ద్వారములో ద్వారము
1సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆత్మలు రక్షించబడ్డాయి అన్న వార్తలు వినుట అనేది నాకు ఇష్టము. అదే ముఖ్యమైన విషయమైయున్నది. ఇక్కడ దేశములోని అనేక ప్రాంతములలో నుండి వచ్చిన చాలామంది మన స్నేహితులను చూచుట ఎంతో సంతోషకరమైయున్నది. మరియు ఈ సహోదరుడు ఇప్పుడు ఈ నగరమునకు వస్తున్నాడు. నాకు అర్థమగుచున్నది అతని యొక్క సామాను గొప్ప ఉజ్జీవము కొరకు ఇక్కడ దించబడుతున్నది. మరియు సహోదరుడి కొరకు, అతను మీలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రావాలని, మరియు ఈ నగరములో ఉన్న అనేక ఆత్మల కొరకు, నేను ఖచ్చితముగా ప్రార్ధన చేస్తాను.
మరియు ఈ ఉదయకాలమున అనేక సేవక స్నేహితులను చూసినందులకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. సహోదరుడు అవుట్లా అక్కడ ఉన్నారు, (నేను లేచినప్పుడు నేను అతనిని గమనించాను), ఫీనిక్స్ నుండి. సహోదరుడు అవుట్లా, మరియు దిగువున మిమ్ములను ఇక్కడ చూచుట నాకు సంతోషముగా ఉన్నది, నీవు యెరికో నుండి వచ్చి యెరుషలేము నుండి మమ్ములను చూచుటకు వచ్చియున్నావు, వారు ఈ ఉదయము ఇక్కడ ఉండుట మాకు అన్ని సమయాలలో సంతోషకరమైయున్నది.
2మరియు ఇంకా…
మరియు కొద్ది కాలము క్రితం సహోదరుడు విలియం యొక్క ఒకదానిని నేను పొందుకున్నాను, ఫీనీక్స్కు పైన, "మీకు తెలుసా," నేను అన్నాను, "టూసన్, ఇప్పుడు నేనిక్కడ జీవిస్తున్నాను, మీకు తెలుసా, కాబట్టి నాకు ఈ ప్రదేశము గురించి ఒక విధమైన అవగాహన ఉన్నది, మీరు చూశారా, అక్కడ ఆ పర్వతము మీద, క్రిందకు యెరికోని చూడండి మరియు మన సహోదరుడని చూడండి. ఎందుకు, మనకు అన్ని సమయాలలో…"
మరియు అనేక మంది ఫీనీక్స్ కు 100ల మైళ్ళ దూరము నుండి వచ్చుచున్నారని సహోదరుడు కార్ల్ చెపుతున్నాడు. జఫర్సన్విల్, ఇండియానా నుండి ఎంతమంది ఇక్కడకు వచ్చియున్నారు? నిలబడండి, మొత్తంలో, అక్కడ ఉన్నారు. అది ఇక్కడ నుండి 2100 మైళ్ళ దూరం. ఓ, కార్ల్!
3ఇక్కడ ఉన్నందుకు సంతోషం మరియు ఈ అద్భుతమైన లోపలి కుమారుని యొక్క వెలుగునకు ఆనందించుడి. చూశారా, ఇది మన యొక్క నగరపు సూర్యుని గురించిన మాటలు. అది బయట దానికి సంబంధించినది; కానీ, ఈ లోపలి కుమారుడు! మై! అందుకనే నేను ఆనందిస్తున్నాను.
నేను ఈ వారమంతా ఈ విధమైన దీవెనలతో ఆనందిస్తున్నాను, మరియు మొదటి అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వద్ద సహోదరుడు బేతనీ యొక్క ఉజ్జీవానికి హజరయ్యాను. ఆయన గొప్పగా ప్రకటించుటను మరియు శిలువ యొక్క ధైర్యవంతమైన ఆ సహోదరుడిని తప్పక అభినందిస్తాను. ఇటువంటివి ఈ వారములో నాకు చాలా అధికముగా ఉన్నవి. నేనన్నాను, "బ్రదర్ బేతనీలో మరియు నాలో అనేకమైన సంగతులు ఒకే రకముగా ఉన్నాయి, ప్రత్యేకముగా మా తలకట్టు యొక్క భాగము, బ్రదర్ బేతనీ." కాబట్టి… మేమెక్కడ ఉన్ననూ, మేము ఒకరిని ఒకరు గుర్తించుట మాకు చాలా ఆనందకరముగా ఉన్నది.
బ్రదర్ టోనీతో కలిసి ఉండే అవకాశము కల్పించినందుకు మేము చాలా గొప్ప అనుభూతిని చెందుతున్నాము. నేను ఆ పేరుని చెప్పలేను, మరియు నేను అతనిని కేవలం "బ్రదర్ టోనీ" అని పిలుస్తాను. మీరు నన్ను క్షమించండి. వాళ్ళు పేతురు అని పిలుస్తారు, "పేతురు," మరియు పౌలు, "పౌలు," మరియు టోనీ ఇది కూడా అలాగే. నేను వారికి ఎల్లప్పుడూ చెపుతుంటాను నన్ను కేవలం "బ్రదర్ బిల్" అని పిలవమని, అది ఏమిటంటే ఒక సహోదరుడుగా మీతో కలసి ఉండుటకు, నేను బ్రదర్ బిల్ అను పేరుని ఇష్టపడతాను, లేక బ్రదర్ అని ఎలాగు పిలిచినా.
4ఉదయకాలపు అల్పాహారమునందు అందరూ సంతోషించారా, ఒకే ఒక్క సంగతి, అక్కడ కావలసినంత మోలాసిస్ (ముడి చెక్కెర నుండి తీసిన చిక్కని ద్రవం, అది లేత మరియు ముదురు గోధుమ రంగులో ఉంటుంది) లేదు. నేను అక్కడ నుండి వచ్చేశాను. మరియు నేను నా కుమారుడి దగ్గర నుండి దానిని అడిగి తీసుకున్నాను, అక్కడ నుండి బయటకు వెళ్ళి అతని తమ్ముడి దగ్గర నుండి అడిగి తీసుకున్నాడు. అతను తనకు ఉన్న పళ్ళెము కాక వేరొక పళ్ళెముతో దానిని కలిగియున్నాడు, మరియు అయిననూ నాకు సరిపోయినంత మొలాసిస్ నా దగ్గర లేదు. మీకు తెలుసా, నేను బాప్టిస్తుని. నేను చిలకరింపుని నమ్మను. నేను వారికి నిజమైన బాస్టీస్మము ఇచ్చుటను ఇష్టపడతాను, మరియు చాలా ఎక్కువ మొత్తములో మొలాసిస్ కలిగియుండుట. నేను ఈ చెక్కెర గిన్నెను తీసుకున్నాను, మరియు దానిలో మరింత ఎక్కువగా లేదు. దానిలో నేను దానిలో కొద్దిగా చెక్కెరను పైన వేసుకున్నాను, మీకు తెలుసా.
5దిగువ దక్షిణమున జ్ఞాపకముంచుకొనండి, దిగువలో, అది అలబామా అని నేను నమ్ముతున్నాను, నేను మిషనరీ బాప్టిస్టు ప్రజలతో ఉన్నాను. నేను ఆ దిగువ ప్రాంతములో ఉజ్జీవాన్ని పట్టుకొనియున్నాను. మరియు నేను ఒక పాత వాకిలియందు బయట నిలబడి చూడబోవుచున్నాను. మరియు అక్కడొక నల్లని సహోదరియున్నది. ఆమె అన్నది. మీకు తెలుసా, ఆ రాత్రి నేను కష్టముగా ప్రసంగించాను, మరియు మర్నాటి ఉదయమున నేను త్వరగా లేవలేకపోయాను. మరియు ఆమె నన్ను "ఓ, సేవకుడా" అని పిలుచుట విన్నాను. ఆమె అన్నది, "ప్రియమైనవాడా, రమ్ము! నేను ఇప్పటికే 4 సార్లు ఫ్లాప్ జాక్స్ వండియున్నాను." ఆమె ఇప్పటికే ఆ ఫ్లాప్ జాక్స్ (పాన్ కాక్) 4 సార్లు వండియున్నది. నేను వాటిని ఇష్టపడతాను.
ఇప్పుడు నాకు ఒక చిన్న కథ తెలుసు. మనమందరము కేవలం సహవాసము కొరకు వచ్చియున్నామని, మీకు తెలుసు.
6వృద్ధ సహోదరుడైన బోస్వర్త్… మీలో ఎంతమందికి డాక్టర్ బోస్వర్త్ తెలుసు? అతనొక నాకు ఒక గొప్ప చిరకాల స్నేహితుడు. అతడు నాతో ఒకసారి ఇలా అన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, సహవాసమంటే ఏమిటో నీకు తెలుసా?"
మరియు నేనన్నాను, "డాక్టర్, నాకు తెలుసనుకుంటున్నాను."
అతడన్నాడు, "ఇద్దరు వ్యక్తులు ఒక నావలో యుండుటయే." మరియు దాని దగ్గరే అంతా యున్నది, మరియు అది ఆ విధముగానే యున్నది. అదే సహవాసమునకు దగ్గరగా యున్నది - దగ్గరగా; అది మూసివేయబడలేదు కానీ, మరొకరితో దగ్గరి సహవాసము కలిగియుండుటయైయున్నది.
7ఒక దినము జ్ఞాపకమున్నది (ఫ్లాప్ జాక్స్ గురించి ఆలోచిస్తూ - బ్రదర్ బేతనీ మేము దక్షిణమున వాటిని ఫ్లాప్ జాక్స్ అని పిలుస్తాము), కానీ మేము… నేను న్యూ హాంప్-శైర్లోని తూర్పు వైపునకు ఒక చిన్న చేపల వేటకు వెళ్ళు యాత్రలోయున్నాను. అక్కడ తోక నలుచదరముగా ఉండే చేపలు దొరుకుతాయి. ఆ స్థలము వాటికి గృహమైయున్నది. మరియు నేను, నా వీపు భాగమున ఒక గుడారమును కలిగియున్నాను. నేను, నా ఒకటిన్నర రోజు ప్రయాణము కొరకై సిద్ధపడియిన్నాను, సున్నితముగా నడచువారందరు ఏదియు కలిగిలేరు. కాబట్టి, నేను వెళ్ళి ఆ ట్రౌట్ అను చేపలను పట్టుకొనుట ప్రారంభించాను. ఓ, ఎటువంటి సమయమును నేను కలిగియున్నాను. ఒక చిన్న గుడారము. ఒక దినమునకు ముందు, ఒక చిన్న గుంట నిండుగా నీరు ఉన్నది. ఓ, అక్కడ ఒక పెద్ద ట్రౌట్ చేప పైన తేలియాడుతున్నది, మరియు నేను దానిని వీలైనంత త్వరగా పట్టుకుంటున్నాను. మరియు నేను ఒక దాన్ని పట్టుకున్నాను. నేను దానిని చంపినట్లయితే, తరువాత నేను దాన్ని తీసుకొని తినవలసియున్నది; కానీ సాధారణముగా, అది ఎక్కువగా గాయపడనట్లయితే, అప్పుడు నేను దానిని విడిచిపెట్టేస్తాను.
మరియు నేను ఎల్లప్పుడు నా వెనుక ఉన్నచిన్న గుంపుగా ఉన్న మూస్ విల్లో పైన ఉన్న దానిని పట్టుకుంటాను. మరియు, "మర్నాటి ఉదయమునే నేను నా యొక్క గొడ్డలిని తీసుకొని మరియు దిగువకు వెళ్ళి ఆ మూస్ విల్లో కత్తిరించాలి" అని నేను అనుకుంటున్నాను, ఎందుచేనంటే, నేను ఆ మూస్ విల్లోతో ఒక చిన్న తెప్పను పట్టుకోవాలి. అందుచేత నేను త్వరగా లేచి, మరియు "మంచిది, నేను ఒకటి లేక తలంచాను. మరియు నా అంతటగా నేను అనుకున్నాను. మరియు నేను నా చిన్న పాతదైన గొడ్డలిని తీసుకున్నాను మరియు దిగువకు వెళ్ళి ఆ చిన్న మూస్ విల్లోని కత్తిరించి, కొన్ని చేపలను పట్టుకొని తిరిగి వీధిలోకి వచ్చాను.
8మరియు నేను ఒక స్వరము విన్నాను - మరియు అది ఒక ముసలి ఎలుగుబంటి స్వరమైయున్నది. ఆ పైన ప్రాంతమంతా వాటితో నిండియుంటాయి. అది ఒక నల్లని ఎలుగుబంటి, దానికి రెండు పిల్లలు ఉన్నాయి. మరియు అది నా గుడారములోనికి వెళ్ళింది, మరియు అది నా గుడారమును చీల్చివేసినది. దానిలో మరేదియు మిగిలిలేదు. అది కేవలం… అది దాని యొక్క ఆహారము కాదు గాని, అది గుడారమును పూర్తిగా పాడుచేసినది. అవి ఏదైనా శబ్దం వినియున్నట్లైతే వెంటనే దాని మీదకు అవి దూకుతాయని మీకు తెలుసా, మరియు అవి నా పాత గ్యాస్ పొయ్యికి ఉన్న రబ్బరు పైపును పీకేశాయి, మరియు మంచిది, ఇంక వెనుకకు తిరిగి వెళ్ళుట తప్ప ఇంకేదియు మిగిలలేదు.
మరియు ఆ ముసలి తల్లి ఎలుగుబంటి నేను పైకి రావటం చూసి, అది పరిగెత్తుకుంటూ వెళ్ళి, తన పిల్లలను పిలుస్తుంది, మరియు రెండు పిల్లలలో ఒకటి తల్లి దగ్గరకు వచ్చింది. రెండోది మాత్రము రాలేదు. మంచిది, రెండవది ఎందుకని రాలేదని నేను ఆశ్చర్యపోయాను. మంచిది, నేను ఒక పాత తుప్పుపట్టిన తుపాకిని ఆ గుడారమందు కలిగియున్నాను, కానీ ఆ ఎలుగుబంటి నా తుపాకి మీద కూర్చునియున్నది. కాబట్టి, నేను ఆ ముసలి ఎలుగుబంటును కాల్చాలని అనుకోవటంలేదు, అలా చేసి నేను ఆ రెండు పిల్లలను అనాధలుగా ఆ చెట్ల మధ్యలో వదిలేయాలని అనుకోవటంలేదు. కావున నేను నిశ్చయంగా… మీరు ఎప్పుడైనా తల్లి ఎలుగుబంటు తన పిల్లలతో ఉన్నప్పుడు సాధారణంగా అది మిమ్ములను గీరటానికి ప్రయత్నం చేస్తుంది, మీకు తెలుసా, అది దాని పిల్లలను మీరు ఏదైనా చేస్తారేమోనని ఆలోచనతో అది ఆ విధముగా చేస్తుంది.
9ఈ చిన్న ఎలుగుబంటి కూర్చునియున్నది, మరియు ఒక చిన్న యవ్వన ఎలుగుబంటి, చూడటానికి సుమారుగా 20 పౌన్ల బరువుండవచ్చును, 15 లేక 20 పౌన్లు, ఉదయమునే — అవి నిద్రాణస్థితి నుండి అప్పుడే బయటకు వచ్చినట్లుగా ఉంది, మరియు ఆ చిన్న ఎలుగుబంటి వెనుకటి భాగము నా వైపునకు తిరిగియున్నది. అది ముందుకు వంగియున్నది. "మంచిది," "ఆ చిన్న ఎలుగుబంటిని ఆకర్షించిన అంశం ఏమైయున్నదో?" అని నేను తలంచాను, మరియు ఆ ముసలి ఎలుగుబంటి మరియు మరొక చిన్న ఎలుగుబంటి పిల్ల బయట నిలబడియున్నాయి, మరియు అవి లోపల ఉన్న పిల్ల ఎలుగుబంటిని పిలుస్తున్నాయి, కానీ లోపల ఉన్న ఎలుగుబంటి పిల్ల ఇవి చేయుచున్న శబ్దమందు ఏ మాత్రము ఆసక్తిని కనుబరచటలేదు.
"లోపల ఉన్న ఆ చిన్నదాని సంగతేమిటా?" అని నేను తలుస్తున్నాను, మరియు ఎలుగుబంటి ఒకవేళ నా వెంటబడినట్లయితే ఎక్కుటకు వీలుగా నేను ఉన్న ప్రాంతములో చెట్ల వరుస క్రమమున్నది, దగ్గరలో ఉన్న చెట్టును నేను ఎక్కగలిగినట్లయితే, "లోపల ఉన్న ఆ ఎలుగుబంటి పిల్ల ఏమి చేస్తున్నదో గమనించవచ్చును" అనుకున్నాను. సాధారణంగా అవి పరుగెత్తుతాయి. కాబట్టి, నేను దాన్ని గమనిస్తూ, నిదానముగా కదులుతున్నాను, నేను దాని దృష్టినుండి తప్పించుకునేంతవరకు కదిలాను. మరియు అక్కడ ఏమి జరుగుతున్నదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
10లోపల ఉన్న చిన్న ఎలుగుబంటి, నా బక్కెటు నిండుగా ఉన్న బెల్లం పాకం (లేక చెరకునుండి తీయబడిన తియ్యటి పాకం) తీసుకున్నది, మరియు బక్కెటు నిండుగా ఉన్న పాకం మొత్తం తీసుకున్నది. మరియు అది దాన్ని నాకుతున్నది. అవి తీపిని ఎక్కువగా ఇష్టపడతాయని మీకు తెలుసా, మరియు దానిని ఎలా త్రాగాలో ఆ చిన్న ఎలుగుబంటికి తెలియటంలేదు. కాబట్టి, అది తన చిన్న చేతిని ఆ బక్కెటులో ముంచి తీసి ఆ చేతిని నాకడం చేస్తున్నది, ఇలాగా, మీకు తెలుసా, అది పైకి దాన్ని బయటకు తీసుకొనివచ్చింది. మరియు అది దాన్ని చూసి నేను గట్టిగా అరిచాను. నేను ఇలా అన్నాను, "అక్కడ నుండి బయటకి పో!" అది వెనుకకు తిరిగింది. అది దాని కన్నులు తెరవలేకపోతుంది, ఎందుకనగా దాని కన్నులు బెల్లం పాకంతో నిండిపోయున్నాయని మీకు తెలుసా, నా వైపు చూస్తున్నది. మరియు అది నా బక్కెటును దానికి వీలైనంత శుభ్రంగా నాకేసింది.
మరియు దాన్ని చూసి నేను నిలబడి నవ్వుతున్నాను. మీకు తెలుసా, నా దగ్గర కెమెరా ఉన్నట్లయితే నేను దాన్ని ఫోటో తీసేవాడిని, మరియు అది అక్కడ నిలబడియున్నది. మీకు తెలుసా, అది ఆ బక్కెటును పూర్తిగా నాకేసిన తరువాత, ఆ బక్కెటు పాడయిపోయింది, ఆ తరువాత అది తన తల్లి మరియు సహోదర ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది, మరియు ఆ రెండు ఎలుగుబంట్లు ఈ ఎలుగుబంటిని నాకుతున్నాయి.
11అప్పుడు నేను ఇలా అనుకున్నాను, "అది ఒక పాత పెంతెకోస్తు కూడికలాగా ఉన్నది — మనము ఎప్పుడైనా తేనె ఉన్న జాడీలో చెయ్యిని ముంచి తీసినప్పుడు మోచేతులకు తేనె అంటుకుంటుంది, మరియు బయటకు వచ్చి ఎవరినైనా ఆ తేనెను నాకమని చెప్పండి." మీకు తెలుసా, అది ఒక మంచి కుటమివలె ఉంటుంది. ఆ చిన్న ఎలుగుబంటి అటువంటి దానినే కలిగియున్నదని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు, మీకు తెలుసా, అది ఆ బెల్లం పాకమును నాకుతున్నంతసేపు దానిని ఎవరు అడ్డంగించరు. అదేవిధముగా మనము కూడా ఆ పాతకాలపు కూటముల అనుభూతిని కలిగియుందాము. అక్కడ స్వాతంత్ర్యము లేకపోవడం అనేదే లేదు, అక్కడ వేరే ఏదియూ లేదు, కాని అక్కడ కూర్చుని కేవలం నాకడం మాత్రేమే ఉన్నది. అదియే.
SONG 2:1
12పరిశుద్ధ గ్రంధములో ఏమున్నదో మీకు తెలుసా, కాపరి తనకు ఒక ప్రక్కన తిత్తిని (లేక సంచిని) కలిగియుండేవాడు. వారు చాలాసార్లు వారితో పాటుగా తేనెను కూడా తీసుకొని వెళతారు. మరియు ఏదైనా గొర్రె అనారోగ్యముగా ఉన్నట్లయితే, ఆ కాపరి దాని దగ్గరకు వెళ్ళి ఒక సున్నపు రాయి పెట్టి దాని మీద కొద్దిగ తేనెను పిండుతాడు. మరియు ఆ గొర్రె కూడా తియ్యదనమును ఇష్టపడుతుందని మీకు తెలుసా, కాబట్టి ఆ గొర్రె అక్కడకు వెళ్ళి మరియు ఆ రాయిని నాకుతుంది. ఆ గొర్రె తేనెను నాకుతుంది, కాని అది తేనెను నాకుతున్నప్పుడు దానికి తెలియకుండానే సున్నపురాయి కూడా కొంత లోపలికి వెళుతుంది, మరియు సున్నపురాయి ఆ గొర్రె స్వస్థపడటానికి సహాయము చేసుంది.
నా దగ్గర ఉన్న తిత్తి అంతయూ తేనెతో నిండుగా ఉంది, మరియు నేను యేసుక్రీస్తు అనే బండ మీద నేను దాన్ని ఉంచుతాను, మరియు గొర్రెలైన మీరు దాన్ని ఇప్పుడే నాకుట ప్రారంభించండి. అన్ని కాలములలో ఉన్న ఆ బండను నాకినట్లయితే నేను నిశ్చయంగా చెప్పగలను, అది మనకున్న అన్ని అనారోగ్యములను స్వస్థపరుస్తుంది, మరియు తరువాత ఆయనే మిగిలిన కార్యము యొక్క సంగతిని చూసుకుంటాడు. మన యొక్క శరీరసంబంధిచిన మరియు ఆత్మీయమైన రుగ్మతలకు ఆయనే స్వస్థపరచువాడుగా ఉన్నాడు. లోయలోని పద్మము ఆయనే. మరియు పద్మములో మనము ఓపియంను కనుగొనవచ్చును, మరియు ఓపియం అన్నిటిని సరిచేస్తుంది. అది నిన్ను సమ్మోహన పరుస్తుంది, మరియు ఆ విధముగానే పరిశుద్ధాత్మడు కూడా వస్తాడు. మరియు అది నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, నీ చుట్టూ కూర్చునియున్నవారి గురించి నీవు చింతించవు లేక దాని గురించి ఆలోచించవు; నీవు ఆ ప్రవాహమును అనుమతించవలసి యున్నది. అంతే.
… ఒకసారి ఒక చిన్న బాలిక పరిశుద్ధాత్మతో నింపబడింది, మరియు ఆ చిన్న బాలిక మెథడిస్టు, మరియు ఆ బాలిక సాక్ష్యమును ఇచ్చింది, మరియు ఆ బాలిక పలికిన ఆ మాటలను నేనెన్నడు మరచిపోను, నేను చెపుతున్నది అసభ్యముగా లేదని అనుకుంటున్నాను. మరియు ఆమె ఇలా అన్నది, "మంచిది, పరిశుద్ధాత్మ నిమిత్తమై నేను దేవుని స్తుతించాలని అనుకుంటున్నాను." మరియు ఆమె ఇలా అన్నది, "ఒకవేళ అదేమైనా మంచిగా ఉంటె, నేను కన్నీరు కార్చి ఉందును."
13ఈ సంపూర్ణ సువార్త వర్తకుల కలయికను మరియు కూడికలను నేను ఇష్టపడతాను. మరియు మీకు తెలుసా, నేను కొన్ని సంవత్సరముల క్రితం అభిషేకించబడ్డాను, సుమారుగా 85 సంవత్సరముల క్రితం బాప్టిస్టు మిషనరి సంఘమందు అభిషేకించబడ్డాను. అప్పటి నుండి సువార్త విషయమై నేను యధార్థవంతమైన సేవకునిగా ఉండుటకు ప్రయత్నము చేస్తున్నాను, సంవత్సరములుగా నాకు తెలిసినదే నిజమైనదిగా నమ్మియన్నాను. మరియు ఆ తరువాత ఆ గొప్ప దర్శనము వచ్చినది.
మరియు నేను పెంతెకోస్తుగా ఉన్నప్పుడు దానిని గురించి ఎన్నడును వినియుండలేదు. పట్టణ దిగువ భాగమునందు పరిశుద్ధ-గుండ్రాళ్ళ గుంపు ఉన్నదని వారు చెప్పుట నేను వినియున్నాను, వారు నేల మీద దొర్లుతారని మరియు అటవంటివన్నివారు చేస్తారని నేను వినియున్నాను. మంచిది, వారి మీద నేను ఎన్నడు ఎటువంటి ఆసక్తిని కనుపరచలేదు. కాని దేవుడు నన్ను పిలిచినప్పుడు, నేను వారి మధ్యకు వచ్చియున్నాను, మరియు నేను కేవలం కలిగియున్నాను. నా హృదయములో దేనికొరకో ఆశను కలిగియున్నట్లుగా అనిపించినది, అది చల్లగా ఉన్న చేతికి ఒక గ్లౌసు సరిగ్గా సరిపోయినట్లుగా ఉన్నది. నేను… అది నిజమైయున్నది, మరియు నేను దాన్ని నిజముగా ఆస్వాదించియున్నాను.
GEN 26:18
14నేను, సహోదరుల మధ్యలోకి వచ్చినప్పుడు, నేను బాప్టిస్టుల మధ్యలో ఉన్నట్లుగా కనుగొన్నాను, వారు ఎన్నో సంస్థలను విడగొట్టియున్నారు. మై, వారు చాలా విధములైనవారైయున్నారు. మరియు వారిలో కొందరు ఒక మూపురం కలిగిన ఒంటె మీద స్వారి చేసియున్నారు, మరియు కొందరు రెండు మూపురములు కలిగిన ఒంటె మీద స్వారి చేసియున్నారు, మరియు ఇంకొందరు మూడు మూపురములు కలిగిన ఒంటె మీద స్వారి చేసియున్నారు, మరియు కొందరైతే అసలు మూపురమే లేని ఒంటె మీద స్వారి చేసియున్నారు, వారందరు ఆ విధముగా ఉన్నారు, మరియు… కాని మీకు తెలుసా, "నేను ఏ గుంపునందు చేరకూడదు, ఎందుకనగా నేను అప్పటికే ఆ గుంపులచేత గుర్తించబడ్డాను" అని తలంచాను. కావున, నేను వారి మధ్యలో నిలువబడి, "మనము సహోదరులము" అని చెపుతాను.
యాకోబు, ఒక బావిని తవ్వించాడని నేను విశ్వసిస్తున్నాను, మరియు ఫిలిష్తియులు అతడిని అక్కడ నుండి తరిమివేశారు. ఇప్పుడు నాకున్న జ్ఞాపకశక్తంటిని బట్టి అతడు దాన్ని "విభేదము" అని పిలిచాడు లేక అటువంటిదేదో, తరువాత అతడు మరొకదాన్ని తవ్వించాడు, మరియు అక్కడ నుండి ఫిలిష్తియులు తరిమేశారని అతడు చెప్పియున్నాడు, కావున అతడు దాన్ని "కలహము" అని పిలిచాడు. మరొక దానిని తవ్వించాడు. "మనందరికి తగినంత స్థలమున్నది" అని చెప్పెను. మరియు దానినే నేను నమ్ముచున్నాను. మనందరకి తగినంత స్థలమున్నది.
ACTS 2:16
15మరియు ఇప్పుడు, నేను… ఈ సంపూర్ణ సువార్త కదలికలో నేను కూడ జతగాయైన ఏకైక కారణమేమంటే… నేను మీలో ఒకడిని, మరియు ఇదియే పరలోకమునకు అత్యంత చేరువగా ఉన్నది ఇదే అని నేను అనుకుంటున్నాను. మరింకేదైనా చేరువుగా ఉన్నట్లయితే, నేను దానిని కనుగొనటానికి ప్రయత్నం చేస్తాను. కాని, నేను కనుగొన్నది ఇదియే, మరియు నేను దీనిని ఇష్టపడుచున్నాను, మరియు దీనికన్నా ఉత్తమమైనది వచ్చు వరకు నేను దీనితో కొనసాగుతాను. మరియు నేను దీనికన్నా ఉత్తమమైనది వస్తుందని ఎదురుచూస్తున్నాను. పెంతెకోస్తు దినమున పేతురు చెప్పినట్లుగా, "అది వచ్చు వరకు నేను దీనిని కలిగి ఉంటాను." మరియు నేను దీన్ని గట్టిగా పట్టుకొనియుంటాను, కారణమేమంటే ఇది చాలా ఉత్తమమైనది కాబట్టి.
16అటు తరువాత, ఈ క్రైస్తవ వ్యాపారస్తులు, పుల్ గాస్పెల్ వ్యాపరస్తులను నేను కనుగొన్నాను, గొప్పవి, మేలైన సంఘముల యొక్క సంస్థలకు మధ్యన వారధిగా వీరు నిలబడి, మరియు సహవాసము అనే వంతెనగా నిలబడుటకు ప్రయత్నము చేస్తున్నారు, పోటీగా ఉన్నారు, కాని వారు, వారియొక్క ఏ సంస్థను చీల్చుటకు గాని, లేక అన్నింటిని కలిపి ఒకటిగా చేయుటకు వారు ప్రయత్నము చేయుటలేదు, కాని వారు సహవాసమును తీసుకొని వస్తున్నారు. ఆ కారణముచేతనే నేను వారితో చేరియన్నాను. మరియు ఈ పుల్ గాస్పెల్ వ్యాపారస్తుల అనే ఈ ఒక్క సంస్థకు మాత్రమే నేను చెందినవాడిని, ఎందుకనగా నేను ఎలాగైతే దేవునికి మరియు ఆయన సంఘమునకు ఒక గొప్ప సేవ చేయాలని ఆశిస్తానో వీరును అలాగునే యోచిస్తున్నారు, అది మేము విడిపోలేదనే అనుభూతి మా మధ్యలోకి తీసుకొనివస్తుంది. మనము సహోదరులము, మరియు మనమందరము ఒకే పరిశుద్ధాత్మను పొందుకున్నాము.
ఇప్పుడు, దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు, నీ తరువాత వ్యక్తి కూడా ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు.
17ఒక బ్రెన్హాం గుంపువలె, నాకు తొమ్మిది మంది సోదరులున్నారు, మరియు వారిలో కొంతమంది లావుగాను మరియు పొట్టిగాను ఉన్నారు, పొడవుగాను, మరియు సన్నగాను ఉన్నారు, కొంతమంది మిగిలినవారిలాగా ఉండరు, మరియు కావున నేను వారిలో మధ్యలో ఒకడిని, కావున… కాని మేము సహోదరులమే. మేము ఇంటి వెనుకకు వెళ్ళి ఒకరితో ఒకరము పోట్లడుకుంటాము. కాని, మేము ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఎవరో ఒక బ్రెన్హాం మీదకు దూకి, ఓ, ఓ, అది చాలా చెడ్డదిగా ఉంటుంది.
కాబట్టి, మనమందరము ఆ విధముగా ప్రవర్తించవలసియున్నదని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యములు మన కన్నులకు కనిపించవు. కాని ఇంకా, ఒకవేళ దేవుడే దాన్ని చేసినట్లయితే, దానికి మనము "ఆమేన్" అని చెపుదాం, ఎందుకనగా దాన్ని దేవుడే చేసియున్నాడు, గమనించారా. మరియు మనమందరము ఆ సమయములోనికి వచ్చియున్నాము.
GEN 3:3•
MAL 3:6
18గత ఆదివారము రాత్రి, సహోదరుడు బేతని యొక్క ఆరాధనలో నేను కూర్చునియున్నాను, మృగపు ముద్రను గూర్చి ప్రసంగిస్తున్నాను, మరియు ఒక వ్యక్తి ముఖ్యమైన భాగమును పట్టుకొని వచ్చాడు. అది నా ఆత్మకు ఎంతో ఉత్సుకతను ఇచ్చినది. వీధిలో ఏదో ఘనమైనది ఎదురుచూస్తున్నది అని అతడు చెప్పియున్నాడు, ఆజ్ఞాపించబడినది రాబోవుచున్నది, దేవుడు నిర్ణయించినది జరుగబోవుచున్నది. నేను కూడా దానిని నమ్ముచున్నాను, దీనిని ముగించి మరియు సంఘమును మహిమలోకి పంపుట, అది ఎంత మధురమైనది. ఇప్పుడు మనము బద్ధకస్తులవలె ఉండవద్దు, అదే మంచిదైయున్నది.
జ్ఞాపకము చేసుకొనండి, దేవుడు ఎన్నడు తన మార్గములను మార్చుకొనడు. ఆయన ఒకేలాగ ఉంటాడు, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు. ఆయనే వాక్యమైయున్నాడు, మరియు వాక్యము ఎన్నడును విఫలం చెందదు. ఆయన అనంతుడైయున్నాడు. కాబట్టి దేవుడు దేని నిమిత్తమైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, అది ఎల్లపుడూ ఒకే విధముగా ఉంటుంది. ఆయన వెనుకకు వెళ్ళి మరియు ఇలా "నేను తప్పు చేశాను" అనడు. గమనించారా, నేను అలాగు అనగలను. మీరును అలాగు అనగలరు. కాని, దేవుడు అనడు, ఎందుకనగా ఆయన అనంతుడైయున్నాడు. గమనించారా, ఆయన యొక్క మొదటి ఆలోచనే నిత్యత్వమైయున్నది.
దేవుడు ఎప్పుడైతే మానవునికి శ్రేష్టమైన రక్షణ ఇచ్చియున్నాడో, ఆయన దాన్ని కలిగియున్నాడు. అతడిని లోపటనే బంధించుటకును, ఆయనలో దగ్గరగా ఉండుటకును, ఏథేను తోటలో మానవునికి దేవుడు తన మాటను ఇచ్చియున్నాడు, ఆయన యొక్క వాక్యమును ఇచ్చియున్నాడు. మరియు హవ్వ అక్కడనే ఆది పాపము చేసియున్నది, చివరిది, ఆమె తన జీవితంలో అన్నింటికన్నా ఘనమైన పాపము చేసియున్నది, లేక చేయకూడనిది చేసియున్నది, దేవుని వాక్యమును సందేహించినది, మనము దేవుని వాక్యమును సందేహించవద్దు, మనం కేవలం వాక్యమును విశ్వసించుదాము. ఇప్పుడు, మనలను ఆయన యొక్క వాక్యమును విశ్వసించమని తప్ప దేవుడు మన దగ్గర నుండి మరేది ఆశించలేదు. అది సత్యమైయున్నది — ఆయన యొక్క వాక్యము. మనము తప్పక ఆ వాక్యమునకు వెనుకే ఉండవలసిందే.
DEUT 18:15•
MATT 16:21•
MATT 17:10-12•
MARK 9:11,12
19ఇప్పుడు, ఇక్కడ కొద్దిసేపు ఆగుదాము. మీకు తెలుసా, ఒక గొప్ప ప్రవక్త వచ్చుట ద్వారా ఇశ్రాయేలు మరలా కూడుకుంటారని పరిశుద్ధ గ్రంథము ముందుగానే చెప్పినదని, మరియు అతడు వచ్చినప్పుడు, మీకు తెలుసా, అతడు వారి మధ్యనుండి వెళ్ళుచున్నను వారికి అది తెలియకున్నది? మరియు ఒక దినము యేసు తన శిష్యులతో మాట్లాడుచూ, "మనుష్యకుమారుడు యెరుషలేమునకు వెళ్లవలసియున్నది…" ముందుగానే చెప్పెను.
"శాస్త్రులు ఎందుకని (లేక, లేఖనములను వ్రాసినవారు) ఎందుకని శాస్త్రులు, ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెట్టునని అన్నారు," అని శిష్యులు అడిగారు.
ఆయన ఇలా చెప్పెను, "నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఏలియానే మొదట రావలసియున్నది. కాని, నేను మీతో చెప్పుచున్నాను, ఏలియా వచ్చేయున్నాడు మరియు మీకు దాని గురించి తెలియదు," గమనించారా. ఆయన నేరుగా దానిగుండానే వెళ్ళియున్నాడు. వారికి అది తెలియకున్నది, అదే విధముగా మనుష్యకుమారుడి గురించి కూడా వారికి తెలియకున్నది. బాప్తిస్మము ఇచ్చు యోహాను గూర్చి ఆయన మాట్లాడియున్నాడని వారు గ్రహించారు. ఇప్పుడు చూడండి, అతడు ఎక్కడో నది దగ్గర బురదలో ఉండియున్నాడు, ఒక అడవి మనుష్యుడు నీళ్ళలోనికి ప్రజలను రమ్మని చెప్పుచున్నాడు, అది ఎంతో వింతైన వర్తమానమైయున్నది. కాని అతడు దేవునికన్నా ముందుగా వచ్చువాడైయున్నాడు. మరియు అది జరిగియున్నది, కాని వారు ఇప్పటికి దాన్ని ఎరుగకున్నారు.
యేసు వచ్చెను.
20యోహాను గూర్చి యూదులలో ఒకటిలో మూడవవ వంతు కూడా వినియుండరు అని నేను ఊహించగలను. యేసు భూమి మీదకు వచ్చినప్పుడు, నేను ఊహించగలను, యూదులలో అనేకమందియే కాదు గాని, భూమి మీద ఉన్న జనాభాలో వందలో ఒకటవవ వంతు కూడా ఆయన ఇక్కడ ఉన్నారని ఎరుగరు. ఆయన వచ్చెను మరియు వెళ్ళిపోయను.
సంఘము… మీ క్యాథలిక్ ప్రజలు, పరిశుద్ధ ప్యాట్రిక్ అని మీరు చెప్పుకొనుటకు ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఎవరికైనా పరిశుద్ధ ప్యాట్రిక్ తెలుసునా… అతడు ఒక క్యాథలిక్ అయ్యున్నాడు, రోమన్ క్యాథలిక్ అయ్యున్నాడు, నా వలె, కావున… కాని, జోనా ఆఫ్ ఆర్క్ ను చూడండి, దర్శనములను చూసే ఆ చిన్న పరిశుద్ధ బాలిక. ఆమెకు మీరేమి చేసియున్నారు? ఆమెను ఒక మంత్రగత్తె అని ఒక చెక్కకు కట్టేసి కాల్చివేసియున్నారు. ఆమె వెళ్ళిపోవుటకు ముందుగానే ఆమె ఒక పరిశుద్దురాలని మీరు తెలుసుకొనవలసియున్నది, గమనించారా.
మీకు ఒకటి తెలుసా? అది ఎంతో భయంకరముగా ఉండదా…
MATT 24:37•
LUKE 17:26•
1THS 4:16,17
21యేసు చెప్పెను, "మనుష్యకుమారుని యొక్క రాకడ వచ్చునప్పుడు, నోవాహు దినములలో ఉన్నట్లుగా ఉండును," నీటి చేత అక్కడ కేవలం ఎనిమిది ఆత్మలు మాత్రమే రక్షించబడ్డాయి. ఈ దినము ఎత్తబాటు వచ్చినట్లయితే ఎలాగుంటుంది, మరియు ఆయన టూసాన్ నుండి ఇద్దరిని, ఫీనిక్స్ నుండి ఒక్కరిని, మరియు ప్రపంచము నుండి, లోకమంతటి నుండి ఎత్తబాటు అంటే ఆ విధముగా ఉంటుంది, మరియు ఒకరు మరణస్థితిలో నుండి లేచి ఆయనను ఆకాశములో కలుసుకొనుటకు వెళతాడు మరియు కనపడకుండా పోతాడు, అది ఒక మర్మమైన కార్యాము కాదా? మరియు ఈ దినములలో ఒక దినము తీర్పు భూమిపైకి దిగబోవుచున్నది.
మీరనవచ్చు, "మంచిది, మొదటగా ఎత్తబాటు రావలసియున్నది కదా?" అది వచ్చేయున్నది, మరియు మీకు దాని గురించి తెలియదు. ఈ దినము ఎంతమంది ప్రజలు కనపడకుండా పోవుచున్నారో దాని గురించి ఆలోచించండి మరియు వారి గురించి ఒక్క మాట కూడా లేదు. మీకు దాని గురించి కొంచెం కూడా తెలియదు. ఈ దినము ప్రపంచములో రోజుకి 500 మంది కనపడకుండా పోవుచున్నారు, మరియు మీకు దాని గురించి ఏమియు తెలియదు. మనము చాలా భయంకరమైన సమయములో జీవిస్తున్నాము. మన దివిటీలను నుసిమి సరిచేసుకుందాము.
అది ఆ విధముగా ఉంటుంది అని నేను చెప్పుటలేదు. ఒకవేళ అలాగు జరిగితే ఏమిటి? అని మాత్రమే నేను చెప్పుచున్నాను. ఎత్తబాటు అయిపోయిన తరువాత తీర్పు వచ్చును, గమనించారా. ఆయన వచ్చేయున్నాడు, మరియు మీకు దాని గురించి తెలియదు.
22కావున మనము ఈ కూడికలలో కలుసుకుంటున్నప్పుడు, మనము దేవుని సేవ చేద్దాము అను ఒకే ఉద్దేశ్యము నిమిత్తము కలుసుకుందాము. మనము మన జీవితములను ఒక కార్యములో ఉంచుదాం. మనము దేనినైనా అనుకరించుటలో ఏదైనా మంచిది ఉన్నదా? ఆకాశమంతటా నిండియున్న అసలైన పెంతెకోస్తు శక్తి మరియు ఆశీర్వాదములు ఉండగా వాటికి బదులుగా మనకు మరొకటి ఎందుకు? దానికి బదులుగా మనము మరొకటి అంగీకరించుట ఎందుకు?
నీవు దేవుని ఆశీర్వాదములను ఉపయోగించుకొనవా? కొలత లేకుండా అడుగుము. అర అంగుళం పొడవున్న చిన్న చేప సముద్రము మధ్యలో ఉండి ఇలాగు అడుగుట నీవు ఊహించగలవా, "ఈ నీటిని కొద్ది కొద్దిగానే నేను త్రాగుట మంచిది, లేకపోతే ఈ నీళ్ళు అయిపోవచ్చును." ఇప్పుడు, అది వినుటకు మీకు చిన్నదిగానే అనిపించవచ్చును. మంచిది, దేవుని యొక్క మంచితనము కూడా అయిపోతుంది అని తలంచినట్లయితే అది దానికన్నా చిన్నదిగానే ఉంటుంది.
23నేను… కొద్దికాలము క్రితం, కార్డ్ విలియమ్స్ యొక్క తల్లి మరియు తండ్రలను చూసే గౌరమును నేను పొందుకున్నాను, మొదటిసారిగా వారిని నిలబడి చూసే ఆధిక్యతను పొందుకున్నాను. మరియు వారు సుమారుగు 80 సంవత్సరములు గడిచిన వృద్ధులైయున్నారు. మరియు చూశారా, దేవుడు ఆ వృద్ధ దంపతులను కావలికాచియున్నాడు. వారు సహోదురుడైన కార్ల్ వలె ఉంటారు, తన తండ్రివలే కాదు. మరియు టోని తన తల్లితో బయట ఉన్న కారులో నుండి దిగమని చెప్పెను, మరియు కారు తలుపును బలంగా వేసియున్నాడు, మరియు ఒక చిన్న సైనికునివలె నడుస్తున్నాడు. మై, మై! గమనించారా? దేవుడు మన పట్ల ఎంతో మంచివాడైయున్నాడు.
ఇప్పుడు, ఒక నీవు కానట్లయితే… ఒకవేళ నీవు పుల్ గాస్పెల్ సభ్యుడివి కానట్లయితే, మీరు… ఒక బాప్తిస్టులాగా, అయితే బాప్తిస్టులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఒక మెథడిస్టుకి, నేనొక మెథడిస్తును.
24మరియు ఒకసారి నేను అర్కాన్సాస్ లో ప్రసంగించుచుండగా మరియు నేను… చేతికర్రల సహాయముతో నడుస్తున్న ఒక వృద్ధుడు స్వస్థతను పొందుకున్నాడు. అతడు వీధులలో పెన్సిళ్లు అమ్ముకొనువాడు. మరియు ఆ రాత్రి కూడికలో అతడు నిలబడి ఆ కూడిక మొత్తం అతడే మాట్లాడియున్నాడు. దాని గురించి, ఓ, ఆ రాబిన్సన్ మెమోరియల్ ఆడిటోరియమ్ లో సుమారుగా అయిదు లేక ఆరు వేల మంది కూడుకొనియుంటారు, మరియు అది చిన్న కొండ మీద ఉన్నది. మరియు అతడు ఇలా అన్నాడు "స్వస్థపరచినదానికి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను." చాలా కష్టముగా ప్రసంగించుట జరిగినది. మరియు నేరుగా అతడు నిలబడి మరియు ఇలా అన్నాడు, "హాయ్, బ్రదర్ బ్రెనాం, నేను కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నాను."
ఇప్పుడు, అతడు స్వయంపాక శాస్త్రంలో 50 సంవత్సరముల అనుభవమును కలిగియున్నాడు. కాబట్టి అతడు మంచి సమయమును కలిగియున్నాడు. అతడు స్వస్థత పొందుకున్నాడు మరియు అతడు సమస్తమును కలిగియున్నాడు. కావున, అతడు ఇలా అన్నాడు, "మీకు తెలుసా…" అది అతడు నజరేతు (సంఘము పేరు) వానిగా ఉన్నప్పుడు స్వస్థతను పొందుకొనియున్నాడు. మరియు ఇలా అన్నాడు, "మీకు తెలుసా, మీరు మాట్లాడుతుండగా నేను విన్నాను మరియు నీవును నజరీనువాడవని నాకు ఖచ్ఛితముగా తెలుసు." అలా చెప్పిన తరువాత, అతడు మరలా ఇలా అన్నాడు, "నేను కూడా…" "ఆ తరువాత ఎవరో నీవు బాప్టిస్టువి అని చెప్పుట నేను విన్నాను." "కాని ఇక్కడ ఉన్న ప్రజలలో పెంతెకోస్తువారు అధికముగా ఉన్నారు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడంలేదు" అని అన్నాడు.
అప్పుడు నేను "ఓ, అది అర్ధం చేసుకొనుట చాలా సులభం" అన్నాను. నేను ఇలా అన్నాను, "నేను పెంతెకోస్తులో ఉన్న నజరేతునైన బాప్టిస్టును." అదియే సత్యమైయున్నది. మనమందరము క్రైస్తవులము, ఆయన ఆత్మలో జన్మించియున్నాము, ఆయన రక్తములో కడుగబడ్డాము, మరియు ప్రభువు రాకడ కొరకు ఎదురుచూస్తున్నాము. ప్రభువు నిన్ను దీవించును గాక.
ROM 7:4
25నీవు వ్యాపారస్తుడవైనా లేక మరేదైనాసరే, నన్ను నీకు ఒక విషయమును చెప్పనిమ్ము. లోపలికి రమ్ము. సహవాసమునకు రమ్ము కేవలం నీవు కరచాలనము చేయు కొద్దిమంది గుంపు కొరకు మాత్రమే సహవాసము చెయ్యవద్దు, కాని వారు పొందుకున్న పరిశుద్దాత్మను పొందుకొనుము. అదియే నిజమైన సహవాసమును తీసుకొనివస్తుంది.
మీకు తెలుసా, నీవు ఒక కార్యమును తయారు చేయలేవు. నీవు ఏదైనా కార్యమును తయారు చేయుటకు పిలువబడలేదు. సంఘము ఉత్పత్తి చేయుటకు లేదా ఫలములను తయారు చేయుటకు పిలువబడలేదు. నీలో నుండి ఫలము రావలసియున్నది. గమనించారా? నీవు ఒక గొర్రె దగ్గరకు వెళ్ళి, "ఊలును తయారు చేయుము" అని చెప్పలేవు. దానిని ఒక గొర్రెగా మారనిమ్ము, అప్పుడు అది ఊలును కలిగియుంటుంది. ఇప్పుడు అదే సమస్యగా మారియున్నది. మనము దేనినో తయారు చేయుటకు ప్రయత్నము చేస్తున్నాము. దానిని నీవు తయారు చేయవద్దు. దానిని నీవు లోపల కలిగియుండవలసియున్నది.
ఒక నల్లని పక్షి, నెమలి యొక్క ఈకలు తన రెక్కలలో పెట్టుకొని మరియు "గమనించారా, నేను ఒక నెమలిని" అని చెప్పుటను మీరు ఊహించండి. దాని లోపల నుండి ఎన్నడు రాని దానిని ఏదో ఒక దాన్ని పెట్టుకొనియుండుటకు ప్రయత్నము చేయుచున్నది. అటువంటి దానిని మనము పెంతెకోస్తు సమూహములలో చాలా అధికముగా చూడవచ్చును. మనము వాస్తవముగాను, అసలైనవారిగాను, తిరిగి జన్మించిన పెంతెకోస్తువారుగాను ఉందాం. ఎందుకనగా, కేవలం అది ఒక్కటి మాత్రమే పరలోకమునకు ఈ ప్రక్కనున్నవైపున నా పాపములన్ని కొట్టివేయబడినవి అని నాకు భరోసాను ఇస్తుంది. నేను కనుగొన్నది ఏమైనా ఉన్నది అంటే, అది ఇదే అని నేను చెప్పగలను, మరియు దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించియున్నాను. అప్పుడు నీవు దేనినో కలిగియుంటావు, నీ లోపల ఏదో లంగరు నిన్ను పట్టుకుంటుంది.
26మంచిది, మీ యొక్క సమయమును అధికముగా తీసుకోవాలని నేను అనుకొనుటలేదు. మీరు వెళ్లవలసియున్నదని నాకు తెలుసు. నేను ఏదైనా ప్రారంభించాలంటే అధికమైన సమయము తీసుకొనువారిలో నేను కూడా ఒకడిని. దీన్ని ప్రారంభించుటకు నాకు సుమారుగా ఒక గంట సమయము పడుతుంది, మరియు ఆ తరువాత నేను రెండు గంటలు బోధిస్తాను. ఆ తరువాత నేను ముగించటకు ఎనిమిది గంటల సమయము పడుతుంది. మరియు కావున, నేను ఈ ఉదయమున అంత కఠినముగా ఉండాలని అనుకోవటం లేదు. మీరందరు ఇక్కడకి వచ్చుటను బట్టి నేను మిమ్ములను అభినందిస్తున్నాను.
ఇప్పుడు నేను టూసన్ లో ఉంటున్నాను, ఇక్కడనే ఉన్న మంచిదైన ఆ పాత యెరుషలేములో ఉంటున్నాను. మరియు ప్రభువు చిత్తమైతే, దిగువలో ఉన్న సహోదరుడు టోని దగ్గర ఒకటి లేక రెండు కూడికలు కలిగియుంటాము, చుట్టు ప్రక్కల ఉన్న మీరందరికి సహాయము చేయుటకు, మరియు మీరందరు అన్ని ఉజ్జీవములకు హాజరు అవ్వండి. సేవక సహోదరులైన మీకును, నేను ఇక్కడ వచ్చి ఏ సంఘమును కట్టబోవటం లేదు. ముందుగా కట్టబడని దానికి సహాయము చేయుటకు నేను ఇక్కడకు వస్తున్నాను, ఈ టూసన్ లో ఆత్మలను గెలుచుటకు మీ సహోదరులకు సహాయము చేయుటకు నా వంతుగా నేను లాగగలిగినంత వరకు లాగుతాను, ఎక్కడను ఏ కూడికను ప్రారంభించుటలేదు, లేక ఇది ఒకరికి ఒకరు సహాయము చేసుకొను కూడికైతే తప్ప, లేక మనము కలుసుకొనుటకు మరేదైనా అయితే తప్ప. నేను ఇక్కడకు వచ్చి ఏ సంఘమును ప్రారంభించుట లేదు. లేదు, అయ్యా!, మనకు సరిపోయినన్ని ఉన్నాయి. మనము చేయవలసినది ఏమిటంటే, వాటిని తిరిగి జన్మించిన క్రైస్తవులతో నింపుటయే. అవును అయ్యా!.
27ఇక్కడకు నేను వచ్చిన కారణమేమంటే చక్రమును (సువార్త) నా భుజముతో పట్టుటకు, మరియు నేను చేయగలిగిన ప్రతివిధమైన సహాయము చేయుటకు, మరియు ప్రతిచోట నేను చేయగలిగిన సహాయము చేయుటకు, మరియు తెరువబడిన ప్రతి ద్వారమునకు, మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చేత రక్షించబడతారు అను సాక్ష్యమును ఇచ్చుటకు వచ్చియున్నాను, మరియు గడచిన సంవత్సరములన్ని ఆయన యొక్క ఆత్మచేత నింపి నన్ను కాచియున్నాడు. ఇప్పుడు, చాలా సార్లు… కొద్దిసేపటి క్రితం టోనిని, నేను చూసియున్నాను, "బ్రదర్ బ్రెన్హాం, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దానిని నేను వ్రాయవలసియున్నది." కావున నేను చేయవలసియున్నది. మీకు తెలుసా, మీరు వృద్ధాప్యమును చేరుకుంటున్నప్పుడు, మీరు గతములో ఆలోచనలు చేసినట్లుగా మీరు చేయరు.
ఒకదినమున ఏవరో ఇలాగు అన్నారు, "బ్రదర్ బ్రెన్హాం, నీ వయస్సు ఎంత?"
"ఓ, నేను ఇలాగు అన్నాను, "నేను ఇరవై-అయిదును దాటాను."
"ఎంత?"
"నేను రెండవసారి 25ను దాటాను" అని చెప్పాను. కావున, నేను ఎంత మాత్రము బాలుడను కాను. సహోదరుడా, ఆ కారణము చేతనే తలపైన మనము వెంట్రుకలను కోల్పోయాము. అది నిజము. అదియే సత్యము.
HEB 12:1•
REV 3:14-22
28మంచిది, ప్రభువును ప్రతియొక్కరు ప్రేమిస్తారా? ఓ, అద్భుతముగా ఉన్నది. ఇప్పుడు, ప్రతియొక్క ఆలోచనను మరియు ప్రతియొక్క భారమును ప్రక్కన పడవేయండి. మరియు ఇప్పుడు అది మనకు అసౌకర్యముగా ఉన్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను, మనము చాలా సేపటి నుండి కూర్చునియున్నాము, కాబట్టి, మనము ప్రార్ధనకై కొద్దిసేపు లేచి నిలబడుదాము. మరియు ఇప్పుడు, మీరు లేచి నిలబడుచుండగా, నేను ఒక అధ్యాయమును, లేక ఒక వచనమును, పరిశుద్ధ గ్రంథము నుండి చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అను గ్రంథము నుండి చదువబోవుచున్నాను. 3వ అధ్యాయము 14వ వచనము.
మరియు లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము;
ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతలేవనగా;
నీ క్రియలను నేనెరుగుదును, … నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయు ఉద్దేశించుచున్నాను.
నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటమువేబడిన బంగారమును నీ దిసమొల సిగ్గును కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించుచున్న వారందరని గద్దించి శిక్షించుచున్నాను. గనుక, నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను: ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల నేను, అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనముమందు కూర్చండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.
REV 3:17
29మన తలలను మరియు హృదయములను క్రిందకు దించి ప్రార్ధన చేద్దాం. ప్రభువైన యేసూ, ఈ ఉదయకాలమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన మా యెడల కృపగలిగిన దేవా! మరియు ఈ దినమున ఆయనను పరిశుద్దాత్మ రూపములో మా కొరకు పంపియున్న దేవా! అది మా హృదయాలను సంధించుచు ఆయనకు అత్యంత సమీపముగా నడుచునట్లుగా చేయుచున్నది. మరియు దినము త్వరలో సమీపముగా ఉన్నదని మాకు తెలియుచున్నది. దినములు క్రమము అంతరించిపోయి నిత్యత్వములోకి అడుగుపెట్టబోవుచున్నాము. మేము తీరమునకు సమీపముగా వచ్చియున్నాము. మేము ఆ తరంగములను వినుచున్నాము. ఓ దేవా! ఇక్కడ మేము చదివిన దాన్ని బట్టి ఇది ఎంతో అపాయకరమైన ఘడియైయున్నది, ఈ లవొదికయ చివరి సంఘకాలమైయున్నది, అందుచేతనే మనము తీరమునకు సమీపములో ఉన్నాము, మరియు ధనికమైన కార్యములు ప్రజలను గ్రుడ్డివారిని చేసియున్నవి. ఓ, దేవా మేము ప్రార్ధిస్తునాము, అన్ని కాలములలో ఉన్న ఆ బండను మా లంగరు పట్టుకొనులాగ మేము ప్రార్ధిస్తున్నాము, మరియు ప్రభువా, మేము ఉదయము కొరకు కనిపెట్టుచున్నాము. దానిని దయచేయుము ప్రభువా.
30దేవుడు పిలిచిన ఈ సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల కూడిక అను ఈ అధ్యాయమును దీవించుము, టూసన్ లోని ఈ ప్రత్యకమైన భాగమును మీరు దీవించాలని మేము ప్రార్ధిస్తున్నాము. మేము ఉన్న ఈ కుటీరము వంటి ఈ గుడారమును మరియు గోడలను తీసివేసి మరియు గూడారమంతటిని విశాలపరచి తిరిగి జన్మించిన క్రైస్తవులను ఉంచబడునట్లుగా అగును గాక. అది మాకు దయచేయుము. ఉజ్జీవముతో ఈ పట్టణములోనికి మరియు గుడారములోపలికి వచ్చుచున్న సహోదరులను దీవించుము, ఈ సంఘములలోనికి మరియు దేవుని రాజ్యములోనకి ఆత్మలను తెచ్చుటకు ఇది ఒక పాత్రగా సహాయము చేయును గాక. ప్రభువా! దేవుని రాజ్యము కొరకు గొప్ప ప్రయాసపడుచున్న ఫస్ట్ అసెంబ్లీ సహోదరుడైన బేతనీని దీవించుము. మేము ఏ విధముగా ప్రార్ధించిననూ నీవు అతనితో కొనసాగుము మరియు దేశములో ఉన్న అన్ని సంఘములతో ఉండుము.
ఇప్పుడు, నీ పరిశుద్దాత్మ మాకు తర్జుమా చేయుటకై మేమందరము ఎదురుచూస్తున్నాము, మరియు చదువబడిన వాక్యమును వెలుగులోనికి తీసుకొని రమ్ము, యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
మీరు కూర్చునవచ్చును.
31ఈ కూడికయే మనము కలుసుకునే చిట్ట చివరి కూడిక అని మీరు ఆలోచించుట మానివేశారా? మీకు తెలుసా, ఇక్కడ ఉన్న మనలోని కొద్దిమంది, రేపటి ఉదయమున తిరిగి మనము కూడుకునే సమయమునకు కొద్దిమంది కనిపించుటలేదు? ఏమి జరిగినదో మనకు తెలియదు, మరియు బహుశా మనము ఈ విధముగా గుంపుగా కలసి కూర్చునుట, మరియు ఈ భూమి మీద కలసి భుజించుట బహుశా చివరిసారియై ఉండవచ్చును.
అయితే జ్ఞాపకముంచుకొనండి, మనమందరము తిరిగి ఒకసారి కలుసుకునే సమయము వస్తుంది, అది ఉదయం అల్పాహామును తీసుకొనుటకు కాదు, కాని రాత్రి విందుకై యున్నది, ఓ, దేవుని యొక్క గొప్ప విందుయందు, గొర్రెపిల్ల యొక్క వివాహములో, మరియు అక్కడ సింహాసనములు ఆకాశమునుండి ఆకాశము వరకు విశాలపరచబడియున్నాయి, మరియు అక్కడ అన్ని కాలములలో విమోచించబడినవారు ఆ భోజనపు బల్ల యొద్ద ఒకరి వెనుక ఒకరు కూర్చునియున్నారు. అది ఎంతో మహిమకరమైన సమయమైయున్నది. దాని కొరకు నేను ఎదురుచూస్తున్నాను.
REV 3:20
32ఇప్పుడు, కొద్ది నిముషములలో మీతో మాట్లాడుటకు నేను ఒక అంశమును తీసుకొనబోవుచున్నాను. సాధ్యమైనంతవరకు మిమ్ములను నేను ఎక్కువసేపు ఉంచాలని అనుకోవటంలేదు. నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కొన్ని లేఖనములను నేను కలిగియున్నాను మరియు నేను "ద్వారమందే ద్వారము" అను అంశము మీద కొద్ది నిముషములు మాట్లాడాలని ఆశించి నేను నోట్సును తయారు చేసుకునియున్నాను.
ఇప్పుడు, మనము చదివిన ఈ లేఖనభాగము ఎంతో అసాధారణమైన సంగతిగా ఉన్నది. ఇది ఎన్నో విధములుగా అసాధారణముగా ఉన్నది. ఇప్పుడు మనము చదివియున్న ఈ లేఖన భాగము పరిశుద్ధ గ్రంథమంతటిలోకి ఎంతో దయనీయమైన లేఖనముగా ఉన్నది, ఈ లేఖనము మనము జీవిస్తున్న ఈ కాలమును గూర్చి మాట్లాడుతున్నది. ఇది యేసుక్రీస్తును తన స్వంత సంఘమునకు వెలుపట ఆయనను నిలబెట్టిన ఈ కాలమును గూర్చి మాట్లాడుతున్నది, తిరిగి లోపలికి రావటానికి ఆయన వెలుపట నుండి ద్వారమును తట్టుచున్నాడు. మరియు ధనవృద్ధి మరియు లోకములోని సుఖములు ఆయనను సంఘము నుండి వెలుపటికి పంపివేసియున్నాయి, తరువాత సంఘము నులివెచ్చగా మారిపోయి ఉన్నది. అది ఎంతో దయనీమైన లేఖనముగా ఉన్నది. అన్ని సంఘకాలముల కన్నా ఈ సంఘకాలము… మరియు నేను దీని గుండా నా సంఘములో వెళుతున్నప్పుడు, ఇప్పుడు 17వ వాక్యము ప్రారంభములో ఉన్న ఏడు ముద్రలను తీసుకొనుటకు నేను తిరిగి వెనుకకు వస్తున్నాను. మరియు ఇప్పుడు, దీనిలో మిగిలిన అన్ని సంఘములు ఈ సంఘకాలములో అంగీకరించబడుటను మనము కనుగొంటాము, కాని చివరిదైన ఈ లవొదికయ సంఘకాలము, క్రీస్తును ప్రజలలో నుండి తీసివేసినది. మరియు ఈ సంఘకాలము ఆయనను సంఘమునకు వెలుపటకు పంపివేసియున్నది మరియు ఆయన వెలుపటి నుండి ద్వారమును తట్టుచూ, తిరిగి లోపలకు వచ్చుటకు ప్రయత్నం చేయుచున్నాడు. గ్రుడ్డివారైయున్నారు.
COL 2:2
33అది ఎంతో అసాధారణమైయున్నది.
కాని మీకు తెలుసా, కొన్నిసార్లు అసాధరణమైన పరిస్థితులలో దేవుడు వస్తాడు. దేవుడు అసాధారణమైన పరిస్థితులలో వస్తాడు ఎందుకనగా ఆయన అసాధారణమైన దేవుడైయున్నాడు. ఆయన అసాధరణమైన కార్యములు చేయువానిగాయున్నాడు. అసాధరణమైన సమయములలో కనిపిస్తాడు, మరియు ఆయన అక్కడ ఉంటాడని నీవు ఆలోచించని సమయములలో ఆయన అక్కడ నీకు కనిపిస్తాడు. ఆయన అసాధరణమైన సమయములలో కనపడతాడు. అత్యంత అసాధారణ రీతిలో ఆయన కనిపిస్తాడు. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథము ఇలా చెపుతుంది, "ఆయన రహస్యముగా కార్యములు చేయువానిగా యున్నాడు." "చేయుటకే ఆయన వద్ద అద్భుతములున్నవి." ఆ కారణముచేతనే ఆయన అసాధరణమైవానియున్నాడు.
మరియు ఆ విధముగానే… మనము అసాధారణమైన కార్యక్రమములతోనే ఆయనను తప్పిపోవుచున్నాము. ఏదో ఒకదాని కొరకు. దేవుడిని అనేకసార్లు తీసుకొనివచ్చుట కూడా అసాధారణముగానే ఉన్నది. మనము ఏదో ఒక ఆచారమునకు కట్టివేయబడుట లేక మనము సేవచేయుటకు చేస్తున్న ప్రయత్నము, ఆ తరువాత, మనము ఆలోచించిన విధముగా ఆ సేవ జరుగకపోయినట్లయితే, "ఇది దేవుని యొక్క చిత్తము కాదు" అని దానిని ఆపివేస్తాము. అప్పుడు మనము ఎంతో పెద్ద తప్పు చేసినవారిగా యున్నాము.
34దేవుడు తనంతట తానుగానే చూపిస్తాడు, ఆయన దేనినైతే చూపించియున్నాడో, ఆ తరువాత ఆయన అదేదాని నుండి కనుమరుగువుతాడు, గమనించారా. ఆయన తనంతటగా తాను దానిలో కనుపరుచుకుంటాడు, మరియు ఆయన దాని నుండి బయటకు వచ్చి తనంతట తానుగు దాగుకుంటాడు. ఒక విత్తనము వలె, విత్తనము తనని తాను అందమైన పువ్వులో కనుపరుచుకుంటుంది, తరువాత అది దానిని కుళ్ళిపోనిస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చే క్రమము నిమిత్తమై అది తననితాను లోపల దాచుకుంటుంది. మరియు దేవుడు కూడా అదే విధముగా చేయుచున్నాడు. ఆయన అసాధరణమైన సమయములలో - ఎంతో అసాధారణముగా ఉన్నాడు, అసాధరణమైన విధములుగా, మరియు కొన్ని సార్లు చాలా అల్పమైన సంగతులలో ఆయన అసాధరణమైనవానిగా ఉన్నాడు.
అది చాలా అల్పమైనది అని చాలాసార్లు మనము ఆ విషయమందున దేవునిని కనుగొనుట నుండి మనము తప్పిపోవుచున్నాము. మనము కలిగియున్న ఈ చిన్న అధ్యామును గూర్చి, లేక మనము కలిగియున్న ఈ చిన్న గుంపును గూర్చి మాట్లడుకుంటున్నప్పుడు, నేను కొద్ది నిముషముల క్రితం దాని గూర్చి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు, గొప్ప గొప్ప సమూహములతో మాట్లడుటను నేను అది నా యొక్క ధన్యతగా భావిస్తాను. భారత దేశములోని ముంబాయిలో ఒక కూడికకు అయిదు లక్షల మంది ప్రజలు వచ్చియున్నారు, మరియు ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికాలో సుమారుగా రెండు లక్షల యాబైవేల మంది ప్రజల ఒక కూడికకు హజరైయున్నారు. కాని, గృహ కూడికలే వాటి అన్నింటిలోకన్నా అత్యంత మధురమైన మరియు దీవించబడిన కూడికలని నేను కనుగొన్నాను. దేవుడు అసాధారణమైన కార్యముల యందు అసాధారణమైన స్థలములలో ఉన్నాడు.
35నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది, కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్న ఈ కెనడా సహోదరుడు, కెనడా దేశములో నేను కలిగియున్న నా మంచి స్నేహితుల గురించి మాట్లాడియున్నాడు. కొద్దికాలము క్రితం… కింగ్ జార్జి, అతడికి ప్రార్ధన చేసే గౌరమును నేను పొందుకున్నానని మీకు తెలుసు, నాడీశాఖ మీద భ్రూణములు పెరుగుట అను ఒక వ్యాధిని నుండి ప్రభువు అతడని స్వస్థపరచాడు. మరియు అతడు ఆ వ్యాధితో బాధించడుచున్నప్పుడు, కెనాడకు వచ్చియున్నాడు. మరియు అతడు ఎంతో ధైర్యవంతుడు. మరియు వాంకోవర్ అను ప్రాంతమునకు వచ్చియున్నప్పుడు, అన్ని స్కూళ్ళు మూసివేసియున్నారు, కావున - వారు బయటకు వచ్చి మరియు అక్కడకు తీసుక వెళ్ళారు. వారికి బ్రిటీష్ వారి యొక్క జెండాను ఇచ్చారు, మరియు ఆ కిరీటమును మరియు రాజు గౌరవపరచుటకు వారు ఆ జెండాను ఊపుచుండగా, అతడు వారిని దాటుకుంటూ వెళ్ళియున్నాడు.
36మరియు నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు, అతని పేరు సహోదరుడు ఇర్న్ బాక్సటర్, మేము ప్రసారములో వినుచుండగా ఈ విషయము వచ్చియున్నది, అతడు మరియు అతడి యొక్క అందమైన రాణి అక్కడ కూర్చునియున్నారు. మరియు నేను ఎన్నటికి మరచిపోను, అప్పుడు మేము ఒక గదిలో కూర్చునియున్నాము. సహోదుడు ఇర్న్ కుర్చి నుండి ఎగిరి దూకి మరియు నా చుట్టూ చేతులు వేసి మరియు మరియు ఏడ్చుట ప్రారంభించెను. మరియు నేను ఇలా అన్నాను, "సహోదరుడా బాక్సటర్, ఎందుకింత ఆందోళన చెందుతున్నావు?"
అతడు "సహోదరుడా బ్రెన్హాం, అతడే మా రాజు," అని అన్నాడు.
నేను ఇలా అనుకున్నాను, "రాజు తనని దాటుకుంటూ వెళుతుంటేనే ఒక కెనడా దేశస్తుడు ఆ విధముగా అనుకుంటుటే, మరి యేసు చేత ప్రారంభించిన సంఘము తిరిగి జన్మించుట జరిగితే అది ఏ విధముగా ఉంటుంది?"
అక్కడ, అతడు ఇంకనూ ఆ వ్యాధితోనే ఉన్నాడు, తన రథము (మరయంత్రము లేక కారు)లో కూర్చునియున్నాడు, మరియు నిటారుగా కూర్చునియున్నాడు, మరియు అతడు తను భయంకరమైన అల్సర్ వ్యాధితోను మరియు వెన్నెముక ఇబ్బంది వలన బాధను పొందుతున్నట్లు చెప్పెను.
37మరియు స్కూల్ టీచర్లు అందరు తమ పిల్లలను బయటకు తీసుకొనివచ్చి, తన చేతులలో ఉన్న జెండాలను ఊపుచు ఉండవలసినది చెప్పబడింది. మరియు గౌరవవందనము ముగిసిన తరువాత, ఎందుకు, ఆ పిల్లలు తిరిగి స్కూళ్ళకు వెళ్ళవలసియున్నది. మరియు వారు వెనుకకు తిరిగివచ్చినప్పుడు, ఒక స్కూలుకు సంబంధించిన ఒక చిన్న బాలిక, మరియు ఆ తరగతి టీచరు హాజరు నిమిత్తమై బాలిక యొక్క సంఖ్యను పిలిచినప్పుడు, ఆ బాలిక తరగతికి తిరిగి రాలేదని తెలిసినది. అప్పుడు "నేను వెళ్ళి ఆ బాలికను కనుగొనాలి" అని ఆమె అన్నది. మరియు పిల్లలను తీసుకొని, వీధులలో ఆ బాలికను కనుగొనుటకు బయలుదేరియన్నారు. మరియు కొద్దిసేపటి తరువాత ఆ టీచరు తనంతట తానుగా ఆ చిన్నదాన్ని కనుగొన్నది, ఒక టెలిఫోను స్థంభము ప్రక్కన నిలబడి యుండుట కనుగొన్నది, తన చిన్న హృదయమంతటి నుండి ఆ చిన్న బాలిక ఏడ్చుచున్నది.
మరియు ఆ బాలిక ఏడ్చుచుండగా, మరియు… ఆ టీచరు ఇలా అన్నది, "హనీ, ఏమి జరిగింది?" "రాజు వెళుతున్న వైపునకు నీవు నీ జెండాను ఊపలేకపోయావా?"
"అవును, నేను రాజవైపునకే నా జెండాను ఊపియున్నాను" అని ఆ బాలిక సమధానము ఇచ్చింది.
టీచరు ఇలా "నీవు రాజును చూడగలిగావా?" అని అడిగింది.
"అవును, నేను రాజును చూడగలిగాను."
"మంచిది," "మరి ఎందుకని నీవు ఏడ్చుచున్నావు?"
ఆ బాలిక ఇలా "నేను చాలా చిన్నదాన్ని అని మీకు తెలుసు కదా. నేను రాజును చూశాను, కాని ఆ రాజు నన్ను చూడలేదు."
ఇప్పుడు, ఈ సంగతి అక్కడ రాజుగా ఉన్న జార్జి రాజుతో జరిగింది, కాని అది రాజైన యేసుతో జరుగదు. ఎంత చిన్న సంఘమును కాపరికి ఆయన ఇచ్చినా, పాలవాడితోను లేక వార్తా పత్రికను పంచువానితోను ఒక పని నిమిత్తము మాట్లాడినట్లుగా అనిపించవచ్చును, అయినను ఆయన దాన్ని కూడా చూస్తాడు. యేసు కొరకు ఏమియు తక్కువగా ఇచ్చాను అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకు అది ముందుగానే తెలుసు. నీవు తప్పక జ్ఞాపకముంచుకోవలసినది ఏమనగా, నీవు చేసే ప్రతి చిన్న కార్యము ఆయనకు తెలుసు, మరియు ఆయనే నీకు తగిన బహుమానము ఇస్తాడు, దానిచేత మాత్రమే నీవు సమస్తమును పొందుకుంటావు. అది ఎంత చిన్నదో అని అనుకొనవద్దు, ఏదో విధముగా దాన్నిచేయుము. ఒకవేళ నీవు నీ జెండాను ఊపాలని అనుకుంటున్నావా, అయితే ఊపుము. ఆయన ఆ అసాధరణమైన కార్యమందు ఉ౦టాడు. ఆయన దానియందు ఒక ఆత్మను గెలుచుకుంటాడు.
38అది డ్వైట్ మూడియే అని నేను నమ్ముచున్నాను — లేక నేను పొరపడుచున్నానా? బహుశా అది కాకపోవచ్చును. ఒకానొక వృద్ధ సహోదరికి తాను క్రీస్తు కొరకు ఒక ఆత్మను సంపాదించాలనే భారమును తన హృదయమందు కలిగియున్నది. మరియు మరియు ఆమె ఒక శుభ్రపరుచు స్త్రీయై యున్నది. అది సుమారుగా 150 సంవత్సరముల క్రితం జరిగినదని నేను అనుకుంటున్నాను. మరియు ఆమె తన దగ్గరన డబ్బును ఎనిమిది డాలర్లు అయ్యేంతవరకు దాచిపెట్టినది మరియు ఆమె ఒక పాత వస్త్రమును ఒక వారమునకు ఒక డాలరు చొప్పున అద్దెకు తీసుకున్నది. మరియు ఆమె తనంతట తానుగా ఆ వస్త్రమును శుభ్రపరచుకున్నది. మరియు ఆమె తను శుభ్రపరచు ఆ బల్లనే బలిపీఠంగా మార్చివేసినది, మరియు పైన ఒక బలిపీఠం పెట్టియున్నది, మరియు తను శుభ్రపరచు బల్లయొద్ద దానిని బుడగలు వచ్చులాగ నానపెట్టినది. మరియు ఆమె కొన్ని ప్రాంతములను దాటుకుంటు వచ్చింది. ఆ దినములు అమెరికాకు తొలినాళ్ళేయున్నవి.
మరియు ప్రతియొక్కరు దానిని చూసి, మరియు దాన్ని క్రింద పడవేసేవారు. ఆమె ఒక మెథడిస్టుగా ఉన్నది. కావున, వారు దానిని క్రిందకు త్రోసివేసియున్నారు.
39మరియు ఆమె ఒక మెథడిస్టుయై యున్నది. మరియు ఆ మెథడిస్టుల తరువాత మూఢులైన ఒక గుంపుగా పెంతెకోస్తులు ఉన్నారు. మరియు దేవుని శక్తి క్రిందకు వచ్చి వారు పాఠశాల భవనములలో పడియున్నారు, మరియు వారి ముఖముల మీద నీళ్ళు పోయబడినవి, మరియు… నాకు చెప్పవద్దు, ఎందుకనగా నేను కూటములలో ఉన్నాను, గమనించారా. మరియు వారు వెనుకకు వచ్చుటకు బదులుగా అక్కడనే ఒంటరిగానే ఉండనిచ్చినట్లయితే, వారిని ఆ విధముగానే ఉండనిమ్ము, వారు పెంతెకోస్తులై యున్నారు, గమనించారా.
కాని ఆ తరువాత, ఆ వృద్ధ స్త్రీ ఈ కరపత్రములను పంచుతున్నది, మరియు, ఓ, ప్రతియొక్కరు ఆ కరపత్రములను వీధులలో పారవేయుచున్నారు, మరియు అది ఒక… తన త్రోసివేయబడిన దాన్ని బట్టి ఆమె నిలువబడి ఏడ్చుచున్నది, అక్కడ ఒక ఉజ్జీవము తీసుకొనివచ్చుట కొరకై ఒక కాపరిని తీసుకుని వచ్చుటకు ఆమె బహు ప్రయాసపడియున్నది. మరియు ఆ రాత్రి ఆ కాపరి రావటానికి సిద్ధపడియున్నాడు. ఆమె వెళ్ళుచున్నది, మరియు అక్కడ పాతకాలపు చిన్న బాలుడు తన తండ్రితో యున్నాడు, (దక్షిణము వైపున, వారిని గలూసెస్ - ఒక విధమైన వస్త్రములను ధరించువారిని అంటారు), మీకు తెలుసా, వదులుగా ఉన్న వస్త్రములు ధరించి, చెదిరిన జుత్తు మెడ దిగువరకు పెంచుకొని, పైకి మరియు క్రిందకి నడుస్తూ ఇలా అన్నాడు, "ఓ, స్త్రీ, నీవు ఇచ్చుచున్నది ఏమిటి?"
మరియు ఆమె ఇలా అన్నది, "హనీ, ఇది కరపత్రమైయున్నది." అప్పుడతడు, "అది ఏమి తెలియచేయున్నది? ఎందుకనగా నేను చదువలేను."
మరియు "మంచిది, ఆ పాత లివరి స్టాబుల్ దగ్గర ఈ రాత్రి మేము ఒక కూటమిని కలిగియున్నాము" అని చెప్పినది.
అందుకతడు, "కృతజ్ఞుడను, నేను ఒకటి తీసుకొనవచ్చునా?" అని అడిగాడు.
ఆమె "తప్పకుండా" అనెను, అతడు దాన్ని తన జేబులో పెట్టుకొనెను.
40ఆ రాత్రి కూటమి అక్కడ జరిగినప్పుడు, మీకు తెలుసా అక్కడ ఎవరు ఉన్నారో? మీ నమ్మకస్తుడైన ఆ పాత కాపరి మరియు స్త్రీ, ఆ కూటమిలో వారు మాత్రమే ఉన్నారు. ఆ ధైర్యవంతుడైన సైనికుడు, అక్కడ ఒక్కరు ఉన్నారా లేక వెయ్యి మంది ఉన్నారా అని చూడకుండా, తను లేచి నిలబడి తన వాక్యమును తీసుకొని ప్రసంగం చేసియున్నాడు. తన పదివేలమందికి ప్రసంగము చేయునప్పుడు, ఏ విధముగా అయితే ప్రసంగము చేస్తాడో, అదే విధముగా ప్రసంగము చేసియున్నాడు. కాని ద్వారము వద్ద నిలబడి ప్రసంగము యొక్క ప్రారంభము నుండి వినుచున్న ఈ చెదిరిన జుత్తు కలిగిన బాలుడు ఆశ్చర్యపోయాడు. మరియు ఆ రాత్రి అతడు తనను తాను బలిపీఠము దగ్గర కనపరుచుకున్నాడు. నేను పొరపాటు పడనట్లయితే, ఆ సహోదరుడు డ్వైట్ మూడియే, తరువాత అతడు సుమారుగా ఐదు లక్షల ఆత్మలను క్రీస్తు వైపు త్రిప్పియున్నాడు. గమనించారా? ఓ, మై! ఎన్ని పెద్ద పెద్ద కూటములు ఆ విధముగా వికసించబడియున్నాయి! గమనించారా, అసాధరణమైన కార్యములలో దేవుడు ఉన్నాడు. అసాధరణమైన రీతిగా ఆయన ప్రత్యక్షమగును. మీరు దాన్ని తప్పక జ్ఞాపకముంచుకోవలసియున్నది.
41ఇప్పుడు, యేసు ద్వారమును తట్టుచున్న ఆ చిత్రమును వేసిన చిత్రకారుడి పేరు గుర్తుకు వచ్చుటలేదు. బహుశా అతడు గ్రీకు చిత్రకారుడైయుండవచ్చును. ఈ సమయములో ఆ చిత్రకారుని పేరును చెప్పలేను, కాని ఈ చిత్రము కొరకు అతడు తన జీవితకాలమంతా గడిపియుండవచ్చును. మరియు మీరు చూశారా, ఈ చిత్రము ప్రముఖమైన చిత్రములు ఉంచు స్థలములోనికి ఈ చిత్రము వెళ్ళకముందే, ఈ చిత్రము విమర్శకులు ఉండు గదిలో దీనిని ఉంచవలసియున్నది. ప్రతియొక్క గొప్ప చిత్రము తప్పక ఆ విధముగా ఉండవలసియున్నది. అది తప్పక విమర్శకులను ఎదుర్కొనవలసియున్నది.
2TIM 4:10
42ఓ, ఈ ఉదయకాలము నేను దాన్ని కలిగియున్నట్లయితే ఈ ప్రేక్షకుల ముందు దాన్ని నేను విసిరివేయవలసియున్నది. మనము చల్లబడిపోయి ఉండగా, మనలను తీసుకొని ఆ విమర్శకుల గది నుండి దేవుడు ఈ దినము తీసుకొని వెళుతున్నాడని పెంతెకోస్తు ప్రజలారా, మీరు గుర్తెరిగియున్నారా? సంఘము ఒక వధువువలె ప్రముఖమైన గదిలోకి వెళ్ళుటకు ముందే విమర్శకుల గదిని దాటవలసియున్నది. దానిని మీరు అర్ధము చేసుకోగలుగుతున్నారా? లేఖనములతో వచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? మరియు క్రీస్తు ప్రేమలో మీరు ధైర్యముగా నిలబడగలరా? లేక పరిశుద్ధ గ్రంథము "దేమా యిహలోకమును స్నేహించి, నన్ను విడిచి వెళ్ళెను" అని చెప్పియున్నట్లుగా, మీరు వెనుకకు వెళ్ళి మరియు మీరును ఆ లోకముతో వెళ్లాలనుకుంటున్నారా. అదిగో నేడు సంఘము అక్కడనే నిలచియున్నది, బరువు సమతూకముగా ఉన్నది. మరియు ఆ కారణము చేతనే అది లవొదికయగా యున్నది.
REV 3:20
43చిత్రకారుడు చిత్రించిన ఈ చిత్రము, విమర్శకుల గదిలోకి వెళ్ళినప్పుడు వారు దీనిలోపల ఏ తప్పిదమును కనుగొనలేకపోయారు. మరియు చివరగా ప్రసిద్ధ విమర్శకుడు వచ్చి ఈ విధముగా అన్నాడు, "నీ చిత్రమందు ఏ దోషము లేదు." "రాత్రి సమయమందు యేసు తన చేతిలో లాంతరు పట్టుకుని చీకటి అనే పాపములో నుండి వచ్చుచున్నాడు, అది సత్యమైయున్నది, ఇది ఎంతో శ్రేష్టమైన చిత్రమైయున్నది. మరియు చిత్రములోని ఆయన యొక్క ముఖ కవళికలు ఆయన ద్వారమును తట్టుచున్నప్పుడు, ఎవరైనా తలుపు యొద్దకు వస్తారేమో అని ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నది" చెప్పెను, "అది ఎంతో అద్భుతముగా ఉన్నది. మరియు లోపల ఉన్నవారిలో ఎవరైనా విన్నారేమోనని అన్న ఆశ ఆయన ముఖములో కనిపిస్తుంది… కాని, అయ్యా, కాని ఆ ద్వారమునకు బయట గడియలేదు. లోపలి నుండి ఎవరు రాకపోయినట్లయితే ఆయన లోపలికి ఎలాగు వెళ్లగలడు, ఎందుకనగా ఆ ద్వారమునకు బయట గడియలేదు కదా?"
"ఓ," అని ఆ చిత్రకారుడు అన్నాడు, "ఈ చిత్రమును నేను ఆ విధముగానే చిత్రించియున్నాను, ద్వారమునకు లోపల గడియయున్నది. యేసు, కేవలం ఆయన చిత్తము ప్రకారముగా ఆయన లోపలికి రాలేడు, ఆయనను లోపలికి పిలుచుట అది నీ చిత్తమైయున్నది." ఇదిగో, ద్వారము వద్ద నిలుబడి నేను తలుపు తట్టుచున్నాను. ఎవరైనను విని తలుపు తెరిచినట్లయితే నేను లోపలకు వస్తాను, నేను లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయుదును, మరియు అతడు నాతో భోజనము చేయును.
44మనము ఇప్పుడు ఆ చిత్రమునే చూస్తున్నాము.
ఒక మనుష్యుడు ద్వారమును ఎందుకు తడతాడు? ఏ కారణము ఒక మానవుడిని ద్వారము తట్టునట్లు చేయును? అతడు ఇంటిలోపలకు అనుమతించబడుటకు, అతడు లోపలకు రావటానికి ప్రయత్నము చేస్తున్నాడు. అక్కడ… బహుశా అతడు నీ గురించి ఏదో మాట్లడటానికై యుండవచ్చును, లేక అతడు నీతో ఏదో వ్యాపార నిమిత్తము లేక అటువంటిది ఏదో మాట్లాడుటకై యుండవచ్చును, లేక నీకు ఏదైనా ఇవ్వటానికై యుండవచ్చును. ఏదో ఒక కారణమున్నది, లేకపోయినట్లయితే అతడు ద్వారమును తట్టడు, గమనించారా. మనము కేవలం… మానవుని యొక్క మర్యాద చొప్పున ద్వారమును తెరిచి అతని ఏమి కావలెయునో చూస్తాము. మానవునిగా మనము ఆ కార్యమును మాత్రమే చేస్తాము. ద్వారమును తెరిచి, "నీవు ఎవరవు? నీకేమి కావాలి?" అని అతడిని అడుగుతాము.
అతడు అనుకొనవచ్చును… బహుశా అతడు నిన్ను కలుసుకుని, మరియు కూర్చుని, "నేను నీ స్నేహితుడను, ఈ ఉదయకాలము నేను నీతో కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను" అని అనవచ్చును. ఒకవేళ అతడు నీ స్నేహితుడైనట్లయితే కూర్చుని అతనితో నీవు మాట్లడుతావు. ఒకవేళ అతడు నీ నుండి ఏదైనా ఆశించినట్లయితే, అతడితో నీవు తరువాత మాట్లాడుతావు. నీవు గమనించావా.
45చాలామంది గొప్పవారు వారి జీవితములలో వారు ద్వారమును తట్టియున్నారు.
ఇప్పుడు, అది అంతయూ నీవు ద్వారము దగ్గరకు వెళ్ళి, ఎవరు తలుపు తట్టుచున్నారు అనే దాని మీద ఆధారపడియున్నది. ద్వారము ఎవరు తట్టుచున్నారు అనేది నీవు తెలుసుకోవలసియున్నది. కాని, కనీసముగా నీవు ద్వారము దగ్గరకు వెళ్ళవలసియున్నది. అది అత్యంత మర్యాదపూర్వకమైన సంగతియైయున్నది, మరియు ద్వారము యొద్ద ఎవరు ఉన్నారో కనుగొనవలసియున్నది. ఎవరైనా తట్టుచున్నట్లయితే వెళ్ళి, "ఎవరది?" అని అనుము. ద్వారమును తెరువుము. "నీవు ఎవరవు? నీకేమి కావాలి?" ఓ, చాలా… అతడు చాలా గొప్ప వ్యక్తియై ఉండవచ్చును. ఒకవేళ అతడు గొప్ప వ్యక్తి అయినట్లయితే? ఒకవేళ నీవు ద్వారము తెరిచినట్లయితే వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి అయినట్లయితే, అది నీకు ఎంతో గౌరవముగా ఉంటుంది.
46కొన్ని సంవత్సరముల క్రితం, అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ దేశమునకు ఒక ఫరోగా ఉన్నప్పుడు ఇది జరిగియున్నట్లయితే నీవేమంటావు? ఈ వీధి దిగువన ఉన్న ప్రాంతములో ఒక చిన్నవాడు జీవిస్తున్నాడు లేక దిగువ వీధులలో ఎక్కడో జీవిస్తున్నాడు, మీకు తెలుసా, ఒక ఉదయకాలమున తన ద్వారము వద్ద తలుపు తట్టుచున్న శబ్దమును అతను వినియున్నాడు, మరియు అతడు ద్వారము వద్దకు వెళ్ళియున్నాడు, మరియు ఈ చిన్న జర్మను అక్కడ నిలువబడియున్నాడు, మరియు ఆ ద్వారము వద్ద అడాల్ఫ్ హిట్లర్ నిలబడియున్నాడు? ఎందుకు, అతడు ఆ సమయములో జర్మనీ దేశములో ఎంతో ప్రముఖమైన వ్యక్తియైయున్నాడు, గమనించారా. నిశ్చయముగా, ఎందుకు, అతడు ఒక గొప్ప వ్యక్తిగా యున్నాడు.
మీకు తెలుసా, ఆ చిన్న వ్యక్తి ఏమి చేసియున్నాడో? అతడు దాదాపుగా సృహ కోల్పోయున్నాడు. అతడు నిటారుగా నిలబడి, జర్మనీ దేశపు వందనమును తెలియచేసి, ఇలా అన్నాడు, "జర్మనీ దేశపు గొప్ప ఫరో, చిన్నదైన నా ఈ గృహములోనికి రమ్ము, మీరు ఏమైననూ ఆశించిన యెడల, నీ సేవకుడు చేయగలిగినది ఏదైనను ఉన్న యెడల నాకు తెలియచేయుము. నేను దానిని సంతోషముగా చేస్తాను."
ఓ, అది ఎంతటి గొప్ప గౌరవమైయున్నది! అది ఏమిటో మీకు తెలుసా? జర్మనీ దేశములోని ప్రతియొక్క వార్తాపత్రిక ఈ వార్తతో నిండిపోయున్నది, అదేమిటంటే, ప్రముఖుడైన అడాల్ఫ్ హిట్లర్, ఒక సాధారణమైన సైనికుడి గృహమునకు వెళ్ళియున్నాడు మరియు ద్వారము తట్టి ఏదో అడిగియున్నాడు, ఆ సైనికుడిని హిట్లరు ఏదో అడిగియున్నాడు, మరియు అతని ఇంటికి హిట్లర్ వచ్చుట ద్వారా అతని ఇంటికి ఎంతో గౌరవమును ఇచ్చియున్నాడు. మంచిది, అది ఎంతో గొప్ప కార్యమైయున్నది.
47ముస్సోలిని జీవించివున్న కాలములో మీరు ఇటలీ దేశములో ఉన్నట్లయితే, మరియు ఇటలీలోని రోమ్ నగరమునకు ముస్సోలిని ఒక నియంతగా ఉన్నాడు. మరియు వీధులలో ఉండే ఒక పేదవాని ఇంటి యొక్క ద్వారము దగ్గర శబ్దము వినబడినప్పుడు, ఆ పేదవాడు ద్వారము తీయగా ఎదురుగా ముస్సోలిని నిలబడియున్నట్లయితే ఏలాగుండును? ఓ, మై! వారి హృదయములు వణికిపోతాయి, మంచిది, "గొప్ప నియంత, నా గృహములోనికి వచ్చి గొప్ప గౌరవమును ఇచ్చియున్నాడు." వణుకుచూ "నేను ఏమి చేయగలను? మీరు ఆశించినది ఇక్కడ ఏమైనా ఉన్నదా? నీ కొరకు నీ సేవకుడు చేయుటకు ఇక్కడ ఏమైనా ఉన్నదా?" ఓ, ముస్సోలిని తన గృహమునకు వచ్చుట అక్కడ ఉన్న ఏ రోమీయుడకైనను ఎంతో గొప్ప గౌరవమైయున్నది.
48లేక ఈ టూసన్ పట్టణమునకు ఇంగ్లాండ్ దేశము యొక్క రాణి వచ్చినట్లయితే అది ఏలాగుండును? మరియు ఇక్కడనే ఉన్న విమానాశ్రమలో దిగియుండి, మరియు మనలో ఎవరో ఒకరి ఇంటికి వచ్చినట్లయితే, మనలో ఒకరి…? మనమందరము సాధారణమైన ప్రజలైయున్నాము. మరియు ఇంగ్లాండు యొక్క రాణి ఇంగ్లాండు నుండి వచ్చి, సముద్రమును దాటుకొని, ఇక్కడనే ఉన్న విమానశ్రయములో దిగి, బాడుగకు ఒక కారును తీసుకొని, నేరుగా వచ్చి, మరియు మీ ద్వారమును తట్టినట్లయితే.. మరియు మీరు, ఒక గౌరవము కలిగిన ఒక స్త్రీ కాని లేక పురుషుడైనా, ద్వారము దగ్గరకు నడచి వెళ్ళి, "మీరు ఎలా ఉన్నారు?" ఆమె అక్కడ ఒక సాధారణమైన స్త్రీ వలె నిలబడియున్నది. మరియు మీరు ఇలా అన్నారు, "మీరు ఎలా ఉన్నారు? మీరు ఎవరు?"
"నేను ఇంగ్లాండు మహారాణిని," అని ఆమె తనని తాను పరిచయం చేసుకున్నది.
ఓ, మై! ఎటువంటి ధన్యత, ఎటువంటి గౌరవము, టూసన్ లోని ప్రతియొక్క వార్తా పత్రిక, అమెరికా దేశములోని ప్రతియొక్క వార్తాపత్రిక… ఆరిజోనాలోని ఒక పట్టణమైన టూసన్కు ఇంగ్లాండు యొక్క గొప్ప రాణి వచ్చి మరియు ఒక పేదవానిని దర్శించియున్నది అనేది ఒక జాతీయ వార్తగా వ్రాయబడుతుంది. ఆ రాణి తనను తాను తగ్గించుకొని నా గృహమునకు వచ్చి ద్వారమును తట్టుట ద్వారా ఆ రాణి యొక్క మర్యాద ఇంకనూ పెరిగియున్నది. ఎందుకు, మీరు ఏమని చెబుతారో తెలుసా? ఆమె లేక మీరు ఆమె యొక్క రాజ్యము భూభాగములో లేరు, కాని, అయిననూ ఆమె మీకు గొప్ప వ్యక్తియైయున్నది. దేశములన్నింటిలోకి… ఆమె అందరికన్నా గొప్ప రాణియైయున్నది. ప్రపంచములో ఆమె గొప్ప రాణియైయున్నది.
ఎందుకు, మీరు ఇలా అని ఉండవచ్చును, "గొప్ప రాణి, మా గృహములోపలకు రమ్ము, మరియు మీరు తీసుకొనుటకు ఇచ్చట ఏమైనా ఉన్న యెడల తీసుకొనుము, లేక మీరు ఏదైనా చేయాలనుకున్నయెడల, మీరు ఆ విధముగా చేయుటను మేము స్వాగతిస్తాము." ఎందుకు, ఖచ్చితముగా, మరియు అన్ని వార్తపత్రికలు ఈ వార్తతో నిండిపోతాయి.
49లేక ఈ ఉదయకాలము, మన యొక్క అధ్యక్షుడైన కెన్నడీ మీ ద్వారము దగ్గరకు వచ్చినట్లయితే.. ఓ, రాజకీయపరముగా నీవు అతనితో విభేధించవచ్చును, అయిననూ అతడిని నీవు లోపలకు అనుమతిస్తావు. ఎందుకు? అతడు ఒక సాధారణమైన మానవుడు అన్న దానినిబట్టి కాదు కాని, అతడు ఎవరైయున్నారంటే, ఈ అమెరికా దేశమునుకు అధ్యక్షుడైయున్నాడు, అందుచేత నీవు అతనికి అనుమతిని ఇస్తావు. రాజకీయపరముగా నీవు అతడిని (నా వరకు) విభేదించినప్పటికిని అనుమతిని ఇస్తావు. కాని అధ్యక్షుడైన కెన్నడీ నీ ద్వారము దగ్గరకు వచ్చుట ద్వారా నీవు గౌరవమును పొందుకొనుచున్నావు.
ఒకవేళ నీ కొరకు అతడు ప్రత్యేకమైన ప్రయాణమై నీ ద్వారము దగ్గరకు వచ్చినట్లయితే అది ఎలాగుండును? ఎందుకు, "ఎంతో తగ్గింపు కలిగిన అమెరికా దేశపు అధ్యక్షుడైన కెన్నడీ, ఆరిజోనాలోని టూసన్ కు ఆకాశమార్గమున వచ్చి మరియు జాన్ డోయి ఇంటి ద్వారము దగ్గరకు వచ్చెను" అనునది ప్రతియొక్క చోట ఒక వార్తగా ఉండును. అది అతనికి ఎంతో గొప్ప గౌరవముగా ఉండును, మరియు అది నీకును గౌరవమే, ఎందుకు, నీవు అతడిని వెళ్ళిపొమ్మని చెప్పవు. నిస్సందేహంగా చెప్పవు! నీవు తప్పక అతడిని ఆహ్వానించుతావు, ఎందుకనగా అతడు గొప్ప వ్యక్తియైయున్నాడు.
REV 3:20
50కాని, యేసు కన్నా గొప్పవారు ఎవరున్నారు? మరియు నియంతల మరియు నాయకులందరి ద్వారముల యొద్ద నుండి ఆయన వెనుతిరిగి వెళ్ళిపోయి ఉన్నాడు, అవును. "నేను ద్వారము యొద్ద నిలబడి తట్టుచున్నాను, మరియు ఎవడైనను నా స్వరము విని తలుపు తెరచినయెడల, నేను లోపలికి వచ్చి అతడితో భోజనము చేయుదును."
ఓ, ద్వారము యొద్దకు మనము వచ్చునప్పుడు చిన్నచిన్నగా తట్టుచున్నాడు, యేసు చాలాసార్లు మన హృదయ ద్వారమును తట్టుచున్నాడు. ఈ దినము సంఘము అచ్చటనే ఉన్నది. ఈ చిన్నగా తట్టుచుండుట, ఇప్పుడే నీవు దానిని అనుభూతిని చెందుతున్నావనుటలో సందేహము లేదు. అది ఏమైయున్నది? అది యేసు లోపలికి వచ్చుటకు చేయుచున్న ప్రయత్నమైయున్నది, నీ హృదయ ద్వారము ద్వారా లోపలకు రావటానికి ప్రయత్నము చేయుచున్నాడు. ఆయన పొందుకున్నాడు… కొద్దిసేపు ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు.
మరియు ఒకవేళ దేశాధ్యక్షుడిని గౌరవించినట్లయితే, మరి యేసు సంగతి ఏమిటి? దేశాధ్యక్షుడనే నీవు వెనుతిరిగిపోనియ్యలేదు కదా, మరి యేసును నీవు వెనుకకు పంపుతావా? దేశాక్షుడు కేవలం ఒక మానవుడైయున్నాడు, అతడు తప్పక మరణిస్తాడు. కాని యేసు నీ దేవుడైయున్నాడు! ఆయన నీ యొక్క న్యాయాధిపతియైయున్నాడు. అది మాత్రమే కాదు, కాని ఆయన ఒక్కడే న్యాయాధిపతిగాను, మరియు రక్షకునిగాను యున్నాడు.
1JN 2:25
51ఇప్పుడు, నీ దేశాధ్యక్షుడు తన సైన్యము చేత నీకు ఆజ్ఞాపించవచ్చును, మరియు అతడు ఆజ్ఞాపించినది నీకు ఎంతో భయానకముగా ఉండవచ్చును. నీ నుండి ఏదైనా లేక నీ పిల్లలను అతడికి సేవకులు ఉండుటకు లేక ఇంకేదైనా తీసుకురమ్మని అతడు ఆజ్ఞాపించియుండవచ్చును, మరియు అటువంటిది ఏదో అతడు చేయవచ్చును. కాని, అటువంటిది ఏది యేసునకు అవసరము లేదు; ఆయనే నీకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ కారణము చేతనే ఆయన ద్వారమును తట్టుచున్నాడు. ఆయన నీ కొరకు ఏదో సిద్ధపరచియున్నాడు. ఆయన నీకు ఇవ్వాలి అనుకునే దానికన్నా ఈ ప్రపంచములో గొప్పది ఏదీ లేదు. అదియే పరిశుద్ధాత్మయైయున్నది. ఆయన నీకు నిత్యత్వమును ఇవ్వాలని కోరుచున్నాడు.
JAS 1:12•
REV 2:10
52ఒకవేళ దేశాధ్యక్షుడు ఈ విధముగా చెప్పినట్లయితే, "నేను నీ దగ్గరకు వచ్చిన కారణమేమంటే, నిన్ను అమెరికా దేశమునుకు అధ్యక్షునిగా చేయుటకు నేను అధికారమును కలిగియున్నాను" అప్పుడేమగును. కొద్దిసేపటి తరువాతయైనా నీవు దాని కొరకు సమస్తము ఇవ్వవలసియుంటుంది. రాణి నీకు కిరీటమును పెట్టి నిన్ను ఇంగ్లాండు దేశపు రాణిగా చేయాలనుకుంటుంది అని అంటే, అప్పుడు నీవేమి చేస్తావు? నీవు నీవు దానికొరకు సమస్తము ఇవ్వవలసియుంటుంది. కాని యేసు మనకు జీవకిరీటమును ఇచ్చుచున్నాడు, మరియు అది కలుషితములేనిదై, మహిమా కిరీటముగా ఉన్నది, దాని కొరకు నీవు ఏమియు ఇవ్వనవసరములేదు. దాని కొరకు నీవు ఏమియు ఇవ్వవలసినది లేదు. ఆయనే నీకు ఇచ్చుచున్నాడు, అది ఒక ఆశీర్వాదమైయున్నది. మనకు జీవితంలో పరిశుద్ధాత్మను ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు.
దాని నుండి మనము ఏలాగు వ్యతిరేకించి తిరిగి వెళ్ళిపోగలము? సంఘము ఎంత వ్యర్ధమైన కార్యాము చేసియున్నది. ద్వారము వద్ద తట్టుచున్నప్పుడు ప్రజలు దాని వినుటకు నిరాకరించుట ద్వారా ఎంత పెద్ద తప్పిదమును చేసియున్నారు. ఈ ఉదయకాలము ఆ ద్వారము దగ్గర తట్టుచున్న శబ్దము నుండి తప్పుకొని వెళ్ళిపోవుట అనునది ఏ స్త్రీకైనా లేక పురుషుడికైనా ఎంత అమానుషమైనది. వారు నిత్యజీవము నుండి వెళ్ళిపోయియున్నారు.
53మరియు తీర్పు మేఘములు కమ్ముకొనుట మనము చూస్తున్నాము మరియు గమనిస్తున్నాము, మధ్యరాత్రికి ముందు మూడు నిముషములు అని సైన్సు చెప్పుచున్నది. మరియు వాస్తవముగా చాలా సంవత్సరముల క్రితమే అందులోని రెండు నిముషములు గడిచిపోయాయి. మరియు సంఘము చెదిరిపోవుట మనము చూస్తున్నాము. మనము అదంతయూ ఆ విధముగా జరుగుటను మనము చూస్తున్నాము, మరియు చల్లబడిపోయిన మతశాఖ నుండి మతశాఖ వచ్చుచున్నది. మరియు ఉజ్జీవ దినములు దాదాపుగా ముగిసిపోయి ఉన్నాయి. మనము అందరము సత్యమును ఎదుర్కొనుచున్నాము.
ఓ, ఖచ్చితముగా మనము చాలా శబ్దములను వినుచున్నాము, పియానో వాయించుట, పైకి క్రిందకు ఎగురుట. స్త్రీలు, మరియు భుజముల వరకు జుత్తు కత్తిరించుకొనుట, మరియు నీలిరంగు కన్నులు, మరియు స్త్రీలు ఆ విధముగా చేయుటకు పురుషులు అనుమతిని ఇచ్చుట, అవి అన్ని జరుగుచున్నాయి. అది లేఖనమునకు వ్యతిరేకమైయున్నది.
54ఈ దినములలో మనము అటువంటివి వీధులలో చూచుట ఎంతో అసహ్యకరముగా ఉన్నది!
నిన్నటి దినమున, నేను నా పిల్లలను తీసుకుని… అక్కడ జరుగుచున్న ప్రదర్శనను వారు చూడాలని అని నా చిన్న పిల్లలు కోరుటచేత… నా తండ్రిగారు అక్కడ నడుపువారుగా ఉన్నారు, మరియు నేను కూడా అక్కడ చిన్న స్వారీ చేసియున్నాను, మరియు అది వారికి గుర్రములను నడుపుచున్నట్లుగా ఉండును. మరియు వారు గుర్రములను చూడాలని ఆశపడ్డారు. మరియు నేను వీధిలో అకస్మాత్తుగా ఆగిపోయాను, నా లోపల ఏదో బలహీనముగా అనిపించుట ప్రారంభించినది, వెంటనే వెనుకకు తిరిగియున్నాను, ఈ దినము ప్రజలు ఏ విధముగా ఉన్నారో చూశారా… జరిగిపోయిన కాలములో వారు జీవించాలని కోరుకుంటున్నారు, అటువంటి ఏదో దానిలో జీవించాలని ప్రయత్నము చేయుచున్నారు.
మనము మారుతున్న ప్రపంచములో ఉన్నాము. మరియు అది నిరంతరము మారుచున్నది. నా దేశములో (పుట్టుకతోనే నేను కెంటకీవాడినని మీకు తెలుసు. వాస్తవానికి నా వారంతా అక్కడే నివసిస్తున్నారు,) మరియు వారికి అక్కడ రెన్ప్రో లోయ ఉన్నది. వారు కొండ ప్రాంతములలో నివసిస్తూ మరియు కిరోసిన్ లాంతరులు వెలిగించుకొని, మరియు కట్టెల పొయ్యి మీద వండుకునే వారు కత్తిరించుకుని ధరించు వస్త్రముల వలె ధరించుటకు ప్రయత్నము చేయుచున్నారు. వారు మారుతున్న ప్రపంచములో ఉన్నారు, ఈ ఆధునిక సమయములో వెనుకకు వెళ్ళి వారివలె జీవించుట వారికి వ్యత్యాసముతో కూడుకున్నదానివలె ఉన్నది. మానవుడిని ఆ విధముగా చేయునట్లుగా చేయునది ఏమున్నది? మరేమియు లేదు కాని, అతడు అలాగు జీవించాలని కోరుకుంటున్నాడు.
DEUT 22:5
55కాని, మీరు తీసుకొనివచ్చుటకు ప్రయత్నము చేయనుచున్న ఈ సువార్తలో మాత్రము ఎన్నడు మార్పురాదు, అది వారికి అవసరము లేకున్నది. ఎప్పటికి అప్పుడు మారుచున్న ఆధునికమైనది వారికి కావలసియున్నది, ఎవరో ఒకరు వారిని భుజము మీద తట్టి కేవలం సంఘములో చేరుము మరియు మీకు నచ్చినట్లుగా జీవించుము అనునది వారికి చాలును. కాని నిజానికి సువార్త తట్టు తిరుగుట, అది వారికి అవసరము లేదు. మరియు వారికి ఉన్న ఏకైక దాహము ఏమిటంటే, సువార్త కొరకు వెనుకకు తిరుగుటయే, మరియు వారు భూసంబంధమైన కార్యములు వెనుకకు తెచ్చుటచేత తృప్తి పొందుచున్నారు, మరియు ఆత్మీయ కార్యములను వ్యతిరేకించుచున్నారు. గమనించారా, ఏలాగు దుష్టుడు వాక్యమును తెలివిగా ప్రజలయెదుట మార్చివేసియున్నాడో?
నా సోదరిలారా దీనియందు మీకు ఏదియూ అలక్ష్యములేదు, కాని పాతకాలములో స్త్రీలు ఏ విధముగా వస్త్రములు ధరించుకుని పట్టణమునకు వచ్చేవారో నేను గత దినము చూశాను, ఒక జత వస్త్రములు ధరించుకుని… ఆ వస్త్రముల లోపలి ఆ స్త్రీ ఏలగు వెళ్ళినది. చూచుటకు ఆమె యొక్క శరీరము బయటకు వస్తుందేమో అనునట్లుగా ఉన్నది. ఆ స్త్రీ యొక్క పాదములు ఆ వస్త్రములలో గుండా ఎలాగు వెళ్ళినవా అని నేను ఆశ్చర్యపోయాను. వీధులలో నడుచుకుంటూ, పురుషుని యొక్క వస్త్రములు స్త్రీలు ధరించుట దేవునికి అసహ్యము అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
మరియు కన్నులకు వెనుక నీలిరంగును పూసుకొనుట, ఒకవేళ ఆమె గనుక ఆ పాతకాలపు పట్టణమునకు వెళ్ళినట్లయితే, అక్కడ ఉన్న ఆ పాతకాలపు వైద్యుడు ఆమెను తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో ఉంచుతాడు, మరియు ఆ స్త్రీ కలిగియున్న వ్యాధి, ఆమె మరణించుటకు ముందుగా ఆ పట్టణములో ఎవరికి రాకుండా ఆమెను పట్టణము నుండి వేరు చేస్తాడు. అది నిజము. అది ఒక వ్యాధియైయున్నది!
REV 3:17
56మరియు నీవు వెనుకకు వెళ్ళి జీవించుటకు ప్రయత్నము చేస్తున్నట్లయితే, నీవు తప్పక పరిశుద్ధాత్మ యొక్క ఆ పాతకాలపు సువార్తను వ్యతిరేకిస్తావు, మరియు పెంతెకోస్తు దినమున ఉన్న మాదిరిగా అవే లక్షణములు దానిలో ఉండి మనలను శుభ్రపరచి మరియు నూతన జీవులుగా చేయుచున్నది. మనము ఛాయలో జీవిస్తున్నాము, మరియు లవొదికయ సంఘకాలములో ఉన్న ఈ సంఘము, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమి కొదువలేదు అనుకొనుచున్నది.
ఇప్పుడు, పెంతుకోస్తులమైన మనము బాప్టిస్టుల గురించి మరియు మెథడిస్టుల గురించి అధికముగా కేకలు పెట్టము, ఎందుకనగా టీ పెట్టుకొను పాత్రను నీవు నల్లగా ఉన్నావు అని కుండ అనలేదు అని మీకు తెలుసు. మనము కూడా అదే పని చేస్తున్నాము. ఇప్పుడు అదే నిజమైయున్నది.
REV 3:20
57మరియు "ఇదిగో, ద్వారము వద్ద నిలబడి నేను తట్టుచున్నాను, మరియు ఎవరైనను." ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఈ కాలములో ఆయన సంఘమునకు వెలుపట ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, తిరిగి లోపలకి రావటానికి ఆయన ప్రయత్నము చేయుచున్నాడు. ఇప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యమును వివాదస్పదము చేయలేవు? గమనించరా? ఆయన లోపలకు వచ్చుటకు ప్రయత్నము చేయుచున్నాడు, లోపలికి రావటానికి ఆయన బ్రతిమాలుకొనుచున్నాడు. "ఎవరైనను ద్వారము తెరచి నన్ను లోపలికి అనుమతించినట్లయితే [ఓ!], నేను లోపలకు వచ్చి మరియు అతడితో కూడా భోజనము చేయుదును," గమనించారా. నీతో మాట్లాడుటకు ఆయన ఏదో కలిగియున్నాడు, ఏదో ఒక వ్యవహారమో, లేక రక్షణకు మార్గమో ఏదో ఆయన యొద్ద నీ కొరకున్నది. నీతో ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు. కాని నీవు ఆచారములతో మరియు చాలా కఠినముగా ఉన్నావు, వ్యత్యాసముగా, ఆయన మాటలు వినుటకు నీవు సిద్ధముగా లేవు. అది సత్యమైయున్నది. "ఇదిగో, నేను ద్వారము యొద్ద నిలబడియున్నాను."
"ఓ, బ్రదర్ బ్రెన్హాం, ఒక్క నిముషము ఆగుము, నేను ఎప్పుడో ఆయనను లోపలకి అనుమతించాను" అని నీవనవచ్చును. కాని బహుశా నీవు చేసినదంతా అదియే అయ్యుండవచ్చును, కేవలం ఆయనను లోపలికి అనుమతించావు. మీరు గమనించారా, చాలామంది ప్రజలు లేరు. పాతాళము యొక్క ప్రతి ఆలోచనను బట్టి వారు భయపడుచున్నారు, మరియు క్రీస్తు లేకుండా వారు వెళతారని వారికి తెలుసు. మరియు వారు "మంచిది, నేను ఆయనను లోపలికి అనుమతించాను. ఖచ్చితముగా, ముప్పై సంవత్సరముల క్రితం, ఇరవై సంవత్సరముల క్రితం అనుమతించాను" అని అంటారు. కాని కేవలం అది మాత్రమే మీరు చేసియున్నారు.
58ఒకవేళ మీ ఇంటికి నేను వచ్చి ద్వారము తట్టినట్లైయితే, మరియు నీవు ఇలా, "బ్రదర్ బ్రెన్హాం, లోపలికి రమ్ము" అని యున్నట్లయితే, [నేను లోపలకి వస్తాను], కాని నీవు అక్కడే నిలబడియుండుము, లోపలికి వెళ్ళి అంతా పరిశోధించవద్దు, నా గృహము లోపలకు వెళ్ళవద్దు," గమనించారా.
ఇప్పుడు, మానవుని హృదయ ద్వారము లోపల మనకు రహస్యగదులున్నాయని మీకు తెలుసా? ఓ, మనము దానిని ఒప్పుకొనము, కాని అది సత్యమైయున్నది. ఖచ్ఛితముగా, మనకు లోపల రహస్యగదులున్నాయి. అవునయ్యా. మనము వాటిని ఇలా పిలుస్తాము… మన హృదయము లోపలికి పిలుస్తాము, కాని ఆయనను మన ప్రభువై యుండాలని కోరుకొనము. మనము పాతాళమునకు వెళ్ళాలను కోరుకొనము, కాబట్టి "యేసు, నీవు ద్వారము కోపలికి రమ్ము, అందుచేత నేను పాతాళమునకు వెళ్ళను, కాని ఇప్పుడు నీవు ఎన్నటికి నాకు ప్రభువు కాలేవు." ఇప్పుడు, "ప్రభువు" అనగా యజమాన్యము. దాని అర్ధము, ఆయనను నీవు ప్రభువుగా లోపలికి అనుమంతించినట్లయితే, ఆయన సమస్తమును నియంత్రిస్తాడు. అప్పుడు అది ఆయన గృహమైయున్నది.
మీ గృహమునకు నేను వచ్చి మరియు ద్వారము తట్టినట్లయితే, ఒకవేళ మీరు నన్ను వద్దనుకుంటే, "నా ద్వారము వద్దనుండి తొలగిపొమ్ము" అని అంటారు. మీరు నన్ను ద్వారము లోపలికి ఆహ్వానించినట్లయితే, నేను దాన్ని అభినందిస్తాను, మరియు మీరు, "ఇప్పుడు, లోపలి భాగములలోకి నీవు వెళ్ళవద్దు. నీవు అక్కడనే నిలబడుము. ఇప్పుడు, చెప్పు నీకు ఏమి కావాలో?" అప్పుడు నేను, నన్ను ఆహ్వానించినట్లుగా అనుభూతిని చెందవలసియున్నదా? నేను ఎందుకని వచ్చానో నీకు చెప్పవలసియున్నదా? నిశ్చయముగా లేదు. మరియు, స్నేహితుడా, సంఘము నేడు ఆ విధముగానే ఉన్నది. ప్రజలు ఆ విధముగానే స్వాగతిస్తున్నారు, "ప్రభువా! లోపలికి రమ్ము, కాని అంతవరకే చాలును. చెప్పుము, నీకేమి కావలసియున్నదో?" గమనించారా? ఓ, లేదు! అక్కడనే మనము సమస్యలో పడియున్నాము.
59మనము ఆయనను ఈ విధముగా స్వాగతించవలసియున్నది, "ప్రభువా, నా గృహములోపలకి రమ్ము. నీకు కావాల్సినది ఏదైనా ఉన్న యెడల నీయంతటగా నీవు చేయము, నేను నీ వాడిని; మరియు నీవు నా వాడివైయున్నావు. నీవు, నన్ను గౌరవించియున్నావు. గొప్ప రాజు, భూమి ఆకాశములను సృజించివాడు నా ద్వారమును తట్టుచున్నాడు మరియు ప్రభువా! నీవు లోపలకి రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువా, నాకు ప్రభువుగా ఉండుము. నన్ను తీసుకొనుము, నా నిమిత్తము నీవు చేయాలనుకున్న సమస్తమును చేయుము. నాలో చెడిపోయినవి ఏమైనా ఉన్నయెడల, నా హృదయములో రహస్యముగా ఏదైనా చెడిపోయినవి ఉన్నయెడల వాటిని కనుగొనుము, ప్రతి ద్వారములోపలకి వెళ్ళుము. ప్రభువా, నా లోపల అంతా వెదుకుము. నా లోపల ఏమి తప్పిదము ఉందో గమనించుము. మరియు ప్రభువా, నా లోపల ఏదైనా తప్పు ఉన్నట్లయితే నాకు కనుపరచుము. ద్వారము నుండి దానిని బయటకు విసిరివేయుము. నీవు ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను నా ప్రభువుగా నేను స్వాగతిస్తున్నాను. ప్రభువా, నేను ఆ ఆశీర్వాదమును పొందుకొనలేదు. ఇప్పుడే నన్ను శుద్ధిచేయుము ప్రభువా."
నేను ఆయనను నా యొక్క పరిపూర్ణమైన ప్రభువుగా అంగీకరించికపోయినట్లైతే, నేను ఎన్నడు ఆయన కొరకు ద్వారమును తెరువను. ఆయన ప్రభువు కానట్టెయితే… ఆయన కేవలం నాకు రక్షకుడుగా ఉండాలని నేను కోరుకోవటంలేదు, ఆయన ప్రభువు కానట్లయితే, నేనైతే… ప్రతియొక్కరికి రక్షకుడు కావలసియున్నది కాని, వారికి ప్రభువు అక్కరలేదు. వారు కేవలం పాతాళమును తప్పించుకొనుటకు మాత్రమే ఎదురుచూస్తున్నారు, మరియు వారు తమకు కావలసియున్నట్లుగా వారు జీవించ ఉద్దేశించియున్నారు, వారు ఏదైతే చేయాలనుకుని యున్నారో దాని చేయుటకు సిద్ధముగా ఉన్నారు.
60మీకు తెలుసా, హృదయమనే భవనము చుట్టు తిరుగుము. తరువాత పది నిముషములలో మీరు నా దగ్గర నిలబడండి? చూడండి. గమనించండి, ఒక్క నిముషము హృదయము చుట్టూ తిరగండి. మానవుని హృదయములోనికి మీరు వెళ్ళినప్పుడు మీరు మొదటగా వెళ్ళేది, కుడి ప్రక్కకు మీరు వెళ్ళినట్లయితే, అక్కడ ఒక చిన్న ద్వారమున్నది, అది ఏమిటంటే, "ఇది నా వ్యక్తిగత జీవితం." ఇప్పుడు, మీరు దానిలోపలకు ఎవరనీ రానియ్యాలని కోరుకొనరు.
"ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకున్నట్లయితే, నా స్వంత వ్యవహారమైయున్నది. నేను సంఘములో చేరతాను, మరియు నేను ఆ దిగువకు వెళతాను. కాని, ప్రసంగికుడా, నేను ఏమిచేయవలెనో నాకు భోదించవద్దు." ఓ, అవును, గమనించారా? "ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పినదని నాకు తెలుసును, కాని నేను దాన్ని నమ్మను." ఓ, గమనించారా? అప్పుడు అటువంటి హృదయములో యేసు ఇంకనూ ఉంటాడని తలంచుచున్నారా? లేదు, నిస్సందేహంగా ఉండడు. ఆయన ప్రభువుగా రావలసియున్నది. ఆయన లోపలికి వచ్చి… ఆయన… ఆ యొక్క వ్యక్తిగత జీవితంలోకి, ఓ, అది ఎంతో గొప్ప సంగతియైయున్నది. ఇప్పుడు, మీకు తెలుసు మనకు మన యొక్క వ్యక్తిగత జీవితములున్నాయి. "మన పొరుగువానితో కలసి సాముహిక మద్యపానము చేయుట మనకు స్వంత వ్యవహారమైయున్నది. ఒక స్త్రీ తన వెంట్రుకలను కత్తిరించుకొనుట, అది తమ అమెరికా యొక్క స్వంత గౌరవమైయున్నది. మనకు కురచ దుస్తులు ధరించవలెనని కోరిక కలిగియున్నట్లయితే, అది మన స్వంత వ్యవహారమైయున్నది. పురుషులు సాముహిక మద్యపానము చేయుచున్నప్పుడు, మరియు మన యొక్క భార్యలు కూడా దానిని చేయవలెనని కోరుకొనుట, ఆ వ్యవహారమందు నీవు ఒక్క మాటను కూడా మాట్లాడుటకు నీకు అధికారము లేదు, ఎందుకనగా అది మా యొక్క స్వంత వ్యవహారమైయున్నది."
కాని సువార్త ఇలాగు చెప్పుచున్నది, "దానిని చేయవద్దు!" ఇప్పుడు ఎవరి యొక్క మాటలు సత్యమైయున్నవి. గమనించారా? దేవుని యొక్క వాక్యము సత్యమైయున్నది.
1THS 5:2•
2PET 3:10•
REV 3:3•
REV 16:15
61ఓ, ఖచ్చితముగా, మనకు యేసు కావలసియున్నది. నిస్సందేహముగా, మనము ఆయనను కలిగియున్నామని తలంచుచున్నాము, మరియు అందరికి అది నచ్చుతుంది. కాని ఎత్తబాటు దాటిపోయిందటే నేను ఆశ్చర్యపోతాను, మరియు మనము ఒక దినము ఒంటరిగా విడిచిపెట్టబడతాము, అప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది అని మరియు అది నిజముగా అదృశ్యముగా వచ్చినదని ఆశ్చర్యపోతామని మీకు తెలుసా, మరియు రాత్రివేళ ఒక దొంగ మాదిరిగా రాబోవుచున్నది అదియే. మీరు… ఐదు లక్షల మందిలో, పది లక్షలమందిలో తొంభై-తోమ్మిది మందికి ఎత్తబాటు జరిగింది అనేది కూడా తెలియదు. అది వెళ్ళిపోతుంది; మరియు వారికి దాని గురించి ఏమియు తెలియదు. యేసు దానిని చెప్పియున్నాడు. కావున అది సత్యమైయున్నది. ఖచ్చితముగా, అది రాత్రివేళ ఒక దొంగ వచ్చి దోచుకొనిపోవునట్లుగ ఉంటుంది.
ఒకసారి నేను చదివియున్న పుస్తకముగా మాదిరిగా అది యున్నది. ఆ మనుష్యుడు ఎవరు? రోమియో మరియు జూలియట్, లేక అటువంటిది ఏదో, చూశారా — అతడు రాత్రివేళ వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు.
62యేసు కూడా అదే మాదిరిగా చేయును. పరిశుద్ద గ్రంథము చెప్పియున్నట్లు లోకమంతా నిద్రలో జోగుతుండగా, లవొదికయా సంఘకాలము, ఆయన లోపలికి వచ్చి వధువును తీసుకొనిపోవును.
కాలములన్నింటిలో నుండి, దిగువన ఉన్న కాలములలో ఉన్నవారు, పునరుత్తానము చెందినవారందరు పరలోకము వెళ్ళు వధువులో కలుస్తారు. అటు తరువాత తీర్పు వస్తుంది. సంఘము ఇలాగు అంటుంది, "మంచిది, ఒక్క నిముషము ఆగుము. ఒక వధువు ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఒక వధువు మరియు ప్రభువు యొక్క రాకడ ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను." అది ఎప్పుడో వెళ్ళిపోయినది. నీకు దాని గురించి ఏమియు తెలియదు. అది రహస్యముగా వచ్చినది.
ఎందుకు? మనము ఇలాగు అంటాము, "ఓ, నేను ఆ సంఘమునకు చెందినవాడను. నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను పెంతెకోస్తును." అది ఏదియూ దేవునికి సంభందించినది కాదు. అది నీకు కాన్సరు ఉన్నది అని చెప్పు వైద్యునికన్నా మేలైనది ఏదియు కాదు, అది చివరి స్థితిలో ఉన్నది. మరియు అది ఆ యొక్క వ్యాధిని ఏమియూ చేయలేదు. అది కేవలం ఆ వ్యాధికి పేరును మాత్రం పెట్టును. కాన్సరు ఒక దెయ్యము. మీరనవచ్చును, "అది ఒక పావురమైయున్నది. అది ఒక రకమైన రాబందుయైయున్నది." అది ఆ వ్యాధిని ఏమియూ చేయలేదు. అది దానిని స్వస్థపరచలేదు. అది దానిని చంపలేదు; అది కేవలం ఏమైయున్నదో చెపుతుంది అంతే.
63నీవనవచ్చును, "నేను ఒక క్రైస్తవుడని. నేను ఒక…" బహుశా అది వృత్తిపరంగా అయ్యుండవచ్చును. చూశారా, మన యొక్క జీవితములు సాక్ష్యము వినపడనంత అధికముగా పలుకుతున్నాయి, మన జీవితములు, మన చేయు పనులు, మన మధ్యలో ఉన్న మన నీతులు.
"అక్కడ వారు ఒక ఉజ్జీవమును కలిగియున్నారు."
"ఎవరు దానిని కలిగియున్నారు?"
"బాప్టిస్టువారు."
"ఆహా, మనందరకి దానితో ఏపనియూ లేదు." మరియు బహుశా దేవుడు మన కొరకు ఒక వర్తమానమును కలిగియున్నాడు.
"ఎవరు దానిని కలిగియున్నారు?"
"ది ఫస్ట్ అసెంబ్లీ వారు, ది సెకండ్ అసెంబ్లీ వారు, లేక యేసు నామములో, లేక చర్చి-ఆఫ్-గాడ్, లేక మరేదో."
"ఓ, మంచిది, మేము ఆ గుంపులోని వారము కాము."
మనమందరము సహోదరులము! దేవుని యొక్క జన్మహక్కును విడదీసే హక్కు ఎవరికైనా ఉన్నదా? నీవు పొందుకున్నట్లుగానే వారును పరిశుద్దాత్మను పొందుకొనియున్నారు, నీవు పొందుకున్నప్పుడు చేసియున్న అవే కార్యములను వారును చేయుచున్నారు. ఖచ్చితముగా. కాని ఎందుకని నేను ఈ సంపూర్ణ సువార్త వ్యాపరస్తులను ఇష్టపడతానో నీకు తెలుసా? ఇవన్ని భోధించుటకు వీరు నాకు వేదికను ఏర్పాటు చేయుచున్నారు, గమనించారా. ఇలా అనుము, "ఇదింతే. మనమందరము సహోదరులము." "మనము విడిపోయినవారము కాము — 'మనమందరము ఒకే శరీరములో ఉన్నాము,' ఒక కవి చెప్పియున్నట్లుగా."
64ఇప్పుడు, నా స్వంత వ్యక్తిగత జీవితము యొక్క ఆ చిన్న ద్వారము. "ఇప్పుడు, అది అంతయూ సత్యమే. నేను మీ సంఘములో ఒక సభ్యుడను, నేను సంపూర్ణ సువార్త వ్యాపారస్తులలో చేరియన్నాను. కాని ఇప్పుడు, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని మరియు ఆ విధముగా ముందుకు కొనసాగాలని నాతో చెప్పవద్దు," గమనించారా. అది మన యొక్క స్వంత వ్యక్తిగత జీవితమైయున్నది. నీవు అలాగు చేయుచుండగా, యేసు యొక్క ప్రభువు తత్వమును నీవు ఎన్నడు పొందుకొనలేవు. అప్పుడు ఆయన వెనుతిరిగి మరియు నడుచుకొనుచు ద్వారము గుండా బయటకు వెళ్ళిపోతాడు. ఆ విధముగా జరిగినట్లయితే నీవేమి చేయగలవు, నీవు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, "ఇక్కడే ద్వారము దగ్గర నిలబడి, నీ వ్యవహారమును చూసుకొనుము" అని చెప్పిన యెడల నీవేమి చేస్తావు?
మంచిది, నీవు "మీకు కృతజ్ఞతలు," అని ద్వారము బయటకు వస్తావు. కావున, నిస్సందేహంగా యేసు కూడా అలాగునే బయటకు వస్తాడు. ఆ కారణముచేతనే సంఘము చల్లబడిపోయి ఉన్నది, గమనించారా, అది ఆ విధముగా ఉన్నది.
పుల్ గాస్పెల్ వ్యాపరస్తులు ఆ స్థితిలో ఎన్నడు పడవద్దు.
65నీవు ఒక వర్తమానమును విన్నప్పుడు, మరియు తట్టుట వినినప్పుడు, ద్వారము తెరిచి ఇలాగ అనుము, "ప్రభువా, ఇదంతా ఏమిటి?" నీవు ఒక మనుష్యుడను చూచినప్పుడు… మనము చాలా మందిని అనుకరించువారిని కలిగియున్నాము, కాని నీవు అసలైనదానిని చూచినప్పుడు… ఇంక అక్కడ అనుకరించువారి అవసరమేమున్నది? ఒక నకిలీ రూపాయికి విలువేమున్నది, నీవు ఆ నకిలీ రూపాయిని తీసుకున్నప్పుడు, అది ఒక అసలైన దానిని ఉద్దేశించి చేయబడినది. ఒక అసలైనదానిని చూచి, ఒక నకిలీది తయారు చేయబడినది. కావున, అసలైన పరిశుద్ధాత్మ అసలైన రక్షణ యొక్క శక్తి, అసలైన దేవుని యొక్క ప్రేమ. అవును, అక్కడ ఏదియు తక్కువ కాదు. లేదయ్యా! దానిని చేయవద్దు.
అదంతయూ సరియే, ఆ వ్యక్తిగత ద్వారము. నేను ఈ ద్వారముల గుండా త్వరగా వెళ్లవలసియున్నది.
66అక్కడ గర్వము అనే చిన్న ద్వారము కూడా ఉన్నది. ఓ, మై! అది చాలా చెడ్డదై యున్నది. మనము ఆ ద్వారము వద్ద ఎక్కువ సమయము ఉండకపోవడం మంచిది. కాని నీవు ఆ పాత ద్వారము వద్ద నిలువబడి చెప్పుము, "ఇప్పుడు, నీవు నాకేమియు చెప్పవద్దు.
కొద్దికాలము క్రితం ఇక్కడ నేను, పావురము మరియు గొర్రెపిల్ల మీద ప్రసంగము చేసియున్నాను. మరియు ఆ గొర్రెపిల్ల… మీరు చూశారా, ఒక గొర్రెపిల్ల, ఒక గొర్రె, అది ఊలును తప్ప మరేది ఉత్పత్తి చేయదు. దానిని మాత్రమే అది ఉత్పత్తి చేయగలదు. మరియు అది దాని యొక్క హక్కును చెల్లిస్తుంది. నీవు ఒక గొర్రెను తీసుకొని మరియు దానిని ఒక మొద్దు మీద పడేసి, దానిని ఈ విధముగా నొక్కి పట్టి మరియు దాని శరీరమంతటి నుండి ఊలును తీస్తుంటే, అది అక్కడ కదలకుండా పడియుంటుంది. అది తన హక్కును చెల్లిస్తుంది. అది కేవలం ఊలు కొరకే పెంచబడియున్నది. అది దానికి సంబంధించియున్నది, కాని చెల్లించుచున్నది.
మీరు ఎవరికైనా తప్పక తిరిగి జన్మించాలని చెప్పినప్పుడు, అతడు తన పాపపు జీవితము నుండి శుభ్రపరచబడాలి, అతడు అబద్దము నుండి, దొంగతనము నుండి, మోసము నుండి తొలగిపోవాలి, మరియు మతాంతీకరణ (లేక అన్యమత) నుండి, మరియు అలాగనే కొనసాగుట నుండి, బాలుడా, వారిలో కొద్దిమంది బుడగ వలె పేలతారు. ఇప్పుడు, గమనించారా, అది ఒక మేక యైయున్నది. గమనించారా. అది దానిని తన్నును, కాని ఒక నిజమైన గొర్రెపిల్ల దాని యొక్క హక్కును చెల్లించును.
67మన స్త్రీలకు దాన్ని గురించి ఒకసారి నేను చెప్పియున్నాను. నేను స్త్రీలకు వ్యతిరేకని కాను, వారు నాకు సోదరీమణులైయున్నారు. కాని నేను ఈ సంఘమును గురించి అసూయ చెందుతున్నాను. అది ఎప్పుడంటే, సొదమలో ఉన్న లోకపు తత్వము సంఘములోపలకి వచ్చుటను చూచినప్పుడు, నేను దానికి వ్యతిరేకముగా కేకలు వేసియున్నాను, మార్లిన్ మన్రో యొక్క పోకడలను మీరు వెంబడించవద్దు, లేక అటువంటి స్త్రీలను మీరు వెంబడించవద్దు. పరిశుద్ధ గ్రంథములోని శారావలె ఉండండి, గమనించారా."
ఏవరో ఒక వ్యక్తివలె ఉండుటకు లేక మరొకరు ఎవరిలాగో, వీధులలో పరుగెత్తుతూ మరియు దానిని పట్టుకుంటూ, మరియు ఏవరినో సూచించులాగున వస్త్రములను ధరించుట, మరియు అలాగు ఉండుట చేయవద్దు… హాలీవుడ్లోని తనని తాను చూపించుకొను పురుషతత్వము పెంతెకోస్తులో మనకు చాలా అధికముగా ఉన్నది. అది సత్యమైయున్నది. మనకు పరిశుద్దాత్మ అవసరమైయున్నది. ఇప్పుడు, మీరు నన్ను ప్రేమించకపోవచ్చును, మీరు నన్ను తిరిగి మళ్లీ పిలువక పోవచ్చును. కాని ఇది నాకు సత్యమును మాట్లాడుటకు ఒక అవకాశమైయున్నది. మరియు ఇది సత్యమైయున్నది. దీనికై ప్రయత్నించుము. అలాగు లేకపోయినట్లయితే దీనిని కనుగొనుము.
ఎవరో ఒక స్త్రీ ఇలాగు అన్నది, "ఇది నా స్వంత అమెరికా యొక్క ధన్యత."
"అయితే నీవు దానిని వదులుకో౦టావు" అని నేను అన్నాను.
MATT 6:10•
LUKE 11:2
68కొంతకాలము క్రితం, నా భార్య మరియు నేను సరుకుల నిమిత్తము
ఇండయానాలో వెళుతున్నాము, మరియు అక్కడ మేము ఒక వింతైన కార్యమును చూచియున్నాము — ఒక స్త్రి స్కర్టు వేసుకుని యున్నది. అది చాలా అసభ్యముగా ఉన్నది.
ఆమె ఇలా అన్నది, "హనీ, అటువంటి స్త్రీలను బృందగానమందు పాడనీయవద్దు?"
"అవును."
"మంచిది, ఎందుకు…?"
నేను ఇలా అన్నాను, "మంచిది, మీరు గమనించారా, హనీ, వారు మన యొక్క రాజ్యమునకు సంబంధిచినవారు కారు."
నేను ఇలా అన్నాను, "మన యొక్క రాజ్యము." మరియు ఇలా అన్నాను, "లేదు, నేను ఒక మిషనరీ అయ్యున్నాను, ప్రపంచములో చాలా సార్లు, నేను కనుగొన్నాను… నేను జర్మనీకి వెళ్ళియున్నాను, అక్కడ నేను జర్మన్ ఆత్మను కనుగొన్నాను. నేను ఫిన్లాండుకు వెళ్ళియున్నాను, అక్కడ వ్యత్యాసమైన ఆత్మ ఉన్నది, నేను ఆస్ట్రేలియాకు వెళ్ళియున్నాను, అక్కడ వేరొక ఆత్మ ఉన్నది. నేను అమెరికాకు తిరిగి వచ్చాను, ఇక్కడ వేరొక ఆత్మ ఉన్నది. ఇది జాతీయ ఆత్మయైయున్నది — మరియు వారందరు దెయ్యమునకు సంబంధించినవారు. యేసు అలాగు చెప్పెను. ఈ భూలోక రాజ్యములు దెయ్యమునకు సంబంధించినవి. వాడు దీనిలోని ప్రతియొక్క దానిని నియంత్రించగలడు. ఇప్పుడు, యేసే దానిని చెప్పియుండెను. కావున నీవు గమనించుము, అది ఒక జాతీయ ఆత్మయై యున్నది."
"మంచిది," అని ఆమె అన్నది. "మనము అమెరికా వారము కామా?"
నేను ఇలా అన్నాను, "లేదండి. సాధ్యమైనంతవరకు మనము అమెరికావారమే."
"మరి నీవు ఎవరివి? అని అడిగెను.
నేను ఇలా అన్నాను…
"మంచిది, మనము అమెరికా వారివలె ప్రవర్తించకూడదా?"
నేను ఇలా అన్నాను, "లేదు, ఈ మద్యమును త్రాగుట, పోట్లాడుట, పాడయిపోయిన గుంపు. లేదయ్యా! మేము పరలోక ఆత్మలో తిరిగి జన్మించియున్నాము. మేము అక్కడ నుండి వచ్చియున్నాము అక్కడ స్వఛ్ఛముగా, వ్యభిచరించలేని పరిశుద్ధత, అక్కడ దూతలును మరియు నీతియును దేవుని ముందు ఉండు స్థలమైయున్నది." మరియు నేను ఇలా అన్నాను, "ఖచ్చితముగా మేము ఇక్కడ ఒక రాజ్యముగా ఉంటాము. అది నిజమే. ఇది మా రాజ్యమైయున్నది, ఇక్కడ మేము చేయు ప్రయత్నమేమనగా… కాని మా… మా రాజ్యము వచ్చుచున్నది, పరలోకములో నెరవేరినట్లు ఆయన చిత్తము భూమి మీద నెరవేరును, కాబట్టి మేము పైన జన్మించినప్పుడు మరియు పాపమంతా అగాధము దాటి వెళ్ళిపోతుంది, అప్పుడు దేవుని యొక్క ఆత్మ లోపలకు వస్తుంది, సృష్టికర్త మన హృదయములో ఉంటాడు, మరియు ఆయన మన యొక్క వ్యక్తిత్వమును నిర్దేశించుతాడు. అప్పుడు మనము అబద్దమాడము, దొంగతనము చేయము, మోసము చేయము, దేవుని యొక్క ఆత్మలో మనము జన్మించి ఉన్నట్లయితే, మనము నిజాయితీగా ఉంటాము, నిటారుగా ఉంటాము, పరలోక పౌరులుగా నడుస్తాము, మనము అటువంటి వారుగా ఉన్నాము."
69మరియు మనలో చాలామంది గందరగోళములో పడుచున్నారు, మరియు ఉపయోగించి చిన్న చిన్న తత్వములను, మరియు అనుభూతులను మరియు ఆ కార్యములను దేవుని యొక్క ఆత్మ అని పిలుస్తున్నారు. సంఘ క్రమమంతా అనుమానముతో ఉన్నది, ఈ కారణముచేతనే ఈ దినమున మనము అనుమానములో ఉన్నాము. అది ఎంతో భయానకమైనది. మరియు వాటన్నిటిలోను, యేసు ద్వారము దగ్గరే నిలబడి యున్నాడు. బయట విడచివెయబడి, కాని ఇంకా…
JOHN 1:1,14•
EPH 4:5
70మరియొక ద్వారమును నేను తెరవాలని అనుకుంటున్నాను — అది విశ్వాసమనే ద్వారము — అటు తరువాత నేను ముగిస్తాను. నేను దాదాపుగా పన్నెండు ద్వారములను వ్రాసుకొని వచ్చాను, కాని నేను వాటిని దాటిపోవుచున్నాను. విశ్వాసమనే ద్వారము. నీవు ఇలా అనవచ్చును, "సంపూర్ణ సువార్త వ్యాపరస్తులలోనికి నీవు రావచ్చుగా?"
"ఏమిటది?"
"సంపూర్ణ సువార్త…"
"అది నా విశ్వాసమునకు వ్యతిరేకముగా ఉన్నది."
ఒకే ఒక విశ్వాసమున్నది. అది నిజము. "ఒక్కటే విశ్వాసము, ఒక్కడే ప్రభువు, ఒక్కటే బాప్తిస్మము." అది నిజమే.
"ఎందుకని, నా విశ్వామునకు వ్యతిరేకముగా ఉన్నది?"
బహుశా విశ్వాసమనే నీ ద్వారము దగ్గర యేసు నిలబడాలని నీవు కోరుకోవడం లేదా, నీ విశ్వాసమును ఏదైనా ఆచారములోగాని లేక ఏదో సంఘములో కాని, లేక మతశాఖలో గాని నిర్మించుకున్నావా? మరియు అప్పుడు నీ యొక్క విశ్వాసము ఒక గదిలో బంధించబడుతుంది. మరియు వాక్యమైయున్న యేసును నీవు లోపలికి అనుమచతించలేవు. "ఆదియందు వాక్యముండెను," అని యోహాను సువార్త 1వ అధ్యాయము చెప్పుచున్నది. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను… మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." ఆయన నిత్యమైన వాక్యమై యున్నాడు.
LUKE 4:41•
JOHN 3:3
71మరియు నీ యొక్క విశ్వాసము… అది అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని చెపుతుంది, మరియు భాషలతో మాట్లాడుట మరియు ప్రవచించుట అనేదే లేదు అని మరియు అదంతా పెంతెకోస్తులు తీసుకొనివస్తున్న చెత్త అని అటువంటి కార్యములు ఏమియు లేవని అనవచ్చును. అటువంటిది ఏదియు లేదని, బహుశా, నీ విశ్వాసమును ద్వారము నుండి నీవు ఏదో ఆచారమును లోపలికి అనుమతిని ఇచ్చావు. నీవు ఆ ద్వారమును తెరచి మరియు వాక్యమైయున్న దేవుడిని లోపలకు అనుమతిని ఇచ్చి మరియు ఆయనను ప్రభువుగా ఉండనిమ్ము. "ఆచారము ఏమి చెప్పుచున్నది అనే దానిని నేను లెక్క చేయను. పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లయితే, నీవు నా ప్రభువు."
నీవు తప్పక తిరిగి జన్మించాలి, మరియు నీవు తిరిగి జన్మించినప్పుడు, నీవు తప్పక పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీవు ఏ ఆచారము అనేది ప్రక్కన పెట్టు, అది… దాని గురించి చింత ఏమియు లేదు. నీవనవచ్చును, "మంచిది, యేసు దేవుని కుమారుడని నేను నమ్ముతాను." దెయ్యము కూడా దానిని నమ్ముతుంది. నీవు తిరిగి జన్మించినవాడవు. ప్రతియొక్క ఆ నూతన జన్మకై భయపడతారు. ఓ, నీకు నీవుగా నేను తిరిగి జన్మించాను అనుకుంటున్నావని నాకు తెలుసు; అయితే మన జీవితములు మన సాక్ష్యము వినబడనంతగా అధికముగా మాట్లాడతాయని నేను అనుకుంటున్నాను, గమనించారా.
72పుట్టుక అనేది ఒక గందరగోళము, అది ఏక్కడ ఉన్నది అన్న నాకు చింతలేదు. ఆ మాటకు నన్ను క్షమించమని అడుగుచున్నాను, కాని పుట్టుక అనేది పందుల కొట్టులో అయితే, అది ఒక గందరగోళము. ఒక పశుశాలలో జన్మించినట్లయితే, అది ఒక గందరగోళము. ఒక ఆసుపత్రిలో జన్మించినట్లయితే, అది ఒక గందరగోళమై యున్నది. మరియు ఒక బలిపీఠము యొద్ద జన్మించినట్లయితే, అది ఒక గందరగోళమైయున్నది. అది నీ స్వంత ఆలోచనలలో నిన్ను క్రుళ్ళిపోవునట్లుగా చేస్తుంది. అది నువ్వు సర్వవమును విసరివేయునట్లుగా చేస్తుంది. నీ హృదయమంతటితో నీవు నమ్మినవి అన్నింటిని అది విసరివేస్తుంది, మరియు నీవు ఆ చిన్నగా తట్టుచున్న శబ్దమునకు సమస్తమును ఇచ్చివేస్తావు. అది మూలన ప్రారంభమైన ఒక కార్యమైనా సరే, నేను దానిని లెక్క చేయను.
మనము అమెరికనులము కాబట్టి మనము పెద్ద పెద్ద కార్యములనే నమ్ముచున్నాము, మనకు పెద్ద టోపీలు కావలయును, మరియు పెద్ద పెద్ద కార్లు కావలయును. మరియు పెద్ద పెద్ద మతశాఖలు, ఆచారములలో పెద్దవి మరియు ఎక్కువ మతశాఖలు మనకు కావలయును. మనకు కావలసినదంతా పెద్ద పెద్ద కార్యములే; మరియు దేవుని యొక్క స్వరము మనకు ఎంతో చిన్నదిగా ఉన్నది.
నేడు మనకు కావలసినది ఏమిటంటే ఎక్కువగా రాకెట్టు మరియు దానియొక్క పెద్ద శబ్దం.
MATT 23:15
73ఒకసారి ఒక రైతు తన యొక్క ట్రక్కును పొలమునకు తీసుకొని వెళ్ళాడు. మరియు అతడు తీసుకొని పోవుచుండగా, అది పైకి క్రిందకు ఎగిరిపడుతూ మరియు గెంతుతూ ఇంకా చాలా శబ్దము చేస్తూవున్నది. అదే ప్రాంతమునకు వెనుకకు తిరిగివచ్చునప్పుడు మరియు అది కదలలేదు ఎగిరిపడలేదు. అది మంచిదైనవాటితో నింపబడియున్నది.
మనకు ఒక ఆచారము కావాలి. "మా మతశాఖయే పెద్దది. మేము దీన్ని కలిగియున్నాము. దేవునికి మహిమ, మేము ఆ గుంపును దాటియున్నాము. మేము ధనమును చెల్లించుటలో ఆ గుంపును దాటియున్నాము, మేము హోదాలు ఇచ్చుటలో వారిని దాటియున్నాము, మరియు సంఘములోకి రావలసియున్న వాటిలో ఇంకా ఏమైనా మిగిలియున్నవా?" దానికి వ్యతిరేకముగా ఏమియు మాట్లాడుటలేదు. అదంతా సరియే. కాని ఇక్కడ నేను చెప్పటానికి ప్రయత్నము చేస్తున్నది ఏమిటంటే, అంతటితో ముగిసిపోలేదు. సంఘమునకు ప్రజలను తీసుకొనివచ్చుట మంచిదే. అవును. కాని యేసు ఇలా చెప్పెను, ఒక మనుష్యుడు బయటకు వెళ్ళి అన్యమతములో నుండి ఒకడిని తీసుకొని వచ్చి, ఇలా అనెను, అతడు ఎమైయున్నాడు? రెండు రకములుగా జీవించు పిల్లవానిగా ఉండుటచేత అంతకు ముందు ప్రారంభించిన జీవితముకన్నా అధికమైన నరకమునకు పాత్రుడగుతాడు.
GEN 18:22•
GEN 19:1
74మనము సహోదరుడైన బిల్లీ గ్రాహమ్ కార్యక్రమములను గూర్చి వింటున్నాము. నిశ్చయముగా ఆ గొప్ప సువార్తీకుని గురించి వ్యతిరేకముగా మాట్లాడుటకు ఏమియూ లేదు. అతడు దేవుని యొక్క మనుష్యుడైయున్నాడు, మరియు దేవుడు అతడిని ఉపయోగించుకుంటున్నాడు. కాని అతడు ఎక్కడ ఉన్నాడు? సొదమలో ఉన్నాడు. ఆ సాదృశ్యము మీకు జ్ఞాపకమున్నదా? అక్కడ సొదమ పట్టణమునకు ఇద్దరు దూతలు వెళ్ళియున్నారు, యేసు రాకడలో అలాగే ఉండునని చెప్చుటచేత, అది సాదృశ్యమైనది. కాని ఒకరు అబ్రహాముతోనే ఉండెను, ఎన్నుకోబడిన సంఘము, బయటకు పిలువబడిన సంఘము. ఆ ఇద్దరు దూతలు ఏమి చేసియున్నారో మీరు గమనించండి, అప్పుడు మీరు వర్తమానమును పొందుకుంటారు.
అది వింతైన కార్యము కాదా, ఆ ఇద్దరు దూతలు — ఖచ్చితముగా చివరి దినములలో ఈలాగు జరుగునని దేవుడు చెప్పియుండెను — పొలములో నుండి ఏ మనుష్యుడు తప్పించుకొనలేడు, మూడీ, శాంకీ, ఫిన్నీ, నాక్స్, కాల్విన్ వారందరి దినములలో ఏ ఒక్కరూ తప్పించుకొనలేరు, ఆ దిగువన ఉన్న వారందరు, వారిలో ఏ ఒక్కరు తమ పేర్ల చివర హా-ము - (గ్రా-హ-మ్) అని నేటి వరకు కలిగిలేరు. నమకార్ధ సంఘపు వర్తమానికుని చూచారా? గమనించారా, రాజ్యములకు తండ్రి.
GEN 18:9,10•
2TIM 3:5•
2PET 1:21•
REV 3:20
75ఇప్పుడు, సంఘము యొక్క ఆత్మీయత ప్రారంభములో ఉన్నట్లుగా పెంతెకోస్తు మాదిరిగా లేదు. ఆ సంఘమునకు వర్తమానమును చెప్పుటకు ఆ దూత వచ్చుటను గమనించుము. మరియు ఆయన కూర్చుని అబ్రహాముతో మాట్లాడియున్నాడు. ఆయన ఇలా అనెను, "నీ భార్యయైన శారా ఎక్కడ ఉన్నది?" మరియు అతడిని అబ్రహాము అని పిలిచెను, అప్పటికి అతడి పేరు అబ్రము. "నీ భార్యయైన శారా ఎక్కడ ఉన్నది" అనెను. ఆమె పేరు శా-రా-యి, ఇప్పుడు అది, శా-రా, శా-రా అని ఆయన పిలిచెను.
అబ్రహాము, "ఆమె నీ వెనుక గుడారములో ఉన్నది" అనెను.
ఆయన ఇలా అనెను, "నేను (వ్యక్తిగత సర్వనామము) జీవకాలమునకు తిరిగి మిమ్ములను దర్శించెదను." మరియు శారా… ఆయన ఇలాగు అనెను, "నేను దాని గురించి చెప్పినప్పుడు, ఎందుకని శారా నవ్వింది?" అదిగో ఆయన అక్కడే ఉన్నాడు.
అది మనకు ఎందుకని జరుగదు? మనము అటువంటి ఆత్మను పొందుకుని సంఘమును దర్శించవలసియున్నది, ఒక ప్రవచించు ఆత్మ ఒక వివేచించు ఆత్మ మరియు అది సంఘము లోపలకు వచ్చునపుడు, ప్రజలు దానిని వ్యతిరేకిస్తారు. ఎందుకు? ఎందుకనగా, ఇది లవొదికయ అయ్యన్నది. వ్రాయబడిన సంఘ ఆచారములతో నిండివున్న మనము దానిని అంగీకరించే స్థితిలో లేము. అది నిజమైయున్నది. "నేను ద్వారము వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విన్నట్లయితే…"
"ఓ, నా విశ్వాసము ఆ కార్యములను అంగీకరించదు."
అయితే నీవు తప్పుడు విశ్వాసమును పొందుకునియున్నావు. విశ్వాసము… మీకు తెలుసా, నిజమైనది మరియు అసలైన దేవుని యొక్క విశ్వాసము ఎల్లప్పుడు దేవుని యొక్క వాగ్దానమునకు "ఆమేన్" చెప్పును, అది ఒక అసలైన పరిశుద్ధాత్మయై యున్నది. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మయే పరిశుద్ధ గ్రంథమును వ్రాసెను. అది అలాగనే చెపుతుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ఆ పాతకాలపు వారు, పరిశుద్ధ గ్రంథమును వ్రాసియున్నారు. అలాగైతే, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు దానిని
ఏలాగు వ్యతిరేకిస్తాడు? అలాగు చేయలేవు. దేవత్వము, ప్రవక్త ఇలాగు అనెను, స్త్రీ, పురుషులను పాపమును మరియు లోకములోని కార్యములను నుండి స్వతంత్రులు చేయు శక్తిని వ్యతిరేకిస్తున్నారు. దేవుడు మన యెడల కరుణ కలిగియున్నాడు. ఓ, నీ లోపల ఉన్న మత విశ్వాసము దేవుని వాక్యమును వ్యతిరేకిస్తున్నట్లయితే, నీవు వెంటనే దానినుండి బయటకు రమ్ము. ఎల్లప్పుడు దేవుని వాక్యమే సత్యమైయున్నది. అవునయ్యా.
REV 3:17
76గమనించుము. ఆయన ఇలాగు చెప్పెను, "నీవు దిగంబరివి, దిక్కుమాలినవాడివి, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడివి అని గుర్తెరగకయున్నావు? ఇక్కడ ఒక బాధాకరమైన విషయమున్నది. (ఇప్పుడు, మనము ముగింపులోనికి వచ్చియున్నాము.) "దానిని ఎరుగయున్నావు" అను దాన్ని తీసుకోవలనుకుంటున్నాను. ఇప్పుడు, స్టోన్ వీధి అను ఈ ముఖ్యమైన వీధిలోకి ఒక మనుష్యుడు రావటం మీరు చూచినట్లయితే, లేక ఈ ప్రధాన వీధులలో దేనిలోకైనా వచ్చినట్లయితే, ఆ మనుషుడు ఎంతో పేదవాడైయున్నాడు, చివరకు అతడు ధరించుకొనుటకు వస్త్రములు కూడా లేవు, మరియు అతడు దరిద్రుడు, దిక్కుమాలినవాడునై యున్నాడు, మరియు వానికి వస్త్రములు లేవు, దిగంబరిగా ఉన్నాడు, లేక ఒక స్త్రీ పూర్తిగా దిగంబరిగా మరియు గ్రుడ్డితనముతో ఉన్నది, మరియు ఆ స్త్రీకి తాను అలాగున ఉన్నాను అని యెరుగక ఉండెను.
ఇప్పుడు, ఒకవేళ తాను ఆలాగు ఉన్నానని ఆ స్త్రీకి తెలిసినయెడల, లేక అతడికి తెలిసినయెడల, వారు వెంటనే వస్త్రములు ధరించుకొనుటకు ప్రయత్నము చేస్తారు. కాని వారు దానిని ఎరుగక ఉన్నప్పుడు, నీవు వారి యొద్దకు వెళ్ళి వారికి చెప్పుటకు ప్రయత్నించుము, వారు ఇలాగు "నీ పని నీవు చేసుకో" అంటారు.
REV 3:16,20
77ఇప్పుడు, పెంతెకోస్తు సంఘము తన చివరి దినములలో ఉన్నది అని ఖచ్చితముగా అది యేసు చెప్పిన మాదిరిగానే ఉన్నది, నులివెచ్చగా మరియు ధనవృద్ధి చేసుకొనుట. అందరిలోకి మనమే ధనవృద్ధిని చేసుకున్నవారిగా ఉన్నాము. మనము పొలములో ఉన్నప్పుడు, మనము రక్షణ కలిగియుండవలసిన వారమైయున్నాము. ఇప్పుడు, మనము ఈ గొప్ప ర్యాంకులు, మొదలైనవి, మరియు ఎక్కువ మందిని కలిగియుండుట, గొప్ప అనుభూతులు కలిగియుండుట. మరియు మనము ఎక్కడ ఉన్నాము? మిగిలినవారు ఉన్నట్లుగానే మనమును ఉన్నాము, అందుకనే యేసు ఆ విధముగా చెప్పియున్నాడు.
అయితే వాటిన్నింటి మధ్యలో ఆయన ద్వారమును తట్టుచునే ఉన్నాడు. "ఎవరైనా (వ్యక్తిగతముగా) నా స్వరమును విని, మరియు తలుపు తీసిన యెడల, నేను లోపలకి వచ్చి, మరియు అతడితో నేనును - నాతో అతడును కలసి భోజనము చేయుదుము." అదియే మనము పొందుకొనవలసియున్నది. దిగంబరిగా, గ్రుడ్డివానిగా, భౌతికమైన గ్రుడ్డితనము, ఆత్మీయమైన గ్రుడ్డితనముగా ఉన్నవారికి నీవు ఏమియు చెప్పలేవు.
78మీకు తెలుసా, మేము భయంకరమైన పేదరికముతో కెంటకీలో పెంచబడియున్నాము. నా యొక్క తాతగారు వేటగాడైయున్నాడు, మరియు అతడు మంచి వేటగాడిగా యున్నాడు. మరియు రక్కూన్ అనే జంతువును అతడు వేటాడేవాడు. మీకు అటువంటివి ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఆ రక్కూన్ ఇక్కడ ఉండుటకు వాటికి తగింనంత నీరు ఈ ఆరిజోనాలో లేదని నేను అనుకుంటున్నాను, కాని, అవి ఒక… ఆ దిగువన రక్కూన్ లు ఉన్నాయి. వారు రక్కూన్లను వేటాడేవారు, రక్కూన్ వేటగాడు అంటే ఎంతమందికి తెలియును? మంచిది, ఇక్కడ కెంటకీవారిని చూడండి. మై! అంతా సరియే. మంచిది, నేను నా కోటును తీసివేసి కొద్దిసేపు ప్రసంగము చేయలనుకుంటున్నాను. నేను కొద్దిగా బంధించబడినట్లుగా ఉన్నాను, కాని ఇప్పుడు అంతయు మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మై! గడ్డితో తయారు చేయబడిన పరుపు అంటే మీలో ఎంతమందికి తెలుసు? హుమ్, హుమ్, టోని, నీకు కృతజ్ఞతలు. నేను చివరకు గృహమునకు వెళ్లవలసియున్నది. అవును, అది మంచిదైయున్నది. నా, జొన్న రొట్టె, మరియు జొన్న వంటకం, నా యొక్క నల్లని కన్నులు కలిగిన బఠాణీ, మరియు ఉల్లి ఆకులు, మీరు అటువంటిది ఎన్నడైనా తినియున్నారా? ఓ, మై! అది… ఇప్పుడు, మేము బాగానే ఉన్నాము. అవునయ్యా, అది మంచిదిగా ఉన్నది.
79మరియు తాతాగారు రక్కూన్లను పట్టుకుండేవారు, మరియు ఆయన వాటి యొక్క కొవ్వును కరిగించేవారు. మరియు వాటిని చిన్న కేనులో ఉంచేవారు. మేము దానిని వంటకు కొరకు ఉపయోగించు పిండిని ఉంచే డబ్బాలో ఉంచేవాళ్ళము. మా కొరకు ఆ పిండితో మా అమ్మ బిస్కట్లను తయారు చేస్తుంది. మరియు వాటితో ఆమె పెద్ద పెద్ద బిస్కట్లు తయారు చేస్తుంది. మరియు ఆ బిస్కట్లలోని పై భాగమును మరియు అడుగు భాగమును తియ్యని జొన్న వంటకములో ముంచుకొని మరియు దాని మీద ఇంటివద్ద తయారు చేసిన వెన్నను రాసుకొని తినినట్లయితే అది ఎంతో బాగుంటుంది. ఇప్పుడు అది ఎంతో బాగుంటుంది. మరియు ఈ ఉదయము నేను ఆ తియ్యని వంటకమను నేను కలిగియున్నాను. కావున, మీరు అటువంటిది కలిగియున్నట్లయితే అది ఎంతో బాగుంటుంది.
మరియు రక్కూన్ల నుండి తీసిన ఆ కొవ్వును ఇంటిలో ఉన్నవాటిని శుభ్రపరచుటకు వాడుతుంది, మా అమ్మ కంచె తీగకు తగిలించి ఉంచుతుంది. మరియు ఆమె… మేము దానిని కత్తిరించి మరియు వారు దాని మీద ఆ పాత కంచె తీగకు ఉన్న కొక్కెమును మరియు టర్పెంటైను పోస్తారు. ఆ తరువాత, మాలో ఎవరికైనా అనారోగ్యముగా ఉన్నట్లయితే అప్పుడు దానిని ఉపయోగిస్తారు.
మరియు మాకు ఒక చిన్న గదియున్నది, మరియు అక్కడ మాకు నిచ్చెన ఉన్నది. మేము పైకి ఈ విధముగా ఎక్కిపోవలసియున్నది, పైకి ఎక్కునప్పుడు పట్టుకొనుటకు చెక్కతో చేయబడిన బారులు ఉంటాయి. మరియు పిల్లలమైన మేము పైన ఉన్న గడ్డి పరుపులో పడుకుంటాము. మరియు ఆ గడ్డి పరుపునకు పైన ఈకలతో చేసిన పరుపు ఉండేది, ఈకల పరుపు. చంద్రుడి కాంతి వచ్చినప్పుడు, ఆ పైన పిట్టగోడవలె చెక్కలను పెడతారు, కావున… అక్కడ ఒక రంధ్రము ఉండేది, దాని ద్వారా మంచు లోపలకు వచ్చేది, రాత్రివేళ బ్రెన్హాంముల గుంపుయైయున్న మేము పడుకున్నప్పుడు, మంచు మా మీద పడకుండా ఉండటానికి మా పైన ఒక దుప్పటి మా అమ్మ కప్పివుంచేది. మరియు ఇద్దరు దిగువన, మరో ఇద్దరు మధ్యలో మరియు ఇంకొక ఇద్దరు పైన ఉండేవారము. మేము అన్ని విధములుగా పడుకునేవారము, పంది పిల్లలు ఒకదానికి ఒకటి ఆనుకొని వెచ్చగా పడుకొనియున్నట్లుగా మేమును పడుకునేవారము.
80ఒకొక్కసారి ఆ దుప్పటి క్రిందనుండి ఏవరో ఒకరు జారిపోయేవారు మరియు చలిగాలి రావడంచేత వారికి జలుబు వచ్చేది. మరియు అది మా కన్నులలోకి వచ్చేది, మరియు గట్టిగా ఆ ఉన్న ఒక పదార్ధము వంటిది కళ్ళలోకి వచ్చేది. అమ్మ దానిని "కన్నులు బరువుగా తెరవలేకుండుట" అనేది. "మీ కళ్లు తెరవలేకుండా ఉన్నాయి." మంచిది, నేను ఉదయకాలమునే లేచియున్నాను, మరియు అమ్మ "బిల్లీ, క్రిందకు దిగి రా, స్కూలుకు సమయమౌతుంది" అని పిలిచినది. నేను ఇలా అన్నాను, "అమ్మా నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళు బరువుగా ఉన్నాయి."
హంపీ, నా సోదరుడు, అతడు కూడా లేచాడు. అతడి పేరు ఎడ్వర్డ్, మరియు హాస్యము కొరకు మేము అతడని హంపి అని పిలుస్తాము. మరియు అతడు ఇలా అన్నాడు, "నేను కూడా నా కళ్ళు తెరవలేకపోవుచున్నాను."
అప్పుడు రక్కూన్ల నుండి తయారుచేసిన ఆ క్రొవ్వు పొయ్యి మీద కరిగించబడుతున్న శబ్దమును నేను విన్నాను. అమ్మ దానిని అంతా బయటకు తీస్తుంది. మరియు అమ్మ మెట్లెక్కి పైకి వచ్చి, మరియు మా కళ్ళను చేతితో మర్ధనా చేస్తుంది. మరియు మీరు నమ్మండి నమ్మకపోండి, మా కళ్ళకు ఇబ్బంది కలుగచేసిన ఆ సమస్య వెళిపోతుంది. రక్కూన్లను నుండి తయారు చేసిన ఆ క్రొవ్వు కన్నులను తెరవలేకపోవుట అనే సమస్య నుండి దూరము చేస్తుంది.
HEB 13:8•
REV 3:18
81నేను మీకు చెప్పుచున్నాను, సంఘములో కూడా అటువంటి చలిగాలి వస్తుంది, మరియు కాని అక్కడ రక్కూన్ల నుండి తయారు చేసిన క్రొవ్వు పనిచేయదు. కాని యేసు చెప్పెను, "నా యొద్ద మీరు కాటుకను కొనండి," అనగా పరిశుద్దాత్మను అని అర్ధము. మీరు వచ్చి - సంఘము గ్రుడ్డిదిగా మారియున్నది, అది దేవుడిని చూడలేకపోవుచున్నది. అది కేవలం మతశాఖను మాత్రమే చూచుచున్నది. దాని ముందు ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే అది చూడగలుగుతుంది. అది ఎన్నడు దానిని దాటి రాబోవుచున్న ప్రభువు యొక్క రాకడను చూడలేకపోతున్నది. దాని కొరకై దానికి రక్కూన్ల నుండి తయారు చేసిన క్రొవ్వు పనిచేయదు,
82కాని పరిశుద్ధాత్మ యొక్క రక్షణ నీ కన్నులను తెరుస్తుంది, మరియు యేసుక్రీస్తు యొక్క సన్నిధిని నీవు గుర్తించగలుగుతావు. మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దేవుడై యున్నాడు, మరియు నీ కన్నులను పరిశుద్దాత్మ ద్వారా ఆయన తెరువగలడు.
నీవు మెథడిస్టువైనా సరే, నీవు ఒక బాప్టిస్టువైనా సరే, లేక ఏకత్వమైనా సరే, లేక ద్విత్వమైనా సరే, లేక త్రిత్వమైనా సరే, లేక చర్చి-ఆఫ్-గాడ్, లేక నజరేనియస్ అయినా సరే, లేక పిలిగ్రమ్-హోలినెస్ అయినా సరే, మొదటగా నీవు ఎవరో మరచిపోమ్ము. నీవు క్రైస్తవుడవు, దేవుని రాజ్యములో తిరిగి జన్మించినవాడవు.
నీవు ఏదైనా కావచ్చును… నీవు ఇలాగు చెప్పుటకు ప్రయత్నము చేయవద్దు, "మంచిది, దీనిని నేను తప్పక చేయవలసియున్నది." నీలోపల ఏదో ఉండి అది నిన్ను అలాగు చేయమని ఒత్తిడి పెట్టుచున్నది. ఆ ఒత్తిడి నీ హృదయములో ఉండుటచేత నీవు ప్రార్ధనలో ఊగుచున్నావు. దైవీక ప్రేమ నీ అంతరంగ అడుగు భాగములలోకి ప్రవహించేంత వరకు నీవు దానిని తీసివేయలేవు. ఒక తవ్వబడిన బావిలో గొట్టాల ద్వారా బయటకు నీరు ప్రవహించినట్లుగా ప్రార్ధనా కూటములు నీలో నుండి ప్రవహిస్తాయి.
PHIL 1:21
83నేను వెళ్ళేవాడిని… చాలాకాలము నేను ఆటలకు వార్డెనుగా ఉన్నాను, నేను చాలా పెద్ద నీటిని దాటియున్నాను. మరియు అది పైకి బుడగలను అలాగున వదులుతుంది. నేను ఆ నీటి దగ్గర ఉన్నాను, మరియు నేను ఇలాగు అన్నాను, "నీవు ఎందుకని అంత సంతోషముగా ఉన్నావు?" ఓ, నీరు చాలా బాగున్నది. మరియు నేను దానిలో నుండి త్రాగుటకు నీటిని తీసుకున్నాను, మరియు నేను ఇలా అన్నాను, "నీవు ఎందుకని సంతోషముగా ఉన్నావు?" నీలోపల నుండి ఆ కుందేళ్ళు నీళ్లు త్రాగుతాయని నీవు సంతోషముగా ఉన్నావా?"
ఒకవేళ ఆ నీరు మాట్లాడగలిగినట్లయితే, "కాదు" అని ఉండేది.
"దుప్పులు నీలో నుండి నీళ్ళు త్రాగుతున్నాయనా?"
"కాదు."
"నేను నీలో నుండి నీటిని త్రాగుతున్నాననా?"
"కాదు."
"ఎందుకని నీవు అంత సంతోషముగా ఉన్నావు? నీలో నుండి బుడగలు వచ్చునట్లుగా నిన్ను సంతోషపరచినది ఏమిటి?"
ఒక వేళ అది మాట్లాడగలిగినట్లయితే, ఇలాగ అని వుండేది, "బ్రదర్ బ్రెన్హాం, బుడగలు వస్తున్నది నాలో నుండి కాదు, నా వెనుక నుండి ఏదో నన్ను నెట్టుచున్నది, నిరంతరము నాలో నుండి బుడగలు వచ్చునట్లుగా చేస్తుంది."
మనంతటగా మనము కార్యములను నెరవేరుస్తాము; కాని పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నప్పుడు, దైవీక ప్రేమ చేత మనము వాటిని చేస్తాము. "నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం," అని పౌలు చెప్పెను. ఖచ్చితముగా, ఇప్పుడు, ఆయన యొక్క గొప్ప అభిషేకము మీ కన్నులకు వచ్చును గాక.
84ముగింపులో… మిమ్ములను ఎక్కువసేపు ఉంచి అలయునట్లుగా చేయుట నా యొక్క ఉద్దేశ్యము కాదు. కాని మొదటిసారి, లేక రెండవసారి మీతో నేను ఈ సమయమును కలిగియున్నాను. నేను ఎక్కువ సమయము తీసుకున్నట్లయితే నన్ను క్షమించండి. ఇప్పుడు నన్ను ముగించనీయుము, ఇది నన్ను చెప్పనీయుము…
దక్షిణము వైపున దిగువున, అక్కడ ఒక పాత పెంతెకోస్తు నల్లనిరంగు సోదరుడు ఉన్నాడు. క్రీస్తుకు అతడు ఒక నిజమైన సేకుడైయున్నాడు. ఆ సంఘమునకు ఒక ముసలి నీగ్రో జాతి స్త్రీ వస్తుండేది. మరియు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది, మరియు ఆమె అటువంటి గొప్ప వ్యక్తిత్వము కలిగిన స్త్రీగా యున్నది. మరియు ఆమెకు ఒక భర్త ఉన్నాడు, అతడు కూడా మంచివాడే అతడి పేరు… వారు అతడని గాబ్రియేలని పిలుస్తారు. అతని పేరుని మేము కత్తిరించి గాబి అని పిలుస్తాము.
కాబట్టి, అతడిని మేము ఎన్నడు సంఘ వరుస క్రమములో ఉంచలేదు. అతడు సంఘమునకు రావటానికి ఇష్టపడుటలేదు. అతడే దానిని చెప్పియున్నాడు. ఓ, బాలురందరు ఆడుకొను (పూల్ ఆట అనగా "ఒక బల్లమీద బంతులతో ఆడుకొను ఒక ఆట - తర్జుమాదారుడు,) ఆ గదిలో ఉండగా మరియు అతడు బయటకు వెళ్ళిపోయి మరియు ఇలాగు అనెను, "వారందరు పరిశుద్ధ గుండ్రాళ్ళు, మరియు వారికేమి కాదు." మరియు గాబీ చేయు ఒకే ఒక కార్యమేమనగా, ఆదివారము ఉదయమునే ఆడుకొను కర్రను (క్యూ) తీసుకొని ఆడుకొను ఆ గదికి వెళ్ళటయే, మరియు ఆ బాలురతో పాటు వెళుతుంటాడు.
85కాని అతడి యొక్క భార్య నిజమైన పరిశుద్ధమైన భక్తురాలు, మరియు ఆమె సంఘమునకు వెళ్ళి ప్రార్ధించేది, కాపరి మరియు మిగిలినవారందరు గాబీ గురించి ప్రార్ధించేవారు, కారణమేమంటే అతడి హృదయం ఎంతో మంచిదైయున్నది. మరియు కాలి బూట్లకు మెరుగుపెట్టే ఒక చిన్న వ్యాపారము అక్కడే దిగువన ఉన్న మూలలో గాబికి ఉన్నది. అతడు దానిని నిర్వహిస్తుండేవాడు. బూట్లకు మెరుగుపెట్టుట ద్వారా వచ్చిన డబ్బు ఆ ఆటకు చెల్లించుటకు సరిపోతుండేవి, కాని ఎందుకు అతడు ఆ ఆటను ఆడేవాడు. కావున అతడు సువార్త క్రమములోకి రావటానికి కోరుటలేదు.
మరియు ఆ కాపరి… ఆ ముసలి గాబి వేటాడుటకు ఇష్టపడేవాడు. ఆ కాపరి కూడా వేటగాడే, కావున ఆ కాపరి, గాబిని తీసుకొని వేటకు వెళ్ళేవాడు. ఒక దినమున, ఆ దినమంతా అడవిలో పాదయాత్ర చేస్తూ మరియు పాడయిపోయిన దారుల్లో నడుస్తూ మధ్యాహ్న సమయమునకు ఇంటికి వెళ్ళు దారిలోకి వచ్చియున్నారు. మరియు వారు దారిపొడవునా కుందేళ్ళు మరియు చుట్టూతా ఉన్న పక్షులను వేటాడుకుంటూ సంచిలో వేసుకుంటూ వచ్చారు. మరియు వారు ఎప్పుడూ వచ్చే ఎంతో పరిచయం ఉన్న దారిలోకి వచ్చారు. వారు నడుచుకుంటూ కొండ పై భాగమునకు వచ్చారు, మరియు దిగువన ఉన్న వారి చిన్న పట్టణమునకు బయలుదేరియన్నారు.
అది శనివారమైయున్నది మరియు సూర్యుడు అస్తమించబోవుచున్నాడు.
86మరియు ఆ కాపరి చుట్టూ చూడటం ప్రారంభించియున్నాడు. అతడు కొద్దిసేపటి వరకు ముసలి గాబి ఏమియు మాట్లాడకుండా ఉండుటను గమనించలేదు. మరియు అతడు చుట్టూ చూశాడు, మరియు గాబి కూడా తన భుజముల మీద నుండి సూర్యుడు పశ్చిమము వైపు అస్తమించుటను చూశాడు. మరియు కాపరి వెనుకకు తిరిగి చూశాడు, మరియు గాబి ఏమియు మాట్లాడలేదని గమనించాడు, కాని అతడు నడుస్తున్నప్పుడు వెనుకకు తిరిగి చూస్తు నడుస్తున్నాడు.
మరియు కొద్ది నిముషములు ఆ కాపరి నడచిన తరువాత, మరియు కొదిసేపటి తరువాత ఒక పెద్దని నల్లని చెయ్యి అతడి భుజము మీద పడినది. మరియు అతడు వెనుకకు తిరిగి చూచిన తరువాత ఆశ్చర్యపోయాడు, ముసలి గాబి బుగ్గలపై కన్నీరు క్రిందకు ఈ విధముగా కారుతుండగా తన ముఖములోకి చూస్తుండుటను చూశాడు. అతడు ఇలా అన్నాడు, "కాపరి, ఉదయకాలమున మీరు నన్ను సంతాప బల్ల యొద్ద కనుగొంటారు." "తరువాత, అక్కడ నుండి నేను తిరిగి వచ్చి మరియు విశ్వాసమైన నా భార్య ప్రక్కన కూర్చుంటాను, మరియు దేవుడు తన ఇంటికి నన్ను పిలిచేంతవరకు సంఘములో నమ్మకముగా ఉంటాను."
87మరియు ఆ కాపరి, తప్పకుండా, వెనుకకు తిరిగి ఆశ్చర్యపోయాడు. అతడు ఇలా అన్నాడు, "గాబీ, నేను ఇదే కోరుకున్నాను, మరియు ఎదురు చూశాను, మరియు ఆశించాను, మరియు సంవత్సరముల కొద్ది ప్రార్ధించాను." "గాబీ, ఇప్పుడు అంతా ముగిసిపోయినట్లేనా?"
"అవును, కాపరి, అంతా ముగిసిపోయినట్లే. కాని నాకు పరిశుద్దాత్మ కూడా కావాలి. మరియు రేపు ఉదయమున నేను ఆ సంతాపబల్ల యొద్దకు వస్తాను మరియు నేను అక్కడ దానిని పొందుకుంటాను లేదా అక్కడే నేను మరణిస్తాను."
కాపరి ఇలా అన్నాడు, "గాబీ, నేను దానిని అభినందిస్తాను." మరియు చెప్పెను, "కాని గాబీ, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. నేను ఏ వర్తమానము భోదించినప్పుడు నీకు ఈ విధముగా చేయాలనే ప్రేరణ కలిగినది. నేను ఏ వర్తమానము నీకు భోధించానో తెలుసుకోవలనుకుంటున్నాను, నీకు నేను ఏది భోధించియున్నాను. లేక బృంద గానములో పాడిన ఏ పాట నీలో ఇటువంటి గొప్ప ప్రేరేపణ రావటానికి కారణం అయ్యింది, గాబి?" అడిగాడు.
ఆ ముసలి నీగ్రో, కాపరిని చూచి, ఇలా అన్నాడు, "కాపరీ, నీవు భోదించిన ప్రతి వర్తమానమును నేను ఖచ్చితముగా అభినందిస్తాను." మరియు ఇలా అన్నాడు, "బృంద గానములో పాడిన ప్రతి పాటను నేను అభినందిస్తాను." ఇంకా, "మరియు బృంద గానమువారు పాడు ప్రతియొక్క మంచి పాటను నేను అభినందిస్తాను." కాని, "కాపరీ, వాటి వలన నేను ప్రేరేపణ పొందలేదు." ఇలా అన్నాడు, "మీకు తెలుసా, వెనకాల ఆ సూర్యుడు అస్తమించుట చూస్తున్నప్పుడు. నేను మరియు మీ సూర్యుడు కూడా క్రిందకు వెళతామని?" శరీరము యొక్క వెలుగు విడిచిపోతుందని మీకు తెలుసా?
అది నిజము.
REV 3:20
88ఈ ఉదయము ఇక్కడ ఉన్న పురుషులారా అది నిజము. సూర్యాస్తమయము — సూర్యుని జీవితంలోను మరియు నీ జీవితంలోను మరియు నా జీవితంలోను మరియు నాగరికత అంతటిలోను జరుగుతుంది, తరువాత అది ముగించబడుతుంది. మరియు ఆయన ద్వారము వద్ద నిలబడి, తట్టుచున్నాడు, ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆ చిన్నగా తట్టుట, నీ హృదయ అడుగుభాగములో ఇలాగు అంటున్నది, "అది నేను, ఇప్పుడే ద్వారమును తెరువవలసియున్నది." అది ఆయనే. గాబీ దానిని వినియున్నాడు, మరియు అతడు వెనుకకు తిరిగియున్నాడు.
అతడు మరియొక సంగతిని చెప్పియున్నాడు. "కాపరి, మీకు తెలుసా నేను సరిగా తుపాకీని పేల్చలేను." "నేను దేనిని కొట్టలేను, మీకును తెలుసు, నేను ఏమియు కొట్టలేనని, మరియు కాని ఇక్కడ చూడుము, ఆ వేటలో మిగిలినవి నాకు మరియు నా భార్యకు తరువాత వారమంతా సరిపోతాయి." మరియు ఇలా అన్నాడు, "నీకు తెలుసు, నేను ఏమియూ కొట్టలేనని," కాని ఇలా అన్నాడు, "ఆయనే నాకు ఇచ్చియున్నాడు." "నేను ఇప్పుడే ఆలోచించటం ప్రారంభించాను: నన్ను ఆయన తప్పక ప్రేమించియుండాలి, లేకపోతే ఆయన నా యెడల ఇంత మంచివానిగా యుండియుండడు."
నీవు ఎప్పుడైనా ఆ విధముగా తెలుసుకొనగలిగావా?
89భారతదేశములో ఉన్న చిన్నపిల్లలు, నాకు తెలుసు, వీధులలో పడుకొనియుంటారు, మరియు వారి కడుపు భాగములు పైకి ఉబ్బి ఉంటాయి, వారి చిగుళ్ల క్రిందకు ఇలాగుంటాయి, ఆకలితో మరణిస్తారు. వాడికొరకు వాని తల్లి భిక్షయాటన చేస్తుంది, అటువంటి వారు వేలలలో ఉంటారు. ఒక మధ్యాహ్నమున వారు వచ్చి మరియు వీళ్లను మోసికొనుపోవు మంచము మీదకు ఎక్కించుకొని మరియు వారిని శ్మశానవాటిక దగ్గరకు తీసుకొనిపోయి మంటలలో విసిరివేస్తారు. అక్కడ యోహాను 14 లేదు. వారు దేనినైనా తింటారు, నేల మీద ఉన్న గడ్డిని తింటారు, చెట్టు బెరడును తింటారు, లేక వారు తినగలిగినది ఏదైనా సరే తింటారు.
REV 3:20
90మన చెత్త డబ్బాలో పడవేయు ఆహారము కూడా వారికి సరిపోతాయి.
ఈ ఉదయము మనము ఇక్కడ కూర్చుని, మన కొద్ది ఆహారము నిమిత్తము ఒక డాలరున్నర చెల్లిస్తున్నాము. మరియు మంచి వస్త్రములు ధరించుకున్నాము, మనము మంచి మోటారు వాహనములు నడుపుచున్నాము, మనము మంచి ఇళ్ళలో నివసిస్తున్నాము. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులైన మీరు, మీకు సాక్ష్యములను నేను వినిన దానిని బట్టి మీ వ్యాపారములు రెట్టింపు అవుతున్నాయి. దేవుడు మీ యెడల ఎంతో మంచిగా ఉన్నాడు. నీవు దానిని గుర్తెరగలేకపోతున్నావా? ఎందుకు? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీకు ఆ సంగతి తెలుసా? మరియు ఆ కారణము చేతనే ఆ తట్టుట నీ దగ్గరకు వచ్చింది. "నేను ద్వారము యొద్ద నిలబడి తట్టుచున్నాను, మరియు ఎవరైనా నా స్వరము విని తలుపు తెరచినట్లయితే, నేను లోపలికి వచ్చి, నాతో అతడును, నేను అతనితోను భోజనము చేయుదుము."
REV 3:20
91ఇప్పుడు, ఆ చిన్న స్వరము ఇంకనూ నీ హృదయద్వారము వద్ద తట్టుచున్నది, అది చాలాసార్లు తట్టి తట్టి బహుశా ఇప్పుడు అది సృహ కోల్పోయియుండవచ్చును. అయితే ఇప్పుడు నీవు కేవలం నిజాయితీగా ఉండుము, దేవునితో నిజాయితీగా ఉండుము మరియు ఒక్క నిముషము మనము దేవుని యెదుట నిజాయితీగా ఉందాము. చిన్నగా తట్టుచున్న ఆ శబ్దము ఇలాగు చెప్పుచున్నది, "నేను నా కాలిబాటలు వెతుకుటయే మంచిది. నేను వ్యత్యాసముగా ఉండుటయే మంచిది. నేను నిటారుగా ఉండుటయే మంచిది. నాలో ఏమి ఉన్నాయో నాకు తెలుసు. నేను.. ఇక్కడ చూడుము. ఈ వాక్యముతో నేను నా జీవితమును పరీక్షించుకుంటాను మరియు నేను చాలా కార్యములలో తప్పుగా ఉండియున్నాను." చుట్టూ చూడము మరియు ఎంత మంచిగా ఉన్నదో చూడుము… ద్వారము యొద్ద తట్టుట ఆయన యొక్క మంచితనమైయున్నది.
మనము ఏమి చేసియున్నామో అని ఆలోచించవద్దు, మనము ఎంత పాపము చేసియున్నాము, దాని నుండి మనము ఎంత దూరము వెళ్ళిపోయున్నాము, తరువాత మనము చేద్దాము అని ఎంతగా చెప్పియున్నాము, అయినప్పటికి వాటి అన్నింటి మధ్యను ఆయన నిలబడి ద్వారము తట్టుచున్నాడు. "మరియు ఎవరైనా పురుషుడైనా లేక స్త్రీయైనా నీ ద్వారమును తెరిచినట్లయితే, నేను లోపలికి వచ్చి భోజనము చేస్తాను." ఈ ఉదయకాలము ఆయనేమి ఆశిస్తున్నాడో చూద్దాము, మనము తలలు వంచుచు౦డగా నీవు చూడాలనుకుంటున్నావా?
92ఓ, నా యేసు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ, కృప కొరకు నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. "యేసునకు నేను మరింత చేరువగా రావాలని అని నా హృదయములో చిన్నగా ఏదో చెప్పుచూనే ఉన్నది ఏమిటది? అది ఎమైయున్నది? ఈ ఉదయకాలము నీవు ఆ ద్వారమును తెరవాలని అనుకుంటున్నావా? ఇప్పుడు, ప్రతియొక్క శిరస్సు వంచబడియుండగా మరియు ప్రతి కన్ను మూసియుండగా, దయచేసి, ఒక్క నిముషము నీ హదయ అడుగు భాగమున నిజమైన నిజాయితీని కలిగియుండుము, ఎందుకనగా నీ హృదయము ద్వారము దగ్గర చిన్నగా తట్టుచున్నది. (కొద్దిసేపటిలో నేను ప్రార్ధించబోవుచున్నాను), మరియు నీ జీవితములో మర్మయుక్తముగా జరిగినది ఏమీటో అని నీవు యదార్ధముగా తెలుసుకోవలనుకున్నట్లయితే, అప్పుడు నీవు ఆయనను లోపలికి అనుమతించవలసియున్నది… ఈ ఉదయకాలమున నీ లోపలకి ఆయన రావాలని నీవు అనుకుంటున్నావా?
చెప్పుము, "బ్రదర్ బ్రెన్హాం, నేను అటువంటి విశ్వాసము పొందుకొనునట్లుగా ప్రార్ధించుము మరియు కృప నా హృదయ ద్వారమును తెరిచి ఆయనకు అనుమతిని ఇచ్చునట్లుగా ప్రార్ధించుము. నా ద్వారము దగ్గర తట్టుచున్నది ఏమిటో అని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అక్కడ ఏదో తట్టుచున్నదని నాకు తెలుసు. బహుశా అది ఆయనకు చాలా దగ్గరగా నడుచుటైయుండవచ్చును, బహుశా అది ఒక వ్యత్యాసమైన సేవయై యుండవచ్చును, బహుశా అది నన్ను నేను సమర్పించుకునేది అయ్యండవచ్చును, బహుశా అది పరిశుద్ధాత్మను పొందుకునేది అయ్యుండవచ్చును."
93నీ చేతిని దేవుని వైపు పైకెత్తి ఈలాగు చెప్పుము, "ప్రభువా, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను." దేవుడు నిన్ను దీవించును గాక, అదియే కావలిసినది. ఓ, ప్రతిచోటా, నా హృదయద్వారము వద్ద చిన్నగా తట్టుటను నేను కలిగియున్నాను." సుమారుగా ఇక్కడ ఉన్నవారిలో 60 నుండి 70 శాతం వరకు ఆ తట్టుట అనే అనుభవమును కలిగియున్నారని నేను ఊహించుచున్నాను.
మన తలలు వంచియుండగా — ఇప్పుడు మా పరలోకపు తండ్రీ, "అక్కడ ఒక ఊట ఉన్నది," ఒక కవి చెప్పియున్నట్లుగా, "అది ఇమ్మానుయేలు నరముల నుండి తీయబడిన రక్తముతో నిండియున్నది, అక్కడ పాపులు ఆ ప్రవాహము క్రింద పడిపోయి తమ యొక్క అపరాధ మరకలన్నింటిని, చనిపోవుచున్న ఆ దొంగ ఆ దినమున ఆ ఊటను చూసియున్నాడు, మరియు అక్కడ నేనును ఉండవచ్చును, అతడు ఉన్నట్లుగానే, నా పాపములన్ని కడుగబడియున్నాయి."
ఇప్పుడు, తండ్రీ, ఈ ప్రజలను బట్టి మేము ఎంతో సంతోషముగా ఉన్నాము. మరియు కొంతమందిలో ఎటువంటి సందేహములేదు, వారు బాహాటముగా క్రైస్తవ్యమును ఒప్పుకొనియున్నారు, కాని తమ యొక్క చేతులు పైకెత్తుటకు నిజమైన విశ్వాసమును కలిగియున్నారు. ఏమిటి, ప్రభువా, వారు తమ చేతులను పైకెత్తుటకు నిజమైన విశ్వాసమును కలిగిలేరా? అయితే వారు విమోచనను దాటిపోయున్నారు. ఆ స్థలమును గురించి ఆలోచించుము, అక్కడ చీకటిలో తిరుగులాడు ఆత్మలు తిరుగాడుచున్నాయి, మరియు దరిద్రులైన గ్రుడ్డివారు మరియు వారికి అది తెలియదు. మరియు వారు దేవుడు ద్వారమును తట్టుటను వినియున్నారు, మరియు అది చాలాసార్లు దుఃఖపడియున్నది, చివరకు ఇక అది ఎన్నడు ద్వారమును తట్టదు. మరియు వారు ఆచారమునో లేక మరేదో తీసుకొనియున్నారు, మరియు దానితో వారి మిగిలిన దినములన్ని జీవించియున్నారు, తీర్పు దినమున వారు తమంతట తాముగా నిరాశ చెందుతారు.
MATT 26:15
94నేను కృతజ్ఞుడను ప్రభువా! ఎవరైతే తమ చేతులను పైకెత్తి మరియు "ప్రభువా! నాయందు దయ ఉంచుము, ప్రభువైన యేసు, నా హృదయములోనికి రమ్ము, మరియు నిన్నునీవు నాకు బయలుపరచుకొనుము, మరియు నేను నా జీవితమును నీకిచ్చెదను. ఇదిగో నేను ఇక్కడ నిలబడియున్నాను. ప్రభువా, నాలో సరిగాలేనిది ఏదైనా ఉన్నట్లయితే… మరియు నేను నా స్వంత జీవితములోకి చూస్తున్నాను మరియు దానిలో చాలా తప్పిదములు ఉన్నాయి. నీవు తయారు చేయు గృహమునకు నన్ను తీసుకొనిపొమ్ము మరియు నన్ను నీవు అనుకున్నట్లుగా మార్చుము, మరియు దేవునికి వ్యతిరేకమైన కార్యముల నుండి మరియు లోకపు కార్యములన్నింటి నుండి నన్ను తీసుకొనిపొమ్మ" అని వీరందరు చెప్పుటచేత నేను సంతోషముగా ఉన్నాను.
"ప్రభువా! నీకు కృతజ్ఞతలు, నేను గీత దాటియున్న స్థలమును నేను పొందుకొనలేదు, నీవు ఎక్కడైతే దాటియున్నావో మరియు అది ఎన్నటికి తిరిగిరాదు, గతసారి దేవుని ఆత్మను దుఃఖపరచాను, మరియు ఇక ఇంకెప్పుడు వెనుకకు తిరిగుటయే లేదు. ప్రభువును ముప్పై వెండి నాణెములకు అమ్మివేసిన ఇస్కరియోతు యూదా వంటి వారివలె, మరియు మేము ఈ దినమే చేస్తున్నాము, పేరు ప్రఖ్యాతుల కోసము, మరియు లోకపు జాగ్రత్తల కోసము, మరియు మత సంస్థల కొరకు మరియు మతశాఖల కొరకు, మరియు ఆచారములు, అవి ఆయనను దేనికోసమైన సరే అమ్మివేస్తాయి.
95ఓ, ప్రభువా, నీతి గలిగిన హృదయముల మీద కరుణను చూపుము. ప్రభువా, నేను వారికొరకు వేడుకుంటున్నాను. ఓ, అదంతయూ నాదియే, నేను దైవిక కరుణ కొరకు అడుగుచున్నాను, మరియు ప్రభువా, నా మొర వినుము ప్రభువా, మరియు ఇది గొప్ప కోరికైయుండవచ్చును, విశ్వాసము చేత దేవుడే వారితో మాట్లడియున్నాడని వారికి తెలియును. దేవుడే ఈ కార్యములను చేసియున్నాడు. మరియు ఇప్పుడే హృదయద్వారము తెరువబడును గాక మరియు యేసు లోపలకి నడచివచ్చును గాక మరియు వారి పరిస్థితులకు ఆయనే ప్రభువుగా ఉండును గాక, లోకమునంతా బయటకు తీసివేసి మరియు యేసుక్రీస్తులో వారిని నూతన జీవులుగా చేయును గాక.
ప్రభువా, బలహీనముగా ఉన్నవారిని స్వస్థపరచుము. తండ్రీ, వారు చాలా బాధపడుచున్నట్లుగా ఉన్నారు, వారికొరకు నేను ప్రార్ధిస్తున్నాను, ఇప్పుడే గొప్ప వైద్యుడు వారి భౌతికమైన దేహమును కూడా తాకును గాక, మరియు దానినే ఆయన తన గృహముగా చేసుకొనును గాక, ఆయన నివసించు స్థలముగా చేసుకొనును గాక, తన పిలుపుచేత తన చేతులను ఆయన అందుకొనును గాక, ఆ హృదయము యొక్క చిన్నవెలుగు యొక్క ఆ పిలుపు ఆయనను చేరుకొనును గాక. మరియు గొప్ప వైద్యుడు తన పనిని తాను చేయునట్లుగా, ప్రభువా అది మాకు దయచేయుము. ఈ దినము మా మొర్ర వినుము. ఇక్కడ ఉన్నవారందరిని దీవించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
96ఇప్పుడు, మన శిరస్సులు వంచియుండగా, నిజమైన తగ్గింపుతో, మృదువుగా, సంఘము యొక్క ఈ పాత పాటను పాడుదాము, "నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను." మరియు నీవు దేనినైతే అడిగియున్నావో దానియందు విశ్వాసముంచుము, నీ హృదయము దగ్గర చిన్నగా తట్టుట అనేది ఇంకా జరుగుచున్నది, యేసు ఇప్పుడే వచ్చుచున్నాడు, మనము పాడుచుండగా ఆయన నిశ్శబ్దముగా వచ్చుచున్నాడు.
నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షము పైనే.
2COR 5:17•
GAL 6:15
97ఇప్పుడు, మన శిరస్సులు వంచియుండగా, నీ హృదయమునకు ఆయనే ప్రభువు అని కావలనుకున్నవారు, "ప్రభువా! నాలోనుండి సమస్తమును తీసివేయుము. మరియు ప్రభువా! ఈ ఘడియ నుండి నేను ఈ బల్ల మీద నీకు ఒక ప్రతిష్ఠ చేయుచున్నాను, అది ఏమిటంటే ఆ గొప్పదైన వివాహపు రాత్రి విందులో నేను నిన్ను కలుసుకుంటాను. ఈ ఉదయకాలమున నేను నా జీవితమును నీకు ప్రతిష్టించుచున్నాను, కావున ప్రభువా, నాకు సహాయము చేయుము, ఒకవేళ నేను ఇంకనూ పరిశుద్ధాత్మను పొందుకొనకపోయినట్లయితే, నిజమైన పరిశుద్ధాత్మ నా లోపలకి వచ్చి మరియు నన్ను నా జీవితమును శుభ్రపరచి నన్ను యేసుక్రీస్తులో నూతన జీవి చేసేవరకు ఎదురుచూస్తాను. ప్రభువా, ఈ దినము నేను నీకు వాగ్దానము చేస్తున్నాను, నేను ఈ బల్ల యొద్ద నీకు ఒక ప్రతిష్ఠ చేస్తున్నాను. నేను నా చేతిని పైకెత్తి యేసుక్రీస్తు నామములో నేను ఇలాగు చేస్తానని వాగ్దానము చేస్తున్నాను." ఇప్పుడు, మీ చేతులను పైకెత్తి, మరియు ఇప్పుడు మీ కనులు మూసియుండగా ఇలాగు పాడుము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను (నీకు నీవుగా నిన్ను ప్రతిష్టించుకున్నావా?), నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగా……
దేవా, కరుణ చూపుము, తండ్రీ, ఈ చేతులను చూడుము, మరియు యేసు నామములో దయచేయుము.
నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షము పైనే.
98ఇప్పుడు మీరు బల్ల యొద్దకు వచ్చి మరియొకరితో కరచాలనము చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగు చెప్పుము, "యాత్రికుడా, దేవుడు దీవించును గాక. ఈ ఉదయకాలము నీతో కలసి ఇక్కడ ఉండుట నాకు సంతోషముగా ఉన్నది." అది నిజమైయున్నది. ప్రతియొక్కరు ఒకరితో ఒకరు కలసిపొమ్ము — మెథడిస్టు, బాప్టిస్టు, క్యాథలిక్, ప్రెస్బెటేరియన్, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ వర్తమానము కొన్నిసార్లు కత్తిరిస్తుంది మరియు కఠినముగా ఉంటుంది, మరియు మనకు తెలియదు. మనము దానిగురించి మంచిగా అనుభూతిని చెందాలి అని కోరుకోవాలి. ఇప్పుడు, సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నీతో ఉండును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. మంచిది. బ్రదర్ టోని, దీవించును గాక.
99ఇప్పుడు, ఒక్క నిముషము లేచి నిలబడుదాము.
మన చేతులు మరియు హృదయము దేవునివైపు త్రిప్పి, మా తండ్రీ, అన్ని ఆచారములు, అన్ని ఇప్పుడు నమ్ముచు… ఇప్పుడు, నీవు ప్రార్ధించిన తరువాత, యేసు చెప్పినది జ్ఞాపకముంచుకొనుము, నీవు ప్రార్ధించిన తరువాత విశ్వాసము చేత నీవు అడిగిన దానిని పొందుకొనియున్నావని నమ్ముము మరియు అది నీకు ఇవ్వబడియున్నది. నీవు దానిని విశ్వసిస్తున్నావా? చెప్పుము, "ఆమేన్, నేను అడిగినది నేను పొందుకున్నాని విశ్వసించుచున్నాను, నేను నా జీవితమును యేసుక్రీస్తుకు ప్రతిష్టించుకున్నాను. మరియు ఈ దినము మొదలుకొని. దేవా, నేను దాని ప్రకారము జీవిస్తాను, నేను నీకు ముందుగా నడుస్తాను, అది నేను వాస్తవమైనది అది నమ్మువరకు, మరియు అప్పటి వరకు యేసుక్రీస్తులో నన్నునేను దాచుకొందును."
100ఇప్పుడు, పాటల నడిపించు నాయకుడు ఇక్కడ ఉన్నాడా? ఆ మహిమకరమైన ఆ పాత పాటను ప్రారంభించుదాము, "నా విశ్వాసము నీవైపు చూస్తున్నది, నీవు కల్వరి గొర్రెపిల్లవు, దైవీక రక్షకుడివి." పియానో దగ్గర ఉన్న ఆ సోదరి వాయించినట్లయితే, అది అద్భుతముగా ఉంటుంది. ఆ పాట ఎంతమందికి తెలుసును? పైకెత్తుము. ఇప్పుడు, మన స్వరమంతటితో పాడుదాము. "నా విశ్వాసము నిన్ను చూస్తున్నది, నీవే కల్వరి గొర్రెపిల్లవు." ఇప్పుడు అందరము కలసి పాడుదాము.
నా విశ్వాసము నిన్ను చూస్తున్నది,
నీవే కల్వరి గొర్రెపిల్లవు,
ఓ, దైవరక్షకుడా;
ఇప్పుడే నేను ప్రార్ధించుచుండగా వినుమా,
నా పాపమంతా తీసివేయుము,
ఓ, ఈ దినము నుండి అనుమతించుము,
పరిపూర్ణముగా నీలోనికి!
మన శిరస్సులు వంచుదాము.
నా జీవితమంతా గాడాంధకార అడివిలో నడుచున్నాను,
నా చుట్టూ వ్యాధులన్ని చుట్టుముట్టియున్నాయి,
(ఇప్పుడు నీవు లోకమును కలుసుకొనబోవుచున్నావు, జ్ఞాపకముంచుకొనుము.)
నీవే నాకు మార్గదర్శిగా ఉండుమా; (వినుము!)
ఈ దినమే ఆ చీకటిని తొలగించుమా,
నా భయములన్ని కడిగివేయుము,
నీ ప్రక్కనే నన్ను సదాకాలమండనిమ్ము
(మనము దీనిని లోలోపల పాడుకుందాము.)