ఆరవ ముద్ర
ఒక క్షణము ఇపుడు మనము తలలు వంచుకుందాము.
2 ప్రభువా, పరిచర్య కొరకు మరలా మేము కూడుకొనుచున్నాము. ప్రభువు యొక్క ఆశీర్వాదాల కొరకు వారందరు షిలోహుకు వచ్చిన ఆరంభ దినాలలోని కాలమును మేము తలస్తున్నాము. మరియు ఇపుడు ఈ రాత్రి నీ యొక్క వాక్యములు వినుటకు ఇక్కడ కూడియున్నాము. మరియు ఈ లేఖనమందలి ప్రత్యేక భాగమును మేము చదువుచుండగా గొఱ్ఱెపిల్ల మాత్రమే ముద్రలను తెరుచును లేక విప్పును. మరియు ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము, ఈ గొప్ప ఆరవ ముద్రను గూర్చి మేము జాగ్రత్తగా విచారణ చేయుచుండగా, పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మా కొరకు దానిని గొఱ్ఱెపిల్ల తెరువమని ప్రార్థిస్తున్నాము, అందుకై దానిని అర్థం చేసికొనుటకు మేమిక్కడ ఉన్నాము. భూమి మీద గాని లేక పరలోకమందు గాని యోగ్యునిగా లేనపుడు గొఱ్ఱెపిల్ల మాత్రమే యోగ్యునిగా కనబడెను. కాబట్టి సకలమునకు సరిపోయినవాడు వచ్చి ఈ రాత్రి మాకై కాలము యొక్క ఆవలను చూచునట్లు మాకై ముద్రను విప్పునుగాక. అది మాకు సహాయము చేయును. మేము జీవిస్తున్న గంభీరమైన, చీకటితోనున్న పాపయుక్తమైన దినమున అది మాకు సహాయము చేసి మరియు మాకు ధైర్యాన్ని చేకూర్చునని మేము నమ్ముతున్నాము తండ్రీ. నీ దృష్టికి మేము వాత్సల్యత పొందుదుమని మేమిపుడు నమ్ముచున్నాము. వాక్యముతో మమ్ములను అప్పజెప్పుకుంటున్నాము, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
మీరు కూర్చొనవచ్చును.
3 స్నేహితులారా, శుభ సాయంకాలము. ఈ రాత్రి తిరిగి ఇక్కడ ప్రభువు యొక్క పరిచర్యలో యుండుట, ఒక ధన్యతయైయున్నది. నేను కొద్దిగా ఆలస్యము చేశాను. నేను…ఈ సంఘమునకు చెందిన ఒక సభ్యుడు మరణ స్థితిలోనుండగా అత్యవసరంగా నేను వెళ్ళాను. అతని తల్లి ఇచ్చటకు వస్తుంది. మరియు అబ్బాయి వెంటనే చనిపోతున్నాడని వారు చెప్పారు కనుక, నేను చూచుటకు వెళ్ళాను. పడక మీద నీడ పరుండియున్నట్లుగా చనిపోతూయున్నాడు, సుమారు నా వయస్సు. ఒక క్షణం సమయములో ఒక మనిషి తన పాదములపై నిలబడి ప్రభువును స్తుతించుట నే చూశాను. మరియు, కాబట్టి మన తప్పిదాలు మనం ఒప్పుకొనుటకు ఇష్టపడి, ఏది మంచిదో అది చేసి వాత్సల్యాన్ని అడిగితే, ఆయనను ప్రార్థిస్తే, అది దేవుడు మనకు ఇచ్చుటకు ఇష్టత కలిగియున్నాడు.
4 మరియు, ఇపుడు ఇక్కడ ఈ రాత్రిలో వేడిగా యున్నదని నాకు తెలుసు. మరియు—మరియు అది…కాదు, వేడి నిలిపివేయబడిందని నేను అనుకుంటున్నాను. మరియు—మరియు మనము…
5 గత రాత్రి లేక ఈ దినము నేను గమనించాను, గదిలో వెలుతురు లేకుండుట ఇది ఏడవ దినము. విద్యుత్ దీపములు తప్ప. చూశారా, మరియు ఈ ముద్రలు విప్పుట కొరకు ప్రార్థిస్తూ, పఠనము చేస్తున్నాము.
6 గత రాత్రి ఆ ప్రశ్నలు…వ్రాసినవారు గుంపులో చాలామంది ఉన్నారు. మరెక్కువ లేవు. కొద్దో గొప్పో ప్రశ్నలు వచ్చినవి. ఏలాగైతేనేం స్వస్థత కూడిక అవసరముంటుంది. అదనంగా ఒక రోజు, సోమవారము స్వస్థత కూడిక యుంటుంది. అది చేయుటకు ప్రజలకిష్టమైతే—కాబట్టి నేను—నేను—నేను దానిని చేస్తాను. మీరు ఉండి రోగులకు ప్రార్థన చేయుటకు ఇష్టపడిన యెడల మీరు ఆలోచించి చెప్పండి.
7 ఎందుకనగా, ఈ సమయమంతటిని ఈ ముద్రల కొరకే సంపూర్ణముగా ప్రత్యేకపరచి ముద్రల కొరకే నేనుండాలని కోరుచున్నాను.
8 కనుక, నీవు దానిని గూర్చి ఆలోచించి దానిని గూర్చి ప్రార్థించు అటు తరువాత నాకు తెలియజేయు. ప్రభువు చిత్తమైతే నేనది చేస్తాను. నా యొక్క తరువాత కార్యక్రమము న్యూ మెక్సికో లోని ఆల్ బుకర్ లో — ఇంకా కొన్ని రోజులున్నవి. మరియు నేను ఒక పని కొరకు ఇంటికి వెళ్ళనైయున్నది. ఆరిజోనాలో మహాసభకు ఏర్పాట్లు చేయవలసియున్నది. మరియు కాబట్టి, అది ప్రభువు చిత్తమైతే! మీరు ప్రార్థించండి. నేను అదే చేస్తాను. తరువాత కొంచెం కాలము తరువాత దానిని గూర్చి మరింత తెలుసుకుందాము.
9 నేనిపుడే కనిపెడుతున్నాను. ఇపుడు నేను…మీరు వెళ్ళి వ్యాధి వచ్చుటను గూర్చి మాట్లాడుచుంటే, చూశారా. ఈ స్త్రీ ఇక్కడ కూర్చుండియుండుట నేను చూస్తున్నాను. ఆమెకు ఒకటి సహాయము చేయనియెడల ఆమె కొంచెం సేపైనను ఇక్కడ ఉండెడిది కాదు. కావున, తరువాత, చూశారా! మనము—మనము దేవుని చిత్తము కొరకు ప్రార్థిద్దాం. దూర ప్రాంతము నుండి వచ్చి అందు కొరకు మనము ఇక్కడ ఉన్నాము. కాబట్టి, చూడండి, ఆ—ప్రతీది పరిశుద్ధాత్మకు తెలుసు. అవునా. కాబట్టి ఆయన…
10 అయితే, చూడండి, ఈ సమయమును ముద్రల కొరకే నేను కేటాయించాను. ఎందుకనగా దానికొరకు మనమిక్కడ ఉన్నాము. అవునా. అయితే…
11 ఏలాగైతే, ప్రార్థన కొరకై ఎంతమంది వ్యాధిగ్రస్తులున్నారు? చుట్టూ, ప్రతిచోట మీ చేతులు చూపించండి. ఓ, మై! హుం! సరే, సోమవారము రాత్రి ఇక్కడే యుండి రోగుల కొరకు ప్రార్థించు ఒక స్వస్థతా కూడిక జరుపుట ప్రభువు చిత్తమని, అది సరియని ఎంతమంది తలస్తున్నారు? అది చేయుటకు మీరు ఇష్టపడుతున్నారా? మీరు చేస్తారా? ప్రభువు చిత్తమైతే ఆలాగు మనమది చేద్దాం. అవునా? మనము—మనము రోగుల కొరకు ప్రార్థనా కూడికలు బుధవారం, లేక ఆదివారం రాత్రి లేక…సోమవారం రాత్రి ఉంటుంది. మరియు రోగులకై ప్రార్థన.
12 ఇపుడు, ఆరిజోనాకు నేను తిరిగి వెళ్ళుచుండగా, ఆ గుంపు వారికి ఇబ్బంది యుండదని నేను అనుకుంటున్నాను. సహోదరుడు నార్మన్ ఇక్కడ యొక చోటనున్నాడా? సహోదరుడా నార్మన్, అది నీ కార్యక్రమమును అభ్యంతరము కలిగిస్తుందా? [సహోదరుడు నార్మన్ “లేదు” అని చెప్పాడు.—సంపా.] సహోదరుడు ఫ్రెడ్ మిగతా మీరు, సరేనా? [మిగతా వారు “సరే,” అని చెప్పారు.] చూశారా? అది సరే. మంచిది.
13 అటుతరువాత, ప్రభువు చిత్తమైతే, సోమవారము రాత్రి రోగుల కొరకు మనము ప్రార్థిద్దాం, ఒక్క రాత్రి అందుకొరకు ప్రత్యేకపరుద్దామా, రోగులకు ప్రార్థించుట కొరకు, ఇపుడు, ఇక ముద్రల కొరకు ఏమీ ఉండదు. ఈ ముద్రలు ప్రభువు విప్పినట్లయితే, తరువాత సోమవారము రాత్రి రోగుల కొరకు ప్రార్థిద్దాము.
14 ఇపుడు, ఓ, వీటి క్రింద ప్రభువును సేవించుట గొప్పగా నేనిది ఆనందిస్తున్నాను. ఈ ముద్రలు విప్పబడుటను గూర్చి మీరు ఆనందిస్తున్నారా? [సభ “ఆమేన్!” అని చెప్పినది—సంపా.]
15 ఇపుడు, మనము అయిదవ ముద్రను లేక…ఆరవ ముద్రను గూర్చి మాట్లాడుచున్నాము. మరియు అది 6వ అధ్యాయములోని 12వ వచనము నుండి తీసుకొనబడుచున్నది, 17వ వచనము వరకు. అది పెద్ద ముద్రలలో ఒకటి. ఇక్కడ కొన్ని కార్యములు సంభవించియున్నవి. మరియు ఇపుడు…
16 గత రాత్రి దానిని కొద్దిగా చెప్పాము, ప్రతీసారి వెనుకటి కార్యములు కొద్దిగా మనము చెప్పుకొనుచున్నాము.
17 మరియు, అనగా నేను—నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను కూడా. ఆ పెట్టెలో నాలుగు లేక ఐదు ప్రాముఖ్య ప్రశ్నలు నాకై పెట్టబడియుండుట నేను కనుగొన్నాను. నన్నడిగారు…నేను నిశ్చయముగా మన్నించాలని కోరుకొనుచున్నాను. టేపు చేయుచున్నారా? టేపులు వేసియున్నారా? సేవకులైన నా సహోదరులను మరియు ఇక్కడున్న ప్రజలైన మిమ్ములను నేను క్షమాపణ కోరుచున్నాను. వారు చెప్పారు, గత రాత్రి ఏలీయాను గూర్చి నేను మాట్లాడుచున్నపుడు…ఎత్తబడుటలో అతడు ఒక్కడు మాత్రమే యుండునని అతడు అనుకున్నాడు. లేక అతడు ఒక్కడు మాత్రమే రక్షించబడబోతున్నాడని. నేను—నేను చెప్పాను, ఏడు వేలకు బదులుగా ఏడు వందలని. అవునా? [సభ “అవును” అన్నారు.—సంపా.] సరే. దానికొరకు నేను చింతించుచున్నాను, మందా. నాకు—నాకు—నాకు బాగుగా తెలియును దాన్ని గూర్చి. అది మాట తడబడుట మాత్రమే. ఎందుకనగా అది ఏడు వేలని నాకు తెలుసు. నేను సరిగా చెప్పలేదు. మరియు నేను—నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దాని అర్థం…నేనేది చెప్తున్నానో అది మీరు గమనిస్తున్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. చూశారా. తరువాత కారణం, అది—అది ఏడు వేలు.
18 దానిమీద నా యొద్ద రెండు లేక మూడు వివరణలున్నవి. చెప్పబడినది, “సహోదరుడా, బ్రాన్హాం, నీవు పొరబడ్డావని అనుకుంటాను,” అని. “వారు చూచినది ఏడు వందలకు బదులు ఏడు వేలు కదూ?”
19 నేననుకున్నాను, “నిశ్చయంగా నేను ఏడు వందలని చెప్పలేదు.” చూశారా? అది…
20 మరియు అటు తరువాత, మొదటి విషయమేంటో మీకు తెలుసా, ఇంకొక వివరణను తీసుకున్నాను. అది చెప్పబడినది, “సహోదరుడా బ్రాన్హాం, నీవు…నీవు ఏడు వందలని చెప్పావనుకుంటాను.”
21 ఒక వ్యక్తి అడిగాడు, “సహోదరుడా బ్రాన్హాం, అది ఆత్మీయ దర్శనమా—అది పోలిక అవుతుందా మరియు ఏడుతో నీవు పోలుస్తున్నావా…?” ఈ కార్యములను గూర్చి మీరు తలంచునపుడు ప్రజలను అది అయోమయంలో ఉంచుతుంది. చూశారా. మరియు అది చాలు. అది నన్ను అంచున ఉంచుతుంది.
22 ఈరోజు ఈ ముద్ర బయలుపరచబడినపుడు ఒకటి జరిగినది. నేను ఆవరణములో నడుచుచున్నాను. బయట ఆవరణలో కొద్దిసేపు. అవును. అది నాలో నుండి ఊపిరి పోయినట్లు అయింది. చూశారా? మీరు ఉద్రిక్తతను గూర్చి మాట్లాడుతారు? ఓ, మై! చూశారా?
23 మరొక విషయం, చూడండి, నేనేమి చెప్తున్నానో దాని మీద మీరు ఆనుకొనుచున్నారు. మరియు నేనేమి చెప్తున్నానో దానికి దేవుడు నన్ను బాధ్యుడుగా ఎంచుచున్నాడు. చూశారా? కాబట్టి నేను—కాబట్టి ఈ అన్ని విషయాలలో అందరు ఎలా నిర్ధారణ చేసుకుంటారో నేనూ ఆలాగు నిర్ధారణ చేసికొనవలసియుంది. ఎందుకనగా ఇది మనము జీవిస్తున్న ఒక—ఒక భయంకరమైన సమయము. ఆఁ.
24 సోమవారము రాత్రి స్వస్థత కూటమును గూర్చి నేను తలస్తున్నాను. అదేదైనా నిన్ను ఆటంకపరచునా సహోదరుడా నెవిల్? [సహోదరుడు నెవిల్ చెప్తున్నాడు, “అది ఆటంకం కాదు, నేనిక్కడ ఉంటాను.”—సంపా.] అది మంచిది.
25 ప్రశస్తమైన సహోదరుడు నెవిల్! వారు—వారు ఒకదానిని చేసి, నేను అనుకుంటాను, మాదిరిని పోగొట్టారు. అది…అతడు నిజంగా ఒక—ఒక నిజంగా స్నేహితుడు నాకు. నేను మీకు చెప్తున్నాను.
26 ఇపుడు మందిరము కట్టబడినది. ఆదివారపు బడుల గదులు అన్నీ సంసిద్ధంగానున్నవి, ఇక్కడ క్రమములో నున్నవి. జఫర్ సన్ విల్ కు చుట్టూనున్న ప్రజలు మీరు చర్చికి రావలయునంటే, మీకు చక్కటి స్థలము కలదు. ఆదివారపు బడికి వచ్చుటకు స్థలమున్నది.
27 శ్రేష్టమైన ఉపదేశకుడు సహోదరుడు నెవిల్, పెద్దల తరగతికి, నిజమైన కాపరి. అతనికి పూల గుత్తినిచ్చుటకు కాదు అయితే అతడు వెళ్ళిపోయిన తరువాత ఒక పెద్ద పూలదండను ఇచ్చుట కంటే అతడు బ్రతికియున్నపుడు ఒక చిన్న గులాబి అతనికి ఇవ్వదలచుకున్నాను. సహోదరుడు నెవిల్, నేను చిన్న బాలుడుగా యుండినప్పటి నుండి తెలుసు. ఒక రవ్వంతైన మారలేదు. అతడు ఎల్లప్పుడు ఏలాగుంటాడో, అతడు ఇంకా ఆర్మన్ నెవిల్.
28 అతనిని సందర్శించుట నాకు జ్ఞాపకముంది. ఇక్కడే నగరములో అతడు మెథడిస్టు బోధకుడుగా నున్నపుడు తన యొక్క ప్రసంగ వేదికను కూడా నాకు ఇచ్చుటకు అభ్యంతరపడలేదు. అక్కడ క్లార్స్ విల్ లో మంచి సభ మనకున్నది. అది హోవర్డ్ పార్క్ లో నున్న ఆరిసన్ ఎవెన్యూ మెథడిస్టు చర్చి అని పిలువబడునని అనుకుంటాను. అతడు అక్కడే ఆమెను కనుగొనియుండును. సహోదరి నెవిల్ అక్కడే, అక్కడే, ఎందుకనగా ఆమె సభ్యు…
29 నేను తిరిగి వచ్చి ఇక్కడున్న సంఘముతో చెప్పాను, నేను చెప్పాను, “అది…అతడు వాళ్ళలో ఒకడని. ఈ ఒకానొక దినాలలో ప్రభువైన యేసు నామములో నేను అతనికి బాప్తిస్మము ఇవ్వబోతున్నాను” అని. అది జరిగినది.
30 అతడిక్కడున్నాడు. మరియు ఇపుడతడు నా ఆప్తమిత్రుడు. నా ప్రక్కనే ఉన్నాడు. అంతటి మర్యాదస్తుడైన గౌరవింపదగిన మనిషి! అతడెల్లప్పుడు నా ప్రక్కన నిలబడతాడు. ఎంతవరకనగా…ఎంత సమీపంగా యుండాలో అంత సమీపంగా. నేనేది చెప్తే, అతడు ఆలాగే శిరసావహిస్తాడు. అతడు మొదట వచ్చినపుడు, అప్పుడు వర్తమానమును అర్థం చేసుకోలేదు. అయితే అతడు అది నమ్మాడు. దానితోనే అతడు ఉండిపోయాడు. ఆలాటి సహోదరునికి అది మర్యాద, అది గౌరవము. అతని గూర్చి చెప్పుటకు చాలా ఉన్నవి. ఇపుడు ప్రభువు అతన్ని దీవించును. సరే.
31 ఐదవ ముద్ర విప్పబడుటలో గత సాయంకాలము చెప్పుకొనిన దానికి కొద్ది సమీక్ష. మొత్తమంతటిని గూర్చి ఈ రాత్రి మనం వెనుకకు వెళ్ళుటలేదు. అయిదవ ముద్రలోని కొంత.
32 ఇపుడు స్వారీ చేస్తున్న అంత్యక్రీస్తు మూడు శక్తుల ద్వారా అతడు గాయపరచబడుటను మనము కనుగొనుచున్నాము. అన్ని ఒక శక్తిలోకి వెళ్ళి మరియు పాండుర వర్ణ గుర్రము మీద స్వారీ చేసి, “మరణముగా,” నాశనమునకై అగాధములోకి వెళ్ళెను. ఎక్కడ నుండి వచ్చెనో అక్కడకు. ఇంకా మనము చూస్తున్నాము…
33 లేఖనము చెప్పుచున్నది. “శత్రువు వరద వలే వచ్చునపుడు, దానిని ఎదుర్కొనుటకు దేవుని ఆత్మ దానికి విరోధముగా లేచును” అని. గత రాత్రి వాక్యములో అది సంపూర్ణముగా బయలుపరచబడుటను మనము చూశాము, ఏలయనగా ఈ స్వారీ చేయువాడు స్వారీ చేసిన నాలుగు సార్లు జవాబిచ్చుటకు నాలుగు జీవులుండెను.
34 ప్రతి యొక్క స్వారీ వేర్వేరు గుర్రము పైన అతడు స్వారీ చేశాడు. ఒక తెల్లని గుర్రం తరువాత ఎర్రని గుర్రము, మరియు నల్లని గుర్రము, అటు తరువాత పాండుర వర్ణ గుర్రము. ఇంకా మనము ఆ రంగులను మరియు అవేమైనవి మరియు అవి ఏమి చేసినవి మనము కనుగొన్నాము. తరువాత నేరుగా సంఘకాలాలు తీసుకున్నాము. ఖచ్చితంగా సంపూర్ణంగా అవి ఏమి చేసినవి.
35 కాబట్టి, మీరు చూడండి, దేవుని యొక్క వాక్యముగా ఒకటిగా కూడినపుడు అది నిజమని అర్థం. చూశారా. ఆ. నేను నమ్ముతున్నాను దేవుని యొక్క వాక్యముతో ఏది కలసినప్పటికి అదెల్లప్పుడు “ఆమేన్.” అవునా?
36 ఇపుడు, ఒక వ్యక్తి తనకు ఒక దర్శనము కలిగిందని చెప్తాడు. అది అవునని, ఓ, అది దేవుడు ఇచ్చాడని వారికి తెలుసు, ఎందుకనగా అది గొప్ప శక్తితో వచ్చినది. సరే. దర్శనం సరియైనదే కావచ్చు. అయితే అది వాక్యముతో లేనట్లయితే మరియు వాక్యానికి విరుద్ధమైతే, అది సరియైనది కాదు. చూశారా?
37 ఇపుడు, బహుశా మార్మన్ సహోదరులు లేక సహోదరి యుండవచ్చు. కొందరు ఈ టేపులు తీసికొని యుండవచ్చు. నేను చెప్పాలనుకోవడం లేదు…మీరు మరియు నేను కలవవలసిన మంచి ప్రజలు కొందరున్నారు, మార్మన్ ప్రజలు. చాలా మంచివారు. అటు తరువాత వారి—వారి ప్రవక్త, జోసెఫ్ స్మిత్, ఇక్కడే ఇల్లినాయిస్ లో వారి యాత్రలో చంపారు. మరియు, కనుక—ఆ మంచి మనిషి, దర్శనము, నేను అనుమానించుట లేదు. అతనికి వచ్చింది దర్శనమే. అతడు యథార్థవంతుడని కూడా నేను నమ్ముతున్నాను. అయితే అతనికి వచ్చిన దర్శనం లేఖనమునకు విరుద్ధం. చూశారా? కాబట్టి మార్మన్ బైబిల్ ను వారి కొరకు తయారు చేసికొనవలసి వచ్చెను. అవునా?
38 నాకు, ఇది అదియై ఇక్కడున్నది. ఆ కారణము చేత కేవలం వాక్యము. అది అది. చూశారా?
39 ఒకసారి, ఒక—ఒక—ఒక సేవకుడు విదేశము నుండి వచ్చాడు. అతడు…ఒక స్త్రీతో…కారు నడుపుకుంటూ వచ్చుట నేను చూశాను. వారు కూటమునకు వచ్చారు. వారు రెండు మూడు రోజులు కలసి నడుపుకుంటూ కూటమునకు వచ్చుట నే చూశాను. మరియు ఆ స్త్రీ మూడు నాలుగు సార్లు పెండ్లి చేసికొనియున్నది.
40 మరియు ఈ సేవకుడు నేనెక్కడ యుంటున్నానో అక్కడ హోటల్ లాబీకి వచ్చి, పరుగెత్తి వచ్చి నాతో కరస్పర్శ చేశాడు. నేనూ అతనితో కరస్పర్శ చేసి లేచి మాట్లాడాను. నేనతనితో చెప్పాను, నేనన్నాను, “నీకు సమయమున్నప్పుడు ఒక క్షణము నా గదిలో నీతో మాట్లాడవచ్చా?”
అతడన్నాడు, “తప్పకుండా, సహోదరుడా బ్రాన్హాం.”
41 నేనతనిని గదికి తీసుకొని వెళ్ళాను. ఆ సేవకునికి నేను చెప్పాను, నేనన్నాను “రెవరెండ్ అయ్యగారు, నీవు విదేశీయుడవు ఈ దేశానికి.” నేనన్నాను, “అయితే ఈ స్త్రీకి ఒక పేరున్నది.” నేను చెప్పాను “…మరియు నీవు పలానా-పలానా స్థలము నుండి ఈ పలానా-పలానా స్థలమునకు వచ్చావు కదా?”
చెప్పాడు “ఔనండి,” అని.
42 మరియు నేను చెప్పాను “ఆలాటి దానికి భయపడుట లేదా…నేను నిన్ను అనుమానించుట లేదు, అయితే ఒక సేవకునిగా నీకున్న పేరు చెడిపోతుందని నీకు తెలియదా? అంతకంటే మనం కొంచెం మాదిరిగా ఉండాలని అనుకొనుట లేదా?”
మరియు అతడు చెప్పాడు, “ఓ, ఆమె పరిశుద్ధురాలు.”
43 నేను చెప్పాను, “నేను—నేను అనుమానించుట లేదు.” అయితే నేను చెప్పాను, “అయితే సహోదరుడా, విషయమేదంటే, ఆమెను చూచు ప్రతీవాడు ఒక పరిశుద్ధుడు కాదు. చూడు, నీవు చేయుచున్న దానిని వారు చూస్తున్నారు.” మరియు నేను చెప్పాను “నీవు జాగ్రత్తగా యుండుట మంచిదని నేననుకుంటున్నాను. అది ఒక సహోదరుని నుండి మరొకరికి.” మరియు అతడు చెప్పాడు…నేను చెప్పాను, “ఆ స్త్రీ ఇప్పటికి నాలుగు లేక ఐదు సార్లు పెండ్లి చేసికొనియున్నది.”
అతడు చెప్పాడు, “అవును. అది నాకు తెలుసు” అన్నాడు. “ఇది నీకు తెలుసా, నేను—నేను…”
44 నేను చెప్పాను “ఇంటి దగ్గర నీ సంఘానికి అది బోధించవద్దు. నీవు అది చేస్తున్నావా?”
45 కాబట్టి చెప్పాడు, “లేదు. అయితే,” “తెలుసా, దానిని గూర్చి ఒక దర్శనం వచ్చినది, సహోదరుడా బ్రాన్హాం” అని చెప్పాడు.
నేను చెప్పాను. “సరే, అది మంచిది.” నేను చెప్పాను…
46 అతను చెప్పాడు “నీవేమీ అనుకొనవు గదా?” “దానిని గూర్చిన నీ బోధను సరిచేయవలెనని యున్నాను” అని అన్నాడు.
47 నేను చెప్పాను, “సరే.” అతడు…నేను చెప్పాను, “నేను—నేను—నేనది తెలుసుకొనుటకు సంతోషంగా ఉన్నాను, అయ్యా.”
48 మరియు అతడన్నాడు, “సరే,” అన్నాడు, “నీకు తెలుసా, ఈ దర్శనములో,” అతడు చెప్పాడు “నేను నిద్రపోయాను.”
మరియు నేనడిగాను “ఆ.” తరువాత నేను చూశాను. అది కల. చూస్తున్నారా?
49 మరియు అతడు చెప్పాడు, “నా—నా భార్య,” చెప్పాడు “ఆమె ఇంకొక పురుషునితో జీవించుచున్నది,” మరియు చెప్పాడు, “మరియు నాతోను జీవించుచున్నది.” మరియు చెప్పాడు “తరువాత నా దగ్గరకు వచ్చి నాతో చెప్పినది, ‘ఓ, ప్రియుడా, నన్ను క్షమించు, నన్ను క్షమించు!’ చెప్పింది, ‘నన్ను—నన్ను—నన్ను—నన్ను క్షమించు నేనది చేశాను. ఇప్పటి నుండి నేను నమ్మకంగా ఉంటాను.’” చెప్పాడు, “నేను ఆమెను అమితంగా ప్రేమించాను. నేను ఆమెను వెంటనే క్షమించాను, ‘సరే.’” మరియు చెప్పాడు, “అప్పుడు…”
50 అన్నాడు, “ఏంటో నీకు తెలుసా? అటు తరువాత ఈ దర్శనానికి అనువాదాన్ని నేను పొందుకున్నాను.” అన్నాడు, “అది ఆ స్త్రీ.” అన్నాడు, “నిశ్చయంగా, ఆమె పెళ్ళి చేసుకున్నది, మరియు మొదలైనవి చేసింది, ఆ అన్ని సమయాలలో.” మరియు చెప్పాడు, అది, “ఆమె వివాహము చేసుకొనడం మంచిదే ఎందుకనగా ప్రభువు ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. ఆమె ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు పెండ్లి చేసికోవచ్చు…”
51 నేను చెప్పాను “నీ దర్శనం బహు మాధుర్యంగా ఉన్నది. అయితే అది సరైన మార్గమునకు ఒంటరిగానున్నది.” నేను చెప్పాను “అది—అది తప్పు. చూడు. నీవది చేయకూడదు.” కాబట్టి…చూశారా?
52 అయితే నీవు లేఖనము చూచునపుడు లేఖనముతో జోడుగా ఉండునపుడు అవి ఎక్కడ నుండి కలిసి వస్తున్నవో వాటి నిరంతర అనుబంధం కలిగియుంటవి. ఇదెక్కడ వదులుతున్నదో, ఆ లేఖనము, ఈ మరొకటి వాటిని చేర్చిన సంపూర్ణ చిత్రం వచ్చును.
53 చెదిరియున్న పజిల్ను ఒక చోట చేర్చినట్లుగా అది యుండును. దానిని సరైన స్థలములో అమర్చిన అది సరిపోవును. అక్కడ మరొకటి సరిపోదు. తరువాత సరిపోయిన చిత్రము వచ్చును.
54 ఒకరు మాత్రమే అది చేయగలరు, అది గొఱ్ఱెపిల్ల, కనుక మనము ఆయన కొరకు చూచుచున్నాము.
55 ఈ స్వారీ చేయువానిని మనము చూస్తే, ఈ గుర్రాల మీద స్వారీ చేసినది అతడే. మరియు మనము అతన్ని వెంటాడి అతడు ఏమి చేశాడో తెలుసుకున్నాము. వెనుక సంఘ కాలాలలో అతడేమి చేశాడో చూశాము.
56 ఆ తరువాత అతడు ఒక కార్యము చేయుటకు ఒక మృగముపై బయలుదేరి వచ్చినపుడు అతడు చేసినది ఎదుర్కొనుటకు ఒకరు పంపబడ్డారని మనము చూశాము.
57 మొదటి కాలంలో ఒకరు పంపబడ్డారు. గొఱ్ఱెపిల్ల…సింహము. అది వాక్యము, క్రీస్తు.
58 తరువాతది ఎద్దు. చీకటి కాలములో, —సంఘము నిర్మాణాత్మకమైనపుడు వాక్యమునకు బదులుగా మూఢ సిద్ధాంతాలు అంగీకరించినపుడు.
59 జ్ఞాపకముంచుకోండి. సమస్తము కూడా రెండు విషయాలపై ఆధారపడియుండును. ఒకటి, అంత్య క్రీస్తు; మరి రెండవది క్రీస్తు.
60 ఈ రోజు కూడా అదే, …మధ్య రకముగాయుండు క్రైస్తవులుండరు. మత్తుగాను మెళకువగానుండు మనుష్యులుండరు; నలుపు—తెలుపు పక్షులుండవు; లేదు. లేదు; పరిశుద్ధుడు—పాపి ఉండడు. లేదు, నీవు పాపివి గాను లేక పరిశుద్ధుని గాను యుంటావు. చూడు? మధ్యస్తంగా ఏదీ యుండదు. నీవు తిరిగి జన్మించియైనా యుండాలి లేక నీవు తిరిగి జన్మించకుండానైనా యుండాలి. నీవు పరిశుద్ధాత్మతోనైనా నింపబడియుండాలి లేదా పరిశుద్ధాత్మతో నింపబడకుండా నీవుండాలి. ఎన్ని ఉద్రేకాలు నీవు కలిగియున్నప్పటికీ, నీవు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినట్లయితే, నీవు దానితో నింపబడలేదు. అవునా? …నీవు దానితో నింపబడినట్టయితే నీ జీవితమును అది చూపుతుంది, దానికి అనుగుణంగానే అదియుంటుంది. చూశారా. దానిని గూర్చి ఎవరు ఏదీ చెప్పనవసరం లేదు. వారది చూస్తారు, అవునా, ఎందుకనగా అది ఒక ముద్ర.
61 ప్రతీసారి ఆ జీవులు ఏ విధంగా స్వారీ చేసినవో మనము చూశాము. రాజకీయ అధికారములతోను, మత సంబంధమైన అధికారములతోను కలిసి ఒకడు తన యొక్క పరిచర్యను బయటకు పంపెను. దానిని ఎదుర్కొనటానికి దేవుడు ఆయన శక్తిని పంపినట్లు మనము చూస్తున్నాము. మనము నేరుగా వెనుకకు వెళ్ళి సంఘకాలమేదో చూశాము, మరియు వెనుకకు చూశాము; ఆ విధంగానే ఖచ్చితంగా అది అక్కడున్నది.
62 అటు తరువాత, మరొక కాలము వచ్చుట చూశాము, మరియు శత్రువు మతం పేరిట, క్రీస్తు నామమున, సంఘము పేరిట అంత్యక్రీస్తును పంపుట చూశాము. అవునండి. చివరకు సంఘము పేరిట బయలువెడలెను. అతడు చెప్పాడు, “అది నిజమైన సంఘమని.” చూశారా?
రష్యా కాదు అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అది కాదు.
63 అంత్యక్రీస్తు క్రైస్తవ్యానికి ఎంతో సమీపము. ఎంతవరకనగా బైబిల్ చెప్తుంది, “ఏర్పాటులేని వారిని మోసపుచ్చునంతగా.” అవునది నిజం. బైబిల్ అది చెప్తుంది, “చివరి దినములలో ముందు నిర్ణయములో లేని వారినందరినీ, ఏర్పాటులేని వారినందరినీ.” అది చెప్తుంది “ఏర్పాటు!” ఇపుడు ఎవరైనా ఆ మాట తీసుకొని మీ మార్జిన్ లో చూస్తే, దాని అర్థమేంటో మీరు చూస్తారు. అది చెప్తుంది, “ఏర్పరచబడినవారు, ముందుగా నిర్ణయింపబడినవారు” అని. చూశారా? “జగదుత్పత్తి మొదలుకొని గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథమందు ఎవరిపేరు వ్రాయబడలేదో వారినందరిని అది మోసము చేయును.”
64 గొఱ్ఱెపిల్ల వధింపబడినపుడు పేరులు గ్రంథములో పెట్టబడెను. మహిమలో, పరిశుద్ధ స్థలములో, ఈ రాత్రి ఆయన ఒక విజ్ఞాపణ కర్తగా ఆ గ్రంథమందు ఎవరి పేరు ఉన్నదో ఆ ప్రతి యొక్క ఆత్మకై విజ్ఞాపణ చేయుచున్నాడు. మరియు ఎవరికీ ఆ పేరు తెలియదు, ఆయనకు తప్ప. ఆయన చేతిలో ఆ గ్రంథాన్ని కలిగియున్నది ఆయనే, ఆయనకు తెలుసు. ఆఖరు వ్యక్తి లోపలకు వచ్చునప్పుడు ఆయన విజ్ఞాపణ దినాలు ముగించబడతాయి. ఆయన దేనికొరకు విజ్ఞాపణ చేశాడో దానిని స్వంతం చేసికొనుటకు ఆయన వచ్చును; మరియు ఆయన స్వంత వారిని స్వీకరించుటకు వచ్చును. ఓ, మై.
65 అది, ప్రతి క్రైస్తవుడు దేవుని యెదుట నిలబడి చేతులు పైకెత్తి, తన్నుతాను పరీక్షించుకుంటూ, “నన్ను శుద్ధిచేయుము, ఓ ప్రభువా, నా బ్రతుకులోకి చూడుము, మరియు—మరియు నా యొక్క తప్పిదము స్థితి నన్ను చూడనిమ్ము. త్వరగా దారి నుండి బయటకు రానిమ్ము.” “ఎందుకనగా నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపి, భక్తిహీనుడు ఎక్కడ నిలచెదరు?” ఇది పరీక్షించుకొనవలసిన సమయం.
66 మరియు మీరు ఈ వాక్యమును—సరైన స్థానములో యుంచదలచినయెడల (దీని మీద మీరు ప్రశ్న అడుగవలెనని కోరుటలేదు, ఎందుకనగా అది ఇంకొక దానిలోనికి నడిపించును. మీరు ప్రశ్నలు అడిగితేనని నా అర్థం.) ఇది తీర్పు ముందు పరిశోధనా కాలము. అవును. మనము బూరల యొద్దకు వచ్చునపుడు లేక పాత్రలు ప్రభువు మనకు దయచేస్తే పరిశోధనా తీర్పును మనము కనుగొందాము. శ్రమలు వచ్చుటకు కొంచెము ముందుగా. అది సత్యమని మనం చూస్తాము. మరియు భూమిని తాకిన ఆ ముగ్గురు దూతలు ఈ విధముగా “అయ్యో! అయ్యో! అయ్యో భూనివాసులకు శ్రమ!” అని కేకలు వేసిరని మీకు తెలుసా.
మరియు మనము భయంకరమగు కాలములో జీవించుచున్నాము, ఒక కాలము…
67 మీరు చూశారా, ఇప్పుడున్న ఈ విషయాలు, ఇపుడు మనము పఠనము చేస్తున్న ఈ విషయాలు సంఘము వెళ్ళిపోయిన తరువాత శ్రమకాలములో జరుగును. ఈ సంఘము శ్రమ కాలంలో పాలు పొందదని ప్రతి విశ్వాసి హృదయంలో స్థిరపడాలని నేననుకుంటున్నాను. సంఘాన్ని నీవెన్నడూ శ్రమలో ఉంచలేవు. నేను…నీవు సంఘాన్ని అక్కడ ఉంచగలవు, గాని పెండ్లికుమార్తెను కాదు. చూడు, పెండ్లికుమార్తె వెళ్ళిపోయినది.
68 ఎందుకనగా, చూడండి, ఆమెలో ఒక్క పాపము కూడా లేదు, ఆమెకు విరోధముగా ఒక్కటి లేదు. దేవుని యొక్క కృప ఆమెను కప్పియున్నది. ఆ బ్లీచ్ ప్రతి పాపమును దూరముగా తీసికొని పోయినది. దానిని గూర్చి ఏలాటి జ్ఞాపకం లేదు; ఒక్కటి కూడా లేదు, అయితే దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత, పరిపూర్ణత తప్ప. పెండ్లికుమార్తె ఆమె మోకాళ్ళపై మోకరించి దేవునికి కేకలు వేయవలసియుంటుంది.
69 ఒక చిన్న కథ నాకు జ్ఞాపకమొస్తుంది, మీ యొక్క సమయాన్ని నేనెక్కువగా తీసుకొనకపోయినట్లయితే, అది పీఠికగా చెప్పబడుతుంది. నేను…నేను—నేను ఒక ఉద్దేశ్యమునకు చెప్తున్నాను. ప్రారంభించుటకు ఆత్మ అనుభూతిని పొందువరకు.
70 ఇది ఒక—ఇది ఒక పవిత్రమైన విషయం. చూశారా? అది, చూడండి, అక్కడున్న విషయాలు ఎవరికి తెలియును? దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మరియు అవి బయలుపరచబడవలసి లేవు. ఈరోజు వరకు అవి బయలుపరచబడవని బైబిల్ గ్రంథము ద్వారా నిరూపించబడియున్నది. అది ఖచ్చితంగా వాస్తవము. చూశారా? అవి—అవి ఊహించబడ్డవి. అయితే, ఇపుడు మనము ఖచ్చితంగా సత్యమును, రుజువు చేయబడిన సత్యమును పొందుకోబోవుచున్నాము. అవునా? గమనించు.
71 ఇపుడు పశ్చిమ ప్రాంతమున ఒక చిన్న బాలిక యున్నది. ఆమె ప్రేమలో పడ్డది…ఒక పురుషుడు ఆమెను ప్రేమించాడు. పశువులను కొనుగోలు చేయు వానిగా ఆర్మన్ సంస్థకి వచ్చాడు. మరియు—వారికి ఒక—గొప్ప…
72 చికాగో నుండి యజమానుని కుమారుడు వచ్చాడు. పశ్చిమ హద్దుల ప్రకారంగా వారిని క్రమములో ఉంచారు. ఆ—అక్కడ ఆడ పిల్లలు వస్త్రాలు ధరించారు, వీరిలో ఒక్కొక్కరు ఈ అబ్బాయిని పొందుకోబోతున్నారు. తప్పక, మీకు తెలుసా, ఎందుకనగా అది ఆ మనుష్యుని అబ్బాయి, కాబట్టి వారు వారి యొక్క పాశ్చాత్య దుస్తులు ధరించుకొన్నారు.
73 మరియు పశ్చిమ ప్రాంతము వారు ఆలాగు చేస్తారు. ఇటువంటి కథ వారు కలిగియున్నారు. మరియు సహోదరుడు మాగైర్, అతడు ఇపుడు ఇక్కడ యుంటాడని అనుకుంటాను, పశ్చిమ దుస్తులను అతడు ధరించనందున వారు అతన్ని పట్టుకొని, వారు చెరశాలలో అతన్ని పెట్టారు. మరియు కంగారో న్యాయశాలలో పెట్టి, అందుకు అపరాధ రుసుము చెల్లించునట్లు చేసి అటు తరువాత పాశ్చాత్య దుస్తులు కొనునట్లుగా బలవంతము చేశారు. అంత పొడవుండే తుపాకులను కొంతమంది వ్రేలాడదీసుకొని నడచుట నేను చూశాను. వారి యొక్క స్వదేశములో వారు ఆలాగు ఉంటారు. వారి యొక్క పూర్వపు దినములలో వలే వారు జీవించుటకు ప్రయత్నిస్తారు. చూశారా?
74 మరియు అటు తరువాత, కెంటకీలో, ఇక్కడ తూర్పుననున్న పాతకాలపు దినాలలో జీవించగోరుతావు. ఇంకా రెన్ ప్రో లోయ పద్ధతులను అవలంబించుచున్నారు. వెనుక దినాలకు నీవు వెళ్ళి అవలంబించుచున్నావు. దానికి కారణము ఒకటియున్నది.
75 అయితే అసలైన దానిలోని సువార్త యొద్దకు అది వచ్చినపుడు, నీవు అది చేయనవసరము లేదు. నవీనమైనది యొకటి కావలసియున్నది. చూశారా. అది చూపించుచున్నది, నీవు—నీవు…అక్కడ…
76 మరియు ఒక మనిషి తప్పు చేయుటకు కారణమేంటి? అతడు త్రాగుటకు అలవాటు పడడానికి హేతువేంటి? లేక స్త్రీ తప్పు చేయుటకు కారణమేంటి? కారణం…ఆమెలో ఒకటున్నది, దాహము. అతనిలో ఒకటున్నది, దాహము. లోకసంబంధమైన కార్యాల చేత ఆ పరిశుద్ధమైన దాహాన్ని ఆర్పుటకు వారు ప్రయత్నిస్తారు. ఆ నిలుపు చేయుట దేవుని వలన కలుగవలసియున్నది. దాహముగొని యుండుటను ఆయన ఆ విధంగా ఉంచాడు. ఆ కారణమును బట్టి ఒకదాని కొరకు నీవు దాహము గొనుటకై, చూశారా? అయితే, ఆ దప్పికను నీవు నిలుపుచేయుటకు ప్రయత్నం చేసిన యెడల…ఎవరైన అది చేయుటకు ఎంత ధైర్యము! ఒకదాని కొరకు నీవు దాహముగొని యున్న ఆ పరిశుద్ధ దాహాన్ని నిలుపు చేయుటకు ప్రయత్నించుటకు, నీవు అది చేయుటకు నీకు హక్కు లేదు. మరియు ఆ తరువాత లోకంతో నీవు సంతృప్తి చెందుటకు లోకము వైపునకు తిరుగుట. నీవది చేయకూడదు. దానిని నింపునది ఒక్కటే ఒక్కటి, అది దేవుడు. ఆయన ఆ విధంగా నిన్ను చేశాడు.
77 కాబట్టి, ఈ—ఈ యవ్వన బాలికలు ఈ అబ్బాయి కొరకు పాశ్చాత్య బట్టలు ధరించి అతడు బయటకు వచ్చుటకు చూస్తున్నారు. అతన్ని ప్రతియొక్కరు తామే ఆకర్షించుదునని నిరీక్షణ కలిగియున్నారు.
78 అక్కడ ఆ ప్రహారాలో వారి చిన్న బంధువు ఒకరు ఉండెను. ఆమె ఒక అనాధ. వీరందరికి పనియంతా ఆమె చేస్తుండేది. ఎందుకనగా, వారు వారి చేతివ్రేళ్ళు సిద్ధపరచుకొనవలసియుంది. ఎందుకో తెలుసా, చేతులతో వారు పాత్రలు కడుగలేరు. ఆమె కఠినమైన పనినంతా చేసేది.
79 మరియు, చివరకు ఆ యవ్వనుడు వచ్చునప్పటికి, వారు బయటకు వెళ్ళిపోయి పాశ్చాత్య పద్ధతి ప్రకారము బక్ బోర్డు ప్రకారంగా అతన్ని తీసికొని వచ్చారు. వారు లోపలకు వచ్చి వారి తుపాకీలు పేల్చుచు నాట్యము చేస్తున్నారని మీకు తెలుసు. ఈ రాత్రి పెద్ద నాట్యము యొకటి వారికున్నది, ప్రాచీన నాట్యమది, అంతా పశువుల కాపరులు వచ్చారు. వారి యొక్క నాట్యాలతో, మొదటి విషయమేంటో తెలుసా, ఈ ఉత్సవము రెండు లేక మూడు రోజులు జరిగినది.
80 అటు తరువాత, ఒక రాత్రి, అలా నాట్యము నుండి కొంచెం విశ్రాంతి తీసికొనుటకు ఈ అమ్మాయిల నుండి బయటకు వెళ్ళుటకు స్థలము నుండి బయటకు వెళ్ళాడు. వసారా వైపు వెళ్తూ అతడు చూచుట తటస్తించెను. మొరటుగా కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి అటు వెళ్తుంది. మరియు ఆమె పాత్ర నిండుగా నీళ్ళు నింపుకొని పాత్రలు కడుగుతుంది. అతడు అనుకున్నాడు, “నేను ఆమెను చూడలేదు, ఆమె ఎక్కడ నుండి వచ్చిందో నేనాశ్చర్యపడుతున్నాను?” కాబట్టి అతడు ఆ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి, వసారా ప్రక్కకు వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు.
81 ఆమె కాళ్ళకు చెప్పులు లేవు. ఆమె నిలిచిపోయి తలవంచుకొని యుండెను. అతడు ఎవరనేది ఆమె చూచి చాలా సిగ్గుపడిపోయింది. ఆ గొప్ప వ్యక్తిని ఆమె గ్రహించినది. ఈ ఇతర అమ్మాయిలకు ఆమె బంధువు అవుతుంది. వారి తండ్రి ఈ పెద్ద ఆర్మర్ అవుట్ ఫిట్ లో పర్యవేక్షకుడు. కనుక…ఆమె క్రిందకు చూస్తూనే ఉన్నది. ఆమె వట్టి కాళ్ళతో నున్నందున ఆమె సిగ్గు పడినది.
82 అతడడిగాడు, “నీ పేరేంటి?” అని. ఆమె అతనికి చెప్పినది “ఆ మిగతా వారు యుండే స్థలములో నీవెందుకు ఉండలేదు?” ఒక రకంగా నెపములు చెప్పింది.
83 కాబట్టి, తరువాత రాత్రి, అతడు ఆమెను గమనించాడు. చివరకు, అతడు అక్కడ కూర్చున్నాడు. వారందరు అవి చేస్తూనే ఉన్నారు. అతడు—అతడక్కడ వసారా కంచెలో కూర్చొని ఆమె వచ్చి నీటిని పారవేయుటను గమనిస్తున్నాడు. ఆమె కొరకు అతడు ఎదురు చూశాడు. అతడామెతో అన్నాడు, అతడన్నాడు “నేనిక్కడకు వచ్చిన నిజమైన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా?”
ఆమె అన్నది, “లేదండి, నాకు తెలియదు.”
84 అన్నాడు, “నేనొక భార్యను ఎన్నుకొనుటకు ఇక్కడ యున్నాను, అది నా ఉద్దేశ్యం.” అతడన్నాడు, “వారిలో లేని గుణమును నేను నీలో కనుగొన్నాను.” నేను సంఘాన్ని గూర్చి ఆలోచన చేస్తున్నాను. చూశారా. అడిగాడు, “నీవు నన్ను పెళ్ళి చేసుకుంటావా?”
ఆమె అన్నది, “నన్నా? నన్నా? నేను—నేను ఆలాటి విషయాన్ని గూర్చి తలంచుట కూడా వీలు కాదు.”
85 చూశారా, అది ప్రధాన యజమానుని యొక్క కుమారుడు. దేశములో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, పశువుల మందలు, అన్నిటికి యజమానుడు. మీరు చూస్తున్నారా. చెప్పాడు, చెప్పాడు, “అవును” అని అన్నాడు. అన్నాడు “నేను—నేను చికాగోలో ఒక్కరినీ కనుగొనలేకపోయాను. నాకు—నాకు నిజమైన భార్య కావలెను. ప్రవర్తన గల భార్య నాకు కావలెను. దేనికొరకు నేను ఎదురుచూస్తున్నానో అది నీలో నేను చూశాను.” “నీవు నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగాడు.
ఆమె అన్నది, “మంచిది…” అది ఆమెను కలవరపరచింది. ఆమె అన్నది, “అవును” అని.
86 మరియు అతడు చెప్పాడు, “మంచిది…” తిరిగి వస్తానని ఆమెతో చెప్పాడు. చెప్పాడు, “ఇపుడు, నిన్ను నీవు సిద్ధపరచుకో. ఈరోజు నుండి ఒక సంవత్సరమునకు నేను తిరిగివస్తాను. సరే…మరియు నేను నిన్ను స్వీకరిస్తాను. ఇక్కడ నుండి నేను నిన్ను తీసుకుంటాను. ఇక్కడ పనిచేసిన రీతిగా ఇక నీవు పనిచేయనవసరము లేదు. నేను నిన్ను తీసుకొని వెళ్తాను. నేను చికాగోకు వెళ్తున్నాను. నీవెన్నడు చూడని ఇంటిని నేను నీ కొరకు కడతాను.”
87 ఆమె అన్నది, “నాకు లేదు. నాకు ఇల్లే లేదు. నేను అనాధను,” అని ఆమె చెప్పింది.
88 అతడన్నాడు, “నేనొక ఇల్లు నీకు కడతాను, ఒక నిజమైన దానిని.” “నేను తిరిగి వస్తాను,” అని చెప్పాడు.
89 సంవత్సరకాలమంతా అతడు ఆమెను గమనిస్తూనేయున్నాడు. ఆమె చేయవలసినదంతా చేసింది. పెండ్లి వస్త్రములు కొనవలెనని ఒకరోజుకు ఒక డాలరు చొప్పున లేక ఆమె దగ్గర యున్నదంతా దాచిపెట్టింది. సంఘమునకు పరిపూర్ణ పోలిక. చూశారా? చూశారా? ఆమె వస్త్రములు సిద్ధపరచుకొన్నది.
90 మరియు, మీకు తెలుసా, ఈ వస్త్రాన్ని ఆమె చూసినప్పటికి ఆమె—ఆమె బంధువులన్నారు, “ఏంటి, నీవు పేద అవివేకపు పిల్లవు. అటువంటి మనిషి నీతో సంబంధాలు కలిగియుంటారని అనుకుంటున్నావా?” అని అన్నారు.
91 ఆమె చెప్పింది, “అయితే అతడు నాకు వాగ్దానము చేశాడు.” ఆమేన్. అన్నది “అతడు వాగ్దానము చేశాడు.” అన్నది, “నేను అతని మాట నమ్మాను.”
92 “ఓ, అతడు నిన్ను గేళి చేయుటకు ఆ విధముగా చెప్పాడు.” “అతనికి ఒకరు కావలయునంటే మాలో ఒకరిని అతడు తీసికొనును,” అని అన్నారు.
93 “అవును,” అన్నది “అయితే నాకు అతను వాగ్దానము చేశాడు. అందుకొరకు నేను ఎదురుచూస్తున్నాను.” ఆమేన్. నేను కూడా.
94 కాబట్టి, దినములు గడచినవి. చివరికి ఆరోజు వచ్చినది, చెప్పిన సమయానికి అతడు వచ్చాడు, ఆమె వస్త్రాలు ఆమె ధరించింది. అతని యొద్ద నుండి ఆమె ఏమీ వినలేదు. అయితే అతడు అక్కడ యున్నాడని ఆమె ఎరిగియున్నది. కాబట్టి ఆమె పెళ్ళి వస్త్రము ఆమె ధరించుకొని, సిద్ధముగా ఉన్నది.
95 సరే, వారు నిజంగా నవ్వారు. కారణం ప్రాముఖ్యమైన యజమాని సంచాలకుడు యొద్దకు పంపియుండును. అందును గూర్చి ఏ కొంచెమైనను ఆ అమ్మాయిలలో ఏ ఒక్కరు వినలేదు. అదంతా వారికి మర్మమైయుండెను. అది కూడా. అది నిశ్చయము.
96 అయితే ఈ అమ్మాయి, వీటన్నిటిపైన ఆమె కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటను ఆధారము చేసికొన్నది. అతడు ఆమె కొరకు వస్తాడని.
97 కనుక వారు నవ్వుతున్నారు. ఒకరి చుట్టూ ఒకరు చేతులు చుట్టుకొని ఆమె చుట్టూ నాట్యం చేస్తున్నారు. అంటున్నారు “హా!” అని నవ్వుతూ, ఏలాగో తెలుసా “దీనురాలైన చిన్న అవివేకపు పిల్ల!” అని అంటున్నారు.
98 ఆమె అక్కడ నిలబడియున్నది. కొంచెమైనను సిగ్గుపడుటలేదు. ఆమె పువ్వులను పట్టుకొనియున్నది. ఆమె పెండ్లి వస్త్రములు అన్నీ కట్టుకొని యుండెను. ఆమె కష్టపడెను మీకు తెలుసా. “ఆయన పెండ్లికుమార్తె తనకుతాను సిద్ధపరచుకొనెను.” చూశారా? ఆమె పువ్వులను పట్టుకొని వేచియుండెను.
99 వారన్నారు, “ఇపుడు, నేను చెప్పాను, అది తప్పని, చూశారా అతడు రావటం లేదు.”
అన్నది, “నాకు ఐదు నిమిషములున్నవి.” అన్నది, “అతడిక్కడే యుంటాడు.”
ఓ, వారు నవ్వారు!
100 మరియు, ఆ సమయంలోనే ఆ పాత గడియారము ఐదు నిమిషాలు కొట్టింది. గుర్రపు డెక్కలు శబ్దం వారు విన్నారు. చక్రముల క్రింద ఇసుక కదులుచున్నది. పాత గుర్రపు బండి ఆగినది.
101 ఆమె వారి మధ్య నుండి తలుపు బయటకు దూకినది. మరియు బండిలో నుండి అతడు దూకాడు. ఆమె అతని హస్తాల్లో పడిపోయినది. అతడన్నాడు, “ఇపుడంతా అయిపోయినది, హనీ.” అక్కడ కూర్చుని చూస్తున్న ఆమె పాత సంఘశాఖల బంధువులను వదిలిపెట్టినది. ఆమె—ఆమె తన ఇంటికి, చికాగోకు వెళ్ళినది.
102 అలాటి గొప్ప మరియొక వాగ్దానమును కూడా నేనెరిగియున్నాను. “నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను; మిమ్ములను స్వీకరించ తిరిగి వస్తాను.” మేము పిచ్చివారము అని వారు చెప్పవచ్చు. అయితే, సహోదరుడా, నాకైతే, ఇప్పుడే అక్కడ నిత్యత్వములోకి గోడ గడియారము సమయము కొట్టుచుండగా, అక్కడ దూత నిలబడి ఏడవ దూత యొక్క ఆఖరి వర్తమానము, “సమయము ఇక ఉండదు,” అని చెప్పుట చూచుచున్నాను. ఈ ఒకానొక దినాలలో ఆ చిన్న విశ్వాస పాత్రురాలుగా నన్ను పెండ్లికుమార్తె యేసు యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోయి తండ్రి యొక్క గృహమునకు కొనిపోబడును. మనమిపుడు ముందుకు సాగుకొలది ఈ విషయాలు ఆలోచిద్దాం.
103 సింహము యొక్క పరిచర్యను, వాక్యము గమనించండి; ఎద్దు, ప్రయాస మరియు అర్పణ; యుక్తి, సంస్కర్తలు; మరియు పక్షిరాజు కాలము వచ్చుట, అనగా బయలుపరచి ఈ సంగతులు తీసుకొని వాటిని చూపించును.
104 ఇపుడు గత రాత్రి పరిచర్యలో మనము చూశాము. ఇంకా ఈ ముద్రతో ఈ గొప్ప మర్మము తెరువబడుట, అనగా క్రితము యొక్క నా గృహానికి అది ఖచ్చితంగా వ్యతిరేకమైయుండుట కనుగొన్నాము. అది నిజమని ఊహించాను. ఆ బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఆరంభ క్రైస్తవ హతసాక్షులని నేనెల్లప్పుడు వదిలివేశాను. అయితే గత రాత్రి, ప్రభువైన దేవుడు ఆ ముద్ర మనకై తెరచినపుడు, అది నిష్కర్షగా అసాధ్యమాయెను. అది వారు కాదు. వారు ఆవల వైపుననున్న మహిమలోకి వెళ్ళిపోయారు. వారు అక్కడ ఉన్నారు. వారు ఆ కాలమున వచ్చు యూదులని మనము కనుగొంటిమి.
105 ఇపుడు పిలువబడబోవుచున్న ఒక లక్ష నలభై నాలుగు వేలమందిని గూర్చి ఈ రాత్రి మరియు రేపు రాత్రి తీసికొనబోతున్నాము. మరియు—మరియు ఆరు మరియు ఏడవ ముద్ర మధ్య ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పిలువబడబోవుచున్నారు.
106 మరియు వారు చంపబడిన హతసాక్షులు అని మనము తరువాత కనుగొన్నాము, అయినను…తెల్లని వస్త్రములు ధరించియున్నారు. అయితే వారి పేర్లు గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి. మరియు వారిలో ప్రతీ ఒక్కరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. మనమది చూశాము. లోకంలో ఏదీ కాదు. నేను నమ్మను. అయితే వారు శ్రమల కాలమునకు ముందు శ్రమల గుండా వెళ్ళిన యూదులు. గడచిన ఈ యుద్ధ సమయములలో, వారు…వారు ప్రతీ ఒక్కరి చేత వారు ద్వేషించబడినవారు. మరియు ఐక్ మాన్ జర్మనీలో లక్షల లక్షల మందిని చంపాడు. మీరు ఆ శ్రమలను మాత్రమే వినియున్నారు. లక్షల లక్షల మంది అమాయకులైన యూదులు చంపబడ్డారు. వారు యూదులు కాబట్టి. మరి వేరే కారణం లేదు.
107 ఇక్కడ, బైబిల్ చెప్తుంది, “దేవుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తమును, వారు కలిగియున్న సాక్ష్యము నిమిత్తమును వారు చంపబడ్డారు” అని. ఇపుడు, పెండ్లికుమార్తెయైతే దేవుని వాక్యము నిమిత్తమును, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అని మనం చూస్తున్నాము. వీరికైతే యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము లేదు.
108 బైబిల్ ఈలాగు చెప్పుట మనం చూస్తున్నాము, “ఇశ్రాయేలీయులందరు, ముందుగా నిర్ణయించబడిన ఇశ్రాయేలీయులందరు రక్షించబడుదురు,” రోమా 11. ఇపుడు, మనకది తెలుసు. మనమక్కడ ఆ ఆత్మలు చూశాము.
109 ఇపుడు ఎంత దగ్గరో చూడండి. ఇది ఇంతకు ముందు ఎందుకు జరుగలేదు? ఎందుకనగా అది ఇంతకు ముందు జరుగలేదు. ఇపుడు నీవు చూడలవు. మీరు చూశారా. అవునా, ఘనమైన పరిశుద్ధాత్మ—కాలములు మరియు సమయముల గుండా ఆ విషయాలు వచ్చుట చూచుచున్నాడు. మరియు ఇపుడది బయలుపరచబడుచున్నది, తరువాత నీవు అక్కడ చూచి, అది సత్యమని చూడగలవు. అది అక్కడయున్నది.
110 ఇపుడు, అది—అది శ్రమకాలములోని, లేక ఐక్ మాన్ యొక్క ముందు శ్రమ కాలములో హతసాక్షులు. ఇపుడు, ఒక లక్ష నలభై నాలుగు వేలమందికి వారు పోలిక, అది ఆరు మరియు ఏడవ ముద్రలలో మధ్యలోకి మనము వెళ్ళబోతున్నాము. అవునా?
111 ఏడవ ముద్ర కేవలం ఒక్కటే, అంతే, ఇది, “పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దము.” దేవుడు మాత్రమే అది బయలుపరచగలడు. ఎక్కడ కూడా అది సూచన రూపమున తెలుపబడలేదు. రేపటి రాత్రికది. నా కొరకు ప్రార్థించండి. అవునా?
112 ఇపుడు, ఆరవ ముద్రలోకి మనం వెళ్తూ, ఇపుడు మనము గమనిద్దాం. ఈ ఆరవ ముద్రకు మనము వచ్చుచుండగా పరలోకపు తండ్రి మనకు సహాయము చేయునుగాక. ఇపుడు 6వ అధ్యాయం యొక్క ఈ 12వ వచనము.
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను.
భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొనిరి.
113 అక్కడ గమనించారా? వారిని చూడండి, “బలిష్ఠులైన మనుష్యులు,” చూశారా. వారు ఏం చేశారు? “వేశ్య యొక్క జారత్వమును ఉగ్రతా ద్రాక్షారసమును వారు త్రాగారు.” అవునా? అది ఖచ్చితంగా ఆమె యొక్క ద్రాక్షారసమును త్రాగినవారు వీరే. చూశారా?
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను, బండలతోను చెప్పుచున్నారు. మరియు గొఱ్ఱెపిల్ల యొక్కయు ఉగ్రత:
మహా దినము వచ్చెను; దానికి తాళజాలిన వాడెవడు?
114 ఎంతటి పరిచయ వాక్యము…చూడండి, స్వారీ చేయువాడు, స్వారీచేయువాని యొక్క మృగములు, జవాబిచ్చు జీవులు, ఆగిపోయారు. అటు తరువాత మనము తీసుకున్నాము. సింహాసనము క్రింద హతసాక్షులను చూశాము. ఈ సమయములో, ఈ హతసాక్షులు పారంపర్యాచారము ఆచరించు యూదులు. క్రైస్తవ విశ్వాసముతో చనిపోయినవారు లేక మత సంబంధమైన విశ్వాసముతో, ఎందుకనగా వారు క్రైస్తవులు కాలేరు.
115 జ్ఞప్తించుకో. దేవుడు వారి కన్నులు మూశాడు. ఎక్కువ కాలము వారు గ్రుడ్డివారుగా యుండబోతున్నారు. అన్య సంఘము మార్గము నుండి ఎత్తబడువరకు. ఏలయనగా దేవుడు ఒకేసారి వారిరువురితో సంప్రదించడు. ఎందుకనగా అది ఆయన వాక్యమునకు చాలా విరుద్ధము.
116 జ్ఞాపకముంచుకో. ఆయన ఇశ్రాయేలీయులతో ఒక దేశముగా వ్యవహరించును. ఎల్లప్పుడు అది ఇశ్రాయేలు దేశము.
117 అన్యులు, ఒక వ్యక్తులు, “అన్య జనులలో నుండి తీసికొనిన ప్రజలు.” అది అన్యజనులై యుండవలసినది. ప్రపంచములోని ప్రజలందరు కలసి, అపుడపుడు యూదుడు అందులోనికి వచ్చును. చూడండి. అరేబియన్, ఐరిష్, ఇండియన్, ఎవరైనా కానీ ప్రపంచమందలి ప్రజలు ఈ పుష్ప గుచ్చములాంటి పెండ్లికుమార్తె ఏర్పడును. అవునా.
118 అయితే ఇపుడు, ఇశ్రాయేలీయులతో వ్యవహరించునపుడు, ఈ యొక్క డెబ్బది వారపు ఆఖరి భాగములో వారిని ఒక దేశముగా వ్యవహరించును. అన్యులు ముగించబడతారు. గడియ త్వరలో రానైయున్నది. బహుశా ఈ—ఈ రాత్రే దేవుడు అన్య జనుల నుండి పూర్తిగా ఇశ్రాయేలు ప్రక్కకు తిరుగవచ్చును. ఖచ్చితం. ఆయన ఆలాగు చెప్పెను. “అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును.” అవునండి!
119 మరియు అటు తరువాత “అపవిత్రుడు అపవిత్రుడుగానే యుండును; నీతిమంతుడు నీతిమంతుడుగానే యుండును.” చూశారా?
120 ఇక బలిపీఠము మీద పరిశుద్ధ స్థలములో ఇక ఎంతమాత్రము రక్తము ఉండదు. బలిపీఠము మీద ఇక రక్తము లేనే లేదు. అర్పణ తొలగింపబడినది. ఇక అక్కడ ధూమము, మెరుపులు, మరియు తీర్పు తప్ప ఏమీ లేదు. అదే ఈ రాత్రి ఇక్కడ ఖచ్చితంగా క్రుమ్మరించబడినది. గొఱ్ఱెపిల్ల ఆయన యొక్క మధ్యవర్తిత్వపు పనిని విడిచిపెట్టెను. సింహాసనము మీద మధ్యవర్తిత్వపు పని ముగించబడియున్నది. అర్పణ యొక్క సంపూర్ణ పోలిక, రక్త సంబంధియగు విమోచకుడు, రక్తము కారుచున్న గొఱ్ఱెపిల్ల ముందుకు వచ్చెను. చంపబడిన ఒక గొఱ్ఱెపిల్ల, రక్తము కారుచున్న ఒకరు, చంపబడి, నలుగగొట్టబడిన ఒకరు ముందుకు వచ్చి, ఆయన చేతిలో నుండి గ్రంథమును తీసుకున్నాడు. ఆ దినములు సమాప్తమాయెను. ఇపుడు ఆయన విమోచించినది దానిపై హక్కును పొందుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్! అది నా నుండి ఒక దానిని పంపుచున్నది.
121 మనమిపుడు చూస్తాము “ఆయన ఆరవ ముద్రను విప్పినపుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను,” అని యోహాను చెప్పాడు, అటు తరువాత ప్రకృతి అంతా గలిబిలియైపోయినది. చూశారా?
122 దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు, ఉదాహరణగా రోగులను స్వస్థపరచుట, గ్రుడ్డివారి కన్నులు తెరచుట మరియు గొప్ప కార్యములు.
123 అయితే మనమిక్కడ చూస్తున్నాము. ప్రకృతి వణికిపోవుట, అవును. ప్రకృతి అంతా. ఏం జరిగిందో చూడు, “ఆ—భూకంపము; సూర్యుడు నలుపాయెను. మరియు చంద్రుడు తన కాంతినివ్వలేదు; నక్షత్రములు కదలి పడిపోయినవి.” మరియు ఈ ఆరవ ముద్ర తెరవబడినపుడే ఎందుకు ప్రతీదీ జరిగినది. అది జరిగిన తరువాత, ఆ యొక్క హతసాక్షులను గూర్చి ప్రకటించిన వెంటనే. హతసాక్షులు ముగించబడ్డారు.
124 ఇపుడు, మనము ఆ సమయానికి ఎంతో సమీపముగానున్నాము. మనము ఏ సమయములోనైనా, చూశారా, ఎందుకనగా సంఘము ఎత్తబడుటకు సిద్ధముగానున్నది. అయితే జ్ఞాపకముంచుకోండి. ఈ సంగతులు జరుగునపుడు పెండ్లికుమార్తె ఇక్కడ ఉండదు. జ్ఞప్తించుకోండి. పెండ్లికుమార్తె వెళ్ళిపోయినది. వాటిలో దేని గుండా ఆమె వెళ్ళనవసరం లేదు. ఇది శ్రమల కాలము. సంఘము యొక్క శుద్ధీకరణ కాలము. అది ఆమెపై పెట్టబడియున్నది. దాని ద్వారా ఆమె వెళ్ళవలెను. పెండ్లి కుమార్తె కాదు. ఆయన ఆయన యొక్క ప్రియురాలను తీసికొనిపోవును. అవునండి. ఆమె విమోచింపబడినది. చూశారా, అది యొక విధమైన…అది ఆయన స్వంత ఎన్నిక. ఏ పురుషుడైన తన పెండ్లికుమార్తెను ఎన్నుకున్నట్లుగా ఆయన స్వంత ఎన్నిక. అవునా? ఇపుడు, భూకంపము.
125 లేఖనాలను ఇపుడు మనము పోలుద్దాం. నేను—నేను కోరుచున్నది…మీ యొద్ద పెన్సిల్ కాగితం యున్నదా? మీరు ఒకటి నాకై చేయాలని కోరుతున్నాను. మీరు వ్రాసుకోవాలనుకుంటే, ఇది వ్రాసుకోండి, ఎందుకనగా, మీరు టేపు తీసుకొనని యెడల వ్రాసుకోండి. ఇపుడు…మీరు చేస్తూ, మీరు నాతో ఇది చదవాలని కోరుతున్నాను.
126 ఈ గొప్ప సంఘటనను గూర్చి లేఖనములతో మనము పోల్చి చూచుచుండగా విమోచనా గ్రంథములోని ఆరవ ముద్రలో గల ఆ గొప్ప రహస్యమును, లేక మర్మమును మనము చూద్దాము. ఇపుడు గుర్తుంచుకోండి, ఇవి మరుగైయున్న మర్మములు. మరియు ఆరు ముద్రలు కలిపితే ఒక పెద్ద గ్రంథము. ఆరు చుట్టలు ఒక్కటిగా చుట్టబడియున్నవి. సంపూర్ణ విమోచనా గ్రంథాన్ని అంతా అది విప్పుతుంది. ఆ విధముగా సమస్త భూమి విమోచించబడినది.
127 ఆ కారణము చేత యోహాను ఏడ్చాడు. ఎందుకనగా ఎవరు గ్రంథాన్ని తీసికోకపోతే సృష్టి అంతా, ప్రతీది నశించిపోతుంది. ఆమె, తిరిగి కేవలం అణువులుగాను పరమాణువులగాను మరియు సూర్య వెలుగుగాను మారిపోవును. చివరకు సృష్టిగాని, వ్యక్తిగాని ఏమియు యుండదు. కారణం ఆ గ్రంథము యొక్క హక్కులను ఆదాము పోగొట్టుకొన్నాడు. అతడు అతని భార్య మాట వినినందున దానిని పోగొట్టుకున్నాడు. మరియు ఆమె దేవుని యొక్క వాక్యమునకు బదులుగా సాతాను తర్కమును విన్నది. అవునా? అది పోగొట్టబడెను.
128 అటు తరువాత, ఎవరైతే మార్గం తప్పించారో అట్టి సాతాను యొక్క మలిన హస్తాల్లోకి అది తిరిగి వెళ్ళలేదు. కాబట్టి ఏ దస్తావేజుయైనా వెళ్ళునట్లుగా అది తన స్వంత యజమానుని యొద్దకు తిరిగి వెళ్ళినది, చూశారా, తన యొక్క అసలైన యజమాని యొద్దకే వెళ్ళెను. ఆయన దానిని చేసిన సృష్టికర్తయైన దేవుడు. మరియు దానిని పట్టుకున్నవాడు ఆయన.
129 మరియు అక్కడ ఒక వెలయున్నది. అది విమోచన. విమోచనకు కొంత వెలయున్నది. అది చేయగలిగిన వారెవరు లేరు. కాబట్టి ఆయన చెప్పాడు, ఆయన చట్టములను చేశాడు. రక్తసంబంధి యొక్క స్వంత చట్టములు చేశాడు. తరువాత వారు ఎవరిని కనుగొనలేదు. ప్రతి మానవుడు లైంగిక చర్య ద్వారా జన్మించాడు. లైంగిక కోరిక ద్వారా జన్మించాడు; అతడు అసలైన పాపములో యుండెను. సాతాను మరియు హవ్వ, కనుక అతడు అది చేయలేకపోయెను. అతనిలో ఏమీ లేదు. ఏ పరిశుద్ధ పోపుగాని, పూజారి గాని, డాక్టర్ ఆఫ్ డివినిటి గాని, అతడెవరైనను, అతడు యోగ్యుడు కాడు. అతడు దేవదూత కానవసరంలేదు, ఎందుకనగా అతడు రక్తసంబంధి కావలసియున్నది. అతడు మానవుడు కావలసియున్నది.
130 దేవుడు మానవ శరీరము ధరించి కన్య జన్మ ద్వారా రక్తసంబంధియైయ్యాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. అది యూదుని రక్తము కాదు. అది అన్యుని రక్తము కాదు. అది దేవుని రక్తము. చూశారా? బైబిల్ చెప్తుంది, “దేవుని రక్తము ద్వారా మనము రక్షించబడితిమి.”
131 బిడ్డ తండ్రి యొక్క రక్తాన్ని కలిగియుంటాడు. అది మనకు తెలుసు. పురుష జాతి దేనిలోనైనా లైంగికము హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయును. కాబట్టి మనము చూస్తున్నాము, కోడిపెట్ట గ్రుడ్డు పెట్టును, అయితే పుంజు లేక మగది దానితో లేనట్లయితే అది పొదగదు. అది ఫలవంతము కాదు. స్త్రీ గ్రుడ్డును మోసుకొనిపోవు పొదిగో యంత్రం మాత్రమే. అయితే గ్రుడ్డు జీవము మగ దానిలోనుండి వచ్చును.
132 మరియు ఈ విషయములో, దేవుడు తానే పురుషుడైయుండెను. అందువలననే నేను చెప్తున్నాను, పైది క్రిందనున్నది, మరియు—మరియు పెద్దది పెద్దదిగా నున్నది. దేవుడెంతో ఘనుడైయుండి ఒక కన్యక గర్భములో ఒక చిన్న జీవ కణముగా మారి అంతటి అతి స్వల్పముగా తనకుతాను రూపుదాల్చుకొనుటచే ఆయన గొప్పవాడైయుండెను. మరియు అక్కడ ఆయన జీవకణములను రక్తమును ఉత్పత్తి చేసెను మరియు జన్మించి, భూమి పైన పెరిగాడు మరియు ఆ విధమైన కల్తీ లేని, ఏలాంటి శరీరేచ్ఛలు లేని ఒక ప్రారంభమును ఆయన కలిగియుండెను.
133 తరువాత ఆయన ఆ రక్తాన్ని మనకై అర్పించెను. ఎందుకనగా ఆయన మనకు రక్తసంబంధి ఆయెను. ఆయన రక్తసంబంధియైన విమోచకుడు. ఆ రక్తాన్ని ఆయన మనకు ఉచితముగా చిందించెను. ఆయన దానిని చేయనవసరము లేదు. విమోచించుట కొరకు ఆయన ఉచితముగా మనకిచ్చాడు.
134 అటుతరువాత దేవుడు తన చేతులలో విమోచనా గ్రంథమును పట్టుకొనియుండగా దేవుని బలిపీఠము పైకి వెళ్ళి అక్కడ వేచియుండెను. మరియు రక్తము కారుచున్న గొఱ్ఱెపిల్ల అర్పణ బలిపీఠము మీద నిలబడియున్నది. విమోచించుటకు మధ్యవర్తిత్వము చేయుచు అక్కడ గొఱ్ఱెపిల్ల యున్నది.
135 తరువాత, మరియ గాని, లేక యోసేపు గాని లేక ఏ ఇతర మర్త్యులు గాని కాగలుగుతారు…మధ్యవర్తులుగా కాగలుగుతారు అని ఎవరైన చెప్పడం ఎంత ధైర్యం! అక్కడ రక్తముండకుండా మధ్యవర్తిత్వము మీరు చేయలేరు. అవునండి. “దేవునికి మరియు మానవునికి మధ్య ఒకే ఒక మధ్యవర్తి యున్నాడు, ఆయన యేసుక్రీస్తు.” అదే లేఖనము చెప్తుంది. ఆఖరి ఆత్మ విమోచించబడువరకు ఆయన అక్కడ నిలబడియున్నాడు; అటు తరువాత ఆయన విమోచించిన దానిని స్వంతము చేసికొనుటకు ఆయన వచ్చును. ఓ, ఎంతటి—ఎంతటి గొప్ప తండ్రి ఆయన!
136 ఇపుడు జ్ఞప్తించుకోండి, ఇపుడు, నేనెల్లపుడు అది బోధిస్తుంటాను, “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట వచ్చు ప్రతి మాట స్థిరపరచబడును” అని. మరియు లేఖనము, నీవు ఒక లేఖనము తీసికొని దాని ద్వారా ఏదియు నిరూపించలేవు, దానితో ఒకటి కలిసియుంటే తప్ప. అవునా?
137 చూశారా, నేనొక లేఖనము తీసికొని “యూదా వెళ్ళిపోయి ఉరివేసికొనెను,” అని చెప్పి మరొకటి తీసికొని, “నీవు వెళ్ళి అదే చేయ్” అని చెప్తే. చూశారా? అయితే చూశారా అది దాని యొక్క మిగతా దానితో కలవదు.
138 నేను తలంచాను, ఈ ఆరవ ముద్ర క్రిందనున్నది, పరిశుద్ధాత్మ దానిని విప్పినపుడు అదేంటో నేను చూశాను. తరువాత నేను అనుకున్నాను ఈ రాత్రి ఒకటి చిన్నది వ్యత్యాసకరమైనది తరగతికి ఇచ్చుట ఒక మంచి విషయము అనుకున్నాను. చూశారా? కారణం, నేను మాట్లాడిన దానికి మీరు విసిగిపోయి యుండవచ్చు. కాబట్టి దానిని వేరే విధముగా చేద్దాం అని అనుకొంటిని.
139 ఇపుడు గమనించండి. ఈ గొప్ప సంఘటన విమోచన యొక్క మర్మమైన గ్రంథములో ముద్రించబడియున్నది. ఇపుడు గొఱ్ఱెపిల్ల ఆయన చేతిలో దానిని కలిగియున్నాడు, దానిని విప్పబోవుచున్నాడు.
140 ఇపుడు మత్తయి 24వ అధ్యాయము చూద్దాం, గొఱ్ఱెపిల్ల తానే మాట్లాడుచున్నాడు. ఇపుడు దానిని గూర్చి ఎరిగినంత వరకు గ్రంథాన్ని అంతటికి గ్రంథకర్త క్రీస్తు అని ఎవరికైనా తెలుసు. అయితే ఇది—ఆయన యొక్క వర్తమానము లేక ఆయన ప్రసంగము ప్రజలకు, సరే, యూదులకు.
141 ఇపుడు, మీరు మీ యొక్క గ్రంథమును ఈ విధముగా పట్టుకోవాలని కోరుచున్నాను. మత్తయి 24 మరియు ప్రకటన 6 ఈ విధంగా [సహోదరుడు బ్రాన్హాం ఈ రెండు అధ్యాయాలు తెరచి, తన బైబిల్ ను పట్టుకున్నాడు—సంపా.] కొద్దిగా ఇక్కడ ఒక దానిని పోల్చుదాము.
142 ఇపుడు, ఇపుడు దీనిని గమనించండి. అదేమిటని మీరు కనుగొంటారు. చూస్తున్నారా. ఇక్కడ గొఱ్ఱెపిల్ల ఏమి చూపుతుందో, స్పష్టంగా సూచనలో ఇక్కడ వాక్యములో ఆయన చెప్పాడు. ఖచ్చితంగా ఆలాగే చేయుచున్నాడు. కనుక అది నిజమగుచున్నది. ఇపుడు, అందులో యున్నదంతా అదే. ఇక్కడ…ఇక్కడ యొకటి, దానిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు మరియు ఇక్కడ అది జరిగినది. చూస్తున్నారా? ఇది సంపూర్ణమైన నిదర్శనం.
143 ఇపుడు మనము పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము మరియు ప్రకటన 6 మరియు మత్తయి 24వ అధ్యాయముతో పోల్చుదాము. ప్రతి యొక్క పండితుడు, ప్రతి యొక్క వ్యక్తి శ్రమ కాలమును గూర్చి మాట్లాడునది అదే అధ్యాయమని మనందరికి తెలుసు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో నుండి అది వస్తుంది. మరియు ఇపుడు మనము…అది ఆలాగైతే…ఎందుకనగా ఈ ఆరవ ముద్ర తీర్పు ముద్రయని మనకు తెలుసు. ఇది తీర్పు ముద్ర, ఖచ్చితంగా అది అదే.
144 ఇపుడు చూడండి, అంత్యక్రీస్తు స్వారీచేయుట మనము చూశాము. సంఘము వెళ్ళిపోవుట చూశాము; ఇది అయిపోయినది, వెళ్ళిపోయినది. తరువాత బలిపీఠము క్రిందనున్న, అక్కడ యూదులను హత సాక్షులను చూశాము. ఇపుడు ఇక్కడ జనులపై న్యాయతీర్పు వచ్చుచున్నది…
145 ఈ శ్రమల ద్వారా తీర్పునొంది దాని ద్వారా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు వచ్చుచున్నారు. వారు యూదులని, అన్యజనులు కాదని నేను మీకు రుజువు చేస్తాను. పెండ్లికుమార్తెతో ఏ ఒక్క విషయములోను సంబంధము లేదు. పెండ్లికుమార్తె వెళ్ళిపోయి యున్నదని మనము చూశాము. మీరు దానిని ఎక్కడా అన్వయించలేరు; అపొస్తలుల కార్యములు పుస్తకములోని 19వ అధ్యాయం వరకు తిరిగి రాదు.
146 ఇపుడు గమనించండి. ఆరవ ముద్ర వాక్యము యొక్క న్యాయ తీర్పు ముద్ర.
147 ఇపుడు, ఇక్కడ, ఇపుడు మనము ప్రారంభిద్దాము మరియు పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము మనము చదువుదాము. ఇపుడు, మీకు ఒక సంగతిని మీతో చెప్పాలని దానిని కనుగొనవలెనని నేను చూస్తున్నాను. ఇపుడు, పరిశుద్ధ మత్తయి 1 నుండి 3 వరకు మొదట అక్కడ నుండి ప్రారంభిద్దాము.
యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
ఇపుడు, మరియు (3వ వచనము) ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి యున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును?…నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా.
148 ఇపుడు అక్కడ మనం నిలుపుచేద్దాం. ఈ మూడు వచనాలు జరిగినదెప్పుడనగా, వాస్తవంగా క్రీస్తు తరువాత 30వ సంవత్సరము ఏప్రిల్ నాలుగవ మంగళవారము మధ్యాహ్నము. మరియు మొదటి రెండు వచనాలు జరిగినది క్రీస్తు తరువాత 30వ సంవత్సరము ఏప్రిల్ మధ్యాహ్నము. మరియు 3వ వచనము జరిగినది, అదే రోజు మంగళవారము సాయంత్రం. చూశారా?
149 వారు దేవాలయమునకు వచ్చారు. ఆయనను ఈ విషయాలు అడిగారు. “ఇది ఏంటి? మరియు ఇదేంటి? ఈ గొప్ప ఆలయాన్ని చూడు! అది అద్భుతం కాదా?”
ఆయన చెప్పాడు, “రాతి మీద రాయి నిలచియుండదు” అని.
150 తరువాత ఆయన వెళ్ళిపోయి పర్వతం పైన కూర్చున్నాడు. అవునా. అక్కడ ఆయన ప్రారంభించాడు. అది మధ్యాహ్నము. అటు తరువాత, ఆయనను వారక్కడ అడిగారు, “కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలని యున్నాము,” అని.
151 ఇపుడు గమనించండి, యూదుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా ఇక్కడ మూడు ప్రశ్నలు అడుగబడినవి. మూడు ప్రశ్నలు అడుగబడినవి. ఇపుడు గమనించు. “ఏంటి,” మొదటిది, మొదటిది, “ఏంటి…? ఇవి ఎప్పుడు జరుగును, ఎప్పుడు, ‘రాతి మీద రాయి నిలువబడనిది’?” “నీ రాకడకు సూచన ఏది?” రెండవ ప్రశ్న. “మరియు యుగానికి అంతము?” అది చూశారా? మూడు ప్రశ్నలు.
152 ఇపుడు, అక్కడే అనేకమంది తప్పు చేస్తున్నది. ఈ విషయాలను వారు ఒక కాలానికి అనువర్తింపజేస్తున్నారు. మీరు చూడండి, మూడు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చుచున్నాడు. వారు…
153 అదెంత చక్కగానున్నదో—ఇపుడు గమనించండి, 3వ వచనము, చూడండి, 3వ వచనములో ఆఖరి భాగము. “మరియు ఏమి జరుగును…?” మొదటిగా, ఎవరూ లేనపుడు ఒలీవ పర్వతమునకు వారు ఆయనను పిలచి, “ఈ సంగతులు ఎప్పుడు జరుగును, మాతో చెప్పుము?” అని అడిగారు. ప్రశ్న సంఖ్య ఒకటి. “నీ రాకడకు సూచన ఏది?” ప్రశ్న సంఖ్య రెండు. మరియు “యుగాంతము?” ప్రశ్న సంఖ్య మూడు. చూశారా? మూడు వ్యత్యాసకరమైన ప్రశ్నలు అడుగబడినవి. ఇపుడు మీరు త్రిప్పి చూచి, ఈ విషయాలు గూర్చి యేసు ఇక్కడ వారికి ఏమని చెప్పినది మీరు గమనించాలని మిమ్ములను కోరుచున్నాను.
154 ఓ, అదెంతో రమ్యమైనది. నేను…నన్నది…నేను—నేను—నేను…గత రాత్రి ఏ మాటను మనము వినియోగించాము? [సమాజము “ఉత్తేజము,” అని చెప్తుంది.—సంపా.] ప్రత్యక్షత నుండి ఉత్తేజము! గమనించు.
155 ఇపుడు మనమిపుడు మొదటి ముద్రకు ఈ గ్రంథములోని ముద్రలు త్రిప్పుదాము. ఈ మొదటి ముద్రను ఈ మొదటి ప్రశ్నకు పోల్చుదాం.
156 మరియు ప్రతి ప్రశ్నను, దానిని ఆ విధముగా క్రిందనున్న వాటితో పోల్చి చూడండి. మరియు సంఘకాలములు మరియు ఇతర కార్యములు గూర్చి మనము ఏలాగు చూచితిమో అదే విధముగా ఒకదానితో ఒకటి జతపరచబడ్డాయా లేదాయని పోల్చి చూడండి. అక్కడ ముద్ర పరిపూర్ణముగా తెరవబడినది. తరువాత గమనించండి, ఇపుడు మొదట మనము చదవబోతున్నాము…“తరువాత ఆయన వారితో చెప్పాడు…” మరియు—మరియు, ఆయన—ఆయన వారికిపుడు జవాబివ్వబోతున్నాడు, ముద్రలతో దానిని మనము పోల్చుదాం.
157 ఇపుడు గమనించు, మొదటి ముద్ర, ప్రకటన 6:1 మరియు 2. ఇపుడు మనము 6:1 మరియు 2 చదువుదాం.
ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.
మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్ళెను.
158 ఇతడెవరని మనము కనుగొనియున్నాము? [సభ “అంత్యక్రీస్తు” అని చెప్పినది.—సంపా.] అంత్యక్రీస్తు. మత్తయి 24 ఇపుడు 4 మరియు 5
యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.
159 అది చూశారా? అంత్యక్రీస్తు. అక్కడే మీ ముద్రయున్నది. చూశారా? చూశారా? ఆయన ఇక్కడ మాట్లాడాడు; వారు ఇక్కడ ముద్ర విప్పియున్నారు మరియు అతడు ఇక్కడ యుండెను పరిపూర్ణంగా.
160 ఇపుడు రెండవ ముద్ర, మత్తయి 24:6, ప్రకటన 6:3 మరియు 4. ఇపుడు గమనించండి, మత్తయి 24:6, ఇపుడేమి చెప్పబడినదో నన్ను చూడనివ్వండి.
మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
161 సరే, రెండవ ముద్ర తీసుకుందాము, ప్రకటన 6:3 మరియు…రెండు. ఆయన ఏమి చెప్తున్నాడో ఇపుడు.
ఆయన రెండవ ముద్రను విప్పినపుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.
అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱము మీద కూర్చున్న వానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
162 పరిపూర్ణంగా ఖచ్చితంగా యున్నది. లేఖనము దానికదే జవాబు చెప్పుటను నేను ఇష్టపడుచున్నాను. మరి మీరు [సభ, “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] పరిశుద్ధాత్మ ఇదంతా వ్రాశాడు, అయితే ఆయనది బయలుపరచగలడు.
163 ఇపుడు మూడవ ముద్రను గమనిద్దాం. ఇపుడు ఇది కరువు. ఇపుడు మత్తయి 24:7 మరియు 8. మత్తయిలో 7 మరియు 8 తీద్దాం.
జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.
164 ఇపుడు మీరు సరిగా పైకి వస్తున్నారు. ఇపుడు ప్రకటనలో 6 లో మనం మూడవ ముద్ర విప్పబోతున్నాము. అది ప్రకటన 6:5 మరియు 6 లో ఉంది.
ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి యుండెను.
మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనబడెను.
165 కరువు! చూశారా, ఖచ్చితంగా అదే ముద్ర, అదే విషయం యేసు చెప్పినది. సరే.
166 నాల్గవ ముద్ర, “తెగుళ్ళు” మరియు “మరణము.” గమనించండి. మత్తయి 24. మనం 8వ వచనం చదువుదాం. 7 మరియు 8. అదే అనుకుంటాను, ఈ నాల్గవ ముద్ర ఇక్కడుంది. సరే.
167 ఇపుడు, వెనుక ఏమి చదివాను నేను? ఒకటి తప్పు చదివానా? ఆ. నేను దానిని గుర్తుంచుకున్నాను. ఆ, అక్కడే మనమున్నాము. ఇపుడు మనము వెళ్తున్నాము. ఇపుడు వెళ్దాము, సరేనండి.
168 ఇపుడు మనము 7న ప్రారంభిద్దాము, ఈ నాల్గవ ముద్ర మీద; మరియు 6:7 మరియు 8, మరొకదాని మీద, ప్రకటనలో.
169 ఇపుడు మనము మత్తయి 24:7, 8 చూశాము. సరే, ఇపుడు.
మరియు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరువులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.
170 ఇపుడు నాలుగవ ముద్ర మనమిక్కడ చదివియుండగా…నాలుగవ ముద్ర 7 మరియు 8 తో ప్రారంభమగుచున్నది, ఈ ఆవలి వైపున.
ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుఱ్ఱము కనబడెను…
171 ఇపుడు ఆగు, నేనిది తప్పుగా వ్రాసుకున్నాను. అఁ ఆఁ. ఇపుడొక నిమిషము. ఇపుడు 7 మరియు 8.
172 ఇపుడు చూద్దాం, మత్తయి 24:7 మరియు 8. ఇపుడు మనమది తీద్దాం. అది మూడు, విప్పబడుట, అదే కదా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] మత్తయి 24:7 మరియు 8. నన్ను క్షమించండి. ఇపుడు అది వర్షమును…లేక కరువును తెరచుచున్నది, కరువును తెరచుచున్నది. సరే.
173 ఇపుడు, “తెగుళ్ళు” మరియు “మరణము.” అవునండి. ఇపుడు దానికి మనము వెళ్తున్నాము, 7 మరియు 8. ఇపుడది నాలుగవ ముద్రయౌతుంది. నాలుగవ ముద్రను మనము ఎక్కడ పొందబోవుచున్నామో మనము చూద్దాం. “ఆయన నాలుగవ—నాలుగవ ముద్రను విప్పినపుడు…” అవును, అది పాండుర వర్ణ గుఱ్ఱము స్వారీ చేయువాడు, “మరణము” చూశారా.
మరియు—మరియు—అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుఱ్ఱము కనబడెను; మరియు ఆయన…దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూరమృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికియ్యబడెను.
174 ఇపుడు, చూడండి, అది “మరణమై” యుండెను.
175 ఇపుడు, అయిదవ ముద్ర, మత్తయి 24:9-13. ఇది సరిగా తీసికున్నానా, చూద్దాం. ఇపుడు మరలా, చూడండి?
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు (అక్కడే నీవున్నావు): మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు.
అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.
176 ఇపుడు మనము అయిదవ ముద్రలో ఉన్నాము. అది గత రాత్రి, చూశారా “ఆ విధముగా ఒకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.”
177 ఇపుడు ఆరును గమనించు, ముద్ర, 6:9 నుండి 11 వరకు. ఇపుడు అది తీద్దాము. ప్రకటన 6:9 నుండి 11 వరకు.
ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
178 ఇపుడు మీరు చూడండి. అయిదవ ముద్ర క్రింద, మనము—మనము హతసాక్షులను చూస్తున్నాము.
179 మరియు ఇక్కడ 24:9లో, 13 వరకు అది హతసాక్షులని మనము చూస్తున్నాము. “వారు మిమ్ములను అప్పగింతురు మరియు మిమ్ములను చంపెదరు,” మరియు ఆలాగు చేస్తారు. చూడు, అదే ముద్ర విప్పబడుచున్నది.
180 ఇపుడు, ఆరవ ముద్రలో, ఇపుడు మనము మత్తయి 24:29, 30 కి వస్తున్నాము. 24:29 మరియు 30 ఇక్కడ మనమున్నాము.
ఇపుడు మనము ప్రకటన 6:12 నుండి 17 వరకు తీసికోబోతున్నాము.
181 అదే ఖచ్చితంగా మనమిపుడు చదివింది. ఇది ఇపుడు విను. మత్తయి 29, 24:29 మరియు 30 లో యేసు చెప్పినది.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే…
182 ఏంటి? ఎప్పుడు…ఈ శ్రమ, ఈ చిన్న శ్రమలు గుండా వారు వెళ్ళారు. చూశారా?
…చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును.
అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమి మీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.
183 ఇపుడు, ఇక్కడ ప్రకటనలో చదవండి, ఆరవ ముద్ర, దానిని ఇపుడే మనము కలిగియున్నాము.
మరియు…ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె (చూశారా?) నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను.
భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.
184 తప్పక సంపూర్ణంగా ఉన్నది. వెనకకు త్రిప్పి చూడు, ఇపుడు మత్తయి 24:29 లో యేసు ఏమి చెప్పాడో, విను. “తరువాత” ఈ ఐక్ మాన్ ఇతరులు.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును.
ఇప్పుడు గమనించండి.
అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమి మీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.
మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు నలుదిక్కుల నుండి వారిని పోగుచేతురు.
185 చూడండి, ఖచ్చితం. యేసు, మత్తయి 24 లో ఏమి చెప్పాడో మరియు ప్రత్యక్షత పొందిన అతడు ఆరవ ముద్రలో ఏమి తెరచాడో అది నిజంగా ఖచ్చితముగా పోల్చబడింది. మరియు యేసు శ్రమకాలంను గూర్చి మాట్లాడుచుండెను. [సహోదరుడు బ్రాన్హాం వేదికను మూడుసార్లు తట్టెను—సంపా.] చూశారా?
186 మొదటిగా అతడు అడుగుచున్నాడు, ఈ సంగతులు ఎప్పుడు జరుగునని, ఆలయము ఎప్పుడు తీసివేయబడునని. ఆయన దానికి జవాబిచ్చాడు. తరువాత విషయము అతడు అడిగాడు, హతసాక్షుల కాలము ఎప్పుడు వచ్చునని. అది ఎప్పుడు జరుగును, అంత్యక్రీస్తు ఎప్పుడు లేచును. మరియు ఎప్పుడు అంత్యక్రీస్తు ఆలయమును కొల్లగొట్టును.
187 దానియేలు, మనము వెనుకకు వెళ్ళి, అక్కడ దానియేలులో తీసుకొని ఈ అధిపతి ఎప్పుడు వచ్చునో, దానిని గూర్చి ఎట్లు చెప్పాడు. చదువుచున్న వారలారా మీకు తెలియును. అతడేమి చేయును? అతడు అనుదిన అర్పణను తీసివేయును. ఆ సమయములో జరిగినదానంతటిని చెప్పాడు.
188 చివరకు, యేసు అది ఇక్కడ మాట్లాడుతున్నాడు, అది గుర్తుంచుకోండి. చెప్పాడు, “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే ప్రవక్త దానియేలు ద్వారా పలుకబడినది.” [సహోదరుడు బ్రాన్హాం వేదికను మూడు సార్లు తట్టుచున్నారు—సంపా.] ఏంటది? ఓమర్ మసీదు. ఎక్కడైతే వారది కాల్చివేశారో ఆ ఆలయ స్థలములో అది నిలిచియున్నది. చెప్పబడినది “కొండలలో నుండువారు…ఇంటిపై నుండువారు, క్రింద ఇంటిలో నున్న వస్తువులను తీసికొనుటకు దిగిరావద్దు లేక పొలములోనున్నవారు తిరిగి రావద్దు. ఏలయనగా శ్రమకాలము వచ్చును!” మీరు చూస్తున్నారా? మరి ఇవన్ని జరుగును. ఈ సంగతులన్నియు జరుగును. ఆరవ ముద్ర తెరవబడుట యొద్దకు అది కొనిపోయి దానిని రుజువుచేయును.
189 ఇపుడు, మీరు గమనించాలని కోరుచున్నాను. యేసు…ఇపుడు రేపు రాత్రి గురించి, దీని మీద, యేసు ఏడవ ముద్రను బోధించుట విడిచిపెట్టాడు. అది ఇక్కడ లేదు. గమనించండి. దాని తరువాత, ఆయన ఉపమానరీతిగా వెళ్ళాడు. యోహాను ఏడవ ముద్రను వదిలిపెట్టాడు. ఏడవది, ఆఖరిది, ఏడవ ముద్ర, అది గొప్ప విషయం కాబోతుంది. చివరికది వ్రాయబడలేదు కూడా. అవునా. ఏడవ ముద్ర విడిచిపెట్టబడింది, ఇద్దరూ ఆలాగు చేశారు. ప్రత్యక్షత కర్త, దేవుడు అక్కడ చెప్పినపుడు, యోహాను చెప్పాడు, “పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను.” అందును గూర్చి యేసు ఒక మాట కూడా చెప్పలేదు.
190 గమనించండి ఇపుడు, వెనుక 12వ వచనము. గమనించు. జీవిలేదు. 12వ వచనము. మన ముద్ర ప్రారంభమౌట. అది విప్పబడుట చూడగలము. ఏ మృగము, జీవి ఏది ప్రతినిధిగా లేదు, అయిదవ ముద్రలో వలే…ఎందుకని? ఇది జరిగినది సువార్త కాలము యొక్క అవతల కోణమున. శ్రమకాలమున, ఈ ఆరవ ముద్ర శ్రమ కాలము, అదే జరిగినది. పెండ్లికుమార్తె వెళ్ళిపోయినది. అవునా! ఏలాటి జీవిగాని లేక ఏదిగానీ చెప్పుటకు అక్కడలేదు. అది…దేవుడు సంఘముతో ఇక సంప్రదింపు చేయడు. అది వెళ్ళిపోయినది.
191 ఇశ్రాయేలీయులతో ఆయన సంప్రదింపు చేస్తున్నాడు. చూశారా. చూశారా. ఇది మరొక ప్రక్క ఇది ప్రకటన 11 లోని ఇద్దరు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులు రాజ్య వర్తమానమును స్వీకరించినపుడు. జ్ఞప్తించుకో. ఇశ్రాయేలు ఒక దేశము. దేవుని దాసుడు, రాజ్యము దేశము. మరియు ఇశ్రాయేలీయులు లోనికి తీసుకురాబడినపుడు అది యొక—ఒక దేశ వ్యవహారము.
192 ఇశ్రాయేలు ఒక రాజ్యపు యుగము. ఎక్కడైతే దావీదు…దావీదు కుమారుడు సింహాసనముపై కూర్చుండును. ఆ కారణము చేత “దావీదు కుమారుడా!” యని ఆ స్త్రీ కేకవేసినది. మరియు దావీదు…దావీదు కుమారుడు! ఆయన తన యొక్క కుమారుని లేపి తన సింహాసనము తీసికొనునని దేవుడు ఆయన తోడని ప్రమాణము చేశాడు. అది నిరంతరముండు సింహాసనం. చూశారా? దానికి అంతము లేదు. సొలొమోను ఒక మాదిరిగా ఆలయములో ఇచ్చెను, మరియు యేసు ఇక్కడ వారితో చెప్పాడు, “రాతి మీద ఒక రాయి కూడా విడిచిపెట్టబడదు” యని. అయితే ఆయన ఇక్కడ వారితో చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు, ఏమిటి…ఆయన తిరిగి వచ్చుచున్నాడు.
“నీవు ఎప్పుడు తిరిగి వస్తావు?”
193 “నేను తిరిగి రాకముందు ఈ సంగతులు జరుగును.” ఇక్కడవి ఉన్నవి!
ఇపుడు మనము శ్రమకాలంలో ఉన్నాము.
జ్ఞప్తించుకోండి, భూమి మీద రాజ్యము స్థాపింపబడునపుడు…
194 ఇది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చును. ప్రశ్నయున్నట్లయితే, మీరు—ఇపుడు మీరు నన్ను అడుగవచ్చును; మీకు ప్రశ్నయుంటె దాని తాకవచ్చు; మీకు లేకపోతే, మీకు తెలియనట్లయితే.
195 వెయ్యేండ్ల పాలన కాలములో, ఇశ్రాయేలు ఒక దేశము, పండ్రెండు గోత్రములు ఒక దేశముగా నుండును.
196 అయితే పెండ్లికుమార్తె అంతఃపురములో నుండును. ఇపుడామె రాణి. ఆమె వివాహితురాలు. మరియు భూనివాసులందరు ఈ నగరానికి, యెరూషలేముకు వస్తారు, మరియు వారు తమ మహిమను తీసికొని వస్తారు. “మరియు రాత్రులలో తలుపులు మూయరు, ’ఎందుకనగా ఇక ఏలాటి రాత్రి యుండదు.” చూశారా? గుమ్మములు తెరువబడును. “మరియు భూ రాజులు,” ప్రకటన…:22 “వారి యొక్క ఘనతను మరియు మహిమను ఈ నగరములోకి తీసికొనివస్తారు.” అయితే పెండ్లికుమార్తె గొఱ్ఱెపిల్లతో కలసి అచ్చట యుంటుంది. ఓ, మై, అక్కడ మీరు చూడగలుగుచున్నారా! కాదు…పెండ్లికుమార్తె ఇక్కడ ద్రాక్షతోటలో శ్రమపడదు. లేదండి. ఆమె పెండ్లికుమార్తె. ఆమె రాజుకు రాణి. అక్కడ పనిచేయువారు ఇతరులు, దేశము, పెండ్లికుమార్తె కాదు. ఆమేన్. సరే.
197 ఇపుడు ఈ వర్తమానికులను గమనించు, ప్రకటన 12 లోని ఈ వర్తమానికులను, ఈ ఇద్దరు ప్రవక్తలు “రాజ్యము సమీపముగానున్నదని!” వారు బోధించనైయున్నారు. చూశారా? పరలోక రాజ్యము స్థాపింపబడవలెను. కాలము, ఆయన ప్రజలైన యూదులకు వాగ్దానము చేయబడిన దానియేలు డెబ్బది వారములోని మూడున్నర సంవత్సరములు. జ్ఞప్తించుకోండి. అది రుజువు చేయుటకు, ఇది దానియేలు డెబ్బది వారములోని చివరి భాగము. రేపటికి దానిమీద నాకొక ప్రశ్నయుంటుంది. అవునా.
198 ఇపుడు, డెబ్బది వారములు వాగ్దానము చేయబడినవి, అవి ఏడు సంవత్సరములు. మరియు ఏడు వారముల మధ్య ఒక అర్పణగా చేయబడుటకై మెస్సీయా కొట్టబడును. ఆయన మూడున్నర సంవత్సరములు ప్రవచించి, ప్రజలు అర్పణయగుటకై కొట్టివేయబడును. ఆ మూడున్నర సంవత్సరములు ఇంకను ఇశ్రాయేలీయుల కొరకు నిర్ణయింపబడియున్నవి. అది ఇంకను ఒక నిశ్చయమే. తరువాత మెస్సీయా కొట్టివేయబడినపుడు, యూదులు మెస్సీయాను చూడకుండునట్లు వారు గ్రుడ్డివారుగా చేయబడ్డారు.
199 మరియు, అటు తరువాత, మెస్సీయా కొట్టివేయబడినపుడు, అటు తరువాత సువార్త, కృపాకాలము అన్యుల యొద్దకు వచ్చినది. మరియు వారు వచ్చినపుడు, దేవుడు ఒకరిని ఇక్కడ నుండి మరియు అక్కడ నుండి, ఇక్కడ మరియు అక్కడ నుండి లాగి, వర్తమానికుల క్రింద పెట్టాడు; మరియు ఇక్కడ, అక్కడ మరియు ఇక్కడ, అక్కడ లాగి వారిని వర్తమానికుల క్రింద ఉంచాడు.
200 మొదటి వర్తమానికుని ఆయన పంపాడు. అతడు బోధించాడు మరియు బూర ఊదబడింది; కొద్దిసేపైన తరువాత మనమది తీసుకుంటాము. అటుతరువాత బూర యుద్ధాన్ని తెలియజేస్తున్నది. బూర ఎప్పుడు కూడా యుద్ధాన్ని నిర్వచిస్తుంది. వర్తమానికుడు, భూమి మీద దూత, కాలానికి వర్తమానికుడు, లూథర్ వలె, మనము మాట్లాడు ఏ వర్తమానికుని వలెనైనా. అతడేమి చేయును? అతడు వచ్చును. మరియు ఒక ముద్ర విప్పబడెను, బయలుపరచబడెను; బూర ధ్వనించును, యుద్ధము ప్రకటించబడినది, వారు వెళ్తారు. తరువాత వర్తమానికుడు చనిపోతాడు. ఆయన ఈ గుంపును ముద్రిస్తాడు, వారు లోపల పెట్టబడతారు. దానిని నిరాకరించిన వారిపైకి తెగుళ్ళు వచ్చును. చూశారా?
201 అది ఆలాగు సాగిపోతుంది, తరువాత వారు సంస్థాపకం చేస్తారు, వేరొక సంస్థాపకం చేస్తారు. మనము ఇపుడే దానిగుండా వచ్చాము. తరువాత, ఇక్కడ వారు ఇంకొక శక్తితో వచ్చారు. చూశారా, ఇంకొక శక్తి, సంఘము యొక్క మరొక కాలము, మరొక పరిచర్య. ఆ తరువాత, అతడు అది చేసిన తరువాత వెనువెంటనే దేవుడు తన పరిచర్యతో వచ్చుచున్నాడు, అంత్యక్రీస్తు తన దానితో వచ్చినపుడు. చూశారా, యాంటి అనగా “వ్యతిరేకము.” వారు ఒకరి ప్రక్క ఒకరు వెళ్ళుచున్నారు.
202 మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కయీను భూమి మీదికి వచ్చినపుడే, హేబెలు భూమి మీదికి వచ్చాడు. మీరిది గమనించాలని కోరుతున్నాను. క్రీస్తు భూమి మీదికి వచ్చినపుడే యూదా భూమి మీదికి వచ్చాడు. క్రీస్తు భూమి మీద నుండి వెళ్ళిపోయిన సమయములోనే యూదా భూమి మీద నుండి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడిన అదే సమయమున అంత్యక్రీస్తు ఆత్మ పడెను. కడవరి దినాలలో పరిశుద్ధాత్మ తనకుతాను బయలుపరచుకొను అదే సమయమున, అంత్యక్రీస్తు తన రంగులు చూపుతూ, తన రాజకీయాలు మిగతా వాటి ద్వారా వచ్చుచున్నాడు. మరియు అంత్యక్రీస్తు తాను రంగములో పూర్తిగా కదలాడు సమయములో దానినంతటిని విమోచించుటకు దేవుడు తనకు తాను కదలుచున్నాడు. చూశారా, కేవలం పరుగు, రెండు ప్రక్కగా…కయీను మరియు హేబెలు! [సహోదరుడు బ్రాన్హాం తన చేతులు కలిపి ఒకసారి చప్పట్లు కొట్టాడు—సంపా.] ఓడ మీద కాకి పావురము. యూదా మరియు యేసు. అలా క్రిందకు మీరు తీసికొనవచ్చు. ఆలాగు…
203 ఇక్కడ మోయాబు మరియు ఇశ్రాయేలీయులు. ఇద్దరు. మోయాబు అన్యదేశము కాదు. కాదండి. ఇశ్రాయేలీయులు అర్పించు అదే అర్పణను వారు అర్పించెడివారు. ఒకే దేవునికి వారు ప్రార్థించేవారు. ఖచ్చితం. మోయాబు…లోతు కుమార్తెలలో ఒకరు తన తండ్రితో పండుకొని, బిడ్డను కనెను. ఆ బిడ్డ మోయాబు. మోయాబు వంశము అతని నుండి విస్తరించెను, మోయాబు దేశము.
మరియు విమోచించబడిన వారి సహోదరుడగు ఇశ్రాయేలును వారు చూచి వచ్చారు.
204 వారు సనాతన వాదులు. వారు ఒక పెద్ద సంస్థాపకము. ఇశ్రాయేలీయులకు ఏ సంస్థాపకము లేదు; ఆమె ఎక్కడకు వెళ్ళినా గుడారములలో నివాసముండెడిది. అయితే మోయాబు వారికి హోదాగలవారు, రాజులు మొదలగు వారుండిరి. మరియు వారికి, అక్కడ బిలాము, ఒక—ఒక అబద్ధ ప్రవక్త యుండెను. వారికి ఇదంతా ఉన్నది. వారు తన వాగ్దానమైన వాగ్దాన భూమి రహదారిన వెళ్తున్న వారి చిన్న సహోదరుని శపించుటకు వారు అక్కడకు వచ్చారు.
205 అతడు వెళ్ళి వారినడిగాడు “నేను మీ దేశము గుండా దాటిపోవచ్చునా? నా ఆవులు నీళ్ళు త్రాగితే నేను దానికి వెల చెల్లిస్తాను. అవి గడ్డినాకితే, మేము దానికి చెల్లిస్తాము.”
206 అతడన్నాడు, “లేదు. మీరు ఈ చుట్టుప్రక్కల ఏలాంటి ఉజ్జీవ కూటములు జరుపకూడదు. అవును. మీరు ఆ విధమైన దానిని ఈ చుట్టుప్రక్కల జరుపకూడదు.”
207 అటుతరువాత అతడేమి చేశాడో గమనించు. అతడు మరలా యెజెబెలు రూపమున వచ్చి మరియు అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చి దేవుని ప్రజలు తప్పు చేయుటకు కారకుడయ్యాడు మరియు మోయాబు స్త్రీలను ఇశ్రాయేలీయులు వివాహము చేసికున్నారు, మరియు వ్యభిచారానికి కారకులయ్యారు.
208 మనమున్న ప్రయాణములో, వాగ్దాన భూమి రహదారిలో, అదేకాలంలో అతడు అదే చేశాడు. అతడేమి చేశాడు? అబద్ధ ప్రవక్త వచ్చి వివాహము చేసుకున్నాడు, ప్రొటస్టెంట్ సంఘములోకి పిలచి సంఘశాఖల కారకుడయ్యాడు. అక్కడ వెనుక ఏమిచేశారో ఖచ్చితంగా ఆలాగే. [సహోదరుడు బ్రాన్హాం వేదికను నాలుగుసార్లు కొట్టాడు—సంపా.]
209 అయితే, పాత ఇశ్రాయేలు ఆలాగే ముందుకు కొనసాగుచున్నది. ఆమె అరణ్యములో చాలాకాలము గడిపినది. ఆ పాత యుద్ధ వీరులంతా చనిపోవలసియుండెను. అయితే ఆమె వాగ్దాన భూమికి వెళ్ళినది. అవును. అవును. వారు యోర్దాను దాటక ముందు ఒకరి చేతులు ఒకరు పట్టుకొనియుండుటను గమనించండి. హా. హా. నేను దానిని ఇష్టపడుచున్నాను. ఇపుడు మనము అదే కాలమునకు వెళ్ళుచున్నాము. ఇక్కడ ఇపుడు గమనించు.
210 ఇపుడు మనము కనుగొంటున్నాము, చివరి సమయము (నేను చెప్పాను) దానియేలు యొక్క డెబ్బది వారములలోని కడపటి మూడున్నర సంవత్సరములు.
211 కొంచెము లోతుగా నేను దానిని వివరించనియ్యు, ’ఎందుకనగా ఇక్కడ ఒకరు దానిని ఎల్లప్పుడు గమనించుట నేను చూస్తున్నాను. ఒక ఉపదేశకునిగా నాకు—నాకు నేనుగా విశదంగా చెప్పగోరుచున్నాను.
212 డెబ్బది వారములు వచ్చుటను గమనించండి. దానియేలు కాలము వచ్చుటను, యూదుల యొక్క ముగింపును చూచి, డెబ్బది వారములు నిర్ణయింపబడినవని చెప్పాడు. అది ఏడు సంవత్సరములు. దాని మధ్యలో మెస్సీయా ఇక్కడుండును లేక ఒక అర్పణ కొరకు కొట్టివేయబడును. అదే ఖచ్చితంగా జరిగినది.
213 అటుతరువాత ఆయన నామము కొరకు ఒక ప్రజలను తీసికొను వరకు, దేవుడు అన్యజనులతో వ్యవహరించును. అన్యజనుల సంఘము గైకొనిన వెంటనే, ఆయన సంఘమును పైకి కొనిపోవును.
214 మరియు ఆయనది చేసినపుడు, నిద్రించు కన్యక, సంఘము తానే…పెండ్లికుమార్తె పైకి వెళ్ళిపోయెను. మరియు సంఘము “బయట చీకటిలో ఉంచబడుతుంది. అక్కడ ఏడ్పును, రోదనయు, పండ్లు కొరకుట ఉంటుంది.” అదే సమయములో శ్రమలు ప్రజలపైకి వచ్చును.
215 శ్రమలు వచ్చుచుండగా, వారికి సువార్త ప్రకటించుటకు ప్రకటన 11లోని ఆ ఇద్దరు ప్రవక్తలు వస్తారు. మరియు వారు ఒక వెయ్యి నూట…అరవై దినములు బోధిస్తారు. చూశారా? సరే, అది ఖచ్చితం ఒక నెలకు ముప్పయి దినములని నిజమైన కాలెండర్ లో ఉన్న విధముగా, సరిగ్గా మూడున్నర సంవత్సరములు. అది దానియేలు యొక్క డెబ్బదియవ భాగము, డెబ్బదియవ వారములోని ఆఖరి భాగము. చూశారా?
ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో సంప్రదించలేదు. లేదండి.
216 కొంచెముసేపటి క్రితము ఒక సహోదరుడు నన్ను అడిగాడు, అన్నాడు “నేను వెళ్ళవలెనా…” ఒక—ఒక సహోదరుడు, ఇక్కడ మందిరములో, ఒక ప్రశస్త సహోదరుడు, ఒక ప్రియమైన సహోదరుడు, అడిగాడు, “నేను—నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ మేల్కొలుపు ఉందని నేను నమ్ముతున్నాను.”
217 ఒకరు నాతో అన్నారు, “సహోదరుడా బ్రాన్హాం, నీవు ఇపుడే ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళవలయును, వారది చూస్తారు.” చూశారా, నీవది చేయలేవు.
నేనక్కడే నిలబడ్డాను, నేననుకున్నాను…
218 ఆ యూదులు అన్నారు “నేనైతే…సరే, ఇది అయితే, యేసు—మెస్సీయా అయితే,” అన్నారు “ఆయన ప్రవక్త సూచన చేయుట నన్ను చూడనిమ్ము. మేము మా ప్రవక్తలను నమ్ముతాము. ’ఎందుకనగా వారు…వారు ఆలాగే యుంటారు.”
219 “ఏ విధంగా సమకూర్చబడింది.” అని నేననుకున్నాను. “ఇక్కడ నేను వెళ్ళాను!” నేనక్కడకు వెళ్ళినపుడు, సమీపంగా వెళ్ళినపుడు…సరే నేను కెయిరోలో నున్నాను. ఇశ్రాయేలు వెళ్ళుటకు నా చేతిలో టికెట్ ఉన్నది. మరియు నేను అన్నాను, “నేను, నేను వెళ్తాను. వారు అది అడిగినట్లయితే ప్రవక్త సూచనను వారు చూడగోరిన యెడల; వారు క్రీస్తును అంగీకరిస్తారో మనం చూద్దాం.”
220 స్టాక్ హోం సంఘానికి సంబంధించిన లెవిపెట్రు వారికి పదిలక్షల బైబిల్ లు పంపాడు.
221 మరియు ఆ యూదులు అక్కడికి వస్తున్నారు. మీరు ఆ చలన చిత్రమును చూశారు. రీల్ మీద అది నా యొద్దనున్నది ఇక్కడ ఇపుడు మధ్యరాత్రి కి మూడు నిమిషాలు. ప్రపంచమందలి అన్ని చోట్ల నుండి యూదులు వచ్చుచున్నారు. అక్కడ కూడుకొనుచున్నారు.
222 ఇంగ్లండ్ దేశపు జనరల్ అలెన్ బై కాలంలో అక్కడకు వెళ్ళినది. ప్రపంచ యుద్ధము తగ్గుచున్నపుడు అటు తరువాత అతడు ఇశ్రాయేలీయులకు తిరిగి ఇచ్చాడు. ఒక దేశముగా ఆమె ఎదుగుతూ ఇపుడు సంపూర్ణముగా దేశమైనది. ఆమెకు స్వంత డబ్బు, ద్రవ్యము చలామణి, జెండా, సైన్యము ప్రతీదీ ఉన్నది. చూశారా?
223 ఈ యూదులు, వారి యొక్క మాతృదేశమునకు తిరిగి వచ్చుచున్నారు. వారు…మొదటి విషయము, వారు ఇరాన్ కు వెళ్ళినపుడు, అక్కడ వారడిగారు…వారు చెప్పారు…ఇశ్రాయేలీయుల యొద్దకు తీసుకువెళ్ళాలని కోరారు వారిని; వారి దేశమునకు పాలస్తీనాకు, వారు ఎక్కడయుండవలెనో అక్కడకు తీసికొని వెళ్ళాలని కోరారు.
224 జ్ఞప్తించుకోండి. ఇశ్రాయేలీయులు ఆ దేశానికి ఆవలయున్నంత వరకు, ఆమె దేవుని చిత్తమునకు ఆవలయున్నది. అబ్రాహాము వలే అది అతనికియ్యబడెను. మరియు…
225 వారు ఆ విమానమును ఎక్కలేదు. వారు అటువంటి దానిని ఎన్నడు చూడలేదు. ఒక వృద్ధుడైన రబ్బీ దిగివచ్చి అన్నాడు “మన ప్రవక్త మనకు చెప్పాడు, ఇశ్రాయేలు తన స్వదేశమునకు వెళ్ళునపుడు వారు ‘పక్షిరాజు యొక్క రెక్కలపై’ కొనిపోబడెదరు,” విమానములో గృహమునకు వెళ్ళు మార్గము.
226 ఇపుడు ఆమె అక్కడ కట్టబడుచున్నది. అంజూరపు చెట్టు పునరుద్ధరణ పొందుచున్నది. ఆమేన్! పురాతనమైన దావీదు ఆరు కోణాల జెండా ఎగురుచున్నది.
227 “అన్యజనుల దినాలు లెక్కించబడుచున్నవి. హింసలతో చిక్కుకొనియున్నవి!” శ్రమకాలము సమీపములోనే ఉన్నది!
228 మరియు ఇక్కడ నిలబడియున్నాము మరియు ముద్రలు విప్పబడుచున్నవి. సంఘము మధ్యాకాశములోకి ఎగురుటకు సిద్ధముగానున్నది.
229 మరియు శ్రమలు వచ్చియున్నవి, తరువాత దేవుడు దిగివచ్చి, అక్కడనుండి లక్ష నలభై నాలుగు వేల మందిని లాగును. ఆమేన్! అక్కడ, ఓ, అది పరిపూర్ణము. ఎక్కడ ముద్రలు దానిని తీసుకొని వచ్చినదో మీరు చూశారా, అది దానిని తెరచుచున్నదా! ఇపుడు ఇది ప్రజలకు ఆఖరి మూడున్నర సంవత్సరములు. ఇంకా మీరు గమనిస్తే. ఈ మూడున్నర సంవత్సర కాలములో దేవుడు యూదులలో నుండి ఒక లక్ష నలభైనాలుగు వేల మందిని పిలచు సమయం ఇదే.
230 చూశారా, ఇక ఆయన వారితో సంప్రదింపులు చేయడు. వారికి ప్రవక్త లేడు. వారు ప్రవక్తను తప్ప మరేది నమ్మరు. నీవు వారిని బుద్ధిహీనులుగా చేయలేవు. కాబట్టి వారు ప్రవక్త మాట వినబోతున్నారు, అవునండి. మరి అంతే. అది, దేవుడు వారికి ప్రారంభములో చెప్పాడు, దానితోనే వారు నిలబడ్డారు.
231 ఆయన చెప్పాడు, “మీ దేవుడైన యెహోవా మీలో నుండి నావంటి ప్రవక్తను మీ మధ్య పుట్టించును.” మోషే అది చెప్పాడు. అన్నాడు “మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట ఎవరు వినరో, ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు.” అవును.
232 మరియు మీరు గమనించారా, వారి కన్నులు మూయబడినవి, లేకపోతే వారు ఆయనను గుర్తెరిగి యుందురు. దానికి బదులు, గ్రుడ్డివారైపోయి, వారు…సాతానుని వారి పైకి వచ్చునట్లు చేసి, వారన్నారు “ఆయన సోదె చెప్పువాడని, బయెల్జెబూబు అని అన్నారు. ఆయన ఆ రక్తము మా మీద నుండును గాక అని అన్నారు. ఆయనలో ఏమీ లేదన్నారు.” చూశారా?
233 మరియు ఆ దీన ప్రజలు గ్రుడ్డివారుగా చేయబడ్డారు. ఆ కారణం చేత ఐక్ మాన్ గుంపు ఆ అందరు గుంపు వారిని అక్కడ చంపారు. వారు వచ్చుటకు హక్కు ఉన్నది; వారి స్వంత తండ్రి వారి కండ్లను గ్రుడ్డి చేశాడు. తద్వారా ఆయన మనలను స్వీకరించునట్లు.
234 లేఖనములో బహు విచారకరమైన విషయం అది. అన్నిటిలో యూదులను గూర్చి అక్కడ ఆలోచన చేయ్. వారి యొక్క స్వంత దేవుడు అక్కడ రక్తము కార్చుచూ వ్రేలాడుచుండగా, వారి స్వంత తండ్రి యొక్క రక్తము మామీదనుండుగాక అన్నారు. చూడు, “అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి,” యని బైబిల్ చెప్తుంది. అది గంభీరమైన నాలుగు మాటలు. చూడు. “అక్కడ,” యెరూషలేము, ప్రపంచములో అతి పరిశుద్ధ స్థలము. “వారు,” ప్రపంచములో అతి పరిశుద్ధమైన ప్రజలు. “సిలువ వేసిరి,” లోకములో అతి భయంకరమైన మరణము. “ఆయనను,” ప్రపంచములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. చూశారా? ఎందుకని? మత సంబంధమైన ప్రజలు, ప్రపంచములో గొప్ప మతము, ప్రపంచములో ఒకే ఒక నిజమైన మతము, అక్కడ నిలబడి, తమ బైబిల్ ఎవరు వచ్చునని చెప్పెనో సాక్షాత్తు ఆ దేవుని సిలువవేస్తున్నారు.
235 ఎందుకు వారది చూడలేదు? బైబిల్ చెప్తుంది మనకు దేవుడు వారిని గ్రుడ్డివారిగా చేశాడు తద్వారా వారది చూడలేకపోయారు. వారు…ఆయన అడిగాడు, “నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు?” మరో మాటల్లో, “నేను చేయుదునని నన్ను గూర్చి చెప్పబడిన ప్రకారము నేను చేయనట్లయితే, ఆలాగైతే నాతో చెప్పండి.” పాపము “అవిశ్వాసము.” దేవుడు చెప్పిన ప్రకారము ఖచ్చితంగా ఆయన చేశాడు, అయితే వారది చూడలేకపోయారు.
236 ఇపుడు మీరు ప్రజలతో మాట్లాడిన యెడల, అది ఒక బాతు వీపు మీద నీళ్ళు పోసినట్లుండును. నా భావమేదో మీరు చూస్తున్నారా? ఈ దేశాన్ని, ప్రజలను వారు చేసే విధానాన్ని చూస్తున్నపుడు అది జాలిపడవలసిన విషయము. ఎంతో మతసంబంధంగా గంజిబెట్టినట్లున్నది. అయితే పరిశుద్ధాత్మ అది మనకు చెప్పుటలేదా? “వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు క్రూరులు మరియు సజ్జన ద్వేషులు పైకి భక్తిగల వారివలే యుండియు దాని శక్తిని ఆశ్రయించనివారైయుందురు.” చెప్పబడినది, “ఇట్టివారికి, విముఖుడవై యుండుము.”
237 ఇక్కడే మనమున్నాము. ఈ సంఘశాఖలు దానిని తారుమారు చేస్తున్నవి. వారు మహిమను శక్తిని తీసికొని దానిని అపొస్తలులకును వెయ్యేండ్ల పరిపాలనకు జతపరచి అప్పుడేయని చెప్తున్నారు. నేను ముందుగా చెప్పినరీతిగా అది మనుష్యుని వలె ఉండును. మానవుడు ఎల్లపుడు దేవుడు చేసినదానికి స్తుతి చెల్లిస్తు, ఆయన చేయుదానికై ఎదురుచూస్తూ, ఇప్పుడేమి చేయుచున్నాడో దాన్ని లక్ష్యపెట్టడు. అది ఖచ్చితం. మానవుడు ఆ విధముగానేయున్నాడు.
238 అక్కడ ఆ యూదులు నిలబడి చెప్తున్నారు. “దేవునికి మహిమ! ఏంటి,” పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయంలో, “అరణ్యములో మా పితరులు మన్నాను భుజించిరి!”
యేసు చెప్పాడు, “వారిలో ప్రతియొక్కరు చనిపోయారు.”
239 “అరణ్యములో బండలో నుండి నీరు త్రాగిరి. మరియు ప్రతీది.”
240 ఆయన చెప్పాడు “నేను ఆ బండనని.” అవును. ఆమేన్. ఆయన చెప్పాడు, “పరలోకము నుండి దేవుని యొద్దనుండి వచ్చిన జీవాహారమును నేనే. అక్కడ ఏదెను తోటలో నున్న జీవ వృక్షమును నేనే. ఈ ఆహారాన్ని మనుష్యుడు తింటే, అతడు చనిపోడు; అంత్య దినములలో నేను అతనిని లేపుతాను.” అయినా వారది చూడలేదు! అవును.
241 సాక్ష్యాత్తు మెస్సీయా అక్కడ నిలబడి, వారి హృదయములోని మాటలు మాట్లాడుతున్నపుడు, మెస్సీయాయని చూపుతున్నపుడు, మెస్సీయా చేయునవి చేస్తున్నపుడు!
242 వారి చేతులను వారి వెనుక పెట్టుకొని అక్కడ వారు నిలబడి, “హు! అదికాదు. కాదు. కాదు. ఆయన—ఆయన—ఆయన క్రమమైన మార్గములో రాలేదు. చూశారా! ఆయన బెత్లేహేము నుండి వచ్చాడు. మరియు ఆయన—ఆయన అక్రమముగా పుట్టిన బిడ్డగాక మరొకటికాదు. దయ్యము ఆయన మీద పనిచేస్తుంది. మాకు—మాకు తెలుసు ఆయన పిచ్చివాడని. ఆయన వెఱ్ఱివాడు. ఆయన దయ్యం పట్టినవాడు.” చూడండి? వారి కళ్ళు దానికి నిజముగా గ్రుడ్డిచేయబడినవి. ఇపుడు.
243 అయితే, వారు వారి యొక్క ప్రవక్త కొరకు ఎదురుచూచుచుండిరి. వారు అది పొందుకోబోతున్నారు. వారిరువురిని పొందుకోబోవుచున్నారు. అవునది నిజం.
244 మరలా ఇపుడు గమనించండి. ఇపుడు, ఇంకా ఈ యూదులు…ఇక్కడున్నవారు యూదులని మీరు గ్రహించునట్లు మరియొక చిన్న సూచనలు మీకిస్తాను. ఎత్తబడుట ఇవతల భాగమున. ఏం జరిగిందో చూడండి. అది కూడా చిహ్నముగానున్నది. అది చేయుటకు మనకు సమయము లేదు, ఎందుకనగా ఇక్కడ మనమది దాటుతున్నాము. ఇంకా చిహ్నముగా నుండి…“యాకోబు శ్రమ” యని పిలువబడుతుంది…ఇపుడు చూడండి. ఇక్కడ ఈ యూదులు…ఇక్కడ ఈ యూదులు, గమనించండి. ఓ, అదియొక…
245 నేను—నేను—నేనిక్కడ కొద్ది సమయము తీసికొనబోతున్నాను. చూశారా. దానిని ఆ విధంగా దాటిపోవునపుడు అది నాకు భీతిని కలిగిస్తుంది. మరియు…చూడండి? గమనించండి. మీరది చూడగోరుతాను. మరియు నేను—నేను—నేను కొద్దిగా…సరే, దేవుడది మీకు చూపుతాడు, నేను నమ్ముతాను. చూడు.
246 యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును కలిగియుండెను. అవునది నిజమా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అయితే అతడు నిజంగా కొద్ది యుక్తిని కూడా కలిగియుండెను. ఎందుకనగా ఏశావు అమ్మాడు. అయితే ఇంకా, చట్టరీత్యా దానిని అతడు కలిగియుండెను. ఎందుకనగా ఏశావు అమ్మాడు. అయితే తన మామకు పనిచేయుటకు అతడు అక్కడకు వెళ్ళినపుడు చినారు జంగి చువ్వలను నీటిలో వేసి ఆ చూలుతోనున్న మందయంతయును చారలు గల వాటిని ఈనునట్లు చేశాడు. మరియు, ఓ, అదంతా ఆ విధంగా చేశాడు. మీకు తెలుసు, డబ్బును సంపాదించుటకు…ఇప్పుడు గమనించు. అతడు తన ప్రజల నుండి త్రోసివేయబడ్డాడు.
247 ఇపుడు యూదునికి ఒక పోలిక. అతడు డబ్బును సంపాదించుకొనువాడు. అతడు దానిని ఏ విధముగా సంపాదించాడని కాదు గాని, అతడు సంపాదించాడు. అతడు అది పొందుటకు నీ చర్మాన్ని ఒలుచును. ఇపుడు అది తెలుసా. అతడు కొద్దిగా యుక్తిపరుడు. అంతే. అబ్బాయ్, అతనితో సంప్రదింపులు పెట్టుకోవద్దు. అతడు—అతడు నిన్ను కూడా పొందగలడు. అవునండి. ఎందుకని? అతడు ఆ విధంగా యున్నాడు. ఆ విధమైన ఆత్మ బలపరచుచున్నది.
248 ఆ యొక్క సంస్కర్తలు కూడా ఖచ్చితంగా ఈ వాక్యమును అర్థం చేసికోలేకపోయారు. ఎందుకనగా మనుష్యుని ఆత్మ వారిపైకి పంపబడింది.
249 వాక్యమును, ప్రత్యక్షతను పొందునది అది పక్షిరాజు కాలము. అది అర్థము చేసుకున్నవారందరు మీ చేతులు పైకెత్తండి. మంచిది. అది శ్రేష్ఠమైనది. చూశారా? అది మంచిది. ఇపుడు, చూడండి, ఇక్కడ ముద్రల యొద్దకు మీరు తిరిగి వచ్చునపుడు…అవి తెరువబడినపుడు దేవుడు ఏమి చేస్తున్నది మీరు చూస్తారు, ఆయన ఏమి చేయుచున్నది. ఇక్కడ ఇది ఖచ్చితం.
250 ఆ కారణము చేత మనుష్యులు ఆ విధంగా ప్రవర్తించారు. ఎందుకనగా, వారి మీద ఉంటానని ఆ కాలానికి ముందుగా చెప్పబడిన ఆత్మ అది. వారేమీ చేయలేకపోయారు.
251 నేను యోహానును గూర్చి, పౌలును గూర్చి తదితరములను గూర్చి ఆలోచిస్తున్నాను. సింహము ఆత్మ అక్కడున్నది. l-i-o-n సింహము అక్కడున్నది, సాక్ష్యాత్తు వాక్యము.
252 అక్కడ పౌలు వాక్యముతో నిలబడి, మరియు చెప్తున్నాడు, “మీ మధ్య అబద్ధ సహోదరులు లేచి వచ్చెదరని నేనెరుగుదును. మరియు వారేమి చేస్తారు. సంఘశాఖలు, తదితరమైనవి మీ మధ్య చేస్తారు. అది అంత్య దినముల వరకు కొనసాగును మరియు భయంకరమైన సమయములు వచ్చును.” ఎందుచేత? అతడు ఒక ప్రవక్త. అక్కడ అతనిలో ఆ వాక్యముండెను. అక్కడ ఏ విధముగా ముగియునో చెప్పబడుతుంది, “అబద్ధపు మనుష్యులు మీ మధ్య లేచెదరు మరియు విషయాలు మాట్లాడెదరు, శిష్యులుగానున్న సహోదరులను త్రిప్పివేస్తారు.” అది ఖచ్చితముగా అంత్యక్రీస్తు. అది ఖచ్చితంగా అది చేసినది.
253 శ్రమల యొక్క అంధకార యుగములోకి వారు వెళ్ళిన తరువాత గమనించండి. అదేంటి? వారక్కడ చేయవలసినది ఏదీ లేదు. రోమ్ హస్తగతము చేసికున్నది…అతనికి మతసంబంధమైన అధికారమున్నది. మరియు అతనికి రాజకీయ బలమున్నది. వారు చేయగలిగినది ఏదియు లేదు. అయితే జీవించుటకు శ్రమించవలసియున్నది. వారు అర్పణగా వారికి వారు అర్పించుకున్నారు. అది ఎద్దు. అదే వారు చేయగలిగినది. ఆలాటి రకమైన ఆత్మను వారు కలిగియున్నారు, దేవుని ఆత్మ, ఎద్దు.
254 తరువాత, ఇక్కడ సంస్కర్తలు వచ్చుచున్నారు. మానవుని తల, యుక్తి, జ్ఞానము; మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ మొదలగువారు, కాల్విన్, ఫిన్నే, నాక్స్, ఇతరులు. ఇక్కడ వారు వచ్చారు, వారు దిద్దుబాటు కర్తలు. వారు వచ్చి దిద్దుబాటు చేస్తూ ప్రజలను బయటకు తీసికొని వచ్చుచుండిరి.
255 వెనుక వారేమి చేశారో ఖచ్చితంగా వారు వెనుకకు తిరిగి వారి సంస్థాపక సంఘ పద్ధతులకే దానికే వివాహము చేయబడ్డారు. ఖచ్చితంగా. బైబిల్ ఆలాగు చెప్తుంది. ఆమె “వేశ్యయని,” తరువాత ఆమెకు “వేశ్యలైన” కుమార్తెలున్నారని. ఖచ్చితంగా.
256 మరియు దేవుడు చెప్పాడు, “నేను—నేను ఆమె మారుమనస్సు పొందుటకు ఆమెకు సమయమిచ్చితిని గాని ఆమె దానిని చేయలేదు. కాబట్టి నేను ఆమెను మరియు ఆమె యొక్క సంతతిని వారు దేనికి చెందియున్నారో అక్కడ వారిని పారవేసెదను.” అది ఖచ్చితం. అది, ఈ ముద్ర క్రింద దేవుడు అది చెప్పాడు. ఇపుడు ఆమె అక్కడ యున్నది. ఆయన అది చేయుట మనము చూచియున్నాము. మరియు ఆయన అది చేయును. మరియు వారిలో ప్రతియొక్కరు ఆ మార్గముననే వెళ్తారు.
257 అయితే, జీవగ్రంథములో ఎవరి పేరున్నదో, వారినందరిని ఆయన పిలచును. వారది వింటారు. “నా గొఱ్ఱెలు నా స్వరమును వినును,” యేసు చెప్పాడు. మనము చేయవలసిన ఒకటే ఒకటి ఏదనగా గొఱ్ఱెలను పిలచుటయే. మేకలు అవి ఎరుగవు. గమనించు, అయితే గొఱ్ఱెలు స్వరము వినును. “నా గొఱ్ఱెలు నా స్వరము వినును.” ఎందుకని? స్వరమేమిటి? స్వరమనగా ఏంటో నేను మీకు చెప్తాను. స్వరము అనునది ఒక ఆత్మీయ సూచన.
258 ఆయన మోషేతో చెప్పాడు “మొదట సూచన యొక్క స్వరాన్ని వారు విననట్లయితే, వారు రెండవ సూచన యొక్క స్వరాన్ని వారు వింటారు” అని.
259 “నా గొఱ్ఱెలు నా స్వరము వినును.” ఈ యొక్క విషయాలు అంత్య దినములయందు జరుగుచున్నపుడు, దేవుని యొక్క గొఱ్ఱెలు దానిని గుర్తించును. అవునండి. చూశారా? దానిని వారు గుర్తెరుగుతారు. “నా గొఱ్ఱెలు నన్నెరుగును.” చూశారా? “అన్యుని అవి వెంబడించవు.” అన్యులైన వారిని వెంబడించకుము. దినము యొక్క రుజువుచేయబడిన సూచనయై యుండవలసియున్నది. వారు అది చూస్తారు. ఇపుడు గమనించండి.
260 ఇపుడు, యాకోబు, అతడు అక్కడకు వచ్చినపుడు, మొదట విషయమేంటో మీకు తెలుసా, తన స్వదేశానికి వెళ్ళుటకు కోరికపుట్టెను (ఎక్కడకు?)
261 ఓ! అదే ఇశ్రాయేలు ఖచ్చితంగా కలిగియున్నది. అది—అది—అది ఇశ్రాయేలు. యాకోబు ఇశ్రాయేలైయున్నాడు. అతని పేరు అప్పుడే మారింది తెలుసా. అవునా? మరియు…
262 అతడక్కడకు వెళ్ళాడు. అతడు సంపాదించిన డబ్బునంతా తీసుకున్నాడు. తన యొక్క కుటుంబీకుల యొద్ద నుండి లేక ఇతరుల యొద్ద నుండి. కనుక మోసగించుట, దొంగిలించుట, అబద్ధము ద్వారా, ఏ విధంగా పొందవలెనో, ఆ విధంగా అతడు పొందాడు. చూశారా, అతడు చేశాడు.
263 అటుతరువాత అతడు ఇంటికి వెళ్ళుటకు అతడు ఆరంభించినపుడు, అతడు తన హృదయంలో ఇంటి బెంగ పెట్టుకున్నాడు. అయితే, అతడు వెనుకకు మరలినపుడు, తన యొక్క మార్గములో, అతడు దేవుని కలుసుకొన్నాడు, అటు తరువాత అతని పేరు మార్చబడినది. అవునా? అయితే ఈ సమయములో, అతడు ఎంతో భయపడ్డాడు. ఎందుకనగా ఏశావు తనను ఎదిరించునని భయపడ్డాడు. చూశారా?
264 మరియు—మరియు గమనించండి. డబ్బును గమనించండి, డబ్బు ప్రతిపాదన. డబ్బు ప్రతిపాదనను యూదుడు రోమ్ తో నిబంధన చేయునట్లుగా యున్నది. చూడండి. వారి యొక్క డబ్బు ప్రతిపాదనలో. అది గమనించండి. ఆ ఏశావుకు అతని డబ్బు అవసరం లేదు; ఆలాగే రోమ్ కి కూడా. ఆమె యొక్క చేతిలో ప్రపంచ ధనమంతా ఉన్నది. చూశారా? అయితే అది క్రియ చేయదు.
265 అయితే ఇపుడు మనము చూస్తున్నాము, ఆ శ్రమ కాలములో అతడు యాకోబుగానున్నపుడు, అతడు పోరాడాడు. ఒక నిజమైన ఒక దానిని పట్టుకున్నాడు. ఒక మనిషి అక్కడకు దిగివచ్చాడు. యాకోబు ఆయన చుట్టూ చేతులు వేసి అక్కడే నిలచిపోయాడు. మరియు—మరియు ఆ వ్యక్తి చెప్పాడు, “నేనిప్పుడు వెళ్ళవలసియుంది. తెల్లవారుతుంది.” ఓహో, అది దినము తెల్లవారుచున్నది! చూశారా? ఒక దినము వచ్చుటకు నిర్ణయమైనది.
266 అయితే యాకోబు అన్నాడు, “నేను—నేను నిన్ను విడిచిపెట్టను. నీవు, నీవు వెళ్ళలేవు. నేను నీతోనే ఉండబోతున్నాను.” చూశారా? “కార్యములు మార్చమని కోరుచున్నాను.”
267 అది లక్ష నలభైనాలుగు వేల మంది, ఆ డబ్బు ప్రణాళిక గుంపు, ఆలాటి వారు, వారు ఒక నిజమైన స్వచ్ఛమైన దానిని పట్టుకొనుటకు చూచినపుడు, అక్కడ మోషే నిలబడియున్నాడు, మరియు అక్కడ ఏలీయా నిలబడియున్నాడు. ఆమేన్! అక్కడ ఒక లక్ష నలభై నాలుగు వేలమంది ఇశ్రాయేలు గోత్రముల వారు బయటకు వచ్చువరకు వారు దేవునితో పోరాడెదరు.
268 అది శ్రమకాలమునకు కొంచెము ముందు, చూశారా, (ఓహో, ఎంత అద్భుతం) ఇంకా, “యాకోబు యొక్క శ్రమలు.”
269 ఇక్కడే లక్ష నలభైనాలుగు వేల మంది బయటకు పిలువబడుచున్నారు. వారు, బోధకులు, వారు ఇద్దరు ప్రవక్తలు, బాప్తిస్మమిచ్చు యోహాను మాదిరిగా వారు బోధిస్తారు. “పరలోక రాజ్యము సమీపముగానున్నది. మారుమనస్సు పొందుడి. ఇశ్రాయేలీయులారా!” దేనికొరకు మారుమనస్సు? “మీ పాపముల విషయమై మారుమనస్సు పొందుడి. మీ అవిశ్వాసము కొరకై, దేవుని వైపు తిరుగుడి!”
270 ఇపుడు, ఇక్కడ యొకటి జ్ఞప్తించుకుందాము. ప్రకృతికి ఇపుడు సంభవించుచున్న ఈ గొప్ప విషయాలు క్రితము జరిగినవి. ఇక్కడ 12 వ వచనములో చూడండి. “సూర్యుడు కంబళివలె నలుపాయెను.” ఇపుడు దీనిని పోల్చు.
271 ఇపుడు జ్ఞప్తించుకోండి, అది అన్యులలో జరుగలేదు. అది ఇశ్రాయేలీయులు. నేను మీకు చూపుతాను. ఇపుడు జ్ఞప్తించుకోండి, నేను మీకు చెప్తాను, అది లక్ష నలభై నాలుగు వేల మందిని పిలుచుట. చూశారా. ఇపుడు ఈ సమయములో, శ్రమలే దానిని చేయవలసియున్నది. మరియు ఈ శ్రమలో ఏమి జరిగినదని ఇది చెప్తున్నది.
272 ఇపుడు మనము నిర్గమకాండము 10:21-23 త్రిప్పుదాం. మరియు ఇక్కడ గమనించండి. నిర్గమము అనగా ఇశ్రాయేలీయులు వస్తున్నారు, కొనిపోబడిపోతున్నారు. నిర్గమకాండము 10 వ అధ్యాయము 21, 23 వచనాలు. ఈ క్రింది వివరణను నేను వ్రాసుకొనునపుడు నేనెంతగానో ఉత్తేజపడి కేకలు వేశాను, కొన్ని సమయములలో నేను వాటిని కలపవచ్చు. సరే. నిర్గమకాండము 10:21-23. సరే. ఇక్కడకు వెళ్దాం. 21 మరియు 23.
అందుకు యెహోవా మోషేతో ఆకాశము వైపు చెయ్యి చాపుము. ఐగుప్తుదేశము మీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.
మోషే ఆకాశము వైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను: (చూశారా?)
మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
273 గమనించండి. ఖచ్చితంగా, ఇపుడు ఇక్కడకు రండి, “మరియు సూర్యుడు కంబళివలె నలుపాయెను.” చూడండి. అదే కార్యము. ఈ ప్రకృతి సంభవాలు, అదేంటి? ఏంటి? ప్రకృతిలో ఈలాగు జరుగుచున్నపుడు, దేవుడు ఇశ్రాయేలీయులను బయటకు పిలచుచున్నాడు. ఇపుడు, “సూర్యుడు కంబళివలె…నలుపాయెను.” దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించనైయున్నాడు. సరే. తమ శత్రువుల హస్తంలో నుండి, అనగా అప్పటి కాలములోని ఐగుప్తు నుండి ఇపుడు, ఇక్కడ, వారెక్కడైతే నిబంధన చేశారో, అట్టి రోమా హస్తము నుండి ఆయన వారిని బయటకు తెచ్చుచున్నాడు. అదే విషయం జరిగింది. అదే తెగుళ్ళు, తెగుళ్ళ కాలములో వారు పిలువబడుచున్నారు.
274 ఈ అన్యుల గుంపును తెగుళ్ళు తాకును, మనకు సమయముంటే ఆ అన్య సంఘమునకు ఏమి జరుగబోతుందో నేను మీకు చూపిస్తాను.
275 బైబిల్ చెప్తుంది, “ఘట సర్పమగు సాతాను స్త్రీ పై (యూదుడు, ఇశ్రాయేలు) ఉగ్రత (కోపము) కలిగి తన నోట నుండి నీటిని చిమ్మెను. అది జనములను మరియు ప్రజలును, అది స్త్రీ సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలెను.” ప్రకటన 13. ఇపుడు అక్కడ మనమది చూశాము. అది ఇశ్రాయేలీయులు ఆమెను పంపినపుడు…నా భావము రోమ్, స్త్రీ సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై ఆమె సైన్యమును పంపును.
276 ఇపుడు గమనించండి. మొదటిసారి, వారి శత్రువుల హస్తాల నుండి విడిపించినపుడు సూర్యుడు నలుపయ్యాడు, ఇపుడు రెండవసారి శ్రమల కాలము ముగియునపుడు.
277 ఇపుడు, దానియేలు 12 లో. మనకు సమయముంటే మనమది చదువుదాం. దానియేలులో 12వ—12వ వచనము…12వ అధ్యాయం. దానియేలు చెప్పాడు, “గ్రంథములో పేర్లు వ్రాయబడిన ప్రతియొక్కరు విడుదల పొందెదరు.” ఇపుడు జ్ఞప్తించుకోండి, ఈ కాలాన్ని గూర్చి దానియేలు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులు విడుదల పొందునప్పటికి ఈ విషయం జరగవలసియుంది. వారి యొక్క డెబ్బది వారము ముగింపులో. అది, వారు విమోచించబడు సమయము. ఇపుడు చూడు. ఇక్కడ దానియేలు 12 తీద్దామా. ఒక్క నిమిషము.
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు (చూడండి, వారు యూదులు): రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును:…
278 ఇపుడు దానిని ఖచ్చితంగా యేసు మత్తయి 24 లో ఏమి చెప్పెనో దానితో పోల్చి చూడండి. “వారు దేశముగా ఏర్పడినప్పటి నుండి ఎన్నడు రాని శ్రమ వచ్చును.” ఆరవ ముద్రను చూడండి. చూడండి. ఒక్కటే విషయం. శ్రమ కాలము. గమనించండి.
…అయితే నీ జనులలో (ఇపుడు, ఈ డెబ్బదియవ, డెబ్బదియవ సంవత్సరపు చివరి భాగమున) గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు.
279 చూశారా, గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడినవారై ముందుగా నిర్ణయింపబడినవారు ఆ సమయమున విడిపింపబడుదురు.
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. మరియు—మరియు నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరమును ప్రకాశించెదరు.
280 అది ఆ విధంగా పోయినది. దానియేలుకు చెప్పబడెను “గ్రంథమును ముద్రింపుము,” అతను తన వంతు వచ్చువరకు విశ్రాంతిలో ఉండును.
281 ఇపుడు మీరు చూడండి. మీరు చనిపోయినను లేక బ్రతికినను అది ఏలాంటి భేదము చేయదు. ఏలాగైనా మీరు బయటకు వస్తారు. కాదు…అది, క్రైస్తవునికి మరణము ఏమీ కాదు, ఏలాగైనా అతడు చనిపోడు. చూశారా?
282 ఇపుడు, దానియేలు 12 చెప్తుంది గ్రంథములో పేర్లు వ్రాయబడిన ప్రతియొక్కరు విడిపింపబడతారు.
283 ఇక్కడ, దేవుడు తన యొక్క రెండవ కుమారుని, ఇశ్రాయేలును, శ్రమ తరువాత విడిపించబోవుచున్నాడు. చూడండి. రెండవసారి. ఇశ్రాయేలు, ఆయన…ఇశ్రాయేలు ఆయన కుమారుడు. మీకది తెలుసా. ఇశ్రాయేలు దేవుని కుమారుడు, కాబట్టి ఆయన అతనిని ఈ శ్రమ కాలములో ఐగుప్తులో ఆయన ఏలాగు చేసెనో ఆ విధముగా విడిపింపబోవుచున్నాడు.
284 ఇపుడిక్కడ ఆగుదాము. తిరిగి మరియు—మరియు ఇంటికి తీసుకురాకముందు మరొకటి తీసుకుందాము. ఇపుడు, ఇక్కడ గమనించండి. ఈ ఇద్దరు ప్రవక్తలు, ఇపుడు వారేమి చేయుచున్నారో చూడండి. మోషే మరియు వారు చేసినట్లు. “మరియు నాకు ఒక కర్ర ఇవ్వబడినది…” మరియు 11 అధ్యాయం 3వ వచనము.
నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
వీరు రెండు ఒలీవ చెట్లును, …
285 అది మీకు జ్ఞాపకమున్నదా, మరియు జెరుబ్బాబెలు ఇతరులు ఆ విధముగా ఆలయమును కట్టవలసినదిగా యున్నది.
…వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచున్న దీప స్తంభములునై యున్నారు.
…ఎవడైనను వారికి హానిచేయనుద్దేశించిన యెడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి,…
286 జ్ఞప్తించుకోండి. క్రీస్తు యొక్క నోటి నుండి ఖడ్గము, వాక్యము బయలువెడలుచున్నది.
…వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆలాగున వాడు చంపబడవలెను.
287 ఇపుడు, మనకు “అగ్ని” తెలుసు. 19వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాకడలో “ఆయన నోట నుండి ఆయన ఖడ్గము బయలువెడలుచున్నది,” అది వాక్యమైయుండెను. అవునా? వాక్యము. ఓహో! ఇపుడు ఈ పదార్థము మీరు తీసుకుంటే, అది రేపు రాత్రి ముద్రకు. చూడండి. దేవుడు ఆయన శత్రువును జయించు వస్తువు, వాక్యము. అవునా?
288 ఇపుడు, ఇక్కడ చూడండి. ఈ ప్రవక్తలు ఇక్కడ ప్రవచిస్తుండగా, వారు…ఎవరైన వారిని అమర్యాదగా చూచిన, వారికి హానిచేసిన: “అగ్ని వారి నోట నుండి బయలుదేరును,” పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యము. వాక్యము దేవుడు. వాక్యము ఆత్మ. చూశారా? “వారి యొక్క నోట నుండి బయలు వెడలును.”
289 మోషేను చూడు. అతని నోట నుండి ఏమి వచ్చినదో మనము చూద్దాం. వారు ఇశ్రాయేలీయులు వారేమి చేశారు…నా అర్థం ఐగుప్తు, ఈ యూదులను వారు అమర్యాదగా చూశారు. మోషే…సరే. వారు వెళ్ళుటకు వీరు అనుమతించలేదు. ఫరో అంగీకరించలేదు. మోషే నోటిలో దేవుడు మాటలుంచాడు. చూశారా, అవి దేవుని యొక్క తలంపులు మోషే హృదయములోకి వెళ్ళుచున్నవి; అతడు దానిని వ్యక్తపరచుటకు అక్కడకు వెళ్ళాడు. అటుపిదప అది వాక్యమైనది. అతడు తన చేయి చాపి “ఈగలు కలుగునుగాక” అని అన్నాడు, ఇక్కడ ఈగలు వచ్చినవి. ఇక్కడ చూడు.
ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును:…
290 చూశారా? అది అక్కడ ఉన్నది. వారనుకున్నది వారు మాట్లాడగలరు. అది జరుగుతుంది. ఆమేన్!
…ఎవడైనను వారికి…హానిచేయ నుద్దేశించిన యెడల ఆలాగున వాడు చంపబడవలెను.
291 సహోదరుడా, దేవుడిక్కడ రంగము మీద స్వారీ చేయుచున్నాడు!
తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు:…
292 ఏలీయా, అది ఏలాగు చేయవలెనో అతనికి తెలుసు; క్రితమది అతడు చేశాడు. ఆమేన్! అది ఏలాగు చేయవలెనో మోషేకు తెలుసు. క్రితమతడు అది చేశాడు. ఆ కారణము చేత వారు ఉంచబడియున్నారు. ఇపుడు…ఆమేన్!
293 నేనిక్కడ యొక భయంకర కార్యము చెప్పగలను, అయితే నేను—రేపు రాత్రి వరకు ఆలాగే యుంచుట మంచిది. చూశారా? మంచిది.
…మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
294 అదేంటి? వాక్యము తప్ప మరి ఏదీ ఈ విధమైన కార్యములు తెచ్చును? వారు ప్రకృతిని తమ ఇష్టప్రకారము చేయగలరు. ఇదిగో ఇది ఇక్కడే యున్నది. ఈ ఆరవ ముద్రను తెచ్చువారు వీరే. వారు విప్పి దానిని తెరుస్తారు. ప్రకృతిని వణికించడం అది దేవుని యొక్క శక్తి. చూశారా, ఆరవ ముద్ర సంపూర్ణంగా ప్రకృతిని భంగపరచుట. ఇపుడు మీరు అర్థం చేసికున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అక్కడే మీ ముద్రయున్నది. అదెవరు చేయుచున్నారు? అది ప్రవక్తలు. ఎత్తబడుటకు ఆవలవైపు. దేవుని యొక్క శక్తిచేత, దేవుని యొక్క వాక్యము, వారు ప్రకృతిని గద్దించుచున్నారు. వారు భూకంపములను పంపగలరు, చంద్రుని రక్తముగా మార్చగలరు. వారి ఆజ్ఞను బట్టి సూర్యుని అస్తమింపజేయగలరు లేక ఏమైనను వారి ఆజ్ఞ ద్వారా చేయగలరు. ఆమేన్!
295 అక్కడే మీరున్నారు. అక్కడే మీరున్నారు. చూశారా? ఏ విధమైన ముద్రలు తెరువబడినవో చూడు. అక్కడ సంఘకాలంలో, అక్కడ ఏ విధమైన హతసాక్షులను చూపించుచున్నవో?
296 మరియు ఇక్కడ ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుని వాక్యముతో వారు అనుకున్నది ప్రకృతికి ఏదైన చేయుటకు నిలబడియున్నారు. వారు భూమిని వణికింపచేస్తున్నారు. అది ఎవరు చేయుచున్నారని ఖచ్చితంగా అది చూపుతుంది. అది మోషే, ఏలీయాలు. కారణం, అక్కడ వారి పరిచర్య మరలా వారి శరీరములో కనబడుచున్నది. అది ఇద్దరు మనుష్యులు. ఓ, మై! మీరిపుడు అది గ్రహిస్తున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] ఆరవ ముద్ర ఏంటో చూశారా? అది ఆ ప్రవక్తలు. ఇపుడు గమనించండి. అది మిమ్ములను ఉక్కిరి బిక్కిరి చేయనీయవద్దు. అయితే ఆ ముద్ర దేనిని తెరచినది గమనించు. ప్రవక్తలు! చూశారా? వ్యూ! ఆమేన్! అక్కడే మీరున్నారు.
297 ఓ, సహోదరుడా, మనము పక్షిరాజు దినమున జీవిస్తున్నాము. మేఘాలలో కొనిపోబడబోవుచున్నాము!
298 వారు ఆ ఆరవ ముద్రను తెరచియున్నారు. అది చేయుటకు వారికి అధికారము కలదు. ఆమేన్! అక్కడే మీ యొక్క ఆరవ ముద్ర తెరవబడుచున్నది. చూశారా?
299 ఇక్కడ మనము నిలిపివేద్దాము. మరియు యేసు మాట్లాడాడు. అది జరుగునని, అక్కడ వెనుక పాత నిబంధనలో, వెనుక యెహేజ్కేలులో, పురాతన ప్రవక్తల పలుకులలో అది జరుగునని వారు పలికారు.
300 మరియు ఇక్కడ ఆరవ ముద్ర తెరవబడియున్నది. వారు చెప్పారు “సరే, అది మర్మమైన విషయము. అది చేసినదేమిటి?”
301 దాని యొక్క రహస్యము ఇక్కడున్నది, ప్రవక్తలు, కారణం, బైబిల్ గ్రంథము అలా చెప్తుంది. ఏ సమయములోనైనా వారది విప్పగలరు…వారు అనుకున్నప్పుడెల్ల ప్రకృతికి వారేదైనా చేయగలరు. వారు చేసిన అదే కార్యమును వారు చేస్తారు, ఆమేన్, కారణం, అదెలా జరిగిందో వారికి తెలుసు. ఆమేన్! మహిమ!
302 నేనది చూచినపుడు, కుర్చీలో నుండి నేను లేచి, నేల మీద పైకి క్రిందకు నడచుటకు ప్రారంభించాను, నేను తలంచాను “ప్రభువా, నేనెంతగా కృతజ్ఞత చెల్లింపను, పరలోకపు తండ్రీ!”
303 అక్కడ అదియున్నది. అది అదే. వారు ఆరవ ముద్రను తెరిచారు. ఆమేన్! వాటిని గమనించు, “ఎవరైన వారికి హాని చేసిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలును,” వాక్యము. పరిశుద్ధాత్మ అపొస్తలుల మీదికి వచ్చినది, చూశారా “అగ్ని వారి నోట నుండి బయటకు వచ్చును.”
304 ఇక్కడ ప్రకటన 19 లో గమనించు, అదే విషయాన్ని మనము చూస్తున్నాము. నేననుకుంటాను “మరియు ఒక గొప్ప ఖడ్గము ఆయన నోట నుండి బయలు వెడలెను”, వాక్యము. చూశారా? క్రీస్తు రాకడ. “మరియు ఆయన ఆయన శత్రువులను దానితో చంపివేసెను.” అవునా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] ఇపుడు ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇపుడు ఆయనను గమనించండి. సరే.
తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు:…
305 అబ్బాయ్, అది ప్రకృతికి అంతరాయము కలిగిస్తుంది! ఇపుడు ఎంతకాలము ఈ మనిషి ఏలీయా, ఆకాశమును మూశాడు? [సభ చెప్పినది “మూడున్నర సంవత్సరములని.”—సంపా.] అక్కడే మీరున్నారు. ఖచ్చితంగా. దానియేలు యొక్క డెబ్బది వారములలో డెబ్బదియవ వారము యొక్క చివరి భాగము ఎంతవరకు? [“మూడున్నర సంవత్సరములు.”] ఖచ్చితంగా అక్కడే మీరు ఉన్నారు.
306 మోషే ఏం చేశాడు? అతను—అతను—అతను నీటిని రక్తముగా మార్చాడు. ఈ ఆరవ ముద్ర క్రింద ముందుగా ఏమి చెప్పబడినవో అవన్నీ ఖచ్చితంగా ఈ రకమైన అద్భుతాలు చేశాడు. ఇక్కడ ప్రకటన 11 లో ఇక్కడున్నవి. అదే కార్యము చేయుచున్నారు. ఆమేన్!
307 అక్కడే లేఖనములలో మూడు వేర్వేరు చోట్ల దీనికి సమాధానాంతరముగానున్న సందర్భములున్నవి. అది ఆరవ ముద్ర విప్పబడుటయైయున్నది. అక్కడే ఉన్నది. ఆమేన్! మహిమ! ఇపుడు గమనించండి.
తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
308 ఓ, మై! అక్కడే మీరున్నారు. ఇపుడు నేరుగా తెగుళ్ళ యొద్దకు తిరగండి. చూశారా. ఈ యొక్క ఆరవ తెగులు లేక ఆరవ ముద్రలో సమస్త సృష్టికి అంతరాయం కలిగింది, తెరువబడుటలో. అదే ఖచ్చితంగా జరిగినది. ఇపుడు చూడండి…
309 ఇక్కడ దేవుడు ఆయన యొక్క కుమారుడైన ఇశ్రాయేలును అక్కడ ఏ విధముగా విడిపించెనో, అదే విధముగా శ్రమల తరువాత విడిపింపనైయున్నాడు. ఆయన మోషేను అక్కడకు పంపి ఇశ్రాయేలును విడిపించాడు. అవునది నిజమా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] అతడు ఈ విధమైన కార్యాలే చేశాడు. ఆహాబునొద్దకు ఆయన ఏలీయాను పంపాడు. మరియు ఏడు వేల మంది బయటకు వచ్చారు. అవునా? [“ఆమేన్.”] ఆయన మరలా ఇక్కడకు పంపాడు శ్రమకాలంలో, ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని బయటకు పిలుచును.
310 ఇపుడు, చూడండి, మీరు గమనిస్తే ప్రకటన…లేక 6వ అధ్యాయము లేక 6వ తెగులు…ముద్ర. క్షమించండి. ఆరవ ముద్ర మరియు ఏడవ ముద్ర. ప్రకటన 7వ అధ్యాయము లెక్కల ప్రకారము చక్కగా పెట్టబడియున్నది.
311 అమెరికా యొక్క సంఖ్య పదమూడు వలె అదియున్నది. అది పదమూడు రాష్ట్రములతో ప్రారంభించబడినది. పతాకములో పదమూడు నక్షత్రాలు. పదమూడు కాలనీలు, పదమూడు గీతాలు. ప్రతీది పదమూడు, పదమూడు. మరియు నేరుగా ఇక్కడ ప్రకటన 13వ అధ్యాయం. అవును. ఆమె పదమూడు, ఒక స్త్రీ.
312 ఇపుడు, ఆయన ఏకైక కుమారుని అర్పించునపుడు, అది ఆయన యొక్క ఏకైక కుమారుడు. యాకోబు ఆయన యొక్క కుమారుడు, ఈయనైతే ఆయన అద్వితీయ కుమారుడు. మత్తయి 27. ఆయన అక్కడ ఏమి చేశాడో చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం. ఇపుడు జ్ఞాపకముంచుకోండి. ఆయన కుమారుడు కొట్టబడెను. మరియు శ్రమపడెను మరియు అపహాస్యము చేసిరి మరియు ఆయన ఇపుడు మంచి శుక్రవారము మధ్యాహ్నము మూడు గంటలకు సిలువపై వ్రేలాడుచుండెను. అప్పుడు సంభవింపనైయున్నది! మత్తయి, 27వ అధ్యాయం మత్తయి, మరియు—45వ వచనము. అదేననుకుంటాను.
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
313 ఇపుడు గమనించండి, ఆయన సరిగా ఇక్కడ ఏమి చేశాడో, ఇక్కడను. చూశారా?
ఆయన ఆరవ ముద్రను విప్పినపుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను;
314 నలుపు, నలుపు! ఐగుప్తు; నలుపు, నలుపు!
315 దేవుడు, యేసును పునరుత్థానము ద్వారా బయటకు తీసికొనివచ్చుటకు ముందు, దేవుడు యేసుని సిలువ మీదికి అప్పగించెను. మొదట, అంధకారము. సూర్యుడు మధ్యాహ్నము అస్తమించాడు మరియు నక్షత్రములు ప్రకాశించలేదు. ఆ తరువాత రెండు రోజులకు ఆయన ఆయనను మహోన్నతమైన విజయముతో లేపనైయున్నాడు.
316 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ ఐగుప్తులో జరిగిన తరువాత వాగ్దాన దేశానికి ఆయన ఇశ్రాయేలును విడిపించాడు.
317 ఇక్కడే శ్రమకాలములో; ఇక్కడ ఆ ప్రవక్తలు నిలబడియున్నారు. వారికి దేవుడిచ్చిన వాక్యము యొక్క అధికారమున్నది. దేవుడు వారికి వాక్యము ఇచ్చుచుండగా వారు దానిని పలుకగలరు.
318 ఇపుడు, వారు దేవుళ్ళు కారు. తాత్కాలికంగా వారు…చిన్న, వారు, ఎందుకనగా వారు ఆలాగని యేసు చెప్పాడు, ఆయన అన్నాడు, “దేవుని వాక్యము ఎవరికి వచ్చునో మీరు వారిని దేవుళ్ళని పిలచుచున్నారు” అని. అయితే చూడు, ఆలాటి వారి ద్వారానే దేవుడు వాక్యము తెచ్చి ఇచ్చినది. మరియు అది అతను మాట్లాడినపుడు అది జరుగుతుంది. అంతే.
319 అతడేమని కోరెను (ఓ, మై) ఆకాశమును మూసివేయుటకు, భూమిని మొత్తుటకు ఇక్కడ అతడు దేవుని యొద్ద నుండి అనుమతిని ఆజ్ఞను పొందాడు. అతను చేయును. విషయమేంటి? విమోచనా గ్రంథములో నుండి విమోచన కొరకు లక్ష నలభై నాలుగు వేల మందిని అతడు సిద్ధపరచుచున్నాడు. అది ఆరవ ముద్రలోని విమోచనా ముద్ర క్రింద. నా ప్రియ స్నేహితుడా అది అదే. అది ఆ ఆరవ ముద్ర, చాలా మర్మముగానున్నది.
320 ఇపుడు మనము…మనకు పది నిమిషములున్నవి. ఇంకొద్దిగా తీసుకుందాము. అవునా. రెండు మూడు పేజీలు నాయొద్ద నున్నవి. సరే…మీరు ఇక్కడ చూడగలరు. నేననుకుంటాను…దానిమీద, నాకింకా పదిహేను పేజీలున్నవి. ఓ, దానిమీద ఎంతో యున్నది! మై. మీరు ఒక చోట నుండి మరియొక చోటికి వెళ్ళుచుండవచ్చును. అయితే నేనెక్కువ వెదజల్లితే నేను మిమ్ములను తికమక చేస్తానేమోనని భయపడుచున్నాను. నేను కాదు…నేను చేయు విధముగా దాని చెప్పవలసిన క్రమములో చెప్పలేకపోవుచున్నాను.
321 యెషయాలో, ఇది తీసుకుందాము. ప్రవక్త యెషయా ఈ ఆరవ ముద్రను విప్పుట చూశాడు, అది మాట్లాడాడు. అది ప్రాముఖ్యమైనదా లేక కాదాయని మాట్లాడాడు. చూశారా?
322 సరే, సమస్తమును, సమస్త విమోచనా ప్రణాళికంతా ఈ ముద్రల క్రిందనున్నది; గ్రంథమంతా.
323 ఇపుడు జ్ఞప్తించుకోండి. దానిని యేసు చూచినట్లు మనము చూశాము. అవునా? అవునా? యేసు అది చూశాడు. ఇతరులు అది చూచినట్లు మనము కనుగొన్నాము. యాకోబులో దాని మాదిరిని మనము కనుగొన్నాము. ఐగుప్తులో దాని మాదిరిని చూశాము. సిలువలో దాని మాదిరిని మనము చూశాము.
324 ఇపుడు యెషయా కు తిరిగి వెళ్దాము. ఇక్కడ చాలామంది ప్రవక్తలను గూర్చి వ్రాసుకున్నాను కూడా. మనము…యెషయా లోనున్న దానిని నేనిష్టపడుతున్నాను. తిరిగి వెనుకకు యెషయా, 13వ అధ్యాయము యెషయా. నేను…
325 యెషయా, దానికదే సంపూర్ణ బైబిల్ యైయున్నది, తెలుసా. అది మీకు తెలుసా? చూడండి, యెషయా సృష్టితో ఆరంభమౌతుంది. గ్రంథము యొక్క మధ్యలో యోహానును తీసుకొనివస్తున్నాడు. ముగింపులో వెయ్యేండ్ల పాలనను తీసికొని వస్తున్నాడు. బైబిల్ లో అరవై ఆరు పుస్తకాలున్నవి మరియు యెషయా లో అరవై ఆరు అధ్యాయాలు. అది, తనకుతానే సర్వ సంగ్రహ నిఘంటువుగా నున్నది.
326 గమనించండి. యెషయా 13వ అధ్యాయము. ఇక్కడ 6వ వచనము ప్రారంభిద్దాం.
యెహోవా దినము వచ్చుచున్నది. ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును.
327 ఇక్కడ ఈ ఆరవ ముద్ర విప్పబడుటను గమనించండి. క్రీస్తు వచ్చుటకు ముందు ఏడువందల పదమూడు సంవత్సరములు ముందు, ఆయన రెండువేల సంవత్సరములు…సుమారు రెండువేల ఏడువందల సంవత్సరముల మునుపు. ఈ ముద్ర అక్కడయుండుట యెషయా చూశాడు. సరే.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును. ప్రతివాని గుండె కరిగిపోవును:
328 యేసు ఏమని చెప్పాడు? “అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.” “మరియు మనుష్యులు గుండె భయము వలన చెడి కూలుదురు; సముద్రము ఘోషించును.” చూశారా, మనుష్యులు గుండె ధైర్యము చెడి కూలుదురు.
జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
329 దానిని ఇక్కడ గమనించు, ఓ “వారి ముఖములు ఎఱ్ఱబారును.” ఒక నిమిషములో అక్కడకు చేరుదాము. నేను దానిని అలాగే పెట్టి ఉంచుతాను. చూశారా.
యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.
330 “దేశము,” అదంతా అంతే, మీరు చూచితే. గమనించండి.
ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను; మరియు అహం…
331 నేను—నేను ఏలాగు ఉచ్ఛరణ చేయాలో నాకు తెలియదు, అహం…[సంఘము “అతిశయము” అని చెప్పినది.—సంపా.] నేనది చెప్పలేను, చూశారా.
…అహంకారుల అతిశయమును మాన్పించెదను బలత్కారుల గర్వమును అణచివేసెదను.
332 చూశారా, అక్కడ, ఖచ్చితంగా, యేసు మాట్లాడినదే యెషయా చూశాడు. ఏడవ ముద్ర దానిని బయలుపరచుచున్నది. ఆయన దేశమును శ్రమల ద్వారా పరిశుభ్రపరచునపుడు, అదే శ్రమకాలము, ఈ ఆరవ ముద్ర. అవునండి. అతడు ప్రవక్త, దేవుని యొక్క వాక్యము అతనికి బయలుపరచబడవలసినది. అది రెండువేల ఏడు వందల సంవత్సరముల క్రితము.
333 నిజంగా. నేనిది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ యెషయా చెప్పినట్లు ప్రపంచమంతా “ఒక స్త్రీ ప్రసవవేదన పడునట్లు,” సృష్టి అంతా ప్రసవవేదన పడుచున్నది. ఈ యొక్క మూల్గు ప్రసవ వేదన ఇదంతా ఏమిటి? ఒక—ఒక—ఒక తల్లి కాబోతున్న స్త్రీ వలె; భూమి తన కదే, ప్రకృతి.
334 ఎందుకని, ఇక్కడ ఈ నగరము, మన స్వంత నగరాన్ని తీసుకుందాము; బీరు అంగళ్లు, వ్యభిచారము, అసహ్యమైనవి, హేయమైన కార్యములు, ఇతర పట్టణముల వలె ఇది కూడా ఉన్నది.
335 ఎందుచేత, వెయ్యి సంవత్సరముల క్రితము ఈ నగరము ఏలాగున్నదో అదే స్థితిలో దీనిని చూచుటకు దేవుడు ఖచ్చితంగా ఇష్టపడును. ఒహియో ప్రవహించునపుడు దానికి ఆనకట్టలు గాని దానిలో వరదలు గాని లేవు. లోయలో పాపము లేదు. గేదెలు ఇక్కడ సంచారము చేసెడివి. మరియు—మరియు పాత చెరకీ అతన్ని వేటాడి పవిత్ర జీవనం గడిపారు. ఎటువంటి ఇబ్బంది లేదు.
336 అయితే మానవుడు లోనికి వచ్చాడు. అక్కడే పాపము లోపల ప్రవేశించినది. భూమి మీద జనులు విస్తరించుట ఆరంభించగానే పాపము మరియు హింస వచ్చినది. అవునది నిజం. ఎల్లప్పుడు మానవుడే కారణం. అది అవమానకరమని అనుకుంటున్నాను.
337 గత దినమున, అక్కడ నేను నా మాతృదేశములో నిలబడియున్నాను, ఇపుడు ఆరిజోనాలో నున్నాను. మరియు నేను—నేను చిన్న బిడ్డగా నున్నప్పుడు జెరోనిమో మరియు—మరియు కాకైస్ మరియు ఆ పాత అపాచేస్ ను గూర్చి చదివాను. కారణం వారికి అక్కడ నేను బోధించాను, మంచి ప్రజలు! మరియు మీరు కలసికొనవలసినటువంటి ప్రజలు వారు ఆ అపాచి ఇండియనులు.
338 మరియు అటు తరువాత, ఎక్కడైతే పురాతన సంఘటనలు, యుద్ధ వ్రాతలు యుంటవో అట్టి స్థలమగు టూంబ్ స్టోన్ యొద్దకు వెళ్ళాను. నేను వాటిని చూశాను…వారు ఎల్లప్పుడు జెరోని మూలను ఒక తిరుగుబోతులుగా, దుర్మార్గులుగా చెప్పుకొంటారు. నాకైతే అతను ఒక ఎర్రని రక్తము గల అమెరికావాసి. నిశ్చయముగా, అందరి వలె అతను తన హక్కుల కొరకు పోరాడుచుండెను. అతడు తన యొక్క భూమిలో కలుషితమును కోరుటలేదు. మరియు ఇపుడు అదెట్లున్నదో చూడు. తన యొక్క బిడ్డలను, కుమార్తెలను, వేశ్యలుగా మార్చివేశాడు. మరియు తెల్లవారు అచటకు వచ్చారు. తెల్లవాడు ఒక దుష్టుడు.
339 ఇండియను ఒక సనాతనవాది. అతడు ఒక—ఒక—ఒక ప్రకృతిని సంరక్షించువాడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిపోయి ఒక బర్రెను చంపిన యెడల ఆ తెగవారందరు దానిని తింటారు. వ్యర్థముగా దానిలోనిది ఏదియు చేయరు. చర్మమును వారు బట్టలుగాను, గుడారములుగాను వాడుకొంటారు. మరియు తెల్లవాడు వచ్చి దానిని గురికొరకై వేటాడి కాల్చి చంపుచున్నాడు; ఎందుకని, అది అవమానకరము.
340 ఆఫ్రికాలో అడవి ఆటకు గల గొప్ప స్థలమును గూర్చి ఒక వివరణను గూర్చి పత్రికలో నేను చదివాను. ఆర్థర్ గాడ్ ఫ్రే మరి ఇతరులు అచటకు వెళ్ళి ఏనుగులను మరియు ఆయా జంతువులను హెలికాఫ్టర్ ల మీద నుండి కాల్చి చంపారని నేను చదివాను. ఒక ముసలి ఆడ ఏనుగు చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుచు, దాని కళ్ళలో నుండి కన్నీరు కార్చుచున్న దృశ్యమును చూశాను. మరియు పెద్దవి రెండు మగవి నిలబెట్టుటకు ప్రయత్నిస్తున్నవి…ఎందుచేత, అదియొక పాపము. అది వినోదము కాదు.
341 నేను అక్కడ బయట ప్రదేశములకు వేటాడుటకు వెళ్ళినపుడు తెల్లవేటగాళ్ళు అక్కడకు వచ్చి ఆ జింకను చంపి దాని వెనుక భాగమును కోసి తీసుకొని వెళతారు. కొన్నిసార్లు ఎనిమిది లేక పది ఆడ జింకలను చంపి వాటిని అక్కడే వదిలివేస్తారు. మరియు జింక పిల్లలు వాటి తల్లులను కనుగొనుటకు చుట్టు తిరుగును. వేటగాడనగా భావము అదేనా? నా యొక్క పుస్తక ప్రకారంగా అది నిజంగా హత్య.
342 ఆ విధముగా వేటగాడు ఆ అమెరికా క్రూరులను తమ దేశములోకి రాకుండ కెనడా దేశము నేను జీవించినంత కాలము అనుమతించదని నేను కోరుచున్నాను. అది నిజము. నా బ్రతుకులో నేను చూచినంతటిలో వారు బహుబలహీనమైన వేటగాళ్ళు వారు.
343 వారందరు కాదు. కొందరు స్వచ్ఛమైనవారు నిజమైన వారున్నారు. అయితే వెయ్యిమందిలో ఒకరుండుట నీవు కనుగొనగలవు.
344 వారు కంటబడిన దేనినైనా కాల్చి చంపుతారు. అవును, అది హత్య. అవును. అతడు హృదయము లేనివాడు. కాలము కానపుడు కాల్చి చంపును.
345 సరే, అక్కడ అలస్కాలో, నా యొక్క మార్గదర్శకులతో ఉన్నాను. అక్కడ అతడున్నాడు. “నేను గైకొన్నాను…అచ్చటికి నేను ఇపుడు వెళ్తాను. అక్కడ నేను ఒక విధమైన కణుజును లేదు…కణుజు కాదు, లేడి వంటి జంతువు అక్కడ పడియుంది; అమెరికన్ పైలట్లు యాభై కాలిబర్ మెషిన్ తుపాకులతో విమానముల నుండి వాటిని కాల్చి చంపారు. ఆ తుపాకి గుండు రొమ్ముల గుండా చొచ్చుకొని పోవుట ద్వారా ఆ లేడి వంటి జంతువులు మందగా చనిపోయి పడియుండెను.” అది ఒక కిరాతక హత్య.
346 వారు బర్రెను చంపినప్పుడెల్ల, వారు ఇండియనును పొందగలరని వారికి తెలుసు. మరణమంతగా ఆకలిగొంటాడు. ఆ హేతువు చేత కోసైజ్ లొంగిపోవలసి వచ్చెను. అతను అతని అధిపతులు, మిగతావారు, అతని బిడ్డలు ఆకలితో మరణమగునంతగా అలమటించిరి. మరి వారు ఆ బర్రెలనన్నిటిని కాల్చి చంపి వాటిని పెద్ద బండ్లలో తీసికొనిపోవుచున్నారు. వారు అక్కడున్న ఆ నలభై ఏభై వాటిని మధ్యాహ్నమున కాల్చి చంపుచున్నారు. వాటిని కాల్చి చంపినయెడల వారు ఆ ఇండియన్లను నాశనము చేయుచున్నామని వారికి తెలియును. ఓ, మై. జెండా మీద మరక ఆ ఇండియన్లను చూచిన విధము, అక్కడే మీరున్నారు.
347 అయితే జ్ఞప్తించుకోండి, బైబిల్ చెప్తుంది, “భూమిని నాశనము చేయువారిని దేవుడు నాశనము చేయబోవు ఘడియ వచ్చుచున్నది.” మరియు ప్రపంచము నంతటిని.
348 ఆ లోయలవైపు చూడు. గతదినము నేను అక్కడ నిలబడి ఫీనిక్స్ లోనున్న లోయవైపు చూచుచుంటిని. దక్షిణ పర్వతానికి వెళ్ళాను. నా భార్య నేను అక్కడ పైన కూర్చున్నాము. ఫీనిక్స్ వైపు చూస్తున్నాము. మరియు నేనన్నాను “అది భయంకరంగా లేదా?” అని.
ఆమె అన్నది, “భయంకరము? అంటే నీ భావము?”
349 నేనన్నాను, “పాపము. అక్కడున్న లోయలో ఎంతో వ్యభిచారం, త్రాగుడు, దూషణలు, ప్రభువు నామము వ్యర్థముగా వాడబడుతుంది. సుమారు నూట నలభై, ఏభై వేల మంది ప్రజలు లేక రెండు లక్షల మంది ఆ లోయలో ఉంటారేమో!”
350 నేనన్నాను, “ఐదు వందల సంవత్సరాల క్రితము లేక ఒక వెయ్యి సంవత్సరాల క్రితము, అక్కడ బలు రక్కసి చెట్లు, ముళ్ళపొదలు మరియు మొదలగునవి తప్ప మరేమియు అక్కడ యుండునవి కాదు. పాత కొయాటోస్, అక్కడ నదీ తీరాన పైకి క్రిందకు పరుగులు తీసేవి. అక్కడ స్నానం చేసేవి.” నేను చెప్పాను, “ఆ విధంగా దేవుడది చేశాడు.”
351 అయితే, మానవుని ప్రదేశము. అతడేమి చేశాడు. అతడా భూమిని అపవిత్రతతో నింపాడు. వీధులన్నీ చెత్తతోనున్నవి. కాలువలు…నదులు మురికితో కలుషితమైనవి. వారు చేయలేరు…ఎందుకని, ఆ నీటిని మీరు త్రాగకుండ ఉండుట మంచిదని వారు చెప్తున్నారు. ఏదైన మీకు వచ్చును. చూశారా? అది చూడు. ఇక్కడ మాత్రమే కాదు. లోకమంతా. ఆ విధముగా కలుషితమైంది.
352 లోకము, ప్రకృతి, (దేవా కనికరం చూపుము!) ప్రపంచమంతా ప్రసవ నొప్పులతో ఉన్నది. ప్రపంచము మూల్గుచున్నది. ఆమె “ప్రసవ వేదన” పడుచున్నది. యెషయా చెప్పాడు. విషయమేంటి? ఆమె వెయ్యేండ్ల పాలనకై ఒక నూతన ప్రపంచమును తీసికొనివచ్చుటకు ప్రయత్నించుచున్నది. అక్కడ ఒక నూతన ప్రపంచమును పాపము చేయని మరియు ఆమెను కలుషితము చేయని ఒక ప్రజలను ప్రసవించుటకు. అవును. ఆమె ప్రసవ వేదనలో నున్నది. ఆ కారణము చేత మనము ప్రసవ వేదనలో ఉన్నాము. క్రీస్తు తన యొక్క వధువును తీసికొని వచ్చుచున్నాడు. ప్రతీదీ కూడా ప్రసవ వేదన పడుచున్నది, మూల్గుచున్నది. చూశారా! ఒకటి జరుగబోతున్నది.
353 మరియు ఆరవ తెగులు ఆమె వెళ్ళుటకు అనుమతించును. సహోదరుడా, భూకంపము వలన భూమి పగిలిపోతుంది. నక్షత్రములు కదిలింపబడును. అగ్ని పర్వతములు బ్రద్దలగును. మరియు భూమి తననుతాను నూతన పరచుకొనును. భూమి మధ్య భాగము నుండి క్రొత్త లావా బయలుదేరి వచ్చును. ఆమె కుప్పకూలిపోవును చుట్టూ తిరుగుచు, తిరుగుచు ఆమె అక్కడ దూరాన తిరుగుచూ యుండును.
354 మరియు, నేను మీకు చెప్తున్నాను. ఒక ఉదయం యేసు ఆయన యొక్క పెండ్లికుమార్తె తిరిగి భూమి మీదకి వచ్చినపుడు, అక్కడ దేవుని యొక్క పరదైసువలె ఉండును. అది, ఓ, మై. యుద్ధభూమిలోని ఆ పాత యోధులు వారి యొక్క స్నేహితులతోను మరియు వారి ప్రియులతోను అచట కలసి తిరుగుతారు. దూతల సమూహము పాడు పాటలతో గాలి ధ్వనించును. “ఓ! నా యొక్క మంచి నమ్మకమైన దాసుడా, దానిని చక్కగా జరిగించావు, నీ కొరకు సిద్ధపరచబడిన ప్రభువు యొక్క సంతోషములో ప్రవేశించుము, పాపములో హవ్వ పడకమునుపు నీకు గల ఆనందములో ప్రవేశించుము.” ఆమేన్! వ్యూ! అవును.
355 ఆరవ ముద్ర ఒకటి చేయబోవుచున్నది. అవునండి. నిజముగా వెయ్యేండ్ల పాలన కాలము కొరకు లోకమంతా మూల్గుచూ బాధపడుచున్నది.
356 ఇపుడు, ఇపుడున్నది ఎంతో మురికితోనున్నది. కొంచెము కాలము క్రితము లోకము పతనమై పోవుచున్నది అను దానిని మందిరములో నేను బోధించాను అని అనుకుంటాను. అది ఖచ్చితము. చూడు, లోకములో ఏమి పగిలిపోతున్నదో. దానిలోనున్నదంతా పతనమౌతుంది. అది ఖచ్చితం. అది—అది విచ్ఛిన్నం కావలసియున్నది. అవునండి.
357 చూడు దాని యొక్క చట్రమును! ప్రపంచము ఆ విధముగా అగుటకు గల కారణము నేను మీకు చూపుతాను. ఈ ప్రపంచము యొక్క చట్రము, ఇనుము, ఇత్తడి, ఈ భూమి యొక్క ఇతర పదార్థములు దాని నుండి బయటకు తీయబడుచున్నవి. దానియొక్క చట్రము పని యుద్ధములకు పరిశ్రమలకు వాడబడుచున్నది. ఎంతవరకనగా దేశము యొక్క ఆ ప్రాంతములో క్రితం ఎన్నడూ, నిన్నటి వరకూ భూకంపము గురించి వినలేదు. సెయింట్ లూయిస్, అక్కడ క్రిందనుండి భూకంపము వచ్చింది. ఆమె చాలా సులువుగా నున్నది. అక్కడ అందులోనుండి అంతా లాగివేశారు. చూశారా?
358 దాని యొక్క రాజకీయాలు ఎంతో కలుషితమైపోయినవి. వారిలో ఏ ఒక్కరు నిజాయితీపరులుగా లేరు. చూశారా, దాని పద్ధతి. దాని యొక్క నైతిక విలువలు ఎంతో హీనము. దానికసలు లేవు. అది అంతే. చూశారా? నిజము. దాని యొక్క మతము చెడిపోయినది. అవునండి.
359 చాలా త్వరలో ఆరవ ముద్ర విప్పబడుటకు, ఇది సమయము. మరియు అది జరిగినప్పుడు, ఓ, మై, అది అంతం. పెండ్లికుమార్తె ఎత్తబడును, ఆమె వెళ్ళిపోవును…రాణి, ఆమె స్థానమును తీసికొనుటకు వెళ్ళిపోయినది. ఆమె రాజుతో వివాహమగుచున్నది, ఇది జరుగునపుడు మరియు ఇశ్రాయేలీయులలో శేషించబడినవారు ముద్రించబడి మరియు వెళ్ళిపోవుటకు సిద్ధముగానుంటారు. అటుతరువాత ప్రకృతి తన కార్యము చేయును. ఓ, ఎంతటి గంభీర సమయము!
360 ఆరవ ముద్ర ఆఖరు వచనము, విప్పుట గమనించండి. వాక్యము ప్రకటించబడుటను మరియు రుజువు చేయబడిన జీవముగల దేవుని వాక్యమును పరిహసించువారు; అక్కడ ఆ ప్రవక్తలు నిలబడి అద్భుతములు చేయుటను, సూర్యుని వెలుగునివ్వక మూసివేయుటను మరియు సమస్తమును జరుగుచుండుట చూచుచు, “వారు బండలు మరియు పర్వతములు వచ్చి వారిని కప్పవలెనని కేకలు వేశారు,” చూశారా, వారు ఏ వాక్యమును చూచి అపహాస్యం చేశారో దాని నుండి వారిని కాపాడవలయునని కేకలు వేశారు. ’ఎందుకనగా ఆయన తిరిగి వచ్చుటను వారు చూశారు. “గొఱ్ఱెపిల్ల ఉగ్రత నుండి మమ్ములను దాచమని.” ఆయన వాక్యము. చూశారా? మీరు వాక్యమును చూచి నవ్వారు. మరియు ఇక్కడ వాక్యము శరీరధారియయ్యాడు. మరియు వారు దానిని గూర్చి హేళన చేశారు. వారిని గూర్చి నవ్వారు. వారిని హేళన చేశారు. శరీరధారియైన వాక్యము వారి మధ్యకు వచ్చింది.
361 ఎందుకు వారు మారుమనస్సు పొందలేదు? వారు పొందలేకపోయారు. అది వారికి అప్పుడు చాలా దూరముగా ఉన్నది. కనుక వారు శిక్షను గూర్చి ఎరిగారు. వారు అది విన్నారు. వారు ఈ విధమైన కూటములో కూర్చొని అందును గూర్చి తెలుసుకొన్నారు. వారు జరుగబోవు ఈ సంగతులను గూర్చి ఆ ప్రవక్తల యొక్క కార్యముల గూర్చి విని, వారి కన్నుల యెదుట అవి చేయబడుటను చూచి వారు నిరాకరించారు. ఆఖరి సమయములో కనికరాన్ని తిరస్కరించారు.
362 మరియు కనికరాన్ని నీవు తృణీకరించినపుడు, తీర్పు తప్ప మరొకటి మిగిలియుండదు. నీవు కనికరాన్ని తృణీకరించినపుడు, అది ఆలోచన చేయ్.
363 మరియు వారు అక్కడే యున్నారు. వారు వెళ్ళుటకు ఏ స్థలము లేదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, “వారు పిలిచారు…వారు బండలతోను మరియు పర్వతములతోను మామీద పడుడని కేకలు వేయుచున్నారు, ‘మా మీదపడి మమ్ములను గొఱ్ఱెపిల్ల యొక్క ఉగ్రత నుండి దాచుడి.’” వారు మారుమనస్సు పొందుటకు ప్రయత్నించారు అయితే గొఱ్ఱెపిల్ల ఆయన స్వంతమైన వారిని గైకొనుటకు హక్కు పొందుటకు వచ్చెను. చూశారా. వారు బండలతోను పర్వతములతోను మొర్రపెట్టిరి. ప్రార్థించారు. అయితే ఆ ప్రార్థనలు ఆలస్యమైపోయెను.
364 నా సహోదరుడా, సహోదరి దేవుని వాత్సల్య కనికరాలు ప్రజలకు విస్తరించియున్నవి. ఇశ్రాయేలు దీని నిమిత్తము సుమారు రెండువేల సంవత్సరములు గ్రుడ్డివారుగా చేయబడ్డారు. మారుమనస్సు పొందుటకు మనకు తరుణం ఇవ్వబడినది. ఆ కనికరాన్ని మీరు త్రోసివేసితిరా? మీరు? మీరు దానిని తృణీకరించితిరా?
365 ఏది ఏమైనను మీరెవరు? మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీరెక్కడకు వెళ్తున్నారు? మీరు ఒక వైద్యుని యొద్ద అడుగలేరు, ఈ లోకంలో ఎవరియొద్ద అడుగలేరు. మీరు చదవగలిగిన ఏ పుస్తకము లేదు. మీరు ఎవరని, మీరు ఎక్కడనుండి వచ్చారని, ఎక్కడికి వెళ్ళుచున్నారని ఈ గ్రంథం మాత్రమే చెప్పగలదు.
366 ఇపుడు, తెలుసా, గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము మీ స్థానములో మీ కొరకు క్రియచేయని యెడల మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో మీరు చూశారు. కాబట్టి, అయితే దేవుడు మీ కొరకు అది చేసినట్లయితే, మనము చేయవలసిన చివరిది ఆయన మనకేమి చేశాడో దానిని అంగీకరించుట. అదే మనలను చేయమని ఆయన అడుగుచున్నది.
367 దీనిని ఆధారము చేసికొని, నేను ఇంకా ముందుకు వెళ్తే, నేను తెగుళ్ళు యొద్దకు రావలయును. అదంతా రేపు రాత్రి పరిచర్య. ఇపుడు నేనది చేయలేను. ఇక ముందుకు వెళ్ళను. “ఇక్కడ నిలపు” మని సిలువ గుర్తు వేసుకున్నాను. అవును. కనుక నేను—నేను రేపటి వరకు వేచియుండవలసియున్నది.
ఇపుడు మనం మన తలలు ఒక్క క్షణం వంచుదాము.
368 నా ప్రశస్త స్నేహితుడా, నేను మాట్లాడుచున్న ఈ దేవుని యొక్క ప్రేమను నీవు అంగీకరించని యెడల! నీవు వద్దంటే…ఇపుడు దీనిని జాగ్రత్తగా వినండి. ఆయన యొక్క ప్రేమ కనికరాన్ని మీరు అంగీకరించకపోతే ఆయన ఉగ్రత న్యాయతీర్పులలో మీరు నిలబడవలసి వస్తుంది.
369 ఈ రాత్రి, నీవు ఆదాము హవ్వలున్న ఏదెను తోటలోనున్న అదే స్థలములో ఉన్నావు. నీకు హక్కున్నది. నీవు స్వతంత్ర జీవివి. జీవ వృక్షము యొద్దకు నీవు వెళ్ళగలవు, లేదా న్యాయ తీర్పు ప్రణాళికను తీసికోగలవు. అయితే, ఈరోజు నీవు విజ్ఞతగానున్నపుడు, నీ మంచి మనస్సుతోనున్నపుడు నీవు లేచి, దానిని అంగీకరించుటకు నీవు ఆరోగ్యంగా నున్నపుడు, నీవు అది చేయనట్లయితే నీవది ఎందుకు చేయకూడదు.
370 అది ఇంకా చేయని వారు ఇక్కడ ఎవరైన ఉన్నారా, అది చేశారా? ఆలాగైతే, మీరు చేయి పైకెత్తి, “సహోదరుడా బ్రాన్హాం, నేనిపుడు అది చేయాలని కోరుతున్నాను. ఇది నా మీదికి వచ్చుటను నేనంగీకరించను.” ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి స్నేహితులారా…దేవుడు మిమ్ములను దీవించును. అది మంచిది. నేను…
371 దీనిని గూర్చి ఆలోచనలు కావు అవి. నేను—నేను…నేను ఆలోచన చేస్తున్నది ఇది కాదు. ఇది పూర్తిగా నా యొద్ద నుండి వచ్చినది. కనుక నాకు సహాయము చేయుడి. పరిశుద్ధాత్మకు అది తెలుసు. ప్రభువు చిత్తమైతే రేపు రాత్రికి మీరు వేచియుంటే ఒక మర్మము మీకు చూపించగోరుచున్నాను. చాలాకాలము నుండి అదియొక మర్మముగానే యున్నది. ఈ కూటము వరకు అది మర్మమే. దానిని మీరు గమనించారో లేదో నాకు సందేహముగా యున్నది. చూశారా, ఏమి జరిగిందో. ఇది మీ ముందే పెట్టబడిన యొకటి. మరియు ప్రతీ రాత్రి నేను గమనించాను. దీనిని, “నేను చూశాను” అని ఒకరు లేచి చెప్పుదురేమోనని నేను గమనించాను. అవును.
372 నేను మిమ్మును అడుగుచున్నాను. దానిని త్రోసివేయవద్దు; మీరు క్రైస్తవులు కానట్లయితే, మీరు—మీరు రక్తము క్రింద లేనట్లయితే, మీరు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మతో నింపబడనట్లయితే, నేను మిమ్ములను అడుగుచున్నాను. త్రోసివేయవద్దు.
373 మీరు అంగీకరించారని ఆయన మరణమునకును, పాతిపెట్టుటకును, పునరుత్థానమునకును బహిరంగ సాక్ష్యముగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొననట్లయితే, నీళ్లు సిద్ధముగా యున్నవి. అవి ఎదురుచూస్తున్నవి. బట్టలు సిద్ధముగా ఉన్నవి. ప్రతీది సంసిద్ధమే.
374 చాపబడిన హస్తాలతో నిన్ను స్వీకరించుటకు క్రీస్తు సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి నుండి ఒక గంటలోగా ఆ కనికరము నీ యెడల హెచ్చించబడకపోవచ్చు. ఆఖరి గడియలో నీవు తృణీకరించవచ్చు. మరలా అది నీ హృదయమును తాకకపోవచ్చు. నీవు సంసిద్ధంగా యున్నప్పుడే, నీవు సంసిద్ధంగా ఉన్నపుడే నీవది ఎందుకు చేయకూడదు? ఇపుడు…
375 బలిపీఠము యొద్దకు ప్రజలను పిలచుట సాధారణంగా చేయు పద్ధతి నాకు తెలుసు. మనము చేస్తున్నాము. అది చాలా మంచిదే. ప్రస్తుతము, బలిపీఠము చుట్టూ ఇక్కడ చాలా గుంపు ఉన్నారు. అది చేయలేనంతగా.
376 అయితే, ఇది చెప్పుటకు నేను ఇష్టపడుతున్నాను. అపొస్తలుల యొక్క దినమున వారు చెప్పారు, “నమ్మినవారందరు బాప్తిస్మము పొందారు.” అవునా? నిజముగా మీ హృదయములో యున్నట్లయితే! ఇక్కడ సమస్తమును ఉన్నది. అదికాదు దానివలన ఉద్రేకము వచ్చినా అది ఉద్రేకము కాదు. నేనేమి చెప్పితినో ఆ విధముగా పొగత్రాగుట, మద్యపానము సేవించుట అది పాపము కాదు. అది పాపము యొక్క గుణము; అది నీవు నమ్మలేదని చూపుతుంది. చూశారా? అయితే, నీ హృదయములో నీవు నిజంగా నమ్మితే నీవు కూర్చున్న స్థలము నుండి నీవు ఎరిగియున్న దానిని బట్టి నీ హృదయమంతటితో దానిని అంగీకరించిన యెడల అక్కడ యొకటి జరగనైయున్నది. ఒకటి జరగబోతున్నది.
377 అటుతరువాత జరిగిన దానికి నీవు ఒక సాక్షిగా నిలబడగలవు. తరువాత నీళ్ల యొద్దకు వెళ్ళి, ఈలాగు చెప్తావు, “నేను సభకు చూపించగోరుతాను, నేను రుజువు చేయగోరుచున్నాను, నా యొక్క సాక్ష్యము నిలచియుండునట్లు తలంచాను. తద్వారా నా యొక్క స్థానమును పెండ్లి కుమార్తెతో తీసుకుంటాను. బాప్తిస్మము పొందుటకు ఇక్కడ నిలబడియున్నాను.”
378 ఈ రాత్రి ప్రపంచములో, మంచి స్త్రీలు, చాలామంది యున్నారని నాకు తెలుసు, అయితే వారిలో ఒక్కరిని నేను చూడగలను. వారిలో ఒక స్త్రీ నా భార్య. ఆమె నాతో కలసి ఇంటికి వచ్చును. ఆరంభములో ఆమె నా భార్య కాదు. అయితే ఆమె ఏ విధముగా నా భార్య అయినదనగా, ఆమె నా యొక్క పేరును తీసుకున్నది.
379 ఆయన వచ్చుచున్నాడు. లోకములో ఎందరో స్త్రీలున్నారు, సంఘాలున్నవి అయితే ఆయన ఆయన భార్య కొరకు వచ్చుచున్నాడు. ఆమె ఆయన నామమున పిలువబడుచున్నది. “క్రీస్తులో ఎవరైతే యున్నారో దేవుడు ఆయనతో తీసికొని వచ్చును.” అందులోకి మనము ఏలాగు వెళ్ళగలుగుతాము? “ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోకి మనమందరము బాప్తిస్మము పొందితిమి.”
380 ఇపుడు మేము ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రార్థించండి. లోపట లేక బయట, చుట్టు ప్రక్కల బయట వీధుల్లో, గదుల్లో ప్రజలు పెద్ద గుంపులుగా యున్నారు. అయితే ఇపుడు మీరు ఉండగనే మిమ్ములను బలిపీఠము యొద్దకు పిలువలేము. అయితే మీ హృదయమును ఒక బలిపీఠముగా చేసికోండి. మరియు నేరుగా మీ హృదయములోనే చెప్పండి, “ప్రభువైన యేసూ, నేనిది నమ్ముతున్నాను, ఈ రాత్రివేళ గాలిలో నేనిక్కడ నిలబడియున్నాను. ఈ చిన్న గదిలో నేను ఊపిరి పీల్చుకోలేకున్నాను. ఈ ప్రజల మధ్య నేను కూర్చున్నాను. నేను—నేను—నేను—నేను—నేను కోరుకొనుటలేదు…నేను వదిలివేయలేను. నేను దీనిని పోగొట్టుకొనలేను.”
381 గత రాత్రి నేను చెప్పినట్లు, ప్రతీది మరియు నాకు సహయపడుము. నేను సత్యము చెప్తున్నానని ప్రభువుకు తెలుసు. పౌలు చెప్పినట్లుగా “నేను అబద్ధమాడుట లేదు.” ఆ దర్శనము, లేక అదేమైనను కావచ్చును; నేనక్కడ నిలబడియున్నాను, చూశాను, మరియు అక్కడకు వెళ్ళిన ప్రజలను తాకిచూశాను. నేను ఇక్కడ నిలబడియుండుట ఎంత వాస్తవమో అంత నిజం. దానిని పోగొట్టుకొనవద్దు. నా దీన సహోదరుడా, సహోదరి అది చేయవద్దు. మీరు బోధ విన్నారని నాకు తెలుసు. మీరు దీనిని దానిని వినియున్నారు, కథలు, అవన్ని. అయితే వినండి. నాది, ఇది…ఇది సత్యమని నాకు తెలుసు. చూశారా. మీరు…నేను—నేను ఇంతకంటే తేటగా చెప్పలేను, చూశారా, అది పోగొట్టుకోవద్దు. అదంతా మీదే.
ఇపుడు ప్రార్థించుకుందాం.
382 ప్రభువైన యేసూ, ఇక్కడ నా ముందు రోగులకు ప్రతినిధులుగా ఒక పెట్టె చేతి రుమాళ్ళు పెట్టబడియున్నవి. వాటిపైన చేతులుంచి వాటికై ప్రార్థిస్తుండగా, బైబిల్ చెప్పినట్లుగా, “పౌలు యొక్క శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినపుడు రోగములు వారిని విడచెను. దయ్యములు కూడా వారిని వదలిపోయెను. మరియు గొప్ప సూచనలు జరిగెను.”
383 ఎందుకనగా, వారు పౌలును చూశారు. అతనితో దేవుని యొక్క ఆత్మయుండుట వారు ఎరిగారు. అతడు—అతడు ప్రత్యేకించబడిన వ్యక్తియని వాక్యమును గూర్చి అతడు మాట్లాడు విషయాలు వింతగానున్నవని వారు ఎరిగారు. అతడు వెళ్ళి పాత హెబ్రీయుల వాక్యమును హెబ్రీయుల సంఘము నుండి తీసికొని, దానిని క్రీస్తునందు పెట్టి దానికి జీవము నిచ్చును. ఆ మనుష్యునిలో దేవుడున్నాడని వారెరిగారు. అటు తరువాత దేవుడు అతని ద్వారా వింతైన బలమైన కార్యములు చేయుట, ముందుగా చెప్పించుట మరియు అవి ఆ విధంగా జరుగుట వారు చూశారు. మరియు అతడు దేవుని సేవకుడని ఎరిగారు.
384 ప్రభువా, వాక్యము యొక్క గౌరవము నిమిత్తమున్న ఈ ప్రజలను ఘనపరచమని మరియు యేసు నిమిత్తము వారిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. పెంతెకొస్తు దినమున అపొస్తలుడైన పేతురు బోధ వినిన జనుల వలె ఇక్కడ ప్రేక్షకులలో జనులు కూర్చొనియున్నారు. అతడు వాక్యము వెనుకకు ఏలాగు వెళ్ళిపోయి వాక్యాన్ని తెచ్చాడు! అతడు చెప్పాడు “యోవేలు చెప్పాడు, చివరి దినములలో ఈ సంగతులు జరుగును. మరియు ఇది అదే.” మూడువేల మంది నమ్మారు. బాప్తిస్మము పొందారు.
385 మరియు తండ్రీ, ఈ దినాన నీ కృపను బట్టి మేము నిలబడియున్నాము. ఇది—ఇది ప్రత్యేకించబడిన ప్రజలమని కాదు, అయితే (సింహపు దినములలో లేక ఎద్దు లేక మనుష్యుని దినములలో వలె) ఇది పక్షిరాజు సమయమైయున్నది. కనుక, ఇది ఘడియ యొక్క అభిషేకము. మనము జీవించుచున్న సమయము ఇదే. యేసు మృతుడు కాదని రుజువు నిమిత్తము ఈ ప్రత్యేక సమయము కొరకు ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యము. సాయంకాల వెలుతురు ఆరిపోవుటకు మునుపు, ఆయన చేయునని చెప్పిన కార్యములు ఆయన ఇక్కడ చేయుటను మన మార్గములో చూచుచున్నాము. అది క్రిందకు దిగివచ్చుటను విజ్ఞాన శాస్త్రము ద్వారా వారు పరిశోధించి తెలుసుకున్నారు. ఆయన యొక్క చిత్రమును తీసిరి; ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన ఆ గొప్ప అగ్నిస్తంభము మరియు పౌలును రహదారిలో కలసిన ఆయనను వారు ఛాయాచిత్రముగా తీశారు.
386 అక్కడ అరణ్యములో మోషేను నడిపించిన అదే ఈ అగ్ని స్తంభము, ఆ అగ్ని స్తంభము ద్వారానే అతడు బైబిల్ లోని అనేక పుస్తకములు వ్రాసెనని మాకు తెలియును, ఎందుకనగా అతడు వాక్యము ద్వారా అభిషేకించబడెను.
387 ఈ అదే అగ్ని స్తంభము దమస్కు మార్గమున పౌలు మీదికి వచ్చియుండెను. దేవుని వాక్యమని పిలువబడు అనేక పుస్తకములు అతడు బైబిల్ లో వ్రాశాడు.
388 మరియు ఇపుడు, ప్రభువా, అదే అగ్ని స్తంభము వాక్యముతోనున్న రుజువుతో గల గురుతు ద్వారా మరియు శాస్త్రీయ పరిశోధన ద్వారా ప్రభువు యొక్క వాక్యము బయలుపరచబడుట ఇక్కడ చూస్తున్నాము.
389 దేవా, ప్రజలు త్వరగా మేల్కొందురు గాక, ప్రభువా, త్వరగా. జీవగ్రంథములో ఎవరి పేరు వ్రాయబడియుందో వారు; ఇది వారి మార్గమునకు ప్రకాశించు వెంటనే వారు చూచెదరు గాక. ఆ దినాన, బావి యొద్ద ఆ చిన్న సాక్ష్యము లేని స్త్రీ వలె. ఆమె త్వరగా గుర్తించింది. అది లేఖనమని ఆమె ఎరిగింది.
390 ఇపుడు, తండ్రీ ఎవరైతే ఈ సమయమందు వారి హృదయాల్లో స్వీకరిస్తారో, ఈ సమయంలో నిరంతరముగా నిశ్చయించుకొందురు గాక; పాపమును సమాప్తము చేసికొందురు గాక; వారు లేచి, వారి పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము నిమిత్తమై బహిరంగ ఒప్పుకోలు కొరకు సిద్ధపడుదురు గాక; దేవుడు వారిని క్షమించాడని చూపుట కొరకు మరియు వారు యేసుక్రీస్తు నామము స్వీకరించారని గుర్తింపునకు.
391 అటు తరువాత, తండ్రీ, ప్రభువైన దేవుని పరిచర్యలో వారుండునట్లుగాను, ఈ చివరి చెడ్డ దినములో వారు పనివారుగా నుండునట్లుగాను వారిపైన పరిశుద్ధాత్మ అను నూనెను క్రుమ్మరించుము. మాకు కొద్ది సమయం యుందని మేము గ్రహిస్తున్నాము. సంఘము ఏ సమయములోనైనా వెళ్ళిపోవును.
392 గొఱ్ఱెపిల్ల ఏ సమయములోనైనా అక్కడ పరిశుద్ధ స్థలము నుండి లేక బలి అర్పించు సింహాసనము నుండి వెళ్ళిపోవచ్చును. ఎక్కడ బలియుండునో అట్టి దేవుని సింహాసనము నుండి వచ్చును. అప్పుడు అది సమాప్తమగును; లోకానికిక నిరీక్షణలు లేవు. ఆమె సంగతి సమాప్తమైనది. అప్పుడు ఆమె గొప్ప నిరాశలోకి, భూకంపములోకి మరియు పునరుత్థానమందు జరుగు ఆటుపోట్లలోనికి ఆమె వెళ్ళును. మరియు—మరియు…
393 క్రీస్తు సమాధిలో నుండి లేచినట్లు, పరిశుద్ధులు లేచినపుడు, అదే విషయము జరుగును. ప్రభువా, అది ఏ సమయములోనైనా కాగలదు. ఆ శుభదినము వచ్చుటకొరకు మేము ఎదురుచూస్తున్నాము.
394 తండ్రీ, ఇపుడు, నీ హస్తాల్లోకి నీ బిడ్డలను స్వీకరించుము. నీ చిన్న గొఱ్ఱెపిల్లలను నీ కౌగిటిలోకి ఆకర్షించుము. అది అనుగ్రహించుము. పరిచర్య కొరకు వారు బలము పొందునంతగా వాక్యము చేత వారిని పోషించుము. ప్రభువా, వారిని నీకు అప్పజెప్పుకొనుచున్నాము. ఈ ప్రార్థనకు జవాబు అనుగ్రహించుము.
395 తండ్రీ, మార్కు 11వ అధ్యాయములో నీవు చెప్పావు “మీరు ప్రార్థించునపుడు, నిలబడి ప్రార్థించునపుడు దేనిని మీరు అడిగితిరో మీరు దానిని పొందియున్నారని నమ్ముడి. అవి మీరు పొందుకుంటారు.”
396 మరియు నా హృదయమంతటితో, ఈ సంగతులను సంవత్సరములు తరబడిగా బయలుపరచుచున్న మరియు ఈ చివరి వారములో ఈ ముద్రలను బయలుపరచిన ఆయనకు; ప్రభువైన దేవా, మేము తలంచి చూచుదానికన్నను నీవు వచ్చుట సమీపముగా నున్నదని, ఆ గడియ ఇపుడు చాలా సమీపముగానున్నదని నేను నమ్ముచున్నాను.
397 దయచేసి నా ప్రార్థనకు జవాబు కలుగునుగాక. మరియు దేవుని యొక్క బిడ్డయని పిలువబడు ప్రతియొక్కరు, ఇక్కడ నుండి దూరమున అది వినుచున్న వారును, లేక టేపు ద్వారా వినుచున్న వారును, ఆ సమయములో…బయలుపరచబడుచున్న వాక్యము ఇది అని ఎరిగి మరియు ఈ వాక్యమును ఆధారము చేసికొని నేను వారిని దేవుని రాజ్యము కొరకు వారిపై హక్కును పొందుచున్నాను. తండ్రీ, సాయంకాల వెలుతురు ప్రకాశింపనిమ్ము, యేసు నామమున నేను వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఆమేన్.
398 ఇపుడు, అందరూ, లోపట లేక బయట ఉండువారిలో ఎవరైనను దేవుని విశ్వసించి, పాపమునకు ఇక తమకు సంబంధము లేదని పాపమును విడిచిపెట్టి దానిని ఇది వరకు బహిరంగముగా ఒప్పుకొనని వారు ఎవరైనను ఉన్నయెడల; మరియు నీవు—నీవు దేవుని కనికరాన్ని కోరిన యెడల మరియు దానిని యేసుక్రీస్తు నామములో అంగీకరిస్తే, నీటికుంట…ఎవరైతే బాప్తిస్మము కోరుచున్నారో వారికి బాప్తిస్మమిచ్చుటకు, ఈ రోజు గాని, రేపుగాని, ఎప్పుడైనను, మరెప్పుడైనను వారు సిద్ధముగానున్నారు.
399 మీరు ఆరవ ముద్రను సంతోషించుచున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] అదెక్కడ విప్పబడినదో మీరు చూశారా? [“ఆమేన్.”] మీరు దానిని నమ్మియున్నారా? [“ఆమేన్.”]
400 అది చెప్పబడినది, “మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?” చూశారా? సమాచారము నమ్మండి. అటు తరువాత యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. బాహువు, దేవుని యొక్క వాక్యము బయలుపరచబడుతుంది.
401 ఇపుడు ప్రభువు చిత్తమైతే రేపు ఉదయము ఆ ప్రశ్నలకు నా శక్తి కొలది జవాబిస్తాను. నేను మిగిలిన రాత్రంతా లేక రాత్రంత వాటికొరకు ప్రార్థిస్తాను. ఒక్కొక్క రాత్రి నేను ఒంటి గంట నుండి మూడు గంటల వరకే నిద్రిస్తున్నాను. గత రాత్రి ఒంటి గంట వరకు నేను నిద్రపోలేదు. మరియు మూడు గంటలకే నేను చదువుచుంటిని. చూశారా? చూశారా?
402 దీనికొరకు నేను జవాబు ఇవ్వవలసిన వాడనైయున్నాను. అవునది యథార్థం. మనము ఏ బుద్ధిహీనమైన కార్యమునకు లేక ఊహకు లేక సగము నమ్మకానికి చాలా సమీపంగా యున్నాము. మొదట నేనది చూడవలసి యున్నది. అటుతరువాత, నేనది చూచినపుడు అది వాక్యములో యుండవలసినది కూడా. ఇంతవరకు దేవుని కృప ద్వారా అవి పరిపూర్ణము. దానిని అన్ని విధములుగా తీసుకున్నాను. తెలుసా, అది ఒక దానితో ఒకటి కలసినవి.
403 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని అది యుండవలసియున్నది. ఎందుకనగా నేను దానిని తెలుసుకొని చెప్పుటకాదు గాని, నాకు నేను చెప్పుట వలన కాదు, అయితే ప్రభువు యొక్క వాక్యము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్యమున్నది. ఆయన నాకు ఏమి ఇచ్చాడో తీసికొని కలిపి మీకు చూపుచున్నాను. కాబట్టి మీరు మీకే తెలుసు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని. చూశారా?
404 ఇక్కడ వాక్యమున్నది ఈ విధంగా చెప్తున్నది. మరియు తరువాత ఆయన నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అది మనలో ఎవరైన ఇంతకు ముందు తలంచుకొనిన దానికి విరుద్ధముగానున్నది; నేను తలంచిన దానికి ఎలా విరుద్ధముగానున్నది. ఎందుకనగా అందులోకి నేను ఆలాగు వెళ్ళలేదు. అయితే ఇపుడు అది తారుమారుగా జారుచున్నదని మనం చూచుచున్నాము. మరియు అదేంటి? అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చూశారా. అది ఖచ్చితం. అది తెరవబడియున్న ఒక స్థలము. ఈ గడియ వరకు అక్కడనే యున్నది. మరియు తరువాత ప్రభువు వచ్చి దానిని ఆ విధముగా నెట్టియున్నాడు. కనుక చూడండి, అది అక్కడే యున్నది. అది—అది ప్రభువు, ఓ, నేను ఆయనను ప్రేమిస్తున్నాను! నా నిండు హృదయముతో ఆయనను ప్రేమిస్తున్నాను.
405 ఇపుడు జ్ఞప్తించుకోండి. నీవు…మనము బలిపీఠము యొద్దకు వెళ్ళలేము. చాలామంది వారి చేతులెత్తారు. ఇపుడు చూడండి. మీ వ్యక్తిగత వ్యవహారము. అది మీరు కోరుకున్నట్లు చేయవచ్చును. చూశారా?
406 సమయము చాలా సమీపంగా యున్నది. మీరు ఎంత బలవంతంగా నెట్టుకొని పోవలెనో అంత బలవంతంగా త్రోసుకొని పోవలెను, లాగటం కాదు. చూశారా, నెట్టుకొనిపోవుట. లోపలకు వెళ్ళుటకు ప్రయత్నించుట, “ప్రభువా, నన్ను వెలుపలికి వెళ్ళనీయకుము. నన్ను వెలుపలకు వెళ్ళనీయకుము, ప్రభువా. తలుపులు మూయబడుచున్నవి; నేను లోపలకు వెళ్ళిన యెడల!” చూశారా?
407 ఒక దినమున దేవుడు తలుపును మూయును. నోవహు దినాన ఆయనది చేశాడు. వారు తలుపు కొట్టారు. [సహోదరుడు బ్రాన్హాం చాలాసార్లు వేదికను తట్టాడు—సంపా.] అవునా? [సభ, “ఆమేన్” అని చెప్పినది.]
408 ఇపుడు, జ్ఞప్తించుకోండి, బైబిల్ చెప్తుంది, “ఏడవ జాములో.” అవునా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] కొందరు మొదటి జాములో నిద్రించారు, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ, ఏడవ. అయితే ఏడవ జాములో అక్కడ ఒక ప్రకటన, ఒక కేక “పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళుడి.”
409 నిద్రించు కన్యకలు చెప్పారు, “ఇపుడు ఆ నూనెలో మాకు కొంత కావలయును.”
410 పెండ్లికుమార్తె అన్నది, “నాకు సరిపడినంత నా యొద్దనున్నది; చాలినంత. మీకు కావలయునంటే, వెళ్ళి ప్రార్థించు.”
411 ఇపుడు మీరు నిద్రించు కన్యకను చూచుటలేదా? ఎపిస్కోపెలియన్, ప్రెస్బిటేరియన్, లూథరన్ మరియు సమస్తమును ప్రయత్నించుటను చూడండి. ఇబ్బంది ఏదంటే, పరిశుద్ధాత్మ పొందుటకు బదులుగా భాషలతో మాట్లాడుటకు ప్రయత్నిస్తున్నారు.
412 వారిలో అనేకులు భాషలతో మాట్లాడుతారు. ఈ సంఘమునకు వచ్చి ప్రార్థించుట కొరకు సిగ్గుపడుతున్నారు. వారిళ్లకు వచ్చి వారికి ప్రార్థించమని నన్ను కోరుచున్నారు. అది పరిశుద్ధాత్మ యని మీరు చెప్తున్నారు? అది భాషలతో మాట్లాడుట, అయితే పరిశుద్ధాత్మ కాదు. అవునా?
413 పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడునని నేను నమ్ముచున్నాను. నేనది నమ్ముతానని మీకు తెలుసు, అవునా! అయితే దానికి నకిలీ కూడా ఉంది. అవునండి. ఆ ఆత్మ యొక్క ఫలములు అదేమిటని రుజువు చేయును. చెట్టు యొక్క ఫలములు ఏ రకమైన చెట్టు అది అని రుజువు చేయును. బెరడు కాదు; ఫలము!
414 ఇపుడు గమనించండి, అటు తరువాత ఆమె వచ్చినపుడు అది ఆఖరు గడియ. అక్కడ వారు వచ్చినపుడు వారు వెళ్ళి అన్నారు, “సరే, నేనిప్పుడు దానిని పొందానని అనుకుంటున్నాను. అది నాకున్నదని నేననుకుంటాను. ఆ. దానిని మనము పొందబోవుచున్నాము.”
415 నేను—నేను—నేనిది చెప్పకుండ యుండుట మంచిది. చూశారా, కారణం అది గందరగోళము కలుగజేయవచ్చు. గత దినము ఎత్తబడుటను గూర్చి నేను చెప్పినప్పుడు, అది ఏలాగు వస్తుంది, నేను—నేను—మీరది తీసుకుంటారని మీరు చెప్పినట్లయితే, మంచిది. [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] గమనించు. గమనించు. మంచిది అది మీ ఇష్టం.
416 నిద్రించుచున్న కన్యక, చూస్తున్నారా ఆమె ప్రార్థించియున్నదని తలంచి తిరిగి వస్తుండగా పెండ్లికుమార్తె వెళ్ళిపోయింది. అది వెళ్ళినది. అది ఆమె ఎరుగకయుండెను; రాత్రి వేళ దొంగవలే. అటు తరువాత వారు తలుపులు బాదసాగిరి. ఏం జరిగింది? ఏమి సంభవించినది? వారు శ్రమకాలములోకి త్రోసివేయబడ్డారు. బైబిల్ చెప్తుంది, “అక్కడ ఏడ్పుయు, రోదనయు, మరియు పండ్లు కొరకుటయు యుండును” అని. అది నిజమేనా?
417 అదెప్పుడు జరుగబోతుంది, సహోదరుడా, సహోదరీ నాకు తెలియదు. అయితే నేను—నేను, నన్ను ఇక్కడ నన్ను, చూశారా. ఇది, ఇది ఏదనగా…ఇది నా యొక్క తలంపు. చూశారా? నేను—నేను—నేను నమ్ముతున్నాను. ఇది చాలా సమీపమని. నేను—నేను…ప్రతి దినము నాకు—నాకు కావాలి…ఎంత మాధుర్యముగా నడవగలనో అంతగా నేను నడుస్తాను. చూశారా. మీకు తెలుసా…
418 ఈ దినము ఒకటి జరిగినది. ఒకటి పైకి వచ్చుట నేను చూశాను. నేను—నేను…నేను ఊపిరి పీల్చుకోలేకపోయినట్లయ్యాను. చూశారా, అక్కడ ఆయన నిలబడియున్నాడు. అక్కడ, ఆ చిన్న వెలుగు అక్కడ నిలబడియున్నది. మరియు అది ఇక్కడే యున్నది. అది సత్యమని నాకు తెలుసు.
419 నేననుకున్నాను, “ఓ దేవా, నేనది చెప్పలేకున్నాను. నేను—నేనది చెప్పలేను. నేను చేయలేను.” నేను గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాను. క్రిందకు పైకి నడిచాను. సహోదరుడా, నేను తలంచాను, “మై! నేనేమి చేయగలను? ఓ!” చూశారా? నేను చేపలు పట్టుటకు లేక దేనికొరకు వెళ్ళిపోవలెను. నేను…అబ్బాయ్, నీవు…నీవు…నేను మీకు చెప్పలేను. చూశారా?
420 కనుక, మనము మంచి సమయము కలిగియుంటిమి. మనము కలిగియుండలేదా? ప్రభువుకు స్తోత్రం. ఆమేన్! చూశారా, మనము—మనము ఒక భయంకరమైన కాలములో యున్నాము. చూస్తున్నారా, ఎందుకనగా నా హృదయము సంతోషముతో ఆనందముతో ఉప్పొంగుచున్నది.
421 అయితే ఈ లోకాన్ని గూర్చి నేను ఆలోచిస్తున్నపుడు మరియు నశించిపోయిన వేలాదిమంది తప్పిపోవుటను, వారై నల్లని నీడను చూచినపుడు, నా హృదయము రక్తము కారునంతగా వేదనపడును. “నీవేమి చేస్తావు? నీవేమి చేస్తావు?” పరిశుద్ధాత్మ మీ హృదయములో వేదనపడుటను మీరు భావించగలరు. మన ప్రభువు, ఆయన యెరూషలేమును చూచినపుడు, ఆయన స్వంత ప్రజలను చూచినపుడు, అన్నాడు. అవునా, “యెరూషలేమా, యెరూషలేమా నేను ఎన్నిసార్లు కోడి తన పిల్లలను చేర్చుకొనినట్లు ఎన్నోసార్లు నిన్ను కాపాడుచుంటిని, అయితే నీవు విననొల్లకపోతివి.” “ఎన్నోసార్లు నేను మిమ్ములను చేర్చుకొనవలెననుకున్నాను, అయినను మీరు వినకపోతిరి” అని పరిశుద్ధాత్మ చెప్పుటను మీరు భావిస్తున్నారా. అవునా?
422 మనము, మనము ఇక్కడ ఒకదానిమీద యున్నాము, స్నేహితుల్లారా. అదేమైనను దేవునికి తెలుసు. అదెప్పుడు జరగబోతుందో ఎవరికి తెలియదు. అది రహస్యము. అదెప్పుడు జరుగబోతుందో ఎవరికి తెలియదు.
423 అయితే యేసు మనతో చెప్పాడు, “మీరు వీటిని చూచునపుడు, ఇవన్నియు చూచునపుడు.” నేనేది కొనసాగించానో మత్తయి 24లో ఆయనేమి చెప్పాడో ఆరవ ముద్రతో పోలుస్తూ చెప్పినట్లు. ఆయనేమి చెప్పియున్నాడో గుర్తుంచుకోండి, “ఈ సంగతులు జరుగుట మీరు చూడగానే, సమయము ద్వారమునొద్దనే యున్నది.” తరువాత వచనము గమనించండి, 30-30 మరియు 31 వ వచనాలు 32 వ, 33 వ వచనాలు.
424 ఆయన చెప్పాడు “మరియు ఆయన తన యొక్క దూతలను ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు.” అది నిజమేనా?
చెప్పబడినది, “ఇపుడు ఒకటి నేర్చుకొనుడి…”
425 ఇపుడు జ్ఞప్తించుకోండి, ఆయన నేరుగా అక్కడే నిలుపు చేశాడు. ఆ ఆరవ ముద్ర తరువాత ఆయన ముందుకు కొనసాగలేదు. ఏడవ దానిని గూర్చి ఆయనేమి చెప్పలేదు. ఆయన మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది చెప్పాడు. అయితే ఆయన అక్కడ ఆపాడు. దానిని గురించి ఏమి చెప్పలేదు.
426 ఆయన చెప్పిన తదుపరి విషయం గమనించండి “ఒక ఉపమానము నేర్చుకొనుడి.” చూశారా? తరువాత ఉపమానము మొదలు పెట్టాడు. ఆయన చెప్పాడు, “ఈ సంగతులు.”
427 ఆయన వారి మూడు ప్రశ్నలకు జవాబు ఇచ్చుచున్నాడు “ఏంటి…ఈ సూచనలు? మరియు నీ రాకడకు సూచన ఏమిటి? లోకము యొక్క అంతమునకు సూచన ఏమిటి?”
428 మరియు ఆరవది ప్రపంచము యొక్క అంతము. మరియు ఏడవ దూత బూర ఊదునపుడు…“చేతులు పైకెత్తి, యుగయుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు.” భూమి ఒక క్రొత్తదానికి జన్మనిచ్చుచున్నది. అది అయిపోయింది.
429 ఇక్కడే మనమున్నాము. ఇక్కడే తలుపునొద్ద. ఓ. నేను భయపడుతున్నాను. “నేనేమి చేయాలి ప్రభువా? నేను ఇంతకు మించి ఏమి చేయగలను?” చూశారా? అటు తరువాత చూచిన ఆ స్థలాన్ని గూర్చి ఆ ప్రశస్త ప్రజలను గూర్చి ఆలోచిస్తున్నాను. నన్ను నేను చూచుకొనుచు అక్కడ నిలబడియున్నాను. నేననుకున్నాను, “ఓ, దేవా వారు—వారు దీనిని పోగొట్టుకోగూడదు. నేను—నేను—నేను వారిని నెట్టవలసియుంది. నేను జనుల యొద్దకు క్రిందికి దిగి వారిని సంపాదించి వారిని ముందుకు నెట్టవలెను.” నీవది చేయలేవు. నీవు…
430 “మరియు నా తండ్రి ఒకనిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు” అయితే మనకొక ఆదరణ ఉన్నది, “తండ్రి నా కనుగ్రహించిన వారందరు వత్తురు.”
431 అయితే మిగతావారు, ఆ సంస్థాపకములోనున్నవారు, ఆ విధంగా వారిపైన ఆధారపడిన వారు, చూశారా. “మరియు భూమిపై జీవించుచు జగత్తుకు పునాది వేయబడక మునుపు వధింపబడిన గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు వ్రాయబడని వారందరిని అతడు మోసగించెను.” ఓ, మై. కనుక, చూశారా, అది విచారకరమైన విషయం.
432 నీవు చేయవలసిన ఒకే ఒక విషయము అలాగు—అలాగు—ఆలాగు వాక్యములో నిలబడు. ఆయన ఏమని చెప్పాడో దానిని గమనించి తరువాత అది చేయ్. ఆయన ఏమి చెప్తాడో అది చేయి.
433 మరియు నీవు బయటకు చూచి చెప్పు, “ఓ, మై! వారు ఇది చేయుచున్నారు, తరువాత…ఓ!” అది…
434 అది ఎటువంటి భారమో మీరు గుర్తించలేరు. ఇపుడిది చెప్పాలనుకుంటున్నాను. టేపులు నిలిపివేసియున్నారని నేను అనుకుంటున్నాను. చాలామంది అంటారు, “సహోదరుడా బ్రాన్హాం, మీరు కలిగియున్న అటువంటి పరిచర్య…” (నేను గమనించవలసియున్నది. ’ఎందుకనగా ప్రజలు ఆ టేపులను తీసికొని వారికిష్టమొచ్చినట్లు వారి యొక్క స్వంత అనువాదములను వారికిచ్చుచున్నారు, మీకు తెలియును.) కనుక వారు ఈ విధముగా చెప్పినపుడు, “సహోదరుడా బ్రాన్హాం, మాకు మీ వలె వాక్య పరిచర్య ఉన్నయెడల,” మీరు ఏమి చెప్పుచున్నారో మీకు తెలియదు. మీరు యథార్థముగా చెప్పవలయునని దానితో కూడా ఏమివచ్చునో మీకు తెలియదు, సహోదరుడా, సహోదరి. ఓ, మై! బాధ్యత. మీరు ప్రజలకు ఏమి చెప్తున్నారో దాని మీద ఆధారపడతారు. గుర్తుంచుకో. మీరు వారికి తప్పు చేస్తే, దేవుడు వారి యొక్క రక్తమును గూర్చి మిమ్ములను అపరాధులనుగా ఎంచును. అటువంటపుడు, అది మీకు ఆలోచించండి. అది భయంకరమైన కార్యము.
435 కాబట్టి ఆప్యాయతగా యుండండి. మీ నిండు హృదయముతో యేసుని ప్రేమించుడి. ఆలాగు…సాధారణంగా యుండండి. దేనిని గూర్చి అర్థం చేసికొన ప్రయత్నించవద్దు. దేవుని యెదుట దీనులైయుండండి. కారణం, మీరెంత విమర్శింప ప్రయత్నిస్తారో మీరు ఆయన యొద్ద నుండి అంత దూరమౌతారు. చూశారా? మీరాయనను నమ్మండి చాలు.
“ఇపుడు, సరే, ఆయన ఎప్పుడు వచ్చును?” అని అడుగుతారు.
436 ఆయన ఇపుడొచ్చిన యెడల, మంచిది. ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాలకు ఆయన వస్తే, అది ఇంకా మంచిది. నేను ఇపుడు వెళ్ళుచున్న విధముననే, వెంబడించు మాదిరిగానే నేను వెళ్తాను. “ప్రభువా, నీవెక్కడయైనా నన్ను వాడుకొనిన యెడల, ఇక్కడ నేనున్నాను ప్రభువా.” ఈరోజు నుండి అది వంద సంవత్సరములైనప్పటికి, నా యొక్క ముని మనుమలు, ముని మనుమలు, ముని మనుమలు, మునిమనుమలు అది వచ్చుటను చూచుటకు ఇంకా జీవించియున్నను, అయినను…“ప్రభువా, అదెప్పుడు జరుగునో నాకు తెలియదు అయితే ఈ దినము నన్ను నీతో క్రమముగా నడువనిమ్ము.” చూశారా? నేను—నేను…కారణం, నేను—నేను ఆ దినమున లేచెదను. ఎలాగనగా నేను ఆ దినమున ఏదో ఎక్కడ నుండియో నిద్ర నుండి లేచినట్లు లేస్తాను.
437 అక్కడ క్రిందకు దిగివచ్చుచుండగా, దూరముగానున్న ఆ మహిమ గల భవనం, అక్కడ దేవుని రాజ్యము, అక్కడ వృద్ధులు యవ్వనులుగా యుంటారు. తెల్లని వస్త్రములు వారు ధరించియుంటారు; పురుషులు స్త్రీలు అందంగా మార్చబడతారు. చక్కని పురుషులు గాను, చక్కని స్త్రీల గాను మారిపోవుదురు. మంచి అందమైన రూపము గల యవ్వన పురుషులు గాను, యవ్వన స్త్రీల గాను నిలబడియుంటారు అక్కడ. ఏలాటి వృద్ధాప్యము, ఏలాటి పాపయుక్తమైన జీవితము ఎటువంటి అసూయ లేక ద్వేషము లేక మరొకటి ఉండదు! ఓ, మై!
438 ఇపుడు, టేపులు నిలపివేశారని అనుకుంటున్నాను. నాకు—నానింకా మూడు లేక నాలుగు నిమిషాలున్నవి. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అది సరేనా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] ఇపుడు ఇది వ్యక్తిగతము. చూశారా. ఎందుకనగా, రేపు, నేను—నేను…అది అద్భుతముగా యుండబోవుచున్నది! నేనేమి చెప్పబోతున్నానో ఇపుడది చెప్పుట మంచిదని నేను అనుకుంటున్నాను. నేను…ఇపుడు ఇది మనకు మాత్రమే. నేను…
439 మీకు తెలుసు, నేను ప్రేమించు నాకొక భార్యయున్నది, ఆమె మిడా. నా—నా మొదటి భార్యయందు గల ప్రేమ చేత నేనామెను పెండ్లి చేసికొనరాదనుకున్నాను. అయినను నేను ఆమెపై అక్కరగల వానిగా దేవుడు నాకు చెప్పనియెడల నేను ఆమెను పెండ్లి చేసికొనేవాడను కాను. మరియు ఆమె ఏ విధంగా ప్రార్థించినది మరి నేనేవిధంగా ప్రార్థించినది ఆ కథ మీకు తెలుసు. ఏమి చేయవలెనో ఖచ్చితంగా ఆయన చెప్పాడు. “వెళ్ళి, ఆమెను పెండ్లి చేసికో,” సరిగా అది చేయుటకు సమయము చెప్పాడు. ఆమె యొక మంచి స్త్రీ. ఆమె ఈ రాత్రి నాకై ప్రార్థిస్తుంది. కాబట్టి ఇపుడు ఇంటియొద్ద ఎనిమిది గంటలు. ఆమె బహుశా ఇపుడు ప్రార్థిస్తూ యుంటుంది.
440 ఇప్పుడు గమనించండి. ఒక రోజు ఆమె నన్ను అడిగింది, ఆమె అన్నది, “బిల్,” ఆమె అన్నది, “పరలోకమును గూర్చి నేనొక ప్రశ్న అడుగవలెననియున్నాను.”
నేనన్నాను, “మంచిది, మిడా, ఏంటది?”
ఆమె అన్నది, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”
441 మరి నేనన్నాను “ఆ” ఇది నేను పైకి వెళ్ళి ఆ కార్యములు చూచిన తరువాత జరిగిన సంభాషణ ఇది.
ఆమె అడిగినది, “హోప్ కూడా నిన్ను ప్రేమించింది కదా.”
“అవును” అని నేనన్నాను.
442 మరియు ఆమె అన్నది “ఇపుడు,” ఆమె అన్నది, “నాకు అసూయ యున్నదని నేననుకొనుటలేదు,” ఆమె అన్నది “అయితే హోప్.” ఆమె అన్నది “మేము పరలోకమునకు వెళ్తే…మరియు నీవు ఆమెను అక్కడ చూచినట్లు చెప్పావు.”
443 నేను చెప్పాను “ఆమె అక్కడున్నది. నేనామెను చూశాను. అక్కడ రెండు సార్లు ఆమెను చూశాను.” ఆమె అక్కడున్నది. నేను వచ్చుటకు ఆమె ఎదురుచూస్తున్నది. కాబట్టి…ఆలాగే షారోను కూడా. నేను నిన్ను ఏలాగు చూస్తున్నానో ఆలాగు చూశాను. నేను అక్కడ ఆమెను చూశాను. మరియు నేను చెప్పాను…
444 ఆమె అన్నది, “సరే, ఇపుడు మేమచటకు చేరినపుడు” అడిగినది “ఎవరు నీ భార్యయగుదురు?”
445 నేను చెప్పాను, “మీరిద్దరు. ఎవరు ఉండరు, చూశారా, అయినను మీరిద్దరు ఉంటారు.”
ఆమె అన్నది, “అది నేను అర్థం చేసుకోలేకున్నాను.”
446 నేను చెప్పాను, “ఇపుడు, హనీ, కూర్చో, నేనొక విషయం నీకు వివరిస్తాను.” నేను చెప్తాను. “నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నేనెంతగా నిన్ను ప్రేమిస్తున్నానో, ఎంతగా గౌరవిస్తున్నానో మర్యాదగా చూస్తున్నానో నీకు తెలుసు. ఇపుడు, ఉదాహరణగా, నేను బాగుగా సిద్ధపడి బయటకు వెళ్ళితే, ఒక అందమైన వేశ్య వచ్చి, తన చేతులు నా చుట్టు చుట్టి, నన్ను కౌగలించుకొని ‘ఓ సహోదరుడా బ్రాన్హాం, నేను నిజంగా నిన్ను ప్రేమించుచున్నాను,’ అని చెప్పి ఆమె చేతులను నా చుట్టు వేసి కౌగిలించుకొనిన యెడల నీవేమనుకుంటావ్?”
ఆమె చెప్పినది, “నేను దానిని అంతగా ఇష్టపడను” అని.
447 మరియు నేనడిగాను “నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. నీవు…ఒకవేళ నిజంగా చెప్పవలసిన పరీక్ష సమయము వచ్చినట్లయితే, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు, నన్నా లేక ప్రభువైన యేసునా?” అది కుటుంబ సంభాషణ.
448 ఆమె చెప్పినది “ప్రభువైన యేసును.” అన్నది. “అవును, బిల్. నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. అయితే ఆయనను విడిచిపెట్టుటకు మునుపు నేను నిన్ను విడిచిపెడతాను.”
449 నేను చెప్పాను. “ధన్యవాదాలు, హనీ. ఇపుడు నీకు ఆ విధంగా చెప్పుట నాకు ఆనందంగా ఉన్నది.” నేను చెప్పాను, “ఇపుడు, అదే చిన్న స్త్రీ యేసునొద్దకు వచ్చి, ఆమె చేతులను ఆయన చుట్టూ ఉంచి, ‘యేసూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,’ అని చెప్తే, దాన్ని గూర్చి నీవేమనుకుంటావ్?”
ఆమె అన్నది, “నేనది ఆనందిస్తాను.” అని అన్నది.
450 చూశారా, అది ఫిలియో నుండి అగాపేకు మారినది. అవునా, అది ఉన్నతమైన ప్రేమ. చూశారా? మరియు భార్యా భర్తయను విషయాలే అక్కడ ఉండవు. పిల్లలు పుట్టించుటకు, స్త్రీ పురుష లైంగికము అంతా గతించినది. గ్రంథులు…అక్కడ వారంతా ఒకేరీతిగా ఉంటారు. చూశారా? అందులో ఏదీ ఉండదు. లైంగిక గ్రంథులు ఉండవు. చూశారా? నీవు కేవలము…అవునండి. లైంగిక గ్రంథులు లేకుండుట ఆలోచించు. అవి మనలో పెట్టబడుటకు కారణము భూమిని నిండించుటకు. చూశారా. అయితే, అక్కడేమి ఉండవు. అక్కడ పురుష గ్రంథులు లేక స్త్రీ గ్రంథులు ఉండవు. ఉండవు.
451 అయితే దేవుని యొక్క పనితనముతో యుండిన నిర్మాణము అక్కడ యుండును. అది ఖచ్చితంగా నిజం. అయితే మనము నిజంగా ఉంటాము. ఫిలియో (మానవ ప్రేమ) అక్కడ యుండదు. అంతా అగాపే (దైవ ప్రేమ). చూస్తున్నారు. కాబట్టి, భార్య అనగా, నీదై, ఒకటి ప్రేమించు ఒక విషయమనగా అచట నీకు స్వంతముగా ఉండును. మరియు ఆమె…మీరు ఒకరికొకరు చెందిన వారిగా ఉంటారు. ఏలాటిది…కాదు, కాదు…చూశారా ఫిలియో ప్రేమ అక్కడ యుండదు. చూశారా, అసూయ అలాటిది ఉండలేదు; అసూయను గూర్చి యుండదు. ఆలాటిది అక్కడ యుండదు. చూశారా? జీవించుటకు అక్కడ ప్రేమ గల యువకుడు, యువతి యుంటారు.
అటు తరువాత ఆమె చెప్పినది, “నేనిపుడు గ్రహిస్తున్నాను, బిల్.”
నేనన్నాను, “అవును” అని.
452 జరిగిన ఒక చిన్న కార్యమును నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది ఒక కల. నేను నిద్రపోతున్నాను. ఇంతకుముందు బహిరంగంగా నేనెన్నడు చెప్పలేదు. ఇద్దరు వ్యక్తులతో నేనది చెప్పాను. అయితే బహిరంగంగా చెప్పలేదు, నేనెరిగినంత వరకు.
453 నేను—నేను కలకన్నాను, సుమారు నెలకు తరువాత ఒక దినాన నేను నిలబడియున్నాను. గంభీరమైన సమయమును గూర్చి గమనిస్తున్నాను…న్యాయ తీర్పు కాదు. న్యాయతీర్పుకు సంఘము వస్తుందని నేను నమ్మను (నా భావము పెండ్లికుమార్తెయని), అయితే కిరీటములు ఇచ్చుచున్నపుడు నేను అక్కడ ఉన్నాను. చూడండి. మరియు ఇక్కడ గొప్ప—గొప్పదైన సింహాసనము పెట్టబడినది. మరియు యేసు మరియు రికార్డింగ్ దూత మరియు అందరు అక్కడ నిలబడియున్నారు. మరియు ఈ విధముగా క్రిందికి వచ్చునట్లు అక్కడ మెట్లు వరుస ఉన్నది. దంతపు రంగులో ఉన్నది. అక్కడ వృత్తాకారముగా అఖండ ప్రకృతి వలె ఈ విధముగా అమర్చబడియున్నది. కాబట్టి అక్కడున్న వారందరు అక్కడ జరుగుతున్నదేదో చూచుటకు అనుకూలముగా ఉండెను.
454 నేను వెనుక ఒక ప్రక్కన నిలబడియున్నాను. నేనక్కడ నిలబడియున్నాను. నేను మెట్ల మీద నడుస్తానని భావనే నాకు లేదు. నేను అక్కడ నిలబడియున్నాను. నేను చూస్తున్నాను…
455 రికార్డింగ్ చేయు దూత ఒక పేరును పిలుచును. నాకు తెలుసు ఆ పేరును గుర్తించగలను. నేను చూశాను. అక్కడ దూరాన వెనకాల ఒక సహోదరుడు ఒక సహోదరితో వస్తున్నాడు. మీ యొద్దకు వచ్చినట్లుగా. క్రీస్తు ప్రక్కగా రికార్డింగ్ దూత నిలబడి (కేవలం కల మాత్రమే), గమనిస్తున్నాడు. వారి పేరు అక్కడున్నది. జీవ గ్రంథములో అది కనుగొనబడినది. ఆయన వారివైపు తిరిగి చూచి, చెప్పాడు “అది—బాగుగా చేసితివి. నా యొక్క నమ్మకమగు దాసుడా, ఇపుడు లోపలకు ప్రవేశించు.”
456 వారు ఎక్కడకు వెళ్తున్నారో, అక్కడకు వెనుకకు చూశాను. అక్కడ యొక క్రొత్త లోకమున్నది, మరియు ఆనందాలున్నవి. మరియు చెప్పబడినది, “ప్రభువు యొక్క సంతోషములో ప్రవేశించుడి. అది—అది భూమికి పునాదులు వేసినప్పటి నుండి మీ కొరకు సిద్ధపరచబడియున్నది.” చూశారా? మరియు ఓ, నేను తలంచాను…వారక్కడకు పోవుచున్నారు. ఒకరినొకరు కలుసుకుంటారు. ఆలాగు ఆనందిస్తారు పర్వతాలపైకి పెద్ద స్థలాలకు వెళ్తారు.
457 అయితే నేననుకున్నాను “ఓ! అది అద్భుతం కాదా! మహిమ! హల్లెలూయ!” పైకి క్రిందకు ఎగురుచున్నాను.
458 తరువాత మరొక పేరు పిలువబడుట నేను విన్నాను. నేను అనుకున్నాను. “ఓ, అతడు నాకు తెలుసు. అతడు నాకు తెలుసు. నేను, అక్కడ, అక్కడ, అతడు అక్కడకు వెళ్ళుచున్నాడు.” ఆలాగు గమనిస్తున్నాను.
“ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించు, నా యొక్క మంచి మరియు…”
“ఓహో,” నేను చెప్పాను, “దేవునికి స్తోత్రం! దేవునికి స్తోత్రం!”
ఉదాహరణగా చెప్తాము, వారు చెప్పినట్లు, “ఆర్మన్ నెవిల్,” చూడండి.
459 తరువాత నేను చెప్తాను, “ఆ పాత సహోదరుడు నెవిల్, అతడు అక్కడున్నాడు.” చూశారా? అతడు ఇటు వస్తున్నాడు, గుంపులో నుండి, పైకి వస్తున్నాడు.
460 ఇపుడాయన చెప్తున్నాడు, “జగత్తుకు పునాది వేయబడకమునుపే మీ కొరకు సిద్ధపరచబడిన ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించండి.” వృద్ధుడైన సహోదరుడు నెవిల్ మార్చబడ్డాడు. వెనుకకు తిరిగి కేకలు పెడుతూ వెళ్ళాడు.
461 అబ్బాయ్, నేను పెద్ద కేక వేసి, “దేవునికి మహిమ!” అని చెప్పాను. నాకు నేనుగా ఇక్కడ నిలబడి నా యొక్క సహోదరులు లోపలకు ప్రవేశించుట గమనిస్తున్నాను. అద్భుతమైన సమయం కలిగియుంటిని.
462 మరియు రికార్డింగ్ దూత నిలబడి అక్కడ “విలియం బ్రాన్హాం” అని పిలిచాడు.
463 ఆ విధముగా నేను వెళ్తానని నేనెన్నడు తలంచలేదు. కాబట్టి అప్పుడు నేను భయపడ్డాను. నేననుకున్నాను, “ఓ, మై! నేనది చేయవలసియున్నదా?” కనుక నేనక్కడకు వెళ్ళాను. ప్రతి ఒక్కరు నన్ను ప్రేమగా తడుతున్నారు. [సహోదరుడు బ్రాన్హాం చాలా సార్లు తనకుతానే తట్టుతూ రుజువుగా చూపుతున్నారు—సంపా.] “సహోదరుడా బ్రాన్హాం! దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా బ్రాన్హాం!” పెద్ద గుంపు ప్రజల మధ్య నుండి నేను వెళ్ళుచుండగా నన్ను ప్రేమతో తట్టుచున్నారు. వారందరు దగ్గరకు చేరి ఆ విధంగా తట్టుచున్నారు. [చాలాసార్లు సహోదరుడు బ్రాన్హాం తన్నుతాను తట్టుకొనుచు చూపించుచుండెను.] “దేవుడు నిన్ను దీవించును గాక సహోదరుడా! దేవుడు నిన్ను దీవించునుగాక సహోదరుడా!”
464 నేను వెళ్ళుచునే యున్నాను. నేను చెప్పాను, “వందనాలు నీకు, వందనాలు నీకు, వందనాలు నీకు.” ఒక కూటము నుండి వచ్చునపుడు చెప్పునట్లుగా, తెలుసా మీకు.
465 ఈ పెద్ద దంతపు మెట్ల మీద నేను నడవబోవుచుంటిని. అక్కడ నుండి నడచుటకు నేను బయలుదేరాను. అలా మొదటి అడుగు నేను వేసి, నేను ఆగిపోయాను. నేను అనుకున్నాను. నేను ఆయన ముఖము వైపు చూశాను. నేననుకున్నాను, “ఈ విధముగా నేను ఆయనను స్పష్టముగా చూడాలి” అని. మరియు నేను నిలచిపోయాను.
466 నా చేతులు ఈ విధంగా ఉంచాను. ఇక్కడ నా చేతిలో ఒకటి జారిపడినట్లు భావించాను. అది ఒకరి చేయి. నేను చుట్టూ తిరిగి చూశాను. అక్కడ హోప్ నిలబడియున్నది; ఆ పెద్ద నల్లటి కళ్ళు. మరియు ఆమె వెనుక నల్లని వెంట్రుకలు వ్రేలాడుచున్నవి, తెల్లటి వస్త్రము ధరించియున్నది. నేను అన్నాను “హోప్!” అని.
467 ఈ చేతిని ఏదో తాకినట్లు భావించాను, చుట్టూ చూశాను. అక్కడ మిడా ఉన్నది. ఆ నల్లటి కళ్ళు పైకి చూస్తూ, ఆ నల్లటి వెంట్రుకలు క్రిందికి వ్రేలాడుచు తెల్లని వస్త్రము ధరించియున్నది. నేను అన్నాను “మిడా!” అని.
468 వారు ఒకరినొకరు చూచుకున్నారు. ఆ విధంగా తెలుసా, వారు…వారిరువురను నా యొక్క చేతులతో పట్టుకొని ఇక్కడకు మేము వెళ్ళాము, ఇంటికి నడచి వెళ్ళాము.
469 నేను మేల్కొన్నాను. ఓ, నేను మేల్కొన్నాను. మరియు నేను—నేను లేచి, కుర్చీలో కూర్చొని ఏడ్చాను. తెలుసా. నేను ఆలోచించాను, “ఓ దేవా, అది ఆ విధముగా వచ్చునని నేను అనుకుంటున్నాను.” ఇరువురు నా జీవితంలో పాలిభాగస్తులయ్యారు మరియు పిల్లలను కన్నారు ఆలాగున్నారు. ఇక్కడ మేము నూతన లోకములోకి నడచి వెళ్ళుచున్నాము. ఎక్కడైతే పరిపూర్ణత మొదలగునవి యున్నవో అక్కడకు. వేరే ఏదియు లేదు…
470 ఓ, అది అద్భుతకరమైన విషయము కాబోతుంది! దానిని పోగొట్టుకోవద్దు. దానిని పోగొట్టుకోవద్దు. దేవుని కృప ద్వారా, నీవు చేయగలిగినదంతా చేయ్. మిగతాది దేవుడే జాగ్రత్త తీసుకొనును. తరువాత
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
మరియు కల్వరిపై…
నా రక్షణను కొనెను
471 మన నిండు హృదయముతో అది మరలా పాడుదాము. ఇపుడు మన నేత్రములు దేవుని వైపు ఎత్తుదాం.
నేనాయనను ప్రేమించుచున్నాను
472 [సభ నేను ఆయనను ప్రేమించుచున్నాను అను పాటను మరలా పాడుచుండగా సహోదరుడు బ్రాన్హాం వేదికను విడిచి ఒక స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నాడు—సంపా.]
…ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
మరియు కల్వరి చెట్టుపై
నా రక్షణను కొనెను.
473 సరే, ఇపుడు. కూటము అంతము వరకు ఆమె బ్రతికి యుంటుందని నమ్మకము ఆమెకు లేదు. అవును. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుచున్న ఆమెను చూడండి. ఆ కారణము చేత చాలా సేపు నేను ఆలస్యము చేశాను. నేనేమి చేయుచున్నానో మీకు చెప్పలేను. నేను మిడాను గూర్చి వారిని గూర్చి మాట్లాడుచుంటిని. నేను గమనిస్తున్నాను…ఆ వెలుగు అటు ఇటు తిరుగుచుండుట నేను గమనిస్తుంటిని. మరియు వెళ్ళి ఆమె పైకి వచ్చినది. “అది అదేనని,” నేను తలంచాను. ఓ, అది అద్భుతము కాదా. [సభ సంతోషిస్తుంది—సంపా.]
నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
మరియు కల్వరి చెట్టుపై
నా రక్షణను కొనెను.
474 ఇపుడు మన హృదయములతో [సహోదరుడు బ్రాన్హాం నేను ఆయనను ప్రేమించుచున్నాను హమ్ చేయుటకు ప్రారంభించాడు—సంపా.] ఆయన యొక్క మంచితనాన్ని కనికరాన్ని తలంచండి.
…నేను ఆయనను ప్రేమించుచున్నాను (ఆమేన్!)
…ఆయన మొదట నన్ను ప్రేమించెను…
475 ఇపుడు, అదెంత మంచిగా యున్నదో చూడండి? ఆమేన్! అది అదే, ఇపుడు…?…వెళ్ళి బాగుండు. ఆమేన్! నీవు బాగుపడునట్లు దేవుని యొక్క కృప నీకు కన్పించినది. ఆమేన్.
…కల్వరి చెట్టుపై.
ఓ, దేవునికి మహిమ!
నేనాయనను ప్రేమించుచున్నాను…
మంచిది మీ యొక్క కాపరి.
నేను…
476 [ఒకరు అడుగుచున్నారు, “సహోదరుడా బ్రాన్హాం, రేపు తొమ్మిది ముప్పయికి ప్రారంభిస్తారా?”—సంపా.] తొమ్మిది నుండి తొమ్మిది ముప్పయి. తొమ్మిది గంటలకు అక్కడ యొక చోట. [“ఉదయం అల్పాహారము తరువాత? తొమ్మిది గంటలకు?”] మీరు తొమ్మిదికి ప్రారంభించండి. నేను తొమ్మిది ముప్పయికి ప్రారంభిస్తాను.
63-0323 — ఆరవ ముద్ర
Rev. William Marrion Branham