రెండవ ముద్ర
స్నేహితులారా, సాయంకాలవేళ శుభములు. ప్రార్థన కొరకు మనమందరము లేచి నిలబడదాం, మీరు ఇష్టపడితే.
2 మా పరలోకపు తండ్రీ, ఈ రాత్రి ప్రభువు యొక్క పరిచర్యలో, తిరిగి ఈ యొక్క పవిత్రమైన సభలో మేము కూడుకొనియున్నాము. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురుగా మేము కూడుకుంటామో అక్కడ మా మధ్య నీవు యుంటావని నీవు వాగ్దానము చేసితివి. మరియు నీవు ఇక్కడ ఉన్నావని మేము నిశ్చయత కలిగియున్నాము, ఎందుకనగా మేము ఆయన నామమున కూడుకొనియున్నాము.
3 ఈ రాత్రి నీవు వచ్చి ఈ రెండవ ముద్రను మా కొరకై తెరువమని, తండ్రీ మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. కవి—కవి చెప్పినట్లు, కాలము యొక్క ఆవలను అతడు చూడగోరెను. మరియు ప్రభువా అది మా యొక్క అపేక్ష, కొంచెము—కొంచెము గతమును చూచి మరియు ముందున్నదేదో చూడాలని. మరియు మేము ప్రార్థిస్తున్నాము, వధింపబడిన గొఱ్ఱెపిల్ల మా మధ్యకు వచ్చి ముద్రను తెరచి, మాకు దానిని బయలుపరచి, మేము చూడవలసినది మాకు చూపునుగాక.
4 క్రీస్తులో, ఈ గొప్ప సహవాసములో ఇంకా ప్రవేశించనివారు ఇక్కడ కొందరున్నారు. ప్రభువా, ఈ రాత్రి వారు నిత్య తీర్మాణము చేసి, దేవుని ఆత్మతో నింపబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
5 తండ్రీ, వ్యాధిగ్రస్తులున్నట్లయితే, నీవు వారిని స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ అనేకమైన చేతి రుమాళ్ళు పెట్టబడినవి. బైబిల్ కు జ్ఞాపకంగా నా చేతులు పైన పెట్టియున్నాను, పరిశుద్ధుడైన పౌలు అతని శరీరము నుండి తీసినవి చేతిరుమాళ్ళు, వస్త్రములు. అపవిత్రాత్మలు ప్రజలను విడిచిపోయెను మరియు వారు స్వస్థతనొందిరి.
6 ప్రభువు రాకడ చాలా సమీపములో యుండుట మేము చూచుచున్నాము. సమయము సమీపించుచుండుట మేమెరిగియున్నాము. పందొమ్మిది వందల సంవత్సరాల తరువాత సంఘానికి ఇవి మరలా దయచేయబడినవి.
7 మేము అడిగినవి మాకు దయచేయుమని తండ్రీ, మేము ప్రార్థిస్తున్నాము. నీ దాసుని బలపరచుము. ప్రతిచోటనున్న నీ సేవకులకు సహాయము చేయుము. ప్రత్యేకించి, ఈ రాత్రి ఇక్కడ కూడిన మమ్ములను తద్వారా మేము వాక్యమును పొందుకొనులాగున. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
8 తిరిగి ఈ రాత్రి ప్రభువు గృహములోకి తిరిగి వచ్చుట నిజంగా మంచిది. మరియు మీలో అనేకమంది నిలబడియున్నారని నాకు తెలుసు. అందునుబట్టి నన్ను—నన్ను క్షమించండి. అయితే, దానిని గూర్చి మేము ఇంకేమీ చేయలేము. మేము ఆలయమును—మూడు లేదా నాలుగు, మూడు వందలు లేదా నాలుగు వందలు పైగా పట్టునట్లు చేశాము. అయితే ఈ విధమైన ప్రత్యేక కూటములలో—అందులో ఎక్కువ గుంపు ఉంటారు.
9 ఈ—ఈ ముద్రలు చదువుటకు, ప్రార్థించుటకు నాకు అద్భుతకరమైన సమయము దొరికినది. ఆ విధంగా మీకు కూడా. [సమాజము “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] మీరు, ఆ విధంగా యున్నారని నేను—నేను నమ్ముతున్నాను. మీకు అది ఆలాగున్నట్లయితే, నాకు ఆ విధంగా ఉంటుంది. అది నిజంగా మీకు…మీకు అద్భుతమైన సమయం.
10 కూడిక ముగింపైన తరువాత నా స్నేహితురాలను పిలువ ఆశించుచున్నాను. ఇది ఆమె యొక్క పుట్టినరోజు. ఈరోజు ఆమెకు పండ్రెడు సంవత్సరములు. శారా, నా కుమార్తె. మరియు, అటు తరువాత ఎల్లుండి, నేను ఇంకొకరిని పిలువవలసివుంది. ఎందుకంటే, అది బెక్కి పుట్టినరోజు.
11 ఇపుడు, ఈ రాత్రి, మనమీ రెండవ ముద్రను చదువుచున్నాము. మరియు మొదటి నాలుగు ముద్రలకు నలుగురు గుఱ్ఱముల మీద స్వారీ చేయువారున్నారు. నేను మీకు చెప్తున్నాను, ఈరోజు తిరిగి మరొకటి జరుగుతుంది. నేను—నేను చాలా కాలం క్రితం నా యొద్దనున్న, నేను మాట్లాడిన ప్రతీది తీసికొని అక్కడ కూర్చొనియుంటిని. మరియు నేననుకున్నాను “సరే, నేను—నేను చేయగలిగినదంతా చేశాను.” అని. మరియు అనేకమంది గ్రంథకర్తలు మరియు ఇతర విషయాలు చూచి నేననుకున్నాను, “సరే. నేను కొంత చదువుతాను, చూస్తాను, ఇది చూస్తాను, అది చూస్తాను”…మొదటి విషయం ఏంటో తెలుసా, ఒకటి జరిగినది, అదంతా వ్యత్యాసంగాయుంది. అది వ్యత్యాసంగా వచ్చింది. ఆ తరువాత వెంటనే పెన్సిల్ లాక్కొని, ఆయనక్కడ యుండగనే ఎంత త్వరగా వ్రాయాలో అంత త్వరగా వ్రాయుటకు మొదలుపెట్టితిని.
12 సుమారు ఒక అర్ధగంటకు మునుపు ఒకటి జరిగినది. కొద్ది నిముషాల క్రితము వస్తూ సహోదరుడు ఉడ్స్ కు చెప్తున్నాను. ఒక విషయం, మీకు తెలుసా? మీకు తెలుసా, ఎన్నో విషయాలు జరుగుతవి. వాటిని గూర్చి నీవు మాట్లాడలేవు. ఔనా. అయితే, ఒకటి జరిగినది. అది నాకెంతో సహాయపడినది.
13 ఇక్కడ, భవనంలో నాకొక స్నేహితుడున్నాడు. బహుశా మీరందరు నాకు స్నేహితులు. ఈ—ఈ సహోదరుడు, సహోదరుడు లీ వెయిల్. అతడు ప్రశస్త సహోదరుడు. లేఖనమును బాగుగా ఎరిగినవాడు. డాక్టర్ వెయిల్ పరిశుద్ధాత్మ పొందిన బాప్టిస్టు. అతడు…నేను మెచ్చుకొనుటకు ఇది చెప్పుట లేదు. నేనిది నమ్మియున్నాను కనుక చెప్తున్నాను. నేను ఎరిగినవారిలో అతను గొప్ప లేఖన విద్యార్థి. అతడిక్కడ చిన్న వివరణ వ్రాసి బిల్లీతో నాకు పంపాడు. బిల్లీ నాకు దాన్ని సరిగా చెప్పలేకపోయాడు. నేననుకుంటాను…నేనది చదవలేదు అయితే అతడిక్కడ ఏమి చెప్పాడో నేను చెప్పబోతున్నాను. నేనిపుడే చదివాను. సహోదరుడా వెయిల్, నీవు ఇక్కడ ఉండినట్లయితే, ఆరు నెలల క్రితం నేనిది చదివాను.
14 “నేను నిశ్చయమని చెప్పను,” అతడన్నాడు “సహోదరుడా బిల్, నేను నిశ్చయమని చెప్పను. అయితే, పరిశుద్ధ యోహాను యొక్క విద్యార్థి పోలికార్పు అని నేను నమ్ముతున్నాను.” అది సరియైనది. అతడౌను, “ఐరేనియస్ పోలికార్పు యొక్క విద్యార్థి.” అది సరియైనది. అది ఖచ్చితం. “ఐరేనియస్ అన్నాడు, ‘యేసు తిరిగి వచ్చును—క్రీస్తు శరీరములోని ఆఖరి ఏర్పరచుకున్న సభ్యుడు లోపలకు వచ్చునప్పటికి యేసు తిరిగివచ్చును.’”
15 అది ఐరేనియస్, క్రీస్తు మరణము తరువాత సుమారు నాలుగు వందల సంవత్సరాలు. అతడు చెప్పాడు, “ఈ చివరి కాలము వచ్చునప్పటికీ…” అది నైసియా ఆలోచన సభముందు, ఇక్కడున్న మీరు…లేఖనము చదువుచున్న మీరు, మరియు చదువుట…అనగా నా భావము, బైబిల్ చరిత్రయని నా భావము, మీరు దానిని, నైసియా సభ ముందు కనుగొనగలరు. అది మొదటి పుస్తకము లేక రెండవ పుస్తకము అని అనుకుంటాను. మీరు—మీరు అది కనుగొనగలరు. …సంవత్సరాల క్రితం అతడది చూశాడు. అతడు చెప్పాడు, “ఆ ఆఖరు, ఆఖరు, ఆఖరిగా ఎన్నుకొనబడినవారు, ఆ ఎన్నుకొనబడినవారు” అని చెప్పాడు.
16 ఎన్నుకొనుటయనగా ఈ మధ్యనే ఒకటి దొడ్డిదారిన వచ్చినదని ప్రజలు అనుకుంటారు. మై. అది మనకున్న పురాతన బోధ, ఏర్పాటు మరియు పిలుపు. …కాబట్టి, ఐరేనియస్, ఖచ్చితంగా, నిజంగా లేఖనము యొక్క నిజమైన విద్యార్థి, ఎల్లప్పుడు ఏర్పాటును నమ్మినవాడు.
17 మనము చూచినట్లుగా, మనము చదివినట్లుగా, ఐరేనియస్ సంఘకాలములలోని దూతలలో ఒకరు. మనము నమ్ముచున్నాము. అవన్నీ మర్మములు. అవన్నీ ఇక్కడే యున్నవి. ఇక్కడ ఈ ముద్రలలో మరుగైయున్నవి. చూశారా. కడవరి దినమున అవి బయలుపరచబడవలసియున్నవి. అవి ఏ విధముగా పౌలులో ప్రారంభమై మరియు—మరియు ఐరేనియస్ మరియు మార్టిన్ మొదలగువారు కడవరి కాలమునకు వచ్చినది.
18 మరియు, ఇపుడు, ఈ రాత్రి మన ప్రయత్నాలలో ప్రభువు మనలను ఆశీర్వదించునని మనము నమ్ముతున్నాము. ఇపుడు మనము…మొదటి ముద్ర. నేను నిజంగా ఆనందించాను. మొదటి ముద్ర, దానితో వచ్చిన ఆశీర్వాదములు నాకు వచ్చినవి.
19 మరియు, ఇపుడు, నేను—నేను ఎక్కువసేపు మిమ్ములను ఉంచదలచుటలేదు. అయితే చూడండి, కొద్ది రాత్రుల తరువాత, ఇదైన తరువాత నేను—నేను బయటకు తిరిగి వెళ్ళబోతున్నాను. మరియు కొద్దికాలము శ్రమపడవలసియున్నది. నేను అభినందిస్తున్నాను…
20 ఇక్కడ సహోదరుడు జూనియర్ జాక్సన్ నిలబడియున్నాడని అనుకుంటున్నాను. నేను…మరియు కొద్ది నిముషాల క్రితం ఇక్కడే ఒకచోట కొద్ది నిముషాల క్రితం సహోదరుడు రడెల్ ను చూచానని అనుకుంటున్నాను. మరియు ఆ సహోదరులు, బయటనున్న సోదరి సంఘములు మరియు బయటవారు. మేము నిజంగా అది అభినందిస్తున్నాము. మరియు నేను సహోదరుడు హూపర్ ను చూస్తున్నాను. ఇక్కడ ఉటికా నుండి, సంఘము నుండి వచ్చి అక్కడ గోడ ప్రక్కగా ఆనుకున్నాడు. మరియు ఇందులో మీ అందరి సహకారము కొరకు మేము నిజంగా అభినందిస్తున్నాము.
21 ఇపుడు, గత సాయంకాలం మనమెప్పటివలె ముద్రలు మీద బోధిస్తుండగా, సంఘకాలాలు ఏ విధంగా బోధించామో ఆ విధంగా బోధించుకొందాము. సంఘకాలపు బోధను మనము ముగించిన తరువాత, ఇక్కడ వేదికయొద్ద, బోర్డు మీద నేను వ్రాసినపుడు, ఏం జరిగినదో ఎంతమందికి జ్ఞప్తింది? ఆయన నేరుగా దిగివచ్చి, గోడ వెనుకకు వెళ్ళి (వెలుగులో) ఆయనకు ఆయన అది గీచి, మనందరి ఎదురుగా, అక్కడ గోడ మీద గీచాడు. ప్రభువు యొక్క దూత అనేక వందలమంది ఎదుట నిలబడ్డాడు.
22 మరియు ఇపుడు ఆయన—ఆయన నిజమైన అతీతమైనది ఒకటి చేయుచున్నాడు. కాబట్టి గొప్ప విషయాలు కొరకు ఎదురుచూద్దాం. మనకు తెలియదు, ఆ గొప్ప నిరీక్షణ కొరకు నీవు ఎదురుచూడవలసియున్నది. తరువాత ఏం జరుగుతుందో తెలియదు. నీకు తెలుసా, కేవలం ఎదురుచూచుట. దేవుడు మన యెడల ఎంత ఘనుడో, ఎంతటి ఆశ్చర్యకరుడో! మనమాయనను ఎంతో శ్లాఘిస్తున్నాము!
23 ఇపుడు 1 మరియు 2 వచనాలు, నేనది చదువుతాను కొంత వెనుకటి భాగం ఇచ్చుటకు, మరియు తరువాత రెండవ ముద్ర కొరకై 3, 4 వచనాలు తీసుకుందాము. అటు తరువాత 5, 6 వచనాలు, మూడవ ముద్ర మరియు 7, 8 వచనాలు…రెండు వచనాలు ప్రతి గుఱ్ఱంపైన స్వారీ చేయువానికి. మరియు, వీరు ఏలాగున్నారో, మీరు గమనించాలని మిమ్ములను కోరుచున్నాను. ఈ పాండుర వర్ణ గుఱ్ఱంపైన…ఇక్కడ వచ్చుచున్నది, వెళ్ళుచూ మార్పు చెందుచున్నది.
24 అటుతరువాత దేవుని చిత్తమైతే ఆ గొప్ప ఆఖరు ముద్ర, తరువాత ఆదివారం విప్పబడుతుంది! అది, అది జరిగినపుడు ఒక విషయం జరుగుతుంది “పరలోకమందు ఒక అరగంట నిశ్శబ్దముండెను.” దేవుడు మనకు సహాయము చేయునుగాక.
25 ఇపుడు 3 వ వచనము చదువుతాను.
ఆయన రెండవ ముద్రను విప్పినపుడు—రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.
(4వ వచనము) అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱము మీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
26 ఇపుడు, ఒక మర్మమైన విషయం. ఆ—ఆ జీవి యోహానుతో చెప్పెను “వచ్చి చూడుము.” అదేమైంది అతడు చూడలేదు. అతడొక సూచనను మాత్రమే చూశాడు. మరియు ఆ సూచన, కారణం…అతడు చెప్పాడు, “వచ్చి చూడుము.” అయితే అతడు సూచనను చూశాడు, వారు దానిని గమనించునట్లుగా అతడు దానిని సూచనగా ఉంచాడు. అది ఆఖరి కాలము వరకు ఉండును. అపుడు ముద్ర విప్పబడును.
27 అది, ప్రతియొక్కరు ఇపుడు గ్రహించారా, చూశారా, ముద్రలు విప్పబడును. ఈ దినాన జీవిస్తున్నందుకు నీకు సంతోషంగా లేదా? [సభ “ఆమేన్” అని చెప్పెను—సంపా.] అది. చూశారా, అది మాత్రమే కాదు స్నేహితులారా! అయితే, ఎల్లపుడు గుర్తుంచుకోండి. గత ఆదివారం, సమస్తమును ఆధారపడింది, సామాన్యత మీద! చూశారా? సామాన్యత, దీనత్వము ఏ విధముగానున్నదనగా ప్రజలు ఆలాగు వెళ్ళిపోయి, అది జరిగిందని కూడా ఎరుగకున్నారు.
28 జ్ఞప్తించుకోండి! ఏ సమయములోనైనా, ప్రభువు యొక్క రాకడకు మనము ఎదురుచూస్తున్నాము. మరియు మనము…బహుశా ఎత్తబడుట కూడా ఆలాగుండునని, నేను ఒక వివరణ ఇచ్చాను. ఆ విధంగా యుండును. చూశారా? సహజంగా…వెనుకనుండి బైబిల్ లోకి వెళితే, అది ఏ విధంగా జరుగుట మీరు చూడగలరు. ఔనా?
29 చివరకు, ప్రభువైన యేసు రాకడ. అందును గూర్చి ఎవరికి ఏదీ తెలియదు. వారనుకున్నారు. “ఆ పిచ్చివాడు ఎవరో అని.” సంఘములు చెప్పినవి, “ఒక వెర్రివాడు. మనము…అతడు నిజంగా వెర్రివాడు” అంటారు. “అతడు పిచ్చివాడు” “మాకు తెలుసు నీవు పిచ్చివాడవని.” పిచ్చి అనగా “వెర్రి” అని అర్థం. “నీకు దయ్యమున్నదని మాకు తెలుసు. అది నిన్ను వెర్రివానిగా చేస్తుంది. నీవు మాకు బోధింప ప్రయత్నిస్తున్నావు? నీవు అక్రమము వలన జన్మించిన వాడవు. మేము…నీవు జారత్వము వలన జన్మించినవాడవు. మాలాటి వ్యక్తులకు, యాజకులకు, ఆలయంలో ఉండువారికి బోధించుటకు ప్రయత్నించుట.” సరే. మై. అది వారికి ఒక అవమానముగా తోచెను.
30 యోహాను వచ్చినపుడు, కాలాల గుండా, యెషయా నుండి మలాకీ వరకు చెప్పబడెను. అది పండ్రెండు వందలు లేదా ఏడు వందల పండ్రెండు సంవత్సరాలు. ప్రవక్తల ద్వారా అతని రాకడ చూపబడెను. ఏ సమయములోనైనను అతడు వచ్చుటకొరకు ప్రతియొక్కరు ఎదురు చూశారు. అయితే అతడు వచ్చి, అతడు బోధించి, పరిచర్య చేసి, మహిమలోకి వెళ్ళిపోయెను.
31 చివరికి అపొస్తలులకు అది తెలియదు. ఏలయనగా ఆయనను వారు అడిగారు. వారన్నారు “ఇప్పుడు, మనుష్యకుమారుడు యెరూషలేమునకు పోవుచున్న యెడల ఇవన్నియు అర్పింపబడవలెను” అన్నారు. “‘ఏలీయా మొదట రావలసియున్నదని’ లేఖనము ఎందుకు చెప్పుచున్నది?” అని.
32 యేసు చెప్పాడు, “అతడెప్పుడో వచ్చాడు మరి మీరు ఎరుగలేదు. అతడు ఏమి చేయునని లేఖనము చెప్పినదో ఖచ్చితంగా అదే అతడు చేశాడు. అది ఏమని చెప్పబడినదో ఆ విధముగానే అతని యెడల వారు చేశారు.” చూశారా? వారది అర్థం చేసికొనలేకపోయారు. ఆయన చెప్పాడు, “అతడు యోహాను” అని.
తరువాత, “ఓ” చూశారా, వారు—వారది గ్రహించిరి. వారు…
33 ఆయన వారికి గురుతులను చూపించిన తరువాత, చివరికి వారిని పిలచి అడిగాడు, “నాలో పాపమున్నదని అవిశ్వాసమున్నదని మీలో ఎవరు ఖండించగలరు? నేను భూమిమీదికి వచ్చినపుడు నేనేమి చేయవలెనని లేఖనము చెప్పుచున్నదో వాటిని నేను చేయని యెడల నేనెక్కడ పాపము చేసితినో చూపండి. ఔనా? అప్పుడు, నేను—మీరెవరైనది చూపుతాను. మీరు నమ్ముచున్నారా లేదా చూద్దాం.” చూశారా? ఆయన వెనుకకు వచ్చి, మరి ఇలా చెప్పును, “నేను వచ్చినపుడు మీరు నన్ను నమ్మవలసియుండును.” వారు అది చేయలేదు. కాబట్టి ఆ విషయములో వారు ఆయనకు కట్టుబడియుండవలసియున్నది. అయితే ఆయన అన్నాడు, “నాలో అవిశ్వాసమున్నదని మీలో ఎవరు నేరారోపణ చేయగలరు? చూశారా? అది యున్నట్లుగా నేనది చేయలేదా?”
34 మరియు అపొస్తలులు కూడా తొట్రిల్లిరి. లేఖనములు ఎలా వెళ్ళుచున్నవో మనకు తెలియును. తరువాత, చివరకు వారు చెప్పారు, “ఇపుడు మేము నమ్ముచున్నాము, ఎవరును నీకు చెప్పనవసరం లేదు, ఏలయనగా సమస్తమును నీవు ఎరుగుదువు.”
35 ఇపుడు నేను ఆయన ముఖమును చూడాలని ఆశపడుచున్నాను. వారివైపు ఆయన చూచియుండును, అడిగాడు, సరే, “మీరిపుడు నన్ను నమ్ముచున్నారా? చివరికి అది వారికి ఉదయించెను.” బహుశా, ఆ సమయం వరకు అది వారికి మరుగుగా యుండవలసియుండలేదేమో. దేవుడు ప్రతిది క్రమములో చేస్తాడు, మీకు తెలుసా. నేను—నేను అందుకొరకు ఆయనను ప్రేమిస్తాను.
36 అయితే, ఇపుడు, మనము, మన కాలాన్ని గూర్చి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే నేను దానిని గూర్చి మాట్లాడితే, ఈ ముద్రలలోకి మనం వెళ్ళలేము సంపూర్తిగా.
37 మరియు, ఇపుడు గుర్తుంచుకోండి, రోగుల కొరకు ప్రార్థించుటకు అనేకమైన విన్నపములు నేను పొందుకొనుచున్నాను మరియు నిరంతరము…నేను ప్రార్థించుటకు, నాకు వచ్చిన ప్రతి విన్నపము కొరకు, చేతి రుమాళ్ళు తదితరమైన వాటికొరకు నేను ప్రార్థించుచున్నాను. ఆఖరు ముద్ర వరకు, ఈ ముద్రలు ముగించగలిగితే, ఆదివారం ఉదయంకు…అది ప్రభువు చిత్తమైతే, ఇక్కడ మంచి పాతకాలపు తరహా స్వస్థత కూటము ఏర్పాటు చేసుకుందాం. రోగుల కొరకు ప్రార్థించుటకు ఉదయం అంతా మీరు తీసుకొనగలరు. మరియు నేను—నేను చెప్పగలను అది వింతైన స్వస్థత కూటము కాగలదు. ఔనా? నాకా తలంపు ఇపుడే వచ్చింది. చూశారా. కనుక, వింతైనది కాదు. అయితే కొందరికి కొద్దిగా వింతయనిపిస్తుంది. నా భావమేదో చూశారా.
38 ఈ దినాన ఆయన మర్మములు మనకు బయలుపరచుట ఎంత గొప్ప దేవుని కృప! మనము కడవరి దినాన జీవిస్తున్నామని మనందరము నమ్ముతున్నాము. మనమది నమ్ముతున్నాము. మరియు జ్ఞప్తించుకోండి. మర్మములు కడవరి దినమున బయలుపరచబడవలసియున్నవి. ఆయన వాక్యమును, ఆయన మర్మములను ఆయన ఏలాగు బయలుపరచును? బైబిల్ గ్రంథము చెప్తుంది. ఆయన అది ఎక్కడ చెప్పాడో అది మీరు చదవాలని ఉందా? ఆయన ఏ విధముగా ఆయన మర్మాలు బయలుపరచునది, మనము త్రిప్పి, చూద్దాం.
39 ఆమోసు, నేను చదువగోరుతాను. ఆమోసు పుస్తకము త్రిప్పండి. ఆమోసు 3వ అధ్యాయం మరియు 7వ వచనము మీరు చదవాలని నేను కోరుతున్నాను. సరే…6వ వచనము కూడా నేను చదువుతాను.
పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
40 ఇపుడు కడవరి దినాలు. మనకు ఒక—ఒక ప్రవక్త పుట్టునని మన కొరకు చెప్పబడెను.
41 మనకు అన్ని విధాలైనవి యున్నవని మనకు తెలుసు. ఈ రాత్రి చుట్టూ చూచిన తరువాత, నేను గ్రహిస్తున్నాను, విద్యార్థులు కూర్చున్న మధ్య నేను—నేను మాట్లాడుచున్నాను మరియు నన్ను—నన్ను మీరు అర్థము చేసుకోవాలని కోరుతున్నాను. ఈ టేపులు ప్రపంచమంతటికి వెళ్ళును అని మీరు గ్రహించండి. సుమారు ప్రపంచమంతా. మరియు నేను ఏలీయా యొక్క దుప్పటి లేక అంగీలాంటిది ఏదో సిద్ధాంతమును మీలో గ్రుచ్చుటకు ప్రయత్నించుట లేదని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆలాటివి మనకు చాలా ఉన్నవి. అయితే, వచ్చుచున్న నిజమైన ముందున్న ఒకదానికి ప్రజలను గలిబిలి చేయుటకున్నవి.
42 మీకు తెలుసా! క్రీస్తు రాకడకు ముందు అబద్ధపు—అబద్ధపు నాయకులు, అబద్ధపు మెస్సీయా లు లేచెదరని మీకు తెలుసా? కాదా…ఆ దినపు గొప్ప బోధకుడు గమలీయేలు, ఈ మనుష్యులను కొట్టుట, మొదలైన వాటిని గూర్చిన ప్రశ్న వచ్చినపుడు, అతడన్నాడు, “వారిని ఆలాగే ఉండనీయుడి. అది దేవుని వలన అయితే, మీరు దేవునికి విరోధముగా పోట్లాడుచున్నారు. అయితే అది దేవుని వలన కాకపోతే…” అన్నాడు, “ఈ మధ్యనే ఒక వ్యక్తి లేచి నాలుగు వందల మందిని అరణ్యములోకి తీసుకొనివెళ్ళెను. మొదలైనవి…ఆలాటివి మనకున్నవి.” ఏంటది? నిజమైన కార్యము వచ్చుచుండగా దానికి ముందు ఇది వచ్చును.
43 ఇపుడు, చూడండి. సాతాను వాటిని లేపును. మనమిక్కడ మాట్లాడుకొనుచున్న ఈ వ్యక్తి యొక్క యుక్తిని గమనించండి. సాతాను. మనమిక్కడ అతనిని తెలియజేయుచున్నాము. బయలుపరచుచున్నాము. లేఖనముల ద్వారా. అదే ఇపుడు మనము చేయబోవుచున్నాము.
44 మరియు, మీరు జ్ఞప్తించుకోండి, ఒక కమ్యూనిస్టుయై లోపలకు వెళ్ళుటకు అతడు ప్రయత్నించుట లేదు, సాతాను కాదు. అతడు అంత్యక్రీస్తు. “దానికి ఎంతో సమీపము,” యేసు చెప్పాడు “ఏర్పరచుకున్నవారిని మోసము చేయును…” అదే ఈ ముద్రలలో మరుగైయుండువారు, ఎవరి పేరులైతే జగదుత్పత్తికి ముందే గ్రంథమందు వ్రాయబడినవారు.
45 అతడు తెలివైనవాడు. ఈ విషయము వచ్చుట అతడు చూచి, అది అక్కడకు వచ్చుటకు ముందే, దానిని తలక్రిందులు చేయుటకు ప్రతీది అతడు నెట్టివేయును. కడవరి దినాలలో అబద్ధ క్రీస్తులు లేస్తారు, మీకు తెలుసా? దీని తరువాత వెంటనే అది వెంటాడును. ఈ సహోదరుడు మాట్లాడిన ఈ వర్తమానము తరువాత, ఏలీయా ఆత్మచేత అభిషేకించబడిన వర్తమానము నిజముగా వచ్చిన వెంటనే.
46 వారతనిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అతడు మెస్సీయ యని కొందరు తలస్తారు. అయితే అతడు నిర్ధిష్టంగా “కాదు” అని చెప్పాడు. కారణం, యోహాను వలె అది రావలసియుండెను.
47 బాప్తిస్మమిచ్చు యోహాను కాలంలో, అతడు బోధించుటకు వచ్చినపుడు “నీవు మెస్సీయావా?, నీవు ఆయనవు కావా?” అని అడిగారు వారు.
48 అతడు చెప్పాడు “నేను కాదు. ఆయన చెప్పులవారు విప్పుటకు నేను యోగ్యుడను కాను. అయితే, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మమిచ్చును.” ఆయన భూమి మీద యుండెనని యోహానుకు ఖచ్చితంగా తెలుసు. అతడు అన్నాడు “ఆయన మీ మధ్య ఉన్నాడు, ఒక చోట.”
49 అయితే, ఆయన మీదికి ఆ గురుతు వచ్చువరకు, అతడు ఆయనను ఎరుగకుండెను. తరువాత, ఆ వెలుగు దిగివచ్చి, పావురము వలె వెదజల్లుకుని ఆయనపై ప్రకాశించినపుడు, అతడు చెప్పాడు, “అదిగో ఆయన, అది ఆయనే.” అయితే అది చూచినది యోహాను మాత్రమే. మీకు తెలుసా. యోహాను ఒక్కడు మాత్రమే స్వరాన్ని విన్నది. మిగతా వారందరు; వారిలో ఎవరు అది వినలేదు.
50 అయితే, అటుతరువాత, ఒక నిజమైన వాస్తవమైన సేవకుడు వచ్చినపుడు; దానికంతా అనుకరణ. మనుష్యుల మనస్సులను తారుమారు చేయుట. సాతాను అది చేస్తుంది. మరియు ఎవరైతే మంచి చెడులను వివేచించరో వారు బోర్లపడతారు. అయితే ఏర్పరచుకున్నవారు అది చేయరు. బైబిల్ చెప్పుతుంది. ఏర్పరచుకున్నవారిని అతడు మోసము చేయలేడని. మరియు క్రీస్తు రాకడకు కొంచెము ముందుగా, బైబిల్ చెప్తుంది “అబద్ధపు క్రీస్తులు లేచెదరని మరియు క్రీస్తు అని చెప్పుకొందురని, ఇంకా చెప్తారు, ‘ఇదిగో ఆయన ఎడారిలో ఉన్నాడు’ దానిని నమ్మకుడి ‘ఇదిగో ఆయన రహస్యపు గదిలో ఉన్నాడు.’ అది నమ్మవద్దు.”
51 “తూర్పు నుండి పశ్చిమమునకు సూర్యుడు ప్రకాశించునట్లు, మనుష్యకుమారుని రాకడయు యుండును.” చూశారా? ఔను, ఆయన—ఆయన—ఆయన అగుపించును. అది ప్రపంచవ్యాప్తమైన విషయం. అది, ఒకవేళ, ఏదోయొకటి సంభవించినదని వారు కనుగొనినపుడు, చూశారు. వారు…జ్ఞప్తించుకొనుడి సంఘము గృహానికి చేరిన తరువాత, ఎత్తబడుట తర్వాత అది జరుగును.
52 ఎప్పుడు కూడా అబద్ధపు అనుకరణలు. మనకు వాటితో సంబంధం లేదు. లేదండి.
53 మరియు నేను నమ్ముచున్నాను. వ్యక్తి వచ్చినపుడు, చెప్పబడిన వ్యక్తి వచ్చినపుడు ఆ వ్యక్తి ప్రవక్తయై యుండవలసినదని లేఖనాల ద్వారా మాత్రమే నేను చూపుతున్నాను. అతడు నిశ్చయంగా అవుతాడు. దేవుని యొక్క ప్రత్యక్షత…ప్రభువు యొక్క వాక్యము ఆయన ప్రవక్తల యొద్దకు వచ్చును. అది ఖచ్చితంగా నిజం. అది…దేవుడు మారడు, ఔనా. ఆయనకు అంతకంటే మంచి మార్గమున్నయెడల ఆయన—ఆయన దానినే ఉపయోగించేవాడు. అయితే ఆయన—ఆయన…ప్రారంభంలోనే శ్రేష్ఠమైనది ఎన్నుకొనేవాడు.
54 ఏలాగనగా, సువార్త ప్రకటించుకొనుటకై ఆయన సూర్యుని ఎన్నుకోగలడు. చంద్రుని ఆయన ఎన్నుకోగలడు. గాలిని ఎన్నుకోగలడు. అయితే, ఆయన మనుష్యుని ఎన్నుకున్నాడు. మరియు ఆయన గుంపులను ఎన్నుకోలేదు. వ్యక్తులను. ఔనా?
55 ఒకే సమయములో భూమి మీద ఇద్దరు పెద్ద ప్రవక్తలు లేరు. చూశారా, ప్రతి వ్యక్తి వేరుగా యున్నాడు. అతని పరిచర్య వేరు. దేవునికి ఒక వ్యక్తి దొరికితే, ఆయనకు అది చాలు. ఆయన చేతిలో ఉంటాడు. ఆయన ఏది కోరితే, అది అతడు చేస్తాడు. ఆయనకు ఒకడుంటే చాలు. నోవహు దినాలలో; ఏలీయా దినాలలో; మోషే దినాలలో.
56 మోషే కాలంలో ఎందరో లేచారు. వారేలాగు చేశారో తెలుసా, ఇలా చెప్పాలనుకున్నారు “సరే. నీవొక్కడవే పరిశుద్ధుడవు కాదు ఈ గుంపులోనున్నది” మరియు దాతాను మరియు కోరహు.
57 మరియు దేవుడు చెప్పాడు, “మిమ్ములను మీరు వేరు పరచుకొనుడి. నేను భూమిని తెరచి వారిని మ్రింగునట్లు చేయుదును.” ఔనా? మరియు—మరియు…
58 మరియు ప్రజలు సణుగుటకు మొదలుపెట్టారు. ఆయన అన్నాడు, “నేను సమస్తమును తీసివేస్తాను.”
59 అక్కడ మోషే, క్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. తరువాత, తనకుతాను ఖాళీ స్థానములో నెట్టుకొని “ప్రభువా, అది చేయవద్దు” అని అన్నాడు. మరియు, అతడు…ఇది చేయుటకు మోషేను ఆయన నిర్ణయించిన తరువాత, ఆయన మోషేను కాదనలేకపోయెను. ఎందుకనగా ఆ సమయములో అతడు క్రీస్తు వలె ప్రవర్తించుచుండెను. అది మోషేలో క్రీస్తు యుండెను. ఖచ్చితం.
60 ఇపుడు, ఈ దినాన దేవుడు ఆయనకు ఆయనే బయలుపరచుకొనుచున్నందుకు మనమెంతో ఆనందంగా ఉన్నాము. ఆ గొప్ప దినము ఇపుడు ఉదయింపతొడిగినదియని నేను నమ్ముతున్నాను. కాంతులు విరజిమ్ముటకు ప్రారంభించినవి. పరిశుద్ధుల హృదయాలలో పరదైసు పక్షులు పాడుటకు ప్రారంభించినవి. ఇది దూరము కాదని వాటికి తెలుసు. ఒకటి జరగబోతున్నది. జరుగుతుంది. కాబట్టి “ఆయనేది చేయకుంటే…”
61 ఇపుడు, లేఖనమంతా ఆత్మ ప్రేరేపితమైనది. లేఖనములు ఖచ్చితంగా సత్యమైయుండును. మరి వేరే దారిలేదు. అక్కడే మన స్నేహితులతో కథోలిక్ సంఘముతో నేను విభేదించునది. మామూలు మనుష్యులతో అది వ్రాయబడలేదని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినదని నేను నమ్ముతున్నాను. మీరు గమనించారా, కలిపిన ఈ చిన్నవన్నీ, దానిని కలుపుటకు ప్రయత్నించినవన్నీ; నివారణ చేయుటలో అది ప్రతియొక్కటి త్రోసివేయబడెను.
62 మరియు ఈ నిజమైన, సత్యమైన లేఖనములు ఒకదానితో ఒకటి జతపరచబడియున్నవి. అక్కడ వాటియందు ఎటువంటి వ్యత్యాసములేదు, ఎక్కడ కూడా లేదు. ఒకటి లేక రెండు వచనములైనా భేదముగా కన్పించని సాహిత్యమును ఒకదానిని చూపించుడి. ఎక్కడగాని, బైబిల్ తనకుతాను విరుద్ధముగా లేదు. పాతకాలపు విమర్శకులు చెప్పుట నేను చదివాను. అయితే, అదెక్కడయున్నదో నాకు చూపించమని చాలా కాలంగా నేను అడిగాను. అది ఇక్కడ లేదు. మానవ మనస్సు గందరగోళంగా యున్నందున, అది అది. దేవుడు గందరగోళము గలవాడుకాదు. ఆయనేమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు.
63 చూడూ, ఒక సంఘము ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చునట్లయితే, కథోలిక్ సంఘము చెప్పినట్లుగా, సరే, ఆలాగైతే అది ఏది? మనకున్న సంఘాలను చూడండి. మనకు తొమ్మిది వందలు ఇంకా కొన్ని. వివిధములైన సంస్థాపక సంఘములు…ఇపుడు…ఒకటి ఈ విధంగా బోధిస్తుంది, ఒకటి ఆ విధంగా. ఎంతటి గందరగోళము. ఎవరేది కోరితే ఆలాగు చేయవచ్చు. నీవెటైనా వెళ్ళవచ్చు. దేవునికొక ప్రమాణమున్నది, అది ఆయన యొక్క వాక్యము.
64 మాటలాడుచుండగా…కథోలిక్ వారిని త్రోసివేయుట కాదు. ఎందుకనగా—ప్రొటస్టెంట్ వారు అంతే చెడ్డగా ఉన్నారు. అయితే ఒక యాజకునితో మాట్లాడుచున్నపుడు, అతడన్నాడు, “మిస్టర్ బ్రాన్హాం గారు,” అతడన్నాడు “దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు,” అని
65 నేను చెప్పాను, “అయ్యా, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. మరియు ఆయన వాక్యమైయున్నాడు.” ఔనండి.
అతడన్నాడు, “సరే, ఆయన సంఘము తప్పిపోనిది,” యని
66 నేను చెప్పాను, “ఆయన అది చెప్పలేదు. అయితే ఆయన చెప్పాడు వాక్యము తప్పిపోనిది.”
67 అతడు చెప్పాడు, “సరే, బాప్తిస్మము ఆ విధముగాయని మేము బోధిస్తాము మరియు తదితరమైనవి.”
నేను అడిగాను, “ఎప్పటినుండి” యని.
చెప్పాడు, “ఆరంభ దినముల నుండి.”
నేనన్నాను, “అది కథోలిక్ సంఘమని నీవు ఒప్పుకొనుచున్నావా?”
“ఔను” అని అతడన్నాడు.
68 నేను చెప్పాను, “ఆలాగైతే, నేను కథోలిక్. పాతకాలపు కథోలిక్ ను. నేను పాతపద్ధతి మార్గమును నమ్ముచున్నాను. మీరు ఈ దినాన అంతా కలగలుపు చేశారు. మీరు బోధించునది లేఖనములో అరుదుగా ఉన్నది. స్త్రీలు మరియు చనిపోయినవారి ద్వారా మధ్యవర్తిత్వము, మరియు ఇతర కార్యములు ఎన్నిటినో చేర్చుకొన్నారు. ఓ! మై. మాంసము తినకూడనివి, నాకు తెలియనివి ఎన్నో. చూశారా” “అవన్నీ లేఖనములో నాకు చూపించు,” అని నేనడిగాను.
69 అతడు చెప్పాడు, “అవి అక్కడయుండనవసరం లేదు. అది అలాగని సంఘము చెప్పినంత కాలము, అది అదే. అదేమని చెప్పెనో వ్యత్యాసము లేదు. అది సంఘము.”
70 నేను చెప్పాను, “బైబిల్ చెప్పినది, ‘ఎవరైనను, దానికి ఒక్క మాట కలిపినను లేక ఒక్క మాట తీసివేసినను జీవగ్రంథములోనుండి వానికి పాలులేకుండ చేయును.’ కాబట్టి అది వాక్యము! నేను వాక్యాన్ని నమ్ముతున్నాను.”
71 ఇప్పుడు మరియు అప్పుడు, ఆమోసు చెప్పినట్లయితే, మిగతా లేఖనాలు దానితో వెళ్ళినట్లయితే…
72 మీరు జ్ఞాపకముంచుకొనుడి, దానిమీద, దాని యొక్క ప్రాముఖ్య కార్యములనే మనము తాకుచున్నాము. అయితే నేను ఆ గదిలోనికి వెళ్ళినపుడు, మరియు—మరియు ఆ అభిషేకము వచ్చినపుడు, ఆ వచ్చినవన్ని వ్రాయగలిగితే, ఒక్కొక్క ముద్ర మీద మూడు నెలలు నేనిక్కడ యుండవలసియుండును. కనుక ప్రాముఖ్య అంశములను తాకి, ప్రజలకు ఇబ్బంది కలిగించనివి వదులుదాము. అయితే, వారిని గాయపరచక, నమ్మునట్లుగా—అది విషయానికి అలవాటుపడతారు. నా భావమేదో మీకు అర్థమైందా.
73 ఇపుడు, ఇది ఇపుడు గమనించండి, “దేవుడు ఏమి చేయనట్లయితే” ఆమోసు చెప్పాడు, “ఆయన సేవకులైన ప్రవక్తలకు ఆయన మొదట బయలుపరచినట్లుగా” తరువాత, ఆయనేమి చేస్తున్నాడో మనం చూద్దాం. ఆయన ఇపుడు ఏం బయలుపరచబోవుచున్నాడో, ఆయన ఒకటి చేయబోతున్నాడని, అది యుండవలసియున్నది. న్యాయ తీర్పునకు రంగము మీద దేవుడు కదలుటకు సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన ఒకటి చేయబోతున్నాడు. మరొక విషయం, మరలా మనము చివరి దినాలలో ఉన్నామని, అది తప్పక సాక్ష్యమిస్తుంది. మనము కాలము యొక్క అంతములో, లవొదికయ కాలము యొక్క ముగింపులో ఉన్నాము. ఎందుకనగా కడవరి దినమున మాత్రమే, ఈ విషయాలు బయలుపరచబడవలసియున్నది.
74 ఇపుడు, అది ఇపుడు ఆలోచించు. మనము—పరిశుద్ధాత్మ, మనము ఏమని ఎరగాలని కోరుచున్నదో దానిలోకి దింపుదాము.
75 ఇపుడు జ్ఞప్తించుకొండి, “దేవుడు, ఆయన సేవకులగు ప్రవక్తలకు మొదట బయలుపరచకుండా ఏదియు చేయడు, ఏదియు బయలుపరచడు.” ఏదైనా ఆయన చేయకముందు, ఆయనది బయలుపరచును. ఆయనది బయలుపరచునపుడు, నీవిది గుర్తుంచుకో. రహదారిపైన ఒకటియున్నది. చూశారా, అది బయలుపరచబడుతుంది.
76 మనం మాట్లాడుచున్న ఈ విషయాలు కడవరి దినమున బయలుపరచబడవలసియున్నవి. ఆఖరి బూరకు ముందు. ఆఖరి సంఘకాలానికి ముగింపులో. ఔను. ఇపుడు నీవది చదవాలనుకుంటే, నీవు త్రిప్పవచ్చు…గతరాత్రి నీకు నేను వివరణ ఇచ్చాను, మూడుసార్లు, ప్రకటన 10:1-7. చూడు, “ఏడవ దూత వర్తమానం బూర ఊదబడు దినములలో దేవుని మర్మము బయలుపరచబడి మరియు సమాప్తమగును.” ఒకటి మాత్రము విడువబడును. ఈ ఏడు ముద్రల గ్రంథము విప్పబడినపుడు, తరువాత దేవుని యొక్క సంపూర్ణ మర్మము…
77 ఎందుకని? మనమది పరిశోధించాము సంవత్సరాల తరబడిగా. మరియు లేఖన ప్రకారంగా తరువాత, మనము…ఈ దినము వరకు దానిని అర్థము చేసుకొనే మార్గము లేకపోయెను. ఎందుకనగా అది మరుగు చేయబడెను. సూచనను మనము చూశాము. దేని ద్వారా అది సూచించబడినది. అయితే కడవరి దినము వరకు సరిగా బయలుపరచబడలేదు. చూశారా? ఇపుడు మనము చివరి సమయము వరకు, మనము అక్కడ యుండవలసినది.
78 ఇపుడు, జ్ఞప్తించుకోండి. వద్దు…ఇది ఇపుడు మరువవద్దు. “అది ఆయన బయలుపరచువరకు ఆయనేది చేయడు.” ఇంకా మరచిపోవద్దు. ఎంతో సాధారణ మార్గాన ఆయన అది చేస్తాడు. “జ్ఞానులు వివేకులు అది పోగొట్టుకొనునంతగా,” మీరు అది గుర్తుపెట్టుకోవాలనుకుంటే, అది మత్తయి 11:25-26 మరియు జ్ఞప్తించుకోండి “ఆయన అది బయలుపరచు వరకు ఆయన ఏదియు చేయడు.” ఆ విధంగా తెలివైనవారు, విద్యావంతులు పోగొట్టుకొనునట్లుగా, ఆయన అది బయలుపరచును. జ్ఞప్తించుకోండి! అది, వాక్యమునకు బదులుగా లోకము అపేక్షించు జ్ఞానము. మొదటి పాపము చేసినపుడు అది చేసినది. అది ఇపుడు మరచిపోవద్దు. అది ఆలోచించునపుడు, ఓ, మనమెంత కృతజ్ఞులమైయుండాలి!
79 జరుగుతున్న విషయాలవైపు చూడు! ఆయన మనకు చెప్పిన విషయాలవైపు చూడు. ఇక్కడ లేచిన ప్రజలైన మీరు ఈ మందిరములో చూడండి. టేపులను ఇపుడు అడగబోవుచున్నాను…సరే ముందుకు సాగండి. టేపు చేయండి. అయితే చూడు, మందిరములోని ప్రజలతో నేనిది నేనిపుడే చెప్పబోతున్నాను, ఇక్కడున్న మీతో చెప్పుతున్నాను. జరగబోవు సంఘటనలు ముందుగానే నేను చెప్పిన వందలకొలది సంఘటనలలో ఏ ఒక్క కార్యము నెరవేరలేదని మీలో ఎవరైనను ఒక్కరు వేళెత్తి చూపించగలరా అని ప్రభువైన యేసు నామమున మిమ్మును అడుగుచున్నాను. అక్కడ వేదికపైన లేక ఎక్కడైన ఆయన చెప్పిన కార్యములు సంపూర్ణంగా ఖచ్చితంగా నెరవేరలేదని చెప్పగలరా? ఏ విధంగా ఆలాగుండగలదు. మానవ మనస్సు ఆలాగు ఉండునా? తప్పక ఆలాగుండదు.
80 ఈ రానున్న జూన్ కు ముప్పయి మూడు సంవత్సరముల క్రితం వెలుగు రూపములో ఆయన అక్కడ నదియొద్ద కనిపించాడు. చిన్నపిల్లవానిగా నుండినప్పటి నుండి ఆ స్వరమును గూర్చి, ఆ వెలుగును గూర్చి నేను చెప్పినది పాతకాలము నుండి చెప్తూ వస్తున్న మీకు జ్ఞప్తుండియుంటుంది. నేను చెప్పు విషయాలు మతిలేనివారు చెప్పుచున్నట్లుగా ప్రజలు అనుకొనిరి. బహుశా, ఒకరు అది చెప్తే, బహుశా నేను కూడా ఆలాగే తలంచేవాడను. అయితే అందును గూర్చి మీరు ఆశ్చర్యపడనవసరం లేదు. ఎక్కడైతే వందలమందికి నేను బాప్తిస్మమిచ్చుచుంటినో…ఆ దినాన ఆ నది యొద్ద 1933 నుండి సంఘము ఆశ్చర్యపడలేదు.
81 మర్రా అబ్బాయ్ నాకు చెప్పినది నాకు జ్ఞప్తుంది. అన్నాడు, “బిల్లీ, ఆ ప్రజలను నీవు ముంచబోవుతున్నావా?” అని అడిగారు. ఇక్కడున్న చిన్న జిమ్ మర్రా, అతడు ఇపుడు చనిపోయాడనుకుంటాను. అతడు అక్కడ హత్య చేయబడ్డాడని అనుకుంటున్నాను. ఒక స్త్రీ అతనిని కాల్చి చంపింది. అయితే అతడు—అతడు నన్నడిగాడు, “నీవు వారిని నీళ్ళలో ముంచబోతున్నావా?”
82 నేను చెప్పాను, “లేదండి. నేను వారికి ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము ఇవ్వబోతున్నాను.”
83 గుంపులో ఒక స్త్రీ వెళ్తుంది. ఆమె మరొక స్త్రీతో అన్నది, ఆమె అన్నది…అందును గూర్చి ఒక గుర్తింపు చేసినది. ఆమె అన్నది, “సరే. ముంచడం గూర్చి నాకేమి పరవాలేదు.” “అది ఆలాగే, నాకు లెక్కలేదు.”
84 నేను అన్నాను, “వెనక్కి వెళ్ళి పశ్చాత్తాపపడు. నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు అర్హురాలవు కావు” చూశారా?
85 ఇదేదో ఆటలాడు విషయం కాదు. వాక్యము ఆజ్ఞ ద్వారా బయలుపరచబడిన క్రీస్తు యొక్క సువార్త. ఇపుడు దీనిని “బుద్ధిహీనతయని, వెర్రితనమని” చెప్పి ఒకచోట దానిని యుంచవచ్చు. అయితే జ్ఞప్తుంచుకో, ఖచ్చితంగా అది ఏమైయున్నదో అది జరుగునట్లుగా ఇది వాక్యమునందు వాగ్దానం చేయబడింది మరియు ఇది ఇక్కడే యున్నది.
86 తరువాత, ఆ దినాన అక్కడ, నది యొద్ద వారు నిలబడినపుడు! మరియు ప్రభువు యొక్క దూత, దూరాననున్న నక్షత్రం వలె అది కన్పించెనని నేను మీకు చెప్పాను, తరువాత అది దగ్గరకు వచ్చినది. మరకతము వలెనున్న వెలుగు కనిపించినదని మీకు చెప్పాను. అది అక్కడ, నేనెక్కడైతే బాప్తిస్మము ఇచ్చుచున్నానో ఆ నది యొద్దకు వచ్చినది.
87 “దాని అర్థమేంటి?” అని నగరంలోనున్న బిజినెస్ మెన్ వారు అడిగారు.
88 నేను చెప్పాను, “అది నా కొరకు కాదు. అది మీ కొరకు. నేను నమ్ముతున్నాను. చూశారా? అది మీ కొరకు, అది దేవుడు చేశాడు. నేను సత్యము చెప్తున్నానని మీకు తెలియబడునట్లు.” నేనొక చిన్న బిడ్డగా, బాలునిగా సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల వయస్కునిగా, వారు—వారు దానిని నమ్మరు. చూశారా, ఎందుకనగా చిన్న బిడ్డకు అది మించినది మరియు తరువాత నేను ఆలోచిస్తున్నాను.
89 సహోదరుడు రాబర్సన్, మన ధర్మకర్తలలో ఒకరు. కొద్ది నిముషాల క్రితం నేనతనిని చూశాను. అక్కడ తీసిన పటము హోష్టన్ లో ఉండుటను గూర్చి (అది మీరు చూశారా) గత దినము అతడు నాతో చెప్పుచుండెను. మరియు నేను ఆ వాగ్వాదములో, గత రాత్రి అందును గూర్చి చెప్పడం ప్రారంభించితిని. సహోదరుడు రాయ్…ఇంకొక మనిషి, గుంపులో రికార్డర్ కలిగియున్న ఒకే ఒక వ్యక్తి అతడు. అది పాతకాలపు వైర్ రికార్డర్. ఇపుడు నేను సహోదరుడు రాబర్ సన్ ను అతని భార్యను చూస్తున్నాను. కాబట్టి, ఈ మిసర్స్ రాబర్ సన్ రోగిగా ఉన్నది.
90 సహోదరుడు రాయ్ అనుభవశాలియైన సైనికుడు. మరియు అతని కాళ్ళు పేల్చివేయబడ్డవి. చనిపోయిన వారికై అతన్ని పరుండబెట్టిరి. సైన్యంలో అతనొక అధికారి మరియు అతడున్న ఈ టాంక్ ను జర్మనీ ఎనభై ఎనిమిది పేల్చి, అతనిని ముక్కలు ముక్కలుగా చీల్చివేసిరి. ఎంతో సేపు చనిపోయినవారితో పరుండబెట్టిరి. అతడు ఇక ఎన్నడు నడవడు, ఎందుకనగా రెండు కాళ్ళు, వాటిలోనున్న నరాలు పెద్దగా పేలి దెబ్బతిన్నవి కనుక, అని చెప్పుకొన్నారు. మై. అతడు నాకంటె ఎక్కువగా నడవగలడు.
91 అయితే, అదేమైయుండెను? అతడు చూచిన ఒకటియున్నది. అతడు హోష్టన్ కు వెళ్ళాడు. మరియు అతని భార్యను గూర్చి అతడు చెప్తున్నాడు. మరియు అతని యొద్ద Wire ఉన్నది. టేపుకు దానిని కలుపబోతున్నాడు. ఇక్కడ కూడికయైన తరువాత, సరే, అది మీ కొరకు వినిపింపబోతున్నాడు అని నేను నిరీక్షిస్తున్నాను. మరియు అక్కడున్న పాతదైన టేపు వైర్ మీద హోస్టన్ లో జరిగిన నా పరిచర్యలు అతని యొద్ద ఉన్నవి. మరియు అతని భార్య, అతడన్నాడు, అక్కడకు చేరుకున్నారు. నిన్నటి దినము వరకు అతడది గమనించలేదు.
92 ఓ! ఆమె ఎంతో విచారంగా ఉన్నది. ఆమె వ్యాధితో ఉన్నది. ప్రార్థనా వరుసలోకి రావాలని ఆమె ఎంతో కోరుతుంది. వారు నాకు తెలియదు. నా జీవితంలో ఎన్నడు వారిని చూడలేదు. కాబట్టి, ఆరోజు ఆమె కిటికీ ప్రక్కన కూర్చొని బయటకు చూచుచుండెను. ఎంతో ఘోరమైన స్థితిలో యుండెను. మరియు గజిబిజి స్థితిలో ఉండియుండెను. ప్రార్థనా వరుసలో వచ్చుటకు ప్రార్థనా కార్డు కోరినది.
93 ఆ రాత్రి వరుసలోకి వచ్చుటకు లేక తరువాత రాత్రి లేక ఇంకొకసారి వచ్చుటకు తటస్థించెను. అదే రాత్రి అనుకుంటాను. ఆమె వరుసలోకి వచ్చినది. మరియు ఆమె వేదికపైకి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఆమెతో చెప్పాడు. చెప్పాడు, “ఇపుడు, నీవు ఇక్కడదానవు కావు. నీవు న్యూ ఆల్బెని అను నగరానికి సంబంధించినదానవు.” చెప్పాడు, “నీవు కిటికీలో కూర్చొని ఈ దినాన బయటకు చూస్తున్నావు, ప్రార్థనా కార్డుకై తడబడుతున్నావు.” అదంతా సంవత్సరాల క్రితం టేపుపైనున్నది.
94 మరియు, కూటము యొక్క ఆరంభంలో అక్కడ పరిశుద్ధాత్మ యుండినపుడు అది మొదటి కూటము. మేము మొదట సుమారు మూడువేల మంది ప్రజలముంటిమి. తరువాత ఎనిమిదివేల మందికి చేరితిమి. తరువాత సుమారు ముప్పయి వేలమంది. కాబట్టి, ఆ తరువాత నేను మాట్లాడుచున్నపుడు నా మొదటి కూటములో నేను చెప్పాను, “నేనెందుకు ఇది చెప్తున్నానో నాకు తెలియదు.” ఇపుడు ఇది టేపు మీదనున్నది. “అయితే, ఇది నా యొక్క కాలములో జరిగిన గొప్ప సంఘటనలలో ఇది యొకటి. ఈ కూటములో ఒకటి జరగనైయున్నది. ఎవరు ఎన్నడు చూడని ఒక గొప్ప కార్యము కాబోతున్నది.”
95 ఆ తరువాత, అది సుమారు ఎనిమిది లేక తొమ్మిది, పది రాత్రులలో సుమారు ముప్పయి వేల ప్రజల ముందు ప్రభువు యొక్క దూత కన్పించి దిగివచ్చెను. పటము తీయబడెను. అది అక్కడ వాషింగ్ టన్ డి.సి. లో ఇపుడున్నది. ప్రపంచంలో ఫొటో తీయబడిన ఒకేయొక సహజాతీతమైన ఉనికిగానున్నది.
96 అటుతరువాత మీకు తెలియును. నేను వివేచన ద్వారా ఈ విధంగా చెప్పుట మీరు వినియుంటారు, “ఒక వ్యక్తి మరణించుటకు సిద్ధముగా నున్నాడు. ఒక నల్లని నీడవలె అతనిపై యున్నది. మరణించుటకు సిద్ధముగా ఉన్నారు.”
97 మరియు తరువాత ఈస్ట్ పైన్స్ లో లేక దక్షిణ పైన్స్ లో అదే అనుకుంటాను, ఆఖరి కూటములో నేనున్నపుడు, ఒక చిన్న స్త్రీ అక్కడ కూర్చొనియున్నది. ఒకటి ఆమెతో చెప్పినది, “వెంటనే ఆ ఛాయా చిత్రం తీయుము,” అని. నేను ఆ స్త్రీతో మాట్లాడుచుండగా అది జరిగెను. అది అక్కడయున్నది. ప్రకటనల పలకము పైన అది యుంటుందని, అది కొద్ది సమయముండునని నేననుకొనుచున్నాను. అక్కడ నల్లని నీడ ఆ స్త్రీపై కప్పియున్నది.
98 పరిశుద్ధాత్మ అది ప్రకటించిన వెంటనే ఆమె ఇంకొక ఛాయా పటమును తీసినది. అది వెళ్ళిపోయింది. చెప్పినది, “నీవు స్వస్థతపొందబోవుచున్నావు. ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు. కాన్సర్ పోయింది.” మరియు ఆ విధముగానే జరిగినది. ఆమె స్వస్థత పొందింది. చూశారా? అక్కడే మీరు ఉన్నారు. చూశారా?
99 దినము యొక్క సమయమేదో దానిని దేవుడు ఎరిగియున్నాడని అది చూపించుచున్నది. మనకు తెలియదు. మనమాయనకు లోబడియుండవలసియున్నది.
100 ఇపుడు మనం మాట్లాడుకుంటూ వెళ్ళగలం. అయితే ఒక్క నిముషము, ఇక్కడకు వద్దాం. మరియు ఈ వెనుక ముద్రను తాకుదాము. దీనిని దానితో కలుపుదాము. ఇపుడు, మరియొక కొద్ది క్షణములు, మొదటి ముద్ర కొరకై కొంచెం పునరావృతం చేద్దాం.
101 మొదటి ముద్ర విప్పబడునప్పుడు, మనము గమనించాము, సాతాను ఒక—ఒక అతీతమైన మత సంబంధమైన మనిషియని మనం గమనించాము. తెల్లని గుఱ్ఱము మీద స్వారీచేయువానిని మీరు గమనించారా? అది, వారు తలంచారు. ఆరంభ సంఘము; అయితే ఓ, మై. సంవత్సరాల తరబడిగా అది బోధింపబడినది, అయితే అది రాలేదు. మిగతావన్నీ, వాటన్నిటినీ మనము కలిపినపుడు, అపుడు అవి ఎక్కడున్నవి కనిపిస్తవి. చూశారా. ఇపుడు, మిగతావన్నీ ఏమి కాబోతున్నవో నాకు తెలియదు. ఇంకా. అయితే, అది క్రమముగా వచ్చునని నాకు తెలుసు, ఎందుకంటే అది సత్యము. అది సత్యము. అది ఆచారాధిపత్యము గల రోమ్ యొక్క సంఘము. ఖచ్చితం.
102 ఎవరైతే, యూదులు అంత్యక్రీస్త ని తలంచుచున్నారో, వారు నిశ్చయంగా దానికి మిలియన్ మైళ్ళ దూరములో నున్నారు. యూదులు అంత్యక్రీస్తు అని మీరు ఎన్నడు తలంచవద్దు. మనం ప్రవేశించుటకు మార్గము చేకూర్చబడగలందులకై ఉద్దేశ్యపూర్వకంగా వారి నేత్రాలు మూయబడినవి. పశ్చాత్తాపము పొందుటకు సమయం ఇవ్వబడినది.
103 అయితే, అంత్యక్రీస్తు ఒక అన్యుడు. ఖచ్చితం. అది సత్యము యొక్క అనుకరణ. యాంటి, “వ్యతిరేకము.” ఇపుడు, ఈ గొప్ప అతీతమైన మనుష్యుడు, ఓ, గొప్ప మనిషి ఏలాగయ్యాడు, మరియు—మరియు అటుతరువాత చివరకు సింహాసనాసీనుడయ్యాడు. అటుతరువాత, సింహాసనాసీనుడైన తరువాత అతడు కిరీటధారియయ్యాడు. ఇపుడు, అతడు దానితరువాత దేవునికి బదులుగా ఆరాధించబడుచున్నాడు.
104 ఇపుడు, చూడు. అది జరుగకముందు, నేనొకటి మిమ్ములను అడుగగోరుచున్నాను. అదెవరు? రెండవ థెస్సలోనికయ 2:3 లో వచ్చునని పౌలు చెప్పిన ఆ మనిషి ఎవరు? ఎందుకు ఆ మనుష్యుడు కాలము ద్వారా గమనించి అది చూశాడు? అతడు దేవుని ప్రవక్త. ఖచ్చితంగా. ఎందుకని…
105 “రాబోవు కాలమందు మోసపుచ్చు…చెవినిచ్చి విశ్వాసము నుండి తొలగిపోయెదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” మోసపుచ్చు అనగా ఏమిటో మీకు తెలుసా? మోసపుచ్చు ఆత్మ సంఘములో ఏదనగా యాజకుడు. “మోసపుచ్చుట, యాజకుని ఆత్మ, దయ్యముల పనులు; సంఘములో వేషధారణ.”
106 “గర్వాంధులు, మూర్ఖులు,” తెలివి, మీరు చూశారా, బుద్ధి, తెలివి; “పైకి భక్తిగలవారు.” (వెళ్ళి చెప్పు, “సరే, మనము క్రైస్తవులము; మనము ఆలయానికి వెళ్ళవలసియున్నది.”) “పైకి భక్తిగలవారైయుండి, దాని ప్రత్యక్షతలను తృణీకరించుట. ఆత్మ యొక్క కార్యములను శక్తిని నిరాకరించుట.” చూశారా? ఇపుడు గమనించండి. అతడు చెప్పాడు, “ఇంటింటికి తిరిగేవారు మరియు అవివేక స్త్రీలను నడిపించుట…” పరిశుద్ధాత్మ పొందిన స్త్రీలని అది అర్థం కాదు. “నానావిధమైన దురాశలతో నడిపించబడు అవివేక స్త్రీలు.”
107 నానా విధములైన దురాశలు! వారు ప్రవేశించగల ప్రతి చిన్న దానిలో వారు ప్రవేశిస్తారు. అన్ని రకాల సొసైటీలలో; వారు ఇష్టము వచ్చినట్లు జీవించుట. ఇంకా చెప్తారు, “మేము ఆలయానికి వెళ్తాము. అందరి వలే మేమూ మంచివారము.” నాట్యాలు, విందులు, వెంట్రుకలు కత్తిరించుకొనుట, రంగులు పూసుకొనుట, వారు కోరిన వస్త్రాలు వారు ధరించుట; ఇంకా “మేము—మేము పెంతెకొస్తులము, మేము—మేము అందరి వలె మంచివారము.” ఓ! మీ స్వంత క్రియలు మిమ్ములను గుర్తింపజేస్తున్నవి. నిజం. గమనించు.
108 అయితే అతడు చెప్తున్నాడు, “సత్యమును గూర్చి భ్రష్ట మనస్సు గలవారు.” సత్యమనగా ఏంటి? వాక్యము, అనగా క్రీస్తు. “సత్యమును గూర్చి.”
109 “ఓ, మీరు…నీవు, నీవు స్త్రీలను తరుమువాడవు. నీవు స్త్రీ ద్వేషివి. నీవు ఇది చేయి, అది.”
110 కాదండి. అది సరికాదు. అది ఒక—ఒక తప్పిదము. నేను స్త్రీలను ద్వేషించుట లేదు. లేదండి. వారు నా యొక్క సహోదరీలు, వారు సహోదరీలు. అయితే విషయం…
111 ప్రేమ దిద్దుబాటు చేస్తుంది. అది దిద్దుబాటు చేయకపోతే, అది ప్రేమకాదు. అది ఆలాగైతే, అది ప్రేమయైనట్లయితే, అది—అది ఫిలియో ప్రేమ అగాపే కాదు, నేనది చెప్పుతాను. కొంచెం అందంగా కనిపించే స్త్రీ కొరకు వారికి కొంత ఫిలియో ప్రేమ యుండవచ్చు. అయితే అగాపే ప్రేమ వేరైనది. విషయాన్ని సరిచేయునది ఈ ప్రేమ. మరియు నిరంతరము మనము జీవించె యొక చోట దూరానయుండు దేవుని కలయునది. చూశారా? నా భావము అది కాదు. బహుశా అది ఊదబడినట్లుగా అది ఉంటుంది. అయితే నేను ఏంటో మీకు తెలుసా? మీరు అర్థం చేసికున్నారని నేననుకుంటాను. సరే.
112 ఇపుడు, గుర్తుంచుకోండి అతడు చెప్పాడు, “యన్నే, యంబ్రేలు మోషేను ఎదిరించినట్లు, ఆలాగే వారు కూడా, అయితే వారి బుద్ధిహీనత త్వరగా బయటపడును.”
113 ఎందుకని? మోషే, ఒక కఠినంగా అగుపించే కార్యము చేయవలెనని ఆజ్ఞ ఇవ్వబడినపుడు, అయితే ఎంతో యథార్థతతో వెళ్ళాడు. ఈ కర్రను తీసికొని అది నేల మీద పడవేయమని చెప్పాడు, అది సర్పముగా మారునని చెప్పాడు. అటుతరువాత ఏమి జరుగునని అతనికి చూపించుటకు, ఆయన అది చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఫరో ఎదుట అతడు నిలబడ్డాడు. కర్ర క్రింద వేశాడు. అది సర్పమైనది.
114 “ఒక చౌకబారు మాంత్రిక విద్య!” అని ఫరో చెప్పియుండెనని అనుమానంలేదు. కాబట్టి అతడు వెళ్ళి అతని యన్నే, యంబ్రేలను తీసుకొని వచ్చాడు. వారు చెప్పారు, “మేము కూడా ఆ కార్యాలు చేయగలము” అని. అతడు కర్ర విసిరి పడవేశాడు, అవి సర్పములైనవి.
ఇపుడు మోషే ఏం చేయగలడు?
115 అదేంటి? అదేమని చూపుతుందనగా, ప్రతి యొక్క నిజమైన దేవుని యొక్క పనికి దయ్యానికి అనుకరణ చేయువాడు ఉన్నాడు. ప్రజలను మార్గము నుండి నెట్టివేయుటకు వారు అనుకరణ చేస్తారు.
116 మోషే ఏం చేశాడు, అన్నాడు, “సరే. నేను తప్పుచేశాననుకుంటాను. నేను వెనుకకు వెళ్ళటం మంచిది?” అతడలాగే నిలువబడిపోయాడు. అక్షరము వరకు అతని ఆజ్ఞను గైకొనవలసియున్నది.
117 మొదటి విషయమేంటో తెలుసా. మోషే సర్పము మిగతా వాటిని మ్రింగివేసినది. చూశారా? మిగతా సర్పములు ఏమైనవి అని ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఎక్కడకు వెళ్ళినవి? మోషే కర్ర పట్టుకొని దానితో వెళ్ళిపోయాడు. దానితో అతడు అద్భుతాలు చేశాడు. ఆ సర్పము, ఈ మిగతా కర్రల లోపల ఉన్నది. చూశారా? అది అద్భుతం. ఔను కదా? ఔనండి.
118 ఇపుడు, అంత్యక్రీస్తు నెమ్మదిగా వెలుగులోకి వచ్చుచున్నాడు. ఇది మీరు గమనించాలని కోరుచున్నాను. ఇపుడు మీరు వినునపుడు…
119 నా కథోలిక్ స్నేహితులగు మీరు ఒక్క నిముషము నెమ్మదిగా కూర్చొనండి. మరిపుడు, అటు తరువాత ప్రొటస్టెంట్ లు, మనమందరము ఎక్కడున్నామో చూడబోతున్నాము. ఔనా.
120 గమనించండి. మొదటి సంఘము, వారే మొదటి సంఘము, అసలైన సంఘము అని కథోలిక్ సంఘము చెప్పిన యెడల, వారు ఖచ్చితంగా నిజమే. వారు ఔను. వారు పెంతెకొస్తులో ప్రారంభించిరి. అక్కడ కథోలిక్ సంఘము ఆరంభమైనది. నేను దానిని ఒకప్పుడు నమ్మలేకపోయాను, చరిత్ర చదివే వరకు కూడా. అది నిజమేనని నేను కనుగొన్నాను. వారు పెంతెకొస్తున ప్రారంభించబడిరి. అయితే వారు తిరిగిపోవుట ప్రారంభించారు. వారెక్కడున్నారో మీరు గమనించండి.
121 ఇపుడు పయనిస్తున్న వేగముతో పెంతెకొస్తు పయనిస్తున్నట్లయితే, రెండు వేల సంవత్సరాలు వారికి అవసరం లేదు. ఇప్పటి నుండి ఒక వంద సంవత్సరాలలో కథోలిక్ సంఘము కంటె వారు దూరంగా ఉంటారు. అది నిజం.
122 అయితే గమనించు. ఈ తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయువానిని. ఈ ముద్రలు మనము తాకు వరకు దీని వెనుకటి కార్యమును కొంచెం చూద్దాం. తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయువానిని గమనించు, అతడు బయటకు వచ్చినపుడు అతడు—అతడు మూడు దశలలో క్రియ చేయుచున్నాడు. గతరాత్రి, నేను మీకు రుజువుచేసినట్లుగా, దేవునివలె, అపవాది త్రిత్వములో ఉన్నది. అయితే ఒకే దయ్యం అన్ని కాలాలలో మూడు దశలలో ఉన్నది. అతని దశలు గమనించండి. మొదటి దశలో, అతడు వచ్చాడు.
123 పరిశుద్ధాత్మ దిగివచ్చెను. ప్రజలు ప్రతీది సమిష్ఠిగా కలిగియుండిరి. దేవుని ఆత్మ వారి మీద ఉండెను మరియు అపొస్తలులు ఇంటింటికి వెళ్ళి, ప్రజలతో రొట్టె విరచుచుండిరి. గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు జరిగెను.
124 మరియు—మరియు తరువాత, మొదటి విషయమేంటో తెలుసా, సాతాను సణుగుడు పుట్టించెను.
125 అటుతరువాత, కొంతకాలము తరువాత, ఈ బానిసలు, పేద రైతులు పరిశుద్ధాత్మను ఎందుకు పొందారో వారు పలు పలు విధాలైన స్థలాలకు వెళ్ళి సాక్ష్యమిచ్చారు. వారి యజమానులకు వారు సాక్ష్యమిచ్చారు.
126 కొంత కాలమైన తరువాత, ఓ, సైన్యాధిపతులు లాంటి వారు. మరియు—మరియు అనేక విధములైన ప్రజలు వచ్చుటకు ప్రారంభించిరి. పేరుప్రఖ్యాతలు గలవారు, ఈ జనులు చేయు గొప్ప కార్యములను, అద్భుతములను మరియు సూచక క్రియలను చూచుటకు ప్రారంభించిరి. కనుక వారు క్రైస్తవ్యాన్ని అంగీకరించారు.
127 సరే, అటుతరువాత చూడండి. అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తరువాత, చిన్న చీకటిగదిలో కూడుకొని, వారి చేతులతో చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ భాషలతో మాట్లాడుచు వర్తమానములు పొందుకొనుచుండిరి. ఎందుకు? తనయొక్క పోటీదారుని యొద్దకు గాని, లేక మరేదైనగాని, తన యొక్క వీధిలో తీసికొనిపోలేదు. “మరి ఆ విధముగా అతడు నమ్మడు.” ఖచ్చితంగా నమ్మడు. కాబట్టి, అతడు దానిని ధరించవలసియుండెను. కాబట్టి వారందరు కలసి ఆలోచించసాగారు ఈలాగు “ఇపుడు మనము కొంచెం వ్యత్యాసకరమైనది రూపొందిద్దాం” యని.
128 మరియు యేసు, వెంటనే మొదటి సంఘకాలంలో, ఆయన వారితో చెప్పాడు. ఇక్కడ ప్రకటన 2 వ అధ్యాయంలో “ఈ నీకొలాయితుల క్రియలు బట్టి, నేను నీకు విరోధముగా ఉన్నాను.”
129 నీకొ, అనగా లౌకికులను “జయించుట,” మరోమాటల్లో, ప్రతియొక్కరు ఒకరిగా యుండుటకు బదులుగా ఒక పరిశుద్ధ వ్యక్తిని ఏర్పరచుటకు ప్రయత్నించిరి. ఒక విధమైనది ఏర్పరచుటకు వారు ఎక్కడ నుండి వచ్చారో అట్టి అన్యత్వము నుండి మాదిరి చేయుటకు వారు ఆశించారు. మరి చివరకు అది చేశారు.
130 ఇపుడు గమనించండి. మొదటిది “నీకొలాయితు.” నీకొలాయితు బైబిల్ గ్రంథములో “అంత్యక్రీస్తు,” అని పిలువబడుచున్నది. ఎందుకనగా, అది అసలైన క్రీస్తు సిద్ధాంతమునకు మరియు అపొస్తలులకు వ్యతిరేకము.
131 ఈ మనుష్యుని యొక్క పేరును నేను చెప్పుటకు ఇష్టపడుటలేదు. అతడు గొప్ప మనిషి. కొద్ది సంవత్సరాల క్రితం నేనతని కూటములో ఉన్నాను. నేనతని కర స్పర్శ చేయుట వలన నేనక్కడ యున్నానని అతనికి తెలుసు. మరియు అతడన్నాడు, “ఓ, నీకు తెలుసా, ఈరోజు పెంతెకొస్తు అని పిలుచుకొనేవారున్నారు.” మరియు అతడు చెప్పాడు, “వారు అపొస్తలుల కార్యముల పుస్తకముపై వారు ఆధారపడతారు.” మరియు అతడన్నాడు, “చూడూ, అపొస్తలుల కార్యములు కేవలం సంఘము కట్టుటకు ఉపయోగపడు పరంజా వంటిది.”
132 బైబిల్ గ్రంథమును బాగుగా చదివిన ఒక గొప్పవ్యక్తి ఆలాటి వివరణ చేయడం మీరు ఊహించగలరా? అది ధ్వనించుట లేదు. అది—అది పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా లేదు. ఆ విధముగా ఎక్కడా లేదు.
133 ఎందుచేతననగా అపొస్తలుల కార్యములు అపొస్తలులవి కావని, అది అపొస్తలులతో పరిశుద్ధాత్మ యుండి చేసిన కార్యములని సామాన్య విజ్ఞతతో ఎవరైనా తెలుసుకొనగలరు. సంఘకాలంలో మనం ఏ విధంగా పోల్చియున్నామో మీకు తెలుసు కదా? జీవులు కూర్చొని మందసమును కనిపెట్టుచున్నారు అక్కడ. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అక్కడ నిలబడి దానిని గమనిస్తున్నారు. అక్కడేమి జరిగినది, తత్ఫలితంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను వ్రాయబడినవి.
134 చెట్టు నుండి వచ్చిన మొదటి కొమ్మ అది. మరియు అదే సంభవించినది. ఆ చెట్టుకు మరో కొమ్మ వచ్చినట్లయితే, దాని వెనకాల మరొక అపొస్తలుల కార్యాలను వ్రాసేవారు. కారణం ఒకే దానిలో ఒకే జీవము ఉండవలయును.
135 కాబట్టి, ఇపుడు, ఈరోజు, మన సంఘశాఖల సంఘాలను చూస్తే, మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ (అనబడేది) మరియు పెంతెకొస్తు మొదలైనవి, ఎక్కడ మనమది కనుగొంటున్నాము. నీవు కనుగొనలేవు.
136 పెంతెకొస్తు దానికి చాలా సమీపంగా ఉన్నారని నేను ఒప్పుకుంటాను. ఎందుకనగా వారు ఇక్కడ లవొదికయ సంఘకాలంలో ఉన్నారు. వారు, సత్యమును కలిగియున్నారు మరి అది తిరస్కరించారు. వారు దానితో నులివెచ్చనగా యున్నారు. దేవుడు ఆయన నోట నుండి ఉమ్మివేసియున్నాడు. అది ఖచ్చితంగా లేఖన ప్రకారమే.
137 మీరు ఆ లేఖనములను అబద్ధము చేయజాలరు. చూశారా? అవి ఎల్లపుడు సత్యములైయుంటవి. ప్రయత్నించవద్దు…ఒకేయొక విషయము, మీ యొక్క తలంపు ప్రకారము లేఖనము తెచ్చుటకు ప్రయత్నం చేయవద్దు. అయితే లేఖనము ప్రకారముగా యుండు, అదీ, అపుడు మీరు దేవునితో పరుగెత్తుచున్నారు. మీరెంత నరికివేయబడవలసినప్పటికి లేక ప్రక్కన పెట్టబడవలసినప్పటికి దాని ప్రకారంగా యుండుడి. చూశారా?
138 అది, మొదట కుమ్మరించబడినపుడు ఏమి జరిగినదో చూడు. సరే. మొదటిసారి దేవుడు ఎట్లు ప్రవర్తించెనో, రెండవసారి ఆలాగే ఆయన ప్రవర్తించవలసియున్నది. ప్రతీసారి ఆ విధముగనే ఆయన ప్రవర్తించవలసియున్నది. లేనట్లయితే, ఆయన మొదట తప్పుగా ప్రవర్తించాడు.
చూశారా, మనము మర్త్యులముగా తప్పులు చేస్తాము, దేవుడు చేయడు.
139 దేవుని యొక్క మొదటి నియమము సంపూర్ణమైనది. కార్యాలు చేయుటకు ఆయన ఎన్నుకొను మార్గము శ్రేష్ఠమైన మార్గము, మరొకటి యుండదు. దానిని ఆయన మెరుగుపరచడు. ఎందుకనగా ప్రారంభములోనే అది పరిపూర్ణమైనది. అది ఆలాగు కానట్లయితే, ఆలాగైతే ఆయన అనంతుడు కాదు. ఆయన అనంతుడు అయితే, ఆలాగైతే ఆయన సర్వము ఎరిగినవాడు. ఆయన సర్వము ఎరిగినవాడైతే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్! కాబట్టి నీవు—“ఆయన ఎక్కువ నేర్చుకున్నాడు” అని నీవు చెప్పకూడదు. ఆయన ఎక్కువ నేర్చుకొనడు. ఆయన—ఆయన సమస్త జ్ఞానము యొక్క ఊటయై యున్నాడు. చూశారా?
140 మన జ్ఞానము, ఇక్కడ సాతాను నొద్దనుండి వచ్చునది. మనము ఏదెను నుండి పొందుకున్నాము. అక్కడే మనము జ్ఞానము కొరకు విశ్వాసమును వినిమయము చేసికొన్నది. హవ్వ అది చేసినది.
141 అతడు మొదట అంత్యక్రీస్తుగా పిలువబడ్డాడు. రెండవ దశలో, అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. ఎందుకనగా ప్రజల మధ్యనున్న ఆత్మ వారి శరీరములో రూపుదాల్చెను.
142 మీకు జ్ఞాపకమున్నదా, తెల్లని గుఱ్ఱం మీద స్వారీచేయువాడు, అతడు ఆరంభించినపుడు, అతనికి కిరీటము లేదు. అయితే, తరువాత కిరీటమియ్యబడెను. ఎందుకని? ఆరంభములో అతడు నీకొలాయితు ఆత్మ; ఆ తరువాత అతడు మానవునిలో అవతారమెత్తెను; తరువాత అతడు కిరీటధారియాయెను. సింహాసనము, కిరీటము పొందుకొనెను. మరియు అటుతరువాత చాలాకాలము పనిచేశాడు. దానిని ముద్రలు విప్పబడినపుడు చూస్తాము.
143 తరువాత మనము కనుగొంటున్నాము. చాలాకాలం తరువాత సాతాను పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. లేఖన ప్రకారంగా అతడు క్రిందికి వచ్చి తనకుతాను సింహాసనాసీనుడయ్యాడు. ఆలోచించు. ఆ మనుషిలో తనకుతాను సింహాసనాసీనుడయ్యాడు మరియు మృగమయ్యాడు. అతడు అధికారాన్ని, మహాధికారాన్ని కలిగి, అద్భుతాలు అన్ని చేశాడు. ఆ—ఆ లేక రోమ్ ఉత్పత్తి చేయగలిగినంత హత్యలను మరియు రక్తపాతములను గావించాడు. సరే. రోమీయుల యొక్క క్రూర హింసవలన ఆయన చంపబడ్డాడు. ఓ, కొన్ని లేఖనాలు చెప్పుకొనవచ్చు.
144 జ్ఞప్తించుకోండి. రోమ్ యొక్క ఘోర శిక్ష వలన యేసుక్రీస్తు చనిపోయెను.
145 ఇక్కడ తరువాత కూటములో, గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం ఇక్కడ ప్రసంగించుటకు, నా హృదయములోనున్న వర్తమానము, మూడు నాలుగు విషయాలున్నవి. చూశారా. “అక్కడ వారు సిలువవేసిరి ఆయనను.” “అక్కడ” అతిపరిశుద్ధమైన, ప్రపంచములో మతసంబంధమైన స్థలము యెరూషలేము. “వారు” ప్రపంచములో అతిపరిశుద్ధమైన ప్రజలు (అనబడువారు), యూదులు “అక్కడవారు సిలువవేసిరి.” రోమ్ ద్వారా ఇవ్వబడు మహా ఘోరమైన శిక్ష. “ఆయనను సిలువవేసిరి.” ఏంటి? జీవించినవారందరిలో మహా ఘనమైన వ్యక్తి. “అక్కడ ఆయనను సిలువవేసిరి.” ఓ, మై.
146 బిజినెస్ మెన్ వారి మధ్యలో వారు ఎక్కడున్నారో వారు చూచునంతగా, అది కదిలించునట్లుగా దేవా, సహాయము చేయుము. మంచిది. ఇపుడు వ్యత్యాసంగా యుండాలని కాదు. రోతగా యుండాలని కాదు. అయితే దానిని కదలించునట్లు ఆ సహోదరులు ఆ గొప్ప వారిని గురించి, పేరు ప్రఖ్యాతలు గలవారిని గురించి మరియు పరిశుద్ధ తండ్రులను గురించి మొదలగు కార్యములను ఈ బిజినెస్ మెన్ వారి పత్రికలో వ్రాయుట బుద్ధిహీనత యని గ్రహించుకొనవలెను. క్రైస్తవులు ఏ ఒక్క వ్యక్తిని “తండ్రి” యని పిలువకూడదు. వారు దానిని ప్రారంభించారు. సమస్త కార్యములలో సరిదిద్దుటకు నేను ప్రయత్నించాను. ఈ టేపు ఎక్కడకు వెళ్తుందో మీకు తెలుసా? కాబట్టి నా పని ముగిసింది. దానితో నేను చేయవలసినది ఏదీ లేదు. సరే. మొదట క్రీస్తును గుర్తుంచుకోండి.
147 మొదట, నిక్…నీకొలాయితు మరియు నీకొలాయితు కాలము ఏమి కోరింది? కేకలు పెడుతూ, చప్పట్లు కొట్టు ప్రజల నుండి వైదొలగవలెనని, పెంతెకొస్తు దినాన చేసినవారిని, ఆత్మతో తూలి త్రాగినవారివలె అసభ్యంగా కనిపించేవారిని అట్టివారి నుండి వైదొలగవలెనని అది కోరెను. అలాటిదేది అవసరం లేదు. వారు త్రాగినవారని వారు చెప్పారు. విను! ఇది పోగొట్టుకోవద్దు. ఇది విడ్డూరంగా నీకు అనిపించవచ్చు. అయితే అది సత్యము. అప్పుడు ప్రసిద్ధినొందినవారు వచ్చుటకు ప్రారంభించారు. దానికి వారు దిగిరాలేకపోయారు.
148 దేవుడు మహోన్నతునిగా చేసినదేంటి? ఆయన దీనత్వంలో తన్నుతాను తగ్గించుకొనుటయే. అది ఆయనను గొప్పవానిగా చేసినది. పెద్దది ఏది లేదు. ఏ మానవుడు తగ్గించుకోనంతగా ఆయన అంతగా తగ్గించుకొనెను. ఆయన పరలోకము యొక్క రాజైయుండెను. ఆయన భూమి మీద అతి దీనమైన పట్టణమైన యెరికోకు వచ్చెను. మరియు పట్టణములో అతి పొట్టివాడైన మనుష్యుడు తనను చూచునట్లు తన్నుతాను తగ్గించుకొనెను. ఔనా? జక్కయ్య. ఔనది నిజం. ఏ మానవుడు పిలువబడనటువంటి పేరుతో ఆయన పిలువబడెను, “గారడివాడని, దయ్యమని, బయల్జెబూబు” అని పిలువబడెను. అది ఆయనను గూర్చి లోకం తలంచినది. బహు క్రూరమైన మరణముతో మరణించెను. తలదాచుకొనుటకు స్థలము లేదు. ప్రతి సంస్థ ద్వారా నెట్టివేయబడెను.
149 అయితే, దేవుడు ఆయనను ఎంతగానో హెచ్చించెను. ఎంతవరకనగా పరలోకమును ఆయన వంగి చూడవలసివచ్చెను. ఎంతగా చూడండి. దేవుడు తగ్గింపులో. చూశారా? పరలోకపు ప్రతి కుటుంబమును, భూలోకపు ప్రతి కుటుంబము మించిన గొప్ప నామము ఆయనకిచ్చెను. భూమి మీదనున్న ప్రతి కుటుంబమునకు “యేసు” నామము పెట్టబడెను. పరలోకమందున్న ప్రతి కుటుంబమునకు “యేసు” నామము పెట్టబడెను. ఇక్కడగాని లేక పాతాళములోగాని ప్రతి మోకాలు ఒంగు నామము, ప్రతి నాలుక ప్రభువని ఒప్పుకొను నామము. అటువంటి నామము. పాతాళము దానిముందు మోకరించవలెను. ప్రతీది దానిముందు మోకరించవలెను. చూశారా? అయితే మొదటిగా అది దీనత్వంలోయున్నది. తరువాత అది గొప్పగా మారినది. చూశారా? దేవుడు హెచ్చించబడునుగాక. “తన్నుతాను తగ్గించుకొనువానిని, దేవుడు హెచ్చించును.” చూశారా?
150 ఇపుడు ఈ నీకొ ఆత్మ జ్ఞానమును తెలివిని కోరుచున్నదని మనం గమనించాము. అది కారణము అడుగగోరెను, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా తర్కమును, ఏదెనులో వలె. జ్ఞానము ద్వారా, అందుకొరకు సంఘము పడిపోయెను. ఏంటది?
151 ఇపుడు, ఇది చెప్తాము, ఇక్కడున్న సంఘమును తీసికొందాం. మనలాటి కొద్దిమంది ప్రజలను తీసుకుందాము. మీరు నిజముగా ఆత్మపూర్ణులు కానట్లయితే. మరియు మనము ఇపుడు, మన నగరం యొక్క మేయర్ కు వ్యతిరేకమేమీ లేదు. అతనిని గూర్చి నాకు తెలియదు. శ్రీ బొటార్ఫ్. అతను ఇంకా మేయర్ గా ఉన్నాడా, శ్రీ బొటార్ఫ్? చూడండి, శ్రీ బొటార్ఫ్ మంచి స్నేహితుడు నాకు. ఔను. అయితే, నగరము యొక్క మేయర్ మరియు పోలీస్ బలగము మరియు సైన్యాధిపతులు మరియు వారంతా—వారందరు ఇక్కడకు వస్తారు. మొదటి విషయమేంటో తెలుసా, వారి తలంపులలో ఏదైనా యున్నట్లయితే, బోర్డువారితోను, ఇక్కడున్న ప్రజలతోను మాట్లాడుటకు ప్రారంభిస్తారు, మరియు చెప్తారు, “ఇపుడు, ఇదేంటో తెలుసా, ఇది వేరేవిధముగా యుండవలసియున్నది.” నీవు ఆత్మపూర్ణుడవు కానట్లయితే, నిజంగా ఆత్మపూర్ణుడైన వ్యక్తి వేదిక వెనుక యున్నట్లయితే, మొదటి విషయమేంటో తెలుసా, వారు కోరుకొను కోరికను ఒప్పుకొనవలసి వచ్చును. బహుశా ఈ తరమందు కాకపోయినను రాబోవు తరమందు జరుగును.
152 ఆ విధంగా అది ఆరంభమైనది. చూశారా? ఎందుకని? “ఇటు చూడు. అది ఆమోదయోగ్యము” అని చెప్తారు. నీవు అది వింటావు.
153 ఒక మనుష్యుడు లోపలికి వచ్చి, “ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉన్నది. పెద్ద ఆలయం కడదాము. ఇక్కడ వేరొకటి కడతాను. అది…అదెంతో విలువైనది. అర మిలియన్ డాలర్లు యౌతుంది. అది అక్కడ కట్టబడుతుంది. నేను దానిని ఆకాశవాణిలో పెడతాను,” అని వారు చెప్పారనుకోండి. వారది చేసినపుడు, వారు విరుగగొట్టుటకు గొడ్డలిని కలిగియున్నట్లుగా అది యుండును. పదిమందిలో తొమ్మిది మంది ఆ విధంగా యుంటారు, మీకు తెలుసా. మొదటి విషయమేటో తెలుసా, అతడు చేసినపుడు, అతడు తనకొరకై, దానిని చేస్తున్నాడు. “నీవేమి చెప్పలేవు, ఎందుకనగా, సహోదరుడు జాన్ డో, అక్కడున్నాడు. ఈ సంఘము యొక్క ధనాగారము అతనే.” చూశారా? ఆ తరువాత ఆఫ్రికాలో నున్న హోటన్ టాట్, ఏమి తెలియని ప్రజలకే ఈజిప్టు యొక్క యోధుని గురించి ఎంత తెలియునో మరి అదే విధముగా దేవుని గురించి ఏమియు తెలియని సెమినరీ నుండి వచ్చిన ఒక రిక్కీని మీరు తీసికొనివస్తారు. మరియు అతడు వచ్చి, అతనికి కావలసినది సమకూర్చును. ఎందుకనగా అతడు ఎల్లప్పుడు క్రొత్త కారు కొని ఇచ్చును అచ్చటకు, ఇచ్చటకు చుట్టూరా త్రిప్పి ఇదీ అదీ మరియు వేరేవి కొని ఇచ్చును.
154 అది ఖచ్చితంగా ఆ విధంగా ప్రారంభమైనది. సరే. గమనించు. తెలివి జ్ఞానము! వారు చెప్పారు, “ఇపుడు ఇక్కడ చూడు అది తెలివిగలదిగా కనిపించుట లేదా? ఇపుడు, మన—మన స్త్రీ లు వారు వారి వెంట్రుకలను ఆ విధముగా యుంచుకొనినను ఏమి వ్యత్యాసము కలదు?” అయితే బైబిల్ చెప్తుంది, ఒక వ్యత్యాసాన్ని చూపుతుంది. మిగతా వందలాది వదలి, ఆ ఒక్క విషయం తీసుకో. చూశారా. అది వ్యత్యాసంగా ఉన్నది. అది వ్యత్యాసంగా చేయబడెనని దేవుడు చెప్తున్నాడు. అందుకని అది వ్యత్యాసము.
155 అయితే, మీరు చూడండి, ధర్మకర్తల బోర్డు వారు, మరియు పరిచారకులు, ఇతరులచే ప్రారంభించబడితే మొదట విషయమేంటో తెలుసా, కాపరి లోపలికి పోవలెను లేదా వెలుపలికి వెళ్ళిపోవలెను. అంతే చూడండి. ప్రజలే దాని అంగీకారమును తెలిపి, లోపలికి తెచ్చిరి.
156 ఇపుడు గమనించండి, ఆ ఆత్మ కదలుట ప్రారంభించినది. ఆ సంఘము ఎంతో ప్రతిష్ఠలు గలవారిని, పెద్ద పెద్ద విషయాలను, ఎక్కువ ధనము ఇచ్చుటను ప్రారంభించినది. దానికి వారు పడిపోయిరి. సాతాను యొక్క క్రూరత్వము అది.
157 ఏదెను తోటలో హవ్వ చేసినది, సాక్ష్యాత్తు అదే కార్యము. మీరు వింటున్నారా. ఔనది నిజం. చూడు, ప్రకృతి సంబంధమైన స్త్రీ, ఆదాము పెండ్లికుమార్తె, భార్యగా ఆమె యొద్దకు అతను రాకమునుపు, తర్కము ద్వారా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరిక్తమైన సాతాను యొక్క యుక్తికి పడిపోయెను. ఆదాము హవ్వతో భార్యగా జీవించకమునుపు, సాతాను అక్కడ అతన్ని మొత్తెను. ఔను. నేను బోధించిన పెండ్లికుమార్తె వృక్షము మీరు వినియున్నారు. దాన్ని గూర్చి అక్కడ చెప్పబడినది, సరే. ఇపుడు గమనించండి. అక్కడ తర్కము కోసము హవ్వ పడిపోయినది. ఇప్పుడతడు, సాతానుడు దానిని తర్కిస్తున్నాడు.
ఆమె అన్నది, “అయితే ప్రభువు చెప్పాడు…”
158 ఆయన చెప్పాడు, “ఓ, నీకు తెలుసా, అయితే ప్రభువు నిశ్చయంగా ఆలాగు చేయడు. ఔనా? నీవు, తెలివిగలవానివి కావాలనుకుంటున్నావు. నీవు ఒకటి ఎరగాలనుకుంటున్నావు. ఎందుకని, నీవు ఒక మూగబిడ్డవు తప్ప మరొకటి కాదు. చూశారా? నీవొకటి ఎరుగవలసియున్నది.” అది సాతాను కానట్లయితే! ఓ, మై!
159 ఈ నవీనమైన వాటిలో అది ఒకటి కానట్లయితే, చూడండి, “ఓ, వారు పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు. ఏలాటి గమనము వారికివ్వవద్దు. చూశారా. వెళ్ళొద్దు, ఔనా?”
160 ఇపుడు, ప్రకృతి సంబంధమైన, మానవజాతిలో మొదటి పెండ్లికుమార్తె, ఆమె భర్త ఆమె యొద్దకు రాకముందు సాతాను అబద్ధమును వినుట వలన ఆమె కృప నుండి పడిపోయెను, దేవుడు ఆమెను ఆయన వాక్యమను కోటలోపల ఉంచిన తరువాత, వాక్యము వెనుక ఆమె యుండినట్లయితే, ఆమె పడిపోయి యుండెడిది కాదు. అది ఇపుడు ప్రకృతి సంబంధమైనది, గమనించు, ప్రకృతి సంబంధమైన స్త్రీ.
161 మరియు దేవుని వాక్యము వెనుక నుండి బయటకు వచ్చిన తరువాత వాస్తవమైన శాపము ఏమిటి?
162 ఇపుడు జ్ఞాపకముంచుకో, దానిలో తొంభై ఎనిమిది శాతము ఆమె నమ్మినది. అయితే, మీరు ఒకదానిని వదిలివేసిన చాలును. చూశారా? ఆమె అదంతా నమ్మినది, ఓ, నిజంగా. ఆమె ఇది చెప్పినది. అది నిజమని సాతాను అంగీకరించినది. ఒక మూలకు అతడు నిన్ను తీసుకొని వస్తే, అదే అతనికి కావలసినది. చూశారా? ఒకే ఒకటి నీవు చేయవలసినది బుల్లెట్ ను కొంచెం ఈ వైపునకు త్రిప్పుట, అందువలన అది గురి తప్పును. చూశారా? అది అంతే. దానిలోని మరింత ఆమె నమ్మినది అయితే అది తప్పినది.
163 ఇపుడు ఫలితములు ఏమనగా, ఒక చిన్న కారణము కొరకు ఆమె వాక్యమును వదిలివేసెను.
164 మంచిది, ఇపుడు ఈ విధంగా చెప్తారు. “స్త్రీలను గురించి ఏమిటి?” లేక “ఆలాటి విషయాలను గూర్చి నీవెందుకు మాట్లాడతావు?” అయితే ఆలాటి చిన్న విషయాలేవైనా, “వ్యత్యాసమేంటి? అది ప్రాథమిక రుజువా?” దానికి సంబంధించి ఒకటున్నది, నీకొకటున్నది.
165 అది సరి చేయవలసియున్నది. ఏడు సంఘకాలాల గుండా మనము దానిని చూశాము. అయితే, దేవుడు అది మాట్లాడే సమయము వచ్చినది. అయితే ఆయన అది మాట్లాడుట మాత్రమే కాకుండా అది ఆయన సూచించును. మరియు అది ఆయన రుజువు చేయును. అది బయలుపరచును. ఔను. అది ఆయన చేయనట్లయితే, అలాగైతే ఆయన దేవుడు కాదు. అంతే. దేవుడు ఆయన వాక్యము వెనుక నిలబడును.
166 గమనించండి ఇపుడు. ప్రకృతి సంబంధమైన స్త్రీ ప్రకృతి సంబంధమైన మరణానికి హేతువైంది. ఎందుకంటే ఆమె తన్నుతాను తెలివిగలదానిగా చేసికొనుటకు, వాక్యము వెనుక నిలువబడి, దేవుడు చేయమన్నది చేయుటకు బదులుగా తర్కమును విన్నది. జ్ఞానవంతురాలగుటకు ఆమె జ్ఞానాన్ని కోరుకున్నది. ఆమె తర్కాన్ని ఆలకించినది. మరియు—మరియు ఆమె మానవాళి అంతయూ పోగొట్టుకున్నది. ఔనా?
167 ఇపుడు, ఈ సమయములో, ఆత్మ సంబంధమైన స్త్రీ, పెంతెకొస్తు దినాన ఆరంభమైన క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె, ఆరంభ ఈ అపొస్తలుల సంఘము నైసియా ఆలోచన సభలో అదే దానిని కోల్పోయెను. లీ, అది నిజమని నీకు తెలుసు. మరియు నైసియా కౌన్సిల్ లో, తన ఆత్మీయ జన్మహక్కులు పోగొట్టుకున్నప్పుడు కాన్ స్టాంటైన్ పెద్ద సంఘములు మరియు అక్కడ అర్పించిన వస్తువులు తీసికొనుటకు, రోమ్ మూఢ సిద్ధాంతములకు తన ఆత్మీయ జన్మహక్కులను అమ్ముకొనెను. కథోలిక్ లకు అది కఠినంగా యుండును. అయితే ప్రొటస్టెంట్ వారు అదే చేశారు. బైబిల్ గ్రంథములో “వేశ్య యొక్క, మహా వేశ్య యొక్క” పిల్లగా గుర్తించబడెను. అది ఖచ్చితంగా నిజం. వారిలో అందరు. ఏలాటి మినహాయింపు లేదు.
168 అయితే వారిలో ఎల్లపుడు కొద్ది శేషముంటుంది. వారే వధువుయౌటకు ఏర్పడియున్నారు.
169 గమనించు. ఆమె తన జన్మ హక్కులను పోగొట్టుకున్నది, చూశారా, ఆమె భర్త ఆమెను చేరకముందే, గమనించారా. వివాహానికి ముందే, ఆమె తన పవిత్రతను పోగొట్టుకున్నది.
170 మరియు ఇపుడు మీరు జ్ఞప్తించుకోండి, ఆమె చెప్తుంది, “నేను రాణి వలె కూర్చున్నాను. నాకేమియు కొదువలేదు.” ఇక్కడ ఆ లవొదికయ సంఘకాలములో “నేను ధనవంతురాలను ధనవృద్ధి చేసికొనియున్నాను మరియు తదితరమైనవి. మరియు ఓ, ప్రపంచమంతా నావైపు చూచుచున్నది. నేను గొప్పదానను. పరిశుద్ధ సంఘమును, మేము ఈ విధముగా యున్నాము.” కాలమంతా ఆ విధంగా చెప్పుకొనుచున్నది.
171 మరియు ఆయన చెప్తున్నాడు, “నీవు దిగంబరివనియు, గ్రుడ్డిదానవనియు, దరిద్రురాలవనియు, దౌర్భాగ్యురాలవు, దిక్కుమాలినదానవు యని ఎరుగకయున్నావు.” అదీ పరిస్థితి. కడవరి దినములలో పరిస్థితి ఆ విధంగా యుండునని పరిశుద్ధాత్మ చెప్పిన యెడల అది ఆ విధంగానే యుంటుంది. మరి వేరే మార్గము లేదు. అది అట్లే యుండును.
172 ఇపుడు గమనించు. అక్కడ ఆమె తన జన్మ హక్కును, ఆమె యొక్క వాక్యము యొక్క సద్గుణమును ఆమె అమ్ముకొనినందు వలన ఆమె ఏమి చేసినది? హవ్వ అది చేసినపుడు, ఆమె సృష్టిని పోగొట్టుకున్నది, సమస్త సృష్టి ఆమె వలన పతనమైనది.
173 ఇపుడు గమనించండి, సంఘము అది చేసినపుడు, ఆత్మ, వాక్యమునకు బదులుగా, మూఢ సిద్ధాంతాలు అంగీకరించినపుడు, సమస్త పద్ధతిని అది శపించెను. ఉన్నటువంటి, ఉండబోవుచున్నట్టి ప్రతి యొక్క సంఘశాఖ, దానితో శపించబడెను. పడిపోయెను. కారణం, వేరే మార్గము లేదు గనుక.
174 ఏదైనను సరియైనదేదియని తెలిసికొనవలెనని ఒక గుంపు ప్రజలను నీవు సమకూర్చిన యెడల, ఒకరు ఈ మార్గమున వెళ్ళవలెనని, ఒకరు ఆ మార్గమున వెళ్ళవలెనని, ఒకరు ఈ మార్గమున వెళ్ళవలెనని సలహా ఇస్తారు. మరియు వారు వాటన్నిటిని కలిపి, కదిలిస్తే తత్ఫలితంగా వచ్చునదే ఇప్పుడున్న కార్యం.
175 నైసియా ఆలోచనా సభలో ఖచ్చితంగా వారు చేసినది అదే. ఖచ్చితంగా, మెథడిస్ట్ లోను, ప్రెస్బిటేరియన్ లోను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోను మరియు మిగతా వాటిలోను వారు చేసినది అదే. మరియు ఏ మనుష్యులైనా, దేవుడు అతనికేం బయలుపరచినప్పటికీ, నీవు వారి మత సిద్ధాంతములనే—మూఢ పద్ధతులనే బోధింపవలెను, లేదా వారు నిన్ను బయటకు నెట్టివేస్తారు. ఇపుడు నాకు చెప్పవద్దు. నేనక్కడయున్నాను. ఔను. అది నాకు తెలుసు.
176 మరియు అదే అచట జరిగిన కార్యము, కాబట్టి సమస్తమును శపించబడినది. దూత ఈ విధముగా చెప్పుట ఆశ్చర్యము లేదు, “నా ప్రజలారా ఆమె నుండి బయటకు రండి, తద్వారా ఆమె తెగుళ్లలో పాలిభాగస్తులు కాకుండుడి.” ఎందుకనగా ఆమె—ఆమె శపించబడినది. ఆమె మీదనున్న దేవుని ఉగ్రత యొక్క శాపము యొక్క బాధను అనుభవించవలసియున్నది. ఎందుకనగా ఆమె యొక్క సద్గుణమును, హక్కులను అమ్మివేసినది. చూశారా? అయితే…ఓ, మై.
177 అయితే జ్ఞాపకముంచుకోండి. పరిస్థితి అంతా చూస్తున్నపుడు, అయితే అయినను దేవుడు యోవేలు 2:25 లో వాగ్దానము చేశాడు, “కడవరి దినములలో…” మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే.
178 ఆయన చెప్పాడు, “గొంగళి పురుగులు విడచిన దానిని మిడుతలు తినివేసియున్నవి. మిడుతలు తినివేసిన దానిని పసరుపురుగులు తినివేసియున్నవి, పసరు పురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి…” ఆలాగే క్రిందకు అది ఏమీ లేనట్లుగా, మోడు తప్ప. గమనించండి. రోమా వారు ఏమి విడచిపెట్టారో, లూథరన్ లు తిన్నారు. లూథరన్ లు ఏమి విడచిపెట్టారో మెథడిస్ట్ లు తిన్నారు. మెథడిస్ట్ లు ఏమి విడచిపెట్టారో పెంతెకొస్తులు తిన్నారు. ఔనా. మొద్దు అగువరకు.
179 అదేంటో తెలుసా? ఆ పురుగులను, మిడుతలు, చీడపురుగులను మొదలగువాటిని గ్రంథములో వెదకు. అది ఒక్కపురుగు, వ్యత్యాసకరమైన దశలు.
180 నీ విషయాన్ని పట్టుకో. ఆలాగే ఈ ముద్రలు. అదంతా ఒకే పురుగులు. మనమది బయటకు తెచ్చునపుడు నీవది చూడబోతున్నావు, కనుక ఇపుడు నీకు చెప్తాను. ఎల్లపుడు కూడా అది అదే పురుగు. ఆ నాలుగు పురుగులు; ఇక్కడ నాలుగు. అవి అక్కడున్నవి. అవి ఒక్కటే. అది ఒకే ఆత్మ. ఒకటి దేనిని విడచినదో, మరొకటి తింటుంది. మరియు ఏది ఇది విడచినదో మరొకటి తిన్నది, ఆ విధముగా ఒక మోడుగా మారువరకు ఆలాగు జరిగినది.
181 అయితే యోవేలు చెప్పాడు, “మిడుతలు తినివేసిన దానిని నేను మరలా మీకు యిచ్చెదను.”
182 ఏమిటది? ఆయన ఏలాగు అది చేయబోతున్నాడు; అది క్రీస్తుకు విరోధిగా ప్రారంభమైయుండగా, క్రీస్తు బోధకు విరోధముగా యుండగా, వాక్యమునకు బదులుగా సిద్ధాంతమును అంగీకరించియుండగా, ఆయన ఏలాగు చేయబోతున్నాడు? బైబిల్ చెప్పినట్లుగా సంవత్సరములు తరబడిగా సంస్కర్తలు దానిలో నిమగ్నులైపోయారు.
183 “అయితే కడవరి దినమున, బూర ఊదునపుడు…” ప్రకటన 10:1-7, ఆయన చెప్పాడు, “కడవరి దినములలో దేవుని యొక్క మర్మము ముగియును, ఏడవ దూత బూర ఊదబడగనే.” మలాకీ 4 చెప్తుంది, “ఆ చెడ్డ దినము భూమి మీదికి రాకమునుపు ఏలీయాను పంపుదునని, ఆయన దానిని కొలిమి కాల్చినట్లు కాల్చుననియు మరియు అతడు తండ్రుల యొక్క విశ్వాసమునకు పిల్లలను త్రిప్పుననియు, మరల్చుననియు చెప్పుచున్నాడు.” ఆరంభ అపొస్తలుల పెంతెకొస్తు విశ్వాసము పునరుద్ధరణ చెందునని వాగ్దానము చేయబడెను. ఇపుడు అది బహు విశదముగా లేఖనము చెప్పుచున్నది. అది వాగ్దానము చేయబడినది. మనము కడవరి దినములలో యున్నట్లయితే ఒకటి జరగవలసియున్నది. చూశారా? అది జరుగుతుంది. మనం చూస్తున్నాము.
184 సాతాను యొక్క త్రిత్వాన్ని గమనించు. అదే వ్యక్తి వచ్చుచున్నాడు. ఒక దానిలో నుండి ఒక దానిలోకి అవతారమెత్తుచున్నాడు. ఆ విధముగా ఆ పురుగులు చేసియున్నవి. ఒక దానికి ఒకటి. ఖచ్చితంగా. నీకొలాయితు, “ఆత్మ సంబంధమైన అంత్యక్రీస్తు.” పోప్, “అబద్ధ ప్రవక్త,” “మృగము” దయ్యం తనకుతానే అవతారమెత్తుట. దానిని అతడు చేయలేడు.
185 ఇపుడు, మీరు ఇది వెంబడిస్తుండగా దానిని మీ మనస్సులో ఉంచుకోండి. ఇక్కడ మీరు ఈ సవారి చేయువారిని చూడబోవుచున్నారు. చూశారా. ఇక్కడ మీ కొరకు నేనొక పటాన్ని ఉంచాను. ఇక్కడ నాకొక నల్ల బోర్డుపై అది ఉన్నట్లయితే మీరు విశదముగా అర్థం చేసికొందురు. చూడండి. నేను గమనిస్తున్నాను.
186 మొదట, ఇపుడు, ఇది మీరు జ్ఞప్తించుకోండి. మొదటిగా అతడు, ఒక “అంత్యక్రీస్తు ఆత్మ.” ఆలాగని యోహాను చెప్పాడు. “చిన్న పిల్లలారా, అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పటికే అవిధేయులగు పిల్లలలో పనిచేయుచున్నది.” చూశారా, ఆ విషయం ప్రారంభమైనది. మరియు అటుతరువాత, ఆ తదుపరి సంఘకాలంలో “ఒక ఉపదేశముగా” మారినది. మరియు ఆ తరువాత సంఘకాలంలో “అదియొక సిద్ధాంతం.” మరియు, ఆ తరువాత సంఘకాలంలో ఆమె “కిరీటము” ధరించినది. మీరు అదెక్కడ చదివినా వివరంగా లేదా? చూశారా? అక్కడ అతడు వచ్చుచున్నాడు.
187 మొదటిగా అతడు పిలువబడ్డాడు (ఏమని?) “అంత్యక్రీస్తు ఆత్మ” ఎందుకంటే అతడు వాక్యానికి వ్యతిరేకము. దానిని ప్రారంభించినది అదే. దేవుని యొక్క వాక్యము నుండి తిరిగిపోవుటకు జరిగిన కార్యమంతా అదే. ఒక దినాన హవ్వ కయీనును కొద్దిగా మందలించినందు వలన జరిగినది కాదు. చూశారా? దానిని చేసినది అదికాదు. మొదటి విషయము సమస్తమును మారుటకు, ఆమె వాక్యము నుండి తిరిగిపోయినది. ఆమె వాక్యము నుండి తిరిగినది. మరియు మొదటి విషయము, జీవము గల దేవుని సంఘములో వ్యభిచారము ప్రారంభించబడినది. క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెలో. ఆమె దేవుని నుండి తిరిగి, దేవుని యొక్క వాక్యమునకు బదులు రోమను సిద్ధాంతమును అంగీకరించినది. ప్రతి సంఘశాఖకు ఏమి సంభవించినది? అదే పనిని అది చేసినది.
188 ఇపుడు, అయితే అంత్యదినములలో తిరిగి పునరుద్ధరణ చేయుటకు మార్గము చేకూర్చుతానని వాగ్దానము చేశాడు. ఆరంభములో ఆయన అది ఏలాగు చేశాడో ఆలాగు ప్రభువు వాక్యము భూమి పైకి వేయబడి, సమస్తమును చక్కదిద్దుటకు మరలా వచ్చును. (ఏమిటి?) ఏమి ఆరంభమైనది. “వాక్యమునకు విరుద్ధమైనది.” ఇతను వచ్చునపుడు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన పిదప ఇతడు వచ్చినపుడు ఏమి చేయును? అతడు “తండ్రుల యొద్దకు నడిపించు పిల్లల యొక్క విశ్వాసము తెచ్చును.” ఆ విధముగా ఆయన మరల్చును. మరియు ఇక్కడున్న దీనినే, ఈ వాక్యమునే, ఇదే స్థానములో కనుగొనగలరు. అది అదే కార్యాన్ని చేయును.
189 యేసు చెప్పాడు, “ఏ మనుష్యుడైనను నావాడైనట్లయితే! నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములు అతడును చేయును.” ఆయనను కొన్ని కార్యములు చేయమని వారు అడిగినపుడు, ఆయన చెప్పాడు, “తండ్రి నాకు చూపినవే నేను చేయుదును. మొదట నేను చూడనిది నేనేది చేయను. తండ్రి చేయునది నేనేది చూతునో, అది నేను కూడా చేయుదును. తండ్రి క్రియ చేయుచున్నాడు. అటుపిదప నేనూ చేయుచున్నాను.” ఔనా. మీరు అది చూచుటలేదా? ఎందుకని? అది వార్తాపత్రిక చదివినట్లుంది. చూశారా?
ఇపుడు, ఇపుడు, మొదట, తరువాత, అతడు ఒక “అంత్యక్రీస్తు” అయ్యాడు.
190 ఇపుడు, అతడు ఆత్మలో మాత్రము అంత్యక్రీస్తు కాలేడు. తరువాత, అతడు అంత్యక్రీస్తు అయిన తరువాత, అంత్యక్రీస్తు చేయు అదే కార్యములు బోధించు మనుష్యుని ఆ ఆత్మ తీసుకొనును. మరియు ఆ తరువాత అంత్యక్రీస్తు ఆత్మలో అతడు “అబద్ధ ప్రవక్తగా” మారును. ఇపుడు ఒక సంఘశాఖలో ఉన్న వ్యక్తిని గూర్చి ఏమిటి? నిన్ను నీవు సరిచేసుకో. అందును గూర్చి నీవు ఏమి తలస్తున్నది నాకు తెలియదు. సరే.
191 ఇపుడు, చివరకు, అతడు “ఒక మృగముగా” మారాడు. కొద్దిగా ఆగు. కొద్దిసేపైన తరువాత అందులోకి వెళ్దాము. చూశారా. మంచిది.
192 ఇపుడు, సాతాను ఆ విధముగా త్రిత్వముగా యున్నాడు; సాతాను అన్ని వేళలలో. సాతాను, “అంత్యక్రీస్తు ఆత్మ.” అంత్యక్రీస్తు ఆత్మ, అవతారమెత్తి “అబద్ధ ప్రవక్త” ఆయెను. తరువాత “మృగముగా” మారెను. చూశారా? ఎపుడు…అంత్యక్రీస్తులో నున్న దయ్యం కాదు; అయితే సాతాను తనకుతాను బయటకు నెట్టివేయబడి సాతాను ఎక్కడున్నదో అక్కడకు వచ్చి స్థానాన్ని తీసుకున్నది. దయ్యం మానవునిలో అవతారమెత్తెను. అది ఆ విధముగా జరుగుచున్నది.
193 ఇస్కరియోతు యూదా అదే మరియు అతడేమి చేశాడు? క్రీస్తుకు విరోధముగా నున్నవారితో అతడు ఒకనిగా నుండెనా? అతడేలాగు ఖజానాదారుడై ఆయనతో నడిచాడు. నిజమే. వారితో కూడా నడిచాడు. అక్కడకు వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టాడు. వారు చేసినట్లు ఖచ్చితంగా చేశాడు.
194 క్రీస్తు, అవతారమెత్తిన దేవుడు. దేవుడు శరీరములో ఇమ్మానుయేలుగా అవతారమెత్తెను. యూదా నాశనపుత్రుడు. యేసు దేవుని కుమారుడు. దేవుని అవతారము; దయ్యము అవతారము.
195 కొందరు ఆ సమయములో మూడు సిలువలు మాత్రమే చూడగలిగిరి. అక్కడ వాటిలో నాలుగు ఉన్నవి. గొల్గొతా పైన మూడు, వాటిని మనము చూస్తున్నాము. మధ్యలో యేసు, ఎడమవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ.
196 మరియు గమనించు. ఒక దొంగ మరొక దొంగతో చెప్పాడు లేదా యేసుతో అన్నాడు, “కనుక…” ఇపుడు, ఆయన వాక్యమని నీకు తెలుసు, అయితే, “నీవు వాక్యమైనట్లయితే నిన్ను నీవే రక్షించుకోలేవా? దానిని గురించి నీవేమైన చేయలేవా?”
197 ఈరోజు అదే విషయం. ఈ పాత దయ్యాలు వచ్చి చెప్పుట మీరు వినుటలేదా, “నీవు బైబిల్ స్వస్థతను నమ్మినట్లయితే, ఇక్కడ ఒకరి కళ్ళున్నవి. వారి కళ్ళు నీవు తెరవకూడదా?” “నన్ను గ్రుడ్డివానిగా మొత్తు, నన్ను గ్రుడ్డివానిగా మొత్తు.” ఆ పాతదైన అదే దయ్యం. చూశావా? “సిలువ మీద నుండి క్రిందకు దిగుము, మేము నిన్ను నమ్ముతాము.” “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళను రొట్టెలగునట్లు చేయుము.” అదే దయ్యం.
198 మీరు వెళ్ళిపోండి, ఔనా. కాదు. యేసు చేసినది ఆలాగే. వారి ఎవరి మాటలకు ఆయన లోబడలేదు.
199 ఆయన చేయి…ఆయన ప్రశస్తమైన కళ్ళ మీద ఆ విధంగా గుడ్డలు కట్టిరి. మరియు వారొక కర్రను తీసికొని తలపై ఆయనను కొట్టారు. అన్నారు, “నీవు ప్రవక్తవైతే మాతో చెప్పు నిన్ను కొట్టినదెవరో మాతో చెప్పు” అని. కర్రను ఒకరొకరు మార్చుకున్నారు. “నిన్ను కొట్టినదెవరో మాతో చెప్పు, నీవు ప్రవక్తవని మేము నమ్ముతాము.” ఆయన తన నోరు తెరువలేదు. ఆయన అక్కడే కూర్చున్నాడు. చూశారా? ఆయన తమాషా చేయలేదు. తండ్రి చెప్పినరీతిగా చేశాడు. చూశారా. ఔనా. వారిని ఆ విధముగా చేయనిచ్చెను. వారి కాలము వస్తుంది. దిగులుపడవద్దు. ఔనండి. ఇపుడు, వారు ఆయన వస్త్రాన్ని ముట్టారు. ఏలాటి ప్రభావాన్ని చూడలేదు.
200 అయితే, ఒక పేద చిన్న స్త్రీ, ఆమెకు అక్కర ఉన్నది. ఆయన వస్త్రాన్ని ముట్టినది. ఆయన వెనుతిరిగి అన్నాడు, “నన్ను ముట్టినదెవరు?” హు—హు. ఏమిటి? ఒక వ్యత్యాసకరముగా తాకుట. నీవు ఏలాగు ఆయనను ముట్టినది దానిపై అది ఆధారపడియున్నది. మీరు గమనించారా. చూశారా. నీవు ఏది నమ్మెదవో ఇపుడు చూడు?
201 ఇపుడు సాతాను…అంత్యక్రీస్తు నుండి అబద్ధ ప్రవక్తగా అవతార మెత్తియున్నాడు. మరియు యూదుల దినములలో, ఆరంభ సంఘములో “అంత్యక్రీస్తు.” అంధకార యుగములో, ఈ లోకమునకు అతడు “అబద్ధ ప్రవక్త” ఆయెను. “ఆమె యొక్క అక్రమ పాత్రలో” ఆమెను అక్కడ చూస్తున్నారా? ఇపుడది సంఘకాలము.
202 అయితే సంఘము గృహమునకు వెళ్ళిన తరువాత, అతడు మృగము అవుతాడు. అతడు దయ్యముగా అవతారమెత్తుతాడు. తనకుతానే ఎఱ్ఱని ఘటసర్పము. ఓ, మై. నా భావమేదో మీరు చూడగలుగుచున్నారా? తరువాత, తన ప్రజలతో తను అవతారమెత్తును. తన శక్తి ద్వారా తాను బంధించు ప్రజలు తనకుందురు. “అబద్ధ ప్రవక్త దానిని వారికి ప్రవచనముగా చెప్పును. ఒక అబద్ధమును నమ్మి దాని ద్వారా నశించుటకు వారికి బలమైన మోసమును ఇచ్చును.” “వాక్యమును నిరాకరించెదరు; దైవభక్తి వేషము ధరించెదరు.”
203 దేవుడు ఆయన స్థలములో, ఒక త్రిత్వములో కార్యము చేయును. నీతిమత్వములో, శుద్ధీకరణలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఆయన ప్రజలలో ఆయనే నివసించును.
204 ఆ విధముగనే, క్రీస్తును దయ్యం అనుసరించుచున్నది. ఓ, సాతాను అవతారమెత్తుచున్నాడు. ఇపుడు గమనించు, సాతాను…
205 యేసు తన ప్రజలలో తనకుతాను నివసించుచున్నపుడు, సాక్షాత్తు క్రీస్తులోనున్న ఆ జీవమే ఆ వ్యక్తిలో ఉండును.
206 ద్రాక్షతీగ జీవమును తీసికొని గుమ్మడి పాదులో పెట్టినట్లయితే ఏమవుతుంది? అది గుమ్మడి కాయలు కాయదు; అది ద్రాక్షలు కాయును. పీచ్ చెట్టు యొక్క జీవాన్ని నీవు తీసికొని పియర్ పండ్లలో పెడితే, అది పియర్ పండ్లు పండునా? లేదు. అది పీచ్ ఫలించును. జీవము అదేదనేది తెలుపుతుంది. చూశారా?
207 నీవు చెప్తావు, ఇక్కడ ప్రజలున్నారు వారు పరిశుద్ధాత్మ కలిగియున్నారు అని చెప్పుకుంటున్నారు, ఈ వాక్యమును తృణీకరిస్తున్నారు. తప్పిదము ఒకటి యున్నది. పరిశుద్ధాత్మ ఆ వాక్యమును వ్రాసినది.
208 మరియు యేసు ఇది చెప్పాడు, “ఒక మనుష్యుడు నా ఆత్మ కలిగియున్నట్లయితే, అతడు నా కార్యములు చేయును.” నీవది చదవాలనుకుంటున్నావా? నీవది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావా? అది పరిశుద్ధ యోహాను 14:12. ఆఁ. సరే. “నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములు చేయును. వీటికంటే మరెక్కువ చేయును. ఏలయనగా, నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను.” చూశారా? తరువాత ఆయన శుద్ధీకరించి అవన్ని కడుగును, తద్వారా దేవుని యెదుట నిలువబడునట్లుగా. ఆ సిరా బొట్టు అక్కడ పడింది మరియు అతనిని అటు ప్రక్కకు కొనిపోయి దాటించును. చూశారా?
209 ఇపుడు గమనించు. సాతాను, తన ప్రజలలో తనకుతాను బయలుపరచుకొనునపుడు, అతడు చేసిన కార్యమే వారు చేయుదురు. అది మీరు చూచుటలేదా? అతనేమి చేయును? ఆమెను మోసము చేయుటకు ఆ అమాయక స్త్రీ యొద్దకు వచ్చును. ఖచ్చితంగా అదే, ఈ దయ్యాలు చేయునవి. ఒక స్థలానికి నేరుగా వచ్చి మరి ఈలాగు చెప్పి…ఒక చిన్న సంఘకాపరి, ఒక చోట నుండి వచ్చి “ఓ నీవు మాతో చేరినట్లయితే” అని చెప్పి ఊ—హూ! అదే దయ్యము పని. ఇపుడు అది సత్యము. సాతాను తన సంఘములో దయ్యంగా, అవతారమెత్తిన తరువాత, హత్యలు, చంపుకోవడం చేయువారు వారే. ఎందుకనగా సాతానుడు హంతకుడు మొదటిగా. ఒక అబద్ధీకుడు మరియు చూశారా?
210 సరే. సాతాను తన ప్రజల మధ్య అవతారమెత్తిన పిదప చేయునదేమి? యుక్తిగా ప్రవర్తించడం అతని యొక్క విధి. అతడు యుక్తిపరుడు. మీరు బైబిల్ పరిశోధించండి. ఎక్కడైన ప్రభువు తెలివిగలవారితో సంప్రదించినట్లు నాకు చూపించండి. చూడండి. దానిని వెదకుడి. అదెల్లప్పుడు కూడా జ్ఞానముగలవారు దయ్యము పట్టినవారు కాదేమో చూడండి. అది పెద్దమాట, అయితే అది నిజం. హేబెలు నుండి కయీను వరకు వంశావళిని తీసుకోమని సవాలు చేస్తున్నాను. ఆ పద్నాలుగు తరములు. మరి వాటి నుండి వచ్చినవి, ఆ తరములలో ఎవరు తెలివైనవారు, ఎవరు దీనులు. ఊఁ—హు.
211 ఎందుకని యేసు అటువంటివారిని ఎన్నుకొనలేదు? ఆయన చేపలు పట్టువారిని ఎన్నుకున్నాడు మరియు వారి స్వంత పేరులను సంతకము చేయలేనివారిని, ఆయన సంఘము యొక్క పెద్దగా ఎన్నుకున్నాడు. ఔనది నిజం. జ్ఞానం ఏమీ లేనిది. అది—అది క్రీస్తుకు విరోధం, లోకజ్ఞానం క్రీస్తుకు విరోధం, ఎల్లప్పుడు. యేసు ఎన్నడు సెమినరీలు కట్టమని మనకు చెప్పలేదు; ఆయనెన్నడు చేయలేదు; బైబిల్ స్కూల్ లు పెట్టమని చెప్పలేదు. ఆయన చెప్పాడు, “వాక్యమును బోధించమన్నాడు! సువార్త ప్రకటించుము!” అని అన్నాడు. తరువాత ఆయన ఇలా చెప్పినట్లయితే, “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును,” ఔనా, నీవు వాటిని కలిగియుండాలి. మరోమాటల్లో, ఆయన చెప్పాడు, “అన్ని దేశములకు వెళ్ళి దేవుని శక్తిని తెలియజేయుడి.”
212 ఇపుడు గమనించండి. సాతాను యొక్క విధి జ్ఞానమును తర్కించుటకై దేవుని వాక్యమును తారుమారు చేయుట. ఓ, మై. ఓ! తరువాత అసలైన వాక్యమును నిరాకరించుట వలన, వారిని తన ప్రజలుగా గుర్తించుట. ఇపుడు ఆ…
213 మీరు—మీరు—మీరు ఇంకొద్దిసేపు నాతో యుండి దీనిని పొందుకుంటారా? ఇది మీరు పోగొట్టుకొనుటను నేను ఇష్టపడను. నేను మీకు పోలికలను చూపించగోరుచున్నాను. వాక్యములోను, సమస్తములోను, మీరు అది చూడగలరు. మీరు—మీరు—మీరు గందరగోళము చెందవద్దు.
214 పాతనిబంధనలో ఒక మనుష్యుడు బానిసత్వమునకు అమ్మబడినపుడు, ప్రతి యాభై సంవత్సరములకు ఒక సునాద సంవత్సరం వచ్చును. నలభై తొమ్మిది గడిచిన పిమ్మట సునాద సంవత్సరము వచ్చును. మరియు ఒక బానిస ఇది విన్నప్పుడు, అతడు స్వతంత్రునిగా వెళ్ళాలనుకుంటే, అక్కడ—అతన్ని ఆటంకపరచునది ఏదీ లేదు. అతడు తన పారను పారవేసి “ఇంతకాలమైనది” ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను. బూర ఊదబడెను. ఔనది నిజం!
215 అయితే, అతడు వెళ్ళుటకు అయిష్టపడినట్లయితే మరియు తన బానిస యజమాని ద్వారా సంతృప్తి చెందినట్లయితే, తరువాత ఆలయంలోకి తీసికొని వెళ్ళి, వారు ఒక పోగరను తీసికొని, పోగరు అనగా ఏమిటో తెలుసా, వారు అతని చెవిని నొక్కి, చెవికి రంధ్రం వేస్తారు. మరియు అది మరియొక గుర్తు. అతడు ఇంకెన్నడు వెనుకకు వెళ్ళడు. ఔనా? కాలమంతటిలో తన యజమానికి సేవ చేయవలసియున్నది. ఎన్నిసార్లు సునాద ధ్వని వినబడినప్పటికీ, ఏం జరిగినా నాకు లెక్కలేదు. అతడు ఖచ్చితంగా తన యొక్క జన్మ హక్కులను, స్వాతంత్ర్యమును అమ్మివేసుకున్నాడు.
216 మరియు ఒక మనుష్యుడు సువార్త సత్యమును నిరాకరిస్తే సాతాను అతని చెవికి (ఎక్కడ?) గుర్తు వేసెను. అతడు అతనిని చెవిటివానిగా చేయును గనుక ఇక సత్యాన్ని వినలేడు. అతని పని ముగిసినది. అతడు సత్యమును వినని యెడల అతడున్న గుంపులతో అతడుండును. లేదు.
217 “సత్యమును మీరు గ్రహించెదరు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును.” చూశారా, సత్యము స్వతంత్రులుగా చేయును.
218 దేవుడు తన జనులు వచ్చినపుడు ఆయన వారిని ముద్రించును. ఆయన వాగ్దాన వాక్యమును రుజువుపరచుట ద్వారా దేవుడు వారిని ముద్రించును. అది ఖచ్చితం. పరిశుద్ధ యోహాను 14:12. మీరు గుర్తుంచుకోవలయునంటే మరొక విషయం, మార్కు 16. యేసు చెప్పాడు, “నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు జరుగును.”
219 ఇపుడు మనమది తీసుకుందాం, ఒక్క నిముషం. ఆయన తమాషా చేస్తున్నాడా? [“కాదు” అని సభ చెప్పుచున్నది—సంపా.] ఆయన…కొందరు మనకు చెప్పునట్లు అపొస్తలులు యని భావమా? [“కాదు”]
220 గమనించండి. దాని పూర్వపరాలు చదవండి. “మీరు వెళ్ళి…” ఎక్కడకు? [సభ చెప్పెను, “సర్వలోకమునకు”—సంపా.] “సర్వలోకమునకు” “ఈ సువార్తను ప్రకటించుడి…” ఏమిటి? [“సృష్టి అంతటికి”] “సృష్టి అంతటికి” ఇంకా దానిలో మూడవ భాగము కూడా జరుగలేదు. “లోకమంతటిలో, సృష్టి యంతటికి ఈ సూచక క్రియలు వెంబడించును. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో, నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును,” ఒక చిన్న గుంపు కాదు.
221 ఒకసారి నాతో చెప్తున్నట్లుగా “దేవుడు పండ్రెండు మంది అపొస్తలులకు మాత్రమే స్వస్థత వరాలు ఇచ్చాడు. మరియు…” ఓహో! అది చెప్పుటకు అతను లేచినపుడు అనేకులు ఇక్కడ కూర్చొని యున్నారు. చూశారా. కొద్ది నిముషాలలో, తగినంత పొందుకున్నాడు.
222 కనుక గమనించు, “లోకమంతటికి, సృష్టి అంతటికి, ఈ సూచక క్రియలు వెంబడించును.”
223 సాతాను యొక్క అపనమ్మకముతో కూడిన గురుతును తీసుకోవద్దు. అతను చేయగలిగితే, అతడు ఈ రాత్రి నీ మీద వేయగలడు. అతడు గోడకు ఎదురుగా నిలువబెట్టి మీ చెవులకు పొడుచును. మీరు బయటకు వెళ్ళిపోయి “దాని గురించి నాకు తెలియదు” అని చెప్తారు.
224 మీరు ఇంటికివెళ్ళి, అది చదవండి, అటుతరువాత విధేయతగా ఉండి ప్రార్థించండి. ఎందుకనగా ప్రతీది కూడా ఈ ప్రాముఖ్య సమయంలో మరింత లేఖనమునకు పరిపూర్ణమైనది. ఈ పవిత్ర సమయములో. అది సంవత్సరముల తరబడి జరుగును. నిరూపించబడి ఇంతవరకు వచ్చినది. ఇదే ఆ ఘడియ. ఇదే ఆ సమయం.
225 అతని యొక్క అవిశ్వాసపు గురుతును నీ యొక్క చెవులకు గ్రుచ్చనీయకండి. చూశారా? కారణం, ఆరంభం నుండి అతడు అవిశ్వాసి. అతడు దానిని అవమానించాడు. సరే. ఓహో…అతని జ్ఞానము చేత లేఖనము తీసికొని మలుపు చేసి మరియు స్వంత జ్ఞానము చేత వంకర చేసి, తర్కపు శక్తితో చేయుటకు అనుమతించకండి. నిన్ను నీవు తగ్గించుకొని “దేవుడు దానిని చెప్పియున్నాడు. అందులోనున్నది అంతే” అని చెప్పు. ఇపుడు మనము…
226 మనకు ఆలస్యమైపోతుంది, కావున మనమిక్కడ నిలిపివేద్దాము. మరి—మరి ప్రారంభిద్దాం.
227 ఇపుడు మనము రెండవ ముద్రకు వెళ్దాం. వధింపబడి, తిరిగిలేచిన గొఱ్ఱెపిల్ల ఇది విప్పినపుడు, దూడను పోలిన రెండవ జీవి ఈలాగు చెప్పెను, “వచ్చి చూడుము ముద్ర యొక్క మర్మము ఏమైనది” అని. చూశారా? ఇపుడు మనము పొందుకోబోవుచున్నాము. జ్ఞప్తించుకోండి, గొఱ్ఱెపిల్ల ప్రతిముద్రను విప్పవలసి యుండెను. మరియు రెండవజీవి…
228 మీరు దానిని గమనిస్తే, మనమెక్కడ వెళ్ళామో, ఆ సంఘకాలాలు గమనిస్తే అదే కార్యముయున్నది. రెండవ…మొదటిది సింహము; తరువాతది ఒక దూడ లేక ఎద్దు లేక మరొకటి, మీరు చూశారా.
229 గొఱ్ఱెపిల్ల ముద్రను విప్పినపుడు, ఈ జీవి చెప్పెను, “వచ్చి, చూడుము” మరియు చూచుటకు వెళ్ళెను. అతడు లోనికి వెళ్ళినపుడు ఏమి జరిగినది? అతడిక్కడ ఏమి కనుగొన్నాడో చూద్దాం. “వచ్చి, చూడు.” ఇక్కడ మర్మము ముద్రింపబడియున్నది. సుమారు రెండువేల సంవత్సరాలుగా ఇక్కడున్నది. అదేంటో చూద్దాం.
230 ఇపుడు, అతడు చూచినది మనము ఇక్కడ కనుగొంటున్నాము (ఏమిటి?) ఎఱ్ఱని గుఱ్ఱము ముందుకు వచ్చుట. దీనిని నేను అర్థం చేసుకున్నరీతిగా, నాకు అర్థమైన రీతిగా, అతని చేతిలోనున్న ఈ గొప్ప ఖడ్గము…సుమారు ముందున్న పదిహేను, ఇరవై నిముషాలలో మనం మూడు విషయాలు చూడవలసియున్నది. ఆయన ఇక్కడ ఏమి చెప్పాడో మనం చదివి చూద్దాం. “మరియు అక్కడ నుండి వెళ్ళెను…” 4వ వచనము.
…అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; (మొదటిది తెల్లనిది): మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱము మీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
231 ఇక్కడ, సూచనలుయున్నవి. వాటిని జాగ్రత్తగా చూద్దాం. అయితే, నాకర్థమైనంతగా నాకు తెలిసినంత వరకు, చూడండి. అదే దానిని, యేసు మత్తయి 24 లో చెప్పాడు. ఔనా? ఆయన చెప్పాడు, “మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. మరియు అయితే,” ఆయన చెప్పాడు “ఈ కార్యములన్నియు ఇంకా జరుగలేదు. చూశారా, సమయం ఇంకా రాలేదు.” చూశారా! వారు యేసును మూడు ప్రశ్నలు అడిగారు. ఔనా? ఆ మూడు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు.
232 అక్కడ మన సహోదరులు అనేకులు సరిగా గ్రహించలేక పొరబడ్డారు. అడ్వెంటిస్ట్ సహోదరులు, సెవెంత్ డే మొదలగువారు అందును గూర్చి…“ఆ దినమున చిన్న పిల్లలకు, పాలిచ్చు వారికి శ్రమ. సబ్బాతు దినమున ద్వారములు మూయబడును.” మరియు మొదలైనవి. మై. ప్రశ్నకు జవాబు లేకుండయున్నది. చూశారా. లేదు. చూశారా?
233 వారు అడిగిన దానికి ఆయన జవాబిచ్చుచుండెను. అయితే ఆయన—ఆయన అంతా చివరి దినమునకు వర్తింపజేయుట లేదు. ఆయన అన్నాడు “మీరు వింటారు…” ఇపుడు మనము ఈ ఒక్క విషయం మీదనే పనిచేయుచున్నాము. కొద్ది రాత్రులలో మరెక్కువ వాటిపైన చేస్తాము. చూడు, ఆయన చెప్పాడు, “మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. తరువాత అదంతా కాదు…చూడండి. తరువాత వారు—తరువాత అప్పచెప్పారు. అదంతా ఇంకా కాదు.”
234 అయితే, “ప్రపంచము యొక్క ముగింపును గూర్చి” వారు ఆయనను అడిగినపుడు ఆయన సమయమును గూర్చి మాట్లాడుచున్నపుడు.
235 “ఈ కార్యాలన్ని ఎప్పుడు సంభవించును, రాతిపై రాయి నిలవని కాలమెప్పుడు వచ్చును? సూచన ఏది? లోకము యొక్క అంతము ఎపుడు?” చూశారా, వారు ఆయనను మూడు విషయాలు అడిగారు.
అప్పుడాయన “లోకము యొక్క అంతమును గూర్చి” చెప్పుచుండెను.
236 ఆయన చెప్పాడు, “అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచునపుడు, సమయం ద్వారము నొద్దనే యున్నదని తెలుసుకొనుడి. మరియు ఇవన్నియు నెరవేరు వరకు ఈ తరము గతింపదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అర్థం తెలియని నాస్తికుడు అదెట్లు తెలుపగలడు! గ్రహించారా? ఆయన చెప్పాడు, “ఈ తరము,” ఆయన మాట్లాడుచున్నది ఆ తరము గూర్చి కాదు. “అంజూరపు చెట్టు చిగురించుటకు చూడబోవు తరమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు.”
237 ఇపుడు ఒక విషయం మిమ్ములను అడుగబోవుచున్నాను. ఆలాగు—ఆలాగు ముఖాముఖిగా జరుగుతున్న ఒక దానిని చూడుడి. ఇరవైయైదు సంవత్సరములకు, మొదటిగా ఇశ్రాయేలీయులు ఇపుడు ఒక దేశముగా ఉన్నది. ఈ రాత్రి యెరూషలేము పైన ప్రపంచములోనే ప్రాచీన జెండా ఎగురుచున్నది. ఇశ్రాయేలు ఆమె యొక్క మాతృ దేశములో ఉన్నది.
238 మిషనరీగా ఉండాలని ఆశ కలిగిన ఒక సహోదరుడు, యూదుల యొద్దకు మిషనరీగా వెళ్ళాలని నడిపించబడ్డాడు. నేను చెప్పాను, “అప్పుడపుడు, ఒకరిని నీవు పొందగలవేమో” అని. ప్రజలు అనుకుంటారు దేశమంతా రక్షించబడునని. లేదండి.
239 ఇశ్రాయేలు ఒక దేశముగా మార్పు చెందును గాని ఒక వ్యక్తిగా కాదు. “ఒక దేశము ఒక దినములోనే జన్మించును.” అది ఇశ్రాయేలు. “ఇశ్రాయేలీయులందరు రక్షింపబడుదురు.” అది గుర్తుంచుకోండి. “ఇశ్రాయేలీయులందరు రక్షింపబడెదరు” అని పౌలు, ఆలాగు చెప్పియున్నాడు. ఇపుడు గమనించండి. “ఇశ్రాయేలీయులందరు.” అది ఖచ్చితంగా నిజం.
240 ఇపుడిది గమనించండి! “అయితే”, ఆయన చెప్పియున్నాడు “అంజూరపు చెట్టును నీవు చూచునపుడు, మిగతా చెట్లన్నీ చిగురించుట చూచునపుడు.” ఇపుడు గమనించు. రెండువేల ఐదు వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలు తన స్వంత దేశమునకు వచ్చి, చేరిన సమయము లేనేలేదు. మధ్యరాత్రికి మూడు నిముషాలు అను చిన్న ప్రదర్శన మనకున్నది. ఆమె అక్కడ ఆరు కోణాల దావీదు నక్షత్రంగా ఎగురుచున్నదిగా ఉన్నది.
241 గతించిన కొద్ది సంవత్సరాలుగా సంఘశాఖలయందు జరుగుచున్నట్టి ఉజ్జీవము వంటి ఉజ్జీవం, ఏ సమయములోనైనా జరిగినదా? ఇపుడది పఠనము చేయండి. మనము మన యొక్క గృహములో ఉన్నాము.
242 మెథడిస్టు, బాప్టిస్టు, యితరమైన సంఘశాఖలలో మరే వ్యక్తి ద్వారా అయినా, బిల్లీగ్రాహం సేవ క్రింద వికసించినంతగా వారి సేవలలో వికసించియున్నదా? మీ యొక్క చరిత్రను వెదకుడి. నామకార్థపు సంఘములోనికి వెళ్ళిన ఏ మనిషి యొక్క పేరు చివర h-a-m అను అక్షరముతో ముగిసియున్నదా? మిమ్ములను అడుగుచున్నాను. A-b-e…
243 A-b-r-a-h-a-m. ఇపుడు చూడు. అబ్రాహాము యొక్క పేరుకు ఏడు అక్షరములున్నవి, A-b-r-a-h-a-m.
244 అయితే మన సహోదరుడు బిల్లీగ్రాహం కు G-r-a-h-a-m, ఆరు, ఏడు కాదు. లోకము, అతడు పరిచర్య చేస్తున్నది ప్రకృతి సంబంధమగు సంఘమునకు.
245 ప్రకృతి సంబంధమైన సంఘము, సొదొమ లోని లోతు. మరియు ఇతడు అక్కడకు వెళ్ళి, బోధించి, సువార్త ద్వారా వారిని అంధులుగా చేశాడు.
246 అయితే, అబ్రాహాముతో ఉండిపోయిన ఒకరున్నారు. అబ్రాహాము ఆయనను “ఎలోహిమ్, ప్రభువా” అని పిలిచాడు. ఇపుడు అబ్రాహాము ముగ్గురు వచ్చుట చూచి, అతడన్నాడు, “నా ప్రభువా.”
247 లోతు, ఇద్దరు వచ్చుట చూచి, అతడన్నాడు, “నా ప్రభువులారా” యని. అక్కడ తేడాయున్నది. మీ త్రిత్వము యొక్క క్రియను చూడండి? ఔనా?
248 యేసు చెప్పాడు, “లోతు దినములలో ఉన్నట్లుగా.” మీరది చూశారా? గమనించు. దానిని లెక్కించు.
249 ఒకరు ఆత్మ సంబంధమైన సంఘము యొద్దకు, పెండ్లికుమార్తె యొద్దకు, అబ్రాహాము యొద్దకు, సొదొమలో లేనివాని యొద్దకు వచ్చుచున్నాడు. మరియు ఆయన ఏమి చేశాడో గమనించండి. వారు చేసినట్లుగా ఏలాటి ప్రసంగము చేయలేదు. ఆయన వారికి బోధించెను. అయితే తరువాత వారు వారి ముందు సూచనలు చేసిరి. ఆయన మెస్సీయ సూచన చేశాడు. ఆయన ఆయన వీపును గుడారము వైపు ఉండి, ఆయన చెప్పాడు, “అబ్రాహాము.” జ్ఞప్తించుకోండి. దానికిముందు అతని అసలైన పేరు, అబ్రాము. అయితే, ఆయన అన్నాడు, “అబ్రాహామా, నీ భార్యయైన S-a-r-a-h ఎక్కడ?” దానికి కొద్ది దినముల ముందుగా అది S-a-r-r-a.
అబ్రాహాము అన్నాడు, “ఆమె నీ వెనుక గుడారములో నున్నది.”
250 మరియు ఆయన అన్నాడు, “అబ్రాహామా, నేను…” అక్కడ నీ యొక్క వ్యక్తిగత సర్వనామము తిరిగి ఉన్నది. “నేను నీతో చేసిన ప్రమాణము ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను.” అదేమైయున్నదో గ్రహించారా. చూశావా? ఆయన వస్త్రములపై ధూళితోనున్న ఒక మనుష్యుడు, దూడ మాంసము భుజిస్తూ, ఆవు పాలు త్రాగుచు, జొన్న రొట్టె తింటున్నాడు. ఔనండి. దేవుడు, ఎలోహిమ్ శరీరరీతిగా ప్రత్యక్షమయ్యాడు!
251 కడవరి దినమున శరీరరీతిగా మరలా ప్రత్యక్షమాయెదనని వాగ్దానం చేశాడు. గమనించు.
“అబ్రాహామా, నీ భార్యయైన శారా ఎక్కడ?”
“ఆమె నీ వెనకాల, గుడారములో యున్నది.”
అన్నాడు, “నేను నిన్ను దర్శించబోతున్నాను.”
252 బహుశా, ఆమెకు వంద సంవత్సరాలు వయస్సుండవచ్చును. గుడారము వెనుకయుండి ఒక విధంగా నవ్వుకున్నది. ఆమె అన్నది, “నాకా, ఒక వృద్ధ స్త్రీకి.” సరే. వారు భార్యా-భర్తలుగా వారి మధ్య దాంపత్య సంబంధం లేకుండ ముగిసిపోయినది, ఎందుకనగా అతడు నూరు సంవత్సరాల వయస్కుడు మరియు—మరియు ఆమె తొంభై. అన్నది, “అది జరగనిపని” అని.
253 మరియు ఆయన అన్నాడు, “ఆమె ఎందుకు నవ్వాలి?” వ్యూ! గుడారమునకు వీపు వుంచి, “ఎందుకు ఆమె నవ్వాలి?” ‘ఇది ఏలాగు సాధ్యము’” అని చెప్తూ ఆమె ఎందుకు నవ్వాలి? చూశారా, ఆయన అతనికి సూచన చూపించాడు.
254 ఇపుడు ఆయన అంత్యకాలంలో ఇది తిరిగి సంభవించునని వాగ్దానం చేస్తున్నాడు.
255 ఇద్దరు మనుష్యులు అక్కడకు వెళ్ళి వాక్యమును బోధించారు. అక్కడ నుండి బయటకు రమ్మని చెప్పారు. ఆ స్థలము కాలిపోబోవుచున్నదని చెప్పారు. అది ఆలాగే జరిగెను. లోతు తొందరపడలేదు; ప్రకృతిసంబంధమైన సంఘము, పాపములోను, ఊబిలోను ఉండిపోయెను. అయినను సంస్థాపక సంఘ ప్రణాళికలతోను సతమతమగుచుండెను. అయితే పెండ్లికుమార్తె…
256 ఆ ఒక్క మనిషి వారి యొద్దకు వెళ్ళలేదు. పెండ్లికుమార్తెకు సాదృశ్యముగా యున్న వారి యొద్దకు వెళ్ళెను. మనమిపుడు కడవరి దినాలలో ఉన్నాము. చూడండి? ఇపుడు గమనించు.
“మీరక్కడ చెప్పారు, ‘దేవుడు శరీరములో ప్రత్యక్షుడయ్యాడా’?”
257 యేసు ఆయనే చెప్పాడు, “మీరు నన్నెట్లు ఖండించగలరు?” చెప్పాడు, “అది మీ బైబిల్ గ్రంథములో వ్రాయబడియుండలేదా, మీ ధర్మశాస్త్రములలో, ప్రవక్తల యొద్దకు వాక్యము వచ్చునని…” యేసు చెప్పాడు, “వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను” అని. ’ఎందుకనగా అన్నిటిలో ఆయన లేఖనములో ఉన్నాడు. ఆయన అన్నాడు, “ఇపుడు వాక్యము చెప్తుంది, ‘వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను’ అని. మీరు వారిని ‘దేవుళ్ళని’ పిలిచారు, ఏలయనగా దేవుని వాక్యము వారి యొద్దకు వచ్చెను.” అన్నాడు. “అలాటప్పుడు, నేను దేవుని కుమారుడనని చెప్పినపుడు మీరెందుకు నన్ను ఖండిస్తున్నారు?” వారి స్వంత చట్టముతో ఆయన వారిని బంధించెను. అక్కడే మీరున్నారు. చూశారా?
258 ఇపుడు మనము ఎక్కడున్నాము? మనము అంత్యకాలములో ఉన్నాము. ఇపుడు జాగ్రత్తగా వినండి.
259 యుద్ధములు, యుద్ధములను గూర్చిన సమాచారముండునని మనము చూశాము. మరియు అంజూరపు చెట్టు చిగురించుచున్నదని చూచుచున్నాము. మిగతా చెట్లు చిగురించుచున్నవని చూచుచున్నాము. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్ లు, మిగతా అందరు చిగురించుచున్నారు, ఒక గొప్ప ఉజ్జీవం జరుగుచున్నది.
260 దేవుడు, పెండ్లికుమార్తెను, ఏర్పరచుకున్న వారిని కడపటి ఘడియ కొరకు ప్రోగుచేయుచున్నాడని నేను నమ్ముతున్నాను. ఓ, మై. ఇపుడు గమనించండి.
261 ఇపుడు, యోహాను ఏమి చూశాడో, ఈ విషయాల్లో అతడేమి చూశాడో అవి గమనిద్దాం. “ఒక ఎఱ్ఱని గుఱ్ఱం; దాని మీద స్వారీచేయువాడు, ఖడ్గముతో చంపుటకు అతనికి అధికారమియ్యబడెను.” ఇపుడు, దానిని గూర్చి నా యొక్క ప్రత్యక్షత, ఇది సాతాను, మరలా ఇది దయ్యం, మరలా మరియొక రూపంలో. ఇపుడు మనకు తెలుసు—ముద్రలు…క్రితం రాత్రి నేను చెప్పినట్లుగా మరియు బూరలు కు—కు—కు ప్రజల మధ్య యుద్ధములకు, దేశముల మధ్య జరుగు యుద్ధములకు సంబంధించి యుండును. అయితే మీరిక్కడ చూస్తున్నారు, ఈ మనిషి ఒక ఖడ్గమును కలిగియున్నాడు. కాబట్టి అతను సంఘమునకు సంబంధించిన వ్యక్తి. రాజకీయ యుద్ధము. నీవది తలంచియుండకపోవచ్చు. అయితే ఒక నిముషం, కొద్ది నిముషాలు గమనించు.
262 ఈ గుఱ్ఱములు రంగు మారుట గమనించండి. స్వారీచేయువాడు ఒకడే. గుర్రములు రంగులు మారుట. గుర్రము ఒక మృగము. మరియు బైబిల్ లో మృగము ఒక సూచనయైయుండి, ఒక శక్తికి పోలికయైయున్నది. ఒకే పద్ధతి మరొక రంగులో ప్రయాణం చేస్తున్నది. అమాయకపు తెల్లదనము నుండి రక్తపు ఎరుపుదనము శక్తిలోకి మారుతుంది. చూశారా? అవన్ని ఇపుడు గమనించండి, ఏలాగు వచ్చుచున్నాడో.
263 అతడు మొదట బయలుదేరినపుడు, అతడొక చిన్న సిద్ధాంతముగా యండెను. నీకొలాయితుగా పిలువబడెను. అది దేనిని చంపదు. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, అది ప్రకటన 2:6. అతడు దేనిని చంపడు. అది కేవలం ఒక సిద్ధాంతము. ప్రజల మధ్య ఆత్మ. ఇపుడు అతడు దేనిని చంపడు. ఓ, అతడు చాలా అమాయకుని వలె, ఈ తెల్లని గుఱ్ఱం పైన స్వారీ చేయుచుండెను. “సరే. నీకు తెలుసా. ప్రపంచమంతట వ్యాపించబడిన సంఘమును మనము కలిగియున్నాము. మనము దానిని సార్వత్రిక సంఘమని పిలుద్దాము.” వారింకా చేయుచున్నారు. సరే. చూశారా. ఇపుడు “మనము…” ఓ, అది పరిపూర్ణంగా అమాయకమైనదే. ఓ, అది అమాయకమైనది. “అది మనుష్యుల యొక్క గుంపు. మనమందరము సహవాసము కొరకు కలసియుందాము.” చూశారా. అదెంతో అమాయకమైనది. అది తెలుపు. తెల్లని గుఱ్ఱం. చూశారా?
264 ఇపుడు, హోదా గలవారు, చక్కటి దుస్తులు ధరించువారు, విద్యావంతులు. చూశారా. ఒకేరకపు రెక్కలు గల పక్షులు, మీకు తెలుసా. “మనము—మనమందరము కలసి కార్యాలు చేద్దాము. ఆ బీద గుంపువారు మనతో కలసియుండలేక సతమతమగుచున్నారు. సరే, అయితే మనము—ఉన్నత వర్గము వారు మన సంఘమునకు వస్తున్నారు. ఇక్కడి నుండి మనము బయటకు వెళ్ళినట్లయితే, మనము—మనము—మనము ఒక మంచి పనిచేయువారిగా ఉంటాము లేక ఆలాగు. తెలుసా. మనము సమస్తము ఏకముగా ఉండినయెడల వారివలె లేదా వింతైన వారిగా” ఉంటాము. కాబట్టి వింతైన వ్యక్తి బాడుగ ఇల్లు అని కాదు. అయితే నా భావమేటో తెలుసా. కాబట్టి అది నిజమైన విశ్వాసికి వింతగా ఉండును. ఇపుడైతే, మరోమాటలలో చెప్పవలయునంటే, “మనమొక చిన్న గుంపుగా యుండవలయునని కోరుచున్నాము. ఒక ఆలోచన సభగా మనలను పిలుచుకొనవలయునని కోరుచున్నాము.” అది వట్టి సిద్ధాంతం మాత్రమే. చాలా అమాయకముగా యున్నది. “సహోదరులారా, ఎందుకు, మీ యెడల మాకు ఏలాంటి వ్యతిరేకము లేదు, నిజంగా లేదు. మీరు సరిగానే ఉన్నారు. అయితే, మీకు తెలుసా, మేము—మాకు పనులున్నవి. మేమొకటిగా కూడుకొనిన యెడల మేము బాగుపడతాము.” చూశారా? అది జరుగువరకు, అది చివరగా చేరుకున్నది, ఔనండి, కలసియుండుట.
265 అయితే, ఈ భయంకరమైన, మోసపుచ్చు ఆత్మ (ఓ, మనిషి) అవతారమెత్తెను. అవతారమెత్తె ఆత్మలో; ఈ సిద్ధాంత ఆత్మ అవతారమెత్తెను, మానవునిలో క్రీస్తు స్థానము తీసికొనుటకు. అది ఆరాధించబడవలసియున్నది, తరువాత క్రీస్తు వలె ఆరాధించబడవలయును. మరోమాటలలో అక్కడ వాటికన్ లో…నేనక్కడ ఉన్నాను. అది వ్రాయబడినది “వికారియస్ ఫిల్లీ డీ” మరియు అది రోమన్ సంఖ్యలో వ్రాయబడినది. ఇపుడు మీరు ఆ యొక్క రోమ్ అంకెల క్రింద గీత గీయండి. దాని అర్థం “దేవుని కుమారునికి బదులుగా” అతడు, మరోమాటల్లో వికార్. వికార్ అంటే ఏమిటో తెలుసా; ఒక దాని స్థానమును తీసికొనుట. అతను ఒక వికార్ “దేవుని కుమారునికి బదులుగా”.
266 మరియు బైబిల్ చెప్తుంది, “బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అదియొక మనుష్యుని సంఖ్యయే. మరియు ఆ సంఖ్య ఆరు వందల అరువది ఆరు.” ఇపుడు నీవు వికారియస్ ఫిల్లీ డీ ని తీసికొని రోమన్ సంఖ్యలతో గీతలు గీయ్; “V” ని అయిదుగాను, మరియు “I” ని ఒకటిగాను లెక్కించండి. మరియు వాటిని కూడిక వేయండి. మరియు ఆరు వందల అరవై ఆరు వస్తుందో లేదో చూడండి.
267 మరియు బైబిల్ చెప్తుంది, “అతడు దేవుని ఆలయంలో దేవుని వలె ఆరాధించబడును, కూర్చుండును.” ఆ చిన్న సిద్ధాంతము అవతారమెత్తినపుడు అది ఒక వికార్ గా మారెను. “దేవుని కుమారునికి బదులు” చూశారా! ఓ, మై. అది భయంకరమైనది. మోసపుచ్చు ఆత్మ! అది మీరు చదవాలనుకుంటే రెండవ థెస్సలోనికయులు 2:3 చదవండి. అదెక్కడో మీరు చూడగలరు.
268 మరియు, బహుశా, ప్రతి దేశానికి సాతాను రాజకీయ శక్తులకు శిరస్సుగా ఉన్నాడని మీకు జ్ఞప్తిండియుంటుంది. అదెంతమందికి తెలియును? [సమాజము “ఆమేన్” అని చెప్పినది—సంపా.] మీరు గుర్తుపెట్టుకోవాలని ఉన్నారా? మత్తయి 4:8. “సాతాను యేసును ఒక ఎత్తైన పర్వతము పైకి తీసుకొని వెళ్ళి మరియు ఆయనకు అప్పటివరకున్న మరియు ఇకపై ఉండబోవు ప్రపంచ రాజ్యములన్నిటిని ఒక్క క్షణంలో చూపించెను.” ఒక వ్యక్తిని గూర్చి మాట్లాడు! అతడన్నాడు, “నీవు నన్ను ఆరాధించిన యెడల, నేను వాటిని నీకు ఇస్తాను.” అని. యేసు వాటికి హక్కుదారుగా కాబోతున్నాడని ఆయనకు తెలుసు.
269 అదే వారు చెప్తారు. “ఎందుకు, బీద పరిశుద్ధ గుండ్రాళ్ళారా!”
270 ఎందుకు, మనము ఈ లోకాన్ని పొందుకుంటాము! “సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు.” అదీ యేసు చెప్పినది. ఔనా? ఔనా?
271 గమనించు. అవన్నియు తన వశమగునని యేసుకు తెలియును. కాబట్టి ఆయన అన్నాడు “సాతానా ఇక్కడ నుండి వెళ్ళు. అని వ్రాయబడియున్నది.” మరలా లేఖనము యొద్దకు తీసికొనిపోతున్నాడు. చూశారా. “‘ప్రభువును మాత్రము, ఆయనను మాత్రమే ఆరాధించవలసియున్నది.’” చూశారా?
272 ఇపుడు—ఇపుడు అతడు పెద్ద దయ్యమైయుండి, ఎంతో భక్తిగలవానిగా రూపము దాల్చెనని బైబిల్ చెప్పియున్నది. అటుపిదప అతడు తన సంఘమును, రాజ్యమును ఐక్యము చేస్తాడు. తన యొక్క రెండు శక్తులు ఏకమగును. చూశారా?
273 అంత్యక్రీస్తు ఆత్మ బయలువెడలినపుడు అది ఆత్మయైయుండెను. తరువాత అదేమైంది? అది…ఇపుడు ఈ ముద్రను గమనించండి. ఆత్మ బయలువెడలినపుడు అది అంత్యక్రీస్తు, క్రీస్తు బోధకు విరోధము. ఔను. తదుపరి చేసినది…ఆయన సంఘమునకు ఆయన ఏమి చేయవలెనని నియమించెననగా, అది పాపమునకు విరుద్ధము. “ఓ, అది కాదు దాని అర్థం. అది కాదు దాని అర్థం. అది ఇంకొకరికి. అది వంద సంవత్సరములు మునుపున్నవారికి. అది, అది మనకు కాదు” చూశారా? అది, చూశారా, విరోధము, “వ్యతిరేకము.” తరువాత అది…
274 ఇపుడు స్వారీచేయువాడు బయలువెడలెను, అతనికి—అతనికి కిరీటము లేదు. అయితే అతనికి ఇవ్వబడెను. ఆ తెల్లని గుఱ్ఱం, అతని యొద్ద విల్లున్నది. బాణములు లేవు. చూశారా? కనుక అతడు బయలువెడలినపుడు…
275 అటుతరువాత కొద్దికాలమైన తరువాత, అతనికి ఒక కిరీటమియ్యబడెను. ఎందుకనగా ఆత్మ తలమీద నీవు కిరీటమును పెట్టలేవు. అయితే ఆ ఆత్మ తన యొక్క రెండవ కార్యములో మర్మముగా చేయు పనిలో అతను రూపము ధరించాడు. అతనికి కిరీటమియ్యబడెను. అంత్యక్రీస్తు ఆత్మగా పనిచేయుటకు అబద్ధ ప్రవక్త. ఇపుడు మనమతనిని చూస్తున్నాము. అతడు అది తీసుకున్నపుడు అతడు ఆ విధంగా అయ్యాడు. అటుతరువాత అతడు, సాతాను ఇదివరకే లోక రాజకీయశక్తులను తన స్వాధీనమందు ఉంచుకొన్నది.
276 ఇపుడు మత సంబంధమగు శక్తి ద్వారా అతడు ఒక విశ్వవ్యాప్త సంఘాధికార శక్తిని పొందు స్థాయికి వచ్చుచున్నాడు. నా సహోదరులారా మీరది అర్థం చేసికొనలేరా, అది…ప్రకటన 13వ అధ్యాయంలో ఈ దేశము కనిపించినపుడు, ఈ చిన్న జంతువు ఒక గొఱ్ఱెపిల్ల వలె లేచినది. దానికి రెండు కొమ్ములున్నవి. పౌర సంబంధమైన, మత సంబంధమైన శక్తిని కలిగియున్నది. అయితే ముందున్న మృగము చేసిన విధముగనే ఇతడును చేశాడు.
277 అది వింతగా ఉన్నది. అమెరికా యొక్క సంఖ్య పదమూడు మరియు స్త్రీ. అది వింతగా ఉన్నది. చివరకు అది 13వ అధ్యాయం ప్రకటనలో కనిపిస్తుంది. మనము జెండాలో పదమూడు గీతలతో ప్రారంభించియున్నాము, పదమూడు నక్షత్రాలు కలవు. సమస్తమును “పదమూడు, పదమూడు, పదమూడు, పదమూడు.” అంతయును. ప్రతీది కూడా. “స్త్రీ, స్త్రీ, స్త్రీ.” అంతయూ అదే.
278 అది చివరకు ముగించబడును. (నేను అది ఊహించి అనుకుంటున్నాను) ఒక స్త్రీ ఆమెను స్వాధీనపరచుకొనును. జ్ఞాపకముంచుకో, ముప్పయి సంవత్సరాల క్రితం నేనది చెప్పాను. మరియు—మరియు, ఆ—ఆ నేను ముందుగా జరుగబోవునని చెప్పిన ఏడు కార్యములలో ఐదు సంభవించినవి. మరియు ఆమెను లోనికి తెచ్చుటకు అక్కడ ఒక మనిషిని కలిగియున్నారు. నీ యొక్క రాజకీయాల ద్వారా నీవు ఓటువేసి నీవులోనికి ఆహ్వానించుచున్నావు. అవును. హు! సరే.
279 చెప్పవలసినది చాలా ఉన్నది. అట్లు చెప్పుకుంటు వెళ్ళితే మన అంశమునకు రాలేము. ఇపుడు గమనించు. రేపు రాత్రి నేను తీసికొనవలెను గనుక మిమ్ములను ఎక్కువసేపు ఉంచను.
280 చూడు, గమనించు. సాతాను…ఇపుడు, ప్రతియొక్కరు, ప్రపంచములోని సర్వ రాజకీయ శక్తులను సాతాను స్వాధీనపరచుకొంటాడని గ్రహిస్తున్నారా. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఆయన ఆలాగని చెప్పాడు. మత్తయి 4వ అధ్యాయం 8వ వచనము, మీరు తీశారా. అన్ని రాజ్యములు అతనికి సంబంధించినవి. ఆ కారణం చేత వారు పోరాటములు, యుద్ధములు, చంపుకొనుటయును. ఇపుడు గుర్తుంచుకొనుడి.
281 అది వింత కాదా? వారు ఒకరినొకరు చంపుకొనుటకు వారికి ఈ ఖడ్గమియ్యబడెను. ఓ, ఓ, ఓ, మై! ఇపుడు గమనించు.
282 అతడు అది చేసినపుడు, అతనికి మత సంబంధమైన శక్తి ఇవ్వబడలేదు. అయితే అతడు దయ్యముతో అబద్ధ బోధను ప్రారంభించెను. మరియు ఆ బోధ సిద్ధాంతముగా మారెను ఆ సిద్ధాంతము ఒక అబద్ధపు ప్రవక్తలో అవతారమెత్తెను.
283 మరియు అటుతరువాత అతడు సరియైన స్థలమునకు వచ్చాడు. అతడు ఇశ్రాయేలునకు వెళ్ళలేదు. అతడు రోమ్ కు వెళ్ళాడు. నైసియా, రోమ్ కు వెళ్ళాడు.
284 ఆలోచన సభ ఏర్పాటు చేయబడినది. వారు ప్రధాన బిషప్పు ను ఎన్నుకున్నారు. అటుతరువాత, ఇది చేయుట ద్వారా, వారు సంఘమును రాష్ట్రమును ఐక్యము చేశారు. అటుతరువాత తన విల్లును తాను విడచాడు. తన తెల్లని గుఱ్ఱమును దిగాడు అతడు అతని ఎఱ్ఱని గుఱ్ఱమును ఎక్కాడు. ఎందుకనగా అతనితో ఏకీభవించని ఎవరినైనను చంపుటకు. అక్కడే మీ ముద్ర ఉన్నది. ఒకే వ్యక్తి…దూరముననున్న నిత్యత్వము వరకు అతడు స్వారీచేయుచు వెళ్ళుటను గమనించండి. తన శక్తులను ఏకము చేసెను.
285 ఇపుడు అదే కార్యము చేయుటకు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు అదే కార్యము. మరియు వింతైన కార్యము. బహుశా మీరు అర్థం చేసికోలేకపోవచ్చు. అయితే, ఈరోజు లూయిస్ విల్ లోని బాప్టిస్టు గ్రూపు…మీరు రేడియోలో విన్నారు. ఒక బోధకుడు లేచి…ఎంతమంది విన్నారు? మంచిది. చూశారా. సరే. మీరెక్కడున్నారు. వారు కోరుతారు, మనం కథోలిక్ సంఘములో చేరకూడదు గాని వారితో సహవాసము కలిగియుంటాము. మరియు, అది లూయిస్ లో జరుగుచున్న అదే సమయములో, ఇక్కడ దేవుడు ఆయన ప్రజలకు ముద్రలు విప్పి “దానిని చేయవద్దని” చూపించుచున్నాడు. అవి రెండు ఏకమై క్రియచేయుటను చూశారా? జ్ఞప్తించుకోండి. కాకి, పావురము ఓడలో ఒకే కొయ్యపై కూర్చుండుట. నిశ్చయం. జ్ఞప్తించుకోండి.
286 తన శక్తిని తాను ఐక్యపరచి, తరువాత, సంఘము, రాజ్యము రెండూ మారినపుడు మత సంబంధముగా, అది మనం కనుగొన్నాము. అప్పుడు మీరేమి చేయబోతున్నారు? అతడు తన స్వంత మతమును రూపొందించును. ఇపుడు తాను చేయగోరినది తాను చేయును. అటుతరువాత, తనతో అంగీకరించని ఎవరికైనను మరణమును విధించుటకు అతడు హక్కు కలిగియుంటాడు. అదే ఖచ్చితంగా అతడు చేసినది. ఖచ్చితంగా అతడదే చేశాడు. ఏది అతడు—అతడు…ఎవరైతే వాక్యమును కాపాడి, అతని యొక్క బోధలకు అంగీకరించలేదో అట్టి నిజమైన భక్తులకు అతడు చేశాడు. వారికి మరణం విధించాడు.
287 ఇపుడు, సహోదరుడు లీ వైల్, నైసియా కాలమును గూర్చి, ఆరంభ సంఘమును గూర్చి మాట్లాడిన బోధకులైన మీరు, మీరు ఇది చదివారో లేదో నాకు తెలియదు. మీరు అది చదవాలనుకుంటే, మీరు స్మకర్స్ యొక్క గ్లోరియస్ రిఫార్మేషన్ లో మీరు పొందుకోగలుగుతారు.
288 మరియు మీరు అక్కడ చూస్తారు, ఏదనగా హిప్పో వాడైన పరిశుద్ధుడైన అగస్టీన్ రోమ్ సంఘములో యాజకుడయ్యాడు. ఒకసారి పరిశుద్ధాత్మ అతనిపైకి వచ్చు తరుణం కలిగినది. అతడు దానిని నిరాకరించాడు. ఒక బోధకునిగా ఎంతమందికి అది తెలుసు? కాబట్టి, అతడు పరిశుద్ధాత్మను తృణీకరించాడు. అది ఖచ్చితంగా ఈ దినాన పరిశుద్ధాత్మను నిరాకరిస్తున్న ప్రొటస్టెంట్ సంఘానికి పోలిక. అతడు హిప్పొ కు తిరిగి వెళ్ళిపోయాడు. మరియు “రోమను కథోలిక్ ను నమ్మని ప్రతివారిని చంపుట దేవునికి ప్రీతికరమైనదనే ప్రత్యక్షతను అతడు దేవుని యొద్ద నుండి పొందుకొనెనని ఒక కాగితముపై ఆజ్ఞను వ్రాసి సంతకము చేసినవాడు ఇతడే.”
289 ఇపుడు వినండి. హతసాక్షుల వృత్తాంతముల నుండి నేను నిర్వచిస్తున్నాను. “హిప్పొవాసియైన పరిశుద్ధ అగస్టీన్-1586 వరకు” రోమన్ హతసాక్షుల చరిత్రలో, “రోమన్ కథోలిక్ సంఘము అరవై ఎనిమిది మిలియన్ల ప్రొటస్టెంట్ లను చంపెను.” అతని ఖడ్గము ఎరుపా? అతను ఎఱ్ఱని గుఱ్ఱం మీద స్వారీచేస్తున్నాడా? అదేంటి? ఒకే శక్తి; ఒకే స్వారీ చేయువాడు. అది ముద్ర. హతసాక్షుల వృత్తాంతములో “అరవై ఎనిమిది మిలియన్లు” అని వారు అంగీకరించారు. ఇదిగాక దానికి మించి మరణించినవారున్నారు. ఓ, కనికరం కలుగుగాక! అంధకార యుగములలో లక్షలమంది సింహాలకు వేయబడ్డారు, అనేక విధములుగా చంపబడ్డారు. ఎందుచేతననగా ఆ కథోలిక్ సిద్ధాంతమునకు వారు లోబడలేదు. అది మీకు తెలుసు.
290 మీకెంత సమయమున్నది? [సభ చెప్పుచున్నది, “చాలా సమయం. రాత్రంతా”—సంపా.] సరే. ఒకటి చదువుతాను. ఇపుడు నాతో కలసి త్రిప్పండి. ఒకటి చూపుతాను. ఒక నిముషము చిత్రీకరిద్దాం. ఇపుడే నా తలంపులోకి వచ్చినది. అది చదువుదాం. ప్రకటన త్రిప్పుదాము. ప్రకటన 17వ అధ్యాయంకు. ఇంక మనకు పదిహేను నిముషాలున్నవి. సరే. ఇపుడు జాగ్రత్తగా వినండి, చదువుచుండగా. బైబిల్ లు కలిగిన వారు త్రిప్పండి. మీరది పొందుకోగలందులకు నేను మీకు సమయం ఇవ్వబోతున్నాను.
291 నీవది తీశావా, లీ. స్మక్కర్స్ లో అది నా యొద్ద నున్నది. గ్లోరియస్ రిఫార్మ్ లో. వాటికన్ లోని రోమ్ యొక్క హతసాక్షుల పట్టిక నుండి అది తీయబడినది.
292 ఇపుడు, అది పరిశుద్ధ పేట్రిక్ ప్రజల యొక్క హింస వరకు జరిగెను. అటుతరువాత పరిశుద్ధ పేట్రిక్ ను వారి—వారి యొక్క భక్తుడని పిలచుకున్నారు. ఉహు! పరిశుద్ధ పేట్రిక్ నావలె ఒక కథోలిక్. నేనెంతమట్టుకు కథోలిక్ నో మీకు తెలుసు. ఔనా. అతడు—అతడు సంఘము యొక్క సిద్ధాంతమును అసహ్యించుకున్నాడు. అతడు పోపు యొద్దకు వెళ్ళుటకు నిరాకరించాడు. ఔనండి. పరిశుద్ధ పేట్రిక్…మీరెప్పుడైనా అతడు విద్యనభ్యసించిన ఉత్తర ఐర్లాండ్ కు వెళ్ళారా? అతని పేరు పేట్రిక్ కాదు. ఎంతమందికి అది తెలుసు? అతని పేరు సుకాట్. ఔను. అతడు తన చిన్న చెల్లిని పోగొట్టుకున్నాడు. మీకు జ్ఞప్తిందా…చూశారా. సరే.
293 ఇపుడు గమనించండి. ప్రకటన 17వ అధ్యాయం. ప్రతియొక్కరు తమ హృదయములు తెరచుటకు ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ మీకు బోధించును గాక.
…ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో—ఒకడు వచ్చి నాతో…
294 ఇపుడు, చూశారా ఏడు పాత్రలు. మీకు తెలుసా, ఈ ఏడును గూర్చి, మనం పఠనము చేస్తున్నపుడు, ఒకేసారి ఇవన్ని సంభవించును. తెగుళ్ళు, సంఘకాలములును వెంబడిస్తు, ఎందుకనగా అవన్నియును ఒక పుస్తకములో ముద్రించబడియున్నవి. మరియు సమస్తమును వరుస క్రమములో ఒకదాని తరువాత ఒకటి జరుగుతవి. ఒకటి మరొక దానిలోనికి, మరొకటి మరియు మరొకటి దానిలోనికి. రెండు ఆత్మలు పనిచేయుచున్నవి. దేవుడు మరియు దయ్యము. చూశారా?
…ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;
295 ఇపుడు, ఇటు చూడు, ఇటు, “జలములు.”
296 “వేశ్య” ఏంటది? అదొక స్త్రీ. పురుషుడు కాలేడు. బైబిల్ గ్రంథములో సంఘము దేనికి సాదృశ్యము? ఎందుకని? క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె మొదలైనవి. మీరు చూశారా, అది స్త్రీ, సంఘము.
297 “జలములు” దాని అర్థమేంటి? ఇక్కడ గమనించండి. అక్కడ 15వ వచనము చదవండి.
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను,…జనసమూహములను,…జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
298 ఈ సంఘము ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తుంది, చూశారా, “విస్తార జలములపై కూర్చొనియున్నది.”
భూ రాజులు ఆమెతో వ్యభిచరించిరి, ఆత్మ సంబంధమైన వ్యభిచారము (ఆమె సిద్ధాంతము తీసుకొని, నీకొలాయితుల సిద్ధాంతము) భూ నివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
299 అబ్బాయ్, నీవొక త్రాగుబోతు గుంపును గూర్చి మాట్లాడుచున్నావా. దానిపైన నీవు…
అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా ఒక స్త్రీని చూచితిని…
300 మరియు, అదేమిటో నీకు తెలుసా? కథోలిక్ ల యొక్క స్వంత వ్రాతలే. ఇది వారి యొక్క సంఘమని అంగీకరిస్తుంది. ఎంతమందికి అది తెలుసు? వారి స్వంత వ్రాతలలో. మన విశ్వాసము యొక్క రుజువులు అను పిలువబడునది నా యొద్దనున్నది. ఇపుడు చూడండి. పూజారికి సంబంధించినది. సరే. సరే.
అప్పుడతను ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములును గల ఎఱ్ఱని మృగము మీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.
301 దానిని ఇపుడు గమనించు, ఆ సూచనను, ఆ “ఏడు తలలు.” అది ఇక్కడ ఈలాగు చెప్పబడినది, మీరు చూస్తున్నారా, “మరియు—మరియు—మరియు…మీరు చూచుచున్న ఆ తలలు, ఆ స్త్రీ కూర్చొనియున్న ఏడు కొండలు.” రోమ్ ఏడు కొండలపై కూర్చున్నది. చూశారా? అందును గూర్చి పొరపాటేమీ లేదు. ఔనా, “ఏడు తలలు.” “మరియు పది కొమ్ములు” తెలుసా, పది రాజ్యములు మరియు ఆలాగు.
ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను…ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను.
302 అంత్యక్రీస్తు ఆత్మ, “జారత్వము” చూశారా, “బోధ” అది దేవునితో వ్యభిచారము చేయుచు. చూశారా? ఆమె యొక పెండ్లికుమార్తెగా ఉండవలసియున్నది. చూశారా. వ్యభిచారము చేయుట. చూశారా? హవ్వ చేసినట్లు సంఘము చేస్తున్నది. ఔనా.
దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను, మర్మము, మహాబబులోను…
303 ఎవరికైనా తెలుసు. “బబులోను” అనగా రోమ్ అని.
వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లి.
304 6వ వచనము వినండి.
మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా.
305 సిలువలు, సమస్తమును ధరించుకొని ఆమె అంత అందంగా యుండెను. “ప్రపంచంలో ఆమె ఏ విధముగా పరిశుద్ధుల రక్తము త్రాగి నేరస్థురాలుగా ఎంచబడును అది?” అతనిని ఆశ్చర్యపరచెను. అపుడాయన అతనికి చెప్పబోతున్నాడు.
ఆ దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీని గూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.
306 ఇపుడు, ఇది ముద్రలలో లేనిది, ఇది ఇంకొకటి. చూశారా.
మరియు అతడు చెప్పాడు…ఏడు తలలును మరియు పది కొమ్ములును.
నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును (పోపునకు పునాది లేదు) నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, (అక్కడ ఎన్నుకొనబడిన వారున్నారు, చూశారా), ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు,…
307 ఏలాగు, జీవగ్రంథములో నీ పేరు ఎపుడు పెట్టబడియున్నది? నీవు హాజరైన ఉజ్జీవమపుడా? కాదండి. “జగత్తు పునాది వేయబడినపుడే.”
…మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.
308 చూశారా, “మృగము” ఒకరు చనిపోవును, మరొకరు అతని స్థానము తీసుకొనును. “అతడుండెను; అతడు లేడు. అతడు యుండెను; అతడు లేడు. ఉండెను; అతడు లేడు.” ఆ విధముగా ఆమె నాశనమునకు పోవును. సరే.
ఇందులో—ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును.
309 తొమ్మిది ఆత్మ సంబంధమైన వరములున్నవి. ఎంతమందికి తెలుసు. వాటిలో ఒకటి జ్ఞానము. [సభ “ఆమేన్” అని చెప్పినది—సంపా.] సరే.
ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు.
310 ఓ! మీరది గ్రహించలేకపోతే, మీరు సంపూర్తిగా గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారైయుంటారు. ఔనా. సరే.
…మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదురుగు కూలిపోయిరి, ఒకడున్నాడు (నీరో), కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.
311 అతడేమి చేశాడో మీకు జ్ఞాపకమున్నదా? నగరాన్ని కాల్చివేశాడు. దానిని క్రైస్తవుల మీదికి నెట్టాడు. అతని తల్లిని ఒక చిన్న చెట్టుపై నుంచి గుఱ్ఱం వలె చేస్తూ ఆమెను ఆ వీధుల గుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు. రోమ్ తగలబడుచుండగా అతడు ఫిడేలు వాయించాడు. సరే.
ఉండినదియు ఇపుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒకడైయుండి…
312 అన్య రోమ్ పోపు రోమ్ అయినది. అవతారమెత్తిన అంత్యక్రీస్తు ఆత్మ అవతారమెత్తి కిరీటధారియాయెను. రోమ్ రాజ్యమునకు సంఘమునకు కిరీటము ధరించిన రాజాయెను. ఓ! సహోదరుడా! అది వాటితో నిండియున్నది. చూశారా?
ఉండినదియు…ఏడవది మరియు నాశనమునకు పోవును… (అతనెంత కాలము నిలుచును? వారు పద్ధతిని మార్చరు)…
…నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతో కూడ రాజుల వలె అధికారము పొందుదురు.
313 వారు నియంతలు. మీరు చూశారా. “వారందరు ఒక్క మనస్సు కలిగియుండిరి.” ఇపుడు ఇటు చూడండి. అది కమ్యూనిజంను గూర్చి మాట్లాడుట కాదు. ఔను?
వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, ఆ నిబంధన విడగొట్టి…(గతరాత్రి నేనది మాట్లాడితిని)…దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.
314 “అయ్యో అయ్యో ఆ మహా పట్టణము ఒక్క గంటలోనే కూలిపోయెనే!” అని నావికులు తదితరులు చెప్తారని బైబిల్ గ్రంథము చెప్పుచున్నదని మీకు తెలియదా. చూశారా?
దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.
…మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.
315 ఒకటి నాకు చెప్పండి. రష్యా అందరిని పరిపాలించుటలేదు. మనము అందరిని పరిపాలించుటలేదు. ప్రతియొక్కరిని పరిపాలించు ఒకరున్నారు. నెబుకద్నెజరు యొక్క ఇనుము దొర్లుచు వ్రేళ్ళ వరకు పోవుచున్నవి. అది రోమ్. ఒక దేశముగా రోమ్ చేయుటలేదు. అది సంఘముగా చేయుచున్నది. ఆకాశము క్రిందనుండు ప్రతి దేశము రోమ్ కు చెందినది.
316 వారు ఈ విధంగా చెప్పుటలో ఆశ్చర్యము లేదు, “ఎవరు వానితో యుద్ధము చేయగలరు?” అతడు “సమాధానము,” అని చెప్తే [సహోదరుడు బ్రెన్హాం తన వ్రేలిని ఒకసారి విరచుచున్నాడు—సంపా.] అది అంతే. ప్రతి కథోలిక్ చెప్పును, “అది, ‘యుద్ధము చేయకుము’” అని చెప్తే, మరియు—మరియు వారు యుద్ధము చేయరు. అంతే. అతడు చేయునది ఎవరు చేయగలరు. ఎవరు చేయరు. అంతే “అతడు చేయు అద్భుతాలకు ఆశ్చర్యపడతారు” అతడు యుద్ధమును ఆపగలడు. [సహోదరుడు బ్రెన్హాం తన వ్రేలిని ఒకసారి విరుపుచుండెను.] అతడు చేయగలిగినదంతా ఒక్కటే “ఆగు” అని చెప్పుట. అంతే. అయితే అతడు చేయునని అనుకుంటున్నావా? తప్పక కాదు.
317 గమనించు, అది నిశ్చయముగా చూపించుచున్నది. “వారు ఒకరినొకరు చంపుకుంటారు. వారు ఒకరినొకరు చంపుకుంటారు” మొదటిగా అతని విల్లుకు బాణములు లేవు. అయితే అతని “గొప్ప ఖడ్గము” ఆ పని చేసెను. తరువాత అతను చంపాడు. మరియు తెల్లని గుఱ్ఱం నుండి ఎఱ్ఱని గుఱ్ఱంనకు మారాడు. అదే అతను, దయ్యం. తన యొక్క ఖడ్గముతో నున్నవాడు.
318 యేసు ఏమి చెప్పాడు? యేసు చెప్పాడు, “కత్తి పట్టుకొనువాడు కత్తితో నశించును.” తిరిగి పోరాడవద్దు. ఔనా? యేసు, ఆ రాత్రి ఆయన అది చెప్పినపుడు, పేతురు తన కత్తి తీసుకున్నాడు. చూశారా. ఆయన చేసిన విధముగా చేయుడి. ముందుకు సాగుదాం.
319 ఇపుడు జ్ఞప్తించుకోండి, అతను ఒక ఖడ్గమును కలిగియున్నాడు. తన చేతిలో ఒక ఖడ్గము పట్టుకొని ఎఱ్ఱని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ, తనతో ఏకీభవించని ప్రతీఒక్కరి రక్తంపై పోవుచున్నాడు.
320 దానిని ఇపుడు మీరు గ్రహించారా? [సభ “ఆమేన్” అని చెప్పెను—సంపా.] ఆ ముద్ర ఏమిటని ఇపుడు ఎంతమంది అర్థం చేసుకున్నారు? [“ఆమేన్”] సరే. ఇపుడు యేసు ఏమి చెప్పాడు? “కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును.” ఔనా? సరే. సరే. ఈ గుఱ్ఱం పైన స్వారీచేయువాడు అతని రాజ్య పౌరులందరు, ఆ కాలమంతటిలో చంపబడినవారు, అనగా పరిశుద్ధులైన హతసాక్షుల రక్తము పీల్చినవారు, యేసుక్రీస్తు వచ్చునపుడు ఆయన ఖడ్గము చేత చంపబడతారు. “కత్తిపట్టుకున్నవాడు కత్తిచేతనే నాశనమౌదురు.” అన్ని కాలాలలోను లక్షలకొలది నిజమైన ఆరాధికులను అంత్యక్రీస్తు ఆత్మచేతను దుర్బోధ సిద్ధాంతము చేత తీసుకున్నాడు. క్రీస్తు తన ఖడ్గము చేత వచ్చునపుడు, అది ఆయన నోటి నుండి వచ్చు ఆయన వాక్యము, ఆయన ఎదుటనున్న ప్రతి శత్రువును చంపును. మీరది నమ్ముతున్నారు. “శత్రువును చంపుట.”
321 ఒక్క నిముషం ఇక్కడకు మనం వెళ్దాము, ప్రకటన. నేను దానిని చెప్తున్నానో లేక వాక్యము అది చెప్తుందో ఇపుడు మనం చూద్దాం. ప్రకటన 19:11.
మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని (ఆమేన్). అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్న వాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలవంటివి, ఆయన శిరస్సు మీద…అనేక కిరీటములుండెను;…
322 ఓ సహోదరుడా! చూశావా, ఆయన కిరీటములను ఆయన యొక్క పరిశుద్ధులు పెట్టారు. మీరు చూశారా.
…వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు.
323 జ్ఞప్తించుకోండి, మనకు—మనకు అది తెలియదు. ఔనా, అదేంటి? “మరియు ఆయన ధరించియున్నాడు.” మనం చూద్దాం.
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. (“యున్నాడు” అని కాదు “యున్నది”)
324 ఎందుకనగా ఆయన, వాక్యము ఒక్కటేయైయున్నారు. ఔనా? ఇపుడు గమనించు. “ఆయన నామములు” కాదు. ఊహూఁ! “ఆయన నామము ‘దేవుని వాక్యమ’ని పిలువబడియున్నది.” అది ఒక నామముగా ఎరుగబడుచున్నది. మరి వేరే నామము కాదు.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. (అది పరిశుద్ధుల యొక్క నీతి. చూశారా?)
325 ఇపుడు గమనించండి. యేసు ఏమని చెప్పాడు? “కత్తి పట్టుకొనువాడు…” సరే. ఎఱ్ఱని గుఱ్ఱం మీద స్వారీచేయువాడు. ఆమె ఇక్కడకు వచ్చుచున్నది. “కత్తి పట్టుకొనువాడు…” అప్పటినుండి, ఈ కాలాలన్నిటిలో, బహుశా ఇంకా ఎక్కువగా అరవై ఎనిమిది మిలియన్ల మందిని చంపియుందురు. అయితే, యేసు చెప్పాడు “కత్తి పట్టుకొనువాడు, దానివలన నాశనమగును” అని. గమనించు.
ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది,…
326 హెబ్రీ 4వ అధ్యాయం చెప్తుంది ఈలాగు “దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడియైన ఖడ్గము కంటే వాడిగా యుండి, ఎముకల యొక్క మూలుగును విభజించునంతమట్టుకు,” అదేమి చేయుచున్నది, వాక్యము ఏం చేస్తుంది? “అది హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది.” ఔను.
…జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి రెండంచులు…గల ఖడ్గము…వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.
327 దేవుని వాక్యమునకు విరోధముగా నుండుచు, మరియు దానివలె నటించువారు దేవుని వాక్యముతో ఏకీభవించనందున ఆ విధంగాయున్నారు. సాతానుడు తాను పట్టుకున్న రాజకీయ శక్తులను, తాను పట్టుకున్న ఆత్మ సంబంధమైన శక్తులను కలిపి ప్రతి దేశములో చొరపడు ఒక సంఘముగా చేశాడు. అతడు లక్షల కొలది…తెల్లని గుఱ్ఱం నుండి దిగి ఎఱ్ఱని గుఱ్ఱం ఎక్కి తన చేతిలో ఖడ్గం పట్టుకొని బయలువెళ్ళెను.
328 అయితే దేవుడు చెప్పాడు “అబద్ధ బోధ ద్వారా దేనినైతే తారుమారు చేశాడో లేక ప్రయత్నించాడో, అదే వాక్యము బలముతో లేచి యేసుక్రీస్తు పెదవుల గుండా ఉచ్ఛరించబడి అతనిని చంపును. ఆయన ఎదుటనున్న సమస్తమును సంహరించును.” ఆమేన్.
329 ఆమేన్. అక్కడే రెండవ ముద్ర యున్నది. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? [సభ, “ఆమేన్” అని చెప్పినది—సంపా.] ఓ, మై. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. [సభ అత్యధికంగా సంతోషించారు.] దేవునికి స్తోత్రం. ఈ మిగతా ఇతర ప్రత్యక్షతలు, దర్శనాలు, ప్రతీదీ ఒకే కార్యంపై చక్కగా సరిపోవుచున్నవా! ఎంతమందికి తెలుసు. మీ చేతులు పైకెత్తండి. వందలమంది, ప్రతియొక్కరు ఇక్కడ, తమ చేతులెత్తారు. మంచిది. ఇది ఆలాగే ఉంటున్నది. ఇదీ అంతే. జ్ఞాపకముంచుకోండి. ఓ, స్నేహితుడా!
ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి వచ్చిన రక్తపు
ఊట యొద్దకు రమ్ము
అక్కడ పాపులు ఊటలో మునిగి
వారి పాపపు మరకలు పోగొట్టుకొనెదరు.
330 మీరెన్నడు చేయనట్లయితే, ఆయనను నమ్మండి. రండి. వాయిదా వేయవద్దు. వద్దు. వద్దు. స్నేహితుడా, ఏదైనా నీ జీవితంలో యున్నట్లయితే.
331 మనమిక్కడ ఉన్నాము. ఒకటి జరగనైయున్నది [సహోదరుడు బ్రెన్హాం ప్రసంగ వేదికను నాలుగుసార్లు తట్టాడు—సంపా.] నాకు తెలియదు. ఎప్పుడో నాకు తెలియదు. ఏమి జరగనైయున్నదో నాకు తెలుసు. అయితే ఎప్పుడది జరుగునో నాకు తెలియదు. అయితే అది జరగనైయున్నది. ఎందుకనగా ఇప్పుడే దానిని ఆయన బయలుపరచనైయున్నాడు. ఆయన అది బయలుపరచకుండ, ఆయన ఏదియు చేయడు. ఆమోసు 3. మొదట ఆయన తెలియపరచును. ఈ విషయాలు కడవరి దినాలలో వచ్చునని ఆయన వాగ్దానము చేశాడు. ఏడవ సంఘకాలము, దాని అంతమందు, వర్తమానికుడు వచ్చినపుడు అక్కడ బయలుపరచబడును. అది బయలుపరచబడును. విప్పబడిన ఆ ముద్రలు బయలుపరచబడును. ఇక్కడే అవి యున్నవి. ఇపుడు అది ప్రభువు నామములో స్నేహితుడా, అది నమ్ము. ఔనండి. బబులోను నుండి బయటకు రా!
332 ముగించక ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కారణం, నేను తొమ్మిదిన్నరకు ఖచ్చితంగా నేను వచ్చాను. ఇపుడిది సరైన సమయం.
333 బిల్లీ మరియు నేను, ఇండియాలో విమానం దిగినపుడు, ఇండియాలో, అది మా ఆఖరి యాత్ర. వారు తీసుకొని వచ్చిన వార్తా పత్రికను నేను చూస్తున్నాను. అది ఇంగ్లీషులో ఉన్నది. మరియు అది చెప్తుంది. “భూకంపం అయిపోయింది. పక్షులు తిరిగి వచ్చుచున్నవి” అని. తరువాత వివరాలు చెప్పబడినవి, వారు…అక్కడ ఒక వింతైన విషయం జరిగినది.
334 ఇండియాలో మనవలె అల్లబడిన కంచెలుండవు. వాళ్ళు రాళ్ళు తీసుకొని కంచెలు పెడతారు. వారు ఇళ్లన్నీ కూడా రాళ్ళతోనే పెడతారు. అక్కడ ఉంచుతారు. అక్కడ, అన్నిచోట్ల, ఇండియా అంతట వేడిగా ఉండును. కొండలపై తప్ప. అంతట, కలకత్తా తదితర ప్రాంతాల్లో వీధులలో ప్రజలు ఆకలితో బాధపడుతుంటారు.
335 కాబట్టి, వారి ఇళ్లు గోపురాలలో వారు కడతారు. వారు—వారి ఇంటి ప్రక్కనే ఇక్కడ కంచె కడతారు. వారి ఇంటికి గోపురం కడతారు. వారి బావి బహుశా అక్కడ యుంటుంది. వారి పశువులకు మొదలైన వాటికి వారు త్రవ్వుతారు. తరువాత చుట్టు కంచెవేస్తారు.
336 మరియు, తటాలున, ఒకటి జరగటం ప్రారంభించినది. తెలుసా, చిన్న పక్షులు ఆ రాళ్లలోకి వెళ్తాయి. వాటి గూళ్ళు అవి నిర్మించుకొని వాటి చిన్న పిల్లలను పెంచుతాయి. ఒకటి జరగటం ప్రారంభించినది.
337 ప్రతి దినము అది వేడిగానున్నపుడు పశువులన్నియు ఆ గోడల చుట్టుకు వచ్చి ఆ గోడల నీడ క్రింద నిలబడును; చల్లదనము కోసము.
338 ఆ చిన్న పక్షులన్నీ ఆ స్థలాలలో నివసించును. అకస్మాత్తుగా, ఆ చిన్న పక్షులన్ని, ఒక తెలియని కారణం కొరకు…గతదినము చిన్న పక్షుల కొరకు ఏమని చెప్పామో మీకు తెలుసా. ఔనా? ఒక తెలియని కారణం చేత అవన్నీ ఎగిరిపోయినవి. అవి బయటకు వెళ్ళిపోయినవి. వాటి గూళ్ళకు మరలా రాలేదు. అవి పొలములోకి వెళ్ళిపోయినవి. చెట్ల మీద కూర్చున్నవి. అవి ఎక్కడెక్కడకో చేరినవి లేక మైదానంపై యున్నవి.
339 పశువులు తిరిగి రాలేదు. గొఱ్ఱెలు తిరిగి రాలేదు. అవి పొలములోనే ఉండిపోయినవి. మరియు ఒకదానికొకటి హత్తుకొనియుండెను. అది చేయవలసిన మంచి మార్గం. ఒకటి జరుగబోతున్నదని వాటికి తెలుసు.
340 అటుతరువాత అకస్మాత్తుగా భూకంపం వచ్చినది. గోడలను, కంచెను కదిల్చివేసినది.
341 అప్పుడు ఆ చిన్న పక్షులు తిరిగి వచ్చుటకు ప్రారంభించినవి. మూడు నాలుగు దినాల వరకు తిరిగి రాలేదు; తరువాత వచ్చుటకు ప్రారంభించినవి. అవి అనుకున్నవి. “సరే. భూకంపం తప్పక అయిపోయి యుంటుంది. పక్షులు తిరిగి వస్తున్నవి.”
342 ఎందుకు? నోవహు దినములలో ఆ పక్షులను, పశువులను మరియు గొఱ్ఱెలను ఓడ లోపలకు నడిపించిన అదే దేవుడు మరి వాటిని సురక్షితమైన చోటుకు ఎగిరిపోవునట్లు చేయగల మారని అదే దేవుడని మీరు నమ్ముచున్నారా? అది నిజమేనా? [సభ “ఆమేన్” అని చెప్పింది—సంపా.]
343 సహోదరుడా, ఇపుడు నన్నొకటి చెప్పనీయ్. ఒకటి జరుగుటకు సంసిద్ధంగా ఉన్నది. ఈ పెద్దవన్ని, పురాతన మత సంబంధమైన గోడలన్ని కూలిపోబోతున్నవి. సుదూరమునకు వెళ్ళి ఏకీభవించనైయున్నవి. నేనిక్కడ నిలబడియుండుట ఎంతటి నిశ్చయమో అంత నిశ్చయముగా అవి చేయబోతున్నవి. “ఆ మృగమునకు ప్రతిమ” యుండును. నేనిక్కడ నిలబడినంత నిశ్చయముగా; ప్రభువు యొక్క వాక్య ప్రకారముగా ఈ దేశము అది గైకొనియున్నది. విను, ఆ వింతైన భావన నీకు కలిగినపుడు, ఆ గోడల నుండి మీరు దూరముగా పొండి, దూరంగా వెళ్ళి పొండి. అక్కడ మీరు చచ్చిపోతారు. దానిని చేయవద్దు. దాని నుండి బయటకు రండి. ఈ కార్యము నుండి దూరంగా వెళ్ళండి. మీరు పరుగెత్తగలిగినంత త్వరగా క్షేమకరమైన స్థానమునకు పారిపొండి. కనికరము కొరకు దేవుని అడగండి.
344 “సరే. నా తల్లి మెథడిస్టు కనుక నేనాలాగు యుంటాను. మా నాన్న బాప్టిస్టు; నేనాలుగు యుంటాను” అని ఆ విధంగా చెప్పవద్దు. ఆ విధంగా చేయవద్దు. నీవు ఏ విధమైన తరుణాన్ని మార్చవద్దు.
345 అదెంత సాధారణంగా, కనిష్ఠ స్థాయిలో ఉన్నా నాకు లెక్క లేదు. అది ప్రభువు యొక్క వాక్యము. యేసుక్రీస్తు యొద్దకు ఎంత త్వరగా పరుగెత్తాలో అంతగా పరుగెత్తు. దేవుడు ఆయన ఆత్మతో నిన్ను నింపు వరకు అక్కడే యుండు. దానికొరకు నీవు వెదకు ఒక ఘడియ రాబోతున్నది. అది అక్కడయుండదు. అది చేయుటకు నిశ్చయించుకొనుము.
ఒక క్షణం, మనం తలలు వంచుకుందాం.
346 పరలోకపు తండ్రీ, ఓ నేను—నేను, కొన్నిసార్లు, ప్రభువా, ఇక్కడ నిలబడి మరియు నేను వణుకుచున్నాను. ఆ భయంకరమైన సమయము సమీపించుట తలంచుచున్నాను. మరియు నేను అది నిలుపు చేయుటకు మార్గము లేదు. అది వచ్చునని చెప్పబడియున్నది. “ఎందుకని ప్రజలు వచ్చి మరియు—మరియు—మరియు వినకూడదు? వారు వచ్చి అది అంగీకరించారా? అని నేననుకున్నాను.” అయితే, వారు అంగీకరించరని, నీవు చెప్పితివి. కనుక వారు చేయరు. అది నాకు తెలియును.
347 అయితే గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు తమ పేరులు వ్రాయబడినవారు కొందరున్నారు. ఆ ముద్రలు అక్కడ విప్పబడినపుడు, వారి పేరు అక్కడుండుట వారు చూచెదరు. మరియు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడును. వారు వచ్చిరి. నీవు వారిని దూరముగా యుంచలేదు. ఎవరు కూడా, ఎవరు కూడా ఏలాగైనా వారు వచ్చుచున్నారు. ఎందుకనగా, ఆ చిన్న పక్షులను, గొఱ్ఱెలను, పశువులను నీవు ఏలాగు నడిపించెదవో, వాటిని ఆలాగు నడిపించుచున్నావు. నీవు దేవుడవైయున్నావు. ఒక అంతర్బుద్ధి ఆ జంతువులు కలిగియున్నందున తప్పించుకోవాలని అవి ఎరిగియున్నవి. అపాయము నుండి తప్పించుకొనుటకు వెళ్ళిపోవాలని ఒక జంతువుకు అంతర్బుద్ధి హెచ్చరిక చేసిన యెడల, పరిశుద్ధాత్మతో నింపబడి యున్నానని చెప్పుకునే సంఘమునకు, అది ఏమి చేయును!
348 దేవా, మా యెడల కనికరము చూపుము. ప్రభువా, మా తప్పిదములన్నిటి నుండి మమ్ములను క్షమించుము, “భలే, చాలా బాగున్నది” అని చెప్పుచూ మరియు ఈ ప్రజలు గోడల చుట్టు నిలబడి, వారి అవయవములు నొప్పులని చెప్పు మాటలను వినుటకు, మేము ఇక్కడ ఈ ప్రసంగ వేదిక యొద్ద నిలబడుటకు కోరుటలేదు. ప్రభువా, మేమొకటి చేయాలని ఆశించుచున్నాము. మేము, మా హృదయములను నీవు పరిశోధించమని కోరుచున్నాము. ప్రభువా, ఏదైనా తప్పిదమున్నట్లయితే, మాకు తెలియజేయుము. దయచేసి అది మరింత ఆలస్యమగు సమయము వచ్చువరకు చేయకుము. నన్ను పరిశోధించుము. నన్ను పరీక్షించు ప్రభువా.
349 ఇక్కడ దేవుని కృప ద్వారా ఇక్కడ నేను నిలబడి, అక్కడ ఆ ముద్రలు విప్పబడి, వచ్చి ప్రజలకు చెప్పుటను నేను చూచుచున్నాను. వారముల క్రితము ఈ విధముగా అది సంభవించునని నీవు ముందుగా చెప్పియుంటివి. తండ్రీ, ఇపుడు ఇక్కడ మాకు ముందుగా ఉన్నది.
350 ఇపుడు ప్రభువా నన్ను పరిశోధించుము. నన్ను పరీక్షించుము. నా హృదయములో నన్ను పరిశోధించుము. ప్రభువా, మాకు వద్ధు…మాకు. నీవు మా జీవితంలోకి చూడవలెనని కోరుచున్నాము. అక్కడ ఏమైన యున్నట్లయితే, సరియైనిది కానిది యున్నట్లయితే, ప్రభువా, మాతో మాట్లాడవలెనని యున్నాము. ఇపుడే, దానిని సరిచేసికోగోరుచున్నాము. ఇపుడే, రక్తముతో నిండిన ఊటయుండగనే, మా పాపములు, అవిశ్వాసములను శుద్ధిచేయు బ్లీచ్ ఉన్నపుడే మమ్ము సరిచేయుము. అందులో మా ఆత్మలను, మా అవిశ్వాసమంతయును ముంచగోరుచున్నాము. దేవా, మా అవిశ్వాసము నుండి మాకు సహాయము చేసి, ప్రభువా, అది మా యొద్ద నుండి తీసివేయుము.
351 ఎత్తబడు విశ్వాసమును మేము పొందగోరుచున్నాము. ఆ మర్మమైన ఉరుము (దూరాన) ఉరుమునపుడు సంఘము పైకెత్తబడినపుడు, అందులకు మేము సమర్థులమౌటకు, అది పొందుకొనగోరుచున్నాము. ప్రభువా అది అనుగ్రహించుము.
352 ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్ములను పరీక్షించుము. అందులోకి మేము చూచెదము గాక. మేము అపజయమొందామని చూచినట్లయితే…ప్రభువా, బిరుదుల ద్వారా ఇక్కడ బాప్తిస్మము తీసుకున్నవారున్నట్లయితే, సత్యమైన, అసలైన బాప్తిస్మము ఎరుగని వారు. పౌలు వలె నేను నమ్మకస్తునిగా యుందును గాక…
353 ఎఫెసు పై భాగము గుండా అతడు వెళ్తున్నపుడు, శిష్యులు కేకలు బొబ్బరింతలు పెడుతూ మంచి సమయాన్ని కలిగియుండుట అతడు కనుగొనెను. అతడు వారితో అన్నాడు, “మీరు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని. ఆలాటిది యున్నదని వారికి తెలియదు. “అయితే దేనిని బట్టి మీరు బాప్తిస్మము పొందారు?” మరియు మహిమగల పరిశుద్ధ ప్రవక్త ద్వారా వారు బాప్తిస్మము పొందారు. అయితే వారు మారుమనస్సు విషయమైన బాప్తిస్మము మాత్రం పొందిరి. అటుతరువాత వారు యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందారు. పౌలు, వారు తిరిగి బాప్తిస్మము పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు.
ప్రభువా, నీ వాక్య వెలుగులో!
354 ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని ప్రతి వ్యక్తికి నేను ఆజ్ఞాపించుచున్నాను. మీకు తరుణముండగనే త్వరగా నీళ్ళ యొద్దకు త్వరపడమని.
355 పరిశుద్ధాత్మతో నింపబడని వారైన మీరు; ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు మోకాళ్ళపై నుండమని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన ప్రేమతోను, మంచితనముతోను నింపి, పరిశుద్ధాత్మ మిమ్ములను నిండుగా శుద్ధీకరించు వరకు లేవకండి. దేవుని సన్నిధానంలో మీ ఆత్మ ఎంతగానో సంతృప్తి చెందు వరకు మీ జీవిత కాలమంతా మీ ఆశ అంతా ఆయనను సేవించి, ఆయనకై జీవించి, ఆయనకై పనిచేయునట్లు.
356 అది అనుగ్రహించుము. దేవుడు దీనిని మీకు అనుగ్రహించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.
నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను
నిజంగా మీరు ఆయనను ప్రేమిస్తారా? ఇపుడు మీ చేతులు పైకెత్తండి.
కల్వరి చెట్టు పైన
నా రక్షణ ను కొనెను.
357 [సహోదరుడు బ్రెన్హాం, నేను ఆయనను ప్రేమించుచున్నాను అను దానిని ఆలాపన చేయుచున్నాడు—సంపా.]
ఎవరైనా కూర్చొని, వారి అక్కరను ఈ రాత్రి భావిస్తే, బాప్తిస్మము తీసికోవాలని భావిస్తే లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మము భావిస్తే. నీ అక్కర నీకు తెలుసు; అది నీకు బయలుపరచబడినది. మరియు నీవు ప్రార్థనలో జ్ఞాపకముంచుకోవాలని కోరుచున్నావు. మాలో ఏ ఒక్కరు అది నీకు ఇవ్వలేరు. ఓ, మేము నీకు బాప్తిస్మము ఇవ్వగలము. అయితే ఒకే విషయము. పరిశుద్ధాత్మను నీకు ఇవ్వలేము. అది దేవుడు మాత్రమే చేయగలడు. అయితే నీ అవసరతను నీవు భావించావు. అది దేవుడు నీ హృదయంతో మాట్లాడుచున్నాడు. అది నీకు అవసరమైన దానిని, నీవు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోగోరుచున్నావు. మేము నిన్ను ఎరుగునట్లు, నీవెవరివో తెలుసుకొనునట్లు, నీవు నిలబడగలవా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఒక అక్కర, ప్రభువు నిన్ను దీవించును గాక.
358 ఇక్కడ, ఒకవేళ నూట యాభై మంది నిలబడియున్నారని అనుకుంటున్నాను. నేను అందరిని చూడగలిగిన యెడల అలాగుండగలదు. గదిలోనున్నవారు, బయట చుట్టు ప్రక్కలనున్నవారు, చేతులు పైకెత్తినవారు మొదలైన వారెంతమందో నాకు తెలియదు. అయితే నీవు యొక అక్కరతో నున్నావు.
ఇపుడు ప్రార్థించుకుందాం.
359 ఇపుడు, మీ ప్రక్కన నిలబడియున్నవారిని చూస్తున్న మీరు క్రీస్తు యెదుట, సాక్షులుగా వారు నిలువబడ్డారు. “నీవు నాకు—నాకు—నాకు కావాలి ప్రభువా. నీవు నాకు కావాలి. నేను—నేను నమ్ముతున్నాను. జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి అక్కడనున్న నా పేరును ఈ రాత్రి ఆ ముద్ర వెనుక ఉండుటను కనుగొనగలిగిన వారిలో నేను కూడా ఒకనిగా ఉన్నాను. ఒకటి నా హృదయమును తాకినది, నేను నిలబడియున్నాను ప్రభువా. అది నేనా? నీవు నన్ను పిలచుచున్నావా? నా పేరు అక్కడయుండుట నీవు నాకు బయలుపరచకోరుచున్నాను. నన్ను నింపి, పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి నన్ను ముద్రించుము.” ముందుగనే ముద్రించబడిన మీరు, నేను మిమ్ములను మేల్కొల్పగోరుచున్నాను. వారివైపు తిరిగి మీ చేతులు వారిపై పెట్టండి, వారి కొరకు ప్రార్థించుటకు. [సహోదరుడు బ్రెన్హాం కొద్దిసేపు నిలుపు చేసియున్నాడు.] ఇపుడు అతి భయభక్తులతో ఉండండి. [సభ అంతయు ప్రార్థించుటకు ప్రారంభించారు—సంపా.]
360 పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు నామములో, పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలివలె ఈ సభపైన దిగి, ప్రభువా, ఇక్కడున్న ప్రతి హృదయమును పిలుచును గాక! ఈ ప్రజలపైకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పంపుము.
మరియు నీళ్ళు సంసిద్ధంగా ఉన్నవి.
361 “పేతురు ఇంకను యీ మాటలు పలుకుచుండగా, వాక్యము వినినవారిపైకి పరిశుద్ధాత్మ దిగి మరియు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడిరి.”
[సభయంతా ప్రార్థన కొనసాగించుచున్నారు—సంపా.]
63-0319 — రెండవ ముద్ర
Rev. William Marrion Branham