అంత్యదినముల యందు దేవుని స్వరము

అంత్యదినముల యందు దేవుని స్వరము

1తిరిగి ఈ ఉదయ కాలమున స్పానిష్ జనుల మధ్య ఉండటము నిశ్చయముగా గొప్ప భాగ్యము. బహుశా జిమ్ దీనిని తీసికొనుచున్నాడని నేననుకొనుచున్నాను. ఓ, అతడు ఆ రికార్డింగ్ తీసికొనుచున్నాడు. నేనింతకు మునుపు సహోదరుడు గార్సియాతో కాక ఇక్కడ ఉండినప్పుడు ఆ చిన్న స్పానిష్ పాటల గుంపువారు పాడిన పాటల రికార్డును నేనింకా కలిగియున్నాను. మరియు నా కొరకు వారు పాడియున్న ఆ చిన్న పాటను నేను మరిచితిని. కాని, ఓ, నేను దానిని ఎంతో ఇష్టపడ్డాను! మరియు ఇప్పుడు ఆ పిల్లలందరూ పెరిగి వివాహములు కూడా చేసికొనియున్నారు. ఇప్పుడు కూడా వారు పాడుటను విన్నాను మరియు ఈ ఉదయకాలమున నేను ఇక్కడకు వచ్చినప్పుడు చిన్న జోసఫ్ను చూచాను, మరియు నిజముగా అది నాకు ఏదో చేసినది మరియు అతనిని చూచుట నాకు చాలా ఆనందము.

మరియు ఇప్పుడు నేను స్పానిష్ లో మాట్లాడగలిగిన ఒక పదము నాకు తెలుసు. దానిని మీరు వినాలనుకొనుచున్నారా? "హల్లెలూయ!" నేను ఆ పదమును ఎన్నడూ మరువలేను. ఒక చెవిటి స్త్రీ నా మాటను వినులాగున నేను ఒకసారి ప్రయత్నించితిని. బహుశా దీనిని నేను తప్పుగా చెప్పవచ్చును, కాని నాకు బాగా గుర్తున్న పదము "ఓయిగా." అది సరియేనా? నన్ను వినండి. వినుము "ఓయిగా." మరియు నేను ఎన్నడూ మర్చిపోని పదము, "గ్లోరియా ఏ డియాస్!" అదేంతో అద్భుతము! ఓ, అక్కడ రాజధాని పట్టణమైన మెక్సికో నగరములో వారితో మాట్లాడు అవకాశమును నేను కల్గియున్నాను. నేను ఎంతో ఆనందము పొందుకొన్నాను! మరియు నేను…

2అప్పుడు నేనిక్కడకు రాకముందు ఫిన్లాండ్లో ఉంటిని. మరియు అక్కడ ఒక చిన్న ఫిన్నిష్ స్త్రీతో మాట్లాడుట నాకు ఎప్పుడూ గుర్తే, వారు "బేతని" అని తాము పిలిచే స్థలమునకు నన్ను తీసికొనిపోయిరి. ప్రతి దేశము తమ సొంత ఆలోచనను కలిగియున్నది. (నా మాట ప్రతిధ్వనించుచున్నదా? నేను చాలా దగ్గరగా ఉన్నాను. సరే, ఇప్పుడు మీకు తేటగా వినబడుచున్నదా? మంచిది) ఆ చిన్న స్త్రీ, ఆమె ఎంతో ప్రియమైన స్త్రీ. కాని ఆమె నా వలే చాలా ఎక్కువ మాట్లాడేది. మరియు ఆ అనువాదకుడు… ఆమె చాలా వేగముగా మాట్లాడినది మరియు ఆ అనువాదకుడు ఆమె ఏమి చెప్పదలచినదో దానిని అంత వేగముగ చెప్పలేకపోయాడు. మరియు ఆమె నిలబడినది. మరియు ఆమె ముఖము ఎర్రబారినది, ఆమె ఇలా చెప్పెను, "ఆ వ్యక్తుల కొరకు నేను ఒక బబులోను కలిగియున్నాను."

కాని మీకు తెలుసా, పక్షులన్ని ఇంగ్లీష్లోనే పాడును, కుక్కలు ఇంగ్లీషులోనే మొరుగును, చంటి పిల్లలు ఇంగ్లీషులో ఏడ్చుట అను మొదలగు వాటిని నేను గమనించాను. సరే, ఏది ఏమైనా మన మద్యనున్న భాషా పరమైన చిక్కులను బట్టి నేను ఆశ్చర్యపోవుచున్నాను. వెయ్యేండ్లపాలనలో మాట్లాడు భాష బహుశా మనము మాట్లాడే భాషే అయి ఉంటదని మనలో ప్రతి ఒక్కరము తలంచెదము. మనం పరిశుద్ధాత్మను పొందుకొంటిమి, అది నిజం, గనుక మనమందరం ఒక పరలోక భాషనే కలిగియున్నాము.

3ఈ ఉదయకాలమున సహోదరుడు రోయిని మనము ఇక్కడ మనతో కలిగియున్నాము, అతడు వాషింగ్టన్లో ఒక అధికారి. బహుశా అతడు ఐదు లేక ఆరుగురు అధ్యక్షులు, ఏడుగురు అధ్యక్షుల యొద్ద పనిచేసియున్నాడని నేను అనుకొనుచున్నాను. మరియు అటువంటి వ్యక్తి నా వెనుక కూర్చొని యుండగా నేను ఇక్కడ ఈ వేదికపై నిలబడి మాట్లాడుటను బట్టి నేనేరకమైన అనుభూతి చెందుచున్నానో మీకు తెలుసా. అంతే కాదు అతని సాక్ష్యము ఎల్లప్పుడూ నాకు ఎంతో అమూల్యమైనదిగా ఉండును, మరియు ప్రత్యేకించి అతడు… అతడొక లూధరన్ అని అనుకొనుచున్నాను. నేను పొరబడుటలేదనుకొనుచున్నాను అతడు లూధరన్ లేదా ఒక క్యాతలిక్ ఆయి ఉండొచ్చును. మరియు అతడు చెప్పాడు… ఒక పెంతెకోస్తు కూడిక జరుగు గుడారములో అతడు ప్రాకుతూ వెళ్ళిన సంగతిని గూర్చి, మరియు అతడు లేచి.. చివరికి బలిపీఠము చేరుకొన్నాడు, మరియు, అతడు దానిని చేసినప్పుడు ప్రభువు అతని మీదకు దిగివచ్చి మరియు అతడిని ఉన్నతముగా ఆశీర్వదించెను. అతడు ఏడు వేర్వేరు భాషలు మాట్లాడగలడని నేను అనుకొనుచున్నాను. తానొక దానిని ప్రయత్నించాడని అతడు చెప్పాడు, కాని "అది పని చేయలేదు," ఇంకొక దానిని ప్రయత్నించాడు, కాని "అది కుడా పనిచేయలేదు." మరియు మీ అందరూ మాట్లాడినట్లుగానే అతడు స్పానిష్ మాట్లాడగలడని నేను అనుకొనుచున్నాను. అతడు వాటన్నిటిని ప్రయత్నించాడు, కాని అవేవి పని చేయలేదు. అయితే మీరు చూడండి, దేవుడు చాలా మంచివాడు గనుక ఆయనే దిగివచ్చి, అతడింతకమునుపు ప్రయత్నించని ఒక భాషను ఆతనికిచ్చెను, "అది పని చేయుచున్నది!" అని అతడు చెప్పెను. అది మంచిది. ఆవలిగట్టున కూడా ఆ విధముగానే ఉండునని నేను తలంచుచున్నాను.

4ఇక్కడున్న చిన్న మందిరమును గూర్చిన ఎన్నో జ్ఞాపకములు నా హృదయములో ఉన్నాయి. నేను నమ్ముచున్నాను… ఓ, అదెక్కడున్నదో నేను మరిచిపోయాను. బహుశా అది ఇక్కడే ఎక్కడో టోంటో మీదికి దగ్గరగా ఉన్నట్టు నాకు గుర్తున్నది. టోంటో వీధి అనే స్పానిష్ పదము నాకు జ్ఞాపకమున్నది. అక్కడే స్పానిష్ అపోస్తలిక్ మందిరము ఉండేది.

ఒక ఉజ్జీవము కలిగియుండుటకు ఇదోక గొప్ప స్థలముగా ఉన్నదని, తగినంత స్థలమున్నదని క్రొత్త మందిరము, మంచి జనులని నేను కాపరికి చెప్పియుంటిని. కావున ఇది ఒకనాటికి ఆ జీవము యొక్క వరుసలో ఉండునని నేను అనుకొనుచున్నాను. దాని కొరకు మీరు ప్రార్థించండి, వచ్చి మరియు ఉజ్జీవమును కలిగి యుండండి. మనం వేరొక మందిరములో కలిగియున్న అదే ఉజ్జీవము ఇప్పుడు ఇక్కడ పునరావృతం అగునని నేను తలంచుచున్నాను. ఆ ఆవరణములో నిలబడి, ఆ కంచెను అనుకొని, వీధిలో అటు ఇటు తిరుగుచూ, రాత్రిళ్ళు ఆ విధముగా వదిలి వేయు ప్రయత్నించుట నాకింకా జ్ఞాపకమే. నిశ్చయముగా నేను మరిచిపోలేనంత ఉత్తేజభరితమైన సంభవమది. మరియు ఆ చిన్న స్త్రీలు, సహోదరులు మరియు సతీమణులు పాడి మరియు రికార్డ్ చేసిన రికార్డును నేను కలిగియున్నాను. మరియు వారు "కేవలము నమ్ముము," అనే పాటను పాడుటకు ప్రయత్నించిరి. మరియు మీకు తెలుసా, సరైన రీతిలో వారు దానిని పాడలేరు. "ఓన్లీ బిలీవ్" అనుటకు బదులు వారు "యోనియా బిలిప్ అని అనెదరు, చూశారా.

5నా కుమార్తె రిబ్కా మరియు శారా ఇలా అన్నట్టు నాకు గుర్తున్నది. మరియు వారు "డాడీ, పాడుము, ఆ చిన్న బాలికలు పొడిన రికార్డును పెట్టుము," అని వారు అడిగేవారు. వారు "స్పానిష్" అని అనుటకు బదులు ఇంకేదో అందురు, వారు ఆ పదమును సరిగా పలుకలేరు, వారు "స్పానిష్ బాలికలు, చిన్న స్పానిష్ బాలికలు పాడిన 'ఓన్లీ బిలీవ్' పాటను పెట్టమని అడిగెదరు."

మంచిది, వారు ఆ కూడికను వెంబడించుటను నేను గుర్తించుకొన్నాను. ఉజ్జీవము అక్కడే ఉన్నది, మరియు పశ్చిమతీరము వరకూ వారు ఆ కూడికలను వెంబడించారు. మరియు మేము కాలిఫోర్నియాను విడిచిపెట్టినప్పుడు ఒక చిన్న విషయము నా హృదయములో లంగరు వేయబడినది. సహోదరుడు మూర్ మరియు నేను మరియు సహోదరుడు బ్రౌన్ ఆ కాపీటోల్ యొద్ద. యుంటిమి, మరియు ఆ రాత్రి నేను ఆ భవనములోనికి వెళ్ళినప్పుడు, అక్కడ నిలబడి ఆ చిన్నబిడ్డలు "ఆయన నీ గూర్చి చింతించుచున్నాడు," అని పాడుచుండిరి. దానిని మీరు వినియున్నారు. "సూర్యకాంతిలో నైనా లేక చిమ్మచీకట్లోనైనా ఆయన నీ గూర్చి చింతించుచున్నాడు," అనే పాటది. క్రీస్తు యొక్క వర్తమానమును తెచ్చు క్రమములో అనేకసార్లు నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, అలాగే లోకము యొక్క యుద్ధరంగములో ఉండినప్పుడు ఆ బాలురు మరియు బాలికలు నాకొరకు పాడిన ఆ పాటను నేనెప్పుడు గుర్తించుకొందును. "సూర్యకాంతిలోనైనా లేక చిమ్మచీకట్లోనైనా ఆయన నీ గూర్చి చింతించుచున్నాడు," అనే ఈ పాట ఒక గొప్ప ప్రేరణ మరియు సహాయము.

6మీ మంచి సంఘ కాపరిని కలుసుకొనటము, సజీవముగా ఉన్న ఈ సంఘమును చూచుటను బట్టి నేనెంతో ఆనందించుచున్నాను, మరలాగే మీరు ఈ గొప్ప ఆందమైన భవనమును ఇక్కడ కలిగియుండుటను బట్టి, అందరూ కూర్చొగలిగినంత స్థలము, అలాగే పార్కింగ్ స్థలమును బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. మనమొక ఉజ్జీవము కొరకు, పిలవబడినామని ఎరిగి ఆయన దానిని చూచునట్లు మనము చేయగలిగితే, నిజంగా ఈ స్థలము పరిశుద్ధాత్మ యొక్క చేతులలో ఒక నిజమగు స్థలముగా ఉండును.

7ఇప్పుడు, ఈ రాత్రి మనము సహోదరుడు అవుట్లా యొక్క సంఘములో ఉన్నాము. దాని పేరు యేసు నామము సంఘము. అటు వైపున సహోదరుడు ఆవుట్లా సంఘమున్నదని నేను నమ్ముచున్నాను… అది కూడా అపొస్తలిక్ సంఘమే. అతడు ఆయన పేరున సంఘమునుకు నామకరణము చేసెను, యేసు నామము సంఘము అని దానిని పిలచుచున్నాడని నేను తలంచుచున్నాను. అతడు కూడా అపొస్తలుల విశ్వాసమునే నమ్మువాడని నేను తలంచుచున్నాను. కావున ఈ రాత్రి మనమంతా అక్కడ ఉండవలసియున్నది. "ఈ రాత్రికి కూటానికి మీరక్కడికి రండి," అని స్పానిష్ సంఘముతో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు, ఎందుకనగా మీరు మీ యొక్క బాధ్యతగలిగిన విధిలో ఉండియున్నారు మరియు జనులు, పరిపూర్ణముగా, రాజకీయ సంబంధమైన ఈ గొప్పదినమున, వారు… వారి యొక్క అనంతరం గురువారమునాడు క్రైస్తవవ్యాపారుల యొక్క గొప్ప పాదయాత్ర (ర్యాలీ) జరుగబోతున్నది. మరియు గురువారము నాడు వేరొక సంఘములో కూటములు ముగిసిన అనంతరం ఇది ఉండబోవుచున్నది. క్రైస్తవ వ్యాపారుల యొక్క ఈ కూటములలో గొప్ప ప్రసంగీకులు యుండబోవుచున్నారు. ఓరల్ రాబర్ట్స్ మరియు ఈమధ్యనే రక్షించబడిన ఎవరో ఒక మెతడిస్టు సహోదరుడు, ఈ కూటాలకి ప్రసంగీకులుగా రానున్నారు. మెతడిస్టు ప్రసంగీకుడగు అతడు ఒక శక్తివంతమైన ప్రసంగీకుడని వారు దృడంగా చెప్పుచున్నారు. నిశ్చయముగా ఈ కూడికలలో మీరెంతో ఆనందించెదరని నేను భావించుచున్నాను. మరియు యవ్వన పిల్లలైన మీరు, యవ్వనస్తుల కొరకు వారొక పాదయాత్రను కలిగియున్నారని ఇప్పుడే సహోదరుడు ప్రకటించియున్నాడు. నా పిల్లలు అక్కడ అందుబాటులో ఉన్నారు గనుక వారు దానిలో పాల్గొనెదరు.. కాబట్టి మీరు కూడా రండి, మిమ్ములను కలిగియుండుట మాకు సంతోషము. ప్రభువు మిమ్ములనందరిని దీవించును గాక.

8మరియు ఇప్పుడు ఆయన యొక్క ధన్యకరమైన వాక్యములో నుండి కొంత భాగమును చదువుటకు మీరు బైబిలు గ్రంథమును త్రిప్పవలెనని నేను కోరుచున్నాను. మరియు ఈ ఉ దయకాలమున ఒక చిన్న అంశమును నేను ఎంపిక చేసికొనియున్నాను. నేను మీమ్ములను ఎక్కవ సమయము ఉంచగోరుట లేదు. నేనెంచుకొనిన లేఖన భాగములో ఒకటి సమూయేలు మొదటి గ్రంథములో ఉన్నది. ఇంకొకటి యెషయా గ్రంథములో ఉన్నది. మరి యెషయా గ్రంథము నుండి మొదటిగా చదువుటకు నేను ఇష్టపడుచున్నాను. మరియు నేను…

మీరు తేటగా వినగలుగుతున్నారా? అందరికి వినబడుతుందా? ఈ మైకులు చాలా సున్నితముగా ఉన్నాయని నాకు అనిపించుచున్నది ఆయితే ఎందుకో నాకు తెలియదు. అక్కడున్న మీరు సరిగా వినగలుగుచున్నారా? మీ చేతులు పైకెత్తండి. మంచిది, మంచిది.

9ఇప్పుడు, ఎక్కువుగా ప్రసంగించుట వలన నా గొంతు కొంచెం బొంగురుపోయినది. పదహారు. సంవత్సరాల నుండి, బహుశా పదహారు లేక పదిహేడు సంవత్సరాల నుండి నేను ఈ స్పానిష్ సహోదరులతో ఉండి, అప్పటి నుండి వారికి బోధించుకొంటూ వచ్చితిని. నేను అలసిపోయాను, ఇప్పటికి నాకు అలసటగానే ఉన్నది, కాని దేవుని కృప వలన నేనింకా కొనసాగుచున్నాను.

ఇప్పుడు మనము యెషయా 40 కు త్రిప్పుదాం, యెషయా 40వ అధ్యాయము; మరియు 1 సముయేలు, 1 లేదా 3వ అధ్యాయము. దేవుని వాక్యము చదువుట కొరకు తీసిన ఆ చోటులను అలానే పట్టుకొనియుండగా, ప్రార్థన కొరకు ఒక్క క్షణం మనందరం తలలు వంచవలసినదిగా నేను కోరుచున్నాను.

10మా పరలోకపు తండ్రి, దేవునికి మరియు ఆయన యొక్క పని కొరకు ప్రతిష్ఠ చేయబడిన ఈ ప్రియమైన మందిరములో ఈ విధముగ నిలబడే భాగ్యము కొరకు ఈ దినమున మేమెంతో కృతజ్ఞులమైయున్నాము. మరియు నీ సేవ కొరకు ప్రతిష్ఠించబడి (అంకితమై), ఈ వేదిక మీద లేక ఈ బలిపీఠము వెనుక నీ యొక్క సేవకులు ఎన్నోసార్లు నిలబడియున్నారని మేము ఎరిగియున్నాము.

మరియు ఈ ఉదయకాలమున పాతజ్ఞాపకాలు జ్ఞప్తికి వచ్చుచున్నవి. పరిశుద్ధాత్మ ఒక పెద్ద వెలుగు రూపములో క్రిందకు దిగివచ్చి, ఒక అగ్నిస్తంభము వలె ఈ వర్తమానము భూమినంతా తుడుచు పెట్టవలెనని అది పలికిన ఉజ్జీవ జ్ఞాపకాలు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేడు ఇప్పుడు అది చరిత్ర. ఓరల్ రాబర్ట్స్ మరియు టామీ ఆస్బర్న్ మరియు టామీ హిక్స్ మరియు ఇంకా అటువంటి గొప్ప వ్యక్తులతో వర్తమానము అగ్నితో మండించబడినది. మనమందరం కలిసి శ్రమించిన యెడల ఆకాశము క్రిందనున్న ప్రతీ దేశములో ఈ వర్తమానము, పెంతెకోస్తు వర్తమానము అగ్నీని మండించుటను మనము చూడగలము. ఓ శక్తిగల దేవా, దీని కొరకు నీకు కృతజ్ఞతలు మరియు స్తుతి చెల్లించుచున్నాము.

11మరియు ఇప్పుడు నీవు మా హృదయములను సరిచేసి, మేము నమ్ము శీఘ్రముగా జరుగనైయున్న ఆ గొప్ప ఎత్తబాటు కొరకు మమ్ములను సిద్ధపరచమని నీకు ప్రార్ధించుచున్నాము. మరియు ఒకవేళ మా హృదయములు దాని కొరకు సరైన సిద్దపాటు లేనియెడల, లేక నీవు మా కొరకు దాచియుంచిన ప్రతిదాని కొరకు మా తప్పిదములను నీవు క్షమించమని మరియు నీ వాక్యము ద్వారా ఈ రోజు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ సంఘము యొక్క పాష్టరును, దీని యొక్క డీకన్లను, ట్రస్టీలను, మరియు సంఘ సభ్యులను దీవించండి. ఈ చిన్న పాటల గుంపును, మరియు పియానో వాయించేవారిని, వాయిద్యకారులను దీవించండి. ఎవరైతే ఈ ద్వారముల గుండా ఈ స్థలములోనికి ప్రవేశించిరో వారినందరిని దీవించండి. వారు మార్పునొందిన వారిగా ప్రతిసారి బయటకు వెళ్ళుదురు గాక. వారు లోపలికి వచ్చినప్పుడు వారున్న స్థితి కంటే మరింత దగ్గరగా వారు ఉందురు గాక. తండ్రి దానిని అనుగ్రహించండి. ఈ ఉదయకాలమున కూడా అది అట్టి విధముగా ఉండునట్లు మేము యేసు నామములో దానిని అడుగుచున్నాము. ఆమేన్.

1SAM 3:1-4,19•

ISA 40:1-5

 

12ఇప్పుడు యెషయా గ్రంధం 40వ అధ్యామునకు త్రిప్పుచూ మనం చదివెదము:

మీ దేపుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి

యెరుషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను నమాచారము ఆమెకు ప్రకటించుడి.

ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను,

ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను.

యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

ఇప్పుడు సముయేలు గ్రంధములోని, 1 సముయేలు, 3వ అధ్యాయము, 1వ, 2వ మరియు 19వ వచనములను నేను చదవగోరుచున్నాను.

బాలుడైన నమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.

ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు.

ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనియుండగా;

…దీపము ఆరిపోకమునుపు నమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగా;

యెహోవా సమూయేలును పిలిచెను… అతడు చిత్తమండి నేనున్నానని చెప్పెను.

19వ వచనము:

సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు.

NUM 12:6•

1SAM 3:1•

PROV 29:18

 

13ఓ, ఒక నెలంతా మాట్లాడుటకు సరిపడినంత లేఖనమది, మరియు మహిమకరమైన ఆ లేఖనములో నుండి చాలా సందర్భములను (లేక పరిస్థితులను) మనము లాగగలము. కాని ఈ ఉదయకాలమున, మన యొక్క ఖచ్చితమైన సమయములోనికి ప్రవేశించడానికి మనకు ఇంకా ఇరవై నిముషములున్నవి. ఆదివారపుబడి అయిపోయినదని నేను ఊహించుచున్నాను లేక అది ఈ కూడిక తరువాత జరుగును, నాకు తెలియదు. సరే, ఈ అంత్యదినములయందు దేవుని స్వరము అనే అంశమును నేను ఉపయోగించగోరుచున్నాను.

ఇది ఎంతో అసాధారణమైన సమయము. లేఖనములలో ఎక్కడ నుండి మనము మాట్లాడుచున్నామో ఆ గ్రహింపును మనము కలిగియున్నాము, అది ఇలా చెప్పినది. సమూయేలు యొక్క దినములలో ఎటువంటి బహిరంగ దర్శనము లేదు." కాబట్టి, "ఎక్కడైతే దర్శనము లేదో అక్కడ జనులు నాశనమగుదురు," అని బైబిలు చెప్పుచున్నది. మనము తప్పకుండా ఒక దర్శనమును కలిగియుండాలి. దర్శనము ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును, మరియు అది వారితో మాట్లాడబడిన ప్రభువు యొక్క వాక్యమైయున్నది.

1SAM 2:11•

1SAM 3:2

 

14ఏలీ ఒక ప్రవక్త కాదు, ఏలీ ఒక యాజకుడు అని మనము కనుగొనియున్నాము. మరియు అతడు వృద్దుడగుచూ, కళ్ళు మందగిల్లుచున్నవి, మరియు తేటగా అతడు చూడలేకుండెను, అతడు పెద్ద ఆకారములను కూడా చూడలేకుండెను. మరియు అతడు ప్రభువు యొక్క పనిని అసంపూర్ణముగా జరిగించుట ఆరంబించెను.

మరియు నేటి దినములలో ఉన్నట్టుగానే అది ఉన్నది. సంఘము, సంస్థ మరియు శాఖలు, అవి చాలా కాలము నుండి రంగముపై ఉన్నవి. అయినప్పటికి వారు నిర్జీవముగానే ఉన్నారని నేడు దేవుని స్వరము మనమధ్య వినబడి మనలను వెనుకకు తీసుకురావలసిన అవసరత ఉన్నది.

మరియు, చూడండి, ఏలీ పండుకొని యుండెను, మరియు… అతడి కనుదృష్టి మందగిల్లినది. అతడొక యాజకుడు. మరియు ప్రభువు యొద్ద నుండి వారికి ఎటువంటి బహిరంగ దర్శనము లేదు. మరియు అదే గొప్ప అవసరము!

LUKE 12:30•

PHIL 4:19

 

15మరియు ఘడియ యొక్క అవసరతను సమకూర్చుదునని దేవుడు వాగ్దానము చేసియన్నాడు. ఆయన ఎల్లప్పుడు దానిని చేయును. మనము జీవించుచున్న కాలమునకు అవసరమైన, ఈ ఘడియకు అవసరమైన దేవుని స్వరము నేడు మనకు కావలయును. మరియు ఆయన వాగ్దానము చేసిన తరువాత, ఆయన తన వాగ్దానమును నేరవేర్చునని మనము నిశ్చయతను కలిగియుండవచ్చును. ఆయన మన అవసరతను తీర్చుననే నమ్ముకము ఒక విశ్వాసిగా మనం మన నిర్మాణకున్ని నమ్మవలసియున్నది.

మరియు, నేడు సంఘము ఉండకూడని స్థితిలో ఉండుటకు ఒక కారణము ఉన్నది, అదేదనగా అనేక స్వరములు దానికి వినబడుచున్నవి, దేవుని స్వరము వినబడకుండా అనేక స్వరములు దానిని ఆకర్షించుచున్నవి. చాలా మంది వారి మద్య దేవుని యొక్క స్వరము నేరుగా వారితో మాట్లాడటం వినుచున్ననూ అది వారికి చాలా సందిగ్ధముగా ఉన్నది. వారు కనీసము దానిని ఆర్ధము చేసికోలేరు, ఎందుకనగా అది వారికి ఒక పరాయి స్వరముగా ఉండెను. ఆ దినము యొక్క స్వరముల పైన వారు తమకు తాము బహుగా కేంద్రీకృతము చేసుకొని యున్నారు!

1SAM 3:13

 

16మరియు మనం చదివిన లేఖనములో మనము గమనించినయెడల దేవుని స్వరము వారికి అన్యస్వరమైనది.

మరియు మళ్ళీ తిరిగి నేడు కూడా అది ఆ విధముగానే అయినది, దేవుని స్వరము… వేరే స్వరములు ఆనేకము ఉన్నది. మరియు దానిని మనకిచ్చెదనని దేవుడు మనకు వాగ్దానము చేసినయెడల, దేవుని స్వరమునకు భిన్నముగా ఇతర అనేక స్వరములు వినబడినయెడల, మనలను గందరగోళ పరచుటకు అది ఖచ్చితముగా శత్రువు స్వరమైయుండును. దేవుని స్వరము పలుకబడినప్పుడు శత్రువు దానిని మనం అర్ధము చేసికొనకకుండా చేయును.

మరి అది సరిగ్గా ఏలీ మరియు సమూయేలు వలె ఉండుటను మనం గమనించగలం. పిలిచినది నిశ్చయముగా దేవుడేనని ఏలీ గుర్తించాడు, కాని అది ఖచ్చితముగా ఏలీ యొక్క దైవ దూషణ అయియున్నది. ఎందుకనగా దేవుని స్వరము సమూయేలుతో మాట్లాడుచుండెను, అది ఏలీ యొక్క పొరపాట్లను సమూయేలుకు చెప్పుచుండెను. అది ఏలీ పెంపకములోని లోపములను ఆతనికి చెప్పుచుండెను. ఏలీ తన పిల్లలను భుజ్జగించుట తప్పని దేవుడు చెప్పుచుండెను. వారు ఆక్రమముగా డబ్బును మరియు ఆర్పణలలో మాంసమును తీసికొనుచుండిరి. అది సరైనది కాదు. వారు దేవుని వాక్యమునకు భిన్నముగా తప్పుడు కార్యములను చేయుచుండిరి.

1SAM 3:12,15

 

17మరియు సమూయేలు… సమూయేలు చేయగలిగిన ఒకే ఒక కార్యము ఏదనగా, ఉన్నది ఉస్నట్లుగా చెప్పడమే. ఆ విధముగా చేయుటం అతనికి కొంచెం అయిష్టమే, ఎందుకనగా తాను పెంచబడుటకు పంపించబడిన స్థలం, ఏలీ మరియు దేవాలయమున్న ఆ స్థలమునకు. అది (దేవుని స్వరం) విరోధముగా ఉన్నది. కాని ఏలీ "మాట్లాడుము" అని అతనిని అడిగెను. చూశారా? అంతట అతడు జరుగబోయే దానిని ఖచ్చితముగా చెప్పెను, ఆ సమూయేలు… లేక, యాజకునిగా ఏలీ యొక్క దినము ముగించబడినది. దానిని దేవుడే పలికియున్నాడు, మరియు తన ప్రవక్తయైన సమూయేలు ద్వారా దేవుడు తన వర్తమానమును పంపుచుండెను. అతనిది చాలా వింత జన్మ. బాలుడిగా ఉన్నప్పటి నుండే ప్రభువుకు సమర్పించబడినాడు. దేవుడు అతనితో మాట్లాడియున్నాడు, ఒక బాలునిగా, అతని ముందు ఉంచబడిన ఒక కార్యముకై దేవుడు అతడిని సిద్దపరస్తూవచ్చాడు. మరియు ఏలీ యొక్క సమయము ముగియబోవుచున్నది.

18ఈ రోజు భూమిపై చాలా స్వరములు ఉన్నవి, అది ఖచ్చితముగా ఒక కఠినమైన సంగతి, ఎందుకనగా అది సహజాతీతమైన స్వరమును చంపివేస్తూ ఉన్నది. ఎంతో జ్ఞానయుక్తమైన సర్వములు అనేకములున్నవి, అధిక తెలివితేటలు గల బలవంతుల యొక్క గొప్ప స్వరములు ఉన్నవి. వారి యొక్క తెలివితేటల వలన చివరికి దేశములను సహితము వణికింప చేయగలరు. వారు రాత్రికి రాత్రే అంత గొప్ప మేధస్సును సంపాదించలేదు. వారు తమ మేధస్సు ద్వారా దేశములను వణికించగలరు, సంఘ శాఖలన్నిటిని ఒక తాటిపైకి తేగలరు. గొప్ప కూటములను పెట్టగలరు, అందముగా. అయితే వీటన్నిటిని బట్టి ఒకడు కొంచెం సందేహాపడును. వీటిని సాధించిన విధమును బట్టి, అవి అభివృద్ది అయిన విధమును బట్టి వారిని గందరగోళ పరచవచ్చును. వారిని తికమక పెట్టుటకు అవి చాలును. మరియు పైకి లేచుచున్న అనేక స్వరములు ఉన్నవి, మరియు అవి ఈ సంగతులను చేయుచూ, దేవుని స్వరమును నిజమైన దేవుని స్వరమును ఎక్కడో వెనక్కి నెట్టివేయబడులాగున అవి చేయును.

19"మరియు దేవుని స్వరము," అని వారు చెప్పెదరు, "అది దేవుని స్వరమని మేము ఎలా తెలిసికొనెదము?" ఏలాగనగా నేడు.. అది ఒక రుజువు చేయబడిన ప్రవక్తలో ఉండెను. ఇప్పుడు, ఈ రోజు, అది దేవుని స్వరమని మేము ఏ విధముగా తెలిసికొనెదము, ఏలాగనగా అది ప్రవక్త యొద్దకు వచ్చిన వాక్య నిరూపణను బట్టి తెలుసుకోగలము. అందును బట్టి అతడు దేవుని ప్రవక్త అని చెప్పగలము. మరియు ఒక నిజమైన దేవుని స్వరము మాత్రమే, నిజమైన, జీవించుచున్న, సహజతీతమైన దేవున్ని, ఆయన యొక్క సహజాతీతమైన వాక్యముతో, నిజ వాక్యము యొక్క సహజతీతమైన బయలుపాటుతో వెనుకకు తీసికొని వచ్చును. అప్పుడు అదే దేవుని స్వరమని మనము తెలిసికొనెదము. ఎందుకనగా, మరియు ఆ సహజ… వేరే ఇతర పరిమాణములలో ఇతరమైనవి చాలా ఉన్నని, దానిని దరిదాపుగా అవి చంపివేసినవి. కాని గుర్తించుకొనండి, అది మెరియును, అది ముందుగా వచ్చును! అది దానిని చేయును.

20ఇప్పుడు, రాజకీయ ప్రపంచములో నేడు ఒక స్వరము ఉన్నది. అదొక గొప్ప స్వరము, మరియు జనులు, పరిపూర్ణముగా, రాజకీయ సంబంధమైన ఈ గొప్ప దినమున, వారు… వారి యొక్క సంఘములలోనూ మరియు అన్నిటిలోనూ అవి కలిసిపోయినవి మరియు చాలాసార్లు, ఈ మధ్యనే మనము చూసియున్నాము, నిజానికి సంఘములలో దేవుని స్వరము కన్నా రాజకీయము స్వరము బలముగా ఉన్నది, లేక ఈ అమెరికా ప్రజలు ఇప్పుడు ఏమి చేసియున్నారో దానిని ఎన్నడూ చేసియుండలేదు. చూశారా? వారు ఎన్నడూ చేసియుండెడివారు కాదు. దేవుని స్వరము సంఘములలో సజీవముగా ఉన్నట్లయితే, వారెన్నడూ ఆ తప్పిదములు చేసియుండేవారు కాదు. కాని ఈ దినమున భూమిపై దేవుని స్వరము కన్నా రాజకీయము స్వరము బలముగా ఉన్నది, ఎంత వరకు అంటే జనులు ప్రఖ్యాతి కొరకు, విద్య కొరకు, రాజకీయ శక్తి కొరకు క్రైస్తవ జన్మహక్కును అమ్మివేసికొనియున్నారు. చూచుటకు అది చాలా సిగ్గుగా ఉన్నది. మన దేశము దేని మీద నిర్మించబడెనో, దేనిపై అది నిర్మించబడెనో అను దానిని విస్మరించి, జనులందరు వెనుకకు తిరిగి - మనము దేని విషయమై ఇతర దేశమును విడిచి పెట్టితిమో దాని కొరకు ఓటు వేసియున్నారు. మరియు ఆ ప్లేమౌత్ రాక్, మరియు మేప్లవర్ మరియు అటువంటి వారు ఇక్కడికి వచ్చి - మరియు మనము కలిగియున్న ఈ గొప్ప ఆర్థిక వ్యవస్థను నిర్మించియున్నారు. దాని నుండి బయటకు వచ్చుట కొరకే మనము చాలా కష్టముతో పోరాడియున్నాము, మళ్ళీ తిరిగి మనలను మనము ఆ బంధకములలో పెట్టుకొని యున్నాము, ఎందుకనగా ఆ విధముగా ఉండునని బైబిలు మాట్లాడుచున్నది.

1COR 14:8

 

21మరియు ఏలీ యొక్క వ్యవస్థ, ప్రవక్తకు బదులుగా ఒక యాజకుడు. ప్రవక్త వాక్యమైయున్నాడు. మరియు యాజకుడు సంఘమైయున్నాడు.

మరియు అది ఎటువంటి స్థలమునకు వచ్చినదనగా, అది పూర్తిగా వదులైన చోటికి వచ్చినది. వాక్యము జనులకు పరాయిదైపోయినది. వారు దానిని పొందుకొనలేరు. అప్పుడు దానిని మీరు మాట్లాడవచ్చు, కాని వారు దానిని అర్ధము చేసికొనలేరు, ఎందుకనగా దాని కొరకు వారు నేర్పించబడలేదు. "బూర గనుక ఒక ఆస్పస్టమైన ధ్వనిని ఇచ్చినచో, యుద్దమునకు ఏ విధముగా తనకు తాను సిద్దపడవలెనో ఎవరు ఎరిగియుండగలరు?" అని పౌలు అనెను.

జనులు సంఘ స్వరము, సంఘపు బూర వినుటకు మాత్రమే తర్ఫీదు చేయబడిరి, మిగతా వారందంరు పొందుకొన్న దానికన్నా మా ఆదివారపు బడిలోనే మేము ఎక్కువ పొందుకొన్నాము," అది అసలు పనికిరాదు. "మిగతావారందరూ పొందుకొన్న దానికన్నా మా యొక్క శాఖలోనే మేము ఎక్కువ పొందుకొన్నాము, సంఘ శాఖలన్నిటిలోనూ మేమే పెద్ద వారమైయున్నాము." చూశారా, అటువంటి స్వరము కొరకే జనులందరూ తర్ఫీదు చేయబడియున్నారు. వారు బయటికి వెళ్ళి, వీధులలోకి వెళ్ళి జనులను లోనికి తీసికొని వచ్చెదరు. గొప్ప కూడికలను ఏర్పాటు చేసి వేవేలమందిని లోనికి తీసికొని వచ్చెదరు. వారు దేనియందు ఆసక్తి కలిగియున్నారు? "మేము పెద్ద సంఘమును కలిగియున్నాము. మేము పెద్ద సమాజమును కలిగియున్నాము. మేము ఎక్కువ మందిని ఆదివారపు బడిలో కలిగియున్నాము. నగర మేయరు మా సంఘమునకు వచ్చువాడే." అదంతయూ మంచిగానే ఉండవచ్చును, కాని అదే సంఘము దేవుని స్వరమును, సువార్త బూరను వినుటకు నేర్పించబడకపోతే ఏం లాభము?

HEB 11:37

 

22మరియు మన ప్రభుత్వములో లేచినట్లుగా ఏదైనా సంగతి లేచినయెడల ఏమి జరుగును? సంఘమునకు బూరధ్వని (స్వరము) తెలియదు, గనుక ఏమీ చేయవలెనో వారెరుగరు. సంపదను గూర్చి గొప్ప వాగ్దానము, ఒక వివేకం గల దిగ్గజము (శక్తిగలవాడు) లోపలికి వచ్చుచున్నాడు, మరియు బైబిలు ఏదైతే ముందుగా తెలిపియున్నదో వారు తిన్నగా దానిలోనికే వెళ్ళియున్నారు, మరియు దానిని లోనికి తీసికొని వచ్చారు. చూడండి, ఒక రాజకీయ స్వరము! మరియు అది మతసంబంధమైన స్వరమును అధిగమించినదని రుజువు చేయబడినది, సువార్త స్వరమును వారు గుర్తించలేకపోయిరి. ఒకవేళ వారు దానిని గుర్తించినట్లయితే, తాము ఏదైతే ఇప్పుడు చేసియున్నారో ఏనాడూ దానిని చేసియుండేవారు కాదు. ఏలయనగా చాలా సంగతులు మనకు దానము చేయబడినవి, సంపద మనకు వాగ్దానము చేయబడినది, మరియు సందేహమే లేదు, కాని మనము ఏమి పొందుకొనెదము.

కాని ఇంకనూ, అది విశ్వాసికి ఏమియూ కాదు. హెబ్రీయుల గ్రంథంలో 11వ అధ్యాయమునకు త్రిప్పి, అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పుచున్నాడో వినండి. వారు ఏ విధముగా ఆ దినములలో "గొర్రె చర్మములను, మేక చర్మములను వేసికొని సంచరించుచూ, నిరాశ్రయులై, పట్టణములో ప్రవేశించలేకపోయిరి."

23నైసియా ఆలోచనసభ అనే గ్రంథమును నేను చదువుచున్నాను, క్రీస్తు మరణించిన మూడువందల సంవత్సరాల తరువాత రోమ్ లోని నైసియా యొద్ద ఆ గొప్ప సమస్యలు వచ్చినప్పుడు, ఆ గొప్ప సంఘము నిలబడినప్పుడు, వారికి బైబిలు కావలసి యుండెను. మరియు రోమా మొదటి సంఘములోనికి చేరిన రోమీయులు తమ సిద్దాంతములను లోపలికి జొప్పించియున్నారు, ఊదాహరణ చెప్పడానికి మనము కలిగియున్న క్రిస్మస్ పండుగ.

క్రిస్మస్, క్రీస్తు ఎన్నడూ డిసెంబరు ఇరువై-అయిదున జన్మించలేదు. ఎందుకని, యూదయ పర్వతములన్నీ మంచుతో కప్పబడియుండును, మరియు అది మిగతా బైబిలు ప్రవచనములన్నిటికి వ్యతిరేకము. గొర్రెలన్ని జన్మించినట్లుగానే ఆయన వసంత కాలములో జన్మించెను. ఆయన ఒక ఇంటిలో జన్మించుటకు బదులు ఎందుకు ఒక పశువుల పాకలో జన్మించెను? ఎందుకనగా ఆయన ఒక గొర్రె. ఒక బలిపీఠము యొద్దకు, అనగా సిలువ యొద్దకు తనంట తానే పరుగెత్తి వెళ్ళలేదు? ఆయన సిలువ యొద్దకు నడిపించబడెను. గొర్రెను వధించువాని యొద్దకు మీరే నడిపించెదరు. ఆయన ఒక గొర్రెపిల్ల. అందుకే గొర్రెలు జన్మించినప్పుడే ఆయన జన్మించెను.

24కాని, మీరు చూడండి, దానిని చేయుటకు, వారు సూర్య దేవుని యొక్క జన్మదినమును కలిగియున్నారు. ఇది సౌరవ్యవస్థలలో, డిసెంబరు ఇరువై నుండి డిసెంబరు ఇరువై-అయిదు వరకు అయిదు రోజులపాటు సూర్యునిలో ఎటువంటి కదలిక ఉండదు. ఆ దినములలో అది కొంచెం డిసెంబరులో అది చిన్న దినముగా ఉండును. మరియు కొంచెమే సమయమున్న ఆ ఇరవై-అయిదవ తేదీన, ఇరవై తేది నుండి ఇరవై-అయిదు వరకు, వారు రోమన్ సర్కసును మరియు సూర్య దేవుని జన్మదినము యొక్క పండుగను జరుపుకొనెదరు. కనుక అప్పుడు గురుడు (సూర్య కుటుంబములో పెద్ద గ్రహము), అతడే రోమీయులకు దేవుడు, మరియు వారు ఇలా చెప్పుదురు, "మేము దేవుని యొక్క కుమారుడు మరియు సూర్యదేవుని యొక్క జన్మదినమును తీసికొని, వాటిని కలిపితే అది గొప్ప పండుగగా ఉండును. "దానిని వారు జొప్పించియున్నారు. అది వాక్యమునకు వ్యతిరేకము! మరియు ఓ, అనేకమైనవాటిని ఆ స్థానములో అక్కడ జొప్పించియున్నారు!

25మరియు అప్పుడు ఎవరైతే దేవుని వాక్యముతో నిలబడాలని కోరుకొనియున్నారో అటువంటి నిజమైన వ్యక్తులు, పొలికార్పు, ఐరేనియస్, మార్టిన్ లాంటివారు, ఆ గొప్ప ప్రారంభములో, పరిశుద్ద జనులు సత్యముతో నిలబడాలని కోరుకున్నారు. మరియు వారు నైసియా ఆలోచన సభ గుండా తీసికొని రాబడినప్పుడు, వారిలో కొంతమంది ఎంతగా తిరస్కరించిబడియున్నారనగా, ఆరణ్యములో నుండి ప్రవక్తలు బయటకు వచ్చి ఆ ఆలోచన సభలో కూర్చొన్నారు. వారిపై ఒక చిన్న గొర్రె చర్మము తప్ప మరేమి లేకున్ననూ వారు ప్రభువు వాక్యమును మాత్రము ఎరిగియున్నారు. ఆ పదిహేను రోజుల యొక్క నీచమైన రాజకీయాలు, పలుకుబడి దానిని అధిగమించినవి. కావున అంతట మనము వేయి సంవత్సరముల చీకటి యుగయును కలిగియుంటిమి, చూశారా.

26కాని ఆ బూర మళ్ళీ మ్రోగునని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. జనులు ఎల్లప్పుడు వాక్యము యొక్క నిజమైన స్వరమును వినెదరు, మీరు చేయు ప్రతిదానిని ఎల్లప్పుడూ వాక్యను బట్టి పరీక్షించుకొనుడి,

రాజకీయముల స్వరము. మరియు అమెరికాలో ఉన్న మనము మరియు మిగతా ప్రపంచమంతా ఈ రోజు బిగ్గరగా మాట్లాడే స్వరమును కలిగియున్నాము. అదే హాలీవుడ్ స్వరము. అది ప్రపంచాన్ని స్వాధీనపరచుకొన్నది. హాలివుడ్లో ఉన్న ఎవరైన ఏదో ఒక దానితో బయటకు వచ్చారనుకోండి, అంతట అది దేశమంతా దానిని మీరు కనుగొనెదరు. ఇప్పుడు, మనము గమనించిన యెడల మన యొక్క స్త్రీల యొక్క వస్త్రాలు, మరియు కేశాలంకరణలపై వారు ఒక పద్దతిని నిర్ణయించియున్నారు. వారు ఆ వస్త్రములను నిర్ణయించారు.

27అయితే దీని విషయమై సంఘము దేవుని బూర స్వరమును తెలిసికొనవలసియున్నది! కాని చాలా గందరగోళమున్నది, ఎందుకనగా ఇతరులు ఆ విధముగా మాదురులు చేయడం మీరు చూస్తారు, అటువంటి ఉదాహరణలపై మీకు మీరు ఎన్నడూ కట్టుకొనవద్దు, ఎందుకనగా అవి పాడైపోవును. ఎల్లప్పుడూ దేవుని స్వరమును, ఆయన దానిని గూర్చి ఏమి చెప్పుచున్నాడు అనే దానిని వినండి.

అప్పుడు మనము గమనించెదము, హలీవుడ్లో వారు సంగతులు లేవనెత్తుదురు. మరియు మనము కొద్దిగా ముందుకు వెళ్ళేముందు దానిపై ఒక్క క్షణము సన్ను మాట్లాడనివ్వండి. ఈ మధ్య కాలములో ఒక సంగతి బయటకు వచ్చినది, హాలివుడ్లో ఒక వ్యక్తి… ఇప్పుడు ఆ వ్యక్తి యెడల ఎటువంటి వ్యతిరేకత లేదు, అటువంటి మర్త్యుని కొరకే క్రీస్తు చనిపోయినది, కాని మీకు చూపించుట కొరకు చెప్పుచున్నాను. వారు ఒక చిన్న దానిని కనిపెట్టియున్నారు, పిల్లలు దానిని హులా-లూప్, హులా-హుప్ అని లేక మరేదో అని పిలిచెదరు. మరియు అటువంటి చిన్న పిల్లలలో ఆశ్లీలము మరియు వాటిని వెంబడించే అటువంటి చాలా సంగతులు ఉన్నట్టు మనము గమనించితిమి. అయితే అది సరైనది కాదు.

28ఇప్పుడు, హాలీవుడ్ అంతా తుపాకీరాయుళ్ళతో నిండిపోయినది. ఇప్పుడు ఇదివరకు పాత కాలపు దినములలో ఉన్న తుపాకీరాయుళ్ళు భిన్నమైన వారు, వారు మర్యాదస్తులైన పౌరులు కారు, వారు దుర్మార్గులు, వారు ఆల్కపోన్ మరియు డిల్లింగర్ వంటివారు అని చరిత్ర తెలిసినవారెవరికైనా సరే తెలుసును. అయితే ఇప్పుడు వారు టెలివిజన్లో ఒక హాలీవుడ్ ఆటను కలిగియున్నారు. దానిని "గన్ స్మోక్" (తుపాకీ పొగ) అని పిలుచుచున్నారు. మరియు నిన్నటి దినమున ఆ దర్శినిపై నేను వినియున్నాను, దానిని వినిపించిన వ్యక్తి పేరు ఆర్నస్ అనుకొంటాను, బహుశా ఆర్నస్ కావోచ్చు లేక అతని పేరేమిటో నేను మరచిపోయాను, మరియు అతడు తీసికొనవలసియున్నది… కాన్సస్లో ఒక సైనికధికారిగా ఉన్న మాట్ డిల్లాన్ కి అతడు ప్రాతినిధ్యం వహించుచున్నాడు. మాట్ డిల్లాన్ అనువాడు ఒక కుందేలు కన్నా పసుపుగా వుంటాడు. అతడు వెనుక ఇరువై-ఎనిమిది మంది అమాయక ప్రజలను కాల్చి చంపాడు, వాడు డాడ్జ్ పట్టణమునకు బయటకు వెళ్ళి, ఒక పొదలో కాపుకాసేవాడు. మరియు ఒక విలన్ అలా వచ్చినప్పుడు, ఎవరో ఒకరు ఫలానా విలన్ వచ్చుచున్నాడని కబురు చేరవేసేవారు. అంతట అతడు అక్కడ కాపుకాచేవాడు. ఎప్పుడైతే ఆ మనుష్యుడు లోపలికి వచ్చునో ఇకవెంటనే మాట్ డిల్లాన్ వెనుక నుండి అతడిని కాల్చేవాడు. ఇప్పుడు అతడొక "పెద్ద మనిషి"గా వచ్చుటను మనము కనుగొనియున్నాము, అయితే అది ఖచ్చితముగా పాపమును గొప్ప చేస్తున్నట్టుగా వుంది. మన దేశము యొక్క చిన్నపిల్లలు యేసుక్రీస్తును గూర్చి చెప్పుదాని కంటే మాట్ డిల్లాన్ గూర్చే మీకు ఎక్కువ చెప్పెదరు. అంగడులు (షాపులు), చిన్న కిరణా షాపులు, మరియు వస్త్ర దుకాణాలు చిన్న-చిన్న తుపాకులను మరియు చిన్న టోపీలను అమ్మకము కొరకు అంతటా వేలాడదీయుచుండిరి. వాటిని ధరించటం తప్పు అని అనట్లేదు గాని దాని ఉద్యేశమును మీరు తెలిసికోవాలని మీకు చెప్పుచున్నాను, మీరు చూడండి. ఆ వ్యాపార ప్రపంచము, వారు దానిని తీసికొని దాని నుండి లక్షల డాలర్లు సంపాదించెదరు.

29"సెయింట్ పాట్రిక్స్-డే "అను పిలుచు దానిని మనము కలిగియున్నాము. "మతపరమైన సెలవులు" అను పిలుచువాటిని మనము కలిగియున్నాము, మరియు వ్యాపార ప్రపంచము వాటిని పట్టుకొని, లక్షలడాలర్లు సంపాదిస్తున్నారు. "మాతృదినోత్సవము" అను వాటికొరకు పూల గుత్తులు. ఎందుకు, ప్రతి దినము మనము తల్లిని గౌరవించే దినముగా ఉండాలి. ఆమె ఎక్కడో ఒంటరిగా ఉండును, వెళ్ళి ఆమెను చూడు. నీవు పంపించే పూలు లేక అటువంటి వాటికన్నా అది చాలా విలువైనది. చూశారా, కాని వారు దానిని పట్టుకొనియున్నారు. అది ఒక స్వరము, మరియు దానితో పాటు మనము దానిలో కలిసిపోయాము. అది నిజముగా నరైనది కాదు. కాని నీవు ఏమి చేయబోవుచున్నావు? చూశారా, మనము కేవలము…

నేను నమ్ముచున్న ఒక దానిని మీకు చెప్పడానికి ఒక అంశము యొద్దకు మిమ్మును రప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుని స్వరము చాలా అరుదు.

30ఇప్పుడు, వారు ఆ వేగమును నెలకొల్పియున్నారని మనము కనుగొనియున్నాము, మరియు మీరు ఎన్నడైనా గమనించారా, మన యవ్వన బాలురు "రికీ" మరియు "ఎల్విస్" వలె మారిపోయారు. ఆ విధముగా పేరు పెట్టబడిన బిడ్డను మీరు కలిగియుంటే, వెంటనే, దానిని మార్చివేయండి, అతడిని "మొదటి" లేక "రెండు" లేక ఏదో పిలువండి. రికీ మరియు ఎల్విస్ గా పిలువబడటం అది ఒక భయంకరము. అలా పిలువద్దు .. సరే మీరు ఇలా అనవచ్చును, "పేరు వలన వ్యత్యాసము ఏమిటి?" ఎందుకు, ఖచ్చితముగా, అది ఏదో అయియున్నది. మీ పేరు మీ జీవితమును వ్యక్తీకరించును. "ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం నీవు సంఖ్యా శాస్త్రముపై ఉన్నావు," అని అంటావేమో లేదు, నేను కాదు! ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అను దాని పై నేను ఉన్నాను. యాకోబు తన పేరుతో అతడు జీవించాడు, ఒక మోసగానిగా, కపటోపాయకుడిగా. మరియు దేవుడు అతడిని మార్చివేసినప్పుడు, ఆయన అతడి పేరును మార్చివేసెను. దేవుడు సౌలును - పౌలుగా మార్చెను. సీమోనును - పేతురుగా మార్చెను. ఖచ్చితముగా, అది ఏదో కలిగియున్నది. రికీ మరియు ఎల్విస్ లాంటి పేర్లు ఆధునీకమైన అమెరికా పేరు, అది తిన్నగా ఆ పిల్లవానిని దానిలో పడవేస్తున్నది. నేను ఏమి చెప్పుచున్నానో చూడండి!

31ఇప్పుడు, నేను అనుకొనుచున్నాను… నేను తిరిగి అంశమునకు వచ్చుట మంచిది మరియు దీని పైనే (నిర్మాణము, అవయవము) పైనే ఎక్కువసేపు కొనసాగను, (నేను ఏమి చెప్పుచున్నానో చూడండి?) దానిని మీరు అర్ధము చేసుకొనలేరు. ఈ సంగతులన్నిటిని ఒక సామాన్యమైన వ్యక్తి అర్ధము చేసుకోలేడు. వారు దానిని (గ్రహించలేరు) పట్టుకొనలేరు, ఎందుకనగా వారికంటూ ఒక పోకడవున్నది. వారు వినేదంతా ఆ స్వరములే.

తత్వవేత్తల యొక్క కమ్యూనిజము యొక్క స్వరములున్నవి, వారైతే తామిచ్చిన వాగ్దానముల మీద నిలిచివుండలేరు. అయిననూ అమెరికా జనులలో గొప్ప శాతము కమ్యునిజములోకి చుట్టబడియున్నారు. నేను జర్మనిలోని బెర్లిన్ కు తూర్పువైపున ఉన్న కమ్యునిజం, కమ్యునిజపు ప్రాంతములలో ఉన్నాను. బహిరంగ ప్రదర్శన కొరకు వారు పెద్ద గృహములను కలిగియున్నారు. వాటిలో మీరు నడవవలసియుండెను, అవి ఇంకనూ పూర్తి చేయబడలేదు. అది తప్పుడు ఆర్థిక వ్యవస్థ, వారు దేనితోనో నెట్టుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

32మరియు రష్యాలో, కమ్యూనిజం యొక్క జన్మస్థానము అది … చాలా సంవత్సరాల క్రితం నేను ఒక యవ్వన ప్రసంగీకుడిగా ఉన్నప్పుడు, ముప్పై-మూడు సంవత్సరాల క్రితము అని నేను చెబుతాను, నాసిజము, ఫాసిజం, మరియు కమ్యూనిజం లేచుచున్నప్పుడు, "ప్రభువు నామములో నేను చెప్పుచున్నాను! అవన్నియు కమ్యూనిజంలో కలిసిపోవునని," నేను చెప్పాను. కాని మీరు ఎన్నడైనా ఆలోచించారా, మనము గనుక ఒక వేళ దానిని తీసుకొనగలిగినయెడల దేవుడు మనకొరకు ఒక మార్గమును విడిచి పెట్టెను. రష్యాలో కేవలము ఒక్క శాతము మాత్రమే కమ్యూనిజము, కాని వారే ఆ నియంత్రించే శాతము. ఒక్క శాతము కమ్యూనిజము… ఒక్క శాతము రష్యా మాత్రమే కమ్యూనిజము, అయినను వారే నియంత్రించెదరు.

33మరియు అదేవిధముగా హాలీవుడ్ అనేది ఒకే స్థలము, కాని వారు నియంత్రించేవారిగా ఉన్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల జనభాలో దాదాపుగా ఒకటిలో మూడవ వంతు లేదా మూడులో రెండొంతుల మంది సంఘమునకు వెళ్లెదరు, మరియు వారు సంఘ సభ్యులు, కాని వారు ఆ సంఘ శాఖలలో నియంత్రించబడెదరు.

అక్కడ కమ్యూనిజముకు అవసరమైనదేమనగా దేవుని స్వరము వారి మధ్యన లేవవలసియున్నది, మరియు అది దానిని సిగ్గుపరచును.

ఫిన్-ల్యాండ్ లో, ఆ రోజు ఆ చిన్న బాలుడు మరణము నుండి లేచినప్పుడు, ఎక్కడైతే ఆ చిన్నవాడు మరణము నుండి లేచియున్నాడో మరి అక్కడ నుండి వారు నన్ను మూడు వీధుల అవతలకు తీసుకొని వెళ్ళిరి. కమ్యూనిస్ట్ సైనికులు, రష్యన్లు, తమ రష్యన్ వందనముతో అక్కడ నిలబడియున్నారు, మరియు కన్నీళ్ళు వారి చెంపల నుండి కారుచున్నవి. "చనిపోయిన వారిని లేపే దేవుడిని మేము స్వీకరించెదము," అని వారన్నారు. క్యాథలిక్ మరియు లూథరన్, మరియు ఆ సంఘశాలన్నిటి యొక్క నిర్లక్ష్య ఫలితమే కమ్యునిజం, మరియు వారు జనుల యొద్ద నుండి ధనమంతటిని తీసికొని, మరియు శాఖలు నెలకొల్పుచూ, మరియు జనులకు ఏమీ లేకుండా చేసిరి, అలాగే వారు మిగతా ప్రజలవలె జీవించిరి. వారు పొందు…

రష్యాకి అవసరమైనదంతా ఏమనగా ప్రభువు యొక్క వాక్యముతో రంగము మీద నిలిచి వారి నోరు మూయించగాలిగిన ఒక ప్రవక్త వారికి కావాలి. అప్పుడు ఆ తొంభై శాతము జయించబడెదరు.

యేసుక్రీస్తు నాముములో నిలిచి హాలీవుడ్ ను మరియు మిగతా వాటిని ఖండిచగలిగిన ఒక ప్రవక్త స్వరము ఆమెరికాకు కావల్సియున్నది. అప్పుడు పరిశుద్ధాత్మ సంఘమును జయించును. అయితే అనేకమైన వ్యతిరిక్తమైన స్వరములు దీనికి విరోదముగా లేచినందున, ఎంతో సందిగ్ధము ఏర్పడినది, చూచారా.

MATT 7:15•

MARK 13:22•

2PET 2:1•

1JN 4:1

 

34ప్రతీ సంఘము ఎక్కువ మంది సంఘ సభ్యులు కావాలి అనే స్వరమును కలిగియున్నది. బాప్టిస్టు వారు ఎక్కువమందిని కోరుకొనుచున్నారు, అలాగే మెథడిస్టువారు, ప్రీస్బటేరియన్ వారు కోరుచున్నారు. మనందరం దీనిని కలిగియున్నాము. క్యాథలిక్ వారు వీరినందరినీ తీసుకొన్నట్లుగా కనపడుచున్నది, ఎటువంటి వాటికన్నా అది చాలా విలువైనది. వారు తీసికొనెదరు. అది ఖచ్చితముగా ఈ బైబిల్ నుండి వచ్చిన దేవుని స్వరము. వారు ఏలెదరు.

కాని చిట్టచివరకు సర్వోన్నతుడగు దేవుడే పరిపాలించును. ఒక దినాన పరిశుద్దులే దానిని జయించెదరు, బైబిల్ ఆ విధముగా చెప్పినది. వారు దానిని జయించెదరు.

ఎన్నో భీకరమైన స్వరములున్నవి. అక్కడ ఒక అబద్ధ ప్రవక్త స్వరము కూడా ఉన్నది. అది భయంకరమైన స్వరము. ఒకడు తనకు తాను ప్రవక్తగా పిలుచుకొనుచుండెను, అది భయంకరమైన స్వరము, నిజానికి ప్రవక్త అనగా ఒక ప్రసంగీకుడు. "ప్రవక్త" ఆనే ఆధునికమైన పదానికి సంపూర్ణమైన అర్ధము - ప్రేరేపణ క్రింద ప్రసంగించేవాడు. అక్కడ ఒక మనుష్యుడు వున్నాడు, అతడు నిలబడి తనకు తాను ప్రవక్తనని పిలుచుకొనుచూ, దేవుని వాక్యమును, దేవుని సత్యమును తిరస్కరించుచుండెను. స్వరములు అనేకమైనవి ఉన్నవి!

35కొద్ది నిముషముల క్రితము, నేను ఇక్కడికి రావడానికి నన్ను నడిపించుటకు అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, కాని నేను… నేను ఎందుకు ఆ వీధిలోనికి వెళ్ళి తిరిగి వచ్చానో అని అతడు ఆశ్చర్యపోయెను. సహోదరుడా, నీవు ఇప్పుడు ఇక్కడ ఉన్నావా, అక్కడ నేను ఒకదాని గురించి వినుచున్నాను, అదేమనగా మన వర్ణ స్నేహితులను గూర్చి, నీగ్రో వారిని గూర్చి. వారు ఇక్కడ ఒక దేవాలయమును కలిగి ఉన్నారు, మరియు వారు దానిని "ఏలియా మహమ్మద్" లేక ఏదో, "యవ్వన ఏలియా మహమ్మద్" అని పిలిచెదరు. ఒక స్వరముతో పైకిలేస్తూ నల్లజాతివారిని ఈ కూపములో నుండి బయటకు తీసుకొని వచ్చే స్వరము మేమే అని వారు చెప్పుకొనుచుండిరి. మీరు చూడండి, ఆ సంగతి, అది వారియొక్క మసీదు. ఎందుకు, మీరు చూడట్లేదా, దానియొక్క నేపధ్యమే తప్పు!

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

1COR 14:8

 

36తెల్లవారివలే, ఛామనఛాయలో ఉన్నవారివలే, మరియు పసుపురంగు వారివలే వర్ణజాతి వారు కుడా మహ్మద్ వైపుకు వెళ్లటం కాదు, కాని క్రీస్తు యొద్దకు రావాలి, బైబిలు బోధించుచున్న ఆసలైన పద్దతి అది. మహ్మద్ మతము వాక్యానికి వ్యతిరేకము. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో ఒకేసారి పదివేలమంది మహ్మదీయులను క్రీస్తులోనికి నడిపించే భాగ్యమును నేను కలిగియున్నాను. అది మానసిక శాస్త్రమును తప్ప దేనిని ఉత్పత్తి చేయదు. మరియు మానసిక శాస్త్రము వాక్యమును తిరస్కరించనంత కాలము మానసిక శాస్త్రము సరైనదే. కాని ఎప్పుడైతే మానసిక శాస్త్రము వాక్యమును తిరస్కరించునో, అప్పుడు అది తప్పు అగును. అది ఒక అస్పష్టమైన ధ్వనిని ఇచ్చును. దేవుని వాక్యము తప్ప మిగతా సమస్తము గతించిపోవును, యేసు ఆ విధముగా చెప్పిను, "భూమ్యాకాశములు గతించిపోవును, కాని నా వాక్యము ఎన్నడూ గతించిపోదు." కనుక, మీరు చూడండి, మనము వాక్యముతోనే అనగా స్వరముతోనే నిలబడియుండవలెను.

MATT 24:24•

MARK 13:22

 

37ఎన్నో గందరగోళ సంగతులున్నవి! జనులు లేచెదరు, కాని వారికి వాక్యము తెలియదు, మరియు వారు సంగతులు చెప్పెదరు, అవి చాలా అర్ధవంతముగా అనిపించవచ్చును. కమ్యూనిజము చాలా అర్ధవంతమైనదిగా ఉండును, "అందరూ ఒక్కటే. ధనవంతులెవ్వరూ లేరు, అందరూ కమ్యూనిస్టులే." కమ్యూనిజము అనేది ఒక తప్పుడు ఉజ్జీవమని ఆలోచించుటకు నీవు ఎన్నడైనా ఆగావా? మరియు వాటన్నిటి అతడు ఎక్కడ నుండి తీసుకొన్నాడు? యేసు చెప్పెను, "ఆ రెండు ఆత్మలు చాలా సమీపముగా ఉండును, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచును." మరియు ప్రతీ దానిని దెయ్యము పట్టుకొన్నది, అది దేవుడు సృష్టించిన దానికి వక్రీకరణ. పాపము అనగా నీతి వక్రీకరించబడుట. అబద్ధమనగా, సత్యమును తప్పుగా అనువదించుట. వ్యభిచారమనగా, దేవుడు మనకొరకు నిర్ణయించిన ఒక క్రియను వక్రీకరించబడుట. అవిశ్వాసమంతయూ విశ్వాసము యొక్క వక్రీకరణే. వక్రీకరణను తీసుకొనుటకు నీవు సత్యమును తిరస్కరించవలసియున్నది. చూడండి, ఈ స్వరములను పరిశీలించుడి, మరియు అవి సత్యమో కాదో వాక్యము ద్వారా పరీక్షించండి.

MARK 16:17

 

38ఓ, ఈ స్వరములపై, ఇంకా ఇంకా చెప్పుకొంటుపోవచ్చు, అయితే ఇప్పటికే మన సమయము ఆయిపోయినది. జనులకు ఏమీ చేయవలెనో తెలియని విధముగా చాలా స్వరములున్నవి. మెథడిస్టు వారు చివరగా ఒక బాప్టిస్టు బోధకున్ని విని, అక్కడికి వెళ్ళెదరు, కొంత సమయము అక్కడ ఉ౦డ౦డి ఆ తరువాత వారు లూధరన్ కి వెళ్ళెదరు. మరియు పెంతెకోస్తులో, వారికి వివిధ గుంపులు వున్నవి. ఒకరు ఇంకొకరిదగ్గరకు పరిగెత్తెదరు, మరియు ఒకరు మరొకరి దగ్గరకు, మరియు ముందుకు వెనుకకు వెళ్ళెదరు. దాన్ని బట్టి మీకు స్థిరత్వము లేదని చెప్పవచ్చును. ఆయన స్వరమును వినుడి! ఇదిగో అది ఇక్కడవున్నది, ఆ స్వరము కాగితముపై వ్రాసివున్నది. అది సత్యమైతే, ఆ స్వరము రుజువు చేయబడును.

ఏమి చేయవలెనో సంఘ ప్రపంచమునకు తెలియదు, రాజకీయ ప్రపంచమంతా కూడా గందరగోళములో ఉన్నది. ప్రతీది కూడా గందరగోళములోనే ఉన్నట్లు కనబడుచున్నది. ఇక్కడి నుండి కొంతమంది పరుగెత్తెదరు, మరేదో పైకి లేచును, ఏదో జాకెట్ మరేదో కోటు. ఒకసారి నేను రోమ్ లో ఉన్నాను, అక్కడ యేసు చేతిలో కొట్టబడిన పందొమ్మిది రుజువు చేయబడిన మేకులను వారు కలిగియున్నారు; వాస్తవానికైతే కేవలము మూడే ఉన్నవి, కాని వారైతే ఇంకా పందొమ్మిది వేరు వేరు మేకులునట్లుగా రికార్డును కలిగియున్నారు. ఇప్పుడు, మేకులను ఎవరు కలిగియున్నారను దానిలో అది ఏమి వ్యత్యాసమును తీసికొని వచ్చును? ఆరాధించుటకు క్రీస్తు ఎన్నడూ మనకు మేకులను విడిచి పెట్టలేదు, ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన మనకు పరిశుద్ధాత్మను విడిచిపెట్టెను! "నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు వెంబడించును. వారు అసలైన మేకులను కలిగియుండెదరు?" "వారు.. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును, నేను ప్రారంభించిన సంఘశాఖకు వారు చెందియుండెదరు?" అనే దేనిని ఆయన ప్రారంభించలేదు. ఆ స్వరము ఎలా వ్యతిరేకముగా ఉన్నదో? చూడండి.

MATT 7:22,23•

MARK 16:17,18•

1COR 13:1

 

39కాని, "నమ్మిన వారిని ఈ సూచక క్రియులు వెంబడించును; నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదరు." అదిగో వాక్యము. "వారు క్రొత్త భాషలలో మాట్లాడెదరు; పాములను ఎత్తిపట్టుకొందురు, అవి వారికి హానిచేయవు. ఒకవేళ వారు మరణకరమైనదేది త్రాగిననూ అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు." తక్కిన ఈ లేఖనములన్నింటిని ఒక దగ్గర సమకూర్చి మరియు మీరు ఈ కార్యములను గమనించండి.

ఇప్పుడు, అది మాత్రమే దానిని రుజువు చేయుదు, ఏ మాత్రము చేయదు. అక్కడే పెంతకోస్తు వారమైన మనము తప్పుడు మార్గములో పడియున్నాము. యేసు చెప్పలేదా, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వత్తురు, మరియు చెప్పుదురు, "ప్రభువా, నీ నామమున మేము అద్భుత కార్యములను చేయలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? ఇవన్నియు నీ నామమున చేయలేదా?"" మరియు యేసు చెప్పెను, "అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి, నేను మిమ్ములను ఎన్నడు ఎరుగను." మీరు చూచారా, నా సహోదరి మరియు సహోదరులారా, నేను ఎందుకు ఈ తరమును గద్దించుచుచు మరియు నేరారోపణ చేయుచున్నానో? మీరు దేవదూతల భాషలతో మాట్లాడవచ్చు, మీరు ఈ సంఘము చుట్టూ తిరిగి ఆత్మలో నాట్యము చేయవచ్చు, దానితో చేయునది ఏమియు లేదు.

40మొహమ్మదీయులు అలాగు నాట్యము చేయుట నేను చూచియున్నారు. మంత్రగత్తెల క్యాంపులో నేను వినియున్నాను, దయ్యములు నిలచి భాషలలో మాట్లాడుట మరియు అనువాదము చెప్పుట నేను చూచియున్నాను, ఖచ్చితముగా ఏమి జరుగునో వారు చెప్పుదురు, మరియు ఆ విధముగా జరిగెను. మరియు ఒక పెన్సిల్ లేచి మరియు పేపరు పై అన్యభాషలో వ్రాయుట నేను చూచియున్నాను, మరియు దానిని చదువునది దయ్యము మాత్రమే. మీరు ఒక ఉద్రేకముపై మీ యొక్క నిత్య గమనమును ఆధారము చేసుకొనియుండలేరు. ఈ ఉద్రేకములను దేనినైనా సాతాను అనుకరించగలదు. క్రీస్తును ఎరుగుట అనునది మీ జీవితమును ఎదో మార్చును. వాక్యముతో మీ జీవితమును మరియు దాని క్రమమును గమనించుము, మరియు మీరు ఎక్కడ ఉన్నారో చూడుము. సమగ్ర జాబితాను తీసుకొనుము, ఖచ్చితముగా.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

JOHN 10:4,27•

HEB 3:15

 

41ఇలాంటి అనుకరణలు, అబద్ధపు స్వరములు, అబద్ధపు ప్రవక్తలు, ఇటువంటి ఇతరమైన అన్నియు లేచినను, యేసు చెప్పెను, "నా స్వరమును విని మరియు నన్ను వెంబడించువారు." ఆయన వాక్యమైయున్నాడు. వినుము, ఈ స్వరములన్నింటిలో ఈ రోజు మనకు ఆయన ఆజ్ఞ. నేను మీకు చెప్పియున్నాను, వాటిని అన్నింటిని తీసుకొని వచ్చుటకు గంటల సమయము పట్టును. మరియు ప్రజలకు అది గందరగోళముగా ఉన్నది, అది దయనీయమైన సంగతి. మరియు దీని తరువాత, మీకు రెండవ అవకాశము లేదు, దానిని మీరు ఇప్పుడే తీసుకోవలసియున్నది. ఈ రాత్రి మీకు అవకాశము ఉండకపోవచ్చును. రేపు మీకు అవకాశము ఉండకపోవచ్చును. అది ఇప్పుడే సమయము! "శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె, నా స్వరమును వినునప్పుడు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడే సమయము. ఏ మనుష్యుడైనా వినుటకు ఇదే సరైన సమయము." అటువంటి గందరగోళముల మధ్యలో కూడ ఆయన స్వరము ఇంకనూ ఉండును, అని అది చూపించును. ఆయన ఇంకను స్వరమును కలిగియున్నాడు! ఎందుకు? ఆయన స్వరము సదా నిలచును. అది ఇక్కడ ఇలా ఉన్నది, "ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు," ఆయన వాక్యము.

JOHN 1:10•

2TIM 3:12

 

42త్వరగా, మరొక అయిదు నిమిషములు తీసికొనెదము. మీరు ఉండగలరా, అంత సమయము మీరు ఉండగలరా, లేక కొద్ది నిమిషములు పాటు ఓర్చుకోగలరా? ఇప్పుడు, నేను త్వరపడెదను, ఈ స్వరమును విని మరియు దానికి లోబడినవారిలో కొంతమందిని తీసికొనెదము. అది వారినెట్లు క్రియ చేయువారిగా చేసినది. ఆ విధముగా చేయుటకు అది వారికేమి చేసినది. దానిని తిన్నగా మీ యొద్దకు తీసికొని వచ్చుటకు, ఇప్పుడు చాలా లేఖనములను నేను దాటి వెళ్ళబోవుచున్నాను. అది వారి జీవితములను ఏ విధముగా మార్చివేసినది మరియు దానిని గూర్చి కలియున్న వారందరూ, వారు ఏ విధముగా వింతవ్యక్తులుగా మారిపోయారు, మనము ఒక "వింత వ్యక్తి" అని పిలిచెదము. దేవున్నీ నమ్మియున్న ప్రతీ మనుష్యుడు ఎప్పుడైనను ఒక వింత వ్యక్తిగా పరిగణించబడును. ఎందుకనగా, మీరు లోక పోకడలో ఉన్నట్లయితే, నీలో ఏదో తప్పు ఉన్నది. క్రైస్తవుడుగా వుండుటకు నీవు ఒక వింత వ్యక్తిగా ఉండవలసియున్నది. "ఏలయనగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారందరు లోకము యొక్క శ్రమలను అనుభవించుదురు. ఆయన లోకములో ఉండెను, మరియు ఈ లోకము ఆయన ద్వారా చేయబడెను, మరియు ఈ లోకము ఆయనను ఎరుగకుండెను." ఇప్పుడు త్వరగా మనము ముగించే ముందు, జాగ్రత్తగా వినండి.

GEN 3:6,8•

JOB 2:10

 

43చల్లపూట సాయంత్రము ఆదాము, ఆయన స్వరమును వినియున్నాడు, మరియు ఆయనతో సహవాసము కలిగియున్నాడు. ఆదాముకి ఎటువంటి శిక్షావిధిలేదు. అతడు దేవుని స్వరము విని ఇలా అనెను, "తండ్రీ, ఇప్పుడు నన్నునేను నిద్రపుచ్చుకొనుచున్నాను, మరియు అతడు పండుకొనియున్నాడు, మరియు అతని చేతిపై హవ్వ, సింహాము, పులి, మరియు ఆ అడవి మృగములన్నీ తిన్నగా అతడి చుట్టే పరుండియున్నవి. ఎటువంటి హానిలేదు, బలహీనపడే మార్గమేలేదు, అతడు ఉదయమే లేచినట్లయితే ఆశ్చర్యపోవలసిన అవసరమేలేదు, వారు కూడ లేవబోవుచున్నారు. ఆదాము ఏ విధముగా దేవుని స్వరమును వినవలసియుండెనో ఆ విధముగానే ఆ స్వరమును ఆదాము విని యున్నాడు.

కాని, ఒక రోజు అతడు తన భార్య యొక్క స్వరాన్ని విన్నాడు. కొద్దిసేపటి వరకు నేను దానిని విడిచి పెట్టుట మంచిది. అతడు ఆ తప్పుడు స్వరాన్ని వినియున్నాడు. ఆమె అతడి భార్యయే కావచ్చు, ఈ భూమిపై అతడు కలిగియున్న సన్నిహిత సంబంధము గల వ్యక్తి ఆమె. యోబు వలే అతడు ఎందుకు చేయకుండెను, "నీవు బుద్దిహీనురాలివలె మాట్లాడుచున్నావు?" అని ఆదాము అనలేకపోయెను. ఒకవేళ అతడు అలాగన్నట్లైతే, మానవజాతి అంతయూ మరణించుటకు బదులుగా జీవించియుండును. మానవుని, మరి కాలగతులను అది మార్చివేసెను. కాని అతడు దేవుని స్వరమును విని, దానితో అతడు సహావాసము కలిగియుండెను. కాని అతడు వెనుకకు తిరిగినప్పుడు… తన భార్య తప్పు చేసినదని అతడు ఏ విధముగా ఎరిగియుండెను? గుర్తించుకొనండి, అది అందమైనది అయి యుండెను.

1KGS 22:6•

2CH 18:5

 

44ఈ రోజు మన యొక్క శాఖ, సంఘము, మన అభివృద్ధిని చూసి దేవుడు మనపై ఆనందము కలిగియున్నాడని మనము తలంచెదము. అది మంచిగా అనిపించును. మీకాయా ఆ నాలుగువందల మంది ప్రవక్తల ముందు నిలబడినప్పుడు, అది మంచిగా కనిపించెను. మరియు దేశమంతా వారికి చెందియున్నది, మరియు ఫిలిష్తియులు లేక అస్సిరియులు దానిపై యున్నారు. అది మంచిగా కనిపించెను. ఈ ప్రవక్తలు చెప్పుచున్నారు, "అక్కడికి వెళ్ళండి, అది మనకు చెందినదే. దానిని తీసికొనండి!" కాని అది దేవుని స్వరము కాదు. మరియు మీకాయా వెనుకకు తిరిగి ఆ స్వరమును శపించెను. మరియు దానిని చేయుటకు ఏ విధముగా అతడు ఎరిగియుండెను? ఎందుకనగా ఆతని దర్శనము ఖచ్చితముగా వాక్యముతో ఉండెను. మరియు ఈ రోజు మనము నమ్మవలసియున్న మరియు చూడవలసియున్న ఒకే ఒక మార్గమదే, అది వాక్యముపై ఉండవలెను.

GEN 3:7,13

 

45దేవుని స్వరమునకు బదులు ఆదాము ఇతర స్వరములను, అనగా తన భార్య స్వరమును వినియున్నాడనే సంగతిని నీవు ఎన్నడైనా గమనించావా. మరియు సంఘము తన యొక్క శాఖ సంబంధమైన స్వరమును విని వాక్యమునుకు బదులుగా దానిలోని సిద్ధాంతములను చొప్పించుకొనుచున్నది, మరియు అది తనకి నచ్చిన విధముగా జీవించుటకు అనుమతించుచున్నది. వారు సంఘమునకు వెళ్ళుచూ మరియు ఒక ఖచ్చితమైన సంఘ సభ్యునిగా, ఉంటే అది సరిపోతుంది అని అనుకొందురు. వారికైతే ఈ భూమిపై ఒక విశ్వాసి కలిగియున్న అతి దగ్గర సంబంధము సంఘము మాత్రమే. కాని విశ్వాసికైతే, ఒక నిజమైన విశ్వాసికైతే దగ్గర సంబంధము పరిశుద్ధాత్మయే, దేవుని వాక్యము మాత్రమే.

కనుక ఆదాము తన యొక్క స్థితిని గుర్తించాడని మీరు కనుగొనెదరు, అలాగే దేవుని స్వరము మళ్ళీ తనను పిలుచుట అతడు వినియున్నాడు, కాని అప్పుడు అతడు అంజూరపు ఆకులతో కప్పబడియుండెను. అతని యొద్దకు వచ్చిన ఖండించునటువంటి స్వరము అది, "నీవు దానిని ఎందుకు చేసితివి?"

46నేను ఆశ్చర్యపోయెదను ఒకవేళ అమెరికా ఈ రోజున, అలాగే ఈ ప్రపంచము దాని యొక్క మతపరమైన ఆర్బాటములో అది ఉన్నట్లుగా, మరియు అమెరికా మ్రి౦గివేయుచున్నది, దానికదే మ్రింగివేయబడుచున్నది, అతి త్వరలో అది ఒక జాతీయ మతముగా ఉండబోవుచున్నది..

ఎవరు నా ముందు కూర్చొనియున్నారు? అది టేపు చేయబడుచున్నదని నాకు తెలుసు మరియు అవి ప్రపంచ వ్యాప్తముగా వెళ్ళాయి. మనము టేపు కార్యక్రమములను కలిగియున్నాము, ప్రతి వర్తమానము ప్రపంచమంతటిలోకి, మిగతా దేశములన్నిటిలోనికి తీసికొనిపోబడును.

మంచిది, ఇప్పుడు ఒకవేళ మీరు నిదానించి చూచినట్లయితే, అంజూరపు ఆకులతో నిలబడియున్నవారుగా మీరు ఉన్నారు. ఒక నిజమైన దేవుని స్వరము బయటకు వస్తున్నప్పుడు, దానితో ఏమి చేయవలయునో వారికి తెలియదు. అది గందరగోళముగా ఉన్నది, ఏమి చేయాలో వారికి తెలియకున్నది.

త్వరగా ముగింతును, నోవాహు దేవుని స్వరమును వినెను. అతని జీవితమును రక్షించుకొనునట్లుగా, అది అతనిని సిద్దపరచుచున్నది, మరియు అతడు ఆ కట్టడలను వెంబడించి నిలబడెను.

1SAM 3:15•

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

47ఒకడు స్వరమును విన్నయెడల… ఇప్పుడు వినండి, ఈ అసలైన దానిని పట్టుకొనండి. విఫలమవ్వొద్దు, ఒకవేళ ఒక మనుష్యుడు ఏదైనా స్వరము విన్నయెడల, మరియు అది దేవుని స్వరమని రుజువు చేయబడితే, మరియు అదే సమయములో, మరియు అప్పుడు ఆ వ్యక్తిలో నుండి అది బయలువెళ్ళితే, భూమ్యాకాశములు గతించిపోవును గాని ఆ వాక్యము మాత్రము గతించిపోదు.

నోవాహు ఆ స్వరమును వినెను మరియు లోకమును గద్దించెను. మరియు అతని ముఖము పైనే వారు నవ్వియున్నారు, ఎందుకనగా అతడి యొక్క వర్తమానము వారి యొక్క శాస్త్రసంబంధమైన ఆవిష్కరణలతో సరితూగలేదు, కాని అక్కడ వర్షము కురిసెను మరియు లోకమును నాశనము చేసెను. చూశారా? బయలువెళ్ళిన అతడి స్వరము, ఆ విత్తనము అక్కడ పడివున్నది. ప్రతికాలములోనూ ఆ విధముగానే ఉన్నది.

సమూయేలు, అతడు దేవుని స్వరమును వినినప్పుడు మేల్కొల్పబడెను, అది అతడు… తనను పెంచి పోషించిన ఆ మనుష్యున్ని, తనకు నాన్నగా ఉండి, తనను పెంచి పెద్దచేసిన తనను, తనను పోషించిన ఆ వ్యక్తియగు ఏలిని గద్దించుటకు ఆ స్వరము ముందుకు వెళ్ళమని చెప్పెను.

48సేవకులైన సహోదరులారా, నేను ముందుకు సాగనా? సేవకులు, అనేకసార్లు వారి యొక్క శాఖ పరిధుల మీద మరియు సిద్దాంతముల మీద ఆనుకొని, తమ యొక్క యోగ్యత పత్రములను తమ జేబులో పెట్టుకొని వారు వు౦దురు, వారు తమను తండ్రిలా పెంచి పోషించి, తమను ఒక స్థాయిలో ఉంచిన తమ శాఖ సంస్థలను బట్టి సంఘములో సమాజములో వారు ఒక హోదాలో పెట్టబడతారు. కావున నీవు వారి బోధకు తలొగ్గవల్సిందే, ఒక నిజమైన సేవకుడికి దేవుని యొక్క స్వరము విని మరియు అదే మాతృ సంస్థ అయిన దానిలోకి వెనుకకు తిరిగి వెళ్ళి, "మీరు వాక్యమును స్వీకరించలేదు గనుక మీరు శిక్షకు లోనవుదురు," అని చెప్పడము ఎంత భయంకరమైన విషయము. అది గొప్ప సంగతి!

సమూయేలుకు అది కఠినముగా ఉండెను. అయితే అతడు ఒక ప్రవక్త, గనుక అతడు దానిని చేయవలసియుండెను. అది వారికి నొచ్చుకొనుచున్నదా లేదా అని కాదు గాని, అది ఏ విధముగానైనా సరే అతడు చేయవలసియుండెను.

49మోషే దేవుని స్వరమును వినెను. అతడు పూర్తిగా వేదాంతముతో నిండియుండెను. లాభనష్టములన్ని అతడు ఎరిగియుండెను, అయినను అతడు విఫలమయ్యెను. మోషే దేవుని స్వరమును వినెను, మరెన్నడూ మోషే అదే విధంగా ఉండలేదు.

మరియు ఏ మనుష్యుడు ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. నీవు ఆ స్వరము మాట్లాడుటను నీ చెవుల ద్వారా నీవు వినియుండవచ్చు, కాని నీ హృదయములో ఆ స్వరము మాట్లాడటము విన్నప్పుడు, చూశారా, అప్పుడే నీవు నిజముగా వినుచున్నావు. నీ కన్నుతో నీవు చూడలేవు, కాని నీ హృదయముతో నీవు చూడగలవు. నీవు ఏదైనా ఒక దానిని చూస్తూ కూడా ఇలా చెప్పవచ్చు, "నేను దానిని చూడలేకున్నాను," అంటే దానర్ధము దానిని నీవు గ్రహింపలేకున్నావు. నీవు చెవులతో వినలేవు, కాని నీ హృదయముతో దానిని వినగలవు. అనేకసార్లు నీ చెవులతో నీవు నిజమైన దేవుని స్వరమునే వినెదవు, అయితే ఒక బాతు వీపు మీద నీళ్ళుపోసినట్లుగా అవి జారిపోవును. నీవు నిజముగా వినెదవు, ఎప్పుడనగా దానిని నీవు నీ హృదయముతో విన్నప్పుడు.

EXOD 2:24•

EXOD 3:5,8,10•

EXOD 4:3,4

 

50మరియు వేదాంత శాస్త్రమంతటిని మోషే కలిగియుండుటనుబట్టి అతడు దేవుని స్వరమును వినలేకపోయెను. కాని ఒక దినాన దేవుడు ఈ ఎనభై సంవత్సరముల ముసలివాడగు గొర్రెల కాపరిని ఒక ప్రక్కకు పిలిచి అతనితో మాట్లాడెను, మరియు అతడు దానిని పట్టుకొనెను. తాను దేవుడునని ఆయన రుజువు చేసికొనెను. మోషేకు ఆయన చేసిన మొదటి సంగతి ఏదనగా ఆయన తన వాక్యమును ఆతనికి రుజువు చేసెను, "నేను క్రిందకు వెళ్ళుచున్నాను, నేను చేసిన వాగ్దానము నాకు జ్ఞాపకమున్నది."

మరియు ఈ అంత్యదినముల కొరకు ఆయన ఈ వాగ్దానము చేసెను. అన్యులలో నుండి ఒక జనమును పైకి లేపెదనని మరియు అన్ని వాగ్దానములు నెరవేర్చుదునని చెప్పెను.

"నేను వాగ్దానము చేసినది ఇదే." చెప్పెను, "మోషే నీ చెప్పులను విడువుము." ఇంకొక మాటలో దానిని గౌరవించుము. "ఇప్పుడు నీ కర్రను విసిరివేయుము." ఎడారి యొక్క ఎండిన కర్ర సర్పముగా మారెను, మరియు మోషే దానిని పట్టుకొనెను, మరియు అది దాని పూర్వపు స్థితిలోనికి వచ్చెను. చూశారా? అది దేవుడే అని అతడు ఎరిగియుండెను. ఎందుకనగా దేవుడు చెప్పెను, దేవుని వాక్యము, ఆతడు మాట్లాడుచున్న ఆ వాక్యము అడిగెను. "నీ చేతిలో ఉన్న కర్రను విసిరివేయుము." అది దేవుని వాక్యము. కావున నీకు చెప్పని దేవుని వాక్యమును నీవు చేయుటకు ప్రయత్నించవద్దు, అది మోషేకు దేవుని యొక్క వాక్కు. ఇదిగో నీకు దేవుని యొక్క వాక్కు! "కర్రను విసిరివేయుము." అది సర్పముగా మారెను. "ఇప్పుడు దానిని చూచి నీవు భయపడుచున్నవా? దాని తోకతో దానిని పైకెత్తుము," అని అనెను. దానికి అతడు లోబడి దానిని చేసినప్పుడు అది తిరిగి తన పూర్వపు స్థితిలోనికి వెళ్ళినది. అది అతడికి దేవుని యొక్క మాట. ఆయన ఏమి చేసియున్నాడు? దేవుడు తన వాక్యమును రుజువు చేసికొన్నాడు.

51కొన్ని నెలల క్రితం ఇక్కడ నాకొక పిలుపు ఉన్నది. బహుశా అది దాదాపు సంవత్సరం కావచ్చు లేక అంతకంటే ఎక్కువ కావచ్చు. ఒక చిన్న స్త్రీ నాతో ఫోన్లో మాట్లాడి ఒక బాప్టిస్టు ప్రసంగీకుడు మరియు ఒక పెంతెకోస్తు ప్రసంగీకుడుతో కలసి, "సహోదరుడా బ్రెన్హాం ప్రభువు నన్ను ఒక ప్రవక్తినిగా చేసెను" అని ఆమె అన్నది.

"సరే మంచిది" అని నేను అన్నాను,

ఆమె చెప్పెను, "నీకు తెలుసా, నా పరిచర్య దేవునిదని నీవు నా గూర్చి సాక్ష్యము చెప్పినావని నాతో అన్నారు."

నేను దానిని చేయలేను, ఎందుకనగా అది వాక్యమునకు వ్యతిరేకము. గనుక నేను చెప్పాను "స్త్రీ, అది తప్పు. నీవు ఎవరివో కూడా కనీసం నాకు తెలియదు."

మరియు ఆ బాప్టిస్టు ప్రసంగీకుడు, నేను అతడిని విన్నాను, నేను పెంతెకోస్తు ప్రసంగీకుడిని విన్నాను. ఆమె చెప్పెను, మంచిది, ఇక్కడ నేనొక కూటమునకు కలిగియున్నాను." మరియు చెప్పెను, "ప్రభువు గొప్ప కార్యములు చేయుచుండెను."

నేను అన్నాను, "సరే దానికొరకు నేను కృతజ్ఞుడిని." ఆమె చెప్పెను… నేను చెప్పాను, "ఆయన ఎన్నడైనా ఏదైనా నీకు చెప్పెనా?"

అందుకామె, "అవును, నా చేతిలో ఒక గొప్ప కార్యక్రమమును నేను పొందుకొన్నాను."

"అద్భుతము" అని అన్నాను. "ఇప్పుడు, నీ కార్యక్రమమేమిటి? దేవుడు నీకు ఏమి చెప్పాడు?"

"ఫలానా ఫలానా తేదిన నీవు ఆరిజోనాలోని ఫీనిక్సునకు వెళ్ళు, మరియు నేను నీకు లాస్ట్ డచ్మన్ బంగారపు గనిని ఇవ్వబోవుచున్నాను, మరియు అక్కడ దొరకు ఆ బంగారమును తీసుకొనబోవుచున్నావు మరియు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మిషనరీలకు నీవు స్పాన్సర్ (ధనమును పెట్టుబడి) చేయబోవుతున్నావు" అని ఆయన నాతో చెప్పాడు, లాస్ట్ డచ్మన్ గని ఒక పురాణం అని మనందరము ఎరుగుదుము. "కనుక అతడు చెప్పాడు…"

నేను చెప్పాను, "మంచిది, అది దేవునిదా లేక కాదా అనేది ఎలా కనుగొనాలో నేను చెప్పెదను." ఇంకా చెప్పాను, "ఆ దినమున నీవు అక్కడ ఉండుము. మరియు ఒకవేళ ఆ లాస్ట్డచ్ మన్ గనిని నీవు కనుగొనినట్లయితే అప్పుడు అది దేవునిది. ఒకవేళ నీవు ఆ లాస్ట్ డచ్మన్ గనిని కనుగొనలేకపోతే, అప్పుడు నీవు పశ్చాత్తాపపడి, నీలో నుండి ఆ అబద్దపు ఆత్మను తీసి వేసికొనుము." అది దేవునిదా లేదా అని కనుగొను విధానమదే.

EXOD 4:3,4

 

52దేవుడు చెప్పెను, "మోషే కర్రను విసిరివేయుము, మరియు అది సర్పముగా మారును." అతడు దానిని చేసెను. "దానిని తీసుకొనుము, అది మరలా కర్రగా మారిపోవును," అని ఆయన చెప్పెను. అతడు దానిని చేసెను.

ఈ చివరి దినములలో దేవుడు ఒక పరిచర్యను గూర్చి వాగ్దానము చేసినప్పుడు, ఆయన ఏ విధముగా చేస్తానని చెప్పెనో, ఖచ్చితముగా ఆ విధముగానే దానిని రుజువు చేయును. అప్పుడు మీరు సరైన స్వరమును కలిగియున్నారని తెలుసుకొనెదరు. మీరు సరైన సంగతినే వినుచున్నారు, ఎందుకనగా అది వాక్యము రుజువు కాబడుట అయియున్నది. చూశారా? ఓ, ఎలా… నన్ను క్షమించండి, నేను … మంచిది.

EXOD 4:20

 

53మోషే వ్యత్యాసముగా ప్రవర్తించెను. మోషే ఎటువంటి హాస్యాస్పదమైన సంగతిని చేసాడో చూడుము. ఇప్పుడు, దేవుని స్వరమును నీవు వెంబడించిన్నంత కాలం లోకానికి నీవు పిచ్చివానిగా ఉంటావు. మరుసటి రోజు మోషే తన భార్యను గాడిదపై కూర్చోండబెట్టి, ఒక చిన్న బిడ్డ ఆమె నడుముపై, ఆ దక్షిణాదివారి ప్రకారం, బిడ్డను ఆమె యొక్క నడుముపై ఉంచి, అదిగో వెళ్ళిపోవుచున్న మోషే అక్కడ కనుగొనబడ్డాడు. ఈ ముసలివాడు గెడ్డము ఈ విధముగా క్రిందకు వ్రేలాడుచూ, అతడి చేతిలో ఒక కర్ర, ఒక గాడిదను నడిపిస్తూ ఎంత కష్టముగా అక్కడికి వెళ్ళగలడో అంత కష్టముగా ఐగుప్తు వైపు తిన్నగా వెళ్ళిపోవుచున్నాడు. ఎవరో అడిగారు, "మోషే నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?"

"దానిని స్వాధీనపరచుకొనుటకు ఐగుప్తునకు వెళ్ళుచున్నాను." ఒక యవ్వనస్తుడిగా అతడు విఫలమయ్యాడు, ఒక సైనికుడిగా విఫలమయ్యాడు, కాని ఇక్కడతడు స్వాధీనపరుచుకొనబోవుచున్నాడు. మరియు అతడు దానిని చేసాడు. ఎందుకని? ఆతడు దేవుని స్వరమును వినియున్నాడు మరియు తన యొక్క కాలమునకు అది రుజువు చేయబడటం చూశాడు, ఏలయనగా ఆ సంగతులు తన యొక్క ఆదీనములో ఉండవలసియున్నది. అతడు దానిని చూశాడు.

ACTS 9:3•

ACTS 10:15

 

54పౌలు ఒక వ్యక్తిగత శైలీగల పరిసయ్యుడు, అతడు ఉండగల్గినంత వేదాంత శాస్త్రముతో నిండియున్నాడు, కాని ఒక రోజు అతడు దేవుని స్వరమును విన్నాడు. అతడొక అగ్నిస్తంభమును చూచెను, మరియు అక్కడ ఏదో వ్యత్యాసమైనది ఉన్నదని అతడు తెలుసుకున్నాడు. అది అతడి జీవితాన్ని మార్చివేసింది. ఎంత మంది పరిసయ్యులు, ఎంత మంది గమలియేలులు లేక ఏదైనా పౌలుతో, "నీవు తప్పు, నీవు తప్పు," అని అరుస్తూ ఉన్నప్పటికీ, పౌలు, అతడు దేవుని యొక్క స్వరమును వినినప్పుడు, అది సత్యమని అతడు ఎరిగియుండెను.

పేతురు, అతడు ఉండగలిగినంత మత సంబంధమైనవాడిగా ఉంటూ, పెద్దల యొక్క ఆచారములను పాటిస్తూ, దాని ప్రకారము కొన్నిసార్లు ఆతడు ఎటువంటి మాంసము తినేవాడు కాదు. లేదయ్యా. దానిని గూర్చి ఆతడు చేయగలిగినది ఏమి లేదు. వాక్యప్రకారము, అతడు నిజముగా పెద్దల యొక్క ఆచారములను పాటిస్తూ ఉండేవాడు. ఏమి జరిగినది? ఒక రోజు అతడు, "నేను శుద్ధిపరచిన వాటిని సాధారణమైనవి మరియు అపరిశుభ్రమైనవి అని పిలువవద్దు," అనే దేవుని స్వరమును విన్నాడు. అతడు మార్పు చెందిన వ్యక్తి, ప్రభువు అతడిని ఎక్కడికి పంపుచున్నాడో అక్కడికి వెళ్ళడానికి అతడు సిద్ధపడియుండెను.

JOHN 11:43

 

55ముగింపులో నేను దీనిని చెప్పగోరుచున్నాను. ఒకప్పుడు ఒక విశ్వాసిగా ఉన్న ఒక మనుష్యుడు కలడు. అతడు చనిపోయి నాలుగు రోజులు అయ్యెను. అతడు సమాధిలో ఉండెను, కంపు కొట్టుచూ కుళ్ళిపోవుచుండెను, కాని అతడు "లాజరు బయటకు రా! " అనే దేవుని స్వరము పలకబడటం విన్నాడు. చనిపోయి మరియు కుళ్ళిపోయిన ఒక వ్యక్తిని అది బయటకు తీసుకురాగలిగితే, ఇంకనూ జీవం కలిగియున్న ఆ స్వరము ఒక సంఘమునకు ఏమి చేయగలదు? మనము మాట్లాడుతున్న మత సంబంధమైన, రాజకీయ సంబధమైన, హాలీవుడ్ సంబంధమైన, అబద్ద ప్రవచములన్నింటిలో నుండి, ప్రతి విధమైన తప్పులో నుండి కుళ్ళిపొయిన కూపములలో నుండి ఆ జీవముగల స్వరం సంఘమును తిరిగి దాని పూర్వపు స్థితికి తీసుకురాగలదు (సంఘమును పునరుత్థాన పరచగలదు). వీటిన్నిటి మధ్యలో నిజమైన దేవుని స్వరము పాపములోను అతిక్రమములోను చనిపోయిన ఒకడిని తిరిగి జీవములోనికి తెచ్చును. అది ఒక వెనుకకు జారిపోయిన సంఘమును తీసికొని తిరిగి జీవములోనికి తెచ్చును. నిశ్చయముగా!

JOHN 5:28,29•

2TIM 3:5•

HEB 3:15

 

56గుర్తించుకొనండి, చివరిగా దీనిని చెప్పి నేను ముగించెదను. యేసు చెప్పెను, "ఒక సమయము వచ్చును, సమాధిలో నున్నవారందరు దేవుని స్వరమును వినెదరు." మరియు నీవు దానిని వినబోవుచున్నావు, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికిని, ఏ విధముగానైనా నీవు దానిని వినబోవుచున్నావు. మరియు సమాధిలో నుండి బయటకు వచ్చిన వారిలో కొందరు శిక్షా విధిలోనికి వచ్చెదరు. వారు స్వరమును వినెదరు, కాని అది వారిని ఖండిస్తున్నది. మరియు ఒకవేళ దానిని నీవు ఈ రోజు వినినట్లయితే, "నేడు చాలా కాలము తరువాత, మీరు నా స్వరమును వింటిరి కనుక మీరు హృదయములను కఠినపరచుకొనకుడి, ఆ కోపము పుట్టించిన దినములలో మీరు చేసినట్లుగా." మరియు పెంతెకోస్తువారైన మీరు లోకానుసారముగా మళ్ళీ సిద్దాంతములతో గుంపులు కట్టినయెడల, "పైకి భక్తిగలవారై యుండియూ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నట్లయితే," ఖండించబడుటకు ముందుగా మీరు పునరుద్దానములో లేవవలసియున్నారు, ఎందుకనగా వాక్యము ద్వారా ఇప్పుడు మీతో మాట్లాడుచున్న ఆ దేవుని స్వరమే ఆ దినమున మిమ్ములను ఖండిచును.

57నీవు ఒక నులివెచ్చని విశ్వాసి అయినయెడల, ఈ ఉదయకాలమున దేవుని స్వరము, "నీవొక నులివెచ్చని విశ్వాసివి, నీవు మారుమనస్సు పొందుట మంచిది!" అని మీ హృదయములో కేకలు వేయుచున్నది. కావున నీవు పశ్చాతాపడుట మంచిది.

క్రీస్తు కొరకు జీవించని స్త్రీ పురుషులారా, బాల బాలికలారా, తన వాక్యము ద్వారా దేవుని స్వరము మీతో మాట్లాడుతూ, "అటువంటిది చేయటం ఇక ఆపివేయండి," అని చెప్పుచున్నది. నీవు త్వరపడుట మంచిది. ఎందుకనగా ఒకానొక దినమున మళ్ళీ దానిని నీవు వినబోవుచున్నావు, మరియు అది నీన్ను ఖండించును. దానిని నీవు తిరస్కరించలేవు, ఇప్పుడు అది నీతో మాట్లాడుచున్నది. మరియు, గుర్తుంచుకొనండి, అది రికార్డు చేయబడుతుంది.

మరియు ఎవరైతే సరైనది చేయుచూ మరియు ఆయన స్వరమును వినెదరో - వారు నీతి కొరకు, మహిమ కొరకు, పరలోకము కొరకు లేపబడెదరు.

JOHN 5:28,29

 

58కనుక ఒకానొక సమయములో నీవు దేవుని స్వరాన్ని వినబోవుచున్నావు. బహుశా ఆశ్చర్యరీతిలో ఈ ఉదయము అది నీవు వెళ్ళుచున్న మార్గములో నుండి నీపు వెనక్కి తిరగవలెనని, దేవుని వైపు తిరుగవలెనని అది నీ హృదయములో మాట్లాడుతున్నది. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇప్పుడు నీ హృదయములో మాట్లాడుచున్న ఆ స్వరమును పరలోకములో రికార్డు చేయుచున్నారు. మరియు ఒక రోజు యేసు పిలచినప్పుడు, సమాధిలో నున్నవారందరూ, అనగా మంచివారు మరియు చెడ్డవారు లేచెదరు. మరియు అప్పుడు ఇదే స్వరము తిరిగి మీతో గుసగుసలాడును, "అరిజోనాలోని ఫినిక్సులో ఒక ఖచ్చితమైన ఆదివారపు ఉదయమున, ఆ స్వరమును గూర్చి మాట్లాడుతూ, ఒక సేవకుడు "మిమ్ములను ఎక్కువసేపు ఉంచెను, నేను మీతో మాట్లాడాను; స్త్రీలారా మీరు జుట్టు పెంచుకొనండి అని మీతో చెప్పాను, అసహ్యముగా (అనైతికముగా) దుస్తులు ధరించడం ఆపివేయండి: పురుషులైన మీరు ఆ అబద్దాలు చెప్పడం, పొగత్రాగడం మానివేయమని మీతో చెప్పాను; బోధకులైన మీకు దేవుని వాక్యమునకు వెనుకకు తిరగమని చెప్పాను. నేనేమి చెప్పుచున్నానో చూడండి? అది సరే.

ఆ నిమ్మళముగా మాట్లాడు స్వరము చెప్పును, "అది సరైయుండవచ్చును."

59ఒకవేళ నేను నికోదేము వలె రాగోరినయెడల, అక్కడికి వచ్చుటకు ఇంకా ప్రయత్నించెదను. నేను ఆయన యొద్దకు వచ్చి, మరియు ఇక్కడే ఎక్కడో ఎడారిలోనికి వెళ్ళి, "ప్రభువైన దేవా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇప్పుడే మార్పుచేయ్యి. నీకిష్టమైనట్టుగా నన్ను మలచుము," అని చెప్పుము. వాక్యము యొద్దకు తిరిగి రండి. ఎక్కడైతే మీరు వాక్యమును విడిచి పెట్టారని మీరు చూచారో, దాని యొద్దకు తిరిగి రండి, ఎందుకనగా ఒక గొలుసు తన యొక్క బలహీనమైన అతుకులోనే (లింకులోనే) అది బలమైనదిగా ఉండును. మరియు మీ జీవితములో ఎక్కడైనా, ఒక ఆచారమును పాటించుటకు, నీవు దేవుని యొక్క ఆజ్ఞను ఏమైనా విడిచిపెడితే, అక్కడే నీవు ఇతర సంగతులలో ఎంత బలముగా ఉన్నప్పటికి నీ గొలుసు తెగిపోవును. మార్పులేని దేవుని హాస్తమును పట్టుకో.

ISA 40:3•

HEB 10:16

 

60మనము ప్రార్ధించుకొందాము. ఈ రోజు చాలాకాలం తరువాత ప్రభువా మాతో మాట్లాడెదవని, నీ ఆజ్ఞలను మా హృదయపు పలకలపై వ్రాసెదవని నీవు చెప్పియున్నావు. నా ముందు ఏమి నిలబడియున్నదో నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిపిన ఒకే ఒక సంగతి ఏదనగా, నీ వాక్యమును తీసుకొని, దానిని బయటకు విస్తరించినట్లయితే, ఖచ్చితముగా అది ఎక్కడో ఏ బండ సందులలోనో స్థిరపరచబడును. దేవా, నీవు ప్రతీ యవ్వనస్తుడితోనూ, ప్రతీ ఒక్క మధ్యవయస్కునితోనూ, వృద్ధుడితోను, అది ఏమైనప్పటికి - నీవు మాట్లాడెదవని ప్రార్థించుచున్నాను. ప్రభువా, నా హృదయముతో మాట్లాడుము. ఈ సేవకుల హృదయములతో మాట్లాడుము. ఈ సమూహములో ఉన్నవారి హృదయములతో మాట్లాడుము.

తండ్రి, ఈ రోజు మేము నీ స్వరమును వింటామని మేము ప్రార్థించుచున్నాము. మరియు మాకు తెలుసు, సమూయేలు యొక్క దినములలోవలె ఒక బహిరంగ దర్శనమనేది చాలా అరుదైన సంగతి, మరియు అది జనులను భయపెట్టినది. ఈ రోజు కూడ అది అలానే ఉన్నది. మాకు కలలు ఉన్నవి మరియు అలాగే కలలు కనువారును వున్నారు, మాకు ప్రసంగీకులు యున్నారు మరియు అలాగే అనువాదకులును వున్నారు. కాని ప్రభువు వాక్యము ఒక బహిరంగ దర్శనముతో బయలువెళ్ళి మరియు సరిచేసినది. పరలోకపు తండ్రి, ఆ అరణ్యములో, "ప్రభువు కొరకు మార్గమును సిద్దపరుచుము," అని మొర పెట్టిన అదే స్వరము నేడు మరొకసారి ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు చేయుము. అది పరిశుద్ధాత్మ ద్వారా మరొకసారి ఈ దినము మాకివ్వబడినదని మేము నమ్ముచున్నాము, ఎందుకనగా ఆ నిజ స్వరము వినబడకుండా ఉండుటకు అనేక స్వరములు అటంకపరచుచున్నవి, కాని ఎవరైతే వినుచున్నారో వారి చెవులలో అది కృపాసహితముగా వినబడుచున్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మా అందరి హృదయములలో ఆ కార్యమును చేయమని నేను ప్రార్ధిస్తున్నాను.

61మనము తలలు వంచియుండగా, వాటితో పాటు మన హృదయములు కూడా వంచబడియున్నవి అని నేను నమ్ముచున్నాను. నీ జీవితములో ఎక్కడో నీవు లోబడియుండలేదని నీవు ఎరిగియున్నావు, కొన్ని లేఖనములను తెలుసుకొని, ఆ బైబిలు బోధకు నీవు సహకరించలేదని నీకు తెలిసికొన్నావు, ఎందుకనగా ఫలానా హాలీవుడ్ స్వరము నిన్ను ఒక వ్యత్యాసమైనవానిగా చేసినది. బైబిలులో ఎక్కడో ఒక స్థలములో సేవకులైన మీరు ఏదో స్థానములో, నిజానికి అది సత్యము అని మీరు కనుగొన్నారు, కాని మీకు తెలుసు, దానిని భోదిస్తే మీ సంఘశాఖ మిమ్ములను బయటకు గెంటివేయునని మీకు తెలుసు. అది పరిపూర్ణముగా సత్యమని మీకు తెలుసు. జనులైన మీరు తప్పు సంగతిని తీసుకొంటే, తప్పు జీవితమునే జీవిస్తారు. పిల్లలను సరిచేయుటకు ప్రయత్నించని తల్లిదండ్రులారా, మీ పిల్లలను మీ పిల్లలను సరిగా పెంచుటకు ప్రయత్నించలేదు, ఒకవేళ నీ శాయశక్తుల ప్రయత్నించి ఉండవచ్చు. ఆయిన్నప్పటికి వారు ఏదో రకంగా లోకానుసారముగానే వెళ్ళిపోవుచున్నారు, వారి ముందు మీ మాదిరులను ఉంచవలసియున్నది. మరియు మీరు గనుక దానిని చేయకున్నట్లయితే, మీతో దేవుని స్వరము మాట్లాడుచున్నది, "దానిని చేయవద్దు."

MATT 5:6•

JOHN 10:4,27

 

62మరియు ఇప్పుడు ప్రతి తల వంచబడి మరియు అన్ని కళ్ళు మూయబడినప్పుడు, ఎక్కడైతే తాము తప్పు చేశామని కనుగొనుటకు ఎవరైతే ప్రయత్నించుచున్నారో అటువంటి ఆకలి గల హృదయము కలిగిన వ్యక్తి వైపు పరలోకపు దేవుడు క్రిందకు చూచును గాక. మరియు ఒక చేయి దేవుని వైపు ఎత్తి, "ప్రభువా, నీ స్వరము సమస్త అవిశ్వాసమును నాలో నుండి తీసివేయవల్సిందిగా నిజముగా నేను ఆశపడుచున్నాను, మరియు నీవు నన్ను ఏ విధముగా ఉండాలని కోరియున్నావో ఆ విధముగా నన్ను చేయుము," అని చెప్పుచూ మీ చేతులను పైకెత్తగలరా. మీరు… ప్రభువు దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.

అప్పుడు బైబిలు చెప్పెను, యేసు చెప్పెను, ఇటువంటి స్వరములు ఎన్ని ఉన్నప్పటికిని, "ఇంకనూ ఒకవేళ ఒకడు నా స్వరము వినినయెడల." ఆయనను వెంబడించుము, మీరు మీ కోరికను పొందుకొనబోవుతున్నారు.

ACTS 2:41•

ACTS 18:8

 

63ప్రభువా, కాలము ముగిసిపోబోపుచున్నది. కాని బైబిలు ఇలా చెప్పుచున్నది, "ఎందరైతే నమ్మియున్నారో, వారు బాప్తీస్మము పొందియున్నారు." నేను ప్రార్ధించుచున్నాను, పరలోకపు తండ్రీ, నిజమైన ఒప్పుకోలుతో తమ చేతులను పైకెత్తిన ఒక్కొక్కరిని, వారు చదివియున్న దేవుని వాక్యమును బట్టి, తాము తప్పులో ఉన్నామని చూచుకొన్నవారిని చూడమని నేను ప్రార్ధించుచున్నాను వారిలో సగము మందిని నేను ఎన్నడూ చూడలేదు. అది నేను చూచుటకు కాదు, అది నీవు చూచుటకు, ప్రభువా, పైకెత్తబడిన చేతుల వెనుక ఉన్న ఉద్దేశ్యమును మరియు లక్ష్యమును నీవు ఎరిగియన్నావు. వారిని ఈ గడియనుండే వారి యొక్క హృదయములలో ఉద్దేశ్యముతో, "ఈ రోజు నుండి, ఇప్పటి నుండి నేను దేవుని యొక్క స్వరమును తీసికొని, మరియు ఎంత వేల అయినప్పటికిని దానిని వెంబడించుదను" అని వారు హృదయములలో నిశ్చయించుకొని, మరియు వారు వెళ్ళుచున్నప్పుడు ఒక కవి పాట, "యేసు ఒక్కడే సిలువను ఒంటరిగా మోయనా, మరియు లోకమంతా విడిపించబడునా? అని వారి మనస్సులలో పెట్టుకోవాలని ప్రార్ధించుచున్నాను. లేదు, ప్రతి ఒక్కరి కొరకు ఒక సిలువ ఉన్నది; నా కొరకు ఒక సిలువ ఉన్నది. మరియు ఈ పరిశుద్ధపరచబడిన సిలువను నేను మోయుదును, మరణము వరకూ అది నన్ను విడిపించును." అప్పుడు దేవుని యొక్క స్వరము పలికినప్పుడు, నేను ఆయన యొక్క నీతిలోనికి వచ్చెదను, ఏలయనగా నేను ఆయన స్వరమును వెంబడించితిని, ఆయన వాక్య స్వరము." ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వారిని నీకు సమర్పిస్తున్నాను.

EXOD 15:26•

PS 103:3•

MARK 11:23

 

64ఇప్పుడు మనము మన యొక్క తలలు వంచి యుండగా, మీరు మీ యొక్క ఒప్పుకోలు మరియు ప్రతిజ్ఞను చేయుచుండగా… ఇక్కడ కూర్చోని తలను చుట్టూ త్రిప్పుచున్న ఒక చిన్న బాలుని చూచి నేను ఆశ్చర్యపోయాను. మరియు సంఘమును ఒక స్వరమున్నది, "మీ రోగములన్నిటిని స్వస్థపరచు యెహోవాను నేనే." సంఘములో అది ఒక స్వరము. మరియు ఎవరికైతే స్వస్థత అవసరమున్నదో, మరియు ఏది సరైనదో అని మీకు తెలిసినంత వరకు ప్రతి దేవుని వాక్యమును బట్టి ఒక పరిశుద్దమైన జీవితమును జీవించుచున్న మీకు, మరియు మీకు స్వస్థతా అవసరమున్నట్లయితే, కేవలము మీ చేతులు పైకెత్తవలెనని నేను ఆశిస్తున్నాను. "ప్రభువా, నాకు స్వస్థత అవసరమున్నది," అని చేతులు పైకెత్తండి. అది సరియే.

ఇప్పుడు, "మీ రోగములన్నిటిని స్వస్థపరచు యెహోవాను నేనే," అనే స్వరమును మీ హృదయములలో ఉంచుకొనండి. గుర్తుంచుకొనండి, వాక్యము పలుకబడినప్పుడు, అది నెరవేరవలసియున్నది. యేసు చెప్పిను, మార్కు 11:22, "నీవు కొండతో కదులుము అని చెప్పి, నీ హృదయములో సందేహించనియెడల, నీవు ఏదైతే పలికియున్నావో అది నెరవేర్చబడునని నీవు నమ్మినప్పుడు, నీవు ఏదైతే పలికియున్నావో దానిని నీవు పొందుకొనవచ్చును."

HEB 13:8

 

65ఇప్పుడు, ప్రతి ఒక్కరు మీ యొక్క సొంత మార్గములలో మీ తలలు వంచి, మీ ఒప్పుకోలు చేయండి, "ప్రభువా, నీ మాటను నేను నమ్ముచున్నాను. నీవు నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒకేరీతిగా ఉన్నావని చెప్పు నీ స్వరమును నేను వినగలుగుచున్నాను." నేను క్రిందకి నడిచి వెళ్ళి మరియు ఈ బిడ్డపై చేతులుంచబోవుచున్నాను, ఎందుకనగా ఇదంతా ఏమిటని తెలుసుకోలేనంత మరీ చిన్న పిల్లవాడతడు, ప్రశస్తమైన చిన్న బాలుడు, నా యొక్క చిన్న యోసేపు అంత వయస్సు మరియు పొడుగు మరియు మీరందరూ ప్రార్ధిస్తూ వుండాలని, కోరుచున్నాను, "ప్రభువా, నేను నీ స్వరమును వినుచున్నాను. నేను నమ్ముచున్నాను," అని ప్రార్థించాలని కోరుచున్నాను.

66పరలోకపు తండ్రి, వారి యొక్క శరీరములు స్వస్థత పొందులాగున ఈ ప్రజలందరిని నీ యొద్దకు తీసికొని వచ్చుచున్నాను. మరియు ప్రభువా, ఇక్కడ ఒక దీన చిన్న బిడ్డ కూర్చొని యున్నాడు, వర్తమానమంతటిలోనూ అతడు నా ఏకాగ్రతను ఆకర్షిస్తున్నాడు, అక్కడ ఒక తల్లి కూర్చొని ఆ చిన్న పిల్లవానిని పట్టుకొని యుండటం చూస్తున్నాను. వైద్య శాస్త్రమును చూడండి, ఆ చిన్న బిడ్డకు ఎటువంటి నిరీక్షణా లేదు. ప్రతిదానిపై స్వారీ చేయుచున్న ఒక దేవుని స్వరము కలదు. మరియు నాకు తెలిసిన ప్రతి ఆజ్ఞ ఏ విధముగా చేయవలెనో దానిని చేయుటకు ఈ సంఘమంతా జత చేయబడినది, తండ్రి మిగిలినదంతా నీకు సంబంధించినదే. నేను క్రిందకి నడుస్తూ మరియు ఆ బిడ్డపై చేతులుంచుచున్నాను.

దేవా తండ్రీ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను దీనిని గద్దిస్తున్నాను. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వస్థత… తరువాత అయిదు నిమిషములలో అక్కడొక గొప్ప మార్పు ఉ౦డును గాక. నీ మహిమ కొరకు వారందరూ దేవుని యొద్దకు వచ్చెదరు గాక.

పరలోకపు తండ్రీ, నీవు వాగ్దానము చేసియున్నావు. నాకు తెలిసినదంతా అదే, నీవే వాగ్దానము చేసియున్నావు. అది చెప్పబడినట్లుగా అది చేయబడినది, "ఒకవేళ నీవు దీనిని చెప్పినయెడల," మరియు ప్రజలందరిని పట్టియున్న రోగము లేక ఇబ్బందులు పెట్టు దెయ్యములో నేను చెప్పుచున్నాను, ఈ జనులను పట్టి పీడిస్తున్న ప్రతి అవిశ్వాసపు ఆత్మతో నేను చెప్పుచున్నాను, "యేసు క్రీస్తు నామములో, ఈ జనులలో నుండి బయటకు పో!" ఇప్పుడు, అది వ్రాయబడినదని మనకు తెలుసు, మరియు ఇప్పుడు అది చెప్పబడినది, దేవుని యొక్క మహిమ కొరకు అది నెరవేరును గాక, మరియు యేసుక్రీస్తు నామములో దానిని అడిగియున్నాము.

JAS 5:15

 

67ఇప్పుడు, నమ్మగలిగిన మీరు, మరియు నమ్మండి, ఏమి జరిగినా పరవాలేదు, విత్తనము అక్కడ వేయబడినది. నీలోనున్న ఆ చిన్నదేదో, ఆ స్వరము. ఈ బిడ్డ యొక్క తల్లి, ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్న పరవాలేదు, నీ హృదయములో దేవుని విత్తనము పడియున్నదని నీవు నమ్ముము, ఆ బాలుడు బాగవును? మిగతా వారందరూ ప్రార్ధించండి, ఒకరి కొరకు ఒకరు, మీ హృదయములలో దేవుని విత్తనము పడియున్నదని నీవు నమ్ముచున్నావా. "నా రోగము ముగించబడినది?" అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్ధన నీ కొరకు ప్రార్ధించబడినది. మరియు ఒకవేళ సాతాను ఎన్నడైనా ప్రయత్నించిన, నీవు తిన్నగా వెనుకకు తిరిగి రా, "ఆ ఆదివారము ఉదయము, ఆ స్పానిష్ సంఘములో నిలబడినప్పుడు, నా కొరకు విశ్వాస సహితమైన ప్రార్ధన చేయబడినది. మరియు దేవుడు వాగ్దానము చేసెను!" విశ్వాససహతమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును మరియు దేవుడు వారిని లేపును. అది నెరవేరవలసి యున్నది. మీరు దానిని నమ్ముచున్నారా, "ఆమేన్" చెప్పండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఇప్పుడు ఈ కూడికను తిరిగి సహోదరుడు రోజ్ కి అప్పగిస్తున్నాను, నేను ఇక్కడ ఉన్న సహోదరుడు జ్యూయల్ రోజ్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...