మొదటి ముద్ర

మొదటి ముద్ర

 ఇప్పుడు ప్రార్థన కొరకు మనము తలలు వంచుకుందాము. మా పరలోకపు తండ్రీ, నిన్ను ఆరాధన చేయుటకు నీ యొద్దకు వచ్చుటకు యీ మరియొక తరుణాన్ని బట్టి ఈ రాత్రి నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మేము సజీవులుగాయున్నందుకు మరియు మాలో నివసించు నిత్యజీవము యొక్క ఈ ఘనమైన ప్రత్యక్షతను కలిగియున్నందుకు కృతజ్ఞులమైయుంటున్నాము. నీ వాక్యమును కలసి పఠనము చేయుటకు, జగత్తు పునాది వేయబడినప్పటి నుండి మరుగు చేయబడిన ఈ గొప్ప మర్మములను పఠనము చేయుటకు, తండ్రీ, ఈ రాత్రి, మేమిచ్చటయుంటిమి. మాకది బయలుపరుచునది గొఱ్ఱెపిల్ల ఒక్కడు మాత్రమే. ఈ రాత్రి ఆయన మా మధ్యకు వచ్చి, ఆయన వాక్యమును తీసికొని అది మాకు బయలుపరచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా ఈ అంత్యకాలములలో ఆయనకు శ్రేష్ఠమైన సేవకులమగుట మేమెరుగునట్లు ఓ దేవా, మేము ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామని చూచుచుండగా, ప్రభువా! మా స్థానాన్ని మేము ఎరుగునట్లు మాకు సహాయము చేయుము. మరియు మా బలహీనమైన ఉనికిని ప్రభువు త్వరగా వచ్చు నిశ్చయతను ఎరుగునట్లు చేయుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

2 “ప్రభువు యొక్క మందిరమునకు వెళ్ళెదమని వారు నాతో అన్నప్పుడు, నేను సంతోషించితిని.” అని దావీదు అన్నాడని నేననుకుంటున్నాను. వచ్చుట అనునది అదెల్లప్పుడు గొప్ప ధన్యత. మరియు—మరియు వాక్యమును చదువుట, ఈ గొప్ప నిరీక్షణను మనకిస్తున్నది.

3 ఇప్పుడు అనేకులు నిలబడియున్నారు. నేనెంత త్వరగా కొనసాగించాలో అంత త్వరగా కొనసాగిస్తాను. అయితే, గతించిన ఈ రెండు పర్యాయాలు కూడా, నేను ఏలాగు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆనందించానో మీరు ఆలాగు అనుభవించారని నేను నమ్ముతున్నాను. [సభ “ఆమేన్,” అని చెప్పింది—సంపా.]

4 మరియు, ఎంతోకాలము సంభవించునది సంభవించునని నేననుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రత్యక్షతను గూర్చి, ముద్ర విప్పబడుటను గూర్చి; అది నేను చదువుచున్నాను.

5 సంవత్సరముల క్రితం ఇక్కడ నేనది చదువుచుంటిని. సుమారు ఇరవై సంవత్సరాల క్రితం లేక సుమారు అంతే. అయితే ఏలాగైనా ఖచ్చితంగా నేను తృప్తి చెందలేదు. అక్కడ యొకటి ఉన్నట్లుగా అగుపించినది, ప్రత్యేకించి ఈ ముద్రలలో ఎందుకంటే ఈ ముద్రలు సంపూర్తి గ్రంథము. చూశారా? అది గ్రంథము. సంపూర్తి గ్రంథము ఒక గ్రంథము. ముద్రించబడినది. అది మొదలు పెట్టబడి…

6 ఉదాహరణకు, ఇక్కడ నా యొద్ద యొకటియున్నట్లైతే, నా భావమేదో మీకు చూపుతాను. [కాగితపు కట్టలను, సహోదరుడు బ్రాన్హాం వినియోగించుట ద్వారా చుట్టను చుట్టి, తెరచుటను చూపించుచున్నాడు—సంపా.] ఇక్కడొక ముద్ర. అదొక్కటి, అది చుట్టబడినట్లుగా మీరిది చుట్టండి. ఈ విధంగా మీరది చుట్టండి. మరియు ఆఖరున. చివరన చిన్న ముక్క అతుక్కొనియుంటుంది, ఆలాగు. అది మొదటి ముద్ర. సరే. తరువాత, గ్రంథము యొక్క మొదటి భాగము అది. అటు తరువాత, తరువాత ముద్ర ఈ విధంగా చుట్టబడుతుంది. దాని ప్రక్కనే, అది ఈ విధంగా, ఇక్కడ చుట్టబడుతుంది. తరువాత చివర, ఇక్కడ, ఇంకొక అతుకుయుంటుంది, అర్థం రెండు ముద్రలు.

7 ఆ విధముగా బైబిలు గ్రంథమంతా చుట్టలలో వ్రాయబడినది. [తాను ఉదహరించుటకు వినియోగించిన కాగితపు కట్టలను సహోదరుడు బ్రాన్హాం మడచుచున్నాడు—సంపా.] కాబట్టి ఈ ముద్రలు విప్పబడుట అనగా, అది గ్రంథము యొక్క మర్మములు తెరవబడుట.

8 గతరాత్రి, మీలో చాలామంది గుర్తుపెట్టుకొన్న విధముగా, యిర్మియాలో, అతడు ఏ విధముగా వ్రాసియున్నారో మీరు చదివియున్నారా? ఏ విధముగా ఆ ముద్రలు వ్రాయబడి చెఱలోనుండి డెబ్బది సంవత్సరముల తరువాత అతడు తిరిగి వచ్చే వరకు ఉంచబడుట. అతడు తిరిగివచ్చి అతని స్వాస్థ్యమును అర్థించాడు.

9 దానిని నిశ్చయంగా చదువుటకు నేను ఇష్టపడుతున్నాను. కాదు…దానినంతటిని తెలియపరచుటకు మార్గము లేదు, ఎందుకనగా అది నిత్యమైన వాక్యము. అది నిత్యమైన గ్రంథము, కాబట్టి ప్రాముఖ్యమైన స్థలములను ఒక విధంగా తాకనైయున్నాము. మరియు ఈ రోజు పఠనం చేస్తూ, మీరు అది చదువునట్లు చాలా లేఖనాలు వ్రాసుకున్నాను. మీరు పఠనము చేస్తున్నప్పుడు, టేపులు దాన్ని గురించి చాలా విషయాలు బయలుపరుచును. అనేక విషయాలున్నవి!

10 గదిలో నాకది బయలుపరచినట్లుగానే వేదిక పైన నిలబడి నేను మీకు బయలుపరిచినట్లైతే, అది అద్భుతకరం. అయితే, మీరు ఇక్కడకు వచ్చినపుడు, మీరు ఒత్తిడిలో ఉంటారు. మరియు కొన్ని కార్యాలు దాటవేసి, ప్రజలు యొక్క ప్రాముఖ్యమైనది పొందుకొనుటకు ప్రయత్నిస్తారు. అది వారు చూచులాగున.

11 సహోదరుడు అన్ గ్రెన్ ఇప్పుడే పాడిన ఆ పాటను నేను నిజంగా అభినందిస్తున్నాను. మహిమనుండి క్రిందకు, ఆయన, ఆయన యొక్క మహిమ నుండి రానట్లైతే, ఈ రాత్రి మనం ఎక్కడుండే వారం? కాబట్టి మనకు సహాయం చేయుటకు ఆయన క్రిందకు వచ్చినందుకు కృతజ్ఞులం.

12 ఇప్పుడు, చాలామంది నిలబడియుండగా, ఇక్కడ మనం తొందరపడదాము,—మనకు సాధ్యమైనంత వరకు, నేరుగా తొందరపడదామని నేను చెప్పుట లేదుగానీ, ఎంత త్వరగా ప్రారంభించాలో అంత త్వరగా ప్రారంభిద్దామని నా భావం. ఇప్పుడు మనం త్రిప్పుదాం, తరువాత…

13 మనము మొదటి అధ్యాయము 2,3,4 మరియు 5ను గత రాత్రి చూచియున్నాము. ఈ రాత్రి ప్రకటన 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాము.

14 ఈ అధ్యాయాన్ని మనము చదువునపుడు, పలువురు స్థలాలను ఆపాదించుచున్నాము. చివరకు పాత నిబంధన క్రొత్తనిబంధనవలె, కారణమేమనగా సంపూర్తి గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. చూశారా! అదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అది దేవుడు. గ్రంథములో ఆయనకు ఆయన బయలుపరుచుకొనుట; గ్రంథములో, క్రీస్తు ద్వారా ఆయనకు ఆయన బయలుపరుచుకొనుట. క్రీస్తే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని బయలుపరుచుటకు ఆయన వచ్చాడు. ఎందుకంటే, ఆయన మరియు దేవుడు ఒక్కటే, “లోకమును ఆయనతో సమాధాన పరుచుకొనుటకు క్రీస్తులో దేవుడుయుండెను.” మరో మాటలో క్రీస్తు ద్వారా ఆయనకు ఆయన బయలుపరుచుకొనునంత వరకు దేవుడు ఎవరనేది నీకు తెలియదు, అప్పుడు నీవు చూడగల్గుతావు.

15 సంవత్సరముల క్రితం, నేను తలస్తూయుండెడివాడను, ఏదనగా బహుశా, దేవుడు నా మీద కోపంగాయుండును గాని క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అని. కనుగొనినప్పటికి, అది ఒకే వ్యక్తియైయున్నది. చూశారా. సాక్షాత్తు దేవుని యొక్క గుండె క్రీస్తు.

16 ఇది మనం పఠనము చేస్తూ, దానిని మనం సరిపోల్చుదాం. బైబిలు గ్రంథములోని ప్రకటన మొదటి మూడు పుస్తకములు మనం, బాగుగా వాటిని తెరచి చూచియున్నాము, అవి సంఘకాలములు—ఏడు సంఘకాలములు. ఇప్పుడు ఏడు సంఘకాలములు, ఏడు ముద్రలు, ఏడు బూరలు, మరియు పాత్రలు మరియు—కప్పలవంటి అపవిత్రాత్మలు మరియు ఇవన్నియూ కలసియున్నవి.

17 మై, నేను—ఒక పెద్ద చిత్రమును కల్గియుండి నేను చూచినట్లుగా దానిపై వ్రాసి, గమనించారా, ఏ విధముగా ఒక్కొక్కటి దాని స్థానము కల్గియున్నదో చూపించవలెనని ఇష్టపడుచున్నాను. చిన్న కాగితం ముక్కపైన నేనది గీచుకొన్నాను. అయితే నేను…అది మీకు తెలుసు. ప్రతీది, ఇంత వరకు ఖచ్చితముగా వచ్చుచునేయున్నది. సమయము, కాలములు అవి వచ్చిపోవుచుండగా, ప్రతీది సంపూర్తిగా కలసియున్నవి. కాబట్టి అదంతా సరికాకపోవచ్చును, అయితే, అందును గూర్చి నేనెరిగినంత వరకు అది శ్రేష్ఠమైనదే ఏలాగైనా. నేనెరిగియున్నాను. నేను—నేను మంచిది చేసినంత వరకు, నేను మంచి చేయుటకు ప్రయత్నిస్తూ నేను తప్పు చేసినట్లైతే, నేనెరిగినంత మంచిని, అందుకు దేవుడు తప్పక నన్ను క్షమించును. నేను తప్పు చేసిన తప్పిదముల కొరకు.

18 అయితే, ఇప్పుడు ఆ మొదటి మూడు పుస్తకములు, ఏడు సంఘకాలములు, తరువాత మనం కనుగొంటున్నాము ప్రకటన 4వ అధ్యాయంలో యోహాను పైకి ఎత్తబడుట, అవునా? మనము సంఘాలను చూస్తున్నాము, సంఘకాలాలను గూర్చి ఎక్కువగా చెప్పబడలేదు. ప్రజలు ఆశ్చర్యపడబోవుచున్నది అక్కడేనని నేననుకుంటున్నాను. వారు—వారు—వారు ఆ జరుగుబోవు కార్యములకు, శ్రమల కాలమునకు సంఘమును అన్వయించుచున్నారు. ఆదివారం, నిన్న నేను చెప్పినట్లుగా మొదటి విషయమేదో తెలుసా, ఆ శ్రమలు బలవంతంగా ప్రవేశించును. మరియు మీరు ఇశ్చర్యపడతారు…మొదటగా వచ్చునది ఎత్తబడుట, అది ఎప్పటి వలె ఉంచును. అది జరిగిపోతుంది మరి నీవది ఎరుగవు, చూశారా?

19 ఆ సంఘానికి, ఆ అన్యుల సంఘానికి, పెండ్లి కుమార్తెకు ఎక్కువగా వాగ్దానము చేయబడలేదు. మీ మనస్సులో మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను, సంఘము మరియు పెండ్లికుమార్తె ఉన్నదని. అవునా?

20 మీరు ఎల్లప్పుడు మూడు మూడుగా లెక్కించవలయును. నాలుగు తప్పు, మూడు! మూడులు, ఏడులు, పదులు, పండ్రెండులు మరియు ఇరవై నాలుగులు, మరియు నలభైలు, ఏభైలు, ఆ విడదీయని సంఖ్యలు. బైబిలు గ్రంథము…మరియు దేవుడు ఆయన వర్తమానములను…బైబిలు గ్రంథములోని సంఖ్యలను అందించాడు. మరియు ఆ సంఖ్యలలో నుండి ఏదో యొకటి వెడలిపోయిన యెడల, నీవు జాగ్రత్తగా గమనించు, తరువాతది సరిగారాదు. నీవెక్కడ ప్రారంభించావో, అక్కడికే రావలసియున్నది.

21 సహోదరుడు వైల్, సహోదరుడు లీవైల్, అతడు—అతడు ఇక్కడయున్నాడని అనుకుంటున్నాను. త్రోవ తప్పిన కొందరిని గూర్చి నిన్నటి దినము మేము మాట్లాడుకుంటున్నాము. అది గురిని చూచి కొట్టుటలాటిది. ఆ తుపాకి సరిగా గురిని నిల్పి, సరిగ్గా శిక్షణ పొంది, సరిగ్గా పేల్చితే, అది గురిని తాకుతుంది. బ్యారల్ కదలికుండనియెడల, లేదా మరో వైపు మరలని యెడల లేక తొణకని యెడల లేదా ఏదైనా—లేదా గురి తప్పును. అది మరలా ప్రారంభించవలెననినా, చేయవలసిన ఒకటే యొకటి, మరలా ప్రారంభం నుండి సరిగ్గా చూచి పేల్చాలి. లేని యెడల అది గురిని తాకదు.

22 లేఖనము చదువు విధము అది అని నేననుకుంటున్నాను. మనమిక్కడ ప్రారంభించినది సరిగా రానియెడల; అది కాదని మీరూ చూచిన యెడల ఆ ఎక్కడో మనము తప్పిదము చేశాము. నీవు వెనుకకు రావలసియున్నది. నీ మనస్సుతో దానిని నీవు గ్రహించలేవు. అది కేవలం…

23 పరలోకములోయున్న ఏ మనుష్యుడుగాని లేక భూమిలోనున్న వారు గాని లేక భూమి క్రింద ఉన్నవారు గాని లేక ఇదివరకును లేక రాబోవు కాలములోను ఏ మానవుడు దానిని చేయలేడని లేఖనముల ద్వారా మనము ఇంతక్రితమే తెలుసుకొనియున్నాము. గొఱ్ఱెపిల్ల మాత్రమే అది చేయగలదు. కాబట్టి సెమినరీ అరుపులు, అవేమైనను, అవి వట్టివి. చూశారా? అది బయలుపరచుటకు గొఱ్ఱెపిల్ల దానిని తీసికోవలసియున్నది. అంతే, కాబట్టి ఆయన మనకు సహాయముచేయునని మనం నమ్ముదాం.

24 “వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో” ఉన్న వాటిని చూచుటకు 4వ అధ్యాయములో, యోహాను కొనిపోబడ్డాడు. అయితే 4వ అధ్యాయంలో సంఘము ముగుస్తుంది. మరియు క్రీస్తు సంఘమును కొనిపోవును; ఆయనను కలసికొనుటకు మధ్యాకాశమునకు కొనిపోబడును. మరియు ఆయన వచ్చులోపల ఏదో ఒకరోజు మనం తెలిసికొంటాము అని నేను నిరీక్షీస్తున్నాను. మనం అలాకానట్లైతే, అదేలాగైనా మనం చూస్తాము, కనుక అది సమస్య కాదు.

25 ఇప్పుడు, ఈ 5వ అధ్యాయంలో ఈ ముద్రలు విప్పబడుచుండగా మరియు ఇప్పుడు ఏడు ముద్రల గ్రంథము. మొదటిగా, మనము మొదటి ముద్ర చదువుదాము.

26 గడచిన సాయంకాలము, వెనుక చెప్పబడిన దానిని కొంచెం చూద్దాం. ఇంకా ఆ గ్రంథము అసలైన యజమానుని హస్తాల్లో, దేవుని చేతుల్లోయుండుట యోహాను చూచెనని మనం కనుగొన్నాము. అది ఏ విధంగా పోగొట్టబడినదో మీకు జ్ఞాపకమున్నదా? ఆదాము వలన, సాతాను యొక్క జ్ఞానము కొరకు అతడు జీవ గ్రంథమును పోగొట్టుకొనెను. అతని వారసత్వాన్ని, సమస్తాన్ని పోగొట్టుకొన్నాడు, మరియు విమోచనకు వేరే దారి లేదు. తరువాత, దేవుడు మానవ రూపముదాల్చి, మనలను విమోచించుట కొరకు దిగి వచ్చి మనకు విమోచకుడాయెను.

27 ఇప్పుడు ఈ మర్మమైన కార్యములు ఈ చివరి దినములలో మనకు తెరువబడునని గడచిన దినములలో మనము కనుగొనియున్నాము.

28 ఇందులో ఇంకా మనము చూస్తున్నాము, తన యొక్క హక్కును పొందుటకు రక్తసంబంధియగు విమోచకుడు రాబోవుచున్నాడను ప్రకటన యోహాను వినిన వెంటనే, అది చేయగల ఏ మనుష్యుడు లేడు. పరలోకములో ఏ మనుష్యుడు లేడు; భూమిలో ఏ మనుష్యుడు లేడు, భూమి క్రింద ఏ మనుష్యుడు లేడు. గ్రంథాన్ని చూచుటకు యోగ్యుడైన వ్యక్తి లేడు.

29 యోహాను ఏడుస్తూ ఉన్నాడు. అది అతను ఎరిగియున్నాడు. ఓ! అలాటప్పుడు, ఇక విమోచనమునకు తరుణము లేదని. ప్రతీది విఫలమైపోయినది.

30 చాలా త్వరగా అతని ఏడ్పు ఆగిపోవుట మనము చూస్తున్నాము, తర్వగా ఎందుకనగా, నాలుగు జీవులలో ఒకరు లేక పెద్దలలో ఒకరు ప్రకటన చేసిరి. పెద్దలలో ఒకరు అన్నారు “యోహాను ఏడ్వవద్దు, ఎందుకనగా యూదా గోత్రపు సింహము జయించెను,” మరో మాటలో “జయముపొందెను మరియు గెలిచెను.”

31 యోహాను తిరుగగా, గొఱ్ఱెపిల్ల వచ్చుట అతడు చూశాడు. ఆయన కోయబడి రక్తము కారుచు, గాయములతో ఉండివుండవచ్చును. అది వధింపబడినది…చెప్పబడినది “వధింపబడిన గొఱ్ఱెపిల్ల”యని. అది ఇంకా రక్తముతో యుండియుండెను. మీరు గొఱ్ఱెపిల్లను కోస్తే—గొఱ్ఱెపిల్లను చంపినట్లెయుండును. సిలువ మీద ముక్కలుగా నరకబడెను, ప్రక్కలో బల్లెము, కాళ్ళు చేతులలో సీలలు మరియు నొసటను ముళ్ళు. ఆయన భయంకర స్థితిలో ఉండెను. ఈ గొఱ్ఱెపిల్ల ముందుకు వచ్చినది. విమోచనా పూర్తి హక్కులు గల పత్రమును పట్టుకొని, సింహాసనము పై ఆసీనుడైయున్న ఆయన యొద్దకు వెళ్ళినది. గొఱ్ఱెపిల్ల వెళ్ళి, సింహాసనమందు ఆసీనుడైయున్న ఆయన చేతిలో నుండి గ్రంథమును తీసికొనెను, మరియు తీసికొని ముద్రలు విప్పి గ్రంథమును తెరచెను.

32 అది జరిగిన తరువాత పరలోకములో ఒక గొప్ప సంఘటన జరుగుట మనము చూస్తున్నాము. ఇరువది నలుగురు పెద్దలు, జీవులు, పరలోకమందున్నవన్నియు “యోగ్యుడవు!” అని కేకలు వేయసాగిరి. ఇక్కడ దూతలు వచ్చి, పరిశుద్ధుల ప్రార్థనలు పాత్రలో క్రుమ్మరించారు. బలిపీఠము క్రిందనున్న భక్తులు అరుపులు అరుస్తున్నారు. “ఓ గొఱ్ఱెపిల్లా, నీవే యోగ్యుడవు, ఏలయనగా నీవు మమ్ము విమోచించియున్నావు, నీవు మమ్ములను రాజులుగా, యాజకులుగా చేసియున్నావు, మేము భూమిని ఏలుదుము.” ఓ, మై ఆయన ఆ గ్రంథమును విప్పినపుడు ఆలాగు జరిగెను.

33 మీరు గ్రహించారా, గ్రంథము వాస్తవముగా జగత్తుకు పునాదికి ముందే పథకము చేయబడి వ్రాయబడియుండెను. ఈ గ్రంథము, బైబిలు గ్రంథము వాస్తవముగా భూమికి పునాది వేయబడక ముందే వ్రాయబడెను. క్రీస్తు గొఱ్ఱె పిల్లయైయుండి భూమికి పునాది వేయబడకముందే వధింపబడెను. మరియు—ఆయన పెండ్లికుమార్తెలోని సభ్యులు, వారి యొక్క పేరులు జగత్తుకు పునాది వేయబడక మునుపే గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథమందు పెట్టబడెను. అయితే, అది ముద్రింపబడియుండెను. అందును గూర్చి ఎవరి పేర్లైతే అందులో వ్రాయబడియున్నవో, ఇప్పుడు తెరవబడెను, ఎంతటి గొప్ప విషయం.

34 యోహాను, అది చూచినపుడు, అతడు చెప్పాడు “పరలోకమందున్నవన్ని, భూమి క్రిందయున్నవన్ని…” ప్రతీది చెప్పడం విన్నాడు “ఆమేన్, ఆశీర్వాదములు మరియు ఘనత!” అతడు మంచి సమయాన్ని కల్గియున్నాడు, ఎందుకనగా “గొఱ్ఱెపిల్ల యోగ్యుడు.”

35 ఇప్పుడు గొఱ్ఱెపిల్ల నిలబడియున్నది, ఇప్పుడు, ఈ రాత్రి 6వ అధ్యాయములోకి మనము ప్రవేశిస్తుండగా, ఆయన గ్రంథమును ఆయన చేతిలోకి తీసుకున్నాడు అది బయలు పరుచుటకు మొదలుపెట్టాడు.

36 ఓ, ఈ దినమున ఖచ్చితంగా…ప్రజలు ఆత్మ సంబంధులని నేను నిరీక్షిస్తున్నాను. ఈ రోజు, సుమారు పండ్రెండు గంటలకు, అది అలా కానట్లైతే దాని మీద నేను ఘోర తప్పిదము చేసియుండెడివాడను. చెప్పుటకు నేను వ్రాసికోబోతున్న ఒక దానిని పరిశుద్ధాత్మ గదిలోకి వచ్చి సరిచేశాడు.

37 పాత సందర్భ అంశము నుండి నేనది మాటలాడుచుంటిని, దానిని గూర్చి నా యొద్ద ఏదీ లేదు. రెండవ ముద్రను గూర్చి నాకేమియూ తెలియదు. ఏమి తెలియదు, అయితే, నా యొద్ద చాలా సంవత్సరాల క్రితం మాట్లాడి వ్రాసుకున్న ఒక పాత సందర్భ అంశం నా యొద్ద ఉన్నది. ఈ సందర్భ అంశమును నేను సమకూర్చుకున్నాను. డాక్టర్. స్మిత్ అంశము, గొప్పవారైన అనేకమంది ఉపదేశకుల అంశములు, నేను సమకూర్చుకుంటిని, వారందరు అది నమ్మారు, కాబట్టి నేనది వ్రాసుకున్నాను. “సరే, నేను ఆ కోణము నుండి చదివాను” అది నేను చెప్పబోతున్నాను.

38 అక్కడ పగలు సుమారు పండ్రెండు గంటలు, పరిశుద్ధాత్మ గదిలోకి నేరుగా దూసుకొని వచ్చెను, సమస్తమును నాకై తెరవబడినది. ఈ—మొదటి ముద్ర తెరవబడెను. ఈ రాత్రి, ఇక్కడ నేను నిలబడియుండుట ఎంత నిశ్చయమో అంతటి నిశ్చయముగా నేను చెప్పబోతున్న ఇది సువార్త సత్యము. నేను—అది ఎరిగియున్నాను.

39 ఎందుకనగా ప్రత్యక్షత వాక్యమునకు విరుద్ధమైయున్న యెడల, అలాటప్పుడు అది ప్రత్యక్షత కాదు, మీరు చూశారా, కొన్ని నిజంగా సత్యముగా కన్పించును. అయినను అవి సత్యము కాదు, చూశారా? అవి ఆలాగేననిపిస్తవి, అయితే అవి కావు.

40 ఇప్పుడు, మనము గ్రంథముతో గొఱ్ఱెపిల్లను చూచుచున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయములో చదువుచున్నాము.

ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి-రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.

మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను, అతనికి ఒక కిరీటమియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్ళెను.

41 ఇప్పుడు మొదటి ముద్ర. దేవుని కృప వలన, ఈ రాత్రి మనం విశదపరచ ప్రయత్నించబోవుచున్నాము. నా శక్తి కొలది…దానిని విశదపరచ ప్రయత్నించు ఏ మనుష్యునినైనా నేననుకుంటున్నాను, నీవు చేయుచున్నదేదో నీవు గ్రహించకుంటే, నీవు అపాయకరమైన స్థలములో నీవు నడుస్తున్నావు. అవునా? కాబట్టి, ప్రత్యక్షత ద్వారా అది నాకొచ్చినట్లైతే నేను మీకు చెప్తాను. నా స్వంత మనస్సుతో నేను తీసుకున్న యెడల, అలాటప్పుడు, నేను ముందుగానే దానిని గురించి చెప్పెడి వాడను. అయితే ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడియుండుట ఎంతటి నిజమో, అంత నిజముగా, ఈ రోజు సర్వ శక్తిమంతుని యొద్ద నుండి స్వచ్ఛముగా నా యొద్దకు వచ్చినది. అది ఈ లేఖన భాగమునకు వచ్చుచున్నప్పటికి అలాటి విషయాలు చెప్పుటకు నేను ఇష్టత చూపను. నేను—నేను…

42 నేనిప్పుడు దేని గూర్చి మాట్లాడుచున్నానో మీరు అర్థం చేసికుంటారని నేననుకుంటున్నాను. అవునా. విషయాలు నీవు చెప్పలేవు…అవి ముందే జరగకుండయున్న సంగతులు ముందు ఇక్కడ పెట్టబడితే, అక్కడ అది పెట్టబడు వరకు నీవు—నీవది చెప్పలేవు. అవునా? మీరు చదువుచున్నారా? మీరు ఒకటి వింటున్నారా? అవునా?

43 ఇప్పుడు ఏడు ముద్రలు చుట్టబడిన గ్రంథము గొఱ్ఱెపిల్ల ద్వారా విడుదల చేయబడినది. ఈ రాత్రి ఆ స్థలాన్ని మనము సమీపిస్తున్నాము. దేవా, మాకు సహాయము చేయుము. ముద్రలు విప్పబడి విడుదల నొందుచుండగా గ్రంథము యొక్క మర్మములు బయలుపరచబడును.

44 ఇప్పుడు, చూడండి, ఇది ముద్రించబడిన గ్రంథము. ఇప్పుడు, మనమది నమ్ముతున్నాము. అవును కదా? [సభ “ఆమేన్,” అని చెప్పింది—సంపా.] మనమది నమ్ముతున్నాము. అది ముద్రించబడిన గ్రంథము. ముందెన్నడూ ఇది మనకు తెలియదు. అయితే ఇది ఉన్నది. అది ఏడు ముద్రలతో ముద్రించబడినది. అనగా, గ్రంథము వెనుక, గ్రంథము ఏడు ముద్రలతో ముద్రించబడినది.

45 ఈ రకమైన పుస్తకమును గూర్చి మనము మాట్లాడుకున్నట్లైతే, దానికి అడ్డంగా త్రాడు చుట్టినట్లు ఏడు త్రాళ్ళు చుట్టినట్లుగా ఉండును [ఒక ఉదాహరణగా, సహోదరుడు బ్రాన్హాం ఒక పుస్తకమును చూపించుచున్నాడు—సంపా.] అయితే ఇది ఈ రకమైన పుస్తకం కాదు.

46 అదియొక చుట్ట. తరువాత చుట్ట విప్పినపుడు, అది యొకటి; తరువాత చుట్టలో ఉన్నది సంఖ్య రెండు. ఇక్కడే అదేమైయున్నది చెప్తుంది అదొక మర్మము, అయితే అయినప్పటికి, మనము దానిని పరిశీలించియున్నాము; అయితే, జ్ఞప్తించుకో గ్రంథము ముద్రించబడియున్నది. మరియు గ్రంథము ప్రత్యక్షతల యొక్క మర్మముల గ్రంథము. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చూశారా! ప్రత్యక్షతల యొక్క గ్రంథము. ఇప్పుడు చూడండి, కాలకాలాలలో మానవుడు పరిశోధించి అందులోకి వెళ్ళుటకు ప్రయత్నం చేశాడు, అవునా, మనమందరం.

47 నాకు జ్ఞాపకమున్నది…ఒకసారి, అయితే—ఇక్కడ Mr. బొహనాన్ ఇక్కడయున్నట్లైతే లేక—వారి వారు ఎవరైనాయున్నట్లైతే, నేను—నేను అది అది అవమానంకై కాదు చెప్పుట. మిస్టర్. బొహనాన్ నా యొక్క ప్రాణ మిత్రుడు. మరియు నేను అక్కడ పని చేస్తున్నపుడు, అతడు పబ్లిక్ సర్వీస్ కు సూపరింటెండెంట్ గాయుండెను. నేను మొదట రక్షించబడినపుడు ప్రకటన గ్రంథమును చదువుటను గూర్చి అతనికి చెప్పుచుంటిని. అతడన్నాడు “నేనూ అది చదువుటకు ప్రయత్నించాను, అని చెప్పాడు.” మిస్టర్. బొహనాన్ మంచి మనిషి. అతడు—అతడు సంఘ సభ్యుడు. మరియు—అతడు దేనికంతటికి సంబంధించినవాడో నాకు తెలియదు గాని, అతడు చెప్పాడు, “యోహాను ఎఱ్ఱని మిరియాలుతో కూడిన భోజనము, ఆ రాత్రి కడుపు నిండా తిని నిద్రపోయి యుండునని నేననుకుంటున్నాను” అని.

48 నేనతనితో చెప్పాను, అది నా ఉద్యోగమంత విలువయంతయైనా, నేను చెప్పాను. “అది నీవు చెప్పటానికి సిగ్గుపడవా?” నేను చిన్న బాలుడను, అయితే నేను అన్నాను, “దేవుని వాక్యమును గూర్చి అలా చెప్పుటకు నీవు సిగ్గుపడవా?” చూశారా? చిన్నవాడను, చిన్న ప్రాయము…ఇరవై యొకటి, ఇరవై రెండు సంవత్సరాలు; ఉద్యోగం దొరుకుట అరుదు, నిరుద్యోగ పరిస్థితి, అయితే, అయినను అక్కడ భయమున్నది, నేను…దేవుని వాక్యమునకు హీనముగా మాట్లాడుట విన్నపుడు భయము కల్గెను. అది సత్యము; అంతా సత్యము. కాబట్టి, చివరికి అది కల కాదు లేక సంకటం కాదు. యోహాను తినినందున వచ్చినది కాదు.

49 అతను పత్మాసు ద్వీపము మీదనుండెను. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము పుస్తక రూపమున పెట్టుటకు ప్రయత్నించెను, మరియు రోమా ప్రభుత్వం ద్వారా దేశ బహిష్కరణ చేయబడెను. ప్రభువు దినమందు అతడు ద్వీపముపైనుండెను. విస్తార జలములవంటి స్వరము అతడు వినెను, చూచుటకు వెనుకకు తిరిగెను. ఏడు సువర్ణ దీప స్తంభములు అతడు చూశాడు. మరియు వాటి మధ్య దేవుని కుమారుడు నిలబడియుండుట చూశాడు, ఇప్పుడు.

50 తరువాత గ్రంథము ప్రత్యక్షమైయున్నది. కాబట్టి, ఒక దానిని తెలియజేయు ఒకటి ప్రత్యక్షత, ప్రత్యక్షపరచు ఒకటి. ఇప్పుడు గమనించు, కాబట్టి నీవు అది మరచిపోవద్దు, “ఆఖరి కాలముల వరకు అది మూయబడినది.” గమనించారా? దానియొక్క మర్మమంతా “ఆఖరి కాలముల వరకు అది మూయబడినది.” ఇక్కడ లేఖనములలో మనమది కనుగొంటున్నాము.

51 ఇప్పుడు, ముద్రలు విప్పబడినపుడు, గ్రంథము యొక్క మర్మము బయలుపరచబడినది. మరియు ముద్రలు సంపూర్తిగా విప్పబడినపుడు విమోచనా సమయము అయిపోయినది. ఎందుకనగా గొఱ్ఱెపిల్ల ఆయన యొక్క హక్కులను అడుగుటకు మధ్యవర్తిత్వపు చోటును విడిచిపెట్టెను, దాని మధ్య, ఆయన మధ్యవర్తి. అయితే, ముద్రలు విప్పబడుతున్నపుడు, వాటి మీద నిజమైన ప్రత్యక్షత సంభవించినపుడు, పరిశుద్ధ స్థలము నుండి గొఱ్ఱెపిల్ల వచ్చుచున్నది. అది వాక్య ప్రకారముగా ఉన్నది. గత రాత్రి మనము చదివాము. ఆయన మధ్య నుండి వచ్చాడు…గ్రంథము తీసుకున్నాడు, కాబట్టి ఆయన ఇక మధ్యవర్తి కాదు, ఎందుకనగా ఆయనను వారు సింహమని పిలిచారు. మరి—అది రాజు. మరియు అలాటప్పుడు ఆయన మధ్యవర్తి కాదు.

52 ఈ ముద్రలలోని నటికులు మొదటి సంఘకాలములోయుండినప్పటికి. ఇప్పుడు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు—మీరు దాని యొక్క వెనుకటి గాధను ఎంత చక్కగా గ్రహించవలెనో అంతగా గ్రహించెదరు. “నటికులు,” దానిని ఆ విధముగా పెట్టవలెననుకుంటున్నాను. ఎందుకనగా నటుడు అనగా తన ముసుగును మార్చుకొనువాడు. గ్రహించారా?

53 ఈ రాత్రి ఈ నటనలో సాతాను తన ముసుగును మార్చుకొనుటను మనము చూడబోవుచున్నాము, మరియు, అందరు, నటులు.

54 క్రీస్తు, ఆయన చేసినది ఆయన నటించెను. ఆత్మ నుండి మానవునిగా ఆయనయైనపుడు, ఆయన కేవలము నటుని వస్త్రము, మానవ శరీరము ధరించి, రక్త సంబంధియగు విమోచకుడుయగుటకు మానవ రూపమున దిగివచ్చెను.

55 ఇప్పుడు—ఇప్పుడు, మీరు గమనించారా. అది కేవలము నటుని రూపము అది, ఆ కారణము చేత అవన్ని కూడా ఉపమానాలు, మరియు—మరియు అవి ఇక్కడున్న విధము మృగములు, జంతువులు మొదలైనవి. అది యొక నటన. మరియు ఈ నటులు మొదటి సంఘకాలము నుండిరి, ఎందుకనగా ఏడు సంఘకాలాలలో క్రీస్తు తనకు తాను బయలుపరుచుకున్నాడు. మీరది గ్రహించారా? [సభ “ఆమేన్,” అని చెప్పింది—సంపా.] మంచిది. చూశారా? ఏడు సంఘకాలములకు క్రీస్తు తనకు తాను బయలుపరుచుకొనుచున్నాడు.

56 అటు తరువాత, ఈ సంఘకాలాల గుండా, గొప్ప గందరగోళము వచ్చుచున్నది, అటు తరువాత, సంఘకాలము యొక్క ముగింపులో, ఈ పోగొట్టబడిన మర్మములను ఏడవ దూత వర్తమానము తీసికొని సంఘమునకు దానిని ఇచ్చును. చూశారా? మనమది గమనిస్తాము.

57 అయితే అప్పుడు వాటి వాస్తవమైన స్థానంలో బయలుపడలేదు. ఇప్పుడు, బైబిలు కాలములలో మర్మములు అక్కడ ఉండెను. ఇక్కడ యోహాను చూచినట్లుగా ఈ కార్యములు జరుగుట వారు చూశారు. ఇప్పుడు అతడు చెప్తున్నాడు, “అక్కడొక తెల్లని గుఱ్ఱముపై స్వారీ చేయువాడు,” అని. అయితే, దాని యొక్క మర్మమేమిటి? ఆ స్వారీ చేయువానితో ఒక మర్మముపోవుచున్నది. అదేమైయున్నది, వారికి తెలియదు అయితే, అది బయలుపరచబడవలసియున్నది. అయితే, గొఱ్ఱెపిల్ల, తండ్రి సింహాసనమును విడిచిన తరువాత అది బయలుపరచబడును. రక్త సంబంధియైన విమోచకునిగా ఆయన యొక్క మధ్య వర్తిత్వం అయిన తరువాత.

58 ఇక్కడ నేను ఒకటి వదిలిపెట్టబోతున్నాను. ఎవరైనా, ఈ టేపులు తీసుకున్నట్లైతే…ఏ మనుష్యుడైనను తాననుకున్నది మాట్లాడగలడు. తన ఒప్పుకోలు ఏదైనా చెప్పుకొనటానికి హక్కు కలదు. అయితే…మీకు తెలుసా ఒక సేవకుడు తన ప్రజల మధ్యకు ఇది వద్దనుకున్న యెడల, అలాగైతే తీసికోవద్దని చెప్పండి, అయితే నేను—నేను ఎవరి యొద్దకు మాట్లాడుటకు పంపబడ్డానో ఇది, ఆ ప్రజల యొద్దకు, కాబట్టి సత్యమేదో నేను బయలుపరచవలసియున్నది. అవునా?

59 ఇప్పుడు, గొఱ్ఱెపిల్ల, ఇక్కడ వెనుక విజ్ఞాపనా కాలంలో భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి అక్కడ పేరులు పెట్టబడియున్నవని, ఆయనకు తెలుసు. భూమి మీద ఆ పేరులు బయలుపరచబడనంత వరకు ఆయన మధ్యవర్తిగాయుండవలసియుండును. మీరది గ్రహిస్తున్నారా? [సభ “ఆమేన్,” చెప్పింది—సంపా.] పరిపూర్ణంగా ముందు నిర్ణయం. చూశారా! మంచిది. ఆయన అక్కడయుండవలసియున్నది. ఎందుకనగా నిత్యజీవమునకు, దేవుడు నిర్ణయించబడిన వారి కొరకు చనిపోవుటకు ఆయన వచ్చెను, చూశారా? అవునా? ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆయన వారిని చూశాడు. ఆయన స్వంత చిత్తమును బట్టి కాదు; ఆయన చిత్తము ఎవరు నశించకుండుట. అయితే, ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఎవరో, ఎవరు కాదో ఆయన ఎరుగును. కాబట్టి, అక్కడ ఒక్క పేరు లేనంత వరకు, భూమి మీద వెల్లడికానంత వరకు ఆ యొక్క పేరును జాగ్రత్త తీసికొనుట కొరకు క్రీస్తు మధ్యవర్తిగా అక్కడయుండవలసినది.

60 అయితే, ఆ చివరి పేరు క్లోరాక్స్ లో లేక బ్లీచ్ లో వేయబడిన వెంటనే, ఆయన విజ్ఞాపన దినములు ముగియును. “అపవిత్రుడు అపవిత్రుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుని పరిశుద్ధునిగానేయుండనిమ్ము” చూశారా? ఆయన పరిశుద్ధ స్థలమును విడచును. అటు తరువాత అది న్యాయతీర్పు స్థానమౌను. అప్పుడు క్రీస్తుకు బయటనున్న వారికి శ్రమ.

61 ఇప్పుడు గమనించండి, అయితే, తండ్రి యొద్ద నుండి తన యొక్క విజ్ఞాపన స్థానమును గొఱ్ఱెపిల్ల విడచినపుడు అది బయలుపరచబడును. అది ప్రకటన 5. ఇప్పుడు ఆయన ముద్రల గ్రంథము తీసుకుంటున్నాడు. ముద్రల గ్రంథము, లేక ముద్రలతో ముద్రించిన గ్రంథము. వాటిని విప్పి చూపించుచున్నాడు. చూడు! ఇప్పుడు కాలము యొక్క ముగింపులో, మధ్యవర్తిత్వము అయిపోయిన తరువాత, సంఘకాలములు ముగుస్తున్నవి.

62 ఆయన మొదటి కాలములో, ఎఫెసి కాలములో వచ్చాడు; బయలుపరచుకున్నాడు, వర్తమానికుని పంపాడు.

63 మనము ముందుకు వెళ్ళి చూడగా ఏమి జరిగినదో గమనించండి. ఇక్కడ దాని యొక్క ప్రణాళికయున్నది. మొదటి విషయము జరుగుచున్నది. మొదటిగా పరకలోకమందు ఒక ప్రకటన ప్రకటించబడెను. ఏమి జరిగినది? ఒక ముద్ర తెరవబడినది. అదేంటి? ఒక మర్మము తెరవబడెను, అవునా? మరియు ఒక మర్మము తెరవబడినపుడు, అప్పుడు, ఒక బూర ఊదబడినది. అది యుద్ధమును ప్రకటించును. ఒక తెగులు వచ్చును మరియు సంఘకాలము తెరవబడును. చూశారా?

64 “యుద్ధము” యొక్క భావమేంటి? ఇంకా సంపూర్ణముగా బయలుపరచబడని దేవుని మర్మమును, సంఘము యొక్క దూత పట్టుకొనును. అయితే, అతడు అది చేస్తున్నప్పుడు, దేవుని మర్మము అతడు పట్టుకొనును, మర్మము అతనికివ్వబడిన తరువాత ప్రజల యొద్దకు అతడు వెళ్ళును. అతడు అక్కడ ఏమి చేయును? ఆ వర్తమానమును ప్రకటింపనారంభించును. అదేమి ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును.

65 తరువాత, ఆ కాలములో ఎన్నికైన వారితో కలసి ఆయన వర్తమానికుని దేవుడు తీసుకొనును. నిద్రపుచ్చును, అటు తరువాత, దానిని తృణీకరించిన వారి పైకి ఆయన తెగులును పంపును; ఒక తాత్కాలిక న్యాయతీర్పు.

66 మరియు అదియైన తరువాత, తరువాత, అది వెళ్ళిపోతుంది మరియు వారు సంస్థాపకము చేసి, సంస్థాపకములోకి తీసికొస్తారు. జాన్ వెస్లీ మిగతావారి వలె ఆ మనుష్య కార్యమును మొదలు పెడతారు. తిరిగి అది గందరగోళంలోకి వెళ్తుంది.

67 తరువాత ఇంకొక మర్మము వస్తుంది, తరువాత ఏమి జరుగుతుంది? సంఘకాలము కొరకు మరొక వర్తమానికుడు భూమి మీదకి వచ్చును. చూశారా? తరువాత అతడు వచ్చినపుడు అతడు—బూర ఊదును. అతడు యుద్ధమును ప్రకటించును. చూశారా? అటు తరువాత ఏమి జరుగుతుంది. చివరగా అతడు కొనిపోబడతాడు. తరువాత అతడు పంపబడిన తరువాత, తెగుళ్ళు వచ్చును. వారిని నాశనము చేయును. ఆత్మీయ మరణము సంఘమును తాకును, మరియు ఆ గుంపు వారు, ఆమె వెళ్ళిపోవును.

తరువాత, ఆయన ఇంకొకరి మీదికి వెళ్లును, ఓ, ఇది ఘనమైన ప్రణాళిక!

68 ఆ యొక్క ఆఖరు దూత యొద్దకు వచ్చు వరకు అలాగుండును, అతనికి ఏ ప్రత్యేక మర్మము లేదు. అయితే ఆ యొక్క ఇతర కాలాలలో పోగొట్టబడినదంతా అతడు ప్రోగుచేసి, ఇంకా నిజంగా బయలుపరచబడని సత్యమునంతా, చూశారా, ప్రత్యక్షత వచ్చినట్లుగా ఆ తరువాత అతని దినాలలో ఆ విషయాలను బయలుపరుచును. మీరు చదవాలనుకుంటే, అక్కడే అది ఉన్నది. ప్రకటన 10, 1 నుండి…1 నుండి 4 వరకు, మీరది పొందుకుంటారు. సరే. చూశారా? “గ్రంథాలన్ని తీసుకొని మరియు ముద్రలు యొక్క గ్రంథాన్ని తీసికొని వాటిని విప్పి,” ఏడవ దూతకు చూపెను; ఇది మాత్రమే, దేవుని యొక్క మర్మము, ఏడవ దూత యొక్క పరిచర్యయైయున్నది. ఇప్పుడు మనము సంఘకాలముల గుండా వచ్చాము, చరిత్రతో సహా, అది నిరూపించియున్నది. చూశారా? అది ఏడవ సంఘకాలము యొక్క—దూత వర్తమానము. సరే, క్రితములోని మర్మములన్ని, గతములోని అన్ని సంగతులను బయలుపరుచును, ప్రకటన 10:1-7 అదంతా. ఇప్పుడు, జ్ఞప్తించుకోండి. “ఏడవ దూత దినాలలో, అతడు బూర ఊదుచుండగా, సువార్త బూరను గట్టిగా ఊదుచుండగా, దేవుని మర్మాలన్ని అతడు ముగించును.”

69 ఆరంభ సంఘకాలములో ఉన్నట్లు, ఇక్కడ వచ్చును. కొద్ది సేపైన తరువాత మనమది (సిద్ధాంతమును) పొందుకుంటాము. మరియు అటు తరువాత, మొదటిగా అది ఒక మాటగాయుండును. తరువాత అది యొక సిద్ధాంతము. తరువాత శాసనముగా మారును. తరువాత అది సంఘమైపోయి అంధకారములోనికి వెళ్ళినది.

70 అటు తరువాత, అంధకార కాలములలో నుండి లూథర్ ద్వారా మొదటి సంస్కరణ వచ్చినది. మరియు ఆ సంఘకాలములో జరిగిన మర్మమైనవన్నియు అతడు తనతో తీసికొని వచ్చెను. అప్పుడున్నవన్ని, అయితే వాటిని అతడు ముగించలేదు.

71 ఆ తరువాత, వెస్లీ శుద్ధీకరణతో వచ్చాడు. మరి ఇంకా కొన్నిటితో వచ్చాడు. ఇంకా అవి ముగించలేదు. మిగిలిన తుంపలను ఎక్కడివక్కడ విడిచిపెట్టాడు. బాప్తిస్మమునకు బదులు చిలకరింపు మొదలైనవి. లూథర్, “ప్రభువైన యేసుక్రీస్తుకు” బదులుగా “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను” తీసుకున్నాడు. ఈ పలుపలు విధములన్ని తీసుకున్నాడు.

72 అటు తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పెంతెకొస్తు కాలము వచ్చినది మరియు దానిని వారు కించపరిచారు. ఇంక కాలాలు లేవు. అదంతా అంతే, అది ఫిలదెల్ఫియా…లేక ఇప్పుడు లవొదికయ కాలము. అయితే తరువాత…

73 ప్రతి యొక్క సారి, కాలము యొక్క వర్తమానికుడు కాలము యొక్క ముగింపులో వచ్చుట లేఖనము చదువుట ద్వారా మనము కనుగొనుచున్నాము. పౌలు, కాలము యొక్క ముగింపులో వచ్చాడు. ఐరేనియస్ కాలము యొక్క ముగింపులో వచ్చుట మనము కనుగొంటున్నాము. మార్టిన్ కాలము యొక్క ముగింపు. లూథర్, కథోలిక్ కాలము యొక్క ముగింపు. (మరేంటి) వెస్లీ, లూథరన్ కాలము యొక్క ముగింపు. పెంతెకొస్తు శుద్ధీకరణ కాలము యొక్క ముగింపు, పరిశుద్ధాత్మ బాప్తిస్మములోకి.

74 పెంతెకొస్తు కాలము యొక్క ముగింపులో, వాక్య ప్రకారముగా మనము పొందుకోవలసియున్నది. మీకు చూపించుటకు దేవుడు ఈ రాత్రి, నాకు సహాయము చేయుగాక. దీని ద్వారా మనము చూడవలసియున్నది; చివరి కాల వర్తమానికుడు, అప్పటి వరకు విడిచిపెట్టబడినట్లుగా కనబడు భాగములన్నిటిని కూర్చి సంఘము ఎత్తబడుటకై దేవుని సమస్త మర్మములను ప్రత్యక్షపరుచును.

75 అటు తరువాత, రాబోవుచున్న ఏడు మర్మయుక్తమైన ఉరుములను గూర్చి, అవి చివరకు వ్రాయబడలేదు. అవునది నిజం. అందువలన ఎత్తబడుటకు కావలసిన విశ్వాసము కొరకు పెండ్లి కుమార్తెను క్రమములో ఉంచుటకొరకై, ఈ చివరి దినములలో ఏడు ఉరుముల గుండా ఆయన బయలుపరచునని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా మన మిప్పుడు ఏమి కలిగియున్నామో దానితో, మనము—మనము చేయలేము. అక్కడ ఒకటియున్నది. మనము ముందుకు వెళ్ళవలసియున్నది. మనకు చివరకు మనకు దైవిక స్వస్థతను గూర్చిన విశ్వాసము కూడా లేదు. ఈ భూమి నుండి ఎత్తబడుటకు ఒక క్షణంతో మార్చబడుటకు చాలినంత విశ్వాసము కల్గియుండవలసియున్నది. ప్రభువు చిత్తమైతే కొద్దిసేపు తరువాత, అది మనం కనుగొంటాము. అదెక్కడ వ్రాయబడినదో తెలుసుకుంటాము.

76 అటు తరువాత ఈ దుర్మార్గపు కార్యములు చేయువారి యొక్క న్యాయతీర్పు! ఇప్పుడు చూడండి. చివరి ముద్ర విప్పబడునంత వరకు ఈ కాలములన్నిటిలో ముద్రలు విప్పబడుట చూస్తారు. ఇప్పుడు వారు—ఈ ముద్రలను గమనించుచున్నపుడు మరియు వారేమి చేయుచుండిరో అనుకొనుచుండిరి. కాలము యొక్క ముగింపులో సంఘకాలము యొక్క ముగింపులో, ఈ చెడు కార్యములు చేయు వారందరు, ఏడు ముద్రలలో ఈ చెడు కార్యములు చేయు వారందరు, అనగా సంఘములో మర్మమైన కార్యములు చేయువారు శ్రమకాలములో కలసికొంటారు.

77 ఒక్క నిమిషములో మనమది కనుగొంటాము, చివరికది ఒక సంఘము పేరుతో చేయుట. “సంఘము” అని తమకు తాము పిలుచుకుంటారు. అది నిజమో, కాదో చూడండి. ఎందుకో నాకు తెలియకుండగానే సంఘశాఖలకు నేను వ్యతిరేకిగాయుండుట ఆశ్యర్యము కాదు, చూశారా? చూశారా?

78 వారు ముగించారు. ఇప్పుడు, అది వెనుక చిన్నగా ప్రారంభమై చెడిపోయిన స్థితికి, ఇంకా చెడిపోయిన స్థితికి వెళ్ళిపోయినది…ప్రజలు అందులోకి వెళ్ళిపోయి, ప్రజలు “ఓ, అవును, ఇది చాలా బాగుంది” అని చెప్పారు. అయితే కడవరి దినాలలో ఈ విషయాలు బయలుపడినవి. చివరికి అవి, ఎంతో చెడిపోయినంతగా అయిపోయి శ్రమకాలంలోకి వెళ్ళిపోతారు.

79 క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె శ్రమలోకి వెళ్తుందని ఒక మనుష్యుడు ఎట్లు చెప్పగలడు? అది నేనర్థం చేసుకోలేకపోతున్నాను. చూశారా? ఆమె శ్రమలకు ముందే తీసికొనిపోబడినది. అయితే—సంఘము తీర్పు తీర్చబడియుండగా, వారికి వారే తీర్పు తీర్చుకొని రక్తమును అంగీకరించియుండగా, ఏ విధంగా దేవుడు, సంపూర్ణంగా పాపరహితునిగా నుండిన ఒక మనుష్యుని దేవుడు తీర్పు తీర్చగలడు?

“అటువంటి వ్యక్తి ఎవరూ లేరని,” నీవు చెప్పావు.

80 ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి, నిజమైన విశ్వాసి ఖచ్చితంగా, సంపూర్ణంగా దేవుని ఎదుట పాపరహితుడు, అతడు తన కార్యాలపైన నమ్మికయుంచుటలేదు; అతని ఒప్పుకోలునంతా యేసు రక్తములో వేయబడినది. అలాగని బైబిలు చెప్తుంది. అవునా? “దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఏలయనగా అతడు పాపము చేయజాలడు.” యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క బ్లీచ్, అతనికిని దేవునికిని మధ్యయున్నప్పుడు ఒక మనుష్యుని నీవు ఒక పాపిగా ఏలాగు చేయగలవు? అక్కడ అది ఏమి మిగలకుండ అది పాపమును పారద్రోలును. చూశారా? ఏ విధముగా పవిత్రమైన క్రీస్తు రక్తము అక్కడ పాపమును ఉంచగలదు? ఆయన ఉండనివ్వడు.

81 యేసు చెప్పియున్నాడు, “పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులైయుండుడి.” మరియు పరిపూర్ణతగా ఉండుట అను తలంపును కూడా మనమెట్లు ప్రారంభించగలము? అయితే యేసు అది కోరాడు, యేసు అది కోరినట్లైతే, దానికి మార్గాన్ని ఆయన చేకూర్చవలసియున్నది, ఆయన స్వంత రక్తము ద్వారా ఆయనది చేయవలసియున్నది!

82 ఇప్పుడు, గతకాలములో విడిచిపెట్టబడిన మర్మములన్ని బయలుపరచబడుచున్నవి. ఇక్కడ అంత్యకాలములో, తలంపు ఏదనగా, ఎంతోకాలమునందు ఆరంభమైన మర్మములు సంఘకాలముల గుండా వచ్చినవి, ఇక్కడ చివరి దినములలో ముద్రలు విప్పబడునపుడు బయలుపరచబడును. విజ్ఞాపన సమయం సుమారు ముగియుచున్న తరువాత, ఆ సమయంలో.

83 అటు తరువాత, ఎవరైతే వెనుకనున్నారో, వారి కొరకు తీర్పులు ఎదురు చూచును, వారు దానిలోనికి పోయెదరు. అది, పెండ్లికుమార్తె రంగం మీద నుండి కొనిపోబడిన తరువాత.

84 ఓ! ఒక లేఖనం చదువుదాం. మీరు కొన్ని లేఖనాలు వ్రాసికొంటానికి ఇష్టపడతారా? ఒక్క క్షణం. రెండవ థెస్సలోనికయులు తీద్దాం. ఒక్క నిముషం ఇటు చూడండి, అది—అది 7వ వచనం నేను కోరుతున్నాను. 2వ అధ్యాయం, రెండవ థెస్సలోనికయులు 2:7. అది సరేనని నేననుకుంటున్నాను. ఇప్పుడు, నేను దీనిని వణుకుతూ భయంతో వ్రాసితిని.

…ధర్మవిరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును.

85 ఎవరు? “అడ్డగించుచున్నవాడు.” చూశారా? చూశారా, ఒక మర్మము, “ధర్మ విరోధ సంబంధమైన మర్మము,” ఆ యొక్క మొదటి సంఘకాలములోనే యున్నది ఇక్కడ. ఇక్కడ పేరు వ్రాస్తూ చెపుతున్నాడు, “ధర్మ విరోధ సంబంధమైన మర్మముయని,” ధర్మ విరోధ సంబంధమైనది అంటే ఏమిటి? ధర్మ విరోధ సంబంధమైనది అనగా, ఒకటి నీవు చేయకూడదని ఎరిగియుండి, ఏలాగైనా నీవు చేయుట. ఈ రోజు భూమి మీద ఆలాటివారున్నారని పౌలు చెప్తున్నాడు. ఓ, అయితే…అది మనము…ఒక నిముషములో ఆ భాగాన్ని చదువుదాము, కొంచెము ముందుకు ప్రారంభిద్దాం, 3వ వచనము.

ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు (పురుషుడు) బయలుపడితేనే గాని ఆ దినము రాదు; (అది నిజము)

ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు దానికంతటిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక పాపములు క్షమిస్తూ.

నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా?

86 అతని బోధలలో కొన్నిటి క్రింద నేను కూర్చండవలసియున్నవని కోరుచున్నాను. మీరు ఆ విధంగా లేరా?

కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.

87 అప్పుడు కాదు, చూశారా, అప్పుడు కాదు; అయితే, “తన సొంతకాలమందు,” ఆ ముద్ర విప్పబడునపుడు. అదేమైయుంది ఖచ్చితంగా మనకు తెలుసు. ఈ ధర్మవిరోధి ఎవరు? ఈ పాప పురుషుడు ఎవరు? ధర్మ విరుద్ధ కార్యాలు చేయు ఇతడెవరు? “అయితే అతని కాలమందు వాడు బయలుపరచబడును.”

ధర్మవిరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది, గాని (మోసగాళ్ళు, మీరు చూశారా, ప్రజలను ఒక దానియందు మోసము చేస్తారు, చూడండి) యిది వరకు అడ్డగించుచున్నవాడు (దేవుడు) మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. (సంఘము, క్రీస్తు, పెండ్లి కుమార్తె)

అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును,…

88 ముద్ర విప్పబడినపుడు “అతని యొక్క కాలంలో,” పౌలు చెప్పాడు, “నా యొక్క కాలంలో కాదు, గాని అతడు బయలుపరచబడు కాలములోయని.” చూశారా?

…ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి,…

89 కొంచెం సేపైన తరువాత మనమది పొందుకోబోతున్నాము “తన నోటి ఊపిరిచేత.” అదేమైంది గమనించు.

…తన ఆగమన ప్రకాశము చేతన నాశనము చేయును.

సాతాను కార్యములతో అతని రాకడయుండును…

90 అతను, “అతను” ఒక మనిషి, అతని క్రియలు సాతాను క్రియలను అనుసరించియుండును.

…అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను,

…మహాత్కార్యములతోను మరియు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను (జనులను దుర్నీతితో మోసగించుచు,) నశించుచున్న వారిలో (ఈ పెండ్లి కుమార్తెలోకాదు) అటువంటి కార్యముకై ఎదురుచూచు వారిలో; ఎందుకనగా సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి…

91 క్రీస్తు సత్యమైయున్నాడు. మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు; అయితే వారు ఒక ఆచారము కల్గియుండగోరుచున్నారు. ఊహు! చూశారా?

…వారు రక్షింపబడుటకై

ఇందుచేత ఒక—ఒక అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు:

92 అదక్కడ ఇట్లు తర్జుమా చేయడియుండవలెను నేను నిఘంటువులో చూచినట్లుగా: “ఆ అబద్ధము”యని, “ఒక అబద్ధము” కాదు. “ఆ అబద్ధము”. అదే హవ్వతో చెప్పెను.

వారు…సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై.

93 ఎంతటి గొప్ప ప్రకటన. ఓహో! పెండ్లికుమార్తె కొనిపోబడిన తరువాత, అప్పుడు పాప పురుషుడు తనకు తాను బయలుపరుచుకొనును.

94 ఆమె, నిజమైన క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె ప్రతి సంఘకాలంలో ఏర్పరచబడుతుంది.

95 గత దినము, నేనొక వివరణ ఇచ్చియున్నాను, “పెండ్లికుమార్తె, నివాస గృహానికి వెళ్తుంది అందును గూర్చి నీకేమి తెలియదు.” అది నిజం.

96 ఒకరన్నారు, “సరే, సహోదరుడా బ్రాన్హాం, అది చాలా చిన్న మందయౌతుంది.”

97 యేసు చెప్పాడు, “అది నోవహు దినములలోనున్నట్లుగా యని,” ఇప్పుడు అందును గూర్చి ఆయనతో మాట్లాడండి, చూశారా, “నీటి ద్వారా ఎనిమిది మంది రక్షించబడిరి, ఆలాగే మనుష్యకుమారుని రాకడయందు ఉండును.” ఈ రాత్రి ఎనిమిది వందలమంది ఎత్తబడుటలో వెళ్ళినట్లైతే, అందును గూర్చి రేపో ఒక్క మాట మీరు వినరు, లేక మరొక దినముననో లేక మరొక్కసారియో వినరు. వారు వెళ్ళుదురు. అందును గూర్చి మీకేమి తెలియదు. చూశారా. అది ఆలాగేయుండును.

98 నేను చెప్పుటకు ప్రయత్నించునదేదనగా? నేను మిమ్ములను భయపెట్టుటలేదు. బాధపెట్టుట లేదు. మీ బొటన వ్రేళ్ళ మీద మీరు ఉండాలని నేను—నేను కోరుతున్నాను. సంసిద్ధంగా ఉండండి. ప్రతి నిముషము మెలకువగాయుండుడి. మీ బుద్ధిహీనతను విడిచిపెట్టండి. దేవునితో సంబంధం కల్గియుండుడి. ఎందుకనగా నీవు అనుకున్న దానికంటే అది ఆలస్యమైపోయింది.

నీవు జ్ఞాపకముంచుకో, నిజమైన పెండ్లికుమార్తె!

99 ఇప్పుడు, అబద్ధపు పెండ్లి కుమార్తెయున్నది, దానిని మనం ప్రకటన 17లో చూస్తాం, ఆమె చెప్తుంది, “నేను విధవరాలను, నాకేది అవసరం లేదు”యని. మీరు గమనిస్తున్నారా? ఎఱ్ఱని మృగముపై, ఆ విధముగా కూర్చొనియున్నది.

100 అయితే నిజమైన పెండ్లికుమార్తె వేలాది, వేలాది మందితో తయారైయున్నది, అయితే ప్రతి యొక్క సంఘకాలములో ఎన్నిక చేయబడినది. ప్రతిసారి వర్తమానం వెళ్ళినపుడు ప్రజలు వెలుగునందు నమ్మి దానిని అంగీకరించినపుడు, ఆ విమోచనా దినము వరకు ముద్రించబడిరి.

101 యేసు, అదే విషయాన్ని చెప్పలేదా? ఆయన చెప్పాడు, “ఆ—ఏడవ జామున ధ్వని—వినబడును”? అది చివరి సంఘకాలం, చూశారా? చెప్పబడినది, “ఇదిగో పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు. ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుడి.”

102 అటు తరువాత, తన కళ్ళు నులుపుకుంటూ నిద్రించుచున్న కన్యక వచ్చెను. “ఆ నూనెలో కొంచెము నాకూ కావలసియున్నది, మీరు కొంచెం ఇస్తారా.”

103 నిజమైన, అసలైన పెండ్లి కుమార్తె నిలబడియున్నది. అన్నదామె, “మాకు సరిపడునంత మాత్రమే మాకున్నది. ఊహు. లోపలకుపోవుటకు సరపడునంత మాత్రముయున్నది. మీకు మేమేదియు ఇవ్వలేము. మీకు కొంచెం కావలెనా మీరు వెళ్ళి ప్రార్థించుడి.”

104 ఆమె వెళ్ళిపోయినపుడు, పెండ్లికుమారుడు వచ్చాడు, పెండ్లికుమార్తె లోపలకు వెళ్ళిపోయినది, అక్కడ శేషించిన వారు, సంపూర్తిగా సద్గుణము గలవారు, సంఘము, బయట విడిచిపెట్టబడినది. “అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును.”

105 చూశారా, అదీ ఏర్పరచుకున్నవారు, “పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు” అను శబ్దం వినబడగానే, ఆ కాలములన్నిటిలో నిద్రించియున్నవారు, ప్రతి యొక్కరు మేల్కొనిరి. చూశారా! మనము అనుకున్నట్లుగా, అది దేవుడు కాదు. ఈ కాలములోని కొద్ది వేలమంది ఆయనను వెదకుతారు మరియు వారిని తీసికొని వెళ్తారు. అది ప్రతి కాలము నుండి ఎన్నుకొనబడినవారే, ఆ కారణం చేత, ఒక విజ్ఞాపన కర్తగా, ఆఖరి కాలములో నుండి ఆఖరు వ్యక్తి వచ్చు వరకు మధ్యవర్తిత్వపు స్థానము మీద క్రీస్తు ఉండవలసియున్నది. అప్పటి ఈ ప్రత్యక్షతలు ఏమైయున్నవో, ప్రజల యెడల తెరవబడి ఏం జరిగినదో వారు చూస్తారు. చూశారా? ఇప్పుడు మీరు అర్థం చేసికున్నారా? [సభ “ఆమేన్,” అన్నది—ఎడి.] సరే.

106 గమనించండి “మిగతా మృతులు,” సంఘ సభ్యులు “వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు మృతులైనవారు తిరిగి జీవించరు.” సంఘ సభ్యులు, క్రైస్తవులు, సంఘము వెయ్యి సంత్సరములు గడుచు వరకు తిరిగి జీవించరు. అటు తరువాత లేచి పెండ్లికుమార్తె ముందు నిలబడతారు. అవును. రాజు రాణి యెదుట నిలబడతారు. మహిమ!

ఈ రోజు కొన్ని సంఘాలు “పరలోకపు రాణి” యని తమ్మును తాము పిలుచుకొనుచున్నవి.

107 పరలోకపు రాణి ఎన్నికచేయబడిన క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె మరియు ఆమె ఆయనతో వచ్చును. దానియేలు అది చూచి చెప్పాడు “వేలవేల కొలది ఆయనకు పరిచారకలుండిరి,” దానియేలులో అక్కడ లేఖనము మీరు గమనించితే, “తీర్పు తీర్చుటకై గ్రంథము తెరువబడెను.” ఇప్పుడు జ్ఞప్తించుకొనండి, ఆయన వచ్చునపుడు, ఆయన ఆయన పెండ్లికుమార్తెతో వచ్చును. భార్య భర్తకు పరిచర్యచేయును. “మరియు వేలవేల కొలది ఆయనకు పరిచర్య చేయుచుండిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును,” “మరియొక గ్రంథము తెరవబడెను, అది జీవ గ్రంథము,” పెండ్లికుమార్తె కాదు, కానే కాదు. ఆమె పైకి వెళ్ళిపోయి తిరిగివచ్చి, సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో ఆ తరము వారు తీర్పునొద్ద నిలబడును.

108 యేసు చెప్పలేదా? “దక్షణ దేశపు రాణి ఈ తరము వారితో లేచి (న్యాయతీర్పు అపుడు) ఈ తరము వారిని ఖండించును. ఆమె భూమ్యంతముల నుండి సొలొమోను జ్ఞానమును వినుటకు వచ్చెను. మరియు సొలొమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” దక్షణ దేశపు రాణి షేబా రాణి న్యాయతీర్పు దినమున నిలబడి తన స్వంత సాక్షమిచ్చును.

109 చివరకు యూదుడు ఏ ఒక్కరు ఆ తరము వారితో రారు. వారు గుడ్డివారు. ఆయనను పోగొట్టుకున్నారు. ఎందుకనగా, వారు ఆయన కొరకు ఎదురుచూచుచుండిరి. అయితే ఆయన చాలా సామాన్యతలో వచ్చినందున, ఆ విధముగా తలక్రిందులైపోయారు.

110 అక్కడ, ఆ గొప్ప రాణి ఆమె తన్ను తగ్గించుకొనినదై వచ్చి వర్తమానాన్ని అంగీకరించినది. “తీర్పు దినమున ఆమె నిలబడి” ఆయన చెప్పాడు, “ఆ తరము వారికి తీర్పు తీర్చును.”

111 ఇప్పుడు మీరు చూడండి, ఎల్లప్పుడు మూడు తరగతులు. గ్రంథము, మృతులు తీర్పుపొందిరి. మరియొక గ్రంథము, జీవగ్రంథము, ఎవ్వరిపేరైతే జీవగ్రంథములో ఉండునో వారు.

112 మీరు చెప్తారు “జీవ గ్రంథమందు నీ పేరున్నట్లైతే, పరవాలేదు. ఊహు,” లేదండి.

113 చూడు, జీవగ్రంథమందు ఇస్కరియోతు యూదా పేరున్నది. అది తప్పంటావా? మత్తయి 10లో, దయ్యాలు వెళ్ళగొట్టుటకు వారికి అధికారము ఇచ్చాడు. రోగులను స్వస్థపరుచుటకు వారిని పంపాడు. కుష్ఠ రోగులను శుద్ధిచేయుటకు, చనిపోయిన వారిని లేపుటకు వారిని పంపాడు. వారు వెళ్ళిపోయి తిరిగి వచ్చారు. యూదా వారితో ఉన్నాడు. వారు దయ్యాలు వెళ్ళగొట్టారు. అన్ని విధాలైన అద్భుతాలు చేశారు. తిరిగి వచ్చి చెప్పారు, “చివరికి దయ్యాలు లోబడుచున్నవి అని అన్నారు.”

114 యేసు చెప్పాడు, “దయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకుడి, అయితే పరలోకమందు మీ పేరులు వ్రాయబడియున్నవని సంతోషించుడి” అని అన్నారు. యూదా వారితో ఉన్నాడు. అయితే ఏం జరిగింది? ఏర్పరుచుకున్న వారి గుంపు యొద్దకు వచ్చుచున్పటికి, అక్కడ పెంతెకొస్తుకు వచ్చుచున్నప్పటికి, పరిశుద్ధాత్మ నిజముగా పొందిన వారిని చూచునపుడు యూదా, తన రంగులు కనపరచాడు. అక్కడ తీర్పులో అతడుంటాడు.

115 కాబట్టి గ్రంథములు తెరవబడినవి. జీవ గ్రంథము తెరవబడినది. ప్రతీ యొక్కరు తీర్పుతీర్చబడ్డారు. ఆ విధంగా, లోకమును తీర్పుతీర్చుటకు పెండ్లికుమార్తె నిలబడియున్నది. వద్దు…పౌలు చెప్తున్నాడు, “తెగించుచున్నాడా” పెండ్లికుమార్తెతో మాట్లాడుచున్నాడు. “మీలో ఒకరు మరియొకని మీదికి వ్యాజ్యమున్నప్పుడు, అనీతిమంతమైన చట్టము యొద్దకు వెళ్ళుచున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా?” చూశారా? అక్కడే మీరున్నారు, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చి, దానిని స్వీకరించబోతున్నారు. అవునది నిజం.

116 “లోకంలో ఆ చిన్న గుంపుకు అదెట్లు సాధ్యం?” అని అడగవచ్చు, అది ఏ విధంగా జరగబోతున్నదో నాకు తెలియదు. అయితే ఆ విధంగా జరగనైయున్నదని ఆయన చెప్పాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అది ఆలాగే జరుగుతుంది.

117 ఇప్పుడు చూడు, ఇప్పుడు గమనించు, “మిగిలిన మృతులు,” సంఘసభ్యులు, చనిపోయిన సంఘ సభ్యులు, “వెయ్యి సంవత్సరముల వరకు బ్రతుకరు.” తరువాత, వెయ్యి సంత్సరములలో వారు కూడుకుంటారు. మరియొక పునరుత్థానము వచ్చును. అది రెండవ పునరుత్థానము, వారు కూడుకుంటారు. మరియు క్రీస్తు, సంఘము, పెండ్లికుమార్తె, సంఘము కాదు పెండ్లికుమార్తె; క్రీస్తు మరియు రాణి, సంఘము కాదు…క్రీస్తు మరియు పెండ్లికుమార్తె అక్కడ నిలబడ్డారు.

118 మేకలలో నుండి గొఱ్ఱెలు వేరుపరచబడినట్లు వారు వేరుపరచబడతారు. అవునది నిజం. అక్కడ సంఘ సభ్యులు లేపబడతారు. వారు సత్యమును విని, సత్యమును నిరాకరించినట్లైతే, అలాటప్పుడు, పట్టకు అడ్డంగా ఒక పెద్దది పరచబడినట్లుగా ఉంటే ఏమని చెప్పబడుతుంది; నీ స్వంత తలంపులు ఉండగ, దానిని గూర్చి నీ తలంపు ఏమైయుండును? దాని నుండి నీవేలాగు తప్పించుకోగలవు. అక్కడున్న దేవుని పెద్ద టెలివిజన్ యగు ఆకాశము యొక్క పట్టమీద అది ఉండును. నీ స్వంత తలంపులే నీకు వ్యతిరేకములగును. ఆ సమయములో నీ స్వంత తలంపులే, నీకు వ్యతిరేకముగా మాట్లాడును.

119 కాబట్టి, నీవు ఒకటి మాట్లాడి మరొకటి తలస్తే, నీవది మానుకొనుట మంచిది. నీ తలంపులు దేవునిపైన ఉంచుకో, వాటిని పరిశుద్ధంగా ఉంచుకో. వాటితోనే యుండు, ఎల్లప్పుడు ఒకే దానిని మాట్లాడు. చూశారా? “సరే, నేనది నమ్మానని నేను చెప్పాను, అయితే, నేను వెళ్ళి కనుగొంటాను” అని చెప్పవద్దు, నీవది నమ్మావు! ఆమేన్.

120 గమనించండి, ఈ పోలిక వారు చనిపోవుటకు కారణం, శ్రమకాలంలో సంభవించు శోధనలో వారు పాలుపంచుకొని శుద్ధిచేయబడవలెను. ఎందుకనగా, వాస్తవముగా వారు రక్తము క్రిందలేరు. వారు ఉన్నారని వారు చెప్పుకుంటున్నారు. అయితే లేరు. వారిని శుద్ధీకరించుటకు శ్రమలలోకి ఎలా వెళ్తారు? యేసు క్రీస్తు రక్తము (బ్లీచ్) ప్రతి పాపపు మరకను, గురుతును తీసివేసినపుడు? “నీవు ఎపుడో చనిపోయావు. నీ జీవము ఆయనలో దాచబడినది. దేవుని ద్వారా, మరియు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడియున్నది.” దేని కొరకై నీవు తీర్పు తీర్చబడతావు? ఎక్కడ నీవు శుద్ధీకరణ పొందుకోబోతున్నావు? క్రీస్తులో పాపములేని వానిగా, పరిపూర్ణునిగా నీవున్నప్పుడు దేని నుండి శుద్ధిచేయబడవలెను? దేని కొరకు న్యాయ తీర్పు? అయితే, అది సరిచేసికొనని ఆ ప్రజలైన నిద్రించుచున్న వారి కొరకు.

121 సంవత్సరములు తరబడిగా వారది చేయకుండిరి. చూస్తున్నారా, అయితే ఇదే ప్రత్యక్షత యొక్క గడియ. చూశారా, చూశారా. పెండ్లి కుమార్తె వచ్చునపుడు బయలుపరచనైయున్నది. చివరి ముగింపు, చివరి విషయాలు వచ్చుచున్నవి. స్నేహితుడా, అది అంతమునకు వచ్చుచున్నది, నేను నమ్ముచున్నాను. ఎప్పుడు? నాకు తెలియదు నేను—నేను నీకు చెప్పలేను. అయితే ఏదైనా. ఈ రాత్రి ఉన్నట్లుగానే ఈ రాత్రి జీవించాలనుకుంటున్నాను. నేను సంసిద్ధంగా ఉంటాను. చూశారా? ఆయన ఈ రాత్రి రావచ్చును. అయినను ఇరవై సంవత్సరముల వరకు ఆయన రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అయితే అదెప్పుడైనా…ఈ రాత్రికి నా జీవితము ముగియవచ్చును. ఆ తరువాత, ఇక్కడ నేను చేసినది ఏమైయున్నను ఆ గడియలో అది ముగియును. నేనిక్కడ జీవించిన జీవితమును బట్టి తీర్పులో నేనాయనను కలసికోవలసియున్న “చెట్టు వాలిన మార్గాన్ని బట్టి, ఆ మార్గాన అది పడుతుంది.”

122 జ్ఞప్తించుకోండి, నూనె కొనుటకు వారు వెళ్ళినపుడు…“ఓ,” “ఒక్క నిముషము ఆగు! సహోదరుడా బ్రాన్హాం, దానిని గూర్చి నాకు తెలియదు,” అని అంటావు. నూనె కొనుటకు వారు వెళ్ళినపుడు, వారు తిరిగి వస్తారు, పెండ్లి కుమార్తె వెళ్ళిపోయింది మరియు తలుపు వేయబడింది, వారు తట్టి అన్నారు, “మమ్ములను లోనికి రానియ్యుడి, మమ్ములను లోనికి రానియ్యుడి!” [సహోదరుడు బ్రాన్హాం వేదికను చాలాసార్లు తట్టారు.] అయితే బయట అంధకారములో వారు ఉండిపోయారు.

123 అటువంటి పోలిక ఒకటి నాకు కావాలనుకుంటే, ఇప్పుడు చూడు, “నోవహు కాలంలో,” యేసు చెప్పియున్నాడు, దానిని వివరణ చెయ్యు. ఇప్పుడు, నోవహు కాలంలో, ఓడలోనికి వారు వెళ్ళారు. అయితే వారు…న్యాయతీర్పు కాలంలో అయితే అది—అది క్రీస్తు పెండ్లికుమార్తెకు పోలిక కాదు.

124 హానోకు పెండ్లి కుమార్తెకు పోలిక. హానోకు! నోవహు…శ్రమకాలము గుండా వెళ్ళిపోయెను మరియు బాధపడెను. త్రాగుబోతుయాయెను. చనిపోయెను. అయితే హానోకు దేవునితో నడచెను. ఐదువందల సంవత్సరాలు. సాక్ష్యము కలిగియుండెను. ఎత్తబడే విశ్వాసముతో “అతడు దేవుని సంతోషపరచెను,” మంచిగా నడచి ఆకాశము గుండా పోయి, చివరకు మరణము చూడకుండ గృహానికి వెళ్ళిపోయెను చనిపోలేదు కూడా.

125 అది ఒక పోలికగా “సజీవులమై నిలిచియుండు మనము, ఆ నిద్రించిన పోలికగల వారి కంటే చేరము (లేక) నిలుపుచేయబడము.” మానవ వయస్సులో మానవ వయస్సునుబట్టి నిద్రించినవారు. వెనుక వారు నిద్రించారు అయితే వారు చనిపోలేదు. వారు నిద్రపోతున్నారు. ఆమేన్. వారు నిద్రించారు, చనిపోలేదు, కావలసిన యొకేయొకటి ఏదనగా, వారిని మేల్కొల్పుటకు పెండ్లికుమారుడు కావలసియుంది. అవును, “మరియు సజీవులమై నిలచియుండు మనము, ముందుగా నిద్రించిన వారి కంటే చేరము. ఏలయనగా దేవుని బూర మ్రోగును క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆ తరువాత సజీవులమై బ్రతికియుండు మనము వారితో కలసి కొనిపోబడుదుము. ఆకాశమండలమున ప్రభువును కలుసుకొంటాము.”

126 “మిగిలిన మృతులు వెయ్యి సంవత్సరముల వరకు బ్రతుకరు.” అక్కడే మీరు ఉన్నారు. వారు శ్రమకాలము గుండా వెళ్ళిరి.

127 అదేంటి? హానోకు వలె, నోవహు హానోకును గమనించాడు. మీకు తెలుసా? హానోకు అదృశ్యమైనపుడు, న్యాయతీర్పు సమీపంగాయున్నదని అతనికి తెలుసెను. అతడు ఒక ఓడ చుట్టు ఉండెను.

128 అయితే, నోవహు పైకి పోలేదు. అతడు చిన్న ముక్కను పైకెత్తి శ్రమలగుండా వెళ్ళాడు, మరణించుట కొరకై శ్రమకాలముగుండా వెళ్ళాడు. చూశారా? అయితే, నోవహు పయనించాడు.

129 ప్రభువును మధ్యాకాశములో కలసికొనుటకు నిద్రించుచున్న వారితో పాటు పైకి ఎత్తబడుచున్న సంఘమునకు పెండ్లికుమార్తెకు ఒక పోలికగా హానోకు మరణమును రుచి చూడకుండా కొనిపోబడెను. మిగతా సంఘము శ్రమలకాలములోకి వెళ్ళిపోయినది, నేను దీనిని ఇంకొకటిగా చేయలేను. హానోకు ఎత్తబడెను, మరణము లేదు.

130 ఇప్పుడు, మన పాఠమునకు వెళ్ళి కొంత మనము పఠనము చేద్దాం. నేను దానిని కొనసాగించితే ఇందులోకి ఈ ముద్రలోకి వెళ్ళలేము. ఇప్పుడు గమనించు. ఇప్పుడు తీసికుందాము. ఎందుకనగా, ఒక వేళ రేపు రాత్రి లేక తరువాత రాత్రి, అప్పుడప్పుడు బూరను తాకబోతున్నాము, ఎందుకనగా ముద్రలు విప్పబడిన అదే సమయములో బూర ఊదబడుతుంది. అది ఒక్కటే. సంఘకాలము తెరవబడును…ఒకే విషయము. చూశారా?

131 ఇప్పుడు, బూర ఎల్లప్పుడు యుద్ధమును గూర్చి గాని లేక, లేదా రాజకీయ గందరగోళమును గూర్చి గాని సూచించును, బూర రాజకీయ కల్లోలమును కలుగజేసి, అది యుద్ధానికి కారణమవుతుంది. రాజకీయ గందరగోళములోనికి నీవు వెళ్ళితే, ఇప్పుడు దానిని కల్గియున్నట్లు ఆ పరిస్థితిని చూచిన యెడల యుద్ధము సమీపముగా ఉన్నది, అయితే చూడు. రాజ్యము ఇంకనూ సాతానుకు చెందియున్నది. ఇంకా ఈ భాగమునంతా తన హస్తములో ఉంచుకొనియున్నది.

132 ఎందుకని? అది క్రీస్తు ద్వారా విమోచించబడినది. అయితే ఆయన రక్త సంబంధియైన విమోచకుని పనినే చేయుచున్నాడు. ఆయనకు సంబంధించిన వారిని తీసుకుంటూ, ఆఖరి పేరు ఆ గ్రంథములో పెట్టు వరకు వారు ముందుగానే స్వీకరించి మరియు ముద్రించబడియున్నారు. మీరది గ్రహించారా? [సభ “ఆమేన్,” అని చెప్పుచున్నది—సంపా.]

133 అటు తరువాత, ఆయన, ఆయన తండ్రి సింహాసము నుండి వచ్చును, ముందుకు, నడుచుకుంటూ వచ్చి, సింహాసనమందున్న దేవుని హస్తములో నుండి గ్రంథమును తీసికొని, తన హక్కును అడుగును. ఆయన చేయు మొదటి విషయము ఆయన యొక్క వధువును పిలుచును. ఆమేన్! తరువాత ఆయన దేనిని తీసికొనును? ఆయన ఆయన విరోధిని తీసికొని, అనగా సాతానును బంధించి, అతనిని వెంబడించిన అతని అనుచరులతో కలిపి, అక్కడున్న అగ్నిలోకి వేయును.

134 ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, అది రష్యా కాదు. కాదు. అంత్యక్రీస్తు మెత్తనివాడు. ఎంత మెత్తని వాడో గమనించుడి. అతడు తెలివైనవాడు. ఇప్పుడు, అవునండి. అలా పరిశుద్ధాత్మను తీసుకో, జయించగల్గినది అదొక్కటే.

135 గమనించండి, బూరలు అనగా అర్థం రాజకీయ కల్లోలము, యుద్ధములు మత్తయి 24లో యేసు దాని గూర్చి మాట్లాడాడు, ఆయన చెప్పాడు “మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి విందురు, చూశారా మార్గమంతట,” యేసు అది చెప్పాడు, గుర్తుంచుకోండి. “యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి, అంతము వరకు అవి యుందును. ఇప్పుడు అది బూరలు ఊదబడుట.

136 ఇప్పుడు, మనము బూరల యొద్దకు వెళ్ళునపుడు, మనమక్కడ వెనుకకు వెళ్ళి, ఆ ఒక్కొక్క యుద్ధాన్ని తీసికొని ఆ సంఘాలను అవి ఎలా వెంబడించినది, అవి ఈ ముద్రలను వెంబడించినది చూపించెదను. “యుద్ధములు యుద్ధ సమాచారములు,” అయితే, బూర రాజకీయ ఆందోళనను సూచిస్తుంది.

137 ఇక్కడైతే, ముద్రలు మత సంబంధమైన గందరగోళమును కల్గిస్తున్నవి. చూశారా? ఒక ముద్ర విప్పబడినది. ఒక వర్తమానము వెళ్లడైనది, అటు తరువాత సంఘము ఎల్లప్పుడు కూడా ఎంతగానో తన స్వంత రాజకీయ మార్గములయందు మరియు ఇంకేమైనా వాటి వైభవమునందు కలసిపోయినది. ఆ యొక్క నిజమైన వర్తమానము వచ్చినపుడు, ఆ వర్తమానికుడు వెళ్ళిపోయి వాటిని ముక్కలుగా కదలించును. అవును. ముద్ర విప్పబడినపుడు అది మత సంబంధమైన గందరగోళం. అక్కడ సంభవించినది అదే. ఆ. అవును.

138 వారందరు సీయోనులో విశ్రమించిరి, సంఘము అంతా స్థిరపడిరి. “మేము సాధించాము,” అని అనుకొనిరి. ఇంగ్లాండు సంఘము వలె, అంతా స్థిరమైరి. కథోలిక్ సంఘము, అంతా స్థిరపడ్డారు. తరువాత లూథర్ వచ్చాడు, మత సంబంధమైన గందరగోళం. మత సంబంధమైన గందరగోళము, అవునండి, నిజం! సంఘము జింగ్లీతో ముందుకు సాగెను. జింగ్లీ నుండి వివిధముగా వచ్చి, కాల్విన్ యొద్దకు వచ్చినది, మరియు కొంచెంకాలం తరువాత ఆంగ్లికన్ సంఘము స్థిరపడినది. అది విశ్రాంతి పొంది వెస్లీ వచ్చాడు. అక్కడ మత సంబంధమైన గందరగోళము. అవును. చూశారా, అదెల్లప్పుడు మత సంబంధమైన కల్లోలము చూపిస్తుంది.

139 ఇప్పుడు, ముద్ర. కొంచెము భాగము చదువుదాము. నేను దీనిని—తీయవలెననియున్నాను. అది చదువుదాము. నేను మాటలాడుచునేయున్నాను. నేను…

మరియు ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినపుడు నేను చూడగా, (ఏమి సంభవించినది?) ఒక ఉరుము వంటి స్వరమును నేను వింటిని,…

140 ఓ! ఎంతగా, దానిపైన కొద్ది నిమిషాలు విశ్రమిచాలని అనుకుంటున్నాను! ఈ సంగతులెరిగిన ప్రజలందరు, ప్రభువు యొక్క ఆదరణకై ఎదురు చూస్తున్న వారు ఎంతో శ్రద్ధగా పఠనము చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను. మరియు టేపులు మీద కూడా, ఇది మీరు ఆలోచించండి.

141 ఆ గొఱ్ఱెపిల్ల మొదటి ముద్ర విప్పగానే మొదటి విషయం జరిగినదేమనగా ఒక ఉరుము ధ్వనించెను. ఇప్పుడు, దానికొక భావమున్నది, దానికొక…దానికొక భావమున్నది. దానికొక అర్థమున్నది. దానికొక అర్థమున్నది. అర్థం లేకుండా ఏది జరగదు. సరే. ఒక ఉరుము, ఒక ఉరుము ఉరిమినది. ఆ ఉరుము ఏమైయుంటుంది. అద్భుతము?

142 ఇప్పుడు కొంచెము భాగము చదువుదాము, మత్తయి త్రిప్పుదాము…కాదు, పరిశుద్ధ యోహాను తీద్దాం. మొదట, పరిశుద్ధ యోహాను, ఒక నిముషం ఆలాగే యుంచండి, పరిశుద్ధ యోహాను 12వ అధ్యాయం. పరిశుద్ధ యోహాను 12, 23వ వచనం నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు ఏమిటి ఇదియని ఆశ్చర్యపడరు.

అందుకు యేసు వారితో ఇట్లనెను—మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.

143 చూశారా నీవు కాలము యొక్క అంతములోయున్నావు, అక్కడ. ఆయన పరిచర్య ముగించబడుచున్నది. చూశారా? “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.”

144 “ఆయన యొక్క పెండ్లికుమార్తె కొనిపోబడవలసిన గడియ వచ్చియున్నది.” దానిని గూర్చి ఏంటి? గడియ వచ్చియున్నది “ఇక సమయము ఉండదు.” దూత, ఒక పాదము భూమి మీదను, మరియొక పాదము సముద్రము మీదను పెట్టుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఇంద్ర ధనుస్సు ధరించుకొనియున్నాడు. మరియు చెప్పుచున్నాడు, “ఇక సమయము ఉండదు గాని”యని. ఇంకా, ఇది జరిగినపుడు “సమయము ఇక ఉండదు”యని ఆయన చేయి పైకెత్తి మరియు ఒట్టుపెట్టుకొని చెప్పెను. ఎట్లు—ఎట్లు సంఘమునకది ఒక ధృవపత్రమై ఖచ్చితమైయున్నది.

…మనుష్యకుమారుడు మహిమపొందవలసిన గడియ వచ్చియున్నది.

గోధుమ గింజ భూమిలోపడి చావకుండియున్నయెడల అది ఒంటిగానేయుండెను; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను,

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును;…ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనును.

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ…సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును.

ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది;…

145 “సరే, ఆయన మార్గము చివరకు వచ్చినందుకు, నీకు కలవరము వచ్చినదని నీవు చెప్పవచ్చును.” ఒక గొప్ప ఆత్మ సంబంధమైనది జరిగితే నిన్ను కలవరపరిస్తే అది నిన్నే విధముగా ఆలోచించునట్లు చేయును? ఓ మై, ఊహూ!

ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? తండ్రీ యీ గడియ తటస్థించకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని;

తండ్రీ నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట-నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.

కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము…ఉరిమెను అనిరి…

146 అటు తరువాత గొఱ్ఱెపిల్ల గ్రంథము తీసికొని మొదటి ముద్రను విప్పగా నిత్య సింహాసనముపైన ఆయన కూర్చొని దేవుడు మాట్లాడాడు. ఆ ముద్ర ఏమైయున్నదో చెప్పుటకు, బయలుపరచుటకు. అయితే యోహాను ఎదుట అది పెట్టబడినపుడు, అదియొక సూచన. అది యోహాను చూచినపుడు, అది ఇంకా మర్మము. ఎందుకని? అది అప్పటికి బయలుపరచబడలేదు. “అంత్యకాలము” అని ఆయన ఇక్కడ చెప్పు వరకు అది బయలుపరచబడదు, అయితే అది సూచనగా వచ్చినది.

147 “ఉరిమినపుడు” గుర్తుంచుకోండి. ఉరుము యొక్క పెద్ద చప్పట్లు కొట్టు శబ్దము అది దేవుని యొక్క స్వరము. అందువలననే బైబిలు గ్రంథము చెప్పుచున్నది “ఒక ఉరుము యొక్క ధ్వని” అని. వారు దానిని ఉరుము అనుకొనిరి. అయితే అది దేవుడు, దానిని ఆయన గ్రహించెను, ఎందుకనగా అది ఆయనకు బయలుపరచబడెను. చూశారా? అది యొక ఉరుము.

148 మరియు, గమనించుడి, మొదటి ముద్ర విప్పబడినది. మొదటి ముద్ర అది సూచన రూపములో విప్పబడినపుడు, అది ఉరిమినది. వాస్తవమైన అది విప్పబడినపుడు ఏమైయుండును? మై…గొఱ్ఱెపిల్ల ముద్రను తాకిన వెంటనే అది ఉరిమెను. అదేది బయలుపరచినది? అదంతా కాదు. మొదట, అది దేవునితోయున్నది; తరువాత అది సూచనలో ఉన్నది; తరువాత అది బయలుపరచబడినది. మూడు విషయాలు. అది సింహాసనము నుండి వచ్చుచున్నది.

149 మొదటిగా అది కనుబడలేదు, వినబడలేదు, లేక ఏమి లేదు. అది ముద్రించబడియున్నది. గొఱ్ఱెపిల్ల వెలను చెల్లంచినది.

150 ఆయన అది పలికినపుడు అది ఉరిమినది. మరియు ఆయన అది చేసినపుడు తెల్లని గుర్రం మీద స్వారీచేయువాడు ఒకడు బయలుదేరాడు. అది ఇంకా ఒక సూచనగా ఉండెను. ఇప్పుడు గమనించు, కడవరి దినమున అది తెలియబడునని ఆయన చెప్పియున్నాడు. అయితే, అది సంఘము గురుతుగా వచ్చును. సంఘమా? నీవది అర్థం చేసుకున్నావా? [సభ “ఆమేన్,” అని చెప్పినది—సంపా.] అది సంఘము గురుతుగా వచ్చుచున్నది. ఒక ముద్రయున్నదని వారు తెలిసికొనునట్లుగా. అయితే అదేమైయున్నది, ఇంకా వారికి తెలియదు, ఎందుకంటే అది యొక తెల్లని గుర్రం మీద స్వారీచేయువాడు.

151 ఈ అసలైన ముద్ర విప్పబడినపుడు, కడవరి దినము మాత్రమే బయలుపరచబడును. ఎవరికి విప్పబడును? క్రీస్తుకు కాదు అయితే సంఘానికి. ఇప్పుడు గమనించుడి, ఓ, మై, అది నన్ను వణికింపజేస్తుంది. సంఘం నిజంగా అది అర్థం చేసికుంటుందని, నా భావమేదో ప్రజలైన మీరు అర్థం చేసికుంటారని నిరీక్షిస్తున్నాను. నేను మిమ్ములను పెండ్లి కుమార్తెయని పిలువబోతున్నాను, చూశారా. అది మీరు అర్థం చేసికుంటారని.

152 స్వరము-ఉరుము. స్వరము ఎక్కడ నుండి వచ్చినది? ఒక విజ్ఞాపణకర్తగాయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడ సింహాసనమును విడిచిపెట్టెనో అక్కడ నుండి, ఆయన, ఇక్కడ తన స్థానమును మరియు తన హక్కులను స్వీకరించుటకు నిలబడియున్నాడు. అయితే, ఉరుము సింహాసనములో నుండి, ఉరిమినది. గొఱ్ఱెపిల్ల ఇక్కడ నిలబడియున్నది. ఉరుము, గొఱ్ఱెపిల్ల విడిచిన స్థలము నుండి వచ్చినది, ఆయన యొక్క స్వంత సింహాసనము తీసికొనుటకు తండ్రి సింహాసనమును విడచెను. మహిమ కల్గునుగాక! స్నేహితులారా, ఇది పోగొట్టుకోవద్దు.

153 క్రైస్తవులుగా మనమందరికి తెలుసు. దేవుడు క్రీస్తును లేపి, దావీదు సింహసనముపైన కూర్చొనబెట్టి, ఆయనకు ఇక్కడ భూమిపైన నిత్యరాజ్యము ఇచ్చెదనని దేవుడు దావీదుకు వాగ్దానము చేశాడని మనందరికి తెలుసు. ఆయన అది చేశాడు.

154 యేసు చెప్పియున్నాడు, “నేను జయించి నా తండ్రి సింహానము మీద కూర్చున్న ప్రకారము అంత్యక్రీస్తును మరియు లోకములో ఉన్న దానినంత జయించిన వానిని, నాతో కలసి నా సింహాసనముపైన కూర్చుండును,” అని. అవునా?

155 ఇప్పుడు ఒక దినాన తండ్రి సింహాసనము నుండి ఆయన లేచును. ఆయన స్వంత సింహాసనమును స్వీకరించుటకు వెళ్ళును.

156 ఇప్పుడు, ఆయన యొక్క ప్రజలను పిలుచుటకు ఆయన వచ్చుచున్నాడు వారిని ఏలాగు తీసికోబోతున్నాడు? ఆయన యొక్క చేతిలో విమోచనా గ్రంథము ముందగానేయుండియున్నది. మహిమ కల్గును గాక! ఒక పాట పాడాలని నేను భావిస్తున్నాను.

నిరంతరము ఆయన ప్రక్కనుండుటకు గొఱ్ఱెపిల్ల ఆయన పెండ్లికుమార్తెను త్వరగా తీసికొనును,

పరలోక సైన్య సమూహమంతయు (అది గమనించుటకు) కూడుకొనును;

ఓ, అది మహిమకర దృశ్యము, మచ్చలేని తెలుపుదనముతో పరిశుద్ధులుందురు;

యేసుతో మనము నిత్యము విందారగించెదము.

157 ఓ, మై! “పరలోక స్థలములో ఇప్పుడు కూర్చుండుట”ను గూర్చి మాట్లాడు? అదెట్లు ఉండునో కదా! మనం ఈ విధంగా భావించితే ఎత్తబడుట రాకముందే, మనమిప్పుడున్న ఈ స్థితిలోనే భూమి మీద ఇక్కడ కూర్చొనియుంటే. గోడల చుట్టూ ఆనుకొని, వర్షములో నిలబడి ఇది వినటానికి; ఆయన అక్కడ కూర్చొనియుండగా అదేమౌను! ఓ! అది మహిమకరమైన సమయము.

158 ఆయన కుమారుడు…తండ్రి యొక్క సింహాసనము విడచి వచ్చి…ఆయన దావీదు యొక్క కుమారుడు. అప్పుడాయన చేయునది ఇశ్రాయేలీయులు తలంచినది అది. సురోఫెనికయ స్త్రీ చెప్పినది జ్ఞప్తించుకోండి. “దావీదు కుమారుడా!” గ్రుడ్డి బర్తిమయిని జ్ఞప్తియుంచుకోండి “దావీదు కుమారుడా” అని అన్నాడు ఊహు! ఆ ప్రణాళిక ఏమైయున్నదో యేసు ఎరిగినవాడాయెను. అయినను వారికది తెలియదు. వారు ఆయనను బలవంతం చేసి, సింహాసనము తీసికొనవలెనని ప్రయత్నించారు. చివరకు పిలాతు ఆయనను అడిగాడు.

159 అయితే ఆయన అన్నాడు, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, అలాటప్పుడు నా ప్రజలు పోరాడుదురు, నా రాజ్యము పైనున్నది” అయితే ఆయన చెప్పాడు, “మీరు ప్రార్థించునపుడు, ‘నీ రాజ్యము వచ్చును గాక పరలోకమందు ఏలాగో ఆలాగున నీ చిత్తము భూమి మీద జరుగును గాక”’ ఆమేన్ యని ప్రార్థించుడి. ఊ-హు! ఈ గంభీరమైన విషయం ఎంత మహిమగలది!

160 ఆయన స్వంత సింహాసనము తీసికొనుటకు తండ్రి సింహాసనమును విడిచిపెట్టుట. తన స్వంత సింహాసనమును అడుగుటకు, ఆయన విమోచించిన ప్రజలను అడుగుటకు, ఆయన యొక్క విజ్ఞాపణ పని నుండి ఇప్పుడాయన వచ్చుచున్నాడు. సింహానము నుండి వచ్చుటకు అది కారణమౌతుంది. అటు తరువాత సింహమును పోలిన జీవి “వచ్చి చూడుము” అని యోహానుతో చెప్పెను, గమనించండి, దీనిని మీరు చదువుచున్నారా?

…ముద్రలలో యొకటి, మరియు అది…ఆ నాలుగు జీవులలో ఒకటి ఉరుము వంటి స్వరముతో…

161 జీవులనగా ఏమిటో మీకు తెలుసా వాటిని మనము తీసుకున్నాము. “ఒకటి సింహమును పోలినది; ఒకటి దూడను పోలినది; మరియు ఒకటి మనుష్యుని పోలినది; మరియు ఒకటి పక్షిరాజును పోలినది.” ఇప్పుడు, ఈ మొదటి జీవి చెప్పెను…గమనించు, నాలుగు గుర్రపు స్వారీ చేయువారు వచ్చిపోవు వరకు, ప్రతిసారి వ్యత్యాసకరమైన జీవి. నాలుగు జీవులు మరియు నల్గురు గుర్రపు స్వారీచేయువారు.

162 గమనించుడి. ఆ జీవులలో ఒక్కొక్కటి ప్రకటించెను. మత్తయి, మార్కు—మార్కు, ఏది యోహాను, ఒక్కొక్కటి ఎటు వెళ్ళినది ఏమిటని ఋజువు చేద్దాం!…?…

…జీవులలో…ఒకటి రమ్మని చెప్పగా…చూడుమని.

163 ఉరుము యొక్క శబ్దమును అతడు విన్నాడు. మరియు జీవులలో ఒకటి “ఇప్పుడు వచ్చి చూడుము” అని అనెను.

164 మరియొక మాటల్లో గొఱ్ఱెపిల్ల ఇక్కడ నిలబడియుండగా, అది జరుగుట యోహాను నిలబడి గమనిస్తున్నాడు. సింహాసనము నుండి గొఱ్ఱెపిల్ల లేచి వచ్చాడు. వధింపబడినట్లుండి, రక్తము చుట్టుండెను. యోగ్యుడుగా కనబడినవాడు ఆయన. మరియు ఆయన సమీపించి గ్రంథమును తీసుకున్నప్పటికి, ప్రతీది కూడా అరుపులు కేకలుతో ఆనందంగా ఉన్నారు. చూశారా, ఎందుకనగా విమోచించబడుటకు వెల చెల్లించబడుటను వారెరిగియుండిరి.

165 ఆయన తన స్వంత వారిని అడుగుటకు వచ్చియున్నాడు. కాబట్టి ఆయన గ్రంథాన్ని తీసికున్నాడు, అక్కడ యోహాను యెదుట నిలబడ్డాడు. మరియు దానిని వెనుకకు లాగి ముద్రను విప్పెను, ముద్రను క్రిందకు లాగెను. ఆయన ముద్రను క్రిందకు లాగినపుడు, స్థలమంతటిలో ఉరుము ధ్వనించెను. ఉరుము ధ్వనించినపుడు, ఉరుము గర్జించినపుడు యోహాను గాలిలో ఎగిరియుండుననుటకు ఏలాటి సందేహము లేదు.

166 అటు తరువాత నాల్గు జీవులలో ఒకటి చెప్పెను, “అదేమైనది వచ్చి చూడు క్రింద ఏమి బయలుపరచబడినదో ఇప్పుడు వచ్చి చూడుము,” ఓ, మై. “యోహాను, నీవు చూచినది వ్రాయి.” కాబట్టి అదేమైంది చూచుటకు యోహాను చూచుటకు వెళ్ళాడు. ఉరుము ఏమని చెప్పినది చూచుటకు యోహాను వెళ్ళాడు. అప్పుడు ఆ జీవి యోహానుతో చెప్పినది “వచ్చి చూడు. మొదటి ముద్ర క్రిందనున్న మర్మము ఏమైయున్నది!” [సహోదరుడు బ్రాన్హాం వేదికను నాల్గుసార్లు తట్టెను—సంపా.] ఉరుము. సృష్టికర్త యొక్క స్వరము పెద్దగా గర్జించెను. ఇప్పుడు, అక్కడేమియున్నదని అతడు ఎరుగవలసియుండెను. చూశారా? ఓ, మై. అయితే ఇప్పుడు ఆలోచన చెయ్యు, దీనిని అతడు వ్రాశాడు.

167 అయితే ఆ మిగతా, ఏడు ఉరుములు, అతడు వ్రాయుటకు మొదలు పెట్టగా “దానిని వ్రాయవద్దు” అని ఆయన చెప్పాడు. అతడు చూచిన ప్రతీది వ్రాయుటకు అతడు ఆజ్ఞను పొందాడు. అయితే, ప్రకటన 10 లో పలుకబడిన ఈ ఏడు ఉరుములు గూర్చి అయితే, ఆయన చెప్పాడు, “వాటినన్నిటిని వ్రాయవద్దు” అని అన్నాడు. అవి మర్మములు, అవి ఏమైయున్నవి మనకు, ఇంతవరకు తెలియదు. అయితే, నా భావము, అవి వెంటనే బయలుపరచబడును. అది ఆలాగైతే, ఆ ఎత్తబడే కృపకు విశ్వాసమును అది అనుగ్రహించును. అది సంఘము కదిలింపబడుటకు. అవునా?

168 మనము ప్రతి కార్యము నుండి, మనమెరిగిన అన్ని కార్యముల నుండి కదలి వెళ్ళుచున్నాము. ప్రతీది మనం గమనించాము. మనము దేవుని యొక్క మర్మములు చూశాము, కడవరి దినములలో పెండ్లికుమార్తె యొక్క కూడిక యొక్క గొప్ప కలయిక కన్పించుట మనము చూశాము. అయితే, అయినప్పటికి, మనలను మనముగా వెలిగించుకోలేనిది అక్కడ ఒకటున్నది, ఇంకా ఏదో యొకటియున్నది.

169 నేను ఊహిస్తున్నాను. ఆ మర్మములు వచ్చుట మొదలు పెట్టగానే, దేవుడు అన్నాడు: “దానినిపుడు పట్టుకో; ఒక నిమిషం ఆగు! ఆ దినమున దానిని నేను బయలుపరచెదను. యోహాను అది వ్రాయవద్దు. ఎందుకనగా దాని మీద వారు అభ్యంతర పడతారు. అది—అది ఆలాగేపోనిమ్ము. చూశారా, అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలసియున్నదో, అప్పుడే నేను దానిని బయలుపరచెదను.”

170 దేని కొరకు ధ్వనించలేదు. జ్ఞప్తించుకోండి, చిన్న సిరా చుక్కవలె, ప్రతీది ఒక ఉద్ధేశ్యం కొరకు, ప్రతీది ఒక కారణం కొరకు. అయితే గమనించండి, సృష్టికర్త గర్జించెను. అతడు—అతడు ఈ స్వరము విన్నాడు. చూచుటకు వెళ్ళిపోయాడు.

171 అయితే, ఇప్పుడు గొఱ్ఱెపిల్ల యోహానుకు, సంఘము యొక్క—సూచనలో, సంఘము తెలుసుకొనుటకు చూపెను. ఏమి వ్రాయవలెనో ఆయన అతనికి చూపెను. అన్నాడు “ఇప్పుడు అదేమైయున్నదని ఇది—చెప్పవద్దు. యోహాను క్రిందకు వెళ్ళి, ఇదేమైయున్నదని, ఈ ఏడవ ముద్ర క్రింద ఏమున్నదని చెప్పవద్దు. క్రిందకు వెళ్ళి చెప్పవద్దు. ఎందుకనగా, అది యోహానుకు నేను చెప్పినట్లైతే యుగయుగములలోనున్న సమస్త ప్రణాళిక పగిలిపోవును. అది రహస్యము.” చూశారా? ఆయన…ఆయన యొక్క రాకడను! ఆయన చెప్పాడు, “నేను ఎప్పుడు వచ్చెదనో ఎవరికి తెలియదు. నేను వచ్చుచున్నాను.” చూశారా? చూశారా? అంతే. అదెప్పుడని తెలుసుకొనుట, నా పనికాదు. నేను సంసిద్ధంగా ఉన్నాను. చూశారా. కాబట్టి అతడు చెప్పాడు…

యోహాను వెళ్ళాడు. అతడనుకున్నాడు, “ఇప్పుడు దానిని చూడబోతున్నాను,”

172 యోహాను వెళ్ళినపుడు, అతడేమి చేశాడు? అతడేమి చేయవలసియుండెను? సంఘ కాలానికి అతడిది వ్రాయవలసియుండెను, అదే అతడు చేయవలసియుండెను. సంఘకాలాలకు అతడు అది వ్రాయవలసియుండెను, “ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు నీవు ఆరంభంలో చూచిన దానిని వ్రాయుము. ఈ సంఘానికి వ్రాసి వారికి చెప్పు” సరే.

173 ఒక ఉరుము ఉరిమెను. అది దేవుని యొక్క స్వరమని యోహాను ఎరుగును తరువాత—సింహము పోలిన జీవి చెప్పెను. “అదేమైయుంది వచ్చి చూడు,” ఇప్పుడు యోహాను అతడేమి చూడబోతున్నాడో తన కలముతో వ్రాయుటకు వెళ్ళిపోయాడు.

174 అదేమైయుంది ఖచ్చితంగా అతడు చూడలేదు. అతడది అర్థం చేసికోలేదు. అయితే అతడు చూచినది ఏదనగా “ఒక సమయం” కోసము సంఘము కొరకు దేవుడు ఏది పంపియుండెనో అది అతడు చూశాడు. ఇప్పుడాయన…ఆయన చేస్తాడు. ఆయన ఎల్లప్పుడు చేస్తాడు. దానిని విశదపరచే సమయమపుడు, ఆయన దానిని విశదపరుస్తాడు. అయితే అప్పుడాయన దానిని విశదపరచలేదు. ఎందుకని? ఎందుకనగా ఆఖరి కాలము వరకు మరుగుగా ఆయన దానిని యుంచబోతున్నాడు మరియు ఏడవ దూత వర్తమానం ఊదునపుడు, ఈ మర్మములు ప్రోగగును. బయలుపరచబడును. చూశారా?

175 అది విశదపరచబడలేదు. అయితే యోహాను ఏమి చూశాడో, అతడు చూశాడు, “స్వారీ చేయువాడు దానిపై కూర్చుండి ఒక తెల్లని గుర్రం బయలు వెళ్ళెను.” కాబట్టి దానినే అతడు వ్రాసెను.

“వచ్చి చూడుము” అది అతడు చెప్పాడు.

176 కాబట్టి, యోహాను తాను చూడగల్గినది చూచి, సంఘమునకు వ్రాయుటకు, అతడు ఆలాగు చేసినపుడు, అతడిది చూశాడు. “ఒక తెల్లని గుర్రం దాని మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొనియుండెను మరియు జయించుటకు బయలు వెళ్ళెను, జయించుటకు, మరియు అతనికొక కిరీటమియ్యబడెను.” అదే యోహాను చూచినది. కాబట్టి అదంతా అతడు వ్రాశాడు. ఇప్పుడు చూడండి, అది సూచనగాయున్నది. ఆ విధముగానే సంఘము దానిని స్వీకరించినది.

177 అయితే, కడవరి దినమున ఆయన దానిని బయలుపరచెదనని, అదేమైయున్నది చూపించెదనని వాగ్దానము చేశాడు. అర్థం చేసికుంటానికి మనకు సహాయము చేస్తానని వాగ్దానము చేశాడు. సంఘకాలాలు అయితే, ఈ ఆఖరు సంఘకాలము యొక్క ఏడవ వర్తమానము వరకు అది సంపూర్తిగా తెలియబడదు.

178 ఈ ఏడవ సంఘకాలము యొక్క వర్తమానికుని మీరు గమనిస్తే, మిగతా వారు చేసినట్లుగా అతడు సంఘశాఖను స్థాపించడు. జ్ఞప్తించుకోండి అతడు స్థాపించుకున్న యెడల…లేదు. మీరు కనుగొంటే, అతడు, దానికి వ్యతిరిక్తము. ఏలీయా దానికి వ్యతిరేకమా? ఖచ్చితంగా, అతడు ఆలాగే ఉండెను. ఏలీయా ఆత్మతోనున్న యోహాను దానికి వ్యతిరేకమా?

179 ఏలీయా తనపైన ఏలాటి ఆత్మను కల్గియుండెను? అతని గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. అతడు కేవలం మానవుడు, అయితే అతడు ప్రవక్త. అతడు ద్వేషించబడ్డాడు మై. అతడే కాలంలో వచ్చాడు. ఇశ్రాయేలీయులు లోకంలో కలసిపోయి కీర్తి ప్రతిష్టలు వచ్చిన కాలం, అతడక్కడ ఉన్నాడు, మరియు అతడు “స్త్రీ ద్వేషకుడు” ఊహు. అవునండి. అతడు ఆలాటివాడే. అతడు అడవులను ప్రేమించాడు. అదే అతని స్వభావము.

180 అటు తరువాత, ఈ యోహాను అదే ఆత్మను కల్గియుండునని ఆ ప్రజలు ఎరుగవలసియుండెను గత రాత్రి నేను చెప్పినట్లు ఆడంబరముగా దుస్తులు ధరించలేదు; వారు పిల్లలను ముద్దాడుచూ మరియు పెండ్లిండు చేయుచు మరియు సమాధి కార్యక్రమములు మొదలగు వాటితో నిమగ్నమైయుండిరి. అయితే ఈ మనిషి అరణ్యవాసిగా వచ్చాడు. అతడేమైయుండెను? అతడు అడవులను ప్రేమించెను. ఇంకొకటి అతడు చేశాడు. సంఘశాఖలను అతడు ద్వేషించాడు. అతడు చెప్పాడు, “మేము దీనికి సంబంధించిన వారము దానికి సంబంధించిన వారము అని చెప్పవద్దు. ఏలయనగా నేను మీకు చెప్పుచున్నాను. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు.”

181 అతడు రాజీపడువాడు కాదు. వారు…అన్నారు, “గాలికి కదలాడు రెల్లును చూడ వెళ్ళితిరా? యోహాను కాదు” కాదండి.

182 ఇంకా, అతడేమి చేశాడు? యెజెబెలుతో చెప్పిన ఏలీయా వలె హేరోదియతో చెప్పాడు. నేరుగా హేరోదు ముఖము యొద్దకు వెళ్ళి, చెప్పాడు, “ఆమెను ఉంచుకొనుట నీకు న్యాయము కాదు.” అందుకొరకు, అతని తలను నరికివేసినది. అవునా? ఎలీషా కొరకు ఆమె ప్రయత్నించినది. యెజెబెలులోనున్న అదే ఆత్మ ఆ స్త్రీలో ఉండెను.

183 యెజెబెలులోనున్న అదే ఈ రోజు సంఘములో ఉన్నది, అదే విషయం, ఇప్పుడు అది గమనించండి. ఎటువంటి గొప్ప పాఠాన్ని మనమిక్కడ చూస్తున్నాము!

184 మరియు, ఆ ప్రజలు ఎరిగినట్లుగా కన్పిస్తున్నాడు. యోహాను అక్కడ నిలబడి అది ఎలీషా ఆత్మయని వారు ఎరుగునట్లుగా ఆ ప్రజల యెడల కేకలు పెడుతున్నాడు. వారు అది అర్థం చేసికొనవలసియున్నది. అతడేమైయుండెనో అది అతడే.

185 లేఖన ప్రకారముగా, సంఘకాలాల గుండా, ఆ ఆత్మ తిరిగి వచ్చు వాగ్దానమును, అంత్యకాలమునకు ముందు కనుగొంటున్నాము. అది నిజం? [సభ, “ఆమేన్” అని చెప్పినది—సంపా.]

186 ఇక్కడ, గమనించు, దాని యొక్క స్వభావాన్ని గమనించు. లూథర్, మరియు వెస్లీ మరియు మిగతా వారందరు చేసినట్లుగా మరియొక సంఘకాలాన్ని అతడు ప్రారంభించలేదు. ఇంకొక సంఘాన్ని అతడు స్థాపించడు. ఎందుకనగా ప్రారంభించుటకు ఇక సంఘకాలాలు లేవు. చూశారా? ఇక మరి ఉండవు. కాబట్టి దానికతడు వ్యతిరేకియైయుండాలి. ఎందుకనగా, అతని ఆత్మ ఖచ్చితంగా వెనుకనున్న అదే ఆత్మ వలె ఉండును.

187 గతరాత్రి నేను చెప్పినట్లుగా, దేవుడు దానిని మూడు వేరు వేరు విధములుగా వినియోగించుకొనుటకు ఇష్టమాయెను. అది ఆయన సంఖ్య, మూడు, రెండు కాదు, మూడు. అది రెండుసార్లు వినియోగించబడినది, ఇప్పుడు ఆయన దానిని తిరిగి వినియోగించబోతున్నాడు. ఆయన ఆలాగు చెప్పాడు, అది వాగ్దానము చేశాడు. ఇప్పుడు గమనించు, అతడు…

188 ఇప్పుడు గమనించు, అతను చేసినపుడు; అతడు సంఘశాఖను ప్రారంభించుట లేదు. ఎందుకనగా లవొదికయ సంఘకాలము చివరి కాలము. వర్తమానికుడు అనగా ఏడవ సంఘకాలానికి ఏడవ దూత, ఏడవ వర్తమానికుడు పరిశుద్ధాత్మ వలన ఈ అన్ని మర్మమైన విషయాలను బయలుపరచబోతున్నవాడు. అది…గతరాత్రి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేయి చూపండి, అలాగైతే, అది నేను చదవనవసరం లేదనుకుంటాను. అదెక్కడయున్నదో అది మీకు తెలుసు. 10వ అధ్యాయం. చూశారా, మంచిది. సరే.

189 పడిపోయిన సంఘకాలముల వాటిని దిద్దుబాటు చేయుటకు సంస్కర్తలు వచ్చారు. అటు తరువాత, సంస్కర్తలు వచ్చి, అదెక్కడ ఉన్నదో అట్టి స్థితినుండి సంఘకాలాన్ని దిద్దుబాటు చేసి మరియు లోకములోకి వెళ్ళిపోయిరి. తరువాత వారు క్రొత్త సంఘకాలాన్ని ప్రారంభించారు. వారెల్లప్పుడు అది చేశారు, ఎల్లప్పుడు, ఇప్పుడు మనమది చూశాము. చూశారా?

190 మరో మాటలలో, ఇక్కడ కథోలిక్ సంఘకాలమున్నది, రోమన్ కథోలిక్ సంఘము యొక్క, ఆ వెంబడి లూథర్ వచ్చాడు, సంస్కర్త. అతడు సంస్కర్తగా పిలువబడ్డాడు. అతడేమి చేశాడు? అతడు ప్రారంభించి ఎదిరించాడు. అతడది చేసి, సంఘమును ఎదిరించాడు. మొదటిగా అతడేమి చేశాడో తెలుసా? దేనినైతే అతడు ఎదిరించాడో దానినే కట్టాడు. ఇంకో సంఘమును.

191 అటు తరువాత, వారు మరియొక సంఘకాలమును కల్గియుండిరి. తరువాత, మొదటి విషయం ఏంటో తెలుసా…సంఘకాలము గందరగోళములో ఉన్నది. ఇంకొక సంస్కర్త జాన్ వెస్లీ వచ్చాడు, చూశారా, మరియొక సంఘకాలమును కట్టాడు. నా భావమేదో అర్థమైందా. మరొక సంఘకాలము కట్టబడెను. వారందరు సంస్కర్తలే.

192 గమనించు, చివరి సంఘకాలము యొక్క ఈ చివరి వర్తమానము సంస్కర్త కాదు. అతడొక ప్రవక్త, సంస్కర్త కాదు, ఒక సంఘకాలాన్ని స్థాపించిన ఒక ప్రవక్త ఎన్నడైనా ఉన్నాడేమో నాకు చూపించు అతడు సంస్కర్త కాడు. అతడు ప్రవక్త.

193 మిగతావారు సంస్కర్తలు. అయితే ప్రవక్తలు కాదు. వారు యైనట్లయితే ప్రభువు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ కారణము చేత, “తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును” కొనసాగించిరి. మిగతావన్నీ చేసిరి, కారణం వారు సంస్కర్తలు, ప్రవక్తలు కారు. అయితే, అయినను వారు దేవుని యొక్క గొప్ప ప్రజలు. వారు జీవించు దినము యొక్క అక్కరను వారు చూశారు. దేవుడు వారిని అభిషేకించాడు వారు అక్కడకు పంపబడ్డారు. వాటిని ముక్కలు ముక్కలుగా చేశారు. అయితే దేవుని యొక్క నిండైన వాక్యము వారి యొద్దకు రాలేదు. ఎందుకనగా వారు ప్రవక్తలు కాదు. వారు దిద్దుబాటు కర్తలు.

194 అయితే కడవరి దినములలో, దేవుని యొక్క మర్మములు తీసికొనుటకు, అది, వెనుకకు తెచ్చుటకు ప్రవక్త యుండవలసియుండెను. ఎందుకనగా, మర్మములు ప్రవక్తల ద్వారానే తెలియబడును. కాబట్టి ఇతడు రావలసి వచ్చెను. నా భావమేదో అర్థమైందా? అతడు సంస్కర్త కాలేడు. అతడు ప్రవక్తయై యుండవలసియుంది. ఎందుకనగా వరము కల్గినవాడై యుండి వాక్యమును పట్టుకొను వాడైయుండవలసియుండును.

195 ఇప్పుడు, అక్కడ ఒక తప్పు ఉన్నదని ఆ సంస్కర్తలకు తెలుసు. ఆ రొట్టె క్రీస్తు శరీరము కాదని లూథర్ కు తెలుసు. కాబట్టి అతడు బోధించాడు, “నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును,” అది అతని యొక్క వర్తమానము మరియు జాన్ వెస్లీ వచ్చినపుడు శుద్ధీకరణ ఉన్నదని అతడు చూశాడు. అది అతని యొక్క వర్తమానము. చూశారా? పెంతెకొస్తు వారు పరిశుద్ధాత్మ, తదితర వర్తమానము తెచ్చారు.

196 అయితే కడవరి దినాలలో, ఈ చివరి కాలంలో, వర్తమానికుడు ఎటువంటి సంస్కరణను ప్రారంభించడం, అయితే ఆ సంస్కరణకర్తలు వదిలిపెట్టిన అన్ని మర్మములన్ని తీసికొని వాటిని ఏకం చేసి, వాటిని ప్రజలకు విశదపరచును. నేను మరలా వాటిని చదువనీయండి. అది నాకు చాలా బాగున్నది! నేను—నేనది చదువుటకు యిష్టపడుచున్నాను.

…బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని మేఘము ధరించుకొనియుండెను:…సూర్యబింబము వలె ఆయన పాదములు అగ్ని స్తంభములవలెను ఉండెను.

197 ఇప్పుడు, ఒకే దానిని మనము చూశాము, అది క్రీస్తు. క్రీస్తు ఎల్లప్పుడు కూడా సంఘానికి వర్తమానికుడని మనకు తెలుసు. సరే. ఆయన అగ్నిస్తంభమని, నిబంధన దూతయని, తదితరంగా పిలువబడుచున్నాడు.

మరియు ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను…

198 ఇప్పుడు, ఇక్కడ ముద్రలు విప్పబడియున్నవి. మనము ఇప్పుడు వాటిని విప్పుచున్నాము. అయితే, దీనిని, విషయము తెరవబడినది.

…ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ…భూమి మీదను మోపి,

సింహము గర్జించునట్లు…గొప్ప శబ్దముతో ఆర్భటించెను, ఆయన ఆర్భటించినపుడు…ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను (మై! సంపూర్తి!)

ఆ యేడు ఉరుములు పలికినపుడు, నేను యోహాను వ్రాయుబోవుచుండగా (ఏంటి వ్రాయబోవుచున్నది?) వారు చెప్పినదేంటి: ఏడు ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి (దేవుడు) యొక స్వరము పలుకుట వింటిని. వాటిని వ్రాయవద్దు. (చూశారా?)

మరియు సముద్రము మీదను…నిలచియుండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశము తట్టు ఎత్తి,

పరలోకములు అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టుపెట్టుకొని- ఇక ఆలస్యముండదు గాని.

199 గమనించు! ఇప్పుడిది మరచిపోవద్దు. మనము ముందుకు వెళ్ళుకొలది.

అయితే యేడవ దూత పలుకు దినములలో (దినములు),…

200 ఆ ఆఖరి దూత, భూ సంబంధమైన దూత. ఈ దూత పరలోకము నుండి దిగివచ్చాడు. అది ఆయన కాదు. ఆయన పరలోకము నుండి వచ్చెను. అయితే ఆయన ఇక్కడ ఏడవ దూత స్వరమును గూర్చి మాట్లాడుతున్నాడు. అది ఒక…దూత అర్థం ఒక “వర్తమానికుడు,” అది ఎవరికైనా తెలుసు మరియు సంఘకాలానికి వర్తమానికుడు.

…యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము (ఏడు ముద్రలు, మొత్తము, మర్మములు) సమాప్తమగును.

201 సమస్త మర్మము తెరవబడినది. అదే ఆ దూత యొక్క పరిచర్య. చూశారా? ఎంతో సాధారణము; ప్రజలు దానికి పైగా దాటిపోతున్నారు. అయినను, అది సంపూర్తిగా నిరూపించబడును. అది సంపూర్తిగా తెలియపరచబడును. అవునా? దానిని చూడాలని కోరిన ప్రతి యొక్కరు అది చూడగలరు. అవునా? అవునది నిజం. అయితే ఆ…

202 యేసు చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, “మీరు కన్నులుండి చూడరు, యెషయా చెప్పాడు మీరు అలాగని, అవునా? మీకు చెవులున్నవి, మీరు వినరు” ఇప్పుడు కనుక అది చూద్దాం…

203 అది నాకు భయాన్ని కల్గిస్తున్నది, ఆ గడియారం వైపునకు నేను వెనుకకు చూచి, అది పది గంటలు అనుకున్నాను, అయితే, అది, నేను…అది ఇంకా తొమ్మిది కూడా కాలేదు. అవునా, మంచిది. ఓ, మై! ఇప్పుడది తీసుకుందాం. గమనించండి. నేనది ప్రేమిస్తున్నాను.

204 ఇతరులు, సంస్కర్తలు, అయితే దేవుని యొక్క గొప్ప దైవజనులైయుండి, దినము యొక్క అవసరతను ఎరిగి సంస్కరణను తెచ్చారు.

205 అయితే ప్రకటన 10 చెప్తుంది, అతని యొక్క వర్తమానము బయలుపరుచుట, దిద్దుబాటు చేయుట కాదు, మర్మములు బయలుపరచుట, మర్మములు బయలుపరచుట. అది, మనుష్యునిలో వాక్యముండుట, హెబ్రీ 4 చెప్తుంది, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల ఖడ్గము గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగానుండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించునంత మట్టుకు దూరును, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది,” చూశారా? ఈ మనుష్యుడు సంస్కర్త కాదు. అతడొక బయలుపరుచువాడు, (దేనిని) బయలుపరుచును? దేవుని యొక్క మర్మములను, ఎక్కడ సంఘములు బిగుసుకపోయిన సమయమున, దేవుని యొక్క వాక్యముతో అతడు వచ్చి విషయాన్ని బయలుపరచును.

206 ఎందుకనగా, అతడు “పిల్లల విశ్వాసమును తండ్రుల వైపునకు త్రిప్పును,” అసలైన బైబిలు విశ్వాసము ఏడవ దూత ద్వారా పునరుద్ధరణ చేయబడును. ఓ, ఇప్పుడు ఎంతగా దీనిని ప్రేమించవలెనో! ముద్రల యొక్క మర్మములన్ని, సంస్కర్తలు వాటిని సంపూర్తిగా అర్థం చేసికోలేదు: అవునా? ఒక్క నిమిషం, మలాకీ 4 చూడు. సరే, నీవు దానిని గుర్తుపెట్టుకో, ఆయన ప్రవక్త, మరియు, “అసలైన తండ్రుల యొక్క విశ్వాసము పునరుద్ధరణ చేయును.” రంగము మీద అగుపించుటకు ఆ వ్యక్తి కోసము మనం ఎదురు చూచుచున్నాము. పది మిలియన్లు పది మిలియన్లగా అతడు దీనుడైయుంటాడు…సరే, చిన్న గుంపు అది అర్థం చేసికుంటారు.

207 (అప్పుడు), గత దినము మీకు జ్ఞాపకమున్నదా, యోహాను రావలయునని చెప్పబడెను, క్రీస్తు రాకమునుపు వర్తమానికుడు, “అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము,” మలాకీ అతనిని చూశాడు. చూడు, మలాకీ 3వ అధ్యాయం క్రీస్తు ముందటివాడుగా నుండు ఏలీయా రాకడను గూర్చి.

208 నీవు చెప్తావు, “ఓ, కాదు కాదు సహోదరుడా బ్రాన్హాం, అది 4వ అధ్యాయం.” నన్ను క్షమించండి.

209 అది మూడవ అధ్యాయమని యేసు చెప్పాడు. పరిశుద్ధ…మీరు తీసికోండి. పరిశుద్ధ మత్తయి,—11వ అధ్యాయం 6వ వచనము, ఆయన—ఆయన ఇది చెప్పాడు. 11—11వ అధ్యాయం, 6వ వచనమని అనుకుంటున్నాను; 4వ, 5వ, లేక 6వ అక్కడే. ఆయన చెప్పాడు, “మీరు అంగీకరించగల్గితే” ఆయన యోహానును గూర్చి మాట్లాడుచున్నపుడు, “నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అని యెవనిని గూర్చి చెప్పబడెనో అతడు ఇతడే,” మలాకీ 3 చదువు. వారిలో కొందరు దానిని మలాకీ 4కు వర్తింపజేస్తున్నారు. కాదండి. అది కాదది.

210 మలాకీ 4 గమనించు, ఆ వర్తమానికుడు వెళ్ళిన తరువాత, ప్రపంచం సంపూర్తిగా కాలిపోవును, నీతిమంతులు, వారి బూడిద మీద నడుస్తూ వెయ్యేండ్ల పాలనలో నడుస్తారు. కాబట్టి, మీరు చూడండి. మీరు అతన్ని వెనుక ఉంచితే, అప్పుడు—అప్పుడు అది ఆలాగు కాదని బైబిలు చెప్పినట్లుయౌతుంది. మనకు రెండు వేల సంవత్సరాలున్నవి. ప్రపంచం ఇంకా దహించబడలేదు. మరియు నీతిమంతులు అందులో జీవిస్తున్నారు. కాబట్టి అది భవిష్యత్ యైయుండవలెను. [ఒక్కసారి సహోదరుడు బ్రాన్హాం చప్పట్లు కొట్టాడు—సంపా.]

211 ఇక్కడ ప్రకటనలోకి మీరు వచ్చి, ఈ చివరి కాలము యొక్క వర్తమానికుడు ఏమి చేయునో చూచినయెడల, అప్పుడు అదేంటో మీరు చూడగలరు. అతడు ప్రవక్తయైయుండవలయును. ఈ యొక్క సంస్కర్తలు చూచి అక్కడ అది పెట్టనవి వాటిని వాటి చోటులో ఉంచును.

212 దేవుని ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేకుండా మత్తయి 28:19 ని అపొస్తలుల కార్యములు 2:38 తో ఎట్లు పోల్చగలవు? దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా అద్భుత కార్యములు జరుగు కాలము ఎట్లు గతించిపోయినదని ఈ ప్రజలు ఎట్లు చెప్పగలరు? అదెరుగు ఒకే ఒక మార్గము; అది సరియా కాదాయని ఎరుగుట! చూశారా? అయితే, వారు సెమినరీల గుండా వచ్చారు. అందులోనికి వెళ్ళుటకు మనకు సమయం ఉన్నదనుకుంటాను.

213 నేను తొందరపడవలసియుంది, “ఎందుకనగా వారం కంటే ఎక్కువగా నేను మిమ్ములను ఇక్కడ ఉంచదలచుకోలేదు, నా భావం మీకు అర్థమైందా? ఈ ముద్రలు విప్పబడుటకు, నాకు ఒక్కరోజు మాత్రముంది, నాకు వీలైతే ఆ దినము రోగుల కొరకు నేను ప్రార్థించగోరుచున్నాను.

214 ఇప్పుడు చూడు, మలాకీ 4, అతడొక ప్రవక్త “పితరుల అసలైన విశ్వాసాన్ని పునరుద్ధరణ చేయును.”

215 అంత్యకాలములో, శ్రమకాలం వచ్చినపుడు…ఇప్పుడు ఇక్కడొక చిన్న విషయం ఒక నిముషం మరలా చెప్పవలెనని ఉన్నాను, మూడున్నర సంవత్సరములు…లేదా, దానియేలు డెబ్బది సంవత్సరములు, దానియేలు డెబ్బది వారములు ఆఖరు సగం, అనగా మూడున్నర సంవత్సరములు. ఇప్పుడు ఎంతమందికి అది గుర్తుంది, సంఘకాలాల నుండి? [సభ “ఆమేన్,” అని చెప్పినది—సంపా.] అవునా? “డెబ్బది వారములు నిర్ణయింపబడినవి.” ఎంత సంపూర్ణమో అది చూడు చెప్పబడినది “మెస్సీయా వచ్చును మరియు అర్పణ కొరకు వారము మధ్యలో కొట్టివేయబడును మరియు ధర్మవిధులన్ని నిలిపివేయబడును,” తరువాత యూదులకు మెస్సీయా సిద్ధాంతమునకు ఇంకా మూడున్నర సంవత్సరములు మిగిలియున్నవి.

216 ఒకే సారి, దేవుడు యూదులతో అన్యులతో సంప్రదింపులు చేయడు, ఒక రాజ్యముగా ఇశ్రాయేలీయులతో ఆయన సంప్రదింపులు చేస్తాడు. అన్యులతో వ్యక్తిగతంగా సంప్రదింపులు చేస్తాడు. ఆయన యొక్క పెండ్లి కుమార్తెగా అన్యులును ఆయన ఎన్నడూ తీసికోలేదు. అన్యులలోనున్న ప్రజలను ఆయన తీసుకున్నాడు. చూశారా? ఇశ్రాయేలీయులతో ఒక దేశముగా సంప్రదింపులు చేస్తాడు. ఇప్పుడామె ఒక దేశముగా అక్కడే కూర్చున్నది.

217 ఈ రోజు పాల్ యొద్ద నుండి, పాల్ జాయడ్ యొద్ద నుండి ఒక ఉత్తరం పొందుకున్నాను, అతడు నాతో చెప్తూ, అన్నాడు “సహోదరుడా బ్రాన్హాం ఇదెంతటి నిజం! అదేం జరిగినప్పటికి ఈ యూదులకు అన్యల యెడల ఒక వింతైన భావన కల్గియున్నారు, ఏమి జరిగినప్పటికి.” నిజం వారికుంది, వారికి ఉండవలసియుంది.

218 “యూదులందరు తరిమివేయబడవలెనని మరియు వారి గృహాలు కాల్చివేయబడవలెనని మార్టిన్ లూథర్ ప్రకటన చేసినపుడు. ఎందుకనగా వారు క్రీస్తు విరోధులు.” చూశారా? మార్టిన్ లూథర్ తనకు తాను వ్రాత మూలముగా ఆ ప్రకటన చేశాడు. ఇప్పుడు, మార్టిన్ లూథర్ ఏమి చెప్పాడో హిట్లర్ అది నెరవేర్చాడు. మార్టిన్ లూథర్ అదెందుకు చెప్పాడు? ఎందుకనగా అతడు సంస్కర్త, ప్రవక్త కాదు.

219 దేవుడు అన్నాడు, “ఇశ్రాయేలును నా ప్రవక్త దీవించెను. అతడన్నాడు ‘నిన్ను దీవించు వారు దీవించబడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు.”’ మరొక ప్రవక్త చెప్పిన దానిని ఒక ప్రవక్త ఎలా తృణీకరిస్తాడు? అతడు చేయలేడు అని నమ్మకం కావాలి. చూశారా?

220 అయితే, ఆ కారణం చేత వారు…జర్మనీ దేశము ఒక క్రైస్తవ దేశముగాయుండియుండవలెను. ఇశ్రాయేలీయుల యెడల వారు ప్రవర్తించు ప్రవర్తన. వారింకా వారి భుజములపైన దండము ఉంచుకొన్నారు. వారిని నీవు నిందించలేవు. అయితే జ్ఞప్తించుకో. యూదులు కూర్చొనియున్నారు. నీవు భయపడవద్దు. దినము రాబోవుచున్నది. దేవుడు వారిని ఎన్నడూ మరువడు. మన నిమిత్తం వారు గ్రుడ్డివారయ్యారు.

221 ఆయన ప్రవక్తతో చెప్తాడు, మీకు తెలుసా, ఆయన…ప్రవక్త మొర్రపెట్టాడు, అన్నాడు “నీవు ఇశ్రాయేలును మరచెదవా?”

222 ఆయన చెప్పాడు, “ఆ కొలకొర్రను తీసికో; ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నది? సముద్రము ఎంత లోతున్నది?”

అతడన్నాడు “నేనది కొలవలేను,” అని.

223 “ఎన్నడూ ఇశ్రాయేలీయులను మరువను” అని అన్నాడు. అది ఆయన ప్రజలు, ఆయన దాసులు.

224 అన్యజనులు, అందులో తీసుకున్న కొద్దిమంది మాత్రమే, ఆయన పెండ్లికుమార్తె కొరకు, అది ఖచ్చితంగా నిజం. అది పెండ్లికుమార్తె.

225 ఇప్పుడు, డెబ్బది వారములు నిర్ణయింపబడియున్నవి, సంపూర్తిగా మెస్సీయా వచ్చి వారము మధ్యలో కొట్టివేయబడును అనునది దానియేలు ఖచ్చితం, మరియు యేసు మూడున్నర సంవత్సరములు ప్రవచించాడు. ఇప్పుడు, దానియేలు యొక్క ఈ మూడున్నర సంవత్సరముల మధ్యలో ఆయన కొట్టివేయబడెను, అయితే, ఇప్పుడు చివరి భాగము శ్రమకాలము, అక్కడ అన్యజనుల సంఘముండును, ఓ! ఇది గంభీరమైనది. ఇప్పుడు కాదు…పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో వెళ్ళిపోవును; తరువాత వెయ్యేండ్ల పరిపాలన, దుష్టుల బూడిదపై నడుస్తారు.

226 దీనిని మనం మన మనస్సులో ఉంచుకొనియుండగా, ఇక్కడ నేనొకటి చూపించనీయండి. అదేమి చెప్పినది, బైబిల్ ఏమి చెప్పినది మీకు చూపుతాను. ఇది దేవుని వాక్యమైయుండగా మనము తృణీకరించలేము. మనమాలాగు చేస్తే మనం అవిశ్వాసులం. చూశారా, మనం నమ్మవలసియున్నది. “నేను అర్థం చేసికోలేకున్నాను” అని నీవు చెప్తే, నాకు అంతే. అయితే దానిని ఆయన బయలుపరచవలెనని నేనాయనకై ఎదురుచూచుచున్నాను. చూడు.

ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును (అమెరికా వంటివారు మొదలగువారు),…దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు (అది కాల్చబడబోతుంది) వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

227 అలాగైతే, అక్కడ నిత్య నరకముండుట మీరెట్లు కలిగియుండగలరు? చూడండి. చివరి దినములలో ఈ విషయాలన్ని బయలుపడును. నరకము నిరంతరమని బైబిలు ఏ స్థలములో చెప్పబడలేదు. ఈలాగు, నిత్య నరకము ఉండుటకు, అక్కడ ఉండుటకు నిత్యజీవము కల్గియుండవలెను. ఒకే ఒక రకమగు నిత్యజీవమున్నది, దాని కొరకే మనం పోరాడుచున్నాము. ప్రతి దానికి ఆరంభము, అంతము యుంటుంది. “నరకము దయ్యానికి అతని దూతలకు సృజించబడినది,” మరియు అది దహించబడి అంతమైపోతుంది. సరే. చూశారా? అయితే అది జరుగునపుడు, “దానికి వేరైనను చిగురైనను ఉండదు.”

అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

228 శ్రమలకాలము తరువాత దుర్మార్గులు ఎక్కడకుపోయెదరు? బూడిదకు.

హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై…నేను మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను…జ్ఞాపకము చేసికొనుడి.

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.

229 ఆమేన్! ఇక్కడ పాత నిబంధన ఆ విధముగా ముగింపుయౌతున్నది, మరియు ఇక్కడ క్రొత్త నిబంధన అదే విధముగా సమాప్తమగుచున్నది. దానిని ఏ విధముగా మీరు దూరంగా ఉంచగలరు? వీలు కాదు. చూడండి. “ఆ దినము రాకముందు ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.”

నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. (ఊహు)

230 అక్కడే మీరున్నారు, అది ప్రభువు యొక్క వాక్యము, ఆయన దానిని వాగ్దానము చేశాడు. అది జరుగవలెను. ఇప్పుడు ఇదెట్లు జరుగునని మీరు గమనించితే దానిని ఎట్లు దేవుడు చేయునో అది రమ్యతగాయుండెను. పెండ్లికుమార్తె పెండ్లికుమారునితో వెళ్ళును. మరియు—మరియు ఆ తరువాత దుర్మార్గులు ఆరని అగ్నితో కాల్చివేయబడతారు. మరియు ప్రపంచము శుద్ధీకరించబడిన తరువాత, దానికదే పునరుద్ధీకరించబడుతుంది. ప్రతీది. శుద్ధీకరించబడును.

231 ఆ గొప్ప చివరి కాలములో అగ్ని పర్వతాలు బ్రద్ధలగును మరియు ప్రపంచం బ్రద్ధలౌను. అగ్ని వెదజల్లబడును. భూమి మీదనున్న పాపము మురికి గుంటలన్ని కరిగిపోవును, మహా వేడిమితో కాలిపోవును. సిరా రంగును బ్లీచ్ కనబడుకుండ చేయునట్లే చేయును. కాబట్టి, దేవుని యొద్ద నుండి వచ్చు అగ్ని వేడిమి, దాని ప్రతీ మురికి వస్తువును, దాని అసలైన స్థానానికి తెచ్చును. సాతాను, సమస్త పాపము, సమస్తము కాల్చివేయబడును. అటు తరువాత ఏదెను తోటలో ఏ విధముగా నుండెనో అంత అందంగా ఉండును. అవును! ఓ ఆ గొప్ప సమయం మనముందున్నది!

232 శ్రమకాలంలో, ఇక్కడ మీరు ఇప్పుడు గమనించాలని నేను కోరుచున్నాను. ఒక చిన్న విషయం, నేనిక్కడ వదిలివేశాను. పెండ్లికుమార్తె పిలువబడిన తరువాత, శ్రమకాలంలో సంఘము శ్రమకాలం గుండా వెళ్తుంది. ప్రకటన 11 లోనికి ఇద్దరు సాక్షుల ద్వారా నూట నలభై నాలుగు వేల మంది పిలువబడెదరు. చూడు, వారు గొనెపట్ట ధరించుకొని ఒక వెయ్యి రెండువందల అరవై దినములు ప్రవచిస్తారు.

233 రోమన్ క్యాలెండర్ లో ఇది ఉండదని మనకు తెలుసు…మనకు ఇరవై ఎనిమిది కొన్నిసార్లు ముప్పై మరియు ముప్పై ఒకటి. అయితే వాస్తవముగా క్యాలెండర్ ఇలా పిలువబడుతుంది, ప్రతి నెలకు ముప్పై రోజులు. అవును. ఒక వంద తీసికో…వెయ్యి రెండు వందల అరవది దినములు దానికి ముప్పై పెట్టు, నీకేం వస్తుందో చూడు. మూడున్నర సంవత్సరం ఖచ్చితంగాయౌతుంది. నిర్ణయించబడిన సమయం అది. అక్కడ వెనకాల ఏలాగో ఇశ్రాయేలీయులకు మెస్సీయా వర్తమానకాలమది. ఆయన తిరిగి వచ్చి ఒక సూచన రూపములో తనకు తాను బయలుపరుచుకొనును…

234 యోసేపు ఆత్మ సంబంధమైన మనిషిగాయున్నందువలన, తన సహోదరుల వలన నిరాకరించబడి వేరే దేశములోకి కొనిరాబడ్డాడు. అతడు దర్శనాలు చూడకలిగాడు, కలల భావాలు చెప్పగలిగాడు, అతడు ఆలాగున్నపుడు, ఇంకొక దేశములోకి కొనిరాబడ్డాడు. ముప్పై వెండి నాణెములకు అమ్మబడ్డాడు. అతడు ఖచ్చితంగా క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎందుకనగా అతనిలోనున్నది క్రీస్తు ఆత్మ.

235 గమనించు తరువాత ఏం జరిగింది. అది గమనించు, అతడు ఇది చేసినపుడు, అతడు చెరసాలలో పెట్టబడెను. మరియు ఒకడు రక్షించబడ్డాడు ఒకడు నశించిపోయాడు. ఖచ్చితంగా ఆయన చెరసాలలో సిలువపైనుండగా ఒక దొంగ రక్షించబడ్డాడు మరియొకడు నశించాడు, ఖచ్చితంగా.

236 సమాధిలో త్రోయబడ్డాడు, మరణించాడు అనుకున్నారు, పైకి తీయబడ్డాడు. ఫరో కుడి పార్శ్వమునకు ఎత్తబడ్డాడు యోసేపును మొదట చూడకుండా ఫరోను ఎవరూ చూడలేరు. యేసు దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, కుమారుని ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అవును.

237 మరియు, యోసేపు ప్రతిసారి విడచునపుడు, ఆ సింహాసనము కుడి ప్రక్క నుండి యోసేపు లేచినపుడు, గమనించండి! మహిమకల్గును గాక! ఫరో యొక్క కుడి ప్రక్కన యోసేపు కూర్చున్నాడు, యోసేపు నిలబడినపుడు ఆ సింహాసనమును విడిచినపుడు బూర ఊదబడును. “ప్రతి యొక్కరు మోకాళ్ళువంచుడి. ప్రతి యొక్కరు, యోసేపు వచ్చుచున్నాడు!”

238 ఆ గొఱ్ఱెపిల్ల సింహాసనమును విడిచి, మధ్యవర్తిత్వపు పని దినాలు విడచి, ఆయన అక్కడ సింహాసనమును విడిచి మరియు విమోచనా గ్రంథమును తీసికొని ముందుకు వచ్చునపుడు ప్రతి మోకాళ్ళు వంగవలయును. అక్కడ ఆయన ఉన్నాడు. గమనించు.

239 యోసేపు తన సహోదరుల ద్వారా నిరాకరించబడినపుడు, అతనికి అన్యజనుల భార్య అనుగ్రహించబడెను. ఫోతిపర్ ను అతనికి ఇచ్చెను…లేక ఫరో అతనికి అన్య భార్యను ఇచ్చెను. మరియు అతడు అన్యజనుల పిల్లలను కనెను సగము అన్యులు సగము యూదులు. వారు ఒక గొప్ప గురుతును ఇచ్చారు యాకోబు వారిని ఆశీర్వదించునపుడు, ఎఫ్రాయిము ఒక ప్రక్కన మనష్షే మరొక ప్రక్కన ఉండిరి. అతడు తన చేతులు అడ్డంగా వుంచి, చిన్న వానికి ఆశీర్వాదమిచ్చాడు. ఇద్దరు పిల్లలు పండ్రెండు గోత్రాలకు కలుపబడిరి. అప్పటికి పది గోత్రాలు. యాకోబు తనలోనే వారిని ఆశీర్వదించెను. మరియు ప్రవక్త కుమారుడు యోసేపు అక్కడ నిలబడి అన్నాడు, “తండ్రీ నీవు పొరపాటు చేశావు,” అన్నాడు “నీవు నీ కుడి చేయి ఆశీర్వాదాన్ని చిన్నవాని మీద ఉంచావు, అది పెద్ద వాని మీద ఉండవలసియున్నది.”

240 మరియు అతడు చెప్పాడు, “నా చేతులు అడ్డంగా పెట్టబడినవని నాకు తెలుసు. అయితే దేవుడు వాటిని త్రిప్పియున్నాడు,” ఎందువలన? ఇశ్రాయేలు పెండ్లి కుమార్తెగా యుండుటకు హక్కులు కల్గియుండెను. తృణీకరించి, వారి జన్మ హక్కును అమ్మివేసికొనెను, మరియు…అది పాత కుమారుడు ఇశ్రాయేలు నుండి నూతన, కుమారుడైన అన్యజనుల యొద్దకు వచ్చెను. ఆశీర్వాదము అక్కడ నుండి వెళ్ళిపోయి సిలువ ద్వారా అన్యజనులకు వెళ్ళిపోయెను.

241 అయితే, అటు తరువాత గమనించు, చూశారా, దాని గుండా, అంతా…అతడు, తన పెండ్లి కుమార్తెను తీసుకున్నాడు. అయితే, ఆ పిల్లలు ఆహారము కొంటానికి వచ్చునప్పటికి…

242 ఓ, అది ఒక అందమైన చిత్రం! నేను ముద్ర నుండి దూరంగా ఉన్నాను. నేను అది చెప్పవలసియున్నది. చూశారా! ఎందుకనగా మీరు అది సరిగా గ్రహించగలరని నమ్ముచున్నాను. గమనించు.

243 ఇప్పుడు, వారు ఆహారము కొనటానికి వచ్చినపుడు, మీకు తెలుసా, యోసేపు వారిని గుర్తించాడు. యోసేపు ఫలభరితుడైన కుమారుడు, అతడు ఎక్కడకు వెళ్ళినప్పటికి అదెల్లప్పుడు ఫలభరితుడే.

244 భూమి మీదికి ఆయన మరలా వచ్చు వరకు ఎదురు చూడు, మన యోసేపు వచ్చు వరకు ఎదురు చూడు! చూశారా? “ఎడారి కస్తూరి పుష్పముల వలె వికసించును మరియు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగుజేయును.” ఓ, మై. ఆరిజోనా చుట్టునున్న ముండ్ల చెట్లు అందమైన వృక్షములుగా మారును. అది సౌందర్యవంతముగా ఉండును.

245 గమనించు, ఇక్కడ అతడు వచ్చి, వారి మీద చిన్న తమాషా చేస్తున్నాడు. మరియు అతడు పంపి అతడడిగాడు “నా తండ్రి ఇంకా జీవించియున్నాడా?” చూశారా? ఆ బాలుని యొక్క తండ్రి జీవించియున్నాడని తెలుసుకొనగోరాడు. “అవును” అని చెప్పబడెను, అది అతని సహోదరుడని ఎరిగారు. అయితే, అతను తన యొక్క సహోదరులకు తనను తాను బయలుపరుచుకొనుటకు సిద్ధముగానుండినది మీరు గమనించారా?

246 అతను చెప్పిన తరువాత, జన్మించిన చిన్న బెన్యామీనును అతడు కనుగొన్నాడు. ఈ యూదులకు అతడు పోలిక. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఈ ఒక లక్ష నలభై నాలుగు వేలమందికి సూచనగాయున్నాడు. ఆయన తిరిగి వచ్చినపుడు ఆయన చెప్పాడు…బెన్యామీనును అతడు చూశాడు. అతని గుండె బ్రద్ధలైనట్లయింది.

247 మరియు జ్ఞప్తించుకోండి. వారు…అతడు…అతడు హెబ్రీ భాష మాట్లాడగలడని వారికి తెలియదు. అతడు ఒక అనువాదికునితో మాట్లాడుతున్నాడు. ఒక ఐగుప్తునివలె అతడు నటిస్తున్నాడు. అవునా? తరువాత అది తెలియబడినప్పుడు అతడు తన్ను తాను తెలియపరచుకోగోరాడు, చిన్న బెన్యామీను వైపే అతడు చూస్తున్నాడు. జ్ఞాపకముంచుకోండి. అతని భార్యను పంపివేశాడు. తన సహోదరులకు తన్ను బయలుపరుచుకున్నప్పుడు ఆమె రాజ భవనంలో ఉన్నది.

248 మరియు యేసు తన స్వంత ప్రజల ద్వారా నిరాకరించబడిన తరువాత ఆయన అన్య పెండ్లికుమార్తెను తీసికొన్నాడు. అన్య పెండ్లికుమార్తె భార్యను, ఆమెను ఇక్కడ నుండి భవనమునకు మహిమలోని ఆయన తండ్రి ఇంటికి పెండ్లి విందు కొరకు తీసుకొని వెళ్ళును. తన సహోదరులైన లక్ష నలభై నాలుగు వేలమందికి తన్ను తాను కనపరచుకొనుటకు తిరిగి వచ్చును…?…ఆ సమయం.

249 అక్కడ అతను నిలబడియున్నాడు. జ్ఞాపకముంచుకో, సూచనను సరిగా గమనించు. ఇది ఎక్కడున్నదో అక్కడ అతడు తిరిగి వచ్చునప్పటికి, వారి వైపు అతడు చూచి అతడన్నాడు—అతడన్నాడు…చూస్తున్నాడు వారు మాట్లాడుటకు మొదలు పెట్టారు వారు అన్నారు, “ఇప్పుడు రూబేనూ, అందు కొరకే మనమిక్కడయున్నాము, చూశారా. ఎందుకనగా మనమేమి చేసియున్నామో నీవు ఎరుగుదువు. ఈ అబ్బాయిని మనము గోతిలో వేశాము. మన మన సహోదరుని అమ్మకుండా ఉండవలసినది.” అక్కడ నిలబడియున్నది వారి యొక్క సహోదరుడు, ఆ బలమైన యువరాజు, అది వారికి తెలియదు.

250 ఆ కారణం చేత ఇశ్రాయేలీయులు ఈ దినాన ఆయనను అర్థం చేసికోలేకున్నారు. అది ఎరుగవలసిన గడియ ఇంకా రాలేదు.

251 మరియు అటు తరువాత, హెబ్రీ అర్థం కాదని వారు అనుకున్నారు అయితే అతడు వారిని వినుచున్నాడు. వారన్నారు, “అందుకొరకే మనమున్నాము.” యోసేపు వారివైపు చూచినపుడు, అతడు నిలువలేకపోయాడు.

252 ఇప్పుడు గుర్తుంచుకో, ఆ సమయములో అతని భార్య బిడ్డలు రాజ భవనంలో ఉన్నారు. అక్కడ నుండి పరిశుద్ధులు వెళ్ళిపోయారు.

253 అతడు చెప్పాడు, “నేను యోసేపును మీ సహోదరుడను,” అని. అతడు పరుగెత్తి చిన్న బెన్యామీను మెడ మీద పడి హత్తుకున్నాడు, ఏడ్చాడు. చూశారా? తనకు తాను తెలియపరచుకున్నాడు.

254 అప్పుడు వారు చెప్పుకున్నారు, “మనం అతనిని అమ్మినామని మనకు తెలుసు. అతనిని అమ్మింది మనమే. అతన్ని చంపుటకు ప్రయత్నించింది మనమే. అతడు ఇప్పుడు మనలను చంపునని మనకు తెలుసు.”

255 అతడన్నాడు, “కాదు, మీరు మీరే కోపపడవద్దు, ప్రాణమును కాపాడుట కొరకు మీరది చేసియున్నారు, అందుకు దేవుడు నన్ను ఇక్కడకు పంపాడు.”

256 ఆయనకు ఆయన బయలుపరుచుకున్నప్పుడు, బైబిలు చెప్తుంది…అందులో గుండా మనం వచ్చాము. ఆ నూట నలభై నాలుగు వేల మందికి ఆయన బయలుపరచుకున్నప్పుడు (ఈనాటి చిన్న బెన్యామీను) అక్కడ యూదులలో శేషించిన వారు; ఆయనకు ఆయన బయలుపరచుకున్నప్పుడు వారంటారు “ఆ గాయములు ఎక్కడ నుండి వచ్చినవి? అవి నీ చేతిలో ఏలాగున్నవి?” అని అంటారు.

257 ఆయన చెప్తాడు “ఓ! అవి నా స్నేహితుల ఇంటిలో అయినవి.” చూశారా; ఓ, అప్పుడు వారు మెస్సీయాను చంపినట్లు గ్రహిస్తారు. అయితే, ఆయన ఏమి చెప్తాడు? యోసేపు చెప్పినట్లుగానే చెప్పును. “ప్రాణమును కాపాడుటకు మీరు చేశారు. కాదు…ప్రాణమును రక్షించుట, మిమ్ములను మీరు కోపగించుకోవద్దు.” ఎందుకనగా యూదులు గ్రుడ్డివారై ఆ విధముగా చేసియుండని యెడల, అన్యజనులలోనికి వచ్చియుండెడివారు కాదు. కాబట్టి, వారు చేసిన కార్యములను బట్టి సంఘము యొక్క ప్రాణమును ఆయన రక్షించాడు. కనుక మీరు అక్కడున్నారు. ఆ కారణం చేత నేటి దినాన ఇది వారు అర్థం చేసికోలేకున్నారు. అది గడియ కాదు.

258 అది, అర్థం చేసికొనే సమయం వచ్చు వరకు ఈ విషయాలు మనం అర్థం చేసికోలేము. ఓహో ప్రకటనలోని ఏడు ఉరుములు, కొనిపోబడుట గొప్ప విశ్వాసము కొరకు ఏ విధముగా స్థిరపడవలెనో ఆయన పెండ్లికుమార్తెకు చూపును గాక!

259 ఇప్పుడు మనం త్వరపడదాం. ఎందుకనగా ఇంకా, మనకు పదిహేను ఇరవై నిమిషాలు కూడా లేవు.

260 ఇప్పుడు, ఈ తెల్ల గుఱ్ఱమనగా అర్థమేంటి? నన్ను చదవనీయండి…నేను దానికి ఎంతో దూరం వెళ్ళాను. నా అంశాన్ని తప్పినందుకు క్షమించండి. అయితే వచనము, మరలాచదువుతాను రెండు వచనాలు.

ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము…చూడుము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.

మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను:…

261 ఇప్పుడు 2వ వచనమునకు పోవుచున్నాము.

…ఒక తెల్లని గుఱ్ఱము: దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను; (అప్పుడు అది లేదు)…అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్ళెను.

262 అదంతా అంతే. అది ముద్ర, ఇప్పుడు సూచనలు చూద్దాం.

263 ఉరుము అనగా అర్థం మనం కనుగొన్నాము. పూర్తిగా, అది ఎరిగియున్నాము. చూశారా. ఉరుము అనగా ముద్ర విప్పబడినపుడు వచ్చు దేవుని యొక్క స్వరము.

264 ఇప్పుడు తెల్లని గుఱ్ఱమనగా అర్థమేంటి? ఇప్పుడు, దాని ప్రత్యక్షత వచ్చుచున్నది. ఇక్కడ నేను నిలబడియున్నది ఎంత వాస్తవమో ఇది దేవుని వాక్యమని నేను బహు నిశ్చయముగా ఎరిగియున్నాను.

265 దానిని గూర్చి, నాకు దొరికిన ప్రతి పుస్తకమును నేను చదివాను. చివరి సారి నేను—అది చదువుటకు ప్రయత్నించాను. కేవలం బోధ చేస్తూ, సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నేను గ్రంథాన్ని తీసుకున్నాను. క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి ఎరిగిన అందరికంటే దాని మీద అడ్వెంటిస్టు వారిని ఎక్కువ వెలుతురు కలదని ఒకరు నాతో చెప్పారు. కాబట్టి అది చదువుటకు కొన్ని వారి పుస్తకాలు తీసుకున్నాను. దానియేలు మీద, ప్రకటనల పైన స్మిత్ పుస్తకము నేను తీసుకున్నాను. అతడు చెప్పాడు: తెల్లనిదిగా వెళ్ళిన ఈ తెల్లని గుఱ్ఱము అది జయించు ఒకనికి సూచనగా ఉన్నది, మరియు ఈ జయించుట…ఇక్కడున్న అనేకమంది అడ్వెంటిస్టులైన సహోదరులకు ఆ పుస్తకము తెలుసు. మీలో మిగతా వారికి కూడా, అది చదువుట వలన. మిగతా వారు, రెండు మూడు చదివాను, నేను. నేను చదివాను, వాటిని చెప్పలేను…మరి రెండు పుస్తకాలు చదివాను. అది సరియని ఇద్దరు అంగీకరించారు. [సహోదరుడు బ్రాన్హాం ఐదుసార్లు ప్రసంగ వేదికను తట్టాడు—సంపా] వారు మంచి ఉపదేశకులు. ఉత్తమమైన వారు, వెలుగును కల్గియున్నవారు. కాబట్టి నేననుకున్నాను. “సరే, నాకు తెలియకపోతే, వారేది చెప్పారో నేను చెప్తాను. అది ఆ విధంగా ఉపదేశించుటకు ప్రయత్నిస్తాను,” అని తలంచాను.

266 దానిని గూర్చి నిజముగా అర్థమేమని చాలా మంది ఆశ్చర్యార్థం వారిచ్చారు. వారు చెప్పారు, “ఇప్పుడు ఇక్కడ ఒక తెల్లని గుఱ్ఱమున్నది. తెల్లని గుఱ్ఱము ఒక శక్తి.” మరియు చెప్పారు, “ఆ తెల్లని గుఱ్ఱము మీద—కూర్చున్న మనిషి పరిశుద్ధాత్మ. ఆ కాలము యొక్క దేవుని రాజ్యము కొరకై ఆరంభకాలంలో వెళ్ళిన వ్యక్తి. అతని చేతిలో విల్లు ఉన్నది. దాని అర్థం మన్మధుని వలె, అతడు ప్రేమ బాణములు ప్రజల గుండెల్లోకి వేసెను, దేవుని ప్రేమను జయించెను.”

267 దాని భావం ఎంతో బాగుంది. అయితే అది సత్యం కాదు. కాదండి, ఆ, అది కాదు. తెలుపు నీతికి అర్థం—మనం అది గ్రహించియున్నాము, తెలుపు నీతియని అర్థం. అది బోధకులు బోధించారు. పరిశుద్ధాత్మ మొదటి కాలంలో జయించెనని బోధించారు. అయితే నా యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మను బట్టి, ఆ విధముగా కాదు.

268 పరిశుద్ధాత్మ వలన నా యొక్క ప్రత్యక్షత ఏదనగా, క్రీస్తు పరిశుద్ధాత్మ ఒకే ఒక వ్యక్తియైయున్నాడు. వేరే రూపమును తప్ప. కాబట్టి ఇక్కడ నిలబడియున్నది, క్రీస్తు, గొఱ్ఱెపిల్ల. ఆయన గొఱ్ఱెపిల్లయని మనకు తెలుసు. ఆయన చేతిలో గ్రంథమును పట్టుకొని ఆయన ఇక్కడ నిలబడి ఉండెను; మరియు అక్కడ తెల్లని గుఱ్ఱము మీద స్వారీచేయువాడు వెళ్ళుచున్నాడు. చూశారా, కాబట్టి అది పరిశుద్ధాత్మ కాదు.

269 ఇప్పుడు, కడవరి దినములలో మర్మములలో ఒకటి, క్రీస్తు ముగ్గురు వ్యక్తులలో ఒకటిగా ఎట్లున్నాడు? అది ముగ్గురు వేర్వేరు వ్యక్తులు కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు, అని త్రిత్వవాదులు మనకు చెప్తున్నట్లు కాదు. ఒకే ఒక వ్యక్తి యొక్క మూడు ప్రత్యక్షతలు. లేక మూడు కార్యాలయాలని నీవు పిలువవచ్చు, నీవు సేవకులతో మాట్లాడుతుంటే కార్యాలయమును ఉపయోగించరు; ఎందుకనగా నేను టేపుమీదనున్నానని అనుకుంటున్నాను. కనుక నేను నీకు చెప్తున్నాను…ఏలయనగా “నా కార్యాలయమునకు కొరకు నేను ప్రార్థింతును మరియు ఆయన మిమ్మును మరియొక కార్యాలయమునకు పంపును” అని క్రీస్తు చెప్పాడు. అది మనకు తెలుసు, అయితే…అది. ఒక్క దేవుని యొక్క మూడు గుణగణాలు, అవునా? అది ముగ్గురు దేవుళ్ళు కాదు. ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణాలు! చూశారా?

270 మరియు కావున క్రీస్తు ఆ తెల్లని గుఱ్ఱంపైన కూర్చొని అక్కడ జయించుచు, ఇక్కడ పుస్తకము చేతిలో ఉంచుకొని ఎట్లుండగలడు? కాబట్టి అది అది కాదు. అది క్రీస్తు కాదు.

271 ఇప్పుడు గమనించుడి, పరిశుద్ధాత్మ (ప్రకటనలో) మరియు క్రీస్తు. వేరొక రూపములోనున్న క్రీస్తే ఆ పరిశుద్ధాత్మయైయున్నది. అవును.

272 గమనించండి, గ్రంథములను తెరచినది గొఱ్ఱెపిల్ల, గొఱ్ఱెపిల్ల క్రీస్తు. అప్పటి నుండి క్రీస్తు ఇక కనబడలేదు, అయితే ఆయన ప్రకటన పుస్తకములోని 19వ అధ్యాయంలో తెల్లని గుఱ్ఱం మీద వస్తూ ఆయన కనబడుతున్నాడు.

273 మీరు అది చదవాలనుకుంటే, ప్రకటన 19:11 తిప్పుదాం, ఆరు…త్వరగా చదువుదాం—మనకు…చాలినంత సమయంయున్నదని అనుకుంటున్నాను. కాబట్టి మనకు ఇంకొద్దిగా బావుండును, 19, 19:11, 11వ వచనం ఆరంభం నుండి 16వ వచనం వరకు.

మరియు పరలోకము తెరవబడియుండుట చూచితిని…అప్పుడదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను (భూమి కాదు; పరలోకములో, చూశారా) దాని మీద కూర్చిండియున్నవాడు నమ్మకమైనవాడును…సత్యవంతుడును అను నామముగలవాడు…ఆయన నీతిని బట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.

ఆయన నేత్రములు…అగ్నిజ్వాలవంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను (చూడు, కిరీటము!); వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి…ఎవనికిని తెలియదు.

274 ఒక నిముషము దాని మీద నిలుపు చేయాలనుకుంటున్నాను. [సహోదరుడు బ్రాన్హాం గారు వేదికను ఒకసారి తట్టి నిలుపు చేశాడు—సంపా.] ఓ, మై. నాకు మంచి తలంపు వచ్చినది. అయితే…మీరు [సభ “కొనసాగించుడి!” అని చెప్పెను]

275 చూశారా, అదెవరికి తెలియదు. “యెహోవా” అను నామము సరికాదని మీకెప్పుడైనా తెలుసా? ఎవరికైనా తెలుసా. డాక్టర్. వెయిల్ అది నిజమని నీకు తెలుసు. అనువాదికులు ఎన్నడూ అనువాదము చేయలేదు. అది J-u-h-v…J-v-h-u అని పలకబడినది. అది “యెహోవా” యని కాదు, వారు దానిని తాకలేదు. అదేమైంది వారికి తెలియదు. అది “యెహోవా” అని పిలిచారు, అయితే అది ఆయన పేరు కాదు.

276 చూడు, జయముపొందు ప్రతిసారి లేక ఏదైనా కార్యము జరుగునపుడు పేరు మార్చబడును.

277 అబ్రాహాము దినాలు చూడు. అతడు మొదట అబ్రాముగా ఉండెను. అబ్రాహాముగా అతని పేరు మారు వరకు ఆ బిడ్డను అతడు పొందుకోలేదు. మరియు శారాయి, S-a-r-r-a ఏమి లేదు, ఆమె పేరు S-a-r-a-h గా మారువరకు మృతతుల్యమైన గర్భం ఆమె కల్గియుండెను.

278 యాకోబు అనగా “మోసగాడు, వంచకుడు” అదే అతడు చేసినది. తనపైన గొఱ్ఱె చర్మము పెట్టుకొని, తన ప్రవక్త తండ్రిని మోసం చేశాడు జన్మ హక్కులు పొందుటకై. అతడు నీటిలో నిరవంజి చువ్వలు వేసి గర్భముతోనుండు పశువులకు మచ్చలు, చారపడులాగు చేశాడు…అవి మచ్చలు గల పశువులు, గొఱ్ఱెలు పుట్టునట్లు చేసెను. అతడు మోసగాడు గాక మరొకరు కాదు.

279 ఒక రోజు ఒక నిజమైన దానిని పట్టుకున్నాడు, అది నిజమని అతడు తెలుసుకున్నాడు, దానితోనే అతడు ఉండిపోయాడు, మరియు జయించు వరకు పట్టుకున్నాడు. అతని పేరు మారినది, ఇశ్రాయేలు అని పిలువబడినది. దాని అర్థం “దేవుని ఎదుట శక్తిగల రాజ కుమారుడు.”

280 అవునది నిజమా? [సభ “ఆమేన్,” అని చెప్పినది—సంపా.] జయించు ప్రతివాడు!

281 సీమోను చేపలు పట్టువాడు. యేసు, అతనితో తానే మెస్సీయానని, అతని పేరు అతని తండ్రి పేరు ఏమిటోయని చెప్పినపుడు, అతని యొక్క విశ్వాసము ద్వారా దానిని కనుగొని ఆయనే యేసు అని ఎరిగినపుడు, అతడు జయించినవాడై సీమోను అను పేరు నుండి పేతురు అను పేరుగా మార్చబడ్డాడు.

282 సౌలు, ఒక మంచి పేరు. సౌలు, ఒక సమయమందు ఇశ్రాయేలీయులకు ఒక రాజు. అయితే, అతడు, ఒక సౌలు, ఒక అపొస్తలుడుగా సరిపడలేదు. రాజుకు సరి పడవచ్చోమో. అయితే ఒక అపొస్తలుడుగా. కాబట్టి అతని పేరును యేసు మార్చాడు (దేని నుండి?) సౌలు నుండి పౌలుకు.

“ఉరిమెడి కుమారులను” చూడు.

283 మరియు, యేసు, భూమి మీద ఆయన పేరు “విమోచకుడు,” యేసు. భూమి మీద ఆయన ఉన్నప్పుడు, ఆయన విమోచకుడు, అది నిజం. అయితే మరణమును, పాతాళ లోకమును ఆయన జయించినపుడు, వాటిని జయించినపుడు ఉన్నత స్థలమునకు వెళ్ళినపుడు, ఆయన క్రొత్తపేరును పొందెను. ఆ కారణం చేత మీరు ఎంతగా కేకలు వేసినను, వారు పొందరు.

284 అది ఉరుములలో బయలుపరచబడును. ఊహు చూశారా. మర్మములు గమనించుడి. ఆయన వచ్చుచున్నాడు. స్వారీచేయుచున్నాడు…ఈ సంఘాన్ని మార్చుటకు ఒకటి కావలసియున్నది. మీకు అది తెలుసు, ఒకటి యుండవలసియుంది, గమనించు, “ఆయనకు తప్ప ఏ మనుష్యునికి తెలియదు.” ఇప్పుడు గమనించు “ఏ మనుష్యునికి తెలియదు, ఆయనకు తప్ప.”

రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

ఓ, మై! గమనించుడి!

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కును.

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.

285 అక్కడే మెస్సీయా వచ్చుచున్నాడు. అక్కడే ఆయన ఉన్నాడు. ఇక్కడ వెనుక గుఱ్ఱం మీదనున్న ఈ వ్యక్తి కాదు. వ్యత్యాసాన్ని గమనించు. ఇక్కడ ఆయన చేతిలో గ్రంథాన్ని పట్టుకొని ఇక్కడ ఆయన నిలబడియున్నాడు. ఇక్కడ విమోచనా కార్యము…ఇంకా ఆయన స్థానాన్ని ఆయన తీసికోలేదు. కాబట్టి బయలుదేరినది క్రీస్తయిన పరిశుద్ధాత్మ కాదు.

286 ఆ గొప్పవారితో నేను విభేదించుట లేదు, లేదండి, నేనది చేయుట లేదు. ఆ విధముగా చేయవలెనని నేను అనుకొనుటలేదు. అయితే అందును గూర్చి నా ప్రత్యక్షత. గమనించారా? మీకు వ్యతిరేకమైనది ఒకటియుంటే, సరే. అయితే అది నాకు సరియైనది కాదు. మీరు గమనిస్తున్నారా, నేను—నేను ఈ విధంగా నమ్ముతాను. ఇప్పుడు మీరు తెలుసుకున్నారా. చూశారా?

287 మరియు గమనించుడి, అక్కడనుండి క్రీస్తు కనబడుటలేదు. అయితే, ఆయన తెల్లని గుఱ్ఱములపైయున్నాడు, కాబట్టి, ఇక్కడున్నతను ఒక తెల్లని గుఱ్ఱంపై స్వారీచేయుచున్నాడనగా, అతడు క్రీస్తును అంగీకరించిన వారివలే నటించుచున్నాడు. చూశారా? మీరు గ్రహించారా? [సభ, “ఆమేన్,” అని పలికెను—సంపా.]

288 గమనించు. తెల్లని గుఱ్ఱము మీద స్వారీచేయువానికి ఏ పేరు లేదు. రెండు, మూడు బిరుదులు అతడు వినియోగించవచ్చు. చూశారా, అయితే అతనికి పేరు లేదు.

289 అయితే క్రీస్తుకు పేరు ఉన్నది. అదేంటి. దేవుని యొక్క వాక్యము. అది అదే. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను, వాక్యము శరీరధారియాయెను.” అవునా? స్వారీచేయువానికి పేరు లేదు. అయితే క్రీస్తు “దేవుని వాక్యముగా” పిలువబడుచున్నాడు. అది ఆయనేయైయున్నాడు. ఆయన ఆ విధముగా పిలువబడెను. ఆయన ఏ మానవుడు ఎరుగని పేరు కల్గియున్నాడు. అయితే, ఈయన “దేవుని యొక్క వాక్యముగా పిలువబడుచున్నాడు.”

ఇతనైతే దేనితో పిలువబడుటలేదు. అవునా, అయితే అతడు తెల్లని గుఱ్ఱముపై కూర్చొన్నాడు.

290 స్వారీ చేయువానికి, అతని విల్లుకు బాణములు లేవు. మీరు గమనించారా? అతడు విల్లును కలిగియున్నాడు, అయితే బాణములున్నట్లు చెప్పబడలేదు. కాబట్టి అతడొక అబద్ధికుడు. అవును. బహుశా అతని యొద్ద గొప్ప ఉరుము ఉండవచ్చును. మెరుపు లేదు. అయితే నీవు చూస్తున్నావు. క్రీస్తుకు మెరుపు ఉరుము రెండూ ఉన్నవి. ఆయన నోటి నుండి రెండంచుల గల వాడియైన ఖడ్గము బయలు వెడలుచున్నది. దానితో ఆయన దేశములను కొట్టుచున్నాడు. ఇతడు దేనిని కొట్టలేడు. చూశారా! అయితే వేషధారి పాత్రను నటన చేస్తున్నాడు. ఇతడు తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ జయించుటకు వెళ్ళుచున్నాడు.

291 క్రీస్తు వాడియైన ఖడ్గము కల్గియున్నాడు, మరియు గమనించు, ఆయన నోట నుండి అది వచ్చుచున్నది. జీవము గల వాక్యము, అనగా, ఆయన దాసులకు బయల్పరచబడిన దేవుని యొక్క వాక్యము. ఉదాహరణగా ఆయన మోషేకు చెప్పినట్లు, “వెళ్ళి, అక్కడ నిలబడు, ఆ దూరాన కర్ర పట్టుకొని ఈగలను పిలువ్,” ఈగలు కలిగినవి. నిజం. అతడేమి చెప్పాడో, అది ఆయన చేశాడు మరియు, అది జరిగినది; ఆయన జీవము గల వాక్యము. దేవుడు ఆయన యొక్క వాక్యము ఒక వ్యక్తి. దేవుడు వాక్యము.

292 ఆలాగైతే, మొదటి సంఘకాలము యొక్క మర్మమైన ఈ స్వారీచేయు వ్యక్తి ఎవరు? ఇతను ఎవరు? దానిని గూర్చి ఆలోచిద్దాం. మొదటి సంఘకాలంలో ప్రారంభమై నిత్యత్వము వరకు, చివరి వరకు స్వారీచేయుచు వచ్చు ఈ మర్మమైన వ్యక్తి ఎవరు?

293 రెండవ ముద్ర బయలు వెడలి చివరి వరకు వెళ్తుంది. మూడవ ముద్ర బయలు వెడలి చివర వరకు వెళ్తుంది. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ప్రతి యొక్కటి చివర వరకు వచ్చి ముగుస్తుంది. ముగింపులో, గడిచిన కాలమంతా చుట్టబడి వాటిలోనున్న మర్మములు, అది విప్పబడుతుంది. అప్పుడు మర్మములన్ని అవి ఏమిటని చూచుటకు తెలియబడును. అయితే, వాస్తవముగా మొదటి సంఘకాలములోనే బయలువెడలినవి, ఎందుకనగా సంఘము మొదటి సంఘకాలంలోనే ఇలాటి వర్తమానమును పొందుకున్నది. [సహోదరుడు బ్రాన్హాం గారు మూడు సార్లు ప్రసంగ వేదికను తట్టియున్నాడు—సంపా.]

294 “తెల్లని గుఱ్ఱం మీద స్వారీచేయువాడు బయలు వెళ్ళెను” అవునా? అతడెవరు? అతడు తన జయించు శక్తిలో బలవంతుడైనవాడు. తన యొక్క జయించు శక్తిలో అతడు గొప్పవాడు. అతడెవరో నేను మీకు చెప్పాలని ఉందా? అతడు క్రీస్తు విరోధి. సరిగ్గా అతడు అతడే. ఇప్పుడు ఎందుకనగా, మీరు గమనిస్తే ఒక క్రీస్తు విరోధి అయితే; యేసు చెప్పాడు, ఏదనగా “సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసపరచునట్లు రెండూ ఎంతో సమీపముగాయుండును.” క్రీస్తు విరోధి, అది క్రీస్తు విరోధి ఆత్మ.

295 జ్ఞాపకముంచుకో, సంఘకాలాలలో, అక్కడ వెనుక మొదటి సంఘకాలమును మనము తెరచినపుడు, ఆ సంఘకాలంలో వారు ప్రారంభించిన ఒక దానికి పరిశుద్ధాత్మ వ్యతిరేకముగా ఉండెను. అవి “నీకొలాయితుల క్రియలని పిలువబడెను.” అది మీకు జ్ఞాపకముందా? [సభ, “ఆమేన్,” అని చెప్పెను—సంపా.] Nikao అర్థం “జయించుట.” Laity అనగా అర్థం “సంఘము.” Nico-Laitane, నీకొలాయితు అనగా “సంఘమును జయించుట.” అదేమనగా “సంఘములోనుండి పరిశుద్ధాత్మను తీసివేసి, అదంతా ఒక పరిశుద్ధమైన మనుష్యునికి ఇచ్చుట. దానికంతటికి అతడే అధినేతయౌట.” మీరు దానిని చదివియున్నారు. నీకొలాయితును. గమనించండి, నీకొలాయితు ఒక సంఘములో “ఒక—ఒక మాట.” అది “ఒక బోధ”గా మారిపోయినది, ఆ తరువాత సంఘకాలములో. మరియు మూడవ సంఘకాలంలో అది యొక “బలవంతము” చేయబడినది, వారు దానిని నైసియా ఆలోచనా సభయందు పెట్టారు. అటు తరువాత సంఘములో ఒక సిద్ధాంతమైనది. మొదట జరిగినదేంటి? దాని నుండి ఒక సంస్థాపకమును చేసినది. అవునా? [“ఆమేన్.”]

296 ప్రపథమంగా నిర్మాణాత్మకమైన సంఘము ఎక్కడ నుండి వచ్చినదో నాకు చెప్పు, రోమన్ కథోలిక్ సంఘము! ప్రకటన ఇలా చెప్పుటలేదా, ప్రకటన పుస్తకం 17 లో “ఆమె వేశ్యయని, ఆమె కుమార్తెలు వేశ్యలని” చెప్పుటలేదా అది నాకు చెప్పు. ఆమెతో సంస్థగా చేరిన అదే విషయం “వేశ్యలు.” “వారు హేయమును, తమ జారత్వము యొక్క అపవిత్రతను ఆ బోధ కొరకు తీసికొనిరి.” “మానవుల యొక్క ఆజ్ఞలను బోధగా వారు బోధించారు.” గమనించండి.

297 చూడు! అతడు జయించుటకు బయలు వెడలెను, గమనించండి. అతనికి కిరీటము లేదు. ఇక్కడ నేను తెల్లని గుఱ్ఱము మీద స్వారీచేయు వానిని గూర్చి మాట్లాడుతున్నాను. గమనిస్తున్నారా? “ఒక విల్లు, అటు తరువాత అతనికి కిరీటం ఇవ్వబడినది,” అవునా? ఆరంభంలో అతనికి కిరీటం లేదు, అయితే కిరీటము ఇవ్వబడినది. గమనించు, తరువాత అతనికి కిరీటము ఇవ్వబడినది. అవును. మూడు వందల సంవత్సరాలు తరువాత నైసియా ఆలోచన సభలో ఇవ్వబడెను. అతడు అది ప్రారంభించినపుడు నీకొలాయితు ఆత్మ ప్రజల మధ్య ఒక సంస్థను రూపొందించినది. అది ఆలాగే, ఆలాగేయుండిపోయి “ఒక మాట”యై అటు తరువాత “బోధగా” మారెను.

298 తిరిగి సంఘముతో క్రీస్తు మాట్లాడుచున్నాడు, “ఈ నికొలాయితు క్రియలు నీవు ద్వేషిస్తున్నావు గనుక నేను కూడా ద్వేషించుచున్నాను” అని అంటాను. జయించుటకు ప్రయత్నించుట పరిశుద్ధాత్మను తీసికొని, ఒకే ఒక పరిశుద్ధ మనుష్యుని మీద; అతడు అన్ని పాపములు క్షమించగలడు. ప్రతీది.

299 అక్కడ, ఇప్పుడే అది చదివియున్నాము, పౌలు అది చెప్పాడు, ఆ వస్తువు కడవరి దినాలలో కూర్చుండును. చివరి దినముల వరకు అతడు బయలుపరచబడడు. “ఆ తరువాత ఆయన దానిని అనుమతించి దేవుని యొక్క ఆత్మను అక్కడ నుండి తీసివేయును, మరియు తరువాత ఆయనకు ఆయన బయలుపరుచుకొనును.”

300 ఈ రోజు అతడు తెల్లని గుఱ్ఱము ముసుగులో ఉన్నాడు. కొద్ది నిమిషాలలో గమనించు. ఏ విధముగా ఆ తెల్లని గుఱ్ఱం నుండి మారునది. అతడు తెల్లని గుఱ్ఱముగా మారుట మాత్రమే కాదు గాని అనేకమైన తలలు కొమ్ములుగల మృగముగా మారుతుంది. చూశారా? చూశారా? తెల్లని గుఱ్ఱము, ఇప్పుడతడు మోసగాడు, మరియు ఆ కారణము చేత, ప్రజలు ఈ సమయమంతటితో గుర్తింపలేకున్నారు. వారు దానిని తలంచిరి, అయితే, ఇప్పుడది ఉన్నది. లేఖనము వలన అది బయల్పరచబడనైయున్నది. గమనించుడి.

301 ఒక నీకొలాయితు, చూశారా, అంత్యక్రీస్తు చివరకు మానవునిలో అవతారమెత్తెను. అటు తరువాత కిరీటధారియైయ్యాడు. సంఘములో నీకొలాయితు ఆత్మగా ఆరంభమైనపుడు, అతడొక ఆత్మ. ఆత్మకు కిరీటమును తొడగలేవు. అయితే మూడు వందల సంవత్సరముల తర్వాత అతడు పోపు అయ్యాడు. అప్పుడు అతనిని కిరీటధారినిగా చేశారు. అతనికి కిరీటము లేదు, ప్రారంభంలో, తరువాత అతనికి కిరీటమిచ్చారు. చూశారా, ఆ ఆత్మ మానవుడు ఆయన తరువాత, చూశారా అతడు నరుడయ్యాడు. నీకొలాయితు బోధ మానవుడుగా మారాడు తరువాత అతనికి కిరీటము ధరింపజేశారు. వారది చేయలేకపోయారు ఎందుకనగా అతడు కేవలం బోధ మాత్రమే.

302 మహిమ కల్గును గాక! గమనించండి! మనము కల్గియున్న ఈ పరిశుద్ధాత్మ మన కొరకు శరీరధారియయ్యాడు. ఇప్పుడు మన మధ్యనున్న ఒకరు, పరిశుద్ధాత్మ రూపముననున్న ఒకరు మన కొరకు శరీరధారియయ్యాడు, యేసుక్రీస్తు అను వ్యక్తిలో. రాజుల రాజుగా ఆయనను కిరీటదారునిగా చేస్తాము. అవునది నిజం, చూశారా?

303 ఇప్పుడు, జ్ఞప్తించుకోండి, క్రీస్తు సింహాసనముపైకి వచ్చునప్పటికి, అంత్యక్రీస్తు సింహాసనము పైకి వచ్చును, యూదా. క్రీస్తు భూమిని వదిలిన అదే సమయములో, యూదా కూడా భూమిని వదలెను, ఆ సమయంలో పరిశుద్ధాత్మ తిరిగి వచ్చాడు. అంత్యక్రీస్తు తిరిగివచ్చాడు.

304 ఇక్కడ యోహాను చెప్పినది మీకు తెలుసా, “చిన్న పిల్లలారా, మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అంత్యక్రీస్తును గూర్చి, అదెప్పుడో వచ్చి అవిధేయులైన వారి మధ్య పనిచేస్తుంది.” అప్పుడు అంత్యక్రీస్తుగా ఉన్నాడు, ఒక సంస్థను స్థాపించుటకు నీకొలాయితు ఆత్మగా ఉన్నాడు.

305 నేనది ద్వేషించుటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, చూశారా? చూశారా? అక్కడే మీరున్నారు. అది నేను కాదు. ఇక్కడ ఒకటియున్నది. అది విషయం అది బయటకు వచ్చినది. మీరు చూస్తున్నారా? [సభ “ఆమేన్,” అని చెప్పెను—సంపా.] దాని చుట్టు ప్రక్కల నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు దానిని చూడలేకున్నాను. ఇప్పుడు అది నాకు తెలుసు. దేవుడు ద్వేషించిన నికొలాయితు ఆత్మ అక్కడేయున్నది.

306 ఇప్పుడు, ఆ ఆత్మ అవతారమెత్తినది. వారు దానికి కిరీటం పెట్టారు. మరియు ఇది ఇక్కడే ఉన్నది. దానితో వారేమి చేయుదురని బైబిలు గ్రంథము చెప్పినదో అదే వారు చేశారు. అది ఖచ్చితం. ఓ, మై. అవతారమెత్తుట. అతడు మానవుడయ్యాడు. వారతనిని కిరీటధారునిగా చేశారు.

307 చదువు. గమనించు లేక చదువు, సంఘ రాజ్యమును అతడెట్లు తీసుకునేది అనునది దానియేలు చెప్పినది చదువు. మీరు చదవాలని ఉందా? [సభ “ఆమేన్,” అని చెప్పెను—సంపా.] అది చేయుటకు మనకు సమయముంది, మనకు లేదా? [“ఆమేన్.”] సరే, వినండి. తిరిగి, దానియేలుకు వెళ్దాము. ఒక్క క్షణం మనం చదువుదాం. బహుశా పదిహేను, ఇరవై నిముషాలు కంటే ఉండము. లేక ముప్పై లేక అంత సరేనా? [“ఆమేన్.”]

308 దానియేలు తీద్దాం. 11వ అధ్యాయం 21వ వచనం తీద్దాం. ఇక్కడ దానియేలు, ఏ విధంగా ఇతడు తీసికొనబోతున్నాడు, దానియేలు మాట్లాడుతున్నాడు.

అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును (రోము-మాట్లాడుతుంది), అతనికి రాజ్య ఘనత నియ్యరు గాని (ఇప్పుడు గమనించు) నెమ్మది కాలమందు అతడు వచ్చి…యిచ్చకపు మాటల చేత రాజ్యమును ఆవరించును.

309 ఖచ్చితంగా అదే జరిగినది. ఈ అంత్య క్రీస్తు చేయునని దానియేలు చెప్పినది అదే. జనుల స్థానమునకు వారు సరిపోవును. అవును, సంఘాలకు ఈ దినము వారి యొక్క రుచికొరకు సరిపోవును. ఎందుకనగా ఈ సంఘకాలంలో వారికి వాక్యము, క్రీస్తు అవసరం లేదు. అయితే వారికి సంఘము కావాలి. మొదటి విషయం నీవు క్రైస్తవుడవైతే వారు నిన్ను అడగరు. “ఏ సంఘానికి నీవు సంబంధించిన వాడవని? ఏ సంఘం?” అని అడుగుతారు. క్రీస్తు, వాక్యము వారికి అవసరం లేదు. నీవు వెళ్ళి, వాక్యాన్ని గూర్చి వారికి చెప్పు, ఏలాగు సరిచేయబడాలో చెప్పు అది వారికి అవసరం లేదు. వారు కోరిన రీతిగా జీవించుట వారికి కావాలి. మరింకా సంఘానికి సంబంధించి ఉండాలి మరియు వారి సాక్ష్యము వారికి కావాలి. చూశారా? చూశారా? కాబట్టి వారు కోరుకున్నట్లుగా అనుకూలంగా యుండును. (వారిని తృప్తిపరచువానిగా ఉండును). జ్ఞప్తించుకోండి, అతడు చివరకు బైబిల్ గ్రంథములో “ఆమె” అని పిలువబడును. ఆమె వేశ్య మరియు ఆమెకు కుమార్తెలు కలరు. ప్రజలకు ఏం కావాలో ఆ రోజు బిల్లుకు ఆమె సరిగ్గా సరిపోతుంది. అక్కడ ఆమె ఉంది.

310 దేవుడు అది వాగ్దానం చేశాడు, వాక్యమును తృణీకరించినపుడు అప్పుడు వారి కోరికలపై వారు తిరిగారు. థెస్సలోనీకయులు మరలా చదువుదాం. ఒక నిముషము మీరు గమనించవలెనని కోరుచున్నాను. ఓ, సరే, కొంచెంసేపటి క్రితం మనం చదివాం. రెండవ థెస్సలోనీకయులకు 2:9-11 అది యీలాగు చెప్పుచున్నది. “వారు సత్యమును త్రోసివేయుదురు, భ్రష్టమనస్సు వారికి వచ్చును, అబద్ధమును నమ్మునట్లు మోసపోయి శిక్షావిధి పొందుటకు పోయెదరు.” ఇపుడు అదే—అదే పరిశుద్ధాత్మ చెప్పినది.

311 ఇపుడు, సంఘము యొక్క కోరిక ఈ రోజు అదే కదా? [సభ “ఆమేన్” అని చెప్పినది—సంపా.] ఇది చేయి, అది చేయి లేక మరొకటి చేయి అది ప్రజలకు నీవు చెప్పినయెడల వెంటనే వారు చెప్తారు, వారు మెథడిస్టు, ప్రెస్బిటేరియన్ లేక మరేదో అంటారు. “నీతో కలసి వచ్చుటకు వారు ఇష్టపడరు.” చూశారా, ఖచ్ఛితం. వారికది కావాలి.

312 మరియు దేవుడు చెప్పాడు, “వారికి అది కావాలంటే, వారు దానిప్రకారము ఉండనిమ్ము. అది సత్యమని నమ్మునట్లు, నేను వాస్తవంగా వారిని చేశాను. ’ఎందుకనగా సత్యమును గూర్చి భ్రష్టమనస్సు నేను వారికిచ్చాను”. ఇక్కడ బైబిల్ ఏమి చెప్తుందో చూడు. ఇంకా, “యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు వీరును సత్యమును గూర్చి చెడిన మనస్సు గలవారై మరియు వారు మన దేవుని కృపను తమ దురాశలకు వాడుకుంటారు, ప్రభువైన దేవుని నిరాకరిస్తారు.”

313 ఇపుడు అదెక్కడున్నది మీరు చూశారా; కథోలికుల్లో మాత్రమే కాదు, అయితే ప్రొటెస్టాంట్లో కూడా. అది అంతా. అది సర్వ ప్రపంచము నిర్మాణాత్మకమైనది. అది ఆ తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు. ఒక—ఒక—ఒక [తెల్లని] నీతియను సంఘముగా ఉన్నాడు. చూశారా, అయితే అది అంత్య క్రీస్తు. అది ఆ విధముగానే అగుపించవలసి యున్నది. ఒక గుఱ్ఱం మీద, చివరకు క్రీస్తు గుఱ్ఱం మీద వచ్చుచున్నట్టుగా. ఔనా? ఓ! వ్యతిరేకం, ఏర్పరచుకున్నవారిని మోసము చేయునంతగా ఎంతో సమీపము. అతడిక్కడున్నాడు. అతడు అంత్యక్రీస్తు.

314 అతడు మొదటి సంఘకాలములోనే స్వారీ చేయుటకు ప్రారంభించాడు. ప్రతి కాలములోను స్వారీ చేయుటకు ప్రారంభించాడు. ఇపుడు అతన్ని గమనించండి. మీరంటారు “వెనుక వెనుక అపొస్తలులు’ కాలంలోనా”. అక్కడ, అతడు “నీకోలాయితు”గా పిలువబడ్డాడు. తరువాత, తరువాత సంఘకాలంలో తరువాత అతడు “సిద్ధాంతమయ్యాడు,” సంఘములో, మొదటిగా అతడొక “మాట” గా యుండి తరువాత అది “సిద్ధాంతము” గా మారినది. అతడు మారాడు.

315 వినోదాలు ఆచరించు ప్రజలు, చక్కని వస్త్రములు ధరించువారు, గొప్ప విద్యావంతులు, కీర్తి ఘనతలు కోరువారు. సంఘములో అది కొనసాగించుటకు ఇష్టపడరు. లేదు. “పరిశుద్ధాత్మను గూర్చినదంతా వారికి అవసరం లేదు. సంఘముగా ఉంటే చాలు. మరియు, రోమ్ లోని నైసీయా సభ గుండా మనం వెళ్దాం అని అంటారు.” తరువాత వారు అక్కడకు వచ్చినపుడు, వారు సంఘమును తీసికొని, అన్యత్వమును తీసికొని, రోమన్ కథోలిక్ ను తీసుకొని…లేక అన్యుల అలవాట్లు తీసికొని, అన్య రోమ్ నుండి, కొన్ని మూఢాచారాలు తీసికొన్నారు. మరియు—అస్తారిశి “ఆకాశపు రాణి” తీసికొని తల్లియైన మరియగా మార్చారు. చనిపోయిన వారిలో నుండి విజ్ఞాపన చేయు వారిని తయారు చేశారు. మరియు గుండ్రని పలుచని రొట్టెను తీసుకొని, దానిని మరింత గుండ్రముగా చేసి, దానిని క్రీస్తు శరీరమని పిలిచారు. “ఎందుకనగా అది ఆకాశపు తల్లికిపోలిక” ఒక కథోలిక్ వెళ్తునప్పుడు అతనికతనే దాటి వెళ్తాడు, ఎందుకనగా అక్కడ వెలుగుచున్న దీపములు యాజకుని యొక్క శక్తి వలన అక్కడున్న పలుచని రొట్టెలు దేవునిగా భావించును. లోకంలో అదేమిలేదు. గానీ అది కేవలం విశదముగానున్న అన్యత్వము మాత్రమే చూశారా? అది నిజం

316 వెంటనే నాకర్థం కాలేదు, సరే, అవును. నాకర్థమైంది. అవునండి. దేవుని కృపద్వారా అది నాకు అర్థమైంది. నిజం.

317 ఇప్పుడు గమనించు ఓ, మై. వారెట్లు దానిని చేయగలరు? చూశారా? మరియు వారి కోర్కెలను వారిచ్చారు. లేదు. అది నిజము. అది వారు చేయనవసరం లేదు. లేదండి. నీవు అది చేయనవసరం లేదంటె, నీవది బలవంతంగా చేయనవసరం లేదు. దేవుడు జీవించే మార్గములో, ఆరాధన, మొదలగు వాటితో నీవు సమతూగకూడదనుకుంటే, నీవు అది చేయనవసరం లేదు. అది ఎవరూ చేయాలని దేవుడు కోరడు.

318 ఒక విషయం నీకు చెప్పనివ్వు, జగత్తుకు పునాది వేయబడకముందే గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథముందు నీ పేరు పెట్టబడినట్లైతే, అది చేయుటకు నీవెంతో సంతోషిస్తావు. అది చేయుటకు ఒక్క నిముషము ఆగవు.

319 ఇక్కడ చూడు. “నేను భక్తిగలవాడను గనుక నాకు అర్థమగునని అనుకొనుచున్నాను” అని చెప్తావు. సరే. అది సత్యం కావచ్చు.

320 చూడు, ప్రభువైన యేసు దినాలలో ఆ యాజకులు భక్తిగలవారు కారని ఎవరు చెప్పగలరు? అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు భక్తిగలవారు కారని ఎవరు చెప్పగలరు? చివరకు వారు…

“అనేకసార్లు దేవుడు నన్ను దీవించాడు!”

321 అవును. వారికి కూడా. వారి జీవనోపాధి కోసం వారు పనిచేయలేదు కూడా. ఆకాశము నుండి ఆయన వారిని పోషించాడు. యేసు చెప్పాడు, “వారు ప్రతి యొక్కరు నశించారు.”

322 “మా పితరులు” వారడిగారు, “నలభై సంవత్సరాలు అరణ్యములో మన్నాను తిన్నారు.”

323 యేసు చెప్పాడు “వారిలో ప్రతియొక్కరు చనిపోయారు. నిరంతరముగా వేరై పోయారు.” అవునా? ఆయన చెప్పాడు, “పరలోకము నుండి దేవుని యొద్దనుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారము తినువాడు, అతడెన్నడు చనిపోడు.” చూశారా? జీవవృక్షము ఆయనే.

324 ఎప్పుడు, ఏ విధముగా యేసు వచ్చునని గమనించండి. అక్కడు వచ్చిన, ఆ యాజకులు, చాలా భక్తిగలవారు. అబ్బాయ్! వారు మంచివారు కాదని ఎవరు చెప్పలేరు. మై! ఆ ధర్మశాస్త్రము యొక్క బాటలో వారు నడుచుచు, సంఘము ఏం చెప్పిందో, అది వారు చేశారు. వారు చేయకపోతే, వారు రాళ్ళతో కొట్టబడతారు. కాబట్టి ఆయన బయటకు నడిచి…యేసు, వారిని ఏమని పిలిచాడో తెలుసా? యోహాను వారిని పిలిచాడు “గడ్డిలోని సర్పములారా! మీరు సంస్థకు సంబంధించిన వారనుకుంటున్నారా, దేవునితో ఎటువంటి సంబంధం మీకున్నదా.” యేసు అన్నాడు “మీరు మీ తండ్రియైన అపవాది సంబంధులు,” అన్నాడు, “ప్రతిసారి దేవుడు ప్రవక్తను పంపునప్పుడెల్ల ఏమి జరుగుతుంది? మీరు అతనిపై రాళ్ళు వేసి, సమాధిలో పెడుతున్నారు. ఇప్పుడు మీరక్కడకు వెళ్ళి అతని సమాధిని అలంకరిస్తున్నారు.”

325 కథోలిక్ సంఘము చేసినది అదే పని కాదా? జోన్ ఆఫ్ ఆర్క్, సెయింట్ పేట్రిక్, వారిలో మిగతా వారిని చూడు. వారిని లోపల పెట్టిన వారు వారే. అటు తరువాత జోన్ ఆఫ్ ఆర్క్ శరీరమును త్రవ్వి పైకి తీసి నదిలో పడవేశారు రెండువందల సంవత్సరాల తరువాత. మంత్రగత్తె అని కాల్చి చంపారు.

326 “మీరు మీ తండ్రియైన అపవాది సంబంధులు. మరియు అతని కార్యములు చేయుచున్నారు.” అది ఖచ్చితం. ఇది ప్రపంచమంతటికి వెళ్తుంది. అవును? సరే. అది యేసు చెప్పినది.

327 ఆ తెల్లని గుఱ్ఱము చాలా చక్కగా ఉన్నదని, బాగున్నది మీరు అనుకుంటున్నారా. అయితే మీరేమి స్వీకరించారో అది చూడండి. అది స్వారీచేయునది ఖచ్చితంగా అదే. ఇప్పుడు, అయితే అది వారికి కావలెనని ఆయన చెప్పుచున్నాడు, కాబట్టి బలమైన మోసమునకు అప్పజెప్పును.

328 జ్ఞప్తించుకోండి, ప్రకటన 17లోని ఈ వేశ్య, ఆమె మర్మము, “ఇది మర్మమగు బబులోను, వేశ్యలకు తల్లి.” యోహాను అద్భుతపడుచున్నాడు. ఈ మనుష్యుని వలె…మనం ఇక్కడకు వచ్చి అతనిని కనిపెడదాం. ఇక్కడ ఈ గుఱ్ఱాన్ని గమనిద్దాం. చూడండి, అయితే మీరది గమనిస్తే అక్కడ సంభవించినదేమనగా “అతడు ఆమెను చూచి బహుగా ఆశ్చర్యపడ్డాడు.” అయితే మర్మమేదనగా “క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తము ఆమె త్రాగినది,” ఊదా రంగుతోను, బంగారము తోను అలంకరించబడిన అందమైన సంఘము అక్కడ ఉండెను. “ఆమె యొక్క వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మతో కూడిన ఒక పాత్ర ఆమె చేతిలో ఉన్నది.”

329 జారత్వమనగా ఏమిటి? అది అవినీతి కార్యము. ఆమె ఇచ్చుచున్న సిద్ధాంతమదే. దేవుని యొక్క వాక్యమును తీసికొని, దానిని నిరూపయోగము చేసి, “ధన్యురాలగు మరియ,” అను కొన్నిటి ద్వారా నిరుపయోగం చేసి వదిలిపెట్టుట. “భూ రాజులు ఆమెతో వ్యభిచరించారు.”

“మంచిది,” “అది కథోలిక్ సంఘము” అని మీరు చెప్తారా?

330 అయితే ఆమె “వేశ్యలకు తల్లి,” చూశారా. ఆమె అదే. అక్కడ నీవున్నావు.

331 ఏం జరిగినది? ఒక సంస్కర్త చనిపోయినపుడు మరియు అతని వర్తమానము చనిపోయినపుడు మీరు…మీరు దానిని నిర్మాణాత్మకము చేశారు. మరియు “రిక్కీల” గుంపును అక్కడయుంచారు. మీ ఇష్టమొచ్చినట్లు జీవించుటకు వాక్యముతో నిలబడరు. వాక్యముతో ముందుకు వెళ్ళుటకు బదులు “ఇది అదే యని” అక్కడ వారు నిలబడతారు. ఊహు! నీవది చేయరాదు.

ఆయన అది. చూశారా, అక్కడ ఆయన!

332 గమనించు. అదొక విషయం. ముగించక ముందు, ఇంకా రెండు కార్యములు తాకుదాం.

333 వాడు దానియేలు యొక్క ప్రజలను నాశనం చేసిన అధిపతి. మీరు అది నమ్ముతున్నారా? కొద్ది నిమిషములు మీరు నాతోయుండి సహకరించిన యెడల నేను ఇది చేయబోతున్నాను. నేను—నేను ఎంత త్వరగా చేయవలెనో అంత త్వరగా చేస్తాను. అయితే, నేనది ఖచ్చితంగా చేయవలెను. ’కారణం నేను…నేనిక్కడ నిలబడియుండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా పరిశుద్ధాత్మ అది నాకు ఇచ్చును. చూశారా? చూశారా?

334 ఇప్పుడు చూడు, ఒక్క నిముషం. తిరిగి దానియేలుకు వెళ్ళి తీద్దాం. నేనొకటి మీకు చదవాలని కోరుతున్నాను, మీరు త్రిప్పకపోయినా పరవాలేదు. దానియేలు 9, దానియేలు 9 నేను చదవాలని ఆశిస్తున్నాను. దానియేలు 9, 26, 27 వచనాలు నేను చదువుతాను. మరియు గమనించండి, దానియేలు ప్రజలను నాశనము చేయునది అతడైనట్లయితే అతడేమి చేయబోతున్నాడో

ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషక్తుడు నిర్మూలము చేయబడును…

335 చూశారా, డెబ్బది వారములలో నుండి అరవది రెండు వారములలో ఆయన నిర్మూలము చేయబడును.

…తన కొరకు: వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును (అది ఇక్కడ ఆచార్యాధిపత్యము) పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వారి అంతము హఠాత్తుగా వచ్చును (అది వచ్చును). మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను.

336 ప్రజలైన మిమ్ములను నేనొకటి అడగాలనుకుంటున్నాను. భూమి మీద క్రీస్తు కొట్టివేయబడిన తరువాత, ఆయన యొక్క మూడున్నర సంవత్సర పరిచర్య కాలంలో, దేవాలయమును ఏది నాశనం చేసింది? ఎవరు దానిని నాశనం చేశారు? రోమ్. నిశ్చయం. కాన్ స్టాన్ టైన్ లేక…కాదు. నన్ను క్షమించండి. టైటస్, రోమా సైన్యాధిపతి. అధిపతిని అతడు నిర్మూలము చేశాడు. ఇప్పుడు గమనించుడి.

వీరిని గమనించుడి. అతడు ఈ గోడ వరకు వచ్చియున్నాడు.

337 యేసు జన్మించినపుడు పరలోకమందున్న ఎఱ్ఱని మహా ఘటసర్పము అది శిశువును కనగానే మ్రింగవలెనని ఆ స్త్రీ యెదుట నిలబడియున్నది. అవునా? [సభ “ఆమేన్,” అని చెప్పిరి—సంపా.] అది జన్మించగానే, శిశువును మ్రింగివేయుటకు ప్రయత్నించినది ఎవరు అది? [“రోమ్.”] రోమ్, చూశారా? అక్కడ ఎఱ్ఱని ఘట సర్పమున్నది. ఇక్కడ మీ అధిపతి ఉన్నాడు. ఇక్కడ మీ మృగము ఉన్నాడు. చూశారా? వారక్కడ ఉన్నారు. వారిలో ప్రతియొక్కరు, ఒకే విధముగా, చూశారా, “శిశువును మ్రింగివేయుటకు.” దేవుడు ఆ శిశువును పరలోకమునకు తీసికొని వెళ్ళి ఆయన సింహాసనముపై కూర్చుండబెట్టాడు. నిర్ణయకాలము వచ్చు వరకు క్రీస్తు అక్కడ ఉన్నాడు. చూశారా? ఇప్పుడు అతడేమి చేయునో గమనించండి.

338 ఇప్పుడు, ఓ, ఇక్కడ నేను ఒకరితో మాట్లాడుతున్నాను, దీనిని గూర్చి ఈ రోజు సహోదరుడు రాబన్ సన్, లేక ఇంకొకరితో నేను మాట్లాడుతున్నది; ఇక్కడ దీనిని గురించి కాదు, అయితే ఆలాటి విషయమే. దానిని గూర్చి, కొంచెం కాలం క్రితం ఇక్కడ నేను బోధించాను. ఈ ద్రవ్య సంబంధమైన దాని మీద ఈ సంయుక్త రాష్ట్రాలకు ఏం సంభవిస్తుందని. చూశారా. సరే. ఇప్పటి నుండి నలభై సంవత్సరముల వరకు చెల్లించవలసిన అప్పులపై పన్నులు ఇప్పడు మనం చెల్లిస్తున్నాము. అంతవరకు మనము వెనుకబడియున్నాము. వాషింగటన్ నుండి వచ్చు క్వయర్ లేక లైఫ్ లైన్ ఎప్పుడైనా మీరు విన్నారా? ఎందుకని మనం సంపూర్తిగా మునిగిపోయియున్నాము. అది అంతే.

339 కారణమేంటి? బంగారమంతా దాచిపెట్టబడినది. యూదుల యొద్ద బాండు పత్రాలున్నవి. అది రోమ్ యొద్దకు పోవును. ఇప్పుడు గమనించు, పెద్ద వ్యాపార సంస్థలు ఎవరియొద్దనున్నవో మనకు తెలుసు, అయితే రోమ్ ప్రపంచములోని సంపదలో అధిక భాగము కల్గియున్నది. మిగతాది యూదుల యొద్దనున్నది. ఇప్పుడు దీనిని గమనించండి. ఇది వినుడి. ఏ విధంగా పరిశుద్ధాత్మ నాకై దీనిని బయటకు తెచ్చెనో వినుడి.

అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; (ఇప్పుడు గమనించుడి) అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును,…హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును.

340 గమనించు! ఓ! ఎటువంటి బుద్ధి కుశలత కల్గిన కార్యము అతడు చేశాడు. ఇక్కడే అతడున్నాడు. మన పఠనమును మనము తీసికొని అతడు రోమ్ అని తెలుసుకున్నాము. మనము, అతడు తెల్లని గుఱ్ఱము మీద స్వారీచేయువాడని మనము తెలుసుకున్నాము. మనము, ఒక సిద్ధాంతముగా అతడు వెళ్ళియుండెనని మనము తెలుసుకున్నాము. అటు తరువాత అన్య రోమ్ ఏమైయుండెను? అది పోప్ రోమ్ గా మార్చబడి కిరీటము పొందుకున్నది.

341 ఇప్పుడు గమనించు, “అంత్యకాలములో”, క్రీస్తు బోధించిన ఆరంభకాలములో కాదు, గానీ “అంత్యకాలములో,” వారము యొక్క చివర భాగమున. అక్కడే మనం దానియేలు డెబ్బది వారములు తీసుకున్నాము. మరియు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు ప్రవచించాడు. ఇంకా మూడున్నర సంవత్సరము నిర్ణయింపబడియున్నవి. అవునా? [సభ “ఆమేన్,” అని చెప్పినది—సంపా.] ఆ సమయములో ఈ అధిపతి దానియేలు ప్రజలతో, అనగా యూదులతో నిబంధన చేయును.

ఇప్పుడు పెండ్లికుమార్తె ఎత్తబడిన తరువాత జరుగును. ఆమె అది చూడదు.

342 గమనించండి. దానియేలు యొక్క చివరి అర్థవార భాగమున, ప్రజలు నిబంధన చేస్తారు. ఈ అధిపతి రోమ్ తో నిబంధన చేయును. వారితో నిబంధన చేయును. నిస్సందేహముగా ఆర్థిక సంపద కొరకు, ఎందుకనగా కథోలిక్కులు, యూదులు ప్రపంచ సంపదను కల్గియుంటారు.

343 నేను వాటికన్ లో ఉంటిని. నేను ముక్కోణపు కిరీటము చూశాను. పోపుతో సమాలోచన చేయవలసియుండెను. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు బారన్ వాన్ జోంబెర్గ్ ఏర్పాట్లు చేశాడు.

344 వారు, నన్ను రాజునొద్దకు తీసికొని వెళ్ళినపుడు, నా ట్రౌజర్ యొక్క మడత అంచును తీసి వేశారు. అంతే వెనుకకు తిరుగకుండ అతని యొద్ద నుండి వెళ్ళమన్నారు, అంతే.

అయితే నేనడిగాను, “ఇతని ఎదుట నేనేమి చేయాలి?” అని.

345 చెప్పారు, “సరే, నీవు వెళ్ళి, ఒక మోకాలు మీదన మోకరించి అతని వ్రేలిని ముద్దుపెట్టుకో.”

346 నేను చెప్పాను, “అది జరగదు. అది జరగదు. లేదండి” నేను చెప్పాను, “ఎవరైనను సహోదరుడుగా ఉండకోరిన యెడల, వారెవరైనను సరే, వారిని నేను సహోదరుడా అని పిలుస్తాను. ఎవరైనను రెవరెండు అని పిలుచుకొనుటకు ఆశించినయెడల, అతని ఆ విధముగా పిలుస్తాను. అయితే, మనుష్యుని ఆరాధించుట, అదంతా యేసుక్రీస్తుకే చెందుతుంది” అవునా. కాదు, కాదండి. ఆలాగు మనుష్యుని చేతిని, ముద్దుపెట్టుకొనుట కాదు. ఏ మాత్రము కాదు. కనుక నేనది చేయలేదు.

347 అయితే, నేను వాటికన్ అంతా వెళ్ళవలసియుండెను ఎందుకని? నీవు దానిని నూరు బిలియన్లు బిలియన్లతో కొనలేవు. సరే నీవు…మరి ఆలోచన చేయ్, “లోకము యొక్క సంపద” బైబిలు చెప్తుంది “ఆమె యొద్ద ఉన్నది.” ఓ! గొప్ప స్థలాలను గూర్చి ఆలోచించు బిలియన్ రెట్లు…

348 ఎందుకు రష్యాలో కమ్యూనిజం పుట్టినది? అనేకమంది ప్రసంగీకులు కమ్యూనిజంను గూర్చి కేకలు వేస్తుంటే, అది నా కడుపులో త్రిప్పినట్లయితే, వారెందుకు అరుస్తున్నారో కూడా వారికి తెలియదు. అవును. కమ్యూనిజం ఏమి లేదు. భక్తుల రక్తము నిమిత్తమై భూమి పైన పగ తీర్చుకొను దేవుని చేతిలో సాధనము. అవునది వాస్తవం.

349 మరియు సంఘము కొనిపోబడిన తరువాత రోమ్ మరియు యూదులు ఒకరితో ఒకరు నిబంధన చేసికుంటారు. పరిశుద్ధులతో వారు ఆ విధముగా నిబంధన చేసికుంటారని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ఇప్పుడు గమనించుడి. వారు ఆ విధముగా (ఎందువలన) ఈ దేశము దివాలు తీయబోతుంది. మిగతా ప్రపంచము యొక్క బంగారపు ధర కూలిపోతుంది. మీకు తెలుసా అది. మనము ఇప్పటినుండి నలభై సంవత్సరముల పన్నులు బిల్లులు వసూలు చేసినయెడల మనమెక్కడయున్నాము?

350 ఒక విషయం జరుగగలదు. అదేదనగా ద్రవ్యమును తీసికొని పత్రములు చెల్లించవచ్చును. మనమది చేయుటకు వీలుపడదు. వాల్ స్ట్రీట్ వాటిని స్వంతం చేసికున్నది. మరియు వాల్ స్ట్రీట్ యూదుల ఆధీనంలోనున్నది. మిగతాది వాటికన్ లో ఉన్నది. మిగతాది యూదుల యొద్ద వాల్ స్ట్రీట్లో ఉన్నది. ప్రపంచం యొక్క వ్యాపారంతో ఉన్నది. మనం ఆ విధంగా చేయలేము.

351 వారది చేయగల్గితే, మీరనుకుంటున్నారా…ఈ యొక్క విస్కీ వ్యాపారులు, ఆ యొక్క పొగాకు వ్యాపారులు, మరియు వారు ఒక సంవత్సరమునకు కోట్ల కొలది కోట్ల కొలది డాలర్లు అసభ్యమైన చిత్రములు తీయుట ద్వారా ఆదాయపు పన్నును ఎగవేస్తారు. అక్కడకు ఆరిజోనాకు వెళ్ళిపోయి లక్షల కొలది ఎకరాలు కొంటారు. పెద్ద బావులను త్రవ్వుతారు ఏభై వేల డాలర్లుకు. వారి ఆదాయపు పన్నులో సరిచేస్తారు. నీవు, నీది చెల్లించకపోతే వారు నిన్ను ఖైదీలో పెడతారు. అయితే వారు అది ఆదాయపు పన్నును చెల్లింపక త్రవ్విన బావులను పేల్చివేసి బుల్డోజర్స్ తో మూసివేస్తారు. మరియు వారేమి చేస్తారు? వారు సంపాదించిన డబ్బుతో గృహనిర్మాణ పనులు అక్కడ పెడతారు. ఒక పెట్టుబడి పెడతారు. గృహ నిర్మాణాలు, ప్రణాళికలు పెట్టి మిలియన్ల డాలర్లకు వాటిని అమ్ముతారు. వారు కరెన్సీ మార్చుటకు రాజీపడతారని మీరు అనుకుంటున్నారా?

352 ఇక్కడున్న ఈ చిన్న వ్యక్తి…అతని పేరు? కాస్ట్రో చేశాడు. అతడు ఎన్నడూ చేయని తెలివైన కార్యము చేశాడు. అటు తరువాత ద్రవ్యము చెల్లించి పత్రములు తీసికొని వాటిని నాశనము చేశాడు.

353 గమనించు. అయితే మనమది చేయలేము. వీరు దానిని అనుమతించరు, ప్రపంచములోని ధనికులైన వర్తకులు దానిని తట్టుకుంటారు.

354 ఒకటి మాత్రం చేయవలసియున్నది, కథోలిక్ సంఘము దానిని చెల్లించగలదు. డబ్బును కల్గియున్నది ఆమె యొద్ద మాత్రమే. ఆమె చేయగలదు. ఆమె చేస్తుంది. ఇది చేయుట కొరకు, అది పొందుకొనుటకు, యూదులతో ఆమె రాజీపడుతుంది, నిబంధన చేయుటకై యూదులతో ఈ నిబంధన ఆమె చేసినపుడు…జ్ఞప్తించుకోండి, ఇప్పుడు నేను లేఖనము నుండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆమె ఇది చేసినపుడు, ఈ నిబంధన చేసినపుడు, దానియేలు 8:23 మరియు 25, లో మనం గమనిస్తున్నాము. “అతడు వర్థిల్లజేయు ఉత్పత్తులను చేయును.” మరియు ఉత్పత్తి అని అర్థం. “అతని చేతిలో,” అతడు ఈ నిబంధనను యూదులతో చేయును.

355 మరియు, ఈ మూడున్నర సంవత్సరాల మధ్యలో, విషయమంతా చేరవేసుకున్న తరువాత యూదుల డబ్బంత చేరవేసుకున్న తరువాత, తన నిబంధనను తెంచివేయును మరియు అతడది చేసినపుడు…ఓ, మై! ఓ మై.

356 సంఘకాలము యొక్క ముగింపు వరకు ఇతడు అంత్యక్రీస్తుగా పిలువబడుచున్నాడు. ఎందుకనగా అతడు…అతడు మరియు అతని యొక్క పిల్లలు క్రీస్తుకు, వాక్యమునకు విరోధము. ఈ మనుష్యుడు అంత్యక్రీస్తుగా పిలువబడుచున్నాడు.

357 ఇప్పుడు, డబ్బును అతడు పట్టుకోబోతున్నాడు. అది వచ్చునని అక్కడే నేను నమ్ముతున్నాను. ఒక్క నిముషం, నేనిది చెప్పి, తరువాత దాని కొరకై ఒక నిముషములో వెనుకకు వెళ్తాను.

358 అతడు అంత్యక్రీస్తని పిలువబడును మరియు అంత్యక్రీస్తని పిలువబడతాడు చివరి కాలములో దేవుని దృష్టిలో, ఇప్పుడు, అయితే అటు పిదప మరొకటిగా పిలువబడతాడు.

359 ధనమంతా తన స్వాధీనములోనికి తీసుకొనునపుడు, దానియేలు చేయునని ఇక్కడ చెప్పినట్లు “అప్పుడు అతడు యూదులతో చేసిన నిబంధనను తెగతెంచుకొనును.” దానియేలు యొక్క “డెబ్బది వారముల ఆఖరి సగము యొక్క మధ్యలో.” మరియు, అటు తరువాత, సహోదరుడా, అతడేమి చేస్తాడు? అతని చేతిలో ప్రపంచ వ్యాపారము? వాణిజ్యము ఉండును, ప్రపంచంతో ఒక ఒప్పందం కుదుర్చుకొనుచు ఎందుకనగా ప్రపంచపు సంపదయంతా పూర్తిగా అతని స్వాధీనంలో ఉండును. ఆ సమయంలో ఆ ఇద్దరు ప్రవక్తలు రంగము మీదికి లేచి ఆ లక్షానలభై నాలుగు వేలమందిని పిలుస్తారు. తరువాత ఏమి జరుగుతుంది? అప్పుడు ప్రకటన 13లోని మృగము యొక్క ముద్ర స్థిరపడును. కారణం సమస్త వ్యాపారము, వాణిజ్యము, ప్రపంచములోని సమస్తమును తన వశముననుంచుకొనును. అప్పుడేమి జరుగును? మృగము యొక్క ముద్ర వచ్చును, “ఏ మనుష్యుడు ఏదియు అమ్మలేడు లేక కొనలేడు, మృగము యొక్క ముద్ర అతనికి లేకుండ.” [సహోదరుడు బ్రాన్హాం గారు ప్రసంగ వేదికను మూడుసార్లు తట్టెను—సంపా.]

360 దేవునికి ధన్యవాదములు, సంఘము మూడున్నర సంవత్సరము ఆ గొప్ప మహిమలో సంతోషించుచుండెదరు, అందులో నుండి వెళ్ళనవసరం లేదు.

361 ఇప్పుడు గమనించు, అంత్యకాలంలో, సంఘకాలము యొక్క అంతములో ఇప్పుడు, అతడు పిలువబడును…అతడు, అతని యొక్క సంతానము అంత్యక్రీస్తు అని పిలువబడుదురు. ఎందుకనగా క్రీస్తుకు విరోధమైనదేదైనను అది అంత్యక్రీస్తు. వాక్యమునకు వ్యతిరేకమైనదేదైనను క్రీస్తుకు విరోధమైనదే. ఎందుకనగా క్రీస్తు వాక్యమైయున్నాడు. ఇప్పుడు అతడు అంత్యక్రీస్తు.

362 అటు తరువాత ప్రకటన 12:7-9లో, నేరము మోపువాడైన సాతాను బయటకు వెళ్ళగొట్టబడినపుడు. మీరు దానిని గుర్తుపెట్టుకుంటారా, కారణం అది నేను చదవాలని కోరుతున్నాను. ఇప్పుడు మనకు సమయం లేదు. ఇది ముగింపు. పదికి ఇరవై పదిహేను నిముషాలు. చూశారా. అయితే, ప్రకటన 12:7-9లో “సాతాను,” ఆత్మ “దయ్యం” ఇప్పుడు పైనున్నాడు “మన సహోదరుల మీద నేరము మోపువాడు.” అవును.

363 సంఘము ఎత్తబడుతుంది మరియు సాతాను బయటకు త్రోసివేయబడును. సంఘము పైకి వెళ్ళినపుడు, సాతాను క్రిందికి వచ్చును. అప్పుడు సాతాను అంత్యక్రీస్తులోకి వెళ్ళి అవతారమెత్తును, అది “మృగమని” పిలువబడును. అటు తరువాత ప్రకటన 13, అతడు ముద్రవేయును. చూశారా?

364 “అడ్డగించుచున్నవాడు మాత్రమే,” ఇప్పుడు భూమి మీద క్రైస్తవ్యము మాత్రమే పవిత్రముగానున్నది, ఎందుకనగా “అడ్డగించువాడు అడ్డగించు వరకు.”

365 ఇక్కడ వెనుక థెస్సలోనికయిలోనిది జ్ఞప్తించుకోండి “దేవుని ఆలయములో తానే దేవుడనని పిలచుకొనుచు, భూమి మీద పాపములు క్షమిస్తు కూర్చొనియున్నాడు.” మరియు అదంతా ఆ విధముగానే కొనసాగును, “మరియు అక్రమము విస్తరించును.” ఎందుకనగా అది తెలియబడదు, అయినను అతడు బయలుపడు సమయము రాలేదు కనుక అదెవరికి తెలియదు.

366 మరియు అటు తరువాత సంఘము ఎత్తబడును. ఓ, మై. “సంఘము, గొప్ప సంఘము ఆ విధముగా,” ఇప్పుడు “మృగముగా” మారును. ఊహు. ప్రజలు అది చూడాలని కోరుచున్నాను.

367 ఇప్పుడు జ్ఞప్తించుకోండి అంత్యక్రీస్తు మరియు మృగము ఒకే ఆత్మ. త్రిత్వమున్నది. అవునండి. అది ఒకే దయ్యము శక్తి యొక్క మూడు దశలు. జ్ఞప్తించుకో, నీకొలాయితును. గమనిస్తున్నారా. అది కిరీటధారికాక మునుపు అది అవతారమెత్తవలసియున్నది. చూశారా? ఇప్పుడు ఈ మూడు దశలు గమనించు. మొదటి దశ, క్రీస్తు విరోధిగా పిలువబడుచుండెను; రెండవ దశ అబద్ధ ప్రవక్తగా పిలువబడెను; మూడవ దశ అతడు మృగముగా పిలువబడుచున్నాడు.

368 నీకొలాయితుల, గమనించు. క్రీస్తు విరోధి బోధ, వాక్యమునకు విరుద్ధమైనది క్రీస్తు విరోధి పౌలు దినాలలో ప్రారంభమాయెను.

369 తరువాత, అతడు అబద్ధ ప్రవక్తగా పిలువబడుచున్నాడు. అది బోధ మానవుడయ్యాడు. కథోలిక్ సంఘము యొక్క ఆచార్యాధిపత్యము యొక్క బోధకు ప్రవక్త అయ్యాడు. అబద్ధ వాక్యమునకు ప్రవక్త పోప్. అది అతనిని అబద్ధ ప్రవక్తగా చేసినది.

370 మూడవ దశ మృగము. కడవరి దినములలో కిరీటము ధరించిన ఒక మనిషి. అన్య రోమ్ కల్గియున్న సమస్త శక్తిని కల్గియున్నాడు, ఎందుకనగా ఏడు తలలు గల మృగము, ఘటసర్పము పరలోకము నుండి పడద్రోయబడెను, వచ్చి అబద్ధ ప్రవక్తగా అవతారమొందెను. అది, అక్కడయున్నది; ఏడు కిరీటములు ధరించియుండెను. అతడు భూమి మీదను సముద్రము మీదను పడద్రోయబడ్డాడు.

371 సరే మనమేమి చెప్తున్నాము? ఈ స్వారీ చేయువాడు, ఈ గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు ఎవరు? అదేమిటో మీకు తెలుసా? అది సాతాను యొక్క అధికుడైన మానవుడు.

372 గతరాత్రి నేను వెళ్ళాను. ఇప్పుడు కూర్చున్న ఇద్దరు సహోదరులు; అక్కడ వెనుక సహోదరుడు నార్మన్ మరియు సహోదరుడు ఫ్రెడ్. అంత్యక్రీస్తును గూర్చి బోధిస్తున్నది వినుటకు మేమక్కడయున్నాము. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిలోనున్న బాగుగా బోధించే ఒకరు. అంత్యక్రీస్తుని గూర్చిన అతని అనువాదమేదనగా, “వారు ఒక విధమైన విటమిన్ ను మానవుని నుండి తీసి—ఈ జీవమును పెద్ద ప్రతిమలోకి మారుస్తారు…అది ఒక్కసారే ఒక నగరములోకి అడుగుపెట్టును…” పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనిషి ఆలాటి భ్రమతో లేక అలా చెప్పగలడా?

373 ఎవరు అంత్యక్రీస్తు అని ఇక్కడ బైబిలు చెప్తుంది, అది కాదు…అది మానవుడు. ఈ స్వారీచేయువాడు సాతాను యొక్క అధికుడైన మానవుడు తప్ప ఇంకొకరు కాదు. అవతారమెత్తిన దయ్యం, అతడొక విద్యావంతుడైన మేథావి, మీరు మీ చెవులు తెరచుకున్నారని అనుకుంటాను. కొంచెం కాలం క్రితమే అతని బిడ్డలలో ఒక్కరిని ప్రెసిడెంటుగా పాలన చేయుటకు ఎదుటవానికున్న మేథస్సుగలవాడా కాదా అని చూచుటకు టెలివిజన్ మీద ప్రసారం చేయుటకు ప్రయత్నించారు. అవునా? అయితే, అతనికి అధికమైన తెలివితేటలు గలవు; సాతానుకు అంతే. అతడు అది అమ్ముటకు ప్రయత్నిస్తున్నాడు. అతడు హవ్వకు అమ్మాడు. అతడు మనకు అమ్మాడు. మన అతీతమైన మానవుని కోరుచున్నాము. మనము అది పొందియున్నాము. సరే. ప్రపంచం మొత్తము అతీతమైన మానవుని కోరుచున్నది. వారు దాన్ని పొందుకుంటారు. సంఘము కొనిపోబడు వరకు ఆగు, మరియు సాతాను వెళ్ళగొట్టబడుతుంది; అతడు అవతారమెత్తును, అవును. పనిని నిజముగా నిర్వర్తించు ఒకరు వారికి కావాలి. అతడు అది చేస్తాడు.

374 విద్యావంతుడు! ఇదియొక…విద్యతోను, జ్ఞానముతోను, తన స్వంత మాటలతో కూడిన సంఘ వేదాంతముతోను, తన్ను స్వంతగా తయారుచేసుకున్న దానితోనున్న అతీత మానవుడు సాతాను. ప్రజలను మోసపరచుటకై తన యొక్క తెల్లని సంఘశాఖ గుఱ్ఱంపైన స్వారీచేయును. లోకములోని అన్ని మతాలను అతడు జయించును. ఎందుకనగా అవన్నీ సంఘముల సమాఖ్యలోకి, ప్రపంచము సంఘముల సమాఖ్యలోకి వెళ్ళనైయున్నవి. వారి భవనాలు ఎప్పుడో నిర్మాణమైయున్నవి. ప్రతీది సిద్ధముగా ఉన్నది. ఏదీ మిగిలియుండలేదు. ప్రతి యొక్క సంఘశాఖ దానిలోకి విలీనమైపోయినది. సంఘముల సమాఖ్యలోకి. దానిని ఏది బలపరస్తుంది? రోమ్. మరియు “మనమందరము ఒక్కటే, మనము ఏకమౌదాము ఒక్కటిగా నడుద్దాం” అని పోప్ కేకవేయుచున్నాడు.

375 వీరు, సంపూర్ణ సువార్తను చెప్పు మీలో కొందరు, ఆలాటి అడుగును స్వీకరించుటకు ఆలాటి బోధలను వదులుకోవలసియుంటుంది. మీరేమి చేస్తారు? ఆ సంఘశాఖ సంగతిని చూచుటకు ఎంతో గ్రుడ్డివారుగా ఉన్నారు. మీరు సత్యమును తృణీకరించారు. సత్యము వారి యెదుట పెట్టబడింది. వారు—వారు దాని నుండి దూరంగా వెళ్ళిపోయి దానిని విడచిరి. ఇప్పుడు వారు “అసత్యమును నమ్మి శిక్షావిధి పొందునట్లు ఘోరమైన వంచనకు పాత్రులగుదురు.” అదేమైయుందో ఖచ్చితంగా అది అదే.

376 దానినంతటిని అంత్యక్రీస్తు తీసుకుంటాడు, బైబిలు చెప్తుంది, అదేమనగా “అతడు అందరిని మోసగించెను” అని. a, రెండు l “భూమిమీదనున్న అందరిని. జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేరులైతే ముద్రల క్రింద వ్రాయబడలేదో వారిని.” [సహోదరుడు బ్రాన్హాం తన చేతులు ఒక్కసారి కొట్టెను—సంపా.] హుం. అతడు చేశాడని బైబిలు చెప్తే, అతడు చేశాడు.

377 వారు చెప్తారు, “సరే, నేను దానికి చెందినవాడను…” అని. అక్కడే నువ్వున్నావు. ఆ, అది ఖచ్చితం, అది, ఆలాటి వేశ్యల పాఠశాల. అది అదే పద్ధతిలో ఆరంభమైనది. అది అంత్యక్రీస్తు, ఆలాగే కొనసాగుచున్నది.

378 దాని నుండి నేను వింటాను, అయితే…అది సత్యము. నేను ఎదురు చూచుచున్నాను. ఆమేన్.

379 ఇప్పుడు, గమనించండి, అతడు జయించును. మరియు ఇప్పటికే అతడు తన స్వాధీనమందంచుకొనియున్నాడు. అతడు మృగముగా మారక మునుపు అతడు ఇంకా అంత్యక్రీస్తుగా ఉన్నాడు. క్రూరమైన శిక్షను గురించి మీరు మాట్లాడుచున్నారా? మీరు కొద్దిగా నిదానించండి. [సహోదరుడు బ్రాన్హాం ప్రసంగ వేదికను నాలుగుసార్లు తట్టెను—సంపా.] వారిని గమనించండి, భూమిపై విడిచిపెట్టబడవలసిన వారు ఏ విధముగా వెళ్ళవలసినదో చూడండి. ఊ ఊ. “అక్కడ ఏడ్పు, రోదనయు పండ్లు కొరుకుటయు ఉండును. పెండ్లికుమార్తె ఎన్నికచేయబడి కొనిపోబడిన తరువాత, శ్రేష్టమైన స్త్రీ సంతానముతో యుద్ధము చేయుటకు, ఘట సర్పము, అనగా రోమ్ తన నోటి నుండి నీటిని చిమ్మును. ఘట సర్పము శేషముతో యుద్ధము చేయును. వారు లోపలకు వచ్చుటకు ఇష్టపడకపోయిరి మరియు వేటాడబడిరి.

380 సాధ్యమైతే, నిజమైన సంఘము దానిలోనుండి వెళ్ళును. అయితే మీరు చూడండి. క్రీస్తు కృపను బట్టి, ఈ రక్తము క్రింద వారున్నారు. ఏలాటి శ్రమలలోకి వారు వెళ్ళరు. వారికి శ్రమలకాలం ఉండదు, సంఘానికి తదుపరి విషయం ఎత్తబడుట. ఆమేన్ మరియు ఆమేన్! దేవునికి స్తోత్రము. ఓ! ఎంతగా నేనిది ప్రేమిస్తున్నాను.

381 నన్ను చెప్పనివ్వండి. అతడెటువంటి జయశాలి కాబోతున్నాడనియు, మరియు నిజముగా జయించుననియు మేము చెప్తున్నాము. అతడిది వరకే చేసియున్నాడు. అది ముందుగానే సిద్ధముగానున్నది. దానినంతటిని ఒక్కటిగా కూర్చుకొనుచున్నాడు. ధనముతో అసహ్యమైన సుఖభోగములతో. అది ఖచ్చితం. దేవుని కంటే ఎక్కువగా డబ్బును వారు ప్రేమిస్తారు. “ఇప్పుడు వారు ఆలోచన చేసినదంతా అతని యొద్ద ఎంత ధనమున్నది?” అదేమిటి?

382 అనేకసార్లు ఇలా చెప్పబడుతుంది మీకు తెలుసా? “సంఘమునకు ధనమివ్వండి ఆమె ప్రపంచమును విప్లవాత్మకముగా మార్చును; సంఘమునకు ధనమియ్యండి. ఆమె ప్రపంచమంతట సువార్తికులను పంపును. మరియు ఆమె ఏం చేస్తుంది? ఆమె క్రీస్తు కొరకు ప్రపంచమును జయించును.”

383 దీనుడైన నా గ్రుడ్డి స్నేహితుడా, నేను నీకొక విషయం చెప్పనివ్వు. ప్రపంచము డబ్బు ద్వారా జయించబడదు. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా. ధైర్యశాలులైన మనుష్యులను దేవునికి ఇవ్వు, ఆ వాక్యము మీద నిలబడతారు. బ్రతకటమా లేక చావటమా, జయిస్తారు. ఊహు. జయించుటకు ఒకే ఒక విషయము జగత్తుకు పునాది వేయబడక మునుపే ఎవరి పేరైతే గొఱ్ఱెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడియున్నవో వారు జయిస్తారు. వారు దానిని మాత్రమే వింటారు. ధనము ఏమి చేయలేదు. వారి యొక్క సంఘశాఖల ఆచారములలోకి దూరముగా వారిని పంపు.

384 మనం చూద్దాం. అవును. విద్యా మేథస్సుతో, అతడు, అతడు తెలివైనవాడు. మై, మై, మై! మరియు అతని చుట్టునున్న అతని బిడ్డలు తెలివైన వారౌతారు. పి.హెచ్.డి, ఎల్.ఎల్.డి డబుల్ యల్.డి, క్వూ.యస్.డి, ఎ.బి.సి.డి.ఇ,యఫ్ అక్కడ నుండి జడ్ వరకు. అదంతా వారికుంటుంది. ఎందుకని? అది సాతాను యొక్క క్రమము. బైబిలుకు వ్యతిరేకమైన ఎటువంటి తెలివియుక్తిగాని అది సాతానుకు సంబంధించినది.

385 అది ఖచ్చితంగా హవ్వ యొద్ద వినియోగించిన కార్యము. హవ్వ చెప్పినది, “ఓ, ఇలాగు వ్రాయబడియున్నది. అది చేయకూడదని దేవుడు మాకు చెప్పాడు.”

386 అతడు చెప్పాడు, “అయితే, ఆగు, నిజంగా దేవుడు అలాగు చేయడు. అయితే నేను మీ కన్నులు తెరచి కొంత జ్ఞానమిస్తాను,” దానినామె పొందుకున్నది.

387 మనమతనిని కోరుచున్నాము. మన మది పొందియున్నాము. ఈ దేశము కూడా. గమనించు, సర్వ ప్రపంచమును అతడు జయించును. అతడు జయించును. దానియేలు యొక్క ప్రజలతో ఒక నిబంధన చేయును. ఇక్కడే అదియున్నది. అన్యజనులలోను మరియు దానియేలు జనులలోను, ఆఖరి వారములలోనున్న యూదులలోనున్నది. మరియు మనము ఇక్కడయున్నాము. బోర్డులమీద కూడా గీయబడియున్నది. మీరది చూస్తున్నారు. సంపూర్తిగా అదెక్కడున్నదో అక్కడ. దేవునికి ధన్యవాదాలు. అతడక్కడ ఉన్నాడు. ఆ నిర్మాణాత్మక సంస్థ పద్ధతి దయ్యానికి సంబంధించినది. మరియు దానిపైన ఏలాటి రంధ్రాలు పొడవబడవు కూడా. చూశారా? ఖచ్చితం. అది దయ్యం యొక్క మార్గము. అది…

388 ఇప్పుడు, అక్కడున్న ప్రజలు కాదు. వారిలో అనేకులు దేవుని ప్రజలు. అయితే ఏంటో తెలుసా? మనం ఇచ్చటకు వచ్చు వరకు, ఈ బూరలు యొద్దకు మనము వచ్చు వరకు, తరువాత నేను వచ్చునప్పటికి ఈ బూరలు ఊదబడతవి. జ్ఞాపకముంచుకోండి, ఆఖరి దూత యొక్క…ఆ మూడవ దూత వచ్చి “నా ప్రజలారా, ఆమెలో నుండి బయటకు రండి” ఆ యొక్క దూత ఎగురుచున్నప్పుడు, ఇక్కడ ఆఖరి బూరకు, ఆఖరి దూత వర్తమానముకు, ఆఖరు ముద్ర తెరవబడుటకు వర్తమానం విడువబడునది అదే సమయము. అన్ని ఒకేసారి జరుగుతవి. అవునండి. అన్ని సమకూడి నిత్యత్వంలోకి వెళ్తవి.

389 ఇప్పుడేమిటి? అదే సమయంలో, ఇతడు జయించుచుండును…తరువాత నేను ముగిస్తాను. అప్పుడు దేవుడు ఒక కార్యమును చేయబోతున్నాడు. ఇక్కడ అంతా సాతానుకు యోగ్యత ఇయ్యకూడదు. అతన్ని గురించియే అంతా మాట్లాడకూడదు. చూశారా? ఈ గొప్ప విషయము అక్కడ జరుగుచుండగ, ఈ యొక్క సంస్థలలో ఈ గొప్ప పద్ధతి ఒక్కటిగా ఇమిడిపోవుచుండగా, ఐక్యమగుచుండగా, వారందరు వారికి వారు ఐక్యతగా కూడి కమ్యూనిజంకు వ్యతిరేకముగా ఎదురించి నిలిచెదరు, మరియు వారిని జయించుటకు దేవుడు కమ్యూనిజంను వారికి ఎదురుగా లేపునని వారికి తెలియదు. ఖచ్చితం.

390 రష్యాలో కమ్యూనిజం లేచుటకు ఏది—ఏది కారణము? రోమ్ సంఘము యొక్కయు మరియు మిగతా వాటి యొక్క అపవిత్రతయే కారణం. రష్యాలోనున్న డబ్బంతా వారు తీసికొని ప్రజలను ఆకలితో చంపారు. వారికేమి ఇవ్వలేదు. లోకం వలె జీవించారు.

391 కొంచెం కాలం క్రితం నేను మెక్సికోలోనున్నాను. బీదలైన చిన్న పిల్లలను చూశాను. ఏ యొక్క కథోలిక్ దేశము కూడా తనకు తాను పోషించుకొనలేదు. వాటిలో ఏ ఒక్కటి లేదు. ఎక్కడ అని నన్ను అడగండి. వారు ఎక్కడున్నారో నాకు చూపించండి. ఏ యొక్క కథోలిక్ పరిపాలనా దేశము కూడా స్వయం పోషకంగా లేదు. ఫ్రాన్స్, ఇటలీ, అవన్ని మెక్సికో, నీవెక్కడకు వెళ్ళినా, అవి స్వయం పోషకమైనవి కావు. ఎందుకని? వాటికున్నదంతా సంఘము తీసుకున్నది. ఆ కారణం చేత రష్యా, దానిని బయటకు నెట్టివేసినది. ఏం జరిగినదో గమనించుడి.

392 ఇది నాకు నేనుగా ఎరుగుదును. నేను ఇక్కడే నిలబడియున్నాను. స్వర్ణోత్సవమని మీరు అనుకుంటారు. గంటలు మ్రోగుట మీరు వింటారు. ఇక్కడొక పేద స్త్రీ, తన కాళ్ళు ఈడ్చుకుంటు వీధిలో వస్తుంది. మరియు ఒక తండ్రి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలను ఎత్తుకొని ఏడుస్తు వస్తున్నాడు. ఆమె, అక్కడున్న చనిపోయిన స్త్రీ యొద్ద పూసలు పట్టుకొని ప్రార్థిస్తు ఉన్నది. ఆమె…దాని ద్వారా ఆమె పరలోకానికి వెళ్తుందని తలంపు కల్గియున్నది. ఓ, ఎంతటి జాలిగల స్థితియది.

393 తరువాత, నేనక్కడ నిలబడి చూశాను. ఇక్కడ…వారియొక్క ఆర్థిక స్థితి చాలా దీన స్థితియందున్నది. వారికున్న దానినంత సంఘము తీసుకున్నది. ఇక్కడ, ఇక చిన్న పాంచో, బహుశా పాంచో అనగా ఫ్రాంక్ అని అర్థం. అతడు వచ్చాడు. అతడు ఇటుక మేస్త్రీ మరియు అతడు—అతడు ఇరువై పెసోస్ లు సంపాదిస్తాడు. అయితే ఆ మొత్తం ఇరవై పెసోస్ తీసికొని అతనికి ఒక జత చెప్పులు కొంటారు, అది వారి ఆర్థిక స్థితి. అయితే, ఇప్పుడు ఆలాగైనట్లయితే ఏంటి అతడు—అతడు, మేస్త్రీయైయుండి మరియు ఇటుకలు పెట్టువాడైయుండి, మరియు ఒక వారమునకు ఇరవై పెసోస్ లు సంపాదిస్తూ, అలా చెప్తున్నాను. నాకు తెలియదు ఎంత అతడు సంపాదిస్తున్నాడని. అయితే, సమానత గల ఒక ఆర్థిక పద్ధతి యని చెప్పుట. ఇప్పుడు గమనించు, ఒక వారమునకు అతడు ఇరవై పెసోస్ లు సంపాదిస్తే.

394 ఇక్కడ ఒక చీకో ఉన్నాడు. చూశారా, దాని అర్థం “చిన్నవాడు” అని అర్థం. అక్కడ అతడు వారమునకు సుమారు ఐదు పెసోస్ కు పని చేస్తాడు. అతను పోషించుటకు అతనికి పదిమంది పిల్లలున్నారు. అయితే, అయితే, అక్కడ ఒకరు తలుపు తడుతున్నారు [సహోదరుడు బ్రాన్హాం చాలాసార్లు వేదికను తట్టుచున్నారు—సంపా.] సుమారు ఐదు పెసోస్ లు లేక నాలుగు ఏలాగైనా తీసుకుంటానికి. దేనికనగా లక్షల విలువచేయు బంగారు బలిపీఠము పైన అతని పాపముల కొరకు క్రొవ్వొత్తి వెలిగించుటకు అక్కడే నీవున్నావు. అది వారి యొక్క ఆర్థిక స్థితి. ఆలాగుంటాయి. ఆదేశాలు.

395 అది దానినంతటిని తీసుకుంటుంది. సంఘము దానినంతటిని తీసుకుంటుంది. అది ఆమె హస్తాల్లో పెట్టుకుంటుంది. అంతే, మరియు ఆమె, యూదుల యొక్క ధనముతో ఆ నిబంధన ద్వారా, బైబిలు చెప్పినట్లు, వారు సమస్తమును తీసుకుంటారు.

396 మరియు అటు తరువాత అతడు మృగముగా మారుతాడు. అతని నిబంధన ఉల్లంఘించి దోచుకుంటాడు. అతడు శేషించిన స్త్రీ సంతానమును అతడు ఆ విధముగా చేయును. అతని నోట నుండి నీటిని చిమ్మి; యుద్ధము చేస్తాడు. అక్కడ ఏడ్పును, రోదన, పండ్లుకొరుకుటయుండును.

397 మరియు, అదే సమయములో మహిమలో పెండ్లికుమార్తె వివాహము చేసికొనును. స్నేహితుడా, ఇది పోగొట్టుకోవద్దు, దేవా, నాకు సహాయము చేయుము! నేను—నేను అక్కడయుండగోరుతాను, అదెంత మూల్యమైనా పరవాలేదు. నేను—నేను అక్కడ ఉండగోరుతాను.

398 ఇప్పడు, గమనించు, ఇదే సమయములో ఇది జరుగుచుండగా, భూమి మీద దేవుడు వాగ్దానము చేశాడు…ఆ అన్ని సంఘశాఖల ముక్కలు వారి సిద్ధాంతాలను గూర్చి వాదిస్తుండగా, దేవుడు వాగ్దానము చేశాడు: మనకై ఆయన నిజ వాక్యము యొక్క వర్తమానముతో నిజమైన ప్రవక్తను పంపుతానని వాగ్దానము చేశాడు. అసలైన దేవుని యొక్క వాక్యము కొరకు మరియు “పితరుల విశ్వాసము యొద్దకు త్రిప్పుటకు,” పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రజల యొద్దకు తెచ్చుటకు. ఈ విషయాలుకు పైగా ఆమెను పైకెత్తుటకు తగిన శక్తితో, అదే సమయంలో ఆమెను లోపలకు తెచ్చుటకు. అవును. యేసు క్రీస్తు యొక్క ఒకే వాక్యము ఋజువౌట ద్వారా, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని ఋజువౌటవలన! “ఇదిగో, యుగపర్యాంతము, మీతో కూడా ఉన్నాను. నేను చేయు కార్యములు మీరును చేతురు. నేను మీతో కూడా ఉందును. కొంచెము కాలము వారు నన్న చూడరు.” ’ఎందుకనగా వారికి వారు నిర్మాణాత్మకము చేసికొని చెదరిపోవుదురు, “అయితే మీరు నన్ను చూతురు, ఎందుకనగా యుగపర్యాంతము, నేను మీతో కూడా ఉందును. మీలో ఉందును.” ఎప్పుడు, యుగసమాప్తి తర్వాత ఆయన యొక్క ఉగ్రత క్రుమ్మరింపబడును. మీరు దానిని గ్రహించండి. ఓ, దేవా!

399 ఆ తెల్లని గుర్రం మీద స్వారీచేయువాడెవరు? మీరు గ్రుడ్డివారు కాదు. అదెవరైనది మీరు చూస్తున్నారా? అది అంత్యక్రీస్తు. వెళ్ళిపోయి పెనవేసుకున్న ఆ మోసపూరిత ఆత్మ…మరియు అటు తరువాత. మరలా దేవుడు దానిని ఉంచాడు. తెల్లని గుర్రం మీద వెళ్ళుచున్న ఒక మనిషిగా ఆయన అది చూపుతున్నాడు. విల్లు కల్గి, బాణము లేకుండా ఉండినట్లు. అతను మోసగాడు. అతనికి బలము లేదు. “సంఘము యొక్క శక్తి!” అది చెప్పుచున్నాడు. అదెక్కడ? వారేమి చేస్తారు? వారంటారు, “మేమే అసలైన సంఘముయని.” అసలైన సంఘము దయ్యములు వెళ్ళగొట్టును, రోగులను స్వస్థపరచును, చనిపోయిన వారిని లేపును. దర్శనములుచూచును, ప్రతీది కల్గియుండును. ఇప్పుడది ఎక్కడ? చూశారా? అది మోసము. విల్లున్నది, బాణము లేదు. ఉ! అవునది నిజం.

400 అయితే, చూడండి, క్రీస్తు వచ్చునపుడు, ఆయన నోట నుండి ఖడ్గము యొకటి బయలు వెడలును. మెరుపు కాంతి వలె, అది వెళ్ళిపోయి ఆయన శత్రువులను కాల్చివేయును. దయ్యమును వెళ్ళగొట్టును. ప్రతి దానిని అది చేదించును. మరియు ఆయన వచ్చును. ఆయన వస్త్రము రక్తములో ముంచబడియుండును. మరియు ఆయన తొడమీద, “దేవుని యొక్క వాక్యము” అని వ్రాయబడియుండెను. ఆమేన్. ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు. ఆయన యొక్క సైన్యములతో, పరలోకము నుండి వచ్చుచున్నాడు.

401 ఆ తెల్లని గుర్రం మీద స్వారీచేయువాడు ఎల్లప్పుడు భూమి మీదనున్నాడు. అతడు అంత్యక్రీస్తు నుండి మారును. అతడు ఆలాగు చేయును. అబద్ధ ప్రవక్తగా మారును. చూశారా, ఒక అంత్యక్రీస్తుగా మొదట ఆరంభించాడు. ఒక ఆత్మ అటు తరువాత అబద్ధ ప్రవక్తగా మారాడు. తరువాత దయ్యం బయటకు గెంటివేయబడినపుడు ఆ దయ్యం అవతారమెత్తును. మూడు దశలు. మొదటగా అతడు దయ్యం, ప్రారంభములో; దయ్యము యొక్క ఆత్మ. అటు తరువాత అతడు అబద్ధ ప్రవక్తగా మారాడు. అబద్ధ సిద్ధాంతమునకు ఉపదేశకుడు. తరువాత, దయ్యమే తనకు తాను అవతారమెత్తి వచ్చును చూశారా! అది తన పని.

402 అదే సమయములో, దయ్యం పరలోకము నుండి పడిపోయి, మనుష్యునిలో అవతారమెత్తును; పరిశుద్ధాత్మ పైకి వెళ్ళి క్రిందికి వచ్చి మనుష్యులలో స్వరూపము దాల్చును. ఆమేన్. ఓ, మై. ఎంతటి సమయము!

దేవుని చిత్తమైతే రేపు రాత్రి, రెండవ ముద్ర.

403 మీరాయనను ప్రేమిస్తున్నారా? [సభ “ఆమేన్,” అని చెప్పిరి, సహోదరుడు బ్రాన్హాం కొద్దిసేపు ఆగారు—సంపా.] మీరది నమ్ముతున్నారా? [“ఆమేన్.”]

404 నేనిపుడు టేపును ఆపాను. దాని నుండి నేను వినగోరుచున్నాను ఇప్పుడు. అది మీకు తెలుసా. చూశారా. అయితే నేను ఎదురుచూస్తున్నాను.

405 సహోదరుడా, నేనొకటి నీకు చెప్పనివ్వు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఆ యొక్క సంస్థాపకమునకు, వాటికి విరుద్ధముగా, ఆ ఆత్మ హెచ్చరిక చేస్తున్నాడో నా జీవితంలో ఒక్కసారి తెలుసుకున్నాను. ఈ విషయాలు నాకు చూపినందుకు ప్రభువైన దేవునికి నేను కృతజ్ఞుడను. అది సత్యమని నాకు తెలుసు. అది అక్కడ బయలుపరచబడినది. ఇక్కడతడు కాలమంతటిలోను స్వారీ చేయుచు, ఇక్కడికి వచ్చి ఇక్కడే బయలుపరుచుకున్నాడు, తనకు తాను సంపూర్ణముగా బయలుపరుచుకున్నాడు. చూశారా? అది అతడే. దాని ద్వారా మనము మోసగించబడము. మీ కళ్ళు తెరవబడియున్నవి. ఆ రకమైన చెత్తకు దూరంగాయుండుడి. మీ నిండు హృదయంతో ప్రభువును ప్రేమించుడి. ఆయనతో నిలచియుండుడి. అవునండి. బబులోను నుండి బయటకు రండి!

406 మూడు విషయాలు: వాక్యము ద్వారా ఋజువు చేయబడినది, పటము ద్వారా చూపించబడినది, ఆత్మ కార్యముల ద్వారా ప్రత్యక్షపర్చబడినది. అది వాక్యమని ఋజువుచేయబడుచున్నది.

407 ప్రభువా, ఈ చేతి రుమాళ్ళు పైకి వాక్యము వచ్చును గాక. రోగులను స్వస్థపరచుము. హాజరైన ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరుచుము. ప్రభువా, మరియు అక్కడ వ్రాసిన వారిని, అడిగిన వారిని కూడా.

408 తండ్రీ, ఈ గడియలో ఇప్పుడే జరుగవలసిన మరియొక స్వస్థతయున్నది. మరియు మేము స్వస్థత పరిచర్యకు వెళ్ళవలసియున్నది. అయితే ప్రభువా, అది ఆ ఆత్మ; అది క్రమములో ఉండవలెనని కోరుచున్నాము ప్రభువా. ఈ విషయాలు రావలసియున్నది.

409 దేవా, ఇప్పుడు చెప్పబడిన ఈ మాటలు తీసికొని ప్రజలకు వాస్తవము చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా! వారు వాటిని చూచెదరు గాక! కాలాన్ని కదలిస్తూ, తండ్రీ, ఇది నీకు తెలుసు, కనుక నేను ప్రార్థిస్తున్నాను. ఆ చాలినంత చెప్పుచున్నది, పరిశుద్ధాత్మ దానిని తీసికొని హృదయాలకు అది బయలుపరచును. ఎవరైతే లేఖనాలు వ్రాసికుంటున్నారో, వాటిని వారు చదువురు గాక. ఎవరైతే టేపులు తయారు చేస్తున్నారో లేక—లేక—లేక టేపులు వింటున్నారో, వారు వాటికి స్వంత అనువాదము పెట్టక వారు వాటిని చదువుదురు గాక. అయితే వాక్యమే చదువుదురు గాక. తండ్రీ అనుగ్రహించుము. ఇవన్నీ యేసు నామములో నీకే అర్పించుకుంటున్నాము. నీ మహిమ కొరకే, ఆమేన్.

410 [ఒక సహోదరుడు ప్రవచిస్తున్నాడు, సభ సంతోషిస్తుంది—సంపా.] ఆమేన్. ఓ, ధన్యవాదాలు నీకు! [సభ సంతోషిస్తూనేయున్నది.] ఓ!

411 క్షమాపణలో, ఆయనను ఎరిగిన వారు, ఇక్కడెవరైనా యున్నట్లైతే, ఇప్పుడే అది చేయండి, ఆ సరళమైన, గట్టి గద్దింపును వినండి. దగ్గరకు వచ్చుట మీరెన్నడు ఆనుకొనకపోతే ఇప్పుడే చేయుడి. ఇదైన దినాలలో.

412 ఆ ముద్ర తెరువబడుట అదియైనట్లైతే ఏమౌతుంది? అక్కడకు పంపబడిన ఆ దూత, (గత దినము), ముగ్గురు సాక్షులు దగ్గరగా నిలబడియున్నప్పుడు నేల మీద నన్ను పేల్చినట్లైతే ఏమౌను? నేను వెళ్ళక ముందు చెప్పినది, “నన్ను సంపూర్తిగా పంపునటువంటి ఒక ప్రేలుడు జరుగును.” నేను ఏడుగురు దూతల ద్వారా పైకెత్తబడి తూర్పు వైపునకు వచ్చెదను, భూమి మీద నుండి నన్ను కదిలింపజేసిన విషయం.

413 టూసన్ పైన అక్కడ అది జరిగినపుడు నాతోనున్న సహోదరుడు నార్మన్, సహోదరుడు సాత్ మన్, అది నిజమేనా? మరియు…కూర్చొని నా బట్టల మీద నుండి ముళ్ళకాయలు ఏరుకుంటున్నాను. దర్శనం ఏం చెప్పిందో ఖచ్చితంగా ఆలాగే, అది…టూసన్ వైపునకు. అది నిజమైతే, సహోదరుడా ఫ్రెడ్, నీ చేయి పైకెత్తు. సహోదరుడా నార్మన్, వారక్కడ ఉన్నారు. మీరక్కడయున్నారని సాక్ష్యంగా ప్రజలు చూచునట్లు మీరు లేచి నిలబడండి, ఆలాటిది నా జీవితంలో ఎన్నడు వినలేదు.

414 మరియు, తక్షణమే, మిగతా రోజంతా వారు వేటాడలేదు. మరుసటి ఉదయం ఫ్రెడ్ ను నేను బ్రతిమలాడాను. ఇది అతనికి తెలియదు. వేటాడుటకు వెళ్ళమని నేను అతనిని బ్రతిమలాడాను. “అది చేయి, అది చేయి” అని చెప్తూనే ఉన్నాను.

415 అయితే, అతడు చెప్పాడు, అక్కడ తిరిగి చెప్పాడు. “అది అతడు చేయడని, ఇప్పుడు నీవు తూర్పుకు వెళ్తున్నావు.”

416 ఏడుగురు దూతలు! మొదటి ప్రేలుడు, ఆమె తెరచినది. ఆ. అదైనట్లయితే ఏంటి? కడవరి గడియలో మనమున్నాము. అవునా?

నేను ప్రేమిస్తున్నాను…

మనమాయనను ఆరాధించుదాము.

నేనాయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను

నిలబడదాం.

నా రక్షణను కొనెను

కల్వరి చెట్టుపైన.

417 సహోదరులారా, మనము తలలు వంచుకుంటూ, ఇప్పుడు మన హృదయాలు కడుక్కుందాము. నా సహోదరీలు; మీతో కఠినంగా మాట్లాడాను. అయితే దైవిక ప్రేమలో నేనది చేశాను. నేనది చేశాను. ఎందుకనగా నేను మిమ్ములను ప్రేమించాను. పొడవాటి వెంట్రుకలు పెంచుకొనుటలోను, వస్త్రధారణ, క్రమమైన నడవడి మొదలైన వాటిని గూర్చి, నేను చేశాను ఎందుకనగా దైవికమైన ప్రేమను బట్టి. దేవుని యొక్క క్లొరేక్స్ యుండగనే మనం మన మనస్సాక్షిని శుద్ధిచేసికుందాము.

418 ఉదయవేళలో, బహుశా చాలా ఆలస్యము, ఆయన ముందడుగు వేయవచ్చు. ప్రియులారా! ఈ విషయాలు ఈ విధంగా వచ్చును. బహుశా విజ్ఞాపనా కార్యము యొక్క అంతములో కావచ్చు. ఎప్పుడైనా అది ఆలోచన చేశావా? సరే, అది నాకు తెలియదు. అది నేను ఇది అని చెప్పను. అయితే, అది, అదియైనట్లైతే? అది అదైనట్లయితే? దాని గూర్చి ఏంటి? ఇక విమోచనే లేదు. ఆ సమయానికి అది అయిపోయినది. అది కాలేదని నా నిరీక్షణ. అయితే, అది కావటానికి అనుకూలతయున్నది.

నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను…

మమ్ములను శుద్ధిచేయుము ప్రభువా, [టేపు మీద ఖాళీగాయున్నది—సంపా.]

…ప్రేమిస్తున్నాను

ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను

నా రక్షణ కొనెను

కల్వరి చెట్టుపైన.

419 ప్రభువు నామమునకు స్తుతి కలుగును గాక! దేవునికి మహిమ! మధురమైన ఆ భావనను నేను ప్రేమిస్తున్నాను. మీకు అనిపించుట లేదా? పరిశుద్ధాత్మ, ఆలాగు మిమ్మును మునగనివ్వండి, దాని చుట్టు నడవండి, ఓ, ఎంతటి అద్భుతం. ఓ, ఆయన కనికరాన్ని గూర్చి తలంచండి.

నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను

నా రక్షణ కొనెను

కల్వరి చెట్టు పై.

420 స్నేహితుడా దానిని మరచిపోవద్దు. దానిని మరచిపోవద్దు. నీతో ఇంటికి తీసికొని వెళ్ళు. దానితోనేయుండు. నీ దిండులో ఉంచుకో. దానిని మరచిపోవద్దు. దానితోనేయుండు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించును గాక.

సహోదరుడు నెవిల్, మీ కాపరి. 


    63-0318 — మొదటి ముద్ర
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...