పోటీ

పోటీ

VGR COUNT -72 1ఆయన యొక్క మార్గములెంతో అగమ్యములు, అవి ఆ విధముగానే ఉండును కదా? అద్భుతమైన దేవుడు. ఆయనను నమ్ముకొనుటనునది ఎంతో మాధుర్యముగా నున్నది. ఈ రాత్రి మీరు నిశ్చయముగా ఒక అద్భుతమైన సమయమును కలిగియున్నారని నేననుకుంటున్నాను. కొద్ది క్షణములకు ముందు తలుపులను తెరచుచుండగా మరి సహోదరి గెర్టీ "కేవలము ఇంకో గంటే యున్నది, పట్టుకొనుచూ యుండుము," అను ప్రాచీన పాటను పాడుచుండుటను, నేను విన్నాను. నేను సువార్త సేవకై బయటి ప్రదేశములకు వెళ్ళక ముందు అప్పటి నా చిన్న సంఘము యొక్క జ్ఞాపికలను అది మరలా తీసికొని వచ్చినవి. నాకు ముందున్న దూలమునకు అడ్డముగా వ్రాయబడిన "మొదట దేవుని వెదకుడి," అను పలుకులను నేను చూచుచున్నాను, సుమారుగా ఇరువది ఐదు సంవత్సరములకు మునుపు సేమి డేవిడ్‌సన్ దానిని వర్ణాక్షరములతో వ్రాసెనని నాకు జ్ఞాకపమున్నది, దానికి అటు ప్రక్కన "నీవు నిత్య జీవమును ఎక్కడ గడుపబోవుచున్నావు? ఆలోచించు!" అనే మాటలను వర్ణాక్షారములతో వ్రాసియున్నవని నేను తలంచుచున్నాను. మరిక్కడ బావి యొద్ద ఒక ఒక స్త్రీ, మరియు సింహపు గుహలో దానియేలు వంటి చిత్రములు గలవు. ఓ, మై! అప్పటి నుండి అనేక కార్యములు సంభవించియున్నవి.

2ఇచ్చట ఈ జిల్లా నుండి సుమారు ముప్పై, నలభై మళ్ళ దూరముననున్న స్థలము నుండి నాకు ఈ మధ్యాహ్నము ఐదు గంటల సమయమునకు ముందుగా ఒక అత్యవసర టెలీఫోను పిలుపు వచ్చెను, అది మరణావస్థలోనున్న ఒక స్త్రీని గురించి మరి ఆమె ఒక ప్రశస్త స్నేహితుడైన జార్జి కార్‌టర్‌ యొక్క తల్లి. నేను వెళ్ళి మరలా తిరిగి వచ్చేంత వరకు చూచుకొనుటకు ఇచ్చట అనేకమంది సేవకులు కలరు. ఎడిట్ యొక్క పరిస్థితి కూడా బాగోలేదు మరియు మేమచ్చటకు వెళ్ళియుండగా, ప్రభువైన దేవుడు సన్నివేశములోకి వచ్చి కదలాడెను మరి సహోదరి కార్టర్ మృత్యువు నుండి చాలా దూరముగా వెళ్ళి పోయిరి. కావున కావున మనము దాని కొరకు చాలా కృతజ్ఞులముగా ఉన్నాము.

3మరిప్పుడు, త్వరలో ప్రభురాత్రి భోజన ఆరాధన సమయము సమీపించుచున్నది వారు సుమారుగా పన్నెండు గంటలకు దానిని చేయబోవుచున్నారని నేను అనుకొనుచున్నాను. దానిని ఎప్పుడు ఇయ్యవలయునని మీరు నిర్ణయించి యున్నారు? [సహోదరుడు నెవిల్ చెప్పుచున్నారు, "ఇప్పటి నుండి పదకొండున్నర వరకు మరి ఆ సమయము లోపల ఏ సమయములోనైనను." సంపా.] కావున ఏ సమయములోనైనను మనము ఈ రాత్రి ఎందరు ప్రభురాత్రి భోజనమును తీసికొనబోవుచున్నారు, మీ చేతులను మేము చూడనిమ్ము. ఓ, అది చాలా బాగున్నది. అది మంచిది. నేను ఒకటిరెండు మాటలను మాటలాడాలనుకుంటున్నాను. నేను నా యొక్క గడియారమును సుమారు పది, పదిహేను నిమిషములకు ఇచ్చట ఉ౦చవలయునని ఉన్నాను, పిదప మనము రాత్రి భోజనమును ప్రారంభించెదము. ఇప్పుడు, మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఆమేన్. మరియు మీరు ఒక గొప్ప సమయమును కలిగియుండిరని నేను ఎరిగియున్నాను, మీరు కలిగియున్నారు కదూ?

4మంచిది, ఎంతో దూరమైన ఓహైయో నుండి వచ్చు సహోదరుడు తామస్ కిడ్ మరియు సహోదరి కిడ్ ఇక్కడ లేనట్లైతే, వారు ఆపైకి వెళ్ళారని నేను ఊహించుచున్నాను. ఓ, అది చాలా బాగున్నది, అది యున్నదని నేను నమ్ముచున్నాను మరి దానిని నేను పొందెదను. మీకు తెలియునా, వారు ఇంకా వదిలివేయ లేదు. వారు ఇంకొద్ది దినములలో వంద సంవత్సరముల వయస్సుగల వారగుదురు. అయితే, మరి అటువంటి ప్రజలను చూచుట వలన నాకుఏమి కలుగుచున్నదంటే, అది నన్ను ధైర్యముగలవానిగా చేయుచున్నది. తలంచి చూడుడి, నేను ఒక వృద్ధుడిని మరియు నేను జన్మించక ముందునుండే వారు సువార్తను ప్రసంగించుచుండిరి. మరటు పిదప ఇచ్చట నేనొక వృద్ధుడిగా యున్నాను మరియు వారు, వారు బయటికి వెళ్ళి వారు ప్రసంగింపలేనప్పటికిని వారు ఒక రికార్డును తీసికొని మరి ఒక్కొక్క వైద్యశాలకు, ఇంటింటికి సువార్తను ప్రకటించుచు వెళ్ళుచున్నారు. అది ఒక శక్తివంతమైన చక్కటి కార్యముగా యున్నది. ఆమేన్. నేను నిశ్చయముగా వారి కొరకును మరియు ఇచ్చట జరుగు ఈ ఆరాధనలను ఎదురుచూచు వారందరి నిమిత్తము చాలా సంతోషించుచున్నాను.

5ఇప్పుడు, జ్ఞాపకముంచుకోండి, దీనిని ఇప్పుడు మీకు ప్రకటించుచున్నాము. ప్రభువు చిత్తమైనయెడల, సంఘము యొక్క భవనము కట్టి ముగించిన వెంటనే, అది బహుశా ఫిబ్రవరి నెలలో సమాప్తమగునని చెప్పబడుచున్నది, ప్రభువు చిత్తమైనయెడల మేము ఇంచుమించు ఎనిమిది లేదా పది దినములు లేదా బహుశా రెండు వారముల వరకు ప్రకటన గ్రంథములోని ఏడు ముద్రలను తీసుకొని వాటిపై మాట్లాడాలని ఆశించుచున్నాము. చుట్టు ప్రక్కల వున్న వారికి కార్డులను తపాలా ద్వారా ఇచ్చట నుండి తెలిపెదము. వారు వచ్చుటకు ఆశించినట్లైతే, అందుకొరకు సిద్ధపడుటకు వారికి ఎంతో సమయము యుండును. మీ రాకకై మేము ఎంతో ఆనందించుచున్నాము. గతసారి ఏడు సంఘ కాలములను ధ్యానించునప్పుడు ఆయన ప్రసన్నత ద్వారా మనలను సంధించిన విధముగానే ప్రభువు చిత్తమైనయెడల ఆయన మరొకసారి మనలకు ప్రత్యక్షమగును.

మీరు గనుక ఎవరికొరకైనను ప్రార్ధి౦పవలయుననిన, ఎందుకు, నన్ను గురించి ఎల్లప్పుడును జ్ఞాపకముంచుకొనండి, ఏలయనగా, నాకు ప్రార్థన చాలా అవసరమైయున్నది. మనము ప్రారంభించుటకు ముందు, కొన్ని విషయములను గురించి చెప్పుటకు ఈ పది, పదునైదు నిమిషములు మాత్రమే తీసుకొనవలసియుండుటకు నాకు చాలా సిగ్గుగా యున్నది, అయినను ఒక్క క్షణము మనతలలు వంచెదము.

JOHN 9:4

 

6ప్రభువైన యేసు, ఓ, ఒకానొక దినమున ఈ యుద్ధము ముగియును, మరియు అప్పుడు ప్రార్థింపబడుటకు ఏ వ్యాధిగ్రస్థులు ఉ౦డరు, మరియు పశ్చాత్తాపపడుటకు ఏ పాపియును ఉ౦డరు. అయితే, తండ్రీ, ఇప్పుడున్న విధముగా ఉ౦డు ఈ దినమున, పనిచేయుటకు వెలుగుయున్నప్పుడే మనము పనిచేయుదము, ఏలయనగా, ఏ మానవుడు పనిచేయుటకు సాధ్యపడని ఘడియ వచ్చుచున్నది. ఇప్పుడు, కొద్ది క్షణములు ప్రభువా, నేను కొన్ని మాటలు చెప్పకుండా ఈ సంవత్సరమును ముగించిన యెడల నేను ఎంతో బాధపడెదను. తండ్రీ, మీ జనుల యొక్క హృదయములలో ధైరమును నాటుకొనునట్లుగా దేనినైనను నేను చెప్పునట్లుగా నాకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను, ప్రభురాత్రి భోజనము ముగించిన పిదప మేము ఈ రాత్రి ఇచ్చటి నుండి వెళ్ళేటప్పుడు, ప్రభురాత్రి భోజనములో శక్తి దాగియుంది అని మేము గ్రహించుచున్నాము. ఇశ్రాయేలు మొదటి ప్రభురాత్రి భోజనమును ఐగుప్తులో తీసికొనెను మరియు వారి చెప్పులు అరిగిపోకుండా వారి వస్త్రములు చినిగిపోకుండా నలుబది సంవత్సరములు నడచిరి. మరియు ఇరువది లక్షల మందితో వారు అరణ్యములో నుండి బయటికి వచ్చినప్పుడు వారిలో ఒక్కరు కూడా బలహీనులు కాలేదు. ప్రభువా, ఈ మహత్తరమైన ఘడియలను మేము సమీపించుచుండగా, ఆ రాత్రిని మేము గుర్తుంచుకొననిమ్ము. యేసు నామమున మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.

EPH 6:12

 

7ఈ మధ్యాహ్నము నేను ప్రారంభింపవలయునని నేను వ్రాసియుంచుకొనిన పాఠ్యాంశమును గనుక నేను మాటలాడిన యెడల మనము ఉదయము ఐదుగంటల వరకు ఇచ్చట యుండవలయును. (సహోదరుడు నెవిల్ చెప్పుచున్నారు, అది ఫరవాలేదు - సంపా.) అయితే, నేను ఒక వాక్యమును చదువవలయునని యున్నాను… మీకు వందనములు. ఎఫెసీయులు 6వ అధ్యాయము, 12వ వచనము మరియు ధైర్యపరచుటకు, ఇప్పుడు కొద్ది క్షణములు.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధలగు లోకనాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

EPH 6:12

 

8"ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను," మరియు దాని నుండి ఒక చిన్న పది లేక పదైదు నిమిషముల అంశమును తీసికొనవలయునని ఆశించుచున్నాను. దానిని నేను "పోటీ" యని పిలవాలనుకుంటున్నాను ఒక పోటీ అనునది ఒక బలపరీక్ష మరియు మనము బలపరీక్ష జరుగుటలో మనము ఇండియనులు ఒక అగ్నిని మధ్యన ఉంచి మరి ఒక త్రాడును పట్టుకొని దానికి ఇరు ప్రక్కల అనేకమంది పురుషులు ఉండెదరు. ఆ త్రాడుకు ఇరు ప్రక్కల ఉండువారు అటు, ఇటు పట్టుకొని బలముగా లాగెదరు, ఆ బలపరీక్షలో బలముగా లాగు జతవారు బలహీనులను అగ్ని గుండా వారి ప్రక్కకు లాగెదరు. మరిప్పుడు అనేక విషయములను మనమెరుగుదుము మరియు మనము దీనిని ఒక పోటీ పైన ఆధారముగా తీసికొని కొద్ది నిమిషములు పోటీలలో ప్రఖ్యాతిగాంచిన ఒక పోటీని గురించి నేను ఈ కొద్ది నిమిషములు మాట్లాడాలని ఆశించుచున్నాను. అది సంఘమునకును మరియు సాతానుకు మధ్య జరుగుచున్న పోటీ. సాతాను యొక్క ఆ గొప్ప శక్తి. మరియు సంఘములో దేవుని యొక్క గొప్ప శక్తిని గురించి మనము మాటలాడగోరుచున్నాము.

MARK 16:17•

JOHN 1:1•

REV 12:9

 

9ఇప్పుడు, ఈ గొప్ప పోటీ అనేక సంవత్సరములుగా కొనసాగుచున్నది. అది పరలోకములో ప్రారంభింపబడి మరి సాతానుడు భూమిపైకి నెట్టివేయబడెను, మరటు పిదప వాడు దేవుని జనులకు ఒక శత్రువుగా మారెను. మరప్పటి నుండి వాడు తన శక్తియంతటిని మరియు తన కుయుక్తులన్నింటి ద్వారా దేవుని జనులను అగ్నికి పైగా లేక తన అగ్నిలోనికి లాగివేయవలయునని ఉపయోగించుచున్నాడు.

ఎవరికి అధిక శక్తి కలదో మనమెరుగుదుము, అది దేవుడు. మరియు దేవుడు, ఆయన ఇవ్వగలిగిన శ్రేష్ఠమైన ఒక కార్యమేమనగా సాతానుని ఎదిరించుటకు ఆయన తన ప్రజలకు ఇవ్వగోరినదేమనగా అది ఆయన యొక్క వాక్యమైయున్నది. ఇప్పుడు, వాక్యము దేవుడై యున్నందున మరియు దేవునికంటే బలవంతులు ఎవరు? కావున, వాక్యము దేవుడై యుండెను, మరియు వాక్యము మన యొక్క శక్తిగా యున్నది. సాతానుడు తనకు తానుగా చేసుకొన్న అగ్ని గుండములోనికి సాతానుని లాగుటకై దేవుడే సంఘములో యుండుటచే మరి సంఘము శక్తివంతముగా మారెను. మరియు బలపరీక్షకై లాగుట కొనసాగుచున్నది.

10ఇప్పుడు, యేసు మార్కు 16లో చెప్పెను, "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు."

ఇప్పుడు, అది పాత సామెతయని నేనెరుగుదును, ఆ జనులు లేక, పాత మాట ఒకటి కలదు… మరియు అది అంత పాత మాట కూడా కాదు. జనులు ఈ దినమున దయ్యములను నమ్ముట లేదు. అయితే నా యొక్క ఉద్ధేశములో చేయవలసిన కార్యము, నీ శత్రువును నీవు గుర్తెరగవలెను. మరియు నీ శత్రువును నీవెరిగి, అతడిని ఎదుర్కొనునపుడు జరుగు బలపరీక్ష యొక్క పోటీ కొరకు నీవు తర్ఫీదు పొందుము, ఏలయనగా, నీవు అతనిని ఎదుర్కొనవలెను. మరియు అతడిని నీవెరిగి, అతడిని ఎదుర్కొన్నప్పుడు అతనిని గురించి తెలుసుకొనవలెను. అతని బలమును గురించి తెలుసుకొనవలెను. మరియు మీరు అతడిని ఎదుర్కొనపుడు జరుగబోవుచున్న బలపరీక్ష యొక్క పోటీకై తర్ఫీదును నీవు పొందియుండవలెను. ఎందుకనగా ఒక విషయము ఖచ్చితమై యున్నది, అదేమనగా మీరు అతడిని ఎదుర్కొనబోవుచున్నారు. మరి కావున మీరు బల పోటీకై శిక్షణ పొందియుండవలెను.

ఇప్పుడు, ఒక బలపరీక్ష యొక్క పోటీకి పొందు తర్ఫీదు ఒక మల్లయుద్ధము చేయువానివలె యున్నది. ఒక బలముల పోటీ యుద్దములో సంధించబోనైయున్న తన శత్రువును గురించి ఒక నిజమైన ముష్టి యుద్ధము చేయువాడు సహజముగా తన శత్రువు యొక్క బలమును గురించి గమనించి తెలిసికొనును, అతనిని నేలకరిపించు విధానమును పరిశోధించి తెలిసికొనును. అతడు ఏ విధముగా కదులుచూ పోట్లాడుచున్నాడు, అతడు ముందుకు వంగునా, లేదా వెనుకకు వాలునా అనియు, అతడు కుడిచేతి అలవాటు గలవాడా, లేదా ఎడమ చేతి అలవాటు గలవాడా అని అనేక విధములుగా పరిశీలించి యుండును. అతను దీనినంతటిని పరిశోధించి తెలిసికొనును. మరియు అతను గనుక ఒక మంచి చురుకుదనము గల పోరాట వీరుడైన యెడల అతను తనకై తన శత్రువువలె యుద్ధము చేయు భాగస్వామిని కనుగొని అతనితో యుద్ధము చేయును, ఏలయనగా, ఆ విధముగా శిక్షణ పొందిన యెడల తన శత్రువు యొక్క బలహీనతలన్నిటిని ఆ సమయములో అతడు కనుగొనును.

GEN 2:16,17

 

11మరియు క్రైస్తవులు చేయవలసిన ఒక మంచి కార్యమని నేను తలంచుచున్నాను. అది నిజము. మరియు మీరు గనుక ఇపుడు శిక్షణ ప్రారంభింపవలసినచో, యోహాను 3:16తో ప్రారంభించండి, బంగారు సూత్రము. మీరు దానితో ప్రారంభించండి మరది మిమ్ములను రంగములోనికి కొనిపోవును. మరటు పిదప క్రింద పడవేయుటకు గాను గుద్దులను గుద్దుటకు గాను శిక్షణ పొందుడి, ఏలయనగా మీరు వాటిని ప్రయోగించబోవుచున్నారని ప్రతి ఒక్కరు దాని ఎరిగి యుండవలెను. మీ శత్రువును దెబ్బతీయుటకై మీరు శిక్షణ నొందవలయును. మరియు ఎల్లప్పుడును దేవుడు ఆయన వాక్యమును ఉపయోగించును. దేవుడు ఆయన యొక్క శత్రువును ఓడించుటకై ఆయన వాక్యమును ఉపయోగించుననుటను మనము గుర్తుంచుకొనవలయును. శత్రువును జయించుటకు వేరేదైనను శ్రేష్టమైనది ఏదైనను ఉన్న యెడల దేవుడు దానిని తన జనుల ఇచ్చియుండును. ఆయన దానిని చేసి యుండెడి వాడు కాదు, నేనెల్లప్పుడును చెప్పెదను, "దేవుడు గనుక ఒక తీర్మానమును చేసిన యెడల, అదియే చాలా శ్రేష్ఠమైనది. ఆయన తన తీర్మానములను మార్చుకొనజాలడు." కావున శత్రువును ఎదిరించుటకు ఏదెను తోటలో దేవుడు ఆయన జనులకిచ్చిన మొదటి తీర్మానము ఆయన యొక్క వాక్యమైయున్నది. వాక్యము ద్వారా శత్రువును ఎదరించవలయుననుటయే ఆయన యొక్క సలహాగా యున్నది. వారు ఆయన యొక్క వాక్యమను రక్షణకోటలో యున్నారు.

JOHN 1:1

 

12మరిప్పుడు వాక్యముతో మనము ఏ విధముగా ఎదరించబోవుచున్నామను పథకమును శత్రువు తెలుసుకొనబోవుచున్నాడు. మరియు ఇప్పుడు, సాతాను దానినంతటిని చాల ఖచ్చితముగా ఎరిగియున్నాడు, అదెట్లనగా, అతను హవ్వ యొద్దకు వచ్చినప్పుడు ఆమె పై ఉపయోగించుటకైన ఒక ఉత్తమ పథకమును అతను కలిగియుండెను, మరది వాక్యమును జ్ఞానముతో వెదకుటకు ప్రయత్నింపవద్దు, దానిని అట్లే నమ్ముము. దానిని వివరించుటకు ప్రయత్నింపకుము. అది ఇట్లుండును, అది అట్లుండునుయని చిత్రీకరించుటకు ప్రయత్నింపకుము. ఇప్పుడు, మీరు దేవుని గురించి ఊహించుకొనలేరు, కావున దేవుడు వాక్యముగా యున్నాడు, మరది నమ్ముట కొరకే యున్నది. మరి వాక్యమును నమ్ముటయే మన శక్తిగాయున్నది. మరియు ఒక విత్తనము మంచి నేలలో పడినప్పుడు అది దాని యొక్క జాతినే మొలకెత్తించునని ఎవరైనా ఎరిగినదే. మరియు మనము వాక్యమును అంగీకరించుచున్నాము.

GEN 2:17•

GEN 3:3-5

 

13మరిప్పుడు, హవ్వ దాని కారణమును వెతుకుట మానెను, వాడికి ఆమె వాక్యమును చెప్పినప్పుడు, "దేవుడు చెప్పెను, వాటిని మీరు తినకూడదు, మీరు వాటిని తిను దినమున చనిపోయెదరు, కావును మేము తిను దినమున చనిపోవుదుము," అని.

మరియు సాతాను ఎన్నడు ఆమెతో విభేదించలేదు, ఏకీభవించెను.

వాడు చెప్పెను, "ఖచ్చితముగా, అది వాస్తవము." కాని వాడు చెప్పెను, "నీకు క్రొత్త వెలుగు అవసరమైయున్నది." దేవుడు చెప్పిన దానికి కొంచెం వ్యత్యాసమైన ఏదో ఒకటి కలిపి చెప్పెను. "మరియు నీవు గనుక దీనిని చేసిన యెడల, నీవు ఇంకొద్దిగా జ్ఞానవంతురాలివగుదువు, నీ కన్నులు తెరువబడును అనెను."

అయితే ఆమె చెప్పెను, "మంచిది, దేవుడు చెప్పెను మేము చనిపోయెదమని."

అతను చెప్పెను, "ఓ, నిశ్చయముగా …" చూడుడి, నీవు ఇంత వరకు వచ్చావు, "నిశ్చయముగా, నీవు చనిపోవు." అయితే దేవుడు చెప్పెను, నీవు చనిపోయెదవని మరి ఆ కార్యమును అది సిర్థపరచెను. మరియు ఆ త్రాడును లాగే గొప్ప యుద్ధములో అప్పుడచ్చట త్రాడు తెగిపోయి మరి సమస్త మానవ జాతిని మరణములోనికి లాగివేసినది. ఎందుకనగా, హవ్వ దేవుని వాక్యమునకు విరోధముగా జ్ఞానము ద్వారా ఒక అసత్యమునకు చెవి యొగ్గెను. ఆమె అట్లు చేయుట సిగ్గుచేటు, అయినను అది సంభవించి సమాప్తమైనది. అయితే, ఇప్పుడు మనమింకా కోట లోపల యున్నాము, మరియు యేసుక్రీస్తు ద్వారా అది జతపరచబడి యున్నది. దానిని మనమెరుగుదుము. దేవుడు మనకు శ్రేష్ఠమైన రక్షణను ఇచ్చియున్నాడు, అదేమనగా, కేవలము ఆయన వాక్యమును నమ్ముటయే.

14మీకు తెలియునా, దయ్యమనునది లేనేలేదని నేడు అనేకులు చెప్పుచుందురు. ఇప్పుడు అది ఒక ఊహ మాత్రమేనని వారు నమ్ముచున్నారు. దానిని వారు నమ్ముచున్నారు. మరియు పరిశుద్ధాత్మ అనునది ఒక మంచి తలంపుయని, మరి దయ్యమనునది ఒక చెడ్డ తలంపుయని నమ్ము జనులు అనేకులు కలరు. అయితే మీరు గమనించిన, పరిశుద్ధాత్మను గురించి బైబిల్ చెప్పునప్పుడు, ఆయన చెప్పెను, "ఎప్పుడైతే ఆయన, అ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు." మరియు "ఆయన" అనేది ఒక వ్యక్తిగత సర్వనామము. చూశారా? కావున, ఆయన ఆయన అనేది ఒక వ్యక్తిని సూచించుచున్నది. మరియు దయ్యము కూడా ఒక వ్యక్తిగానే వ్యవహరించుచున్నాడు. మరియు దయ్యములు కూడా వ్యక్తులే. అవును, అవి దయ్యములు, మరియు అవి అనేక మార్గముల ద్వారా లోపలికి దూరును. అయితే అది పాత-కాలపు పద్ధతియని వారు తలంచుచున్నారు.

JOHN 16:13

 

15కొద్ది వారముల క్రితము ఒక మనుష్యుడు నాతో వాదించుచుండెను. అతను చెప్పెను, "నీవేమి చేయుచున్నావో నీకు తెలియునా? నీవు జనుల యొద్ద ఒక దానిని చెప్పి, దాని యొక్క భావమును వారి మనస్సులలో ప్రవేశించునట్లు చేయుచున్నావు. అది తలంపులను మార్చునటువంటి ఒక కార్యమే అగుచున్నది."

ఇటువంటి దానినే ఒకసారి నేను ఇండియాలో చూచాను, అక్కడ మేము చూచిన పరిశుద్ధ మనుష్యులు, నేనింతవరకు మాట్లాడిన కూటములన్నింటిలో అదే గొప్ప జనసమూహము గల కూటము. ఒకే కూటములో ఐదు లక్షలమంది జనులు కూడికొని యుండిరి, మరియు నేను ఆత్మల వివేచనతో పట్టుకోనుచుంటిని. పరిశుద్ధాత్మ కూటము మధ్యలో నుండి జనుల యొక్క పేర్లను చెప్పి పిలచుటయు మరియు జనులను మధ్యలో పిలుచుటయు, మరియు ఇతర సంగతులు, తలంపులను పట్టుకొనుటయు వారు గమనించిరి. అచ్చట ఉన్న రాజులు మరియు పరిశుద్ధ మనుష్యులు, అతడు ఒక "వారి మనస్సులను చదివే వాడుగా యున్నాడని," చెప్పిరి.

16కావున కొన్ని క్షణముల తర్వాత సుమారు ఐదు లేక ఆరుగురు ప్రార్థనా వరుసను దాటిపోయిన పిదప మరి ఒక గ్రుడ్డివాడు వరుసలో వచ్చెను. మరియు అతను పూర్తిగా గ్రుడ్డివాడు, మరియు అతని కండ్లు నా చొక్కావలె తెల్లగానుండెను. మరియు నేను చెప్పాను, "ఇప్పుడు, ఇదిగో ఇక్కడ ఒక గ్రుడ్డివాడున్నాడు అతను గ్రుడ్డివాడని ఎవరైనా వచ్చి చూడవచ్చును." మరియు నేను చెప్పాను, "నేను గనుక అతనికి సహాయపడగలిగిన యెడల, నేను చేసెదను, అయితే నేను దానిని చేయాలంటే ఒకే మార్గమగు ఒక వరము ద్వారానే అది సాధ్యమగును, ఇతడు తన గత జీవితములో చేసిన విషయములను గురించి చెప్పుటయే; మరది ఒక తలంపును ఇచ్చుచున్నది, దేవుడు గనుక అతను ఏమి చేసినాడని ఎరిగియున్నయెడల, ఇతడేమి చేయబోవుచున్నాడో అని కూడా ఆయన నిశ్చయముగా ఎరిగి యుండును." కావున నేను చెప్పాను, "ఇపుడు, అతని తట్టు చూడుడి," నేను చెప్పాను, "ఇప్పుడు, ఇతడు సూర్యుడిని దేవుడిగా ఆరాధించువాడు. అతను ఇరువది సంవత్సరములుగా గ్రుడ్డివాడుగా యున్నాడు." మరియు ఆ తర్జుమాదారుడు దానిని చెప్పినప్పుడు, అది వాస్తవముగా యుండెను. నేను చెప్పాను, "అతను ఒక వివాహమైన వ్యక్తి. అతని భార్య పొట్టిది, మరియు అతనికి ఇద్దరు కుమారులు, ఒకనికి సుమారుగా ఏడు సంవత్సరముల వయస్సు, ఇంకొకనికి తొమ్మిది సంవత్సరములు." అది ఖచ్చితముగా సరియే. వారి పేర్లు ఏమిటో పిలువబడెను.

JOHN 5:19

 

17పిదప అక్కడ జనులు గుమిగూడియున్న చోట శ్రోతల మధ్యనుండి వ్యతిరేక ధ్వని ఒక అలవలె అది వచ్చెను. "అది మానసికమైన విషయము అది మనస్తత్వ శాస్త్రము ద్వారా వారి మనస్సులను గ్రహించునటువంటి ఒక కార్యముగా యున్నది."

పిదప నేను తలంచాను, "ప్రభువా, నీవు గనుక నాకు సహాయపడిన యెడల. ప్రభువా నాకు నాకు మీ సహాయము కావలయును. ఈ జనులు దీనిని ఒక మనస్తత్వమును గురించిన కార్యమని వారు చెప్పుచున్నారు. మరిది ఇట్లు కాదు, మరి ఇదేమిటని మీరెరుగుదురు, ప్రభువా. మరప్పటికిని, యేసు చెప్పిన ఆ లేఖనములను గురించి వారికి చెప్పాను, యేసుకు, తన తండ్రి ఆయనకు ఏదీ చూపించనంత వరకు ఏమియును చేయలేదు. మరియు పిదప నేను ఆ వ్యక్తి వైపుకు తిరిగి చూచినప్పుడు నా నేత్రములు వంటి చక్కని నేత్రములను అతడు కలిగి యుండుటను నేను ఒక దర్శనమందు చూశాను. నేను ఇదే ఆ సమయమని తలంచితిని."

నేను చెప్పాను, "ఇప్పుడు ఈ మనుష్యుడు సూర్యుడిని దేవుడిగా ఆరాధించువాడు మరియు అతను గ్రుడ్డివాడైనాడు." మరియు నేను చెప్పాను, "ఇప్పుడు, అక్కడ మహమ్మదీయుల మతగురువులు, మరియు అక్కడ సిక్కుల యాజకులు, మరియు జైను మతస్థులు గలరు. ఇప్పుడు, ఈ వ్యక్తి తన చూపును మరల పొందుకోవలెనని ఆశించుచున్నాడు. ఇప్పుడు, అతడు అతడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించుచున్నాడని మీరు చెప్పవచ్చు. నేను కూడా దానిని నమ్ముచున్నాను. అయితే మనమిక్కడ ఈ రాత్రి కూర్చొనియున్నాము."

నేను చెప్పాను, "మరియు మీలో ఎవరైనా, ఆ మొహమ్మదియులు ఇక్కడ ప్రధాన మతము, అయితే ఆ మొహమ్మదియ మతగురువు వచ్చి ఈయనకు చూపును ఇవ్వగలిగినచో నేను ఒక మహమ్మదీయుని వెంబడించెదను, లేక ఒక బౌద్ధ మతగురువు గనుక ఇచ్చటికి వచ్చి అతనికి చూపును ఇవ్వగలిగిన యెడల. అయితే అతనిని సృష్టించిన దేవుడు, ఒక దేవుడు, ఆ ఒక్క దేవుడు ఎవరి దేవుడైనా గాని ఎచ్చటో ఉండి తీరవలయును కదా, ఏలయనగా దేవుడు ఖచ్చితముగా ఉండి తీరవలయును, సృష్టికర్త ఒకడు లేకుండా సృష్టియనునది యుండదు. మరియు ఈ నేత్రములకు దృష్టిని అనుగ్రహించాలంటే అది దేవునివలనే సాధ్యమగును. సూర్యుని ప్రతి దినము చూచుట వలన గ్రుడ్డివాడై అతను ఇరువది సంవత్సరములుగా గ్రుడ్డివాడుగా యున్నాడు, అతను అనుదినము సూర్యుని చూచి ఆరాధించుట వలన పరలోకమునకు వెళ్ళెదనని తలంచుకొనెను. అతను ఎరుగక దానిని చేసెను.

నేను అడిగాను, "బౌద్ధ మత గురువులైన మీరు ఏమి చేయగలరు? మీరు అతని ఆలోచనలను మార్చగలరు. మీరు అతడిని చూచి తప్పని చెప్పగలరు. వారు, వారి మరణించిన పూర్వికులను ఆరాధించెదరు. మరియు నేను చెప్పాను, ఇప్పుడు, మీరు తలంచుచున్నారా, అతను అతను తప్పని మీరు చెప్పుచున్నారా, అయితే మీరు ఏమి చేయగలరు? మీరు అతను ఆలోచించు మార్గమును మార్చగలరు."

18మరియు నేను అడిగాను, "మహమ్మదీయులు మీరేమి చేయగలరు? అతడు అనుసరించు మార్గమును మార్చివేసెదరు. సిక్కులు, జైనులు మరియు ఆ విధముగా, వారు వారి ఆలోచించు మార్గమును, విధానమును మార్చివేసెదరు."

నేను చెప్పాను, "మాకు అమెరికా ఐక్య రాష్ట్రములలోను ఇటువంటి విషయములే గలవు. మెతడిస్థులందరూ బాప్తిస్థులను మెతడిస్థులుగా మార్చి వేయవలెనని ఆశించుచున్నారు, మరియు పెంతెకోస్తు వారు మెతడిస్థులనందరినికి పెంతెకోస్తులుగా మార్చివేయాలని ఆశించుచున్నారు. అది తలంపులను మార్చునటువంటి ఒక కార్యమై యున్నది. అయితే మేము చెప్పుచున్న విషయము అది కాదు. మేము సృష్టికర్తయైన దేవుని గురించి మాటలాడుచున్నాము. మరియు నేను చెప్పాను, "నిశ్చయముగా సృష్టికర్త మాట్లాడును." మరిప్పుడు ఆ దర్శనము గనుక అక్కడ లేని యెడల నేను దానిని చెప్పియుండెడి వాడిని కాదు. ఇప్పుడు, నేను చెప్పాను, "ఇప్పుడు గనుక ఆ దేవుడు ఒక్కడే అయినట్లైతే, ఆ దేవుడు వచ్చి అతనికి చూపును అనుగ్రహించును గాక!" మరియు నేను చెప్పాను, "ఇప్పుడు నేను ఏ మత గురువైనను, లేక రాజైనను, లేక పరిశుద్ధ వ్యక్తియైనను, లేక ఎవరైనా సరే ముందుకు వచ్చి అతడికి చూపును ప్రసాదించుమని నేను సవాలు చేయుచున్నాను. మరి అట్లైనయెడల "నేను మీ మతమును అనుసరించెదను, అప్పుడు మీరు మీ మతములో ఒకనిని చేర్చిన వారగుదురు." నేను చూచిన గుంపులో అదియే చాలా నిశ్శబ్దమైన జనుల గుంపుగా యుండెను. చూశారా? ఎవరును దానిని చేయలేకపోయిరి.

19మరియు నేను అడిగాను, "మీరెందుచేత ఇంత నిశ్శబ్దముగా యున్నారు?" నేను చెప్పాను, "మీరింత నిశ్శబ్దముగా యుండుటకు గల హేతువేమనగా మీరు దానిని చేయలేరు, మరియు నేను కూడా చేయలేను. అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును లేపిన పరలోకపు దేవుడు, నేను ఎవరి సేవకుడనో ఆయన, ఈ వ్యక్తి తన చూపును పొందబోవుచున్నాడని ఇప్పుడే నాకు ఒక దర్శనము ద్వారా చూపించెను." చూశారా? ఇప్పుడు, "ఆ విధముగా జరుగని యెడల మీరు నన్ను ఇండియా నుండి వెలుపలికి వెళ్ళగొట్టవలెననే ఆజ్ఞను జారీ చేయవచ్చును. అయితే ఆయన ఇతడికి చూపును అనుగ్రహించిన యెడల, మీలో ప్రతి యొక్కరు మీ జీవితములను యేసుక్రీస్తుకు సమర్పింపవలయును. ఈ గ్రుడ్డివాడు చూపును పొందిన యెడల ఇచ్చటయున్న మీలో ఎంత మంది మీ జీవితమును క్రీస్తుకు సమర్పించెదరని నేను మిమ్ములను అడుగవలయునని కోరుచున్నాను? ఒక్కరు కూడా ఇచ్చటికి పైకి ఎక్కి రాలేని మీ యొక్క గురువులను మీరు చూడండి. వారి యొక్క మతము ఎంతో ప్రఖ్యాతిగాంచిన మతముగాను, మరియు ఎంతో గొప్పదిగాను మీ యొద్ద చెప్పుకుంటున్న వీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఒక్కరన్నా ఎవ్వరూ రాలేకపోయిరి." నేను చెప్పాను, "ఇక్కడున్న జనులైన మీరు, ఇక్కడ నిలుచుకొనియున్న ఈ గ్రుడ్డివానిని మీరు చూచుచున్నారు…"

20మరి అతని కండ్లను పరీక్షించుటకై ఒక వైద్యుడు పైకి వచ్చెను. ఆ వైద్యుడు తన తలను ఆడించెను, "అతను గ్రుడ్డివాడు," అని అతడు చెప్పెను.

మరి కావున నేను చెప్పాను, "నిశ్చయముగా, అతను గ్రుడ్డివాడు." అయితే నేను చెప్పాను, "మరి దేవుడు గనుక అతనికి చూపునిచ్చిన యెడల మీలో ఎందరు యేసు క్రీస్తుకు సేవ చేసెదరు?" మరియు నా కన్నులకు కనబడుచున్న నలువైపులా సముద్రమువలె వేల కొలది మంది తమ నల్లని చేతులను పైకెత్తిరి. ఆ వ్యక్తివైపు తిరిగి మరి చెప్పాను, "ప్రభువైన యేసు, మీరు దేవుడని తెలియబడనిమ్ము." ఆ వ్యక్తి నా మెడ చుట్టూ చేతులను వేసి కౌగలించుకొనెను. మరి అక్కడ బొంబాయి నగరపు మేయరు కూర్చొని యుండెను, అతడు తన చేతులను నాపై వేసి కౌగటించుకొనెను. అందరిలా అతడు కూడా చక్కగా చూడగలుచున్నాడు.

అదేమిటి? అది వాస్తవముగా దేవుని యొక్క శక్తి. దేవుడు దేవుడుగానే యున్నాడు, మరియు సాతాను సాతానే. మీరు గనుక దయ్యమును గనుక నమ్మని యెడల… నేను ప్రారంభములో, నేను అనుదినము అజ్ఞానివలె దుడుకుగా వాడితో పోరాడెడివాడిని. దయ్యమలు లేవని నాతో చెప్పవద్దు, ఎందుచేతంటే దాని గురించి నేను బాగా ఎరుగుదును. నేను అనుదినము వాడితో పోరాడుచునే యున్నాను. కావున అచ్చట సాతానున్నదని నేనెరుగుదును. మరియు మీరు వాడిని ఎదుర్కోవాలంటే అందుకొరకై మీరు తర్ఫీదుని పొందియుండవలెను మనస్తత్వ శాస్త్రములో తర్ఫీదు కాదు, విద్య యందు తర్ఫీదు కాదు, అయితే పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదు పొందవలయును; దానిని బయలుపరచుటకు దేవుని యొక్క వాక్యములోనున్న ఆయన యొక్క శక్తి దానిని బయలుపరచనిమ్ము మరియు మీ శత్రువును మీరెరుగవలయును. ఓ, వాడెంతటి క్రూరుడుగా యున్నాడు.

MATT 12:43-45•

MARK 16:9,17•

LUKE 11:24-26

 

21మరియు బైబిలులోకి పూర్తిగా వెళ్ళి మరి దానిలో యున్న పురుషుడు ఏ విధముగా ముఖాముఖిగా దానితో ఎదుర్కొన్నారో మరి దానిని ఇప్పుడు నేనిక్కడ నిలుచుకొని చెప్పుటకు ఇష్టపడుచున్నాను. శత్రువుతో పోరాడునపుడు వారు ఏ విధముగా ఆ పోరాటములో దేవుని యొక్క వాక్యమును కోటగా ఆశ్రయించిరో గమనించండి. నోవహు, దాని యొక్క అనుభవము కలదు. మరియు వర్షము రానున్నదని దేవుడు అతనితో చెప్పుటచే అతను దానిని ఎరిగియుండెను. మరియు విజ్ఞానమునకును, దేవుని వాక్యమునకు మధ్య యుద్ధము కొనసాగుచున్నది. విజ్ఞానము "అది సంభవింపదు," అని చెప్పుచున్నది. దేవుడు చెప్పెను, "అది సంభవించును." ఆమేన్.

నేడు కూడా అది అదే విధముగా యున్నది. అది సంభవించును! అది సంభవించెను! దయ్యములున్నవి! అయితే యేసు వాటిని వెళ్ళగొట్టి యున్నాడు, మరియు ఆయన తన సంఘమునకు ఆ విధముగా చేయుటకు అధికారమును అనుగ్రహించెను, "నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుడి!" ఒక దినమున ఆయన ఒక అందమైన స్త్రీలో నుండి ఏడు దయ్యములను వెళ్ళగొట్టెను. మరియు ఆయన చెప్పెను, "అపవిత్రాత్మ ఒక మనుష్యుని నుండి బయటికి వెళ్ళినప్పుడు, అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, పిదప మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును." ఇప్పుడు ఒక మనుష్యుడు దయ్యములు పోవునట్లు పవిత్రపరచబడిన యెడల, అతనిలో నుండి ఏదో కార్యము బయటికి వెళ్ళియున్నదని అది చూపించుచున్నది. ఒక దయ్యము బయటికి వెళ్ళియున్నది. ఇప్పుడు దయ్యము బయటికి వెళ్ళినయెడల, దేవుడు లోపలికి ప్రవేశించుటకు అది ఒక అవకాశము నిచ్చుచున్నది. కావున, వాడు వెలుపలికి వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ లోపలికి ప్రవేశించుటకు అనుమతించండి. దానిని అట్లే ఖాళీగా వదిలి వేయవద్దు. మీరు పాపమునకు మాత్రము పశ్చాత్తాపము పడి అట్లే కొనసాగినయెడల మీరు ముందుకంటే బహు అధ్వాన స్థితికి దిగిజారి పోయెదరు. ఒకప్పుడు సాతాను ఆక్రమించుకొనియున్న ఆ స్థలమున దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపుకొనిన యెడల, అప్పుడు మీరు దేవుని వాక్యము యొక్క శక్తి మీలో యుండి, మరి ఆ శక్తి మీలో బయలుపడి మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. పోటీ మొదలైనది. సాయంకాలపు వెలుగు ప్రకాశించుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇప్పుడున్నది.

ISA 59:19•

DAN 3:16-18

 

22మరిప్పుడు నూతన సంవత్సరములో ప్రవేశించుటకు, దానికి సూచనగా ఊదబడు ఈలలు ఊదబడుటకు ఇంకా మూడు నిమిషములే యున్నవి మరి అప్పుడు మధ్య రాత్రియగును. అటు పిదప మనము పలు విధములైన స్థలములకు వెళ్ళుటకు ఈ భవనమును వదిలి వెళ్ళుచుండగా మరియు బయట కలిసికొనుటకును, ప్రపంచమును ఎదుర్కొనుటకు మనము పోబోవుచుండగా, మనము మనుపు ఉన్న విధముగా నుండక నూతనమైన వారుగా కొనసాగెదము. మనము ఆయన పునరుద్ధన శక్తితో ముందుకు సాగిపోయెదము. శత్రువును ఎదుర్కొనుటకు మనము యేసుక్రీస్తు యొక్క నామమున ధ్వజమును ఎత్తిపట్టుకొని రెండంచులు గల ఆ ఖడ్గమును ఉపయోగించునట్లుగా ఆయన యొక్క వాక్యమునందు విశ్వాసమును గలవారమై, డాలును చేతిన పట్టుకొని, మరియు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొనివారమై మనమిచ్చట నుండి వెళ్ళెదము. ఎందుకనగా శత్రువు దిన దినమునకు బహు బలాఢ్యు గాను మరియు శక్తివంతుడుగాను అగుచున్నాడు. "శత్రువు వరదవలె వచ్చునప్పుడు, దేవుని యొక్క ఆత్మ వాడికి విరోధముగా ఒక ధ్వజము నెత్తును."

మనము గనుక ఈ కార్యముల యొక్క అంతమునకు సమీపించిన యెడల, దేవుని యొక్క మర్మములు మనకు సమాప్తమగుచున్నవి, మనము అధిక శక్తి కొరకు ఎదురు చూచుచున్నాము, ఒక క్రూరమైన సైన్యమును ఎదుర్కొనుటకు ఒక ఎత్తబడు బలమునకై మనము ఎదురుచూచుచున్నాము, అది సంఘమును పైకెత్తి మరి మహిమలోనికి తీసికొనిపోవును. మనము దానిని పొందవలయును, మనము జీవించు దేవుని యొక్క సేవకులమని ఒక సవాలుతో మనము ఈ 63వ సంవత్సరమును ఎదుర్కొనెదము. మరియు ఆ పాత షద్రకు, మేషాకు, అబేద్నెగో వలె మనము వేటిని గురించి మాటలాడేమో మరి వాటిని తిరిగి మనము అలవరచుకొనక ఈ ప్రపంచము దయ్యములకు తలవంచక, అయితే ముందుకు సాగి యుద్ధములో కొనసాగెదము.

2SAM 5:23,24•

1CH 14:14,15•

ISA 6:5

 

23వారి యొక్క ఈలలు మనము వినుచుండగా, ఆ భయంకరమైన వేడి రాత్రియందు దావీదు కంబళి చెట్టు క్రింద పండుకొని యుండగా, మరి శత్రువు అతనిపైకి లేచిన విధముగా, నేటి రాత్రి నేను కూడా అటువంటి ఒక అనుభూతిని పొందుచున్నాను. దావీదుకు ఎటువంటి సమయమది, అక్కడ పండుకొని యుండుట ఎటువంటి ఒక ఘడియ అది , అతడికి ఎచ్చటికి వెళ్ళాలో, ఏ వైపు వెళ్ళాలో అని కూడా తెలియని ఒక అయోమయ స్థితిలోవుండెను. ఎందుకనగా తన శత్రువులు తనకంటే బలాఢ్యులైయుండగా తాను ఒక నిస్సహాయ స్థితిలో యుండుటను అతను ఎరిగియుండెను. అయితే ఆకస్మాత్తుగా చెట్లకు పైగా ఒక గాలి వీచుచున్నటువంటి ఒక స్వరమును అతను వినెను. దేవుడు అతనికి ముందుగా వెళ్ళుచున్నాడని అతను ఎరిగి, మరి యుద్ధమునకు వెళ్ళెను. గత రాత్రి వర్తమానమునకు పిదప మరి అటువంటి ఒక అనుభూతిని పొందుచున్నాను. నా జీవితములో నేను ఎన్నడూ ఎదురుకోలేని ఎంతో అంధకార సమయమందు నేనున్నాను. దేవుని మందిరములో దేవ దూతలను చూచిన తర్వాత యెషయా పొందిన అనుభవమువలె. నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. అయితే వినుడి, నేను ఎలాగైనను దానిని ఎదుర్కొనబోవుచున్నాను మరి ఇప్పుడున్న ఒకే కార్యము, శత్రువు ఎక్కడున్నను అతనిని ఎదుర్కొనుటకు నేను ఆ కంబళి చెట్టు మీద వీచు గాలి వంటి స్వరమునకై వేచియున్నాను.

PHIL 3:13,14

 

24మరిప్పుడు, పండ్రెండు గంటలకు ఇంకా ఒక్క నిమిషమని నేను అనుకొనుచున్నాను. మరయు 62వ సంవత్సరములో సంభవించి గతించిపోవుచున్న కార్యములన్నింటిని, అవి గతించిపోయిన కార్యములుగానే ఉండనిమ్ము.

ఇప్పుడు మనలో ప్రతి యొక్కరును లేచి నిలువబడెదము. పోటీ ప్రారంభమై యున్నది. మీలో ప్రతి యొక్కరును; పౌలు చెప్పెను, "వెనుక ఉన్నవి మరచి, గతించిన సంవత్సరపుమన పొరపాట్లు అన్నియును, దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను." ఈ గతించిన సంవత్సరములన్నిటను నేను చేసిన పొరపాట్లన్నిటిని, వాటి కొరకు నన్ను క్షమించుము. సంఘమా నన్ను క్షమించుము మరియు నేను పరిచర్యలో సరిగ్గా నిర్వర్తించలేని కార్యముల కొరకు, నేను అనుకొనుచున్నాను దేవా, దాని కొరకు నన్ను క్షమించుము. సంఘమా, నా పొరపాట్లు కొరకు నన్ను క్షమించుము. మరియు క్రీస్తు యేసునందు ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. రేపటికి ఏమి జరుగనైయున్నదో, ఏమిటనే దానిని నేనెరుగను, అయితే 1963వ సంవత్సరమును ఎవరు చేపట్టిరో నేనెరుగుదును.

2COR 5:17

 

25ఇప్పుడు మనము మన చేతులను పైకెత్తి మరి మనయొక్క తప్పులను ఒప్పుకొనుచుండగా మన స్వయమైన మార్గములో మనము ప్రార్థించెదము మరియు ఈ రానున్న నూతన సంవత్సరము దేవుడు మనకు సహాయపడవలెనని అడిగెదము.

పరలోకపు తండ్రీ, మేమిక్కడ నిలబడియుండగా, మా హృదయములలో అనేకమైన ఆలోచనలు మృతి చెందుచుండగా, మరియు గత సంవత్సరపు పొరపాట్లు కూడా మృతి చెందుచుండగా, మరియు మేము 62వ సంవత్సరము మృతిచెందుచు మరియు 63వ సంవత్సరపు జననము సమీపించుచుండగా, మేము యేసును ఆయన యొక్క ప్రణాళికను చూచువరకు నిచ్చెనలో ఒక మెట్టు పైకెక్కి వెళ్ళునట్లుగా సహాయము చేయుము. ప్రార్థించుచుండగా, ప్రభువా, పాత సంవత్సరము అంతమవుచుండగా మరియు నూతన సంవత్సరము ఉదయించుచుండగా ఇచ్చటనున్న వారందరి యొక్క ప్రాచీన మానవుని యొక్క పాపము మరియు అవిశ్వాసము మా హృదయమందు మృతిచెంది ఈ నూతన సంవత్సరమైన 1963లో వారు నూతన జన్మలోనికి ప్రవేశించునట్లు చేయుము. అదెట్లుండవలయుననగా, ఒక వేగముగా వీచు గాలివలె మమ్ములను నింపి మరియు క్రీస్తులో మమ్ములను నూతన సృష్టిగా మార్చుము.

26మమ్ములను యోగ్యమైన సేవకులుగా చేయుము. మా గతమును క్షమించుము. మా భవిష్యత్తును ఆశీర్వదించుము. ఓ ప్రభువైన దేవా, మీ యొక్క బలమైన హస్తముతో మమ్ములను నడిపించుము, యెహోవా. ఇక్కడున్న వాక్య పరిచారకులను ఆశీర్వదించుము. సంఘమంతటిని, మా యొద్దకు వచ్చిన క్రొత్త వారిని ఆశీర్వదించుము. మీరు మాతో ఉ౦డము, ప్రభువా. మేము మీ యొక్క సేవకులము మరియు 1963వ సంవత్సరము కొరకు మమ్ములను మేము మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము, మరియు మీ యొక్క ఆత్మీయ శక్తి మా జీవితములలోను మరియు మాలోను ప్రధాన స్థానము వహించనిమ్ము. మాకు సహాయపడుము, దేవా, మమ్ములను క్షమించుము మరియు మాకు సహాయపడమని, మేము ప్రార్థించుచున్నాము. బలిష్ఠమైన మానవులుగా మమ్ములను లేపుము. మహత్తరమైన విశ్వాస యోధులుగా మమ్ములను లేపుము. ప్రభువా, ఈ సంవత్సరము ఆ రాతికి క్రింది భాగముననున్న బండయగు మరుగైన మన్నాను మాకు తెరచి ఇచ్చి, దేవుని యొక్క ప్రణాళికను మేము గ్రహించునట్లు దయచూపుము. ప్రభువా, మా జీవితమనే పిరమిడ్‌పై తలరాయితో మూయుము. క్రీస్తు యేసనే తలరాయిని మా ఒక్కొక్కరిపైన ఉంచుము. ఆయన యొక్క గొప్ప, ఘనమైన, పరిశుద్ధ ఆశీర్వాదములు మా అందరి పైనను ఉ౦డును గాక. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మా పైకి వచ్చును గాక. పునరుద్ధానపు శక్తి ప్రత్యక్షపడును గాక. దేవా ఈ రాత్రి మేమెట్లు మీకు కృతజ్ఞతలు చెల్లించగలము. మేము మీవారము, ప్రభువా, మమ్ములను మేము సంపూర్తిగా మీకు సమర్పించుకొనుచున్నాము.

27ఎచ్చటికి వెళ్ళవలేనో లేక ఎలా వెళ్ళవలేనో, లేక నేనేమి చేయబోవుచున్నాననియు నేనెరుగని దూర ప్రదేశములకు నేను వెళ్ళుచుండగా, మీరు నన్ను నడిపించునట్లుగా నేను మీ పై ఆధారపడి యున్నాను, సర్వశక్తిమంతుడగు దేవా, ఎందుకు పనికిరాని ఆప్రయోజకుడైన సేవకుడుగాయున్న నన్ను సర్వశక్తివంతుని యొక్క ఘనతా మహిమలకు నన్ను ఉపయోగపడనిమ్ము. దానిని అనుగ్రహించుము, తండ్రీ.

మా ప్రార్థనలు అంగీకరించుము. మా ప్రయత్నములను ఆశీర్వదించుము. ఆత్మీయముగాను మరియు శరీరరీతిగా వ్యాధులతో బాధపడుచున్న వారిని స్వస్థపరచుము. మరియు మమ్ములను మీ సేవకులుగా చేయుము. మేము బంకమన్నుగా యున్నాము, మీరు కుమ్మరిగి యున్నారు. ఆయన యొక్క శరీరములో ఒక అవయవముగా, క్రీస్తు యేసుతో మేము ఏకముగా జతపరచబడునట్లుగా కుమ్మరివైన మీ చేతిలో మీ స్వచిత్తమైన మార్గమందు మా ప్రతి ఒక్కరిని మలచుకొమ్ము. సువార్త నిమిత్తమును, మరియు ఆయన నిమిత్తమును దీనిని యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్ మరియు ఆమేన్.

MATT 6:9-13•

LUKE 11:2-4

 

28[ఒక సహోదరుడు అన్య భాష మాట్లాడుచుండెను మరియు మరో సహోదరుడు దాని వ్యాఖ్యానము అనువాదము చెప్పుచుండెను - సంపా.]

తండ్రియైన దేవా, మీకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరపు ప్రోత్సాహమునకై మేము స్తోత్రములు చెల్లించుచున్నాము, అది మమ్ములను నమ్మికతోను మరియు దీనిని ఎరుగని మానవులకు, ఈ మాటలను చెప్పుట ద్వారా మరియు ఈ వర్తమానము సత్యమని తెలుపుటచే కలుగు ఓదార్పుతో వెలుపలికి పంపించుచున్నది. ఈ వర్తమానము కొరకై మేము స్థిరముగా నిలబడవలెనని మీరు మా యందు ఆశించుచున్నారు. మీ వాక్యముతోను మరియు మీతోను నిలిచియుండి, మేము ఎరిగియున్న దానినంతటిని మేము మీ కోసము చేసెదము, ప్రభువా.

మేము ఈ విధముగా ప్రార్థింపవలయునని బోధించిన ఆయన యొక్క నామములో మమ్మును అంగీకరించుము. [సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘమంతయూ ఏకముగా ప్రార్థించుచున్నది - సంపా.] "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునునెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యమును, శక్తియును, మహిమయు నిరంతరము నీవియైయున్నవి." ఆమేన్.

EXOD 12:6,8

 

29దేవుడు మిమ్ములను ఆశీర్వదించి మరి మిమ్ములను కాచుకొనును గాక. ఇప్పుడు గృహములకు వెళ్ళాలనుకున్నవారు… ఇప్పుడు 63 సంవత్సరములో ఐదు నిమిషములు అయినవి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. మరియు మీరు రాత్రి భోజనముకై యుండదలచిన యెడల, మీరు ఉండుటకు మేము ఆహ్వానించుచున్నాము మీరిచ్చట యుండుట మాకెంతో సంతోషముగా యున్నది. ఇది కొందరికి మాత్రమే సదుపాయము చేసిన ప్రభురాత్రి భోజనము కాదు. క్రీస్తుతో కూడా సహవాసము కలిగియుండు మరి ప్రతి యొక్క విశ్వాసి కొరకు ఈ రాత్రి భోజనము. మీరు ఇచ్చటనే యుండి మరి మాతో ప్రభురాత్రి భోజనమును భుజించవచ్చును. మరి మేము దీనిని మొదటిగా చేయు కార్యముగా యుండుటకు గల కారణమేమనగా, మనము ఒక ప్రయాణమును ప్రారంభించుచున్నాము. మరియు ఇశ్రాయేలు, వారి యొక్క ప్రయాణమును ప్రారంభించుటకు ముందు, వారు గొర్రెపిల్లను చంపి మరియు చేదు కూరలను భుజించిన తర్వాతే వారి ప్రయాణమును ప్రారంభించిరి. మరియు ఇది ఈ రాత్రికి ఎంత చక్కగా పొందికగా యున్నది, అని నేను తలంచితిని. గొర్రెపిల్ల చంపబడి యున్నది. విందు సిద్ధపరచబడియున్నది, మరియు ఇది మధ్యరాత్రిగా యున్నది. కావున మనము ముందున్న రానైయున్న ప్రయాణమునకై సిద్ధపడుగోరు వారు మరి మాతో ఉ౦డుటకు ఆశించువారు, దీనిలో పాల్గొనవచ్చును. మీరు మాతో ఉ౦డుటను మేము సంతోషించుచున్నాము. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.

30మరియు ఇప్పుడు వెళ్ళాలనుకున్నవారు, మీరు మీ గృహములకు వెళ్ళవచ్చును మరల మనము కలుసుకొను వరకు దేవుడు మీతో కూడా నుండును గాక. ఆమేన్. మిగిలినవారు మీరు కూర్చొనవచ్చును మరటు పిదప మనము ప్రభురాత్రి భోజనమును ప్రారంభించెదము. సహోదరి…

మనము కలిసికొను వరకు,

మనము కలిసికొను వరకు,

యేసు పాదముల యొద్ద కలిసికొను వరకు (మనము కలిసికొను వరకు);

మరల మనము కలిసికొను వరకు, దేవుడు మీతో కూడా నుండును గాక.

బయటికి వెళ్ళు వారందరు వెళ్ళు వరకు మనము వేచియుండగా మనము ఈ పాటను మరల పాడెదము. నిశ్శబ్దముగా ఉ౦డెదము, మరటు పిదప ఇది ఒక ముఖ్యమైన పవిత్రమైన కార్యము. ఇంకొక్క క్షణములో ఇచ్చట లేఖనముల నుండి నేనుకొన్నిటిని చదువబోవుచున్నాను అది చాలా చాలా మంచిది. మరిప్పుడు మనము దానిని మరల పాడెదము.

మనము కలిసికొను వరకు….

మనము ఎవరితోనైనను కరచాలనము చేసెదము. మీ జీవితములోఏదైనను తప్పిదముయున్న యెడల,

మీరు తప్పు చేసిన ఆ వ్యక్తి ఇచ్చటయున్న యెడల,

వారి యొద్దకు ఇప్పుడే వెళ్ళి దానిని సరిచేసికొనుము.

మనము కలిసికొనువరకు,

మనము కలిసికొను వరకు,

దేవుడు … (పియోనా వాయించువారు పియోనా యొద్దకు దయచేసి వచ్చెదరా?)

… మనము మరల కలుసుకొను వరకు,

మనము కలిసికొను వరకు,

మనము కలిసికొనువరకు,

మనము కలిసికొను వరకు,

దేవుడు మీతో నుండును గాక!

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు,

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు,

సూర్యుని వెలుగు యున్నను లేక చీకటి యున్నను,

ఆయన మీకొరకు ఆసక్తి కలిగియున్నాడు.

మనము దానిని మరల పాడెదము.

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు,

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు

సూర్యుని వెలుగు యున్నను లేక చీకటి యున్నను దాని ద్వారా,

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు.

అది చాలా బాగున్నది కదూ? వారు నిశ్శబ్దముగా యుండగా మనము మరల దానిని పాడెదము.

ఆయన… (మీ కండ్లను మూసికొను.) …మీ కొరకు,

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు

సూర్యుని వెలుగు యున్నను

లేక చీకటి యున్నను దాని ద్వారా,

ఆయన మీ కొరకు ఆసక్తి కలిగియున్నాడు.

HEB 13:5

 

31పరలోకపు తండ్రీ, మా యొక్క చీకటి ఘడియలలోను లేదా సూర్యుని వెలుగు యుండు ఘడియలలోను ఆయన మనలను విడువడు లేక ఎడబాయడు, మరి అది సత్యమని మనమెరిగినపుడు అదెంతో ఆనందమును మనకిచ్చుచున్నది, అందుకొరకై మనమెంతో ఆనందించుచున్నాము. మన యొక్క నమ్మకము నీతిగల యేసు రక్తముపై కట్టబడియున్నది. ఈ ప్రపంచపు పేరు ప్రఖ్యాతులపై మేము ఆధారపడక, ప్రభువా మీ పైన మేము ఆధారపడి యున్నాము. మీకు ఏ విధముగా స్తోత్రములు చెల్లించగలము, తండ్రీ.

ఇప్పుడు, మీరు మా కొరకై వదిలి వెళ్ళిన కొన్ని నిబంధనలలో ఒకటైన దానిలో పాలుపంచుకొనబోవుచున్నాము. ఆ నిబంధనలలోఒకటైన బాప్తిస్మము, మరొకటి ప్రభురాత్రి భోజనము, మరియు తదుపరి కార్యము కాళ్ళు కడుగుట. ఓ, దేవా, ఈ యొక్క గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్లయని మేము పవిత్రముగా దీనిలోనికి పోబోవుచున్నాము. బిడ్డలకు మునుపు గొప్ప అరణ్యవాసపు యాత్ర యున్నది. వధింపబడిన పస్కా గొర్రెపిల్లను భుజించుటకు ముందు రక్తము ద్వారబంధములపై పూయబడవలయును.

దేవా, మా హృదయములను ఇప్పుడు పరీక్షించుము. ప్రభువా, అక్కడ రక్తము యున్నదా? లేని యెడల, మీరు దానిని ఇప్పుడు ప్రయోగింపవలయునని ప్రార్థించుచున్నాము, అది మా పాపములను తీసివేసి మరి వాటిని మూసివేసి, మరి ఆ పాపములు మా నుండి విమోచించబడి, ఈ లోకపు పాపములను మా యొద్ద నుండి తీసివేయుము ప్రభువా, ఈ శరీరమును మరియు దేవుని కుమారుడును, మా రక్షకుడైన, మా గొర్రెపిల్ల చిందించిన రక్తమును తీసికొనుటకు మేము వచ్చుచుండగా మేము పరిశుద్ధముగా మరియు మా తండ్రీ ద్వారా అంగీకరింపబడునట్లు నుండనిమ్ము. మేము చదువుచుండగా మా హృదయములను పరీక్షించుము, తండ్రీ, మరటు పిదప మమ్ములను మీ స్వకీయులుగా చేసికొనుము. గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు నామమున దీనిని మేముఅడుగుచున్నాము. ఆమేన్.

1COR 11:23-34

 

32కొరింథీయులకు 11వ అధ్యాయము నుండి నేను కొన్ని వచనములను చదువ వలెనని ఆశించుచున్నాను 23వ వచనము నుండి నేను దీనిని చదువుచున్నాను. పౌలు కొరింథీయుల సంఘమునకు చెప్పుచున్నాడు.

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని:

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, యిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని, యీ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

మీరు ఈ రొట్టెను తిన, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు.

కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్ర లోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను, ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

ప్రభువు శరీరమని వివేచింపక తిని, త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు.

అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము.

మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము.

కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి.

మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనిన యెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

MATT 26:30•

MARK 14:26

 

33దీనిని నేను తలంచుచుండగా, మహా పావనమైన సమయము! ఈ యొక్క ప్రభురాత్రి భోజనము మొదట ఇవ్వబడినపుడు మరియు పాదములు కడుగుటయు ఆచరింపబడినపుడు, మనకు నీళ్ళు లేనందువలన ఈ రాత్రికి పాదములు కడుగుట వదిలి వేయుచున్నాము. నీటి సరఫరా నిలిపివేయబడియున్నది, ఈ రాత్రి మనకు విశ్రాంతి గదుల వసతి కూడా లేదు, ఈ రాత్రి ఆరాధన మనము జరిపించుకొనుటకై వారివలన సాధ్యమైనంత వరుకు సమస్తమును తాత్కాలికముగా ఏర్పరచి మనకు సదుపాయమును సమకూర్చి యిచ్చిరి. అయితే మనకు వారు చేసిన విధముగా చేసెదము, లూకా దానిని చెప్పినాడని నేను నమ్ముచున్నాను, "వారు ఒక పాటపాడి మరి బయటికి వెళ్ళిరి." అయితే ఇది దేనిని సూచించుచున్నదని మీకు తెలియునా? మీకు తెలియునా, మొదటి ఈ ఆజ్ఞ ఇశ్రాయేలుకు ఇవ్వబడినపుడు ప్రారంభములో, ఐగుప్తులో వారు వారి వాగ్ధాన భూమికి పోవుచునుండిరి. మరియు మనము కూడా వాగ్ధాన భూమికి పోవు మార్గమును ఉన్నామని ఈ రాత్రి మనము అనుభూతి చెందులాగున్నది. మరియు ప్రయాణము మనకు ముందుగా యున్నది.

EXOD 12:12,13•

1COR 11:29

 

34మరియు వారు ఒక సూచనను కలిగియుండిరి, మరణ దూత వచ్చినప్పుడు వారి ద్వారములపై రక్తమును పూసియుండవలయును, లేని యెడల పెద్ద కుమారుడును లేక పెద్ద బిడ్డ ఆ ఇంటియందు చనిపోవును. నేను చెప్పు దాని యొక్క భావమేమనగా మరియు దాని నిజమైన అర్థము, మొదట రక్తమును పూయవలయును. ఇచ్చట పౌలు ఏ విధముగా దానిని ఆ స్థానములో జతపరచియున్నాడో మీరు గమనించితిరా? "ఎవరైనను ప్రభువు శరీరమని వివేచింపక అయోగ్యముగా తినిన యెడల, వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు," దాని అర్థము అదే కార్యము, ప్రభురాత్రి భోజనములో అయోగ్యముగా పాలుపంచుకొనిన అది మరణము, ఆత్మీయ మరణము, ఆ వ్యక్తికి వచ్చును. దాని భావమేమనగా మద్యపానమును చేయుచు మరియు అటువంటి కార్యములు చేయుచు లోకమును అనుసరించి నడచుకొనుచు మరి ప్రభువు యొక్క భోజనపు బల్ల యొద్దకు వచ్చుట. ఆ విధముగా మనము చేయకూడదు. ఇప్పుడు మనము చెడ్డ తలంపుల నుండి మన మనస్సులను దూరముగా నుంచుకొని మరియు మన హృదయములను శుద్ధీకరించుకొని మరియు మన చేతులను శుభ్రపరచుకొని, మనము మన బలియైన యేసుక్రీస్తు ద్వారా ఏకము చేయబడి యున్నామని మనము ఎరిగియుండుట వలన, ఆయన ఒక్కటే మన రక్షణ, దానిని తెలిసికొని ప్రభువు యొక్క బల్ల యొద్దకు భయభక్తులతో మరియు పరిశుద్ధతతో రావలయును.

35మరిప్పుడు ఈ రాత్రి, మనము దీనిని చేయబోవు విధానము, ఇచ్చట పెద్దలలో ఒకరైన సహోదరుడు జెబెల్. ఈ రాత్రి సహోదరుడు జెబెల్, మొదట మీరు వేదిక నుండి పిలిచిన యెడల, ఈ జనులు వేదికపై వచ్చి, మరి మీరు కోరిన యెడల ఒక వరుసగా నిలిచెదరు. మేము, రాత్రి భోజనమును ఆశీర్వదించి ముగించిన కొద్ది క్షణములలో, ఇప్పుడు సహోదరుడు జెబెల్ మిమ్ములను నడిపించును.

36క్రైస్తవుల ద్వారా చేయబడిన ఈ రాత్రి భోజనపు రొట్టె, పులియని రొట్టె మరియు మీరు గనుక దానిని గమనించిన యెడల, మీరు దానిని మీ నోటిలో నుంచిన యెడల, అది కరకుగా నుండి చేదుగా నుండును. అది ముడతలతో నుండి మరియు విరచబడి కలుపబడి యున్నది. మరి దాని అర్థము విరుగగొట్టబడి, ముక్కలు, ముక్కలుగా చేయబడిన మన ప్రభువైన యేసు యొక్క శరీరమును సూచించుచున్నది. ఓ, దానిని నేను తలచినప్పుడు, నా హృదయము ఆగిపోవునట్లు అనిపించినది. ఆయన నలుగగొట్టబడి, చితుకగొట్టబడి మరియు కొట్టబడినపుడు దానిని నేను తలంచుచుండగా, నిరపరాధియైన దేవుని కుమారుడు! ఆయన దానిని ఏ విధముగా చేసెనని మీరెరుగుదురా? ఏలయనగా నేను అపరాధిని మరియు ఆయన పాపియైన నా స్థానమును తీసుకోని ఆయన పాపియాయెను, నేను ఆయన యొక్క బలి అర్పణ వలన ఆయన యొక్క సారూప్యముతో ఒక దేవుని కుమారుడుగా ఉ౦డునట్లుగా ఆయన దానిని చేసెను. ఎటువంటి ఒక బలి అర్పణ.

ISA 53:5

 

37మనము మన తలలను వంచెదము. మహా పరిశుద్ధుడైన దేవా, నేను ఈ చిన్న లోహపు పళ్ళెమును పట్టుకొనియుండగా, ఈ రాత్రి విరిచిన, కలుపబడిన, నలుగగొట్టబడిన, కొట్టబడిన ఈ రొట్టెను మన ప్రభువు యొక్క శరీరమునుకు చిహ్నముగా యున్నది, ఆ యొక్క ప్రవక్త కేకలేసెను, "మన యతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది." ఓ, దానిని మేము ఏ విధముగా గుర్తుంచుకొని యున్నామో, ప్రభువా! ఈ రాత్రి నన్ను నేను ఆ బలి అర్పనకు కట్టుకోనుచున్నాను, మరియు ఇక్కడి ప్రజలు ప్రభువా, ఆ యొక్క బలి అర్పనకు, ఈ రొట్టెను మనము తీసికొనుచుండగా, మనము మన ప్రభువును, ఆయన మరణమును మరియు ఆయన మనలను శుద్ధీకరించిన విధానమును మరియు మన కొరకు ఆయన అనుభవించిన శ్రమలన్నింటిని మనము గుర్తుంచుకొనెదము. దేవా, మేము అపవిత్రులమైన జనులము. మేము అటువంటి ఒక పరిశుద్ధ కార్యమునకు అర్హులము కాము, కావున మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క ప్రసన్నత మరియు మీ రక్తము మా హృదయములను శుద్ధీకరించుము ప్రభువా. మేము దానిని అంగీకరించుచుండగా, మా జీవిత కాలమంతా రాత్రింబవళ్ళు ఆయనకు ఎల్లప్పుడూ సేవ చేయు ఉద్ధేశమును మా యొక్క తలంపులలో మేముంచుకొననిమ్ము. ఇప్పుడు, ఈ రొట్టెను ఏ ఉద్ధేశమునకై ఉపయోగింపబడనై యున్నదో దీనిని పరిశుద్ధపరచుము. యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.

MATT 26:29•

MARK 14:25•

LUKE 22:18

 

38మరియు దీనిని నేను నా చేతులలో ముప్పది సుమారుగా ముప్పది మూడు సంవత్సరములుగా నేను నా ప్రభువుకు సేవ చేసియున్నాను, మరియు నన్ను గురించి నేను సిగ్గుపడుచున్నాను. అయితే, ఈ రాత్రి నా చేతిలో రెండు నిజమైన ఆయన యొక్క రక్తపు చుక్కలను నేను కలిగియున్న యెడల నేనేమి చేయుదునో అని నేను తలంచుచున్నాను? నేను దానితో ఏమి చేసెదను? అయితే, మీకు తెలియునా, ఈ రాత్రి నా చేతిలో ఆయన యొక్క దష్టిలో శ్రేష్టమైన దానిని పొందుకొనియున్నాను, అది ఆయన రక్తము ద్వారా కొనబడినది, అది ఆయన సంఘము. కావున, నేను దీనిని పట్టుకొని యున్నప్పుడు మరియు ఈ ద్రాక్షారసమును కలిగియుండగా, నేను దానిని తలంచుచున్నాను. ఆయన చెప్పెను, "నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను." పాపముతో యుద్ధము ముగిసిన పిదప, మనము ఆవలి తీరమునకు వెళ్ళిన తరువాత చేయు మొదటి కార్యము ఏదనగా ప్రభురాత్రి భోజనమును తీసికొనుటయే యనుటను గమనించండి.

39మరియు మనము ఈ ద్రాక్షా రసమును ఆశీర్వదించుచుండగా మన తలలు వంచెదము. మా పరలోకపు తండ్రీ, యేసు రక్తమును సూచించు ఇక్కడున్న ఈ ద్రాక్షారసమును నేను పట్టుకొని యుండగా, ఏ విధముగా ఆ ప్రవహించు రక్తము ద్వారా నా పాపములు పోయినవియనియు, మరి ఇకెన్నడును అవి జ్ఞాపకములోనికి రాని మరచిపోవుటయను సముద్రములలో పడవేయబడినవి అని నేను తలంచునప్పుడు, మరియు దూరముగానున్న ఒక వైద్యశాలలో ఒక దినమున నేను చనిపోవుచుండగా మరి ఈ రక్తముతో నీవు నన్ను రక్షించితివి. ఓ దేవా, నేనెట్లు మీకు కృతజ్ఞతలు చెల్లించగలను. మరటు పిదప జనులను కల్వరి యొద్దకు నడిపించి మరి వారి నిత్యగృహమునకు పోవు మార్గమును వారికి చూపించు కర్తవ్యమును, పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహించితివి. తండ్రీ మీకు స్తోత్రములు. మరిప్పుడు ఏ ఉద్దేశమునకై ద్రాక్షా రసము ఉపయోగింపబడనైయున్నదో మరి దానిని పరిశుద్ధపరచుము. మరియు ఈ రాత్రి ఈ సంస్కారములో పాలుపంచుకొనుచున్న ప్రతి యొక వ్యక్తియు ముందున్న ప్రయాణమును కొనసాగించుటకై కావలసిన ఆత్మీయ మరియు శరీర బలమును అనుగ్రహించుము. యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

40[సంఘమునకు ప్రభురాత్రి భోజనము పంచి ఇవ్వబడుచున్నది.] ఇచ్చట నిలిచి కుటుంబములు లోపలికి వచ్చుటను చూచుచుండగా, ఈ విధముగానే ఒకానొక దినమున యుండును, కుటుంబము కుటుంబములుగాను, వరుస వరుసగా, గుంపు గుంపుగా, ఒక్కొక్కరుగా వచ్చెదరు. మనము ఆయనను కలుసుకొనినపుడు, ఆయనను నమ్మినవారు మరియు ఆయనపై ఆధారపడిన భూమి మీదనున్న మానవ జీవితములన్నియును అక్కడ ఆ దినమున కలుసుకొనునపుడు అది ఎటువంటి ఒక సమయముగా నుండును. అది అద్భుతముగా నున్నది కదూ?

నీళ్ళు లేని కారణము వలన పాదములు కడుగుటను మనము వదిలి వేయుచున్నాము. ఇప్పుడు ఆ నీటి సదుపాయమును కలిగించు వసతి ఇప్పుడు లేదు, అవి త్వరలో సరిచేయబడునని మనము నమ్ముచున్నాము. వారు నూతన ఆలయ నిర్మాణ కార్యములో వేగముగా మరియు చక్కగా పనిచేయుచున్నారు. ఏది ఏమైనను, సంవత్సరపు మొదటి దినమున, ఈ దినమున, ఈ విధముగా ప్రభురాత్రి భోజనమును ఆచరించుట సబబుగా యున్నది.

41ఇప్పుడు, ఈ నగరమునకు వెలుపల నుండి వచ్చిన వారు, మీరు మీ గృహములకు వెళ్ళునప్పుడు రేపు చాలా జాగ్రత్తగా కారును నడుపుకుంటు వెళ్ళండి. దేవుడు మీతో కూడా ఉ౦డును గాక. ఈ ప్రాంతములో ఇచ్చట సమీపములోనున్న మీతో దేవుడు యుండి మీకు సహాయము చేయును గాక. మరిప్పుడు ప్రభువు చిత్తమైన యెడల అరిజోనాలో రానైయున్న కూటమునకై నేను ఇచ్చటి నుండి వదలి వెళ్ళవలసియున్నది, మరటు పిదప నేను మీకు వాగ్ధానము చేసిన ప్రకారము ఏడు ముద్రలు ప్రసంగించుటకు నేను మరల మీతో కూడా ఉ౦డెదను. నేను నిశ్చయముగా మీ ప్రార్థనల కొరకై ఆశించుచున్నాను. నాకు నిజముగా మీరు కావలయును, కావున నా కొరకు ప్రార్థన చేయుట మరచిపోకుడి. మరియు సమస్తమును మీకు మంచిగానే జరుగును. మరియు నేను సువార్తలో చెప్పిన దానిని మీరు శ్రద్ధగా ఏ విధముగా వినియున్నారో మరియు దానిని వినుటకు మీరు ఇచ్చట హాజరైనందులకు నేను నిశ్చయముగా మెచ్చుకొనుచున్నాను. ఇప్పుడు, మనము ఒక మార్పును చేయుచున్నామని నేను నమ్ముచున్నాను. మరియు నేను మీరు నాపై చూపుచున్న దయను బట్టి మీకు నా కృతజ్ఞతలు.

42దేవుని యొక్క వాక్యమును తీసికొనివచ్చు నా లాంటి ఒక సాధారణ వ్యక్తి ప్రసంగమును వినుటకు మీలో అనేకులు అనేక మైళ్ళ దూరము నుండి వచ్చుచున్నారు. నేను చెప్పే విషయములను వినుటకై మీరు రావటం లేదు గాని, దానికంటే శ్రేష్టమైన దానినే వినుటకు మీరు వచ్చుచున్నారని నేను నమ్ముచున్నాను. ఎందకనగా, నేను చెప్పుటకు మీకు నా యొద్ద ఏదీ లేదు. నేను విద్యలేని వాడిని, అందగాడిని కాదు, చెప్పుకోతగిన ఏ ఘనమైన కార్యములు నాలో లేవు. మరట్లైన జనులు అనేక వందలకొలది మైళ్ళు కారు నడుపుకుంటూ వచ్చి మరిక్కడ ఉదయము రెండు గంటలనుండే కాచుకొని నిలుచుకొని యుండుటను నేను చూచునప్పుడు, అది నా యొద్ద ఏదో యున్నదని వారు వచ్చుట లేదు. అది క్రీస్తు. మీరు ఆయనను ప్రేమించుటనుబట్టి నేను చాలా ఆనందించుచున్నాను. మరి నేను కూడా ఆయనను ప్రేమించుచున్నాను. మరియు మనమందరమును ఒక్కటిగా ఆయనను ప్రేమించుచున్నాము. మరియు మనము ఆయనను ప్రేమించుట వలన మనము ఎన్నడూ విడిపోలేము. సమయమగుచుండగా ఇచ్చట కొద్దిగా మనము వీడిపోవలసియున్నది, అయితే మనము మరల ఒక్కటిగానే ఉ౦డెదము. ఆ ఒక్కటిగా యుండు స్థలమునకు జనులను నడిపించుటకు ప్రయత్నించుటయే నా యొక్క ఆశయమై యున్నది.

43మరిప్పుడు నూతన సంవత్సరపు ప్రారంభమును, మీకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, అని నేను చెప్పదలచుకొనలేదు అయితే దీనిని మీకు నేను చెప్పుటకు కోరుచున్నాను, "దేవుడు మిమ్ములను ఆశీర్వదించును." మరియు ఆయన గనుక దానిని చేసిన యెడల, రాబోవు సంవత్సరములో మీకు కావలసిన దంతయును అదియే. మరియు ఆయన దానిని చేయునని నేను నమ్ముచున్నాను.

మరియు నేను ఆయన యొక్క కృప వలన, నూతన సంవత్సరములో మనము దీనిని ప్రయత్నించెదము, ఆయన గనుక నన్ను ప్రాణముతో నుంచిన యెడల, మిమ్ములను ప్రాణముతో నుంచిన యెడల, ఈ సంవత్సరములో నేనున్న దానికన్నను శ్రేష్ఠమైన సేవకునిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు క్రీస్తుకు ఒక శ్రేష్టమైన సేవకునిగా నుండెదనని ఎదురుచూచుచున్నాను, నేను ఆయనకు అత్యంత సన్నిహితముగా, ఇంకా సత్యముగా, వర్తమానమును ఆయన నాకు ఇచ్చిన విధముగానే మీకు తీసికొని రావలయునని ఆశించుచున్నాను. నేను మీకివ్వాలని ఆయన ఆశించిన వాటిన్నింటినీ ఏదీ కూడా విడిచిపెట్టకుండా నాకు సాధ్యమైనంత వరకు దానిని ఆయన యొద్ద నుండి మీకు తీసికొని వచ్చెదను. ఏ విధముగా చేయవలయునని నేనెరిగిన దానినంతటిని నేను చేసెదను. మరియు మీరు కూడా ఆ విధముగానే అనుకొనుచున్నారని నేనెరుగుదును. ఇప్పుడు మనమందరమును ఏకముగా కలిసి పనిచేయవలయునని మనము ఆశించుచున్నాము. మరి మీరు కూడా ఆ విధముగానే అనుభూతి చెందుచున్నారు, ఏలయనగా, సాయంకాలపు వెలుగులు మందమగుచున్నవి, మరియు సూర్యుడు అస్తమించుచున్నాడు. భూమి చల్లబడుచున్నది మనకది తెలియును. ఆత్మీయముగా చెప్పవలయుననిన, సంఘము కూడా చల్లగా నున్నది మరియు ఉజ్జీవము ముగించబడి యున్నది. తదుపరి ఏమి రానైయున్నదో మనకు తెలియదు, అయితే అది ఏమైనను దాని కొరకు మనము దేవునిపై ఆధారపడి యున్నాము. మరిప్పుడు, మనము కొన్ని సమయములలో…

44ఇచ్చటనున్న ఈ గుడారము ప్రపంచములోనే అతి దివ్యమైన సంఘ కాపరులలో ఒకరిని కలిగియున్నదనుటను మీరు గుర్తుంచుకొనవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను, సహోదరుడు ఆర్మన్ నెవిల్, ఒక దైవభక్తిగల వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. మరియు నేను లేనప్పుడు నేనిచ్చట యుండు విధముగానే సహోదరుడు నెవిల్ పూర్తి బాధ్యతతో కొనసాగును. వారెల్లప్పుడును యుండునట్లుగానే ధర్మకర్తలు, పెద్దలు మరియు ఆ విధముగానే తదితరులు వారి యొక్క కార్యక్రమములలో నుండవలయును. మరియు ఇది మన యొక్క ప్రధాన కార్యాలయము. ఇక్కడే మనము మనము ఇచ్చటనే యున్నాము.

బయట అక్కడ బిల్లీ పౌల్ నాతో కూడా ఉ౦డను, కూటములకు మాత్రము యుండును, అతను తిరిగి ఇచ్చటికి వచ్చును. తక్కిన వ్యవహారములన్నియును అదే విధముగా ఇచ్చటి నుండియే పనిచేయును. నేను బయటికి వెళ్ళుచున్నందువలన, నేను మిమ్ములను వదలి వెళ్ళుచున్నానని అర్థము కాదు. నేను బయటికి వెళ్ళుచున్నాను, మీరు దానిని గ్రహించుడి, అది ఒక దర్శనము. అదేమిటని నాకు దాని అర్థము తెలియదు. నేను బయటికి వెళ్ళుట పూర్తి సంఘము యొక్క శ్రేయస్సు కొరకని నేను నమ్ముచున్నాను మరియు విశ్వసించుచున్నాను. మరియు ప్రభువు యొక్క నడిపింపును గనుక మనము వెంబడించిన యెడల మనకందరికిని అది మంచిది. అది ఏ విధముగా చేయవలయునో దానిని చేయుటయే, మనకు తెలిసినదంతా అదియే. నాకది సులభమైన కార్యము కాదు. ఇచ్చట దీనికి ముందు ఒకసారి ఈ సంఘమును విడిచి నేను దూరముగా వెళ్ళిపోవలసి యుండెను. నేను దానిని ఆ విధముగా చేయలేకపోవుటను మీలో చాలా కాలముగా ఇచ్చటికి వచ్చుచున్న పాత వారికి అది గుర్తుండవచ్చును! నేను జనులను ప్రేమించుచున్నాను.

45నేను ఒక చిన్న బాలునిగా నున్నప్పుడు నేను ప్రేమింపబడ లేదు, నేను ఒక బిడ్డగా నున్నప్పుడు ఎవ్వరును నాపై అక్కర చూపలేదు, మరియు నన్ను ప్రేమించువారినెవరినైను కనుగొనినయెడల, నేను వారి కొరకు నా ప్రాణమైనా ఇవ్వాలని, తలంచెదను. మరిప్పుడు ఎవరైనను మిమ్ములను ప్రేమించిన, ఎవరైనను అక్కరగొనిన, ఒక మారు నేను ఒక స్థంభము నెక్కునప్పుడు నా యొక్క కొక్కెము ఆ పాత దేవదారు వక్షము నుండి జారి బయటికి వచ్చినది, మరి ఆ ముడి చాలా ఎత్తుగా నున్నందువలన, నేను దానిని మరి నా యొక్క తన్నెడు ముల్లుతో కొట్టి మరి ప్రక్కకు తిరిగినప్పుడు, అక్కడ నుండి సుమారుగా పదునయిదు అడుగుల నుండి పడిపోవుచూ నా చేతిలో ఆధారముతో నిలద్రొక్కుకొన్నాను. దానిని చూచిన ఒక స్త్రీ తనను తాను కొట్టుకొనుచు కేకలేసెను. నేను ఆ స్త్రీని ఎల్లప్పుడును మెచ్చుకొనెదను, ఆమె ఆదరించెను. నా గురించి చింతించిన ఒక స్త్రీ ఆమె. మరియు, "నా కొరకు చింతించిన ఎవరైనను, నేను వారిని ప్రేమించెదను," ఆ విధముగా నేనెల్లప్పుడును తలంచెదను.

46మరియు నేను కొద్ది కాలమునకు పిదప డౌన్‌టౌన్ యందుంటిని, నేను గతించిన దినములను గురించియు, మరియు దేవుడు నాకేమి చేసెనో దానిని గురించి తలంచుకొనుచు౦టిని, మరి నేను నిశ్చయముగా మెచ్చుకొనుచున్నాను. మీ యొక్క ప్రేమ కొరకును మరియు సహవాసము కొరకును నేను మీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. నేనెప్పుడును మిమ్ములను అసత్య మార్గములో నడిపించుటకు ప్రయత్నించలేదు. నాకు తెలిసినంత వరకు నేను సత్యమైన మార్గములోనే మిమ్ములను నడిపించి యున్నాను. నేను చెప్పిన వాటినన్నిటిని తీసి చూడుడి, నన్ను గురించి నేను ఎన్నడును చెప్పలేదు, అది ఎల్లప్పుడును యేసుక్రీస్తును గురించే యుండును. చూడుడి. చూశారా? ఈ స్థలమునకు మిమ్ములను దాని నడిపించుటకు, తీసికొనివచ్చుటకు, నాకు తెలిసినంత వరకు ఆయన యొక్క వాక్యమునకు అత్యంత సన్నిహితముగా యుండుటకే నేను ప్రయత్నించియున్నాను.

ఇప్పుడు నేను మిమ్ములను సహోదరుడు నెవిల్‌ యొక్క చేతులకు అప్పగించుచున్నాను, మొదట దేవుని యొక్క చేతులకు, మరటు పిదప ఈ కూటమునకై నేను మరల మీ యొద్దకు వచ్చు వరకును, మీ స్వాస్త్యము కాపాడుటకై సంఘ కాపరియైన సహోదరుడు నెవిల్‌ యొక్క చేతులయందు మిమ్ములను అప్పగించుచున్నాను. ఆ సమయములోపు ప్రతి యొక్క హృదయమును పులకరింపజేయుచు మరియు దేవుని యొక్క సంఘమును మహిమ పరచు ఒక గొప్ప ప్రత్యక్షతను నేను మీకు తీసికొని రాగలనని నేను నమ్ముచున్నాను.

47మనము ప్రభురాత్రి భోజనమును ఆచరించుట వాడుక. నేను దీనికంటే ఇంకేమీ ఎక్కువ చెప్పదలచుకో లేదు, నేను ఏ విధముగా అనుభూతినొందుచున్నానో మీరెరుగుదురు. మరియు మనమిప్పుడు పాడవలసిన పాట, "నా యొక్క విశ్వాసము మీ వైపు చూచుచున్నది, నీవు కల్వరి గొర్రెపిల్ల." మరియు మనము లేచి నిలుబడి దానిని పాడుచుండగా, మనము ఒకరి చేతుల నొకరము కరచాలనము చేయుచు మరి, "దేవుడు నిన్ను ఆశీర్వదించును, అని చెప్పెదము."

నా యొక్క విశ్వాసము నీ వైపుకు చూచుచున్నది,

కల్వరి యొక్క గొర్రెపిల్ల,

రక్షణ దైవము;

ఇప్పుడు నేను ప్రార్దించుచుండగా వినుము,

నా అపరాధములన్నియు తీసివేయుము,

ఓ ఈ దినము నుండి నన్ను,

సంపూర్ణముగా నీ యొక్క!

మనము మన చేతులు ఆయన వైపు ఎత్తుదము.

నా యొక్క విశ్వాసము నీ వైపుకు చూచుచున్నది.

కల్వరి యొక్క గొర్రెపిల్ల,

రక్షణ దైవము;

ఇప్పుడు నేను ప్రార్దించుచుండగా వినుము,

నా అపరాధములన్నియు తీసివేయుము,

ఓ ఈ దినము నుండి నన్ను,

సంపూర్ణముగా నీ యొక్క!

మనము కలిసికొను వరకు! మనము పాడుదము "మనము మరల కలిసికొను వరకు."

మనము కలిసికొను వరకు, మనము కలిసికొను వరకు!

యేసు పాదముల వద్ద మనము కలిసికొను వరకు;

మనము కలిసికొను వరకు, మనము కలిసికొను వరకు,

యేసు పాదముల వద్ద మనము కలిసికొను వరకు;

మనము కలిసికొను వరకు, దేవుడు మీతో ఉండును గాక!

ఇప్పుడు మనము మన తలలు వంచుదుము. సహోదరుడు నెవిల్, ప్రార్ధనలో మనలను విరమించుము, దేవుడు నిన్ను ఆశీర్వదించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...