సాయంకాలపు వర్తమానికుడు
vgr Count 323 మీకెంతో వందనములు. దేవుడు మిమ్ము దీవించును గాక. మీరు కూర్చొనవచ్చును.
ఈ రోజున నా కుమారుడు మాట్లాడుచు, "తండ్రీ, మన సంఘ కట్టడము ప్రారంభించుటకు ముందు, ఆ సంఘమును చూచియుండవలయునని నేను ఇష్టపడుచున్నాను, అది ఎంతో అందమైన స్థలముగా ఉన్నది." మరియు అతడు దానిని గురించి మాట్లాడుచు ఇలా చెప్పాడు, "ఆ సేవకుని నేనింత వరకు కలిసికొనలేదు, అయితే అతని భార్యవలె అతడు కూడ ఒక మంచి వ్యక్తి, నిజముగా అతడొక మంచి వ్యక్తి." అందువలన మేమిక్కడ ఉండుటలో ఎంతో సంతోషించుచున్నాము.
మరియు నేను రాత్రి కూడిక కొరకు చూస్తున్నాను, దేవుడు తన ఆశీర్వాదములను మెండుగా మనపై కుమ్మరించి, మనకు సహాయము చేయును గాక.
2నేనిప్పుడే లోపలకు వచ్చాను. సహోదరుడు విలియమ్స్ అనే నేను నమ్ముచున్నాను. మరియు దానిని గురించి ప్రకటనలు చేయబడి ముగించినవని నేను ఊహించుచున్నాను. సాధారణముగా నేను లోపలకు వచ్చునంతలో వారు దానిని గురించి శ్రద్ధ తీసికొందురు. మనము ఆ సమావేశములో ఒక గొప్ప సమయము కొరకు ఎదురుచూచుచున్నాము. ఇక్కడ నా భాగమేదనగా చుట్టు ప్రక్కలకు వెళ్ళి సహోదరులను కలిసికొని, ప్రజలమధ్య సహవాసము చేసి, దేవుడు మనకొక నిజ కదలికను అనుగ్రహించునట్లు ప్రార్థన చేయుచు, అంతట నేరుగా రాయడాలో జరుగు ఆ గొప్ప కూడికకు వెళ్ళవలసి యున్నది, అందువలన మేము వీలుపడినంత వరకు అన్ని సంఘములను కలిసికొనుటకు ప్రయత్నించుచున్నాము. ఆ సమయము వరకు అలా కొనసాగించెదము. మనమొక గొప్ప సమయమును కలిగియున్నాము. మేము నిజంగా సహోదరుల మధ్య గొప్ప అద్భుత సహవాసమును కలిగియున్నాము.
3సాధారణముగా నేను గొప్ప ప్రసంగీకుని కానని ఎవ్వరికైనను తెలియును. నేను ఒక స్పేర్ టైరు లాంటి వాడిని. అయితే నేను నేను నా సేవ రోగుల కొరకు ప్రార్థించుటయైయున్నది. నేను మనము రాత్రులలో జరుగు కూడికలలో అనేకులు పాల్గోనుట వలన రద్దీ అధికమగుచున్నది. వారు కూర్చొనుటకు చాలినంత స్థలము లేక గదులు లేవు. మనము చేయగలిగితే మనము ప్రయత్నించవచ్చు, మనము కూర్చొను స్థలములకు చేరిన తరువాత కొన్ని కార్డులు రోగులకిచ్చి వారి కొరకు ప్రార్థించుటకు వారిని తీసికొని రావచ్చును. అయితే ఒక రాత్రికి ఒక కూడికను కలిగి యున్నప్పుడు, ఈ రాత్రి ఆ కార్డులను అందుకోలేని వారు మరుసటి రాత్రికి అందుకొనునట్లు చూడవచ్చు, ఆ విధముగా ప్రతిరాత్రి ప్రజల కొరకు ప్రార్థించుచు వారితో మాట్లాడవచ్చు, అదే నేను చేయగలిగిన దానిలో మంచిది. వారిని గౌరవించి, యేసుక్రీస్తు మహిమార్థము చేయుచు, ఎవ్వరినైతే మనము ప్రేమించి నమ్ముచున్నామో ఆయనకు మహిమ కలుగునట్లు మనము ఏకముగా కలిసి సహవాసము చేయుదము.
4కొద్ది క్షణములకు ముందు ఆ వీధి చివరిన జరిగిన విపత్తును గురించి మీరు విని యుండవచ్చును. ఆ మనిషి చంపబడెనో ఏమోనాకు తెలియదు.లేక ఆ కారులో వ్యక్తి ఎవరోనని కూడ తెలియదు. మేము కేవలము అక్కడ నిలిచాము, కొద్ది నిమిషముల క్రితము ప్రార్థనకై అక్కడ నిలిచాము. ఇక్కడికి రెండు కట్టడములకు తరువాత ఎవరో ఆ వీధి ప్రక్కను కొట్టుకొంటూ ఆ వీధి చివరి వరకూ వెళ్ళిపోయారు. ఒక బలమైన వ్యక్తి అక్కడ మూయబడెను. పోలీసువాళ్లు అక్కడున్నారు గాని అంబులెన్స్ వచ్చినది అని నేను అనుకోను. వారు అది చంపబడకున్న యెడల, అది ఖచ్చితముగా జరిగియుండవలసి యున్నది, ప్రక్కగా కొట్టుట ద్వారా ఎదుటి వాకిలి వరకు నెట్టుకొని పోయినది, అందువలన అదొక భయంకర దెబ్బగా ఉన్నది. మీకు తెలుసా అది కేవలము…
1THS 5:6•
2PET 3:14
5మనము ప్రతి నిమిషము దేవునికి సేవ చేయవలసి యున్నది. ఏ సమయములో ఏమి జరుగునో మనకు తెలియదు. అటువంటివి ఏ సమయములో జరుగునో మనకు తెలియదు. మనకు కాదని మనము తలంచవచ్చు, అయితే మీకు తెలుసా, అది జరుగవచ్చునని మీకు తెలియును. అందువలన యేసు చెప్పెనని నేను నమ్ముచున్నాను, "మనము ఏ ఘడియలో పిలువబడుదుమో మనకు తెలియదు గనుక సిద్ధముగా ఉండుడి." అంతట విపత్తులు గాని, కష్టములు గాని లేని స్థలమునకు మనము వెళ్ళిపోయెదము. వాగ్ధానములో అలాంటి స్థలమున్నదని మనము సంతోషించుచున్నాము.
మీకు తెలుసా, ఈ రాత్రికి ఆ తలంపు, అనగా అటువంటి స్థలము కొరకు మనము ఎదురుచూచుచున్నాము. అటువంటి స్థలము అక్కడ ఉన్నదని అది మనకు చూపుచున్నది. చూశారా? సమస్త ఛాయలు, నీడలు, ఒక నీడ ఏర్పడుటకు ఏదో ఒకటి అక్కడ ఉండవలసి యున్నది. నీడ అనునది ఒక నిజ వస్తువు యొక్క ఛాయగా వున్నది. అందువలన ఈలాంటి జీవితము ఒకటున్నదని, అది ఒక నీడ మాత్రమేనని నిరూపించుచున్నది. అప్పుడు ఎక్కడో ఒక నిజజీవము దీనిని ప్రతిబింబింప జేయుచున్నది. చూశారా? మీరు ఒక చెట్టును గమనించండి, అది ఎంత అందముగా ఉన్నది? అది ఏమిటని మీకు తెలియునా? అది పరలోకమందున్న జీవవక్షమునకు ఛాయాపరముగా (Negative) ఉన్నది.
6ఇప్పుడు, మీకు తెలియునా, దేవుడు భూమి మీదికి వచ్చినప్పుడు, ప్రారంభములో ఆయన భూమిపై ఉత్పన్నము చేయునప్పుడు, మొదటిగా విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్పుచున్నట్లు ఒక చిన్న జీవి పాలీవోగ్ పైకి వచ్చి యుండును. ఆ తరువాత మరొకటి వచ్చి యుండును నేను సత్యమైన క్రైస్తవ పరిణామమును విశ్వసించెదను. అయితే ఒక్క అణువు నుండి సమస్తము వచ్చినవనుట నమ్మదగినది. నేను దానిని నమ్మను… నేను నమ్మునదేమనగా దేవుడు ఒక చిన్న కప్పను చేసి, అంతట ఆయన ఒక చేపను చేసెను. అంతట ఆయన మిగిలిన వాటిని చేసెను. ఆ విధముగా అవి వచ్చి యున్నవని నేను నమ్ముచున్నాను. కాని ఒక అణువు నుండి ఏర్పడినవనుట నమ్మదగినది కాదు, అయితే వ్యత్యాసమైన జీవిని ప్రతిసారి చేసికొంటూ వచ్చాడు.
చివరిగా ఆయన ఉన్నతమైన జీవులను చేయుట ప్రారంభించాడు. ఆ తరువాత అవి తమను సృష్టించు దేవుని ప్రతిబింబించుటకు ప్రారంభించినవి, ఆయన దేవుడైయున్నాడు. ఇప్పుడు అది సత్యమని నిరూపించుటకు దేవుడు శరీరధారియైనప్పుడు, ఒక మానవునిగా యేసుక్రీస్తు వచ్చెను. చూశారా? అందువలన ఒక దేవదూతగా రాలేదు. ఒక మానవునిగా వచ్చాడు. అందువలన అది ఆయనను ప్రతిబింబింపజేయుచున్నదని చూపుచున్నది.
7ఓ, ఈ బైబిలు పాత కృపాకడ్డీలతో నింపబడి యున్నది. దానిలోని దుమ్మును దులిపి దానిలోని కార్యములను చూచుటకు ఇష్టపడుచున్నాను, మీరు కూడా ఇష్టపడుట లేదా? ఏ విధముగా ఆ ఆభరణములు ఆరిజోనాలో ఉన్నమీరు భూమిలోని మట్టిలో నుండి ఏవిధముగా ఆ ఆభరణములు వచ్చునో మీకు తెలియును, అవి అక్కడ నుండి తీయబడును. దేవుని యొక్క ఆభరణములు కూడా ధూళిలో నుండి తీయబడుచున్నవి. అంతేకాదు ఆయన ఆయన కర్మాగారము (Refinery) లోనికి వెళ్ళి మనలోని పనికిరాని కార్యములను తీసివేయు హక్కును మనము పొందినందులకు చాలా సంతోషపడుచున్నాము.
వారేమి చేయుదురో మీరెరిగి యున్నారా? బహుశా ఆరిజోనాలోని ప్రజలైన మీరు వారెలా కొలిమికి తీసికొనివచ్చుటకు ముందుగా వారే విధముగా ఆ బంగారమును శుద్ధి చేయుదురో దానిని మీరెరిగి యున్నారు. వారు ఆ బంగారమును తీసికొని కొట్టెదరని మనకు చెప్పబడుచున్నది. పూర్వపు ఇండియన్‌లు దానిని చేయుదురు. త్రిప్పి, త్రిప్పికొట్టుచు, కొట్టుచు ఆ మురికి అంతయు పోవు మట్టుకు కొట్టెదరు. దానిలోని కల్మషమంతయు పోయినదని ఎలాగు కనుగొందురనగా, దానిలోని ఇతర లోహములన్నియు వారప్పుడు ఏ విధముగా తెలిసికొందురనగా, కొట్టువాడు తన ప్రతిబింబమును దానిలో చూచును. అతడు తనను దానిలో చూచును, అప్పుడు అది స్వచ్చముగా వచ్చుచున్నదని ఎరుగును, ఎప్పుడనగా, అది తన స్వంత రూపమును ప్రతిబింబింపజేసినప్పుడు.
HEB 12:1,2
8మరియు మీకు తెలుసా, దేవుడు తన సంఘమును ఆ విధముగానే ఉండుటకు ఇష్టపడుచున్నాడు. దానిలోని ప్రపంచమంతటిని కొట్టి తీసివేసినప్పుడు, యేసుక్రీస్తు అక్కడ ప్రతి బింబించును. ఆయన మనలో ప్రతి ఒక్కరిలో నివసించును. అప్పుడు మనము ఆయన జీవమును ప్రతిబించెదము. అప్పుడు ఆయన (రాకడకు) మనము సిద్ధమైతిమని అర్థము ప్రతి భారమును, సుళువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ప్రక్క నుండి మనముందుంచిన పందెములో ఓర్పుతో పరిగెత్తుదము. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు వెళ్ళుదుము. దాని వలన మనకెంతో సంతోషము!
9నేను ప్రతి రాత్రి చెప్పునట్లు నేను సహో. కారల్ విలియమ్స్‌తో నేను ఇలాచెప్పాను, "సహో కారల్ ఆ ప్రజలు నేను చెప్పునది వినుటకు ఇష్టపడుట లేదు. ఆ లోయలలో వారితో రెండు మూడు గంటలు రాత్రులందు మాట్లాడుటను వారు ఇష్టపడుట లేదు."
అందుకతడు మంచిది, "మంచిది, మీరు రండి."
అందువలన నేను మీ ఓర్పును మెచ్చుకొనుచున్నాను. నన్ను మీరు మరలా ఆహ్వానించారు. మరియు ఇప్పుడు ప్రతి రాత్రియు
కొంత సమయమునకు ముందు నేను నా భార్యతో మాట్లాడాను. ఆమె ఇప్పుడు టూసాన్ నందున్నది. "వాతావరణమెట్లున్నదని" ఆమెను అడిగాను.
"వెచ్చగా ఉన్నదని," ఆమె చెప్పినది. "నిర్ణయము ప్రకారమే ముందుకు వెళ్ళుచున్నవా?" అని ఆమె అడిగినది.
"ఖచ్చితముగా, ప్రతి రాత్రి 10 లేక 11 గంటల సమయము వరకు," అని చెప్పాను.
అప్పుడామెతో నేను మరలా చెప్పినదేమనగా, "ఈసారి నేను ఆరిజోనాకు వెళ్లినప్పుడు కొంత విశ్రాంతి తీసికొందును. ఈ కూడికలను ముగించి వెళ్ళుదును. అప్పుడు నేను ఆ సంఘములను, ఆ సహోదరులను కలసికొందును. వారినందరిని నేను బలవంతము చేయబోవుట లేదు, ఆ జూబిలీ గానములోనికి వారిని తీసుకు రాబోవుచున్నాను. అక్కడకు మౌనముగా వెళ్ళెదను. నన్ను నా అదుపులో ఉంచుకొనబోవుచున్నాను. పదిహేను లేక ఇరువది నిమిషములు మాత్రము మాట్లాడుటకుగాను సిద్ధపడియున్నాను. ఆమేన్ అని చెప్పుచు ఇంటికి వెళ్ళిపోవుదును" అని చెప్పాను.
అప్పుడామె,"మీ ప్రణాళిక పైనే మీరున్నారా?" అని అడిగినది.
అప్పుడు నేను, "నిజమే, హనీ, నేను ఆ విధముగానే సిద్ధపడి యున్నాను; నేను సాధారణముగా, మూడు గంటలకు కావలసిన పాఠ్య భాగముల కొనిపోవుచున్నాను." వారు చక్కని ప్రజలు; ఎంతో ఓర్పు గలవారని చెప్పాను.
10మంచిది. ఒక్క క్షణము మన తలలు వంచి, ఆయన చెంతకు చేరుదము. ఇప్పుడు ఇలాంటి మంచి ప్రేక్షక ప్రజలను చూచుటలో నేను ఎంతో సంతోషించుచున్నాను. వారు మంచి విశ్వాసులు. ముఖ్యముగా ఇక్కడ రెండు మంచములు ఉన్నవి, ప్రజలు రోగులుగా వారి అవసరతలలో ఉన్నారు. వారికి ప్రత్యేక మనవులున్నవి. ఇతరులు అనేకులకు ఈలాంటి మనవులున్నవనుటలో సందేహము లేదు. ఆలాగున్న యెడల, మీ చేతులను పైకెత్తుడి. మీరు మీ చేతులెత్తుట ద్వారా అది తెలియబడుచున్నది. నేను అక్కడికి వెళ్ళి, అక్కడున్న ఆ మంచములపై నున్న ప్రజల కొరకు ప్రార్థించనైయున్నాను. మనమిక్కడ ఉండగా, మనము దానిని పొందెదము, నిశ్చయతను కలిగి యున్నాము. ఇక్కడ ఏదైనను సంభవించనున్నయెడల వారిని ఇక్కడకు నమ్మకముతో తీసుకొని రావచ్చును. మీరందరు నాతో కలిసి ప్రార్థించవలయునని కోరుచున్నాను.
ISA 53:5•
HEB 4:16•
1PET 2:24
11మా పరలోకపు తండ్రీ, ప్రతి తలంపును ఇప్పుడు మేము ప్రక్కను పెట్టి, మా మనస్సులను శుభ్రపరచుకొనుచున్నాము. ఆత్మశుద్ధి కొరకు మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును మాకు ముందుగా తెచ్చుచున్నాము. మేము నీ యొక్క పరలోకపు ఆశీర్వాదములకు అర్హులము కాదని ఒప్పుకొనుచున్నాము, అయితే మేము ఈ ఆశీర్వాదములను పొందునట్లు ధైర్యముతో సింహాసనము ఎదుటకు రమ్మని సెలవిచ్చాడు. మా ప్రభువైన యేసుక్రీస్తు కృపనుబట్టి మేము ఈ ఆశీర్వాదములను తీసికొనుచున్నాము. ఆయన ఇమ్మానుయేలుగా భూమి పైకి వచ్చి పాపి స్థానమును తీసికొనెను. ఆయన మేముగా మారెను, ఓ, మేము ఆయనగా మారుటకు.
ప్రభువా! ఏ మా మార్పు! పాపములో నుండి పాతాళము వైపునకు వెళ్ళు, ఒక పాపపు జీవితమును మనము కలిగియున్నాము. ఒకరు దిగి వచ్చి మన ఈ జీవితమును తనపై తనకుతానే వేసికొని, తన స్వంత జీవము నుండి వెలువడిన రక్తముతో కడిగి మన పాపములను శుద్ధి చేసెను. ప్రభువా, మా హృదయాలు తలంచు దాని కన్నను అది ఎంతో గొప్పగా ఉన్నది. ఆ తరువాత వీటన్నింటికన్నను, మన అపరాధములను తొలగించుటకు ఆయన మనకొక మార్గమును ఏర్పాటు చేసి, తన గాయముల చేత మనలను స్వస్థపరచెను. మనము ఆయనకు సేవ చేయునప్పుడు, ఆయన మనలను కాపాడునని ఆయన చేసిన వాగ్ధానము కొరకు మనము ఆయనకు ఎంతో వందనస్థులమైయున్నాము.
12తండ్రీ, ఇప్పుడు ఈ రాత్రికి అనేక మనవులు వచ్చి యున్నాయి వారి చేతులను పైకెత్తి యున్నారు. వారిలో ప్రతి ఒక్కరి కొరకు అక్కర తీసికొందువని మేమెరిగియున్నాము. వారి చేతుల క్రింద వారి హృదయాలలో ఏమున్నదో నీవు పూర్తిగా ఎరిగియున్నావు.
ప్రభువా, నేనడుగునదేమనగా, మేము ఈ రాత్రి చదువనైయున్న వాక్యభాగమును జ్ఞాపకము చేసికొనుము. ఒక చిన్న పాఠముగా దానిపై ధ్యానించనై యున్నాము. ఒక ఆదివారపు పాఠముగా ధ్యానించనై యున్నాము. ఈ రాత్రి మేము ఈ స్థలమును విడిచి వెళ్ళుచుండగా, నీకు ఇంకనూ చేరువైనామను నమ్మకముతో మా హృదయాలు నింపబడును గాక. మరలా అదే తలంపుతో మేము తిరిగి వచ్చెదము, అందుకొరకే మేమిక్కడ ఉన్నాము. ఇది ఈ దేశము చుట్టూను ఒక ఉజ్జీవము కొని తెచ్చునట్లును, అది ఎప్పుడు ప్రారంభమగునో తెలియదు, అయితే ప్రభువా వాంఛతో ఎదురుచూచుచున్నాము. ప్రతి మానవ ప్రయత్నమును నీ ముందుంచుచు మేమెరిగినట్లు స్త్రీలను, పురుషులను తీసికొని వచ్చు ఉజ్జీవమును తెచ్చుటకు, బాలురను, బాలికలను క్రీస్తు యొక్క రక్షణ జ్ఞానమునకు తెచ్చుటకు నీ ముందుంచుచున్నాము.
13ఈ సంఘము కొరకును, దాని కాపరి కొరకును ఆయన కుటుంబము కొరకు, ఇక్కడి పెద్దల కొరకును, ధర్మకర్తలకొరకును, ప్రతి ప్రతినిధి కొరకు మేము వందనములు తెలుపుటకు ఇష్టపడుచున్నాము. ఇచ్చట ధైర్యముతో నిలచు ప్రతివారి కొరకు వందనములు తెలుపుచున్నాము. ప్రభువా, దేవుని ఆశీర్వాదములు వారిపై మెండుగా నిలచునట్లు మేము ప్రార్థించుచున్నాము. వారు చేయు ప్రతి ప్రయత్నమును దీవించుము. ప్రభువా, ఇది ఒక కూడలిగా ఉండి సమస్తమైన ఇక్కడి లోయలు ఇక్కడకు వచ్చి విశ్రాంతిని కనుగొనును గాక. అనుగ్రహించుము తండ్రి. రోగుల కొరకు కాపరి చేయు ప్రార్థనలకు జవాబు దొరుకును గాక. ఆయన రక్షణకొరకు చేయు ప్రార్థనలు — సువార్త పరిధులలోనికి వెళ్ళునట్లు జవాబు దయ చేయుము. నీ మెండైన దీవెనులు ఆయనపైనుంచుము. సంఘములో ఎలాంటి ఆత్మీయ వరముగాని కొదువ పడనియ్యకుము. ఇది ఒక మాదిరి సంఘముగాను, స్థలముగాను సమస్త జాతికి ఉండునట్లు దయచేయుము. ప్రభువా.
MARK 16:17,18•
ROM 8:11
14ఇప్పుడు, తండ్రీ, ఈ కూడికలో మంచముపై నుండి కూర్చోలేని, మంచముపై నుండి సంతోషించలేని వారిని కనికరించుము. ఈ అవకాశమును పోగొట్టుకొనిన వారిని కనికరించుము. ఈ రాత్రి వారందరు ఏదో ఒక విధముగా కూడి యున్నారు. ఓ దేవా, కృప చూపుము! నేను తలంచునదేమనగా," నా భార్య లేక నా సహోదరుడు లేక మరొకరు, ఒక బంధువు, నాకు బాగుగా తెలిసియున్నను ఏమున్నది?" అది మరొకరిది. తండ్రీ, నేను ప్రార్థించుచున్నాను. దేవుని కృపను ఆయన శక్తితో ఈ రాత్రి దిగివచ్చి ఆ కట్లలో నుండి వారిని విడిపించును గాక. ఈ రాత్రి ఈ కూడికలో తప్ప మరెప్పుడు గాని ఈ కట్ల నుండి విడుదల పొందును గాక. యేసు క్రీస్తును జీవింపచేసిన అదే శక్తి వీరి శరీరములను కొత్త ఆరోగ్యమునకును, బలమునకును మరల్చును గాక. మా తండ్రీ, దయచేయుము. దానిని వాగ్ధానము చేశామని మేమెరిగియున్నాము.
అందువలన లేఖనములలో వ్రాయబడినదేమనగా "నమ్మిన వారి వలన ఈ సూచనలు కలుగును. రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందెదరు."
ఇప్పుడు తండ్రీ, ఇతరులు ప్రతి ఒక్కరిని చేరునప్పుడు, చేరకుండువారు ఎవ్వరూ లేక యుందురు గాక. ఈ వాగ్ధానముపై (ఆజ్ఞపై) నేను నడచి వెళ్ళుచున్నాను. దేవా, వారి నుండి ఒక ఉత్తరమును ఎదురు చూస్తున్నాను. నేను యేసుక్రీస్తు నామమున వెళ్ళుచుండగా ఆ విధముగానే జరుగును గాక.
15ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.
ఓ, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.
సమస్తమును సాధ్యమే, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.
ప్రభువా, నేను విశ్వసించుచున్నాను,
ఓ, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.
సమస్తమును సాధ్యమే, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.
ఆ ఇద్దరు స్త్రీలకు క్యాన్సర్ వ్యాధి ఆవరించి పెరిగి యున్నది.
16నేనిప్పుడు నా కొద్ది సాక్షమును ఇవ్వబోవుచున్నాను. నేను మాట్లాడుటను ముగించుచున్నాను. మనము ఇంటికి వెళ్ళుటకు ముందు అది నా చివరి సంభవముగా నుండును. ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు డైయర్; ఆమె, ఇప్పుడు నేనామె పేరును మరచిపోయాను. ఆమె లూయిస్‌విల్ నుండి వచ్చిన డాక్టర్. డైయర్, ఓ, జేమ్స్, డాక్టర్ జేమ్స్ డైయర్స్ గడ్డల వ్యాధి యందు ఒక స్పెషలిస్టు. వారు లూయిస్‌విల్ నందున్నారు.
ఆయన కుమార్తె ఓపన్ డోర్ సంఘమందు పియానో వాయించును. ఆ సంఘ కాపరి డాక్టర్ కోబెల్ట్. అది ఒక గొప్ప పురాతన యూద సినగోగు లాంటిది. అతడేమో క్రీస్తు సంఘమునకు చెందిన వ్యక్తి. సంస్థాగతమైన క్రీస్తు సంఘము. ఆ తరువాత సంపూర్ణ సువార్తను నమ్ముట వలన మార్చబడి ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. లూయిస్‌విల్ లోని మెమోరియల్ ఆడిటోరియంలో నా కూడికలు జరిగినప్పుడు ఆమె అక్కడ పియానో వాయించెను. అక్కడ జరిగిన దానిని చూచి ఆమె ఆశ్చర్యము చెంది, ఆమె తండ్రితో ఆ కార్యములను చెప్పుటకు ప్రయత్నించెను.
అందుకతడు "అదొక రకమైన మనస్తత్వమును వారు ఎన్నడూ ఉండునట్లే రోగముతో ఉందురు," అని చెప్పెను. అందువలన అతడు దానిని నమ్మలేక పోయాడు.
17చివరకు ఆమె ఒక యవ్వనుని పెండ్లి చేసికొని ఆ సంఘమును విడిచి పెట్టినది. ఆ అబ్బాయి ఒక బాప్టిస్టు సెమినరీకి చెందిన వ్యక్తి. అతడు చివరకు తన విశ్వాసము నుండి తప్పి పోయాడు. అతడు ఒక సేవకునిగా తర్ఫీదు తీసికొనినందున, ఆ బాప్టిస్టు అతనిని ఆ విధముగా చేసినది. అందువలన వారు చివరిగా అతడు దూరమై పోయాడు, ప్రసగించుటకు ఇష్టపడలేదు. వారు ఇల్లినాయిస్‌లోని రాక్‌పోర్డులోని వారి బంధువుల దగ్గరకు వెళ్ళిపోయారు.
చివరిగా ఆమె, ఆమె పేరు జీన్, ఆమెకు స్త్రీల జబ్బు ప్రారంభమైనది. ఆమె పరీక్షకై తన తండ్రి యొద్దకు వెళ్లినది, అందువలన లూస్‌విల్‌నకు పరీక్ష కొరకు తిరిగి వచ్చినది. వారు పరీక్ష చేసి, "ఆమెకు చాక్లెట్ట్యూమర్" అను జబ్బున్నదని నిర్ణయము చేశారు. అది స్త్రీల గ్రంథులలో ఏర్పడినది. దానిని ఆపరేషన్ ద్వారా తీయవలెనని ఆ గడ్డను విడగొట్ట వలసియున్నది. ఆమెకు కొంత లోతైన ఎక్స్‌రేను ఇచ్చారు. అది ఒకరకమైన వైద్యము.
అప్పటి నుండి ఆమె ఇంటికి వెళ్ళిపోయినది, కాని ఆ జబ్బుతో బాధపడుచుండినది.
ఆ తరువాత ఒక్క సంవత్సరమునకు ఆమెను మరలా ఒక పరీక్ష కొరకు వెనుకకు తెచ్చారు. వారు పరిపూర్ణముగా పరీక్ష చేశారు. వారా విధముగా చేయచుండినప్పుడు, ఆమె తండ్రి, డాక్టర్ హ్యమెస్‌తో కలిసి, ఆయన ఆ దక్షిణ ప్రాంతములో ఒక పెద్ద డాక్టరు. ఆపరేషన్ చేయుటలో ప్రసిద్దియైన డాక్టర్ ఆపరేషన్ చేయుటకు ఇక వీలుపడలేదు, ఎందుకనగా క్యాన్సర్ వ్యాధి కడుపులో ఎదిగి ముదిరిపోయినది, అందువలన కొంత వ్యవధి కొరకు ఆమెను విడిచిపెట్టారు. ఆ తరువాత ఎక్స్‌రే వైద్యములను కొనసాగించారు, అది ఏమిపని చేయలేదని వారు గ్రహించారు. మరలా ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు, వారు ఆమె కడుపును శుభ్రపరచలేక ఎనీమా ద్వారా శుభ్రపరచారు, అందువలన నీరు గర్భములోనికి ఇక వెళ్ళలేదు.
18అప్పటి నుండి ఆమె భర్త నన్ను విమర్శించు వారిలో ఒకడు. చివరిగా అతడు ఒక దినమును అక్కడకు వచ్చి ఒక పుస్తకమును తీసికొని చదివాడు. (అప్పుడు నా కుమారుడు మరియు సహోదరుడు సోత్‌మాన్, ఆయన ఒక ట్రస్టీ, ఇక్కడ ఉండిరి.) అతడు ఆలయ వాకిలిలో కూర్చొని రెండు రోజులు ఆలాగే ఉండిపోయాడు. నేను ఒక కూడిక నిమిత్తము వెళ్ళి యుంటిని. నేను తిరిగి వచ్చినప్పుడు ఆమెను చూచుటకు వెళ్లాను. అప్పుడతడు ఇప్పుడు "ఆమెకు క్యాన్సర్ వ్యాధి ఉన్నదని ఎరుగదు," అని నాతో చెప్పాడు. "ఆమె యొద్దకు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె కొరకు ప్రార్థించుమని" చెప్పాడు.
అందువలన నేనామెను చూచినపుడు, " ఆమె సహో బ్రన్హం నా భర్త దైవీక స్వస్థతను అంగీకరించుచున్నాడు, ఎందుకనగా నేను ఒక పుస్తకము నైనను చూడగలుగునట్లు తీసుకొని రాలేకపోయాను," కాని ఇప్పుడు "అతడు పేజీ వెంబడి పేజి ప్రతిదినము ఒక్కొక్క పుస్తకముగా చదువుచున్నాడు," అని చెప్పినది.
19అప్పుడు" నేను జీన్, నేను గ్రహించాను." ఇప్పుడు "మనము మాట్లాడి ప్రభువు చిత్తమేయని చూచెదము, జీన్" అని చెప్పాను. అప్పుడు ఆ గదిలో ఎవ్వరూ లేరు. నర్సు వెళ్లినది. మేము కొంతసేపు మాట్లాడునంతలో ఒక దర్శనము వచ్చినది. నేను ఆమెకు నలువది సంవత్సరములైనవి, అయితే ఆమెకు వెంట్రుకలు మొత్తము నెరిసిపోలేదు, కాని వృద్ధురాలి వలె అయిపోయినది. నేను చెప్పాను, "నేను జీన్, ఇప్పుడు నీవు కూడికలలో ఉండబోవుచున్నావు"
"నిజమే, సహో బ్రన్హం."
అప్పుడు నేను, "వారు దానిని నీకు దాచారు, నాతో చెప్పవద్దని చెప్పారు, అయితే నీకు క్యాన్సర్ వ్యాధి వచ్చియున్నది." "మీ తండ్రి లేక నీ భర్త నీతో దానిని గురించి ఏమియు చెప్పలేదు, అయితే నీకు క్యాన్సర్ ఉన్నది జీన్." అయితే ఇప్పుడు నీతో ఒకటి చెప్పబోవుచున్నాను, దర్శనము ఎప్పుడు గాని తప్పిపోదు. ఇప్పుడు నేను నీతో చెప్పబోవునదేమనగా, జీన్, అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు! చూశావా? చూడగలిగావా?
20ఇప్పుడు నీవు ఎంతో నిశ్చయతతో ఉండవలసియున్నది, చూశావా, అది ప్రభువు. మరొకటి కాదు; నీవు దానిని చూశావా.
అంతట నేను చెప్పినదేమనగా, "నీవు జీవించబోవుచున్నావు." వారు..
అప్పుడామె "సహో బ్రన్హం, కాలమంతయు నేను సందేహపడినాను." ఒక ఇంటిలో, తండ్రితో పెంచబడినందున నా తండ్రి డాక్టరుగా ఉన్నారు. "నేను దానిని సందేహపడితిని." ఇన్ని దినములు అది ఏమని నేను ఊహించాను. "నేను ఊహించినది సరియే," అని చెప్పినది. మేము ప్రార్థించాము.
మరుసటి దినము, దానికి రెండవ దినము, వారు ఆమెను ఒక పరీక్షకై తీసుకొనివెళ్లనై యున్నారు. దానిలో వారు ప్రేగులను కత్తిరించి ఒక సంచిలాంటి దానిని అక్కడ ఉంచబోవుచున్నారు. అప్పుడది ఆ రోగి బ్రతికి ఉన్నంత కాలము ఆలాగే యుండును. ఆ క్యాన్సర్ చివరిగా వారిని చంపి వేయును. ఒక సంచిలో ఖాళీ ప్రేగులుండును. ఆ విధముగా వారు ఆమెను సిద్ధపరచినప్పుడు, వారు ముందుగానే సమస్తమును సిద్ధపరిచారు. ఆమెను ఆపరేషన్‌కు తీసుకు వెళ్లనైయున్నారు. అప్పుడు ఆమె ఆశ్చర్యమైన అనుభూతిని పొందినది. అప్పుడు వారు ఆమె నర్సును పిలచి స్నాన గదికి తీసుకొని వెళ్లమని చెప్పినది. ఆ విధముగా వారు తీసికొని వెళ్లినప్పుడు, ఆమెకు సాధారణ స్థితి ఏర్పడి యున్నది. ఆమె భర్త దానిని అంత త్వరగా అంగీకరించలేకపోయాడు. రెండవ దినము వారామెను కొనిపోలేదు. రెండవ దినము సాధారణముగా ఉండినది. ఉదయకాలము ఆహారము ముగించిన తరువాత మరొకసారి పూర్తిగా ఆమె సాధారణస్థితిని పొందినది. అందువలన ఆమె..
ఆమె డాక్టరు పిలువబడినప్పుడు, ఆ కేకల మధ్య అతడు, నేను దీనిని గ్రహించలేకున్నాను. "దాని రేకలు (క్యాన్సర్) ఒక్కటి కూడ లేకున్నది. అంతయు పోయినది," అని చెప్పాడు.
JAS 5:15
21ఇప్పుడు అమూల్యమైన నా సోదరీలారా, నేను ఏదో పొరపాటును చెప్పుటకు గాను క్రీస్తు సేవకునిగా ఇక్కడ నిలచుట లేదు, ఎందుకనగా ఆ దినమున నేను న్యాయము తీర్చబడుదును. అబద్ధము చెప్పిన యెడల ఒక భక్తిహీనునిగా నెట్టి వేయబడుదును.
ఇప్పుడు తెరువబడిన దేవుని వాక్యముతో, మీకు చేసిన దానికన్నను సోదరి జీన్‌కు అధికముగా చేయలేదు, చూడండి. విశ్వాసముతో కూడిన ప్రార్థన అను చిన్న స్తంభమును అక్కడకు తెచ్చాము. అంతే. అక్కడది దానిని కుదిర్చినది. దేవుని వాక్యము ఆ విధముగా చెప్పినది, చూడండి. "విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును".
ROM 8:28
22ఇప్పుడు, డాక్టరు డైయర్స్ కుమార్తెను స్వస్థపరచిన అదే దేవుడు, ఆమె పేరుజీన్ ఇప్పుడామె పేరు ఏమనినాకు తెలియదు. అయితే ఆ మనుష్యుడు సంపూర్ణ సువార్తను కౌగిలించుకున్నాడు. చివరి ప్రసంగములో అతడు అక్కడ కూర్చుండి పూర్తిగా గైకొనెను. మనతో రాత్రి భోజనము తీసికొనెను, ప్రతి కార్యములో పాల్గొనెను. ఒక బాప్టిస్టు విద్యార్థి పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ప్రభువు నొద్దకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు దేవుడుగానే ఉన్నాడని నిరూపణయైనది.
ఆ డాక్డరు, ఆమె తండ్రి, ఒక ప్రియమైన మనిషి, ఆ విధముగా జరిగిన దానిని ఆయన ఎప్పుడు గాని చూడలేదు.
దేవుడు ప్రతి దానికి ఒక కాలమును కలిగియున్నాడు. నమ్ముటను బట్టి మీరిరువురు విశ్వాసులై యున్నారు. కొన్నిసార్లు ఈ కార్యములు మంచికొరకు జరుగును. మీకు తెలుసా, బైబిలు ఇలా చెప్పుచున్నది. "మంచికొరకు అవి సమకూడి జరుగుచున్నవి."
ఇప్పుడు యోబును జ్ఞాపకము చేసికొనుడి. ఆయనకు సంభవించి శోధనలను తలంచారా? అది యోబును దేవుడు శుద్ధిచేయుట కాదు గాని, దేవుడు తన సేవకుని నిర్ణయించుచున్నాడు. అందువలన అదంతయు మంచి కొరకు జరుగుచున్నది. మీరు చూశారా, యోబు గ్రంథము సమస్త తరముల కొరకు వ్రాయబడినది. అది ఒక సాక్ష్యముగా ఉన్నది. దేవుడు మంచి కొరకు పనిచేయుచున్నాడు.
మీరు జ్ఞాపకముంచుకొనండి, నా హృదయమంతటిలో, విశ్వాస ప్రార్థనను నేను ప్రార్థించాను. మీరు దానిని విశ్వసించాను, అక్కడ అది వున్నది. అది ఆ కార్యముగా ఉన్నది, కేవలము ఫలితముల కొరకు ఎదురు చూడండి.
23ఇప్పుడు వర్తమానమునకు నేరుగా వెళ్ళుటకు (అనేకులు నిలచి యున్నారు) ఇది ఈ సాయంకాలమునకు ఒక చిన్న వర్తమానము.
మీరు జ్ఞాపకముంచుకొనండి, అక్కడ రమడాలో, ఆ రమడా సమావేశములలో అనేక గొప్ప ప్రసంగికులు వచ్చుచున్నారు. అనేకులైన సేవకులు (Business Men) అందువలన మీరు రమడాలో ఉండవచ్చు. అందువలన మీరు ఖచ్చితముగా ఈ కూడికలకు హాజరు కాగలరు. సహో ఓరల్ రాబర్ట్ ప్రారంభోత్సవ రాత్రి అక్కడుండెదరు.
నేను ట్యూసాన్‌లో ఒక చిన్న భాగమునకు సంబంధించి యున్నాను. అక్కడ మనమొకరిని కలిగియుండెదము. మంచిది, మీరు కూడా అక్కడకు రండి. అక్కడ మీరు నాతో కొంతసమయము గడుపవచ్చు, ఎందుకనగా నేను దానిని మాట్లాడనైయున్నాను…. అందువలన మీరు మరుసటి మంగళవారము అక్కడకు రండి. మరుసటి సోమవారము రాత్రి రమాడ విడిదిలో కలిసికొనవచ్చు. ట్యూసాన్‌లో ఉన్న రమాడవిడిది. బహుశా, ఫోనిక్స్ అను పట్టణము ట్యూసాన్ పొలిమేరలలో ఉన్నది. మనకందరికి తెలియును. మీరు చూడండి. అందువలన మీరు వచ్చి ఆ కొండ ప్రాంతపువారు ఎలా జీవింతురో తెలిసికొనవచ్చును.
ZECH 14:6,7
24ఇప్పుడు బైబిలు నందు జెకర్యా గ్రంథములో 14వ అధ్యాయము 6వ వచనము. మరియు 7వ వచనము చదువుటకు నేను ఇష్టపడుచున్నాను. దీనిలో నుండి నేను తెచ్చుటకు ఇష్టపడు అంశము అందులో ఉన్నది.
ఆ దినము ప్రకశాగమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.
దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రికాదు; అస్తమయ కాలమున వెలుతురు కలుగును.
ఇప్పుడు దీని నుండి నేను, సాయంకాల వర్తమానికుడు అను అంశమును తెచ్చుచున్నాను. సాయంకాల వర్తమానికుడు. పగలంతయు అనేక వర్తమానికులను కలిగి యుండవచ్చు, ఈ దినమంతటిలో అనేక వర్తమానికులు వచ్చారు. వారు మాట్లాడారు, అయితే ఒక సాయంకాల వర్తమానికుడు వచ్చుచున్నాడు. మనము ఈ రాత్రికి దానిని చూడవలసి యున్నాము. ఇది ఒక ఆదివారపుబడి పాఠము వలె ఉండును. దానిపై కొద్ది సమయము మాట్లాడెదము.
ZECH 14:7
25ఇప్పుడు, మన కందరికి తెలియును, జెకర్యా ఇక్కడ మాట్లాడుచూ "ఒక దినము వచ్చుచున్నది అది పగలు కాదు రాత్రికాదు; ప్రభువు ఎరిగిన దినము, సాయంకాల మందు వెలుగు కలుగును." అది పగలు కాదు రాత్రి కాదని మనమెరిగి యుండినయెడల అది మబ్బుతో కూడిన దినమని గ్రహించగలము. ఒక రకమైన పొగమంచుతో కూడిన దినము.
మనకందరికి తెలిసినట్లు నాగరికత తూర్పు నుండి పశ్చిమమునకు ప్రయాణించినది. పురాతన, నాగరికతను మనము చైనా దేశములో కలిగి యుంటిమి. నాగరికత తూర్పు నుండి పశ్చిమమునకు సాగిపోయినది, ఎందుకనగా అది సూర్యుని వెంటాడినది. మనమిప్పుడు పడమటి తీర ప్రాంతములకు వచ్చేశాము. ఇంక ముందుకు వెళ్లామంటే మరలా తూర్పుకు వెల్ళెదము, చూశారా. అందువలన మనము దారి చివరలో ఉన్నాము.
26మనము ఒక సంఘముగా నమ్మునదేమనగా సువార్త ముగింపునకు వచ్చినది. కాలములో ఆ గొప్ప వర్తమానికులుండిరి. ఈ దినముల చివరిలో, చివరి కొన్ని వందల సంవత్సరములలో ఈ గొప్ప కార్యముల కొరకు పోరాడితిమి; విశ్వాసము ద్వారా తీర్పు, లూథర్; జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ; పెంతెకోస్తు ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఈ కార్యములు ఆ పరిపూర్ణ శరీరమును ఏర్పరచినవని నమ్ముచున్నాము. అది ప్రకృతి సంబంధముగాను, ఆత్మ సంబంధముగాను జరిగినవి.
ఒక శిశువు సాధారణముగా జన్మించునప్పుడు, మొదటి కార్యమేమిటి? మొదటిగా నీరు వెలువడును; రెండవదిగా రక్తము వచ్చును; మూడవదిగా ఆత్మ వచ్చును.
1JN 5:7,8
27I యోహాను 5:7 పరలోకములో సాక్షమిచ్చువారు ముగ్గురు "తండ్రీ, వాక్యము, మరియు పరిశుద్ధాత్మ: ఈ మూడు ఒకరై యున్నారు." వారు ఒకటే; మీకు కుమారుడు లేనిదే తండ్రి లేడు, మీకు పరిశుద్ధాత్మ లేనిదే కుమారుడు లేడు. చూశారా, వారు ఒక్కటే. "కాని భూలోకములో సాక్షమిచ్చు కార్యములు మూడు: "నీరు, రక్తము, మరియు ఆత్మ; అవి మూడు ఒక కార్యములో ఏకీభవించుచున్నవి." అవి మూడు ఒక్కటి కాదు," కాని అవి ఒక కార్యమును అంగీకరించుచున్నవి. చూశారా? [I యోహాను 5:7-8 ఆంగ్లములో ఉన్నవాక్యములకు తెలుగు తర్జుమా సరిగా లేనందువలన ఆంగ్ల పరిశుద్ధ గ్రంథము నుండి ఆ రెండు వచనములను అట్లే తెలుగులో తర్జుమా చేసి వ్రాసియున్నది. దేవుడు ముగ్గురు కాదు ఒక్కరే అనునది ఆ వచనములలో చెప్పబడుచున్నది.]
ఇప్పుడు, శుద్ధీకరణలేనిదే తీర్పు తీర్చ వచ్చు పరిశుద్ధాత్మ లేనిదే శుద్ధీకరణ పొందవచ్చు. చూశారా? పరిశుద్ధాత్మ లోపల నివాసము చేయు క్రీస్తు శక్తియైయున్నది, ఆత్మలో నివసించును. ఇప్పుడు, మనము ప్రకృతి, ఆత్మను అనుసరించునని చూచాము, కావున సంఘము ఇప్పుడు దాని పరిపూర్ణతకు వచ్చియున్నదని అర్థము: నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మనము ఏడు సంఘ కాలముల ద్వారా వచ్చి మన గృహమును చేరియున్నాము. అది ఎంతో చక్కగా పోలికనిచ్చుచున్నది.
28ఆ మార్గములోనే ఎవరైనను సంఘ కాలమును గురించి విన్నారా? ఇంతకు ముందు, ఆ కాలమును, నల్ల బల్లపై చిత్రించి చూపించాను. పరలోకపు తండ్రి అది సత్యమని ఎరిగియున్నాడు, నేను నా శాయశక్తులా దాని ముగించాను. దేవుడు నాకిచ్చిన ఆత్మ ద్వారా, ఆ ప్రభువు దూతను మీరు ఫోటోలో చూస్తున్నారు. (అనేకులు ఆ ఫోటోను చూశారు, మీరు చూడలేదా. ఆ వెలుగును చూడలేదా?) అది నా గదిలోనికి వచ్చినది మూడు లేక నాలుగు వందల ప్రజల యెదుట ఆ గోడ ప్రక్కగా వెళ్ళినది.(ఒక వెలుగు వలె) ఆ సంఘ కాలములు తానే వ్రాసినది. మనమందరము దానిని చూస్తూ అలాగే నిలచి పోయాము. ఆ విధముగా మొదటి సంఘ కాలము, రెండవ సంఘ కాలము, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, సంఘ కాలములను వ్రాస్తూవుండగా గమనించి చూచాము. (ఆ అగ్ని వ్రాసినది)
MATT 18:16•
2COR 13:1•
REV 3:17
29ఇప్పుడు ఇక్కడ ప్రజలు దానికి సాక్షముగా కూర్చొనియున్నారు. అది నిజమైతే మీ చేతులెత్తుడి. బైబిలు చెప్పినట్లు, "ఇద్దరు ముగ్గురు సాక్షుల" మాట ప్రకారము.
ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని ఆక్రందన చేస్తూ అక్కడ చూడండి! "ఇప్పుడు చూడదలచిన ప్రతివారు అక్కడ నేరుగా చూడవచ్చు." పగలు 11 గంటలకు గోడ ప్రక్కన నిలబడి, ఆ సంఘ కాలములను వ్రాశాడు. అధిక ఆత్మతో ఉండి, తరువాత ఆ చీకటి చూపునదేమనగా, ఆత్మ చల్లబడి పోవుటను చూపుచున్నది. అంతట చీకటి యుగము గుండా వెళ్లి మరలా వచ్చినది, నేను వ్రాసిన విధముగానే అది ఉండినది. దాని పఠములను మనము కలిగి యున్నాము, వ్రాయబడిన ప్రతిది ఆ గోడకు తగిలించబడియున్నది, అది ఖచ్చితముగా అలాగే యున్నది. అది పూర్తి చేయబడినదని ప్రభువు ఆత్మ తప్తి చెందినది, ఎందుకనగా మరలావచ్చాడు, అది నిజమని నిరూపించాడు.
మనము లవొదికయ సంఘ కాలమందు జీవించుచున్నాము. గొప్ప ధనిక సంఘ కాలము, ఏమియు కొదువ లేదనుకొనుచున్నది. అయితే అది దిగంబరిగాను, దౌర్భాగ్యముగాను, గ్రుడ్డిదై, ఆ స్థితి ఎరుగకున్నది, చూశారా. ఇప్పుడు అవన్నియు మాదిరులుగా ఉన్నాయి.
ZECH 14:6,7
30ఇప్పుడు, అక్కడ ప్రకాశించిన ఆ సూర్యుడే తూర్పునందు ఉదయించిన ఆ సూర్యుడే పశ్చిమమందు అస్తమించుచున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషమాగి, ఈ వర్తమానమునకు వెనుక చూచెదము. మనకు తెలిసినట్లు ఆ సూర్యుడు అనగా నక్షత్రమండలములోని సూర్యుడు (Sun) దిగి వచ్చినప్పుడు, ఆయన దేవుడు దేవుని ప్రకాశమానమును, దేవుని వెలుగునై యుండి తూర్పున జన్మించెను. ఇప్పటికి రెండువేల సంవత్సరములు గడచి పోయినవి. దేవునిచే నిర్ణయించబడినవి, "అది పగలు కాదు రాత్రి కాదు అస్తమయ సమయము (వెలుగు లేని సమయము) అయితే సాయంకాల సమయములో వెలుగు కలుగును," అని ఆయన సెలవిచ్చెను.
31ఇప్పుడు మీరు గమనించారంటే, పరిశుద్ధాత్మ మొదట తూర్పు దేశస్తులపై దిగినది. అప్పుడు సంఘమును చేర్చు కాలమును మనము గలిగి యుంటిమి. చిన్నచిన్న కార్యములను గ్రహించు కాలము. చిన్న కారణములతో కూడిన వాటి కొరకు పోరాడవలసివచ్చినది. అయితే సాయంకాల సమయమున పడమటి అర్థగోళమునందు, వెలుతురు కలుగును. మనము ఆ కాలమందే ఉన్నాము! నాగరికత గొప్ప చీలికగా, తూర్పు నుండి వచ్చి, ఆ విధముగా వచ్చుచున్నప్పుడే పాపమును సమకూర్చుకొని వచ్చినది. చివరికి పడమటి తీరమును ఒక గొప్ప శబ్ధముతో తాకినది. అక్కడ అది వెనుకకు పడిపోయినది. చివరకు అధికముగా చెడిపోయిన స్థలముగా నాకు తెలిసి పడమటి తీరము మిగిలి పోయినది. (West Coast) మీరు తలంచు దేనినైనను అక్కడ పొందవచ్చు. పాపము, చెడుతనము, విడాకులు, పెండ్లిండ్లు, హాలీవుడ్ అది పాతాళమునకు ముఖద్వారముగా ఉన్నది! అది ఖచ్చితముగా నిజమై యున్నది.
32నేను బైబిలు నిజపరిశుద్ధత యందు విశ్వసించెదను. ఈలాంటి చెడుతనమును, ప్రజల ముందంచబడిన క్రుళ్లిన వాటిని, అవి హాలివుడ్ అని పిలువబడుచున్నది. వాటియందు విశ్వాసముంచలేము. నేను ఎప్పుడు దానికి వ్యతిరేకముగా ఉందును. ఒక మనుష్యుడు తనలో దేవుని ఆత్మకలిగి యుండినయెడల దానికి వ్యతిరేకముగా ఉండును, ఎందుకనగా అతనిలో ఉండుదేవుని ఆత్మ "అది పొరపాటని" అతనికి సాక్షమిచ్చును.
ఇప్పుడు అది ఒక మనము పారీస్ పట్టణమునకు వెళ్ళుచుందుము. అక్కడ దిగంబరి సాదృశ్యములను స్త్రీల కొరకు తెచ్చుకొనుచుందుము. ఇప్పుడు పారీస్ ఏ విధముగా మారినదనగా, మన నాగరికతను తీసికొని వెళ్ళుటకును వచ్చుచున్నది. చూశారా? హాలీవుడ్ ప్రపంచమును నడుపుచున్నది. మరియు ఆ దిగంబర నాగరికత, ప్రాన్స్ దేశము కన్నను మనకు ఈనాడు అధికముగా ఉన్నది (కేవలము దానిని గురించి తలంచి చూడుడి!) ఆ త్రాగుబోతు స్థితి, రచ్చలు, అవినీతి స్థలములు, ఇవన్నియు ఉండినను, హాలీవుడ్ వీటన్నిటిని మించిపోయినది.
మన టెలివిజనులన్నియు తీసివేయబడని అవినీతినంతటిని వాటియందు వెలువరించుచున్నారు. అసహ్యమైన తమాషాలు, ప్రతి వాటిలో ఉన్నవి, క్రుళ్లిపోయిన చెడుతనముతో నిండి పోయినవి. ఆ ప్రజలు, దయ్యము మనము కొన్ని సంవత్సరముల క్రితము మన పిల్లలను ఫిలిమ్ షోలకు పంపము, పూర్వపు పెంతెకోస్తులు అలాచేసేవారు, అయితే ఇప్పుడు దయ్యము దానిలో ప్రవేశించుట ద్వారా చివరకు మన యింటిలోనే తెచ్చిపెట్టినది. మీరు చూచారా? అందువలన అతడు (సాతాను) సినిమాలను ఇంటిలోనికి తెచ్చివేశాడు.
33ఇప్పుడు, అది అటువంటి మరణకర కార్యముగా ఉన్నది. తలంచి చూచినప్పుడు ప్రపంచము ఇటువంటి చెడుతనములో చిక్కుబడి పోయినది, ఎందుకనగా సమస్త చీలికలు, మీరు చూడండి. నాగరికతతో వచ్చుచు ఈ విధముగా తేలిపోయినవి.
అయితే అన్ని సమయములందు… ప్రభువు చిత్తమయితే ఈ దినములలో ఒకదానియందు కొన్ని దినములలో 'క్రిందికి లెక్కించుట' అను అంశముపై ప్రసంగించబోవుచున్నాను. మీకు తెలియునా, నేను, మీరు తిరుగుచున్నారని నాకు తెలియును. (మనము భూమితో పాటుతిరుగుచున్నాము) అందువలన అక్కడ ఏమి జరుగుచున్నదో చూడగలము. అలాగే దేవుడు కూడ తన సంఘముతో ఏదో కొంత అన్ని సమయములలో చేయుచున్నాడు, మీరు చూడండి, ఈ కార్యములు జరుగునప్పుడే అది కూడ జరుగుచున్నది. ఇప్పుడు మనము చివరి కాలమందున్నాము, ప్రభువుకు వందనములు!
REV 10:4,7
34ప్రతికాలము తన వర్తమానమును వర్తమానికుని కలిగియున్నది. దేవుడు దానిని చూచుచున్నాడు. ప్రతి సంఘకాలములలోను, దానిలో ప్రతి ఒక్కటి ఒక వర్తమానికుని కలిగియుండినది. ప్రతి ఒక్కరు వారి కాలమును జీవించారు. మరొకరు వచ్చినప్పుడు ఆ ముందున్నది వెళ్ళిపోవును; మరొకరు వచ్చినప్పుడు ముందున్నది వెళ్ళుచున్నది; ఆ విధముగా ఏడవ సంఘ కాలము వరకు జరుగుచున్నది. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సంఘమునకు దూతగా ఉన్నారు. ఆ దూత వర్తమానికుడుగా ఉన్నాడు.
మనము ఆ చివరి సంఘకాలమందు, ప్రకటన 10వ అధ్యాయములో ఒక బూర ఊదబడుటయు, ఏడు (ఉరుములు) వాటి వాటి శబ్దములు పలుకుటయు కనుగొనుచున్నాము అవి వ్రాయబడుటకు అనుమతించబడలేదు. అయితే అది వెనుక ప్రక్కగా ఆ పుస్తకము ముద్రించబడియున్నది. ఆ గ్రంథము వెనుక ప్రక్క ఏడు ముద్రలున్నవి. ఈ గ్రంథము వ్రాయబడిన తరువాత, అది ఏడు ముద్రలతో వెనుక భాగము ముద్రింపబడినది. ఇప్పుడు అవి ఏమిటని ఏ ఒక్కరు ఎరుగరు. అయితే అక్కడ చెప్పబడినదేమనగా, "ఏడవదూత పలుకు దినములలో, ఆయన వర్తమానమును బయలు వెడలు కాలములో," ఇప్పుడు అది భూలోకపు దూతగా ఉన్నాడు.
ఎందుకనగా దూత పరలోకము నుండి దిగి వచ్చును; అయితే ఇది భూమి మీద జరుగుచున్నది; దూత అనగా ఒక వర్తమానికుడు, ఆ కాలమునకు ఒక వర్తమానికుడు.
REV 10:1-7
35అంతట మనము గమనించినదేమనగా, ఆయన తన శిరస్సుపై ఒక వర్షధనస్సును కలిగి, ఆయన తన చేతిని పైకెత్తి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని, (ఈ శబ్దములు పలుకునప్పుడు, ఏడు ఉరుములు వాటి శబ్దములు పలుకునప్పుడు). ఆయన వాటితో చెప్పినదేమనగా, "వ్రాయవద్దు, అయితే ముద్రించుము." ఆ ముద్రలు ఆ గ్రంథమునకు వెనుక ఉన్నవని మనము కనుగొన్నాము.
అయితే "ఆ ఏడవ దూత తన వర్తమానమును ముగించినప్పుడు, అతడు ఆ దినమును గురించి ప్రవచించిన తరువాత, దేవుని మర్మము సమాప్తమగును." బైబిలు దానిని చెప్పుచున్నదని ప్రతి ఒక్కరు ఎరిగి యున్నారు." దేవుని మర్మము," దేవుడనగా ఏమిటి, దేవుడెవరు, బాప్తిస్మమనగా ఏమిటి, ఇతర కార్యములన్నియు ఆ దినమున ముగింపునకు రావలసియున్నది.
36ప్రతి వర్తమానికుడు తన వర్తమానమును కలిగియుండెను. వర్తమానము మరియు ఆ కాలమునకైన వర్తమానికుడు. గుర్తించవలసినదేమనగా ప్రతి వర్తమానికుడు సంఘ కాలములలో మనము వారిని కనుగొన్నాము. (మరియు ఈ రాత్రికి పాత నిబంధనలోకి వెనుకకు వెళ్లి అవే కార్యములను కనుగొందము) ఆ కాలమునకు చివరిగా దేవుడు ఆ కాల వర్తమానికుని పంపుచున్నాడు; ఎల్లప్పుడు చివరిలోనే పంపుచున్నాడు. ప్రారంభములో కాదు. కాలపు చివరిలో!
ఇప్పుడు లూథర్ కాలము గతించి పోవుచుండగా, వెస్లీ ప్రవేశించెను. ఆ తరువాత వెస్లీ శుద్ధీకరణ గతించి పోవునప్పుడు, పెంతెకోస్తు కాలము ప్రవేశించినది. చూశారా? అది ఎల్లప్పుడు వర్తమానికుడు ఆ క్రొత్త వర్తమానము ప్రారంభించునప్పుడు, అది ఆ పూర్వపు కాలము యొక్క చివరిగా ఉండును. ప్రతి కాలములోను ఆ విధముగానే జరిగినది. అది సత్యమని మనమెరిగియున్నాము.
37బైబిలులో ఇది ఆలాగే మారి మారి వచ్చుచుండును. మనము ఈ కార్యములను పవిత్ర లేఖనముల యందు మార్గమంతటను చూడగలము. అది ఎప్పుడును పూర్వము యొక్క చివరిలో జరుగును, అప్పుడు క్రొత్తది ప్రవేశించును. ఆ కాలము గతించిపోవును, ఒక క్రొత్త యుగము లేక కాలము ప్రవేశించును, దేవుడు ఒక వర్తమానికుని పంపును.
మరియు ప్రతిసారి ఎల్లప్పుడు వర్తమానికుడు వచ్చు ప్రతి కాలములోను, అది అన్ని వేళల వాక్యమునకు మరలా పిలచునదిగా ఉండును, అది ఎన్నడూ తప్పిపోదు. జ్ఞాపకముంచుకొనుము, ఇది యేసుక్రీస్తు పరిపూర్ణ ప్రత్యక్షత లేక బయలుపాటుగా వున్నది. దీనితో మరేది చేర్చుటకు వీలులేదు, దీని నుండి తీయుటకు వీలు లేదు. ఇది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ బయలుపాటుగా ఉన్నది. ఇది మనము నిశ్చయముగా ఉండుటకు ఒకే ఒక మార్గము. ఈ బయలుపాటునకు వ్యతిరేకముగా ఏదైనను మనమధ్య లేచినయెడల అది పొరపాటుగా ఉండును. చూశారా? అది వాక్యమునకు తిరిగి వచ్చునదిగా ఉన్నది! అది ఎల్లప్పుడు వాక్యమునకు పిలచునదిగా ఉండును.
AMOS 3:7
38మరియు వాక్యములో ప్రతి సందర్భము. దేవుడు ఆ కాలమును వెనుకకు పిలచుటకు ప్రతి సందర్భములోను ఒక ప్రవక్తను వాడుకొనును. చేయును లేదు, ఒక్కసారియైనను అది తప్పిపోదు, ఆయన ఎల్లప్పుడు ఒక ఒక ప్రవక్తను పంపును! ఇప్పుడు ఎందుకాయన అలా చేయుచున్నాడు? బైబిలు ఇలాగు చెప్పుచున్నందువలన, "దేవుని వాక్యము ప్రవక్తలకు మాత్రమే వచ్చును," అతడు వాక్యమును బయలుపరచువానిగా ఉన్నాడు.
ఇప్పుడు, నేను నేను నేను దానిని పొరపాటుగా గ్రహించలేదని నమ్ముచున్నాను. చూశారా? అది అపార్థము చేసికొనవలెనను భావముతో నేను చెప్పుట లేదు, అయితే ఆ పిలుపునకు నమ్మకముతో విశ్వాసముతో ఉండుటకేనని నేను భావించుచున్నాను. మనమాలాగే ఉండవలసియున్నది.
MAL 3:6
39ఇప్పుడు, దేవుడు ఎల్లప్పుడు ఒక ఒక ప్రవక్తను వాడుకొనును. అతడొక మానవుడై యుండును. మీరు అనేకులను వాడుకున్నారనగా, అక్కడ కలత లేర్పడును; చూడండి, ప్రతి మనిషి, ఇద్దరు మనుష్యులు ఆయన ఏ కాలమందైనను ఒకేసారి ఇద్దరు గొప్ప ప్రవక్తలను భూమిపైనుంచలేదు. ఆయన ఒక్కరినే తీసికొనును. అప్పుడు ఆ మరొకరు తనకాలములో తన స్థానమును గైకొనును. ఆయన ఇద్దరిని కలిగి యుండలేదు, ఆయన ఒక్క కాలములో ఒక్కరిని మాత్రమే కలిగి యుండెను.
మరియు ఆ మారని దేవుడు తన కార్యక్రమమును ఎన్నడూ మార్చుకొనడు, ఆయన ప్రారంభించిన దానితోనే ఆయన నిలచియుండును. అందువల్లనే ఆయన చెప్పిన దానియందు మనము నమ్మకము కలిగియున్నాము. ఆయన మారని దేవుడై యున్నాడు. దేవునియందు విశ్వాసముంచుట ద్వారా ఆయన ఒక మనిషిని రక్షించుననగా, ఆ తరువాతి మనిషి కూడా ఆ విధముగానే రక్షింపబడవలెను.
GEN 3:7
40తన సృష్టితో సహవాసించుటకు ఆయన ఒక స్థలమును ఏర్పాటు చేసినప్పుడు, ఆదాము తనకొక మార్గమును ఏర్పరచుకొనుటకు ప్రయత్నించెను. తన కొరకును తన భార్య కొరకును ఆకులను కచ్చడములను చేసికొనెను. దేవుడు దానిని త్రోసివేసెను. దేవుడు తన కార్యక్రమము ఎలాగున్నదో, ఆ విధముగా మనిషిని కలిసికొని అతనితో సహవసించును. అది చిందించబడిన రక్తము ద్వారానే జరుగును. ఆయన దానిని మార్చలేదు.
ఇప్పుడు ఒక మెతడిస్టు నుండి ఒక బాప్టిస్టుకు మారుచు ఒకరి చేతులు ఒక కరచాలనము చేసికొనవచ్చు. అయితే మెథడిస్టుగా ఉండుట ద్వారా లేక బాప్టిస్టుగా ఉండుట ద్వారా ఒక కార్యమును వారు సమ్మతించరు. నేను బాప్టిస్టునకు లాగుచుండగా మీరు మెథడిస్టునకు లాగుదురు. లేక అక్కడ నుండి ఇక్కడకు ఆ కార్యము జరుగవచ్చు. అయితే ప్రతి విశ్వాసి కలిసికొను స్థలము ఒక్కటి మాత్రమే ఉన్నది, అది చిందించబడిన రక్తము. అక్కడ మాత్రమే మనము ఏకముగా చేరగలము. అప్పుడు మిగిలిన వాటన్నింటిని ప్రక్కకు ఉంచెదము. అందువలన మనమందరము ఒక్క సంస్థగా చేరలేము, మనమలా చేయకూడదు.
41ఈ చిన్న సంస్థలు, దానంతటిలో దేవుడు ఉండి యున్నాడని నేను తలంచుచున్నాను. అయితే ప్రజలు… ఎందుకనగా మనము వ్యత్యాసము గలవారము. ఒక్కొవ్యక్తి ఒక్కొక్క విధముగా చూచును, ప్రతి వ్యక్తి వ్యత్యాసముగా చూచును, ఎప్పుడును గాని రెండు మనస్సులు ఏకమై యుండవు. ఏ ఇద్దరు వ్యక్తులు ఏకమై యుండరు; ఏ రెండు ముక్కులు, ఏ రెండు బొటన వ్రేలి ముద్రలు ఏకమై యుండవు. చూశారా, మనము వ్యత్యాసముగా చేయబడితిమి, ఆ విధముగానే మనము వ్యత్యాసమైన సమూహముగా ఉన్నాము.
అయితే దేవుడు ఎల్లప్పుడు ఒక వ్యక్తితో మాత్రమే పని చేయును. నీవు మెథడిస్టువై యున్నందున ఆయన నిన్ను రక్షించలేదు; నీవు ఒక బాప్టిస్టువై యున్నందున ఆయన నిన్ను రక్షింపలేదు; నీవు పెంతెకోస్తువై యున్నందున ఆయన నిన్ను రక్షించలేదు. ఆయన నీతో వ్యక్తిగతముగా సంధించుచున్నాడు గనుక ఆయన నిన్ను రక్షించును! నీవు ఆ విధానముమీదనే రక్షింపబడుచున్నావు. నీవు దానిని అంగీకరించవలసియున్నది. అందువలన దేవుడు నీతో సంధించును. సంఘవిధానముతో ఆయన నిన్ను సంధించడు. ప్రత్యేకముగా ఆయన నిన్ను సంధించును.
అందువలన దేవుడు తన ప్రవక్తలను పంపునప్పుడు. ఆయన యొక్క నిబంధన దూతలను పంపునప్పుడు ఆయన ఒకనితో మాత్రమే మాట్లాడును. అతడు ఆ వర్తమానమును తీసికొని రావలసియున్నది. ఇతరులు ఆ వర్తమానికుని నుండి వెళ్ళుదురు. ప్రతి స్థలమందు ఒకే రకమైన వర్తమానము తెచ్చును. అయితే కేంద్రస్థానము ఒక్కటి మాత్రమే ఉండవలెను. దేవుడు దానిని ఎల్లప్పుడు కలిగి యుండును. ఈ రాత్రి దానిని కలిగి యున్నందుకు ఆయనకు నేను కృతజ్ఞుడను. బహుశా ఆ పరిశుద్ధాత్మ మనకందరికి తెలియును. ఇప్పుడు ఏదో ఒక సమూహము కాదు, అయితే పరిశుద్ధాత్మ దేవుని కేంద్రముగా ఉన్నాడు. అదియే ఆ ఘడియకు దేవుని వర్తమానికునిగా ఉన్నాడు.
AMOS 3:7
42ఇప్పుడు, వాక్యము ఎల్లప్పుడు ప్రవక్తకే వచ్చిన ఏమున్నది, వారు వాక్యమునకు ఒక నిజ ప్రవక్తగా ఉన్నప్పుడు, దేవుడు తన వాక్యమును ఆ ప్రవక్త ద్వారా నిరూపించును.
ఇప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలున్నారు. కాలములన్నింటిలోను మనము వారిని కలిగియుంటిమి. మనము పాత నిబంధనకు వెళ్లినట్లయిన చూడండి. వారు లేచి ప్రభువు పేరట మాట్లాడిరి, అయితే అది సరికాదు. దేవుడు దానితో చేయునదేమియు లేదు. ఆయన తన వాక్యమునుకాక మరొక దానిని నిరూపించడు. ఏ కారణము చేత గాని ఆయన ఆ విధముగా తన కార్యములను చేయడు. చూశారా?
మీరు దీనిని మాత్రము జ్ఞాపకము చేసికొనండి. దేవుడు తన వాక్యమును మాత్రమే నిరూపించును! ఒక్క నిజ ప్రవక్త మాత్రమే మరియు అదొక్క మార్గమునందే అతడు నిజమైన ప్రవక్త లేక అబద్ధ ప్రవక్తయని, వాక్యముతో మాత్రమే చెప్పగలము. అతనిని తీర్పు తీర్చుటకు అదియే మార్గము.
1KGS 22:6•
2CH 18:5
43ఇప్పుడు మీరు గమనించినయెడల, మీకాయా దినములలో జరిగినట్లు, అక్కడ నాలుగు వందల మంది హెబ్రీ ప్రవక్తలు ఆహాబు రాజు ముందు నిలిచారు. యెహోషాపాతు రాజు కూడా అక్కడున్నాడు. అప్పుడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 'ముందుకు వెళ్లి జయమును పొందుము.'" మూలాధారముగా వారు సరిగానే యున్నారు. అంతట మికాయా పిలువబడినప్పుడు అతడు అందరిచేత ద్వేషించబడినవ్యక్తి. ఇప్పుడు అది చూచుటకు నాలుగు వందల హెబ్రీ ప్రవక్తలు ఒక్క మాటపై నిలచి యున్నారు. (నేను బయలు ప్రవక్తలను చెప్పుట లేదు) "రామోద్గిలాదు మీదికి వెళ్ళుము, దేవుడు నిన్ను ఆశీర్వదించి జయమును దయచేయునని పలుకుచుండిరి." ఆ మనుష్యులు కపటమైన వారు కారు. అయినను వారు ప్రేరేపించబడిరి! అయితే వారి…
1KGS 21:19-23•
1KGS 22:9,14•
2CH 18:8,13
44అట్లయిన ఎందుకు ఒక చిన్నవాడైన మికాయా అను పేరుగల వ్యక్తి అక్కడకు రావలసియున్నది. అతడు ఇమ్లా కుమారుడు. అతడు వచ్చి వారికి విరోధముగా ప్రవచించెను? అది స్థిమితమును తప్పించుచున్నది. అది నేరమును మోపుచున్నది. చూశారా? అయితే అతడు సత్యము చెప్పుచున్నాడని ఎలా తెలిసికొనగలడు? మీరక్కడ నిలచి యుండినయెడల ఏ విధముగా దానిని ఎరుగగలరు? దానికి ఒకే ఒక మార్గము, ఆ మనుష్యుడు చెప్పు దానిని తీసికొని, వాక్యముతో పోల్చుము. చూశారా? మికాయా ఖచ్చితముగా వాక్యముపై ఉన్నాడు, ఎందుకనగా ఏలీయా, ఆ గొప్ప ప్రవక్త, అతడు ప్రభువు వాక్యమును కలిగి యుండి, ఆహాబును, ఎజెబెలును మిగిలిన వారిని శపించెను. చూశారా? అట్లయిన దేవుడు ఏ విధముగా శాపమున్నదానిని మరల తిరిగి ఆశీర్వదించగలడు? చూడండి. అందువలన అది పని చేయదు.
DEUT 18:22
45ఇప్పుడు, దేవుడు తన వాక్యమును నిరూపించునని మనము కనుగొన్నాము. ఆ ప్రవక్త వాక్యమును, అతడొక ప్రవక్తయై యుండిన యెడల, దేవుడు దానిని నిరూపించును. అంతట అది అతడు వాక్యానుసారముగా మాట్లాడును. ఒక స్థలములో బైబిలు ఈలాగు చెప్పుచున్నది, "వారు ధర్మశాస్త్రము ప్రకారము పూర్వపు ప్రవక్తల మాటల ప్రకారము మాట్లాడనియెడల వారిలో వెలుగుండదు." అప్పుడు ఈ వర్తమానికుడు పిలువబడిన వారిని వెలుపలకు పిలచును. అతడు దేవుని వాక్యముతో ఖచ్చితముగా నిలచును. అతడు చెప్పునది సత్యమనిక నిరూపించును.
గమనించండి, గమనించండి, ఇప్పుడు మనము కొన్ని వ్యక్తులను తీసికొని వాటిని విందుము.
46నోవహు ప్రళయమునకు ముందు చివరి కాలమందు దేవుని సాక్షియైఉండెను. ఇప్పుడు, ఆ నాటి పూర్వపు ప్రపంచమునకు అతని వర్తమానము ఎంత వ్యతిరేకముగా ఉండినదో గమనించండి. ఎందుకు, ఆ మనుష్యుడు ఒక పిచ్చివాడుగా లెక్కించబడెను. ఎందుకు? అతని… అయితే, అయినను, అతడు ప్రభువు యొక్క ఖచ్చితమైన మాటను కలిగి యున్నాడు. దేవుడు మాట్లాడెను ఆయన పాపమును భరించలేడు, అందువలన ఆయన ప్రజలు పాపము చేయుటకు ప్రారంభించినప్పుడు, దేవుడు దిగి వచ్చి, నోవహు చివరి కాలవర్తమానమును ప్రసంగించాడు. అదెప్పుడు? అది చివరి కాలమునకు కొంత ముందుగా ఈ వర్తమానికుడు లేచినాడు. దేవుడు తనప్రవక్తను ఆ చివరి కాలము కొరకైన వర్తమానముతో పంపించాడు. అతడు పరిహాసము చేయబడెను. గేలి చేయబడెను, అతడు తన కుటుంబమును మాత్రమే కాపాడుకోగలిగెను. అది నిజము! ఎవ్వరూ అతనిని నమ్మలేదు. అయితే అతడు చివరి కాలపు వర్తమానమును కలిగియుండెను. ఇప్పుడు నమ్మని వారందరు నశించిపోయారు. నమ్మిన వారు రక్షించబడిరి. దేవుడు వారికి జీవమునివ్వగా వారు రక్షించబడిరి. నమ్మని వారు నశించిపోయిరి.
47ఇప్పుడు నేను కొంత మాదిరిని చూపుచున్నాను. గమనించండి. దేవుడు, దీనిని ఎట్లు మూడు పర్యాయములు చేశాడో గమనించండి.
మూడు అనునది దేవుని పరిపూర్ణ సంఖ్యగా ఉన్నది. దేవుడు మూడులో పరిపూర్ణడగుచున్నాడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నీతిపరచబడుట, పరిశుద్ధ పరుచబడుట, పరిశుద్ధాత్మ అభిషేకము ఈ విధముగా ఆయన పరిపూర్ణుడగుచున్నాడు. ఎందుకనగా మూడు అనునది ఆయన పరిపూర్ణతకును, ఐదు అనునది ఆయన కృపకును, ఏడు ఆరాధనకు సంఖ్య పండ్రెండుగాను నలువది వేదనలకు సాదశ్యముగాను, ఏబది జూబిలి విడుదల, ఆరాధన గాను ఉన్నవి. పెంతెకోస్తు అనగా ఏబది, నలుబది దినములు మోషే శోధించబడెను. నలువది దినములు క్రీస్తు కూడా శోధించబడెను. మీరు చూశారా, అవన్ని సాదృశ్యములుగా ఉన్నాయి. దేవుడు మూడులో పరిపూర్ణుడగుచున్నాడు.
GEN 7:7•
GEN 19:15•
MATT 24:37•
LUKE 17:26
48మూడు నాశనములున్నవి. వాటిలో ఒకటి నోవహు ఓడలోనికి వెళ్లినప్పుడు జరిగినది, రెండవది లోతు వెలుపలకు వచ్చినప్పుడు జరిగినది, సొదొమ నుండి. గమనించండి, యేసు వాటిని గురించి మాట్లాడెను. "నోవహు దినముల వలెను, లోతు దినములవలెను మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును." గమనించండి! ఒకరు లోపలకు వెళ్లారు, ఒకరేమో వెలుపలకు వచ్చారు. ఆ తరువాతది పైకి వెళ్ళనై యున్నది. లోపలకు వెళ్ళుట, వెలుపలకు వచ్చుట, పైకి వెళ్ళుట! ఇప్పుడు అది దేవుని క్రమమైయున్నది. చూడండి, యేసు ఆ ఇద్దరు ప్రవక్తలను గురించి మాట్లాడుచున్నారు. నోవహు దినములలో ఉండినట్లు, లోతు దినములలో ఉండినట్లు అబ్రాహాము ప్రవక్తగా ఉండెను. అది ఉన్నట్లే మనుష్యకుమారుని రాకడ యందును జరుగును. చూడండి, వెనుక వాటిని ఉదహరించుచున్నాడు.
GEN 26:3•
EXOD 2:24•
EXOD 3:2,7,10
49మోషే, మరొక ప్రవక్త అతడు ఈజిప్టు చివరి కాలములో ఉండిన ప్రవక్త. దేవుడు తన ప్రజలను విడిపించబోవుచున్నాడని, ఐగుప్తీయులు వారిని ఎంతో హింసించి వారిపై అధికారులను నియమించి వారిపై అధికారులుగా ఉండిరి. వారి నాశనమునకు ముందు ఆ విధముగా చేశారు. అయితే దేవుడు, ఎప్పటివలె, ఒక ప్రవక్తను ప్రభువు వాక్యముతో పంపాడు. జ్ఞాపకముంచుకొనండి, ఆ ప్రవక్త దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్ధానమును ఖచ్చితముగా నెరవేర్చుచున్నాడు. (వందల సంవత్సరముల క్రితము నాలుగు వందల సంవత్సరముల క్రితము వాగ్ధానము చేయబడినది) నీ సంతానము తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. అయితే ఆయన బలమైన తన హస్తముతో వారిని వెలుపలకు తెచ్చునని చెప్పెను. మండుచున్న పొదలో మోషే దేవుని కలసికొనినప్పుడు, ఆయన మోషేతో "నా ప్రజల మూలుగులను నేను విని యున్నాను. వారి బాధలను చూచి యున్నాను. నా నిబంధనను జ్ఞాపకము చేసికొనుచున్నాను," అని చెప్పెను. ఆయన తన వాక్యమును (మాటను) జ్ఞాపకము చేసికొనుచున్నాడు!
జ్ఞాపకముంచుకొనండి, ఆయన ఇప్పటికిని తన మాటను జ్ఞాపకము చేసికొనును! చూశారా? ఆయన తప్పిపోడు. ఆయన ప్రతిసారి అదే కార్యమును చేయును. నేను ఈ కార్యములను చెప్పుటకు కారణమేమనగా, మీరు వాటిని మీ తలంపులకు తెచ్చుకొని వాటిని తలపోయవచ్చును. వ్యాధిలో ఉన్న ఎవరైనను, గమనించండి. నేను వ్యాధితో ఉన్నను అని చెప్పుచున్నాను, వారు తలంచవచ్చును.
MAL 3:6•
HEB 13:8
50ఇప్పుడు, ఇప్పుడు గమనించండి, ప్రజలైన మీరందరు దీనిని జ్ఞాపకము చేసికొనవలెను. దేవుడు మారలేడు! ఆయన మారని దేవుడు. కాలములు మారును, ప్రజలు మారెదరు. దేవుడు నిత్యుడు. ఆయన మారలేడు! ఆయన యొక్క ఆయన నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా ఉండవలసియున్నది. ఆయన ఎల్లప్పుడు ఆ విధముగానే ఉండవలసియున్నది. ఇది దేవుని వాక్యమని మనము నమ్మిన యెడల ఆయన చెప్పు ప్రతి దానిపై మన నమ్మకమును మనముంచెదము. చూశారా?
ఇప్పుడు, ఆయన వర్తమానమేవిధముగా వచ్చుచున్నదో మీరు చూడండి. ఆయన ఏ విధముగా తన వర్తమానమును పంపుచున్నాడో గమనించండి. ఆయన దానిని మార్చడు. ఆయన ఎల్లప్పుడు ఒకే విధముగా ఉండవలసి యున్నది. ఆ విధముగానే ఆయన ఎప్పుడును చేయుచుండును. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, ఆయన ఎప్పుడు చేయును? నాశనమునకు ముందుగా ఆయన చేయును. ఆ కాలమునకు చివరిలో చేయును. అప్పుడే ఆయన తన వర్త మానమును పంపి తన ప్రజలను పిలచును. (వారు అప్పుడు అందరితో కలిసిపోయి ఉందురు), ఇక్కడ వారు వచ్చెదరు.
51ఇప్పుడు మోషే దినములతో, విశ్వాసులు రక్షించబడిరి, అవిశ్వాసులు నశించిపోయిరి.
ఎవరైతే దేవుని వద్ద నుండి వచ్చిన మోషే వర్తమానమును విశ్వసించారో, వారు మోషే దేవుని నిరూపణయనియు దేవుని వాక్యము అతనితో ఉన్నదని మోషే నిరూపించినంత వరకు విశ్వసించలేదు. అదే అతనిని ఒక ప్రవక్తగా చేసినది. అతడు అక్కడ నుండి వెలుపలకు వచ్చి," రేపు ఈ వేళకు మీరు ఈ, ఈ కార్యములు జరుగుట చూచెదరు. రేపటి దినమున అది జరుగుటను చూచెదరు." అది అంతే. ఏ నిజప్రవక్తయైనను ప్రభువు నామమున పలుకునప్పుడు దానిని చేయును. మరియు ఇది, ఇది జరుగుట నెరవేరును. నేను ఫరో యొద్దకు వెళ్ళుచున్నాను, అతని హృదయము కఠినమగును, కఠిన హృదయము కలిగియుండును. అతడు మనలను పొమ్మని చెప్పును గాని, పోనియ్యడు. అది జరుగును. చూశారా? ఎందుకు? అప్పుడే ప్రజలు ఈ మనుష్యుడు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని గ్రహించిరి. అంతట దేవుడు అతనిని ఆశీర్వదించుట చూచిరి. అప్పుడతనిని గౌరవించిరి. వారా విధముగా చేసినప్పుడు, గొప్ప కార్యములు జరిగినవి.
EXOD 3:8
52అంతట ఎవ్వరైతే నవ్వారో, పరిహాసము చేసి వర్తమానమును నమ్మలేదో వారు మిగిలిన అవిశ్వాసులతో నశించిరి.
అయితే విశ్వాసులు వెలుపలకు వెళ్లి, వాగ్థాన భూమిలో ప్రవేశించిరి. వారు అభిషేకము చేయబడిన వర్తమానికుని వర్తమానము క్రిందుగా వెళ్లిరి. అది విడుదల వర్తమానముగా ఉన్నది. దేవుడు తన ప్రజలను పాలుతేనెలు ప్రవహించు భూమికి తెచ్చెదనని వాగ్ధానము చేసియుండెను. అది జరిగినది, ఎందుకనగా దేవుడు ఆ విధముగా జరుగునని చెప్పెను. మోషే వచ్చి ఆ దినపు వర్తమానికునిగా నిరూపించబడెను.
ఇప్పుడది మనకు విశదముగా తెలుపబడినది.
DEUT 18:15
53మంచిది, మోషే ఖచ్చితముగా నిరూపించబడెనని మనము కనుగొన్నాము.
అంతట ఆ కాలపు మార్పులో ధర్మశాస్త్రమునకును కృపకును మధ్యకాలము వచ్చినది. ఈ పలుకబడిన మెస్సీయా వచ్చుటకు ఒక కాలము రావలసియున్నది. ప్రజలు ధర్మశాస్త్రమును త్రిప్పివేసిన కాలములో, దానంతటిని ఒక గొప్ప సమూహముగా చేసిన సమయములో, సకల విధములైన మనుష్య పారంపర్యములో నిండిన కాలములో, దానంతటిని ఆ ధర్మశాస్త్రములో ఇమిడ్చిన కాలములో, కాలపు మార్పులో యేసు వచ్చెను. ఈయన మరొక ప్రవక్త, దేవుడు-ప్రవక్త.
ఇప్పుడు అతడు "ఒక ప్రవక్త కాదని" మీరు చెప్పవచ్చు.
బైబిలు ఆయన ప్రవక్తయని చెప్పుచున్నది. "ప్రభువైన మీ దేవుడు, నా వంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి లేపును." ఆయన దేవ ప్రవక్తగా ఉన్నాడు. ధర్మశాస్త్రము, కృప కాలములో గత సంవత్సరములన్నిటిలో ఆయన చెప్పినట్లు జరిగినది. ఆయన మోషేకు తన ధర్మశాస్త్రమిచ్చిన తరువాత కాలము మారునప్పుడు, ఇది జరుగునని చెప్పినప్పుడు ఆయన కృపకు తిరిగి వచ్చెను. ఆ కాలమునకు ప్రవచించు ఒక ప్రవక్తను పంపెను. ఇప్పుడు విశ్వాసులు, వారిని ఆయన సమకూర్చెను. అవిశ్వాసులు అతని దినమున నశించిరి. ఆయనయందు విశ్వాసముంచిన వారందరు రక్షింపబడిరి; ఆయన వర్తమానము అంగీకరించని వారందరు నశించిరి.
54అది ఖచ్చితముగా నోవహు దినములలో జరిగినది. అదియే లోతు దినములలో జరిగినది. మిగిలిన దినములందును అదియే జరిగినది. మోషే దినములయందును, యేసుక్రీస్తు దినములయందు జరిగినది అదియే. ఎందుకనగా వారావర్తమానమును నిరాకరించి నశించిరి, ఎవరు విశ్వసించిరో వారు రక్షించబడిరి.
ఇప్పుడు, ఆ తరువాత సంఘయుగము ప్రవేశించినది. మనము నోవహు దినములలోని ప్రళయమునకు ముందు జీవించియున్నాము. అక్కడ నుండి ధర్మశాస్త్ర యుగమునకు వచ్చాము. అంతట కృపాకాలమునకు వచ్చాము. ఇప్పుడు సంఘయుగము ముగించుచున్నది. మన మందరము దానిని ఎరిగి యున్నాము.
దేవుడు ఈలాగు మరియు ఈలాగు ఆయాకాలములలో చేసియుండిన, రెండు కాలములలోను ఆయన చేసిన కార్యములను ఆయన మారనివాడై ఇప్పుడును చేయును, ఎందుకనగా ఆయన చేయునని ఆయనే చెప్పెను. దానిని నేను కొన్ని నిమిషములలో వాక్యము ద్వారా నిరూపించెదను. ఆయన చేయుదునని చెప్పెను. ఇప్పుడు, ఆయన తన కార్యక్రమమును మార్చుకొనలేడు. ఆయన దేవుడైయున్నాడు. గమనించండి, ఆయన కాలములలో చేసినదేమని చూడండి.
ZECH 14:7
55ఇప్పుడు మనము సంఘ కాలములకును దాని ముగింపుకును వచ్చియున్నాము. దానినే నేను ఈ రాత్రి చదివితిని.
…సాయంకాల సమయమున వెలుగు కలుగును.
మనము కావలసినంత వెలుగు లేని సమయమును కలిగియుంటిమి, అయితే వెలుగు రానైయున్నది. ముందు వచ్చిన ఆ కుమారుడే ఇప్పుడును, కాలముల మార్పులో మరలా వచ్చుచున్నాడు! అది భూమినుండి మహిమలోనికి వెళ్ళుటయైయున్నది. మనము దానిలో వెళ్ళిపోయెదము. ఒకప్పుడు మనము లోపలికి వెళ్లినాము. ఆ మరుకాలములో వెలుపలకు వెళ్లాము. ఈ పర్యాయము మనము పైకి వెళ్ళుచున్నాము. చూశారా? మంచిది: లోపలకు, వెలుపలకు, పైకి, మనము చివరి కాలమునకు వచ్చుచున్నాము. మనము రావడము మాత్రము కాదు, మనము వచ్చి చేరియున్నాము. మనము చివరి కాలములో ఉన్నాము!
దేవుడు ఈ చివరి కాలములో దేనిని కనుగొనెను? ముందుండిన రెండు కాలముల చివరలో దేనిని కనుగొనెనో ఆ విధముగానే ఈ చివరికాలమందును కనుగొనుచున్నాడు. అవిశ్వాసము! కేవలము ఆయన అవిశ్వాసమునే కనుగొనెను! ప్రజల కొరకు ఆయన ఉంచిన కార్యక్రమము ఆయన కనుగొనెను.
56నోవహు కాలమునకు ముందు, ఆయన కట్టడలను సజీవముగా ఎంచి, బలులను అర్పించిరి వారు దానినుండి తొలగిపోయారు. ఆయన వచ్చినప్పుడు, ఆయన కనుగొనినదేమనగా, ఆ కార్యము పొరపాటుగా వాడబడినది.
ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, అలాంటి స్థితినే ఆయన కనుగొనెను, ఆయన ఆ ప్రజలను మరియు పరిసయ్యులను, మిగిలిన వారు ధర్మశాస్త్రము వెనుక నిలచుటను కను గొనెను. వారేమి చేయుచుండిరి?దానియందు (ధర్మశాస్త్రము కలిగి యున్నామని చెప్పుకొనుచున్నారే గాని దానియందు) నమ్మకముగాలేరు. విధిగా ముందుకు వెళ్ళుచూ, ఒక పురాతన మార్గములో దానిని నడిపించారే గాని, దాని ప్రకారము జీవించలేకపోయారు. వారు "సంఘములో చేరుచున్నంత కాలము వారికి అది మాత్రము చాలును," అని అనుకొన్నారు. ఆ స్థితి మాత్రమే ఆయన కనుగొన్నాడు.
ఇప్పుడు మరలా అదే స్థితిని ఆయన కనుగొనుచున్నాడు! వారు సంఘములలో చేరు కార్యమును మాత్రమే ఆయన చూచుచున్నాడు. ప్రజలు మారలేదు. అందువలన ఆయన తన కార్యక్రమమును పంపుచున్నప్పుడు, ప్రజలు దానిని అవిశ్వాసముతో త్రోసివేయుచున్నారు. అందువలన వారు నశించిపోవుచున్నారు. నమ్మిన వారు జీవించుచున్నారు. (ఇప్పుడా రెంటి పైనను), ఈ సమయములో కూడ అదే స్థితి ఏర్పడినది. ఆ విధముగానే ఉండవలసి యున్నది.
ప్రతిసారి వర్తమానికునికి పాతదానిలో నుండి క్రొత్తదానికి తెచ్చుటలో ఒక పెద్ద పోరాటమున్నది. అది ఎల్లప్పుడు అలాంటి యుద్ధముగానే యున్నది, ఎందుకనగా వర్తమానికుడు పాతదానిలో నుండి క్రొత్తదానిని వేరుపరచుటకు వచ్చుచున్నాడు. అన్ని వేళల వర్తమానము లేఖనముల ప్రకారము ఉండవలసి యున్నది, ఎందుకనగా ప్రతి ఒక్క వర్తమానము రాబోవు దానిని గురించి ముందుగా చెప్పుచున్నది.
DAN 8:11•
DAN 11:31•
DAN 12:11
57ఇప్పుడు, ఒక సందర్భము కొరకు యేసును తీసికొందము. ఆయన ప్రవేశించి, ఆ వర్తమానమును ధర్మశాస్త్రము నుండి కృపకు మార్చుట ఎంత కఠినమైనది. అయినను బైబిలు చెప్పునదేమనగా అది ఆ విధముగానే వచ్చును. "ఒక మెస్సీయా వచ్చును, అనుదిన-బలి నిలిపివేయబడును." అది ప్రవక్తలచే ప్రవచింపబడినదని మనమెరిగియున్నాము. ఆయన దానిని చేయుటకు అదెంతో గొప్పకార్యమైయున్నది. అయితే ఆయన చేశాడని మనము కనుగొన్నా ము. మరియు ఆ ఒక్కడు లేఖనము చెప్పుచున్నందున ఆయన దానిని చేశాడు. ఆ దినపు విశ్వాసులు (విశ్వాసులు అని పిలువబడినవారు) ఖచ్చితముగా ఆయనను అంగీకరించలేదు.
ఆ పరిసయ్యులను, సద్దూకయ్యులను చూడుము, వారు వారివారి స్వంత పారంపర్యములను కలిగియుండి మరియు ఎవ్వరూ వారిని దానినుండి కదిలించలేని స్థితిలో ఉండిరి. దానినే వారు నమ్మారు, వారు తల్లులు నమ్మారు, వారి తండ్రులు నమ్మారు, వారి తాత ముత్తాతులు కూడ వాటిని నమ్మారు. మరియు మోషే ఆ విధముగా చెప్పాడు అని చెప్పుచున్నారు. అయితే ధర్మశాస్త్రమునిచ్చిన ఆ మోషేయే ఆయన వచ్చుననియు చెప్పెను. వారు దానిని గుర్తించుటకు తప్పిపోయారు, ఎందుకనగా వారు దేవుని నిజవాక్యమును వారి పారంపర్యము ప్రకారము కలిగియున్నారు. అందువలన దాని ప్రధాన మూలమును విడిచిపెట్టారు. అదలా ఉండవలసియున్నది.
58గమనించండి, ప్రతి ఒక్కరు మరొకరు వత్తురని ముందుగా చెప్పారు. ప్రతి ఒక్క వర్తమానికుడు, వర్తమానము తరువాత అది వచ్చునని ముందుగా చెప్పారు. అయితే ప్రజలు ఎల్లప్పుడు వారి దినపు వర్తమానమును తీసికొని దానితో నిలచిపోవుచున్నారు.
దానిని కొంత విడమర్చి కొంతముందుకు వెళ్ళి లూథరు కాలమును చూచెదము. లూథరు విశ్వాసము ద్వారా తీర్పును ప్రకటించుచుండగా, అతడు ఆ కాలమునకు వర్తమానికునిగా, ఆ సంఘ కాలమునకు సార్దీస్ సంఘమునకు దూతగాను యుండెను. అది మంచిది. ఇప్పుడు గమనించండి, ఆయన ప్రకటించినప్పుడు ఆయన లూథరనులను క్రమములో ఉంచెను. లూథరు వ్యాపించుచువచ్చెను. ఆ తరువాత వెస్లీ ప్రవేశించినప్పుడు శుద్ధీకరణ వర్తమానముతో ఫిలదెల్పియా సంఘ కాలము ప్రారంభమైనది, అయితే లూథర్‌నకు దానిచూచుట ఎంతోకష్టమైనది. ఆ లూథరనులు (ఆ వర్తమానమును) విశ్వసించలేదు.
JUDE 1:14
59ఆ తరువాత వెస్లీ (వర్తమానము) ఆ తరువాతి వారిని స్థిరపరచి, పరిశుద్ధ యాత్రికులని, స్వాతంత్రియ మెథడిస్టులని ఆ శుద్ధీకరణలో మిగిలిన తెగలు కూడ ఏర్పడినవి. దాని వెంట పెంతెకోస్తు వర్తమానము వచ్చినది. ఇంతెందుకు, ఒక మెతడిస్టునకు దాని నమ్ముట ఎంతోకష్టమై పోయినది. ఖచ్చితముగా అది అలాగే జరిగినది. చూశారా, అది ఒక…
లేఖనముల ప్రకారము మాట్లాడవలెనన్న ఒకరు ఇంకొకరిని గూర్చి మాటలాడుచున్నారు. హానోకు తన ఎత్తబడుట ద్వారా రాబోవు నాశనమును చెప్పెను, దేవుడు అతనిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు; అతడొక సాక్షిగా అక్కడున్నాడు. అబ్రహాము మోషేను గురించి చెప్పెను. మోషే మెస్సీయాను గురించి చెప్పెను. చూడండి, వారు ఒకరిని గురించి మరొకరు చెప్పుకుంటూనే వెళ్లారు. మెస్సీయా ఈ కాలమును గురించి (మనము జీవించు ఈ కాలము) చెప్పెను. ఈ కాలమేవిధముగా ఉండునో దానిని కూడ చెప్పాడు!
"ఓ, "సహోదరుడా బ్రన్హం!" అని మీరు చెప్పవచ్చు.
MATT 24:6,32,33•
MARK 13:8,23,28,29•
LUKE 17:26•
LUKE 21:10
60ఓ, అవును! ఆయన చెప్పాడు. మనలను చూడనివ్వండి… ఇక్కడ నేను అనేక లేఖనములను వ్రాసియుంచాను. మీ కొరకు వాటిలో ఒకటి లేక రెండింటిని ఉదహరించెదను. మనము మత్తయి 24వ అధ్యా. తీసికొందము. ఇప్పుడు మత్తయి సువార్తను తీసికొందము, 24వ అధ్యా., తీసికొని ఏమి జరుగునని ఆయన చెప్పెనో చదువుదము. ఏ విధముగా "రాజ్యములు ఒకదానిపై ఒకటి లేచునో" తెలిపెను. అయితే జ్ఞాపకము చేసికొనండి, అంతట ఆయన అక్కడ చెప్పెను. "నోవహు దినములవలెను, లోతు దినముల వలెను మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండునని," ఆయన చెప్పెను. ఆయన దానిని ముందుగా చెప్పియున్నాడు. ఆ కార్యములు జరుగునని ఆయన ప్రవచించియున్నాడు!
"ఇవ్వన్నియు జరుగునప్పుడు, ఇకపై కాలముండదని," ఆయన చెప్పెను. అయితే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. "అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు, వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరిసంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి," అని ఆయన చెప్పెను. ఇప్పుడు, మీరు దేనిని చూచినప్పుడు? అంజూరపు చెట్టు చిగురించునప్పుడు మిగిలిన చెట్లన్నియు చిగురించును, అది ఒక సూచనగా ఉన్నది. ఇశ్రాయేలు ఎప్పుడును ఆ అంజూరపు చెట్టుగా ఉన్నది.
JOEL 2:25
61యోవేలు దానిని ప్రవచించెను, "గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసినవి. అయితే దేవుడు 'దానిని మీకు మరలానిత్తును అని వాగ్ధానము' చేసెను." ఆయన దానిని చేయును. అయితే ఆయన దానిని (ఇశ్రాయేలు) ఆత్మీయ స్థితిలో మరలా ఉంచుటకు ముందు, అన్యుల సంఘము ఎత్తబడవలెను. ఆయన ఇరువురిని (ఇశ్రాయేలు పురప్రజల సంఘము) ఒక్క సమయములో ఉంచుకొనడు. ఇప్పుడు, మీరు లేఖనములను ఒకదానితో ఒకటి తిరుగబడునట్లు చేయలేరు. చూశారా? ఆయన రెండు సాక్షములను ఏకకాలమందును కలిగియుండలేదు. ప్రధాన సాక్షులను, ఆయన కలిగి యుండలేదు — అలా లేదు.. ఆయన రెండు సంఘములును ఒకే సమయములో కలిగియుండలేదు.
DAN 9:25,26•
MATT 24:34•
MARK 13:30•
LUKE 21:32•
REV 11:3
62గమనించండి, యూదుల కొరకు అన్యుల సంఘము ఎత్తబడవలసియున్నయెడల, అంతట దానియేలు డెబ్బది వారముల యొక్క చివరి భాగము జరుగవలసియున్నది. మూడు న్నర సంవత్సరములు మెస్సీయా ప్రవచించెను, అంతట ఆయన తీసివేయబడవలెను, అప్పుడు ఇంకనూ మూడున్నర సంవత్సరములు మిగిలియుండును. ప్రకటనలోని ఇద్దరు ప్రవక్తలను అక్కడ మనము కనుగొనగలము (ఆయన ఎన్నడూ తన నియమమును మార్చుకొనడు), ప్రకటన 11, వారు వచ్చి యూదులకు ప్రవచించెదరు. ఇప్పుడు సంఘము ఆ సమయములో ఎత్తబడియుండును.
ఇశ్రాయేలు అనేక వందల సంవత్సరముల తరువాత, రమారమీ రెండు వేల సంవత్సరముల తరువాత, ఒక రాజ్యముగా కూడుటను మనము చూడగలము; ఆ దేశము ఇప్పుడు తన స్వంత సైన్యమును కలిగి యున్నది, తన స్వంత ఆర్థిక చలామణిని కలిగియున్నది. ఇశ్రాయేలు తన స్వదేశమందున్నది! ఆమె స్వంత దేశము, స్వంత పతాకము, ఐక్యరాజ్యసమితిలో చేరియున్నది. ఇప్పుడది ఒక రాజ్యమైయున్నది! ఎందుకు, మనము తలంచువాటిలో అదొక గొప్ప సూచనయైయున్నది. ఇప్పుడు ఇశ్రాయేలు తన స్వదేమందున్నది. యేసు చెప్పినదేమనగా, "ఇశ్రాయేలు తన స్వంత దేశమునకు వెళ్ళుటను చూచు ఈ తరము, చెప్పబడినవన్నియు నెరవేరువరకు గతించదు." చూశారా, ఆయన ఈ దినమును గురించి మాట్లాడును.
2TIM 3:3-5
63మరొక ఉదాహరణను ఇచ్చెదను. II తిమోతి 3, ఆయన చివరి కాలపు సంఘమును గురించి మాట్లాడెను. "వారు అహంకారులునై యుండి, గర్వాంధులు గాను, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారైయున్నారు." లోకపు సంఘమును తీసికొనండి, "దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారైయున్నారు," బుధవారము ప్రార్థనలకు ముందు ఇంటిలోనే నిలచి (టెలివిషన్) దూరదర్శనులను చూచుకొనుచున్నారు.
"వారు బాప్టిస్టులని," మీరు చెప్పవచ్చు.
వారు పెంతెకోస్తువారుగా ఉన్నారు! నిజము! అవునండి. ఓ! "అహంకారులు, గర్వాంధులు, సుఖములను అధికముగా ప్రేమించువారు;" వారు వాక్యమును తమ ముందేపెట్టుకొని, దానివైపు చూడకున్నారు. "దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారైయున్నారు." స్త్రీలకు వారి తలవెంట్రుకలను పొట్టిగా (బాబ్ హేర్స్) కత్తిరించవద్దని ఎంతగా చెప్పినను, ఏదోవిధముగా వారు కత్తిరించుచునేయున్నారు. దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియలు, క్రూరులు, సజ్జన ద్వేషులు.
వారు "ఎతిస్టులు" (నాస్తికులు)," అని మీరు చెప్పవచ్చు.
"పైకి భక్తిగలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఈ చెడ్డ స్థితి నుండి, ఈనాటి ప్రపంచ విధానము నుండి మనలను విడుదల చేయుశక్తిని ఆశ్రయించని వారై; ఇట్టి వారికి విముఖడవై యుండుము." ఇతరులు ఏమి చెప్పుదురని చింతించవద్దు, నీవు దేవుని ఎదుట వ్యక్తిగతముగా నిలబడుచున్నావు. నీవు జవాబు చెప్పవలసియున్నది. ఈ స్త్రీ చేయునదేమి, లేక ఆ పురుషుడు చేయునదేమియనియు, లేక వీరు, వారు చేయునదేమనియు, ఈ బోధకుడు చెప్పునది లేక ఆ బోధకుడు చెప్పునది కాదు, అది నీకును దేవునికిని మధ్య ఉండునది. పైకి భక్తిగలవారివలె ఒక సాంప్రదాయము ముందుంచుకొని, దేవుని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. మీరాదినములో జీవించుచున్నారా? మనము నిజముగానే ఆ దినమందు జీవించుచున్నాము!
REV 1:1•
REV 3:16,17
64ఆ చివరి కాలపు సంఘ కాలములోనికి చూడుము. పరిశుద్ధాత్మయైన యేసు తానే ఇలా చెప్పుచున్నాడు, "నేను నా దూతను పంపియున్నాను. అతడు సంఘముల కోసరము ఈ సంగతులనుగూర్చి సాక్షమిచ్చును." ప్రకటన 3వ అధ్యాయము, ఈ సంఘకాలమును గురించి మాట్లాడుచున్నది, ఈ చివరి దినములలో ఏమి జరుగనున్నదో, దానిని గూర్చి యేసు సాక్షమిచ్చుచున్నాడు. ఆయన చెప్పినదేమనగా, "సంఘము ధనికురాలై లవొదికయలో, నులివెచ్చనిదై యుండును," సంగీతము వాయించునప్పుడు, ఎగిరి దుమికి గంతులు వేసి కేకలు వేయును. అది నిజము. అయితే మనలను శుద్ధిచేయు జీవిత సాక్షమునకు అది ఎంతో దూరముగా ఉన్నది.
REV 3:17
65నేను చేయుట లేదు… నేను మరొక దాని నిమిత్తము మిమ్మును బాధించుట లేదు, అయితే నేను కొంతకాలము క్రితము దేవుని పరదైసులో ఉన్న దర్శనము నాకు వచ్చినది. అయితే సత్యమును తప్ప మరొక దానిని మీకు చెప్పుట లేదు. దేవుని సేవకులైన మేము ఈ కార్యములలో నమ్మకముగా ఉండి సత్యమును చెప్పుటకు సహాయము చేయును గాక!
చూడండి, చల్లగా ఉన్నది వారావిధముగా ఉందురని బైబిలు చెప్పుచున్నది, అందువలన వారావిధముగానే ఉందురు. అది లూధరు కాలమునకు సరిపోయినయెడల, అది వెస్లీ కాలమునకు కూడ, అనగా ఫిలదెల్పియా కాలములో వెస్లీతోను సరిపోవును, అది దానిని మాట్లాడవలసి యున్నది, దానితో ఖచ్చితముగా నుండును… అది మాట్లాడినది, అందువలన లవొదికయలో అది ఖచ్చితముగా ఆ విధముగానే యుండును.
ధనవంతురాలై, కొదువలేనిదైయున్నది! మనము కోట్ల కొలది ధనమును (డాలర్లను) కట్టడములపై పెట్టుచున్నాము. మనము ప్రతి దానికొరకు ఖర్చు చేయుచున్నాము. ప్రతి ప్రపంచ సంతోషముల కొరకు ఖర్చు చేయుచు అందమైన సంఘములను మనము కట్టగలము. అది మంచిదే. ఏమి లేదు. అవన్నియు ఖచ్చితముగా మంచివే.
66అయితే నేనేమి చెప్పుటకు ప్రయత్నించుచున్నాననగా, వర్తమానము వారికి వెళ్లినప్పుడు మీరు వారికి అక్కర లేదు. "నీవు ఒక పిచ్చి వాడివై యుందువు! నీవొక మతిపోయినవాడవగుదువు! నీవు ఏబది సంవత్సరముల క్రితము జీవించువాడవగుదువు." చూచారా? ఓ, నీవు దానిని తలచి చూడవలసియున్నది. నేను అటువంటి పాస్టరును (కాపరిని) కలిగియుండను అని వారు చెప్పెదరు. అయినను అతను కాపరిగా ఉన్నాడు! యెజెబెలు దానిని అంగీకరించలేదు, ఏలీయాను ఎన్నడూ ఆమె తన కాపరిగా అంగీకరించలేదు; అయినను, ఆయన ఖచ్చితముగా ఆమెకు కాపరిగా ఉన్నాడు. ఆయన నిశ్చయముగా కాపరిగానే ఉన్నాడు. ఆయన ఒక ఉదాహరణకు పంపబడెను. ఇశ్రాయేలు రాజ్యమునకు ఒక వర్తమానికునిగా ఉన్నాడు. ఈనాడు ఆ ప్రియమైన పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యము సంఘమునకు వర్తమానికుడుగా ఉన్నాడు. వారిని చక్కబరచుటకై వారిని మరలా వాక్యము నొద్దకు తెచ్చుట కొరకై వేచియున్నాడు. మనము దానిని గురించి మాట్లాడితిమి, అయితే ఒక్కరు కూడకదలలేదు. మనము ఆ కార్యములన్నియు కలగొలుపుగా కలిపియున్నాము, అవన్నియు మిళితమై పోయినవి.
67ఎవరో ఒకరు సాక్షమును ఇలా చెప్పుట నేను విన్నాను, "ఆయనను పైకెత్తుడి," ఏ విధముగా ఆయనను పైకెత్తుదురు? ఓ, చిన్న ఇసములను (isms) తెచ్చుట ద్వారా నేనా, మరొకరు, ప్రార్థించి వేచియుండుము దానికర్థమేదనగా, "ప్రార్థించునప్పుడు ఒక కంటిని తెరచి యుంచుకొనుము, వేచియుండి ప్రార్థించుము, ఎందుకూ వేచియుండి అనగా ప్రభువు యొక్క రాకడ కొరకు వేచి యుండుము. అందుకొరకు ప్రార్థించుము." ఇది దాని భావము. చూడండి, వారు చెప్పునది ఆ కార్యమునే త్రిప్పివేయుచున్నది. (భావము మార్చి వేయుచున్నారు.)
అందువలన, మనము దానిలో చేయగలిగినదేమి? మన కొరకు ఒక చిన్న సాంప్రదాయమును చేసికొన వచ్చును. (అంతట అది..) అది దేవుని చేత కట్టబడినను లేకున్నను, మనము వెలుపలకు వెళ్ళుదము. మొదటిగా జరుగు కార్యమేదో మీకు తెలియునా, మనలను వెంబడించు చిన్న సమూహమును ఏర్పరచుకొని వారిని సంఘశరీరము నుండి దూరముగా లాగివేయుదుము. అది మంచిదే. లోపలకు వచ్చి, ప్రార్థించి సమస్యను తీర్చుకొనుట కంటెను, ఆ శరీరమును కదలిపోనిమ్ము, అవి కట్టబడినవైనను లేకున్నను మనము ఈ కార్యములను చేయుదము. మీరు సత్యమును కలిగియున్నయెడల, ఆ సత్యముతో నిలచియుండుము. అది ఖచ్చితముగా సరియైనది! అయితే అది బైబిలు సత్యముగా మొదటిగా ఉండవలసియున్నది! గమనించండి, దానితో… అ లవొదికయ సంఘకాలము.
HEB 1:1,2
68ఆ ప్రవక్తలు లేక పరిశుద్ధాత్మ, పౌలు ద్వారా మాట్లాడుచు, ఆ పరిశుద్ధాత్మయే మెస్సీయాగా ఉన్నాడు, అది పౌలు కాదు గాని క్రీస్తు మాట్లాడుచు, "పూర్వకాలమందు నానాసమయములలోను, నానావిధములుగాను, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను." యేసు క్రీస్తు ద్వారా, అని హెబ్రీ 1లో వ్రాయబడియున్నది, గమనించండి, పరిశుద్ధాత్మయైన క్రీస్తు, క్రీస్తు కేంద్రీకృతమైన సువార్త. క్రీస్తు కేంద్రీకృతమైన వాక్యము. అది క్రీస్తుతో కేంద్రీకృతమై ఉన్నది, మరియు నిరూపించబడినది. దేవుడు దానిని సత్యమని నిరూపించుచున్నాడు.
ఆ కారణము చేతనే పెంతెకోస్తులైన మీరు, విశ్వాస విధానములో పరిశుద్ధాత్మను పొందితిరి… మెతడిస్టు శుద్ధీకరణమును అనుసరించారు, ఎందుకనగా వీరు ఆనాడు ఖచ్చితముగా వాక్యముపై నిలచితిరి.
ఆ కారణము చేతనే లూథరనులు దానిని విశ్వసించనప్పుడు మెథడిస్టులైన మీరు శుద్ధీకరణను పొందితిరి. మీరు ఆ దినమందు వాక్యముపై నిలచితిరి.
ఆ విధముగా లూథరనులు రక్షింపబడిరి, నీతిమంతులుగా తీర్చబడిరి, ఏలయనగా మీ వర్తమానికుడు నీతిమత్వమును ప్రసంగించెను. కాథలిక్ సంఘమును ఎదిరించెను, ఎందుకనగా అది (కాథలిక్ సంఘము) అన్ని సంఘవిధానాల సగరూపమై యున్నది. వారు కేవలము సంఘమును మాత్రమే నమ్మిరి; మీరు బైబిలునకు తిరిగి వచ్చారు, మీరు బైబిలు సత్యమును గైకొని దానితో నిలచారు.
ఆ తరువాత వెస్లీ మరొక సత్యముతో వచ్చెను, మరియు ఆ సత్యముతో నిలచియుండెను; ఆ తరువాత పెంతెకోస్తులు వచ్చారు, వారు మరొక సత్యముతో వచ్చి దానితో నిలచారు; మీరు ఆ తరువాత దానితో నిలచియుండినయెడల, అది సరియైనదని చూచినయెడల, సత్యమని నిరూపించబడిన ఆ పూర్తి కార్యములను ఎందుకు గైకొనకూడదు? దానినంతటిని నమ్మవలసియున్నది!
HEB 9:22•
1JN 1:7
69ఇప్పుడు, మనమా వర్తమానికులను చూచినప్పుడు, వారిని ఎరిగితిమి. మనము క్రీస్తును చూచితిమి, ఆ గొప్ప దేవ-ప్రవక్త ఇవన్నియు చివరి దినములలో జరుగునని ముందుగా చెప్పెను. అది ఏమి చేయుచున్నది? కోతకాలమును పరిచయము చేయుచున్నది. పంట కోతకు సిద్ధముగా ఉన్నదని ఆ సమయము వచ్చినదని పరిచయము చేయుచున్నది. ఈ చివరి దినములలో ఏమి జరుగుచున్నది? మీరు చూచుచున్నారా?
ఇప్పుడు, ఈ కార్యములు చివరి దినములలో జరుగును. ఎటువంటి పంట కొరకు మనము ఎదురుచూచుచున్నామని మీరెరిగియున్నారు. ఒకప్పుడు వెలుగును కలిగి, దాని నుండి మరలిపోయిన ఒక సంఘము కొరకు ఎదురు చూచుచున్నాము. అది ఈ ప్రపంచపు మెరుగుదల వైపునకు వెళ్ళిపోయినది అనియు పై మెరుగులు పెట్టబడియున్నవి. (అది నిజమేనా?) దూరమైపోయినది, ఎటువంటి రకమైన సభ్యునినైనను అది గైకొనినది. దేనినైనను తీసికొని తనను పెంతెకోస్తు సంఘమని పిలచుకొనుచున్నది, ఏ రకముగానైనను అది బాప్తిస్మము పొందును.
నీళ్ళు మనిషిని రక్షించదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే దానికి కావలిసియున్నది. నీళ్ళలో జీవము లేదు. రక్తకణము నుండియే జీవము వచ్చుచున్నది; ఆ జీవమును అది శుద్ధి చేయుచున్నది, పాపపు ఇచ్చను చంపుచున్నది; అప్పుడు పరిశుభ్రము చేయబడిన పాత్రలలో ఆ పరిశుద్ధాత్మ వచ్చుచున్నది, ఆ తరువాత పని చేయుట కొరకు ప్రత్యేకముగా ప్రక్కన పెట్టబడుచున్నది. బలిపీఠము ఆ పాత్రను శుద్ధిచేయుచున్నది, అయితే దానిని క్రియలో ఉంచు దానితో నింపబడుచున్నది. అది సేవ కొరకు ప్రక్కనుంచబడుచున్నది, ఇప్పుడది సేవలో ఉంచవలసియున్నది. పరిశుద్ధాత్మ సంఘమును సేవలో ఉంచుచున్నది. నేనా చిన్న పాటను ఇష్టపడుదును:
ఆ మేడ గదిలో వారు కూడిరి,
ఆయన నామమందు వారు ప్రార్థించుచుండిరి,
వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిరి,
అంతట సేవకై శక్తి వచ్చినది; (నిజమే)
ఆ తరువాత ఇలా చెప్పబడుచున్నది:
ఆ దినమున వారి కొరకు ఆయన ఏమి చేసెను
నీ కొరకును దానినే చేయును (నిశ్చయము)
ISA 28:8
70ఆ పంట; ఆ ప్రవక్తలు; మనము కూడ క్రీస్తుపై నిలచియుంటిమి. ఇప్పుడు మనము కొంత వెనుకకు వెళ్లి చూచెదము.
యెషయా, ఆ ప్రవక్త, ఆయన ఏ విధముగా సాక్షమిచ్చాడు, ఆయన ఈ చివరి కాలమును గురించి ప్రవచించాడు, "ఆ శరీరమంతయు కుళ్ళిన గాయములతో నిండియున్నది, వారి బల్లలన్నియు వాంతితోను కల్మషముతోను నిండియున్నవి!" అని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకు, ఈనాడు స్త్రీ, పురుషులందరు, ఇద్దరు ముగ్గురితో జీవించుచు రాత్రి భోజనము తీసికొనుచున్నారు. అన్ని రకముల సిగరెట్లు త్రాగుట, అవన్నియు సంఘములోనికి వచ్చినవి. వీటన్నిటిని కలిగి యుండియు రాత్రి భోజనమును తీసికొనుచున్నారు!
ఇప్పుడు, దానికంటెను తక్కువ స్థితికి వెళ్లగలను గాని, నేను కొంచెముసేపు వేచియుండి, అప్పటికైనను సరియగునో చూచెదను. నేనేమి చేయుచున్నానో లేక చెప్పదలచుచున్నానని యోచించుచున్నాను. అయితే నేను… వరుసల (వాక్యముల) మధ్య మీరు చదువవచ్చు. బైబిలు ఏమి చెప్పుచున్నదో మీకు తెలియునా, సాధారణమైన మరియు అసాధారణమైన కార్యములేవని తెలుపుచున్నవి.
MATT 23:29,31
71ఇవన్నియు జరుగుటను మనము చూచున్నాము, మరియు రాజ్యములు… విజ్ఞాన శాస్త్రము దానిని వివరించి చెప్పుచున్నది నాలుగు లేదా ఐదు సంవత్సరముల క్రితము "అర్థరాత్రికి మూడు నిమిషములున్నవి," అను చిత్రములో ఇశ్రాయేలు తన స్వదేశమందున్నది. సంఘము లవొదికయలో ఉన్నది. ఓ, మై! మనము దేనికొరకు చూచుచున్నాము? ఏమిటి సంగతి?
సాయంకాల వెలుగు కొరకు మనము చూచుచున్నాము. ఓ, అది వచ్చునేమోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. అది వచ్చునప్పుడు మనము దానిని ఎరుగగలమా? గుర్తించగలమా? లేక అది మన తలలకు పైగా, వెనుకటి కాలములలో వెళ్లినట్లే దాటి వెళ్ళునా? అది ఎంతో దూరము వెళ్ళిపోయినంత వరకు దానిని వారు ఎరుగలేదు.
మీరు జ్ఞాపకముచేసికొనండి, ఆ మత ప్రజలు వారికొరకు పంపబడిన ప్రవక్తలను చంపారు. యేసు కూడా ఆలాగే చెప్పెను. ఆయన, "భక్తిహీనులైన మీరు!" మరియు "అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృ౦గారించుచుందురు, మీ తండ్రులు వారిని సమాధిలో ఉంచి వారికి గోరీలు కట్టిరి."
ACTS 2:23
72రోమన్ కాథలిక్ సంఘమును చూడండి, పరిశుద్ధ పాట్రిక్ సమాధిని కట్టించిరి, జోన్ ఆఫ్ ఆర్క్ సమాధిని కట్టించిరి. వారామెను చంపి, ఒక మంత్రకత్తెయని కాల్చివేశారు, ఎందుకనగా ఆమె ఆత్మీయముగా ఉండినది, ఎందుకనగా ఆమె దర్శనములను చూచుచుండెను. ఒక మంత్రగత్తెగా ఆమెను ఒక కొయ్యకు వ్రేలాడదీసి కాల్చి వేశారు. రెండు వందల సంవత్సరముల తరువాత ఆ బోధకుల శరీరములను త్రవ్వి తీసి కాలువలలో పడవేశారు. ఆమె క్రీస్తు పరిచారకురాలని ఎరుగుట ద్వారా దానికి పరిహారముగా వారిని ఆ విధముగా చేశారు. అయితే వారి దినములో ఆమె ఎవరో వారికి తెలియదు అలాగే సంఘము వెళ్ళిపోయినది.
అది ఆ ప్రజల తలలకు పైగా వెళ్లినది, వారు దానిని గుర్తించలేదు.
యేసు, ఆయన దేవుని కుమారుడని ఆయన మరణించి పాతిపెట్టబడి, పునరుత్థానుడైనంతవరకు వారు ఎరుగకుండిరి. పెంతెకోస్తు దినములో పేతురు వారిపై నేరమును మోపలేదా? "పాపపు చేతులతో మీరు జీవాధిపతిని ఆయనను చంపినారు."
1SAM 4:21
73ఓ, ముందు ఆయన వచ్చుచున్నందుకు గుర్తుగా ఎర్ర దీపము వెలుగుచున్నది! ఆమేన్! మనము చివరిలో ఉన్నాము. ఆమేన్. ఆ వెలుగుచున్న ఎర్ర దీపము ప్రతిచోటను వెలుగుచున్నది. ప్రతి స్థలమందు వెలుగుచున్నది." ఈకాబోదు," అని దానిపై వ్రాయబడియున్నది. (ప్రభావము పోయినది) కాలము ముగించి పోయినది. సమయము పోయినది!
విజ్ఞాన శాస్త్రము ముగింపుకు వచ్చి యున్నది. అది నిజము. ఇప్పుడు వారు ప్రపంచమునే చెదరిపోవునట్లు చేయు దానిని వారు కనిపెట్టియున్నారు. ప్రతి ఒక్కరు మరొకరిని గురించి భయపడుచున్నారు. వారు చివరి కాలమందున్నారు.
నాగరికత, అది ప్రజలను ఎక్కడికో తీసికొని వెళ్ళు ఒక స్థలమునకు వచ్చియున్నది. ఆ కూర్మ గోపురములు వెనుకకు ఊగిపోవుచున్నది. ప్రజలు నాగరికత గల ప్రజలుగా నడచుకొనుట లేదు. ఒక పురుషుడు తన మెడ మీద స్త్రీలవలె వెంట్రుకలతో ఉండుటను ఊహించిన ఎట్లుండును. (ఈ ప్రపంచపు జ్ఞానము ఇంతకు ముందు ఏ విధముగా ఉండునని అది చూపుచున్నది), చిన్న పదునాలుగు సంవత్సరముల బాలికను వీధులలో తీసికొని వెళ్ళుటయా?
74ఈ దినము, నా విడిది గదిలో ఉన్న శాలలో ఒక తల్లి వివస్త్రగా ఒక చిన్న తుపాకీని చేత పట్టుకొని అక్కడ పడియున్నది. ఆమె భర్త కూడ అక్కడ ఆ చలిగాలిలో అలాగే పడియున్నాడు. వారేమి తలంచుచున్నారనగా వారి దేహము ఎంతో అందముగా ఉన్నది, కావున దానిని ఇతరులకు చూపవలసియున్నదని తలంచుచున్నారు. అది దయ్యమని మీరు గ్రహించుట లేదా? అది నిజము. వారి బట్టలను చింపుకొని నడచుట, కేవలము పిచ్చి వారు మాత్రమే ఆ విధముగా చేయుదురు. లేగియాన్ (2000 వేల దయ్యములు పట్టిన మనిషి) అను దయ్యము దానిని చేయుచున్నది, ఎందువలెననగా పిచ్చి. గమనించండి! మనము దానిని కలిగియున్నాము, అయితే దానిని నాగరికత తెలుపు విధానమనుచున్నాము. అది "నవనాగరికత," అని పిలువబడుచున్నది. మనము దానిని "దయ్యమని" పిలచుచున్నాము. అది దయ్యమని నేను బైబిలులో నిరూపించగలను. అది దయ్యము పట్టియుండుట, అది పిశాచము పట్టియుండుటగా ఉన్నది. అది మిమ్ములను పట్టి యున్నది! అది నిజము. దానిని వారితో చెప్పినయెడల? వారు మనలను దులిపి వేయుదురు. వారు దానితో చేయునది ఏదియు లేదు! లేదండి. వారికి వారి స్వంత తలంపులున్నాయి, ఎందుకనగా వారు వెళ్ళు స్థలములలో వారు దానిని దూషించరు. కామ విధానము పాఠశాలల యందును, సంఘముల యందును వాడబడుచు, కాపరులు దాని నిందించుటకు భయపడుచున్నారు, వారు దానిని అడుగుటయే విడిచి పెట్టారు.
ISA 3:18•
1COR 11:5
75ఒక సేవకుడు గత దినములో ఇలా చెప్పుటను విన్నాను, వారు "ఈ నీలి సరకును వారి కండ్ల కొరకు కనిపెట్టినప్పుడు, ఎర్ర పెదవులు, వారు ఒక చక్కటి ప్రపంచమును తయారు చేశారు." ఒక బలిపీఠముపై ఒక సువార్త సేవకుడు వాటిని అటువంటి వాటిని ఎత్తి చూపవలయునన్న అతడు కల్వరికి వెళ్లవలసియున్నది. అది ఖచ్చితముగా నిజమైయున్నది, బైబిలు దానిని ఖండించుచున్నది!
మరియు ఒక పెంతెకోస్తు సమూహము ఒక వేయుచు వచ్చిన సోదరితో మాట్లాడుచూ, ఆమె తల వెంట్రుకలు కొప్పుగా తలవెనకాల ఉన్నాయి, "నీ అరిగిపోయిన టైరులో నుండి గాలి తీసివేయవలసియున్నది, ఎందుకనగా నీవు నీ వెంట్రుకలను కత్తిరించవలసియున్నది, ఆ విధముగా బైబిలు చెప్పుచున్నది అని… ఆమె యెషయా 5వ అధ్యాయములో చంద్రుని వలె గుండ్రని టైరులను కలిగి యుండవలసియున్నది," అని ఆమెను చెప్పుచున్నారు. బైబిలు ఆ విధముగా ఎలా చెప్పవలసియున్నది అని ఆమెను చెప్పుచున్నారు. బైబిలు ఆ విధముగా ఎలా చెప్పగలదు. ఒక స్త్రీ "అస్వభావ కార్యము" చేసినయెడల ఆమె తన తల వెంట్రుకను కత్తిరించినయెడల ఆమె జీవించుటకే అర్హురాలు కాదు. ఆమె తన తలను అవమానపరచుచున్నదని నిరూపించుచున్నది. అందువలన పొడుగైన వెంట్రుకలను గలిగి యుండవవలసియున్నది? ఏదో ఒక విధముగా బైబిలును మీరే విధముగా చెప్పగలరు? మంచిది, మన పెంతెకోస్తు స్త్రీ సంగతి ఏమిటి? మీరు అధికముగా టెలివిషన్‌లను చూచుచున్నారు! మీరు అధిక ప్రపంచమును చూచుచున్నారు. అందువలన అధికముగా దేవుని వాక్యము మిమ్ములను ప్రీతిపరచుట లేదు. ఇప్పుడు, బైబిలు దానిని చెప్పుచున్నది. దానినే బైబిలు చెప్పుచున్నది. నేను కాదు గాని బైబిలు చెప్పుచున్నది!
76ఓ శరీర వాంఛ! కొంత కాలము క్రితము ఒక స్త్రీ నాతో మాట్లాడుచు, నేను ఈ పొట్టి దుస్తులతో పోవుచు "పొట్టి చొక్కాయిలను" ధరించెదనని చెప్పినది.
"అది ఇంకా చెడ్డదని" నేను చెప్పాను. మీరు బైబిలు ఆలాగు చెప్పుచున్నది. ఆయన మారనివాడై యున్నాడు.
"అది బాప్టిస్టులు చేయుదురని" మీరు చెప్పవచ్చు, అయితే వారు పెంతెకోస్తు వారుగా ఉన్నారు. నేను మీతోనే మాట్లాడుచున్నాను. అది నిజము. అది సత్యము.
అయితే ఏమిటి? ఏమా సంగతి? ఎవరో ఆ అడ్డులను ఎక్కడో తీసివేశారు. ఒక పూర్వపు స్నేహితుడైన ఒక వర్తమానికుడు చెప్పేవాడు:
మేము అడ్డులను తొలగించాము, మేమా అడ్డులను తొలగించాము,
మేము పాపముతో ఒడంబడిక చేసికొన్నాము;
మేమా అడ్డులను తొలగించాము, గొర్రెలు వెళ్ళిపోయినవి,
అయితే మేకలు ఏ విధముగా లోపలకు ప్రవేశించినవి?
ఏమైనది? మీరా అడ్డులను తొలగించినప్పుడు, అవి దేవుని వాక్యపు అడ్డులుగా ఉన్నవి! జ్ఞాపకముంచుకొనండి, ఆయన ప్రారంభములో తన సంఘమునకు వాక్యము అను కోటలో కాచుట ఆయన కార్యక్రమమై యుండినది.
77ఎప్పుడైతే హవ్వ ఆలోచించినప్పుడు, "మంచిది, ఇప్పుడు అది యోచించదగినది కాదా," నేను బాగుగనే జీవించగలను" అని చెప్పినది. అది దానిని చేసినది.
దానిని ఎల్లప్పుడు చేయునదైయున్నది. అందువలననే బోధకురాలిగా ఉండుటకు అంగీకరించబడలేదు. చూడండి, అది ఆ అడ్డులను తీసివేసినది. అక్కడే (సంఘము) దాని వేరునందు పొదుగుబడినది, అది పెంతెకోస్తులో జరిగినది, అది ఆ గడ్డి నేరుగా ఉన్నది. దానికి ఎటువంటి లేఖనము లేదు. చూశారా? అప్పుడు మీరేమి చేయగలరు? అక్కడ ఏదెనులో మీరు కలిగియుండినట్లు అదే రకమైన మిశ్రమమును మీరు పొందెదరు. ఇప్పుడు గమనించండి, మనము వాక్యమునకు వచ్చినప్పుడు, మీరు దానిని గురించి చెప్పెదరు..
ఎవ్వరూ దానికి ఎదురు నిలువలేరు! ఎవ్వరైనను దానిని చెప్పగలిగితే నేను ఛాలెంజి చేయుదును. సర్ప సంతానముపై మాట్లాడుచుండినప్పుడు అనేకులు దానిని గురించి ఉగ్రులైపోయారు. అప్పుడు నేను ఎవ్వరైనను వచ్చి నా యెదుట అది అబద్ధమని నిరూపించవచ్చునని అడిగితిని. నేను ఎవ్వరిని కనుగొనలేదు.
78కొంతకాలము క్రితము చికాగోలో వారు నన్ను చిక్కించుకొనుటకు వేసిన పన్నాగమును వినవచ్చును. వారు అక్కడ ఆ గొప్ప చికాగో సేవకుల సమావేశమును ఏర్పాటు చేసి, సోదరులు ఏమిటి లూమీహిక్స్ మరియు సోదరులు చార్లుసన్ అక్కడుండిరి. అప్పుడు రెండు రాత్రులకు ముందుగా, ప్రభువు రాత్రి యందు నన్ను లేపి, "వెళ్లి ఆ కిటికి ప్రక్కగా నిలువుము," అని చెప్పినప్పుడు; నేను వెళ్లి నిలచాను, అప్పుడు గాలివాన వచ్చుచుండినది. అతడు చెప్పెను, "వారు నీ కొరకు ఒక పన్నాగమును ఏర్పాటు చేసియున్నారు, ఆ ఉదయ కాలపు అల్పాహార సమయమందు అది జరుగును. భయపడవద్దు, ముందుకు వెళ్ళుము; నేను నీకుతోడై యుందును," అని చెప్పెను. "ఇది ప్రభువు నామములో జరిగినది. మీరు వారిని అడిగి తెలిసికొనవచ్చును. ఇది టేపుపై ఉన్నది. ముందుగా చెప్పి ఉన్నాను." చెప్పెను, ఇప్పుడు పోవుటకు భయపడవద్దు, పోయి నిలువుము." చెప్పెను "నేను నీతో కూడ ఉందును."
79ఆ మరుసటి దినము నేను సోదరులు చార్లుసన్ గారిని కలిసికొని, ఆయన ఆ సభకు పెద్దగా ఉన్నారు, టామిహిక్స్ కూడ ఒక పెద్దగా ఉన్నారు. నేను వారిని "టౌవున్ అండ్ క౦ట్రీ" అను స్థలమందు అల్పాహారము కొరకు ఆ స్థలమునకు వెళ్లి నేను వారిని కలిసికొన వలసియున్నదని అతడు చెప్పాడు. నేను అక్కడ కూర్చొని ఇలా చెప్పాను, "సహో. హిక్స్, మీరు ఒక దైవత్వములో డాక్టరు పట్టమును పొందినవారు. మనమిక్కడ ఒక గొప్ప సేవకుల బందమును కలిసికొనబోవుచున్నాము, చికాగోలోని వారి సమావేశమును కలిసికొనబోవుచున్నాము, వారి కొరకు వెళ్లి మీరెందుకు మాట్లాడకూడదు? నేను మీకొరకు ఎన్నో కార్యములను చేశాను గదా," అని ఆయనను అడుగుచూ ఆయనను పరీక్షించాను.
అందుకతడు, "ఓ, నేను ఆ కార్యమును చేయలేను బ్రెన్హాం సోదరుడా," అని చెప్పాడు.
అప్పుడు నేను, "మీరెందుకు ముందుకు వెళ్లకూడదు? నేను మీ కొరకు ఏదైనా చేయగలను. మీరు నా కొరకు దానినెందుకు చేయకూడదు?" అని అడిగితిని.
అందుకతడు, "ఓ, సహో, బ్రెన్హాం నేను దానిని చేయలేను. వారు దానికి ఓర్చుకొనరు," అని చెప్పాడు.
"సహో. చార్లుసన్ కూడ, "లేదు, వారు ఒప్పుకొనరు," అని చెప్పాడు.
అందుకు నేను "ఎందుకో తెలియునా," నన్ను చెప్పనివ్వండి, ఎందుకనగా మీరిరువురును, తెలిసికొనవలెను, వారు నా కొరకు ఒక చిక్కు పెట్టుటకై యున్నారు, మీరు గ్రహించారా," అని చెప్పాను. ఇది టేపుపై ఉన్నది. మీకు టేపు కావలయునన్న, మా వద్ద దొరకును. మీకు వారందరు తెలిసినవారే. అందువలన నేను ఇలా చెప్పాను, "నిన్నటి రాత్రి నేనొక దర్శనమును చూచాను, దానిలో మనము టామి ఇక్కడ కూర్చొని యున్నాము, మీరు ఆ హోటలు గదిని బాడుగకు తీసికున్నారు."
"అవును. "
"బాడుగ చెల్లించబడినది."
"అవును," చార్లసన్ సోదరుడా.
"అయితే మీరు దానిలో జరుపబోవుట లేదు. అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు!"
"ఎందుకు?"
"మీరు మరొక స్థలమునకు వెళ్లబోవుచున్నారు. అది ఒక పచ్చరంగు గది; అయితే మనము వెళ్లబోవునది ఒక బ్రౌవున్ రంగు గది. నేనొక మూలన కూర్చొనబోవుచున్నాను; డాక్టరు. మీడ్ నా కుడి ప్రక్కగా కూర్చొనెదరు; ఆ వృద్ధ నల్ల సేవకుడు అతని భార్య, నా ఎడమ ప్రక్కగా కూర్చొందురు." అది ఆ విధముగా ఉండును. ఇప్పుడు మీరు గమనించండి. ఆ వెంట వచ్చు దానిని గమనించండి." దేవుడు రోగులను స్వస్థపరచుటను మీరు చూచినారు, ఆయనను ఒక్కసారి యుద్ధ మందు గమనించండి!" "ఆయన గొప్ప వాడు, ఆశ్చర్యకరుడు." "ఆ ప్రశ్నను గమనించండి మరియు అది ఎంత నిశ్చబ్ధముగా నుండునో చూడుడి."
మేమా ఉదయము అక్కడకు వెళ్లినప్పుడు…
80మీకు టేపు కావలసియుంటే… జిమ్, నీ వద్ద ఉన్నాయా, నీవు తెచ్చావా? ఇక్కడున్నాయా, ఇక్కడున్నాయి, మీకు టేపు కావలసియుంటే మీరు కూడికల దగ్గర తీసికొనవచ్చు.
అప్పుడు నేను, "నా మీద వ్యతిరేకత మీకేమున్నది? మీ సంగతి ఏమిటి?" అని అడిగాను.
అప్పుడు సహో. చర్లిసన్, మంచిది," సోదర బ్రెన్హాం రెండు రోజుల క్రితము మనముండబోవు దానిని ఆ కట్టడము (ఆ హాలు) వారికివ్వబడలేదు, దానిని వారు రద్దు చేశారు. వారు దానిని తీసికొనుటకు అనుమతించలేదు, ఎందుకనగా ఒక సంగీత బృ౦దము ముందుగానే ఆ హాలును నిర్ణయము చేసికొనిరి. వారు దానిపై ముందుగానే కొంత ధనమును తీసికొన్నారని మరిచిపోయారు. అందువలన వారిని ( Business Men) అనుమతించలేకపోయారు." సహో. విలియమ్స్ మాట్లాడిన వర్తమానమును బహుశా మీరు వినియుండవచ్చు. ఆయన, "సోదరా బ్రెన్హాం, ప్రతి ఒక్కరు ఎక్కడ కూర్చొందురని నాతో చెప్పాడు, ఏమి జరుగునో ఖచ్చితముగా" చెప్పాడు. "అయితే ఒక కార్యము, నేను అనేకులైన ఆ సేవకులు సోదర బ్రెన్హాం వర్తమానమును అంగీకరించక పోవచ్చు," అయితే చెప్పెను, "ఒక కార్యమును మాత్రము మేము ఒప్పుకొనవలసియున్నది, ఆయన దానిని చెప్పుటకు వెనుతీయలేదు," "భయము లేక మాట్లాడెను." ఇప్పుడు "సోదర బ్రెన్హాం ఇక్కడున్నారు," అని చెప్పారు.
అందుకు నేను, "ఇప్పుడు మనము ప్రారంభించుటకు ముందు, ఎవరైనను బైబిలు తీసికొని నా ప్రక్కన వచ్చి నిలువుమని కోరాను." మీరు విన్నదానంతటిలో, అతి నిశ్శబ్దమైన కూడికగా అది ఉండినది. అప్పుడు నేను, "అంతట మీరు దానిని అంగీకరించని ఎడల నా వెనుక నిలువుడి! నిజము, సోదరులారా, నా భుజములను మీతో కలుపుటకు నేనిక్కడ నిలిచాను. మనము బైబిలు కార్యములకు వచ్చి యున్నాము," అని చెప్పాను.
అందుకు వారు, "మీరెందుకు స్త్రీలను విడిచిపెట్టకూడదు? మీరొక దేవుని ప్రవక్తగా ప్రజలు భావించుచున్నారు," అని చెప్పెను.
నేనిలా చెప్పాను, "నేను దానిని చెప్పుట లేదు."
"అయితే ప్రజలు అలా నమ్ముచున్నారు, మీరెందుకు స్త్రీలను ప్రక్కనుంచకూడదు. వారు దుస్తులు వేయు విధమును గాని, వారు వెంట్రుకలు కత్తిరించు విధమును గాని, ఈ కార్యములలో వారు నడచుకొను విధానములను మీరెందుకు మాట్లాడుచున్నారు. వారితో చెప్పుట మానుకొనవచ్చును గదా? వారే విధముగా వరములను పొందవలెనని వారికెందుకు బోధించకూడదు. దేవుని మహిమార్థము ఏదో కొంత మీరెందుకు చేయకూడదు?" అని అతడడిగెను.
నేను చెప్పినదేమనగా "ఏ విధముగా ఈ ప్రపంచమునకు లెక్కలు నేర్పించగలను, వారికి తొలి అక్షరములే రావుగదా?" అది నిజము. మీరు మొదటిగా పునాది యొద్దకు రావలసియున్నది. అది ప్రారంభము.
దేవా, ఇప్పుడు మాపై కృపను కలిగియుండుము. అవునండి.
MAL 4:6
81ఇక్కడ మనము చివరి కాలమందున్నాము! ఎర్ర దీపము పైన వెలుగుచున్నది! ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది! అవునండి. వినండి! చివరి కాలవర్తమానము చివరికాల పరిస్థితులను కలిసికొనును. వారెక్కడ తప్పిపోయారో అక్కడకు ఆ వర్తమానము మనలను కొనితెచ్చుచున్నది. ఎల్లప్పుడు చివరి కాలవర్తమానము చివరి కాల పరిస్థితులను కలిసికొనును. వాక్యము ద్వారా మార్గమంతటను ఆ విధముగా జరుగును. ఈ కాలములో కూడ అది ఆ విధముగానే జరుగవలసియున్నది. వాక్యపు మొదటి స్థితికి తిరిగి వచ్చుటకు ఒక పిలుపు. ఓ, మై! మిగిలిన వర్తమానికులు వారి కాలములో చేసినట్లు ఈ వర్తమానము ఆ విధముగానే యుండును. అది మనకు వాగ్ధానము చేయబడినది! దేవుడు తన వాక్యమందు దానిని వాగ్ధానము చేశాడు! మలాకి 4, అది జరుగునని చెప్పుచున్నది. "పిల్లల హృదయములను తండ్రుల తట్టు త్రిప్పును." అది వాగ్ధానము చేయబడినది. మనము ఆ దినములో జీవించుచున్నాము!
ఓ, అది అన్ని సమయములోను, ప్రతి కాలమందును ఒక సమూహపు పెద్దలు ప్రజలను మిశ్రితము చేసి ఉంచుచున్నారు. అది ప్రజలు చేయు కార్యము కాదు; పెద్దలు ఆ విధముగా చేయుచు, వారిని మిశ్రితము చేయుచున్నారు. ఇప్పుడు మనము…
"ఓ, సోదర బ్రెన్హాం!" అని మీరు చెప్పవచ్చు.
MATT 4:10•
LUKE 4:8
82మంచిది, ఇప్పుడు ఒక్క నిమిషము, దానిని వాక్యానుసారముగా చేయుదము. అది వాక్యము కాకున్నయెడల, అది ఏ మంచి చేయదు. వారి జ్ఞాన మాటల ద్వారా, వారి యొక్క ప్రేరేపణ లేని నడుపుదలలో లోకసంబంధ జ్ఞానవాక్కులను వారు కలిగియున్నారు, వారు… ఎందుకు, వారిలో కొందరు అతిజ్ఞానులు దానిని ఏకపరచగలరు. సాతాను అతి జ్ఞాని కాడని మీరు తలంచుచున్నారా? అతడలా కాదా, మంచిది, వారు యేసును సమీపించి ఒక ఆలోచననిచ్చి, ఆయనతోనే వాక్యమును ఎత్తి చెప్పలేదా? వాడు దానిని అలాగే చేశాడు! వాడు దానిలో గొప్ప వ్యక్తి. అయితే యేసు వానితో వ్యాజ్యమాడలేదు. ఆయన చెప్పినదేమనగా "అది కూడ వ్రాయబడి యున్నది! సాతానా నా వెనుకకు పొమ్ము." అవును, ప్రేరేపణ లేని నడుపుదల.
NUM 16:3,18,28•
MATT 16:18
83కోరహును చూడండి, ఆ దినములలో దేవుడు మోషేను ఒక వర్తమానముతో పంపినపుడు, కోరహును, దాతాను ఏదో తలంచి మోషే యొద్దకు వచ్చి "ఇప్పుడు ఒక్క నిమిషము, నిన్ను నీవు ఎక్కువగా అధికపర్చుకొనుచున్నావు! నీవొక్కడివే సముద్ర తీరములోని విలువైన రాయివని తలంచుకొనుచున్నావు; నీవొక్కడివి, కొలనులోని బాతువని తలంచుకొనుచున్నావు. ఇతరులు కూడా పరిశుద్ధులని నీకు తెలియజేయుదును!" అని చెప్పిరి. వారు పరిశుద్ధులు కారని మోషే చెప్పలేదు. అయితే ఆయన (మోషేకు) ఒక పనికలిగి యుండెను (కార్య నిర్వహణను కలిగియుండెను), అతడు దానిని కొనిపోవలిసియున్నది. అయితే వారు ఒక సమూహమును ఏర్పరచుకొని మోషేకు వ్యతిరేకముగా వచ్చుచున్నారు.
దేవుడతనితో "వెళ్ళి ఆ తలుపు నొద్ద నిలువుము," అని చెప్పెను. ఆ మనుష్యులలో ఒక్కొక్కడు ఒక్క ధూపార్తి చేతపట్టుకొనియుండెను. ధూపార్తియనగా ఏమిటో మీకు తెలియును. దేవుడు భూమి తన నోరు తెరచి వారిని మ్రింగునట్లు చేసెను. బలిపీఠము పైనున్న అగ్నిని ఆ ధూపార్తిని యందుండును. ఆ అగ్నితో నిండిన ధూపార్తిని, ప్రాథమికమైనదని గ్రహించలేదు. వారు ఆ వర్తమానమును గుర్తెరుగుటకు తప్పిపోయిరి.
దేవుడు చెప్పినదేమనగా, "మోషే, నేను నిన్ను అక్కడ ఆ కార్యము చేయుటకు పంపుచున్నాను. వారిని ఇక్కడికి తీసికొని రమ్ము."
చూడండి, వారు దానిని గుర్తించుటకు తప్పిపోయారు. మోషే వారితో "మొహమాటము లేక" ఖచ్చితముగా నుండెను. ఆ పాఠశాల ప్రవక్తలతో ఏలీయా ఖచ్చితముగా ఉండెను. వాక్యముతో నిలచియుండెను.
పెంతెకోస్తు ప్రజలైన మీరు ఆ విధముగా ఉండవలసియున్నది. ఈ ప్రపంచము నుండి మిమ్మును వేరుపరచకొనవలసియున్నది. వాక్యముతో సరళముగా ఉండవలసియున్నది. మీరు వచ్చిన దానికే తిరిగి వెళ్లి పారిపోవద్దు. మీరు ప్రక్కకు తొలగుచున్నారు. కల్వరి నుండి మీ లంగరును త్రెంపి వేసికొనండి. దేవుని వాక్యమును పట్టి నిలవండి, ఎందుకనగా "ఈ బండపైన నేను నా సంఘమును కట్టుదును," దానితో నిలచియుండుడి.
JOHN 8:46•
JOHN 10:37,38
84ఇప్పుడు, దాతాను తలంచినదేమనగా… వారు మరొకరు కూడ ఉండవచ్చునని తలంచారు. చూడండి, అది మానవ జ్ఞానమై వారి తలంపులను దేవుని కార్యక్రమములో చూపుటకు ప్రయత్నించుచున్నారు. అది చూడండి. అది మంచిదే. మానవ తెలివి ద్వారా వారి తలంపులను దేవుని వాక్యములో దోపుటకు ప్రయత్నించుచున్నారు. అది క్రియ చేయదు. అది క్రియ చేయదు! అది ఎప్పుడు గాని క్రియ చేయబోదు. అది ఎన్నడూ క్రియ చేయలేదు మరియు అది ఎన్నడూ క్రియ చేయదు.
యేసు అక్కడ నిలచి యుండినప్పుడు ఆయన వైపు చూడండి. ఆయన ఇలా చెప్పుచున్నాడు, "నాలో పాపమున్నదని ఎవ్వరు నిరూపించగలరు? నేను చేయునది వాక్య మునకు వ్యతిరేకమని ఎవ్వరు చెప్పగలరు? నేను మెస్సీయనని చెప్పుచున్నారు. నేను నా తండ్రి క్రియలు చేయకుంటే నన్ను నమ్మవద్దు. అయితే నేనా క్రియలను చేసినయెడల, నన్ను నమ్మకున్నను, నేను చేయు క్రియలను నమ్ముడి, ఎందుకనగా అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి." అది నిశ్చయము. వారు దానిని నమ్మలేదు, వారికి వారి స్వంత మార్గములు కావలసి వచ్చినవి.
MATT 15:14•
LUKE 6:39
85దీనిని చేయుట ద్వారా వారు పొరపాటు చేయుచున్నామని తలంచుకొనుటలేదు. వారు భావించుట లేదు ఒక మనుష్యుడు దానిని చేయునని నేను నమ్మను. ఆ సంస్థాగతమైన పెద్ద సంఘాలలో అనేక మంది మంచి ప్రజలుండుట నేను కనుగొన్నాను. మంచి మనుష్యులను చూచాను. అది ఆ లాయరు రేడియో ద్వారా చెప్పినట్లే ఉన్నది. ఆయన ఇక్కడకు వస్తూ, ఆశ్చర్యమైన కార్యమేదనగా, "ఏ విధముగా యాజకులు బలిపీఠములపై నిలబడి ఈ కాలములు వచ్చుటను చూచుచు, ప్రపంచపు పాపముల నుండి దూరపర్చబడి నీతిని చేపట్టలేకున్నారు!" ఒక లాయరు నిలచి ఆ విధముగా మాట్లాడుచున్నప్పుడు! "ఏ విధముగా సంఘములో లోకసంబంధమైన కార్యములకు ధనమును వినియోగించుచు, సువార్తను ప్రపంచమునకు కొనిపోవు మిషనరీలను పోషించలేకపోవుచున్నవి."
ఆకలితో ఉన్న మిషనరీలు, వారి పాదాలకు చెప్పులు కూడ లేకుండ హల్లెలూయ. వారిని ఏ సంస్థయు ఆదుకొనుట లేదు, ఎందుకనగా వారు దేవుని వాక్యము కొరకు నిలచారు. వారిని ఆదుకొనుటకు ఏదియు లేదు. అక్కడ వారిని ఆదుకొనుటకు మీరు దేనినో కొనిపోవుచున్నారు, అప్పుడు వారేమి పొందుచున్నారు? ఒక పెద్ద సిద్ధాంతమూటను పొందుచున్నారు. ఒక నిజ సత్యమైన మిషనరీ, వారిని సూచనలు వెంటాడును, వారు ఎవరో చాకలి స్త్రీలపై ఆధారపడి వారికొరకు కొన్ని పెన్నీలను పొందెదరు. గమనించారా, అక్కడది ఆ విధముగానే ఉన్నది.
వారు దాని చేయ తలంచుట లేదు… మంచిది, అయితే వారి సంగతేమిటి? వారు గ్రుడ్డివారు. యేసు అలా చెప్పుచున్నాడు. జ్ఞాపకముంచుకొనుడి, జ్ఞాపకముంచుకొనుడి, యేసు అదే కార్యమును చెప్పెను. అది ఆ విధముగానే ఈనాడును కనబడుచున్నది…
86ఇప్పుడు వినండి, నేను నేరము మోపుట లేదని నమ్ముచున్నాను. మీరొక సత్యమును తెలుసుకొనునప్పుడు, నేను నేరము మోపుచున్నానని తలంచవద్దు. నేను ప్రయత్నించుచున్నాను… నేను ప్రేమించుచున్నాను… మీరలా కాకున్నప్పుడు… నేను నేను సంఘమును గురించి రోషముగలిగి మాట్లాడుచున్నాను. ఇది వారు బహుశా అసెంబ్టీస్ ఆఫ్ గాడ్ సంఘముగా ఉండవచ్చు, లేక మరొకటై యుండవచ్చు, అదేదో నాకు తెలియదు… అదేదైనను నాకు ఏ వ్యత్యాసము చూపించదు. అది ఒక దేవుని సంఘము. అది ఒక సంఘమైయున్నది, ఒక దేవుని సంఘమని నేను నమ్ముచున్నాను. మంచిది, ఇప్పుడు మనమందరము ఆ విధముగానే ఉండవలసియున్నది, సంస్థాగతమై దేవుని సంఘము కాదు, అయితే మన హృదయములలో మనము నిజక్రైస్తవులమైయండవలెను. దేవుని సంఘము గోడల మధ్య నివాసము చేయును. ఒక (సంస్థ)పేరులో కాదు.
MATT 15:14•
MATT 23:15
87ఇప్పుడు ఈనాడు దానిపై అధికముగా ఉన్నది. సభ్యత్వము ప్రజలకు లెక్కలో ఉన్నది. ఇప్పుడు బాప్టిస్టు కలిగియున్న ఉజ్జీవమును చూడండి. ఓ, వారు ఒక దానిని కలిగియున్నారు. వారు 44లో ఒక గేయమును పాడిరి. అది, "ఒక మిలియను అధికముగ ఈ 44లో బిల్లీగ్రాహామ్ వర్తమానము ముందుకు వెళ్లినది." ఎందుకు, నిజమే. అది ఒక గొప్ప కార్యమును చేసినది. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్‌లు అది ఒక గొప్ప కార్యముగా ఉండినది, అయితే మనము పొందినదేమిటి?
ఆ పరిసయ్యులతో యేసు ఇలా చెప్పెను, "గ్రుడ్డివారగు మీరు, గ్రుడ్డివారిని నడిపించుచున్నారు. ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు." దానినే మనమీనాడు కలిగియున్నాము.
88బిల్లీగ్రహాం, ఆయనతో కెంటకీలోని లూయిస్‌విల్ పట్టణములో అతనితో ఉదయకాల అల్పాహారమునందు కలిసికొనినప్పుడు అక్కడ ఒక సువార్త సేవకునిగా వచ్చి చెప్పిదేమనగా, "నేను వెళ్లి…" పౌలు ఇలా చెప్పెను… ఇక్కడొక ఉదాహరణ ఒకటున్నది, అని చెప్పుచు, " పౌలు ఒక పట్టణములోనికి వెళ్లి మరియు ఒకరిని విశ్వాసమునకు మార్చి మరుసటి సంవత్సరమునకు వచ్చినప్పుడు, ముప్పది మంది ఉండిరట." అయితే "నేను ఒక పట్టణమునకు వెళ్లి ముప్పది వేలమందిని మార్చగలిగాను, మరుసటి సంవత్సరమునకు వచ్చి చూచినప్పుడు ముప్పది మంది మాత్రమే ఉన్నారు." "ఏమిటా కారణము?" ఆ సువార్త సేవకుని విధానమును నేనెంతో మెచ్చుకున్నాను. అతడు (బిల్లీగ్రహామ్) తన వ్రేలును చూపి, అక్కడ సుమారు మూడు వందల సేవకులు కూర్చొనియున్నారు. అప్పుడతడు అది "మీరే సోమరులైన ప్రసంగీకులు." "మీరు మీ కార్యాలయములలో బల్లపై కాళ్లు చాపుకొని టెలిఫోనులో ఒకనిని పిలచి వానిని రమ్మని చెప్పి, నీ సంఘములో చేర్చుకొందువు. అయితే నీవు వెళ్లి అతనిని దర్శించవలసియున్నది."
89నేనక్కడ కూర్చొని, ఇలా తలంచాను, " (ఓ దేవా!) సువార్త సేవకుడవైన బిల్లీ నీవు ఒక గొప్ప మనిషివని నీకు తెలియును. నేను ఎందుకూ పనికిరానివాడిని. అయితే నన్ను ఒక దానిని అడుగనిమ్ము." నేను తిరిగి దీనిని చెప్పదలచాను; అయితే నేను నా సహోదరుని మెచ్చుకొన్నాను, అతడొక దేవుని సేవకుడని తలంచాను. అయితే నేను దీనిని చెప్పుటకు ఇష్టపడితిని, "అట్లయిన బిల్లీ, ఒక్కడైన తన విశ్వాసిని వెంటాడుటకు పౌలు ఎటువంటి సేవకునిగా ఉండును?" ఏమి జరిగినది? పౌలు, ఆ విశ్వాసి తీర్మానమును తెలుపుటకు తన చేతిని మాత్రము ఎత్తునట్లు చేయలేదు అతనిని పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు కొనిపోయెను, తన ఆత్మను రగిలించెను, అప్పుడతడు తన ఆత్మలో అగ్ని అభిషేకింపబడినందున తన సమాధానమును నిలుపుకోలేకపోయెను.
90ఈనాడును అదే కారణముగా నున్నది, అది కేవలము సభ్యత్వమే గాని మరొకటి కాదు. అవును సభ్యులు, పెద్ద సభ్యత్వము, గొప్ప ఆదివారపుబడి తరగతులు, బహుమతుల నిచ్చుట, ఆ విధముగా ఒక సంఘము నుండి మరొక సంఘమునకు తెచ్చుట, ఎవరు అధికముగా ఉన్నారో చూచుకొనుట. అది పరిసయ్యుల విధానమని మీకు తెలియునా! దానిని గొప్ప చేయుట, "మేము వారిని గత ఆదివారము ఓడించితిమి." ఒక దేవుని సంఘమును ఎలుకల పందెముగా చేయుటకు ఒక స్థలమున్నయెడల, దానిని మూసివేసి ఇంటికి వెళ్ళిపోవుటకు ఇది సమయమైయున్నది.
దేవుని సంఘమునునది, భూమిపై జీవించు దేవుని వస్తువుగా ఉండి, యేసుక్రీస్తును రూపించును. అది పలుకబడి ఉన్న సంఘముగా ఉండదు. మీరు దానిని ఆ విధముగా ఎదురుచూడలేరు. మనము ఎదురు చూచునది సరియైనది.
1KGS 19:12
91ఒక గొప్ప డంబముగా చేయుట అయితే మీకు తెలుసా, ఆ గొప్ప శబ్దము ఏలీయా ప్రవక్తను కదిలించలేదు. ఆయన ప్రక్కగా అగ్నియు, పొగయు వెళ్లినది, ఉరుములు, మెరుపులు ఏర్పడినవి, రక్తము నూనె, ప్రతిది ఏర్పడినది, అయితే అదేది ఆయనను కదిలించలేదు. మీకు తెలుసా, అమెరికా దేశము ఎప్పుడును ఒక పెద్ద కార్యము ఒక గొప్ప, లేక అధిక శబ్దము దానిలో ఉండుటను చూచుచున్నది. అయితే దేవుడు మెల్లని స్వరముగా ఉన్నాడు అదియే ఆ ప్రవక్తను ఆకర్షించినది.
92ఒకప్పుడు ఒక బండి పొలములోనికి వెళ్లినది, అది ఎగురుచు అధిక శబ్దము చేయుచుండినది. అది తిరిగి వచ్చునప్పుడు, అవే ఎగుడు దిగుడులలో వచ్చినది, కాని ఎటువంటి శబ్దము చేయలేదు, అది మంచి వస్తువులలో నింపబడినది.
అయితే మనము మన అనుభవమును ఒక శబ్దముల మోత మీద ఉంచుచున్నాము. దానిని ఎట్లు చేయగలము. ఆ కార్యములను ఆ విధముగా ఎట్లు చేయగలము? ఓ, మై! ఆ తరువాత హాలీవుడ్ మెరుగులను దానిలో ఉంచుట, బలిపీఠముపై స్త్రీలను ఉంచుట, దుస్తులను బిగుతుగా వేయుట ద్వారా కామ వికారముగా కనబడునట్లుండుట, ఆత్మలో నాట్యమాడుట. ఇది ఎటువంటి ఆత్మగా ఉండునో నాకు తెలియుట లేదు.
నేను ఇక్కడ విమర్శించుటకు లేదు. నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. నేను ప్రేమించనియెడల దేవుడు నన్ను తీర్పు తీర్చును. నేను అదికాక మరొక ఉపదేశము నాకుండిన ఆయన తీర్పు తీర్చును. చూశారా?
అయితే నీవు దానిని పొందుము, చూడుము. అక్కడికే పెంతెకోస్తు వారు జారిపొయిరి. "ఆ చివర కలిగియుండుట కంటే మేమెక్కువగా సోదరులను కలిగియున్నాము." ఓ! "మేము అధికమైన అసెంబ్లీలను కలిగియున్నాము, ఎందుకనగా మేము ఏకత్వపు వారిమి లేక మేము త్రిత్వమునకు చెందినవారిమి, లేక మేము త్రిత్వమునకు చెందిన వారిమి, మేము ఓ, ఇది…" మరొకటి, అన్నియు వేర్వేరు రకములకు చెందిన వాటిని వారుకలిగియున్నారు, మీరు చూశారా. ఓ, సోదరా, అది దేవునికి ఏ అర్థమునివ్వదు. ఆయన వ్యక్తిగతముగా మనతో వ్యవహరించును. నిజము.
1KGS 19:12,13
93గమనించండి, పెద్ద శబ్దములు, అయితే అవి ఆ ప్రవక్తను ఆకర్షించలేదు. ఆ ప్రవక్త ఆ పెద్ద శబ్దములను గురించి చింతించుట లేదు. అయితే ఆయన ఆ మెల్లని స్వరమును విన్నప్పుడు, అది వాక్యమని అతడు గ్రహించాడు, అతడు తన ముఖమును మూసికొని వెలుపలకు నడచి వచ్చాడు.
సూర్యుడు పదిహేను నిమిషాలలో అధికమైన నీరును పీల్చివేయునని మీకు తెలియును, కాని ఏ శబ్దమును అక్కడుండదు, అన్నిటికన్నను అధికముగా… అయితే మనము ఒక్క గాలను (5 లీటర్లు) నీటిని లాగుటకు అధిక శబ్దమును చేయుదుము. అయితే ఆ సమయమునకు సూర్యడు పది లక్షల పీపాల నీటిని లాగివేయును. అది నిజము. మన మెప్పుడు పెద్దదిగా ఉన్నదానినే చూచెదము. ఎక్కువ శబ్దమును మెచ్చుకొని "భళా" అనెదము. అయితే వాక్యమును గైకొను కార్యమునకు వచ్చినప్పుడు, అప్పుడే అది ఇక్కడ పైకి వచ్చును. చూశారా? వచ్చి, వారు చెప్పెదరు, "మంచిది, దేవుడు దీవించు గాక, నేను చెప్పుచున్నాను….
94ఇక్కడ నేనొక మనిషిని కొంతకాలము క్రితము కలిసికొన్నాను… ఇది దేవదూషణ చేయుటకు నేను చెప్పుట లేదు గాని, ఆ విధముగా నేను తలచినయెడల నన్ను మన్నించండి. నేను ఒక గుడారపు కూడికలో ఉండగా, ఆ సేవకుడు ఒక పెంతెకోస్తు సేవకుడు పియానోను వాయించుటకు తన భార్యను తెచ్చాడు. అతడు నన్ను ఆమెకు పరిచయము చేయునప్పుడు, నేను మూర్చిల్లబోయాను. ఆ స్త్రీ పొట్టి వెంట్రుకలతో ఉంగరాల జుట్టును కలిగి, గొప్ప చెవిపోగులను (రింగులను) వేసికొని, పెదిమలకు రంగుపూసికొని, వ్రేలి గోళ్లకు రంగులు వేసికొని యున్నది. ఆమె ఒక విధముగా… అది చూచుటకు ఎంతో భయంకరముగా ఉండినది; పెద్ద, గొప్ప పొడవైన గోళ్లతో ఉన్నది. కామవికారముగా కనబడుచు, చిన్న పొట్టి బట్ట ధరించి, ఆమె కూర్చున్నప్పుడు ఆమె మోకాళ్లను కూడ మూయలేక పోయినది. మంచిది, అక్కడ కొంతసేపు నిలచి "సోదరా, నేను నీతో చెప్పు దానికొరకు నీ తలంపులను గాయపరచినట్లుండునా?" అని అడిగితిని.
అందుకతడు, "ఎందుకు, చెప్పకూడదు?" అతడొక మంచి చక్కని వ్యక్తి. ఆమె కూడ మంచి స్త్రీయే.
అప్పుడు నేను "నీ భార్య ఒక పరిశుద్దరాలని నీవు చెప్పెదవా?"
అతడు, "అవును" అని చెప్పాడు.
"నా భావనను క్షమించండి, కాని ఆమె చూచుటకు ఒక దెయ్యములా నాకు కనబడుచున్నది, అది నిజము, లేదా మరోలా కనబడుచున్నది," అని చెప్పాను.
అందుకతడు, "సోదర బ్రెన్హాం నీవేవిధముగా భావించుచున్నావు?" ఓ, "నీవు ఒక పురాతన పాఠశాలకు సంబంధించినవాడివి," అని చెప్పాడు.
అందుకు నేను, "నేను లేఖనముల పాఠశాలకు చెందినవాడిని, అది నిజము, లేఖనముల పాఠశాల," అని చెప్పాను. ఒక పరిశుద్దులు ఆ విధముగా నడచుకొనునని నేను నమ్ముట లేదు. బైబిలు దానిని అంతగా ఖండించునప్పుడు నేను దానిని నమ్మలేకున్నాను. చూశారా?
JOHN 14:12
95మంచిది, ప్రతిసారి కనబడుచునే ఉన్నది, మనము విను ప్రతిది, వారు "నలువది తీర్మానములను" చేశారు, "నలుబది-నాలుగు "తీర్మానములను చేశారు "మనము మూడు వందల తీర్మానములను" చేసియున్నాము. మంచిది, అది ఒప్పుకోలుగా ఉన్నది. ఒప్పుకొనుట "రాయిగా" ఉన్నది. అది నిజము, ఎందుకనగా పేతురు, తన ఒప్పుకోలుపై "రాయి, చిన్న బండ" అని పిలువబడెను. పేతురు, అతని ఒప్పుకోలు. ఇప్పుడు రాళ్లు మంచివే, అయితే అది ఒక నిజరాయి కానప్పుడు అది ఒక కట్టడమునకు ఏ విలువనిచ్చును, అక్కడ ఆ తాపీ పనివాడు, పదునైన వాక్యమను వస్తువును చేత పట్టుకొని, దానిని నరికి దేవుని కుమారులుగా చేయలేనప్పుడు ప్రయోజనమేమి? చూశారా? ఒక ఒప్పుకోలు వలన ప్రయోజనమేమి?
ఆ కారణము చేతనే ఆయన (బిల్లీగ్రహామ్) తిరిగి వచ్చినప్పుడు ముప్పది వేలమందికి ముప్పది మాత్రమే మిగిలారు. ధూళిలో నుండి మీరు రాళ్లను దొర్లించారు. అక్కడకు దొర్లించారు గాని, అవి ఆలయానికి పొందికయైనవి కావు. అవి చెక్కబడవలెను, వాక్యపు కొలతలతో అక్కడ ఉంచబడవలెను, ఒకదానితో ఒకటి కలిసియుండవలెను మరియు అపొస్తలుల సిద్దాతంముపైన కట్టబడి ఉండవలెను. యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. ఆయన ఇలా చెప్పెను, "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడును చేయును." అది నిజము.
MAL 4:5•
JOHN 13:35
96మనము ఒకరికొకరము విభేదము కలిగియున్నప్పుడు ఒక సంఘముగా ఎలా ఉండగలము. ఆయన చెప్పినది, "మీరు ఒకరిపై ఒకరు ప్రేమ గలిగియుండినప్పుడు నా శిష్యులని అందరు ఎరుగుదురు." మనము విడిపోయి, మరియు సంస్థాగత విభేదాలను ఏర్పరచి సంఘాలు మారినప్పుడు… నేను ప్రజలపై దానిని ఉంచను, నేను సంస్థలపై దానిని ఉంచుచున్నాను. అది నిజము. ప్రజలు కానే కాదు. చూశారా? ఓ, అది ఎంతో చెడ్డది. అయినను…
అయినను దేవుని వాక్యమను ఆ పదునైన ఆయుధమును నీవు కలిగి యుండవలసియున్నది. అప్పుడే నీవు వారిని ఆ కట్టడపు కుమారులుగా రూపించగలవు. ఓ మై! నా ప్రార్థన ఏదనగా, "దేవా మలాకీ 4ను వేగపరచుము. ఈ చివరి దినములలో ఆ వర్తమానమును మాకిమ్ము. మా కొరకు ఒకరిని పంపుము. ఈ పెంతెకోస్తు సంఘమును కాపాడుటకు ఎవరినైనను పంపుము."
97ఈ కడవరి దినములకు ఎటువంటి వర్తమానికుని మనకొరకు దేవుడు పంపనైయున్నాడు? నా సోదరీ, సోదరుడా, మీ సోదరునిగా, మీ తోటి సేవకునిగా, మీతో ఆ కాలమును ఎదురుచూచువానిగా, నేను మీతో చెప్పునదేమనగా, ఇంకొక కాలములో వచ్చిన అలాంటి సేవకునిగానే అతడుండును. అలాంటి రకమే! అతడు సంఘమును వాక్యమునకు తెచ్చును. దేవా, అది ఇక్కడకు వచ్చునంతలో ఒక పునాదిని మేము వేయుదుము గాక. అతడు వచ్చుటకు ముందు, మేము పునాదిని వేసి, రాళ్లుగా ఉండెదము. చెక్కబడిన రాళ్లుగా భుజమునకు భుజము కలిపి అతనితో నిలచునట్లు సిద్ధముగా ఉండెదము. దేవుడతనిని పంపునంతలో ఈ కార్యములు సిద్ధముగా ఉండును గాక, ఎందుకనగా ఆయన దానిని చేయునని వాగ్ధానము చేసెను.
MAL 3:1•
MAL 4:1,3•
MATT 11:10,14
98ఇప్పుడు నేను మరలా తిరిగి వెనుకకు వచ్చుచున్నానని నాకు తెలియును. జ్ఞాపకముంచుకొనండి, ఒక చిన్న వరముతో ఆత్మ యొక్క హృదయ రహస్యములను ఎరుగగలను, చూడండి. ఇప్పుడు మీరు దానిని, అనగా, నేను చెప్పిన మలాకీ 4ను తప్పుగా గ్రహించుచున్నారు. అయితే మీరు చెప్పిన దానిని చెప్పనివ్వండి, "యేసు చెప్పినది, మీరు దానిని పొందినట్లయిన, చెప్పబడిన ఏలీయా ఇతడే'"
అయితే ఆయన మత్తయిలో చెప్పిన దానిని చూచినయెడల 11వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ సంగతిని అ౦గీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. మరియు "నాకు ముందు మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుదును." అది మలాకీ 3; మలాకీ 4 కాదు.
ఎందుకనగా మలాకీ 4లో ఈ దినము వచ్చుటకు ముందు భూమి కాల్చబడును మరియు ప్రజలు దానిపై నడిచెదరు; కాల్చబడిన పొట్టువాలే ఉండును." అది నిజము. ఆయన తనయెదుట నున్న వర్తమానికుని గురించి మాట్లాడుచున్నాడు, ఆయన ఒక ఏలీయాగా ఉన్నాడు.
1TIM 1:17
99ఈనాడు మన చుట్టూ ఉండు కార్యముల యందు నాకు నమ్మకము లేదు. ఏలీయా దుప్పటియనియు, ఏదేదో చెప్పుచున్నారు. అలాంటి మోసగాళ్ళు రావలసియున్నది. బహుశా, నిజమైనది వచ్చినప్పుడు దానిని తారుమారు చేయుటకు ఇలాంటివి రావలసియున్నది. అయితే, నన్ను దానిని చెప్పనివ్వండి, ఈ పెంతెకోస్తు కాలము చివరిలో ఒక వర్తమానికుడు రావలసియున్నది. అతడు వచ్చి దీనంతటిని సరిచేయును. అతడొక మనిషిగా ఉండును. ఒక సమూహము కాదు, లేక ఒక సంస్థ కాదు; అయితే ఒక మనిషి. అది అన్ని సమయములలోను అలాగే ఉండును, మరియు దేవుడు తన కార్యక్రమమును మార్చడు, ఆయన నిత్యమైన దేవుడు.
MAL 3:1•
MAL 4:1,3,6•
MATT 11:10
100జ్ఞాపకముంచుకొనండి, ఆ వర్తమానికుడు — మలాకీ 4, వర్తమానికుడైన యోహాను, లేఖనములు తప్పిపోవును, ఎందుకనగా అది ఆ విధముగా ఉండునవి అవి చెప్పుచున్నవి. "ఈ భూమి కోసిన పొలమువలె కాలిపోవును. భక్తిహీనుల బూడిదపై నీతిమంతులు నడిచెదరు." అది ఆ విధముగా చదువబడుచున్నది, చూడండి, అది ఖచ్చితముకాకున్న యెడల ఏమగును. చూశారా? అయితే యేసు దానిని ఎప్పుడు గాని చెప్పలేదు. ఆయన మలాకీ 3 మాత్రమే గుర్తుచేసెను," నాకు ముందు మార్గమును సిద్ధపరచుటకై, నా దూతను పంపుదును." అది ఖచ్చితముగా నిజమైయున్నది.
ఇప్పుడు, అయితే జ్ఞాపకము చేసికొనండి, ఈ మరొకడు పిల్లల హృదయమును తండ్రుల తట్టుకు త్రిప్పును. పిల్లల విశ్వాసమును తండ్రుల విశ్వాసము వైపునకు త్రిప్పును, ఆ మూల బైబిలు.
మోషే ఆ విధముగా చేసెను. యేసు అదే విధముగా చేసెను. ప్రతి యొక్క వర్తమానికుడు బైబిలులో చూచినప్పుడు అదే విధముగా చేసిరి, ముగించు కాలములో, వారు తిరిగి వర్తమానమును పునరుద్ధరించారు. ప్రజలు వారి యొక్క సంస్థావిధానముల వలన ఈ ప్రవక్తలు చెప్పిన దానినే సందేహించు విధముగా ఆ రోజులలో ఉన్నారు.
JOHN 6:37,44,65•
ACTS 13:48
101వారు ఈనాడు అదే కార్యమును చేశారు! అందువలన మనము ఒక వర్తమానికుని కొరకు చూచుచున్నాము. దేవా అతనిని పంపుము! అతనిని అంగీకరించెదమని మీరు తలంచెదరా? లేదండి! అతడొక బుద్ధిహీనునిగా పిచ్చివానిగా ఉండును, ఖచ్చితముగా, వారు అతనిని ఆ విధముగానే చేయుదురుగాని దేవుడతనిని నిరూపించును. ఒక నిజవిశ్వాసి, నిత్యజీవమునకు ముందెరుగబడిన వారు, యేసు ఇలా చెప్పెను," నా తండ్రి నాకిచ్చిన వారందరు నా యొద్దకు వచ్చెదరు, ఒకనిని నా తండ్రి ఆకర్షించనిదే అతడు నా యొద్దకు రాడు." (గతించిన కాలము) "ఇచ్చును, వారు వచ్చెదరు." అది నిజము, వారు ఉన్నారు
ఈ బాప్టిస్టువారి సిద్దాంతమైన, నిత్యత్వము యొక్క భద్రతను నేను విశ్వసించను. ఒక విధముగా దానిని నేను నమ్మెదను, అయితే మీరు సంఘములో ఉన్నంత వరకు మీకు కాపుదల ఉండును. అయితే నీవు వెలుపలకు వెళ్లినట్లయిన యేసుక్రీస్తు రక్తము నుండి వెలుపలకు వెళ్ళినట్లయిన, నీకు కాపుదల లేదు. నేను ఇక్కడున్నంతకాలము వర్షము నుండి కాపాడబడుదును.
మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినప్పుడు, మేము పరిశుద్ధాత్మను పొందితిమని మీరు చెప్పుదురా, మరియు అలా చెప్పి దేవుని వాక్యమును త్రోసివేయుదురా? మేము విశ్వసించి పరిశుద్ధాత్మను పొందితిమని చెప్పుకొనుచూ, వాక్యము సత్యమైనప్పుడు దానిని త్రోసివేయుదురా? అట్లయిన అది ఏ విధముగా పరిశుద్ధాత్మయని చెప్పనగును? ఎందుకనగా ఆ పరిశుద్ధాత్మయే బైబిలును వ్రాసెను. ఆ పరిశుద్ధాత్మతాను తన వాక్యమును నిరాకరించునా? "నేను పొరపాటుగా వ్రాయబడితిని, మీరు సరియే," అని చెప్పునా? లేదు, అది దేవుడు కాదు. లేదండి.
102పదునైన ఖడ్గము! (ప్రభువా, మాకొక గొప్ప ప్రవక్తను పంపుము.) దాని కొరకే మనము ఎదురు చూస్తున్నాము. అప్పుడు బహుశా, అతడు ఆ రాళ్లను అమర్చుటకు వచ్చునప్పుడు, ఆ కట్టడమును అనుకూలముగా ఆ రాళ్లను చెక్కును. అప్పుడేమి జరుగును? ఆ వాక్యపు పరీక్షకు అనేకులు నిలబడలేరు. దేవుని వాక్యమును ప్రేమించుటకంటెను వారి సంస్థలను అధికముగా ప్రేమించెదరు. వాక్యము ఒక మనష్యుని ద్వారా వాక్యము నిరూపించబడినప్పటికిని వారంగీకరించరు. ప్రభువు నామములో వచ్చిన ప్రవక్తగా అతడుండును. భూమి పైకివచ్చిన ఒకడుగా అతడుండును. నేను దానిని నమ్ముచున్నాను.
"ఓ, అది ఒక ప్రజల సమూహముగా ఉండునని," ప్రతి ఒక్కరు చెప్పుదురు.
బైబిలులో ఎక్కడైనను అది "ఒక ప్రజల గుంపుగా" ఉండునని వ్రాయబడి యున్న ఎడల ఎవ్వరైనను దానిని చూపవచ్చును; దేవుడు తన స్వంత వాక్యమును విరచునా, ఆయన అలా చేయడు. లేదండి. ఆయన దానిని వాగ్ధానము చేసెను. అది ఒక్క మనిషిగా ఉన్నాడు. ఆ తరువాత అతనితో అనేకులుందురు, బహుశా వేలలెక్కలో ఉండవచ్చు, సంఘ విశ్వాసులందరు ప్రతి చోటను అతనితో ఉండెదరు.
MATT 24:35,37•
MARK 13:31•
LUKE 17:26,28•
LUKE 21:33
103నోవహు దినములలో ఉండినట్లే రక్షింపబడుటకు అనేకులుండరు, ఎందుకనగా యేసు ఇలా చెప్పెను, "నోవహు దినములు ఉండినట్లే." మీకది తెలియునా? లోతు దినములవలె (వారిని లెక్కించండి), అది ఆ విధముగానే ఉండును.
"భూమ్యాకాశములు గతించిపోవును గాని, నా మాటలు ఎన్నడును గతించిపోవు." నేనేమి భావించుచున్నానో చూడుడి? ఓ, సోదరా, మనము వేగిరపడుట మంచిది. అది మనము తలంచు దానికంటెను ఆలస్యమేమో. మనమేదో ఒక దినము మేల్కొని చూచినప్పుడు మనమేదో కొంతపొగొట్టుకొని యుందుము. జాగ్రత్తగా ఉండండి! వేచి యుండి, ప్రార్థించి, వెదకి కనుగొనుము. నిన్ను దాటి దానిని వెళ్లనీయకుము. మరియు జ్ఞాపకముంచుకొనుము, దేవుని వాక్యము ప్రకటింపబడినప్పుడు, దేవుడు దానికి కట్టుబడియుండి, ఆ వాక్యమును నిరూపించును.
LUKE 17:28,30
104ఆయన అక్కడ చెప్పినదేమని తెలిసికొనుడి, లోతు దినములలో జరిగినదేమి? "ఆయన లోతుదినముల వలెను," అని చెప్పెను. ఆ అగ్ని పడుటకు ముందు ఏమి జరిగెను? మరి ఇప్పుడు అగ్ని కురియుటకు ముందు ఏమి జరుగును? సంఘము ఎటువంటి వర్తమానమును పొందును? ఇప్పుడు సొదొమ కాదు గాని, ఎన్నుకొనబడిన సంఘము. వాటిని మూడు (మూడుగా) దానిని ఉంచండి: అక్కడ సొదొమీయులున్నారు; మరియు లోతు అతని కుటుంబము అక్కడున్నారు, నామమాత్రపు సంఘము; అబ్రాహాము, ఎన్నుకొనబడినవాడై అక్కడున్నాడు. వారు ముగ్గురు వర్తమానమును పొందిరి, అవును, వేవ్వేరు వర్తమానికుల ద్వారా పొందిరి. అయితే ఎన్నుకొనబడిన సంఘము నొద్దకు ఎటువంటిది వెళ్లినదో గమనించండి. ఆయన అబ్రాహామునకు ఏమి చేశాడో గమనించండి. యేసు ఇలా చెప్పెను," మనుష్యకుమారుడు వచ్చినప్పుడు అలాగే ఉండును." ఇప్పుడు, మనము దానిని కాదనలేము, దానిని ఖచ్చితముగా యేసు చెప్పియున్నాడు. అందువలన బహుశా అది ఆ విధముగానే ఉండును.
JOHN 5:39
105ఇప్పుడు, అనేకులు… యేసు వచ్చినప్పుడు, ఆ పరీక్షను తెచ్చెను. "లేఖనములను వెదకి చూడుడి, వాటి యందు నిత్య జీవమున్నదని మీరు తలంచెదరు, అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి," అని ఆయన చెప్పెను. వారా పరీక్షకు నిలిచారా? లేదు. ఎవ్వరైనను దానినెరిగియున్నారు, సమస్త రాతి ఒప్పుదలలు, అవి వాక్యపు పరీక్షకు నిలువ లేక గుట్టలలో తోయబడినవి. అవి చీలికలు గలిగి, చిల్లులుపడి, ఆ పరీక్షకు అది నిలువలేకపోవుచున్నది. ఓ, మానవుడా, త్రోసివేయబడి వాటికి అది పంపివేయబడు చున్నది. దేవుడెల్లప్పుడు సభ్యులకు బదులు, గుణములను చూచును.
నేను ముగించుచున్నాను. మిమ్మును ఎక్కువ సమయము ఇక్కడ ఉండనిచ్చినందుకు చింతించుచున్నాను. నేను దీనిని చేయతలంచలేదు, ఇంక ఒక క్షణము నన్ను కొనసాగనివ్వండి. రెండు క్షణములలో ఈ చివరి గుర్తింపును చేసెదను. ఆ తరువాత ఒక్క నిమిషములో మనము వెళ్ళిపోయెదము. నేను నేను నేను నమ్ముచున్నాను. నేను మీకు సహాయము చేయుటకు కొంత చెప్పాను. చూడండి, మీరు దానిని పఠించవలెనని దానిని మీకు తెచ్చాను. చూశారా?
106దేవుడెల్లప్పుడు గుణలక్షణమును చూచునే గాని సభ్యులను చూడడు. ఈ దినము మనము దానిని తారుమారుగా చేయుచున్నాము. మనము మంచి సభ్యులను చూచెదము. మంచి దుస్తులను, అధికముగా ధనమిచ్చువారిని, గుణలక్షణమునకు బదులు, వాటిని చూచెదము.
యెలియేజరు గుణలక్షణము కనుగొనునంత వరకు కష్టపడెను. అది సరియైనది. అతడు ఎవరిని పొందెను? అతడు దేవుని నమ్మెను. ఎందుకొరకు ఆ గుణలక్షణము? ఇస్సాకు కొరకే ఆ గుణలక్షణము. ఆమె వధువైయున్నది. సంఘము దానికి సాదృశ్యముగా ఉన్నది. అది మీకు తెలియును. అది అబ్రాహాము స్వాభావిక బీజము. ఇది (సంఘము) అబ్రాహాముయొక్క రాజరికపు బీజముగా ఉన్నది. మంచిది. ఎలియేజరు, ఆ వర్తమానికుడు వధువును వెదుకు చున్నాడు, గుణలక్షణమును కనుగొన ప్రయత్నించుచున్నాడు. ఆ మనుష్యుడు వచ్చినట్లయిన, అతడు ఈ చివరి దినపు వర్తమానికుడు. క్రీస్తు కొరకు వధువును వెదకుచున్నాడు. అతడు సంస్థాగతమైన సభ్యత్వము కొరకు చూడడు. ఇష్టపడు వారి గుణలక్షణమును చూచువాడై యున్నాడు.
గమనించండి! మొదటిగా మంచి శీలము, ఆ తరువాత ఇస్సాకును కలిసికొనునట్లు ఆమెను సిద్ధపరచుట. ఆయన గుణలక్షణమును కనుగొనిన తరువాత, ఇస్సాకు వర్తమానమును వినుటకు కావలసినంత ఓర్పుతో నిలచునట్లు చేయుట.
107అతడే ఈ చివరి దినముల వర్తమానికుడు, ఆ సాయంకాలపు వెలుగు మొదటిగా ఆ సంఘమును (ఎక్కడ ఆవర్తమానమును విశ్వసించెదరో అక్కడ) వెదకును. నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో దానిని చదువగలుగుచున్నావా? ఆ సంఘము ఎక్కడున్నదోనని వెదకుచున్నాడు. అది మిమ్మును ఆహ్వానించును. మీకు ఎప్పుడు గాని దాని తలుపులు మూయదు. నీవక్కడ ఉన్నప్పుడు నీవు గుణలక్షణము కనుగొందువు. ఆమె అక్కడే నిలచి నెమ్మదిగా ఉండునప్పుడు ఆమెతో ఆ వధువు ఎలాగు దుస్తులను ధరించవలెనో ఆమెకు చెప్పబడును! ఆమెకు దుస్తులు ధరింపజేయవలసి యున్నది. నెమ్మదిగా నిలిచి యుండును! ఆమె పొందినట్లయిన
108ఆ చిన్నదైన రిబ్కా ప్రతి మాటను వినుటను చూడండి. ఆమె చిన్న హృదయము కొట్టుకొనుచున్నది. ఆమె అతడు ఆమెకు చెప్పుచున్నాడు. నేను గుణలక్షణము కనుగొన్నంత వరకు నేను ఎక్కడికి వెళ్ళుదును? అని కష్టపడినాడు. అంతట నేను ఆ గుణలక్షణమును కనుగొన్న తరువాత, ఆమె నెమ్మదిగా అక్కడే నిలచి, అతనిని కలసికొనుటకు వెళ్ళుటకు సిద్ధపడవలసి యున్నది. ఓ మై! ఏమా ఆశ్చర్యకార్యము! (ఆ గడియారముపై ఇంకనూ కొంతసమయము మనకుండిన బాగుండును.) ఆమె తనను సిద్ధపరచుకొనుచున్నది; అతని వర్తమానమును వినుటకు మౌనముగా నిలచియున్నది. ఎలీయెజరు తనను గురించి మాట్లాడుట లేదు. అయితే ఆయన ఎవరి దగ్గర నుండి పంపబడెనో వారిని గురించి మాట్లాడు చున్నాడు. అతడి దగ్గరి నుండి (ఇస్సాకు) పంపబడెననుటకు ఆధారముగా బహుమతు లున్నాయి. ఆమేన్! ఈ వస్తువులతో అతడామెను అలంకరించుటకు ఇష్టపడుచున్నాడు. ఆమెను అతడు ఎట్లు నిర్ణయించాడో మీకు తెలియును.
ఆమె తన ముఖమును కడుగుకొనుటకు నేను తీసికొని వెళ్లవలసి యున్నది! చూశారా? మీకు తెలియును. నేను నేను దానిని గురించి పరీక్షించుకోవలసియున్నది. అందువలన నేను నెమ్మదిగా ఉండుట మంచిది. ఏదో ఒక విధముగా నేను చాలినంత వరకు చెప్పాను. నేనేమి మాట్లాడుచున్నానో మీరెరుగుదురు. ఇప్పుడు వినండి, మౌనముగా అక్కడే నిలవండి.
109గమనించండి, ఆ చివరి కాల వర్తమానికుడు, అతని పని ఏదనగా ఆ పరిశుద్ధులను సిద్ధము చేయుట వరుని కొరకు వధువును సిద్ధముగా ఉంచుట. అదియే అతని వర్తమానముగా ఉండును. ఇప్పుడు మీరు అ,ఆ లు నేర్చుకొనుటకు ఇష్టపడుచున్నారు కావున మీరు పెద్ద పాఠములను, వెనుక చదువగలరు? ఆ వెనుక నున్న ముద్రలు విప్పబడినప్పుడు, అవి వారికి మాత్రమే బయలుపర్చబడును. అది నిజము. మొదట అ, ఆ లు నేర్చుకొనండి. అ, ఆ లనగా ఏమిటి? (ఆంగ్లములో A, B, C లనగా, Always Believe Christ) "అన్ని వేళల క్రీస్తును విశ్వసించుటయై యున్నది," మీ సిద్ధాంతమును కాదు; క్రీస్తును. చూశారా? ఆయన ఏమి చెప్పుచున్నాడో దానిని విశ్వసించండి, మరెవరో చెప్పిన దానిని కాదు.
అది వ్యతిరేకముగాఉన్నట్లయిన అనగా, ఒక మనిషి మీతో, మీరు వెంట్రుకలు కత్తిరించుకొనవచ్చు స్త్రీలారా అని చెప్పిన యెడల అతడు అబద్ధము చెప్పుచున్నాడని మీకు తెలియును. అది పొరపాటని బైబిలు చెప్పుచున్నది. అతడు ఇంకనూ మాట్లాడుచు, నీవు సంఘపెద్దగా ఉండుచునే నలుగురు లేక ఐదుగురు భార్యలను కలిగి యుండవచ్చునని చెప్పిన అతడు ఇంకనూ అబద్ధమాడుచున్నాడు. అది వాక్యమునకు వ్యతిరేకము. చూశారా? మనము మాట్లాడు ఈ కార్యములన్నియు వాక్యమునకు పిలచునవైయున్నవి. అది వాక్యముతో సరిపోయినదాయని చూడండి.
MAL 4:6•
ACTS 20:9
110సంఘమును, వాక్యమునకు మరలా తీసికొని రండి. ఇప్పుడు ఈ మలాకీ 4లోని వర్తమానికుడు ఏమిచేయనైయున్నాడు? అది విశ్వాసమును మరలా తెచ్చువాడైయున్నాడు. అది పునరుద్ధాన విశ్వాసమును తెచ్చునదై యున్నది. అనగా, యేసు పునరుత్థ్ధానుడైన తరువాత ఆయనను చూచిన వారు ఆయన వారిమధ్య క్రియలను చేయుట చూసారు.
ఆ మనుష్యులు మిత సంభాషులు. వారు వెళ్ళి వాక్యమును ప్రకటించిరి. ఓ, వారు ఎంతోసమయము ప్రకటించిరి. అపొ. పౌలు ఒక రాత్రి యంతయు బోధించుచుండెను. ఒకడు ఆ కట్టడము మూడవ అంతస్తు నుండి పడి, చనిపోయాడు. అప్పుడు పౌలు తన శరీరమును అతనిపై నుండి మరలా అతని జీవమును రప్పించెను, చూశారా. ప్రసంగించుచునే యుండిరి.
111ఇప్పుడు గమనించండి, వారు ఈ నాటి గొప్ప చదువులు గల వారి కంటెను వ్యత్యాసమైన మనుష్యులు నాడు వీరిని ఏవేవో బిరుదులతో పిలచుచున్నారు. ఏమిటి? ఆ వర్తమానికుని ప్రత్యేకపరచుచున్నది లేక వర్తమానమును, ఆ వర్తమానికుని ద్వారా వేరు చేయబడుచున్నది. విశ్వాసులు అవిశ్వాసుల నుండి వేరుపడవలసి యున్నది. కొందరు దానితో కలిసిపోవుదురు, కొందరేమో కలువరు. కొందరు లూథరనులు… కొందరు కాథలిక్‌లు లూథరును అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. కొందరు లూథరనులు, మెథడిస్టును అంగీకరించారు, కొందరేమో అంగీకరించలేదు. కొందరు పెంతెకోస్తును అంగీకరించారు, మరికొందరు అంగీకరించలేదు. అదే విధముగా కొందరు ఈ సాయంకాలపు వెలుగును అంగీకరించుదురు, కొందరు అంగీకరించరు.
అది సాయంకాలపు వెలుగేనా, కాదా అని ఏలాగు మీరు కనుగొందురు? వాక్యముతో పరీక్షచేయండి, (ఏదో ఒక్క వాక్యముతో కాదు, వాక్యమంతటితో ఏకపరచి చూడండి) అది సరియోకాదో చూడండి. ఓ, దానిలో ఏమున్నది? అట్లయిన ఈ వర్తమానము దేవుడు చెప్పిన దానిని నిరూపించు నిరూపణలను కలిగినట్లయిన, ఆయన చేయుదునని చెప్పిన దానితో సరిపోయినయెడల, అది వాక్యముతో సరిపోయిన యెడల, మిగిలిన కాలములలో నిరూపించబడినట్లే ఈ వాక్యము కూడ నిరూపించబడినది. ఇతర ప్రవచనములు ఆ విధముగానే చేశాయి.
MATT 14:19•
MARK 6:41•
LUKE 9:16•
JOHN 6:11,19,60,67,68
112గమనించండి, ఆ వర్తమానము ఎప్పుడు… గమనించండి, ఆ వర్తమానము ప్రజలచే నిరాకరించబడినప్పుడు, ఆ వర్తమానికుడు పూర్తిగా ఓడిపోయినట్లు కనబడును. అతడు మరొక గుమ్మమునకు వెళ్లలేడు, అతని ఏ స్థలము దొరుకదు.
మన ప్రభువు ఉన్నట్లే. జ్ఞాపకముంచుకొనండి, ఆయన.. ఓ ఆయన రోగులను స్వస్థపరచునప్పుడు, అతడొక యవ్వన ప్రవక్త, "ఓ మై! ఆయన ఒక గొప్పవాడు!" "హలో, రబ్బీ ఎట్లున్నావు?" అయితే ఒక దినము ఆయన కూర్చొని సత్యము చెప్పుటకు, ప్రారంభించాడు, సంఘము, ప్రజలు ఆయనను గౌరవించారు, వేలమంది ఆయనను వెంబడించారు. ఆయన చుట్టూ డెబ్బది మంది సేవకులుండిరి, పన్నెండుగురు అపొస్తలులుండిరి. అయితే ఒక దినము ఆయన ఆ రొట్టెను మార్చినప్పుడు, లేక దానిని త్రిప్పినప్పుడు ఆ ముక్కలను అధికపరచినప్పుడు, ఆయన దేవుడని నిరూపించుటకు దానిని చేసెను, ఎందుకనగా దేవుడొక్కడు మాత్రము ఆకాశము నుండి రొట్టెను క్రుమ్మరించగలడు, చూశారా. ఆయన ఆ ముక్కలను అధికపరచెను. ఆ వెంటనే ఆయన నీటిపై నడిచెను, మహత్కార్యములను చేసెను. ఆయన చేయవలసిన కార్యములన్నింటిని చేసెను. ఆయన దేవుడని వాటి ద్వారా నిరూపించెను.
ఆయన వాటిని చేసిన తరువాత, ఆయన కూర్చొని ప్రజలతో కఠినముగా మాట్లాడుటకు ప్రారంభించెను. ప్రజలు తిరుగబడిపోయారు. ఆ డెబ్బది మంది, "ఉహ్! దీనినెవరు వినగలరు? అది చాలా కఠినమైనది. మేమేదో తలంచిన దానిని నీవు చెరిపి వేశావు. వీటన్నింటిని మాకు చెప్పుటకు నీవెవ్వడవు?" వారు వెళ్ళిపోయారు.
అప్పుడు యేసు తన చిన్న మందతో నోవహు దినముల వలెను, సొదొమ యొక్క దినముల వలెను; అక్కడ ఉన్న చిన్న గుంపుతో, "మీరును వెళ్ళిపోవుటకు ఇష్టపడుచున్నారా?"
అప్పుడు పేతురు ఆ గొప్ప మాటలను పలికెను, "ప్రభువా, మేమెక్కడకు వెళ్లగలము?" (దేవా, మాకు సహాయము చేయుము.)
113గమనించండి, వర్తమానము నిరాకరించబడినప్పుడు, వర్తమానికుడు ఓడిపోయినట్లు కనబడును. అయితే దేవుడు ఆ దశ్యమునందు కాలు పెట్టినప్పుడు అతని వర్తమానము ముగించిపోవును.
నోవహు, (ఇప్పుడు ముగించుచున్నాను) నోవహు తన ఓడ గుమ్మము ముందు నూట-ఇరువది-సంవత్సరములు ప్రకటించెను. చివరకు వారు అతని వైపు తిరిగి పరిహాసము చేశారు, నిందించారు. నోవహు తలంచుకొనుచు ఓడలోకి ప్రవేశించాడు… అదంతయు బాగుగనే ఉండును. దేవుడు ఆ ఓడ తలుపులను మూసివేశాడు. ఆ ప్రజలు ఆ ఓడ చుట్టూ చేరి ఏమి జరుగునో అని చూస్తూ నిలచారు. ఏడు దినములు అక్కడ దానినక్కడ ఉంచి చెమటలు పట్టునట్లు చేశాడు. ఆ తరువాత ఏడవ దినమందు వర్షము వచ్చుటకు మొదలు పెట్టినది.
మోషే, అతడెందుకు లోపలున్నాడు? అతడు తన కార్యనిర్వహణలో లీనమైయున్నాడు. ప్రజలను నడిపించుచున్నాడు. ఎర్ర సముద్రము దారినిచ్చినది. ఆయన తన దారి చివరిలో ఉన్నాడు. అప్పుడే దేవుడు తూర్పు గాలితో దిగివచ్చి సముద్రమును వేరు చేశాడు, దారి చివరిలో ఉన్నాడు.
DAN 3:17,18•
DAN 6:13,16
114అది దానియేలు, అతడు తన వర్తమానముపై నిలచి యున్నాడు. "ఈ రాజు యొక్క ప్రపంచముతో నేను కలిసిపోను." దేవునికి నిజాయితీగా నిలిచి యున్నాడు. అతడు కూడ తన మార్గము చివరిలో నిలచి యున్నాడు. తన ముగింపు వచ్చినట్లు తలంచుచు నిలచాడు. వారు సింహముల గుహలో అతనిని త్రోసివేశారు. అయితే దేవుడు ఆ ఇక్కటైన సమయములో దిగినాడు.
ఒక ఉదయ కాలము బబులోను మార్గము వెంబడి ఆమేన్! నేను పరలోకము వైపు చూచినప్పుడు, నేను ఒక సింహాసనమును చూచాను. దూతలు చుట్టూ నిలచియున్నారు. ఇక్కడ బబులోను వైపు తిరిగి చూచాను, ఒక మండుచున్న కొలిమిని చూచాను. అక్కడ ముగ్గురు పిల్లలు నిలచియున్నారు. వారు, "మా దేవుడు మమ్ము విడిపించుటకు శక్తిగలవాడు," అని చెప్పుచున్నారు. చూశారా? "అయితే నీ ప్రతిమకు మాత్రము మేము నమస్కరించము, ఎందుకనగా అది వాక్యమునకు వ్యతిరేకము." చూశారా? "మనమక్కడ నిలచియున్నాము."
115"మంచిది," అని ఆ రాజు చెప్పాడు. "మెట్లు దిగి వెళ్లండి, మీరు కాల్చివేయబడనున్నారు." బలమైన మనుష్యులు ఆ మెట్ల దగ్గరకు వచ్చారు. అక్కడ వేడిగా ఉన్నది.
ఒక దూత ఆ సింహాసనము ప్రక్క నిలచియుండుటను చూచుచున్నాను. అక్కడ తన ఖడ్గమును ఒర నుండి తీసి, "తండ్రీ, ఆ క్రింద చూడుము, ఏమి జరుగుచున్నదో! నన్ను అక్కడకు వెళ్లనిమ్ము, నేను గాబ్రియేలును, నేనా దశ్యమును మార్చి వేయుదును."
"గాబ్రియేలు నీ ఖడ్గమును ఆ ఒరలో పెట్టి వేయుము, నేను దానిని గమనించాను."
ఇక్కడ మరొకరు వచ్చుచున్నారు. తండ్రీ, నేను వామ్వుడ్ ను నేను నీటితో నాశనము చేయుదును. జలప్రళయమునకు పూర్వము మానవుడు పాపము చేసి నీ ప్రజలను దుర్మార్గముగా చూచాడు, నేను నేను ఈ పూర్తి ప్రపంచమును ముంచివేశాను. ఈ ఉదయము బబులోను దేశమును తుడిచివేయుదును. నన్ను వెళ్లనిమ్ము."
"నీవు చేయగలవని నాకు తెలియును. వోమ్వుడ్, నీవు విశ్వాసము గల దూతవు. చూశావా? అయితే, నేను నిన్ను వెళ్లనివ్వలేను, ఎందుకనగా అది నా పనియై యున్నది. నేనే వెళ్ళుచున్నాను."
"ఇక్కడ, మీరు వారిని చూచుచున్నారా?"
"వారిని రాత్రంతయు చూస్తూ ఉన్నాను, వారి ప్రార్థనను నేను విన్నాను. వారు నా వాక్యముకై నిలచుటను నేను చూచుచున్నాను. సకాలమునకు నేనక్కడ ఉందును ఓ మై! ఆయన పైకి లేచినప్పుడు ఆయన రాజ వస్త్రములు ఆయన చుట్టూ పడియున్నవి. అప్పుడు, "ఆయన తూర్పు గాలి ఇక్కడకు రమ్ము. ఉత్తరము, దక్షిణము, పడమర అక్కడ సమీపమునకు దిగి వెళ్ళుము. మిమ్మును ఒక రథముగా ఈ ఉదయకాలము వాడుకొనబోవుచున్నాను. నేను బబులోనుకు దిగి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి ఆ ధృశ్యమును మార్చి వేయుదును." ఓ, సోదరా, ఆయన సకాలమునకు అక్కడున్నాడు.
ఆయన కండ్లు పిచుకపై యున్నవి మరియు ఆయన నన్ను గమనించుచున్నాడని నేనెరుగుదును. ఈ రాత్రి కూడ ఆయన నన్ను గమనించుచున్నాడు, నన్ను గమనించుచున్నాడు. ఆయన మిమ్ము గమనించుచున్నాడు. మనము నిలువ గలమాలేమా అని చూస్తూ ఉన్నాడు. మనమే తీర్మానము చేయనైయున్నాము. మనము వాక్యమునకు నమ్మకముగా నిలువగలమా లేక దాని నుండి దూరమై పోవుదుమా. అది మీరు తలంచు దానికన్నను ఎంతో ఆలస్యమై పోయినది.
GEN 32:24
116యాకోబు, తాను ఇంటికి వెళ్ళు మార్గములో అతడు ఇంటికి తిరిగి వెళ్లవలెనని ప్రేరేపించబడెను. అతని సహోదరుడు అతని కలిసికొనబోవుచున్నాడు. ఓ, అయితే ఒకరాత్రి అతడు దేవునితో పోరాడెను. అతడు తన సహోదరుని కలిసికొనుటకు భయపడెను, అయితే ఆ మరుసటి ఉదయము, అతడు భయములేక నిలచెను కుంటుచున్న యువరాజు. "నాకు ఏశావు గాని అతని సైన్యము గాని నాకక్కరలేదు," దేవుడు దృశ్యమునకు దిగి వచ్చాడు. చూడండి, ఆయన ఒక అసాధారణమైన విధముగా దానిని చేశాడు.
JOHN 10:37
117యేసు నిరాకరించబడెను, ఆయన దేవుని కుమారుడని నిరూపించబడెను. ఆయన నేను నా తండ్రి కార్యములను చేయకుంటే నన్ను నమ్మకుడి. ఆయన ఆ దిన వెలుగుగా ఉండెను. (ఆయన ఇప్పటికిని వెలుగై యున్నాడు!) ఆయన తెరకు దిగి వచ్చెను. ఆయన చేయుచున్నంత కాలము ఆ ప్రజలు రొట్టెలు, చేపలు అన్ని బాగానే ఉన్నాయి, వారాయనను వెంటాడారు. అయితే ఆయన వారికి వాక్య సత్యమును తెలుపుటకు ప్రారంభించినప్పుడు, అది వారిని వేరు పరిచినది. వారు వారి స్వంత సాంప్రదాయములను అంటి పెట్టుకొని యుండిరి. అది వారికి వ్యతిరేకమే గాని, ఆయన ఖచ్చితముగా వాక్యముతో నిలచెను. అయితే గ్రుడ్డివైన ఈ లోకపు కండ్లు దానిని చూడలేకపోయినవి. వారు ఇప్పుడును చూడలేకున్నారు, వారు ఏ కాలమందును చూడలేకపోయారు, నేను మొత్తముగా మాట్లాడుచున్నాను. ఏమి జరిగినది? ఆయన ఓడిపోయినట్లు అది కనబడినది.
118మీరు ఆ సమయము గమనించండి, ఆయన పలుకుబడి ఆయనను అప్పటి నుండి విడిచిపోయినది. ఎప్పుడు? ఆయన వాక్యమును చెప్పుటకు ప్రారంభించినప్పుడు, ఆయన వెళ్ళి స్వస్థత కూడికలను జరిపినప్పుడు, ప్రతి ఒక్కరు ఆయనను కోరారు. "ఓ రబ్బీ, ఇక్కడికి రమ్ము!" రబ్బీ, ఇక్కడకు రమ్ము! అయితే ఆయన తన సిద్ధాంతమును చెప్పుటకు ప్రారంభించినప్పుడు ఓ నీ బోధను మా ప్రజలను చెరుపుచున్నది. ఓ మంచితనమా! ఓ, నేను మా సంఘములో ఇకపై నిన్ను ఉంచుకొనలేను, రబ్బీ, ఎందుకనగా, ఎందుకు, నీవు మా ప్రజలను తారుమారు చేశావు. మేము నమ్ముదానికి నీ బోధ ఎంతో వ్యతిరేకముగా ఉన్నది. అది మారలేదు. అవును అది మారలేదు. నిన్ను మేము కలిగి యుండలేము! ఆయన ఒక నిరూపణగా ఉన్నాడు, ఆయన ఎవరని లేఖనములచే నిరూపించబడినను, వారు ఆయనను నమ్మలేకపోయారు.
చివరకు, చివరి క్షణము వరకు ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయనను నేను జయించానని సాతాను తలంచినప్పుడు ఆయనను వాడు (సాతాను) సిలువపై మరణమును విధించాడు. పడిపోయాడు, పడిపోయాడు, పడిపోయాడు అని చెప్పుచు, చివరకు ఆయన మన చేతిలో చిక్కిపోయాడని తలంచి సమాధిలో ఉంచరు. అయితే అప్పుడే దేవుడు తెరపై దిగి యున్నాడు. సమాధి నుండి ఆయన పైకి లేచాడు! ఎందుకు?
ACTS 7:58•
ACTS 8:1•
ACTS 21:10,11,13•
2TIM 1:15•
2TIM 4:10,16
119అదే విధముగా, పౌలు "అ౦దరు… దేమా నన్ను విడిచిపోయాడు. వాక్యము నిమిత్తము అందరు నన్ను విడిచిపోయారు," అని చెప్పాడు. దేమా రాత్రి క్లబులకో లేక మరొక స్థలమునకు వెళ్ళియుండునని నేను నమ్ముట లేదు. పలుకుబడి గలిగిన గుంపుతో ఉండుటకు వెళ్ళిపోయాడు, ఎందుకనగా దేమా ఒక ధనికుడు. మిగిలిన పలుకుబడియున్న వారితో కలిసిపోయాడు. అప్పుడు పౌలు ఇలా చెప్పాడు, "అందరు నన్ను విడిచిపోయారు." ఎందుకు? ఆయన సేవలో ఆయన తలరాయికి వచ్చుచున్నాడు. ముగింపుకు వచ్చుచున్నాడు.
అతడొక హతసాక్షిగా మరణించాలని కోరాడు, ఎందుకనగా అతడు స్తెఫెనును చంపాడు, అతడు అతని మరణమునకు సాక్షిగా నిలచి దానిని అంగీకరించాడు. అతడు మరణించుటకు ఇష్టపడుచున్నాడు. అప్పుడు అగబు అను ప్రఖ్యాతి గాంచిన ప్రవక్త అతని ప్రవక్త అతని ప్రక్కగా నిలిచి యెరూషలేమునకు వెళ్ళవద్దని చెప్పాడు. అందుకు (పౌలు), "వెళ్ళకూడదని నాకు తెలియును. అయితే నేను వెళ్ళినప్పుడు సంకెళ్లతో బిగింపబడుదునని ఎరిగియున్నాను, అని చెప్పాడు. నేను వెళ్లి ప్రభువైన యేసు కొరకు మరణించుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను." అది ఏమిటి? అతడు తన సేవను ముద్రించుచున్నాడు.
ZECH 14:7
120ఓ, జీవించు దేవుని సంఘమా, మన మీ రాత్రి అంతయు మాట్లాడవచ్చును. మన వర్తమానమును మనమేవిధముగా ముద్రించనై యున్నాము? దానిని ఏ విధముగా చేయబోవుచున్నాము? దేవా, ఈ వాక్యమును గైకొని ధైర్యముగా నిలచుటకు సహాయము చేయుము. వాక్యముతో నన్ను మరణించనిమ్ము; వాక్యముతో జీవించనిమ్ము, వాక్యముతో మరణించనిమ్ము. వెలుగును ప్రకాశించనియ్యుము, ఎందుకనగా సాయంకాల సమయములో వెలుగు కలుగును. మనము ఆ ఘడియలో ఉన్నాము. స్నేహితులారా, మనము తలలు వంచుచుండగా దానిని నమ్ముదుము.
మొదటిగా మిమ్ములను ఇంత సమయముంచినందుకు మిమ్మును క్షమాపణ కోరుచున్నాను. రెండు గంటలో లేక ఒక గంట నలువది ఐదు నిమిషములు అయిపోయినవని నేను తలంచుచున్నాను. ఏది మనలను బాధించదని నమ్ముచున్నాను. మనము సిగ్గుపడ కూడదు. అది మన హృదయములోను — మన ఆత్మలోను ఉండినట్లయిన, మనము తప్పు చేయు వారమగుదుము. మనకు మనము సేవకులుగా ఉన్న మనము ఈ కార్యములను మాట్లాడకున్నాము. ఇక్కడున్న నా సోదరులారా, పరిశుద్ధాత్మతో నిండియున్నవారు. చూశారా?
121నేను రక్షించబడినప్పుడు, నేను నా బాప్టిస్టు పాస్టరుతో చెప్పినదేమనగా, నేను పరిశుద్ధాత్మను పొందాను. ఇదంతయు ఆ దేవుని దూత ఏమి చేయాలో నాతో చెప్పినది అతడు, "బిల్లీ నీకు పీడకల వచ్చినది," అని చెప్పాడు.
అందుకు "నేను డాక్టరు డేవీస్ గారు, నేనొక దూతను చూచాను."
అందుకు అతడు "ఓ పనికిమాలిన తనము!" "అది దయ్యమునకు సంబంధించినది." చూశారా? ఓ, మై, అది ఎంతగా నన్ను బాధించినదో! అతడు, "నీవు రాజులకును, మరి గొప్ప వారికిని బోధించబోవుచున్నావా?," అని అడిగెను.
అందుకు నేను, "అదే ఆయన చెప్పినది."
అందుకతడు, "నీ ఏడవతరగతి చదువుతోనా?" అని అడిగెను.
అందుకు నేను, "అదే ఆయన చెప్పాడు," అని చెప్పాను.
అందుకతడు "ఎవ్వరు విందురని నీవు తలంచుచున్నావు ఈలాంటి (అవిశ్వాసపు) దినములో దైవీక స్వస్థతను గురించి ప్రకటించబోవుచున్నావా? ఇక్కడ ఎంతో గొప్ప చక్కటి ఆసుపత్రులు మరియు వైద్యపు పరిశోదనలున్నవి?"
అందుకు నేను, "ఎందరు గొల్యాతులు నిలచినను నేనేమి లెక్కచేయను."
అందుకతడు, "ఎవరు నీవు మాట్లాడు దానిని విందురని తలంచుచున్నావు."
అందుకు నేను, "దేవుడు నన్ను పంపించునప్పుడు, ఎవ్వరో కొందరు నేను చెప్పుదానిని వినుటకని యుండెదరు."
1COR 11:5
122అప్పుడు ఈ ప్రజలను గురించి నాకు అంతగా తెలియదు. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, అది చేతి తొడుగు వేసినట్లుండినది, మీతో చక్కగా ఇమిడి పోయాను. నేను మిమ్ము ప్రేమించాను. నేను మిమ్ములను ప్రేమించాను. నా కాపరి సోదరులను ప్రేమించాను. ఈ సహోదరులు ఈ రాత్రి ఈ రకమైన వర్తమానమును ప్రసంగించుటకు అనుమతించినట్లు ప్రెస్బెటేరియనులు, మెతడిస్టు లేక లూథరనులు వారి సంఘములను తెరచి యుందురా? కాదయ్యా కానే కాదు. వారు సత్యమును నమ్మిన ధైర్యవంతులు. ఇప్పుడు ఆ వరుసలో వాక్యముతో వారితో కలవండి. ప్రపంచ కార్యములకు దూరముగా ఉండుడి.
సోదరీలారా, మీ తల వెంట్రుకలు ఎదుగనియ్యండి. క్రమముగా చక్కగా దుస్తులు ధరించడి, ఎంతో అవమానము. మీ ముఖముల నుండి రంగులను తీసివేయండి. మీరు మీ ముఖములకు రంగు వేసికొనుట కంటెను, మీ తలవెంట్రుకలు కత్తిరించుకొనుట కంటెను అధికముగా లేఖనములు బైబిలులో ఉన్నాయి. అది నిజము. దానిని చేయవద్దు. చేయవద్దు. ఓ, స్త్రీ అలాగు చేయుట అవమానకరమని బైబిలు చెప్పుచున్నది. ఆ తల వెంట్రుకలు ఆమెకు మహిమగా ఉన్నాయి, అది ఒక చిన్న కార్యమని మీరు చెప్పవచ్చు అది పరవాలేదు అని చెప్పవచ్చు. చిన్న వాటిని క్రమపరచుకొనినప్పుడు పెద్ద వాటిని సులభముగా చేయవచ్చును. ఇప్పుడే వాటిని చేయుటకు ప్రారంభించెదము.
MATT 5:28
123ఇప్పుడు సోదరులారా, ఓ మై! పురుషులకు ఒకదానిని చెప్పనివ్వండి. నా సోదరా, నీ భార్యను ఆ విధము చేయుటకు నీవు అనుమతించిన యెడల నేను నిన్ను గురించి సిగ్గుపడుచున్నాను. నీవొక ఆత్మనింపుదల మనివని చెప్పుటకే సిగ్గుగా ఉన్నది. ఆమెను ఆ విధముగా వీధివెంబడి నడిపించుట అది నీకు అవమానము.
మరియు మీ దుస్తులన్నియు కావలికరముగా ఉన్నాయి. బైబిలు ఈ విధముగా చెప్పుచున్నదని మీకు తెలియునా, యేసు ఇలా చెప్పెను ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును?
"ఒక్క నిమిషమాగండి, నా సోదరా, నేను అమాయకురాలిని." నీవు అమాయకురాలివని నేను నమ్ముచున్నాను. నా సోదరీ, స్వభావికముగా నీవు అమాయకురాలివి అయితే నీవు నిన్ను బాహ్యముగా చూపుకొన్నప్పుడు మరియు పాపియైన వాడు నిన్ను చూచినప్పుడు, నీవు ఆ విధముగా నిన్ను చూపుకొనినందున ఎవరు పాపము చేసిన వారగుచున్నారు? నీవే, నీవే నీ శరీరమును అగపరచుకొనుచున్నావు. అప్పుడు న్యాయతీర్పు దినమందు, ఆ పాపితన పాపమును గురించి జవాబిచ్చునప్పుడు, అది ఎవరు తన హృదయమందు చేసెను? నీతోనే, ఎందుకనగా నీవు నిన్ను చూపుకొన్నావు. అది సత్యము.
చేయవద్దు, చేయవద్దు సోదరీ, దయచేసి యేసుక్రీస్తు నామములో నిన్ను ఒక సహోదరునిగా అడుగుచున్నాను. సరిచేసికొందువా?
సోదరా, నీ యింటిని నీవావిధముగా నడుపుచున్నందుకు అది అవమానము. సరి చేయుము. నేను నేను గొప్ప నమ్మకముతో నిన్ను ఒక మనిషిగా చూచుచున్నాను.
124కాపరులైన మీరు ప్రజలను ఆ విధముగా లోపలకు అనుమతించుచున్నారు. పలురను భార్యలుగా గల వారిని సంఘ పెద్దలుగా ఉంచుచున్నారు. మీకు సిగ్గుగా లేదా, సేవకులారా? అటువంటి కార్యములను గురించి మీరు సిగ్గుపడుట లేదా? వ్యభిచారములో వారు జీవించు నప్పుడు, వారిని మీరు తీసికొనుచున్నారు. వారు సిగరెట్లు త్రాగుచూ సకల కార్యములను చేయుచున్నారు. అయినను వేదికపై నుండి ఒక్కమాటయైనను దానిని గురించి చెప్పుట లేదు. అది మీకు అవమానము! నేను నేను నేను మీ కొరకు ప్రార్థించుచున్నాను సోదరా.
దేవుడు మిమ్ము దీవించుగాక. ఇంత సమయము నాతోనిలచి భరించిన ఓర్పునకు వందనస్థుడను, ఇప్పుడు నేను ఆశ్చర్యపడుచున్నాను.
సాయంకాలపు వెలుగు వచ్చినది. ఆ సాయంకాలపు వెలుగు ఇక్కడ వాక్యమునకు తిరిగి వచ్చినది.
125ఇప్పుడు, మీరు తలలు వంచి యుండగా, మీ హృదయములను వంచియుండగా, ఈ ప్రశ్న మీరే వేసికొనండి. "నేను ఈ వాక్యముతో ఉన్నానా? నేనున్నానా?"
ఈ వేదిక నుండి నాప్రార్థన ఏమనగా, "ఓ, దేవా, నీ వలెనేని ప్రతిది నాలో నుండి నరికి వేయుము. ఓ దేవా, నాలో నుండి తీసివేయుము." మనమిప్పుడు దారి చివరిలో ఉన్నాము.
మంచిది, నీవు నమ్మకముగా చేతులెత్తి ఈ విధముగా చెప్పెదవా, "దేవా, నీ వలె లేని ప్రతి దానిని నాలో నుండి నరికి వేయుము. నన్ను రూపు దిద్దుము. ప్రభువా, నన్ను రూపుదిద్దుము?" ప్రభువు మిమ్ము దీవించుగాక.
ఇక్కడెవరైనను సరియైన జీవితము లేకున్నయెడల ఒక పాపిగా ఉండినయెడల, ఈ రాత్రికి ఇక్కడకు వచ్చి యుండిన యెడల, క్రీస్తు తమ రక్షకునిగా అంగీకరించక, లేక వెనుకబడినయున్న యెడల ఆ విధముగా ఎవ్వరైనను ఉండి, వారు తీరుగా రాదలచినయెడల మీరు వచ్చి ఇక్కడ ఈ బలి పీఠము నొద్ద నిలువవలసినదిగా ఆహ్వానించుచున్నాను. దేవుడు వ్యాధిగల వారి కొరకు నేను చేయు ప్రార్థన ఆయన వినునని నమ్మువారు, ఆయన నా ప్రార్థన వినునని నేను నమ్ముచున్నాను. మీరును, నేనును ఏకమై ప్రార్థనలను బలిగా ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తుపై ఉంచి, ప్రార్థన సమర్పించుదము. దేవుడు దానిని వినునని నేను నమ్ముచున్నాను. ప్రార్థనకు వచ్చి నిలుచుటకు మీరు ఆహ్వానింపబడుచున్నారు.
HEB 12:5
126ఇప్పుడు, మా పరలోకపు తండ్రీ, మేము ఈ ప్రేక్షకులను మీకిచ్చుచున్నాము. ఇంత వరకు మేము విడిపోయిన ఈ మాటలతో కొనసాగాము. ప్రభువా, అనేకులు ఆయాసము చెంది ఇండ్లకు వెళ్ళిపోయారు. కొందరికి కొంచెము బాధకలిగినది. ప్రభువా, నేను ఈ ప్రేక్షకులలో ఎప్పుడు ఉండువారెవరని నేనుచెప్పలేను. తండ్రీ, అది నీ వాక్యమై యున్నది. నీవు నా హృదయమును ఎరిగియున్నావు. అందువలన నేనున్నాను దానిని నేను చేయకున్నయెడల నన్ను క్షమించుము. నేను దానిని ఖచ్చితముగా చేయవలసి యున్నది ప్రభువా. అందువలన ఇప్పుడు నేను ప్రార్థించునదేమనగా, ఆ ప్రజలు ఎవ్వరైతే వాక్యపు గ్రహింపును కలిగి యున్నారో వారు స్పష్టముగా గ్రహించారు. నీవు జీవమునకు పిలచిన వారు ఈ లోకములో దేనిని ఆశించరు గాని వారి హృదయము నిండుగా దేవుని ప్రేమ ఉన్నది. ఆయన సంఘము కొరకు వీటిని నేను ఆర్థించుచున్నాను.
తండ్రీ ఇక్కడ ప్రతి చేయి పైకెత్తబడి సున్నతి కోరి, సంబంధము లేనివన్నియుతీసివేయబడుటకు నిలచి యున్నారు. దేవా, మాకందరికి సహాయము చేయుము. ప్రభువా, నేను వారితో నిలచుచున్నాను. నేను వారితో ఒకడను నేను ఆ సంతోషకరమైన వెయ్యేండ్లపాలన దినము కొరకు వేచియున్నాను. అప్పుడు పాపమును, అవమానమును పూర్తిగా నాశనము చేయబడును. తండ్రీ, మేము ప్రపంచములో ఉండగా, మేము ఈ కార్యములకు సంబంధించి యున్నాము. మేము పొరపాట్లను చేయు స్థితి ఉన్నది. పాపము చేయు స్థితి ఉన్నది. పాపము చేయుస్థితి ఉన్నది. అయినను మేము నడచుచున్నాము. అయినను వాటిని చేయవలెనని ఆశించుట లేదు. బైబిలు చెప్పినట్లు, మీ మీద నిందమోపబడినప్పుడు అలసిపోవద్దు అయితే తండ్రీ నేను ప్రార్థించునదేమనగా వాక్యపు నింద, మిగిలిన వాటిని నరికి వేయనిమ్ము. తండ్రీ, వారు దానిని ఆ విధముగా గ్రహించునట్లు నేను ప్రార్థించుచున్నాను.
127నీవు వారిని ఆశీర్వదించవలెనని నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, మేము ప్రార్థించుటకు ముందు మేమేమి అడుగుచున్నామో, తెలిసికొని వేచి యుండునట్లు సహాయము చేయుము, క్రమము లేని దానిని మేము కోరుటలేదు. ఏదో సర్దుబాటు మాటలను మేము కోరుట లేదు, ఎందుకనగా మేము నీతో మాట్లాడుచున్నాము.
ఈ రాత్రి నన్ను ఇక్కడకు ఆహ్వానించి తలుపు తెరిచిన ఈ చిన్న మా సోదరుని ఆశీర్వదించుము. ఆయన సంఘమును నీవు ఆశీర్వదించుము. ప్రభువా, ఇది ఒక సముద్రతీర దీపస్థంభముగా ఉండునట్లుగా, దేవుని వరములు ఉండు స్థలముగాను ప్రతిది సమాధానముగా నెమ్మదిగా వెళ్ళునట్లు ఆశీర్వదించుము.
ఇక్కడ కూర్చొనియున్న ప్రతి సేవకుని దీవించుము, వారి సంఘములను దీవించుము. దేవుని ఆత్మ ఈ ఫోనిక్సును దాటి వేళ్ళుచుండగా, మల్బరీ వృక్షములో గొప్ప శబ్దము, పెద్ద కదిలిక ఏర్పడును గాక. ఆ విధముగా ఆ సంఘములను ఒక సహవాసములోనికి తెమ్ము. ఒక గొప్ప ఉజ్జీవమునకు అవి వచ్చును గాక, అప్పుడా దేవుని మహిమార్థ సేవకులు బోధించలేనంతగా ఉజ్జీవము కలుగనిమ్ము; అయితే ఈ మధ్యాహ్నము పరిశుద్ధులు ద్వారా కలిసి వచ్చినప్పుడు వారు ఆక్రందన చేయుచు, ప్రార్థించుచు, వర్తమానములకు సాక్షులుగా నిజముగా ఆత్మ కుమ్మరింపబడిన వారుగా ఉండిరి. ఈ పట్టణమంతయు ఆకర్షించబడి వచ్చి వినునట్లు ఇప్పుడు అనుమతించుము.
రోగులను స్వస్థపరచుము, ప్రభువా, వారు మా మధ్య ఉన్నారు. తండ్రీ, వారికి దైవీక విడుదలను దయచేయుము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము.
128మనము తలలు వంచియుండగా, ఇక్కడెవరైనను ఇష్టపడిన యెడల బలిపీఠము చుట్టూ వచ్చి నిలవండి, మన తలలు వంచియుండగా, ఒక చిన్న పాటను మెల్లగా పాడుదము. ఒక మంచి, పురాతన సువార్త పాట. మనము మెల్లగా పాడుదము. మనమలా చేయుచుండగా, ఎవరైనను ప్రార్థించబడుటకు ఇష్టపడినయెడల, అధిక అనుభవము కొరకు గాని, పరిశుద్ధాత్మను పొందుటకు గాని లేక రక్షించబడిరిగాని శుద్ధీకరించబడలేదనిన, మరేదైనను మీ కొరకు చేయుటకు మేము ఇష్టపడుచున్నాము. మనమా పాటను మెల్లగా పాడుచుండగా, నేను ఆయనను ప్రేమించుచున్నాను. మీరు ఆయనను ప్రేమించుచున్నారా, ఆయన వాక్యమును గౌరవించెదము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
నా రక్షణను కొనెను.
ఆ కల్వరి వక్షముపై
వారు వచ్చుచుండగా, ప్రతి ఒక్కరు వారి స్థలమును తీసికొనవలెనని కోరుచున్నాను. మంచిది, సోదరీ.
ఆయనను నేను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే (ఈ బలిపీఠము చుట్టు
వచ్చుటకు ఇష్టపడుచున్నవారు రండి) నేను;
ఆ కల్వరి వృక్షముపై,
నా రక్షణను కొనెను.
2COR 11:14
129ఎందుకు మీలో కొందరు సోదరీలు పొట్టి వెంట్రుకలతో ఉన్న మీరు, ఇక్కడకు వచ్చి ప్రభువును కోరుకొనకూడదు? మీ కొరకు దానిని బైబిలు నుండి చదువమనెదరా? మంచిది. ఎందుకు మీరు వచ్చి, "ప్రభువా, నేను ప్రతి కార్యములోను నిజాయితీగా ఉండదలంచుచున్నాను. నేనిప్పుడే ప్రారంభించుటకు ఇష్టపడుచున్నాను. నేను సరియైన మార్గమును చేరుకొనుటకు ఇష్టపడుచున్నాను. అక్కడ ఉండదలంచాను. నేను మీతో ఈ రాత్రి విజ్ఞాపన చేయనైయున్నాను. ప్రభువా. అది ఇప్పటి నుండి ఎదుగనిమ్ము?"
బైబిలు చెప్పునదేమనగా పురుషుడు పొడుగాటి తలవెంట్రుకలు కలిగి యుండుట అతనికి అవమానము, అది స్త్రీ వలె కనబడును. దేవుడు రెండు నిబంధనలను చేసెను. ఒకటి ఆదాముతోను రెండవది హవ్వతో చేసెను. ఆయన వారికి వ్యత్యాసముగా దుస్తులు ధరింప జేసెను. వారు మొత్తమునకు వ్యత్యాసమైన వారుగా ఉన్నారు. వారు ఎప్పుడును వ్యత్యాస ముగా ఉందురు. రెండు నిబంధనలున్నవి, బైబిలంతటిలో రెండు మాత్రమే ఉన్నవి. ఆ ద్వంద నిబంధనలపై నేనొక రాత్రి ప్రసంగించుటకు ఇష్టపడుచున్నాను. అప్పుడు ఆ వ్యత్యాసమేమని చూపుదును. ఓ మై, అది ఎంతో భయంకరముగా ఉండును. అది మీ వివాహము పరిత్యాగమునందును ఉన్నది. మీరు దానిపై సత్యమును గ్రహించినట్లయిన, పూర్తి కార్యము ముగించిపోవును. అది నిజము. ఇప్పుడు మరలా, మనము స్థిరముగా ఉందము. రండి, వచ్చేదరా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను…
(మీకు పరిశుద్ధాత్మ కావలెనా ముందుకు వచ్చి ఇక్కడ నిలవండి),
ఎందుకనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను.
మరియు……
మీరు ఆయనతో సన్నిహితముగా నడచుటకు ఇష్టపడుచున్నారా? రండి, ప్రమాణము చేసికొనండి. ఆయన ప్రక్క నిలచి దానిని నిలబెట్టుకొనండి. మీరు నిలబెట్టుకొననిదే ప్రమాణము చేయుటలో ఏమి లేదు.
మీరు వచ్చి మీ ప్రమాణమును చేసికొనవచ్చు, దేవుడు దానిని నిలుపును. మీరు మీ ప్రమాణమును చేపట్టి యుండుడి.
130ఇప్పుడు నా సేవక సోదరులను ఈ క్రిందికి నడిచి రావలసినదిగా కోరుచున్నాను. ఈ విలువైన ప్రజల చుట్టూ నిలువ వలసినదిగా కోరుచున్నాను, మనమందరము కలిసి ప్రార్థించుదము. ఒకరితో ఒకరు మాట్లాడుదము, వారి అవసరతలేమిటో మనమిక్కడ ఉండగా అడుగుదము.
ప్రతి ఒక్కరు మర్యాదతో మనముందము. దేవుడు మిమ్ము గౌరవించును. ఈ ప్రార్థనచేయబడి ముగించునంత వరకు మర్యాదతో నెమ్మదిగా, నిలచి యుందము. మీరు ఇప్పుడు వీరి చుట్టూ వచ్చి నిలువవచ్చు ఈ ప్రజల వెనుక, ఇక్కడ ప్రార్థనకై నిలచిన వారి వెనుక వచ్చి నిలవండి.
కల్వరి వక్షము పైన.
ఇప్పుడు మరలా ఇంకనూ అక్కడ సేవకులు ఇరుప్రక్కల చేరునంతలో:
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను వేర్వేరు సంస్థల సేవకులను చూచుటకు ఇష్టపడుచున్నాను, అందరు ఒక్కటిగా; ఇప్పుడున్నారు, అది ఆయన రక్తము క్రింద.
ఎందుకనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను.
ఆ కల్వరి వక్షముపై
నా రక్షణను కొనెను. (మై!)
సోదరులారా నడిచి రండి, మీరు నిలచియండు వ్యక్తి ప్రక్కకు వచ్చి, మీ చేతులను వారిపై యుంచుడి, వారు దేవుని యొద్ద నుండి ఏమి కోరుచున్నారో అడుగుడి, ఇది ఆశ్చర్యమైన సమయము కాదా? మీకు తెలియును, నేను దీనిని చూచునప్పుడు ఈ వైపు చూడండి, విభిన్నమైన సంఘసేవకులు, ఒక్కటిగా చుట్టూ నిలచియున్నారు. పైన కూర్చొని యున్న సోదరీలు లేచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. ప్రభువు నామమును నిలచియున్నందుకు ఆయనకు ఎంతో వందనములు.
131ఇప్పుడు ప్రేక్షకులు, మీలో ప్రతి ఒక్కరు తలలు వంచండి. మీలో ప్రతి ఒక్కరు, మీ హృదయములలో, నాతో మాట్లాడినట్లే దేవునితో మాట్లాడుడి, మీరు వచ్చి సోదరా బ్రెన్హాం, నేను నేను అని మాట్లాడునట్లే దేవునితో మాట్లాడుడి. నీవేదైనను పొరపాటు చేసియున్న యెడల, "నేను చింతించుచున్నాను, సోదరా బ్రెన్హాం నేను. నేను నేను దీనిని చేశాను, దాని నిమిత్తము మన్నించగలవా? సోదరా బ్రెన్హాం నేను నీతో వాగ్ధానము చేయుదును, ఇకపైన నేను దానిని చేయను." నాతో చెప్పునట్లు ఆ విధముగానే ప్రభువైన యేసు క్రీస్తుతో చెప్పండి.
మీకు స్వస్థత కావలంటే నా దగ్గరకు వచ్చి సోదరా బ్రెన్హాం, నేను నేను నశించి పోయాను, ఈ రాత్రి తినుటకు నాకు ఏమీ లేదు. అవును నీ యొద్ద ఒక డాలరు ఉన్నయెడల అది నాకిచ్చెదవని నాకు తెలియును. ఇప్పుడు చూడుము, నీవు దేవునిలో నేరుగా నీకు స్వస్థత శక్తి ఉన్నట్లయిన అని అడుగనక్కరలేదు. ఆయన దానిని కలిగి యున్నాడు. చూడండి. నీవు నాతో చెప్పవలెను, నీవు కలిగి యున్న యెడల అయితే ఆయనతో నీవు చెప్పవలసినది లేదు. నీవు కలిగి యున్న యెడల అని చెప్పనవసరము లేదు. ఆయన కలిగి యున్నాడు! చూశారా? నీవు ఈ విధముగా చెప్పుము. సోదరా బ్రెన్హాం ఒక డాలరు నాకివ్వుము. నేను నేను నేను భోజనము చేయుటకు కావలసి యున్నది. ఎందుకు, బహుశా నేను చేయుదును అని మీకు తెలియును. నేను దానిని కలిగి యుండిన యెడల మీకు దానినిత్తును. నేను ఆ విధముగా చేయలేదనగా నాకు కఠినమైన మనస్సున్నదని అర్థము. నేను క్రూరమైన, పాపపు మనిషిని, మీలాంటి మంచివారికి మంచి హృదయముండును. నేను కఠినమైన మనస్సు కలిగి యుంటే కూడా మీకు ఇచ్చెదను నేనే ఇట్లున్న దేవుడేమైయుండును?
MATT 7:9-11•
LUKE 11:11,13
132మీరు చెడ్డవారై యుండియు మంచి ఈవులనిచ్చుటకు ఎరిగి యుండగా, పరలోకపు తండ్రి మీకు మరి ఎంత ఎక్కువగా తన ఆత్మను మీకిచ్చును. మీరు చేపనడిగిన పామునిచ్చునా? రొట్టె నడిగిన రాతినిచ్చునా? ఖచ్చితముగా ఆ విధముగా చేయడు!
ఎందుకు, మీరు ఆయనను అడిగినట్లయిన, విశ్వాసముతో, నమ్ముచూ అడిగిన యెడల, ఆయన దగ్గర నుండి నీవు అధికముగా పొందగలవు. నేను మీకు సహాయపడుదాని కంటే పదిలక్షల రెట్లు అధిక త్వరితముగా నీవు దానిని దేవుని యొద్ద నుండి పొందగలవు. నేను మీకు సహాయపడగలనని మీకు తెలియును. నేను చేయగలిగినదైనను చేయగలను. మీకు సహాయము చేయుటకు మా వద్ద వున్నదంతయు ఇవ్వగలము. మేము చేయగలిగినదేదైనను చేయగలము. అయితే ఇది మీరు విశ్వసించవలసిన ఒకటై యున్నది.
మనము ప్రార్థించుచుండగా మీరు దానిని పొందెదరని మీరు నమ్ముచున్నారు. ప్రేక్షకులు ప్రార్థించుచుండగా మీరు ప్రార్థించుచుండగా నేను విశ్వసించునదేమనగా, దేవుడు దిగి వచ్చి, మన ప్రార్థనలను గౌరవించును. నీవు దానిని పొందితివను అనుభూతిని పొందిన ఆ క్షణమందే, దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చును. అంతట నీవు ఒక నిబంధనను చేయుచున్నావు. "ప్రభువా, నేను పొరపాటు చేశాను. ఇకపై దానిని చేయను. నేను నా చేతిని ఎత్తుచున్నాను, నేను ఇకపై చేయనని వాగ్ధానము చేయుచున్నాను." మీ మాటను ఆయన అంగీకరించును. నీవు ఆ విధముగానే నమ్మవలసి యున్నది. అది ముగించిపోవును. మీ చేతులెత్తి ఆయనకు వందనములు చేయండి. "ప్రభువా, నేను నా ఒప్పుదలను చేశాను. అది నీదని నాకు తెలియును. నీవు చేయుదునని వాగ్ధానము చేశావు. నీవు తప్పిపోవు."
PS 2:1•
ACTS 4:25
133పరలోకపు తండ్రీ, మేము నీ సేవకులము. ఇక్కడికివచ్చి ముందు నిలచిన వీరు నీ దీవెనలను కోరియున్నారు. ఇప్పుడు నీవు వారిపై శ్రద్ధ తీసుకొవాలని కోరుచున్నారు. తండ్రీ వీరు ఈ వర్తమాన బహుమానములుగా వారున్నారు. వారు ఈ సాయంకాలపు వెలుగు సమయములో ఉన్నారు. ప్రభువా వారిలో అనేకులు, పాపములను ఒప్పుకొనినవారు, కొందరు అధిక అక్కరలో ఉన్నవారు. నేను యేసు నామములో ప్రార్థించుచున్నాను, దేవా, వారిలో ఒక్కరు కూడ విడువబడకూడదు. ఎందుకనగా, నీవు నీ మాటను నిలబెట్టుకొందువు. నేను నీ మాటను జ్ఞాపకమునకు తెచ్చుచున్నాను, ప్రభువా, పేతురు అలాగే చేసెను. ఆ శిష్యులు అపొ. కార్య., 4వ అధ్యాయములో ప్రార్థించినప్పుడు, వారు "ప్రభువా వాక్యమును జ్ఞాపకము చేసికొనుమని ప్రార్థించారు! ఎందుకు అన్యజనులైన ప్రజలు వ్యర్థమైన దానిని యోచించుచున్నారు?"
PROV 28:13•
JOHN 5:24•
JOHN 6:37,40,47
134ఇప్పుడు, తండ్రీ మేము నీ మాటను తెచ్చుచున్నాము. నా యందు విశ్వాసముంచు వారు నిత్యజీవము గలవారు. నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. నా మాట విని నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వారు తీర్పులోకి రాక మరణము నుండి జీవమునకు దాటియున్నాడు.
ఓ, మన కోరికలను దేవునికి తెలియజేయుదము. ఆయన మనకు జవాబిచ్చును. ఆయన అమితముగా తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు వారు మన్నించబడదురు. తన పాపములను కప్పిపెట్టుకొనిన వారు వర్థిల్లరు మన తప్పులను ఒప్పుకొందము. నేను నా ప్రజల తప్పులను ఒప్పుకొనుచున్నాను. నా తప్పులను కూడ ఒప్పుకొనుచున్నాను. నేను కృప కొరకు వేడచున్నాను, స్వస్థత కొరకు వేడుచున్నాను. స్వస్థత కొరకు వేడుచున్నాను. దయ కొరకు, కనికరము కొరకు వేడుచున్నాను. పరిశుద్ధాత్మను కుమ్మరించుమని వేడుచున్నాను. ప్రభువా, వేచి యున్న ఈప్రజలు దేవుని స్వరూపమునకు మార్చబడునట్లు, దేవుని కుమార సారూప్యము వారిలో ఏర్పడునట్లు, ఆయనను జీవింపజేసిన ఆ ఆత్మ వారి శరీరాలలో ప్రవేశించి వారిని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయును గాక. అనుగ్రహించుము ప్రభువా.
ఇప్పుడు నీవు ఇక్కడున్నవాని నమ్ముచున్నాము. నీవు నా వాక్యమును గౌరవించెదవని నమ్ముచున్నాము. వాక్యపు క్రియలను గౌరవించెదవని నమ్ముచున్నాము. ఇప్పుడు ఈ ఆశీర్వాదములను ఇక్కడ బలిపీఠము దగ్గర వేచియున్న వారిపై పంపుము. వారు నీ ప్రసన్నత కొరకు వేచి యున్నారు. యేసు నామమున అడుగుచున్నాము.
135ఇప్పుడు మీరు నమ్మినట్లయిన, మీరు పొందినారని నమ్ముడి. మీ చేతులను దేవుని వైపుకు ఎత్తుడి. దీనిని ప్రార్థనా విశ్వాసముగా మీరంగీకరించినట్లయిన మీరు ఒప్పుకున్న ప్రకారము దేవుని వైపుకు తిరిగి మీ చేతులెత్తుడి.
ప్రేక్షకులందరు లేచి నిలచెదరు గాక. ప్రతి ఒక్కరు, అక్కరలో ఉన్నవారు. దేవునికి విజ్ఞాపన చేయుడి. ఇప్పుడు, నేను విశ్వసించుచున్నాను. నేను దానిని అంగీకరించుచున్నాను. నేను దానిని విశ్వసించుచున్నాను.
ఇప్పుడు మీ చేతులెత్తి ఆయనను స్తుతించుడి అన్నియు జరుగును. దేవునికే మహిమ! ప్రభువైన యేసు, నీ మంచితనము కొరకును, నీ కృప కొరకును, మా కొరకు చేసిన దానికంతటి కొరకును వందనములు చెల్లించుచున్నాము, ప్రభువా. యేసుక్రీస్తు ద్వారా నీకే స్తుతులు చెల్లించుచున్నాము.