దేవుడు ఎవరు?

దేవుడు ఎవరు?

శుభ సాయంత్రము. రోగులు మరియు అవసరతలో ఉన్నవారికి ప్రార్ధించుట కొరకు మరియు, లేఖనము చదువుట కొరకు ఈ రాత్రి తిరిగి ఇక్కడ ఉండుట చాలా సంతోషమైయున్నది.

గత రాత్రి ప్రభువు ఇచ్చిన ఆ గొప్ప విజయమును వినుట ద్వారా నేను చాలా సంతోషించియున్నాను. కూడిక ముగించబడుటకు కొంచెం ముందు, ప్రభువు యొక్క ఆత్మ కుమ్మరించబడినట్లుగా కనిపించినది, ప్రజల పైకి దిగి వచ్చినది, మరియు ఆయన మహిమార్ధమై మహిమకరమైన సంగతులు జరిగియున్నవి. దానిని బట్టి నేను కృతజ్ఞుడను. మరియు ప్రతీరాత్రి అది అలాగే ఉండవచ్చును.

కొంతమంది మంచములపై ఉన్నారు, మరియు కొంతమంది అంబులెన్సులోని స్టెచర్‌లపై ఇక్కడ కూర్చొని ఉన్నారు ... అయినప్పటికీ, వారు దానిని నాకు చెప్పవలెను. నాకు నేనుగా కొన్ని సంగతులు మర్చిపోవుచున్నాను. కానీ విశ్వాస సహితమైన ప్రార్ధనను దేవుడు గౌరవించును. ఆయన యందు విశ్వాసముంచు ప్రజల యొక్క విశ్వాసమును ఆయన గౌరవించును. మీరు దానిని నమ్మెదరా? మన హృదయమంతటితో, నేను దానిని నమ్మెదను.

2

ఇప్పుడు, కూడికలు జరుగుచున్నవి, మరియు మనము ఒక మహిమకరమైన సమయమును కలిగియున్నామని మనకు మనముగా అనుభూతి చెందుచున్నాము.

ఈరోజు నేను సేవక సహోదరులతో మాట్లాడుచున్నాను. ఈ ఉదయకాలమున ఒక అల్పాహార విందు కొరకై మేము బయటకు వెళ్ళియున్నాము. వారు నన్ను బయటకు తీసుకొని వెళ్ళియున్నారు. మరియు వేర్వేరు సంఘములకు చెందిన మీలో చాలా మంది మంచి సేవకులను వ్యక్తిగతముగా పరిచయము చేసుకొనుటను బట్టి నేను చాలా సంతోషించియున్నాను. వారిలో కొంతమంది పెంతెకోస్తు సంఘము నుండి, మరియు కొంతమంది ఫోర్‌స్వ్వేర్‌, అని నేను నమ్ముచున్నాను, మరియు కొంతమంది దేవుని సంఘము, మరియు మిషనరీ ఫెలోషిప్‌ సంఘము; మరియు ఆ ప్రియ సహోదరులందరూ ఒక్కటిగా కలిసి. ఆ విధముగానే మనము ఆవిధముగా కలిసినప్పుడే దేవుడు మనతో కలిసి పనిచేయగలడు. సేవకులు తమ హృదయములను కలిపి ఉంచినప్పుడు, అప్పుడు వారు సంఘమును ఒక్కటిగా తీసుకొని వచ్చెదరు.

3

మీకు తెలుసా, నేను నమ్ముచున్నాను యేసు ప్రత్యక్షమైనప్పుడు, మనము ఫలానా శాఖా సంఘమునకు చెందినవారమా అని ఆయన అడగడు. ఆయన... మన హృదయములో మనము ఆయనను గూర్చి ఏమి చేసియున్నామనే దానిపైనే మనము తీర్పుతీర్చబడబోవుచున్నాము.

క్రైస్తవ్యమనగా ఎవరో ఫలానా సంఘమునకు చెందినవారని అర్ధము కాదు; అది ఎవరో దేవుని యొక్క రాజ్యములో జన్మించియున్నారని అర్ధము. చూశారా?

ఇప్పుడు, ఆ రక్తమును తృణీకరించు సంస్థల యొక్క శాఖా సంఘములు ఈ రోజు మనము కలిగియున్నామని నేను ఎరుగుదును. ఎందుకు, సహోదరుడా, సహోదరీ, ఒకవేళ క్రీస్తు యొక్క రక్తమును నీవు ఇక్కడ నుండి తీసివేసినట్లయితే, నీవు కేవలము ఏదో తత్వశాస్తము లేక మరేదో కలిగియుండెదవు. అది కేవలము రక్తము మాత్రమే పరిహరించునదైయున్నది. అది రక్తము మాత్రమే రక్షించునది. మరియు అది రక్తము మాత్రమే స్వస్థపరచునది. అది రక్తము మాత్రమే శుద్ధీకరించునది. అదియే దేవుని యొక్క నిజమైన సంగతి అయియున్నది, రక్తము.

4

మరియు ప్రజలు ఇంకా రక్తము నందు విశ్వాసము కలిగియున్నారని తెలుసుకొనుటను బట్టి నేను ఈ రాత్రి సంతోషించుచున్నాను (చూశారా?), క్రీస్తు యొక్క రక్తము. మరియు వారు ఈ రోజు కలిగియున్న ఈ సాంఘిక సువార్తను నేను నమ్మను, మరియు “అవును, రక్తము మరియు0 పరిశుద్ధాత్మ అనునటువంటివి లేవు”, అని చెప్పుచూ తిరుగుచున్న ఈ తెగలనన్నింటినీ నేను నమ్మను. నీవు కేవలము... నీవు దానిని చేసినప్పుడు నీవు ఒక క్రైస్తవుడవు కాదు. నీవు కైస్తవుడవుగా ఉండలేవు. నీవు తిరిగి జన్మించకుండా నీవు ఒక క్రైస్తవుడవుగా ఉండలేవు. అది నిజము. నీవు ఏమి చెప్పుకుని తిరుగుటకు ప్రయత్నించినా ఫరవాలేదు, నీవు కైస్తవుడవుగా ఉండవు. కానీ ఆయన చెప్పెను, “పరిశుద్ధాత్మ ద్వారా తప్ప, యేసే క్రీస్తని ఏ మనుష్యుడును చెప్పలేడు”. చూశారా? ఒకవేళ ఎవరో చెప్పినది నీవు తీసుకొనుచున్నట్లయితే, ఎవరో చెప్పినది పట్టుకొని నీవు వెళ్ళుచున్నావు. కానీ ఆయనే పరిశుద్ధాత్మ అని మరియు అది నిజమని నీకు సాక్ష్యమిచ్చి, మరియు పరిశుద్దాత్మ ఆయన ప్రసన్నతతో నిన్ను నింపు వరకూ దానిని నీవు ఎరుగవు. యేసుక్రీస్తే దేవుని కుమారుడని నమ్ము నీవు, దేవుని యొక్క ఆత్మలో జన్మించియున్నావని నేను ఎరుగుదును. కానీ అది నీకు సాక్ష్యమిచ్చేంత వరకూ నీవు ఎవరో చెప్పిన దానిని తీసుకొనుచూ ఉందువు. చూశారా?

5

నేను చెందియున్న సంఘమునకే చెందియున్న ఒక ప్రియమైన సహోదరుడిని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అతడు చెప్పెను, “బ్రాన్హాం సహోదరుడా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో, వారందరూ దేవుని ఆత్మ ద్వారా జన్మించి యున్నారని పరిశుద్ధగ్రంథము చెప్పుచున్నది.”

మరియు నేను చెప్పాను, “మరియు ఈలాగు కూడా వ్రాయబడియున్నది: పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసే క్రీస్తని ఏ మనుష్యుడును చెప్పలేడు.” చూశారా? అదంతా ... చూశారా?

అతడు చెప్పెను, “మంచిది, ఒకవేళ నీవు దానిని నమ్మిన యెడల...”

నేను చెప్పాను, “ఎవరో చెప్పిన దానిని నీవు తీసుకొనుచున్నావు. నీకు నీవుగా ఒక సాక్ష్యమును కలిగియుండవలెను (చూశారా?), నీవే ఎరిగియుండవలెను.” తల్లి ఏమి చెప్పుచున్నదో, తండ్రి ఏమి చెప్పుచున్నాడో, సేవకుడు ఏమి చెప్పుచున్నాడో నీవు చెప్పుచున్నావు. కానీ “నేను ఎవరని నీవు చెప్పుచున్నావు”, అని ఆయన పేతురుని అడిగినప్పుడు...

అతడు చెప్పెను, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు.”

సిమోనూ బర్‌-యోనా, నీవు ధన్యుడవు, ఏలయనగా రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రే నీకు బయలుపరచెను. మరియు ఈ బండపై నేను నా సంఘమును కట్టుదును మరియు పాతాళ లోకపు ద్వారములు దానిని జయించలేవు“, అని ఆయన చెప్పెను. బండను గట్టిగా పట్టుకొనుము. సరైన దానినే చేయుము. దేవుడు నిన్ను దీవించును.

6

ఇప్పుడు, లూకా 7వ అధ్యాయములో, మొదటి పది వచనములూ చదువవలెనని నేను ఆశించుచున్నాను. ఎల్లప్పుడూ చదువుటకు ప్రయత్నించెదను, ఎందుకనగా దేవుడు తన వాక్యమును గౌరవించునని నేను ఎరుగుదును.

ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.

ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావసిద్ధమైయుండెను.

శతాధిపతి యేసును గూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.

వారు యేసునొద్దకు వచ్చి - నీవలన ఈ మేలు పొందుకొనుటకు అతడు యోగ్యుడు;

అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి.

కావున యేసు వారితో కూడ వెళ్ళెను. ఆయన అ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి - మీరాయన యొద్దకు వెళ్ళి - ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.

నేను సహ అధికారమునకు లోబడినవాడను; నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.

యేసు ఈ మాటలు విని, అతని గూర్చి అశ్చర్యపడి, తన వెంట వచ్చుచున్న జన సమూహమువైపు తిరిగి -ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను.

పంపబడినవారు ఇంటికి తిరిగి వచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి.

7

ఒక్క క్షణము ప్రార్థించెదము. మా పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మరలా మేము వచ్చియున్నాము, మరియు ...? ... బహు దీర్థమైన కూడికల యొక్క వరుసలో, ఇప్పుడు రెండవ వారములోనికి వెళ్ళుచున్నాము. ఈ రాత్రి ఇక్కడ ఉంచబడియున్న అనేక మంచములు ఖాళీయై మరియు వారు వెళ్ళిపోవుటను బట్టి మేము కృతజ్ఞులము. బంధకములలో ఉంచబడిన అనేకమంది, ఈ రోజు ఆరోగ్యముగా ఉన్నవారితో కలిపి కదులుచూ ఉన్నారు. రోగగ్రస్తులైనవారు, బాధలు పడుచున్నవారు, మరణమునకు దగ్గరైన వారు అనేక మంది; ఇప్పుడు స్వస్థత పొందుకొనియున్నారు. మరియు ఈ సంగతులను బట్టి, ప్రభువా, మేము కృతజ్ఞులము. పాపులైన అనేకమంది, పాపము యొక్క సంకెళ్ళతో బంధించబడినవారు, వందలాది మంది మార్చుచెంది, దేవుడు ఎవరు అనేగ్రహింపులోనికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహవాసములోనికి తీసుకొని రాబడ్దారు. ఇప్పుడు, దానిని బట్టి మేము మిమ్ములను ప్రేమించుచున్నాము.

మరియు ఇప్పుడు, ప్రభువా, ఈ రాత్రి ఎనిమిదవ రాత్రి ప్రారంభమగుచున్నది. మరియు ప్రభువా, ఈ రాత్రి నేను నిన్నుఅడుగుచున్నాను, ఈ రాత్రి వాక్యము చుట్టూ సహవాసము కలిగి ఉండే ఒక నిజమైన సమయమైయుండును, దేవుని యొక్క ఆత్మ చుట్టూ సహవాసము, నన్ను వినుచున్న వారందరికీ, ఈ రాత్రి ఒక గొప్ప సంగతి వచ్చుచుండగా, స్వస్థత పొందుట కొరకు విశ్వాసము పొందుకొనెదరు గాక. నీయొక్క ప్రసన్నతను బట్టి, ఇది బహుకాలము గుర్తించుకొనదగిన ఒక మహిమకరమైన కూడికగా ఉండును గాక.

8

ప్రభువా, అనుగ్రహింపుము, ఈ రాత్రి ఏదో చెప్పబడును, లేక చేయబడును, అది క్రీస్తు వైపునకు తిరుగుటకు కారణమగును. ఏలయనగా మనము నమ్ముచున్నాము, మరియు ఆత్మలో తొందర పెట్టబడుచున్నాము, చివరి దినములలో ఆ గొప్పతీర్పులు ఈ భూభాగముపై ఉండబోవుచున్నవి. తెగుళ్ళు, సూక్ష్మ క్రిమి వ్యాధులు ఇప్పటికే దేశములన్నిటి యందు వ్యాప్తి చెందియున్నవి. దానిని ఏ విధముగా నియంత్రించవలెనో కనీసము ఏ వైద్యునికి కూడా తెలియదు. ఓ దేవా, అప్పుడు మేము దైవిక స్వస్థత యందే నమ్మికయుంచవలెను. దేశములన్నియూ కలిపి సూక్ష్మక్రిములను పెంపకం (ఉత్పత్తి) చేయుచుండగా, వాటిని బాంబులతో పేల్చివేయుటకు, మరియు ఆ ప్రేలుడులో గంటలలో కొన్ని లక్షల మంది చనిపోవుదురు.

కానీ ఓహ్‌, మరణదూత బయలు వెళ్ళునప్పుడు, నీవు చెప్పావు, “వారి నుదుటి పైన తండ్రి యొక్క ముద్ర కలిగిన వారెవరినీ తాకవద్దు. వారు నావారు, దానిని బట్టి మేము చాలా కృతజ్ఞులము. ఓహ్‌, సురక్షితముగా భద్రము చేయబడి, రక్తము క్రింద ఉన్నందులకు, ఈ రాత్రి మేము చాలా సంతోషించుచున్నాము; గతించిన దినములలో ఇశ్రాయేలు ప్రజలు, రక్తమును ద్వారబంధపు పై కమ్మెకు, మరియు ద్వారబంధమునకు, సిలువకు గుర్తుగా రాసుకొనియున్నారు. మరణపు దూత దేశమును తుడిచిపెట్టుచుండగా, చీకటి రెక్కలు క్రిందకు వంచబడినప్పుడు, అతడు రక్తమును చూడగానే, అది తిరిగి పైకి లేచెను, మరియు ”నేను నిన్ను దాటిపోయెదను“.

9

ఎదురుచూస్తూ ... బలి అర్పణగానున్న గొర్రెపిల్ల చంపబడెను. మనము రక్తము క్రింద ఆయన శరీరమును తీసుకొనుచున్నాము, భద్రముగా, మరియు ఓ దేవా, అర్ధరాత్రి ఘడియ కొరకు ఎదురుచూస్తూ, “కవాతు” బయటకు పిలువబడినప్పుడు ... ఈ రాత్రులలో ఒకరాత్రి మేము వాగ్ధాన దేశములోనికి వెళ్ళుచున్నాము, కవచమును ధరించుకొని, శాంతి యొక్క సువార్తతో సిద్ధపడి, సువార్త యొక్క సర్వాంగ కవచముతో, ముందుకు సాగుచూ వెళ్ళెదము. ప్రియమైన దేవా, మాకు సహాయము చేయుము, ఈ రాత్రి కవచమును బిగుతుగా పెట్టుకుని, గుమ్మము మరియు ద్వారబంధపు పైకమ్మెను రక్తము ఉన్నదా అని చూచి పరీక్షించుచూ, పిదప ప్రతీ శత్రువును సవాలు చేయుటకు ముందుకు సాగెదము. మన యొక్క గొప్ప సైన్యాధిపతిని ఎరిగియుండి, నదిని దాటిన వెంటనే యెహోషువాను కలిసిన ఆ ఒక్కడు, నేను సైన్యములకు అధిపతియైన యెహోవాను...“ అని చెప్పెను, ఓ దేవా, యెహోషువా వణికెను. నీవే నడిపించుచున్నావని అతడు ఎరిగియుండెను.

మరియు ఆ వేకువ చుక్కమన పైననే ఉన్నదని, ఈ రాత్రి మనము ఎరిగియున్నాము. పతాకములు (జెండాలు) ఎగురుచున్నవి, రంగులు వెదజల్లబడుచున్నవి. మనలను ఓడిపోనివ్వని ఆయనయందు ఒకవేళ మనము నమ్మకము ఉంచగలిగితే మనము విజయము సాధించబద్దులమైయున్నాము.

ప్రభువా, ఈ రాత్రి దానిని అనుగ్రహించుము, చాలా కార్యములు జరుగును గాక. నీ ఆత్మను పంపుము. జనులకు విశ్వాసము నిమ్ము ... తండ్రీ, కొన్నిసార్లు అది వారిని కంపింపజేయును. ఆ సన్నిధిని వారు గుర్తించలేరు, ఈ గొప్ప సంగతి, పాత నిబంధన యొక్క యెహోవా, కొత్త నిబంధన యొక్క యేసు, ఈ దినము యొక్క పరిశుద్ధాత్మ ఆయన ఆయన చేసిన ఏవాగ్ధానము నైననూ మంచిగా చేయుట కొరకు ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్నాడు. ప్రభువా మమ్ములను దీవించుము.

పిదప నీ వరములను పంపించుము, అవి వీటన్నిటికీ తరువాత అయ్యియున్నవి, జనులను తీసుకొని వచ్చి సంఘమును సరిచేయుటకు అది క్రియ చేయును, నీ యొక్క ప్రసన్నతను గుర్తెరుగులాగున అది మమ్ములను తీసుకొని వచ్చును. నీ కుమారుడైన, యేసు యొక్క నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్‌.

10

రాత్రులు పెరుగును (ఎక్కువగును). అవును, నేను అలసి, మరియు మరి ఎక్కువగా అలసిపోవుదును. నేను నమ్ముచున్నాను అనునది ఒక సత్యము, ఒక శరీరసంబంధియైన వ్యక్తి కన్నీరు కార్చుచుండగా, ఆత్మ సంబంధియైన వానికి ఒక అవకాశము వచ్చును. దాని కోసరమే ఉపవాసము మరియు ఆ సంగతులన్నీ ఆయన యందు విశ్వాసముంచుటకు మరియు మనలను నమ్ములాగున చేయుట కొరకు, మనకు సంబంధించిన ఈ అయిదు ఇంద్రియములపై కార్యము చేయుటకు ఆయనకు ఒక అవకాశము వచ్చును.

ఈ రాత్రి ఈ శతాధిపతి యొక్క వైఖరిని నేను ఇష్టపడుచున్నాను, ఇప్పుడే దానిని మనము చదివియున్నాము. అతడు తనను తాను అయోగ్యముగా ఎంచుకొనుచున్న వ్యక్తి. ఎంతకాలమైతే నీవు అడుగుచున్న ఆశీర్వాదమునకు నీవు యోగ్యుడవు కాదు అని నీవు అనుభూతి చెందెదవో, ఖచ్చితముగా దానిని పొందుటకు నీవు అర్హుడవు. కానీ నీవు దేవుడే దానిని మనకు రుణపడియున్నాడు అని నీవు తలంచే స్థలమునకు నీవు వచ్చెదవో, అక్కడే నీవు తప్పిదము చేసియున్నావు. మనమే దేవునికి ఋణస్థులము, దేవుడు మనకు ఋణస్టుడు కాదు. మనమే దేవునికి అప్పుపడి యున్నాము.

11

మరియు ఈ రోమీయుడు, ఇటలీవాడు, అతడు ఏమైనప్పటికీ, అతడు చెప్పాడు, “ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, మరియు నిన్ను ముఖాముఖిగా ఎదుర్కొనుటకు కూడా నేను యోగ్యుడను కానని తలంచుచున్నాను.” మరొక మాటలో, “నిన్ను కలుసుకొనుటకు నేను నీ సంఘమును పంపియున్నాను మరియు ఈ ప్రశ్న అడుగుటకు. కానీ నాకు విశ్వాసమున్నది. నీవు ఒక అధికారము క్రింద(కలిగి) ఉన్న మనుష్యునివని నేను ఎరుగుదును, ఏలయనగా నేను కూడా అధికారము క్రింద ఉన్నవాడను. మరియు నా సేవకుని పై నీ చేతులుంచుటకు నీవు నా ఇంటివరకూ రానవసరములేదు. ఇక్కడ వరకూ వచ్చి మరియు ఏ ప్రార్ధనా చేయనవసరము లేదు.”

గమనించుడి. ఇప్పుడు, దీనిని పట్టుకొనుటకు నిశ్చయతను కలిగియుండుము. అతడు చెప్పెను, “నేను కూడా అధికారము క్రింద ఉన్న వ్యక్తిని. మరియు ఒకవేళ నేను ఈ వ్యక్తికి, ”వెళ్ళి దీనిని చేయుము,“ అని చెబితే అతడు చేయకుండునా. మరియు ఒకవేళ ఈవ్యక్తికి ”నీవు ఇక్కడకు రమ్ము“ అని చెప్పిన ఎడల, అతడు వచ్చును. నేను అధికారము కలిగినవాడను. మరియు ఎవరైతే నా అధికారము క్రింద ఉన్నారో వారు నాకు లోబడవలసియున్నారు.”

మరియు ఆయన దేవుని కుమారుడని అతడు ఎరిగియున్నాడు, మరియు ప్రతీ వ్యాధి మరియు ప్రతీ దయ్యము ఆయన క్రింద ఉన్నది. మరియు ఆయన చేయవలసినదంతా కేవలము మాట మాత్రమే పలకవలయును, ప్రార్థించనవసరము లేదు, కేవలము మాట మాత్రము పలకవలయును (అంతే), మరియు అది జరగును, ఎందుకనగా ప్రతీ దయ్యము ఆయనకు లోబడవలయును. ఈ రాత్రి నీవు దానిని నమ్మెదవా? ప్రతీ దయ్యము దేవునికి లోబడును. అది లోబడవలయును. ప్రతీది దేవునికి లోబడును మరియు ఒకవేళ విశ్వాసము కలిగి ఉంటే అది నీకు కూడా లోబడును.

12

యెహోషువా సూర్యుడిని ఆపెను. అది నిజమేనా? ఎవరో చెప్పిరి, “దేవునికి సమస్తమునూ సాధ్యమే, ఏదియూ అసాధ్యము కాదు.” కానీ నీకు కూడా సమస్తమునూ సాధ్యమే. నమ్మువారికి ఏదియూ అసాధ్యము కాదు. సమస్తమునూ సాధ్యమే. ఒకవేళ దేవుడు ఎవరో నీవు ఎరిగియుంటే, తిన్నగా అక్కడకు తీసుకుని వచ్చి మరియు నిన్నుచేసియున్నాడు (సృజించియున్నాడు).

అవును, సంఘము వారి యొక్క అధికారమును ఎరిగియుండలేదు అని నేను భయపడుదును. దేవుడు తన సంఘమునకు అనుగ్రహించిన అధికారమును - లేక వారి అధికారమును పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వ్యక్తులు గ్రహించుట లేదు అని నేను భయపడుచున్నాను. రాజ్యము యొక్క తాళపు చెవులు నేను నీకు ఇచ్చెదను. భూమి మీద నీవు దేనిని బంధింతువో అది పరలోకములో కూడా బంధింపబడును, నీవు దేనిని విప్పెదవో అది విప్పబడును. సర్పములపై నేను నీకు అధికారమిచ్చియున్నాను, మరియు అన్నిరకముల వ్యాధులపై, ఓహ్‌, ప్రతీదియూ, మరియు ఏదియూ నిన్ను హానిపరచదు“. నీ విశ్వాసమును ఆచరణలో పెట్టుము. దానిని విడుదలచేయుము. దేవుడు తన యొక్క మార్గమును కలిగి ఉండనిమ్ము. దేవుడు దానిని నీకు అనుగ్రహించును గాక.

13

ఇప్పుడు, కొంచెము, దేవుడు ఎవరో చూచెదము. ఈ రాత్రి దేనిని గూర్చోనేను అనుభూతి చెందుచున్నాను. నేను దేవున్ని ఏదో అడిగియున్నాను. మరియు దానిని ఆయన నాకు అనుగ్రహింపబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను. నా హృదయమంతటితో దానిని నేను నమ్మెదను. ఇప్పుడు, మీరు ప్రార్ధనలో ఉండుడి. ఆయన మాట్లాడేంత వరకూ నేను మాట్లాడలేను.

అయితే దానిని తీసుకొని ఒక్క క్షణం దేవుడు ఎవరు అనే దానిని మనము కనుగొనెదము. కాలము యొక్క ప్రారంభమునకు మనము వెనుదిరిగి చూచెదము. ఈ రాత్రి మనమధ్యన ఉన్న ఈ జీవి (లేక ఈయన) ఎవరు అనే దానిపై మీరు ఒక భావనను కలిగియుండుటకు ఇక్కడ ఇక చిన్న చిత్రమును నేను గీయగోరుచున్నాను, ఆయన మన మధ్యన కదలాడుచున్నాడు. ఒకవేళ అది ఎవరు అని నీవు గనుక గ్రహించగలిగిన యెడల, స్వస్థత అనునది ఒక అల్పమైనది గానూ లేక ద్వితీయమైనది (ప్రథమము కానిది) గాను ఉండును. ఒకవేళ ఆయన ఎవరో నీవు చూడగలిగిన యెడల.

14

ఇప్పుడు, కొన్ని వందల సంవత్సరముల క్రితమును మనము తీసుకొనెదము, మరియు దానికి కొన్ని వందల సంవత్సరములకు ముందు మనము తీసుకొనెదము. మరియు ఆ విధముగా వెళ్ళుచుందుము.

ఎంతోకాలము క్రితము కాదు, నేను ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్నాను. అక్కడ ఒక ఖగోళశాల ఉన్నది. అక్కడ వారు ఒక అద్దమును కలిగియున్నారు. మరియు వారు నూట ఇరవై కాంతి సంవత్సరముల వెనుకకు వారు చూడగలరు, అప్పుడు నేను. ...? కాంతి ప్రయాణించు వేగము మరియు ఇంకనూ దానికి పైగా ఇంకా ఉనికి లేక ప్రదేశము ఉన్నది. అక్కడే ఈ రాత్రి మనము వ్రేలాడుచున్నాము.

కానీ అస్సలు అక్కడ ఏమియూ లేనప్పటి సంగతిని మనము ఆలోచించెదము, అక్కడ దేవుడు ఉన్నాడు. ఆది యందు ఆయన ఉండెను. మరియు అక్కడ ఆ శూన్య ప్రదేశములో మనము ఆయనను చూచెదము, మరియు ఆయనను గ్రహించెదము. ఆ యెహోవాను గూర్చియే మనము మాట్లాడుచున్నాము. మరియు దేవుని యొక్క త్రిత్వము ఏ విధముగా మానవుని యొద్దకు వచ్చినదో ఒక్క క్షణము మనము గమనించెదము.

15

మరియు అక్కడ, ఆ గొప్ప విశాలము, దానికి పైగా ఎవ్వరి మనస్సులో కూడా దానిని శోధించలేము, ఆ విశాలము, నిత్యత్వము. అక్కడే యెహోవా దేవుడు ఉన్నాడు. మరియు ఆ లోస్‌, లేక ఆ దేవుని కుమారుడు దేవునిలో నుండి బయలు వెళ్ళాడని, ప్రారంభములో మనకు బోధించబడినది.

ఇప్పుడు, నిత్య కుమారత్వము యందు నాకు నమ్మిక లేదు. కనీసం ప్రస్తావించుటకైననూ అది ఒక విపరీతార్ధమైన సంగతైయున్నది, నిత్య కుమారత్వము. ఏ విధముగా... ఆయన ఒక నిత్య కుమారత్వమును కలిగియున్నాడు...?... అలాగే, మరియు అది నిత్య కుమారత్వము, ఆయన ఏలాగు కుమారుడవ్వగలడు? ఆయన ఒక ప్రారంభమును కలిగియుండవలెను. చూశారా?

16

కాబట్టి ఆయన మొదటిగా యెహోవా దేవుడు. మరియు ఆయనలో నుండి... కనుక దానిని మీరు అర్ధము చేసుకొనుటకు ఒక చిన్ననాటకముగా దానిని చిత్రీకరించెదము. అక్కడ ఏమీ లేని ఒక శూన్యములో నుండి వచ్చుటను మనము చూచెదము, ఒక చిన్న తెల్లని వెలుగు , ఒక మర్మమైన (గూఢమైన)వెలుగు లాంటిది, దానిని ఒక చిన్న తెల్లని వెలుగువలె చేయుదుము మరియు ప్రారంభములో దేవునిలో నుండి బయలు వెళ్ళిన లోగాస్‌ అదియే. తండ్రీ యొక్క ఒడిలో నుండి బయటకు వచ్చిన దేవుని యొక్క కుమారుడు అదే అదియే “ఆది యందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై యుండెను. మరియు ఆ వాక్యమే శరీరధారియై మన మధ్యన నివసించెను.” ఆదియందు దేవుడు ఉండెను. మరియు దేవునిలో నుండి లోగోస్‌ బయటకు వచ్చెను, దేవుని యొక్క భాగము దేవునిలో నుండి బయటకు వెళ్ళెను.

దీనిని గమనించెదము. ఇప్పుడు, ఒక్క అంశమును మీ ముందుకు తెచ్చుటకు, దానిలోనికి వెళ్ళుటకు ముందుగా, మీ కొరకు ఒక చిన్న నాటకీయచిత్రము వలె ఒక్క క్షణము, దీనిని నేను చేయవలయును, ఎవరు... ఈ రాత్రి మన మధ్యలో ఏమున్నది.

17

మరియు అక్కడ... ఇప్పుడు, చూడండి, ఇది ఒక చిన్న పిల్లవాడు గుమ్మము ముందు ఆడుకొనునట్లుగా ఉన్నది. అదియే దేవుని కుమారుడైన, లోగాస్‌. మరియు అక్కడ నేను ఆయనను చూడగలుగుచున్నాను, మరియు ఆయన పలికెను, మరియు చెప్పెను, “వెలుగు కలుగును గాక.” మరియు అక్కడ ఏమి లేదు (కలుగలేదు). కానీ అక్కడ ఏదో జరిగినది, మరియు ఒక అణువు అక్కడ తిరుగుచూ మరియు ఈ మార్గములో గిర్రున తిరుగుచూ పోయెను. సూర్యుడు ఉనికిలోనికి వచ్చుటకు ప్రారంభించెను, ఎందుకనగా ఆయన చెప్పెను, “వెలుగు కలుగును గాక.” అక్కడ అధికారమున్నది.

ఆయన ఎక్కడ నుండి దానిని చేసెను? నాకు తెలియదు. ఏదో దానిలోనుండి చేయుటకు అక్కడ ఏమియూ లేదు. కానీ ఆయన తన సొంత మాటయందు నమ్మకముంచెను, మరియు అక్కడ వెలుగు కలిగెను. దానిలో నుండి ఒక చిన్న ముక్క ఎగిరి వెళ్ళుటను నేను చూచియున్నాను; అది ఒక ఉల్క కొన్ని లక్షల సంవత్సరముల తరువాత, లేక కొన్ని కోట్ల సంవత్సరములు, ఒకవేళ దానిని మీరు పిలువవలెననిన, ఆ విధముగా గిర్రున తిరుగుచూ వెళ్ళెను. దానిని గమనించుచూ ఆయన అక్కడ నిలబడి యుండుటను నేను చూచియున్నాను. మరియు అది ఇక్కడ పడినది. కొన్ని కోట్ల సంవత్సరముల తరువాత దానిని ఆయన ఆపెను, మరియు ఒక కక్ష్యలో దానిని వ్రేలాడనిచ్చెను. సూర్యునిలో నుండి ఇక్కడ మరియొకటి ఎగురుచూ వెళ్ళెను. అది ఇక్కడ నుండి వెళ్ళి మరియు వ్రేలాడబడెను, అక్కడే నిలపబడెను.

18

ఆయన ఏమి చేయుచుండెను? తన మొదటి బైబిలును వ్రాయుచుండెను. గమనించుడి, మానవులు ఒకప్పుడు ఆకాశము వైపు చూచుచుండిరి. మరియు ఆయన అన్ని నక్షత్రములను ఆకాశములో పెట్టెను, రాశి చక్రము, కన్యకతో ప్రారంభమై, సింహమైన సింహరాశితో ముగింపబడెను. క్రీస్తుయొక్కమొదటి రాకడ, రెండవ రాకడ. కన్యక నుండి వచ్చెను, యూదా గోత్రపు సింహముగా మళ్ళీ తిరిగి వచ్చెను. అక్కడే ఆయన తన మొదటి బైబిలును పెట్టెను.

ఓహ్‌, ప్రాచీన కాలపు ఆ పాతదినములలో, వారు ఆ సంగతులను చూచిరి. ఈరోజు, ఆయన తన బైబీలును ఇక్కడ వ్రాసి (పుస్తక రూపము) ఉంచెను. కానీ మానవుడు పైకి చూచి మరియు సృష్టికర్తయైన యెహోవాపైన నివసించెనని గ్రహించుటకు, ఆయన ఆకాశములో దానిని వ్రాసెను మరియు పిదప నేను ఆయనను చూడగలను, ఆయన ... దానిని చూచెను.

ఎక్కడో దూరముగా, ఒక వ్రేలాడుచున్న ఐసుముక్క లేక మరేదో దాని వలె ఉన్న ఈ ప్రపంచముతో ఆయన మాట్లాడుచుండుటను నేను చూచుచున్నాను. మరియు ఆయన దానిని ఇక్కడకు కదిల్చెను (మార్చెను). ఈ చిన్న వెలుగు బయటకు వెళ్ళుటను నేను చూడగలుగుచున్నాను. ఇప్పుడు, మనము ఇద్దరిని కలిగియున్నాము. తండ్రీ, మరియు తండ్రి నుండి బయటకు వచ్చిన ఆ వెలుగు, కుమారుడు. మరియు ఆ వెలుగు ఇక్కడ కదులుచూ మరియు దానిని ఎండిపోజేయుటకు భూమిని సూర్యుని దగ్గరకు లాగెను. మరియు ఆయన... చేయుటకు ప్రారంభించెను...?... నీటిని వేరు చేసి, భూమిని ఎండిపోజేసి, నీటి నుండి భూమిని వేరుపరిచెను, మరియు ఆ విధముగా.

అప్పుడు ఆయన సృష్టించుటను ప్రారంభించెను. మరియు ఆయన సముద్రములోని జలరాశులను, వృక్షజాతిని చేసెను. కొండపైన పశువులను ఉంచెను. అదంతయూ మంచిగా ఉన్నదని ఆయన చూచెను.

పిదప ఆయన చెప్పెను, “మన స్వరూపమందు, మన పోలికె చొప్పున నరులను చేయుదము”. అది నిజమేనా? అది సరే. కనుక ఆయన నరుడిని చేసెను. దేవుడు ఆత్మయై యున్నాడు; ఆయన స్వరూపములో చేయబడిన ఒక ఆత్మ స్వరూపము వలె అతడు (మానవుడు) ఉండవలసి యుండెను. పరిశుద్ధాత్మ ఈ రోజు సంఘమును నడిపించుచున్నట్లుగా, పశుజాతిని మరియు మిగిలిన వాటిని ఇక్కడ ఈ భూమిపై నడిపించుటకు మానవుడిని ఆయన ఇక్కడ పెట్టెను. అదియే మానవుడు.

19

పిదప ఆయన అతడినిపెట్టినప్పుడు ...భూమిని సేద్యపరచుటకు ఏ నరుడును లేడు, మరియు అతడిని ఆయన అయిదు ఇంద్రియములలో పెట్టియున్నాడు. అక్కడే శాస్త్రవేత్తలు...?... వారు భీతి చెందుచున్నారు, గందరగోళమగుచున్నారు. ఆయన అతడికి కోతీకున్నటువంటి ఒక చేతిని మరియు ఎలుగుబంటికి ఉన్నటువంటి ఒక పాదమును, ఆయన కోరుకున్న విధముగా దేనినైననూ ఇచ్చి యుండవచ్చును, కానీ ఆయన తన ఆత్మను అతడిలో ఉంచెను, మరియు అతడిని ప్రాణిగా (జీవించుచున్నఆత్మ కలిగినవానిగా) చేసెను. అక్కడే వైవిధ్యమున్నది. మనము ఏ పశుజాతి నుండి వచ్చుట లేదు, లేదయ్యా. పశుజాతికి చెందిన ఇంద్రియాలను మనము కలిగిలేము. దేవుడే మనలను చేసెను. అది నిజము.

పిదప ఏవిధముగానైననూ, గమనించండి. తరువాత అతడు ఈభూమిపై ఉండెను, మరియు ఆయన అతడికి ఒకసాటియైన సహచరిని ఇచ్చెను, మరియు అవన్నీ, చెప్పాలంటే, అతడు తన తండ్రి యొక్క దీవెనకరమైన సహవాసమును కలిగియుండెను.

20

మరియు తరువాత, మనము ఈ రెండవ మానవుణ్ణి చేయబోవుచున్నాము ... ఆ మొదటి వ్యక్తి, నీవు అతడిని చూడలేవు. దేవుడు... రెండవ వ్యక్తి ఒక చుట్టూ మహిమగల వ్యక్తి మరియు ఇప్పుడు ఆయన ఒక మూడవ వ్యక్తిని తీసుకొని మరియు ఒక చిన్న తెల్లని మేఘము వలె అతడిని చేసి యున్నాడు, వచ్చుచున్నాడు, మనము అతడిని చూడగలము; పరిశుద్దాత్మ క్రిందకు వచ్చుచున్నది. మరియు అతడే సంపూర్ణ నరుడు. అదియే నరుని (ప్రాణి) యొక్క జీవాత్మ, అప్పుడు మాత్రమే అతడు నిత్యుడు.

మరియు దీని తరువాత మానవుడు పాపము చేసెను, అతడు ఆ ప్రాణమును (జీవాత్మను) పాడు చేసెను. చీకటి, అంధకారము దానిలోనికి వచ్చెను. మరియు పిదప దేవుడు క్రిందకు వచ్చి మరియు మానవునిలో నివసించెను, మానవునితో శ్రమపడెను, మానవున్ని విమోచించుటకు; మరియు ఆ పరిశుద్దాత్మ మానవునిలోనికి వచ్చి మరియు అతనిలో నుండి ఆ చీకటిని మరియు పాపమును పారద్రోలెను, మరియు వానిని పరిపూర్ణమైన సహవాసములోనికి తిరిగి తీసుకొని వచ్చెను, దేవునిలో భాగముగా మరియు ఇప్పుడు, మనము, పాపము నుండి మనలను శుద్ధీకరించుచున్న, క్రీస్తు యొక్క రక్తము ద్వారా, మనము దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలముగా అగుచున్నాము.

దేవుడు ఎవరు? ఒక్కడు అక్కడ నిలబడి మరియు తన చేతులలో నుండి నక్షత్రాలను దొర్లించి, మరియు తన హస్తములలో నుండి ప్రపంచములను దొర్లించి, మరియు మనకు కనబడునటువంటి సంగతులను చేసినవాడు: దైవత్వము మరియు దైవత్వము తనకు తానుగా మానవునిలో నివసించెను. భూమి మరియు ఆకాశములను సృజించిన, ఆ సృష్టికర్త, మానవాళిలో నివసించుచుండెను.

21

ఎందుకు, ఆశ్చర్యము లేదు, అవిటితనములు (అంగవైకల్యములు, అవి సరైపోవునని మీరుగ్రహించగలిగినచో; సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. ఆశ్చర్యము లేదు గ్రుడ్డితనము మరియు చూడలేనివారి యొక్క కన్నులు తెరువబడును, సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు, సృష్టికర్త. మనమెవరిమో ... గ్రహించుము.

“మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నాము”, అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయన బిడ్డలము. ఇప్పుడు, అయితే మనము దేవునివంటివారమై యున్నాము. యేసు స్వయముగా చెప్పెను, “మీరు దైవములు అని మీ ధర్మశాస్తములోనే వ్రాయబడియున్నది.” యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కుమారునిగా దత్తత చేయబడి, మనము దేవుని యొక్క భాగమగుచున్నాము.

కాబట్టి, ఒకవేళ ఈ ధూళిని మరియు ఈమట్టిని (భూమిని), మరియు ఇక్కడ ఉన్న ప్రతీ దానిని చేసిన ఆ దేవుడే, మానవులలో నివసించుచున్నాడనే దానిని మనము గ్రహించగలిగినచో, స్నేహితులారా, ఇక మన విశ్వాసము ఎక్కడున్నది?

మరియు ఆయన చెప్పెను, “నేను చేయు ఈ సంగతులు,” ఆయన ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు, “మీరింకనూ గొప్పవాటిని చేతురు, ఏలయనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. మీరు కోరిన వాటినెల్లనూ, మీరు. ప్రార్ధించినప్పుడు, మీరు వాటిని పొందుకొనియున్నారని నమ్ముడి; అప్పుడు మీరు వాటిని పొందెదరు”. అది సృష్టికర్త మాటైయున్నది. అది నిజమేనా? అయితే అది ఆయనలో ఉండుటలేదు; అది మనలోనే ఉన్నది.

అప్పుడు మనము, సహవాసములో, పడిపోయినప్పుడు ఆదాము కోల్పోయిన దానిని, క్రీస్తు తన మరణములో దానిని పునరుద్ధరించెను. (దానిని మీరు నమ్మెదరా?) మానవున్ని తిరిగి దేవుని యొక్క సహవాసములోనికి తిరిగి తీసుకొని వచ్చుట.

ఇప్పుడు, సంఘము దేవునితో ఆ సహవాసమునకు పైకి కదిలినది, ఒకే రకమైన విశ్వాసుల యొక్క సహవాసము, ఆదాము ప్రారంభములో ఏదేను తోటలో కలిగి యున్నది. పాపమంతటినీ తీసివేసినది, నేరారోపణ నుండి విముక్తి చేసినది, పాపమంతటి నుండి పరిశుద్ధాత్మే మనలను శుద్ధీకరించుచున్నది. ఇప్పుడు, దేవునిలో తరువాత అడుగును వేయుటకు మీరు స్వతంత్రులైయున్నారు. చూశారా?

22

ఒకవేళ మీరు చనిపోవుచున్నట్లయితే, నేను వారి పక్షమున నిలబడియున్నాను. వారు రక్షింపబడియున్నారని తలంచుచుండుటను నేను చూచియున్నాను, మరియు వారు చనిపోవుచున్నప్పుడు నేను వారిని పట్టుకొనియున్నాను. తాము రక్షింపబడియున్నామని నిజముగా ఎరిగియున్న వారిని నేను చూచియున్నాను, మరియు విజయమును గూర్చి కేకలు వేయుచూ బయలువెళ్ళిరి. అది నిజము. అది (విజయము) వచ్చుచున్నప్పుడు అన్ని దశలలోను నేను వారిని గమనించాను. మీరు ఇక్కడ నుండి విడిచి వెళ్ళుటకు ముందు మీరు దేవునితో సరిచేసుకొనియున్నారనే నిశ్చయతను కలిగియుండుడి. ఎవరో చెప్పిన దానిని తీసుకొనవద్దు; దేవుని కొరకు మీరు సరిగా ఉన్నారని మీకు మీరుగా నిశ్చయతను కలిగియుండుము.

ఇప్పుడు, దైవత్వము ఇక్కడ మనతో ఉన్నది, దైవత్వము మనలో ఉన్నది. “కొద్ది కాలమైన తరువాత మరియు ఈ లోకము ఇక నన్ను చూడదు.” లేఖనము అదియేనా? “అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా యుగసమాప్తి వరకూ నేను మీతో ఉందును, ఇంకా మీలో ఉందును.” పిదప ఇక ఈ ప్రపంచము తీసివేయబడేంత వరకూ క్రీస్తు తన సంఘములో ఉండును. తరువాత ఒకవేళ క్రీస్తు తన సంఘములో ఎక్కడ పనిచేయుచున్నాడో మనము కనుగొనినయెడల, అదే సంఘములో నేను ఉండగోరుచున్నాను.

23

ఇప్పుడు, నేటి విశ్వాసి. చాలా మంది జనులు, వారు చెప్పెదరు అతడు చాలా మంచివాడు, అతడు సంఘమునకు దశమభాగములను చెల్లించును; అతడు ఒక మంచి సభ్యుడు. అది చాలా మంచిది. అది ఒక మాదిరి జీవితం. ఇప్పుడు, దానిని గూర్చి ఎవరూ చెడు మాట్లాడలేరు. కానీ నేను దానిని గూర్చి మాట్లాడుట లేదు. యేసు విశ్వాసిగా ఉన్న ఒక వ్యక్తిని, ఒక విభిన్న వ్యక్తిత్వము గలిగిన వ్యక్తికి తీర్పు తీర్చెను.

యేసు, ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు ఆయన చెప్పిన చివరి మాటలు, “సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అది నిజమేనా? “నమ్మి, బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును.” అది నిజమేనా?

ఇప్పుడు, ప్రతీ సంఘమూ అంత దూరము వచ్చును, కానీ మిగిలిన దానియొక్క సంగతి ఏమిటి? ఆయన చెప్పెను, “నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును.” మీరు దానిని నమ్మెదరా? “నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును: నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్తభాషలు మాటలాదుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, లేక విషపూరితమైనవి త్రాగిననూ వారికి హాని కలుగదు; ఒకవేళ వారు రోగుల మీద తమ చేతిలుంచినప్పుడు వారు బాగుపడెదరు” మరియు ఆయన వారి మధ్య నుండి తీసివేయబడెను, మరియు శిష్యులు గొప్ప ఆనందముతో తిరిగి వచ్చెను, మరియు ప్రతీ చోటా వాక్యమును ప్రకటించెను, ప్రభువు వారితో పనిచేయుచుండెను, సూచకక్రియలు మరియు అద్భుతకార్యములతో వాక్యమును రుజువు పరచుచుండెను. అది నిజమేనా?

24

ఇప్పుడు, యేసు తిరిగి వచ్చే వరకూ అదే ప్రసంగించబడవలెను. ఓ దేవా, ధైర్యము కలిగిన పురుషులను మరియు స్త్రీలను మాకిమ్ము. ఎవరైతే (ధైర్యముగా) నిలబడి మరియు ఒప్పును ఒప్పుగాను మరియు తప్పును తప్పుగా చెప్పెదరో వారిని అది తప్పైనా లేక ఒప్పైనా. ఒకవేళ అది కాక... ఒకవేళ అది కాకుండా... నేను ఆ మార్కు 16ను చదివాను. ఒకవేళ అది సత్యముకాని యెడల, నేను పరిశుద్ధ గ్రంధమును నమ్మకుందును. మరియు ఒకవేళ నేను పరిశుద్ధ గ్రంథమును నమ్మని యెడల...

ఒకవేళ నేను యేసు పక్షము కాని యెడల, ఇక్కడ నేను ఆయనకు వ్యతిరేకిగా ఉందును. దేవా, పురుషులు మరియు స్త్రీలు వారు ఏమి మాట్లాడెదరో అదే వారు అయ్యుండే దినమును అనుగ్రహించుము. ఒకవేళ నీవు క్రైస్తవుడవైతే, దానివలె జీవించుము, దానివలె ఉండుము, దానివలె ప్రవర్తించుము. ఒకవేళ నీవు కైస్తవుడవు కాని యెడల, దానికి వ్యతిరేకముగా ఉండుము, కాబట్టి నీవు ఎక్కడ నిలబడియున్నావో జనులు తెలుసుకొనెదరు గాక. ఒకవేళ నేను దానిని నమ్మకున్న యెడల, నేను దానికి వ్యతిరేకినై యుందును.

కానీ అది సత్యమని చెప్పుటకు, ఆ వాక్యము యొక్క ఏ భాగముపైనైనా నా ప్రాణమును (అంతరంగము) ఉంచుటకు నేను ఇష్టపడుచున్నాను. అది దేవుని యొక్క ప్రేరేపింపబడిన వాక్యమని నేను నమ్ముచున్నాను. మరియు ఆ వాక్యము యొక్క ప్రతీ మాట ప్రేరేపింపబడినదని నేను నమ్ముచున్నాను. మరియు ఏ సమయములోనైనా నా జీవితమును దేవుని యొక్క వాక్యము మరియు ఆయన వాగ్ధానములపై నమ్మికయుంచుటకు నేను ఇష్టపడుచున్నాను, ఏలయనగా అది సత్యమైయున్నది.

25

ఇప్పుడు, ఒక చిన్న ఉదాహరణ లేక రెండు, అప్పుడు రోగుల కొరకు మనము ప్రార్ధించుటను ప్రారంభించెదము.

గమనించుడి. ఇప్పుడు, దేవునితో నీవు ఎన్నడైనా, ఏదైనా పొందుకొను ఒకే ఒక మార్గము, అది ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్ముటయే, మరియు ఆయనను శ్రద్ధగా వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడు. నీవు దానిని నమ్మవలెను. మరియు దేవుడు ...

ఒకవేళ నేను ఈ వ్యక్తికి చెప్పవలసిన యెడల, యవ్వనస్తుడు, వారిరువురూ ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చొనియున్నారు. ఒకవేళ నేను వారికి చెప్పవలయుననిన, “లెమ్ము, నీవు స్వస్థపడియున్నావు. నీవు నడువగలవు.” మరియు ఇప్పుడు, ఇక్కడ ఈ చక్రాల కుర్చీలలో కూర్చొని ఉన్న చాలా మంది ప్రజలు, ఒకవేళ నేను వారికి చెప్పవలసియున్న యెడల, “లేచి మరియు నడువుము, ఏలయనగా క్రీస్తు నిన్ను స్వస్థపరిచెను.”

ఇప్పుడు, ఒకవేళ వారు చెప్పిన ఎడల, “ఇప్పుడు, చూడుము. నేను ఒక అవిటి ...” అదంతయూ సరియగును. అది అంతే.

నేను మీకు సత్యమే చెప్పితిని అని నమ్మగలుగుటకు మీకు విశ్వాసము కావలసియుండెను. మరియు అది సత్యమని మొదటిగా నేను తెలుసుకునేంత వరకూ, నేను మీకు చెప్పను. మరియు నేను ఖచ్చితముగా చెప్పగలను, నేను ఒక నరమాత్రుడనై యుండి, మరియు తప్పిదములు చేయుటకు ఆస్కారము కలిగి ఉండి, అది దేవుడు వైఫల్యము లేనివాడు, మరియు ఒక తప్పు కూడా చేయలేడు. చూశారా?

మరియు ఆయన చెప్పెను, “మీరు నమ్మగలిగినట్లయితే. మీ యొక్క విశ్వాసమును బట్టి, అది మీకు జరుగును గాక.” అది సరియేనా? మేము దానిని నమ్మెదము.

26

ఇప్పుడు, చాలాసార్లు, నేను రోగుల వైపు చూచెదను. ప్రజలు విమర్శిస్తూ మరియు వారి వ్రేలు నా వైపు ఎత్తి, “అవును, అక్కడ నేను ఎవరినో తీసుకొని వచ్చియున్నాను, మరియు వారికి ఏమియూ జరుగలేదు,” అని చెప్పెదరు. “నీవు సిలువపై నుండి క్రిందకు దిగిరమ్ము మేము నిన్ను నమ్మెదము”, అని చెప్పిన అదే పాత దయ్యము అది. అది ఇంకనూ ఈరోజు మానవునిలో నివసించుచున్నది ...? ...

స్నేహితుడా, దేవుని ముందు నిజాయితీగా ఉండుట కొరకు, నాకు దేని గూర్చి అయినా తెలిసియున్నంత వరకూ, నేను ఏమియూ చెప్పలేను. ఇక్కడ పైన నేను నిలబడియుండవలెనని మీరు ఆశించుచున్నారా ... మంచిది, నేను మీ చివాట్ల యొక్క “విషపు మత్తు” ను పిలిచెదను, లేక అటువంటిదేదో, మరియు ఏదో తప్పు చేసి దేవుని యొక్క సంఘమునకు దానిపై నిందను తీసుకొని వచ్చెదనా? ఎన్నడూ కాదు.

నేను ఒక్క వ్యక్తినే (మాటను) వినెదను, మరియు అది దేవుడే. నిర్వాహకులు, లేక ఎవరైనా, నేను కలిగియున్నాను, ప్రపంచములోనే మంచి నిర్వాహకులు అని నేను నమ్ముచున్నాను. వారు... వారు ఆశించిన చోటనెల్లనూ వారు కూడికను ఏర్పాటు చేయగలరు, కానీ నేను స్వతంత్రుడను.

దేవుని యొక్క ఆత్మ ఏమి చేయమని చెప్పునో, దానిని చేయుడి. ఒకవేళ ఆయన ఇప్పుడే ఈ వేదికపై నుండి ఈ దేశములో ఎక్కడో ఎవరికో ప్రార్ధన చేయుటకు వెళ్ళమని నన్ను పిలిచినయెడల, నేను ఇప్పుడే వెళ్ళెదను. అది నిజము. మరియు ఇక్కడ ఏమి జరిగినప్పటికీ, నేను ఇప్పుడే వెళ్ళెదను. బలి అర్పించుట కంటే (మాటకు) లోబడుటయే మంచిది. అది నిజము.

27

కానీ ఒకవేళ ఆయన నాకు ఏదో చెప్పినట్లయితే... కొన్నిసార్లు నేను ఆ వ్యక్తిని పట్టుకొనెదను మరియు నేరుగా వారివైపు చూచెదను. మరియు చాలాసార్లు, ఒకవేళ మీరు గమనించినట్లయితే, నేను ఎల్లప్పుడూ తిరుగుచుండెదను. అది... నాకు అది తెలుసు, విశ్వాసము యొక్క లాగుడు నాలోనికి వచ్చుచున్నది. ఒకవేళ నేను ఆగిన యెడల, అది ప్రజలను పిలుచుటను ప్రారంభించును. చూశారా? ' మరియు నాకు సాధ్యమైనంతగా నేను దానినుండి దూరముగా ఉండుటకు ప్రయత్నించెదను, తిన్నగా ప్రేక్షకుల వైపు చూస్తూ, ఎందుకనగా ఎంత త్వరగా నేను ఒక వ్యక్తిని సంధించెదనో, దర్శనములు రావడం ఆరంభమగును. పదిలో తొమ్మిది ఆరంభమగును. మరియు అవి ఆరంభమైనప్పుడు, అప్పుడు అవి...

కానీ అది ఆ వ్యక్తిని స్వస్థపరచదు. కానీ ఒకవేళ... అప్పుడే ఒకవేళ జనులునమ్మునట్లు నీవు చేసుకొన గలిగితే, కొన్నిసార్లు, వారితో మాటలాడుచూ, తప్పు ఏమిటో వారికి చెప్పుచూ, అవును తరువాత, అది... వారు నమ్మెదరు. అది వారికి విశ్వాసమునిచ్చును. కానీ దేవుడు మొదటిగా మీలో ఏ తప్పిదము ఉన్నదో నాకు చూపించేంతవరకూ నేను మీకు చెప్పలేను.

28

అవిటి వారి మధ్యలో నుండి యేసు నడిచి వెళ్ళిపోయెను మరియు వారిని అక్కడే పడియుండుటకు విడిచిపెట్టెను. ఆయన చెప్పెను, “మొదటిగా నా తండ్రి నాకు చూపించేంత వరకూ నేను ఏమియూ చేయజాలను.” అది నిజమేనా? పరిశుద్ధ యోహాను 5:19. “నిశ్చయముగా నేను మీకు చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏమియూ చేయనేరడు.” చూశారా? అది మొదటిగా చూపించబడవలయును.

బిలాము, అతడు ఇశ్రాయేలీయులను శపించుటకు ప్రయత్నించినప్పుడు, అతడు ఇశ్రాయేలీయులను దీవించెను. మరియు ఎందుకు అని బాలాకు అడిగెను. అతడు చెప్పెను, “దేవుడు తన నోటిలో ఉంచేంతవరకూ, ఏ ప్రవక్తయైనా ఏమి చెప్పగలడు”. చూశారా? నీవు దానిని చెప్పలేవు. అవసరము లేదు.

కనుక, ప్రార్ధిస్తూనే ఉండుడి, ప్రతీ ఒక్కరూ ప్రార్ధన అనే భావనలో ఉండుము, పిదప నమ్ముము. మరియు ఒకవేళ మీకు చెప్పమని దేవుడు నాకు ఏదైనా చెప్పిన యెడల, నేను దానిని చెప్పెదను. మరియు నేను దానిని చెప్పినప్పుడు, దానిని నమ్ముము.

29

ఇక్కడ కొంత కాలము క్రితము, ఒక స్త్రీ ప్రార్ధనా వరుసలో వచ్చినది. ఆమె వేగముగా వచ్చెడి వరుసలో ఉన్నది. ఆమె నడుచుచున్నది...?... అది ఒక్మాహమాలోని తుల్సా (అనే పట్టణము) అని నేను నమ్ముచున్నాను. మరియు ఆమె తన అవిటి ఊత కర్రల సహాయముతో వరుసలో నడుచుచున్నది. మరియు నేను చెప్పాను, “సహోదరి, దేవుని యొక్క సేవకునిగా నీవు నన్ను నమ్మెదవా?”

ఆమె చెప్పినది “అవునయ్యా”.

నేను చెప్పాను, “వెళ్ళి నీ ఊత కర్రలను క్రిందకు విసిరివేసి, అలా నడుస్తూ వెళ్ళిపొమ్ము”. మరియు ఆమె చెప్పెను, “కానీ-అయ్యా, నేను రెండు సంవత్సరముల నుండి ఈ ఊతకర్రల సహాయముతో నడుచుచున్నాను.”

నేను చెప్పాను, “బహుశా నీవు ఎల్లప్పుడూ దానిపైనే ఉండేదానవు.” మరియు ఆమె సాగిపోయినది. అది ముగిసినది.

30

సుమారు ఇరవై నిముషముల తరువాత, ఆ రెండు ప్రవేశముల మధ్యనుండి వచ్చిన ఒక స్రీ ఆమెకు సహాయము చేయుచుండెను. మరియు ఆత్మ ఆమె వైపునకు లాగుటను నేను అనుభూతి చెందియున్నాను. ఆమె పైకి చూచినది, మరియు ఆమె ఏడ్చుచున్నది.

నేను అడిగాను, “అమ్మా, నీవు నమ్మెదవా?”

ఆమె చెప్పెను, “అది నీవు దేవున్ని ఏమి అడిగిననూ, దేవుడు దానిని చేయునని, నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను.”

నేను చెప్పాను, “అక్కడకు నడువుము (కొంతసేపటి క్రితము ఆ స్త్రీకి నేను చెప్పినట్లుగానే) మరియు ఆ ఊతకర్రలను విసిరివేసి మరియు నడిచిపొమ్ము”.

కొంచెము నిలబడి మరియు ఆమెను గమనించాను. ఆమె అక్కడకు నడిచినది. వారు ఆమెకు సహాయము చేయవలసియుండెను, బీద ముసలి అవ్వ, చాలా బలహీనురాలు. ఆమె ఒకదానితో అలా నిలబడినది. ఆమె ఊతకర్రలను తీసుకొని మరియు క్రిందకు విసిరివేసినది. మరియు ఆ భవనము గుండా ఆమె వెళ్ళినది, అరుస్తూ చుట్టూ మరియు చుట్టూ తిరుగుచుండెను.

ఇప్పుడు, ఒకవేళ ఆమె దానిని చేయకపోతే ఏమి జరిగియుండును. చూశారా, చూశారా? నేను మొదటిగా తెలుసుకొనవలసియున్నది. మరియు మీరు లోబడి మరియు మీకు ఏమి చేయవలెనని చెప్పబడి యున్నదో దానిని చేయుము.

31

మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు మరియు ఎవరో కీలకమైన వైద్యుడు ... వైద్యులందరూ ఆ విధముగా సంకుచిత మనస్తత్వము గలవారుగా ఉండరు. కానీ ఒకవేళ ఎవరో కీలకమైన వైద్యుడు మీరు స్వస్థత పొందియుండలేదు అని మీకు చెప్పిన యెడల, మరియు ఆ విధముగా ఏదో, మరియు దానియందు నమ్మికయుంచవద్దు. మీరు ' అలాగే కొనసాగి, మరియు దేవుడు మీకు ఏమి చేయమని చెప్పునో దానిని చేయుము. వాటిలో దేనిని మీరు వినవద్దు. ఒకవేళ మీరు ఒక వైద్యుని యొద్దకు వెళ్ళగోరిన యెడల, దేవున్ని సేవించే - దేవున్ని సేవించుచున్న వేరే వైద్యుని యొద్దకు వెళ్ళుము. ఇప్పుడు, నీవు...

ఇప్పుడు, గుర్తించుకొనుండి. నేను వైద్యులకు, లేక వైద్య విధానములకు, ఆసుపత్రులకు, లేక వాటిలో దేనికైననూ నేను వ్యతిరేకము కాదు. ఎవరికైనా సాయము చేయు దేనికైననూ, పేదలకు బాధను నివారణ చేయు మానవత్వము, మరియు అటువంటి దానిని చేయు ఏ ప్రయత్నమునైననూ దేవుడు దీవించును. లోకములో ఉన్న ప్రతీ క్యాన్సర్‌ను చంపివేయు, ఒకరకమైన మందును ఎక్కడో ఉన్న ఆ శాస్త్రవేత్తలకు దేవుడు పంపించవలెనని నేను ప్రార్ధించెదను. క్షయ వ్యాధిని చంపి వేయునది, లేక మరేదైనా చేయునదేనినైనా ఆయన పంపించునని నేను ఆశించుచున్నాను. ఆయన దానిని చేయునని నేను నమ్ముచున్నాను. ఆయన దానిని చేయునని నేను ప్రార్ధించుచున్నాను.

32

కానీ ఇప్పుడు, సహోదరుడా, దేవుడు దానిని తన కొరకు తీసుకునే వరకు ఏ స్వస్థతయూ జరుగదు. “మీ యొక్క రోగములన్నిటినీ స్వస్థపరచు యోహోవాను నేనే.” అది కేవలము దేవుని ద్వారా మాత్రమే అగును. ఉత్తమమైన వైద్యులు కొందరు తాము తయారు చేసిన మందునే తీసుకొని మరియు మరణించారు. అది నిజము. వారు ఇక్కడ నుండి వెళ్ళెదరు....

ఇక్కడ చాలా కాలము క్రితము, కాలిఫోర్నియాలో దేవునిపై నమ్మకము కలిగి ఉన్న ఒక క్రైస్తవ స్త్రీ ఆమె యొక్క బిడ్డల కొరకు దేవుడిని నమ్ముచూ ఉండడం నేను చూచాను. ఆ బిడ్డ చనిపోయినది. మరియు మియానీ నుండి కాలిఫోర్నియా వరకూ, “దైవిక స్వస్థత. అంతా మూఢత్వము. వైద్యము పొందకుండా బాలిక చనిపోయినది”, అని వార్తా పత్రికలన్నీ దంచికొట్టినవి: మరియు ఆ వార్త దేశమంతా ప్రయాణించుచున్న అదే సమయములో, వైద్యులు దాదాపు పదివేల మంది రోగులను పోగొట్టుకున్నారు (ఆసుపత్రికి రాకున్నవారు). కానీ వారికి వైద్య విజ్ఞాన మతోన్మాద ఉత్పత్తి అవసరము లేదు.

33

ఒకవేళ నేను ఈ రాత్రి ఇక్కడ ఆ స్మశాన వాటికకు వెళ్ళి, మరియు “వైద్యము చేయించుకొని చనిపోయిన మీరందరూ, లేచి నిలబడండి. మరియు దేవున్ని నమ్ముచూ చనిపోయిన మీరందరూ, లేచి నిలువబడుము” అని చెప్పినచో, అది. త్రాసులో సరితూయుము. ఎవరికైననూ ఒక్కటే న్యాయము. మరియు ఒక్క రోగి నయమవ్వని కారణముచే మీరు దైవిక స్వస్థతనంతటినీ మీరు కొలవగలిగిన యెడల (బేరీజు వేసిన యెడల) అప్పుడు వైద్య ప్రక్రియ ద్వారా ఒక్క కేసు నయము కాకపోతే ... అది మూఢత్వము. రండి, మన వివాదమును పరిష్కరించుకొందము. అది నిజము.

ఒకవేళ దైవిక స్వస్థత ద్వారా ఒక్క కేసు పోగొట్టుగొనబడితే (స్వస్థపడకపోతే), ఎందుకనగా ఆ స్వస్థతను స్వీకరించుటకు ఎవరికో తగినంత విశ్వాసము లేకుండుట వలన, మరియు అదంతయూ మతోన్మాదము అని ముద్ర వేయబడినప్పుడు మరి వైద్యము పొందుచున్న ఒక్క వ్యక్తి పోగొట్టుగొనబడితే ఒక్క రోగి, వైద్య విధానములో ప్రతీరోజూ మీ పట్టణములో మరియు దాని చుట్టూ వందల మంది చనిపోతున్నప్పుడూ... అది నిజము.

34

ఇప్పుడు, జనులందరూ చేయవలసిన సంగతి ఏమనగా, ఒకవేళ మీకెవరికైనా హృదయమున్నట్లయితే, ఒకవేళ వారికి ధనదాహము. లేనట్లయితే, మరియు కొన్ని రూపాయలు మేము పోగొట్టుకొనెదము అనే భయము లేకున్న యెడల, మరియు ఒకవేళ మీరందరూ కలిపివచ్చి మరియు “సహోదరుడా, సేవకులారా, మరియు అందరునూ కలిపి, ఈ సంగతితో మనమందరమూ కలిపి పని చేయుదుము, మరియు మనతోటి మానవునికి సహాయముచేయ ప్రయత్నించెదము”, అది మంచిగానుండును, లోకమంతా. అప్పుడు దేవుడు మనలను దీవించును. అది నిజము.

నేను వైద్యశాస్త్రమునకు లేక దేనికైననూ వ్యతిరేకముగా ఏమియూ చెప్పుట లేదు. నేను ఇక్కడ తీర్పు తీర్చుటకు లేను. సువార్తను ప్రసంగించుటకు, మరియు రోగులకు ప్రార్ధించుటకు నేను ఇక్కడ ఉన్నాను. మరియు నేను ఏ ఒక్కరినీ స్వస్థపరచలేను. ఏ వైద్యుడూ ఎవ్వరిని స్వస్థపరచలేడు. వారెవ్వరూ మేము స్వస్థపరచువారమని ఆరోపించలేరు. నేను అనుకొనుచున్న ప్రకారము, వారు కలిగియున్న దాని ప్రకారము మాయోస్‌ వారే ఉత్తమమైన యాజమాన్యము. వారు చెప్పెదరు, “మేము స్వస్థపరిచేవారము అని ఆరోపించుకొనలేము. మేము ప్రకృతికి సహాయము చేసెడివారము. ఒక్కరే స్వస్థపరచువాడు అది దేవుడే.” అది నిజము. ఆయనే ఉత్తమమైన యజమాని (హక్కుదారు).

కనుక ఒకవేళ నేను స్వస్థపరచువాడను అని ఒక వైద్యుడు ఆరోపించుకొన్నచో, అతడు ఒక నకిలి, అదంతే. అది నిజము. ఒక సేవకునిగా, నేను ఎంతమంది వైద్యులను కలిగియున్నానో అంతమంది నకిలీ సేవకులను కూడా చూచియున్నాను. నా వరకూ, దేవుని యొక్క వాక్యమందు నమ్మకము లేనిది ఏదైనా, అది ఒక నకిలి. అది నిజము. అది (వాక్యము) ఏ విధముగా ఉన్నదో ఆ విధముగానే దానిని తీసుకొని మరియు అది తప్పో లేక ఒప్పో చెప్పేవారిగా నిలబడుటకు ఇష్టులై ఉండవలెను. సత్యము. ఇప్పుడు, దేవునిని నమ్ముము. దేవునిలో విశ్వాసము కలిగియుండుము.

35

మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నిన్ను ఉత్తేజపరచుటకు ఇక్కడ ఉన్నప్పుడు, గుర్తించుకొనుము, నీ యొక్క శరీరము నీ యొక్క ఒప్పుదలలోనికి వచ్చులాగున దేవుడు చేయును. ఒకవేళ నేను త్రాగుబోతును, మరియు నాకు మద్యము కావలెను అని నీవు చెప్పినయెడల... చింతించవద్దు, నీవు వారిలో ఒకనిగా అగుదువు. ఒకవేళ నేను ఒక పాపిని, మరియు పాపము చేయగోరుచున్నాను అని నీవు చెప్పిన యెడల, నీవు తిన్నగా దానిలోనికి వెళ్ళెదవు.

ఒకవేళ నేనొక క్రైస్తవుడను అని నీవు చెప్పిన యెడల మరియు దానిని అలాగు నమ్ముచూ ఉంటే, దేవుడు... తీసుకొని వచ్చును. నీ యొక్క సాక్ష్యము నేరుగా నిన్ను దానిలోనికి తీసుకొనివచ్చును. ఒకవేళ స్వస్థతను నీవు నమ్మిన యెడల, మరియు దేవుడు నిన్ను స్వస్థపరిచెనని నమ్మినచో, దానిని ఒప్పుకొన్నచో, మరియు నీ యొక్క శరీరమును నీ యొక్క ఒప్పుకోలుకు లోబడునట్లుగా దేవుడు చేయును, ఎందుకనగా ఆయన మన ఒప్పుకోలుకు ప్రధాన యాజకుడైయున్నాడు; ఏలయనగా ఆయన దేని కొరకు చనిపోయెనో అటువంటి ఒప్పుకోలు ఏదైనా, లేక మరేదైనా వాటికి మధ్యవర్తిత్వము వహించుటకు ఇప్పుడు తన స్వరక్తముతో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొనియున్నాడు.

మరియు పాపమును తీసివేయుటకు ఆయన చనిపోయెను. మరియు రోగము పాపముయొక్క ఫలితమైయున్నది. “మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, ఆయన గాయములచే మనము స్వస్థపడియున్నాము .” దానిని గుర్తించుకొనుము. విశ్వాసమును కలిగియుండుము. అటు ఇటూ ఊగిసలాడవద్దు. దానిపై స్థిరముగా నిలబడుము.

36

ఒకసారి ఒక కేసును గూర్చి ఆలోచిస్తూ, నేను ఎన్నడూ చూడనటువంటి ఒక భయంకరమైనది. ఆ ప్రార్ధనా వరుసకు ముందు. మీరు... ఇష్టపడే... ఇప్పుడు మీలో ఎంతమంది దీనిని వినియోగింప -గోరుచున్నారు, కాబట్టి మీరు పంపి మరియు ఈసాక్ష్యములలో కొన్నిటిని మీరు పొందుకొనగలరు. రాత్రి వెంబడి రాత్రి నేను మీకుచెప్పెదను. అది సరే. ఒకవేళ మీకు ఈ సాక్ష్యము కావలసినట్లయితే,... వ్రాయండి. చూచెదము. రెవ.జి. హెచ్‌.బ్రౌన్‌, 505 విక్టర్‌ స్త్రీట్ , లిటిల్‌ రాక్‌, ఆర్కాన్సాస్, దీనికి వ్రాయుము.

మరియు నేను చెప్పుచున్నాను, వారు ఆ చేతి రుమాలును గూర్చి అపహాస్యము చేసిరి, అది పనిచేయుటను బట్టి. అవిశ్వాసులు దానిని విశ్వసింపవలెనని నేను ఆశించను. అది కేవలము నమ్మువారికి మాత్రమే.

37

ఇప్పుడు, అది ఇదే కూడికలో, మరియు అదే రాత్రి. ఆ చిన్న స్రీ రక్తపు మరకలు అంటని తన చేతి రుమాలుతో ఆమె అక్కడ ఉన్నది. మరియు అక్కడ ఆమె యొక్క ముంజేతులు బార్లాగా చాచియున్నవి మరియు ఒకసాక్షిగా వేలాది మంది ముందు అక్కడ నిలబడియుండెను. మరియు రక్తస్రావము ఆగిపోయెను, మరియు అది ఎందుకు ఆగిపోయెనో వారికి అర్ధముకాలేదు. ఎందుకనగా దేవుడే దానిని ఆపివేసెను.

ఏ విధముగానైనా నీవు ఇక్కడకు భూమి పైకి ఎలా వచ్చావు. జీవకణము ఏవిధముగా రూపింపబడినది. గమనించుడి. అది దేవుడైన సృష్టికర్త ద్వారా మాత్రమే.

38

ఇప్పుడు. దగ్గరగా ఒక్కక్షణం. సుమారు పదకొండు గంటలు. ఆడిటోరియంలో సహో.బ్రౌన్‌ నాకు చెప్పియున్నాడు. “సహోదరుడా బెన్‌ హామ్‌ ఇక్కడ ఉన్న మానసిక రుగ్మత కలిగిన రోగుల యొద్దకు నీవు ఎప్పుడు వచ్చెదవు...” అని అడిగాడు. వారు వారిలోనే మౌనముగా నుందురు, ఎందుకనగా వారు కలవరపడుచున్నారు. మరియు కొన్ని సార్లు, ఆ ఆత్మలు ప్రజలలో నుండి బయటకు వచ్చినప్పుడు, వారు భయంకరముగా ప్రవర్తించెదరు.

“వారు నిన్ను తీసుకొని రాకముందు నేను ఒక భయంకరమైన పరిస్థితిని, నా జీవితములో ఎన్నడూ చూడని దానిని నేను చూచియున్నాను”, అని అతడు చెప్పాడు. మేము ఒక మహిమకరమైన కూడికను కలిగియున్నాము. “మేము అతనిని అక్కడ ఆ భవనపు క్రింది అంతస్తులో ఉంచియున్నాము”, అని చెప్పాడు.

మరియు నేను ఆ వీధి గుండా వచ్చి, మరియు ఆశ్చర్యపోయాను. మీకు ఆ చిన్న పాట తెలుసా, “కేవలము నమ్ముము?” ఆ ఉదయము నేను ఆ పైకి, క్రిందకు తీసుకొని వెళ్ళెడి యంత్రము (ఎలివేటర్‌)పైన వచ్చుచూ, మరియు ఎవరో, “కేవలము నమ్ముము, సమస్తమునూ సాధ్యమే, కేవలము నమ్ముము”, అని పాడుచూ ఉండడం నేను విన్నాను. మరియు అది ఆ యంత్రమును నడిపెడి బాలుడు, అక్కడ నిలబడి ఆ యంత్రమును మార్చుచూ...?...

మరియు నేను అలా సాగి వెళ్ళాను, మరియు ఆ విధముగా ఆ వీధిలో ముందుకు సాగుతూ వెళ్ళాను, ' అలా ఆ పట్టణపు వెనుక భాగమునకు. మరియు ఒక అమెరికా జాతి కలపతో చేయబడిన ఒక పాత కలప కుర్చీలో ఒక తల్లి తన బిడ్డను ఊపుచూనుండటం నేను విన్నాను. ఒక పాత నార కలపతో అల్లబడిన కుర్చీ ఎంతమందికి తెలుసు? ఆ నారతో మనము దానిని అల్లుచుండేడెడివారము. మరియు నేను కూడా ఆ కలపను పెంచి స్వయముగా అల్లెడివాడను.

39

అదిగో అక్కడ ఆ చిన్న దీనురాలైన తల్లి తన బిడ్డను ఎత్తుకొని, మరియు వెనుకకు వాలినది...?... “కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, సమస్తమునూ సాధ్యమే.”

మరియు నేను చెప్పాను, “ఓ దేవా, నేను నీకు ఏవిధముగా వందనములు చెప్పగలను. ఆ స్త్రీ కూడికకు వచ్చినది.

క్రిందకు వెళ్ళాను. మరియు అందమైన కొన్ని సంగతులలో ఒకటి, ఒక చిన్నబాలుడు. అక్కడ అతడు ఏదో గోళీలను ఆడుచున్నాడు, మరియు నేను ప్రక్కనుండి నడుచుచూ మరియు అతడిని గమనించాను. మరియు ఆ చిన్నవాడికి అతడు ధరించియున్న ప్యాంటునకు ఒక కాలు క్రిందకు మరియు ఒక కాలు పైకి పెట్టబడియున్నది. మరియు అతడు తన గోళీని ఆవిధముగా కొట్టుటకు ప్రారంభించెను, మరియు అతడు నా యొద్దకు వచ్చి, పైకి లేచి, తన కాలుతో దువ్వి, “కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, సమస్తమునూ ...” అని చెప్పెను. అతడు తన గోళ్లీతో కొట్టుటకు ముందు... “కేవలము నమ్ముము” అని పాడుచుండెను.

40

ఆ రాత్రి కూడికలో, సహో. బ్రౌన్‌ చెప్పెను, “సహోదరుడు బ్రాన్హాం ఇక్కడకు రమ్ము మరియు నీవు ఎన్నడూ చూడనటువంటి ఒక దృశ్యమును నేను నీకు చూపెదను.”

మరియు మెట్ల మీదుగా నేను క్రిందకు వెళ్ళాను, మరియు అక్కడ ఒక అసాధారణమైన ముసలి సహోదరుడు నిలబడియున్నాడు, ఒక జత పూర్తిగా కప్పబడియున్న ఉతికిన వస్తములతో నిలబడియున్నాడు, ఆడిటోరియం లోపలికి వెళ్ళుమార్గములో మెట్లపై నిలబడియున్నాడు.

మరియు నేను అడిగాను, “అయ్యా, మీరు ఎలా ఉన్నారు.”

మరియు అతడు, “సహోదరుడు బ్రాన్హాం మీరు ఎలా ఉన్నారు,” అని అడిగాడు.

మరియు నేను క్రిందకు వెళ్ళాను. మరియు నేను అడిగాను, “ఆ రోగి ఎక్కడ?”

“అదిగో అక్కడ ఉన్నది”, అని చెప్పాడు.

మరియు అక్కడ ఒక స్త్రీ పడుకొనియున్నది. బలముగా, గొప్ప ధృడమైన భుజములు మరియు కాళ్ళు కలిగియుండుటను చూచాను. మరియు కాలి నుండి రక్తము ఆవిధముగా కారుచూ ఉన్నది. వెల్లకిలా పడుకొనియున్నది, ఆమె యొక్క చేతులు మరియు కాళ్ళు నిటారుగా పైకి ఉంచబడినవి, తిన్నగా ఆ విధముగా, తన వీపుపై పడుకొనియున్నది, ఒక మూలన పడుకొనియున్నది. మరియు “ఆమెకు ఎందుకు రక్తము కారుచున్నది?” అని నేను అడిగాను.

“సహోదరుడు బ్రాన్హాం, ” అని అన్నాడు. “ఆమె యొక్క రుతుక్రమ ప్రక్రియ ఆగిపోయే దశలో ఆ వైద్యుడు ఇచ్చిన ఒక్క మందుతో ఆమె తన మతిస్థిమితం కోల్పోయినది”...?... కానీ... ఆమె రుతుక్రమ ప్రక్రియ ఆగిపోయే దశలో , మరియు ఒక్క సూది మందు ఇచ్చాడు, మరియు అది ఆమె మెదడులోనికి వెళ్ళినది. మరియు ఆమె తన స్థిమితం కోల్పోయినది.

మరియు చెప్పాడు, “ఆమె ఆసుపత్రిలో రెండు సంవత్సరములు ఉంచబడినది”. మరియు “నాకు ఇంటి దగ్గర అయిదుగురు చిన్నపిల్లలు ఉన్నారు”, అని చెప్పాడు. నేను నా పొలమును మరియు నాకున్నదంతటినీ అమ్మివేశాను“, అని చెప్పాడు. ”ఆమెకు వైద్యము చేయించుట కొరకు“, అని చెప్పాడు. మరియు ”చివరికి ఆమెను తీసుకొని వెళ్ళిపొమ్మని వారు చెప్పారు“, అని చెప్పాడు. ”మరియు నేను... చెప్పెను, ఆసుపత్రి దగ్గర... అక్కడ మిస్సిసిపిలో, పైన్‌విల్‌ దగ్గర అంతకుముందు ఒక స్తీ అక్కడ ఉన్నది అని నేను విన్నాను...?...

పది సంవత్సరముల నుండి మానసిక రోగముతో బాధపడుచూ ఉన్నది, మరియు నేను ఆమె ప్రక్కగా వెళ్ళినప్పుడు ఆమె తన స్థితిని పొందుకొనియున్నది“, అని అతడు చెప్పాడు.

మరియు ఆమె నా కాళ్ళకున్న ప్యాంటును లాగి పట్టుకొని యున్నది. మరియు ఆమె కుమార్తె చెప్పినది, “దేవుడు కృప చూపించును”.

“సహోదరుడు బ్రాన్హాం, దేవుడిని అడుగుము”, అని చెప్పినది.

“ఆయన దానిని చేయునని నీవు నమ్మెదవా?” అని నేను అడిగాను.

“అవును”, అని చెప్పినది.

మరియు ఆమెను దీవించమని నేను దేవున్ని అడిగియున్నాను, మరియు నేలపై తన శిరస్సును ఆవిధముగా కొట్టుకొనుచున్నది. మరియు ఆమె ఒక యవ్వన స్తీ అయి ఉండి...

41

మరియు నేను సుమారు, దాని తరువాత రెండు వారములకు, నేను సాన్‌ ఆంటోనియోలో ఉన్నాను. నేను ఉంచబడిన ఒకచిన్న స్థలము, ఒక చిన్న యాత్రా శిబిరమునకు బయట ఎవరో వాదించుకొను చుండుటను నేను విన్నాను. “నేను సహోదరుడు బ్రాన్హాంను చూడగోరుచున్నాను”, అని వారు చెప్పిరి.

మరియు సహోదరుడు కిద్సన్‌ చెప్పాడు, “నేను దానిని అనుమతించలేను”, “అతడు

ఆయన ప్రార్ధిస్తూ ఉన్నాడు“, అని చెప్పాడు.

“మంచిది, నేను అతడితో కరచాలనము చేయగోరుచున్నాను”, అని చెప్పాడు.

మరియు నేను కిటికీ గుండా బయటకు చూచాను. అతడు ఒక సైనిక బాలుడు అని నేను చూచాను. మరియు తలుపు తీసి మరియు చెప్పాను, “అయ్యా, మీరు నన్ను చూడగోరుచున్నారా?”

మరియు అతడు చెప్పాడు, “నీవు సహోదరుడు బ్రాన్హాంవా?” అతడు చెప్పాడు,

“అవునా ... ఓహ్‌, సహోదరుడు బ్రాన్హాం”, అతడు వచ్చి నా చుట్టూ చేతులు వేసి నా మెడపైన ముద్దు పెట్టుకొనెను.

మరియు “సైనికబాలుడా, ఏమిటి సంగతి?” అని నేను అడిగాను.

అతడు చెప్పాడు, “సహోదరుడు బ్రాన్హాం! గతరాత్రి సాన్‌ ఆంటోనియోలో ఒక స్త్రీ తన తలను ఆ ప్రక్కగా కొట్టుకొనుట నీకు జ్ఞాపకమున్నదా?”.

“ఓిహ్‌, నీవు ఆమె బంధువా?” అని నేను అడిగాను.

అవును“. చెప్పెను, ”ఆమె నా తల్లి“. ”నేను విదేశాలకు వెళ్ళాను; నేను యుద్ధములో ఉన్నట్లు ఆమెకు కనీసము కూడా తెలియదు“, అని చెప్పాడు. మరియు, ”ఆమె అలా పది సంవత్సరములు ఉన్నది“, అని చెప్పాడు. ”సహోదరుడు బ్రాన్హాం, ఆ ఆసుపత్రిలో నుండి ఆమెను పంపించి వేసిరి, ఆమెను ఇంటికి పంపించెను“, అని చెప్పెను. ”నేను గృహమును విడిచి వెళ్ళే సమయమునకు ఆమె భోజనము సిద్ధపరచుచుండెను, “నేను మిమ్ములను కౌగిలించగోరుచున్నాను, మరియు తల్లి సరైన మానసిక స్థితిలో ఉన్నందులకు, నేను చాలా ఆనందముగా ఉన్నాను” అని చెప్పుటకు రాగోరియున్నాను“, అని అతడు చెప్పాడు.

మరియు నేను చెప్పాను, “మంచిది, ఇప్పుడు, సహోదరుడా, నీవు ఒక క్రైస్తవుడవా?” అతడు చెప్పాడు, “అవును, సహోదరుడా, ఆయన నన్ను యుద్ధములు మరియు వాటన్నిటి గుండా నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనను నమ్మియున్నాను”, అని చెప్పాడు.

మంచిది, నేను చెప్పాను, “అవును, దేవుడు నిన్ను దీవించును. వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము”, అని చెప్పాను.

42

మరియు వారు దీనిని వినియున్నారు, మరియు ఆ రాత్రి ఆమెను గూర్చి వినియున్నాను

అని చెప్పిన అతడిని గూర్చి ఆ మెట్లపై అతడు చెప్పాడు. మరియు నేను చెప్పాను, “మంచిది - మంచిది, మరియు ఆమె నీ భార్యా ?

మరియు అతడు చెప్పాడు, “అవును”.

“మంచిది, నేను బయటకు వెళ్ళెదను”, అని నేను చెప్పాను.

ఆ సమయములో, వివేచించుట లేదు. అది ఏమిటో ... తెలుసుకొనుటకు అది నా యొద్దకు రాలేదు, వారి యొక్క శరీరమును స్పర్శించుటకు నేను జనుల యొక్క చేతిని పట్టుకొనవలసియున్నది. ఇప్పటి వరకూ అది ఎన్నడూ రాలేదు, గడిచిన సంవత్సరము ఇదే సమయము, అది కెనడాలోని, వాంకో-లేక, రెజీనా అని నేను ఊహించుచున్నాను, నేను నమ్ముచున్నాను.అప్పుడు అది వచ్చునని ఆయన వాగ్ధానము చేసెను, కానీ అది ఇంకనూ రాలేదు. ఇప్పుడు, సాధ్యమైనంత త్వరగా, మనము ప్రార్ధనా వరుసను ప్రారంభించెదము.

43

గమనించండి. మరియు నేను చెప్పాను, “నేను బయటకు వెళ్ళి మరియు ఆమె చేతిని పట్టుకొనెదను మరియు ఒకవేళ... అని చూచెదను”.

“సహోదరుడు బ్రాన్హాం, నీవు వెళ్ళవద్దు”, అని అతడు చెప్పాడు. “అమె నిన్ను చంపివేస్తుంది”, అన్నాడు. “ఆమెను ఇక్కడకు తీసుకొని వచ్చుటకు నాకు ఒక అంబులెన్సు కూడా దొరకలేదు. నేను ఒక వ్యక్తిని బేరమాడుకున్నాను, అయిదుగురు. మరియు ఆమెను వారు కారులోనికి ఎక్కించిరి. ఆమె కారు యొక్క అద్దములన్నిటినీ తన్నివేసినది, మరియు ఆ ఐదుగురు వ్యక్తులు ఆమెను పట్టుకొనియున్నారు. అందుచేతనే ఆ విధముగా ఆమె రక్తము కారుచున్నది”, అని చెప్పాడు. “ఆమె అలా రెండు సంవత్సరముల నుండీ వెల్లకిలా పడుకొనుట చేత ఆమె వీపుపై లేవలేదు”, అని అన్నాడు.

నేను అన్నాను, “మంచిది, నేను వెళ్ళి మరియు చూచెదను ...”

“దానిని చేయవద్దు”, అని అతడు అన్నాడు. నేను చెప్పాను, “ఓహ్‌, ఆమె ఏమీ చేయదు”

మరియు నేను నడిచి వెళ్ళాను. ఆ మార్గములో క్రొత్తవానిగా (అనుభవము లేనివాడిగా), దయ్యములతో ఖచ్చితముగా ఏ విధముగా వ్యవహరించవలెనో ఎరుగకుండా మరియు ప్రేరేపింపబడనంతవరకూ నీకు ఎన్నడూ తెలియదు (చూశారా?) ...?... అప్పుడు మీరు ఏమి చేయుచున్నారో దాని యెడల జాగ్రత్తగా ఉండుము. అధికారము లేకుండా కొంతమంది బాలురు అటువంటి దానినేదో ప్రయత్నించిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి? అది వారి పైకి వచ్చినది.

44

మరియు ఆమె ఎక్కడ ఉన్నదో నేను అక్కడకు నడిచి వెళ్ళాను. ఆమె అక్కడ పడి ఉన్నది. మరియు ఆమె తన చేతులు పైకిఎత్తియున్నది, తన కళ్ళను ఆడించుచున్నది, ఆ విధముగా తీక్షణముగా చూచుచున్నది. మరియు నేను అడిగాను, “ఎలా ఉన్నావు, సహోదరి”.

ఆమె ఏ విధముగానూ కదలలేదు. “నీ చేతిని పట్టుకొననిమ్ము”, అని చేతితో ఆమె చేతిని పట్టుకున్నాను. చేతితో ఆవిధముగా ఆమెను పట్టుకున్నాను.

మరియు అక్కడొక గొప్ప సంగతి ఏదనగా దేవుడు నాతో ఉన్నాడు, మరియు నా యొక్క అజ్ఞానము (లేక నిర్లక్ష్యము)నకు దయ చూపించియున్నాడు. ఆ బలమైన చేతితో, సాధారణము కన్నా పదిరెట్లుశక్తి. ఒకవేళ ఎవరైనా పిచ్చివారితో వ్యవహరించిన యెడల, ఆ ప్రజలపైన నున్న అవే దయ్యములు, దురాత్మలు.

అవును, ఒకవేళ దయ్యము యొక్క శక్తి ఒక వ్యక్తికి తనకున్న దాని కన్నా పదిరెట్లు శక్తినిచ్చిన యెడల, నీపై ఉన్న దేవుని యొక్క శక్తి ఏమి చేయును, ఒకవేళ నీవు అవిటివాడవైనా లేక ఏమైనా. ఆ దయ్యముకన్నా దేవుడు ఎంత శక్తిమoతుడు, అది నీపైన ఉన్నప్పుడు. చూశారా?

45

అప్పుడు, ఆమె తన యొక్క పెద్ద చేతితో నన్ను ఒక్క కుదుపు కుదిపినది. మరియు నేను ఇప్పుడుండిన దాని కన్నా చిన్నగా ఉన్నాను, సుమారు నూట ముప్పె పౌండ్ల బరువు. మరియు ఆమె నన్ను ఎంత బలముగా లాగినదంటే దాదాపుగా నేలపై పడవేసినది. ఆ విధముగా, ఆ చేతితో గోడకేసి నన్ను విసిరివేసి యుండెడిది. మరియు కేవలము దేవుని యొక్క కృపను బట్టి, ఇక్కడ నా కాలితో, అది ఆమె యొక్క నడుముకు తగిలినది. మరియు అది (నాచేయి) ఆమె యొక్క చేతిలో నుండి విడిపించబడినది.

మరియు. ఇప్పుడు, వినండి. నేను వెనుకకు తిరిగి మరియు పరుగెత్తుటకు ప్రారంభించాను, మరియు మెట్ల పైకి దుమికాను. మరియు ఇక్కడ ఆ స్రీ తన యొక్క వీపుపై ఆ విధముగా నేలపై ప్రాకుచూ వచ్చినది, ఇక్కడ ఈ విధముగా చేయుచూ ఉన్నది, కేవలము ఒక సర్పము వలె, కదులుచూ, నేలపై నన్ను వెంటాడుచూ :దురాత్మలు, దయ్యము.

నేను ఒక వ్యక్తిగత దయ్యమును నమ్మెదను. అవునండీ. అది అదే ఆమెపై ఉన్నది. ఆమె తనయొక్క శరీరమును కదల్చుచూ, సర్పము వలె ప్రాకుచూ, నన్ను వెంటాడుచున్నది.

46

మరియు నేను మెట్ల పైకివచ్చాను. నేను... ఎందుకు, నేను ఆసుపత్రులకు వెళ్ళియున్నాను, చూచాను... నేను అన్ని రకములైన దృశ్యములనూ చూచియున్నాను. యవ్వన స్త్రీలు తమ బట్టలు ఊడదీసుకోవడం నేను చూచాను, మరియు మలవిసర్జన పాత్రను తీసుకొని మరియు దానితో ఆమె యొక్క ముఖము కడుగుకోవడము నేను చూచాను, మరియు ఆసుపత్రులలో అటువంటివన్నీ, కానీ ఇటువంటిది నేను ఎన్నడూ చూడలేదు.

మరియు ఇక్కడ ఆమె నన్ను వెంటాడుచున్నది, మరియు బుసలు కొడుతూ మరియు ఒక సర్పము వలె ఊదుతూ ఉన్నది. “నేను నీకు చెప్పాను కదా”, అని అతడు అన్నాడు. నేను అన్నాను, “సహోదరుడా, అటువంటి దానిని నేను ఎన్నడూ చూడలేదు.” నేను చెప్పాను,

“మై, అది ఖచ్చితముగా ఆమెలో ఉన్న దయ్యమే.”

“మరియు సహోదరుడా బ్రాన్హాం, ఆమె ఒక మంచి స్త్రీయే. ఇప్పుడు, నీకు ఎటువంటి ప్రకంపనలూ (ప్రవక్తకు వివేచన ద్వారా వచ్చే చేతి సూచన) రావడం లేదు అని నీవు చెప్పుచున్నావు, మరియు నేనిప్పుడు ఏమి చేయవలెను?” అని అతడు అన్నాడు. “నేను నా కంచరగాడిదను కూడా అమ్మివేశాను, ఈ సహోదరులను కిరాయికిపెట్టుకొనుట కొరకు నాకున్న చివరది అదే, రెండు వందల మైళ్ళ దూరమున ఉన్న ఇక్కడకు ఆమెను తీసుకొని వచ్చుటకు వారిని కిరాయికి మాట్లాడుకున్నాను”, అని చెప్పాడు. మరియు వెంటనే ఏడుపు లంఖీంచుకొనెను, ఆ విధముగా గోడకు తన తలను కొట్టుకొనుచుండెను.

47

నేను అన్నాను, “ఒక్క నిముషము, సహోదరుడా”. “ఆ ప్రకంపనలు ఏమి కాదు. అవి కేవలము ఆ వ్యాధిని గూర్చి చెప్పును. చూశారా? నేను దేవున్ని అడిగెదనని మీరు నమ్మెదరా?” అని అన్నాను.

అతడు అన్నాడు, “నా హృదయమంతటితో నమ్ముచున్నాను.”

మరియు నేను వెనుకకు తిరిగాను, మరియు ఆమె తన యొక్క పెద్దబలమైన పాదముతో గోడకు అదిమి, మరియు గట్టిగా తన్నినది. మరియు అక్కడ ఎవరో కూర్చొని ఉన్న ఒక చెక్కబల్ల పెట్టబడియున్నది. మరియు ఆమె దానిని తన తలతో కొట్టినది, మరియు ఆ దెబ్బకు ఆమె నుదుటిపై నుండి ఒక పెద్దముక్క జుత్తుతో పాటు ఊడి ఎగిరినది, మరియు రక్తము బయటకు చిమ్మినది, మరియు ఒక చెక్కముక్మను విరుగగొట్టినది. మరియు ఆమె దానిని (చెక్కముక్క) పట్టుకొని, మరియు దానిని అలా విసిరినది, మరియు గోడనుండి ఒక పెచ్చును లాగినది, బ్రద్దలుగొట్టినది ...?... మరియు ఆమె “హీ-హీ-హీ, హీ-హీ-హీ*, అనుచూ వెళ్ళుచున్నది. ఒక నిజమైన వెటకారపు నవ్వు అలా నవ్వుతూ. అలావెళ్ళుచున్నది.

మరియు నేను చెప్పాను, “అవును, అటువంటి దానిని నేను ఎన్నడూ చూడలేదు.” మరియు ఆమె తనకు తానుగా నన్ను చూచుట కొరకు చుట్టూ తిరిగినది; ఆమె చెప్పినది, “విలియం బ్రాన్హాం, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేనే ఆమెను ఇక్కడకు తీసుకొని వచ్చాను.”

అవును, ఆ వ్యక్తి నా వైపు చూచాడు, అతడు చెప్పాడు, “ఎందుకు, రెండు సంవత్సరములలో ఆమె పలికిన మొదటి మాటలు అవే. ఆమెకు కనీసము తనయొక్క సొంత పేరు కూడా తెలియదు. ఆమెకు నీవు ఎలా తెలుసు?” అని అన్నాడు.

“సహోదరుడా, విను. అది ఆమె కాదు. అది దయ్యము దేవుని యొక్క వరమును గుర్తించుచున్నది. అది అదియే”, అని అన్నాను. నేను చెప్పాను, “వాడికి. అది తెలుసు. మరియు వాడి సమయము వచ్చియున్నదని వాడికి తెలుసు.”

“నేనే ఆమెను ఇక్కడకు తీసుకొని వచ్చాను. నీవు నన్ను ఏమియూ చేయలేవు”, అని ఆమె అన్నది.

“అయ్యా, నీవు నమ్మెదవా?”, అని అడిగాను.

“నా హృదయమంతటితో”, అని అతడు చెప్పాడు.

నేను అన్నాను, సాతాన్‌, నేను ...“ మరియు ఆ మధ్య స్తంభము ఉన్నంత దూరములో ఆమె నాకు దూరముగా ఉన్నది. ”సాతాన్‌, ఈ వ్యక్తి తాను చేయగలిగినదంతయూ చేశాడు. మరియు వైద్యులు మరియు అందరూ తాము చేయగలిగినదంతయూ చేశారు. మరియు ఆమెను పట్టుకొనియుండవలెనని, నీవు కూడా ధృడనిశ్చయముతో ఉన్నావు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, నీవు ఆమెలో నుండి బయటకు వచ్చి మరియు ఆమెను విడిచిపెట్టమని నేను ఆజ్ఞాపించుచున్నాను“, అని చెప్పాను. ఆమె అక్కడే పడుకొని మరియు రెండు లేక మూడుసార్లు ఊదినది (బుస).

48

నేను చుట్టూ తిరిగి అతనివైపు చూచాను, మరియు “నీవు నమ్ముచున్నావా?” అని నేను అడిగాను.

అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రాన్హాం, నమ్ముట తప్ప ఇంక నాకు మరేమియూ లేదు.” “ఆమెను నేను ఏమి చేయగలను?” అని అన్నాడు.

నేను చెప్పాను, “ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళుము. వారినే ఎదుర్కొననిమ్ము...?...” నీవు సందేహింపకుండిన యెడల? ఇప్పుడు, అక్కడ ఆ స్తీ చేసినదేదో ... నీవు చూచియున్నావు...

..?... ఆమె నా పేరును పిలిచియున్నది, మరియు ఆమె నన్నుఎరుగకున్నది అనుదానిని ఇప్పుడు నీవు గ్రహింపగలవు“. అతడు చెప్పాడు ... ”మరియు సాతాను ఆ వరమును ఎరిగియున్నది“, అని నేను చెప్పాను.

మరియు అతడు, “నీవు ఏమి చేయమని చెప్పుదువో దానినే నేను చేయుదును”, అని అన్నాడు. “వెళ్ళు, ఆమె పొందుకొనిన స్వస్థతను బట్టి దేవునికి వందనములు చెల్లించుము. ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళుము. ఈ దినాలలో ఒకదినము ఆమె ఇంటికి తిరిగి వచ్చును”, అని చెప్పాను

“అయితే సరే”, అని అన్నాడు.

49

అక్కడ నుండి సుమారు మూడు వారములకు...?... జోన్స్‌, రెండు రోజుల కూడిక కొరకు ఆగుచున్నాము. మరియు అక్కడ కూర్చొని నేను చూచియున్నాను, మరియు ఒక వ్యక్తి మరియు అతడి భార్య, మరియు అయిదుగురు చిన్న పిల్లలు, సుమారు మూడు సంవత్సరముల వయస్సు కలిగిన ఒక బిడ్డను నేను చూచాను. నా వైపు చూచి చేతిని అటు ఇటూ ఊపుచున్న స్రీని నేను చూచాను. ఆమె ఎందుకు ఊపుచున్నదా అని నేను ఆశ్చర్యపడ్డాను. మరియు ఆమె చెప్పినది ... ఆమె ఊపుచున్నది. ఆమె భర్త దూరముగా నున్నాడు.

“అవును, ఎవరామె?”, అని నేను తలంచాను. ఆమె భర్త అన్నాడు, “సహోదరుడు బ్రాన్హాం నీవు నన్ను ఎరుగవా?”

నేను అన్నాను, “లేదు, నాకు తెలియదు”.

చెప్పాడు, “అక్కడున్న ఆ స్తీ జ్ఞాపకమున్నదా, ఆ పిచ్చాసుపత్రిలో?”

“అవునయ్యా”, అని అన్నాను.

“ఈ స్రీ, ఆమెయే”.

మరియు నేను అన్నాను, “అవునా?”

అతడు చెప్పాడు, “తరువాత రోజు ఉదయం నేను ఆమెను తీసుకొని వెళ్ళాను.” “మరియు ఆమెతో ఇక మాకు ఎటువంటి సమస్యా లేదు. నీవు చెప్పినట్లుగానే మేము ఆమెను ఆ ఆసుపత్రిలో ఉంచియున్నాము. మరియు తరువాత రోజు ఉదయం, ఆ నర్సు లోపలికి గదిలోనికి వెళ్ళినప్పటికి ఆమె కూర్చొని ఉన్నది. ఆమె తన అల్పాహారమును తినియున్నది, మరియు మూడవరోజు ఆమె ఆసుపత్రి నుండి పంపించివేయబడినది, ఒక మంచి స్థితిలో, ఒక సాధారణ స్త్రీగా ఆమె ఇంటికి తిరిగి వచ్చినది.”

సహోదరుడా, హల్లెలూయా. నేను దీనిని చెప్పుచున్నాను : అది యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మరియు ప్రతీ ఒక్క దయ్యమునకూ దేవుని యొక్క అధికారము తెలుసు మరియు నిజానికి అది ఏమియూ కాదు గానీ నీ పూర్ణ హృదయముతో యేసుక్రీస్తు యందు నమ్మికయుంచి, మరియు స్వస్థతనొ౦దుటయే. అది నిజము. నీవు దీనిని నమ్మెదవా?

50

ఓహ్‌, పురుషులారా, స్త్రీలారా, సహోదరులారా మరియు సహోదరిలారా, ఎందుకు, ఎందుకు ఇప్పుడు మనమందరము, ఏకహృదయముతో, “యేసూ, నేను నిన్ను నమ్ముచున్నాను, మరియు నేను దానిని అంగీకరించుచున్నాను”, అని చెప్పకూడదు. ఓహ్‌, అది ఎంత మహిమకరముగా ఉండును. ఎంత ఆశ్చర్యము.

వినండి, అపోస్తులుల యొక్క పద్ధతిలో ఒక స్వస్థతా కూడికను కలిగియుండుట ఏలాగనగా ప్రసంగించుటయే, దేవుడు ఏమీ చేయుచుండెనో దానిని చూస్తూ, మరియు అక్కడ విశ్వాసమును కనుగొనులాగున దానిని బయటకు పలుకుటయే, పురుషులు మరియు స్రీలు నమ్మునట్లుగా, దేవునిలో విశ్వాసము కలిగియుండుట కొరకు, దేవుని యందు నమ్మకముంచుటకు, మరియు దానిని వారందరికీ అనుగ్రహించును. మీరు దానిని నమ్మెదరా? ప్రార్ధనలో ఉండండి. మనకు సహాయము చేయులాగున మనము దేవున్ని అడుగుదాము, ఒక్క నిమిషము.

ఓ యేసూ, ఖచ్చితముగా, ప్రభువా, సత్యమే జయించును. ఖచ్చితముగా, సత్యమే. ఓ దేవా, ఇక్కడున్న జనులందరు నీకు తెలుసు. వారి పరిస్థితులను నీవు ఎరుగుదువు. వారిని గూర్చి సమస్తము నీకు తెలుసు. వారి విశ్వాసమును నీవు ఎరుగుదువు. మరియు వారికి విశ్వాసమును ఇవ్వవలెనని - నేను ప్రార్థించెదను. వినుట వలన విశ్వాసము కలుగును, వాక్యము వినుట వలన. ఈ రాత్రి దానిని అనుగ్రహించుము.

నీ ఆశీర్వాదముల యొక్క గొప్ప కుమ్మరింపుతో ఈ జనులను దీవించుము. అది నీవే అని ఈ పురుషులు మరియు స్త్రీలు గ్రహించెదరు గాక. దాని కొరకే వాక్యము బోధింపబడుతున్నది, ప్రభువు నందు నమ్మకముంచుము.

51

“నీవు నా గృహమునకు వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, కేవలము మాట మాత్రము సెలవిమ్ము. ఏలయనగా నేను ఒక అధికారము క్రింద ఉన్నవాడను, మరియు నీవొక అధికారము కలిగియున్నావు. మరియు నీవు ఏమి చెప్పినను, అది ఆవిధముగానే జరుగును”, అని చెప్పిన ఆ శతాధిపతిని గూర్చే మనము ఆలోచించుచున్నాము. ప్రభువా, నీవింకనూ అధికారము క్రింద ఉన్నావని తెలుసుకొనుటకు ఈ రాత్రి పురుషులకు మరియు స్రీలకు అనుగ్రహించుము. అవిటివారిపైనా, గ్రుడ్డివారిపైనా, క్యాన్సర్‌ పైన, అన్ని రకములైన వ్యాధులపైనా, పాపము పైన నీవు అధికారము పొందుకొనియున్నావు. నీవు చక్కగా దానికి అర్హుడవు.

నీవు ఆ ఉద్దేశ్యము కొరకే మరణించావు. సిలువ యొద్ద నీవు మా స్థానమును తీసుకొన్నావు. అతిక్రమములను నీ శరీరములో భరించియున్నావు. మరియు ఇప్పుడు, మమ్ములను విడిపించుటకు... నీవు పరిశుద్ధాత్మను పంపియున్నావు, మరియు ఆయన దానిని గూర్చి సాక్ష్యమిచ్చును. నీవు వాక్యమును పంపించావు అది దానిని గూర్చి సాక్ష్యమిచ్చును. నీవు పంపిన సేవకులు దానిని గూర్చి వారు సాక్ష్యమిచ్చెదరు. నీవు నీ వరమును పంపించియున్నావు, మరియు అది దానిని గూర్చి సాక్ష్యమిచ్చును.

ఓ దేవా, విశ్వాససహితమైన ఒక గొప్పహస్తము ఈ భవనములో కదలాడి మరియు అవసరతలో _ ఉన్నవారిని స్వస్థపరచుటకు అనుగ్రహించుము. ఏలయనగా ఆయన నామములో మరియు ఆయన మహిమార్ధమై దానిని మేము అడుగుచున్నాము. ఆమేన్‌.

52

ఓ, మై. నా హృదయమంతటితో నేను ఆయనను ప్రేమించుచున్నాను. నా ప్రాణమంతటితో, హృదయము మరియు మనస్సుతో ప్రభువైన యేసును నేను ప్రేమించెదనని, ప్రతీ ఒక్కరూ ఎరిగియుండవలెనని నేను కోరుచున్నాను.

కొంతకాలం క్రితం ఎవరో అన్నారు, ఒక పట్టణములో నన్ను బెదిరించారు, “ఒకవేళ నీవు దైవిక స్వస్థతను గూర్చి ప్రసంగించుట ఆపకపోతే, మేము వేదికపై ఒక బాంబువేసి పేల్చివేసెదము”, అని చెప్పారు.

నేను అన్నాను, “ఆ పొగ ఆగిపోకముందే నేను మహిమలో ఉందును.” “అది సరియే”, అన్నాను. మనమెందుకు భయపడెదమూ? మై, దేవుడు గనుక మన పక్షమున ఉన్న యెడల, ఎవరు నీకు వ్యతిరేకముగా ఉండెదరు? మీకు తెలుసు, నా యందు నమ్మిక కలిగియున్నవారికి అటంకము కలిగించిన యెడల, అతడి మెడకు ఒక తిరుగాటిరాయి కట్టి సముద్రపు లోతులో విసిరివేయుట మంచిది అని బైబిలులో వ్రాయబడియున్నది కదా? “నాయందు విశ్వాసముంచిన వారిని ఈ సూచకక్రియలు వెంబడించును. నా అభిషిక్తులను ముట్టవద్దు. నా ప్రవక్తలకు ఎటువంటి హాని తలపెట్టవద్దు”.

ఒకవేళ నీవు పోరాడదలచుకొన్న యెడల, దేవుడు పోరాడలేడు. నిలిచియుండుము; దేవున్ని పోరాడనిమ్ము, ఆయన దానిని నెరవేర్చులోనికి తెచ్చును. ఆమేన్‌. ఆయన ప్రతీ విమర్శను, ప్రతీ దానిని అవమానపరుచును. సహోదరులారా, మీరు ఆయనను నమ్మెదరా? విశ్వాసములో స్థిరులమగుదుము.

53

ఈ రాత్రి ఏదో విధముగా నేను వింత అనుభూతిని పొందుచున్నాను. నేను దేవున్ని అడిగి యున్నాను, ఈ రాత్రి ... నేను ఏమి చేసియున్నానో మీకు చెప్పెదను. నేను ఆయనను అడిగాను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు అది ఈ రాత్రే అగును గాక, అది ప్రతీ చోటా ఉన్న ప్రజలలోనుండి రోగములు విడిచిపోవును. అది గతరాత్రి కొంచెముగా జరిగినది. మరియు అవసరతలో ఉన్నవారు అక్కడ కొంతమంది ఉన్నారు, వారు లేచి మరియు సంపూర్ణులై ఈ భవనమును విడిచిపెట్టారు. అది ఈ రాత్రి వందశాతముగా ఉండును గాక. చూశారా? ఒక్క సమయములో ఒక్కొక్మరితో వ్యవహరిస్తూ, నేను ఆ ప్రార్ధనా కార్డులతో, నేను! ఒక్కసారి ఒక్కొక్క దానినే తీయవలయును. మరియు ఆది వేర్వేరు వ్యాధులను గూర్చి వచ్చుచున్నవి. అది కేవలము ఆ వ్యక్తిలో ఏ తప్పిదము (లోపము) ఉన్నదో అది మాత్రమే చెప్పును. కానీ అది దేవునిలో మనము కలిగియున్న విశ్వాసము మాత్రమే నిన్ను స్వస్థపరచును. అధికారమును నమ్ముము. దేవునిని నమ్ముము. చూడుము మరియు జీవించుము.

ఓహ్‌, ఆ ఇత్తడి సర్పము ఎవరిగూర్చి ప్రార్ధించలేదు, చేయగలదా? ఆ ఇత్తడి సర్పము... చేయలేదు. వారు ఏమి చేసిరి? ఆ ఇత్తడి సర్పము, అది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని యొక్క వరము అని నీవు నమ్ముచున్నావా? వారు చూచి మరియు జీవించిరి. బెతస్ట కోనేటి పైన ఉన్న ఆ దూత ఎవరిని గూర్చి ప్రార్ధించలేదు. వారు ఆ నీటిలోనికి దిగి మరియు స్వస్థత పొందుకొనిరి. అది నిజమేనా? నీవు స్వస్థపడుటకు దేవుడు మాత్రమే ఏకైకమార్గము.

ఇప్పుడు, ఇటువైపు నన్ను చూడుము. మీకు వాక్యము చెప్పుటకు దేవుడు దీవించెను. నేను నమ్ముచున్నాను దేవుడు...

54

ఎన్ని ప్రార్ధనా ...(ప్రార్ధనా కార్డులు?) అది సరే. అవి చాలా ఉన్నవని నేను ఊహించుచున్నాను. ప్రార్ధనా కార్డులన్నీ బయటకు ఇవ్వబడినవి. బహుశా ...?...

ఓ, మై. మీ ప్రార్ధనా కార్డుపై చూడుము, దానిపై ఏమి వ్రాయబడియున్నదో. మీరు పొందిన వ్యాధులు మరియు సంగతులన్నీ ఇక్కడ అవి మాత్రమే నీకు చెప్పబడును. మంచిది, అది లేకుండా దానిని నీవు ఎందుకు అంగీకరింపలేవు? అదియే ఆలోచన. విశ్వాసముంచుము. నమ్ముము.

మై, నేను ఈ జనుల పైకి చూచుచున్న... ఇప్పుడే ఇక్కడ నాలో ఏదో జరుగుచున్నది. అది ఏమిటో నాకు తెలియదు...నేను ఆ ప్రార్ధనా వరుసను పిలువలేను, ఏ విధముగానైనా. ఈ సమయమునకు ఇంకా మరేదో కావాలని దేవుడు కోరుచున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఆయన నా ప్రార్ధనకు జవాబు ఇచ్చును అని నేను నమ్ముచున్నాను. ఏదో...

ఇప్పుడు, స్నేహితులారా, నేను ఆపివేయుట లేదు. నా హృదయము దేవునికి తెలుసు. నేను ఇక్కడ నిలబడియున్నాను, ఎందుకనగా జనుల కొరకు ఏదో చేయాలని పరిశుద్ధాత్మ కోరుచున్నదని నేను నమ్ముచున్నాను. ఓ, మై, ఎంత మహిమకరమైనది. ప్రతీ ఒక్కరూ, ప్రార్ధనలో ఉండుము.

55

ఒక్క క్షణం. ఇక్కడ నేను క్రిందికి వెళ్ళి... జనులను చూడగోరుచున్నాను. చుట్టూ చూచెదను. ప్రతీఒక్కరూ ఇటువైపు చూచి మరియు విశ్వాసము పొందుకొని మరియు నమ్ముము, చుట్టూ తిరిగి మరియు భవనము గుండా రమ్ము ఇక్కడ విశ్వాసము కలిగియుండుము.

సహోదరుడా దేవుడు నిన్ను దీవించును. అక్కడే నమ్మి వెనుక అక్కడ పైన, కొంచెము ప్రక్కగా, నమ్ముటకు ప్రయత్నించుచున్న ఒక స్త్రీ నా వైపు చూచుటను నేను చూచుచున్నానని నేను నమ్ముచున్నాను. యవ్వన స్తీ అక్కడ కూర్చొని ఉన్నదని నేను నమ్ముచున్నాను. సహోదరీ, నీ హృాదయమంతటితో, నీవు నన్ను నమ్మెదవా? నీ యొక్క స్వస్థత కొరకు దేవుడు నన్ను ఇక్కడకు పంపెనని నీవు నమ్మెదవా? నీవు నాకు ఒక అన్యుడవు (తెలియనివాడవు)...?...నేను నిన్ను ఎరుగను. నీ గురించి నేను ఏమీ ఎరుగనని దేవునికి తెలుసు. ఇప్పుడు, ఇప్పటికైతే నీ గురించి నేను ఏమీ ఎరుగను. కానీ నీవు ఇటువైపు చూడాలని నేను కోరుచున్నాను. నీవు నమ్మవలెనని నేను కోరుచున్నాను.

ఒక్క సంగతి, ఇది నాకు తెలుసు; నీవు జీవింపగోరిన జీవితమును నీవు జీవించలేదు, జీవించావా? నీవు ఉండగోరిన మరియు నీవు ఆశించిన క్రైస్తవునిగా నీవు లేవు. అది నిజము. నీవు విజయవంతమైన జీవితమును జీవించలేదు, ఎందుకనగా నీ చుట్టూ అంధకారము అలుముకొనియున్నది. కానీ నేను ఇంకా...

ఇక్కడ, నీతో ఉన్న తప్పిదము ఇదే. ఒకవేళ నీవు ఏమి తప్పిదము చేశావో నేను నీకు చెప్పగలిగిన యెడల, నీవు నన్ను నమ్మెదవా? అది సరే. నీవు ఒక కిడ్నీ సంబంధిత... బాధపడుచున్నావు. కాదు, అది కాదు, అది ఒక పిత్తాశయపు సమస్య, అది నిజమేనా? నీ పిత్తాశయములో మంట (లేక) వాపు ఉన్నది. ఒకవేళ అదే నిజమైతే, నీ చేయి పైకెత్తుము? నీవు ఇంటికి వెళ్ళాని నేను కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి నా వాక్యము (మాట) నీకు అధికారముగా ఉండునని నీవు నమ్మెదవా? గృహమునకు వెళ్ళుము మరియు నీ హృదయమంతటితో దేవున్ని సేవింపుము, నీవు దానిని జయించెదవు. ఆమేన్‌. నీవు దానిని అంగీకరించెదవా? “ఆమేన్‌”, చెప్పుము. ఆమేన్‌. నీవు చేయుము.

56

తన చేతిలో ప్రార్ధనా కార్డు పట్టుకొనియున్న ఒక మర్యాదగా ఉన్న వ్యక్తి అక్కడ మీ ముందు కూర్చొనియున్నాడు. ఏదో...?... అక్కడ కూర్చొనియున్నాడు...?... అది సరే. అయ్యా, ఇక్కడ, ఇటువైపు చూడుము. నీవు అక్కడ కూర్చొని యుండుటను నేను చూచాను. నీవు కీళ్ళవాపు వ్యాధిలో బాధపడు చున్నావు, అవును కదా: కీళ్ళవాపు. చెప్పుము, నీవు ఈ బాలిక యొక్క తండ్రివి కూడా, కదా? అది నిజమేనా? నీ పాదములపై నిలబడుము. యేసుక్రీస్తు ఆ కీళ్ళవాపు నుండి నిన్ను స్వస్థపరిచెను. ఇక నీకు దీని అవసరము లేదు. ఆమెతో పాటుగా ఆ భవనము బయటకు వెళ్ళి మరియు దేవునిని మహిమపరచుము. నీవు ఇప్పుడే స్వస్థపడియున్నావు. నీకు నీ ప్రార్ధనా కార్డు అవసరము లేదు. ఆ నేలపై విసిరివేసి మరియు కొనసాగుము. అది నీకు అవసరము లేదు.

ప్రతి ఒక్కరూ, “దేవునికి స్తోత్రము” చెప్పెదము. ఇదే ప్రజలతో దేవుడు చేయగోరుచున్నాడు. ఆనందించుచూ బయటకు వెళ్ళుము.

57

సహోదరి, నీ గురించి ఏమిటి, అక్కడ చక్రాల కుర్చీలో కూర్చొన్న నువ్వు? లేక, నీవు... లేదు, అవును, అది నీ బిడ్డ కొరకు. ఇటువైపు చూడుము. బిడ్డ బాధపడుచున్నాడు, కండరములు పట్టేసి, చిన్నబిడ్డగా. నీ మనస్సులో ఏదో ఉండుటను నేను చూడగలుగుచున్నాను, మరియు చెప్పు... ఓహ్‌, నేను చూచాను. ఇంతకు మునుపు నీవు నా కూడికలకు హాజరైనావు. అది నిజమేనా? అది సత్యమేనా? నీవు ఖచ్చితముగా... లేదు, అది వేరొక కూడిక. ఇది కాకుండా నువ్వు వేరొక కూడికకు వచ్చావు. చెప్పుము, స్వస్థత పొందుకొనియున్న ఒక చిన్న బాలికను నీవు కలిగియున్నావు. అది నిజమేనా? మెల్ల కన్ను, చాలా వికారముగా. అది స్వస్థపడినది. అది నిజమేనా? ఒకవేళ అదే అయితే, అది అవునని నీ చేయి ఎత్తి చెప్పుము... అది సత్యము, సహోదరి. దేవుడు నిన్ను దీవించును. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విఫలమవ్వడు.

సహోదరి, దానిని గూర్చి నీవు ఏమి ఆలోచించెదవు? కీళ్ళవాపు వ్యాధితో నీవు ఇక్కడ బాధపడు చున్నావు? నీ కాళ్ళపై లేచి నిలువుము. నీ కీళ్ళవాపును ఇప్పుడదే యేసు స్వస్థపరచును. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసము కలిగియుందుము.

చూడుము సహోదరి, ఎర్ర టోపీ పెట్టుకుని ఉన్న నీవు. ఇటువైపు చూడుము. నీ హృదయమంతటితో నీవు నమ్మెదవా? ఒకవేళ ఒక్క క్షణం నీవు ఇటువైపు చూడగలిగితే, ఒకవేళ నీవు చేయగలిగితే, కొంచెము... నీవు క్యాన్సర్‌తో బాధపడుచున్నావు. అది నిజమేనా? మరియు ఆ క్యాన్సర్‌ కొరకు నీకు శస్త్రచికిత్స జరిగినది. అది నిజమేనా? అది విఫలమైనది. యేసుక్రీస్తు ఇప్పుడు నిన్ను ఆ క్యాన్సర్‌ నుండి స్వస్థపరిచెను. అది నిజము. విశ్వాసము కలిగియుండుము. నమ్ముము.

58

నీ సంగతి ఏమిటి, అమ్మా, ఆమె ప్రక్కన కూర్చొన్నది. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నావైపు చూచి మరియు నమ్ముము. నన్ను ఆయన ప్రవక్తగా దేవుడు పంపెనని నీవు నమ్ముచున్నావా? నీవు... బాధపడుచుండుటను నేను చూచాను, చెప్పుము, నీవు వేరొక సంఘమునకు చెందినదానవు కూడా, అవునా, దీని నుండి ... నన్ను చెప్పనివ్వండి :; నీవొక వేషధారివి, నేను నమ్ముచున్నాను, విశ్వాసము ద్వారా. అది నిజమేనా? ఒకవేళ అయితే, నీ చేయి ఎత్తి మరియు అది నిజమేనని చెప్పుము. అది నిజమేనా...?... నీవు ఆరాధించుచున్న స్థలము యొక్క చిహ్నమును చూడుము. నీవు మూర్భవ్యాధితో బాధపడుచున్నావు. అది నిజమేనా? మూర్చ వ్యాధి. దేవునిలో విశ్వాసము కలిగియుండుము. ఆయన నిన్ను బాగుపరచును, మరియు ఆయన నిన్ను సంపూర్ణునిగా చేయును. నీ హృదయమంతటితో దానిని నీవు నమ్మెదవా? వెళ్ళి ఆయనను ఆరాధించుము మరియు ఆయనను విశ్వసించుము.

అక్కడ కూర్చొని ఉన్న ఆ చిన్న స్త్రీ. సహోదరి, నీవు కలిగియున్న ఆ స్త్రీ సంబంధిత సమస్య, నీవు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు పది నిముషముల క్రితము నిన్ను విడిచిపెట్టి పోయినది. లేచి వెళ్ళుము.

ఇప్పుడు, నువ్వు, ఆమె చుట్టూ చేయి వేసినవాడవు. హూ - హూ. నీవు నిజముగా భయపడుచూ వణుకుచున్నావు, అవును కదా. నీవు కూడా స్వస్థపడియున్నావు.

మరియు అక్కడ ప్రక్కన కూర్చొని ఉన్న ఆ స్తీ ఆమె యొక్క కన్ను సమస్యతో బాధపడుచూ, ఆమె కూడా కొద్ది నిముషముల క్రితము స్వస్థపడియున్నది. సహోదరి, నీవు స్వస్థపడియున్నావు. దేవుడు నిన్ను దీవించును.

59

ఇప్పుడు, ఇక... నీవెందుకు నీ (వేలును నావైపు చూపుచున్నావు... ఆ చిన్న బాలిక వేలు నావైపు చూపుచున్నది? నన్ను చూడుము. యేసుక్రీస్తు నన్ను ఇక్కడకు పంపెనని నీవు నమ్మెదవా? నా మాటను బట్టి ప్రవక్తగా అంగీకరించెదవా, ఆ చిన్నబాలిక పుట్టుకతోనే మూగ మరియు చెవిటిదానిగా జన్మించినది. అది నిజమేనా? యేసుక్రీస్తు ఆమెను సంపూర్జునిగా చేసెను...?... అది నిజము. హల్లెలూయా! యేసుక్రీస్తు, అదే దేవుడు.

ఇక్కడ కూర్చొని ఉన్న ఈ స్తీ చప్పట్లు కొడుతూ, ఇటువైపు చూస్తూ, గ్రుడ్డితనముతో అక్కడ ఆ చిన్నబాలుని ప్రక్మన కూర్చొన్నది. సహాదరి, విశ్వాసము కలిగియుండుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును మరియు నిన్ను సంపూర్జునిగా చేయును. నీవు దానిని నమ్మెదవా? నీ హృదయమంతటితో నీవు దానిని నమ్మెదవా? విశ్వాసము కలిగియుండుము. సహోదరీ, నీవు ఆమెను మోచేతిపై తాకుము. నీ హృదయమంతటితో నీవు దానిని నమ్మెదవా? పిదప లేచి మరియు ఇటువైపు రమ్ము. విశ్వాసము కలిగియుండుము. దేవుడు నిన్ను దీవించును. సందేహింపవద్దు. నీవిప్పుడు నీ చూపును పొందుకొనియున్నావు. ఒకవేళ నీవు వచ్చి ఇటువైపు కదిలినచో ఇటువైపు వచ్చి కదులుము. దేవుడు - నీవు దానిని పొందినట్లు చేయును ...హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఆయన నిన్ను స్వస్థపరిచెను.

ప్రతీ ఒక్కరూ, ఇటువైపు చూడుము. విశ్వాసము కలిగియుండుము; వద్దు... మీ కళ్ళను ఇటువైపు ఉంచుము, ప్రతీచోటా.

60

అమ్మా, ఆ కుర్చీలో, ఆ కూర్చొనియున్న కుర్చీలో బంధింపబడి, నీవు నమ్ముచున్నావా? అక్కడ ఆ పచ్చరంగు వస్త్రములు ధరించి కూర్చొనియున్నావు. నీ పాదములపై లేచి నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచెను. అది నిజము.

“దేవునికి స్తోత్రము”, చెప్పెదము. ముందుకు రండి. ఎవరు దేవుని యొక్క ఆత్మ ద్వారా స్వస్థపడగోరుచున్నారు? ఆమె తన పాదములపై లేచి నిలబడుటకు ఎవరైనా ఆమెకు సహాయము చేయుము. ఇదిగో ఆమె వచ్చుచున్నది, బంధింపబడి, నడుస్తూ. ప్రతీఒక్కరూ, “దేవునికి స్తోత్రము” చెప్పెదము. తన కుర్చీలో నుండి ఆమె బయటికి వస్తూ... ముందుకు రమ్ము. ఇప్పుడే యేసును స్వస్థపరచువానిగా అంగీకరింపుము. నమ్ముచూ రమ్ము

సర్వశక్తుడైన దేవా, జీవాధిపతి, ప్రతీ మంచి ఈవులను ఇచ్చువాడా, ఈ ప్రజలపై నీ ఆశీర్వాదములు కుమ్మరింపుము.స్నేహితులారా, ఆయనను విశ్వసించుము.ఇప్పుడు నేను ఆయన విశ్వాసము ద్వారా మరియు యేసుక్రీస్తు నామములో ... విశ్వాసిగా ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ విశ్వాసము కలిగియుండుము.

అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరిచెను, సహోదరి. విశ్వాసము కలిగియుండుము, నమ్ముము. నీవు ఆ...

నీ చేతులు పైకెత్తుము, ఈ క్షణమే ఆయనను అంగీకరింపుము. చెప్పుము, “ప్రభువా ...” మీకు ఆ ప్రార్ధనా కార్డులు అవసరము లేదు. ప్రతీ ఒక్కరూ నమ్ముము. మీ ప్రార్ధనా కార్డులను గాలిలో 'విసిరివేయుము. “నేను క్రీస్తును నమ్ముచున్నాను” అని చెప్పుము. మీ ప్రార్ధనా కార్డులను పారవేయుము. ఆ విధముగా చేయవలెను. హల్లెలూయా!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...