దేవుడు సామాన్యత యుందు తననుతాను మరుగు చేసుకొని, పిదప అందులోనే తననుతాను బయులుపరచుకొనుట

దేవుడు సామాన్యత యుందు తననుతాను మరుగు చేసుకొని, పిదప అందులోనే తననుతాను బయులుపరచుకొనుట

1సహోదరుడా, నెవిల్‌. ధన్యవాదములు నీకు. ప్రభువు నిన్ను దీవించును. స్నేహితులారా, శుభోదయం, తిరిగి ఈ ఉదయం మందిరములో యుండి, దానియొక్క అందమైన నిర్మాణము, ఈ దినాన ఆయన యింటిలో దేవుని బిడ్డలు కూర్చున్న విధమును చూచుట, నిజముగా నా జీవితములో ఒక గొప్ప సంఘటన యని నేనెంచుకొనుచున్నాను.

2 నిన్నటిరోజు, నేను యిక్కడకువచ్చి, భవనంయొక్క రూపురేఖలు చూచినపుడు, నేనెంతో ఆశ్చర్యపడ్డాను. ఈ విధముగా అది యుండునని కలలోకూడా నేను అనుకోలేదు. వారు కట్టడపు నమూనాలు గీచినపుడు నేను ఆ నమూనాలు చూచినపుడు, మరియొక చిన్నగది, ప్రక్కన పెట్టబడి యుండుట నేను చూశాను. అయితే, యిపుడది ఒక—ఒక అందమైన స్థలముగా నుండియుండుట నేను కనుగొన్నాను. ఈ యొక్క అందమైన స్థలము కొరకు సర్వశక్తిమంతునికి మనము కృతజ్ఞులమైయుంటున్నాము. మరియు మనము…

3 ఈ ఉదయం, నా భార్య మరియు నా బిడ్డలయొద్దనుండి, మీకు శుభములు తీసికొనివస్తున్నాను. ఈ ప్రతిష్ట కార్యక్రమము కొరకు క్రీస్తుకు సమర్పణచేసికొను ఈ వారం కొరకు, ఈ సమయంలో వారుండవలెనని వారు ఎంతో ఆశించారు. అయితే, బిడ్డలు పాఠశాలలో ఉన్నారు. మరియు బయటకు వచ్చుట కఠినమైన కార్యము. ఇంటి నిమిత్తము వారు ఇంటిబెంగ పెట్టుకున్నారు. అయితే మీ నిమిత్తమైన భావన మమ్ములను బలహీనపరచదు. మీరు ఆవిధంగానే ఉందురు. స్నేహితులుండుట ఆలాగుంటుంది. ప్రతిచోట నున్న స్నేహితులను నేను—నేను అభినందిస్తున్నాను. అయితే పాత స్నేహితులను గూర్చి ఒకటియుంటుంది. క్రొత్త స్నేహితులను నీవు ఎంతమందిని సంపాదించుకొన్నను, పాత స్నేహితులుతో సరికాదు.

4 నేనెక్కెడెక్కడ తిరిగినను, యీ చోటు నాకు ఎల్లపుడు పవిత్రమైనది. ఒక—ఒక బురద గుంటగా తప్ప, మరొకటిగా యిది లేనపుడు, షుమారు ముప్పయ్‌ సంవత్సరాల క్రితం ఒక బురద గుంటలో యేసుక్రీస్తుకు ఈ చిన్న స్థలమును నేను ప్రతిష్టించియుంటిని. ఇదంతయు ఒక చెరువు. ఆ కారణంచేత, వీధి, అక్కడ మలుపు తిరిగియున్నది—దారి చుట్టు తిరగవలసియ్నుది. మరియు ఇక్కడున్న యీ కొలను దాటుటకై ఇందులో తామరలు ఉండేవి. చెరువు తామరలు పెరిగేవి.

5 మరియు తామర—ఒక వింతైన పుష్పము. అది బురదలో పుట్టినను, బురదలోనుండి అది నెట్టుకొని రావలసియున్నది. అటుతరువాత నీటిలోనుండి చిత్తడిలోనుండి వచ్చి, తన సౌందర్యమును చూపుటకై దానికదే పైకి వస్తుంది.

6 మరియు ఈ ఉదయం, ఇక్కడ ఏమేమి జరిగినదో అదేనని నేను—నేను అనుకుంటున్నాను. అప్పటినుండి, చిన్న కొలనులోని తామర తనకు తాను నెట్టుకొని వచ్చినది. నీటిపై భాగానికి అది వచ్చునప్పటికి, తనరెమ్మలను విరజిమ్మినది. చిన్న పుష్పదళాలు బయటకు వస్తవి; లోయలోని వళ్ళీ పద్మాన్ని అది ప్రతిబింబింపచేస్తుంది. అది చిరకాలముండునుగాక! సంపూర్ణముగా దేవునికి సమర్పించబడిన నిలయముగా అది ఉండునుగాక!

7 మందిరము 1933లో ప్రతిష్ఠ చేయబడియున్నది. అయితే, ఈ ఉదయం ఆలోచనచేస్తూ, ప్రత్యేకించి ఎవరైతే క్రీస్తుయెడల, తమప్రేమ భక్తి గల్గి, యిదంతా సాధ్యపడుటకు కారణమౌతారో, అట్టి వారి కొరకు, మరలా ఒక—ఒక చిన్న ప్రతిష్ట కార్యక్రమము, అది యొక మంచి—విషయంయౌతుంది. మరియు ఈ ఆలయాన్ని క్రీస్తుకు ప్రతిష్టచేయుటకు, మీ యొక్క కానుకలు, తదితరమైన మీరిచ్చిన వాటికై మీలో ఒక్కొక్కరికి నేను కృతజ్ఞతలు చెల్లింప ఆశించుచున్నాను.

8 మరియు ఎవరైతే వారి పరిచర్యలను, యిందుకొరకు అంకితం చేసికున్నారో ఆలాటివారగు యిక్కడ ఆలయంలోనున్న మన మంచి సహోదరుల పక్షమున యీ మాటలు మాట్లాడుటకు యిచ్చిన అవకాశమునకై సమాజమును నేనెంతగానో శ్లాఘిస్తున్నాను మరియు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సహోదరుడు బాంక్స్ ఉడ్ మన గౌరవప్రదమైన సహోదరుడు రాయ్ రాబర్సన్ సహోదరుడు మనయొక్క గౌరవ ప్రదమైన సహోదరుడు, యింకా నిశ్వార్ధముతోను, ఏకమనస్సుగల అనేకులు యిది ఈలాగు కట్టబడుటకు నెలలు తరబడిగా అది మంచిగా కట్టబడుటకు యిక్కడున్నారు.

9 మరియు నా జీవితకాలమంతా, నేనెల్లపుడు ఆశించునది ఈ వేదికను, నేను చూచుటకు నేను లోపలకు వెళ్ళాను. నేనేది…యిష్టపడతానో సహోదరుడు ఉడ్ కు తెలియును. అతడు దానిని కడతానని చెప్పనేలేదు. అయితే, అది అతడు కట్టాడు.

10 మరియు నేను భవనమును మరియు అది ఏలాగు కట్టబడినదో, అదీ గమనించాను, అది సరిగా ఉన్నది. సర్వోత్కృష్టమైనదిగా ఉన్నది. నా భావనలు వ్యక్తముచేయుటకు మాటలు లేవు. అది చేయటానికి మార్గాలు లేవు, ఔనా! అయితే దేవుడు అర్ధంచేసికుంటాడు. మరియు మీరిచ్చిన కానుకలకు, మరియు ప్రభువుయొక్క యింటిగా ఒక భవనరూపమున యీ స్థలముండుటకు మీరు చేసిన దానంతటి కొరకు మీరు ప్రతిఫలము పొందుకొందురుగాక. నేను—నేనీ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇపుడు మరియు భవనము లోపల బయట ఎంతో అందంగా ఉన్నది…

11 నా యొక్క బావమరిది జూనియర్ వెబర్ యిటుక పని చేశాడు. ఇపుడు ఉన్నదానికంటె ఏదైనా శ్రేష్టమైనది. ఏలాగు సాధ్యమా అని నేననుకొనుటలేదు. సంపూర్ణమైన పని.

12 ఇక్కడున్న మరో సహోదరుడు. నేను మనిషిని కలవలేదు. చూడలేదు. ధ్వని పద్ధతులు ఏర్పాటుచేశాడు. అయితే, యిటువంటి చదరమైన భవనంలో కూడా, నేను…ధ్వని తరంగాలలో ఏలాటి ప్రతిధ్వనిలేదు. పలు పలు విధములుగా, ఆ పైకప్పులు అవియున్నవి. నేను, ఎక్కడ నిలబడినా ఫరవాలేదు, అది ఒకే విధముగా యుంటుంది. చూశారా మరియు కట్టబడిన—ప్రతియొక్క గదిలో స్పీకర్స్‌ ఉన్నవి. నీవు ఏలాగు వినాలనుకుంటావో, అలాగది చేసికోవచ్చు. ఇవన్ని చేసినది, సర్వశక్తిమంతుడైన దేవుని హస్తమని నేను నమ్ముతున్నాను. ఇపుడు ఐతే…

13 ముప్పయ్‌ సంవత్సరముల నుండి మనము ఆయనను ఆరాధించుటకు మనప్రభువు మనకు, ఎక్కువగాఒక భవనాన్ని ఎంతో అనుగ్రహించెను. మనం బురద నేలమీద, రంపపు పొట్టు వేసికొని బొగ్గు పొయ్యిలు పెట్టుకొని, యిక్కడ కూర్చొని ప్రారంభించితిమి. మరియు కంట్రాక్టరైన సహోదరుడు ఉడ్‌ వారిలో ఒకరు, సహోదరుడు రాబర్‌సన్‌ నాతో చెప్పుచుండిరి. ఆ పాత బొగ్గు పొయ్యిల వలన, ఆ స్థంభములపైనున్న యింటివాసములు కాలిపోయి (పొయ్యినిప్పుల వలన), బహుశా లోపల రెండు మూడు అడుగుల లోతు వరకు కాలిపోయెనని చెప్పుచుండిరి. ఎందుకది కాలిపోలేదు? కేవలం దేవుడుమాత్రమే దానిని కాపాడాడు. మరియు తరువాత కాలిపోయి, మందిరము యొక్క బరువంతా దానిమీద పడెను. ఎందుకు అది పడలేదు? కేవలం దేవుని హస్తమే. ఇపుడది యినుముతో చుట్టబడి భూమిపై పెట్టబడినది. గట్టిగా నిర్మింపబడినది.

14 ఇపుడు, దేవుని కృప ద్వారా లోపల సరిచేయడం మన విధియైయున్నది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుటకు…ఇది, మనము వచ్చుటకు, ఇది కేవలం అందమైన భవనం మాత్రమే కాదు గానీ, ఎవరైతే లోపలకు వస్తారో, లోపలకు వచ్చిన ప్రతియొక్కరిలో అందమైన యేసుక్రీస్తుయొక్క గుణగణములను చూచెదరుగాక! సమర్పించుకున్న ప్రజలకొరకు ప్రభువు సమర్పిత స్థలముగా బహుశాయిది యుండునుగాక. ఎందుకనగా నిర్మాణము ఎంత అందంగాయున్నదని కాదు (మేము దానిని నిజంగా శ్లాఘిస్తున్నాము. ఆలయము యొక్క అందము ప్రజలయొక్క ప్రవర్తనయైయున్నది. అందం, ఎల్లపుడు దేవునియొక్క గృహమైయున్నది.

15 ఇప్పుడు అసలైన మూలరాయిని పెట్టునటువంటి ప్రతిష్ఠ కార్యక్రమములో, ఒక ఘనమైన దర్శనం వచ్చెను. నేను దానిని ప్రతిష్ఠించిన ఉదయం అది మూలరాయిపైన వ్రాయబడియుండెను.

16 మరియు కొద్ది నిముషాల క్రితము, ఎందుకు నేను చాలా ఆలస్యంగా వచ్చానా యని బహుశా మీరు ఆశ్చర్యపడియుండవచ్చు, నా ప్రధమ కర్తవ్యం, నూతన ఆలయంలోకి నేను వచ్చుచూ, కార్యాలయములో నిలబడిన ఒక యౌవన పురుషునికి, స్త్రీకి నేను వివాహము చేశాను. ఆ దినము యొక్క ఉత్సవమునకు సంసిద్ధపడిన పెండ్లికుమార్తెను తెచ్చుటకు, నేను నమ్మకమైన క్రీస్తు సేవకునిగా యుండుటకు, బహుశా అది యొక పోలిక కాబోలు.

17 మరియు ఇపుడు మనం ప్రారంభములో చేసినట్లు చేద్దాం. ఆలయము యొక్క మొదటి ప్రతిష్టను మనము మొదలుబెట్టినపుడు, మూలరాతిని వేసినపుడు, నేను కేవలం యౌవనస్తుడను. బహుశా ఇరవై-యొకటి, ఇరవై-రెండు సంవత్సరాల వయస్కుడను, అది నేను వివాహము చేసికొనకముందు. దేవునిలో…దేవుడు, ఆరాధన చేయబడుట కొరకు. చూశారా! మరియు ఆయన ప్రజలతో దేవుడు ఆరాధింపబడుటకు సరియైన క్రమముగల స్థలము చూడవలెననునది ఎల్లపుడు నా ఆశ, మనమది ఒక విధంగానే చేయగలము. అందమైన భవనం ద్వారా కాదు, గానీ సమర్పణ జీవితము బట్టియే అది చేయగలము.

18 మరియు మనం ప్రతిష్ఠచేయకముందు, ఒక ప్రతిష్ఠ ప్రార్ధన కొంతలేఖనాలు చదువుదాం. తిరిగి దేవునికి ఆలయాన్ని ప్రతిష్ఠచేద్దాం. నాకు…ఆ తరువాత రానున్న నాయొక్క వర్తమానము కట్టుబడికై సువార్త మీద నాయొద్ద ఒక వర్తమానమున్నది.

19 మరియు, రాత్రికి నేను, ప్రకటన 5వ అధ్యాయాన్ని తీసికొనగోరుచున్నాను. అది ఏడు సంఘకాలముల నుండి—ఏడు ముద్రలలోకి పోయి కలయుచున్నది. నేను…అది తరువాత మనకు…

20 సోమవారం రాత్రి, తెల్లని గుర్రం మీద సవారిచేయువాడు, మంగళవారం రాత్రి…నల్లని గుర్రం మీద సవారి చేయువాడు అలాగు ఆలాగు నాలుగు గుర్రంలపై సవారి చేయువారు. తరువాత ఆరవ ముద్ర విప్పబడుట.

21 మరియు ఆ తరువాత ఆదివారం ఉదయం తరువాత ఆదివారం ఉదయం ప్రభువు చిత్తమైతే…మనం తరువాత చూద్దాం. తరువాత అది ప్రకటన చేద్దాం. బహుశా, తరువాత ఆదివారం ఉదయం, భవనంలో రోగులకై ప్రార్ధనా కూటము ఉంటుంది.

22 మరియు తరువాత ఆదివారం రాత్రి ముగింపుతో…ఏడవ ముద్ర విప్పటానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక! అది అక్కడ చిన్న వచనము. అది యిది చెప్తుంది. “పరలోకములో అరగంట సేపు నిశ్శబ్ధముగా యుండెను”. ఆ నిశ్శబ్ధం ద్వారా.

23 ఇపుడు ఈ ముద్రల యొక్క అర్ధమేదో నాకు తెలియదు. బహుశా ఈ ఉదయం మీలో కొందరివలె ఎరుగని స్థితిలో నేనున్నాను. మనము మనుష్యులద్వారా ప్రవేశపెట్టబడిన మతగురువుల సంబంధమైన భావాలు మనము కల్గియున్నాము. అయితే అది దానిని తాకలేదు. మీరు గమనించినట్లయితే, అది ప్రేరేపణ ద్వారానే రావలసియున్నది. అది, దేవుడే, ఆయనేయై యుండవలసియున్నది. అది చేయగలవాడు, ఆయన ఒక్కడే, ఆయన గొర్రెపిల్ల.

ఈ రాత్రి ఆ విమోచనా గ్రంధమును గూర్చి.

24 ఇపుడు ఇందులో, రోగుల కొరకు ప్రార్ధనా కూటమును, మొదలైనవి, నేను ప్రకటించకపోవుటకు కారణమేదనగా, నేను…కొందరు స్నేహితులతో యుంటున్నాను. సమయము యొక్క ప్రతి నిముషమును చదువుటకు, ప్రార్ధించుటకు నేను వినియోగించు చున్నాను. మరియు నేను విడచి, పశ్చిమానికి వెళ్ళకముందు ఆ ఏడుగురు దూతలు ఎగిరివచ్చుట, ఆ దర్శనము మీకు తెలుసా? కనుక, కొద్దిసేపైన తరువాత మీరు అర్ధంచేసికుంటారు.

25 కాబట్టి, యిపుడు భవనంలో అది ప్రతిష్ఠించబడితే, లేక దేవుని ఆరాధించుటకు, కొద్ది నిముషాలలో ప్రతిష్ఠించబడబోతున్నట్లయితే, దానిని ఆ విధముగా నుంచవలసిన వారమై యుంటున్నాము. మనము ఎన్నడును భవనంలో కొనకూడదు. లేక అమ్మకూడదు. ఇక్కడున్న యీ ఆడిటోరియంలో ఏలాటి వ్వాపారము చేయకూడదు. అది యిక్కడ జరుగకూడదు. సేవకులు లోపలకు వచ్చి పుస్తకాలు మొదలగునవి, అమ్ముటకు అనుమతి యివ్వకూడదు. అదేదైననప్పటికి, అది చేయుటకు వేరే స్థలాలున్నవి. ఎందుకనగా మనము—మనము ప్రభువుయొక్క యింటిలో అమ్మకూడదు, కొనకూడదు. అది—ఆరాధన స్థలముగా ఉండవలసియున్నది. ఆ ఉద్ధేశ్యమునకై అది పరిశుద్ధమైనది, సమర్పించబడియ్నుది. ఔనా! ఆయన మనకు మంచి స్థలాన్ని అనుగ్రహించాడు. దానిని ఆయనకు ప్రతిష్టచేద్దాం. దానితో పాటు మనలను ఆయనకు సమర్పణ చేసికుందాం.

26 మరియు ఇపుడిది వినుటకు అభ్యంతరగా యుండవచ్చు. అయితే, ఇది దర్శించు స్థలముకాదు. ఇది ఆరాధనా స్థలము. ఇక్కడ ఒకరు ఒకరు ఆరాధనచేయుటతప్ప, లోపల గుసగుసలాడుట చేయకూడదు. అది ఖచ్చితంగా అత్యవసరమైతేతప్ప. చూశారా? మనం గుంపులుగా కూడుకొనకూడదు. మనం భవనంలో పరుగులు తీయకూడదు. మన పిల్లలు పరుగులెత్తుటకు అనుమతించకూడదు. కనుక యిది చూస్తూ, యిది చేయుటను ఎంతోసేపని భావించక, మనం జాగ్రత్త తీసికొనుటకై యిది మనం కట్టియున్నాము. ఇపుడు మనమిది యిక్కడ యుంచియున్నాము. అనేకులుక్రొత్తవారున్నారు. సర్వశక్తిమంతుని యొక్క పరిచర్య కొరకై భవనము ప్రతిష్టచేయబడుబోవుచ్నుదని మందిరములోని వారికి తెలుసు. కాబట్టి, మనలను మనము ప్రతిష్టచేసికుంటూ పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించునపుడు, ఒకరికొకరము నిశ్శబ్ధంగాయుండి దేవుని ఆరాధన చేద్దామని జ్ఞప్తించుకుందాం.

27 మనలను ఒకరినొకరం సందర్శించవలయునంటె ఆ విధముగా సందర్శించుటకు స్థలాలు యున్నవి. అయితే, చుట్టు తిరుగవద్దు. తద్వారా మీరు తలంచునవే మీరు వినలేరు. ఒకరు లోపలకు వస్తే వారేమి చేయాలో వారికి తెలియదు. ఎంతో శబ్ధము. అది కేవలం మానవత్వం. నన్నెంతగానో గాయపరచునంతగా దానిని నేను ఆలయాలలో చూశాను. ఎందుచేతననగా ప్రభువు యొక్క పరిశుద్ధ స్థలములోకి, మనం ఒకరినొకరం కలసికొనుటకు రాలేదు. దేవుని ఆరాధన చేయుటకు మనం యిక్కడకు వచ్చాము. తరువాత మన గృహాలకు వెళ్తాము. ఈ పరిశుద్ధ స్థలము ఆరాధన చేయుటకు ప్రతిష్టించబడుచున్నది. ఇప్పుడైతే…బయట నిలబడు. అది నీకెంతగా మంచిగా, పరిశుద్ధంగా యున్నంతవరకు నీవు కోరిందల్లా మాట్లాడు. ఒకరి యింటికి ఒకరు వెళ్ళు. ఒకరి స్థలాన్ని ఒకరు సందర్శించు. అయితే, ఆ ద్వారాన్ని ప్రవేశించునపుడు, నిశ్శబ్ధంగా యుండుడి.

28 మీరు ఆయనతో మాట్లాడుటకు మీరు యిక్కడకు వచ్చారు. ఔనా! ఆయన తిరిగి మీతో మాట్లాడ నీయ్యుడి. ఇబ్బంది ఏదంటె, మనం ఎక్కవసేపు మాట్లాడుతాము. తగినంతగా వినం. అటుతరువాత, మనం యిక్కడకు లోపలకు వచ్చిన తరువాత, ఆయనకొరకు వేచియుందాం.

29 ఇపుడు, పాతమందిరములో, మేజర్‌ ఉల్‌రిచ్‌ సంగీతం వాయించినపుడు ఉన్నవారిలో, అక్కడ ప్రతిష్ట దినమున నున్నవారిలో, ఈ ఉదయం ఒకరుకూడా లేరు. స్థలాన్ని ప్రతిష్టించుటకై యిక్కడ మూడు సిలువల వెనకాల నేను నిలబడ్డాను. నేను ఎవ్వరిని అనుమతించను…ద్వారము నొద్ద ద్వారపాలకులు నిలబడియున్నారు. ఎవ్వరూ మాట్లాడకుండ చూచుటకు, మీరు, బయట మాట్లాడుకొండి. లోపలకు రండి, మీరు వేదికయొద్దకు నెమ్మదిగా వచ్చి నిశ్శబ్ధంగా ప్రార్ధించుకోవాలనుకుంటె రండి మీరు తిరిగి మీ స్థలాలోకి వెళ్ళిపోయి, బైబిల్‌ తెరవండి. మీ పొరుగువారు ఏం చేసినను, అది అతనికి సంబంధించినది. నీవేమి చెప్పనవసంలేదు. నీవు అతనితో మాట్లాడవలెననుకుంటె “బయట అతన్ని చూస్తాను” అని చెప్పు ప్రభువును ఆరాధన చేయటకు నేనిక్కడ ఉన్నాను “అని చెప్పు” ఆయన వాక్యాన్ని చదువు (లేక) నిశ్శబ్ధంగా కూర్చొ.

30 మరియు అటు తరువాత సంగీతం. సహోదరి, గెర్టీ, ఆమె యిక్కడ యీ ఉదయం ఉన్నదో లేదో తెలియదు. సహోదరి, గిబ్స్‌, పాత పియానొ, నీకు జ్ఞాపకమున్నంతవరకు యీ మూలలో వెనుక కూర్చొని యున్నారని అనుకుంటాను. మరియు “నా రక్షకుడు ఎక్కడైతే చనిపోయెనో, అక్కడ సిలువనొద్ద” అను నిజమైన మాధుర్యమైన, మెల్లని సంగీతమును, మరియు—మరియు పరిచర్య సమయం వచ్చువరకు మరియు ఆమె నెమ్మదిగా వాయించును. పాటల నాయకుడు లేచి నిలబడి, సభకు సంబంధించిన రెండు పాటలను నడిపించెను. మరియు అటు తరువాత, ఏదైన ప్రత్యేక గానము ఉన్నట్లయితే, వారది పాడుతారు. అయితే గుంపుగాకాదు. తరువాత సంగీతం కొనసాగుతునేయుంటుంది. తరువాత, నేనది విని, అది నేను బయటకు వచ్చు సమయమని నేను తెలిసికుంటాను.

31 ఎప్పుడైతే ప్రార్ధించుచున్న ప్రజల సమూహము నొద్దకు ఒక సేవకుడు, ఆత్మ అభిషేకముతో నడుచుకుంటు వచ్చునపుడు, పరలోకమునుండి మీరు వినుటకు బద్ధులైయున్నారు. అదంతే, దానిని అభ్యంతరపరచుటకు వేరే మార్గములేదు. అయితే, మీరు—మీరు…గందరగోళంలోకి మీరు—మీరు వెళ్ళిపోతారు. ఆత్మ దుఃఖపడతాడు. అది మనకు వద్దు వద్దు ఇక్కడకు మనము ఆరాధన చేయుటకు వచ్చాము. మనకు మంచి గృహాలున్నవి. ఒక్క నిముషంలో నేనందునుగూర్చి మాట్లాడబోతున్నాను. మన యిండ్లలో, మన స్నేహితులను దర్శించి వారిని తీసికొని వెళ్తాము. ఇది ప్రభువుయొక్క గృహము.

32 ఇపుడు చిన్న బిడ్డలున్నారు. పసిబిడ్డలున్నారు. ఏలాటి వ్యత్యాసము వారికి తెలియదు. వారికి కావలసినది వారు పొందుకునే యొకేయొక మార్గము దానికొరకు ఏడ్చుట. మరియు కొన్నిసార్లు, అది (తాగే నీటికొరకు; కొన్నిసార్లు వారియెడల శ్రద్ధచూపుట కొరకు మరియు, మనము ప్రభువు కృపనుబట్టి, ఒక గదిని ప్రతిష్టించాము. అది పట్టిలో “అరుపుల గది” అని యున్నది. అయితే, అది నేరుగా, నాకు ఎదురుగనే ఉన్నది. మరియొక పదములో అది “తల్లులు తమ పిల్లలను తీసికొనివెళ్ళునది”. అది

33 ఇపుడు అది యిబ్బందిగా యుండదు. బహుశా, అది నాకు, యిక్కడ వేదికనొద్ద, అంతరాయం కల్గించదు, అభిషేకముతోనున్నందున, బహుశా నేనది గమనించలేను కూడా. అయితే, మరికొందరు దగ్గఱగా కూర్చున్నారు. అది వారికి అంతరాయం కలిస్తుంది. ఔనా! పరిచర్య వింటానికి వారు వస్తారు. కాబట్టి అలాగే తల్లి కూడా, మీ చిన్నబిడ్డ మూల్గటం ప్రారంభించగనే మీరు దానికేమి చేయలేరు. అదియొక…మీరు దానిని తీసుకరావలసియున్నది. ఒక నిజమైన తల్లి, తన బిడ్డను ఆలయానికి తీసిక రాగోరును. అది, నీవు తప్పక చేయవలసియున్నది.

34 మరియు భవనము యొక్క ప్రతి మూలను మీరు చూడగలందులకు, సభామందిరమునంత చూచుటకు, అక్కడొక గది మనకున్నది. అక్కడొక స్పీకర్ ఉన్నది. మీరు కోరినట్లు మీరు దాని ధ్వనిని స్వాధీనపరచుకొన గలరు. చివరన ఒక—ఒక చిన్న అలంకరణ గది మరియు నీళ్ళ బేసిన్ యున్నది. తల్లి సదుపాయముకొరకు ఖచ్ఛితంగా ప్రతీది ఉన్నది. కుర్చీలు మొదలైనవాటిలో ఉన్నవి. నీవు కూర్చొనవచ్చును. బిడ్డను మార్చుకొన వచ్చును. మార్చుకోవాలనుకుంటె, అక్కడ కూర్చొంటానికి అన్నీ ఉన్నవి. అంతా ఏర్పాటు చేయబడి యున్నవి.

35 మరియు అటు తరువాత, చాలాసార్లు, యౌవన వయస్కులు మరియు కొన్నిసార్లు పెద్దవారు, తెలుసా? ఆలయంలో యౌవనస్తులు…కాగితపు నోట్సులు కత్తిరించుకుంటు, అందించుకుంటుయుంటారు. అంతకంటె మంచిది మీరు ఎరిగినవారు. ఔనా! అంతకంటె శ్రేష్టమైనది మీరు తెలిసికొనవలసియున్నది. చూశారా? మీరు ఇక్కడకు రాకూడదు…ఒక దినాన నిజమైన పురుషుడవు నీవు కావలయునంటె, మరియు దేవుని రాజ్యముకొరకై కుటుంబాన్ని పెంచవలయునంటె, అలాగైతే ఆరంభంనుండి దానిని ప్రారంభించు. గమనిస్తున్నావా మరియు—మరియు మంచి కార్యంచేయి, మంచిదిచేయ్‌ మరియు ఇపుడు ఒకవేళ

36 ఇపుడు, ద్వారపాలకులు భవనములయొక్క మూలల్లో, మొదలగుచోట్ల నిలబడియున్నానంటారు. ఏదైన సంభవిస్తే, వారి కర్తవ్యము కొరకు వారు—నిర్ణయించబడ్డారు. ధర్మకర్తలు యిక్కడ ముందు కూర్చున్నారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వ్యక్తి నెమ్మదిగా యుండమని చెప్పుటకు వారు ఆజ్ఞను పొందియున్నారు.

37 తరువాత, ఒకవేళ ఆ మర్యాద వారికి లేకపోతే, స్థలాన్ని యింకొకరు పుచ్చుకొనుట మంచిది. ఉద్ధేశ్యముకొరకు వచ్చినవారు ఒకరున్నారు కనుక. అందుకొరకు మనము యిక్కడున్నాము. అనగా ప్రభువు వాక్యము వినుటకొరకు మరియు, ప్రతియొక్కరు అది వినాలనికోరుతారు. ఎంత నిశ్శబ్ధంగా వినాలో అంత నిశ్శబ్ధంగా, వారు ఉన్నంత నిశ్శబ్ధంగా. అనగా గుంపుగా సంభాషించుట కాదు, అలాగు చేసికొనిపోవుటకాదు.

38 ఒకరు ప్రభువును ఆరాధిస్తున్నారు అది అనుకున్నట్లే, అది ఆలాగు యుండవలసియున్నది. అందుకే, నీవు యిక్కడున్నది. ప్రభువును ఆరాధన చేయుటకొరకు వెంటనే దేవుని స్తుతించుటకు నీవు భావన కల్గియుంటావా, కేకలు పెట్టుటకు ముందుకు సాగు. ఔను, ఎందుకనగా అందుకొరకే నీవు యిక్కడ ఉన్నది. అయితే, నీ స్వంత విధమున ఆరాధించుటకు ప్రభువును ఆరాధించుటకు. అయితే, నీవు మాట్లాడుచున్నపుడు, పుస్తకం చీటివ్రాసుకుంటున్నపుడు ఒకరు ప్రభువును ఆరాధిస్తున్నారు. ప్రభువును ఆరాధన చేయుటనుండి, నీవు ఒకరిని ఆటంకపరచుచున్నావు. చూశారా కాబట్టి, అది తప్పని మనం భావిస్తున్నాము. మన యొక్క సభలో మన ఆలయములో దానిని మనం ఒక చట్టముగా చేయగోరుచున్నాము. అనగాఈ భవనం కొరకై, ఈ ఆలయం దేవుని రాజ్యముకొరకును, వాక్యము ప్రకటించుట కొరకును ప్రతిష్ట చేయబడబోవుచున్నది. ప్రార్ధించుడి! ఆరాధించుడి. ఆ కారణము కొరకే మీరిక్కడకు రావలసియ్నుది. ఆరాధించుటకు తరువాత.

39 మరియు యింకొక విషయం: కూటము ముగించబడిన తరువాత, సహజంగా ఆలయంలోని ప్రజలు…ఇక్కడ ఆలాగని నేను—నేను అనుకొనుటలేదు. ఎందుకనగా…నేనెప్పుడు వెళ్ళిపోతాను. ఔను, ఎందుకనగా నేను వెళ్తాను.

40 సహజంగా, ఇతరకూటములో ప్రసంగించినపుడుకూడా, అభిషేకము వచ్చునపుడు, దర్శనములు కల్గునపుడు, నేను అలసిపోయి గదిలోనికి వెళ్ళిపోయెదను. ఒకవేళ, బిల్లీ లేక అక్కడ మరికొందరు, కొంచెం నాకు విశ్రాంతి కొరకు, అందులో నుండి నేను వచ్చువరకు యింటిలోకి తీసికొని వెళ్తారు. ఎందుకనగా అది ఎంతో బాధాకరమైయుంటుంది.

41 మరియు పరిశుద్ధ స్థలమందంతట పిల్లలు పరుగులు తీయుట, మరియు—మరియు పెద్దలు గదిలో నిలబడి ఒకరితో ఒకరు అరుపులు అరచుట సంఘాల్లో నేను చూశాను. ఆ రాత్రివచ్చు కూటమును లేక ఏ సమయములోనైనా కూటమునైనా పాడుచేయు మంచి విధానమౌతుంది. ఔను.

42 కూటము ముగిసిన వెంటనే, సభాస్థలమును విడుచివెళ్ళడం. మీరు ఆరాధనలో ఉండియుంటిరి. తరువాత, బయటకు వెళ్ళిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకొండి. మీరేమి చేయాలనుకుంటె అది చేయండి. మీకేమైనయున్నట్లయితే, మీరు ఒకరితో మాట్లాడుకొనాలంటె, వారిని—వారిని చూడాలనుకుంటె, వారితో వెళ్ళండి. లేక వారియింటికి వెళ్ళండి. లేక ఏదైన, అయితే సభాస్థలములో చేయవద్దు. దీనిని దేవునికి ప్రతిష్టచేద్దాం. ఔను. ఇది ఆయనను కలసికొను స్థలము. ఆయనను మనము కలుస్తాము. ఔను. మరియు బహుశా, చట్టము పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళును. అది మన పరలోకపు తండ్రిని సంతోషపరచునని నేను—నేను నమ్ముతున్నాను.

43 మరియు మీరు వచ్చునపుడు, మీ మద్య వరములు అగుపడుట మీరు కనుగొనగలరు…అది యిక్కడ…యుండవని నేను నమ్ముతున్నాను. అయితే ప్రజలకు క్రొత్త ఆలయం ఉన్నట్లయితే, మొదటి విషయం ఏంటో తెలుసా? సమాజం గంజివలె బిగుసుకుపోతారు. ఆలాగు నీవెన్నడు ఉండకూడదు. ఇది ఆరాధన స్థలము. ఇది ప్రభువు యొక్క గృహమైయున్నది. మరియు ఆత్మ సంబంధమైన వరములు మీ మధ్యకు వచ్చుట ఆరంభమైతే…

44 నేను వెళ్ళిన తరువాత, దేశములోని వివిధ స్థలములలో నుండి ప్రజలు యిక్కడకు వచ్చి యిది వారి గృహముగా చేసికుంటారు. నేను కృతజ్ఞుడనై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అది నమ్ముచున్నాను…

45 నేను ప్రతిష్టించి, ఒక యౌవనస్తునిగా ఆ మూలరాతిని అక్కడ ఆ ఉదయం వేసినపుడు - యేసుక్రీస్తు రాకడను చూచుటకు దానియొక్క నిలకడకై ప్రార్ధించితిని. మరియు నేను ఆలాగు చేసి వేల డాలర్లు అప్పుచేసి…యింత సంఖ్యగల సమాజములో యింత కానుక మీరు తీసితిరి. ముప్పయ్‌ లేక నలభై సెంట్లు. మరియు మన? కరారు కర్తవ్యం, నెలకు నూట ఏభై, రెండు వందల డాలర్లు. నేనది ఏలాగు చేయగలను? మరియు నేను పనిచేస్తున్నానని, నాకు తెలుసు. నేనది చెల్లించవలయునని నేనెరిగియుంటిని. నేను…పదిహేడు సంవత్సరాల కాపరత్వములో ఒక్క సెంటుకూడా తీసికొనకుండ నాకు కలిగినదంతా (నేను నా జీవన వ్యయమునకు తప్ప దేవుని రాజ్యము కొరకు వెనుక పెట్టెలో వేసెడివాడను.

46 మరియు ఒక్క సంవత్సరంలోగా యిది, వాహనాలు బాగుచేయు స్థలముగా మారుతుందని ప్రజలు ప్రవచించి చెప్పారు. ఒకసారి, ఒక మోసకరమైన న్యాయసభ వివాదము ద్వారా సాతాను దీనిని తీసికొన ప్రయత్నం చేసినది. ఒక మనుష్యుడు, తాను, అందులో పనిచేస్తున్నపుడు తన పాదములో దెబ్బ తగిలినదని, చెప్పి, మందిరం తీసికొన ప్రయత్నించ ఆశించి దావా వేశాడు. మరియు…విధి నిర్వహణకై, వారములు నేను నిలబడ్డాను అయితే, ఈ అపార్ధాలు, ముందు పలుకులు యింకా వారు చెప్పినవి ఏమైనప్పటికి, ఈ దినాన అది యొక అందమైన సభాస్థలముగాను, సంయుక్త రాష్ట్రములలో ఒక అందమైన ఆలయముగాను ఉన్నది, అది నిజం.

47 ఇక్కడనుండే, జీవముగల దేవుని వాక్యము ప్రపంచమంతటికి వెళ్ళిపోయినది. చూశారా! ప్రపంచమంతటకు, విరామము లేకుండ ఆకాశము క్రిందనున్న ప్రతిదేశమునకు నేనెరిగినంత వరకు ప్రపంచమును చుట్టి భూగోళమునకు వెళ్ళిపోయినది. ఇందుకొరకు మనం ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఇందుకొరకు మనము కృతజ్ఞులమై యుంటున్నాము.

48 మరియు, మనమిపుడు నివాసముండుటకు ఒక స్థలము, మన తలలక్రింద ఒక కప్పు, కూర్చుండుటకు పరిశుభ్రమైన, అందమైన ఆలయము ఉన్నది. విధికొరకు మనలను నూతనముగా ప్రతిష్టించుకొని మరియు క్రీస్తుకు అర్పణచేసికుందాం.

49 మరియు సహోదరుడు నెవిల్‌, మన ఉన్నతమైన సహోదరుడు, నిజమైన కాపరి, జీవముగల దేవునియొక్క సేవకుడు. ఆ మనుష్యుడు తాను ఎరిగినంత వర్తమానముతో, తాను అది పట్టుకొనియున్నాడు. ఔనది నిజం. అతడు సాధు స్వభావముగల వ్యక్తి. అతడు కొద్దిగా భయస్తుడు…లేక భయమనికాదు. నా అర్ధం అదికాదు. అయితే, అతడు ఎంతో సాధువు. అతడు గట్టిగా మాట్లాడడు. మీకు తెలుసా. “కూర్చొ లేక, నిశ్శబ్ధంగా ఉండుడి” అని తీవ్రంగా, కరుకుగా పలుకుట—మాట్లాడడు. అది నేను—నేను గమనించాను. దాని వెనుక టేపుల్లో నేను విన్నాను.

50 అయితే నేనూ ఆలాగు చేయుట జరిగినది. కాబట్టి, నా—నా…మాటలు మీరు జ్ఞాపక ముంచుకోవాలని నేను—నేను కోరుచున్నాను. ఇదంతా టేపు చేయబడుచున్నది. ఔనా! ప్రతీది టేపు చేయబడుతున్నది. మరియు దయచేసి, ప్రతియొక్క పరిచారకుడు తన విధి నిర్వహణలో యుండవలసియున్నది. ఆ విధిని పవిత్రంగా కాపాడుటకు, దేవుని యొద్దనుండి నీవు ఆజ్ఞను పొందావని జ్ఞాపకముంచుకో చూశారా! ధర్మకర్త ఆలాగే. కాపరి తెచ్చును…

51 అది చెప్పుట కాపరియొక్క స్థానముకాదు. అది ధర్మకర్తలయొక్క…లేక నాయొక్క భావము పరిచారకులయొక్క స్థానం. ఎందుకనగా వారు సంఘము యొక్క రక్షకభటులు అనగా, యౌవన జంట బయటకు వచ్చి, బయటవచ్చి, హారన్‌ మ్రోగిస్తే వారు సహజంగా చేస్తారు తెలుసా?, కూటములలో, అలాటిది చేస్తారు. బయటకు వెళ్తారు. తల్లి తమకూతురుని యిక్కడకు పంపినపుడు, ఆమె ఒక తుంటరి పిల్ల వానితో కారులో వెళ్ళిపోతుంది. ఆమె తల్లి, ఆమె ఆలయంలో ఉన్నదని అనుకుంటుంది. ఆలాగు. దానిని సంఘపరిచారకుడు, చూడవలసియుంటుంది. “నీవు యిక్కడకు లోపలకు వచ్చి కూర్చుంటావా? లేదా, నేను నిన్ను నా కారులో తీసుకొనివెళ్ళి, నీ తెల్లియొద్దకు నీ యింటికి తీసికొనివెళ్తాను”. చూశారా, నీవు, నీవు తప్పక అది చేయవలసియున్నది.

52 జ్ఞప్తించుకో, చూడండి, ప్రేమ ఎల్లపుడు సరిదిద్దును. నిజమైన ప్రేమ దిద్దుబాటు చేయును. కావున దిద్దుబాటుకు నీవు నిలబడవలసియున్నది. తల్లులు! మీ పిల్లలకు స్థలమున్నదని మీరు గుర్తెరుగుడి. యౌవన బిడ్డలైన మీరు, భవనంలో పరుగులు తీయుటకంటె వ్యత్యాసమైనది ఔనా! పెద్దలైన మీరు మాట్లాడుచూ, భవనంలో మీ సంభాషణ కొనసాగించుట చేయవద్దు. చూశారా అలా చేయవద్దు. అది దేవుని సంతోషపరచుటకాదు సుమా.

53 యేసు చెప్పియున్నాడు. “నా యిల్లు ఆరాధనా స్థలముగా, యిల్లుగా చేయబడియుండెనని” వ్రాయబడియున్నది అని. అన్ని దేశములద్వారా ప్రార్ధనా యిల్లుగా ఏలా పిలువబడుతుంది? వారు కొనుచు, అమ్ముతున్నారు. ఆయన త్రాళ్ళను పేనాడు. భవనంలోనుండి ప్రజలు బయటకు పరుగులు తీసివెళ్ళిపోయారు. మరియు ఇక్కడున్న యీ పరిశుద్ధ స్థలములో జరుగుటకు మనం అంగీకరించవద్దు, కాబట్టి, మనయొక్క జీవితాలు, మన ఆలయం, మన పరిచర్య, మనం కల్గియున్న సమస్తము దేవుని రాజ్యమునకు అర్పణచేద్దాం.

54 ఇపుడు, ప్రతిష్ట ప్రార్ధనకు ముందు కొన్ని లేఖనములు నేను చదవాలనుకుంటున్నాను. తరువాత—తరువాత అది పున: ప్రతిష్ట, ఎందుకంటె వాస్తవమైన ప్రతిష్ట ముప్పయ్‌ సంవత్సరముల క్రితమే జరిగినది. ఇప్పుడు…తరువాత, తరువాత ఈ లేఖనము చదివి కొద్ధి నిముషాలు మనము—మనము దానిమీద మాట్లాడుకుందాం. దేవుడు, ఆయన ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతాను.

55 మరియు ఇప్పడు, నేను చెప్పాలనుకున్న మరొక విషయం. రికార్డింగులకొరకు, యితరత్రా వాటికొరకు మనము అక్కడ ప్రత్యేక గది కల్గియున్నాము. ఎవరైతే రికార్డింగ్‌ చేసుకుంటారో వారికి. అక్కడ ప్రత్యేకమైన తగిలించు సాధనములు, అక్కడ ముఖ్యమైన మైక్‌నుండి నేరుగా వచ్చునవియున్నవి.

బాప్తిస్మము కార్యక్రమము కొరకు అక్కడ గదులున్నవి. బట్టలున్నవి.

56 మరియు నిజంగా లేఖనము తెలియని అనేకులు, సిలువ ఆలయంలో ఉంచుటను గూర్చి ఎరుగని అనేకులు, ఎప్పుడు నన్ను చెడ్డగా తలస్తారు. ఇక్కడ అందునుగూర్చి ఒకటి జరిగియుండుట నాకు జ్ఞాపకమున్నది. నేను మూడు సిలువలుంచాను. ఒక సహోదరుడు ఉద్రేకపడి లేచిపోయాడు. ఎందుకంటె, సిలువ యనునది కతోలిక్‌వారికి అని మరియొక్క సంఘశాఖ చెప్పుట విన్నాడు.

57 సిలువను గూర్చిన ఎన్నిక కతోలిక్‌ వారే కల్గియున్నారని చెప్పు, ఒక విద్యార్ధిగాని, లేక మరొకరుగాని, లేక తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు నాకు కావలయును, క్రీస్తుయొక్క సిలువ కతోలిజమునకు సంబంధముండదు. అది, దేవునిని, రాజ్యమును పోలిక చూపుతుంది. ఇపుడు భక్తులు కతోలిజంనకు పోలికగానున్నారు. “దేవునికి నరునికిని మధ్యవర్తి ఒకరున్నారని మేము నమ్ముతున్నాము. ఆయన క్రీస్తు, అయితే కతోలిక్‌లు నమ్ముతారు అన్నిరకాలైన మద్యవర్తులున్నారని. వేలకొలది స్త్రీలు, పురుషులున్నారని వారు నమ్ముతారు. ఏదైన ఒక మంచి కతోలిక్‌ వ్యక్తి చనిపోతే మధ్యవర్తి అవుతాడు. క్రీస్తుయొక్క సిలువ యేసుక్రీస్తుకు పోలిక.”

58 ఆరంభ సంఘము యొక్క పురాతన చరిత్ర ప్రకారము—ఆరంభ క్రైస్తవులును గూర్చి మీకు తెలుసా? వారెక్కడకు వెళ్ళినను క్రైస్తవులుగా వారు గుర్తించబడుటకై వారి వీపులమీద శిలువలను మోసికొనిపోయిరి. ఇపుడు అది వారేనని కతోలిక్‌లు చెప్పుకుంటున్నారు. బహుశా, ఆ మొదటివారు వారేయని చెప్పినట్లయితే, అప్పటికి కతోలిక్‌ సంఘము నిర్మణాత్మకం కాలేదు. ఔనా? అయితే, క్రైస్తవులు శిలువను మోసిరి…“వెనక శిలువ” అని జనులు చెప్పుట మీరు వినియుందురు. అది కతోలిక్‌కు సరిపోలుస్తారా?

59 ప్రపంచమందున్న విశ్వవ్వాప్తమైన పరిశుద్ధాత్మ సంఘము అది నిజమైన కతోలిక్‌. మనము కతోలికలము. అసలైన కతోలిక్‌లము. మరియు బైబిల్‌ నమ్మిన కతోలిక్‌లము. ఔను. వారు కతోలిక్‌ సంఘము, సంస్థాపకము. మనము వారికి స్వతంత్రులము. అపోస్తలుల సిద్ధాంతము యొక్క కొనసాగింపులో నున్నవారము మనము. పరిశుద్ధాత్మ బాప్తిస్మములోని కొనసాగింపులోనున్న వారము మనము. మరియు ఆరంభ సంఘము నిలబడిన వాటి కన్నిటికి, నిలబడినవారము. కతోలిక్‌ సంఘమునకు అవన్నిలేవు. ఔనా.

60 కనుక ఏ ఓలీవ చెట్టు క్రిందనైతే యేసు ప్రార్ధించాడో అక్కడనుండి దానిని చెక్కి, యిక్కడ శిలువ నుంచారు, సంవత్సరాల తరబడిగా తీయబడిన శిలువ అది. సహోదరుడు ఆర్గన్‌బ్రైట్ వలన నాకు యివ్వబడినది. ఈ ఆలయంతో దానిని నేను ప్రతిష్ట చేయగోరుచున్నాను.

61 మరియు ఎవరు, అక్కడ అది తగిలించినా, అదెంతో తగిన విషయంగా ఉంటుంది. నా—నా ఎడమ ప్రక్కగా అదెవరు తగిలించారో నాకు తెలియదు. ఆయన కుడివైపున నున్న దొంగను క్షమించాడు. అదినేనే.

62 మరియు ఇంకొక దానిని అది పోలుస్తుంది. ఆయన తలను వంచియుండగా ఆయన వేదనను మీరు చూస్తున్నట్లు అది బలిపీఠము వైపునకు చూస్తున్నది. పాపివైన, నీకొరకు ఆయన ఎదురుచూస్తున్నాడు. నీవైపే ఆయన చూస్తున్నాడు. తరువాత, యిక్కడ వారు, చిన్న దీపము పెట్టారు. వేదిక పిలుపు పిలువబడినపుడు, ప్రజలు యిక్కడకు వచ్చునపుడు, ఆ దీపము మెరియుచుండును…

63 “ఎందుకది?” అని మీరు అడగవచ్చు, “ప్రతిమ అక్కడ యుండకూడదు కదా?” అని అడగవచ్చు.

64 సరే. “చెక్కుడు ప్రతిమలను మీరు చేసికొనకూడదు” అని చెప్పిన అదే దేవుడు “రెండు కెరూబులను చేసి, వాటి రెక్కలు ఒకటిగా కట్టి, ఎక్కడైతే ప్రజలు ప్రార్ధించెదరో, వాటిని అక్కడ కరుణా పీఠము యొద్ద పెట్టుడి” అని చెప్పాడు.

చూశారా! అది—అది అర్ధం తెలియక. ఔనా?

65 కాబట్టి, అది ప్రేరేపణచేత, నేరుగా సరైన స్థలములో ఉంచారు. కుడివైపున నున్న ఒకరిలో నేనున్నందకు నేనెంతో కృతజ్ఞుడను. ఆయన నన్ను క్షమించాడని నేను నమ్ముతున్నాను. నేనెరిగినంత వరకు, అక్షరార్ధకంగా ఏదైన దొంగిలించుట నేనెరిగినంత వరకు నా జీవితంలో నేనెన్నడు చేయలేదు. అయితే, ఆయన యొక్క సమయాన్ని నేనెంతగానో దుర్వినియోగపరచి, ఆ విధంగా దొంగిలించాను. మరియు నేను చేయకూడని అనేక విషయాలు నేను చేశాను. ఆయన నా పాపములు క్షమించినందులకు, ఈ ఉదయవేళ, నేను దేవునికి కృతజ్ఞుడును.

66 మరియు ప్రతిష్ట ఆరాధనమీద షుమారు ఐదు నిముషాలు మాట్లాడుటకొరకై మొదటి దినవృత్తాంతములు పుస్తకములో 17 నుండి, నేను చదవాలని కోరుతున్నాన. ప్రార్ధించి వర్తమానంలోకి వెళ్దాము. మొదటి—దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో.

దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి - నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున నున్నదని చెప్పగా నాతాను - దేవుడు నీవు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో అనెను.

ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానుకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో…ఇట్లనుము - యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయము కట్టించుట నీ చేతకాదు.

ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.

మరియు నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు - మీరు నాకొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైనను పలికి యుంటినా?

కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా - సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు - నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివైయుండునట్లు, గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డినుండి తీసికొని

నీవు వెళ్ళిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించువారిని నీ ముందర నిలువ నియ్యక నిర్మూలము చేసితిని, లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగజేయుదును.

67 ఈ స్థలములో, మనము చూచినదానినే దావీదు—చూచి యుండెనని నేను చెప్పాలనుకుంటున్నాను. దావీదు అన్నాడు. “నా దేవుని యొక్క నిబంధన మందసము తెరలచాటుననుండగా, జనులైన మీరు, దేవదారు మ్రానులతో నాకు యిల్లుకట్టుట సరికాదు”. అని అన్నాడు. అది, గొర్రెలయొక్క, జంతువులయొక్క చర్మముతో కలిపి కుట్టినది అవి. అతడన్నాడు. “నా దేవుని యొక్క నిబంధన మందసము గుడారములో నుండగా, నాకు అందమైన గృహము యుండుట మంచిదికాదు” అని. కాబట్టి, ఒక ఆలయము కట్టుటకు దేవుడు అతని హృదయంలో పెట్టాడు.

68 అయితే, దావీదు, అతడెంతో రక్తము వలికించిన వాడైనప్పటికి—దేవునియెడల సమర్పణ—ప్రేమగల ఒక మనుష్యుడు. నాతాను అను, ఆ కాలముయొక్క ప్రవక్త ఎదుట, దావీదు యిది మాట్లాడుచున్నాడు. కనుక అతడు చెప్పాడు…దావీదును దేవుడు ప్రేమించియున్నాడని నాతాను ఎరిగినవాడై, అతడన్నాడు, “దావీదూ! నీ హృదయంలో యున్నదంతా చేయుము, ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు.” ఎంతటి వివరణ! “నీ హృదయంలో ఉన్నదంతా చేయుము. ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు.” అదే రాత్రి…దేవుని యెడలనున్న ప్రేమకుగల దావీదు సమర్పణను చూపుట.

69 మరియు తరువాత చూచినట్లయితే అదే రాత్రి, అతడు తప్పిదములతో ఉన్నాడని ఎరిగి, అతడది చేయుటకు అనుమతింప బడలేదని ఎరిగి, దేవుడు దిగివచ్చి నాతానుతో మాట్లాడుటకు కృపగలవాడాయెను. మరియు నేనెప్పుడు యీ మాటలు యిష్టపడాతాను…“వెళ్ళి, నా సేవకుడైన దావీదుతో చెప్పుము. గొర్రెల దొడ్డినుండి నిన్ను తీసితిని” అతడు కేవలం ఏమి లేనివాడు.

70 మరియు ఒక్క నిముషం నేను—దానిని యిక్కడ సరిపోల్చాలని యిష్టపడుచున్నాను. “వట్టి దానిలో నుండి నేను నిన్ను తీశాను. నేను—నేను—నేను నీకొక పేరు యిచ్చాను. భూమిలో నున్న గొప్పవారికున్న.” పేరులాటిది నీకున్నది. అంతరంగముగా—అది నేను ఉపయోగించాలనుకుంటున్నాను. అయినను ఆ—ఆ విషయం ఎత్తిచూపుటకు…

71 కొద్ది సంవత్సరాలక్రితం, నగరంలో, యిక్కడ నిలబడియున్నాను. ఎవ్వరూ నన్ను లెక్కచేయలేదు. ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు. మరియు నేను ప్రజలను ప్రేమించాను. కారణం మాయొక్క కుటుంబ పూర్వపరాలనుబట్టి, నాయొక్క ప్రశస్తమైన తల్లి తండ్రిని బట్టి ఎటువంటి అగౌరవాలు కాదు.

72 ఈ ఉదయవేళ, తల్లి జీవించి ఈ పరిశుద్ధ స్థలములో యుండాలని, నేను ఆశించితిని, అనేకమంది పాతకాలపువారు, యిది యిక్కడ నిర్మించుటకు వారి డబ్బు సహకరించిరి. ఒకవేళ, దేవుడు ఈ ఉదయం అక్కడనుండి చూచుటకు అనుమతించునుగాక.

73 అయితే త్రాగుడువలన, బ్రెన్‌హాం కుటుంబమునకు మంచిపేరు యిచటలేదు. ఎవ్వరూ నాతో ఏ కార్యము చేయుటకు యిష్టపడరు. మరియు ఎవ్వరూ నాతో మాట్లాడుటకు, ఎవ్వరిని నేను సంపాదించలేక పోయానని, కొంచెం కాలంక్రితం నా భార్యతో చెప్పినది నాకు జ్ఞప్తియున్నది. ఎవ్వరూ నన్ను—లెక్కచేసేవారు కాదు. కొద్ది విశ్రాంతికోసము దాగుకొన వలసిన పరిస్థితులలో యుంటిని.

74 మరియు ఇపుడు, ప్రభువు మాకు యీ గొప్ప స్థలమును యిచ్చియున్నాడు. మరియు—మరియు యీ గొప్పకార్యములు జరిగించాడు. చెడ్డపేరు—యింకా కొందరిగొప్పవారికి అనుగ్రహించిన పేరు ఆయన నాకు దయచేశాడు…మరియు నేను ఎక్కడకు వెళ్ళినను ఆయన నా శత్రువులను నిర్మూలము చేశాడు. అది ఎక్కడకు వెళ్ళినను, దాని ఎదుట ఏది నిలువలేదు. అయితే, అందుకొరకు నేను ఎంత కృతజ్ఞుడనో.

75 మరియు నాకు ఏలాగు తెలియను? చింపిరి గుడ్డలు ధరించిన ఒక చిన్న బాలునిగా ఇన్‌గ్రాన్‌విల్‌ పాఠశాలకు యిక్కడకు రెండు, లేక మూడు వీధుల దూరంలో, చింపిరిగుడ్డలు ధరించినందునను, చెరువులో జారుటద్వారాను, పాఠశాలలో హాస్యాస్పదంగా ఉండే నాకు ఏలా తెలియును? ఆ చెరువు అడుగు భాగాన ఈ విధముగా వికసించు లిల్లీ విత్తనం పడియున్నదని నాకెలాగు తెలియును? ఎవ్వరూ నాతో మాట్లాడని వానికి అయినను నాకు, ఆయన ప్రజల మద్య గౌరవప్రదమైన పేరును—ఆయన యిచ్చునని, నా కెలాగు తెలియును?

76 మరియు ఆలయం కట్టుటకు, దావీదు అనుమతించబడలేదు. అది అతడు చేయలేడు. అయితే, ఆయన చెప్పాడు, “నీ సంతానములో ఒకని పుట్టించెదను. అతడు ఆలయమును కట్టును. అది నిత్యముయుండు ఆలయము. నీ కుమారుని మీద, దావీదు కుమారునికి నిరంతరము రాజ్యముండును. అతడు స్వాధీనము చేసికొనును.” సొలొమోను, ప్రకృతి సంబంధముగా, ప్రకృతి సంబంధమైన బలమువలన కల్గిన దావీదు కుమారుడు, సొలొమోను, ప్రభువు కొరకు ఒక యింటిని, ఆలయమును కట్టెను,

77 అయితే దావీదు యొక్క నిజమైన సంతానము వచ్చి, దావీదు కుమారుడు వచ్చి, ఆ ఆలయమునకు రాతిమీద రాయి యుండని ఒక కాలము వచ్చునని, ఆయన చెప్పాడు. అయితే ఆయన మరొక ఆలయమును చూపుటకు ప్రయత్నించాడు.

78 ప్రత్యక్షత కల్గిన యోహాను, అక్కడ ప్రకటన గ్రంథములో, ఈ మందిరాన్ని అతడు చూశాడు, ప్రకటన 21, “పరలోకము నుండి నూతన ఆలయం దిగివచ్చుట, తన భర్తకొరకు అలంకరించబడిన పెండ్లికుమార్తెవలె” అతడు చూశాడు. మరియు ఆలయములోనుండి ఒక స్వరమువచ్చి యిలాగు చెప్పినది. “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడు వారితో ఉండి, వారి కన్నులనుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇక ఆకలియైనను, దుఃఖమైనను, బాధయైనను మరణమైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను” అని చెప్పబడినది.

79 తరువాత, నిజమైన దావీదు కుమారుడు ఈ వారములో రాబోతున్న, ఈ పాఠములలో మనం చూడబోతున్నాము. తరువాత, ఆయన ఆలయంలోకి వచ్చుట, దేవునియొక్క ఆలయం, ఆయన యిపుడు కట్టుటకు వెళ్ళిన నిజమైన మందిరము ఎందుకంటె, యోహాను 14లో ఆయన చెప్పాడు. “నా తండ్రియింట అనేక నివాసములు కలవు. మరియు నేను వెళ్ళెదను…” దాని ద్వారా ఆయన యొక్క అర్ధమేంటి? అది ముందుగనే నిర్ణయించబడినది. “మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను మరల వచ్చి, మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును.” -మరియు బహుశా, అది ఘనమైన కాలమౌతుందని మనందరికి తెలుసు. నిజమైన దావీదు సంతానము సింహాసనమును స్వీకరించును. ఆయన యేసుక్రీస్తు, ఇంటిలో ఆయనతో కలసి, ఆయనయొక్క పెండ్లికుమార్తెవలె, సంఘముయొక్క పరిపాలన ఉండును. నిత్యత్వమంతటిలో, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములపైన.

80 మరియు ఈ చిన్న స్థలాలు: నిజమైన దేవునియొక్క మందిరాన్ని దావీదు కట్టలేకపోయాడు. ఎందుకనగా అది చేయుటకు అతడు సిద్ధపడలేదు. అతడు ఏమి చేయలేడు. అతడు మర్త్యుడు. రక్తము చిందించినవాడు. కాబట్టి, మన యెడల ఈ రోజు అంతే. దేవుని యొక్క నిజమైన మందిరమును కట్టుటకు మనం సంసిద్ధపడలేదు. ఒక్కరే ఒకరు అది చేయగలరు అది యిపుడు దానియొక్క నిర్మాణములో ఉన్నది.

81 అయితే సొలొమోను, ఆయనకొరకై నిర్మించిన ఆలయంలో కలిపి, ఈ చిన్న మందిరము, మిగతావి కలిపి, భూమిమీద నిజమైన ఆలయము ఆయన నిలబెట్టువరకు, ఇవి కేవలము తాత్కాలిక స్థలాలే. “నీతి ఆకాశము ఆ చివరనుండి ఈ చివరివరకు పరిపాలన చేయును. మరియు ఇక దుఃఖముండదు.” ఆ మందిరములో యిక సమాధి సంబంధమైన బోధలుండవు. ఇక వివాహాలుండవు. నిత్యత్వము ఉండు ఒక ఘనమైన వివాహముండును. ఏలాటి సమయమో అది!

82 అయితే, ఈ దినాన మన హృదయములో నిశ్చయంచుకొందాము. రాబోవుచున్న, ఆ మందిరము జ్ఞాపకార్ధముగాను, ఎదురు చూచునదిగానుయుండి, ఆయన ఆత్మవలన ఎంతో గుణగణముగల వారమైయుండి, ఆ యొక్క మరో స్థలములో మనమున్నట్లుగా ఈ స్థలములో ఆరాధన చేద్ధాం. ఆస్థలము వచ్చుటకై ఎదురుచూస్తూ.

83 ఇపుడు మనం లేచి నిలబడదాము. మరియు పరిశుద్ధ లేఖనం, నేను చదువుచుండగాః

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.…మరియు యోహానను నేను నూతనమైన యెరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని.

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయనవారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుందును.

ఇపుడు మనము తలలు వంచుకుందాం.

84 మా పరలోకపు తండ్రీ, భక్తి పూర్వకముగా మేము నిలబడియున్నాము. మర్యాద పూర్వకము గాను, పరిశుద్ధమైన భక్తి భయముతోను మేము నిలబడి యున్నాము. ప్రభువా! నీకొరకొక ఆరాధన స్థలాన్ని నిర్మాణము చేయుటకై నీవు మాకు కృపను, ధనాన్ని నీవు మాకు దయచేశావు, అట్టి మా బహుమతిని నీవు అంగీకరించుమని నిన్ను అడుగుచున్నాము—అక్కడ దేవునియొక్క ఆత్మ నివాసముండుటకు యోగ్యమైనది భూమిమీద సిద్ధపరచుటకు ఏలాటి స్థలముగాని లేక యింకొకటిగాని లేదు. అయితే ప్రభువా! నీ యెడలగల భావాలకు, ఒక ప్రేమ చిహ్నముగా యిది నీకు అర్పణచేసికుంటున్నాము. నీవు మాయెడల చేసిన సమస్త కార్యములకు నీకు కృతజ్ఞలు చెల్లించుకుంటున్నాము.

85 మరియు, ఇపుడు, భవనమును, భూమియు నీ పరిచర్యకొరకు చాలా కాలం క్రితం ప్రతిష్టత చేయబడియుండెను, ఏమైయుండెనో అట్టి జ్ఞాపకాలకొరకు మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మరియు ప్రభువైన దేవా! సంవత్సరముల క్రితం, ఒక దర్శనము వచ్చినట్లు, ఒకనాడు పాతభవనంలో నున్న ప్రజలు, వారు మరమ్మత్తుచేసి కొత్తది చేయుటను నేను చూచితిని. నేను నది ఆవలకు పంపబడుటను చూచితిని.

86 ఇపుడు ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్తా! నీ దొడ్డిలోని జనముగా మేము నిలబడి యున్నాము. నీ రాజ్యముయొక్క ప్రజలుగా మేము—మేము—మేము—మేము నిలబడియున్నాము. దేవునియొక్క పరిచర్య కొరకు మరియు దేవుని గౌరవ భయ భక్తులకొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున - నాతో కలసి, కాపరి మరియు సంఘము, ప్రజలు కలసి, సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్యకై ఈ భవనమును ప్రతిష్ట చేయుచున్నాము. అందులోనుండి దేవుని మహిమ వెళ్ళుచుండుట చూచుటకై భూగోళము యొక్క నాల్గుదిక్కుల నుండి లోకమువచ్చునట్లు అది చేయు నటుల ఈ స్థలము నుండి సువార్త ఎంతగానో ప్రవహించును గాక. నీవు గతములో చేసినట్లు, భవిషత్‌ మరింతగా ఘనమౌనుగాక.

87 తండ్రీ, మాలో ఉన్నదానంతటితో వాక్యము ద్వారా, పరిచర్యకై మాకు మేము ప్రతిష్ఠచేసికుంటున్నాము. ప్రభువా, సభ మరియు ప్రజలు వాక్యము వినుటకొరకై ఈ ఉదయం వారికి వారే ప్రతిష్టచేసి కున్నారు. మరియు “సమయమందు అసమయమందు వాక్యము ప్రకటించుటకు; సమస్త విధమైన దీర్ఘశాంతముతో గద్ధించుటకు, బుద్ధిచెప్పుటకు సేవకులుగా, మేము ప్రతిష్టచేసికుంటున్నాము”. ముప్పయ్‌ సంవత్సరాల క్రితం మూలరాయి మీద వ్రాయబడినట్లు :నీవు చెప్పియుంటివి. “జనులు హితబోధను సహింపక, దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని సత్యమునకు చెవినియ్యక కల్పనాకధలవైపునకు తిరుగుకాలము వచ్చును”. ప్రభువా, ప్రజలకు నీ వాక్యమును పట్టుకొనుటకు మేము ప్రయత్నించుచుండగా, మేము రెండంతలుగా ప్రేరేపించబడి, బలముపొందుదుముగాక ప్రభువా, రెండంతల ఆత్మ, పరిశుద్ధాత్మ స్థలమును తాకునుగాక…

88 ఆలయ ప్రతిష్ట దినమున సొలొమోను ప్రార్థించినప్పటివలె. అగ్నిస్తంభము మరియు మేఘము రూపమున, పరిశుద్ధాత్మ ముఖ ద్వారం యొద్దకు వచ్చి, కెరూబులను చుట్టుచూ వచ్చి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి విశ్రమించెను. సొలొమోను చెప్పాడు. “ఓ దేవా! నీ జనులు ఎక్కడైనను ఆపదలోయుండి, ఈ పరిశుద్ధ స్థలమువైపు చూచి ప్రార్థించినయెడల పరలోకమునుండి వారి మనవి ఆలకించుము” యని.

89 ప్రభువా! ఈ ఉదయవేళ యిక్కడున్న ప్రతి హృదయంలోకి సమర్పించబడిన ప్రతి ఆత్మలోకి పరిశుద్ధాత్మ వచ్చునుగాక! బైబిల్‌ చెప్తుంది. “దేవుని యొక్క తేజస్సు అధికముగా ఉన్నందున, దేవుని యొక్క మహిమకై, పరిచారకులు సేవచేయలేకపోయిరి.” ఓ ప్రభువైన దేవా! పరిచర్యకై ప్రతిష్టంచుటలో, సంఘముతో మమ్ములను మేము సమర్పించుకొను చుండగా, తిరిగి అది జరుగునుగాక, అది యిలాగు వ్రాయబడినది. “అడుగుడి మీకు యివ్వబడును”

90 మరియు సంఘముయొక్క అర్పణతోపాటు, ఈ ఉదయం నీకును, పరిచర్యకు, కడవరి దినపు వెలుగుకాంతుల కొరకు, సాయంకాల వెలుగు కాంతుల కొరకు మమ్ములను అర్పించుకుంటున్నాము. తద్వారా ఆదరణ పొందునట్లుగాను, పెండ్లి కుమారుని రాకడకై ఎదురుచూచుచున్న వారి విశ్వాసమునకై, ప్రభువైన యేసును స్వీకరించుటకై, క్రీస్తు సువార్తలో ఒక పెండ్లి కుమార్తెను అలంకరించుటకు మమ్ములను సమర్పించుకుంటున్నాము. దీనిని నాకు నేనుగాను, నేను మరియు సహోదరుడు నెవిల్‌, మరియు సమాజము యేసుక్రీస్తు నామములో, దేవుని పరిచర్యకై ప్రతిష్టించుచున్నాము. ఆమేన్‌.

మీరు కూర్చొనవచ్చు.

91 యెహోవా మందిరమునకు వెళ్ళుదమని, జనులు నాతో అన్నపుడు, “నేను సంతోషించితిని”, యని దావీదు అన్నాడు. అది ఆ విధముగా నిర్వచించబడినపుడు, అది మనతో అలాగుండునుగాక. ప్రభువు గృహములో మనము కూడుకున్నపుడు మనం ఆనందంగా ఉంటాము [సభ “ఆమేన్‌” అని చెప్పుచున్నది—సంపా. ఆమేన్‌]

92 ఇపుడు, చిన్న ప్రతిష్ట పరిచర్య తరువాత, నాకు ఒక గంట సమయమున్నది.

93 దేనికి మనము ప్రతిష్టచేసికున్నామో జ్ఞాపకముంచుకోండి. భయభక్తులతో, పరిశుద్ధతతో, ప్రభువు యెదుట నిశ్శబ్ధముగాను, ప్రభువును ఆరాధించుటకు, ప్రభువు యొక్క గృహములో ఎంతో ఎంతో భయభక్తిగా యుండవలెను. మరియు కూడిక ముగించబడగనే కూడిక ముగించబడిన వెంటనే భవనంలోనుండి బయటకు వెళ్ళుడి. ఔనా, అది ద్వారపాలకునికి సమయం యివ్వబడుతుంది. లోపలకువచ్చి తరువాత సమయం కొరకు అది శుభ్రంచేసి సిద్ధంచేస్తాడు. తరువాత, ప్రభువు యొక్క గృహంలో గందరగోళం ఉండదు. మరియు…?…కూటములు ముగించిన వెంటనే స్థలము సంసిద్ధపరచబడుతుంది, ఘమారు పదిహేను నిముషాలలో, స్నేహంగా ఉండుటకు నిర్దారించుకొండి. ప్రతియొక్కరితో కరస్పర్శచేయుడి. ప్రతియొక్కరిని మరలా రమ్మని ఆహ్వానించుడి.

94 మరియు—ఈ రాబోతున్న వారంలో ముందెన్నడు మందిరములో జరుగనటువంటి గంభీరమైన కూటములకై మనం ఎదురుచూద్దాం. అందుకొరకై మనము ఎదురుచూద్దాం. ఇపుడు, నేను—నేను…ఎక్కువసేపు గత రాత్రి కొద్ది గంటలు వరకు ఆరంభం కాలేదు…ప్రార్ధనలో ఒకటి చూచుటకు నేను ప్రారంభించాను, కాబట్టి, యిది గొప్ప సమయమని నేను నమ్ముతున్నాను. ప్రభువు మనకు సహకరించినట్లయితే. ఇపుడు “గొప్ప సమయమని” నేను చెప్పినపుడు, ఈ ఉదయం ఒక దాని మీద నేను మాట్లాడబోతున్నాను. మీకు తెలుసు మనుష్యుడు “గొప్పది” అని పిలిచినపుడు కొన్నిసార్లు అదికాదు. అయితే, “గొప్పది” అని దేనిని దేవుడు పిలచునో మనుష్యుడు “వెర్రిది” అని పిలుస్తాడు. మరియు “వెర్రిది” యని దేనిని దేవుడు పిలచునో, మనుష్యుడు గొప్పది అని పిలుస్తాడు. కాబట్టి మన మనస్సులో అది ఉంచుకొని ప్రతి వాక్యమును తూనిక తూచుదాము.

95 ఇపుడు కూటములు పెద్దవి. అవి ఆవిధముగా అమర్చబడినవి. ఎందుకనగా అదొక కఠినమైన కూటము. ఎంతో ఉపదేశము, సమర్పణ యుండవలయును మరియు నేను…

96 నేనుంటున్న స్థలములో ప్రతిదానితో నేను భుజింప ప్రయత్నం చేస్తారు. అయితే నేను…అన్నారు “సహోదరుడా బ్రెన్‌హాం. నీ వెంతో బరువును కోల్పోయావు”. అయితే, నేను ఎడతెగక పరిచర్యలో ఉన్నాను. మెక్సికో ఇంకొకటి నేను చేరుకొనుటకై తరువాత ఆదివారం రాత్రి యిక్కడ నేను విడువ వలసియున్నది. కాబట్టి ఇది కఠినమైన విషయం. కాబట్టి, అయితే మరింత తినుట మానుకొని మరియు—మరియు నన్ను నేను సిద్ధపరచుకొను చున్నాను.

97 మరియు ఈ ఉదయం, సహోదరుడు, జూనియర్ జాక్సన్ ను చూచుటనుబట్టి మరియు—మరియు సహో. రడెల్ ను, మొదలైన చుట్టునున్న మిగతా సేవకులను చూచుటనుబట్టి నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు మిమ్ములనందరిని దీవించునుగాక.

98 ఇపుడు నేను—నేను నేనిక్కడ కొంత వివరణ వ్రాసికున్న అంశముపైన—ఈ ఉదయం నేను మీతో మాట్లాడ ఆశించుచున్నాను. మొట్టమొదట నేను యెషయా పుస్తకములోని 53వ అధ్యాయము నుండి నేను చదువగోరుతాను. దాని మీరు తీయుచుండగా, ఒకటి లేక రెండు ప్రకటనలు చేయ యిష్టపడుచున్నాను.

99 అది, ఈ రాత్రి, ఈ పుస్తకము మీద నేను మాట్లాడి, ఆఖరి సంఘకాలమునకు ముద్రవిప్పబడుటకు మధ్య అది వారధి కట్ట మాట్లాడ గోరుచున్నాను. అందులో ఎడమ ఉన్నది.

100 మరియు ముందుగా, సంఘకాలములు నేను ముగించినపుడు దానియేలు యొక్క డెబ్బది వారములను గూర్చి కూడా నేను మాట్లాడాను. వెంటనే, అది దానిని వెంబడించునట్లుగా. ఎందుకనగా దానికది బంధము ఉన్నది. మరియు నేను చెప్పాను. ఏడు ముద్రలు నేనెపుడైనా తీసుకున్నట్లయితే, ముద్రలలో ముడివేయుటకై బంధము కల్గియుండుటకై, ఈ దానియేలు డెబ్బది వారములు నేను విడిచిపెట్ట వలసియున్నది. ఒకటి తెరవబడుటకై విడిచిపెట్టి. అది 5వ అద్యాయము, ఏడు ముద్రలు ముద్రించబడిన గ్రంధము. ఈ రాత్రి అది తీసుకుందాము.

101 మనం ఈ రాత్రి పెందలకడ ప్రారంభించుటకు ప్రయత్నిద్దాం. నేను ఏలాగు ముందుగనే…అది తెలియజేశానా, ఔనా పెందలకడనే? [సహోదరుడు నెవిల్‌ “ఔను” అని చెప్పుచున్నాడు—సంపా.] ఏడు గంటలకు మీరందరు షుమారు యిక్కడ ఉండగలరా? [సభ “ఆమెన్‌” చెప్పిరి. సరే], క్రమముగా కూటమును ఆరు ముప్పయ్‌కి ప్రారంభిద్దాం. పాటల పరిచర్యను. యిక్కడ, ఏడుకు నేనుంటాను. మరియు తరువాత వారం అంతా, పెందలకడనే చేద్దాం. మరియు—మరియు మనము, ఇపుడు, మనమువచ్చి…

102 క్రైస్తవులవలె పాటలు పాడుటకు ఎవ్వరూ యిష్టపడరు. మనం పాడుటకు యిష్టపడతాం. వాటిని మనం ప్రేమిస్తాం.

103 అయితే మనము—మనము యింకొక కార్యము నిమిత్తమైయున్నాము. మనము—మనము వాక్యములో ఉన్నాము. ఔను! కాబట్టి, మనము—మనము దానిమీదనే మనం నిలబడదాము. మనం వెళ్ళబోతున్నాము. మనం—మనము ఉపదేశములో ఉన్నాము. మరియు నా మీద ఎంతటి ఒత్తిడియున్నదో మీరు గ్రహించవలసియున్నది. ఎందుకనగా, నేనేదైనా తప్పు బోధిస్తే, అందుకొరకు నేను జవాబు చెప్పవలసి యున్నది. ఔనా! కాబట్టి, ఎవరో చెప్పునది నేను తీసికొనకూడదు. నేను…తప్పక ప్రేరేపించబడినదై యుండవలసియున్నది. ఈ ఏడు ఉరుములు ఎవరైతే పట్టుకున్నారో ఆ ఏడుగురు దూతలు అది అనుగ్రహించునని, నేను నమ్ముతున్నాను. ఔనా!

104 మరియు ఇపుడు, యెషయాలో, 53వ అధ్యాయము, యెషయా 1వ వచనము లేదా రెండు. నేను ఈ ప్రశ్నను అడగనైయున్నాను.

105 ఇదెంత మాత్రము ఏడు ముద్రలకు సంబంధించినది కాదు. ఇది కేవలం ఒక వర్తమానము. ఎందుకనగా, ప్రతిష్ట చేయవలసినదని నాకు తెలుసు. నేనందులోకి వెళ్ళలేను, ఎందుకనగా నాకు సమయముండదు. అయితే నేను అనుకున్నాను. కొద్దిపాటి ప్రతిష్ట కూటముకొరకు, ఈ సంఘము యొక్క చిన్న జ్ఞాపకార్ధ కూటమునకై, లేదా చిన్న ప్రతిష్ట ఆరాధన కొరకు. వారు—వారు…నేనేమి చెప్పదలచుకున్నానో అందులోకి వెళ్ళుటకు సమయముండదు—చూశారా. ఈ గ్రంధం విప్పబడుటను గూర్చి కాబట్టి ఈ రాత్రికి చెప్పాను. మరియు ఇపుడు, యిది యొక చిన్న కూడిక. ఏలాగైనా, దానితో యిది కలసియుంటుంది.

106 కాబట్టి ప్రతి వాక్యమును వినుడి, అది పట్టుకొనుడి. మరియు—మరియు అది మీకు టేపుల మీద తీసికోవాలనుకుంటె, (లేక ఏదైనను), అలాగైతే టేపు ఉపదేశముపైనే నిలబడండి. టేపు చెప్పింది తప్ప ఏమి చెప్పొద్దు. టేపు ఏమి చెప్పినదో ఖచ్ఛితంగా అదే చెప్పుడి. ఔనా? ఎందుకనగా అందులో కొన్ని విషయాలు, ఇపుడు యిందును గూర్చి, యిది మనం ఎంతో అర్ధం చేసికోవలసియున్నది. అదెందుకు అపార్ధం చేయబడవలెను? ఔనా మరియు టేపు ఏమిచెప్పినదో అదే చెప్పుటకు మీరు నిశ్చయించుకొనవలెను. ఏమి చెప్పవద్దు. చూశారా? కారణం. నా స్వంతముగా నేనేమి చెప్పుటలేదు. అది చెప్పునది ఆయనే. మీరు గమనించారా? చాలసార్లు గందరగోళం జరుగుతుంది. ప్రజలులేచి, “ఫలానావారు అది చెప్పారు. ఆ విధముగా అది అర్ధం” అని చెప్తారు. అది—ఆలాగు ఉన్నట్లుగానే దానిని వదలివేయండి.

107 చూశారా. బైబిల్ ఆ విధముగా ఉండవలసియున్నదని మేము కోరుచున్నాము. ఏ విధముగా చెప్పుచున్నదో బైబిల్, అది—అది ఆలాగుండవలెనని మేము కోరుచున్నాము. అది దానికి స్వంత అనువాదము చేయవద్దు. ఆ విధముగా ఉండవలసియున్నది. అది ముందుగానే అనువాదము చేయబడినది. మీరు గమనించారా ఇపుడు :

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

108 ఇపుడు, మరలా జాగ్రత్తగా అది చదవ నీయండి.

మా సమాచారమును ఎవడు నమ్మెను? (ప్రశ్న) మరియు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

109 మరోమాటల్లో, “మీరు మా యొక్క సమాచారమును నమ్మిన యెడల అప్పుడు యెహోవా బహువు బయలుపరచబడును.” ఔనా.

మా సమాచారమును ఎవడు నమ్మెను? మరియు యెహోవా బహువు ఎవనికి బయలుపరచబడెను?

110 ఇపుడు, పరిశుద్ధ మత్తయి పుస్తకములో నేను చదువగోరుతాను. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము, మీకు రికార్డర్‌ లేనట్లయితే, మీరు మీ కాగితాలు తదితరమైనవి తీసుకరండి. మీరది—మీరది పొందుకొనులాగున మీ కాగితాలు తీసుకురండి…పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము 25 మరియు 26 వచనాలు మరియు 27. మంచిది. ప్రార్ధనలో, యేసు మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుగా నేను ప్రారంభించబోతున్నాను. 25 మరియు 26 వచనాలు చూద్దాం. నేను ప్రకటించినది అక్కడే అనుకుంటున్నాను. ఎందుకనగా యిక్కడ బైబిల్లో నేను గుర్తుపెట్టుకున్నాను.

ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.

111 ఆ రెండు లేఖనాలు పట్టుకొండి. “మా యొక్క సమాచారమును ఎవడు నమ్మెను? మరియు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? చివరకు, జ్ఞానులకును వివేకులకును దేవుడు మరుగుచేసి పసిబాలురకు తెలియజేసినందుకు, ఆయనను యేసు స్తుతించెను. ఎందుకనగా ఆలాగు చేయుట దేవుని దృష్టికి అనుకూలమాయెను”. ఇపుడు ఈ పాఠము నుండి లేక చదవబడిన ఈ లేఖనమునుండి ఈ పాఠమును నేను తీసుకుంటున్నాను…

112 దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని, అటుతరువాత ఆ విధముగనే ఆయనను బయలుపరచుకొనును. ఇపుడు టేపులకొరకు నేను మరలా చెప్పుచున్నాను. మీరు గమనిస్తున్నారా? ఎందుకనగా అది వారు—వారు టేపు చేస్తున్నారు. చూశారా? దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగుచేసికొని అటు తరువాత ఆ విధముగనే ఆయనను బయలుపరచుకొనును.

113 అది ఆలాటిదానిని దేవుడు ఏలాగు చేయునా, యని ఆలోచించుట అది యొక వింతైన విషయం. దేవుడు, ఎంతో ఒక సామాన్యమైన ఒక దానిలో మరుగుచేసికొనును. జ్ఞానులు లక్షల లక్షలమైళ్ళు పోగోట్టుకొనుటకు కారణమౌను. తరువాత, అదే మార్గములో తిరిగి తాను క్రియచేయు సామాన్య పద్ధతిలో క్రియచేసి, తిరిగి ఆయనను బయలు పరచుకొనును. ఏడు ముద్రల యొక్క గంభీరమైన ఉపదేశములకై మనం వెళ్ళకముందు, మనమిది పఠనము చేయుటకు ఇది ఒక—ఒక—ఒక పాఠము యౌతుందని నేను తలస్తున్నాను. ఆయనకు ఆయన బయలుపరచుకొనుట వలన, అనేకులు ఆయనను పోగొట్టుకుంటారు.

114 దేవుడు ఏలాగుండవలెనో మరియు దేవుడు ఏమిచేయబోవుచున్నాడు అనుదానిని గూర్చి, మానవులకు తమ స్వంత భావాలున్నవి. పాతకాలపు వివరణ నేను చాలసార్లు చెప్పినట్లు మానవుడు ఎన్నటికి మానవుడే. మానవుడు ఎల్లపుడు ఆయన చేసినదానికై, దేవునికి స్తుతి చెల్లించుచు, ఆయన ఏమి చేస్తాడయని ఎదురుచూచుచు, ఆయన ఏమిచేయుచున్నది వదలి వేస్తాడు. ఔనా? ఔనా? ఆ విధంగా వారు పోగొట్టుకుంటారు. వెనుతిరిగి చూస్తారు. ఏ గొప్పవిషయం ఆయన చేశాడాయని—అయితే, ఆయన చేయుచున్న సాదారణమైన దానిని వారు చూడలేకపోతారు. చూశారా? వారు ఎదురుచూస్తూ, జరగబోవు గొప్ప కార్యము వచ్చుటకు చూస్తారు. పదికి తొమ్మిదిసార్లు. వారిమధ్య అది ముందుగానే జరిగినది. అదెంతో సామాన్యమైనది. అది, వారు ఎరుగనంతగా! చూశారా!

115 ఒక దినము యుటికాలో…ఒక—ఒక మనుష్యుడున్నాడు. మరియు అతనియొక్క జనులు యిక్కడ ఉన్నట్లయితే, మనుష్యునియొక్క తీవ్ర భావములు—ఏవైన ఎత్తి చూపుటకు యిది నేను చెప్పుటలేదు. అంతర్యుద్ధంలో అతడు ఒక—ఒక అనుభవశాలి. మరియు నేను అనుకుంటున్నాను…ఏ ప్రక్కన అతడున్నాడో నాకు తెలియదుగాని అతడు తిరుగుబాటుదారుడని నేను అనుకుంటున్నాను. అయితే, అతడు—అతడు నాస్తికుడు. దేవుడు అనునటువంటి కార్యములేదని అతడు వాదిస్తాడు. అతడు ఉటికాలో నివాసమున్నాడు. అతని పేరు జిమ్‌ డార్సి. మీలో అనేకమందికి అతడు తెలిసియుండవచ్చు.

116 నేను చిన్న పిల్లవానిగా ఉన్నపుడు, అతడు నాకు చాలా పుచ్చకాయలు యిచ్చాడు. అక్కడ అడుగుభాగాన, నదియొద్ద, అతడు పుచ్చకాయలు పండించెవాడు. ఆ—ఆ అడుగు ప్రాంతములలో. మరియు నా తండ్రికి ప్రాముఖ్య స్నేహితుడు. అయితే ఒక రోజు అతడన్నాడు. అతడేనాడు చెప్పనటువంటి గొప్ప కార్యమునకు భేదముగా చెప్పాడు. ఆ దినాలలో నేను చాల చిన్నవాడను. అయితే, అతని నమ్మకానికి వ్యతిరేకముగా అతడు తలవంచుకొని ఏడుస్తు వెళ్ళునట్లు చేసెను. దీనినిబట్టి ఆ మనుష్యుడు, షుమారు ఎనబై అయిదు సంవత్సరాల వయస్సులో మహిమకరముగా మార్చబడ్డాడని నేను గ్రహించితిని.

117 ఒక రోజు, ఆదివారం బడినుండి వస్తున్న ఒక చిన్న బాలికను అతడు అడిగాడు. అటువంటి విషయాన్ని చేయుట వలన తన సమయాన్ని ఎందుకు వృధా చేసికోసుకోవాలి? అని ఆమె చెప్పినది. ఎందుకనగా ఒక దేవుడున్నాడని ఆమె నమ్మింది కనుక అని చెప్పినది. శ్రీ డార్సీ చెప్పాడు. “బిడ్డా! ఆలాటిదొకటి నీవు నమ్ముట వలన నీవు పొరబడుతున్నావు” అని అన్నాడతడు.

118 మరియు ఆ చిన్న బాలిక ఒంగి…నేలపైనుండి ఒక—ఒక చిన్న పువ్వును తీసికున్నది. దానిలోని రెమ్మలను లాగివేసినది. “డార్సీ గారు ఇదెట్లు జీవించుచున్నదో, నీవు చెప్ప గలవా?” అని అడిగినది.

119 అదీ సంగతి. అతడు తిరిగి పరిశోధన చేసికోబోతుండగా “సరె భూమిమీద అది పెరుగుతుంది” అని అతడు చెప్పగలిగాడు, తరువాత తిరిగి తిరిగి ప్రశ్నలు వచ్చినవి. భూమి ఎక్కడనుండి వచ్చినది? ఆ విత్తనము అక్కడకు ఏలాగు వచ్చినది? అదెట్లు జరిగినది? ఆ విధముగా అది పొడిగించబడి, పొడిగించబడి, పొడిగించబడి, అతడది చూచేవరకు వెళ్ళిపోయినది. చూశారా?

120 మనం తలంచే ఆకర్షణీయమైన గొప్ప విషయాలు కాదు. గాని సాదారణమైన వాటిలో, సామాన్యతలో, దేవుడు ఎంతో నిజముగా ఉండును. కాబట్టి, దేవుడు ఆయనకు ఆయన బయలు పరచుకొనుటకు అది ఆయనకు సంతసము కల్గించును. తరువాత, తనకు తానే మరుగుచేసికొనును తరువాత ఆయన మరుగుచేసికొనును. మరియు చిన్న విషయాలలో, సాధారణంగా, ఆయనకు ఆయన బయలుపరచుకొనును. అది—అది మనుష్యుని తలమీద పోవుచున్నది.

ఎందుకనగా, “ఎందుకు నీతిగల దేవుడు ఆలాగుచేస్తాడు?” అని అడుగుతారు.

121 ఎందుకనగా, ఆదిలో మానవుడు తనపైతాను ఆధారపడకుండునట్లు సృజించబడ్డాడు. సంపూర్తిగా దేవునిమీద మానవుడు ఆధారపడునట్లుగా మనుష్యుడు నిర్మించబడ్డాడు. ఆ కారణం చేత మనం గొర్రెపిల్లలుగా లేక గొర్రెలుగా పోల్చబడ్డాము. ఒక గొర్రె తనకు తానుగా నడవలేదు. అతనికి ఒక నాయకుడు కావలసియున్నది. పరిశుద్ధాత్మ మనలను నడిపించవలెను. కాబట్టి, మనుష్యుడు ఆ విధముగా నిర్మించబడ్డాడు.

122 సాధారణమైనవారు దానిని అర్ధంచేసికొనందులకై, మరియు దేవుడు ఆయన అన్నికార్యములు సాధారణమైనవిగా చూశాడు. సాధారణమైనవారి ద్వారా అర్ధంచేసుకొనుటకై, సాధారణతో దేవుడు తనకు తానే సాధారణమైన వాడయ్యాడు. మరోవిధముగా. యెష్షయా 35లో, ఆయన చెప్పాడు “మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు” అదెంతో సాధారణమైనది.

123 మరియు దేవుడెంతో గొప్పవాడని మనకు తెలుసు. ఏదోయొక గొప్ప విషయమగునట్లుగా, అది మనం ఎదురుచూచునంతగా, సామాన్యమైన వాటిని మనము వదలిపెడతాము. సామాన్యమైన వాటియందు మనం తొట్రిల్లుతాము. ఆ విధముగా మనము దేవుని పోగొట్టుకుంటాము. సామాన్యమైన వాటిలో తొట్రిల్లుటవలన దేవుడు ఎంతో సామాన్యతగలవాడు. ఎంతవరకు అనగా నేటి దినములోని పండితులు మరియు అన్ని కాలాలలోనున్నవారు లక్షల లక్షలమైళ్ళ దూరంగా ఆయనను పోగొట్టుకున్నంతగా. ఎందుకనగా, వారియొక్క తెలివితేటలలో, ఆయనవంటి గొప్పవాడు లేరని వారు తెలుసుకున్నారు. అయితే, ఆయనయొక్క ప్రత్యక్షతలో, దానిని ఆయన ఎంతో సామాన్యతగా చేశాడు. దాని ఉపరితలమునకు వెళ్ళిపోయి, దానిని పోగొట్టుకుంటున్నారు.

124 ఇపుడు దానిని పఠనము చేయుడి. అదంతా పఠనము చేయుడి. ఇక్కడ సందర్శించిన ప్రజలైన మీరు, మీరు మీ విడిదిగదులకు వెళ్ళినపుడు, ఆ విషయాలు తీసికొని వాటిని ధ్యానించుడి. మాకు అవి విడదీయబడినట్లుగా అది విడదీయుటకు సమయం లేదు. అయితే మీరు మీ విడిది గదికి లేక బాడుగ గదికి వెళ్ళినపుడు, లేక మీ రెక్కడ నివాసముంటున్నారో అక్కడకు వెళ్ళినపుడు లేక యింటికి వెళ్ళినపుడు మీరది చేయాలని నేను కోరుతున్నాను. అన్ని కలిపి, అది చదవండి.

125 ఆయనకు ఆయన బయలు పరచుకొను విధమున ఆయనను పోగొట్టుకుంటాము. ఎందుకనగా ఆయన ఎంతో గొప్పవాడు. అయినప్పటికి, అల్పులకు ఆయన తెలియపరచుకొనుటకై సామాన్యతలో ఆయన దాక్కుంటాడు. చూశారా? గొప్ప వాటిలో ఆయనను పొందుటకు (గొప్పవాటిని పొందుటకు) ప్రయత్నించవద్దు. ఎందుకనగా, దానిపైనుండి ఆయన దాటిపోతాడు. అయితే, దేవుని యొక్క సామాన్యతను వినుడి. అప్పుడు, సామాన్యమైన మార్గములో యిక్కడే, దేవుని మీరు కనుగొంటారు.

126 అత్యధికముగా మెరుగులు దిద్దిన లోకజ్ఞానం, విద్య ఎల్లపుడు ఆయనను పోగొట్టుకొన్నట్లుగా చేయును. ఇప్పుడు, నేనిక్కడలేను…మరియు నేనెరిగిన యిద్దరు ముగ్గురు పాఠశాల ఉపాధ్యాయులు యిక్కడ కూర్చుండియున్నారని నాకు తెలుసు. పాఠశాలకు, విద్యకు నేనిక్కడ వ్యతిరిక్తముగా లేను. నిరక్షరాస్యతను నేను హెచ్చించుటకు ప్రయత్నించుచున్నానని కాదు. మరియు అందుకొరకు నేనిక్కడలేను. అయితే, అదేదనగా, జనులు దానిమీద అధికముగా ఆధారపడతారు చివరకు సెమెనిరీలు మొదలైనవి. వారు, దేవుడు వారి ముందుంచినవాటినే వారు పోగొట్టుకుంటున్నారు.

127 ఆ కారణముచేత, సంఘశాఖలలో నున్న సహోదరులకు నేను వ్యతిరేకినికాదు. గానీ, సంఘశాఖల పద్ధతికి నేను వ్యతిరేకిని. ఎందుకనగా, అది, దానికదే ఘనపరచకొన గోరుతుంది. మరియు—మరియు—మరియు తనయొక్క సేవకులును ఫలానా-ఫలానా స్ధానములలో విధ్యనభ్యసించజేయును. తర్ఫీతునిచ్చును. ఎంతవరకనగా, వారికి తగినంత, తర్ఫీతు విద్యలేనట్లయితే, వారు బయటకు గెంటివేయబడెదరు. మరియు—మరియు వారు మానసిక వైద్యుని పరీక్షకు, మొదలగువాటికి తట్టుకోవలయును. ఒక మానసిక వైద్యుని వలన ఒక సేవకుడు పరీక్షించబడుట దేవుని చిత్తమని నేను ఎన్నడు అనుకోను. అయితే, వాక్యము ద్వారా పరీక్షించబడవలసియున్నది. ఔనా? వాక్యము కల్గియుండుటకు, ఆయన పంపు, ఆయన మనిషికి, అది—అది—అది దేవునియొక్క పరీక్ష మార్గమైయుంటుంది.

128 “వాక్యమును ప్రకటించుము” ఇపుడు, యీ రోజు మనము తత్వశాస్త్రమును ప్రకటించుచున్నాము. మనము మతవిధానమును, సంస్థాపకవిధానమును ప్రకటించు చున్నాము. మరియు వాక్యమును విడచిపెట్టుచున్నాము. ఎందుకంటె అది అర్ధం కాదు అని వారు చెప్తున్నారు. అది అర్ధంఔతుంది. అది చెస్తానని ఆయన చెప్పియున్నాడు. అది చేయమని మనం ఆయనను అడుగుచున్నాము.

129 ఇప్పుడు కొద్ది నిముషముల కొరకు యిక్కడ కొన్ని పాత్రలను మనం తీసికోబోతున్నాము.

130 నోవహు దినములను మనం గమనిద్దాం. నోవహు దినములు లోకజ్ఞానము ఎంతగానో ప్రాముఖ్యత నివ్వబడుటను, గౌరవించబడుటను దేవుడు చూశాడు. ఆయనయొక్క గొప్పతనమును చూపుటకు ఆయన ఒక సామాన్య వ్యక్తి ద్వారా సాదారణ వర్తమానమును పంపాడు.

131 ఇప్పుడు మనం ఎరిగియున్నాము. నోవహు దినములలో—లో—లో నాగరికత ఎంతో గొప్పగా ఉండెనని వారు చెప్పుకొనుచుండిరి. ఎంతవరకనగా మన నవ నాగరికతలో యింకా ఆ హద్దులు అందుకోలేనంతగా ఉన్నాము. మరియు అది ఆ స్ధితికి వచ్చునని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మన ప్రభువు చెప్పాడు నోవహు దినములలో ఉన్నట్లుగా మనుష్యుకుమారుడు వచ్చుదినమున ఉండును. ఆయనకొన్ని ఉదాహరణలు యిచ్చాడు.

132 మరియు వారక్కడ ఈజిప్జులో పిరమిడ్‌లను మరియు స్పినిక్స్ లను కట్టారు. వారు మహా గంభీరమైన కట్టడాలు కట్టిరి. ఈ రోజు ఆలాటివాటిని కట్టుటకు మనకు శక్తిలేదు. పరిమళ ద్రవ్యములు పూయు విధము వారికి కలదు ఈ రోజువరకు అది యధాతధoగా కాన్పించుటకు శరీరానికి వారు ఒక—ఒక—ఒక సుగంధద్రవ్యాలు పూస్తారు. మనము చేయలేము. ఈ రోజు మనం మమ్మీలు (చెడిపోకుండ సహజముగా యుండు శరీరములను) చేయలేము. ఆలాటి పదార్ధం మనయొద్దలేదు. నాలుగు లేక ఐదువేల సంవత్సరములుండు—రంగులు వారికి ఉండవు. అది యింకా అదే రంగుకల్గియుండెను. చూశారా? ఆలాటివి ఈ దినాన మనకులేవు.

133 మన నవీన నాగరికతకు చెప్పబడు అనేక విషయాలున్నవి. మరియు కాబట్టి, విద్య, విజ్ఞానము మనము వదలిపెట్టిన వాటికి ఎంతగా గొప్ప చిహ్నములుగా ఉన్నవో నీవు ఊహించగలవు? ఎంతటి—ఎంతటి గంభీరమైన నాగరికతయై యుంటుంది. సరే, ఈ జ్ఞాపకార్థాలు!! ఎంతగా విజ్ఞానశాస్త్రము, ఒక—ఒక నవనాగరికత, విద్య ప్రజలలో—ఉండవలసియుండెను. “వారు ఉండవలసియుండిరి. వారికి వుండవలసియుండెను”, వారిలో అందరును చదువుకున్నవారుగా ఉండియుండిరని నేను ఊహించుచున్నాను.

134 మరియు కాబట్టి, దేవుడు, ఆ దినమునందున్న ఆ గొప్ప క్రమమును చూచి, వారి పద్ధతులు చూచి, సరైన వ్యక్తిని కనుగొనలేకపోయెను. ఒక అవిద్యాపరుని, వ్యవసాయదారుని, గొర్రెలు కాయువాడైన నోవహు అను పేరుగల ఒకని కనుగొనువరకు. మరియు ప్రజలకు ప్రకటించుటకు, ఆయన, ఆయన వర్తమానమును అతనికి యిచ్చాడు. ఆ దినమున వారి—వారియొక్క పాండిత్యమునకు అదెంతో సామాన్యమైనది. వర్తమానముయొక్క సామాన్యతవలన ప్రజలు తొట్రిల్లునంతగా సామాన్యమైనది మరియు అయినప్పటికి, వర్తమానము, విజ్ఞానశాస్త్ర పరిగణలో హేతుబద్ధమైనది. అక్కడపైన వర్షమేలేనపుడు, ఆకాశములో వర్షం ఏలాగుండును? ఔనా! మరియు అటువంటి—అటువంటి ఓడను కట్టుటయను సామాన్య వర్తమానము. లోపలకు వెళ్ళుటకు ఒకదానిని కట్టుట. అది తేలాడుటకు అక్కడ నీరే లేనపుడు. అతడొక పిచ్చివానిగా ఎంచబడెను. మనం ఏమని పిలుద్దాం. నేటి దినాన ఒక—ఒక—ఒక—ఒకటియిదైతే…ఉచ్ఛరణను మీరు క్షమించితే “అతడొక వింతబంతి” అయ్యాడు.

135 మరియు సర్వసాదారణంగా, దేవుని ప్రజలందరు “వింతబంతులే” ఔను. వారట్లే ఉంటారు. వారిలో ఒకడుగా నేనున్నందుకు నాకు సంతోషం. కాబట్టి మీకు తెలుసా? నవనాగరికత విధమునకు వారు—వారు వ్యత్యాసంగా ఉంటారు. కాబట్టి వారు విడ్డూరంగా వింతగా యుంటారు. ఆయన చెప్పాడు. ఆయన ప్రజలు “ప్రత్యేకించబడినవారు, విడ్డూరంగా, వింతగా యున్నవారు, అయితే ఆత్మసంబంధమైన యాజకులు, రాజ వంశపువారు, దేవునికి ఆత్మసంబంధమైన బలులు అర్పించువారు, తమ పెదవుల ఫలములు ఆయన నామమునకు స్తుతి చెల్లించువారు”. ఎంతటి—ఎంతటి ప్రజలు వారు! వారిని ఆయన కల్గియున్నాడు.

136 మరియు గమనించండి. ఒక విధమైన మూఢభక్తిగలవాడు ఆలయానికివచ్చి, దానికంతటికి వేరుగా అగుపించు సువార్తను ప్రకటిస్తే, వారి నమ్మికకు వేరైనది చెప్పినట్లయితే, ఆ దినమున అదెంతటి గొప్ప విషయమౌతుంది, మరియు శాస్త్రజ్ఞులు అన్నారు. “ఏంటి? ఇదంతా—ఇదంతా పిచ్చి” అని అన్నారు. అక్క డ వర్షంలేదని శాస్త్రరీత్యా ఏలాగు నిరూపించగలరు!

137 అయితే, గొర్రెలు కాచుకునే యీ సామాన్యుడు నమ్మాడు. “అది దేవుడు వర్షము కురియునని చెప్పినట్లయితే వర్షం కురియును” ఔను?

138 మరియు ఒకరు స్వస్థపరచబడుటనుగూర్చి, ఈ దినానపోల్చిచూడు. వారంటారు, “అది కేవలం ఉద్రేకం. ఆ కాన్సరు, లేక—లేక—లేక ఆ పదార్ధం లేక ఆ వస్తువు యింకా అక్కడున్నదని శాస్త్రరీత్యా, నేను నీకు రుజువు చేయగలను” అని. అయితే, సామాన్య విశ్వాసికైతే, అది వెళ్ళిపోయింది. చూశారా? ఎందుకనగా, అతడు పదార్ధం వైపు చూచుటలేదు. అతడు వాగ్ధానం వైపు చూస్తున్నాడు, నోవహు మాదిరిగా.

139 కనుక నీవు చూచుట లేదా, “నోవహు దినములలో ఏలాగుండునో మనుష్య కుమారుని రాకడ యందు ఉండును”.

140 శాస్త్రరీత్యా, వైద్యుడు చెప్పగలడు, “ఇటు చూడూ! నీ గడ్డ అక్కడే యున్నది. నీ యొక్క కాన్సర్‌ అట్లే ఉన్నది. నీ కుంటిచేయి అట్లాగేయున్నది. నీవు వెర్రివాడవు.” అని చెప్పాడు.

141 మరియు, జ్ఞప్తించుకో? నోవహు దినాలనుండి అదే ఆత్మ అది చెపుచున్నది “పైన నీళ్ళులేవు, సాధనాలతో చంద్రుని మేము ఛేదించగలము, అక్కడ నీళ్ళు లేవు”. అయితే దేవుడు చెప్పినట్లయితే, అక్కడ వర్షం ఉన్నది.

142 కనుక “విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఋజువునైయున్నది.” విశ్వాసము, దానియొక్క కడపటి విశ్రమస్థానమును దేవుని వాక్యముపైనే తీసుకొనును. అక్కడే, అది దాని విశ్రమస్ధానమును కనుగొనును. మీరు అర్ధంచేసికున్నారా?. [సభ “ఆమేన్‌” అని చెప్పినది—సంపా]. దానియొక్క విశ్రమస్థానము, దేవుని వాక్యముపైనే.

143 “ఆలాగని దేవుడు చెప్పాడు”. అక్కడే నోవహు, తన విశ్రమ స్ధానమును తీసుకున్నది. అది అయిపోయినది. ఇప్పుడు మీరు మరలా గమనిస్తే, నోవహు అటువంటిది నమ్ముటవలన, ఒక మూఢభక్తి గలవాడయ్యాడు.

144 పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఈ రోజు ఎవరు నమ్ముతారో వారిని, ఇప్పుడు సంఘము చెప్తుంది, “వీరు మూఢులని” అంటారు. వారు ఉద్రేకపూరితులై, భీతిచేత దెబ్బతిన్నవాటి కంటె మరొకరుకాదు అని అంటారు. అయితే దేవునియొక్క వాక్యము బోధిస్తుంది యని కొద్దిగా మాత్రమే తెలుసు. అది యొక వాగ్ధానము.

145 మరియు నోవహునకైతే, “ముసలివాడు మతితప్పిపోయాడు; శాస్త్రరీత్యా అతడు తప్పు; మరియు—మరియు—మరియు మనస్సు రీత్యా అతడు తప్పు” అని వారెంత అనినప్పటికి అయితే నోవహుకుయైతే అది ప్రభువుయొక్క వాక్యము. నోవహు దానితోనే నిలబడ్డాడు. మరియు దానియొక్క సామాన్యతను గూర్చి జ్ఞానులు, వివేకులు తొట్రిల్లారు, వారి ఉనికిని పోగొట్టుకున్నారు. అదెంతటి ఒక—ఒక—ఒక గద్ధింపు, ఆ తరమునకు!

146 చాలామంది అంటారు, “అక్కడ వెనుకటి దినాలలో నేనుండినట్లయితే!”, అని. లేదు, నీవు అదే విధముగా ప్రవర్తించియుందువు. ఎందుకనగా, ఈ దినమును, తిరిగి అదే విషయము మరలా ప్రత్యుత్పత్తియౌతుంది, యింకొక రూపమున, అప్పుడు వారు చేసినట్లుగా, ఈ రోజు దానిపైన వారు తొట్రిల్లుతారు.

147 సందేహము ఏమిలేదు, వారియొక్క దినాలలో చాలినంతమంది బోధకులు వారికి యుండిరి. నోవహుయైతే దేవునిచేత ప్రేరేపించబడినవాడు. మరియు ఏమి గోమొఱ్ఱాకు జరగబోవుచున్నదో నోవహు చూడగల్గాడు, ఆ వ్యభిచారపు చెడ్డ తరమును దేవుడు ఉండనివ్వడని అతడు ఎరిగియున్నాడు. కాబట్టి, ఈ దినమున ఏమి చేయగలము, అదేవిషయాన్ని చూచుటతప్ప. నవీన సొదొమా గొమొఱ్ఱా! చూశారా! వ్యభిచారులైన దుష్టప్రజలు, పాండిత్యముచేత ఎంతగానో పూతపూయబడినవారు. ఆయనయందు ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతయందు ఆయన వాక్యము చూపు సామాన్యతలో తొట్రిల్లుతారు.

148 అక్కడ ప్రపంచములో ఎటువంటి వ్యక్తిగానిలేదు. రోజెల్లా, అది…లేక, మరియు—సాక్షాత్తు దేవుని యొక్క వాక్యము మనలో ప్రత్యక్షమౌట. మేము—చూడలేదని చెప్పరు. కడవరి దినముల వాగ్ధానము, ప్రకాశించవలసిన సాయంకాల వెలుతురులు, అవి చూచుటకు ధన్యులమైయుంటున్నాము. మరియు అధికముగా పూతపూయబడిన వారు, నాగరికత చెందినవారు, ఇది వారికి మరుగుచేయబడినది. తండ్రియైన దేవునితో యేసు చెప్పారు, ఆయన యిలాగు చెప్పాడు, “దానియొద్ద నుండి నీవు అది మరుగుచేయుట, అది నీకు ప్రియమైయున్నది. ఔను, తండ్రి, నీవు అది మరుగు పరచచితివి”. వారి జ్ఞానముతో వారిని ఉండనిమ్ము…

149 మీరు గమనించారా, ఆది యందు పాపమనే పేడలో బంతిని దొర్లించినది జ్ఞానమే. హవ్వసాతానును కలసి, ఆమె జ్ఞానమును వెదకుతున్నపుడు, సాతాను, ఆమెకు అది యిచ్చినది. మరియు జ్ఞానము, వాక్యమునకు విరుద్ధము. మనము జ్ఞానము కల్గియుండవలెనని కోరబడలేదు. ఏదైతే ముందుగా చెప్పబడినదో దానిమీద విశ్వాసము కల్గియుండవలెనని కోరబడుచున్నాము. చూశారా? కాబట్టి, అయితే, ఈనాడు, పండితులు దానిని ఎంతగానో మెరుగులు దిద్ది, దానిని పైనపెట్టి దానికి వారి స్వంత అనువాదాన్ని పెడుతున్నారు, ఎప్పుడు అంతే. అదే దానిని వారు ఈ రోజు చేస్తారు; అదే కొలప్రమాణంతో. ఇపుడు ప్రజలు…

150 లేదా, ఆనాడు ప్రజలు పోగొట్టుకొనుటకు కారణం, ఈ రోజు చేసి పోగొట్టుకునట్లుగా, అదే విషయం. వారు…వారు తెలివితేటలు గలవారుగా నున్నందున, అది నమ్మలేకపోయారు. వర్తమానం ఎంతో సామాన్యమైనది. వర్తమానం యొక్క సామాన్యతను నమ్మలేనంత తెలివైన వారువారు. చూశారా? ఓ సత్యమందు దేవుడు దానిని ఎంతో సామాన్యతగా చేసెను. తెలివిగలవారు, జ్ఞానవంతులు అది పోగొట్టుకొనేంతవరకు. ఎందుకనగా అది ఎంతో సాదారణమైనది. అదే దేవునియొక్క ఔన్నత్యను గొప్పచేసినది. ఎందుకనగా మహోన్నత స్థితిలోయుండి, తనకుతాను సామాన్యత చేయుచున్నది.

151 నేటి దినాన, మనుష్యులు వారు దేవుని సంబంధులు కారని చూపించుకొనుచున్నారు, వారు గొప్పవారు కావలయునని, వారు గొప్పవారుగా అగుపించుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. “పెద్ద బిషప్పు, డాక్టర్‌. హోలీ పోప్‌,” వారు తమకు తాము అగుచున్నారు. వారు నిజముగా కాకపోయినను. దేవుడు, మహోన్నతుడైయుండి, సామాన్యునిగా తనకు తాను దిగివచ్చెను. సామాన్యతయే గొప్పతనము.

152 మనం జట్‌ప్లెయిన్‌ను కట్టగలము, మనయొక్క రాకట్‌ను…పేల్చగలము…కక్షలో ఒక—ఒక—ఒక క్షిపణిని పెట్టగలము. ఇవన్ని మనం చేయగల్గుతాము, అయినను, అయితే, ఒక గడ్డిపూచను నిర్మించలేం. ఊహు. ఆమేన్‌. ఏంటది? అయితే, వెనుకకు తిరిగివచ్చి, ఆ గడ్డిని చేసినదేదో చూచి, ఆ గడ్డిని చేసిన సాక్షాత్తు దేవుని అంగీకరించుటకు బదులుగా, ఒకరు నిర్మించిదానికంటె వేగముగాపోవు ఒక దానిని తయారు చేయుటకు ప్రయత్నిస్తున్నాము. ఔనా? నిర్మించి

153 మనము, మనయొక్క ఆలయములలో ఎంతో తెలివైన వారముగా వివేకవంతులుగా ఉన్నాము. ఎంతవరకనగా మిలియన్‌ డాలర్లు కట్టడమును లేక పది మిలియన్‌ డాలర్ల భవనమును నిర్మించునంతగా - అయినను, అయితే, మెతడిస్టు వారికంటె ఒక ఉత్తమమైన భవనాన్ని నిర్మించ ప్రయత్నించుచున్నాము, లేక ప్రెస్బిటేరియన్ల కంటె ఒకటి నిర్మించ బాప్టిస్టులు ప్రయత్నించుట మరియు పెంతెకోస్తులు ఎలుకల పందెములో ఉన్నారు. అయితే, విషయం యిది, మనము ఆ మూలజరుగు చిన్న సేవలో, దేవుడున్నాడను కార్యమును గుర్తించుటకు మనము తగ్గించుకొనలేక అధిక తెలివిగలవారమై మన స్వంత మార్గముల మీద ఉన్నాము. చూశారా? ఔనది నిజం. మన సామాన్యతలో, తొట్రిల్లుట, వారెల్లపుడు అదిచేశారు.

154 ఇపుడు వారు—వారు ఎంతో తెలివైనవారైనందున, ఆలాటి సాధారణ వర్తమానమును నమ్మలేక పోయారు. వారు కల్గియున్న విజ్ఞానశాస్త్ర సంబంధమైన పరిశోధనలకు అది తగినంతగా మెరుగుపరచబడలేదు. ఆ దినమున వారు—వారికున్నటువంటి విద్యాప్రణాళికలకు తగినంతగా వర్తమానంలేదు. విజ్ఞతకాలేదు చూశారా? దేవుడున్నాడని తెలుసుకొనుటకు వారు చదివియుండిరి. ఆయన గొప్ప వాడనియు, వారు చదివియుండిరి, తమ్మును తాము, ఆయనతో గొప్పగా కట్టుకొనుటకు ప్రయత్నించిరి, పైకి వెళ్ళు మార్గము ఎల్లపుడు క్రిందనే యుంటుంది.

155 ఇపుడు ఉత్తర దృవము ఉత్తర దృవమని ఎవరికి తెలుసు? లేక దక్షిణ దృవము ఉత్తరమని? లేదా ఉత్తర దృవము దక్షిణమని, దక్షిణ దృవము ఉత్తరమని, ఏది పైన, ఏది క్రింద? మనము శూన్యములో వ్రేలాడుచున్నాము. మనం అంటాము “ఉత్తర దృవము పైన” యని. నీకెలాగు తెలుసు. దక్షిణ దృవము ఉత్తరం కావచ్చును. చూశారా? మనకు తెలియదు. కాబట్టి, జ్ఞాపక ముంచుకుందాం, ఈ వాక్యము…

156 అంటారు. “సహోదరుడా బ్రెన్‌హాం! ‘పైన క్రిందయని’ నీవేలా చెప్పగలవు?” అని.

157 యేసుక్రీస్తు మాట మీద ఆధారము చేసికొని, ఆయన చెప్పియున్నాడు. “తన్నుతాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. గాని తన్నుతాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును.” ఆలాగైతే, ఖచ్ఛితంగా, పైనక్రింద, క్రిందపైన.

158 షికాగోలో ఒక వృద్ధుడైన భక్తుడు చెప్పినట్లు, ఒక సంస్థాపకము నుండి వచ్చిన ఒక సేవకుడు కొందరు పెంతెకోస్తు వారి ముందు లేచి నిలబడ్డాడు. అతడు తనయొక్క అన్ని బుద్ధి కుశలతలు కల్గియున్నాడు. అతడక్కడ లేచి నిలబడి, పెంతెకోస్తులు ఏమి ఎరుగని మాటలు వినియోగించాడు. పెంతెకోస్తువారికి అర్ధం కాలేదని అతడు చూశాడు. మరియు అతడు, తన గుండె విరచి అతడు “ఫలానా, ఫలానా పరిశుద్ధ డాక్టరునని,” షికాగోలోని “ఫలానా-ఫలానా” పెద్ద పాఠశాలకు చెందియున్నానని చెప్పాడు. మరియు అతడు చుట్టూ చూశాడు. ఆ పెంతెకోస్తువారు ఒకరినొకరు చూచుకున్నారు. అతడేమని మాట్లాడుచున్నాడో వారికి తెలియదు. అతడెంతో విద్యావంతుడు, తెలివైనవాడు, పండితుడు. వారికి తెలియదు.

159 అది, ఒక సెనెటు సభలోని సభ్యుడో, లేక ఒక మనిషి ఈ మధ్యనే అద్యక్షపదవికి పోటిచేసి ఓడిపోయినట్లు యుంటుంది. టక్‌ కోట్స్‌ నాతో అన్నాడు. నేను తల్లి…యొక్క సమాధి కార్యక్రమమును బోధిస్తు, పునరుత్థానమును గూర్చి మాట్లాడుతూ, పునరుత్థానము యొక్క నిశ్చయతను చెప్తున్నాను. “సూర్యుడు తిరిగి లేచుట ఎంత నిశ్చయమో, నేను లేస్తాను. ఆకులు రాలు కాలంలో గడ్డి చనిపోవుట ఎంత నిశ్చయమో, ఆకులు చెట్టునుండి రాలిపోతవి. అవి తిరిగి వస్తవి. భూమి, కక్ష్యచుట్టు, తనకుతాను తిరుగును సరిదిద్దుకున్నపుడు, అది తిరిగి లేవవలసియున్నది.”

160 టక్‌ అన్నాడు. “బిల్లీ, ఆ వర్తమానాన్ని నేను అభినందిస్తున్నాను” అని. నేను, సహోదరుడు నెవిల్‌ కారులో కలసి కూర్చున్నాము. నేనన్నాను, “టక్‌…” అతడన్నాడు నీ వర్తమానాలను నేను అభినందిస్తున్నాను.

నేను అన్నాను. “టక్‌ నాకు విద్యలేదు”. అతడు చెప్పాడు.

“అందును గూర్చిన మంచి భాగము అదే” చూశారా?

161 మరియు చూచుటకు వెళ్ళాడని చెప్పాడు…సరే, ఆ మనుష్యుడు నన్ను క్షమిస్తాడని నేననుకుంటాను, నా భావము కాదు…అడ్‌లాయ్‌ స్టీవెన్‌ సన్‌, మీకు తెలుసా. అతనివి పదిహేను నిముషాలు విన్నానని చెప్పాడు. శ్రీ స్టీవెన్‌ సన్‌ తెలివిగల బోధకుడు అయియుంటాడు. మీకు తెలుసా, టక్‌ చెప్పువరకు…కళాశాల విద్య గల వాడనుకుంటాను అతడు చెప్పాడు. మరియు అతడు అక్కడ కూర్చొని నిద్రపోయాడు. అతని మాటలు వింటూ పదిహేను నిముషాల్లో నిద్రపోయాడు. అయితే చెప్పాడు కళాశాల చదువు ఉన్నప్పటికి, నేను అర్ధం చేసికోలేదు. అయితే కొద్ది మాటలే అతడు చెప్పాడు, అవి ఎంతో మెరుగుదిద్దినవి. అతడు ఆన్నాడు. “నీ కూడికలలో నేను నిద్రపోవడం నీవు చూడలేదు. ఔనా, సహోదరుడా బ్రెన్‌హాం?”

162 కాబట్టి చూశారా! అది దానియొక్క సామాన్యత. సాదారణ సామాన్యత. అక్కడే దేవుడుంటాడు.

163 ఇప్పుడు దేవుడు సామాన్యతలో చేయు కార్యముల అర్ధం చూచుటకు ఆ దినాన వారు—వారెంతో తెలివైన వారుగా యుండిరి. వారికొరకై అది మెరుగులు దిద్దలేరు. అది మెరుగులు దిద్దబడవలసియుండెను. అదెంత మిన్నగానో రంగులు పూయబడవలసి యుండెను లేదా వారది పోగొట్టుకుంటారు. ఇప్పుడు అయితే, ఘనమైన యెహోవా, ఆయన వాక్యమునందు మరుగు చేసికొనెను. ఆయన వాక్యములో నమ్మినప్రజలను, వారిని రక్షించుట ద్వారా, మరియు సామాన్యమైన వర్తమానమును తెచ్చుట ద్వారా ఆయనను ఆయనను బయలుపరచుకొనెను. నోవహు యొక్క సామాన్య వర్తమానమును, దేవుడు అది నెరవేరునట్లు చేసెను. ఇపుడది గమనించుడి.

164 ఇపుడు ఆ తరువాత, మరలా మోషే యొక్క దినమున, గమనించు యింకొక విమోచనా యొక్క కాలము.

165 దేవుడు, తన యొక్క ప్రజలను విమోచించుటకు ఒకటి చేయబోతున్నపుడు, దేవుడు ప్రజలకు వర్తమానము పంపును. అదెంతో సామాన్యమైనది, ఈ ముద్రలను విప్పునపుడు మనమది పట్టుకుంటాము. ఇది ప్రప్రధమముగా తెచ్చుటలో అదే నా ఉద్దేశ్యము. ఆ—ఆ—ఆ ముద్రలు విప్పబడుట ఎంతో సులభమని, దానిని మనం కనుగొంటాము. తెలివైనవారు, మిలియన్ల మైళ్ళలో పోగొట్టుకుంటారు. చూశారా? అందుకొరకై, దేవుడు నన్ను అభిషేకించునని నేను నిరీక్షిస్తున్నాను. చూశారా? చూశారా? అది పైనుండి పోవును, ఆ కారణంచేతనే ఈ ఉదయం ఈ వర్తమానమును గూర్చి తలస్తున్నాను. దేవుని యొక్క సామాన్యతమీద పునాది వేయడం. చూస్తున్నారా! దేవుడే విధముగా సామాన్యతమీద తనకుతాను మరుగు చేసికొనునది ఏలాగు యనునది శ్లాఘించతగినది.

166 అలా ఆలోచించు, వారు అణువులను పగలగొట్టగలరు. ప్రతీది చేయగలరు; అయితే, జీవము దగ్గఱకు వచ్చినపుడు. అదెక్కడనుండి వచ్చినదో కూడా వారు చెప్పలేరు. ఒక సాధారణమైన గడ్డిపూచ, దేవుడు దానిలో దాగియున్నాడు. వారు చంద్రునిపైకి రాకెట్‌ను వారు ప్రయోగించగలరు. మరియు—రాడార్‌ను అక్కడకు పంపగలరు. మీరేమేమో చేయగలరు. అయినప్పటికి, గడ్డిపరకలోని జీవమును వివరించలేరు. ఔను. చూశారా? అదెందుకనగా, అది వివరణ చేయబడదు. అదెంతో సాధారణమైనది. అది వారు చూడలేకున్నారు.

167 ఇపుడు మోషేను గమనించు, ఆయన వాక్య ప్రకారముగా, దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించు దినమున ఆయన ఏం చేశాడు? ఆయన ఒక సామాన్యమైన కుటుంబమును ఎన్నుకున్నాడు. వారిని గూర్చిన వివరణ మనయొద్దలేదు. చూశారా, కేవలం “లేవి కుమారుడనే,” మనకు తెలుసు. చూశారా? అతని భార్య ఒక—ఒక అతడు కేవలం ఇశ్రాయేలీయులలో సాధారణమైన బానిస, అయితే విమోచకుని తెచ్చుటకై, దేవుడు ఆ కుటుంబమును ఎన్నుకున్నాడు. కేవలం సాధారణమైన యూదా కుటుంబము. ఆయన వెళ్ళి, రాజవంశములోని వారినిగాని, ఖ్యాతిగాంచిన వారిని గాని లేక మరెవరినో తీసికొనలేదు. లేక చివరికి పూజారిని తీసికొనలేదు. ఆయన సామాన్యమైన, సాధారణమైన కుటుంబమును తీసుకున్నాడు. చూశారా? సామాన్యత. ఆయనేమి చేశాడో గమనించు. అప్పుడు ఆయనొక బిడ్డను తెచ్చాడు, ఒక సాధారణమైన మానవుడు. అతడు…

168 అతడు—వారిని విడిపించుటకు ఆయన కోరినట్లయితే, ఆయన సూర్యుని నియమించగలడు, వారిని విడిపించుటకు, ఆయన గాలిని నియమించగలడు. వారిని విడిపించుటకు ఆయన ఒక దేవదూతను నియిమించగలడు. ఓ హల్లెలూయ! ఆయన ఏం చేయాలనుకుంటె, దేవుడది చేయగలడు.

“సరే, అది నీకెలాగు తెలుసు సహోదరుడా బ్రెన్‌హాం?”

169 దేవుడు, ఆయన ప్రణాళికను వదలడు. ఆ కారణం చేతనే, ఈ దినము అది సామాన్యముగా ఉండవలసియున్నదని, మేమెరిగియున్నాము. చూశారా? ఆయన ఎల్లవేళలలో సామాన్యతలో పనిచేయును. అయితే, దేవుడు ఆరంభంలో, సువార్తను ప్రకటించుటకు సూర్యుని చేయగలడు లేక సువార్తను ప్రకటించుటకు గాలిని చేయగలడు. లేక సువార్త ప్రకటించుటకు ఒక దేవదూతను చేయగలడు, అయితే ఆ ఉద్దేశ్యం కొరకు మానవులను నియమించాడు మరియు దానిని ఆయన ఎన్నడు మార్చడు. ఆయన…సంఘశాఖలను నియమించలేదు. మనుష్య గుంపులను ఆయన నియమించలేదు. సువార్తను ప్రకటించుటకు మనుష్యులను ఆయన నియమించెను. యంత్రములను కాదు. యంత్ర సామాగ్రినికాదు. లేక ఏలాటి దేవదూతనుగాని నియమించలేదు. అది మానవుడు!

170 మరియు అక్కడున్న ప్రజలకు ఆయన వియోచన తెచ్చుటకై, బానిసల గుంపులోనున్న, సామాన్యకుటుంబంలో పుట్టిన సామాన్య మానవుని ఆయన పంపాడు. ఓ, మై ఎటువంటి దేవుడు ఆయన, సామాన్యతలో తనకు తాను బయలుపరచుకొనును!

171 ఇపుడు గమనించుడి. ఆయన అతనికి లోకజ్ఞాన విషయములో తర్ఫీదునిచ్చాడు. తద్వారా, అతడు ఓడిపోగలందులకై; విశ్వాసము ద్వారానే మనము విడుదలపొందవలసి యున్నది. అతడు ఐగుప్తీయులకు బోధించునంతటివానిగా, జ్ఞానమునిచ్చునంతటివానిగా విధ్యనభ్యసించువానినిగా, ఆయన అతనిని అనుమతించెను. అతడెంతో తెలివైనవాడు. దేవుడు, ఆ యొక్క సామాన్య కుటుంబంతో యుండెను. బహుశా వారు, వారి పేరును వారు వ్రాయలేరేమో. మరియు మోషే ఉన్నతమైన పాండిత్యమును అభ్యసించెను. అటువంటి గొప్ప విద్యతో ఉపదేశకులకు అతడు జ్ఞానము ఉపదేశించగల్గెను. అతడు పండితులకు బోధింపగల్గిను. ఔను. ఆ విధముగా అతడు ఎదుగుటకు ఆయన అనుమతించెను. కాబట్టి దీనత్వంలో ఆయనకు ఆయన బయలుపరచుకొనుటకై జ్ఞానం వలన ప్రయోజన మేమిలేదని చూపుటకు ఆయన దీనత్వంలో బయలు పరచుకోగల్గెను. మోషే, తనయొక్క మేధాశక్తిలో ఘోరముగా విఫలుడాయెను. ఆయన ఉద్ధేశ్యం కొరకు అతడామార్గమందు ఉండుటకు అనుమతించెను, తద్వారా అతడు విఫలుడౌట కొరకై, అతడు అపజయ మొందాడు మరియు అతడు పడిపోయాడు.

172 కాబట్టి “శక్తిచేత బలముచేత కాదని” చూపించుటకు. అయితే, ఐగుప్తుజ్ఞానము చేతకాదు, మన పాఠశాలల జ్ఞానముచేకాదు, సెమినరి పాఠశాలల బలమువలనకాదు, అయితే, సంస్థాపకముల ఐక్యతవలన కాదు, మన పాండిత్య ఉపదేశముల బలము వలన కాదు “అయితే, నా ఆత్మ ద్వారానే యని దేవుడు చెప్పుచున్నాడు”. అతని యొక్క జ్ఞానము, దాని అంతమున అదృశ్యమైపోయినది. దేవుడు అతనిని అక్కడ మండుచున్న పొదయొద్ద కలసినపుడు అతడు, తన చెప్పులు తీసి తన్నుతాను దీనత్వంలో తగ్గించుకొనుటకై మరియు అతని జ్ఞానాన్ని గూర్చి మరచిపోయాడు.

173 దేవుడు, విమోచనమును తీసికొనివచ్చుచు—జ్ఞానముతో అతనికి తర్ఫీదు యియ్యవలసివచ్చెను. అతడు పడిపోవుటకొరకై, నీవు నీ స్వంత తెలివియగు బాహువు మీద, లేక మరియొకరి తెలివి మీద ఆనుకొనలేవని, ఆయన బాహువును చూపుటకు అతడుపడునట్లు చేసెను మీరది చూడగల్గితిరా? [సభ “ఆమేన్‌” యని చెప్పిరి.—సంపా.] ఆలాగుచేయుటలో దేవునియొక్క ఉద్ధేశ్య మేదనగా, దీనత్వంలో ఆయనకు ఆయన కనపరచుకొనుట. ఉన్నత స్థానాన్ని మోషే పొందుటకు ఆయన అంగీకరించాడు. ఫరోతరువాత వాడౌనంత వరకు. అతడు శక్తిగల సైన్యాధిపతి. చరిత్ర ప్రకారముగా, మోషే, తానొక్కడే చుట్టుప్రక్కల దేశములను జయించాడు. తరువాత, తనకున్న అన్ని సామర్ధ్య యోగ్యతలతో ప్రభువు యొక్క కార్యమునకు అతడు తిరిగి వచ్చినపుడు, అతడు తలక్రిందులగునట్లు చేశాడు. తద్వారా, అతనిని అక్కడ ఎడారిలో ఉంచి, అతనిలోనున్నవన్ని కొట్టివేసెను. తరువాత అతనికి అగుపించాడు. దీనత్వంతో ప్రజలను విమోచించుటకు అతని చేతిలో ఒక కర్రతో అతనిని పంపాడు.

174 అప్పుడు ఒక సైనిక శిక్షణద్వారాను, ఒక విద్యద్వారా, ఒక విజ్ఞాన విద్య ద్వారాను, అతడది చేయలేకపోయాడు. సైనిక బలము ద్వారా అతడది చేయలేకపోయాడు. మరియు ఆయన అతనికి ఎడారిలో ఒక వంకి కర్రను యిచ్చాడు, అతని ద్వారా ఆయనది చేశాడు. దేవుడు, దీనత్వంలో, సామాన్యతలో ఉంటాడు. దేవుడు ఒక కర్రలో, మోషేలో ఉండెను. మోషే యొద్ద కర్ర ఉన్నంత కాలము, అది దేవునియొద్ద ఉన్నట్లే, ఎందుకనగా దేవుడు మోషేలో ఉండెను. నిశ్చయం.

175 గమనించు. “శక్తిచేత—బలము చేతకాదు నా ఆత్మ ద్వారానే”, అయితే, నాయొక్క చిన్న విశ్వాసం ద్వారానే!

176 తన తల్లియొక్క ఉపదేశమువలన, మోషే, తాను విమోచకుడేనని అతడు గ్రహించియుండెను. అలాగు చేయుటకు సైనిక శక్తితో, అతడు తర్ఫీదు పొందెను. అయితే అది సఫలతకాలేదు. చూశారా? అతనికి తెలివి ఉన్నది. అతనికి విద్య ఉన్నది. అయితే అది పనిచేయలేదు. కాబట్టి అదంతా అతడు మరచిపోవలసి యుండెను. మరియు సామాన్యస్థితియగు దేవుని, ఆయన వాక్యమును తీసికొని స్థితికి వచ్చి, తరువాత ప్రజలను విమోచించెను. ఔనండి.

177 దేవుడు విమోచించును. (దేనిద్వారా?) ఆయన వాక్యమందలి విశ్వాసముద్వారా. ఎల్లపుడు అంతే. మనకు సమయముంటె మనమది చూద్దాం. మనకు షుమారు యింకా ఇరవై నిముషాలు ఉన్నది. మనము…

178 కయీను మరియు హెబెలును చూద్దాం, ఒక విధమైన సౌందర్యముద్వారా కయూను, ఏవిధముగా, దేవుని సంతోషపరచగోరినది.

179 మరో విధము ప్రజలు తలస్తారు. “గంభీరమైన, అందమైన వస్త్రములు ధరించిన సభద్వారా—పూజారులద్వారా అంగీలు ధరించిన సేవకులు, వస్త్రాలు ధరించిన గాయకులు యివన్ని ధరించుట, అది—అది దేవునికి సంతోషము కలుగజేయును” అని ప్రజలు తలస్తారు. అదెక్కడ నుండి వచ్చినదో మీరు చూడగలరా? కయూను ఆలాటిదే ప్రయత్నించాడు. మరియు అతడు, ఆయనకు యొక బలిపీఠము కట్టాడు, అతడు దానిని అందంగా తయారుచేశాడు అనుటకు సందేహం లేదు.

180 ఆ మనుష్యుడు యధార్ధవంతుడు. అతడు ఆరాధనచేశాడు. “నేను విధేయుడుగా నున్నంత కాలము, ఏలాటి వ్యత్యాసముండదు” అని అతడనుకున్నాడు. అది వ్యత్యాసము కల్గించును. నీవు యదార్ధంగా తప్పే.

181 గమనించుడి. అతడు—అతడు యీ బలిపీఠమును కట్టాడు, పూలు చక్కగాపెట్టి, అందమైన ఫలములు పెట్టి “నిజంగా మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిర్మలుడు, అందమైన దేవుడు ఆ అర్పణను స్వీకరించును” అని తలంచాడు. అయితే, గమనించుడి, తన స్వంత జ్ఞానముతో దానినతడు చేశాడు. తన స్వంత తలంపులతో అది అతడు చేశాడు.

182 అదే యీ రోజు కూడా. అది—వారు, వారు—వారు…వారి స్వంత జ్ఞానము చేత, వారి పాండిత్యంచేత, వారి విద్యచేత మరియు వారు నేర్చుకున్న నీతిశాస్త్రంచేత

183 “అయితే, హెబెలు ప్రత్యక్షతద్వారా, విశ్వాసముద్వారా ఎంతో శేష్టమైన అర్పణను దేవునికి అర్పించెను”. మానవత్వంరీతిలో మాట్లాడినపుడు, అది చూడగా అందుగూర్చి పరిశుభ్రత ఏమిలేదు. ఆ చిన్నదానిని మెడపట్టుకొని గట్టిగా లాగుచు, ఆ విధంగా చుట్టూర ద్రాక్షాతీగచుట్టి దానిని బలిపీఠమునొద్దకు లాక్కొచ్చాడు. దానిని గూర్చి అందమైనది ఏదీలేదు. బలిపీఠముపైన దానిని పరుండబెట్టి, ఒక—ఒక పదునైన రాతితో దాని చిన్న గొంతుకోశాడు. దాని రక్తము తనమీద చిందింపబడి, అది అరుపులు అరుస్తూ చనిపోయేంతగా లాక్కొచ్చాడు. చూచుటకు అది భయంకరమైన దృశ్యము. అయినను, అది సామాన్యమైన విషయము.

184 సామాన్యతలో, తన తల్లియొక్క తండ్రియొక్క రక్తమునకు తాను జన్మించాడని. అతనికి తెలుసు, తనయొక్క తల్లి రక్తమువలన, తన తండ్రి రక్తము వలన యని తెలుసు. పడిపోవుటకు కారణమైనది రక్తము. కాబట్టి రక్తమే దానిని తిరిగి తెచ్చుటకు కారణమౌతుంది. కాబట్టి, దేవునికి శ్రేష్టమైన అర్పణనుఅతడు అర్పించెను. కారణం : అది అతనికి బయలుపరచబడెను.

185 మరియు మరికొందరు సహోదరులు వారు యాపిల్లు పియర్‌ వారు తినియుంటారని అనుకుంటున్నారు. గత దినము వార్తాపత్రికలో విపరీతమైన విషయం నేను—నేను చూశాను. వారు చెప్పారు “హవ్వ తిన్నది యాపిల్‌” కాదని ఋజువు చేస్తామన్నాం “అది “యాప్రికాట్‌” అని వారన్నారని అనుకుంటాను. చూడండి. ఓ!! ఎక్కడనుండి ఆ ఆత్మ వచ్చినదో చూడుడి!

186 మరియు వారు చెప్పారు “మోషే ఎర్రసముద్రమును దాటలేదు. అవి, అక్కడ రెల్లు కుప్పలున్నవి. రెల్లు గడ్డి—సముద్రము. అతడు ఇశ్రాయేలీయులను రెల్లు గడ్డి సముద్రమునుండి తీసికొని వచ్చాడు. సముద్రముయొక్క—చివరన అక్కడ రెల్లు కుప్పలు కుప్పలుగా యుండెను మరియు మోషే సముద్రమును దాటాడు. అయితే అతుడు రెల్లు సముద్రాన్ని దాటాడు. ఎత్తయిన గడ్డి మొదలైనవి యున్నవని, అక్కడ అతడు దాటాడని వారు చెప్పారు”. ఎంతటి హాస్యాస్పదమది!

187 “నీళ్ళు”, బైబిల్‌ చెప్తున్నది, “కుడి ఎడమలకు విభజింపబడెను” యని. “వేరుపరచటకు, బలమైన—తూర్పుగాలిని దేవుడు పంపెను”, ఔనా? ఔనా?

188 వారు, వారి స్వంతమార్గములలో అర్ధంచేసికొనుటకు ప్రయత్నించుచున్నారు. వారు ఆ విధముగా ఎల్లపుడు తప్పిపోయారు, వారు తప్పిపోతూనే యుంటారు. ఇవన్ని మీకు తెలుసు!

189 మరియు ఎవరైతే పైకి భక్తిగా యుంటాడో, అట్టి, ఈనాటి ప్రకృతి—సంబంధమైన మనిషికి కయీను ఒక పోలిక. బాహ్యంగా ఒకటి చేయాలనుకున్నాడు. అయితే, అతడు ఆలయమునకు వెళ్ళును, భవనంకొరకు—చాలాపనులు చేయును.

అక్కడ సంఘము ఒకటే ఒకటియున్నది, అందులో నీవు చేరలేవు. ఇవన్ని అద్దెయిల్లు.

190 ఇవి అద్దె ఇల్లులు. చూశారా! నీవు మెతడిస్టు అద్దె యింట్లో చేరతావు. బాప్టిస్టు అద్దె యింట్లో చేరుతావు, ప్రెస్పిటేరియన్‌ అద్దె యింట్లో చేరుతావు. పెంతెకొస్తు అద్దె యింట్లో చేరుతావు.

అయితే, సంఘములో నీవు జన్మిస్తావు. ఔనండి, అయ్యా, చూశారా.

191 ఇవన్ని అద్దె యిల్లులు, అవి సంఘాలుకావు. అవి అద్దె యిల్లులు. మెతడిస్టు “సంఘమని” లేక పెంతెకొస్తు “సంఘమని” లేవు. లేదు ఆలాటివి లేవు…లేదు అదంతా తప్పు చూశారా! ఔనది నిజం ప్రజలు చేరే అద్దె యిల్లులు అవి.

192 అయితే, నీవు జీవముగల దేవుని సంఘములో జన్మించావు, అది రూపుదాల్చుచున్న మర్మమైన యేసుక్రీస్తు శరీరము.

193 ఇప్పుడు అయితే, చిందింపబడిన రక్తములో నున్న సామాన్య విశ్వాసము వలన, హెబెలుకు ఆయన రహస్యాన్ని బయలుపరచుటకు దేవునికి ప్రీతికరమాయెను - ఓ, నాకు సమయముంటె కొద్దిసేపు దానిమీద ఉండాలని నేనాశపడుచున్నాను. ఔను?

194 అయినప్పటికి, కయీను, తన జ్ఞానమంతటితో నుండెను, తెలివైనవాడు! “ఓ”, “సహోదరుడా బ్రెన్‌హాం”, నీవు…అతనిని పాండిత్యముగల మేధావిగా చేయుటకు ప్రయత్నిస్తున్నావే? అని అంటావు. అతడు ఆలాటివాడే, అతడు తెలివైనవాడు. అతని వంశాన్ని—చూడూ! అతని బిడ్డలను చూడు. వారిలో ప్రతియొక్కరు శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు తెలివిగలవారు, ప్రతియొక్కరు.

195 అయితే, షేతు యొక్క వంశావళిని చూడూ వారు దీనులు, వారు కాపరులు, వ్యవసాయదారులు అలాగు నాశన మగువరకు.

196 అయితే కయీను యొక్క సంతానము, తెలివైనవారు జ్ఞానవంతులైన గుంపు. రాగిని కరిగించి, లోహాలు తయారు చేసిరి, భవనములు నిర్మాణము చేశారు; వారు తెలివైన మనుష్యులు.

197 యీ—యీ మిగతా మనుష్యులు గుడారములలో నివసించారు, వారి గొర్రెలను కాచుకున్నారు. దేవుని వాగ్ధానంమీద ఆధారపడ్డారు ఔను? చూశారా? అదేమైయుండెనో చూశారా? వారియొక్క వంశావళిని వరుసుగా చూచి అది ఔనో కాదో చూడుడి. చూశారా? దేవుని వాగ్ధానం మీదనే వారు ఆధారపడిరి.

198 ఆ విధమైన ప్రజలనుండి నోవహు ఆ విధముగా ఎన్నుకొనబడెను. ఆ విధముగనే పౌలు తన మంద నుండి తీసికొనబడెను. చూస్తున్నారా? ఆవిధముగనే, జాన్‌ వెస్లీ, మార్టిన్‌ లూధర్‌ మరి యితరులు ఎన్నుకొనబడిరి. ఈ రోజు మీరు ఏమైయున్నారో ఆవిధంగా మీరు రాగలరు, ఆలాగుననే, దేవునియొక్క సామాన్యమైన వాగ్ధానమును నమ్ముటకు అణకువతో వచ్చారు.

199 ఇప్పుడు గమనించుడి, గుర్తింబడుట—దేవునికి అది ప్రీతికరమైయున్నది. అది సత్యమా లేక కాదా యని, దేవుడు ఎల్లపుడు ఋజువుచేయును. చూశారా! మిలియన్ల మైళ్ళ దూరంలో దేవుడున్నట్లు అనేకులు ప్రవర్తించుటకు ప్రయత్నించుదురు. ఔనది నిజం, అయితే, దేవుడు తిరిగివచ్చి “అది నిజం, అది నిజం, అది నిజం” అని అది నొక్కి చెప్తే, అప్పుడు అది నిజమని నీవు తెలుసుకుంటావు.

200 ఇపుడు అర్పణలు బలిపీఠము మీద నుండగా, దేవుని గూర్చిన బుద్ధి కుశలతతో కూడిన అవగాహనను, దేవుడు తృణీకరించాడు. అయితే ఆయన హెబెలును చూచినపుడు, అది ఆపిల్స్ కాదు, లేక పొలములోని ఫలాలుకాదు అయితే అది రక్తము యని నమ్మిన చిన్న విశ్వాసము ద్వారా; విశ్వాసమును బట్టి అది అతడు నమ్మాడు. దేవుని యొద్దనుండి వచ్చిన ప్రత్యక్షత ద్వారా అతడు నమ్మాడు. అతని అర్పణను అంగీకరించుట ద్వారా, దేవుడు, ఆదామును ఋజువు పరచెను. చూశారా?

201 రోగులకొరకు ప్రార్ధించునపుడు మరిదేనిలోనైనా, అదే, మనం అక్కడ తలంచునది. యేసు చెప్పాడు : “మీరు నాయందును, నా మాటలు మీ యందును నిలచియుండినట్లయితే, మీకేది యిష్టమో, అది అడుగుడి, అది మీకనుగ్రహించబడును” అని.

202 ఇపుడు మనము త్వరగా క్రిందికి వస్తున్నాము. ఇరవై నిముషాలు యిక మనకు ఉన్నది.

203 గమనించు. ఏలియాయొక్క దినము, సామాన్యమైన వ్యక్తిలో, దేవుడు ఆయనకు ఆయన మరుగు చేసికొనుటకు ఏర్పరచుకొనెను. అది ఆలోచించుడి! దేవుడు ఎన్నుకున్నాడు. అది ఆయన ఎన్నిక. జ్ఞాపకముంచుకోండి, వారికి రబ్బీలున్నారు, యాజకులున్నారు. వారి దినాలలో గొప్పవారున్నారు. చివరకు రాజైన ఆహాబు, తాను ఒక యూదుడు. ఆ దినాన దేశములో అతనికి ఘనులైన వారున్నారు. అయితే, దేవుడు సామాన్యమైన మనుష్యునిలో తనకు తాను మరుగుపరచుకున్నాడు. ఒక మేధావిలో కాదు. లోకంలో ఖ్యాతిగాంచిన మనిషిలోకాదు. ఒక ఘనుడైన సైన్యాదిపతియైన మేధస్సుగల ఒకనిలోకాదు. కాదు. పెద్ద పేరుగల వ్యక్తి లో కాదు. చివరికి అతని తండ్రి ఎవరో, తల్లి ఎవరో మనకు, తెలియదు. అతని వంశావళినిగూర్చి మనకు తెలియదు. కేవలం, ఒక చోట నున్న, సాధారణమైన వృద్ధుడైన వ్యవసాయదారుడు. ప్రవక్తయొక్క పరిచర్యకై పుట్టినవాడు. అరణ్యములో, తనకైతాను బ్రతుకు లాగున దేవుడు అతనిని ఉంచుకొనెను. మనకు తెలిసినది ఒకటే యొకటి అతడెక్కడ నుండియో వచ్చి, నడచుకుంటు వచ్చి, సమస్త మతపద్ధతులను గద్ధించాడు. మై! వ్యక్తి

204 మరియు అతన్ని గూర్చి, వారేమను కున్నారో మీకు తెలుసా? “ఏ పాఠశాల నుండి అతడు వచ్చాడు?” చూశారా! “ఏ సంఘశాఖ అతడు? అతడు పరిసయ్యులతో ఉన్నాడా, సద్దూకయ్యులతో ఉన్నాడా?” లేక యింకేవో వారికున్నవి? వాటిలో దేనికి అతడు చెందినవాడుకాదు. అయితే సమస్తమును ఖండించాడు. చూశారా! అది చేయుటకు దేవుడు ఎన్నుకున్నాడు.

205 అయితే, సామాన్యమైన ఒక మనుష్యుడు, అవిద్యాపరుడు. పాఠశాలకు ఎక్కడకు వెళ్ళాడా, అను స్థలము మనకులేదు. అతనిని గూర్చి మనకేమిలేదు. ఒక సామాన్యమైన మనిషి. ఆ సామాన్యమైన వ్యక్తిలో దేవుడు మరుగైయుండుటకు యిష్టపడ్డాడు. అక్కడ, దేవుడు, ఈ సామాన్య మనిషిలో, నరునిలో మరుగుగా యుండుట. అది మీరు అర్ధంచేసికోగలరా? [సభ “అమేన్” అని చెప్పిరి—సంపా.]

206 లోకమునకు “విద్య లేని వెర్రివానిలో”, దేవుడు మరుగుచేసికొనెను. అన్నివిధాల అతనిని వారు—దూషించారు. మీకు తెలుసా? చివరకు “మాంత్రికుడైన”, ఏలీయా యనికూడా. ప్రవక్తలందరు దూషించబడ్డారు, ఔనా.

207 కనుక, యేసు కూడా వారిలో ఒకనిగా దూషింపబడ్డాడు. ఔనా! “బయల్జబూబు;వెర్రివాడు” అని అన్నారు. “నీవు పిచ్చివాడివి, అన్నారు. ఆ నీవు దయ్యము పట్టిన వాడనిరి. నీవు—నీవు మతిపోయిన వాడవనిరి.” ఔనా?

208 అక్కడ ఆయన వారికి చెప్పాడు. “అది కడవరి దినములకు వచ్చినపుడు…ఆలాటిది చేయుట దేవదూషణ యౌతుంది”. ఆయన వారిని క్షమించాడు. అయితే, అది, యీ కడవరి దినములలో క్షమించబడదు. నిత్యముగా వారు వేరుపరచబడతారు, అది క్రమము చెల్లించవలసియుంటుంది. “ఈ లోకంలోగాని, రాబోవు లోకములోగాని క్షమింబడదు.”

209 అయితే ఏలీయా, ఒక వెర్రివానిగా పరిగణింపబడ్డాడు. నవీన దినములలో…వలె—స్త్రీలు అంతా వెంట్రుకలు కత్తిరించుకొన్నారు. నేనూహిస్తున్నాను. దేశములోని ప్రథమ స్త్రీ యగు, యెజెబెలువలె రంగులుపూసుకున్నారు. మరియు—మరియు బోధకులందరు లోకకార్యకలాపాలకు వెళ్ళియున్నారు. మరియు అపుడు ఏంజరిగింది? తరువాత, వృద్ధుడైన ఏలీయా బయటకు వచ్చి, యెజెబెలు మొదలుకొని అందరిని గద్ధించెను.

210 “ఎందుకు,” అని వారనుకున్నారు, “మేము, నీమాట విననవసరంలేదు! మాకు కాపరులున్నారు” అని వారనుకున్నారు.

211 నిజమే, వారు విననవసరంలేదు, అయితే, అతడు వారికాపరే ఏలాగైనా. అతడు యెజెబెలు యొక్క కాపరి. ఆమెకు అది అవసరంలేదు. వేరేవిధమైన వారు ఆమెకుయుండవచ్చు. అయితే, దేవుడు పంపినవాడు. అతడూయుండెను. చూశారా! ఆమె కొరకై దేవుడు పంపిన కాపరి అతడు. ఆమె అతనిని ద్వేషించినది. అయితే, అతడు కాపరి, ఎప్పటివలెనే. గమనించుడి.

212 ఏలీయా తన్నుతాను తగ్గించుకొని, దేవుడు ఏమని చెప్పెనో, అంతగా అతడు దేవుని వాక్యముతో నిలబడెను. ఏలీయానుండి అదే ఆత్మనుతీసి మూడుసార్లు దానిని మరలా పంపుటకు దేవునికి ప్రీతికరమాయెను. చూశారా! ఆమేన్‌, ఆయన అది చేశాడు, ఆమేన్‌ ఖచ్చితంగా ఆయన చేశాడు. ఖచ్ఛితం. అది ఆయన వాగ్ధానము చేశాడు. అది వచ్చును అని, అతని వెనువెంట వచ్చినవాడగు ఎలీషా మీదికి అది వచ్చెను; అటుతరువాత బాప్తిస్మమిచ్చు యోహాను మీదికి వచ్చెను. మలాకి 4 ప్రకారముగా కడవరి దినమున అది యిక్కడ యుండవలసియుంది. ఔను?

213 అక్కడ అడవులలో ఎక్కడో ఒకచోట అడవిమనిషి, అవిద్యాపరుడు, సామాన్యమైన వాని మీదనున్న ఆ ఆత్మను దేవుడు ప్రేమించెను. మరియు అది, ఆయన వాక్యమునకు ఎంతో విధేయత గలది, ఎంతవరకనగా “ఏలీయా, యిది చేయ్‌” అని ఆయన చెప్తే, ఏలీయా అది చేయును, ఆలాటి సామాన్యతయందు దేవుడు, ఆయనకు ఆయన మరుగుచేసికుంటాడు.

214 “ఆ ముసలి వెర్రివాడు అతనితో పనిలేదు” అని వారంతా అన్నారు.

215 అయితే, ఒక దినాన, అతడు—అతడు వృద్ధుడై పోయాడు. ఆతని తల బట్టతల, అతని నెరసిన మీసాలు క్రిందకు వ్రేలాడుచున్నవి. మిగిలిన కొద్ది వెంట్రుకలు అతని భూజాలపైకి వ్రేలాడుతున్నవి. చేతులకు అంటుకపోయిన చిన్న ముసలి చేతులు మాంసపు కండరములు ఊగులాడుతున్నవి. సమరయకు పోవుదారిన వస్తున్నాడు. చేతిలో వంకర కర్ర పట్టుకొని ఆ కళ్ళు ఆకాశముపైపు చూస్తున్నవి, అతడు, చూచుటకు ఏవిధంగా అంత ఆకర్షణగాలేడు. అయితే, అతడు ఆ దినానికిగల “యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడు” అను దానిని కల్గియుండెను. దానితో అతడు తడబడలేదు. అతడు నత్తిగా మాట్లాడలేదు. “మహోన్నతుడైన ఆహాబు”, అని అతడు చెప్పలేదు. అతడు నేరుగా నడచుకుంటువెళ్ళి—“నేను తిరిగి దానికొరకై అడుగువరకు ఆకాశమునుండి మంచైనను పడదు” అని చెప్పాడు. హల్లెలూయ!! చూశారా? దేవుడు, అతని సామాన్యతను గౌరవించాడు.

216 ఇపుడు, మీరు గమనించారా! అది సామాన్యమార్గంలో యుండగా, ప్రతియొక్కరు—ప్రతియొక్కరు అతనికి వ్యతిరేకమే. ప్రతియొక్కరు అతని చంపవలెనని ఉన్నారు. సమస్తసేవకుల సంఘమంత, ప్రతియొక్కరు అతని గొంతుకొరకు కాచుకొనియున్నారు. అతని తప్పించుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ సామాన్యతలో అతని కూటాలలో వారు సహకరించకపోయినను, అతని యితరత్రమైనవాటిలో నహరించకపోయినను ఆ సామాన్యతలోనే యుండెను. అతడు వెర్రివాడని ప్రతియొక్కరు తలంచారు. దేవుడు తనకు తాను మరుగుచేసికున్నాడు.

217 అయితే, ఆ నాటబడిన, విత్తనము ముదురు కాలం వచ్చునప్పటికి, దేవుడు ఆకాశమునుండి పంపబడిన అగ్ని వచ్చి అర్పణను నాకగా, దేవుడు ఆయనకు ఆయన ప్రత్యక్షపరచు కొనెను. దేవుడు సామాన్యతలో మరుగుపరచుకొని, తరువాత మరలా ఆయన బయలుపరచుకొనును. చూశారా? అది ఖచ్ఛితం. అది చేయుటకు దేవునికి ప్రీతికరమాయెను. ఆ విధముగనే ఆయన అన్ని వేళలలో చేశాడు. ఔనండి, ఆయన—ఆయన యీ విషయాలు వాగ్ధానం చేశాడని మనం చూస్తున్నాము.

218 ఈ రోజు యిబ్బంది ఏదనగా, ఈ రోజు మనలో చాలామంది, ఎంతో- సెమినరి పొందుకోవాలని, సంఘశాఖల విద్యాసంబంధమైన -మనస్సు పొందాలని కోరుకుంటున్నాము. తద్వారా దేవుడు మనలను వాడుకొనడు. ఒకటి చేయుటకు దేవుడు ఒక మనుష్యునికి ఒకటి అనుగ్రహిస్తే, అతనికి పరిచర్యనిస్తే, ఇతరులు చెప్పువాటిని సమకూర్చుకొనుటకు వెళ్తాడు. మొదటి విషయమేంటో తెలుసా? అతడంతా చుట్టుకుపోయి పెద్ద గుంపులోకి పడిపోవును. అటుతరువాత దేవుడు, తన హస్తాలు తీసివేసి, అతన్ని ఒంటరిగానుంచును. చూశారా? చూశారా?

219 తరువాత, ఆయన కొరకు యింకొకరిని కనుగొనుటకు ప్రయత్నించును, అదిచేయు ఒకరిని. చూశారా? ఆయన వాక్యమును తీసికొను ఒకరిని, దైవిక ప్రత్యక్షతను తీసికొను ఒకటిని ఆయన కనుగొనవలసియుంది. దానితో కదలక, ఆయన వాక్యముతో సరిగ్గా—సరిగ్గా నిలబడు ఒకరిని కనుగొనవలసియున్నది. ఆ విధముగా ఆయన—ఆయన అది చేయును. ఆయన ఎల్లపుడు ఆవిధముగనే అది చేసెను.

220 కాబట్టి, ఒక మనుష్యుడు బాగా విద్యనభ్యసించి, తెలివిగలవాడైనపుడు, అతడు, తన స్వంత అనువాదమును పెట్టుటకు ప్రయత్నిస్తాడు. వారు పరిశుద్ధాత్మను గూర్చి చెప్పినట్లుగా వారంటారు. “ఓ! అది మరొక దినమునకు సంబంధించినది” యని. అయితే, నేను చెప్తున్నాను నీకు. పెంతెకొస్తు దినమున అది వచ్చినట్లు, అది రాదు. మేము నమ్మినపుడు మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. మరియు—మరియు అలాటిదంతా చెప్తారు. చూశారా! మరియు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును గూర్చి మాట్లాడు, వారు…ఆ విధముగానని బైబిల్‌ చెప్తున్నపుడు నీవు అంటావు; “మరి, అయితే సెమినరీ చెప్తుంది! మరియు ఫలానా-ఫలానా వారుచెప్తుంది”. అది రాజీపడడం. చూస్తున్నారా? ఆలాటి వ్యక్తిని దేవుడు వాడుకొనడు, చూశారా?

221 ఆయన ఆ విధముగా ఒక మనుష్యుడు దేశమంతట కొట్టబడి మరియు మనుష్యుడు వెలివేయబడి అపహాస్యంచేయబడి, హేళనచేయబడుటకు ఆయన అనుమతించును. అయితే, నిజమైన పరీక్ష సమయం వచ్చునప్పుడు, అదే సామాన్యతలో దేవుడు అతనిప్రక్కన నిలబడి తన్ను నిరూపించుకొనును.

222 పువ్వువలె వికసించును. విత్తనము, అది అయిపోయినట్లుగా కాన్పించి, అది చనిపోవును. మరియు భూమిలోపడిపోవును, చిన్న విత్తనాన్ని పైకిత్రవ్వితే అది మురిగి పోయియుండును, తారుమారుగా కాన్పించును. అయితే, మరియొక పువ్వు మరలా ప్రత్యుత్పత్తియగుటకు అక్కడ నుండి తెచ్చుటకు జీవాన్ని ఉత్పన్నం చేయును.

223 దేవుడు సామాన్యతలో నున్నాడు. దానినే ఆయన చేయును. పైకి వెళ్ళే మార్గము ఎల్లపుడు క్రిందకే. మిమ్ములను మీరు తగ్గించుకొండి. “సరే! నాకు యిది ఉంది, అది ఉంది” అది ఎన్నడూ చెప్పవద్దు. నీ యొద్ద ఏమీ—ఏమీ లేదు జ్ఞాపకముంచుకో! దేవుని కృప నీకున్నట్లయితే, అందుకొరకై కృతజ్ఞుడవైయుండు, అందుకొరకై దీనుడవైయుండు. చూశావా, నిన్ను నీవుగా తగ్గించుకొనుము.

224 ఇప్పుడు నేను తొందరపడబోతున్నాను. కారణం…మిమ్ములను ఎక్కువసేపు ఉంచాలని యనుకొనుటలేదు. ఎందుకనగా మిమ్ములను అలసిపోవునట్లు చేయుటకు నేనిష్టపడుటలేదు. ఈ వారమంత మనకు చాల సమయముంది.

225 ఇపుడు, ప్రజలు ఎంతో తెలివిగలవారుగానో, విద్యావంతులుగాను యుండుట కనుగొనుచున్నాము.

226 ఇపుడు యింకొకటి మీకు చూయించగోరుతాను. ఆ—మిగతావారు మరోప్రక్కకు సుదూరాన వెళ్తారు. వారు మూఢభక్తిగల్గి, భక్తిగల వారుగా తయారౌటకు ప్రయత్నిస్తారు. ఆ గుంపువారున్నారని మనకు తెలుసు. ఔనా! వారు ఆ ప్రక్కకు వెళ్ళెదరు.

227 అదే వెలుగు మార్గమునుండి—కొంచెము కాలంక్రితం విడిపోయిన గుంపు సహోదరులతో, అక్కడే నేనేకీభవించుటలేదు. జరిగించబడిన అద్భుతమును వారు చూడలేక, కెనడాలో మరియు—మరియు ఒక గుంపుగా వారికివారే తయారై వారిలోనుండి కొందరిని అపోస్తలులుగా ప్రవక్తలుగా, మరియు అటువంటి కార్యములు చేస్తున్నారు. మరియు అది పడిపోయినది. చూశారా? వారు ఆలాగేయుండును…ఔనా? వారు…వారది భావించారు. వారు…ఇతర విషయాలు ఎంతగానో వారు ఖండించారు. వారు—మరోవైపునకు ఒరిగిపోవులాగును చూశారా?

228 ఒక ప్రక్క అధిక తెలివిగలవారు. చల్లని, వ్యత్యాసపరులై అక్కడ అన్నిటిని ఉద్రేకపూరితులై, వాక్యమును తృణీకరిస్తున్నారు.

229 అయితే, అసలైన నిజమైన సంఘము సరిగ్గా రహదారి మధ్యలో నున్నది. మీరు గమనించితే, దేవుడు ఏమి చెప్పియున్నాడో అది—అది—అది ఆ బైబిల్‌ తెలివిని కల్గియున్నది. అది, దాని హృదయంలో వెచ్చదనము యుండుటకై, అది—అది తగినంత ఆత్మీయంగా ఉన్నది. అది రహదారిపైనున్నది. అది, ఆ విధముగా ఉండునని యెషయా చెప్పాడు. అతడు చెప్పాడు. “ఒక రాజ మార్గముండును…”. యని.

230 మరియు శుభప్రదమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నజరీను సంఘ స్నేహితులు బలమైన చిన్న కదలికను దేవుడు ప్రారంభించాడు. అయితే వారేమి పొందారు? అప్పుడు సంఘములో, దేవుడు బాషలతో మాట్లాడుట ప్రారంభించగనే వారెంతో మతావేశపరులై పోయారు. ఎంతో గంజిపెట్టుకున్న వారైయ్యారు. దానిని వారు దయ్యమని పిలచారు. వారికేమి జరిగిందో మీకు తెలుసా? చూశారా? చూశారా? వారు వారు నీ కంటె పరిశుద్ధులు. మరియు—మరియు ఇవన్ని విత్తనం యొద్దకు వెళ్ళి, నేరుగా చనిపోవునని మనం చూచుచున్నాము. ఔనా! మరియు—మరోవైపున.

231 ఒక వైపున మూఢభక్తి యౌతుంది మరోవైపున చల్లని, గంజిపెట్టినది యౌతుంది.

ఇప్పుడు యెషయా చెప్పాడు. “ఒక రాజ మార్గముండును…”

232 నజరేనులు, పరిశుద్ధతను చెప్పు పాతగుంపువారు చెప్తూయుంటారు. “శుభప్రధమైన పురాతన రాజమార్గమా! దేవునికి మహిమ”. పురాతన రాజమార్గమున మేము నడుస్తున్నాము. అయితే, మీరు జ్ఞాపకముంచుకొండి. అతడు చెప్పినది ఖచ్ఛితంగా అదికాదు.

233 అతడు చెప్పాడు “రాజ మార్గముండును” మరియు అనునది సంయోగము. “మరియు ఒక మార్గము” కలుపునది. అది పరిశుద్ధమైన రాజమార్గమని పిలువబడదు. అయితే, “పరిశుద్ధ మార్గము.”

234 ఇపుడు ఒక పరిశుద్ధమైన రాజమార్గము, ప్రజలు, తమకు తాము పరిశుద్ధులుగా యుండుటకు ప్రయత్నిస్తారు. నీవది చేసినపుడు, క్రితం నేనది చెప్పినట్లుగా యుంటుంది. అది యిలాగుండును…అది, గ్రద్ద—పావురపు రెక్కలు పెట్టుకొనినట్లుండును. దానిద్వారా పావురము అగుటకు. అతని స్వభావము యింకా గ్రద్ద స్వభావమే. ఔనా? అతడు అది…అది కాకి పావురపు ఈకలు పెట్టుకొనుటకు (లేక) నెమలి పెట్టుకొనుటకు ప్రయత్నించినట్లు యుంటుంది. మరియు, చూడూ! నేను అందమైన పక్షిని అది చెప్పినట్లు యుంటుంది. చూశారా. అది యొకవిధంగా తయారుచేసికొన్నట్లు.

235 అయితే, నెమలి, నెమలి యీకలు తాను కల్గియున్నానా లేదా యని బాధపడదు. పావురము, పావురపు యీకలు తాను కల్గియుంటానా లేదా యని బాధపడదు. తన స్వభావము పావురము స్వభావముగా ఉన్నంతకాలము, అది పావురపు యీకలు కల్గియుండును.

236 మరియు చూడుడి. పరిశుద్ధ గుంపు వారు చెప్తుయుంటారు. “స్త్రీలు పొడవాటి వస్త్రములు ధరించాలి, పొడవాటి వెంట్రుకలు కల్గియుండాలి. మరియు—యివన్ని పొడవాటి లంగాలు, మరియు పెండ్లి ఉంగరాలు పెట్టుకొనకూడదు, ఏవిధమైన ఆభరణాలు ధరించరాదు” అని చెప్తారు. చూశారా! అది యొక స్వనీతి పరిశుద్ధతగా మారుతుంది. ఔనా!. చూశారా! అది—అది—అది తయారు చేయబడిన పరిశుద్ధత. అయితే, నిజమైన జీవముగల దేవుని సంఘము…సంఘ శాఖలకు ఏమి సంభవించినదో చూడుడి. ఇపుడు వారంతా, పెంతెకొస్తు వారివలె, తదితరులవలె కత్తిరించుకున్న వెంట్రుకలు; మరియు—మరియు వారందరు, అంతా ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. సంవత్సరాల క్రితమున్న పెంతెకోస్తువారిని చూడూ! దాని మీద వారు ఏలా వీణ వాయించారో! చూడూ! “మేమే సంఘం! మేమే సంఘం.”

237 ఆ సంఘము, క్రీస్తుయొక్క శరీరము. ఇతరులమధ్య అది అఖండమైన ఒక వస్తువు. అనగా అది దేవుని రాజ్యములో జన్మించినది. లోపలనుండి బయటకు వచ్చునది. అది, తనంతట తానే జీవించునది.

238 ఒక గొర్రెను నీవు ఉన్ని పుట్టించమని…ఉత్పత్తి చేయమని అడుగ నవసరంలేదు. అని నా అర్ధం. గొర్రె ఉన్నిని ఉత్పత్తిచేయనవసరం లేదు. అతడు “ఈ సంవత్సరం, నా యజమానుడు కొంత ఉన్ని కావలయునని కోరుచున్నాడు. నేనెక్కువ పనికల్గి యుండవలెను” అని అతను చెప్తే. లేదు. అతను చేయవలసిన ఒకే ఒక విషయము, అతడు గొర్రెగా ఉండవలసినదే. అంతే, ఉన్ని, తనంతట అదే వచ్చును…అది వచ్చును. అతడది పుట్టించును ఎందుకనగా…

239 ఎందుకనగా మనము, ఫలములు పుట్టించమని అడుగబడుటలేదు. మనము ఫలములు ఉత్పత్తి చేయవలసినవారమైయున్నాము. చూశారా! పుట్టించవలసిన వారమైయున్నాము. ఔనా! మనము ఫలములు పుట్టించవలసిన వారమైయున్నాము. మరియు దేవుని యొక్క ఫలములుగల చెట్టువై నీవున్నంతకాలము దేవుని వాక్యముతో నీవున్నంతకాలము, దేవునియొక్క వాక్కము, దానికదే ఋజువు చేయును. అందులో వాక్యము ఉన్నంతకాలము అది ఫలము ఫలించును. యేసు చెప్పారు “మీరు నాయందును, నా మాట మీయందును నిలచియున్న యెడల మీకేది యిష్టమో అడుగుడి. అది జరుగును” ఔనా? అది మీకు తయారుచేయనవసరంలేదు. అంతవరకు మీరు పనిచేయుటకాదు. వాస్తవంగా అది అక్కడ యున్నది. అది ఆలాగే కొనసాగుతుంది.

240 ఇపుడు, మనం త్వరపడదాం, కొద్ది నిముషములు మిగిలియున్నవి. తరువాత మనం ముగిద్దాం.

241 ఇపుడు, ఇపుడు ఇతరులు, మూఢులవలె ఎంతో దూరం వెళ్తారు. వారు మరో ప్రక్కకు వెళ్తారు. పైకి క్రిందికి వారు దూకారు కనుక లేక ఒక విధమైన ప్రేరేపణ లేక ఉద్రేకము పొందారు కాబట్టి, లేక—లేక—మంచిగా జరిగిన ప్రవచనం యిచ్చారు లేక అలాటిది చేశారు కాబట్టి వారు తలస్తారు, అది అదేనని వారు తలుస్తారు. అది—అది వారు పొందుకున్నారు, అని అనుకుంటారు. అయితే, అది అది కాదు.

242 యేసు చెప్పాడు “ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి ‘ప్రభువా, నీ నామమున ప్రవచించలేదా? నీ నామములో అనేక కార్యములు చేయలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా?’” అది చెప్తారు. ఆయన అన్నాడు. “తొలిగిపొండి మిమ్ములను నేనెన్నడు ఎరుగను.” అని. చూశారా అది అది కాదు స్నేహితుడా! అది అదికాదు.

243 ఆ కారణంచేత…భాషలు, ఋజువా? భాషలు మాట్లాడుటను నేను నమ్ముతాను. అయితే, పరిశుద్ధాత్మకు అది మాత్రమే గురుతని, అది నేను తీసుకొనను. లేదండి!! ఆత్మయొక్క ఫలము ఋజువు చూశారా? ఆ వారు గమనిస్తున్నారు. ఇపుడు ఆ కారణంచేతనే పెంతెకొస్తు సహోదరుల కదలికతో నేను ఏకీభవించుటలేదు. ఆ విధముగా అనగా “ఒక మనుష్యుడు భాషతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ కల్గియున్నాడని అని వారు చెప్పుటకు”. నేను ఏకీభవించను. పరిశుద్ధాత్మ అతడు కల్గియున్నాడని అది గురుతుకాదు. ఔను?

244 ఎంత త్వరగా అవి మాట్లాడవలెనో అంతత్వరగా దయ్యములు మాట్లాడుట నేను వింటిని. మానవ పుర్రెలో నుండి రక్తాన్ని త్రాగి దయ్యములను పిలచుట నే వింటిని.

245 అక్కడ ఆరిజోనాలో, వర్షములో—వర్షములో—వర్షపు నాట్యములో, ఇండియావారు పాములను పట్టుకొని వారి చుట్టూ చుట్టుకొనియుండుటను నేను చూశాను. ఆ విధముగా చేతులుపైకెత్తి చుట్టూ పరుగులు తీస్తారు. ఆ మాంత్రిక వైద్యుడు, తనకుతాను ఈటెతో పొడుచుకొంటాడు. పెన్సిల్‌ క్రిందపెట్టగా, అది అన్య భాషలతో వ్రాస్తుంది, దానికి అనువాదం యిస్తుంది. చూశారా?

కాబట్టి అది నాకు చెప్పవద్దు, వాటిలో నేను ఎక్కువగా ఎరిగినవాడను. ఔనా?

246 కాబట్టి—ఆత్మ ఫలమేదనగా…“వారి ఫలముల వలన” అది యేసు చెప్పాడు. ఉద్రేకాలద్వారా, భాషలద్వారాకాదు. “అయితే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు” చూశారా! కాబట్టి, అది ఆత్మఫలము. అది, దేవుడు తనకుతాను దీనత్వంలో, రమ్యతలో బయలుపరచుకొనుట. ప్రతి సమయము అంతే, అందునుగూర్చి అది యొకటి, ఒక మనుష్యుడు వాక్యముతోనే నిలబడుట. వాక్యమును అతడు చూచినప్పుడెల్ల, యితరులు ఏమిచెప్పినప్పటికి, దానితో అతను “ఆమేన్‌” అని చెప్పును. అది, అతడు నమ్ముతాడు. చూశారా సరే చూశారా?

247 అయితే మనమెంతో దూరం వెళ్ళాము. మూఢభక్తిమీద ఆనుకునేంతగ సాతాను ప్రజలమధ్యకు వస్తాడు. అది సాతానుని పని. సాతాను ఒక మంచి వ్యాపారి. మరియు అతడు ప్రజల మధ్యకు వస్తాడు. అది వారు కల్గియున్నారని వారు తలంచునట్లు చేస్తాడు. ఎందుకంటె, వారు ఎగిరి—దూకారు కాబట్టి, అటు తరువాత నీ పొరుగువానిని ద్వేషించుట? లేదు. చూశారా?…విషయాలు చెప్పడం మరియు భాషలతో మాట్లాడం, అద్భుతం!! ఆలాటివి చేయడం.

248 మరియు జ్ఞాపకముంచుకో నీవు స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలవు. అయినను పరిశుద్ధాత్మ కల్గియుండవు. బైబిల్‌ గ్రంధము ఆలాగుచెప్పుచున్నది. “నేను మనుష్యుల భాషతోను, దేవదూతల భాషలతోను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే అది నాకు వ్యర్ధము. నేను గణగణలాడు కంచును, మ్రోగెడి తాళమునైయున్నాను”. మొదటి కొరింధి 13. చూశారా? కనుక…అది అది చేయదు. ఔను

249 ఆ మెతడిస్టులు చెప్తారు, “మేము కేకలు వేసినపుడు మేమది పొందియున్నామని.” అయితే వారది పొందలేదు. నజరీనులు చెప్తారు. “వారు పరిశుద్ధంగా ఉన్నపుడు వారది కల్గియున్నారని” అంటారు. అయితే వారదిపొందలేదు. పెంతెకొస్తువారు చెప్తారు. “మేము భాషలతో మాట్లాడాము. మేమది కల్గియున్నామని” చెప్తారు, అయితే, వారది పొందుకోలేదు, చూశారా? చూశారా?

250 దేవుడు, ఆయనకు ఆయన బయలుపరచుకొనుట, ఉద్రేకములలోకాదు. లేదు…ఉద్రేకములు. అయినను దానితో ఉండును. దాని స్థానమును మీరు చూచుచున్నారా! దానికి నీయొక్క—స్వంత మనస్సును మిశ్రితం చేయుటకు ప్రయత్నించుకుండనట్లయితే, మరియు నీ తలంపులను క్రోడీకరించకుండ నట్టయితే, దానిని ఎవరైనా చూచుటకు అది సాదారణమైనది. అది దేవుడు.

251 ఇప్పుడు తరువాత, వారు మూఢభక్తిగల గుంపుగా మారారు. తరువాత, ఇక్కడ, యీవైపున చల్లని నామకార్ధమైనవారు. ఇక్కడ మతభక్తిగలవారు ఆ మరోవైపు, ఇక్కడ రెండు వైపుల నుండి పిలువబడుచూ పెండ్లి కుమార్తె నేరుగా వెళ్తుంది. ఔనది నిజం! దేవుడు ఆయన వాక్యము వెంబడి వెళ్ళుచు; దానిని ఋజువు చేయుచు.

252 ఇపుడు, యిదికొంత వదలివేయవలసియున్నది. ఎందుకనగా నాయొద్ద చాలా ఉన్నది. నేను—నా…సమయం గడచిపోతుంది. ఎంతత్వరగా నేను త్వరపడగలనో అంతత్వరగా నేను త్వరపడతాను.

253 ఏదేను నుండి అది వచ్చినది. మెస్సీయా వచ్చునది ప్రవచింపబడినది—ఏదేను నుండి

254 ఇప్పుడు నేను యిక్కడ వ్రాసుకున్న, నాయొక్క కొన్ని లేఖనాలు, కొంత వివరణలు నేను దాటవేయబోతున్నాను. నాకు సాధ్యపడితే వర్తమానమును సమయంలో ముగించుటకై. తగ్గింపులో దేవుడు దాగియుంటాడు. నేను త్వరగా మాట్లాడుతాను. అయితే, అయినప్పటికి, నేను—నేనిది పట్టుకోవాలి. ఔనా?

255 ఏదేను యొద్ద నుండి, మెస్సీయా వచ్చునని ప్రవచింపబడియున్నది. ఆయన ఎటువంటి వ్యక్తి యౌతాడా అనునది ముందుగా చెప్పబడినది. దానిమీద ఎక్కువసేపు ఉండగలము. ఆయన ఎవరైనది, ఎటువంటి వ్యక్తి యగునది బైబిల్‌ చెప్తున్నది. మీకు తెలుసు మోషే చెప్పాడు. “ప్రభువైన మీ దేవుడు నావంటి ప్రవక్తను పుట్టించును.” మెస్సీయా ప్రవక్తయైయుండునని, ఆలాటి పరిచర్య ఆయన కల్గియుంటాడని వారికి తెలుసు. ఆయన ఏమి చేస్తాడో అందరు ప్రవక్తలు చెప్పారు. సూచనలద్వారా వారు పలికారు. మరియు అది వారి తలలకుపైగా పోయినది. మిగతా వారి క్రిందుగా పోయినది. చూశారా? చూశారా? ఒకరికి క్రిందుగా ఒకరికిపైగా పోయినది. చూశారా?

256 కాలము యొక్క రంగం మీదికి ఆయనవచ్చు సమయానికి, ఎవరికొరకై ఆయన పంపబడ్డాడో ఆ ప్రజలు, ఆయన ఏమైయుండునో అనుదానిని గూర్చి, వారి స్వంత ఊహ జనిత అనువాదముతో వారి స్వంత అనువాదమును కల్గియుండిరి.

257 ఆ బైబిల్‌ గ్రంధము ఎన్నడు మారదు. బైబిల్‌ ఎల్లవేళల ఒకటిగానేయుండును. ఆ కారణం చేతనే నేను చెప్తున్నాను. “లేఖనము చెప్తుంది, దానితో నేను నిలబడుతున్నాను, ‘బైబిల్‌కు ఎటువంటి ప్రత్యేక అనువాదము లేదు.’”

258 కాబట్టి, మెతడిస్టులు, బాప్టిస్టులు, పెంతెకొస్తులు మీ యొక్క స్వంత అనువాదమును దానికి పెట్టునకు ప్రయత్నించవద్దు. “అది ఆ అర్ధంకాదు, ఇది యీ అర్ధం” అని చెప్పవద్దు.

259 దాని అర్ధం అదేమి చెప్పినదో అదే, ఖచ్ఛితంగా అదే. ఒకరు చెప్పారు. “అది ఏలాగు?” అని. ఏలాగో నాకు తెలియదు. చెప్పటానికి అది నేను కాదు. దాని భద్రత తీసుకొనునది దేవుడే. అది చెప్పినది ఆయన ఔనా? ఆయన తన స్వంతదానిని జాగ్రత్త తీసికొనును.

260 అయితే, యిపుడు, ఈ మెస్సీయా ప్రవచింపబడ్డాడు. ఆయన ఏలాగువచ్చునని, ఆయన వచ్చునపుడు ఆయనేమి చేయునని, ఖచ్చితంగా ప్రవక్తలు చెప్పారు. అయితే, అందునుగూర్చి ప్రజలమద్య వారి స్వంత అనువాదముతో! ఆయన వచ్చినపుడు, సామాన్యతలో అంతటి సామాన్యతలో ఆయన యుండెను. సమస్త సంఘ గుంపు అందునుగూర్చి తబ్బిబ్బులై పోవునంతగా. ఔనది నిజమా? [సభ “ఆమేన్‌” అని చెప్పిరి—సంపా.] అక్కడే ఎవరైతే బోధింపబడిరో…

261 ఒక మనుష్యుడు, లేవి వంశక్రమములో జన్మించితే తప్ప, అతడు ఒక బోధకుడు, యాజకుడుకాలేడు. ఆలోచనచేయ్‌! అతనియొక్క గొప్ప - గొప్ప - గొప్ప - గొప్ప - గొప్ప- గొప్ప ముత్తాత యాజకుడు. నేరుగా వాక్యములోనే, ఆలయంలోనే పగలు, రాత్రి ఉన్నాడు.

262 కతోలిక్‌ యాజకుని వలె లేక తరములనుండి కొన్ని సంఘములకు అప్పజెప్పబడిన పరిచారకునివలె, “నాయొక్క తాత, తాత ముత్తాత మెతడిస్టు బిషప్పు. మా తాత బిషప్పు యింకా యితరత్రమైనవి”. గమనిస్తున్నారా?

263 అదంతా వాక్యములో జీవించిరి. అయితే, దానియొక్క స్వంత మార్గమును నిర్మాణము చేసికొనిరి. దానిని గూర్చి తండ్రులు చెప్పినది వారి పిల్లలు అంగీకరించిరి. నిజమైన మార్గమును తండ్రులు బోధించు వరకు మరియు దానియొక్క ఒక సంస్థను వారు తయారు చేసినందు వలనను ఆత్మసత్యమునిచ్చుటకు ప్రయత్నించినను, అది వారు స్వీకరించలేకపోయిరి.

264 మరియు ఈ రోజు ఆలాటిదే జరుగుచున్నది. నేను కఠినంగా యుండాలని కాదు. అయితే యిది నిజము. ఈ రోజు అదే విషయం. వారు దానిని ఎంతో—ఎంతో చిక్కులు చిక్కులుగా చేయుచున్నారు. మరియు—మరియు యింకొక విధముగా చేస్తున్నారు…వారు దేవునికి ఏలాటి మనుమళ్ళులేరు” అని చెప్పబడినట్లు. అది మీకు తెలుసా? దేవునికి కుమారులున్నారు. ఆయనకు కుమార్తెలున్నారు. అయితే, మనుమలు, మనుమరాళ్ళు లేరు. ప్రతియొక్కరు ఒకటే వెలను చెల్లించవలసియున్నది. ఒకే మార్గమున రావలసియున్నది. నీ తండ్రి ఏలాగుచేసెనో, నీవూ అంతే.

265 ఇప్పుడు కాబట్టి, ఆయన ఎంతో సాధారణమైనవాడు. నాల్గువేల సంవత్సరముల వరకు, ప్రతి ప్రవక్త ఆయనను గూర్చి, ఈ మెస్సియాను గూర్చి…మాట్లాడారు. దావీదు, ఆయనను గూర్చి పాడారు. మరియు ఆలాగు అందరు కూడా ఆయన వచ్చినపుడు, ప్రజలు ఆయన ఏమి చేయవలెనని, ఆయన ఏ విధంగా చేయబోతున్నాడని వారి స్వంత భావాలను నిర్మించుకున్నారు. అదంతా ఏలాగు వివరణ యివ్వబడినది పటముల మీద గీచుకున్నారు. ఆయన సాధారణ మార్గమున వచ్చినపుడు, అది కేవలంఅది కేవలం వారియొక్క వేదాంతాన్ని పాడుచేసినది, చూశారా? వారు దానిని తెలుసుకొనలేదు.

266 ఆయన వాక్య ప్రకారముగా వచ్చాడు. ఒక విధముగా మెస్సీయ వచ్చునని ప్రవక్తలద్వారా, దేవుడు మాట్లాడి యుండెనని మీరు నమ్ముతున్నారా? మనము అక్కడకు వెళ్ళి అదెలాగు యని వివరించడం మరియొక సమయం లేదని అనుకొనడం అదెంతో బాధాకరమైన విషయం. ఔనా? అదెలాగైనది మనకందరికి తెలుసు. మనలో చాలామందికి తెలుసు. ఆయన ఏ విధముగా వచ్చునని దేవుడు చెప్పినది, “యూదా బెత్లెహేమా, అందులో అల్పమైన దానవుకావు…” ఇంకా క్రిందకు మరియు ఆయన ఏలాగుచేయునది మరియు ఆయన ఏమి చేయునది? ఔనా?

267 మరియు అయినప్పటికి, ఆయన ఎంతో సాధారణమైన వాడైయుండెను. ఎంతవరకనగా, ఆ గంభీరమైన మేధావులు, దానిలో ఎంతగానో మిళితమైపోయి, వారు తప్పిపోయేంతగా. అయితే మీకు తెలుసా! యేసు, వాక్యమునకు విరుద్ధముగా రాలేదు. వాక్యప్రకారమే ఆయన వచ్చాడు. అయితే, వారియొక్క అనువాదమునకు విరుద్ధముగా వచ్చాడు. ఔను! ఆయనను గూర్చి వారియొక్క మతసంబంధమైన తర్ఫీదుకు వ్యతిరిక్తముగా ఆయన విషయాలను బోధించాడు.

268 ఇప్పుడు ఉదాహరణగా వారన్నారు. “మెస్సీయా వచ్చినపుడు ఖచ్ఛితంగా ఆలయంలోకి ఆయనవచ్చి ‘కయఫా’ లేక ఎవరు ప్రధాన యాజకుడైనప్పటకి ‘నేను వచ్చాను’ అని చెప్తాడు. పది లక్షల దూతల వందనములతో ఆయన వచ్చును.” దేవుడు చెప్పుచున్నాడు, ‘మంచిది యిక్కడున్న సభికులారా!, మీరు నిజముగా ఒక—ఒక బలమైన సంఘము. మీరు నా ప్రజలు. నేను యిక్కడ వంకర యిరుసును త్రిప్పబోతున్నాను. పరలోక ద్వారాలు దిగుతవి. నేను ఈ ఉదయం, మెస్సీయాను మీ యొద్దకు పంపుచున్నాను. అక్కడ ఆవరణములో దిగునట్లు చేసెదను’. ప్రజలు చుట్టుచేరి ‘డాక్టర్‌ ఫలానా - డాక్టర్‌ ఫలానా, ఆయనను ప్రథమముగా శుభము పలుకుటకు, మీరు ముందు నిలబడుడి అని చెప్పుదురు. చూశారా!’”

269 ఇప్పుడు బహుశా, అది యీ రోజు వారు తలంచినట్లుగా యున్నది. అది కొంత…దుడుకు తనముగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే, నేను కాదు…నేను విషయమును వివరించ ప్రయత్నిస్తున్నాను.

270 “మరియు—మరియు, అక్కడ అది ఆ విధముగా యుండబోతున్నది. అది ఆ విధముగా రానట్లయితే, అది సరికాదు. అది అంత్యక్రీస్తు. చూశారా! అది ఆ విధముగా రానట్లయితే, అది యొక అంత్యక్రీస్తు చూశారా! కనుక అలాగుండకూడదు. మరియు, తరువాత…తరువాత విషయం వస్తుంది. షుమారు, పది మిలియన్ల దూతల మేళతాళాలతో వందనములతో ఉంటుంది. మరియు ఎక్కడైతే, సొలొమోను ఆలయాన్ని నిర్మించాడో, అక్కడ ఆవరణములో వారు దిగుతారు. ఓ! యీ పరిశుద్ధ స్థలములో ఎక్కడైతే పరిశుద్ధులు, భక్తులు చనిపోయిరో, యిక్కడ క్రిందకు పైకి”.

271 “ఔను” యేసు చెప్పాడు. “వేషధారులైన మీరు, అపవాది కుమారులు! మీరు ప్రవక్తల సమాధులను అలంకరించెదరు. మీ పితరులు వారిని అందులో పెట్టారు.” ఔనది నిజం, ఔనది నిజం. చూశారా! “ఎంతమంది నీతిమంతులను ప్రవక్తలను, మీ యొద్దకు పంపగా, యింకా వారినందరిని మీరు చంపుతునే యున్నారు”. చూశారా? అయితే, దేనిని ఆయన నీతిమంతులని పిలచెను? “మూఢులని, పిచ్చివారిని”, వారెవరిని పిలచెను? ఔను.

అక్కడ, ఆ విధముగా అది వచ్చునని వారనుకున్నారు.

272 అయితే, ఆయన పశులతొట్టిలో వచ్చెను ఒక కన్యకు—జన్మించెను, ఒక సామాన్యమైన వండ్రంగివాని పెంపుడు తండ్రి వలన, ఖ్యాతిప్రఖ్యాతులు లేని ఒక చిన్న—చిన్న బాలిక వలన వచ్చెను. గమనించారా. ప్రధానయాజకుని కుమార్తెగా కాదు. లేక యింకో విధముగా కాదు. ఆయన—ఆయన…నజరేతు యని పిలవబడు ఒక—ఒక పాతకాలపు నీచ గ్రామములో నివసించెను. ఒక చిన్న స్త్రీ ద్వారా ఆయన వచ్చాడు. మరియు అతడు, తన భార్య చనిపోయిన ఒక సామాన్యుడు; యోసేపుకు, అతనికి పిల్లలున్నారు. మరియు—మరియు ఆమె ప్రధానం చేయబడినది. మరియు ప్రారంభం నుండే నలుపు పేరుతో ఆయన వచ్చాడు. ఆయన భ్రష్టుడుగా జన్మించాడని వారన్నారు. అయ్యో

273 అది వారి నైపుణ్యానికి చాలా యిబ్బంది కల్గించెను. చూశారా! వారి విద్యా శాస్త్రానికి అది మింగుడు పడలేకపోయెను. లేఖనములను గూర్చిన వారి అనువాదము దానినేమి ఎరుగకుండెను. అయినప్పటికి అది “యెహోవా యిలాగు సెలవిచ్చుచున్నాడు” అనునది. అయ్యో.

274 దానిని గూర్చి ఆలోచించుట ద్వారాను, మరియు, మరల అదే విషయం జరుగుచుండుట ద్వారాను, అది నన్ను వణికింపజేయుచున్నది. దేవుడు మారడు.

275 అది పండ్రెండు అయిపోయింది. మీరు…నిలుపుచేయనా? [సభ “వద్దు ముందుకు కొనసాగించు” అని చెప్పిరి—సంపా]. వందనాలు. కొద్దిసేపు నెమ్మదిగా కూర్చొండి. [“నీవు కొనసాగించుము”]. ఇప్పుడు ఇది రానున్న వర్తమానం కొరకు నేనొకటి పునాది వేస్తున్నాను. గమనిస్తున్నారా? మీరు త్వరగా వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. మనకు సాధ్యమైతే తదుపరి పది, లేక పదిహేను నిముషాలు. దేవుడు మిమ్ము దీవించును.

276 గమనించుడి అదెంతో సాధారణమైనది. వారి నిమిత్తమైతే, అది గురిని తప్పింది. అయితే, అది—అది—అది దేవుని గురిని తాకింది. చూశారా! అది వాక్యాన్ని తాకింది. ఆయన ఖచ్ఛితంగా ఏమని చెప్పాడో, ఆవిధంగా వచ్చాడు. అయితే, అందును గూర్చిన వారియొక్క అనువాదము తప్పు. మోషే కాలంలో విమోచకుని యొక్క అనువాదము తప్పు. నోవహు కాలమందలి అనువాదము తప్పు. అయితే, దేవుడు ఆయన వాక్య ప్రకారముగా వచ్చును.

277 మరియు తరువాత యేసు వచ్చాడు, మరియు ఆయన—విరుద్ధమైన వాటిని ఆయన బోధించాడు. “నీవు మెస్సీయావైతే, యిది- యిది- చేయ్‌,” ఔనా.! “నీవు యైనట్లయితే, సిలువ మీదనుండి వచ్చి యిపుడు మాకు చూపించు.” చూశారా? అయితే, దేవుడు ప్రజలకొరకై హాస్యగాడుకాడు. దేవుడు మంచివి, సంతృప్తికరమైనవి చేస్తాడు.

278 గంభీరమైన దేవదూతల వందనములతో ఒకరు తప్పక రావలసియున్నదని వారు అనుకున్నారు. అయితే, ఆయన పశుల తొట్టిలో వచ్చాడు. మరియు వారియొక్క స్వంత నునుపుచేయబడిన విజ్ఞానమునకు, ఎవరైతే, భూమికి స్వంతదారుడో, మరియు సర్వమును సృజించిన సర్వశక్తిమంతుడగు యెహోవా, సర్వోన్నతమైన దేవుడు తన స్వంత బిడ్డ జన్మించుటకు ఎరువు కుప్పలున్న పశులపాక కంటె మరి శ్రేష్టమైన స్థలము దొరకలేదని తలంచుట, ఒక సామాన్య మానవునికి అది యొక హాస్యాస్పదమైనదిగా యున్నది. ఏలాగు…చూశారా?

279 అదేమైయెండెను? సామాన్యతలో దేవుడు యుండుట. అదే ఆయనను ఎంతో గొప్ప వానిగా చేసినది. చూశారా, విద్య వలన వచ్చిన విజ్ఞత ఆ విధముగా తనకు తాను తగ్గించుకొనదు. చూశారా, దానికది నిలువజాలదు. అయితే, దేవుడు తనకు తాను తగ్గించుకొన్నంతగా అంతటిగొప్పవాడు. తన స్వంత బిడ్డకు ధరింపజేయుటకు బట్టలు లేనంతవానిగా. అందునుగూర్చి ఆలోచన చెయ్. మరియు లోకంలో…సత్రములో స్థలములేదు. ఆయన ఆవుల దొడ్డిలోకి వచ్చెను, ఒక చిన్న—కొండ అంచులోనున్న—గుహ. దేవుని కుమారుడు గడ్డి పడకమీద వచ్చెను. ఓ, అది కలసికొనుట ఎంతో వ్యత్యాసము…

280 మరియు ఆయన తల్లి తల్లిగా యుండవలసియుండెను. ప్రధానము చేయబడకముందు లేక వివాహముకాక ముందు కొన్ని నెలలకు ముందు ఆమె తల్లి ఆయెను.…లేక వివాహమునకు ముందు. ఔనా? ఆమె తల్లి కావలసియుండెను. అది ప్రజలు చూశారు. అది యీ మార్గమందైనదని వారికి తెలుసు. మరియయైతే, ఆమె హృదయములో, ఏమి జరుగుచున్నది, ఆమె ఎరిగియుండెను.

281 మరియు యోసేపుకు అర్ధంకాలేదు, అయితే ప్రభువు దూత రాత్రియందు అతని యొద్దకు వచ్చి, “దావీదు కుమారుడవైన యేసేపు నీవు. మరియ ను భార్యగా చేర్చుకొనుటకు భయపడవద్దు. ఎందుకనగా ఏమి పొరపాటు లేదు. అయితే, అది పరిశుద్ధాత్మ వలన కల్గినది.” అది అయిపోయినది. ఆ యోసేపు అను మనుష్యుడు దేవుడు తనతో మాట్లాడునంతటి సంబంధమును దేవునితో కల్గియుండెను.

282 అయితే, ఈనాడు మనము మతశాఖల దుస్తులను గట్టిగా చుట్టు ధరించియుండుటవలన, మనము ఏ మతగుంపునకు చెందియున్నామో అది తప్ప ఏది మనతో పలుకదు! నేను కఠినంగా లేక వ్యతిరేకిగాయుండదలచుకోలేదు. కాబట్టి దానిని అక్కడే వదలివేస్తాను. గమనించుడి. అయితే నా భావమేదో మీరు గ్రహించారా? గమనించుడి.

283 నాగరికత గలవారికి పశులపాక హాస్యాస్పదముగా ఉన్నది. చివరకు ఆయన ఒక్కరోజైనా పాఠశాలకు వెళ్లినట్లుగా మనకు వివరణలేదు; అయినను, పండ్రెండు సంవత్సారాల, వయస్సులో, సాధారణ బాలుడు దేవాలయములోని బోధకులను, తన బోధ ద్వారా ఆశ్చర్యపరచాడు. ఓహో, ఏంటిది? దేవుడు తనను మరుగుచేసికొనుట…?…నేనిప్పుడు భక్తి పులకితుడనై పోతున్నాను. దేవుడు ఒక పాకలో మరుగుపరచుకొనుట. ఒక చిన్న బాలునిలో దేవుడు మరుగుచేసికొనుట, చూశారా? గమనించుడి. కొద్దిసేపైన తరువాత అది బయల్పడబోవుచున్నది. చూశారా?. ఆయన చేయవలసియుండెను.

284 ఆయన వీధుల్లోకి వెళ్ళినపుడు యిది అనుమానం లేదు తల్లిదండ్రులు యిట్లు చెప్పియుందురుః “ఆ బిడ్డతో ఆడుకోవద్దు, ఆయనతో మీకు పనిలేదు. ఆయన తల్లి ఒక సాధారణ వేశ్యతప్ప మరొకరుకాదు. వారు వాస్తముగా పెండ్లి చేసికొనకముందు…ఆమె తల్లి ఆయెను, దానితో మనకు సంబంధంలేదు.” అని చెప్పియుందురు.

285 మరియ ఏమి తలంచియుండెను! అయితే, బయటవారు ఏమి తలంచినను యీ విషయాలన్ని ఆమె మనస్సులో ఆలోచించుచుండెను. వారి హృదయంలో అవి, వారు భద్రపరచుకొనెను. వారు ఎరిగియుండిరి. అందుకు వ్యతిరేకముగా వేరొకటి మాట్లాడలేదు.

286 కొన్నిసార్లు, దేవుడు ఆయన మనిషితో ఆయన మాట్లాడుతాడు “మౌనముగా ఉండు, అందునుగూర్చి ఏమి చెప్పవద్దు.” అని.

287 నా కూటములలో ప్రజలు చెప్పుకొనుట నేను గమనిస్తాను. చెప్తారు, “నీవు క్రీస్తు దాసుడవైతే, ఇది అక్కడ జరుగుచుండునని, నీకు తెలియును”.

288 నిశ్చయమే, అది జరుగుతుందని నాకు తెలుసు. అయితే, ఆలాగైతే “మౌనముగా ఉండు, అందునుగూర్చి నీవు ఏమి చెప్పవద్దు” అని ఆయన నాతోచెప్పినయెడల అప్పుడు మీరేమి చేయగలరు?

289 గత దినము కొందరిని తీసుకొని వెళ్ళి పుస్తకము మీద నున్నది వారికి చూపించాను. “కొన్ని సంవత్సరాల క్రితము ఒకటి నాతో చెప్పినది”! అని చెప్పాను.

అన్నాడు, “సరే, అది నాకు అర్ధం కాలేదు.”

290 “నీవు అక్కడ చూస్తున్నావా”? అని అడిగాను. అక్కడ వెనుక జరిగినవి. అక్కడ, పుస్తకములో యుండుట చాలా మంది చూశారు. “ఇది యీ విధముగాను, అది ఆ విధముగాను, అది జరుగును.” అని నేను చెప్పాను.

291 “సరే, దానిని గూర్చి ఒకటి నీవెందుకు చెప్పలేదు?” అని అడిగారు…అది ఆ విధముగా ఉండవలసియున్నది. చూశారా?

292 మరియు యేసేపు మరొక విధముగా ఎరిగియున్నాడు. ఆ బిడ్డ ఎవరికి సంబంధించియున్నాడో అతనికి తెలుసు. ఎవరికి అది చెందియున్నదో మరియకు తెలుసు. ఆయనకు తండ్రి ఎవరో యేసుకు తెలుసు. ఆయన ఏమని చెప్పాడు? “నేను నా తండ్రి పనులమీద ఉండవలసియున్నది” అని చెప్పాడు…చెక్కను రంపముతో కోయడం కాదు—తలుపు చేయుటకు. అయితే తండ్రి పనులమీద యుండుట. ఆమేన్‌. తన తల్లితో చెప్పాడు “నా తండ్రి పనులమీద యుండవలసిన సమయం యిది యని నీకు అర్ధం కాలేదా”?

293 ఇప్పుడు వారనుకున్నారు: “ఈ చిన్న వెర్రి బిడ్డ…” ఏ, అక్రమముగా పుట్టిన బిడ్డయిన ఒక విధమైన వింతగాను, వినోదవస్తువుగా నుండును. అక్కడే నీవున్నావు. చూశారా! అయితే, దేవుడు తనకు తాను మరుగుచేసికున్నాడు. విను. “మురికి, కలుషితం, అక్రమమని” లోకమేమి తలస్తున్నదో అందులో దేవుడు తనకు తాను మరుగు చేసికున్నాడు.

294 చూడూ! జీవమును తీసికొనివచ్చుటకై, మృతమైన విత్తనము యొక్క కలుషితములో తనకుతాను దేవుడు దాగియున్నాడు. చూశారా? మీకర్ధమైందా? [సభ “ఆమేన్‌” అని చెప్పెను].

295 సామాన్యమైన, చిన్న బట్టలుతుకు స్త్రీలో దేవుడు, తనకుతాను దాగియుండును. (లేక) ఒక సామాన్య మనిషి, తన భోజన మూటను తన చంకలోపెట్టుకొని, తన భార్యా బిడ్డలను ముద్దాడి, సెలవుపుచ్చుకొని, బయటకు వెళ్ళుచున్న అతనిలో ఒక ఆ కార్యము చేయుటకు ఒకవేళ దాగియుండును. ఈ కార్యం ఆర్చిబిషప్పుకు ఏమి తెలియదు. చూశారా? ఆయన ఏలాటి కొమ్ములూదడం, పంపడం మీరు వినలేరు. అలా మహిమ కల్గును. అంతే! సామాన్యులు అది విని సంతోషింతురు. చూశారా!

296 దేవుడు ఇపుడు, తన చిన్న శిశువులోని సామాన్యతలో మరుగుచేసికొనెను. సామాన్య కుటుంబము—యొక్క సామాన్యతలో మరగుపరచుకొనెను. మరియు దేవుడు మత గురువులు, గొప్పవారు, మేధావులు, తెలివిగలవారు—వారందరు, మరియు ఆనాటి హేరోదీయులు మొదలగువారు, నీరోలు నిరాకరించిరి. దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు.

297 ఇపుడు త్వరగా, యెషయా 40లో బాప్తిస్మమిచ్చు యెహాను. మీరు కోరితే, మనం తీద్దాం. మలాకి. 3. అంతా. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యెషయా. 40. మీ అందరికి తెలుసు. అది సమాధానము గూర్చి మాట్లాడుచున్నది…నేను—నేను—నేను చదివితే, అది మంచిదని అనుకుంటాను. మీకు—మీకు సమయముంటే [సభ “ఆమెన్‌” అని చెప్పెను—సంపా.] మనమది చేద్దాం. ఒక్క నిముషము. ఇక్కడ మనం యెషయ పుస్తకం తీసి 40వ అధ్యాయం, దీనినిగూర్చి, అతడేమని చెప్పాడో చూచి, చదువుదాం. ఇక్కడ చూడండి. “నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి.” జ్ఞాపకముంచుకోండి. ఇది ఏడువందల పండ్రెండు సంవత్సరాలు. అక్కడున్న ముఖభాగమును చూడండి. చూశారా. అతడు జన్మించకముందు ఏడువందల పండ్రెండు సంవత్సరాలు. అతని గూర్చి ప్రవక్త మాట్లాడుచున్నాడు.

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి

యెరూషలేముతో ఓదార్పు మాటలు మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె దోషరుణము తీర్చబడెను;యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి

ప్రతిలోయను ఎత్తుచేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను :

298 ఓ! అతడెటువంటి మనుష్యుడై యుండును! చూశారా? ఇప్పుడు నాతో కలసి మలాకి ని త్రిప్పండి. పాతనిబంధనలో ప్రవక్తల ఆఖరు పుస్తకము, మలాకిలో ఇక్కడ వినండి. మలాకి, అది తీస్తున్నది, అంత్యకాలము, అది మరవవద్దు. మలాకి 3వ అధ్యాయం.

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

299 యోహానును గూర్చి యింకా మాట్లాడుట, “నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నేను నా దూతను పంపుచున్నాను.” యేసు దానిని గురించి మత్తయి 11:10లో మాట్లాడాడు మీరు అంగీకరించగల్గితే, చెప్పబడినవాడితడే.

ఇదిగో నా దూతను నాకు ముందు పంపుచున్నాను…

300 చూశారా? అది నిజమే. ఇదంతయు ఏలా పలుకబడినది? ఏడువందల సంవత్సరములకు ముందే, మెస్సీయకు ముందు ఒక ముందటి వాడు వచ్చునని చెప్పబడెను. అయితే, అతడు రంగం మీదికి వచ్చునప్పటికి (ఎంతో సామాన్యతలో) వారతనిని పోగొట్టుకొనిరి. వారతనిని చూడలేక పోయిరి.

301 ఇప్పుడు జ్ఞప్తించుకో, అతడు యాజకుని కుమారుడు. తిరిగి సెమినరీకి వెళ్ళకుండుట, తన తండ్రియొక్క ఉద్యోగాన్ని అనుసరించక పోవుట, ఎంతటి అవహేళనో చూడూ! అయితే అతనియొక్క పని చాలా ప్రాముఖ్యమైనది. అతని తొమ్మిది సంవత్సరముల వయస్సున అరణ్యమునకు వెళ్ళాడు. బోధచేస్తూ, అతడు తిరిగివచ్చాడు. వారది పోగొట్టుకున్నారు. అతడెంతో సాధారణమైనవాడు. వారియొక్క ఉన్నతమైన - నాగరికత విద్యతో అలాటివానిని నమ్ముటకు ఎంతో సాధారణమైనవాడని వారు అనుకున్నారు…

302 “అన్ని ఎత్తయిన స్థలములు అణచబడును, అన్ని పల్లపు స్థలములు ఎత్తు చేయబడును; కరుకైనవి చదునుచేయబడును” అందును గురించి ఏంటి? దావీదు, అది చూచి, అన్నాడు “పర్వతములు చిన్న పొట్టేళ్ళవలె గంతులు వేయును మరియు ఆకులు చప్పట్లు కొట్టెను.” [సహోదరుడు బ్రెన్ హాo చాలా సార్లు తన హస్తాలతో చప్పట్లు కొట్టాడు—సంపా.]

303 ఏంటి? అది జరిగినదా? నెరసిన మీసాలతోనున్న ఒకడు, ఎటువంటి విద్యలేని పామరుడు, గొర్రె చర్మాన్ని చుట్టూ చుట్టుకొనియుండి తడబడుతూ యూదా అరణ్యములో నుండి వచ్చాడు అన్నాడు, “మారుమనస్సు పొందుడి పరలోక రాజ్యము సమీపముగా యున్నది. మరియు సర్పములారా ‘నేను ఫలానా సంస్థకు చెందియున్నాను,’ అని తలంచవద్దు. ఈ రాళ్ళవలన, దేవుడు అబ్రాహాముకు పిల్లలు పుట్టించగలడు.” సరే!

“అయ్యో! సరే అది అతనుకాదు, అక్కడ, అతడు కాదని మాకు తెలుసు.”

304 అయితే, అది అతడే, చూశారా! అతడు మార్గాన్ని శుభ్రంచేస్తున్నాడు. ఔనా? అక్కడ కరుకైన స్థలములు చదును చేయబడెను. అక్కడే ఎత్తయిన స్థలములు పల్లము చేయబడెను. “అబ్రాహాము మీకు తండ్రియని మీరు తలంచవద్దు. అలాటి విషయాలు చెప్పవద్దు. ఎందుకనగా దేవుడు, యీ రాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలు పుట్టించగలడు.” ఎత్తయిన స్థలములు చదును చేయబడెను. ఓహో! అది యిదీ. ఔను. వ్యత్యాసము చూడూ? ఆ విధంగా జరుగునని ఆయన చెప్పాడు.

305 మరియు వారు వచ్చినపుడు, వారు అనుకున్నారు. (అయ్యో), వారియొక్క స్వంత సంస్థాపకమునకు వచ్చినట్లయితే, అతనిని చేర్చుకోవాలనుకున్నారు. అయితే…అతడు అంతటి సాధారణమైన మార్గాన వచ్చాడు. అయినను లేఖనమందలి అనువాదములలో ఎత్తయినవి సరాళము చేయబడెను. వారు అంగీకరించుటకు యిష్టపడలేదు. అయితే, అవి అట్లె యుండెను.

306 అబ్బాయ్‌. అతడు వారిని గొరిగి వేసెను. అతడు వారిని ఊపివేశాడు. “సర్పములారా! గడ్డిలోని సర్పములారా, మీరు! గొడ్డలి చెట్టువేరున ఉంచబడియున్నదని నేను మీతో చెప్తున్నాను. ఫలము ఫలించని ప్రతిచెట్టును, నరకబడి, అగ్నిలో వేయబడును. నేను నిజముగా నీళ్ళతో మీకు బాప్తిస్మము యిచ్చెదను. అయితే, నా వెనుక ఒకరు వచ్చుచున్నాడు. ఆయన నాకంటె బలవంతుడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము యిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. ఆయన పొట్టును…కాల్చివేయును. గోధుమలను కొట్టులో చేర్చును.” ఆమేన్‌.

307 అది కరుకైన స్థలమును సమము చేయునపుడు, గమనిస్తున్నారా? అయితే, ప్రజలు దానిని స్వీకరించ లేదు. అయితే, అది ఖచ్ఛితంగా వాక్యముతో నున్నది. వాక్యము చెప్పిన ప్రకారముగా ఉన్నది. ఎంతో సామాన్యము, వారది పోగొట్టుకున్నారు. వారు అది చూడలేకపోయారు. మై

308 ఆ గుడ్డి తనముతో మీరు ఉండవద్దు. చూశారా! ఆ గ్రుడ్డితనముతో మీరుండవద్దు. కనుక వినండి.

309 వారు దానిని పోగొట్టుకొనిరి. ఆలాటి వ్యక్తిని గూర్చి వారి యొక్క సాదారణ విశ్వాసమునకు అతడెంతో సాధారణమైనవాడు. అది వారు పోగుట్టుకున్నంతగా, తిరిగి, అదేమిటి? దేవుడు. వాక్యమై యున్నాడు. సామాన్యతలో మరుగుచేయబడినవాడు, తనయొక్క కాలరు త్రిప్పుకొని తెలివి తేటలతోనున్న యాజకుడు కాదు.

310 యేసు వారిని అదే విషయం అడిగాడు. ఆయన అడిగాడు: మీరేమి చూడ వెళ్ళితిరి. “యని. యోహాను శిష్యులు వచ్చినపుడు మీరేమి చూడవెళ్ళితిరి” యని అడిగెను. యాజకుని వస్త్రము ధరించిన మనుష్యుని చూడవెళ్ళితిరా? ఔనా? సన్నపు నార వస్త్రములు ధరించిన వాని చూడవెళ్ళితిరా? “అటువంటి—అటువంటి—అటువంటి—అటువంటి బోధకునినా?” అని ఆయన అడిగాడు. ఆయన అడిగాడు, “అది చూచుటకు మీరు వెళ్ళితిరా?”

311 చెప్పబడుతుంది “లేదు మీకు తెలుసా? పిల్లలను ముద్దుపెట్టుకొనుట, మృతులను పాతిపెట్టుట. యుద్దములోని రెండు శిఖరముల ఖడ్గము వారికి తెలియదు. ఒక విధమైన జ్ఞానయుక్తమైన సంభాషణతో, కివానిస్‌ క్లబ్‌ మరిదేనికో యున్నట్లుగా, చూశారా! వారక్కడ సరియే. అయితే యుద్ధంలోకి వచ్చినపుడు, అది ఎదుర్కొన్నపుడు, దానినిగూర్చి వారికేమి తెలియదు. వారు—వారు రాజ గృహములలో ఉన్నారు. ఆవిధమైన పండుగతో వారికి వారు మోసం చేసికుంటున్నారు”.

312 అయితే చెప్పబడినది “ఆలాగైతే, మీరేమి చూడవెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లును చూడవెళ్ళితిరా? ఒకరన్నారు…చూడూ! నీవు—నీవు ఏకత్వమునకు సంబంధించినవాడవు; నీవిక్కడకు అసెంబ్లీస్ వచ్చినట్లైతే నేనేం చేస్తానో చెప్తాను—నేనది చేస్తానని నేను నమ్ముతున్నాను. ఊహు. ఒక రెల్లు, ఊగుట. యోహానుకాదు. కాదు కాదు, కాదు, కాదు. ‘నీవు వచ్చినట్లయితే, ఒక సద్ధూకయునిగానో మరియు ఒక పరిసయ్యునిగానో యుండు. లేక ఒక దానిగా ఉండు. తరువాత? గాలిచేత ఊగినట్లుగా నీవు ఎవరిని చూడలేదు. యోహానుకాదు”. కాదండి. సహోదరుడా అతడు కాదు.

313 ఆయన అన్నాడు. “ఆలాగైతే, ఎవరిని చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా?” అది చేయుటకు ప్రవక్తకావలెను. చూశారా. ఆయన అన్నాడు…అది ప్రవక్తయొక్క ఋజువు. చూశారా? దేవునియొక్క వాక్యము అతనితో యుండును. వాక్యము ప్రవక్తయొద్దకు వచ్చును. చూశారా! అడిగాడు “ఏమి చూడవెళ్ళితిరి? ఒక ప్రవక్తనా”? చెప్పబడినది “ఔను, అది నిజమే, అయితే, నేను మీతో చెప్పుచున్నాను. ప్రవక్త కంటె గొప్పవాడు”, అతడు.

314 ప్రవక్తంటె ఎందుకని అతడు గొప్పవాడు? అతడు నిబంధన దూత. ఔను. అతడు నిజముగా అతడే. ధర్మశాస్త్రమునకు కృపకు మధ్య వారధిని కట్టువాడు అతడే. చెప్పబడిన ప్రముఖమైన రాయి అతడే.

315 ఆయన చెప్పాడు “మీరు అది అంగీకరించగల్గినట్లయితే ప్రవక్త చెప్పినవాడు, యితడే. ‘ఇదిగో’ మలాకి 3 లో ‘నాకు ముందుగా నా దూతను పంపెదను, నాకు ముందుగా అతడు మార్గము సిద్ధపరచును’”. చూశారా? అతడెంతో సామాన్యమైనవాడు. దేవుడు తిరిగి సామాన్యతలో మరుగుచేసికొనుట.

316 తరువాత అతడేమి చేశాడో గమనించు. బలవంతుడైన అట్టి క్రీస్తు వచ్చుటను అతడు ప్రకటించాడు. “ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన…ఆయనయొక్క మార్గమును అతడు విసరుతున్నాడు. అబ్బాయ్‌. ఇది నాయొక్క భావము. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయును. ఆయన చెత్తను తీసి, దూరానకు ఊడ్చి, దానిని కాల్చివేయును. ఔను. ఆయన విత్తనాన్ని సమకూర్చి, గరిసెలో ప్రోగుచేయును”. చూశారా, అతడు ఆత్మ ఆవేశమును పొందియుండెను.

317 అయితే, యేసు వచ్చినపుడు వారు…మీకు తెలుసా! అపోస్తలులందరు, ఒకటి ఘనమైనది వచ్చుటకు వారు ఎదురు చూచుచుండిరి. “మై. మై ఓహో! ఆయన వచ్చుచున్నాడు. అదంతే. ఆయన వచ్చుచున్నాడు. అబ్బాయ్‌! ఆయన బలవంతుడైయుంటాడు. ఆయన భూమీ మీద నుండి రోమీయులను తీసివేయును. గ్రీకులు యిటువెళ్ళునట్లు, రోమీయులు అటువెళ్ళునట్లు ఆయన వచ్చునపుడు చేయును”.

318 ఆయన వచ్చినపుడు, ఒక చిన్న దీనుడైన యౌవ్వనుడు ఆ ప్రక్కకు యీ ప్రక్కకు త్రోయబడుచుండెను ఏంటది? దేవుడు సామాన్యతలో మరుగుచేసికొనుట, అయ్యెయ్యో!.

319 తరువాత, ఆయనయొక్క వర్తమానపు ముగింపులో ఉన్నాడు. అన్నాడు “నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? నేనేమీ చేయుదునని బైబిల్ చెప్పినదో…నేను నా తండ్రి కార్యములు చేయనట్లయితే, నన్ను శిక్షించుడి. అయితే, నేనేమి చేయుదునని లేఖనములు చెప్పినదో అవి నేను చేయనట్లయితే”. అవిశ్వాసమే పాపము, మీకు తెలుసా! ఎవరు నా మీద నేరము మోపగలరు? దేవుని వ్రేలిచేత నేను దయ్యములను వెళ్ళగొట్టినట్లయితే, అలాగైతే, అందును గూర్చి మీరేమి చేస్తున్నారో నాకు చూపించుడి. సామాన్యత!

320 చివరికి, ఆయన మరణానికి కూడా అప్పజెప్పుకున్నాడు! ఓ!! అయితే, ఆయొక్క ఈస్టరు ఉదయవేళ, హల్లెలూయ! అక్కడ ఆయన కళ్ళమును శుభ్రముచేసినది. ఆయన చెత్తను ఊడ్చివేసి; ఔనా, సహోదరుడా, నిజముగా, మరియు గరిశెలో, గోధుమలు భద్రపరచబడియున్నవి. మనం మాట్లాడుచున్న, ప్రభువు యొక్క రాకడ యను మహాదినము కొరకు ఎదురు చూచుచు, అందులో నిత్యజీవము కల్గియండి అక్కడ భూమిలో ఉండియున్నది. ఆ జీవము నిత్య జీవమునకు వచ్చినపుడు, ఆ పునరుద్ధానములో మనము లేచెదము. ఆయనతో పాటు ఆకాశమండలమునకు కొనిపోబడి గరిశెలో కూడుకొనెదము మరియు చెత్త కాల్చివేయబడును. చుట్టుకొన్న పొట్టు దానిని యిటూ అటూ లాగుటకు ప్రయత్నించును. ఆరని అగ్నితో కాల్చివేయబడును. ఆమేన్‌. ఓ! ఆయన ఆశ్చర్యకరుడు కాదా! [సభ “ఆమేన్” అని చెప్పినది—సంపా]

321 వారు అయనను పోగొట్టుకుంటారు. సామాన్యతలో దేవుడు. ఎందుకు? ఎందుకు? ఆయన ఎన్నడు. ఆయన ఎన్నడు మతసంబంధమైన పదజాలములను వినియోగించ లేదు. బోధకునివలె ఆయన ఎన్నడు బోధచేయలేదు. ఔనా? దేవునియొక్క సాధారణ పదజాలమును ఆయన వినియోగించాడు…ఈలాటి పదజాలములను “గొడ్డలి పెట్టబడియున్నది.” “చెట్టు” పదజాలములను, “సర్పములు” పదజాలములను” మొదలగు వాటిని ఉపయోగించెను. “పదజాలములను” మొదలగు వాటిని ఉపయోగించెను. సెమినెరి ఉపాధ్యాయుని వలె కాకుండ, దినముననున్న మతసంబంధికునివలె కాకుండ, డాక్టర్‌ ఆఫ్‌ డివినిటి, ఫలానా ఫలానా డాక్టర్‌ వలె కాకుండ; అతడు, అది చేయలేదు. అతడు దూరముననున్న అడవి మనిషివలె బోధించెను. అతడు, గొడ్డళ్ళును గూర్చి, చెట్లను గూర్చి, సర్పములను గూర్చి, ఆలాటి వాటిని గూర్చి; గోధుమలు, గరిసెలు మొదలైన వాటని గూర్చి బోధించాడు. ఈ రోజు, అతడు సబ్బుపెట్టె బోధకుడుగా పరిగణింపబడతాడు. ఆ దినాన, అతడు, “చెట్టు మొద్దు బోధకుడుగా” పిలువబడియుంటాడనే తలస్తున్నాను. ఆ దినాన అక్కడ యోర్దానునులో చెట్టు మొద్దుకు ఆనుకొనియున్నాడు…సామాన్యతలో దేవుడు, లోకము యొక్క జ్ఞానమునకు మరుగుగా ఉన్నాడు.

322 ఇపుడు, మనం కనుగొందాం, యేసు అన్నాడు, “తండ్రీ! నీవు ఈ సంగతులను లోకజ్ఞానులకు మరుగుపరచి పసిబాలురకు వీటిని తెలియజేయుచున్నావు”. చూశారా! దేవుడు, సామాన్యతలో మరుగు చేసికున్నాడు. క్రీస్తులో, దేవుడు సామాన్యతలో మరుగుచేసికున్నాడు. యోహానులో చూశారా? కొంచం చూశారా సరిగ్గా…చూడు, ఆయన—ఆయన…ఆలోచన చేయ్‌. దేవుడు సామాన్యతలో, లోకమునకు తనకుతాను మరుగుపరచుకున్నాడు.

323 ఇప్పుడు ఒక్క నిముషం. లేక రెండు, ముగించుకుందాము. ఎందుకనగా ఎక్కువ సేపు మిమ్ము ఉంచదలచుకోలేదు.

324 చూడు. ఒక నిముషం నిలుపుచేద్దాం. ఒకటి వ్యక్తిగతం. ఇపుడిది ముగించుటకు, మనము జీవిస్తున్న దినమును గూర్చి ఆలోచించు. మనము నివసిస్తున్న చిన్న స్థలములో దేవుడు వచ్చి రోగులను స్వస్థపరచుచున్నాడు. మరియు ధనికులు, అహంకారులు, అధిక విద్యావంతులు “అద్భుతకార్యములు జరుగు దినములు గతించినవి, దైవిక స్వస్థత అనేది లేదు” అని చెప్పుచున్నారు.

325 ఇక్కడ, యీ స్థలమునుండి ఆ ఉదయం నేను వెళ్తూ బోధించిన వర్తమానం గుర్తున్నదా మీకు, దావీదు, గొల్యాతును గూర్చి?

326 అడిగారు, “సహోదరుడా బ్రెన్‌హాం, దీనంతటితో, అక్కడ ఒక విద్యా లోకమును నీవు ఎదుర్కొనగలవు?”

327 నే చెప్పాను. దానిని నేనెలాగు ఎరుద్కొనగలను. నాకు నేను సహాయము చేసికోలేను. దేవుడు చెప్పాడు “వెళ్ళు” అని. చూశారా? అది అంతే ఔను. అది ఆయన వాక్యము, దానిని ఆయన వాగ్ధానము చేశాడు. ఆ ఘడియ యిక్కడే.

328 అక్కడ మీరు చూచుచున్న పటములో నున్న ఆ దూత, రానున్న జూన్‌కు ముప్పయి సంవత్సరముల క్రితం లేదా ముప్పయ్‌ మూడు సంవత్సరాల క్రితము, ఆ దినమున నదియొద్దకు వచ్చిచెప్పెను. ఐదువేలమంది యింకా మరెక్కువ మంది ఎదుట చెప్పెను. “బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లు”. “నీ యొక్క వర్తమానము ప్రపంచమును చుట్టివచ్చు ఘడియవచ్చినది.”

329 అక్కడున్న మీలో ఎవరికైనా విమర్శ జ్ఞాపకమున్నదా? రాయ్‌ స్లాటర్‌ లేక ఇక్కడ కూర్చున్న కొందరికి ఆ దినము జ్ఞాపకముందనుకుంటాను అని తలస్తున్నాను, లేదా కొందరు, శ్రీమతి స్పెన్సర్‌ లేక—లేక పాతకాలపు వారైన కొందరున్నారు—వారికి తెలుసు. ఔనా. జార్జి రైట్‌ లేదా వారిలో కొందరు, అది ఏలాగైంది వారికి తెలుసు. అయితే అది చేయలేదా? అది దానిని చేసినది. [సభ “ఆమేన్‌” అని చెప్పుచున్నది—సంపా.]

330 మరియు తరువాత, మధ్యలో, వారు నిరాకరించి - యిది యొక మానసిక స్వస్థత అని అన్నారు. దేవుడు త్రిప్పి ఒక మూగజీవియైన పోసం అను జంతువును పంపి, దేవునియొక్క శక్తి ద్వారా స్వస్థపరచెను.

331 లైల్‌ ఉడ్‌ మరియు బాంక్స్‌, మేమక్కడ కూర్చొని యుండినపుడు, దేవుడు సత్యమును ఋజువు పరచెనని తెలిసికొంటిమి. అపుడు ఒక చిన్న, మంచినీటి చేప, చచ్చిపోయి నీళ్ళమీద పడియున్నది. నిన్నగాక ముందటి దినమున, పరిశుద్ధాత్మ మాట్లాడి, ఆయన మహిమ ఆయనకు చూపించగోరి, అందును గూర్చి ఒకటి చేయగోరెను. మరియు ఆ ఉదయం అక్కడ నిలబడి ఉండగా, పరిశుద్ధాత్మ ఆ బోటులోకి వచ్చాడు. నేను నిలబడి ఆ చేపతో మాట్లాడితిని, అర్ధగంటసేపు అది చచ్చి నీటిలో పడియున్నది. దాని శ్వాసేంద్రీయములో మరియు పొట్టప్రేవులు దాని నోటిలో నుండి బయటకు వచ్చినవి. అది ప్రాణం పొందుకున్నది. మిగతా చేపలవలె యీదుకుంటు వెళ్ళింది. ఏంటది? దేవుడు సామాన్యతలో మరుగు చేసికొనుట.

332 దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలు పుట్టించగలడు. దేవుడు, పోజంను, లేక చేపను లేక దేనినైనను స్వస్థపరచగలడు. ఆయన ఆయన యొక్క వర్తమానమును తీసికొని వస్తే, ప్రజలు దానిని నమ్మనట్లయితే, దానిని నమ్ముటకు దేవుడు పోజంను పుట్టించగలడు. హల్లెలూయా! చచ్చిపోయిన చేపను దేవుడు లేపగలడు. చచ్చిపోయిన పోజంను ఆయన లేపగలడు. ఆయన చేయగలడు. ఆయన చేయవలెనని అనుకున్నది ఆయన చేయగలడు.

333 ఎంతటి గద్దింపు ఈ తరానికి! దానిని గురించి వారు తొట్రిల్లినపుడు, దానిని గురించి వారు గజిబిజియైనపుడు “నీవు యిది చేయలేదు, అది చేయలేదు” అని. దేవుడు సాదారణమైన జంతువును పంపాడు. ఔనా? ఎంతటి గద్దింపు అది! ఏంటది? సామాన్యతలో దేవుడు. గమనించారా? గొప్పవాడుగా తనకుతాను చూపించుకొనుట. ఓహో! ఈ తరము యొక్క మనుష్యులకు వారియొక్క అవిశ్వాసమునకు ఎంతటిగద్ధింపు.

334 వారెల్లపుడు కల్గియున్నట్లుగానే, యిపుడు వారు తలస్తారు. వారి స్వంతమార్గమున అది జరుగవలసియున్నది.” దైవిక స్వస్థత…అటువంటిది ఉన్నట్లయితే” ఒక కతోలిక్‌ మనిషి యిది నాకు చెప్పినట్లుగా, గత రాత్రి, అందునుగూర్చి నాకు చెప్పారు. దానిగూర్చి మీకు తెలుసు. చెప్పబడినది…ఈ అయ్యర్స్‌ హోస్టన్ లో నున్న అతని అబ్బాయ్‌ని చూడవెళ్ళితిని. అతడు చెప్పాడు—అతడు చెప్పాడు. “అది, దేవుని యొక్క వరమైనట్లయితే—అది కతోలిక్‌ సంఘములోకి రావలసియున్నది.” మీరు చూశారా? చూశారా? ఆ మెతడిస్టులు అనుకున్నారు అది వారి సంఘములోకి రావలసియున్నది” యని, పెంతెకోస్తువారు అను కున్నారు. అది వారి సంఘములోకి రావలసియున్నదని, అయితే ఏ ఒక్కరి దగ్గరకు అది రాదు.

335 యేసుక్రీస్తు, ఆయనకు ఆయన ప్రత్యక్షపరచుకున్న పునరుత్ధానశక్తి వలన అది వచ్చినది. అది నిజము. ఖచ్ఛితము. ఆయన చేసియున్నాడు. ఆ. అది గమనించు. నీయొద్ద నుండి దానిని పోనివ్వద్దు. దానిని నీ—నీ గుండెక్రింద ఉంచుకో మరియు అది జ్ఞప్తియుంచుకో, అక్కడ దానిని ధ్యానించుకో.

336 అది వారి స్వంత మార్గమున రావలసియున్నది. వారియొక్క స్వంత సంఘశాఖ ద్వారా. “అది అది చేయనట్లయితే, అది ఆయన కాదు. చూశారా! అది కేవలం, అది మనఃతత్వ తాత్వికము. లేక అది దయ్యము. అది—అది…దేవుడు కాదు. ఎందుకనగా అది దేవుడైయున్నట్లయితే ఆయన రావలసియున్నది.” వారి స్వంత మార్గమున. మీరు గమనించారా, “అది మనము అనువదించ వలసిన విధమున యుంటుంది.”

337 పరిసయ్యుల యొద్దకు యేసు ఆవిధమున రావలసియుండెను. అది అ విధముగా యుండవలసియుండెను. చూశారా? వారి…దేవుడు ఒక—ఒక మెస్సీయాను పంపగోరినట్లయితే, ఆయన ఏలాగు వచ్చునో, అంతా వారు అనువదించేవారు. మరియు ఎందుకనగా, ఆయన వ్యత్యాసంగా వచ్చాడు. అలాగైతే “అది మెస్సీయ కాదు. ఆయన ఒక విధంగా అక్రమముగా వచ్చినవాడు. ఆయన బయల్జబూబు”. అయితే, అది దేవుడు, సామాన్యతలో మరుగుచేసికున్నాడు.

338 ఆ ముందుండువాడు, తప్పక ఒక విద్యావంతుడై యుండవలసియున్నది. ఏలాటి సందేహం లేకుండ, ప్రతి దినము ప్రతి సంవత్సరము, వారి పరిచారకులను వారు అభిషేకించి, వారిని మిషనరీలుగా పంపుటకు, మతప్రవిష్టులుగా చేసి లోపలకు తెచ్చునపుడు, ప్రతియొక్కరు తలంచిరి. “వచ్చునటు వంటి ముందటివాడు, ఇతడేయై యుండును”. అయితే ఏలాటి సెమినెరీ అనునది లేనిచోట, అరణ్యములోనుండి దేవుడతనిని పుట్టించాడు. ఔనా! ఆలాటివాటినుండి. చూశారా? దేవుడు దీనత్వంలోను, సామాన్యతలోను తనకు తాను మరుగుచేసికుంటాడు.

339 అయితే, ఇపుడు ఆగండి. ముగింపులో ఇది చెప్పుకుందాం. అయితే దేవుని యొక్క సాధారణమైన వర్తమానమును తృణీకరించినట్లయితే, దానిని—దానిని—దానిని తృణీకరించుట దేవుని యొక్క సాధారణమైన మార్గమును త్రుణీకరించుట నిత్యము నాశనమౌతుంది. ఇపుడు అదెంతటి…సామాన్యమైనదో మనం మాట్లాడుకున్నాము. ప్రజలు ఆలోచిస్తారు. దాన్ని గూర్చి వారు నవ్వుతారు; అది నిరాకరిస్తారు. వారి కిష్టమొచ్చినట్లుగా దానిని చూస్తారు. అయితే అది దేవుని యొద్ద నుండి నిత్యమైన ఎడబాటు ఔతుంది.

340 నోవహు దినాలలో, వారు ఎవరైతే చనిపోయారో, వారు అతని వర్తమానమును ఆలకించలేదు. వారు నశించిపోయారు. చీకటి గొలుసులలో, ఆయన మరణములో యేసు వెళ్ళి వారికి బోధించాడు. ఆయన లేవకముందు ఆయన నరకంలోకి వెళ్ళాడు. చెరసాలలోనున్న ఆత్మలకు బోధించాడు, నోవహు దినాలలోనుండి దీర్ఘశాంతముతో నున్నను, మారుమనస్సు నొందని వారికి బోధించాడు; దేవునియొక్క సాధారణ వర్తమానము సాధారణమైన మనుష్యుని వలన ప్రకటించబడినది. ఆయన వెళ్ళాడు. ఆయన చెప్పాడు. “నేను యిక్కడ యుంటానని నోవహు బోధించాడు. నేను యిక్కడ ఉన్నాను.” ఔనది నిజం. ఔనా?

341 ఒక అగ్నిస్తంభము ద్వారా ఖచ్చితంగా ఋజువు చేయబడి దేవుని యెద్ద నుoడి పొందుకొనిన ఆ ప్రవక్త యొక్క వర్తమానమును విననటువంటివారు అరణ్యములో మోషే ద్వారా నడిపించబడిరి. తరువాత లేచి నిర్మాణాత్మకము చేయుటకు ప్రయత్నించిరి. వారిలో ప్రతి యొక్కరు నశించిపోయారు. అరణ్యములో చచ్చిపోయారు. అయితే ఇద్దరు యెహోషువా కాలేబులు.

342 మరియు అక్కడ ఆ—పరిసయ్యులు. ఎంతో గ్రుడ్డివారు అది చూడలేకపోయారు. కాబట్టి వారు వెనుకకు చూచి’ “మా పితరులు మన్నాను తిన్నారు. అరణ్యములో మన్నాను తిన్నారు” అని అన్నారు.

343 యేసు చెప్పాడు. “ఔను వారు తిన్నారు. ప్రతియొక్కరు చచ్చిపోయారు”. దేవుని మహిమను వారు చూశారు. వారు వెలుగులో నడచారు…వారు వెలుగులో నడిచారు. వారు అగ్నిస్తంభముయొక్క వెలుగులో నడిచారు. దానియొక్క శక్తి సన్నిదిలో నడిచారు. పరిశుద్ధాత్మ, వారు నడచుటకు సిద్ధపరచిన స్థలములగుండ వారు నడిచిరి. దేవుడు సిద్ధపరచిన పరలోకమునుండి పడిన మన్నాను వారు భుజించిరి. నశించి, నరకానికి వెళ్ళిపోయారు. “వారిలో ప్రతియొక్కరు చనిపోయిరి.” ఆ మాట మీరు తీసికున్నట్లయితే, అది దేవుని సన్నిధినుండి “నిత్య ఎడబాటు” యౌతుంది. “వారందరు ప్రతియొక్కరు. చనిపోయిరి” చూశారా?

344 యేసును తృణీకరించిన ప్రతియొక్కరు నశించిపోయారు. నా భావమేదో మీరు గ్రహించారా? దేవుని యొక్క సామాన్యతను తృణీకరించుట. “సరే, నేను తప్పు చేశాను” అని అంటారు. నీవు ఆ విధముగా చేయకూడదు. ఆ విధముగా దేవుడు అంగీకరించడు. నీవు నిత్యముగా నశించిపోతావు. మనం దానిని గూర్చి ఆలోచించుట మంచిది. ఇపుడు అది దేవునిచేత సరిగా గుర్తించబడవలసియున్నది. తరువాత, అది ఆలాగైతే, అది ఆయన యొక్క వాక్యము. చూశారా? వారివారి దినాలలో మోషెను తృణీకరించినట్లుగా, ఏలీయాను తృణీకరించినట్లుగా, యోహానును తృణీకరించినట్లుగా, యేసును తృణీకరించినట్లుగా ఉండును.

345 ఇక్కడ, మీకొక చిన్న విషయం చెప్పనీవండి. ఎక్కువగా మిమ్ము బాధించుట లేదనుకుంటాను. అయితే చూడండి. గతదినము టెక్సాస్‌లోని హూస్టన్‌కు పిలువబడ్డాను. ఒక క్షమాపణ పొందటానికి. ఒక వర్తమానము బోధించుటకు, జనులను సమకూర్చుటకు, ఈ యౌవనస్తుడు యౌవన బాలిక యొక్క—యొక్క క్షమాపణ సంతకం పొందుకొనుటకు, ఆ ఇబ్బందిలో వారున్నారు. మీకు తెలుసా, పత్రికలో మీరది చదివారనుకుంటాను. మరియు అది శ్రీ. అయ్యర్‌ యొక్క మారు కొడుకు.

346 ప్రభువు దూతయొక్క పటమును తీసినవాడు శ్రీ. అయ్యర్‌, దానిని మీరు అక్కడ చూస్తున్నారు. ఒక రోమన్ కెథొలిక్ అతని భార్య యూదురాలు. మరియు అతడు ఈ యొక్క యూదా అమ్మాయిని పెండ్లి చేసికున్నాడు. మతసంబంధమైన విషయాలు ఒకరి మధ్య ఒకరు మాట్లాడుకోరు. టెడ్‌ కిప్పర్‌ మాన్‌ వ్యాపారంలో అతనితో యుంటున్నాడు. డగ్లస్ స్టుడియో కల్గియున్నాడు.

347 మరియు అతడు అక్కడకు వచ్చినప్పటికి బాప్టిస్టు సంఘమునకు చెందిన మిస్టర్ బెస్ట్‌, డాక్టర్‌ బెస్ట్‌, సహోదరుడు బోస్‌వర్త్‌ ముక్కు క్రింద అతని పిడికిలిని పెట్టి అది కదిలించి, అన్నాడు. “నేనది చేస్తున్నట్లు నా పటము తీయ్‌” అని అన్నాడు”. “నేను ఆ ముసలివాని చర్మము వలిచి, దైవికస్వస్థత జ్ఞాపకార్ధముగా నా పటన గదిలో తగిలించబోతున్నాను.” అని అన్నాడు.

348 మరియు టెక్సాస్‌లోని హూస్టన్‌కు నేను వెళ్ళకముందు, అక్కడకు వెళ్ళమని ప్రభువైన దేవుడు నాతో చెప్పాడు. ప్రభువు నామమున నేనక్కడ యున్నాను. మరియు జరిగిన వాగ్వాదమంతా మీ అందరికి తెలుసు. పుస్తకాల్లో, తదితరమైన వాటిలో మీరు చదివారు. అది అదే, ఆ రాత్రి…దీనంగా నడచుటకు ప్రయత్నించాను.

349 “ఎందుకని,” వారన్నారు, “వారు ఒక అవివేకులగుంపు”. డాక్టర్‌. బెస్ట్‌ అన్నాడు. “వారు ఒక అవివేకులగుంపు తప్ప మరేమికాదు”. అన్నాడు. అటువంటి వారు తప్ప, దైవిక స్వస్థతను నమ్మువారు లేరు. అదియొక వెనుక బడిన వెర్రి గుంపు. దేవుడు సామాన్యతలో ఉంటాడని వారికి తెలియదు.” ఎందుకని”,” చివరకు వ్యాకరణ విద్య ఎరుగని వ్యక్తి”.

350 అతను తన నాగరికత పాండిత్య డిగ్రీలతో సహోదరుడు బోస్వర్త్ ను పడగొట్టవలెనని తలంచాడు. అయితే, వాక్యము నొద్దకు వచ్చునప్పటికి, అతనికి పదియవ వంతు కూడా యితడు సరికాదు. చూశారా! సహోదరుడు బోస్‌వర్త్ కు తెలుసు తానెక్కడ నిలబడ్డాడో. అతని యొక్క ప్రజలు చాలామంది ఆ వాదములో యుండిరి. మరియు అది అదే.

351 తరువాత మా మీద విరుచుకుపడ్డాడు. మేము అవివేక గుంపు అని చెప్తూ- “విజ్ఞానవంతులైన వారు ఎవరు చివరకు అది నమ్మరు” అని అన్నాడు.

352 సహోదరుడు బోస్‌వర్త్‌ అన్నాడు. “ఒక్కక్షణం” అతడు చెప్పాడు. “ఈ నగరంలో ఎంతమంది,” షుమారు ముప్పయ్ వేలమంది ఆ రాత్రి మా మధ్య కూర్చున్నారు. “ఇక్కడున్న ఈ పట్టణములో, ఈ పెద్ద, అందమైన బాప్టిస్టు సంఘాలకు వెళ్ళు వారు, సహోదరుడు బ్రెన్‌హాo, నగరంలో నున్నపుడు, ఎంతమంది దేవుని యొక్క శక్తి ద్వారా స్వస్థత పొందియున్నారని వైద్యుని వివరణ వలన ఋజువు చేయగలరు నిలుబడండి”. మూడు వందలమంది నిలబడ్డారు. “దాని సంగతి ఏంటి?” అది అదే. సామాన్యతలో దేవుడు మరుగుచేసికున్నాడు. తరువాత అతడన్నాడు. “సహోదరుడా…”

353 అతడన్నాడు. “దైవిక స్వస్థత చేసిన వానిని తీసుకురా; ఒకనికి మాయాజ్వాల చేయుట నన్ను చూడనిమ్ము. ఈ రోజునుండి ఒక సంవత్సరం నన్ను వారిని చూడ నిమ్ము”. మరియు టెడ్ కిప్…

354 ఎవరైతే చిత్రం తీశారో, ఆ అయ్యర్స్‌ అక్కడే యున్నాడు. అతడన్నాడు. శ్రీ. బ్రెన్‌హాం మాయాతంత్రము చేసేవాని కంటె మరొకటికాదు. ఆమె గొంతు మీద కాయకల్గిన ఒక స్త్రీని చూశాను. అది ఆలాగున్నది. అతడన్నాడు. “ఆ స్త్రీని మాయ తంత్రం చేశాడు యని తరువాత రోజు ఆమెతో నేను మాట్లాడాను. ఆమెకు గొంతు మీద కాయలేదు”. చెప్పాడు. “అతడు ఆమెను మాయా తంత్రంచేశాడు” మరియు ఓ! అతడు నన్ను హేళన చేశాడు. నేను పట్టణము విడచి పారిపోవలసియున్నదని అన్నాడు. అది చేయునది అతనే అన్నాడు. చూశారా! ఆలాటివన్ని అన్నాడు. పెద్ద అక్షరాలతో హూస్టన్ క్రానివల్ లో ముందు పేజీలో పెద్ద అక్షరాలతో అవి ప్రచురితమైనవి.

355 ఒక్క మాట నేను చెప్పలేదు. నా తండ్రి పనిని చేయుటకు, నేనక్కడ ఉన్నాను. అది అంతే, ఆ వాక్యముతో నిలబడు. ఆయన నన్ను అక్కడకు, పంపాడు. మరియు అది ఆయన పని.

356 ఆ రాత్రి, నేనక్కడకు నడిచి వెళ్ళినపుడు, నేను చెప్పాను, “నేను—నేను—నేను—నేను ఏలాటి స్వస్థపరచువాడనుకాను. నేను కాదు. ఎవరైన అది చెప్పినట్లయితే”, “వారు తప్పు” అని నేను చెప్తాను. “దైవిక స్వస్థత చేయువాడు యని పిలిపించుకొనుటకు నేను కోరుకొనను”. నేను చెప్పాను. “డాక్టర్‌ బెస్ట్‌ రక్షణను బోధిస్తే ఆలాటప్పుడు దైవిక రక్షకుడు యని పిలువబడడు”. మరియు నేను చెప్పాను. ఆలాటప్పుడు. “దైవిక స్వస్థతను నేను బోధించినపుడు, దైవిక స్వస్థత యిచ్చువానిగా పిలువబడుటకు నేను కోరను. అయితే, అతను అంటున్నాడు. అతడు దైవిక రక్షకుడు కాదని. నిజమే. అతడు కాదు. నేను కూడా దైవిక స్వస్థత యిచ్చువాడను కాదు. అయితే, ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థతకల్గియున్నది దానికి ఎత్తి చూపుచున్నాను.” చూశారా?

మరియు, కాబట్టి అతడన్నాడు. “బుద్ధిహీనత” మీకు తెలుసా, తిరిగి వెళ్ళాడు.

357 మరియు నేను అన్నాను. “అయితే, ఈ ప్రసన్నత, దేవుని యొక్క ఈ వరము, ప్రభువు యొక్క ఈ దూత, అది ప్రశ్నార్థకమైనట్లయితే అది నిరూపించబడును”. షుమారు ఆ సమయానికి యిక్కడ అమె సుడిగాలిలో దిగివచ్చినది. అన్నాను, “యిపుడు మాట్లాడ నవసరంలేదు. ఆయన ఇదివరకే నాతో మాట్లాడాడు”. నేను బయటకు వెళ్ళిపోయాను.

358 మరియు నేను హూస్టన్‌ లోకి వెళ్ళాను. అది పెద్దనగరం. దేశములోనే అందమైన ఒక పట్టణము, అంతటితో, నిన్నటి దినం నేనక్కడకు వెళ్ళినపుడు, ఆ పట్టణాన్ని చూచుటకు విచారకరమైనది. ఆ వీధులు మురికిగా ఉండెను. టెక్సాస్‌ మూల వరకు బజారులన్ని అట్లెయుండెను. ఎక్కడైతే చలన చిత్రతారలు నివాసముంటారో రైస్‌ హోటల్‌కు కు వెళ్ళాను. మరియు క్రింది అంతస్తు యొద్దకు వెళ్ళాను. ఆ ఫలహార శాల యొద్దకు వెళ్ళాను. సీలింగ్‌ పడిపోతుంది. గచ్చు, నేలపైయుండి. మురికి, ధూళితో ఉంది. నా జీవితంలో ఎన్నడు కనివిని ఎరుగనంతగా బోధకుల మధ్య కలవరమున్నది.

359 ఎందుకని? వెలుగును తృణీకరించుట చీకటిలో నడుచుట యౌతుంది. అక్కడే వారి పిల్లలు మరణ వరుసలో ఉన్నారు. ఔను. దేవుడు దిగివచ్చాడు. సామాన్యత చూపబడి మరి నిరాకరించబడినపుడు, అప్పుడు దేవుడు తనకుతాను సామాన్యతలో చూపబడెను.

360 ప్రపంచాన్నే వ్యాప్తి జేసిన ఆ పటమును వారు అక్కడ తీశారు. చివరకు శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచ చరిత్రలో మరెన్నడు ఫోటో తీయని అతీతమైన ఉనికి మాత్రమే యిది, అని అన్నారు. మత సంబంధమైన కళలతో నున్న హాలులో వాషింగ్‌టన్ డి. సి లో వ్రేలాడుచున్నది. అది అదే. సామాన్యత ప్రత్యక్షమాయెను. తరువాత? చూశారా? చూశారా? సామాన్యతలో దేవుడు మరుగుచేసికొనును తరువాత తనకుతాను ప్రత్యక్షపరచు కొనును. ఔనా?

361 ఇపుడు ఆయన తనకు తాను క్రీస్తు యొక్క మరణములో మరుగుచేసికొనెను. అయితే, పునరుత్థానములో ప్రత్యక్షపరచుకొనెను. ఓహో! యింకా మొదలగు వాటిలో మనం చెప్పగలం. దానికి అంశము లేదు. చెప్తూ వెళ్ళవచ్చు. అయితే, అక్కడే నీవున్నావ్‌, చూశారా.

362 క్రింది అంతస్తుకు వెళ్ళి, వెలుగు చూడకుండ నీ కళ్ళు మూసుకొని, ఒక సూర్యరశ్మి యున్నదని నిరాకరించి చెప్పుట కు జ్ఞాపకముంచు కొండి, నీది తప్పు యనుటకు గల ఒకే ఒక కారణం; మొదటిగా నిజాన్ని నిరాకరించుటే. చూశారా? నీ కళ్ళను తెరుచుటకు నిరాకరించుట, నీవు చీకటిలో జీవిస్తావ్‌. గ్రహించావా? నీవు చూచుటకే నిరాకరిస్తే నీవు ఏలాగు చూస్తావ్‌? చూశారా? మరియు సామాన్యమైన వాటిని గమనించు. స్వల్పమైన వాటిని చేయుటకు మరచి, పెద్దకార్యములు చేయుటకు ప్రయత్నములు—చేయుట. ఓహో!

363 తరువాత, ఇటు చూడుడి, ఇది నీకు నన్ను చెప్పనీయ్. మత్తయి 11:10, ఆయన యిలాగు చెప్పాడు. “మీరది అంగీకరించగల్గితే, ఇది అతడే” చూశారా? “నాకు ముందుగా పంపబడినవాడు ఇతడే” అది సామాన్యత.

364 ఆయనను ఒకదినాన అడిగారు “శాస్త్రులెందుకు చెప్పుచున్నారు అది అలాగైతే…”

365 ఆయన చెప్పాడు. “మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు. నేను పాపులచేతుల్లో పెట్టబోతున్నాను. మనుష్య కుమారుని వారు చంపబోతున్నారు. మరియు ఆయన చనిపోబడబోతున్నాడు. మరియు మూడవ దినమున ఆయన మరలా లేవబోతున్నాడు”. అన్నాడు, “అక్కడ ఆ దర్శనం ఎవరితోను చెప్పవద్దు.”

366 మరియు ఇపుడది ఆలోచన చేయ్‌. ఎవరైతే యోహానుతో అరణ్యములో, నడిచారో, అతనితో మాట్లాడారో, అతనితో భుజించారో, వారు నది ఒడ్డున కూర్చొని అడిగారు, “ఏలియా మొదట రావలెనని ఉపదేశకులు యిది ఎందుకు చెప్పుచున్నారు? యని. నీవు చెప్తున్నావు. నీవు సిలువ వేయబడుటకు వెళ్ళుచూన్నానని, మరియు తిరిగి లేచెదనని. నీవు మెస్సీయావు. సమస్త లేఖనాలన్ని యిక్కడ చెప్పుచున్నవి. లేఖనములు విశదముగా చెప్పుచున్నవి. క్రీస్తు రాక ముందు ఏలీయా మొదట వచ్చును.” ఆఁ అవునండి?

367 ఆయన చెప్పాడు. “ఆయన ఎపుడో వచ్చెను. అది మీరు ఎరుగలేదు.” ఎవరది? శిష్యులు.

368 నేకిక్కడ మిమ్మును కొద్దిగా గాయపరచగోరుచున్నాను. అది చూస్తారని భావంకాదు. తరువాత కొద్దిక్షణాలు, చూశారా, ఒకటి, రెండు క్షణాలు అయితే, తద్వారా మీరు తప్పక అర్ధం చేసికుంటారు. నా స్వరం వింటున్నారు? [సభ “ఆమేన్‌”—అని చెప్పుచున్నది. సంపా.]

369 చూడండి, “ఎందుకని?” క్రీస్తుతో నడచిన ఆ మనుష్యుడు మొదట “ఏలీయా తప్పక రావలసియున్నదని లేఖనము ఎందుకు చెప్పుచున్నది?”. యోహాను వలన స్వంతగా మార్పు చెందినవారు, వారు, అతడెవరో చివరకు తెలియదు. నా భావమేదో మీకు అర్ధమైందా? చూశారా? “ఏలీయా మొదట రావలసి యున్నదని లేఖనములు ఎందుకు చెప్పుచున్నవి?” ఆయనతో నడచిన శిష్యులు. “ఈ సంగతులకు ముందు, అతడు మొదట వచ్చి సమస్తమును చక్కబెట్టునని ఎందుకు లేఖనములు చెప్పుచున్నవి?” షుమారు అర డజను మంది ముందు అతడు చేశాడు. అదంతే. చూశారా? దానిని స్వీకరించ తగినవారు వారు మాత్రమే. అది చూచుటకు నిర్ణయించబడిన వారు వారే.

370 యేసు చెప్పాడు.“అతడెవుడో వచ్చాడు. మీరు అది ఎరగలేదు. అయితే అతడు ఏమిచేయునని లేఖనము చెప్పినదో అదే చేశాడు. అతడు వారిని పునరుద్ధరణ చేశాడు. మీరందరు నన్ను స్వీకరించి, నా యందు విశ్వాసముంచితిరి. వారేమి చేయుదురని లేఖనము చెప్పినదో అతని యెడల అదే వారు చేశారు. అతడెపుడో వచ్చాడు. మీరది ఎరుగలేదు.”

371 మీరు సంసిధంగా ఉన్నారా? నేను కొద్దిగా మిమ్ములను దిగ్భ్రాంతి గలుగజేయగోరుతాను. ఎత్తబడుట ఆ విధముగనేయుంటుంది. అదెంతో సాదారణంగా యుండును. ఆలాగు యుండునని అనుటకు ఏలాటి సందేహంలేదు. ఈ ఒకానొక దినాలలో ఎత్తబడుట వచ్చును. దానిని గూర్చి ఎవ్వరు ఏది ఎరుగరు. ఇపుడు ఎవ్వరు వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దు, అయితే, ఒక నిమిషం పఠనం చేయండి. నేను ఖచ్చితంగా ముగిస్తున్నాను. అంతటి సాధారణమైన విధముగా ఆ ఎత్తబడుట వచ్చును. తీర్పు వచ్చు వరకు, మరియు మనుష్య కుమారుని వారు చూతురు. వారు చెప్తారు. “మనం ఫలానా-ఫలానా కల్గియుండవలసినది కదా? అని. ఏలియా మనకై పంపబడవలసినది కదా? ఒక ఎత్తబడుట యుండవలయును గదా”.

372 యేసు చెప్తాడు “అదెప్పుడో జరిగినది, మీరది తెలుసుకోలేదు.” దేవుడు సామాన్యతలో, చూశారా?

373 ఇపుడు ఈ వారం మనం భక్తిపూర్వకమైన నిగూఢమైన ఉపదేశం పొందుకోబోతున్నాము…?…ఇపుడు గమనించుడి. ఎత్తబడుట, ఆ పెండ్లికుమార్తెలో ఎంతో కొద్దిమంది మాత్రమే వెళ్తారు…

374 ఇపుడు చూడండి. ఏవిధంగా ఉపదేశకులు అది పొందుకున్నారో? వారికి పటములున్నవి. ఇక్కడకు పది మిలియన్ల మంది వచ్చారని వారు వచ్చి చూపుతారు. అది మెతడిస్టు బోధకుడైతే అందరు మెతడిస్టు అంటాడు. పెంతెకోస్తు బోధకుడైతే పెంతెకోస్తులందరు అని అంటాడు. అదెన్నడను దాన్ని ముట్టడు.

375 అది యీలాగుండును. బహుశా ఒకరు విడుస్తారు, జఫర్‌సన్‌విల్‌ను కేవలం ఒకరు తప్పిపోవుదురు. మిగతావారికి తెలియదు. ఒకరు విడిచిపెడతారు. జార్జియాను చూశారా, ఒకరు ఆఫ్రికాను విడుస్తారు. మరియు జీవిస్తున్న వారిలో, ఐదువందల మంది కొనిపోబడుటలో ఉంటారని చెప్పగలం. అది సంఘ సభ్యులు కాదు. ఇది పెండ్లి కుమార్తె. అది సంఘము—శరీరము కాదు. ఇది పెండ్లి కుమార్తె. చూశారా!

376 ఆ—ఆ సంఘము వేలాదిమందిగా లేపబడతారు. అయితే, అది తరువాత పునరుత్ధానము. “వెయ్యి సంవత్సరముల వరకు వారు బ్రతుకరు”. ఔనా?

377 అయితే పెండ్లి కుమార్తెలో, ఈ నిముషంలో, ఐదువందల మంది విడువబడితే, అందును గూర్చి ప్రపంచానికి ఏమి తెలియదు. యేసు చెప్పాడు. “ఒకరు పడకలో ఉంటారు; నేను యొకరిని తీసికుంటాను, ఒకరిని విడిచిపెడతాను.” అది రాత్రి పూట, “పొలములో యిద్దరు ఉంటారు,” భూమియొక్క ఆవల భాగమున “ఒకరిని తీసుకుంటాను. ఒకరిని విడిచిపెడతాను. నోవహు దినములలో నున్నరీతిగా మనుష్య కుమారుని దినమున ఉండును.”

378 ఆలోచించు! ప్రతిదీ సాధారణంగానే కొనసాగుచుండును. ఒక మూఢభక్తి వర్తమానము కొనసాగుచుండును. మొదటి విషయమేదో తెలుసా! “ఈ సేవకుడు ఎక్కడకు పోవుచున్నాడు. అతడు తిరిగిరాడు. బహుశా, అడవులలోకి వేటకు వెళ్ళియుండును. అతడు తిరిగిరాడు. మరియు ఇతడు ఎక్కడకో వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? నేను అనుకుంటున్నాను ఆ యౌవన బాలిక ఆమె—ఆమె ఎక్కడో ఒక చోట చిక్కుకొనియుండును. తెలుసా? ఒకరు ఆ బాలికను తీసికొని, చెరచి, బహుశా నదిలో పడవేసియుందురు. ఆమె ఎవరితోను లేదు.” అందులో సగం…ప్రతి దానిలో తొంబది తొమ్మిది…నేను చెప్తాను. ప్రతి వంద మిలియన్లలో అందును గూర్చి ఎరుగరు. చూశారా! ఆమెకు పరిచయస్తులలో ఒకరు తప్ప. అని చెప్తారు. “అమ్మాయి తప్పిపోయినది. ఎందుకని నాకు అర్ధం గాలేదు. ఆ విధముగా ఆమె ఏనాడు విడువదు.” లేదు.

379 మరియు “సమాధులు తెరవబడును” అని వారు చెప్పినపుడు, సమాధులు ఎట్లు తెరవబడును? నేననుకున్నట్లుగా యిందులోకి వెళ్ళుటకు నాకు—నాకు సమయం లేదు. దేవునియొక్క సౌమాన్యతను చూపించుటకై, నేనది తీసికోబోతున్నాను. మరియు ఆ యొక్క కాల్షియం, పొటాష్‌ తదితరమైనవి…నీలోనున్న ప్రతియొక్క పదార్ధములు, కేవలం గంటె మాత్రం యౌతుంది. ఔను అది నిజం అదేం చేస్తుందనగా. అది ఆత్మను, జీవమును వెనుకకు తీస్తుంది. దేవుడు అలా మాట్లాడగా, ఎత్తబడుట వస్తుంది. అది, అక్కడ యిలాగుండబోదు. దేవదూతలు దిగివచ్చి, సమాధులను త్రవ్వి, చచ్చిన పీనుగులను బయటకు తీయుటకాదు. అది ఏంటి? ప్రారంభంలో అది పాపములో పుట్టినది. అయితే మీకు తెలుసా? దానిని పోలియున్న నూతనమైనది యొకటి. మనం దీనిని కలిగియుంటె, మనము తిరిగి చనిపోతాము. చూశారా? ఎవరుకూడా…నీవు చెప్తావు. “సమాధులు తెరవబడును. చనిపోయినవారు బయటకు వచ్చెదరు.” అది నిజం కావచ్చు. అయితే, తెరువబడును అని నీవు చెప్పినట్లుగా కాదు. గమనిస్తున్నారా? ఔనది నిజం. గమనిస్తున్నారా? అది ఆలాగు కాదు.

380 అది రహస్యమై యుంటుంది. ఎందుకనగా “మధ్య రాత్రివేళ దొంగవలె అని” ఆయన చెప్పాడు. ఈ ఎత్తబడుటను గూర్చి ఆయన ముందుగనే మనకు చెప్పాడు.

381 తరువాత, తీర్పులు వచ్చును. పాపము, తెగుళ్ళు, వ్యాధులు, ప్రతీది వచ్చును. తీర్పులు వచ్చునపుడు, ప్రజలు వారిని తీసికొమని మరణము కొరకు మొర్రపెట్టుదురు. “ప్రభువా! మాపైన ఎందుకు ఈ తీర్పు, ఎత్తబడుట మొదట జరుగును? అని నీవు చెప్పినపుడు. యివి ఎందుకు” అందురు.

382 ఆయన చెప్తాడు. “అదెప్పుడో వేసినది, మీరు దానిని ఎరగలేదు.” చూశారా? సామాన్యతలో ఆయనకు ఆయన మరుగుపరచుకొనును. ఓహో! సరే. “అదెప్పుడో జరిగినది, మీరది తెలుసుకొనలేదు.”

383 ఆయన రాకడను గూర్చిన చిన్న సూచనలు విశ్వాసులు ఎందుకు నమ్మరు?

384 లేఖనముల ద్వారా పలుకబడిన వీటిన్నిటకోసం వారు ఎదురుచూస్తారు, మరియు—మరియు మధ్యలో చంద్రుడు దిగిపోవును…లేక సూర్యుడు మధ్యాహ్నమందు. అన్ని విధాలైనవి యుండబోతున్నవి. ఓ నేనిక్కడ వివరణ పట్టి వ్రాసుకున్నాను. చూశారా! అవేంటో చూపించుటకు. ఈ వారంలో ముద్రలు తెరవబడుటలో మనమది పొందుకుందాము. ఏలాగైనా, సరేనా? అది అదే. అవి ముందుగానే జరిగిపోయినవి. నీవు అది ఎరుగలేదు. చూశారా! అది ముందుగానే జరిగిపోయినవి. నీవు అది ఎరుగలేదు. చూశారా! అది ఆలాగైనట్లయితే, ప్రభువు యొక్క దూత ఆ ముద్రలు విప్పనట్లయితే చూడుడి. జ్ఞప్తించుకోండి. ఆ మర్మమైన ఏడు ఉరుములతో అది ముద్రించబడినది. చూశారా!

385 ఇపుడు ఏంటి? దీనులైన ప్రజల చిన్న సామాన్యతను ప్రజలెందుకు నమ్మరు? గమనిస్తున్నారా! దేవుని సూచనలయొక్క స్వరము? అదెందుకు నమ్మరు? ఎల్లపుడు ఉన్నట్లుగానే, దేవుని యొక్క సత్యవాక్యము ప్రత్యక్షపరచబడుట అది అంతే. అది వ్రాయబడిన వాక్యముయొక్క సాదారణ పద్ధతిని నమ్ముటకు వారియొక్క, అధిక విద్య, అతి తెలివి నమ్మకుండ చేసినవి. దానికి వారియొక్క స్వంత, అనువాదమును పెట్ట గోరువారు. “ఇది దీని యొక్క అర్దంకాదు, అది దీని యొక్క అర్ధంకాదు.” చూశారా? అది ఆ ఆర్ధం కాదు.

386 వినండి, నేనిది త్వరగా చెప్పనా. ఇక్కడ, ఈ స్థలములో దేవుడిచ్చిన దర్శనాలు కూడా, అవెంతగానో అపార్ధం చేయబడెను. ఆ కారణం చేతనే, టేపులో మీరు నావి వింటున్నారు. ఈ విధముగా చెప్పబడుతుంది. “టేపు ఏమి చెప్పినది చెప్పండి. దర్శనం ఏమి చెప్పింది చెప్పండి.” ఇప్పుడు మీరు బాగా మేల్కొనియుంటె, మీ రొకటి చూస్తారు. ఔనా? నేను నా చేతిలో పెట్టుకొని మీకు చూపించనవసరంలేదు. ఔనా? ఔనా? ఔనా? మీరు…అది—అది యిక్కడే అది యున్నది. మనము అంతములో ఉన్నాము. ఔనా? ఔనండి. తెలివితేటలుగల విద్యావంతులు దానిని పోగొట్టుకుంటారు. సాదారణమైన దర్శనాలు, అంతటి సాధారణమైన విధముగా అవి బయలుపరచబడినపుడు ప్రజల తలలపైన ముసుగువై నట్లుండును. చూశారా?

387 ఎందుకనగా, నేను దర్శనాన్ని చూశాను. అక్కడ, వేటకు వెళ్ళినదంతా మీతో చెప్పాను. ఔనా! అది ప్రజలను తొట్రిల్లజేసింది. ఒక ఉద్ధేశ్యం కొరకే దేవుడు పంపాడు. తిరిగివచ్చి, దానిని అనువదించి, నా తల్లి వెళ్ళిపోవుట, మొదలైనవి చూపించుట. మరియు తరువాత తిరిగివచ్చి, ముందుగానే దానిని చెప్పితిని. అది జరుగునని ఆయన ఏవిధముగా చెప్పెనో ఖచ్చితంగా ఆ విధముగానే జరిగినది. చూశారా!

388 మరియు అయినను అక్కడకు వచ్చి ఒప్పుకున్నాడు. అతడుచెప్పాడు. “నేను మెస్సీయాను కాదు. గాని, నేను అరణ్యములో కేకవేయు ఒక శబ్ధమును” అని.

389 మరియు సాక్షాత్తు, శిష్యులు అన్నారు. శాస్త్రులు…ఏలీయా మొదట రావలసి యున్నదని లేఖనము ఎందుకు చెప్పుచున్నది? చూశారా? దేవుని యొక్క సామాన్యత, ప్రజల తలలుపైగా వెళ్ళుచున్నది.

390 ఇది తీసికొని, తరువాత ముగిస్తాను. దేవుని సహాయముచేత, నేను చేస్తాను. చూడండి. చూడూ! దీనిని వివరిద్దాం. ఇదంతా చెప్తున్నందుకు మన్నించండి. చూడండి. మిమ్ములను యుంచినందుకు నన్ను—నన్ను క్షమించుడి. అయితే, కొద్ది గంటలు మాత్రమే, తిరిగి మనం వస్తాం.

చూడండి! ఒక సాధారణ సిరా చుక్కను తీసుకుందాం.

391 ప్రతీదీ ఒక ఉద్ధేశ్యం కొరకు, ఈ ఉదయవేళ మీరిక్కడ కూడుకున్నది ఒక ఉద్ధేశ్యం కొరకు. చార్లీ నేను మీ యింట్లో భోజనం చేశాను. నెల్లీ నీవు నా కొరకు వంట చేశావు. ఒక ఉద్ధేశ్యం కొరకు. నేను…ప్రతీదీ ఒక ఉద్ధేశ్యం కొరకు. ఈ ఆలయం ఒక ఉద్ధేశ్యం కొరకు నిర్మితమైనది. ఒక ఉద్ధేశ్యం లేకుండ ఒక కారణం లేకుండ ఏది ఉండదు.

392 ఇపుడు, మనము చిన్న సిరా చుక్కను తీసుకుందాం. మీరు వినగల్గుచున్నారా? [సభ “అమేన్” అని చెప్పినది.—సంపా.] చిన్న సిరా చుక్కను తీసికొని దానిని చూద్దాం. అదేంటి? సిరా చుక్క అదెక్కడనుండి వచ్చినది? సరే. యిపుడు, యీ సిరా చుక్కను తీసుకుందాము. ఇది నల్ల సిరా అందాం. ఆ సిరా ఒక ఉద్ధేశ్యం కొరకు…చెఱసాలలో నుండి బయటకు వచ్చు నా క్షమాపణను యిది వ్రాయగలదు. మరణ గదిలోనుండి క్షమాపణను అది వ్రాయగలదు. ఔను?. యోహాను 3:16ను అది వ్రాయగలదు. అది నమ్ముట ద్వారా నా ఆత్మను అది రక్షించగలదు. ఔనది నిజమేనా [“ఆమేన్‌”] లేక. అది నా మరణ శాసనమును సంతకం చేయగలదు. చూశారా! అది నన్ను న్యాయతీర్పునొద్ద ఖండించగలదు. అది యొక్క ఉద్ధేశ్యము కొరకే. ఔనది నిజమేనా? [“ఆమేన్‌”]

393 సరే, అదెక్కడనుండి వచ్చినదో ఆ కొద్ది సిరాను చూద్దాం. అది సిరా. అది సిరాగా అగువరకు, రసాయనాలు మొదలైనవి కలుపుట ద్వారా అది వచ్చినది. అది నలుపు. మీ బట్టలు మీద అది వేస్తే అది మరకలు ఏర్పడును.

394 అయితే, మనము చలువపిండి (బ్లీచ్‌) అను దానిని మనం తయారు చేసియున్నాము. స్త్రీలైన మీరు క్లోరాక్స్ బ్లీచ్ వినియోగిస్తారు. సరే. నేను ఒక సిరా చుక్కను తీసికొని, బ్లీచ్‌ తొట్టిలో వేస్తాను. సిరాకు ఏం జరుగుతుంది? చూడండి. ఎందుకు? బ్లీచ్‌ తయారుచేయబడి, పరిశోధించబడిన రసాయినముల కలయిక. మీరది చూడలేనంతగా విడగొట్టును. ఇప్పుడు బ్లీచ్‌లోని కొంతభాగము నీళ్ళు.

395 నీరు H20 అనగా హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, హైడోజన్‌, ఆక్సిజన్‌, రెండును హానికరమైన ప్రేలుడు పదార్ధములే ఆ తరువాత హైడ్రోజన్‌, ఆక్సిజను వాస్తవంగా బూడిదయే. అది అదే, అది నిజం. రసాయిన బూడిదలు ఇప్పుడు ఇప్పుడు కేవలం రసాయిన బూడిదలు వాటిని కలుపు. నీరు నీకు వస్తుంది. అయితే అది, విడదీయ్‌. నీవు హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ పొందుకుంటావు. అది ఆవిధంగా వెనుకకు వెళ్తుంది.

396 ఇపుడు, యిక్కడ రసాయనిక శాస్త్రవేత్తలు కూర్చొని యుండవచ్చును. ఇపుడది…చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనగా, అది—అది రసాయిన వేత్తలు వింటారు. ఫార్ములా (సూత్రం) తెలియదు నాకు. అయితే దేవుడు, అందులో ఆయనను బయలుపరచుకొనునని నమ్మి, నా స్వంతదైన మార్గములో, అది వివరించగోరుతాను.

397 చూడండి. ఒక—ఒక—ఒక సిరా చుక్కను బ్లీచ్‌లో నేను వేస్తున్నాను. ఏమి జరిగినది? వెంటనే నల్ల మరక వెడలిపోతుంది. నీవు కావాలనుకుంటె, మరలా నీవది కనుగొనలేవు. అది వెడలిపోయింది. నీవెన్నడు అది చూడలేవు. ఏం జరిగినది? దానినుండి ఏది వచ్చుట నీవు చూడలేవు. నీవు కనుగొనలేవు. అది వెడలిపోయింది. నీవెన్నడు అది చూడలేవు. ఏం జరిగినది?. ఇప్పుడు దానినుండి ఏది వచ్చుట నీవు చూడలేవు. నీవు కనుగొనలేవు. నీవు ఎందుకని చూడలేవు. ఎందుకనగా అది విడిపోయినది.

398 “దానియొక్క అసలైన ఆమ్లములోకి అది తిరిగిపోయినదని” విజ్ఞాన శాస్త్రము చెప్పుచున్నది.

399 ఏంటి ఆమ్లములు దేని నుండి వచ్చినవి? గమనిస్తున్నారా?” ఫలానా వాటిద్వారా అవి వచ్చినవి” అవి మీరు చెప్పవచ్చు. సరే, ఉదహరణగా “ఆవిర్ల వలన ఆమ్లములు తయారగును” ఆవిర్లు ఎక్కడనుండి వచ్చినవి? సరే అది. “మనం చెప్పవచ్చు, పరమాణువులద్వారా ఆవిర్లు తయారౌతవి”. “పరమాణువులు. ఎక్కడనుండి వచ్చినవి? “అణువుల నుండి”. అణువులు ఎక్కడనుండి వచ్చినవి? “ఎలక్ట్రానిక్స్‌ ద్వారా (బుణ విద్యుత్‌ కణము) ద్వారా.” అవి ఎక్కడనుండి వచ్చినవి? “సూర్యరశ్మి ద్వారా.” చూశారా, రసాయన వేత్తలు కనుగొన్న వాటియొద్దకు వెళ్ళుచున్నాము. మరియు అది యొక పదార్థమై మరియు ఒక సృష్టియైతే అది సృష్టికర్తయొద్దనుండి రావలసియున్నది.

400 కనుక మీరిక్కడ తలవని తలంపుగా కూర్చొని యుండలేదు. అనుకొనని రీతిగా పండ్రెండు ముప్పయ్‌ లేక ఒంటిగంట వరకు మిమ్ములను ఉంచలేదు. “నీతిమంతుని అడుగు జాడలు ప్రభువు చేత నిర్ణయించబడినవి.” ఔనా. అందుకొరకు కారణం యొకటి యుంటుంది. నమ్ముటకు నీకొరకు యొక కారణముంటున్నాది. నీవు నమ్మకుండ యుండుటకు కారణం యొకటియుంటుంది. ఆ సిరావలె అది యుంటుంది.

401 ఇపుడు దానిని విడదీద్దాము. మొదటి విషయం పరమాణువుల వరకు మనమది తీసికొని వద్దాం. ఇపుడు మనం పరమాణువు తీసుకుందాం. నే చెప్తాను…సంఖ్య ఒక్కసారి పరమాణువులు 9, 9 CH సార్లు పరమాణువులు 12, అది 11 అయితే, దానినుండి ఎరుపు వచ్చును. అయితే, నలుపు అగుటకొరకు అది—అది 12 కావలసియున్నది. పరమాణువుల సంఖ్యనుబట్టి రంగు ఏర్పడును.

402 అటు తరువాత అణువు యొద్దకు అది తీసికెళ్దాము. అది అణువు మరియు 96 సమానవులకు +43 సమానువులు కలిపినయెడల, అది 1611 సమాననువులగును. అది 1612 అయితే అది ఊదారంగు కావచ్చును. చూశారా? తరువాత, ఆ విధంగానే విచ్ఛిన్నం చేయ్‌.

403 ప్రారంభంలో అక్కడ ఏదో యొకటియున్నదని అది తెలుపు తున్నది. అది కేవలము (యింగిత జ్ఞానము) సాదారణ జ్ఞానము. అది సృష్టి. దానికి ఒక సృష్టికర్త ఉండవలసి ఉంది. అది యొక సృష్టికర్త యొద్దనుండి బయలుదేరి అది నిర్ణయించబడి, వివిధమైన వాటిలో పెట్టబడినది. ఇపుడు విజ్ఞానశాస్త్రము అణువు B16 ను 12 గుణించినను, 14తో గుణించినను, ఎన్నిసార్లు చేసినను. దానిని చేయలేరు. దేవుడే దానిని చేయవలెను.

404 మరియు అటు తరువాత, ఎక్కడైతే అణువులలోకి చేరుకున్నదో, ఆ స్థలానికి తీసుకురాబడుతుంది. తరువాత విజ్ఞానశాస్త్రము అది తాకుతుంది. తరువాత అది పరమాణువులలోకి వస్తుంది, తరువాత కొంచెం బాగుగా అది చూడగల్గుతారు. అటుతరువాత, దానినుండి ఒక దానిలోకి వచ్చును. అటుతరువాత, మొదటిగా రసాయినములోకి వచ్చి, వీటిని ఒకటిగా కలిపెదరు.

405 ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఇది పోగోట్టుకోవద్దు. మానవుడు పాపము చేసినపుడు అతడు దేవునికి తనకుతానే వేరైపోయాడు. మహా అగాధమును దాటాడు. యీవైపున మరణములోకి వెళ్ళాడు. అతడు వదలిపెట్టాడు. ఇక వెనుకకు మార్గములేదు. ఖచ్ఛితం. తిరిగి వెనుకకు వచ్చుటకు మార్గము లేదు. అయితే అటుతరువాత, అతడది చేసినపుడు రక్తం కొరకు, గొర్రెపిల్లనేగాని లేక మేకనుగాని లేక గొర్రెనుగాని లేక ఒక దానిని ప్రత్యామ్నాయముగా దేవుడు అంగీకరించెను. అది, మహ ఆగాధము అవతల వైపున ఆదాము లేక—లేక హేబేలు పలికెను.

406 ఆవైపున, అతడు దేవుని కుమారుడు, అతడు దేవుని సంతానమై యున్నాడు. అతడు భూమిని స్వతంత్రించుకొనువాడైయుండెను. అతడు ప్రకృతిని స్వాధీనము చేసికోగలడు. అతడు శూన్యతతో మాట్లాడగలడు. అతడు తానకుతాను సృష్టికర్త. అతడు దేవునియొక్క సంతానము.

407 అయితే అతడు దాటినపుడు, అతని కుమారత్వమునకు అతడు వేరైపోయాడు. అతడు ఒక పాపి, స్వాభావికము, అతడు సాతాను యొక్క హస్తాల్లో, సాతాను పరిపాలనలో ఉన్నాడు.

408 ఒక రసాయనమగు, రక్తమును అర్పణముగా దేవుడు తీసికున్నాడు. అయితే, కోడెల యొక్క మేకల యొక్క రక్తము పాపమునుండి వేరుపరచలేకపోయెను. అది పాపమును కప్పివేసెను. నా చేతిమీద ఎర్రటి మరక నాకున్నట్లయితే, తెల్ల దానితో కప్పినట్లయితే ఎర్రటి మరక యింకా అక్కడయున్నది. చూశారా యింకా, అది ఉన్నది.

409 అయితే పాపము నిమిత్తమై యొక (విరంజన చూర్ణమును) బ్లీచ్‌ను, దేవుడు పరలోకమునుండి పంపాడు. అది ఆయన యొక్క స్వంత కుమారుని రక్తము, మనము ఒప్పుకొనిన పావము, దేవుని బ్లీచ్‌లో పడగనే, తిరిగి దానిని కనుగొన ప్రయత్నిస్తే. కాల కాలాలుగా మధ్యవర్తుల ద్వారా ఉన్న ఆ పాపపు రంగు వెనుకకు పోయి, మన మీద నేరారోపణచేయు సాతానును కొట్టి, న్యాయతీర్పు దినము వరకు అది అతనిపైననే యుండును.

410 కుమారునికి ఏమి జరుగును? తిరిగి అతనికి తండ్రితో సంపూర్ణ సహవాసములో యుండును. అగాధము మరో వైపున నిలబడి, అతనికి వ్యతిరేకమైన ఎలాటి పాపపు జ్ఞప్తిలేకుండ యుండును. ఎక్కడకూడా ఎటువంటి బ్లీచ్‌ మరక యిక కనబడదు. అతడు స్వతంత్రుడు. హల్లెలూయ! అ యొక్క క్లొరేక్స్‌ వలె. లేక ఆయొక్క సిరాయిక సిరావలె యుండదు. ఎందుకనగా ఆది పగలగొట్టబడి వెనుకకు పంపబడినది. యేసుక్రీస్తు రక్తములోకి ముంచబడిన…ఒక పురుషుడు, లేక ఒక స్త్రీ, అది అన్ని సూచిక లక్షణాలను చంపివేస్తుంది. మరియు ప్రతి పాపము యొక్క పరమాణువు తిరిగి దయ్యం మీదికి వెళ్ళిపోతుంది. మరియు న్యాయతీర్పు దినమువరకు అతనిపైయుంటుంది, అక్కడే, అతని నిత్యస్థానమైన అగ్నిగుండములో పడద్రోయబడుతుంది. మరియు అగాధము కట్టబడి యిక ఎన్నడు జ్ఞప్తిలోకి రాదు. నీతిమంతుడుగా తీర్చబడి మానవుడు ఒక దేవుని కుమారునిగా నిలబడతాడు. సామాన్యత!

411 మోషే, కోడెలయొక్క మేకలయొక్క రక్తము క్రిందయుండి, దేవుని వాక్యములో నున్న అతని ఒప్పుకోలుతో, దేవుడు, ఆ సాధారణ మనిషిని తీసికొని ఆయన మాటలు అతని నోటిలో ఉంచాడు. మరియు అతడు యెహోవా సేవకుడని అతడు ఋజువు చేశాడు. ఎందుకనగా యెహోవా అతనితో దర్శనముల ద్వారా మాట్లాడుచుండగా అతడు నడచుచుండెను. అతడు, తన చేతులను, తూర్పువైపునకు చూపి అతడు బయలు వెళ్ళాడు.

412 మరియు జ్ఞాపకముంచుకొండి. దేవుడు, అతనితో మాట్లాడాడు. అది దేవునియొక్క ఆలోచన. దేవుడు మానవుని వినియోగించుకొంటాడు. దేవుడు అతనితో మాట్లాడుతాడు. ఔనది నిజం. ఆయన చెప్పాడు. “వెళ్ళి, నీ చేతిలో ఆ కర్ర తూర్పుతట్టున చాచి, ‘ఈగలు అని చెప్పు’”.

413 మోషే, ఆ మేక, గొర్రెల యొక్క రక్తము క్రింద ఉన్నవాడై, అక్కడకు వెళ్ళి కర్ర తీసికొని, తూర్పు దిశకు చేరుకున్నాడు. “యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడు. ఈగలు కలుగునుగాక” ఎన్నడు ఈగలు వినలేదు వెనుకకు తిరిగాడు. అదెప్పుడో పలుకబడినది. అది ఒక తలంపు. ఇపుడు అది పలుకబడింది, అది తెలియపరచబడినది. అపుడది దేవునియొక్క వాక్యము. కోడెల యొక్క లేక మేకల యొక్క రక్తము క్రిందనున్న సాదారణ మానవుని ఒక నరుని పెదవులనుండి అది వచ్చినది.

414 మొదటి విషయమేంటో తెలుసా? ఒక ఆకుపచ్చ ఈగ చుట్టూ తిరుగుటకు ఆరంభించినది తరువాత విషయమేంటో తెలుసా? ఒక గజానికి ఐదు పౌన్లు ఉండిపోయినవి. ఏంటది? సృష్టికర్తయైన మోషే ద్వారా పలుకబడిన దేవుని యొక్క వాక్యం. కారణమేదనగా, రక్తము క్రింద, దేవునియొక్క సన్నిదానంలో అతడు నిలబడియున్నాడు. అతనియొక్క స్వంతమాటలు, అతని స్వంతమాటలు కాదు.

415 “మీరు నాయందు నిలచినట్లయితే, నా మాటలు మీయందు నిలచినట్లయితే, మీకేది అవసరమో అడుగుడి. అది మీకను గ్రహించబడును”. సంఘము ఎక్కడ నిలబడియుంది?

416 “కప్పలు కలుగునుగాక!” దేశములో ఒక్క కప్ప కూడా లేదు. ఒక గంట సమయానికి, ప్రతిచోట, పది అడుగుల అవి ఉన్నవి. అదేంటి? అది దేవుడు, సృష్టికర్త, సామాన్య మానవునిలో ఆయనకు ఆయన మరుగుచేసికొనుట.

417 ఇపుడు, మిమ్ము యొకటి అడుగగోరుతాను. కోడెలయొక్క రక్తము, మేకల యొక్క రక్తము బ్లీచ్‌గా వినియోగించగల్గినట్లయితే (అది కేవలం కప్పగలదు మాత్రమే) సృజించగల్గిన దేవుని వాక్య స్ధానములో మనుష్యుని ఉంచగల్గి, ఈగలు కల్గునట్లు చేయగల్గితే, బ్లీచ్‌గా యుండు యేసుక్రీస్తు యొక్క రక్తము ఎవరైతే, ఉడుతలు, లేక మరొకటి సృష్టి కల్గుటకు మాట్లాడుటకు మీరెందుకు తొట్రిల్లుచున్నారు?

418 అది మీరు చెయవద్దు. సామాన్యతనుగూర్చి మీరు తొట్రిల్లవద్దు. ఆయన యింకా దేవుడైయున్నాడని నమ్మండి. ఓహో! పాపమునకు క్షమాపణ ఓ! నేనే విధముగా కోరుచున్నానో…

419 తరువాత, మార్కు 11:22లో “మీరు యీ కొండను చూచి ‘కదలిపొమ్ము’ అని చెప్పి - మీ హృదయములో సందేహించక, అయితే మీరు అడిగినది జరుగునని నమ్మిన యెడల మీరు చెప్పిన ప్రకారమే మీకు జరుగును”.

420 మై, నాకు మూడు లేక నాలుగు పేజీలున్నవి. దానిని మనం వదలివేద్దాం. ధన్యవాదాలు మీకు.

421 దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికుంటాడు. మీరు చూచుటలేదా? ఒక పొరపాటు ఒక చోట యున్నది. దేవుడు ఒక వివరణ చేసినట్లయితే, ఆయన అబద్ధమాడడు. ఆయన వాగ్ధానం చేశాడు. చూశారా! సామాన్యతతో ఆయన మరుగు చేసికొనును. అదెంతో సామాన్యమైనది.

422 విద్యావంతులు, పండితులు చెప్తారు.…ఓ అది మానసికమైన విద్య. లేక యింకేదో. మీకు తెలుసా? అది యొక…

423 కాలమనే ప్రవాహములగుండా, దేవుడు తానేవెళ్ళి, ఏం జరిగినదో ఖచ్ఛితంగా ఆయన చెప్పగలడు. ఈ రోజు నీవేమైయున్నది ఖచ్ఛితంగా చెప్పగలడు. రానున్న దినాలలో చెప్పగలడు. అది యింకా, యేసుక్రీస్తు బ్లీచ్‌ ద్వారా. ఆయన ఒక పాపిని తీసుకొని, అందులో ఆయన బ్లీచ్‌లో కడుగును. అతడు దేవుని సన్నిధిలో నిలబడును.

424 మరియు “మీరు నాయందు నిలచియుండినయెడల, మరియు నా వాక్యములు మీయందున్న యెడల, మీకేమి కావలెనో అడుగుడి. అది జరుగును. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయుకార్యములు చేయును”.

425 మీరు ఎలాగు నన్ను ఖండించుచున్నారు? దేవుని వాక్యము ఎవరియొద్దకు వచ్చునో (ప్రవక్తలయొద్దకు) వారిని మీరు ‘దేవుళ్ళని’ పిలువలేదా అని మీ స్వంత ధర్మశాస్త్రము చెప్పుట లేదా. మరియు ఆలాగైతే. నేను, దేవుని కుమారుడనని చెప్పినట్లయితే మీరేలా నన్ను, ఖండించు చున్నారు? వారది చూడలేక పోయారు. వారది చూడలేక పోయారు.

426 ఇప్పుడు సంఘము ఈ రాత్రినుండి వర్తమానములు, అది చూడకుండ యుండవద్దు. చూశారా! మనం జీవిస్తున్న యీ దినాన్ని చూడండి. యేసుక్రీస్తు రక్తము మీ నుండి పాపమును ఎంతో దూరం తీసికొనిపోవును. అవి, యిక దేవుని యొక్క ఙ్ఞాపకములో లేవు. మరకనంతా అది తీసివేయును.

పాపము ఎర్రని మరకను వదలివేసినది

ఆయన దానిని హిమమంతా తెల్లగా కడిగెను

తరువాత, ఆయన సింహాసనము యెదుట

ఆయనలో సంపూర్ణుడనై నిలబడెదను

427 ఓహో, నేనెలాగు సంపూర్ణుడగుదును? నేనెట్లు సంపూర్ణుడిగా కాగలను. ఎందువలనననగా, రక్తము వలన. నేను కాదు. అయితే ఆ రక్తము దేవునికి నాకు మధ్య నిలబడినది. నేను దానిని అంగీకరించాను…నేను పాపిని. అయితే, ఆయన దేవుడు. అయితే, పాపమును చంపివేయు రసాయనము నామధ్య నిలబడినది, కాబట్టి, దేవుడు, బ్లీచ్‌లోనున్న నీళ్ళు ఎంత తెల్లగానున్నదో, అంతతెల్లగా ఆయన నన్నుచూస్తాడు. నా పాపము పోయింది. అది ఆయనయొద్దకు చివరకు అందుకోలేదు. ఎందుకంటె అక్కడ అర్పణ పెట్టబడినది.

428 సాధారణ దేవుని వాక్యమును నమ్ముటకు మనయొక్క విశ్వాసము ఎక్కడా? దేవుడు ఏమి చెప్పియున్నాడో ఆయన వాక్యముతోనే అయనను స్వీకరించు. దేవుడు యిపుడు సామాన్యతలో, దీనులైన చిన్న గుంపులో, దేవుడు తనకు తాను మరుగుచేసికున్నాడు. అయితే గతించిన దినాలలో, ఆయన ఎల్లవేళలలో ప్రత్యక్షపరచుకున్నాడో, యీ ఒకానొక దినాలలో ఆయన ప్రత్యక్షపరచుకొనును. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? [సభ “ఆమేన్‌” అని చెప్పినది—సంపా.]

నేనాయనను ప్రేమించెదను నేనాయనను ప్రేమించెదను

ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను

నా రక్షణను

కల్వరి చెట్టుపై కొనెను

429 మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? [సభ “ఆమేన్‌” అని చెప్పెను—సంపా]. మై ఆయన ఆశ్చర్యకరుడు కాదా (“ఆమేన్‌”) దేనికొరకు వర్తమానము ఉద్దేశించబడినదో, అట్టి దానిని అది ఉత్పన్నం చేయునని, నేను నిరీక్షించి నమ్ముతున్నాను. మీరు ఎదురుచూడని అలంకార ఆడంబర విషయాలకై అది మిమ్ములను తీసికొని వెళ్ళును. లేక…గొప్పతనములో, దేవుని మీరు చూచినపుడు, అదెంతటి సాధుత్వమో చూడండి. అప్పుడు దేవుని మీరు చూస్తారు. ఆయన కొరకు చూడవద్దు…

430 ఎలీషా, గుహలో నున్నపుడు, పొగ చుట్టూ వచ్చినది. రక్తము ఉరుము, మెరుపు, చూస్తున్నారా. మనకున్న, అన్ని ఉద్రేకాలు, ముఖము, చేతిలో రక్తము, ప్రతిచోట ఉద్రేకాలు. అది ఎమి ఆ, ప్రవక్తను యిబ్బందిపరచలేదు. చిన్న మెల్లని స్వరము విను వరకు అతడు అక్కడ పండుకున్నాడు. (ఏంటిది?) వాక్యము అటు తరువాత, తన ముఖమును కప్పుకొని బయటకు వచ్చాడు. చూశారా! అది. అది.

431 జ్ఞాపకముంచుకో, స్నేహితుడా! గొప్పవాటికొరకు ఎదురుచూడవద్దు. గొప్పవి…నువ్వు చెప్తావు, “దేవుడు, ఆయన గొప్ప విషయాలు పెద్దపెద్దవి మాట్లాడుతాడు అని”. ఒక సమయం వస్తుంది. ఇది, అది లేక మరొకటి, గొప్ప విషయాలు. నేను దేనిని గూర్చి మాట్లాడుతున్నానో దానిని మీరు పట్టుకుంటారని నేననుకుంటున్నాను. చూశారా?. “గొప్పవి. పెద్ద విషయాలు, చూశారా! ఓహో, అప్పుడది జరుగునపుడు, అది గొప్పది, ఇంత పెద్దది”.

432 అది, తగ్గింపు కల్గియుంటుంది. అంతా నీవు పోగొట్టుకుంటావు. ఆలాగే వెళ్ళును. చూడండి?- నీవు వెనుకకు చూచి చెప్తావు. “అది యిక రాదు…” చూశారా! పైపైగానే దాటిపోయినది. చివరకు దానిని చూడలేదు. వెళ్ళిపోయినది. చూశారా! అదెంతో సామాన్యమైనది. చూశారా! దేవుడు సామాన్యతలో ఉంటాడు. చూశారా! గొప్పతనములో తనకు తాను ప్రత్యక్షమగుటకు ఆయనను ఏది ఘనమైనదిగా చేసినది? ఎందుకనగా, ఆయన తనకుతాను సామాన్యునిగా చేసికొనుటవలన.

433 ఒక పెద్ద, గొప్ప మనిషి తనకుతాను సామాన్యునిగా చేసికొనలేడు. అతడు హోదాతో యుండవలసియుండును. చూశారా! అయితే, అతడు, యింకా తగినంత పెద్దవాడు కాలేదు. అతడు పెద్దవాడౌనప్పటికి, అప్పుడు యీ విధంగా వస్తాడు. తన్నుతాను తగ్గించుకోగలడు. చూశారా!

434 అక్కడ చికాగోలో, ఒక వృద్ధుడైన భక్తుడు చెప్పి నట్లుగ “ఆ వ్యక్తి, పాండిత్య మంతటితో కూడా, పలుపలు విధములైన వాటిలో పైకి ఎక్కిపోయాడు అన్నాడు. బాధనొందినవాడై, తలదించుకొని, అతడు క్రిందికి వచ్చాడు. ఓడిపోయినవాడై నడచివెళ్ళాడు.” అతడు చెప్పాడు “అతడు దిగివచ్చిన మార్గాన అతడు ఎక్కివెళ్ళితే, అతడు పైకి వెళ్ళిన మార్గాన అతడు దిగియుండును.” సరే. ఔనది నిజం! చూశారా?

435 నిన్ను నీవు తగ్గించుకో దీనుడుగా యుండు. వింతగా యుంటానికి ప్రయత్నించకు యేసును ప్రేమించు—చూశారా? “ప్రభువా, నా హృదయంలో ఏదైన కపటమున్నట్లయితే, ఏదైన తప్పిదమున్నట్లయితే, తండ్రీ! ఆ విధంగా యుండాలని అనుకొనుటలేదు. దానిని నీవు తీసివేయ్‌. ఆ విధంగా యుండాలని నేననుకొనుట లేదు. ఓ! ఆ దినాన, వారిలో ఒకరిగా నేను లెక్కింపబడుటకు ఆశించుచున్నాను. ప్రభువా! ఆ దినము సమీపించుట చూచుచున్నాను”.

436 దేవుడు, వాటిని మనకై తెరచిన యెడల, ఈ ముద్రలు ప్రారంభించుట మీరు చూస్తారు. జ్ఞప్తించుకోండి! ఆయన యొక్కడు మాత్రమే అది చేయగలడు. మనం ఆయనపై ఆధారపడియున్నాము. దేవుడు మిమ్ములను దీవించును.

437 మరియు ఈ మధ్యహ్నం మనం కూడుకొనక ముందు, మన సంఘకాపరి, మీతో ఒక మాట చెప్తాడని లేక చెప్పుటకు ఉందని నేననుకుంటాను. నేననుకుంటాను కూడిక పాటలు కూడిక ఆరు ముప్పయ్‌కా కాపరి?[“ఆరు ముప్పయ్‌కి ప్రారంభముగును…” సహోదరుడు నెవిల్‌ చెప్పుచున్నాడు—సంపా]. ఆరు ముప్పయ్‌…[ఆరుకు తలుపులు తీయబడును]. ఆరు ముప్పయ్‌కి పాటలు పరిచర్య ప్రారంభమగును.

438 ప్రభువు చిత్తమైనట్లయితే, ఈ రాత్రి, నేను ఏడు ముద్రల పుస్తకము యొక్క అంశము మీద నేను మాట్లాడతాను. మరియు తరువాత, సోమవారు రాత్రి తెల్లని గుర్రంపై స్వారీచేయువాడు, మంగళవారము రాత్రి…నల్లని గుర్రం మీద స్వారీ చేయువాడు. బుధవారం రాత్రి బూడిదవర్ణ గుర్రము పాండురవర్ణ గుర్రము. మరియు ఎర్రని గుర్రం మీద స్వారీచేయువాడు. అటు తరువాత ఆరవ దానిలోకి…నాల్గవది, ఐదవది మరియు ఆరవది తరువాత ఆదివారం రాత్రి తరువాత ఆదివారం ఉదయం ఒకవేళ స్వస్థత పరిచర్య, నాకు తెలియదు.

439 ఇపుడు జ్ఞాపకముంచుకొండి. మనలను మనముగాను, ఆలయాన్ని దేవునియొక్క పరిచర్య కొరకు, ప్రభువుకు సమర్పణ చేసికుందాము. దేవుడు మిమ్ములను దీవించునుగాక!

440 నేను—నేను ఒక గంట ఆలస్యం. మీరు నన్ను క్షమిస్తారా? [సభ “ఆమేన్‌” యని చెప్పుచున్నది—సంపా]. నేను—నేను చూడండి. ఆలా చేయాలని నేనను కోలేదు. అయితే, చూడండి. ఈ వారం నేను—నేను మీతో ఉంటాను. నేను తిరిగి విడచి వెళ్తాను. మరియు నేనెక్కడకువెళ్తానో నాకు తెలియదు. ఆయన నన్ను నడిపించిన యొద్దకు అక్కడకు నాకు, సాద్యమైనంతవరకు ప్రతి నిముషము మీకై ఉపయోగించాలని నేను ఆశించుచున్నాను. ఎందుకనగా నిత్యత్వం మీతో గడపవలెనని ఆశించుచున్నాను.

దేవుడు మిమ్ము దీవించునుగాక. ఇపుడు, సహోదరుడా, నెవిల్‌. 


    63-0317M — దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని అటుతరువాత, ఆవిధముగనే తనకుతాను బయలుపరచుకొనును
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...