నాలుగవ ముద్ర

నాలుగవ ముద్ర

 సాయంకాల వేళ శుభములు. ఇపుడు, మనము ప్రార్థన కొరకై తలలు వంచుకుందాము.

2 కృప కలిగిన మా పరలోకపు తండ్రీ, మరొక దినము కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుటకు, తిరిగి ఈ రాత్రి ప్రభువైన యేసు నామములో ఇపుడు నిన్ను సమీపిస్తున్నాము. మరియు ఈ రాత్రిలో కూడిక కొరకైన నీ ఆశీర్వాదాలకై మేము ఇపుడు అడుగుచున్నాము. మేమెంతో జాగ్రత్తగా అడుగుచున్న ఈ విషయాలకు అనువాదమును పరిశుద్ధాత్మ వచ్చి మాకు దయచేయును గాక. ఓ దేవా, అదెంతో ప్రశస్తమైనదిగా యుండును గాక. ఎంతవరకనగా వాక్యము వెంట మేము సహవాసము చేయునపుడు, మేము విడుచునపుడు మేము ఈలాగు చెప్పుదుము గాక, “మార్గము వెంబడి ఆయన మనతో మాట్లాడునపుడు మన హృదయములు మండలేదా?” అని చెప్పుదుము గాక. ఆయన మాకేమైయున్నాడో అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు మేము యాత్ర చేస్తుండగా ఆయన మాతో నుండునని నమ్ముచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

3 ఈ రాత్రి తిరిగి దేవుని గృహములోకి వచ్చినందుకు, మరలా పరిచర్యలోకి వచ్చినందుకు ఎంతో ఆనందం. మరియు మనము ఆనందంగా ఉన్నాము. నేనెంతో సంతోషంగా ఉన్నాను.

4 ఇది రాదని తలంచాను, అయితే, చివరికి అది వచ్చినది. మరియు నేనెంతో కృతజ్ఞుడనైయుంటున్నాను. ఆ నాలుగు గుఱ్ఱపు స్వారీ చేయు వారిలో ఇది చివరి వాడు. ఈ సమయములో సంఘమునకు ప్రధాన వర్తమానములలో ఒకటి అని నేననుకుంటున్నాను.

5 ఇంకొకటి ఏమైయున్నదో అది నాకు తెలియదు. ఆయన దానిని ఏ విధముగా బయలుపరచుచున్నాడో, ఆలాగే అనుదినము నేను దానిని తీసుకొనుచున్నాను. ఆయన దానిని నాకు…ఇచ్చినట్లుగానే, నేను దానిని ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నాను.

6 మీరు ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] అది, ఏ విధముగా ఆ సంఘకాలాలతో జతపరచబడినది, అది ఏ విధముగా ఖచ్చితంగా వాటితో ముడివేయబడినది మీరు గమనించారా? అది ఆ విధంగా…అది నాకైతే, సంఘకాలాలను అనుగ్రహించిన అదే పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ దీనిని కూడా ఇచ్చెను, అవునా, ఎందుకనగా అది యొకటిగా కలసి ఉన్నవి. అదంతా దేవుని యొక్క ఒక పెద్ద కార్యము. వివిధమైన మార్గములలో ఆయనకు ఆయన కనపరచుకొనుట.

7 మీరు గమనిస్తే, దానియేలుకు ఆయన కనబరచుకున్నపుడు, దర్శనములో, ఒక దానియొక్క పోలికగాయుండెను. ఈ స్థలములో ఒక మేకగా, లేక ఒక చెట్టుగా యుండెను; మరియు మరియొక స్థలములో శిల్పము వలె యుండును. మరియు—మరియు—మరియు ఆయన చేసినవి, అది చేస్తున్నది, ఎల్లప్పుడు ఒక్కటే, మనమది పోగొట్టుకొనకుండునట్లు ఖచ్చితంగా ఒక్కటే.

8 ఇపుడు, కొద్ది క్షణాల క్రితం ఎనభై అయిదు సంవత్సరాల వయస్సు కలిగి ఇక్కడే కూర్చున్న ఒక స్త్రీతో నేను మాటలాడుచుండగా నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. మరియు ఆమె…

9 కొంచెం కాలం క్రితం, పశ్చిమ ప్రాంతమునకు వెళ్ళుటకు ముందు అక్కడ ఒహియోలో ఒక—ఒక చిన్న బాలికయున్నది. లుకేమియా చివరి దశతో నుండి చనిపోవుటకు సిద్ధముగా నున్నది అని అనుకుంటున్నాను. లుకేమియా రక్త ప్రవాహములోని కాన్సర్. మరియు చిన్న విషయమేంటో తెలుసా, అంత భయంకరమైన స్థితి. ఆమెకు ఇక నిరీక్షణ లేదు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి నరముల ద్వారా ఆహారమిచ్చుచుండిరి. మరియు వారెంతో పేద కుటుంబం. మరియు వారు…

10 శ్రీమతి కిడ్ ఇక్కడున్నారు. మరియు సహోదరుడు కిడ్, ప్రభువు ప్రార్థనలకు ఎంతో జవాబిచ్చునని వారికి చెప్పారు. వారందరు కలసి అద్దెకు ఒక దానిని తీసుకొని ఆ చిన్న బాలికను ఇక్కడకు తీసుకొని వచ్చారు. ఆమె అందమైన చిన్న అమ్మాయి, సుమారు, ఓ ఆరు, ఏడు సంవత్సరాలుంటవి. [“తొమ్మిది సంవత్సరాలని” ఒక సహోదరి చెప్పింది.—సంపా.] తొమ్మిది సంవత్సరాలు. మరియు—మరియు ఆమె వెనుక గదిలో ఉండెను, మరియు…

11 మరియు మేము ప్రభువు నొద్దకు వెళ్ళినపుడు పరిశుద్ధాత్మ ఆమెకు ఒక మాట ఇచ్చెను. మరియు వారు ఆమెను తీసుకొని, మరియు వారు ఆమెను తీసుకొని భోజనం పెట్టారని మీరెరుగుదురు. ఆ విధముగా…మరియు ఆమె వెళ్ళినపుడు రొట్టె మాంసము కొరకు ఏడ్చింది, కనుక నోటి ద్వారా భోంచేసింది. ఆమెకు వారు మాంసపు ముక్క ఇచ్చారు. మరియు స్వాభావికంగా భోజనం తిన్నది.

12 కొద్ది కాలానికి, కొద్ది దినాలకు, తిరిగి వైద్యుని యొద్దకు ఆమెను తీసుకొని వెళ్ళారు. మరియు వారు…వైద్యునికి అర్థం కాలేదు. అతడు చెప్పాడు, “క్రితము వలె లేదు. ఆ బాలికవలె లేదు.” అతడు చెప్పాడు “అసలు—ఎక్కడ కూడా ఎక్కడ కూడా లుకేమియా చిహ్నములు ఒకటి కూడా లేదు.” కాబట్టి, ఆమె చనిపోతుంది. ఆమెపై ఆశలు వదలుకొనిరి, కేవలం నరములు ద్వారా ఆహారము ఇచ్చుచుండిరి. ఆమె పసుపు రంగుగా మారింది. వారేలాగున్నది మీకు తెలుసా. మరియు…మరియు ఇపుడు ఆమె పాఠశాలకు వెళ్తూ, ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఎంత సంతోషంగా ఉండవలెనో అంత సంతోషంగా యున్నది.

13 ఆలాటిది మరియొక విషయం నాకు జ్ఞప్తి వచ్చుచున్నది. ఒక రోజు అపుడే నేను ఇంటికి వచ్చాను. ఒక…నేను పొరపాటు పడనట్లయితే, వారు ఎపిస్కొపెలియన్లు లేక ప్రెస్బిటేరియన్లు కావచ్చు కన్ సాస్ నుండి ఒక చిన్న బాలికను తీసుకొచ్చారు. మరియు లుకేమియా వలన వైద్యులు ఆమె బ్రతుకదని చెప్పారు. మరియు, ఆమె నాలుగు దినాలు బ్రతుకుతుందని చెప్పారనుకుంటాను. ఆమె ఎంతగానో క్షీణించింది, కావున వారు మంచు మార్గముల గుండా వచ్చుటకు ఎక్కువ ప్రయాసపడి, ఆమె కొరకు ప్రార్థించబడుటకై ఆ నాలుగు దినములు ఇక్కడ గడుపుతామని చెప్పారు. మరియు ఆమె యొక్క తాత, తల నెరసిన పెద్ద మనిషి.

14 మరియు ఆమెను ఇక్కడ చిన్న బాడుగ ఇంట్లో రెండు దినాలు ఉంచారు. అది ఇపుడక్కడ లేదని, ఈ సిల్వర్ క్రీక్ ప్రక్కన లేదని నేను—నేను అనుకుంటున్నాను. మరియు, కాబట్టి ఆమె కొరకు ప్రార్థించుటకు ఆ రాత్రి నేను వెళ్ళాను. అది ప్రాతఃకాల వేళ, పట్టణములో నుండి నేనా రాత్రి వచ్చి వెళ్ళాను. మరియు…తాత నేల మీద నడుస్తున్నాడు. మరియు తల్లి బిడ్డను జాగ్రత్త తీసుకొనుటకు ప్రయత్నిస్తుంది.

15 మరియు నేను ప్రార్థించుటకు మోకరించగనే తల్లి తండ్రి మధ్యనున్న ఒక రహస్యాన్ని, వారు చేసిన ఒక దానిని పరిశుద్ధాత్మ నాకు తెలియజేశాడు. వారిని నేను ప్రక్కకు పిలచి, అందును గూర్చి వారిని అడిగాను. వారు ఏడుస్తూ “అవును” అని చెప్పారు.

16 అటు తరువాత నేను వెనుకకు చూశాను. ఒక చిన్న బాలిక ఒక త్రాడుతో ఎగురుతూ ఆడుతూయుండుట చూశాను. మరియు చిన్న బిడ్డ…సుమారు మూడు వారాల సమయంలో, తిరిగి పాఠశాలలో యుండు త్రాడుతో ఎగురుచుండు చిన్న బాలిక యొక్క పటమును వారు నాకు పంపారు. లుకేమియా ఎంత మాత్రము లేదు.

17 ఇపుడు, ఇపుడు ఆ సాక్ష్యములు ఖచ్చితంగా యథార్థములైన సత్యములు. చూశారా. కాబట్టి మన దేవుడు ఎంతో నిజమైన వాడు. చూశారా. మనం కేవలం ఆయనను సేవిస్తాము మరియు—మరియు ఆయనను నమ్ముతాము. మరియు—మరియు ఆయన వాస్తవమైన వాడని నేనెరుగుదును.

18 మన అంతరంగమందు, మన మధ్య ఒకటియుండి, తన మార్గమున పని చేస్తుండగా, నా శక్తి కొలది చేస్తాను. మరియు ఇపుడు, ఈ రాత్రి దేవుని కృప ద్వారా ఈ నాలుగవ ముద్ర తీసుకొనుటకు ప్రయత్నిద్దాం మరియు అందులో ఏమున్నది పరిశుద్ధాత్మ మనతో ఏమి చెప్పబోతున్నాడో చూద్దాం.

19 ఇపుడు నేను—ప్రకటన 6వ అధ్యాయము 7వ వచనము చదవబోతున్నాను; 7 మరియు 8వ వచనము. ఎపుడూ రెండు వచనాలు యుంటవి; మొదటిది ప్రకటన, రెండవ వచనము అతడు చూచినది.

ఆయన నాలుగవ ముద్రను విప్పినపుడు-రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని (కూర్చున్నవాని) పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలోనుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను.

20 ఇపుడు, మనము దీనిని అర్థం చేసుకొనుటకు ప్రభువు మనకు సహాయము చేయును గాక! ఇది యొక మర్మము.

21 ఇపుడు, కొద్దిగా పునరావృతం, మనం సంఘకాలాలను చూచినట్లు, ఈ స్వారీ చేయువారు, ఈ ముద్రలను విప్పబడుటను, కొద్దిగా వెనుకకు చూద్దాం. కాబట్టి మనమది మనస్సులోకి తెచ్చుకొని, మాట్లాడుటకు అది సరియైన సమయమా యని మనం భావించు వరకు కొంచెం మాట్లాడుకుందాం.

22 ఇపుడు, ముద్రలు విప్పబడుటను గూర్చి మనం గమనించాము. అది ముద్రించబడిన విమోచనా గ్రంథము. పాతకాలపు పద్ధతివలె గ్రంథము ఒక చుట్టవలె చుట్టబడియుండెను.

23 [సహోదరుడు బ్రెన్హాం కాగితపు కట్టలను వినియోగించి చుట్టుటను మరియు ముద్రించుటను చూపించుచున్నాడు—సంపా.] ఈలాటి రకపు పుస్తకము అది కాదు. ఎందుకంటె అది ఈ మధ్య వచ్చినది. ఈ రకాలైన పుస్తకాలు, నూట ఏభై సంవత్సరాలు లేక రెండు వందల సంవత్సరములు. మరియు తరువాత, వారు దానిని చుడతారు, తరువాత చివర వదలివేస్తారు. అదెలాగో నేను మీకు చెప్పినట్లుగా, లేఖనాలలో, యిర్మీయాలో, మొదలైన వాటిలో తెలుసుకొనగలము. అటు తరువాత చుట్టబడియుండును. అటు తరువాత వదులు వదలివేయబడును. అది ఆలాగు.

24 ఒక్కొక్కటి ఒక ముద్రగా ఉన్నది. అది ఏడు ముద్రల గ్రంథమైయుండెను. మరియు అది…ఎవరూ…వారు…అది ఏడు ముద్రల విమోచనా గ్రంథము. నన్ను క్షమించండి.

25 మరియు, తరువాత, పరలోకమందు గాని, భూలోకమందుగాని భూమి క్రింద గాని దానిని విప్పుటకైనను లేక దానిని చూచుటకైనను ఎవరూ యోగ్యులు కారు. మరియు యోహాను ఏడ్చాడు. ఎందుకనగా ఏ మనుష్యుని కనుగొనలేకపోయెను…ఎందుకనగా అసలైన యజమానుని చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనకపోతే…హవ్వ, ఆదాముల ద్వారా అదెక్కడ పోగొట్టబడినదో, తిరిగి అది వెళ్ళిపోయినది, వాక్యము యొక్క హక్కులను, వాగ్దానములను, వారి వారసత్వమును కోల్పోయినపుడు.

26 వారు, జ్ఞాపకముంచుకో, వారు భూమిని స్వాధీనపరచుకొనిరి. అతడొక—ఒక చిన్న దేవుడు. ఎందుకనగా అతడు దేవుని కుమారుడైయుండెను. మరియు ఒక దేవుని కుమారుడు ఒక—ఒక—ఒక చిన్న దేవుడు. ఇపుడు అది లేఖనానికి విరోధం కాదు. అది వింతగా వినిపిస్తుందని నాకు తెలుసు.

27 అయితే యేసు చెప్పాడు, “దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారిని మీరు పిలచిన యెడల…” మరియు ఎవరి యొద్దకు దేవుని వాక్యము వచ్చును? [“ప్రవక్తలు” యని సభ చెప్పినది.—సంపా.] ప్రవక్తలు. “దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారిని దేవుళ్ళని మీరు పిలచిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నన్నేల ఖండించుచున్నారు?” చూశారా?

మరియు, ఇపుడు, వారు దేవుళ్ళు.

28 మరియు, మనుష్యుడు, నీవు నీ కుటుంబంలో జన్మించిన యెడల నీ కుటుంబం పేరు నీకుండును. నీవు కుమారుడవు. మరియు నీ తండ్రి భాగానివి.

29 మరియు తరువాత—తరువాత పాపము లోపలకు వచ్చినపుడు, మానవుడు అగాధమును దాటెనని మనము కనుగొనుచున్నాము. మరియు—మరియు కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము కప్పెను. అయితే తుడిచివేయలేదు. నిజమైన బ్లీచ్ (వచ్చు వరకు) వచ్చి పాపపు మరకలను తీసివేసి, దానిని సంపూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసి, దాని యొక్క అసలగు తారుమారు చేసినవాడగు సాతాను యొద్దకు పంపు వరకు.

30 అది సాతాను యొద్దకు తిరిగి చేరునప్పటికి నిత్య నాశనము కొరకు అతడు కాచుకొనియుండును. ఇపుడు, మనము నమ్మిన దానిని అది చూపించుచున్నది. వాడు పరిపూర్ణముగా నాశనము చేయబడునని మనము నమ్ముచున్నాము.

31 పాపము పగిలిపోవునని నేను నమ్ముచున్నాను. మరియు అది యేసుక్రీస్తు రక్తము వలన ఒప్పుకొనబడినపుడు, అది ఒక చుక్క నల్ల సిరా క్లొరాక్స్ బ్లీచ్ లో వేసినట్లుండును. అది దానిని రసాయనాలలోకి విచ్ఛిన్నం చేసి, అది ఎక్కడ నుండి వచ్చెనో అక్కడకు దానిని పంపును. చూశారా? ఆ విధముగా యేసుక్రీస్తు రక్తము చేయును.

32 అటు తరువాత, మానవుడు మరలా అగాధము దాటి దేవుని కుమారునిగా యుండునట్లు అది చేయును. మరియు అటు తరువాత అతడు—తరువాత అతడు…దేవుని యొక్క సృష్టించే శక్తి అతనిలో కలదు. చివరకు అది జరుగును గాక యని దేవుడు ఆజ్ఞ ఇచ్చినపుడు, అది జరుగును. మనము వెనకకు వెళ్ళుదుము. అది ఎపుడైతే—ఆ…

33 మోషే, కోడెల యొక్క రక్తము క్రింద ఉండెను. మరియు ఆ వెలుగును అతడు సంధించినపుడు, మండుచున్న పొదలలో అగ్ని స్తంభమును అతడు సంధించెను. మరియు దేవుడు అతనికిచ్చిన ఆజ్ఞతో అతడక్కడ నిలబడెను. అతడొక ప్రవక్త. మరియు ప్రభువు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చినపుడు అతడు మాట్లాడాడు. అతడు మాట్లాడగా వాక్యము ద్వారా కార్యాలు సృజించబడినవి. చూశారా?

34 ఇపుడు, కోడెల యొక్క రక్తము క్రింద ఉండగనే అది చేసినట్లయితే యేసు యొక్క రక్తమును గూర్చి ఏంటి? కప్పివేయడం కాదు గాని దానిని తుడిచివేసినది. సంపూర్తిగా. విమోచించబడిన ఒక కుమారునిగా దేవుని సన్నిధానంలో నీవు నిలబడ్డావు. ఇపుడు, చూడండి, సంఘము దాని యొక్క జీవన ప్రమాణమునకు చాలా దూరంగా ఉన్నది. మరియు నేను తలస్తున్నాను. అనేకసార్లు మనం బయటకు వచ్చి సమస్యను ఎదుర్కొనుటకు బదులు ఇదీ అదీ యని పరిశోధించెదమని తలంచుచున్నాను.

నేను చెప్పవలసినది యొకటియున్నది. నేను—నేను సమయము వచ్చినపుడు దానిని చెప్తాను.

35 ఇపుడు గమనించండి. సంఘాలలో యొకచోట యొక తప్పు ఉన్నది. మరియు నేననుకుంటాను ప్రజల యొక్క మనస్సులను త్రిప్పివేసినది సంఘశాఖల పద్ధతులని. అది ఏలాగు చేయవలెనో అది వారు ఎరుగకున్నంత వరకు. అవునది నిజం.

36 అయితే అది బయలుపరచబడునని మనకు వాగ్దానము చేయబడినది. మరియు ఈ గ్రంథము ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది. మరియు ఆ ఏడు ముద్రలు ఇపుడు…

37 మరియు అటు తరువాత, ఈ ఏడు ముద్రలు పూర్తియైన తరువాత, ప్రకటన 10 లో మనం చూస్తున్నాము. యోహాను వ్రాయుటకు ఆజ్ఞ పొందిన ఏడు మర్మమైన ఉరుములుయున్నవి. అయితే అటు తరువాత అవి వ్రాయుటకు అనుమతి నిరాకరించబడినది. మరియు ఆ ఉరుముల సమయములో, క్రీస్తు, లేక, “ఇంద్ర ధనస్సుతోనున్న దూత దిగి వచ్చి ఆయన పాదము భూమి మీదను సముద్రము మీదను మోపి ఇక సమయముండదని ప్రమాణము చేసెనని మనము కనుగొనుచున్నాము.”

38 మరియు అటు తరువాత చూస్తున్నాము. ముద్రలు బయలుపరచబడుటలో, ఒక విజ్ఞాపన కర్తగా గొఱ్ఱెపిల్ల ఆయన మధ్య వర్తిత్వపు పనిని విడిచిపెట్టి ఆయన మరణము ద్వారా ఆయన విమోచించిన దానినంతా, వాటి హక్కులను స్వాధీన పరచుకొనుటకు ఇపుడు వచ్చుచున్నాడు.

39 మరియు, అటు తరువాత ఎవ్వరూ గ్రంథమును విప్పలేకపోయిరి. ఎవ్వరూ అర్థం చేసుకొనకపోయిరి. అది విమోచనా గ్రంథమైయుండెను. మరియు తండ్రియైన దేవుడు, ఆత్మ, దానిని ఆయన మనస్సులో ఉంచుకొనెను. ఎందుకనగా క్రీస్తు, ఒక మధ్యవర్తిగా, ఒకే ఒక మధ్యవర్తిగా సింహాసనముపై ఉన్నాడు. కాబట్టి ఏలాటి పరిశుద్ధుడు గాని, మరియ గాని, యోసేపు గాని, మరెటువంటిది గాని ఆ బలిపీఠం మీద లేదు. ఎందుకనగా అది రక్తము. మరియు కేవలం యేసు రక్తము మాత్రమే పాపపరిహారము చేయగలదు. మరొకటేది మధ్యవర్తిగా నిలువలేదు. అవును. ఇక వేరేది ఏదియూ లేదు.

40 కాబట్టి యూదా రాజకీయాల కొరకు విజ్ఞాపన చేయుటయనునది, పరిశుద్ధ సెసిలియా మరొక దానికై విజ్ఞాపన చేయుటయనునది, అదంతా బుద్ధిహీనత. అది కాదు…నేను—నేను, ప్రజలు నమ్మకస్తులు, యథార్థవంతులు కాదు అని నేను చెప్పుటలేదు. నీవు అది చేయుటలో నీవు యథార్థవంతుడవు కాదని నేను చెప్పుటలేదు, నీవు చేసినట్లయితే. అయితే, నీవు తప్పు, నీవు యథార్థంగా తప్పు. మరి ఏదైనా…

41 వారు చెప్పుతారు, “సరే, ఈ—ఈ దూత, ఇది—ఇది పరిశుద్ధుడు బోనిఫెర్ అగుపించి ఇది, అది మరియు ఇంకొకటి చెప్పెను. మరియు వారు ఇది చెప్పవలసియున్నది.” నా మనస్సులో రవ్వంతైనా అనుమానం లేదు. దర్శనములో ఒకరు ఏది చూచినను. నేను—నేను అనుమానించను జోసఫ్ స్మిత్ చూచిన దర్శనమును. అయితే మిగతా వాక్య ప్రకారము లేదు. కాబట్టి అది నాకు తప్పు. చూశారా? అది మిగతా వాక్యమునకు సరిపోవలసియున్నది.

42 ఆ విధముగాయున్నవి, సంఘకాలములు, మరియు ముద్రలు, మరియు దాని మిగతా అంతా. మరియు ఎవరైనను ఆ ఏడు ఉరుములను గూర్చి ఏమైన యున్నదని తలంచిన యెడల, అది మిగతా వాక్యముతో పోలిక లేనట్లయితే, తప్పు ఒకటియున్నది. చూశారా? అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని రావలసియున్నది. ఏలయనగా ఇది గ్రంథము. ఇది దాని సంపూర్ణతలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత.

ఇపుడు, తరువాత ఆ గొఱ్ఱెపిల్ల వచ్చెనని నేను—నేను నమ్ముతున్నాను.

43 వారికి తెలియదు. యోహాను ఏడ్చుచున్నాడు. అతడు పరలోకంలో గాని, భూమిలోను గాని ఎవరిని కనుగొనలేకపోయెను. ఎందుకనగా అందరు అగాధము ఆవలనున్నారు. చూశారా. పాపము. ఏ మనుష్యుడు లేడు…ఒక దూత కావచ్చు. అతడు యోగ్యుడు కావచ్చు అయితే, అతడు రక్త సంబంధి కావలసియుండెను. అతడు మానవుడు కావలసియుండెను. అలాటిదేది లేదు. ఎందుకనగా ప్రతి మనుష్యుడు లైంగికమును బట్టి పుట్టియున్నాడు.

44 ఆ విధముగా జన్మించిన ఒకరు కావలయును. కాబట్టి, దేవుడు దానిని కన్య జన్మ ద్వారా తానే తీసుకొని ఇమ్మానుయేలు అయ్యాడు. ఆయన రక్తము యోగ్యమైనది. అటు తరువాత ఆయన ఈ అగాధమును తానే దాటి, ఋణమును చెల్లించి మిగిలిన మన కొరకు మార్గాన్ని సిద్ధపరచెను. తరువాత మధ్యవర్తిగా యుండుటకు కూర్చుండెను. మరియు ఆయన అక్కడ కూర్చొనియున్నాడు.

45 మరియు గ్రంథము వాస్తవంగా ఎపుడూ మూయబడియుండెను. అది అక్కడ ఉన్నది. అయితే అది ఇంకా సూచనలతో ఉన్నది. వారు దానిని చూచారు. యోహాను కూడా అది చూశాడు. మొదటిది వచ్చినపుడు ప్రకటన వచ్చెను. అతడు చెప్పాడు, “ఒక తెల్లని గుఱ్ఱం బయలు వెడలెను. అతనిపై స్వారీ చేయువాడుండెను. అతని చేతిలో విల్లు ఒకటియుండెను.” అది యొక సూచన. అది బయలు పరచబడలేదు. లేదు. అది కేవలం సూచన. భూమిపైన నున్న ఏ వ్యక్తియైన అతడు చెప్పగలిగినదంతే. అవును. అతడు నిస్సందేహంగా తొట్రుపడవచ్చును, తత్తరపడవచ్చును. కొంచెం సేపైన తరువాత ఇక్కడ లేక అక్కడ యని తాకవచ్చును.

46 అయితే, అటు తరువాత ప్రకటన గ్రంథములోను, “ఏడవ దూత వర్తమానములో మర్మములు (దాని యొక్క అన్ని మర్మములు) ఆ సమయానికి బయలుపరచబడునని” మనం చూస్తున్నాము. ఇపుడు, అది ప్రకటన 10:1-7. ఆ సమయం ప్రకారము అది బయలుపరచబడవలయును. ఆయన చేసిన ఆ సమయం.

47 అటు తరువాత ఏడు ఉరుములు వాటి వింతైన స్వరములు ఉరిమెను. యోహాను వ్రాయబోతున్నాడు. అయితే, అదేమైంది యోహానుకు తెలుసు. అయితే అతడు—అతడు అది వ్రాయలేదు ఎందుకనగా అది వ్రాయుటకు అతడు అనుమతి పొందలేదు. అది ఖచ్చితంగా సంపూర్ణంగా ఒక మర్మము. అది చివరకు సూచనలలో కూడా లేదు, లేక వేరే లేదు. అది ఉరిమెను…అది మాత్రమే తెలుసు. అంతే.

48 మరియు ఇపుడు ఇది పఠనము చేస్తుండగా, ఇపుడు మరచిపోకండి, ఇపుడు, ఆదివారం లేక ఆదివారం ఉదయం, మనం స్వస్థత కూటమును వదలిపెట్టియున్నాము. ఎందుకనగా ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు. ఇపుడు ఈ ఏడు ముద్రల మీద మీకు ప్రశ్నలు యుంటే, అది మిమ్ములను ఇబ్బంది పరస్తే, మీకు అర్థం గానివి ఒకటియుంటే, మనం ఏడు ముద్రలలో అవి చూద్దాం. తరువాత శనివారం రాత్రికి నేను చెప్తాను. వాటికి జవాబు ఇవ్వవలెనా లేదా వద్దా, అవునా. మరియు తరువాత ఇపుడు, సరే. ఒక దానిని గూర్చి, లేక, “నేను ఇది చేయనా?” లేక—లేక, కల వచ్చియుండవచ్చును. అవి, అవి అన్ని ఉపయుక్తమైనవే. ఇపుడు గుర్తుంచుకోండి. అవి యోగ్యమైనవి. అయితే, మనము ఏడు ముద్రలతో నిలచియుందాము. దాని పైనే మనమున్నాము…అదే—ఏడు ముద్రల కొరకే కూటము ఏర్పాటు చేయబడినది. దానితో మనము నిలబడదాము.

49 నేను ఇంటికి వెళ్ళవలసియున్నది. పశ్చిమమున కొన్ని కూటములున్నవి. తరువాత కొద్దిగా ఒక నెల లేక రెండు లేక కొంచెం తరువాత తిరిగి వస్తాను. మరియు ప్రభువు అనుమతిస్తే మనమొకటి ఏర్పాటు చేద్దాము, బహుశా స్వస్థత కూటము లేక ఒకటి లేక…ఏదైనను.

50 తరువాత, ఏడు బూరలు చెప్పుకోవలసియున్నది ఇంకా. అవునా. అవన్నియు రావలసియున్నవి కూడా. మరియు ఏడు పాత్రలు పోయబడవలసియున్నది. కాబట్టి అతన్ని ఇక్కడ పెనవేసుకొన్నవి. అయితే అవి ఇంకా మర్మముగానేయున్నవి.

51 ఇపుడు, గతరాత్రి…మొదటి ముద్ర బయలు వెడలుచుండగా మరియు స్వారీచేయువాడు, మనం చూశాము…మరియు ప్రభువు…ఎంతో సహాయము చేశాడు, క్రితము నాకది తెలియదు. వీటిలో ఏ ఒక్కటి క్రితము నాకు తెలియదు. అవును మరియు నాకు తెలియదు.

52 అలా అక్కడకు వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని కూర్చొని అది అక్కడ తెరువబడు వరకు ఆలాగు కూర్చుంటాను. నేను నా కలమును తీసుకొని వ్రాయుటకు మొదలుబెడతాను. మరియు ఆలాగు అక్కడేయుంటాను, ఒక వేళ గంటలు వరకు, అది—అది ముగియు వరకు.

53 తరువాత నేను వెనుకకు వెళ్ళి ఆయన ఎక్కడ దీనిని చెప్పాడో చూస్తాను. నేననుకుంటాను, “మంచిది, అది నేనెక్కడో చూచినట్లున్నది.” నేను నా యొక్క వ్యాఖ్యానము తీసుకొని, తిరిగి చూస్తాను. “అక్కడేదైనా ఆలాగు ఉన్నదా? ఇక్కడ ఇది సరిగ్గా ఉన్నది, మరియు ఇక్కడ కూడా ఇది తిరిగి ఉన్నది. మరియు తిరిగి ఇక్కడున్నది. మరియు ఇక్కడ క్రింద మరియు ఇక్కడ పైన ఉన్నది.” తరువాత దానిని నేను ముడివేస్తాను. అది లేఖనమునకు లేఖనము సరిపోలినంత కాలము, అది దేవుడని నాకు తెలుసు. ఆ విధముగా అది యుండవలసియున్నది. భవనమును కలిపినట్టుగా, రాయి మీద రాయి, రాళ్ళు అమర్చబడవలసియుంది.

54 ఇపుడు, గత రాత్రి మూడవ ముద్రను తెరువబడుట కలిగియుంటిమి. మొదటిది తెల్లని గుఱ్ఱం, మరియు ఆ తరువాతది ఎర్రని గుఱ్ఱం మరియు అటు తరువాతది నల్లని గుఱ్ఱం. మరియు అన్ని సమయాలలో స్వారీ చేయువాడు ఒకడేయని మనం కనుగొన్నాము; మరియు ప్రారంభం నుండి అది అంత్య క్రీస్తు. అతనికి ఎటువంటి—కిరీటము లేదు, అయితే తరువాత అతడు ఒకటి పొందుకున్నాడు. మరియు భూమి మీద సమాధానము తీసివేయుటకు అతనికొక ఖడ్గమీయబడినట్లు మనం చూస్తున్నాము. అతడది చేశాడని మనం చూశాము. అటు తరువాత తన సిద్ధాంతములతో వచ్చాడు. సంఘములో తన సిద్ధాంతమును ప్రవేశపెట్టి డబ్బుతో అమ్మాడు; ఒక దేనారమునకు ఇది, దానికి రెండు దేనారములు అని అమ్ముచుండెను. అయితే, అతడు నూనెను ద్రాక్షారసమును తాకుటకు నిషేధించబడెను, అది కొద్దిగా మిగల్చబడినదైయున్నది.

55 మరియు, ఆ తరువాత, నూనె, ద్రాక్షారసము వేటికి ఉదాహరణముగా నున్నవనియు, వాటి వలన జరుగు ఫలితములు గడచిన రాత్రి వదిలాము. చూశాము. మరియు మనము…అది ఒక వేళ కఠినంగా అనిపించవచ్చును, అయితే నేను…అది ఖచ్చితంగా సత్యం. చూశారా? ఇపుడు వదలియున్నాము…మనం కొద్ది క్షణాలు దానిని గూర్చి చెప్పుకొందాం ఇపుడు. అటు తరువాత ద్రాక్షారసమును గూర్చి, శక్తిని గూర్చి, నూనె దేనికి గురుతని, ఆత్మ. అక్కడ నిలిపివేసియున్నాము. ఇపుడు మీరందరు దానిని గుర్తుపెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అలా కాకపోతే, టేపు మీద అది కనుగొనగలరు. మరియు లేఖనములో ఎక్కడ చూచినను నూనె ఎల్లపుడు పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఉదాహరణగా నూనె లేని బుద్ధిలేని కన్యకలు, నూనె కలిగిన బుద్ధిగల కన్యకలు, అది పరిశుద్ధాత్మ. మరియు తరువాత వెనుక, ప్రవక్తలు మొదలగు వారిలో. మరియు ఇపుడు నేను…

56 అక్కడ నేను ప్రతీ లేఖనము చెప్పుటకు ప్రయత్నించుట లేదు. అక్కడ నీవు మాట్లాడలేని విషయాలు ఉండును; మరింత సమయము తీసుకుంటుంది. అయితే ఇక్కడ లేఖనములు మొదలైనవి గుర్తించుటకు ప్రయత్నిస్తాను. అది వారు ఎరిగి దాని యొక్క పటమును చూచులాగున…అయితే, ఆ ముద్రలలో ఒక దానితో మీరు కూర్చున్నట్లయితే, మై, ఆ ముద్ర మీదనే ప్రతి రాత్రి ఒక నెల ప్రసంగం నీవు తీసుకుంటే అది చివరకు తాకలేవు. చూశారా, వాటిలో ఒకటి. మరియు అందుచేత—అందులో అనేక కార్యములున్నవి. అయితే, దాని యొక్క ప్రాముఖ్య స్థానాలను తాకగలము. తరువాత—అదంతా ఏదో మీరు చూడగలరు.

57 ఇపుడు, నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. తరువాత మనము కనుగొంటాము నూనె ద్రాక్షారసము ఆరాధనలో కలసియున్నవి. చూశారా, ఎల్లపుడు ఆరాధనలో కలసియున్నవి.

58 మరియు ద్రాక్షారసము, నా యొద్దకు వచ్చినది, ద్రాక్షారసము శక్తికి సూచనగానున్నది. ప్రత్యక్షత ద్వారా వచ్చు ఉత్తేజము యొక్క శక్తి. చూశారా? ఒకటి బయలుపరచబడుట. అది విశ్వాసికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందుకనగా, అది ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించబడినది. చూశారా? అది దేవుడు చెప్పిన యొకటి. అది మర్మము. వారు దానిని అర్థం చేసుకోలేరు, చూశారా. మరియు కొద్ది సమయమైన తరువాత, దేవుడు దిగివచ్చి అది బయలుపరచును. మరియు తరువాత అది రుజువు పరచును.

59 జ్ఞాపకముంచుకోండి. సత్యము బయలుపరచబడినట్లయితే, సత్యము రుజువు చేయబడవలసియున్నది కూడా…వ్యక్తి ఎంత తెలివైన వాడైనప్పటికి, అతడు తన మనస్సులో ఎంత బుద్ధిమంతుడైనప్పటికి; అతడు చెప్తున్న దానిని, దేవుడు బలపరచని యెడల, ఒక తప్పు ఒకటియున్నది. అవునా. అవును. కారణం, అది వాక్యము.

60 ఇపుడు, దేవుని యొక్క ప్రేరేపణ వలన అక్కడకు వెళ్ళి “ఈగలు వచ్చును గాక” అని అన్నాడు. ఈగలు వచ్చినవి, “కప్పలు వచ్చునుగాక” అని చెప్పాడు. కప్పలు వచ్చినవి.

61 “ఈగలు వచ్చునుగాక,” అని అతడు చెప్పినపుడు, అవి రానియెడల? ఏలాగుండును. చూడు. అలాటప్పుడు అతడు—అతడు ప్రభువు యొక్క మాటను పలుకలేదు. చూశారా; అతడు కేవలం అతని స్వంత మాట పలికాడు. అక్కడ ఈగలు వుండవలెనని అతడు తలంచియుండును. అయితే, అక్కడ ఏ ఈగలు వచ్చియుండవు. ఎందుకనగా దేవుడు అతనికి అలాగని చెప్పియుండలేదు.

62 మరియు దేవుడు ఏదైనా నీకు చెప్పినపుడు, “నీవు వెళ్ళి ఇది చెయ్యు, నేను దానితో ఉంటాను, ఏలయనగా ఇది నా వాక్యము” అని మీతో చెప్పినపుడు బైబిల్ గ్రంథములో అది ఆయన చూపించును. దాని వెనుక దేవుడు నిలబడును. అది బైబిల్ గ్రంథములో వ్రాయబడకపోయినను, దాని వెనుక దేవుడు నిలబడును, ఏలాగైనా, అది దేవుని వాక్యమైనట్లయితే, చూశారా?

63 మరియు, అటు తరువాత దాని ఆవల అది యున్నట్లయితే, అది ప్రవక్తలకు బయలుపరచబడును. దేవుని యొక్క అన్ని మర్మములు ప్రవక్తలకు, వారికి మాత్రమే తెలియబడునని మనము గ్రహిస్తున్నాము. చూశారా, ఆమోసు 3:7.

64 ఇపుడు, ఇపుడు విశ్వాసికి ప్రత్యక్షత యొక్క శక్తి ఉత్తేజమును పుట్టించును. ఎందుకంటె, ద్రాక్షారసము యొక్క శక్తి ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసము యొక్క శక్తి ఉత్తేజమును తెచ్చును. అవును. చచ్చిన వాని వలె క్రిందపడియున్న ఒక వ్యక్తికి అది ఉత్తేజమును కలిగించును. అవునా? అవునా? మంచిది, అటు తరువాత, ఇపుడు, వాక్యము యొక్క ప్రత్యక్షత యొక్క శక్తి ఉన్నది. అది విశ్వాసికి ఉత్తేజము యొక్క ఆనందమును అనుగ్రహించును. సంతృప్తి యొక్క ఉత్తేజాన్ని, అది రుజువుచేయబడిన, అది రుజువైన ఉత్తేజాన్ని ఇచ్చును.

65 మనమది గుర్తుంచుకోవాలని కోరిన యెడల లేఖనములో అది “క్రొత్త ద్రాక్షారసము” యని పిలువబడుచున్నది. మనము ఎల్లపుడు దానిని “వీరు క్రొత్త ద్రాక్షారసము త్రాగియున్నారు” అని చెప్పుకొనుచున్నాము. చూశారా? సరే. లేదా, “ఆత్మీయ ద్రాక్షారసము” మంచి అనువాదము అవుతుందని నేననుకుంటాను. అది “ఆత్మ సంబంధమైన ద్రాక్షారసము.” ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసము దానిలోని ఉత్తేజపు శక్తితో ఏలాగు బయలుపడునో, అలాగే క్రొత్త ద్రాక్షారసము దేవుని యొక్క వాక్యమును, ఆత్మను అది బయలుపరచును. ఓ! ఇపుడు…అది యొక…చూశారా, వాక్యమే ఆత్మ. మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.]

66 మనమది చదువుదాము. మనమది చదువుదాము, పరిశుద్ధ యోహాను 6. మనము…ఆఁ, తరువాత మీరు—తరువాత మీరు—మీరు చెప్పొద్దు, “సరే ఇపుడు ఒకరు చెప్పారు.” మనము—ఎవరది చెప్పారో మనము చూద్దాం, అటు తరువాత అది సత్యమో కాదో తెలుసుకుందాం. పరిశుద్ధ యోహాను, 6వ అధ్యాయం. 6వ అధ్యాయము, అది అరవై…63వ వచనము. సరే. ఇది అది. అవును.

ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి.

67 వాక్యమే ఆత్మయైయున్నది. అది వాక్య రూపమున నున్న ఆత్మ. తరువాత మీరు గమనిస్తే, అది జీవింపబడునపుడు లేక జీవమునకు వచ్చునపుడు వాక్యము యొక్క ఆత్మ పనిచేయుటకు మొదలు పెట్టును. చూశారా? ఎందుకనగా అది…

68 ఇపుడు, ఇటు చూడండి. ఒక తలంపు వాక్యము కాక మునుపు (మాట కాక మునుపు) తలంపు తలంపై యుండవలసియున్నది. మరియు అటు తరువాత ఒక తలంపు వ్యక్త పరచబడినపుడు అది యొక మాట. ఇపుడు ఇది ఆయన వాక్యములో ఉంచిన దేవుని యొక్క తలంపు. మరియు తరువాత ఆయన యొద్ద నుండి మనమది తీసుకున్నపుడు అది వాక్యమౌతుంది.

69 ఏమి చేయవలసినది దేవుడు మోషేకు బయలుపరిచాడు. మోషే అది మాట్లాడాడు, అది జరిగినది. అవునా? అది అదే. అది దేవుని యొద్ద నుండి నిజముగా వచ్చినపుడు.

70 ఇపుడు మనం కనుగొంటున్నాము, అది—అది—అది—అది ఉత్తేజపరచి, ఆనందాన్ని ఇచ్చును. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యము. మరియు క్రొత్త ద్రాక్షారసము, ఉత్తేజమునిచ్చును…అది వాక్యమును బయలు పరచినపుడు. అటు తరువాత, కొన్ని సార్లు, అవధులు లేని ఆనందాన్ని తెచ్చును. మీరు అంతటి ఆనందముతో పొర్లిపోవునంతగా అది అటువంటి ఆనందమును తీసికొనివచ్చునని మనము దానిని చూచితిమి.

71 ఇపుడు, జనులు కొనసాగించు విపరీతమైన మత పిచ్చిని గూర్చి నాకు తెలుసు. కొన్నిసార్లు సంగీతము ముందుకు, పైకి వాయించునపుడు వారు అది చేయుదురని నాకు తెలుసు. అది ఆ విధముగా కొనసాగునని నాకు తెలుసు. మరియు నేను—నేను దానిని కూడా నమ్ముతున్నాను. అయితే సంగీతం వాయించునంత సేపు ప్రజలు ప్రతి యొక్కరు ఎగురుచూ, అరుపులు అరుస్తూయుండుట నేను చూశాను. అయితే సంగీతం నిలిపివేయబడినపుడు, అది నిలిపివేయబడింది. చూశారా? నేననుకుంటాను…అది నా మట్టుకు అది సరే, చూశారా, ప్రజలు సరిగా జీవించునంత వరకు. మరియు…

72 అయితే, ఇపుడు, ఏంటి, మీరు వాక్యమును తెచ్చునపుడు ఏమి జరుగును. ఇపుడు, వాక్యమే నిజముగా జీవమును తెచ్చు కార్యమైయున్నది. అది క్రొత్త ద్రాక్షారసము యొక్క ఉత్తేజమును గూర్చిన ఆనందమును తెచ్చును. చూశారా? అవును. మరియు అదే పెంతెకొస్తు దినమున వాక్యము బయలుపరచబడినపుడు జరిగినది.

73 ఇపుడు చూడు. ఇపుడు, యేసు వారితో చెప్పాడు, లూకా 24: 49, “ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని” వారితో చెప్పాడు. తండ్రి యొక్క వాగ్దానమేంటి? యోవేలు 2:28 ఆయన “ఆత్మను క్రుమ్మరించబోవుచున్నాడని” మనము చూస్తున్నాము. యెషయా 28:19 లో, ఏ విధముగా “నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోను,” మరియు తదితర కార్యములు.

74 వారక్కడకు పైకి వెళ్ళారు. మరియు మనము అందులో వెళ్తున్నపుడు, బహుశా ఒకరు అన్నారు, “సరే, మనము ఎంతోసేపు వేచియున్నామని నేను అనుకుంటున్నాను. దానిని మనము విశ్వాసము ద్వారా అంగీకరిద్దాం అని.” అది ఒక మంచి బాప్టిస్టు సిద్ధాంతం. అయితే అది సహోదరులతో పని చేయదు.

75 కనుక, తరువాత, మొదటి విషయమేంటో తెలుసా, అది వాస్తవము కావలసియున్నది. మరియు వారు వారి పరిచర్య కొరకై వేచియుండిరి. ఎందుకనగా వాక్యము నిరూపించబడవలసియుండెను. పరిశుద్ధాత్మను వెదకుటకై నీవు వచ్చినపుడు, నీవూ అదే చేస్తావు.

76 అవును. నీవు విశ్వాసము ద్వారా దానిని అంగీకరించగలవు. విశ్వాసము ద్వారానే క్రీస్తును నీవు అంగీకరించవలసియున్నది. అది ఖచ్చితంగా నిజం. మరియు పరిశుద్ధాత్మను నీవు విశ్వాసము ద్వారానే అంగీకరించవలయును; అయితే, అటు తరువాత ఆయన మీ విశ్వాసాన్ని అంగీకరించాడని సాక్షిగా పరిశుద్ధాత్మ వచ్చి సున్నతిని ఇచ్చును. అటు తరువాత, చూడండి, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను,” అయితే అతని విశ్వాసాన్ని ఆయన అంగీకరించాడను ఒక నిర్థారణగా సున్నతి గురుతును దేవుడు అతనికి అనుగ్రహించెను.

77 కనుక, అదే మనము చేయవలసియున్నది. పరిశుద్ధాత్మ ఒకటి చేయు వరకు మనము దాని మీద వేచియుండవలసియున్నది. అన్య భాషలతో మాట్లాడుచున్నామని కాదు; మనము నాట్యమాడితిమని కాదు. లేక ఉద్రేకపూరితులమై కేకలు బెట్టితిమని కాదు. మనము మార్పు చెందు వరకు; వాస్తవంగా ఒకటి మనకు జరుగు వరకు. అది ఏ రూపమున వస్తుంది నాకు లెక్కలేదు. అది జరగవలెను. అది ప్రాముఖ్యము. చూశారా?

78 మరియు భాషల ద్వారా మాట్లాడుట నేను నమ్ముతాను మరియు మిగతావన్ని మంచివే. అయితే దానంతటదే పని చేయదు. మరియు అది పని చేయదని నీకు తెలుసు. కనుక అది దానిని చేయదు.

79 మాంత్రికులు భాషలతో మాట్లాడుట నేను చూశాను. మంత్రగాళ్ళు భాషలతో మాట్లాడుట మరియు ఆత్మలో నాట్యం చేయుట నేను చూశాను, ఖచ్చితం. పెన్సిల్ క్రింద బెడితే అన్య భాషతో వ్రాయుట. మరియు ఒకరు దానికి అర్థం చెప్పుట. అవును. సత్యము చెప్పుట. అవును. ఖచ్చితమైనదేదో వ్రాయుట, ఖచ్చితంగా ఆ విధంగా ఉండుట. వారు, వారి తలలపై ధూళి పోసుకుంటారు. కత్తులతో వారిని కోసుకుంటారు మరియు అడవి మృగపు రక్తముతో లేక మరో దానితో కప్పుకుంటారు మరియు—మరియు ఖచ్చితంగా చూడండి. మరియు దయ్యాన్ని పిలుస్తారు. కాబట్టి చూశారా, అది…

80 భాషలతో మాట్లాడుట అది చేయదు. “మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే, అది వ్యర్థం, చూశారా, నేనది చేసినను!” చూశారా? కాబట్టి ఆ విషయాలు నీవు పరిశుద్ధాత్మ కలిగియున్నావని అర్థం కాదు.

81 అయితే, ఆయన, వ్యక్తి—అక్షయమైన క్రీస్తు ఆత్మ, నీ యొక్క వ్యక్తిగత రక్షకుడై మరియు నిన్ను మార్చి, కల్వరిలోకి మరియు ఈ వాక్యములోకి నీ ఊహలన్నిటిని త్రోసివేసినపుడు ఒకటి జరిగినది. అవునండి. ఒకటి జరిగినది. ఎవరూ అందును గూర్చి చెప్పనవసరం లేదు. అది జరిగినపుడు, అది నీవు ఎరుగుతావు.

82 క్రొత్త ద్రాక్షారసము, అది ప్రత్యక్షత తెచ్చినపుడు అప్పుడు అది అది బయలుపరచబడుతుంది.

83 పెంతెకొస్తున అది ఆ విధముగానున్నది. వారు—వారి పైన ఆత్మ క్రుమ్మరింపబడవలయునని వారు ఎరిగియున్నారు. ఇది జరుగు వరకు వారు వేచియున్నారు. మరియు ప్రత్యక్షత యొక్క రుజువు జరుగగానే, అటు తరువాత వారిపైన ఉత్తేజము వచ్చినది. నిశ్చయంగా వారు పొందారు. వారు ఇంకా వేడెక్కారు. ఎక్కడైతే వారు భయపడి, తలుపులు వేసుకున్నారో, ఆ వీధుల్లోకి వెళ్ళారు. ఎక్కడైతే గుంపు ప్రజలకు భయపడ్డారో, వారికి సువార్త ప్రకటించుటకు భయపడ్డారో అట్టి వీధుల్లోకి వెళ్ళిరి, అవును. చూశారా. ఒకటి జరిగినది. ఎందుకనగా నిజమైన వాగ్దాన వాక్యము రుజువు పరచబడినది.

84 ఇపుడు, ఇక్కడ మనమిపుడు ఒక నిముషము ఆపుదాం. అది ఆ మనుష్యులకు ఆలాటి నిజమైన దానిని తెచ్చినట్లయితే వారు—వారు…వారందరు వారి రక్తముతో వారి సాక్షాన్ని ముద్రించుకొనిరి. వారు జీవించినంత కాలము ఏమి జరిగినను ఆ విధముగానే జీవించిరి. అది అక్కడ నిలచిపోయినది, ఎందుకనగా, అది రుజువు చేయబడిన నిజమైన వాగ్దాన వాక్యము. ప్రత్యక్షత రుజువుగా మారినది. మరియు వారి స్వరక్తము చేత వారి సాక్ష్యాన్ని ముద్రించి వారు చనిపోయారు.

85 ఇపుడు కడవరి దినముల యొక్క వాగ్దానమును చూడు. మరియు మన ముందే నేరుగా ప్రత్యక్షపరచబడుట మనం చూస్తున్నాము. ఆ—పరిశుద్ధాత్మ ప్రస్తుతం మన మధ్యకు వచ్చి, ఆయన చేయవలసిన కార్యములు చేయుట, మన మధ్య అది చూస్తున్నాము. అవునా? ఓ, మనము తప్పక…ఓ మై! మనమెలాగు వినగలము? ఒకటి సంభవించినది, స్నేహితుడా, నేను నీతో చెప్తాను. నిజమైన, సత్యమైన, విధేయతతో కూడిన, ముందుగా నిర్ణయించబడిన విశ్వాసి ఆ వెలుగు ఆ విత్తనమును తాకినపుడు ఒక నూతన జీవమునకు ఒకటి చీల్చుకొని వచ్చును. బావి నొద్ద ఆ చిన్న స్త్రీ!

86 ఆ పండితులైన యాజకులన్నారు, “సరే, అది దయ్యము. అతడు సోదె చెప్పువాడు, అతడు—అతడు ఆ ప్రజలకు వారి అదృష్టాన్ని గూర్చి చెప్తున్నాడు. అతడు—అతడొక దయ్యం” అని అన్నారు.

87 అయితే, ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనముతోనున్న ఆ చిన్న స్త్రీ! ఇపుడు, అది సరికాదని నీవనుకుంటున్నావా? అయితే యేసు చెప్పాడు, “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాడు; తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు.” మరియు ఆయన…

88 మరియు అంత్యక్రీస్తు, కడవరి దినములు…సంఘశాఖలలో మనము చదువుతున్న ఆ అంత్యక్రీస్తు ఆత్మ, మరియు సంఘశాఖ తత్వం అంత్యక్రీస్తు అని రుజువు చేయబడినది. ఇపుడు, ఎవరైనా ఆ విధముగా ఇక్కడ నుండి బయటకు వెళితే, అతనిలో, ఒక తప్పిదమున్నది. మరియు ఇంకా సంఘశాఖ క్రమము అంత్యక్రీస్తు కాదని నమ్ముతాడు. అది చరిత్ర నుండి, ప్రతి దాని నుండి దేవుని బైబిల్ గ్రంథము నుండి, అది అంత్యక్రీస్తని ఖచ్చితంగా రుజువు చేయబడినది. మరియు రోమ్ దానికి ప్రాముఖ్య స్థానము. మరియు కుమార్తె సంఘములు దానిని అనుసరించుచున్నవి. వారిరువురు నరకములో త్రోయబడుదురు. అవును. కాబట్టి, ఈ విషయాన్ని, అంత్యక్రీస్తును, దాని ఆత్మను మనం చూద్దాం.

89 మరియు మనము జీవిస్తున్న దినమున, అది “చెప్పనశక్యమైన ఆనందమును నిండైన మహిమను అది తెచ్చుచున్నది.” ఆ దీనురాలైన స్త్రీ ఆమెను అది తాకిన వెంటనే, మై. విత్తనము బయటకు చొచ్చుకొని వచ్చినది!

90 ఇపుడు, గుర్తుంచుకోండి, బైబిల్ చెప్తుంది, కడవరి దినమున ఈ అంత్యక్రీస్తు “ప్రపంచము మొత్తాన్ని మోసము చేయును” యని.

91 జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేరైతే గొఱ్ఱెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పెట్టబడియుందురో ఆ స్వల్ప సంఖ్య గలవారు ఉందురు. మరియు దేవుని వాక్యము యొక్క బయలుపరచబడిన సత్యము యొక్క నిజ బయల్పాటు ఆ హృదయాన్ని తాకగనే, అక్కడనున్న పరిశుద్ధాత్మతో ఎంతగా తాకాలో అంతగా అతడు నీటిని తాకును. అది చేయుటను నీవు నిలుపు చేయలేవు, ఎందుకనగా క్రొత్త జీవము పనిచేయును.

92 కొంచెము కాలం క్రితం ఒక వ్యక్తితో నేను మాట్లాడుచున్నాను. నాతో వాదిస్తు అన్నాడు, “‘దేవుడు మూడు దినములలో…లేక ఆరు దినములలో భూమ్యాకాశములను సృజించాడని’ చెప్పుటకు నీవు సిగ్గుపడవా?” అని అన్నాడు.

నేనన్నాను, “అది బైబిల్ చెప్తుంది” అని.

93 అన్నాడు, “సరే, మా యొద్ద రుజువున్నది. లక్షల లక్షల సంవత్సరాలని రుజువు చేయగలం.”

94 నేనన్నాను, “దానితో ఎటువంటి సంబంధం లేదు. ఆదికాండం 1:1 లో, ఈలాగు చెప్పబడినది. ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.’ కాలపరిమితి! అంతే. చూశారా. ‘భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.’” మరియు నేను చెప్పాను, “ప్రతి యొక్క విత్తనము వేరొక నాగరికత నుండి లేదా ఏదో ఒక దానిలో నుండి పెట్టబడియున్నదని నేను నమ్ముతున్నాను. మరియు నీరు దాని నుండి తొలగి, వెలుగు దానిని తాకగనే చెట్లు తదితరమైనవి పైకి వచ్చెను.”

95 మరియు మానవునితో అంతే. పోలిక. మంచు అంతా పోయినపుడు అక్కడున్న నిజమైన విత్తనమునకు సత్యము బయల్పడినపుడు, అది ఇంకా మొలకెత్తుతున్నపుడు నిజమైన వాక్య ప్రత్యక్షత ద్వారా అది జీవిస్తుంది. దానిలో జీవము పొందుకున్నది. అది నమ్మును. దానికి బయట అది బ్రతుకదు. దానిలో ఏలాటి జీవము లేదు.

96 భూమికి పునాదులు వేయబడక మునుపే ఎవరి పేరులైతే గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథమందు పెట్టబడియుండెనో వారు నిశ్చయంగా బయటకు వస్తారు. మరియు ఆ కారణము చేత యేసు అక్కడ కూర్చుండి, ఆఖరి విత్తనము వరకు మధ్యవర్తిత్వపు పని చేయుచున్నాడు. అదెప్పుడు తాకునో ఖచ్చితంగా ఆయనకు తెలుసు.

97 డాక్టర్ లీవైల్ వలె…అతడెక్కడో కూటములో ఉన్నాడని అనుకుంటూ కొన్ని దినాల నుండి, నేను అతనిని చూడలేదు. నేను అతనిని చూశానని అనుకొనుట లేదు. [“అతడిక్కడ ఉన్నాడు” అని ఒక సహోదరుడు చెప్పాడు.—సంపా.] అతడిక్కడున్నాడు. సరే. ఐరేనియస్ ఏమి చెప్పినది అందును గూర్చి అతడు గత దినము ఈ కాగితం పంపాడు. సరే. నేను ఐరేనియస్ ను తీసికొని పలు విధములుగా చూచి ఆ కాలపు దూతగా గుర్తించితిని. అయితే అతడు చెప్పాడు, “ఈ చివరి కాలములో శరీరములోని ఆఖరి అవయవము లోపలకు వచ్చునపుడు,” ఈ చివరి కాలములో, “తప్పక…ఆ సమయానికి విషయము బయలుపరచబడుతుంది.” మరియు అది ఇక్కడున్నది. అది ఖచ్చితంగా వాస్తవము. చూశారా? మనము ఆ దినములలో యున్నాము. మంచిది.

98 తరువాత, పెంతెకొస్తు వారు ఆనంద అవధులు దాటిరి. వారు నిజంగా ఉత్తేజపూరితులయ్యారు. అది ఎవరినైనా చేయునని నేను తలంచుచున్నాను.

99 ఒక్క క్షణము మనమది తీసుకుందాము, దావీదును గూర్చి ఆలోచిద్దాం. అతడు—అతడు కూడా ఉత్తేజ పూరితుడయ్యాడు, అతడు చెప్పాడు, “నా గిన్నె నిండి పొర్లుచున్నది.” నేను అనుకుంటాను. నేననుకుంటాను, అతడు వాస్తవముగా—అతని జీవితములో ఘనమైన సంఘటనను కలిగియున్నాడు. ఏంటి, అతడొక ప్రవక్త. అతడదియని మనకు తెలుసు. ఆలాగని బైబిల్ చెప్తుంది. ప్రవక్త దావీదు. ఇపుడు, అతడు ప్రవక్త, మరియు అతడు ఆత్మ పూర్ణుడైయుండెను. మరియు అతడు పునరుత్థానమును చూశాడు. మీరు అది చదవాలనుకుంటె అది కీర్తనలు 16: 8 నుండి 11. అతడు చెప్పాడు, “నా యొక్క శరీరము కూడా ఆనందంగా ఉన్నది. మై! నేను—నేను నిరీక్షణతోనున్నాను. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడువవు; నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు.” నేను మీకు చెప్పుచున్నాను. అతని గిన్నె నిండి పొర్లుచున్నది. ’ఎందుకనగా అతడు దానిని చూశాడు. ఏమైనను పరవాలేదు. ఓ! అతడు పునరుత్థానాన్ని చూశాడు. మరియు అతని గిన్నె నిండి పొర్లెను.

100 ఇంకా, దావీదుకు మరియొక గిన్నె నిండి పొర్లెను. రెండవ సమూయేలులో (మీరు మీ పెన్సిల్లు బయట పెట్టుకోండి), రెండవ సమూయేలు 6:14. అక్కడొక గడ్డు పరిస్థితిగా ఉన్నది.

101 వారు మందసాన్ని తీసుకున్నారు. శత్రువు లోనికి వచ్చి ప్రభువు యొక్క మందసమును తీసుకొని దాగోను ముందు పెట్టారు. దాగోను బోర్లపడినది. మరియు వేరొక పట్టణమునకు తీసుకొనిపోయారు అక్కడ తెగుళ్ళు పుట్టుకొచ్చినవి. అది…అది వారి చేతుల్లో నిప్పు పట్టుకున్నట్లుగా ఉన్నది. మరియు దాని నుండి వారు తప్పించుకొనలేకపోయిరి. ఎందుకనగా అది వేరే స్థానములో పెట్టబడినది.

102 ఇపుడు, వారు దానిని ఎద్దుల బండి మీద పెట్టి వెనుకకు పంపారు. మరియు, మందసము వచ్చుట దావీదు చూచినపుడు, అతడేమి చేశాడో తెలుసా? అతడు—అతడెంతో ఉత్తేజుడై అతని గిన్నె నిండి పొర్లినది; ఉత్తేజము. ఇశ్రాయేలు లోనికి తిరిగి వాక్యము బయలుపరచబడుట అతడు చూడగానే, చుట్టూ, చుట్టూ, చుట్టూ, ఆ విధంగా చుట్టూ తిరిగి ఆత్మలో నాట్యమాడెను. ఆఁ. అతని గిన్నె నిండి పొర్లినది. అవునా! ఎందుకని? వాక్యము మరలా వచ్చుట అతడు చూశాడు.

103 మరియు నేననుకుంటాను. ఈ అనేక సంవత్సరముల తరువాత, వాగ్దానము ద్వారా నిజమైన వాక్యము తిరిగి వచ్చుట వారు చూచినపుడు, అది బయలుపరచబడి మరియు నిరూపించబడుట చూచినపుడు అది ఎవరినైనను ఉత్తేజపరచును. ఎటువంటి సమయం! ఎటువంటి సమయం!

104 ఇపుడు, మనము చదువుదాం. నేను—నేను మాట్లాడుచునే ఉన్నాను. దీనికి రాలేను. మరియు మిమ్ములను పదిన్నర వరకు ఉంచుతాను. గత రాత్రి మిమ్ములను పెందలకడ పంపాను. కనుక ఈ రాత్రి మిమ్ములను ఎక్కువసేపు ఉంచవలసియున్నది. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అవును. అవును కాదు. నేను ఎగతాళిగా చెప్పాను. అవునా? నేను…ప్రభువు మనలను నడిపించునట్లె మనముందాం ఇపుడు.

మరియు ఆయన నాలుగవ ముద్రను విప్పినపుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

105 ఇపుడు, “గొఱ్ఱెపిల్ల నాలుగవ ముద్రను విప్పినపుడు.” ఇప్పుడు అక్కడ నిలుపు చేద్దాం. ఇపుడు నాలుగవ ముద్ర, ఎవరది విప్పారు? గొఱ్ఱెపిల్ల. ఎవరైనా యోగ్యులైన వారున్నారా? దానిని ఎవరు చేయలేరు. లేదు. గొఱ్ఱెపిల్ల నాలుగవ ముద్రను విప్పెను.

106 మరియు—నాలుగవ జీవి, పక్షిరాజు వలెయుండెను, యోహానుతో చెప్పెను, “ఈ గ్రంథములో మరుగైయున్న, విమోచనా ప్రణాళిక యొక్క నాలుగవ మర్మము ఏమైయున్నది వచ్చి చూడుమని చెప్పెను.” ’ఎందుకనగా గొఱ్ఱెపిల్ల దానిని తెరచుచున్నది. మరో మాటల్లో, దానినే అతడు చెప్పాడు, “ఇక్కడొక నాలుగవ మర్మము ఉన్నది. దానిని నేను సూచనగా చూపాను. ఇపుడు, యోహాను, దానిని నీవు అర్థం చేసుకున్నావో లేదో నాకు తెలియదు.” అయితే అతడు చూచినది అతడు వ్రాశాడు. అయితే అది మర్మము. కాబట్టి అతడేమి చూశాడో అతడు వ్రాశాడు.

107 గొఱ్ఱెపిల్ల ముద్రలను తెరచుచుండెను. దానిని దేవుడు ఇంకా బయలుపరచలేదు. అది కడవరి దినములకు వదలిపెట్టబడినది. చూశారా? ఇపుడు మనకు సూచనలున్నవి, వాటిని మనము పరిశోధించియున్నాము, చాలా మంచిగా చూశాము. అవునా. అయితే, అది ముందుకు కదలిపోవుచున్నదని మనమెరుగుదుము. అయితే ఇపుడు, కడవరి దినములలో, మనము వెనుకకు తిరిగి, అదెక్కడున్నదో చూద్దాం. ఎత్తబడుటకు కొంచెము ముందుగా, సంఘకాలము యొక్క ముగింపులో, అది జరుగవలసియున్నది.

108 సంఘము శ్రమలగుండా వెళ్ళునని ఎవరైనా ఎట్లు చెప్పగలరు, నాకు తెలియదు. అయితే, శ్రమల గుండా దేనికై పోవలసియున్నది, దానిలో—పాపము లేనపుడు? నా అర్థం సంఘమని నా అర్థం కాదు. సంఘము శ్రమల గుండా వెళ్తుంది. అయితే, నేను పెండ్లి కుమార్తెను గూర్చి మాట్లాడుచున్నాను. పెండ్లికుమార్తెలో దానికి వ్యతిరేకముగా పాపమే లేదు. అది బ్లీచ్ లో తుడిచివేయబడింది. మరియు చివరకు…అక్కడ దాని యొక్క వాసన కూడా లేదు. ఏదీ మిగల్చబడలేదు. దేవుని యెదుట వారు పరిపూర్ణులు, కాబట్టి వారు శుద్ధిపరచబడుటకు శ్రమలెందుకు? అయితే ఇతరులకు కావలయును. సంఘము శ్రమలగుండా వెళ్ళును అయితే పెండ్లికుమార్తె కాదు.

109 ఇపుడు, ఇపుడు మనము దానిని అన్ని రకములైన సూచనలతో తీసుకున్నాము. సంఘము—వలె, నోవహు సంఘము వలె ఒక పోలికగా కొనిపోబడి, పాపములోకి వెళ్ళిపోయాడు. చూశారా. వారు వెళ్ళిపోయారు. అయితే, హనోకు మొదట వెళ్ళాడు. అది శ్రమల కాలమునకు ముందు పరిశుద్ధులు లోపలకు వెళ్ళుదురు అనుదానికి పోలిక.

ఇపుడు ఈ గొఱ్ఱెపిల్ల ముద్రను విప్పుట మనము కనుగొనుచున్నాము.

110 ఇపుడు మొదటి జీవిని మనము చూస్తున్నాము, మీరు గమనిస్తే…మొదటి జీవి సింహము; సంఘకాలపు పుస్తకములో చూశాము. మరియు తరువాత రెండవ జీవి, ఎద్దు ముఖము గలది లేక దూడ అని అనుకుంటాను. మరియు మూడవ జీవి మనుష్య ముఖము గలది. అయితే నాలుగవ జీవి పక్షిరాజు ముఖము గలది. ఇపుడు ఆ విధముగా మనము కలిగియున్నాము. అవి అట్లే ఆ విధముగా తిరుగుచుండెను. అవి ఖచ్చితంగా ఇక్కడ గ్రంథములో అమర్చబడియున్నవి.

111 మరియు ఒకప్పుడు ఫ్లోరిడాలోనున్న ఒక గొప్ప బోధకుడు బోధిస్తూ అన్నాడు, అ—ఆ…అన్నాడు, “అపొస్తలుల కార్యముల పుస్తకము కేవలం సంఘానికి ఒక—వేదిక పని అని అన్నాడు. సంఘము నాలుగు సువార్తల్లో కనుగొనబడియున్నది.”

112 మరియు దానికి తలక్రిందులుగా మనము చూస్తున్నాము, అది నాలుగు సువార్తలు అపొస్తలుల కార్యముల పుస్తకమును కాచుచున్నవి. ఆ నాలుగు సువార్తల నుండి అపొస్తలుల కార్యములు వ్రాయబడెను. అపొస్తలుల పరిశుద్ధాత్మ కార్యములు…మరియు గ్రంథములో అక్కడ చూస్తున్నాము అక్కడ కాపలాదారులు అక్కడ కూర్చొని గమనిస్తున్నారు. తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం. ఇక్కడ దానిని మనమెట్లు గీచామో జ్ఞప్తిన్నదా? ఎంత చక్కగా పరిపూర్ణంగా ప్రతీది దాని స్థానాన్ని తాకినదో చూశారా!

113 ఇపుడు మీరు గమనించగోరుతాను. “వచ్చి చూడుము” అని చెప్పబడినది. యోహాను…దీనికి ముందు ఇపుడు మీరు దీనిని మరలా గమనించగోరుతాను. ఇపుడు, అంత్యక్రీస్తు పనిని బయలుపరచుటకు, ఇక్కడ ఇది ఆఖరి స్వారీ చేయువాడు.

రేపు రాత్రికి బలిపీఠము క్రిందనున్న ఆత్మలు తాకుదాము.

తరువాత రాత్రి తీర్పులు.

114 తరువాత రాత్రి, కాలము యొక్క ముగింపు, అన్నిటికి ముగింపు, కొనిపోబడుట, ఆమె ఎత్తబడినపుడు. కాబట్టి, అక్కడే ఏడవ ముద్రలో అక్కడ పాత్రలు క్రుమ్మరించబడును, ప్రతీది క్రుమ్మరించబడును. అవేంటో నాకు తెలియదు.

115 గమనించు. అయితే, ఇపుడు, ఇక్కడున్న ఈ వ్యక్తి ఒక పక్షిరాజు అని గుర్తెరుగుచున్నాము. ఈ మనిషి…లేక ఈ జీవి, ఇక్కడ క్రుమ్మరించిన ఈ జీవి. లేక మరో మాటల్లో దానికి నాలుగు వ్యత్యాసమైన కాలాలున్నవి. అక్కడ సింహము యొక్క కాలమున్నది. మరియు ఇది నాలుగవ కాలమని మనము చూస్తున్నాము.

116 మరియు అతడు చెప్పాడు, “ఈ గ్రంథమందు మరుగైయున్న విమోచనా గ్రంథము యొక్క నాలుగవ మర్మమును వచ్చి చూడు. వచ్చి చూడు.” యోహాను చూచుటకు వెళ్ళాడు. అతడు పాండుర వర్ణ గుఱ్ఱాన్ని చూశాడు. తిరిగి, ఈ పాండుర వర్ణ గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు ఒకే వ్యక్తి.

117 మరణము అను పేరు అతనికున్నది. ఇపుడు గమనించండి. ఇంతకు ముందు గుఱ్ఱములపై స్వారీ చేసినపుడు, ఆ గుఱ్ఱములకు గాని వ్యక్తికి గాని వారికి ఏ పేరు లేదు. అయితే ఇపుడు అతడు మరణమని పిలువబడుచున్నాడు. అది నిర్వచింపబడలేదు. చూశారా? ఇపుడతడు బయలుపరచబడ్డాడు, అతడేమైయున్నాడంటె మరణము.

118 సరే. మనం ఎంత సమయమైనా దానిని గూర్చి ప్రసంగించి దానిని వివరించవచ్చును. అయితే, ఏదైనను అది వ్యతిరేకమైతే, అనగా నిజమైన దానికి వ్యతిరేకమైతే, అది మరణముగా ఉండవలయును. ఎందుకనగా రెండు అంశాలు మాత్రమేయున్నవి, అవి జీవము మరియు మరణము. మరియు ఈ దినాన దీనిని గూర్చిన పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ఇది ఖచ్చితముగా సత్యమని నిరూపించుచున్నది. దీనికి వ్యతిరిక్తము, అతడు మరణము. మనము తరువాత చూడగా, అది వాక్యము, జీవమైయున్నది. చూశారా?

119 ఈ మనుష్యుడు మరణముగా పిలువబడుచున్నాడు. ఈ స్వారీ చేయు వాని గూర్చి మిగతా కాలములలో నిర్వచింపబడలేదు. అయితే ఇపుడు అతడు మరణమని నిర్వచింపబడుచున్నాడు.

120 అయితే సింహము యొక్క ప్రత్యక్షతలో…ఇపుడు గమనించండి. ఇపుడు దీనిని నేను దగ్గరగా చదువుగోరతాను. నేను ఖచ్చితమని అనుకొనునట్లుగా, నేను దీనిని వ్రాసికొని, గుర్తుంచుకొని నిలబడియున్నాను. సింహము యొక్క బయల్పాటు కాలములో గాని, లేక మొదటి కాలంలో గాని, ఆరంభ కాలంలో గాని ఇది బయలుపరచబడలేదు. తరువాత కాలము, ఎద్దు కాలము అనగా అంధ కాలము, మధ్యకాలము; అది ఏమైయున్నది అది బయలుపరచబడలేదు. మనుష్యుని పోలిన జీవి కాలంలో కాదు. జ్ఞానము యొక్క కాలము, సంస్కర్తలను సూచించుచున్నది. లూథర్, వెస్లీ మొదలగు వారు; అది బయల్పరచబడలేదు. అయితే, ఆఖరి కాలంలో, పక్షిరాజు కాలంలో, ప్రవచన కాలంలో, చూశారా ఎవరి యొద్దకు రహస్యములు వచ్చునో అట్టి కాలములో బయలుపరచబడును. ఇపుడు, అక్కడేయున్నాము…

121 మనము దానిపైన, కొద్దిసేపు గడుపుదాము. తద్వారా మీరు అది పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇపుడు, చాలాసార్లు వాటిని మీరు గ్రహిస్తారు…ఇక్కడున్న ఈ గుంపు వారితో కాదు నే మాట్లాడునది. ఈ టేపులు ప్రతి చోటకు వెళ్తాయి. అవునా, నేను అది విశదంగా చేయాలి. కారణం, ఒకరు ఒక టేపు తీసుకుంటె, ఆ తరువాత మిగతావి తీసుకొనకపోతే, అవన్ని కలసిపోతవి. చూస్తున్నారా. ఈ దినము కొరకు దేవుడు ఇది వాగ్దానము చేశాడు. చూశారా, చివరి దాని కొరకు, పలు విధాలైన విషయాలు ముగింపు కొరకు; వెడలిపోయి మరియు మిశ్రితమైన వాటికై.

122 మనము ఏలీయా వస్త్రములు కలిగియున్నాము. మనము ఏలీయా బట్టలు కలిగియున్నాము. ఓ…అక్కడ జాన్ అలెగ్జాండర్ డౌ ఒక అంగీలో చుట్టబడి పాతిపెట్టబడ్డాడు. అతడు ఎలీషా అని చెప్పుకున్నాడు. మరియు ఆలాటివి మనకు చాలా ఉన్నవి. ఏంటది? ఏలాగైనా, చెప్పబడబోతున్న సత్యమును తీసివేయుట మాత్రమే అది యౌతుంది. చూశారా? యేసుకు ముందు కాలములో వారికి అబద్ధ క్రీస్తులుంటారు. చూశారా? వారది ఎల్లపుడు చేస్తారు. విషయము వాస్తవంగా జరుగక ముందు, ఒక నకిలీగా పరుగెత్తుచున్న సాతాను అది. ప్రజల మనస్సులను, విశ్వాసాన్ని తలక్రిందులు చేయుటకు. అంతే.

123 ఆ దినాన యూదులతో అదే విషయాన్ని గమలీయేలు చెప్పలేదా? ఇలా చెప్పాడు, “ఒక మనుష్యుడు లేచి ఇది అని చెప్పుకొనిన వ్యక్తి అక్కడ లేడా? వారు నాలుగువందల మందిని అరణ్యమునకు కొనిపోయారు, వారు నశించిపోయారు మొదలైనవి.”

124 చెప్పబడినది, “పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు,” యేసు చెప్పాడు, “పెల్లగింపబడును.”

125 గమలీయేలు చెప్పాడు, “వారిని అలా ఉండనియ్యు. అది దేవుని సంబంధం కానట్లయితే అది నిష్ ఫలమగును. అయితే అది దేవుని వలనదైతే మీరు దేవునికి వ్యతిరేకముగా పోరాడిన వారౌదురు.” ఆ వ్యక్తి జ్ఞానమును వినియోగించాడు. అతడు ఉపాధ్యాయుడు.

126 ఇపుడు గమనించండి. ఇపుడు ఈ మర్మములన్ని ముగించుటకు, అవి బయలుపరచుటకు ఒక స్వచ్ఛమైన ఎలీషాను, ఆ ఆత్మతో నింపబడిన ఒక మనుష్యుని లేపునని దేవుడు వాగ్దానము చేశాడు. దానిని ఆయన మలాకీ 4లో వాగ్దానం చేశాడు. అది ఆలాగు కాదని చెప్పు వ్రాతలు, వివరణలు నా యొద్దనున్నవి. అయితే, నేను ఆ వ్యక్తితో మాట్లాడగోరుచున్నాను. చూశారా? ఎందుకు మీరు అది తృణీకరించలేరు. నిజమైన ఏ మంచి వేదాంతియైనా అది సత్యమని ఎరుగును. దానికై వారు ఎదురు చూస్తున్నారు.

127 క్రీస్తు యొక్క మొదటి సమయమునకు ముందటివాడైన యోహాను విషయములో ఏలాగో ఆలాగే. ఎందుకని? వారతనిని గుర్తించలేదు, ఎందుకనగా అతన్ని గూర్చి ఆలాటి ఘనమైన సంగతులు ప్రవచింపబడియుండెను. ఏలయనగా, “ప్రతి మెట్టను పల్లము చేయుటకు, ప్రతి పల్లమును కరకు చేయుటకు, ప్రతి కరకు స్థలమును చదును చేయవలసియుండెను.” మరియు ఓ, అతడు…ప్రవక్తలు; యెషయా, అతని జన్మకు ముందు, అతని జన్మకు ముందు ఏడువందల పండ్రెండు సంవత్సరములకు మునుపు. మరియు మలాకీ, అతడు రంగం మీదికి రాకమునుపు నాలుగు వందల సంవత్సరములకు మునుపు; అందరు అతన్ని గూర్చి ప్రవచించారు. మరియు వారు పరలోకము నుండి వసారా క్రిందికి దిగివచ్చునని వారు ఎదురు చూచుచుండిరి, మరియు ఈ ప్రవక్త దేవుని యొద్దనుండి తన చేతిలో దండముతో దిగివచ్చునని తలంచిరి.

128 మరియు ఏమి జరిగినది? ఒక మనుష్యుడు…అతడు ఒక సహవాస కార్డును కూడా చూపించలేకపోయాడు. అతడు యొక యోగ్యతా పత్రం చూపించలేకపోయాడు. అరణ్యములో నివసించాడు. సాధారణ పాఠశాల విద్య లేదు. చరిత్రకారుల ద్వారా మనకిలా చెప్పబడినది. అతని యొక్క తండ్రి తల్లి మరణము తరువాత అతని తొమ్మిది సంవత్సరముల వయస్సప్పుడు అరణ్యమునకు వెళ్ళిపోయాడు. మరియు…అతని పని చాలా ప్రాముఖ్యమైనది, సెమినరీలో చేరుట కాదు. అతడు—అతడు మెస్సీయాను గూర్చి ప్రకటించవలసియుండెను.

129 వేదాంత విద్యతో పూర్తిగా నిండిన మనిషిని దేవుడు వాడుకోజాలడు. ఆయన అది చేయజాలడు. ఎందుకనగా అతడెల్లపుడు వెనుకకు జారును. అది అతని నేర్పరితనము. అతడక్కడకు వెనుకకు వెళ్ళును. కాబట్టి, ఒకటి చూచుటకు వెళ్ళాను. ఉపాధ్యాయులు ఏమి చెప్పారోయని చూచుటకు వెనుకకు వెళ్ళాను. ఆలాటి విషయాలకు దూరంగాయుండి దేవునియందు విశ్వాసముంచుట మంచిది.

130 మరియు వారు అతనిని వదలివేసిరని మనం చూశాము. చిట్టచివరకు, అక్కడ నిలుచున్న అపొస్తలులు సహా అతనిని పోగొట్టుకున్నారు. ఎందుకని? వారన్నారు, “ఎందుకు లేఖనము చెప్పుచున్నది, ఏలీయాను గూర్చి శాస్త్రులెందుకు చెప్పుచున్నారు…”

131 ఆయన చెప్పాడు, “ఆయన ఎపుడో వచ్చాడు, మీరు ఆయనను తెలుసుకోలేదు.”

132 మరియు అక్కడే నేను పునరుత్థానమును లేక ఎత్తబడుటను నేను పోల్చుచున్నాను. అది జరుగును. అది వింతగా అగుపించునని నాకు తెలుసు. అయితే, ప్రభువు చిత్తమైతే ఈ రాత్రి తరువాత, ఇంకొంచెం ఎక్కువగా మీరు తెలుసుకుంటారు, అది ఎలాగు జరుగుతుందని. చూశారా! అదెంతో మర్మము. దానిని గూర్చి ఎవరికి తెలియదు. లోకము దానిని ఆలోచిస్తుంది, వారు ఎల్లపుడు ఎలా చేస్తారో ఆలాగే. ఆయన ఎల్లపుడు దానిని ఆ విధముగానే చేయును.

133 మీకు తెలుసా, నేను అనుమానిస్తున్నాను ఒకరు—ఒకరు…నేను చెప్తున్నాను. భూమి మీదనున్న ప్రజలలో నూటికి తొంభై పాల్లు, యేసు క్రీస్తు ఇక్కడున్నపుడు ఆయనను ఎరిగియుండలేదని నేను సందేహిస్తున్నాను. ఏలీయా ప్రవచించినపుడు అతడని ఖచ్చితంగా ఎరిగినవాడు ఉన్నాడని…నేను అనుమానిస్తున్నాను. వారు, అక్కడొక పిచ్చివాడుయున్నాడు, ఒక ముసలి మూఢభక్తి పరుడున్నాడు అని వారు ఎరిగియుండిరి. వారు అతన్ని ద్వేషించారు. ఖచ్చితం. వింతవ్యక్తి అని పిలిచారు.

134 మరియు నేననుకుంటాను. తిరిగి జన్మించిన ఏ క్రైస్తవుడైనా—లోకానికి ఒక విధమైన వింత వ్యక్తి. ఎందుకనగా నీవు మార్చబడ్డావు. నీవు మరో లోకమునుండి వచ్చావు. నీ ఆత్మ అగాధమును దాటి వచ్చినది. ఇక్కడ ఇది అంతా గందరగోళంలోయున్నది…అలాగైతే, మీరు వేరు కాని యెడల, ఏదో తప్పు ఒకటి ఉన్నది, మీరు ఇంకా లోక సంబంధులుగా యున్నారు. మీరు పరలోక సంబంధమైన మనస్సుగలవారై యుండవలసియున్నది. మరియు పరలోకము వాక్యము ద్వారా జీవించును.

135 ఇపుడు, మనము ఈ—ఈ గొప్ప విషయము జరుగుట చూచుచున్నాము. ఎలీషా యొక్క నిజమైన ఆత్మ రావలసియున్నదని మనము నమ్ముచున్నాము. అది రానున్నదైయున్నదని ముందుగానే చెప్పబడినది. చూశారా! అది దాని యొక్క స్వంత సమయమందు, కాలమందు ఇక్కడ యుండునని మనము జ్ఞప్తించుకొనవలసియున్నది. ఇపుడు, దానికి మనము పునాది వేయుచున్నామను కొనవచ్చును. మరియు అది ఏ సంస్థాపకముగా ఉండకూడదు.

136 నేను—నేను, దాని గూర్చి నా యొక్క మంచి స్నేహితునితో నిరాకరించాను. అతడన్నాడు, అది యొక గుంపు ప్రజలని, లేఖన ప్రకారంగా మీరది చూపగోరతాను. దేవుడు, మార్పు చెందని దేవుడు, ఎన్నడూ ఆయన యొక్క ప్రణాళికలను మార్చడు. ఆయన ఆలాగు చేసినట్లయితే, ఆలాగైతే ఆయన దేవుడు కాదు; అవును, ఎందుకనగా ఆయన మర్త్యుడు, నేను చేయునది ఆయనకు తెలియును మరియు ఆయన తప్పులు చేస్తాడు.

137 ఏదెను తోట సమయము నుండి కూడా, దేవుడు తన యొక్క ప్రణాళికను ఎన్నడూ మార్చలేదు. విమోచన కొరకు ఆయనొక ప్రణాళికను సిద్ధపరచాడు; అది రక్తము. మరియు మనము విద్య ద్వారా ప్రయత్నించాము. మనము నియంతృత్వము ద్వారా ప్రయత్నించాము. మనము మానసిక శాస్త్రము ద్వారా ప్రయత్నించాము, సంఘశాఖల ద్వారా మనము ప్రయత్నించాము. మనము సమస్తము ద్వారా ప్రయత్నించాము. ప్రతి వారిని ఐక్యపరచుట ద్వారా లేక ఒకరినొకరు ప్రేమించుకొనుట ద్వారా, ప్రతి విధమైన దాని ద్వారా ప్రయత్నించాము. రక్తము క్రింద తప్ప మరొక చోట సహవాసము లేదు. దేవుడు మనుష్యుని కలయు ఒకే ఒక స్థలము అది.

138 దేవుడు ఎల్లపుడు ఒకే ఒక వ్యక్తితో సంప్రదింపులు చేయును. ఇద్దరు మనుష్యులకు రెండు అభిప్రాయాలుంటవి. ఒకేసారి ప్రవచించినట్లుగా ఇద్దరు ప్రవక్తలు ఒకేసారి భూమి మీద లేరు. ఉన్నారేమో ఒకసారి వెను తిరిగి చూడూ. లేదండి. ఎంతో కలగలుపు! ఆయన ఒక మనిషిని సంపూర్తిగా లోబరచుకొని ఆ వ్యక్తిని వాడుకొనును. ఆయన ఆ వ్యక్తి కొరకు వెదకును.

139 అయితే, కొన్ని సార్లు ఒకరుంటారు. వాక్యము వెంబడి వాక్యము ఆయన మాట వినువారు ఒకరుంటారు. ఇతరులు ఏమి చెప్పినది నాకు అనవసరము. దాని నుండి వారు ఎన్నడూ తొలగిపోరు. అవును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అను దాని మీద వారు ఆనుకుంటారు. మరియు, తరువాత అంత వరకు వారు కదలరు. అతను సరిగా నిరూపించబడును…

140 ఇపుడు, బాహ్య ప్రపంచము దానిని అసహ్యించుకొనును, అయితే ఏర్పరచుకొనిన విత్తనము, ముందు నిర్ణయించబడిన విత్తనము, యేసు యొక్క దినాలలో మాదిరిగా, వెలుతురు ప్రకాశించగనే ఆ విత్తనము ఆ విధముగా జీవములోకి వచ్చును. [సహోదరుడు బ్రెన్హాం తన వ్రేలిని ఒకసారి వంచుచున్నాడు—సంపా.] అది వారు ఎరుగుతారు. అది వారు అర్థం చేసుకుంటారు. దానిని గూర్చి నీవు ఒక్క మాట చెప్పనవసరము లేదు.

141 ఆమె అన్నది, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చినపుడు నేనెరుగుదును, ఆయన…”

ఆయన అన్నాడు, “ఆయనను నేనే.”

142 అబ్బాయి, అది, అది చాలు, రాత్రంతా ఆమె వేచియుండనవసరం లేదు. మరుసటి రాత్రికి వేచియుండనవసరం లేదు. అక్కడ, అప్పుడే ఆమె పొందుకుంది. ఆమె ఆమె రహదారిన వెళ్ళింది, వారికి దానిని గూర్చి ఆమె చెప్పుచుండెను.

143 ఇపుడు గుర్తుంచుకోండి, మొదటి కాలము సింహము కాలము. అది యూదా గోత్రపు సింహము, క్రీస్తు. ఆయన స్వంత జీవితము యొక్క పలుకబడి, ఆ కాలమును తీసుకొన్నది. అది మొదటి జీవి, దాని అర్థం “శక్తి,” అది మానవ స్వరము ద్వారా జవాబు ఇచ్చినది.

144 తరువాత కాలము ఎద్దు కాలము లేక నల్లని గుఱ్ఱం మీద స్వారీచేయు వాని కాలము. చూశారా?

145 ఇపుడు, ఈ మొదటి కాలము తెల్లని కాలముగా యుండుటకు కారణము ప్రజలు చెప్పుకొనుట నేనెల్లపుడు వింటుంటాను, మొదట స్వారీ చేయు తెల్లనిది జయించుటకు బయలు వెళ్ళిన సంఘము యొక్క శక్తియని. అతనికి ఒక కిరీటము ఇయ్యబడినట్లు మనము చూస్తున్నాము, అది అదే. అది సంఘము. అది సంఘము. అయితే వాడెక్కడికి వెళ్ళెను? రోమ్ కు. అతడక్కడికే వెళ్ళెను. అతని కిరీటాన్ని అతడు పొందుకొనెను.

146 ఇపుడు, రెండవ కాలము—ఎర్రని గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు. అది చీకటి కాలము.

147 మరియు ఇపుడు—ఇపుడు తరువాత కాలము-మనుష్యుడు. నల్లని గుఱ్ఱం మీద స్వారీచేయు కాలము. అతడు సంస్కర్తల కాలము, చూశారా. దానిని పలికిన స్వరము. ఇపుడు నల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయువాడు. అది అంత్యక్రీస్తు. అయితే, మనుష్యునికి ప్రతినిధిగా ఆ కాలములో మాట్లాడు అది జ్ఞానము, తెలివి, చురుకుదనమైయుండెను. చూశారా? వారు దానిని గ్రహించలేదు. అవునా. వారు…వారు అతనికి పేరు పెట్టలేదు. చూశారా? వారు అది బయలు వెడలినది అని మాత్రం చెప్పారు.

148 అయితే, ఇపుడు, పక్షిరాజు కాలము వచ్చునప్పటికి, అదే…దేవుడు ఎల్లపుడు ఆయన ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చును, ఆయనకు ఆయనే పక్షిరాజు అని పిలుచుకున్నాడు, పక్షిరాజు ఎత్తైన చోటుకు వెళ్ళును. దానినేది తాకలేదు. అతను పైన యుండుట మాత్రము కాదు గాని ఆ స్థానములో నుండుటకు నిర్ణయింపబడ్డాడు. అతను పైకి వెళ్ళినపుడు అతనెక్కడయున్నది చూడగలడు. కొందరు అక్కడకు వెళ్ళారు, వారెక్కడయున్నది వారు చూడలేరు. కాబట్టి అక్కడకు వెళ్ళుట వలన ఉపయోగం లేదు. అయితే…

149 అయితే, మీరు ఒక కాకిని గాని, గ్రద్దను గాని పక్షిరాజుతో ఎగురుటకు ప్రయత్నం చేస్తే వాటి శరీర భాగములు విడిపోయి నశించును. అతడు వెళ్ళు దానికి ఒత్తిడి నీయవలెను.

150 అదే ఈ దినాన కలిగిన ఇబ్బంది. మనలో కొందరు ఒత్తిడికి గురికారు. మనం త్వరగా ప్రేలిపోతాం. చూశారా, మనము ఎగురునపుడు. అయితే, మనము ఒత్తిడికి గురి కావాలి.

151 నీవు అక్కడ లేచి, వచ్చుచున్నదేదో అది చూచుటకు పక్షిరాజు కనుదృష్టి ఏం చేయాలో ఎరగాలి. ఇపుడు, పక్షిరాజు కాలము దానిని బయలుపరచును. ఇపుడు పక్షిరాజు కాలము ప్రకటన 10:7 మరియు మలాకీ…: 1, 4 లో వాగ్దానము చేసియున్నది. అది కడవరి దినములలో. చూశారా. అవును. అది ఇక్కడున్నది. సరే గమనించండి.

152 ఇపుడు, ఇతడు పాండుర వర్ణ గుఱ్ఱం మీద స్వారీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. పాండుర వర్ణము! అయ్యో…తరువాత, తరువాత గమనించండి…

153 గత రాత్రి రోమ్ యొక్క హతసాక్షుల పుస్తకమైన స్మక్కర్స్ గ్లోరియస్ రిఫార్మ్ నుండి “అరవై ఎనిమిది మిలియన్ల ప్రొటస్టెంటులను” తీసుకున్నాము. మనము 150 గుర్తు వరకు, అదే అనుకుంటాను, లేక పద్దెనిమిది…ఇపుడు నాకు ఖచ్చితంగా గుర్తు లేదు. అయితే అది అరవై ఎనిమిది మిలియన్లను వారు చంపారు. మొదటి రోమన్ సంఘమును ఎదిరించినందుకు, రోమ్. వాడు తనను తాను మార్చుకొని…మరణమనే పేరున వచ్చుటలో ఆశ్చర్యమేమీలేదు. అతడు నిశ్చయమే.

154 ఇపుడు, తన యొక్క వ్యతిరేక-బైబిల్ వాక్య ఉపదేశము ద్వారా ఎంతమంది ఆత్మీయంగా మరణించుటకు కారణమో దేవునికి మాత్రము తెలుసు. అరవై ఎనిమిది మిలియన్లను కత్తికి అప్పగించి వారిని చంపినది ఇతడే. బహుశా, అక్షరార్థంగా అతని తప్పుడు ఉపదేశము ద్వారా ఆత్మీయంగా బిలియన్ల మంది చనిపోయారు. మరణము యొక్క పేరు, తీసుకొనుటలో ఆశ్చర్యము లేదు.

155 స్వారీ చేయు వానిని చూడు? మొదటి స్థానమందు ఒక అంత్యక్రీస్తుగా ప్రారంభం నుండి మృత్యువుగానున్నాడు. అయితే అపుడతడు అమాయకుడు. తరువాత కిరీటమును, ఒక ముక్కోణ కిరీటము గైకొన్నాడు. అతడలా చేసినపుడు అతడు ఐక్యమయ్యాడు. సాతాను అతని సంఘాన్ని రాజ్యాన్ని ఐక్యపరచినది. ఎందుకనగా అపుడు అతను ఆ రెండూ, ఒక మానవ రూపములో అంత్యక్రీస్తు సాతాను.

156 తరువాత, ఇంకా, పరిశుద్ధ మత్తయి, అదే అనుకుంటాను, 4వ అధ్యాయం అది చెప్తుంది. మన ప్రభువైన యేసుని సాతాను పైకి తీసుకొని వెళ్ళి, లోక రాజ్యములన్నిటిని చూపించి, వాటి మహిమను ఒక క్షణములో ఈయనకు ఇచ్చెదనని చెప్పాడు. అతడు చెప్పాడు…అవి, అవి అతనివని చెప్పాడు.

157 కాబట్టి మీరు గమనించండి. అతడు తన యొక్క రాజ్యమును, తన సంఘాన్ని ఐక్యపరచిన యెడల, అలాటపుడు ఎర్రని గుఱ్ఱం మీద స్వారీచేయువాడు తప్పక స్వారీ చేయవచ్చు. అవునా? నిజంగా! ఇపుడు, అపుడు, ఇక్కడ అతని మర్మమును అతని సంఘములో మరియు రాజ్యములో మనం చూస్తున్నాము.

158 అతని పరిచర్య యొక్క నాలుగవ దశ. అతడు జీవి అని పిలువబడుచున్నాడు. మొదటిగా అతడు అంత్యక్రీస్తుగా పిలువబడెను, చూశారా; అటు తరువాత అతడు అబద్ధ ప్రవక్తగా పిలువబడెను, మరియు అతడు మృగముగా పిలువబడెను, ఇపుడు, అతడిక్కడే మృగముగా పిలువబడుటను చూచుచున్నాము. ఇపుడు, నాలుగవ గుఱ్ఱం తరువాత మీరు గమనించాలని కోరుచున్నాను.

159 మరియు, ఈ నాలుగవ గుఱ్ఱంలో మీరు గమనించితే, అంతా…మొదటిది తెల్లనిది; అటు తరువాతది ఎర్రనిది; అటు తరువాతది నల్లనిది; మరియు నాలుగవది, మిగతా మూడింటి యొక్క పోలికలు అందులోయున్నవి; ఎందుకనగా పాండురవర్ణము ఎరుపు మరియు తెలుపు మరియు ఇతరమైనది, మిశ్రితముగా ఉండును. అవునా? అది—అదంతా ఈ ఒక్క గుఱ్ఱంలో మిశ్రితమౌను. గమనించారా? మరియు అక్కడ అతడు నాలుగుగా మారును. లేక వాస్తవముగా మూడు ఒక దానిలో అదంతా ఆ ఒక్క దానిలో మిశ్రితమౌతుంది.

160 నాలుగింటిని గమనించాలని ఇపుడు మిమ్మును కోరుచున్నాను. ఆత్మ సంబంధమైన నాలుగు లెక్కల యొక్క, సగము గుర్తింపును, గమనించండి. దేవుడు మూడులోనున్నాడు. ఇది నాలుగు. అతడు నాలుగుగా ఉన్నాడు. ఇక్కడ…మొదటిగా అంత్యక్రీస్తు, తెలుపు; రెండవది అబద్ధ ప్రవక్త, ఎరుపు; మూడు, ఆకాశములు భూమి యొక్క ప్రతినిధి మరియు పరిహారకుడు, నలుపు; నాలుగు, మృగము, పాండుర వర్ణ గుఱ్ఱం, సాతాను పరలోకము నుండి నెట్టివేయబడెను. మీరది చదవాలని ఉందా? ప్రకటన 12:13, సాతాను పరలోకములో నుండి నెట్టివేయబడుట. తరువాత ప్రకటన 13:1, 8 మృగమనే వ్యక్తిలో అతడు అవతారమెత్తాడు.

161 అతడు మొదట అంత్యక్రీస్తు, కేవలం—కేవలం నీకొలాయితుల బోధగా పిలువబడెను; అటు తరువాత దాని నుండి అతడు అబద్ధ ప్రవక్తగా మారెను. అతడు అంత్యక్రీస్తు, అయితే అంత్యక్రీస్తు విరోధమైనది. దేవుని యొక్క వాక్యమునకు ఏది విరోధమైనా అది దేవునికి విరోధమైనది. ఎందుకనగా వాక్యము దేవుడు. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము శరీరధారియై, క్రీస్తు అయి మన మధ్య నివసించెను.” ఇపుడు అతడు వాక్యమునకు విరోధము కనుక అతడు అంత్యక్రీస్తు. అయితే ఒక ఆత్మ కిరీటధారి కాలేడు; ఆ కారణం చేత అతడు కిరీటము పొందుకోలేదు. కేవలం విల్లు మాత్రమే, బాణములు లేవు.

162 అటు తరువాత అతడు కిరీటము ధరించుకొనవలసిన సమయము వచ్చినప్పటికి, అటు తరువాత తన యొక్క అంత్యక్రీస్తు బోధకు అబద్ధ ప్రవక్తగా మారెను. అర్థం చేసుకున్నారా? అటు తరువాత అతడు ఖడ్గాన్ని పొందుకున్నాడు. ఎందుకనగా తన అధికారాలన్ని ఏకం చేసుకున్నాడు. అటు తరువాత ఎవరిని అడుగనవసరం లేదు. అతడు రాజ్యమును పరిపాలించువాడయ్యాడు. పరలోక పరిపాలికుడు అతడు. ముక్కోణపు కిరీటము పొందుకున్నాడు. తనకు తాను “పరిహారకునిగా” పిలుచుకున్నాడు. అక్కడ వారిలో ఎవరైనా చనిపోతే, వారికి డబ్బుంటే, వారికి చెల్లించాలంటె, అందులో నుండి అతడు ప్రార్థించును. ఎందుకనగా ఆలాగు చేయుటకు అతనికి అధికారమున్నదని చెప్పును. అతడు ప్రతినిధి, ఖచ్చితంగా అతడదే. “భూమి మీద దేవుని స్థానాన్ని అతడు తీసుకొనును.” అది ఎంతో విశదంగా ఉన్నది కాదా!

163 మనము బైబిల్ గ్రంథమును లోతుగా చూచిన యెడల కనుగొంటాము. మరియు అతని యొక్క సంఖ్యను, సమస్తమును లెక్కించిన, అతడిక్కడ…ఇక్కడ వెనుక సంఖ్య నాలుగు, సంఖ్య మూడు కాదు. సంఖ్య నాలుగు చూశారా.

164 ఇపుడు, ప్రకటన 12 త్రిప్పుదాం. ఇది కొద్దిగా చదువుదాం. ’ఎందుకనగా-అది చేయుటకు మనకు సమయముంది. మరియు ప్రకటన 12 వ అధ్యాయము, 13 వ వచనము చదువుదాము. “మరియు అదే సమయములో ఒక గొప్ప భూకంపము కలిగెను…” కాదు, నా యొద్ద నేను పొరపాటు తీశాను 13:

ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను.

165 ఇపుడు మీరు చూశారా, అతడు భూమి మీద పడద్రోయబడ్డాడు. అంత్యక్రీస్తు ఆత్మగా అవతారమెత్తాడు. మనుష్యరూపములోకి అవతారమెత్తాడు. ఆ మనుష్యుడు ఒకదానిలో నుండి మరొకదానిలోకి, అంత్యక్రీస్తు ఆత్మలో నుండి అబద్ధ ప్రవక్తలోకి మరియు అప్పుడు మృగము అతనిలోకి వచ్చెను.

166 సంఘము ఏలాగు ఎదిగినదో ఖచ్చితంగా ఆలాగే; అతని సంఘము—అంత్యక్రీస్తు నుండి అబద్ధ ప్రవక్త వరకు వెళ్ళినది. మరియు రానున్న ఘనమైన కాలంలో దాని నుండి మృగము లేవనైయున్నది. కాబట్టి సంఘము ఆ విధముగానే నీతికరణము, శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా వచ్చుచున్నది. క్రీస్తు ప్రజలలో ఉన్నాడు ఖచ్చితంగా. దానికి ఇతడు మాదిరిగా ఉన్నాడు. చూడు దాని పోలిక. ఖచ్చితంగా ఆలాగే ఉన్నాడు. అదే అతడు. అతడు పరలోకము నుండి నెట్టివేయబడ్డాడు.

167 ఇపుడు మనము ప్రకటన 13:1-8 లో చూద్దాం.

మరియు నేను సముద్ర ఇసుక పైన నిలచి యొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని…

168 ఇపుడు, ఇక్కడ 12, అతడెక్కడ నెట్టివేయబడ్డాడో, ఇపుడు గమనించు.

…మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు…

169 ఓ, ఇపుడు మనకు సమయముంటే, మిగతా రాత్రంతా తీసుకుందాము. అక్కడున్న ఆ సూచనలతో తిరిగి అతని దగ్గరకు నేరుగా అది తెచ్చి చూపించగలము. ఇతర ఇతర పఠనాల నుండి మీలో చాలామందికి అది తెలుసు.

…దాని…పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు…సింహపునోరు వంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

170 ఊహు! సాతాను అవతారము ధరించెను! చూశారా?

దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను;…

171 మరియు, ఆ విధముగా మనము క్రిందకు సాగినయెడల, మీరు కోరిన యెడల మీకు అవకాశమున్నయెడల చదువుడి. లేదా, మనము కొద్దిగా చదువుదాం.

దాని తలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.

172 మీరు దానిని గమనించండి! కమ్యూనిజంను ఎన్నడు గమనించకండి. అది “రక్తమునకు ప్రతీకారము” తీర్చుటకై మీకు సహాయపడుటకై దేవుని చేతిలోనున్న ఒక సాధనముగానున్నది. రేపు రాత్రి అది చూద్దాం. సరేనా?

వారు ఆ ఘటసర్పమునకు నమస్కారము చేసిరి…

173 ఆ ఘటసర్పము ఎవరు? సాతాను. నిజమేనా? “ఎఱ్ఱని ఘటసర్పము.” సరే.

…ఆ మృగమునకు అధికారమిచ్చినందున (అతడు తన యొక్క అధికారమును ఎక్కడ పొందాడు చూశారా): మరియు వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటియెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.

డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను.

గనుక దేవుని దూషించుటకును (అక్కడే నీవున్నావు, చూడండి. మంచిది.)…ఆయన నామమును, ఆయన గుడారమును (పరిశుద్ధాత్మ నివసించు స్థలము), పరలోక నివాసులను దూషించుటకును, (అతనికి ఒక బిరుదు ఇవ్వండి)…అది తన నోరు తెరచెను,…

174 రోమ్ లో ఒక స్థలము చేకూర్చుకొనుటకు, ఒక వాటికన్ నగరము. నీవింకా ముందుకు వెళ్ళు.

…పరలోక నివాసులను.

175 వారిని దూషించెను. వారు విజ్ఞాపణ చేయుచున్నారని చెప్పుచు.

మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను (మరియు అతడు దానిని చేసెను) వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను (అతడు దాని చేసెను):…

176 కొయ్యకు కట్టి వారిని కాల్చెను. సింహములకు ఆహారముగా వేసెను. తన ఇష్టమొచ్చినట్లుగా వారిని చంపాడు.

…ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.

177 అన్య రోమ్ పోపుల రోమ్ గా మారువరకు రోమ్ లో ఎన్నడూ ఆ విధంగా ఉండలేదు. మరియు కథోలిక్ అధికారము ప్రపంచ వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్త కథోలిక్ సంఘముగా మారింది.

మరియు భూనివాసులలో గ్రంథమందు ఎవరిపేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు…

178 “నా యొక్క నూనెను మరియు ద్రాక్షారసమును తాకవద్దు!” చూశారా?

భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.

ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక.

ఎవడైనను చెరపట్టవలెనని యున్న యెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపినయెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

179 ఇపుడు, గతరాత్రి అతడు తన యొక్క గొప్ప ఖడ్గముతో చంపుటకు వచ్చుటను మనము చూశాము.

180 అతడు కూడా ఖడ్గము ద్వారా అనగా వాక్యమనే ఖడ్గము ద్వారా చంపబడునని మనము కనుగొన్నాము. దేవుని వాక్యము పదునుగల రెండంచులు గల ఖడ్గము అతనిని చంపును, పడద్రోయును. ఆ ఏడు ఉరుములు వాటి స్వరములు పలుకు వరకు వేచియుండు ఆ గుంపు, నిజముగా దేవుని వాక్యమును తీసుకున్న ఆ గుంపు దానిని అక్కడ అందజేశారు. అది ముక్కలు ముక్కలుగా నరుకును. వారు ఆకాశములను మూయగలరు. వారు దీనిని మూయగలరు లేక అది చేయగలరు. దేనిని వారు చేయాలనుకున్న. మహిమ! ఆయన నోట నుండి వచ్చు ఖడ్గము ద్వారా అతడు చంపబడును. అది రెండంచుల ఖడ్గము కంటే వాడిగాయుండును. వారు కోరినయెడల వందల బిలియన్ల టన్నుల ఈగలను రప్పించగలరు. ఆమేన్. వారేమి చెప్పినప్పటికీ, అది జరగబోతుంది. ఎందుకనగా దేవుని నోటనుండి వచ్చునటువంటి దేవుని యొక్క వాక్యము అది. ఆఁ. ఆమేన్. దేవుడు ఎల్లప్పుడు అది చేయును. అది ఆయన వాక్యము. అది చేయుటకు దేవుడు ఎల్లప్పుడు మనుష్యుని వాడుకొనును.

181 అక్కడ ఐగుప్తులో దేవుడు వారికై ఆ ఈగలను పిలువగలిగెను. అయితే ఆయన అన్నాడు, “మోషే, అది నీ యొక్క విధి. నీవేమి చేయవలెనో నేను నీకు చెబుతాను. నీవు వెళ్ళి అది చేయ్.” అతడది సంపూర్తిగా చేశాడు. చూశారా? ఆయన—ఆయన వాటిని పిలుచుటకు—సూర్యుని ఆయన పిలవగలడు. అది పిలచుటకు ఆయన చంద్రుని కారకుడుగా చేయగలడు. అయితే ఆయన—ఆయన చెప్పాడు, “మోషే.” ఆ, ఆ…ఆయన మనుష్యుని ఆయన ఎన్నుకున్నాడు. సరే.

182 ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ సాతాను పరలోకము నుండి పడద్రోయబడిన తరువాత మృగములో తాను అవతారమెత్తాడు. ఇపుడు ఇతడు మృగము; అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఇపుడు మృగము. మరణము అను పేరు ఇవ్వబడెను! మరియు పాతాళము అతనిని వెంబడించుచున్నది. సంపూర్తిగా సాతాను తన సింహాసనముపైనున్నది. ఓ, మై. భూమి మీద, అతడు సాతాను, భూమి పైన ప్రతినిధిగా ఉన్నాడు, అనగా ప్రపంచ రాజ్యములకు అతడు ఇపుడు అధిపతిగా ఉన్నాడు. మత్తయి 4 లో ప్రభువైన యేసుకు అప్పజూపిన అవే రాజ్యములు, సాతాను ఇపుడు పూర్తిగా రాజయ్యాడు.

183 ఇపుడు, ఇది తరువాత సంభవించును. ఇపుడతడు అబద్ధ ప్రవక్త, అక్కడ యూదులతో తన నిబంధన విరమించుకున్న తరువాత అతడు మృగము అవుతాడు. ఏలాగో తెలుసా…సరే. ఇపుడు గమనించు, ఆ సమయములో మృగము యొక్క హృదయము ఇవ్వబడును, సాతాను తనకుతాను అవతారమెత్తును. ఎందుకనగా సంఘము పైకి ఎత్తబడినపుడు సాతాను వెళ్ళగొట్టబడును. చూశారా? చూశారా? అది సంభవించును. అతని నేరములన్నీ ముగియును. గమనించారా?

184 చూడు, మధ్యవర్తి సింహాసనముపైన కూర్చున్నంత వరకు, సాతాను అక్కడ నిలబడి నేరారోపణ చేయును. ఎందుకనగా అతడు అవతల ప్రక్కన వాదించువానిగా ఉన్నాడు. అతడు క్రీస్తుకు విరోధి. మరియు క్రీస్తు…అతడక్కడ నిలబడి ఉన్నాడు, ఆ—ఆ—ఆ విరోధి అక్కడ నిలబడియున్నాడు. “అయితే, ఆగు! ఆదాము పడిపోయాడు! ఆదాము ఇది చేశాడు. నేను అతనిని జయించాను. అతని భార్య ఒక అబద్ధమును నమ్మునట్లు చేశాను. దాని ద్వారా ఆమె నశించునని నీవు చెప్పావు, నేను దానిని పట్టుకున్నాను అని చెప్తున్నాడు!”

185 అయితే ఇక్కడ ఒక మధ్యవర్తి నిలబడి ఉన్నాడు, ఆమేన్, ఆయనే సమీప బంధువుడైన విమోచకుడు, ఆమేన్, నీచమైన పాపి యొక్క హృదయాన్ని తీసుకొని మార్చుటకు అక్కడ రక్తముతో నిలువబడియున్నాడు. ఆ మధ్యవర్తి అక్కడ సింహాసనం మీద ఉన్నాడు. అవునండి.

“వారు నేరస్థులని!” సాతాను అన్నాడు.

“వారు కాదు” అని ఆయన చెప్పగలడు.

186 ఆ క్లొరాక్స్ మరకలను తీసివేయుటకు సిరాలో గాని మరి ఏ ఇతర రంగులలో గాని మరకలు తీసివేయుటకు తయారు చేయబడింది లేక కనుగొనబడినది. వారు దానిని కనుగొన్నారు. తిరిగి నీవు దానిని కనుగొనలేనంతగా అది దానిని పగులగొడుతుంది. అది తిరిగి వాయువులుగా వెళ్ళిపోతుంది. నేరుగా సూర్యవెలుగులోకి వెళ్తుంది. అది సృష్టి. ఒక సృష్టియనునది సృష్టికర్త యొద్దనుండే రావలయును. అయితే తయారు చేయబడిన ప్రతీ రసాయనము మరియు కలిపినవి, అవి విచ్ఛిన్నమైపోవును. అవి ఇక ఉండవు. దానిలోనున్న నీరు అను పదార్థము కూడా క్లొరాక్స్ తో కలసిపోయి, బూడిదయగును.

187 ఆమేన్! దేవునికి మహిమ కలుగును గాక! అదంతా శుభ్రంగా ఉండును. దేవుని యొక్క నిజమైన బిడ్డయెడల యేసుక్రీస్తు రక్తము చేయునది అదే. అతడు ఆ పాపమును ఒప్పుకొని అక్కడ నిలబడిన యెడల, ఆయన యొక్క కనికర సంపన్నతలో నీతిమంతునిగా చేయబడును. అదెంత గొప్పదనగా, “అది ఇక ఎన్నటికి నాకు జ్ఞప్తిలేదు అని దేవుడు చెప్పునంతగా. అతడు ఖచ్చితంగా నా కుమారుడు.”

188 “నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, కదలిపొమ్మని మీరు ఈ పర్వతముతో చెప్పినట్లయితే, మీ హృదయములో సందేహింపకుండ, మీరు అడిగిన దానియందు నమ్మికయుంచినట్లయితే…జరుగును. ఏది జరగాలని మీరు చెప్పారో, మీరది పొందుకుంటారు.” నీవు విమోచించబడిన కుమారుడవు. ఆమేన్! అది నిజమని నాకు తెలుసు.

189 ఆరు వేరు వేరు సమయములలో దూరములో ఉడుతలు కనిపించుట నేను చూశాను. ఇక్కడ కూర్చున్న వాటిని గూర్చి నాకు తెలియదు. ఆయన ఏ విధముగా ఈగలను లేక కప్పలను లేక మరేదైనను ఏ విధముగా సృష్టింపగలడో ఆలాగే ఉడుతలను కూడా సృష్టింపగలడు. ఆయన, ఆయన దేవుడు, సృష్టికర్త, సరే! మరియు ఏ మర్త్యుడు కూడా…

190 ఆ మర్త్యుని యొక్క పాపము ఒప్పుకొనబడి ఆ క్లొరాక్స్ వేయబడి యేసుక్రీస్తు యొక్క బ్లీచ్ లో, అది పాపమునంతా తీసివేయును. అతడు పవిత్రుడుగా, పాపములేనివాడుగా, దోషము లేనివాడుగా ఉన్నాడు. “దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు ఏలయనగా అతడు పాపము చేయజాలడు.” బ్లీచ్ అతనికి దేవునికి మధ్య నిలబడును. ఎవరైతే దానిని మార్పు చేశాడో అతనియొద్దకు అది పగులగొట్టబడి తిరిగి పంపబడినపుడు అదెట్లు చేయగలదు. ఆమేన్!

191 వ్యూ! నేను భక్తి పరవశుడనౌతున్నాను. నేను—నేను మీకు చెప్తున్నాను. నేను ఇపుడు మీకు బయలుపరచుచుండగా ఉత్తేజపూరితుడనౌతున్నాను.

192 గమనించు, సంపూర్తిగా సాతాను తన సింహాసనము మీద కూర్చున్నాడు. ఔనండి. దేవునికే దాని నివ్వగోరాడు. మన ప్రభువుకు ఇవ్వగోరాడు. ఇక్కడ అతడు మృగపు హృదయంతో కూర్చున్నాడు. ఇపుడు, ఇక్కడ అతడు వ్యక్తి, మృగము, అవతారమెత్తిన దయ్యం. ఇక్కడ భూమి మీద అతడు అబద్ధపు నటనతో కనపరచుకొనుచున్నాడు. అయ్యో ఎంత జాలి. నిజమైన వాక్యము యొక్క అబద్ధపు నటన వలన, వాక్యముతో తనకుతాను ఏకం చేసుకొనుచున్నాడు.

193 అతని పోలిక చేసినట్లయితే అతడు చేసెను, రెండువేల సంవత్సరముల క్రితము అతడు యూదా. అతడేమి చేశాడు. ఒక విశ్వాసిగా యూదా వచ్చాడు. ఆరంభం నుండి అతడు దయ్యం. “నాశనపుత్రుడుగా అతడు జన్మించాడు.” అతడు, యేసును ఏమీ చేయలేకపోయాడు. ’ఎందుకనగా ఆరంభం నుండి అతనిని గూర్చి ఆయనకు తెలుసు; ఆమేన్. ఏలయనగా ఆయన వాక్యమై యుండెను. సరే. మరియు జ్ఞప్తించుకోండి. యూదా, ఒక ఖజానాదారునిగా స్థానాన్ని తీసుకొని, ధనం వలన పడిపోయాడు.

194 సంఘము ఆలాగే ఈనాడు. గతరాత్రి మనము గమనించినట్లుగా కథోలిక్ సంఘము తొమ్మిది దినముల ప్రత్యేక ప్రార్థన అనగా నోవెనాలకు డబ్బు వసూలు చేయుట, ప్రార్థనలకు డబ్బు వసూలుచేయుట, ప్రతి దానికి డబ్బు వసూలుచేయుట. అటువంటి విషయాల ద్వారానే కథోలిక్ కుమార్తెలు, ప్రొటస్టెంట్ లు కూడా పడిపోయారు. సమస్తమును ధనముతో చుట్టివేశారు. అక్కడే, అతడు, యూదా పడిపోయినది. అక్కడే ప్రొటస్టెంట్ లు పడిపోయారు.

195 గమనించు! చివరిగా స్వారీ చేస్తూ, పాండురవర్ణము గల దానిమీద స్వారీ చేస్తున్న వానిని గమనించు. అతని యొక్క ఆఖరి స్వారీ ఇదియే అగును. అది మన యొక్క దినాలలో కాదు. అది ఇంకా ముందుకుండును. అది యొక ముద్ర ముందుగా చెప్పబడినది. ఎందుకనగా చూడండి. ఇది జరుగునపుడు సంఘము వెళ్ళిపోవును. ఇక్కడ క్రీస్తు భూమి మీద అగుపించునప్పటికి, ఈ వ్యక్తి అగుపించును, సంపూర్తిగా దయ్యము అగుపించును. అంత్యక్రీస్తు నుండి అబద్ధ ప్రవక్తగా మారును, తరువాత మృగములోనికి, సాక్ష్యాత్తు దయ్యమే. అతడు పాండుర వర్ణ గుఱ్ఱము పైన స్వారీ చేస్తున్నాడు. అన్ని రంగుల కలయిక. అన్ని రంగుల మిశ్రమముతో ఉన్నవి, అవి అతనిని పాండుర వర్ణముతోను, మరణ కారణముగా చేయుచున్నవి.

196 అయితే, మన ప్రభువు భూమి మీద అగుపించునపుడు, ఆయన హిమము వంటి తెల్లని గుఱ్ఱం పైన స్వారీ చేయును. మరియు ఆయన పరిపూర్ణముగా నిండుగా ఇమ్మానుయేలుగా ఉండును. ఒక మానవునిలో దేవుని వాక్యము అవతారముగా యుండును. ఔనా? వారిలోనున్న భేదము అంతే. వారిలోనున్న వ్యత్యాసము అంతే.

197 గమనించు, అంత్యక్రీస్తు పాండుర వర్ణ గుఱ్ఱం పైన ఉన్నాడు. రంగుల రంగుల దానిపైనున్నాడు. మృగము ఒక జంతువు, అది శక్తికి పోలిక. అతని శక్తి అంతా మిశ్రితంగా ఉన్నది. ఎందుకు? అది రాజకీయము. అది—అది యొక దేశముల బలములు (శక్తి), అది మతసంబంధమైన బలములు, అది దయ్యపు బలములు. అది అన్నిరకముల బలముల మిశ్రమము, కలయిక, పాండురవర్ణ గుఱ్ఱమైయుండెను. అతడు అన్ని విధములైన అధికారములు కలిగియున్నాడు.

198 అయితే యేసు వచ్చునపుడు, ఒక స్థిరమైన రంగు గల గుఱ్ఱంపై వచ్చుచున్నాడు. వాక్యము. ఆమేన్!

199 ఎరుపు, తెలుపు, నలుపు, ఇది తన రంగులను కలుపుచున్నది. ఒకదానిలో మూడు రంగులు, ఒకదానిలో ప్రతిధ్వనించుచున్నవి. మరియు మూడు బలములు ఒకదానిలో ప్రతిధ్వనించుచున్నవి; తెల్లని గుఱ్ఱం, నల్లని గుఱ్ఱం, ఎర్రని గుఱ్ఱం. మూడు కిరీటాలు ఒకదానిలో, చూశారా. ఔను నిశ్చయం.

200 కిరీటము నేను చూశాను. నాకు నేనుగా; నిలబడి దానికి అంత దగ్గరగా యుండి, అది చూశాను. దాని మీద అద్దం యుండుట వలన దగ్గరకు వెళ్ళనివ్వలేదు. ఒక పెట్టెలో అది ఉంచి పెద్ద తాళం వేసి అదక్కడ యుంచారు. ముక్కోణ కిరీటం. కావున అది సత్యం. ఊహుఁ. కావున అతడు త్రికోణ కిరీటము కలిగియున్నాడు. వికార్: పరలోకము ప్రతినిధి, పాప పరిహారము చేయు అధికారము గలవానిగాను, భూమి మీద అధికారము గలవానిగాను చెప్పుకొనుచున్నాడు.

201 మూడు బలములు ఒక్కటిగా కలపబడియున్నవి. చూశారా! అన్ని కూడా పాండుర వర్ణములో కలసినవి. మరణము అన్నిటిలో చెప్పబడియున్నది; రాజకీయం మరియు—మరియు మతము మరియు—మరియు దయ్యపు బలములు కలసినవి. రాజకీయములు, సాతాను రాజకీయములకు రాజు, తెలివైనవాడు. వ్యూ! నిశ్చయము. అతనిని ప్రతియుక్తి చేయుటకు ప్రయత్నం చేయవద్దు. ఆలా—ప్రభువు నందు నమ్మికయుంచు. అంతే.

202 అంతా, ముందుగానే నేను చూశాను. అన్ని తెలివితేటలు, విద్యా మొదలైనవన్నీ తప్పు మార్గమునుండి వచ్చును. దానిని లేఖనము ద్వారా వెంటాడి, అది సరియైనది అవునో కాదో చూడండి. కయీను సంతతిని గమనించి వారేమయ్యారో చూడండి. అటు తరువాత షేతు సంతతిని గమనించి వారేలాగున్నారో చూడండి. నేను అజ్ఞానమును బలపరచుటలేదు. ఎప్పటికి కాదు. లేదండి. అయితే బైబిల్ లో ఉన్న ఏ వ్యక్తినైనా తీసుకొని చూడండి. చాలా అరుదుగా…

203 మరియు పౌలు అను పేరుగల ఒకడున్నాడు. అతను తెలివైనవాడు. అతడు చెప్పాడు క్రీస్తును తెలుసుకొనుటకు అతడు ఎరిగినదంతా అతడు మరువవలసియున్నదని. అతడన్నాడు, “మనుష్య జ్ఞానముతో కూడిన తియ్యని మాటలతో నేను మీ యొద్దకు రాలేదు గాని క్రీస్తు యొక్క పునరుత్థానముతోడి శక్తితో మీ యొద్దకు వచ్చుచున్నాను.” ఔను, పరిశుద్ధాత్మ శక్తితో.

204 ఇతరులను చూడు, వారిలో కొందరికి కుడి ఎడమలు కూడా తెలియదు. మరియు—మరియు, ఓ! ప్రవక్తల కాలములు చూడండి, వారెక్కడ నుండి వచ్చిరో మొదలైనవి. నా భావమేదో చూశారా?

205 చూశారా, అది తెలివైనది, మేథాశక్తి, జ్ఞానము. జ్ఞానము ఖచ్చితంగా దేవునికి దూరంగా తీసుకొనిపోవునది.

206 అతనికి మూడు బలములున్నవి. లేక మూడు పరిధిలున్నవి. భూమి, పరలోకము మరియు పాపపరిహార స్థలము.

207 అతను తనకుతానే త్రిత్వము. దానితోనే అతడు చేయబడియుండెను. మరియు త్రిత్వము స్వారీచేయుచున్నాడు. త్రిత్వములో అతని బలమున్నది. అతని కిరీటము త్రిత్వములో ఉన్నది. అతని గుఱ్ఱము త్రిత్వములో ఉన్నది. అదే అతడైయున్నాడు. త్రిత్వము. త్రిత్వము అతని యొక్క బలము, త్రిత్వము యొక్క కిరీటము, గుఱ్ఱపు (స్వారీ) యొక్క త్రిత్వము, అది వాని యొక్క కార్యాలయము, తిరిగి నాలుగు. చూశారా. నాలుగు. మంచిది.

208 అతని పరిచర్య యొక్క మూడు దశలు, అతనిని ఒక వ్యక్తిగా చేసినది, సాతాను అవతారమెత్తుట. మూడు దశలు…అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త మరియు మృగము. ఆ మూడు, పోలిక. చూడండి. ఇపుడు మూడు మాదిరులున్నవి. అవన్ని చేస్తున్నవి.

209 దేవుడు, దేవుడు కూడా నీటి ద్వారా, రక్తము ద్వారా, ఆత్మ ద్వారా బయలుపరచుకొనుచున్నాడు. దేవుని వాక్యము ద్వారా ఒక క్రైస్తవునిని ఒక దేవుని కుమారునిగా చేయుచున్నారు. చూశారా. మరియు ఈ మూడు బలములు అవన్ని దయ్యముగా చేయుచున్నవి. చూశారా? ఓ, ఇక్కడ ఇది, నీరు, రక్తము మరియు ఆత్మ, అది దేవునిదై యున్నది. మరియు అది రాజకీయము, మతము మరియు దయ్యపు శక్తి, కలసినవి అవన్ని దయ్యముగా చేసినవి.

210 క్రీస్తు యొక్క మొదటి రాకడ, ఒక మర్త్యమైనది. ఆయన మూడుసార్లు వస్తాడు. క్రీస్తు మూడులో ఉన్నాడు. చూశారా? (అతడు ఎలా వచ్చాడో చూడండి, అతడు నాలుగు.) మొదటి రాకడ మర్త్యునిగా, రెండవ రాకడ ఎత్తబడుట; అమర్త్యులముగా మనమాయనను ఆకాశములో కలుసుకుంటాము. ఆయన మూడవ రాకడ ఆయన అవతారమెత్తిన దేవుడు. ఆమేన్! [సహోదరుడు బ్రెన్హాం ఒకసారి తన చేతులు కలిపి చప్పట్లు కొట్టాడు—సంపా.] దేవుడు, ఇమ్మానుయేలుగా భూమి మీద పరిపాలించుట! ఔను. మూడు మాత్రమే.

211 స్వారీ చేయువాని యొక్క నాలుగవ దశ, గమనించు ఈ స్వారీచేయువాని యొక్క నాలుగవ దశ మరణముగా పిలువబడుచున్నది. మరణము అనగా “దేవునికి నిత్యమైన ఎడబాటు.” మరణమనగా అది అర్థం. నిరంతరము దేవునికి ఎడబాటుగా యుండుట.

212 తరగతి, ఇపుడు ఇతనిని మనము బయట యుంచినట్లయితే, ఆ వ్యక్తి ఎవరైనది మనము బైబిల్ ద్వారా మనము చూపించ గలిగిన యెడల, మరియు మనము కొండలను, ఆ స్థలములను మరియు ఎక్కడెక్కడ యున్నాడో సమస్తమును చూశాము. మరియు ఇపుడు అతడు “మరణము” అని పక్షిరాజు ద్వారా పిలువబడుచున్నాడు. అదే అతనిని ఆయన పిలచునది. జ్ఞప్తించుకో, ఇక్కడ, చూడండి, మరణము నిత్యమైన ఎడబాటు.

213 జ్ఞప్తించుకోండి, పరిశుద్ధులు మరణించరు. వారు నిద్రిస్తారు. మరణించరు. “నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు.” ఔనది నిజం. “తీర్పులోనికి రాక; మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. నేను పునరుత్థానమును జీవమునైయున్నాను,” యేసు చెప్పాడు, “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు.” లాజరు చనిపోయాడా? “అతడు నిద్రిస్తున్నాడు.”

214 “భయపడవద్దు, చిన్నది చనిపోలేదు, నిద్రిస్తున్నది.” ఆయనను అపహాస్యము చేయుచు నవ్విరి. ఔనా? అయ్యో! చూశారా భక్తులు చనిపోరు.

215 దేవునికి దూరమవుట మరణము, నిత్య మరణము. ఈ వ్యక్తి “మరణమని” పిలువబడుచున్నాడు. కాబట్టి అతనికి దూరముగా యుండుడి. అతడేమైయున్నాడు? నిర్మాణాత్మకమైన పద్ధతియైయున్నాడు. నైసియా సభలో, కాన్ స్టాన్ టైన్ చెప్పిన ఆలోచన ప్రకారముగా మొదటిగా స్థాపించబడిన సంఘము యొక్క శాఖా క్రమమై యున్నాడు.

216 గతరాత్రి మనము స్త్రీలను గూర్చి చూశాము. ఏ విధంగా, హవ్వ, మొదటి పెండ్లికుమార్తె, తన భర్తతో పోకముందు, ఏదెనులో దేవుని వాక్యమును అపనమ్మకముంచుట వలన ఏ విధముగా పడిపోయినది చూశాము. క్రీస్తు యొక్క పెంతెకొస్తు దినాన జన్మించిన ఆత్మీయ పెండ్లికుమార్తె ఆయన ఆమెను చేరకముందు, ఏం జరిగింది? ఆమె రోమ్ లో పడిపోయినది. ఏంటి? సిద్ధాంతము కొరకై వాక్యము యొక్క శీలమును కోల్పోయినది. ఆమేన్. ఓ, మై!

217 నేను—నేను—నా మీదికి ఉత్తేజము తిరిగి వచ్చుట నేను చూచుచున్నాను. ఔనండి. తలంచుచు…వెర్రిగా ప్రవర్తించుట కాదు నా భావము. అదికాదు నా అర్థం. అయితే నేను…అది నాకేం చేస్తుందో మీకు అర్థం కాదు. ఇపుడు ఇందులో నాలుగు దినాల నుండి కూర్చొనియున్నాను. ఆలా…మరియు నేను మరలా సాధారణ మానవునిగా అనుభూతిని పొందవలెనన్నచో మరేదో నేను చెప్పవలెను. నా భావమేదో మీకు తెలియును. ఆఁ. సరే. ఆ విధముగా మాట్లాడుచుండగా అన్ని చోట్ల దర్శనములు వచ్చునని మీకు తెలుసు. ఔను. చూడండి. ఆ కారణం చేత, నేను తిరిగి మీకు యొకటి చెప్పవలసియుంటుంది. చూశారా?

218 నేను వివేచనా వరుసలో నున్నపుడు మీరెపుడైనా నన్ను గమనించారా? నేనొకటి చెప్తాను. ప్రజలను నవ్వునట్లు చేస్తుంది; అటు తరువాత నేనొకటి చెప్తాను ప్రజలను ఏడ్చునట్లు చేస్తుంది; తరువాత ఇంకొకటి నేను చెప్తాను; వారు కోపము వచ్చునట్లు అవుతారు. నేనేదో అంశమును కనుగొంటాను. మరియు అది ఏ విధముగా తీసికుంటుందో యనియు, తరువాత ఏ విధమైన వెలుగు వారిపైనున్నదనియు, ఏం జరుగుతుందనియు చూచుటకు…తరువాత అదెక్కడో నాకు తెలియును మరియు అది పిలుపో కాదో నాకు తెలియును. అది కాకపోతే…ఒక అసలైన విశ్వాసి అక్కడ కూర్చొనియున్న యెడల సరే. నీవు వారిని పిలువు, అటు తరువాత చెప్పు, “నీవు పలానా—పలానా.” చూశారా.

219 మరి నీవు క్రిందికి వచ్చునపుడు, ఆత్మ అభిషేకించుట ప్రారంభించును. తరువాత, ఆ వెలుగు ఆ విధంగా గది చుట్టూరా ప్రకాశించుట జరుగును. కాబట్టి, ఆ కారణం చేత నేను ఏదైనను ఒక కార్యము చెప్పుచుండగా మధ్యలో నిలిపి దానిని మరలా చెప్పుటకు ప్రారంభిస్తాను, చూశారా.

220 గత ఆదివారము నుండి, నేను గదిలో కూర్చొని అలా ప్రార్థిస్తున్నాను. అంతే, అభిషేకము క్రింద యుండి. ఇది సరియేయని నాకు తెలుసు. మీరు దేవుని నమ్ముతున్నారు. మీరు ఔనది నాకు తెలుసు. వారము చివరను మీరు గమనించండి. ఊహు. చూశారా? మంచిది. ఔను.

221 ఇపుడు మరణమనగా దేవుని యొద్ద నుండి నిత్యమైన ఎడబాటు. ఇపుడు గుర్తుంచుకోండి. పరిశుద్ధులు చనిపోరు.

222 జ్ఞప్తించుకోండి. అతని పెండ్లికుమార్తెకు పాండుర వర్ణము గల గుఱ్ఱం ఇవ్వబడెను. నా అర్థం, ఈ స్వారీచేయువానికి పాండుర వర్ణపు గుఱ్ఱము ఇవ్వబడెను. వెళ్ళుటకు, ముందుకు సాగుటకు అతనికి ఈ—ఈ పాండుర వర్ణ గుఱ్ఱం ఇవ్వబడెను. మరియు మరణమను ఈ పాండుర వర్ణ గుఱ్ఱంపై స్వారీ చేయుచున్నాడు. ఇపుడు అదేంటో మనకు తెలియును. అదే సంఘమో మనకు తెలియును.

223 మరియు గుర్తుంచుకోండి, గతరాత్రి చూచియున్నాము. ఆమె ఒక “వేశ్య” మాత్రమే కాదు గాని “వేశ్యలకు తల్లి” కూడా.

224 ఆమెను వేశ్యనుగా చేసినదెవరు యని మనము చూశాము. ఒక స్త్రీ. ఆ రకమైన స్త్రీ. నేను…అది మిశ్రిత జనుల మధ్య చెప్పెడి మాటకాదు. అయితే అది బైబిల్ చెప్తుంది అది. ఔనా, కాబట్టి, అటు తరువాత మనము గ్రహిస్తున్నాము—తన యొక్క వివాహ ప్రమాణాలకు అపనమ్మకముగానున్న ఒక స్త్రీ యని మనము గ్రహిస్తున్నాము. చూడండి, మరియు ఆమె ఆ విధముగా నుండగా “పరలోకపు రాణి యని” ఆమెకు ఆమె పిలుచుకొనుచున్నది. (దేవుని యొక్క పెండ్లికుమార్తె. దేవుడు అనగా క్రీస్తు.) ఆమె జారత్వము చేయునట్లుగా మనము చూచియున్నాము. మరియు ధనికులు గొప్పవారు భూరాజులు జారత్వము చేయునట్లుగా ఆమె ప్రవర్తించెను. భూలోకమంతా ఆమె వెంట వెళ్ళినది. చూశారా?

225 మరియు, అటు తరువాత ఆమె కొంతమంది కుమార్తెలను ఉత్పత్తి చేసినట్లుగా మనము కనుగొన్నాము. మరియు వారు వేశ్యలు. వేశ్య అంటే ఏంటి? జారిణి గాక మరెవ్వరు? ఒక్కటే. ఒక జారిణి జారత్వము, చెడు, వ్యభిచారము చేసిరి. వారేమి చేశారు, నిర్మాణాత్మకమయ్యారు. ఒక క్రమమును ఏర్పరచుకొన్నారు. మానవ కల్పిత పద్ధతులను బోధించారు. పెంతెకొస్తు మరియు సమస్తము.

226 ఇపుడు, నీవు వద్దు—పెంతెకొస్తు, మీ యొక్క మనస్సాక్షిని జేబులో విడిచి పెట్టుకోకండి. నేనొకటి మీకు చెప్తాను. నేరుగా ముఖానున్న విషయం చూద్దాం. ఒకరికొకరు దూషణ చేసుకుంటూ, ఇప్పటికే రహదారిన ఆలస్యము చేసియున్నాము. ఇక్కడ చూడండి.

227 మనము లవొదికయ సంఘకాలములో నివసిస్తున్నాము. అది మిగతా సంఘకాలములన్నిటిలో చాలా పరిహాసింపతగిన సంఘకాలము. ఒక లోపలకు వచ్చుటకు ప్రయత్నిస్తున్న క్రీస్తును బయట యుంచిన ఒకేయొక నులివెచ్చని సంఘకాలము. మరియు పెంతెకొస్తు వర్తమానము బయలువెడలు కాలమిది. చెప్తుంది, “నేను ధనవంతుడను!” అని. అబ్బాయ్, నీవు దరిద్రుడవు, మొదట. ఇపుడు నీవు నిజముగానే ధనికుడవయ్యావు, చూశారా. “ఏమి కొదువలేదు!” మరియు—మరియు, ఓ, నీవెట్లు యుంటివి!

228 ఆయన చెప్తున్నాడు, “నీవు దిగంబరివి, దిక్కుమాలినవాడవు, గ్రుడ్డివాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవును, అది ఎరుగనివాడవు.”

229 ఇపుడు, అక్కడ వీధిలో ఒక మనుష్యుడు దిగంబరిగా యుంటే, అది ఎరిగియుంటె, ఎందుకు, అతనికి అతనే సహకరించుకుంటాడు. అయితే అతడు—అతడు అది ఎరుగకపోతే, అతనికి వ్యత్యాసాన్ని నీవు చెప్పలేవు. ఆలాటపుడు అతడు హీన రూపమందు ఉంటాడు. దేవుడు అతని యెడల జాలి కలిగియుంటాడు. ఔను. గమనించు. అయ్యో!

230 ఇపుడు జ్ఞప్తించుకోండి, ఈ అంత్యక్రీస్తు, తానే మనుష్యుడైయున్నాడు; అతని పెండ్లికుమార్తె, అనగా అతని సంఘము, “మారుమనస్సు పొందుటకు సమయమియ్యబడెను, ఆమె అది చేయుట లేదు,” ఆ తుయతైర సంఘకాలములో. మీకు జ్ఞాపకమున్నదా. మీరు…

231 సరే. ఒక నిముషము వెనుకకు వెళ్దాము. ఒక నిముషము వెనుకకు వెళ్ళుట వలన అది మనలను గాయపరచదు. ఒక నిముషము 2వ అధ్యాయము కొరకు వెనుకకు వెళ్దాం. ఇపుడు, తుయతైర ను గూర్చి 2వ అధ్యాయము, మనమది చదువుదాము. ఇపుడు ఇది గమనించండి. ఇపుడు త్వరగా. అయ్యో, మనకు సుమారు ముగింపు సమయం, ఇంకా ప్రారంభించలేదు. అయితే, గమనించండి, తుయతైర. ఇపుడు, 2వ అధ్యాయం 18వ వచనమునుండి అది ప్రారంభం.

…తుయతైరలో ఉన్న సంఘపు దూతకు (అది వర్తమానికుడు) ఈలాగు వ్రాయుము అగ్ని జ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా;

నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.

అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు,…

232 అక్కడే నీవు ఉన్నావు. బైబిల్ గ్రంథములో ఆమెను మీరు ఎరుగుదురు. ఆమె ఆహాబు యొక్క భార్య. మరియు ఇక్కడ స్త్రీ, సంఘము, యెజెబెలు, అబద్ధ ప్రవక్త భార్య. అతడు అసలైన దేవుని ప్రవక్త అనబడువాడు, పోప్; మంచిది. అసలైన ప్రవక్త అతని భార్య యెజెబెలు. ఇపుడు, ఆహాబు అసలైన యూదుడు. అయితే అతడు బుద్ధిలేనివాడు. అది మీకు తెలుసు. ఎందుకనగా అతని భార్య ఆమెకు ఇష్టము వచ్చినట్లు నడిపించినది. యెజెబెలు ఆమె ధనాన్ని తీసుకొని వీరు కోరినట్లు వీరిని కూడా నడిపించినది.

…తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న (దానిని గమనించారా?)…అది నా దాసులకు బోధించుచు వారిని లోబరచుచున్నది. (చూడండి, ఆ యెజెబెలు బోధ దేశమంతా ప్రాకిపోవుచున్నది.) జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును.

…మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని (చూశారా?) అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.

233 ఈ తరువాత వచనము గమనించండి.

…ఇదిగో నేను దానిని మంచము పట్టించి (అది పాతాళము) దానితో కూడ వ్యభిచరించు వారిని బహు శ్రమలపాలు చేతును…(అనగా గొప్ప శ్రమలకు వెళ్ళుట. సంఘము కాదు, ఇపుడు)…తమ క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని.

234 ఇపుడు ఇక్కడ గమనించండి.

…దాని పిల్లలను (ఆమె వేశ్యలను) నిశ్చయముగా చంపెదను (ఆత్మ సంబంధమైన మరణము);…

235 మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అది వాక్యము. “నేను వారిని చంపెదను.” వారు చంపబడినట్లయితే, వారు నిరంతరము ఎడబాటుగా ఉందురు. సరే. జ్ఞప్తించుకోండి. మారుమనస్సు పొందుటకు ఆయన సమయమిచ్చాడు.

236 తుయతైర కాలము అంధకార కాలము. ఆ సమయములో నల్లని గుఱ్ఱం స్వారీచేయు సమయము. జనులందరు ప్రార్థనలకై నొవెనాలకు మొదలగువాటికి పైకము చెల్లించు సమయమున ఆ నల్లని గుఱ్ఱంపై స్వారీ చేయువాడు బయలుదేరును. ఇపుడు అతని నల్లని గుఱ్ఱంను చూడండి. తరువాత, తుయతైరలో మారుమనస్సు పొందుటకు నిరాకరించాడు, (ఏంటి?) అతని స్వారీ నల్లని గుఱ్ఱం నుండి పాండుర వర్ణ గుఱ్ఱం రూపమునకు మార్చుకున్నాడు, మరణానికి, అతని ఆఖరి పరిచర్య.

237 ఇపుడు, ఇక్కడ వ్యక్తికి ఒక చిన్న కదలికను నేను ఇవ్వవచ్చును. దేవుని తిరస్కరించుట, దేవుని పిలుపును తిరస్కరించుట, కొన్నిసార్లు నీవు చివరి సమయములో చేస్తున్నావు. మరియు సంఘము చేసినట్లు, అది అయిపోయినది. దేవుడు, సహనము ఎల్లప్పుడు నరునితో వాదించదు. చూశారా?

238 మరియు ఆమె దానిని తిరస్కరించినపుడు, మరి దానిని అంగీకరించుటకు తిరస్కరించినపుడు, అటు తరువాత ఆమె మారినది మరియు వెళ్ళిపోయినది…ఇపుడు ఆమె “మరణము” అను నామము కలిగియున్నది. ఎడబాటు. దేవుడు చెప్పాడు, “ఆమె పిల్లలను సహా తీసుకుంటాను, ప్రొటస్టెంటులను, వారిలో ప్రతియొక్కరిని నిత్య ఎడబాటుచేత వారిని చంపెదను.” అక్కడే నీవున్నావు. తుయతైర కాలము, అంధకారకాలము. అతని నల్లని గుఱ్ఱం ఇపుడు మరణముగా మారినది, అతని యొక్క ఆఖరి పరిచర్య.

239 చూడండి, ఏ విధముగా సంఘకాలములు ముద్రలతో సమ్మిళతమైయున్నవో? సంపూర్ణము. అది సరియైనదని మనకు తెలుసు. పరిశుద్ధాత్మ ఏలాటి తప్పులు చేయడు. ఆఖరుగా సంఘకాలములను గూర్చి మనము వెనుక ఆలోచించునపుడు, మనకొక రుజువును ఆయన ఇచ్చెను. మీకు తెలుసు.

240 చూడు, ప్రేమ, దేవుని యొక్క సహనము! ఆమె పైన ఆయన తీర్పును వేయుటకు ముందుగా ఆమె మారుమనస్సు పొందుటకు స్థలాన్ని ఇచ్చెను. అది ప్రభువు నామములో ఇది చెప్తున్నాను. ప్రొటస్టెంట్ సంఘానికి ఆయన అదే ఇచ్చుచున్నాడు. ఆమె అది చేయుటలేదు. ఆమె తన స్వంత మూఢభక్తిని గాని సిద్ధాంతములను గాని కలిగియుండబోవుచున్నది. నీవు దానిని ఎంతగా విశదీకరించినా నాకు లెక్కలేదు.

241 అక్కడ చికాగోలో, గతదినము నేను చెప్పినట్లు, ’ఇక్కడ కూర్చున్న జనులకంటే ఎక్కువమంది సేవకులున్నారు. మరియు అక్కడ వారు సిద్ధాంతమును గూర్చి సర్ప సంతానమును గూర్చి, యీ ఇతర విషయాలను గూర్చి నన్ను నొక్కి నొక్కి అడిగారు. నేను అడిగాను, “ఒకరు మీ బైబిల్ తీసుకొని ఇక్కడకు వచ్చి నా ప్రక్కన నిలబడండి” అని. ఎవరు ఏదీ చెప్పలేదు.

242 టామీ హిక్స్ అన్నాడు, “నేను—నేను ఆ విధముగా జరుగుట ఎన్నడూ వినలేదు—సహోదరుడా బ్రెన్హాం. నాకు ఆ టేపులు మూడువందలు కావలయును. నా సేవకులకందరికి నేను పంపబోవుచున్నాను.”

243 అక్కడ సుమారు యాభై లేక డెభ్బై అయిదు మంది అన్నారు, “తిరిగి బాప్తిస్మము పొందుటకు నేనక్కడకు వస్తున్నాను.” వారు వచ్చారా? వారిలో ఏ ఒక్కరు. ఎందుకని? మారుమనస్సు పొందుటకు ఆయన సమయమిచ్చాడు! మరియు ఆయన మీ యొక్క పిల్లలను మరణమునకు, ఆత్మీయ మరణమునకు అప్పగించును.

244 ప్రభువు చిత్తమైతే రేపు రాత్రికి లేక శనివారం రాత్రికి చూపుదాము. ఆ రాబోవు తెగుళ్లు గూర్చి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి.

245 ఐగుప్తుకు ఆయన ఇచ్చిన విధంగా, ఐగుప్తు మారుమనస్సు పొందుటకు ఆయన అవకాశమిచ్చాడు. ఆఖరి తెగులు ఏమిటి? మరణము.

246 అదే, పెంతెకొస్తు సంఘమును తాకిన ఆఖరి తెగులు, ఆత్మీయ మరణము. ఆమె చనిపోయినది. అది ప్రభువు నామమున. ఆమె ఆత్మ సంబంధముగా మరణించినది. ఆయన, ఆమె మారుమనస్సు పొందుటకు అవకాశమిచ్చాడు. అది ఆమె నిరాకరించినది. ఇపుడామె మరణించినది. అది తిరిగిలేవదు.

247 మరియు అక్కడ ఆ ప్రజలు ఎపిస్కొపెలియన్లలోనికి యాజకులలోకి తీసుకొచ్చుటకు ప్రయత్నించి, వారిని “పరిశుద్ధమైన తండ్రీ పలానా—పలానా” యని పిలచుచున్నారు. ఎందుకని? వారు అందు నిమిత్తము సిగ్గుపడవలసియున్నది. మనుష్యులు ఏ విధముగా గ్రుడ్డివారుగానున్నారు! ఆ నిద్రించు కన్య నూనె కొనుటకు వచ్చునప్పటికి, ఆమె దానిని పొందుకోలేకపోయిందని, యేసు చెప్పలేదా?

248 ప్రతియొక్కరు ప్రజలు చెప్పుట మీరు వినియుంటారు, “నేను పరిశుద్ధాత్మను పొందాను. నేను భాషలతో మాట్లాడాను” అని చెప్పుట. అయితే వారు ఈ విధమైన సంఘమునకు వచ్చుటకు కోరుకొనుటలేదు. “ఓ, మీకు తెలుసా. ఆ విధమైన స్థలమునకు పోవుటకు నేను కోరుటలేదని నేను నమ్ముచున్నాను.” మరియు ఆ విధముగా చెప్తు మీరు పరిశుద్ధాత్మను పొందియున్నారా?

249 అయితే, మీరు మీ డాంబిక మార్గాలే కోరుచున్నారు. బబులోనులోనే ఉండాలని కోరుతూ పరలోక ఆశీర్వాదాలతో ఇంకా ఆనందిస్తారా. మీ యొక్క తీర్మానము చేయవలసియున్నది. లోకములో మీరు ఉంటూనే, అదే సమయములో దేవుని సేవించలేరు. దేవుని, సిరిని మీరు సేవించలేరని యేసు చెప్పాడు. కాబట్టి, మీరు ఎదురు చూడని యెడల…

250 మీరు నిజముగా రక్షింపబడితే ఎక్కడ పరిశుద్ధాత్మ తనకుతాను నిరూపించుకొని దేవుని యొక్క వాక్యము పలానాయని చూపించునో అట్టి కూటములలో మీరు ఆనందించెదరు.

251 ఒకరన్నారు, “ప్రజలు ఎక్కువ శబ్దం చేస్తున్నారు. అది నన్ను భయస్తున్ని చేస్తుంది యని.” నీవు పరలోకానికి వెళ్తే నీవు భయస్తుడవౌతావు. నీవు ఆలోచించు. వారందరు అక్కడ యున్నపుడు, అలాటప్పుడు ఏంటి? అయ్యో! ఏ విధముగా ప్రభువు…

252 నోవహు దినాలలోయున్నట్లు ఆయన దీర్ఘశాంతుడు. ఆయన బహుగా ప్రయత్నించాడు. వారు మారుమనస్సు పొందుటకు నూట ఇరవై సంవత్సరములు ఆయన ఎంతో ఓర్చుకొన్నాడు. వారు చేయలేదు.

253 ఐగుప్తు దినాలలో, ఆయన తెగుళ్లను మొదలగువాటిని పంపెను. వారు చేయలేదు.

ఆయన యోహానును పంపాడు, వారు తిరగలేదు.

254 మరణించుటకు ఆయన యేసుని పంపెను. వాక్యమును విను సమస్త గుంపును రక్షించుటకు.

255 మరిప్పుడు, కడవరి దినాలలో ఆమెను బయటకు పిలచి, దానియొద్దకు, వాక్యమునొద్దకు, అసలైన విశ్వాసము నొద్దకు త్రిప్పుటకు ఆయనొక వర్తమానమును పంపుదునని వాగ్దానము చేశాడు. వారు దానిని స్వీకరించరు. వారెంతో హేతుబద్ధంగా యుంటారు. వారి సిద్ధాంతములలోను, మూఢభక్తిలోను, వారికి వద్దన్నంతగా ఉన్నారు. ఓ! వారికున్నవని వారనుకున్నట్లయితే…ఒక దేవదూత దిగివస్తే; అయితే దేవుడు అది చేయడు.

256 ఆయన ఒక బుద్ధిలేని, అమాయకుని, చివరికి అ ఆ ఇ ఈ లు ఎరుగని వానిని ఆయన తీసుకొనును. తరువాత ఆలాటి వ్యక్తినే తీసుకొనును, ఎందుకనగా ఏమీలేని ఒకదానిని ఆయన తీసుకొని దానిద్వారా పనిచేయును. వారు ఏదో అని తాము అనుకున్నంత వరకు, వారు దానితో ఏమి చేయలేరు. ఆయన ఎప్పుడు అదే చేశాడు. దేవునితో నీవు ఒకటి అగువరకు నీవు ఏమిలేనివాడవు కావలసియున్నది. అయ్యో!

257 గమనించు, ఇంకా, “ఆమె మారుమనస్సు పొందుటకు ఆయన ఆమెకు సమయమిచ్చెను, అయితే ఆమె అది చేయలేదు.”

258 ఆయన దానిని మరలా చేశాడు; ఆమె అది చేయలేదు. ఆమె నిరాకరణ, లేక ఆమె నిరాకరణ సాతాను ఆమెలోకి వచ్చి అవతారమెత్తుటకు పరిపూర్ణ మార్గము ఏర్పరచెను. ఔను. ఆమెలోనే తాను అవతారమెత్తెను, ఎందుకనగా ఆమె వాక్యమును నిరాకరించెను. మరియు ఖచ్చితంగా ఆ విధముగనే ప్రొటస్టెంట్ సంఘములో జరిగి ఒక వేశ్యగా మారింది. ఎందుకనగా రుజువుచేయబడిన దేవుని వాక్య సత్యమును ఆమె తృణీకరించినది. అది సాతాను లోపలకు వచ్చుటకు, తనకుతాను అవతారమెత్తుటకు అవకాశము పొందింది. అక్కడ వారందరు కలసికూడుకొనినపుడు మృగమునకు అతడు ప్రతిమను చేయును, ఆయన ఖచ్చితంగా ఏమి చెప్పాడో ఆలాగే జరుగుచున్నది. ఔను. ఆమేన్.

259 నాకు విద్య యున్నట్లయితే, నేనది తెచ్చేవాడను. నాకు ఏలాటి విద్యలేదు. మీకు దానిని బయలుపరచుటకు పరిశుద్ధాత్మనే ఎదురుచూచుచున్నాను. ఎవరికి ఆయన చేయునో…ఔను. ఆయన చేయును. ఔను…గమనించు.

260 ఆమె ఇక్కడ ఏమి చేసిందో చూడు. ఆమె మారుమనస్సు నిమిత్తము, ఆమె దేవుని వర్తమానమును నిరాకరించినది. ఒక అంత్యక్రీస్తుగా ఆమె ప్రారంభించినది. ఆమె అదే. ఆమె ఒక అబద్ధ ప్రవక్తగా వచ్చినది, ఒక అవతారమెత్తిన దయ్యం. ఆమె అబద్ధ బోధతో ఆమె చేసినపుడు…తరువాత అంతటిలో కూడా దేవుడు మారుమనస్సు పొందుటకు ఆమెకు అవకాశమిచ్చాడు, ఆమెను సంపాదించుటకు ప్రయత్నించాడు.

261 చూశారా, ఎంతటి దీర్ఘశాంతమో! ఎంతటి ఆశ్చర్యకరమైన ప్రేమ! ఆలాటి ప్రేమ లేదు! వారిని చూడు, ఆయన ముఖము మీద ఉమ్మివేసిన వారిని, ఆయన వారిని క్షమించాడు. ఆయన దేవుడు. చూశారా. వద్దు…

262 దేవుని వర్తమానమును తృణీకరించుట. చూడు! ఆమె ఎక్కడైతే పడిపోయినదో అక్కడకు తిరిగివెళ్ళి మారుమనస్సు పొందవలెనని అడిగెను.

263 ఆమె ఎక్కడనుండి పడిపోయినది? వాక్యము నుండి. నిజం. ఎక్కడ నుండి హవ్వ పడిపోయినది? [సభ “వాక్యము” అని చెప్పినది.—సంపా.] వాక్యము! ఎక్కడ నుండి సంఘశాఖ పడిపోయినది? [“వాక్యము.”] అక్కడే నీవున్నావు. చూశారా? మరో మార్గము లేదు. ప్రతీసారి తిరిగి వాక్యమునొద్దకు, తిరిగి వాక్యము నొద్దకు. చూశారా? వాక్యమునకు దూరంగా పరుగెత్తిపోవు పద్ధతిలోకి వారు వస్తున్నారు. వాక్యము నొద్దకు కాకుండా వాక్యము నుండి పరుగెత్తుచున్నారు. గమనించు.

264 చూడు, వెనుకకు వెళ్ళుటకు, మారుమనస్సు పొందుటకు ఆమెకు సమయమివ్వబడెను. మారుమనస్సు అనగా అర్థం “వెనుకకు వెళ్ళుట, వెనుకకు తిరుగుట, ముందుకు కొనసాగుట.” మారుమనస్సు, “వెనుకకు వెళ్ళుట.” మరియు ఎచటి నుండి వచ్చినదో అచటకు తిరిగివెళ్ళుటకు సమయమివ్వబడెను…

265 ఇపుడు జ్ఞప్తించుకోండి! పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడిన అసలైన పెంతెకొస్తు సంఘము ఆమె. ఎంతమంది బైబిల్ విద్యార్థులకు తెలుసు అది? అవును. ఆమె ఆలాగు…ఆమె ఎక్కడ నుండి వెళ్ళినదో? ఆమె వాక్యము నుండి పడిపోయినది. మరియు మూఢ సిద్ధాంతాలను అంగీకరించినది. ఆమె…పరిశుద్ధాత్మకు బదులుగా, ఆమె పరిశుద్ధ మనుష్యుని కోరుకున్నది, “డాక్టర్ యల్ యల్., పి. హెచ్., క్యూ. యు,” ఆ పిదప అతనిని పోప్ గా చేసినది. చూశారా? ఖచ్చితం. అయితే, ఆమె అదే కోరుకున్నది. ఆమె కొరకు ఒక ప్రార్థించుట కోరుకున్నది. ఒకరు…ఆమె దానికొరకు ధనము చెల్లించుచున్నది. ఆమె చేయవలసినది అదే. చూశారా?

266 ఇపుడు, ఈ దినము అదే విషయం కూర్చుండుటకై ఒక కుర్చీ దొరికిన చాలు, కానుకల పాత్రలో అధిక ధనమును వేస్తారు. వారు, ఆ సంఘానికి సభ్యులు. దానిని గూర్చి వారికేమీ చెప్పవద్దు. వారు తెలుసుకొనవలసిన అవసరం లేదు. అది ఆమె కుమార్తెలు.

267 ఇపుడు, ఎక్కడినుండి ఆమె పడిపోయినది? ప్రవక్తల, అపొస్తలులు యొక్క అపొస్తలుల అసలు వాక్యము నుండి. అక్కడ నుండి ఆమె పడిపోయినది. ప్రొటస్టెంట్ అక్కడ నుండి పడిపోయినది.

268 మారుమనస్సు పొందు! వెనుకకు వెళ్ళు! మరింత ఆలస్యముగాక ముందే వెనుకకు వెళ్లు. ఈ ఒకానొక దినాలలో గొఱ్ఱెపిల్ల తన స్థానాన్ని విడిచిపెట్టును అటు తరువాత అంతా అయిపోతుంది. ఆమెతోపాటు తీర్పుతీర్చబడక మునుపు “తిరిగి రమ్మని” ఇపుడు ఆమె కుమార్తెలు అడుగబడుచున్నారు.

269 ఇపుడు, వారు పొందుచున్న ఈ ఆఖరి వర్తమానము, నేను మాట్లాడుచున్న ఈ ప్రవక్తదే. దానిని గురించి అనేక పుస్తకాలు చదువుచున్నాను. ఒక నిజమైన, మంచి తెలివైన, ఆత్మీయ వివేచనగల వ్యక్తులు అది వచ్చుచున్నదని తెలిసికొందురని నేను ఎరిగియున్నాను. అది వారికి తెలుసు. అది వస్తుందని వారికి తెలుసు. చూశారా. వారు…అయితే, దాని యొక్క ఇబ్బంది ఏదంటే, వారు చెప్పుతూ యుంటారు, “మాకది కావలసియున్నది, అది జరగవలసియున్నది.” యని. అది వచ్చునపుడు, వారెంతో సాధారణంగా ఉంటారు; మరొక కాలంలో పోగొట్టుకున్నట్లుగా బహుశా వారు దానిని పోగొట్టుకుంటారు. ఔను. జనులు దానిని గురించి వ్రాస్తారు మరియు ప్రతీదీ చేస్తారు. “ఓ, ఔను. అది అవసరం” అని చెప్తారు. అటు తరువాత సాక్ష్యాత్తు వారి ఎదురుగనే కనిపించినపుడు వారు వేరుగా వెళ్ళిపోతారు. చూశారా. కాబట్టి వారెళ్ళపుడు అది చేస్తారు.

270 ఇపుడు గమనించు, అసలైన వాక్యమును. వారు…వారు…ఆమె మారుమనస్సు పొందవలసియున్నది. వెనుకకు వెళ్ళుట. కాబట్టి ఆమె కుమార్తెలు అడగబడుచున్నారు. బలవంతంగా…వారు తీర్పుతీర్చబడతారు, అదే పడకలోకి త్రోయబడి ఆమెతో చంపబడతారు. అసలైన వాక్యము వైపునకు మరల్చబడి, అపొస్తలుల సిద్ధాంతము వైపునకు మరలమని అడుగబడుచున్నారు. అయితే, వారి సిద్ధాంతములు మొదలగు వాటివలన వారెంతగానో కట్టబడి, వారది చేయరు. వారు దానిని అపహాస్యము మాత్రం చేయుదురు.

271 తరువాత, వారేమి చేస్తారు? వారు చివరకు మృగము కొరకు ప్రతిమను చేస్తారు. మరొక అధికారము; గమనించు మరియు ప్రకటన 13:14లో, ఆమె చేసినట్లుగా గొఱ్ఱెపిల్ల యొక్క పెండ్లికుమార్తెగా నటించును. అదే వారు చేస్తారు. హింసిస్తారు. అదే విషయం. రోమ్ చేసినట్లు ఈ సంఘములు క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెను అపహాస్యం చేస్తారు. ఖచ్చితంగా. ఔనండి. ప్రకటన 13:14లో ఆమె చేసినట్లు నిజమైన గొఱ్ఱెపిల్ల యొక్క పెండ్లికుమార్తె యెడల ఖచ్చితంగా చేస్తారు.

272 ఇపుడు గమనించు. మనము చూస్తున్నాము దేవుని వాక్య వాగ్దానము చేత, ఆత్మ సంబంధమైన మరణముతో ఆయన ఆమె బిడ్డలను, సంఘశాఖలను, ఆమె కుమార్తెలను చంపును. ఇపుడు, అది ప్రకటన 2:22. అది మరచిపోవద్దు. చంపుట అనగా మరణమునకు పెట్టుట. మరణమనగా “దేవుని సన్నిధానము నుండి నిత్య ఎడబాటు.” స్నేహితులారా, అది ఆలోచించండి. దానిని గూర్చి ఆలోచించు, ఏలాటి మనుష్య కల్పిత భక్తిని నమ్మవద్దు. వాక్యానికి విరుద్ధమైన దేని నుండియైనా, దానికి నీవు దూరంగా ఉండు.

273 ఇపుడు గమనించు, ఇక్కడున్న బైబిల్ గ్రంథములో గమనించు. అతని పేరు పాతాళమని పిలవబడుచున్నది, మరియు…నా భావము:

…అతని పేరు మృత్యువు, మరియు పాతాళ లోకము వానిని వెంబడించెను.

274 ఇపుడు పాతాళలోకమెప్పుడు మరణమును వెంబడిస్తుంది, ప్రకృతి సంబంధముగా. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు చనిపోతే పాతాళము అతనిని వెంబడిస్తుంది; అనగా అది సమాధి, పాతాళము, చూశారా అది ప్రకృతి సంబంధముగా. అయితే ఆత్మ సంబంధముగా అది అగ్నిగుండము, చూశారా. సరే. నిత్య ఎడబాటులోనికి, అక్కడ వారు కాల్చబడెదరు.

275 మరియు—మరియు మలాకీ 4 చెప్తుంది, “చివరకు కొమ్మనుగాని, మొద్దునుగాని లేక దేనిని వదలదు.” ఆ విధముగనే, ప్రపంచం వెయ్యేండ్ల పరిపాలనకై తనకుతాను శుద్ధీకరించుకొనును. చూశారా?

276 మీరు గమనించారా, స్వారీచేయువాడు “అతడు?” మరియు “అతడు” “అతని” చేతిలో; “పురుషుడు,” అబద్ధ ప్రవక్త. అయితే అతని పెండ్లికుమార్తె సంఘముగా పిలువబడుచున్నది, “ఆమె,” యెజెబెలు. ఆహాబు; యెజెబెలు. ఎందుకని, అది చాలా తేటగా ఉన్నది. చూశారా? చూశారా?

277 కుమార్తెలు కూడా “ఆమె,” అయితే ఒక మానవుని నాయకత్వము ఎన్నడూ స్వీకరించలేదు. ప్రొటస్టెంట్ లు, అయితే వారి యొక్క సిద్ధాంతములోను, సంఘశాఖలోను, పద్ధతులలోను, ఇంకా వేశ్య. అది…అదే అది చెప్తుంది.

278 గమనించండి. ఇదంతా ఎక్కడకు వచ్చుచున్నది? ఇపుడు మనకు సుమారు పండ్రెండు పద్నాలుగు నిముషాలు మనకున్నవని అనుకుంటున్నాను. ఇదంతా ఎక్కడకు వెళ్ళుచున్నదో చూడు. అదేంటి. అది వచ్చిన దారినే నేరుగా వెనుకకు వెళ్తుంది. పరలోకంలో ప్రారంభమైనది. అది అంత్యకాలయుద్ధం వరకు వచ్చుచున్నది.

279 పరలోకంలో మొదటి విషయం యుద్ధం. లూసిఫర్ బయటకు త్రోయబడి భూమికి వచ్చాడు. తరువాత అతడు ఏదెనును కలుషితం చేశాడు. అటు తరువాత, అప్పటి నుండి కలుషితం చేస్తూనే ఉన్నాడు. మరియు ఇపుడు, పరలోకములో యుద్ధము మొదట, అదే యుద్ధము ఇపుడు భూమి పైకి వచ్చుచున్నది; మరియు అది భూమి మీద, అంత్యకాలములో హార్మెగిద్దోను అని పిలువబడు యుద్ధములో ముగియును. ఇపుడు అది ఎవరికైనా తెలియును. పరలోకములో యుద్ధము ప్రారంభమైనది. పరిశుద్ధమైనదిగా, కనుక వారు బయటకు నెట్టివేశారు. మిఖాయేలు ఆయన దూతలు వానిని క్రిందకు నెట్టివేసిరి. పరుగెత్తిపోయాడు. మరియు వారది చేసినపుడు ఏదెనులో పడ్డాడు. ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించాడు. కలసి…

280 దేవుడు, వాక్యమను కంచెను తన బిడ్డల చుట్టునుంచెను. మరియు హవ్వ, తన మెడను చాచి, “బహుశా నీవు నిజమేనని నేను నమ్ముచున్నాను,” అని చెప్పినది. మరియు ఆ విధముగానే కొనసాగినది. అది ఆలాగే జరుగుచున్నది. తరువాత దేవుడు దిగివచ్చి…ఎవరు దిగివస్తారో వారి కొరకు ఆయన దిగివచ్చెను.

281 నేను చెప్పినట్లుగా దేవుడు ఒక పెద్ద కాంట్రాక్టరు లాంటివాడు. ఆయన తన సామగ్రినంత కూర్చుకొని ఆ తరువాత ఆయన కట్టడాలను కట్టును. ఇపుడు జ్ఞప్తించుకోండి, భూమి మీద ఒక విత్తనపు గింజ లేక మునుపు, సూర్యుడు భూమిని తాకక మునుపు, నీ దేహము భూమి మీద పెట్టబడియున్నది. ఎందుకనగా నీవు భూమి యొక్క ధూళివైయున్నావు. చూశారా? నీవున్నావు. దేవుడు కాంట్రాక్టరు.

282 ఇపుడు, ఆయన ఆదామును ఏ విధముగా సృజించెనో ఆ విధముగనే చేయుటకు ఆయన క్రిందికి వచ్చును (ఆదామును చేసిన విధముగా) ఆయన కొద్దిగా కాల్షియం, పొటాష్ మరియు సూర్యకాంతి తీసుకొని మరియు “వ్యూ!” అని చెప్పి, “ఇదిగో నా యొక్క మరియొక కుమారుడు” అని చెప్పును. చూశారా? అటు తరువాత ఇంకొంత మందిని తెచ్చియుండును మరియు “వ్యూ!” “అక్కడ ఇంకా కొందరు.”

283 అయితే హవ్వ ఏమి చేసినది? ఆమె ఆ మార్గాన్ని చెరిపివేసినది. మరియు ఆమె దానిని లైంగిక చర్య ద్వారా తెచ్చినది. అప్పుడు మరణము దానిని తాకినది.

284 ఇపుడు, దేవుడు ఏమి చేయుచున్నాడు. ముందుగా నిర్ణయించబడిన విత్తనములు అనేకములు ఆయన కలిగియున్నాడు; అనేకములు, ముందుగా నిర్ణయించబడినవి. ఆ తరువాత, అంత్యకాలములో, “హవ్వ, వచ్చి ఇంకొక బిడ్డను కను” అని ఆయన చెప్పడు. ఆయన (“వ్యూ!”) పిలువగా, నేను జవాబిస్తాను. అంతే. అది అదే. అదే ఉద్దేశ్యము. ఆ ఆఖరిది లోపలకు వచ్చినపుడు అది సమాప్తమగును.

285 ఇపుడు, యుద్ధము పరలోకములో ప్రారంభమైనది. హార్మెగిద్దోను రూపమున భూమి మీద సమాప్తమగును.

286 ఇపుడు మనము గమనించి అది తెరువబడుటను చూద్దాం. బహుశా మనము అది తెరువగలము. ఇది ఇపుడు చేయుటకు ప్రభువు మనకు సహాయము చేయును. ఇది తెరువబడుట గమనించు.

287 ఆ మర్మమైన స్వారీచేయువాడు అతడు ఇపుడు ఏమి చేశాడో గమనించు; “వ్యతిరేకించుచున్నాడు,” మారుమనస్సు పొందుటకు తిరస్కరించుచున్నాడు. అసలైన రక్తపు వాక్యము నొద్దకు వెళ్ళుటకు తిరస్కరించుచున్నాడు. వాక్యము రక్త మాంసము లాయెను. చూశారా? దానియొద్దకు వెళ్ళుటకు అతడు తిరస్కరించెను. అది అంత్యక్రీస్తా! నిజమైన వాక్య పెండ్లికుమార్తె…నిజమైన వాక్య పెండ్లికుమార్తెకు వ్యతిరేకిగానున్నాడు. తన స్వంత పెండ్లికుమార్తెను తీసుకొనియున్నాడు. ఈ నిజమైన పెండ్లికుమార్తెను వ్యతిరేకించుచున్నాడు. అతడు తన స్వంత పెండ్లికుమార్తెను తీసుకుంటున్నాడు. మూఢభక్తి, మూఢ సిద్ధాంతములుగా పిలువబడు భక్తి రూపమున ఆమెను తన యొద్దకు తీసుకొని వచ్చుచున్నాడు. చూశారా? మరిపుడు పరిశుద్ధ పెండ్లికుమార్తెను చూచుచు, అతడు ఆమెకు వ్యతిరేకముగా ఉన్నాడు. అయితే, క్రీస్తుకు విరుద్ధమైన అంత్యక్రీస్తు బోధ వలన అంత్యక్రీస్తు అను తన స్వంత పెండ్లికుమార్తెను అతడు రూపొందించియున్నాడు. ఎంతటి యుక్తిపరుడో చూడండి. మరియు ఇపుడు, ప్రేమ ఐక్యత రక్తము క్రింద ఆరాధన ఆధీనమందు యుండుటకు బదులు, అతడు సంఘశాఖను కలిగియున్నాడు. వాక్యము కలిగియుండుటకు బదులు, అతడు మూఢ సిద్ధాంతములను, మూఢ భక్తిని మొదలగునవి కలిగియున్నాడు.

288 ప్రొటస్టెంట్ చెప్తున్నట్లుగా, “అపొస్తలుల మూఢ సిద్ధాంతమని.” బైబిల్ గ్రంథములో మీరు దానియొక్క మాట చూపించగోరుతాను. అపొస్తలుడు, అపొస్తలుల మూఢభక్తి (అపొస్తలుల Creed బైబిల్ లో లేదు).

289 కొంచెము కాలం క్రితం నేనిక్కడే చెప్పినట్లు, లేక ఇంకొక చోట చెప్పినట్లు. అపొస్తలులకు ఒక మూఢ సిద్ధాంతముంటే, అది అపొస్తలుల కార్యములు 2:38. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వారికున్నది అదే. ప్రతియొక్కరు చేయవలెనని దానినే వారు చెప్పారు. క్రైస్తవులుగా కనిపిస్తున్న వారిలో ఒకరిని కనుగొని అతడు అడిగాడు, “నీవు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మను పొందితివా యని?”

చెప్పాడు, “ఉన్నదని మాకు తెలియదు…”

అడిగాడు “ఆలాగైతే మీరెలాగు బాప్తిస్మము పొందారు?”

290 ఇపుడు, యేసు నామములో, లేక ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట అది మంచిది, అయితే దానితో సరిపోదు. లేదండి. ఆ విధముగా యాభై సార్లు బాప్తిస్మము పొందు. ఆ హృదయం పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెందువరకు కొంచెమైనను ప్రయోజనముండదు. అదంతా కలసి ఒక్కటిగా జరుగవలెను. గమనించు, అది—అది క్రీస్తు!

291 అంత్యక్రీస్తు నిజమైన పెండ్లికుమార్తె సిద్ధాంతమును తిరస్కరించును, కాబట్టి, ఇపుడు తన యొక్క స్వంత పెండ్లికుమార్తెను తీసికొని, తన స్వంత భక్తి చేత ఆమెను కట్టును. తన స్వంత పెండ్లికుమార్తెను తీసుకొని సంఘశాఖగా తయారుచేయును. ఈ పరిశుద్ధ లేఖనములలో నిర్వచింపబడినట్లు ఆమె కుమార్తెలను కనును. ఆమె ఇతర సంఘశాఖలను కనును. ఆమె…ఆమె, ఆమె తల్లి వలె ప్రకృతిసంబంధమైన, లోకసంబంధమైన, సంఘశాఖ సంబంధిగా తయారగును. ఆత్మసంబంధమైన పెండ్లికుమార్తెను, వాక్యమును వ్యతిరేకించును.

292 సంఘానికి సంబంధించిన వారము కాదని వారు చెప్పరు. ఒక సంఘశాఖ వ్యక్తితో నీవు మాట్లాడు. “ఔను, నేను సంఘానికి చెందినవాడను.” నీవు క్రైస్తవుడవా? “నేను సంఘానికి సంబంధించినవాడను!” దానితో ఏ ఒక్క సంబంధం లేదు. వారు చెప్తారు, నీవు సంఘానికి సంబంధించి…సంఘమని పిలువబడు దానికి నీవు సంబంధం కలిగియుండవచ్చు. చూడు. అది సంఘము కాదు. అవి సంఘాలు కాదు. అవి ప్రజలు ఒకటిగా కూడుకొను బాడుగ ఇళ్లు. “ఏ గూటికి చెందిన పక్షులు ఆ గూటికే చేరునట్లు” ప్రజలుంటారు.

293 అయితే, మీరు ఒకే ఒక సంఘమైయున్నారు. మరి అది మర్మమైన క్రీస్తు శరీరము. మీరు అందులో చేరనవసరం లేదు. మీరు అందులో జన్మించారు.

294 నేనెల్లపుడు చెప్తున్నట్లుగా, నేను యాభై మూడు సంవత్సరముల నుండి బ్రెన్హాం కుటుంబంలో యుంటున్నాను. నేనెన్నడూ చేరలేదు. నేనందులో జన్మించాను. ఔనా?

295 ఇపుడు గమనించు. అది చక్కగా పోల్చబడినది. నేను—నేను లేఖనము ఇక్కడ వ్రాయబడినది, అయితే నేను అందులోకి వెళ్ళుటకు మనకు సమయం లేదు; ఏశావు, యాకోబు వలె.

296 ఇపుడు, ఏశావు ఒక మతసంబంధమైన మనిషి, అతడొక అవిశ్వాసి యని చెప్పుకోలేదు. యాకోబు నమ్మిన అదే దేవుని అతడు నమ్మాడు. తన తండ్రి నమ్మిన అదే దేవుని. అయితే అతడు ఒక బిడియం గలవాడు లేక అలా చెప్పినందుకు క్షమించండి. అతడు మంచివాడు కాదు. నైతికంగా చూచిన యెడల అతడు యాకోబు కంటే ఎక్కువగా నైతిక విలువగల మనిషి. అయితే, మీరు చూడండి, అతడు…“ఓ, జ్యేష్ఠత్వపు హక్కు వలన ఏమి ప్రయోజనము?” అతని జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేశాడు. చూశారా?

297 అయితే, యాకోబు, అతనికేమి గొప్ప విషయాలు లేవు, ఏశావుకు ఉన్నట్లుగా. అతనికున్న స్వాస్థ్యము ఇతనికి లేదు. అయితే, యాకోబు కోరినది యొకటి, అది జ్యేష్ఠత్వము. అది ఏలాగు పొందుకొనునది, అతడు లెక్కచేయలేదు; అతడు పొందుకోబోవుచుండెను. దేవుడు అతనిని గౌరవించాడు.

298 మరియు, అటు తరువాత, అదే విషయం ఈనాడు, ప్రకృతి సంబంధియైన మనుష్యుడు, శరీర సంబంధియైన మనుష్యుడు, లోక సంబంధి. “సరే, రాష్ట్ర సంఘానికి నేను సంబంధించాను. ఈ సంఘానికి నేను సంబంధించాను. నేను దానికి సంబంధించాను.” అది దానితో ఏలాటి సంబంధం లేదు. ఏ ఒక్క విషయానికి.

299 గమనించు, తన మిశ్రమ రంగుల గుఱ్ఱంపై నుండి వారిని ప్రోగుచేయుచున్నాడు. తన యొక్క మిశ్రమ రంగుల గుఱ్ఱం మీద యుండి అతడు వారిని సమకూర్చుచున్నాడు. ఎందుకనగా అతడు రాజకీయ అధికారమును కలిగియున్నాడు.

300 అతడు కలిగియున్నాడని నీవు నమ్మవా? ఇపుడు ఈ అధ్యక్షుడు ఏలాగు వచ్చాడు? ఏ విధముగా ఎన్నుకొనబడియున్నాడు? దానిని మీరెలాగు జారవిడచారు? ఊహుఁ! మత స్వేచ్ఛ కొరకు ఇక్కడకు వచ్చారు, డెమొక్రాట్స్ లైన మీరు జ్యేష్ఠత్వపు హక్కును రాజకీయాలకు అమ్ము మీరు! నేను…డెమొక్రాట్ పార్టీ సరియే. అవి రెండూ మురిగిపోయినవి. క్రైస్తవ్యాన్ని గూర్చి నేను మాట్లాడుతున్నది. అయితే, మీ యొక్క జ్యేష్ఠత్వ హక్కులను మీరు అమ్మివేస్తారు. మీకది సిగ్గు.

301 ఖచ్చితంగా, ఈ దేశము ఇశ్రాయేలు దేశమునకు పోలికగానున్నదని మీరు గ్రహించుటలేదా? ఇశ్రాయేలు ఏమి చేసినది? ఆమె క్రొత్త దేశమునకు వచ్చి, అక్కడ నివాసులైనవారిని పట్టుకొని చంపి, వెళ్ళి, దేశాన్ని స్వతంత్రించుకున్నది. అదీ మనము చేసినది; ఇండియన్లను. అక్కడున్న నిజమైన అమెరికన్లు వారే, వారు మన ఇండియా స్నేహితులు.

302 మరియు అటు తరువాత వారేం చేశారు? ఇశ్రాయేలుకు కొద్దిమంది గొప్ప మనుష్యులున్నారు. మొదటి విషయమేంటో తెలుసా…వారికి దావీదు ఉన్నాడు. వారికి సొలొమోను ఉన్నాడు. వారికి గొప్పవారున్నారు. చివరకు వారికి దుర్మార్గులు యున్నారు, ఒక అవిశ్వాసిని పెండ్లిచేసుకున్న ఆహాబు ఉన్నాడు.

303 సరే. ఆలాటిదే మనము చేశాము. మనకు వాషింగ్టన్ మరియు లింకన్ ఉన్నారు. అయితే ఇపుడు మనకు ఎవరున్నారో చూడు. ప్రాముఖ్యమైన విషయము అతడు యెజెబెలును పెండ్లి చేసుకున్నాడు. అతడు ఒకవేళ మంచి మనిషిగా ఉండవచ్చునేమో. అయితే వ్యవహారమంతా ఆమె నడిపిస్తుంది. మరియు మీరు ఇపుడు అది చూస్తున్నారు. కుటుంబమంతా లోనికి వచ్చుచున్నది.

304 ముప్పై ఐదు సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్మ నాకు ఏమిచెప్పెను? అంతమునకు ముందు ఏడు సంగతులు జరుగునని, అందును గూర్చి పాతకాలపు వారగు మీకు తెలుసు. మరియు ఇది ఆఖరిది. చివరి సంభవమునకు ముందు జరుగు సంభవమునైయున్నది. యుద్ధములు గూర్చి మరియు ఇతరత్రా కార్యములు గూర్చి ప్రతీది ఖచ్చితముగా ఆలాగే జరిగినది. చూశారా? ఇపుడు, దేశాన్ని పరిపాలించుటకు ఆమె స్త్రీ హస్తాల్లో ఉన్నది. యెజెబెలు! చూశారా.

305 అయితే జ్ఞప్తించుకోండి, యెజెబెలు దినాలలో, వారి రంగులను గూర్చి ఒకరు వారికి చెప్పారు! చూశారా?

306 మిశ్రిత రంగు గుఱ్ఱం పైకి ఎక్కి జనులను సమకూర్చుచున్నాడు. మరియు చూడండి. అతడు ఈ కార్యములను మూఢభక్తితో, సంఘశాఖతో మానవ కల్పిత సిద్ధాంతములతో కలుపుతూ మిశ్రమము చేయుచున్నాడు. ఔనది నిజమా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఖచ్చితం. ఒక మిశ్రిత రంగు, మరణము యొక్క మిశ్రిత రంగులు. లోకపోకడగల పాండురవర్ణ గుఱ్ఱం. ఓ, మై, వాక్యము యొక్క పరిశుద్ధ రక్తము లేదు. ఎప్పటికి లేదు!

307 మరియు గమనించండి. నుండి…“భూమి యొక్క నలుదిక్కుల నుండి, వారిని ప్రోగుచేశారు; హార్మెగిద్దోనుకు సమకూర్చారు,” బైబిలు చెప్తుంది. నేను వ్రాసికొనియున్న ఈ లేఖనములను గూర్చి నేను తలంచుకొనుచున్నాను. నేను వాటిని చదువుటలేదు. అయితే అవి ఎక్కడ వ్రాయబడియున్నవో అవేంటియని చూచుచున్నాను. “ప్రభువైన దేవుని గొప్ప యుద్ధ దినము కొరకు వారిని ఒకటిగా కూర్చుచున్నది.” గమనించండి. ఇపుడు, ఈ యొక్క మిశ్రిత రంగులతో కూడి, లోకసంబంధమైన, పాండుర వర్ణ, చీకిపోయిన గుఱ్ఱం, దానిని గూర్చి ఆలోచన చేయ్; తెలుసా, అది హీనకరమైనది. ఇపుడు గమనించు వారిని ఎక్కడ నుండి ప్రోగుచేయునో, “భూమి యొక్క నాలుగు మూలల నుండి.” ఇపుడు ప్రదర్శన కొరకు వారు కూడుచున్నారు. వాక్య ప్రకారముగా ప్రదర్శన “హార్మెగిద్దోను” అను చోటు యుంటుంది. చూశారా?

308 పాండుర వర్ణ గుఱ్ఱం పై, దానిమీద స్వారీ చేస్తూ “మరణము” దానిపై ఒక పేరుయున్నది “మరణము,” అంత్యక్రీస్తు! విను. అంత్యక్రీస్తు మొదటి సంఘశాఖ (దానిలో వాగ్వాదము లేదు); అతని యొక్క యెజెబెలు తో, వాక్యమునకు ఒక వేశ్య, ఆమె కుమార్తెలతో, ఆమెతో, ప్రొటస్టెంట్ లు వారందరు ఇపుడు ఐక్యపడుటకు కూడుకొనుచున్నారు.

309 గతదినము బాప్టిస్టు వారు ఇక్కడ అన్నది మీరు విన్నారా, మీకు తెలియునా? ఊ? “ఓ, మేము వారితో కలవము అయితే మేము—మేము వారితో సన్నిహితంగాను, స్నేహంగా ఉంటాము. వారి సంఘములో మేము చేరనవసరం లేదు, అయితే…” అక్కడే మీరున్నారు. ఖచ్చితంగా వాక్యము ఏమి చెప్పిందో ఆలాగు అక్కడ మీరున్నారు. చూశారా? చూశారా? ముసలి వేశ్య. మొదటి స్థానములో యుండుట, చూడండి.

310 ఇప్పుడు ఇక్కడవారు, తమకుతాము గుఱ్ఱం పై స్వారీచేయుచు, ఒక గుఱ్ఱం తెల్లగా, ఒక గుఱ్ఱం ఎర్రగా, ఒక గుఱ్ఱం నలుపుగా. మూడు వ్యత్యాసకరమైనవి: రాజకీయ—రాజకీయ శక్తి, ఆత్మీయ శక్తి, అంత్యక్రీస్తుయైన దయ్యపు శక్తి చేత ఆధీనములో ఉండును. అవన్ని కలిపితే, నీకు పాండురవర్ణ రంగు వస్తుంది. హీనమైన రూపము గల వస్తువు పైన అతడు స్వారీ చేస్తున్నాడు. ఔను. ఇపుడు గమనించు, దేని మీద అతడు స్వారీచేయుచున్నాడో గమనించు. ఈ పాండుర వర్ణముగా కనిపించు, నలుపు ఎరుపు మరియు తెలుపుతో మిశ్రమ రంగైన పాలిపోయిన రంగు గల గుఱ్ఱంపై అతడు వచ్చును ఆకాశము క్రింద నుండు ప్రతి దేశము నుండి తన ప్రజలను ప్రోగుచేయుచు స్వారీచేయుచున్నాడు. దానియేలు కలకు అర్థం చెప్పలేదా మరియు రోమ్ యొక్క ఇనుప రాజ్యములో ప్రతి చోట అది ప్రవేశించుట లేదా? ఇచట వారు వచ్చుచు ఏకముగా కూడుకొనుచున్నారు.

ఇపుడు ముగింపులో, నెమ్మదిగా కూర్చొండి. ఒక్క నిముషము జాగ్రత్తగా వినండి.

311 ఇపుడు అది చేయుటకు, పాండుర వర్ణ, బలహీనమైన, మూడు రంగుల మిశ్రిత గుఱ్ఱం పైన సవారీ చేయువాడు తన యొక్క ప్రజలను భూమిలోని నాలుగు మూలల నుండి ఏకముగా సమకూర్చుచున్నాడు. అదే మనిషి.

312 ఇపుడు, ప్రకటన 19, అతడు సిద్ధపడుట మాత్రమే కాకుండా, అతనిని కలసుకొనుటకు క్రీస్తు కూడా సిద్ధపడుచున్నాడు. యుద్ధం భారమైనదిగాను, ఘోరమైనదిగాను యుండబోతున్నది. క్రీస్తు, ప్రకటన 19 లో. క్రీస్తు తనవారిని కూర్చునది, భూమి యొక్క నాలుగు మూలల నుండి కాదు. ఎందుకంటే, కొద్దిమంది శేషము మాత్రమే యుంటారు. ఆయన ఏమి చేయుచున్నాడు? పరలోకము యొక్క నాలుగు దిక్కుల నుండి ఆయన వారిని ప్రోగుచేయుచున్నాడు? పరలోకము యొక్క నాలుగు దిక్కుల నుండి ఆయన వారిని ప్రోగుచేయుచున్నాడు. మనము వారిని చూద్దాం, “బలిపీఠము క్రిందనున్న ఆత్మలు,” అది సరియా కాదా, అని రేపు రాత్రికి మీరు చూస్తారు. పరలోకము యొక్క నాలుగు మూలలు; హిమము వలె తెల్లగానున్న గుఱ్ఱంపై వచ్చును.

313 ఆయనకొక పేరు కూడా ఉన్నది, మరణము కాదు. అయితే “దేవుని యొక్క వాక్యము,” జీవము. ఆమేన్. ఇక్కడ ఆయన తొడ మీద వ్రాయబడియున్నది. “దేవుని యొక్క వాక్యము.” అదొకటి మాత్రమే జీవము. నిత్యజీవానికి దేవుడు మాత్రమే ఆధారము కనుక. జోయి. ఔనా? [సభ, “ఆమేన్” అని చెప్పింది.—సంపా.]

314 మరియు తెల్లని గుఱ్ఱంపై స్వారీచేయుచు, ఆయనపై “జీవము,” అని వ్రాయబడియున్నది; మూడు వేర్వేరు బలములతో మిళితమై “మరణము” అని పిలువబడు ఒక మనుష్యుడు ఇక్కడున్నాడు. భూసంబంధమైన ప్రతినిధులను సమకూర్చుచున్నాడు; మరియు క్రీస్తు పరలోక సంబంధముగా పుట్టిన పౌరులను, భక్తులను సమకూర్చుచున్నాడు. అతనిపై “మరణము” అని వ్రాయబడినది; క్రీస్తుకు, ఆయనపై “జీవము” అని వ్రాయబడినది.

315 ఆయనతో ఉన్నవారు కూడా “భూమికి పునాది వేయబడకముందే ఎన్నుకోబడినవారు.” ఆమేన్! వారు వాక్యానికి నమ్మకస్తులు. ఆమేన్! వ్యూ! నేనది ఇష్టపడుచున్నాను. “పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, లోకము పుట్టకమునుపు.” అటు తరువాత వాక్యానికి నమ్మకస్తులు, వారి ఎన్నికను బట్టి, అంతా క్రొత్త ద్రాక్షారసముతోను, నూనెతోను ఉత్తేజితులైయున్నారు. నేరుగా స్వారీచేయుచు అతని ఎదుర్కొనుటకు వచ్చుచున్నారు. ఉరుములు త్వరలో బయలుపరచునని దానిని వారు ఎరిగినవారైయున్నారు. చూశారా?

316 గమనించండి. ఆయన ఏ విధముగా చేయును? కాబట్టి, ఆయన వాక్యమైనట్లయితే మరియు ఆయన నామము వాక్యమైనట్లయితే, ఆలాటప్పుడు వాక్యము జీవము. అంత్యక్రీస్తు; ఏది వ్యతిరిక్తమో “అది విరుద్ధమే,” కనుక anti అనగా “విరుద్ధము,” క్రీస్తుకు వాక్యమునకు. కాబట్టి, అది మూఢభక్తి కావలసియున్నది, లేక సంఘశాఖ, వాక్యానికి విరుద్ధము.

317 ఎందువలన దానిని మీరేలాగు గ్రహించలేకపోవుచున్నారో నాకు తెలియదు. మీరు—మీరు అది అర్థం చేసుకుంటే, ఏలాగు అది పోగొట్టుకుంటారు. మీరు అది ఏలాగు పోగొట్టుకుంటారో నాకు తెలియదు.

318 అది నిజం. Anti అనగా “విరోధము.” ఔనా? “తీసివేయుట.” అది ఆ విధముగా ఉన్నాడు. అతడు అతని మిశ్రిత రంగు గుఱ్ఱం మీద స్వారీచేయుచున్నాడు. దానిని ఇక్కడే నేరుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాము.

319 అక్కడ ఏడు సంఘకాలాలలో మనము చూశాము. ఇక్కడ ఆయన ముద్రలలో తీసుకొనివచ్చి, తెరచి సంఘకాలములలో సంభవించుచున్న కార్యములను వారికి చూపించుచున్నాడు.

320 యాంటి అనగా వాక్యమునకు “విరుద్ధము.” చూడు! ఎందుకని మూఢ సిద్ధాంతములకు సంఘశాఖలకు మనమంతా వ్యతిరేకము. ఎందుకనగా అవి వాక్యానికి విరుద్ధము. చూశారా?

321 జీవము మరియు మరణము, చివరి పోరాటమునకు వచ్చుట మనము చూస్తున్నాము. నిజమైన జీవము తెల్లని గుఱ్ఱం; మిశ్రిత మూఢభక్తి పాండురవర్ణ గుఱ్ఱం. నిజమైన ప్రదర్శనకు వచ్చుట అవి చూపించుచున్నది.

322 ఇపుడు ఇక్కడ ఒకటి చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది మీరు నమ్మకపోవచ్చు. అయితే అది నిశ్చయమైనట్టు నేను చూశాను. అసలైన ఒకే ఒక రంగు ఉన్నది, అది తెలుపు. ఎంతమందికి అది తెలుసు? ఒకే ఒక అసలైన రంగు. మరేదైనను మిశ్రితమే.

323 క్రీస్తు స్థిరమైన తెలుపు మీద, ప్రారంభం నుండి కలుషితము లేని వాక్యముపైన ఉన్నాడు. ఆమేన్! ఆమేన్! వాటిలో రసాయనిక క్రియ జరగనట్లయితే ప్రతి రంగు తెలుపు. ఆమేన్! మహిమ! సంఘ తెగలు, సంఘశాఖలు దానిలో కలవకుండా యుండిన యెడల, ప్రతియొక్క సంఘము దేవుని యొక్క వాక్యము యొక్క అపొస్తలుల సిద్ధాంతం పైనే నిలబడి యుండెడివి. మరియు దేవుడు దానిని నిర్ధారణ చేసియుండును. అక్కడే మీరున్నారు.

ఓ, సహోదరుడా ఈవాన్స్, నేనిపుడు మంచిగా భావిస్తున్నాను. ఔనండి. ఔనండి.

324 ఒకేయొక అసలైన రంగు. అది తెలుపు. అది—అది సంఘశాఖలతో గానీ లేక మూఢభక్తితోగానీ కలవదు. ఔనండి.

325 మరియు, జ్ఞప్తించుకోండి. ఆయన భక్తులు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్నారు. సంఘశాఖల మూఢభక్తితో కాదు. మనము కనుగొన్నాము, సంఘశాఖల మూఢభక్తి, ఇక్కడే మీ మిశ్రమ రంగులు మీరు పొందుకుంటుంది. అయితే, ఆయన స్వారీచేయు అసలైన రంగు ఇదే, అసలైన రంగే ఆయన ప్రజలపైనున్నది. అవి రక్తములో ముంచబడి, వస్త్రము శుద్ధిచేయబడి నేరుగా వెనుకకు పంపబడినది. చూశారా? ఔనది నిజం.

మిశ్రమమునకు లోనైనవారు పాండుర రంగుగా మారి మరియు మరణమునకు లోనౌదురు.

326 ఇది వంకరవుతున్నది, తిరిగిపోవుట, తెలుపుతో రంగులు కలుపుట; అసలు రంగును నీవు త్రిప్పివేయుచున్నావు. ఔను. అసలైన రంగు, ఒకే రంగు తెలుపైతే దానితో ఒకదానిని నీవు కలిపితే, అసలైన దానిని నీవు త్రిప్పివేస్తున్నావు. ఆమేన్. ఔనా?

327 మరియు, ఆయన తెల్లని గుఱ్ఱం అయిన యెడల, ఏదైన మూఢభక్తిని కలిపినట్లయితే, ఒక్కమాటను కలిపితే, దానినుండి ఒక్క వాక్యమును తీసివేస్తే, సమస్తమును తారుమారు చేసినట్లే. ఓ, మై! నన్ను వాక్యముతో ఉంచుము, ప్రభువా!

328 సత్యము మరియు తప్పు! ఓ, మై! అది ఎంతమంచిగా ఉన్నప్పటికీ…సత్యము, తప్పు కలవవు. అది కలవదు. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యని గాని లేక అది తప్పు. దాన్ని గూర్చి హోలీ ఫాదర్ ఏమి చెప్పినా, సెయింట్ బోనిఫెర్ గాని లేక కాంటర్ బరీ ఆర్చ్ బిషప్ గాని, అదెవరు చెప్పినా నాకు తెలియదు. అది వాక్యానికి వ్యతిరేకమైతే, అది తారుమారే. అది కలవదు. “అతనెందుకు చేశాడు…” అతడేమి చేసినా నాకు లెక్కలేదు. అతడెంతటి పరిశుద్ధుడైనా లేక ఆలాటిది ఏలాటిదైనా. మనము కలిగియున్న సరళమైన సత్యము ఇదే. దీనికి ఆవల అది యున్నట్లయితే ఏ సంఘమునకైనను, ఏ సిద్ధాంతమునకైనను సత్యములేదు.

329 అది కలిగిన ఒకటి నాకు చూపించు. మీరు చెప్పాలని అడుగుచున్నాను. బైబిల్ లో ఒక పుటను త్రిప్పి మీకు ఒకటి చూపిస్తాను. సరేనా? ఒక దానిని చూపించండి. మీరు చెబుతారు “పెంతెకొస్తులు” అని. ఓ, మై! అక్కడున్న ఒకరి ద్వారా నేను ఈ విషయాన్ని పట్టుకోగలుగుచున్నాను. ఆ హేతువుచేత నేనది చెప్పాను, ఇప్పుడే దానిని వదిలిపెట్టు. ఎందుకనగా అది గాయము కలిగించుట నేను చూచుచున్నాను. నేను మిమ్ములను గాయపరచవలెనని అనుకొనుట లేదు. అయితే దానిని గూర్చి మీరు ఏమి తలంచుచున్నారో నాకు తెలియునని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ఔను.

330 ఎవరైతే కలిశారో, (విరుద్ధమైనవారు) మరణించిరి. అసలైన దానితో నీవు ఏదైనా మిశ్రమము చేస్తే మరణ రంగును వారు మార్చుచున్నారు.

331 ఆవగింజను గూర్చి క్రీస్తు చెప్పినట్లు అది ఉంటుంది. అయినప్పటికీ, విత్తనములన్నిటిలో అది చిన్నది. అయితే అది దేనితో కలవదు. ఆవగింజ మిశ్రమము కాదు. అతడు అసలైన ఆవగింజ. కాబట్టి అంత విశ్వాసము నీవు కలిగియున్నట్లయితే దానిని మాత్రం పట్టుకొనియుండండి.

332 గమనించు, ఎవరైతే వాక్యము, జీవమైయున్నాడో, ఆ తెల్లని గుఱ్ఱం మీద స్వారీచేయువానిని జీవము వెంబడించినది. ఆయనతో కూడా నున్న పునరుత్థానులైన పరిశుద్ధుల ద్వారా రుజువు చేయబడినది. ఇపుడు ఏ విధముగా యుద్ధము జరుగబోవుచున్నది?

333 యేసు చెప్పాడు, “నాయందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రతుకును.” ఆయన అన్నాడు, “మీరు నాయందు విశ్వాసముంచినట్లయితే, మీరు—మీరు చనిపోయినను మీరు బ్రతుకుదురు. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు.” మరలా, ఆయన చెప్పాడు, “నాయందు విశ్వాసముంచువాడు…ఆయన వానికి నిత్యజీవము ఇచ్చును, అంత్య దినములలో వాని లేపెదను.” అది ఆయన యొక్క వాగ్దాన లేఖనము.

334 ఇక్కడ సాతాను భూమి యొక్క నాలుగు మూలల నుండి, తన యొక్క ప్రొటస్టెంట్ వారితోను తన కథోలిక్ లతోను సమకూర్చుకొని వచ్చును. హార్మెగిద్దోను యుద్ధమునకు అడుగులు వేసుకుంటూ వచ్చును. సరే.

335 మరియు ఇక్కడ యేసు వచ్చుచున్నాడు. పునరుత్థానులైన పరిశుద్ధులతో, రుజువు చేయబడిన వాక్యముతో పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు.

336 నేను చెప్పాను, దేవుడు మాట్లాడితే, లేక నిన్ను పంపితే, ఆయన—ఆయన నీవు చెప్పిన దానిని బలపరచును. చూశారా? గమనించు, నీవు పరలోక రాయబారివైనట్లయితే, పరలోకమంతా నీ వెనకయుంటుంది. మరియు పరలోకపు వాక్యముతో నిండియుండును. ఊహు.

337 ఇపుడు గమనించండి. పునరుత్థానులైన పరిశుద్ధులతో ఆయన వచ్చుచున్నాడు. ఆయన వాక్యము సత్యమని రుజువుచేయుచు.

338 కాబట్టి సాతానుకు తెలుసు, అగాధము వానికి సిద్ధంగానున్నదని; చూశారా? ఓ, మై. మరణమనే పాండుర వర్ణ గుఱ్ఱం స్వారీ చేయుచుండగా, మిశ్రమమైన సంఘశాఖలు వానిని వెంబడించెను. ఓ, మై, నిత్యముగా దేవుని నుండి ఎడబాటుకు. అదే నిత్య ఎడబాటుకు వారిని నడిపించునది.

క్రీస్తు స్వారీ చేయుచు, తన సంఘమును పునరుత్థానము యొక్క మహిమలోకి తీసుకొని వెళ్ళుచున్నాడు.

339 వచనము 8 గమనించు ఇపుడు…వచనము 8 ఆఖరి భాగము, మనము ముగించుచుండగా, చూడండి.

…అధికారము వారికియ్యబడెను…

340 ఎవరు “వారు?” చూశారా? మంచిది. అంత్యక్రీస్తు, “మరణము” అని పిలువబడుచున్నాడు. “పాతాళము వెంబడించెను.” అతని నాలుగు విధాల పథకమును గమనించండి.

341 అంత్యక్రీస్తు, తెల్లని గుఱ్ఱం, ఆత్మ ద్వారా చంపుట, అంత్యక్రీస్తుయైయుండి. ఆత్మీయంగా చంపుట.

342 సంఖ్య రెండు. ఎర్రని గుఱ్ఱం, ఖడ్గం ద్వారా చంపుట; రాజకీయ అధికారము, సంఘము మరియు రాజ్యం ఏకమైనపుడు.

343 నల్లని గుఱ్ఱం; ఆత్మలు, అతడు తన యొక్క సిద్ధాంతమును ఇవ్వగా, ఆమె తన జారత్వమును జరిగించినది. మరియు అతడు వారి ఆహారమును తూచాడు. వారి దేనారమునకు కొన్ని సేర్ల చొప్పున ఆహారమును అమ్మాడు. ఆలాగు.

344 నాలుగు, పాండుర వర్ణ రంగు; దేవుని యొద్ద నుండి నిత్య ఎడబాటు. మరలా నాలుగు, చూశారా. ఓ, మై!

దేవునికి స్తోత్రం!

345 ఇపుడు, ముగింపులో చివరిగా. ఎవరైతే…మీరు పొందియున్నారా…నేను సమయము దాటాను, అయితే మీరు నాకు పది నిముషాలు ఇస్తారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఈరోజు నాకు చాలా పిలుపులు వచ్చినవి. ఇక్కడ నేను మాట్లాడుటను గూర్చి.

346 ఏలీయాను గూర్చి ఎంతో మూఢత్వము మొదలైంది, కొద్ది…అది—అది మరణమునకు దారి తీసినది. మరియు మీరు…సరే…నేను దేనిని చూచుచున్నానో దానిని మీరు చూచునట్లు, నేను మీకు సహాయము చేయునట్లు దేవుడు నాకు సహాయము చేయును గాక. మీరు సహాయం చేస్తారా? ప్రయత్నిద్దాం. ఔనా.

347 ఇపుడు, ఇక్కడ ముగింపులో సంఘకాలానికి చివరి వర్తమానికుడు అభిషేకించబడిన ప్రవక్తయైన ఏలీయా అని నమ్మనివారికి.

348 మరణము తరువాత…గమనించండి. ఈ చివరి సంఘకాలము మరణము తరువాత…ఇపుడు, గమనించండి ఏమి జరిగినదో. చూడండి. మరణము తరువాత వారి మృతదేహాలు అడవి మృగములు నాశనము చేయును. అది మీకు తెలుసా. అది నిజము. వారివలెనే, యెజెబెలు ఒక సాదృశ్యముగా ఉన్నది.

349 ఇపుడు ప్రకటన 2:18 నుండి 20 కి త్రిప్పండి. కొద్ది నిముషాల క్రితం మనమది తీశామనుకుంటున్నాము. కాదా? ఆఁ, మనం తీశామనుకుంటున్నాను. ఇక్కడ నేను వ్రాసుకున్నాను…ఔను. నైతికంగా పాడైన సమయం. అదీ అది. ఏలాగో చూడండి. ఏ విధముగా యెజెబెలు లోపల ప్రవేశించినది. యెజెబెలు అనగా సంఘములు, ఈ నవీన సంఘము, పెండ్లికుమార్తె కాదు. ఇపుడు, పాత నిబంధనలోని యెజెబెలు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈరోజు సంఘానికి పోలిక. ప్రకటన 2:18, 20.

…తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు,…

350 చూశారా? అది నిజమేనా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఇపుడది ఖచ్చితముగా యెజెబెలుకు పోల్చబడియున్నది. ఇపుడు, మొదట…

351 చివరి కాలమందు ప్రవక్త వర్తమానము సంఘమునకు ఇవ్వబడి, వారిని అసలైన వాక్యము వైపునకు రమ్మని పిలచునని చూపించుటకు లేఖనము వెంబడి లేఖనములు ఇవ్వగలము. ఇపుడు గమనించు. ఔనా. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] మలాకీ 4 అలా చెప్తుంది మరియు మిగతావి. ప్రకటన 10:7 ఇంకా, ఇంకా, యేసు తనకు తానే అది చెప్పాడు. ఇంకా, ఇంకా, ఇంకా. “లోతు దినముల వలె,” ఆలాగు మొదలైనవి. ఇంకా, ఇంకా, అది ఆ విధంగానే క్రిందివరకు.

 

352 యెజెబెలు నేటి దినపు నవీన సంఘమునకు పోలికయైయున్నది. ఎందుకనగా కథోలిక్ వారు మరియు ప్రొటస్టెంట్ వారు ఇపుడు ఏకమయ్యారు. అక్కడ దానినెవరు ఆటంకపరచలేరు. అవి రెండు సంఘశాఖలు, కాబట్టి అది—అది తల్లి, చెల్లి, అంతే. వారు ఒకరితో యొకరు వాదించుకొంటారు. అయితే వారిరువురు ఒకటే. ఇద్దరూ వేశ్యలే. ఇపుడు నాకు నేనుగా చెప్పుటలేదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అను దాని నుండి నిర్వచిస్తున్నాను. చూశారా? సరే.

353 ఇపుడు మనము గమనిద్దాము యెజెబెలు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా చంపబడెను. యెజెబెలును చంపుటకై దేవుడు యెహూని అచ్చటకు పంపి, ఆమెను కిటికి లో నుండి పడద్రోయించి ఆమెను చంపాడు. కుక్కలు ఆమె మాంసమును భక్షించెను. (ఔనా?) అక్షరార్థంగా యెజెబెలు. [సంఘము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] ఆహాబు, ఆమె యొక్క రాజు, శిరస్సు; మొదటి ఏలీయా ప్రకటించినట్లుగా కుక్కలు అతని యొక్క రక్తమును నాకెను. మనమెక్కడకు వెళ్ళుచున్నామో చూశారా, మీరు చూచుచున్నారా?

354 ఎందువలన? మొదటి ఏలీయా సంఘముల ద్వారా నిరాకరించబడిన మనిషి. మరియు యెజెబెలు మరియు ఆహాబు ఆ సంఘములకు శిరస్సు; సంఘము, రాజ్యము కలిపి. ఎలీషా అతని యొక్క పాపములన్నీ ఆహాబుకు తెలిపాడు; నిజమైన వాక్యము వైపునకు మరలమని సమస్త సంఘానికి ఆజ్ఞ ఇచ్చాడు.

355 ఈ దినాన రెండవ ఏలీయా ఈ సంఘమునకు వచ్చునపుడు ఖచ్చితంగా అదే చేయబోవుచున్నాడు కాదా, “అసలైన విశ్వాసము వైపునకు త్రిప్పును”! దాని నుండి మీరు ఏలాగు దూరముగా వెళ్ళుచున్నారో నాకు తెలియదు. ఔను. నిజమైన వాక్యము వైపునకు త్రిప్పుట! ఔనది నిజం.

356 ఇపుడు, వాక్యము వారిని చంపిన తరువాత వారి శరీరాలు మీరు చూడాలనుకుంటే, ఇక్కడ మనం ప్రకటన 19 కి త్రిప్పుదాం. తరువాత వాక్యము వారిని చంపబోతున్నది. అది మీకు తెలుసా. సరే. క్రీస్తు ప్రకటన 19 లో వచ్చునపుడు ఏమి జరుగుతుందో మీరు గమనించి చూడండి. 17వ వచనము నుండి.

మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని;…

357 ఇపుడు దాని తరువాత ఇక్కడ పైన చూడండి, “రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఆయన పిలువబడెను.” 13వ వచనములో “దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” చూశారా? ఇక్కడ ఆయన, “రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.”

మరియు నేను ఒక దూతను చూచితిని…

358 ఇపుడు గమనించండి. ఆయన బయలువెడలెను.

జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడి గల ఖడ్గము బయలు వెడలుచున్నది:…

359 “ఆయన నోట నుండి,” ఎట్లనగా దేవుని నోటి నుండి మోషే నోటికి వచ్చినట్లు. చూశారా?

…ఆయన ఇనుప దండముతో వారిని యేలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును.

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది.

మరియు నేను దూతను చూచితిని…

360 ఇపుడు గమనించండి. ఇపుడు ఆయన సంహరించుచు వచ్చుచున్నాడు. ఆయన ఎవరిని సంహరించుచున్నాడు. యెజెబెలును మరియు అబద్ధపు ప్రవక్తయైన ఆహాబును.

మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని; అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి…దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

361 ఆయన వారిని మృగములకును పక్షులకును ఆహారముగా చేయుచున్నాడు. ఇక్కడ, మరొక అధ్యాయములో ప్రకటన గ్రంథములో గమనించు. మరియు ఒక్క నిముషము, “ఖడ్గము ద్వారా, మరణము ద్వారా భూమిలోని మృగముల ద్వారా చంపబడెదరు” అని చెప్పబడెను. చూశారా? యెజెబెలు సంఘము, ఆమె (వాస్తవమైన) శరీరము, ఆకాశపక్షుల ద్వారా, భూమిలోని మృగముల ద్వారా భక్షించబడును. ఖచ్చితంగా ప్రకృతిరీత్యా ఆహాబు యెజెబెలుకు జరిగినదో ఆ విధముగనే సంఘమునకు ఆత్మీయంగా సంభవించును. నా అర్థమేదో మీరు అర్థం చేసుకున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] మంచిది.

362 ఏలీయా యొక్క…ఓ! ప్రకృతిరీత్యా, ఆహాబు, యెజెబెలు దినాలలో ఏలీయా ఒక ప్రవక్తయైయుండెను. మరియు ఆత్మీయంగా, వాక్యములో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడను ప్రకారము, అదే విషయం చేస్తానని అతడు వాగ్దానము చేయబడెను; ఆత్మ రూపములోనున్న అతని పరిచర్య.

363 గమనించు, ఏలీయా, అతని దినములలో క్రమముగాను, తేటగాను నిరూపించబడినప్పటికీ వారిని వెనుకకు వాక్యము యొద్దకు త్రిప్పజాలకపోయాడు. అది నిజమా? అన్నివిధాల ఏలీయా ప్రయత్నించినప్పటికీ. అతడు అన్ని కార్యాలు చేశాడు. అతడు—అతడు వారికి సూచక క్రియలు అద్భుతాలు చూపించాడు; అతని ముఖాన్నే వారు నవ్వారు. ఆత్మ సంబంధముగా అదే కార్యం వారు ఇక్కడ చేస్తారు. చూశారా. అతడు వాక్యము వైపునకు వారిని త్రిప్పలేకపోయాడు. పది లక్షల మందిలో…

364 ఇపుడు వినండి. సంఘమా, ఇపుడు ముగింపులో దీని నిమిత్తము కొంచెము కలవరపడు మీరు.

365 ఏలీయా యొక్క దినాలలో ప్రపంచమంతటా ఎన్నో లక్షల కొలది ప్రజలున్నను యెజెబెలు మరియు ఆహాబు పాలించిన పరిపాలన, అది నేటి దినానికి సాదృశ్యముగా యుండగా, మొత్తం ప్రపంచమంతటిలోను కేవలం ఏడువందలమంది మాత్రమే ఏలీయా ప్రసంగం ద్వారా రక్షించబడ్డారు. ఔనా? అది ఖచ్చితం.

366 చూడు, ఏలీయా వారిలో ఒక్కరినైనా కూడా ఆ విధముగా యుందురని ఎన్నడూ ఎరిగియుండలేదు. దేవుడు ముద్రలలో ఒకదానిని తెరచి, గ్రంథములోని మర్మమును అతనికి చూపించువరకు, వారు కలిగియున్న మూఢభక్తికి లోబడని వారు, ఆయనకు ఏడువందలమంది ఉన్నారని అతనికి చూపించువరకు అతడొక్కడే రక్షింపబడెనని అతడు అనుకున్నాడు. దేవుడు, తన గ్రంథమును ఏలీయాకు తెరచి చూపించి, చెప్పాడు, “కుమారుడా, ఒక్క నిముషము ఆగు. నా కొరకై దాగియున్న ఏడువందలమందిని నేను కలిగియున్నాను. అక్కడ వారి యొక్క పేర్లు జగత్తు పునాది వేయబడినప్పటి నుండి ఉన్నవి. వారు నావారు.” వ్యూ! దేవుడు ముద్రలు విప్పియున్నాడు.

367 ఆ కారణము చేతనే గతరాత్రి యోహాను గట్టిగా అరచెనని నేననుకొనుచున్నాను. అక్కడ, అతడు తన పేరును తప్పక చూచియుండవచ్చును. చూశారా. ఔనా.

ఒక రోజు దేవుడు తెరచెను…

368 ఎలీషా, అతడు బోధించెను. అతడు అన్ని చేశాడు. మరియు—మరియు—మరియు నిండు హృదయముతో బోధించెను. అతడు చేయగలిగినదంతా చేశాడు. “నిలిపి నిలిపి” అతన్ని మాట్లాడిరి. “దీనికంతటికీ కారణం నీవే అన్నారు. నీవు మాంత్రికుడవు. ఈ ఇబ్బందులు వచ్చుటకు నీవే కారకుడవు. నీవు నేరస్థుడవు అని అన్నారు.” అతడు, అతనితో అన్నీ అన్నాడు. యెజెబెలు అతని తలను నరికి వేస్తానని బెదిరించెను. ఔను. ప్రతియొక్కరు అతనికి వ్యతిరేకమే.

369 అటు తరువాత అతడన్నాడు, “ప్రభువా, నీవు చెప్పినదంతా నేను చేశాను. నీ వాక్యమందు ఖచ్చితంగా నేను నిలబడియుంటిని. నీవేదైనా చెప్పినపుడు, నేను భయము లేకుండాయుంటిని. నేరుగా రాజ సముఖమునకు వెళ్ళి, ‘యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని’ నేను వారికి తెలియజెప్పితిని. మరియు వాటిలో ఏదియు సంభవించకుండా తప్పిపోలేదు. ఇపుడు వారందరిలో నేనొక్కడనే మిగిలాను. వారు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.”

370 “నేను ముద్రలలో ఒకదానిని తెరచి నీకు ఒకటి చూపెదను” అని దేవుడు చెప్పాడు. ఆయన అన్నాడు, “నీకు తెలుసా, అక్కడ నాకు ఏడువందలమంది ఉన్నారు. వారు మోకాళ్ళు వంచలేదు. వారి మూఢభక్తిలోను, సంఘశాఖల్లోను చేరలేదు. ఎత్తబడుటకు ఏడువందలమంది సిద్ధంగా ఉన్నారు, చూశారా.” ఓ, ఓ. లేఖనము ద్వారా చూచునట్లు ఆయన ఎవరికి తన వాక్యము బయలుపరచునో అట్టి ప్రవక్తతో ఆయన చెప్పాడు. “ఈ తరములోనుండి సిద్ధము చేయబడిన ఏడువందలమంది పేర్లను ఇంకా నేను కలిగియున్నాను; వారిలో ఏడువందలమందిని కలిగియున్నాను. వారు ఏ విధమైన వారికి మోకాళ్ళను వంచలేదు” (నేను గనుక దీనిని ఈ దినమున అని చెప్పిన యెడల) “మత సంబంధమైన సంఘశాఖలకు సంఘ ఆచారములకు వారు.”

371 నా అర్థమేంటో మీరు గ్రహించారా? ఆలాగైతే అది ఆ విధముగా సామాన్యముగా నుండవలెను. అది ఆలాగే యుండవలయును. అది వాక్యప్రకారముగా ఉన్నది. ఆ వ్యక్తి రంగం మీదికి వచ్చినపుడు, అతడు ప్రవక్తయై యుండవలెను. ఈ వేదికయొద్ద నేనెలాగు నిలబడ్డానో ఆలాగు. ఔనా? అతడు ఆ వాక్యముతోనే నిలచియుండును. అతడు ఎవరియొక్క సిద్ధాంతములను మరి దేనినైనను అనుసరించడు. అది నిజం. ఎలీషా మాదిరిగా ఒక అడవుల యందు సంచరించు వ్యక్తిగా యుండును. అతడు యోహాను వచ్చినట్లుగా ఉండును. అతడు—అతడు స్త్రీలను ద్వేషించును, (అబ్బాయ్!) అసభ్యమైన స్త్రీలను! వ్యూ! అబ్బాయ్, అతడు వారి మీద విరుచుకుపడును! ఏలీయా చేశాడు, మరియు యోహాను కూడా చేశాడు. చూశారా? చూశారా? మరియు ఆ వాక్యముతోను అతడుండును. అతడు సంఘశాఖలకు విరోధముగా ఉండును. సంస్థాపక సంఘాలకా? “అబ్రాహాము మా తండ్రియని మీలో మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టించగలడు.” ఔనా? తప్పక నేను చెప్పుచున్నాను.

372 ఇపుడు, స్నేహితులారా, అక్కడే మీరున్నారు. ఇక్కడ నాల్గవ ముద్ర విప్పబడినది. నాలుగు గుఱ్ఱాల యొక్క స్వారీచేయువారు బయలుపరచబడ్డారు. నాకు తెలిసినంత వరకు. ఇపుడు ఇదంతా భూమి మీద జరిగినది.

373 తరువాత ముద్ర పరలోకమందు మనం చూస్తాము. ఎక్కడైతే బలిపీఠము క్రింద ఆత్మలు ఉన్నవో.

374 ఇపుడు ముగింపులో ఈ రెండు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కొద్ది మాటలు నేను వ్రాసుకున్నాను. మనము నాలుగు ముద్రలను దాటియున్నాము, మొదటి నాలుగు ముద్రలు.

375 ఇపుడు రేపు రాత్రికి మనము—మనము భూమి మీద జరుగుచున్న కార్యములనుండి రంగం మార్చుదాము. ఆయన ఇక్కడ నుండి పైకి చూచి మరియు బలిపీఠము క్రిందనున్న ఆత్మలను చూచుచున్నాడు, బలి అర్పించునది, బలిపీఠము.

తరువాత రాత్రి న్యాయతీర్పు తాకుట.

376 నాలుగవ రాత్రి లేక ఆఖరు రాత్రి, ఆదివారము రాత్రి, ఏదో నాకు తెలియదు. ఈ మిగతావి ఏవో నాకు తెలియదు. మీ మాదిరిగా నేను వాటిని కేవలం చదివాను. అయితే, “అర్థగంటసేపు నిశ్శబ్దముగా నుండెను,” అయితే ఒకటి జరిగింది. అది బయలుపరచుటకు నేను ఆయన మీద ఎదురుచూచుచున్నాను. ఆయన అది చేస్తాడు. ఆయన చేస్తాడని నేను తృప్తి కలిగియున్నాను.

377 క్రీస్తు యొక్క రాకడ అంత్యక్రీస్తును హతమార్చునని చూపించుటకు మనము లేఖనములో పలుచోట్ల నుండి ప్రకటన 19 వరకు వెళ్ళితిమి. ఆ కారణము చేత, నేను దీనిని వదలి రెండు వచనములు మాత్రమే తీసుకున్నాను. ఈ విషయాలను రుజువుచేయుటకు లేఖనములలోని పలుపలు భాగాలకు నేను వెళ్ళవలసియున్నది. కాబట్టి, ఆ కారణం చేత అంత్యక్రీస్తు అంతమును చూపించుటకు ప్రకటన 19 కి నేను వెళ్ళితిని. వాడు చంపబడుటను చూపించుటకు. క్రీస్తు వచ్చునపుడు, ఆయన అంత్యక్రీస్తుని చంపును.

378 ఈ అంత్య దినములకు నియమింపబడు ఏడవదూత మలాకీ 4 వ అధ్యాయంలో చెప్పబడినట్లు, ఏలీయా ప్రవక్తవలె దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని యొక్క నిజమైన దేవుని యొక్క (అసలైన) వాక్యమును ఈ తరమునకు బయలుపరచును అని నిరూపించుటకు మనము ప్రకటన 10వ అధ్యాయం చదవవలసియుండెను. ప్రకృతి సంబంధమైన యెజెబెలుకు ఆ ఏలీయా చేసినట్లు, ఈ ఏలీయా కూడా ఈ ఆత్మీయ యెజెబెలుకు, సంఘశాఖల సంఘమునకు చేయును. నేను 7వ అధ్యాయమునకు వెళ్ళవలసియున్నది…10వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. అది నిజమని రుజువు చేయుటకు మరియు అది రుజువు చేయుటకు. మరియు మలాకీ మరియు ఆమోసు మొదలైనవి.

379 ఆ యొక్క ప్రత్యేక తరములో యెజెబెలును గూర్చి గద్దించి ప్రవచించిన ఏలీయా ప్రవక్త యున్నాడు.

380 మరియు ఏలీయా చనిపోలేదు. అతడు నిశ్చయముగా. రూపాంతర కొండపైన యేసుక్రీస్తు ప్రక్కన సుమారు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత ఆయన తిరిగి అగుపించాడు. అతడు చనిపోలేదు.

381 ఇపుడు మనము చూస్తున్నాము, దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా, అంత్య దినములలో ఒక మనుష్యుని అభిషేకించవలయును. ప్రకృతి సంబంధమైన యెజెబెలుకు ఏమి చేసెనో, అదే కార్యమును ఆత్మీయ యెజెబెలునకు అతడు చేస్తాడు.

382 ఆ కారణము చేత నేను మీ మనస్సులో ఏ సందేహము లేకుండునట్లు, అది రుజువు చేయుటకు బైబిల్ గ్రంథములో అనేకములు చూపాను. ఏమైనా యున్నట్లయితే నన్ను తెలుసుకోనివ్వండి. సరే. నాకొక ఉత్తరం లేక చిన్న చీటి వ్రాయండి.

383 మరియు చివరి దినమున వారి యొక్క ప్రకృతి శరీరములను మృగములు భక్షించునట్లు ఈ దినములలో కూడా తినునని ఎంతో చక్కగా చెప్పబడినది.

384 నాకు తెలిసినంత వరకు, నాకు దేవుడు ఇచ్చిన బయల్పాటు ప్రకారము ఇది జరుగునని ముందుగానే చెప్పబడినట్లు నాలుగు గుఱ్ఱముల స్వారీచేయువారిని గూర్చిన సత్యము ఇదియే.

385 యేసును గూర్చి మీరేమనుకొనుచున్నారు? [సభ సంతోషించెను—సంపా.]

నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయన మొదట ప్రేమించెను

మరియు నా యొక్క రక్షణను

కల్వరి చెట్టుపై కొనెను.

386 ఇపుడు జ్ఞప్తించుకోండి, (అది అదే; ముందుకు సాగుడి; మంచిది.) ఏ సంఘశాఖలో నున్న ఏ జనమునైనను ఎటువంటి చెడ్డ భావము ఉంచుకొనవద్దు. కారణం, దేవునికి కథోలిక్ పద్ధతిలో బిడ్డలున్నారు. ఆయనకు మెథడిస్టు పద్ధతిలో బిడ్డలున్నారు. బాప్టిస్టు పద్ధతిలో ఆయనకు బిడ్డలున్నారు. వెలుగును చూచిన తరువాత, వివిధములైన అన్ని పద్ధతుల నుండి బయటకు వచ్చినవారు ఈ రాత్రిలో ఎంతమందిగలరు. మీ హస్తాలు చూపించండి. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఇప్పుడు జ్ఞప్తించుకోండి, మీలాంటి వారు అక్కడ ఉన్నారు. అయితే ఆ పద్ధతి వారిని చంపుచున్నది. చూడండి. ఏలాటి సత్యాన్ని వారు వినకపోవునంత వరకు అంత్యక్రీస్తు ఆత్మ వారిని అటువంటి స్థానమునకు తీసుకొని పోవుచున్నది.

387 మరియు గత రాత్రి నేను ముద్రింపబడుటను గూర్చి చెప్పినపుడు గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి సునాద ధ్వనిని వినియు స్వతంత్రునిగా వెళ్ళిపోవుటకు నిరాకరించిన యెడల, అతనిని ఒక స్తంభం యొద్దకు తీసుకొని వెళ్ళి, చెవికి పోగరుతో రంధ్రం వేస్తారు. చెవి ద్వారా మీరు వింటారు. “వినుట ద్వారా విశ్వాసము కలుగును.” ఆలాగైతే, దానిని అతడు విని, అతని స్వతంత్రతను నిరాకరిస్తే, అలాటప్పుడు…తన శేష జీవితమంతా తన సంఘశాఖ యజమానునికి సేవచేయవలెను. ఆమేన్.

388 ఓ! ఓ, మై! ఆయన ఆశ్చర్యకరుడు కాదా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.]

నేనాయనను ప్రేమించుచున్నాను, నేను…

ఇపుడు మనం మన చేతులెత్తి ఆయనను ఆరాధిద్దాము.

ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను (మహిమ!)

మరియు కల్వరి చెట్టుపై

నా రక్షణను కొనెను.

389 [సహోదరుడు బ్రెన్హాం నేను ఆయనను ప్రేమించుచున్నాను ను హమ్మింగ్ చేస్తున్నాడు—సంపా.] ఇపుడు తలలు వంచి హమ్ చేస్తూ ఆయనను ఆరాధన చేద్దాము. [సహోదరుడు బ్రెన్హాం నేను ఆయనను ప్రేమించుచున్నాను ను హమ్మింగ్ చేస్తూనేయున్నాడు]

390 ప్రభువా, మేమెంతటి ధన్యులము! నేనెంతో ఆనందంగా ఉన్నాను, ప్రభువా, నీ కొరకు నీ ప్రజల కొరకు సంతోషంగా ఉన్నాను. ఓ ప్రభువా, మా రక్షణను నీవు కల్వరిలో కొంటివి. ప్రభువా, మేము ఆనందముతో అది అంగీకరిస్తున్నాము.

391 ఇపుడు నీ ఆత్మతో మమ్ము పరిశోధించు ప్రభువా. ప్రభువా ఏదైనా కీడు మాయందు యున్నట్లయితే, వాక్యమును గూర్చిన ఏలాటి అవిశ్వాసమున్నట్లయితే, తండ్రీ, దేవుని యొక్క ప్రతి వాగ్దానమునకు “ఆమేన్” అని చెప్పని ఏ వ్యక్తియైనా ఇక్కడ యున్నట్లయితే; ఇపుడే పరిశుద్ధాత్మ దిగివచ్చి, తెల్లని గుఱ్ఱం మీద స్వారీచేయు ఆయన వచ్చి, ఆయన యొక్క ఆత్మ, అనగా క్రీస్తు యొక్క ఆత్మ, అంత్యక్రీస్తుకు విరోధముగా నుండి స్వంత వారిని పిలుచును. బయటకు పిలుచును ప్రభువా.

392 ఇపుడు వారు పశ్చాత్తాపపడి, త్వరగా నీ యొద్దకు వచ్చి, నూనెతోను ద్రాక్షారసముతోను నింపబడుదురుగాక; మరియు కయీను మరణము యొక్క సంఘశాఖ వస్త్రమును విడిచి పెండ్లికుమారుని ద్వారా ఇవ్వబడు నిత్యజీవపు హిమమంత తెల్లని అంగీని మార్చుకొందురు గాక. మరియు అటు తరువాత ఒక దినాన రుజువు చేయబడిన వాక్య పునరుత్థానములో పెండ్లి విందుకు వారు వెళతారు. ప్రభువా, అనుగ్రహం చూపు. ప్రజలు నీపై వేచియుండగనే హృదయాలను పరిశోధించుము. యేసు నామము ద్వారా!

[సహోదరుడు బ్రెన్హాం నేను ఆయనను ప్రేమించుచున్నాను ను హమ్మింగ్ చేస్తున్నారు—సంపా.]

393 ఇపుడు, నా సహోదరుడా, నా సహోదరీ, నా స్నేహితుడా, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. చాలాసేపు నేను మీతో ఉన్నాను. ఇది సుమారు ముప్పై మూడు సంవత్సరములు ప్రభువు నామములో మీకు ఏదైన చెప్పి అది సంభవించకుండా ఎన్నడైననూ తప్పిపోయినదా? [సభ “లేదు” అని చెప్పినది.—సంపా.] మీకు తరుణముండగనే క్రీస్తును వెదకండి. మీరు చేయలేని సమయం త్వరలో రావచ్చును. ఔనా? ఆయన మధ్యవర్తిత్వపు సింహాసనము ఏ సమయమునైనా విడువవచ్చును; అటు తరువాత నీ హృదయమంతటితో అరుస్తావు. నీవు ఎగరవచ్చును, నీవు భాషలతో మాట్లాడవచ్చును, నీవు నేలమీద పైకి క్రిందకు ఎగరగలవు. నీవు అనుకున్నదంతా చేయగలవు. లోకంలోని ప్రతి సంఘములో చేరగలవు. నీ—నీ పాపము కొరకు ఏ విధమైన బ్లీచ్ ఉండదు. అప్పుడు నీవేమి చేస్తావు, ఎక్కడ నీవుంటావు?

394 మంచిది, నా నిండు హృదయంతో నేను నమ్ముతున్నాను, సింహాసనము ఇంకా తెరవబడి యున్నది. ఆయన ఇంకా దేవుని సింహాసనము మీద కూర్చుండియుండి యున్నాడు. అయితే, ఆయన అక్కడ నుండి లేచి మరియు ఆయన దేనినైతే విమోచించాడో దాని హక్కును పొందుటకు వచ్చుచున్నాడు. రూతు నిరీక్షించుచుండగా ఆయన రక్త సంబంధియైన విమోచకుని పని చేయుచున్నాడు.

395 అయితే మీకు తెలుసా, బోయజు రక్తసంబంధి యొక్క పనిని చేసి ముగించిన తరువాత అతడు వచ్చి తన స్వాస్థ్యమును పొందుకొనెను. అతడదే చేశాడని ఖచ్చితంగా బైబిల్ చెప్తున్నది. “ఆయన వచ్చి మరియు గ్రంథమును తీసుకున్నాడు.” అప్పుడు మధ్యవర్తిత్వము అయిపోయింది. ఆయన సింహాసనము వదలి వచ్చియున్నాడు (He is off the Throne); కరుణాపీఠము మీద ఇక రక్తము లేదు. మరియు ఇక అదేంటి? న్యాయతీర్పు సింహాసనము.

396 ఈ రోజులలో, “ఎత్తబడుట జరుగునని నేననుకొనుచున్నానని” చెప్పవద్దు. మరియు “అది గతములో” అని చెప్పు స్వరము వినునట్లుగా ఉండవద్దు. దేవుడు మీకు సహాయపడును!

ఇపుడు మనము తలలు వంచుకుందాము.

397 సహోదరుడా నెవిల్, ముగించుటకు లేక నీవేమైనా చేయుటకు రమ్ము. రేపు రాత్రి వరకు దేవుడు మిమ్ము దీవించును.


    63-0321 — నాలుగవ ముద్ర
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...