మూడవ ముద్ర

మూడవ ముద్ర

 స్నేహితులారా, శుభ సాయంకాలం, ప్రార్థన కొరకై మనమిపుడు ఒక క్షణం నిలబడదాము. మన తలలు వంచుకుందాము.

2 మా పరలోకపు తండ్రీ, ఆ మధురమైన పాటను మేము వినుచుండగా నీవు…సమీపములోయున్నావని ప్రభువా—మేము ఆలోచన చేస్తున్నాము. మరియు ఈ రాత్రి నీవు మమ్ములను స్వీకరించమని; ప్రభువా, నీ యొక్క బిడ్డలుగా, ఒక అవసరతతోనున్న ప్రజలుగా, మా యొక్క అన్ని పాపములు, అతిక్రమములు క్షమించి, నీ ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాము.

3 మరియు, మేము ఇపుడు జీవిస్తున్న ఈ గంభీరమైన ఘడియలో లోకము సంవత్సరము సంవత్సరము అంధకారము అంధకారమైపోవుట చూస్తున్నాము. మరియు, ఆయన, ఆయన వాక్యమందు బయలుపాటుతో ప్రత్యక్షపరచుకొనుట ద్వారా ప్రభువు యొక్క రాకడ మరింత కాంతివంతముగా కన్పించుచున్నది. ప్రభువా, ఈ రాత్రి మరలా ఈ యొక్క కూటములో, ఈ గ్రంథము యొక్క ఈ మూడవ ముద్రను మాకై తెరువమని నీకు ప్రార్థించుచు అందుకై ప్రయత్నించుచున్నాము. తద్వారా మేము ఏమి చేయవలెనో, ఏలాగు జీవించవలెనో, మంచి క్రైస్తవులుగా ఎలా మేముండవలెనో మాకు తెలియబడును గాక.

4 దేవా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి క్రైస్తవేతరుడు నీ యొక్క అవసరతను గుర్తెరుగులాగున, నేను ప్రార్థించుచున్నాను. అది అనుగ్రహించుము. మరియు పరలోకపు తండ్రీ, కొత్తగా జన్మించిన ప్రతి క్రైస్తవుడు గతకాలమున్న కన్నా ఇప్పుడు తాను మీకై అత్యంత సన్నిహితునిగా జీవించవలెనను గ్రహింపును, మరియు మేమందరము క్రైస్తవ ప్రేమ మరియు విశ్వాసపు ఐక్యతలోనుండునట్లు చేయమని నేను—నేను ప్రార్థించుచున్నాను.

5 ఈ రాత్రి మా మధ్యనున్న ప్రతి యొక్క వ్యాధి గ్రస్తునికి స్వస్థత అనుగ్రహించుము, ప్రభువా నిన్ను గూర్చిన అవసరత వారు గ్రహించుదురు గాక. తండ్రీ, నీ యొక్క ఘనతా, మహిమార్ధమై చేయబడిన లేక చెప్పబడిన ప్రతి దానిని నీవు దీవించమని నేను ప్రార్థించుచున్నాను. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

6 సరే. తిరిగి, ఈ రాత్రిలో, వారములోని ఈ బుధవారము—తిరిగి, మనము కూడుకొనియున్నాము. ఆయన వాక్యముపైన ఆయన యొక్క విస్తారమైన ఆశీర్వాదములు కొరకు ఈ రాత్రి ప్రభువుపై ఆధారపడుచున్నాము. మరియు నేను దేనిని చెప్పవలెయునో అవి వాటికి తగినట్టుగా అగుపించు వాటిని గూర్చి ఆలోచించుచు, అందు కొరకై ఎప్పటిలాగే వాటిని నేను ఈ దినాన పఠనము చేశాను. అటు తరువాత వ్రాయబడిన ఈ వాక్యము యొక్క అర్థములను మరియు భావములను నాకు దయచేయుటకు ప్రభువుపై ఆధారపడుచున్నాను. మరియు వారములో ఆయన మన యెడల చేసిన దాని కొరకు అనగా ఈ ముద్రలు తెరచినందుల కొరకు నేను ఆయనకు కృతజ్ఞుడనైయుంటున్నాను.

7 మరియు, ఇపుడు, ఒకవేళ అది ఆదివారం ఉదయమైతే మంచిది…మీకు తెలుసా, చాలాసార్లు మనం అపార్ధం చేసికొనెదమని కాదు. అయితే, మీకు తెలుసా…అది ఆలాగుయుంటుంది. మరియు, కాబట్టి, ఒక వేళ, ఆదివారం ఉదయం, అందును గూర్చి, ఎంతమందికి వారి మనస్సులో ప్రశ్నలుంటవో అది వ్రాసి, ఇక్కడ బల్లపై అవి ఇవ్వండి. శనివారం రాత్రికి, తద్వారా అవేంటో, నేను చూస్తాను. అటు తరువాత, ప్రభువు చిత్తమైతే, ఆదివారం ఉదయం మీకు జవాబు ఇచ్చుటకు ప్రయత్నిస్తాను. మనం ప్రణాళిక చేసిన దానికంటె అది శ్రేష్టమని నేననుకుంటాను. ఎందుచేతనంటే కొన్నిసార్లు అది అపార్ధం చేయబడుతుంది, తెలుసా. కాబట్టి అది…నేను అది సరిచేయడం మంచిది. తెలుసా, అదేలాగుండాలో అది ఆలాగే ఉంటుంది. కారణం కొన్నిసార్లు…

8 ఈరోజు ఒకరు నన్ను పిలిచి అడిగాడు—“ఎత్తబాటు జరిగినపుడు జెఫర్ సన్ విల్ నుండి ఒకరు మాత్రమే, న్యూయార్క్ నుండి ఒకరు, మిగతావారు ఇతర దేశముల నుండి ఎత్తబడెదరు,” ఇది నిజమా యని తెలుసుకొనగోరెను. కాబట్టి చూశారా, అది అపార్ధం చేయబడెను. అటు తరువాత ఒకరు అన్నారు, “శనివారం రాత్రి, ప్రభువు ఆఖరు ముద్ర ఇచ్చినట్లయితే, అలాగైతే ఆదివారం యేసు ఇక్కడ ఉంటాడు.” చూశారా? కనుక అది యొక…నీవు చూడు. నీవు—నీవు కాదూ…అది ఆలాగు కాదు. మరియు నీవు కాదు. నీవు—నీవు కాదు…అది కాదు.

9 మాకు తెలియదు. ఆయన వచ్చుచున్నాడని ఎవరైన మీకు చెప్పినట్లయితే, వారు తప్పని మీకు తెలుసు. ఎందుకంటె ఎవరికి అది తెలియదు. అయితే, అది ఇపుడేయైనట్లుగా, ఈ దినాన మనం జీవించాలి.

10 ఒక్క నిమిషము, నేను మిమ్ములను ఒక విధంగా త్రిప్పాలనుకుంటున్నాను, సంసిద్ధంగా ఉండుడి. ఆయన యొక్క కాలము ప్రకారము ఇప్పటి నుండి సరిగ్గా మూడు నిమిషముల లోపుగా యేసు వచ్చునని నేను నమ్ముతున్నాను. అదెంతయౌతుందో మీకు తెలుసా? సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు. ఆయనతో వెయ్యి సంవత్సరములు ఒక రోజు, చూశారా.

11 కాబట్టి, అక్కడ అపొస్తలుడు ఇక్కడ చెప్పినది మీరు వినినపుడు “కాలము సమీపించియున్నది,” ఇక్కడ “కాలము సమీపించియున్నది.” అపొస్తలుడు ప్రకటనలో చెప్పాడు. అదెంతో మీకు తెలుసా? అది…దేవునికది నిన్నటి దినములాంటిది. చివరకు రెండు రోజులు కూడా ఇంకా కాలేదు.

12 మరియు, చూడండి, ఆయన రాకడకు మూడు నిమిషములు తక్కువగా ఉన్నట్లయితే, అది మనకు సుమారు ముప్పయి సంవత్సరములు లేక ఆ విధముగా ఉంటుంది. ఏలాగో చూడు, ఏ మూడు నిమిషాలు ఆయనకు; ఆయన వచ్చుటకు ఇది వరకే లేచియున్నాడు. కాబట్టి, మనము…కొన్నిసార్లు నీవిక్కడ చదివినపుడు వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడుచున్నాడు, మన ప్రకారము కాదు. చూశారా.

13 మరియు అటు తరువాత, రేపు రాత్రికి ఆయన వస్తున్నాడని నాకు తెలిసినట్లైతే, రేపు నేను చదివి, నాలుగవ ముద్ర కొరకు వర్తమానము నాకివ్వమని నేను ఆయనను అడుగుతాను. మరియు నేను ఇక్కడకు వచ్చి, అలాగే అది బోధిస్తాను. అవునా? ఆయన వచ్చినట్లయితే నేనేమి చేస్తుంటానో నేను—నేను ప్రతి దినము చేయాలనుకుంటాను. మరియు ఆయన వచ్చునపుడు నాకివ్వబడిన స్థానములో కంటె ఇంకొక స్థానములో నేనుండుటకు కోరుకొనుట లేదు. కాబట్టి ఆయన వచ్చు వరకు కొనసాగుదాము.

14 కొన్నిసార్లు మనము చదువునపుడు బహు జాగ్రత్తగా యుండవలయును. మరియు నీవు చదువునపుడు, టేపులను తీసుకొను, వాటిని జాగ్రత్తగా విను. ఎందుకనగా టేపులో మీరు దానిని పొందుకోగలరు. ఎందుకనగా వారు టేపులను వెనుక నుండి వినునట్లు చేయుచుండిరి. మరియు అవి తేటగాను మంచిగానుయున్నవి. కనుక, నీవు అక్కడ విశదముగా పొందుకోగలవు.

15 ఇపుడు, ప్రతి యొక్కరు క్రీస్తుతో ప్రేమ కలిగియున్నారని నిరీక్షిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి యొక్కరు ఆయనను ప్రేమిస్తున్నారు.

16 కొన్నిసార్లు, ఏది ప్రజలను గలిబిలి చేస్తుందనగా, ఒకరు లోపలకు వస్తాడు, పరిచర్యలో మొదటి భాగాన్ని అందుకోడు. చూశారా. తరువాత లోపలకు వస్తారు, నీవు పునరావృతం చేసినది వారు వింటారు. చెప్పబడినది తీసుకుంటారు. మరియు మొదటి భాగము గ్రహించలేరు. అపుడు, అదంతా వారికి గందరగోళంగా యుంటుంది, చూశారా. వ్యత్యాసకరమైనది యొకటి చెప్పినట్లుగా వారు తలస్తారు. అయితే అది—అయితే అది కాదు.

17 కాబట్టి, నీవు అర్థం చేసికోని దాని మీద నీకు ప్రశ్నయున్నట్లైతే, ఒక కాగితం ముక్క పైన అది వ్రాయు. ఇపుడు, శనివారం రాత్రి మధ్యలో ఏ సమయులోనైనా లోపల ఉంచు. ఆదివారం ఉదయం నేను ప్రయత్నిస్తాను…అది కొంచెము కలవర పరిస్తే—“సరే, దీని అర్థం ఇదా యని నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను దానిని గ్రహించలేకపోతున్నాను” అని చెప్తావు. నా భావమేంటో మీకు తెలుసా. ప్రభువు చిత్తమైతే, ఆదివారం ఉదయం నీకు జవాబు చెప్ప ప్రయత్నిస్తాను.

18 ఇపుడు, పురాతనమైన శుభప్రధమైన ఈ వాక్యములోనుండి ఈ రాత్రి మనం చదువుకోబోతున్నాము. 6వ అధ్యాయములో నుండి మూడవ ముద్రతో మనమిపుడు ప్రారంభిస్తున్నాము. అది 5వ వచనము, 5వ మరియు 6వ వచనము.

19 మరియు, రేపు రాత్రికి మనం నాలుగు గుఱ్ఱపు రౌతులను ముగిస్తాము; తెల్లని గుఱ్ఱం, ఎర్రని గుఱ్ఱం, నల్లని గుఱ్ఱం మరియు పాండుర వర్ణపు గుఱ్ఱం.

20 మరియు నేనిది చెప్పాలని ఆశిస్తున్నాను. ఏదనగా, ప్రతియొక్క సారి, ఈ ఉదయం కూడా సుమారు…నేను చాలా పెందలకడ లేచాను, కార్యాలను ప్రారంభించుటకు ముందే ప్రార్థనకు వెళ్ళితిని, దినమంతా ప్రార్థించుచుంటిని. అయితే, ఈ ఉదయం చాలా పెందలకడనే నేనెక్కడయున్నానో అక్కడకు పరిశుద్ధాత్మ వచ్చాడు. మరియు ఎంతో స్పష్టముగా, నేను—నేను చూశాను. మరొక ముద్ర తెరవబడుట. ఖచ్చితంగా. ఇప్పుడు—ఇప్పుడు—ఇప్పుడు ఆయన నా మాట వింటున్నాడని నాకు తెలుసు. నేను చాలా కృతజ్ఞుడను.

21 ఇపుడు ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి జరిగియున్నది, అది మీరు దానిని గ్రహించారని నేను అనుకుంటున్నాను. చూశారా, చూశారా, అక్కడేదో సంభవించుచున్నది. ఈ యొక్క సంఘమును ఒక్కసారి పరిశోధించగోరుచున్నాను. వాస్తవముగా అది జరుగులోగా వారు వాస్తవముగా పట్టుకొనగలరా అని చూస్తాను. ఇపుడు జ్ఞప్తించుకోండి. నేను మీకు ఏమి చెప్పానో జ్ఞప్తించుకోండి. మరియు ప్రభువు ఇపుడు మనకు సహాయము చేయునుగాక.

22 ఇపుడు 5వ వచనములో.

ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు—రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండియుండెను.

మరియు—దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను…ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.

23 మనం దాటి వచ్చిన ముద్రల మీద కొద్దిగా వెనుక వృత్తాంతమును చూద్దాం. ఎందుకనగా సంఘకాలముల వలె ఇది ఉన్నది. మునుపటి కార్యాలు చూద్దాం…లేఖనములో కాలాలు ఆ విధంగానేయున్నవి. ఒక దానికి పైగా ఒకటి, నిచ్చెన ఎక్కుటవలె; మెట్లు ఎక్కుట వలె; ఒక దానిమీద ఒకటి పరుగు తీయుట, నీవు మెట్లు ఎక్కినట్లు ఆలాగు తిరిగి వచ్చుట.

24 మరియు, ఇపుడు, ఈ ముద్రలు…అదొక—ముద్రించబడిన విమోచనా గ్రంథము. అది ప్రతి యొక్కరు అర్థం చేసికుంటున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] మరియు ఈ గ్రంథము ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది. అది యొక ఏడు ముద్రల గ్రంథము. చూశారా?

25 దానిని యిర్మీయా నుండి మరియు అందరి నుండి తీసి, చిత్రీకరించి మీకు చూపితిమని ఇపుడు గుర్తుంచుకొనుడి. ఇపుడు వారు…వారు ఈ విధంగా వ్రాశారు లేదా కాగితంపై వ్రాయబడలేదు. అయితే అది చర్మముపై వ్రాయబడెను. [సహోదరుడు బ్రాన్హాం కాగితపు పత్రాలు తీసుకొని చుట్టటమును మరియు ముద్రించుటను చూపించెను—సంపా.] వారు ఈ విధముగా అది చుట్టిరి. ఇపుడు అది…దాని యొక్క చివర ఆ విధముగా వదలిపెట్టబడెను. అక్కడ ఏమున్నది అది చూపించుచున్నది. అటు తరువాత, తరువాతది, అదే స్థానము తీసుకొనును, అదే విధముగా చుట్టబడును, ఆ విధముగా చుట్టబడును. తరువాత ఇక్కడ చివర, అది ఆ విధముగా చింపబడును ఇంకొకటి వదలిపెట్టబడును.

26 సరే. అది ఏడు ముద్రల గ్రంథము. గత కొద్దికాలం క్రితమే మనము వాడే ఇటువంటి గ్రంథములు వచ్చినవి. పాతకాలంలో గ్రంథములన్ని చుట్టలు. అవి చుట్టబడియుండెను. మరియు అటు తరువాత వారికి అంశము లేక ఏదైన కావలయునంటె…వలె—బైబిల్ గ్రంథము చుట్టబడిన యెడల, యెషయా పుస్తకము నీవు చదువగోరిన యెడల; యెషయాకు ఇటు త్రిప్పి, ఆ విధముగా దానిని విడదీసి, అది చదవవలెను. విమోచన యొక్క ఏడు ముద్రల గ్రంథము ఇది.

27 మరియు గొఱ్ఱెపిల్ల వచ్చి, సింహాసనమందు ఆసీనుడైయున్న వాని చేతిలో నుండి గ్రంథమును తీసుకొను ముద్రలను విప్పెనని మనము కనుగొనుచున్నాము. మరియు వాటిని విప్పి, ప్రజలకు ముద్రలను విప్పెను.

28 సంఘకాలములలో మనము తీసుకున్న నాలుగు జీవులు అక్కడ కూర్చున్నవి. అదే నాలుగు జీవులను మీరు లేఖనమంతట చూచుచున్నారు. మరియు ఈ ముద్రలు విప్పబడుచుండగా ప్రకటనలు చేయుచున్నవి అవే. ఇప్పుడు, అది విమోచనా పుస్తకమని మనము చూచుచున్నాము.

29 అటు తరువాత మనం వెనుకకు వెళ్ళి సమీప బంధువుడగు విమోచకుని తీసుకున్నాము. మరియు ఆయన పని ఏదో చూచుటకు ఆయనను తీసుకున్నాము. మరియు ఈ సంవత్సరాలన్ని సమీప బంధువుడగు విమోచకుని పని క్రీస్తు చేస్తున్నాడు. ఇపుడు అర్థం చేసికున్నవారందరు “ఆమేన్” అని చెప్పండి. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] సమీప బంధువుడగు విమోచకుని పని ఆయన చేయుచున్నాడు.

30 అయితే, ఒక విమోచనా కార్యము ముగింపు సమయము వచ్చును. విమోచనా కార్యము ముగిసిన వెంటనే, తరువాత ఆయన దేవుని సింహాసనమును విడిచి పెట్టును. ఎక్కడైతే ఆయన కూర్చున్నాడో ఇపుడు అది. అయితే అది ఆయన సింహాసనము కాదు. “నేను జయించి నా తండ్రి సింహాసనము మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనము పైన కూర్చుండనిత్తును.” అది ఆయన సింహాసనము కాదు. అది ఆత్మయైన దేవునికి సంబంధించినది. గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుకు, అది ఆయనకు సంబంధించినది కాదు. ఆయన అవతారమెత్తిన దేవుడు, చూశారా; అదే దేవుడు, అవతారమెత్తెను. ఇపుడు ఆయన స్థలమునుండి లేచి…

31 మొదట, ప్రకటన బయలు వెడలినది, “ఎవరు వచ్చి…ఈ విమోచనా గ్రంథము తీసుకొనగలరు?” అని. చూశారా. సమస్త విమోచనా ప్రణాళికంతటికి, ఆదాము నుండి, ఆదాము పోగొట్టుకున్నదంతా.

32 ఆదాము వరకు ఏదీ నశించలేదు. ఆదాము తరువాత భూమి మీద అంతా నశించిపోయినది. భూమిపై సృజించబడిన అంతయు నశించినది. ఆదాముతో సమస్తమును పడిపోయెను. అగాధమును దాటెను. తద్వారా ఎవరును ఏ విధముగాను వెనుకకు రాలేకపోయిరి. నరుడు, అతడు పాపము చేసినపుడు తన మార్గమును విడిచాడు, అతడు వెనుకకు వచ్చుటకు మార్గము లేదు. తరువాత…

33 ఈ ప్రశ్న అడగబడినపుడు; ప్రత్యక్షత తెచ్చిన యోహాను…ప్రవక్త యోహాను, దర్శనములోయుండి, అది చూశాడు. పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రిందగాని గ్రంథము చూచుటకైనను యోగ్యుడు లేడు. చూశారా. అటు తరువాత గొఱ్ఱెపిల్ల ముందుకు వచ్చి, ఆయన గ్రంథమును తీసుకున్నాడు. ఇక ఏడ్వవద్దు అని యోహానుకు చెప్పబడెను. ఆయన చెప్పాడు, “ఇదిగో, యూదా గోత్రపు సింహము జయించెను. మరియు—మరియు ఆయన గ్రంథమును తీసుకొని అది విప్పును.” కాబట్టి సింహమును చూచుటకు అతడు తిరిగెను. అతడు గొఱ్ఱెపిల్లను చూచెను. పెద్ద పిలచి అన్నాడు “సింహము జయించెను” అని. అయితే అతడు వచ్చి చూచినపుడు, సింహాసనము నుండి వచ్చుచున్న గొఱ్ఱెపిల్ల.

34 ఇపుడు, ఇంతక ముందు దానిని అతడు గమనించలేదు. ఎందుకని? అక్కడ వెనుక ఆయన మధ్యవర్తిత్వపు పనిని జరిగించుచునేయుండెను. ఏలయనగా ప్రజల కొరకు రక్తము కారుచుండెను, జగత్తు పునాది వేయబడక మునుపే పేరు వ్రాయబడియున్న ఆ చివరి ఆత్మ వచ్చు వరకు ఆయన విజ్ఞాపణ చేయుచున్నాడు. అక్కడ అందులో చాలామంది ఉందురు. అది అంతే. ఇతరులు లోనికి కూడా రారు. వారికి లోపలకు వచ్చుటకు ఇష్టము కూడా యుండదు. కాబట్టి, తరువాత, ఆఖరి ఆత్మ లోపలకు వచ్చునప్పటికి విమోచనా సమయం ముగియును.

35 అటు తరువాత, సృష్టియంతటిలో తాను ఏమి విమోచించెనో ఆయన హక్కులను పొందుటకు గొఱ్ఱెపిల్ల వచ్చును. భూమి మరియు సమస్తము ఆయనకు చెందును. చూశారా? ఆయన దానిని తన స్వరక్తమిచ్చి విమోచించెను. ఈ గ్రంథం తీసుకొనుటకు ఆయన వచ్చునప్పటికి, అది తెరచుటకు వచ్చునప్పటికి వారు…యోహాను ఇక ఏడ్వలేదు. ఈ గొఱ్ఱెపిల్ల వధింపబడిన గొఱ్ఱెపిల్లగా చూశాడు. అది ఎపుడో చంపబడినది. అయితే అది తిరిగి బ్రతికినది. వధింపబడిన గొఱ్ఱెపిల్లే రక్తము కారుచున్న గొఱ్ఱెపిల్ల, చుట్టు రక్తమున్నట్లుగా మనము చూస్తున్నాము. అది వధింపబడెను. అది వధింపబడిన తరువాత అది తిరిగి లేచినది. అది సింహాసనం పైన కూర్చున్నది. సింహాసనం వెనుకయుండి, ఈలాగు, రానున్న ఆ ఆత్మల కొరకు విజ్ఞాపణ చేస్తున్నది. తరువాత ఆఖరిది అక్కడున్నపుడు అది పూర్తియైనపుడు…దేవుడు ఇంకా విమోచనా గ్రంథమును పట్టుకొనియున్నాడు. చూశారా? ఇపుడాయన రక్త సంబంధియగు విమోచకుని పనిని చేయుచున్నాడు.

36 బోయజు వలె, బోయజు వచ్చు వరకు, రూతు కూర్చొనియున్నది. నా అర్థం బోయజు…రక్త సంబంధియగు విమోచకుని పనిని చేశాడు. కొంచెం కాలం క్రితం నేను బోధ చేసినది, మరియు ఇంకా మరియు ఆఖరి విషయం రూతు వేచియుండుట. ఏ విధముగా సంఘములో నేను దానిని పోల్చినది జ్ఞాపకముంచుకోండి? బోయజు రక్తసంబంధియగు విమోచకుని పని చేయుటకు వెళ్ళెను. అతడు అది చేశాడు. తన చెప్పును విప్పి తన సాక్ష్యము వినిపించెను. మరియు నయోమిని విమోచించాడు. తద్వారా రూతును పొందుకొనెను. ఇపుడు, కనుక, రూతు వేచియుండెను, ఎందుకనగా ఆమె ఎపుడో శ్రమపడెను. ఆమె ఈ మిగతావన్ని చేసినది అయితే ఆమె ఎదురు చూస్తుంది. మరియు తరువాత…సంఘము ఎదురు చూస్తూ విశ్రాంతిలోనున్నది, (వారిలో చాలామంది భూమి యొక్క ధూళిలోయున్నారు), ఆయన తన రక్త సంబంధి విమోచనా పని చేస్తుండగా.

37 లోకము ఘోరమైన స్థితికి ఇంకా దిగజారిపోవుచున్నది. పాపము పెరిగిపోవుచున్నది. మరియు—మరియు వ్యాధి, ఇబ్బంది మరియు మరణము మరియు దుఃఖము ఎక్కువైపోతున్నది. భక్తిలేని పురుషులు, భక్తిలేని స్త్రీలు అక్కడక్కడే చనిపోతున్నారు. క్యాన్సర్, ప్రతీది వారిని తినివేస్తున్నది. వారు దానిని నిలుపగల విశ్వాసము గాని నివారింప శక్తిగాని పొందలేకపోతున్నారు.

38 ఇపుడు గమనించండి, అయితే, తరువాత, ఇదంతా అయిన తరువాత ఆయన యొక్క మధ్యవర్తి…తరువాత, ఆయన విజ్ఞాపణ తరువాత, ఆయన వచ్చి, ఆయన చేతిలో నుండి గ్రంథమును తీసుకొనును. మరియు తరువాత యోహాను, పరలోకమందున్నవన్నియును మరియు…బలిపీఠము క్రిందనున్న ఆత్మలు కేకలు వేయ ఆరంభించిరి. తిరిగి మనము దానిని ఆరవ ముద్రలో పొందుకుంటాము. మరియు వారు ఎంతగా ఆనందించారో! మరియు వారు సాగిలపడ్డారు. పెద్దలు పరిశుద్ధులు ప్రార్థనలు క్రుమ్మరించిరి. మరియు బలిపీఠము క్రిందనున్న ఆత్మలు కేకలు వేసిరి, “నీవే యోగ్యుడవు ఎందుకనగా దేవుని కొరకు మమ్ములను విమోచించితివి. మరియు రాజులగాను యాజకులుగాను జీవించుటకు భూమికి మేము తిరిగి వెళ్ళనైయున్నాము.” ఓ అక్కడ ఒక…

39 మరియు యోహాను చెప్తున్నాడు, “పరలోకమందున్న ప్రతి ఒక్కరు, భూమి క్రిందనున్న ప్రతి ఒక్కరు మరియు ప్రతీది” అందును గూర్చి అతడు దేవుని స్తుతించుట అతడు విన్నాడని. యోహాను తన పేరు అక్కడయుండుట కనుగొనియుంటాడు. మీకు తెలుసా. ఆ సమయమంత.

40 తరువాత, అతడు చెప్పాడు “విమోచనా గ్రంథము తీసుకొనుటకు ఆయన అర్హుడు అని.” ఇక మీదట అది న్యాయాధిపతికి చెందినది కాదు. అది విమోచకునికి చెందినది. విమోచనా కార్యమును ఆయన చేశాడు.

41 ఇపుడు ఆయన ఏమి చేశాడో దానిని ఆయన సంఘమునకు చూపించబోవుచున్నాడు ఆమేన్. చూశారా? తరువాత ఆయన తీసుకొని…అయితే గ్రంథము మూయబడినది. ఎవరికి ఏ మాత్రము తెలియదు. అది విమోచనా గ్రంథమని వారికి తెలుసు. దానిపైన అది ఉన్నది. అయితే అది కడవరి దినములలో బయలుపరచ బడవలసియున్నది. ప్రకటన 10 ప్రకారముగా దాని యొక్క వర్తమానమును ఏడవ దూత ఇవ్వబోవుచున్నది. ఎందుకనగా అది ఈలాగు చెప్పబడినది, “ఏడవ సంఘకాలమునకు బూర ఊదబడునపుడు ఏడవ దూత అతడు బూర ఊదునపుడు, అతడు బూర ఊదుట ద్వారా, దేవుని యొక్క మర్మములన్నియు సమాస్తమగును.” అటు తరువాత, అది బయలుపరచబడిన తరువాత, దూత పరలోకము నుండి దిగివచ్చును, ఆయన క్రీస్తు. ఇపుడు గుర్తుంచుకోండి, భూమిపైనున్న ఈ దూత, వర్తమానికుడు.

42 క్రీస్తు క్రిందికి దిగి వచ్చుచున్నాడు, ప్రకటన 10వ అధ్యాయములో మీరు ఆయనను చూస్తారు; ఒక పాదము భూమి మీదను, మరొకటి సముద్రము మీదను పెట్టియుండుట. తలమీద ఇంద్ర ధనుస్సు, నేత్రములు…మరియు పాదములు అగ్నివలెనున్నవి. తదితరంగా; ఆయన చేయి పైకెత్తి, సింహాసనముపై యుగయుగములు కూర్చున్న వాని తోడని ప్రమాణము చేసి, “ఇక సమయముండదు గాని” యని. మరియు ఆయన ఈ ప్రమాణము చేసినపుడు, ఏడు ఉరుములు వాటి వాటి స్వరములు పలికెను.

43 మరియు, ఈ రచయిత, యోహాను పైకెత్తబడినపుడు, అతడు చూచినది వ్రాయగోరెను. అతడు వ్రాయుటకు మొదలుపెట్టెను, ఆయన చెప్పాడు, “అది వ్రాయవద్దు.” ఎందుకనగా…“అది వ్రాయవద్దు.” అది ఒక…ఆయన చెప్పాడు, “దానికి ముద్ర వేయు.” లోపల ఏమున్నది? “ముద్ర వేయు, అది చెప్పవద్దు.” చూశారా, అది బయలుపరచబడవలసియుంది, అయితే అది వాక్యములో కూడా అది వ్రాయబడలేదు.

44 అటు తరువాత ఆయన ముద్రలు విప్పుట ప్రారంభం కాగానే, అదంతా కలవరంగాయున్నది. చూశారా? ఆయన మొదటి ముద్రను విప్పాడు. అతడు అనుకున్నాడు. “ఇపుడు, ఇక్కడ అది చెప్పబడబోతున్నది, ‘అది వచ్చి, పలానా-పలానా వారు వచ్చి సింహాసనమును తీసుకొనును, పలానా ఇది చేయును మరియు ఇది అది చేయును.’”

45 అయితే, అది ఆలాగున్నపుడు, తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ ఇక్కడ అతడు వెళ్ళిపోయెను. దాని మీద ఒకడు స్వారీ చేయుచుండెను. సరే, “అతడు అతని చేతిలో విల్లును కలిగియుండెను. మరియు కొద్ది సేపైన తరువాత అతనికి కిరీటము ఇయ్యబడెను” అని, అతను చెప్పెను. అంతే.

46 గొఱ్ఱెపిల్ల వెనుకకు తిరిగి మరొక ముద్రను తెరచెను. నల్లని గుఱ్ఱం పై బయలు వెడలెను…ఎర్రని గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు బయలు వెడలెను. “మరియు అతనికి…ఒక—ఖడ్గమీయబడెను; అతడు యుద్ధము చేయబోవుచున్నాడు; మరియు గొప్ప శక్తి ఇయ్యబడెను. మరియు భూమి నుండి సమాధానం తీసివేయును. ఒక్కొక్కరిని చంపును.” అది ఒక విధమైన…అది ఇంకా మర్మమైన విషయము. (అవును కదా?) ఆయన అది తెరచినపుడు.

47 మరియు ఆ విధముగా పోవుచుండగా, ఇలా చెప్పబడుతుంది, “ఈ ఏడు ఉరుములకు ముందు దినము, ఇక్కడ మర్మములన్ని బయలుపరచబడును.”

48 ఇపుడు చూడు! తరువాత కాలాలలో మనం పఠనము చేస్తున్న కొలది కనుగొంటున్నాము. మనకు సంస్కర్తలున్నారు. ప్రవక్తలు కాదు. సంస్కర్తలు. ఒక్కొక్క కార్యాలయము తన స్వంత పనిగా కొనసాగించును.

49 ఒక మనుష్యుని వలె—ఒక టెలిఫోన్ ఆపరేటర్ వలె, అతడు ఖచ్చితంగా ఒక ఎలక్ట్రీషియన్ కాదు. అది కొంచెంగా అతడు చేయవచ్చు. మరియు ఉదాహరణగా, ఒక మనిషి లైన్ మ్యాన్ అయినట్లైతే, మంచిది, అతడు ఖచ్చితంగా…తీగలను అమర్చుటకు స్తంభములను పెట్టే వ్యక్తి తీగలను అమర్చలేడు, ఆ పనిని అతడు చేయకపోవుటయే మంచిది. అయితే ఆ పనిని అతడు కొద్దిగా చేయవచ్చు.

50 అయితే, సంఘము యొక్క ఆఖరి భాగములో, ఆఖరి దినమున వాస్తవమైన విషయం బయలుపరచబడుతుంది. లేఖన ప్రకారముగా మనకు పంపెదనని, దేవుడు చెప్పినట్లుగా. మరియు ఏలీయా యొక్క ఆత్మ మరలా ఒక వ్యక్తిలో వచ్చునని ఆయన చెప్పినది అది ఎంతగానో మనము పరిశోధించాము, ఇపుడు అదెంతగానో విశదపరచబడినదని నేను అనుకుంటున్నాను. మరియు మనము…మరియు అది జరుగుటకు మనమెదురు చూచుచున్నాము. అభిషేకించబడిన ఒక వ్యక్తి కడవరి దినములలో లేచును. అది మూఢభక్తి, ఇంకెంతో మీరు వింటారు. అయితే అది—ప్రయత్నించును…అది దయ్యం, అతడు ఇక్కడ యున్నపుడు నిజమైన దానిని తీసివేయుటకు ప్రయత్నించును, అవును. అయితే అది సరిగా గుర్తించబడుతుంది. ఏలీయా, ఏంటో మీకు తెలుసా, మరియు అది గమనించండి. మీరు, మీరు తెలుసుకుంటారు. తరువాత…ఇపుడు ఏర్పరచుకున్న వారు ఎరుగుతారు.

51 ఇతరులు కాదు. వారు ఖచ్చితంగా తెలుసుకొనరు. లక్షల కొలది మైళ్ళ దూరంలో వారది పోగొట్టుకుంటారు. ఏలాగనగా…మనమదంతా చూశాము. మరియు, ఏ విధంగా వారు యోహానును పోగొట్టుకున్నది, ఏ విధంగా ఏలీయాను పోగొట్టుకున్నది, ఏ విధంగా యేసును పోగొట్టుకున్నది, వారందరిని పోగొట్టుకున్నది చూశాము. మరియు అదే విషయం వారు చేస్తారు. బైబిల్ చెప్తుంది వారు చేస్తారని. అవునా. కాబట్టి, అప్పుడు, ఆ సమయంలో అదెంతో సాధారణముగాయుండును. అదెంతో సామాన్యముగా ఉండును. మనం చూస్తున్నాము. అన్ని వేళలలో. ప్రజలు తెలివితేటలు గలవారై, విద్యావంతులైనపుడు, అనేక కార్యములు ఎరిగినవారైయున్నపుడు ఆ రకముగా వారది పోగొట్టుకుంటారు, తెలుసా. అవును.

52 ఆ విధమైన వారిని యేసు ఎన్నడు తన శిష్యులుగా తీసుకొనలేదు. అవిద్యావంతులైన వారిని, చేపలు పట్టువారిని, వారి సంఘాలతో, ఇతరమైన వాటితో సంబంధము లేని వారిని తీసుకున్నాడు. ఆయన సామాన్య ప్రజలను, పన్ను కట్టువారిని, వ్యవసాయదారులను, చేపలు పట్టువారిని ఆయన పని చేయుటకు ఆయన తీసుకున్నాడు. చూశారా? కారణం, వారు—వారు వట్టివారని వారికి తెలుసు. అటు తరువాత, వారిలో నుండి ఆయన యొకటి చేయును. చూశారా. వారు వట్టివారని వారు ఎరిగినంత కాలం, అప్పుడు దేవుడు పనిచేయును.

53 వారికొకటి తెలుసునని వారు అనుకుంటున్నపుడు, అలాటప్పుడు, “నీవు ఎరుగవలసినది నీకు తెలియదు” అని బైబిల్ చెప్తుంది. కాబట్టి, మనము—అది మనము తెలుసుకుందాము.

54 మరియు, ఇపుడు, ఈ మర్మములన్ని బయలుపరచబడవలసినవిగా మనము కనుగొనుచున్నాము.

55 ఎందుకని ఈ మనుష్యులు, నీతిమత్వము శుద్ధీకరణ తెచ్చిన ఆ గొప్ప సంస్కర్తలు వెస్లీ, లూథర్, పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నున్న పెంతెకొస్తు కాలము, ఈ వర్తమానములు వారెందుకు పట్టుకోలేదు? వాటిని వారెందుకు పొందుకోలేకపోయారు? ఎందుకనగా వారు సంస్కర్తలు. అవునా?

56 ఆ విధంగా, మరొక విధంగా తీసుకో, “రాజుల వలె అధికారము గలవారు అయితే రాజులు కారు” వారు వచ్చారు. చూశారా? చూశారా? మీరు దేని విషయములోనైనా బైబిల్ పదజాలమును గమనించవలసియున్నది. అవునా? ఇపుడు గమనించు. ఇది, విడువబడిన అన్ని మర్మమైన కార్యములు, నీతిమత్వమును గూర్చిన మర్మమైన భాగము, శుద్ధీకరణం గూర్చిన మర్మమైన భాగమును, పరిశుద్ధాత్మను గూర్చిన మర్మమైన భాగమును విడిచిపెట్టబడియున్నవి. మరియు, ఎందుకని, ఎందుకని…హవ్వ యాపిల్ తిన్నదా లేక ఆమె దానిమ్మ తిన్నదా లేక ఏదైనా తిన్నదా? చూశారా? సర్పము యొక్క సంతానమనగా ఏంటి? మరియు—మరియు “తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ” యొక్క నామమున బాప్తిస్మమా లేక “ప్రభువైన యేసు” నామమున బాప్తిస్మమా, సరేనా? ఓ! వందలకొలది ఆ విషయాలు విప్పబడకుండనే విడిచిపెట్టబడినవి. చూశారా.

57 మరియు, అటు తరువాత, ఆఖరి గడియలో ఈ వ్యక్తి వచ్చి, లేఖనము తీసుకొను విషయము బయలుపరచవలయును. అది సరిగా గుర్తించబడుతుంది. చూడు. అవునండి. ఇపుడు, అదొక గొప్ప కార్యముగా ఉండదు. ఇక్కడ బైబిల్ గ్రంథములో, అదొక పెద్దదిగా, అది కన్పించును.

58 యోహాను అక్కడకు వచ్చి బాస్తిస్మమిచ్చునది, అదెంత గొప్ప కార్యముగా యుండెను! ఇపుడు ఆలోచించు వెనుకనున్న ప్రవక్తలు యెషయా మలాకీ అతడెపుడు వచ్చునో వారందరు అతన్ని గూర్చి మాట్లాడారు. అతడు వచ్చినపుడు, కేవలం ఒక ఒంటరివానిగా, పెద్దవానిగా, అవిద్యాపరునిగా ముఖము నిండుగా మీసాలు మరియు వెంట్రుకలతో కప్పబడిన పురుగు వలె వెంట్రుకలు అతుక్కొనియుండియున్నాడు. మరియు ఒక పెద్ద పాతదైన గొఱ్ఱె చర్మమును చుట్టూ చుట్టుకొని ఉన్నాడు. చదువులేదు, మనకు తెలిసినంత వరకు అతని జీవితంలో ఏ ఒక్క రోజు బడికి వెళ్ళలేదు, చూశారా? ఇక్కడ అరణ్యము నుండి అతడు వచ్చాడు. ప్రసంగ వేదిక ఆహ్వానం లేదు. యొర్దాను నదిలో అక్కడ నిలబడి ప్రజలు మారుమనస్సు కొరకు పిలుపు ఇచ్చుచుండెను. మీరు ఊహించగలరా!

59 బైబిల్ గ్రంథము చెప్తుంది, “ఆ దినమున సమస్తమును ఎంతో గొప్పగా యుండును. చివరకు అన్ని ఉన్నత స్థలములు పల్లములగును మరియు అన్ని పల్లపు స్థలములు ఎత్తుచేయబడును” అని. అవునండి. “మరియు కరకు స్థలములన్నియు సమము చేయబడును.”

60 ఎందుకు, వారక్కడ చూచుట నేను ఊహిస్తున్నాను, యోహాను లేక క్రీస్తుకు ముందటివాడైన ఈ గొప్పవాడు వచ్చి, ఎడారినంతా తీసుకొని చదును చేయుననియు మరియు గడ్డితో చిగిరించునట్లు చేయును. చూశారా? ఓ, వారు, వారికి ఈనాడున్నట్లుగా అంతా నిర్మించుకొందురని నేనూహిస్తున్నాను.

61 అయితే, అదెంతో సాధారణముగాయుండును, చివరకు అపొస్తలులు అది పోగొట్టుకున్నారు. వారన్నారు, “సరే, లేఖనము ఎందుకు చెప్పుచున్నది, అట్లయితే…నీవు అర్పించబడుటకు వెళ్ళుచున్నావు? ఏలీయా మొదట రావలెనని లేఖనము ఎందుకు చెప్పుచున్నది?”

62 ఆయన చెప్పాడు, “అతడు ఇది వరకే వచ్చాడు మరియు మీరు అది ఎరుగకుంటిరి. మరియు మనుష్య కుమారుని యెడల, వారు అదే చేశారు. అయితే, యోహాను,” ఆయన చెప్పాడు, “అతని యెడల ఏమి చేయవలెనని యుండెనో దానిని చేసిరి. మరియు అతనికి ఏమి చేయబడవలెనని యుండెనో వారు దానిని చేశారు. మరియు” చెప్పాడు, “ఆ విధముగానే మనుష్య కుమారుడు శ్రమపడవలెను.”

63 ఎందుకని, యేసుక్రీస్తు భూమిపై నున్నాడని సమస్త యూదా జాతియంతటిలో మూడవ వంతైనా ఎరిగియుండలేదని నేనూహిస్తున్నాను. లేదు…కొంత మూఢభక్తిగలవాడు అక్కడెక్కడోయుండెనని వారు వినియుండవచ్చు. అయితే వారు దానిని గూర్చి పట్టించుకోలేదు. వారు ఆలాగు సాగిపోయారు. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.” అక్కడ నేను నమ్ముతున్నాను…ఆయన రహస్యముగా వచ్చునని అది చెప్పలేదు.

64 అయితే, ఎత్తబడుట ఒక రహస్యం. కాబట్టి అది అంత రహస్యమైతే, ఆయన వచ్చినపుడు, ఎత్తబడుట ఎంతటి రహస్యముగా నుండి తెలియబడకుండును. చూశారా. అది వారికి తెలియకుండును. నేరుగా వారు చెప్తారు, “మంచిది, మనకొక ఎత్తబడుట యుండునని నేననుకున్నాను. మరియు భూమి మీద ఈ తీర్పు ఏమిటి?” అని.

65 ఆయన చెప్తాడు, “అదెప్పుడో జరిగినది, మీరు దానిని ఎరుగకయున్నారు” అని. చూశారా? అది ఆలాగుండును. రాత్రి వేళ దొంగవలెనుండును.

66 ఒకసారి నేను చదివిన ఒక పుస్తకము మాదిరిగా ఉండును. దాని పేరేంటి? రోమియో మరియు జూలియట్, అదేనా లేక మరొకటా? అతడు ఒక నిచ్చెను ఇంటి ప్రక్కగా వేసి, ఏదో విధంగా…ఎంతో కాలం క్రిందట. మరియు…రాత్రిపూట ఆమెను బయటకు తీసుకొని వెళ్ళిపోయెను.

67 ఇపుడు, ఆ విధముగా అది జరుగును. అది ముగియును. వారు ఒక గుంపు దూతలను పారలతో పంపి సమాధులను త్రవ్వుట కాదు. బైబిల్ చెప్తుంది, “నీవు నీ కనురెప్పను కొట్టకముందే, మనం మార్చబడుదుము” అని. రెప్పపాటులో అది ముగియును. అంత వేగముగా.

“ఎవరో అదృశ్యమైనారు” అని చెప్తారు.

68 మంచిది, నేను ఊహిస్తున్నాను. ఈ రోజు ప్రపంచమును పరిశోధించిన యెడల ప్రతిరోజు ఐదువందల మంది భూమి నుండి అదృశ్యమగుచున్నారు. చూశారా. దానిని గూర్చి వారికేమి తెలియదు. వారు ఆలాగు అదృశ్యమౌతారు.

సరే. ఆ ఎత్తబడుటలో చాలామంది ఎత్తబడరు.

69 నేను మిమ్ములను భయపెట్టుట లేదు. మరియు నేను—మరియు అది ఆ విధముగానని నేను—నేను—నేను అనుకొనుటలేదు. అయితే, ఆయన ఏమి చెప్పాడో అది చెప్పాలని కోరుచున్నాను. నీకై నీవు తెలుసు. “నోవహు దినములలో ఉన్నట్లుగా ఎనిమిది ఆత్మలు రక్షించబడ్డారు. నీటి ద్వారా లోకమంతటిలో ఎనిమిది ఆత్మలు రక్షింపబడియుండిరి.”

70 సరే, నీవు చెప్తావు, “ఓ, మై! నేను ప్రయత్నం చేయనవసరం లేదు” అని. నీకుండవలసిన విశ్వాసము, నీకుండలేదని అది చూపుతుంది.

71 వెళ్ళువారు—ఒకరైన యెడల, అది నేనైయుండెదను. ఆమేన్. ఎందుకనగా నేను నమ్ముచున్నాను. చూశారా? ఆ విధముగా నీవది నమ్మవలసియున్నది. చూశారా, “అది నేనే”. నిశ్చయం కలిగియుండు. ఆయన వచ్చునపుడు ఆయన నన్ను తీసికొనబోతున్నాడు అది నేనెరుగుదును అనునంతటిగా ఆయనకు సమీపముగా నేనుండగోరుదును. నేనది నమ్ముతాను. అవును. కనుక…ప్రతి యొక్కరు అది పోగొట్టుకున్నట్లయితే, ఆయన కృపను బట్టి నేనక్కడ యుండబోతున్నాను. కారణం అది ఆయన వాగ్దానము చేశాడు. మరియు నేను—నేనక్కడ ఉందునని నేనెరుగుదును. కారణం, ఆయన అబద్ధమాడడు. మరియు నా ప్రాణం, జీవము, సాక్షమిస్తున్నవని నాకు తెలుసు. ఆయన వచ్చుచున్నట్లుగా, ఆయనకై ప్రతి దినము జీవించ ప్రయత్నిస్తాను. నేను—నేను ఆ వ్యక్తినౌతాను. ఆ విధంగా నీవు భావించవలెను. “వారు ఎనిమిది మందేయైనట్లయితే, ఆ ఎనిమిదిలో నేనొకడను; ఐదువందల మంది వెళ్ళుచున్నట్లయితే, ఆ ఐదువందల మందిలో నేను ఒకడను. నాకు ఇతరులను గూర్చి తెలియదు. అయితే ఆ ఐదు వందలమందిలో నేనొకడను.” చూశారా? ఆ విధంగా నీవు గుర్తుంచుకొనవలయును. అవునా?

72 ఆ విధంగా నీవు గుర్తుంచుకోనట్లయితే, నీ విశ్వాసములో ఒక లోపమున్నది. చూశారా? ఆలాగైతే ఇంకా నీవు రక్షించబడ్డావని నీకు నిశ్చయత లేదు. దానిని గూర్చి నీవు ఊహిస్తున్నావు. అలా చేయవద్దు. సరే.

73 మనమింకా ఈ ముద్రలోకి వెళ్ళలేదు. అవునా? సరే, నేను కోరుతున్నాను ప్రతి రాత్రి…మీ సమయాన్ని తీసుకుంటున్నానేమోనని మీరు అనుకుంటున్నారేమోనని నాకు తెలియదు. కొంచెం ముందుగానే మనం వెళ్తాము. అధికమైన…

74 ఈ ముద్రలు బయలు పడుటలో గుర్తుంచుకోండి. అది కేవలం ఒక వచనం మాత్రమే. మొదటిగా దానిని గూర్చి ప్రకటించుట, 2వ వచనం…అనేకములైన వ్యాఖ్యానాలు మొదలైనవి, వాటిని గూర్చి చదివితిని లేక వారి యొక్క తలంపులను చదివితిని. వారందరు నమ్మిన విధముగానే నేను నమ్మితిని. ఆ మొదటి గుఱ్ఱపు రౌతు ఆరంభ సంఘమని నమ్మియుంటిని. అయితే పరిశుద్ధాత్మ అది బయలుపరచినపుడు, అది ఖచ్చితంగా విరోధము. కాబట్టి అదేంటో చూపబడినది. తరువాత నేను ప్రయత్నించాను.

75 ఇపుడు, ఇది నాకైతే, ఇది చాలా పవిత్రమైనది. ఆ కారణం చేత, ఈ ప్రశ్నలకు నేను జవాబిస్తాను. మనమిది ఎరగవలసియున్నది, టేపుల మీద కూడా ప్రతి యొక్కరు ఎరగవలసియున్నది. ఇపుడు వారు తెలుసుకుంటారు. చూశారా? రాత్రియందు నేను కొద్దిసేపు ప్రజలు అర్థం చేసుకొనుటకై గత రాత్రి దానిని గూర్చి మాట్లాడుటకు ప్రయత్నించాను.

76 తొందరపడటం, తోసుకొని రావటం, మీరది చేయకూడదు. చూశారా? అయితే ఆ విధముగా చేసినపుడు, అది మానవ మాత్రులం. ఇక్కడ—వేడిగానున్నది. మరియు మీరు—మీరు అలసియున్నారు.

77 అయితే మీరు, చాలా చాలా మంచివారు. ఈ మందిరంలో, ఈ కూటములో ప్రజలు చక్కగాయుండుట నేను చూస్తున్నాను. మరియు నెమ్మదిగా కూర్చుండుట, తల్లులు, పిల్లలు ఏడ్చినపుడు వారిని తీసుకొనుట, ప్రతీది బాగున్నది.

78 అయితే, ఈ వాక్యములు చెప్పుటకు, నాకు బయలుపరచబడినది చెప్పుటకు ఆత్మ నా మీదికి వచ్చు అభిషేకము నేను భావించు వరకు దాని పూర్వాపరాలు చెప్పుటకు నేను ప్రయత్నిస్తాను. అటు తరువాత ఒక చోట, ఇక్కడ నేనేదైనా తప్పు చేసిన యెడల, ప్రజలందరి యెదుట ఆయన నా తప్పు సరిచేయును. నేను—నేను దానిని ఆశించుచున్నాను. అది—అది…నేనది సరిగాయుండవలెనని ఆశించుచున్నాను. మీరు ఊహించినది తీసుకోనవసరం లేదు. ఒకటి సరియైనది ఉన్నది. మరియు—అది మనకు కావలసియున్నది. ఏది సరియైనదో అది మనకిచ్చు దేవుడు కావలసియున్నది.

79 కాబట్టి, మనమిపుడు ఈ స్వారీ చేయువారిని తీసుకున్నాము. వారు వచ్చుచుండగా…మొదటి గుఱ్ఱం, ఇపుడు మనము గ్రహిస్తున్నాము. బయలు వెళ్ళిన అంత్యక్రీస్తుయని. గత రాత్రి మనం చూశాము, అంత్యక్రీస్తుగా వెళ్ళిన అదే వ్యక్తి, ఒక తెల్లని గుఱ్ఱంగా వెళ్ళియుండగా, ఖడ్గముతో స్వారీ చేయుచు, ప్రజలను చంపుచు వెళ్ళినట్లుగా మనం కనుగొన్నాము.

80 ఇపుడు, ఇపుడు, ఎల్లప్పుడు కూడా ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఉంటుంది. మరియు సంఘము కొరకు, ఈ ముద్రను విప్పబడుటకు కొంచెము ముందుగా, నేను పోల్చాలని కోరుచున్నాను.

81 ఆయన నాకిచ్చినది, ఇక్కడ నేను వ్రాసుకున్నాను. ఇక్కడ చాలా లేఖనాలున్నవి. దానిని గూర్చి ఏడు ఎనిమిది పుటలు, నేను చూస్తుండగా.

82 గమనించుడి! సంఘాన్ని గూర్చిన ఒక పోలిక ఇవ్వాలని. మరియు మీరు చూచుటకు విశదముగా యుండగోరుచున్నాను. అవునా?

83 ఇపుడు, ఏదెను తోటలో ప్రకృతి సంబంధమైన పెండ్లి కుమార్తెయున్నది. గతరాత్రి జ్ఞప్తించుకోండి? ప్రకృతి సంబంధమైన పెండ్లి కుమార్తె, ఆదాము యొక్క ప్రేయసి. ఇంకా భార్య కాలేదు. ఎందుకనగా భార్యగా ఆమెను అతడు ఇంకా ముట్టలేదు.

84 ఏ విధముగా మరియ యోసేపు భార్య ఆయెనో ఆలాగు. అయితే ఆమెను, అతడు ముట్టలేదు. “ఆమె గర్భవతియాయెను.” గమనిస్తున్నారా?

85 ఇపుడు, ఆదాము తన భార్యను ముట్టక మునుపు, ఈమె అతనికి కేవలం పెండ్లి కుమార్తెగాయుండెను. సరే. మనం చూస్తున్నాము, దేవుడు…ఆమె ఏదెను తోటలో పడిపోయినది. కారణం ఆమె దేవుని వాక్యము పట్టుకొనుటలో విఫలమైంది.

86 సాతాను వారి మధ్యకు విడిచిపెట్టబడునని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వారికి దాగుకొనియుండుటకు ఒక—ఒక స్థలాన్ని ఇచ్చాడు; భద్రంగాయుండుటకు. సరే, దేవుని కంటె భద్రంగా యుండే స్థలము ఎవరికి తెలియును, ఆయన తన స్వంత బిడ్డలను జాగ్రత వహించుటకు ప్రయత్నిస్తుండగా?

87 నేను నా చిన్న జోసఫ్ ను జాగత్ర తీసికోవాలని ఆశిస్తే, సరే ప్రతి విషయంలో సహోదరుడా…దాని మీద అతని బ్రతుకు ఆధారపడియుంటుంది. ఎందుకని…నేను దానిని చేయగలను. సరే, అతనిని కాపాడుటకు నలభై-అడుగుల కాంక్రీట్ తో కట్టిన గోడ చాలన్ననూ, ఇంకా రక్షణ కల్పించుటకై నేను తొంభై అడుగుల కాంక్రీట్ గోడ కట్టుటకు ప్రయత్నిస్తాను.

88 నా చిన్న బాలుని గూర్చి నేను ఆలోచన చేస్తే, (అతని భౌతిక జీవితం పోతుందని, బిడ్డ రక్షింపబడతాడని నేను నమ్ముతున్నాను,) నిత్యముగా నశించిపోయే ఆయన బిడ్డను గూర్చి, దేవుడు ఎంతగా శ్రద్ధ వహించును! అతని వెనుకాల ఆయన ఏమి ఉంచుతాడు? ఆయన స్వంత వాక్యము వెనుక అతనిని ఉంచుతాడు. ఆయన వాక్యములో నీవున్నంత కాలము, నీవు క్షేమంగా ఉంటావు. “మీరు నాయందు నిలిచియున్నట్లైతే, నా మాటలు మీయందు నిలచియున్నట్లయితే, మీకేమి కావలెనో అడుగుడి.” అది అదే, వాక్యము.

89 కనుక, హవ్వ ఏదెనులో విహరిస్తుంది. ఎంతో నాజూకు వ్యక్తియైన సర్పము యొద్దకు ఆమె పరుగెత్తుకొని వెళ్ళినది. మరియు ఆమె—మరియు…ఇపుడు, అతడు ఇంకొక ప్రక్కన ఉన్నాడు. దేవుడు, దీనత్వంలో పనిచేయును, నివాసము చేయుచున్నాడు. మరో మార్గము లేదు. చూశారా? దీనురాలైన ఆ చిన్న స్త్రీ అక్కడ నడుస్తుంది. సాతాను నాజూకైన వ్యక్తిగా జ్ఞానముతో అక్కడకు వచ్చాడు. అతడు ప్రణాళికను అమ్ముటకు కోరుచున్నాడు. ఉన్నంత కాలము…

90 సాతాను ఎంతగా చుట్టూ ఉన్నప్పటికి ఆమె ఈ వాక్యమునకు వెనుకనున్నంత కాలము, ఆమె క్షేమమే [సహోదరుడు బ్రాన్హాం తన బైబిల్ ను తట్టెను—సంపా.] సరేనా? కాబట్టి సాతాను ఏమైనా చేయనిమ్ము; వాక్యముతోనే నీవు ఉండు, కొంచమైననూ వ్యత్యాసముండదు.

“నీవెందుకు జబ్బుతో ఉన్నావు” అని అతడు అడిగితే.

“ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థతనొందితిని.”

“సరే, నీవు చనిపోబోవుచున్నావు.”

“ఆయన నన్ను తిరిగిలేపును. ఆయన అది వాగ్దానం చేశాడు.”

91 చూశారా? వాక్యం వెనుక నిలబడు. అంతే. క్రీస్తు, ఆయనకు ఆయన వాక్యము వెనుక దాగియుండును. “ఈలాగు వ్రాయబడియున్నది.” చూశారా? వాక్యము వెనుక నిలబడు.

92 అయితే, హవ్వ, ఒక విధంగా దిగజారినది, అయితే ఆమె అంతా దిగజారలేదు. ఆమె ఒక చిన్న మాటను మాత్రమే జారవిడిచినది. ఆమె అది చేయాలనే సాతాను కోరినది. తర్కము ద్వారా దేవుని వాగ్దానము చాటు నుండి ఆమెను బయటకు రప్పించాడు అతడు.

దేవుని వాక్యమును ఎన్నడు తర్కించవద్దు. అది నమ్ము! అవును?

93 కాబట్టి, ఆమె అక్కడ నుండి బయటకు వచ్చినది. ఆదాము ఆమెను ఒక భార్యగా కూడక మునుపు, ఆమె సాతాను ద్వారా ముందుగా చెరపబడినది. ఆమె…

94 మీరు గమనించారా? క్రీస్తు, అదే విషయం చేశాడు, ఖచ్చితం. ఇపుడు, విమోచించుటకు, మొదటిగా దేవుడు అక్కడయుండ వలసియుండెను, మీరు గమనించారా? మరియ ఆమె యోసేపు యొద్దకు రాక మునుపు పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనెను. ఆమేన్. చూశారా? అక్కడ నుండి విమోచకుడు వచ్చాడు.

95 ఇపుడు, గమనించు. ప్రకృతి సంబంధియైన స్త్రీ పడిపోయినది. విమోచింపబడుటకు దేవుడు ఆమె కొరకు మార్గమును చేకూర్చెను. ఆమె పడిపోయినప్పటికి ఆయన మార్గమును సమకూర్చెను.

96 ఆమె భర్త, ఆమె పెండ్లికాక ముందు పడిపోయిన మొదటి పెండ్లి కుమార్తె అది. వాక్యముతో నిలచియుండుటకు బదులు తర్క వితర్కము ద్వారా ఆమె పడిపోయినది. ఆమె పడిపోయినది. ఆమె మరణానికి పడిపోయినది. నిత్య ఎడబాటు, ఆమెతో పాటు తన భర్తను, భూమి మీదనున్న సమస్తమును పడిపోజేసెను. ఆమె పడిపోయినది.

97 ఇపుడు, దేవుడు, కనికర సంపన్నుడుగా యుండి, ఆ స్త్రీని విమోచించుటకు మార్గమును ఏర్పరచెను. ఇపుడు ఆమెకు వాగ్దానము చేశాడు. భవిష్యత్తులో ఒక సమయాన నిజమైన వాక్యము తిరిగి ఆమె యొద్దకు వచ్చునని ఆమెకు వాగ్దానము చేశాడు. నిజమైన వాక్యము ఆమెకు తెలియజేయబడును. ఇపుడు జ్ఞాపకముంచుకొనుడి. ఎందుకనగా స్త్రీ ద్వారా క్రీస్తు వచ్చునని ఆయన వాగ్దానం చేశాడు.

98 మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. పరిశుద్ధ యోహాను 1, “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడైయుండెను. మరియు వాక్యము శరీరధారియాయెను,” చూశారా, “మన మధ్య నివసించెను.” దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించెను. ఆయన వాక్యమైయుండెను.

99 వాక్యము కాక మునుపు అది యొక తలంపు, ఒక తలంపు సృజింపబడవలెను, సరే. కాబట్టి, దేవుని యొక్క తలంపులు వాక్యము వలన, అవి పలకబడినపుడు సృష్టి ఆయెను. ఒక తలంపుగా—ఆయన నీకు ఇచ్చునపుడు, ఆయన తలంపు, అది నీకు బయలుపరచబడును, అటు తరువాత నీవు అది మాట్లాడు వరకు అది ఇంకా ఒక తలంపుయైయుంటుంది. ఆ కారణం చేత…

100 మోషే ప్రార్థించుటకు వెళ్ళాడు. ఆ అగ్ని స్తంభము అతని చుట్టునున్నది. ఆయన అన్నాడు, “వెళ్ళి, నీ యొక్క కర్రను తూర్పు దిశగా చూపి ‘ఈగలను’ పిలువు.”

101 అక్కడ ఈగలు లేవు. అయితే అతడు వెళ్ళి, కర్రను చాపి, మరియు చెప్పాడు, “ఈగలు కలుగును గాక.” ఈగలు లేవు. వెనుకకు వెళ్ళాడు. అయితే, మాటలు, దేవుని యొక్క తలంపు, ముందుగనే పలుకబడింది, అది యొక మాట, అది నెరవేరవలసియున్నది.

102 యేసు చెప్పినది మీరు చూచుటలేదా? “ఈ కొండతో మీరు చెప్పిన యెడల; నేను అది చెప్పుట వలన కాదు. కాని ‘కదలి పొమ్మని’ ఈ కొండతో మీరు చెప్పినయెడల.”

103 మోషే కాలంలో నేననుకుంటాను. మొదటిగా పెద్ద పాత పచ్చ ఈగ జుం అంటూ ఎగిరి వచ్చినది. కొద్ది సేపైన తరువాత గజానికి ఐదు పౌన్లు వచ్చినవి. చూశారా? అవి ఎక్కడ నుండి వచ్చినవి? ఆయన…దేవుడు వాటిని సృష్టించాడు. ఏలాగో నీవు చూచుట లేదా…

104 దేవుడు, ఆయన అనుకుంటే దోమలతో ఈ రాత్రి లోకమును నాశనం చేయగలడు. సరే. ఆయన దోమలను చంద్రుని ఎత్తు వరకు ప్రోగుచేయగలడు. ఆయన చేయవలసిన ఒకే యొక విషయం, “చంద్రుని వరకు దోమలు వచ్చు గాక” అని చెప్పుటయే. పలికిన ప్రకారము అవి చేరుకొనును. ఏలాటి రసాయనాలు లేక మరేమిలేదు. అవి ఆలాగే పెరుగుచుండును, పెరుగుచుండును, పెరుగుచుండును. అవునా?

105 ఆయన అనుకున్నది ఆయన చేయగలడు, ఆయన దేవుడు, సృష్టి కర్త. ఆయన చేయగలిగినది యొకటే అలా అది మాట్లాడుట [సహోదరుడు బ్రాన్హాం తన వ్రేలిని ఒకసారి విరచియున్నాడు—సంపా.] అవునది నిజం. ఆయన సృష్టి కర్త. ఆయన ఎంత ఘనుడో మనం గ్రహించగలిగితే. చూశారా? ఆయన కోరినది ఆయన చేయగలడు.

106 ఆయన అక్కడ కూర్చొని ప్రజల వైపు చూచును. ఈ చిన్న విద్యావంతులు తెలివిగల ప్రజలు “దేవుడు లేడు,” మరియు—మరియు సమస్తము చేస్తారు. ఊహూ! ఎందుకని తిరిగి బాబేలులో ఉన్నట్లుగా, మరలా బాబేలు వలె.

107 ఇపుడు మనం చూస్తున్నాము దేవుడు హవ్వతో చెప్పుట, “చాలా కాలమైన తరువాత వాక్యము తిరిగి నీ యొద్దకు వచ్చును.” ఇపుడు, ఆమె ఏలాగు పడిపోయినది? అది చెప్పుటకు నా తరగతిని నేను కోరుచున్నాను. దేని నుండి ఆమె పడిపోయినది? హవ్వ దేని నుండి పడిపోయినది? వాక్యము నుండి. అది సరియేనా? [సమాజము “వాక్యము” అని చెప్పుచున్నది.—సంపా.] వాక్యము. తిరిగి వాక్యము వైపునకు ఆమె విమోచించబడుటకు ఆయన మార్గమును చేకూర్చునని దేవుడు చెప్పాడు. సరే. చాలా కాలమైన తరువాత వాక్యము ఆమెకు తెలియబడును. సరే. ఒక ఉద్దేశము కొరకై వాక్యము వచ్చును. నేను చెప్పునది గట్టిగా పట్టుకొనుడి. ఒక ఉద్దేశము కొరకు వాక్యము ఆమె యొద్దకు వచ్చును, అది విమోచన కొరకు. సరే.

108 అయితే, అప్పటి వరకు ఆమె యొక ప్రత్యామ్నాయము కలిగియుండెను అసలైన వాక్యము వచ్చు వరకు అది పని చేయును. ఇపుడు మీరు—మీరు స్పష్టముగా అర్థం చేసుకున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] చూశారా? తిరిగి వాక్యము ఆమె యొద్దకు వచ్చునని ఆయన ఆమెతో చెప్పాడు. అయితే, ఆ సమయం వచ్చు వరకు ఆమెకు ఆయన ప్రత్యామ్నాయం ఇచ్చాడు. కనుక, ఆ రక్తమునకు ప్రత్యామ్నాయముగా చేయుటకు ఆయన ఆమెకు ఒక అర్పణను ఇచ్చాడు.

109 ఇపుడు, ఎద్దులు, గొఱ్ఱెలు, మేకలు మొదలగు వాటి రక్తము, ఆమె పాపము తీసివేయలేదు. అవునా? అది కేవలం ఆమె పాపమును కప్పివేయును. అది దానిని ఎంతమాత్రము తీసివేయదు. అది దానిని కప్పును. ఎందుకనగా, అది జంతువు యొక్క రక్తము. మరియు జంతువు యొక్క రక్తములో జంతువు ప్రాణం యుంటుంది. అసలైనది వచ్చు వరకు అది ప్రత్యామ్నాయము…ఇపుడు మీ కోట్లు ధరించుకొనుడి.

110 మానవులు కలిగియున్నట్లుగా నిజమైన మానవ రక్తము (దేవుడు); లైంగిక సంబంధం లేకుండా దేవుడు శరీరధారియై, కన్యక జన్మ ద్వారా అది ఉత్పత్తి చేసెను. దేవుని యొక్క వాక్యము, వాగ్దానము రక్తముగా మారెను. రక్షకుడైన యేసుక్రీస్తు అను వ్యక్తిలో అవతారమెత్తెను. “కోడెల యొక్క మేకల యొక్క రక్తము…”

111 అయితే ఇపుడు ఆగు. ఇక్కడ దేవుడు వాగ్దానము చేశాడు, “ఆమె యొక్క సంతానము సర్పము యొక్క తలను చితకకొట్టును” అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. ఇపుడు, ఆమె యొక్క సంతానము ఆదాము నుండి వచ్చినదైతే, లేక సర్పము నుండి వచ్చినట్లయితే, అది ఇంకా పాపయుక్తమైన సంతానము.

112 ఆ కారణం చేత యోహాను ఏడ్చాడు. ఏ మనుష్యుడు లేడు. ఎందుకనగా…ప్రతి యొక్కరు అగాధము యొక్క ఆవలివైపే యుండిరి. అయితే, వాస్తవమైన అవతారమెత్తిన ఆయన రక్తము వచ్చినపుడు, ఈ ప్రత్యామ్నాయముగా నున్న జంతువు యొక్క రక్తము గతించిపోవు కాలము యొకటి రానున్నది. దేవుడు రక్త మాంసములుగా మారాడు. ఆయన ఆలాగని బైబిల్ చెప్తుంది. మొదటి తిమోతి 3:16, “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది: ఏలయనగా దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయెను.” అవునది నిజం. కన్యక ద్వారా జన్మించిన జన్మ ఇది చేసినది.

113 ఇపుడు, గొఱ్ఱెల యొక్క మేకల యొక్క రక్తము పాపమును కప్పి వేసినది. అయితే, అది దానిని పరిహరింపలేదు. ఎందుకనగా అది జంతువు యొక్క రక్తము. అయితే ప్రత్యామ్నాయముగానున్నంత కాలం అది పరవాలేదు.

114 వారు, నిశ్చయంగా ప్రత్యామ్నాయమునకు అలవాటు పడి వారు దానిని కొనసాగించిరి.

115 మరియు, యేసుక్రీస్తులో నిజమైన వాగ్దాన వాక్యము ప్రత్యక్షమైనపుడు గొప్ప సృష్టి కర్తయైన దేవుని కుమారునిగా ఆయన రుజువు చేయబడ్డాడు, జీవము గల దేవుని వాక్యమగుట ద్వారా మనకు తాను రుజువు చేయబడ్డాడు. వ్యూ మై. ఆయన అని ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన పలుకు చేత విషయాలను ఉనికిలోకి తేగలిగెను.

116 ఏ మానవుడు గాని లేక—లేక లోకములో ఏదైనను గాని అది చేయలేదు. భూమి మీద ఏది అది సృజించలేదు. దేవుడు తప్ప. దయ్యము సృష్టించలేదు. సృజించబడిన దానిని అతడు తారుమారు చేయును. అయితే అతడు సృష్టించలేడు. పాపము, నీతి తారుమారౌట, నా భావమేదో మీకు తెలుసా, అబద్ధమనగా ఏంటి? అది సత్యాన్ని తలక్రిందులు చేయుట. చూశారా? వ్యభిచారమనగా ఏంటి? నిజమైన చట్టబద్ధమైన కార్యమును తారుమారు చేయుట. పాపము యొక్క ప్రతీది, పాపమనగా సత్యమును తారుమారుచేయుట. ఇపుడు అతడు సృష్టించలేడు.

117 అయితే, క్రీస్తు వచ్చి ఆయన సృష్టికర్తయని రుజువు చేశాడు, వాగ్దానము చేయబడిన రక్తమున్నది. మీరది చదవాలనుకుంటె, మీరు…ఒక నిమిషములో మనమది త్రిప్పుదాము. దీని మీద మనం సమయం తీసికోబోతున్నాం. ఏలాగైనా ఈ రాత్రి నేను…

118 అది నన్ను భయపెడుతుంది. ప్రతి యొక్కరు ఇండ్లకు వెళ్ళాలనుకుంటున్నారు, అవునా, కాబట్టి [సభ “లేదు” అని చెప్పినది.—సంపా.] ఇపుడు, అపొస్తలుల కార్యములు 2 తీద్దాం. వందనాలు. మరియు…

119 అపొస్తలుల కార్యములు 2 మరి ఇది సరియైనదో కాదో చూద్దాం. ఆయన దేవుడని తాను నిరూపించుకున్నది. సరే. అపొస్తలుల కార్యములు 2 తీయుడి. ఇక్కడ 22 వచనం తీద్దాం. పెంతెకొస్తు దినాన పేతురు మాట్లాడుచున్నాడు.

ఇశ్రాయేలువారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు…మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి…ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరచెను. ఇది మీరే…యెరుగుదురు:

120 “ఒక మనిషి నిరూపించబడుటచే దేవుడు మీ మధ్య నుండెననుటకు రుజువు.” ఆయన చేసిన కార్యములు ద్వారానే ఆయన ఎవరో నిరూపించబడెను. ఇక్కడ పేతురు సన్ హెడ్రిన్ సభ ఎదుట నిలబడి, వారితో చెప్పుచున్నాడు.

121 అదే విషయం నీకొదేముకు తెలుసు. అతడు చెప్పాడు, “రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమందరము ఎరుగుదుము, ’ఎందుకనగా, ’అతడు దేవుని యొద్ద నుండి వచ్చినట్లయితేనే గాని ఎవరును ఈ సంగతులు చేయరు.” చూశారా? అది వారికి తెలుసు, అయితే ఎందుకు?

122 ఇపుడు గమనించండి, ఇపుడు, ఇది హవ్వకు వాగ్దానం చేయబడినది. అయితే…ఆ పెండ్లి కుమార్తె వచ్చినపుడు, నిజమైన వాక్యము ఆమె యొద్దకు వచ్చినపుడు నిరాకరించెను. కాబట్టి హెబ్రీ పెండ్లి కుమార్తె గుర్తించుటకు నిరాకరించెను. ఎందుకనగా ఆమె దేవుని యొక్క పెండ్లి కుమార్తెయైయుండెను. విడాకులిచ్చి ఆయన ఆమెను వదిలిపెట్టెను. అవునా? ఆమె, దేవుని పెండ్లి కుమార్తె.

123 నీవు చెప్తావు “సరే, వారికింకా వివాహము కాలేదు” అని. అవును. అయితే యోసేపు మరియను…మరియను వేరుగా విడనాడవలెనని కోరాడు. చూశారా? అతడు ఆమెతో ప్రథానము చేసికొన్నాడు.

124 మరియు ఆయన వచ్చినపుడు, ఆయన వాగ్దానము చేసిన వాక్యము వివాహము చేసికొనుటకు వచ్చెను. ఆమె ప్రత్యామ్నాయములతో ఎంతగానో ఆమె చుట్టబడియుండుట ఆయన కనుగొనెను. నిజముగా వాగ్దానము చేయబడిన వాక్యమైన క్రీస్తును ఆమె తీసికోలేదు.

125 బహుశా, మీరది అర్థం చేసికోలేకపోవచ్చు. ఇపుడు మరలా దానిలోనికి వెళ్ళనివ్వండి. మీరిది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అవును.

126 ఒక విమోచకుని పొందుకోబోవుచున్నదని ఆమెకు వాగ్దానము చేయబడెను. (పెండ్లి కుమార్తె, హవ్వ) ఆమె విమోచకుడు వాక్యమైయుండును. వాక్యము శరీరధారియై వచ్చినపుడు, ఆమె దానిని తిరస్కరించెను. ఆమెకు ప్రత్యామ్నాయము ఇవ్వబడెను. ఇపుడు ఆ “ప్రత్యామ్నాయమును” పట్టుకొనండి. విమోచకుడు వచ్చువరకు ప్రత్యామ్నాయములు ఇవ్వబడెను. మరియు విమోచకుడు వచ్చినపుడు నిజమైన వాక్యమును తిరస్కరించి, ప్రత్యామ్నాయమును కొనసాగించుటకు కోరెను చూశారా? అది? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అదీ హెబ్రీ పెండ్లి కుమార్తె.

127 ఆలాగే ఆయన; రెండవ హవ్వ ద్వారా, పెండ్లి కుమార్తె, ఆత్మీయులందరికి. చూశారా? హవ్వ అనగా “అందరికి తల్లి” అనగా…“సజీవులందరికి.” హవ్వ, “జీవించు వారందరికి తల్లి.”

128 హెబ్రీ పెండ్లి కుమార్తె యొద్దకు ఆయన వచ్చినపుడు, ఆమె సమస్త జీవులకు తల్లి, అయితే అది ఆమె నిరాకరించినది.

129 దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా సాతాను యొక్క వాగ్వాదమును వినుట వలన ప్రకృతి సంబంధమైన హవ్వ ఏదెనులో పడిపోయినది. ఆ విధంగా ఆమె పడిపోయింది. సరేనండి. ఆమె పడిపోయినది కారణం ఆమె అది చేసినది.

130 ఆత్మ సంబంధమైన హవ్వ, ఇపుడు, అది సంఘము, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. ఆమె పడిపోయినది. ఏదెనులో కాదు. అయితే రోమ్ లో. చూశారా. ఆ పెంతెకొస్తు సంఘమును నైసియా సభలో నిరాకరించినపుడు, నైసియాలోకి వెళ్ళి, వాక్యమును పట్టుకొనుటకు బదులు రోమ్ తర్కమును వినుట వలన, ఆమె పడిపోయింది. ఆమె చుట్టు వున్న సమస్తము ఆమెతో చనిపోయినది. ఏ విధంగా ప్రకృతి సంబంధియైన హవ్వ పడిపోయినదో ఆలాగే ఆత్మ సంబంధమైన హవ్వ పడిపోయినది. దేవుని పెండ్లి కుమార్తె పడిపోయినది—తోటలో పడిపోయినది; క్రీస్తు పెండ్లి కుమార్తె రోమ్ లో పడిపోయినది. చూశారా.

131 గమనించుడి. దేవుని వాక్యమునకు వ్యతిరిక్తమైన అదే కారణం చేత, ఆమె సద్గుణ హక్కులను కూడా సాతాను యొద్ద కోల్పోయినది. ఈ ముద్రలు విప్పినపుడు, అది సాతానని మనం కనుగొనుచున్నాము. మరియు ఇంకను సాతానుయైయున్నది. బైబిలు చెప్తున్నది, అది సాతాను యొక్క సింహాసనమని. మరియు ఏ విధముగా హవ్వ తన—తన సద్గుణ హక్కులను పోగొట్టుకున్నదో, మరియు ఏదెను తోటలో వాటిని సాతానుకు ఇచ్చినదో; సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె వారి యొక్క సిద్ధాంతములకు, తర్కములకు బైబిల్ ను పోగొట్టుకున్నపుడు రోమ్ లో అదే పని చేసినది. ఏలాటి పోలికో చూడండి. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.]

132 మీరు, పోలికలను సరిగా నడిపించిన యెడల మీరు సరియైనది పొందుకోగలుగుతారు. నా చేయి ఇలా కన్పిస్తే…నన్ను నేనుగా ఎన్నడు నేను చూచుకొనని యెడల, నా నీడ వచ్చుట నేను చూస్తాను. నేనెలాగున్నానో నేను తెలుసుకుంటాను. అవునా? అయితే అది మార్గము. ఏమి వస్తుందో నీవు చూడాలనుకుంటె ఏమైయుండెనో చూడు. “ఎట్లనగా…పాతవన్నీ కూడా రాబోవుచున్న వాటి ఛాయలు” యని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మంచిది.

133 ఏలయనగా, నీతియుక్తమైన వాక్యమును, దేవుని వాక్యమును ఆమె కోల్పోయినది. బైబిల్ ను అమ్ముకొని, సంఘము ఏది కోరితే దానిని మార్చవచ్చు అని చెప్పు మనుష్యుని ఆమె అక్కడ ఏర్పరచినది. మరియు దానిని వారు చేశారు. మరియు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె, పెంతెకొస్తు పెండ్లి కుమార్తె హవ్వ తన సద్గుణాన్ని ఏదెను తోటలో సాతానుకు అమ్మినట్లు తన సద్గుణాన్ని నైసియాలో అమ్మినది. ఖచ్చితం. సరే.

134 దేవుడు వాగ్దానం చేశాడు. ఆమె అది చేయునని ఎరిగి, ఆ సంఘానికి, ఈ పెంతెకొస్తు సంఘానికి, హవ్వకు ఆయన చేసినట్లు, దేవుడు వాగ్దానము చేశాడు.

135 పెంతెకొస్తు సంఘము, ఆమె తన జన్మ హక్కులను, ముందు…ఆమె అక్కడ వదలిపెట్టినపుడు జన్మ హక్కులను అమ్మినదని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఆమె, నిజంగా చేసినది. ఆలాటపుడు, ఈ బైబిల్ మీద ఆధారపడకుండ ఒక సిద్ధాంతము వలన ప్రయోజనమేటి? అపొస్తలుల సిద్ధాంతం లేక దానిని గూర్చిన ఒక మాటయైనను బైబిల్ గ్రంథములో ఉన్నదో ఒకరు నాకు చూపించవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. అది కథోలిక్ సిద్ధాంతము, అపొస్తలుల సిద్ధాంతం కాదు.

136 అపొస్తలుల కార్యములు 2:38 చదువు. అదీ అపొస్తలుల సిద్ధాంతం ఆయనకు ఏదైన యున్నట్లయితే. ఆఁ. అవునా? ఇపుడు, అది వారు అన్ని వేళలలో వినియోగిస్తారు. కాబట్టి…చూశారా?

137 కాబట్టి, వారి జన్మ హక్కులను వారు అమ్మి వేశారు. అది మాత్రమే కాదు, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్, పెంతెకొస్తులు, మిగతావారు అదే చేశారు. ఆమె సంఘశాఖగా నిర్మాణమైంది. ఆలాగు చేయుటకు రోమ్ కారణమైంది. ఆమె సంఘశాఖను నిర్మాణము చేసినది దానికి శిరస్సుగా ఒక మనుష్యుని పెట్టినది. మరియు మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంతెకొస్తులు మరియు ప్రతి యొక్కరు అదే విషయం చేశారు. దానికి శిరస్సుగా గుంపు మనుష్యులు ఉంచారు. దేవుడు ఏమి చెప్పినది అవసరం లేదు. వారు…వారు చేయమని చెప్పినట్లు మీరు దానిని చేయవలసిన వారైయున్నారు.

138 మంచిది, ఏంటది? అది లోకంలో మరేమి కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారము తప్ప. తప్పుడు పోలికయైన స్త్రీ; అవునండి, సిద్ధాంతాలు, అబద్ధపు మానవ కల్పితమైన సిద్ధాంతాలు. తరువాత ఆమె, ఆమె అది చేసినపుడు…నేనిది ఇపుడు రుజువు చేస్తాను. ఆమె దేవుని పట్ల వేశ్యగా మారినది. బైబిల్ అది చెప్తుంది మీరు నమ్ముతున్నారా? అవునండి. ఆమె కుమార్తెలు అదే చేశారు.

139 ఇపుడు, ప్రకటన 17లో మీరది గుర్తుపెట్టుకోవాలనుకుంటె, యోహాను ఆత్మలో కొనిపోబడ్డాడు, “మరియు ఒక గొప్ప వేశ్య కూర్చొని యుండుటను చూచెను…” మరియు గతరాత్రి అది చదివియున్నాము. మరియు అక్కడ ఏడు కొండలున్నవి. ఖచ్చితంగా ఆమె అది చేసినది. ఆమె లోకమునకు తన అపవిత్ర జారత్వము ఇచ్చెను. అది నిజమేనా? “భూరాజులందరు ఆమెతో వ్యభిచరించిరి,” మోసగించుట మరియు దొంగిలించుట మరియు అబద్ధము చెప్పుట మరియు మారుమనస్సుకు డబ్బు చెల్లించుట మరియు—మరియు నోవేనాలు మరియు ఇతర కార్యములు చేయుట.

140 సరే. ఇపుడు జ్ఞప్తించుకోండి, ఆమెకు కుమార్తెలున్నారు. మంచిది. ఆమె ఒక సంస్థగా మారి, ఒక సంస్థాపక పద్ధతిన ఉండినట్లయితే మొత్తం క్రమమే తప్పు, హవ్వ దేవునికి అవిధేయురాలై, ఆమె క్రిందనున్న సమస్తమును మరణమునకు గురిచేసినట్లుగానే నిర్మాణాత్మకమైన ప్రతి సంఘము, దాని క్రిందనున్నది మరణమునకు త్రోయుచున్నది. ఖచ్చితం. సమస్తమును పాడైపోయినది. ఇక్కడున్న వాక్యము ప్రకారముగా ఖచ్చితం అదే. ప్రకటన 17 చదువు. మరియు బైబిల్ చెప్తుంది, ఆయన “ఆమెను ఆమెతో కూడా నున్న ఆమె యొక్క బిడ్డలనందరిని అగ్నితో కాల్చివేయును” యని. అవునది నిజం. దాని అర్థం, ప్రతి నిర్మాణాత్మక పద్ధతి కాల్చివేయబడును, వేశ్యతో.

141 అది వినుటకు కఠినంగాయుండును. మీరు దాని నుండి వింటారని నాకు—నాకు తెలియును. మరియు నేను—నేను దాని నుండి వినగోరుతాను. మరియు నేను—నేను…అది అయినప్పటికి సరియే. అలాగని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది నిజముగాయున్నది.

142 ఆమె “వేశ్యగా” మారినది. ప్రకటన 17 వ అధ్యాయములో మీరది చదువగలరు. ఆమె, ఆమె ఏమి చేసినది? ఆమె తన స్వంత భర్తకు వ్యతిరేకముగా వ్యభిచరించినది. “సరే,” మీరు “కాదు, అది బైబిల్” అని చెప్పవచ్చును. దేవుడు వాక్యమైయున్నాడు. మరియు ఒక దానిని మీరు తీసివేసిన యెడల.

143 మీ యొక్క భార్య ఇంకొక పురుషుని ముద్దు పెట్టుకొనుట మీరు కోరుకొందురా? ఆమె అంతకంటె ఏమియు చేయకున్నను మీరు అది చేయుటకు కూడా ఇష్టపడరు ఆమె యొక్క అప నమ్మకత్వము నిరూపణ చేయుచున్నది.

144 “ఎవరైనను దాని నుండి ఒక్క వాక్యము తీసివేసిన యెడల, లేక దానికి ఒక్క వాక్యము కలిపిన యెడల.” హల్లెలూయ! క్రీస్తు, ఆయన భార్య వాక్యముతో పవిత్రంగా యుండవలెనని కోరుచున్నాడు. [సహోదరుడు బ్రాన్హాం వేదికపై నాలుగు సార్లు తట్టుచున్నాడు—సంపా.] ఆ విధముగా ఆమె యుండవలసియున్నది.

145 ఆ ధర్మశాస్త్రము నుండి గాని లేక ఆ గ్రంథము నుండి గాని, అదంతా నెరవేరు వరకు ఏది కాని, ఒక సున్నయినను లేక పొల్లయినను లేక ఏదైనను లేక ఏ బిరుదైనను నెరవేరును. యేసు చెప్పాడు, “భూమి ఆకాశము గతించును, గాని నా మాట గతించదు.”

146 దానికెటువంటి వ్యక్తిగత అనువాదము పెట్టవద్దు. ఆయన పవిత్రమైన, కలుషితములేని, చివరకు పరిహారము కాని, నా యొక్క భార్య ఇంకొక పరాయి పురుషునితో సరసమాడుట నేను కోరను. దానికి మించి, ఏ విధమైన తర్కాలు మీరు వినినట్లయితే, సాతానుతో మీరు సరసమాడుచున్నట్లు అగును. ఆమేన్! మిమ్ములను భక్తి పులకితునిగా చేయుట లేదా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] కలుషితము కాని వానిగా నీవుండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఆ వాక్యముతో ఉండు. దానితో ఉండు. సరే.

147 హవ్వకు, ఏదెను తోటలో ఆయన ఏలాగు చేశాడో, ఇక్కడ ఈ చివరి హవ్వకు దేవుడు వాగ్దానము చేసెను. ఆది సంఘమైన పెంతెకొస్తు ఆరంభ సంఘము, సంఘమే, జీవించు ప్రజలందరికి తల్లి. ఎందుకనగా వారు అక్కడ యుండు వరకు ఆ విధముగాయుండెను. అయితే, చూడూ, వారు ఆమె యొక్క పాపములు తీసుకొనుట వలన, ఆమెతో వారు చనిపోతారు.

148 ఇక్కడొక చిన్న వ్యక్తి వచ్చుచున్నాడు, అతడు చెప్పాడు, “నేను—నేను దేవునికి సేవ చేయవలెనని కోరుచున్నాను” అని.

149 వారు చెప్తారు, “మంచిది. ఇక్కడ నీవేమి చేయవలెనో చెప్పబడినది. క్రిందకు వెళ్ళి మారుమనస్సు పొందు.”

“సరే. నేనది చేస్తాను. దేవునికి మహిమ కలుగుగాక!” క్రిందకు వెళ్ళి, మారుమనస్సు పొందు.

150 “ఇప్పుడు వచ్చి మాతో కలువు.” అక్కడే, అక్కడే మీరున్నారు. ఊహుఁ. చూశారా? అది పొందుకున్నారు. ఊహుఁ. అక్కడ దానితోపాటు చనిపోవుచున్నాడు. చూశారా? చూశారా? అది…అది ఈ గ్రంథము బోధిస్తుంది. చూశారా. నేను చెప్పుట కాదు. ఎందుకనగా, ఇది ఇక్కడ చెప్పినది. సరే.

151 ఇపుడు, ఆయన హవ్వకు చేసినట్లుగా ఆయన ఆమెకు వాగ్దానం చేశాడు. హవ్వతో ఆయన చెప్పాడు ఒక సమయము వచ్చునని—వాక్యము ఆమె యొద్దకు తిరిగి వచ్చునని చెప్పాడు. మీకది జ్ఞాపకముందా? ఆమె దేనిని పోగొట్టుకొనెనో అది తిరిగి ఇవ్వబడును. కారణం, ఒకే యొకటి పునరుద్ధరణ కాగలదు, అది వాక్యము. ఖచ్చితం.

152 నేను చెప్పాను, తుపాకీని పేల్చు; అని. నీవు గురిని తగలకపోతే, అది ఎచటకు పోయినదో తెలుసుకో. నీవు వెనుకకు తిరిగి వచ్చి తిరిగి ప్రారంభించు. అవునా?

153 నీవు వెనుకకు వెళ్ళిన యెడల నీవు నైసియాకు వెళ్ళవలెను. అక్కడే నీవు తిరిగి ప్రారంభించవలెను. చూశారా, వెనుకకు వెళ్ళు. ఆ సంస్థాపకములకు దూరముగా ఉండు, ఆ సంఘమంతటికి దూరంగాయుండు. మనమీ ముద్రలను క్రమముగా చూస్తున్నాము.

154 నా జీవితమంతటిలో సంస్థాపక పద్ధతులకు నేనెందుకు వ్యతిరేకినా యని ఎల్లపుడు ఆశ్చర్యపడుతుంటాను. ప్రజల కొరకు కాదు. కాదు. ప్రజలు నాలాటి వారు లేక నీలాటి వారు, అందరిలాటి వారు. అయితే ఆ పద్ధతి, ఆ సంఘశాఖ పద్ధతి, దానినిక్కడే చూస్తున్నాను. ఇప్పటి వరకు నాకది తెలియదు. మరియు అవునది నిజం.

155 వాక్యము ఆమెకు పునరుద్ధరణ చేయబడునని ప్రకృతి సంబంధమైన హవ్వకు ఆయన ఏలాగు చేసెనో ఆలాగే దేవుడు ఆత్మ సంబంధమైన హవ్వకు వాగ్దానం చేశాడు. కడవరి దినములలో మరలా అసలైన వాక్యమును ఆయన సంఘమునకు పునరుద్ధరణ చేయును.

156 బహు జాగత్రగా గమనించుడి. నేను—నేను, మీరిది నిశ్చయముగా తెలుసుకోవాలని కోరుచున్నాను. ఆమె సంతానము ద్వారా వాక్యము పునరుద్ధరణ చెందు ఒక కాలము వచ్చునని దేవుడు హవ్వకు వాగ్దానము చేశాడు. ఈ వాక్యము, దానికదే, విత్తనముగా (సంతానముగా) మారును. వారు ఆమెకు ప్రత్యామ్నాయము ఇచ్చినపుడు ఆ ప్రత్యామ్నాయమును పట్టుకున్నది. మరియు వాక్యము ఆమె యొద్దకు వచ్చినపుడు ఆమె ఏమి చేసినది? “నాకు అది వద్దు.” అదెంతో దీనత్వంలో ఉండెను. ఆమెకది సరిగా కన్పించలేదు. చాలినంతగా మెరవలేదు. “ఒక పశువులపాక? ఓ మై! మై! అలాటి ఒక వ్యక్తి, ఒక రోజు కూడా బడిలో ఉండలేదు? నేను దానిని అంగీకరింపను. అది మెస్సీయా కాదు. తనను ఇతరులు ఆ విధముగా కొట్టుచు, ఆ విధముగా చేయుచున్నను ఆయన ‘మెస్సీయాగా’ ఎట్లు పిలువబడును? ఆయన ముఖము చుట్టు గుడ్డను పెట్టి తరువాత ఆయన తలపైన వారు కొట్టారు కదా? మరియు ఆయన తనకు తాను ఒక ప్రవక్తగా, ఒక నిజమైన ప్రవక్త లేచెనని ఏ విధముగా చెప్పుకోగలుగుచున్నాడు అని వారు ఆలోచించారు.”

157 వాస్తవంగా వారు ప్రవక్తలనెరుగరు, ఆలాగని యేసు చెప్పాడు. ఆయన అన్నాడు, “మీరు ప్రవక్తలను ఎరిగిన యెడల, మీరు నన్ను ఎరుగుదురు.” అవునది నిజం.

158 ఇపుడు గమనించుడి. అయితే, వాక్యము ఏ విధముగా వచ్చునని దేవుడు చెప్పియుండెనో అదే విధముగా వాక్యము ఆమె యొద్దకు వచ్చినపుడు, ఆమె దానిని ఇంకో విధముగా తలంచుకొనెను. నేను పెండ్లి కుమార్తెను గూర్చి మాట్లాడుతున్నాను. యూదా పెండ్లి కుమార్తె, హెబ్రీ పెండ్లి కుమార్తెను గూర్చి. ఆమెయే ప్రారంభంలో హవ్వ. తరువాత, అది ఇక్కడకు వచ్చినపుడు, ఆమె దానిని వద్దనెను. ఆమె తన యొక్క ప్రత్యామ్నాయములతో ఉండగోరినది.

159 ఇపుడు, పెంతెకొస్తున, దేవుడు ఆత్మీయ హవ్వకు వాగ్దానము చేశాడు. అది జరుగకముందే, సంఘము పడిపోవుటకు నాలుగు వందల సంవత్సరములకు ముందే. వారు పడిపోదురనియు, వారు ఇది వరకు చేసినట్లే ఇపుడు చేస్తారని చెప్పెను. అయితే, కడవరి దినములలో వాక్యమును తిరిగి పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు.

160 యేసు భూమి మీద నున్నపుడు ఆయనదే మాట్లాడాడు; తిరిగి ఆయన అది పంపాడు. మరియు ఏది…అది దేనిని కనుగొన్నది? అది మొదట వచ్చినపుడు దేనిని కనుగొన్నదో దానినే అది కనుగొన్నది. అవును. వారు…వారికి ప్రత్యామ్నాయములు కావాలి. వారికి వారి సంఘశాఖ కావాలి. వారికి వారి సిద్ధాంతాలు కావాలి. వారికిష్టమొచ్చినట్లుగా వారు జీవించగోరుతారు. మరియు, “నేను పలానా-పలానా. నేను పలానా-పలానా దానికి చెందాను,” అని కోరుతారు. దేవుడు ఎంత చేసినప్పటికి, ఎంతగా తనను తాను బయలుపరచుకున్నప్పటికి అది వారికి ఏ విధమైన క్రియ చేయలేదు. ఆయన చనిపోయిన వారిని లేపగలడు. హృదయము యొక్క రహస్యాలను ఆయన చెప్పగలడు. ఆయన చేయునని బైబిల్ ఏది చెప్తుందో అట్టి ప్రతి దానిని ఆయన చేయగలడు. అది ఏ విధమైన చిన్న వ్యత్యాసము లేదు. “అది నా సంఘశాఖతో సంబంధం లేకపోతే, దానికి సంబంధం లేదు.” చూశారా?

161 అదే విషయాన్ని హెబ్రీ పెండ్లి కుమార్తె చేసినది. అవును. చూశారా, వారు వారి యొక్క ప్రత్యామ్నాయములను కోరారు. దేవుడు వారికి నిజమైనది వాగ్దానం చేశాడు. నిజమైనది వచ్చినపుడు అది వారికి అవసరం లేకపోయెను. అదెంతో దీనత్వంలో యుండిపోయెను.

162 అది రంగము మీదికి వచ్చుచున్నప్పటికి, ఆలాటి విషయమే ఈ రోజు కూడా. ఇపుడు, దేవుడు చెప్పాడు, మలాకీ 4 లో పునరుద్ధరణ చేయు వర్తమానమును కడవరి దినాలలో పంపెదనని దేవుడు చెప్పాడు. యోవేలు చెప్పాడు, “నేను అన్ని సంవత్సరాలను పునరుద్ధరించెదను.” రోమ్ తినివేసిన ప్రతీది, మరియు మెథడిస్టులు తినివేసిన ప్రతీది, మరియు బాప్టిస్టులు తినివేసిన ప్రతి యొక్కటి, ఆ సగము అసలైన పెంతెకొస్తు కొమ్మ. “నేను పునరుద్ధరించెదను కడవరి దినమున” అని దేవుడు చెప్పాడు. అవునది నిజం.

163 మరియు ఆలాటి వ్యక్తిని ఆయన పంపును…దేవుడు ఎల్లపుడు ఆయన వాక్యమును పంపునది, ప్రవక్త యొద్దకు. సంస్కర్తల యొద్దకు కాదు; ప్రవక్తల యొద్దకు. దాని కొరకైన సమయం అది కాదు. ఇపుడు మరి ఆ సమయం వచ్చుచున్నది. ఆ కారణం చేత అది వచ్చుటకు మనం ఎదురు చూచుచున్నాము. అదెంతో సాధుత్వంతో దీనత్వంతోయుండును. కాబట్టి…ఓ, మై!

164 ఆ ధనవంతులైన మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకొస్తులు అది స్వీకరిస్తారని నీవనుకుంటావా?

“ఓ,” మీరు చెప్పవచ్చును, “పెంతెకొస్తువారు?”

165 పెంతెకొస్తు వారే లవొదికయులు. “ధనవంతులు, ఏమి కొదువలేని వారు.”

166 “దరిద్రుడవని నీవు ఎరుగవు” అని చెప్పబడుతుంది. మిలియన్ల డాలర్ల భవనాలు నీవు కట్టవచ్చు. అయినప్పటికి ఇంకా నీవు దరిద్రుడవే, ఆత్మ సంబంధంగా నీవు దరిద్రుడవే.

“ఓ,” నీవు చెప్పవచ్చును, “నేను అంతా చూస్తున్నాను.”

“నీవు గ్రుడ్డివాడవు!”

“మంచిది,” “దేవునికి స్తోత్రం, నేను కప్పబడియున్నాను” అని నీవు చెప్తావు.

“దిగంబరివి!”

“మంచిది, నా యొక్క బిడ్డలను గూర్చి, నాకు బాగా తెలుసు. మాకు సెమెనిరీలున్నవి. మేము…”

167 “మరియు అది ఎరుగనిది.” అది తారుమారు. ఇపుడు, లవొదికయ సంఘము ఆ స్థితిలో యుండెనని బైబిల్ చెప్తుంటె…

168 ఇది కడవరి కాలము కాదని భూమి మీదనున్న ఏ వ్యక్తియైన తిరస్కరించలేడు. ఎందుకనగా, ఇది లవొదికయ సంఘకాలము లేక ఏడవ సంఘకాలము. ఇక్కడ మనమున్నాము. రెండవ రెండు వేల సంవత్సరములు పూర్తియగుచున్నవి. ఇంక సంఘకాలాలు లేవు. ఆ కారణం చేత కడవరి వర్షపు సహోదరులైన మీరు, ఇంకొక సంస్థాపకమును ప్రారంభించలేరు. ఇంకొకటి యుండబోదు. అవును. ఇది అంతముననున్నది. ఆమేన్. ఇక నుండి ఏ సంఘకాలములుండవు. అదంతా అయిపోయినది.

169 అయితే, అటు తరువాత, పెంతెకొస్తు వర్తమానమే ఆఖరు వర్తమానమైతే, అనగా, నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆఖరు మూడు వర్తమానములు, ఆఖరు మూడు సంఘకాలాలు సంపూర్ణ జన్మను రూపొందించును.

170 ఒక స్త్రీ తన బిడ్డను కనునపుడు ఏలాగో ఆలాగు. వాస్తవంగా మొదట జరుగు కార్యము నీరు వచ్చును. తరువాతది రక్తము. తరువాతది జీవము వచ్చును.

171 సిలువలో, యేసును వారు చంపినపుడు, ఆయన శరీరములో నుండి వచ్చిన పదార్థం తయారు చేసెను…క్రొత్త జన్మ వచ్చినది. ఆ ప్రక్కను వారు పొడవగా రక్తము నీరు వచ్చినది, మరియు, “నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను.” ఆయన శరీరము నుండి వచ్చినదేదనగా నీరు, రక్తము, ఆత్మ.

172 ఇపుడు, మొదటి యోహాను 5:7 దాన్ని గూర్చి చెప్తున్నది, “పరలోకమందు సాక్షమిచ్చునవి మూడుగలవు. తండ్రి, వాక్యము (అది క్రీస్తు) మరియు పరిశుద్ధాత్మ.” మరియు ఈ మూడును ఏకీభవించియున్నవి; అవి ఒకటి కాదు. అయితే అవి ఒకటిగా ఏకీభవించియున్నవి. మరియు సాక్ష్యమిచ్చునవి మూడు…లేక “అవి ఒక్కటే,” అని నా భావం. నేనిక్కడ పొరపాటు చెప్పాను. “భూమి మీద సాక్ష్యమిచ్చునవి మూడు, అవి నీరు, రక్తము మరియు ఆత్మ మరియు అవి ఒకటిగా ఏకీభవించియున్నవి.”

173 నీవు నీతిమంతునిగా తీర్చబడకుండగనే శుద్ధీకరణ పొందవచ్చును. నీవు శుద్ధీకరించబడకుండగనే నీతిమంతునిగా తీర్చబడవచ్చును. నీవు పరిశుద్ధాత్మను పొందకుండగనే శుద్ధీకరణ పొందవచ్చును. అది ఖచ్చితం.

174 శిష్యులు యోహాను 17:17 లో శుద్ధీకరించబడి దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము పొందిరి. అయితే ఇంకా వారికి పరిశుద్ధాత్మ లేదు. చూశారా? నిశ్చయంగా. పెంతెకొస్తుకు వెళ్ళి, పరిశుద్ధాత్మ వచ్చు వరకు కనిపెట్టవలసియున్నది.

175 అక్కడే యూదా తన రంగులు చూపించినది. ఆ ఆత్మ ఏ విధముగా నీతిమత్వము శుద్ధీకరణ అను మార్గముల గుండా పని చేసినదో చూశారా? అయితే, అది అంతమునకు వచ్చునప్పటికి, అతడు తన రంగు చూపించెను. అవునా? అవునది నిజం.

176 ఇపుడు గమనించుడి, ఇపుడు మనమిపుడు అంత్యకాలంలో ఉన్నాము. మరియు ఆత్మ సంబంధమైన హవ్వ, ఏలాగో…హెబ్రీ హవ్వకు వాగ్దానము ఇయ్యబడినట్లుగా, హెబ్రీ పెండ్లి కుమార్తెకు తిరిగి ఇవ్వబడునని వాక్యము వాగ్దానము చేయబడెను. మరియు పెంతెకొస్తునందున్న ఆత్మీయ పెండ్లి కుమార్తె, నైసియాలో ఆమె పడిపోయినపుడు, అప్పుడు అంత్య దినములలో ఆ వాక్యము తిరిగి వచ్చునని ఆమెకు వాగ్దానము చేయబడెను. ఇపుడు మీరు చెప్పవచ్చును, తరువాత…

177 మీకు ఇంకొక లేఖనము కావలయునంటె ఇక్కడ తీసుకొండి, ప్రకటన 10. మరియు చెప్పబడెను, “ఈ ఘడియలో—చివరి దూత యొక్క సమయములో ఏడవ దూత (ఏడవ వర్తమానికుడు) పలుకు దినములలో దేవుని యొక్క మర్మము సమాప్తమగును.” చూశారా? తిరిగి వాక్యము నొద్దకు వచ్చుట! బైబిల్ చెప్తుంది కడవరి కాలము యొక్క ఈ వర్తమానికుడు, “మరలా నిజమైన, అసలైన విశ్వాసము యొద్దకు వారిని త్రిప్పును. పితరుల యొక్క విశ్వాసము యొద్దకు త్రిప్పును.” అయితే అది వారు అంగీకరిస్తారని అనుకుంటున్నావా? లేదండి. “కడవరి దినములలో, అసలైన వాక్యమును తిరిగి ఆయన పునరుద్ధరణ చేయును,” మలాకీ 4 లో ఆయన చెప్పినట్లుగా.

178 అయితే ఆమె పోగొట్టుకున్నది. ఆ వాక్యమును ఆమె నైసియాలో పోగొట్టుకున్నది. హవ్వ ఏదెనులో పోగొట్టుకున్నది. హవ్వ కల్వరిలో ఆమె దానిని నిరాకరించినది. మరియు నైసియా వర్గము కడవరి దినములలో దానిని నిరాకరిస్తున్నారు, ఆలాగుననే, మై.

179 అయితే వాక్యము మానవ శరీరములోకి వచ్చినపుడు, ఆమె, హవ్వ, హెబ్రీ సంఘము అప్పుడు ఆత్మీయముగా జీవించువారి తల్లి దానిని తిరస్కరించినది. ఆమె యొక్క ఆచార పద్ధతులలో, దానిని ఆమె పోగొట్టుకున్నంతగా ఆమె చనిపోయింది. ఆలాగుననే ఇదీ ఉన్నది, ఖచ్చితంగా, మంచిది.

180 వాక్యము ద్వారా వాగ్దానము చేయబడిన ఆ జీవము గల వాక్యము శరీరములో బయలు పడినపుడు ఆయనను వారు తప్పిపోయారు. ఈ సంగతులను చేయునని వాక్యము వాగ్దానము చేసెను. కడవరి దినములలో అది ఈ విధముగా నుండునని వాగ్దానము చేయబడెను. “సొదొమ దినములలో ఉన్నట్లుగా మనుష్యు కుమారుని రాకడయందును ఉండును.” ఇపుడు గమనించు సొదొమాలో ఏం జరిగిందో. “నోవహు దినములలో ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడయందును ఉండును.” చూశారా? అపుడేమి జరిగిందో గమనించు. చూశారా? ఇపుడు అది అదేయైయుంటుందని ఆయన చెప్పాడు. మరియు ఆ దినాన మనం జీవిస్తున్నాము. మంచిది. అది ఆలాగేయుండును. నేను వాటిని ఊహించి, లేఖనములో నుండి ఆరువందల వాగ్దానములు చూపగలను. దానికి గుర్తించగలను. చూశారా? అయితే వారు దానిని నిరాకరించారు.

181 ఆమె పారంపర్యాచారములను, ప్రత్యామ్నాయమును పట్టుకొన్నది, ఆమె నిజమైన రక్తమునకు బదులుగా, ప్రత్యామ్నాయ రక్తమును పట్టుకొన్నది. వాక్యమైన యేసు చెప్పాడు, ఆమెకు ప్రత్యక్షమైనపుడు “ఆమె ఈ పారంపర్యాచారాలను పట్టుకొన్నందున…” పెండ్లి కుమార్తెతో, హెబ్రీ పెండ్లి కుమార్తెతో ప్రత్యక్షపరచబడియున్న వాక్యమైన యేసు, “నీ పారంపర్యాచారాలను పట్టుకున్నావు కనుక దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నావు. అది ఫలితం లేకున్నది.”

182 ఆ కారణం చేతనే ఈనాడు, ఆ—మనకుండవలసిన ఉజ్జీవాలకు బదులుగా సంఘశాఖల ఉజ్జీవాలు మనకున్నవి. మనము నిజమైన కదలింపు కలిగియుండుట లేదు, లేదు, లేదు, లేదు. లేదండి. మనకు ఉజ్జీవమున్నదని తలంచవద్దు. మనకు లేవు. వారికి మిలియన్లు, మిలియన్ల, మిలియన్ల సంఘ సభ్యులున్నారు, అయితే ఎక్కడా ఉజ్జీవం లేదు, లేదు, లేదు.

183 ఆ—పెండ్లి కుమార్తెకు ఇంకనూ ఉజ్జీవము లేదు. చూశారా? అక్కడ ఉజ్జీవము లేదు. పెండ్లి కుమార్తెను ఇంకా కదలించుటకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. చూశారా? దాని కొరకు మనమిపుడు ఎదురు చూస్తున్నాము. ఆమెను మరలా లేపుటకు అక్కడ వెనుకనున్న తెలియబడని ఆ ఏడు ఉరుములు కావలయును. చూశారా. ఆఁ. ఆయన అది పంపును. అది ఆయన వాగ్దానము చేశాడు. ఇపుడు గమనించు.

184 ఇపుడు ఆమె—ఆమె చనిపోయినది. మరియు ఇపుడు సంఘములు వారి యొక్క మత తెగలను, వారి యొక్క మత సిద్ధాంతములను మరచి, బైబిల్ మాత్రమే తీసుకొని వాగ్దానమును ఒప్పుకొనిన యెడల, అప్పుడు అది వారికి ఫలభరితం యౌతుంది. అయితే చూడండి, యేసు చెప్పాడు “మీరు మీ యొక్క పారంపర్యాచారాల చేత, దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు.” అదే నేటి దినమందు ఆత్మ సంబంధమైన హవ్వతో కూడినది, చూశారా, నేటి దినమందలి ఆత్మ సంబంధమైన పెండ్లి కుమార్తె సంఘము అనబడునది. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తుంది, దానిని ఆమె అంగీకరించదు. బదులుగా మత సిద్ధాంతాలు అంగీకరిస్తుంది. కాబట్టి వాక్యము ఆమెకు ఉపయుక్తము కాదు. చూశారా, ఎందుకనగా ఆమె యొక్క సిద్ధాంతమును వాక్యమునకు కలుప ప్రయత్నించినది, అది పనిచేయదు. ఇపుడు ఈ దినాన మనకేమి కావాలి…

185 నేనిది ఇక్కడ చదువుచుంటిని, ఆయన రాకడ యొక్క దూత, ప్రాముఖ్య పాఠమును, “ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమైయున్నది! ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమైయున్నది!” మరియు నేననుకుంటాను, అతడు తిరిగి వచ్చినపుడు అందును గూర్చి వారికేమి తెలియదు. అంతే…అది అంతే. అది ఎల్లపుడు ఆలాగే యుంటుంది. అవునా. “అది మనకు అవసరం,” మీరు మాట్లాడు సమస్తమును, “భయము లేకుండ ప్రభువు యొక్క వాక్యమును తీసుకొని వచ్చే, ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమైయున్నది. బైబిల్ మనకది వాగ్దానము చేసినదని మనము నమ్ముతున్నాము.”

186 ఇపుడు సహోదరుడు మోర్, వారు అతని ఇంట్లో భోజనం చేశారు. అతడు పత్రిక యొక్క సంపాదకుడు. అతడెంతో మంచివాడు. చాలా మంచి వారిలో ఒకడు. చర్మపు బూట్లను వేసికుంటాడు. అయితే, చూడూ. మనము దానిని పొందవలసిన వారముగా ఉన్నామనే దానినతడు ఎరిగియున్నాడు. మరియు సహోదరి మోర్ మంచి స్త్రీ…దీనురాలైన చిన్న సహోదరి. వారు త్యాగము చేశారు.

187 నా యొక్క అభిప్రాయ ప్రకారముగా ఆయన రాకడ యొక్క దూత, పొలములో శ్రేష్టమైన ఒక పత్రిక. అయితే మీరు కనుగొనవచ్చును, “మనకు ఒక ప్రవక్త కావలయును! మనకొక ప్రవక్త కావలయును!” అని వారు అరచుచున్నారు. చూశారా? మై! దానిని గురించి వారు మాట్లాడుచున్నారు.

188 మరియు నిన్న నేడు రేడియోలో ప్రకటించునట్లు, ఈ రోజు ఇక్కడున్నాము. అది…మరియు బాప్టిస్టు సంఘములు మొదలైనవి అన్నవి, “మనము కథోలిక్కులను చేర్చుకొనరాదు కాని వారితో సహవాసము కలిగియుండవచ్చు.” చూశారా?

189 మరియు ఇక్కడే, “విషపూరితమైన దాని నుండి దూరంగాయుండు” అను వర్తమానము ఇక్కడ నుండే వెలుతుంది. చూశారా? చూశారా? “ఇద్దరు ’అంగీకరించకుండ ఏలాగు కూడి నడుతురు?” వెలుగు చీకటి కలసి సహవాసము చేయలేవు, వెలుగు వచ్చిన వెంటనే చీకటి బయటకు వెళ్ళిపోతుంది. అవునా? అది కాదు…బహు శక్తివంతమైనది. మీరు చీకటితో వెలుగును ఆర్పలేరు. అయితే వెలుగుతో చీకటిని బయటకు త్రోయగలరు, అవును. మరియు ఆయన వెలుగైయున్నాడు. ఆయన వాక్యమైయున్నాడు. చూశారా? ఇపుడు అక్కడే మీరున్నారు. నేరుగా వెనుకయున్నారు. మీరు దానిని అబద్ధం చేయలేరు లేక ఏ తప్పు చేయలేరు. అది సరిగ్గా తిరిగి దాని చోటుకే వచ్చుచున్నది. అవునండి.

190 ఒక వ్యక్తి మీ యొద్దకు వచ్చి, మిమ్ములను గజిబిజి చేయుటకు ప్రయత్నిస్తే, మీరెక్కడ నిలబడ్డారో మీరెరిగియుంటె, అతడు నమ్మినదేదో ఎరిగియుంటారు.

191 అది ఈలాగుంటుంది. ఒక కుందేలును తీసుకొని గూట్లో వదిలిపెట్టి ద్వారము అన్ని మూసివేయండి. మీరు తలుపు నొద్ద నిలబడండి. అది వెనుకకు రావలసియున్నది. దానికున్నది అదొక్కటే. అవునా? అది తిరిగి ద్వారము యొద్దకే రావలసియున్నది ఎందుకనగా, అది రావలసిన ద్వారము అదొక్కటే. అది తన తలను ఇక్కడ అందులోయుంచి మెడ విరిగిపోవునంతగా వెలుపలికి వెళ్ళుటకు అటూ ఇటూ తిరుగుచు మీరు గమనించగలరు. అలా నిలబడి గమనించుడి. అది తిరిగి వచ్చును. చూశారా? అది అంతే.

192 చేయగలిగిన మార్గము అదొక్కటే, వాక్యముతో నిలబడు. ఆ విధముగా మీరు కూడా ఎంతగా మీ తలలను మీ సిద్ధాంతములతోను ఆచారములలోను దూర్చుటకు ప్రయత్నించినను అయితే ఈ వాక్యము యొద్దకే రావలయును. చూశారా? అవునండి, అదంతా అదే.

193 ఇపుడు, చూడుడి. వారు—వారు—వారు—వారికి అది అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము వారికి అవసరం లేదు. ఎందుకనగా ఆమె ఆమె యొక్క ఆచారములు పట్టుకున్నది. దేవుని యొక్క వాక్యము నిరర్ధకమగునట్లు ఆమె దానిని పట్టుకున్నది.

194 ఆత్మీయ హవ్వ కూడా ఆలాగేయున్నది. ఆమెకు అవసరం లేదు. ఆమె యొక్క ఆచారములను ఆమె కాపాడగోరి, దేవుని యొక్క వాక్యమునకు దూరముగా వెళ్ళినది. దేవుని వాక్యమును తీసుకొనుటకు బదులుగా ఆమె తిరిగి సంఘశాఖలును వాటి క్రమములను, ఆమె పెద్దల ఆచారములను పట్టుకున్నది.

195 కడవరి దినములలో వాక్యము యొక్క వాగ్దానము ఆమె యొద్దకు తీసుకు రాబడినపుడు ఆమె అది తీసికోదు. కారణం, హెబ్రీ వధువు చేసినట్లు ఆమె ఆచారములతో చేయును. నిజమైన వాక్యము ప్రత్యక్షపరచబడినను, రుజువు చేయబడినను, నిరూపించబడినను ఆమె అది పొందదు. ఆమె ఎందుకని దానిని పొందుకొనదు? ఎందుకనగా అక్కడ ఆమె పోలికయున్నది. ఆమె, అది చేయలేదు. అవునది నిజం. ఆమె పోలికను ఆమె కొట్టలేదు. చూశారా? ఆమె అది చేయునని ముందుగా చెప్పబడెను. కాబట్టి, ఆ విధమైన కార్యముల నుండి ఏ విధముగా దూరముగా యుండగలవు?

196 నీవున్న స్థానములో సంతోషముగా యుండుటయే ఇపుడు మీరు చేయవలసిన ఒకే యొక కార్యమైయున్నది. అంతే. దాని కొరకు కాచుకొనియుండు. సరే.

197 కడవరి దినములలో ఆయన వాక్యమును రుజువు చేస్తాడని, ఆమెకు నిరూపణ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, అయినప్పటికి ఆమె అది చేయలేదు. అదంతా, ఆయన యొక్క సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా, దేవుడు ఆమెకు వాగ్దానము చేశాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. యోవేలు ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. పౌలు ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. మలాకీ ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. యోహాను…ప్రత్యక్షత తెచ్చిన యోహాను ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. ప్రవక్తలందరి ద్వారా—ఆఖరి వర్తమానికుడు ఆమెకు ఎట్లుండునోయని ఖచ్చితంగా తెలియజేశాడు. మీరు, ఇపుడు వ్రాసుకోవాలంటే వ్రాసికొనవచ్చును; బహుశా అవి మీకు తెలుసు. యేసు, యోహాను 14:12, మరియు యోవేలు, యోవేలు 2:38, పౌలు; రెండవ తిమోతి 3; మలాకీ 4 అధ్యాయం; మరియు ప్రత్యక్షత తెచ్చిన యోహాను, ప్రకటన 10: పదిహేడు, ఒకటి నుండి పదిహేడు వరకు, చూశారా! ఖచ్చితంగా ఇపుడేమి జరుగునో! మరియు సంఘానికి, అదేంటి? అవతారమెత్తిన వాక్యము తిరిగి తన ప్రజల మధ్య శరీరధారియాయెను! చూశారా? వారది నమ్మరు.

198 యేసు ఆయన చూచినపుడు, ఆయన…వారి యెదుట అద్భుతములు ఆయన చేసినపుడు, ఆయన ఏమి చెప్పాడో మీకు తెలుసా, ఆయన దేవుడని రుజువు చేసినపుడు? ఆయన చేస్తుంది ఆయన రుజువు చేశాడు. ఆయన, ఆయన ఖచ్చితంగా చేశాడు. ఆయన—ఆయన వారితో చెప్పాడు, ఆయన చెప్పాడు, “ఓ, మీరు, కపెర్నహూమా, ఆకాశము వరకు హెచ్చించబడినదానా కార్యములైతే…సొదొమాలో గొప్ప కార్యములు చేసినట్లయితే; నీలో చేసిన గొప్ప కార్యములు సొదొమాలో చేసినట్లయితే, ఈ దినానికి అది నిలచియుండును.” అవునది నిజం. కపెర్నహూములో ఆయన ఏదీ చేయలేదు. కొద్దిమందిని స్వస్థపరచుట తప్ప. వారి హృదయాలోచనలు చెప్పి, వెళ్ళిపోయాడు. ఊహు. అంతే. చూశారా?

199 గొప్ప కార్యములంటె వారికి తెలియదు. వారు అనుకున్నారు గొప్ప కార్యములనగా గొప్ప కార్యక్రమములని, ప్రతి యొక్కరు నిలబడితే, ఒక న్యాయాధిపతి ఒక ప్రసంగం చేస్తే, మరియు వాయిద్యములు వాయించుచు, పతాకములు ఎగరవేయుచు—విలువైన వస్త్రములు ధరించిన స్త్రీలు, మరియు వారి…గొప్ప పి.హెచ్.డిలు యల్.యల్.డి లు పొడవాటి టోపీలు, నిటారైన మెడలుతో లోపలకి వస్తారు. “అదీ ఒక గొప్ప విషయం.”

దేవుడు చెప్తున్నాడు, “అది బుద్ధిహీనత” యని.

200 మరియు బహుశా ఎ బి సి మధ్య ఏమి వ్యత్యాసమున్నదో ఎరుగని ఒక చిన్న దానిని తెచ్చి నిజమైన సంఘమును ఒక దానిని మండింపజేయును. మిగతా వారు వారిని “పరిశుద్ధ గుండ్రాళ్ళని” చెప్తారు. దేవుడు దానిని “గొప్పది” అని పిలుచును, లోకం దానిని “బుద్ధిహీనత” యని పిలుచును. లోకం దానిని “గొప్పది” అని పిలుచును, దేవుడు దానిని “బుద్ధిహీనత” యని పిలుచును. చూశారా, ఒకదానికి యొకటి వేరుగానున్నది. చూశారా? దేవుడు వాగ్దానము చేసినది దేవుడు చేయును మరియు దేవుడు చేసెను. చూశారా? ఇక్కడే మనమున్నాము.

201 హెబ్రీ హవ్వ చేసినట్లు ఆమె ఇంకా ఆలాగే చేయుచున్నది. ఆమె అది చేయలేక యున్నది. చనిపోయిన వారిని మీరు లేపవచ్చును; దేవుని ఆత్మను మీరు చూడవచ్చును. యేసు దిగివచ్చి దేవుని కుమారుడని తనకు తాను నిరూపించుకున్నాడు. మొదట ఆయన బోధించుట మొదలు పెట్టాడు. సరే. వారు అనుకున్నారు, “మంచిది. ఆయన ఒక వినోదమైన వ్యక్తిగా నున్నాడు. ఏలాగైనా ఆయన ఎవరు?” సరే, మొదటి విషయమేంటో తెలుసా, ప్రజలు చెప్తున్నారు…

202 ఏలయనగా ఆయనకు ముందుగా రావలసిన యోహాను వచ్చినపుడు వారు అడిగారు, “నీవు మెస్సీయావా?”

203 అతడు చెప్పాడు, “కాదు. అయితే ఆయన మీ మధ్య ఒక చోటనున్నాడు.” ఉహు. చూశారా? ఎందుకని? అతని యొక్క వర్తమానము అందింపబడునపుడు అతడు ఏమి చేయవలెనో అతడు ఎరిగియుండెను. అతడు ఏమి చేయవలెనో అతడు ఎరిగియుండెను.

204 నోవహు, హనోకును గమనిస్తున్నట్లుగానే అదియున్నది. హనోకు వెళ్ళిన తరువాత నోవహు చెప్పాడు, “ఓడకు సమీపముగా వచ్చుట మంచిది, సమయం సమీపమైయున్నది.” నోవహు, హనోకును గమనిస్తూనేయుండెను. అవునా?

205 యేసు, అతనికి చెప్పిన సూచనను లేక దేవుడు అతనికి చెప్పిన సూచనను యోహాను గమనిస్తూనేయుండెను. అతడు చెప్పాడు, “ఆయన మీ మధ్య ఒక చోటయున్నాడు. ఆయన నాకు తెలియదు గాని నేనాయనను తెలిసికుంటాను.”

206 వారక్కడ నిలబడి వారు అడిగారు, “నీవు మెస్సీయావా?” అన్నారు, “మేము ప్రధాన కార్యాలయము నుండి పంపబడినవారము.” ఉహుఁ. అన్నారు, “పెద్దలు మరియు వారందరు మమ్ములను ఇక్కడకు పంపియున్నారు. నీవు మెస్సీయావుయైతే, నీవు వచ్చి, నిన్ను నీవుగా తెలియపరచుకోకూడదు? ఇక్కడ ఈ గుంపు మధ్య ఎందుకుంటున్నావు! నీవు అక్కడకు వచ్చి, నిన్ను నీవు తెలియపరచుకో.”

207 అతడు చెప్పాడు, “నేను మెస్సీయాను కాదు.” అతడు చెప్పాడు, “నేను అరణ్యములో కేక వేయు ఒక శబ్దము” అని.

208 అది వారి తలలకు పైగా ఎంతో దూరము పోయినది. దాని గూర్చి వారేమి ఎరుగరు, చూశారా, మరియు అయినప్పటికి అతడు వచ్చుటకు వారందరు ఎదురు చూశారు. “అయితే వారు ఎదురు చూచునతను ఆ విధముగా ఉండడు. ఓ. మై. అది భయంకరము!”

“నీవు ఏ పాఠశాల నుండి వచ్చియున్నావు?”

“ఏది కాదు.”

“నీ యొక్క సహవాస కార్డు కలిగియున్నావా?”

“అదేమిటి?” చూశారా?

209 అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు. అతడన్నాడు, “నా యొద్ద ఒకటి ఉన్నది. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది.” ఇపుడు, అది—అతడు కలిగియున్నదంతా అదే. అడవులలో నివసించే వారి పదజాలము వాడాడు. బోధకుని పదజాలము కాదు. సర్పములు గొడ్డల్లు మరియు చెట్లు మొదలైనవి. అతడు—అతడు ప్రసంగీకుల పదజాలమును వాడలేదు.

210 అయితే, అతని వంటి ప్రవక్త లేడని ఎవ్వరూ లేరని యేసు చెప్పాడు. “అతని దినము వరకు స్త్రీలు కనిన వారిలో అతని వంటివాడు లేడు.” అవును. “అతడు ప్రవక్త కంటె గొప్పవాడు.” అతడు నిబంధన దూత. రెండు ఏర్పాటు కాలముల మధ్య నిలచెను చూశారా? “ప్రవక్త కంటె గొప్పవాడు.”

211 మరియు కనుక అప్పుడు వారు అతనిని ఎరుగకుండిరి. వారు అతనిని అర్థం చేసికొనలేదు. అతడు వారికి ఒక వింత మనిషిగాయుండెను కనుక వారు అతనిని త్రోసివేశారు. చూశారా.

212 అటు తరువాత, యేసు వచ్చినపుడు, వారు ఆయనను అంగీకరింపలేదు. ఈ వండ్రంగి వాని కుమారునిగా యుండి “అక్రమముగా” పుట్టినవాడని చెడ్డ పేరు కలిగియుండెను మరియు, ఆయన, ఆలాటి వ్యక్తిని చూడలేకపోయారు.

213 అయితే, దేవుడు ఏం చేశాడో చూడు. ఆయన విద్యలేని వారిని, పేదలను, చేపలు పట్టువారిని, అడవి మనుష్యలను, వ్యవసాయదారులను, వేశ్యలను తీసుకొని హోదాగలవారిని వారి స్థానాల్లో ఉంచాడు. ఎందుకని? ఏమిటి? ఎందుకని ఆయన అలా చేశాడు? ఆలాటి కార్యము ఎందుకు అలా చేశాడు? నీవు ఊహించగలవా? ఎందుకనగా వారు ఆయనను వాక్యముగా గుర్తెరిగారు. ఇపుడు ఒక నిమిషం వారిని గమనిద్దాం.

214 ఇక్కడొక విద్యలేని వృద్ధుడైన జాలరి ఉన్నాడు, తన పేరు వ్రాయబడలేదు. బైబిల్ చెప్తుంది అతడు “విద్యలేని పామరుడని.” అతడు అతని చేపలు పట్టి, అక్కడ పెట్టాడు. అక్కడకు వెళ్ళి ఈ శబ్దమంతా ఏమిటని చూశాడు. అయితే అతని రంగములో, మెస్సీయాను గూర్చి బైబిల్ గ్రంథము ఏమి చెప్తుంది అతనికి తెలుసు…హెబ్రీయులందరు మెస్సీయా కొరకు ఎదురు చూశారు. ఎందుకంటె ఆయన వచ్చునపుడు లేఖనము కార్యము నెరవేరవలసియుండెను.

215 ఎంతోమంది మెస్సీయాలు లేచి “నేను ఆయనని” చెప్పారు, మరియు వందలమందిగా వారిని వెంబడించునట్లు చేసిరి మరియు—మరియు వారు నశించారు. అయితే, చూడూ, నిజమైనది వచ్చునపుడు దానిని త్రోసివేయుట యౌతుంది.

216 మనము ఏలీయా దుప్పట్లు, అంగీలు, ఆ విధమైనవి కలిగియున్నాము. అయితే అది—అది—అది—అది నిజమైనది వచ్చునపుడు దానిని గుర్తింపకుండా చేయుటకు ఇవి వచ్చును. చూశారా? అవును. వస్త్రాలు, అంగీలు ధరించిన అన్ని రకాలైన ప్రజలు, తల క్రిందులుగా పెట్టుకున్న అన్ని రకాలైన టోపీలతోనున్నారు. అది…అది—అది కేవలం రుజువు చేయును. నకిలీ డాలర్ వలె. ఒక చోట మంచిది యొకటి ఉన్నదని చూపుతుంది. నీవు కనుగొంటే. చూశారా.

217 కాబట్టి, ఇక్కడ ఈయన వచ్చుచున్నాడు. ఇపుడు ఈ హోదాగలవారు వచ్చుచున్నారు. వారు ప్రత్యామ్నాయములనే పట్టుకొన్నారు. “ఎందుకు,” వారన్నారు, “మెస్సీయా వచ్చినట్లయితే, ఆయన తప్పక కయప యొద్దకే వచ్చును. ఆయన మా యొక్క సంఘశాఖ యొద్దకే వచ్చును. ఆయన పరిసయ్యుల యొద్దకే వచ్చును.” సద్దూకయ్యులు “అదీ మీరు తలస్తుంది! ఆయన సద్దూకయ్యుల యొద్దకే వచ్చును.” మరియు అక్కడే వారున్నారు. చూశారా, అదే విషయం ఈ దినాన కలిగియున్నారు.

218 అయితే, ఆయన వచ్చినపుడు, అది వింతగా ఉండెను. ఆయన వచ్చును. ఓ, వారి తలంపులకు ఎంతో వ్యత్యాసము. అయితే ఆయన వాక్య ప్రకారముగా వచ్చును. వారు వాక్యమును ఎరుగరు.

219 అది నిజంగా మీకు చెప్తాను. తద్వారా…అది అంతరంగంలోకి చొచ్చుకొనును. ఇది మీరు గ్రహింపవలెనని కోరుచున్నాను. ఈ దినాన మీ యొద్దనున్న విషయం ఇదే, చూశారా వాక్యము మీకు తెలియదు. గ్రహిస్తున్నారా?

220 యేసు చెప్పాడు, “ఆకాశ వైఖరిని మీరు వివేచించుదురు గాని కాలము యొక్క సూచనలు మీరు వివేచింపలేరు.”

అన్నారు, “మోషే మాకున్నాడు.”

221 కాబట్టి, చెప్పాడు, “మీరు మోషేను ఎరిగినట్లయితే, మీరు నన్నెరుగుదురు.” మోషేను ఎరిగియుండలేదు, కాబట్టి వారెరుగలేదు, వారు పొదిగి బయటకు వచ్చిన ఒక మూఢ భక్తినే వారెరుగుదురు.

222 ఇపుడు, మనము పెద్దవాడైన ఈ జాలరిని తీసుకుందాం. తన యొక్క బుట్టను క్రింద పెట్టాడు. తన యొక్క గడ్డమును క్రిందకు అనుకొని, “అదెవరైనది నేను చూస్తాను. అది నేను నమ్ముచున్నాను.”

223 సహోదరుడు చెప్పాడు, “రా. మనమిక్కడకు వెళ్దాము.” చెప్పాడు, “అది అతనే ఇతడు, ఆ దినాన వారు చెప్పినది అతడు…గతరాత్రి, రాత్రంతా అతనితోనున్నాను. నేను మాట్లాడుతున్న యోహాను నీకు తెలుసా?”

224 “ఆఁ. అక్కడున్న ఆ అడవి మనిషి! ఆఁ, అతనిని గూర్చి నేను విన్నాను.” “సరే,” పెద్దవాడైన సీమోను నీకు తెలుసా, చెప్పాడు, “అక్కడ అతన్ని గూర్చి విన్నాను. ఆఁ, రెండు లేక మూడు నెలల క్రితం అక్కడ ఉన్నాను. అవును.”

225 “సరే, అతడన్నాడు…మరియు ఒక రోజు అతను అక్కడ నిలబడియున్నాడు. ఒక వింతైన విషయం చెప్పాడు, అతడు అన్నాడు, ‘మీకు తెలుసా, ఆయన ఇపుడే ఇక్కడకు వచ్చుచున్నాడు!’ వారు అడిగారు ‘నీకెలా తెలియును?’ అక్కడ చూచాడు. సాధారణ వ్యక్తి అక్కడ నిలబడియున్నాడు. అతడు చెప్పాడు, ‘దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చుట చూచుచున్నాను. “ఆయన ఈయన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు ఆనందించుచున్నాను.”’ అటు తరువాత అతడు నీటిలోకి వెళ్ళి ఆయనకు బాప్తిస్మము ఇచ్చాడు. సరే. ఆయనను ఎరుగునని అతడు చెప్పాడు.”

226 “ఓ, నాకు తెలియదు,” అని సీమోను అన్నాడు. “అనేకసార్లు ఆలాటిది నేను విన్నాను.” అయితే, ఇక్కడకు అతడు వచ్చాడు. అయితే అతని హృదయములో ముందుగా నిర్ణయింపబడిన విత్తనమున్నది. అవునా? యేసు ఆలాగని చెప్పాడు. అవును. ఆయన యొద్దకు నడచి వెళ్ళాడు. నడచి వెళ్ళి చెప్పాడు, “నేను ఆ కూటమునకు వెళ్ళి చూస్తాను.” అక్కడకు నడచి వెళ్ళాడు.

227 ఒక చిన్న సాధారణ మనిషిగా యేసు అక్కడ నిలబడియున్నాడు, నడచి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, “నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు జోనా.” అది అతన్ని ఊపిరి నిలచిపోవునట్లుగా ఆశ్చర్యపరచినది. ఎందుకని? ఆ చిన్న నిత్యజీవము యొక్క విత్తనము అక్కడ తాకినది. అవునండి.

228 అన్నాడు, “ఒక్క నిమిషం ఆగు! అది ఏలాగు? నీవు నన్నెన్నడూ చూడలేదు. నా తండ్రిని కూడా చూడలేదే, ఎందుకంటె అతను చనిపోయి సంవత్సారాలైనది. అయితే, ఇక్కడకు నీవు వచ్చి, అది చెప్తున్నావు? ఇపుడు బైబిల్ చెప్తుందని నాకు తెలుసు…” ఇపుడు పెద్దలు ఏమి చెప్పియున్నారని కాదు. “అయితే బైబిల్ చెప్తుంది మెస్సీయా ప్రవక్తయైయుండునని, అక్కడే ఆయన ఉన్నాడు. అది ఆయనే.”

229 ఒకరోజు ఆయన సమరయ గుండా వెళ్ళుచుండెను. ఒక యూదుల గుంపుతో వెళ్ళుచుండెను. ఆయన వారిని విడచిపెట్టాడు. ఈ చిన్న చెడ్డపేరు గల స్త్రీ బయటకు వచ్చింది. బహుశ అందమైన చిన్న స్త్రీ కావచ్చు. అవునా. చిన్నపిల్లగా వీధులలో తిరుగుచు ఉండేది. మరియు ఆమె అక్కడకు వెళ్తుంది. బహుశా దేనిని గూర్చియో ఆమె ఆలోచిస్తుంది. ఆమె అక్కడకు వెళ్ళి, బక్కెట్టును క్రింద పెట్టినది. ఆమె చేదను బావిలో దింపి నీళ్ళు నింపి దానిని పైకిలాగుచుండెను, చూశారా. “నాకు దాహమునకిమ్ము” అను ఒక పురుషుని శబ్దం ఆమె విన్నది, ఆమె చుట్టూ చూచినది. అక్కడ మధ్య వయస్కునిగా ఉన్నట్టున్న ఒక యూదుడు కూర్చొనియుండెను.

230 ఆమె అడిగినది “చెప్పుము, నీవు యూదుడవు కావా? నీవు చేయకూడదు. నాతో మాట్లాడుట అది సబబు కాదు. నేను సమరయురాలను.”

231 ఆయన అన్నాడు, “అయితే నీతో మాట్లాడుచున్నది నీవు ఎరిగియుంటే నీవు…నీవు నీకు దాహమునకిమ్మని నన్ను అడుగుతావు.”

232 అడిగినది, “నీ బక్కెట్టు ఎక్కడ?” చూశారా? “నీ త్రాడు ఎక్కడ?”

“సరే,” ఆయన అన్నాడు, “నేనిచ్చు నీళ్ళు జీవము.”

233 “ఏమిటి?” చూశారా? “ఎందుకు,” ఆమె అన్నది, “మీరందరు యెరూషలేములో ఆరాధింపకోరుతారు. మరియు మా పితరులు…”

234 “ఓ,” ఆయన అన్నాడు, “అవును, అయితే,” అన్నాడు “యూదులమైన మాకు మేము దేనిని ఆరాధించుచున్నామో తెలియును. అయితే,” చెప్పాడు, “తెలుసా, ఒక కాలము వచ్చును—ప్రజలు యెరూషలేములోనైనను లేక ఈ పర్వతం మీదనైనను ఆరాధింపరు.” ఆయన చెప్పాడు, “వారు—వారు దేవుని ఆత్మతో ఆరాధింతురు. ఎందుకనగా ఆయన ఆత్మ, ఆత్మ మరియు సత్యము గనుక.” సరే. ఆమె ఆలోచించసాగెను. అవునా.

మరియు ఆయన చెప్పాడు “వెళ్ళి, నీ భర్తను తీసుకొని ఇక్కడకు రా.”

ఆమె అన్నది, “నా భర్తా? నాకు భర్తలు లేరు.”

235 “ఎందుకు,” అన్నాడు, “అది సత్యము.” చెప్పాడు “నీవు ఐదుగురిని కలిగియుంటివి. ఆరవవాడు ఇపుడున్నాడు.” మరియు అన్నాడు, “నీవు ఐదుగురిని కలిగియుంటివి. మరియు—మరియు నీకు తెలియును. నీవు సత్యము చెప్పావు.”

236 గమనించుడి. అదేంటి? ఆ వెలుగు ఆ విత్తనాన్ని తాకినది. దేవుని ద్వారా పలుకబడిన అది, అది అక్కడయుండెను. అవునండి.

237 విత్తనము భూమి పైనయుండెను. దేవుడు నీళ్ళను కదిలించినపుడు, సూర్యుడు దానిని తాకెను. అది పైకి వచ్చెను. అవును. చూశారా? దానికి కావలసినదంతా సూర్యుడే. కేవలం వెలుగు కావలెను. అవునండి.

238 అటు తరువాత, ఆయనలోనున్న పరిశుద్ధాత్మ ఆమె గత జీవితాన్ని కదిలించి, దానిని ఆమెకు చూపించినపుడు, ఆ వెలుగు దానిని తాకినది. ఆమె అన్నది, “అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను.” ఆమె అన్నది “ఇపుడు మెస్సీయా వచ్చినపుడు ఆయన ఏమైయుండెనో మాకు తెలియును. మరియు మాకు వందల సంవత్సరాల నుండి ప్రవక్త లేకుండెను. వందల సంవత్సరాల నుండి, మాకు నిజమైన ప్రవక్త లేడు.” మరియు ఆమె అన్నది “నా భర్తను గూర్చి నీవెలాగు చెప్పితివి. మరియు నాకెంతమందియున్నారో నీవు చెప్పావు. ఎలాగు,” అన్నది, “దీనిని నేను అర్థం చేసికోలేకున్నాను.” అన్నది, “మెస్సీయా వచ్చినపుడు, ఆయన అది చేయబోతున్నాడు. అయితే నీవెవరు?”

ఆయన చెప్పాడు, “నేనే ఆయనను.”

అది అంతే. చూశారా? ఒక వేశ్య!

239 మరియు యాజకులు చుట్టు చూచి అన్నారు…సరే. వారు వారి యొక్క సమాజములకు జవాబు చెప్పవలసిన వారైయున్నారు. అన్నారు, “ఆ వ్యక్తితో మోసపోవద్దు. ఆయన—ఆయన ఒక దయ్యం పట్టినవాడు. అంతే.” ఇపుడు, అదీ వ్యత్యాసం. అదే ఈ రోజు. చూశారా? ఈ రోజు అదే. ఖచ్చితంగా దానిని తాకినది. ఆఁ. అవునండి.

240 ఆమె, అది ఆమె ఎరిగినది. కారణం, వెలుగు దానిని తాకినది. వారు…ఆ జాలరులు, అడవులలో నివసించేవారు, వ్యవసాయదారులు, సుంకం వసూలు చేయువారు, వేశ్యలు ఆయన ఏమి చేయనైయున్నాడోయని లేఖనాలు చెప్పినవో, వారు ఆయనలో చూశారు. పరిసయ్యులు చూడలేకపోయారు. చూశారా. వారు ఆచారాన్ని బట్టి. [సహోదరుడు బ్రాన్హాం నిలుపు చేసి ఒక విధముగా సైగ ద్వారా చెప్పుచున్నాడు. సంఘము అది నిజమని రూఢిపరచునట్లు బదులిచ్చుచున్నది—సంపా.] వారి ఆచారముల వలన వారు చూడలేకపోయారు. అయితే, వేశ్య, వ్యవసాయదారులు, వారందరు, అది చూశారు. ముందుగా నిర్ణయించబడిన వారందరు. అనుమానాలన్ని తీరిపోయిన తరువాత విత్తనం పెరుగుటకు ప్రారంభించును. అవును.

241 ఆమె ఏమి చేసినది? “భలే, నేను మెస్సీయాను కలసినందుకు ఆనందంగా ఉన్నాను”? అని ఆమె చెప్పిందా. ఓ, లేదు, సహోదరుడా, నేరుగా ఆమె నగరంలోకి వెళ్ళింది. నీళ్ళ సంగతి ఆమె మరచింది. ఆమె చెప్పింది “రండి, నేను చేసినవన్ని నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. మెస్సీయా చేయునని లేఖనము చెప్పిన చేసినది ఈ కార్యములు కాదా? ఇది ఖచ్చితంగా అది కాదా?” అని చెప్పినది. మరియు ప్రజలు అవే కార్యములు చూడగలిగిరి.

242 పరిశుద్ధ యోహాను 14:12 లో యేసుక్రీస్తు చెప్పినట్లుగా, అది మరలా జరుగును. అది ఆయన లూకాలో చెప్పెను, “నోవహు దినములలో ఉన్నట్లు” అని. ఆయన చెప్పాడు. ఒక శరీరధారిగా ప్రత్యక్షమై తన వెనుక గుడారములోనున్న శారా నవ్వినదని ఏ విధంగా చెప్పెనో. మరియు ఈ లేఖనాలన్ని మలాకీ మొదలైనవి కడవరి దినములలో ముందుగా చెప్పబడినవి. హెబ్రీ 4 చెప్తుంది “వాక్యము” తిరిగి వచ్చునని, మలాకీ 4 చెప్తుంది మనుష్యుని ద్వారా అది తిరిగి వచ్చునని. హెబ్రీ 4 చెప్తుంది, “హృదయములోని ఆలోచనలను వివేచించునని.”

243 మరియు వారు ఆ కార్యములన్నియు జరుగుట చూచినప్పటికి దాని నుండి దూరంగా పోవుచున్నారు. వారి ఆచారాలు వాటిని మరుగు చేసి, ఎటువంటి ప్రభావము చూపలేకపోతున్నవి. సరే. మనమిక్కడ ఉన్నాము. అంతే. ఊహు.

244 మీకు తెలుసా, ఆయన అదే కార్యము ఈ రోజు చేస్తాడు. ఆయన అప్పుడు చేసినవి, ఆయన రంగం మీదికి వచ్చి ఆయన చేయునని ఆయన చెప్పినవి వాటిని ఉత్పన్నం చేయును. చూశారా? అది చేయునని ఆయన వాగ్దానం చేశాడు. అది చేయునని ఆయన వాగ్దానం చేశాడు. అదే విషయం ఆయన చేస్తే, లవొదికయ వర్తమానికుడు అది చేయవలసిన వాడైయున్నాడు.

245 మరియు అపుడు ఆ కార్యము చేయబడుటకు లవొదికయ సంఘము చూచిన యెడల, మొదటిగా హెబ్రీ సంఘము ఏమి చేసినదో ఖచ్చితంగా వారు ఆ విధముగనే చేయుదురు. అది ఎంతగా నిరూపించబడినప్పటికి, వారు దానిని చేస్తారు ఏలాగైనా. ఓ. మై!

246 ఇపుడు, అది ఏమి చేయునని చెప్పబడినదో అది చేస్తుంది. మనము, తిరిగి అసలైన వాక్యమునకు, విశ్వాసమునకు తిరిగి వస్తాము. వాగ్దానము చేయబడినట్లుగా ప్రత్యక్షపరచబడుదుము. ఈ కార్యములు చేయుట ద్వారా ఆయన యొక్క జనుల మధ్య ఆయన నివసించుచున్నాడని, ఆయన తెలియపరచుకొనిన యెడల; ఆయన పటమును తీయబడునట్లు చేసి, అది విజ్ఞాన శాస్త్ర ప్రకారము నిరూపించెను. మరియు, అయినప్పటికి, అది వారు నమ్మలేదు. మరియు నిరూపించబడి, ఆయన అక్కడ నిలబడియుండుట కెమెరా యొక్క యాంత్రిక కన్ను ఆయనను పట్టుకున్నది. అదే అగ్ని స్తంభం నిన్న నేడు యుగయుగములు ఒకే రీతిగా ఉన్నది. హెబ్రీ 13:8 అది విజ్ఞానశాస్త్ర రీత్యా చూపించుటకు, ఆత్మీయ పరిధిలో జరుగు కార్యములను అది నిరూపింపబడగల శాస్త్రీయంగా చూపించగలుగుచున్నది. ప్రతి మార్గమున అది నిరూపించగలుగుచున్నది. అది రుజువు పరుచుచూనే ఉన్నది.

247 మీకు తెలుసా? బహుశ అదే కార్యములు చేయుచున్నారు. వారు దానికి దూరంగా తొలగి వారు చేసినట్లుగానే అదే చేయుచున్నారు.

248 ఓ, దేవా మాకు సహాయము చేయుము! ఓ! ఇక్కడ ఆపుదాము. అయితే, ఇపుడు చూచుటకు మనము వచ్చుచుండగా దేవుడు మనకు ఇపుడు సహాయము చేయుగాక, అది నా ప్రార్థన. ఎందుకనగా, మిమ్ములను నేను ఆలస్యంగా ఉంచదలచుకోలేదు. మనము చూచుటకు దేవుడు సహాయయు చేయును గాక. ఆత్మ మన పైననున్నదని, బయలుపరచుటకు, ఈ ముద్ర తెరచుటకు ఆయన మనకు సహాయము చేయునని ఆత్మ ఇపుడే మనపైనున్నదని నేను నమ్ముతున్నాను.

249 మనము చదువుదాము. సంఘము ఎటువంటి స్థితిలోనున్నదో మనము చూచుచుండగా, అదెక్కడున్నదో మనం చూశాము. వారేమి చేశారో మనం చూశాము, అదెక్కడకు రావలసియున్నదో మనం చూశాము, దానినక్కడ చూశాము. అదేమి చేయనైయున్నదో మనము చూశాము. వారు దానినే చేసియున్నారు. ఇపుడు, మనము ఎక్కడున్నామో మీరు చూస్తున్నారా? మీరే తీర్పు తీర్చుకొనుడి. నేను తీర్పు తీర్చలేను. ఈ వాక్యమును తెచ్చుటకు మాత్రమే నేను బాధ్యుడను. అది నాకు ఇచ్చినట్లుగానే నేను దానిని మీకిచ్చుచున్నాను. అది నాకు ఇవ్వబడు వరకు నేను దానిని మీకివ్వలేను; ఎవ్వరు కూడా.

ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు-రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండియుండెను.

మరియు-దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షా రసమును పాడు చేయవద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను.

250 ఇపుడు, గొఱ్ఱెపిల్ల ముద్రలను విప్పుటకు గ్రంథమును తన చేతిలో కలిగియున్నది. ఆయన మొదటి దానిని, రెండవ దానిని విప్పియున్నాడు. మరియు ఇపుడు ఆయన మూడవ దానిని విప్పుచున్నాడు. మరియు దానిని ఆయన విప్పుచుండగా గొఱ్ఱెపిల్ల దానిని విప్పగా, మూడవ ముద్ర, మూడవ జీవి…

251 ఇపుడు మూడవ జీవి ఏలాగు కన్పించెనో ఎంతమందికి తెలుసు? మనుష్యుని వలె కన్పించెను. మొదటిది సింహము వలె కన్పించెను; తరువాతది దూడవలె లేక ఎద్దు వలె కన్పించెను, మూడవది ఒక మనుష్యుని వలె కన్పించెను. ఆ జీవి యొక్క—ఆ జీవి యొక్క స్వరము అతడు విన్నాడు. మనుష్యుని వంటి జీవి యోహానుతో చెప్పాడు, “వచ్చి, అదేంటో చూడూ, మరుగైయున్న ఈ మర్మము.” ఈ విమోచనా సంవత్సరము అన్నిటిలో, భూమికి పునాది వేసినప్పటి నుండి ఏమి జరుగనైయున్నదో, అది ఈ ముద్ర క్రింద మరుగైయున్నది. ఇపుడు, “వచ్చి అదెంటో చూడు.”

252 మరియు ఆయన దానిని తెరిచాడు. ఒక ఉరుము ఉరిమెను గొఱ్ఱె పిల్ల ముద్రలు తెరచెను.

253 ఇపుడు, అదేమిటి యని చూచుటకు యోహాను ముందుకు వెళ్ళాడు. అతనేమి చూశాడు? అతడు ఒక నల్లని గుఱ్ఱమును చూశాడు. దాని మీద స్వారీ చేయువాని చేతిలో ఒక త్రాసు ఉండెను. మొదటిగా అతడు చూచినది అది. గొఱ్ఱెపిల్ల దానిని ప్రకటించి, ముద్రను విప్పినపుడు, అప్పుడు ఇంకొక జీవి…చూస్తున్నారా, జీవులు తిరిగి “వచ్చి, చూడుమని” ప్రకటించుచున్నవి. ఒక వేళ ఈ విధముగా ఇక్కడ నిలబడియున్న యోహాను గొఱ్ఱెపిల్ల విప్పినపుడు నడచి ముందుకు వెళ్ళుచుండెను. సాధారణంగా…

254 మనము మొదటి ముద్రను చూచిన విధముగా ఉరుము ఉరుముట చూశాము. ఏమి జరగనైయున్నదని అతడు గమనిస్తున్నాడు. మొదట తెల్లని గుఱ్ఱము మీద ఒక మనుష్యుడు వచ్చుట చూచుచున్నాడు. స్వారీ చేయుచు వచ్చుటను అతడు గమనించాడు. యోహాను అతన్ని చివరి వరకు చూశాడు. తన తెల్లని గుఱ్ఱం మీద అతడు క్రిందికి వచ్చుటకు. అతని చేతిలో విల్లున్నది మరియు ఆ స్వారీ చేయువానికి దానితో బాణాలు లేవు. అతడు చూచిన తరువాత విషయము అతడొక కిరీటము పొందుకొని స్వారీ చేయుచు పోవుట చూశాడు.

255 ఇక్కడ మరలా గొఱ్ఱెపిల్ల వచ్చుట తరువాత మనము చూస్తున్నాము. ఆయన మరొక దానిని తెరచెను. మరియు చూచుచున్నాడు. ఇపుడు ఇక్కడ ఒక—ఒక ఎర్రని గుఱ్ఱం వచ్చుచున్నది. ఈ మనిషి చేతిలో ఖడ్గాన్ని కలిగియున్నాడు. లేఖనములో అతను స్వారీ చేయుచు పోవుట, చూశారా, తన చేతిలో ఈ ఖడ్గముతో చంపుటకు భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు అతడు బయలుదేరాడు.

256 ఇపుడు గొఱ్ఱెపిల్ల మరియొక ముద్రను తెరచుచున్నది. జీవులలో మరొకటి, మానవ ముఖము వలెనున్న మరొక జీవి చెప్పినది, “వచ్చి, చూడుము” అని. ఇదేమిటి యని చూచుటకు అతడు నడచి వెళ్ళాడు. అతడు ఆలాగు చేసినప్పటికి, అక్కడ ఒక నల్లని గుఱ్ఱము పైన స్వారీ చేయుచు వచ్చుచున్నాడు.

257 ఇపుడు, తెల్లని గుఱ్ఱము పై స్వారీ చేయువాడే ఎర్రని గుఱ్ఱము పై కూడా స్వారీ చేయుచున్నాడని గత రాత్రి మనము కనుగొన్నాము.

258 మరియు జీవుల మధ్యనున్న స్వరము బయటకు పిలచి చూడుము అని చెప్పెను. అక్కడ, అదేమిటని వచ్చి చూశాడు. అతడు జీవుల మధ్య ఉన్నాడు. అతడు ఈ నల్లని గుఱ్ఱమును చూశాడు.

మరియు…దేనారమునకు ఒక సేరు గోధులనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. (చూశారా?)

259 ఈ స్వారీ చేయువాని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదట స్వారీచేయు వాడు ఎవరైనది మీరు గమనిస్తే. లేఖన ప్రకారంగా గత రాత్రి మనం కనుగొన్నాము. రెండవ స్వారీ చేయువాడు ఖచ్చితంగా అదే మనిషి. మరొక గుఱ్ఱం పై కూర్చుండుట తప్ప. ఏం జరిగింది? అతని పరిచర్యను అతడు మార్చాడు. చూశారా? అవును. అతడొక అంత్యక్రీస్తని, అతని యొక్క స్థానాన్ని అతడు మార్చాడని మనం కనుగొన్నాము.

260 మొదటిగా అతడు, కేవలం తెల్లని గుఱ్ఱం, సిద్ధాంతముగా మారాడు. ఇపుడు మనం లేఖనంలో నుండి తీసుకొనుచున్నాము. చూశారా?

261 ఇపుడు మనము ఈ రాత్రిలో ఎచటయున్నామో గమనించుడి. మరొక సంఘకాలం ఇపుడు. చూశారా? మూడవ సంఘకాలంలోకి వచ్చుచున్నాము. ఇపుడు. చూశారా? ఖచ్చితంగా మూడవ సంఘకాలంలో, ఖచ్చితంగా మూడవ గుఱ్ఱమునకు పోలియున్నది. చూశారా?

262 ఇపుడు మొదటి సంఘకాలము. అదేంటి? నీకొలాయితులు ఒక సిద్ధాంతాన్ని కలిగియుండిరి. చూశారా, మొదటిది. సరే. అటు తరువాత మొదటి విషయం మనకు తెలుసు. ఈ నీకొలాయితు సిద్ధాంతము. ఇది అంగీకరించబడి, సరియని సమ్మతించబడి కార్యరూపము దాల్చింది. మరియు వారు ఈ వ్యక్తికి కిరీటం ధరింపజేశారు. తరువాత, ఈ ఆత్మ, అంత్యక్రీస్తు ఆత్మ ఒక మానవునిలో రూపము దాల్చినది. చూశారా? అటు తరువాత అది సాతాను యొక్క అవతారమెత్తినది. దయ్యం వెళ్ళిపోయింది అపవాది లోపలకు వచ్చినది.

263 మరియు, సంఘము, అంత్యక్రీస్తు సంఘము అభివృద్ధి చెందుచున్న అదే సమయమున; పెండ్లి కుమార్తె వివిధ విషయాలలో ముందుకు కొనసాగుచున్నది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, ఆ విధముగా కొనసాగుతుంది. వారు వారి మొదటి ఉజ్జీవమునే పొందియున్నారు, సంఘము ఆఖరిది తీసుకొనుచున్నది. వారి మొదటి మూడు సంవత్సరములు…వారి యొక్క మూడు దశలలో అంధకారయుగము గుండా వెళ్ళిరి. తరువాత మూడు దశలలో సంఘము బయటకు వచ్చినది; అవతారము ధరించిన దేవుడు మన మధ్య ప్రత్యక్షమగుచున్నాడు. ఇక్కడ అతడు అంత్యక్రీస్తుగాను, అబద్ధ ప్రవక్తగాను, అటు తరువాత మృగము గాను అటు తరువాత అంధకార యుగములో. మరియు సంఘము ఆ అంధకార యుగము నుండి; నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నుండి బయటకు వచ్చుచున్నది. అవతారమెత్తిన వాక్యము, ఇపుడు ద్వారము. అతడు క్రిందికి పోవుచున్నాడు. ఊహుఁ. మీరది చూశారా? అతడు క్రిందికి పోవుచున్నాడు. సంఘము పైకి వెళ్ళుచున్నది. చూశారా? అదెంత సంపూర్ణంగాయుండాలో అంతగానున్నది. ఓ! అదెంత రమ్యంగా ఉన్నది. నేనది ప్రేమిస్తున్నాను.

264 ఈ స్వారీ చేయువాడు ఒక్కడే, అయితే అతని పరిచర్య యొక్క మరొక దశ.

265 మొదటి దశ, తెల్లని గుఱ్ఱం, చూశారా, అతడు కేవలం ఉపదేశకుడు. ఒక అంత్యక్రీస్తు ఉపదేశకుడు. అతడు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకి.

266 మరియు, నీవెట్లు అంత్యక్రీస్తువౌతావు? దీనిలోని ప్రతి యొక్క మాటను ఎవరైతే సత్యము కాదని తృణీకరిస్తారో, మరియు ఆ విధమని ఆలాగు బోధిస్తారో అతడు అంత్యక్రీస్తు. ఎందుకనగా వారు ఆ—ఆ—ఆ—ఆ—ఆ వాక్యమును తృణీకరించారు. ఆయనే ఆ వాక్యము.

267 ఇపుడు, మొదటి దశ, తెల్లని గుఱ్ఱం. అతడు కేవలం ఉపదేశకునిగా యుండెను. అయితే, దాని యొక్క సిద్ధాంతములోను మరియు దాని యొక్క గుణములోను అంత్యక్రీస్తు ఆత్మ ఉన్నది. అది అమాయకమైనది. అది దేనిని బాధపరచినట్లు కన్పించదు; ఆ విధముగా కొనసాగిపోవుచుండును. ఆలాగు సాతాను లోపలకు వచ్చును. ఓ! అతడు ఒక యుక్తిగల పక్షి.

268 అతడు హవ్వతో చెప్పాడు, “ఇపుడు, చూడూ నీవు జ్ఞానం కోసం ఎదురు చూచుచున్నావు. అది తప్పో కాదో నీకు తెలియదు.” అన్నాడు, “నీ కన్నులు తెరవబడినట్లయితే, నీవు అది ఎరుగుదువు.” మరియు చెప్పాడు, “పండు, బహు మధురముగాయున్నది. అది మంచిది. అది—అది కన్నులకు ఇంపైనది. అది ఇపుడు నీవు తీసికోవలసియున్నది. అది ఆలాగున్నదా లేదా నీకు తెలుసా?”

“లేదు, నాకు తెలియదు. అయితే అది చేయొద్దని దేవుడు చెప్పాడు.”

“అయితే, ఓ, సరే, నాకు తెలుసు. అయితే…”

“దేవుడు చెప్పాడు…మేము చనిపోదుమని.”

269 అతడు చెప్పాడు, “నిశ్చయముగా ఆయన అది చేయడు.” చూడూ. అదెంతగానో మధురముగా ఉండెను. అదేమి చేసినదో చూడూ.

270 ఒక నీకొలాయితు బోధగా ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఆరంభ సంఘములో లేచుటను గమనించు. నీకొ, లౌకికులను “జయించుట” పరిశుద్ధమైన మనిషిని తయారు చేయుట. ఓ! అది కేవలం…“సరే, మాకు సహవాసము కావలెనని మేము కోరుచున్నాము. ఎందుకని? ఇక్కడ మీరు చెదరిపోయారు; ఎవరు ఎక్కడ యున్నారనునది ఎవరికి తెలియదు. మనమొక సంస్థగా ఉండవలసియుంటుందని నేననుకుంటున్నాను. ఒక వ్యత్యాసంగా. చూశారా, మనం వెళ్ళి, మనం ఐక్యంగా ఉండవలెను. దాని నుండి మనం ఒక విడిదిని తయారు చేయవలసియుంటుంది.” మరి అది ఇదే. క్రైస్తవ మెథడిస్టు సంఘము అనునది లేనే లేదు. అది సంఘము కాదు. అది బాడుగ ఇళ్లు. బాప్టిస్టు, సంఘము కాదు. అది బాడుగ ఇళ్లు.

271 ఒకే యొక సంఘము ఉన్నది. అది మర్మమైన యేసుక్రీస్తు శరీరము. నీవు అందులో జన్మించావు. అవును. ముందు నిర్ణయము ద్వారా. అవును. “తండ్రి నాకనుగ్రహించిన వారందరు వస్తారు. తండ్రి అతనిని పిలువకుండ ఏ మనుష్యుడు రాడు. ఆయన నాకనుగ్రహించిన వారు, నా యొద్దకు వత్తురు.” కాబట్టి, అది, అది అది.

272 ఆఖరు వ్యక్తి లోపలకు వచ్చు వరకు, గొఱ్ఱెపిల్ల అక్కడ కూర్చొని విజ్ఞాపణ చేయుచున్నది. చిన్న గంటలు మ్రోగును. ఆయన బయటకు నడచి ఆయన స్వాస్థ్యమును తీసుకొనును. చూడూ, అంతే. ఆయన ప్రజలను వారి గృహమునకు తెచ్చును. మరియు ఆయన శత్రువును అగ్ని గుండములో వేయును. అతని యొక్క అనుచరులందరు అతనితో కలసి అందులోకి వెళ్తారు; మరియు అది ఆలాగుండును. తరువాత, మనము వెయ్యేండ్ల పాలనలోకి వెళ్తాము.

273 ఇపుడు, స్వారీచేయువాడు ఒక్కడే. ఈ మొదటి దశలో అతడు అమాయకుడు. ఇపుడు రెండవది, మీరు కొంచెము ముందుకు వెళ్ళి చూచిన యెడల, కొంచెం పైగా రెండవ దశ, బైబిల్ చెప్తుంది అతనికొక “కిరీటము ఇవ్వబడినది.” ఒక గొప్ప వ్యక్తిగా ఒక మనిషికి కిరీటము ధరింపజేశారు. చూశారా. అతనికి కిరీటము ధరింపజేశారు! అటు తరువాత, అతనిని పోప్ గా బైబిల్ పిలువలేదు. “అబద్ధ ప్రవక్తగా” బైబిల్ అతనిని పిలుచుచున్నది. ఎందుకు? అవును. ఎందుకనగా తన యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ద్వారా, అసలైన వాక్యమునకు క్రీస్తు విరోధముగా బోధించుట. ఎందుకనగా అసలైన వాక్యమునకు వ్యతిరిక్తముగా అతడు బోధించినట్లయితే, అది అంత్యక్రీస్తు. అది ఆ విధముగానేయున్నది. వాక్యము దేవుడైయున్నాడు. అవునా! క్రీస్తు. సరే. అటు తరువాత, కిరీటము ధరించుటను చూచుచున్నాము. అతడు కిరీటధారియైన తరువాత, ఇపుడు, అతడు చాలా అమాయకునిగా, నిస్సహాయకునిగా ఉన్నాడు. అతడు కేవలం అల్పుడుగా ఉండెను.

274 అయితే, అటు తరువాత నైసియా ఆలోచనా సభలో, అతడు అది సాధించాడు. కాన్ స్టాంటైన్ సమస్త ఆస్తిని ఇచ్చాడు. అటు తరువాత, అతడేమి చేశాడు? తరువాత అతడు, చూడుడి, సాతాను తన యొక్క సింహాసనాన్ని మరియు అధికారాన్ని ఇచ్చాడు. దానిని మనము చూస్తున్నపుడు బైబిల్ ఆలాగు చెప్తుంది.

275 ఇపుడు, తరువాత మనం చూస్తున్నాము. ఉన్నవి, ఇక ఉండబోవుచున్న సమస్త రాజకీయాలను అపవాది స్వాధీనములో ఉంచుకొన్నది. మత్తయి 4:11 లో మనమది చూస్తున్నాము. సాతానుడు ముందుగానే రాజకీయాలను స్వాధీనం చేసుకున్నాడని మనమిపుడు చూస్తున్నాము.

276 అయితే అతడు సంఘమును తీసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. తద్వారా దానిని మోసం చేయుట కొరకు. అతడు అతని గొప్ప వ్యక్తిని తీసుకొని ఒక సంస్థాపకము ద్వారా అతని పనిచేయించును. క్రీస్తుకు బదులుగా “వికార్” గా కిరీటము ధరింపజేయుచున్నాడు. దేవునికి బదులు క్రీస్తు పనిచేశాడు. అవునా, ఈ వ్యక్తి దేవునికి బదులు వికార్. చూశారా? ఆ విధముగానే, “దేవునికి బదులు,” అతడు యుండవలసిన విధమేదనగా క్రీస్తు క్రింద వికార్ గా యుండుట.

277 ఇపుడు, ఇపుడు, దానిని అతడు చేసినపుడు, అప్పుడతడు ఏం చేశాడు? అతడు, సాతాను, అతనికి ముందుగానేనున్న తన రాజకీయ అధికారాన్ని తీసుకొని మరియు మత సంబంధమైన అధికారాన్ని తీసుకొని, ముందుగానే కిరీటధారి చేయబడినవి తీసుకొని ఏకం చేసెను.

278 పాతాళముపై మరియొక కిరీటాన్ని అతనికై తయారు చేశాడు. చాలినంత డబ్బు ఎవరు చెల్లిస్తారో అట్టి వారిని అతడు విడిపించగలడు. చూశారా? కాబట్టి, అతడిపుడు—అతడు వికార్ గురువు పరలోకంపైన, Purgatory పైన, తన కిష్టమొచ్చిన రీతిగా పిలుచుచున్నాడు. ఆలాటిది బైబిల్లో లేదు. చూశారా. అయితే, అతడు ఒక దానిని చేయవలసియున్నది. బైబిల్ చెప్తుంది అగాధములో నుండి అది వచ్చెననియు, అదే విధముగా తిరిగి వెళ్ళెననియు బైబిల్ చెప్తుంది. మరియు భూమి మీద ఒక అధిపతిగా ఉండును.

279 అప్పుడు అతనికేమి ఇవ్వబడెను? మొదటిగా అతని యొద్ద విల్లు ఉన్నది. అయితే అతని యొద్ద బాణము లేదు. అయితే ఇప్పుడు అతని చేతిలో బలమైన ఖడ్గమున్నది. ఇపుడు అతడు ఒకటి చేయగలడు. అటు తరువాత, అతడు తన తెల్లని గుఱ్ఱం మీద నుండి దూకియున్నాడు; తెల్లని గుఱ్ఱం వెళ్ళిపోయినది. ఇపుడు అతడు దేనిపై కూర్చున్నాడు? ఒక ఎర్రని గుఱ్ఱం, రక్తము, రక్తపు ఎరుపుగల గుఱ్ఱం పైన కూర్చున్నాడు. అతడు నిజముగానే దానిపై స్వారీచేయుచున్నాడు. ఓ, నిశ్చయముగా. ఇపుడు అతనికి గొప్ప అధికారమును, చంపుటకు పెద్ద ఖడ్గమును ఇయ్యబడెను. ఆ తరువాత రక్తపు వర్ణపు గుఱ్ఱం పైన అతడు స్వారీచేయుచున్నాడు.

280 అతడు భూమి మీద నుండి సమాధానము తీసివేసి మరియు ఒకనినొకడు చంపుకొనునట్లు చేసెనని, గతరాత్రి విప్పబడిన రెండవ ముద్ర నుండి మనము చూశాము. మరియు పరిశుద్ధ హిప్పో…హిప్పో వాసియగు పరిశుద్ధ అగస్టీన్ కాలము నుండి పదిహేను వందల ఎనభై వరకు. “అరవై-ఎనిమిది మిలియన్లు.” మీరు చదువగోరితే స్మక్కర్స్ గొప్ప సంస్కరణ లేక మహిమకరమైన సంస్కరణ చదువుడి. అవును. ఇపుడు హతసాక్షుల గ్రంథములో అరవై ఎనిమిది మిలియన్లు నమోదైనది. రోమన్ కథోలిక్ సంఘముతో ఏకీభవించని వారెవరైనను, ఒక విశ్వాస ద్రోహులుగా ఎంచబడి, వారు చంపబడవలెనని వారి యొక్క పరిశుద్ధునిగా పిలువబడు వారిలో ఒక పిలువబడు పరిశుద్ధునికి ప్రత్యక్షత కలిగెనని చెప్పబడుచున్నది. అబ్బాయ్, రక్తము చిందించుటకు అతడు వెళ్ళెను! అతడు—అతడు తన తెల్లని గుఱ్ఱం పై నుండి దూకి…అతని ఎర్రని గుఱ్ఱం పైకి దూకియుండెను. స్వారీ చేయుటకు అతడు వెళ్ళెను. ఓ!

281 ఇపుడతనికి గొప్ప శక్తి వచ్చెను. అతడు పరలోకము పైన గురువు అయ్యాడు. మరియు దేవుని వలె ఆరాధించబడ్డాడు. సంఘము రాజ్యమును ఐక్యము చేయుట ద్వారా భూమి పై పరిపాలించువాడయ్యాడు. అతనికి కిరీటమియ్యబడెను. Purgatory లో నున్న ఆత్మల కొరకు అతడు ప్రార్థించగలడు. అతడు ఇంకా…దేవుని బదులు భూమి మీద దేవుని వలె ఉన్నాడు. అతని యొక్క ఆజ్ఞకు ఎవరెవరు సమ్మతింపరో వారిని చంపుటకు అతడు గొప్ప అధికారము కలిగియుండెను. ఏదైనా అతనికి ఎవరు చెప్పగలరు? సంఘము ఏదీ చెప్పలేదు. అతడు దాని యొక్క శిరస్సు. రాజ్యము ఏదీ చెప్పలేదు. అతడు దాని యొక్క శిరస్సు. కాబట్టి చంపబడిన వారు అనేక మిలియన్లగా ఉన్నారు. సహోదరుడా, ఆ చిన్న సంఘములన్ని చిన్నాభిన్నము చేయబడి మరియు చంపబడి, హత్యచేయబడి సింహాలకు ఆహారముగా వేయబడి పలుపలు విధములుగా చేయబడిరి. చూశారా? “ఘట సర్పము,” రోము, “తన సింహాసనమును మరియు అధికారమును ఇచ్చెను.” ఆ విధముగా బైబిల్ చెప్తుంది. అవునా. కాబట్టి, అది ఎర్రని గుఱ్ఱంగా మారునంత వరకు, మానవ రక్తము వలన ఎఱ్ఱని గుర్రం స్వారీ చేయుట వలన.

282 ఇపుడు యోహాను అతనిని నల్లని గుఱ్ఱం మీద చూస్తున్నాడు. అతడు ఒక దానిని మార్చాడు.

283 ఇపుడు అది నా యొద్దకు ఏలా వచ్చినదో నేనిది చెప్పవలసియున్నది. తరువాత అది నా యొద్దకు వచ్చి, మిగతా లేఖనాలకు అది సరిపోలనట్లయితే, అలాగైతే దేవుడు అది నాకివ్వలేదు. చూశారా, లేఖనములన్ని, ప్రతి యొక్కటి అది గొప్ప కార్యముగా ఉన్నది. లేఖనమునకు లేఖనము అంగీకరించవలసియున్నది. మరియు లేఖనానికి ఏదైన విరుద్ధమైతే…లేఖనము కానిది ఏదైన ప్రభువు దూత నాకు చెప్పిన యెడల, నేనాయనను నమ్మను. చూశారా?

284 నేను చెప్పాను, గత దినము అక్కడ చికాగోలో ఆ వందల మంది సేవకులు…ఆ కూటమిలో అక్కడ ఎవరైనాయున్నారా? నిశ్చయం. చికాగోలో ఆ కూటములో నేను చెప్పాను, “ఇపుడు మీరందరు…ఒక దాని మీద ఇక్కడ మీరు నన్ను పరీక్షించవలెనని అనుకున్నారు.” ఇంచుమించు ఈ గది వలెనే ఉండెను. నేనన్నాను, “ఏంటది? మీరు నాకు విరోధముగా ఉన్నారు.” నేను చెప్పాను, “మూడు రాత్రుల క్రితము, మీలో ప్రతి యొక్కరు ఎక్కడ ఉంటారో పరిశుద్ధాత్మ నాకు చూపించాడు. మేము ఆ విధముగా…అది సరికాదేమో ఇక్కడున్న కార్ల్ ను అడగండి.”

285 మరియు అక్కడ హాంక్ వారందరు ఉన్నారు, “అది నిజం.” దానిని వినుటకు మీరందరు ఉన్నారు.

286 నేను చెప్పాను, “మీరు నా మీద, నా బోధ మీద విరోధంగాయున్నారు. అది విషయం. మీలో ఒకరు ఇక్కడకు వచ్చి మీ బైబిల్ తీసుకొని, నా ప్రక్కన నిలబడి అది తప్పని నిరూపించగలరా” అని. నీవెన్నడూ విననంత నిశ్శబ్దంగా ఉన్నారు. నేను అడిగాను, “మీ విషయమేంటి?” నేను అడిగాను, “అలాగైతే మీరు వాక్యమునకు విరోధంగా మీరు నిలబడలేరు అని మీరు ఎరిగితే నా వెనుకకు రండి. ‘డాక్టర్,’ ‘డాక్టర్,’ ‘డాక్టర్’ యని మీకు మీరు పరిచయము చేసికుంటున్నారు. నేను…” (ఓ, సహోదరుడు ఉడ్స్ మరియు నేను చెప్పాము “క్రొత్త వ్యక్తి,” లేదా, “అనుభవం లేని వ్యక్తి” అని.) “నాకు విద్య లేదు, ఏలాటి సెమినరి లేక పాఠశాల నుండి రాలేదు. అయితే మీరు బైబిల్ తీసుకొని ఇక్కడకు వచ్చి నా ప్రక్కన నిలబడి సర్పము యొక్క సంతానము, యేసు నామములో బాప్తిస్మము నేను చెప్పిన ఏ విషయము కాని అవి తప్పని నిరూపించండి.” ఎవరూ ఏ మాట చెప్పలేదు. మీరు ఇంతవరకు చూచిన వాటన్నిటికంటె అతి నిశ్శబ్దముగానున్న సమూహము అది.

287 చూడండి, నాకు ఏమి తెలియదని వారు కాకులవలె అరచిరి. ఇప్పుడు, ఇపుడు అదక్కడ ఉన్నది. ప్రజలతో వాదించుట నేను నమ్మను. అయితే అది ఒక స్థానానికి వచ్చి, అందులోకి లాగుటకు ప్రయత్నించారు. నా అంతట నేను వెళ్ళ లేదు. అయితే పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, “అక్కడకు వెళ్ళు, నేను నీతో ఉంటాను” అని.

288 మూడు లేక నాలుగు రోజుల క్రితమే వారికి తెలియ చెప్పితిని, మీరందరు అక్కడయుండి Mr. కార్ల్ సన్ మరియు ఇతరులు మరియు టామీ హిక్స్ అందరు వింటిరి. వారందరు అక్కడ కూర్చొనియున్నారు. మరియు మూడు రోజుల ముందుగా నేను వెళ్ళి చెప్పాను, “ఆ స్థలాన్ని మీరు రద్దు చేసికోబోతున్నారు” అని.

289 అది యొక తుఫాను రాత్రి. నాకొక కూటమున్నది. “వెళ్ళి, అక్కడనున్న ఆ చిన్న తలుపునొద్దనున్న ఆ కిటికీ యొద్ద నిలబడుమని” ఆయన నాతో చెప్పాడు. నేనక్కడకు వెళ్ళి అక్కడే నిలబడ్డాను. ఆలాగు బయటకు చూచుచుంటిని.

290 ఆయన చెప్పాడు, “వారు నీ కొరకు పన్నాగం పన్నారు. గొప్ప నగరమైన చికాగోలో అక్కడ సేవకుల కూటములో నీవు మాట్లాడమని వారు నిన్నడగబోతున్నారు.” చెప్పాడు, “నా వాక్యమును గూర్చిన నీ యొక్క బోధను గూర్చి నీ మీద వారు పన్నాగం పన్నారు.”

291 ఆయన చెప్పాడు, “ఇపుడు, అక్కడ ఆ స్థలాన్ని వారు రద్దు చేసికోబోతున్నారు. వారు దానిని పొందలేరు. వారు ఒక స్థలాన్ని పొందుకోబోతున్నారు, అది ముదురుగా ఉన్నది.” అన్నాడు, “ఇక్కడ చూడూ.” నేను ఆగిపోయాను, ఒక మూలన నేనుండుట చూశాను; వెను తిరిగి చూశాను. వారందరు అక్కడ యుండుట చూశాను. ఆ సేవకులందరు అక్కడ కూర్చుండుట, వారున్న విధమును చూశాను. వారందరిని నేను చూశాను. మరియు ఆయన చెప్పాడు…

292 “ఓ,” నేననుకున్నాను, “ప్రభువా, ఆలాగైతే, వారు అది చేయునట్లయితే నేనక్కడకు వెళ్ళకుండయుండుట మంచిది. నేను వారి భావాలను బాధపరచాలని లేక ఏ తప్పు చేయాలని లేదు.”

ఆయన చెప్పాడు, “వెళ్ళు. నేను నీ ప్రక్కనుంటాను.” ఆయనది చేశాడు. అది నిజం.

293 ఇపుడు, మీరందరు, అక్కడ కూర్చున్న మీరు, ఇక్కడే సాక్షులు, అది సత్యమని తెలుసు. అవును. మీ యొద్ద టేపులు కూడా ఉన్నవి. అయితే అక్కడే మీరున్నారు. చూశారా.

294 ఇపుడు, ఇపుడు దీని యొక్క మర్మము ఇక్కడున్నది. తెల్లవారకముందు ఈ ఉదయం పెందలకడనే ఇది నాకు బయలుపరచబడినది. అటు తరువాత, త్వరగా లేఖనానికి వెళ్ళి చూచుటకు ప్రారంభించాను, వెదికాను. అదక్కడ ఉన్నది. ఇంతవరకు వాటిలో మూడు ఖచ్చితంగాను, అతీతంగాను బయలుపరచబడినవి. ఇపుడు నల్లని గుఱ్ఱం యొక్క మర్మము ఇక్కడున్నది. నాకు బయలుపరచబడిన విధముగా.

295 అతడు అంధకార యుగములలో అతనిపై స్వారీ చేయుటకు ప్రారంభించాడు. అది, నల్లని గుఱ్ఱం సూచిస్తున్నది, అంధకార యుగములు. ఎందుకనగా, అది మిగిలిన నిజ విశ్వాసులకు మధ్య రాత్రి సమయం. ఆ సంఘకాలమును, ఆ మధ్య సంఘకాలమును, అంధకార సంఘకాలమును గమనించుడి. “నీకు కొంచెము శక్తి ఉన్నది” అని ఆయన చెప్పినది గమనించుడి. అది నిజమైన విశ్వాసికి మధ్య రాత్రి సమయమైయుండును. ఇపుడు గమనించుడి. సాధారణముగా నిజమైన సంఘము నుండి సమస్త నిరీక్షణ తీసివేయబడెను, ఎందుకనగా ఇతడు సంఘమును రాజ్యమును స్వాధీనము చేసుకున్నాడు. వారేమి చేయబోతున్నారు? చూడండి, కథోలిజం, సంఘమును రాజ్యమును వశపరచుకొన్నది. మరియు కథోలిజంతో అంగీకరించనివారు చంపబడ్డారు. ఆ కారణం చేతనే అతడు నల్లని గుఱ్ఱంపైనున్నాడు. అతడు చేసిన చీకటి కార్యము ఏమిటి గమనించుడి. చూశారా, అప్పుడు మీరు చూస్తారు. మీరు…మీరు మీ చరిత్రను ఎరిగి, అది గమనిస్తే, అప్పుడు మీరు…సరే, ఇది తెలుసుకొనుటకు అవసరం లేదు. ఇపుడు గమనించండి. నిరీక్షణంతా వెడలిపోయెను. అదే అతని యొక్క నల్లని గుఱ్ఱం.

ఇపుడు, అతడు యుక్తిగా తెల్లని గుఱ్ఱం పైన స్వారీ చేశాడు.

296 అటు తరువాత అతనికి అధికారము ఇయ్యబడెను. అతడు సమాధానమును తీసివేసెను. మిలియన్ల మందిని చంపివేసెను. అతడు స్వారీ చేయబోవుచుండగా అతడు చేయబోవు కార్యము అదే. అతడింకా చేస్తున్నాడు. చూశారా?

297 ఇపుడు, ఇక్కడ అతడు నల్లని గుఱ్ఱం పై ఉన్నాడు, వచ్చుచున్నాడు. అంధకార యుగము, అదే సమయం. సంఘము స్థిరపడిన తరువాత, ఆ సమయానికి, శక్తిని పొంది, ప్రతీది అణచి వేశారు. ఆ విధముగా వందలకొలది వందలకొలది సంవత్సరములుగా కొనసాగింది. అది అంధకార యుగమని చదివిన ప్రతి వారు దానిని ఎరుగును. ఎంతమందికి అది తెలుసు? [సభ “ఆమేన్” అని చెప్తున్నది.—సంపా.] నిశ్చయముగా అవి అంధకార యుగములు…అక్కడే ఆ అంధకార యుగమునకు సాదృశ్యముగా మీ నల్లని గుఱ్ఱం ఉన్నది. ఇపుడు అన్ని ఆశలు వెలిపోయినవి; నిరీక్షణ లేదు. ఆ కొద్దిమంది విశ్వాసులకు ప్రతీది అంధకారమయం. ఇపుడు, ఆ కారణం చేత అది నల్లని గుఱ్ఱంగా పిలువబడుతూ, పోలికగానున్నది.

298 “అతని చేతిలో త్రాసులు, లేక కొల పాత్రలున్నవి,” చూస్తున్నారా. “దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్లు యవలనియు చెప్పుచున్నాడు.” చూశారా, వాస్తవముగా అవి, గోధుమ బార్లీ (యవలు) ప్రకృతి రీత్యా జీవనాధారమైనవి. వాటి నుండి రొట్టె మొదలైనవి తయారగును. అయితే చూడండి. అతడు దీని కొరకు వెల నిర్ణయించియున్నాడు దాని అర్థం ఎట్లనగా, అతడు వారికి జీవము నిచ్చెదనను నిరీక్షణను వారికి కలిగించుచు దాని కొరకు అతడు ప్రజల నుండి డబ్బు వసూలు చేయుచున్నాడు. ఎట్లనగా…అతడు ప్రతిసారి ప్రార్థనలకై వారి యొద్దనుండి పైకము తీసుకొనుచున్నాడు. ఆ విధముగా ప్రార్థనలకై జీవము నిచ్చెదనన్న నమ్మకము కలిగించి ఇంకా పైకము వసూలు చేయబడుచున్నది. ఇంక వారు నొవేనా వారం చేస్తున్నారు.

299 కారణం, అతడేమి చేస్తున్నాడు? ప్రపంచం యొక్క సంపదను పట్టుకొనుచున్నాడు. త్రాసు ద్వారా కొలుచుచున్నాడు. “ఒక దేనారమునకు సేరు గోధుమలనియు; ఒక దేనారమునకు మూడు సేర్ల యవలు.” త్రాసుతో తూచుచున్నాడు. నల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు…తన ప్రజల యొక్క డబ్బును దోచుకొనుచున్నాడు. ప్రపంచ సంపద యావత్తు అతని యొద్ద నుండునని బైబిల్ ముందుగా తెలియజేయుచున్నది. గతరాత్రి మనం రష్యాను గూర్చి మాట్లాడినట్లు, అంతా, వారు ప్రజల యొద్ద నుండి డబ్బంతా తీసుకొని, ప్రతీది వారి యొద్ద నుండి వలిచివేయుచున్నారు. కనుక, అవి చూడండి.

300 ఇపుడు గమనించుడి. సంఘములో డబ్బు తీసుకొను ఆ పాత పద్ధతి ఎక్కడ నుండి వచ్చినదో చూడుడి. ఆలాటి వాటికి దూరంగా ఉండుడి. సంస్థను నిర్మాణాత్మకము చేయుటకు ఒకటి పెద్దది చేయుటకు, మిలియన్ డాలర్లు ఇక్కడ ఖర్చు చేయుటకు, దాని తల్లి ఎవరని మీరు చూశారా?

301 ప్రభువా ధన్యవాదాలు నీకు. ఓ. మై, నేనెంతో ఆనందంగా ఉన్నాను. అవునండి. మంచిది. ఇది ఆయన కృప. అంతే. మంచిది. మంచిది.

302 అది మధ్య రాత్రి సమయం. అది మీరిపుడు అర్థం చేసుకుంటున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఇక్కడ అతడు ఒక విధమైన జీవనమునకు పైకము వసూలు చేయుచున్నాడు. అవి ప్రకృతి సంబంధమైన యవలు ఇతరమైనవి. ఆత్మీయమైనది కాదు, ఇపుడు అవి యవలు. చూశారా. కాబట్టి యవలు రొట్టె, గోధుమ రొట్టె. అతడు తన ప్రజలకు ఇవ్వబోవు ఆ విధమైన జీవనమునకు అతడు వసూలు చేయుచున్నాడు. Purgatory బయటనున్న వారికి ప్రార్థించుటకు పైకము వసూలు చేయుటకు, ఇపుడు నేను దీనిని చరిత్రలో నుండి తీసికుంటున్నాను. డబ్బు చెల్లించుట, అది నొవెనా, అనుకుంటున్నాను. దానిని గురించి ఎవ్వరికి ఏమి తెలియదని నేను ఊహిస్తున్నాను. నొవెనా, అనునది నీవొకటి చేయవలసియుండునని నేననుకుంటున్నాను. తెలుసా. పశ్చాత్తాప ధనము చెల్లించుట. ఒకరు దానికై చెల్లించాలి. ప్రపంచ సంపద, తన యొద్దకే తెచ్చుకొనుట, సంఘములోనికి తెచ్చుట. అతడు ఇంకా స్వారీ చేయుచున్నాడు. ఓ. అవును తప్పక. అవునండి. ఇంకా స్వారీచేయుచున్నాడు.

303 గమనించు. ఇక్కడ చక్కని భాగమున్నది. గమనించుడి.

…నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు.

304 “ఇంకొద్దిగా అక్కడ మిగిలింపబడియున్నది, అయితే దానిని తాకవద్దు!”

305 ఇపుడు, నూనె…ఆత్మకు పరిశుద్ధాత్మకు సూచనయైయున్నది. మీకు కావలయునంటె కొన్ని వచనాలు నేనిస్తాను. రెండు లేఖనాలున్నవి. లేవీకాండము 8:12 లో, అహరోను లోపలకు వెళ్ళకముందు తైలముతో అభిషేకింపబడవలసియున్నది, తెలుసా. మరియు జెకర్యా 4:12 లో తైలము కొమ్ములలో నుండి వచ్చుటను గురించియు చెప్పబడినది, “ఇది నా ఆత్మ, తైలము.” ఇంకొక విషయము, మత్తయి 14…25 లేక 25:3 మీరు చూచితే బుద్ధిలేని కన్యకలున్నారు. బుద్ధి లేని కన్యకల యొద్ద నూనె, ఆత్మ లేదు. మరియు మత్తయి 25:4, బుద్ధిగల కన్యక యొద్ద ఆమె దివిటీలో నూనె ఉన్నది. ఆత్మ పూర్ణురాలైయుండెను. ఆత్మ! నూనె ఆత్మకు పోలిక. ఓ. మహిమ! [సహోదరుడు బ్రాన్హాం ఒక్కసారి తన చేతులు కలిపి కొట్టాడు—సంపా.] సరే. మీకు అర్థమైందా [సభ “ఆమేన్” అని చెప్పినది.] సరే. ఇపుడు నూనె ఆత్మకు పోలిక.

306 మరియు ద్రాక్షారసము ప్రత్యక్షత యొక్క ఉత్తేజమునకు గురుతుగా ఉన్నది. ఓ, నేను—నేను ఈ స్థలమంతా పరుగెత్తవలెనని ఉన్నాను. ప్రభువు నాకు చూపించినపుడు నా పొరుగువానిని లేపకుంటే నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. చూశారా, “ప్రత్యక్షత యొక్క ఉత్తేజము.” అవునా.

307 ఎల్లపుడు, బైబిల్ గ్రంథములో నూనె, ద్రాక్షారసం కలసి ఉంటవి. నా యొద్ద వ్యాఖ్యానమున్నది. నేను చూశాను. అన్ని వేళలలో ద్రాక్షారసము నూనె కలసియుండుట, ఆ విధముగా యుండుట త్రాడుతో ముడివేయబడినట్లుగా కలసియున్నవి. అవునా?

308 ఒక వాగ్దానము చేయబడిన దేవుని వాక్యము యొక్క సత్యము ఆయన యొక్క పరిశుద్ధులకు నిజముగా బయలుపరచబడినపుడు, అది నూనెతో నింపబడుట, వారందరు ఉత్తేజ పూరితులౌదురు. ద్రాక్షారసము ఉత్తేజము. మహిమ! అది నేనిపుడు భావిస్తున్నాను. కేకలతో, ఆనందముతో ఉత్తేజపూరితులౌట. చూశారా? అది చేసినపుడు, ప్రకృతి సంబంధమైన మనిషి మీద ద్రాక్షారసము చేసినట్లు అదే విధమైన ప్రభావముండును. ఎందుకనగా, దేవుని యొక్క సత్యము నుండి ప్రత్యక్షత ఇవ్వబడినపుడు, నిజమైన విశ్వాసి నూనెతో నింపబడతాడు. ప్రత్యక్షత బయలుపరచబడుతుంది, ఉత్తేజము ఎంతో ఎక్కువైపోతుంది, అతడు అసాధారణముగా ప్రవర్తించునట్లు ఆయన చేయును. అవును. మహిమ. [సభ ఆనందించుచున్నది—సంపా.] చూశారా, ఇపుడు వారితోనున్న కార్యము అదే. అవునది నిజం. అది వారిని అసాధారణముగా తమకు తాము చూడనటువంటి విధముగా ప్రవర్తింపజేయుచున్నది.

309 దీనికి మీకు లేఖనము కావలయునంటె, అపొస్తలుల కార్యములు 2 చదవండి. వారెక్కడనున్నారు? ఇవ్వబడిన వాగ్దానము వారి యొద్దనున్నది. పరిశుద్ధాత్మ వాగ్దానమంతయు వారి మీద క్రుమ్మరింపబడెను. మరియు…అది లేఖన ప్రకారము రుజువు చేయబడినది. ఇపుడు మీరు చూస్తున్నారా.

310 వారు చెప్పినట్లైతే ఎట్లుండును…“ఇపుడు ఆగు, మన యొక్క పరిచర్య నిమిత్తం ఇక్కడ కనిపెట్టుకొనియుండుడి అని ఆయన మనకు చెప్పాడు.” మరియు ఎనిమిది దినములైన తరువాత, వారన్నారు, “సరే, అబ్బాయిలు, నేను మీకు చెప్తాను,” మార్కు మత్తయితో అన్నాడు, “నేను—నేను నమ్ముతున్నాను, అబ్బాయిలు మనమెపుడో అది పొందుకున్నాము. మీరు అలా అనుకొనుటలేదా? చూశారా. మనమెపుడో అది పొందుకున్నాము. ఇపుడు మనము మన యొక్క సేవ మీద కనిపెట్టుకొని యుండకుండ ఇప్పటికే మనం బోధ చేసియుండవలసియున్నది. ఇక్కడకు వచ్చి కనిపెట్టుకోవలసినదని ఆయన మనకు చెప్పాడు. మనమిక్కడ యుండి ఎనిమిది దినాలు యౌతుంది.”

“సరే. ఇంకొక దినమునకు మనము వేచియుందాము.”

311 తొమ్మిది దినములు అయినవి. తరువాత మార్కు వచ్చి, లేక—లేక—లేక వారిలో ఒకరు వచ్చి యోహాను అన్నాడు, “నేను—నేను—నేను మనమింకను వేచియుండుట అవసరము లేదని నేననుకుంటున్నాను. మనమెపుడో అది పొందుకొనియున్నామని నేననుకుంటున్నాను. మరి మీరు?”

312 అటు తరువాత నేను సీమోనును చూస్తున్నాను, ’కారణం, అతడు తాళపు చెవులు కలిగియున్నాడు, తెలుసా. “ఇపుడు ఒక నిమిషం ఆగు. అబ్బాయిలూ! దీనిని గూర్చి లేఖనము ఒకటి చెప్పవలసియున్నది. ఎన్ని దినాలు వేచియుండాలని ఆయన మనకు చెప్పలేదు. ‘అప్పటి వరకు వేచియుండుడి!’ అని ఆయన చెప్పాడు. యోవేలు ప్రవచనము నెరవేరు వరకు, యెషయా ప్రవచనము ప్రత్యక్షపరచబడు వరకు మీరక్కడ ఉండుడి.’”

313 “నత్తివారి పెదవులతోను అన్య భాషలతోను ఈ ప్రజలతో నేను మాట్లాడెదను. ఇదే విశ్రాంతి.” పోయబడిన ద్రాక్షారసము ఇదే. బైబిల్ గ్రంథములో ద్రాక్షారసమనగా ఏంటి? విశ్రాంతులు. “ప్రభువు సన్నిధానములో నుండి వచ్చునటువంటిది విశ్రాంతి ఇది.” చూశారా? అది—అది ఇపుడు లేఖన సంబంధమైనది కావలసియున్నది. చూశారా.

314 కాబట్టి మీరు చూశారా, ద్రాక్షారసము ప్రత్యక్షత యొక్క ఉత్తేజమునకు పోలికయైయున్నది. పరిశుద్ధాత్మ దిగినపుడు దేవుని యొక్క అగ్ని దిగుట వారు చూశారు. మై, అది వారిని ఉత్తేజపరచుటకు మొదలు పెట్టినది. మరియు మొదట విషయమేంటో తెలుసా, వారు ఎంతగానో ఉత్తేజము పొందారు. ప్రజలు వారు తాగినవారని తలంచునంతగా, అయితే, వారు ప్రత్యక్షత ద్వారా ఉత్తేజం పొందారు. దేవుని ద్వారా…ఇదిగో ఇక్కడ. దేవుని యొక్క ప్రత్యక్ష పరచబడిన ప్రత్యక్షత వారికి విశదపరచబడినది. అందును గూర్చి వారెంతో ఆనందించారు. దేవుడది వాగ్దానం చేశాడు. అదిక్కడ వారికి రుజువు చేయబడినది. బయలుపరచబడినది. ఆమేన్! ఇక్కడొక మనుష్యుడు నిలువబడి అన్నాడు, “ఇది అదే! ఇది అదే!” యని. మరియు అదే అక్కడున్నది. మనకిపుడున్న అదే సూచన వలన రుజువు చేయబడినది. అది—అది ప్రత్యక్షత ద్వారా ఉత్తేజము. అవునా, ఇపుడు, వారు నిజంగా అప్పుడు దానిని పొందారు.

315 ఆ కారణము చేత, పేతురు అక్కడ నిలబడి, “ఎందుకు? యూదయ మనుష్యులారా యెరూషలేము నివాసులారా నా మాట ఆలకించుడి. డివినిటి డాక్టర్లారా మీరందరు నేను మీతో చెప్పినది ఆలకించుడి. చూశారా.”

316 ఓ. ఎంతటి ఆశ్చర్యం. బయలుపరచబడినది. బయలుపరచబడినది. అది బయలుపరచబడుట వారు చూచినపుడు వారెంతగానో ఉత్తేజపూరితులయ్యారు. అదెల్లపుడు అది చేయును. అది ఎల్లపుడు చేయును.

317 ఈ దినమున దేవుడు ఒక కార్యమును చేయుటను వాగ్దానమును నేను చూచినపుడు, ఈ చివరి దినమున ఈ ముద్రలను విప్పెదనను ఆయన వాగ్దానమును చేసినపుడు! ఇది ఆయన బయలుపరచినపుడు నేనక్కడ నిలబడి అది జరుగుట గమనించినపుడు ఆ ఆనంద మహిమలు మీకు తెలియదు. మరియు ఏ వ్యక్తినైనా నింపగలనని నేనెరిగియున్నాను. ఆ విధముగా జరిగిన దానికంటె వేరొకటి ఆయన చెప్పలేదు. మరియు ఆయన అది చేయుదునని వాగ్దానము చేసినట్లు ఈ చివరి దినములకైన ఆయన వాగ్దానమును నేను చూస్తున్నపుడు అది నా హృదయమునకు ఆనందాన్ని ఇచ్చుచున్నది. మరియు అది ఇక్కడ రుజువు చేయబడి సంపూర్ణంగా యుండుట ఇక్కడ చూస్తున్నాను. నేను…“నేను భక్తి పులకితుడనౌతున్నాను,” అని చెప్పుట మీరు వినియుంటారు. అదీ విషయం. ఉత్తేజము ఎంతో ప్రభావము గలది. ఎంతవరకనగా నేను—నేను—నేను కోయబడుటకు కూడా సిద్ధముగానుండునట్లు అది చేయుచున్నది. ప్రత్యక్షతను బట్టి ఉత్తేజము! సరే.

318 వారు రుజువు చేయబడిన వాగ్దానము పైన గల ప్రత్యక్షత ద్వారా వారెంతో ఉత్తేజపూరితులైరి. ఓ. మై! దేవుడు వారికి ఆయన వాగ్దానమును బయల్పరచినపుడు, “వారు క్రొత్త మద్యము త్రాగితిరి” యను చెప్పునంతగా వారు బయలుపాటు వలన కలిగిన ఉత్తేజముతో ఆనందంగా ఉండిరి. ఆయన అది బయలుపరచుట మాత్రమే గాక ఆయన దానిని రుజువు పరచెను.

319 అదే నేను ఎల్లప్పుడు చెప్తున్నది. ఒక మనుష్యుడు ఏదైన చెప్పగలడు. ఆఁ, అతడు దేనినైనను చెప్పుకొనుటకు కోరుకొనవచ్చును. అయితే దేవుడు అక్కడకు వచ్చి దానిని రుజువు చేసినపుడే అది రుజువగును!

320 ఇపుడు బైబిల్ చెప్తుంది, “మీలో ఎవడైనను తాను ఆత్మ సంబంధినియనియైనను, ప్రవక్తనని చెప్పుకొనిన యెడల, అతడు ఈ సంగతులు చెప్తే అవి జరుగని యెడల, ఆలాటప్పుడు అతనిని లక్ష్యపెట్టకుడి. అతనికే మాత్రము భయపడకండి. ఆ మనుష్యునికి భయపడద్దు. అయితే అతడు అది చెప్పి అది నెరవేరితే, అది నేనే. చూశారా. నేను అందులో ఉన్నాను. అది నేనేయని రుజువు చేస్తున్నది.”

321 మరియు, అటు తరువాత, ఆ చిన్న సమరయ స్త్రీ. ఈ మెస్సీయా ఈ విషయాలు చేయునని లేఖనము చెప్పినప్పుడు, ఇక్కడ ఆయన యుండి లేఖనము ఏమి చెప్పిందో ఖచ్చితంగా ఆయన అదే చేశాడు. ఆమె చెప్పినది “వచ్చి, ఒక మనుష్యుని చూడుడి, ఆయన అక్కడున్నాడు. జరుగునని లేఖనము చెప్పినట్లు ఖచ్చితంగా అది కాదా?” చూశారా? ప్రత్యక్షత ద్వారా ఆమె ఉత్తేజపరచబడినది. అవునా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అది రుజువు చేయబడినపుడు ప్రత్యక్షత ద్వారా ఆమె ఉత్తేజపరచబడినది. చూశారా? అవునది నిజం. ఆమెకు తెలుసు…

322 “క్రీస్తు అనబడు మెస్సీయా వచ్చునని మాకు తెలియును. మరియు ఆయన వచ్చినపుడు ఆయన ఈ కార్యములను చేయును.” ఆమె అది చూచినది.

మరియు ఆయన చెప్పాడు, “నేను ఆయనను” అని.

323 అటు తరువాత ఉత్తేజము ఆరంభమైనది. కేకలు పెట్టుకుంటూ నగరములోనికి ఆమె వెళ్ళిపోయినది. ఆమె పాత నీళ్ళకుండను వదలిపెట్టి అక్కడకు వెళ్ళిపోయి “వచ్చి, చూడుడి!” అని వారితో చెప్పినది.

324 ఇపుడు, తూర్పు ప్రాంతము వారి ఆచారములు మీకు తెలిస్తే, ఆమె ఆలాగు చేయుట తప్పు. అవునండి. ఆ రకమైన స్త్రీ చెప్పినది ఎవరూ వినరు. లేదండి. గమనిస్తున్నారా, ఆమెకు ఒక గురుతున్నది. మరియు…ఆమె వీధుల్లోకి ఆ విధంగా వెళ్ళిపోయి మరియు ఆ విధంగా ప్రవర్తిస్తే, వీధుల్లో పురుషులు ఆమె వైపు శ్రద్ధ చూపరు.

325 అయితే, సహోదరుడా, ఆమె అక్కడ వాక్యము యొక్క జీవమును కలిగియున్నది. ఆమె ఉత్తేజపూరితురాలైనది. నీవు…గాలి వీచుచున్న దినమున మంటలతో మండుచున్న ఇంటిని ఆర్పినట్లుండును. ఓ దాన్ని ఒకటి విసురుతున్నది! ఆమె సిద్ధంగా ఉన్నది. అవును. వారు దానిని ఆర్పలేరు. అది దేవుని అగ్ని మండుట. అవునండి. ఆమె అన్నది, “అది ఆలాగు కాదని మీరు నమ్మనియెడల, ఎక్కడైతే కూడిక జరుగుచున్నదో అక్కడికి మీరు రండి. నేనది మీకు చూపుతాను.” ఆఁ. అది అదే—ఆఁ. అవునండి.

326 మరియు కాబట్టి ఆ మనుష్యులు అక్కడకు వెళ్ళారు. మరొకసారి ఆయన అది చేయలేదు, అయితే ఆ స్త్రీకి ఒకటి జరిగినదని వారు తెలుసుకున్నారు. ఆమె మారింది, కనుక వారు ఆయనను నమ్మారు. అవునండి. వారు ఆయనను నమ్మారు.

327 కారణం, “వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాగ్దానము మూలముగా, దేవుని వాక్యము వలన కలుగును. మరియు అది నిజరూపము దాల్చుట గమనించండి.” ఎందుకనగా అది విత్తనము. అది విత్తబడినపుడు అది జీవమును పొందుకొనును. అది దేనిని గూర్చి మాట్లాడుచున్నదో అది ఉత్పత్తి చేయును. ఆలాగు అది లేనట్లయితే, ఆలాగైతే అది దేవుని విత్తనము కాదు. లేక విత్తువాడు అది ఏలాగు విత్తవలెనో అది తెలియలేదు. విత్తనాలు విత్తుటకు దేవుని చేత అతడు పంపబడలేదు. బండమీద లేక మరియొక దాని మీద వాటిని అతడు విత్తియుండవచ్చును. చూశారా? కాబట్టి నీవు—కాబట్టి చూడూ, విత్తువాడు విత్తనము విత్తుచున్నాడు, దానిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడు, అది మంచి స్థలములో పడుతుంది. అవును. ఓ. మై!

328 ఆలాగైతే, ఈ నల్లని గుఱ్ఱం పై స్వారీ చేయువానికి, అది ఏమి చెప్తుంది? “నా ద్రాక్షారసమును నా నూనెను పాడుచేయవద్దు. అది తాక వద్దు—నా ద్రాక్షారసము, నూనె! నేనిక్కడ కొంచెము లోతుగా వెళ్ళవలసియున్నది. అయితే అక్కడ ఇంకా కొద్దిగా ఉన్నది. ఆఁ. నీవు ఇపుడు వెళ్ళుచు నీ జీవితంలో ఉన్నవాటిని లెక్కించుము; అది నీకు సంబంధించినది. నీవు అక్కడ మూల్యమును చెల్లించవలసియున్నావు. అయితే, ద్రాక్షారసము నూనెను వదలిపెట్టు!” ఓ. మై! నీవు…

329 మరో మాటల్లో, ఈ విధంగా, “నా యొక్క నూనెతోను, ద్రాక్షారసముతోను నింపబడిన, చూశారా, పరిశుభ్రమైన వాక్యము యొక్క ద్రాక్షారసము, నూనె నా చిన్న మందను కొంత పట్టుకొనిన యెడల నీవు వారిని చంపెదవు. ఎందుకనగా నీవు అది చేస్తున్నావు. అది నీవు చేస్తున్నావు. ఏలాటి ‘మరియా శుభము’ ఆలాటిది చెప్పవద్దు లేక అటువంటిది చేయవద్దు లేక నీ మూఢభక్తి చేయవద్దు…నీ చేతులు వారిపై నుండి తీసివేయుము. వారు నా నూనె వలన అభిషేకము పొందియున్నారు గనుక వారెక్కడకు వెళ్తున్నారో వారికి తెలుసు. మరియు నా యొక్క నూనెతో అభిషేకము పొందుట వలన ఆనందమును ద్రాక్షారసము కలిగియున్నారు. ’ఏలాగనగా ‘నేను తిరిగి లేపెదను’ అను నా యొక్క వాగ్దాన వాక్యమును వారు ఎరిగియున్నారు. దానిని పాడు చేయవద్దు. వారిని గజిబిజి చేయుటకు వెళ్ళవద్దు. కారణం, దానికి దూరంగా ఉండు. కాదు.”

330 ఆయన ఆయన వాక్యమును రుజువు చేసి దానిని లోపలకు తెచ్చును. వారు ఎరుగుదురు. వారు తిరిగి లేచెదరని వారు ఎరుగుదురు. ఓ. నేనెంతగా అది ప్రేమిస్తున్నాను. వ్యూ! వారు తిరిగి లేచెదరు. ఇక్కడ నల్లని గుఱ్ఱం స్వారీ చేయబడుచున్నది, చీకటి యుగములు వచ్చుచున్నవి.

331 తెల్లని గుఱ్ఱం వెళ్ళిపోయినది. అతడు ఏమి చేశాడు అనునది మనము ఖచ్చితంగా చూశాము. ఇక్కడ ఎర్రని గుఱ్ఱం వచ్చినది, అతడేమి చేశాడో ఖచ్చితంగా మనము చూశాము. ఇక్కడ నల్లని గుఱ్ఱం వచ్చినది. చూశారా అతడేమి చేస్తున్నది, అన్ని కాలాలలో, అన్ని సమయాలలో ఒకే స్వారీ చేయువాడు.

332 ఇక్కడ అతడు అది కొలచి ధర నిర్ణయించినట్లు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా; గోధుమ, ప్రకృతి సంబంధమైన జీవనం. దాని ద్వారా వారు జీవించుచున్నారు.

333 అయితే, నూనె ఆత్మయు, ద్రాక్షారసము ఆనందమునకు సూచనలుగా ఉన్నవి. “అది ఆత్మ సంబంధమైన జీవము, దానిని పాడు చేయవద్దు. దానిని వదలివేయుము!” మరో విధముగా, “రోమ్, దానిని ముట్టవద్దు. అది నాది! అది నాకు సంబంధించినది!”

334 ఇపుడు మీరు ఎరుగుటకు ఇంకొక విషయం ఇక్కడున్నది. గమనించుడి, “నూనెను ద్రాక్షారసమును గాని ముట్టవద్దు” అని చెప్పినది నాలుగు జీవులలో ఒకటి కాదు. మీరది గ్రహించారా? నాలుగు జీవులు మాట్లాడుచుండెను. అయితే…గమనించుడి, నేనిక్కడ చదువుతాను, కొద్దిగా. అవును. ఇపుడు

…దేనారమునకు, —ఒక…సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను…ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు.

335 ఇపుడు ఇక్కడ వినుడి.

ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు—నాకు వినబడెను…

336 ఏంటది? గొఱ్ఱెపిల్ల! ఆమేన్! అది నాలుగు జీవులు కాదు. గొఱ్ఱెపిల్ల దానిని చెప్పెను. ఎందుకని? ఆయన తన వారిని తీసికోబోతున్నాడు. అది ఆయనకు సంబంధించినది. ఆయన దానిని విమోచించాడు. అవునా? ఆమేన్! “మీరు ఆ నూనెను ముట్టవద్దు!” లేదండి. నాలుగు జీవులు కాదు. అయితే అది చెప్పినది గొఱ్ఱెపిల్ల. మరియు, ఓ. మై. గొఱ్ఱెపిల్ల. కాదు…నాలుగు జీవులు దీనిని ప్రకటించలేదు. గొఱ్ఱెపిల్ల తానే చెప్పాడు.

337 “వచ్చి చూడుడి” అని నాలుగు జీవులు చెప్పినప్పుడు, వారు వెళ్ళి, వారు వెళ్ళి ఆ విధంగానే చూశారు.

338 మరియు ఆయన చెప్పాడు “ఒక దేనారమునకు సేరు గోధుమలనియు, మరియు…ఈ విధంగా మరిన్ని యవలనియు” చెప్పెను. అయితే, వారి మధ్యనే గొఱ్ఱెపిల్ల కేకవేసి “నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని” చెప్పెను. ఊహు. అవును. ఓ. మై. అది విను, “నీవది పాడు చేయవద్దు. అబ్బాయ్, లేదా దాని కొరకు ఒక రోజు లెక్క చెప్పవలసియున్నది.” ఓ. మై!

తొమ్మిది-ముప్పయ్.

339 సరే. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నా హృదయములో నేను నమ్మినదానంతటితో, ఆ మూడు ముద్రల యొక్క నిజమైన అర్థం అది. అందుకొరకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లించగోరుతాను. మరియు నేనిది చెప్తాను. అనగా ఆయన నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. దాని యొక్క ప్రత్యక్షతను ఆయన నాకు ఇచ్చాడు. కడవరి దినాలలో మనము జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను.

340 రేపు రాత్రికి మనము పాండుర వర్ణము గల గుఱ్ఱం మీద స్వారీ చేయువానిని తీసుకుందాము. ఇపుడు నాకు తెలియదు. నాకు తెలియదు. అది నిజమని దేవునికి తెలుసు. అందును గూర్చి ఒక్క విషయము నాకు తెలియదు. లేదు.

341 అనేక సంవత్సరముల నుండి నా యొద్దనున్న పాత పాఠ్య భాగాన్ని నేను చూశాను. కొంచెం సేపు క్రితం సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్ ది చూశాను. బహుశా అతడు బయటకు వెళ్ళియుండ వచ్చును. అయితే ఇక్కడకు ఇంతకు మునుపు నేను ప్రసంగించానని నాకు జ్ఞాపకమున్నది. సంవత్సరాల క్రితం నేనేమి చెప్పానో నేను చూశాను. ఒక రోజు నేను ప్రకటన గ్రంథాన్ని చదువుచుంటిని. ఒక్కసారి నాలుగు గుఱ్ఱంలపై స్వారీ చేసిన వారిని నేను తీసుకుంటిని.

342 నేను చెప్పాను, “ఒక తెల్లని గుఱ్ఱం, అనుమానము లేదు. అది ఆరంభ సంఘము.” అడ్వెంటిస్టుల పుస్తకము నుండి నేనది చదివాను. ఒక దానిని నేను చదివాను. నేను అన్నాను, “జయించుచు బయలు వెళ్ళిన అది, ఆరంభ సంఘము.” మరియు ఆ తరువాత నల్లని గుఱ్ఱం, నేను చెప్పాను…ఆ నల్లని గుఱ్ఱమును గూర్చి నేనేమన్నానో, అది నేను మరచాను. నేను చెప్పాను…

343 లేక “ఎర్రని గుఱ్ఱం,” నేను చెప్పాను “ఒక వేళ గుఱ్ఱం యొక్క అర్థం—మార్గములో అనేకమైన ఇబ్బందులు అనేకమైన యుద్ధాలు యున్నవని లేక ఆలాంటివి వున్నావని.” నేను చెప్పాను, “బహుశా అనేకమైన యుద్ధాలు ఉన్నవి.” నేను చెప్పాను, “అది అదేయైయుండును.” మరియు అటు తరువాత నేను చెప్పాను, “పాండురవర్ణ…”

344 లేక, “ఆ నల్లని గుఱ్ఱం,” నేను చెప్పాను, “దాని—దాని అర్థము—బహుశా అన్ని నక్షత్రాలన్ని ప్రకాశించుట ఆగిపోతే; సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు తన ప్రకాశతను ఇవ్వడు, భూమికి చీకటి కాలము వచ్చును.” నేను చెప్పాను, “బహుశా దాని అర్థం అది కావచ్చు.”

345 “పాండురవర్ణ గుఱ్ఱం, ఎన్నో వ్యాధులు రానున్నవని దాని అర్థం” అని చెప్పాను. ఇపుడు దాని అర్థమేటో నాకు తెలియదు. అయితే, అపుడు దానిని గూర్చిన నా అనువాదము అదే. ’ఎందుకనగా నాకు వీలైనంత వరకు ఇక్కడ వేదిక యొద్ద నిలబడి దానిని గురించి చెప్పాను.

346 అయితే, ఓ, నేనొకటి చెప్పియున్నాను! సరే. ఉఁ! ఓ! మీరు—మీరు చూస్తారు. గమనించి, చూడండి.

347 ఇపుడు, మనము జీవిస్తున్న ఈ ఘడియను గూర్చి ఆనందంగా లేదా [సంఘము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] ఈ విషయాలన్ని సమకూడి జరుగుట చూచునపుడు నేననుకొనుచున్నాను:

దేశములు ముక్కలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడిన సూచనలు;

అన్యజనుల దినములు లెక్కింపబడుచున్నవి, భయంకరమైనవి కలవరపరచుచుండగా;

“ఓ చెదరిన వారలారా, మీ యొక్క స్వదేశమునకు తిరిగి రండి.”

విమోచనా దినము సమీపించుచున్నది,

భయము చేత మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది;

ఆత్మతో నింపబడుడి, మీ దినములు చక్కపరచి తేటగా ఉండనిమ్ము,

పైకి చూడు, నీ విమోచన సమీపమైయున్నది (ఓ. మై!)

అబద్ధ ప్రవక్తలు అబద్ధములాడుచున్నారు, దేవుని సత్యమును వారు తృణీకరించుచున్నారు,

క్రీస్తుయై యున్న యేసు దేవుడుని;

మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.]

అయితే, అపొస్తలులు నడిచిన దారిని మనం నడుద్దాము.

విమోచన దినము సమీపించియున్నది,

మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది;

ఆత్మతో నింపబడుడి, మీ దీపములు చక్కపరచి తేటగా ఉండనిమ్ము,

పైకి చూడు నీ విమోచన సమీపమైయున్నది!

348 అది అద్భుతం కాదా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] నేనది ప్రేమిస్తాను. విమోచన సమీపముగా ఉన్నది.

సాయంకాల సమయమున వెలుతురుండును,

మహిమకు మార్గమును మీరు తప్పక కనుగొందురు;

నీటి మార్గములో, నేడు వెలుగుండును;

ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టబడుడి.

యౌవ్వనులు వృద్ధులు మీ పాపాలన్నిటికి పశ్చాత్తాపపడుడి,

పరిశుద్ధాత్మ నిశ్చయము లోనికి వచ్చును;

సాయంకాల వెలుగు వచ్చియున్నది,

క్రీస్తు దేవుడు ఒకటైయున్నాడనునది నిజం.

ఆయన వాక్యము! ఓ, మై అద్భుతం!

త్వరలోనే గొఱ్ఱెపిల్ల ఆయన వధువు నిరంతరము ఆయన ప్రక్కన ఉండుటకు తీసుకొని పోవును,

పరలోక సైన్య సమూహమంత అక్కడ కూడును;

ఓ, అది యొక మహిమకరమైన దృశ్యము, పరిశుద్ధులందరు మచ్చలేని వస్త్రములు ధరింతురు;

మరియు యేసుతో వారు నిత్యము విందు అనుభవించెదరు.

ఓ, “వచ్చి భోజనం చేయుడి,” యజమానుడు పిలచుచున్నాడు, “వచ్చి భోజనం చేయుడి;”

ఓ, ఎల్లవేళల యేసు బల్లయొద్ద మీరు విందు చేయవచ్చు;

బహు జన సమూహమును పోషించిన ఆయన, నీటిని ద్రాక్షారసముగ మార్చిన ఆయన,

ఇపుడు ఆకలి గొనిన వారిని, “వచ్చి భోజనం చేయుడి,” అని పిలచుచున్నాడు.

ఓ, “వచ్చి భోజనం చేయుడి,” యజమానుడు పిలచుచున్నాడు, “వచ్చి భోజనం చేయుడి;” (వాక్యమును భుజించుడి!)

ఎల్లవేళల యేసు బల్లయొద్ద మీరు విందు చేయవచ్చు;

బహు జన సమూహమును పోషించిన ఆయన, నీటిని ద్రాక్షారసముగ మార్చిన ఆయన,

ఇపుడు ఆకలిగొనిన వారిని, “వచ్చి భోజనము చేయుడి,” అని పిలచుచున్నాడు.

349 ఓ, మై మీరు ఆకలితోనున్నారా? [సభ ఆనందించుచున్నది—సంపా.] “నీతి నిమిత్తము ఆకలి దప్పిక గలవారు ధన్యులు.”

350 మీరాయనను ప్రేమిస్తున్నారా? [సభ “ఆమేన్” అని చెప్తుంది.—సంపా.] మీరాయనను ప్రేమిస్తున్నారా? నేను ఆయనను ప్రేమించుచున్నాను అను పాటను వాయించు సంగీతం మీరెరుగుదురు. ఇపుడు మనం నిలబడి, మన చేతులెత్తి ఆయనకు మనలను మనం వ్యక్తం చేసుకుందాము. “నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను ఏలయనగా ఆయనే మొదట ప్రేమించెను.” సరే, ఇపుడు అందరము కలసి.

నేనాయనను ప్రేమించుచున్నాను-నేనాయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను

కల్వరి చెట్టుపైన

మరి నా రక్షణను కొనెను.

351 [ఒక సహోదరుడు అన్య భాషతో మాట్లాడుచున్నాడు, సహోదరుడు బ్రాన్హాం కొద్దిసేపు నిలుపు చేశాడు—సంపా.] చాలా భయభక్తులతో యుండుడి. మనకొక అనువాదికుడున్నాడు, సహోదరుడు హిగిన్ బోదం. అతడు ఇక్కడున్నాడో లేదో నాకు తెలియదు. ఆయన మనతో ఏమి చెప్పాడో మనం కనుగొందాం. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ, ఇక్కడ…[ఒక సహోదరి అనువాదం ఇచ్చుచున్నది.]

352 నిజం, ప్రభువుకు స్తోత్రం! నా యొక్క విశ్వాసము దేవునిలో హెచ్చించబడినది. మీరు, మీరు మీ నిండు హృదయముతో, ఈ రాత్రి ఆయనను ప్రేమిస్తున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఓ, ఆయనకు స్తుతి కలుగునుగాక “ప్రభువైన యేసూ ధన్యవాదములు!” అని చెప్పండి. [సభ దేవుని స్తుతించుచున్నది.]

353 ప్రభువా, మా నిండు హృదయాలతో నీకెట్లు స్తోత్రం చెల్లించగలము! దేవునికి మహిమ!

354 ప్రజలందరు ఆయనకు స్తుతి చెల్లించుడి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక! [సభ దేవుని స్తుతిస్తూ, ఆనందిస్తున్నారు—సంపా.] 


    63-0320 — మూడవ ముద్ర
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...