యేసుని మేల్కొల్పుట
1సాయంకాల శుభములు. ప్రభువు మందిరములో ఉండుట ఎల్లప్పుడు గొప్ప భాగ్యమైయున్నది. ఇక్కడ ఆర్కాన్సాస్ నుండి వచ్చిన ఈ బాలున్ని చూడటం ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. అతడు నాకు స్నేహితుడైయున్నాడు. చాలా కాలం తర్వాత, క్రిందట సారి నిన్ను కాలిఫోర్నియాలో నిన్ను చూచాననుకొంటాను, అవునా? మై! నీవింకను కాలిఫోర్నియాలోనే వుంటున్నావా? ఇక్కడ? మై! బయటకు వెళ్ళవలసివున్నదని తలంచుచున్నాను. తూర్పున ఉన్నవారంతా పశ్చిమమునకు వచ్చుచున్నారు. మరి, మంచిది, అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది, ఇప్పుడిది మనకు ఆరవ కూటమని అనుకొనుచున్నాను. మరొకవారం వరకు అనగా రాబోయే సోమవారం వరకు మనకి వుండును. ఇప్పుడు, సోమవారం రాత్రి టూసాన్ లో జరిగే విందును గూర్చి మరచిపోవద్దు. మరి అప్పుడు అనగా వచ్చే సోమవారంనాడు మనమొక గొప్ప సమయమును కలిగి వుందుమని ఆశపడుచున్నాము.
2నేడు నేను, సహోదరుడు విల్లియమ్స్ తోను మరియు సహోదరుడు రోజ్ తో మాట్లాడితిని. అప్పుడు నేను అన్నాను, "మీకు తెలుసా, రోగుల కొరకు నేను ప్రార్థించబోవుచున్నాను." ఇంకా అన్నాను," దీనులగు ఆ జనులను ప్రతిరోజు రాత్రి పది లేక పదకొండు గంటల వరకు వుంచుచున్నాను. ఆ విధంగా వుంచుటను బట్టి నిజంగా నేను సిగ్గుపడుచున్నాను." అంత ఎక్కువ సేపు మిమ్ములను వుంచుచున్నందుకు మన్నించండి, అయితే మిమ్ములను ఎక్కువగా నేను చూచే అవకాశము దొరకదు… దానినొక నెపముగా నేను ఎంచుకోట్లేదు, ఎందుకనగా గృహము (బ్రెన్హాం టాబర్నికల్) యొద్ద ఇంతకంటే ఇంకా ఎక్కువ సేపు వుంచుదును, చూచారా. కొన్నిసార్లైతే ఉదయాన్నే, పెందలకడనే ఆరంభించి, మధ్యహ్నం వరకు, ఇంకా కొన్నిసార్లైతే, మరింకా ఆలస్యంగా ముగించెదము. ఒక మంచి సమయమును అనుభవించుటకు మేమా విధముగా ఉండగలిగినంతసేపు ఉండెదము.
3సహోదరుడా గ్రూమర్, నీవిక్కడుండుట మంచిది. అవును, నేను చేశాను. ఒకరకంగా చెప్పాలంటే అతడు నాకు కనబడకుండా దాగినట్లు ఉండెను. అవును కదా? గత సంవత్సరం మేము ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇక్కడే వుంటిని, అవును కదా? ఉన్నానని అనుకొంటున్నాను. స్థలమును, సంఘమును నేను జ్ఞాపకముంచుకొన్నాను. ఈ రాత్రి ఇక్కడుండుట చాలా సంతోషము. దేవుడు మీ అందరిని దీవించును గాక.
4ఇప్పుడు ఈ రాత్రి ప్రభువు రోగులను స్వస్థపర్చవలెనని మేము కోరుచున్నాము. కార్యక్రమాన్ని కొద్దిగా మార్పుచేసాము. నేను వర్తమానం ఇవ్వటం ఆరంభించి, సువార్తను బోధించి నాకు తెలిసినంత మట్టుకు నేనేం చేయాలనుకొంటున్నానంటే, నేను ప్రసంగమును ఆరంభింతును, ఎప్పుడు ముగించవలెనో తెలియదు. ఇంకా కొనసాగించుచూ మిమ్ములను ఎక్కువసేపు వుంచితిని, అయితే చాలా రాత్రుల నుండి బోధించుచున్నాను గనుక కొద్దిగా సమయాన్ని తీసికొని రోగుల కొరకు ప్రార్థించటం మంచిదని భావించుచున్నాను. కాబట్టి దాని కొరకు సిద్ధపాటును కలిగి, ప్రభువు కొరకు ఎదురుచూచుచున్నాము. ఆ విధంగా వుండాలని గతరాత్రి నేను అనుకొన్నాను. ఆయన నిన్ను నడిపించినట్లుగా నీవు నడువవలెను. నీకు తెలుసా, ఏదో నిన్ను కదిలించినట్లు నీకనిపిస్తుంది, ఇక అలా అనిపించినప్పుడే
దర్శనములు రావడం ఆరంభమగును, మరియు అప్పుడు ఏదో నీకు సమీపిస్తుందని నీకు తెలుస్తుంది.
5మరి ఈ రోజు నేను బయటకు వెళ్ళాను… నా హోటల్ గదిలో వున్నప్పుడు, ఫలాని మార్గములో వెళ్ళమని పరిశుద్ధాత్మ నాకు చెప్పెను. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడొక ఈత కొలను వున్నది. ఎవరో చిన్నపిల్లలు అందులో పడి మునిగిపోతున్నారేమోనని తలంచాను. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ కొంత మంది జనులను చూడటం జరిగింది. వారు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని యున్నారు. ప్రభువు అక్కడికి ఎలా వచ్చాడో వారు ఎరిగియుండిరి, మరలాగే ఆయన అక్కడ ఏం జరుగునని చెప్పియున్నాడో, ఖచ్చితంగా అలాగే అది వుండెను. కావున రోగుల కొరకు ప్రార్థించుటకు సరియైన సమయం ఇదేనని నేను ఎరిగితిని.
ఆయన వాక్యమును సమీపించుటకు ముందుగా, మనము ప్రార్థన ద్వారా ఆయనకు సమీపించుదుము. మీరు చాలా మంచి ప్రేక్షకులు. ప్రతి రాత్రి చాలా ఆసక్తిగా వచ్చుచున్నారు. మీలో కొందరు, కొన్నిసార్లు, కూటము ముగించుటకు ముందు గానే వెళ్ళవలసివుండునని నాకు తెలియును. కేవలం కాలక్షేపం కొరకు అలా లేచి వెళ్ళడం కాదని కొందరికి బస్సులందవని, మరికొందరు విధుల కొరకు అలా వెళ్తున్నారని నాకు తెలుయును. దానిని అర్ధం చేసికొన్నాను. ఇప్పుడు ప్రార్థన కొరకు కొద్ది నిముషములు తలలు వంచుదుము. ఇప్పుడు, ఇక్కడ ఎంతమందైతే కూర్చొనియున్నారో, అక్కడ బయట కూడా అంతమంది ప్రజలు నిలబడియుండుటను నేను గమనించాను. మరి మేము చేయగోరుచున్నాము… అన్ని చోట్ల దేవుడు జరిగించినట్లుగానే ఇక్కడ కూడా దేవుడు వారి మనవులను దయచేయునని మనం ఎరిగియున్నాము. ఇప్పుడు మీకు విన్నపములున్నాయా? మీ చేతులను ఎత్తి చూపుట ద్వారా తెలియపర్చుడి. దేవుడు వాటిని వినును.
1JN 2:1
6మా పరలోకపు తండ్రి, ఆయన నామములో మేమిప్పుడు యేసు సన్నిధిలోనికి వచ్చుచున్నాము. దిన దినము నీ విషయములో మేము తప్పిపోవుచున్నందున మా తప్పిదములను క్షమించుమని అడుగుటకు మేమిప్పుడు కృపా సింహాసనమును సమీపించుచున్నాము. మా జీవితములోని ప్రతిక్షణం, మా మార్గములలో ఆగి, "ప్రభువా, నన్ను మన్నించుము. దానని ఆ విధముగా చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు… దీనిని మరొక విధముగా, నీ కిష్టమైనట్లుగా నేను చేసియుండవలసివున్నది," అని చెప్పెదము. ప్రభువా, నీవెల్లప్పుడు కనికరము గలవాడవు, నీ పిల్లలను క్షమించుటకు సిద్దమనస్సు గలవాడవని మేము ఎరుగుదుము. సొమ్మసిల్లిన వారి మొర్రను నీవు వినుము. ఉత్తరవాది మాకున్నందుకు మేము సంతోషించుచున్నాము.
తండ్రి, ఈ రాత్రి ఈ సంఘము కొరకు, మా ప్రియమైన సహోదరిని కొరకు ప్రార్థించుచున్నాము. ఈ సంవత్సరములన్నిటిలో, అతనిని ఒక అద్భుతమైన క్రీస్తు సేవకునిగా ఎరిగితిమి మరియు అతని యొక్క వ్యక్తిత్వమును కనుగొంటిమి. అటువంటి ఒక వ్యక్తి కొరకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, అతనితోను మరియు అతని జనులతోను వుండుటయు, వారితో కలసి స్నేహము చేయుట, దేవుని వాక్యము చుట్టు వారితో కలసి వచ్చి సహవాసము చేయుట ఒక చక్కని అవకాశముగా వున్నది. ప్రభువా, ఈ రాత్రి నీ ప్రవాహమును మా మధ్య ఉధృతంగా ప్రవహింపజేయుమని, మరియు ఈ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. పరిచర్య ఆరంభమందు ఏళ్ళక్రితం నుండి నేనెరిగియున్న పాత స్నేహితులను కలుసుకోటం చాలా సంతోషంగా వుంది.
మరిప్పుడు, ప్రభువా, క్రీస్తునందు ఉన్నత స్థలములలో ఈ రాత్రి మేము కూడుకొనియుండగా, మమ్మును దీవించమని ప్రార్థించుచున్నాము. ప్రభువా, కేవలం అందుకొరకే మేము కూడుకొనియున్నాము, ఈ రాత్రి మా అక్కరలను తీర్చుమని నీతో మేము విన్నవించుకొనిన మనవులను దయచేయమని ప్రభువా, ప్రార్థించుచున్నాము, రోగులను స్వస్థపర్చుము, నశించినవారిని రక్షించుము, క్రుంగినవారిని ధైర్యపర్చుము, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
7ఇప్పుడు, మీరు, ధన్యకరమైన పురాతన వాక్యమును, పరిశుద్ధ మత్తయి సువార్తలో నుండి, 8వ అధ్యాయమునకు మీరు మీ బైబిల్ ను త్రిప్పవలెనని కోరుచున్నాము. మత్తయి 8వ అధ్యాయము, 23వ వచనము నుండి నేటి ధ్యానవాక్యముగా ఆరంభించుదుము.
సహోదరుడు నుండి… లేదా సహోదరుడు విల్లియమ్స్ మరియు సహోదరుడు జూవేల్ రోజ్ యొద్ద నుండి సెలవు తీసికొని వెళ్ళిన తరువాత, నా దృష్టి ఒక అంశం మీద పడింది. కావున అక్కడికి నేను చేరుకోగానే దీర్ఘముగా మేము బోధించుచున్నందు వలన పరిశుద్ధాత్మ మమ్మును చాలా దగ్గరగా సమీపించెను. వారు మమ్మును విడిచివెళ్ళిన తరువాత నేను అనుకొన్నాను, "ఓ, మై! ఇప్పుడు ఆయన నిశ్చయముగా మాట్లాడును." బైబిల్ గ్రంథములో జరిగియున్న సంఘటన ఒకటి నా మదిలో వచ్చియున్నందున, వెంటనే దాని వైపుగా బైబిల్ ను త్రిప్పాను. కొద్దిపాటి లేఖనములు నా యొద్దవున్నవి. వాటిలో నుండి నేను నా అంశమును కొంత పాఠ్యాంశములను నేను తీసికొనియున్నాను. వీటిని మీకు అందించగోరుచున్నాను.
MATT 8:23-27
8మొదటిగా, పరిశుద్ధ మత్తయి సువార్త 8వ అధ్యాయం, 23వ వచనం నుండి చదువనారంభింతుము. మత్తయి 8:23 - 27
ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి.
అంతట సముద్రము మీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా,
వారు ఆయన యొద్దకు వచ్చి - ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
అందుకాయన - ఆల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రముమ గద్దింపగా మిక్కిలి విమ్మళమాయెను.
ఆ మనుష్యులు ఆశ్చర్యపడి - ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
ఇదొక చిన్న అద్భుతమైన అంశంగా, లేదా లేఖనముగా వున్నది. దీనిలో నుండి ఒక వింత అంశము నేను తీసికొనుచున్నాను - "యేసును మేల్కొల్పుట." యేసుని మేల్కొల్పుట.
ACTS 19:4•
HEB 11:6
9ఆయనకు ఇదొక గడ్డు దినమైయుండొచ్చును. ఆయన అలసిపోయాడు. ఆయన శరీరము చాలా అలసట చెందియుండెను. మీకు తెలుసా, ఆయన సాగిపోతుండగా జనుల ఆయనలో నుండి దేవున్నిలాగుచున్నారు. ఆయనలో నుండి వారు తమ యిచ్చలను పొందుకొంటున్నారు. దానిని వారు చేసినప్పుడు… సూక్ష్మముగా దానిని మనం వివరించబోవట్లేదు, ఎందుకనగా ఏ ఒక్కరు దానిని చేయజాలరు. మనకు తెలియని వాటిని మనమెలా వివరించగలం?
ఆ కారణము చేతనే దేనినైతే నీవు వివరించలేవో, దాన్ని అంగీకరించుటకు సిద్ధపడనంత వరకు నీవు రక్షింపబడలేవు. "ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను." నీవు దానిని నమ్మవలసివుండెను. ఇప్పుడు, సైన్స్ పరంగా దానిని రుజువు పర్చుటకు మార్గమే లేదు, అయినను దానిని నీవు తప్పక నమ్మవలసివుంది. ఒకవేళ దానిని నీవు రుజువు చేసినట్లైతే, అది ఇక ఎంతమాత్రం విశ్వాసకార్యముగా వుండలేదు. మరి విశ్వాసము… చూడనప్పటికిని, ఆయన ఉన్నాడని నీవు నమ్మేటంతవరకు దేవుడు తన్నుతాను నీకు మరుగుచేసికొనును. నీవు చూచినను లేక చూడకున్నను, నీవు దాన్ని నమ్ముము; ఎలాగైనా సరే నీవు నమ్మితీరాలి.
ROM 10:17•
GAL 5:22
10ఇప్పుడు, అదొక అద్భుతమైన కార్యమని నేననుకొనుచున్నాను. విద్యలేని పామరులగు నావంటి ప్రజలకు, అలాగే ప్రతి ఒక్కరికి నమ్ముటకు అది ఒక అవకాశము నిచ్చుచున్నది, ఎందుకనగా దానిని మనం వినుచున్నాము. "వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని వాక్యము వినుట వలన కలుగును." అలా విన్నప్పుడు దానిని అంగీకరించెదము, దానిని నమ్మెదము. దానిని మనం ఆధారం చేసికొనుటవలన, అనగా విశ్వాసము వలన మనం రక్షించబడితిమి, స్వస్థపడితిమి. మరి అదేకాదు గాని దేవుని నుండి మనం పొందిన ఏదైనా సరే అదృశ్యమూలాలలో నుండే వచ్చియున్నది.
క్రైస్తవులకు, క్రైస్తవ్యమునకు సర్వాంగ కవచము విశ్వాసమే. మనము కలిగియున్న ప్రతి ఒక్కటి అదృశ్యమైనదే. కేవలం అదృశ్యమైనవి, అగోచరము (వివరింపజాలవన)వి మాత్రమే వాస్తవములై వుండెను. ఏవైతే వివరింపగలిగినవో, అవి వాస్తవములే కావు. అవి కేవలం బూటకం (వట్టిది), మరియు మృతమైనవి. కేవలం వివరింపజాలనివి మాత్రమే అక్షయమైనవి, కనబడని లోకం (ప్రపంచం) నశింపజాలనది. క్రైస్తవ్యము యొక్క కవచమును చూడుము. ప్రేమ, నీలో ఏభాగం అదైవున్నది? ప్రేమ, సంతోషం, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళత్వము, సహనము - చూచారా? వీటిలో ఏ ఒక్కదానిని నీవు కంటితో చూడలేవు. అవి అదృశ్యమైనవి, అయినను మనం వాటిని చూడనప్పటికినీ వాటిని నమ్ముదుము. ప్రేమకు నశియింపు (మరణం) అనేది లేనేలేదు. విశ్వాసము అనేది విజయమునైయున్నది. మనము కనబడని వాటిని నమ్మెదము.
2COR 5:19
11ఇప్పుడు, యేసులో దేవుడువుండెను. "క్రీస్తులో దేవుడు వుండి, లోకమును తనతో సమాధానపరుచుకొనుచుండెను." ఈ ప్రజలు ఆయన యొక్క సాక్ష్యమును నమ్మెను. నిజముగా దానిని నమ్మినవారందరు ఆయనలో నుండి దైవుని యొక్క దీవెనలను పొందుకొనెదరు. దానిని వారు చేసినప్పుడు ఆయన చెప్పెను ప్రభావము తనలోనుండి వెడలిపొయినది అని. ప్రభావము అనగా బలము (లేక) శక్తి. మరొక మాటలో చెప్పాలంటే ఈ దినమున కూడా జనులు ఆయనలో నుండి దేన్ని పొందినా ఆయన నీరసపడును. మంచిది, అది అలాగునే మానవ శరీరమందు ఆలాగున అది పనిచేసియున్నట్లైతే, అది మరొక మానవ శరీరమందు కూడా పనిచేయును.
మనమందరము మన చుట్టూ వుండే వాతావరణంను మనమే కలుగజేసికొంటాము. నీవు ఎంతో చక్కని జనుల దగ్గరికి వెళ్ళావు, కాని వారితో వుండటం నీకు కష్టంగా నీకువుండెను. ఆ తరువాత మరొక రకమగు జనుల యొద్దకు వెళ్ళితివి. మరి వారితో వుండుటకు నీకు ఎంతో యిష్టంగా వుండెను. ఆ విధమగు వాతావరణమును నీవే కలుగజేసికొనెదవు. ఓ, కొద్దిగసేపు యేసుతో వుండుటను నీవు ఇష్టపడుటలేదా? అద్భుతం ఏ రకమగు వాతావరణమును ఆయన కలుగజేసియుండెననో, అనే దానిని ఊహించుచున్నాను. అది ప్రేమ, గౌరవము మరియు దైవిక భయముతో కట్టబడిన పెద్దమూట కట్టయైయున్నది.
ఇప్పుడు, తరచుగా ప్రజలు చెప్పేదానిని నేను విందును…
12మీలో అనేకులు, నేనిప్పుడు అరిజోనా లో ఎందుకు నివాసముంటున్నానో, దాని గూర్చిన టేపులు ఇప్పటికే విని యుందురని అనుకొనుచున్నాను. మరి అది… ఓ మై! ఒకవేళ వినకపోతే, "అయ్యలారా! ఇదేనా ఆ సమయం?" అనే వర్తమాన టేపును, మా వద్ద కొనుక్కోవాలని మిమ్మును కోరుచున్నాను. ఇప్పుడు, అవి నావి కావు. మనతో పనిచేసే మరొక కంపెనీకి చెందినవిగా అవి వున్నవి. అవి నావి కావు, కావున… అయితే ఆ బాలుని యొద్ద అవి అందుబాటులో వున్నవని నేనెరుగుదును.
13నాకు అట్టి విధముగా ఎన్నడు జరిగివుండలేదు. దానిని నేనెన్నడు వారిలో కొందరన్నారు, "దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, ఫలాని, ఫలాని దానిని నీవెందుకు ఆయనను అడుగకూడదు?" అది నీవు అనేదాని కంటే వ్యత్యాసమైనది… చూచారా, దేవుని యొక్క శక్తిని దేవుని ఆశీర్వాదములుగా అనేకులు అందురు. అయితే దేవుని శక్తి, దేవుని ఆశీర్వాదము, అనేవి ఒకటి కాదు. ఆయన సన్నిధిలోకి నీవున్నప్పుడు దేవుని శక్తి నిన్ను కమ్ముకొన్నప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. కేవలం నీవు… ఆయన సన్నిధిలో నీవు వున్నప్పుడు మొద్దుబారుపోయినట్లు నీవుండిపోతావు రెండు రోజుల పాటు నా తల, నా శరీరం తిమ్మిరైనట్లుగా వుండెను. నా భావోద్రేకములన్ని స్థంబించినట్లుండెను. నిజముగా మొద్దుబారినట్లు వుండెను. ఆ పర్వతం మీద నుండి ఆరోహణమైనప్పుడు, దూతలగుంపు నన్ను సంధించినప్పుడు, అది నాకు నిజంగా భయకంపితముగా వుండెను. ఆ ఏడుగురు దూతల గుంపు ఇక్కడే నిలిచినప్పుడు, కేవలం నిలిచియున్నప్పుడు, నన్ను నేను చూచుకొన్నట్లుగానే నేను వారి వైపు చూచుయుంటిని. "ఓ అంతేనా?" అని నీవు తేలికగా అనుకోవచ్చును. కాని అది అంత తేలికైన విషయం కాదు. నిజంగా నీవే గనుక అక్కడ వుండి చూచిన్నట్లైతే, అది పూర్తిగా భిన్నంగా వుండును.
MARK 5:2•
LUKE 8:22,27
14మరిప్పుడు, ఇమ్మానుయేలుగా ప్రభువైన యేసు శరీరమందు ఆలసట చెందెను. ప్రభావము ఆయనలో నుండి తొలగిపోయెను. చేయుటకు పెద్దపని ఆయన యెదుట వుండెను. మరుసటి దినమున ఆయన అవతలి వైపున వున్న గదరేనీయుల దేశమునకు వెళ్ళి పిచ్చివానిని కనుగొని బాగుచేసెనని మనందరికి తెలుసును. దోనె గలిలయ దాటుచున్నప్పుడు, బహుశా కొంత విశ్రాంతి కొరకు ఆ సమయములో కొద్ది విశ్రాంతి తీసికోవాలని ఆయన అనుకొన్నాడు. సాధారణముగా ఎవరైనా అలాగే చేతురు.
ఆయనతో కలసి వారు దోనెలోనికి ప్రవేశించిరి. ఆయనను లోనికి తెచ్చిరి. అవతల గట్టున ప్రకటించుటకు వారు దోనెలో సముద్ర ప్రయాణం సాగించిరి. మానవునిగా ఆయన ఎంతో అలసిపొయి, బలహీనమై, ఆ సమయమందు కొంత విశ్రాంతిని తీసికొనగోరెను. శరీరములో వున్న ఆయన అప్పుడు అక్షయుడు కాదు. ఆయన ఒక మనిషి, గనుక ఆయన మరణించవలసియున్నది. ఆ కారణము చేతనే మరణించుట కొరకు దేవుడగు ఆయన మనిషిగా రావలసివచ్చెను.
ఇప్పుడు, అక్కడ అలసిపోయి, నిద్రించుచుండెను. ఆయన శిష్యులు తెడ్లు వేసి, తమ ప్రయాణంను సాగించిరి.
15ఆ దినములలో, సముద్రంలో ప్రయాణించునప్పుడు గాలులు బలముగా వీచినట్లైతే, వారు తాము వెళ్ళు దోనె యొక్క దిశను మార్చి ఇంకా తెరచాపలను దించుదురు, తద్వారా అది ముందుకుసాగును. కొన్నిసార్లు అది బాగా నెమ్మదిగా నడుస్తున్నట్లైతే, వారు తమతో తీసికెళ్ళిన తెడ్ల సహాయంతో దానిని ముందుకు నడుపుతారు. తెరచాపలతో కూడా వారు ఒక మంచి సమయమును కలిగియుందురు. ఒకవేళ అది పెద్ద దోనె అయినట్లైతే ఎనిమిది లేక పదిమంది కలిసి తెడ్డు వేయుదురు. దోనె వెనుక వైపున కొందరుండి తెడ్డును వేయుదురు. మరలాగే దోనె వెనుక మరొకరుండి చుక్కాని యొక్క బాధ్యతను తీసికొందురు. తెడ్డును వేయుచున్నప్పుడు చుక్కానిని వేసి, తెడ్లతో లాగుచుందురు.
16ఇప్పుడు, వారు తమ ప్రయాణమునకు బయలుదేరినట్లుగా ఊహించుకొందుము, అయితే కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాటి గాలులు వీచుట ఆరంభమైనవి. గలతీయ సముద్ర తీర ప్రాంతములోకి వారు ప్రవేశించిరి — అయితే అక్కడ మరి కొద్ది లోతుల్లో ఏ సమయములోనైన ఏదైన జరుగవచ్చునని ఎవ్వరికైనా తెలుసును. కావున వారి దోనె దానిని దాటుచు ముందుకు సాగిపోవుచున్నది. యేసు ఆ దోనె యొక్క అడుగు-భాగమునకు వెళ్ళి, అక్కడ అమరము మీద తలవాల్చి, ముడుచుకొని పడుకొనియుండెను. రాబోతున్న కూటము కొరకు అక్కడ ఆయన కొంత విశ్రాంతిని పొంది, తిరిగి బలమునొందుటకు నిద్రించుచుండెను.
ఆయన చేసిన దానిని చూచుటను బట్టి శిష్యులు ఒకరితో ఒకరు ఎంతగానో ఆనందించుచుండెను. వారికి అదొక అద్భుతమైన సమయముగా వుండివుండొచ్చును, ఎందుకనగా వారు జరిగిన వాటిని గూర్చి ఒకరితో ఒకరు సాక్ష్యం పంచుకొనుచుండిరి. బహుశా వారు ఆయన చేసిన కొన్ని కార్యములను గూర్చి సంభాషించుకొనుచుండిరి.
JOHN 6:31,48,49,58•
JOHN 8:52,57,58•
HEB 13:8
17మరి ఇప్పుడు కొద్దిగ ఆగి, వారి సంభాషణలను విందుము.
"నేను ఉన్నవాడను అనువాడను," అని ఆయన చెప్పిన చోటును గూర్చి వారు సంభాషించుకొనుచుండిరి.
దానిని ఆయన అన్నప్పుడు… వారు చెప్పుకొనుచున్నారు, "మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి, మోషే నాయకత్వం క్రింద," మరియు యేసు చెప్పెను, "వారిలో ప్రతి ఒక్కరు నశించిపోయిరి." [వారిలో కేవలం ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశములోనికి ప్రవేశించిరి. వారే యెహోషువా, కాలేబు.] "వారందరు చనిపోయిరి, అయితే నేను పరలోకము నుండి దిగివచ్చిన, దేవుని నుండి వచ్చిన జీవాహారమునైయున్నాను." ఈ రొట్టెను తిను మనుష్యుడు ఎన్నడును చనిపోడు. మార్పు, అది తేడాగా వుంది. ఆయన ఏలాగున ఆహారం కాగలడు? బహుశా వారి సంభాషణ అలా సాగిపోయినట్లుండెను. మరి వారు దాన్ని గూర్చి ఇంకా చర్చించుకొనియుండిరి.
బహుశా ఈ రాత్రి స్వస్థత కూటము కొరకు ఇక్కడ మీలో క్రొత్తవారు ఉండి ఉందురు, అని నేను అందును. వారు అన్నారేమో… ఇప్పుడు, మండుచున్న పొదలో ఉండి 'నేనే' అని పలికినది తానేనని ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎందుకనగా వారన్నారు, "నీకింకా యేబది సంవత్సరములైనా లేవే, నేను అబ్రాహామును చూచియున్నానని అనుచున్నావు. నీవు పిచ్చివాడివని మాకు తెలియుచున్నది." [చూచారా, పిచ్చి అనగా మతిస్థిమితం-లేనివాడు అని అర్ధం.] దానిని ఆయన చెప్పినప్పుడు ఆయనకి ముప్పది ఏళ్ళ ప్రాయము. "నీకు యేభై ఏళ్ళు కూడా లేవే, అబ్రాహామును చూచితినని నీవేల చెప్పచున్నవు? నీవు పిచ్చిపట్టినవాడవని మేము ఎరుగుదుము," అని వారన్నారు, చూచారా.
కాని ఆయన చెప్పెను, "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను." ఓ, మై! ఆయన అబ్రాహామును చూచుట మాత్రమే కాదు గాని, అబ్రాహాము పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. 'నేను ఉన్నాను' అని ఆయన అప్పుడు ఎలాగైతే పలికియున్నాడో, మరిప్పుడును ఆలాగే 'నేను ఉన్నాను' అని పలుకుచున్నాడు. ఇప్పుడు, గమనించండి, 'నేను ఉన్నాను' అనేది నేను ఉంటిని, లేక నేను ఉండబోతాను అనేది కాదు. భూత, భవిష్యత్, వర్తమానం అను మూడు కాలములలో ఆయన 'నేను ఉన్నవాడను' అనే దానిని చెప్పుచున్నాడు. నిన్న, నేడు, నిరంతరము, నేను ఉన్నవాడను.
18దాని తర్వాత వారు ఇలా అనివుందురు, "మంచిది, ఇదిగో ఇక్కడ ఆయనే మెస్సీయ అని, చెప్పుటకు ఒక కారణం వున్నది, దానిని బట్టియే ఆయన మెస్సీయా అని చెప్పొచ్చును, ఎందుకనగా మనమెరుగుదుము [ఇప్పుడు, ఆయన నిద్రకు ఉపక్రమించెను.] … "ఆయన ఖచ్చితముగా మెస్సీయ అయివుండవలెను, ఎందుకనగా మెస్సీయ వచ్చినప్పుడు, ఫలానివి ఆయన చేయునని మనకు లేఖనములు ద్వారా చెప్పబడియున్నవి." ఇప్పుడు, అది ఎవ్వరికైనా సరే చక్కని వేదాంత శాస్త్రమునైయున్నది, అది ఒక ఆరోగ్యకరమైన, చక్కని సనాతన బోధయైయున్నది. దానినే నేను గతరాత్రి ఆ యొక్క వేదిక మీద చెప్పుటకు ప్రయత్నించితిని. ఎప్పుడు కూడా ఉద్రేకములను బట్టి తీర్పు తీర్చకుడి, కాని వాక్యమును బట్టియే తీర్పు తీర్చుడి. ఏదైనా సరే వాక్యములో వుండవలసివుంది. ఇప్పుడు, వాక్యమును గమనించుడి, మరియు వాక్యము ఏమి చెప్పుచున్నదో దాన్ని బట్టియే అది సరియని గ్రహించుడి, ఎందుకనగా దేవుడే దానిని చెప్పియుండెను. వాక్యము చెప్పినదే నిజమగును. ఇప్పుడు మరి ఆయనను వాక్యమును బట్టియే వారు బేరీజు వేయుచున్నారు.
NUM 12:6•
DEUT 18:18,19,22
19ఇప్పుడు, ఆయన మెస్సీయానో కాదో అనే దానిని తెలిసికొనుట కొరకు నీవు ధర్మశాస్త్రమును తెచ్చిన మనిషి యొద్దకు వెళ్ళవలసియున్నది. దానిని ఇచ్చింది దేవుడే, కాని ఆ పర్వతము మీద దేవుని నుండి దానిని మోషే తీసికొని వచ్చెను. ఒక దినమున తాను వారిని విడిచి వెళ్ళెదనని వారితో చెప్పెను, "దేవుడు తనవంటి ఒక ప్రవక్తను, తన వలె వుండే ఒకనిని లేపునని ధర్మశాస్త్రము నిచ్చువాడును, ఒక రాజు ప్రవక్తను లేపునని మరి ఈ ప్రవక్తను తృణీకరించు ప్రతీ ఒక్కడు జనములో నుండి కొట్టివేయబడును."
యేసు రంగము మీదకు వచ్చినప్పుడు, దానిని వారు ఆయలో గమనించారు… లేఖనములన్నిటిలో, వారు ఒక ఆజ్ఞను కలిగియుండిరి, యూదులు దానిని కలిగియుండిరి. మీ మధ్య ఆత్మసంబంధియైనను ఒక ప్రవక్తయైనను వున్నయెడల యెహోవానగు నేను దర్శనములో అతనికి నన్ను నేను కనపరచుకొందును. అతడు చెప్పినది నెరవేరినట్లైతే అతడు చెప్పినది దానిని వినుడి, ఎందుకనగా నేను అతనితో వుందును. ఒకవేళ అతడు చెప్పినది నెరవేరనట్లైతే, అతడు చెప్పిన దానిని వినవద్దు. అది ఆయన విదానం. అది న్యాయబద్దమైనది, మరియు వివేకమైనది.
JER 27:9,14•
JER 28:2,3,6,9-11
20ఒకసారి మనిషి ఒకడు రంగం మీద నిలిబడెను - అతడే యిర్మియా, అతడొక పెద్ద ప్రవక్త - 70 సంవత్సరముల పాటు యూదా వారు బబులోనుకి కొనిపోబడి 70 సంవత్సరముల పాటు అక్కడ ఉందురనే దానిని ప్రభువు అతనికి సెలవిచ్చెను. అతడు ఇలా అన్నాడు, "ప్రభువు సెలవిచ్చిన దానికి విరుద్ధముగా పలికే ఏ ప్రవక్త మాటను గాని, లేక ఏ కలలుగనే వాని మాటగాని, లేక మరే ఒక్కరి మాటను గాని మీరు వినవద్దు; ఎందుకనగా అలా చెప్పుట వలన అతడు మీ మీద కాడిని మోపుచున్నాడు." మరి హనన్య… ఇప్పుడు, హనన్య కూడా ఒక ప్రవక్తయైయున్నాడు. అంతేకాక, అతడొక ప్రవక్త కొడుకైయున్నాడు — అతని తండ్రి కూడా ఒక ప్రవక్త. అతడు ప్రేరణ క్రింద వచ్చి, ఆ కాడిని తన మెడ మీద వేసికొని, దానిని విరగగొట్టి ఇలా అన్నాడు. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, రెండు సంవత్సరములలో వారు తిరిగి వత్తురు." ఆ మాటలకు ప్రజలు చప్పట్లు కొట్టిరి. మై, అది వారికి సరిగా అనిపించింది. కావున వారు హనన్య చెప్పిన దానిని వినగోరిరి; కాని అది వాక్యమునకు విరుద్దం. అది వాక్యానుసారముగా లేదు, మీరు చూచారా.
కావున యిర్మియా, అతడిలా చెప్పెను, "హనన్యా, ఆమెన్, నీవు పలికిన మాటలను ప్రభువు నెరవేర్చును గాక. కాని ఒక మాట, మనకు ముందుగా కూడా ప్రవక్తలుండిరి. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు అతడు తెలియబడును…" ప్రవక్త తాను చెప్పిన ప్రవచనం నెరవేరుటను బట్టి అతడు ప్రవక్తగా తెలియపర్చబడును.
21కొంతమంది ఇండియన్ మిత్రులు ఇక్కడ కూర్చోటం నేను గమనించాను. కొంతకాలం క్రిందట, అనగా ఇండియన్ల యొక్క క్రైస్తవ దినముల ఆరంభమందు జరిగిన వాటిని వారి చరిత్రను చదువుచుంటిని. సజీవంగా బ్రతకాలంటే వారు క్రీడను ఆపకూడదు. వారి మధ్యలో నుండి ఒక ప్రవక్త లేచి, క్రీడ ఎక్కడ ఆగిపోయెనో అనుదానిని వారితో చెప్పి ప్రవచించినయెడల, అతడు వారి మీద అధికారి అగును. అయితే అతడు అబద్దమును చెప్పినయెడల, ఇక అదే అతనికి జీవితపు ముగింపుగా వుండును. అతని ప్రాణంను తీసివేయుదురు. ఇక ఏ మాత్రం జీవించలేడు.
JER 28:9,15,16
22మంచిది, దేవుడు చేయునది కూడా అలాగే వుండును. దేవుడు యిర్మియా సెలవిచ్చెను, "హనన్యా అబద్దమును పలికెను. నేనెన్నడు అతనికి సెలవియ్యలేదు. [చూచారా, ఆయన సెలవిచ్చిన వాక్యమునకు అది విరుద్దంగా ఉండెను.] "సంవత్సరం తిరిగేలోపే అతడు భూమి మీదనుండి తీసివేయబడును." ఏడవ నెలలోనే అతడు చనిపోయెను. భూమి మీదనుండి అతనిని ఆయనే తీసివేసెను. ఇప్పుడు, మీరు చూడండి, అతడు ప్రేరేపించబడినప్పటికి, అది వాక్యమునకు విరుద్దముగా వుండెను. ఒక బోధకుడు ఎంత గట్టిగానైన ప్రసంగించవచ్చును, దానిని ఎంత అందముగానైన అతడు చూపించ వచ్చును, అయితే అది వాక్యమునకు విరుద్దముగా వున్నట్లైతే, దానిని అక్కడే విడిచివేయుము. దానిని నుండి దూరముగా తొలగిపొమ్ము, అంతే.
అది వాక్యము, అది దేవుని యొక్క ప్రణాళిక - ఇది వరకు ఆయనేమైయున్నాడో, ఇప్పుడేమైయున్నాడో, ఇకముందు కూడా ఆయన ఏమైయుండునో అనే పూర్తి ప్రత్యక్షతయే. వాక్యము యేసుక్రీస్తు యొక్క నిరంతర ప్రత్యక్షతయైయున్నది. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతయే ఈ బైబిల్ అయి యున్నది. ఆయనకు విరుద్దంగా దీనిలోనుండి ఏదియు బయలుపడదు. ఒకవేళ ఒకప్పుడు ఆయన ఒకరకంగాను, ఇప్పుడు మరో రకంగాను ఆయన ఉన్నాడని ఎవరైనా అన్నట్లైతే, దానిని మీరు నమ్మవద్దు! వాక్యము ఆయన ఏమైయున్నాడని చెప్పినదో, ఆయన అలాగే వుండును, అది వాక్యము, చాశారా.
23ఇప్పుడు ఈ శిష్యులు మరో సంగతిని గూర్చి మాట్లాడుతున్నట్లుగా మనం కనుగోగలము. బహుశా పేతురు ఇలా అనివుండొచ్చును, "మీకు తెలుసా, నేను ఆలోచించుచుండగా, మా తండ్రి చెప్పిన ఒక సంగతి నాకు గుర్తుకు వచ్చుచున్నది. అదేమనగా ఒకానొక రోజు గొప్ప గందరగోళము పుట్టును, మెస్సీయా రాకకు ముందు ఎల్లప్పుడు అబద్దపు మెస్సీయాలు వచ్చెదరు. మరియు ఇంకా మా తండ్రి ఇలా చెప్పెను, "కుమారుడా, ఒక్క విషయమును గుర్తుపెట్టుకొనుము, మనము యూదులం, మనము దేవుని ఎన్నికలో వున్నవారము. మన పరలోకపు తండ్రి వలన మనకొక ఆజ్ఞ ఇవ్వబడెను, అదేదనగా మెస్సీయా ఒక ప్రవక్తగా వుండును. ప్రవక్తను గుర్తుంచు ఒకే ఒక కార్యమేదనగా, అతడు వాక్యము పలుకును, అది నెరవేర్పులోనికి వచ్చును. తద్వారానే అతడు మెస్సీయాగా మనం తెలిసికోగలుగుదుము."
MATT 2:2,9•
MATT 3:11,14,16•
MARK 1:10•
LUKE 3:22•
JOHN 1:32•
ACTS 9:3
24ఒక దినాన యోహాను - ఆయనే మెస్సీయా అని ఆయన గూర్చి బహిరంగముగా ప్రకటించినప్పుడు, బహుశా అంద్రెయ దానిని విని చూచి, తన సహోదరుడగు పేతురుకు తెలపగా అతని యొక్క ఆహ్వానం మేరకు పేతురు ఆయన సన్నిధిలోకి నడిచివచ్చెను. మరి యెహాను దేవుని ఆత్మ దిగివచ్చుటను చూచెను, స్వరము పలుకుటను వినెను. అతను తప్ప మరెవ్వరును దానిని చూడలేదు, స్వరమును వినలేదు. కేవలం అతను మాత్రమే అక్కడ వేలాది మంది నిలిచి యుండిరి, కాని కేవలం యెహాను మాత్రమే దానిని చూశాడు. స్వరమును విన్నాడు. అది అతని కొరకే పంపబడి యుండెను. "యెహాను సాక్ష్యమిచ్చెను, అదేమనగా దేవుని ఆత్మదిగి రావడము, పరలోకములో నుండి స్వరము రావడము."
వెలుగు తన చుట్టూ ప్రకాశించుట వలన పౌలు గ్రుడ్డితనము చేత మొత్తబడెను, అయితే ఆ వెలుగును అతడు తప్ప మరెవ్వరు చూడలేదు. అది అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసేటంత వాస్తవముగా పౌలునకు వుండెను. దూరములోనున్న బబులోనులో నుండి నక్షత్రము చేత నడిపించుట వలన జ్ఞానులు నడిపించబడిరి. నక్షత్రములను బట్టి వారు కాలములను నిర్ణయించుదురు. ప్రతీ నక్షత్రశాలను దాటుకొనుచు వారు ప్రయాణించిరి, అయితే వేరేవారు ఎవ్వరు కూడ దానిని చూడకపోయిరి. ఆ నక్షత్రము కేవలం జ్ఞానులకు మాత్రమే కనబడెను. ఎవరిని ఎన్నికోవాలో వారినే దేవుడు ఎన్నిక చేసికొనును. ఏది చేయాలని ఆయన ఇష్టపడునో దానినే ఆయన చేయును. ఆయన దేవుడు. తన వాక్యమునకు విరుద్దముగా ఆయనేమి చేయడు. ఆయన ఎల్లప్పుడు తన వాక్యమునకు కట్టుబడి ఉండును.
JOHN 1:42
25ఇప్పుడు. దోనె అమరమున ఆయన నిద్రించుచుండగా, సీమోను తెడ్డును వేయుచూ, ఇలా అని వుంటాడు, "నేను ఆయన సన్నిధిలోనికి నడిచి ఆ సరస్సులో వెళ్ళినప్పుడు, ఆయన నాతో అన్నాడు, నీ పేరు సీమోను, మరి నీవు యోనా కుమారునివి. ఇక అంతే, నిశ్చయముగా ఆయనే నిజమైన మెస్సీయా అని, నాకర్ధమైంది, ఎందుకనగా అదివరకు ఎన్నడు ఆయన నన్ను చూడలేదు, అయినప్పటికి వాస్తవమును సరిగ్గా ఆయన నాకు తెలియబర్చాడు."
నతానియేలును రాబట్టుటలో పిలిప్పుకు ఒక సాక్ష్యము వున్నది, ఎందుకనగా అతడు ఆయన యెదుటకి రాకమునుపు తాను ఎక్కడ వున్నాడో అన్న సంగతి ఆయన చెప్పియుండెను. ఈ విధంగా వారు ఇంకా ఎన్నో సంగతులు ముచ్చటించుకొనుచుండిరి. వారు అలాగే బావి యొద్దనున్న స్త్రీని గురించి కూడా మాట్లాడియుండవచ్చును. మరలాగే వారు గ్రుడ్డివాడైన బర్తమయి గురించి కూడా మాట్లాడియుండవచ్చును. వాడు ఆయనకు సుమారు వంద అడుగుల దూరంలో వుండి ఆయనను తాకియుండెను. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీ! ఆయనే మెస్సీయా అని ఇవన్ని నిరూపించుచుండెను. ఎంత అద్భుతమైన సమయమది!
26ఇప్పుడు, మరలాగే ఆయన యెడల ప్రజలకున్న వైఖరి గురించి కూడా వారు మాట్లాడుకొనియుండవచ్చును. (వారు ఇలా సంభాషించుకొనుచు ఆ సరస్సును దాటుచుండిరి.) వారిలో ఆయనను కొందరు నమ్మిరి, మరికొందరు నమ్మలేదు. సరిగ్గా ఈ దినము కూడా అది అంతే వుండెను. కొందరు దీనిని నమ్మిరి. అది ఎంత సామాన్యముగా రుజువుపర్చబడినప్పటికి కొందరు నమ్ముటలేదు. కొందరు చాలా ఆత్మీయులు, వారు దీనిని విన్నప్పుడు అంగీకారం తెలుపునట్లుగా తలను ఊపెదరు, వారు పొందుకొనెదరు; అయితే మరి కొందరున్నారు, వారు దీనిని రాత్రింబవళ్ళు విన్ననూ, దానినెన్నడును వారు పొందుకోలేదు.
REV 13:8•
REV 17:8
27ఒక్క నిముషం దీనిని ఆపి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరోదానిని వివరించెదను. భూమిలో పడు విత్తనములు, వాటికి అంకురార్పణ జరిగినట్లైతే, సూర్యుని వెలుగు వాటి మీదపడినప్పుడు, తేమ చుట్టూవుంటే ఇక అది చిగురిస్తుంది. ఒకవేళ అది అంకురించకపోయినట్లైతే, ఎంత ఎండ వేడి తగిలినా, ఎంత తేమ వున్న, అది ఎదుగదు. కుళ్ళిపోతుంది. దానిలో ఏదో ఒక కార్యం జరుగవలసివుంది. మనకు అంకురార్పణ జరిగియున్నది. జగత్తు పునాది వేయబడక మునుపే మన పేరు పిలువబడి, గొర్రెపిల్ల జీవగ్రంథములో పెట్టబడియున్నవి. మనం ఎంత భక్తిని కనపరిచినా ఎన్నికలో లేకపోతే దాని వల్ల ప్రయోజనమే లేదు. మనం అంకురించాలి. భక్తి అనేది కొన్నిసార్లు మనకు వ్యతిరేకముగా అగపడును.
MATT 10:25•
JOHN 7:20•
JOHN 8:48•
JOHN 10:20
28ఇక్కడ వున్న చక్కని సహోదరుడగు గ్రూమర్ తోను మరియు కొంతమంది సహోదరులతోను వుండుట ఇంటివద్ద ఉన్నట్లుగానే నాకు అనిపించుచున్నది. నాకు అలా అనాలనిపించుచున్నది. యేసుని గమనించండి. ఆయన మెస్సీయా అని మనకిప్పుడు తెలియును. ఆయన వచ్చి మత సంబంధులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, అహరోను సంతానము నుండి వచ్చిన యాజకులకు వేలాది సంవత్సరముల నుండి తన్నుతాను బయలుపర్చుకొనుచుండెను. వెనుక తాత ముత్తాతల నుండి, తరతరముల నుండి వారు యాజకులుగా వున్నారు, వాక్యమును అభ్యసించినవారిగాను, ప్రవక్తల ద్వారా బోధింపబడినవారుగాను వున్నారు. ప్రవక్తలు చాలా తేటగా దీనిని చెప్పుకొంటూ వచ్చారు. కాని యేసు వచ్చి, దానిని నెరవేర్చినప్పుడు, వారు గబ్బిలము వలే చూడలేనివారైరి.
మతపరంగా భక్తిపరంగా వారు ఎంతో చక్కగాను, మృదువుగాను, చురుకుగాను తెలివిగలవారుగాను, నేడు మనలోని వారు వెళ్ళినట్లుగా ఎంతో దూరంగా వెళ్ళారు, వాక్యమందు మేదా సంభదమైన తర్పీదు నొందిరి బాల్యమునుండే ఆ విధంగా పెంచబడిరి. నిజమైన సత్యము వారి కళ్ళ ఎదుట ప్రసరించినప్పుడు, ఆ వెలుగు వారి ముందు ప్రకాశించినప్పుడు, వారన్నారు, "ఈ మనుష్యుడా… ఒక దయ్యమును, బయెల్జేబూబు అని వారికి అర్ధమైంది. గొప్ప తెలివితేటల గలవాడు అందుకనే ప్రజల మనస్సులను సుళువుగా చదివి చెప్పగలుగుచున్నాడు మనస్సులను చదువువాడు (telepathist) దానిని మనం నేడు అలాగే పిలుస్తాం. వారికి అది అర్థం కాదు.
JOHN 4:7,10,16-20,26
29కాని ఇప్పుడు చూడండి. ఒకనాడు సమరయలో వున్న సుఖారు అను ఒక చిన్న గ్రామము గుండా ప్రయాణించుచు అక్కడున్న బావియొద్ద కూర్చెండెను. అక్కడికి ఒక చిన్న స్త్రీ, చెడ్డ స్త్రీ, చెడ్డపేరుగల స్త్రీ ఒకతి వచ్చెను. ఆమెకు అనేకనుంది భర్తలు వున్నారు, కాని అలా వుండకూడదు. నీరు చేదుకొనుటకు ఆమె అక్కడికి వచ్చెను. "నాకు దాహమునకు ఇమ్ము, త్రాగుటకు నీరు ఇమ్ము," అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె తాము అలా ఇవ్వజాలరని చెప్పెను. అది వారికి పద్దతి కాదు, అది ఆమెకి అవమానము. సమరయకు చెందిన స్త్రీని ఆయన అడుగుట, యూదుడగు ఆయనకు అది అవమానము. అందుకు వెంటనే ఆమెతో ఆయన చెప్పెను, "నీతో మాట్లాడుచున్నవాడు ఎవరో నీవెరిగియుంటే!" ఇప్పుడు, ఆయన ఎవరో ఆమెకు తెలియదు. ఆయన చెప్పెను, "నిన్ను దాహమునకు అడిగినది ఏవరో నీకు తెలిసివుంటే నీవే ఆయనను అడుగుదువు."
కొద్దిసేపటి వరకు ఆ సంభాషణ అలా కొనసాగింది. తర్వాత యేసు ఆ బావి దగ్గరికి కొంచెం ముందుకు వెళ్ళి, ఆమెతో అన్నాడు వెళ్ళి, "నీ భర్తను తీసికొనిరమ్ము."
అందుకు ఆమె ఇలా బదులిచ్చెను, "నాకు పెనిమిటి లేడు." ఇంకను ఆమె గ్రుడ్డితనములోనే వుండెను. చూచారా, వేదాంతమును ఎవ్వరైనా బోధింపవచ్చును, చూచారా, అతడు ఏ నివేదికనైనా తయారు చేయవచ్చును. తాను కోరుకొనే దేనినైనను అతడు చెప్పవచ్చును గాని అది వాస్తము కానేరదు.
ఆయన చెప్పెను, "వెళ్ళి, నీ పెనిమిటిని తీసుకొని రమ్ము."
ఆమె అన్నది, "నాకు పెనిమిటి లేడు."
అందుకు ఆయన, "నీవు సత్యము పలికితివి. నీకు అయిదుగురు పెనిమిటిలున్నారు. ఇప్పుడు నీతో వున్నవాడు నీవాడు కాడు. నీవు సత్యమును చెప్పితివి."
ఆ వెలుగు జీవకణమును తాకుటను గమనించుము. అతి త్వరగా అది మొలకెత్తుట జరిగియుండెను. త్వరగా, వెంటనే చెడ్డ జీవితములో వున్న ఈ స్త్రీ, ఆమె నిత్యజీవము కొరకు ముందుగానే నిర్ణయింబడియుండెను. కావున వెలుగు ఆమెను తాకగానే, తక్షణమే ఆమె దానిని గుర్తించెను.
ఆమె అన్నది, "అయ్యా, నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇప్పటికి నాలుగువందల ఏండ్లనుండి మాకొక ప్రవక్త అంటూ లేడు, అయితే మెస్సీయా అనే ఒకడు వచ్చునని మనమెరుగుదము, ఈ విషయాలన్ని ఆయన మనకు చెప్పును." చూచారా, తాను చెప్పిన అబద్దమును బయట పెట్టినవానిని ఆమె ఎరిగియుండెను.
ఆయన దానిని ఎరిగెను, మరియు ఆయన అన్నాడు, "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను." దాని తర్వాత ఆమె ఒక్క ప్రశ్న కూడా వేయలేదు, గాని పట్టణములోనికి వెళ్ళి, "రండి. ఆయనను చూడండి." వ్యత్యాసమును గమనించండి! చూడండి, వెలుగు తాకినప్పుడు, అది గ్రుడ్డితనమునైన కలుగజేయును లేక జీవములోనికైన తెచ్చెను. అది ఏదో ఒకటి చేయును - జీవము, బైబిల్, లేఖనము.
MATT 7:29•
MATT 12:24•
MARK 1:22•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 7:46
30ఇప్పుడు, జనులు మాట్లాడుకొనుటకు అక్కడ అనేక సంగతులు ఉండి ఉండవచ్చును. వారిలో కొందరు ఇలా అన్నారు, "ఈ మనుష్యుడు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదు." వారిలో కొందరునమ్మి ఇలా అన్నారు, "ఈ మనుష్యునికి అధికారమున్నట్లు కనబడుచున్నది. తాను మాట్లాడునది అంగీకారముగా వున్నది. లేచి, ఈలాంటి సంగతులను ఈ విధముగా మాట్లాడినవానిని మేమింతవరకు చూడనేలేదు. యాజకుల బోధను విన్నాము. రబ్బీ (బోధకు)లు, యాజకులు వారి ప్రసంగములు ఇంకా అన్ని రకములైన వాటిని మేము విన్నాము; అయితే ఈయను అధికారముతో మాట్లడుచున్నాడు. తాను దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో, దానిని ఆయన ఎరిగినవాడైయున్నాడు. ఈ విధముగా మాట్లాడినట్లు ఎవ్వరూ లేరు."
మరికొందరు, "ఆయన బెయెల్జెబూబు," అని అన్నారు.
MATT 14:19•
MARK 6:41•
LUKE 9:16
31మీకు తెలుసా యవ్వనస్తుడును, చురుకుగా ఆలోచించువాడును అగు యోహాను, ఈ విధముగా అని వుండొచ్చును, "ఒకసారి దాని గూర్చి ఆలోచించండి!" ఐదు రొట్టెలు, రెండు చేపలను ఐదువేల మందికి పంచగలిగినవాడు [ఆమెన్!], హృదయ రహస్యములను ఎరిగినవాడు మన దోనెలో వున్నాడు. ఆయన మనతోనే వున్నాడు. సహోదరులారా! ఇప్పటి వరకు మీరు ఎవరిని గూర్చియైతే సాక్ష్యములు చెప్పియున్నారో, ఆయనే మన మధ్యలో వున్నాడు.
మనము ఎవరిని గూర్చియైతే బోధించుచున్నామో, ఎవరిని గూర్చియైతే మాట్లాడుకొనుచున్నామో, ఆయన విషయంలో ఇప్పుడు కూడా అది అంతే. మోషే యొక్క దేవుడు ఈ దినమున కూడా అదే రీతిగా వుండకపోతే ఏం లాభం? మనమెవరిని గూర్చి మాట్లాడుచున్నామో, ఆయన మనతోనే వున్నాడు. ఓ, ఆలోచించుటకు ఇది ఎంత చక్కని విషయం!
32ఆ తదుపరి మీరు చూడండి, ఒక అపాయకరమైన సరస్సులో వారు వుండిరి. ఎంత చక్కని భద్రత భావము, భీకర అలలు గల ఒక సరస్సులో ప్రయాణం సాగించుచున్నప్పటికీ తమ యొక్క దోనెలో సురక్షితముగా కాపాడువాడు వున్నాడని వారు తెలిసికొనివుండుట ఎంత మంచిది. సముద్రము అల్లకల్లోలముగా వున్నను, లేక నిమ్మళముగా వున్నను నీ యొక్క భద్రతను గూర్చి నీవు చింతపడవలసిన పనేలేదు. ఆయన నీతో వున్నాడన్న సంగతిని నీవు ఎరిగనంతకాలం, ఏ వ్యత్యాసమును అది చేయును? అలలు వచ్చినా, పోయినా నీవు మాత్రం నిశ్చింతగా ఉండవచ్చును, ఎందుకనగా ఆయన నీతోనే వున్నాడు. నీవు కాన్సర్ వలన చనిపోవుచున్నావని వైద్యులు నీతో అన్నప్పుడు నీవు ధైర్యంగా ఇలా చెప్పగలవు, "దేవునికే మహిమ, శీఘ్రముగా నేను గృహమునకు పోవుచున్నానేమో, అందునుబట్టి నేను దేవునిని స్తుతియించుచున్నాను." చూచారా, వారు లెక్క చేయరు.
33ఒకదినాన నేను ఒక గుంపు వైద్యులతో మాట్లాడుచుంటిని. అతడు అన్నాడు, "దైవిక స్వస్థతను గూర్చిన నీ పుస్తకమును చదివియున్నా."
"బహుశా ఏదైనా విమర్శ చేస్తారేమోనని అనుకొనుచున్నాను," అని బదులిచ్చాను.
అందుకతడు, "లేదయ్యా. అది వాస్తవమని అంగీకరిస్తున్నాను."
అప్పుడు నేను, "మీకు వందనములు డాక్టర్ షీన్," అని అన్నాను.
అతడన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, క్యాన్సర్ సోకిన ఒక రోగికి తన రోగమును గూర్చి మేము చెప్పినప్పుడు, ఫలాని దానిని బట్టి మరణించబోవునని మేము అన్నప్పుడు, అల్సర్ పగిలిపోవుటకు పరిపక్వమైనదని తెలిసినప్పుడు, ఒక క్షయ వ్యాది ముదిరిపోయినదని అన్నప్పుడు, అతని యొక్క మానసిక వైఖరిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వారు కంగారుపడి, గుండెపగిలి కృంగిపోతే వారు ఉన్నపాటునే మరణమవుదురు. అలాకాక నిబ్బరం కలిగి, "మంచిది, మరణం కూడా జీవితంలో ఒక భాగం ఎప్పుడైన చావలసినదేగా?" అని నింపాదిగా అన్నట్లైతే, ఆ వైఖరి వల్ల కొంత ఉపశమనం కలుగును. ఇలాంటి కేసులను ఎన్నో మేము రికార్డు నమోదు చేశాము.
కొద్దిగా ఆలోచించాను. అట్టివిధమైన మానసిక వైఖరిని కలిగివున్నట్లైతే, అంతరంగ పురుషున్ని పరిశుద్ధాత్మ సంధించినప్పుడు అది అలాగే వుండును? అక్కడ అది ఉంది అది దాని గురించి నేనతనిని అడిగితిని అలానే వుండును అది… దానిని నేను అడిగితిని.
అతడన్నాడు, "నిశ్చయముగా, అది వాస్తవం, ఒక చోటుకి నీవువచ్చినప్పుడు, దానిలోనికి కదలి వెళ్ళెదవు…" (దక్షిణ ప్రాంతంలో వున్నటువంటి శస్త్ర వైద్యులలో మరియు, వైద్యులలో పేరుగాంచిన వారిలో అతడు ఒకడు.) అతడు అన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, అది రుజువు అవ్వగలదు. ఒక వ్యక్తి కదలినట్లైతే, ఆ చోటుకి తన సొంత మనస్సుకి ఎరుగనప్పటికీ, అతడు అక్కడికి కదిలివెళ్ళగలడు. అతడు దానిని నమ్మితే, అది జరుగును."
అది సత్యము.
34చూచారా, నీ మానసిక వైఖరికి అనుగుణంగానే అది వుండును… ఇప్పుడు, మనసు అది చేయలేదు గాని, అయితే ఆ వైఖరినందు జీవముగలదానిని నీవు పొందినట్లైతే, అప్పుడు ఆ జీవము దిగివచ్చి, కార్యము జరిగించును. నీ మానసిక వైఖరి కాదు గాని నీవు పొందిన అదియే నిన్ను ఆయన సన్నిధిలోనికి తెచ్చును. నీ మనసుకు నీవు చేయునది అదియే. దేవున్ని తృణీకరించనంతకాలం నీకున్న పంచేద్రియాలు చెప్పినట్లు నీవు చేయటం సరియే. కాని అవి ఎప్పుడైతే దేవున్ని తిరస్కరించినయెడల, అప్పుడు నీవు వాటిని నీవు వంటరిగా వదిలివేయుము. అవి చెప్పినట్లుగా నీవు చేయకూడదు. వాటిని నియంత్రించేది దేవుడే. వాటిని సృష్టించిన సృష్టికర్త ఆయనే.
ఇప్పుడు, నమ్మదగని సముద్రయానంలో, స్వయంగా ఆయనే దోనెలో పడుకొనియున్నాడనుట అనేది నేను చెప్పినట్లుగా అది ఎంతో భద్రత, మరియు క్షేమమునైయున్నది. ఈ రాత్రి మనవలే, శిష్యులు కూడా జరిగిన కూటముల యొక్క స్పందనలను (ప్రయోజన ఫలములను) గూర్చి సంభాషించుకొనుచున్నారు. ఉజ్జీవము వచ్చిన తరువాత, ఆ ఉజ్జీవము యొక్క తాలూక విందులు, మొదలగు వాటిగూర్చి వారు మాట్లాడుకొనుచున్నారు.
35ఇప్పుడు, బ్రదర్ గ్రూమర్ మరియు ఇక్కడున్న బ్రదర్… ఇంకా అనేక మంది బ్రదర్స్. పదిహేను ఏళ్ళక్రితం ఈ ప్రాంతము గుండా వెళ్ళాము, అప్పుడు ఒక ఉజ్జీవము ఉండెను. మై! నేడు మనమేమి చేయుచున్నామో మీకు తెలుసా? అప్పటి ఉజ్జీవమును గురించి మాట్లాడుకొనుచున్నాము. ఉజ్జీవము ముగిసిపోయినది, ఎప్పుడో ముగిసిపోయినది. మనము కేవలం దాని తాలూకు ఫలితములలో మాత్రమే బ్రతుకుచున్నాము, కనిపెట్టుకొనుచున్నాము.
GEN 2:2
36ఆ దోనెలో ఆ శిష్యులు కూడా సరిగ్గా అదే చేస్తున్నారు, ఆనందించుచున్నారు. బహుశా ఒక దినమునకు ముందు జరిగిన, ఒక వారమునకు ముందు జరిగిన, ఒక సంవత్సరమునకు ముందు జరిగిన వాటిని నెమరువేసుకొనుచూ, తాము చూచిన వాటిని జ్ఞప్తికి తెచ్చికొనుచు, ఆ జ్ఞాపకాలలో వారు కాలం గడుపుచున్నారు. వాటి గురించి సాక్ష్యమిచ్చుచున్నారు, ఓ, వాటిని గురించి గొప్ప సాక్ష్యములు చెప్పుకొనుచున్నారు.
వారి దినములలో యేసు ఆ ఉజ్జీవముల మధ్య విశ్రాంతిని తీసికొనుచున్నాడని మనమెలా తెలిసికోగలం, బహుశా ఇప్పుడు కూడా ఆయన ఈ ఉజ్జీవముల మధ్య విశ్రాంతి తీసికొనుచున్నాడని మనమెలా తెలిసికోగలం? అవును. "ఓ, ఒక్క నిముషం ఆగుము, బ్రదర్ బ్రెన్హాం, మీరు చెప్పుచున్న దాని గూర్చి నేనొకటి అడుగగోరుచున్నాను, యేసు విశ్రాంతి తీసికోవటమా?" అని నీవడగవచ్చును. అవును, ఆయన విశ్రాంతినొందెను. "దేవుడు భూమ్యాకాశములను ఆరు దినములలో సృజించెను, ఏడవ దినమున ఆయన విశ్రాంతి నొందెను," అని బైబిల్ చెప్పుచున్నది. నిశ్చయముగా ఆయన తీసికొనెను. యేసు అలసటనొంది దోనెలో పడుకొనెను. ఆయన నిద్రించి, విశ్రమించుచుండెను. జరిగియున్న ఉజ్జీవము యొక్క ప్రయాసను బట్టేనేమో, అప్పుడు ఆయన విశ్రాంతినొందెను. మరదేవిధముగా ఇప్పుడును ఆయన విశ్రాంతి తీసికొనుచున్నాడు, అది ఇదేనని నేను నమ్ముచున్నాను. ఆయన చేసినదానిని చూచుటను బట్టి మరియు తమతో ఆయన ఉండుటనుబట్టి శిష్యులు ఎంతగానో ఆనందించుచుండిరి, చూచారా.
37మానవుడు ఎప్పుడూ అంతే, అది మానవుని మనస్సు. దేవుడు చేసిన దానిని బట్టి మాట్లాడుకోవటం మరియు దాన్నిబట్టి ఆనందించటం అనేవి మానవ నైజం. ఆయన దేనినైతే చేయనైయున్నాడో దాన్ని గూర్చి మాట్లాడుదురు గాని ఆయన ఇప్పుడు ఏమి చేయుచున్నాడో అనే దాన్ని మాత్రం గుర్తించరు. (నిజానికి ఆయన నిద్రించటంలేదు - కొద్ది నిముషములలో మనకా సంగతి తెలియును. చూచారా.) ఆయన చేసినదాన్ని వారు నమ్ముదురు, దానిబట్టి కేకవేయుదురు; మరలా ఆయన చేయబోయే దాన్నిబట్టికూడా మాట్లాడుదురు, అందుకొరకు దేవుని మహిమపరిచెదరు; అయితే ప్రస్తుతము, ఇప్పుడు, ఆయనదేన్ని చేయుచున్నాడో, అనే దాన్ని మాత్రం పట్టించుకోరు. అది సహజంగా మానవనైజం. అతడు చేయు విధానము అలాగే వుండును.
38వారందరు ఒకరిలో నొకరు తమ సహవాసము యొక్క ఆశీర్వాదములను గూర్చి ఎంతగానో ఆనందించుచు, ఓ, తాము చూసినవాటన్నింటిని తలపోసుకొనుచూ వుండిరి. అలా వుంటుండగా అకస్మాత్తుగా వారికి ఒక సమస్య తలెత్తెను. సాక్ష్యములు పంచుకొనే ఒక కూటము లేక అలాంటిది ఒకటి జరుగుచుండగా సరిగ్గా అక్కడే అపవాది జొరబడి, దానినంతటిని గందరగోళం చేయజూచును. అనేకసార్లు నేను… ఇక్కడ కొద్దికాలం క్రితం నేనోక కూటములో వున్నాను. వేదిక పిలుపునిచ్చుటకు సిద్ధపడుచున్నాను. ఒక వృద్దుడు తూలిపోయి అక్కడే నేలమీద పడిపోయెను. చచ్చిన వానివలే వుండెను. అతడికి గుండెపోటు వచ్చెను. అప్పుడు అక్కడ ఎంతో గందరగోళం, అంతటను అల్లకల్లోలము. బహుశా అది ఎక్కడనేది నేను మరిచిపోయాను… బహుశ అది విస్కాన్సిన్ లోని షువ్వానో ప్రాంతములో కాబోలు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, "దేవా, ఇప్పుడు నేనేం చేయాలి?" నేను అక్కడ చూచాను, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వృద్దుడు గుమ్మము గుండా నడచి వచ్చుటను చూచాను. అప్పుడు నేనేం చేయాలో నాకర్ధమైయింది.
39ఈమద్య కాలం ఓరల్ రాబర్ట్ యొక్క అతిముఖ్య స్పాన్సర్ ఒకరు అతడు ఫిలదెల్పియాలో ఒక వైద్యుడు. అతని పేరేమిటి? అతడు… అతని పేరు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు, అతడొక దంతవైద్యుడు. ఓరల్ రాబర్ట్ యొక్క టెలివిజన్ పరిచర్యకు అతడొక ముఖ్యమైన స్పాన్సర్ (దాత), అతని పేరు గుర్తుకురావట్లేదు. మరి మనకు —బార్టన్ — మేము ఒక కూడికలో వున్నప్పుడు, వేదిక పిలుపునిచ్చుటకు సిద్ధపడుచున్నాను. ఒక స్త్రీ చాలా వింతగా ప్రవర్తించుటను నేను గమనించాను. ఆమె కుమార్తె ఇక్కడికి పరుగెత్తికొని వచ్చి, తన ముఖమును రుద్దుకొనుచుండెను. ఆమెకు మూర్చలు వచ్చెనని నేను అనుకొన్నాను. ఉన్నపాటునే ఆమె కాళ్ళు చేతులు వంకర్లు తిరిగెను.
అప్పుడు డాక్టర్. బార్టన్ ఆమె ఎక్కడైతే పడిపొయిందో అక్కడికి పరుగెత్తుకొనిపోయి, ఆమె నాడిని పరీక్షించెను. ఆమె శ్వాస ఆగిపొయింది గనుక అతడు నావైపు చూచి, తల ఊపెను. నేను అక్కడున్న వారిని కంగారు పడనివ్వకుండా చాలా ప్రయత్నించితిని. అక్కడ గొప్ప జన సమూహముండెను. ఆ యొక్క పరిస్థితిని అదుపులోనికి తెచ్చుటకు నేను ఆ విధముగా బోధించుట కొనసాగించితిని. మరి అతడన్నాడు, "వెళ్ళీ చిన్ని బ్రెన్హాంను తీసికొని రమ్ము." చిన్ని బ్రెన్హాం అనగా, నా కుమారుడు, బిల్లీ. అప్పుడే చనిపోయిన ఆమెను బిల్లి చూచెను. అతడేమి చేయలేకుండెను, చూచారా. దానిని అతడు చూడలేకపోయెను.
40నేను తిరిగి బోధింపసాగితిని (ఇప్పుడు డాక్టర్ బార్టన్ ను మీరందరు ఎరుగుదురు, కావాలంటే అతన్నే మీరు అడగవచ్చును), తిరిగి బోధింపనారంభించి, "ఇప్పుడు, ప్రతి ఒక్కరు. కంగారుపడొద్దు. నెమ్మదిగావుండండి," అని చెప్పాను. ఒక వ్యక్తిలో నుండి అపవిత్రాత్మ (దయ్యము) బయటకు పోయేటప్పుడు అతడు చాలా మట్టుకు గౌరవం లేనట్లుగా (గందరగోళం చేయునట్లుగా) వుండును. ఆ సమయంలో అక్కడున్న గుంపు కూడా చెల్లాచెదరగును. అయితే అది సరైనది కాదు. అలాంటివి జరిగేటప్పుడు నెమ్మదిగా భక్తిగా ఉండవలెను. "నెమ్మదిగా వుండుము, కంగారు పడకుము, ఆయన ఇక్కడ ఉన్నాడు." నేను అలా చెప్పుచుండగా, అదెలా జరిగిందో నాకు తెలియదు గాని నేను ఆమె వైపు చూసి, పేరు పెట్టి ఆమెను పిలిచాను. "మేరీ ఇలా చూడు!" ఆ మాటకు ఆమె స్పందించెను. ఆమె ప్రాణము ఆమెలోకి వచ్చెను. చూడండి, అదొక సమస్యాత్మక పరిస్థితి. మనం అనుకొనని ఘడియల్లో అకస్మాత్తుగా సమస్యలు లేచును.
41ఇప్పుడు, కావాలంటే జరిగిన ఆ సంఘటనను గూర్చి మీరు డాక్టర్ బార్టనను అడిగి తెలిసికోవచ్చును. తరువాత దినాన నేనతనిని కలిసాను. అతడన్నాడు. "బ్రదర్ బ్రెన్హాం ఆమె యొక్క గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. అది మెడక్రిందికి వచ్చినట్లుగా నేను గ్రహించాను". అంతటా దానిని నేను వెదికాను, కాని ఏ మాత్రం అది పనిచేయలేదు, ప్రాణం పోయిందని గ్రహించాను. వారిది చాలా సంపన్నకుటుంబం. ఆ విధముగా కూటములకు రావటం ఆమెకు అదే మొదటిసారి, మరి ఆమె… అతడు మరియు నేను ఇరువురం కలిసి ఆమె ఇంటికి వెళ్ళాము. ఆమె "నీవు నాపేరు పెట్టి పిలుచుట నాకు వినబడింది," అని నాతో అన్నది. నిజానికి అంతకు ముందు నేన్నెడు అమెను చూడలేదు. అయితే అది జరిగించినది నేను కాదు గాని పరిశుద్ధాత్మయైయుండెను, చూచారా.
42ఇప్పుడు, అకస్మాత్తుగా, నమన్య లేచెను. దోనె మునగనారంభించెను. భీకరముగా అలలు లేచిపడుచుండెను, వరద ఉగ్రరూపం దాల్చి తెరచాపను, స్థంబమును కొట్టుచుండెను. పెద్ద అలలు వీచుట వలన నీళ్ళు దోనెలోకి వచ్చుచుండెను. దోనెలో నీళ్ళు నిండటం వలన అది మునిగిపోసాగెను. సమస్య! అనేక అద్భుత కార్యములను ఆయన చేయటం వారు చూచినప్పటికినీ, బ్రతుకుతామన్న ఆశలు మాత్రం వారికి ఏమాత్రం లేకుండాపోయెను. వారు ఆయన కార్యాలను ఎన్నో చూచారు. సమస్యలేవగానే వాటన్నిటిని వారు మరచిపోయారు.
ఈ రాత్రి కూడా సరిగ్గా మరి ఆదే పునరావృతం అగుట నాకెంతో ఆశ్చర్యముగావుంది. ఈ ఉజ్జీవములయందు దేవుడు చేయు దానిని మనం చూచితిమని మనకు తెలుసు. సేవకులగు మీకు అది తెలుసు. మీరు ఆయన యొక్క శక్తిని చూచారు. మృతులన ఆయన ఏలాగున లేపియున్నాడో, దానిగూర్చి వైద్యులు ఏలాగు నిర్ధారణ ప్రకటన (నివేదిక)లు ఇచ్చియున్నారో అనేదానిని కూడ మీరెరుగుదురు. జరుగుచున్న ఈ కార్యాలను ఆయన చేయుదునని ముందుగానే తెలియజేసాడు. ఆయన రోగులను బాగుచేయుచున్నాడు. ప్రపంచమంతటా వేలాది మంది రోగులు స్వస్థపడుచున్నారు, వేలాదిసార్లు బాగుపడుచున్నారు. ఇప్పుడు కొద్దిపాటి లేక నిద్రబుచ్చే సందర్భములు రాగా, అప్పుడు శ్రమలు శోధనలు ఎదురునిలువగా మనం, చాలా సులువుగా ఆయన కార్యములు మరచిపోతాము, కాదంటారా?
EXOD 14:21
43ఇశ్రాయేలీయులు కూడా అంతే, ఐగుప్తులోకి ఆయన తెగుళ్ళను పంపి, గొప్ప కార్యములను జరిగించియుండెను. వారు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు, మోషే గట్టిగా కేకవేసి, "మీరు ఇది వరకే పది అద్భుతములను చూచియున్నారు. ఇంకా మీరు దేవున్ని సందేహించుచున్నారా?" వారు ఆ పాత ఎండిపోయిన నీటిఊటలు వద్దకు వచ్చినప్పుడు వారు సణిగారు, పిర్యాదులు చేశారు. అది కేవలం మానవ నైజం. ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని వారు మరచిపోయారు, చూచారా. మనం కూడా మరి అంతే. బహుశా ఒక్కసారిగా వారు కష్టాల్లో పడినందున శిష్యులు కూడా ఆయన కార్యాలను మరచిపోయివుందురు.
ఇప్పుడు మనం కూడా… వారు కష్టాల్లో పడిపోయి దానిలో నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమగుచుండిరి. బయటపడే మార్గం దొరికినంత కాలం, ఒక దాన్నే అట్టి పెట్టుకొని మనం ఉండాలి. వారు సమస్యలో ఇరుక్కొనిపోయి ఇక దానిలోనుండి ఎలా బయటపడాలో తెలియక భయపడిపోయారు. వారు కేకలుపెట్టారు. బయటపడే మార్గం కనపడకపోయే సరికే వారు ఎంతగానో కలత చెందారు. తొమ్మిది గంటల కల్లా ఈ ప్రార్థన కూటము ముగించి, మిమ్మును గృహములకు పంపుదునని మాట ఇస్తున్నాను. ఎక్కువసేపు కాక, ముఖ్యమైన వాటిని చెప్పుటకు నేను ప్రయత్నించుచున్నాను, తర్వాత మీరు వాటిని చూడగలరు.
సహోదరుడా, పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ఈ రాత్రి మనం ఎదుర్కొనుచున్నాము. జాబితా నా యొద్ద వుంది, అవి దేశాల సమన్యలు. వాటికి వారు పరిష్కారం కనుగోలేకపోవుచున్నారు. ఏం పరిష్కరించాలో కూడా వారికి తెలియకున్నది. ఐక్యరాజ్యసమితి, నానారాజ్యముల సమితి, మొదలగునవి పరిష్కారం కొరకు ప్రయత్నించుచున్నవి. కాని సమస్యలు అంతకంతకు జఠిలమౌతున్నవి.
44ఆ రాత్రి ఫిన్లాండ్ లో, వీధిలో ఆ చిన్నబాలుడు చనిపోయెను. ఆ నగర మేయర్ దానిని నాకు వ్రాసి తన ఆఫీస్ ముద్రవేసి నాకు పంపెను. అది జరుగకముందు, సంవత్సరాలకు ముందే దానిని నేను ఒక దర్శనములో చూచితిని. నేను అరిజోనా వచ్చినప్పుడు దాని గూర్చి చెప్పాను, "ఒక చిన్న బాలుడు మరణములో నుండి లేపబడును." మీ అందరికి అది జ్ఞాపకమున్నదా? మీలో అనేకులకు వుందికదూ. ఇప్పుడు అది అలా జరిగిపోయింది. అది స్వస్థతస్వరము (The Voice of Healing) అను పత్రికలో వచ్చునని కూడా చెప్పాను. దాని తరువాత రెండు లేక మూడేళ్ళకు అది అలానే పత్రికలో వచ్చినది, చూచారా. వారందరు ఎంతగానో కలవరపడ్డారు. ఆ బాలుని శవమును చూచి వేదనపడ్డారు, అయితే విరుగుడు, పరిష్కారం అక్కడవుండెను. దేవుని యొద్ద పరిష్కారమున్నది. ఆయన ఆ చిన్న బాలున్ని స్వస్థపరచి మృతులలో నుండి లేపాడు.
45ఆ రాత్రి కువోపియాలో వీధిలో వెళ్ళుచున్నాము. మేమావిధముగా వెళ్ళుచుండగా, వారు బాలురు. క్షౌరము చేయించుకొనక చాలా కాలమైంది. వారు సైన్యంలోకి తీసికొనిపోబడిరి. వారిని రష్యా సైన్యం చంపివేసింది. వారు దిగువునకు పెద్ద, పాత, పొడవైన, వంకర కత్తులతో గుంపులు గుంపులుగా వెళ్ళుచున్నారు. అదే సమయములో నేను మెషుహల్లి (Messuhall)గా వారు పిలిచే ప్రాంతమందు వెళ్ళుచుంటిని, అక్కడ సుమారు ముప్పది-అయిదు వేలమందిని బయటకు వెళ్ళునట్లుగా అనుమతించిరి, అప్పుడు మరొక ముప్పది-అయిదు లేక నలభైవేల మందితో మాట్లాడునట్లు అనుమతించిరి.
ఆ దారిపోడవున రష్యా సైనికులు నిల్చొనియుండిరి. వారు గౌరవవందనం చేస్తూ వుండగా నేన ముందుకు నడుచుకొంటూ వెళ్ళిచున్నాను, వారి చెంపల మీదుగా కన్నీరు కారుచుండెను. నేను వారిని దాటివెళ్ళుచుండగా వారు ఫిన్నీ సైనికులను కౌగలించుకొనుచుండెను. సహోదరుడా, ఒక రష్యా సైనికుడు - ఫిన్నీ సైనికున్ని హత్తుకోటం, ఒక ఫిన్నీ సైనికుడు - రష్యా సైనికుని హత్తుకోటం వలన యుద్దము అక్కడ ఆగిపోయింది. యుద్ధమునకు దారితీసిన పరిస్థితులను వారు అదిగమించిరి, అయితే మానవ నిర్మిత లక్ష్యమును బట్టి అది నివారణ కాలేదు. అది ఇదివరకే అయిపోయినది. దాని కొరకు ఒక మనష్యుడు చనిపోయెను.
46ఎటువంటి పరిష్కారం (నివారణ) పొందనటువంటి సమస్యలను సంఘము కలిగియున్నది. బాప్టిస్టులందరినీ, మెథడిస్టుగా చేయాలని మెథడిస్టులు ఎందుకు ప్రయత్నించుచున్నారో నాకు ఆశ్చర్యముగావున్నది. అసెంబ్లీస్ వారందరు ఏకత్వపువారిని తమ వైపుకి తిప్పుకోవాలని ఏలజూచుచున్నారు? అసెంబ్లీ వారు చెడ్డతనమును ఏలా అనుమతించుచున్నారు? ప్రెస్బిటేరిన్లందరిని లూధరన్లందరిని గెలవాలని, పెంతెకొస్తులందరు ఏలా జూచుచున్నారు? సమస్తమును తన వైపు తిప్పుకోవాలని, నియంత్రించాలని కాథలిక్ ఏల చేయబూనుచున్నది? చూచారా? తమలో ఎవరిది పైచేయి అని వారిలో ఏ ఒక్కరును చెప్పలేరు చూచారా? అది వారికి తెలియదు. పరిష్కారము (విరుగుడు) అనేది వారియందులేదు. అవునండీ.
వరదను ఆలలను నియంత్రించగల పరిష్కారము వారియందు లేదని మీకు తెలుసా, అయితే పరిష్కారమనేది అక్కడే తమతోనే పడుకొనియుండెను. సహోదరుడా, ఈ రాత్రి దీనిని నేను చెప్పనిమ్ము. మన సమస్యలన్నిటి మధ్య మనకింకా వరిష్కారమనేది ఇంకను ఉన్నది. అదిక్కడేవున్నది. అది ఆయనే, ఆయన వాక్యమైయున్నాడు. ఆదిక్కడే ఉంచబడియున్నది. దానిని బయలుపర్చుటకు ఆయన ఆత్మ ఇప్పుడు ఇక్కడే వుండెను. కావున పరిష్కారమును మనము కలిగియున్నాము, అయితే మరో విధంగా పరిష్కార మార్గాలను మనం ప్రయత్నిస్తూవుంటాము, మరో సంస్థను ప్రారంభింపజూస్తాము. మనమంతే, చూచారా. దానిని మనం స్వాలంబన చేజాలము. అది ఇదివరకే అలా చేయబడి, ఇదివరకే, మనకొరకు స్వాలంబన చేయబడిన దానియందు నడుచుటలో మనం విఫలమౌతున్నాం. వారు కలవరపడిరి.
47"గ్రూమర్ సంఘంలో ఒక స్వస్థత కూటం జరుగుతుంది, అయితే వారిలో నాకు నచ్చనది ఒకటుంది. వారు పరిశుద్ద గుండ్రాళ్ళు అందుకే వారి దగ్గరికి వెళ్ళడం నాకిష్టంలేదు," అని నీవు అనొచ్చు. అయితే నీవు అక్కడే వున్నాను, నీవు అంతేమరీ? చూచారా. అది వుండవలసిన విధంగానే వుంది. క్రీస్తు అన్నింటికి పరిష్కారమైవుండెను. ఆయన శిష్యులు ఇప్పుడు అనేక సమస్యల్లో చిక్కుకున్నారు. పరిష్కారం తెలియకున్నారు. అవునండీ. దీనిని నన్ను చెప్పనిమ్ము. అనేకసార్లు ప్రశస్థమగు ఆయన పరిశుద్ధులు సహితం భౌతికమైన కష్టాలలో చిక్కుకుందురు. కాని మనకి పరిష్కారం (విరుగుడు) వుంది. ఆమెన్! స్వస్థత మనకున్నది.
48ఇక్కడ, ఊపిరితిత్తుల సమస్య చేత బాధపడుచున ఈ స్త్రీని గూర్చి ఆలోచించున్నాను. కృత్రిమశ్వాస ఆమెకు అందించుచున్నారు. అది ఎంతో వ్యయముగా వున్నది. రాత్రుల్లో ఆమె ఎలా నిద్రించుచున్నదో? సహోదరీ, ఇక్కడ మాత్రమే స్వస్థతవున్నదని నాకు తెలుసు. అది ఇక్కడే వుంది. ఆవిధంగా కష్టపడవలసిన పనిలేదు. స్వస్థత, ఔషదమును నీవు తీసికోవలసివుంది, చూచారా? ఇప్పుడు, వైద్యుల వలన కూడ పరిష్కారం దొరకని చిక్కుల్లో వున్నారు.
ఆ శిష్యులు వలే, వారు సమస్యల్లో చిక్కుకొన్నారు. వారు శిష్యులు, వారు అక్కడి దోనే నడిపే వారిని బట్టి బయటపడలేరు. మరేం చేసినా ప్రయోజనం శూన్యం. ఎవరి వలన లాభంలేదు, అయితే వారిని రక్షించగలవాడు, దేనైనా పరిష్కరించగలవాడు అక్కడ వారితోనే వున్నాడు.
49వైద్యుల వలన నయం కాని సమస్యతో ఈ రాత్రి నీవిక్కడికి వచ్చియున్నావేమో, అయితే వారితో వున్నట్టే ఇప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. అది మంచిది. దోనెలో ఉన్నదెవరో నన్న సంగతిని వారివలే మనం కూడా మరిచిపోవుచున్నాము. అది సంఘము కాదు, మనం పాటించే నియమాలు కాదు గాని భూమ్యాకాశముల సృష్టికర్తయగు ఆయనే, జరిగిపోయిన ఉజ్జీవమును బట్టి విశ్రాంతినొందుచున్నాడు. ఆయన ఒకదాన్నీ పంపి, విశ్రాంతినొందుచుండెను.
ఆయన మరోక ఉజ్జీవమును, మరుసటి దినాన తనముందు కలిగియున్నాడు, అది ఏదనగా సేనదేయ్యములు పట్టిన వానిని బాగుచేయుట అనే ఉజ్జీవము. కలిగియున్న దానికి మరియు కలుగబోవు దానికి మధ్యలో అనగా దోనెలో ఆయన విశ్రాంతి నొందుచుండగా సమస్య రానేవచ్చెను. ఆయన నిద్రించుచుండెను. విశ్రాంతి తీసికొనుచుండెను. వారు తమ యొక్క కలవరముల మధ్యన తముతో ఉన్నదెవరో నన్న విషయాన్ని మరిచిపోయారు. "మంచిది, సీమోను తెడ్లు వేయుము!"
"అంద్రెయ తేడ్లను బలముగా వేయుము, మనము ఏం చేయబోవుచున్నాము?"
చూచారా, ఆయన అక్కడే ఉన్నాడు. నీకు కలవరమెందుకు? "డాక్టర్ ఇలా అన్నారు, అలా అన్నారు." సరే, వారు అలానే అంటారు, వారన్నది నిజమే కావచ్చు, కాని ఇదేమన్నది? తరువాత విషయమదే, చూచారా.
50మరొక విషయం. గతములో వారు ఆయనను ఏ విధముగానైతే తెలిసికొనియున్నారో, మరదేవిధముగా ఆయన మనిషి హృదయాలోచనలను చెప్పగలవాడని, ఆరంభమందే దాని అంతమును ఎరిగినవాడని వారు తప్పక తెలిసికొని యుండవలసివుంది. ఆమెన్. ఇప్పుడు దానిని గ్రహించుటలో తప్పిపోవద్దు. తుఫాను వచ్చునను సంగతి ఆయనకు ముందే తెలుసు. అయినను ఆయన దోనెలో నిద్రకు ఎలా ఉపక్రమించాడన్నదే నాకు ఆశ్చర్యంగా వుంది. అది జరుగునని ఆయనకు తెలుసు, ఎందుకనగా ఆయన దేవుడు. దేవుడు అనంతుడు, కావున ఆది జరుగబోవునని ఆయన ఎరిగియుండెను. అది ఎప్పుడు జరుగబోవుచున్న సంగతి కూడా ఆయన ఎరిగియుండెను. అయితే వారి విశ్వాసము పరీక్షింపబడు నిమిత్తమే ఆది జరుగును. అదే సంగతిని ఆయన తరువాత అన్లేదా?
బహుశా అందుకే మీరు ఈ రాత్రి రోగులుగా వున్నారు. అందుకోసమేనేమో ఈ ఉజ్జీవం కొద్దిగా స్థబ్దంగా వున్నది. ఇదివరకు జరిగినదానిని చూచిన నీవు ఇకముందు ఏమి జరుగనైయున్నదో చూచుట కొరకే బహుశా ఈ విరామం వచ్చివుండెనేమో, దీనిని నీవు తీసికోని మరొక సంస్థను ఈ ఉజ్జీవంలో నుండి తయారు చేయుదువా?
51ఇక్కడ కూర్చొనియున్న ఈ సహోదరీ కేన్సర్ తో బాధపడుచుండెను. అక్కడ ఆ చిన్ని మెక్సికో సంఘములో కూటము జరుగుచుండగా ఆమెను ప్రార్థనా వరుసలోనికి తీసికొని వచ్చారు. ఆమె యొక్క డాక్టర్ ఎక్స-రేను తీయించాడు. ఆమె భర్త అక్కడ కూర్చొనియున్నాడు. "వరుసలో ఒక చనిపోయిన స్త్రీ తీసికొనిరాబడింది," అని వారన్నారు.
నేను చెప్పాను, "ఆమెను తీసికొనిరండి." ఆయన ఇచ్చట ఉన్నాడనే నిశ్చయత నాకున్నది. ఆమె పేరు సిస్టర్ వాల్డ్రాప్. అది చాలా కాలం క్రిందట జరిగెను. సుమారు పదహారు సంవత్సకాల క్రితం. చూచారా, కేన్సర్ తో చనిపోవుచున్నది. ఆమెను లేపిన అదే దేవుడు నేడు ఇంకను దోనెలోనే వుండెనని గుర్తుంచుకొనుము. కలవరపడకు ఫినిక్సును, మేరికోప వాలీను లేక లోకమంతటిని తలక్రిందులు చేయగల ఒక సాక్ష్యము వున్నది. వేలకొలదిగా వున్న వాటిలో ఒక్కటి చాలు లోకాన్ని తలక్రిందులు చేయుటక.
1PET 1:7
52ఇంకా ఆయన ఇక్కడనే ఉన్నాడు. కాని మనందరం దిగులుపడుతుంటాం, చూడండి, వారనట్లుగా, "ఓ, ఇంకేముంది, ఇక్కడ తెడ్డును వేయుము. మరి అక్కడ వేయుము. తర్వాత ఏం చేద్దాం? అంటూ స్వప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు దానిని మనస్కరించకుము. ఆయన నీ దోనెలో వున్నంతకాలం, దేన్ని లెక్క చేయకు, దాని గురించి మరచిపొమ్ము. నిశ్చయముగా. ఇప్పుడు, అది కేవలము వారి యొక్క విశ్వాసమును పరీక్షించుట కొరకు మాత్రమే ఆయన అది చేసెను. మనకు కలిగే ఈ శ్రమల వలన మనము శుద్ధి చేయబడి సువర్ణమువలే మారుదుము," అని మనకివ్వబడిన లేఖనములు బోధించుటలేదా? మనం అలా అనుకోకపోవచ్చును, కాని బైబిల్ చెప్పినది వాస్తవము.
JOB 13:15•
MATT 8:26
53బిడ్డలను, సంపదనంతటిని పోగొట్టుకొని, అన్నిటిని నష్టపోయి, కురుపులతో మొత్తబడినను యోబు సహించుకొనెను అనేదానిని నీవు ఊహించుగలవా? అదేమంత సుళువైనదేంకాదండీ, అయితే దేవుడు అతని యందు వుంచిన నమ్మకం ఒమ్ము కాలేదు. అపవాదికి నిరూపించుట కొరకే దీనంతటిని దేవుడు అనుమతించెను. బహుశా నీ విషయంలో కూడా ఆయన సరిగ్గా దానిని కోరుతూవుండవచ్చునేమో. "వారు నిన్ను వీడిపోదురు, ఓ వారు.." ఎవరువున్నా, తొలిగిపోయినా యోబు ఎంతమాత్రము చలించలేదు. లేదండీ, ఆయన తనవారిని పరీక్షింపగోరుచున్నాడు.
తరువాత కొద్ది నిముషములకే ఆయన పలికిన వాటిని గుర్తుతెచ్చుకోండి. "ఓ అల్ప విశ్వాసులారా రొట్టెలను విరిచి ఐదువేలమందికి ఆహారం పెట్టిన దానిని మీరు గ్రహించలేదా? అరణ్యములో ప్రతిరోజు రాత్రి ఆకాశము నుండి మన్నాను కురిపించి పొయ్యి పెట్టకుండానే నలుబది సంవత్సరాలు పోషించిన యెహోవాను నేనే అని మీరెరుగరా? మీరెందుకు అంతగా భయపడుచున్నారు! ఒకనాడు నేను ఎర్ర సముద్రమును ఎండిన నేలగా చేసిన సంగతి మీకు తెలియదా? నేను భూమికి ఆజ్ఞాపింపగా అది తన నోరు తెరిచి అవిశ్వాసులైన వారిని మ్రింగిన సంగతి మీకు తెలియదా? శూన్యములో భూమిని వ్రేలాడదీసాను అది మీరు గ్రహించరా."
ఆయన దోనెలో ఉన్నాడు, అది ఒక ఊహాజనితం కాదు; అది సత్యము. ఈ రోజున కూడా మరి అంతే, ఆయన మనల్ని పరీక్షింపగోరుచున్నాడు, తద్వారా మనం నిలుచుదుమా లేక సోలిపోదుమా అని చూచును. సంఘములో నుండి ఉజ్జీవమును, తీసివేసి ఒక వాదనను అనుమతించును. అందును బట్టి నీవు ఎలా నిలబడదువోనని ఆయన చూచును. మీ మద్యలోకి సాతానుని అనుమతించును, అప్పుడు నీవెలా నిలుచుదువో ఆయన చూచును. నిన్ను నీవు నీరూపించుకొనుటకు ఆయన నిన్ను కొట్టనిమ్ము. యోబు ఇలా పలికాడు, "ఆయన నన్ను చంపినా, ఆయననే నేను నమ్ముదును." ఆమెన్! అంతే.
DAN 3:17
54షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఇలా అన్నారు, "మా దేవుడు మండుచున్న అగ్నిలో నుండి మమ్మును విడిపించుటకు సమర్ధుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం మా తీర్మానం నుండి వెనుతీయము." అది నిశ్చయము.
దోనెలో అపోస్తలులు కలవరపడినట్లుగానే మనం కూడా కలవరపడుచుందుము. వారు వారి వలె మనం కూడా. ఆయన ఎవరో అనే దానిని నిరూపించెను, మరిప్పుడును ఆయన అదే చేయును, ఆయన సృష్టికర్తయైయున్నాడన్న సంగతి నిరూపించబడెను. ఆయన సృష్టికర్త. "ఏలాగున ఆయన సృష్టికర్త?" మంచిది, నాకు చెప్పుము ఆయన ఎట్లు రొట్టెను, చేపను వండి సిద్దం చేసెను. ఆయన చేపను సృజించుట మాత్రమే కాదు గానీ, అదే సమయమున దానిని వండెను. అది వాస్తవం. మన్నా ఎక్కడ నుండి వచ్చినది? ఆకాశము నుండి, వాస్తవంగా అది జనులను నలుబది సంత్సరంపాటు పోషించెను (బ్రతికించెను). ఆహారము ఆకాశము నుండి వచ్చెను. ఎక్కడ నుండి దానిని ఆయన పొందెను?
1KGS 17:6
55ఏలియాను పోషించుటకు అవసరమైన రొట్టె, మాంసంలను కాకోలములు ఎక్కడ నుండి పొందుకొన్నవి? కాకోలము యొక్క తెలివితేటలను గమనించండి. అది ఒక గోవును చంపి ముక్కలు చేసి వండి రొట్టెమీద వేసి కాల్చి సిద్ధం చేసి ఏలియా వద్దకు తెచ్చినవి!
ఆయన దేవుడు! మనం నమ్మకపోతే అవిశ్వాసులం అవుతాం. అంతే.మనం దానిని నమ్మితీరవలసినదే. అబ్రాహాము చేసినది కూడా మరి అదే, "తాను నమ్మినది ఎంతో అసాధ్యముగా నున్నప్పటికిని, అది ఇంకను జరుగకమునుపే దానిని నమ్మెను." తాను ఎంతో వృద్దుడునో అనే దానిని… తాను పొందుకొనిన వాగ్దానమును బట్టి నిరంతరం దేవునిని స్తుతించుచూ దానికొరకే కనిపెట్టెను.
MATT 4:3,4,7•
LUKE 4:3,4,8•
JOHN 10:37
56ఇప్పుడు, ఆయన తన మాటచేతను, రుజువులు స్థిరపర్చి చూపుట చేతను తాను ఎవరోనన్న విషయాన్ని నిరూపించుకొనెను. ఆయన ఇలా అన్నాడు, "నన్ను గూర్చి వ్రాయబడిన కార్యములను నేను చేయకపోతే నన్ను మీరు నమ్మవద్దు," చూచారా. దానిని నీవు ఎలా పట్టుకొంటావో నీ ఇష్టం. దానిని నీవు ఎలా పట్టుకొంటావో నీ ఇష్టం. దానిని నీవు లోతుగా గ్రహిస్తావని నా నమ్మకం, చూచారా. ఆ మాటను నిత్యము శ్రద్ధతో చూడుము.
ఏదేను తోటలో దాని ద్వారానే అపవాది హవ్వ మీద దాడిచేసెను. దానిలోనుండి కారణములను (హేతువు)లను వాడు ఆమెను అడిగెను. అదే అపవాది తిరిగి యేసు మీదికి దాడిచేసి, వాక్యమును ప్రశ్నించే కార్యములను, వాక్యమునకు తప్పుడు అనువాదములను ఆయన ముందు పడవేసెను. సాతాను ఇలా అడిగెను, "నీవు దేవుని కుమారుడవైతే, ఇప్పుడు నేనొక అద్భుతమును నీ ద్వారా చూడాలనుకొంటున్నాను. నేనింతవరకు నీవు చేయుట చూడలేదు. నీవు వీటిని మార్చాలని… నీవు ఆకలిగొనుచున్నావు గనుక ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము."
అందుకు ఆయన, "ఈ విధముగా వ్రాయబడింది…" ఓ, మై! నీవున్నది అక్కడే. దేవాలయము యొక్క శిఖరము మీద, అందుకు ఆయన, "ఈ విధముగా వ్రాయబడింది.." ఎత్తైన పర్వతము మీద, "ఈ విధముగా వ్రాయబడింది…" ఆయన సరిగ్గా వాక్యముతోనే నిలిచియుండి, అపవాదిని ఎక్కడ వుంచాలో సరిగ్గా అక్కడే వుంచెను.
JOHN 5:39•
JOHN 8:46
57తనను నమ్మని వారితో ఆయన చెప్పెను. వారు ఆయనను ఒక సోదెగాడిగాను, ఒక బయెల్జిబూబు అని, ఒక దయ్యము అని, దయ్యముల సహాయం చేత జనుల హృదయాలోచనలు పసిగట్టుచున్నాడని భావించారు. అందుకు ఆయన అన్నాడు, "నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును?" ఇంకా అన్నాడు, "మీరు నన్ను నమ్మనట్లైతే లేఖనములను పరిశోదించండి. వాటియందు నిత్యజీవముకలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నా పరిచర్యను నిర్దేషించేవి అవే," [చూచారా! నా భావం గ్రహించారా?] "నన్ను గూర్చి సాక్ష్యమిచ్చేవి అవే. [గమనించారా? మరొకసారి లేఖనములను ప్రస్తావించుచున్నాను.] నన్ను గూర్చి సాక్ష్యమిచ్చేవి అవే. నేను ఎవరినో అవే చెప్పును." ఆమెన్. దేవునికి మహిమ!
నీవు విశ్వాసివో లేక అవిశ్వాసివో అనేది లేఖనము చెప్పును. నీవు సరైన (వాక్యపు) వరుసలో ఉన్నావో లేదో లేఖనము చెప్పును. ఒక మనిషిని తనకున్న సాక్ష్యము ద్వారా నీవు తెలిసికోవచ్చును. తాను ఏం చెబుతాడో అన్న దానిని బట్టికాదు గానీ, అతడు లేఖనము యొక్క వరుసలో ఉండుటను బట్టి నీవు చెప్పవచ్చును. అది సత్యము. నీవు ఒక వ్యక్తిని తెలిసికొనే విధానం అదియే.
JOHN 13:16
58"ఒకవేళ నేను మెస్సీయాకుండవలసిన ప్రతి అర్హతలో ఒక్కటైనా సరే నేను ఎక్కడ తప్పిపోయానో చెప్పండి," అని యేసు వారిని ఆహ్వానించాడు. [ఓ మై! అవును అది సరియే. కాదంటారా?] "నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి, మెస్సీయాకి ఉండవలసిన ఏ యోగ్యతలు నాలో లేవో చెప్పండి. నేను ఏమి చేస్తానని లేఖనము సెలవిచ్చెనో, ఖచ్చితంగా అదే నాలో నెరవేరింది అని యేసు చెప్పెను."
ఓ, క్రైస్తవుడా, మనము ఆ వరుసలోనికి వచ్చినట్లైతే, ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పబడిందో దానినే మనము చేయాలి. ఆయనే సృష్టికర్తయని వారు ఎరిగియుండవలసివుంది. గాలిని, నీటిని సృష్టించినవాడు ఆయనేనని వారు గ్రహించవలసివుండెను. దానిని వారు ఎరిగినవారైతే, ఆయనే ఈ సృష్టిని సృజించినట్లైతే, తప్పక అది ఆయన మాటకి లోబడునని వారు గ్రహించలేకపోయారు. ఇప్పుడు చెప్పండి సృజించినవాడు గొప్పా లేక సృజించబడిన సృష్టి గొప్పా? యేసు ఇలా అన్నాడు, "పంపబడినవాడు గొప్పా? లేక పంపినవాడు గొప్పా?" ఏది గొప్ప, సృష్టా లేక సృష్టకర్తా? నిశ్చయముగా సృష్టికర్తె. తానే సృష్టికర్తనని ఆయన వారికి నిరూపించాడు. వారు దానిని చూసారు. మరి ఆయన సృష్టికర్త అయినయెడల, ఆయన సృష్టి ఆయనకు లోబడదా?
MATT 10:19•
MARK 13:11•
LUKE 12:11,12•
LUKE 21:14•
JOHN 6:54•
JOHN 11:25•
1COR 15:19
59ఆయన మన దేహములను సృజించేనన్న సంగతిని కూడా మనం జ్ఞాపకముంచుకోవాలి. అదే నిజమైతే మరి ఆయన ఆజ్ఞకు మన దేహాలు లోబడవలసిన పనిలేదా? "క్యాన్సర్ ని బయటకు ఉమ్మివేయుము," అని ఆయన దేహమునకు సెలవిచ్చినయెడల, దేహము తప్పకుండా ఆయన ఆజ్ఞకు లోబడును. కావున క్యాన్సర్స్ బయటకు వచ్చును. నీవు వాక్యమును తీసికొని ఇక్కడ దానిని నీవు విత్తుము, తరువాత గమనించుము ఏం జరుగునో నిశ్చయముగా ఏదో జరుగును. మన దేహములు ఆయన మాటకు లోబడవలెను. నేనొక క్రైస్తవుడిని అని నీవు చెబుతున్నావు. సరే, నీవు క్రైస్తవుడివేనని నమ్ముతున్నాను, మరి అలాగే నీవు కూడా నమ్మచున్నావు. అయితే దేని కొరకు మనము నిరీక్షించుచున్నాము? ఒక దినాన ఆయన మన దేహములను లేపును, అవి నిశ్చయముగా సంపూర్ణముగా నశించిన తరువాత లేపబడుతాయి.
ఒకటే దానిని నీవు నమ్మకపోతే మరి సంఘమునకు ఎందుకు వెళ్ళుచున్నావు? "పునరుత్థానము అనేది లేదు అని అన్నట్లైతే మనము మనుష్యులందరికంటే బహు ఘోరమైన వారముగా వుందుము." ఆయన వాగ్దాన వాక్యమేదనగా: "నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినను, అతడు తిరిగి లేచును." ఆమెన్. "పునరుత్థానమును జీవమును నేనే." ఆమెన్! నా శరీరమును తిని నా రక్తము త్రాగువానియందు నిత్యజీవముకలదు. అంత్యదినములయందు నేను అతనిని లేపుదును. మై! ఎందుకు? దేహము, బూడిద, అగ్నిపర్వతపు బూడిద చేత సృజించబడిన మన దేహము ఆయన మాటకు లోబడును, ఎందుకనగా దాని నిర్మాణకుడు ఆయనే.
మనయందున్న జీవము కేవలం సృజించబడిన ప్రాణము మాత్రమే కాదు గాని, ఆయన యొక్క సొంత జీవములో అది భాగమైయున్నది. ఆ కారణమును బట్టియే ఒక దయ్యమును గద్దించు అధికారమును మనము కలిగియున్నాము, ఎందుకనగా నీవు ఆభిషేకించబడినట్లైతే, మనలోవున్నది దేవుని యొక్క సొంత సృజనాత్మక జీవమైయున్నది, చూచారా. నిజమది. ఆ సమయమందు మాట్లాడునది నీవు కాదు గాని నీయందు నివసించు తండ్రియే. "ఏమి చెప్పవలెను అని నీవు తలంచకుము, ఎందుకనగా ఆ సమయానికి అది నీకు అందించబడును." కేవలం వెళ్ళుము. దానితో నిలుపుము. ఓ, దానిని నేను ఇష్టపడుదును!
60శిష్యుల చెయ్యవలసిన ప్రయత్నములన్నిటిని చేసి ముగించిన తరువాత వారిలో కొందరు ఆయన తమతో ఉన్నాడన్న సంగతిని గుర్తించిరి. మార్గమునకు ఆంతమునకు వచ్చిన తర్వాత వారిలో కొందరు, "మంచిది, ఇక్కడ మనము సకల ప్రయత్నములు చేశాము, అయితే మేము ఒక సాక్ష్యమును ఇచ్చుచున్నాము, అదేదనగా ఆయన మనతోనే ఇక్కడే పడుకొనియున్నాడు. ఉజ్జీవములకు మధ్యన ఆయన విశ్రాంతి నొందుచున్నాడు. మనం చేయవలసిన గడబిడను అంతటిని చేశాము, ఎంతగానో మధనపడ్డాం, ఆందోళనపడ్డాం, భగ్నమయ్యాం, సందేహపడ్డాం, భయపడ్డాం, చెయ్యావలసినదంతా చేశాం. అయితే సృష్టికర్త ఇక్కడే మన మద్యే, ఈ దోనెలోనే ఉన్నాడను సంగతిని గుర్తించలేకపోతిమి." ఓ, మై! ఓ, దేవా, ఆ సంగతిని మాలో కొందరు మొదటిగా తెలిసికొందురు గాక. ప్రభువా, అది ఉనికిలోకి వచ్చును గాక. దానిని మేము గ్రహించుదుము గాక.
నిన్ను తీసికొని నీ తల్లి గర్భము నుండి వేరుచేసిన ఆ దేవుడే, నీకు పరిశుద్ధాత్మను ఇచ్చిన ఆ దేవుడే. నీకు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు ఎలాగైతే దేవునిగా ఆయన ఉండెనో, మరి ఇప్పుడును ఆయన అలానే వున్నాడు. అప్పుడు వారికి ఎంత దగ్గరగా ఉన్నాడో, మరి నీకును ఆ దేవుడు అంతే దగ్గరుగా ఇప్పుడు ఉన్నాడు. నిశ్చయముగా అంతే. నీవు తప్పక గుర్తుంచుకొనుము, ఆయన ఎల్లప్పుడు ఉన్నాడు - ఎల్లప్పుడు. ఆది మంచిది. దోనెలో తమతో సృష్టికర్త ఉన్నాడని సంగతినే వారిలో కొందరు మాత్రమే గుర్తించారు.
HEB 13:8
61ఈ రాత్రి మరికొద్ది నిముషముల్లో రోగులతో నేను మాట్లాడబోవుచున్నాను, నీవు ఏ దేవున్నైతే నమ్మియున్నావో, ఏదేవుడైతే భూమ్యాకాశములకు సృష్టికర్తయైయున్నాడో, ఏ దేవుడైతే నీ దేహమును నిర్మించియున్నాడో, మరి ఆయనే ఇక్కడ ఉన్నాడని గుర్తించటం ఎంతో ఉత్తమం అని నాభావం. ఇది వరకు ఆయన ఎంతటి గొప్పవాడో, మరిప్పుడును ఆయన అంతే గొప్పవాడు. ఆయన దేవుడు. ఆయన గొప్పతనం, ఉనికి, ఎన్నటికీ తరగదు. ఆయన దేవునిగా ఉన్నంతకాలం దేవునిగానే వుండును. నీవు ఇలా అడగవచ్చును, "అది నిజమా బ్రదర్ బ్రెన్హాం? ఆది లేఖనమా?" హెబ్రీ 13:8 ఇలా చెబుతుంది. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఒకటేరీతిగా ఉన్నాడు."
బ్రదర్ గ్రూమార్, బ్రదర్ నోయల్ ఈ రాత్రి మన హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటి? మన విజ్ఞప్తి ఏమిటి? యేసుని మేల్కొపుట! నీ చుట్టూ శ్రమలు చుట్టుకొనివుంటే, ఇప్పుడే ఆయనను రంగము మీదికి తీసికొని వద్దాం. ఆమెన్. యేసుని మేల్కొల్పుదాం, ఎందుకనగా ఆయను మనము మనతో కలిగి వున్నాం. నిశ్చయముగా ఆయన మనతో ఉన్నాడు. గతములో ఎలా అయితే ఉన్నాడో మరి ఇప్పుడును, మరెప్పుడును ఆయన అలాగే ఉన్నాడు. ఆయనను గూర్చి చెప్పబడిన, ఆయన చేత రుజువు చేయబడిన వాక్య లేఖనములను వారు చూచియున్నారు.
ACTS 2:13-17
62పెంతెకోస్తు దినాన పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది అక్కడ నిలబడెనని మీకు తెలుసా. అక్కడ కొద్ది మంది యూదులు నత్తిగా మాట్లాడుటను, ఉమ్మివేసికొనుచూ, త్రాగుబోతులవలే కనబడుచుండుట జనులు చూసి, వారిని వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూన్నారు. మత సంబంధులగు ఆ పెద్దలు అక్కడ నిలువబడి, "ఈ జనులు ఇంత పొద్దున్నే క్రొత్త మద్యంతో ఎలా నిండుకొనియున్నారు," అని హేళనగా మాట్లాడిరి. మరి పేతురు నిలబడి వర్తమానమును బోధించినప్పుడు, నిజంగా వారు విన్న మాటలు వారి హృదయములలో నొచ్చుకొనిరి. అతడు అక్కడ నిజంగా సువార్త పునాదిని వేసెను.
అతడన్నాడు, "యూదా మనుష్యులారా, యెరూషలేం కాపరస్థులారా ఇది మీకు తెలియపర్చబడును గాక. నా మాటలకు చెవియొగ్గుడి. మీరు అనుకొన్నట్లుగా వీరు మద్యం సేవించలేదు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, కాని వీరు. [బహుశా? కాదు!] "ఇది ప్రవక్తయైన యావేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము." "అంత్యదినములయందు నా ఆత్మను సమస్త జనముల మీద కుమ్మరించెదను," అని "యెహోవా యిలాగు సెలవిచ్చుచున్నాడు." నా కుమారుల మీదను, నా పని వారి మీదను, పనికత్తెల మీదను నేను నా ఆత్మను కుమ్మరించును. ఆకాశములో నేను సూచనలను కనపరచెదను. అనగా రక్తమును అగ్నిని మరియు పొగ, ఆవిరిని కలుగజేసెదను; నా ఆత్మను పనికత్తెల మీద కుమ్మరించను, వారు ప్రవచించెదరు, మీ వృద్దులు కలలుకందురు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును." అవునా?
వారు అడిగారు, "మేమేమీ చేతుము? దానిని మేము ఎలా పొందుదుము?"
ACTS 2:38,39
63అతడన్నాడు, "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు." అది వారితోనే ఆగిపోయెనని మనకు చెప్పబడింది, కాని వారు… మీరు అక్కడ ఆగినట్లైతే, అది అక్కడే ఆగిపోవును. కాని అతడు ఏమి అన్నాడో ఒకసారి చూడు, "ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువగు మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికి చెందునని" చెప్పెను. చల్లటి శాఖ లోకము ఎదుటే అది సత్యమని మనం నిరూపించితిమి. ఆమెన్! వాక్యమునందు ఆ భాగము సత్యమైనప్పుడు, ఇక మిగతా బాగము కూడా సత్యమైయుండును. ఆమెన్! అవును. ఆయన చేత లేఖనము రుజువు చేయబడటాన్ని వారు చూచారు. మరలాగే మనం కూడా.
MATT 8:25,26•
LUKE 8:24,25
64ఆయనను రంగము మీదికి పిలుచుట అనేది కష్టమైన కార్యమేమి కాదు. ఆయనను పిలుచుట బహు సుళువు. ఆయన కార్యము చేయుటకు రంగము మీదికి వచ్చుటను గమనించుము. అది నాకిష్టము - జనసమూహముల మద్యలోకి ఆయన వచ్చుటను చూచుట నాకు ఎంతో ఇష్టం. ఆయన రంగము మీదికి వచ్చుటను గమనించుము… వారు అడిగారు, "ప్రభువా, మేము నశించిపోవుచున్నాము!"
ఆయన తన కన్నులు రుద్దుకొని ఇలా అన్నాడు, "అల్పవిశ్వాసులారా, మీరెందుకు సందేహపడితిరి? నేను చేసిన దానంతటిని మీరు చూడలేదా? చూడలేదా… నా ద్వారా లేఖనము నెరవేర్చుబడుటను మీరు చూడలేదా? లేఖనములన్ని నన్నే ఎత్తి చూపుతున్నవి. మీరు నన్ను నమ్ముచున్నారా అని నేను అడిగిన ప్రతీసారీ, 'అవును, ప్రభువా మేము నిన్ను నమ్ముచున్నాము, మేము దీనిని, దానిని చేతుము," అని ఎల్లప్పుడు చెప్పితిరి కదా!' మరి ఒక చిన్ని సమస్యకే ఇలా తేలిపోయారు ఎందుకని?"
వారిని అడిగిన అదే విషయాన్ని ఆయన నేడు మనల్ని కూడా అడుగుచున్నాడు, అవునా? నిశ్చయముగా అడుగుచున్నాడు. అవును, "మేము నిన్ను నమ్ముచున్నాము అని మీరు అన్నారు, కాని ఆ నమ్మకం సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోయింది? మీరెందుకు సందేహపడితిరి?"
JOHN 11:35
65కొద్దికాలం క్రితం ఒక స్త్రీ నాతో అన్నది. దీనిని నేను… ఇది వరకే దీనిని నేను చెప్పియుండొచ్చునేమో. అయినను మరొకసారి చెప్పగోరుచున్నాను. ఆమె ఒక క్రిస్టియన్ సైన్స్ అనే శాఖకు చెందియున్నది. ఆమె నాతో, "బ్రదర్ బ్రెన్హాం లేఖనములను గూర్చి మీరు చెప్పుదానినంతటిని నేను అభినందించుచున్నాను, అయితే మీలో ఒకే ఒక లోపం వుంది," అని అన్నది.
అందుకు నేను," మీకు వందనములు, ఒకటేనా? మై! మీ దృష్టిలో ఆమాత్రం దయనొందినందుకు ధన్యుడును," అని అంటిని.
ఆమె చెప్పినది, "మీ యొక్క లోపము ఏదనగా, నీవు యేసును గూర్చి మరీ ఎక్కువగా మాట్లాడుదువు."
అందుకు నేను, "ఓ, మై! నాకున్న ఏకైక లోపం అదే అయినట్లైతే, నేను అక్కడికి చేరినప్పుడు ఒకే లోపము నాలో వుందని దేవుడు అనుకొనును, కేవలం అదే అయివుంటే నిశ్చయముగా నేను లోనికి ప్రవేశించెదననే నమ్మకం నాకు కలదు. నాకు పదివేల బాషలోచ్చియు ఆయన గూర్చి గొప్పగా మాట్లాడకపోతే, ఏం ప్రయోజనం. అనర్గళంగా నేను ఏ బాషనైనా మాట్లాడవచ్చును, అయితే ఆయన గూర్చి గొప్పగా మాట్లాడలేకపోతే, ఆ బాషలన్ని వ్యర్థమే," అని చెప్పాను.
ఆమె చెప్పెను, "కాని బ్రదర్ బ్రెన్హాం, నీవు ఆయనను దైవికమైనవానిగా చేయుచున్న ఆయనను దేవుని చేయుచున్నావు."
అప్పుడు నేనన్నాను, "నేను చేయడమేంటి? ఆయన దేవుడైయున్నాడు. అప్పుడు, ఇప్పుడు ఎల్లప్పుడు. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే లోకమందంతటిలో ఆయన పెద్ద మోసగానిగా అవుతాడు."
ఆమె అన్నది, "ఓ…."
"లేదు ఆయన.." నేను అన్నాను, "దానిని నీవు నమ్మవా?"
"ఓ, శ్రీ. బ్రెన్హాం, ఆయన ఒక బోధకుడని నా నమ్మకం, ఆయన ఒక ప్రవక్త అని అందరి ప్రవక్తల వలే ఆయన కూడా ఒక సాధారణమగు ప్రవక్తయైయున్నాడని నేను నమ్ముదును అన్నది."
అందుకు నేను, "ఓ, మై, ఓ నీవు చాలా పొరబడుచున్నావు."
ఆమె చెప్పింది, "దానిని నీకు నిరూపించెదను."
నేను అడిగాను, "ఎలా?"
ఆమె చెప్పింది, "లేఖనములయందు, పరిశుద్ద యెహాను 11వ అధ్యాయములో, లాజరు చనిపోయినప్పుడు, యేసు కన్నీరు విడిచెను," అని బైబిల్ సెలవిస్తుంది, "ఒకవేళ ఆయనే దేవుడైవుంటే ఏ విధంగా కన్నీరు కార్చగలడు?"
అందుకు నేనన్నాను, "ఆయనలో మనిషి భాగమే కన్నీరు కార్చెను, అది మనిషి భాగము, అయితే లోపలి అక్షయ భాగము వుండెను. అది ఆయనలో దేవుడిగా వుండెను."
ఆమె అన్నది, "ఓహ్, బుద్ధిహీనత!"
MARK 4:39•
JOHN 11:43•
HEB 13:8
66"నేను నిన్నొక విషయం అడగగోరుచున్నాను. ఒక నరునిగా ఆయన ఆ దోనెలో నిద్రించుచుండెను. అది నిజం. ఆయన ఒక నరునివలే అలసిపోయి, నీద్రకి ఉపక్రమించెను. అయితే తుఫాను, అలలు రేగినప్పుడు, ఆయన లేచి, దోనె అంచుల మీద పాదము మోపి, "నిమ్మళముగా ఉండుము," అని గద్దించినప్పుడు, అలలు, గాలియు ఆయనకు లోబడెను. ఒక మనిషిగా ఆయన లాజరు సమాధి వద్ద ఏడ్చెను, కాని 'లాజరూ బయటకు రమ్ము' అని పిలిచినప్పుడు, చచ్చి నాలుగు రోజులైన మనిషి బయటకు వచ్చెను. ఒక మనిషిగా ఆయన కొండదిగి వచ్చి, ఆకలి తీర్చుకొనుటకు ఆ చెట్టు పండ్లను ఆశించి, దానిని తేరి చూచెను. అయితే ఐదు రొట్టెలను తీసికొని ఐదువేలమందికి పంచి పెట్టెను, అది మనిషి కాదు, సృష్టికర్త, అది వాస్తవం." నిశ్చయం. క్రియలో, దేవుడు క్రియలోకి వచ్చుట!
ఓ, దానిని నేను ప్రేమించుదును. ఒక విగ్రహాం కాదు, ఒక చెక్కుడు బొమ్మను ముద్దు పెట్టుకొనే తలంపు కాదు, సహజ రూపాల స్థంబమునకు మొక్కుట కాదు, నిజమైన, జీవముగల దేవుడు కార్యరూపంలోకి వచ్చుట. ఆమెన్! ఆమెన్. అటువంటిది గతములో కాదండీ; ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అది లోకానికి వింతగా, వెర్రితనముగా కనబడవచ్చును. కాని ఓ, నమ్మినవారికి అదెంత భాగ్యం. అదెంత అద్భుతం! నిశ్చయముగా. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు.
AMOS 3:7
67మీకు తెలుసా, ఆయన ప్రవక్తకంటే ఎక్కువ. అయినప్పటికి ఆయన ఒక ప్రవక్త. ఆయన దేవుడును, ప్రవక్తను అయివున్నాడు, చూచారా — ఎందుకనగా ప్రవక్త కూడా వాక్యమైవున్నాడు. వాక్యము ప్రవక్త యొద్దుకు వచ్చునని బైబిల్ చెప్పుచున్నది. ప్రవక్త వాక్యము పలికినంతకాలం, తాను మరియు దేవుడు… తాను ఏం చేయుచున్నాడో అతనికి తెలియదు, అతడు కేవలం దేవుని వాక్యమును పలుకుచున్నాడు, చూచారా. తనకు తెలియకుండానే, ప్రేరేణ క్రింద అతడు ప్రవచించును, చూచారా. అది మనిషి మాట కాదు, దేవుడే మనిషి పెదవుల గుండా మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు మనిషిని వాడుకోటమే దేవుని ఎన్నిక. సువార్తను ప్రకటించుటకు ఆయన సూర్యున్ని ఎన్నుకొనియుండగలడు. సువార్తను ప్రకటించుటకు ఆయన గాలిని ఎన్నుకొనియుండగలడు. అలాగే నక్షత్రములను ఆయన ఎన్నికొనగలడు. కావాలనుకొంటే తాను దేనినైనా వాడుకోగలడు, అయితే ఆయన మనిషిని ఎన్నుకొనెను, ఎవరో ఒకరి దానిని చేయుదురు. అది వాస్తవం. ఎవరో ఒకరుంటారు.
ACTS 2:3•
COL 2:9
68తన కొరకు ఒక వ్యక్తిని ఆయన కనుకొనలేకుండినట్లైతే తన చేతికి అందివచ్చే వానితోనే ఆయన తన కార్యమును జరిగించుకొంటాడు. ఒక వ్యక్తిని కనుగొనుట అనేది కొన్నిసార్లు చాలా క్లిష్టముగా ఉండను. సమ్సోను గూర్చి నేను ఆలోచించుచున్నాను. గొప్ప బలవంతుడగు వ్యక్తిని ఆయన కనుగొనెను. తన బలశౌర్యమును సమ్సోను దేవునికి అప్పగించుకొనెను గాని తన హృదయమును కాదు. అతడు దానినీ దెలీలాకి ఇచ్చెను, చూచారా. నీ హృదయమును, బలమును, ఆత్మను, దేహమును, మనసును, నీ సమస్తమును దేవుడు కోరుచున్నాడు. ఆయన నిన్ను వాడుకొనే ఏకైక విధానమదే. నీ సమస్తమును ఆయన వాడుకొనును. అవునండి.
యేసు అనగా అదేమరి. "దైవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా ఆయనలో వశించుచున్నది." ఆయనలో సర్వసంపూర్ణత, మనలో కోలత ప్రకారం వుంది, ఎందుకనగా పెంతికోస్తు వద్ద అగ్నిస్తంభము దిగివచ్చుటను నీవు గమనించు, బైబిల్ దానిని ఇలా చెప్పుచున్నది. "అగ్ని అనేది నాలుకలవలే చీలి (విభాగింపబడి) వారి మీద వ్రాలెను." అది ఏమై వుండెను? ఆ అగ్నిస్తంభము దానికదే విభజింపబడి, తన ప్రజల మధ్య ఆయన తన్నుతాను విభాగించుకొనెను. అది ఎంతో కృపగల కార్యం, చూచారా. నీలో వున్న దేవుడు, చూచారా. తన ప్రజలలో ఉన్న దేవుడు. ఇప్పుడు, గమనించుము.
MATT 28:20•
JOHN 14:12,17•
HEB 13:8
69ఈ రాత్రి సంఘములో ఒకరు చెప్పుదురు, దీనిని చెప్పుదురు. నేడు జనులు ఇలా చెబితే, "ఆయన యిక్కడ, మనతో ఉన్నాడని మనము ఎరిగినట్లైతే, ఏదైనా మార్గము ఉండునా?" మీరు గమనించండి, వారు ఆయన వైపు చూడగలరు.
ఇప్పుడు, కొంచం దగ్గరగా వినండి, ప్రార్ధన వరసును మనం పిలువకముందు ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. మనం చెప్పవచ్చును, "ఆయన అక్కడే వున్నాడు."
ఇప్పుడు, ఆయన సమీపముగా ఉన్నాడు. ఇంకా సమీపముగా ఉన్నాడు. "యుగసమాప్తివరకు నేను మీతో ఉందును." అది నిజం కాదా? దోనెలో ఆయన వారితో అన్నదానికంటే మరీ సమీపముగా ఆయన మనతో ఉన్నాడు, ఎందుకనగా దోనెలో ఆయన వారికి దిగువున వున్న అమరములో నిద్రించుచుండెను. అక్కడికి వారు వెళ్ళి ఆయనను మేల్కొల్పిరి. ఇప్పుడు నీవు ఆయన యొద్దకు వెళ్ళి నిద్రలేపాల్సిన పనిలేదు. ఓ మై! హ్! ఓ, నేనిప్పుడు భక్తిపారవశం చెందుచున్నది. అది నాకు చాలా హాయిగా వుంది ఇప్పుడే మరి, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 సెలవిచ్చుచున్నది. ఆయన మరలా ఇలా అంటున్నాడు, "ఇదిగో నేను ఎల్లప్పుడు మీతో ఉన్నాను, అంతమువరకు, సాయంకాలము వరకు." గతరాత్రి నేను "సాయంకాలమందున, అది ఉండును," అనే అంశంను భోదించితిని. "నేను మిమ్మును ఎన్నడు విడువను దోనె సుడిగుండాలలో చిక్కుకొన్న, తలక్రిందులైనా, ఇంకేదైనా సరే, నేను మాత్రం మిమ్మును ఎడబాయను, అంతము వరకు మిమ్మును విడువను."
నీవు అడగవచ్చు, "బ్రదర్ బ్రెన్హాం ఇదెలా సాధ్యం?"
JOHN 14:12
70ఆయన దానిని నిరూపించును అని పరిశుద్ద యోహాను 12 అధ్యాయం 14వ వచనం సెలవిచ్చుచున్నది. చూచారా, "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయుక్రియలు చేయును."
"ఆయన ఎల్లప్పుడు ఒక్కటేరీతిగా ఉన్నాడన్న సంగతిని నాకు మీరు చూపించాలని, నిరూపించాలని నేను కోరుచున్నాను. ఒకవేళ నీవు దానిని రుజువు చేయగలిగినయెడల…" అని నీవు అడగవచ్చునేమో.
మంచిది, ఇక్కడే ఆయన రుజువును సవాలు చేయుచున్నాడు. "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును…" మరొక మాటలో నీవు ఒక చిన్న మెస్సీయాగా ఉందువు. అది నిశ్చయముగా వాస్తవం. ఎందుకనగా ఆయన జీవము నీలో వున్నది, చేసేది నీవు కాదు; ఆయనే. ఆయన పనిని జరిగించుటకు లేక ముందుకు తీసికొనిపోవుటకు నిర్ణయించబడితివి. "నాయందు విశ్వాసముంచువానికి నేను మెస్సీయానని నిరూపించుకొందును. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును." ఇప్పుడు, ఆయన అబద్దమాడనేరనివాడు, ఆయనేమై ఉన్నాడని నీవు అనుకొందువో ఆయనేమైయున్నాడని నేనెరుగుదునో, అదే రీతిగానే ఆయన ఉన్నాడని నీవు నమ్ముము, చూచారా.
71ఆయన ఏమి చేయుచున్నాడో నీకు తెలుసా? తనను బయలుపర్చుకొనుటకు లేక రుజువు చేసుకొనుటకు ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. అది నిజం. మనం ఏం చేయాలో నీకు తెలుసా? వారు దేన్నైతే చేసారో, మనం అదే చేయవలసివుంది. వారు దోనెలో ఉన్న యేసును మేల్కొల్పారు. మనము మనలో ఉన్న యేసుని మేల్కొల్పాలి. మన జీవితములో ఉన్న యేసును మేల్కొల్పవలయును. పరిశుద్ధాత్మ ఆగ్నితో మన హృదయమును మండించిన దేవుడు, నా గ్రుడ్డి కన్నులను తెరిచిన దేవుడు, మరణ పడకలో నుండి నన్ను లేపిన దేవుడు, ఐదు పర్యాయములు వైద్యులు మరణ దృవీకరణ పత్రం జారీ చేసినను, మరణించి అనేక గంటలు గడిచినప్పటికిని, దేవుడు వారిని మరలా బ్రతికించుటను నేను చూచితిని. మరి ఆ దేవున్ని మేల్కొల్పుము. ఆయనను మేల్కొల్పుము మనము యేసుని పిలిచి మేల్కొపవలసివుంది, రంగము మీదికి ఆయన్ని పిలువవలసివుంది. ఆయన యొక్క అవసరత మనకి ఎంతవుంది. అవునండి.
JOHN 14:19•
JOHN 17:16
72అప్పుడు తన వాక్యమును రుజువుపర్చుటకు ఆయనను పిలువుము.
ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఆయనను మనము మేల్కొల్పినప్పుడు, ఆయన లేచి మన సందేహములు, కలవరము పోగొట్టును, అలా పోగొట్టేవరకు మనము ఆయనను కదిలించుచూనే వుండాలి. కావున ఇప్పుడే ఆయనను పిలిచి, "ప్రభువా, ఇకను లోకము నన్ను చూడనేరదు అని కొద్ది సేపటి క్రితమే పలికితిని, లోకమునకు నేను చెందినవాడిని కాదు. లోకసంబంధిని నేను కాకుండునట్లు నా కొరకు నీవు ప్రార్థించితివి. నేను లోకసంబంధిని కాను. నేను నీవాడను. లోకము ఇకను నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూతురు, అని నీవు సెలవిచ్చితివి - మీరు నన్ను చూతురు. ప్రభువా, నిద్రలో నుండి నిన్ను భంగపరచగోరుచున్నాను. నిద్రావస్థలో వున్న నా శరీరములో నుండి, నిద్రావస్థలో వున్న నా హృదయములో నుండి నిన్ను లేపగోరుచున్నాను," అని చెప్పుము.
యేసుని మేల్కొల్పుము. "నా యొద్దకు రండి, అప్పుడు సందేహములన్నియు, భయములన్నియు తీరిపోవును."
సమస్త కలవరములు, చింతలు… "ఓ, వైద్యుడు అలా ఇలా అన్నాడు, ఏదో చేయబోతున్నాడు, నాకైతే ఏమి పాలుపోట్లేదు. నాకు…" అని కృంగిపోకుము. ఆయన దేవుడు గనుక అన్ని కుదురుకొంటాయి. ఆయన పలుకగా సమస్తం మౌనం దాల్చును (లోబడును).
MATT 28:20•
JOHN 1:1,14•
JOHN 14:17,19•
HEB 13:8
73ఇంకా ఎన్నో పేజీల కొద్ది దీన్ని గూర్చి మనం మాట్లాడుకోవచ్చును. అయితే ఇప్పుడు నేను నిన్ను ఒక విషయం అడుగగోరుచున్నాను, ఎందుకనగా ఇప్పటికే సమయం పది నిముషముల తక్కువ తొమ్మిది అయినది. బహుశా గత రాత్రి కంటే రెండు గంటలు ముందే కూటమును ముగించబోవుచున్నామని మరి మీకు తెలుసు, కాని చూడండి. ఇప్పుడు దీనిని ఆపుదును, మరొక సారి ఎప్పుడైనా ఈ అంశంను ముగింతును, అని నేను చెప్పగోరుచున్నాను. దేవుడెప్పుడైనా విఫలమగునా? మరి ఆయన వాక్యము తప్పిపోవునా, ఎందుకనగా ఆయనే వాక్యమైవున్నాడు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను. వాక్యమే దేవుడైవుండెను, ఆ వాక్యమే శరీరము ధరించి మన మధ్య నివసించెను. లోకము ఇకను నన్ను చూడదు. అయినను మీరు నన్ను చూతురు, ఎందుకనగా నేను [మరియు అనేది వ్నేయక్నుతిగత సర్వనామం], నేను మీతో యుగసమాప్తి వరకు, కాలము ముగిసేవరకు వుందును. అంత్యకాలమందు నేను మీతో వుందును." అంత్యకాలమందు వెలుగు ప్రకాశించును.
ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8లో వ్రాయబడింది. దానిని మీరు నమ్ముదురా? హెబ్రీ 13:8 వ్రాయబడినది. అది వ్రాయబడినది గనుక తప్పక నెరవేరును. ఆమెన్. ఆయన వాక్యమును పరీక్షించుటకు ఏమాత్రం భయపడవద్దు. అది ఉన్నది. ఆయన ఇక్కడ ఉన్నాడు. అయితే నీవు చేయవవలసిన ఒకే విషయము, ఆయనను మేల్కొల్పటమే.
నీవు…
MATT 8:25•
MARK 4:38•
LUKE 8:24
74వడకట్టబడని ఆత్మ (దురాత్మ) ను బట్టి మనము ఎంతగానో ఉక్కిరిబిక్కిరి అయ్యాము, గతాన్ని గుర్తుచేయుటను కారణమును బట్టి, ఆటువైపుగా త్రిప్పబడి, "నేను అలసిపోయాను - ఎంతో నీరసించిపోయాను ఇది జరుగుట చూసాను. పగిలిపోవుటకు నీవు దేన్ని చూపుదువు?" "నేను నిన్ను దాని యొద్దుకు తీసికొనిపోవుదును," అని అందువు. అంతే కాక "నాకు ఒకరు తెలుసు అతడు దేవున్ని నమ్ముకొన్నాడు. అయినా నయంకాక చనిపోయాడు," అని కూడా అందువు, మరి అదే సమయంలో వైద్యుల పర్యవేక్షణలో వున్న వేలాది జనులు చనిపోవుచున్నారని నాకు తెలుసు. గమనించావా? అవును. ఆది వాస్తవం. వైద్యుడు చేయగలిగినదంతా చేసియుండెను. అయినను ఫలితం లేకపోయెను, కాని దేవునియందు నమ్మికయుంచుము, దానిని నీవు నమ్ముము.
ఇప్పుడు, "మంచిది, నేను నమ్మబోవుచున్నాను," అని నీవు చెప్పుట సరికాదు, దానిని నీవు అలా చెప్పుట యుక్తము కాదు. నిశ్చయముగా నీవు నమ్మాలి, ఆ విధముగా కార్యము చేయాలి. అంతే.
నీవు ఆయన యొక్క నిద్ర అది కాస్త భంగపర్చాలి, ఎప్పటి వరకు అనగా ఆయన లేచి, రంగము మీదికి వచ్చేటంత వరకు, మరి మన ప్రార్ధనలు ఆయనను భంగపర్చలేవా? ఆయన విశ్రాంతిలో నుండి లేచునట్లుగా మన ప్రార్థనలు ఆయనను మేల్కొల్పలేవా? వారు చేసారు, వారు మొర్ర పెట్టారు. "ప్రభువా మేము నశించిపోతున్నాము." వెంటనే ఆయన రంగము మీద కదిలెను, వారు చేసినట్లుగానే మనం కూడా ఇప్పుడు అదే చేయుదుము. ఇప్పుడు, మీరు నమ్ముదురా? అలాగైతే మనం ప్రార్థించుదుము.
MATT 28:20•
HEB 13:8
75ఓ, ప్రభువా, "యేసుని మేల్కొల్పుట" అనే సాధారణమైన ఈ చిన్న తలంపును, ప్రభువా, ఇంతకాలం మా ఆత్మలో మేము ఆయన ఆత్మను, ఆయన విశ్వాసమును వాడుకోనందున, అవి నిద్రించిన స్థితిలో వుండిపోయినవి. ఈ రాత్రి మమ్ములను కదిలించుము. మా నిద్ర స్థితిలో నుండి మేము మేల్కొనునట్లు చేయుము, తద్వారా ఆయన ఇంకనూ దోనెలో ఉన్నాడని చూడగలుగుదుము.
ఓ, ప్రభువా, నేడు నేను నా ఆత్మను కదిలింప ప్రయత్నించితిని. ఈ రాత్రి నేను ఇక్కడున్న చిన్న గుంపు ప్రజల యెదుట నిలబడియున్నానని నేను ఎరుగుదును. నన్ను నేను కదిలించుకొనుచున్నాను. ప్రభువైన యేసూ, లేచి రంగము మీదికి రమ్ము, నీ వాక్యమును జనుల ముందుంచితిని. అది పరీక్షింపబడవలసియునది. నీవు ఇంకనూ సజీవుడవని ఇంకను నీవు మాతో వున్నావని ప్రభువా, ఈ రాత్రి శ్రోతలకు దానిని నిరూపించుము. నీ మాటలు సత్యమైనవి: "నేను ఎల్లప్పుడు, యుగసమాప్తివరకు మీతో కూడా ఉందును." నీవు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నావు.
ప్రభువా, నీవింకా ఓడలోనే వున్నావు. సమస్యల సుడిగుండాల గుండా ఆ పాత సీయోను నావ మమ్ములను తీసికొనిపోవుచున్నది. దయ్యము గాలి తుఫానులు రేపి, మా నావను కొట్టినా నావలో నీవున్నందున మాకేమి కాదు. తండ్రి, ఈ రాత్రి మాతో నీవుండుము. ఈ రాత్రి నీవే ప్రజల హృదయములలోకి నడచి వచ్చుదువు గాక.
JOHN 14:12,19•
EPH 1:3
76నా హృయములోకి, ఆత్మలోకి, శరీరములోకి మనస్సులోకి నేత్రములలోకి, పెదవులలోకి నీవు వచ్చుదువు గాక. నన్ను నేను నీకు అప్పగించిన ఈ సమర్పణ నీ వాక్య ప్రకారముగా అనగా "నాయందు విశ్వాసముంచువారు, నేను చేయు క్రియలు చేయును," అని యోహాను 14:12లో నీవు వాగ్దానము చేసిన దాని ప్రకారముగా రూడి చేయుము. తరువాత అది శ్రోతలలోనికి వెళ్ళును గాక, తద్వారా వారు దీనిని, "కొద్ది కాలం తరువాత లోకం నను చూడదు గాని మీరు నన్ను చూతురు," అను దాని ప్రకారం నమ్ముదురు. క్రీస్తు యేసునందు మనం ఈ రాత్రి పరలోక స్థలములో కూర్చొనియున్నాము, ప్రభువా, నిన్ను నీవు కనబడచుకోనుము. అది నీ వాగ్దానము అయివున్నది. నీ మాటలు ఎన్నడు తప్పిపోవు. ప్రజల యొక్క విశ్వాస పరిమాణము చొప్పున, వారు నిన్ను స్వీకరింతురు (పొందుకొందురు) గాక మేము చేయగగలిగినదంతా అదే.
ప్రభువా, నీవు మహిమ పొందులాగున ఈ శ్రోతలను, వర్తమానమును, విత్తబడిన విత్తనమును నీకు సమర్పించుచున్నాను. పరిశుద్ధాత్మ వచ్చి తన వెలుగును దానిపై ప్రకాశింపనిమ్ము. ఇది వరకు నేను చెప్పినట్లుగా సమరయ స్త్రీ యొక్క విత్తనమువలెను వెలుగు ప్రసరించి, వెంటనే జీవము బయటకు వచ్చును గాక, విశ్వాసి దానిని చూచును గాక. రోగులుగా వున్న స్త్రీ, పురుషులు, బాలబాలికలు దానిని చూతురు గాక, ఇతరులు స్వస్థపడాలని కోరువారు దానిని చూతురు గాక. త్వరగా స్వస్థత నొందుదురు గాక. యేసు నామములో ఆమెన్.
ఇప్పుడు మీరు నమ్ముచున్నారా?
MARK 9:23
77ఇప్పుడు, నేను నమ్ముచున్నాను… మంచిది, నేను ప్రయత్నింతును. నేను వాటిని తీసుకోని రాలేను, కాని అవసరాన్ని బట్టి ఒక్కసారి కొన్నిటిని, గనుక వారిని తీసికొనిరావడం ఆరంభింతుము, కొద్దిమందిని ప్రార్థన నిమిత్తము. ఇది మంచి గుంపుని నాకు తెలుసు. సేవక సహోదరులారా, ఇంకొద్దిసేపు ఓపికగా కూర్చొండి. నేను ఇక్కడ దీని వెనుకకి వచ్చెదను. మీరు ఇక్కడ ఉండొచ్చును. మంచిది.
ఇప్పుడు, సందేహించవద్దు; నమ్మండి. మీరు నమ్ముదురా? "నమ్మువానికి సమస్తమును సాధ్యమే." "అవును. నమ్మువానికి సమస్తమును సాధ్యమే." అవునండీ ఇప్పుడు మీరు నిశ్చయముగా నమ్మండి. దేవుని వాక్యము సత్యమని మీరు నమ్మవలెను. మంచిది.
ఇప్పుడు ఆరంభింతుము…
78ఒకేసారి ఇక్కడ ఎంతమంది నిలబడగలరు? సుమారు ఎనిమిది లేక పదిమందా? మంచిది. ప్రార్థనా కార్డు ఒకటితో ఆరంభింతుము, మరియు ఒకటినుండి సుమారు పదిలేక, పదిహేను ప్రార్ధనా కార్డులను, A (ఏ), ఒకటినుండి పదిహేను వరకు. ఒకటో నంబరు ( A) గల ప్రార్థనా కార్డును ఎవరు కలిగి ఉన్నారు? స్పానిష్ వారు, ఇండియన్ వారు ఇరువురుండుటను నేను చూచుచున్నాను. వారు దీనిని అర్థం చేసికోలేరేమో. మంచిది, ఇక్కడికి ఒక స్త్రీ వచ్చింది, నా దగ్గరకు రెండవ నంబరా? ఇక్కడకి హూ, హూ అక్కడికి అవును. ఇక్కడికి మంచిది అంకే రెండు మూడు మూడవ నెంబరు? మంచిది. ఇక్కడికి మీకు ఇష్టమైతే, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏనిమిది? ఆ చిన్న బిడ్డను ఎవరో ఒకరు అలా తీసికెళ్ళండి. ఎనిమిది, తొమ్మిది, పది. ఇప్పుడు, పదివరకు.
మంచిది. మనము చూచాము ఏరకమగు… ఓ, మనం నాకు తెలియదు. బహుశా ఎక్కువ మంది ఉన్నారేమో. మంచిది, అది చాలా మంచిది. వారు ఆ విధముగా వరుసలోకి రానివ్వండి. చాలా బాగుండును. పూర్ణ హృదయముతో మీలో ఎందరు నమ్ముదురు? ఇప్పుడు, మనకిక్కడ ఎక్కువ మంది లేరు. పది, పదికొండు, పండ్రెండు, పదమూడు, పద్నాలు, పదిహేను మంచిది.
79ఇప్పుడు, ప్రతిఒక్కరు, చాలా భక్తిగా వుండండి. ఇప్పుడు, సుమారు గంటపాటుగా నేను బోధించాను. ఇప్పటివరకు నేను బోధించిన దాని పక్షమున దేవుడు నిలువకపోతే ఏమి ప్రయోజనముండదు. ఆయన దానిని జరిగించినా లేదా లేకపోయినా వాక్యము మాత్రం సరైనదే. అయితే దాని పక్షమున ఆయన నిలువవలసి ఇంతవరకు ఆయన ఎన్నడు కూడా తన వాక్యము పక్షమున నిలువకపోవటమంటూ చేయలేదు. ఇంతవరకు ఆయన నా విషయంలో ఎన్నడు తప్పిపోలేదు, చూచారా. ఆయన దానిని చేయునని నేనెరుగుదును. అయితే మనం తప్పక నమ్మవలెను. హృదయపూర్వకముగా మనము నమ్మవలెను.
ఇప్పుడు నాకు తెలిసినంతవరకు… ప్రార్థనా వరుసలో వున్న మీరు, ఈ దారిని చూడాలని, ప్రార్థనా వరుసలో జరుగుదానిని గమనించాలని కోరుచున్నాను. ప్రార్థనా వరుసలో వున్న ప్రతి ఒక్కరు నాకు కొత్తవారేనని నేను నమ్ముచున్నాను. అది సరైతే మీ చేతిని ఎత్తి చూపండి. మీ అందరికి నేను క్రొత్త అయినట్లైతే, మీ చేతులను పైకెత్తి చూపండి. మంచిది. వారిని నేనెరుగను. వారు, వారిలో అనేకులకు… ఇక్కడున్న వరుసలలో కొందరిని బహుశా నేనెరుగుదునేమో ఖచ్చితంగా చెప్పలేను. ఈమె బ్రదర్ నోయల్ సతీమణి అని నేననుకొంటున్నాను. ఖచ్చితమని నేను అనను, ఎందుకనగా చూచి చాలాకాలమయింది.
EPH 1:3
80బ్రదర్ జాన్సన్ ఎలా ఉన్నాడు? అతనికి గుండెపోటు వచ్చిందనుకొంటాను. అవును కదా? ఓ మై. ఏం చెప్పుదును? అది నిజమేనా? ఆమె హృదయాన్ని దేవుడు దీవించును గాక. ఆర్కన్సాస్ లో ఈ చిన్ని గుంపుతో కూటమును ఆరంభించినప్పుడు, అప్పుడు వారు నాతో ఉండిరి. వారు నాకు తల్లిదండ్రులతో సమానం. నేనెన్నడు ఆర్కన్సాస్ ను మరిచిపోలేను. నిశ్చయముగా నేను ఎక్కడ కూటమునకు వెళ్ళినా, అక్కడ ఆర్కేయులు తప్పకుండా వుంటరు. ఆర్కన్సాస్ నుండి వచ్చినవారు ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెతులెత్తండి? సరే. మిగతావారు ఓక్లహోమా నుండి వచ్చినవారు, గనుక మీరు దాని మీద ఆధారపడవచ్చును. అది వెళ్ళే విధానం అది. అయితే మనమందరం పరలోకమునకు చెందినవారము, క్రీస్తు యేసులో ఏకముగా కూడి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము.
81సిస్టర్ జోన్స్ మరియు బ్రదర్ జోన్స్, ఏళ్ళ క్రితం నేను మీ సంఘమునకు వచ్చితిని అది మోఆర్క్ లో అనుకొంటాను, కదూ? మీకు గుర్తున్నదా, నేను అక్కడికి వచ్చినప్పుడు ప్రజల సమస్యలను తెలిసికొనిన ఒకే ఒక విధానం ఏదనగా… మీరు వారిని వేదిక మీదికి నడిపించితిరి. వారు తమ చేతులను నా మీద వేసితిరి, అప్పుడు నేను ఒక నిమిషం వేచియుండెదను. నా స్వంత జ్ఞానంతో వారి సమస్యను చెప్పలేదు గాని, ఆయన నాకు దేనినైతే చెప్పేవాడో, దానిని మీకు చెప్పితిని. "కణితి, కంటి శుక్లము," అంటక ఫలానిది, ఫలానిది అని ఆయన నాకు బయలుపర్చి, చెప్పమన్నట్లు, యధార్ధముగా నేను చెప్పితిని, వారి హృదయాలలో వున్న రహస్యములను బయట పెట్టితిని, చూచారా. అది నిజం. మొట్టమొదటసారి నేను ఫినెక్స్ కు వచ్చినప్పుడు ఎందరు దానిని గుర్తుంచుకునియున్నారు? అది మంచిది. అవి జరిగినవా? ఇప్పుడు గుర్తుంచుకోండి (ఈ టేపును గమనించండి), మనము మరో మెట్టు పైకి వెళ్ళుచున్నాము, చూచారా, ఇంకొద్దిగా పైకి వెళ్ళుచున్నాము. దానిని గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి.
ISA 53:5•
JOHN 14:10,12•
1PET 2:24
82ఇప్పుడు మనము యేసుని చూడగోరుచున్నాము. నేను ఆయనను చూడగోరుచున్నాను. ఇప్పుడు ఆయన తన సంఘము కొరకు వచ్చేటంతవరకు, ఆయన శరీరము భూమి మీదికి తిరిగిరాదు, అని మన మెరుగుదుము, ఎందుకనగా ఒక బలి కొరకు అది (శరీరము) అక్కడే వుండవలసివుంది. అది అంతేకదా? అది ఖచ్చితముగా బలిపీఠము మీద ఉండవలసివుంది. ఈ రాత్రి ఆయన దేవుని సంహాసనము మీద కూర్చొనియున్నాడు. అది అక్కడే నిలిచియుండవలెను, ఎందుకనగా ఆయన బలియాగము, ఆ బలియాగము బలపీఠము మీద ఉండి తీరాలి. ఆయన తాను పొందిన దెబ్బలను బట్టి, చూచారా. అందుకనే ఆయన దేహము రాజాలదు, కాని ఆయన జీవము అది క్రీస్తులో వున్నది. అది సంఘములోనికి పరిశుద్ధాత్మ రూపములో తిరిగి వచ్చినది. మరి ఆ పరిశుద్ధాత్మ…
వాటిని చేసినది ఆయన దేహము కాదు. ఆయన అన్నాడు, "ఈ క్రియలను చేసేది నేను కాదు గాని, నాయందు నివసించు తండ్రియే ఈ కార్యములన చేయుచున్నాడు." దానిని మనం నమ్ముచున్నాము, అవునా? ఇప్పుడు, ముఠా నాయకుని ఆత్మ నాలో వుందని నేను చెబితే, అప్పుడు మీరు నా యొద్ద పెద్ద తుపాకులు, మరి అలాంటివి వుండటాన్ని ఆశించుదురు. ఒక కళాకారుని ఆత్మ నాలో వుంటే, ఒక కుంచె, రంగులు మొదలగువాటిని నా నుండి ఆశించుదురు. క్రీస్తు యొక్క ఆత్మ నాలో వున్నదని నేను పలికితే, క్రీస్తు చేసిన కార్యములనే అది చేయును. "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయను." ద్రాక్షావల్లిలో వున్న జీవము ఒక కొమ్మలో నుండి మరొక కొమ్మలోనికి ప్రవహించుట, ద్రాక్షావల్లిలో ఉన్న జీవమును బట్టియే ద్రాక్షాపండు ఉత్పత్తి అగును.
83ఆయన ఏమి చేయనైయున్నాడో నేనెరుగను. దానిని నేను చెప్పజాలను కాని ఒక వరమును బట్టి నేను… ఇప్పుడు, దానిని వివరింపవలసిన పనిలేదు. నేను వివరింపలేను. నేను ప్రపంచమంతట అనేకసార్లు ప్రయాణించితినని మీలో అనేకులకు తెలుసు. ఒకసారి ఐదులక్షల మంది వివిధ రకములగు బాషలు మాట్లాడు జనులు కూడివచ్చిరి. నేను ఒకసారి మాట్లాడితే, అక్కడ సుమారు పదిహేను మంది అనువాదకులు ఒకరి వెంబడి ఒకరు అనువదించే వారు. నేను చెప్పినది పదిహేను అనువాదములు పూర్తి అయ్యేసరికి నేను చెప్పిన దానిని నేనే వ్రాసుకొనేటంత సమయము పట్టేది. ఇక్కడ ఎలాగైతే పనిచేయుచున్నదో, అక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ అంత బలముగా కదిలియుండినది, చూచారా. ఏ బేధము లేదు, అన్ని దేశములలో, అన్నీ బాషలలో అదే దేవుని ఆత్మ కార్యం.
ISA 53:5•
1PET 2:24
84ఇప్పుడు గుర్తుంచుకోండి, అది ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళదు. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇక్కడ ఉన్నాడని యూదుల జాతీలో మూడవ వంతు మందికి తెలియదు. అది మీకు తెలుసు. ఆయన ఎన్నిక చేయబడిన వారి యొద్దకు మాత్రమే వచ్చెను. వారే ఆయనను చేర్చుకొనిరి. అది నిజం. మరి ఈ రాత్రి కూడా దేవుని ఆత్మ ఎన్నికలో ఉన్న వారియొద్దకే తిన్నగా వెళ్ళును. ఇప్పుడు, నీ పాపముల కొరకు యేసు చనిపోయాడని నమ్మి, నీ రక్షకునిగా ఆయనను నీవు అంగీకరించినట్లైతే, ఆయన నీ జీవితాన్ని తీసికొని, దానిని తిరిగి రూపించుకొనును. గుర్తుంచుకొనుము, "ఆయన పొందిన దెబ్బలచేత నీవు స్వస్థతపడితివి," చూచారా. మీరు ఇదివరకే స్వస్థపడితిరి. దానిని మీరు నమ్ముదురా? మనము స్వస్థపడితిమని బైబిల్ చెప్పుచున్నది. అది నిజమే కదా? స్వస్థపడబోతున్నాము కాదండి; ఇది వరకే స్వస్థపడ్డాము, ఇంత మునుపే స్వస్థపడ్డాము.
JOHN 1:29
85కల్వరి యొద్ద యేసు చనిపోయినప్పుడే పాపము అనేది పూర్తిగా విరుగుడయింది. సహోదరుడా, దానిని నీవు నమ్ముదువా? చూచారా, లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే." నీకు దయచేయబడిన క్షమాపణను నీవు అంగీకరించనంతకాలం దాని వలన నీకు ప్రయోజనం ఉండదు. దానిని నీవు అంగీకరించవలసివుంది. పాప క్షమాపణను ఎలాగైతే అంగీకరించావో, మరి అలాగే నీకు దయచేయబడిన స్వస్థతను కూడా నీవు అంగీకరించవలసివుంది. ఎవరైన వచ్చి, "నేను నిన్ను స్వస్థపరుస్తాను," అని చెబితే, అది నమ్మకూడదు, అతడు తప్పు. అది లేఖనమునకు విరుద్దము. యేసు నీ కొరకు దేనినైతే చేసియుండెనో, దానినే ఆయన నీకు చూపును, అది నీ విశ్వాసము మీద ఆధారపడివుంది. దేవుడు ఎన్నడు కూడా… నీ విశ్వాసమునకు విరోధముగా దేవుడు ఏమి చేయజాలడు. దానిని నీవు నమ్మవలసియున్నది.
MATT 13:58
86ఇప్పుడు యేసు, ఆయన తన సొంత జనుల యొద్దకు వచ్చినప్పుడు, బైబిల్ చెప్పేదాన్ని జాగ్రత్తగా గమనించండి, "ఆయన అక్కడ అనేక సూచన క్రియలను చేయలేకపోయెను, కారణం వారి యొక్క అవిశ్వాసమే." తానే మెస్సీయానని ఆయన చూపిన పిమ్మట. ఆయన దానిని ఆ విధముగా నిరూపించాడు, ఆయనే మెస్సీయా అని. భూమి మీదికి దిగివచ్చిన అదే దేవుడు, ఇంకను ఆయన మెస్సీయగానే వున్నాడని నేను రుజుపర్చుటకు ఆత్మలో దీనుడుగా నేనుండునట్లు, దేవుడు నాకు సహాయం చేయును గాక. ఆయన మర్త్యమైన నా దీన శరీరము తీసికొని, తాను ద్వారా ఎలాగైతే కార్యాలు చేయుదునని వాగ్దానము చేసియున్నాడో, సరిగ్గా ఆలాగున చేయుటకే నన్ను నేను ఆయనకి సమర్పించుకొనుచున్నాను. అది మిమ్మును ఒప్పింపజేయుట లేదా? ఆయన నిద్రించుట లేదని అది కనపర్చుటలేదా? ఆయన మేల్కొనియున్నాడు. కార్యము చేయుటకు ఆయన నీ పిలుపు కొరకు సిద్ధముగా ఉన్నాడు.
JOHN 4:7
87ఇప్పుడు, ఈ రాత్రి నేనిక్కడ నిలబడుటకు కారణమేమిటి, నేనేమి చేయవలెను? ఇక్కడ నూట-యాభై మంది వున్నారని నేననుకొనుచున్నాను, బహుశా అంతే కావచ్చు నూట-యాభైమందైనా, ఒక్కరున్నా, ఐదులక్షల మందైనా తేడా ఏం లేదు, అదంతా ఒకటే, చూచారా. ఇదంతా బూటకము, నిజం కాదు, అని ఎవరైనా అనుకొనుచున్నట్లైతే, అలాంటివారు ఇక్కడికి వచ్చి, నా స్థానం తీసుకొని, ఆ కార్యములను చేయమని నేనడుగుచున్నాను. మరి శ్రేష్ఠముగా ప్రయత్నించుట గూర్చి నీకు బాగా తెలుసు. గమనించండి. అతడు బూటకమా, వాస్తవమా అనే దానిని దేవుడు రుజువుపర్చవలసివుండెను. ప్రభువగు దేవుడు…
ఇది… అక్కడున్న ఆ బాలుని కార్డు ఇవ్వండి. ఇక్కడికి రమ్ము, ఇక్కడ ఒక స్త్రీ వున్నది, ఆమె నాకంటే వయస్సులో చిన్నది. నా జీవితంలో నేనెన్నడు ఆమెను చూడలేదు. మనం పరస్పరం క్రొత్తవారమనీ అనుకొనుచున్నాను? అది నిజం. మనమెవరిమో ఒకరికొకరం తెలియదు.
JOHN 4:19,25
88మీరు ఇంటికి వెళ్ళిన తరువాత, పరిశుద్ధ యోహాను నాలుగవ అధ్యాయం చదవండి, మరియు మీరు కనుగొందురు…
ఎవరైన పాలస్తీనా వెళ్ళినట్లైతే, సుఖారు దగ్గర గుండ్రని చోటును మీరు గమనించగలరు. ఆ చిన్న బావి ఇంకా ఆక్కడ వుంది, ఆ బావి వద్దే ఆ స్త్రీ వుండెను, అది గుండ్రని చోటు, దాని మీద తీగలు అల్లుకొని వుండెను. ఆ స్త్రీ వచ్చే సమయానికి యేసు ఆ బావికి ఎదురుగా కూర్చొనివుండెను. వీధిలో నుండి ఆమె నడిచి వచ్చి, నీరు చేదుకొనగా, ఆయన అక్కడ నిల్చొనియున్నాడు, అదొక సమగ్ర లేక విసృత దృశ్యముగా వుంది. ఆ బావి వీధికి చివర్లో వుండెను. ఆమె అక్కడికి రాగా, ఆయన ఆమెతో సంభాషించటం మొదలు పెట్టెను. ఆమె తన యొక్క సమస్యను గుర్తించేటంత వరకు ఆయన ఆమెతో సంబాషణను కొనసాగించెను, తన సమస్యను ఆమెకు ఆయన చెప్పెను.
ఎప్పుడైతే దానిని ఆయన చేసెనో, వెంటనే ఆమె అన్నది, "అయ్యా, నీవు ఒక ప్రవక్తయై వుండెదవు," చూచారా, ఎందుకనగా ఆయన దానిని కలిగివుండవలసి వుండెను… దేవుని వాక్యము ఆయన యొద్దకు వచ్చెను గనుక ఆయన ఒక ప్రవక్త, ఇంకా ఆమె అన్నది, "మేము మెస్సీయ కొరకు ఎదురు చూచుచున్నామని మాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు, ఆయన వీటినే చేయును." అది లేఖనమని మీలో ఎందరు నమ్ముదురు? అది లేఖనము.
MATT 16:18
89ఇప్పుడు, ఇక్కడ నా చేయి బైబిల్ మీద ఉన్నది, నాకు తెలిసినంత వరకు ఈ స్త్రీని నేను ఎన్నడునూ చూడలేదు. మరియు ఖచ్చితంగా మనం ఒకరి ఒకరం క్రొత్తవారం అని అనుచున్నది. ఇప్పుడు, మాట తప్పైనా కావాలి, లేక ఒప్పైనా కావాలి. నిజం. మంచిది. అది ఒకవేళ తప్పైన కావచ్చును, లేక నిజమైన కావచ్చును. దాని విషయమై మనమేమి చేయజాలము. ఓ స్త్రీ మన ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడినట్లుగా, కొద్దిగా నేను నీతో మాట్లాడుదును… ఆయన నాకు చెబితే…. "నీకు ప్రార్థనా కార్డు వుంది, నీవు అనారోగ్యంగా వుండుటను బట్టి ఇక్కడికి వచ్చావు. దేవునికే మహిమ, దేవునికే మహిమ నీవు బాగవుతావు," అని నీతో చెప్పినట్లైతే, అది బాగానే వుంటుంది, అది అంతటితో అయిపోతుంది. సరిగ్గా చేయావలసినది అంతే. అది అంతే మరి. "వారు రోగుల మీద చేతులుంచుదురు, వారు స్వస్థతనొందెదరు," అని బైబిల్ చెబుతున్నది. అది నిజం.
కాని నీవు తలగోక్కుంటూ, చదువుతూ, "అతడు నాకు వాస్తవంగా చెప్పగలడా? నేను బాగుపడగలనా?" అని అనుకొనుచున్నావు. ఇప్పుడు, నీ జీవితమును గురించి, నీవు ఎక్కడ నుండి వచ్చితివోనన్న సంగతిని, నీవు ఏమేమి చేసితివన్న సంగతిని గురించి, ఆమె యొక్క సమస్యను ఆమెకు చెప్పినట్లుగా ఆయన నీతో చెప్పగలిగినట్లైతే, నిశ్చయముగా ఆయన నీ గతమును ఎరిగియుండటమే కాక, నీ భవిష్యత్తును కూడా ఎరిగియుండును. అది నిజమేనా? నిశ్చయముగా.
MARK 9:23
90ఇప్పుడు ఆ స్త్రీ అనారోగ్యంతో వుంటే… సహాయం కొరకు నిలుచును. అది అనారోగ్యమే కావచ్చును. ఆర్థిక ఇక్కట్లే కావచ్చును, కుటుంబ సమస్యలే కావచ్చును, అవి ఏమిటో నాకు తెలియదు, వాటిని నేను చెప్పజాలను. ఆది నిజం, చూచారా. అది ఏమైనప్పటికీ, దానిని ఆయన నాకు తెలియపరిచినట్లైతే, దానిని నేను చెప్పినప్పుడు అది వాస్తవమో, కాదో ఆమెకు తెలుసును. తప్పో, ఒప్పో నీకు తెలుస్తుంది. ఒకవేళ అది తప్పైతే, అది దేవుని ఆత్మ కాదు, ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం తప్పు. మరి అది నిజమైతే, అది దేవుని ఆత్మ అని చెప్పవచ్చును, చూచారా. ఈ రాత్రి ఇక్కడ యేసు ఉన్నాడన్న సంగతి మనకి ఆదరణను, అత్యద్భుతమును కలిగించునట్లు ఉండదా? అది మీకు విశ్వాసమును కలిగించుచున్నదా? నిశ్చయముగా.
ఈ స్త్రీని నేను బాగుచేయలేను, నేను కాదు, అది ఇదివరకే జరిగియున్నది, చూచారా. అది ఇదివరకే జరిగియున్నది. ఆమె యొక్క విశ్వాసం మీద అది ఆధారపడింది. ఆమె నమ్మాలి, నమ్మకపోతే ఆయనేమి చేయలేడు. స్వస్థత కార్యమును ఆయన ఏనాడో జరిగించియున్నాడు. "దానిని నేను చేస్తానని నీవు నమ్మితే అది అంతటితో అయిపోవును," చూచారా. అది అంతే.
91ఆయన చేయగల ఏకైక కార్యం ఏదనగా, తానే మెస్సీయానని ఆయన తన్ను తాను రుజువు పర్చుకొనుటయే, అయినను దైవప్రవక్త రావలసివుంది. తన శిష్యులు కూడా తనలాగే అవే కార్యములు చేయుదురని ఆయన వాగ్దానము చేసెను. కావున నీవు అక్కడవున్నావు, చూచారా. అది తిన్నగా తిరిగి లేఖనముల వైపుకు తెచ్చును. సహోదరుడా, అది లేఖనమైయున్నది. నవనాగరికతకు అదంతయు వ్యతిరిక్తముగా వుండునని నాకు తెలుసును, అది దేవుని విశ్వాసమునైవున్నది, అది దేవుని విధానము, ఎందుకనగా దానిని ఆయన అలా చెప్పెను. నీవు చదువుటకు అక్కడ ఒక లేఖనము వున్నది. అయితే వారు దానిని మెలికలు త్రిప్పి, దానిలో నుండి ఏదో తయారు చేయాలని ప్రయత్నించారు.
ఇప్పుడు, నేను నిన్నొకటి అడగగోరుచున్నాను. ఈ స్త్రీ ఒక విశ్వాసి. నేను కోరుచున్నాను… ఏదో జరుగును. దానిని మీరు జ్ఞాపకముంచుకోండి, ఏదో జరుగును. అది జరిగినట్లైతే ఎందరు దానిని అంగీకరించి, "అది నా కొరకు పరిష్కరింపబడింది," అని చెప్పగలరు? ఓ స్త్రీ దానిని నీవు నమ్ముచున్నావా? దానినక్కడ నీవు నమ్ముచున్నావా? మిగతా వారు కూడా నమ్ముచున్నారా? దేవుడే దానికి తీర్పరి.
HEB 13:8
92ఇప్పుడు చెప్పవలసిన అగత్యత వుంది గనుకనే నేను దానిని చెప్పితిని. మీలో ఎందరు ఆ వెలుగును చూచియుంటిరి, వెలుగు చిత్రపటమును, అది ప్రభువు యొక్క దూత? మీకు జార్జి జె. లాసీ తెలుసునా? మంచిది, మరి ఆ వెలుగు ఆమెకి, నాకు మధ్య ఇప్పుడున్నది. అది స్వాగతించుచున్నది. ఆమె ఒక విశ్వాసి అని నాకు తెలుసు. అవును, నేను దేని నిమిత్తం నీ కొరకు ప్రార్థించాలని నీవు కోరుచున్నావు? పుండ్లు, నీ శరీరం మీదున్న పుండ్లు. మరొక విషయం, అది బాగా ముదిరిపోయినవి. నీవు ఇంకా చాలా సమస్యలతో సతమతమవుచున్నావు. కాని ఒక నిముషం ఆగు. నేను నీ ఆత్మతో సంభాషించుచున్నాను. శస్త్ర చికిత్స కొరకు నీవు సిద్దపడియున్నావు. అది నిజం. ఒక ఆపరేషన్ కొరకు. ఇప్పుడు నీవు దేనిని తలంచుచున్నావు? దేవుడు నిన్ను దీవించును గాక. కేవలం నమ్ముము. అంతే. ఆమెన్. ఆయన క్రీస్తు కాడా? నేను చెప్పిన సంగతులు సరైనవో, కావో మీరిప్పుడు ఆ స్త్రీని అడిగి తెలిసికోవచ్చును.
ఇప్పుడు ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చూచారా, నీ యొక్క విశ్వాసమే ఆయనను మేల్కొల్పెను, చూచారా. నీకు సహాయం చేయుటకు, దీవించుటకు, నీవు వాంఛించే వాటిని దయచేయుటకు ఆయన ఇప్పుడు రంగము మీదికి వచ్చెను.
93ఇప్పుడు, ఒక గంటన్నర ప్రసంగము చేసిన దానికంటే ఎక్కువగా ఆ దర్శనము నన్ను ఎంతో బలహీనపర్చెను, చూచారా. నీకు నీవు వణుకుతున్నట్లు అనుభూతిచెంది, దూరముగా తొలగిపోయెను, చూచారా. యధార్ధంగా, అటువంటి ఒక కూటమును నేను కలిగివుండుట మొదటిసారి… మరొక రాత్రి ఒక సంఘములో పరిశుద్ధాత్మ దిగివచ్చెను. ఆ పరిశుద్ధాత్మ అక్కడున్న వారిలో ముగ్గురిని లేక నలుగురిని పేరు పెట్టి పిలిచెను. అది నేనెరుగుదును, అలా పిలిచినప్పుడు వారు వెంటనే స్పందించలేదు, అందువలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడెను. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయెను, చూచారా. నన్నక్కడే విడిచిపోయెను. నీవు ఆయనకు, నీవు ఆయనకు, తిరిగి స్పందించవలెను. అవునండీ. దానిని జ్ఞాపకముంచుకొనుము, ఆయన నీకు బద్దుడగుట కాదు గాని; ఆయనకు నీవు బద్దుడవు అవ్వవలెను.
మనము క్రొత్తవారం. నీవు నన్ను ఒకసారి చూచితివా? ఇక్కడ అరిజోనాలోనే చూచితివా? ప్రార్థన వరుసలోనా. అయితే ఎంత కాలం క్రితం చూచితివి? చాలా కాలమైంది.
94ఫినెక్స్ లో ఒక మధ్యాహ్నాం నా జీవితములోనే ఒక పెద్ద దీర్ఘ ప్రార్థనా వరుస కలిగి ఉండుట నాకు గుర్తున్నది. అది ఏ సంఘంలోనో అనేది నాకు సరిగా గుర్తులేదు. ఆ సంఘం పేరు మరిచిపోయాను, అక్కడ ఒక పొట్టివాడు ఆ సంఘమును నడుపువాడు. అతడిని నేను మరచి… అది ఫినెక్స్ లోనే పెద్ద సంఘం. అతని పేరు పుల్లర్? కాదు. బ్రదర్ పుల్లర్ ను నేనెరుగుదును, అతడు గార్షియాకి చెందినవాడు. అది నాకు గుర్తే. కాని అక్కడున్నవాటిలో ఇది పెద్ద సంఘమండీ, బహుశా డాక్టర్. సట్టన్ దానికి కాపరి కావచ్చును. ఆ పెద్ద సంఘం పేరేమిటి? పుల్-గాస్పల్ చర్చీలలోనే అదొక పెద్ద సంఘం. ఆ అవును. ఫాక్నర్, అవును ఫాక్నర్. అతడి సంఘంలో.
ఆ పెద్ద ప్రార్థన వరుస ఆ మధ్యాహ్నం. ఆ వరుస మీకు గుర్తున్నదా? మధ్యాహ్నం ప్రారంభించాను, అర్ధరాత్రి వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను, అదేనని నమ్ముచున్నాను. కేవలం జనుల మీద చేతులుంచుచూ, ప్రార్థించుచూ వుండుట వలన చాలా బలహీనమయ్యాను, కనీసం కదలలేని పరిస్థితి, చాలా క్లిష్టం.
దర్శనము వచ్చే దానికి ముందు అది. అది వచ్చును, కాని కొద్దిగా, మరిప్పుడును దాని తదుపరి కొన్నిసార్లు నా మట్టుకు నేను దానికొరకు ఉండగా, ఆయన నన్ను పిలిచి జరగబోవుదానిని చెప్పును. అప్పుడు ఆయన నాకు ఏదైతే చెప్పెనో, దానిని మీకు చెప్పుదును. ఎల్లప్పుడు అది జరుగను, అవునా? ఇప్పుడు అదేమి చెబుతున్నది? "దానిని నమ్ముము," దేవుడు దానిని స్థిరపరుచును, చూచారా.
MATT 12:45•
MATT 18:16•
LUKE 11:26
95సరే, ఓ స్త్రీ ప్రపంచ వ్యాప్తంగా నేను ఇప్పటి వరకు ఎంతోమంది (లక్షలమందికి) ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థించుచు వస్తున్నానని అనుకొనుచున్నాను. ఇంకా దానికంటే ఎక్కువే కావొచ్చు. ప్రార్థించబడే వ్యక్తి గూర్చి, వారి పరిస్థితుల గూర్చి నాకు ఏమీ తెలియదు. కాని బైబిల్ సెలవిస్తుంది, అది, ఒకసారి…
సరే, ఏదేమైనా ఆ స్త్రీ మీదున్న ఆ చీకటి ఆమెను విడిచి వెళ్ళిపోయింది. అది నిజం. నీకు వేరేలా అనిపిస్తుంది కదూ? కాదంటావా? విశ్వాసమును కలిగివుంటే చాలు మిగతాదంతా అదే చేయును. ఇప్పుడు దానిని సంతోషముతోను, విశ్వాసముతోను నింపుము, లేకపోతే అది ఈ సారి మరో ఐదు లేక ఏడు మరొ వాటిని తీసికొనివచ్చి, జీవితాన్ని దుర్బరముగా చేస్తుంది, చూచారా. అక్కడే నిలచి, "నేను నమ్ముచున్నాను, అది పరిష్కారం అయిపోతుంది," అని చెప్పుము.
ఇప్పుడు, మనమిరువురం ఒకరికొకరం కొత్తవారిమి. మరో రెండు సాక్ష్యములు చెప్పుదును. ఎందుకనగా "ఇద్దరు లేక ముగ్గురి నోటి సాక్ష్యములు స్థిరమగును," అని బైబిల్ సెలవిస్తుంది. అది సరియేనని నేను నమ్ముచున్నాను, కాదా? "ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు, ముగ్గురు సాక్షులు వలన ప్రతి మాట స్థిరమగును." సరే, కాలయాపన చేయక, స్వస్థత కొరకున్న ప్రార్థన వరుసను సాగింతును. తద్వారా వివేచించుట మీద ఎక్కువ దృష్టి పెట్టను. అందునుబట్టి మీరు తెలిసికొందురు.
HEB 4:15
96సరే ఏదేమైనా, అక్కడ కూర్చొనియున్న స్త్రీ మానసిక రోగి (మానసిక అస్థిరత), నీవు నమ్మితే అది నిన్నేమి చేయలేదు. ఆమె దేనిని తాకినదో నాకు చెప్పండి. వృత్తాకారమగు ఆ వెలుగు ఇక్కడనుండి ఆ మూలకు వెళ్ళినది. ఆ స్త్రీ తన తలను ఈ విధంగా పట్టుకొన్నది దర్శనములో, అటు, ఇటు కదిలాడుచూ. ఆమె ఏమి చేసినది? ఆయన వస్త్రమును ఆమె ముట్టుకొన్నది… "ఆయనే ప్రధానయాజకుడని," బైబిల్ చెప్పుచున్నది. ఆయన మన బలహీనతల్లో మనతో కూడా సహానుభం కలవాడు. (అది నిజమేనా?) ఆమె చేసింది కూడా అదే మరి. ఆమె చాలా త్వరగా స్పందించింది. కావున కార్యం ఆమెకు జరిగింది. చూచారా కేవలం నమ్ముము.
ఇప్పుడు అది అంతటిలో పరిష్కారం అయిపోయింది అది నిజమైంది. ఇప్పుడు నేను హడావుడిగా ఎందుకెళ్ళట్లేదంటే, ఈ వరుసలో ఈ రాత్రి ముగించి, రేపటి రాత్రి మరొక వరుసను కలిగియుండాలని నేను కోరుచున్నాను. ఆయన రంగము మీదికి వచ్చుటను మీరు చూచెదరు. అది ఆయనే. నేను కాదు. నేనెన్నడు నా జీవితంలో ఆ స్త్రీని చూచియుండలేదు, ఆమె గూర్చి నాకేమి తెలియదు.
97అది చాలా తేలిక, అటువంటి సామాన్యత వద్దే నేడు అనేకమంది పెద్ద తెలివితేటలగలవారు తికమక పడుచున్నారు. తమకున్న తెలివితేటలను బట్టియే వారు దానిని పొందలేకపోవుచున్నారు. దానిని ఒక రూపమునకు తేవాలని ప్రయత్నించుచున్నారు. అది నీవు చేయజాలవు. దానిని కేవలం నీవు నమ్మాలి. దానిని కేవలం నీవు నమ్మాలి.
ఆ ఇండియన్ బాలిక తలపోటు చేత బాధపడుచున్నది, ఆమె దానిని నమ్మినట్లైతే, తలనొప్పి పూర్తిగా ఆమెను విడిచిపోవును. నేనెన్నడు ఆమెను చూడలేదు, ఆమె కూడా… చూచారా? ఆయనను తాకండి కేవలం ఒక్కసారి ఆయనను తాకండి. అది వాస్తవమో, కాదో తెలిసికోండి. చూడండి, ఆ జనులు నాకు పరిచయస్తులు కారు. ఆ స్త్రీని అడగండి. నా జీవితములో నేనింత వరకు ఆమెను చూడలేదు. అది వాస్తవం. నేనెరిగినంతవరకు దేవుని యెదుట అది సత్యమే. చూచారా, నీవు ఆయనను నమ్మగలిగితే, ఆయన రంగము మీద ఉన్నాడు. కంగారుపడకు కేవలం దానిని నమ్ముము. నీవు నమ్మగలిగితే, అది నీకు కార్యమును సిద్దింపజేస్తుంది. ఆయన నిన్ను స్వస్థపర్చును. నమ్మితే మీరందరు స్వస్థతనొందుదురు. మీరు చూడండి, వేదిక మీద ఒక స్త్రీ నీలోని వున్నది. పరిశుద్ధాత్మ జనుల మధ్య కదులుచూ, జనులను స్వస్థపర్చుచూ, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడని కనపరుచుకొనుచున్నాడు. ఆమెన్! మహిమ! మీలో వున్న యేసుని మేల్కొల్పుము. పరిశుద్ధాత్మ రూపములో ఆయన వచ్చి మీ గుండా కదలనివ్వండి.
ACTS 3:4
98నాకేం తెలియదు గాని దేవునికి సమస్తము తెలుసును. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఏ అవసగతతో వచ్చావో ప్రభువగు దేవుడు నాకు బయలుపర్చును. నీవు దానిని నమ్మడం, నమ్మకపోవడం అది నీ యిష్టం. మంచిది. మావైపు చూడుము అని పేతురు, యాకోబులు అన్నట్లుగా, నేను కూడా అలాగనే అనగోరుచున్నాను. "నావైపు చూడుము." మీకర్ధమైందా నిన్ను దానిలోనుండి… అది ప్రతిచోటునుండి వచ్చుచున్నది. మరి కొద్ది నిముషములలో నిజమగు స్వస్థత కూటము ఉండబోతున్నదని నేను నమ్ముచున్నాను, చూచారా. చూచారా.
ఒక్క విషయమై మీ కళ్ళు ఇబ్బంది పెట్పటుచున్నవి. దాదాపు నీ కళ్ళు మూసుకొనిపోవుచున్నవి, కళ్ళల్లో వున్న నరాలు చచ్చుబడ్డవి.
చాలా కాలం క్రితం మొదటిసారిగా నేను దానిని పట్టుకొన్నాను. ఎవరో అన్నారు, "అతడు ఊహించి చెప్పుచున్నాడు." లేదండి, నేను ఊహ ద్వారా చెప్పట్లేదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా నేను నీ ఆలోచనలను పట్టుకొంటున్నాను. నేను ఊహించి చెబుతున్నానో లేక పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నానో ఇప్పుడు చూద్దాం, సహోదరీ, ఇక్కడ చూడండి. నీవు ఒక విశ్వాసి. నీ రొమ్మునందు ఒక సమస్య వున్నది. అది క్యాన్సర్, నీమెడ వెనుక భాగమున చర్మమునకు సంబంధించిన క్యాన్సర్ అది. ఇప్పుడు దేవుడు దానిని తొలగించునని నీవు నమ్ముదువా? నీవు న్యూ-మెక్సికో నుండి వచ్చావు, తిరిగి వెళ్ళగోరుచున్నావు, దేవుడు నిన్ను స్వస్థపర్చునని నీవు నమ్ముదువా? మంచిది, నీ పేరు శ్రీమతి. వాటికిన్స్, తిరిగి వెళ్ళుము మరియు నీవు అక్కడికి తిరిగి వెళ్లినప్పుడు…
…కేవలం విశ్వాసముంచుము, నమ్ముము.
99మనమిరువురం ఒకరికొకరం కొత్తవారిమి. నీవు నన్ను కూటములలో చూచితివేమో, అయితే అది నాకు తెలియదు, తెలిస్తే తెలుసు అని చెప్పెదను. నా భావం అర్ధంమైందా. ఇప్పుడు కొద్దిసేపు నేను ముగించబోవుచున్నాను, నిశ్చయముగా ఆయన ఇక్కడ ఉన్నాడని నీవు తెలుసికొనుము. ఇక్కడ మరొక స్త్రీ నిలబడియున్నది. మరలా మనమందరం కలసి ప్రార్దింతుము. కనీసం ముగ్గురు ఇక్కడున్నారని నేను అనుకొంటున్నాను. నిజమేనా? ఓ, అవును. సమాజమంతటి లోనుండి.
నాకు తెలియదు. నీవు చాల ఆరోగ్యంగాను, బలంగాను నాకు కనబడుచున్నావు. నీ గురించి నాకు తెలియదు గాని దేవునికి తెలుసును. నీ హృదయములో ఏదో వుంది. దాని కొరకు నీవు ఆశపడుచున్నావు. అది నీ కోరకు కాదు గాని, మరెవరి కొరకో అది. నేను ఒక యవ్వనస్తున్ని - కాదు, ఇద్దరు యవ్వనస్తులను చూచుచున్నాను. వారు నీ కుమారులు. కాదు, వారిలో ఒక్కరే నీ కుమారుడు, మరోకరు నీ అల్లుడు. వారిద్దరికి కడుపులో సమస్య వుంది. వారిద్దరి మీద చీకటి తెరలు అలుముకొన్నవి. వారిద్దరును పాపులే. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." దానిని నీవు నమ్ముదువా? ఆమెతో పాటు మీలో ఎందరు నమ్ముదురు? మనం ప్రార్ధించుదాం.
ప్రభువై యేసూ, మా సహోదరి నిమిత్తము, ఈ అక్కరి కొరకు మేము నిన్ను నమ్ముచున్నాము. నీ నామములో నేను ఆమెను దీవించుచున్నాను. నీ మహిమ కొరకు ఆమె ఏదైతే అడిగినదో, దానిని పొందుకొని వెళ్ళును గాక. ఆమెన్.
100మీరందరు మీ హృదయ పూర్వకముగా నమ్ముచున్నారా? ఇప్పుడు, ఇలా రమ్ము, నీ సమస్య ఏమిటో ఆయన నాకు చెబుతాడని నీవు నమ్ముదువా? నీకున్న ఆ పాత ఆస్తమా (ఉబ్బసం) సమస్య తొలగిపోయి, బాగుపడి ఇంటికి వెళ్ళడం మంచిగా లేదా? నీవు నమ్మితే కార్యము జరుగును.
ఇంగ్లీషు మాట్లాడుచున్నావా? గుండెలోనూ, కడుపులోనూ సమస్య. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అది నిన్ను విడిచిపోవును. ఆమెన్. మంచిది. ఇక్కడికి రా, స్త్రీ. ఇంగ్లీష్ మాట్లాడుదువా? ఊపిరి పీల్చుకోవడం చాల కష్టం వుంది. ఆస్తమా వెళ్ళిపో, నమ్ముము. శ్వాశ తీసికొనుము, మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్ముము.
రండి. ఇంగ్లీషు మాట్లాడుదువా? నేను దేవుని ప్రవక్తనని నీవు నమ్ముచున్నానా? నీకు నీ వెన్నులో సమస్య వుంది. నమ్ముము, అది ఇక నిన్ను ఏం బాధ పెట్టదు.
నేను సేవకుడినని నీవు నమ్ముదువా? నీవు కీళ్ళనొప్పుల చేత బాధ పడుతున్నారు. ఉదయాన్నే మంచం మీద నుండి లేవడం నీకు చాల కష్టంగా వుంటుంది. నమ్ముము, ఇక ఎన్నటికి నీకు ఆ సమస్య వుండదు. పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా వెళ్ళము.
మీరు నమ్ముచున్నారా? మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా?మీలో ఉన్న క్రీస్తుని మెల్కొల్పుము. క్రీస్తు ఇక్కడ వున్నాడు. ఆయన రంగము మీది ఉన్నారు. దానిని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులుంచండి. అందరూ ఒకరి మీద ఒకరు చేతులుంచండి
MARK 16:15,18
101నేను ఒక లేఖనభాగాన్ని మీ దృష్టికి తెచ్చుచున్నాను. యేసు చెప్పెను, "సర్వలోకమునకు వెళ్ళండి [తెంపి, అరిజోనా], సువార్తను ప్రకటించుము. నమ్మినవారి వలన సూచక క్రియలు వెంబడించును. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. భాషలు మాట్లాడుదురు, పాములను పైకెత్తుదురు. విషకరమైనదేది త్రాగినను వారికి హానిచేయదు. వారు రోగులమీద చేతులుంచగా, వారు బాగుపడుదురు." ఇప్పుడు యేసు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ వున్నాడని మీరు నమ్ముదురా. యేసుక్రీస్తులో వున్న అదే ఆత్మ, ఇప్పుడు ఇక్కడ సంఘములో వున్నది. ఇప్పుడు మీరు ఎవరి మీద చేతులుంచితిరో, వారి కొరకు ప్రార్ధించండి. అక్కడేవుండి ప్రార్ధించి, "ప్రభువగు దేవా, వ్యక్తిని స్వస్థపరుచుము," అని చెప్పండి. వారు నీ కొరకు ప్రార్ధించుచున్నారు.
ప్రభువైన యేసూ, దేవా, ఈ జనుల మీద నీ ఆత్మను, నీ శక్తిని పంపమని, ఇక్కడ ముఖము మీద ముసుగు ధరించిన ఈ చిన్ని స్త్రీ మీదికి పంపమని ప్రార్ధించుచున్నాను. ప్రభువా, వారిని నీవు స్వస్థపర్చుము అని ప్రార్దించుచున్నాను. దయ్యము, తుఫానులు, నిమ్మలపరచబడును గాక, మరియు దేవుని శక్తి ఈ జనులపై వచ్చును గాక, మరియు ప్రతి యొక్క దుష్ట శక్తిని మరియు అవిశ్వాసమును పారద్రోలును గాక.