేము ముందుకు కొనసాగుచు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయములపై ఉంచబడిన ఈ కార్యములను గైకొనుచున్నాము. నీవు మాతో ఉండునట్లును, మాకు సహాయము చేయుచు, దాని ద్వారా మహిమ పొందుమని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, మమ్ములను మేము నీ వాక్యముతో అప్పగించుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.

20ఇప్పుడు, మీ యొద్ద ఒక పెన్సిలు, పేపరో ఉన్నట్టయిన మీరు ఏదైనను వ్రాసికొనవచ్చును, లేక మీరు ఇష్టపడిన దానిని వ్రాసికొనవలెనని నేను ఇష్టపడుచున్నాను, సిద్దముగా ఉంచుకొని యుండుడి. టేపులను కూడ సిద్దముగా ఉంచుకొనుడి, మీరు లేఖనములను వ్రాసికొనదలచిన వ్రాసికొనవచ్చును — ఎందుకనగా లేఖనము లేక వాక్యమే లెక్కకు తీసుకోనతగినది అని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు, ఈ రాత్రి మన పాఠ్యాంశమును చదువుదము, లేక యేసుక్రీస్తు యొక్క ప్రకటన గ్రంథము నుండి ఒక లేఖన భాగమును చదువుదము. నేను నమ్మునదేమనగా, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతగా ఆ గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ ప్రత్యక్షతకు వేరైన మరొక ప్రత్యక్షత పొరపాటైనది. అది దాని సాక్ష్యమును కలిగియున్నదని నేను నమ్ముచున్నాను. మరే ప్రత్యక్షతయైనను ఈ ప్రత్యక్షతతో పొందిక లేకపోయినయెడల, ఈ ప్రత్యక్షతను వెలుగునకు తీసికొని రానియెడల అది పొరపాటైన ప్రత్యక్షతగా ఉన్నది. అది ఆత్మీయముగా లేఖనానుసారముగా ఉండవలసియున్నది.

REV 10:1-7

 

21ఇప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంధము నుండి 10వ అధ్యాయమలో మొదటి కొన్ని వచనములను నేను చదువగోరుచున్నాను. మొదటి వచనము నుండి ఏడు వచనములు. ఇప్పుడు, దగ్గరగా వినుచు, నా కొరకు ప్రార్థించండి.

"బలిష్టుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్పుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొనియుండెను, ఆయన శిరస్సు మీద వర్ష ధనస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను.

ఆయన చేతిలో విప్పబడియున్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటి౦చినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను.

ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా, - ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని.

మరియు సముద్రము మీదను, భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి,

పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టుపెట్టుకొని - "ఇక ఆలస్యముండదు గాని,

యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను."

ఈ రాత్రి నా అంశమును, (నేను దీనిని ఇలా పిలువ తలంచి౦తిని), "అయ్యా, ఇదే నా ఆ చివరి కాలపు సూచన?" (" Is this the Sign of the End, Sir?")

22సంఘము యొక్క మహిమకరమైన కాలములో మనము జీవించుచున్నామని మనకందరికి తెలియును, అయితే అవిశ్వాసికి ఇది ఒక భయంకర కాలముగా ఉన్నది. మనము జీవించు ఈ కాలము, కాలములన్నింటిలో అతి భయంకర కాలముగా ఉన్నది. ప్రపంచము ప్రారంభించినది మొదలుకొని, ఇటువంటి భయంకర కాలమును మనము కలసికొనినది లేదు. మనము జీవించు ఇటువంటి కాలములో, ఏ ప్రవక్త గాని, అపొస్తలులు గాని ఎవ్వరూ జీవించలేదు. ఇది అంతముగా ఉన్నది.

ఇది ఆకాశములో వ్రాయబడినది. భూతలముపై వ్రాయబడినది. ఇది ప్రతి వార్తా పత్రికలో వ్రాయబడినది. ఇది అంతముగా ఉన్నది — మీరు ఆ చేవ్రాత చదువగలిగినట్లయితే. ఆ చేవ్రాత ఒక దేశపు గోడపై వ్రాసినప్పుడు ఆ కాలమందు ప్రవక్తలు జీవించారు; కానీ కాలమునకు గోడపై చేవ్రాత కలిగియున్న సమయములో మనము జీవించుచున్నాను. సమస్త దేశములకును, భూమికిని ప్రతిదానికి ఇది ఆంతముగా ఉన్నది. కావున మనము జీవించుచున్న ఈ ఘడియకు సంబంధించిన లేఖనమును వెదుకవలసియున్నది.

23ఎల్లప్పుడు, ఒక దేవుని నిజప్రవక్త లేఖనములలోనికి వెళ్ళును. అందువలన, అది ఆ విధముగా ఉండునని అతడు నిశ్చయత కలిగియున్నను పాత నిబంధనలో ప్రవక్తలు ఏదైనను చెప్పినయెడల, అవి నెరవేరు కాలమందు ఎక్కడైనను ఒక ప్రవక్త ఆ మాటలతో వచ్చి నిలచును. అతడు ఆ వాక్యముతో (లేఖనములలో చెప్పబడిన దానితో) నిలచియుండును. దర్శనముల కొరకు దేవుని తట్టు తిరిగి వేచియుండును. అతని దర్శనము వాక్యమునకు వ్యతిరేకమైనయెడల, అతని దర్శనము పొరపాటైనది. ఆయన వాక్యమును ఆయన ప్రజలకు కొనిపోవు విధానము ఆ విధముగానే ఉండును.

(వెనుక ఉన్నవాళ్ళు చక్కగా వినగలుగుచున్నారా?) ఎక్కడ ప్రారంభించాలో అని నాకు తెలియుట లేదు. ఇప్పుడు ఈ మందిరము నా సంఘమని తెలిసికొనుట నాకొక గొప్ప ధన్యతగా ఉన్నది. ఇది ఒక మహిమకరమైన కార్యము. నేను దానిని మరచిపోలేను — యేసు వచ్చుట ఆలస్యమైతే, నేను ఇంకనూ వందల సంవత్సరములు జీవించుదును. నేను మూలరాయిని వేసిన దినమును జ్ఞాపకము చేసికొనుచున్నాను. అక్కడ ఆ మూలగా, ఆ ఉదయకాలమందు ఆయన నాకిచ్చిన దర్శనము ఈ మందిరమును గూర్చినది. మీరందరు దానిని జ్ఞాపకముంచుకొనియున్నారు, అది పుస్తకములలో వ్రాయబడినది. అది నిశ్చయుముగా, అక్షరములతో సహా నెరవేరినది. దానిలో ఏ ఒక్క చిన్న భాగమైనను తప్పిపోలేదు.

24ఇప్పుడు, నా జీవిత సంవత్సరములన్నింటిలో ఆయన నాతో మాట్లాడిన దానంతటిని ప్రజలతో చెప్పక మిగిల్చినది ఏదియు లేదని నమ్ముచున్నాను. అయితే నేను చెప్పినదంతయు నెరవేరినది. అనేక ప్రజలు కలలతో నా యొద్దకు వచ్చినప్పుడు, ఆయన కృప ద్వారా ఆయన నన్ను వాటిని వివరించుటకు అనుమతించెను. అనేకులు తమ కలలతోను, చిక్కులతోను వచ్చినప్పుడు, నేను వాటిని వివరించలేకపోయాను. అయితే ప్రజలైన మీకు ఆయనను పరిచయము చేయుటకు దేనినో నేను ప్రయత్నించలేదు, వాటన్నిటికి జవాబు దొరికినది. నేను నమ్మకముగా ఉండుట మాత్రమే కాకుండ, సత్యమేదో మీతో చెప్పాను, ఆయన నాతో చెప్పినట్టే మీతో నేను చెప్పగలను. అది వచ్చినప్పుడు నేను మీకు దానిని చెప్పగలను.

నేను మిమ్ములను హెచ్చరించుటకు ఇష్టపడుచున్నాను. మనము జీవించు ఈ దినమందు, అనేక… కాదు. ప్రజలకు నిరోధముగా చెప్పుట కాదు, అయితే ప్రతి దానికి జవాబునిచ్చువారిని ఎవ్వరినైనను మీరు చూచినప్పుడు, వారు వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నయెడల మీరు జాగ్రత్తగా ఉండవలసియున్నది.

LUKE 4:25-27

 

25యేసు ఇలా చెప్పెను, "ఏలీయా దినములలో అనేకులు కుష్ట రోగులుండిరి, అయితే ఒక్కడు మాత్రమే స్వస్థతనొందెను." చాలా కాలము, 80 మరియు ఎక్కువ సంవత్సరములు ఏలియా మరియు ఒక కుష్ఠ రోగి మాత్రం స్వస్థతపొందియున్నాడు. ఎలీషా దినములలో అనేక విధవరాండ్రు ఉండినను, సారెపతులోని ఒక విధవరాలి యొద్దకు మాత్రమే పంపబడెను.

దేవుడు అనేక కార్యములు చేసెనని మనమెరిగియున్నాము, అయితే వాటిని ఆయన తన సేవకులకు బయలుపరచలేదు, మరియు తన ప్రభువుకన్నను ఏ సేవకుడు గొప్పవాడు కాదు. అట్లయిన, దేవుడు తన మహిమను ఇతరులతో పంచుకొనడు. ఆయన దేవుడు. దేవుని స్థానమును తీసికొనుటకు ఒక సేవకుడు ప్రయత్నించినయెడల దేవుడు అతని జీవమును తీసివేసి, అతనిని ఎక్కడో ఒక స్థలమునకు త్రోసివేయును, లేక మరొక దానికి అప్పగించును. మనము దానిని జ్ఞాపకముంచుకొనవలసియున్నది.

DAN 2:9

 

26ఇప్పుడు, ఆ దర్శనములలో మరియు ఆ వివరణలతో, నేను ఖచ్చితముగా చూడనిదే ఏ కలను కల వివరణ గాని నేను చెప్పను. దానిని దర్శనము ద్వారా చూడవలసియున్నది. ఆ కల ఏమిటని చూడవలసియున్నది. మీలో అనేకులు మీ కలలను నాతో చెప్పిరని మీకు తెలియును, అయితే నేను దానికి ఏమియు చెప్పియుండను. ఆ కల నాకు మరలావచ్చుట నేను చూచినప్పుడు, ఆ కలను గురించి మీరు విడిచిపెట్టినదాని కూడ చెప్పియున్నాను. అది నిజమని మీరెరిగియున్నారు. అది నిజమైనయెడల "ఆమేన్" అని చెప్పండి. మీరు నాతో చెప్పినవి నేను మీతో చెప్పియున్నాను. అందువలన, మీరు చూడండి, అది నెబుకద్నెజరు రాజుకు వచ్చినట్లున్నది. "నేను కనిన కలను నాతో చెప్పకపోయావంటే, నీవు దాని వివరణను కలిగియున్నావని నాకెట్లు తెలియును?" అని అడిగెను.

అయితే అన్ని అనుభూతులను తీసికొని "ప్రభువు సెలవిచ్చుచున్నాడుగా" చెప్పకూడదు. మనమలా చేయకూడదు. మనము నేరుగా ఆయన శబ్దమును వినవలసియున్నాము. దేవుని దగ్గరనుండి జవాబు) అప్పుడు అది దేవుడు చెప్పినదని చెప్పవచ్చు. ఒక అనుభూతి కాదు, లేక ఒక భావన కాదు. అది ఎంతగా మనలను నమ్మించుటకు ప్రయత్నించినను, "అది ఇలా ఉండవలసియున్నదని నేను నమ్ముచున్నానని" మనము స్థిరముగా చెప్పవలెను. అయితే మీరు "ప్రభువు సెలవిచ్చుచున్నాడని" మాట్లాడినయెడల అది మీరు కాదు. వేదికపై గమనించుడి. అది ఎప్పడైనను తప్పిపోవుట చూచారా? "ప్రభువు సెలవిచ్చుచున్నాడనునది" పరిపూర్ణమైనది. అది తప్పిపోదు. అది ప్రభువు సెలవిచ్చినదిగా? ఉన్నంతకాలము అది తప్పి పోవుటకు వీలులేదు.

27అయితే ఇంతవరకూ, ఆయన నన్ను కాపాడుచు వచ్చెను, ఎందుకనగా నేను ఆయన కొరకు వేచియుంటిని. పలుకుబడి కొరకు నేను ప్రయత్నించలేదు, లేక వ్యర్థమైన మానవ మహిమ కొరకు మాట్లాడలేదు. నేను ఎంతో వినయముగా జీవించుటకు ప్రయత్నించాను. ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవితమును జీవించాను. అది నాకుగా నేను చేయలేదు, అయితే ఆయన నా కొరకు, ఈ దినము వరకు చేయుచున్నాడు. నేను చెప్పుచుండు ప్రకారము ఆయనే నన్ను నడిపించువాడై యున్నాడు.

అనేక కార్యములు ఈ విధముగా చెప్పవచ్చును, అయితే అందుకు ఎంతో కాలము తీసికొనును. మీరందరూ ఈ కార్యములను గురించి జాగ్రత్తగా ఉండవలసియున్నది. కొంత సమయుమునకు ముందు మిమ్ములను "ఆమెన్" అని చెప్పమన్నందుకు ఒకే కారణము — మీరు నాతో ఎన్నో కలలను చెప్పారు, అప్పుడు మీకు ఆ కలలో మీరు విడిచిపెట్టిన దానిని కూడా చెప్పాను — ఎందుకనగా ఈ వర్తమానము రికార్డు అగుచున్నది. సమస్త దేశ మనుష్యులు దీనిని వినెదరు, మీరు "ఆమేన్" అని చెప్పుదానిని వారు వినినప్పుడు, ఈ సేవక్రింద అనేక శబ్దములున్నవని గ్రహించెదరు. వారు పొరపాటు చేయక మంచివాటిని చేసెదరు, లేక పొరపాటు లేని దానికి "ఆమేన్" అని చెప్పెదరు. ఆమేన్ అనగా, "అలాగే జరుగును గాక," అని అర్థము. అది దానిని అంగీకరించుచున్నది.

28ఇప్పుడు, నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పటి నుండి, నన్ను ఏదో తొందర చేస్తూ వుండినది, నాకు జీవితము చాలా కఠినముగా ఉండినది, గ్రహించుటకే కష్టమైపోయినది. నా భార్య కూడ తల కొట్టుకొని, ఈ విధముగా చెప్పినది, "బిల్, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేరని నమ్ముచున్నాను."

"నన్ను నేనే గ్రహించలేకున్నాను," అని చెప్పాను, ఎందుకనగా నన్ను క్రీస్తుకు అనేక సంవత్సరముల క్రితమే అప్పగించుకొన్నాను. ఆయనే నన్ను నడిపించుచున్నాడు. దానిని నేను గ్రహించలేకున్నాను. ఆయన నన్ను ఎక్కడికి నడిపించునో, అక్కడికి నేను వెళ్ళుదును. నాకు తెలిసినంత వరకు నేను ఆ విధముగానే చేయుదును.

నాకు మంచి భార్యను బిడ్డలను దయచేసినందుకు ఆయనకు వందనములు తెలుపుకొనుచున్నాను. నా భార్య బిడ్డలు నన్ను ఎంతగా నమ్మియన్నారనగా, నేను వారితో మరే పొరపాటును చెప్పనని నమ్మియున్నారు — వారు నన్ను నమ్మియున్నారు. ప్రతిసారి ఏదైనను చెప్పినప్పుడు వారు దానితో నిలచెదరు. వారితో ఏ పొరపాటైన చెప్పనని వారెరిగియున్నారు. అట్లయిన దేవుని పిల్లలతో నేను పొరపాటును చెప్పగలనా? స్వీయ ఇష్టముగా చెప్పలేను, లేదండి! దేవుడు తన పిల్లలను నిజమైన తర్ఫీదులో ఉంచుటకు ఇష్టపడును. అందువలన వారితో నమ్మకముగాను, సత్యముగాను ఉండవలసియున్నది. దానిని ఆయన దీవించునని నమ్ముచున్నాను.

ROM 11:29

 

29ఇప్పుడు, ఈ ప్రయాణమంతటిలో, నేను గ్రహించలేని అనేక కార్యములు జరిగినవి. వాటిలో ఒక్కటి, నేను చిన్నపిల్లవానిగా ఉండినప్పుడు, ఆ దర్శనములు నాకు వచ్చుచుండును. నేను వాటిని చూచి జరుగనైయున్న కార్యములను నా తల్లిదండ్రులతో చెప్పుచుందును. నేను నరముల బలహీనతలో ఉన్నానని వారు తలంచారు. అయితే ఆశ్చర్యమైన కార్యమేదనగా, అది చెప్పబడినట్లే జరిగినది.

"అది నీవు విశ్వాసమునకు మార్చబడుటకు పూర్వము జరిగినదా?" అని అడుగవచ్చు.

అవును. "వరములు - పిలుపులు మారుమనస్సు లేకనే వచ్చునని," బైబిలు చెప్పుచున్నది. నీవు ఈ ప్రపంచములో ఒక కారణముతో జన్మించావు. అది మీకు తెలియదు… మారుమనస్సు వలన వరములు కలుగవు. అవి మీకు ముందుగా నిర్ణయించబడినవి.

ఇప్పుడు, ఈ మార్గము వెంట, నేనొక చిన్నపిల్లవానిగా ఉండినప్పుడు, నేను జీవించు ఈ దేశముతో అసంతృప్తినొందితిని, ఎదోవిధముగా నేను పశ్చిమంవైపు వెళ్ళుటకు ఇష్టపడుచుంటిని.

30తుపాకితో నేను కాల్చబడినప్పుడు, నాకు శస్త్రచికిత్స చేశారు. అప్పుడు నేను చిన్న బాలుడను. మొదటిగా మైకపు మందు నిచ్చుటకు వారు వచ్చినప్పుడు, నేను చిత్రవధను అనుభవించబోవుచున్నానని తలంచాను — ఆ మైకపు మందు నన్ను పూర్తిగా మైకములోనికి త్రోసివేసినది. నేను ఎనిమిది గంటలసేపు మైకములో ఉంటినని తలంచుచున్నాను. వారు నన్నుమరలా స్వాధీనములో తెచ్చుటకు కష్టపడుచున్నారు. వారు పెన్సిలిన్ మందు లేకుండానే ఒక పెద్ద ఆపరేషను చేశారు. రక్తమంతయు కారిపోవుచుండినది, నా రెండు కాళ్లు ఒక చిన్న తుపాకితో కాల్చబడినవి. నా స్నేహితుడు ఆ తుపాకీని ప్రేల్చేశాడు.

ఏడు నెలల తరువాత నేను మరొక మైకపు మందును తీసికొనవలసి వచ్చినది. ఆ వైద్యము నుండి వచ్చిన తరువాత, నేను విశాలమై పడమటి పచ్చిక బైళ్లపై నిలచియుండు తలంపు వచ్చినది. అప్పుడు ఒక పెద్ద బంగారు శిలువ ఆకాశములో నిలచినది, దాని నుండి దేవుని మహిమ ప్రకాశించుచుండెను, మరియు నేను అలాగే అక్కడ నిలచిపోయాను.

31ఈ రాత్రి మీరు ఈ చిత్రములో చూచు ఈ వెలుగు అతీతజీవియని (Supernatural Being) ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనలో నిరూపించబడినది; నాకు అది ఏమైయున్నదనగా, దమస్కు మార్గములో పౌలును సంధించిన వెలుగుగాను, ఇశ్రాయేలు పిల్లలను అరణ్యములో రాత్రులందు నడిపించిన అగ్నిస్తంభముగాను ఉన్నది. "మీరు ఇక్కడ ఈ దూతను గమనించారా?" "ఆయన మేఘమును ధరించియుండెను." చూడండి, ఆయన పగలు మేఘముగా నిలచెను.

ఇప్పుడు, అదే వెలుగు, దానిని గ్రహింలేని ప్రజలు మొదటిగా అది పొరపాటైనదని తలంచుచున్నారు. నేను ఆ విధముగా చెప్పుచున్నానని తలంచుచున్నారు. అయితే పరిశుద్ధాత్మ శాస్త్రీయ పరికరముల ఎదుట నిలచినప్పుడు, అక్కడి ప్రజలకు అది నిరూపణగా ఉన్నది, ఆ చిత్రమును వారు పలుమార్లు తీశారు.

"ఒక వ్యక్తి మరణపుఛాయతో కప్పబడియుండుటను చూచుచున్నానని" చెప్పితిని — ఆమె పై నల్లటి (మరణపు ఛాయ) ముసుగు ఉండినది.

32కొన్ని వారముల క్రితము నేను ఒక పట్టణములో ఉండగా, అక్కడ నేను ప్రస౦గించుచుంటిని. సాధారణముగా, ప్రసంగించునప్పుడు చిత్రములు తీయకూడదని మీకు తెలియును, అప్పుడు… తీసినప్పుడు ఏదో ఒకటి ఉండినది.

అయితే వారు ఒక కెమెరాను ఉంచుకొనియుండిరి. అక్కడ కూర్చొనియున్న ఒక స్త్రీతో నేను ఇలా చెప్పాను, ఆమె నాకు తెలియని వ్యక్తి, (నేను "పడమటి పైన్స్" లో ఉన్నాను) ఈ స్త్రీ పైన, ఒక ముసుగు ఉన్నదని చెప్పాను. నేనామెను నా జీవితములో చూడలేదు. "ఆమె అప్పుడే డాక్టరు వద్ద నుండి వచ్చినది. ఆమెకు రెండు స్థనముల యందు కాన్సరున్నది. ఒక్కొక్క రొమ్ముపై ఆ కాన్సరున్నది, ఆమెను వదిలేశారు. ఆమె నల్లటి మరణముసుగు చేత కప్పబడియున్నదని," చెప్పాను.

అక్కడ ప్రక్కనున్న ఒక సోదరితో ఎవ్వరో ఇలా చెప్పచున్నారు, "వెళ్ళి ఫోటో తీయుము," ఆమె ఒక వెలుగు నిచ్చు కెమెరాను కలిగియుండినది. ఆమె ఆ విధముగా చేయుటకు ఇష్టపడుటలేదు. అయినను, "వెళ్లి ఫోటో తీయుము," అను శబ్దము వినుచుండినది. అయినను ఆమె మౌనముగా కూర్చొనియుండినది. ఆ శబ్దము మరలా వచ్చినది, ఆమె ఆ కెమారాను తీసికొని ఫోటో తీసినది. అది శాస్త్రీయముగా అక్కడున్నది. ఆ చిత్రము వెలుపల ప్రకటన పలకకు అంటించియున్నది. నల్లనీ ముసుగు-నీడ.

ఆ స్త్రీ విశ్వసించిన తరువాత ప్రార్థన చేయబడినది, అప్పుడు మరొక ఫోటో తీయబడినది. అందులో ఏ ఛాయకూడ లేదు. "ఆ నీడ విడిచి పోయినది" ఆ స్త్రీ దేవుని కృప చేత జీవించుచున్నది.

33నేనేమి భావమేమిటో మీరు చూచుట లేదా? మీకు సత్యము చెప్పబడినప్పుడు కొంత సమయము నవ్వవచ్చు. మీరు అపార్ధము చేసుకొనవచ్చు, అయితే దేవుడు దానిని నిరూపించును. అది సత్యమని మీరు దానితో నిలచియుండవలసియున్నదని నిరూపించును. కేవలము నిలిచియుండండి. అది జరుగుటకు సంవత్సరములు కావచ్చు, అబ్రాహాము వలె, ఇతరుల వలె ఆలస్యము కావచ్చు, అయితే ఆయన ఎల్లప్పుడు సత్యమును నెరవేర్చును.

అక్కడున్న దూత… నేను నా భార్య ప్రక్కగా నిలచియుండగా, ఆ వెలుగు దిగి వచ్చుటను చూచినవారు అనేకులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు, అది ముప్పది సంవత్సరముల క్రితము జరిగినది. ఆ సమయములో ప్రభువు దూత వచ్చిన దానిని చూచినవారు ఇప్పుడిక్కడ ఎవ్వరైనను ఉన్నారా? ఆ నది ఒడ్డున మొదటిసారిగా ప్రజల యెదుట, ఆయన వచ్చినప్పుడు చూచిన వారిక్కడ ఉన్నారా? మీ చేతులు ఎత్తండి. అవును, అక్కడ కూర్చొనియున్నారు. నేను శ్రీమతి విల్సన్ చేతులు ఎత్తుటను చూచుచున్నాను. ఆమె అక్కడ నిలచియుండినది. నా భార్య అక్కడుండినది.

మిగిలినవారు అక్కడ నిలచిన వారెవరని నాకు తెలియుట లేదు. అనేక ప్రజల ఎదుట నేను బాప్తిస్మమిచ్చుచుండగా, మధ్యాహ్నము 2.00 గంటలకు, మెరయుచున్న కంచు రంగులో ఉన్న ఆకాశము నుండి ఆయన మాటలాడెను. అప్పటికి ఒక వారముగా వర్షము లేదు, అక్కడ ఆయన గర్జించుచు వచ్చెను. ఆయన, "క్రీస్తు మొదటి రాకడను సూచించుటకు, బాప్తిస్మమిచ్చు యోహాను ఏ విధముగా పంపబడెనో క్రీస్తు రెండవ రాకడను సూచించుచు ఈ వర్తమానముతో నీవు పంపబడుచున్నావని," చెప్పెను.

34అనేకులు, పట్టణములోని వ్యాపారులు అనేకులు అక్కడ ఆ గట్టుపై నిలచియుండిరి. వారు నన్ను అడిగినప్పుడు, "అది నా కొరకు కాదు; అది మీ కొరకు వచ్చినది," అని చెప్పాను. ఆయన పడమరగా వెళ్ళుచు, ఆ నది వంతెన మీదగా పడమర వైపుగా వెళ్ళెను.

ఆ తరువాత నేనొక నక్షత్ర శాస్త్రజ్ఞుని కలిశాను, అతడొక మ్యాగి. వారు నక్షత్ర కూటమును గురించి నాతో మాట్లాడుచుండెను. బబులోను నుండి తూర్పు ప్రాంతములకు పరవాసముగా వెళ్ళిన జ్ఞానులు పాలస్తీనా దేశముపై మూడు నక్షత్రములు ఒక కూటముగా నిలచిన దానిని కనుగొనిరని, నేను పలుమార్లు చెప్పుటను మీరు వినియు౦దురు. అది సత్యమని ఈ చివరి రెండు వారములలో నిరూపించబడినదని మీకు తెలియునా?

35సోదరుడా సోత్మాన్, మీ వద్ద ఆ కాగితమున్నదా? అది ఒక కాగితము — ఆదివారపు పత్రిక డిసెంబరు 9లో వచ్చినది. ఒక పరిశోధకుడు అక్కడకు వెళ్ళి వాటిని త్రవ్వి తీసెను. మనము ఇప్పుడు ఎక్కడ జీవించుచున్నాము అనునది దానిలో నిరూపించబడినది. ఈ రానున్న 1970 లో జరుగవలసిన కార్యములన్నియు జరిగినవి. ఏడు సంవత్సరములు వాటిని త్రవ్వి తీశారు, అది పొరపాటని చెప్పారు. దానిని మీరు యోచించునంతలో ఎంతో ఆలస్యమైపోయినది!

నేను సోదరుడు ఫ్రెడ్ ను చూడలేకున్నాను. సోదరుడా సోత్మాన్, మీరిక్కడ ఉన్నారా? మీ వద్ద ఆ కాగితము ఉన్నదా, సోదరుడు సోత్మాన్? (ఆయన వద్ద ఆ కాగితము ఉన్నది.) రేపు రాత్రికి మనము దానిని చదువగలము. ఈ రాత్రి మనకు సమయము లేదు.

MATT 2:2

 

36అందువలన మీరు చూచి గమనించగలరు, ఖచ్చితముగా. ఆ మాగీలు యూదా సన్యాసులు, వారు బబులోనులో ఉండిరి. ఆ నక్షత్రములను చదువుచుండి నప్పుడు, అవి ఏ విధముగా కూడుచున్నవో చూచి, అవి ఆ విధముగా కూడినప్పుడు, మెస్సీయా భూమిపై ఉన్నాడని తెలిసికొనిరి. వారు పాడుచు ఇక్కడ యెరుషలేముకు వచ్చారు. (రెండు సంవత్సరముల ప్రయాణము), "యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడు?" వీధులలోపైకి, క్రిందికి తిరుగుచూ వారు వెళ్ళుచున్నారు. అక్కడ ఇశ్రాయేలీయులు వారిని చూచి నవ్వుచు, వీరు పిచ్చోళ్లు, అని వారిని చూచి పరిహాసము చేశారు. వారిని గురించి ఇశ్రాయేలీయులకు ఏమియు తెలియదు. అయితే మెస్సీయా భూమిపై యున్నాడు. ఇప్పుడు, మీకు ఆ మిగిలిన చరిత్ర అంతయు తెలియును. వారేమి చెప్పారో, అదంతయూ మీకు తెలియును. మనము రేపటి రాత్రి దానిని చదువుదము.

ACTS 10:34

 

37ఇప్పుడు దీనికి వచ్చుచుండగా, ఆ దర్శనములు తప్పిపోలేదు, ఎందుకనగా అవి దేవుని దగ్గర నుండి వచ్చినవి. నా ప్రయాణమంతటిలో ఏదో నన్ను లాగుచూ పోరాడుచుండినది. ఆ మాగీలు ఈ సంగతులను నాతో చెప్పినప్పుడు, నేనొక చిన్నపిల్లవానిగా ఉంటిని — ఆటల సంరక్షకునిగా పనిచేయుచుంటిని, లేక దానికి ముందుగా ఉండునని విశ్వసించుచున్నాను. ఈ కార్యములన్నియు నన్ను భయపెట్టెను, ఎందుకనగా ఆ మాగీలు ఎవరోనని భయపడితిని. ఆ తరువాత బైబిలులోని మాగీలు ఖచ్చితమైనవారని ఎరిగితిని, ఎందుకనగా దేవుడు భూమిపై దానిని నెరవేర్చుటకు ముందు ఆకాశములో దానిని తెలియపరచుచున్నాడు — ఆకాశపు శక్తులను గమనించుచుండిరి.

"దేవుడు దేశములందున్న అందరిని గౌరవించడు, అయితే తనకు భయపడు వారిని అన్ని దేశముల యందును దేవుడు అంగీకరించును," అని పేతురు చెప్పెను.

[టేపు మీద ఖాళీ] …

38అప్పుడు మనము కనుగొనినదేమనగా, ఆ తలంపును మీకిచ్చుటకు నేను ప్రయత్నించాను గాని… ఓ, అవి ఎన్నో గంటలు తీసికొనును, అవి ఏ విధముగా క్రమముగా కదిలిపోవుచు ఉన్నవని చూడదగును. అయితే నేను వాటిని గురించి భయపడితిని. ఈ మాగీ నాతో చెప్పినదేమనగా, "నీవు తూర్పునందు జయము పొందవు." "నీవు ఒక గుర్తు క్రింద జన్మించావు. ఆ గుర్తు, ఆ నక్షత్రముల కూటమే, అవి అక్కడ దాటిపోవుచు ఉండగా, అది నీ జన్మదినముగా ఉండినది. అప్పుడు అవి పడమరలో వ్రేలాడుచుండినవి, కావున నీవు పడమరకు వెళ్లవలసియున్నావని," చెప్పిరి.

అందుకు నేను, "దానిని మరచిపొండి." నేను వాటితో చేయునది ఏదియు లేదు. అన్ని దినములగుండా అవన్నియు నా హృదయము నుండి తొలగిపోలేదు.

MATT 8:29

 

39అప్పుడు, ఈ దర్శనములలో నేనక్కడ ఉండినప్పుడు… నేను వాటిని గ్రహించలేకపోయాను. నా బాప్టిస్టు సోదరులు అది దయ్యమునకు సంబంధించినదని చెప్పారు. అప్పుడు ఆ దూత కనబడినప్పుడు, లేఖనములోనికి వెళ్ళి ఆ యాజకులు ఆ కార్యములను గురించి వాదములు చేయుచుండిరి. వారు ధరించవలసిన దుస్తులను గురించే వారి వ్యత్యాసములను గురించి వాదములు చేయుచుండిరి — ఆ మాగీలేమో క్రీస్తు నక్షత్రమును వెంబడించారు.

ఆ యాజకులు యేసు అలా నటించుచున్నాడనియు, ఆయన ఒక వంచకుడనియు బెయల్జబూబు అనియు చెప్పిరి, అయితే ఒక దయ్యము లేచి "నీవెవరివో మాకు తెలియును — నీవు దేవుని పరిశుద్ధుడవు," అని చెప్పెను. "మా సమయము ముగించుటకు ముందే నీవు వచ్చి మమ్ము ఎందుకు తొందరపెట్టుచున్నావు?" అని అడిగినవి.

ACTS 16:17,18

 

40పౌలు, సీలయు, వాక్యమును ప్రకటించుచు వచ్చినప్పుడు, అదృష్టము చెప్పువాడొకడు ఆ వీధిలో కూర్చొనియుండెను. ఆ దేశ బోధకులు ఏమి చెప్పారనగా, "వీరు వంచకులనియు, వీరు మన సంఘములను చీల్చివేయుదురు అనియు, వారి అవినీతి చేత ప్రపంచమును తలక్రిందులుగా చేయుదురని చెప్పిరి.

అయితే ఏమి జరిగినది? ఆ చిన్న మాగి, ఆ చిన్న అదృష్టము చెప్పువాడు, "వీరు దేవుని మనుష్యలుగా ఉండి, మనకు జీవమార్గము చెప్పుచున్నారని," చెప్పెను.

పౌలు అతనిలో ఉన్న ఆత్మను దూషించెను, ఎందుకనగా అతను ఎవరని చెప్పుటకు అతనికి ఎవ్వరి సహాయము అక్కర లేదు. సమాధానమును చేపట్టియుండుడని యేసు ఎల్లప్పుడూ చెప్పెను. కొన్ని సమయములలో బోధకులు తెలిసియున్న దానికన్నను దయ్యమునకు అధికముగా తెలియునని చూపించుటయగుచున్నది. వారు అధికముగా మత బంధకములలో చిక్కుబడియున్నారు. ఆ విధముగా బైబిలులో, వ్రాయబడియున్నది, మరియు దేవుడు మారనివాడు.

41ఒక దినము, ఐదు సంవత్సరముల క్రితము సోదరుడు నార్మన్ దగ్గర నుండి వచ్చుచుండగా, నేను ఆ బాట వెంబడి కారును నడుపుచున్నాను, అక్కడ నాకొక కూడిక ఉండినది. అప్పుడు ప్రభువు నాకు దర్శనములో కనబడెను, నేను నా ఇంటి ముందు గేటు దగ్గర కూర్చొనియున్నాను, అప్పుడు వాతావరణము ఏమి బాగుగా లేదు.

ఆ దర్శనమును మీలో అనేకులు జ్ఞాపకముంచుకొనియుందురు. అది నా దర్శనముల పుస్తకమందు వ్రాయబడియున్నది. నేను మరచిపోకుండునట్లు నేను వాటిని వ్రాసియుంచాను.

ఆ దర్శనములో నేను చూడగా, ఆ వీధి ద్వారా ఒకటి వచ్చుచున్నది. మా ఇంటి పెరటిలో అంతటను రాళ్ళు వేయబడియున్నవి. శుభ్రము చేయువారు వీధి వెంబడి పైగా, క్రిందుగా ఉన్నారు. చెట్టు నరుకబడి వేర్లతో లేపబడుచున్నవి. నేను ఆ గేటు ద్వారా పరుగెత్తుటకు మొదలుపెట్టితిని. అదంతయు రాళ్ళుతో అడ్డగించబడియున్నది, "ఎందుకు ఈ విధముగా చేయుచున్నారని," అడుగుటకు నేను వెలుపలకు వచ్చాను.

అతడు చాలా విరోధముగా ఉన్నాడు, అతడు నన్ను నెట్టివేసి, "బోధకులైన మీతో వచ్చిన తొందర అదియే!" యని చెప్పుచున్నాడు.

"నీవెందుకు దీనిని చేయుచున్నావని మాత్రమే నేను నిన్ను అడుగుచున్నాను. నీవు నేనుండు వీధి యొక్క స్థానములోకి వచ్చుచున్నావు, నీవెందుకు అది చేశావు?" అని అడిగితిని. అతడు దాదాపు నన్ను కొట్టి, మరియు నన్ను నెట్టివేశాడు.

42"అతడేమి మాట్లాడుచున్నాడో, అతడు ఎరుగక ఉన్నాడని అతనితో చెప్పుటకు వెళ్ళుచున్నాను," అని నేను తలంచాను.

అప్పుడు ఒక స్వరము మాట్లాడుచు ఈ విధముగా చెప్పినది, "ఆ విధముగా చేయవద్దు. నీవొక సేవకుడవు."

"చాలా మంచిది," అని నేను చెప్పాను.

నేను ఇటు తిరిగి నా కుడి ప్రక్కగా గేటుముందు కూర్చున్నాను. అక్కడ ఆ పచ్చిక బయలులో ఒక గాజు పాత్ర ఉండినది. మూయబడిన పెద్ద మోత బండి అనగా ఏమిటో మీకు తెలియును (Wagon). ఆ బండికి గుర్రములు కట్టబడియుండినవి. నా భార్య బండిని నడుపువానికి ముందు కూర్చొనియున్నది. అక్కడ వెనుక చూడగా, నా పిల్లలు కూర్చొనియున్నారు. నేను ఆ బండిని ఎక్కి "హనీ, నేను నిలువగలినంతవరకు నిలచెదను."

నేను ఆ గుర్రపు త్రాడును పట్టుకొని మరియు గుర్రములను కదిలించాను. మేము పడమర ప్రక్కగా ముందుకు వెళ్ళుచున్నాము. ఒక స్వరము నాతో, "ఇది నెరవేరుట వచ్చినప్పుడు, పడమట ప్రక్కకు వెళ్ళుము," అని చెప్పినది.

43సోదరుడు వుడ్, ఆయన మన సంఘమును కట్టు గుత్తదారుడు మరియు ట్రస్టీ ఉన్నాడు. ఎందరు ఆ దర్శనమును జ్ఞాపకము ఉంచుకొనియున్నారు? మీతో చెప్పుట జ్ఞాపకము ఉన్నది? నిశ్చయముగా, అది కాగితముపై వ్రాయబడినది. నేను సోదరుడు వుడ్తో చెప్పాను. ఆయన ఈ మధ్య అక్కడ నుండి తెచ్చాడు. ఆయన అక్కడ ఒక రాతి నివాసము కట్టబోవుచున్నాడు.

"సహాదరా! ఉడ్, ఆ పనిచేయవద్దు," అని చెప్పాను, ఎందుకంటే దానినుండి వచ్చిన డబ్బు నీకు ఎన్నడు ఇవ్వరు. అయితే, ఐదు సంవత్సరములకు ముందు, "వాళ్ళు ఆ వంతెనను దీని ద్వారా తీసుకు రావచ్చును, అందువలన నా పునాది పగిలిపోవచ్చును, మరియు నా నడకలు వస్తువులు, ఇక్కడ పడియున్నవి," అని చెప్పాను. అవి రాళ్ళకు బదులుగా, కాంక్రీటు దిమ్మెలుగా ఉన్నవి. మరి అది వారు దానిని ఇక్కడ ము౦చబోవుచున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ పత్రికలో వాళ్ళు ఏమి చేయబోవుచున్నారో చెప్పారు.

మంచిది, అతను దానిని కట్టలేదు. చివరికి వారు నిర్ణయించారు, ఒక సంవత్సరము తరువాత, లేక రెండు, వారు ఇక్కడకు తీసుకొని రానైయున్నారు, ఈ మార్గములో అందుచేత అది జరిగినది, అందుచేత నేను దానిని మరచినాను, దానిని జరగనివ్వండి.

44ఇప్పుడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యము జరిగినదేమనగా, ఒక సంవత్సరము క్రితము నేను సోదరుడు జూనియర్ జాక్సన్ గారి దగ్గర ఆరాధన జరుపుచుంటిని. అక్కడ కూర్చొనియున్న ఒక మెథడిస్టు సేవకుడు పరిశుద్ధాత్మను పొందియుండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందెను. ఆయన మన సోదర సంఘములలో ఒకదాని యందు కాపరిగా ఉన్నాడు.

దేవుడు ఏ విధముగా ప్రజలతో సంబంధము కలిగియున్నాడని చూపుటకు మాట్లాడుచున్నాను. దీనిని నా హృదయపూర్వకముగా మాట్లాడుచున్నాను. వేరొక సమాజము నాకు తెలియదు, ప్రపంచమంతట నీలో దేవుని ఆత్మ ఇక్కడ కన్నను, మరొక సమాజములో క్రియచేయుట లేదని నమ్ముచున్నాను. వారు వారి వ్యత్యాసములను కలిగియున్నారు. వారు ఉండవలసిన స్థలములో వారు లేరు, ఒక్కరు కూడ లేరు, అయితే నాకు తెలిసిన దానిలో అతి చేరువగా ఉన్నారు.

45ఇప్పుడు మీకు చూపుటకు గాను, ఇది జరుగబోవుచున్నది, సోదరుడు జూనియర్ జాక్సన్ కనిన కలగా వున్నది. అతడు దాని నుండి దూరము కాలేడు. నేను అతని సంఘమును విడిచి వచ్చుచుండగా, అతడు దానిని ఓర్చుకొనలేడు. ఎంతకాలము క్రితము ఆ కల వచ్చినది జాక్సన్ సోదరా? [సోదరుడు జాక్సన్ ఫిబ్రవరి 61లో ఆ కల వచ్చినదని చెప్పెను.]

ఫిబ్రవరి 61 అతడు కలకన్నాడు. అతడు నా యొద్దకు వచ్చి ఇలా చెప్పాడు, "బ్రెన్హాం సోదరుడా, నా హృదయములో ఒక భారము ఉన్నది. దానిని నీతో చెప్ప తలంచుచున్నాను."

"చెప్పండి జాక్సన్," అని చెప్పాను.

"నేనొక కలకన్నాను," అని చెప్పాడు. నేను మౌనముగా కూర్చొన్నాను మరియు నేను వినుచూ గమనించుచుంటిని. అతడు, "అక్కడ ఒక గొప్ప కొండ ఒకటుండినది. ఒక విశాల పొలములో ఉండినట్లు ఉండినది. ఆ కొండపైన నీళ్లు ఆ మట్టిని కడిగి వేసినది. ఆ కొండపైన ఒక ఎత్తైన బండ ఒకటి ఉన్నది. అది కొండ శిఖరమువలె ఉండినది.

"అది ఒక బండ. గడ్డి అక్కడ లేదు. నీళ్లు కడిగి వేసిన తర్వాత, చదువగలిగిన వ్రాత దానిపై చెక్కబడినది. మీరు అక్కడ నిలచి ఆ వ్రాతకు వివరణ నిచ్చుచున్నారు. మనమ౦దరము [అతడు ఈ విధముగా దానినుంచాడు] జార్జియా నుండి వచ్చిన సోదరుడు, చుట్టు ప్రక్కల నుండి వచ్చినవారందరు మనము కూడ వారితో నిలచి ఆ బండ మీది వ్రాత వివరమును నీ నుండి వినుచున్నాము. అది ఆశ్చర్యకరమైనదిగా ఆ బండ మీద వ్రాయబడి ఆ పర్వతముపై నున్నది," అని చెప్పెను.

46"అంతట నీవు ఏదో ఆకాశములో ఒక దానిని తీసికొని, ఒక గునపము లాంటి దానిని తీసికొని, అదేనా సోదరా? అటువంటిది ఒక దానిని తీసికొని, అది చాలా పదునుగా ఉండినది. నీవే విధముగా దానిని చేశావో తెలియదు గాని దానిపై చిప్పను తొలగదీశావు.

(అది పిరమిడ్ వర్తమానము మాట్లాడుటకు అనేక నెలల క్రితము జరిగినది.) "దాని క్రింద ఒక తెల్లని చలువ రాయి ఉండినది. వెలుగు లేక సూర్యుడు దానిపై అంతకు పూర్వము ప్రకాశించలేదు. దానిలో చూచి గమనించుము."

మరియు అది నిజము, ఎందుకనగా ప్రపంచ సృష్టి క్రమములో వెలుగుకు ముందు ప్రపంచము నిర్మించబడినది. మనకందరికి అది తెలియును. దేవుడు నీళ్లపై సంచరించుచుండెను. మరియు అప్పుడు ఆది య౦దు ఆయన వెలుగుకై పలికెను. సహజముగా ఆ తరువాత సృష్టిలో ఆ వెలుగు ఆ రాయిపై ప్రకాశించలేదు.

47అతడు "దీనిని చూడుము. ఇంతకు ముందు దీనిపై వెలుగు ప్రకాశించలేదు. అక్కడ అందరు లేచినప్పుడు, వారితో దానిని గమనించుడని చెప్పాను. అందరు దానిని చూచుటకు వచ్చారు. వారందరు దానిని చూచుచుండగా, అతడు తన కంటి చివరి నుండి (అదేనని నేను నమ్ముచున్నాను) చూచుచు, నన్ను గమనించెను. నేను ఒక ప్రక్కగా తప్పుకొని పడమర ప్రక్కగా వెళ్ళుచుంటిని. సూర్యాస్తమయము ప్రక్కకు కొండ మీదుగా పైకి వచ్చి క్రిందికి దిగుచున్నాను. వెళ్ళగా - వెళ్ళగా చిన్నదై పోవుచున్నది. చూపు నుండి దూరమైపోయినదని" చెప్పెను.

అతడు చెప్పినదేమనగా, నేనలా వెళ్ళినప్పుడు, "సహోదరులు తిరిగి, కొంత సేపటికి, అతడు మాయమైపోయెనా?" అని అడిగిరి. "ఎక్కడికి పోయాడు?" "కొందరు ఒక విధముగా, కొందరు మరొక విధముగా తీసికొనిరి. అయితే కొందరు స్థిరముగా నిలచి నేను చెప్పినదానిని చేయుచుండిరి."

ఇప్పుడు గమనించండి, ఆ కల వివరణలో అతనితో నేను ఒక్కటి మాత్రము చెప్పలేదు, లేక ఎవ్వరితోను చెప్పలేదు. అయితే నేను "అవును" అని మాత్రము చెప్పాను. నా హృదయము కంపించిపోయినది. నేను గమనించుచుంటిని. ఆ ఆశ్చర్యకరమైన వ్రాత… ఆగండి, నేను దానిని కొంచెము విడిచిపెట్టెదను.

48కొంతకాలము క్రితము సోదరుడు బీలరు… సోదరుడు బీలరు ఎప్పుడు మనతో ఉండెదరు. బీలరు సోదరా, మీరిక్కడ ఉన్నారా? అవును. అక్కడ వెనుకగా ఉన్నారు. బిల్లీ ఇలా చెప్పాడు, "సోదరుడు బీలరు తారుమారై ఉన్నారు. అతనికొక ఆశ్చర్యకరమైన కల వచ్చినది." అప్పుడు నేను సోదరుడు బీలరు దగ్గరకు వెళ్ళాను. ఒక రాత్రి ఆయనతో మాట్లాడుటకు వెళ్లాను.

అప్పుడు ఆతడు, "బ్రదర్ బ్రెన్హాం, నేనొక వింతైన కల కన్నాను. నేను ఒక సెలయేరు వెంబడి పడమరవైపునకు వెళ్ళుచుంటిని. అక్కడ ఎడమ ప్రక్కగా ఒక బాట ఉండినది. నేను అతని ఎడమ ప్రక్కగా పడమర వైపుకు ప్రయాణమైపోవుచుండినట్లు కనబడినది. పశువులను వేటాడుటకై వెళ్ళునట్లు ఉండినది. ఆ కుడిప్రక్కన (నేనిక్కడికి వచ్చిన తరువాత గమనించాను), మీరక్కడే యున్నారు. మీరు ఒక పెద్ద పశువుల మందను చుట్టుకొనియున్నారు. అక్కడ కావలిసినంత ఆహారము (గ్రాసము) ఉన్నది.

"మీరు ఆ పశువులను తోలుకొని నది వైపుకు వచ్చుచున్నారు. "మరియు చూచుచుండగా, ఆ పశువులను చూచుకొనుమని అతనికి సైగ చేశాను, అతడు "ఇప్పుడు ఆ పశువులకు ప్రతిది సులభముగా ఉండును. అవి వాటి మార్గములో అడ్డు లేకుండ వెళ్లగలవు. అయితే సహోదరుడు బ్రెన్హాం వారిని నది కుడి ప్రక్కగా ఉండవలసినదిగా కోరుచున్నారు. అందువలన ఆ వీధి వరకు వెళ్లి, వారిని నది దాటి రాకుండునట్లున్నది ఆవల నిలచియుండునట్లు చేశాను." అయితే ఆ పశువులను నేను వెంబడించక ఉండుటను గమనించాడు, అయితే పడమటి దిశగా వెళ్లిపోయాను.

అందుకతడు, "అతడు వేటాడునప్పుడు తప్పిపోయి ఉండవచ్చునని," చెప్పాడు.

49ఆయన కలను చెప్పిన వెంటనే, నేను దానిని చూచాను. అంతట గమనించండి, అతడు నన్ను ఓరగా చూచాడని చెప్పాడు. అందువలన వెనుకకు వెళ్లి చూచాడు. అతడు చూచుచుండగా, నేను ఒక కొండపైకి వచ్చుచున్నానని, వెంటనే నేను మాయమైపోయానని చెప్పాడు. ఏమైనదని అతడు ఆశ్చర్యపోయాడు. అతడు ఆ విధముగానే క్రిందికి వెళ్ళుచుండగా, ఒక చిన్న సెలయేరు అతని ప్రక్కగా వచ్చుచు చీలికలై ఎడమ ప్రక్కకు పోయినది. (అది సరియని నేను తలంచుచున్నాను, బీలరు సోదరా అవును.) అతడు గమనించుచుండగా, నా ప్రక్కన ఒక పెద్ద భయంకర జలపాతముల కనబడినది. అందులో నుండి నీరు పైకి వేగముగా వెలుపలకు క్రుమ్మరించబడుచున్నవి. అప్పుడు నేను ఆ జలపాతములోకి వెళ్లి నశించాను అని, అతడు అనుకున్నాడు.

అప్పుడు అతడు గమనించాడు… అతడు చెప్పెను, అతడు చుట్టూ చూచి. ఆ జలపాతము యొక్క ప్రభావము ఆ ప్రక్కగా వెళ్లి, అక్కడ ఉబుకుచున్న నీరుగా ఏర్పడెను; అయితే నీరు మరలా భూమి లోపలకు వెళ్ళుట లేదు. అప్పుడతడు ఆ చిన్న సెలయేరు ప్రక్కగా చూచాడు, చిన్న సెలయేరు, మరియు అక్కడ కొన్ని చిన్న జంతువులు గుండ్రని చెవులతో ఉండుట చూచాడు. అతడు అనెను, "నేను వాటిలో ఒకదానిని తీసికొనవలెనని," ఆ సెలయేరును దాటెను.

50అప్పుడతడు నన్ను గురించి ఆలోచించాడు. అతడు అక్కడున్న చిన్న గుట్టను ఎక్కి చూచినప్పుడు, అక్కడ ఒక ఇరుకైన బండ కొనను చూచి, నేనక్కడకు నడిచి వెళ్ళుటను చూచాడు. అయితే, "అక్కడ ఏమీ లేదని" చెప్పుచు అతడు కలత చెంది, "మన సహోదరునికి ఏమి జరిగినది? బ్రెన్హాం సోదరునికి ఏమి జరిగినదో ఆశ్చర్యముగా ఉన్నదేనని చెప్పాడు. అప్పుడతడు భయపడుచుండగా నేను ఎక్కడో మాట్లాడుటను విన్నాడు. నేనొక కొండపైన నిలచియుండి, సోదరుడు బీలరుతో ఒక కలకు వివరణను చెప్పుచుంటిని. ఆ కల వివరణను కొంత కాలము క్రితము ఆయనతో చెప్పాను, మరియు ప్రభువుకై వేచియుండుమని చెప్పుచు, ఒక దినము అతనిని ఒక ద్వీపములో అతడు అక్కడుండగా కలిసికొందునని చెప్పాను, మరియు ఆయన అక్కడ ఉన్నాడు.

ఆ కల వివరణ ఇదియే: అంత పెద్దదిగా ఉన్న ఆ సెలయేరు, జీవ సెలయేరుగా ఉన్నది. దాని పడమటి దిశగా నేను వెళ్ళుచున్నాను, అతడు కూడా వెళ్ళుచున్నాడు, ఎందుకనగా అతడొక బాటపై వెళ్ళుచున్నాడు. అతడు ఆ బాట వెంబడి పరుగిడుచున్నాడు, మరియు ఆ మరు ప్రక్కగా అధికమైన పచ్చిగడ్డి యున్నది. అయితే చిక్కగా అడవిలాగా ఉన్నది.

ఆ విధముగానే మనము ప్రభువును వెదకెదము. దేవుని ఆహారమును ఆ కఠినమైన విధానములో వెదకెదము. ఆ పశువులను చుట్టుకొనియుండినది - అది ఈ సంఘమే. వారిని మరొక ప్రక్కగా ఉంచుట, అనగా, పశువులు సాధారణముగా సుళువైన మార్గములో వెళ్ళును, అవి సంస్థలుగా ఉన్నవి. ఆ దారి సంస్థను సూచించుచున్నది. నేను అతనిని వెనుకకు మళ్లించి, వారు సంస్థలలో పోయి చేరక ఉండునట్లు చేశాను.

అంతలో అతడొక గోడను చూచాడు, దాటి వెళ్ళుటకు అది ఆటంకముగా ఉన్నది. నేను పడమటికి వెళ్ళుటను వారు నిలుపుటకు ప్రయత్నించారు… అది ఆ ప్రభుత్వ పన్నును గురించినదై యున్నది. నేను దానిలో నుండి ఏ విధముగా తప్పించుకొంటినో, ఎవ్వరికి తెలియదు. అదే నన్ను అడ్డగించిన గోడ, అయితే ప్రభువు నన్ను దాని ద్వారా తీసుకొని వెళ్లేను. నేను దానిపై యుంటిని, ఆ ద్వీపమందు సోదరుడు బీలర్ ను నేను కలిసికొందును.

51అందువలన అది జరిగిన వెంటనే సోదరుడు రాయ్ రాబెర్సన్. సోదరుడు రాయ్, ఈ రాత్రి మీరిక్కడున్నారా? అవును. అటు ప్రక్కగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఆయన నన్ను పిలచి అతనికి కల వచ్చినది అని చెప్పాడు. ఆ పశువుల చుట్టూ నిలిచినట్లు కలగనెను. (ఇప్పుడిది మూడవ కలగా ఉన్నది.) ఆ పశువుల చుట్టూ నిలచుట. అక్కడ అధికమైన గడ్డి కావలసినంతగా ఉన్నది. మన సహోదరులందరు ఒక్కడిగా ఉన్నారు. మనమందరము కలిసి భోజనమునకై ఒక్క స్థలములో చేరాము. అప్పుడు సోదరుడు సాత్మన్ లేచి, "ఏలీయా, ఆ గొప్ప ప్రవక్త, ఇక్కడ ఈ దినపు మధ్యాహ్నము మాట్లాడనైయున్నాడని," చెప్పెను. మనమందరము భోజనము చేసి వెళ్లిన తరువాత ప్రతిఒక్కరు వెళ్లిపోయారు. అప్పుడు అతడు, ఎందుకు వీరు వేచియుండి మాట్లాడునది వినకనే వెళ్లిపోవుచున్నారని ఆశ్చర్యపడెను.

ఇప్పుడది ఏ విధముగా సోదరుడు జాక్సన్ చెప్పిన దానితో సరిపోయినదో చూడండి! అది ఖచ్చితముగా ఏకమగుటను చూడండి. సోదరుడు బీలరు ఏమి చెప్పెనో దానితోను సరిపోయినది. ఏ ఒక్కరూ దానిని తెలిసికొనుటకు వేచియుండలేదు.

52గమనించండి, వెంటనే దాని తరువాత సోదరి కాలిన్స్ (మీరిక్కడున్నారా, సోదరి కాలిన్స్?) ఇక్కడ సంఘమును గురించి ఒక కలను కనిరి. ఇక్కడ ఒక పెండ్లి జరుగుటకు నిశ్చయమైనది. ఆమె ఆ కలను కనినప్పుడు, పెండ్లి కుమారుడు పరిపూర్ణముగా వచ్చుటను చూచినది. అయితే వధువు అంత పరిపూర్ణముగా లేదు; అయినను అది వధువుగా ఉన్నది. ఇప్పుడు, అది సంఘముగా ఉన్నది.

ఇక్కడ ఒక ప్రభువు బల్ల సంస్కారము, లేక ఒక ఆరాధన జరుగుచుండినట్లుగా ఉండినది — అక్కడ భోజనము సిద్దపరచబడినది. సోదరుడు నెవిల్ సంఘములో ఆ భోజనమును వడ్డించుచుండిరి. అయితే ఆమె చెప్పినదేమనగా, ఆమె భోజనము చేసినదానంతటిలో ఇది మంచి ఆహారమని చెప్పినది. ఆమె ఎంతో ఆకలితో ఉండినది, ఆ కలలో ఆమె ఆ భోజనమును వడ్డించుట లేదు. ఆమె మరియు సోదరుడు విల్లార్డు కలిసి "రాంచ్ హౌస్" అను స్థలమునకు వెళ్లి భోజనము చేశారు. వారు ఆ విధముగా భోజనము చేసినప్పుడు కుడి చేతి ప్రక్క వెలుగు వెలుపలకు వెళ్లినది. అది ఏమని మీరు ఎరిగియున్నారు.

ఇప్పుడు, ఆ ఆహారము… వధువు పరిపూర్ణముగా లేదు; అయితే వరుడు పరిపూర్ణముగా ఉన్నాడు. వధువు ఇంకనూ పరిపూర్ణము కాలేదు. ఆమెకు ఇవ్వబడిన ఆహారము బాహ్యమైన ఆహారము కాదు. అది మీరు కలిగియుండు ఆత్మీయ ఆహారము. ఇక్కడ నాల్గవ కలయందు నేను ఒక నిమిషము ఆగియుండవలసియున్నది.

53సోదరుడు, సాత్మాన్ మరియు సోదరుడు బాంక్స్ వుడ్, మీకు బాగుగా జ్ఞాపకమున్నదా? గత సంవత్సరము మనము అరిజోనాలో ఉండినప్పుడు, అక్కడ జావలిన్ (ఒక రకమైన అడవి పంది), వేటాడునప్పుడు, ప్రభువు మాట్లాడెను. ఆయన పరిపూర్ణముగా చేసిన కార్యములను మీరెరుగరా, ఏమి జరుగనైయున్నదో చూపుచు, మన మార్గమున వెళ్ళుచుండగా నిరూపించెను. అది నిజమేనా, మీరిరువురు సోదరులు "ఆమేన్" చెప్పండి. ఎన్నడు తప్పిపోలేదు.

మేము ఒక దినము ప్రయాణమై కారులో వెళ్ళుచుండగా, ప్రభువు దర్శనము ఒకటి చూశాను. నేనా సమయములో సిద్దపడుచున్నాను, విదేశములకు వెళ్ళుటకు గాను నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఆ తరువాత నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఆ ఓడపై చూచినది… లేక సముద్రము ప్రక్కగా, ఓడలు వెళ్ళు స్థలమందు చూచినప్పుడు, అక్కడ పొట్టి మనిషి ఒకడు ఉండెను. "బ్రెన్హాం సోదరుడా, నీ కొరకు ఒక పడవ నేను సిద్దము చేసియున్నాను," అని అతడు నాతో చెప్పెను. అది చిన్నదిగా ఒక్క అడుగు పొడవు ఉండును, అయితే అది మంచువలె తెల్లగా ఉండెను. "నీవు దాటుటకు గాను నీ కొరకు ఇది ఉన్నది," అని చెప్పాడు.

"ఓ" "అది ఇది చాలదే?" అని చెప్పాను.

అందుకతడు "ఇవి నలువది మైళ్లు ఈ నదిలో పైకి క్రిందికి ఒక గంటలో వెళ్ళునని," చెప్పాడు.

"అయితే, అది నన్ను తీసికొనిపోదు," అని చెప్పాను. అప్పుడు అతడు క్రిందికి చూచి, "వారు వెళ్లినట్లు నీవును వెళ్ళుము," అని చెప్పాడు. నేను అటువైపుగా చూచాను. అక్కడ సోదరులు ఫ్రెడ్ సోత్ మాన్, బాంక్స్ వుడ్ పచ్చ రంగు పూసిన చిన్న పడవలో కూర్చొనియుండిరి. వారి వెనుక చిన్న తెరచాప ఎత్తబడియుండినది. సోదరుడు బాంక్స్ వంగిన టోపిని వేసికొనియున్నారు. అప్పుడు "వారివలె వెళ్ళుము," అని అతడు చెప్పెను.

అప్పుడు నేను, "లేదు, నేను వెళ్ళను," అని చెప్పాను.

అప్పుడు ఆ (చిన్న వ్యక్తి) వారితో ఇలా చెప్పెను, "మీరు పడవ నడుపువారేనా?"

సోదరుడు బాంక్స్, "అవునని" చెప్పారు.

సోదరుడు ఫ్రెడ్, "అవునని" చెప్పారు

అయితే నేను "వారు పడవ నడుపువారు కారు," అని చెప్పాను. మరియు "నేను పడవ నడుపువాడను, మరియు నేను ఆ విధముగా వెళ్లనని నాకు తెలియును, నిశ్చయముగా నేను ఆ విధముగా వెళ్లను," అనియు చెప్పాను.

"వారితో ఎందుకు వెళ్లకూడదు," అని అతడు అడిగినప్పుడు.

"లేదు, వీలుపడదు," అని నేను చెప్పాను. మంచిది, నేను తిరిగి అటువైపు చూడగా, ఆ చిన్న వ్యక్తి నా యొక్క మంచి స్నేహితుడైన సోదరుడు ఆర్గన్ బ్రైట్ గా కనబడెను.

54నేను ఈ దర్శనములో వెనుకకు వెళ్లినప్పుడు, అక్కడ చిన్న పొడవైన కట్టడము ఒకటి ఉండినది. అప్పుడు ఒక స్వరము నాతో ఇలా పలికినది (మీరందరు దీనిని జ్ఞాపకము ఉంచుకొనియుందురు, లేక మీలో అనేకులు జ్ఞాపకము ఉంచుకొని యుందురు), అప్పుడు ఆ స్వరము "ఆహారమును లోపలకు తెమ్ము, తెచ్చి నిలువ చేయుము. వారిని ఇక్కడ ఉంచుటకు ఇది ఒక్కటే మార్గము, వారికి ఆహారమియ్యుము." నేను లోపలకు తెచ్చాను. పెద్ద తొట్టు నిండుగా మంచి రకపు క్యారెట్టును, మంచిరకపు కూరగాయలను నేను చూడని అనేక వస్తువులను తెచ్చాను.

ఆ దర్శనమును మీరిప్పుడు జ్ఞాపకము చేసికొనుచున్నారా? ఇప్పుడు, దాని వివరణను తరువాత మీతో చెప్పెదను. నేను స్వీట్జర్లాండలోని జూరిక్ ప్రాంతమునకు సోదరుడు ఆర్గన్ బ్రైట్ తో ఐదు రాత్రుల కూడికలకు వెళ్లవలసి యున్నది. అది జరుకగమునుపే నేను సహోదరులతో చెప్పాను, "నేను వెళ్ళుట లేదు."

నేను సోదరుడు వెల్స్ ఈవాన్స్ తో అక్కడికి వెళ్లాను, అప్పుడు నేను దాని వివరణ ఇచ్చాను.

55ఒక రాత్రి, సోదరుడు వెల్స్ వచ్చి నన్ను తీసికొని వెళ్లారు (మేమిరువురము చేపలు పట్టు యాత్రకు వెళ్లుచుంటిమి), అప్పుడతడు సోదరుడు ఆర్గన్ బ్రైట్ నన్ను పిలచుచున్నారని చెప్పారు. అందుకు నేను మంచిది, అది ఇక్కడే ఉన్నది, వారు నన్ను విడిచిపెట్టనైయున్నారు," అని చెప్పాను. అనేక సమయములు. (సోదరుడు మైనర్తో కాదు - అతడొక మంచి స్నేహితుడు), అయితే కొన్నిసార్లు, వారు వారి సిద్దాంతమునకు వ్యతిరేకముగా బోధించెదరేమోనని తలంచెదరు. నీవు నీ స్నేహితులను సమకూర్చుకొనుటకు అక్కడకు వెళ్లుచున్నావని చెప్పారు.

సోదరుడు ఆర్గన్ బ్రైట్ నన్ను పిలచి, "బ్రెన్హాం సోదరుడా, [ఆత్మ చెప్పినదే] మీరు రండి, మీ భార్యను కూడ తీసికొని రమ్ము, ఎందుకనగా నీవు అధికముగా బోధించనవసరము లేదు, ఒక్క రాత్రి మాత్రమే నీవు మాటలాడబోవుచున్నావు." "నీవు దానిని కూడా మాట్లాడవలసిన పనిలేదు" అని చెప్పాడు.

అందుకు నేను "వీలుపడదు," అని చెప్పాను.

"మంచిది" చెప్పాను. "నీవు, నీ భార్య, మరియు అందరు, రండి, చూడండి. మీరు వస్తే నేను అందరినీ యాత్రకు తీసుకొని వెళ్తాను. నా భార్య, మీ భార్య మరియూ వారందరు, మనము స్విట్జర్లాండ్, పాలస్తీనా ద్వారా పోవుదుము.

"లేదు" అని నేను చెప్పాను.

ఆ వివరణ నా యొద్దనే యున్నది. సోదరుడు వెల్స్ లేక సోదరుడు ఫ్రెడ్తో ఇలా చెప్పాను. "నేను రేపటి ఉదయము దానిని చెప్పెదను. మొదటిగా నా భార్య మీతో ఏదో చెప్పాలని ఆశించుచున్నది," అని చెప్పాను. నేనామెను పిలచినప్పుడు, ఆమె వెళ్ళుటకు నిరాకరించినది. అప్పుడు నేను, "ఇదిగో, అదిక్కడే ఉన్నది," అని చెప్పాను. చూచారా.

56ఆ చిన్న పడవ అక్కడ కూడిన ఆ కూడికను సూచించుచున్నది. ఆ గట్టు వెంబడి ఒక్క కూడికతో ఎక్కడికైనను వెళ్లవచ్చును. అయితే సముద్రమును దాటి నన్ను పిలచునప్పుడు, ఆ ఒక్క కూడిక చాలదు. అది తెల్లగాను, మంచిదిగాను ఉండినను.

సోదరుడు ఫ్రెడ్ మరియు సోదరుడు (దర్శనములోని ప్రతినిధులు), వారు ప్రాతినిధ్యమును వహించారు, వారు ఉల్లాస ప్రయాణికులుగా వెళ్లారు, తమాషాకు చెప్పుచున్నాను. అయితే నేను దానిని చేయవలెనని చింతించుట లేదు. వారు పడవను నడుపువారు కాదని చెప్పాను — వారు బోధకులు కాదని అర్థము; అయితే నేను ఒక బోధకునిగా ఉన్నాను. మరియు అప్పుడు ఆ చిన్న పొడవైన కట్టడములోని ఆహారము… నేను దీవి దేశములకు వెళ్లలేదు, నేను ఆ చిన్న కట్టడమునకు తిరిగి వచ్చి, ఆ పిరమిడ్ (ముక్కోణ), మరియు టేపులను, అనేకమైన వాటిని తయారు చేశాను. ఆ విధముగా ప్రజలకు మనము జీవించు ఈ ఘడియను చూపించాను.

ఇప్పుడు దీనిని ఇతరులకు వచ్చిన కలలతో పోల్చి చూడండి. ఇది ఒక దర్శనముగా ఉన్నది. అది ఆహారము, అదిక్కడున్నది. ఇదియే ఆ స్థలము.

57గమనించండి, అప్పుడేమి జరిగినది? ఆ నాల్గవ దర్శనము వచ్చిన వెంటనే (లేక నాతో చెప్పబడిన నాల్గవ కల వచ్చినప్పుడు), సోదరుడు పార్నెల్ వచ్చారు. ఆయన ఇక్కడెక్కడో ఉండును. ఇక్కడే బిల్లీ ఇక్కడ లేడు, మరియు ఆ మనుష్యుడు ఒక మూర్ఖ స్వభావముగలవాడు. అతడు బ్లూమింగ్టన్ నుండి వచ్చుచున్నాడు. లేక బెడ్ఫోర్డ్ నుండి వచ్చుచున్నాడని తలంచెదను. లేఫాయొట్ట్ కూడికలను ఏర్పాటు చేసియున్నాడు. అతడు కూడ ఒక కలగన్నాడు, మరియు అతడు సోదరుడు ఉడ్ దగ్గరకు వచ్చి, "నేను దీనిని చెప్పకుండ ఉండలేను, దీనిని ఏ విధముగానైనను చెప్పవలసియున్నది. నేను దీనిని సోదరుడు బ్రెన్హాంతో చెప్పవలసియున్నది. అది నన్ను తొందరచేయుచున్నది," అని చెప్పాడు. దేవునికి సమస్తమును తెలియును, వాటి మధ్య ఒక్కటి కాదు. అవి ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అని వచ్చినవి.

58సోదరుడు పార్నెల్ ఈ విధముగా చెప్పాడు, "నాకొక వింతైన కల వచ్చినది. నేనొక కూడికను అక్కడ జరుపనున్నాను. ఏదో ఒక విధముగా ఒక క్రొత్త సంఘము లాంటి దానిలో ఇక్కడ ఒక కూడిక జరుగును. అతడు మరలా చెప్పుచు, ఈ క్రొత్త సంఘము, ఏ విధముగా వెలుపలకు రాగలదు, వారెందుకు సహకరించకున్నారని అతడు ఆశ్చర్యపడుచున్నాడు. అతడు ఇంకను చెప్పుచు, అతడక్కడ నిలచి ఆలోచించుచుండగా, "మంచిది, నేనిక్కడే నిలచియుందును, నేను వేచియుండి ఆరాధనలలో కలిసికొందును," అని చెప్పాడు.

అప్పుడు ఒక మనుష్యుడు బ్రౌన్ రంగు కోటును ధరించినవాడై, ఆ కట్టడములో నుండి వచ్చుచుండెను. అతడు ఒక పుస్తకమును వ్రాయుచుండెను. అతడు సోదరుడు పార్నెల్తో.. "ఇది ఒక ఒద్దికైన కూడిక, ఇది సంఘ పెద్దలకును, సంఘకర్తలకును జరుగు కూడిక," అని చెప్పాడు. మంచిది, అతడు ఒక అడుగు ముందుకు వెళ్ల తలచాడు. అందువలన అతడు ఆ క్రొత్త సంఘ గుమ్మమునొద్దకు వెళ్లాడు. ఆ సంఘము అప్పుడే నిర్మించబడినది, లేక అది మరమత్తు చేయబడినది — మరలా సరిచేయబడినది. అతడు వెలుపలకు వెళ్లినప్పుడు మంచు పడుచూ ఉండినది — చెడు వాతావరణముగా ఉండినది, చలికాలము. ఈ ప్రజలలో ఎవ్వరూ దీనిని గురించి ఎరుగరు.

59ఆయన గుమ్మమునకు వెలుపలగా వెళ్లినప్పుడు, నేనక్కడ నిలచి పడమటి దిశగా చూచుచుంటిని. అప్పుడు "సోదరా పార్నెల్ ముందడుగు వేయ తలంచకుము, నీవేమి చేయాలోనని, నేను నిన్ను నడిపించెదను," అని చెప్పాను.

సోదరుడు పార్నెల్ మిగిలినవాళ్లకు నేను ఏ విధమైన వివరణను ఇవ్వలేదని ఎరిగియున్నారు. (అది ఇప్పుడు జరుగుచున్నది.) వారు మాట్లాడుచుండగా ఇంకనూ కనబడుచున్నది. నేనెంత త్వరగా అక్కడి నుండి వచ్చేశానో మీరు గమనించారా, సోదరుడు పార్నెల్ నుండి వచ్చి మీకు చెప్పకుండునట్లు వచ్చాను. నేను వెళ్లి సోదరుడు వుడ్తో గాని మరెవ్వరితో గాని ఏమియు చెప్పలేదు. ఎవ్వరితోను, దానిని అలాగే వదిలేశాను, ఎందుకనగా అదెక్కడికి నడిపించునో చూచుటకు ఇష్టపడితిని. ఆ తరువాత "నేను ఇబ్బందిపడుచున్నాను," అని చెప్పుట విన్నారు గదా? అదియే ఇది.

అప్పుడు సోదరుడు పార్నెల్, నేను అతనితో చెప్పినట్లు ఈ విధముగా చెప్పారు. "పార్నెల్ సోదరుడా, ప్రారంభించుము, మొదటిగా నీవు రావలసిన స్థలము సిప్పోరా" ("Zipporah" అను దానికి అర్థము నిలువుము లేక ఆగుము, లేక మరొకటి.) "అక్కడ నిలచియుండకుము. అప్పుడు మరొక దానికి వెళ్ళుము, నీవు ఒక వృద్ధురాలిని కనుగొందువు. అక్కడను నిలువకుము." నేను మాట్లాడుచున్నంత కాలము, ఆ మంచుగుండా నడచి వెళ్ళుచుంటిమి.

"నా భార్యను కనుగొనునంత మట్టుకు, ముందుకు వెళ్ళుము. నా భార్యను కనుగొనినప్పుడు, అక్కడ నిలువుము," అని నేను చెప్పాను. అతడు చూచాడని చెప్పాడు, మేము ఆ మంచు నుండి వెలుపలకు ఎడారిలోనికి వచ్చాము, అప్పుడు నేను మాయమైపోయాను. అతడు వెనుతిరిగి చూచినప్పుడు మరియు అతని భార్య ఒక బావినుండి నీళ్లు చేదుచుండినది, ఎవరో ఒక సేవకుడు ఆమెను లగివేయుచున్నాడు, ఆ భావినుండి దూరముగా. ఆమె అతనిని గమనించుచుండినది — అంతట అతడు నిద్ర మేల్కొన్నాడు.

60ఇక్కడ మీ కలకు వివరణ ఉన్నది (రాత్రియే దానిని చెప్పియందును, అయితే నేను తిరిగి వెళ్లిపోయాను): ఆ సిప్పోరా మరియు ఒక వృద్ద స్త్రీ మరొక నిజమైన మరి నిజమైన వృద్ధ స్త్రీ — అని ఆ సంఘములుగా ఉన్నాయి, చూశారా, సిప్పోరా, మోషే భార్యగా ఉన్నది, సిప్పోరా. అక్కడ నిలువకుమని అతనితో చెప్పాను. వారు ఎంత పాతకాలపువారైనను పరవాలేదు, వారు సంస్థలుగా ఉన్నారు. వాటి యొద్ద నిలువవద్దు! వారి కాలములో వారు జీవించారు. అయితే అతడు నా భార్య యొద్దకు వచ్చినప్పుడు — అది నా సంఘమైయున్నది. దానికొరకు యేసు క్రీస్తు ఈ చివరి దినములో నన్ను పంపెను, అది ఇక్కడ ఉన్నది — అక్కడ నిలువుము! నేను పడమరగా వెళ్లాను.

61అప్పుడు, సోదరి స్టెఫీ… ఆమె ఇక్కడ లేదు, ఆమె హాస్పిటలులో ఉన్నది. నాకు తెలియదు. అవును ఆమె ఇక్కడ ఉన్నది. సోదరి స్టెఫీ హాస్పిటలుకు ఒక ఆపరేషన్ కొరకు వెళ్ళుటకు ముందు ప్రార్ధనకై నా యొద్దకు వచ్చినది. దేవుడామెను ఆశీర్వదించి, సహాయము చేయును గాక. ఆయన తప్పక చేయును.

ఆమె "బ్రెన్హాం సోదరుడా, నేనొక వింతైన కలను కన్నాను," అని చెప్పినది.

నేను చెప్పాను, "అవునా?"

"నేను పడమటి దిశగా వెళ్లినట్లు కలగన్నాను, మరియు నేను…" (ఇది ఆరవ కలగా ఉన్నది.) ఆమె ఇంకనూ చెప్పుచూ, "నేను పడమటి దిశగా వెళ్లినట్లు కలగన్నాను, అక్కడ ఒక గుట్ట మీద నిలచి నేను చూచినప్పుడు, అది ఒక ఏటవాలు దేశముగా ఉండినది. అక్కడ ఒక వృద్దుడు పొడవైన తెల్లటి గడ్డమును పెట్టుకొని నిలచియుండెను. భుజముల వరకు ఎదిగిన తల వెంట్రుకలతో తెల్లని వస్త్రము చుట్టబడినవాడై యుండగా, గాలికి ఆ వస్త్రము ఎగురుచుండినది," అని చెప్పి ముగించినది. (అది వాస్తవమని, సోదరి స్టెఫీ చెప్పినది ఆ విధముగానే యున్నదని నమ్ముచున్నాను.) మరియు ఆమె, "నేను దగ్గరకు వచ్చుచుండగా, అతడు ఆ కొండ శిఖరముపై నిలచియుండి తూర్పు దిశగా చూచుచుండెను." "ఎవ్వరీ వృద్దుడు," అని నేను ఆశ్చర్యపడితిని! ఆమె ఇంకనూ, ఇంకనూ చేరువైనది. ఆమె ఆ విధముగా దగ్గరగా వచ్చినప్పుడు, అతడు ఎవరని గ్రహించినది. అతడు మరణించని ఏలీయాయని గ్రహించినది. ఆ ప్రవక్త తూర్పు దిశగా గమనించుచు నిలచియున్నాడు.

62"నేనాయనను చూడాలి," అని ఆమె అన్నది. (ఆమెకొక అవసరత ఉన్నది.) ఆమె ఏలియా నామములో అతనితో మాట్లాడుటకు ఆ కొండ వరకు పరుగిడి అక్కడ సాగిలపడినది. ఆమె మాట్లాడినప్పుడు, ఆమెతో ఒక స్వరము ఇలాగు మాట్లాడుట విన్నది. "సోదరి స్టెఫీ, కావలసినదేమిటి?" అది ఎవరో కాదు నేనే.

సోదరి స్టెఫీ, మీ కల ఖచ్చితముగా నెరవేరినది. ఎందుకనగా దాని తరువాత, వెంటనే నేను లూయిస్విల్-కు వెళ్లాను. నీవు ప్రార్థనను కోరుచున్నావు, అది నీ అవసరతయై యున్నది, దానిని చూచుటకై ఆమె ఆసుపత్రిలో స్వస్థత నొందినది; నేను నా మందకొరకు (సంఘము) తూర్పున గమనించుచు, పడమర దిశగా వెళ్లుచున్న, నా సూచనగా ఉన్నది.

గమనించండి, అప్పుడు నేను లూయిస్విల్-కు వెళ్ళాను. నేను వెనుకకు తిరిగి వచ్చినప్పుడు, నేను ద్వారము నుండి బయలుదేరాను. అక్కడ పెద్ద బండలు నా ద్వారపు వాకిలి యొద్ద పడవేయబడియుండినవి. మిస్టర్. గోనే అను అధికారి ఆ వీధిలో వెళ్లుచుండెను. అతడు "బిల్లీ, ఇక్కడకు రమ్ము, నీవు ద్వారపు వాకిళ్లను, ఇతర వస్తువులను… కంచెను, రాళ్ల కంచెను, తొలగించవలసియున్నది," అని చెప్పెను.

అప్పుడు నేను, "మంచిది, ఆ విధముగానే చేయుదును, బిల్." అందుకు నేను, "దానిని ఎప్పుడు చేయవలసియున్నది?" అని అడిగితిని.

అందుకతడు, "నేను చెప్పెదను. నీకు తెలియజేతును." అందుకతడు "సరియే, ఈ సంవత్సర ప్రారంభములో వారు దానిని చేయుటకు ప్రారంభించిరని," చెప్పెను.

అందుకు నేను, "మంచిది," అని చెప్పాను.

63అందువలన నేను ఇంటిలోనికి తిరిగి వెళ్లిపోయాను, అప్పుడు నా భార్య, నేను వెళ్లి అంగడి సామానులను తేవలసియున్నదని చెప్పినది. అప్పుడు నేను ఆ వీధి ద్వారా వెళ్లాను. అక్కడ ఒక బాలుడు "రేమాండ్ కింగ్, అతడొక పట్టణపు ఇంజనీరు… నేనతనిని సాధారణముగా" "మడ్ ఇయర్" అని పిలచేవాడిని, ఎందుకనగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అందరము కలసి ఈదుచున్నప్పుడు, అతను ఒక బాలుని చెవిపై బురద ముద్దను విసరివేశాడు. అప్పటి నుండి, మేము వానిని "బురద చెవి" యని పిలచేవాళ్లము. అతడు నేనుండు వీధిలో రెండవ ఇంటిలో ఉన్నాడు. ఆ ఇల్లు సోదరుడు వుడ్ ఇ౦టికి క్రింది భాగమున ఉన్నది.

అందువలన నేను, "మడ్, ఒక్క నిమిషమిక్కడికి రమ్ము" అని చెప్పాను.

అందుకతడు "మంచిది బిల్లీ" అని దగ్గరకు వచ్చాడు.

అందుకు నేను, "నీవు దించిన ఆ దూలమును…"

అందుకతడు, "బిల్లీ, వారు దానంతటిని తీసివేయనున్నారు" "ఈ చెట్టు, ఈ కుంచెలను, ప్రతీది తీసివేయబడవలసియున్నది," అని చెప్పాడు.

అందుకు నేను "మంచిది, ఆ ఇంజనీరు, నా స్వంత (ఆస్తి) నడివీధికి వచ్చి యున్నదని చెప్పాడు," అని చెప్పాను.

"అవును, అయితే వారు ఆ కాలమును పొడిగించనైయున్నారు. అయినను వారు దానిని ఎట్లయినను తీసివేయుదురని" చెప్పాడు. "నా దానిని కూడ తీసివేయుచున్నారని" కూడ అతడు చెప్పాడు.

"మంచిది సోదరుడు వుడ్, ఒక రాతి పనివాడు, కాబట్టి దానిని జరుపుటకు అతనిని తీసికొని వచ్చెదను," అని చెప్పాను.

"బిల్లీ, దానిని ముట్టవద్దు. ఆ కాంట్రాక్టరు దానిని చేయనిమ్ము, అది పాస్టరు ఇల్లు, కాదా?" అని చెప్పినప్పుడు,

"అవునండి" అని చెప్పాను.

"అతనిని చేయనిమ్ము. నేనేమి చెప్పుచున్నానో, ఎరిగి యున్నావా?" అని అతడు అడిగినప్పుడు.

"అవును" అని నేను చెప్పాను. నేను అటు తిరిగిన వెంటనే, ఏదో దానిని కొట్టినది. నేను ఇంటికి వెళ్లిపోయాను, నా చదువుకొను గదికి వెళ్లి "ఆ పుస్తకమును" తీసికొన్నాను. అది అక్కడే ఉండినది. అవి కాంక్రీట్ బండలు కావు — అవి రాళ్లుగా ఉన్నవి.

నేను నా భార్యతో "మీడా, సిద్దపడుము," అని చెప్పాను.

64ఆరు కలలు నేరుగా వచ్చినవి, అప్పుడు ఆ ఆరింటికి ఈ దర్శనము తలరాయిగా నిలచినది. "ఈ కార్యములు జరుగుటకు ప్రారంభించినప్పుడు, పడమటి దిశకు తిరుగుము."

నేను ట్యూసాన్కు పిలువబడితిని. సోదరుడు నార్మన్ ఒక స్థలమును సిద్దపరిచాడు. నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో, నాకు తెలియదు. నేనేమి చేయాలో అదియు తెలియుట లేదు. నేను కేవలము ఒక కష్టమైన (స్థితిలో) నిలచిపోయాను. ఏమి చేయాలో నాకు తెలియుట లేదు. నేను ఒక ఇంటిని విడిచిపెట్టుచున్నాను. నేనింక బాడుగను చెల్లించవలసిన పనిలేదు. నా జీతము వారమునకు నూరు డాలర్లు మాత్రమే. నేను ఒక నెలకు 100 డాలర్లను ఇంటి బాడుగగా చెల్లించవలసియున్నది. ఇప్పుడు నేను ప్రేమించబడు నా సోదరీ, సోదరులతో ఉన్నాను. నేనెక్కడకు వెళ్లుచున్నానో నాకు తెలియుట లేదు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకో మీతో చెప్పలేను. అయితే నాకు తెలిసినది ఒకటున్నది: ఆయన ఏమి చెప్పుచున్నాడో, దానిని వెంబడించెదను. నేను ఏ వైపుకు తిరుగవలెనో, నాకు తెలియదు. ఏమి చేయాలో తెలియదు. అది నా పని కాదు.

దేవుడు అబ్రాహాముకు, "నది ద్వారా వెళ్ళుము" అని చెప్పినప్పుడు, ఆ మార్గమును పొందియుండవచ్చునని నేను ఊహించుచున్నాను. అతనికి ఏమి చేయవలెనో తెలియలేదు, కాని ప్రయాని౦చినాడు, తనకుతాను వేరుపడినాడు. ఏమి చేయాలో నాకు తెలియలేదు.

65గత శనివారము ఉదయము, నిన్నటి నుండి ఒక వారమునకు ముందు ఉదయము 3.00 గంటలకు నేను లేచి, నీళ్లు త్రాగి, జోసఫ్ గదిలో అతనికి కప్పి ఉంచాను. ఆ తరువాత తిరిగి నా గదిలోనికి వెళ్లి పడకపై వ్రాలి నిద్రపోయాను. నేను నిద్రపోయినప్పుడు. నేనిప్పుడు ఈ చిన్న కలలన్నిటిని జరిగిన కార్యములను ఎందుకు చెప్పుచున్నాననగా, నేను ముందు చెప్పబోవుదానికి ఆధారముగా ఉండుటకు చెప్పుచున్నాను. నేను జోసఫ్ను కప్పి వెనుకకు వెళ్లిపోయాను, మరలా పడకకు వెళ్లి నిద్రించాను. అప్పుడు నాకొక కల వచ్చినది.

ఆ కలలో నా తండ్రిలాంటి మనిషిని చూచాను, అయినను అతడు ఒక గొప్ప మనిషిగా ఉన్నాడు. ఆ తరువాత నా తల్లిలాంటి ఒక స్త్రీని చూచాను, అయితే ఆమె నా తల్లిలాగా కనబడలేదు. ఆ మనిషి తన భార్యను చాలా హీనముగా చూచుచున్నాడు. అతడు ఒక మూడు మూలల కర్రను చేత పట్టుకొనియున్నాడు. అతడు ఆ విధముగా దానిని చెక్కుకొనియున్నాడు, ఒక మొద్దు నుండి ఒక ముక్కను చెక్కి తీయునప్పుడు, అది మూడు మూలల కర్రగా వచ్చును. ప్రతిసారి, ఈ స్త్రీ లేచి నిలచుటకు ప్రారంభించినప్పుడెల్లా, అతడు ఆ కరత్రో ఆమె మెడనుపట్టి లాగుచూ, తలపై కొట్టుచూ క్రిందికి పడ ద్రోయుచుండెను. ఆమె అక్కడ పడియుండి ఏడ్చుచుండును. మరలా ఆమె పైకి లేచుటకు ప్రయత్నించును.

అతడు గర్వముగా నడచి వచ్చి తన ఎదను పైకెత్తి నిలచి — అతడు చాలా భారీ మనిషి. ఆమె లేచినప్పుడెల్లా అతడు ఆమె మెడను పట్టి లాగుచున్నాడు. ఈ మూడు మూలల కర్రతో ఆమె తలపై కొట్టుచు, ఆమెను క్రిందికి పడద్రోయుచున్నాడు. అంతట వెనుకకు నడచి వెళ్లిపోవును. వెళ్లునప్పుడు గంభీరముగా ఎదను ఎత్తి నడచి వెళ్లుచున్నాడు.

66నేను దీనిని గమనించుచు నిలచి, ఈ విధముగా తలంచాను, "నేను ఆ మనిషిని ఎదుర్కొనలేను. అతడు చాలా బలశాలి. అతడు నా తండ్రిలాగున్నాడు, అయితే నా తండ్రి కాడు. ఆ స్త్రీని ఆ విధముగా చేయవలసిన పనియు అతనికి లేదు. అతనిని చూచినప్పుడు నేను కొంచెము తడబడిపోయాను.

అప్పుడు అనుకోకుండా నేను ధైర్యము తెచ్చుకొని, అతని పైకి వెళ్లి అతని చొక్కా కాలరును పట్టుకొని అతనిని నా తట్టుకు త్రిప్పాను. అప్పుడు నేను, "ఆమెను కొట్టు అధికారము నీకు లేదు," అని చెప్పాను. నేను ఆ విధముగా చెప్పినప్పుడు, నా కండలు పెరిగిపోయినవి. నేనొక గొప్ప దేహముగలవానిగా అతనికి కనబడుచున్నాను. ఆ మనిషి ఆ కండరములను చూచి భయపడిపోయాడు. అప్పుడు నేను, "నీవు ఆమెను కొట్టావంటే, నాతో పోరాడవలసియుండును," అని చెప్పాను. అందువలన అతడు ఆమెను మరలా కొట్టుటకు వెనుకాడినాడు. అప్పుడు నేను నిద్రమేల్కొన్నాను.

కొంత సమయమునకు ముందు "అది ఏమిటని? తలంచాను. ఆ స్త్రీని గురించి కలగనుటలో ఆశ్చర్యముగా ఉన్నదని," తలంచాను. ఒక క్షణములో ఇక్కడకు అది వచ్చెను — నేను ఆ వివరణను పొందాను.

67ఆ స్త్రీ, ఈ దినపు లోకము యొక్క సంఘమును సూచించుచున్నది — ప్రపంచమంతటను ఉండు సంఘము. నేను ఈ కలగూరగంపలో జన్మించి ఇక్కడ ఉన్నాను. ఆమె ఒక తల్లిగా ఉండవలసినది… ఆమె వేశ్యలకు తల్లిగా ఉన్నది — అయినను నేను అందులోనే జన్మించాను. ఆమె భర్త ఆమెను పాలించు సంస్థగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న ఆ మూడు మూలల కర్ర, అబద్దపు పేర్లయందున్న త్రిత్వబాప్తిస్మము. ప్రతిసారి సమాజము లేచి నిజమును అంగీకరించుటకు ప్రయత్నించినప్పుడెల్లా, అతడు దానిని క్రిందికి త్రోయుచున్నాడు. బహుశా, అతడు చాలా గొప్పవాడైయున్నందున, నేను వెనకకు తిరిగాను, అతనిని గురించి కొంచెము భయపడినను. ఏదో ఒక విధముగా అతనిని ఢీకొన్నాను, ఆ కండరములు విశ్వాస కండరములుగా ఉన్నాయి. అది నన్ను ఇలా యోచించునట్లు చేసినది, "దేవుడు నాకు తోడైయుండిన మరియు నాకు కండరములనివ్వగలడు, ఆమె కొరకు నేను నిలచెదను," అతడు ఆమెను కొట్టుట మానివేశాడు.

68నా భార్య నా గదికి వచ్చునప్పుడు పగలు 10.00 గంటల సమయముండును, అప్పుడు ఆ కల వచ్చినది. ఆ ఉదయము నేనొక దర్శనములోకి వెళ్లాను, నేను ఏదో ఒక విధముగా… ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి అది ఒక కల కాదు!

కలలకు, దర్శనములకు ఎంతో వ్యత్యాసమున్నది. కలలు నిద్రపోవునప్పుడు వచ్చునని. దర్శనములు మేల్కొనియున్నప్పుడే వచ్చునని. ఆ విధముగానే మనము జన్మించియున్నాము. ఒక సాధారణ మనిషి కల కనునప్పుడు, అది అతని లోపలి మనస్సులో కలుగునది. అతని లోపలి మనస్సు అతని నుండి దూరముగా ఉన్నంతసేపు అతని ఇంద్రియములు పనిచేయుచుండును. అప్పుడతడు తన మొదటి మనస్సులో ఉండును. ఈ సృహలో మీరు సాధారణముగా ఉందురు. మీరు చూశారా, రుచి, స్పర్శ, వాసన, వినుట మొదలగునవి. అయితే మీరు అనకల్పిత స్థితిలో ఉన్నప్పుడు నిద్రించుచుందురు, చూడరు, రుచి చూడరు, స్పర్మించరు, వాసన చూడరు, లేక వినరు. అయితే అక్కడ కొంత ఉన్నది… నీవు కలగని మరలా వెనుకకు వచ్చునప్పుడు, అనగా ఈ మనస్సునకు వచ్చునప్పుడు ఏదో కొంత జరుగును. కొన్ని సంవత్సరముల క్రితము నీవు కలగన్న వాటి జ్ఞాపకము ఏర్పడును.

సాధారణ వ్యక్తి ఆ విధముగా ఉండును. అయితే దేవుడు దేనినైన ముందుఏర్పచినప్పుడు, ఆ లోపలి మనస్సు ఆ ప్రవక్తకు దూరముగా ఉండదు, కాని ఆ రెండు మనస్సులు ఒక్కటిగానే ఉండును. ఆ ప్రవక్త ఒక దర్శనములో నిద్రించడు — అతడు తన సాధారణ స్థితిలోనే ఉండి, దానిని చూచును.

69కొందరు డాక్టర్లకు గత దినమందు దాని వివరించుచుంటిని, మరియు వారు లేచి నిలచి, "ఓ, ఎంతో ఆశ్చర్యము, అటువంటి దానిని తలంచి కూడ చూడలేము," అని చెప్పారు. నేనొక పరీక్షను తీసికొనుచున్నప్పుడు, అటువంటి దానిని వారు చూడలేదని చెప్పారు. మంచిది, వారిలా చెప్పారు. "నీకేదో జరిగియున్నది."

అందుకు నేను… నేను వారితో చెప్పాను. "ఖచ్చితముగా, అది జరుగుచున్నదని," చెప్పాను.

ఆ రెండు మనస్సులు అక్కడ ఏకమగును. నేను చేయునది ఏదియు ఉండదు. మిగిలిన వారి కన్నను అధికునిగా చేయలేవు. దేవుడే దానిని ఆ విధముగా చేశాడు. నీవు నిద్రలోనికి పోవు — నీవు స్పృహలోనే యుండెదవు, నిద్రించి నట్లు౦డెదవు. ఇక్కడ నిలచి ఈ విధముగానే నీవు చూచుచుందువు. అందరు దానిని చూచిరి, ప్రపంచమ౦తట.

నీవు నిద్రించవు — వేదికపై నిలచి ప్రజలతో మాట్లాడుచుందువు. మీతో కారులో వెళ్లునప్పుడు, ఆ విధముగానే నేను దర్శనములలోకి వెళ్లి తిరిగి వచ్చుట మీరు వినియున్నారు మరియు ఎక్కడైనను, జరుగనైయున్న కార్యములను మీతో చెప్పాను. అవి ఎప్పటికి తప్పిపోలేదు. అవి ఎన్నడు తప్పి పోవు. అవి తప్పిపోవుట ఎవ్వరైనను చూశారా? లేదండి. అది తప్పిపోవుటకు వీలులేదు. అది దేవునిదై యున్నంతవరకు అది తప్పిపోదు. గమనించుడి, ఇక్కడ ఈ వేదికపై వేలకొలది ప్రజల ముందు, నేను మాట్లాడలేని ఇతర భాషలలో వచ్చినప్పటికిని — అయినను అవి తప్పిపోలేదు. చూచారా. అది దేవునిది.

70ఇప్పుడు, ఈ దర్శనములో, లేక నేను మాట్లాడుచుండగా; నేను చూచినప్పుడు, వింతైన కార్యమును చూచాను. ఇప్పుడు, నా చిన్న కుమారుడు జోసఫ్ నా ప్రక్కలో ఉన్నట్లు కనబడినది. నేనతనితో మాట్లాడుచుంటిని. ఇప్పుడు, ఆ దర్శనమును జాగ్రత్తగా గమనించండి, ఎక్కువ చేరువగా గమనించినట్టయితే, ఎందుకు జోసఫ్ అక్కడ నిలచియున్నాడని మీరు చూడగలరు.

నేను చూచినప్పుడు అక్కడొక పెద్ద పొద ఒకటి ఉండినది. ఈ పొదలో ఒక పక్షుల సమూహము ఉండినది. చాలా చిన్న పక్షులు — అర్ధ అంగుళము పొడవు ఉండును. అర్ధ అంగుళము ఎత్తుండును. అవి అనుభవము గల చిన్నవి. వాటి చిన్న రెక్కలు కొట్టుకొనుచున్నవి. రెండు మూడు అడుగుల ఎత్తున ఒక కొమ్మలో ఆరు లేక ఎనిమిది మరొక కొమ్మలో పదిహేను లేక ఇరువది మరొక కొమ్మలో ఆ విధముగా పిరమిడ్ రూపములో క్రిందికి వచ్చుచున్నవి. ఆ చిన్నవి… చిన్న వర్తమానికులు, అవి అధికముగా అలసిపోయివున్నాయి. అవి తూర్పు దిశగా గమనించుచున్నాయి.

నేను అరిజోనాలోని, ట్యూసాన్లో, దర్శనమందు ఉన్నాను. అది ఎంతో ముఖ్యముగా ఏర్పడినది మరియు నేను దానిని చూచుటలో తప్పిపోవుట ఆయనకు ఇష్టము లేదు. అప్పుడు నేను నా తొడుగునకు అతికియుండు గడ్డిముల్లును తీయుచుంటిని, అది ఆ ఎడారిలో వచ్చుచుండగా అతికినది. అప్పుడు నేను, "ఇది దర్శనమని నేనెరిగియున్నాను, నేను ట్యూసాన్ న౦దున్నానని ఎరిగియున్నాను. ఆ చిన్న పక్షులు దేనినో సూచించుచున్నవని ఎరిగియున్నాను," అని చెప్పాను. అవి తూర్పు దిశగా గమనించుచున్నవి. తలంచని రీతిగా అవి ఎగిరిపోవు సంజ్ఞను తీసికొన్నవి, తూర్పు దిశగా దూరమునకు ఎగిరిపోయినవి.

71అవి విడిచిపోయిన వెంటనే, పెద్ద పక్షుల సమూహమొకటి వచ్చినది. అవి పావురములవలె కనబడినవి — వాటి రెక్కలు మొనలుదేరియుండినవి, అవి బూడిద రంగులో ఉండినవి, ఆ మొదటి వర్తమానికుల కన్నను కొద్దిగా రంగు తక్కువలో ఉండినవి. అవి తూర్పు దిశనుండి వేగముగా వచ్చుచున్నవి.

అవి నా చూపులో నుండి దూరమైన వెంటనే, నేను పడమర దిశగా చూచుటకు తిరిగితిని, మరియు అక్కడే ఇది జరిగినది. భూమినంతటిని కదలించివేసిన భయంకర ప్రేలుడు ఒకటి ఏర్పడినది! ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. టేపులను వినుచున్న మీరు నిజముగా గ్రహించుదురను నిశ్చయత కలిగియుండుడి!

మొదట, ప్రేలుడు! అది ఒక పెద్ద శబ్దగోళము వలె శబ్ది౦చినదని నేను తలంచుచున్నాను, లేక విమానములు పైకి వెళ్లునప్పుడు ఏర్పడు శబ్దముగానో, మరొకటి మీరు ఏ విధముగా పిలచినను, ఆ శబ్దము క్రిందికి భూమి మీదికి వచ్చినది. అది అలాగే కదిలించి వేసినది… గర్జించినది, ప్రతీది జరిగినది. అప్పుడు ఒక పెద్ద ఉరుము - మెరుపు యొక్క శబ్దము వాలే ఏర్పడినది. నేను ఆ మెరుపును చూడలేదు. దక్షిణము నుండి వచ్చుచుండినట్లు నేను ఆ గొప్ప ప్రేలుడు ముందుకు వెళ్ళుటను విన్నాను, మెక్సికో ప్రక్కగా వెళ్లినది.

72అయితే అది భూమిని కదిలించి వేసినది. అది ఏర్పడినప్పుడు నేనింకను పడమటి దిశగా చూస్తూ ఉండిపోయాను. నిత్యత్వము మార్గములో, ఒక నక్షత్ర కూటములాంటిది వచ్చుచుండుటను నేను చూచాను. అవి ఏవో చిన్న చుక్కలవలె కనబడినవి. అవి ఐదుకంటె తక్కువలేవు, ఏడుకంటె ఎక్కువలేవు. అయితే అవి ఒక పిరమిడ్ ఆకారములో (ముక్కోణ ఆకారములో) ఉన్నాయి. అవి కూడ ఈ వర్తమానికులు వచ్చినట్టే ఉన్నాయి.

అవి అలా వచ్చుచుండగా, సర్వ శక్తుడైన దేవుని శక్తి నన్ను పైకెత్తి వారిని కలిసికొనునట్లు చేసినది. నేను చూడగలిగాను… అది నన్ను విడచిపోలేదు. ఎనిమిది దినములు గడిచినవి, దానిని నేను మరచిపోలేకపోయాను. వాటివలన నేను పొందిన తొందర మరి వేటివల్లను పొందలేదు. నా కుటుంబము దానిని మీకు చెప్పును.

73నేను ఆ దూతలను చూడగలుగుచున్నాను, వాటి రెక్కలు వెనుకవైపుగా వంగి యున్నవి. అవి శబ్దము కంటెను అధిక వేగముతో ప్రయాణము చేయుచున్నవి. వారు నిత్యత్వము నుండి కనురెప్ప పాటులో వచ్చారు. మీరు మీ కన్నుమూయు సమయుము కూడ అక్కడ లేదు, ఒక చిన్నకదలిక, వారక్కడే ఉన్నారు. లెక్కించుటకు నాకు సమయము లేదు. చూచుట కన్నను మరి నాకు దేనికిని సమయము లేకపోయినది. బలమైనవి, గొప్ప శక్తిగల దూతలు అవి మంచువలె తెల్లగా ఉన్నవి! వాటి రెక్కలు తలయందు అమర్చబడి "వ్యూ, వ్యూ" ఎగిరి వచ్చినవి. అలా వచ్చినప్పుడు, నేను ఈ "పిరమిడ్ నందు ఎత్తబడితిని," అది నక్షత్ర కూటముగా ఉన్నది.

అప్పుడు నేను "ఇప్పుడు, ఇది అంతే" యని తలంచాను. నేను వాటన్నింటిని లెక్కించాను. ఓ, మై! దీనిని చూడగా ఈ ప్రేలుడు నన్ను చంపివేయునని తలంచాను. ఇప్పుడు నా మార్గము చివరిలో ఉన్నాను. ఈ దర్శనము విడచిపోవునప్పుడు, నేను నా ప్రజలతో చెప్పకూడదు. దీనిని గురించి వారు తెలిసికొనుటకు నేను ఇష్టపడుట లేదు. అయితే నా సమయము అయిపోయినది అని పరలోకపు తండ్రి నాకు తెలియజేసెను. నేను నా కుటుంబమునకు కూడ చెప్పను, ఎందుకనగా వారు నా గురించి చింతించెదరు, 'ఎందుకనగా, ఆయన వెళ్లిపోవుటకు నిర్ణయించెను.' ఈ దూతలు నా కొరకు వచ్చారు, ఒక విధమైన ప్రేలుడులో నేను త్వరలో చంపబడుదును," అని తలంచాను.

నేను ఈ నక్షత్ర కూటములో ఉండగా అది నా యొద్దకు వచ్చినది, "లేదు, అది కాదది. అది నన్ను చంపియునట్లయితే, అది జోసఫ్-ను కూడా చంపియుండును." మరియు జోసఫ్ను పిలచుటను వినుచున్నాను. అప్పుడు నేను వెనుదిరిగి ఇలా తలంచాను. మంచిది, "ప్రభువైన దేవా, ఈ దర్శన భావమేమి?"

నేను ఆశ్చర్యపోయాను, అప్పుడు అది నాకు తెలియవచ్చినది. స్వరముగా కాదు, అది సాధారణముగా వచ్చినది. "ఓ! వారు ప్రభువు దూతలై నాకు నియమించిన క్రొత్త కార్యనిర్వహణను ఇచ్చుటకై వచ్చారు!" ఆ విధముగా నేను తలంచినప్పుడు, నేను నా చేతులెత్తి, మరియు "ఓ, యేసు ప్రభువా, నేనేమి చేయాలని నీవు ఇష్టపడుచున్నావు?" అని చెప్పినప్పుడు, ఆ దర్శనము నన్ను విడచిపోయినది. రమారమి ఒక గంట కాలము నేను స్థంబించిపోయాను.

ROM 9:1•

1PET 2:6

 

74ఇప్పుడు, ప్రజలైన మీరు ప్రభువు దీవెనలేమిటని ఎరిగియున్నారు. అయితే దేవుని శక్తి పూర్తిగా వ్యత్యాసమైనది, ఆ రకమైన స్థలములలో దేవుని శక్తిని ముందుగా, అనేక పర్యాయములు, దర్శనముల యందు అనుభవించాను, అయితే ఈ విధముగా కాదు. ఇది "భక్తితోకూడిన భయము," ను కలిగించినది. నేనెంతగా భయపడితిననగా, ఈ జీవుల ఎదుట స్థంభించిపోయాను. నేను సత్యమునే చెప్పుచున్నాను. పౌలు చెప్పినట్లు, "నేను అబద్దమాడుట లేదు." ఈలాంటి విషయము నేను పొరపాటుగా చెప్పుట మీరెన్నడైన చూచారా. ఏదో జరుగుటకు నిర్ణయమైనది!

ఆ తరువాత కొంతసేపటికి నేనిలా చెప్పాను, "యేసు ప్రభువా, నేను చంపబడనైయున్నయెడల, నాకు దానిని తెలుపుము. నేను నా ప్రజలతో దానిని చెప్పను. అయితే అది వేరే ఏదో అయితే నాకు తెలుపుము." నాకు ఏ జవాబు రాలేదు.

ఆత్మ నన్ను విడచిపోయిన తరువాత అర్ధగంటకు, నేను తలంచాను, లేక అధికముగాను ఉండవచ్చును. అప్పుడు నేను, "ప్రభువా, నేను చంపబడవలెనని అది ఏర్పడినదైతే నీవు భూమిపై కలిగిన కార్యమును ముగించివేశావు. నేను ఇప్పుడు నా గృహమునకు ఎత్తికొనబడబోవుచున్నాను… అది దాని కొరకైనదైతే, అది మ౦చిదే. అట్లయిన అది మంచిది." "అది ఆ విధముగా ఉన్నయెడల నాకు తెలుపుము. నీ శక్తిని నాపైకి మరలా పంపుము. అప్పుడు నా ప్రజలకు తెలుపకూడదని తెలిసికొందును, లేక మరెవ్వరితోను దానిని గురించి తెలుపను, ఎందుకనగా నీవు నన్నుతీసుకొనిపోవుటకు నిర్ణయించియున్నావని తలంచాను. మరియు ఏమియు జరుగలేదు. నేను కొంత సమయము వేచియుంటిని.

అప్పుడు నేను "యేసు ప్రభువా, అది దాని భావము కానియెడల నీవు నాతో చేయవలసినదేదో ఒకటున్నదని అర్ధము, మరియు అది తరువాత నాకు బయలుపరచబడును, అప్పుడు నీ శక్తిని నాకు పంపుము." అది దాదాపు నన్ను, నా గదిలో నుండి ఎత్తుకెళ్లిపోయినది!

ROM 9:33

 

75నేను ఎక్కడో ఒక మూలగా పడియుండుటను కనుగొన్నాను. నా భార్య ఎక్కడో తలుపును తెరచు శబ్దమును వినగలుగుచున్నాను. పడక గది తలుపు తాళము వేయబడియున్నది. నేను ఒక బైబిలును తెరచి ఉంచుకొని, దానిని చదువుచున్నాను… నాకు తెలియదు, అయితే అది అక్కడున్నది, అది రోమా 9వ అధ్యాయములో చివరి వచనమని నమ్ముచున్నాను. "ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను. సీయోనులో స్థాపించుచున్నాను, ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపర్చబడడు."

నేను దానిని చదువుట ఆశ్చర్యముగా ఉన్నదని తలంచాను. ఆత్మ నన్నింకను నా గదిలో బంధించియున్నది. నేను నా బైబిలును మూసివేసి అక్కడ నిలచాను. నేను కిటికీ దగ్గరకు వెళ్లి నిలచాను, అప్పుడు పగలు 10.00 గంటలు కావచ్చుచున్నది, లేక ఇంకను అధికముండవచ్చును, అప్పుడు నేను చేతులెత్తి ఇలా చెప్పాను, "ప్రభువైన దేవా, నేను గ్రహించలేకున్నాను. ఇది నాకొక ఆశ్చర్యమైన దినము. నేను మొత్తమునకు నా ప్రక్కగానే ఉన్నాను."

"ప్రభువా, దాని భావమేమిటి? నేను మరలా దానిని చదివెదను. అది నీవేనా?" (ఇప్పుడిది పిల్లవానివాలే అనిపించును.) నేను బైబిలును తీసికొని, దానిని తెరిచాను. మరలా అదే స్థలము వచ్చినది — పౌలు, యూదులతో చెప్పువారు చేయు ప్రయత్నమును… రోమీయులతో చెప్పుచు, యూదులు క్రియల ద్వారా అంగీకరించారు, అయితే మనము విశ్వాసము ద్వారా దానిని అంగీకరించెదము.

76మంచిది, అది అంతకు ముందటి కన్నను భయంకర కాలముగా నున్నది. ఇప్పుడు నేనెక్కడ నిలచియున్నానో మీరెరిగియున్నారు. ఏమి జరుగుచున్నదో నాకు తెలియుట లేదు. ఏమి చెప్పాలో అని కూడ తెలియుట లేదు! అయితే ఇక మీదట నేను రానున్న పదిహేను, ఇరువది నిమిషములు, ఒకదానిని చెప్పనివ్వండి. జ్ఞాపకముంచుకొనండి, ఒక్కటైనను ఏ కాలమందైనను దర్శనములు తప్పిపోలేదు.

ఇప్పుడు, నేను కొన్ని క్షణములు వాక్యభాగములను తీసికొనబోవుచున్నాను. మీరు ప్రకటన 10వ అధ్యాయము, గమనించినట్టయిన… నన్ను దీనిని చెప్పనివ్వండి: ఆ దర్శనము లేఖనానుసారమైనయెడల అది లేఖనము ద్వారానే వివరించబడవలెను. అప్పుడు వాటిని అలా జతపరచవలెనని నేను కోరుచున్నాను. ఇక్కడున్న మీరు లేపులు వినుచున్న మీరు నేను చెప్పుచున్న మీరును చెప్పునట్లు ఖచ్చితముగా ఉండుడి, ఎందుకనగా దానిని అపార్ధము చేసికొనుట సులభము. (మీరు త్వరపడుచున్నారా? మంచిది. అయినను మీరెంతో ప్రశాంతముగాను నెమ్మదిగాను ఉన్నాదానిని బట్టి వందనములు.)

77ఇప్పుడు ఆ ఏడవ దూత… ఇప్పుడు, అయ్యలారా, (ఈ పాఠమును నేను పిలచినట్లు), ఇది చివరి కాలము యొక్క సూచనగా ఉన్నదా? మనమెక్కడ జీవించుచున్నాము? ఈ దినములో ఇది ఏ ఘడియగా ఉన్నది? సోలిపోయిన పందెగాడు రాత్రియందు లేచి, తిరుగుచు, ఎంత సమయమైనదో అని గడియారమును చూచునట్లున్నదా — దీపమును త్రిప్పి చూచుచున్నాడు — నా ప్రార్ధన ఏదనగా, "దేవా మమ్మును ఆ వెలుగు ప్రక్కకు త్రిప్పబడనిమ్ము." నేను భయ౦కరమైన ఒక స్థలమందు నిలచియున్నాను, మీరు దీనిని తెలిసికొనినయెడల, జ్ఞాపకముంచుకొనుడి, నేను ప్రభువు నామములో చెప్పుచున్నాను, నేను మీతో సత్యమును చెప్పాను! ఏదో జరుగబోవుచున్నది! అయితే నాకు తెలియదు. టేపు వద్ద ఉన్న నీవు దానిని తెలిసికొనుము. అది నాకు తెలియదు! నేను ప్రయత్నము చేయబోవుచున్నాను… నేను చదువు గదిలో నిన్నటి రోజున వచ్చినదేమిటో, దానిని చెప్పుటకు ప్రయత్నించెదను. ఇది సత్యమని నేను చెప్పను. నేను నడుచుచుండగా అది నా హృదయమందు కదలినది.

నేను క్రిందికి వెళ్లవలసియున్నది… కొంత సమయము దూరమై, ఉండుటకు చార్లీ దగ్గరకు వచ్చాను, మేము ఒకరి నుండి ఒకరు విడిపోవుటకు ముందు అతనితో కలిసి ఒక దినము వేటకు వెళ్లాను.

78నన్ను దానిని చెప్పనివ్వండి, ఎందుకనగా నేను పడమరగా వెళ్లుచున్నాను, అంటే నేను ఈ మందిరమును విడచి వెళ్ళుచున్నానని కాదు. ఇది దేవుడైన ప్రభువు నాకిచ్చిన సంఘము. ఇదే నా ప్రధాన కార్యాలయము. ఇక్కడే నేను నిలచియుండు స్థలము. నాకు దర్శనము ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడి వెళ్లుచున్నాను. నా కుమారుడు, బిల్లీ పాల్, నా కార్యదర్శిగా మిగిలియుండును. ఈ సంఘములోనే నా కార్యాలయము ఉండును.

దేవుని సహాయముతో, ఈ కార్యము ముగించిన వెంటనే నేనిక్కడ ఉండి, ఏడు ముద్రలను ప్రసంగించెదను. నేను మాట్లాడు ఏ టేపులు గాని, మరొకటి గాని ఇక్కడ ఈ సంఘములోనే చేయబడును. నాకు తెలిసినంతవరకు ఇక్కడే చేయబడును, ఇక్కడ నేను అధిక స్వేచ్ఛగా బోధించగలను, ప్రపంచములో మరెక్కడికన్నను ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఉండదు — ఎందుకనగా ఇక్కడున్న ప్రజల విశ్వాసము వారి ఆకలి, వారు దానిని చేపట్టిన విధము దానికి కారణము. ఇది నా ఇల్లుగా నేను భావించెదను. ఇదే ఆ స్థలము. మీరు గమనించినయెడల, ఆ కల దానినే మాట్లాడినది, చూడండి, ఆహారము ఎక్కడున్నదని…

ఇప్పుడు, భవిష్యత్తులో ఏమున్నదో నాకు తెలియదు. అయితే భవిష్యత్తును ఎవ్వరు పట్టియున్నారని నేను ఎరుగుదును. ఇది ముఖ్యమైన కార్యము.

79ఇప్పుడు, దేవా, నేను పొరపాటు చేసినట్టయిన, నన్ను క్షమించి, నా నోరు మూయుము; ప్రభువా, నీ చిత్తము కానిది దేనినైనను తీసివేయుము. నేను అనుభూతిని పొందుచున్నాను కాబట్టి నేను దీనిని చేయుచున్నాను, ప్రభువా. ప్రజలు దానిని గ్రహించనిమ్ము — ఇది నా అభిప్రాయము మాత్రమే.

ఆ వివరణ వెంటనే రాలేదని నేను చెప్పినందుకు నేను తలంచు కారణము - ఆయన పరిపాలన ద్వారా అది రావలసియున్నది, ఎందుకనగా నా కొరకు బైబిలులో అది వ్రాయబడియున్నది. అప్పుడు వాక్యానుసారమైనదైతే, వాక్యము ద్వారానే వివరించవలసియున్నది. సోదరీ, సోదరులారా ఇది సత్యము. మిమ్ములను భయపెట్టవలెనని నా భావము కాదు, అయితే మనము జాగ్రత్తగా ఉండవలసియున్నది. మనము దేనికో నిర్ణయించబడియున్నాము. ఏదో జరుగనైయున్నది.

ఇప్పుడు దీనిని దేవుని భక్తితోను, దేవుని భయముతోను చెప్పుచున్నాను. నేనిక్కడ నిలచియున్నానని మీరు తలంచవచ్చు. నేను ఒక ప్రవక్తనని మీరు విశ్వసించవచ్చు. నేను అలా చెప్పుట లేదు. ఇది నా భావము ఇది. గత సంవత్సరము, "ఈ ఒక్కదానిని మాత్రమే నేను చూచానని చెప్పాను, దేశములో ఉజ్జీవము ముగించిపోయినది — ఎట్లయినను ఈ దేశమును గురించినది ముగించిపోయినది." నేనొక సేవా యాత్రను తలపెట్టియున్నాను — అనేకులు నాతో వచ్చారు. ఓ, అది మంచిదే. మనము మంచి కూడికలను, గొప్ప సమయములను అధికమైన సమూహములను కలిగియుంటిమి. అయితే తగిన స్థలమును అని చేరలేదు. ఈ సంవత్సరము నేనొక మిషనరీ యూత్రను కొనసాగించుచున్నాను. వీలుపడినంత త్వరగా, నేను ఆఫ్రికా దేశమునకును, ఇండియా దేశమునకును, మరియు ప్రపంచమంతటికిని వెళ్లుచున్నాను. సాధ్యమైతే మరొక మిషనరీ యాత్రను కూడ కొనసాగించెదను.

అది పనిచేయకున్నయెడల, నేను ఆహారమును తీసుకొనబోవుటలేదు. అక్కడున్న ఎతైన కొండలను ఎక్కి, దేవుడు నాకు జవాబును ఇచ్చు వరకు అక్కడే నిలచియుందును. ఈ విధముగా నేను జీవించగలను. నేను ఈ విధముగానే ముందుకు వెళ్లలేను. ఇదే నా జవాబుగా ఇక్కడ ఉన్నది. నాకు తెలియదు. ఆయన నన్ను మార్చునంతవరకు…

80మూడు వారముల క్రితము ఎండలో నిలచియుండి సమాజమునకు బోధించినది మీకు జ్ఞాపకమున్నదా? గత ఆదివారము మీరందరు ఇక్కడున్నారు. అనేక ఆదివారములు. మీరు టేపులను తీసికొని వెళ్లారు మరియు అవి రికార్డు చేయబడినప్పుడు మీరిక్కడ ఉన్నారా; మీరు ఈ కార్యములను గ్రహించుడి, ఎందుకనగా ఇప్పుడు ఈ స్థలములన్నింట నీలో నేను మాట్లాడుచూ ముందుకు వెళ్ళుదును, మీరు దానిని గమనించండి. అక్కడ ఉపమానములుగా చెప్పబడిన ప్రతీది ఇక్కడ నెరవేర్పులో ఉండును. ఆ విధముగానే వివరణలు కూడ ఉండును. నాకు తెలియదు గాని, అందువలననే నేను ఈ విధముగా చెప్పుచున్నాను. "అయ్యలారా, ఇదే నా అది?"

REV 10:7

 

81ప్రకటనలోని 10వ అధ్యాయములోని ఏడవ దూత ప్రకటన 3:14 యొక్క సంఘకాల వర్తమానకునిగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. జ్ఞాపకముంచుకొనండి… ఇప్పుడు దాని చదివెదను, చూడండి, ఎక్కడ నేను చదువుచున్నానని. ఇప్పుడు, ఇది ఏడవ దూతగా ఉన్నాడు.

"యేడవదూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను."

ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఇతడొక దూతగా ఉన్నాడు; అతడు ఏడవ సంఘ కాలమునకు దూతగా ఉన్నాడు, ఎందుకనగా ఏడవ సంఘకాలపు దూతయని ఇక్కడ చెప్పబడియున్నది. కనుగొన్నారా? ఎవరు ఆ దూతయని మీరు చూడదలంచిన… లేదా ఆ దూత — ప్రకటన 3:14. అతడు లవొదికయ సంఘమునకు దూతగా ఉన్నాడు.

82ఇప్పుడు, అక్కడ ఆ విధముగా చెప్పబడినప్పుడు, సంఘకాలములకు దూతలుగా ఉన్నారు, మీరు దానిని జ్ఞాపకముంచుకొనవలసియున్నది. ఇప్పుడు, దీనిలో ఇవి ఆ ఏడు ముద్రలలోకి నేరుగా వెళ్ళును, ఆ ఏడు ముద్రలను మనము త్వరలో మాట్లాడనైయున్నాము. మనము మాట్లాడుటకు ప్రయత్నించుచు ఆ ఏడు ముద్రలు (తరువాత రానున్నప్పుడు) వ్రాయబడి ముద్రించబడినవిగా ఉన్నవి. మీరు ఎరిగి యుండునట్లు ఏడు ముద్రలు, ఏడు సంఘ కాలములలోని ఏడుగురు దూతల రూపాంతరముగా ఉన్నవి, లేక నిరూపణలుగా ఉన్నవి. అయితే మరొక ఏడు ముద్రలు, గ్రంధము వెనుక ఉన్నవి — అవి బైబిలునకు వెలుపల ఉండునవని గమనించండి. ఇంక ఒక్క క్షణములో మనము దానిలో ప్రవేశించెదము.

ఇప్పుడు దీనిని నేను ప్రారంభించుటకు ముందు, మీరు అలసిపోయి ఉన్నారా? మీరు లేచి మీ స్థలములను మార్చుకొన తలంచుచున్నారా?

REV 10:7

 

83ఇప్పుడు, దగ్గరగా వినండి. ప్రకటన 10:7లోని ఏడవ దూత ఏడవ సంఘకాల వర్తమానికుడై యున్నాడు, చూశారా. ఇప్పుడు గమనించండి. "ఆ దినములలో…" ఇప్పుడు ఇక్కడ గమనించండి.

ఏడవ దూత పలుకు దినములలో, అతడు బూర ఊదబోవుచుండగా, దేవుని మర్మము సమాప్తమగును…

ఇప్పుడు ఆ దూత లేక వర్తమానికుడు, ఇక్కడ ఏడవ దూతగా బూర (వర్తమానమును) ఊదబోవుచున్నాడు. (పలుకబోవుచున్నాడు) అతడు తన వర్తమానమును లవోదికయ సంఘమునకు తెలుపబోవుచున్నాడు. అతని వర్తమానము యొక్క విధానమును గమనించండి. ఇప్పుడది మొదటి దూతకో, నాల్గవ, ఐదవ, ఆరవ దూతకో కాదు; అయితే అది ఏడవ దూతకు సంబంధించినది. అతడు ఈ రకపు వర్తమానమును ఇచ్చుచున్నాడు. అది ఏమిటి? అతని వర్తమానము విధానమును గమనించుడి: దేవుని మర్మములన్ని౦టిని, అనగా గ్రంథములో వ్రాయబడినవన్నింటిని ముగించుచున్నాడు. వదలిపెట్టబడిన వాటినన్నింటిని ఆ ఏడవ దూత లేక వర్తమానికుడు, ఆ మర్మములన్నింటిని చుట్టివేయుచున్నాడు. అవి అన్నియు సంస్థల ద్వారాను, సంఘ శాఖల ద్వారాను విడిచిపెట్టబడినవి. ఆ ఏడవ వర్తమానికుడు వాటన్నింటిని సమకూర్చి, ఆ పూర్తి రహస్యములను మర్మములను ముగించుచున్నాడు. అలా బైబిలు చెప్పుచున్నది — "వ్రాయబడిన గ్రంథము యొక్క మర్మములను ముగించుచున్నాడు."

MATT 13:11

 

84ఇప్పుడు, ఆ మర్మములలో కొన్నింటిని తీసికొందుము, మీరు వ్రాసికొనదలంచిన, వ్రాసికొనవచ్చు. మొదటిగా మత్తయి 13లో, స్కోఫీల్డు చెప్పిన దానిని తీసికొందును. మీరు వీటిలో కొన్నింటిని వ్రాసికొనదలంచినయెడల, ఒక స్కోఫీల్డు బైబిల్ తీసికొనండి. ఆయన ఈ మర్మములను గురించి ఏమి తలంచుచున్నాడోనని మీరు చదువగలరు.

ఇప్పుడు, 11వ వచనములో:

పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు [ఆయన శిష్యులకు] అనుగ్రహింపబడియున్నది గాని, (వెలుపల) వారికి అనుగ్రహింపబడలేదు. [మర్మములు.]

ఆ మర్మములు ఇక్కడే ఉన్నవి: ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది. ముందుగా, దాచియుంచబడిన సత్యమనునది ఇప్పుడు ఆత్మీయముగా బయలుపరచబడుచు, కాని బయలుపరచబడినదిగా యున్నను, ఒక సహజాతీతమైన శక్తి ఇంకనూ ఉంటున్నట్లుగానే యున్నది. ఆ గొప్పవైన మర్మములు మరియు గొప్ప మర్మములు ఏవనగా:

MATT 11:25•

MATT 13:11•

1COR 15:51-53•

GAL 2:20•

EPH 3:6•

EPH 5:32•

COL 2:9•

1THS 4:17•

2THS 2:7•

HEB 13:8•

REV 1:20•

REV 17:5

 

85మొదటి మర్మము: పరలోక రాజ్య యొక్క మర్మము. మనము ఇప్పుడు మాట్లాడునది అదియే. మత్తయి 13:3-15.

ఆ రెండవ మర్మము: ఈ కాలమందు ఇశ్రాయేలునకు కొంతవరకు గ్రుడ్డితనము కలుగుట (రోమా 11:25.)

మూడవ మర్మము: ఈ యుగము చివరిలో జీవించుచున్న పరిశుద్దుల రూపాంతర మర్మము (I కొరింథీ 15, థెస్ట్స 4:14-17.)

నాల్గవ మర్మము: యూదులును అన్యులును కలిసి ఒక్కశరీరముగా ఉన్న క్రొత్త నిబంధన సంఘము యొక్క మర్మము. (ఎఫెసీ 3:1-11, రోమా 16:25, మరియు ఎఫెసీ 6:19, కొలస్సి 4:3.)

ఐదవ మర్మము: సంఘము యొక్క మర్మము, క్రీస్తుయొక్క వధువుగా. (ఎఫెసీ 5:28-32.)

ఆరవ మర్మము: నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండుచు జీవించుచున్న క్రీస్తుయొక్క మర్మము. (గలతీ 2:20 మరియు హెబ్రి 13:8, మరియు ఇంకనూ ఆ విధముగా అనేక అధ్యాయములు.)

ఏడవ మర్మము: క్రీస్తు దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణతగా దైవీక జ్ఞానమును, దైవభక్తిని ఒక మనిషిలో పునరుద్దరించిన దేవుని మర్మము.

ఎనిమిదవ మర్మము: (ఈ వర్తమానములో వ్రాయబడలేదు.)

తొమ్మిదవ మర్మము: II థెస్స, అక్రమము యొక్క రహస్య మర్మము.

పదియవ మర్మము: ప్రకటనలోని 1:20లోని, ఏడు నక్షత్రముల మర్మములోనే ఉన్నాము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములు, ఏడు వర్తమానికులు మొదలగునవి.

పదకొండవ మర్మము: మహా వేశ్యయైన బబులోను మర్మము. (ప్రకటన 17:5-7.)

86ఇలాంటి కొన్ని మర్మములను ఆ వర్తమానికుడు ముగించనైయున్నాడు… దేవుని మర్మములన్నింటిని. మరొకటి (నేను దీనిని భక్తితో చెప్పదలిచాను, నన్నునేను గుర్తించుకొనుట కాదు గాని, దేవుని దూతను గుర్తించుచున్నాను): వాక్యము రూపు చెందిన నిరూపణ లేకున్న ఎడల ఇది చివరి కాలమని ఏ విధముగా మనము తెలిసికొనగలము? సర్పసంతానము కాలమంతటిలో మరుగు చేయబడిన మర్మము. కృప పొడిగించబడినది — కృపాహీనము కాదు, అయితే నిజమైన, సత్యమైన కృప; నిత్యముగా మండుచుండు పాతాళము అనునది ఏదియు లేదు. మీరు ఒకవేళ అనేక లక్షల సంవత్సరములు మ౦డవచ్చు, అయితే నిత్యత్వము అనునది ప్రారంభము లేదా ముగింపు లేనిది, పాతాళము సృష్టించబడిన ఒకటి — ఈ మర్మములన్నియు.

పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము. మీయందు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నదే గాని, ఉద్రేకముతో కూడినది కాదు. నీటి బాప్తిస్మ మర్మము, ఆ గొప్ప త్రిత్వ విధానము ఆ బాప్తిస్మమును తండ్రి, కుమార, పరిశుద్దాత్మ యొక్క బిరుదులకు తెచ్చి వేసినది; దైవత్వము యొక్క మర్మము, "యేసు క్రీస్తు" నామములోని బాప్తిస్మము నందు సంపూర్ణమగుచున్నవి. ఇది ప్రకటన గ్రంథము ప్రకారము నెరవేరుచున్నది, ఈ సమయములో ఉన్న సంఘము దానిని పొందవలసియున్నది. ఇంకనూ కొన్ని మర్మములు ఉన్నవి.

అగ్ని స్తంభము వెనుదిరిగి వచ్చినది. ఆమేన్! జరుగవలసినది కార్యము అదియే, మరియు మనము దానిని చూచాము!

1COR 14:8•

HEB 13:8

 

87ఓ, ఆ మర్మములకు పేరిడుచు ముందుకు వెళ్తూ ఉండవచ్చు. ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన అగ్ని స్తంభము — దమస్కు మార్గములో సౌలును తాకిన అదే అగ్ని స్తంభము, అదే అగ్ని స్తంభము, అదే శక్తితో అవే కార్యములను చేయుచు, అదే వాక్యమును బయలుపరచుచు, బైబిలులోని ఒక్కొక్క వాక్యముతో నిలచియుండినదై వచ్చుచున్నది.

బూర శబ్దమనగా "సువార్త బూర," అని అర్థము. బైబిలులో బూర శబ్దమనగా, "ఆత్మీయ యుద్దమునకు" సిద్దపడుట యని అర్ధము. మీరు దానిని వ్రాసికొనుచున్నారా? ఆత్మీయ యుద్దము! పౌలు ఇలా చెప్పుచున్నాడు, (మీరు వ్రాసికొన తలంచిన I కొరింధీ 14:8), "మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్దమునకెవడు సిద్దపడును?" అది ఆత్మీయ ధ్వని లేక శబ్దమును కలిగియుండనియెడల, ఒక నిరూపణ, దేవుని వాక్యము రూపుచెందిన నిరూపణ లేకున్నయెడల ఇది చివరి కాలమని ఏ విధముగా మనము తెలుసుకొనగలము?

యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, ఒకవేళ వారు నమ్ముచున్నారని చెప్పుచు. కాని ఆయన యొక్క సూచనలను మరియు అద్భుతములను నిరాకరించుచున్నదే గాని, ప్రకృతిలోని సర్వము ఆయనపై విశ్వాసము ఉంచియున్నది. మరియు దీని ద్వారా సమస్త సంఘము ఆయనను విశ్వసించుచున్నది, మనము ఏ విధముగా సిద్దపడవలెనో ఎట్లు తెలిసికొనగలము?

1COR 14:8•

HEB 13:8

 

88ఒకరు ముందుకు వచ్చి చక్కగా పటములు గీచి చూపించారు, మరియు మరొకరు మరొక దానితో వచ్చారు, వీటన్నిటిని గీచి చూపించారు, అయితే దీనికి వ్యతిరేకముగా ఉన్నది. ఒకరు ముందుకు వచ్చి "అదె ఇది," అని చెప్పుచున్నారు, మరి కొందరు కొన్ని పుస్తకములను వ్రాయుచున్నారు.

అయితే దేవుడు తన పునరుద్దాన శక్తితో వచ్చుచున్నాడు, మరియు దానికి వ్యతిరేకముగా ఎవ్వరు మాట్లాడగలరు? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నప్పుడు; ఆయన నిన్న, నేడు, నిరంతరము చేయు వాటినే చేయును. అదియే ఈ దూత చేయవలసియున్నది — ఆ మర్మములను తీసికొని, విడిచిపెట్టబడినవాటిని తీసికొని ప్రజలు దాని ద్వారా వెళ్ళునట్లు చేయును.

గమనించుడి, అది కాని ధ్వని ఇచ్చినయెడల, వాక్యానుసారము కానియెడల, ఎవరు సిద్దపడగలరు? అయితే ఒక బూర అనునది.. ఆ ఒక్కొక్క కాలమును మీరు గమనించారా. నేను మీతో చెప్పినట్టు, సంఘము వచ్చుచుండగా, బూర ఒకటి ఊదబడుచున్నది, ఒక ముద్ర విప్పబడుచున్నది. బూరయనగా యుద్దమని అర్ధము! అది వాక్యానుసారమైన శబ్దమును ఇవ్వనియెడల, దాని గురించి ఏమిటి?

దీనిని మీ జ్ఞాపకమునకు తీసుకొనిరానివ్వ౦డి. దీనిని ఇప్పుడు తప్పిపోనివ్వకుడి.

89గమనించండి, ప్రతి సంఘకాలము దాని వర్తమానికుని గలిగియుండినది. మనకది తెలియును. పౌలు ఆ మొదటి వర్తమానికునిడుగా ఉన్నాడు. ఆ మొదటి బూర ఊదబడినప్పుడు, ఆ మొదటి ముద్ర విప్పబడినది. మనము కనుగొనిన ప్రకారము, పౌలు, ఆ మొదటి వర్తమానికుడుగా ఉన్నాడు. మరియు అతడేమి చేశాడు? యుద్దమును ప్రకటించాడు. దేనిపై? ఆనాటి సిద్దాంతవాద సంఘము పైన యుద్దమును ప్రకటించాడు, ఎందుకనగా యేసు వారికి ఇచ్చిన ఆ మెస్సీయా సూచనను నమ్మలేదు గనుక.

ఎందుకు, వారు దానిని తెలిసికొని యుండవలసియున్నది! వారు ఆయనను తెలిసికొని యుండవలసియున్నది! జ్ఞాపకము ఉంచుకొనుడి, పౌలు ఆ కాలము చివరిలో వచ్చెను — సమస్త వర్తమానికులు ఆ కాలముల చివరిలోనే వచ్చారు. ఆ చివరి కాలములోనే ఇవన్నియు ముందుకు వచ్చును.

పౌలు, లేఖనములను ఎరిగినవాడై, యేసు, మెస్సీయాయేనని ఎరిగియుండి… ఆ సమాజమందిరములో ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళుచూ, వాక్యముతో వాటిని పగులగొట్టెను, వారిలో ప్రతివారిని వెలుపల ఉంచెను; చివరిగా అతడు తన పాదధూళిని దులిపివేసి, అన్యుల ప్రక్కకు తిరిగెను.

ROM 1:17

 

90అదియేమి? అదే బూరను ఊదుట! దూత, వర్తమానికుడు, వాక్యముతో అక్కడ నిలచియున్నాడు. ఓ, మై! దీనిని ఇప్పుడు విడచి పెట్టకండి! అది వాక్యమైయున్నది! మరియు పౌలు, కల్పితము లేని దేవుని వాక్య వివరణతో, ఆ సమాజమందిరములను పగులగొట్టెను. తన ప్రాణమునే వెలగా అర్పించెను.

మనము ఏ విధముగా ఐరేనియస్ దగ్గరకు వెళ్లగలము, అతడు తరువాత సంఘకాల వర్తమానికుడు! పరిశుద్ద మార్టిన్, ఆ తరువాత వర్తమానికుడు. వారు నికొలాయితీయుల సిద్దాంతములను గైకొనుటకు ప్రారంభించగానే — అవి లోపలకు వచ్చుటకు ఆరంభించినవి. వారు ఆ కాలములను ప్రేల్చివేశారు. పరిశుద్ద మార్టిన్, తన కాలమును ప్రేల్చివేశాడు.

ఆ తరువాత లూథరు, ఐదవ వర్తమానికుడు, కాథలిక్ సంఘమును దేవుని వాక్యముతో ప్రేల్చివేసెను. "నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించెదరు," అది అతడు చెప్పెను; "ఇది క్రీస్తు యొక్క బాహ్య శరీరము కాదు?" అతడు ఆ బల్ల సంస్కారమును క్రిందపడవేసి, వెలుపలకు వెళ్లిపోయాడు. అతడు ఆ కాథలిక్ సంఘమును ప్రేల్చివేశాడు! ఆ బూర ఊదబడినది. అది నిజము. అది నిజమేనా?

91జాన్ వెస్లీ, ఆంగ్లికను సంఘ దినములలో, వారు "ఇకపై ఉజ్జీవములు లేవు," అని వారు చెప్పుచుండగా, అది విత్తనములోనికి వెళ్లినది. అయితే జాన్వెస్లీ కృప యొక్క రెండవ వర్తమానముతో నిలిచెను — శుద్దీకరణము. అతడు ఆ ఆంగ్లికన్ సంఘమును సువార్త బూరతో ప్రేల్చివేసి — యుద్దమును ఆయత్తము చేశాడు. అది నిజము. అతడు దానిని చేశాడు.

ఇప్పుడు, మనము లవొదికయ కాలమందు ఉన్నాము, వారు ఈ కాలమందు మరలా శాఖలుగా చీలిపోయి — మెథడిస్టులని, బాప్టిస్టులని, ప్రెస్బిటేరియనులని, లూథరనులని, పెంతెకోస్తులని, చీలిపోయారు — అయితే మనము ఒక ప్రవక్త రాకడ కొరకు చూచుచున్నాము, మరియు అతడు ఈ కాలమును ప్రేల్చివేసి వారి అక్రమము నుండి మరల్చును.

ఇప్పుడు, కాలమంతటిలో అటువంటి పద్దతి కొనసాగినయెడల, దేవుడు తన విధానమును ఈ దినమందు మార్చుకొనునా? ఆయన దానిని మార్చడు. ఆయన క్రమముగా వచ్చు దానిని నిలుపును. జ్ఞాపకముంచుకొనుడి, ఈ వర్తమానికుడు ఏడవ దూత, అతడు సమస్త మర్మములను తీసికొని ఏకపరచును.

ROM 1:17

 

92గమనించండి, ఆ ఏడవ దూత ధనవంతురాలైన లవొదికయ సంఘమును ప్రేల్చివేయును. "నేను ధనవంతురాలను, నాకు అధికమైన వస్తు సామాగ్రియున్నది, నాకు కొదువ లేదు," అని చెప్పుచున్నది. అయితే ఆయన, "నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరినైయున్నావని ఎరుగకున్నావు," అని చెప్పుచున్నాడు. ఇది అతని వర్తమానముగా ఉన్నది.

ఓ దేవా, మాకు భయము లేని ప్రవక్తను, "ప్రభువు సెలవిచ్చుచున్నాడు," అను దానితో పంపుము. దాని ద్వారా దేవుని నిరూపించిన వాక్యము ముందుకు కదులును. ఆ విధముగా అతడు దేవుని యొద్ద నుండి పంపబడెను అని రుజువు చేయుము. అతడు వచ్చినప్పుడు, అతడు ఆ కాలములన్నింటిని ప్రేల్చివేయును. అతడు నిశ్చయముగా చేయును. ఆయన (దేవుడు) ఆ లవోదికయ సంఘమును అతనికి (ఆ దూతకు) విరోధముగా లేపును. ఖచ్చితముగా అతడు దానిని చేయును. వారు దానిని ప్రతియొక్క కాలములలో చేశారు. ఈ కాలములో అది మారిపోదు. అది ఆ విధముగానే జరుగవలసియున్నది.

93ఇప్పుడు గమనించండి, ఈ లవొదికయ సంఘము. ఆ వర్తమానికుడు ఆ లవొదికయను ముగించివేయును…. ఆ ఏడవ దూత ఆ మర్మములన్నింటిని ముగించివేయును, అవి నిజమునకు గత కాలములలో సత్యము కొరకు యుద్దములలో పోయినవి.

లూథరు లేచాడు, కాని అతడు సమస్త సత్యమును కలిగియుండలేదు. అతడు తీర్పు నీతికరణను మాత్రము కలిగియుండెను! సరి. ఆ తరువాత మరొక వర్తమానికుడు వచ్చాడు, అతని పేరు జాన్ వెస్లీ, అతడు శుద్దీకరణ అను దానితో వచ్చాడు. అతడు దానిని కలిగిలేడు. బైబిలు చెప్పుచున్నది… అది ఫిలడెల్ఫియా సంఘకాలము. ఆ తరువాత వచ్చునది లవొదికయ సంఘకాలము, పరిశుద్దాత్మ బాప్తిస్మముతో వచ్చినది, అయితే వారు దానంతటిని ఏకము చేసి కలిపివేశారు. అందువలన వెనుదిరిగి, వారు మొదటిగా చేసిన విధముగా నామకార్ధ స్థితిలోనికి వెళ్లిపోయారు — ఆయన ఆల్ఫా మరియు ఒమేగా వలె వాటిని చూడవలసియున్నది, ఆయన చేయి ఒక ప్రక్కను మరొక చేయి మరొక ప్రక్కను ఉన్నది — "మొదటిది మరియు చివరిది."

94ఆయన ఆత్మ పెంతెకోస్తు దినమున వ్రాలి మరియు ఆ గుంపును నింపినది. క్రమేణా ఆ సంఘము ఎండిపోయినది, చివరకు చీకటి యుగమునకు వచ్చినది. ఆ ఏడు బంగారపు దీప స్తంభములు, ఏడు సంఘ కాలములు, చివరిది ఆయన నుండి అధిక దూరముగా వెళ్లిపోయినది. అది సుమారు వెయ్యేండ్లు చీకటి కాలముగా ఉండినది, అది కాథలిక్ సంఘముగా ఉండినది. లూథరు వెలుగును తెచ్చుట ప్రారంభించెను, తరువాత వెలుగు ఇంకను కొద్దిగా వాక్యమునకు దగ్గరగా వచ్చినది. ఆ తరువాత వెలుగు ఇంకా కొద్దిగా దగ్గరగా వచ్చెను. ఆ తరువాతి వెలుగు, ఆ లవొదికయలో వచ్చునప్పటికి, ఆ మొదటి స్థలమునకు మరలా వెళ్లిపోయినది; అది దాని మొదటి స్థితిగా, నేరుగా అదే గజిబిజిలోనికి చేరిపోయినది. నా భావమేమిటో మీరు చూచుటలేదా?

95ఇప్పుడు గమనించండి. అక్కడ అధిక సత్యము విడిచిపెట్టబడినది. ఎందుకు? అక్కడవారు సత్యముతో సర్దుబాటు చేసికొన్నారు. అయితే ఆ ఏడవ దూత ఎవ్వరితోను, దేనితోను సర్దుబాటు కాజాలడు! అతడు సమస్తమును విడిచిపెట్టబడిన — దానినంతటిని సమకూర్చును. ఆయన బూర ధ్వని చేయునప్పుడు, దేవుని సమస్త మర్మములు ముగించబడును. దేవుడు అతనిని పంపెను. దాచిపెట్టబడిన సమస్తమర్మములు అప్పటికి ముగించిపోవును… అదంతయు అతనికి బయలుపరచబడెను.

అయితే ఏమిటి? ఇవన్నియు దాగియుండిన మర్మములు, కాబట్టి వీటిని బయలుపరచుటకు అతడొక ప్రవక్తగా ఉండవలసియున్నది. మనము అనేక కార్యముల ద్వారా వెళ్ళుట ద్వారా, ఈ చివరి దినములలో వచ్చు ఆ ప్రవక్త మనము ఎదురుచూచుచుండు ఆ గొప్ప ఏలీయాగా ఉండునా? ఎందుకనగా ఈ మర్మములు వేదాంత పండితులకు మరుగుచేయబడినవి, ఇవి దేవుని ద్వారా బయలుపడవలసియున్నది. వాక్యము ప్రవక్తలకు మాత్రమే వచ్చును, మరియు అది మనకు తెలియును. వాగ్దానము చేయబడినట్లు అతడు రెండవ ఏలీయాగా ఉండును. ఓ, మై! అతడు తెచ్చు వర్తమానము వీటన్నిటికి పైనుండు మర్మములుగా ఉండును.

JOEL 2:25•

ACTS 4:12

 

96మనకు నీటి బాప్తిస్మమున్నది — అదంతయు కలిసిపోయినది. అది నిజము, ఒకరు చిలకరింపు, మరొకరు తలపై నీళ్లు పోయుట; మరొకరు తండ్రి, కుమార, పరిశుద్దాత్మ, అనువాటిలో బాప్తిస్మము ఇచ్చుట; ఒకరు మూడు పర్యాయములు, బాప్తిస్మమిచ్చెదరు — ఒకటేమో దేవుని పేరైన "తండ్రి," మరొకటి దేవుని పేరైన, "కుమారుడు," ఇంకొకటి దేవుని పేరైన "పరిశుద్దాత్మ"; మరొకరు, "నీవు చేయునది పొరపాటు అట్లు కాదు, మరలా వెనుకకు మూడుసార్లు బాప్తిస్మమివ్వవలసియున్నదని," చెప్పెదరు. ఓ, ఏమి ఆ గందరగోళము!

అయితే అదంతయు చుట్టివేయబడినవి. ఎందుకనగా, ఉన్నది ఒక్క దేవుడే. ఆయన పేరు యేసుక్రీస్తు; మరియు రక్షించబడుటకు, ఆకాశము క్రింద మరొక నామము లేదు. ఒక లేఖనమైనను లేదు, బైబిలులో ఎక్కడైనను ఎవ్వరైనను యేసుక్రీస్తు నామమున కాక మరొక నామములో బాప్తిస్మమిచ్చినట్లు వ్రాయబడలేదు. ఆ క్రొత్త సంఘములో… ఏ ఒక్క స్థలములో కూడా ఆ విధముగా ఇవ్వబడలేదు, లేక యేసుక్రీస్తు సంఘము ఎప్పుడైనా చిలకరింపు ద్వారా లేక పోయుట ద్వారా ఇవ్వబడినదా? ఏ ఒక్క కార్యక్రమములో కూడ ఇవ్వబడలేదు, "నేను నిన్ను తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తిస్మమిచ్చుచున్నానని," ఎవరూ చెప్పలేదు. అవి సిద్దాంతములును మరియు అవి ఆచారములైయున్నవి. సత్యము కొరకు జరుగు యుద్దములో, అవన్నియు తొలగిపోవును. అయితే దేవుడు దానిని చివరి దినములలో పునరుద్దరించును. "నేను పునరుద్దరించెదను," అని ప్రభువు చెప్పుచున్నాడు." ఇంతకు ముందు "వధువు వృక్షము"లో ఆ పునరుద్దరణను చూచాము.

MATT 24:37•

LUKE 17:26

 

97అందుకు ఒక ప్రవక్త కావలసియున్నది. అతడిక్కడ ఉండునని బైబిలు చెప్పుచున్నది. అది నిజము. అతడిక్కడ ఉన్నాడని మలాకి 4 మాట్లాడుచున్నది, అతడున్నాడని మనము విశ్వసించుచున్నాము. మనము అతని కొరకు చూచుచున్నాము, మరియు మనము అతని నిరూపణ కొరకు ఎదురుచూచుచున్నాము. నిరూపించబడిన దేవుని వాక్యమును మనము చూచెదము.

కేవలం కొందరు మాత్రము దానిని గ్రహించబోవుచున్నారు. "నోవహు దినముల వలె, మనుష్య కుమారుని రాకడయందు జరుగును." ఏది రక్షించబడినది? ఐదు ఆత్మలు మాత్రమే. లోతు దినములలో ముగ్గురు మాత్రమే రక్షించబడిరి. భార్య ప్రారంభించినదే గాని, నశించిపోయినది. మనుష్య కుమారుని రాకడలో అలాగే జరుగును. కొందరు మాత్రమే రక్షించబడుదురు, ఆ సమయములో రూపాంతరము చెందెదరు — మర్మములలో ఒకటి, సంఘము ఎత్తబడుట. లోతు వెలుపలకు తేబడినట్లు. నోవహు పైకి ఎత్తబడెను. సంఘము కూడ పైకి ఎత్తబడును. ఒకరు లోనికి వెళ్లారు, ఒకరు వెలుపలకు వెళ్లారు, మరొకరు పైకి వెళ్లుచున్నారు. చూడండి, అది ఖచ్చితముగా, పరిపూర్ణముగా.

వాక్యము వచ్చుచున్నది.

1TIM 3:16•

REV 10:7

 

98ఈ మర్మములన్నియు శబ్దించి (పలుకబడి) ముగించిపోవునప్పుడు, లోపల వ్రాయబడిన గ్రంథము ముగించిపోయినది.

ఇప్పుడు, మనము దానిని మరలా చదివెదము, అందువలన మీరు ఖచ్చితముగా ఉండెదరు. ఇప్పుడు చూడండి:

అయితే ఏడవ దూత పలుకు దినములలో [ఆ చివరి వర్తమానికుడు], "అతడు బూర ఊదబోవుచుండగా, దేవుని మర్మము సమాప్తమగును…"

ఇప్పుడు, "దేవుని మర్మము" అనగా ఏది? వాటిలో ఒకటి. పౌలు I తిమోతి 3 (అదేనని నేను నమ్మెదను), "నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది." "ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలోప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను — ఆయనే దేవుడు."

నిశ్చయముగా, అది ఒక గొప్ప మర్మమైయున్నది, అయితే అదంతయు ముగించిపోయినది. అది, తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అనుచు — ముగ్గురు దేవుళ్లు కారు — అయితే ఒక్క దేవుడు మూడు కార్యాలయములలో: మోషే క్రింద తండ్రి స్థానములోను, క్రీస్తు క్రింద కుమారుని గాను, ఈ కాల పరిధిలో పరిశుద్దాత్మ గాను బయలుపడెను. అవి ఒక్క దేవుని మూడు కాలపరిధులై ఉన్నవి — ముగ్గురు దేవుళ్లు కాదు. ఆ మర్మము ఇప్పుడు ముగించిపోయినది. అది ముగించి పోవునని బైబిలు చెప్పుచున్నది.

99గత దినములో శాస్త్రజ్ఞలు వారు చెప్పుదానితో వ్యతిరేకముగా చేయుటకు ప్రయత్నించిరి. అప్పుడు నేను, "హవ్వ ఒక ఆపిలు పండు తిన్నదని ఎవ్వరైనను నమ్మెదరా?" అని అడిగినప్పుడు విజ్ఞాన శాస్త్రము ఏమి చెప్పినదనగా (గత దినములో వార్తా పత్రికలో పెద్ద అక్షరములలో నేను చూచాను) "ఆమె ఒక ఆఫ్రికాట్ పండును తిన్నది," అని వ్రాయబడినది. అదెంత బుద్ధిహీనత! అది ఆమెను మోసగించునా? చూడండి, వారు కేవలము…

కయీను కూడ అలాగే తలంచాడని మీకు తెలియును. అందుకే అతడు వాటినే తెచ్చాడు, అయితే దేవుడు అతని బలిని అంగీకరించలేదు. హేబెలు, నీతిమంతుడు, కావున అతనికి బయలుపర్చబడినది. అది రక్తమని బయలుపరచబడినందున, అతడు రక్తమును తెచ్చాడు. ఓ, దేవా, ఈ సంఘము మరియు మేము జీవించున్న ఈ కాలము!

EZEK 18:4,20•

MATT 25:41•

REV 20:6

 

100ఆ గ్రంథములో వ్రాయబడినది అంతయు, ఆ దూత పలుకు దినములలో ముగుయును (ఇప్పుడు, దయచేసి దీనిని అర్ధము చేసుకొనండి)… ఆ ఏడవ దూత వర్తమానము పూర్తియైన వెంటనే: దైవత్వపు మర్మము, సర్ప సంతానము యొక్క మర్మము, మిగిలిన ఈ మర్మములన్నియు ముగించిపోవును. నిత్యత్వపు కుమారత్వపు వారు మాట్లాడుచుండునట్లుగా, ఏ విధముగా నిత్యత్వపు కుమారుడుగా ఆయన ఉండగలడు? నిత్యత్వమునకు ప్రారంభము లేదు లేదా ముగింపు లేదు. ఒక కుమారుడనగా జన్మించినవాడని అర్ధము. అది ఏ విధముగా జ్ఞానమగును?

నిత్యనరకము ఏ విధముగా ఉండును? నరకము సృష్టింపబడిన ఒకటి. మండే నరకము అను దానిని నేను కూడ నమ్ముచున్నాను. నిశ్చయముగా. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. అయితే అది నశించిపోవలసియున్నది. బైబిలు ఇలా చెప్పుచున్నది, "రెండవ మరణములో పాలు పొందని వారు ధన్యులు," చూశారా. చూడండి, మీరు ఆ రెండవ మరణములో నశించరు. ఆ మొదటిది, ప్రకృతి సంబంధమైనది. రెండవది, ఆత్మ సంబంధమైనది, సమస్తము ముగించబడినప్పుడు. పాపము చేసిన ఆత్మ, ఆ ఆత్మ మరణించును. మీరు మీ పాపముల నిమిత్తము దండింపబడుదురు, అవి ఎన్నో వేల సంవత్సరములుగా ఉండవచ్చు.

కాని నిత్య నరకము అనునదిలేదు, ఎందుకనగా నరకము అనునది సృష్టింపబడినది అని బైబిలు చెప్పుచున్నది. ఏ విధముగా సృష్టింపబడినది నిత్యమైనదిగా ఉండగలదు. అటువంటిది ఒకటున్నయెడల… నరకము ఆ దయ్యమునకును (సాతానుకును) అతని దూతలకును సృష్టించబడినదని బైబిలు చెప్పుచున్నది. అట్లైన అది సృష్టింపబడినది, అది నిత్యమైనదిగా ఉండుటకు వీలులేదు; ఎందుకనగా నిత్యత్వము… నిత్యమైనది ఏదైనను ప్రారంభము లేదా ముగింపు గాని లేకుండును.

ఆ విధముగానే మనము ఎన్నడూ మరణించము, ఎందుకనగా మనము ఎల్లప్పుడు ఉండెదము. మనము దేవుని భాగమైయున్నాము, దేవుని నుండి వచ్చినవారమైయున్నాము. ఆయన ఒక్కడే ఉన్న దానంతటలో నిత్యుడు. ఆమేన్. దేవుడు మరణించడు గనుక మనమును మరణించము, ఎందుకనగా మీరును ఆయనతో నిత్యమైనవారైయున్నారు. ఆమేన్! అంతట అది వచ్చును! హల్లేలూయ! ఈ పాత పురుగుల నివాసములో ఒక రకమైన ఆయాసమును పొందుచున్నాము.

101గమనించుడి, ఆ గ్రంథము వ్రాయబడినది. గత కాలములో లూథరు, వెస్లీ, పెంతెకోస్తు చేసిన సత్యము కొరకైన యుద్దములో మిగిలిపోయినవాటిని ఈ దూత చేసి ముగించినప్పుడు. అయితే ఒకరు వచ్చెదరుని బైబిలు చెప్పుచున్నది, అతని స్వరము పలుకు దినములలో మిగిలిపోయిన ఈ మర్మములన్నియు. ఓ ఏకత్వపు వాళ్ళు యేసు నామమున పరుగిడుచున్నారు. త్రిత్వపు వాళ్లు తండ్రి, కుమార, పరిశుద్దాత్మ పై పరుగిడుచున్నారు, వీటిని అన్నింటిని వారు నైసియా సమావేశములో చేశారు. అదే కార్యము ఇప్పుడు కూడ జరుగుచున్నది. వారిరువురు కూడ పొరపాటుగానే యున్నారు. అయితే ఇప్పుడు వారి మధ్య లేఖనములు సత్యమును ఉంచుతున్నవి. మనము ఎక్కడున్నామో మీరు చూస్తున్నారా? ప్రభువు యొక్క ఆ దూత.

REV 5:1•

REV 10:1-4,7

 

102గమనించండి, ప్రకటన 5:1. దీనిని ఇప్పుడు వినండి.

మరియు లోపటను వెలుపలను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని.

ఇప్పుడు ఆ గ్రంథము లోపలిప్రక్క వ్రాయబడియున్నది, అయితే వెనుకప్రక్క వ్రాయబడియున్నది. అయితే వెనుకప్రక్క ఏడు ముద్రలు ముద్రించబడియున్నవి. దాని వెనుక ప్రక్క వ్రాయబడినది ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. దీని ప్రత్యక్ష్యతను తెలుపు వ్యక్తి ఇలా మాట్లాడుచున్నాడు — అతడు యోహాను. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, అది గ్రంథములో వ్రాయబడలేదు. "మరియు ఏడవ దూత పలుకు దినములలో అందులో వ్రాయబడిన మర్మములన్నియు పూర్తి కావలసియున్నది." ఆ దినములో దానిని గురించి శ్రద్ద తీసికొనవలసియున్నది.

నేనేమి చెప్పుచున్నానో గ్రహించారా? నన్ను వెంబడించుచున్నారా?

ప్రకటన 10లోని ఏడు స్వరములు బయలుపడు కాలముగా ఇది (మనము జీవించు ఈ కాలము) ఉన్నది. ఆ గ్రంథము ముగించినప్పుడు ఒక్క కార్యము మాత్రమే మిగిలియుండును, అని ఆ ఏడు మర్మమైయున్న ఉరుముల యొక్క స్వరములు, అని ఆ గ్రంథము వెనుక ప్రక్క వ్రాయబడియున్నవి. యోహాను వాటిని వ్రాయుటకు అనుమతించబడలేదు. దానిని నేను చదివెదను.

"బలిష్టుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆయన మేఘము ధరించుకొనియుండెను. ఆయన శిరస్సు మీద వర్షధనస్సుండెను; ఆయన ముఖము సూర్య బింబమువలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను.

ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్నపుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి.,

సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్బటి౦చినప్పుడు, ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. [గమనించండి!]

ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా: [ఏదో ఒకటి మాట్లాడుచున్నది. అది శబ్దము మాత్రము కాదు. అతడు వ్రాయబోవుచుండగా ఏదో అతనితో మాట్లాడెను.] మరియు నేను పరలోకము నుండి ఒక స్వరమును వింటిని, అది నాకు చెప్పుచున్నది.

103[చూడండి ఆ ఉరుములు — పరలోకములో కలుగలేదు; భూమిపై కలిగినవి. ఉరుములు పరలోకములో కలుగవు గాని; భూమిపైనే కలుగును.], నేను వ్రాయబోవుచుండగా: నేను పరలోకము నుండి ఒక స్వరమును వింటిని, అది నాకు చెప్పుచున్నది, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర [పెద్ద అచ్చులలో, ము-ద్ర] వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి యొక స్వరము పలుకుట వింటిని.

అది వెనుక ప్రక్క ఉన్నది ఒక గ్రంథము పూర్తి చేయబడినప్పుడు. ఆ గ్రంథము ముందు భాగమని ఆయన చెప్పుట లేదు. వాటి వెనుక భాగమని ఆయన చెప్పుచున్నాడు. అదంతయు ముగించిన తరువాత ఈ ఏడు ఉరుములు, స్వరములు, ఆ గ్రంథముతో అతుకబడియున్నవి, అవి ప్రత్యక్షము కాలేదు. అవి ఆ గ్రంథములోను వ్రాయబడలేదు.

ఓ,మై! నేను వాటిని ప్రజలకు పొందుకోవలెనని ఆశించుచున్నాను, నిజానికి ప్రజలు… తప్పిపోకండి! తప్పిపోకండి… ఈ సమయములో దయచేసి తప్పిపోకండి. నేను మిమ్మును విడిచిపెట్టు సమయము వచ్చినది. తప్పిపోవద్దు! మీరు ముందు వినుచుండినట్లే దీనిని వినండి. ఈ ముద్రలు ఆ గ్రంథమునకు వెనుక ప్రక్కగా ఉన్నవి. ఆ ఏడవ దూత పలుకు దినములలో ఆ గ్రంథమందు వ్రాయబడిన మర్మములన్నియు పూర్తిచేయబడును. లోపల వ్రాయబడి, తెరువబడిన ఆ గ్రంథము వెంటనే మూయబడినది! దేవుని మర్మములు సమాప్తమైనవి. ఇవియే దేవుని మర్మములు — సంఘములు వెడలిపోవుట మరియు ఇతర కార్యములన్నియు. ఆ మర్మములన్నియు ముగించిపోయినవి.

REV 10:7

 

104ఆ ఏడవ దూత ప్రతి మర్మమును పలికి ముగించిన వెంటనే అది సమాప్తమైనది, అతడెవరైనను కావచ్చును, అదేమైనను కావచ్చును, దేవుని వాక్యము తప్పిపోదు. ఆయన ఇలా సెలవిచ్చెను.

యేడవ దూత పలుకు దినములలో, అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

ఆ కార్యములన్నియు సమాప్తమగును — రోము (రోమను కాథలిక్ సంఘము), వేశ్యగా ఉన్నందున; ప్రొటెస్టెంటు సంఘములన్నియు, శాఖలన్నియు, దాని వెనుక శాఖలుగా వచ్చి దాని యొక్క వేశ్యా కుమార్తెలుగా ఉన్నాయి, చూశారా — ఆ మర్మములన్నియు, అనగా, ప్రవక్తలు చెప్పినవన్నియు, ఈ చివరి ఘడియలో ఇక్కడ, ఇప్పుడు మనముందు బయలుపడినవి. లవొదికయ కాలములో ఆ ఏడవ దూత లేచినప్పుడు సత్యమైన బూరను ఊదుటకు మొదలుపెట్టును, ఎందుకనగా అది (లవొదికయు) వాక్యమునకు వ్యతిరేకముగా ఉండును. వారు దానిని నమ్మరు. వారు దానిని నిజముగా నమ్మరు. అయితే అతడు ప్రేరేపించబడిన ఒక ప్రవక్తగా ఉండును, ఎందుకనగా దానిని రూపుదిద్ది చూపుటకు వేరే మార్గము లేదు.

మనిషి త్రిత్వమును రూపుదిద్ది చూపగలడు, ఆ విధముగానే వారు వృద్దులై, పిచ్చివారై పోయెదరు. ఎవ్వరూ దానిని గ్రహించలేరు. వారు ఇప్పటికిని, "హవ్వ ఆపిలు పండు తినెనని తలంచుచున్నారు." ఆ కార్యములన్నియు ఆ విధముగానే ఉన్నాయి, ఎందుకనగా అవి మానవుడు చిక్కుకొనిపోయిన పారంపర్యములుగా ఉన్నాయి. యేసు తన కాలమందు ఆ సంఘమును చూచినట్టే ఉన్నది. ఆత్మ చేత నడిపించబడు ఒక ప్రవక్త అతని దగ్గరకు వచ్చు దేవుని వాక్యమును, యేసుక్రీస్తు ప్రత్యక్షతగల నిజమైన వివరణతో ఉండవలసియున్నది! కావున, అది ఆ విధముగా ఉండవలసియున్నది! దేవుడు మనకు సహాయము చేయును.

REV 18:4

 

105ఇప్పుడు "ఈ శబ్దము ముందుకు వచ్చునప్పుడు." "అది ప్రభువు సెలవిచ్చునదిగా" ఉన్నది! మనకది స్పష్టము చేయబడినది. అతడు దాని వర్తమానమును మాట్లాడునప్పుడు, యుద్దమును ప్రకటించి — ఆనాటి యూద సంఘముపై పౌలు చేసినట్లును, మిగిలినవారు చేసినట్టును, లూథరువలెను, వెస్లీవలెను — సంస్థలకు విరోధముగా అతడు యుద్దమును ప్రకటి౦చినప్పుడు, వారు అబద్దమును పలుకుచున్నారని వారితో చెప్పును. అది సత్యము కాదని చెప్పును, వారు మనుష్యులను మోసగించుచున్నారని చెప్పును. అతడు దానిని పలుకునప్పుడు మీరు తప్పిపోకూడదు. అది తప్పిపోదు, ఎందుకనగా అతడు (ఆ దూత) దేవుని వాక్యములో నిరూపించబడును. అది ఏమిటని మీరు ఖచ్చితముగా ఎరిగియుండవలసియున్నది. అతడు బబులోను నుండి వెలుపలకు రండని పిలచునప్పుడు, "నా ప్రజలారా, దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దానిని విడిచి రండని," చెప్పును. దేవుడు అతనిని ప౦పెను. దానిని తప్పిపోకండి.

REV 17:5

 

106ఇప్పుడు, అతడు పలుకుట ప్రారంభించినప్పుడు ఆ మర్మము పూర్తియగునని ఇప్పుడు గుర్తించుకొనుడి. అప్పుడు ప్రకటన 10లోని ఏడు ముద్రల శబ్దములు బయలుపడుటకు అది సమయముగా ఉన్నది. మీరు గ్రహించారా? గ్రంథములోని మర్మమములన్నియు ముగించినప్పుడు… బైబిలులో అతడు ఈ మర్మములను ముగించునని చెప్పబడియున్నది.

పూర్వము వారు సత్యము కొరకు పోరాడినప్పుడు, తీర్పు నిరూపణ శుద్దీకరణ — వీటి కొరకు, వాటి కొరకు వారు పోరాడిరి. వారేమి చేశారు? వారు తిరిగి సంస్థలుగా మారిపోయారు. అదే కార్యము మరలా జరిగినది. పెంతెకోస్తులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, లూథరనులు — ప్రతి ఒక్కరు ఆ కార్యమునే చేశారు. బైబిలు, ప్రకటన 17లో చెప్పినట్లే వారు చేశారు — ఆ పూర్వపు వేశ్యయైన తల్లి, దాని కుమారైలు, "బబులోను మర్మము."

107మర్మములలో అది ఒకటై బయలుపడునని బైబిలు చెప్పుచున్నది. ప్రొటెస్టెంటు — వేశ్యలు — ఆత్మీయు వ్యభిచారము చేయుచూ సంఘ శాఖలుగా ప్రజలను నడిపించుచు, వారి అక్రమము శిరస్సుగా, మానవ-కల్పిత సిద్దాంతములతో, ప్రజలను యేసు రక్తముతో నిండిన ఊలు నుండి లాగి వేయుచున్నారు, అయితే సర్వశక్తుడైన దేవుని శక్తి యేసు క్రీస్తును రూపించుటకు ఉచితముగా ప్రవహించుచున్నది.

అది సత్యమైతే దేవుడు దాని వెనుక నిలచును. ఆయనే దానిని చేసెను, ఆయన దానిని కొనసాగించును. అయితే అది నెరవేర్పునకు వచ్చినప్పుడు వాక్యము ముగించిపోవును.

ఇప్పుడు, ఒక్కటి మాత్రము విడిచిపెట్టబడియున్నది. అవి ఆ ఏడు ఉరుములు అవేమిటో మనకు తెలియదు, అది వ్యర్ధముగా ఉరుమదు. దేవుడు ఆటలాడుటకు గాను ఏదో చేయడు. మనము ఆటలాడుదుము, విపరీతముగా నటించెదము, అయితే దేవుడలా చేయడు. దేవునితో ఉన్న ప్రతిది అవును లేక కాదనియు, ఆయనేమి చెప్పుచున్నాడో దానిని చేయువాడైయున్నాడు. దానికేదో ఒక భావము లేక అర్ధము లేనిదే ఆయన దానిని చేయడు. అతను చిన్నపిల్లవాడుకాడు.

REV 10:4

 

108ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యకతలో ఆ ఏడు ఉరుములు ఒక మర్మముగా ఉన్నవి. ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షతయని బైబిలు చెప్పుట లేదా? మ౦చిది, అట్లయిన దానికి సంబంధించినది ఏదో ఒక మర్మము ఉండవలసియున్నది. అది ఏమిటి? వాటిని ఆ ఏడు ఉరుములు కలిగియున్నవి. యోహాను వాటిని వ్రాయబోవునప్పటికి, పరలోకము నుండి ఒక స్వరము దిగి వచ్చి, "వాటిని వ్రాయవద్దు, వాటిని ముద్రించుము; వాటిని ముద్రించి వేయుము; వాటిని ఆ గ్రంథము వెనుక ఉంచుమని," చెప్పెను. అవి బయలుపడవలసియున్నవి. అవి మర్మములుగా ఉన్నవి.

ఇప్పుడు, వీటిని పరిశుద్దాత్మ ద్వారా పూర్తి చేయుదము. అవి ఆపిలు పండ్లు కావని అది మనకు చెప్పుచున్నది. అది శరీర సంబంధమైన క్రియగా ఉన్నది. ఈ కార్యములన్నింటిని మనకు చెప్పినది. దాని ముందు ఏ ఒక్కరు నిలువలేకపోయారు. ఏ ఒక్క బోధకుడైనను దానిని అంగీకరించలేదు. అయితే నేను వారిని అడుగవలసి వచ్చినది.

109మీకు తెలియును, చికాగో పట్టణములో వారి ముందు నిలచినప్పుడు 350 బోధకులు. చికాగో నుండి వచ్చిన స్త్రీలు, మీరు దానిని వినియుండవచ్చు. దానిని గురించి మూడు రాత్రులకు ముందు ప్రభువు నాకు తెలిపెను. ఆయన "వారు నీ కొరకు ఒక ఉచ్చువేయబోవుచున్నారు." కిటీకీ దగ్గర నిలువుము, నీకు చూపెదను.

"శ్రీయుతులు కార్ల్సన్, టామీ హిక్స్, నిన్ను రేపటి ఉదయము కలిసికొని ఉదయాహారమునకు ఆహ్వానించెదరు. నీవు అ టామీతో వేచి ఉండునని చెప్పుము. అయితే అది ఈ విధముగా కనబడును. "వారు తలంచు స్థలములో ఆ కూడిక జరుగదని వారితో చెప్పుము, అది మరొక స్థలమందు జరుగనున్నది. "నీవు భయపడవద్దు. నేను నీతో ఉండెదనని," చెప్పెను. నాకు అది చాలినంతగా ఉండినది.

ఆ మరుసటి ఉదయుము శ్రీయుతులు కార్ల్సన్, సంపూర్ణ సువార్త వ్యాపారుల అధ్యకుడు అక్కడకు వచ్చారు. నన్ను ఆ కూడికకు రమ్మని పిలచారు. అతడు "బ్రెన్హాం సోదరుడా, నేను నీతో ఉదయకాలపు ఆహారము తీసికొనదలచానని," చెప్పాడు.

అప్పుడు నేను "మంచిది. (గమనించును. అటామిహిక్స్ కూడ అక్కడ ఉండునని చెప్పాను.)

మేము అక్కడున్న "టౌన్ అండ్ కంట్రరీ" విడిదికి వెళ్లాము. అప్పుడతడు "మ౦చిది, బ్రెన్హాం సోదరుడా, ఓ, ఇది ఎంతో ఆశ్చర్యముగా ఉన్నదని," చెప్పాడు.

అప్పుడు నేను, "అ టామీ నాకు కొంత దయను (సహాయమును) చూపగలవా?"

"ఓ, ఖచ్చితముగా, బ్రెన్హాం సోదరుడా."

అప్పుడు నేను, "నీవు నా కొరకు మాట్లాడావంటే నేనెంతో సంతోషించుదును," అని చెప్పాను.

అందుకు అతడు, "ఓ, నేనలా చేయలేను," అని చెప్పాడు.

అందుకు నేను, "ఎందుకు? నేను ఒక ఏడవ తరగతి చదివిన విద్యార్థిని. నేను అంపయర్ అను మాటకు బదులుగా ఎంపయర్ అని చెప్పువాడను, చూశారా. వారి ముందు ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఒక గొప్ప చికాగో సేవకుల సమావేశము జరుగబోవుచున్నది. నీవు దైవత్వమును చదివిన డాక్టరువు (Doctor of Divinity), ఏ విధముగా మాట్లాడవలెనో అది నీకు తెలియును, అయితే నాకు తెలియదు," అని చెప్పాను.

అందుకతడు, "బ్రెన్హాం సోదరుడా, నేను మాట్లాడలేను," అని చెప్పాడు.

అందుకు నేను, "ఎందుకు? నీకెన్నో ఉపకారములు చేశాను గదా?" నేను సూటిగా మాట్లాడాను.

అప్పుడు సోదరుడు కార్ల్సన్ మాట్లాడుచూ, "బ్రెన్హాం సోదరుడా, అతడు మాట్లాడలేడు," అని చెప్పాడు.

అందుకు నేను, "ఎందుకు?"

అందుకతడు "మంచిది. దుస్… దుస్… దుస్.. అది. ఉప్."

110అప్పుడు నేనిలా చెప్పాను, "ఎందుకో మీకు తెలియునా? ఎందుకో మీకు తెలియును, కాని నాతో చెప్పుటకు మీరు ఇష్టపడుట లేదు. వారు నా కొరకు ఒక ఉచ్చును పన్నియున్నారు." కార్ల్సన్ సోదరుడా, నీవా విడిది గదిని సిద్దపరచావు. కదా, మరొక దానిని ఎక్కడ కలిగియున్నాము?"

"అవును."

"మీకు దొరుకదు," అని చెప్పాను.

అందుకతడు, "బ్రెన్హాం సోదరుడా, దానికొరకు ముందుగా పైకము చెల్లించి యున్నాము," అని చెప్పాడు.

అందుకు నేను, "మీరేమి చేశారో అది నాకక్కరలేదు, మీకది దొరకదు. అది అక్కడ ఉండదు. అది ఒక పచ్చ రంగు గది, అయితే మనము ఒక బ్రౌన్ రంగు గదిలో కూడనైయున్నాము. నేను వెనుకప్రక్క ఒక మూలగా కూర్చొనియందును. డాక్టరు మీడ్ నా కుడి ప్రక్కగా కూర్చోనెదరు. ఆ నల్ల రంగు వ్యక్తి అతని భార్య, అటు ప్రక్కగా కూర్చొనియుందురు. ఫలాని-ఫలాని వారు అక్కడక్కడ కూర్చొనియుండెదరు. ఒక బుద్ద బోధకుడు నాకు ప్రక్కగా ముందు కూర్చొనియుండును [వారు ఏ విధముగా దుస్తులు ధరించెదరని చెప్పితిని.]

టామీ, "అది ఏమని మీకు తెలుసా. ఆ గొప్ప చికాగో సేవకుల సమావేశము యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మమును గురించి నాతో సవాలు చేయనైయున్నారు! ఆ గొప్ప చికాగో సేవకుల సమావేశము పరిశుద్దాత్మ సాక్ష్యమైన అన్యభాషలు మాట్లాడు దానిని సవాలు చేయబోవుచున్నారు! వారు "సర్పసంతానమును, కృపను గురించి బోధించుటను సవాలు చేయనైయున్నారని," చెప్పాను.

అప్పుడు టామీ చెప్పినదేమనగా, "ఓ కృప మంచిని చేయును గాక, నేనక్కడికి వెల్లెదనని తలంచుట లేదని," చెప్పాడు.

అందుకు నేను "అవును నీవు వచ్చెదవని," చెప్పాను.

111ఆ మరుసటి దినము ముందు, పైకము తీసికొన్న ఆ విడిది అధికారి ఆ పైకమును తిరిగి ఇచ్చివేశాడు. "అక్కడ ఒక సంగీత బృందమునకు ముందుగా పైకము తీసికొని దానిని మర్చిపోయాము, దానిని వారు ముందుగా నిర్ణయించుకొనిరి. మేము వారికి ఇవ్వవలసియున్నది, కావున మీకు ఇచ్చుటకు వీలుపడదని," చెప్పేశారు. మేము "టౌన్ అండ్ కంట్రీ" విడిదికి వెళ్లాము.

ఉదయము అక్కడికి వెళ్లినప్పుడు వారందరు అక్కడ నిలచియుండిరి. నేనక్కడ ఆ బల్లవెనుక కూర్చొని వేచియున్నప్పుడు, వారు ఉదయకాల ఆహారమును ముగించుకొని వచ్చారు. వారి చుట్టు నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. (మేము ఒక గదిలో అల్పాహారమును తీసికొనివచ్చి కూర్చొన్నాము) అక్కడ ఆ గొప్ప చికాగో సేవకుల సమావేశము జరిగినది. వారినందరిని నేను చుట్టూ కలియచూచాను, వారిని చూచాను. వారిలో ప్రతి ఒక్కరు ఒక డాక్టరుగా Ph.D.,LL, QU.S.T. తక్కిన ఉన్నతమైన వారుగా తమను పరిచయము చేసికొనిరి. నేను కూర్చొని మౌనముగా వింటూ ఉండిపోయూను. అప్పుడు వారు వారి కార్యక్రమము ద్వారా వెళ్ళుటకు ప్రారంభించారు.

112సోదరుడు కార్ల్సన్ లేచి నిలచి, "మహాశయులారా." (మీ కందరికి హాంక్ కార్ల్సన్ బాగుగా తెలియును, ఎందుకు, దానిని మనము టేపుల యందు కలిగియున్నాము. మీరు ఆ టేపును కొనదలచినయెడల అవి ఇక్కడ దొరకును. అక్కడున్న ఆ పిల్లల యొద్ద అవి దొరకును.) అప్పుడతడు, "మహాశయులారా…" "ఇప్పుడు మీకు సోదరుడు బ్రెన్హాం గారిని పరిచయము చేయునైయున్నాము."

"మీరందరు ఆయన సిద్దాంతముతో వ్యతిరేకించవచ్చు, అయితే నేను మీతో కొంత చెప్పనివ్వండి. మూడు రోజుల క్రితము మేము ఒక స్థలములో కూర్చొనియున్నప్పుడు, ఆ మనుష్యుడు ఇక్కడ ఇంత వరకు జరిగిన సమస్తమును చెప్పకున్నయెడల, నేనిక్కడ నిలచియుండను. మీరందరు ఆయనను తన సిద్దాంతముపై ప్రశ్నించబోవుచున్నారని, ఆయన ముందుగా నాతో చెప్పాడు. మనము ముందు ఎన్నుకొన్న గదిని మార్చవలసి వస్తుందనియు చెప్పాడు. మరియు ఎవ్వరెవ్వరు ఎక్కడెక్కడ కూర్చొనియుందురనియు; ముఖ్యముగా డాక్టరు. మీడ్, మరియు ఇతరులు ఖచ్చితముగా ఆ స్థలములలో కూర్చొనియున్నారు. మీరు ఆయనతో సమ్మతించకపోవచ్చు, అయితే నేను ఒక్క సంగతి చెప్ప తలంచాను, అతడు తలంచు దానిని గురించి అతడు భయములేక యున్నాడు. "ఇప్పుడు సహోదరుడా బ్రెన్హాం, వేదికను మీకిచ్చుచున్నానని," అతడు చెప్పాడు.

ACTS 26:19

 

113అప్పుడు నేను, ప్రారంభించుటకు ముందు, ఈ ఉదయము నేను చదివిన దానినే చదివాను, "వాక్య భాగము పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాను." ఇప్పుడు మన కార్యమును ముగించెదము. మీరందరు దైవత్వపు డాక్టరుగా, పరిచయము చేసికొన్నారు. ఇక్కడ నేను ఒక్కడనై నిలచియున్నాను. అట్లయిన మీరు యేసు నామములోని బాప్తిస్మమును గురించి నన్ను ప్రశ్నించబోవుచున్నారు. దానిని మొదటిగా మనము ప్రారంభించెదము, "మీలో ఎవ్వరైనను ఒకరు మీ బైబిలును తీసికొని నా ప్రక్కగా వచ్చి నిలచి! నేను ఉపదేశించిన దేనినైనను, దేవుని వాక్యముతో దానిని అసత్యమని నిరూపించుడని కోరుచు మౌనముగా వేచియున్నాను."

ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను, "మీలో ఎవ్వరైనను వచ్చి ఇక్కడ నా ప్రక్కగా నిలువుడని చెప్పుచున్నానే గాని ఎవ్వరూ వచ్చుచున్నట్లు కనబడుట లేదు. ఏమైనది? మీరు వచ్చి నాతో నిలచుటకు భయపడినయెడల, నా వెనుక నిలువుడి. వారు భయపడునది నాకు కాదు, సర్వశక్తుడైన దేవుని ఉగ్రతకు వారు భయపడుచున్నారు. ఆయన నాకు ముందు జరుగనైయున్నవాటిని చెప్పునని ఎరిగియున్నారు, వారికి తెలియును, నేను వారిని గురించి తలంచుదానికన్నను వారెంతో అధిక తెలివిగలవారు. వారు అధికముగా అక్కడ నిలచుటకు తెలిసినవారైయున్నారు.

114మీకు తెలియును, కాలములలో మీరు… ఆ కాలములలో కూడ వారు ఆ విధముగా చేయలేదు. (గడచిన సంఘ కాలములయందును అప్పుడున్నవారు సత్యమును అంగీకరించలేదు), ఏమైనది? అదెంతో గొప్పగా ఉండినది. అదెంతో సత్యమైనదని వారెరిగియున్నారు. నేను దానిని టేపులలో మాట్లాడియున్నాను. ఎక్కడికైనను నేను సిద్దముగా ఉన్నాను. క్రైస్తవ మార్గములో ఏ సహోదరునితోనైనను మాట్లాడుటకు సిద్దముగా ఉన్నాను. నేను ఎవ్వరితోను వాదించను, అయితే మీలో ఎవ్వరైనను వచ్చి వాక్యముతో దానిని అసత్యమని నిరూపించవలెనని కోరుచున్నాను. మీ యొక్క అచ్చు పుస్తకములతో కాదు, మరి ఫలాని-ఫలాని ఒక డాక్టరు చెప్పాడని కాదు, లేక ఫలాని-ఫలాని పరిశుద్దుడు చెప్పాడని కాదు. దేవుడేమి చెప్పాడో, నేను తెలిసికొనుటకు ఇష్టపడుచున్నాను. అది పునాదిగా ఉన్నది. అది ఏమిటని తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను. అయితే వారు ఆ విధముగా చేయుట లేదు.

115ఇప్పుడు చూడండి. ఆ ఏడు స్వరముల కాలము వచ్చినప్పుడు, (ఆ గ్రంథము ముగించినప్పుడే ఆ ఏడు స్వరముల కాలముగా ఉన్నది) అప్పుడు ప్రకటన 10వ అధ్యాయము బయలుపడవలసియున్నది. ఇప్పుడు గమనించ౦డి, వినండి. (ఇప్పుడు మిమ్ములను అధిక సమయము ఇక్కడ ఉంచను, నేను మిమ్ములను ఆయూస పెట్టుచున్నానని నాకు తెలియును. ఇప్పుడు 10.00 గంటలకు 20 నిమిషములు ఉన్నవి. దగ్గరగా వినండి, మీరు లేచి మీ స్థలములును మార్చుకొనుచున్నారనియు తెలియును. సంఘము దీనికొరకు నిర్మించబడినప్పుడు నేనెంతో సంతోషించెదను. ఇటువంటి సమయుములో మనము మౌనముగా ఉండకూడదు. మనము బోధించుటకు దినమంతయు తీసికొనవలసియున్నది.)

ఇప్పుడు గమనించండి, ఇప్పుడు గుర్తుంచుకొనండి. ఆ ఏడు స్వరములు ఆ ఏడు ఉరుములుగా ఉన్నాయి — అవి ప్రేలినవి! (దేవా మాకు సహాయము చేయుము! ఒకవేళ నేను పొరబడినచొ, ప్రభువా, నన్ను మన్నించుము.) నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఈ స్వరము శబ్దించినప్పుడు, ఆ ఉరుముతో అది ప్రేలినది. ఏడు సంఘకాలములను వెంటపడిన ఏడు ముద్రలను మీరు గమనించినట్లయిన — ఆ మొదటి ముద్ర తెరువబడినప్పుడు, అక్కడ ఒక ఉరుము ఉండినదా? ఆ గ్రంథములో మొదటి ముద్ర తెరువబడినప్పుడు, అక్కడొక ఉరుము ఉండినది. ఆ గ్రంథము వెనుక ప్రక్క ఆ మొదటి ముద్ర ఆ విధముగా తెరవబడలేదా? దేవుడు తన కార్యక్రమమును మార్చడు.

REV 6:1•

REV 8:1

 

116ప్రకటన 6వ అధ్యాయమును త్రిప్పుదము.

"ఆ గొర్రెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమువంటి స్వరములో చెప్పట వింటిని."

ఇప్పుడు, అక్కడ మరియొక ఉరుము లేదు; "మరియు ఆఖరి ముద్ర తెరువబడినది, అక్కడ పరలోకములో ఒక అర్ధగంట మౌనము ఏర్పడినది." కాని మొదటి ముద్ర తెరువబడినది; అక్కడ ఉరుమువంటి ప్రేలుడు సంభవించెను.

ఓ సంఘమా, అది (మన మధ్య) ఉన్నదా, సాధ్యమగునా? దానికి మనమెంతో దూరముగా ఉన్నామా? స్నేహితులారా, తలంచి చూడండి! బహుశా… ఆ విధముగా అది దూరముగా లేదని నేను నమ్ముచున్నాను. అయితే అది చేరువైయున్ననేమి? ఆ ధ్వని ఏమిటి? దేవుని ఎదుటను తెరచియుంచిన ఈ బైబిలు గ్రంథము ఎదుటను నేను అబద్దమాడుట లేదు! ఆ ధ్వని లేక ప్రేలుడు భూమిని కదిలించి వేసినది. ఆ ఏడు ముద్రలలో మొదటిది బైబిలు గ్రంథము తెరువబడినప్పుడు, అది ముందుకు వచ్చినది — ఆ ఒక్కటి మాత్రమే — అయితే ఒక్క ప్రేలుడు సమస్తమును కదిలించివేసినది. ఏడింటిలో మొదటి ముద్ర తెరువబడినప్పుడు, అది ఒక ఉరుముగా ఉన్నది. అప్పుడు ఆ వెనుకప్రక్క ఉన్న ఒక ముద్ర తెరువబడుచున్నది. అది కూడ ఒక ఉరుము కాదా? ఏమో నాకు తెలియదు. నేను చెప్పలేను.

అక్కడొక ఉరుము ఉండినది — అది మొదటి ముద్రగా ఉన్నది. ఆ మొదటి ముద్ర ఒక ఉరుముగా ఉన్నది. ఆ సమయములోనే ఒక బూర ఊదబడినది — పెంతెకోస్తు నాడు బూర ఊదబడినది. (నేను దానిలోకి పోవుట లేదు).

MATT 24:44•

REV 10:6

 

117ఇప్పుడు, ఆ దర్శనము లేఖనానుసారమైనదైతే (నేను మాట్లాడుచుండు ఈ దర్శనము, దానిని నేను గత శనివారము ఉదయము చూచాను — ఇప్పటికి ఒక వారమునకు ముందు)… అయితే ఇక్కడ జ్ఞాపకము ఉంచుకొనండి, ఆ దర్శనము ఆత్మీయమైనదైతే అది వాక్యము చేత నివరించబడవలసియున్నది, లేక ఆ లేఖనము యొక్క కొనసాగింపుతో వివరించబడవలసియున్నది! (మీలో అది ఇమిడిపోవాలని నేను వేచియున్నాను.) ఇది నేను చూచినదే అయితే… అది ఏమిటో నాకు తెలియదు. అయితే నేను మరణ భయము నొందితిని! మనము వృథా అయిపోయామా? మనము అంతములో ఉన్నామా? జ్ఞాపకము ఉంచుకొనండి, ఆ దూత చెప్పినదేమనగా ఇది జరుగుట ప్రారంభించినప్పుడు, ఇక ఆలస్యము ఉండదని అతడు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మనము దీనిని నిజముగా గ్రహించామా అని నేను ఆశ్చర్యపడుచున్నాను?

మీరిలా చెప్పవచ్చు, "మంచిది, అది ప్రేలినట్టు కనబడవచ్చు…" సోదరా, మీరు తలంచని నిమిషములో అతడు వచ్చును. మీరు దానిని చివరి సమయముగా వినెదరు.

REV 6:1•

REV 10:4

 

118ఇప్పుడు, మీకు అది విశదమైనదా? ఆ మొదటి ముద్ర విప్పబడినప్పుడు… ఆ గ్రంథము లోపల వ్రాయబడినవాని ముద్ర విప్పబడినప్పుడు, శబ్దించుచున్న ఈ మర్మములు — నీతికరణ, శుద్దీకరణ, రోమను కాధలిక్ సంఘము, ప్రొటెస్టంటులు… వారిచిన్న యుద్దములలోను, కార్యములలోను దేవుని వాక్యమందు విడిచిపెట్టబడిన చివరలను (ముగించనివి), ఆ ఏడవ దూత వచ్చి వాటన్నింటిని సమకూర్చి వారికి వివరించును, చూశారా? అతడు ముగించిన వెంటనే, ఏడు ఉరుములు వాటి శబ్దములను పలికెను! యోహాను వ్రాయుటకు ప్రారంభించగా, "వాటిని వ్రాయవద్దు, దానిని ముద్రించుము," అని ఆయన చెప్పెను. ఆ గ్రంథము లోపల ఉన్న ఏడు ముద్రలలో మొదటిది విప్పబడెను, అది ఒక ఉరుము ధ్వనితో విప్పబడెను.

ఇది లేఖనమైయున్నయెడల, అలాగు మాత్రమే ఉండగలదు… ఏ లేఖనమైనను, ఏదైనను అది బైబిలునకు సంబంధించినదై యుండవలెను… మృతులు విశ్రాంతి స్థలము అనునదియు మరియు ఇతర కార్యములు బైబిలులో ఉన్నవని మీరు నాతో చెప్పలేరు. ఎందుకనగా వాటిని బలపరచుటకు బైబిలులో ఏ లేఖనము లేదు.

REV 1:1

 

119మెకాబీయుల గ్రంథమనియు, దానియేలు నాల్గవ గ్రంథమనియు అక్కడ ఒక దూత అతని జట్టును పట్టుకొని క్రిందికి దించినది అనుటలో అర్థము లేదు, అవి చూచుటకు బాగానే ఉన్నాయి. బైబిలులో అలాంటివి జరిగెను అనుటకు ఆధారమే లేదు. నజరేయుడైన యేసు ఒక మట్టి పక్షిని చేశాడని, దానికి కాళ్లను బిగించి దానితో "ఎగిరి పొమ్ము, చిన్న పక్షి" అని చెప్పినట్లు, ఇవన్నియు బుద్ధిహీనముగా ఉన్నది. అవి నిజమనుటకు బైబిల్ లో ఏ ఆధారము లేదు.

అందువలన అది తర్జుమాదారులను బుద్ధిహీనులుగా చేయలేదు. తర్జుమా చేయువారు వాటిని ఆ సిద్దాంతములను మరియు బుద్ధిహీనతలను చేర్చకుండునట్లు దేవుడు చూచుకొనెను. వారు మంచి ప్రజలుగా ఉండవచ్చు, మెకాబీ సోదరులు. దానిలో వారు మంచివారు కారని నేను చెప్పుట లేదు, అయితే అది ఆత్మీయమైనది కాదు. ఇది (బైబిలు) యేసు కీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షతగా ఉన్నది. దీనితో దానిని చేర్చకూడదు, లేక దీని నుండి తీసివేయకూడదు. వీటిని అక్కడ ఉంచినప్పుడు మిగిలిన లేఖనములతో జతచేరదు. బైబిలులో 66 పుస్తకములు ఉన్నవి, వాటిలో ఒక్క వచనము కూడ ఒకదానితో ఒకటి వ్యతిరేకించదు.

120అప్పుడు అవి, అనగా, ఆ చివరి బూరల శబ్దము లేక చివరి ఏడు ఉరుములు ఈ బైబిలు యొక్క కొనసాగింపుగా ఉండి ముందుకు వచ్చుచున్నయెడల ఆ మర్మములు, ఆ చివరి ముద్ర — అది మిగిలిన లేఖనములతో పోల్చబడవలెను… లేక, పూర్తిచేయవలెను. ఆ మొదటిది ఉరుము ధ్వనితో విప్పబడినయెడల, ఆ రెండవది కూడ ఆ విధముగానే విప్పబడవలెను, అనగా, ఆ వెనుక ఉండునవి కూడ ఆ విధముగానే విప్పబడవలెను.

ఏమి జరుగునో గమనించండి. ఆ దర్శనము లేఖనమైయుండిన, అది లేఖనముతో వివరించబడవలెను, లేక ఆ లేఖనము యొక్క కొనసాగింపుగా ఉండవలెను.

REV 10:1-3,6

 

121గమనించుడి, ప్రకటన 10:3-4 ఏడు ఉరుములు… ఏడు ఉరుములుగా ఉన్నవి! అంతలు గమనించుడి… 3-4. అప్పుడేమి జరిగినది? ఒక బలమైన దూత ఒట్టపెట్టుకొను కాలము ముగించిపోయినది. ఈ ఉరుములు, మీరు చూడండి, అవి ఆ శబ్దములను తెచ్చుచున్నవి, అప్పుడు ఆ దూత…

దానిని గురించి తలంచి చూడుడి. ఒక దూత మేఘమును ధరించుకొని యున్నాడు, ఒక ఇంధ్ర ధనస్సు ఆయన తలను ఆవరించియున్నది. (ఎందుకు, ఆయనెవరో మీకు తెలియునా!) "భూమి మీద ఒక పాదమును సముద్రము మీద మరొక పాదమును పెట్టి, తన చేతులెత్తి, ఆ ఏడు ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు ఇక ఆలస్యముండదని ఒట్టపెట్టుకొనెను! అట్లయిన దేవుని యొక్క మర్మముల సేవా కార్యక్రమము ముగించిపోయినయెడల, ఆ వచ్చుచున్న ఏడు మర్మములు ఏమై ఉండును? మనలాంటి నమ్రతగల చిన్న సంఘములో సర్వశక్తుడు వచ్చి ఆయన ప్రజల యొక్క తగ్గుస్థితిని అంగీకరించుచున్నాడు.

మీరు ఇలా చెప్పవచ్చు, "మ౦చిది, అయితే నేను ఆ విధముగా తలంచలేను." ఒకవేళ అది కాకుండపోవచ్చు, అయితే అది అదే అయితే? అప్పుడు కాలము గతించిపోయినది. మీరు తలంచుచున్నారా? తీవ్రముగా ఉండుడి. అది మనము తలంచుదాని కన్నను ఆలస్యమైపోయినదేమో?

122ఆ నక్షత్రములు వాటి కూటములలో మరలా పడుచున్నవి; అప్పుడు ఆ దూత వచ్చి, "పాత నిబంధనను ముగించి, క్రీస్తును పరిచయము చేయుటకు యోహాను పంపబడినట్లు, నీ వర్తమానము (క్రొత్త నిబంధనలో) విడిచిపెట్టబడిన సత్యముల చివరలను పూర్తిచేయును, మరియు మెస్సీయాను పరిచయము చేయును, అది ఆయన రాకడకు ముందు జరుగును అని చెప్పెను'' — ఈ చివరి దినముల వర్తమానము. గమనించండి, ఆ బలమైన దూత ఒట్టు పెట్టుకొనుచున్నాడు, ఇక ఆలస్యము ఉండదు, ఇక సమయము లేదు. (ఇప్పుడు, మిమ్మును అధిక సమయము ఉంచుటకు ఇష్టపడను. ఇప్పుడు ఒక్క నిమిషము దీనిని తలంచి చూడుడి.)

REV 10:5,6

 

123ఇప్పుడు వినండి. ఈ దూత పరలోకము నుండి వచ్చుచున్నాడు. చూడండి, తక్కిన ఆ ఏడు సంఘకాల వర్తమానికులు భూసంబంధమైనవారు. అయితే ఆ దూత… వర్తమానమంతయు ముగించిపోయినది; ఆ ఏడవ దూత సమస్తమును పూర్తి చేసెను. ఈ దూత భూమికి వచ్చుట లేదు. ఇతడు భూమి నుండి వచ్చిన ఆ సంఘకాలముల వర్తమానికులవలె భూసంబంధమైన మనిషి కాదు. అది ముగించి పోయినది. అయితే ఈ దూత తరువాత ప్రకటనలను తెచ్చుచున్నాడు (ఒక దూత, అనగా, ఒక వర్తమానికుడు అని అర్థము), ఆయన పరలోకము నుండి అగ్ని స్తంభమును మేఘమును ధరించుకొని దిగివచ్చెను. ఆయన తలపైన ఇంధ్ర ధనస్సు ఉండెను. ఇంధ్ర ధనస్సు అనగా ఒక నిబంధన. అది క్రీస్తుగా ఉండి, ఒక పాదము భూమి మీదను మరియు మరొక పాదము సముద్రము మీదను ఉంచి, ఇక ఆలస్యము ఉండదని ప్రమాణము చేయుచున్నాడు.

2SAM 22:30•

REV 2:1•

REV 3:14•

REV 10:6

 

124అయ్యలారా, మనమెక్కడ ఉన్నాము? ఇదంతయు ఏమిటి? నేను మిమ్మును అడుగుచున్నాను.

ఆ తక్కిన దూతలు వర్తమానికులు, వారు భూసంబంధ మనుష్యులు. అయితే ఈ దూత… "లవొదికయ సంఘములోనున్న దూతలకు," దీనిని చెప్పుచున్నాడు"; "ఎపెసు సంఘ దూతకు," చెప్పుచున్నాడు — వారు భూసంబంధ వర్తమానికులు, చూశారా, మనుష్యులు; వర్తమానికులు; ప్రవక్తలు, మరియు మొదలగు సంఘము కొరకు వీరు ఉన్నారు. అయితే ఈయన భూమి నుండి రాలేదు. ఆయన పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు, ఎందుకనగా మర్మములన్నియు ముగించిపోయినవి. ఆ దూత చెప్పిన దేమనగా, ఆ మర్మము సమాప్తమగుచున్నప్పుడు, "ఇక సమయము ఉండదు," ఆ ఏడు ఉరుములు వాటి-వాటి శబ్దములు పలుకును.

మనము ఏ విధముగా ఎత్తబడు విశ్వాసములో ప్రవేశించవలెనో, దానిని తెలుపునవిగా ఒకవేళ అది ఉన్నదా? అదేనా? మనము గోడలపైనుండి దాటగలమా? ఏదో జరుగుటకు నిర్ణయమైనదా, ఈ పాత చెడిపోయిన, నీచమైన, శరీరములు మారబోవుచున్నవా? ఓ, ప్రభువా దానిని చూచుటకు నేను జీవించెదనా? నేను చూడగలుగునంతగా అవి చేరువైనవా? అది ఈ తరమేనా? అయ్యలారా, నా సోదరులారా, ఇది ఏ సమయము? మనము ఎక్కడున్నాము?

MATT 24:32,34•

MARK 13:28

 

125మనము జీవించు ఈ దినమును సమయమును తెలిసికొనుటకు — గడియారమును చూచెదము — ఒక క్యాలండరును చూచెదము. ఇశ్రాయేలు పాలస్తీనాలో ఉన్నది, ఆమె స్వదేశములో ఉన్నది. అది చివరి సూచనగా ఉన్నది. దావీదు యొక్క ఆరు మూలల నక్షత్రము. అది రెండువేల సంవత్సరములకు పూర్వము ఉండినది (అవును, సుమారు 2500 సంవత్సరములకు పూర్వము), అదే పురాతన పతాకము, (జెండా) ఇప్పుడు ఇశ్రాయేలులో ఎగురుచున్నది. ఇశ్రాయేలీయులు వారి స్వదేశమునకు తిరిగి వచ్చారు. "అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు, ఈ తరము మరణించదు — ఇవన్నియు నెరవేరు వరకు గతించిపోదు."

రాజ్యములు విడిపోవనున్నవి, ఇశ్రాయేలు మేలుకొనుచున్నది,

ప్రవక్తలు ముందు చెప్పిన సూచనలు నెరవేరుచున్నవి,

అన్యుల దినములు లెక్కించబడినవి, భయములో చిక్కుకొని;

"ఓ, తప్పిపోయినదానా, నీ స్వంతమైనదానికి తిరిగి రమ్మ."

నీ దానికి నీ విమోచన దినము సమీపమైనది,

మనిషి హృదయము భయముతో వణికిపోవుచున్నది;

ఆత్మతో నింపబడుము, నీ దీపమును చక్కబెట్టుకొనుము,

నీ విమోచన సమీపించినది, చూడుము!

అబద్ద ప్రవక్తలు కల్లలాడుచున్నారు,

దేవుని సత్యమును వారు నిరాకరించుచున్నారు.

యేసు క్రీస్తు మన దేవుడు;

(అది సత్యమని మీకు తెలియును!)

అయితే అపోస్తలులు నడిచిన మార్గమున నడిచెదము.

సమీపించెను మన విమోచన దినము.

మానవ హృదయము భయముతో వణికించుచున్నది;

ఆత్మతో నింపబడుము, నీ దీపమును చక్కబెట్టుకొనుము.

నీ విమోచన సమీపించినది, పైకి చూడుము!

REV 10:6

 

126మీరు తలంచుదానికన్నను అది ఎంతో సమీపముగా ఉన్నది. అది నన్ను భయపెట్టినది! ఓ, నేను చాలినంత చేయలేదు! మనమెక్కడున్నాము?

ఇక ఆలస్యము ఉండదు. కాలము గతించిపోయినదని ఆయన ప్రకటించుచున్నాడు. ఏమి జరిగినది? ఇప్పుడు ఆ విధముగా ఉన్నదా, సోదరుడా? తీవ్రముగా ఆలోచించుము. అది అలా ఉన్నయెడల, ఆ పిరమిడ్ (ముక్కోణము)నకు ఆ ఏడు ఉరుములు తలరాయిగా వచ్చి చేరుచున్నవి?

మీకు ఆ పిరమిడ్ వర్తమానము జ్ఞాపకము ఉన్నదా? అది తలరాయిగా ఉన్నది. అదేమి చేయుచున్నది? పరిశుద్దాత్మ ఒక్కొక్క వ్యక్తిని కప్పుచు మన విశ్వాసములో నీతిని, దైవభక్తిని విశ్వాసమును ఆ విధముగా చేర్చుకొనుచూ వెళ్లినప్పుడు, మనలను ముద్రించుచున్నది. మనము ఏడు కార్యములను పొందువరకు వాటిని చేర్చుకొనుచూ వెళ్ళెదము. ఆ ఏడవది ప్రేమ, అది దేవుడైయున్నాడు. ఆ విధముగా ఆయన ఒక వ్యక్తిని చేయును. ఆయన అతనిని కప్పుచు మరియు పరిశుద్దాత్మ చేత ముద్రించును.

అప్పుడది ఆ విధముగా ఉండినయెడల, ఆయన ఆ యేడు సంఘ కాలములను, ఏడు మర్మములను శబ్ది౦పజేసి వారిని మరలా తెచ్చుటకు అవి యుద్దము చేయుచున్నవి. అప్పుడు ఆ తలరాయి సంఘమును పూర్తి చేయుటకు శిఖరముగా వచ్చుచున్నది. ఆ ఉరుముల భావము అదేనా, నా సోదరా? అయ్యలారా, మనమక్కడే ఉన్నామా?

DAN 2:1,30

 

127"జూనీ," నేను నీ కలను తీసికొనుటకు ఇష్టపడుచున్నాను. చూడుము. జూనియర్, కొన్ని నెలల క్రితము ఈ పిరమిడ్ వర్తమానము ముగించుటకు ముందు, ఈ కలను చూచెను. "ఆ కలను గురించి ఏమిటని నీవడిగితివి?"

నెబుకద్నెజరునకు కల వచ్చినది, దానిని దానియేలు వివరించెను, అన్యుల ప్రారంభ కాలమును వివరించెను. అది పోయిన వెంటనే, అలాంటిదే ఒకటి వచ్చినది. దానిలో ఏ కొంతయైనను తప్పిపోలేదు.

మీరు గమనించండి, ఆ బండల పైన ఉన్న వ్రాతను మీరు గమనించారా, అతని కొరకు నేను దానిని వివరించుచున్నప్పుడు వారెంతో ఉప్పొంగిపోయారు. అనేక సంవత్సరముల తరువాత దేవుని మర్మముగా ఉండిన దానిని గ్రహించగలిగితిమి. అదిగానే ఉండునా? మరియు అప్పుడు గమనించండి. ఒక మర్మమైన మార్గములో మేము ఒక పదునైన గునపమును తీసికొని, గాలిలో నుండి, ఆ పైకప్పును తెరచినప్పుడు. అక్కడ ఆ తెల్లటి చలువరాయి ఉండినది, అయితే అది వివరించబడలేదు. అక్కడ అక్షరములు లేవు. జూనియర్కు నేను దానిని వివరించలేదు. నేను దాని వైపు చూచి సోదరులతో ఇలా చెప్పాను, "దీనిపైన చూడుము." అది ఈ రాత్రి నెరవేరినది!

వారు దానిని చదువుచుండగా, నేను పడమటకి దిశగా వెళ్లిపోయాను. ఎందుకొరకు? దానిపై వ్రాసియున్నదేమిటని దాని వివరణను గ్రహించుటకు గాను వెళ్లవలసియుండెనా?

128ఆ ధ్వనులు, ఆ మరుసటి ఉదయము నన్ను ఎంతగా కదిలించెననగా ఈ కట్టడము ఎంత ఎత్తుననున్నదో, అంత ఎత్తుకు నన్ను పైకి లేపినది; ఆ దూతల కూటము, ఏడు దూతలు, వారు ఒక పిరమిడ్ ఆకారములో ఉన్నారు. వచ్చినవి ఆ ఉరుములేనా? అది వీలుపడునా? ఇదంతయు వివరించబడినవి. ఆయన కల ప్రకారము అదంతయు ముగించిపోయినది. దేవుని వాక్య ప్రకారము, ఆ ఏడవ వర్తమానికుడు సమస్తమును ముగించును… ఆ ఏడవ దూత వర్తమానము ముగియును. అప్పుడు ఆ ఏడు ఉరుములు.

వాటిపైన తలరాయిగా దొరలి వచ్చినవి, అనేకులైన ప్రజలు అవి బయలుపడవలసిన ఏడు ముద్రలని ఎరుగకున్నారు. అనేక మనుష్యులు వ్రాసిన ప్రకటన గ్రంథముపై వాఖ్యానము చదివాను. వారు (ఈ ఏడు ముద్రలను గురించి) మాట్లాడినట్లు కనబడలేదు. వారు దానిని విడిచిపెట్టుచున్నారు. అయితే అవి అక్కడ ఉన్నవని చెప్పబడినది. అవేమిటో నాకు తెలియదు. అవి (ఆ ఏడు ఉరుములు) అదిగా ఉండునా? దేవా, మా పట్ల కృప కలిగియుండుము. అది అదే అయితే, మనము ఒక గంభీరమైన ఘడియలో ఉన్నాము.

JOEL 2:28•

ACTS 2:17

 

129ఇప్పుడు, ఒక్క నిమిషము చూడండి. అది అలాగుండిన యెడల ఈ బండలలో వ్రాయబడిన మర్మము ముగించెను. దేవుని పిల్లలతో ఒక సంఘమ౦దు వారితో కూర్చొనియుండుటలో సంతోషించెదను, దేవుడు వారికి కలల నిచ్చుచున్నాడు. జూనియర్ సంఘమునకు వెళ్లు స్త్రీ పురుషులను మీకు పరిచయము చేయుచున్నాను, సోదరుడు నెవిల్-కును మిగిలిన వారికిని పరిచయము చేయుచున్నాను. వారు జూనియర్ సంఘ సభ్యులు! ఈ సమాజములో కూర్చుండియుండు వారైయున్నారు… "వారు చివరి దినములలో కలలు కందురని," బైబిలు చెప్పుచున్నది. ఇక్కడ అది జరిగినది, దానిని చూడండి. అది వాక్యముతో సరిపోవుచున్నది.

దానిని గురించి నాకేమియు తెలియదు, ఒక పెద్ద ధ్వని వచ్చిన వెంటనే ఏడుగురు దూతలు నిత్యత్వము నుండి దిగి వచ్చుచున్నారు. అప్పుడు నేను చెప్పినదేమనగా, "ప్రభువా, నన్నేమి చేయమంటున్నావు?" అయితే జవాబు రాలేదు. దానిని కనుగొనుటకు నేను మొదటిగా వెళ్లవలసియున్నది. నాకు తెలియదు. అది కాకుండను. నాకు తెలియదు. నేను కేవలము చెప్పుచున్నాను, "అది ఒకవేళ అదే అయితే ఏమిటి?" ఒకవేళ లేఖనానుసారమైనడైతే, అది దానికి చాలా దగ్గరగా కనబడుచున్నది. మీరు ఆలాగు అనుకోవటము లేదా?

130ఆ తలరాయి వివరించబడలేదు, చూడండి. "పడమటికి వెళ్లి, వెనుకకు తిరిగివచ్చినది." లేక ఇదేనా అది? ఈ ఏడుగురు దూతలు కూటముగా నా యొద్దకు వచ్చారు… పునరుద్దాన దినములో నేను మిమ్మును కలిసికొనునప్పుడు, నేను అబద్దమాడుట లేదని మీరు తెలిసికొందురు, దేవుడు నా తీర్పరియైయున్నాడు.

లేక నేను గత దినములో మాట్లాడిన ఆ రెండవ అంతము ఘట్టము ఇదియేనా? ఇంకేదైనా సంఘము కొరకు వచ్చుచున్నదా? నాకు తెలియదు. ఆ కొద్ది దానిపైన నేను నిలచియుందును, అయితే దానితో ముందుకు కొనసాగుదును.

అదిగా ఉండునా? అది ఆ బలము గల ఉరుముగా ఉండునా, లేక ఆ ఏడుగురి కూటములో ఉన్న ఆ ఏడవ దూతగా ఉన్నాడా, అది ఆ ఏడవ కాలపు కూటముగాను, పిరమిడ్ (ముక్కోణాకారము) ఆకారములో, (ఇరు ప్రక్కల మూడు వాటిపై ఒకటి నిలచినదై ముక్కోణ ఆకారములో) నిత్యత్వము నుండి దిగి వచ్చినవి. అదిగా ఉండునా? ఆ తలరాయిని తెచ్చు ఉరుముల మర్మముగా ఇదేనా?

131పిరమిడ్ మూయబడలేదని మీకు తెలియును. తలరాయి ఇంకనూ రావలసియున్నది. అది తృనీకరించబడినది. సోదరీ సోదరులారా, అది ఆలాగు ఉండునా?

లేక మూడు నాలుగు సంవత్సరముల క్రితము, ఆయన నాతో చెప్పినట్లు, ఇది మూడవ ఈడ్పుగా ఉండునా?

ఆ మొదటి ఈడ్పులో — ఏమి జరిగినదో మీరు జ్ఞాపకముచేసికొనండి? నేను దానిని వివరించుటకు ప్రయత్నించాను. అయితే, "దానిని వివరించవద్దు," అని ఆయన చెప్పెను.

రెండవ ఈడ్పు — "వివరించుటకు ప్రయత్నించకుము," అని ఆయన చెప్పెను. అయినను నేను దానిని వెలుపలకు తెచ్చాను. మీకు జ్ఞాపకము ఉన్నదా? మీకు అందరికి జ్ఞాపకము ఉండవచ్చు. అవి టేపులయందున్నవి. ప్రతిది, టేపుల యందున్నది.

అంతట ఆయన ఇలా చెప్పాడు, "ఇప్పుడు మూడవ ఈడ్పు వచ్చుచున్నది, అయితే దానిని వివరించుటకు ప్రయత్నించకుము."

ఈ రాత్రి దానిని ఎట్లు చేరానో మీరు చూచారా? నాకు తెలియదు. అయితే నా సంఘమునకు ఏదో కొంత చెప్పవలసిన విధి నాకున్నది. మీరే మీ తీర్మానమును తెచ్చుకొనండి.

JOHN 14:12

 

132ఇప్పుడు, విప్పబడవలసిన రహస్యమిదేనా, ఇది క్రీస్తును తెచ్చునదై సంఘమునకు శక్తిని తెచ్చునదిగా ఉన్నదా? చూడండి, మనము ముందుగానే… మనము మారు మనస్సునందు విశ్వాసము ఉంచాము, మనమలా యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందుట ద్వారా నెరవేర్చాము. పరిశుద్దాత్మను పొందుట యందు మనము విశ్వసించాము. మనము, సూచనలను, అద్భుతములను, ఆశ్చర్యకార్యములను, బాషలయందు మాట్లడుటను, ఆది సంఘము కలిగియున్నవాటన్నిటిని మనము కలిగియున్నాము.

బహిరంగముగా చెప్పవలెనన్న, అపొస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయబడిన దానికన్నను, ఇక్కడ అధికముగా జరిగినవి. అది ఈ చిన్న మందలోనే జరిగినది, మనకున్న ఈ చిన్న సేవలోనే జరిగినది. అట్లయిన ఈ ప్రపంచమును గురించి ఏమిటి? అపొస్తలుల కార్యముల గ్రంథమందు వ్రాయబడిన దానికన్ననూ ఇంకనూ అధికముగా జరిగినవి. అవే రకమైన కార్యములు — మృతులు లేచుట. జ్ఞాపకముంచుకొనండి, యేసు కాలములో ముగ్గురు మాత్రమే మరణము నుండి లేచారు; మనకు డాక్టర్లు నిరూపించిన ప్రకారము, ఐదుగురు మృతులు లేచారు, ఐదు. "నేను చేయు క్రియలకన్నను అధికముగా మీరు చేయుదురని," ఆయన చెప్పెను.

133కింగ్ జేమ్స్ (ఆంగ్లములో బైబిలు కింగ్ జేమ్స్ రాజు కాలములో వ్రాయబడినది, కావున అది కింగ్ జేమ్స్ వర్షన్ అని పిలువబడినది) "అతి గొప్పగా" అని చెప్పుచున్నాడని నాకు తెలియును, అయితే మీరు అతి గొప్పగా ఏమీ చేయలేరు — దానినుండి అధికముగా చేయగలరు. అప్పుడు ఆయన ఒక్క వ్యక్తిలో (యేసు అను శరీరములో మాత్రమే) ఉండెను. అయితే ఇప్పుడు మన సంఘమంతటిలో ఉన్నాడు, చూడండి. "వీటి కన్నను మీరు అధికముగా చేయుదురు, ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను."

ఇది మూడవ ఈడ్పుగా ఉండినయెడల, ఒక గొప్ప సేవ ముందున్నది. నాకు తెలియదు. నేను దానిని చెప్పలేను. నాకు తెలియదు.

మూడవ ఈడ్పును గమనించండి. ఒక్క నిమిషము దానిపై నిలచెదము. ఆ దర్శనములో, మొదటిగా ఎత్తబడునది చిన్న వర్తమాన పక్షులు. మనము మొదట ప్రారంభించినప్పుడు అది జరిగినది. వ్యక్తిని చేతిలో తీసికొనుటతో అది పెరిగినది. ఆయన నాతో ఏమి చెప్పాడో మీకు జ్ఞాపకము ఉన్నదా? "నీవు నమ్మకముగా ఉంటే, నీవు ప్రతి హృదయ రహస్యమును ఎరుగగలవు." అది ఇక్కడ ప్రకటింపబడినదని ఎందరు జ్ఞాపకము ఉంచుకొనియున్నారు? అది ఈ దేశమంతటను ప్రకటింపబడినది. అది జరిగినదా? ఖచ్చితముగా. అప్పుడు ఆయన "భయపడవద్దు, నేను నీతో ఉందును, మరియు అది ఆ విధముగా ముందుకు సాగును."

134ఇప్పుడు ఆ మొదటి ఈడ్పు ఆ చిన్న పక్షులుగా ఉన్నవి — అవి ఎగిరిపోవుచున్నవి. అవి కాలమును కలిసికొనుటకు వెళ్లినవి, ప్రభువు రాకడను కలసికొనుటకు వెళ్లినవి, అది మొదటి వర్తమానము. రెండవసారి — హృదయ రహస్యములను గ్రహించుట. ఒక వ్యక్తి చేతిని పట్టుకొనుట ద్వారా, అక్కడ నిలచి వారిలో ఉన్నదేమిటని తెలుపుట. ఆ తరువాత వారి పాపములు బయలుపడును. వారేమి చేయూలో చెప్పబడును… అది నిజమేనా? అది సంపూర్ణముగా నెరవేరినది, అది దేవుడు చెప్పినట్లే జరిగినది. మీరు దానికి సాక్ష్యమిచ్చారు, ఈ ప్రపంచము కూడా సాక్ష్యమిచ్చినది. అదే విధముగా ఈ సంఘము కూడా సాక్ష్యమిచ్చినది.

"నేనొక దూతను చూచాను, అది మండుచున్న పచ్చరాయివలె ఉండినది," (మరకతమణి వలె) అని నేను చెప్పినప్పుడు, ప్రజలునవ్వుచూ "బిల్లీ, మరొక దానిని నీ కొరకు ఉంచుకొనుమని," పరిహాసము చేశారు. అయితే ఆ శాస్త్రీయ కెమెరా కన్ను దానిని పటము తీసినది. నేను అబద్దమాడుట లేదు. నేను సత్యమునే చెప్పుచున్నాను. దేవుడు దానిని నిరూపించాడు.

నేను చెప్పినట్లు, "చీకటి కమ్ముకొనినది. అది మరణము, నలుపు; మరియు ఇది తెలుపు. ఒకటి జీవము; మరొకటి మరణము." అక్కడ వెనుకగా ఆ పటము ఉన్నది. "జార్జ్ జె.లేసి" చెప్పినట్లు, "కెమెరా యొక్క యాంత్రిక కన్ను తత్వమును ఫోటో తీయదు. మీరు నన్ను వెంబడించుచున్నారా?

JOHN 1:29,36

 

135గమనించండి, ఆ మొదటి చిన్న ప్రయాణము — చేయి. రెండవది ఇంకనూ అధిమైనది. అది తెలుపు, అవి పావురములు — పరిశుద్దాత్మ హృదయు రహస్యములను బయలుపరచుటే. అంతట మూడవ ప్రయాణము దూతలుగా ఉన్నారు! పక్షులు కాదు దూతలు! అదే చివరి కాలము. అదంతయు అదే.

సోదరులారా, ఇదేనా ఆ సమయము! ఆ కాలమిదేనా?

ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దీనిని వేరు విధముగా లేక అసత్యముగా తర్జుమా చేయకండి. నేను మిమ్మును కొంత అడుగబోవుచున్నాను.

ఒక్క నిమిషము మనము వెనుకకు వెళ్ళుదము. ఇది సత్యమని సంఘమునకు తెలియును. శాస్త్రీయ ప్రపంచము దీనిని సత్యమని గ్రహించియున్నది. ఇక్కడ ఈ రాత్రి ప్రజలు కూర్చొనియున్నారు, అనేకులు ఇంకనూ జీవించుచున్నారు; వీరు ఆనాడు ఆ నదియొడ్డున నిలచియుండగా, ఆ స్వరము ఇలా మాట్లాడినది, "మొదటి రాకడ వర్తమానములో యోహాను పంపబడినట్లు, ఈ రెండవ రాకడ వర్తమానము అదే విధముగా పంపబడుచున్నది." మీకు జ్ఞాపకము ఉన్నదా?

అది ముగించినదైతే యోహాను చేసినదేమి? "అదిగో, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే" యని యోహాను ప్రకటించెను.

MAL 4:6

 

136ఇది ఆ ఘడియేనా…? నా సోదరులారా, అది సమీపించినదా? అది వచ్చినదని నేను చెప్పను. నాకు తెలియదు, అయితే నేను మిమ్ములను అడుగుచున్నాను. మీరు దానిని యోచించవలెనని ఆశించుచున్నాను, లేక "ఇదిగో, దేవుని గొర్రెపిల్ల," అని చెప్పు కాలముగా ఇది ఉన్నదా? లేక మలాకి 4 కాలము — పిల్లల మనస్సు, తండ్రుల తట్టు త్రిప్పు కాలముగా ఉన్నదా. అది అంత పెద్ద ధ్వనిగా ఉన్నదా, అది సంఘమును కుదుర్చుటకై అటువంటి గొప్ప క్రియలను చేసినదా, అది ఏటవాలుగా ఉండుట ద్వారా దేవుని రహస్యములను గ్రహించలేము. ఆ శక్తిగల ధ్వని సమస్తమును తుడిచివేయుచు ముందుకు వెళ్ళుటను వారు చూచుచుండగా, వారి హృదయములను అది తండ్రుల తట్టు త్రిప్పుచున్నదా? నాకు తెలియదు. అయ్యలారా ఇది చివరికాల సూచనయై యున్నది, లేక సమస్తమును సమాప్తమగుటకు ఇది కాలముగా ఉన్నదా? అది లేఖనానుసారముగా నాకు అగుపడుచున్నది. నాకు తెలియదు.

1SAM 12:3

 

137అక్కడ ఆ దూతలు ఉన్నారు. ఒక ఉరుము ధ్వని లాంటి ధ్వని ఏర్పడినది, అది భూమినంతటిని కదిలించి వేసినది. నేను సత్యము చెప్పుచున్నానని దేవుడు ఎరిగియున్నాడు. కొంచెము జ్ఞాపకము ఉంచుకొనుడి, ఏదో జరుగబోవుటకు నిర్ణయమైనది. అది ఏదో నాకు తెలియదు, అయితే అది ఇదేనా? ఇది నేను చెప్పుటకు కారణమేమనగా: మిమ్ములను మీరు సిద్దపరచుకొనండి.

ప్రార్థించెదము. ఏ విధముగా ప్రార్థించెదము? ఆయన విశ్వాస సైన్యములో మీ స్థానమును మీరు తీసికొని మిమ్మును సిద్దపరచుకొనుడి, ఎందుకనగా మనము దానిని (రెండవ రాకడను) తలంచునంతలో ఇప్పటికే ఆలస్యమైనదేమో, మీరు నన్నెరిగియున్నారు. ఇప్పటి వరకు మీతో ఒక్క అబద్దము కూడ నాకు తెలిసినంతవరకు చెప్పలేదు. సమూయేలు వారితో చెప్పినట్లు, "ప్రభువు నామములో నెరవేరినది కాక మరేదైనను మీతో చెప్పానా?" ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, అది ఏమిటో నాకు తెలియదు. అయితే నేను సత్యమును మాత్రము చెప్పుచున్నాను — నేను భయపడుచున్నాను. మీ సోదరునిగా, గత శనివారము నుండి నేను భయపడుచునేయున్నాను.

REV 10:6

 

138ఇది చివరి కాలముగా ఉండవచ్చు. ఇది ఆ వర్ష ధనస్సులు ఆకాశమంతటను ఏర్పడు కాలముగా ఉండవచ్చు. "ఇక ఆలస్యము ఉండదు," (ఇక సమయము లేదు), అని ఆకాశములు చెప్పుచూ ఒక ప్రకటన చేయుచున్నది. అదేనైతే మనలను మనము సిద్దపరచుకొందుము. స్నేహితులారా, మన దేవుని కలిసికొనుటకు సిద్దపరచు కొందుము.

ఇక్కడ ఎంతో ఆహారము సమకూర్చబడియున్నది. దానిని మనము వాడుకొందుము. ఇప్పుడే మనము దానిని వాడుకొందము. ఈ వేదికయందు నాతో కలిసియుండుడి, నేను దేవునికి ఆక్రందన చేసెదను. "యేసు ప్రభువా, నాకు కృప జూపుము."

నేను ఎంత వరకు నమ్మకముగా జీవించాలో అంత వరకు నమ్మకముగా జీవించాను. దేవుని వాక్యము నుండి, ఎంత మంచి మార్గములో నేను వర్తమానములను తీసికొని రాగలనో ఆ విధముగా తెచ్చుటకు నేను ప్రయత్నించాను. దేవుడు నా హృదయమును ఎరిగియున్నాడు. అయితే ఆ దూతల కూటము భూమిని తుడిచివేసినప్పుడు నేను స్తంబించిపోయూను. నేను ఎంతో సమయుము కదలలేకపోయాను. ఎంతో సమయుము తరువాత నా గదిలోకి నడవగలిగాను. నా వెన్నెముక నుండి, నా మెడ వరకు పూర్తిగా స్థంభించిపోయినది. ఎటువంటి స్పర్శ కూడా లేదు. నా చేతితో స్పర్శించలేక పోయాను. ఆ దినమంతయు చలనము లేక భ్రమ చెందిపోయాను. నేను మౌనముగా గదిలోకి వెళ్లి కూర్చున్నాను.

139ఆ ఆదివారము, నేనిక్కడకు మాట్లాడుటకు వచ్చినప్పుడు నేను మాట్లాడుచూ నన్ను కదిలించుకొనవలసివచ్చినది. సోమవారము అలాగే ఉండినది. ఇప్పుడును అలాగే యున్నది. నాకు తెలియుట లేదు. అయ్యలారా, నాకు తెలియులులేదు. నా సోదరులవలె మీతో నమ్మకముగా ఉన్నాను. నాకేమి తెలియదు.

ఇదేనా సమయుము? మర్మమంతయు ముగించిపోయినదా? శబ్ది౦చుట అంతయు ముగించినదా? ఆయన వచ్చునప్పుడు ఎత్తబడుటలో ఎత్తబడుటకు, ఈ చిన్న సమూహమునకు కావలసిన ఎత్తబడు విశ్వాసమును అనుగ్రహించినది ఈఏడు ఉరుములుగా ఉండునా? ఎందుకనగా ఆ దూతలవలె మనము మార్చబడెదము — ఒక క్షణములో, కనురెప్ప పాటున నిద్రించినవారితో కలిసి ప్రభువును మధ్యాకాశములో కలసికొందుము.

అది నా ప్రార్థనయైయున్నది: దేవా, ఇది ఆ విధముగా ఉన్నయెడల ప్రభువా నాకు తెలియదు నేను సంఘముతో చెప్పుచున్నాను. అంత మాత్రమే, ప్రభువా అది అలాగుండినచో, నా హృదయమును సిద్దపరచుము. మమ్మును సిద్దము చేయుము, ప్రభువా, చరిత్రలోని ఆ గొప్ప ఘడియ, సమస్త ప్రవక్తలు, పరిశుద్దులు ఆ సమయము కొరకు ఎదురు చూచారు.

ప్రభువా, నేనేమి చెప్పాలో నాకు తెలియుట లేదు. "ప్రభువా, రావద్దు," అని చెప్పుటకు భయపడుచున్నాను. నాకు నేను సిగ్గుపడుచున్నాను, ఎందుకనగా ఈ లోకపు స్థితిని నేను చూచినప్పుడు, నేను చేయవలసినదానంతటిని చేశాను, కాని నాకునేను సిగ్గుపడుచున్నాను. రేపనునది ఒకటున్నయెడల, ప్రభువా, నా హృదయమును అభిషేకించుము. నన్నుఅధికముగా అభిషేకించుము తండ్రీ, ఇతరులను నీ యొద్దకు తెచ్చుటలోనేను చేయవలసినదంతయు చేశాను. నేను నీవాడనైయున్నాను.

ISA 6:2,3,5•

ACTS 26:19

 

140యెషయా ఆ ఆలయములో చూచినప్పుడు దూతలు పైకి, క్రిందికి, ఎగురుచుండిరి, అవి వాటి పై రెక్కలతో తమ ముఖములను కప్పుకొని, క్రిందివాటితో పాదములను కప్పుకొని మధ్య ఉన్నవాటితో ఎగురుచూ, - "పరిశుద్ధుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు," అని కీర్తించుచున్నవి. ఓ, ఏ విధముగా ఆ యవ్వన ప్రవక్త కదలించబడెను! అతడు ఒక కాలము ముందుకు వెళ్లి దానిని చూచాడు. అతడు దర్శనములను చూచినప్పుడు "నేను నశించితిని" అనుచు ఏడ్చాడు.

తండ్రీ, నేను ఒకవేళ ఆ విధముగా తలంచినయెడల గత రాత్రి నేను ఆ దూతలను చూచినప్పుడు — లేక ఆ ఉదయకాలమందు, "నేను నశించానని" తలంచాను, ఎందుకనగా అశుభ్రమైన పెదవులను గలవాడై అశుభ్రమైన ప్రజల మధ్య జీవించుచున్నాను. తండ్రీ, నన్ను శుభ్రపరచుము. ఇక్కడే నేనున్నాను. ప్రభువా, నన్ను పంపుము. అది ఏమైనప్పటికిని.

ప్రభువా, ఇక్కడ ఈ ప్రసంగ వేదిక దగ్గర ముప్పది సంవత్సరములుగా నిలచియుండునట్లు నేను ఇంకనూ చేయవలసినది, ఏదైనను ఉన్నయెడల ఇదిగో నేనిక్కడ ఉన్నాను. ప్రభువా, నేను సిద్దముగా ఉన్నాను. అయితే నీ దృష్టిలో కృపను పొందనిమ్ము,

వినయముతో ప్రార్థించుచున్నాను.

ఈ చిన్న మంద కొరకు ప్రార్థించుచున్నాను, పరిశుద్దాత్మ వారిని పోషించునట్లు వారి పర్యవేక్షకునిగా నన్ను ఉంచెను. ప్రభువా, నేను చేయుటకు తెలిసినది అంతయు చేశాను. నీవు ఇచ్చిన జీవాహారముతో పోషించాను. ఎన్నో సంవత్సరముల క్రితము ఆ దర్శనములో చూచినట్లు, పడమరలో ఆ పెద్ద తెర వేయబడియుండగా, అక్కడ జీవాహారపు పర్వతము ఒకటుండినది. ఆ చిన్న పుస్తకము, "నా పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాను? అది చెప్పబడినట్లు అదంతయు నెరవేరినది, మా ముందు బయలుపరచబడినది.

GEN 28:17•

EPH 2:6

 

141నీవు దేవుడవు, నీవు తప్ప మరెవ్వరు లేరు. ప్రభువా, మమ్మును అంగీకరించుము. మా పాపములన్నింటిని మన్నించుము. నా అవిశ్వాసమునంతటిని బట్టి నేను పశ్చాత్తాపపడుచున్నాను, నా అక్రమమ౦తటిని గురించి దుఃఖపడుచున్నాను. దేవుని బలిపీఠముపై నేను సమర్పించుకొనుచున్నాను.

రాత్రి, నాముందు నిలచియుండు ఈ చిన్న సంఘముతో నేను వచ్చుచుండగా, మేము విశ్వాసముతో ఈ కట్టడమును వదలి ఎత్తబడుటలో కదలిపోవుచుండగా, మేము దేవుని సింహాసనము ముందు పరలోక స్థలములలో ఏకముగా కూర్చొనియున్నాము. నీవు చేసిన అనేక కార్యములను చూచుటయందు, నీ మర్మములను మాకు బయలుపరచుటయందు అనేక సమయములలో మా హృదయములు వెచ్చదనము పొందినవి. అయితే ప్రభువా, ఈ రాత్రి నేను నిండుగా సోలిపోయి ఉన్నాను. నేను నశించితిని. మరియు యాకోబువలె, ఆ దూతలు ఆ నిచ్చెనను దిగుచూ ఉండుటను అతడు చూచినప్పుడు, "ఇది భయంకర స్థలము, ఇది దేవుని ఇల్లుగా ఉన్నది," అని చెప్పి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అక్కడ బేతేలు ఏర్పడినది.

దేవా, ప్రజలు దానిని గ్రహించలేకపోవుచున్నారు. దీనిని ఎంతో సంతోషముగా వారు తలంచుచున్నారు. అయితే ప్రభువా, ఎంత నీరసము, అది ఎంత మరణకరమైనదో, ఒక మానవ జీవి, పరలోకపు శక్తిగల జీవి యొక్క సన్నిధికి వచ్చుట ఎంత మరణకరమైన సంగతి.

ఇక్కడున్న నా చిన్న సంఘమును క్షమించుమని ప్రార్ధి౦చుచున్నాను. దానిని నడిపించుటకును, దారి చూపుటకును, నీవు నన్ను ఇక్కడికి పంపియున్నావు. వారిని దీవించుము ప్రభువా, నేను చేయవలసినదిగా, దర్శనముల ద్వారాను, కలల ద్వారాను, ఇతల కార్యముల ద్వారాను, చెప్పబడినట్టే నాకు తెలిసినంతవరకు చేశాను. ప్రభువా, వారికి ఏ విధముగా చేయాలని తలంచానో ఆ విధముగా, నేను ఆహారమును సిద్దపరచియున్నాను.

ప్రభువా, అది ఏమైనను, మేము నీవారమైయున్నాము. ప్రభువా, మమ్ములను మీ చేతికి అప్పగించుకొనుచున్నాము, మన్నించి కృప జూపుము, మేము ఈ భూమి మీద ఉన్నంతకాలము నీకు సాక్షులుగా ఉండునట్లు కృప జూపుము. మమ్ములను మీ రాజ్యములో అంగీకరించుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

142మీలో ప్రతిఒక్కరు, మీ హృదయుములను శుద్ధిచేసుకొనండి. ప్రతి భారమును, ప్రతి దానిని ప్రక్కనుంచండి. మీ మార్గము నుండి దూరపర్చండి. ఏదియు మిమ్మును తొందరచేయనియ్యకుడి. భయపడవద్దు. భయపడుటకు ఏమియు లేదు. యేసు వచ్చుచున్నయెడల అది ఎంతో… ఈ ప్రపంచమంతయు ఎందుకొరకు మూలిగి, ఏడ్చారో అది ఈ ఆ క్షణమైయున్నది. క్రొత్తది వచ్చుటకై ఏదో ముందుకు చొచ్చుకొని వచ్చుచున్నది — క్రొత్త బహుమానము లేక మరొకటి వచ్చుచున్నది — అది ఎంతో ఆశ్చర్యము. ఆ ఏడు బూరలు సంఘమునకు బయలుపడుట వచ్చుచున్న కాలముగా అది ఉన్నది. (ఏ విధముగా ఆయన యొద్దకు వెళ్లాలో దానిని తెలుపుటకు), నాకు తెలియదు. నేను చూచిన దానిని నేను చెప్పినాను.

ఓ, మై, ఏమి ఆ సమయము! ఇది అపాయకరమైనది గాను, ప్రశాంతముగాను యోచించవలసియున్నది. నేను వెళ్లిపోవలసిన కాలమైయున్నది. నేను నీ వాడనైయున్నాను ప్రభువా, నేను నీ వాడనే. నీవు సమస్తమును ముగించినప్పుడు, ప్రభువైన యేసు రమ్ము ఎక్కడికైనను ఏ సమయమైనను నేను నీ సన్నిధిలో ఉన్నాను. నేను నిన్ను విడిచిపోవాలని, ఆశించుచున్నానని, చెప్పుటలేదు; అలా కాదు. పెంచుటకు నాకొక కుటుంబము నాకున్నది; నేను సువార్తను ప్రకటించవలసియున్నది. అయితే అది ఆయన చిత్త ప్రకారము జరుగునదైయున్నదే గాని, నా ఇష్టప్రకారమైనది కాదు. అది ఆయన చిత్తమైయున్నది. నాకైతే తెలియదు. అది ఏమిటో మీకు తెలుపుచున్నాను. ఏమనగా, దేవుడు దానిని నెరవేర్చును. అయితే నేను చూచినదానిని మీతో చెప్పాను, ఏమి జరిగినదో అది మీతో చెప్పాను. దాని అర్థమేమో నాకు తెలియదు. అయితే అయ్యలారా, ఇది అంతముగా ఉన్నదా?

143ఇప్పుడు ఈ ప్రజలు ఇక్కడున్నారు — ఆ ఆరుగురు కలలుకన్నవారే, అవి ఏడుగా ఉండక ఆరుగా ఉండుట ఆశ్చర్యముగా లేదా? ఆరవది ముందుకు నడిపించుకొని వెళ్ళుట, వెంటనే ఆ దర్శనము కలుగుట ఆశ్చర్యముగా ఉన్నదా? ప్రజలందరు ఇక్కడ ఉన్నారు. సోదరుడు జాక్సన్, ఇక్కడే ఉన్నారు. సోదరుడు పార్నెల్ మరొకరు; సోదరి కాలిన్స్ మరొకరు; సోదరి స్టేఫీ మరొకరు; సోదరుడు రాబెర్సన్ మరొకరు; సోదరుదు బీలర్ మరొకరు; మరియు దానికి సంబంధించినది మరొకటి లేదని పరలోకపు తండ్రి ఎరిగియున్నాడు. ఆ ఏడవ దాని చివర, (అది సోదరి, స్టెఫీకి వచ్చిన కల) ఆ దర్శనము, వెంటనే ప్రత్యక్షమైనది.

మీరు చూచారా? నేనెందుకు వెళ్ళుచున్నానో మీరుచూశారా? ఎందుకు వెళ్ళవలసి వచ్చుచున్నదో చూశారా? దానిని నేను చేయవలసియున్నది. మరియు స్నేహితులారా, నన్ను చూడకండి. నేను మీ సోదరుడను. నన్ను గమనించకండి, నాపై శ్రద్ద ఉంచకండి, నేను మీలాంటి ఒక మనిషిని, ఎందుకనగా ఇతరులు మరణించినట్టే నేను మరణించవలసియున్నది. నేను మట్లాడు విధానమును చూడకండి, అయితే నేను చెప్పుచున్నదానిని వినండి. నేను వర్తమానమును చెప్పుచున్నాను. వర్తమానికుని పై మీ తలంపును ఉంచకండి; వర్తమానమును గమనించండి. మీ చూపును వర్తమానికునిపై ఉంచకండి, అయితే వర్తమానముపై ఉంచండి — అదేమి చెప్పుచున్నదో గమనించుడి. అదే మీరు చూడవలసినది. మరియు దేవుడు మనకు సహాయము చేయాలని నా ప్రార్థనగా ఉన్నది.

144నేను వచ్చి దీనిని చెప్పుటకు ఇష్టపడుట లేదు, అయితే మీకు తెలుపకుండ దేనిని మరుగుచేయలేదు.

నాకు తెలిసినంతవరకు, (మీతో చెప్పనివ్వండి), నాకు తెలిసినంతవరకు, నేను ఇంక రెండు లేక మూడు దినములలో వెళ్లనైయున్నాను. బుధవారము ఉదయము ట్యూసాన్ వెళ్లనైయున్నాను. నేను ప్రసంగించుటకు అక్కడికి వెళ్ళుట లేదు. నేను నా కుటుంబమును అక్కడ స్థిరపరచుటకును, పిల్లలను పాఠశాలలో చేర్చుటకు వెళ్ళుచున్నాను. ఆ తరువాత నేను సువార్తసేవలో తిరుగవలసియున్నది.

నేను ఫోనిక్స్ వరకు వెళ్లి అక్కడ జరుగు ఆ చిన్న కూడికలలో కలసికొనబోవుచున్నాను. అది చిన్న వర్తమానముగా ఉండును. మరియు, మరియు తరువాత నాకు తెలియదు. అక్కడ ఒక సమావేశములో వారు నన్ను ప్రసంగించమని కోరారు. దానిని గురించి వారేమి నాతో చెప్పలేదు. నేనక్కడ ఉండవలెనని వారు కోరుచున్నారు. అది నాకు అంత మంచిగా తెలియుట లేదు. సోదరుడు షికారియన్తో నాకు, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఒకటి ఉన్నది. అతడు దానితో ఏమి చేయునో నాకు తెలియదు. అయితే అతనితో చెప్పుటకు నాకొక మాట వచ్చియున్నది. అతడేమి చేయునో నాకు తెలియదు. అది అతనికి సంబంధించినది.

145ఆ చివరి స్వరమును మీరు గమనించారా? అది ఒక సంస్థగా ఉండ వలసినదికాదు, అయితే వారు వారి సిద్దాంతమును ప్రకటించారు. అది ఒక సంస్థగా ఏర్పడినది, అప్పుడు నేను దానిని విడిచిపెట్టాను. అటువంటి దానికి నేను వెలుపల ఉన్నాను.

ఇప్పుడు, సోదరుడు ఆర్గన్ బ్రైట్ మరియు సోదరుడు రోల్, అతడు వాషింగ్టన్ పట్టణములో ఏడుగురు అధ్యక్షుల క్రింద రాజకీయ ప్రముఖునిగా పని చేసెను, ఒక గొప్ప మేధావి, అతడు ఆఫ్రికా దేశమందు ఉన్నాడు. సోదరుడు రోల్, నేను మరియు ఆ సోదరుడు ఆర్గన్ బ్రైట్ కలిసి ఆఫ్రికా దేశమునకు కొన్ని కూడికల కొరకు అక్కడ నుండి వెళ్ళుచున్నాము — దక్షిణ ఆఫ్రికాలోను, టాన్ జ్యానికా పట్టణములకు, సోదరుడు బోయెజుతో వెళ్ళుచున్నాము. అక్కడ నుండి బహుశా ఆస్ట్రేలియా వెళ్లి, ప్రభువు మరొక దానిని చేయనియెడల తిరిగి వచ్చెదము. అయితే నేను ఈ పట్టణముల కన్నిటికిని వెళ్ళుటకు ముందు ఇక్కడికి వచ్చెదను.

అక్కడ నుండి వచ్చిన తర్వాత, దేవుడు మరొక విధముగా నాతో మాట్లాడని యెడల, నేను నా కుటుంబమును తీసికొని, అలస్కాలోని, ఆంకరేజ్ప్రాంతమునకు వెల్లవలసియున్నది. ఇది దక్షిణ పడమరలుగా ఉన్నది; అది ఉత్తర పడమరలుగా ఉన్నది. అప్పుడు ఎండకాలము అక్కడ నిలచియుందుము. ట్యూసాన్లో అధిక ఉష్ణము౦డుట వలన, మీ చర్మము కాలిపోవును. వారు దానికి నిలచెదరని నేను నమ్ముట లేదు. వారికి అధికముగా జబ్బు చేయును. మేము ఆ స్థలమును అమ్ముట లేదు. సామానులతో ఆ ఇల్లు అక్కడే ఉండును. ఏమి చేయాలో నాకు తెలియుట లేదు.

2TIM 4:5

 

146అంతట అప్పటికి ఎండాకాలము అయిపోయి ఉంటుంది, ప్రభువు చిత్తమైతే నేను అలస్కాను విడిచి, డెన్వెర్ అను ప్రాంతమునకు వచ్చెదను — అది మధ్య పడమరగా ఉన్నది. దక్షిణ పడమర, ఉత్తర పడమర, మధ్య పడమరలో ఆక్రందన చేయుచు, "ఓ, ప్రభువా, నేనేమి చేయూలని నీవు తలంచుచున్నావు," అని అడిగాను.

ఆ మధ్యలో, ప్రతి వర్తమానము, నాకు తెలిసినంతవరకు మాట్లాడనున్న వర్తమానములన్నియు ఇక్కడ ప్రసంగించబడినవే. ఈ గుడారమందు, ఇక్కడే ఆ వర్తమానము టేపులు చేయబడుచున్నవి. ఇక్కడే ప్రధాన కార్యాలయమున్నది. మరియు నేను నా కుటుంబముతో పడమరలో నిలచియుండు తలంపులేదు. దేవుడు నన్ను ఏ విధముగా వాడుకొనబోవుచున్నాడో దానిని గ్రహించు వరకు అక్కడ ఉ౦డేదను.

ఈ సంవత్సరము కాకున్నయెడల, రానున్న సంవత్సరములో కూడ కొనసాగించెదను. ఆహారము, నీళ్లు లేకనే నేను ఆ ఎడారిలోనికి నడిచి వెల్లెదను. ఆయన నన్ను పిలచు వరకు నేను వేచియుందును. ఈ విధముగా నేను వెళ్లలేదు. మీరు భయము లేని స్థితిని పొందవలెను. దేవుని చిత్తమును పూర్తిగా గ్రహించు స్థానమునకు మీరు రావలసియున్నది. ఆ చిత్తమును మీరే విధముగా చేయాలో తెలిసియుండవలెను, మీకు ఆ చిత్తము తెలియదా? నేను దానిని లోతుగా పరిశీలించుచున్నాను, ఎందుకనగా, ఆ దర్శనము వెనుక మీరేమి చేశారు, దేశము చుట్టూ మిషనెరీగాను, సువార్త సేవకుని గాను, దేవుని పిలుపు వచ్చునంత వరకు వెళ్లుచుందును.

మనము మొదటిగా ఆ మూలరాయిని వేసినప్పుడు జ్ఞాపకము ఉన్నదా? "సువార్తకుని పనిచేయుము," అని ఆయన సెలవిచ్చెను. నీవొక సువార్తికుడవని ఆయన చెప్పలేదు, అయితే ఆ పనిచేయుము; ఏదో ఒకదానికి బహుశా కాలము వచ్చును, అది మరొక మార్పుగల పనిగా ఉన్నది. అది వ్యత్యాసముగా ఉండవచ్చు. నాకేమి తెలియదు.

147మీరు ఆయనను ప్రేమించుచున్నారా? దానిని గురించి నమ్మకముగా ఉండుడి. ప్రభువును ప్రేమించువారు, అలా ఉండుడి…

ప్రభువు కొరకు వేచియున్నవారు,

వారి బలమును నూతనబలముపొందుదురు.

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకిఎగురుదురు.

వారు అలయక పరిగెత్తేదరు.

సోమసిల్లక నడచిపోవుదురు.

ఓ, నేర్పుము ప్రభువా, వేచి యుండుటకు నేర్పుము ప్రభువా?

నేనాయునను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించుచున్నారని ఎరిగి యున్నాను.

ఇప్పుడు రేపు రాత్రి… మీకు చాలినంతగా విశదపరచానని నేను తలంచుచున్నాను. నేనలా చేశానా? దానిని ఏ విధముగా చేయాలోనని నాకు తెలిసినంతవరకు ఎంత విపులముగా చేయాలో ఆ విధముగా చేశాను. నాకు తెలిసిన దంతయు అంతే. నేను ఏమి చెప్పాలో నాకు తెలిసినదంతయు అంతే. అది నాకు ఒక కారణముగా బయలుపడినది. నేను త్వరగా మీకు చెప్పెదను. మీరు దానిని తెలిసికొనుటకు ఉత్సాహముగా ఉందురు. నేను కూడ తెలిసికొనుటకు ఇష్టపడుచున్నాను. దాని భావమేమో నాకు తెలియదు. నేనెక్కడికి వెళ్ళుచున్నానో అది కూడ తెలియదు. ఏమి జరుగనైయున్నదో నాకు తెలియదు. నేను కేవలము. నాకు తెలిసిన ఒక్క సంగతి, నేను దేవుని కృప వలన ముందుకు వెళ్ళుచున్నాను. నేనక్కడికి వెళ్లినప్పుడు ఆయన నాతో చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నా భాగము వెళ్ళుటయే.

నేను మరొక స్థలమునకు వెళ్ళుటకు ముందురెండు వారములు అక్కడ ఉండెదను లేక ఇక్కడికి తిరిగి వచ్చెదను. అది నిజము. నాకు తెలియదు గాని నేను, ఆ దర్శనములో నా భార్య బిడ్డలున్నారు. అదేమనగా - నేనొక మూయబడిన బండిలో ఉన్నాను, నేను అక్కడికి నడచి వెళ్లిన నిమిషములో, ఒక. నేను నా బండిలో (చిన్నవాడను) కూర్చొనియున్నాను.

ఆ విధముగా రెండు రోజులలో మేము వెళుచున్నాము. ఎక్కడికి వెళ్లవలెనో తెలియకయే వెళ్లుచున్నాము. మేమేమి చేయాలో తెలియకయే అక్కడికి వెళ్లుచున్నాము. కేవలము వెళ్లుచున్నాము. అంతే.

JOHN 21:22

 

148దేవుడు మనయందు ఆశ్చర్యకరుడు, ఎందుకనగా ఆయన మార్గములు త్వరగా కనుగొనదగినవి. ఆయన లోబడుటను కోరుచున్నాడు.

"మీరెక్కడికి వెళ్ళుచున్నారు?"

"అది నీ పని కాదు వెళ్ళుచూ ఉండుము."

"ప్రభువా నీకేమి చేయమందువు?"

"అది నీ పని కాదు నన్ను వెంబడించుము. నడుచుకొంటూ వెళ్లుము."

"నేనెక్కడ నిలువవలెను?"

"అది నీకెందుకు? నడుచుచూ వెళ్లుము"

అందువలన నేను ఇప్పుడు వెళ్లుచున్నాను. అది ప్రభువైన యేసు క్రీస్తు నామములో వెళ్లుచున్నాను. ఆమేన్.

నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును,

ఆయనే నన్ను మొదటగా ప్రేమించెను,

నా రక్షణను కొనెను,

ఆ కల్వరి వృక్షముపై,

నేనాయనను ప్రేమింతును. (ఆయన నా జీవము)

నేనాయనను ప్రేమింతును. (నేనాయన కొరకు జీవింతును).

ఆయనే నన్ను మొదటగా ప్రేమించెను,

నా రక్షణను కోనెను, ఆ కల్వరి వృక్షముపై

అయ్యలారా, ఇదేనా ఆ సమయము?

[సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘము నేను ఆయనను ప్రేమించుచున్నాను అను పాటను పాడుచుండిరి.]

మరియు మనము మరలా పాడుచుండగా ఒకరినొకరు కరచాలనము చేసికొందము. "సహాదరుడా, సహాదరీ, నా కొరకు ప్రార్థించుము, నీ కొరకు ప్రార్థించెదము," అని చెప్పుకొందము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...