ఏడు సంఘ కాలములకు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడము

ఏడు సంఘ కాలములకు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడము

1స్నేహితులారా, శుభ సాయంకాలము. ఈ రాత్రి ఈ ఆరాధనలో తిరిగి ప్రభువు యొక్క గృహములోనికి వచ్చుట ఒక గొప్ప భాగ్యముగా నున్నది, మరియు ఈ రోజు ఉదయపు మన్నా ద్వారా ఇంకను జీవించుచు ఆయన యొక్క గొప్ప సన్నిధిని బట్టి మన యొక్క ఆత్మలు ఎంతగానో ఆశీర్వదింపబడియున్నవి.

మరిప్పుడు ఈ రాత్రి, మనము ఏడు సంఘ కాలములకు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడము అన్న అంశముపై ప్రారంభించనైయున్నాము. మరి ఈ మధ్యాహ్నము నేను ఒక స్నేహితునితో మాట్లాడుచుంటిని. మరియు ప్రభువు చిత్తమైనయెడల రాబోవు వేసవిలో ఆయన నన్ను తన గృహమునకు తీసికొని వెళ్ళనియెడల, లేక నేను విదేశములకు పర్యటించకున్నయెడల నేను తిరిగిరావలసియున్నయెడల నేను కడపటి ఏడు బూరలను గురించి తిరిగి మాట్లాడవలయునని యున్నాను, చూశారా. మరి ఇదంతయు ఒకదానితో ఒకటి జతపరచబడి యున్నది. మరి అటు పిమ్మట ఏడు తెగుళ్ళు కలవు — మరి మనము వీటినన్నిటిని మనము ధ్యానించుచుండగా ఇదంతయు ఒకదానితో ఒకటి జతపరచబడి యుండుటను చూచెదము.

GAL 6:17

 

2కావున ఈ రాత్రి నిశ్శబ్దముగాయున్న ఈ సమయములో నేను ఈ రాత్రి కొంచెం ఎక్కువసేపు ప్రసంగించుచున్నాను. నేనిక్కడ నుండి ఫినిక్సులో ఎంత ప్రసంగించినప్పటికిని నా గొంతు ఒక్కసారి కూడా బొంగురుపోలేదు, చూశారా. (అది సరి), మరియు ఓ, మై, నేనెంత కఠినముగా ప్రసంగించినను! ఇరవై ఏడు ఆరాధనలలో ప్రసంగించాననుకుంటున్నాను, అయినప్పటికిని నా గొంతు బొంగురు పోలేదు. అయితే ఇక్కడ పరిస్థితి సరిగా లేదు, అనారోగ్యముగా నుండును, నేనేమి చెప్పుచున్నానో గ్రహించారా మరి మంచి వాతావరణము కాదు. ఆ విధముగా ప్రసంగించు ఏ ఒక్క ప్రసంగికునికైనను గొంతు పాడగును.

ఒకప్పుడు నా డాక్టరు స్నేహితుడు నా గొంతులో ఏమి లోపమున్నదని పరీక్షించెను. చెప్పెను, ''అంతా బాగున్నది, బోధించుటవలన స్వర పేటికలోని నరములు కరడుకట్టినవి.'' సరి నేను దానిని ఇష్టపడుచున్నాను, మీకు తెలియునా. ప్రసంగించుటవలన ఈ విధముగా సంభవించినందువలన నేను ఆనందపడుచున్నాను. దేవుని రాజ్యము కొరకు ఏమైనను అది మంచిదే. పౌలు దెబ్బలు తినినందువలన అతడు తన శరీరములో యేసుక్రీస్తు యొక్క ముద్రలను పొందినట్లుగా ఇప్పుడు మనము మన శరీరములపై కలిగియుండకపోవచ్చును. అయితే ప్రసంగించుట వలన కలగు బాధ అను ముద్రను కలిగియుండి, తప్పైన కార్యములను మన గొంతు ద్వారా ఖండించవచ్చును. కావున, ఈ సమయములో మనము దెబ్బలు తిననవసరము లేనందుకు వందనములు చెల్లించుచున్నాము, ప్రత్యేకముగా ఈ సమయము వరకు.

3అయ్యలారా, ఇదేనా ఆ సమయము? అను వర్తమానమును ఇక్కడ ఎందరు చదివియున్నారు? లేక "అయ్యలారా! ఇదేనా ఆ సమయము?" అనునది మీరు వినియున్నారా? అది నాకు కొద్దిగా బాధకలిగించినది. మీరు దానిని కలిగియుండని యెడల మీరు ఏ విధముగానైనను దానిని వినుడి. అది నన్ను ఒక విధముగా బాధించుచున్నది. ఆరాధనను ప్రారంభించుటకు మునుపు దీనిని నేను చెప్పగోరుచున్నాను.

సుమారు ఒక వారము లేక పది దినములకు మునుపు, నేనెంతో కలవరమునకు గురికాబడితిని. అదేమిటో నాకు తెలియనందువలన నేను ఆరాధనలను జరిపించలేక పోయాను. అదేదో ఒక కీడుగా నున్నదనిపించెను. మరి అదేమిటో నాకు తెలియకుండెను. కావున నేను… ఒక రోజు పెందలకడ నేను లేచి సాబినో కాన్యాన్‌కు వెళ్ళుటకు సిద్ధపడితిని. ఇంటి నుండి సాబినో కాన్యాన్ శిఖరమునకు ముప్పై లేక నలుబదిని మిషముల ప్రయాణము (కారు ప్రయాణము), మరటు పిదప కొండపైకి వెళ్ళుటకు ముప్పై మైళ్ల దూరమునకు రహదారి కలదు. అక్కడ పైన చాలా వింతైన ప్రదేశమది. ఇక్కడ ఈ ఎడారిలో శీతోష్ణ స్థితి ఎనభై లేక తొంభై డిగ్రీలు ఉండును, అయితే ప్రయాణించి వెళ్ళు చోట కొండ శిఖరమున ఎనిమిది అడుగుల లోతునకు మంచుపడును. చూశారా.

4కొద్ది రోజుల క్రితము మేము ఫినిక్సులో నున్నప్పుడు అక్కడ ఇరవై డిగ్రీలు లేక ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండెను. వారక్కడ ఈత కొలనులను వేడి చేసి మరి ప్రజలు ఈతకొట్టుచుందురు. మరక్కడి నుండి నలభై నిమిషములు కారు ప్రయాణము చేసి ఫ్లాగ్‌స్టాఫ్ అను ప్రదేశమునకు చేరుకొనినయెడల అక్కడ సున్నాకు దిగువగా నలుబడి డిగ్రీలు ఉండును. చూశారా? అదియే ఎత్తైన ప్రదేశములకును మరి ఎడారికిని మధ్యనున్న బేధము. మరది ఉబ్బస రోగమునకు మరలా౦టివాటికి ఆ ప్రదేశము చాలా ఆరోగ్యకరమైన ప్రదేశమది.

5అయితే ఇప్పుడు నేను ఆ కొండపైకి (కాన్యాన్) ఎక్కగలిగినంత పైకి ఎక్కి వెళ్ళాను. అక్కడ పైన కూర్చొని ఉన్నప్పుడు మరి నేను ప్రభువును ఇదంతయు ఏమిటి, వీటి అర్ధము ఏమిటని అడిగితిని. నేను ఒక విధముగా కలవరపడితిని మరి ఏమి చేయవలెనో నాకు తెలియలేదు.

మరియు నేను ప్రార్థించుచుండగా వింతైన కార్యము సంభించెను. నేను యథార్ధముగా ఉండగోరుచున్నాను. ఇప్పుడు, నేను ఒకవేళ నిద్రపోయియుండవచ్చును. నేను పరవశుడనైనట్లుంటిని లేక అది ఒక దర్శనముగా ఉండవచ్చును. అయితే అది ఒక దర్శనముగా నేను భావించుచున్నాను. దానిని గురించి నేను నా చేతులు చాపి అడిగితిని, ''ప్రభువా, ఈ ప్రేలుడుకు అర్ధమేమిటి? మరియు ఈ ఏడు దూతలు ఒక గుంపుగా పిరమిడ్ ఆకారములో వచ్చి నన్ను నేల మీదనుండి లేపి తూర్పు దిశకు త్రిప్పినవి గదా, దాని భావమేమిటి?''

6నేనక్కడ ప్రార్ధించుచు నిలబడియుంటిని, మరేదో సంభవించెను. మరియు నా చేతిలో ఏదో పడినది. మరియు మీరు ఆత్మీయ కార్యములను అర్థము చేసికొననియెడల ఇవి అన్నియు మీకు వింతగా నుండునని నాకు తెలియును, అయితే ఏదో నా చేతిలో, నన్ను తాకినది. మరియు నేను చూడగా అదొక ఖడ్గము. మరియు పిడి ముత్యముతో చేయబడియుండెను, నేనెన్నడును చూడని మనోహరమైన ముత్యముతో అమర్చబడి మరియు దాని ఒక (మీకు తెలియునా, మీరు యుద్ధము చేయునప్పుడు మీ చేతులు గాయపరచుకొనకుండా యుండుటకై) అది సువర్ణముతో చేయబడినది. ఆ కత్తి అంత పొడవుగా లేదు గాని చాలా పదునుగా యున్నది. వెండితో అది మెరయుచున్నది. మరియు నేను ఇంతవరకు ఆ విధమైన చక్కని దానిని చూడలేదు. నా చేతికి అది ఖచ్చితముగా ఇమిడిపోయినది. మరియు దానిని నేను పట్టుకొనియుంటిని.

దానివైపు నేను చూచి, ''ఇది అందముగా నున్నది కదూ!'' అని చెప్పాను. మరి నేను తలంచాను, అయితే మీకు తెలియునా, నాకెల్లప్పుడు ఖడ్గమంటే చాలా భయము. వాటిని ఉపయోగించు కాలమునందు జీవించనందుకు నేను సంతోషించుచున్నాను, ఎందుకంటే ఖడ్గమంటే నాకు భయము. కావున మరి నేను ''దానితో నేనేమి చేయగలను?'' అని తలంచితిని.

మరియు దానిని చేతిలో పట్టుకొనియుండగా, ఎక్కడినుండియో ఒక స్వరము చెప్పెను, ''అది రాజు యొక్క ఖడ్గము.'' మరటు పిదప అది నా నుండి తీసుకొనబడినది.

JOHN 15:7•

HEB 4:12

 

7సరి, నేను అదేమిటని ఆశ్చర్యపడుచుంటిని, ''అది రాజు యొక్క ఖడ్గము.'' అదే దాని అర్ధమేమిటని నేను ఆలోచించుచుంటిని. ఆ శబ్దము ''అది ఒక రాజు యొక్క ఖడ్గము,'' అని చెప్పియుండినయెడల అప్పుడు నేను అర్ధము చేసుకునేవాడినని తలంచితిని. అయితే అది చెప్పెను, ''రాజు యొక్క ఖడ్గము.'' కావున ఈ విధముగా తలంచుటలో నేను తప్పుగా ఉండవచ్చును, అయితే ''ఒకే ఒక్కరే ఆ రాజు. ఆయనే దేవుడైయున్నాడు. ఆయన తప్ప మరెవ్వరూ కాదని గ్రహించితిని. మరియు ఆయన ఖడ్గము ఇదే, రెండంచులుగల ఖడ్గము కంటెను వాడియైనది,'' చూశారా.

మరి మీరు నాలో ఉన్నయెడల, మరి నా మాటలు… చూశారా? మరి నేను తలంచితిని… యుద్ధములను గురించి నాకు ఒక్క మాటైనను దానిని గురించి తెలియదు. అయితే నాకు తెలిసినంతవరకు ఖడ్గములను ఒకరిపై ఒకరు దూసుకొందురు. మరటు పిదప ఒకరిపై ఒకరు గుండెల మీద ఖడ్గముల నుంచినప్పుడు యుద్ధము చేయువాని వ్యక్తి యొక్క బలముపై విజయము ఆధారపడియుండును. ఏలయనగా చూడుడి, అతని ఖడ్గములు రెండును ఝళిపించుచూ పెనవేసుకొనియుండును. మరటు పిదప అవి కొట్టుకొనుచు ఒక్కటిగా ఉండును. మరటుపిదప ఒక ఖడ్గము ఇంకొక ఖడ్గమును క్రిందికి త్రోసి నేరుగా గుండెపై పెట్టబడును. కావున అది… ఖడ్గము వాక్యమైనప్పటికిని, దానిని పట్టుకొనుటకును, దానిని శత్రువు యొక్క గుండెపై పెట్టుటకును బలమైన విశ్వాసముగల చేతులు కావలయును.

8ఇప్పుడు, ఈ కార్యములన్నియును తెలియక, అయితే ఆయన యొద్ద నుండి పొందినవన్నియును నేను మీకు చెప్పుచున్నాను. కావున మీకు తెలియును, నేను నమ్ముచున్నాను అది… మన ప్రభువు చెప్పియుండలేదా, తండ్రి యొద్ద నుండి పొందిన వాటన్నింటిని ఆయన చెప్పినాడని, ఏదియును దాచుకొనకుండా చెప్పినారని? మరి కావున అదే విధముగానే ఒక్కొక్క కార్యమునకు మనము వచ్చుచుండగా వాటన్నింటిని ఆచరణలో పెట్టవలసినవారమై యున్నాము.

ఇప్పుడు, మీరు నిజముగా జ్ఞానముగలవారైనయెడల, మరి ప్రార్థించినయెడల మరి నేను నిశ్చయముగా నమ్ముచున్నాను, మీరు త్వరలో దేనినో గ్రహింపబోవుచున్నారని, ఏదో బయలుపడబోవుచున్నదని నేను ఎదురుచూచుచున్నాను.

9ఇప్పుడు ఈ పుస్తకములో, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని పిలువబడు పుస్తకము నుండి 5వ అధ్యాయమునకు మనము త్రిప్పెదము. ఇప్పుడు, రేపు రాత్రి మొదటి ముద్ర… నాలుగు గుర్రములపై సవారి చేయుచున్న వారిద్వారా మొదటి నాలుగు ముద్రలు విప్పబడెను, ఒక్కొక్క ముద్రయు భూమిని తాకెను, మరి అవి అధిక సమయమక్కరలేదు, మనము వాటిని దాటిపోవువరకు (సోమవారము, మంగళవారము, బుధవారము) బహుశా గురువారము మరియు నాలుగు ముద్రలను గూర్చి ధ్యానించెదము. మరి అటుపిదప ఐదవది, ఆరవది మరి ఏడవ ముద్ర చాలా సమయము తీసికొనును. కావున అది మీరు విశ్రాంతి తీసికొనుటకు కొద్దిగా సమయము నిచ్చును.

10ఇక్కడ ఈ వారములో రాత్రి ఆరాధనలను మేము ఏడు గంటలకు ఆరంభింపనుద్దేశించి యున్నాము. మరియు నేను సరిగా ఏడున్నరకు ప్రసంగవేదికపై ఉండెదను. మరటు పిదప మనము ఆ విధముగా చేయుటవలన అర్ధ రాత్రి వరకు చెప్పెదను. కావున నేను ఈ ఉదయము ఒక గంటసేపు అధికముగా తీసికొని యున్నాను. ఆ విధముగా చేయవలయునని నా ఉద్దేశ్యము కాదు. నేను… నాకు తెలయదు ఎప్పుడు అని. ఏలయనగా మొదట సవారి చేయువానిని గురించి ఏమిటని నాకు తెలియదు. నాకు రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ లేక ఏడవ ముద్ర గురంచి తెలియదు. నాకు ఈ క్షణము వరకు, నాకు తెలియదు. చూశారా? నేను ఆయనపై ఆధారపడి యున్నాను.

11కావున అందువలననే దానిని నమ్ముచు ఈ వారమంతయు దేవుని దయవలన సహాయము కొరకు ప్రయత్నించుచున్నాను, మీరు దీనిని లోతుగా గ్రహించినయెడల… మీకు తెలియునా, దర్శనము ద్వారా, మీరు వాటిని బయలుపరచుటకు అనుమతింపబడితేనే గాని మీరు దర్శనములను బయలుపరచకూడదు. ''ఒక గృహములోనికి మీరు వెళ్ళండి; ఒకవేళ ఒక టోపి ఇక్కడ పడియుండవచ్చును. మరి ఈ చిన్న బిడ్డ లేక అటువంటి వారెవరైనను అదక్కడ పడియుండువరకు స్వస్థపరచబడరు." నేను వారికి చెప్పలేను, లేక దానిని అక్కడి నుండి కదల్చలేను. అది మరొక విధముగా జరుగవలసియున్నది. మరెవ్వరో దానిని తీసి మరి దానిని జరుపవలసియున్నది. మరన్నియును క్రమముగా జరుగవలసియున్నది, అటు పిదప అది బయలుపడును, అని ఈ విధముగా నేను అనేకసార్లు చెప్పినదానిని మీరు ఎంతమంది వినియున్నారు!'' కావున ఇప్పుడు ప్రార్థనలోఉండుడి.

GEN 1:24,25•

MATT 5:6

 

12ఇప్పుడు గ్రంథమును సమీపించుటకు ముందు మన తలలు వంచి ఆయనతో మాట్లాడెదము. ప్రభువైన యేసు, మేము అసమర్ధులము. ప్రభువా అని అడుగకుండా, కాల ప్రవాహము యొక్క గురి యొద్ద ఆత్మలు నిరీక్షించి ఈ మహత్తరమైన పరిశుద్ధ ఘడియయందు మీ యొద్ద అనుమతిపొందుకొనకుండా, ఈ పరిశుద్ధ గ్రంథమును చదివి దాని యొక్క భావమును వివరించుటకు మేము ప్రయత్నించము. దీనిని బయలుపరచుట మీ ఒక్కరివలన మాత్రమే సాధ్యమగును. ఆయన ఇప్పుడు ముందుకు వచ్చి నీ దాసుని యొక్క బలహీనమైన ప్రయత్నములను ఆశీర్వదించుము ప్రభువా.

వాక్యము బయలువెడలుచుండగా దానిని ఆశీర్వదింపుము. అది ఆత్మతో నింపబడిన శక్తితో బయలువెళ్ళును గాక! మరియు ఆత్మీయ గర్భములో… దేవుని యొక్క చిత్తమును మరియు నీతిని తెలుసుకొనుటకై ఆకలిదప్పులు గలవారి గర్భములో పడి మరి దాని జాతిని అది మొలిపించును గాక. ప్రభువా దానిని అనుగ్రహించుము. మీకే సకల స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ రాత్రి ఆకలి దప్పులుగలవారు వాక్యములో నుండి ఆహారము, దాహము పొందెదరు గాక. బయలుపాటు ఎవరిని గురించియున్నదో ఆ యేసు నామమున మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

13ఇప్పుడు మనము 5వ అధ్యాయమునకు త్రిప్పబోవుచున్నాము. ఇప్పుడిది ఏడు ముద్రలు కాదు. సంఘ కాలములకును మరి ఏడు ముద్రలకును మధ్యనున్న ఎడమిది. ఇప్పుడు 6వ అధ్యాయములో కూడా… మరది ప్రకటన 4వ అధ్యాయము. మరందులో సంఘము ఎత్తబడిన పిదప జరుగనైయున్న సంగతులు బయలుపడియున్నవి. ప్రకటన 3వ అధ్యాయములో సంఘము పైకెత్తబడుటను చూతుము. మరి 19వఅధ్యాయము వరకు అది తిరిగి రాదు. చూశారా? అందువలననే సంఘము (వధువు) శ్రమలను తప్పించుకొనును.

నేను ఇంతవరకు ఎరిగియుండు బోధకులందరి భావములకు ఇది వ్యతిరేకముగా యుండును. అయితే నేను వారితో ఏకీభవింపకూడదని కాదు. నేను మీ యొక్క సహోదరునిగా ఉండవలయునని కోరుచున్నాను. అయితే నేను చూచిన రీతిగానే దానిని బోధించవలయును. ఆ విధముగా నేను చేయనియెడల వాటిన్నింటిని నేను కలపలేను, మీరు చూడుడి. మరిప్పుడు పైకి ఎత్తబడుట శ్రమలకు మునుపా లేక శ్రమలకు పిదప అనునది కాదు గాని, నేను దానితో కూడాపైకి వెళ్ళగోరుచున్నాను. అదే ముఖ్యమైన కార్యమగును.

14కావున, ఆ కార్యములన్నియును మనము భావించుచున్నాము, ఏలయనగా చదువు లేకుండా నేను మాదిరిలు చూపించుచున్నాను. పాత నిబంధనలో ఉన్న కార్యములు క్రొత్త నిబంధనలో దేనికి మాదిరిగా లేక ఛాయగా ఉన్నవని నేను చూచుచున్నాను, అప్పుడు నాకు క్రొత్త నిబంధన అనగా ఏమిటని ఒక అభిప్రాయము కలుగును. చూశారా? ఈ విధముగా… శ్రమలకు మునుపు నోవహు ఓడలోనికి వెళ్ళెను అదొక మాదిరిగా యున్నది; అయితే నోవహు ఓడలోనికి వెళ్ళుటకు మునుపే, ఏదైనను సంభవింపక మునుపే హనోకు ఎత్తబడెను. చూశారా. మరి నాశనము చేయబడుటకు కుమ్మరింపబడు శ్రమలు మచ్చుకైనను కనబడకముందే సొదొమ నుండి లోతు బయలకు పిలువబడెను. అయితే అబ్రాహాము అసలు అందులో లేనేలేడు, బయట ఉండెను. మాదిరిలు చూడండి.

REV 5:1-7

 

15అయితే మనమిప్పుడు 1వ వచనమును చదివెదము. దానిలోని మొదటి రెండు లేక మూడు వచనములను నేను చదివెదను.

మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడైయుండువాని కుడి చేత చూచితిని.మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక దేవ దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.అయితే పరలోకమందుగాని భూమి మీదగాని భూమి క్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. (ఇప్పుడు మీరు అయోగ్యతను గురించి చెప్పుచున్నారా? ''దానిని చూచుటకు కూడా ఏ మానవుడును, ఎక్కడను యోగ్యుడుగా లేడు.'')ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులునుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

ప్రకటన 5వ అధ్యాయము 7వ వచనము వరకు చదివిన ఆ వాక్యముల యొద్ద మనము కొద్ది క్షణములు ఆగెదము.

REV 10:1

 

16ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయములోని ఏడు ఉరుములప్పుడు ఈ ఏడు ముద్రల పుస్తకము బయలుపడెను. మీరు వ్రాసుకున్న యెడల… ఒక క్షణము మనము ప్రకటన 10వ అధ్యాయమునకు త్రిప్పెదము, కావున దానిలోనికి పోక మునుపు మీరు దానిని గ్రహించగలరు. ఇప్పుడు, ఇది అంత్యకాల మందు సంభవించు కార్యము. ఏలయనగా వినుడి:

…బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొనియుండెను, ఆయన శిరస్సు మీద వర్ష ధనుస్సుండెను…

మీరు గమనించినయెడల అది క్రీస్తే, చూశారా, ఏలయనగా ఆయన పాత నిబంధనలో ఒడంబడిక దూతగా పిలువబడెను. మరిప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు, ఏలయనగా సంఘము యొక్క పని సమాప్తమై పోయినది. చూశారా? అది సరి.

…ఆయన ముఖము సూర్యబింబమువలెను, ఆయన పాదములు అగ్ని స్తంభములవలెను ఉండెను:

ప్రకటన పుస్తకములోని 1వ అధ్యాయములోని ఆ దూత మీకు గుర్తున్నదా? అదే కార్యము, దూత అనగా ఒక ''వర్తమానికుడు,'' అని అర్ధము. మరియు ఆయన ఇశ్రాయేలుకు వర్తమానికుడు. చూశారా? ఇప్పుడు సంఘము (వధువు) ఎత్తబడి యుండును, చూశారా, లేక ఎత్తబడుటకు సిద్ధముగా యున్నది. ఆయన తన సంఘము కొరకు వచ్చును.

REV 10:2-7

 

17ఇప్పుడు గమనించుడి.

ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను…

ఇప్పుడిక్కడ ఇది మూయబడి మరి ముద్రించబడియున్నది; మరిదిక్కడ తెరువబడియున్నది. అప్పటి నుండి ముద్రించబడియున్న పుస్తకము ఇప్పుడు తెరువబడియుండుటను చూడగలము. ఈ రాత్రి మనము దానిని చూడబోవుచున్నాము. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము, యుండుటను చూడగలము. ఆయన… అది తెరువబడియున్నది. ఓ, ఏ విధముగా సూర్యుడు, స్తంభములవలె…'' ఒక నిమిషమాగండి. దీనిని మరల నేను వెనుక నుండి చదివెదను.

ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను: ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను… (ఆయన యూదా గోత్రపు సింహము అని మనమెరిగియున్నాము. ఇక్కడ ఆయన ఒక గొర్రెపిల్లగా యున్నాడు; అయితే ఇక్కడ ఆయన సింహము. చూశారా?)…మరల ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. (ఇప్పుడు, యోహానుకు అతను చూచినది వ్రాయునట్లుగా చెప్పబడెను, కావున ఆ అపొస్తలుడు, మరియు ప్రవక్త దానిని వ్రాయుటకు తన కలమును ఎత్తెను.)ఆ యేడు ఉరుములు పలికినప్పుడు, నేను వ్రాయబోవుచుండగా: ఏడు ఉరుములు పలికినసంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి యొక స్వరము పలుకుట వింటిని. (ఇప్పుడు, అదే మనకు తెలియదు. అదింకను బయలుపడలేదు. ఆ ఉరుములు ఏమి చెప్పినవో అనునది పరిశుద్ధ లేఖనములలో లేదు.)మరియు సముద్రము మీదను భూమి మీదను నిలచియుండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశము తట్టు ఎత్తి (ఇప్పుడు వినండి),పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని: (గమనించుడి! ఇక్కడున్న వచనమును నేను చెప్పగోరుచున్నాను.)యేడవ దూత పలుకు దినములలో, అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

REV 10:7

 

18ఇప్పుడు, చూడుడి ఏడవ సంఘ దూత వర్తమానము అందించు సమయములో ఈ ఏడు ముద్రల పుస్తకము యొక్క మర్మము బయలుపరచబడును. చూశారా? ''ఏడవ దూత పలుకుటకు ప్రారంభించునప్పుడు,'' మరక్కడ వర్తమానములు వ్రాయబడుచున్నవి, మరి వాటిని మనము టేపుల ద్వారాను మరి పుస్తక రూపమున కలిగియున్నాము.

ఇప్పుడు, "వర్తమానము ధ్వనించుటకు ప్రారంభించునప్పుడు దేవుని యొక్క మర్మము సమాప్తమగును,'' చూశారా! ఇప్పుడు మనము గమనించెదము. ఆ పుస్తకములోనున్న దేవుని యొక్క మర్మము ఆ సమయములో ఏడవ దూత యొక్క వర్తమానము ధ్వనించువరకు బయలుపడలేదు. ఇప్పుడు, ఈ యొక్క విషయములన్నియును ముద్రలలో చాలా ముఖ్యమైనవి, నేను నిశ్చయముగా యున్నాను, ఏలయనగా ప్రతి యొక్కొక్కటియును జతపరచబడవలెను. ఇప్పుడది మర్మముగా వ్రాయబడియున్నవి, ఏలయనగా ఏ మానవుడును, ఎక్కడను దానిని ఎరుగడు. దేవుడొక్కడే, యేసుక్రీస్తు మాత్రమే దానినెరుగును, చూశారా.

REV 10:7

 

19ఇప్పుడు, అయితే అది ఒక మర్మమైన పుస్తకము. అది ఒక విమోచన గ్రంథము. (ఇంకొద్దిసేపైన పిదప దానిని చూచెదము.) మరిప్పుడు ఈ విమోచన పుస్తకమును సంపూర్తిగా అర్దము చేసికొనలేమని మనమెరిగి యున్నాము; అది ఆరు సంఘ కాలముల నుండి పరిశోధింపబడెను. అయితే చివరి కాలములో ఏడవ దూత తన మర్మమును పలుకుటకు ప్రారంభించినప్పుడు ఈ ఆరు సంఘ కాలములయందు పరిశోధించి వదిలి పెట్టబడిన కార్యములన్నియు విప్పబడును. మరియు దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచును, అప్పుడు దైవత్వము గూర్చియు మరియు సమస్త కార్యములు గూర్చియు వెల్లడియగును. సర్పము యొక్క సంతానము మరి ఈ మర్మములన్నియు ఇంకను మిగిలినవన్నియును బయలుపరచబడవలెను.

REV 10:1,2,7

 

20ఇప్పుడు, మీరు చూడుడి, నేను వాటినన్నిటిని తయారు చేయలేదు. అది అదే… అది "ప్రభువు సెలవిచ్చుచున్నాడు అయి యున్నది." పుస్తకము నుండి దానిని నేను మీకు చదివి వినిపించెదను, ''యేడవ దూత వర్తమానము ధ్వనించునప్పుడు తన పరిశుద్ధ ప్రవక్తలకు తెలిపిన ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమగును,'' (వాక్యమును వ్రాసినది ఆ ప్రవక్తలే.) ఏడవ సంఘ కాలమనే కడపటి సంఘ కాలములో, అంతకుముందున్న సంఘ కాలములలో పరిశోధించి బయలుపడక మిగిలిపోయిన కార్యములన్నియు ఏకముగా జతపరచబడి బయలుపరచబడును. మరియు ముద్రలు విప్పబడునప్పుడు, మర్మములు బయలుపడెను, ఆయన పాదమును నేల మీదను, మరి సముద్రము మీదను మోపి ఆయన తలపై వర్ష ధనుస్సుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఈ రాకడ సమయమున ఈ ఏడవ దూత భూమియందు ఉండుటను, ఇప్పుడు మీరు గుర్తుంచుకొనండి.

MAL 4:6

 

21యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయములో మెస్సీయా ఆ దినములలో వచ్చెను. యోహానుకు తెలియును, అతడు ఆయనను చూచునని, ఏలయనగా అతడే ఆయనను పరిచయము చేయవలసినదిగా ఉండెను. మరియు మనము మలాకీ 4లో లేఖనములలో దానిని గుర్తెరిగియున్నాము, యోహానువలె ఒకడు, యోహానువలె ఒక ఏలియా చివరి దినములలో ఉండవలెననియు, దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చుననియు. అతను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములన్నియును బయలుపరచవలసినదై, మరియు పిల్లల విశ్వాసమును తిరిగి అపొస్తలుల విశ్వాసమునకు త్రిప్పును, ఇన్ని సంవత్సరముల నుండి సంఘ శాఖలు పరిశోధించుచున్న మర్మములన్నిటిని బయలుపరచును. ఇప్పుడు దానినే వాక్యము చెప్పుచున్నది. అదేమి చెప్పినదో దానికి మాత్రమే నేను బాధ్యుడను. చూశారా? అది, వ్రాయబడియున్న ఇదియే సత్యమగును. వ్రాయబడియున్న కార్యము అదియే.

REV 1:13•

REV 10:7

 

22ఇప్పుడు ఈ ఏడు ముద్రల పుస్తకము విమోచన యొక్క మర్మమని మనము చూచియున్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక విమోచన గ్రంథమిది. ఇప్పుడు ఈ వర్తమానికుడు పలుకు దినములలో సమస్త మర్మములును సమాప్తమగును. ఇప్పుడు ఇక్కడ భూమిపై ఏడవ సంఘ కాలపు దూత యున్నాడు. మరి 'ఇంకొక' దూత బలిష్ఠుడైన వర్తమానికుడు క్రిందికి వచ్చెను. చూడుడి, ఈ దూత ఒక భూసంబంధమైన దూత, వర్తమానికుడు; అయితే ఇక్కడ ఒకడు పరలోకము నుండి శిరస్సుపై వర్ష ధనుస్సుతో భూమిపైకి దిగి వచ్చుచున్నాడు. ఇచ్చట అది ఒడంబడికకు మాదిరిగా యున్నది. గమనించండి. అది క్రీస్తుగా యుండవలయును. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ఉన్నట్లే అదే విధముగానే, ''ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య, ఒక వర్ష ధనుస్సుతో నిలచుకొని సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడై యుండెను.''

REV 10:7

 

23మరిక్కడ 10వ అధ్యాయములో ఆయన మరల వచ్చుచున్నాడు, సమస్త మర్మములు సమాప్తమగు సమయమందు ముద్రలు విప్పబడవలయును, మరియు ''సమయము ఇక లేదని'' చాటించుటకు వచ్చుచున్నాడు. మరియు ఆయన చెప్పెను, ''ఏడవ దూత పలుకుటకు ప్రారంభించునప్పుడే ఈ మర్మము సమాప్తమగును, మరి ఈ కాలమందే దూత ప్రత్యక్షమగును.'' మనము దానికి చాలా సమీపముగా యున్నాము. సరి.

24ఇప్పుడు గమనించుడి. పుస్తకము యొక్క మర్మమును ఏడు ముద్రలు కలిగియున్నవి. ఆ ఏడు ముద్రలలో ఏమి ముద్రించబడినదో మనము చూచు వరకు, ఆ కార్యములను మనము కేవలము ఊహించుకొనుచుంటిమి. ఏలయనగా నేను ఈ ఉదయమున మీకు చెప్పిన విధముగా, ఈ ఉదయపు చిన్న వర్తమానమైన "దేవుడు సామాన్యతలో దాగియున్నాడు." మీరు చూశారా, మనము పరిశుద్ధాత్మ పరిపూర్ణముగా, స్వచ్ఛముగా బయలుపరచి మరి దానిని నిరూపించితేనే గాని లేని యెడల మనము దానిని తప్పిపోయెదము. చూశారా? ఒకవేళ ప్రవక్త లేచి అదంతయును అంతే, అని చెప్పినా కూడా, మరి దేవుడు ప్రతీ మాటయందు, ప్రతీ కార్యమందును అది సత్యమని చెప్పుటకై ఆయన దానిని నిరూపింపవలయును. చూశారా? కావున, ఆయన బిడ్డలు ఆ కార్యములను గమనించుచు, చూచుచు, మెళకువగా యుందురు.

25పుస్తకములోని ఏడు ముద్రలు (ఈ ఏడు ముద్రలు) పుస్తకమును ముద్రించియున్నవి. చూశారా? ఆ పుస్తకము పరిపూర్ణముగా ముద్రించబడియున్నది. దానిని మీరు చూచుచున్నారా? ఏడు ముద్రలు విప్పబడువరకు ఆ పుస్తకము పూర్తిగా ముద్రింపబడియున్నది. అది ఏడు ముద్రలతో ముద్రింపబడియున్నది.

ఇపుడు, ఏడు ఉరుములకు ఇప్పుడు అది భిన్నమైన కార్యముగా యున్నది. చూశారా? ఇది పుస్తకముపైన ఏడు ముద్రలు గలవు. మరియు ఏడవ దూత వర్తమానమును అందించు వరకు ముద్రలు, ఆ పుస్తకము తెరువబడదు. చూశారా? కావున మనము ఊహించుచుంటిమి. అయితే స్వచ్ఛమైన దేవుని యొక్క బయలుపాటు ఆ యొక్క ధ్వనిలో పలుకు దినములలో పరిపూర్ణముగా బయలుపరచబడి సత్యమును నిరూపించును. ఇప్పుడు, ''ఆ సమయములో మర్మము సమాప్తమగును,'' అని దేవుని యొక్క వాక్యము ఖచ్చితముగా దానినే చెప్పుచున్నది. మరియు ఈ ఏడు ముద్రల పుస్తకము, గుర్తుంచుకొనుడి, అది ప్రకటన 5వ అధ్యాయములో మూయబడియున్నది, మరి ప్రకటన 10వ అధ్యాయములో అది తెరువబడుచున్నది.

REV 5:7

 

26మరిప్పుడు అదెట్లు తెరువబడునని ఈ గ్రంథము ఏమి చెప్పుచున్నదో మనము దానిని చూడబోవుచున్నాము. గొర్రెపిల్ల పుస్తకమును తీసికొని మరి ముద్రలను విప్పి, ఆ పుస్తకమును తెరుచువరకు దానియందు గల మర్మములు బయలు పరచబడదు చూశారా? గొర్రెపిల్ల ఆ పుస్తకమును తీయవలసినదిగా యున్నది. అది మరుగుపరచబడియున్నది. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ''పరలోకములో నున్న వ్యక్తి అయినను, భూమిపైనున్న ఏ వ్యక్తి అయినను,'' పోప్, భిషప్, కార్డినల్, రాష్ట్ర మత గురువో, లేక వేరెవరైనను, ఆ ముద్రలను విప్పుటకో, లేక పుస్తకమును బయలుపరచుటకో అధికారము లేదు; అయితే గొర్రెపిల్ల మాత్రమే దానిని తెరువగలదు. మరియు మనము పరిశోధించియున్నాము, మరి ఊహించియున్నాము, మరి తొట్రిల్లియున్నాము మరి ఆశ్చర్యపడియున్నాము, మరి ఆ కారణము వలననే మనమందరమును అటువంటి గందరగోళములో యుంటిమి. అయితే ఈ విమోచన పుస్తకము గొర్రెపిల్ల ద్వారా పరిపూర్ణముగా తెరువబడుననియు, మరియు అటు పిదప ముద్రలు గొర్రెపిల్ల ద్వారా విప్పబడుననియు, మరి ఈ దైవీక వాగ్దానముతో ఇప్పుడు మనము జీవించుచున్న కడపటి దినములలో, మరి గొర్రెపిల్ల ఈ పుస్తకమును తీసికొని ముద్రలను విప్పువరకు అది తెలుపబడదు. ఏలయనగా గుర్తుంచుకొనుడి, ఈ గ్రంథము సింహాసనాసీనుడైయున్న వాని చేతిలో యున్నది. ''మరియు గొర్రెపిల్ల సింహాసనాసీనుడైయున్న వాని యొద్దకు వచ్చి ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనును.'' గ్రంథమును తీసికొనును.

27ఓ, అది లోతైన కార్యము. పరిశుద్దాత్మ యొక్క సహాయము వలన మనకు సాధ్యమయితే దానిని పరిష్కరించెదము. ఇప్పుడు, మనము ఆయనపై ఆధారపడియున్నాము. మరియు మనము పిదప దానిని చూచెదము, ఇది అంత్యకాలమైయున్నది, ''కాలము గతించుచున్నది.'' ఈ గ్రంథమును అనువదించుటకు ఏ సంఘశాఖకు హక్కు లేదు. ఏ మానవునికి దానిని అనువదించుటకు హక్కులేదు. గొర్రెపిల్లయే దానిని అనువదించును; మరియు గొర్రెపిల్లయే దానిని గురించి చెప్పును; దానిని నిరూపించుచు, వాక్యమునకు జీవము నిచ్చుచు, వాక్యమును తెలియపరచును. చూశారా? ఖచ్చితముగా!

28గమనించుడి. మరియు అది ఇంకను బయలుపడలేదు… సంఘ కాలములు మరియు సంఘశాఖల కాలము ముగియు వరకు ఈ గ్రంథము బయలుపడదు, ''మరియు ఇక సమయము లేదు.'' దానిని చూశారా? సంఘ కాలములు మరియు సంఘశాఖల కాలము గతించిన తర్వాతనే అది బయలుపరచబడును.

ఆ కారణము వలననే ఈ కార్యము ఈ రాత్రి గుప్తముగా యున్నది. చూడుడి, వారు ఏదో ఒక చిన్న సిద్దాంతమును గైకొని దానిని ఒక ప్రక్క మాత్రము చూచుచు, ''దాని అర్థము ఇదే!'' అని చెప్పుచున్నారు. మరియొకరు ఇంకొక సిద్దాంతమును తీసికొని మరల అదే లేఖనములు ''దీని అర్థము ఇదే!'' అని చెప్పుచున్నారు. దాని ద్వారా ప్రతి ఒక్కరు, ఒక్కొక్క శాఖను ఏర్పరచుచు, అందుకు ఇప్పటికి మనకు వందలకొలది శాఖలకు కలిగియున్నాము. అయితే వీటన్నిటి మధ్య ఈ గందరగోళములన్నిటిని చూచి జనులు ''ఏది సత్యమని?'' ఆశ్చర్యపడుచున్నారు, నేటి స్థితి అది కాదా! అయితే ఆ కాలము సమాప్తమైనప్పుడు, అప్పుడు ఏడవ దూత యొక్క స్వరము ధ్వనించును!

MATT 28:19•

ACTS 2:38•

REV 10:7

 

29మరప్పుడు, ఆ సమయములో ఈ గ్రంథము బయలుపడును, అని ఆయన వాగ్దానము చేసియున్నాడు. అయితే ఆ కాలము సమాప్తమైనప్పుడు, అపుడు ఏడవ దూత యొక్క స్వరము ధ్వనించును, మరప్పుడు, ఆ సమయములో ఈ గ్రంథము బయలుపడును,'' అని ఆయన వాగ్దానము చేసియున్నాడు. ఇప్పుడు ''అప్పటి జనులు వెనుకటి వారు ఎవరును రక్షింపబడలేదని'' చెప్పవద్దు. అయితే మర్మములను వారు అర్ధము చేసికొనలేకపోయిరి! దేవుడెట్లు త్రిత్వముగా నుండి మరెట్లు ఒక్కడుగానుండగలడు! ''తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మమియ్యుడి,'' అని లేఖనములు చెప్పి మరియు మరల అదే లేఖనములు ''యేసు నామములో బాప్తీస్మమియ్యుడి,'' అని ఎట్లు చెప్పగలవు? (చూశారా? ఓ, అనేక కార్యములు!); హవ్వ ఆపిలు తిని సర్వ ప్రపంచమునకు ఎట్లు పతనము తీసికొని రాగలదు? చూశారా? అదెట్లు సాధ్యము? అయితే ఆ మర్మములన్నియును అంత్యకాలమందు బయలుపడునని వాగ్దానము చేయబడియున్నది. ఈ విధముగా వదిలిపెట్టబడిన ఇటువంటి చిన్న చిన్న విషయములను ప్రత్యక్షపరచుటకే, ఐరేనియన్, మరియు మార్టిన్ (పరిశుద్ధ మార్టిన్), మరియు పాలికార్ప్ మరియు పలువిధములైన వారు, మరియు లూథర్, మరియు వెస్లీ మరి వీరందరు ఈ గొప్ప యోధులందరు రంగము మీదికి వచ్చిరి. చూశారా? ఆ విధముగా వారు వచ్చి ఆ వెలుగును తీసికొని వచ్చి మరియు దానిని ప్రకాశింపచేయు వరకు జీవించిరి, అయితే వారు ఇంకా అనేక విషయములను చీకటిలో వదిలివేసిరి.

మరియు ఆ పిదప పెంతెకోస్తు కాలము వచ్చినది, లూథరను కాలమువలె వారు అంగములతో నిలిచిపోయిరి. అయినప్పటికిని పరవాలేదు, వారు సరికాదని చెప్పవద్దు. వారు వారి కాలము వరకు సరియే. అయితే వారు వివరించలేక విడిచిపెట్టబడిన కొన్ని సంగతులు గలవు. అయితే అప్పుడు.. ఎందువలన? ఈ విషయములన్నింటిని వివరించుటకు ఇంకా పూర్తిగా ఆ ముద్రలు విప్పబడలేనందువలన ఆ సంగతులు వారికి బయలుపరచబడలేదు. చూశారా?

REV 6:1

 

30అయితే చివరి కాలములో ఈ మర్మములన్నియును విశదపరచబడి మరియు అందించబడును. మరియు అప్పుడు సమయముండదు గాని, ముద్రలు గొర్రెపిల్ల ద్వార విప్పబడి మరియు సంఘమునకు బయలుపరచబడును. చూశారా? ఎంత అద్భుతము! అప్పుడు ఈ గ్రంథము, అది ఒక విమోచన గ్రంథము. ఏలయనగా అప్పుడు అది కొనసాగుచు… మరియు లక్ష-నలుబది-నాలుగు-వేలమంది ఏ విధముగా తీసుకొని రాబడెదరో మరి ఆ కార్యములన్నియును ఇంకొద్దిసేపైన పిదప మనము ధ్యానించెదము. మంచిది. అది యూదులు.

EPH 1:13,14

 

31ఇప్పుడు, పౌలు… మనము కొద్దిగా చదివెదము. నేను కొన్ని లేఖనములను కలిగియున్నాను, మనము వాటిని చదువవలయును. ఇప్పుడు మనము పౌలు ఎఫెసీయులు 1లో లేఖనమునకు త్రిప్పెదము. అనేకులు వ్రాసికొనుటను నేను చూచుచున్నాను. వారు వారి పుస్తకములను కలిగియున్నారు, లేఖనములను వ్రాసుకొనుచున్నారు, దానిని అట్లే కొనసాగించుకొనుటకు వారి పరిశుద్ధ గ్రంథములలో గుర్తించుకొనుచున్నారు. కావున, అది మంచిది. మీరు ఆ విధముగా చేయుటను నేనిష్టపడుచున్నాను, మరియు మీరు మీ గృహములకు వెళ్ళి దానిని చదువుకొనవచ్చును. చూశారా? మరియు మీరే దానిని చదువుకొనినయెడల దానిని మీరు చక్కగా అర్ధము చేసికొనగలరు. చూశారా? చదవండి. మరియు దానిని అర్ధము చేసికొనుటకు మీరు సహాయము చేయమని దేవుడిని అడగండి. ఇప్పుడు నేనిక్కడ వ్రాసియుంచుకొనియున్న ఒక లేఖనమును మనము చదివెదము. ఎఫెసీయులు 1:13 మరియు 14, ఇప్పుడు:

మీరును సత్య వాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

చూశారా?

32ఇప్పుడు లేఖనములను మనము తెరిచియుంచినప్పుడు, మనము… చూడుడి, పరిశుద్ధాత్మ ఇచ్చట యున్నది, అదే ఒక ముద్రగా యున్నది. పరిశుద్ధాత్మ ఒక ముద్రగా యున్నది. మరియు ముద్ర దేనిని సూచించుచున్నది (ఏమిటి) ముగించబడిన ఒక కార్యమునకు అది గురుతుగా యున్నది. ప్రతి యొక్కొక్కరికి పరిశుద్ధాత్మ ఒక ముద్రగా యున్నది. మరియు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అతని మూలుగు కాలము ముగియును, చూడుడి, ఏలయనగా అదొక ముగించబడిన కార్యము.

33నేను రైలు రోడ్డు కంపెనీలో పనిచేయున్నప్పుడు, తినుబండారాలను భద్రపరచుటకై డబ్బాలను తయారు చేయు కర్మాగారము నుండి వచ్చు డబ్బాలను, మేము లారీలలో ఎక్కించుట మాకు వాడుక. అయినప్పటికిని మరి ఆ రవాణా వాహనము ముద్రింపబడుటకు మునుపు అవన్నియును సరిగ్గా అమర్చబడినవా-లేవా అని ఒక ఇన్‌స్పెక్టర్ వచ్చి వాటిని తనిఖీ చేయును, అట్లు కానియెడల అవి ఒకదానిపై ఒకటి తగులుకొని పగిలిపోయి, ఆ డబ్బాలలో ఉన్న పదార్థములన్నియు చెదిరిపోవును. మరి ఆ రైలు రోడ్డు కంపెనీ దానికి బాధ్యత వహించవలయును. మరియు ఆ ఇన్‌స్పెక్టర్ అన్నియును సరిగా వాటి స్థానములో ఉన్నవో-లేవోయని పరీక్షించును. అట్లు లేనియెడల అతడు ఆ వాహనమును నిలిపివేయును. ఆ ఇన్‌స్పెక్టర్ తృప్తి చెందువరకు మరలా మేము వాటన్నిటిని సరైన స్థానములో ఉంచవలయును. మరి అటు పిమ్మట ఇన్‌స్పెక్టరుకు తృప్తికరముగా ఉన్న పిదప అతను తలుపును మూయును. మరియు ఇన్‌స్పెక్టర్ దానిపై ముద్రవేయును, మరటు పిమ్మట దాని గమ్యమును అది చేరు వరకు ఈ ముద్రను ఎవరును తీయలేరు.

EPH 4:30

 

34పరిశుద్ధాత్మ దానినే చేయుచున్నది, చూశారా? ఆయన వెళ్ళి మరియు ఆయన పరీక్షించును. ఆ కారణమువలననే ఈ కార్యములను మీరు కలిగియుండరు మరియు… మీరు చెప్పెదరు, ''నేను అన్య భాషలలో మాట్లాడియున్నాను, మరియు నేను కేకలు వేసియున్నాను, మరియు నేను ఆత్మతో నింపబడి నాట్యము చేసియున్నాను.'' దానితో ఏమీ పనిలేదు, చూశారా? ఆ కార్యములన్నియును ఏమిటని ఆ వ్యక్తిని సంపూర్ణముగా పరీక్షించిన పిదప పరిశుద్ధాత్మ తృప్తి చెందును. అటు పిమ్మట వారు వారి నిత్య గమ్యము చేరు వరకు ముద్రింపబడెదరు. ఆ ముద్రను ఏదియు విరుగగొట్టలేదు (విప్పలేదు).

పరిశుద్ధ గ్రంథము (మీరు మీ లేఖనములను వ్రాసుకొనుచున్నారు), ఎఫెసీ 4:30, చెప్పుచున్నది, ''దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రించబడియున్నారు.''

ఆ వాక్యమును గైకొనుడి, ''విమోచన,'' చూశారా! విమోచన గ్రంథము బయలుపరచబడు దినము వరకు, మరియు విమోచకుడు వచ్చి తన స్వాస్థ్యమును తీసికొనువరకు ఎవ్వరు దానిని తాక జాలరు. చూశారా? ''దానిని దుఃఖపరచవద్దు.'' దేవునికి ఇష్టమైన కార్యములను చేయుడి, ఏలయనగా ఇప్పుడు పుస్తకము ముద్రించబడియున్నది, మరియు మీరును ముద్రించబడియున్నారు. పరిశుద్ధాత్మయే ఆ ముద్రగా యున్నది.

35"ముద్ర" దేనిని సూచించుచున్నదనగా (ఇప్పుడు నేను నిఘంటువులో నుండి ఈ మాటలను తీసికొనియున్నాను), ''ఒక పూర్తి చేయబడిన పనిని'' ముద్ర సూచించును. మరియు ఏడవ ముద్ర విప్పబడినప్పుడు, ఈ ముద్రలలో ముద్రింపబడియున్న దేవుని మర్మము సమాప్తమగును. ఆ ముద్ర విప్పబడు దినము వరకు, విప్పబడినప్పుడు ఆ లోపట ఉన్నది బయలుపడును.

ఆ పెట్టెలను ఎక్కించు వాహనములో ఏమున్నదని అతను ఆశ్చర్యపడుచు చెప్పును, ''దాని లోపల ఇది ఉండవచ్చును, మరియు పలాన ఉండవచ్చును. అది ఉండవచ్చును…" అతను ఊహించుచు యుండవచ్చును. అయితే మరి ముద్ర విప్పబడినప్పుడు మరియు తలుపు తెరువబడినప్పుడు, మనము దానిలోనికి కచ్చితముగా ఏమున్నదో చూచెదము. మీరు దానిని చూచారా? మరియు అది కేవలము అంత్య-కాలములోనే జరుగును.

36మరియొక విషయము, ముద్ర ''యాజమాన్యమును'' సూచించును. ముద్రపైన ఒక గుర్తు ఉండును — అది యాజమాన్యమును చూపించుచున్నది. మీరు యేసుక్రీస్తు రక్తమువలన కొనబడి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడియున్నయెడల మీరు లోకమునకు చెందినవారు కారు, లేక లోకమునకు చెందిన ఏ కార్యమునకు మీరు సంబంధించినవారు కారు. మీరు దేవుని సొత్తు.

మరొక విషయము ఏమనా ముద్ర అనగా ఒక ''భద్రత,'' అని అర్ధమిచ్చుచున్నది. ముద్ర అనగా మీరు క్షేమముగా లేక భద్రముగా యున్నారని అర్ధము. ఇప్పుడు మీలో నిత్య భద్రతను నమ్మనివారున్నయెడల ఇచ్చటుండవచ్చు. నాకు తెలియదు. అయితే ఇప్పుడు… అయితే ఒక ముద్ర గమ్యస్థానము చేరువరకు అది భద్రముగా నున్నదని సూచించుచున్నది. ఆ ముద్రను విరుగగొట్టుటకు ప్రయత్నించువానికి అయ్యో, శ్రమ! మరియు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను విరుగగొట్టలేము.

''సాతాను నేను ఈ విధముగా చేయునట్లు చేసినదని,'' జనులు చెప్పుచున్నారనే దానిని నేను మీకు చెప్పియున్నాను; కానే కాదు, సాతాను దానిని చేయలేదు, కేవలము మీరు దానిలోపల ముద్రింపబడలేదు. ఏలయనగా మీరు లోపల ముద్రింపబడినప్పుడు, సాతానుడు బయట ముద్ర౦పబడియున్నాడు, చూచారా.

37ఇప్పుడు, మీరు అతని కొరకు బయటికి వెళ్ళియున్నారు. అతను రావలయుననిన మీరు వచ్చిన ప్రకారమే అతను రావలయును. అతడు లోనికి ప్రవేశించలేడు, ఎందుకనగా అతను కూడా రక్షింపబడవలయును, పరిశుద్ధపరచబడవలయును మరియు అతడు పరిశుద్ధాత్మతో నింపబడవలయును, ఆ విధముగా అతను వచ్చినయెడల అతను మీ సహోదరుడగును. కావున మీరు చూశారా, కావున అతను దానిని చేయలేడు. కాదు, కాదు. నీవు సరిహద్దు వరకు వెళ్ళావు, మరి లోక ఆశలను ఆశించి తిరిగి వచ్చియున్నావు. నీవు కానాను వరకు పోలేదు, యోర్దానును నీవు దాటలేదు, అనగా నీకు నీవు మరణించలేదు. చూశారా?

ROM 8:22,23

 

38ఇప్పుడు, గమనించుడి. ఇప్పుడు, ఈ గ్రంథము ముద్రించబడియున్నది. మరియు మీరు గ్రంథముతో విమోచన దినమువరకు ముద్రింపబడియున్నారు. మరల రోమా 8:22 మరియు 23. దానిని తీసి దాని వెనుక ఉన్న కార్యములను చూచినయెడల, దానిని ప్రతి వ్యక్తి తనకు తానుగా చదివినయెడల దానిని చక్కగా అర్ధము చేసికొనగలరని నేను అనుకొనుచున్నాను. నేను మీరు చూచునట్లు కొన్ని లేఖనములను ఇచ్చుచున్నాను, మరియు సమయమున్నప్పుడే. ఇప్పుడు, రోమా 8:22 నుండి:

సృష్టి యావత్తు ఇది వరకు ఏక గ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని యెరుగుదుము.అంతే కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడ దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.

39ఓ, మై! ఓ,మై! వృద్ధులగుచున్న మనకు అది ఆనందము కలిగించుట లేదా? ఆ సమయము కొరకు కాచుకొనియుండుట వలన అది మనకు ఆనందము కలిగించవలయును. మొదటి పునరుత్థానములో ఇది సంభవించునని మనము గ్రహించియున్నాము. చూశారా? సృష్టి మూలుగుచున్నది, మనము మూలుగుచున్నాము, సమస్తమును మూలుగుచున్నది, ఏలయనగా ఎక్కడో ఏదో సరిగ్గా లేదని మనము గుర్తించియున్నాము. మరియు నీవు దాని కొరకు మూలుగుచూ కనిపెట్టవలయును, ఏలయనగా క్రొత్త ప్రపంచమును గురించి చెప్పబడు ఆ నూతన జీవితము ఇచ్చటికి వచ్చుచున్నది.

40ఇచ్చటనున్న నా భార్య నేను కొద్దికాలము క్రితము సూపర్ మార్కెట్‌కు వెళ్ళాము. మరి నేను చెప్పాను, మేము ఒక వింతైన కార్యమును చూశాము; ఒక స్త్రీ దుస్తులు ధరించియుండెను, మరి అది వింతగా నుండెను. వారిలో దరిదాపు అనేకులు దుస్తులు ధరించనే లేదు. మీరు చూచారా. మరెట్లో వారు మరచిపోయారు, వారు దుస్తులు లేకుండా బయటకు వెళ్ళుచున్నారు. కావున అట్లైన మనము.. (వారు ఇష్టపూర్వకముగా మరచిపోయి యున్నారు).

కావున మరప్పుడు, మీడా నన్ను అడిగెను, ''బిల్లీ అదెందుకు అట్లున్నది?'' అని ఆమె అన్నది…

''ఓ,'' నేను చెప్పాను, ''అది ఈ దేశము యొక్క ఆత్మ'' మరియు నేను చెప్పాను, ''నీవు జర్మనీకి వెళ్ళినయెడల వారికి ఒక విధమైన ఆత్మయుండును. ఫిన్‌లాండ్‌కు వెళ్ళినవారి దేశపు ఆత్మ వారికి యుండును. నీవు అమెరికాకు వచ్చిన యెడల మనకు ఒక దేశపు (అమెరికన్) ఆత్మయుండును.'' మన దేశపు ఆత్మ సరసముల, వినోదముల ఆత్మైయున్నది. ఎందువలన అని మీకు తెలియునా? అపొస్తలుల బోధనలపై మనము నిర్మింపబడియున్నాము. గొప్ప వ్యక్తులైన వాషింగ్‌టన్, లింకన్ నాయకత్వము క్రింద మనము స్థాపింపబడియున్నాము. అయితే ఆ పునాది నుండి మనము తొలగిపోయాము. మరియు అది మనము పొందియున్నామని ఎరిగియున్నాము. అణుబాంబుపై మన పేరు వ్రాయబడి యున్నదని మనము ఎరిగియున్నాము. ఆ దాస్యము మనముందున్నదని మనము ఎరిగియున్నాము. మిమ్ములను మీరు మోసపుచ్చుకోనవసరము లేదు.

41హాస్యగాళ్ళు కొందరు సరసోక్తులు చెప్పుకొనుచుండుటను, మరియు స్త్రీలు, పురుషులు తమకిష్టము వచ్చినట్లు చేయుచుండుట, నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అది ఒక చిన్నపిల్లవాడు సమాధుల యొద్ద పోవుచు తనకు భయములేదని చూపించుకొనుటకు ఈల వేయులాగున్నది. నిజమగా అతను భయపడుచున్నాడు. చూశారా? వాడెవరినీ మోసముచేయలేడు. అందువలననే అతను ఈల వేయుచున్నాడు. చూశారా? అతను భయపడలేదని చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు. అయితే అతను భయపడుచున్నాడు.

మరియు ఈ రోజు జరుగుచున్న కార్యము అదే. అయితే మన యొక్క విమోచన సమీపముగా యున్నదని చేతులుపైకెత్తు విశ్వాసికి ఎటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఇటువంటి కార్యములు జరుగుట చూచునప్పుడు విశ్వాసికి అదొక గొప్ప సమయమైయున్నది.

42ఇప్పుడు, ఈ సంగతులు, మన శరీరములోని ఆ మూలుగులు. ఒక చెట్టు జీవమునకై ఎట్లు పోరాడునో మీరు గమనించారా? అది జీవించవలయునని కోరుచున్నది. మరియు ఒక జంతువు తన ప్రాణము పోవు సమయములో ఎట్లు పోరాడునో మీరు గమనించుడి. మీరు ఒక మానవుని, సమస్త సృష్టిని అది మూలుగుటను గమనించుడి. మనము కూడా మనలో మూలుగుచున్నాము. చూశారా? ఎక్కడో ఏదో పొరపాటుయున్నదని మనకు తెలియును. ఈ వచనములను బట్టి మనము చూచుచున్నాము మానవుడును, భూమియును దేనినో పోగొట్టుకొని యున్నది. పలు రకములైన సృష్టియును దేనినో పోగొట్టుకొని యున్నవి, ఏదో ఒక కారణము చేత అవి మూలుగుచున్నవని, ప్రేరిత వాక్యము ద్వారా మనము చూచుచున్నాము. మీరు ఒక కారణము లేకుండా మూలుగరు. నేను సిరాను గురించి చెప్పియున్నాను, దానికొక కారణమున్నది.

43అందువలననే రోగుల కొరకు ప్రార్థించునప్పుడు; మీరు కారణమును కనుగొను వరకు… స్వస్థత నాకు తెలియును, అయితే కారణమును నేను కనుగొనవలయును. అందువలననే దర్శనములు ప్రాముఖ్యమైయున్నవి, అవి కావలసియున్నవి. అది హృదయ రహస్యములను బయలుపరచును, ఎక్కడ నీవు తప్పు చేసినావనే దానిని మరియు నీవు ఏమి చేయవలెనని ఆ వ్యక్తితో అది చెప్పును. చూశారా? మీరు ఎన్ని మందులు వాడినను లేక వారి తలలపై ఎంత నూనె పోసినను లేక, ఎవరైనను మీపై ఎంతగా అరచి కేకలేసినను; ఏదైనను తప్పు ఉండినయెడల వాడు అక్కడనే యుండును. నేను ''వాడు'' అని చెప్పాను. అనగా, అదే సాతాను.

చూశారా, ఈ రోజు, మనము వైద్య రంగములో ఎంత ముందంజ వేసినను ఈ కార్యములను గురించి మనకు తెలియదు. మీరు చెప్పెదరు, ''అతనికి క్యాన్సర్ కలదు.'' సరి దానితో ఏమి లేదు. అది వాటికి ఇయ్యబడిన పేర్లు. వైద్య రంగములో ఇవ్వబడిన పేరు క్యాన్సర్. వాటివలన వారికేప్రయోజనము లేదు. దానిని ఆ పేరుతో మనము పిలిచెదము. క్యాన్సర్ పేరుతో మనము ఆ వ్యాధిని పిలిచెదము. అయితే నిజముగా అదేమిటని దానిని విప్పి చూచినయెడల అది దయ్యము.

44ఇప్పుడు, మనము చెప్పెదము ''పాపము,'' దానిని పాపము అని పిలిచెదము. విప్పి చూడండి. పాపమనగా ఏమిటి? అనేకులు చెప్పెదరు, ''త్రాగుట వ్యభిచారము చేయుట.'' కాదు, కానేకాదు. అవన్నియును పాపము యొక్క లక్షణములు. చూశారా? పాపము వాటినే కలుగజేయును చూడుడి. అయితే నిజమైన పాపము అవిశ్వాసము. అక్కడే - వాటికి పేరియ్యబడి పిలువబడియున్నది. మీరు విశ్వాసియైన యెడల ఆ కార్యములను మీరు చేయరు. అయితే నీవు ఎంతగా పరిశుద్ధుడవుగా ఉండుటకు ప్రయత్నించినను, మరియు మీరు ఎంత భక్తిమంతుడుగా కనబడుటకు ప్రయత్నిచినను, మీరు ఆ కార్యములను చేసినయెడల మీరు ఒక అవిశ్వాసిగానే యుందువు. అది లేఖనానుసారమైనది.

45ఇప్పుడు, ఏదో పోగొట్టుకొనబడియున్నది, మరియు అది మూలుగుచున్నది. అది మరల వెళ్ళుటకై, దాని యొక్క నిజమైన స్థానమునకు మరల వెళ్ళి చేరుటకు అది ప్రయత్నించుచున్నది. ఎవరో ఒకరు భూమిపై నుండి అగాధములోనికి పడి, పైకి వచ్చుటకు ప్రయత్నించుచు, ఎక్కుటకు ప్రయత్నించుటలో దానిని దీనిని లాగుచుండుటను మీరు ఊహించగలరా? వారేలాగైనను ఆ గుంట నుండి పైకి రావలయును. వారు వారి యొక్క మొదటి స్థానమునందు లేరు. మరియు వారు వెర్రిగా కేకలువేయుచున్నారు, వారి గోళ్ళతో గోడలను ఎక్కుటకును, కేకలేయుచు లేక, వేరే ఏదో విధముగా పైకి ఎక్కుటకై ప్రయత్నము చేయుచుండిరి. వారు మూలుగుచున్నారు, ఏలయనగా వారు వారి యొక్క మొదటి స్థానమునకు వెళ్ళవలెనని యున్నారు.

ROM 8:22,23

 

46అందువలననే ఒక వ్యక్తి వ్యాధితో మొత్తబడినప్పుడు బాధతో, నొప్పితో ఉండును (ఒకప్పుడు వారు ఆ విధముగా లేరు), అయితే వారు మూలుగుచున్నారు. ఎందువలన? వారు సరైన స్థానములో లేరు. ఎక్కడో ఏదో తప్పిదము జరిగియున్నది. వారికి ఆరోగ్యము ఉన్నప్పుడు వారు ఎక్కడ ఉండిరో ఆ చోటికి వెళ్ళుటకు వారు ప్రయత్నించుచు మూలుగుచున్నారు. పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లు, మరియు ప్రకృతియు, ప్రజలును, ''మూలుగుచున్నారు,'' అది దేనిని చూపించుచున్నదనగా వారుండవలసిన స్థితిలో వారు లేరని తెలియుచున్నది. వారెక్కడినుండో పడిపోతిరి.

47ఇప్పుడు, దానిని గురించి మనకెవ్వరు అనువదించవలసిన అవసరత లేదు, చూశారా, ఏలయనగా వారు నిత్యజీవము నుండి పడిపోతిరని మనకు తెలియును. మరియు వారు నిత్య జీవముపై హక్కును కోల్పోతిరి, ఆదాము మరియు హవ్వ ఏదెను తోటలో నిత్య జీవము నుండి మరణములోనికి పడిపోయినపుడు, వారి అధీనములోనున్న సృష్టియావత్తును మరణములోనికి తీసికొని వెళ్ళిరి.

ఆదాముకు మునుపు, ఒక వృక్షము ఎన్నడును చావలేదు. ఆదాముకు మునుపు ఒక జంతువు ఎన్నడును చావలేదు. మరియు చనిపోనటువంటి ఒకే ఒక కార్యము కలదు, దేవుడు మాత్రమే మృత్యువునకు అతీతుడు, ఏలయనగా ఆయన నిత్యుడు. మరియు మనము మరణమును తప్పించుకొనుటకు అదొక్కటే మార్గము గలదు. మనము చనిపోకుండ ఉండుటకు, మనము దేవుని కుమారులుగా, మరియు కుమార్తెలుగా ఉండవలయుననిన మనము మనలో నిత్యజీవము కలిగియుండవలెను. అయితే మనము పాపములో చనిపోయినప్పుడు, ఈ ఉదయము వర్తమానములో నేను చెప్పిన విధముగా, మనము మన జన్మహక్కును అమ్ముకొని మరియు ఈ స్థితికి వచ్చియున్నాము, ఇప్పుడు ఈ స్థితిలో నిత్య జీవమునకు ఈ ప్రక్క దేవునిని అందుకొనలేని స్థితిలో ఉన్నాము.

48ఆదాము మరణములో పడిపోయినప్పుడు, అతడు సమస్త సృష్టిపై మరణమును తీసుకొని వచ్చెను. ఇప్పుడు అతనికి స్వేచ్ఛ ఇవ్వబడెను. మనకివ్వబడినట్లు ఎన్నిక చేసికొనుటకు వారికివ్వబడెను.

ఇప్పుడు, ఆదాము మరియు హవ్వ ప్రారంభములో, వారికి ముందు మంచి, చెడు వృక్షము ఉండెను, మరియు అదే వృక్షము మనందరిముందు ఉంచబడియున్నది. చూడుడి, దేవుడు ఆదాము లేక హవ్వకు మాత్రము చేయలేదు… మీరు చెప్పవచ్చును, ''సరి, అది వారి యొక్క తప్పు అని.'' కాదు, ఇప్పుడు అట్లు కాదు. అది మీ యొక్క తప్పుగా యున్నది. దానిని ఇప్పుడు ఆదాముపై మోపజాలరు. దానిని మీపై మీరు మోపుకొనవలయును, ఏలయనగా మంచి, చెడు మీ ముందర ఉంచబడియున్నది. ఆదాము మరియు హవ్వలవలె మనము అదే స్థితిలో ఉంచబడియున్నాము.

49అయితే మీరు చూశారా, మనము విమోచింపబడినపుడు, మన స్వచిత్తము లేక కోరిక మనకక్కరలేదు, అయితే ఆయన కోరిక లేక చిత్తము మనకు కావలసియున్నది. చూశారా? ఇప్పుడు, ఆదాము మరియు హవ్వ వారి యొక్క స్వచిత్తమును వారు కోరుకొనిరి. వారు జ్ఞానమనగా ఏమిటని తెలిసికొనగోరిరి, కావున దానిని వారు అన్వేషించిరి మరి అది మరణమును కలిగించినది.

50ఇప్పుడు, ఒక వ్యక్తి విమోచింపబడినపుడు, అతడు విద్యకొరకై లేక విద్యకొరకైన వేతనము కొరకు లెక్కచేయడు. అతడు ప్రపంచ కార్యముల కొరకు, ప్రపంచ జ్ఞానము కొరకు లేక్కచేయడు. తన చిత్తము జరిగించుకొనడు. అతని కోరిక క్రీస్తుగా నుండును మరి అది అంతే. అతను విమోచింపబడియున్నాడు. అతను తన్నుతాను నడిపించుకొన కోరుకొనడు. అతను ఎక్కడికి వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో అను సంగతులను ఇతరులతో అతడు సంప్రది౦చడు. అతను తన సృష్టికర్త యొక్క చిత్తము ఏమైయున్నదో దాని కొరకై కాచుకొనియుండి కనుగొనును. తన సృష్టికర్త తనను పొమ్మని చెప్పినప్పుడు, అప్పుడతను తన యొక్క సృష్టికర్త యొక్క నామములో పోవును.

అయితే జ్ఞానమును అన్వేషించు వ్యక్తి, ''సరి ఈ సంఘము చాలా బాగున్నది; అయితే అక్కడ దూరమున నున్నవారు నాకు అధికముగా చెల్లించెదరు, కావున నేను అచ్చటికి వెళ్ళెదను,'' అనే దానిని కనుగొనును. చూశారా? చూడుడి, అది జ్ఞానమైయున్నది.

GEN 2:17

 

51ఇప్పుడు, ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకొనుటకు బదులుగా తన భార్య మాట వినినందువలన అదే అతనిని పాపము చేయునట్లు చేసినది. అతని భార్య సాతానుతో కారణములడిగి పిమ్మట ఆ ఉత్పత్తిని ఆదాముకి ఉత్పత్తి చేసినది, మరియు ఆదాము వాక్యమును విడిచి, అమ్ముడుపోయెను. అతను తన సహవాసమును మరియు జీవము యొక్క తన హక్కును పోగొట్టుకొనినప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయెను. గుర్తుంచుకొనుడి, ''దానిని నీవు తిను దినమున నిశ్చయముగా నీవు చనిపోయెదవు.''

మరియు అతడు తన జీవమును పోగొట్టుకొనినప్పుడు, అతని జీవములోనున్న తన స్వాస్థ్యమును కూడా కోల్పోయెను, ఏలయనగా భూమిపైయంతటను అతను సర్వాధికారము కలిగియుండెను. అతడు భూమికి దేవుడు. దేవుడు విశ్వమంతటిలో ఎక్కడైనయుండును. అయితే ఆయన కుమారుడు ఈ భూమిని తన ఆధీనములో ఉంచుకొనెను. అతను పలికినది జరిగెను, అతడు పేర్లు పెట్టగలడు, అతను చెప్పగలడు, అతను ప్రకృతిని నిలుపగలడు, అతడు తాను కోరుకొనుదంతయును చేయగలడు. చూశారా? అయితే అతడు దానిని చేసినప్పుడు తన స్వాస్థ్యమును కోల్పోయెను.

ఇప్పుడు, ఆదాము చెప్పగలడు, ''ఈ కొండ కదిలి అక్కడికిపోవును గాక,'' మరది ఆలాగే చేయును. ఆదాము ఇట్లనగలడు, ''ఈ చెట్టు పెకలింపబడి అక్కడ నాటబడును గాక,'' దానిని అది చేయును. చూశారా? ఏలయనగా మన తండ్రియైన దేవుని క్రింద ఒక చిన్న దేవునిగా అతనికి సంపూర్ణ, పరిపూర్ణ అధికారము ఉండెను, ఏలయనగా అతను దేవుని యొక్క కుమారుడు.

JOHN 14:12

 

52ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషము ఆగి నిజమైన వర్తమానమును చూచెదమా! చూశారా? ఓ! అప్పుడు రక్తము కనుక దానిని పరిశుద్ధపరచినయెడల మరి దానిని గురించి ఇప్పుడేమిటి? గమనించుడి, రెండవ ఆదామైన దేవుని కుమారుడు ఏమి చేసెను. చూశారా? మరియు చెప్పెను, ''నేను చేయు క్రియలు, మీరును చేయుదురు.'' చూశారా?

ఆదాము భూమిపై తన స్వాస్థ్యమును కోల్పోయెను. ఇప్పుడు, అది అతని చేతులను దాటి అతను అమ్ముడుపోయిన సాతాను యొద్దకు పోయెను. దేవుని యందు తనకు గల విశ్వాసమును సాతాను హేతువాదమునకు అతడు అమ్మివేసెను. అందువలననే తనకు సొంతమైన తన నిత్య జీవమును, జీవ వృక్షముపై తనకు గల హక్కును, భూమిపై తనకు గల హక్కును తన సమస్తమును సాతాను హస్తముల యొద్ద పోగొట్టుకొనెను. తన యొద్ద నుండి సాతాను చేతులకు దానిని దాటిపోవునట్లు అతడు చేసెను. అందువలననే ఇప్పుడు అది కలుషితమాయెను. భూమిపై ఆదాముకు ఉండవలసిన స్వాస్థ్యమును ఆదాము యొక్క సంతతి కోల్పోయినది. అది సరియే, చూశారా, ఆదాము సంతతి.

53నేను జీవించుచున్న టూసాన్‌లో, నేను ఒక రోజు ఆగాను, మరియు నేను కొండపై ఎవరితోనో మాట్లాడుచూ క్రిందికి చూచాను. నేను అడిగాను, ''నీవేమి తలంచుచున్నావు… మూడు వందల సంవత్సరముల క్రితము పాత పపాగో అను అమెరికన్-ఇ౦డియన్ తన భార్యతో కూడా పిల్లలను వీపుపై మోసుకొని వచ్చి అక్కడ నివాసమేర్పరచుకొని సమాధానముగా జీవించుచుండెను. వారి మధ్య వ్యభిచారము, విస్కీ త్రాగుట, జూదము ఆలాటి కార్యములు ఏమీ లేకుండెను. వారు పవిత్రముగా జీవించిరి. మరియు తోడేలు టూసాన్‌లో నీటి యొద్దకు అరచుచు వచ్చును. ఆ నది ఒడ్డున చెట్లు, ముండ్ల చెట్లు చక్కగా పువ్వులు పూసియుండును, యెహోవా ఈ దృశ్యమును తొంగి చూచి తిలకించుచు సంతోషించి చిరునవ్వు చిందిచియుండును."

అయితే తెల్లవారు అక్కడికి వచ్చి, మరి అతను చేసినదేమిటి? ముండ్ల చెట్లనన్నిటిని త్రవ్వి పెరికి వేసెను. అతను బీరు సీసాలు మరియు విస్కీ సీసాలతో దేశమును కలుషితము చేసెను. అతడు దేశము యొక్క నీతిని పతనము చేసెను. అమెరికన్-ఇండియనుల ఆహారమగు గేదెలను చంపుట ద్వారా వారిని తరిమి వేయసాగారు.

54ఒక రోజు నేను మ్యూజియమ్‌లో నున్న సమాధుల ఫలకములను చదువుచూ జెరోనిమో అను అమెరికన్-ఇండియన్‌ల నాయకుని యొక్క ఫోటోలను చూచాను. మరియు మీలో అనేకులకు జెరోనిమో ద్రోహి, చెడ్డవాడనే అభిప్రాయము కలదు. నాకయితే అతడు అసలయిన అమెరికను. దేవుడు అతనికిచ్చిన ఒక భూమి, మరియు ఒక దేశము, మరియు నివసించుటకు ఒక స్థలము ఆ హక్కుల కొరకు అతడు పోరాడుచుండెను. అతనిని నేను నిందించను.

మరియు ఆ తెల్ల సైనికులు అక్కడికి వచ్చి, బలవంతముగా ఆ భూమిని లాగుకొని వారిని ఈగల గుంపును చంపినట్లు చంపిరి. మరియు జెరోనిమో వైద్య ప్రధాన కార్యాలయము, లేక అతని వైద్యశాల యొక్క అసలైన చిత్రములు అచ్చటయున్నవి. అది ఒక చెట్టుపై రెండు లేక మూడు దుప్పట్లు వేసియుండును. మరియు వారు దేవుడు వారికిచ్చిన హక్కుల కొరకు పోరాడి గాయపడిన, నిజమైన, అసలైన అమెరికనులు (ఇండియనులు). మరియు జెరోనిమో అక్కడ తన సొంత శిశువును ఎత్తుకొని పెన్సిలిన్ లేక మరేదియును లేకుండా రక్తము కార్చుచు, చనిపోవుచున్న తన సొంత యుద్ధ వీరులను నిలబడి చూచుచుండెను, వారికి సహాయపడుటకు మార్గమే లేకుండెను; స్వచ్ఛమైన, దేవుడు వారికిచ్చిన అమెరికనులు! అతనిని ఒక దుర్మార్గుడని, తిరుగుబాటుదారుడని పిలుచుచున్నారా? నేను అతనిని పెద్ద మనుష్యుడు అనెదను.

55కోకైస్ ఎన్నడూ లొంగియుండేవాడు కాడు. అతను ఒక వృద్ధుడు. అయితే అమెరికన్ సైన్యము (వారందరూ దుస్తులు దరి౦చుకొనివారై), అక్కడికి వెళ్ళి గేదెలనన్నిటిని చంపెదరు. వారు వినోద యాత్రలకు అని వెళ్ళి, మరి పశువులను కాల్చి చంపు తుపాకిని ( sharpe) కనిపెట్టెను, మరి వారు అక్కడికి వెళ్ళి మరి ''ఓ, నాకు ఈ రోజు చాలా బాగున్నది,'' అని చెప్పెదరు, వాహనముల ప్రక్కన నిలబడి వాటిని కాల్చి చంపెదరు. చెప్పెదరు, ''ఈ రోజు నేను నలభై కాల్చి చంపియున్నాను.'' నలభై పశువులు అవి ఆ మొత్తం ఇండియనుల జాతికి రెండు సంవత్సరములు లేదా ఇంకా ఎక్కువగా ఆహారముగా ఉపయోగించుకొనెదరు. వాటిని చంపిన పిదప వారేమి చేయుదురు? ఎడారిలో అట్లే పడవేయుదురు. వాటి కుళ్ళిన మృత కళేభరములు ఆ ప్రాంతమంతటిని దుర్వాసనతో నింపినవి. తోడేళ్లు వాటిని భక్షించును.

GAL 6:7

 

56ఇండియనులు ఒక ఎద్దు లేక పశువును చంపినపుడు ఒక మత ఆచార ఉత్సవము లాంటిది జరుపుకొందురు. వాటి డెక్కలను అతను తీసి మూకుళ్ళను చేసికొందురు. వాటి మాంసమును వారు తినెదరు, ప్రేగులవరకు తినెదరు. దాని మాంసమంతటిని వారు తీసివేసి మిగిలిన దానిని ఎండ వేయుదురు. వాటి చర్మమును ఎండవేసి వాటిని వస్త్రములు గాను, మరియు గుడారములు గాను వారు చేసికొనిరి. వాటిలో ఏదియు మిగిలియుండలేదు…

అయితే తెల్లవారు వచ్చినప్పుడు, ఆ తెల్లవాడే దుర్మార్గుడు, ద్రోహి. వాడు దుష్టుడు. మరి వాడు లోనికి వచ్చి ఆ పశువులనన్నిటిని చంపివేసి అక్కడున్న ఇండియనులను ఆకలితో మాడ్చెను. తనకు దేవుడిచ్చిన హక్కులకు గాను ఏ నిజమైన వ్యక్తి అయినను పోరాడును. అమెరికనులు వారికి చేసిన కార్యము అమెరికనుల పతాకముపై ఒక మచ్చగా మిగిలినది. అది వారికే చెందును. మీరు ఏమి తలంచెదరు.

ఒకవేళ జపాను, లేక ఏదో, రష్యాలోనికి వచ్చి, ''ఇక్కడి నుండి పొండి! వెనుకకు పోండి,'' అని చెప్పిన, మరియు మనము ఆ ఇండియనులకు చేసిన విధముగా మనకు మన పిల్లలకు చేసిన ఎట్లుండును? అయితే గుర్తుంచుకొనుడి, మనము విత్తియున్నాము, మరిప్పుడు దానినే మనము కోయబోవుచున్నాము. మీకు తెలియునా, అది దేవుని చట్టము. నాటుకాలము ఒకటున్నది, మరియు అటు పిదప ఒక కోతకాలము ఉన్నది. అది చాలా నీచమైనదని నేను తలంచుచున్నాను. అవునండి.

REV 11:18

 

57ఇప్పుడు ఏమి జరిగినది? కలుషితమైన ఆదాము సంతానము దేశమునే కలుషితము చేసి మరియు ఖచ్చితముగా సర్వనాశనము చేసెను. పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నదని మీకు తెలియునా? చెడిపోయిన ఆదాము సంతానము దానిని చేసినందువలన దేవుడు వారిని నాశనముచేయును. మీరు దానిని చదువగోరుచున్నారా? మనము దానిని చూచెదము. దానిని నేనిక్కడ వ్రాసియున్నాను. ప్రకటన 11వ అధ్యాయమునకు త్రిప్పండి, మరి దానినక్కడ కనుగొనెదము. ప్రకటన 11వఅధ్యాయమునకు వెళ్ళినయెడల, మరి అక్కడ భూమిని నాశనము చేయువారిని గురించి దేవుడు ఏమి చెప్పియున్నాడో చూచెదము. 11వ అధ్యాయము మనము 18వ వచనము తీసికొనెదము, నేను అదే అనుకొనుచున్నాను 1:18. ఇదిగో ఇక్కడ మనము:

జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్దులకును, నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలము నిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

REV 11:18

 

58వారేమి చేయబోవుచున్నారు? వారేమి విత్తిరో దానినే కోయుదురు, నిశ్చయముగా. మీరు పాపము వీధులలో పరుగెత్తుటను చూచున్నప్పుడు! ఎన్ని ఈ ఆదివారపు రాత్రి, ఎన్ని వ్యభిచారములు ఈ నగరములో ఈ రాత్రి జరుగనైయున్నవి? జెఫర్‌సన్‌విల్ అను ఈ చిన్న భూభాగములో ఎందరు స్త్రీలు పెండ్లి ప్రమాణములను విచ్ఛిన్నము చేయుచున్నారు? ముప్పై దినములలో చికాగోలో ఎన్ని గర్భస్రావపు కేసులు నమోదుకాబడినవి? నెలకు ఇరవై-అయిదు మరియు ముప్పె వేల కేసులు నమోదగుచున్నవి, లెక్కకు రానివి ఇంకెన్నో యున్నవి చికాగోలో ఎంత విస్కీ త్రాగబడుచున్నది? ఒక రాత్రిలో లాస్ఏంజలస్‌లో ఏమి జరుగుచున్నది అనుకొనుచున్నారు? ఈ రోజు జెఫర్‌సన్‌విల్ పట్టణములో ఎన్ని పర్యాయములు ప్రభువు నామము వ్యర్థముగా ఉచ్ఛరింపబడుచున్నది? జార్జి రోజర్స్ క్లార్క్ తెప్ప మీద వచ్చినప్పటి కాలము బాగున్నదా లేక ఇప్పుడు బాగున్నదా?

మీరు చూశారా, మన యొక్క అసహ్యమైన కార్యములతో భూమిని కలుషితము చేసియున్నాము, మరి దేవుడు ప్రపంచమును నాశనము చేయు వారిని నాశనము చేయును. దేవుడు ఆ విధముగా చెప్పెను. నాలో ఏదో యున్నదని నేను ఎల్లప్పుడును తలంచుకొనుచుందును, పర్వతముల పైకి వెళ్ళి దేవుడు వాటిని ఏ విధముగా అమర్చియున్నాడో చూడ గోరుదును.

59ఫ్లోరిడా అంటే నాకిష్టముండదు, అక్కడ వారు కృత్రిమ ఈత చెట్లు ఉంచియున్నారు. ఆ హాలివుడ్‌లో కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటికంటె, ఈ త్రాగుబోతుల వైభవముకంటె ఎక్కడో అరణ్యములో తోక ఆడించుచు తిరుగుచున్న మొసలిని చూచుట నాకు ఇష్టము. మరియు ఓ మై, నేననుకొనుచున్నాను, ''ఒక రోజు, ఒక రోజు!'' అవును.

MATT 5:5

 

60అయితే గుర్తుంచుకొనుడి, మత్తయి 5వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథము మనకు చెప్పుచున్నది, ''సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు.'' అది వాస్తవము. ''సాత్వికులు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.'' యేసు చెప్పెను, ''సాత్వికులు ధన్యులు.'' వారు సర్వ సామాన్యముగా యుండి ఏదో గొప్పగా యుండవలయునని ప్రయత్నించరు, ''అట్టివారు భూమిని స్వతంత్రించుకొందురు.'' యేసు ఆలాగు చెప్పియున్నాడు. అవును.

ఇప్పుడు, వారు దానిని కలుషితము చేసియున్నారు, మరియు దేవుడు వారిని నాశనము చేయును. అయితే అది శుద్ధీకరింపబడిన పిదప సాత్వికులు భూమిని స్వతంత్రించుకొనెదరు.

61ఇప్పుడు, ఓ, మై! పోగొట్టుకొనిన హక్కు పత్రము అసలైన యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతిలో నున్నది. భూమిపై, నిత్యజీవముపై హక్కు పత్రము ఆదాము దానిని కోల్పోయినప్పుడు; సాతాను యొక్క మలినమైన హస్తములు దానిని గైకొనలేకపోయెను, కావున అది అసలైన యజమానుడైన దేవుని యొద్దకే తిరిగిపోయెను. ఇంకొక నిమిషములో దానిని మనము కనుగొనెదము. అక్కడ ఆయన హక్కు పత్రము తన చేతులందు ఉంచుకొని సింహాసనముపై కూర్చొనియున్నాడు. ఓ, అది నన్ను భక్తి పరవశతలో ఉండు అనుభవము నిచ్చుచున్నది. నిత్యజీవమునకైన హక్కు పత్రం, నిత్యజీవమునకైన సంగ్రహ హక్కు పత్రములు, విశ్వాసమునకు బదులు జ్ఞానము కొరకు ఆదాము వాటిని పోగొట్టుకొనినప్పుడు, అది యజమానుడైన, సర్వోన్నతుడైన దేవుని చేతుల యొద్దకు తిరిగిపోయెను, ఎటువంటి గొప్ప కార్యము అది!

అది సరి. కాచుకొనియున్నది… అదేమి చేయుచున్నది? దేవుని చేతిలో యుండి, అది విమోచన హక్కుల కొరకు కాచుకొనియున్నది. ఆయన ఒక విమోచన మార్గమును ఏర్పరచియున్నాడు, ఆయన ఇదివరకే ఒక మార్గమును ఏర్పరచెను, మరి ఏదో ఒక దినమున విమోచకుడు దానిని తిరిగి తీసికొనును. ఇప్పుడు, మనము దేనిని పొందబోవుచున్నామో మీరు చూచుచున్నారా? సింహాసనముపై కూర్చొనియున్న ఆయనను మనము గమనించెదము.

62అది సరి, విమోచన హక్కుల కొరకు కాచుకొని యుండుట — అది విమోచన.

ఈ విమోచన గ్రంథము అనగా ఏమిటి, ఈ హక్కు పత్రము, సంగ్రహ హక్కు పత్రము? "సంగ్రహ" అనే పదమునకు అర్థమేమిటి? అట్లనగా ఆది నుండి అన్నిటిని వెదకుట. ఆ యొక్క చిన్న సిరా చుక్క ఈ ఉదయము చెప్పబడిన విధముగా అది ఆ బ్లీచ్‌ను తాకినప్పుడు, అది వెనుకటి స్థితికి పోవును. మరియు ఆ విధముగానే పాపము ఒప్పుకొనబడి మరి యేసుక్రీస్తు రక్తములో పడినపుడు, (ఓ, మై), అది పూర్తిగా మనకు స్పష్టతను యిచ్చును. మరల పాపము లేకుండ సృష్టికర్త యొద్దకు తిరిగి వెళ్ళును. నీవు దేవుని యొక్క కుమారుడవగుదువు. సర్వోన్నతుడైన దేవుని చేతిలో పూర్తి వివరములతో కూడిన హక్కు పత్రము. ఓ, మై!

LEV 25:25,48,49

 

63దాని యొక్క విమోచన అనగా ఆదాము హవ్వల ద్వారా కోల్పోయిన సమస్తమును చట్ట రీత్యా మన స్వాధీనపరచుకొనుట. ఓ, మై! అది తిరిగి-జన్మించిన క్రైస్తవునికి అది ఎంతటి దృఢత్వమును ఇవ్వవలెన! నిత్య జీవము యొక్క హక్కుకు (హక్కు పత్రములను) మనము చట్టపూర్వకముగా మన స్వాస్థ్యమును పొందునప్పుడు, ఆదాము, హవ్వలు కోల్పోయిన సమస్తమును నీవు స్వాధీనపరచుకొనుట, అని అర్ధమునిచ్చును. సహోదరుడా, దానిని గురించి ఏమిటి? ఆ పత్రములు నీవు కలిగియుండుట.

ఆదాము విమోచనకు కావలసిన అర్హతలను పొందలేకపోయెను. అతడు పాపము చేసినందువలన దానిని అతడు కోల్పోయెనని ఎరిగిన పిదప దేవుని యొద్ద నుండి తనను వేరుపరచుకొని దేవునికి ఈ ప్రక్క అగాధములో పడిపోయెను, కావున దానిని అతడు విమోచింపలేడు. అతడు దానిని చేయలేడు, ఏలయనగా అతడు తానే విమోచింపబడవలసిన వాడైయుండెను. కావున దానిని అతడు చేయలేడు.

64అయితే చట్ట ప్రకారము ఒక సమీపబంధువుడు కావలసియున్నది. దేవుని యొక్క చట్ట ప్రకారము విమోచించు సమీప బంధువుడొకడు కావలెను. ''సమీప బంధువుడగు విమోచకుడు,'' దానిని మీరు వ్రాసుకోదలచుకున్నారా? దానిని మీరు లేవీయు కాండము 25లో కనుగొనగలరు. దీనిని పూర్తిగా చూచుటకు మనకు సమయము లేదు, ఏలయనగా, మీకు తెలియునా, ప్రతి అంశమును ఒక రాత్రి తీసికొనును.

అయితే దేవుని యొక్క చట్టము ఒక ప్రత్యామ్నాయమును స్వీకరించెను. ఇప్పుడు దేవుడు ప్రత్యామ్నాయమును అంగీకరించకుండనియెడల ఏమగును? అయితే ఆయన దానిని చేయుటకు ప్రేమ బలవంతపెట్టెను. మానవుడు పాపము చేయుట వలన అతడు తిరిగి వెళ్ళుటకు మార్గము లేనివాడయ్యెను, అతడు తిరిగి వెళ్ళుటకు ఒక మార్గమే లేకుండెను. అతనికి అచ్చట ఏ మార్గము లేదు. కాని దేవుని కృప యేసుక్రీస్తు అను వ్యక్తిలో ఈ సమీపబంధువుడగు విమోచకుడిని సంధించెను. దేవుని చట్టమునకు అది అవశ్యకతాయెను. కృప దాని అర్హతలకు సరితూగెను. ఓ, "అద్భుతమైన కృప! ఎంత మధురమైన స్వరము…"

REV 5:10

 

65దేవుని యొక్క ప్రమాణము ఒక నిర్దోషమైన ప్రత్యామ్నాయమును కోరెను, మరియు ఎవరు నిర్దోషి? ప్రతి మానవుడు శారీరేచ్ఛవలన పుట్టినవారు, శరీరేచ్ఛ ద్వారానే, ప్రతి ఒక్కరూ! మరియు అలాగు జన్మించని ఒకడుండెను, అతడు భూమిపై రాజుగా నుండుటకును, నిత్య జీవమునకైన హక్కును పోగొట్టుకొనెను. ఓ, నేను ఆ లేఖనములను గురించి తలంచుకొనునప్పుడు, ''నీవు మమ్మును తిరిగి దేవుని యొద్దకు తీసికొని వచ్చితివి, మరియు మేము భూమి మీద రాజులము గాను, యాజకులు గాను ఉండునట్లు చేసితివి.'' ఓ, మై! ఏమిటి? సమీపబంధువుడగు విమోచకుడు…! ఓ, ఎంత చక్కని గాధ ఇక్కడున్నది!

గమనించుడి, చట్టప్రకారము పోగొట్టుకొనిన వస్తువును విమోచించుటకు ఒక రక్తసంబంధియగు విమోచకుడు అవసరమైయుండెను. కృప యేసుక్రీస్తు అను వ్యక్తి ద్వారా దీనిని నెరవేర్చెను. ఒక సమీపబంధువుడగు విమోచకుడు మానవుని జాతిలోనే పుట్టవలసియుండెను.

66ఇప్పుడు, మనమెట్లు ఉండగలము, ప్రతీ మానవుడు శరీరేచ్ఛవలన జన్మించిన ప్రతీ మానవుడు స్త్రీ ద్వారా శరీరేచ్ఛవలననే జన్మించినవాడు. అది శరీరేచ్ఛవలన కలిగినదనే దానిని చూడలేని ప్రతీవాడు గ్రుడ్డివాడై యున్నాడు. చూశారా? మరియు దేవుడు ఒక సమీపబంధువుడగు విమోచకుని కోరియున్నాడు, మరియు అతడు ఒక మానవునిగా ఉండవలయును. ఓ, మై, మీరిప్పుడు ఏమి చేయబోవుచున్నారు? చట్టము ఒక సమీపబంధువుడగు విమోచకుని కోరుచున్నది.

ఇప్పుడు, ఆయన ఒక దేవదూతను తీసికొనలేడు, మరియు అతను ఒక మానవుడై యుండవలయును, ఏలయనగా మనము దేవదూతలకు సమీపబంధువలము కాలేము. మనము ఒకరికొకరము సమీపబంధువులమై యున్నాము. దేవదూత ఎన్నడును పడిపోలేదు. అతను వ్యక్తిత్వము వేరు, వేరు విధమైన శరీరము కలిగియున్నాడు. అతను ఎన్నడును పాపము చేయలేదు, లేక ఏమియును చేయలేదు. అతను వేరే జీవి. అయితే చట్టము ఒక సమీపబంధువుడగు విమోచకుని కోరెను. మరి భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి శారీరేచ్ఛవలన జన్మించినవాడు.

ఇప్పుడు, మీరు చూడగలుగుచున్నారా, అదెక్కడి నుండి వచ్చియున్నదోయని. అక్కడే పాపము మొదలైనది. కావున ఇప్పుడది ఎక్కడున్నదని మీరు చూడగలుగుచున్నారా? అక్కడే అతను వచ్చుచున్నాడు, సర్పము యొక్క సంతానము, చూశారా.

67ఇప్పుడు గమనించుడి, ఒక సమీపబంధువుడగు విమోచకుడు కావలసియుండెను. మరియు విమోచకుడు, (రక్తసంబంధియగు విమోచకుడు) మనుష్యజాతి నుండి జన్మించియుండవలయును. ఇక్కడ అది మనలను చిక్కులో పెట్టుచున్నది. అయితే నేను బూరను మీకు ఊదనీయుడి. కన్యక నుండి పుట్టిన పుట్టుక దాని ఉత్పత్తి చేసెను. ఆమేన్! కన్యక నుండి పుట్టిన పుట్టుక మన సమీపబంధువుడగు విమోచకుని ఉత్పత్తిచేసెను. వేరే ఎవరో కాదు, అయితే సర్వోన్నతుడైన దేవుడే ఇమ్మానుయేలుగా మనలో ఒకడాయెను. ఇమ్మానుయేలు! సమీప బంధువుడగు విమోచకుడు, అర్హుడాయెను.

మీరు చూడండి ఏ విధముగా దేవుడు కావలసిన దానిని సంధించెను, మరియు మనము చేయవలసినది ఏదియు లేదు. అయితే అప్పుడు కృప ముందడుగు వేసి ఆ చట్టమును మూసివేసి మరి దానిని ఉత్పత్తి చేసెను. ఆమేన్!

68ఓ, మీరు పరలోక గృహమునకు వెళ్ళినపుడు! సహోదరుడు నెవిల్ పాడుచుండగా ''నేను నా చిన్న గదిని అచ్చట పొందుకొన్నపుడు," అక్కడ ఒక ఉదయము, ''అద్భుతమైన కృప, వినుటకు ఎంత మధురమైన స్వరము, నా వంటి నీచుని రక్షించెను!'' అనే పాటను పాడుచుండగా. మీరు దానిని వినునపుడు, మీరు చెప్పెదరు, ''దేవునికి స్తోత్రము! ఆ వృద్ధ సహోదరుడు బ్రన్హం దానిని పొందెను. అదిగో అక్కడ అతను, చూశారా.''

అవును. ఓ! "నా హృదయమునకు భయము నేర్పినది కృపయే, నా భీతులను తొలగించినది కృపయే; నేను విశ్వసించిన ఆ మొదటి ఘడియలో ఆ కృప ఎంత ప్రశస్తముగా కనబడినది! ఇంకొక్క క్షణములో దాని యొద్దకు మనము పోవువరకు కాచుకొనియుండుడి!

ఓ, మై!

69ఇప్పుడు గమనించుడి. రూతు గ్రంథము దీనిని గురించి చక్కని వర్ణను యిచ్చుచున్నది, ఎట్లు బోయజు మరియు నయోమి తమ స్థితిని కోల్పోయినది. మీకు తెలియును. ఆ అంశముపై నేను ప్రసంగించిన దానిని మీరు విన్నారు. కదూ? మీరు, నేను దానిపై ప్రసంగించిన దానిని వినినయెడల, మీ చేతులను పైకెత్తుడి, కావున మీరు గ్రహించియుండెదరు, చూశారా. బోయజు విమోచకునిగా ఉండెను, మరియు అతనొక్కడే చేయగలడు. అతడు సంబంధికుడుగా ఉండవలయును, సమీపబంధువుడిగా యుండవలయును. మరియు నయోమిని విమోచించినపుడు అతను రూతును పొందెను. అది యేసు, బోయజు క్రీస్తుకు పోలికగా యున్నాడు. మరియు ఆయన ఇశ్రాయేలును విమోచించునప్పుడు, ఆయన అన్యజనుల వధువును పొందెను. కావున, అప్పుడు మీరు చూశారా… చాలా చక్కగా నున్నది! టేపులపై ఆ వర్తమానము ఉన్నది, ఇక్కడెక్కడో యున్నది, దానిని తీసికొనుటకు మీరు ఇష్టపడెదరు.

LUKE 1:35

 

70ఇప్పుడు గమనించుడి. ఇప్పుడు, ఆయన సమీపబంధువుడిగా యుండవలయును. కావున, మీరు చూచిన, ఒక దేవదూత దానిని చేయజాలడు. ఒక మానవుడు దానిని చేయజాలడు; అది ఒక మానవునిగా యుండవలయును, అయితే అతను శరీరేచ్ఛవలన స్త్రీకి పుట్టియుండకూడదు. కావున కన్యక గర్భము నుండి పుట్టెను, పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొనెను. అందువలననే యేసు ఒక యూదుడు కాడు. యేసు ఒక అన్యుడు కాడు. యేసు దేవుడైయున్నాడు. ఖచ్చితముగా అదంతే. ఏ శరీరేచ్ఛవలన ఆయన రక్తము రాలేదు. ఆయనది దేవుని చేత సృజింపబడిన పరిశుద్ధ దేవుని రక్తము. మరియు మనము యూదుల రక్తము వలన రక్షింపబడలేదు, లేక అన్యజనుల రక్తము వలన రక్షింపబడలేదు. ''మనము దేవుని యొక్క రక్తమువలన రక్షింపబడియున్నాము.'' అది పరిశుద్ధ గ్రంథము ప్రకారము జరిగియున్నది. అది అట్లు చెప్పుచున్నది. మనము రక్షింపబడి యున్నాము…

71కావున మీరు చూశారా, యేసు దేవుడు. ఆయన మూడవ వ్యక్తి కాదు, నాలుగవ వ్యక్తి కాదు, రెండవ వ్యక్తి కాదు. ఆయన వ్యక్తి. ఆయన దేవుడైయున్నాడు, చూశారా. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. దేవుడు తన మహిమ నుండి దిగివచ్చియున్నాడు, తనను తాను బయలుపరచుకొనెను…

బూత్-క్లిబ్బోర్న్ కధ నాకు ఎంతో ఇష్టము, ఆ గొప్ప, చక్కని పాట:

ఆయన మహిమ నుండి క్రిందికి దిగి వచ్చెను, అది సదా నిలుచు గాధ, నా దేవుడు, రక్షకుడు వచ్చెను, ఆయన పేరు యేసు.

పశువులపాకలో జన్మించెను, తన స్వకీయులకే పరదేశిగా ఉండెను,

దుఃఖము, కన్నీరు, వేదనగలవానిగా యుండెను.

ఓ! ఎటువంటి అనుగ్రహత, మనకు విమోచనను తీసికొని వచ్చెను;

కాళరాత్రిలో, నిరాశ స్థితియందు,

దేవుడు, ప్రశస్తమైన, మృదువైన,

ఆయన వైభవమును విడచి,

నా ఆత్మను రక్షించెను.

ఓ, నేనెంతగానో ఆయనను ప్రేమించుచున్నాను.

ఎంతో ఆయనను ఘనపరచుచున్నాను!

నా ఊపిరి, నా కాంతి, నా సర్వస్వము ఆయనే!

గొప్ప విమోచకుడు, నా రక్షకుడాయెను,

గొప్ప సృష్టికర్త, నా రక్షకుడాయెను,

మరియు దేవుని యొక్క పరిపూర్ణత అంతయు, ఆయనలో నివసించెను.

ఆయనే సమస్త అవసరతలను కలిసికొనెను.

72కృప యేసుక్రీస్తు అను వ్యక్తిని ఉద్భవింపజేసెను. మరియు మనము చూచియున్నాము, ఇప్పుడు ఈ గ్రంథము… దేవుడు తన గుడారమును సాగదీసెను, ఒక మానవుడగుటకు దేవుని యొద్ద నుండి వచ్చెను. ఆయన సర్వశక్తుడైన స్థానము నుండి నరుని రూపమును దాల్చుటకు ఒక మానవునిగా తనను తాను మార్చుకొనెను. అందువలన ఆయన మానవుని విమోచించుటకు చనిపోగలడు. ఆయనను చూచువరకు కాచుకొనియుండుడి, అక్కడ ఎవరును యోగ్యుడు కారు. చూశారా? అది

73మంచిది. పరిశుద్ధ గ్రంథములో, రూతు పుస్తకములో, దానిని మీరు చదువుచుండగా, మీరు కనుగొనగలరు, అటువంటి వ్యక్తి ''గోయెల్,'' అని పిలువబడును. గోయెల్ (goel, g-o-e-l) అని పిలువబడును, లేక దాని అర్ధము అవసరతను కలసికొనెవాడని. మరియు గోయెల్ అని పిలువబడేవాడు, అతడు విమోచించుటకు మనఃపూర్వకముగా అంగీకరించువాడుగా యుండవలెను, అందుకు కావలసిన అర్హతలను కలిగి యుండుటకు అతడు సమర్ధునిగా యుండవలెను. మరియు అతడు సమీప బంధువుకు తదుపరి సమీపబంధువుగా యుండవలయును, దానిని చేయుటకు. మరియు ఆత్మగా నుండు సృష్టికర్తయగు దేవుడు, మన పాపములను తనపై వేసికొనుటకు, మరియు క్రయమును చెల్లించుటకు, మరియు దేవుని యొద్దకు తిరిగి మనలను విమోచించుటకు ఆయన మానవుడాయెను.

ఆయనే అది. ఆయనే ఆ విమోచకుడు. క్రీస్తు ఇప్పుడు మనలను విమోచించెను. మనమిప్పుడు విమోచింపబడి యున్నాము. అయితే ఆయన ఇంకను తన స్వాస్థ్యమును తీసికొనలేదు. ఇప్పుడు మీరు దానిపై వ్యతిరేకింపవచ్చును. అయితే ఒక్క నిమిషమాగండి, చూశారా! మనము చూచెదము. చూశారా?

74దానిపై ఇంకా హక్కును పొందుకొనలేదు, చూశారా? ఆయన విమోచన పుస్తకమును తీసికొనియున్నాడు… అట్లనగా, ఆదాముకు కలిగిన యావత్తును మరియు ఆదాము కోల్పోయిన సమస్తమును క్రీస్తు తిరిగి విమోచించెను. మరియు ఆయన మనలను ఇదివరకే విమోచించియున్నాడు, అయితే ఆయన ఇంకా తన స్వాస్థ్యమును గైకొనలేదు; నిర్ణయ కాలము వచ్చువరకు ఆయన దానిని చేయలేడు. మరియు అప్పుడు పునరుత్థానము వచ్చును, మరియు, అటు పిమ్మట భూమి నూతనపరచబడును. మరప్పుడు ఆయన తన స్వాస్థ్యమును గైకొనును, ఆయన మనలను విడిపించినప్పుడు, తనకు కలిగిన స్వాస్థ్యమును అప్పుడు ఆయన స్వాధీనపరచుకొనును. అయితే నిర్ణయింపబడిన కాలుమున ఆయన దానిని చేయును. ఓ, మై!

ఇప్పుడు మనము మాటలాడుకొనుచున్న ఈ ఏడు ముద్రల పుస్తకములో ఇదంతయు వివరించబడియున్నది. అది వాస్తవము. విమోచన పుస్తకము, ఇదంతయు ఇచ్చట వివరించబడియున్నది. ఒకవేళ దేవుడు మనకు అనుమతించినయెడల, ఈ వారములో క్రీస్తు అంతమందు ఏమి చేయబోవుచున్నాడో అదంతయు ఏడు ముద్రలతో బయలుపరచబడును, చూడండి. మంచిది. అవి విప్పబడును.

JER 32:12

 

75ముద్రలు విప్పబడి మరి అవి వెల్లడియగుచుండగా ఆ సమస్తము ప్రత్యక్షపరచబడును. అప్పుడు ఈ గొప్ప విమోచన కార్యక్రమము అనగా ఏమిటి? మరియు అది ఏ విధముగా సంభవింపనైయున్నదో మనము చూడగలము. ఇక్కడ అదంతయు ఈ మర్మమైన పుస్తకములో మరుగుపరచబడియున్నది. అది ముద్రింపబడియున్నది, ఏడు ముద్రలతో ముద్రింపబడియున్నది, కావున మరి గొర్రెపిల్ల మాత్రమే దానిని విప్పగలదు.

ఇప్పుడు.. (నన్ను మన్నించుడి), మనము గుర్తెరిగియున్నాము… ఇప్పుడు మీరు లేఖనములను చూచుట ఇష్టపడిన యెడల, యిర్మీయాలో దానిని అక్కడ కనుగొనగలరు. అప్పుడు అతను చెరపట్టుకొని కొనిపోబడినపుడు, మీకు తెలియును, అతను తన తండ్రి తోడబుట్టిన.. అతని తండ్రి తోడబుట్టిన వాని కుమారుడు కొద్దిగా ఆస్తి కలిగియుండెను, మరి అతడు దానిని ముద్రింపతొడగెను. మరియు మనము దానినంతయును తీసికొనిన… ఏడు సంఘకాలములలో కూడ దానిని మనము కలిగియున్నాము, పిదప ముద్రలలో మరి ఆ విధముగా అక్కడ కూడా, అది యున్నది.

76మీరు చూచిన, ఒక ముద్ర పాత నిబంధనలో ఒక కాగితపు చుట్టవలె యుండును, ఈ విధముగా యుండును. (సహో, బ్రెన్హాం కాగితమును ఉపయోగించుచు, కాగితపు చుట్టగా చుట్టి, ముద్రలను, మరియు చుట్టలు ఏ విధముగా తెరువబడుచున్నవో వివరించుటకు వాటిని ప్రయోగించి చూపుచున్నారు -సంపా.) మరియు ఇక్కడొక మర్మము గలదు, మరియు ఈ మర్మము మరుగుపరచబడియున్నది. అది నిజము. అది ముద్రింపబడి మరిక్కడ ఉంచబడియున్నది, అది పలానా వారికి పలానా వారికి హక్కుగలదని వ్రాయబడియుండును. అటు పిదప ఇంకొక మర్మము స్వాస్థ్యమనగా ఏమిటనే దానిని లోపల వ్రాయబడి చుట్టబడి ఈ ప్రక్కగా అతికించబడియుండును, ఇది ఫలానా వారికి - ఫలానా వారికి హక్కుకని ఉండును. మరి ఆ విధముగా చుట్టబడి పెద్ద కాగితపు చుట్టగా అగునంతవరకు ఒకదానిపై ఒకటి చుట్టబడియుండును, ఏలయనగా ఈ విధమైన పుస్తకములు ఆనాడు జనులు కలిగియుండలేదు. అది ఒక చుట్టలో ఉండెను. చుట్టలు అని పిలువడు వాటిని గురించి (ఎందరికది తెలియును?). సరి, ఒక ముద్రింపబడిన చుట్ట. మీరు దానిని విప్పి తెరచి చూచినప్పుడు (అందులోనున్న మర్మము ఏమిటనే దానిని కనుగొనవచ్చును), మరియు దానిని విప్పి, దానిలో గల మర్మము ఏమిటని చూడవచ్చును. మరియు అటు పిమ్మట ఇంకొక దానిని తెరచి మరి మీరు చూడవచ్చును, ఆ మర్మము ఏమైయున్నదనే దానిని తెలుసుకొనవచ్చును.

77మరియు ఇక్కడున్నదంతయును ఏడు ముద్రలలో గలవు, అక్కడ జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క మర్మములన్నియు ముద్రింపబడియున్నవి, మరియు ఏడు వేర్వేరు ముద్రల ద్వారా బయలుపడియున్నవి, మరియు దేవుని చిత్తమైనయెడల ఈ ముద్రలను విప్పి మరియు గ్రంథములో ఉన్న కార్యములు ఏమైవున్నవో చూచెదము. మరియు మనకు గొప్ప సమయము కలదని నేను నమ్ముచున్నాము!

అక్కడ విమోచన యొక్క మర్మము ముద్రించబడియున్నంత వరకు… కడపటి దూత వర్తమానము అందించు వరకు ఈ గ్రంథము విప్పబడదు లేక తెరువబడదు. చుట్ట అక్కడ యున్నది. మనకు తెలియును, అది అక్కడ ఉన్నది. మనకు తెలియును అది విమోచన అని. అది విమోచన అని మనము నమ్ముచున్నాము.

JER 32:14

 

78యిర్మీయా చెప్పెను, ''ఈ చుట్ట (మట్టి కుండలో) పెట్టవలయును…'' మనము దీనినక్కడ వీటిని గురించిన కార్యములన్నియును ఏమిటని కనుగొనెదము. చూశారా? ఓ, మనము చదువుచుండగా, మట్టి కుండలో దానిని ఉంచవలయునని అతడు చెప్పెను. చూశారా! ఓ, అదెంతటి చక్కని కార్యము, దానిని గురించి నేను కొద్దిసేపు చెప్పవలెను. ఈ చుట్ట ఒక మట్టి కుండలో ఉంచబడెను — ఒక పాత్ర అది ఒకప్పుడు మాంసమాయెను (మహిమ!) శరీరధారియాయెను, చనిపోయెను, తిరిగి లేచెను, మరియు కొనుగోలు చేయు కాలము వచ్చువరకు మట్టి పాత్రలో ఉంచబడెను. ఓ, మై! మనోహరము.

అది సరి, ఇప్పుడు, ఈ వర్తమానములన్నియును, దేవుని యొక్క నిర్ణయ కాలము వరకు, ఈ మట్టిపాత్ర భూమిపై, కడపటి వర్తమానికుడు, వచ్చువరకు దాచబడి యుండును. మరియు అనేక జనులు వారికి వారే తలంచుకొని న్యాయమనుకొనిరి, దానిని చూచి, ''నాకు తెలియును, అదక్కడ నున్నది. అదక్కడ నున్నదని నేను నమ్ముచున్నాను,'' అని చెప్పిరి; మరియు దానికై పోరాడి, మరెన్నో కార్యములను దానినుండి ఉత్పత్తి చేసితిరి. వారి విశ్వాసము ద్వారా వారు దానిని నమ్మిరి. అయితే ఇప్పుడు అది మనకు ప్రత్యక్షత ద్వారా, మరియు దేవుని హస్తము వలన నిరూపింపబడి మనకు అనుగ్రహింపబడును. దేవుడట్లు చెప్పియున్నాడు. దానిని ఆయన వాగ్దానము చేసియున్నాడు.

REV 5:1,2

 

79ఇప్పుడు. ఇప్పుడు మనము చూచెదము. మనము ఎక్కడ ఉన్నాము?మనమిప్పుడు 2వ వచనమునకు పోయెదము. 1వ వచనమును చాలాసేపు ధ్యానించియున్నాము, అయితే మనము 2వ వచనమును తీసికొనెదము. ఇప్పుడు, తదుపరి వచనముపై అధిక సమయము మనము తీసికొనబోవుట లేదు.

మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన ఒక దేవ దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.

ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, మనము 1వ వచనమును మరల చదివెదము, దానితో రెండు వచనములలోని విషయములను కలిపి అర్ధం చేసికోగలము…

"…సింహాసనమునందు ఆసీనుడైయున్నవాని కుడిచేత చూచితిని…" దేవుడు! అదెవరు? జీవ గ్రంథమునకు సంపూర్ణమైన అసలైన హక్కుదారుడు. ఆయన దానిని పట్టుకొనియున్నాడు. దేవుడు పట్టుకొనియున్నాడు. ఆదాము దానిని పోగొట్టుకొనినప్పుడు, అది దాని యొక్క అసలైన యజమానుని యొద్దకు వెళ్ళినది. అది ఆయనకు చెందినది. మరియు యోహాను, దర్శనములో, లోపటను, వెలుపటను వ్రాత కలిగి యేడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడి చేత చూచెను. చూడండి. లోపల!

80ఇప్పుడు, మనము ఈ ముద్రలను విప్పుటకు పోవునప్పుడు, మీరు దానిని చూడగలరు. ఆ ముద్రలు ఒక్కొక్కొటియు తిరిగి వాక్యములోనికే వెళ్ళును, మరల వెనుకకే వెళ్ళును. సమస్తమును, మర్మములన్నియును ఒక్కటిగా ఈ ముద్రలలోనే యున్నది. మరియు ముద్రలు ఆ సమయము వచ్చువరకు తెరువబడవు. ఇంకొక నిమిషములో దానినిక్కడ నిరూపంచెదను.

81గమనించుడి, ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, గ్రంథము ముద్రింపబడియున్నది. ఇదిగో ఇక్కడ ఒకటి — ఇదిగో ఇక్కడ, ఈ ముద్ర అటు పిదప ఇంకొకటి చుట్టబడి యున్నది — ఒక ముద్ర. ఇంకొకటి చుట్టబడియున్నది — ఒక ముద్ర. అది ఒక విమోచన గ్రంథము. మరియు అంతా కలిసి ఒక గ్రంథముగా యున్నది, మరియు అది ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది. మరియు అది వెలుపట ముద్రించబడియున్నది, ఏలయనగా అది చుట్టబడియున్నది. ముద్రించబడిన రహస్యము లోపటనున్నది, మరియు అది దీనిని మాత్రము చెప్పుచున్నది, ''తెల్లని గుర్రముపై సవారి చేయువాడు,'' లేక ''నల్లని గుర్రముపై సవారి చేయువాడు,'' మరియు వెలుపల ఆ విధముగానే చూపించబడుచున్నది. అయితే గ్రంథము యొక్క సంపూర్ణ మర్మము, ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు ముద్రలలో యున్నది. విమోచన ప్రణాళిక అంతయు పూర్తిగా ఈ యేడు ముద్రలలో ప్రత్యక్షపరచబడియున్నది. ఓ, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. దేవా, దానిని గ్రహించుటకు సహాయపడుము!

REV 5:2

 

82ఇప్పుడు, ''మరియు బలిష్టుడైన ఒక దూత…'' ఇప్పుడు 2వ వచనము… బలిష్టుడైన ఒక దూత, ఒక గొప్ప స్వరముతో చాటించుచు, "ఎవరు యోగ్యుడు?" దేనికి యోగ్యత? "ఆ పుస్తకమును తీయుటకు ఎవరు యోగ్యుడు?" ఇప్పుడు, మనము కనుగొనెదము… ఇప్పుడు ఆ గ్రంథము ఎక్కడనున్నది? అసలైన యజమాని యొద్దకు వెళ్ళియున్నది, ఏలయనగా ఒక కుమారుని వలన అది పోగొట్టుకొనబడినది, మనుష్యజాతిలోనే మొదటి దేవుని కుమారుడు. మరియు సాతాను చెప్పునది వినుటకు అతను తన హక్కులను పోగొట్టుకొనినపుడు అతను వదులుకొనెను… అతనేమి చేసెను? దేవుని యొక్క వాక్యమునకు బదులుగా సాతాను యొక్క జ్ఞానమును అంగీకరించెను.

REV 4:1

 

83ఇప్పుడు, ఇక్కడ ఒక్క క్షణమాగెదమా? దేవుని యొక్క వాక్యమునకు బదులుగా, దేవుని యొక్క కుమారులు సెమినరీ యొక్క అభిప్రాయములను తీసికొనుచున్నారు, చూశారా. అదే ఆదాము చేసి తన హక్కులను కోల్పోయెను. మరియు ఆ విధముగా చేసినప్పుడు అది మరల దేవుని యొద్దకే వెళ్ళిపోయినది. ఆ యుగములన్నియును ఎక్కడనున్నవని మీరు చూడగలుగుచున్నారా? చూశారా? మొదటగా దానిని పొందియున్న లేక కలిగి యున్నతని యొద్దకు తిరిగి వెళ్ళెను. మరియు యోహాను, ఆత్మయందు పరలోకములో ఇక్కడ నిలబడియుండెను. ఇప్పుడే అతడు పైకెత్తబడి, సంఘకాలముల నుండి పైకెత్తబడి — సంఘకాలములను చూసెను. మరియు అతడు 4వ అధ్యాయములో పైకి కొనిపోబడెను. ''పైకి రమ్ము, జరుగబోవు కార్యములను నేను నీకు చూపించెదను,'' అని ఆయన చెప్పెను.

REV 5:1-4

 

84మరియు ఈ గ్రంథమును తన చేతిలో, తన కుడి చేతిలో పట్టుకొని సింహాసనముపై కూర్చొనియున్న ఒకనిని అతడు చూచెను. ఇప్పుడు దానిని గురించి ఆలోచించుడి. మరియు ఈ పుస్తకములో విమోచన కొరకైన స్వాస్థ్యపు పత్రములు ఉండెను, మరియు అది ఏడు ముద్రలతో ముద్రించబడియుండెను. మరియు అప్పుడు ఒక దూత వచ్చెను, బలిష్టుడైన ఒక దూత బిగ్గరగా ఇట్లు చాటించుచు, ''గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవరు; గ్రంథమును తీయుటకు? ముద్రలను ఎవరు తెరువగలరు? ఈ గ్రంథమును ఎవరు తెరువగలరు?'' చూశారా, దేవదూత అట్లు అడిగెను. యోహాను దానిని చూచెను మరియు అతను చెప్పెను, ''ఇప్పుడు, ఎవరు యోగ్యులు? ఆయన..'' ఓ, మై! ఒకవేళ నేను ఇట్లు అనుకొనుచున్నాను, ''అయితే ఆయన,'' ''ఆయనను రానిమ్ము…'' అని దూత చెప్పెను.

ఇదిగో విమోచన గ్రంథము! ఇదిగో ఇక్కడ విమోచన ప్రణాళిక. మీరు విమోచింపబడుటకు ఇదొక్కటే మార్గము గలదు, సమస్త పరలోకము మరియు భూమిని విమోచించు పత్రము ఇచ్చట నున్నది. ''ఇచ్ఛయించువాడు ముందుకు రావచ్చును.'' ఓ, మై! ''ఇప్పుడే మాట్లాడవలయును లేదా మరెన్నటికిని ఊరకుండవలసినదే. అతను ముందుకు వచ్చి ఈ గ్రంథము యొక్క హక్కును పొందుకొనవలెను. దానిని చేయుటకు యోగ్యుడెవరు?'' మరియు యోహాను చెప్పెను: పరలోకమందు యోగ్యుడెవడును కనబడలేదు; భూమి పైనను యోగ్యుడెవడును కనబడలేదు; జీవించి మరి చనిపోయిన భూమి క్రిందనుండు ఏ వ్యక్తియు యోగ్యుడుగా కనుపించలేదు. ఏ వ్యక్తియు యోగ్యుడుగా కనుపించలేదు.

85సమీపబంధువుడగు విమోచకుడు ప్రత్యక్షమగుటకు దేవదూత పిలుపునిచ్చెను. దేవుడిట్లు చెప్పెను, ''నాకు ఒక చట్టము గలదు. సమీపబంధువుడగు విమోచకుడు ప్రత్యామ్నాయముగా ఉండవచ్చును.'' ఆ సమీప బంధువుడగు విమోచకుడు ఎక్కడ? దానిని తీసికొనగల సమర్దుడెవరు?''

మరియు ఆదాము నుండి అది వచ్చుచున్నది, ఆదాము నుండి అపొస్తలులు వరకు, ప్రవక్తలు మరియు ఇతరులందరును అందుకు అయోగ్యులని తేలినది. ఇప్పుడు, దాని గురించి ఏమిటి? ''పరలోకమందును గాని, భూమిపై గాని, మరి జీవించిన ఏ ఒక్కరు గాని.'' ఏలియా అక్కడ నిలబడియున్నాడు, మోషే అక్కడ నిలబడియున్నాడు. అపొస్తలులందరు అక్కడ నిలబడియున్నారు, లేక చనిపోయిన ప్రతియొక్కరును; ప్రతి ఒక్కొక్క పరిశుద్ధడును, యోబు, జ్ఞానులు అందరు అచ్చట నిలబడియున్నారు. ప్రతి ఒక్కరును అచ్చట నిలబడియున్నారు, కానీ, గ్రంథమును తీసికొని ముద్రలు విప్పు మాట అటువుంచి, అసలు గ్రంథమును చూచుటకైనను యోగ్యులెవరూ లేరు.

ఇప్పుడు, పోపు మరి వీరందరూ వారెచ్చటున్నారు? మీ యొక్క బిషప్పు ఎక్కడ? మన యొక్క యోగ్యత ఎక్కడ? మనము ఏమిలేని అనర్హులము! అది నిజము.

REV 5:4

 

86ఒకవేళ రాగలిగినయెడల సమీపబంధువుడగు విమోచకుడు ముందుకు రావచ్చునని ఆయన అడిగెను. అయితే ఏ మనుష్యుడును యోగ్యుడు లేడు, అని యోహాను చెప్పెను, అక్కడ అర్హులైనవారు లేరని కాదు, దేవదూతవలె; ఉదాహరణకు, మనము చెప్పగలము, గబ్రియేలు, లేక మిఖాయేలు మొదలగు దేవదూతలున్నారు. అయితే గుర్తుంచుకొనుడి, అది సమీపబంధువుడై ఉండవలయును. గుర్తుంచుకొనుడి, ఇచ్చట యోహాను చెప్పెను, ''మరియు ఏ మానవుడు,'' దేవదూత కాదు, సెరాపులు కాదు. వారు పాపము చేయలేదు, అయితే వారు ఇంకొక వర్గమునకు చెందినవారు. వారు ఎన్నడునూ పడిపోలేదు. అయితే ఇక్కడ సమీపబంధువుడగు విమోచకుడుగా యుండవలయును. ''ఏ మానవుడు,'' ఏలయనగా వారిలో ఎవరును విమోచింపబడలేదు. ''ఏ మానవుడును దానిని చూచుటక కూడా యోగ్యత లేనివానిగా ఉండిరి.'' ఓ, కాదు! మై, మై!

REV 5:3

 

87కావున, అది సమీపబంధువుడగు ఒక మానవ విమోచకుని తీసుకొనెను. మరియు దానికొరకు అతడు అడిగెను, మరి అటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఎవరును లేకుండిరి. బిషప్పు, ఆర్చ్ బిషప్పు లేడు, యాజకుడు లేడు, పెద్ద గురువులు లేరు, వేరే ఎవరును లేరు… వారెవ్వరికిని ఆ గ్రంథమును కనీసము చూచుటకు కూడా చాలినంత పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నది. నేను యోహాను చెప్పినదానినే చెప్పుచున్నాను.

REV 5:4

 

88పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది యోహాను ''ఏడ్చెనని.'' దానిని ఇతరులు వివరించిన విధముగా కాదు. ఒకప్పుడు ఒకతను దీనిని గురించి చెప్పుటకు నేను వినియున్నాను, అతను చెప్పెను, ''తనకుతాను అయోగ్యుడని తెలిసికొని ఏడ్చెను.'' ఓ, పరిశుద్ధాత్మ వశములోనున్న ఏ వ్యక్తైనను దానికి భిన్నముగా తెలిసికొనును, చూశారా; దేవుని ప్రేరేపణలోగల వ్యక్తి అందుకు భిన్నముగా తెలిసికొనియుండును.

REV 5:2-5

 

89అయితే యోహాను ఏడ్చెను. ఇక్కడ అతను ఎందుకు ఏడ్చెనో అనునది చెప్పుచున్నాను: ఏలయనగా ఈ విమోచన గ్రంథమును విప్పుటకు ఎవరూ యోగ్యులు కానియెడల సృష్టి యావత్తు నశించుచునని అతడు ఏడ్చెను. ఇదిగో ఇచ్చట ఆ గ్రంథము, ఇచ్చటున్న హక్కు పత్రములు మరియు సమస్త అర్హతలను కలిగియున్నసమీపబంధువుడగు విమోచకునికి ఇవ్వబడును. అది దేవుని యొక్క స్వంత చట్టము, మరియు ఆయన తన చట్టము రద్దు చేయలేడు, తన చట్టమును మీరడు. చూశారా? దేవునికి దానిని చేయుటకు సామర్ధ్యముగల, యోగ్యత గల, దానిని చేయుటకు సారముగల ఒక సమీప బంధువుడగు విమోచకుడు కావలసియుండెను. మరియు ''ఇప్పుడు ఆ సమీపబంధువుడగు విమోచకుడు, ముందడుగు వేసి రావలయును,'' అని దూత చెప్పెను.

మరి యోహాను చూచెను. మరియు అతను భూమియందంతటను చూచెను. భూమి క్రిందను అతను చూచెను. మరక్కడ ఎవరును లేరు. సృష్టియంతయును మరి సమస్తమును నశించెను. సమస్తము నశించెను, అందువలననే యోహాను ఏడ్చెను.

అతని ఏడ్పు ఒక్క నిముషమే కాని, ఎక్కువసేపు కాదు. అక్కడ పెద్దలలో ఒకరు నిలబడి ఇట్లనెను ''యోహానూ, ఏడువకుము.'' ఓ, మై! అతని ఏడ్పు ఒక్క నిమిషమే కాని, ఎక్కువ సేపుకాదు.

''ఓ, మై, ఆను మష్యుడెక్కడ? అని యోహాను తలంచెను, అక్కడ ప్రవక్తలు నిలబడియున్నారు. నేను జన్మించినట్లే వారు జన్మించిరి. అక్కడ జ్ఞానులు అచ్చట నిలబడుకొని… ఓ, ఇక్కడ వేరే ఎవ్వరును లేరా?''

90''దానిని చేయగల ఒక మనుష్యుడు నాకు కావలెను. విడిపించగల ఒక వ్యక్తి నాకు కావలయును.'' మరియు అటువంటి మనుష్యుని అతను కనుగొనలేదు, కావున యోహాను ఏడ్చెను. ఓ, సమస్తమును నశించిపోయెనని అతడు గట్టిగా ఏడ్చెను. మరియు అతడు చాలా వేదనపడెను, ఏలయనగా వారు ఎవరినైనను కనుగొననియెడల సమస్తమును, సృష్టి యావత్తు, సమస్తము నశించును. దేవునికి మహిమ! ఆ విమోచించుటకు కావలసిన అర్హతలన్నియును కలిగిన వ్యక్తివారు కనుగొననియెడల, ప్రతి మానవ సమూహమును మరియు సర్వ ప్రపంచమును మరి సృష్టియును నశించును. ఓ, సమస్తమును పడిపోయెను — విమోచన హక్కు, నిత్య జీవపు హక్కు, వెలుగు. ఈ హక్కులన్నింటిని కోల్పోయెను, మరియు క్రయము చెల్లించగలవారెవ్వరును లేకపోయిరి.

REV 5:3-5

 

91మరియు యోహాను ఏడ్చుటకు ప్రారంభించెను, ఏలయనగా ఎవ్వరును అర్హులు కారు, మరియు ఆ గ్రంథమును చూచుటకు కూడా ఎవ్వరు యోగ్యులు కారు. ఓ, దానిని చేయుటకు ఒక మానవుడు కావలయును. ఏలయనగా ఎవడును దానిని చేయలేకపోయిరి.

మరియు సమస్తమును కోల్పోబడినది, కావున యోహాను ఏడ్చెను.

మరియు అక్కడ నాలుగు జీవుల మధ్యను, పరలోక సమూహము మధ్యను నిలబడియున్న పెద్దలలో ఒకని నుండి ఒక స్వరము వచ్చి, చెప్పెను, ''యోహాను, ఏడువకుము.'' [ఓ, మై, దేవుని యొక్క కృప!] ''హృదయము బ్రద్దలగునట్లు ఏడ్వవద్దు, యోహాను ఏడువకుము. ఎందుకనగా, యూదా గోత్రపు సింహము, దావీదు సంతతి నుండి వచ్చిన వేరు మరియు చిగురునై యున్నవాడు, ఆయన జయించెను.'' జయించుట అనగా ''పోరాడి జయించుట,'' అని దీనికి అర్ధము. ఓ, మై! గెత్సెమనె తోటలో ఆయన ముఖము నుండి రక్తము కారుచుండగా, ఆయన జయించుచుండెను. ''సింహమును, మరియు దావీదు చిగురునైయున్నవాడు పోరాడి దానిని జయించెను.''

GEN 32:26,28

 

92యాకోబు మోసగానివలె యుండియు, మరియు అతడు ఆ దూతను చూచినప్పుడు, అతడు పట్టుకొనెను. మరియు దూత అతనిని విదిలించుకొనుటకు ప్రయత్నించినప్పుడు, అతడు చెప్పెను, ''నేను నిన్ను పోనియ్యను.'' అతడు కోరుకొనునది పొందువరకు గట్టిగా ఆ దూతను పట్టుకొనెను. మరియు అతని పేరు మార్చబడెను, మోసగాని పేరు నుండి మార్చబడెను. ఏ పేరుగా మార్చబడెను? ''దేవుని యొక్క రాజ కుమారుడుగా,'' మార్చబడి, ఇశ్రాయేలుగా పిలువబడెను. అతను జయించెను.

REV 5:5

 

93మరియు ఈ యూదా గోత్రపు సింహము జయించెను. అతను చెప్పెను, ''ఏడువకుము, యోహాను, ఏలయనగా యూదా గోత్రపు సింహము, దావీదు యొక్క చిగురునైయున్నవాడు జయించెను. ఆయన ఇంతకు మునుపే జయించెను. దానిని ఆయన చేసియుండెను. యోహాను, అది ముగిసిపోయినది!" ఓ, మై! తన జ్ఞానముతో మానవుని నాశనము చేసే పాపపు మరకల చేతులు గల వాడియొద్దకే తిరిగి పాపము పోవుటకు ఆయన పాపము పోగొట్టు బ్లీచ్‌ను ఉత్పత్తి చేసెను. అవును.''

REV 5:5

 

94అయితే యోహాను తిరిగి చూచినప్పుడు, అతను ఒక గొర్రెపిల్లను చూచెను. సింహమునకు గొర్రెపిల్లకు ఎంతో తేడాగలదు! ''సింహము జయించెను.'' అతను చెప్పెను, మరల చూడుడి, దానిని నేనక్కడ ఉపయోగించుచున్నాను: "దేవుడు సామాన్యతయందు మరుగుపరచుకొనియున్నాడు." అతను చెప్పెను,''అక్కడొక సింహము.'' (మృగములకు అది రాజు). ''సింహము జయించియున్నది.'' అత్యంత బలమైనది ఏది అంటే సింహము.

నేను ఆఫ్రికా అడవులలో గడిపియున్నాను, జిరాఫీలు అరచుట వినియున్నాను. మరియు గొప్ప పెద్ద శరీరముగల ఏనుగు తన తొండమును పైకెత్తి, ''వీ, వీ, వీ,'' అని అరచుటను వినియున్నాను. మరియు అరణ్యవాసులు వారు చేయు భయంకరమైన అరుపులను విన్నాను. మరియు కుమ్మరి పురుగులు, అవి… మరియు నేను, బిల్లీ పాల్ ఒక చిన్న పాత స్థలములో దాగుకొని యుంటిమి. మరి కొద్ది దూరములో ఒక సింహము గర్జించుటను వినియున్నాను, మరి ఆ అడవిలో ఉన్న సమస్తము నిశ్శబ్దముగా ఉండిపోయినవి. కుమ్మరి పురుగులు కూడా తిరుగటం మానివేసినవి. రాజు మాటలాడుచున్నాడు. ఓ, మై.

నేను చెప్పుచున్నాను, అదెప్పుడనగా సంఘ శాఖలు వాటి సందేహములు నేలకు ఒరిగిపోవు సమయము. రాజు మాట్లాడునప్పుడు సమస్తమును మౌనముగా ఉండవలసినదే. మరియు ఈయనే ఆ రాజు, అది ఆయన యొక్క మాట.

REV 5:5

 

95ఓ! ఆయన చెప్పెను, ''యోహాను, దిగులుపడకుము, ఏడవకుము. దిగులుతో కుమిలిపోవద్దు, యోహాను. నేను నిన్ను ఇక్కడ దర్శనములో కలిగియున్నాను. నేను నీకు ఒక కార్యమును చూపించబోవుచున్నాను. మరియు మీరందరు నిరాశ చెందియున్నారని, నాకు తెలియును ఏలయనగా, మీకు తెలియును, విమోచింపబడవలసినది ఏదియు లేదు; సమస్తము కోల్పోయినవి. కావలసిన అర్హతలు గల యోగ్యులు ఎవరును లేరు. అయితే యూదా గోత్రపు సింహము…'' మీకు తెలియునా, యూదా (ఇక్కడ నల్లని బల్లపై మనము వ్రాసియుంచియున్నాము), యూదా గోత్రపు చిహ్నము ఒక సింహమని మీకు తెలియును.

సింహము, ఎద్దు, మనుష్య ముఖము మొదలగు జీవులు, మరియు ఆ సెరూపులు - ఆ వాక్యము చుట్టూయుండుట మీకు గుర్తున్నదా? ఆ విధముగానే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అపొస్తలుల కార్యముల గ్రంథము చుట్టూ యున్నవి.

96మరియు ఒక గొప్ప వ్యక్తి వాక్యపరిచారకుడు ఇట్లు చెప్పుటను నేను విని యున్నాను, ''అపొస్తలుల కార్యముల గ్రంథము తన కట్టడమును కట్టుటకు కర్రల ద్వారా కట్టి ఉపయోగించు ఒక పరంజా లాంటిది,'' అని చెప్పెను. పరిశుద్ధ సంఘము నుండి వచ్చిన మొట్టమొదటి ద్రాక్ష తీగె అదియే. అవునండి! మరియు ఇంకొక తీగ దానినుండి వచ్చినయెడల అది కూడా ఆలాగేయుండును. అవునండి! మీ యొద్ద కొన్ని అంటుకట్టిన తీగెలు ఉన్నవి, మరి వాటిద్వారా నిమ్మకాయలను మరియు నారింజలను కాయించుచున్నారు, అయితే ఆ ద్రాక్ష తీగ నుండి ఇంకొక కొమ్మ వచ్చినయెడల అది ఖచ్చితముగా అసలు ద్రాక్ష తీగవలె యుండును.

మరియు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, ఆ సువార్తలన్నియు అక్కడ దానికి రక్షణగా నిలబడియున్నవి. మానవుని యొక్క జ్ఞానము; సింహము యొక్క శక్తి; ఎద్దు యొక్క పని; మరియు చిరుతపులి యొక్క చురుకుదనము — లేక పక్షిరాజు అక్కడ యున్నది. అవును, సువార్తలు అక్కడ నిలబడియున్నవి! ఏమిటి…? ఏడు సంఘ కాలములలో దానిని మనము ధ్యానించినది మీకు జ్ఞాపకమున్నదా?

GEN 49:10•

REV 5:5,6

 

97ఇప్పుడు అతను చెప్పెను, ''యూదా గోత్రపు సింహము.'' యూదాలో నుంది ఎందుకు? ఓ, యూదా! షిలోహు వచ్చువరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ దండము తొలగదు. అయితే ఆయన యూదా ద్వారానే వచ్చును. ''మరియు సింహము, యూదా గోత్రపు చిహ్నము, జయించెను. ఆయన జయించెను.''

మరియు అతను ఆ సింహము ఎక్కడున్నదని చుట్టూ తిరిగి చూడగా, అతను ఒక గొర్రెపిల్లను చూచెను. వింతగా నున్నది, సింహము కొరకు చూడగా మరి ఒక గొర్రె కనబడినది. ఆ పెద్ద ఆయనను ఒక సింహమని పిలిచెను. అయితే యోహాను తిరిగి చూచినప్పుడు, అతనొక గొర్రెపిల్లను చూచెను, ''ఒక గొర్రెపిల్ల జగత్తుకు పునాది వేయబడక మునుపే వధించబడినట్లుండెను.'' వధించబడియున్న గొర్రెపిల్ల. అదేమిటి? ఆ గొర్రెపిల్ల ఏమిటి? అది గాయపడి రక్తము కారుచుండెను. ''వధించబడిన ఒక గొర్రెపిల్లయైనను, అది తిరిగి జీవించియున్నది.'' మరియు ఆయన రక్తము కారుచుండెను. ఓ, మై! దానివైపు చూచుచు, జనులారా, మరి మీరింకను ఒక పాపిగా ఎట్లుండగలరు?

REV 5:5

 

98ఒక గొర్రెపిల్ల ముందడుగు వేసెను. ఆ పెద్ద ఇట్లనెను, ''ఒక సింహము జయించెను, యూదా గోత్రపు సింహము.'' మరియు యోహాను సింహమును చూడవలెనని తిరిగి చూడగా, రక్తము కారుచు, గాయములతో నిండి కదులుచు వచ్చుచున్న గొర్రెపిల్లను చూచెను. ఆయన యుద్ధములో ఉండెనని మీరు చెప్పగలరు. ఆయన వధించబడెను, అయితే ఆయన తిరిగి జీవించియున్నాడు.

HEB 1:3•

HEB 7:25•

HEB 10:12

 

99మీకు తెలియునా, ఇక్కడ యోహాను ఈ గొర్రెపిల్లను ఇంతకు ముందు గమనించలేదు. దానిని గురించి ఇంతకు ముందు ప్రస్తావించలేదు. ఎక్కడను దానిని గురించి చెప్పలేదు.

యోహాను తాను చూచుచుండగా, పరలోకములో కూడా దానిని అతడు చూడలేదు, అయితే ఇక్కడికి అది వచ్చియున్నది. గమనించండి. అది వచ్చినప్పుడు, అదెక్కడి నుండి వచ్చినది? అది తండ్రి యొక్క సింహాసనము నుండి వచ్చినది, ఆయన వధింపబడినప్పటి నుండి అక్కడే యుండెను, మరియు తిరిగి లేచెను. ''ఆయన లేచి మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొనియున్నాడు, విజ్ఞాపనలు చేయుచు సదా జీవించుచున్నాడు.'' (ఆమేన్), అక్కడ మృత్యంజయుడై లేచిన ఆయనే, ఈ రోజు మధ్యవర్తిగా, ఆయన తన సొంత రక్తముతో కొనిన జనులయొక్క అజ్ఞానమును బట్టి మధ్యవర్తిత్వము జరుపుచున్నాడు. ఇప్పుడు ఆయనపైననే నేను ఆధారపడియున్నాను. పాపమును క్షమించు బ్లీచ్‌తో ఆయన ఇంకా కప్పబడియున్నాడు.

100యోహాను ఆ గొర్రెపిల్లను చూచెను, మరియు ఆయన వధింపబడినట్లు ఆ గొర్రెపిల్ల కనబడెను. మరియు ఆయన గాయపరచబడి, నరుకబడి, నలుగగొట్టబడి, మరియు రక్తము కారుచుండుటను — యోహాను చూచెను. పాపియైన మన స్థానమును తీసుకొని ఆ గొర్రెపిల్ల మన కొరకై గాయపరచబడినది.

ఒక సాధారణ గొర్రెపిల్ల మన స్థానమును తీసికొనుట వింతగా లేదా? మరియు అతడు ఆ గొర్రెపిల్లను చూచెను. ఆయన బయలుదేరి వచ్చెను. యోహాను, ఆయనను చూడలేదు, ఏలయనగా ఆయన నిత్యత్వములో నుండి విజ్ఞాపనలు చేయుచుండెను; మరియు చూపించెను, ఎద్దులు, మేకలు రక్తము క్రింద దేవుని యొద్దకు వచ్చు పాపపరిహారముగా అర్పించబడిన ఆ బలిపై విశ్వాసముంచి ఆయనవైపు వారందరు చూచుచున్నారు… ఎందుకనగా ఇంకా రక్తము చిందించబడలేదు, కావున ఆయన వారిని శుద్ధపరచుటకు అక్కడుండెను. నిన్ను మరి నన్ను శుద్ధి చేయుటకు ఆయన అక్కడుండెను. మరియు, ఓ, దేవా! ఈ రాత్రి ఆయనిక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ప్రతి పాపి కొరకు గొర్రెపిల్ల వధించబడెను.

101ఆ రక్తము కారుచున్న గొర్రెపిల్ల అక్కడ నిలబడియుండగా మరేదియూ యెహోవాకు కనబడదు. మరియు ఇప్పుడు దర్శనములోనికి వధింపబడినట్లుగా గొర్రెపిల్ల వచ్చెను. గమనించుడి, తండ్రి యొక్క సింహాసనము నుండి వచ్చెను. ఓ, దానిని గురించి ఆలోచించండి! ఆయన, ఈ దర్శనములో ఎక్కడి నుండి వచ్చెను? ఆయన మహిమలో నుండి వచ్చెను అక్కడ ఆయన తండ్రి సింహాసనమున కుడి పార్శ్యమున కూర్చొనియుండెను. ఆయన మహిమ నుండి యోహాను నొద్దకు వచ్చెను.

ఓ, మన పాపపు తలంపులను ప్రక్కకు పెట్టి ఆయనను అంగీకరించినయెడల మరి ఆయన తన మహిమ నుండి ఈ రాత్రి మీలో ఎవరికైనను తననుతాను తెలియపరచుకొనును, అది మహిమగల కార్యముగా లేదా? విజ్ఞాపనలు చేయుటకు గొర్రెపిల్ల మహిమ నుండి వచ్చెను, మంచిది. ఇప్పుడు ఆయన ద్వారా విమోచింపబడిన వారిపై హక్కును పొందగోరుచున్నాడు!

102గుర్తుంచుకొనుడి, ఆయన ఇచ్చట తన విజ్ఞాపన చేయు పనిలో యున్నాడు. అయితే గుర్తుంచుకొనుడి, ఈ ముద్రలు తెరువబడుటకు సిద్ధముగా నున్నవి, మరియు గొర్రెపిల్ల దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నుండి ముందుకు వచ్చియున్నది. పరలోకమందు అర్ధగంటసేపు నిశ్శబ్దముగా ఉండుటను గూర్చి మనము ధ్యానించబోవు వరకు మీరు వేచియుండవలెను. దేవుని పరిశుద్ధ స్థలము నుండి పొగ వచ్చుచున్నది. ఇక మీదట విజ్ఞాపన లేదు బలి అక్కడ లేదు. అది న్యాయ తీర్పు సింహాసనము. దానిపై రక్తము ఇక లేదు, ఏలయనగా రక్తముతో కప్పబడియున్న గొర్రెపిల్ల అక్కడి నుండి నడచి వెళ్ళిపోయెను. ఆ సమయము వరకు కాచుకొనియుండవద్దు.

LUKE 23:41

 

103పాత నిబంధనలో మీకు గుర్తున్నదా? మీరు వేచియుండవలెను. రక్తము లేనియెడల ఇక తీర్పు అని అర్ధము. అయితే రక్తము అక్కడున్నంత వరకు కృప యుండును. అయితే గొర్రెపిల్ల వెళ్ళిపోగానే, అది న్యాయ తీర్పు సింహాసనముగా మారిపోయినది.

''ఆయన ఎట్లుండెను? ఆయన ఒక మధ్యవర్తిగా యుండెను. వేరే ఏ వ్యక్తియును లేడు! అప్పుడు మరియ మధ్యవర్తిత్వము చేసినదా, నాకు చెప్పండి. మరియు ఏమి అర్పించగలదు? పరిశుద్ధ, ఫ్రాన్సిస్, పరిశుద్ధ అసిసి, లేక వేరేవరైనా, మరియు పరిశుద్ధ సిసిలీ, లేక వేరేవరైనా మనుష్యులు ఏమి అర్పింపగలరు? మధ్యవర్తిత్వము జరుపు స్థలమునందు ఒక వెయ్యి మంది పరిశుద్ధులు వచ్చుటను యోహాను ఎన్నడును చూడలేదు. ''అతను ఒక గొర్రెపిల్లను చూచెను, వధింపబడిన రక్తము కారుచున్న ఒక గొర్రెపిల్లను చూచెను.''

ఎందరు పరిశుద్ధులు వధింపబడినను నాకనవసరము, అది ఒక్కొక్కరి యొక్క వంతైయున్నది, సిలువ మానుపై ఆ దొంగ చెప్పిన విధముగా, ''మేము పాపము చేసితిమి, గనుక ఇందుకు మేము తగుదుము. అయితే ఈయన ఏమియు చేయలేదు.''

REV 5:4-6

 

104ఆయన ఒక్కడే యోగ్యుడు. మధ్యవర్తిత్వపు గూడు నుండి ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఇప్పుడు ఎందుకొరకు వచ్చుచున్నాడు? అతనిని గమనించండి. ఓ, మై!

యోహాను ఏడ్చుచున్నాడు. ఇదంతయు దేని గురించి? ఏమి జరుగనై యున్నది?

"యోహాను ఏడువకుము, అని చెప్పెను,'' ''ఇదిగో ఇక్కడ సింహము వచ్చుచున్నది. జయించిన తను ఆయనే,'' అని పెద్ద చెప్పెను.

అతను తిరిగి చూచినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక గొర్రెపిల్ల వధింపబడి, రక్తము కారుచు వచ్చుచున్నది. చంపబడినదేదైనను రక్తమును కార్చును. మీకు తెలియునా, అది వధించబడి యున్నది. దాని గొంతు నరుకబడి, నోరు తెరచుకొనియున్నది లేక ఆ విధముగా వధింపబడియున్నది. రక్తము దానిపై యంతయు నున్నది. వధింపబడిన గొర్రెపిల్ల ఇక్కడ వచ్చుచున్నది. మరియు ఆయన వచ్చుచున్నాడు. ఓ, మై, ఎందుకొరకు? ఆయన విడిపించిన వారిపై హక్కు పొందుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్. ఓ, మీకు ఆ మూలకు వెళ్ళి కొద్ది సేపు ఏడ్వవలెనని అనుపించుట లేదా?

REV 8:1•

REV 10:6

 

105రక్తమింకను కార్చుచు ఒక గొర్రెపిల్ల ఇక్కడకి వచ్చుచున్నది. అక్కడేమియును లేదు. మహానుభావులు అక్కడ చుట్టూ నిలబడికొనియున్నారు, అయితే వారిలో ఏ ఒక్కరు కూడా దానిని చేయలేరు. కావున, ఇప్పుడిక్కడకి గొర్రెపిల్ల వచ్చుచున్నది. ఆయన యొక్క విజ్ఞాపన చేయు దినములు ముగించియున్నవి, విజ్ఞాపన రోజులు. అదెప్పుడనగా, ఈ దూత అక్కడ నిలబడినప్పుడు. మనము ముద్రలలోనికి పోవువరకు మీరు కాచుకొనియుండుడి. ''సమయము ఇక లేదు.'' అది నిజము.

ఆ అర్ధగంట నిశ్శబ్దము: ప్రభువు చిత్తమైనయెడల రాబోవు ఆదివారము రాత్రి, ఆ ఏడవ ముద్రయందు, ఆ అర్ధగంటలో ఏమి జరుగనైయున్నదో దానిని మీరు గ్రహించెదరు.

REV 5:5•

REV 22:11

 

106ఆయన వచ్చుచున్నాడు (ఎందుకు?) ఇప్పుడు తన వారిని స్వీకరించుటకు (ఓ, మై!) ఆయన తనవారిపై హక్కు పొందుకొనుటకు వచ్చుచున్నాడు! ఇప్పుడు, ఆయన మన సమీపబంధువుడిగా తన యొక్క పనిని చేసెను. ఆయన దిగివచ్చెను, మానవుడాయెను, చనిపోయెను. ఆయన సమీపబంధువుడుగా మన యొక్క విమోచనా కార్యమును ముగించెను. అయితే ఇంకా ఆయన పొందుకోవలసిన వారిని సొంతము చేసుకొనుటకు ఆహ్వానించబడలేదు. ఇప్పుడు, ఆయన దేనికొరకు వధింపబడెనో ఆ హక్కును పొందుకొనుటకు రంగము మీదికి వచ్చుచున్నాడు (ఏమి జరుగుచున్నదో గమనించుడి) ఓ, మై, మానవుని విమోచించుటకు, ఆ మానవుని స్థానములో ఆయన ఒక సమీపబంధువుడిగా మరణించెను. అయితే ఆయన ఒక ''సింహము,'' అని ఆ పెద్ద చెప్పినది సరియే, చూశారా. పెద్ద ఆయనను పిలిచెను, ఒక ''సింహము,'' అని చెప్పెను, ఏలయనగా ఆయన ఒక గొర్రెపిల్లగా యుండెను, మధ్యవర్తిగా, రక్తము చిందించుచున్న గొర్రెపిల్లగా యుండెను. అయితే, ఇప్పుడు ఆయన ఒక సింహముగా వచ్చుచున్నాడు.

ఆయన విజ్ఞాపన చేయు దినములు గతించిపోయినవి. ''అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్ము.'' ఆ కార్యము ముగించబడియున్నది. ఓ, సహోదరుడా! అటు పిదప ఏమి జరుగనై యున్నది? అటు పిదప ఏమిటి? మరియు గుర్తుంచుకొనుడి, దేవుని మర్మములు తెరువబడుచున్నప్పుడు అది ఏడవ సంఘ కాలములో వచ్చును.

REV 10:7

 

107ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినుడి. ఇక్కడేదో మీరు పొందుకొనవలసిన విషయమొకటి ఉన్నది. ఇప్పుడు, విశ్వాసి కొరకు విజ్ఞాపన చేయుచు తన మధ్యవర్తిత్వము ఆయన జరిగించుచునే యున్నాడు. రెండు వేల సంవత్సరములుగా ఒక గొర్రెపిల్లగా ఆయనక్కడ ఉన్నాడు. ఇప్పుడు, హక్కు పత్రమును గైకొనుటకు, మరియు ముద్రలను విప్పుటకు, మరియు మర్మములను బయలుపరచుటకు, నిత్యత్వము నుండి బయటికి వచ్చుచున్నాడు. అదెప్పుడు? అంత్యకాలమందు. దానిని మీరు గ్రహించియున్నారా? అది సరి. మనము ముందుకు సాగెదము.

ఇప్పుడు, ఆయన ముద్రలను విప్పి ఏడవ దూతకు దేవుని యొక్క మర్మములను బయలుపరచును. ఏడవ దూత యొక్క వర్తమానము ఏడు ముద్రలలో దాగియున్న మర్మయుక్తమైయున్న రహస్యములను బయలుపరచుటయే. దేవుని యొక్క మర్మములు ఈ ఏడు ముద్రలలో యున్నవి. చూశారా? దానినే అతనిక్కడ చెప్పెను. సమస్త మర్మములును ఈ ఏడు ముద్రలయందు గలవు.

AMOS 3:7•

MAL 4:1,3,6•

REV 5:5-7

 

108దేవునికి మానవునికి మధ్యవర్తిగా నుండిన గొర్రెపిల్ల ఇప్పుడు వచ్చుచున్నది. ఆయన ఒక సింహముగా మారును. మరియు ఆయన సింహముగా మారినప్పుడు, ఆయన ఆ గ్రంథమును స్వీకరించును. అది ఆయన హక్కు. ఆ మర్మముయున్న ఆ గ్రంథమును దేవుడు తన చేతిలో పట్టుకొనియున్నాడు. అయితే ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చియున్నది. ఎవరు ఆ గ్రంథమును తీసికొనలేరు. అదింకా దేవుని చేతిలోనే యున్నది. ఏ పోపు గాని, యాజకుడు గాని ఎవరెటువంటివారైనను గాని, వారు గ్రంథమును తీసికొనలేరు. (తీయలేరు) ఏడు ముద్రలు ఇంకా బయలుపడలేదు. చూశారా? అయితే, ఒక విజ్ఞాపనకర్తగా యున్న ఆయన తన మధ్యవర్తిత్వపు పనిని ముగించినప్పుడే ఆయన వచ్చును. మరియు యోహానుతో.. ''ఆయన ఒక సింహము.'' అని పెద్ద చెప్పెను, మరియు ఆయన వచ్చుచున్నాడు. ఆయనను గమనించుడి. ఓ, మై! చూశారా.

ఇప్పుడు గమనించుడి, సంఘ శాఖలు సంఘకాలములలో ఎందరో వీటిని గూర్చి వేరేవిధముగా ఊహించగా ఆ గ్రంథమును తీసుకొని దేవుని మర్మములన్నింటిని బయలుపరచుటకు ఆయన వచ్చుచున్నాడు. చూడండి, అప్పుడు ఏడవ దూతను… ఈ గ్రంథములో ఉన్న మర్మములు అది దేవుని వాక్యమైనయెడల, ఏడవ దూత దేవుని యొక్క వాక్యము వచ్చు ఒక ప్రవక్తగా యుండవలయును. ఏ యాజకుడు గాని, పోపు గాని,లేక వేరేవరైనను దానిని పొందజాలరు; వాక్యము అటువంటివారి యొద్దకు రాదు. ఎల్లప్పుడు దేవుని వాక్యము ఒక ప్రవక్త యొద్దకే వచ్చును.

మలాకీ4 ఆ విధముగా వాగ్దానము చేసియున్నది. మరియు అతను వచ్చునప్పుడు సంఘ శాఖలలో శాఖలుగా యున్నవారు అర్ధం చేసుకోలేక గందరగోళముగా యున్న దేవుని యొక్క సమస్త మర్మములను ప్రత్యక్షపరచి ''మరి పిల్లల యొక్క విశ్వాసమును తిరిగి తండ్రుల తట్టుకు త్రిప్పును.'' మరి అటుపిదప ప్రపంచమును న్యాయ తీర్పు తాకి మరి భూమి దహించివేయబడును. మరటు పిదప వెయ్యేండ్ల పరిపాలనలో నీతిమంతులు దుర్మార్గుల ధూళిపై నడిచెదరు. ఇప్పుడు దానిని మీరు గ్రహించియున్నారా? అది నిజము.

REV 10:1-7

 

109సంఘ శాఖల కాలములో ఇతరులు దానిని ఊహించికొనిరి. అయితే చూడండి, అతడొక మానవునిగా ఉండవలయును, ఏడవ దూత… ప్రకటన 10:1-4.. ఏడవ దూత యొద్ద దేవుడిచ్చిన మర్మములన్నియును కలవు, మరియు అతడు సంఘశాఖల కాలములలో విడువబడిన మర్మములన్నిటిని ముగించును లేక బయలుపరచును.

ఇప్పుడు, సంఘ శాఖలలో ఉన్న నా సహోదరులను నేనెందుకు నిందించునని మీరు గ్రహించగలరు. అది ఒక సంఘ శాఖ యొక్క క్రమము! వారికి దానిని గురించి తెలియదు. దానిని వారు తెలుసుకొనుటకు ప్రయత్నించనవసరము లేదు, ఎందుకనగా అది వారికి బయలుపరచబడదు. అది వాక్య ప్రకారము అట్లు చెప్పబడుచున్నది. దానిని ఊహించి, మరియు దానిని నమ్మి అది అక్కడ యున్నదని మరి విశ్వాసము ద్వారా దానిని వారు పట్టుకొనినడచిరి, అయితే, ఇప్పుడది సాక్ష్యము ద్వారా ఋజువు చేయబడినది. ఆమేన్. ఓ, మై, ఎటువంటి ఒక లేఖనము ఇది!

ZECH 14:5•

REV 10:6•

REV 19:16

 

110ఇప్పుడు గమనించుడి. అప్పుడు అది ఆయనే, గొర్రెపిల్ల రాజు యొక్క స్థానమును ఆక్రమించును, అప్పుడు ఆయన యొక్క పరిశుద్ధులు ''ప్రభువులకు ప్రభువుగా, మరియు రాజులకు రాజుగా,'' ఆయనకు కిరీటము పెట్టుటకు వచ్చెదరు, చూశారా? చూడుడి, సమయము గతించిపోయినది. ''ప్రకటన 10:6 — ''ఇక సమయము లేదు.''

REV 5:3,4,6,7

 

111గమనించుడి, ఈ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములున్నవి. దానిని మీరు గమనించి యున్నారా? ''ఏడు కొమ్ములు కలిగియున్నది.'' దానిని గురించి ఇప్పుడే ధ్యానించి యున్నాము. కొమ్ములు అనగా అర్ధము జంతువుకుండు ''శక్తి'' మరి గమనించుడి, ఆయన ఒక మృగము కాదు, ఏలయనగా ఆయన సింహాసనము నందు కూర్చొనియున్న వాని యొక్క కుడి చేతియందున్న గ్రంథమును తీసికొనెను. చూశారా?

గమనించుడి. ఓ, మై! దానిని ఎక్కడో వ్రాసియుంచానని అనుకొనుచున్నాను. ఓ, ముద్రలను పత్రమను విప్పి, ఆ వర్తమానము ఏడవ దూతను అందించుటను గూర్చి ఎక్కడో నేను వ్రాసియుంచానని అనుకొనుచున్నాను. మరియు ఆయన రాజు స్థానమును గైకొనును. ఇప్పుడు దానిని చేయుటకు ఆయన వచ్చును.

ఇప్పుడు గమనించుడి, ఆయన బయలువెడలినప్పుడు, ఏడు కొమ్ములు…. ఇప్పుడు, అతను ఈ గొర్రెపిల్లను చూచినప్పుడు, యోహాను దానిని చూచినప్పుడు, అది ఆయన వధింపబడి రక్తము కారుచున్నట్లుండెను. మరియు ఆయన నిత్యత్వము నుండి వచ్చియున్నాడు, మరియు ఆయన మధ్యవర్తిత్వమును ముగించియున్నాడు. అది అట్లునప్పుడు, మీరు మరియకు ఎంత ప్రార్ధించినను ఏమీ లాభము లేదు!

''పరలోకమునందును, మరియు భూమిపైనను, ఎవరును లేరు, లేక ఏ మానవుడును, ఏ ఇతర జీవరాశులును దానిని తీసుకోలేరు.'' అందుకే యోహాను ఏడ్చెను. ఓ, కాథలిక్కు స్నేహితుడా, దానిని నీవు చూచుట లేదా? చనిపోయిన ఎవరో ఒక వ్యక్తికి నీవు ప్రార్ధన చేయవద్దు.

112గొర్రెపిల్ల మాత్రమే మధ్యవర్తి. చూశారా? ఆయనే బయటకు వచ్చెను. మర్పిడాయన ఏమి చేయుచున్నాడు? ఆయన యొక్క రక్తము ప్రతి వ్యక్తికి పాపపరిహారము చేయువరకు ఆయన విజ్ఞాపనలు చేయుచున్నాడు. గ్రంథములో ఏమి వ్రాయబడియున్నదో గొర్రెపిల్లకు తెలియును. కావున, వారి పేర్లు జగత్తు పునాది వేయబడినప్పటి నుండి అందులోనున్నవని ఆయన ఎరిగియున్నాడు, కావున ఆయన అక్కడ నిలబడిమరి - మరి, మధ్యవర్తిత్వము చేయుచున్నాడు, గ్రంథములోనున్న ప్రతి యొక్కరు విమోచింపబడి మరి ఆ కార్యము ముగియువరకు ఆయన తన మధ్యవర్తిత్వము పనిని చేయుచున్నాడు. మరిప్పుడు ఆయన వెలుపలికి వచ్చుచున్నాడు.

RUTH 4:7

 

113చూశారా? ఆయన సమీపబంధువుని యొక్క పనిని చేసెను. సమీపబంధువుని యొక్క పని ఏమిటో మీకు తెలియునా? పెద్దల ఎదుట సాక్ష్యమిచ్చుటయే. బోయజు చెప్పు విడుచుట మరి ఆలాటి కార్యము మీకు గుర్తున్నదా? ఇప్పుడు ఆయన ఇవన్నియును చేసియున్నాడు. ఇప్పుడు ఆయన తన వధువును తీసికొనుటకు వచ్చుచున్నాడు. ఆమేన్. ఇప్పుడాయన రాజుగా వచ్చుచున్నాడు. ఆయన తన యొక్క రాణి కొరకు చూచుచున్నాడు. ఆమేన్! దానిని గూర్చిన సమస్త మర్మములను ఈ గ్రంథములో ఉన్నవి, ఏడు ముద్రలు దానిపై చుట్టబడియున్నవి. (ఓ, సహోదరుడా!) ఏడు ముద్రలు, ఆయన రాకడకై కాచుకొనియున్నవి.

గమనించుడి, ఈ సూచనలను గురుతులను చూచెదము. సరి, ఇప్పుడు సమయము తొమ్మిది గంటలు అగుచున్నది. మనము కొనసాగిపోవుటకు మనకు ఇంకా మూడు గంటలు లేక అధిక సమయమున్నది. మనము కలిగియున్నాము. సాతానుడు జనులు చాలా అలసిపోయినారని నాతో చెప్పుచున్నాడు, కావున మీరు అలసిపోయియున్నారని నేను అనుకొనుచున్నాను, అయినను మనము దీనిని తీసికొనెదము ఎట్లైనను.

REV 5:6

 

114''ఏడు కొమ్ములు'' ఏడు సంఘ కాలములు, చూడుడి, ఏడు సంఘ కాలములు, ఏలయనగా, అది గొర్రెపిల్ల యొక్క రక్షణ. ఆయన తన హక్కును వేటి ద్వారా రక్షించుకొనెను! భూమిపై, దేవుని ద్వారా పంపబడిన జనుల గుంపు ద్వారా, వారే ఆయనకు రక్షణగా నుండి; గొర్రెపిల్లపైనున్న కొమ్మును చూడండి. ''ఏడు నేత్రములు'' ఏడు సంఘ కాలముల యొక్క ఏడుగురు వర్తమానికులు. ''ఏడు నేత్రములు'' - ఏడుగురు ప్రవక్తలు.

115మీరు కొన్ని లేఖనములను వ్రాసుకొనగోరుచున్నారా? దాని తట్టుకు మనము త్రిప్పెదము. మీకు అధిక సమయమున్నదని చెప్పుచున్నారా? సరి. మనము జెకర్యాకు పోయెదము, జెకర్యా పుస్తకము, కొద్దిగా వాటి నుండి చదివెదము. ఈ విషయములపై నేను మిమ్ములను అధిక సమయముంచదలచలేదు. మరియు నేను… అయినప్పటికిని, దానిని మీరు పోగొట్టుకొనక గ్రహించవలయునని కోరుచున్నాను. దీనికంటెను వేరేదైనను ముఖ్యమైనది యున్నదా? ఒక వ్యక్తికి నిత్యజీవముకన్నను ముఖ్యమైనదేదియు లేదు. మనము దీనిని ఇప్పుడు పొందుకొనవలయును, దానిని పొందియున్నామన్న నిశ్చయతతో నుండవలయును. మంచిది.

ZECH 3:8,9

 

116అవును. అయ్యా. మరిప్పుడు మనము జెకర్యా 3వ అధ్యాయము చదువగోరుచున్నాము. అది సరి అని నేను అనుకొనుచున్నాను, ఇప్పుడు జెకర్యా 3. నేను లేఖనములను వ్రాసియుంచుకొనినయెడల, ఈ గురుతులను మనము చూచెదము. దీనిని నేను గ్రహించినప్పుడు, ఈ మధ్యాహ్నము నేనున్న స్థలమందు ఆనందముతో కేరింతలేసాను. కావున, నాకు తెలియదు, నేను సరైన దానిని పట్టుకొన్నానా లేదా అని. నేను సరైన దానిని పొందియున్నానని అనుకొనుచున్నాను. జెకర్యా 3 మనము చూచెదము అది… ఇక్కడ (నేను 89) అని వ్రాసుకొన్నాను, అయితే అది 8 నుండి 9 వరకు. సరి. సరి. అది 89గా ఉండదు అని నాకు తెలియును. జెకర్యా 3:8 మరియు 9:

ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు (క్రీస్తు) అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.యెహోషువా యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పనిచేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును.

ZECH 4:10•

REV 5:6

 

117ఇప్పుడు మనము జెకర్యా 4:10,4:10కి త్రిప్పెదము. వినుడి:

…కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు? (దేవుడు సామాన్యతలో యున్నాడు, చూశారా?) లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును.

''ఏడు నేత్రములు…'' నేత్రములు అనగా ''చూచుట.'' చూచుట అనగా ''ప్రవక్తలు, దీర్ఘదృష్టి కలవారు.'' ఈ గొర్రెపిల్లను ఏడు కొమ్ములు కలవు, మరి ఆ ఒక్కొక్క కొమ్ముపై ఒక కన్ను కలదు. ''ఏడు కన్నులు'' అదేమిటి? క్రీస్తు మరియు ఆయన యొక్క వధువు; ఏడు సంఘ కాలములు. వాటిలో నుండి ఏడుగురు ప్రవక్తలు బయలువెళ్ళిరి, వారే ఆ ఏడు నేత్రములు, దీర్ఘదృష్టిగలవారు. కావున చివరిగా వచ్చువాడును కూడా దీర్ఘదృష్టిగలవాడై యుండవలయును. మంచిది.

REV 5:6,7

 

118గమనించుడి, ఆయన ఒక జంతువు కాదు. ''సింహాసనముపై కూర్చుండియున్నవాని కుడిచేతిలో నుండి గ్రంథమును ఆయన తీసికొనెను.'' అదెవరు? యజమాని, నిజమైన యజమాని యొక్క కుడి చేతిలో ఆ విమోచనా గ్రంథము గలదు. మరియు ఏ దేవదూత గాని, అట్టి మరెవరైనను గాని ఆ స్థానమును తీసికొనలేరు. ''మరి రక్తము కారుచున్న గొర్రెపిల్ల బయటికి నడచి వచ్చి ఆయన చేతిలో నుండి గ్రంథమును తీసికొనెను. అదేమిటి? సహోదరుడా, ఇదియే వాక్యములో ఒక మహోన్నతమైన కార్యముగా యున్నది. ఆమేన్. దీనిని ఒక దేవదూత గాని, వేరే ఏదియును ఆ పనిని చేయలేరు. మరి గొర్రెపిల్ల వచ్చి సింహాసనముపై కూర్చొనియున్న ఆయన కుడి చేతిలో నుండి గ్రంథమును తీసికొనెను. అదేమిటి? ఇప్పుడుఅది గొర్రెపిల్లకు చెందినది. ఆమేన్.

REV 4:10•

REV 5:8

 

119దేవుని చట్టము దానిని కోరుచున్నది. దానిని ఆయనే పట్టుకొనియున్నాడు. దేవుని యొక్క చట్టము ప్రకారము ఒక సమీపబంధువుడగు విమోచకుడు కావలెను. మరి గొర్రెపిల్ల బయటికి వచ్చి, దానిని పట్టుకొనియున్నది, ''వారి యొక్క సమీపబంధువుడను నేనే. వారి యొక్క విమోచకుడను నేనే. నేను ఇప్పుడు, విజ్ఞాపనలను చేసినది నేనే, మరిప్పుడు వారి హక్కులను పొందుటకు వారికొరకు, వచ్చితిని.'' ఆమేన్. ఒక్కరే ఒక్కరు యున్నారు. ''నేను వారి హక్కులను పొందుటకు వారి హక్కులను వారికి తిరిగి ఇచ్చుటకు వచ్చియున్నాను. వారు పాపముచే పతనమై కోల్పోయిన సమస్త హక్కులు అందులో గలవు. నేను క్రయమును చెల్లించితిని.'' ఓ, సహోదరుడా! వ్యూ! అది మీకు హృదయాంతరములోను ఆత్మీయ ప్రేరణను కలిగించుట లేదా? ''మనము చేసిన మంచి కార్యముల నిమిత్తము కాదు గాని, ఆయన యొక్క కృప వల్లనే.'' ఓ, ఒక్క నిమిషము ఆగండి! మరియు ఆ పెద్దలును మరియు సమస్తమును వారి యొక్క కిరీటములను విసిరివేయసాగిరి, మరియు ప్రముఖులు నేలపై పడవేయసాగిరి, చూశారా.

REV 5:7

 

120ఏ ఒక్కరును, ఏ ఒక్కరును దానిని చేయలేకపోయిరి. మరియు ఆయన దేవుని యొక్క కుడి చేతియొద్దకు నడచి వెళ్ళెను, ఆయన చేతినుండి ఆ గ్రంథమును తీసికొని తన హక్కులను కోరెను. ''వారికొరకు నేను చనిపోయాను. నేను వారి యొక్క సమీపబంధువుడగు విమోచకుడను. నేను మధ్యవర్తిని. నా యొక్క రక్తము చిందింపబడినది. నేను మానవుడనైతిని. నేను జగత్తుకు పునాది వేయబడకమునుపు చూచిన ఆ సంఘమును మరల దాని స్థానమునకు దానిని తీసికొని వచ్చుటకు నేను దీనిని చేసియున్నాను. నేను ఉద్దేశ్య పూర్వకముగా దానిని చేసితిని. అదక్కడ నుండునట్లు నేను దానిని పలికియున్నాను. మరియు దానిని ఎవరును తీసుకొనలేకపోయిరి, అయితే, నేను క్రిందికి వెళ్ళి, నేనే స్వయముగా దానిని చేసియున్నాను. నేను వారి యొక్క సమీపబంధువుడను. నేను వారి సొంతవాడనైతిని.'' మరి ఆయన ఆ గ్రంథమును తీసికొనెను. ఆమేన్.

ఓ, ఈ రాత్రి నా కొరకు అక్కడ వేచియున్న ఆయన ఎవరు. సంఘమా, అక్కడ కాచుకొనియున్న ఆయన ఎవరు? నీ కొరకు ఎదురు చూడగలరు? ఆయనే సమీపబంధువుడగు విమోచకుడు. ఓ, మై! ఎటువంటి మహోన్నతమైన వివరణ అది, లేక క్రియ!

121ఇప్పుడు విమోచనకు హక్కు పత్రము ఆయన యొద్ద కలదు. దానిని ఆయన తన చేతలందు ఉంచుకొని యున్నాడు. మధ్యవర్తిత్వము అయిపోయినది. అది ఆయన చేతిలో ఉన్నది. గుర్తుంచుకొనుడి, అది ఎల్లప్పుడు దేవుని చేతిలో యుండెను, అయితే ఇప్పుడు అది గొర్రెపిల్ల యొక్క చేతిలో నున్నది.

ఇప్పుడు గమనించుడి, సమస్త సృష్టి యొక్క విమోచనా హక్కు పత్రములు ఆయన చేతిలో నున్నవి. మానవజాతి కొరకు, తిరిగి వాటిని పొందుటకు ఆయన వచ్చెను. దూతల కొరకు దానిని విమోచింపలేదు. మానవుల కొరకియ్యబడిన దానిని తిరిగి పొందుటకు వారిని మరల దేవుని యొక్క కుమారులుగాను, మరియు కుమార్తెలుగాను చేయుటకు దానిని ఆయన పొందెను, వారు పోగొట్టుకొనిన సమస్తమును — సమస్త సృష్టియు, చెట్లు, జంతువులు, మిగిలిన సమస్తమును వీటితో వారిని ఏదెను తోటలో తిరిగి రప్పించుటకు దానిని విమోచించెను. ఓ, మై! అది మీకు ఎంతో శ్రేష్టమైనదిగా కనిపించుట లేదా? వ్యూ!

122నేను అలసిపోయానని అనుకొంటిని, అయితే ఇప్పుడు నాకు అలసట లేదు. చూశారా? కొన్నిసమయములలో నేను బోధించలేనంత వృద్ధుడనైపోయానని అనుకుంటాను. మరటు పిదప అటువంటి ఆత్మీయ ప్రేరణకు కలిగించు సంభవమును నేను చూచినప్పుడు, నేను మరల ఒక యువకునిగా మారిపోయినట్లనిపించును. అది మీకేదో చేసియున్నది. చూశారా? ఏలయనగా ఇది నాకు తెలియును, అక్కడ నా కొరకు ఎవరో కాచుకొని యున్నారు. నేను చెల్లించలేని వెలను అక్కడొకరు చెల్లించిరి. అది వాస్తవము. చార్లీ, ఆయన దానిని నా కొరకు చేసెను. నీ కొరకు చేసియున్నాడు. సమస్త మానవ జాతికొరకు ఆయన దానిని చేసియున్నాడు. మరిప్పుడు ఆయన తన విమోచన హక్కులను పొందుటకు వచ్చుచున్నాడు. ఎవరి కొరకు దానిని పొందగోరుచున్నాడు? ఆయన కొరకు కాదు; మన కొరకు, ఆయన మనలో ఒకడు. ఆయన మన సమీపబంధువుడు. ఓ, మై! ఆయన నా యొక్క సహోదరుడు. ఆయన నా యొక్క రక్షకుడు. ఆయన నా యొక్క దేవుడు. ఆయన నా యొక్క సమీపబంధువుడగు విమోచకుడు. ఆయనే నా సర్వము. ఆయన లేకుండా నేనేమి చేయవలెను, లేక ఆయన లేకుండా నేనెట్లుండ గలను?

కావున, చూడుడి, ఆయన నా సమస్తము, మరియు ఆయన అక్కడ మన యొక్క సమీపబంధువుడిగా నిలబడియున్నాడు. మరియు ఇప్పుడు ఈ సమయము వరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన విమోచనా గ్రంథమును తీసుకొని, మన కొరకు ఆయన ఏమైతే సంపాదించెనో దానిని పొందుకొనుటకు ఆయన ఇప్పుడు వచ్చుచున్నాడు.

LUKE 12:38•

JOHN 6:54•

JOHN 11:25•

1THS 4:14,16

 

123వారు చనిపోయిరి… యేసు చెప్పెను, ''నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరల బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు. నా యొక్క శరీరము తిని, నా రక్తము త్రాగువానికి నిత్యజీవము కలదు, అంత్య దినమున అతనిని లేపుదును.''

మొదటి జాములో నిద్రించినను, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ లేక ఏడవ జాములో ఎక్కడ నిద్రించినను పరవాలేదు. ఏమి జరుగును? దేవుని యొక్క బూర ధ్వనించును. కడపటి బూర గట్టిగా మ్రోగును, అదే సమయములో కడపటి దూత తన వర్తమానమునిచ్చును, మరియు కడపటి ముద్రయు తెరువబడును. ఆ కడపటి బూర మ్రోగును మరి విమోచకుడు తన సంఘమును, రక్తముతో కడుగబడిన, తాను విమోచించిన స్వాస్థ్యమును తీసికొనుటకు వచ్చును.

124ఇప్పుడు. ఓ, సమస్త సృష్టియును ఆయన చేతిలో యున్నది, ఇప్పుడు దానిపై పూర్తి విమోచన పథకము ఆయన తీసికొనిన ఈ గ్రంథములో ఏడు మర్మమైన ముద్రల ద్వారా ముద్రింపబడియున్నది. ఇప్పుడు గమనించుడి, ''ఆయన మాత్రమే తనకిష్టమైన వారికి దానిని బయలుపరచును.'' దానిని తన హస్తములందు కలిగియున్నాడు, చూడుడి. ఇప్పుడు, ఆ విమోచనా గ్రంథములో ఏడు ముద్రల యొక్క మర్మములను ముద్రించబడియున్నవి. దానిని ఆ కాలమందు ప్రత్యక్షపరచెదనని ఆయన వాగ్దానము చేసెను. ఇప్పుడు గమనించండి.

ఇప్పుటికింకా స్నేహితులారా… మిమ్ములను ఎనిమిదిన్నరకు విడిచి పెట్టెదనని, నేను మీతో చెప్పాను, అయితే దీనిని చెప్పుటకు మూడు లేక నాలుగు పేజీలను త్రిప్పవలసియున్నది, కావున నేను కోరుచున్నాను ( నేనిప్పటికే తొమ్మిది దాటియున్నాను.) కావున మీరు తిరిగి రేపు రాగలరు.

125కాని, ఇప్పుడు ఈ ఏడు ముద్రలుగల విమోచనా గ్రంథమును, తనకు తానుగా తీసికొనుటకు ఈ గొర్రెపిల్లకు మాత్రమే వీలగును. ఆయన విమోచించిన వాటియొక్క హక్కులను ఆయన పొందుకొనుటకు, సింహాసనముపై కూర్చొనియున్న వానియొక్క కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఏదెను తోటలో ఆదాము కోల్పోయిన సమస్తమును తిరిగి ఇచ్చుటకు, ఆయనచే విమోచించబడిన, నీపై, నాపై ఆయనకున్న హక్కును పొందుటకు ఆయన వచ్చెను. చూశారా!ఆయన మనలను ఆ ఆది స్థితికి తీసుకు వెళ్ళుటకు విమోచించెను.

REV 6:10

 

126ఇప్పుడు గొర్రెపిల్ల గ్రంథమును తన చేతులందు ఉంచుకొనియుండగా, ఏడు ముద్రలను తెరచి, కొద్దిగా కాలము యొక్క తెరను ఎత్తి మనమందులో చూచుటకు ఆయన యొక్క కృపను మరియు దయను మనపైనుంచమని మనము వేడుకొనుటకు సిద్ధముగా నున్నాము. ఓ, మై!

గమనించుడి, ఆయన గ్రంథమును తీసినప్పుడు, హక్కుగల పత్రములు ముద్రించబడియుండెను, (దానిని మీయొక్క మనస్సులో యుంచుకొనుడి) మరియు వాటిని బయలుపరచుటకు, ఆయనకై చెందినవారికి వాటిని తీసికొని వచ్చుటకును, (చూశారా), ఆయనచే విమోచింపబడిన జనులందరి కొరకు మర్మమైన ముద్రలను తెరచెను. ఇప్పుడు, మనము దీనిని గురించి ముద్రలలో సంధించబోవుచుండగా, మనము అక్కడ ఇంకా వెనుకకు వెళ్ళి మరి బలి పీఠము క్రిందనున్న ఆత్మలు ఇట్లు మొరపెట్టుట, ''ప్రభువా, ఎంత కాలము, ఎందాక?'' అనే దానిని చూడబోవుచున్నాము.

1THS 4:15-17•

REV 6:11

 

127మరి ఇక్కడ ఒక మధ్యవర్తిగా బలిపీఠముపై ఆయన, ''ఇంకా కొంచెము కాలము, మీవలె మరి కొందరు శ్రమపడవలసియున్నారు.'' అయితే ఇప్పుడు, ఇక్కడ ఆయన చివరి ముద్రలో వచ్చుచున్నాడు. ఆయన ఇక మధ్యవర్తి కాడు; ఇప్పుడు ఆయన రాజు. మరి ఆయన ఏమి చేయును? ఆయన రాజైనయెడల ఆయనకు ప్రజలుండవలయును. మరియు ఆయన విమోచించినవారే ఆయన యొక్క జనులు, మరియు వారు ఆయన విమోచనపు హక్కును పొందువరకు ఆయన ఎదుటికి రాలేరు. మరిప్పుడు ఒక మధ్యవర్తి స్థానము నుండి నడచి వచ్చుచున్నాడు; మరణము ఎక్కడ మనలను సమాధిలో ఉంచెనో, ఆయన తన హక్కులతో వచ్చుచున్నాడు. ఆమేన్.

''మరియు ఆయన రాకడ వరకు సజీవులై నిలిచియున్న వారు, నిద్రించిన వారిని ఆటంకపరచరు. ఆ కడపటి బూర మ్రోగినప్పుడు, దేవుని బూర మ్రోగును.'' కడపటి ముద్ర విప్పి తెరువబడినప్పుడు మరియు ఏడవ దూత తన వర్తమానమును ఇచ్చుచున్నప్పుడు, క్రీస్తునందు మృతులైనవారు లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ఆయనను ఎదుర్కొనుటకు ఆకాశమండలమును కొనిపోబడుదుము. ఆయన హక్కును పొందబోవుచున్నాడు! ఇప్పుడు, ఆయన తన - తన స్వాస్థ్యమును పొందుటకు వచ్చియున్నాడు.

గమనించుండి! దీనిని చూడుడి! మై! ముద్రలను విప్పి, మర్మములను బయలు పరచెను. బయలుపరచెను (ఎక్కడ?) జీవించుచున్న ఒకే ఒక కడపటి కాల సంఘమునకు. తక్కిన వారందరును నిద్రించుచున్నారు.

MATT 23:9•

MATT 25:6•

LUKE 12:38

 

128ఆయన చెప్పెను, ''ఆయన మొదటి జాములో వచ్చినను, రెండవ జాములో, మూడవ జాములో, చివరగా ఏడవ జాములో వచ్చినను.'' ఏడవ జాములో ఒక ఆజ్ఞ లేక ఒక పిలుపు బయలువెడలెను, ''ఇదిగో, పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు!'' మరి వారు చేయుచున్నప్పుడు, నిద్రించుచున్న కన్యక, నామకార్ధ సంఘములు, చెప్పెను, ''ఓ, మీకు తెలియునా, నేను నమ్ముచున్నాను, ఆ పరిశుద్ధాత్మను నేను పొందగోరుచున్నాను.'' మీరు ప్రెస్బిటేరియనులను, ఎపిస్కోపెలియన్‌లను గమనించియున్నారా? ఫినిక్స్‌లో నా వర్తమానమును మీరు వినియున్నారా? అక్కడ ఆ కూటములో నిలబడియున్న వ్యక్తి, "వాయిస్" అను పత్రికలో చెప్పబడియున్నది. ''పరిశుద్ధ తండ్రి మొదలగునవి,'' మంచిది, ఆ పత్రిక యొక్క సంపాదకుడుకి ఏమైనది? ఏ మానవుడిని "తండ్రి" అని పిలువకూడదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది కదా! చూశారా, వారిలో వారు నిద్రించుచున్నారు, ఆ కారణము వలననే, మరి వారు వచ్చినప్పుడు ''అవును, మేము నమ్ముచున్నాము,'' అని చెప్పుచున్నారు.

129ఒక స్త్రీ ఇంకొక స్త్రీని పిలిచి, చెప్పెను, ''నీకు తెలియునా, నేను ఎపిస్కోపెలియనును.'' చెప్పెను, ''నేను ఒక రోజు భాషలలో మాట్లాడాను. నేను పరిశుద్ధాత్మను పొందానని నేను నమ్ముచున్నాను, అయితే, ష్, ఎవరికి చెప్పవద్దు.'' దానిని నేను సందేహించుచున్నాను. మీరు భాషలలో మాట్లాడియుండవచ్చును, అయితే, ఒక వ్యక్తికి నిప్పంటించినయెడల, అతడెట్లు ఊరకుండగలడు? దానిని చేయలేడు.

పేతురు, మరియు యాకోబు, మరి యోహాను మరి మేడ గదిలోనున్న వారందరును, ఈ విధంగా చెప్పుటను మీరు ఊహించగలరా, ''ఓ, ఇప్పుడు మేము పరిశుద్ధాత్మను పొందియున్నాము, అయితే మేము ఊరకుండుట మంచిది''? వారు, సహోదరుడా, కిటికీలగుండా, తలుపులగుండా, మరి అన్నిటి ద్వారా వీధులలోనికి వచ్చి, త్రాగినవారివలె కనిపించిరి. అది నిజమైన పరిశుద్ధాత్మ.

MATT 25:7,10,30

 

130అయితే, మీరు చూడండి, ఆ నిద్రించుచున్న కన్యక ఏమియు పొందియుండలేదు. అది సరియే. మరియు గుర్తుంచుకొనుడి, వారు నూనెను కొనుటకు వెళ్ళినప్పుడు, గుర్తుంచుకొనుడి, వారు దానిని పొందిరని లేఖనములు చెప్పుట లేదు. అయితే వారు బయటికి వెళ్ళి దానిని కొనుటకు ప్రయత్నించుచుండగా, ఒక స్వరము వినిపించెను. ఏమి జరిగినది? నిద్రించుచున్నఆ కన్యకలందరును లేచి మరి వారి దీపములను శుభ్రపరచుకొని, ''మరి పెండ్లి విందుకు వెళ్ళిరి.'' అది సరియేనా? మరి మిగిలినవారు శ్రమల కాలమునకు విడువబడిరి, సరి, ''ఏడ్పును, రోదనయు, పండ్లు కొరుకుటయు.'' అది సంఘము, వధువు కాదు; సంఘము. వధువులోనికి వెళ్ళినది. సంఘమునకును మరి వధువునకును చాలా తేడా యున్నది. అవునయ్యా! పెండ్లి విందులోనికి వెళ్ళినది. ఓ, గమనించుము, బాలుడా!

REV 10:6

 

131ముద్రలు విప్పబడియున్నవి. ఎందుకొరకు? ఈ కడపటి సంఘ కాలములో ఈ సత్యములను బయలుపరచుటకు. ఎందులకు? ఆయన రాజ్యమునకు తన ప్రజలను పోగుచేయుటకు, గొర్రెపిల్ల ముద్రలను విప్పి మరి తన సంఘమునకు బయలుపరచెను. ఆయన వధువు, చూశారా! ఓ, మై! ఆయన తన ప్రజలను తన యొద్దకు ఇప్పుడు తీసికొనరాదలచెను.

అదేమిటి? భూమి యొక్క ధూళిలో నుండి, సముద్రపు అడుగు నుండి, గోతుల నుండి, అన్ని చోట్ల నుండి మరి అన్ని స్థలముల నుండి, చీకటి ప్రదేశములు నుండి, పరదైసులో నుండి, వారెక్కడనున్నను. ఆయన పిలుచును, మరి వారు ఉత్తరమిచ్చెదరు. ఆమేన్! ఆమేన్! ఆయన పిలుచును మరి వారు బదులిచ్చెదరు.

ఆయన తన ప్రజలను చేర్చుకొనుటకు, వచ్చుచున్నాడు. ఆయన తన మర్మములను బయలుపరచియున్నాడు, మరి వారు దానిని చూచిరి. ఆ వేళలో మరి సమయముండదు. సమయము గతించిపోయినది. అది సమాప్తమైనది. సరి.

1COR 6:2

 

132ఒక వధింపబడిన గొర్రెపిల్లగా, విజ్ఞాపణలను చేయుటను నిలిపి, ఆయన సింహాసనమును విడిచి బయలుదేరియున్నాడు. ఆయన వర్తమానమును నిరాకరించిన వారిని, లోకమును న్యాయతీర్పు తీర్చుటకై ఒక సింహముగా, ఒక రాజుగా వచ్చుచున్నాడు. ఆయన ఒక మధ్యవర్తిగా కాదు.

పాత నింబంధన యొక్క బోధనలను జ్ఞాపకముచేసుకోండి. మనము త్వరితముగా ముగించవలెను. కరుణాపీఠము నుండి రక్తము తీయబడిన పిదప ఏమైనది? న్యాయతీర్పు సింహాసనము. మరియు వధింపబడిన గొర్రెపిల్ల నిత్యత్వము నుండి తండ్రి యొక్క సింహాసనమును విడిచి బయలుదేరి, ఆయన యొక్క స్వాస్థ్యమును పొందుకొన్నప్పుడు, అది ఒక న్యాయతీర్పు సింహాసనముగా మారుచున్నది. అప్పుడు ఆయన ఒక గొర్రెపిల్ల కాదు, అయితే ఒక సింహము, రాజు, మరియు ఆయన తన రాణిని పిలిచి తన ప్రక్కన నిలబెట్టుకొనును. ''పరిశుద్ధులు భూమిని తీర్పుతీర్చుదురని మీరు ఎరుగరా?''

DAN 7:10

 

133దానియేలు చెప్పెను, ''తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను, వేవేలకొలది ఆయనకు పరిచారము చేయుచుండిరి'' — రాజు మరియు రాణి. మరి అటుపిదప వేరొక పుస్తకము తెరువబడెను, అది జీవగ్రంథము,'' అది సంఘము కొరకు ఇవ్వబడినది. రాణి మరియు రాజు అక్కడ నిలబడిరి.

134ఒక పశువుల కాపరి ధ్యానములో ఇట్లు చెప్పబడెను:

గత రాత్రి నేను గడ్డి బీడులో పరుండియుంటిని,

ఆకాశములోని నక్షత్రములవైపు చూచాను,

మరియు ఒక పశువుల కాపరి,

ఎన్నడైనా ఆ మాధుర్య స్థలానికి వెళ్లునా అని ఆశ్చర్యపడితిని.

ఆ ప్రకాశమానమగు ఆనందవైశాల్యమునకు ఒక దారి ఉన్నది,

కాని ఆ త్రోవ మసకగా కనబడుచున్నదని వారందురు,

కాని నాశనమునకు పోవు దారి విశాలముగా ఉన్నది,

అది చాలా చక్కగా మెరయుచున్నది.

మరొక గొప్ప యజమానుని గురించి అని మాట్లాడుచున్నవి,

అతడు తన పశువుల జీవితముతో మాట్లాడుచున్నాడు. మీరెప్పుడైనా అక్కడున్నచో దానిని తేటగా చూడగలరు.

అవి మరో గొప్పయజమానుని గురించి మాట్లాడుచున్నవి,

ఆయన ఎన్నడును కాదనడు అని వారందురు,

ఎల్లప్పుడూ పాపికి ఒక గదినిచ్చును,

అది తిన్నని ఇరుకు మార్గమునకు నడుపును.

ఆయన ఎన్నడు నిన్ను విడువడని వారందరు,

మరియు ఆయన ప్రతి క్రియను,

ప్రతి చూపును ఎరుగును;

రక్షణ కొరకు మనము గుర్తింపబడియుందుము,

ఆయన గొప్ప సరిచూచు గ్రంథములో మన పేరుండును.

వారు చెప్పుదురు ఒక గొప్ప సమావేశము జరుగునని,

ఆవుల కాపరులు వేట కుక్కలవలే నిలబడెదరు,

తీర్పు తీర్చు వారితో గుర్తింపబడుదురు,

(వారే ప్రవక్తలు మరియు జ్ఞానదృష్టి కలవారు)

వారు అక్కడ ఏర్పరచబడెదరు,

ప్రతి గురుతును వారు ఎరుగుదురు.

135పశువులను ఒక్కటిగా చేర్చి మందగా యుండుటకు మీరెప్పుడైనా చూచితిరా? యజమాని అక్కడ నిలబడుకొని యుండును. మరియు సవారి చేయువారు చిన్న గుర్రములపై ఎక్కి ఆవులకు మధ్య సవారి చేయుదురు. అతను తన గురుతుగల ఆవులు వెళ్ళుటను చూచి యజమానుకి సైగ చేయును. మరి యజమాని చూచి సరేయని తల ఆడించును. అతని చిన్న గుర్రము లోనికి పరుగెత్తికొనిపోయి యజమానికి సొంతమైననన్నింటిని వేరు పరచును.

ఒక గొప్ప చుట్టుముట్టడి జరుగునని వారందురు,

మరియు ఆవుల కాపరులు వేట కుక్కలవలె నిలబడెదరు,

తీర్పుతీర్చు వారితో గుర్తింపబడుదురు.

వారు అక్కడ ఏర్పరచబడెదరు.

ప్రతీ గురుతును వారెరుగుదురు.

కావున అతడు చెప్పెను:

''నేను దారి తప్పిన దూడవలెయున్నాను''

మరణ శిక్ష విధించబడిన వానివలెయున్నాను.

సవారి చేయు పశువుల కాపరుల యజమాని వచ్చినప్పుడు,

నేను కూడా ఆ పశువులతో పాటు వధించబడెదను.

(ముద్రలేని పశువులన్నింటిని వధించి,

సూప్ తయారుచేయుదురు)

సవారిచేయు ఆ పశువుకాపరుల యజమాని ఎవరు! ఆయనే గొర్రెపిల్ల. ముద్రించబడిన వాటిని చక్కగా ఎరిగిన ఏడుగురు వర్తమానికులను ఆయన అచ్చట నిలబెట్టెను.

136గమనించండి, ఒక వధింపబడిన గొర్రెపిల్లగా, ఒక మధ్యవర్తిగా సింహాసనమును వదలి ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు; ఒక సింహముగా, రాజుగా నుండుటకు, నిరాకరించిన వారిని న్యాయతీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు. మన సమీపబంధువుడగు విమోచకుడు సమస్తమునకు రాజాయెను. ఎందువలన? ఆయన విమోచనా హక్కు పత్రములను కలిగియున్నాడు. ఆయన చేతిలో అది యున్నది. ఆయనను నేను ఎరిగియున్నందుకు నేను ఆనందించుచున్నాను. చూశారా? పిమ్మట ఆయన తన స్వాస్థ్యమును పొందును; అదియే ఆయన సంఘము, వధువు. ఆయన దానిని స్వీకరించును. అటు పిమ్మట ఆయన ఏమి చేయును? ఆయన యొక్క ప్రతివాదియగు సాతానును ఆయన చెదరగొట్టును. విమోచన వాక్యమును నిరాకరించుటకు సాతానుచే ప్రేరేపింపబడినవారిని, వారితో కూడా సాతానును అగ్ని గుండములోత్రోసివేయును.

137ఇప్పుడు ఆయన రాజు.

కృప ఇంకా సింహాసనముపై నున్నది. ఆయన యొక్క పిలుపును త్రోసివేయవద్దు. చూశారా? మీరెవరని సవారిచేయు వారెరుగుదురు. మరిప్పుడు, రెండు వేల సంవత్సరములుగా ఆయనకు శ్రమలను కలిగించిన ఆయన ప్రతివాదియగు సాతానుడిట్లు చెప్పుచున్నాడు. ''వారిని నా కిష్టమొచ్చినట్లు చేయుదును. వారు నాకు చెందినవారు, వారియొక్క హక్కును వారు అక్కడ కోల్పోతిరి.'' అయితే ఆయన మన సమీపబంధువుడగు విమోచకుడు.

ఇప్పుడు ఆయన విజ్ఞాపనలు చేయుచు, ఇక్కడ ఉన్నానని చెప్పెను. అయితే ఒక రోజు…

ఆయన చెప్పుచున్నాడు, ''వారిని నేను సమాధిలో ఉంచెదను.'' అయితే ఆయన సంఘమునకు చెప్పెను, ''నేను మిమ్ములను వెలుపలికి తీసికొని వచ్చెదను.'' చూశారా? కాని, మొదటిగా నేను ఒక మధ్యవర్తిగా నుండవలయును.

REV 2:27•

REV 12:5•

REV 19:15,20

 

138ఇప్పుడు, ఆయన మధ్యవర్తిగా కూర్చొనియున్న తండ్రి యొక్క సింహాసనము నుండి, నిత్యత్వము నుండి బయటికి అడుగు పెట్టియున్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా నుండుటకు ఇనుప దండముతో రాజ్యములను ఏలుటకు వచ్చుచున్నాడు, (ఓ!) తీర్పు సిద్ధముగా నున్నది. ఓ, సహోదరుడా, మన సమీపబంధువుడగు విమోచకుడు దానినంతయును కలిగియున్నాడు. అది సరి. అవునండీ.

ఆయన ఏమి చేయును? ఆయన ప్రతివాదియగు సాతాను చేతిలోనున్న వారిని పిలుచును. ''ఇప్పుడు వారు నావారు. సమాధి నుండి వారిని నేను లేపియున్నాను.'' మరియు ఆయన అబద్ధికులను, మరియు వాక్యమును వంకరచేసిన వారిని మరటువంటి వారినందరని సాతానుతో కూడ అగ్ని గుండములో నాశనము చేయును. ఇప్పుడు అంతా ముగిసినది. వారిని అగ్ని గుండములో పడద్రోయును. ఓ, మై!

REV 5:6,7

 

139మీరెరుగుదురా? మనము ముగించుటకు మునుపు ఇక్కడ నేను ఒక విషయమును చెప్పగోరుచున్నాను. మరటుపిమ్మట మనము త్వరపడెదము. గమనించుడి. మనమిప్పుడు 7వ వచనము వరకు వచ్చియున్నాము. అయితే 8వ వచనము నుండి 14వ వచనము, ఏమి జరుగుచున్నదో మీరు గమనింపవలయునని నేను కోరుచున్నాను. పరలోకమునందున్న సమస్తమును మరియు భూమిపైనున్న సమస్తమును… దీనిని వినండి; ఇప్పుడు, దీనిని నన్ను చదవనీయండి. పుస్తకములో ఏడవ వచనముతో చదవుట మంచిది అని నేను నమ్ముచున్నాను, చూశారా. మరియు 6వ వచనమును చూడుడి:

మరియు సింహాసనమునకును, ఆ నాలుగు జీవులకును, పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలబడియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు ఏడు తలలును… లేక ఏడు కొమ్ములును [నేను ఆ అర్ధముతో చెప్పుచున్నాను] ఏడు కన్నులు నుండెను [దానిని ఇప్పుడు మనము వివరించియున్నాము], ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు. [చూశారా, ఏడు సంఘ కాలములు, ఏడు వర్తమానికులు వారు ఆ అగ్నిని మండించుచుండిరి. చూశారా? అది వాస్తవము.]

ఆయన [గొర్రెపిల్ల] వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

140ఇప్పుడు గమనించుడి. మరి ఆయన దానిని చేయునప్పుడు, ఏమి జరిగినదో గమనించుడి. హితవత్సరము గురించి మీరు మాటలాడెదరు! ఇప్పుడు అది ఏడు ముద్రలను విప్పునపుడు సంభవించియున్నది. దీని తదుపరి మనము అర్ధగంట నిశ్శబ్దమును గురించి చూచెదము, దీనిని గమనించుడి, మరి మనము ప్రారంభించెదము. రాబోవు ఆదివారము ఇక్కడే మనము దీనిని ముగించెదము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించుడి. మీరు సిద్దముగా నున్నారా? ''ఆమేన్.'' అని చెప్పుడి.

REV 5:3-7

 

141ఆయన దీనిని చేయునప్పుడు ఏమి జరిగియున్నదో జాగ్రత్తగా గమనించుడి. సమస్త సృష్టి మూలుగుచున్నప్పుడు; ఏమి చేయవలయునో ఎవరికిని తెలియలేదు, మరియు యోహాను ఏడ్చుచుండెను. ''ఇక్కడ గొర్రెపిల్ల నడచుచు వచ్చుచున్నది!'' మరియు ఈ గ్రంథము అసలైన యజమాని యొద్ద నుండెను, ఏలయనగా మానవుడు పడిపోయి దానిని కోల్పోయెను, మరియు దానిని తీసికొనుటకు ఏ మానవునికి యోగ్యత లేకుండెను, ఏ యాజకుడో, పోపు, ఏ ఒక్కరు కూడా విమోచించుటకై దానిని తీయలేకపోయిరి, నేను చెప్పిన విధముగా. అయితే గొర్రెపిల్ల పైకి వచ్చెను! ఏ మరియనో, ఈ పరిశుద్ధుడో లేక ఆ పరిశుద్ధుడో కాదు. ''సింహాసనముపై కూర్చుండియుండు వాని కుడి చేతిలో నుండి గ్రంథమును తీసుకొనుటకు వధింపబడి, రక్తము కారుచున్న గొర్రెపిల్ల వచ్చెను." మరియు వారు ఒక విమోచకుడు ఉన్నాడని చూచినప్పుడు; మరియు బలిపీటము క్రిందనున్న ఆత్మలు, దూతలు, పెద్దలు, సమస్తమును ఇది సంభవించుచున్నప్పుడు దానిని చూచిరి…

REV 5:8-10

 

142అయినను అది ఇంకను జరుగనైయున్నది. ఈ రాత్రి ఆయన ఒక మధ్యవర్తి, అయితే ఆయన దీని యొద్దకు వచ్చుచున్నాడు. గమనించుడి:

ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశద్దుల ప్రార్ధనలు.

చాలా కాలముగా ప్రార్థించిన బలిపీఠము క్రిందనునున్నవారు వీరు. చూడుడి, వారు విమోచన కొరకు పునరుత్థానము కొరకు ప్రార్ధించిరి. మరిక్కడ, ఈ పెద్దలు వారి ప్రార్ధనలను గొర్రెపిల్ల ముందు పోయుచున్నారు… ఏలయనగా ఇప్పుడు మనకు ఒక ప్రతినిధి యున్నాడు, పరలోకమందు మనకొక విమోచకుడున్నాడు, ఆయన హక్కులు పొందుటకు వచ్చియున్నాడు.

ఆ పెద్దలు - నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి;

గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు.

REV 5:11

 

143వారు తిరిగి రావలయునని యున్నారు, మరిక్కడ వారు రాజులుగాను, యాజకులుగాను ఉండుటకు తిరిగిపోవుచున్నారు. దేవునికి మహిమ! భాషలలో మాట్లాడవలయుననిపించుచున్నది. గమనించుడి! చూడుడి! అవును. ఆయనను స్తుతించుటకు తగినంత భాషలు లేవు, ఉన్నయెడల నేను వాటితో ఆయనను స్తుతించెదను. నాకు తెలియనిది ఒకటి నాకు కావలయును. గమనించుడి,

''మరియు నేను చూడగా..'' [దీనిని వినుడి.]

మరియు నేను చూడగా, నేను చాల దూతల స్వరములు వింటిని…

REV 5:8,9,11,12

 

144ఎటువంటి ఉత్సవము కలిగినదో గమనించుడి! వారు, ఆ గొర్రెపిల్ల వచ్చి మరి ఆ విమోచన గ్రంథమును తీసినప్పుడు ఆ ఆత్మలు కేకలు వేసెను. దానిని మనము చూచెదము. సమస్తమును, అన్నియును, పెద్దలును సాగిలపడిరి. వారు పరిశుద్దుల యొక్క ప్రార్థనలను పోసిరి. ఏమిటి? మనకొరకు ఒకవిమోచకుడు ప్రతినిధిగా యున్నాడు. వారు సాష్టాంగపడిరి. మరి వారు ఒక పాట పాడిరి, మరి చెప్పిరి, ''నీవు యోగ్యుడవు, ఏలయనగా నీవు వధింపబడితివి!'' ఏమిటని గమనించుడి… మరి ఈ దూతలను గమనించుడి:

మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను; [వ్యూ! గమనించుడి!]

వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతోచెప్పుచుండిరి.

REV 5:13,14

 

145పరలోకములో ఎటువంటి ఉత్సవ సమయమది, ఆ గొర్రెపిల్ల ముందడుగు వేయగా, మధ్యవర్తిత్వపు స్థలమును వదిలి ఆయన తన వారిని పొందుకొనుటకు హక్కును గైకొనుచుండగా ఎటువంటి సమయము అది!మీకు తెలియునా, యోహాను కూడా ఆ ఆనంద సమయములో నుండెను. అక్కడ తన పేరు వ్రాయబడియుండుటను అతను చూచివుండవచ్చును. ఆ ముద్రలు విప్పబడుటను చూచినప్పుడు అతను నిజముగా చాలా ఆనందించెను. అతనేమి చెప్పెనో గమనించుడి:

అంతట పరలోకమందును, భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టియు, అనగా వాటిలోనున్న స్వరమును -సింహాసనాసీనుడైయున్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును… ఘనతయును… మహిమయు… ప్రభావమును, యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

ఆమేన్! ఆమేన్! ఆమేన్! ఓ!

ఆ నాలుగు జీవులు ఆమేన్, అని చెప్పగా. ఆ పెద్దలు సాగిలపడి సదా కాలము జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి.

EPH 1:4•

REV 5:13•

REV 17:8

 

146ఆ గొర్రెపిల్ల నడచి వచ్చునపుడు, పరలోకమందు ఎంతో సంతోషకరమగు సమయమిది. గమనించండి, ఆ గ్రంథములోని మరమ్మము ఏమిటనే దానిని పరలోక మందును ముద్రించబడియున్నది. చెప్పవచ్చును, ''అక్కడనా పేరు ఉన్నదా?'' నాకు తెలియదు; అక్కడ నున్నదని నేను నమ్ముచున్నాను. అయితే అది అక్కడున్నయెడల జగత్తుకు పునాది వేయబడక మునుపే అది ఆ గ్రంథములో వ్రాయబడెను. అయితే మొదటి విషయము, జగత్తుకు పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల అచ్చటికి వచ్చెను, ఆ విమోచనకు అది సాదృశ్యము. మరియు ఆయన ఆ గ్రంథమును తీసికొని (మహిమ!) ఆ గ్రంథమును తెరచి ముద్రలను విప్పి దానిని భూమి క్రిందనున్న ఏడవ దూతకు యిచ్చి తన జనులకు వాటిని బయలుపరచమని ఆయన చెప్పెను. అక్కడ మీరున్నారు. ఓ, మై! ఏమి సంభవించియున్నది? మిక్కిలి సంతోషము, ఘోష, హల్లేలుయా అనే కరధ్వనులు, అభిషేకము, శక్తి, సమస్త మహిమ నీకు మాత్రమే అంటూ శబ్దము ఉద్భవించినది.

మరియు మన సహోదరుడు మనమెరిగిన వృద్ధ యోహాను అక్కడ నిలబడుకొని కేకలేయుచున్నాడు! ''ఎందులకు,'' అతను చెప్పెను, ''పరలోకములో నున్న సమస్తమును, భూమిపైనున్న సమస్తమును, సముద్రములోనున్న సమస్తమును, నేను రోధించుట వినెను." ఆమేన్! సదాకాలము జీవించువానికి దీవెనలు, ఘనత, బలము, శక్తి చెల్లును గాక.

REV 5:13

 

147ఆ ముద్రలు విప్పబడినప్పటి సంతోష సమయమును గురించి మాటలాడ వలయునన్నా! యోహాను కాలపు తెరను దూసికొనిపోయి దానిలోనికి చూచి మరి చెప్పెను, ''అదిగో అక్కడ యోహాను.'' అతను ఈ విధముగా చెప్పునంతవరకు సంతోషముగా నుండెను, ''పరలోకములోనున్న సమస్తమును…'' అతను నిజముగానే ఆనంద కేకలు వేసి ఉండవచ్చును, అతను వేసెనా లేదా? ''పరలోకములోనున్న సమస్తమును, భూమిలోనున్న సమస్తమును, భూమి క్రిందనున్న సమస్తమును, సకల సృష్టియు, మిగిలినవన్నియు, నేను, ఆమేన్! దీవెనలు, మరియు మహిమ, మరి జ్ఞానము, మరి శక్తి, మరియు బలము, మరి సంపదలు, ఆయనకే చెల్లును గాక,'' అని చెప్పుటను వినెను ఆమేన్!

148ఎందులకు? ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల, విమోచకుడు, మన సమీపబంధువుడు, మధ్యవర్తిత్వము సింహాసనము నుండి వచ్చి ఆయన యొక్క స్వాస్థ్యమును స్వతంత్రించుకొనుటకు ఇచ్చటికి నడచి వచ్చెను…

ఓ, త్వరలో తన ప్రక్క నుండుటకు

గొర్రెపిల్ల ఆయన యొక్క వధువును తీసికొనును,

పరలోక సమూహమంతయు కూడుకొనును;

ఓ, అది మహిమగల దృశ్యము,

పరిశుద్ధలందరును మచ్చలేని తెల్లదనముతో;

మరియు యేసుతో మనము నిత్యముగా ఏలుదము.

ఓ, ''వచ్చి భోజనము చేయుడి,''

యజమానుడు పిలుచుచున్నాడు,

(వాక్యముపై), ''వచ్చి భోజనము చేయుడి.''

(ఓ, నాకు మాటలు రావటము లేదు, చూశారా.)

''వచ్చి భోజనము చేయుడి; వచ్చి భోజనము చేయుడి,''

మీరు ఎప్పుడైనను వచ్చి యేసు భోజనపు బల్లపై భుజింపవచ్చును,

(ఇప్పుడు! అయితే ఆయన వదలి వెళ్ళినప్పుడు ఏలాటి నిరీక్షణ లేదు.)

ఆయన గొప్ప జనసమూహములను పోషించినవాడు,

నీటిని ద్రాక్షారసముగా మార్చెను…

JOHN 14:12•

JOHN 21:12

 

149''నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును,'' అని చెప్పినవాడు, ఓ, మై!

ఈ సంగతులను అంత్య దినములలో వాగ్దానము చేసినవాడు, ఈ సంగతులను చెప్పినవాడు. ఈ కార్యములు తెలియపరచబడుతున్నా ఈ ప్రత్యక్షతా సమయములో ఉన్నవాడు. ''వచ్చి భోజనము చేయుడి.'' ఓ, దీనిని తప్పిపోకు, నా సహోదరుడా. ఇప్పుడు మన తలలను ఒక నిమిషము వంచెదము.

రేపు రాత్రి, దేవుని కృపనుబట్టి, మనము మొదటి ముద్రను విప్పుటకు ప్రయత్నించెదము, దేవుడు దానిని మనకొరకు విప్పినయెడల ''జగత్తు పునాది నుండి దాచబడిన,'' ఈ ప్రత్యక్షత ఏమైయున్నదో మనము చూచెదము.

150దానిని చేయుటకు మునుపు పాపియైన స్నేహితుడా, లేక నులివెచ్చని సంఘసభ్యుడా, ఒక సంఘములోనికి నీకు సభ్యత్వము మాత్రమే యున్నదా లేక నీకు సభ్యత్వము లేదా? మరి నీకు సభ్యత్వము మాత్రమున్నయెడల, దానిని లేకుండానే ఉండవచ్చును. నీకు జన్మ కావలసియున్నది. నీవు రక్తము యొద్దకు రావలసియున్నది. దాని గుర్తు కూడా లేకుండ చేయు పాపమను మరకను తుడిచివేయు ఏదో కార్యమునొద్దకు మీరు రావలసియున్నది.

గొర్రెపిల్లను ఆకాశములో సంధించుటకు మీరు ఒకవేళ సిద్ధపడనియెడల! మరియు సర్వోన్నతమైన దేవుని ద్వారా ఇవ్వబడి, మరియు నాకు దూత ద్వారా పరిచర్య చేయబడి, ఒక అగ్ని స్తంభము ద్వారా, నేను పొందిన ఆజ్ఞను బట్టి, నాకివ్వబడిన అధికారమును బట్టి నేను యేసుక్రీస్తు నామములో మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను! ఈ భూమిలోని ఒక నివాసపు సంఘ సభ్యత్వము ద్వారా ఆయనను సంధించుటకు ప్రయత్నింపవద్దు.

నాకు తెలిసినంతవరకు విజ్ఞాపనలు చేయుచు ఇంకా సింహాసనముపై ఒక మధ్యవర్తిగా ఆయన ఉన్నప్పుడే ఆయన యొద్దకు రండి. ఏలయనగా మీరందరు రావలయునని కోరుకొను ఒక దినము వచ్చును, ఆ దినమున మధ్యవర్తి అక్కడ ఉండడు. మనము జీవించుచున్న ఘడియను మనము చూచినయెడల, ఏడవ సంఘ కాలములో దేవుని మర్మములు వాటిని, నిరూపింపబడిన దేవుని యొక్క ఆత్మ దానిలో ఉన్నదనే దానిని, ఆయన వాగ్దానము చేసిన ప్రకారము ప్రత్యక్షపరచబడిన సమస్తమును మనము గ్రహించినప్పుడు, ఇంకా ఎంత సమయము మిగిలియున్నది? పాపియగు స్నేహితుడా, రమ్ము.

151ప్రభువైన యేసు, కాలము సమాప్తమగుచున్నది. మనము అనుకున్న దానికంటే సమయము ఆలస్యము కావచ్చును. ఆ ఘడియ సమీపించుటను చూచుటకు మరి మనము ఆనందించుచున్నాము. విశ్వాసికి ప్రపంచము ఎన్నడును చూడనటువంటి గొప్ప మహిమగల సమయమిది. అయితే, నిరాకరింపబడిన వారికి బహు విచారకరమైన సమయమిది. ఆ రాబోవు శ్రమలను మరి బాధలను వివరించుటకు సరైన అక్షరములు, మాటలు లేవు. అదే విధముగా విశ్వాసికి ముందున్న ఆశీర్వాదములను వ్యక్తపరచుటకు మాటలు చాలవు.

తండ్రీ, ఈ రాత్రి నమ్మకము లేకుండా కొందరుండవచ్చును మరియు వారు మేధావులైన మానవులుగా యుండవచ్చును. మరియు ఇప్పుడు, ఒకవేళ రక్తము ఇంకా కృపా సింహాసనముపైనున్న యెడల, గొర్రెపిల్ల సింహాసనము నుండి ఈ రాత్రి వారి హృదయముల యొద్దకు నడచి వచ్చి వారు నశించియున్నారని వారికి బయలుపరచనిమ్ము. మరియు రక్తము కారుచున్న చేతులతో, ''రమ్ము, వచ్చుటకు సమయమున్నప్పుడు,'' అని చెప్పనిమ్ము.

ప్రభువా, నా యొక్క ప్రార్థనతో, మీ యొక్క చేతులకు ఈ వర్తమానమును అప్పగించుచున్నాను. మీ చిత్త ప్రకారము చేయండి, యేసు నామములో, తండ్రీ.

152మన తలలు వంచి యుండగా, మీరు ఈ యొక్క విన్నపమునకు, మరియు ఈ అర్హతకు సరితూగని యెడల! మీరు మీ సంఘముపై మాత్రము ఆధారపడియున్నయెడల! విడిపించగల వేరే ఏదియును లేదు. మీరు ఒకవేళ ఏదో ఒక పరిశుద్ధుని విజ్ఞాపనపై నమ్ముకొనియుండినయెడల, మీరు నశించిపోయెదరు. మీరు మీ చేతి కార్యములు, మీరు చేసిన మంచి కార్యములపై ఆధారపడియున్న యెడల మీరు నశించెదరు. మీరొకవేళ మీ తల్లి యొక్క ప్రార్ధనపై, లేక మీ తల్లి యొక్క నీతిని నమ్ముకొనియుండిన యెడల, మీ తండ్రిపై, దానిపై నీవు నమ్ముకొనియుండిన యెడల నీవు నశించినవాడవే. ఒకవేళ ఏదో చలనముపై నమ్ముకొనియుడిన, వింత అనుభూతిపై ఆధారపడిన యెడల, ఏదో ఉద్రేకముపై, భాషలతో మాట్లాడుటవలన లేక నాట్యము ఆడుటవలన! వీటన్నిటిపై నీవు నమ్ముకముంచుకొని, ఆ గొర్రెపిల్లను, మరియు ఆయనను నీవు వ్యక్తిగతముగా ఎరుగకుండిన యెడల, ఇప్పుడే నీవు దేవునితో ఆ కార్యమును సరిదిద్దుకోమని, ఆయనకు ముందు నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను. నీ హృదయ లోతులో నుండి ప్రార్థించుము. మరియు సామాన్యముగా నుండును, ఏలయనగా దేవుడు సామాన్యతలో తనను మరుగుపరచుకొని యున్నాడు.

ACTS 2:47•

ACTS 5:14

 

153పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, ''నమ్మినవారందరు చేర్చబడిరి,'' అని మీకు జ్ఞాపకమున్నదా. మేము మీ కొరకు ప్రార్ధిస్తుండగా ''ప్రభువా, నేను అవును అని చెప్పెదను," అను నిత్యమైన నిర్ణయమును తీసికొనెదరని నేను నమ్ముచున్నాను.

మరియు ఒక నిర్ణయము అనునది ''ఒక రాయి.'' అయితే ఆ రాయిని చెక్కి భవనమును తగినట్లుగా మలచనివాడు దొరకనిచో ఎంత మంచి రాయి అయినను గాని దానివలన ఏమి లాభము గలదు? అట్లయిన, మీరు ఏమైయున్నారో దాని నుండి మీరు ఏమైయుండవలెనో దానిలోనికి చెక్కునట్లుగా పరిశుద్ధాత్మను అనుమతించండి. మీరొక చలనము లేని సంఘసభ్యుడుగా, ఒక పాపిగాయున్నయెడల, మీరెట్లున్నను, మీరు క్రీస్తు లేకుండా ఉన్నయెడల, పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నయెడల, దేవుడు ఈ రాత్రి మీకు సమాధానమును అనుగ్రహింపనిమ్ము.

154ఇప్పుడు ప్రభువా, బుద్ధిపూర్వకముగా ఎట్లు రావలయునో నాకు తెలియును, మరియు లేఖనముల ప్రకారము ఎట్లు రావలయునో నాకు తెలియును, వాక్యముతో ఇప్పుడు నేను వచ్చి వీరిని మీకు సమర్పించుచున్నాను. ఈ రాత్రి జనుల యొక్క హృదయములలో వాక్యము దాని స్థానమును గైకొన్నదని నేను నమ్ముచున్నాను ప్రభువా. ఇక్కడొకవేళ పరిశుద్ధాత్మ యొక్క మధురమైన సన్నిధి వారి జీవితములలో ఉన్నదని తెలియని వారున్నయెడల, వారి యొక్క మూర్ఖ స్వభావము లేక వ్యతిరేక అభిప్రాయములు, లేక స్వార్ధము ఇవన్నియును ఆ గొప్ప కార్యము నుండి వారిని దూరపరచినయెడల; లేక ఏదో ఉద్రేకము, దేవుని యొక్క మధురమైన సహవాసము నుండి వారిని దూరపరచినయెడల అవన్నియు ఇప్పుడు వదలిపోనిమ్ము.

మరియు రక్తము కార్చుచున్న, ఆ గొర్రెపిల్ల, పరిశుద్ధ సమీపబంధువుడు, సింహాసనము నుండి నడచుచు, దేవుని యొక్క సింహాసనపు ప్రాకారముల ద్వారా, మర్మమైన కాంతి మధ్య నుండి నడచి వచ్చుచు ఆయన యొక్క స్వాస్థ్యమును గైకొన వచ్చుచున్నాడు! దేవా, ఈ రాత్రి ఆయనను వారు అంగీకరించునట్లు దయచేయుము. ఒక్కొక్క నిర్ణయము భయభక్తులతో తీసికొనబడనిమ్ము, మరియు దేవుని యొక్క కుమారులుగాను, కుమార్తెలుగాను వారిని చెక్కి మరియు చక్కగా రూపొందించు, ఆయనకు మాత్రము వారు తమకుతాము పరిపూర్ణముగా సమర్పించుకొందురు గాక.

155ఇప్పుడు, పవిత్రమైన ప్రార్ధనలో, నేను దానిని చేయుటకు నడిపించుబడులాగున ఈ విధముగా నేను చేయుచున్నాను. దేవుని ముందు పవిత్రముగా ఆయన తన్నుతాను మీకు నిరూపించుకొనెను. మరి మీరు ఒక క్రైస్తవుడు కాదు, లేక మనము పిలుచునట్లు మీరు ఒక సంఘశాఖలో చేరిన వ్యక్తి కాదు, అయితే తిరిగి జన్నించిన క్రైస్తవులని నా ఉద్దేశ్యం. అయితే మీరు భయభక్తులతో వర్తమానము సత్యమని నమ్ముచున్నారు, మరియు దేవుని కృపవలన మాత్రమే రక్షింపబడెదరని యథార్థముగా నమ్ముచున్నారు. మరియు ఇప్పుడు, మీ హృదయములతో ఆయన మాట్లాడుచున్నాడని మీరు నమ్ముచున్నారు. మరియు మీరు ఆయనను అంగీకరింపగోరుచున్నారు, మరియు ఆయన వాక్యమునకు మీరు ఏ విధముగా జీవించాలనుకుంటున్నారో ఆ ప్రకారముగా ఆయన మిమ్ములను సరి దిద్దుటకు మీరు సిద్ధముగా ఉన్నారు. మీరు లేచి నిలువబడుట ద్వారా దానిని సాక్ష్యమియ్యగలరా? సమస్తమును సంపూర్తిచేయు ఆ సర్వసమృద్ధి గల ఆయన ఇక్కడున్నయెడల మీరు లేచి నిలబడండి.

MATT 10:32•

LUKE 12:8

 

156పరలోకపు తండ్రీ, మీ యొక్క వాక్యమును చెప్పుట తప్ప వేరే ఏమియు నాకు తెలియదు. ఇక్కడ కొందరు పురుషులు నిలువబడియున్నారు, వారు ఉండవలసిన స్థానములో లేరని వారు అనుకొనుచున్నారు, మొదటి ముద్ర తెరువబడుటకు మునుపు ఎత్తబడుట జరిగినయెడల వారు సిద్ధముగా లేరని భావించుచున్నారు.

మరియు, తండ్రీ వారి కొరకు నేను ప్రార్ధించుచున్నాను, నేను మీ యొక్క దాసునిగా, గొప్ప మధ్యవర్తైన, క్రీస్తుకు ఈ ప్రార్థన సమర్పించుచున్నాను, వారు ప్రార్ధించుచుండగా, ఈ రాత్రి ఎక్కడ రక్తపు బలి ఉన్నదో ఆ దవళసింహాసనము మీద, వారితో కూడ చేరి నేను నా ప్రార్ధన సమర్పించుచున్నాను. మరియు ఏ సమయముననైనను సింహాసనము నుండి వచ్చి తన స్వాస్థ్యమును గైకొనవచ్చును, అప్పుడు కృప ఉండదు; అది న్యాయతీర్పే.

అనుగ్రహించుము, ప్రభువా, దేవుని యొక్క ఆత్మ వారిని మలచి, చెక్కి రూపొందింపవలయునని వారి పాపములను వారు ఒప్పుకొని వారి హృదయములలో వారు దేవుని యొక్క గృహములో జీవమైన రాళ్ళుగా ఉండవలెనని కోరుకుంటు ఈ జనులు ఇక్కడ నిలబడుకొనియున్నారు.

అనుగ్రహించుము, ప్రభువా, తండ్రీ, ఇప్పుడు వారిని నీకు అప్పగించుచున్నాను. మరియు మీరు చెప్పియున్నారు, ''మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వానిని, తండ్రి ఎదుటను, మరియు పరిశుద్ధ దూతల ఎదుటను నేను ఒప్పుకొందును.'' ఈ రాత్రి అందరి ముందు మీరక్కడ మరిప్పుడు కూర్చొనియున్నారు, మరియు వారు నిలబడుకొనియున్నారు, మిమ్ములను ఒప్పుకొనియున్నారు. మరియు, ప్రభువా, దేవుని వాక్యము ఎంత నిజమో వారు ఒప్పుకొనుట కూడా అంత నిజమైనయెడల, మీరిప్పుడు వారికొరకు విజ్ఞాపన చేయుచు వారిని శుద్దీకరించుటకు, కృప, దయతో బలివ్వబడిన గొర్రె పిల్ల యొక్క రక్తము క్రింద వారిని అంగీకరించుము, మరియు వారు మీ వారు. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

157ఇప్పుడు, లేచి నిలబడియున్న ఈ జనులను చూచు మీరు, ఈ యువకుడు ఇక్కడ, మరియు నిలబడుకొనియున్నవారు, సమస్త పాపమును మరియు శిక్షయు పోయియున్నది. వారికి చేరువలోనున్న మీలో కొందరు లేచి నిలబడవలయునని నేను కోరుచున్నాను. వారితో కరచాలనము చేసి, మరి చెప్పుడి, ''సహోదరుడా, నీ కొరకు నేను ప్రార్ధించెదను. సహోదరీ, నీ కొరకు నేను ప్రార్ధించెదను.'' వారితో చేతులు కలిపి, మరిచెప్పుడి, ''దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.'' మరిప్పుడు మిగిలిన సమస్తము సర్వోన్నతుని హస్తములలో ఉన్నది. చెప్పండి, నేను ప్రార్ధించెదను, మరియు దేవుని రాజ్యములోనికి నిన్ను నడిపించుటకు నాకు వీలైనంతవరకు నేను సహాయము చేసెదను.''

… ఓ, ఈ రోజు పిలుచుచున్నాడు!

ఓ, యేసు పిలుచుచున్నాడు!

ఆయన మృదువుగా ఈ రోజు పిలుచుచున్నాడు!

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

HEB 10:25

 

158మీరాయనను ప్రేమించుచున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? ఇది లేకుండా మనమేమి చేయగలము? ''మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని; దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును.'' ఓ, నన్ను వాక్యముతో పోషించుము, ప్రభువా.'' ఆ దినము సమీపించుటను మీరు చూచునప్పుడు, అవిశ్వాసులవలె మీరు కూడుకొనుట మానవద్దు.''

దేవుని చిత్తమైనయెడల, రేపు రాత్రి, దేవుని కృప వలన నాలో ఉన్న సమస్తముతో, ఆయన అవి తెరుచుచుండగా ఈ ముద్రలలోని మర్మములను ఆయన యొద్ద నుండి దేవుని వాక్యమును జనులకు ప్రకటించుమని నేను ఆయనను అడుగుటకు ప్రయత్నించెదను. నేను మరల మిమ్ములను కలయువరకు, దేవుడు మీతో కూడా నుండును గాక!

159మరిప్పుడు, నేను ఆరాధనను మన ప్రశస్త సహోదరుడును, సంఘకాపరి, సహోదరుడు నెవిల్‌కు అప్పగించుచున్నాను. ఎందరు సహోదరుడు నెవిల్‌ను ప్రేమించుచున్నారు? ఇప్పుడు మనమందరమును ప్రేమించుచున్నాము. సహోదరుడు నెవిల్ ముందుకు రండి. సహోదరుడు నెవిల్, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక, సహోదరుడా!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...