అయిదవ ముద్ర

అయిదవ ముద్ర

 ఇపుడు మనము ప్రార్థన కొరకు మన తలలు వంచుకుందాం.

2 కృపగల పరలోకపు తండ్రీ, సర్వశక్తిమంతుడగు దేవా, ఎవరైతే యేసుక్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపి మరియు పరిశుద్ధాత్మ శక్తిలో చివరి దినములలో ఆయనను మాకు ఎవరు అనుగ్రహించిరో అట్టి అమర్త్యుడైన దేవుని యొక్క ఘనమైన ఈ సందర్శనములకు మేము కృతజ్ఞులమైయుంటున్నాము. మరియు ఇపుడు, తండ్రీ, అనేకమంది ప్రజల యొక్క నిత్య మార్గాన్ని మార్చునటువంటి మరియొక ఘడియను మేము ఎదుర్కొనుచున్నాము.

3 మరియు ప్రభువా, ఇది సమీపించుటకు మేము అపాత్రులము. ఎందుకనగా అది లేఖనములలో నున్నది, “గొఱ్ఱెపిల్ల గ్రంథమును తీసుకొని ముద్రలు విప్పెను.”

4 ఓ, దేవుని గొఱ్ఱెపిల్లా, ముందుకు రావలెనని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, మహోన్నతుడగు విమోచకుడా, మేము నిన్ను పిలుచుచున్నాము. ఈరాత్రి మా కొరకై ఈ అయిదవ ముద్రను విప్పి, సంవత్సరముల తరబడిగా మరుగైయున్న నీ యొక్క విమోచనా ప్రణాళికను ముందుకు వచ్చి మాకు చూపించుము. తండ్రీ, ఆ ముద్ర క్రింద ఏమున్నది మాకు బయలుపరచుము. తద్వారా ఇప్పటికంటే మేము మంచి క్రైస్తవులుగా వెళ్ళుదుము గాక. తద్వారా మా ముందుంచబడిన పనికి మంచి అర్హులముగా ఉందుముగాక. యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్.

కూర్చొనండి.

5 స్నేహితులారా, సాయంకాలవేళ శుభములు. ఈ గొప్ప సంఘమును బట్టి, ఈ రాత్రి ఇక్కడ యుండుట ఘనమైన తరుణమని ఎంచుచున్నాను. రాజు యొక్క పని మీద ఉండుట కంటే మరొక శ్రేష్టమైనదిగా భావించునది ఇంకొకటి ఎక్కడ లేదని నేననుకొనుచున్నాను. మరియు ఇపుడు మనము దేనికై ఎదురు చూచుచున్నామో ప్రత్యేకించి ఈ పాఠములకు వచ్చుచున్నాము; అది ఆయన నాకు బయలుపరచనట్లయితే, నేను దానిని మీకు ఇవ్వలేను. నా స్వంత తలంపులనో మరి దేనినో వినియోగించుటకు నేను ప్రయత్నించుట లేదు. ఆయన ఇచ్చినట్లుగానే. అంతే. మరియు నేను—నేను నిశ్చయంగా, నేను నా స్వంత తలంపులను వాడనట్లయితే, అది తన దారినే వచ్చును. జీవితకాలమంతా అది తప్పుగా ఉండలేదు. ఈసారి కూడా తప్పుగా ఉండదు.

6 ఆయన మన కొరకు చేసిన మహిమ గల దానిని బట్టి ఆయనకు ఎంతగానో, ఎంతగానో కృతజ్ఞులమై యుంటున్నాము. గంభీరమైన జీవముగల దేవుని హస్తము వాటిని చేయుచున్నది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు మన మధ్యలో ప్రసన్నమైయుండుట కంటెను శ్రేష్టమైనది మరి వేరేది ఏది కలదు? అందరికంటే చాలా భాగ్యవంతులైన జనులుగా యున్నాము.

7 దేశము యొక్క అధ్యక్షుడు నగరములోకి వచ్చుట కొరకు మనము ఈలలు వేస్తాము మరియు—మరియు జెండాలు ఎగరవేయుదుము మరియు తివాచీలు పరుస్తాము. అయితే ఆలోచించు, అది మంచిదే, అది నగరమునకు ఘనత.

8 అయితే, ఆలోచించు, మన యొక్క చిన్న మందిరములో ఈ రాత్రి, రాజులకు రాజైన మన దేవుని ఆహ్వానిస్తున్నాము. మనము కాదు…ఆయన తివాచీలు పరవడం మొదలగునవి కోరటం లేదు. ఆయన దీన హృదయములను పరువవలెనని కోరుచున్నాడు. తద్వారా ఈ దీన హృదయములను తీసుకొని, ఆయన ప్రేమించు వారికై ఏ మంచి వస్తువులు భద్రపరచాడో అవి వారికి బయలుపరచును.

9 ఇపుడు, మనం అడిగియున్నాము…నేను ఇచ్చుటకు నా యొద్ద సాక్ష్యమున్నది. దాని మీద పొరబడ్డాను, ఇపుడే అది విన్నాను. నేను తప్పు కావచ్చును. అయితే సాక్ష్యము సంబంధించిన ప్రజలు ఇక్కడున్నారు.

10 మరియు తరువాత, కొన్ని దినముల క్రితం, ఆరిజోనాలో నా గృహములో నేను యున్నపుడు, ఒక చిన్న బాలుడు వాత రోగ జ్వరముతో ఉన్నాడని మాకు ఒక పిలుపు వచ్చినది. మరియు అది గుండెకు చేరుతుంది. మరియు అతడు…అతని తండ్రి, తల్లి నాకు బహు ప్రియమైన స్నేహితులు. అతను ఇక్కడ సంఘ పరిచారకులలో ఒకరు. సహోదరుడు కాలిన్స్. అతని చిన్న బాలుడు, చిన్న మిక్కీ, జోయ్ యొక్క తోటి ఆటగాడు, గుండెకు సంబంధించిన వాత జ్వరముతో బాధపడుతున్నాడు. మరియు వైద్యులు అతన్ని పడక మీద పరుండబెట్టమని ఇంటికి పంపారు. కదల్చవద్దని, లేక తల పైకెత్తవద్దని, త్రాగుటకు నీళ్ళివ్వమని తల్లిదండ్రులకు చెప్పాడు. గొట్టం ద్వారా ఇవ్వమన్నారు. అతడు చాలా దురవస్థలో ఉన్నాడు. మరియు తల్లిదండ్రులు నమ్మకస్తులు, నమ్మినవారు, ఇక్కడ మందిరానికి వచ్చువారు.

11 కొన్ని రాత్రుల క్రితము, నిదానించకుండానే ఆదివారం స్వస్థత కూటమున్నదని మేము ప్రకటించాము. అయితే, ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలెనని తలంపుతో, అందుచేత స్వస్థత కూటమును విడిచిపెట్టవలసి వచ్చెను.

12 మరియు అటుతరువాత, నా హృదయంలో ఒక చిన్న సంగతిని ఉంచుకొంటుయున్నాను.

13 మరియు తల్లి తండ్రి గదిలోకి—బిడ్డను తీసుకొని రావచ్చునా అని తెలుసుకొనగోరారు. మరియు ఆ చిన్న వానిని వారక్కడకు తెచ్చారు. అతడు స్వస్థత పొందుకున్నాడని పరిశుద్ధాత్మ ప్రకటించాడు.

14 మరియు కాబట్టి, తల్లిదండ్రులు అది గౌరవించి, ఆ చిన్న బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళి, పాఠశాలకు పంపారు. అతనిని పాఠశాలకు పంపారు.

15 వైద్యుడు అది తెలుసుకొని, దానిని గూర్చి వైద్యుడు అంతగా ఇష్టపడలేదు. కాబట్టి, అతడు తల్లితో చెప్పాడు, బిడ్డ తప్పకుండా పడక పైన యుండవలసియున్నది అని. మరియు ఆమె అతనికి కథ చెప్పినది. మరియు నేను అనుకుంటున్నాను, అతడు సంఘశాఖ రీత్యా ఒక క్రైస్తవ విశ్వాసియని అనుకుంటున్నాను. ఒక—ఒక సెవెంత్ డే అడ్వంటిస్టు వైద్యుడు…కాబట్టి అతడు చెప్పాడు, “సరే, నీవు…నేను దానిని పరీక్ష చేయు సమయం ఇది.” అన్నాడు, “నీవు పరీక్ష చేయవలసియున్నది.”

“చాలా మంచిది” అని ఆమె అన్నది.

16 బిడ్డను తీసుకొని వెళ్ళారు. వాత జ్వరము ఎక్కడున్నదో, అక్కడ రక్త పరీక్ష వైద్యుడు చేశాడు. అతడేమి చేయాలో తెలియక వైద్యుడు ఆశ్చర్యపడిపోయాడని నేననుకుంటున్నాను. ఆ చిన్న బాలుడు మామూలు స్థితికి వచ్చి ఆరోగ్యంగా క్షేమంగా యున్నాడు…?…

17 ఇపుడు, కాలిన్స్ ఇక్కడున్నారా? అది నేను తప్పు చెప్పవచ్చు. నేను…సహోదరి కాలిన్స్ అది నిజమేనా? ఆఁ సరే. ఆఁ అది చిన్న మిక్కీ కాలిన్స్ ఆరు, ఏడు సంవత్సరముల వయస్సు.

18 మరియు మూడు రాత్రుల క్రితము అది గదిలోనే జరిగిన విషయం. ఓ, వారు…మానవులు కాకుండ మరొకరు గదిలో యుండవలసియున్నది! అది—అది బలమైన మహోన్నతుడైన యెహోవా. ఔను. ఆయన వాక్యమును ఘనపరచుటకు వచ్చాడు. మరియు అది వినటానికి నేనెంతో కృతజ్ఞుడను. చూశారా? మనందరము కూడా అని నేననుకుంటాను. నేను మాత్రమే కాదు, మనందరము కూడా. ఎందుకనగా—ఆలాగున నీ చిన్న బాలునికి లేక నా చిన్న బాలునికి జరిగితే ఏమి చేస్తాము.

19 మరియు, జ్ఞప్తించుకోండి. నేనిక్కడ సాక్ష్యమును ఎత్తి చెప్పాను. అది ప్రతి చోట జరుగుచున్నది. అయితే నా యొక్క పరిచర్య దైవిక స్వస్థత యని మీకు తెలియపరచుచున్నాను. అయితే మీరు…నేను ముద్రలు కొరకు ఇక్కడ ఉన్నాను. ఎందుకనగా, కొంచెం సేపైన తరువాత నేనెందుకు ఇది చేస్తున్నానా యని మీరు అర్థం చేసుకుంటారు. మరియు, కాబట్టి, నేను ఉపదేశకుడను కాను, నేను వేదాంత పండితుడను కాదు. నేను—నేను రోగుల కొరకు ప్రార్థించుటకు యున్నాను, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. ఇపుడు, ఇపుడు ఇందులో…

20 గతరాత్రి, మేము ఒక చిన్న బాలిక యొక్క సాక్ష్యమును ఇచ్చియున్నాము. ఆమె పేరు నా యొద్ద ఉన్నది. మరియు, యొక చోట వారెవరైనది బిల్లీ యొద్ద ఉన్నవి. మరియు ఈ చిన్న బాలిక లుకేమియా యొక్క చివరి దశలో ఉండెను…ఆమె ఎంతో ఘోరమైన స్థితిలో ఉండెను. నోటి ద్వారా ఆహారము ఇవ్వలేకపోయారు. ఆమె…రక్త నాళముల ద్వారా రక్త మార్పిడి చేసిరి. ఆమె చిన్న వస్తువుగా ఉన్నది. ఆమె వయస్సుకు తగ్గట్టుగా లేదు. ఇక్కడున్న స్త్రీ వలె అనుకుంటాను. అయితే, సుమారు ఆమె ఇంత ఎత్తు ఉన్నది. వారు, వారు మనలో చాలామంది వలె ఉంటారు. వస్త్రాలు ధరించిన బిడ్డను బట్టి మీరు చెప్పగలరు…తల్లిదండ్రులు చాలా పేదవారు. చాలా పేదవారు. అయితే చాలా భయభక్తులు గలవారు. మరియు ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నదని పరిశుద్ధాత్మ ప్రకటించాడు.

21 ఇపుడు, లుకేమియాతో నున్న ఆ చిన్న బిడ్డను గూర్చి, అది ఆలోచించు. మరియు రక్తమెంతో క్షీణించినది, వారు నోటితో ఆహారం ఇవ్వలేకపోయారు. వారు ఆసుపత్రికి వెళ్ళి రక్తము ఎక్కించుకొనవలయును లేదా నాళము ద్వారా మార్పిడి చేసుకొనవలయును, వాటి వలన ఆహారం ఇవ్వవలెను. గ్లూకో లేక మరొకటి అనుకుంటాను. ఆ జబ్బుకు ఏలాటి వైద్య సదుపాయాలు చేస్తారో నాకు తెలియదు గాని, ఆ విధంగా ఆహారం ఇవ్వవలసియుంటుంది. మరియు బిడ్డ స్థలమును విడుచుటకు ముందు హాంబర్గర్ కోసం ఏడ్చింది.

22 మరియు యెహోవా ఈలాగు చెప్పుచున్నాడు అని పరిశుద్ధాత్మ చెప్పుట తల్లిదండ్రులు విన్న తరువాత, చూడండి, వారు…వారు అన్యులు. క్రితము వారు ఇచటకు రాలేదు. అయితే వారు…ఒక అందమైన వృద్ధ దంపతులు, వారి స్థలాలు వారికిక్కడ యున్నవి, కొద్ది నిముషాల క్రితము, సహోదరుడు, సహోదరి కిడ్ వారు ఏమి చేయాలో, ఏమి వినాలో చెప్పారు. ఆ బిడ్డ ఇంటికి వెళ్తూ మార్గంలో ఆహారము భుజించినది.

23 రెండు రోజుల తరువాత పాఠశాలకు వెళ్ళింది. మరియు వైద్యుని యొద్దకు వెళ్ళినపుడు వైద్యుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు చెప్పాడు, “ఏలాటి చిహ్నములు ఒకటైనా కనబడలేదని” చెప్పాడు. చూశారా? ఇపుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి వెంటనే అక్కడకక్కడే రక్తనాళమును తీసుకొని దానిని శుద్ధిచేసి, నూతన రక్త కణములను సృజించి వాటికి నూతన జీవమును అనుగ్రహించెను. మీ రక్త ప్రవాహమే మీకు జీవము, మర్త్యమైనది. మరియు నూతన కణములు సృష్టించుట మరియు పాతవి శుద్ధీకరించుట! మరియు ఏంటది? అది ఖచ్చితంగా…నేనిది చెప్పగలను. అది సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క సృజించు క్రియ; తీసుకొని—భయంకరమైన స్థితిలోనున్న ఆ చిన్న బాలిక పసుపుగా మారి ఉబ్బిపోయి, ఆమెలోనున్న కేన్సర్ తో కలుషితమైన రక్త ప్రవాహమును తీసుకొని మరియు కొద్ది క్షణాలలో ఒక నూతన ప్రవాహమును ప్రసరింపజేసెను.

24 నేను నమ్ముతున్నాను…నేను దానిని ఆయన నామములో మాట్లాడబోవుట లేదు. నేను నా యొక్క…నా విశ్వాసము యొక్క ప్రత్యక్షత బట్టి. గత దినము శాబినో కానియన్ లో ఏమి జరిగినదో అది. కోల్పోయిన అవయవములు పునరుద్ధరణ చెంది మరియు సృష్టికర్త యొక్క మహిమ గల శక్తి అనుగ్రహింపబడు ఘడియ ఆసన్నమైనదని నేను నమ్ముతున్నాను. నేను—నేను నమ్ముతున్నాను. ఉడుత అగుపించుట ఆయన చేయగలిగినట్లయితే, ఇక్కడొక పురుషుడు లేక స్త్రీ ఉన్నాడు, ఒక భాగము విడిపోయింది మరియు అది పూర్తి జంతువు. అదే. ఆయన దేవుడు. నేను—నేను ఆయనను ప్రేమిస్తాను.

25 సరే. ఇపుడు, నేను పాఠ్యాంశములను గూర్చి ఆరంభిస్తున్నాను. మరియు ఇపుడు మాట్లాడుకుందాము. మరియు గోడల చుట్టు జనులున్నారు. హాలులోను, గదులలోను నిలబడియున్నారు. కావున నేను నేరుగా వర్తమానములోకి వెళ్తాను.

26 మరియు, ఇది నేను చెప్పగోరుతాను. సర్వాంతర్యామియగు ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించగోరుతాను. మరియు, ఈరోజు అయిదవ ముద్రను గూర్చి ఒక్క విషయము నాకు తెలియకుండగనే, ఉదయం, సుమారు తెల్లవారుటకు ఒక గంట ముందుగా అదే మర్మమైన మార్గమున నేను ప్రార్థనలో యుండగా అది వచ్చెను. మరియు ఈరోజు…

27 నేను గడచిన ఈ ఐదు లేక ఆరు దినములుగా ఒక గదిలో కూర్చున్నాను. ఎవరిని చూడలేదు. అలా బయటకు వెళ్ళి ఒక—ఒక స్నేహితునితో, ఇక్కడున్న కొందరి స్నేహితులతో భోంచేయుచుంటిని. మరియు, బహుశా ఆ స్నేహితుడెవరో మీకు తెలిసియుండవచ్చును. అది సహోదరుడు మరియు సహోదరి ఉడ్. అవును. మరియు—మరియు మీకు తెలుసా, నేనక్కడకు వెళ్ళి, వారితోనే ఉన్నాను. ప్రతియొక్కరు నన్ను బాగుగా చూశారు. ఏ ఇబ్బందులు లేవు. అన్ని సావధానంగానే…

28 ఈ ముద్రల యొక్క వర్తమానముల పైనే నేను నిలబడ ప్రయత్నిస్తున్నాను. అది ప్రాముఖ్యము. దాని యొక్క ప్రత్యక్షత యొక్క బయల్పడు సమయము యొక్క ఘడియ అదేనని నేను నమ్ముతున్నాను.

29 మరియు మీకు ఈ ముద్రలలో అర్థంగాని విషయాలు ఏవైనా ఉన్నచో మీకు వీలైనంత త్వరగా వాటిని వ్రాసి, వాటిని బల్ల మీద ఉంచండి. మరియు సహోదరుడు నెవిల్ లేక ఎవరైనా ఒక పెట్టెను ఉంచుతారు. [ఒకరు చెప్తున్నారు, “ఇక్కడ పెట్టియున్నది.”—సంపా.] ఓ, ఇక్కడ—ఇక్కడ, నేను వాటిని ఇపుడు చూస్తున్నాను. మంచిది, ఈ రాత్రికి నేను వాటిని తీసుకోవాలనుకుంటున్నాను. ఆదివారం ఉదయం కొరకు నేను వాటిని చదువుట కొరకు, ఇపుడు, ఈ సమయములో, ఇదే సమయములో “పరిశుద్ధాత్మను పొందియున్నామనుటకు సూచన ఇదేనా?” అని అడుగవద్దు. చూశారా? నేను దేనిని బోధించానో, నేను—నేను దానిని తెలుసుకొనగోరుచున్నాను, చూశారా. కనుక, ఈ ఒక్క అంశాన్నే తీసుకుందాము (సంఘకాలముల వలె) నేరుగా, ఔనా, ఎందుకనగా దానిని గూర్చే మనము కొనసాగించునది.

30 ఇపుడు మనము రోగుల కొరకు ప్రార్థించునపుడు, అది మరియొక విధముగా ప్రార్థనగా ఉండును. నీవు అభిషేకించబడ్డావు, వ్యత్యాసకరమైన దానికై వచ్చియున్నావు, తెలుసా. నీవు దేవుని వెదకుచున్నావు. దానిని కనుగొనుటకు, “ప్రభువా, ఈ రాత్రి ఇక్కడెవరైనా ఉన్నారా?”

31 “ఔను. కుడిచేతి మూలన, పసుపురంగు వస్త్రాలు ధరించి ఒకరున్నారు. నీవు ఆమెను పిలచినపుడు, దీనిని పిలువు. ఆమె పలానా పలానా కార్యము చేసెనని చెప్పు. మరియు ఆమె పలానా-పలానా కలిగియున్నది.” తరువాత అక్కడకు నీవు వెళ్ళు; కనిపెట్టు ఆమె అక్కడున్నది. చూశారా? అక్కడే నీవు ఉన్నావు. చూశారా. అది వ్యత్యాసము. చూశారా?

32 మరియు ఈ విధంగా నేను ప్రార్థిస్తాను, “ప్రభువైన యేసూ, దీని యొక్క అర్థమేంటి? దానిని నాకు బయలుపరచుము.” ఆమేన్.

33 ఇపుడు, మన యొక్క—మన యొక్క ఖడ్గములు మరలా బయటకు తీద్దాం. మరియు వాక్యమును.

34 మరియు సహోదరుడు నెవిల్ యొక్క ఆత్మీయ సహకారమును ఇంకా అతని యొక్క సహోదర ప్రేమను నేను అభినందిస్తున్నాను. నా వెనుకాల యుండి నాకై ప్రార్థిస్తున్నందులకు. మరియు మీరందరు కూడా అక్కడున్నారు. మరియు ఇపుడు ఈ రాత్రి శుక్రవారం రాత్రియైనందున మనం…ప్రయత్నిద్దాం…

35 అన్ని సంగతులు నీవు చెప్పుకొనలేవు. నీవు…కారణం, నీవు దానిని తీసుకొని, ఆ యొక్క ముద్రలలో ఒక దానిని తీసుకొని లేఖనము ద్వారా తీసుకొని—తీసుకొని రావచ్చును, నేరుగా. ఔనా? అది అనేక నెలలు, నెలలు, నెలలు పడుతుంది, అయినా అది పొందుకోలేరు. కారణం—ముద్ర, దానికదే సంపూర్ణ లేఖనముతో, ఆదికాండము నుండి ప్రకటన వరకు ముడిపడి యుంటుంది, దాని యొక్క ఒక ముద్ర.

36 కనుక, నేను చేయుటకు ప్రయత్నించునదేమనగా, విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తున్నాను. నేను లేఖనమును గుర్తుపెట్టి, లేక—లేక ఇక్కడొక చోట చిన్న గుర్తింపు ఇచ్చి అలా ఆ ఒక్క దానిమీద ఉంచి, వెనుక నేను గమనించాలి, ’ఎందుకనగా…మాట్లాడి…నేను—నేనది సరైన ప్రేరణయని అనుకుంటాను. అటు తరువాత నేను—నేను చూచునపుడు…నేను—నేను మాట్లాడుటకు ఆరంభించినపుడు పాఠ్యాంశమును విడచి దూరముగా వైదొలగినట్లు అనుభూతి చెందినచో, నేను దానిని విడచి మరలా అంశమునకు రావలెనని నేను మరొక లేఖనమును మీకు తీసుకొనివచ్చి పాఠ్యాంశముపై ఇంకా తేటగా మీకు చెప్పుటకు ప్రయత్నిస్తాను.

37 మరియు, కాబట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క సహాయము ద్వారా, ఈ రాత్రి మనము—అయిదవ ముద్రను పఠనము చేయనైయున్నాము. అది యొక చిన్నది. మిగతా వాటి కంటే కొద్దిగా పొడవైనది. నాలుగు గుఱ్ఱములపై స్వారీచేయువారిని గూర్చి, రెండు వచనములున్నవి మరియు దీనిలో మూడు వచనములున్నవి. ఇపుడు అయిదవ ముద్ర ఆరంభము, ప్రకటన 6వ అధ్యాయం, 9వ వచనము.

38 మరియు, ఇపుడు మీకు ఒకవేళ ఒక—ఒక క్రొత్తగా వచ్చి యుండవచ్చును, నాలుగు గుఱ్ఱముల మీద స్వారీ చేయువారిని గూర్చి వినియుండకపోవచ్చును. సరే, మీరు…చూశారా, కొన్నిసార్లు మీరు—వెనుకకు వెళ్ళి జనులకు అర్థం అగునట్లు సంగతిని చెప్పవలసియుండును. మరియు, మీరు అలా చేయునపుడు, అది ప్రజలు అర్థం చేసుకుంటారని మీరు తలంచుచున్నారు. కాబట్టి, మీకు అర్థం కాని ఏదైన ఒక చిన్న విషయముంటే కొద్దిగా ఓర్చుకోండి. లేదా టేపు తీసుకొని అది వినండి, మరియు—మరియు దాని ద్వారా మీరు—మీరు ఆశీర్వదింపబడతారని నేను నిశ్చయంగా చెప్పగలను. నేను చెప్పగలను. మీరు దానిని చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను.

39 ఇపుడు, ప్రతియొక్కరు సిద్ధమేనా, 9వ వచనము నుండి 11వ వచనము వరకు లేదా 11వ వచనము కలిపి.

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.

వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

40 ఇపుడు, ఇది మర్మమైనది. మరియు, ఇపుడు టేపుల నిమిత్తమును ప్రస్తుతము ఇక్కడ కూర్చున్న సేవకులు, ఉపదేశకుల కొరకు, ఇపుడు దీనిని గూర్చి వేరే ఆలోచన యున్నయెడల; నాకు కూడా యుండెను. అయితే దానిని నేను ప్రేరేపణ ద్వారా తీసుకుంటున్నాను. అది నన్ను దానిని గూర్చిన భావననే మార్చెను. ఔను?

41 మరియు, తరువాత ఇది బయలుపడుట మీరు చూచుచుండగా, అది ఒకదానితో యొకటి అతుకబడియున్నవి మరియు ఆ సంఘకాలాలు తీసుకొని వచ్చుచున్నవి. మరియు లేఖనములను ఒకదానికొకటి అంటుకొనియున్నవి. చూశారా, ఆ కారణము చేత అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేను నమ్ముతాను. ఇపుడు మనము గ్రహిస్తున్నాము అది.

42 దానిని గూర్చి ఒక గొప్ప బోధకుడు ఏమి చెప్పాడో దాని మీదనే మనము ఆధారపడతామని నేను తలస్తున్నాను. చూశారా? మరియు అది—అది మంచిదే. ఏ విధంగాను బోధకుని నేను ఖండించుట లేదు. ఎవరిని కూడా నేను ఖండించుట లేదు. నేను పాపమును అవిశ్వాసమును ఖండిస్తున్నాను; ఎవ్వరిని కాదు.

43 మరియు కొందరంటారు, “సంఘశాఖను నీవు ఖండిస్తున్నావని.” లేదు, నేను చేయుట లేదు. నేను—నేను సంఘశాఖ పద్ధతిని ఖండిస్తున్నాను; అందులోనున్న ప్రజలను కాదు. సంస్థను తయారుచేయు ప్రజలను, ఔనా. అయితేవారు నడిపించబడు పద్ధతిని. నేను గద్దించునది దానిని. కథోలిక్, ప్రొటస్టెంట్ ఒకటే. మై! నేను…

44 నేనెరిగిన మంచి స్నేహితులు కొందరున్నారు. కథోలిక్ లు…?…మీరు గ్రహించగలరా…మరియు ఆ మనిషి ఇక్కడ ఈ రాత్రి కూర్చుండవచ్చును, ఒకవేళ. ఈ మందిరము కట్టుటకు ఒకే ఒక కారణము, ఎందుకనగా అక్కడ ఒక రోమన్ కథోలిక్ అక్కడ న్యాయస్థానంలో నిలబడి, నా ముందున్నాడు, ఎవ్వరూ చేయ లేని విధంగా. ఔను. వారు దానిని మార్చలేకపోయారు. ఔను.

మరియు “‘చాలామంది ప్రజలున్నారని,’ వారు లెక్కించారని చెప్పబడెను.”

45 అతడు చెప్పాడు, “ఓ, ఇంకా ఎనభైమంది కంటే ఎక్కువైనను దానివలన ఏమి పరవాలేదు.” ఇంకను అతడు చెప్పాడు, “ఆ సంఘము అక్కడ కట్టబడియున్నది.” చెప్పాడు, “నేను—నేను సంఘకాపరిని ఎరుగుదును, ఆలాగు.” మరియు చెప్పాడు, “ఆ సంఘము అక్కడున్నది.” ఇంకా అన్నాడు, “మిగతావారు కలుపుకుంటున్నారు, వారు ఎందుకు చేయకూడదు?” ఒక రోమన్ కథోలిక్, నా మంచి స్నేహితుడు. చూశారా? ఔనండి.

46 ఒక—ఒక బాలుడు, అతడొక కథోలిక్, ఒక నిజమైన నా యొక్క స్నేహితుడు నాతో మాట్లాడుచుండెను. ఒక ఇనుప సామగ్రి కొట్టు కలిగియున్నాడు. నేను విడిచిపెట్టకముందు. అతడన్నాడు, “బిల్లీ, మా మతము యొక్క పద్ధతిని నీవు నమ్మవని నాకు తెలుసు.” అతడన్నాడు, “అయితే ఇపుడు నేను చెప్తున్నాను,” అన్నాడు, “మా కొరకు నీవు చేసిన ప్రార్థనలు ఎన్నో దేవుడు విన్నాడు! నేను అనుకుంటున్నాను, దేశములో నీవు ఎక్కడ ఇబ్బందిలో నున్న,” చెప్పాడు, “దేశములో ప్రతి కథోలిక్ అతను నిన్ను ఆదుకుంటాడు.” కనుక, మీరు చూశారా…

47 అతను చెప్పాడు, “సిలువను మోయు ప్రతివారు,” అతను ఆలాగు పలికాడు. అతను చెప్పిన రీతిగానే నేను చెప్పబోతున్నాను. ఎందుకనగా ఆరంభ క్రైస్తవులు వారి వీపున సిలువను మోయువారు, అని వారు చెప్తారు. చరిత్ర ద్వారా మనకది తెలుసు. వారు ఆది క్రైస్తవులని చెప్తారు, అయితే క్రమము మార్గమును తప్పించినది, చూశారా.

48 మరియు ఆ ప్రజలు, ఒక కథోలిక్ గాని లేక యూదుడు గాని లేక వారెవరైనను, వారందరు మనము వచ్చిన ఒకే వృక్షము నుండి వచ్చిన మానవులే. ఔనా? ఔను. ప్రతియొక్కరి వలె ఎవరైతే ప్రేమిస్తారో, భుజిస్తారో, త్రాగుతారో, నిద్రిస్తారో అటువంటి వారు—వారు. కాబట్టి వ్యక్తులను మనము ఖండించకూడదు. కాదు. ఎవరిని కూడా. చూశారా. అయితే వ్యక్తులను మనము ఖండించకూడదు.

49 అయితే, ఒక సేవకునిగా, అక్కడున్న ప్రజలను కరచు సర్పమును కొట్టవలయును. మీరు చూడండి. నేను కాదు. మరియు నేను…నన్ను, నాకు నేను, అది దేవుని యొద్ద నుండి వచ్చు ఆజ్ఞ కానట్లయితే నేను దానిని చేసియుండేవాడను కాదు. విధి నిర్వహించుటకు నేను బాధ్యుడను. ఔనా. మరియు నేను నమ్మకముగా, సత్యముగా నుండవలెను.

50 అయితే, ఒకవేళ ఒక కథోలిక్, యూదుడు, లేక వారెవరైనప్పటికి, ఇచటకు వచ్చిన యెడల; అతడు గనుక ఒక మహమ్మదీయుడైన యెడల, గ్రీకు లేక మూఢాచారములు గలవాడైన యెడల, లేక అతడెవరైనను, అతను ప్రార్థించుకోవాలని ఇచటకు వస్తే నా జనులకు ఎంత యథార్థముగా ప్రార్థిస్తానో అంత యథార్థముగా వారికి ప్రార్థిస్తాను. ఔను. ఖచ్చితంగా, ఎందుకనగా అది మానవుడు. మరియు నేను బౌద్ధుల కొరకు, సిక్కుల కొరకు, జైనుల కొరకు, మహమ్మదీయుల కొరకు మరియు—మరియు ప్రతివారి కొరకు ప్రార్థించాను. ఆలాగు. చూశారా. ఏలాటి ప్రశ్నలను వారిని అడగలేదు; అలా ప్రార్థించాను. ఎందుకనగా వారు ఒకరు, మానవులు బాగుపడాలని కోరుతున్నారు. రహదారిన జీవితం వారికి సులభమయం కావాలని ప్రయత్నిస్తున్నారు.

51 ఇపుడు మనము గ్రహించియున్నాము, ఇక్కడున్న వారిలో అనేకులు నాకు తెలుసు. ఇద్దరు లేక ముగ్గురు నిజమైన పండితులు ఇక్కడ కూర్చొనియున్నారు. మరియు—మరియు వారు తెలివైనవారు, మరియు ఇతర మనుష్యుల సిద్ధాంతములు చదివియుంటారు. మరియు నేను—నేను ఈ మనుష్యులను ఖండించుటలేదని ఈ సహోదరులు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ప్రభువు నాకు చూపించిన దానినే నేను వ్యక్తపరచుచున్నాను. అది మాత్రమే నాయొద్ద నున్నది.

52 పాత్రలు కడుగు ఒక స్త్రీ యో లేక—లేక అరక దున్ను ఒక చిన్న అబ్బాయో దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను పొందరని మనమెన్నడు తలంచకూడదు. ఎందుకనగా చూడండి…దేవుడు, ఆయన వాస్తవముగా సామాన్యతలో ఆయన బయలుపరచుకొనును. అదే, ఆదివారము చూశాము. ఏ విధముగా ఆయన, ఆయన యొక్క సామాన్యతలో బయలుపరచుకొనునో మనము మొదలుపెట్టాము. అదే ఆయనను మహోన్నతునిగా చేస్తుంది.

53 ఇపుడు నేను…కొద్దిగా నన్ను దానిని పునరావృతము చేయనివ్వండి. దేవుని ఏది గొప్ప చేస్తుంది, ఏదనగా ఆయన తనకు తానుగా ఎంతో తగ్గింపు చేసుకొనుట ద్వారా. అది ఆయనను గొప్పవానిగా చేస్తుంది. దేవుడు గొప్పవాడు, ఈ లోక జ్ఞానులు తాము చూడలేనంతగా అంత సాధారణ రూపమును కనపరచుకొనుట వలననే. వారు ఆయనను కనుగొనలేరు. ఎందుకనగా ఆయనకు ఆయన ఎంతో సామాన్యునిగా చేసుకున్నాడు. ఇపుడు గమనించండి. ఇది దానికదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మర్మము. చూశారా? ఇది, దేనికదే…అక్కడ…దేవుని కంటే గొప్పది ఏదియు లేదు. ఆయన తనకుతాను సామాన్యత చేసుకున్నంతగా నీవు దేనిని చేయలేవు. చూశారా, అది ఆయనను గొప్పవానిగా చేసినది. చూశారా?

54 ఇపుడు, ఒక గొప్ప మనిషి, ఇంకొద్దిగా గొప్ప వ్యక్తిగా ఎదిగి, లేక అతడు వంగి, “నీవు ఏలాగున్నావు?” అని నిన్ను అడుగవచ్చును. చూడండి. లేక ఆ విధంగా అడగవచ్చు. అయితే అతను తనకుతాను చిన్నవానిగా చేసుకొనలేడు. అతని గూర్చి ఒకటియున్నది, అతడు మానవుడు. అతడు చిన్నవాడిగా చేసుకొనలేడు. కారణం, చిన్నవానిగా చేసుకొనవలెనంటే, మొదటి విషయమేంటో తెలుసా, అతడు, ఒకరుచేసిన దానిని చూడవలసియున్నది. తరువాత తనకుతాను వెనుకకు లాగుకొనుటకు మొదలుపెట్టును. చూశారా.

అయితే దేవునిలో పైకి ఎదుగు మార్గము క్రిందికి దిగుటయైయున్నది. ఔను.

55 లోకమందున్న జ్ఞానులు, వారి జ్ఞానముతో ఆయనను కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. వారు ఆ విధంగా చేయుట ద్వారా ఆయనకు దూరంగా వెళ్ళుచున్నారు. చూడండి, లోక జ్ఞానులు, గణితము ద్వారానో లేక మరొక దాని ద్వారానో నీవు వివరించుటకు ప్రయత్నిస్తే…జ్ఞప్తించుకో, ఆయన దానిని…బైబిల్ లో పెట్టియుండెను. ప్రకటనలో…కాదు, నన్ను క్షమించండి.

56 యెషయా 35, అదే అనుకుంటాను. అది ఆలాగైతే—అదెంతో చిన్నది. ఒక—ఒక—ఒక అపరాధి కూడా అది గ్రహించును. చూశారా? ఓ, “మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు.”

57 జ్ఞానులు, వారి యొక్క జ్ఞానము ద్వారా దూరముగా పోగొట్టుకుంటారు. జ్ఞానము ద్వారా ఆయనను కనుగొనుటకు ప్రయత్నించుట ద్వారా ఆయనకు దూరంగా వెళ్ళిపోతారు. ఇపుడది మరచిపోవద్దు. అది టేపు చేయబడుతుంది. ఔను. జ్ఞానులు, తమ జ్ఞానాన్ని బట్టి, వారి జ్ఞానము ద్వారా ఆయనను కనుగొనుటకు ప్రయత్నించుట ద్వారా ఆయనను పోగొట్టుకుంటారు. చూశారా. వారు చిన్న వారగునంత పెద్దవారైనచో, ఆయనను వారు కనుగొంటారు. నీవు చిన్న వాడగునంత పెద్దవాడివైనచో! అది చూశారా? మీకు తెలుసా, అది—అది నిజంగా సత్యము.

58 నేను జనుల యొక్క కార్యాలయములోకి మొదలగు వాటిలోకి వెళ్ళాను. వారు చాలా పెద్దవారు, రాజులు, సామంతులు, చక్రవర్తులు వారు చాలా పెద్ద వ్యక్తులు. తరువాత, ఒకడు బట్టలు మార్చుకొను స్థలమనుకుంటాను, అక్కడకు వెళ్ళాను. కొద్దిసేపు నాతో వాదించుటకు కోరిన ఒక సేవకుడు కాబోలు, మరియు నీవు—నీవు తలంచవచ్చు వారు లేనిదే ప్రపంచం సాగదని మీరు తలంచవచ్చును. చూశారా. అది తలలోని జ్ఞానము మాత్రమే. చూశారా. అయితే ఒక—ఒక పెద్ద మనిషి క్రింద కూర్చొని నీవు పెద్దవాడవని నిన్ను గూర్చి తలంచుట. చూశారా? చూశారా, తనకుతాను తగ్గించుకొనుట.

59 మరియు, చూడండి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంతటివాడంటే మానవులు దిగిపోలేని స్థానమునకు ఆయన తనకుతాను తగ్గించుకొనెను. ఔనా. అంతే. మరియు…

60 మరియు, వారు ఆయనను కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. ఇపుడు చూడు. బాలురను పాఠశాలకు పంపి, బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పొందుకొనుట ద్వారా, ఆయనను కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. మరియు బైబిల్ యొక్క వేదాంత పదజాలము ద్వారా వారది తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. మరియు విద్యా పథకముల ద్వారా ఆయనను తెలుసుకొన ప్రయత్నిస్తున్నారు. మరియు సంస్థాపక ప్రణాళికల ద్వారా, మరియు కార్యములను అలంకరించుట ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతమాత్రము అక్కడలేడు. నీవు—నీవు దానికి దూరమైపోతావు.

61 చిన్నవారగునంతగా—వారు పెద్దవారైతే, వారు ఆయనను ఆ మార్గములో కనుగొంటారు. సామాన్యులుగా నుండుట వలన. అయితే, జ్ఞానము వైపునకు నీవు వెళ్ళినంత కాలము ఆయనకు దూరమవుతూనే ఉంటావు.

62 నీవు దానిని పోగొట్టుకొనకుండునట్లు నేనిది తీసుకొస్తాను. జ్ఞానము ద్వారా దేవుని నీవు వెదకినంత కాలము, ఏదెను తోటలో వలె, మోషే దినాల వలె, నోవహు దినాల వలె, క్రీస్తు యొక్క దినాల వలె, యోహాను దినాల వలె, అపొస్తలుల దినాల వలె మరియు ఈ దినము వరకు…నీవు దానిని లెక్కించుటకు ప్రయత్నిస్తే, జ్ఞానము ద్వారా దేవుని కనుగొనుటకు ప్రయత్నిస్తే అన్నివేళలలో నీవు ఆయనకు దూరస్థుడవౌతావు. నీవు దానిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నావు. దానిని కనుగొనుటకు వేరే మార్గమే లేదు. అలా అంగీకరించు. చూడు? అది నమ్ము. అర్థం చేసుకొనుటకు ప్రయత్నించవద్దు.

63 నేను అనేక కార్యములను గూర్చి అర్థం చేసుకోలేకపోవుచున్నాను. చాలా విషయాలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏ విధముగా ఇక్కడ కూర్చొని ఈ యౌవనస్థుడు నేను భుజించే ఆహారము భుజిస్తున్నాడు. తల నిండా వెంట్రుకలతోనున్నాడు. నాకు లేవు. నేనది అర్థం చేసుకోలేకున్నాను. కాల్షియం వలన అవి వచ్చునని వారంటున్నారు; నా వ్రేలి గోళ్ళు తగినంతగా కత్తిరించుకుంటాను మరియు కత్తిరించుకొంటానికి తల వెంట్రుకలు లేవు. నేను—నేను అది అర్థం చేసుకోలేకున్నాను. పాత సామెత చెప్పినట్లు…

64 నేను అంశము నుండి దారి తప్పుట లేదు, ప్రాముఖ్యం అది; అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది, అయితే నేను ఇంకా ముద్ర యొద్దకు పోలేదు.

65 ఏ విధంగా నల్ల ఆవు పచ్చగడ్డిని తిని, తెల్ల పాలు నిచ్చి దాని నుండి పసుపు వెన్నను ఇచ్చును! నేను—నేను దానిని వివరించలేను. ఔను. కారణం, మీరు చూడండి. ప్రతీది ఇంకొక దాని యొక్క ఉత్పత్తి. మరియు అదెలాగు, నేనది వివరించలేను.

66 ఒకే జాతినందున్న రెండు లిల్లీలు, లేక రెండు పూలు ఒకటి ఎర్రగా, మరొకటి పసుపుగా, ఒకటి గోధుమ వర్ణంగా, ఒకటి నీలి రంగుగా యుండుట నేను వివరించలేను. అది నాకు అర్థం కాదు. ఒకే సూర్యుడు దాని మీద పడును. ఎక్కడ నుండి రంగు వస్తుంది? చూశారా? నేను—నేను అది వివరించలేను. అయితే, అయినను నీవు అది అంగీకరించవలయును.

67 కక్ష్య మీద ఈ భూమి ఏ విధంగా నిలబడుచున్నదో ఒక గొప్ప వేదాంత పండితుడు నాకు వివరించవలెనని నేను కోరుచున్నాను. మీరు విజ్ఞానపూర్వకంగా ఒక బంతిని గాలిలో విసరండి, తిరుగుతుంది. అదే స్థానములో రెండవసారి అది తిరుగునట్లు ఎవరైనా చేయగలరా. మీరు దానిని చేయలేరు. మరియు అయినను ఇప్పటి నుండి రాబోయే ఇరువది సంవత్సరముల తరువాత సరిగ్గా నిముషములతో సహా సూర్య గ్రహణం ఎప్పుడు వచ్చునో వారు చెప్పగలరు. వారి యొద్ద ఆ విధముగా పరిపూర్ణ వివరణతో దాన్ని చెప్పుటకు గడియారములు లేక గోడ గడియారములు లేవు. యాంత్రిక పరికరములు లేవు. అయినప్పటికి అది అక్కడయున్నది. తరువాత వెనుకకు వంగియున్నది. అది నిటారుగా నిలబడితే ఏమౌను? ఆఁ. నీవు ప్రయత్నిస్తే బుద్ధిహీనుడవౌతావు. ఔను.

68 కాబట్టి చూడు, అర్థం చేసుకొనుటకు, జ్ఞానాన్ని పొందుకొనుటకు ప్రయత్నించవద్దు. ఆయనేమి చెప్పాడో అది నమ్ము. మీరెంత సామాన్యులుగా ఉందురో, మీరు అది పొందుకుంటారు. ఇపుడు అందుకొరకు నేనెంతో కృతజ్ఞుడను. ఆయన సాధారణమైనవానిగా చేసుకున్నందుకు నేను కృతజ్ఞుడను. ఇపుడు మనము 6వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. నేనిపుడు ప్రారంభిస్తాను.

ఆయన అయిదవ ముద్రను విప్పినపుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.

69 గమనించుడి, ఈ యొక్క అయిదవ ముద్రను గూర్చిన ప్రకటనలో, ఎటువంటి మృగము గాని ఏ ఇతర జీవి—జీవిని గూర్చి గాని ప్రకటించినట్లు లేదు. ఇపుడు జ్ఞాపకముంచుకోండి నాలుగవ ముద్రలో నున్నది. మొదటి ముద్ర, రెండవ, మూడవ, నాలుగవ ముద్రలో ఉన్నది. అయితే ఇక్కడ లేదు. చూశారా?

70 ఇపుడు, మీరు గమనించితే, వెనుకకు వెళ్ళి చదువుదాము, ఒక్కొక్క ముద్ర. నాలుగవ ముద్రకు వెళ్దాం. చూడండి. అది 7వ వచనము.

ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు—వచ్చి చూడుము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

…ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు—వచ్చి చూడుము అని మూడవ జీవి చెప్పుట వింటిని.

…రెండవ జీవి…వచ్చి…చూడుము

…మొదటి జీవి చెప్పెను, వచ్చి చూడుము.

71 అయితే తరువాత అయిదవ ముద్రకు మనము వచ్చునప్పటికి, జీవి లేదు. ఇపుడు గమనించండి.

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, నేను బలిపీఠము క్రింద చూచితిని…

72 చాలా త్వరగా! చూడండి. లేదు—అక్కడ జీవిలేదు. జీవి శక్తికి గురుతుగా నున్నది. అది మనకు తెలుసు. ఔను. ఏలాటి జీవి అచటలేదు.

73 సంఘములను గూర్చిన ప్రత్యక్షత, మనము పఠనము చేయుచుండగా, ఆ జీవులలో ఒకటి సింహము; ఆ యొక్క—ఆ యొక్క మరొకటి ఎద్దు; మరియు ఇంకొకటి మానవుడు; ఆ మరొకటి పక్షిరాజు. సంఘకాలాలలో మనము చూశాము ఆ నాలుగు జీవుల అర్థం నాలుగు బలములు. అరణ్యములో మందిరమున్నట్లు అపొస్తలుల కార్యమున్నది. మీరది అర్థం చేసుకున్నారా, కారణం అందులోకి వెళ్ళుటకు నాకు సమయం లేదు. దానినిక్కడ ఏ విధంగా గీచామో ఖచ్చితంగా చూపాము. వారు దీనిని కాపలా కాస్తున్నారు. గొఱ్ఱెపిల్ల మరియు వాక్యము, అరణ్యములోని పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసములో తదితర కార్యములు ఏ విధముగా చేశారో ఆ విధముగానే వాక్యములో ఇది నెరవేర్చుటకు చేసెను.

74 ఇపుడు, ఇశ్రాయేలు గోత్రముల యొక్క రంగుల ద్వారా, అవి వాటి వాటి స్థానములో యుండుట చూపితిమి. మరియు…ఎంతమంది ఏడు—ఏడు సంఘకాలాలు విన్నారు? అందరు అనుకుంటాను. సగటు మూడు వంతుల మంది మీలో…గమనించు జీవుల యొక్క స్వభావము కూడా ఖచ్చితంగా ఒక గోత్రపు చిహ్నముగానున్నది. అవి…పండ్రెండు గోత్రములు, నాలుగు ప్రతియొక్క ప్రక్కకు, లేక—లేక మూడు గోత్రములు ఒక్కొక్క వైపునకు నాలుగు జీవులు నాలుగు దిశల నుండి కాపలా కాచుచున్నారు.

75 మనము వెళ్ళిపోయి సువార్తలను తీసుకొని ఖచ్చితంగా చూపితిమి. మందసములోకి నీవు వెళ్ళినపుడు, వారు నిబంధన మందసమును వారు కాపలా కాయుచుండిరి. మరియు ఆ తరువాత మనము క్రొత్త సంఘము యొక్క నిబంధనను కనుగొంటిమి. భూమి మీద దాని యొక్క ప్రాతినిధ్యాన్ని, అది పరిశుద్ధాత్మ. రక్తము పరిశుద్ధాత్మను మనకొరకు పంపెను. నాలుగు జీవులు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములకు మాదిరిగా నున్నవి. మరియు వాటి స్వభావమును కనుగొను. అదే స్వభావమును తీసుకొని ఆ నాలుగు సువార్తలకు ప్రతిదానికి అన్వయించి చూస్తే, ఖచ్చితంగా, ఖచ్చితంగా ఒక్కటే. ఒకటి సింహముతో మాట్లాడుచున్నది. మరొకటి ఎద్దుతో, మరొకటి…నాలుగు సువార్తలు. అక్కడే అది ఉన్నది. నాలుగు సువార్తలు పరిశుద్ధాత్మ యొక్క కాపుదలగా ఉన్నవి. ఆమేన్.

76 నేను ఎల్లపుడు ఆశ్చర్యపడుదును. అది నాకు గుర్తు వచ్చుచున్నది. ఇపుడు, ఇది సుమారు ఆరు సంవత్సరాలనుకుంటాను. ఒక గొప్ప వ్యక్తి అది చెప్పుట…“అపొస్తలుల కార్యములు, అది కేవలం అల్లిక పని అని.” చాలాసార్లు చెప్పుట నేను విన్నాను. అయితే ఒక బోధకుని యొక్క హోదా గల వ్యక్తి, ఒక ఉపదేశకుడై యుండి, ప్రతిచోట ప్రజలు చదువుకొనే కొన్ని పుస్తకాలు వ్రాసినవాడై యుండి అపొస్తలుల కార్యములు సంఘమునకు ఉపదేశించుట సరిపడదని చెప్పుట!

77 అపొస్తలుల కార్యములు సాక్ష్యాత్తు దానికి పునాది; అల్లిక పని కాదు. పునాది! కారణం, బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క పునాది—పునాది, “అపొస్తలుల సిద్ధాంతంపై కట్టబడియున్నది” యని, ఔను, “క్రీస్తు, శిరస్సు, మూలరాయి.”

78 మరియు ఈ వ్యక్తి అక్కడ నిలబడి మరియు ఆ వివరణ చేసినపుడు, నేను—నేను—నేను—నేను…నా గుండె నిలచిపోయినంతగా అయింది. నేను అనుకున్నాను, “ఆశ్చర్యమేమి లేదు.” సరే. ముద్రలలో ఇపుడు చూస్తున్నాను. అది ఇంకను బయలుపడలేదు. అంతే. చూశారా?

79 వారక్కడ నిలబడియున్నారు. అయితే, దానినేదో చెప్పుచున్నది. ఇపుడు గమనించు, అవి కావలి కాయుచున్నవి.

80 ఇపుడు, మనము మత్తయి 28:19 తీసుకొని, సింహానికి పోలికైన మత్తయి గుండా గమనిస్తే; అక్కడ లోపలకు వస్తే ఎందుకు వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇచ్చినది మనము కనుగొంటాము. ఆయన అక్కడయుండి, లేఖనముతోనే సాక్ష్యాత్తుగా నిలబడి ఉన్నాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము యొక్క పవిత్ర బాధ్యతను కాయుటకై. సరే. మంచిది. నేనిపుడు సంఘకాలములను వదలిపెట్టుచున్నాను.

81 గమనించండి. అయితే, ఇక్కడ మనం ఈ అయిదవ ముద్రకు వస్తున్నపుడు అక్కడ—అక్కడ—అక్కడ ఏలాటి స్వారీచేయువాడు లేడు. అది ప్రకటన చేయుటకు ఎటువంటి జీవి లేదు. యోహాను…గొఱ్ఱెపిల్ల దానిని విప్పెను. యోహాను దానిని చూశాడు. “ఇపుడు వచ్చి చూడు, వచ్చి చూడు” అని చెప్పువారు అక్కడ ఎవ్వరు లేరు. గమనించండి. జీవి యొక్క ఏలాటి అధికారము లేదు. లేక…

82 మరియు ఆరవ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు. మరియు ఏడవ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు. అది ప్రకటన చేయుటకు ఏలాటి అధికారాలు లేవు. చూశారా, ఎవరూ అది చేయలేరు. చూడు…నాలుగవ ముద్ర తరువాత ఎటువంటి జీవి అధికారము వలన ఏలాటి ప్రకటన లేదు. అయిదు, ఆరు లేక ఏడవ ముద్ర ద్వారా. లేనే లేదు.

83 ఇపుడు గమనించండి. నేనిది ప్రేమిస్తున్నాను. నాలుగు గుఱ్ఱములే స్వారీ చేయువాని కాలములో, స్వారీ చేయువాడు (ఏక వచనము) నాలుగు వ్యత్యాసకరమైన గుఱ్ఱములు. అధికారాన్ని ప్రకటించుటకు జీవి ఉండెను. ప్రతిసారి మరొక గుఱ్ఱమును మార్చి స్వారీ చేయుటకు వచ్చినపుడు, మరియొక విధమైన జీవి వచ్చి అది ప్రకటించెను, “అది గొప్ప మర్మము.” చూశారా? “అది మర్మము.” ఎందుకని? మర్మమును ప్రకటించుచుండెను.

84 దానిని ప్రకటన చేయుటకు ఇక్కడ అయిదవ ముద్రలో ఒకరు ఎందుకు ఉండకూడదు? అది ఇక్కడ ఉన్నది. ప్రభువైన యేసు ఈ దినాన, చూడండి లేక ఈ ఉదయ వేళ పెందలకడనే నాకిచ్చిన ప్రత్యక్షత ప్రకారముగా అదే, అనగా సంఘకాలముల యొక్క మర్మము ఈ సమయమునకు ముగించబడియున్నది. ఈ సమయమునకు, అంత్యక్రీస్తు యొక్క మర్మము బయలుపరచబడియున్నది. అంత్యక్రీస్తు తన చివరి స్వారీ చేశాడు. అనేకమైన రంగులతో మిళితమై నాశనమునకు (Perdition) పోయినట్లు మనము కనుగొనుచున్నాము.

85 బూరలు మొదలైన వాటిని మనమది బోధించునపుడు, మనమది పొందుకుంటాము. ఇపుడు వాటిలోకి వెళ్దాము. అయితే అంశమును వదిలివేస్తాము. మరియు మనము—మనము…అతడు స్వారీచేయుచుండగా…

86 ఆ కారణము చేత అక్కడ ఎవ్వరూ లేరు. ఇపుడు ఒక దానికి ఒక కారణము కలదని వ్రాయబడిన కారణము లేదు. ఇపుడు, ప్రారంభములో నేను చెప్పినది మీకు జ్ఞాపకమున్నదా. నేను చెప్పాను ఒక కారణము లేకుండా ఏదీ యుండదు. చిన్న సిరా చుక్కను జ్ఞాపకముంచుకోండి. చూడండి, ఇపుడు కారణము మీరు కనుగొనవలసియున్నది. ఈ ముద్రను తెరవబడుటకు ప్రకటించుటకు ఒక జీవిగాని లేక ఒక అధికారము గాని లేకుండ ఉండినందులకు ఒక కారణమున్నది. దేవుడు మాత్రమే దానిని బయలుపరచగలడు. అంతే. ఎందుకనగా అదంతా—అదంతా ఆయనలో ఇమిడియున్నవి.

87 అయితే ఆయన అది బయలుపరచుటకు గల కారణం, నేను అర్థం చేసుకున్నట్లుగా, ఎందుకనగా విమోచనా గ్రంథము యొక్క మర్మము క్రీస్తు విరోధి ఎవరనేది బయల్పడవలసియున్నది; మరియు అదే సమయములో సంఘము వెడలిపోవును. మరియు ఈ సంగతులన్నియు సంఘకాలములో జరగవు. అవును. అవి—అవి సంఘకాలమునకు దూరంగా ఉండును. ఈ సమయమునకు సంఘము ఖచ్చితంగా ఎత్తబడును. ప్రకటన 4వ అధ్యాయములో సంఘము వెళ్ళిపోవును. మరియు 19వ అధ్యాయములో అది దాని రాజుతో తిరిగి వచ్చు వరకు తిరిగిరాదు. అయితే ఈ ముద్రలు ఇక్కడ ఏమి జరిగెనో, ఏమి జరుగుచున్నదో, ఏమి జరగనైయున్నదో బయలుపరచుచున్నవి. ఔనా? మరియు, ఇపుడు సంఘకాలముల సంగతులను ఈ ముద్రలు బయలుపరచుచున్నవి. ఏమి జరగనైయున్నదో గమనించండి.

88 ఆ—ఆ స్వారీ చేయువాని నాలుగు దశలు బయల్పడియున్నవి. అంత్యక్రీస్తు స్వారీ చేయు నాలుగు దశలు ఈ సమయానికి బయలుపరచబడినవి. కాబట్టి అవి ఇక ఉండనవసరం లేదు.

89 అది స్వారీ చేయుచుండగా, స్వారీ చేయువానిని ప్రకటించుటకై అక్కడ, దేవుని యొక్క నాలుగు జీవులుండెను. నాలుగు జీవులు నాలుగు శక్తులు. ఇపుడు, మృగము అనగా ఏమిటో మనకు తెలుసు. బైబిల్ సూచన పదజాల అర్థం ప్రకారముగా దాని అర్థం “శక్తి.” ఇపుడు దానిని జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ లోని నాలుగు మృగములు ప్రజల మధ్య శక్తిని సూచించుచున్నవి.

90 ఇపుడు, దానియేలులో వలె మనము చూస్తే, ఒక దేశము లేచుట అతడు చూచినపుడు, అది ఒక ఎలుగుబంటి ఒక ప్రక్కటెముకను పట్టుకొనియున్నట్లు యుండు ఒక గురుతు చూశాడు. మరియొక శక్తి లేచుట అతడు చూశాడు, మేక. అది ఒక దానికి పోలిక. మరొక శక్తి లేచుట అతడు చూశాడు. అది అనేక తలలు కలిగియున్న చిరుతపులి. ఒక రాజ్యానికి అది పోలిక. తరువాత, మరొకటి లేచుట చూశాడు, గొప్ప సింహము కోరలతోనున్నది. మరియు—మరియు మిగిలిన వాటిని త్రొక్కుచున్నది. అది ఇంకొక శక్తికి పోలిక. ఒకటి నెబుకద్నెజరు రాజ్యము. మరియు మరొకటి కల యొక్క పోలిక. దానియేలు దర్శనం చూశాడు. నెబుకద్నెజరు కలను కన్నాడు. అయితే, దానియేలు అతని కలకు అనువాదము చెప్పాడు. ఖచ్చితమైన దర్శనముతో.

91 ఆమేన్! వ్యూ! ఓ! [సహోదరుడు బ్రెన్హాం ఒక్కసారి చేతులు కలిపి చప్పట్లు కొట్టుచున్నాడు—సంపా.] ఏమి జరిగిందో మీరు తెలుసుకుంటే…ఇక్కడ విడిచి వెళ్ళక ముందు ఏం జరిగింది? మీరు గ్రహించారా? ఎందుకని, దర్శనముతో ఖచ్చితంగా ఆరు కలలు వచ్చినవి. ఆమేన్. చూశారా. ఒక కల యొక్క అర్థం దర్శనము. ఎందుకనగా ఒక వ్యక్తి మేలుకొని యుండగనే అంతః మనస్సుతో చూచునట్లుగా పుట్టియుండక పోవచ్చును. తరువాత దేవుడు ఈ అంతః మనస్సాక్షిని కమ్మి అతనితో మాట్లాడును. కడవరి దినములలో కలల ద్వారా, మరియు దర్శనముల ద్వారా ఆయన జనులని దర్శించునని వాగ్దానము చేశాడు. చూశారా?

92 ఇపుడు, ఒక దర్శనమనగా నీవు బాగా మేల్కొని, ఈలాగు నిలబడునపుడు కొన్ని విషయాలు బయలుపరచబడును. ఏమి జరిగినదో చూచి, ఏమి జరుగనైయున్నదో మొదలైనవి ఖచ్చితంగా చెప్పుట.

93 అయితే, ఇపుడు ఒక కల నీవు నిద్రించునపుడు వచ్చును. నీ ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయని స్థితియందుండును. నీవు—నీవు ఉప మనస్సాక్షితో యుంటావు. నీవెచటనో ఉంటావు. ఎందుకనగా, నీవు తిరిగి వచ్చునప్పటికి నీవెక్కడ యున్నావనేది తెలుసుకుంటావు. జీవితకాలమంతా జ్ఞాపకముంచుకుంటావు. చూశారా? కనుక అది నీ యొక్క ఉప మనస్సాక్షి. అంతః స్థితి. అటుతరువాత క్రమముగా, చూడండి…

94 కాంగ్రెస్ మ్యాన్ అప్ షా ఇలా చెప్తుంటాడు, “నీకు లేని దానిని నీవు కలిగియుండలేవు.” అది నిజమే, చూశారా.

95 తరువాత నీవు దీర్ఘదర్శిగా పుట్టిన యెడల, ఇపుడు అది చేయుట మీరు చూస్తారు. ఆ రెండు అంతః మనస్సులు కలసియుండవలెను. ఐదు ఇంద్రియాలు కలిగి, స్పర్శ కలిగి, ఇక్కడ యుండి, మిగతాది ఇక్కడ యుండి నీవు నిద్రిస్తున్నపుడు, ఐదు ఇంద్రియాలు స్పర్శ లేకుండ యుండి. అయితే చూడు, అవి రెండును నీ పుట్టుకలోనే ఒక్కటిగా నుండును. నీవు నిద్ర పోనక్కరలేదు. ఒకదాని నుండి ఒక దానికి వెళ్తావు—ఆలాగు. నీవు నిద్రపోవుటకు చాలినంత స్థలము లేదు. నీవు ఆ విధంగా చేసుకొనలేవు.

96 కాబట్టి, “వరములు, పిలుపులు దేవుని యొక్క ముందు నిర్ణయములు.” అవి—అవి దేవుని యొక్క వరములు, పిలుపులు, చివరకు “మారుమనస్సు లేకుండానే,” అని బైబిల్ చెప్తుంది. చూశారా? భూమికి పునాది వేయబడక మునుపే అవి నిర్ణయింపబడియున్నవి. చూశారా?

97 ఇపుడు, ఇపుడు మనము చూస్తున్నాము. దానియేలు యొక్క ఒక మృగము, దాని యొక్క అర్థం ప్రజల మధ్య ఒక శక్తి (అధికారము) లేచుట. సరే. మరియు—మరియు ఇక్కడ కూడా యోహాను దర్శనాలు అది అధికారాలని, దేశములు లేచుటయని చూపుతున్నవి. ప్రకటన 13లో ఒక గొఱ్ఱెపిల్లగా సంయుక్త రాష్ట్రాలు అగుపించుట. మరియు తరువాత నీవు తెలుసుకోవాలనుకుంటే…

నీవంటావు, “సరే, అది దేశము యొక్క శక్తిని గూర్చి చెప్పుచున్నది.”

98 అది పరిశుద్ధమైన శక్తికి కూడా పోలికయైయున్నది, మృగము. అది నీకు తెలుసా?

99 రిబ్కాను గమనించు; ఆ—అబ్రాహాము యొక్క దాసుడు ఎలీయెజెరు…రిబ్కాను తెచ్చుటకు అతడు వచ్చినపుడు, ఆమెను అతడు ఒంటెపై ఎక్కించాడు, ఆమె నీరుపోసిన అదే ఒంటె. ఆమె చూడని పెండ్లి కుమారుని కలుసుకొనుటకు ఈ ఒంటె మీద ఆమె ప్రయాణము చేసెను. ఆమె నీరు పోసిన ఆ వస్తువే ఆమె భవిష్యత్ గృహమునకు మరియు భర్త యొద్దకు ఆమెను తీసుకొని వచ్చెను.

100 మరియు ఈ రోజు అదే. సంఘము నీరు పోసే అదే వస్తువు, అదే విత్తనము, వాక్యము యొక్క విత్తనము. సాక్ష్యాత్తు ఆ వాక్యమే, సజీవమై మనము చూడని పెండ్లి కుమారుని యొద్దకు మనలను మోసుకొని పోవును. చూశారా? చూశారా?

101 ఎంత సంపూర్ణమో చూడండి. ఇస్సాకు ఇళ్లు వదలిపెట్టాడు. పొలములో ఉన్నాడు. ఇంటికి దూరంగా ఉన్నాడు, రిబ్కా అతన్ని చూచినపుడు.

102 మరియు సంఘము క్రీస్తును మధ్యాకాశములో కలుసుకొనును, ఆయన ఆమెను తిరిగి తండ్రి ఇంటికి, ఎక్కడ భవనాలు సిద్ధపరచబడెనో అక్కడకు తీసుకొని వెళ్ళును. ఇస్సాకు రిబ్కాను ఆ విధముగానే తీసుకొని వెళ్ళెను.

103 మరియు గమనించండి. మొదటి చూపులోనే ప్రేమ. ఓ, మై. అతనిని కలుసుకొనుటకు ఆమె పరుగెత్తినది.

104 మధ్యాకాశములో, ఆ విధముగానే సంఘము క్రీస్తును కలుసుకొనును. నిరంతరం ఆయనతో యుండును.

105 ఇపుడు, బైబిల్ గ్రంథము యొక్క పదజాలము, ఈ మృగములు శక్తులు. గమనించండి. ఇపుడు మీరు గమనించాలని నేను కోరుచున్నాను.

106 రంగుల మృగములు నాలుగు సాతానుకుండెను. అతనికి అతని యొక్క నాలుగు మృగములుండెను. ఆ యొక్క మూడు ఒక రంగులో పెడితే, ఒక పాండుర వర్ణ గుఱ్ఱం యౌతుంది; ఒక తెల్లని గుఱ్ఱం, ఎర్రని గుఱ్ఱం, నల్లని గుఱ్ఱం. అతని పరిచర్యను గూర్చిన ఒక్కొక్క భాగాన్ని మనము చూశాము. నైసియాలో ఒక సంఘశాఖ గా రూపుదాల్చుకున్న ప్రారంభ సంఘ స్థితిని చూశాము. పరిశుద్ధాత్మ ఎవరిపైన కుమ్మరించబడెనో, ఆ ఆరంభ పెంతెకొస్తు సంఘము, క్రిందకు వచ్చి, అంత్యక్రీస్తు ఆత్మను తీసుకొని, ఒక సంస్థగా తయారై, సంస్థాపక పిల్లలను కన్నది. మూడుసార్లు తన అధికారమును మార్చుకుంటు, వాటిని ఒకదానిలో యుంచి పాండుర వర్ణ గుఱ్ఱముగా తయారైనది. అటుతరువాత మృత్యువు అను పేరు ఇవ్వబడెను, మరియు నిత్యత్వములోకి స్వారీ చేయుచు వెళ్ళినది. అది ఎంతో తేటగా ఉన్నది! ఇపుడు, ఇపుడు గమనించండి. అతనికి—అతడు స్వారీ చేయుచున్నాడు.

దేవుడు, దేవుడు కూడా ఆ విధముగానే ప్రతిసారి కలిగియున్నాడు…

107 ఇపుడు గమనించు, మొదటిగా అంత్యక్రీస్తు అగుపించినపుడు, అతడు ఎందులో అగుపించెను? తెల్లని గుఱ్ఱంలో. చూశారా. అమాయకుని వలె ఉండెను. సంఘములో సిద్ధాంతముగా యుండెను. వారు సహవాసము కోరారు. నీ సహవాసము క్రీస్తుతో కూడా యున్నది. అయితే వారు సహవాసము కోరారు. వారు నిలువలేకపోయారు, వారు కోరిరి…

108 సరే. మీకు తెలుసా, చిన్న గుంపులు సంఘములో లేచును. మీకు, మీకవి తెలుసు, కాపరులైన మీకు తెలుసు. చూశారా? వారు చెప్పినట్లుగా “ఈకలు గల పక్షులు.” అయితే మనము తిరిగి జన్మించితే, సహోదరులారా, ఆ విధమైన వైఖరి యుండదు. చూశారా. ఉండదు. ఇపుడు, మనము—మనము—మనము…

109 మన సహోదరులలో తప్పిదము ఏదైన చూస్తే, ప్రార్థించి ప్రభువు ముందు ఉంచుదాము. దేవుని యొక్క సన్నిధానములోకి అతనిని మనము తెచ్చువరకు ఆ మనుష్యుని మనము ప్రేమిద్దాం. చూశారా? మనము చేయు నిజమైన మార్గమదే.

110 యేసు చెప్పాడు, మీకు తెలుసా. “అక్కడ గురుగులుండును,” అక్కడుండునని యేసు చెప్పాడు కనుక. “అయితే వాటిని పెరికి వేయవద్దు. వాటితో మీరు గోధుమలను పెల్లగింతురు.” చూశారా, “వాటిని ఆ విధముగానే యుండనియ్యుడి.” ఆయన…కాలము వచ్చునప్పటికి ఆయనే వాటిని వేరుపరచునుగాక. చూశారా? వాటినన్నిటిని కలిసి ఎదగనియ్యుడి.

111 గమనించండి, మృగము వెళ్ళినపుడు, అంత్యక్రీస్తు మృగము పైన బయలు వెళ్ళెను, అతని బలముతో.

112 ఓ, నేనిది ప్రేమిస్తున్నాను. నేనిపుడే భక్తి పులకితుడను కాబోవుచున్నాను. చూశారా. ఉత్తేజపూరితుడనౌతున్నాను. గమనించండి, అంత్యక్రీస్తు…ఓ, ఆ—ఆ ప్రత్యక్షతలు, అక్కడ గదిలో ఆ అగ్ని గోళం వ్రేళాడుచుండగా ఆ సమక్షములో ఆ ప్రత్యక్షతలు వచ్చినవి. అంతవరకు…ఓ, సహోదరుడా, చిన్న బిడ్డనైనది మొదలు నేను చూచినప్పటికి, అది నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి అది నన్ను హెచ్చరిక చేస్తుంది. ఆయన నన్ను అపస్మారక స్థితిలో ఉంచును. దానికి మీరు అలవాటు పడలేదు. మీరు లేదు. అది చాలా పవిత్రమైనది.

113 గమనించండి. అంత్యక్రీస్తు తనయొక్క పరిచర్య చేయుటకు ఆ (నాలుగు) మృగములపై వెళ్ళినపుడు దానిని ఎదుర్కొనుటకు దేవుడు ఒక జీవిని పంపెను. చూస్తున్నారా? ఇపుడు గమనించండి. అటుతరువాత, ప్రతిసారి (మృగము) దాని యొక్క గుఱ్ఱం మీద స్వారీ చేయునపుడు, అంత్యక్రీస్తు తన గుఱ్ఱంపైన స్వారీ చేసెను. తన పరిచర్యను ప్రకటించుటకు గుఱ్ఱమనే మృగముపై స్వారీ చేసెను. దేవుడు కూడా ఆయన జీవిని పంపెను. ఆయన దానితో తన యుద్ధమును ప్రకటించుటకు ఆయన దానిపై యుండెను.

114 ఇపుడు, లేఖనము చెప్తుంది, “శత్రువు వరద వలె వచ్చినపుడు, దేవుని ఆత్మ దానికి విరోధముగా ఒక శక్తిని లేపును.”

115 మరియు కాబట్టి శత్రువు ఒక అంత్యక్రీస్తుగా బయలు వెడలినపుడు; దేవుడు అతని ఎదుర్కొనుటకు ఒక విధమైన శక్తిని పంపును. అటుతరువాత…

116 అతడు మరలా వెళ్ళిపోయాడు, ఒక ఎర్రని గుఱ్ఱం మీద స్వారీ చేయువానిగా, మరొక రంగులో, మరొక శక్తితో, మరొక పరిచర్యలో; దానిని ఎదుర్కొనుటకు దేవుడు మరొకరిని ఆయన సంఘమును స్థిరపరచుటకు పంపాడు.

117 మూడవ వానిని పంపెను, మూడవ జీవి వచ్చి ప్రకటించుటకు ఆయన మూడవ జీవిని దేవుడు పంపెను.

118 అతడు నాలుగవ దానిని పంపెను; దేవుడు ఆయన నాలుగవ దానిని పంపెను. తరువాత అంత్యక్రీస్తు ఆగిపోయాడు, సంఘకాలాలు కూడా ఆగిపోయినవి, ఆ సమయానికి. గమనించండి. ఇపుడు, ఓ ఇది నిజంగా మంచిది.

119 ఇపుడు, అపవాది మారటం చూశాము. నాలుగు—నాలుగు మృగములు, అర్థం ఏలాటి శక్తిని బయలుపరచుచున్నాడు…లేక ఎటువంటి శక్తిని లోకానికి అతడు బయలుపరచియున్నాడు, మరియు ఏ విధముగా పాండుర వర్ణ “మృత్యువు” గుఱ్ఱం మీద వారు ముగించినది అని అర్థం.

120 ఇపుడు వాటిని ఎదుర్కొనుటకు దేవుని జీవుల యొక్క శక్తులను గమనిద్దాం.

121 దేవుని యొక్క మొదటి జీవి, ఆయన అంత్యక్రీస్తును ఎదుర్కొనుటకు వెళ్ళెను. అంత్యక్రీస్తు ఆత్మ కొద్దిగా తన ఉపదేశముతో నున్నపుడు. ఇపుడు జ్ఞప్తించుకోండి, అంత్యక్రీస్తు మొదట స్వారీ చేసినపుడు అతడు ఉపదేశ పరిచర్యలో యుండెను. అంత్యక్రీస్తు మొదట ఉపదేశ పరిచర్యలో స్వారీ చేసెను. ఇపుడు అతన్ని ఎదుర్కొనుటకు వెళ్ళినదెవరో గమనించు: సింహము, యూదా గోత్రపు సింహము, వాక్యము. అతని అబద్ధ బోధ బయలువెడలినపుడు, నిజమైన వాక్యము అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళెను.

122 ఆ కారణము చేత మనకొక ఐరేనియస్, పోలికార్పు మరియు—మరియు—మరియు—మరియు ఆ వ్యక్తులున్నారు, పరిశుద్ధుడైన మార్టిన్.

123 తన అబద్ధపు ఉపదేశముతో అంత్యక్రీస్తు స్వారీ చేయుచుండగా; దేవుడు, ఆయన ఉపదేశమగు వాక్యమును పంపాడు. యూదా గోత్రపు సింహమును, పరిశుద్ధాత్మలో బయలుపరచబడిన వాక్యమును. మరియు పరిశుద్ధాత్మ, వాక్యమను ఆయనను అక్కడ బయలుపరచబడవలెను.

124 ఆ కారణము చేత ఆరంభ సంఘము స్వస్థతలు, అద్భుతాలు, దర్శనాలు, శక్తిని కలిగియున్నది. ఎందుకనగా దానిని ఎదుర్కొనుటకు యూదాగోత్ర సింహపు రూపముననున్న జీవము గల వాక్యమైయుండెను. ఆమేన్! ఇపుడు మీకు అర్థమైందా? అంత్యక్రీస్తు తన శక్తిని పంపునపుడు; దేవుడు ఆయన వాక్యమును, వాక్యమును పంపును. అంత్యక్రీస్తు, అబద్ధ బోధ; దానిని ఎదుర్కొనటానికి నిజమైన బోధ బయలువెళ్ళెను. ఇపుడు, అది మొదటిది. ఇపుడు, ఇది మొదటి సంఘము, అపొస్తలుల సంఘము. అతనిని ఎదుర్కొనుటకై వెళ్ళినది.

125 ఇపుడు, అంత్యక్రీస్తు పంపిన రెండవ మృగము ఒక ఎర్రని మృగమైయుండెను. యుద్ధముతో భూమి మీద సమాధానము తీసివేయుటకు (మరియు) ఆ ఎర్రని మృగమనే గుఱ్ఱం పై స్వారీ చేసెను.

126 ఇపుడు అతన్ని ఎదుర్కొనటానికి వెళ్లిన రెండవ జీవి ఎద్దు. ఎద్దు అనగా అర్థం శ్రమ, భారము మోయు జీవి.

127 మరియు ఇపుడు ఒక నిముషము మనము ఆగిన యెడల, నన్ను, ఆ, నన్ను మీరు ఖచ్చితంగా ఇది ఇపుడు చూస్తారు. ఇపుడు, ఇది కొంత మిమ్ములను ఆశ్చర్యాన్ని కలిగించును. అయితే, ఇక్కడ తుయతైరను తీద్దాము. అది ఒక—ఒక—ఒక శ్రమపడు సంఘమో కాదో చూద్దాము. ఔనా.

తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—అగ్ని జ్వాల వంటి కన్నులును అపరంజిని పోలిన పాదములును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

నీ క్రియలను యెరుగుదును,…

128 చూశారా, ఇపుడు అన్ని క్రియలుగానున్నవి, చూశారా, ఎందుకనగా అది అతనితో కూడా స్వారీ చేయుచున్నది.

…మరియు నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను (చూశారా, అదంతా…) నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియలు కన్న (మరల, రెండుసార్లు, “నీ క్రియలు”), నీ కడపటి క్రియలు మరి యెక్కువైనవని యెరుగుదును.

129 చూశారా, తుయతైర కాలములో అంత్యక్రీస్తు స్థిరపడిన తరువాత, తుయతైర కాలమునకు వచ్చిన తరువాత, ఆ చిన్న సంఘము శ్రమపడుట తప్ప మరేమి చేయలేకపోయెను.

130 మరొక విషయము ఎద్దు అర్పణ జీవి. చూశారా? ఆ యొక్క అంధకార యుగములో, కథోలిక్ లు ప్రపంచమును స్వాధీనమందుంచుకొనినపుడు, వారు వారి యొక్క జీవితములను ఎంతో ఉచితముగా అర్పించిరి. వారక్కడ అవును లేక కాదు అని చెప్పవలెను. వారు చనిపోవుటకు లెక్క చేయలేదు. అది మరణమా, అయితే. ఏలాగైనా వారు వెళ్ళి చనిపోయారు. ఎందుకు? అది కాలము యొక్క ఆత్మగా ఉన్నది.

131 ఆ కారణము చేత, ఆ కారణము చేత ఐరేనియస్, పోలికార్పు, అక్కడున్న యోహాను, పౌలు మొదలైన గొప్ప వ్యక్తులు ఆ కార్యమును ఎదిరించుచుండిరి.

132 పౌలు, అది చూశాడు. అతడు చెప్పాడు, “నాకు తెలుసు, నేను వెడలిపోయిన తరువాత తోడేల్లు మీ మధ్య ప్రవేశించనైయున్నవి. సహోదరులారా, వక్ర మాటలు బోధించుదురు. అది మిమ్ములను వెనుకకు లాగును.” ఆ చిన్న వృద్ధ అపొస్తలుడు దృఢ నిశ్చయముతో అక్కడ నిలబడియున్నాడు. తన వీపు నిండా దెబ్బలతోనున్నాడు. అతని కళ్ళు నీళ్ళు కారుచున్నవి. అయితే, అతను దూరదర్శి యంత్రము కన్నను దూరంగా చూడగలిగెను. వారు దానితో ఆకాశములో నూట ఇరవై మిలియన్ల వెలుగు సంవత్సరములను అది చూడగలదని చెప్తారు. అతడు నిత్యత్వములోకి వెళ్ళి చూశాడు. అతడక్కడే యున్నాడు. ఏమి జరుగునోయని ముందుగా ఊహించి చెప్పాడు. ఇంకా చెప్పాడు, రాబోయే మరియొక కాలము వరకు అతడు చూచి చెప్పాడు. ఇపుడు, అతడు ఆ విధముగా నుండుటను గమనించుడి.

133 అతని తరువాత వరుసలో, పరిశుద్ధుడైన యోహాను ఎక్కువ కాలం జీవించాడు. పరిశుద్ధుడైన యోహాను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినవాడై పవిత్రమైన పత్రికలన్ని తీసుకొని ఒకటిగా కలిపి బైబిల్ గా చేయుటకు ప్రయత్నించుచుండగా రోమా ప్రభుత్వము అతన్ని పట్టుకొని పత్మాసు ద్వీపములో పెట్టిరి. దేవుని వాక్యము నిమిత్తము పత్మాసు ద్వీపములో అతడు అక్కడయుండెను. అది తర్జుమా చేయుటకు పోలికార్పు అతనికి సహకరించెను.

134 నిన్నటి దినము, మరియ స్వయంగా పోలికార్పుకు వ్రాసిన ఉత్తరము నేను చదివాను. మరియు అతని గద్దించుట కాదు. కానీ దేవుని యొద్ద నుండి తన ద్వారా జన్మించిన యేసుక్రీస్తు యొక్క బోధను అంగీకరించి మరియు దానిని బోధింప గల యోధుడని అతన్ని మెచ్చుకొనెను. మరియ స్వయంగా పోలికార్పుకు వ్రాసిన వివరణ యది.

135 పోలికార్పు సింహాలకు వేయబడ్డాడు, మీకు తెలుసా. కాదు, అతడు కాల్చబడ్డాడు. అది—పందెపు ఆట స్థలములో సింహమును వదులుట వారికి ఆలస్యమౌతుందని వారు ఒక పాత స్నానపు గదిని పడగొట్టి, పందెపు రంగములో అతనిని తగులబెట్టిరి.

136 అతడు తన తల దించుకొని, తన దారిన నడుస్తు వస్తున్నాడు. రోమా శతాధిపతి అన్నాడు, “నీవు వృద్ధుడవు, గౌరవింపతగిన వాడవు. ఎందుకు దానిని తృణీకరించకూడదు?”

137 అతడు ఆకాశము వైపునకే చూస్తున్నాడు. మరియు ఒక చోట నుండి ఒక స్వరము పలికినది. ఎక్కడ నుండో వారు అర్థం చేసుకోలేకపోయారు. చెప్పబడినది, “పోలికార్పు, భయపడవద్దు. నేను నీతో ఉన్నాను.” ఊహు. ఎందుకని? ఆ వాక్యముతో అతడు నిలబడియుండెను.

138 అతన్ని కాల్చుటకు వారు చెక్కలు అతని మీద పెడుతున్నపుడు ఒక పరలోక సంగీతము దిగివచ్చెను. మరియు—మరియు కొందరు దేవదూతలు ఎక్కడనుండియో వచ్చి పాటలు పాడారు. అతడు తనను పరిహసించు వారివైపు ఒక్కసారి కూడా కనురెప్ప దించి చూడలేదు.

139 అటువంటి ధైర్యశాలురు ఆ మనుష్యులు. ఆలాటి మనుష్యులు ధైర్యంగా నిలబడ్డారు. అన్ని కాలాలలో హతసాక్షులు చాలా ఘోరముగా హింసించబడ్డారు. అయితే వారేలాగుండిరి. వారు ప్రేరేపణతోను, దేవుని ఆత్మతోను, శక్తితోను నుండిరి. నేను…

140 సంఘమా, ఇది మరచిపోవద్దు. టేపు వినుచున్న సహోదరులైన మీరు, ఇది మీరు పరీక్షించాలని కోరుచున్నాను. వారికి అనుగ్రహించబడిన దేవుని యొక్క శక్తి లేకుండా ఏలాటి వాటినైనా మనుష్యులు ఏలా చేయగలరు? దానికి ప్రతినిధిగా ఈ పెట్టెను నేనిక్కడ పెట్టబోవుచున్నాను. దేవుడు వారి మధ్యకు ప్రత్యేక ఆత్మను పంపిన యెడల దాని ద్వారానే వారు క్రియలు చేయవలెను. ఆ ఆత్మ వారి మధ్య పని చేయును. సంఘము యొక్క చరిత్ర ద్వారా మరియు ముద్రలు తెరువబడుట ద్వారా మరియు వదలబడిన శక్తుల ద్వారాను ఇపుడు మేము నిరూపిస్తాము. మరియు గమనించండి. ఖచ్చితంగా సంఘము అభిషేకమునకు ప్రతిస్పందించినది. వేరే వారేమి చేయలేరు.

141 ఇపుడు, మొదటిది గర్జించు సింహము. పవిత్రమైన కలుషితము లేని వాక్యము.

142 రెండవది తుయతైరలో ఎద్దు. అది భారము మోయునది…భారము మోయు జీవి. క్షమించండి నన్ను. మరియు అది అర్పణ జీవి కూడా. మరియు ఆ ఖచ్చితంగా చిన్న దీన సంఘము కాదా? రోమ్ ఆ వెయ్యి సంవత్సరములు అంధకార యుగములలో స్థిరపడి మరియు రోమన్ సంఘముతో అంగీకరింపని దానికి విరోధముగా చెప్పు ప్రతివారిని తక్షణమే మరణశిక్షకు అంగీకరించిరి. వారు శ్రమపడవలసి వచ్చెను. ఒక చోట నుండి ఇంకొక చోటకు వెళ్ళుచుండిరి.

143 మేషన్స్ సంస్థవారలారా, మీరు, మీరు గమనించవలెనని కోరుచున్నాను. సిలువ యొక్క గురుతు మీకు జ్ఞప్తుందా? ఇపుడు మీరు—నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో మీకు తెలుసు.

144 ఇపుడు గమనించండి. మీరు—మీరు గమనిస్తే, ఆ బైబిల్ గ్రంథమును భద్రపరచి, మూటగట్టుట. చూశారా? వారు ఒకరి మధ్య ఒకరు శ్రమపడవలసియుండెను. అక్కడే మీరున్నారు, ఎద్దు. అది…గతరాత్రి మనమది చదివాము. చూశారా, విషయం ముందుకు వెళ్ళినపుడు అర్పణ వచ్చును. వారు వెళ్ళవలసియుండెను.

ఆయన చెప్పాడు, “నూనెయు ద్రాక్షారసము పాడుచేయవద్దు.”

145 వారేమి చేశారు? ఇష్టపూర్తిగా వారక్కడకు వెళ్ళిపోయి మరణించిరి. వారు భయపడలేదు, ఎందుకనగా ఆ దినాన సంఘము యొక్క ఆత్మ అర్పణ, శ్రమపడుట. ఆ కాలము యొక్క నిజమైన దేవుని ఆత్మతో అభిషేకించబడి వారు మరణించుటకై ధైర్యముగా ముందుకు నడచి వెళ్ళుచు యోధుల వలె మరణించారు. ఒక అర్పణ. వేలకొలది వేలకొలదిగా, అరవై ఎనిమిది మిలియన్ల మంది వివరణ ప్రకారంగా.

146 ఎద్దు, అర్పణ! ఓ, మై. మీరది అర్థం చేసుకున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] సరే మంచిది. ఇపుడు, అర్పణ, ఆ కాలములో అది శ్రమపడగలదు. ఆ వెయ్యి సంవత్సరములలో ఎంతో వ్యతిరేకముగా నున్న దానితో పోరాడుటకు అది ఆ కాలములో శ్రమ పడగలిగినది.

147 ఇపుడు, అపవాది నుండి బయలు వెడలినది ఈ నల్లని గుఱ్ఱం. చూశారా?

148 ఇపుడు, అతనిని ఎదుర్కొనుటకు, నల్లని గుఱ్ఱము యొక్క శక్తులను ఎదుర్కొనుటకు బయలు వెళ్ళిన మూడవ జీవి దేవుని యొద్ద నుండి వెళ్ళిన ఒక శక్తి; ఒక మనిషి. యుక్తి గల, తెలివి గల, దేవుని యొక్క జ్ఞానము గలవాడు. మృగములన్నిటి కంటే మానవుడు తెలివిగలవాడు, మీకు తెలుసా. ఔనా? అతడు తెలివిగలవాడు, ఎందుకనగా అతడు అన్ని ఓడించగలడు. అతడు తెలివైనవాడు, యుక్తిగలవాడు. చూశారా? మరియు అతడు…

149 ఆ కాలము, అది అంధకారము నుండి బయటకు వచ్చుచున్న కాలముగా యున్నది. ఈ అవతల ప్రక్క, ఈ నల్లని గుఱ్ఱము స్వారీ చేయునపుడు, వారి యొక్క—వారి యొక్క—వారి యొక్క—వారి యొక్క అర్పణలు మరియు చేయువాటన్నిటికి వారు వసూలు చేయుచుండిరి. మరియు డబ్బు…ఓ అదెలాగో మీకు తెలుసా.

150 ఇపుడు, దానిని ఎదుర్కొనుటకు వెళ్ళిన తదుపరి జీవి ఏదనగా మనుష్యుని ముఖము కలిగిన జీవి. తెలివితేటలు గలిగి, తెలివైనది, మంచిది, ఆ దినము యొక్క ఆత్మతో అభిషేకించబడినది. మీరది గ్రహించారా? దేవుని జ్ఞానపు యుక్తితో అతడు అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళెను. అది సంఘ సంస్కరణ కాలము. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ మరియు మొదలగు వారుండిరి. చూడండి. అది సంస్కరణ. జింగ్లీ మరియు ఓ, అందరు నాక్స్, కాల్విన్ వారందరు. చూశారా, అది యుక్తిగల తనము. ఇపుడు మీరు గమనించండి. ఖచ్చితంగా అంధకార యుగము నుండి, సంస్కరణ నుండి, ఇదే మార్గము, గమనించు అది మనుష్యుని యొక్క తెలివితేటలు.

151 మీ కిటికీలను మీరు కొద్దిగా తెరిస్తే బాగుండును. ప్రజలకు కొద్దిగా వేడిగానున్నదని నేను అనుకుంటాను. అక్కడ అనుకుంటాను. కొద్దిగా కిటికీలను తెరచిన యెడల బాగుండును. కారణం, ఇక్కడ నేను నిలబడి బోధిస్తుండగా, వేడి తగులుట వలన అక్కడున్న మీరు బద్ధులౌతారని నాకు తెలుసు.

152 సరే. గమనించండి. అది మానవుని యొక్క యుక్తి. ఇపుడు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా?

153 సాతాను పంపిన ఆ మూడవ మృగము, అతను కూడా తెలివైనవాడు. గమనించు, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు.” చూశారా? ఓ, మై, చూడండి. డబ్బు సంపాదించు పథకము, తెలివి. ప్రపంచము యొక్క బంగారము, సంపద అందులోకి తెచ్చుట. అది ఖచ్చితంగా నెరవేరినది. అక్కడే ప్రార్థనలకు వసూళ్లు చేయుట ప్రారంభమైనది. మరియు పర్గెటరి అనగా పాపమును పరిహరించు స్థలమను ఒక స్థలమును ఏర్పరచి వారి పితరులకు ప్రార్థనలు చేశారు. మరియు, ఓ, మరియు మీ ఆస్తులను, సమస్తమును మీ హక్కులను వారికి ఇవ్వవలెను. సంఘము మరియు రాజ్యము ఒకటియాయెను. మరియు సంఘము మీ ఆస్తిని తీసుకున్నది.

154 మరియు ఈ దినాన కొంతమంది సువార్తికులు, ఇంకా వారి మీద అదే అభిషేకముండుట మీరు చూచుటలేదా? వృద్ధులు తమ పెన్షన్ లను వదులుకొనునట్లు చేయుట మరియు వారి ఇండ్లను వారి కార్యముల కొరకు ఇచ్చుట లాంటి సంగతులు. ఎందుకు, సహోదరుడా, నేను—నేను ఆ విషయానికి పోవుటకు నేనిష్టపడుట లేదు. చూశారా. అయితే నేనిపుడు దీనితో నిలబడతాను; నేనెక్కడకు వెళ్ళుచున్నాననునది నేను తిరిగి చూస్తాను. ఇపుడు గమనించు, ఆ మనుష్యులు, అది వారికి సంబంధించినది. దానికి వారే బాధ్యులు. అది—అదే—అది ఏ ఒక్కటి నాకు సంబంధము లేదు. ఇక్కడ దీనికి నేను బాధ్యుడను.

155 ఇపుడు గమనించండి, దానిని ఎదుర్కొనుటకు వచ్చిన ఆ జీవి, మనుష్యుడు. ఈ జీవి మనుష్యుడని మానవుని శక్తి అని మనందరికి తెలుసు. తన యొక్క తెలివితేటలతో, మార్టిన్ లూథర్ తన యొక్క చేతిలో ఆ కోషెరు రొట్టె ముక్కను పెట్టుకొని ఆ మెట్లు ఎక్కుచుండగా గుర్తెరిగెను.

156 వారు చెప్పారు, “ఇది యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము.”

157 లూథర్ దానిని క్రింద విసరివేసి చెప్పాడు, “ఇది రొట్టె ద్రాక్షారసము. ఇది క్రీస్తు యొక్క శరీరము కాదు; ’కారణం అది హెచ్చింపబడి విజ్ఞాపణ చేయుచు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను.” చూడండి, జ్ఞానము; చూడండి. మానవుడు.

158 మరియు జాన్ వెస్లీ దాని తరువాత వచ్చెను. తరువాత జింగ్లీ వచ్చాడు, కాల్విన్ వచ్చాడు.

159 వారు సంఘమును సురక్షితమైన స్థానమునకు తీసుకొని వచ్చిరి. ఆ తరువాత వారు ఇక ఉజ్జీవములు లేవనిరి. “ఏది జరిగితే అది జరగనియ్యుడి.” అంతే. వారికిష్టమొచ్చిన జీవితం వారు జీవించారు. లూథరన్ సంఘము ఎంతో దారి తప్పినది. ఆంగ్లికన్ సంఘము అంతే! ఓ, మై! ఇపుడేలాగో ఆలాగే దేశమంతా కలుషితమైపోయినది. సంఘములు తారుమారైనవి. మరియు రక్తము చిందించిన పిమ్మట రాజైన హెన్నీ VIII ఇంగ్లాండు వచ్చాడు, మరియు ఆ కార్యములన్ని సంభవించినవి. తరువాత సంఘము చెడుతనముతోను, హింసతోను నిండిపోయినది. అనేకులు క్రైస్తవులని పిలుచుకుంటూ నాలుగు లేక ఐదుగురు భార్యలతో జీవించుచు లేక వారికిష్టమొచ్చినది చేయుచు, అపవిత్రమైన జీవితము జీవించిరి.

160 జాన్ వెస్లీ లేఖనములు చదువుచు, దానిని గమనించుచుండెను. యేసుక్రీస్తు యొక్క రక్తము విశ్వాసిని పవిత్రపరచునని అది బయలుపరచెను. మరియు నీవు…కాదు…అయితే అతడేమి చేశాడు? ఇంకొక సంస్కరణతో అతడు వచ్చాడు. లూథర్ చేసినట్లుగా అతని దినాన అతడు లోకమును రక్షించాడు. చూశారా? ఏంటది? మనుష్యుడు, జీవి యొక్క శక్తి బయలు వెడలుచున్నది.

161 విషయము తప్పని గ్రహించుటకు మనుష్యునికి జ్ఞానము దయచేసెను. “అది యేసుక్రీస్తు యొక్క రక్తము. అది—అది యేసుక్రీస్తు యొక్క శరీరము. అది శరీరమునకు ప్రతినిధి.” ఔనా?

162 అది ఇంకా కథోలిక్ ప్రొటస్టెంట్ వారి మధ్య వాదముగానే యున్నది. ఇప్పటికి కూడా సమ్మతికి రాని ఒకే యొక అంశము అదే. దాని మీద తప్ప మరిదేని మీదనైనను మీరు అంగీకారానికి రాగలరు, వారి ఆలోచనా సభలలో వారు కలిగియున్నారు. ఇపుడు గమనించండి. అయితే, ఇది అయితే వారు—దానిపై వారు ఏకీభవించలేరు. [సహోదరుడు బ్రెన్హాం వేదికను మూడుసార్లు తట్టెను—సంపా.] చూశారా?

163 “రక్తము, మరియు,” “ఇది అక్షరార్థంగా రక్తము అని చెప్పుచున్నారు, ఈ రొట్టెను అక్షరాల క్రీస్తు శరీరముగా మార్చు శక్తి పూజారికి ఉన్నదని వారు చెప్పుచున్నారు.” అదే చిన్న మందిరం సంఘములో మీకు తెలుసా. ఆ కారణము చేత గుర్తును వేసుకొనుచు మరియు అన్యుల అర్పణలు పలు విధముగా అర్పించుచు టోపీలను తీసివేసి వాటి ముందు వంగి నమస్కరించుటను మీరెరుగుదురు. ఆ భవనమునకు కాదు; గుడారములోనున్న కోషెరుకు. సాతాను ఎంత కుయుక్తిగా దూర్చెనో గమనించండి!

164 అయితే, చూడండి, ఆ సమయములో అది తప్పుయని గ్రహించుటకు మానవుని మీద దేవుడు ఒక జ్ఞానాత్మను ఉంచాడు. ఇపుడు అది మూడవ మృగమును ఎదుర్కొనుటకు ఆ విధముగా అనుగ్రహించబడినది. అపుడు సంఘము చాలా చెడిపోయి, అతడు స్వారీ చేయుచుండగా అది ఇంకా ఘోరముగా మారిపోయింది. సంస్కర్తలు, అప్పుడు వారేమి చేశారు. దిద్దుబాటు కాలంలో వారున్నారు. వారు సంఘమును విగ్రహ సంబంధమైన అన్య ఆచారముల నుండి తిరిగి దేవుని యొద్దకు త్రిప్పారు. చూశారా? జీవి బయలు వెళ్ళింది అందుకే. అది చేయుటకు మానవుని యొక్క యుక్తి.

165 ఇపుడు, అయితే, ఇపుడు 3వ వచనము చదువు మరియు…లేక ప్రకటన 3:2, ఒక్క నిముషము. ఇపుడు ఒక కారణము కొరకు నేనిక్కడ గుర్తు పెట్టుకున్నాను. ఇపుడు ఇది, లూథరన్ కాలము, సంస్కర్తల కాలంలో ఇక్కడ వచ్చుచున్నది, ప్రకటన 3:2.

166 వారేమి చేశారు. వారు నిర్మాణాత్మకము చేశారు. లూథర్ తన సంఘమును ప్రారంభించగనే, వారది నిర్మాణాత్మకము చేశారు. సరే. ఆలాటిది వెస్లీ చేశాడు. పెంతెకొస్తులు ఆలాటిదే చేశారు. ఖచ్చితంగా అది నిర్మాణము చేశారు. వారేమి చేశారు. వారు దేని నుండి బయటకు వచ్చారో అదే పద్ధతిని వారు స్వీకరించారు. చూశారా?

167 ఇపుడిది గమనించు. ప్రకటన, ఈ సార్దీస్ సంఘమును గూర్చి పలుకుచున్నది. “సంఘపు దూతకు,” అది మొదటి వచనము. చూశారా? అది మంచిది.

జాగరూకుడవై, చావనైయున్న మిగిలిన వాటిని బలపరచుము,

168 అది, “నీకు బోధింపబడిన వాక్యము,” చూశారా “మిగిలిన వాటిని.”

…చావనైయున్నవాటిని:…

169 కథోలిక్ సంఘము నుండి బయటకు వచ్చి మరలా దానిలోనికి వెళ్ళునట్లుగా అతడు అక్కడ సంస్థాపకమును స్థాపించుటకు సిద్ధముగా ఉన్నాడు. చూశారా?

…నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుట లేదు.

170 అక్కడకే నీవు వెళ్ళుచున్నావు. అక్కడకే…అక్కడకే మరలా వెళ్ళుచున్నాడు. సంస్థాపక సంఘముల పద్ధతులు ఎందుకు తప్పో మీరు చూచుట లేదా? ఎవరది స్థాపించారు? దేవుడా? అపొస్తలులా? రోమన్ కథోలిక్ సంఘము అది స్థాపించినది. ఇపుడు ఏ చరిత్రకారుడైనా వ్యత్యాసంగా చెప్పగలడా. అక్కడ అది లేదు. వారంటారు తల్లి సంఘం వారేనని, మరి వారే. అయితే వారు విషయాన్ని నిర్మాణాత్మకము చేసి, మానవుని శిరస్సుతో ఒక పద్ధతిని పెట్టారు. మరియు వారు చేసినట్లుగా ఒక మనుష్యుని మనము తీసుకోలేదు; మనము మనుష్యుని అంతా ఆలోచన తీసుకొని, ఏకము చేసి మరియు తరువాత గందరగోళంలోకి వచ్చాము. ఔను. ఒక ఆలోచనా సభ వలన ఏమి జరుగును?

171 ప్రజాస్వామ్యము మంచిది అని మనము అనుకున్నట్లుగా అది యుంటుంది. నేను కూడా అది అనుకుంటున్నాను. అయితే అది ఎన్నడు పనిచేయదు. అది చేయదు. ఒక రకపు రిక్కీలు దానిని నడుపునంత కాలము లోకములో దానినెట్లు సరిచేయగలవు? నీవు చేయలేవు. గమనించు, నిజమైన విషయమేదనగా దైవభక్తిగల రాజు సరిచేయగలడు.

172 ఇపుడు జీవిని, మూడవ జీవిని గమనించు. అది మానవుని యొక్క యుక్తియై యున్నది. మరియు బయలు వెడలిన సంస్కర్తలను అతడు సూచించుచున్నాడు.

173 “ఇది రొట్టె” దానిని తీసుకొని చెప్పుచు విగ్రహారాధన వలె [సహోదరుడు బ్రెన్హాం తన చేతులను కలిపి నాలుగుసార్లు చప్పట్లు కొట్టుచున్నాడు—సంపా.] “ఇది ద్రాక్షారసము.” [సహోదరుడు బ్రెన్హాం తన చేతులను కలిపి రెండుసార్లు చప్పట్లు కొట్టుచున్నాడు.] చూడండి, క్రైస్తవ్యమునకు సరిపోలికగానున్న ఒకదానిని అంత్యక్రీస్తు ఇంకా కలిగియున్నాడు. అతడు ఆ విధముగా యుండవలసినది, ’ఎందుకనగా అతడు “వ్యతిరేకము,” ఔనా. మరియు అలాగైతే, అతడు ఒక దానికి వ్యతిరేకమైతే…

174 ఇపుడు, అతడు వచ్చి, “ఓ, నేను ఒక బౌద్ధుడను,” అని చెప్తే. సరే, దానితో ఏమిలేదు. వారందరు చేస్తారు. అది ఆరంభం నుండి అన్యత్వం.

175 అయితే, అంత్యక్రీస్తు యుక్తిపరుడు. అక్కడున్న సమస్తమైన వాటి పోలికగా, అతడు అన్ని కార్యములు కలిగియున్నాడు. అయితే వాటిని త్రోవ పట్టించుచున్నాడు. దాని యొక్క అసలైన సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఒకటి. చూశారా, అది అతనిని అంత్యక్రీస్తుగా చేస్తుంది. చూశారా?

176 కాబట్టి, సంస్కర్తలు, దానిని ఎదుర్కొనుటకు ఆ జీవి ఒక—ఒక మానవుని రూపములో వెళ్ళెను.

177 ఇపుడు, తరగతీ! ఇది మరచిపోవద్దు. ఇది మరచిపోవద్దు! [సహోదరుడు బ్రెన్హాం వేదికను నాలుగుసార్లు తట్టెను—సంపా.] చూశారా? అది జ్ఞప్తించుకోండి. మీ జీవితకాలమంతా అది జ్ఞప్తించుకోండి! చూశారా? ఈ జీవులు నిజం. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఔనా?

గమనించండి. విగ్రహారాధన తీసుకొని వచ్చినది…

178 దేవుడతనికి అనుగ్రహించిన జ్ఞానము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనుష్య జీవి బయలువెడలి విగ్రహారాధన నుండి సంఘమును తిరిగి దేవుని యొద్దకు తీసుకొని వచ్చెను. అయితే…

179 అదే సంఘకాలంలో మనము కనుగొన్నాము. వారు సంస్థాపకముగా ఆరంభించినపుడు, ఆరంభంలో వారు చేసినదానినే అనగా రోమ్ చేసినదే చేయుటకు చేసినపుడు, ఇపుడు ఆమె సంఘమునకు కుమార్తెలను చేయబోవుచున్నది. మరియు ఆమె ఏమి చెప్పుచున్నది?

180 చెప్పెను, “ఇపుడు నీవు…నీవు పరిపూర్ణముగా లేవని నేను కనుగొన్నాను. మరియు నీలో మిగిలియున్న కొద్ది బలముతో నీవు బలపరచుకొనవలయును.” తిరిగి ప్రకటన, 3:3 లో వారిని హెచ్చరించుటను విను. తీద్దాం…సరే, కొద్ది నిముషాల క్రితం నేను దానిని పొందియున్నానని అనుకుంటున్నాను.

నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.

181 ఇంకొక విధముగా, “జ్ఞాపకముంచుకొనుము నీవు అటువంటి కలుషితము నుండి బయటకు వచ్చితివి.” చూశారా? మరియు ఇక్కడ చూడండి.

…నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలె (ఉహు), వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

182 ఇంకా క్రిందకు, ఆయన దీపస్తంభమును కదిలించబోవుచున్నాడు. చూశారా, కనుక అది అదే. ఏంటది? సంఘము యొక్క వెలుగు.

183 ఆమె ఏ అన్య చీకటి నుండి వచ్చినదో అదే సంస్థాపక పద్ధతిలోకి ఆమె వెళ్ళిపోయినది. నేటి దినము ఆమె అక్కడ నిలచియున్నది. కథోలిక్ లు ఏలాగు అది సత్యమని నమ్ముకొని యున్నారో యథార్థ హృదయము గల జనులు ఆ శాఖా క్రమములో యున్నారు. ప్రొటస్టెంట్ లు కథోలిక్ లను చూచి నవ్వుతారు. అది ఆరింట ఒకటి, బయట అరడజను. ఖచ్చితం వాక్య ప్రకారము. మనుష్య జ్ఞానము!

184 ఇపుడు గమనించు. ఓ, నేను దీనిని ఎంతగా ప్రేమిస్తున్నాను! ఆయన వారిని హెచ్చరిక చేయుటను వినండి. ఇపుడు, ఇపుడు…మీరు ఖచ్చితంగా ఏకీభవిస్తున్నారా, మీలో ప్రతి ఒక్కరు. మీరలా కానట్లయితే, నాకొక ప్రశ్న వ్రాయండి. అదేదనగా, ఇక్కడ బైబిల్ వారిని గుర్తింపు చేసినట్లుగా, ఖచ్చితంగా ప్రతియొక్క కాలంలో ఆ జీవులు గుర్తింపు చేయబడినవి. వారు ఖచ్చితంగా అచట ఆలాగే చేసిరి. వారేమి చేసింది చరిత్ర చూపుతుంది. మనమిక్కడే చూచి వారేమి చేసినది చూడగలం.

185 మరియు, ఇక్కడ ఆ జీవులు, క్రితమది నాకు—నాకు—నాకు తెలియదు. నేను కేవలం అక్కడ కూర్చున్నాను. మీరు నన్ను చూస్తున్నట్లుగానే అది అక్కడ కదులుట నేను చూశాను. చూశారా? మరియు అది నిజమై యుండవలసియుంది. ఎందుకనగా ఇక్కడ బైబిల్ తో అది నిజము. కాబట్టి అది నిజమని చెప్పుట తప్ప మరి వేరేమి చెప్పగలవు? గమనించు.

186 అంత్యక్రీస్తును ఎదుర్కొనుటకు పంపబడిన ఈ ఆఖరి నాలుగవ జీవి. మీరు సిద్ధమేనా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] పంపబడిన చివరి జీవి లేక దేవుని యొక్క బోధకు విరోధముగా నున్న అంత్యక్రీస్తును ఎదుర్కొనుటకై చివరి శక్తిగా పక్షిరాజు అనే జీవి పంపబడెను. చూశారా? నాలుగవ జీవి పక్షిరాజు. ఇపుడు, మీరు కాలములను లేఖనములను పఠనము చేయండి. పక్షిరాజేనా! మరియు బైబిల్ లో ఆఖరి కాలము పక్షిరాజు కాలము. దేవుడు ఆయన ప్రవక్తలను పక్షిరాజుతో పోల్చుచున్నాడు. ఔనా? అది…ఇపుడు గమనించండి. చివరి కాలము, పక్షిరాజు కాలము ఒక—ఒక నిజమైన వాక్యమును బయలుపరచువాడు. చూశారా?

187 దేవుడు క్రియ చేయుటకు ఆరంభించుటకు ముందు, నోవహు దినములలో చేసినట్లుగా ఆయన ఒక పక్షిరాజును పంపెను. ఆయన ఇశ్రాయేలీయులను బయటకు తెచ్చినపుడు, ఫరో సైన్యము వెళ్ళుటకు సంసిద్ధమాయెను, ఆయన పక్షిరాజును పంపెను. ప్రతిసారి ఆయన దాని యొక్క చివరన ఒక పక్షిరాజును పంపును.

188 మరియు, ఇక్కడ కూడా తిరిగి ఆయన పక్షిరాజును పంపును. అది ఖచ్చితంగా వాక్య ప్రకారము యున్నది. కాబట్టి దానిని తప్ప వేరేది నీవెట్లు చేయగలవు? పక్షిరాజును పంపుట, (ఎందుకు?) కాలమంతటిలో పడిపోవుచున్న సత్యమును బయలుపరచువాడు.

189 కాబట్టి, లోకంలో ఆ—ఎద్దు లేక మనిషి లేక ఏ జీవి స్వారీ చేయుచున్నను పక్షిరాజు వచ్చు వరకు అదెట్లు బయలుపరచబడును? వారి స్థానములలో వారుండిరి. వారు తక్కిన ఇతర జీవుల వలె, వారు భక్తిగలవారు.

190 సింహము, అది అసలైనది. అక్కడే అంత్యక్రీస్తు లేచెను—ఎదుర్కొనుటకు.

191 అటుతరువాత అతడు ఇంకొక శక్తిని లేపెను. దానిని ఎదుర్కొనుటకు ఆయన ఇంకొక శక్తిని పంపెను.

192 అటుతరువాత అతడు ఇంకొక శక్తిని లేపెను. దానిని ఎదుర్కొనుటకు ఆయన మరియొక శక్తిని పంపెను.

193 మరియు తరువాత ఆయన చివరి శక్తిగా పక్షిరాజును పంపాడు, “వారి తండ్రుల యొక్క అసలైన విశ్వాసము వైపుకు పిల్లలను త్రిప్పుటకు.” పక్షిరాజు కాలము! తరువాత మీరు గమనించండి. ఇక జీవులు లేరు. అదంతా అంతే. అదే ఆఖరిది. ఇపుడు మీరు ప్రకటన 10:1, 7 తీయండి. నేను దానిని నిర్వచిస్తున్నాను. జ్ఞప్తించుకోండి. చివరి వర్తమానికుని కాలములో, చూడండి ఏమి జరుగును? “దేవుని మర్మములన్ని బయలుపరచబడును.” పక్షిరాజు! ఆమేన్!

194 ఇపుడు మీరు స్వారీ చేయబడిన నాలుగు మృగములను చూశారు. అది సంపూర్ణంగా నిజము. మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] మరియు, ఇక్కడ ప్రతీ కాలము లేక దాని వెనకాల స్వారీ చేసిన ప్రతి శక్తి ఉన్నది. మరియు స్వారీ చేయు శత్రువు ఏమి చేయుచున్నాడను దానిని లేఖనము అక్కడ చూపించుచున్నది. ఈ ముద్రలలో అది బయలుపరచబడియున్నది. మరియు ఇంకా ఇది కూడా బయలుపరచబడినది. అదేదనగా, ప్రతి మృగమును ఎదుర్కొనుటకు దేవుడు శక్తిని పంపెను. పక్షిరాజు కాలము వరకు అది ఖచ్చితంగా సరిపోవుచున్నది. ఇది చివరి కాలమైనట్లయితే పక్షిరాజు వచ్చును. ఔను. ఇపుడు గుర్తుంచుకోండి.

195 ఇపుడు, సింహము వచ్చిన దినాలలో, అసలైన వాక్యము వచ్చినది, సుమారు నూటికి ఒక్కరు సింహము మాట విన్నారు.

196 ఎద్దు వచ్చిన దినాలలో రవ్వంత మంది ఎద్దు వర్తమానం వినిరి.

197 మనుష్యుడు వచ్చిన దినాలలో, మనుష్యుల మధ్య అతడు పనిచేశాడు. ఔనా. కావున ఆయన తెలివైనవాడు. ఒక చిన్న గుంపును బయటకు తెచ్చెను.

198 మరియు వారేమి చేశారు? సాతాను వారికి చూపినది, కనుక అతడు వానిని వెనుకకు పంపి, దానిలోనికి వివాహము చేసెను.

199 మరియు జ్ఞప్తించుకో, చివరకు పక్షిరాజు వచ్చినపుడు, పదివేలకు ఒక్కరు మాత్రము వింటారు. అది పక్షిరాజు కాలము. జ్ఞాపకముంచుకో, ఈ ఇతర స్వారీచేయు వారందరు…అటుతరువాత చివరకు యేసు చెప్పాడు, “ఆయన త్వరగా రానియెడల ఎత్తబడుటకు ఏ శరీరియు రక్షింపబడడు.” …?…అది లేఖనమేనా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఆలాగైతే మనం ఎక్కడున్నామో మీరు చూచుట లేదా, కాదా సహోదరీ, సహోదరుడా? [“ఆమేన్.”] మనమెక్కడున్నామో చూశారా?

200 దేవా, నేనెంతో ఆనందంగా ఉన్నాను. నేను—నేను—నేనేమి చేయవలెనో నాకు తెలియుట లేదు. ఇక్కడ నిలబడి మాట్లాడు వాడను నేను కాదు. నేను కూడా ఇక్కడే ఉన్నాను. నేను, నేను మీ మధ్య ఉన్నాను. చూశారా, నేను, అది నేను. నాకు కుటుంబం ఉన్నది. నేను ప్రేమించు సహోదరులు సహోదరీలు నాకున్నారు. ముప్పయి సంవత్సరముల నుండి సత్యమని నిరూపించబడిన దానిని పరలోకపు దేవుడు దయతో దిగివచ్చి ఆయన ఆ కార్యమును దర్శనముల ద్వారా బయలుపరచియున్నాడు. మనమిక్కడ ఉన్నాము. మనము…మనము వచ్చియున్నాము. శాస్త్రీయ పరిశోధన దానిని రుజువు పరచినది. వాక్యము యొక్క నిరూపణ దానిని రుజువు చేసినది. మనమిక్కడున్నాము! ఈ యొక్క ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి వచ్చినది మరియు ఇది సత్యం!

201 ఏదైన మీరు పట్టుకున్నారా? [సభ “ఆమేన్” అన్నది.—సంపా.] మీరు గ్రహించినందుకు నేను ఆశ్చర్యపడుచున్నాను. చూశారా? ఔనండి. అట్లయిన యెడల ఆదివారము మీకు నేను చెప్పనవసరం లేదు. గమనించండి. గమనించండి. అద్భుతం. ఇపుడు, ఇపుడు, ఇపుడు గమనించండి.

202 జల ప్రళయమునకు ముందు ప్రపంచమును దేవుడు విడిపించుటకు ఆయన పక్షిరాజును లేపెను.

ఆయన ఇశ్రాయేలీయులను విమోచించుటకు ముందు సమయమున ఆయన పక్షిరాజును పంపెను.

203 యోహాను పత్మాసు ద్వీపమున యున్నపుడు, ఈ వర్తమానం చాలా సంపూర్ణముగాను యున్నందు వలన అతడు దానిని ఒక దూతకు అప్పగించెనని నమ్మలేకపోయాడు. అది మీరు నమ్ముతున్నారా? ఒక దూత ఒక వర్తమానికుడు. తెలుసా. అయితే వర్తమానికుడు ఒక ప్రవక్తయని మీకు తెలుసా? మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అది మనము రుజువు చేద్దాం. ప్రకటన 22, అది పక్షిరాజు ఏమో చూద్దాం. ఆఁ. చూద్దాం. ఖచ్చితం, అతడొక దూత, అతడొక వర్తమానికుడు, అయితే ఈ సంపూర్ణ ప్రకటన గ్రంథమును అతనికి బయలుపరచు ఒక ప్రవక్త, అది.

204 ప్రకటన 22వ అధ్యాయము 19వ వచనము. అది నిజమేనని నేననుకుంటున్నాను. ఇక్కడే నేను వ్రాసుకున్నానని అనుకుంటున్నాను…22:19. నాది తప్పు కావచ్చు. కాదు. [ఒకరు చెప్పారు, “అది 22:9, కావచ్చు.”—సంపా.] 22:9, అది అదే. నేను 22:9 చూస్తున్నాను. ఔను. ఓ, ఔను. ఇక్కడ.

అతడు వద్దు సుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, సహదాసుడను,…

205 ఇక్కడ యోహాను ఏమి చూచినది గమనించు.

…యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను.

206 ఇపుడు అతడు ముగిస్తున్నాడు. ఇది ఆఖరి అధ్యాయము.

…నేను విని చూచినపుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా

207 మరియు, “అతను,” తరువాత “దూత,” చూశారా.

పిమ్మట అతడు వద్దు సుమీ చేయవలదు:…

208 ఏ నిజమైన ప్రవక్తయైనా లేక ఏ విధమైన వర్తమానికుడైనా ఆరాధించబడడు. చూశారా. అది దేవునికే వర్తిస్తుంది.

అతడు—వద్దు సుమీ: నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

209 చూశారా? ఇపుడు, ఆ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనది, అది, అది దేవుని యొక్క వాక్యమైయున్నది. ఇపుడు గమనించండి. దేవుని యొక్క వాక్యము తీసుకొని రాబడవలయునంటె, అది ప్రవక్త ద్వారా తీసుకొని రాబడవలసియున్నది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము అతని యొద్దకే వచ్చును.

210 ఇక్కడున్న పెట్టెలో దాన్ని గూర్చిన ఒక ప్రశ్న ఎవరైనను వేస్తారని నేను అనుకుంటున్నాను. కొంచెము ముందుగా వాటిని కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. తెలుసా. అక్కడ ఆలాటిది ఉన్నదని నేను భావిస్తున్నాను. అంతే. నేను—నేను దానికి బదులు ఇస్తానని నేను తలంచాను. మీరు చూశారా. చూశారా.

211 ప్రతి దేవుని యొక్క వాక్యము తీసుకొనిరాబడినది. బైబిల్ తన పద్ధతిని మార్చదు. ఔను. అదంతా ఒక్కటే. వచ్చుటకు మనమెదురు చూచుచున్న ఈ దీర్ఘదర్శి యొద్దకు అది రావలసియున్నది. ఇపుడు గమనించు, ప్రకటన 10:1, 7.

212 ఇపుడు తిరిగి 9వ వచనము చదువుదాము. ఇపుడు…మనము…ఇపుడు, ఆ వచనము దగ్గరకు మనము వెళ్ళక ముందు, ఒకటి మిమ్ములను అడగాలనుకుంటున్నాను.

213 ఈ ముద్రలను మనము విడిచిపెట్టక ముందు పరిపూర్ణముగా యున్నవని మీరు చూస్తున్నారా? ఇపుడు జ్ఞప్తించుకోండి. ఆ పక్షిరాజు తరువాత ఏ శక్తులు బయలు వెడలలేదు. చూడండి. ఇకలేదు. ప్రతిసారి అంత్యక్రీస్తు ఒకదానిని పంపునపుడు, దేవుడు ఒక శక్తిని పంపాడు. అంత్యక్రీస్తు మరొక శక్తిని పంపినది. దానిని ఎదుర్కొనుటకు దేవుడు ఒక దానిని పంపాడు. తరువాత అతడు మరియొక శక్తిని పంపాడు. దానిని ఎదుర్కొనుటకు, దేవుడు ఒక దానిని పంపాడు. చూశారా? మరియు అటుతరువాత మొదటిలో యున్నట్లుగానే ఆయన పక్షిరాజును పంపినపుడు, అది ఆయన వాక్యము.

214 ఇపుడు గమనించు. మనమొక ప్రవక్త వచ్చునని ఎదురు చూచుచున్నాము కాదా. ఏలీయా వలె ఆత్మతో అభిషేకించబడిన ఒక మనుష్యుడు? వాస్తవంగా ఏలీయా కాదు. అయితే ఆలాటి మనిషి, వచ్చును. మరియు అతని ప్రాముఖ్య పరిచర్య ఈ సంఘశాఖ మలుపులలో పడిపోయిన ఈ ప్రజలను తండ్రుల యొక్క అసలైన విశ్వాసము వైపునకు తిరిగి తెచ్చుట. ఇపుడు, అది బైబిల్ తో ముడివేయబడుట లేదా. నేను—నేను—నేను దానిని గురించి ఇంకేమి చెప్పలేను. ఎందుకనగా అది అదే. మీరు అచటకే రావలసియున్నది. అది సత్యము నీవు దాని నుండి ఏదైనా తీసుకొని, నీవది త్రిప్పినా. చూశారా? కాబట్టి అది ఆ విధంగానే యుండవలసియున్నది.

215 ఇపుడు గమనించండి. ఇపుడు, 9వ వచనములో, “బలిపీఠము క్రింద ఆత్మలు.” ఇక్కడే నేను కొన్ని ఏకీభవించకనున్న విషయాలున్నవి. అయితే ఒక నిముషము గమనించండి. మరియు…చూశారా? నేను కూడా ఆలాగే తలంచాను. అయితే అది ఆ విధంగా రాలేదు. మనము…నేను ఎప్పుడు అనుకునేవాడను, ఈ బలిపీఠము క్రిందనున్న ఆత్మలు—ఆ—ఆ ఆరంభ సంఘము యొక్క హతసాక్షులు యని. మరియు డాక్టర్ ఉరియా స్మిత్, వారందరు అదే చెప్పారని అనుకుంటాను. ఔనా? అయితే నాకు నేనే అనుకున్నాను. అయితే దాన్ని గూర్చిన దర్శనం పరిశుద్ధాత్మ చూపినపుడు అది అది కాదు; అది ఆత్మలు కాదు.

ఇపుడు, ఇపుడు నీవంటావు, “సరే, ఇపుడు, దానిని గూర్చి నాకు తెలియదు.”

216 సరే. ఇపుడు ఒక్క నిముషం ఆగు. మనము చూద్దాం. చూడు. వీరు—వీరు పెండ్లికుమార్తె సంఘము అక్కడ వేచియుంటుందని మనము తలంచాము. మొర్ర పెట్టుచుండిన బలిపీఠము క్రిందనున్న ఆత్మలు. చూశారా, “ఇంకా ఎంతకాలము ప్రభువా, ఎంత కాలం?” నేను ఇది మరలా చదవనీయ్యు, ఇపుడే అది గ్రహించగలము.

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని:

217 చూశారా, “దేవుని యొక్క వాక్యము మరియు వారు కలిగియున్న సాక్ష్యము.” ఇపుడు, వద్దు అక్కడ నుండి కదలవద్దు. ఒక్క నిముషము, చూశారా.

వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక (చూశారా?) తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

218 ఇపుడు ఈ సమయమునకు వారు, ఈ అయిదవ ముద్ర తెరువబడినపుడు, చూశారా, సంఘము వెళ్ళిపోయినది. క్రిందనున్న ఆత్మలు ఆరంభ సంఘమునకు చెందినవి కావు.

219 ఇపుడు, ఇపుడు దయచేసి మీ యొక్క దృష్టినంతా ఇచటనే కేంద్రీకరించవలసిన సమయము ఇదే. ఎందుకనగా ఇది పెద్ద వివాదముగా నున్నది. కనుక మీరు జాగ్రత్తగా ఆలకించాలని కోరుచున్నాను. మరియు మీరు వ్రాసుకొనుటకు మీ కాగితములను, మొదలగునవి తీసుకోండి. ఇపుడు మీరు గమనించాలని కోరుచున్నాను.

220 ఇపుడు, అవి ఆ ఆత్మలు కానేరవు. ఎందుకనగా ఆ—ఆ నీతిమంతుల ఆత్మలు, హతసాక్షులు, నీతిమంతులైన ప్రజలు, సంఘము, పెండ్లికుమార్తె, ఇది జరిగినపుడు ఎత్తబడియుండును. కాబట్టి వారు బలిపీఠము క్రిందనుండరు. పెండ్లికుమార్తెతో కూడా మహిమలో ఉంటారు. ఇపుడు గమనించండి. ప్రకటన 4వ అధ్యాయములో ఎత్తబడుటలో వారు వెళ్ళిపోయారు. వారు ఎత్తబడ్డారు.

221 ఇపుడు, అలాగైనట్లయితే, ఎవరీ ఆత్మలు? అది తరువాత విషయం. ఆలాగైతే ఎవరు వీరు, ఆరంభ సంఘము కానట్లయితే? ఒక దేశముగా రక్షించబడిన ఇశ్రాయేలు ఇది. వారంత ముందుగా నిర్ణయించబడినవారు. అది ఇశ్రాయేలు. అది ఇశ్రాయేలు.

222 నీవు చెప్తావు, “ఓ, ఒక నిముషమాగు” అని. నీవు చెప్తావు, “వారు కాదని.” ఓ, ఔను. వారు రక్షించబడవలసియుంది.

223 అక్కడ దానిని ఒక నిముషములో నిర్ధారణ చేద్దాం. నా యొద్ద నాలుగు, ఐదు లేఖనాలున్నవి. ఒకటి తీసుకుంటాను. ఒక్క నిముషం. రోమా తీసుకుందాము, అది ఔనో కాదో చూద్దాం. రోమా పుస్తకము తీసుకుందాము. రోమా 11వ అధ్యాయానికి వెళ్దాము, కనుగొందాము…దానిని మనము చదువుదాము. తరువాత మనకు మనము తెలుసుకుందాం. రోమా 11వ అధ్యాయము 25, 26 వచనాలు. ఇపుడు, ఇక్కడ పౌలు చెప్పునది ఆలకించండి.

224 మరియు పౌలు చెప్తున్నాడు, “ఎవరైనను, చివరికి దూతయైనను మరియొక సువార్తను ప్రకటించిన యెడల,” (ఏంటి?) “అతడు శాపగ్రస్తుడవును.” గమనించు.

సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము (ఉహు!) మీరు తెలుసుకొనగోరుచున్నాను (అక్కడే మీరున్నారు); అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు.

225 చివరి అన్యజనుల పెండ్లికుమార్తె లోపలకు ప్రవేశించు వరకు, పెండ్లికుమార్తె నిమిత్తము అందు నిమిత్తము ఇశ్రాయేలునకు గ్రుడ్డితనము కలిగెను.

విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరును రక్షింపడుదురు:

226 సరే. వారు ఇశ్రాయేలీయులు, ఈ బలిపీఠము క్రిందనున్నవారు. గమనించు. మనము రక్షింపబడు కారణము కొరకై ఇశ్రాయేలీయులు గ్రుడ్డివారైరి. మీరు అది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] ఇపుడు వారిని గ్రుడ్డివారినిగా చేసినదెవరు? దేవుడు. దేవుడు తన స్వంత బిడ్డలను గ్రుడ్డివారినిగా చేసెను.

227 యేసు, అక్కడ సిలువయొద్దనుండగా ఆ యూదులు ఆయన రక్తముకై కేకలు వేయుట ఆశ్చర్యము కాదు. అది ఆయన స్వంత బిడ్డలు. ఆయన లేఖనమై యుండెను. ఆయనకు ఆయనే వాక్యమైయుండెను. మరియు ఇక్కడ, ఆయనను ఆ ప్రజలు సంతోషముగా అంగీకరించెదరని ఆయనకు తెలియును. మరియు ఆ కారణము చేత ఆయన వారిని గ్రుడ్డివారినిగా చేసెను, తద్వారా వారు ఆయనను గుర్తించలేకపోయిరి. ఆలాటి సాధారణమైన రీతిలో ఆయన వచ్చెను. అందుకు వారిని అంధులుగా చేసెను. దానిని వారు స్వీకరించకుండునట్లు. చూశారా. వారు చేయుదురని లేఖనము చెప్పుచున్నది. మరియు ఆయన గ్రుడ్డివారినిగా చేసెను. గ్రుడ్డివారిగా చేయబడిరి. యేసు వారిని గూర్చి ఎంతో జాలిపడి, ఆయన అన్నాడు, “తండ్రీ, వారిని క్షమించుము. వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు.” ఔనా? వారు గ్రుడ్డివారు. ఒక కారణము కొరకు, మనకొరకు వారు గ్రుడ్డివారయ్యారని పౌలు చెప్పాడు.

228 గమనించండి. దీనిని మీరు బహు జాగ్రత్తగా గమనించాలని కోరుచున్నాను. “వారికి వస్త్రములు ఇయ్యబడెను.” వారికి అవి లేవు. వారిలో ప్రతియొక్కరికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను. ఇపుడు పరిశుద్ధులు కలిగియుండిరి. ఇంతకు ముందే ఇయ్యబడెను. ఇచటనే వారు పొందుకొన్నారు. అయితే, అక్కడ, “వస్త్రములు ఇవ్వబడెను.” మరియు పరిశుద్ధులు వారెప్పుడో కలిగియున్నారు, వెళ్ళిపోయారు. ఔనా…చూడండి? వారు కలిగియున్నారు—లేరు…

229 వారు, చూడండి, వారికి తరుణం లేదు, ఎందుకనగా వారు దేవుని ద్వారా, వారి స్వంత తండ్రి ద్వారా వారు గ్రుడ్డివారిగా చేయబడ్డారు. తద్వారా దేవుని కృప నెరవేర్చబడుటకు, తద్వారా అన్యులలో నుండి పెండ్లికుమార్తె తీసుకొనబడుటకు. అది నిజమేనా? [సభ “ఆమేన్” అని చెప్తుంది.—సంపా.]

230 నన్ను—నన్ను యోసేపు లో ఒక చక్కని మాదిరిని చూపించనీయండి; యోసేపు ఆత్మ మనిషి. పక్షిరాజు. నిజమైన సంఘము మిగతా వారి మధ్య ఏలాగో, తన సహోదరుల మధ్య అతడు జన్మించాడు. అతడు కలలకు అర్థం చెప్పి దర్శనములు చూడగలడు. మిగతావారు అతనిని ద్వేషించారు. అతని తండ్రి అతనిని ప్రేమించాడు.

231 గమనించండి, అటుతరువాత తన సహోదరుల వలన ద్వేషించబడ్డాడు. తన తండ్రి వలన కాదు. తన అన్నల వలన మరియు మప్పయి వెండి నాణెములకు అమ్మబడ్డాడు. గుంటలో త్రోయబడ్డాడు, చనిపోయాడని తలంచారు.

232 పైకి తీయబడి ఫరో కుడి పార్శ్వమున కూర్చుండపెట్టబడ్డాడు. మరియు ఎందుకనగా తన సహోదరుల వలన త్రోసివేయబడెను. చూశారా, అన్యజనులలో నుండి పెండ్లికుమార్తె ఇయ్యబడెను, తన స్వ ప్రజలలో నుండి కాదు. అక్కడ నుండి అతడు ఎఫ్రాయిము మనష్షేను కనెను. వారు ఇశ్రాయేలునకు చేర్చబడిరి.

233 ఇశ్రాయేలు తన యొక్క చేతులను మార్చి చిన్నవాని నుండి పెద్దవానికి మార్చినట్లుగా యూదుల నుండి ఆశీర్వాదములు అన్యజనులకు మార్చబడెను. చూశారా? చిన్న కుమారునిపైకి, తన యొక్క హస్తములు మార్చెను. చిన్న సంఘములోకి ప్రవేశించుటకు. “ఆ—ఆ తల్లి సంఘము సూర్యునిలో నిలబడియున్నది. ఆమె ఈ శిశువును కన్నది.” మరియు గమనించండి. ఇశ్రాయేలు మాదిరి కొరకు తన చేతులను అడ్డముగా మార్చెను. మరియు యోసేపు…

అదే పిల్లలు, అన్య తల్లి.

234 ఇశ్రాయేలు యొక్క చేతులను అడ్డముగా మార్చునట్లు చేసిన అదే పరిశుద్ధాత్మ ద్వారా ఇశ్రాయేలు యొక్క పెండ్లికుమార్తె ప్రాచీన ఆచార మార్గముల నుండి వారు వైదొలగి క్రైస్తవ మార్గములను వారు అనుసరిస్తారు. అతడన్నాడు, “దేవుడు నా చేతులను అడ్డుగా మార్చాడు.” అతనికి దానితో ఏ సంబంధము లేదు.

235 గమనించండి. తరువాత, యోసేపు తన స్వంత అన్నల ద్వారా, తన స్వంత ప్రజల ద్వారా తృణీకరించబడ్డాడు. అన్యజనుల పెండ్లికుమార్తెను తీసుకున్నాడు. ఖచ్చితంగా యేసు ఏమి చేశాడో ఆ విధముగా. యూదుల ద్వారా తృణీకరించబడ్డాడు. అన్యులలో నుండి పెండ్లికుమార్తెను తీసుకొనెను.

236 ఇపుడు, ఇక్కడ ఒకటి చదువుదాము. నేనొక లేఖనము వ్రాసుకున్నాను, అపొస్తలుల కార్యములు 15 మరియు ఇది మనము బోధించబోవు కార్యము, ఏలాగైనా. ఇపుడు ఈ హక్కు నాకున్నదని నమ్ముచున్నాను. అపొస్తలుల కార్యములు 15:14. సరే. మంచిది. “దేవుడు ఏ విధముగా…సుమెయోను వివరించెను” కాదు, 13 వ వచనము నుండి ప్రారంభిద్దాము.

వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను,…

237 ఇపుడు చూడండి, ఏమి జరిగింది, వారు అన్యుల యొద్దకు వెళ్ళారు. చూశారా? మరియు గందరగోళం జరిగింది. ఎందుకనగా వారు యూదులు. చూశారా?

వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా, నా మాట ఆలకించుడి:

అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను (అది సీమోను పేతురు) వివరించి యున్నాడు.

238 ఉఁ! చూడండి, నా భార్య యొక్క పేరు బ్రాయ్. నేనామెను తీసుకున్న తరువాత ఆమె బ్రాన్హామై యుండెను. ఔనా?

239 యేసు ఆయన సంఘమును లేక ఆయన పెండ్లికుమార్తెను అన్యులలో నుండి తీసుకున్నాడు. యోసేపు వలె, అది లేఖనము యొక్క పోలిక.

240 ఇపుడు, దీనిని గమనించండి, బలిపీఠము క్రిందనున్న ఆత్మలు. సరే, సరే, ఈ, “ఈ ఆత్మలు,” ఇపుడు అర్థం చేసుకున్నారా, “అది బలిపీఠము క్రింద,” ఐక్ మాన్ లాంటి పాపిష్ఠి మనుష్యుల వలన వారెందుకు హతసాక్షులు కావాలి. చూశారా? వారలాగే యుండిరి. మిలియన్ల మంది. చూశారా. అయితే వారు యూదులు గానే యుండిరి.

241 ఇపుడు జ్ఞప్తించుకోండి. అదేంటి? “దేవుని వాక్యము నిమిత్తము వారు చంపబడిరి,” క్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తము కాదు. మీరు అర్థం చేసుకున్నారా?

242 సంఘము కూడా లోపలకు వచ్చుటను గుర్తుంచుకోండి. సంఘము యొక్క హతసాక్షులు, దేవుని వాక్యము నిమిత్తమును మరియు యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. ఎంతమందికి అది తెలుసు, ఇక్కడ…[“ఆమేన్” అని సభ చెప్పినది.—సంపా.] ఔను. మంచిది.

243 ఇపుడు, వీరైతే యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము కలిగియుండలేదు.

…దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును:

244 యూదులు! హిట్లర్ వారిని ద్వేషించాడు, అలాగే ఐక్ మాన్, స్టాలిన్ కూడా, మిగతా లోకమంతా. చూశారా? అయితే, వారేది నమ్మారో, దానిని వారు నమ్మకస్తులుగా నుండిరి. వారు వారిని చంపారు. ఎందుకనగా వారు యూదులు గనుక.

245 అదే విధమైన ఆలోచన మార్టిన్ లూథర్ కలిగియుండెను. మీకు తెలుసా? అది సత్యము అతడన్నాడు, “యూదులనందరిని బయటకు త్రోయవలెను. వారు అంత్యక్రీస్తు.” అని అన్నాడు. చూశారా? అయితే అతడు మరియొక ఏర్పాటు కాలములో ఉన్నాడు. చూడలేదు అది, వాక్యాన్ని చూడలేదు.

246 ఇపుడు వాక్యము, సత్యము వచ్చుచున్నది. మరి ఏ విధముగా ఇశ్రాయేలీయులను గ్రుడ్డివారిగా చేయగలరు? మీరది చేయలేరు. లేరు.

247 ఓ, అక్కడ ఓ దినాన ఏలాగు ప్రవక్త నిలబడి, “ఇశ్రాయేలు, నీవు గురుపోతువలె యున్నావు?” అని చెప్పగలిగెను? వారతనికి దాని యొక్క అధమ స్థితి చూపించుచుండగా. ఆయన చెప్పాడు, “ఎందుకు” అని, అతడు చెప్పాడు, “నిన్ను దీవించువారు దీవించబడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు.” ఔను. ఓ మానవుడా! అది నీవేలాగు చేయగలవు?

248 ఒకసారి దేవుడు మరచిపోయాడని వారు అనుకున్నారు. ఆ చీకటి యూదులు మీదికి వచ్చుట ప్రవక్త చూచెను. ఆ మనుష్యుడు అక్కడ నిలబడియుండెను. దేవుని యొక్క వాక్యము అతని పై క్రుమ్మరించబడెను. అతడు చెప్పాడు, “ఓ ప్రభువా, నీవు నీ ప్రజలను మరచిపోబోతున్నావా?”

ఆయన అడిగాడు, “నీ ప్రక్కన పడియున్నదేంటి?”

అతడు చెప్పాడు, “ఒక కొలకర్ర” యని.

249 ఆయన అడిగాడు “పరలోకమునకు అది ఎంత ఎత్తు? కొలువుము అది.” ఉహు. “సముద్రము ఎంత లోతు?”

అతడన్నాడు, “నేనది చేయలేను.”

250 ఆయన అన్నాడు, “నేను అంతే, ఇశ్రాయేలీయులను కూడా నేను మరచిపోజాలను.” లేదండి. ఆయన ఆమెను మరువలేడు.

251 ఆయన యొక్క స్వంత బిడ్డను ఆయన గ్రుడ్డివానిగా చేయవలసి వచ్చెను. ఇపుడది ఆలోచించు. మనకొక తరుణం ఇచ్చుటకై, తన స్వంత బిడ్డను గ్రుడ్డివానిగా చేసెను. మనము త్రోసివేయుచున్నాము. ఇపుడు, చూడండి? పది గాలన్ల టోపి ధరించి, రాతితోనున్న బండ క్రింద ప్రాకినట్లుగా యుండి, అసలు తాకినట్లుగానే యున్నట్లు భావన కలిగియున్నట్లుగా లేదా? అదెంతో చిన్నది. ఔనా. ఓ, మై.

252 “వారు దేవుని వాక్యమును పట్టుకొనియుండిరి.” వారు యూదులు. వారికి వారి ధర్మశాస్త్రముండెను. దానితో వారు నిలబడిపోయారు. ఇపుడు చూశారా? వారు దానితో నిలబడిపోయారు. వారు యూదులు, వారికి ధర్మశాస్త్రమున్నది. ధర్మశాస్త్రము దేవుని వాక్యము. దాని ద్వారా వారు జీవిస్తున్నారు. ఔను. “వారు కలిగియున్న సాక్ష్యాన్ని బట్టి వారు హతసాక్షులైరి.” మరియు సంఘము వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ బలిపీఠము క్రింద ఆత్మలున్నవి.

253 ఇపుడు గమనించండి. వారు వారి యొక్క గ్రుడ్డితనములో వారి యొక్క మెస్సీయాను హతసాక్షి చేసిరి. ఇపుడు వారు దానికొరకు ఫలాన్ని కోయుచున్నారు. వారు అది గ్రహించారు. వారు అది గుర్తెరిగారు. అది జరిగిన తరువాత వారది గుర్తెరిగారు. అప్పుడు ఆయనను వారు చూశారు, దేవుని బలిపీఠము యొద్దకు వారు వచ్చినపుడు. ఇపుడైతే దేవుని కృప వారికున్నది.

254 గమనించండి. ఇపుడు ఏ విధముగా పరిశుద్ధులుగా యుండలేరు. కారణం, వారెప్పుడో అంగీలు ధరించియుండిరి. అయితే, ఇపుడు, ఇక్కడ వారు “దేవుని వాక్యము నిమిత్తమును మరియు వారు కలిగిన సాక్ష్యము నిమిత్తము బలిపీఠము క్రింద ఆత్మలై యున్నారు,” వారు దేవుని ప్రజలైన యూదులు.

255 అయితే, ఇపుడు గమనించు. దేవుని యొక్క కృప వారి యొద్దకు వచ్చుచున్నది. వారిలో ప్రతియొక్కరికి ఒక తెల్లని వస్త్రాన్ని యేసు వారికిచ్చాడు, (ఓ, మై, గమనించు; సంఘము వెళ్ళిపోయిన తరువాత అది జరిగినది), ఎందుకనగా వారు నమ్మిన దానియందు వారు నమ్మకముగా యుండిరి. వారు గ్రుడ్డివారై దానిని ఎరుగక యుండిరి. వారికది తెలియదు. వారు ఏ పాత్రయందు నడచుటకై దేవుని వలన నిర్ణయించబడెనో ఆ పాత్రనే వారు పోషించిరి. ఇక్కడ, ఇక్కడ యోహాను బలిపీఠము క్రింద ఆత్మలను చూచుచున్నాడు. ఇపుడు గమనించండి. అతడు ఈ ఆత్మలను చూచుచున్నాడు. అతడు వారిని ఏమని పిలచుచున్నాడో గమనించండి.

“ప్రభువా, ఇంకెంత కాలము?” అని వారు కేకలు వేయుచున్నారు.

గమనించండి, “ఇంకొద్ది కాలము మాత్రమే.” చూశారా?

256 ఇపుడు నేరుగా లేఖనములలోకి వెళ్ళి అది పొందుకుందాము. వారి మెస్సీయాను వారు హత్య చేశారని వారు గ్రహించారు. చూశారా? అది వారికి తెలియదు. అయితే అటుతరువాత వారు గ్రహించారు. వారు—వారు దానికొరకు క్రయమును చెల్లించు విధముగా వారు చంపబడిరి. తప్పు చేసినందులకు వెల చెల్లించిరి. ఇపుడు వారు చేయవలసిన కార్యమేదో చూడండి! చూశారా, వారు హత్యచేసిన దోషమును కలిగియుండిరి. కాబట్టి, చంపబడిరి. చూశారా? “ఆయన రక్తము మా మీద ఉండును గాక!” అని వారు అరిచారు. చూశారా? ఔను. వారు గ్రుడ్డివారయ్యారు.

257 ఇపుడు, వారు గ్రుడ్డివారిగా చేయబడకపోతే; దేవుడు చెప్పాడు, “వారిని ఆలాగే ఉండనిమ్ము. వారు యోగ్యులు కాదు.” అయితే దేవుని వలన గ్రుడ్డివారుగా చేయబడ్డారు కనుక ఆయన కృప వారియొద్దకు వచ్చెను. ఆమేన్! ఆశ్చర్యమైన కృపను గూర్చి మాట్లాడు. వారిలో ఒక్కొక్కరికి వస్త్రము ఇమ్ము. ఎందుకనగా ఇశ్రాయేలీయులందరు రక్షింపబడుదురు. ప్రతియొక్కరు వారి పేరు వ్రాయబడెను. ఔను. యేసు వారికి వస్త్రాలు ఇచ్చాడు.

258 యోసేపు తన అన్నల యెడల చేసినట్లుగా; ఒక పోలిక. చూడు, యోసేపు అక్కడ నిలబడినపుడు, అతడు చివరకు…అతడు తనకు తాను అక్కడ బలిపీఠము యొద్ద, తన యొక్క భవనములో, అతని సింహాసనము యొద్ద బయలుపరచుకొన్నాడు. అతడు చెప్పాడు, “ప్రతియొక్కరు నన్ను విడచి వెళ్ళండి” అని. అతని భార్య భవనంలో ఉన్నది; పెండ్లికుమార్తె ఎక్కడుండునో అక్కడ.

259 మరియు అతడు వారితో అన్నాడు, “మీరు నన్నెరుగరా?” అని అడిగాడు. హే, అతడిప్పుడు మాట్లాడుచున్నాడు. “నేను మీ సహోదరుడను, యోసేపును.” ఓ, మై!

వారన్నారు, “ఇపుడు, ఓ, నీవు మమ్ములను తీసుకొనబోవుచున్నావు.”

260 అన్నాడు, “ఒక్క నిముషము ఆగు. ఒక్క నిముషము ఆగు. ఒక ఉద్దేశ్యము కొరకు దేవుడది చేశాడు. జీవమును రక్షించుటకే మీరు నన్ను త్రోసివేయునట్లు చేశాడు” అని అన్నాడు. మహిమ! అక్కడే మీరున్నారు. ఖచ్చితం. అన్నాడు, “మీకు సంతాపము కలుగనీయకుడి.” యోసేపు అది చెప్పాడు, గుర్తుంచుకోండి. అన్నాడు, “మీకు సంతాపము కలుగనీయకుడి. సమస్తమును ఇపుడు సరిగాయున్నవి. అంతా అయిపోయింది. మీకు ముందుగా దేవుడు నన్ను పంపాడు.”

261 తెలుసా, బైబిల్ చెప్తుంది, ఆయన వచ్చుటను వారు చూచి ఆయనతో వారంటారు, “నీవు మెస్సీయావు మేమెరుగుదుము. అయితే, అయితే ఆ గాయములేంటి?” యని. చూశారా?

262 ఆయన చెప్పాడు, “ఓ, వాటిని నేను నా స్నేహితుల ఇంట్లో పొందుకున్నాను.” స్నేహితులారా?

263 అటు తరువాత మిగిలిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది అది గ్రహిస్తారు. వారు ఒక్కొక్కరు తమ ఇండ్లలో నుండి ప్రత్యేకించుకుంటారు. ఏడ్చుటకును, ప్రలాపించుటకు దినములు ప్రత్యేకిస్తారు. పైకి క్రిందకు యని బైబిలు చెప్తుంది. నేలమీద నడుస్తారు. “మేమేలాగు ఇది చేసితిమి? ఇది మేమేలాగు చేసితిమి? మా స్వంత మెస్సీయాను మేమెందుకు సిలువ వేసితిమి” అని చెప్తారు. తమ ఏకైక కుమారుని కొరకు ఇళ్లంతా ఏడ్చినట్లు “మేమిది ఎట్లు చేసితిమి?” అన్నట్లు అని చెప్పుచున్నది.

264 ఆ యూదులు, వారు—వారు లోకములో అతి భక్తిపరులైనవారు. దేవునిచే ఏర్పరచబడినవారు. మనలను తీసుకొనుటకై ఆయన వారిని గ్రుడ్డివారినిగా చేశాడు. మనమది తృణీకరించాము. అన్యజనుల సంఘము యొక్క తీర్పు ఏమైయున్నది? అక్కడే నీవున్నావు. చూశారా? యేసు కొరకై ఒక పెండ్లికుమార్తెగా మనలను దేవుని ద్వారా అన్యజనుల నుండి ఎన్నుకొను ఉద్దేశ్యము కొరకై వారికి గ్రుడ్డితనము కలుగజేసెను. వారిని వెలుపలకు తీసుకొని వచ్చుటకై…చూశారా? మరియు అన్నిటిని ముందు సాదృశ్యముగా ఉంచెను.

265 ఇపుడు మీరు చూస్తున్నారా? వారు హతసాక్షులైన భక్తులు కాదు. వారు వెళ్ళిపోయారు. ఔను. గమనించండి. వారు వెళ్ళిపోయారు. ఔను.

266 కాబట్టి వారిలో ఒక్కొక్కరికి వస్త్రములు ఇవ్వబడినవి. ఇపుడు మీరు గమనించాలని కోరుచున్నాను. అయితే ఇపుడు దేవుని కృప వారికి క్రిందకు వంగియున్నది. యోసేపు ఇచ్చినట్లుగా వారిలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము యేసు ఇచ్చాడు. తన సహోదరుల యెడల అతని వాత్సల్యత వలె.

267 ఇపుడు గమనించండి. యోసేపును వారు వదిలిపెట్టుకోవాలని వారు చూచినప్పటికి, కానీ అతని వాత్సల్యత వారి యొద్దకు చేరెను. చూశారా? “ఓ, అది సరే. మంచిది. మీరు దానిని ఉద్దేశ పూర్వకంగా చేయలేదు. అయితే, చూడండి, అది దేవుడు చేస్తుంది. చూడండి. దేవుడు ఆ విధముగా మీరు చేయునట్లు, ఆయన మీ ద్వారా చేశాడు. మిమ్ములను ప్రాణములతో రక్షించుటకై ఆయన నన్ను ఈ అన్యజనుల యొద్దకు పంపాడు. వారిలో నుండి నేను నా భార్యను పొందితిని. నేనక్కడ ఉండిన యెడల నేను భార్యను పొందుకునే వాడను కాదు. నేను నా భార్యను ప్రేమిస్తున్నాను. ఆమె ద్వారా ఈ బిడ్డలను పొందితిని.” ఇంకా అన్నాడు, “నేను—నేను…మరియు ఇపుడు—ఇపుడు నేను మిమ్ములనందరిని తీసుకొని రాబోవుచున్నాను. ఇపుడు మీరందరు మేలును పొందబోవుచున్నారు. నేను మిమ్ములను ఇక్కడకు తీసుకొని రాబోవుచున్నాను. ఒక పెద్ద కుటుంబముగా మనమంతా కలసి ఉండబోవుచున్నాము.” చూశారా? చూశారా? చూశారా? అన్నాడు, “ఒకటి మిమ్మును అడుగబోవుచున్నాను. వృద్ధుడైన నా తండ్రి ఇంకా సజీవుడుగా ఉన్నాడా?” ఓహో!

268 మరియు అతన్ని గమనించు, చిన్నవాడైన బెన్యామీనుకు అతడేమి చేసినది; లక్ష నలభై నాలుగు వేలమందికి పోలిక, దానిని మనము తరువాత చూడబోవుచున్నాము. చూడండి అతడేమి చేసినది. అతడు బెన్యామీను యొద్దకు పరుగెత్తిపోయాడు. అతని మెడమీద పడి హత్తుకొనుటకు ప్రారంభించాడు. అతడు వచ్చిన తరువాత అతని తల్లికి పుట్టినవాడే చిన్న సహోదరుడు. ఆ తల్లి మొదటి మతాచారముతో నిండిన మొదటి సంఘము. ఆయన లేనపుడు, ఆయన యొక్క అన్యజనుల పెండ్లికుమార్తెను పొందుకొనుటకు దూరముగా వెళ్ళినపుడు జన్మించిన వారే ఈ లక్ష నలభై నాలుగు వేలమంది. ఓ, మై. అది మీలో ఒక భావనను కలిగించుట లేదా. అక్కడ అది ఉన్నది, కాబట్టి ఎవరని మీరు చూశారు? వారెక్కడ ఉన్నారు?

269 ఇపుడు గమనించండి. యోసేపును వారు వదిలించుకోవాలని ప్రయత్నించినను అతని దయ వారికి చూపబడెను.

270 యేసును వారు వదిలించుకొనుటకు ప్రయత్నించినను ఆయన వారి యొద్దకు వచ్చి, ( ’ఎందుకనగా వారు గ్రుడ్డివారై యుండిరి) వారిలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము ఇచ్చెను. ఏలాగైనను ఆయన తన గృహమునకు తీసుకొని పోబోతున్నాడు. కొంచెమైనను వ్యత్యాసము లేదు. ’ఎందుకనగా, “ఏలాగైనా నేను వారిని రక్షించుకొందును” అని ఆయన ముందే చెప్పాడు. చూశారా?

ఇపుడు వచనము 10. గమనించండి, వారు “ప్రతీకారము” కొరకు అడిగారు. చూశారా?

271 ఇపుడు, అది పెండ్లికుమార్తె యైనట్లయితే, అది స్తెఫను వలె యుండును. “తండ్రీ, వారిని క్షమించుమని,” ఔనా. చూశారా?

272 అయితే, ఇపుడే లోపలకు వచ్చిన యూదులు వీరు. చూడండి. “ప్రతీకారము” కొరకు వారు అడుగుచున్నారు. మరలా గమనించండి, చూడండి. మరలా ఆయన చెప్పాడు…గమనించండి. అది కాదు…ఆయన చెప్పాడు, “అది నీ సహోదరులు,” యూదులు. నూరు…ఇపుడు వారు ప్రతీకారము కోరుచున్నారు. వారన్నారు, “ఓ, మేము…మాకొరకు అక్కడ ప్రతీకారము తీర్చుకొనుము.”

273 ఆయన చెప్పాడు, “ఇంకా కొద్ది కాలము, ఇపుడు ఇంకా కొద్ది కాలము.” ఏలయనగా గమనించండి. నేనిక్కడ చదువుతాను. అది—10వ వచనము. సరే.

వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చూశారా (ఏంటి?)…

274 చూశారా? ఇపుడది ఏంటి? ఇపుడు ప్రవక్తలు ఇశ్రాయేలీయులకు బోధ చేయుచున్నారు. చూశారా?

…మరియు వారివలెనే చంపబడబోవు మీ సహదాసుల యొక్కయు…మీ సహోదరుల యొక్కయు…

275 చూశారా, ఆ విధముగా యుండవలెనని ముందుగా నిర్ణయించబడినవారు. చూశారా?

…చంపబడబోవు వారి లెక్క పూర్తియగు వరకు.

276 చూశారా, మరొక మాటల్లో, అది వారికొరకు ముందుగా నిర్ణయింపబడినది. అది వారు చేయవలసియున్నదని, అది లేఖనములైయున్నది. “మరియు కొంచెము కాలము విశ్రమించుడి. ఇపుడు మీరు మీ యొక్క వస్త్రములు పొందియున్నారు; మీరు గృహమునకు వెళ్ళుచున్నారు. మరియు కొంచెము కాలము కూర్చోండి. చూడండి. కొద్దిసేపు వేచియుండండి.”

277 ఇపుడు గమనించండి. ఇపుడు గమనించండి. “మీ సహోదరులు.” “మీ సహోదరులు ఇంకా చంపబడవలసి యున్నారు,” అనగా దాని అర్థం శ్రమల కాలములో లక్ష నలభై నాలుగు వేల మంది ఇంకను పిలువబడుదురు. లక్ష నలభై నాలుగు వేల మంది పిలువబడుదురు.

278 మనకు సమయమున్న యెడల బాగుండును. ప్రభువు చిత్తమైతే రేపు రాత్రికి మనమది పొందుకుంటాము. మరొక ముద్రకు మనము వెళ్ళకముందు. ఔనా.

279 ఇంకా, ఇపుడు గమనించండి. అంత్యక్రీస్తు ద్వారా వారు హతసాక్షులు కావలసియున్నది. మనము దానిని చూశాము. మరియు గమనించండి. అతని చివరిసారి స్వారీ చేయునపుడు అతడు అక్కడ యూదులతో చేసిన నిబంధనను అతిక్రమించును. మరియు ఆమె అక్కడ పోవుచున్నది. ఔనా?

280 ప్రకటన 11 అధ్యాయములోని ఇద్దరు సాక్షుల వలన లక్ష నలభై నాలుగు వేలమంది వెలుపలకు పిలువబడుదురు. ఇపుడు మీరు గుర్తుంచుకోండి. వారు ప్రకటించవలెను.

281 మీరది చదివారు. ఎంతమంది చదివారు? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] నిజం. లేఖనము చదువుట ద్వారా మనమంతా పరిచయము కలిగియున్నాము.

282 మరియు వారు ప్రవచిస్తారు, ఈ ఇద్దరు సాక్ష్యులు దానియేలు యొక్క డెబ్బది వారపు రెండవ అర్థకాలములో ప్రవచిస్తారు. అది చివరి మూడున్నర సంవత్సరములు.

283 దానియేలు యొక్క డెబ్బది వారమును మనమేలాగు తీసుకున్నది జ్ఞప్తించుకోండి. మనమిక్కడకు వచ్చునపుడు మనకవసరమని నేను చెప్పాను. ఎందుకనో నాకు తెలియదు. అయితే…మనకది అవసరమని ఒకటి నాకు చెప్పినది. ఇక్కడ మనమున్నాము. అఁ. చూశారా?

284 గమనించండి. దానియేలు యొక్క కాలములో. ఇపుడు గుర్తుంచుకోండి, దానియేలు చెప్పాడు, “మెస్సీయా వచ్చును” యని, రాజకుమారుడు “మెస్సీయా,” మరియు, “ఆయన ప్రవచించును. ఇశ్రాయేలీయులకు ఇంకను డెబ్బది వారములు మిగిలియున్నవి. మరియు డెబ్బది వారముల మధ్యలో మెస్సీయా కొట్టివేయబడును. అనుదిన బలి నిలిపివేయబడును.” ఔను కదా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] “అయితే మూడున్నర వారము నిర్ణయించబడినది.”

ఈ సమయములోనే ఆయన అన్యజనుల పెండ్లికుమార్తెను తీసుకొనిపోవును.

285 ఇపుడామె పైకి వెళ్ళును. ఆమె పైకి వెళ్ళునపుడు ఇద్దరు ప్రవక్తలు ఇశ్రాయేలీయుల యొద్దకు వస్తారు. చూశారా?

286 మరియు హతసాక్షులైన ఆ ఆత్మలు, నిజమైన సత్యమైన యూదులుగా నున్నవారు; గ్రంథములో వారి పేర్లున్నవి. మంచి జీవితము జీవించి, మంచి కార్యములు చేసినవారు. ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా యూదా మతమును అనుసరించినవారు. వారు, వారు ఐక్ మాన్ చేత మరి ఇతరుల చేత హతసాక్షులుగా చేయబడ్డారు. మిలియన్ల మంది యథార్థవంతులుగా యుండిరి. ఆ జర్మనులు కాల్చి చంపారు. వారిని హత్యచేసి చంపారు. వారిని కంచెలకు వ్రేలాడదీశారు. వారిని తగులబెట్టారు. అంతిమ సంస్కారము చేశారు. ఆ కఠిన హృదయులు రక్తపిశాచియగు హిట్లర్, స్టాలిన్ మరియు ముస్సోలిని యూదులైన వారిని ద్వేషించారు.

287 యూదుని గౌరవించుట వలననే ఈ దేశము ఇంకా ఈ దేశము ఉండుటకు కారణమని అనుకొనుచున్నాను. అది నిజం. అతనికి చోటు ఇచ్చాడు. యూదుని నీవు గౌరవించు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు.

288 ఇపుడు దుర్మార్గులైన యూదుల గుంపున్నారు. అన్యజనులలో కూడా ఆలాటి వారున్నారు.

289 అయితే నిజమైన యూదుడు భూమికి పునాది వేయబడక ముందే గ్రంథమందు అతని పేరును దేవుడు పెట్టియున్నాడు. ఈ కాలములో ఇక్కడ అతడు హత్య చేయబడ్డాడు. జ్ఞప్తించుకో, అది ఆలోచించు. అదెంత సంపూర్ణమైనదో. ఆ తరువాత అమాయక ప్రజలైన యూదులను ప్రపంచములోని దేశముల ద్వారా మిలియన్ల కొలది వధింపబడ్డారు, ఇక్కడ లేఖనము చెప్తుంది, ఈ కాలములో ప్రతియొక్కరు బలిపీఠము క్రింద, ఏమి జరిగియున్నదని గుర్తించిరి మరియు వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను.

290 మరియు వారన్నారు, “సరే, ఎందుకని? ఇపుడే మేము మరలా రాజ్యమునకు వెళ్ళలేమా?” అని. యూదుల రాజ్యము భూమి మీద స్థాపింపబడును, మీకు తెలుసా. యోహాను చెప్పాడు, రాజ్యము అక్కడయున్నది. చూశారా. స్థాపింపబడనైయున్నది.

ఇపుడు, ఇది సువార్త యొక్క రాజ్యమైయున్నది. ఔనా.

291 అయితే యూదుల రాజ్యము ఈ—ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా ప్రకటించబడును. కనుక గమనించండి ఆ—ఆ ఇక్కడ భూమిపైనున్న రాజ్యము.

292 “పరలోక రాజ్యము బోధింపబడుచున్నది,” …యూదుల వలన, లేక నా అర్థం, “అన్యులకు.”

293 భూమి మీద రాజ్యము వెయ్యేండ్ల పాలనలో స్థాపింపబడును. వెయ్యేండ్ల పాలనయైన తరువాత యూదులకు జరుగును.

294 ఇపుడు గమనించండి. ఇక్కడ ఇపుడు గమనించండి. వారు—వారు బోధిస్తుండగా, చూడండి.

295 ఈ—ఈ ప్రవక్తలు రంగం మీదికి రాకముందే; యూదులు ఐక్ మాన్ మొదలైన వారి వలన చంపబడతారు. ముందుగా నిర్ణయించబడిన ప్రతియొక్కరికి (దేవుని కృప వలన) ఒక తెల్లని వస్త్రము ఇవ్వబడెను. ప్రతి యొక్కరికి ఒక తెల్లని వస్త్రము ఇవ్వబడెను. గమనించు.

ఇపుడేమి జరుగుతుంది? అది జరిగిన వెంటనే…

296 అక్కడ వెనుకనున్న గోడ గడియారాన్ని నేను గమనిస్తున్నాను. మరియు నాకు తెలుసు—మనకు ఆలస్యమైపోతుందని మనకు తెలుసు. అయితే నాకు తెలుసు…ఔనా, నేను—నేను…వారు…అక్కడ నిలబడియున్న బలహీనులను నేను గమనిస్తున్నాను. దేవుడు మీకు సహాయము చేయునుగాక సహోదరులారా. ఆ దినాన మీలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము దయచేయునని నేను నిరీక్షించుచున్నాను. ఔనా. నిలబడియుండి, కాళ్ళు నొప్పులతో ముందుకు వెనుకకు మార్చుకుంటూ ఉన్నారు. దినమెల్ల మీలో కొందరు పనిచేసి యున్నారు. అదేంటో నాకు తెలుసు. మరియు ఇక్కడ చూడండి…కొందరు పెద్దలైన దీన స్త్రీలు నిలబడియున్నారు. కొందరు పురుషులు వారి స్థలాలను స్త్రీలకు ఇచ్చారు; మరియు మరికొందరు బిడ్డతోనున్న తల్లికి ఇచ్చారు. మరియు నేను—నేను—నేను—నేను అదంతా చూశాను. చూడండి. ఆయన తప్పక చేస్తాడని నమ్ముతున్నాను. గమనించు, మిమ్మును ఎక్కువసేపు ఉంచాలని అనుకొనుట లేదు. మీరు వర్తమానమును గ్రహిస్తే, అదే నేను కోరునది, ఔను.

297 ఇపుడు, ఈ యూదులను గమనించండి. ఈ ముద్ర యొక్క ప్రత్యక్షతను మీరు చూచుట కొరకై నేను ఇది చేయవలసియున్నది; అదేంటో మీరు చూశారా, బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఎవరైనది. ఇపుడు గమనించండి.

298 దానియేలు కాలములో, ఇపుడు, డెబ్బది వారములోని రెండవ అర్థ భాగము. ఇపుడు గుర్తుంచుకోండి, “మెస్సీయా మధ్యలో కొట్టివేయబడును.” అది మధ్యలో సరే. ఏడులో సగమేంటి? [సభ “మూడున్నర” అని చెప్తుంది.—సంపా.] మూడున్నర. ఎంతకాలము క్రీస్తు బోధించాడు? [“మూడున్నర.”] ఔను. ఇపుడు, “అయితే ప్రజలకు ఇంకా నిర్ణయించబడినది,” (ఎంత?) “మరియొక మూడున్నర సంవత్సరములు.”

299 మంచిది, ఈ సమయములో చూడండి, ఏమి జరుగుతుందనగా ఏడు సంఘకాలాలలో అన్యుల పెండ్లికుమార్తె ఎన్నుకొనబడి, మరియు పైకి వెళ్తుంది.

300 మరియు అది ఆ విధముగా జరుగుచున్నపుడు, గ్రుడ్డితనము చేత హత సాక్షులుగా మరణించిన ఈ యూదులందరును బలిపీఠము క్రిందనున్నపుడు దేవుడు అక్కడకు వచ్చి చెప్పాడు, “అదేమైంది మీరు చూస్తారా? ఇపుడు నేను మీలో ప్రతియొక్కరికి వస్త్రము ఇస్తాను.”

వారన్నారు, “ఎంతకాలము ప్రభువా? మేము ఇపుడు లోపలకు వెళ్ళుచున్నామా?”

301 చెప్పాడు, “కాదు, కాదు, కాదు, కాదు. మీ సహచరులగు యూదులు కొంచెము కాలము శ్రమపడవలసియున్నది. ఇంకా. మీరు హతసాక్షులైనట్లు వారు హతసాక్షులు కావలసియున్నది. మృగము తన నిబంధనను ఉల్లంఘించి వారిని తీసుకొనును.”

302 ఇపుడు గమనించండి. మరియు ఇపుడు గమనించండి. ఒక్కసారి…ఇపుడు జ్ఞప్తించుకోండి. ఈ ప్రకటన 11 ప్రకారంగా ప్రకటిస్తారు. మీరు, మీరది చదివితే మీ చేతులు పైకెత్తండి. చూశారా? వారికి అధికారము ఇవ్వబడినది.

303 ప్రభువు చిత్తమైతే, ఒక్క నిముషములో మనమది కనుగొనబోతున్నాం. ఎవరీ ప్రవక్తలు ఇపుడు గమనించు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఇపుడు. తప్పక ఆయన చేస్తాడు. తప్పక. చూశారా?

304 ఇపుడు గమనించండి. ఈ మూడున్నర వారముల మధ్యలో, వారిక్కడే ప్రవచిస్తారు. ఆ—ఆ ప్రకటన ఇక్కడ చెప్తుంది. వారు—వారు ఒక వెయ్యి మూడు వందల నలభై దినములు ప్రవచిస్తారు. అయితే…

305 క్రమమైన యూదుల కాలెండరు, దేవుని కాలెండరు యొక్క క్రమమైన కాలమునకు ఖచ్చితంగా నెలకు ముప్పయి దినాలు. రోమా కాలెండర్ అంతా మిశ్రితంగా యున్నది. క్రమమైన కాలెండరు నెలకు ముప్పయి దినాలు.

306 ఇపుడు ముప్పయి దినాలు తీసుకొని దానికి మూడున్నర సంవత్సరం కలిపితే, ముప్పయి దినములతో చూచితే, నీవెంత పొందుకుంటావు? ఒక వెయ్యి మూడు వందలు మరియు…లేక రెండువందల మరియు అరువది దినాలు. “ఒక వెయ్యి రెండు వందల అరవై దినాలు (అరవై రోజులు),” ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు.

307 ఇపుడు మీరు చూశారా. దానికి ఏలాటి తప్పిదము ఉండదు. అది అక్కడే ఉన్నది, అలా కలసిపోతవి—దాని భాగము దానినంటుకున్నరీతిగా. గమనించు. ఆ ఇద్దరు ప్రవక్తలు యూదులకు మూడున్నర సంవత్సరములు బోధించారు. దానిలో లక్ష నలభై నాలుగు వేలమంది పిలువబడ్డారు.

308 తరువాత, గమనించండి ఈ ఇద్దరు ప్రవక్తలు ఖచ్చితంగా మోషే మరియు ఏలీయా. చూశారా? ఔనా? ఇపుడు చూడు, చూడు, వారి…వారి పరిచర్యను చూడు. చూడు ఈ ప్రవక్తలు ఏం చేస్తారో. “వారు అనుకున్నప్పుడెల్లా భూమిని తెగుళ్లుతో మొత్తుటకు వారికి అధికారము కలదు.” ఎవరది చేశారు? మోషే. “ఆకాశమును మూయుటకు, వారి పరిచర్య దినాలలో వర్షము కురవకుండ చేయుటకు.” మూడున్నర సంవత్సరములు ఎవరు ఆకాశాన్ని మూశారు? [సభ “ఏలీయా” అని చెప్పినది.—సంపా.] అక్కడే వారున్నారు. వారే వారు. చూశారా, అది…

309 చూశారా, మనుష్యుడు తాను మరణించినపుడు, అతని హోదా మారలేదు. అతని రూపు మారలేదు. ఔనా. చూడు, అంతకు ముందు…

310 సౌలు వెనుకబడిపోయినవాడైనపుడు, దేశములో ఏ ప్రవక్త లేడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు—అర్థం కాలేదు. దానికి విరోధముగా యున్నాడు. అతడు యుద్ధానికి వెళ్తున్నాడు. అతడు ఏన్దోరు లోని మంత్రగత్తె యొద్దకు వెళ్ళాడు.

311 ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన ఆమె ఇది చేయగలిగెను. ఆమె సమూయేలు యొక్క ఆత్మను పైకి పిలచింది.

312 సమూయేలు పైకి వచ్చినప్పుడు తన యొక్క ప్రవక్త వస్త్రముతో నిలబడ్డాడు. అది మాత్రమే కాకుండ యుండుట కాదు గానీ అతడు ఇంకా ప్రవక్తయైయున్నాడు. అన్నాడు, “నా విశ్రాంతి నుండి నన్నెందుకు పిలిచావు,” చూశారా, అతడన్నాడు, “నీవు దేవునికి శత్రువగుట నాకగుపిస్తున్నది?” “రేపు రాత్రి ఈ సమయమునకు యుద్ధములో నీవు కూలిపోతావు మరియు రేపు రాత్రి ఈ సమయమునకు నీవు నాతో ఉంటావు.” అది ఖచ్చితంగా జరిగినది. చూశారా? అది మాత్రమే కాకుండా…అతడింకా ప్రవక్తయై యండెను. ఔనా?

313 మరియు ఈ వ్యక్తులు ఇంకా ప్రవక్తలైయున్నారు. ప్రభువు చిత్తమైతే కొద్ది నిముషములలోగా కొంచెము లోతుగా వెళ్ళబోవుచున్నాము. ఔనా?

314 ఓ! మై! నేనెంతగా ఆ వాక్యమును ప్రేమించాను! “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు జీవించునది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునది!” ఆశ్చర్యము కాదు.

315 ఈ ఇద్దరు ప్రవక్తలు మోషే, ఏలీయాలు క్రియలు మరలా అదే విధముగా పునరావృతమగుచున్నవి. అది, అది ఎల్లపుడు వారి పరిచర్యయే యైయున్నది. ఇపుడు గమనించండి. వారు చేసినట్లుగానే. అది వారిని మార్చలేదు. గుర్తుంచుకోండి. వీరు ఎన్నడూ చనిపోలేదు. ఒక నిముషము గమనించండి.

316 ఇపుడు, దీనికి మనం దూరం గాక ముందు గందరగోళంలో పడకండి. ఏలీయా యొక్క నాలుగవసారితో నున్న పరిచర్యతో అయిదవ సారి పరిచర్యను గందరగోళం చెందకండి. అన్యజనుల సంఘము ఏలీయా కొరకు ఎదురుచూచు చున్నదని నేను మీకు చెప్తూనేయున్నాను. ఔను.

317 మరియు అతడు ఇక్కడ యూదులతో అక్కడనే యున్నాడు. జ్ఞప్తించుకోండి. నాలుగవ వానిగా అతడు రాడు; అది—అది శత్రువు సంఖ్య. అతడు అయిదవవాడై యుండవలసియున్నది.

318 మొదటిగా అతడు వచ్చాడు, అతడు ఏలీయాగానే తనకుతాను వచ్చాడు. తరువాత అతడు వచ్చాడు, అతడు ఎలీషా. తరువాత అతడు వచ్చాడు, అతడు (ఏంటి?) బాప్తిస్మమిచ్చు యోహాను. తరువాత సారి అతడు వచ్చాడు, ఏడవ దూత కొరకు. మరియు అయిదవ సారి అతడు వస్తాడు, అతడు మోషేతో యుండి వారికి బోధ చేయుట కొరకు. నిశ్చయం. ఔనండి. అతన్ని గలిబిలి చేయవద్దు. ఊఁ హు.

319 ఐదు, మీరు ఎరిగియున్నట్లయితే—మీరు బైబిల్ గ్రంథము యొక్క సంఖ్యలను ఎరిగినట్లయితే, శ్రమపడు కృప యొక్క సంఖ్య అయిదు. అది ఆయన ఏమి చేశాడో అది. ఇపుడు గమనించండి. అదెక్కడున్నదో మీరు తెలుసుకోవాలని ఉందా. యేసు కృప యొక్క శ్రమ. J-e-s-u-s, ఐదు, l-a-b-o-r. ఔనా? శ్రమ—మీ కొరకైన ప్రేమ. నీవు ఆయన యొద్దకు చేరాలంటే ఏలాగు వస్తావు, దేనిద్వారా? F-a-i-t-h in l-a-b-o-r శ్రమలో విశ్వాసము ద్వారా. ఔనా? శ్రమ కృప యొక్క సంఖ్య. విశ్వాసులకు. సరే.

320 గమనించు, మొదటి ఏలీయా, అతడు. రెండవది ఎలీషా. మూడవది యోహాను. నాలుగవది ఏడవ దూత లేక సంఘానికి ఆఖరి వర్తమానికుడు, మలాకీ 4 ప్రకారము మరియు ప్రకటన 10:7 ప్రకారము. ఇపుడు అయిదవ సారి, అతడు యూదులకు వర్తమానికుడు, లక్ష నలభై నాలుగు వేలమంది యూదులకు, సంఘము వెళ్ళిపోయిన తరువాత.

321 నేను—నేను—నేను కొంతగా భావిస్తున్నాను. చూశారా? చూశారా? చూడండి. ఒకరు తలంచినట్లయితే…దీనిని ఇపుడు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. చూశారా. మలాకీ 4 లోని వ్యక్తి జనులను “త్రిప్పుటకు” వచ్చు వ్యక్తి ఒకటేయని అక్కడ యూదుల యొద్దకు వచ్చు వ్యక్తి ఒకటేయని కొందరు తలంచుచుండుట వలన దానిని మీకు తెలియజేస్తాను. ఒక్క నిముషము…చూశారా, అది కొంచెం గజిబిజిగా యుండును. కారణం, జ్ఞప్తించుకోండి, మలాకీ 4 లో చెప్పబడుతుంది, “తండ్రుల విశ్వాసమును త్రిప్పును…లేక పిల్లలను తండ్రుల తట్టునకు త్రిప్పును.” చూశారా, తండ్రులు వైపునకు త్రిప్పుట!

322 ఇపుడు పరిచర్య యొక్క విశ్వాసాన్ని చూపుతాను. అతడు పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల వైపునకు త్రిప్పినట్లయితే, అతడు క్రీస్తును నిరాకరించిన వాడౌతాడు. అతడు తిరిగి ధర్మశాస్త్రము యొద్దకు వెళ్ళాలి. ఔనా? తండ్రులు ధర్మశాస్త్రమును గైకొన్నారు. మీకర్థమైందా. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.]

323 గమనించండి, ఎలీషా మలాకీ 4 లోని తన పరిచర్యను చేయుటకు అతడు వచ్చినపుడు చూడండి, మలాకీ 4 ప్రకారము ఏలీయా స్వయంగా తానే వచ్చుచున్నాడు.

324 ప్రకటన 11 ప్రకారముగా, యూదుల యొద్దకు పరిచర్యకు అతడు వచ్చునపుడు, మోషే అతనితో ఉంటాడు. [సహోదరుడు బ్రెన్హాం తన చేతులు కలిపి రెండుసార్లు చప్పట్లు కొట్టాడు—సంపా.] కాబట్టి ఏలాటి గజిబిజి లేదు. ఏ కొంచెం కూడా. చూశారా? అర్థమైందా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.]

325 ఎలీషా వచ్చునపుడు, మలాకీ 4, అతడు తానే వస్తాడు. ఏలీయా పరుగెత్తును; ఏలీయా మోషేలు కాదు. “ఏలీయా” లేచును. అయితే అదే ప్రేరేపణ యుండును. ఏలీయా సంఘకాలము యొక్క కడపటి భాగమునకు వచ్చుననియు, “పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల యొక్క అసలు విశ్వాసమునకు త్రిప్పుననియు,” ఆ అపొస్తలుల విశ్వాసమునకు, దానికే మీరు తిరిగిపోవలెను. మరియు అంత్యక్రీస్తు వారందరిని లాగివేసింది. “తిరిగి త్రిప్పుట,” లేఖనాలన్ని కలసియున్నరీతిగా. చూశారా, అతడు తనకుతానే వచ్చును. చూశారా?

326 అయితే అతడు సంఘమునకు వచ్చునపుడు, బైబిల్…కాదు లక్ష నలభై నాలుగు వేల మంది యొద్దకు వచ్చునపుడు, బైబిల్ తేటతెల్లగా తెలుపుతుంది…ఇద్దరు అని, వారిలో ఒకరు అది కాదు. ఇద్దరు! మరియు అతని మొదటి పరిచర్య యూదులను తీసుకొని వారిని మరలా ధర్మశాస్త్రము వైపునకు త్రిప్పలేకపోయెను. ’ఎందుకనగా అతడు వచ్చి లక్ష నలభై నాలుగు వేలమందికి క్రీస్తును ప్రకటించును. ఆమేన్. “ఆయన అక్కడ ఉన్నాడు. కొట్టివేయబడిన ఆ మెస్సీయా.” ఆమేన్! అది అది. కాబట్టి గజిబిజి చెందవద్దు. అది గజిబిజి కాదు. లేఖనము అబద్ధమాడదు, ఒక పొల్లు కూడా.

327 మహిమ కలుగును గాక! ఓ నేనది చూచినపుడు, నేను గంతులు వేశాను. నేను అన్నాను, “ధన్యవాదాలు ప్రభువా,” నేను కనిపెడుతున్నపుడు అక్కడ జరిగినది అది. మొదటి కాలంలో ఏలీయా తనకుతానే నడచి వచ్చుట చూశాను. అటు తరువాత మరలా వచ్చుట నేను చూచినపుడు, అక్కడ యొక చోట, అది జరిగినపుడు ఇద్దరిని చూశాను. చెప్పబడినది, “అదిగో అక్కడనున్నది, అది, అది చేసినది. ప్రభువా. ఆమేన్! ఇపుడు నేనది చూశాను! హల్లేలూయ!” అది ఖచ్చితము.

328 ఇపుడు నేనది చెప్పని యెడల, ఒకరికది గందరగోళంగా యుండును. అయితే ఆయన—అది చెప్పుటకు ఆయన అది చెప్పాడు. కనుక నేను చెప్పితిని.

329 గమనించండి. భవిష్యత్ పరిచర్య కొరకు, వారి అసలు పరిచర్య నుండి దేవుడు ఈ మనుష్యులను సజీవులుగా కాపాడెను. వారు పరిచర్యను చక్కగా చేశారు. చూడు. ఆలోచించు. ఏలీయా ఆత్మ పరిచర్య ఐదుసార్లు. మోషే, రెండు. ఏంటి? భవిష్యత్తు పరిచర్య కొరకై జీవముతో నుండుట.

330 వారిలో ఏ ఒక్కరు ఇప్పుడు చనిపోలేదు; మీరది నమ్మరా. వారిద్దరు అగుపించారు. సజీవంగా, రూపాంతరపు కొండపైన యేసుతో మాట్లాడుచున్నారు. అయితే, జ్ఞప్తించుకోండి. వారు చనిపోవాలి.

331 ఇపుడు, ఇపుడు మోషే వాస్తవంగా చనిపోయాడు. అయితే అతడు లేచాడు. ఎందుకనగా అతడు, క్రీస్తుకు పరిపూర్ణమైన పోలిక. ఔనా? అతడెక్కడ పాతిపెట్టబడ్డాడో ఎవరికి తెలియదు. దేవదూతలు వచ్చి అతనిని తీసుకొని వెళ్ళారు. ఔనా? దేవదూతలు అతని శవమును మోసుకొని వెళ్ళారు. ఊ హు. ఎందువలన? అతడు ఎక్కడకు వెళ్ళుచుండెనో అక్కడకు ఏ మర్త్యుడు అతన్ని మోసుకొని పోలేడు. అతడొక కార్యము ద్వారా వెళ్ళెను. అంతే. అతనిని దేవదూతలు మోసుకొనిపోయారు. ఔనా, ఎందుకనగా అతడు ఉండవలసిన స్థలమునకు వారు తీసుకొని వెళ్ళారు. ఎవరికి తెలియదు.

332 చివరకు సాతానుకు తెలియదు. ప్రధాన దూతతో అతడు వాదించాడు. ఔను. మోషేకు ఏమి జరిగినదో అతనికి తెలియదు. “అక్కడతడు వణికిపోవుట నేను చూస్తున్నాను. దేశాన్ని అంతటిని చూచి, ఇశ్రాయేలీయులను తదితరులను చూచి అతడు వణుకుచుండుట నేను చూస్తున్నాను. అయితే అతడు బండమీద కెక్కడం నేను అతని చూచుట అదే ఆఖరు సారి.”

333 అదే బండ! అదే బండ! నా రహదారి అంతమున నేను బండపైన నిలబడును గాక! ఔనండి. ఇపుడు…నా నల్లజాతి సహోదరులు తరచుగా ఇక్కడకు వచ్చి చిన్న పాట పాడుచుందురు, “నాకు వీలైనట్లయితే మోషే ఎక్కడ నిలబడెనో ఆ బండ మీద నేను నిలబడెదను.” ఔనండి! ఓ, నేను నిలబడగోరు బండ అదే. విశ్వాసము ద్వారా నేనక్కడ నిలబడతాను.

334 అయితే, గుర్తుంచుకోండి, ఏలీయా, అతడు అలసిపోయాడు ఎందుకనగా అతని ముందు ఎంతో పని ఉన్నది. [సహోదరుడు బ్రెన్హాం నిలుపుచేశాడు, సంఘము నవ్వినది—సంపా.] కాబట్టి అతడు బహుగా నలిగిపోయాడు, మరియు దేవుడు అతనిని గృహమునకు తీసుకొని వెళ్ళుటకై ఒక రథమును పంపాడు. అది నిజమేనా? [“ఆమేన్.”] అతన్ని తీసుకొని వెళ్ళాడు. అతడు చనిపోలేదు, ఎందుకనగా ఆయన అతన్ని సజీవునిగా ఉంచాడు. అతని మీద ఆయనకు ముందు పని ఉంది. అతని ఆత్మతో అభిషేకించబడు ఒక మనిషిని కూడా కలిగియుండును.

335 అయితే వారు మరణాన్ని రుచి చూడవలసియున్నది. ఇపుడు ప్రకటన 11వ అధ్యాయము. ఇపుడు వెళ్దాము. నేనిక్కడే ఉన్నాను. ప్రకటన 11ను తాకుదాం. వారిద్దరు మరణించారో లేదో గమనించి చూడండి. వారిరువురు మరణమును రుచి చూడవలసియున్నది. ఔనండి. వారి పరిచర్య ముగించబడిన తరువాత వారు మరణమును రుచి చూస్తారు. ప్రకటన 11:7 తో ప్రారంభిద్దాం.

వారు…సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము…వారితో యుద్ధము చేసి,…

336 ఓ, మై, అతడు దానికి నిలబడలేకపోయెను; ఆ పరిశుద్ధ గుండ్రాళ్ళు మరలా వచ్చారు. చూశారా. సరే. సరే.

…అగాధములో నుండి వచ్చు క్రూర మృగము…వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును.

337 అయితే ఏమి జరిగినదో చూడండి. ఇపుడు వారు చక్కని సాదృశ్యంగా ఉన్నారు.

వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను, (యెరూషలేము, చూడండి).

338 ఇపుడు, వారు మరణము రుచిచూడవలసి యున్నది. (వారు కదా?) ఔను. వారి పరిచర్య ముగించబడిన తరువాత.

339 ఎందుకని? ఏడవ దూత పరిచర్య, ఏడవ దూత పరిచర్య, ఏలీయా పరిచర్య ఏడవ దూతకు, కాదు…నేను ఏమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నాననగా, ఎందుకు ఏడవ దూత పరిచర్య మోషే యొక్క పరిచర్యగా ఉండకూడదు? అతడు అమర్త్యుడైనట్లయితే ఏలీయా పరిచర్య వలె…ఎందుకని…ఎందుకు దేవుడు అతన్ని పంపి, “ఏలీయా నీవు—నీవెంతో కష్టపడ్డావు. ఈ పలు పలు స్థలాలలో చేశావు. నేను మోషేను క్రిందికి పంపుతాను”? ఎందుకని?

340 మోషే పరిచర్య చూడండి. ఏలీయా అన్ని దేశాలకు ప్రవక్త; అయితే మోషే యూదులకు మాత్రమే ధర్మశాస్త్రము ఇచ్చినవాడు. ఆమేన్. మోషే…ఏలీయాతో అతడు వచ్చుటకు కారణమేమనగా…ఆ యూదులు అంటున్నారు, “ఆగు, మేము ఇంకా ఇక్కడ ధర్మశాస్త్రమును గైకొంటున్నాము.” అయితే ఇక్కడ మోషే నిలబడియున్నాడు; మరియు ఇక్కడ ఏలీయా అతనితో ఉన్నాడు. ఓ! చూడండి. అతడు యూదుల యొద్దకు మాత్రమే వస్తాడు. ఔనా. మోషే యూదుల యొద్దకు మాత్రమే వెళ్ళాడు; ప్రవక్త ఏలీయా అన్ని దేశాలకు. అయితే మోషే యూదులకు ప్రవక్త అయ్యాడు, ధర్మశాస్త్రము ఇచ్చినవానిగా. ఔనా. అదీ అతని వర్తమానము, ధర్మశాస్త్రము.

341 అయితే ఏలీయా వర్తమానమేంటి? వెంట్రుకలు కత్తిరించుకొనిన స్త్రీలకు, సంఘశాఖలకు. ఔనండి. వారిని నిజముగా ముక్కలుగా చీల్చెను. రంగులు పూసుకున్న ముఖాలు, వారితో చెప్పాడు, “మీరు కుక్కలకు ఆహారముగా వేయబడబోవుచున్నారు.” అతడు నిజముగానే వారిని చీల్చాడు.

342 మరియు అటుతరువాత అతని ఆత్మ యోహాను మీదికి వచ్చినపుడు, అరణ్యములో నుండి అడుగు వేసుకుంటూ వచ్చి అదే కార్యము చేశాడు. ఔను. అన్నాడు, “మేము దీనికి సంబంధించిన వారము దానికి సంబంధించిన వారము అని అనుకొనవద్దు. దేవుడు అబ్రాహాముకు ఈ రాళ్ళ వలన పిల్లలు పుట్టింపగలడు.”

343 దారిన వెళ్ళుచు, అతడడిగాడు, “మరియు నీ యొక్క స్వంత బావను పెండ్లిచేసుకొన్నావని నాతో చెప్తున్నావా అని…?” చెప్పాడు, “అది చేయుట నీకు చట్టబద్ధము కాదు!” ఓ, సహోదరుడా! వ్యూ హుమ్! అతడు ఆమెకు చెప్పాడు. ఖచ్చితంగా.

344 గమనించండి. ఈ ఆత్మలు కొంచెము కాలము వేచియుండవలెను. ఆ యొక్క లక్ష నలభై నాలుగు…వారు హతసాక్ష్యులుగా మరణించవలెను. ఓ అది కాదా, అది కాదా…అది బైబిల్ గ్రంథము జతచేయుచున్నది.

345 ఇపుడు నా సమయం అయిపోయింది. మిమ్ములను పెందలకడ పంపించవలెను. అయితే కొన్ని చిన్న విషయాలు మీకు చెప్పవలసియున్నది, దానికి మీరు నిలబడగలిగితే. [సభ, “ముందుకు సాగిపో!” అని చెప్పినది.—సంపా.] వేడిగా యున్నదని నాకు తెలుసు. నాకు చెమట పోస్తుంది.

346 అయితే వినండి. నేను మీకు చెప్పవలసినది ఒకటియున్నది. అదెంతో మేలైనది, అది నా హృదయములో మండుతున్నది. అది మీరు మరచిపోరని నేను నిరీక్షిస్తున్నాను. చూశారా. ఆయన సన్నిధానంలో నేనిది చెప్పనీయండి. ఆయన కృపను బట్టి, కొంచెం కాలం క్రితం నా ప్రజలు తెల్లని వస్త్రములు కలిగియుండుటను ఆయన నాకు చూపెను. అది మీకు జ్ఞాపకముందా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] జ్ఞాపకముందా? కొంచెం కాలం క్రితం ఆ కథ మీకు జ్ఞాపకముందా? [“ఆమేన్.”] అన్యుల పెండ్లికుమార్తె వారిప్పుడు అక్కడ ఉన్నారు. వారందరు తెల్లని వస్త్రములు ధరించియున్నారు.

347 నేను మేల్కొన్నాను. కూటములో ఉన్నాను. అది ఒక సంవత్సరము, ఇంకొంచెము కావచ్చు. ఒక ఉదయవేళ నేను మేల్కొన్నాను. నేను లేచాను. నేను నా భార్యతో అన్నాను, “ప్రియా?” ఆమె కదలలేదు. పిల్లలను…లేపవలసియుంది, బడికి తీసుకువెళ్ళవలసి ఉంది. అక్కడే యున్న పాతస్థలములో. సరే. నేను—నేను పడక మీద నుండి లేచి, వంగాను. ఏలాగో తెలుసా; కూర్చొని, కొంచెం వంగి వెనుక తలగడకు ఆనుకున్నాను. పాతకాలపు పడక మాకుంది. కనుక ఆ విధముగా వెనుకకు ఆనుకున్నాను.

348 మరియు నేను అనుకున్నాను, “అబ్బాయ్, నీకు యాభై మూడు. నీవేదైన దేవునికి చేయాలనుకుంటే, నీవు చేయుట మంచిది, ఎందుకనగా కొంచెం కాలమైన తరువాత నీవు ఇంకా వృద్ధుడవు కాబోతున్నావు.” చూశారా.

349 మరియు నేను అనుకున్నాను, “మీకు తెలుసా, అది నిజమే, ఇపుడు.” నేను తలంచాను, “అబ్బాయ్, మీకు తెలుసా. నేను దూరములో లేను. నేను త్వరలో వెళ్ళవలసియున్నది.” నేను అన్నాను, “అది—అది నా తండ్రి జీవించినదానికంటె ఒక సంవత్సరం ఎక్కువ.” చూశారా? నేను అనుకున్నాను, “నే త్వరగా వెళ్ళిపోవలసియున్నది. నేను దానిని చూశాను. నేనిక్కడ దేవునికి ఏమి చేయలేదు, ఇంకా.” నేను తలంచాను, “నేను ఆయనకు ఒకటి చేయాలనుకుంటాను.” నేను అనుకున్నాను, “నేనది చేయదలస్తే నేను తొందరపడవలసియుంది. నేనేలాగు అది చేయవలెనో నాకు తెలియదు, అంతే.”

350 నేను తలంచాను, “మనుష్యుడా, ఆయన వచ్చుటను చూచువరకు నేను జీవిస్తానని నిరీక్షిస్తున్నాను. నేను శరీరములేని ఆత్మగానో లేక ఒక ఆత్మగానో యుండుటకు నాకిష్టము లేదు.”

351 చూశారా, ఆత్మను గూర్చి నేనెల్లపుడు భయపడతాను. మరియు ఇపుడు మీకు తెలుసా, ఆ రకమైన…నేనెల్లపుడు తలస్తాను, ఏలయనగా, నేను సహోదరుడు నెవిల్ ను కలుసుకొనినట్లయితే అతడు ఒక తెల్లని మేఘముగా తిరుగుచు కదలుచుండును. “హలో, సహోదరుడా నెవిల్” అని చెప్తే, అతడు “హలో సహోదరుడా బ్రెన్హాం,” ఇంకొక ఇంద్రియమున అని అతడు చెప్తే; అతడు మాట్లాడలేడు. అయితే అతడు సహోదరుడు నెవిల్ అని నేనెరుగుదును. ఆ…నేనెల్లపుడు చేసినట్లు అతని హస్తాన్ని నేను స్పర్శించ కోరాను. ఎందుకనగా మానవులలో నాకు తెలిసింది అదే. చూశారా! అది అక్కడ సమాధిలో కుళ్ళిపోయినది. ఔను?

352 నేననుకున్నాను, “మై, నేనందులో గుండా వెళ్ళకూడదని అనుకొంటిని.” ఇపుడు నేను…నేనిపుడు సత్యము చెప్పబోతున్నాను. నేను—నేను చనిపోవుటకు భయపడేవాడను; నశించిపోతానని కాదు, అయితే నేను ఆత్మగా ఉండరాదని నా కోరిక. నేను మనుష్యునిగానే యుండాలని కోరుచున్నాను. నేను ఎత్తబడు వరకు నిలచియుండాలని కోరుచున్నాను. నేను ఆ విధముగానే నిలిచియుండగోరుతాను. నేను ఆత్మగా యుండి ఆ విధముగా తిరుగుచూ యుండుటకు కోరుటలేదు. అది తలస్తూ నేనక్కడ పండుకొనియున్నాను.

353 తటాలున, అక్కడొకటి జరిగినది. [సహోదరుడు బ్రెన్హాం తన వ్రేలిని ఒక్కసారి నొక్కాడు—సంపా.]

354 ఇపుడు, మీకు తెలుసు, మీరందరు దర్శనములను గూర్చి ఎరిగినవారే. ఇది దర్శనమైతే, ఆలాటిది మరెన్నడు కలుగలేదు, చూశారా, నేను చిన్న బాలుడుగా యున్నపుడు నుండి దర్శనములు చూచుచునేయున్నాను.

355 మరియు, అకస్మాత్తుగా ఒకటి జరిగినది. నన్ను నేనుగా విడిచిపెట్టినట్లు భావించాను. “ఊహో” నేననుకున్నాను. మరియు నేను—నేను తలంచాను, “నేను—నేను ఎప్పుడో చనిపోయాను, చూశారా, నేను—నేను వెళ్ళిపోవుచున్నాను.” చూశారా?

356 మరియు నేనొక స్థలానికి చేరుకున్నాను మరియు నేననుకున్నాను, “నేను వెనుకకు చూడాలని అనుకుంటున్నాను.” నేనిక్కడ నిలబడియుండుట ఎంత వాస్తవమో అక్కడ నేను పడక మీద పరుండియున్నాను. నా భార్య ప్రక్కనే చాచుకొని పండుకొనియున్నాను.

357 నేననుకున్నాను, “సరే, బహుశా అది గుండెపోటు కావచ్చు.” చూశారా. నేననుకున్నాను, “సరే, చూడు, నేనిపుడే మరణించితిని,” ఆ విధముగా చనిపోవుట మంచిది. కాబట్టి, “అది గుండెపోటు, నేను బాధపడనవసరము లేదు.” నేను చూశాను, అనుకున్నాను, “సరే, అది వింతగా యుంది. అక్కడ నేను పండుకొనియున్నాను; ఇక్కడ నేను నిలబడియున్నాను, ఇక్కడ.”

358 కాబట్టి నేను తిరిగాను. అది పెద్ద—ఒక పెద్ద పొలము వలె లేక ఒక దానివలె, నీలి రూపములో కప్పబడిన పెద్ద పొలము వలెయుంది. మరియు—మరియు నేనన్నాను “భలే, ఇదంతా ఏమిటని నేను ఆశ్చర్యపడుతున్నాను?”

359 మరియు అకస్మాత్తుగా, నేను చూస్తుండగా, వేలవేలమంది యౌవన స్త్రీలు, తెల్లని వస్త్రములు ధరించినవారై వచ్చుచుండిరి. వారు నడుము వరకు పొడవైన జుట్టు వ్రేలాడుచున్నది, చెప్పులు తొడుక్కొనలేదు, వారు నావైపు పరుగెత్తుచున్నారు. నేననుకున్నాను, “ఇదేంటి?” అని.

360 నేను చుట్టూ తిరిగాను, అక్కడ వెనుకకు చూశాను. నేనక్కడ ఉన్నాను; ఈ వైపునకు చూశాను. అక్కడ వారు వచ్చారు. నేను నా వ్రేలిని కొరుక్కున్నాను. “నేను—నేను—నేను—నేను ఖచ్చితంగా నిద్రపోవుట లేదు.” అయితే నేను స్పర్శ కలిగియున్నాను. నేను అన్నాను, “సరే, ఇక్కడ యొకటి వింతగా నున్నది.”

361 ఈ స్త్రీలంతా పరుగెత్తుకుంటు వచ్చారు. అంతటి అందమైన స్త్రీలను నేనెన్నడు చూడలేదు. నా యొద్దకు పరుగెత్తుకుంటు వారందరు వస్తున్నారు. వారు నా యొద్దకు పరుగెత్తి వచ్చి…

362 నేనెట్లుండెదనో తెలుసా, ఒక రకంగా…స్త్రీ ద్వేషకుడు అని వారు నన్ను పిలుస్తారు. అయితే నేను కాదు. ఔను. అయితే నేను—నేను తలస్తాను ఒక మంచి స్త్రీ…ఒక ఆభరణం. అయితే నేననుకుంటాను, సొలొమోను చెప్పినట్లు చెడు స్త్రీ “నీ రక్తములో నీరు వంటిది.” కాబట్టి శీలము లేని స్త్రీలకు లేదా చెడ్డ స్త్రీలకు నిజంగా నావలన ప్రయోజనము లేదు.

363 కనుక ఈ స్త్రీలందరు వచ్చారు. వారు చేతులు నా చుట్టు చుట్టారు. అది అసాధారణముగానున్నది. నేనెందుకు అంగీకరించనని మీరు ఎరుగుదురు. కాబట్టి వారు…ఇపుడు, నేను ఈ విధంగా చెప్పవలెనని ఉన్నాను. నేను—నేను మిశ్రిత జనం మధ్య ఉన్నాను. అయితే వారు, వారు స్త్రీలు. వారు స్త్రీలు. వారు ఒక్కొక్కరు నన్ను హత్తుకున్నారు, మరియు అన్నారు, “మా—మా ప్రశస్తమైన సహోదరుడా!” అని అన్నారు. ఒకరు నన్ను హత్తుకున్నారు తరువాత ఇంకొకరు నన్ను హత్తుకున్నారు.

364 అక్కడ నిలబడి చూస్తున్నాను. నేను అనుకున్నాను, “ఇదంతా ఏమిటి?” అని. చూశారా వారక్కడ నిలబడియున్నారు. నేననుకున్నాను, “ఏం జరిగింది?” అని. నేను వెనుకకు తిరిగి చూశాను. నేను అక్కడే పరుండియుండియున్నాను. మరియు ఇక్కడ నేను ఉన్నాను. ఇక్కడ నిలబడియున్నాను. నేను తలంచాను, “ఇపుడు వింతగా ఉన్నదే. నేను—నేనది అర్థం చేసుకోలేకున్నాను.”

365 ఆ అరిచే స్త్రీలు, “ఓ, మా ప్రశస్త సహోదరుడా,” అని అంటు హత్తుకుంటున్నారు. వారందరు స్త్రీలేయని నేను గ్రహించాను.

366 ఇపుడు, సహోదరిలారా, నేనిది చెప్తుండగా నన్ను క్షమించండి. ఎందుకనగా…అయితే మీ వైద్యుని మాట మీరు వినండి; మనకు శుద్ధమైన మనస్సు లేని యెడల అలాగైతే మనం క్రైస్తవులము కాము. నాకు లెక్కలేదు…

367 నేనెల్లపుడు పరిశుభ్రముగానే జీవిస్తాను. అది దేవునికి తెలుసు. నేను చిన్న పిల్లవానిగా ఉన్నపుడు నా దేహాన్ని అపవిత్రపరచుకోవద్దని చెప్పాడు. పొగత్రాగవద్దు, మద్యపానము సేవించవద్దు అని. అది సత్యము. దేవుని కృపను బట్టి నేనది కాపాడుకున్నాను. నేను పాపిగా ఉన్నపుడు స్త్రీలతో నేను తిరగలేదు. కాబట్టి…

368 అయితే ఏ పురుషుడైనను ఒక స్త్రీని తన హస్తాల్లో కౌగిలించుకొనిన యెడల, అతను పురుష కణములతోను, ఆమె స్త్రీ కణములతోను నిర్మింపబడుట వలన స్పర్శ కలుగును. మీరెవరైనది నాకు లెక్కలేదు. నీవు ఆరోగ్యవంతుడైన వ్యక్తివైతే స్పర్శ లేదని చెప్పవద్దు.

369 అయితే అక్కడ లేదు. ఎందుకనగా ఏలాటి వ్యత్యాసకరమైన కణములు నీకు లేవు. నీవు అక్కడ పాపము చేయవు. అక్కడ మార్పుంది. స్త్రీల పట్ల సహోదర ప్రేమ తప్ప మరేమీ ఉండదు.

370 అయినను నేననుకుంటాను—ఒక స్త్రీ కృప ద్వారా చూపబడిన యెడల, చక్కటి ప్రవర్తన ద్వారా మరియు ఒక నీతిగల స్త్రీ గా నడుచుకొనునపుడు ఆమె యొక—ఆమె యొక ఆదర్శవంతమైన ఆభరణం భూమిమీద. నేను—నేను ఇష్టపడతాను కృపగల దానిని. నేననుకుంటాను, ఒక—ఒక తన స్థానాన్ని కాపాడుకొని, వనితగా యుండుటకు ప్రయత్నించే స్త్రీ, ఘనతకు చిహ్నముగా నున్నది. నేనది నమ్ముతున్నాను. అలాకానట్లయితే, అది క్రీస్తు, అంత్యక్రీస్తు వలె యుండును.

371 నేను—నేను, సహజముగానుండు దేనినైనా నేనిష్టపడతాను. ఒక అందమైన గుఱ్ఱము లేక దేనినైనా, అది నిజమైన అందమైన దానికి చిహ్నముగా నిలబడుతుంది. లేక ఆలాటిదేదైనా అందమైన పర్వతము, అందమైన స్త్రీలు, అందమైన పురుషులు, దేవుడు చేసిన ఏదైన ఎల్లప్పుడు నేను అభినందిస్తాను.

372 మరియు ఇవన్నియు పరిపూర్ణముగా నున్నవి. అయితే, వారి హస్తాల్లో నన్నెంతగా కౌగలించుకొన్నప్పటికి మరియు వారు స్త్రీలు, మీరు అర్థం చేసుకున్నారా, ఏలాటి పాపము లేదు. పురుష గ్రంథులు స్త్రీ గ్రంథులు రెండునూ తీసివేయబడినవి. [సహోదరుడు బ్రెన్హాం ఒక్కసారిగా తన రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టాడు—సంపా.] ప్రభువుకు ధన్యవాదములు! వారు నా సహోదరీలు, సంపూర్తిగా.

373 నేను చూశాను. మరియు నేను—నేను—నేను నా చేతులు చూచుకున్నాను; అవన్ని యౌవ్వనంగా యుండుట చూశాను. మరియు నేను చూచుకున్నాను. నేను యౌవ్వనస్తునిగా యున్నాను కూడా. మరియు నేను…

374 ఒక యౌవ్వనస్తునిగా, నా వెంట్రుకలు పోగొట్టుకొనుట; ఒక మంగళి చేశాడు. కార్బొలిక్ ఆమ్లము దాని మీద పోశాడు. నేను చిన్నవాడిగా నున్నపుడు అవన్ని తీసివేయబడినవి. అదెల్లపుడు నాకొక విధమైన దానిగాయుంటుంది, అది నాకు—నాకు—నాకు జలుబు చేస్తుంది, ఎందుకనగా నా కపాలము మెత్తనిది కనుక, చూశారా. అచ్చట నున్న జుట్టు యొక్క కుదుళ్ళు కార్బోలిక్ ఆమ్లముతో కాలిపోయినందున, వెంట్రుకలు ఇక పెరగవు. చూశారా.

375 నేను వెళ్ళాను, నా భార్య…చాలా సంవత్సరాల క్రితం ధరించుకొనుటకు నా తల కప్పుకొనుటకు ఒక తల ముసుగు తెచ్చినది. అయితే అది ధరించుకొనుటకు నేను సిగ్గుపడ్డాను. ఎందుకనగా ఒక తప్పుడు దానివలె కన్పించినది. ఏ తప్పుడిది నాకు అవసరం లేదు.

376 కనుక నేననుకున్నాను, “స్టాకింగ్ టోపి నేను పెట్టుకుంటాను” అని అనుకున్నాను. తరువాత కొంతకాలము అలా చేశాను. వారేమి చేశారో తెలుసా? వారు నన్ను “బిషప్పు” అని పిలుచుటకు మొదలు బెట్టారు. నేను…చూశారా? నేను చెప్పాను, “అది వెళ్ళనియ్యు” అని.

377 కాబట్టి నేను అటువంటి తీవ్రమైన జలుబుతో బాధపడితిని…అయితే ఇపుడు కిటికీలు తెరచితిరి. ఆ చిన్న గాలి ఆ విధముగా వస్తున్నది, అబ్బాయ్. నాకు వస్తుంది.

378 నేను వైద్యుని యొద్దకు వెళ్ళి అడిగాను. అతని అభిప్రాయమేమని. అతడు చెప్పాడు, “మంచిది, చూడు, నీ—నీ రంధ్రాలు తెరువబడినవి. బోధ ద్వారా నీకు చెమట వస్తుంది. ఆ గాలి వస్తుంది. దాని వలన చలి క్రిమి అక్కడకు చేరుకుంటుంది. అది నీ గొంతు లోపలకు వెళ్ళుట వలన మరుసటి దినము నీ గొంతు బొంగురుబోతున్నది. అది అదీ.”

379 మరియు—మరియు కనుక, ఓ, మై, వెంట్రుకలున్న మీరు, అవి మీకున్నందుకు మీరెంత కృతజ్ఞత కలిగియుండవలెనో మీకు తెలియుట లేదు. అవునది నిజం. చూశారా.

380 మంచిది, ఇపుడు, నేను కనుగొన్నాను. తరువాత, నేను—నేను…ఈ ఒకానొక దినాలలో నాకు పండ్లు లేకుండాపోయినను, నేను వాటిని పొందుకోబోతున్నాను. వాటిని లేకుండ ఉండగలను.

381 కాబట్టి ఒక అబ్బాయి అయితే—ఒక అబ్బాయి అయితే…సరే, తాను ఇష్టపడినట్లుగా తన తలకు వెంట్రుకల ముసుగును ఇక మీదట ధరించనవసరము లేదని, స్త్రీలైతే తమ తల నిండుగా నానా రకములుగా అలంకరించుకుంటూ వారి జుట్టులోకి ఎలుకలు, సుంచులు వెళ్ళి దాగుకున్నట్లుగా వారు చేసుకోకూడదని నేను తలంచను. చూశారా? అయితే, ఒకవేళ, నీవది చేస్తే, దేనికొరకు చేస్తున్నావో దానిమీద ఆధారపడుతుంది. చూశారా? దేనికొరకు చేస్తున్నావో దానిమీద ఆధారపడుతుంది అది.

382 అయితే, అయినప్పటికి, అక్కడ నిలబడియుండగా, నా తలవెంట్రుకలు నాకు మరలా వచ్చినట్లుగా నేను భావించాను. మై! నేను యౌవ్వనస్తునిగా ఉన్నాను. మరియు వీరందరు యౌవ్వనస్తులుగా ఉన్నారు! నేను అనుకున్నాను, “భలే, ఇది వింతగా లేదా! ఇక్కడే వారున్నారు.” వారందరు పరుగులు తీస్తున్నారు…

383 మరియు నేను చూశాను వారు వచ్చుట, మరియు హోప్ వచ్చుచుండుట చూశాను. ఆమె కనిపించినది…ఆమె ఇరవై—రెండు లో చనిపోయినది. ఆమె ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉన్నది. మీలో అనేకులకు ఆమె గుర్తుండియుంటుంది. ఆ పెద్ద నల్లటి కళ్ళు. ఆమె జర్మనీ దేశస్తురాలు. ఆమె నల్లటి వెంట్రుకలు ఆమె వెనుక వ్రేలాడుచున్నవి. నేననకున్నాను, “ఆమె ఇక్కడకు వచ్చి, ‘బిల్’ అని పిలచునని నాకు తెలియును. ఆమె ఇక్కడకు వచ్చినపుడు, ‘బిల్’ అని పిలచునని నేనెరుగుదును.”

384 నేను గమనిస్తున్నాను. ఈ స్త్రీలు ప్రతియొక్కరు వచ్చి నన్ను హత్తుకుంటూ, “ఓ, ప్రశస్త సహోదరుడా, నిన్ను చూచినందుకు మేమెంతో ఆనందంగా ఉన్నాము!” అని చెప్తున్నారు. నేను అనుకున్నాను…ప్రతి ఒక్కరు ఒక విధంగా దుస్తులు ధరించియున్నారు. అయితే వారి వెంట్రుకలు వ్యత్యాసంగా ఉన్నవి. తెలుసా. ఎర్రని వెంట్రుకలు, నల్లని వెంట్రుకలు, సొగసైన వెంట్రుకలు కలిగియున్నారు. మరియు వారు వచ్చుచున్నారు, అయితే వారంతా యౌవనస్తులు.

385 మరియు ఆమె నా యొద్దకు వచ్చి, నేననుకున్నాను, “ఏమి చెప్పబోవుచున్నదో చూద్దాం అనుకున్నాను.”

386 ఆమె నావైపు చూచింది, ఆమె అన్నది, “ఓ, మా ప్రశస్త సహోదరుడా!” అని. ఆమె నన్ను హత్తుకున్నది. ఆమె వెళ్ళిపోయినది. కొందరు స్త్రీలు వచ్చారు, తరువాత నన్ను హత్తుకున్నారు.

387 నేనొక శబ్దాన్ని విన్నాను. ఈ వైపు చూశాను. ఇక్కడ ఒక యువకుల గుంపు పురుషులు, అందరు ఇరవై సంవత్సరాల వయస్సు గలవారు వచ్చుచున్నారు. వారు నల్లని వెంట్రుకలు, అందమైన వెంట్రుకలు కలిగియున్నారు. వారంతా తెల్లని వస్త్రాలు ధరించియున్నారు, కాళ్ళకు చెప్పులు లేవు. వారంతా నా దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి, నన్ను కౌగలించుకుంటూ “ప్రశస్త సహోదరుడా” యని అరుస్తున్నారు!

388 నేను తలంచాను. నేను వెనుకకు తిరిగాను. నేనక్కడ ఇంకా పండుకునే యున్నాను. నేననుకున్నాను, “భలే, ఇది వింతగా ఉన్నదే.”

389 అటుతరువాత వెంటనే ఒక స్వరము నాతో మాట్లాడసాగెను. స్వరాన్ని నేను చూడలేదు. అది చెప్పినది, “నీవు సమకూర్చబడితివి, నీవు—నీవు నీ ప్రజల యొద్దకు సమకూర్చబడితివి.” తరువాత ఒక మనిషి నన్ను పైకెత్తి ఈ విధంగా ఒక పెద్ద దానిమీద నన్ను కూర్చుండబెట్టాడు.

నేనడిగాను, “ఎందుకలాగు చేశావు?” అని.

చెప్పాడు, “భూమి మీద నీవొక నాయకుడివి.”

మరియు నేనడిగాను, “సరే, నేను—నేనిది అర్థం చేసుకొనుట లేదు.”

390 ఆ స్వరము నాతో మాట్లాడుచున్నది. స్వరాన్ని నేను చూడలేకున్నాను. అది నాకు పైగా ఉన్నది నాతో మాటలాడుచు.

391 నేను అడిగాను, “సరే, నేను దాటివస్తే, నేను యేసుని చూడాలని ఉంది.” నేను అన్నాను, “నేను…ఆయన…ఆయన నా జీవము. నేను ఆయనను చూడగోరుచున్నాను.”

కనుక ఆయన చెప్పాడు, “ఇపుడు నీవు ఆయనను చూడలేవు. ఆయన ఇంకా ఎత్తులో ఉన్నాడు.”

392 చూడండి. అది బలిపీఠము క్రిందనున్నది. ఇంకా ఎక్కడికైతే మనుషులు వెళ్తారో ఆరవ స్థానము. చూశారా, ఏడవది కాదు, దేవుడు ఉండునది, ఏడవ పరిమాణము. ఆరవది!

393 వారందరు—వారందరు అక్కడున్నారు. వారు అటువైపు వెళ్ళుచున్నారు నేనన్నాను…అక్కడ మిలియన్ల మంది యున్నట్లు కనిపించినది. వారినెన్నడు నేను చూడలేదు. నేనక్కడ కూర్చున్నపుడు ఈ స్త్రీలు పురుషులు ఇంకా పరుగులు తీస్తూ నన్ను కౌగలించుకుంటూ “సహోదరుడా” అని నన్ను పిలుస్తున్నారు. నేనక్కడ కూర్చున్నాను.

394 అటుతరువాత ఆ స్వరము చెప్పినది, “యాకోబు తన జనుల యొద్దకు సమకూర్చబడినట్లు నీవు నీ జనుల యొద్ద సమకూర్చబడ్డావు.”

నేను అడిగాను, “వీరంతా నా జనులా? వీరంతా బ్రెన్హాం లా?”

ఆయన చెప్పాడు, “కాదు. వారు నీ ద్వారా మార్పు చెంది క్రీస్తు యొద్దకు వచ్చినవారు.”

395 నేను చుట్టూ చూశాను. అక్కడ ఒక నిజమైన అందమైన స్త్రీ పరుగెత్తినది. ఆమె ఆ విధంగానే కనిపించినది. ఆమె నా చుట్టు చేయి చుట్టి, ఆమె అన్నది, “నా ప్రశస్త సహోదరుడా!” ఆమె నా వైపు చూచినది.

396 నేను అనుకున్నాను. “మై! ఆమె దేవదూతవలె కనిపించినది.” ఆమె దాటిపోయింది.

ఆ స్వరము చెప్పినది, “ఆమెను నీవు గుర్తించావా?” అని.

నేను చెప్పాను, “లేదు, నేను గుర్తించలేదు.”

397 అన్నాడు, “ఆమె తొంభై సంవత్సరములు దాటిపోయిన తరువాత నీవు ఆమెను క్రీస్తు నొద్దకు నడిపించావు” అని చెప్పాడు. “నిన్ను తిరిగి ఆమె అంతగా ఎందుకు తలస్తున్నారో తెలియునా?” అని అడిగాడు.

నేనడిగాను, “ఆ అందమగు బాలిక తొంభై నిండిన స్త్రీయా?”

398 “ఆఁ.” అన్నాడు, “ఆమె ఇక ఎన్నడు మారదు.” అన్నాడు, “ఆ కారణం చేత ఆమె ‘ప్రశస్త సహోదరుడా’ అని చెప్తుంది.”

399 నేననుకున్నాను, “ఓ, మై! దీనిని గూర్చి భయపడుచున్నానా? ఎందుకని, వీరు నిజంగా వాస్తవము.” వారు—వారు ఎక్కడకు వెళ్ళుట లేదు. అక్కడ యుండుట ద్వారా వారు అలసిపోలేదు.

మరియు నేను అడిగాను, “సరే, నేనెందుకు యేసును చూడకూడదు?”

400 అన్నాడు, “సరే, ఆయన—ఆయన ఒక దినమున వస్తాడు. మొదట నీ యొద్దకు వస్తాడు, అపుడు నీవు తీర్పుతీర్చబడతావు.” అన్నాడు, “నీవు నడిపించిన మార్పు చెందినవారు వీరు.”

401 మరియు నేనడిగాను, “నేను నాయకుడిగా ఉన్నందున…ఆయన నాకు తీర్పుతీర్చునా?”

“ఔను,” అని అన్నాడు.

402 మరియు నేనడిగాను, “ప్రతి నాయకుడు ఆ విధంగా తీర్పు తీర్చబడవలెనా?”

“ఔను,” అని అన్నాడు.

నేనడిగాను, “పౌలు సంగతి ఏంటి?” అని.

ఆయన చెప్పాడు, “అతని యొక్క వాటితో అతడు తీర్పుతీర్చబడును.”

403 “సరే,” నేనడిగాను, “అతని యొక్క గుంపు లోపలకు వెళ్తే నా యొక్క జనులు కూడా, ’ఎందుకనగా నేనూ అదే వాక్యమును ఖచ్చితంగా ప్రకటించాను.” అది అది. నేను చెప్పాను, “ఎక్కడ అతడు యేసు’ నామములో బాప్తిస్మమిచ్చెనో, నేను చేశాను. నేను బోధించాను…”

404 మిలియన్ల మంది ఒక్కసారిగా అరిచారు, “దానిపై మేము విశ్రాంతి పొందుచున్నాము” అని!

405 మరియు నేను అనుకున్నాను, “మై! ఇది నేను ఇక్కడకు రాకమునుపు ముందు తెలిసినట్లయితే, ప్రజలను ఇక్కడకు వచ్చునట్లు చేసేవాడను. వారు దీనిని పోగొట్టుకోకూడదు. ఎందుకనగా, ఇక్కడ చూడండి!” మరి అటుతరువాత…

406 మరియు ఆయన చెప్పాడు, “ఇపుడు, ఒక దినాన ఆయన వచ్చును. తరువాత…ఇక్కడ మనము తినము త్రాగము లేక నిద్రించము. మనమంతా ఒక్కటే.”

407 భలే, అది పరిపూర్ణము కాదు; పరిపూర్ణమునకు దాటినది. అది మహోన్నతమైనది కాదు; అది మహోన్నతమైన దానిని దాటినది. ఏ పేరు లేదు…నీవు తలంచలేవు…దానిని గూర్చి చెప్పుటకు భాషా నిఘంటువులో మాటలు లేవు. నీవు ఇపుడే వచ్చియున్నావు. అంతే.

408 నేననుకున్నాను, “సరే, ఇది పరిపూర్ణముగానున్నది. తరువాత మనమేమి చేయబోవుచున్నాము?”

409 చెప్పాడు, “అటుతరువాత, యేసు వచ్చినపుడు, మనము…ఆయన నిన్ను న్యాయ తీర్పు తీర్చును, లేక నీ పరిచర్యను తీర్పు తీర్చును. అటుతరువాత మనము వెనుకకు భూమి మీదికి వెళ్ళి మన శరీరములు తీసుకుంటాము.” సరే, నేను—నేనపుడు దానిని గూర్చి ఆలోచన చేయలేదు. అది ఖచ్చితంగా లేఖనము. చెప్పబడెను, “తరువాత మనము భూమి మీదికి తిరిగి వెళ్ళి, మన శరీరములను తీసుకుంటాము, అప్పుడు మనము తింటాము. మనము ఇక్కడ భుజించము, మనము నిద్రపోము.” చెప్పెను, “మనము అక్కడ తింటాము. అయితే మనము భూమికి తిరిగి వెళ్తాము.”

410 నేను అనుకున్నాను, “మై, ఇది అద్భుతము కాదా! ఓ, మై! నేను దానిని గూర్చి భయపడ్డాను. ఇక్కడకు రావటానికి చనిపోవుటకు నేనెందుకు భయపడాలి? మంచిది, ఇది పరిపూర్ణము, ఎంతో పరిపూర్ణము, ఎంతో పరిపూర్ణము. ఓ, ఇది అద్భుతము!”

411 చూడండి, మనము బలిపీఠము క్రింద ఉన్నాము. చూశారా? అది అదే. చూడండి. రాకడకు ఎదురుచూస్తు బలిపీఠము క్రింద ఉన్నాము. చూశారా, ఆయన వెళ్ళి ధూళిలో నిద్రించుచున్న శరీరములను లేపును. మనలను మరలా లేపును.

412 యేసు పరదైసులో నుండి వచ్చునపుడు అబ్రాహామును, ఇస్సాకును వారందరిని పైకి తీసుకొని వచ్చాడు. వారు మొదటి పునరుత్థానము కొరకు వేచియుండిరని మీరెరుగుదురు. వారు నగరములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి.

413 అది సంపూర్తిగా లేఖనమునకు సంబంధించినది. అది దర్శనము లేక మరేదైనను సంపూర్తిగా లేఖనమునకు సంబంధించినది.

414 మరియు నేనన్నాను, “సరే, ఇది అద్భుతము కాదా!” తరువాత నేననుకున్నాను “అది అద్భుతముగా…?”

415 ఏదో గుఱ్ఱం వలె సకిలించుట నేను విన్నాను. మరియు నేను చూశాను. నేను స్వారీ చేయు నా యొక్క జీను గుఱ్ఱము, చిన్న ప్రిన్స్, దాన్ని గూర్చి నేను ఎక్కువగా ఆలోచించేవాడను. ఇదిగో అది నా ప్రక్కన నిలబడియున్నది. తన తల నా భుజముపైన పెట్టి నన్ను ఆనుకొనియున్నది. నేను దానికి పంచదారను పెట్టునపుడు, మీకు తెలుసా, అది…నేను దాని చుట్టు చేయి పెట్టేవాడను. నేను చెప్పాను, “ప్రిన్స్, నీవిక్కడ యుంటావని నాకు తెలుసు.”

ఏదో నా చేతిని నాకినట్లుగా భావించాను. అక్కడ నాయొక్క కూన్ కుక్క ఉన్నది.

416 అపుడు—ఇక్కడున్న మిస్టర్ షార్ట్ దానికి విషం పెట్టాడు. అందుకై నేను మిస్టర్ షార్ట్ ను చంపుతానని ప్రమాణము చేశాను. నేను సుమారు పదహారు సంవత్సరాల వయస్కుడను. అతడు కుక్కకు విషం పెట్టి చంపాడు. నేనతనిని కాల్చి చంపుటకై రైఫిల్ తో వెళ్తుండగా, మా నాన్న నన్ను పోలీస్ స్టేషన్ లోనే పట్టుకున్నాడు. “నేనతనిని చంపుతాను” అని అన్నాను. నేనన్నాను, “సరే…” నేను కుక్కల సమాధి తోటకు వెళ్ళాను. మరియు నేనతనితో చెప్పాను, నేనన్నాను, “ఫ్రిడ్జ్, నీవు నాకు సహచరుని వలె యుంటివి. నీవు నాకు బట్టలు వేసి పాఠశాలకు పంపావు. నీవు పెద్దదానివైనపుడు నిన్ను జాగ్రత్త తీసుకున్నాను. ఇపుడు వారు నిన్ను చంపారు.” నేనన్నాను, “ఫ్రిడ్జ్, నీకు వాగ్దానం చేస్తున్నాను. అతడు బ్రతుకడు.” నేను చెప్పాను, “నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, అతడు బ్రతుకడు. ఎపుడైనా వీధిలో నడచి వెళ్తున్నపుడు, అతనికెదురుగా వెళ్ళి, చూశారా.” మరియు నేనన్నాను “నీ కొరకు అతన్ని పట్టేస్తాను.”

417 అయితే జరిగినదేంటో తెలుసా? నేనతనిని క్రీస్తునొద్దకు నడిపించి అతనికి యేసు’ నామములో బాప్తిస్మమిచ్చాను. అతని మరణములో అతన్ని పాతిపెట్టాను. ఔనండి. ఆ తరువాత సుమారు రెండు సంవత్సరములకు అతన్ని మార్పు చెందించాను. తరువాత విషయాలు మార్పు చూశాను. నేను అతన్ని ద్వేషించుటకు బదులు అతన్ని ప్రేమించాను.

418 కాబట్టి తరువాత, అయినప్పటికి, అయితే ఫ్రిడ్జ్ అక్కడ నిలబడియుంది, చేయి నాకుతూ. నేను చూశాను.

419 నేను ఏడ్వలేకపోయాను. ఎవ్వరు ఏడ్వలేదు. అదంతా ఆనందమే. నీవు విచారంగా ఉండవు, ఎందుకనగా అదంతా ఆనందమే. నీవు చనిపోవు, ఎందుకనగా అదంతా జీవమే. చూశారా? చూశారా? ముసలివారు కారు, ఎందుకనగా అదంతా యౌవ్వనమే. అదే…అది పరిపూర్ణము. నేననుకున్నాను, “ఓ, ఇది ఆశ్చర్యము కాదా!” లక్షల కొలది…ఓ, మై! నేను ఖచ్చితంగా ఇంటిలో నున్నాను. చూశారా.

420 మరియు—మరియు వెంటనే నేనొక స్వరాన్ని విన్నాను. అది పెద్దగా కేకవేసి చెప్పినది, “నీవు ప్రేమించిన వారందరూ…” నీ పరిచర్యకు బహుమానము. నాకెలాటి బహుమానము అవసరము లేదు. ఆయన చెప్పాడు, “నీవు ప్రేమించినవారందరిని, మరియు నిన్ను ప్రేమించిన వారందరిని దేవుడు నీకనుగ్రహించాడు.”

నేను చెప్పాను, “ప్రభువుకు స్తోత్రం” అని!

421 నేను వింతగా అనుభూతి పొందితిని. నేననుకున్నాను, “విషయమేంటి? నేను వింతగా భావించాను.” నేను వెనుతిరిగి చూశాను. పడకపైన, నా శరీరము కదులుతున్నది. నేనన్నాను, “ఓ, నేను వెనుకకు వెళ్ళనవసరము లేదు. నిశ్చయంగా. నన్ను వెళ్ళనీయవద్దు.”

422 అయితే, సువార్త ప్రకటించబడవలసియున్నది. ఒక్క క్షణంలో ఆ విధంగా తిరిగి పడకమీద యున్నాను. చూశారా.

423 సుమారు రెండు నెలలు కూడా కాలేదు, అంతకు ముందు, మీరు వినియుంటారు, చదివియుంటారు—బిజినెస్ మెన్స్ వాయిస్ లో. అది ప్రపంచమంతా వెళ్ళింది. ఇక్కడున్న సహోదరుడు నార్మన్, ఈ రాత్రి ఇక్కడొక చోట ఉంటాడని నేననుకుంటాను. అతడు దాన్ని తర్జుమా చేసి పత్రికల్లో పంపాడు. అది అన్ని స్థలాలకు వెళ్ళినది. సేవకులు (దాన్ని గూర్చి) వ్రాశారు, అనేకులు చెప్పారు…

424 ఇక్కడ ఒకటి, వాటిలో ఈ ఒక్కదానిని చెప్తాను. బహుశా వారిలో వందలమంది ఉన్నారు. ఈ యొక్కటి ఇలా చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, బిజినెస్ మెన్స్ వాయిస్ లో మీ యొక్క దర్శనము…”

425 బిజినెస్ మెన్ వారితో అతడు యుండనప్పటికి నేను టోమి నికెల్స్ ను అభినందిస్తున్నాను. ఎందుకో నాకు తెలియదు. చక్కగా దానిని అక్కడ పెట్టాడు, నేను చెప్పినది, అక్కడ నేరుగా ఆ యొక్క త్రిత్వము వారి పత్రికలో, అతడన్నాడు, “అక్కడ…పౌలు యేసు’ నామములో బాప్తిస్మమిచ్చి, అదే చేయమని ప్రజలకు ఆజ్ఞాపించాడు, నేను అదే చేశాను.” చూశారా, అది ఉన్నట్లుగానే అది దానిని ఉంచియున్నాడు. చూశారా? కనుక నేను—నేను—నేనపుడు అనుకున్నాను. “మై!”

426 ఈ సేవకుడు వ్రాసి చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, నీ దర్శనము…”

427 అది దర్శనముగా యుండవచ్చును. అన్నాడు…ఇపుడు, “కొనిపోబడుట” అని చెప్పదలచుకోలేదు. పౌలు అయితే…నేను మొదటి ఆకాశమునకు కొనిపోబడి దానిని చూచిన యెడల మూడవ ఆకాశమునకు కొనిపోబడిన పౌలు సంగతి ఏంటి? అదేంటి? అతడు చెప్పాడు అందును గూర్చి చివరకు మాట్లాడలేనన్నాడు, చూశారా, అతడు కొనిపోబడినట్లయితే, అది కొనిపోబడుట యైతే, నాకు తెలియదు. నేను చెప్పలేను నేను మీకు చెప్పలేను.

428 అయితే ఈ సేవకుడైతే అన్నాడు, “సహోదరుడా బ్రెన్హాం, నీ దర్శనము చాలా లేఖనములకు అనుకూలంగా ధ్వనిస్తుంది మరియు అక్కడున్న గుఱ్ఱమును గూర్చి నీవు మాట్లాడిన విధము కూడా సరియే.” అన్నాడు, “ఒక గుఱ్ఱం పరలోకములోనా?” అని అన్నాడు…ఇపుడు చూడండి, ఆ మతసంబంధమైన జ్ఞానము గల మనిషి మనస్సు? చూడండి? అతడన్నాడు, “పరలోకము మానవుల కొరకు నిర్మింపబడినది, గుఱ్ఱాల కొరకు కాదు.”

429 మంచిది, నేను కూర్చున్నాను. బిల్లీ, ఇక్కడ నా యొక్క కుమారుడు, మూడు నాలుగు నెలల క్రితము ఉత్తరాన్ని పాత చర్చి ఆఫీసులో పెట్టాడు.

430 నేను చెప్పాను, “నా ప్రశస్త సహోదరుడా, నీ యొక్క జ్ఞానమునకు మరియు లేఖనము నీవు ఎరిగినంత వరకు నేను ఆశ్చర్యపడ్డాను. నేను పరలోకములో ఉన్నానని చెప్పలేదు. పరదైసులాంటి ఒక స్థలమని నేను చెప్పాను. ఎందుకంటే క్రీస్తు ఇంకా పైన ఉన్నాడు. చూస్తున్నారా. అయితే,” నేను చెప్పాను, “అది నిన్ను సంతృప్తి కలిగిస్తే ప్రకటన 19 ని నీవు త్రిప్పు. పరలోకము యొక్క (ఆకాశ మహాకాశముల నుండి) పరలోకము నుండి యేసు బయటకు వచ్చునపుడు, ఆయన తెల్లని గుఱ్ఱం మీద స్వారీ చేయును, పరిశుద్ధులందరు గుఱ్ఱముల మీద ఆయనతో ఉంటారు.” నిజం. ఖచ్చితం. ఔను. తప్పక.

431 మరియు, పైన అదే స్థలములో, పక్షిరాజును పోలిన ఒకటియుండెను, ఎద్దు వలె కనిపిస్తూ ఒకటియుండెను. మరియు…సరే, మై వచ్చి ఏలీయాను తీసుకొని వెళ్ళిన గుఱ్ఱములు ఎక్కడ నుండి వచ్చినవి. చూశారా. మానవ మనస్సు పట్టుకొనుటకు ఒకదానిని కోరుతుంది. ఔనది నిజం.

432 ఇపుడు గమనించు. దైవభక్తి గల ఈ ప్రశస్త సహోదరుని గూర్చి నేనిప్పుడే ఆలోచన చేస్తున్నాను. యోహానును గూర్చి…ముగించక ముందు దానిని ప్రవేశపెట్టడం ఒక మంచి స్థలమని నేను తలంచాను, చూశారా. యోహాను అక్కడ చూచినట్లయితే, మరియు అతని సహోదరులను చూచినట్లయితే చూడండి, అతని సహోదరులు కొంచెము శ్రమపడుట చూశాడు. తరువాత ప్రభువైన దేవుడు నా యొక్క సహోదరులను, మరియు ప్రభువు యొక్క రాకడకు ఎదురుచూచుచున్న పరిశుద్ధులను చూచుటకు నాకు అనుమతిచ్చెను. గమనించండి, అర్పణ బలిపీఠము క్రింద వారు లేరు; నావారు లేరు. అయితే వీరు, వారు హతసాక్షులు. చూడండి? హతసాక్షుల బలిపీఠము క్రింద నావారు లేరు.

433 ఇపుడు, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. మరియు నేను ముగిస్తున్నాను, ఇక పది నిముషాలలో, పది గంటలకు, నేను దానిని కొద్దిగా వదిలివేస్తే, రేపు దానిని ముగిద్దాం.

434 చూడండి. వారు, వారు నావారు…ప్రభువు నాకు చూపించిన వారు, పెండ్లికుమార్తె, ఆమె హతసాక్షులుగా మరణించినవారి లెక్కలో లేదు. లేదు. హతసాక్షుల యొక్క బలిపీఠము క్రిందలేదు; అయితే వారు తెల్లని వస్త్రములు పొందుకున్నారు. జీవముగల వాక్యము యొక్క కృపా క్షమాపణ అంగీకరించుట వలన. క్రీస్తు వారికి తెల్లని వస్త్రము ఇచ్చాడు. నేను తలంచుట లేదు…

435 లేక, నేను తలస్తున్నాను, ఈ అయిదవ ముద్ర విప్పబడుట వలన నేను నమ్మినట్లు అది మనకొరకు తెరువబడింది. దానిని నేను మంచి మనస్సాక్షితో దేవుని యెదుట నిర్మళమైన ప్రత్యక్షతతో చేశాను. అది చేయుటకని ప్రయత్నించుట కాదు. ఎందుకనగా నేనెల్లపుడు సంస్థాపకమునకు వ్యతిరేకిని. నేను వాటికి చెందినవాడను కాను. అయితే అది నాకు తెరవబడినది ఇపుడు.

436 మరొక విషయము నేను ఆలోచించాను. ఈ దినాన ఈ అయిదవ ముద్ర విప్పబడుట ద్వారా ఇక్కడేనున్న మరియొక సిద్ధాంతము క్రమపరచబడుతుంది. నేను మాట్లాడియుండవచ్చు. ఆత్మ నిద్రించుట. ఇపుడు నేననుకుంటాను. అది, ఆత్మ నిద్రించుట నమ్మినవారు ఇక్కడున్నారు. ఆత్మ నిద్రించుట యనునది తప్పని, ఇది దానిని నిరూపిస్తుంది. వారు నిద్రించుట లేదు. వారు సజీవులుగా యున్నారు. వారి శరీరములు నిద్రించుచున్నవి. అయితే, ఆత్మ, సమాధిలో లేదు. వారు దేవుని సన్నిధిలో బలిపీఠము క్రింద యున్నారు.

437 ఇక్కడే నేను ఒక ప్రశస్త సహోదరునితో, ఉపదేశకునితో విభేదిస్తుంది. కొందరు అతని యొక్క ప్రజలు ఇక్కడ కూర్చుండుట నాకు తెలుసు, నేను గమనించాను. అతడు గొప్ప బోధకుడని నేను గుర్తెరిగియున్నాను. అతడొక డాక్టర్, మరియు డాక్టర్ ఆఫ్ డివినిటి మరియు పి.హెచ్. యల్. యల్.డి మరియు అతడు నిజంగా ఒక మంచి వ్యక్తి కూడా. ఈ సమయానికి అతడు వెళ్ళిపోయాడనుకుంటాను. అయితే అతడు మంచి మనిషి, మంచి రచయిత. అతడు సహోదరుడు ఉరియా స్మిత్, దానియేలు మరియు ప్రత్యక్షతల యొక్క గ్రంథకర్త. అతని బోధలను అనుసరించు వారైన మీరు, చూడండి, నేను…నేను ఇది గర్వంగా చెప్పాలనుకొనుట లేదు, అయితే నేను…చూడండి?

438 అయితే సహోదరుడు స్మిత్ ఆత్మలు నిద్రించుటను బలపరచుచున్నాడు. “ఆత్మ నిద్ర ను గూర్చి అతడక్కడ తెలియజేశాడు. పరలోకములో అర్పణ బలిపీఠము లేదు. పలుకబడిన ఒకేయొక బలిపీఠము,” అతడు నమ్ముచున్నట్లు పరలోకములో నున్నది, “ధూపము వేయు బలిపీఠము.” అయితే మీకైతే ప్రియమైన వారలారా…నా సహోదరునితో విభేదించుట కాదు…నేను ఆవలివైపున కలుసుకుంటానని నిరీక్షిస్తున్నాను. చూశారా. ఆ గొప్ప బోధకునితో విభేదించుట కాదు.

439 అయితే, అది దానిని ఏలాగు నిరాకరిస్తుంది మీకు కొంచెము చూపిస్తున్నాను. ఔను. అది తప్పని నిరూపించినది. ఈ చివరి దినములో ఈ ముద్ర విప్పబడుట ద్వారా ఆత్మ నిద్రించుచున్నదనునది తప్పని నిరూపించుచున్నది. చూశారా? వారు జీవించుచున్నారు. వారు చనిపోలేదు. ఔనా? గమనించు.

440 ఇది ఇపుడు గమనించండి. పరలోకములో బలి అర్పించు బలపీఠము లేనియెడల పాపమునకు ప్రాయశ్చిత్తముగా చెల్లింపబడిన గొఱ్ఱెపిల్ల ఎక్కడయున్నది? రక్తము కార్చుచున్న వధింపబడిన ఆ గొఱ్ఱెపిల్ల ఉండుటకు ఒక స్థలము తప్పక అక్కడ యుండవలెను…అది.

441 ఇపుడు ధూపము సువాసన, వారు చేయుచున్న దహన బలియొక్క సువాసన. “అది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలని” బైబిల్ చెప్తుంది. బలిపీఠము పైన అర్పణ యుండనట్లయితే, ప్రార్థనలు అంగీకరించబడవు. అర్పణలు అర్పించు బలిపీఠము పైన రక్తముండుట వలన ప్రార్థనలు దేవుని యొద్దకు పోవుచున్నవి.

442 సహోదరుడు స్మిత్ తప్పు. ఔను. అతనితో అంగీకరించుట లేదు. అతని యొక్క గొప్ప పనికొరకు గౌరవాలు చెల్లిస్తూ సహోదర ప్రేమతో నాకు నేను విశదపరచుకుంటున్నాను. అతడు తప్పు.

443 దానిని అయిదవ ముద్ర తెరచెను, చూశారా, చూశారా, మీరు దానిని పట్టుకుంటే చాలా విషయాలున్నవి. చూశారా? నా ప్రశ్నల కొరకు ఎదురుచూస్తున్నాను. చూడండి నేను…మంచిది.

444 ఇపుడు మందసము ఎక్కడున్నది; ఈ సువాసన గల ప్రార్థనలు స్వీకరించుటకు వధింపబడిన, గాయపడిన, రక్తము కారుచున్న ప్రాయశ్చిత్తమైన రక్తముతో నున్న గొఱ్ఱెపిల్ల ఎక్కడయున్నది?

445 గమనించండి. బైబిల్ చెప్తుంది, “మన నివాస స్థలమైన భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, మనకొరకు యొకటి వేచియున్నది.” ఆ పరిశుద్ధులను అక్కడే నేను చూచినది. ఔనా?

446 గమనించు, ఒక బిడ్డ యౌవ్వన స్త్రీల యెదుట విశదపరచు ఈ బహిరంగ సంభాషణకై సహోదరీలు మరలా నన్ను క్షమించండి. అయితే చూడు, ఒక తల్లి గర్భము దాల్చినపుడు ఆ చిన్న కండరాలు కొట్టుకుంటవి, మీకు అర్థమైందా, అది ప్రకృతి సంబంధమైన శరీరము. ప్రకృతి ఈ సహజ శరీరమును రూపొందించినట్లు…

447 చిన్న బిడ్డలు జన్మించక మునుపు నీ భార్యను ఎపుడైనా గమనించావా? ఆమె ఎల్లపుడు ఎంతో సాధువుగా, మాధుర్యముగా నుండును. ఆమె జీవితమంతటిలో ఆమె లేనట్లయితే, అప్పుడామె ఉంటుంది. తల్లి భక్తిగాను, దయగల భావాలు కలిగియున్నట్లుగా యుంటుంది, గమనించావా?

448 నీవు గమనించు. అక్కడొక పాపి ఒక తల్లిని అనగా గర్భిని స్త్రీని హేళన చేసిన, అది భయంకరమే, అని నేననుకుంటాను. అది జీవము లోకములోకి వచ్చుచున్నది.

449 అయితే నీవు గమనించావా, ఆ తల్లి చుట్టూ ఒక మాధుర్యమైన అనుభూతిని కలిగియుండును. ఏంటది? అది జన్మించగనే ఆ చిన్న శరీరములోకి వచ్చుటకు వేచియుండు చిన్న ఆత్మీయ జీవము ఆత్మీయ శరీరము. అది కేవలం జన్మ. అయితే అది జన్మించినపుడు, అది జన్మ. ఆత్మీయ శరీరము ప్రకృతి శరీరముతో కలసియుంటుంది.

450 మరియు, అటుతరువాత మనము దేవునికి జన్మించిన వారమని బైబిల్ బోధిస్తుంది. మనము పరిశుద్ధాత్మకు జన్మించిన వారము, మనలో క్రీస్తు ఉన్నాడు, ఒక దేవుని కుమారుడు మనలో రూపొందుకుంటున్నాడు. ఈ భూ సంబంధమైన శరీరము శిథిలమైపోయినపుడు, ఈ ఆత్మ సంబంధమైన శరీరము భూ భాగముల నుండి వచ్చును. “ఈ యొక్క భూ సంబంధమైన గుడారము కూలిపోతే మరియొక శరీరము దాన్ని స్వీకరించును.” ఈ మర్త్య శరీరము అమర్త్యమును ధరించుకొనును. ఈ భూ సంబంధమైనది పరలోక సంబంధమైన దానిని ధరించును. ఇది, నా అర్థమేదో గ్రహించారా? ప్రకృతి సంబంధమైన శరీరముంది, అది పాపయుక్తమైనది; అయితే, అందులోనే మరియొక శరీరము నిర్మించబడుతుంది. మనము అందులోకి వెళ్తాము.

451 నేను మీ యొక్క సంఘ కాపరిగా మరియు సహోదరునిగా దీనిని చెప్పగలను. అందుకై నేనెంతో దేవునికి కృతజ్ఞుడను. నేను ఆ ప్రజలను చూచాను, ఆ శరీరముతో, నా చేతులతో తాకాను. ఔనది వాస్తవము. గమనించు.

452 గమనించు. మోషేను, ఏలీయాను చూడండి. మోషే చనిపోయిన తరువాత, ఏలీయా పరలోకమునకు కొనిపోబడెను, ఇక్కడ రూపాంతర కొండపైన సిలువకు ముందు తన జ్ఞానేంద్రియములతో పలికి, విని, అర్థం చేసుకొని యేసుతో మాట్లాడెను. ఇపుడు, ఏలాటి శరీరాన్ని అతడు కలిగియుండెను?

453 సమూయేలును చూడు, చనిపోయి రెండు సంవత్సరాలైన తరువాత. ఏన్దోరు మాంత్రికురాలు ద్వారా ఆ రాత్రి మరలా అతను గుహలోనికి పిలువబడ్డాడు మరియు సౌలుతో మామూలు భాషతో మాట్లాడాడు; సౌలు విన్నాడు, తిరిగి మాట్లాడాడు. జరుగబోవు విషయాలు ఎరిగియున్నాడు. ఇంకా అతని ఆత్మ మారలేదు. అతడు ప్రవక్తయై యుండెను.

454 ఏలీయా ఆత్మ మనుష్యుని మీదికి వచ్చినపుడు అది అతనిని ఏలీయా వలె నడిపించును. అతడు అరణ్యమునకు వెళ్ళును. అతడు అరణ్యమును ప్రేమించును. నీతి లేని స్త్రీలను ద్వేషించును. అతడు సంస్థాపక సంఘములకు విరోధి. అతడు ఎవరితోను రాజీపడడు. అది…అది అతని యొక్క ఆత్మగా ఉండును. అది ఉండు, ప్రతిసారి వచ్చినపుడు, చూశారా.

మోషే ఆలాటి వ్యక్తిగానే యుంటాడు.

ఇపుడు మనము ప్రకటన 22:8 లో అట్టిదానినే కనుగొంటున్నాము.

455 ఇపుడు, అది నిర్ణయించుటకు, ఎవరైతే…ఆ ఆత్మలు (ఇపుడు దీనిని గమనించు) బలిపీఠము క్రిందనున్న ఆ ఆత్మలు, క్రీస్తు యొక్క మరణమునకు మరియు సంఘము ఎత్తబడుటకు మధ్యనున్న కాలములో; ఐక్ మాన్ వంటి వారిచే చంపబడి గ్రంథములో వారి యొక్క పేర్లు గల నిజమైన యూదులే బలిపీఠము క్రింద కనబడు ఆత్మలని ఈ ముద్ర విప్పబడుట ద్వారా మనమెరిగితిమి. మీరు గమనిస్తే, నా సహోదరుడా, లేఖన ప్రకారము, వారు మాట్లాడగలరు, అరవగలరు, మాట్లాడగలరు, వినగలరు మరియు ఐదు అన్ని ఇంద్రియాలు కలిగియున్నారు. స్పర్శ లేనివారై సమాధిలో లేరు. వారు పూర్తిగా మేల్కొని యున్నారు. వారు సంభాషించగలరు, మాట్లాడగలరు, వినగలరు ఏదైనా. ఔనా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] …ఓ, మాకు సహాయము చేయుము.

456 రెండు నిముషాలు. ఆమేన్. నేను అర్థగంట సేపు ఉంచినందుకు క్షమించండి. లేదండి. నేను కాదు, అది నేను చెప్పకూడదు. చూశారా, ఔనా, ఔనది నిజం. చూశారా.

457 అయితే, గమనించండి, ఇక్కడ నామకార్థమైనంత వరకు. మరియు ఈ ఉదయం తెల్లవారక ముందే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకివ్వబడిన ప్రత్యక్షత ప్రకారము అయిదవ ముద్ర విప్పబడెను మిగతా నాలుగుతో జతయగునట్లు. ఆయన కృపను బట్టి ఆయన నాకది ఇచ్చాడు, ఆయన కృప మీకు, నాకు ఉన్నది. అందుకొరకై ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మరియు ఆయన సహాయాన్ని బట్టి, నేను జీవించినంత వరకు నేను జీవించగోరుచున్నాను. అన్ని అయిపోయిన తరువాత మహిమలో మీతో ఆయనను కలుసుకొను వరకు అదే చేయమని ఇతరులకు బోధిస్తాను. ఇందుకొరకై నేనాయనను ప్రేమిస్తాను, మరియు అందుకొరకు నాకు తెలిసింది అదే.

458 మరియు నా నిండు హృదయముతో నేను నిజంగా నమ్ముతున్నాను. ఒకటవ, రెండవ, మూడవ, నాలుగవ, అయిదవ ముద్ర యొక్క బయల్పాటు నిజ ప్రత్యక్షతలు, ఇపుడు మనకు తెరవబడినవి.

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను

[సహోదరుడు బ్రెన్హాం నెమ్మదిగా ఒకరితో మాట్లాడుచున్నాడు—సంపా]

కల్వరి చెట్టుపైన.

[సహోదరుడు బ్రెన్హాం తనలోతాను మూల్గుచూ పాడుకొనుచున్నాడు నేను ఆయనను ప్రేమించుచున్నాను—సంపా.]

459 ఇపుడు, నెమ్మదిగా, భయభక్తులతో దేవుని యెదుట! ఈ ముద్ర మనకు తెరవబడుటను మనము చూచుచుండగా దేవుడు ఆయన స్వంత ప్రియమైన బిడ్డలను తీసుకొని వారిని గ్రుడ్డివారినిగా చేసి వారిని పంపెను, ఎందుకనగా ఆయన స్వంత నీతి—నీతి పాపమునకు తీర్పు తీర్చవలెనని కోరెను. అది ఆలోచించు. ఆయన నీతి, మరియు ఆయన యొక్క పరిశుద్ధత నీతిని కోరెను. జరిమానా లేని చట్టము చట్టము కాదు. మరియు ఆయన స్వంత చట్టములు, తానే ఆయన తృణీకరించి ఇంకా దేవుడుగా ఉండడు.

460 ఆ కారణం చేత, దేవుడు మానవుడు కావలసివచ్చెను. ఆయన ఒక ప్రత్యామ్నాయమును తీసుకొనలేదు. ఒక కుమారుడు…ఆయనకొక మామూలు కుమారుడు లేక ఏదైన కాదు. దేవుడు రెండుగానుండెను, యేసు రెండు, కుమారుడు మరియు దేవుడు, అదొక్కటే ఆయన న్యాయము తీర్చు మార్గము. దేవుడు, తానే జరిమానాను భరించెను. ఒక వ్యక్తి మీదను, మరొకరి మీదను వేయుట న్యాయము కాదు. కాబట్టి యేసు అను వ్యక్తి, దేవుడు, శరీరమందు ప్రత్యక్షమై, ఇమ్మానుయేలుగా పిలువబడెను.

461 మరియు అది చేయుటకు, ఒక పెండ్లికుమార్తెను తీసుకొనుటకు, నశించు అన్యుల గుంపును రక్షించుటకు తన స్వంత బిడ్డలను గ్రుడ్డివారిగా చేయవలసి వచ్చెను. అటుతరువాత నిరాకరించినందుకు, అందుకు శరీరరీతిగా శిక్షించవలసి వచ్చెను. అయితే ఆయన కృప వారికి వస్త్రములు ధరింపజేసెను. అయితే, జీవము, ఏమి జరిగినదో చూడండి.

462 మరియు మనకు తరుణము దొరుకుట కొరకు, ఆయనది చేసిన యెడల ప్రేమతో ఇచ్చిన ఆ అవకాశాన్ని ఎట్లు తృణీకరించగలం? ఈ రాత్రి ఈ భవనంలో ఈ వ్యక్తి, యౌవ్వనుడు గాని, వృద్ధుడు గాని అట్టి తరుణమును ఈ సమయము వరకు నిరాకరించిన యెడల మీరు ఈ రాత్రి ఆ అవకాశమును సద్వినియోగపరచుకొనుటకు ఇష్టపడుచున్నారా. మీరు దేవుని కొరకు హతసాక్షులుగా యుండనవసరము లేదు, మీకు ఒకవేళ అటువంటి కోరిక యుండవచ్చును. అయితే తెల్లని వస్త్రము నీకు సిద్ధపరచబడియున్నది. దేవుడు నీ హృదయమును ఇపుడు తట్టిన యెడల ఎందుకు అది అంగీకరించకూడదు! [సహోదరుడు బ్రెన్హాం వేదికను మూడుసార్లు తట్టాడు—సంపా.]

ఇపుడు మరలా మనము తలలు వంచుకుందాం.

463 ఆలాటిది ఆశించే ఆ వ్యక్తి, లేక వ్యక్తులు ఇక్కడ యుండినట్లయితే, ఏ మర్త్యుడు శ్రమను బాధలను పడి మీ కొరకు రక్తము చిందించిన ఆ దేవునిపై నున్న మీ విశ్వాసమును బట్టి కోరినను, లేక దానిని అంగీకరించ దలచియున్నారా. ఆ విధముగా ఏ మర్త్యుడు శ్రమ పడలేదు. చివరకు ఆయన స్వంత దుఃఖము ఆయన స్వంత రక్తము నుండి ఆయన నీటిని వేరుచేసెను. ఆయన కల్వరికి వెళ్ళకముందు ఆయన శరీరము నుండి రక్తపు బిందువులు వచ్చుచుండెను. అటువంటి దుఃఖముతో పగిలిన హృదయముతో ఆయన చేయవలసి వచ్చెను. అయితే, నిరాకరించవచ్చును కూడా. అయితే నీ కొరకు నా కొరకు మనః పూర్వకంగా అది చేశాడు. అట్టి కొలవలేని ప్రేమను తృణీకరించగలవా?

464 ఈ ముద్రలు విప్పబడుట ద్వారా, మీరేమి చేసినది మరియు దేవుడు మీకేమి చేసినది ఇపుడు మీరు చూశారు. మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించ సంసిద్ధంగా ఉన్నావా, మరియు ఇపుడు మీరున్న అంత్యక్రీస్తు చేతులలో నుండి ఆయన మిమ్ములను లాగినట్లయితే? నీ చేయి ఆయన వైపు ఎత్తుట ద్వారా, “దేవా దీని ద్వారా నేను చెప్పుచున్నాను, అని చెప్తూ ఆయన మీకిచ్చు దానిని అంగీకరిస్తావా. నేను కృపా ఈవిని నేను అంగీకరించుచున్నాను.”

465 “మరియు, సహోదరుడా, బ్రెన్హాం, నేను నీ ప్రార్థనలు అపేక్షిస్తున్నాను, దానికి నేనెల్లపుడు విశ్వాసపాత్రుడుగా యుంటాను.”

466 నీ చేయి పైకెత్తు, నేను ప్రార్థిస్తాను. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. వద్దు—ఆ అర్థం నీవు గ్రహించు వరకు అది చేయవద్దు. మరియు నీవు ఎక్కడ కూర్చున్నావో, దానిని అక్కడే అంగీకరించు. కారణం, జ్ఞప్తించుకో, అది చేయమని ఒకటి నీకు చెప్పకుండ నీ చేయి ఎత్తియుండలేవు. అది చేసినది ఎవరో కాదు, దేవుడే.

467 కాబట్టి, ఇపుడు లేఖనములు ఏలాగు పరిపూర్ణముగా తెరువబడియున్నవో చూశారు! కాలములన్నిటిలో, గత కొద్ది సంవత్సరములుగా ఇరవై లేక ముప్పయి సంవత్సరాలలో ఏమి జరుగుచున్నదో మీరు చూశారు. బహు విశదంగా రుజువుయగుట మీరు చూశారు. ఏమి జరిగినదో మరియు ఏమి జరగనైయున్నదో ఖచ్చితంగా మీరు చూశారు. తరువాత క్రీస్తు కార్యము నందు విశ్వాసముంచు దానిని ఆధారము చేసుకొని, ఇపుడెక్కడ మీరు కూర్చున్నారో, అక్కడే మీ చేతులెత్తి చెప్పండి, “ఈ నిముషము మొదలుకొని అది నాకు స్థిరపడినది. క్రీస్తును నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. నా మిగతా జీవితమంతా నేను ఆయన కొరకు జీవిస్తాను. నన్ను పరిశుద్ధాత్మ నింపునట్లు దేవుని అపేక్షిస్తున్నాను.” యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మము తీసుకొనకపోతే నీళ్ళ కుంట నీకై వేచియున్నది.

మనము ప్రార్థించుకుందాము.

468 ప్రభువైన దేవా, ప్రజల మధ్య కొంత గొప్ప సంఖ్యగల హస్తాలు పైకెత్తబడినవి. అనేక సంవత్సరముల క్రితము మా కొరకు ప్రాయశ్చిత్తము చేసిన అదే ప్రభువైన యేసువు నీవని నేను నిశ్చయత కలిగియున్నాను. మరియు ముద్రలు బయలుపరచబడుట ద్వారా మరియు ఇక్కడ గత కొద్ది సంవత్సరముల నుండి గంభీరమైన కార్యములు జరుగుట ద్వారా ఆ కరుణా తలుపు మూయబడుటకు సిద్ధముగా నున్నదనియు మరియు నీ ప్రజలను విమోచించుటకు నీ యాత్రకు నీవు సంసిద్ధంగా యున్నావనియు నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. నోవహు దినములలో వలె తలుపు తెరచియున్నపుడే ఇంకా గదిలో చోటున్నపుడే ఈ ప్రశస్తమైన ఆత్మలు ఒకానొక రోజు శిథిలమైపోవు ఈ గుడారమను శరీరములో జీవించుచు, ఒకానొక రోజు శిథిలమైపోవు ఆత్మలు, వారి చేతులనెత్తిన మర్త్యులు, తెరచియున్న ఈ ముద్రింపబడిన పుస్తకము అది మా కొరకు తెరువబడెను. ఈ రాత్రి, ప్రభువా, వారికి యేసుక్రీస్తు యొక్క నీతియగు వస్త్రమును అనుగ్రహించుము, దానితో వారి ఆత్మను కప్పుము. తద్వారా వారు సమీపములో నున్న ఆ దినమున నీ యెదుట క్రీస్తు రక్తము ద్వారా పరిపూర్ణులుగా నిలబడనిమ్ము.

469 ప్రభువైన దేవా, యేసుక్రీస్తు నామములో వారు బాప్తిస్మము పొందనట్లయితే! అందును గూర్చి నీవు నాకిచ్చిన ప్రత్యక్షతను బట్టి. పరిశుద్ధాత్మ పొందుకొనుట కొరకు, అపొస్తలుల కార్యములు 19లో యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారిని తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందమని పౌలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రభువా, నీవు వారిని సత్యమును గూర్చి ఒప్పించమని మరియు వారు నీకు విధేయులగుదురు గాకని నేనడుగుచున్నాను.

470 అటుతరువాత వారు అంగీకరించిన విధేయతకు గాను మరియు వారి ఒప్పుకోలును గూర్చిన విధేయతకు గాను నీటి యొద్దకు నడిపించుము. తిరిగి వచ్చునపుడు, మిగతావారి జీవితంలో పరిచర్య బలము కొరకు వారిని పరిశుద్ధాత్మతో నీవు నింపుదువు గాక. అర్పణ చేయబడిన దేవుని గొఱ్ఱెపిల్లయైన, యేసుక్రీస్తు నామములో వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్.

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను

కల్వరి చెట్టుపైన

నా రక్షణను కొనెను.

471 ఇపుడు, చేతులెత్తిన మీరు. ఆత్మ యొక్క ఆజ్ఞకు విధేయులు కండి. పశ్చాత్తాప్తుడైన పాపికొరకు అది వాక్యము యొక్క నియమావళిని పాటిస్తుంది. ప్రతీ క్రియలో దానిని వెంబడించుడి. పరలోకమందున్న దేవుడు ఆయన యందున్న మీ స్థిరత కొరకు బహుమతి నిచ్చును. ప్రభువు మిమ్మును దీవించును.

472 మీరు వచ్చినట్లుగానే రేపు రాత్రికి మీ పెన్సిల్లు, కాగితాలు తెచ్చుకోండి. ప్రభువు చిత్తమైతే అదే సమయానికి, ఖచ్చితంగా ఏడు—ముప్పయికి ఇక్కడ యుండుటకు ఎదురుచూద్దాం. మరియు…నాకై ప్రార్థించండి, నాకు దేవుడు ఆరవ ముద్రను విప్పి, రేపు ఆయన నాకిచ్చినట్లుగానే, నేను మీకు అది ఇచ్చుటకు శక్తి కలిగియుండునట్లు. అప్పటి వరకు, మనము తిరిగి పాడుదాము. పాటల ద్వారానే కాదు, అయితే మన స్థానములో చనిపోయి, మనలను విమోచించిన ఆయన కొరకు స్తుతులు చెల్లించెదము. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. “నేను…”

ఇక్కడ ఇపుడు మీ కాపరి.

…ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను.

ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను. 


    63-0322 — అయిదవ ముద్ర
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...