ముద్రలపై ప్రశ్నలు మరియు సమాధానములు
[ఒక సహోదరుడు వేరొక భాషతో మాట్లాడుచున్నాడు. మరొక సహోదరుడు అనువాదము చేయుచున్నాడు. సభ బిగ్గరగా ప్రార్థించుచున్నది—సంపా.]
మా పరలోకపు తండ్రీ, దేవుని యొక్క సన్నిధానంలో మరలా నీ యొక్క వాక్యముతో మేము సహవాసము చేయుచున్నందుకు ఈ సమయము కొరకై మేమెంతగానో కృతజ్ఞులమైయుంటున్నాము. ఈ ఉదయవేళ మాతో యుండి, మమ్ము ఆశీర్వదించగలందులకు నీవు మాతో ఉన్నందుకు మేమెంతో కృతజ్ఞులమైయుంటున్నాము. మా యొక్క దీపములు నూనెతో నింపబడి శుభ్రపరచబడి, మండుచుండుటకై మా పాపములకు క్షమాపణ కోరుచున్నాము. తద్వారా నీ ఘనమైన నామ ఘనత కొరకు మమ్మును వాడుకొందురు గాక. మేము దీనిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రియమైన నామమున అడుగుచున్నాము. ఆమేన్.
కూర్చొనవచ్చును.
2 ఆ వర్తమానము బయలు వెడలునపుడు నేను అప్పుడే లోపలకు వస్తున్నాను. కనుక నేను…మనము మన యొక్క దీపములను నింపుకొనవలసియున్నదనునది వాస్తవము…మీకు తెలుసా…మీరు వెలుగుచుండగా మీరు చేసిన దానితో ముందుకు వెళ్లలేరు. చూశారా? …ఎందుకనగా నిప్పు, నూనె వలన మండుచున్నప్పుడు మసిపట్టును. కాబట్టి మీ దీపములు పరిశుభ్రము చేయవలయును. ఎందుకనగా వత్తి మీద మసిపట్టినది. నా వయస్సులోయున్న మీలో చాలామంది, మనము బొగ్గునూనె దీపమును వాడేవారము. చూశారా, అదెక్కడ మండుతుందో, అక్కడ చివరన మసివచ్చేది. అందుచేత వెలుగును రానిచ్చేది కాదు. కనుక మసినంతా నీవు తుడువ వలసియుంటుంది. అది “ముందుకు సాగులాగున, క్రీస్తునందు ఉన్నత పిలుపగు గురియొద్దకు.”
3 ఇపుడు, ఇది ఒక—ఇది ఒక గంభీరమైన, అందమైన ఉదయ వేళ, లోపట, బయట ఈ యొక్క ఈస్టరు సమీపిస్తుండగా.
4 మరియు—మరియు ఈ రాత్రి, ప్రభువు చిత్తమైతే, మనము చివరి ముద్రకు వస్తున్నాము. మరియు ఇది యొక చాలా మర్మమైన ముద్ర, చాలా, చాలా, ఎందుకనగా అది చివరకు—చివరకది ఎక్కడ కూడా లేఖనములలో, ఏలాటి సూచనలతోగాని గుర్తించబడలేదు. అది నేరుగా పరలోకము నుండి రావలసియున్నది.
5 మరియు అది—అది యొక—యొక విధమైన అలసట సమయము నాకు. అది వారమంతా, ఇది నాకు…గదిలో ఎనిమిదవ రోజు. అనేకమైన ఈ విన్నపాలలో నేనిక్కడ గమనించినది నేను ఏరుకొనవలసినది. అక్కడ అనేకమంది కలవవలెనని కోరుచున్నారు. మరియు నేనది అభిమానిస్తున్నాను. ఇప్పుడే నేనది ఇవ్వవలెనని ఇష్టపడుచున్నాను. చూశారా, అయితే ఇప్పుడు నేనది చేయలేను. ఎందుకనగా, మీరు గ్రహించగలరు, ఇపుడు మనము చేయు ప్రయత్నమంతా ప్రభువు యొక్క చిత్తమును గూర్చిన బయల్పాటును ఇపుడు కనుగొనుటయే. చూశారా. కనుక మీతో సమాలోచన జరిగినయెడల, అది మిమ్ములను లాగివేయును. మరొక దానివైపునకు లాగివేయును. ఔను.
6 మరియు, తరువాత, రోగుల కొరకు ప్రార్థించుట వలె, అదంతా వ్యత్యాసము. మీరు…అది దర్శనములు మరియు విషయాలు; మీరు వేరే విధముగా చదివారు. మరియు మీరు—మీరు వేరే విధముగా అభిషేకించబడ్డారు. అది, బైబిల్ ఆ విధముగా చెప్పినట్లుగా ఉంటుంది, “ఒక—ఒక వృక్షము—నీటి కాలువల వెంట నాటినట్లుంటుంది.” “నీటి కాలువలు,” చూశారా, ఒక్కటే నీరు, అయితే నీరు ఈ ప్రక్క నుండి, ఈ ప్రక్క నుండి, ఈ ప్రక్కన నుండి బయటకు వచ్చును. ఏ ప్రక్కన నుండి వచ్చుననునది దానిపై ఆధారపడియున్నది. అది ఒకే ఆత్మ.
7 పౌలు, మొదటి కొరింథీ 12, అదే చేస్తున్నది, దానిని గూర్చి మాట్లాతుచున్నాడు, “చాలా వరములున్నవి, అయితే అది ఒకే ఆత్మ.”
8 కాబట్టి, మీరు చూడండి, ఒక వస్తువు వలె మీరు పని చేస్తున్నట్లయితే, తరువాత, ఇక్కడ ఈ కార్యమునకు వస్తారు. నా భావమేదో అర్థమైందా. మీరు—మీరు ఆ వరుసను చదువుతారు, ప్రజలను చేరుతారు…మరిప్పుడు వారి హృదయాలు స్థిరపడియున్నవి, “ఈ ముద్రలు ఏమిటి?” వారి యొక్క దృష్టియంతా దానిమీదనే నున్నది, “ఇదేంటి?” రాత్రి వెంబడి రాత్రి, నేనిక్కడకు వచ్చునప్పటికి, ఎంతో ఉద్రిక్తతతో నున్నారు, నేనొకటి మాట్లాడువరకు; దానిని నిలుపు చేయువరకు. తరువాత పరిశుద్ధాత్మ ముద్రను విప్పువరకు. మరియు తరువాత—తరువాత ప్రతిరాత్రి అలాగే. తరువాత దానిని స్వస్థతకు లేక మరోదానికి మార్చినయెడల…ప్రజలు ఒకే దానిమీద కేంద్రీకృతమై యుందురు. మీరు దానిని వేరొక దానివైపునకు మార్చుట అంత సులభం కాదు.
9 మరియు—మరియు తరువాత, ఇంకా, మీ మధ్య కార్యములు జరుగుచున్నవి. చూడండి, నేను—నేను…నేను—నాకు తెలుసు. మీరు నాకు తెలుసు, మీరది చూడరు. మీరు దాన్ని చూడలేరని, నాకు నిశ్చయముగా తెలుసు. మీరంటారు, “సహోదరుడా, బ్రెన్‌హాం, నీవు దాన్ని చెప్పుట కఠినమైన విషయం.” అది ఆ విధముగా నుండునని నాకు తెలుసు.
10 అయితే, చూడండి, ఇప్పుడు దీనిని చెప్పనీయండి. ఈ టేపులు మనకు మాత్రమేనని నేను అనుకుంటున్నాను. అయితే ఇది చెప్పనీయండి. అది, మీరు—మీరు చేయరు…మీరది పొందుకోరు, చూడండి. మీరు దానిని పొందుకోనక్కరలేదు. కాబట్టి, దేనిని అనువాదము చేయవద్దు. చూశారా. నీ యొక్క అనువాదాన్ని దాని మీద పెట్టవద్దు. నీవు మాత్రమే—నీవు దానికి దూరంగా వెళ్తావు. నా సలహా తీసుకో, నీవు ఇపుడు నన్ను నమ్మినట్లయితే, నీ దృష్టిలో దేవుడు నాకు దయ కలుగజేసిన యెడల.
11 మీకు తెలుసా, ఆ ప్రత్యక్షతలు మరియు సంగతులు. నేను—నేను మీతో చాలా కాలము నుండి యున్నాను. అదెల్లపుడు నిజం. దానిని రెండంతలుగా రుజువు చేయుటకుగాను అది వాక్యముతో జతపరచబడియున్నది. చూశారా? కాబట్టి ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనునది. అది ఖచ్చితం. ఔనా, అది మీకు నిరూపించబడియున్నది.
12 ఇపుడు, మీ యొక్క సహోదరుడుగా నా సలహా తీసుకోండి. దేనికి కూడా మీ యొక్క స్వంత అనువాదాన్ని పెట్టవద్దు. మీరు వెళ్లుచూ, మంచి క్రైస్తవ జీవితం జీవించండి. కారణం, మీరు అది చేస్తే మీకు మీరే నిజమైన దాని నుండి దూరమవుతారు. ఔనా? మీరు, మీరు అసలు విషయము నుండి దూరమవుతారు.
13 మరియు మీరందరు దానిని గూర్చి తెలిసినవారై అక్కడ ఏదో మర్మమైన విషయము జరుగనైయున్నదని మీరెరుగుదురు. మరియు అది జరుగుచున్నది. మరియు అదేంటో నాకు తెలుసు. ఇపుడు నేను అది మాత్రమే చెప్పుట కాదు; అదేమైయున్నది నేనెరుగుటకు అది దేవుని కృపయే. అది యొక భీకరమైన కార్యము. మరియు అది ఇప్పుడు వెళ్లిపోయినది. లోకములో నీవు అది చూచుటకు లోకంలో మార్గం లేదు. మరియు అది…నేను…అయితే నాకు సహాయపడినది, ఈ బైబిల్ గ్రంథము నా చేతిలో యుండగా అదేమిటని నాకు తెలుసు. ఇంతకుముందే అది మీకు చెప్పబడినది. కాబట్టి ఏలాటి అనువాదాన్ని పెట్టవద్దు. నన్ను నీ సహోదరునిగా, కేవలం నమ్ముము. చూశారా? మనము గంభీరమైన సమయములో నివసించుచున్నాము. మనము జీవించుచున్నాము…సరే, మనము…
14 ఇపుడు, మీరు నిజముగా దీనులై, క్రైస్తవులుగా యుండి, దేవుని కొరకు జీవించుటకై ప్రయత్నించండి. సాటి మనుష్యులతో నమ్మకముగా బ్రతకండి, మిమ్ములను ప్రేమించని వారిని ప్రేమించండి. ఏదైన చేయుటకు ప్రయత్నించవద్దు…మీరు చూస్తున్నారా, ఒక మర్మమైన దానిని మీరది చేస్తున్నారు మరియు దేవుని యొక్క నిజమైన పథకమును చెరిపివేయుచున్నారు. ఔనా?
15 నిన్న మధ్యాహ్నము, ఒకటి నా గదిలో జరిగింది, నేను—నేనది వదలలేకున్నాను. చూశారా. మరియు…సుమారు రెండు వారముల క్రితము, ఒకటి జరిగినది, నేనది…భూమి మీద నేనున్నంత కాలము దాని నుండి నేను బయటకు వెళ్లలేను, చూశారా. మరియు, కాబట్టి, అయితే…
16 మరియు—సంఘము, ఈ విషయాలు ముందుగా తెలుసుకొనుటకు మీరు ముందుగా నిర్ణయింపబడకపోవచ్చును. కాబట్టి దేనికి కూడా ఏలాటి అనువాదము పెట్టవద్దు. చూశారా? మీరు ముందుకు సాగివెళ్లండి. మీకేమి చెప్పబడిందో, అది జ్ఞప్తించుకోండి. క్రైస్తవ జీవితం జీవించండి. మీ ఆలయానికి వెళ్లుడి. మీరెక్కడున్నారో అక్కడ నిజమైన వెలుగుగా యుండండి. క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ మీరు ఆయనను ఏలాగు ప్రేమిస్తున్నారో అది ప్రజలకు తెలియజేయండి. మరియు మీ యొక్క సాక్ష్యము ప్రజలతో నిరంతరము ప్రేమతో యుండును గాక. చూశారా? ఎందుకనగా మీరు ఆ విధముగా నుండని యెడల మీరు అక్కడ మరేదో కార్యములోకి వెళ్లి దారి తప్పుతారు, తరువాత మీరు—సగము దారిపై యుంటారు. చూస్తున్నారా, మీరు చేయుటకు ప్రయత్నించునప్పుడెల్లా, మీరది చేస్తారు. చూశారా, కాబట్టి వద్దు, వద్దు, ఏలాటి అనువాదము చేయుటకు ప్రయత్నించవద్దు.
17 మరియు ప్రత్యేకించి ఈ రాత్రి ఆ ముద్ర తెరవబడుటకు మీ ముందున్నపుడు, చూశారా, దానిని అనువాదము చేయుటకు ప్రయత్నం చేయవద్దు. మీరు ముందుకు సాగుడి. దీన మనస్కులై యుండుడి. మరియు తేటగానున్న అదే వర్తమానముతో ముందుకు సాగుడి.
18 ఇపుడు మీరు చెప్తారు, “సహోదరుడా బ్రెన్‌హాం…మేము జీవముగల దేవుని సంఘము, మేము చేయకూడదా…”
సరే. నేను ప్రయత్నిస్తుండగా…ఇటు చూడు, నేను చెప్పాలనుకుంటున్నాను…
అంటావు, “సరే, నేనెందుకు చేయకూడదు? నేను చేయవలసియున్నది…”
కాదు. ఇపుడు, కాదు.
19 జ్ఞప్తించుకోండి, నేనిది మీ క్షేమము కొరకు చెప్తున్నాను. చూశారా, మీరు అర్థం చేసుకొనుటకై నేనిది చెప్తున్నాను. మీరు నన్ను నమ్మినట్లయితే, ఇపుడు, నేనేమి మీకు చెప్తున్నానో అది ఆలకించండి. చూశారా? చూశారా?
20 ఇపుడు, ఇక్కడ ఒక స్తంభము ఉన్నది, దానిని మనము వినునటువంటి స్తంభమందాము. మరియు రేడియో యున్నది మరియు అక్కడ హెచ్చరికలు మొదలైనవి వస్తుంటవి. మీ చేతిలో ఖడ్గము వలె, చెడు నుండో లేక…అది వాటి వర్తమానమును పొందుకొనును, చూశారా.
21 ఇపుడు, అయితే ఇపుడు, ఉదాహరణగా, సాధారణ మానవునికి భక్తి భావాలు లేచినవి. చిన్న ఆత్మ కుమ్మరింపులు కలుగుచున్నవి. ఎంతవరకనగా జనులు వీటివలన కదలింపబడి ఉద్రేకమునకు లోనై వెళ్లిపోయి చిన్న చిన్న ఉద్యమములు స్థాపిస్తున్నారు. మీకు తెలుసా విషయం. చూశారా? ఇపుడు మీరది చేయనవసరము లేదు. చూశారా? ఇపుడు గుర్తుంచుకోండి, మీ మార్గములోనే యుండండి.
22 మరియు, మీరు అంటారు, “భలే, ప్రభువు చూపించాడు…” కాదు. ఇపుడు జాగ్రత్తగా ఉండుడి. చూశారా.
23 ఇటు చూడండి. ఒక దానిని చూపించనివ్వండి. చూడండి. పదివేలు స్వరాలు ఇపుడు ఇక్కడయున్నవని మీకు తెలుసా? [సభ “ఆమేన్” అని చెప్తుంది—సంపా.] అక్షరార్థంగా ప్రజల యొక్క స్వరములు రేడియో విద్యుత్ తరంగముల ద్వారా బయటకు వచ్చుచున్నవి! వాటిని మీరెందుకు వినకూడదు? అవి స్వరములు. ఔను. [“ఆమేన్”] ఇపుడు ఇక్కడ అవి కదలిపోవుచున్నవి. సరే. అక్కడ ప్రజల రూపములో, దేహములుగా ఈ గదిలోగుండా కదలుచున్నవి. ఔనది నిజమేనా? [“ఆమేన్”] మరి మీరెందుకు వాటిని చూడకూడదు? చూశారా? అవి ఇక్కడున్నవి, నా మాదిరిగా వాస్తవమైన స్వరములు. సరే. ఎందుకని మీరు వినరు? ఔనా? అది బయలుపరచుటకు, మొదటి ఒక దానిని తాకవలయును. ఔనా? మీరు ఇపుడు అర్థం చేసుకున్నారా? [“ఆమేన్”]
24 ఇపుడు దేనినీ అనువాదము చేయవద్దు. ఒకటి మీరు తెలుసుకోవాలని దేవుడు కోరినట్లయితే, ఆయన దానిని మీ యొద్దకు పంపుతాడు. చూశారా? కాబట్టి స్థిరంగా నిజంగా యుండుడి. గట్టిగా పట్టుకోండి, ఒకటి జరిగినది. మరియు నిజంగా…నా భావమేదో మీరు అర్థం చేసుకున్నారా, లేదా? [సభ “ఆమేన్” అని అన్నది—సంపా.] మరియు…క్రైస్తవుడుగా యుండుటకు నిన్ను నీవు వింతగా చేసుకొనవద్దు. ఎందుకనగా దేవుని యొద్ద నుండి మీకు మీరు దూరమవుతారు. మరియు మీరు—మీరు—మీరు…
25 అది మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఇది ఈ మూడవ లాగుడు. చూశారా? మీరు—మీరు గత దినమున దానిని పట్టుకొందురు. చూశారా…కాబట్టి అటుతరువాత జ్ఞప్తించుకోండి, మిగతా రెంటికి యున్నట్లు ఏలాటి అనుకరణ దానికి యుండదు. చూశారా? కాబట్టి, అది నీవు ఎరిగినంత వరకు ఇపుడు…
26 మీరు చూస్తున్నారా, ఇపుడు ఈ గదిలో ఒక కార్యము జరుగుతుంది మరియు ఇక్కడొకటి యున్నది. అక్కడ—అక్కడ, వాస్తవముగా, ఈ గదిలో, దూతలు, దేవుని యొక్క స్వరము యున్నది. చూశారా? అయితే నీవేలాగు…నీవు వినలేవు. స్వాభావిక స్వరమును దానిని వినుటకు పంపునటువంటి ఒక సాధనము లేకుండా మీరు వినలేని యెడల మరి ఏ విధముగా ఆత్మీయ స్వరమును వినగలరు?
27 ఇపుడు ఈ పలానా పాటను ఒకరు పాడుచున్నారని ఒకరు మీకు చెప్పవచ్చును. వారు అక్కడ యుండకపోవచ్చును, చూశారా. అయితే అది వాస్తవముగా ఆ క్రిస్టాల్ అను సాధనమును తాకినపుడు, అది నిజమైన అర్థమును ఇచ్చును. మరియు బొమ్మను చూపుట ద్వారా రుజువుపరచును. నా భావమేదో అర్థమైందా? [సమాజము “ఆమేన్” అని చెప్పింది.—సంపా.]
28 ఇపుడు, దేవుని ఆత్మ, నిజమైన వాక్యము ద్వారా మాట్లాడినపుడు, దానికదే రుజువుపరచును, అది నిజమని దానికదే చూపించుట కొరకు. ఇపుడు మీరు అర్థం చేసుకున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] సరే.
ఇపుడు మరలా ప్రార్థించుకుందాం.
29 పరలోకపు తండ్రీ, మేము ఈ గ్రంథము యొక్క మూతలను తెరవబోవుచున్నాము. నీవు ఆత్మీయ మండలపు సంగతులను మాకు తెరచి ఇచ్చిన విధముగా శరీరరీత్యా దీనిని మేము తెరచి ఇచ్చుటకు ప్రయత్నించుచుండగా ఆ కార్యములు మాకు అనుగ్రహించుము. మరియు దేవా, ఈ ప్రశ్నలకు సరియైన అనువాదము ఇచ్చుటకు నీవు నాకు సహాయము చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అది ఈ విధంగా చెప్పబడవచ్చు—అవి…అవి ప్రజలకు ఉపయుక్తము లౌతున్నవి. అవి వారికి భావాన్ని ఇస్తున్నవి. అవి నీ ప్రజలకు నేను పంపునట్లుగాను, తద్వారా వారది గ్రహించునట్లుగాను, తద్వారా మేము కలసి నీ మహిమా ఘనతల కొరకు జీవించునట్లుగాను వారికి గ్రాహ్యమగునట్లుగా చేయుము. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.
30 ఇపుడు, అది నేను చెప్పాలని ఆశిస్తున్నాను.
31 మరియు ఇక్కడున్న ఇది ఆ టేపులను స్వాధీనమందుంచుకున్నదని నేననుకుంటున్నాను. అయితే అది కాదు. మరియు ఇది—బల్ల వెలుతురు. టేపును అదుపుచేయు పరికరము ఇక్కడుండేది. అయితే రికార్డు చేయు గదిలోనున్న సహోదరులకు నేను గురుతు చేయాలని చెప్పారు. ఎప్పుడు నిలుపు చేయవలెనో, ఎపుడు నిలుపు చేయకూడదో తెలుసుకుంటారు.
32 చూడండి. టేపులు ప్రతి చోట, చూడండి ప్రతి యొక్క చోట ప్రపంచ వ్యాప్త పరిచర్య. అన్ని రకములైన భాషలలోకి అవి వెళ్తున్నవి. కాబట్టి బయట కొన్ని చోట్ల చెప్పలేని విషయాలను ఇక్కడ చెప్తాము. ఔనా. ఆ కారణము చేత మనము అది నిలుపు చేస్తాము.
33 ఇపుడు, ప్రశ్నలకు జవాబిచ్చుట…ఒక ముఖ్యమైన విషయము. కాబట్టి, నేను—నేను…దీనికి జవాబివ్వబోతున్నాను. వాటిలో అనేకమైన ప్రశ్నలు…ఇపుడు…వాటిలో కొన్ని వర్తమానమునకు సంబంధమున్నవి కావు, అయితే నేను, లేక, ముద్రలకు సంబంధించినవి కావు. అయినప్పటికి వాటికి జవాబివ్వ ప్రయత్నిస్తున్నాను. మరియు అవి నాకు ఇవ్వబడినవి, వారు అడిగిన విధముగా వారికి జవాబివ్వవలెనని కోరారు. లేక వాటిలో అనేకములు వ్యాధిగ్రస్తులకు, బాధలోనున్నవారి కొరకు ప్రార్థనా విన్నపములు. మరియు—మరియు అలాటి విధములైనవి. మరియు జవాబివ్వవలసిన ఎటువంటి ప్రశ్నకు అవి సంబంధించినవి కావు. మరియు పలు విధములైన రకరకాలైన విషయాలు, లేఖనము తదితరమైనవి; అయితే, ఒకవేళ మనకు సమయమున్నట్లయితే వాటికి జవాబిచ్చుటకు శక్తికొలది మేము ప్రయత్నిస్తాము. ఇపుడు, మరియు నేను తప్పు చేస్తే, జ్ఞప్తించుకోండి అది ఉద్దేశపూర్వకముగా చేసిన తప్పుకాదు.
34 కాబట్టి అందరూ మంచి భావముతో నున్నారా? [సభ “ఆమేన్” అని చెప్తున్నారు.—సంపా.] ఆమేన్. ఇది ఆ విధముగా కాదా…క్రీస్తు యేసునందు పరిశుద్ధ స్థలములో యుండుటను గూర్చి మాట్లాడుట. ఎంతటి అద్భుతకరమైన స్థలము, ఎంతటి అద్భుతకరమైన సమయము!
35 మందిరములో వేదిక వెనుక నేనున్న సమయాలన్నిటిలో, నా పరిచర్య ఏ సమయములోను దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన కార్యములు మరియు ఆత్మీయ కార్యములను గురించిన సంగతులు వీటన్నిటిని గూర్చి అనేక సమయములలో ప్రస్తావించినను ఈ సమయముల వలె అవి లేవు. అవన్నియు అనేకములు స్వస్థతను గూర్చి. అదే ఆత్మ ద్వారా ఇది సత్యములను బయలుపరచు కార్యములైయున్నవి, అదే ఆత్మ ద్వారా.
36 మరియు నేను—నాకు నేనే ఒకే స్థలములో ఉన్నాను మరియు ఒక స్థలములో భోజనము చేయుచున్నాను. మరియు నేను ఒంటరిగానున్నాను. అది నిజముగా గొప్ప సమయము.
37 మరియు, ఇపుడే ఉదయం గానీ, లేక రాబోవు ఉదయం గానీ, నేను…ఒకవేళ, మనకు సమయముంటే, ఈ ప్రశ్నలు త్వరగా ముగించిన యెడల రోగులకై ఈ ఉదయం నేను ప్రార్థిస్తాను.
38 కాబట్టి నేను—నాకు నేను కొద్దిసేపు సిద్ధపడవలసియుంది, చూశారా. మానవుని మనస్సు కొంతవరకే నిలబడగలదు. ఔనా? దేవుని యొక్క సన్నిధిలో మీరు ఒక గంట కూర్చొనియున్న యెడల, మరియు అగ్ని స్తంభము అక్కడ మీముందున్న యెడల, మీరు ఎక్కువ సేపు ఉండలేరు. ఔనా. మానవుడు దానిని తట్టుకోలేడు.
39 కాబట్టి, ఇపుడు ఈ ప్రశ్నలు చాలా బాగున్నవి. నేను అభినందిస్తున్నాను. వారి యొక్క జ్ఞానమును, కార్యములను నేను అభినందిస్తున్నాను. ఇపుడు మొదటి దానికి. మరియు నేను వాటికి జవాబిచ్చుటకు ప్రయత్నిస్తాను. అటుతరువాత నేను—నేను సరికానియెడల, సరే, మీరు—మీరు నన్ను మన్నించండి, ఆలాగైతే.
40 మరియు మీకు వేరే అర్థం యున్నట్లయితే, దానిని గూర్చిన మీ అర్థం సరియని నమ్మినట్లయితే ఆ విధముగానే ముందుకు సాగుడి. అది బాధించదు. ఎందుకనగా ఒకటి లేక రెండు తప్ప మరి ఏ ప్రశ్నయు రక్షణకు సంబంధించినది లేదు. అది మాత్రమే…
41 చాలా ప్రశ్నలు మరొక వైపు…లేక సంఘము ఎత్తబడుటను గూర్చి అడగబడినవి. కాబట్టి, చూడండి, రాబోవు వాటిని గూర్చి, జరగబోవు వాటిని గూర్చి ఇక్కడ ప్రశ్నలున్నవి. కారణం గ్రంథములోని బోధలు సంఘకాలానికి ఆవలనున్నవి. ఒక లక్ష నలభై నాలుగు వేలమందిని పిలచిన కాలమునకు దాటిన వారముగా మనమున్నాము. ఇపుడు మొట్ట మొదటిది:
173. మత్తయి 25 లోని అయిదుగురు బుద్ధిగల కన్యకలు, పెండ్లి కుమార్తెకు—పరిచారకులా, లేక వారు పెండ్లి కుమార్తెయా? చూశారా? ఈ బుద్ధిగల కన్యకలు పెండ్లికుమార్తెకు పరిచారకులైన యెడల, పెండ్లికుమార్తె ఎక్కడున్నది?
42 చూశారా, ఇపుడు, నాకు తెలిసినంత వరకు ఈ అయిదుగురు కన్యకలు…బయటకు వెళ్ళినవారు పదిమంది, మీకు తెలుసా, ఔనా. మరియు ఇక్కడ ఇది యొక సూచన, లేక ఒక ఉపమానము, చూశారా, అది—అది మీకు చెప్పబోవుచున్నాను. చూశారా, వారిలో పదిమంది యుండిరి. పదిమంది కన్నా ఎక్కువమంది ఉండిరి. అది సంఖ్యగా చెప్పబడెను. అయితే, తరువాత, బుద్ధిగల కన్యకలు తమ దివిటీలలో నూనె కలిగి ఉండెను. బుద్ధిలేని వారు తమ దివిటీలలో నూనె లేకుండెను.
43 “కాబట్టి మత్తయిలోనున్న ఆ పదిమంది…” ఇది—వ్యక్తి యొక్క ప్రశ్న. “ఆ పదిమంది, అక్కడున్నవారు అదియని ఆ అర్థమా…లేక ఈ అయిదుగురు, అయిదుగురు మాత్రమే, చూశారా అయిదుగురు మాత్రమేనా?” కాదు, అది ఆ అర్థం కాదు.
44 అది కన్యకల యొక్క సూచన, చూశారా, దివిటీలలో నూనె కలిగి వెళ్లిపోయిన కన్యకలు వారు పెండ్లికుమార్తెలో భాగము. మరియు నాకర్థమైనట్లుగా…
45 మరియు, తరువాత మీరు గమనిస్తే వారు ఆఖరు జాము యొక్క కన్యకలు. జాములను చూచుచు వచ్చిన యెడల, ఏడు జాములున్నవి. ఏడవ జాము, మధ్య రాత్రి వేళ. ఇపుడు ఈ మధ్య రాత్రి జాములో, ఈ కన్యకలు మేల్కొని వారి దివిటీలు వెలిగించిరి, లోపలకు వెళ్లిరి; అక్కడ నిద్రించు కన్యకలు…
46 “ఇపుడు, ఇక్కడ ఈ భాగము, ఈ అయిదుగురు” అది ప్రశ్నకు జవాబుయైనట్లయితే, ఏ అర్థం “అక్కడ అయిదుగురు మాత్రమేనా?” మరియు ఇక్కడ చాలా ప్రశ్నలు మనకున్నవి. ఏడు వేలమంది మొదలగు వాటిని గూర్చి. ఇపుడు, అది కేవలము చిహ్నము, అందులో భాగము. మరియు, ఈ ఆఖరి కాలములో, ఏడవ జామున మేల్కొనిన వారు,…“అయితే అయిదుగురు మాత్రమే మేల్కొని, మరి మార్చబడి పెండ్లికుమార్తెతో, పెండ్లికుమారునితో లోపలకు వెళ్లిరి. కాదా. ఇపుడు వారికి వారే…”
47 కేవలం అయిదుగురు మాత్రమే యుందురని దాని అర్థం కాదు. ఎందుకనగా మనము ఈ వారములో చూచినట్లుగా కాలాలన్నిటిలో నిద్రించుచున్నవారు వీరే, చూశారా.
48 పౌలు యొక్క దినాలలో, ఎఫెసుకు సంఘపు దూత; పౌలు ఈ సంఘానికి వర్తమానికుడై యుండి, ఈ సంఘమును కనుగొనెను. జ్ఞప్తించుకో, పౌలు, ఎఫెసులో సంఘాన్ని కనుగొని, ఆ సంఘానికి వర్తమానికుడయ్యాడు. ఆ సమయములో ఆ దేశములోనున్న ఆత్మ సింహపు ఆత్మ. మరియు సింహము, యూదా గోత్ర సింహము, అనగా క్రీస్తు. క్రీస్తు వాక్యము. పౌలు ఆ కాలము యొక్క వాక్యముతో ఉండెను! వేలకొలది మంది ఆ కాలంలో నిద్రించారు. ఔనా? [సభ “ఆమేన్.” అని అంటున్నది.—సంపా.]
49 అటుతరువాత, మరొక కాలము వచ్చెను. మరియు అంధకార కాలంలో సంఘము స్థిరపడినపుడు, ఎద్దు యొక్క ఆత్మ బయలువెడలింది; పని, శ్రమ, సమర్పణ, వారి ప్రాణాలు అర్పించుట, హతసాక్షుల పేరిట వేలకు వేలు నిద్రించారు. వారు ఎదురుచూస్తున్నారు. చూశారా.
50 అటుతరువాత, తరువాత కాలము వచ్చెను. లూథరన్, దిద్దుబాటు కాలము. అక్కడ మానవుని యొక్క యుక్తి, జ్ఞానము బయలువెడలెను. మీరు గమనిస్తే, మానవుడు వాటితో బయలువెడలి, అతడు దానికి తన యొక్క వివేకమును సూక్ష్మబుద్ధిని చేర్చాడు. అదియే అతనిని ఇంకొకదానితో వివాహమాడునట్లు చేసింది, చూశారా. చూశారా? అతడు దేవుని జ్ఞానముతో నిలచినట్లయితే, దిద్దుబాటు చేస్తూ సాగిపోతే…అయితే అతడేమి చేశాడు? ఆ వ్యక్తి లూథర్ వర్తమానము కలిగియున్న తరువాత, లూథర్ మరణము తరువాత, వారు ఒక లూథర్ సంస్థాపకములను కలిగియుండిరి.
51 వెస్లీ మరణము తరువాత వారు మెథడిస్టు సంస్థాపకమును కలిగియుండిరి. ఔనా? అక్కడ, ఆ మార్గమున మీరు వెళ్లుచునేయున్నారు. అది—అది…అది అది చేయును. ఇపుడు, మీరిది—గమనించాలని నేను కోరుచున్నాను. ఔను. ఇపుడు, పెంతెకొస్తును గూర్చి ఒకరు అడగవచ్చు, అది మూడవ కాలము.
52 మీరు గమనించండి, ఆ కాలములో ప్రతి యొక్కటియు పరిశుద్ధాత్మలో ఒకసారి మునిగినవి. నీతిమత్వము పరిశుద్ధాత్మ యొక్క పని; శుద్ధీకరణ పరిశుద్ధాత్మ యొక్క పని; అయితే బాప్తిస్మము అనునది పరిశుద్ధాత్మ. ఆ కారణం చేతనే ఒక ప్రవచనాత్మక ప్రవక్త రావలసియుండెను. కాలమునకు వర్తమానికుడు లేడు. ’ఏలయనగా పరిశుద్ధాత్మ తనకుతానే వచ్చెను. బాప్తిస్మములో ఆయన యొక్క సంపూర్ణతలో వచ్చెను.
53 అయితే కాలము యొక్క ముగింపులో, ఇతరులు వచ్చుటలో ముగిసినట్లుగా, మనమక్కడ చూస్తున్నాము, వర్తమానికుడు పంపబడ్డాడు. ఆ కొదవలన్ని, మొదలగువన్ని ఆ విధముగా వాటి స్థానములో పెట్టబడును. అటుతరువాత సంఘమునకు ఎత్తబడుట వచ్చును.
54 అయితే, ఈ పలు పలు విషయాలను పలు విధములుగా చాలా మంది విభాగించారు, “సూర్యుడు చీకటిగా మారును, చంద్రుడు…” వారు దానిని ఇక్కడ క్రైస్తవ కాలమునకు అన్వయించుచున్నారు. అక్కడ వారు ప్రభువును మూడు ప్రశ్నలు అడిగారు. ఆయన వాటికి జవాబిచ్చినపుడు, చూడండి, వారు అవి చూచుటలో తప్పిపోయారు.
55 ఇపుడు, గడచిన రాత్రి, ఏ ప్రశ్న లేదనుకుంటాను. మనము వాటిలో ప్రతీ ప్రశ్నను తీసి వాటిని ముద్రల క్రింద ఉంచుదాము. మరియు ముద్రలు సంపూర్ణ పుస్తకము, దానికదే.
మీరది నమ్ముతున్నారా, డాక్టర్? [ఒక సహోదరుడు “ఔను” అని చెప్పెను.—సంపా.]
56 చూశారా, సమస్తము ఒక్కటిగా చుట్టబడియున్నవి. మరియు యేసు ఏమి చెప్పాడో అది తీసుకున్నాము. వారు మూడు ప్రశ్నలు అడిగారు, చూశారా, “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచన ఏది? మరియు లోకమునకు అంతము ఏది?” మరియు ఆయన వాటికి జవాబిచ్చెను…ఒకటి తప్ప, వాటిని మనము లాగాము. అదేంటి? ఏడవ ముద్ర. ఎందుకని? చూశారా, అది తెలియబడలేదు. ఔనది. ప్రతీది తెలియబడెను. నేను వాటిని ముందు వెనుకకు త్రిప్పి పోల్చి చూపించాను.
57 మరియు నేను గతరాత్రి వ్రాసుకొన్నపుడు, మరియు అక్కడకు వచ్చి…నా పాత వివరణ పుస్తకమును తీసుకొని అది చూచినపుడు, సరే, ఇంకో స్థానంలో నేను ఒకటి పెట్టియుండుట చూశాను, ఆలాగు. వాటిని నేను ముందుకు వెనుకకు ఉంచాను. అదీ నేను చేసినది. మీరు అది పట్టుకున్నారనుకుంటాను. మీరు, మీరు పట్టుకున్నారా? చూశారా?
58 నేను ఒక చోట వ్రాయవలసిన దానిని ఇంకొక చోట వ్రాశాను. అక్కడ వ్రాయవలసిన దానిని ఇక్కడ వ్రాశాను. రెండు—ఆ రెండిటిని ఉంచాను. 9, 11 లేక 9, 6 లేక ఏదీ…లేక 6 మరియు 11, మరియు—మరియు—మరియు 9 మరియు 11 మరియు ఆ విధంగా కాదు. ఒకటి ఒక వ్యతిరేకము. దాని క్రింద తరువాత వచనము. చూశారా? మరియు అది అదే, జవాబు, తెగులు యుద్ధము మధ్య, చూశారా. అది అక్కడ ఉంది.
59 కాబట్టి నేనెంతో ఆనందంగా ఉన్నాను! నేనాలాగున కొనసాగుతున్నాను…ప్రత్యక్షత ద్వారా కలిగిన ఉత్తేజము వలన నేను సంతోషంగా ఉన్నాను. కనుక నేను—నేను ఇది ఇక్కడ ఉంచాను. పెన్సిల్, లేక కలము పట్టుకొని కూర్చుండి, రెండు స్థలాలలో 11 పెట్టాను, ఉండకూడని దానిలో. మరొక ప్రక్క 11 బదులు 9 అనుకున్నాను.
60 అయితే, అవి ఎంతగా సరిపడినవో మీరు చూశారా? ఇపుడు, దానిని మరువవద్దు. అవి, ఆరు వరకు ఒకదానితో ఒకటి సరిపరచబడి, ఆగినవి. చూశారా. గమనించుడి—ముద్రలు విప్పబడటము గమనించుడి. అది ఆరు వరకు వచ్చి, మరియు ఆగినది. “పరలోకములో నిశ్శబ్దము,” అది అంతే, అది చెప్పబడినది, “ఇంచుమించు అరగంటసేపు.”
61 ఇపుడు—ఇపుడు వీటిలో చూడండి, నేను…నేను తొందరపడి వీటికి జవాబు ఇవ్వవలసియుంది. ఎందుకనగా చూడండి, వాటిలో ఒక్కొక్కటి నాలుగు వారముల ప్రసంగం, గ్రహించారా, ఆ విధముగా చేసిన ప్రతియొకటి వేరే దేనికైనను దారి తీయును. అయితే ఆలాగు చేయవలెనని నా అర్థం కాదు, ’ఎందుకనగా ప్రతియొక్కరి ప్రశ్న నేను తీసుకోవాలి, నాకు సాధ్యమైనంత వరకు.
62 ఈ కన్యకలు…ఆ కాలములో, వారిలో భాగము. ప్రతి కాలము కన్యకలు కలిగియున్నది. ఔనా? ఒక—ఒక ముద్ర…
దూత సంఘము యొద్దకు వచ్చుచున్నది. “ఎఫెసులోనున్న సంఘపు దూతకు వ్రాయుము.” చూశారా?
63 తరువాత, ఇక్కడకు వచ్చి, తరువాత ఎఫెసు సంఘానికి వ్రాసిన తరువాత దానిని వెనుకకు వచ్చి పోల్చి చూడండి, ఒక ముద్ర విప్పబడినది. ఆలాగున మనము ఆ కార్యాలను తీసుకొని వచ్చుచున్నాము. ప్రభువు చిత్తమైతే, మీకు తెచ్చుటకు ప్రయత్నిస్తాను. (నా భావమేదో గ్రహించారా?)
64 వారు మొదట దేనిని కలిగియుండిరి? సంఘకాలాలు. ఔను. తరువాత, సంఘకాలాలకు వర్తమానాలు. అదిప్పుడు అందరికి విశదంగా ఉందా? చూశారా?
65 మొదట, సంఘకాలాలు చూశాము, మరియు చరిత్ర చూశాము, నికేయ ఆలోచనా సభలను, ముందు-నికేయ సభలను చూశాము. ప్రతీదీ చరిత్రలో కనుగొన్నాము మరియు సరియైన వాక్యము యొక్క అనువాదము చరిత్రతో యుండుట కనుగొన్నాము. మరియు ఈ లవొదికయ కాలమునకు ఈ దినమునకు దానిని తీసుకొని రండి, మరియు మీరు—మీరు కలిగిలేరు, దానిని గూర్చిన చరిత్రయు లేదు. ఇది ఇపుడు చరిత్ర చేస్తుంది. అదక్కడే యున్నది. అటుతరువాత ఈ కాలంలో ఏమైయుండునని చూపించబడినది.
66 ఇపుడు, మనము ముద్రల యొద్దకు వచ్చి ఆ ముద్రను తెరచాము. దేవుడు ఆ ముద్రను మన కొరకు విప్పాడు. ఏంటది? మొదట, ఒక వర్తమానికుడు, సంఘ కాలము; తరువాత ఏడు ముద్రలు.
67 ఇపుడు, ఏడవ సంఘకాలమును కలుషితము ఎంత తాకినదో మనము చూశాము. అయితే, ఏడవ ముద్ర ఏదీ బయలుపరచలేదు. దానికి ఏమి సంభవించనైయున్నది అనునది. చూశారా? ఎందుకనగా ఆ సంఘకాలము యొక్క చివరన ఈ సంగతులు బయలుపరచుటకు ఒక ప్రవచన వరము రానైయున్నది. చూశారా? మీరు దానిని గ్రహిస్తున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది.—సంపా.] సరే.…ఇపుడు గమనించు, ఏ విధముగా ఆ ఒక్కొక్క ముద్ర…
68 తరువాత నేనిక్కడకు వచ్చాను. మరియు ఆ మూడు ప్రశ్నలు యేసుక్రీస్తును అడిగారు, “ఏమిటి, ఎప్పుడు ఇవి జరుగును, ‘రాతిమీద రాయి నిలువబడని కాలము వచ్చును’? మత ప్రపంచములో కేంద్రముగా యుండు ఇది ఎప్పుడు పడద్రోయబడి మరియు ఇంకొకటి స్థాపించబడును? చూశారా, అదెప్పుడు జరుగును?” అంత్యక్రీస్తు స్వారీ! చూశారా? దానిని ఎదుర్కొనుటకు ఏమి బయలు వెళ్లినది? వాక్యము, వాక్యమునకు విరుద్ధముగా వాక్యము.
69 అటుతరువాత, అది రాజకీయాలతో అన్నిటితో స్థిరపడిపోయినది. మరియు ఎద్దు శ్రమ వచ్చినది. చూశారా? అది ఖచ్చితంగా రెండవది. ఇక్కడ. మరియు మత్తయి 24 లో యేసు ఈ విధముగా చెప్పాడు, ఔనా. అటుతరువాత మనము సంస్కర్తల యొక్క యుక్తి యొద్దకు వచ్చాము. మానవ జీవి దానిని ఎదుర్కొనుటకు బయలువెళ్లెను. అది జరిగిన కార్యము. అటుతరువాత నాలుగవ ముద్ర యొద్దకు వచ్చాము. అక్కడ అంత్యక్రీస్తు మిశ్రమమై “మృత్యువు” అను పేరు కలిగియుండెను.
70 ఇపుడు యేసు ఏమి చెప్పాడో గమనించుడి, “మరియు వారిని అగ్నిలోనికి త్రోసి మరియు ఆమె యొక్క బిడ్డలను చంపివేయును.” అదియే మరణము, స్వారీచేయుట. అది ప్రొటస్టెంటు మరియు కథోలిక్ వారు. ఇరిరువురునూ వారిపై మరణముద్రను కలిగియున్నారు. చూశారా. “ఆమె మరియు ఆమె పిల్లలు నాశనము చేయబడిరి.” కాబట్టి మీ సంస్థాపకములపై ఆధారపడినట్లయితే, ఇపుడే మీరు దూరమౌట మంచిది.
71 మరియు అది ఏడవ ముద్ర యొద్దకు వచ్చునప్పటికి, యేసు అక్కడే నిలుపుచేశాడు. “చంద్రుడు రక్తముగా మారును మరియు సమస్తమును అంధకారమగును” అని చెప్పుట ద్వారా ఆయన ఆరవ ముద్రను తెరచాడు.…ఈ కార్యములు జరుగును. మనము ఇక్కడకు వచ్చాము మరియు ఆరవ ముద్ర తెరచాము. ఆరవ ముద్ర తెరచిన తరువాత, అపుడు వెనుకకు వెళ్లి అదే విషయము చూపుతుంది.
72 అక్కడే మీరున్నారు, లేఖనములలో మూడు వేరు వేరు స్థలాలలో బయలుపాటుతో అది ముడివేయబడియున్నది. చూశారా? గమనించుడి. ఆలాగని యేసు చెప్పిన స్థలము; ఆయన గ్రంథమును విప్పిన స్థలము, భూమికి పునాది వేయబడినప్పటి నుండి అది మరుగుచేయబడినది; మరియు అటుతరువాత ఇక్కడున్న ఈ దినపు ప్రత్యక్షత, అక్కడ దానిని క్రమములో యుంచి, మూడు ఐక్యముగా కలుపును. మూడు సాక్ష్యము. కాబట్టి, అది సత్యము. అది ఖచ్చితంగా సత్యము.
73 ఇపుడు, ఇక్కడ వచ్చుచున్న ఈ కన్యకలు నిద్రించినవారు, అటుపిదప సమస్త శరీరము ఆ గుంపుతో కలసి తయారైనది. అది వెళ్లును…చూశారా, బుద్ధిగల కన్యకలుగా తయారుచేయుటకు. బుద్ధిగల కన్యకలతోనే ఆ బుద్ధిలేని కన్యకలు కూడా బయలుదేరారు, అంత్యక్రీస్తు, నూనెను కొనుటకు ప్రయత్నించినది వీరే.
74 ఇపుడు ఇటు చూచి నీవెటు చూచినగాని ఎంత పరిపూర్ణమో చూడండి. నేనిక్కడ నిలబడి, ఆ గదిలో ప్రత్యక్షమైన విషయాలు మాట్లాడితే, మీ తల తిరుగును. అయితే వారిక్కడ సమస్తకార్యాలు పొందినట్లయితే, దానిని మీరెట్లు చేయగలరు?
75 మరియు తరువాత ఏదో ఒక విధంగా, ప్రజల నుండి మీరు దూరమైనపుడు, ఆ తరువాత మర్మములు తెరవబడుటకు ప్రారంభమౌను. ఆ తరువాత, ప్రజలకు మీరు చెప్పలేని విషయాలు కూడా మీరు చూస్తారు. కారణం, మీరు చూచిన యెడల, వారు చిన్న మూఢ నమ్మకాలు ప్రారంభిస్తారు.
76 మరియు తరువాత ఈ చిన్న స్వస్థత వరము ఏం చేసిందో, అదేవిధముగా సంఘమును గజిబిజి చేసిందో మనం చూద్దాం. ప్రతి యొక్కరు ఒక ఉద్రేకాన్ని కలిగియున్నారు, ప్రతియొక్కరు ఇది కలిగియున్నారు; నా హృదయారంతరంగంలో, (అది సత్యమని దేవునికి తెలుసు.), అది క్రమము కాదని నాకుతెలుసు, ’కారణం ఆలాగని ఆయన నాకు చెప్పాడు. చూశారా? అయితే అది తప్పుడు అనుకరణ, ప్రజలను గుంపుగా చేయుట మాత్రమే. ఇపుడు అది నిజం. అయితే, మీరు చూడండి, నీవు ఆ విషయాలు చెప్పలేవు. దానిని ఆలాగే వదలివేయుట మంచిది.
77 మరియు మీకు మూడవ లాగుడు గుర్తున్నదా? ఆయన చెప్పాడు, “ఎవరితోను చెప్పవద్దు.” నేను చెప్పినది అదేనా? ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? నిజమేనా. దర్శనంలో, నేను అక్కడ నిలబడి ఆ చిన్న బూటుకు లేసులను ఆ రంధ్రముల గుండా ఎక్కించుటకు ప్రయత్నించుట, ఎందరకు గుర్తుంది? ఆయన చెప్పాడు, “పెంతెకొస్తు బిడ్డలకు అతీతమైన విషయాలు నీవు బోధింపలేవు” అని.
78 నేను చెప్పాను, “ఇది మూడవ లాగుడు, మరియు అది తెలియబడదు, కాబట్టి నాకు సహాయపడుము దేవుని కృప వలన.”
ఇపుడు—ఇపుడు, మనము—మనమిపుడు అంత్యకాలమున ఉన్నాము. కృపా సింహాసనము న్యాయ పీఠముగా అగువరకు ఎక్కువ కాలము పట్టదు. ఇవి వచ్చుట మీరు చూచునప్పుడు మరియు ఈ ప్రజలు వచ్చుట మీరు చూచునపుడు, మీరు కూడా లోపలకు వచ్చుట మంచిది. మీరు లోపల లేనట్లయితే. చూశారా?
79 ఇపుడు, “పరలోక స్థలములో కూడుకొనుట,” చూశారా. సంతోషించుట కంటే మిక్కటమైన కార్యము యని భావము కూడా. “పరలోక స్థలములో,” మీరు నిజముగా కూడుకున్నట్లయితే అది యొక భయపడవలసిన విషయం.
80 ఆ ప్రభువు దూత…యొద్ద నిలబడినపుడు, మీరు అరచవచ్చు, కేకలు వేయవచ్చును. అది, అది అది కాదు. అది మీకు చనిపోవునంతగా భయము కలిగించును. చూశారా? కాబట్టి, చూశారా, అక్కడ కేవలం ఆనందించుటలో, ఉద్రేక నాట్యములో వ్యత్యాసముంది, అది సరే. అటు తరువాత అసలైన విషయానికి వస్తుంది. చూశారా? చూశారా? అక్కడే భయమున్నది. అది భయపడవలసిన విషయం. మీరు నశించిపోయారని భయం కాదు; అయితే దూతకు ముందు నిలబడినపుడు, పరిశుద్ధాత్మ తనకుతానే అక్కడ నిలబడి యున్నపుడు భీతి కలుగును.
81 ఇపుడు, అది పెండ్లికుమార్తెలో భాగమైయున్నది. నిద్రించిన వారందరును చేరి ఆ గుంపుగా ఉంటారు. మరియు దానిని ఖచ్చితంగా చూడలేము…
[టేపు రికార్డు చేయు పరికరము ఆగిపోయింది. టేప్ లో ఖాళీ స్థలము ఉన్నది.—సంపా.]…పరుండబెట్టబడిన ఈ యొక్క చేతి రుమాళ్ల ద్వారా, ప్రజలకు స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో, ఆమేన్.
ఇపుడది బాగుందా? [సహోదరులు “ఆమేన్” అని చెప్పారు—సంపా.] వందనాలు మీకు. ఒకరు దేనిమీదనైనా కాలు పెట్టారా? [ఒక సహోదరుడు చెప్పారు, “ఆ వరుసలో చాలా టేపు రికార్డులు యున్నవి.”] చాలా టేపు రికార్డులు ఉండుట వలన దానిపై ఎక్కువ బరువు ఏర్పడింది. ఔనా! మంచిది. టేపును తీసి దానిని మార్చివేయండి. ఇపుడు తరువాత ప్రశ్నను గమనించండి.
174. సువార్తికులు పొలములో పనిచేయుట కొనసాగవలెనా?
82 ఒకవేళ “ఈ ఘడియలో,” దాని అర్థం ఏంటి. తప్పక అన్ని విధములుగా. ఏ ఒక్క విషయము మార్చవద్దు. ఉదయవేళ యేసు వచ్చుచున్నట్లయితే, అది ఈ దినము నుండి పది సంవత్సరములనుకొని ఈ దినమున బోధించు, అయితే అది ఈ ఘడియలోనే జరుగనున్నట్లు జీవించు.
83 వద్దు—ఇపుడు దేనిని గూర్చి సందేహించవద్దు. దానిని గూర్చి నేను నీకు హెచ్చరిక చేయ ప్రయత్నిస్తున్నాను. ఔను. విడ్డూరంగా వింతగా యుండవద్దు. దేనిని మార్చవద్దు. అయితే మీరు ఒకటి తప్పు చేస్తున్నట్లయితే లేక కీడు చేస్తున్నట్లయితే, పశ్చాత్తాపపడు, చూశారా, తిరిగి దేవుని యొద్దకు రండి. మీరు ఎల్లప్పుడు చేయుచున్నట్లుగానే మీ యొక్క సువార్త పరిచర్యను కొనసాగించుడి.
84 మీరు ఇల్లు కట్టుచున్నట్లయితే, కట్టండి. యేసు రేపు వస్తే, మీ కర్తవ్యములో నమ్మకస్తులుగా యుండండి. మీరు ఆలయాన్ని కట్టుచున్నట్లయితే, సాగిపోండి, కట్టండి. ధనమును నా జేబులో ఉంచుకొనుట కంటే ఆలాటి కార్యాల కొరకు పెడతాను. చూశారా?
85 కాబట్టి—సాగిపోండి. మీరున్న విధముగానే కొనసాగించుడి. ఇపుడు ప్రతియొక్కరు అర్థం చేసుకున్నారా? [సభ “ఆమేన్” అని అన్నది.—సంపా.] మీరున్నట్లుగానే యుండి ఆలా కొనసాగించుడి. ఇపుడు, నిలుపు చేయవద్దు. ఏదీ చేయవద్దు…మీరుండినట్లు ఆ విధంగానే యుండండి. ప్రభువును సేవిస్తూ యుండుడి.
86 ఇపుడు, ఉదాహరణగా, మీరు—ఒక మనిషి కొరకు పనిచేయుచున్నట్లయితే, అది వదిలిపెట్టు సమయమునకు పదిహేను నిముషాలు ఉన్నవని మీరు ఎరుగుదురు. “సరే,” “ఉఁ. ఇక పదిహేను నిముషాలున్నవి, కనుక నేను వెళ్లి కూర్చుంటాను,” అని నీవు చెప్తే, నీకు పదిహేను నిముషాల జీతము తగ్గించబడును.
87 నీవు గోధుమ నాటుతున్నట్లయితే; గోధుమ నాటు. నీవు బంగాళదుంప త్రవ్వుతున్నట్లయితే; త్రవ్వు, వాటిని వెలుపలకు తీయు. “సరే, ఎవరూ అవి తినరు” అని చెప్పవద్దు. అదేమి వ్యత్యాసము చేయదు. ఏలాగైనా వాటిని వెలుపలకు తీయు. చూశారా? ఆఁ. నీవు ఆలాగే కొనసాగించు.
88 గత దినమున నేనొకరి యొద్ద నుండి ఒక ఉత్తరం పొందుకున్నాను. చెప్పారు, ఒకరు వారితో చెప్పారు, “సరే, సమయము సమీపించినది, పొలమును అమ్మివేయ్. ఇపుడు మీరు పొలము పండించి ఆ పంటను తినుటకు మీకు అవకాశము లేనేలేదు.” అన్నారు, “ఎందుకనగా వెయ్యేండ్ల పాలన ప్రారంభం కానున్నది. నీకు అది అవసరము లేదు. కాబట్టి మీరు ఆలాగు చేయండి…మరియు శ్రమ కాలము జరుగునపుడు, మీ బిడ్డలు రక్షించబడని యెడల, వారు…బిడ్డలు పొలమును కలిగియుండనీయుడి. వారు అది భుజిస్తారు. అయితే మీరు మీ యొక్క పొలమును అమ్మి” మరియు—మరియు ఆలాగుండుడి. మరియు వారు…
89 నేను అంటాను, “ఓ, మై!” ఆయన రేపు వచ్చుచున్నట్లు నేనెరిగియున్నట్లయితే, నేను వ్యవసాయకుడనైతే, నేను ఈరోజు నా యొక్క పంటను వేస్తాను. ఖచ్చితం. ఆయన నన్ను వ్యవసాయకుని చేసిన యెడల నేను నా విధిలో నిలచియుంటాను. ఔను. ఆయన నన్ను ఒక మెకానిక్ గా చేస్తే…
90 గత దినాన ఒకరన్నారు, అతడు చెప్పాడు, “ఒకరు లోపలకు వచ్చి ‘చెప్పాడు, సహోదరుడా, ఏంటో తెలుసా?’ అని అడిగాడు. అతడు చెప్పాడు, ‘నేను’ నీకు నా యొక్క రెండవ తాళపు చెవి గుత్తిని ఇవ్వబోతున్నాను. నేను కొత్త కారును కొన్నాను.’ అతడన్నాడు, ‘నేను’ నీకు రెండవ తాళపు చెవి గుత్తిని, ఇవ్వబోతున్నాను,’ అని తన సంఘకాపరితో చెప్పాడు. అన్నాడు, ‘నేను’ నీకు రెండవ తాళపు చెవి గుత్తిని ఇవ్వబోతున్నాను, ’ఎందుకనగా ఎత్తబడుట బహుశా రావచ్చును. తెలుసా, మరియు’ అన్నాడు, ‘ఇవి ఇక నాకు అవసరముండవు.’” కాపరి వదిలిపెట్టబడబోవుచున్నాడు. చూశారా. ఓ! అది సిద్ధపడుట. ఔనుకదా? మంచిది. అయితే—అది ఆ విధంగా ఉండును. చూడండి. మనం ఆ విధంగా ఉండాలి.
91 మనము తప్పకుండా స్థిర బుద్ధి కలిగి, గట్టి క్రైస్తవులుగా ఉండవలసియున్నది. ఔనా. అందుకొరకు నేను ఆఖరి నిముషము వరకు పని చేయుటకు ఇక్కడ ఉన్నాను. నేను నిర్వర్తించవలసిన విధి యొకటి యున్నది. మరియు నేను నా విధి నిర్వహణలో నమ్మకస్తునిగా కనుగొనబడవలసియున్నది. ఆయన ఈ ఉదయం వచ్చినట్లయితే, ఇక్కడ వేదిక యొద్ద నిలబడగోరుచున్నాను.
92 నీవు అడుగుతావు, “సహోదరుడా బ్రెన్‌హాం, ఆయన ఈ ఉదయం వచ్చుచున్నట్లయితే నీవు అక్కడ బయట నుండవలెనా?” లేదండి!
93 ఇది నా విధి నిర్వహణ. ఆయన వచ్చినపుడు, నేనిక్కడే నిలబడి బోధిస్తాను. నేను చెప్పు విషయాలే చెప్తాను. తరువాత ఆయన వచ్చినపుడు, నేను ఆయనతో కూడా వెళ్తాను, చూశారా.
94 నేను పాఱతో బంగాళాదుంపలు త్రవ్విన యెడల, నేనెంతగా త్రవ్వవలెనో నేనంతగా త్రవ్వుతాను. ఆయన వచ్చునపుడు, నేను పాఱను పడవేసి ఎత్తబడతాను.
సునాద సంవత్సరము గూర్చి గుర్తున్నదా? వారు పాఱతో—పాఱతో త్రవ్విన యెడల వారు త్రవ్వుచునే యుంటారు. సునాద సంవత్సరము ఇంకా పది నిముషాలు ఉన్నవనియు సునాద సంవత్సరమున బూర ఊదబడుననియు వారికి తెలుసు. వారు గడ్డిని తీయుచు, వారు చేయునది చేయుచుండిరి. అయితే బూర ఊదబడినప్పుడు గడ్డిని ఎత్తివేయు కర్రను అట్లే వదిలి వెళ్లిపోతారు. చూశారా? ఔను. బూర మ్రోగు వరకు గడ్డిని ఏరుచు కొనసాగిస్తారు.…సరే
[అక్కడ సమీపమున నుండి ఒక శబ్దము వినబడుచున్నది—సంపా.] ప్రశ్న “తెరువబడిన ప్రకారము…” అది…? సంభవించినదా? ఊ? అది—అదిక్కడ శబ్దము చేసియున్నది. ఒక ప్రశ్న:
175. అయిదవ—అయిదవ ముద్ర విప్పబడిన ప్రకారముగా, మోషే, ఏలీయాలు—చనిపోవలసియున్నది. హనోకు సంగతి ఏంటి?
95 నాకు తెలియదు. చూశారా? నేను—నేను…నాకు తెలియనట్లయితే, నేను నాకు తెలియదని మీకు చెప్పబోవుచున్నాను. చూశారా? నాకు—నాకు ప్రజలారా, అన్ని జవాబులు నాకు తెలియదు. నాకు—నాకు తెలియదు. మరియు నాకు తెలియనట్లయితే, నాకు తెలియదని నేను మీకు చెప్పబోవుచున్నాను. నాకు తెలియనట్లయితే…నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను, ఔనా. అయితే నాకు—నాకు తెలియదు.
96 అందును గూర్చి, నాకు నేను తరచుగా ఆశ్చర్యపడుతుంటాను. హనోకు ఉన్నాడు…మోషే వచ్చుటను మరియు ఏలీయా తిరిగి వచ్చుటను నేను చూశాను. మరియు వారు చంపబడ్డారు. చూశారా. అయితే ఇపుడు హనోకు సమయమునకు ముందే కొనిపోబడ్డాడు. నేను తరచుగా ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతుంటాను, “సరే. అదేంటి? అని.”
97 ఇయితే, పిదప, నేను మీకు చెప్పగలిగిన ఒకేయొక ఆదరణ ఒకటియుంది, అది. ఇపుడు గమనించండి, మోషే నలభై సంవత్సరాలు మాత్రమే దేవుని సేవించాడు. ఔనా? అతడు—అతడు నూట ఇరవై. అయితే ఇరవై సంవత్సరములు…నలభై సంవత్సరములని నా భావం. అతడు తన విద్యనభ్యసించాడు. ఔనా? రెండవ నలభై సంవత్సరములు అతనిలో నుండి దేవుడు అది తీసివేస్తున్నాడు. మరియు మూడవ నలభై సంవత్సరములు అతడు దేవుని సేవించాడు. ఔనా. సరే. అయితే హనోకు దేవునితో అయిదు వందల సంవత్సరములు నిందారహితముగా నడిచాడు. చూశారా? చూశారా? కావున, మోషే, ఏలీయాలు ఇంకొద్ది కాలము సేవ చేయుటకు వస్తారు.
98 ఇపుడు, అది, అది సరియని నేను చెప్పుట లేదు, చూశారా. ఒక ఆలోచనకై నేనది మీకు ఇచ్చాను. ఔను. అయితే చెప్పుటకు అది ఏ భాగములోనిదో నాకు తెలియదు. నేను వాస్తవముగా—అక్కడ ఏమి జరిగిందో లేక దేవుడు ఏమి చేయునో నాకు తెలియదు.
176. ప్రకటన 3:12 లో ఉన్న జనుల మీద ఉండు నామము ఏమిటి?
99 నాకు—నాకు తెలియదు. అఁ. ఆయన చెప్పాడు, “వారికి ఒక నూతన నామము ఇవ్వబడును” నాకు—నాకు—నాకు తెలియదు అదేంటో, చూశారా. బహుశా మనము అక్కడకు చేరుకున్నపుడు అది తెలియబడును, అయితే ఇపుడు నాకది తెలియదు. చూశారా, ఆయనది చేయబోతున్నాడు. చూశారా? ఆయన వారికి నూతన నామము ఇచ్చును—వారికి మాత్రమే తెలియును. ఔనా?
177. ఇపుడు, సహోదరుడా బ్రెన్‌హాం, విడాకులు ఇచ్చిన తరువాత వివాహమును అనుమతించు లేఖనము ఏదైనా ఉన్నదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది.
100 అది “ప్రాముఖ్యమైనదని” అది చెప్పుచున్నది. సరే, ఆ కారణం చేత…అది దీనికి సంబంధించినది కాదు. నా సహోదరుడా లేక సహోదరీ, అదెవరైనది నేను చూచినప్పటికి, నీ సహచరిని చనిపోతే గాని మీకు అనుమతి లేదు. ఎందుకనగా, బైబిల్ చెప్తుంది, “వారు బ్రతికియున్నంత కాలము మనము బద్ధులమైయున్నాము.” చూశారా?
101 కాబట్టి—“దానికి సంబంధించిన లేఖనము ఏమైనను ఉన్నదా?” ఇక్కడ అది అడుగబడినది. “ఏదైనా లేఖనము ఉన్నదా?” చూశారా? “ఏదైనా లేఖనమున్నదా?” నేను కనుగొనినంత వరకు లేదు. చూశారా, నేను కనుగొనినంత వరకు లేదు.
కారణం, పౌలు చెప్పాడు—వివాహితులైన వారిని గూర్చి చెప్పాడు, “సహచరిని లేక సహచరుడు చనిపోయిన యెడల, ప్రభువు నందు వారు వివాహము చేసుకొనుటకు వారికి స్వాతంత్ర్యము కలదు.” అయితే అంతవరకు, అయితే గమనించండి, దానిని తీసుకోండి, “మరణము మనలను విడదీయు వరకు.” అదంతే. మీరు దాని మీద ప్రమాణము చేశారు. ఔనా.
102 కాబట్టి ఆలాగున్నదని నేననుకోను. ఇపుడు, ఆలాగైతే…మీరు కనుగొంటే అది సరియైతే, మంచిదే, అయితే నా మట్టుకైతే నేను—నేనది కనుగొనలేదు.
178. ప్రకటన 6:6 లో “నీవు నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దు” అనుదానికి అర్థమేమిటి?
103 అది పరిశుద్ధాత్మ. చూశారా? మనము ఇపుడే దాన్ని గూర్చి చెప్పుకున్నాము. బహుశా వర్తమానమునకు ఆలస్యంగా ఒకరు వచ్చియున్నారేమో, వారు…ఇతర టేపుల కొరకు, చూశారా.
“నూనెను మరియు ద్రాక్షారసమును పాడుచేయవద్దు.” నూనె మరియు ద్రాక్షారసము అనగా అర్థమేంటి?
104 నూనె, దానిని మనము సూచనగా తీసుకున్నాము, అర్థం పరిశుద్ధాత్మ. చూశారా? ద్రాక్షారసము…మరియు నూనె కలిపి బైబిల్ గ్రంథములో ఆరాధనలో యున్నవి. చూశారా? మరియు ద్రాక్షారసము, అది ఉంచినపుడు, అక్కడే నాకు తలంపు వచ్చినది, “ఉత్తేజము.” ద్రాక్షారసము ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మరియు ద్రాక్షారసము, అది ప్రకృతి స్వభావముగా ఉత్తేజాన్ని కలిగించినట్లు, బయలుపాటు వలన ఉత్తేజమునకు అది సాదృశ్యముగా ఉన్నది.
105 ఇపుడు ఆలోచించు. సంఘాన్ని ఏది ఉత్తేజం కలిగిస్తుంది? ప్రత్యక్షత. ఔనా? కాబట్టి ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసము…ఇపుడు గమనించండి. అర్పణలో నూనె మరియు ద్రాక్షారసము కలసి వెళ్లును. సంఘ ఆరాధనలో కలసి వెళ్లును. గమనించు. కలసిన సూచనలు, కలసిన సమ్మిళితము.
106 మీ యొద్ద అకారాధి సూచిక నిఘంటువు యుంటే ఆరాధనలో ద్రాక్షారసము, నూనె యుండుట పట్టీ యంతటిలో యుండుట మీరు కనుగొనగలరు. మీ యొద్ద క్రూడెన్స్ యుంటె అక్కడ కూడా చెప్పబడింది.
107 ఇపుడు దీన్ని గూర్చి గమనించు. అయితే చూడండి. నూనె ఎల్లపుడు పరిశుద్ధాత్మ. అది యెహెజ్కేలులో కనుగొంటున్నాము. పాత నిబంధనలో మనమది చూస్తున్నాము. క్రొత్త నిబంధన అంతట మనమది చూస్తున్నాము.
108 ఎందుకు మనము రోగులను నూనెతో అభిషేకిస్తున్నాము? రోగులను నూనెతో మనము అభిషేకిస్తున్నాము. ఎందుకనగా, వారి మీద పరిశుద్ధాత్మ క్రుమ్మరింపుకు గురుతుగా అది యున్నది. చూడండి. ఇంకా బుద్ధిగల కన్యక నూనెను కలిగియున్నది; బుద్ధిలేని కన్యక యొద్ద నూనె లేదు, ఆత్మ లేదు. చూశారా. అదీ నూనె. మరియు అటు తరువాత ద్రాక్షారసము. అది—అది…నూనె పోలికగా యున్నట్లయితే, దేవునికి పోలికగాయుంటే. దేవుడు ఆత్మయైయున్నాడు. చూడు?
109 దేవుడు వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద నుండెను. వాక్యము శరీరధారియాయెను, మరియు అది దేవుడు.” ఇపుడు, తరువాత వాక్యము…ఇక్కడ ప్రకృతి రూపములో కూర్చొనియున్నది. ద్రాక్షారసమును నీరు వలె లేక వాక్యమును వ్యాఖ్యానించు ఆ బయలుపాటును ప్రత్యక్షపరచుట, అది ఒక విశ్వాసిని ఉత్తేజపరచును, మీరు చూడండి. మై వారు చెప్తారు, “క్రితం నేనెన్నడు చూడలేదు! మై! మహిమ!” అదేమిటి? చూశారా, ఉత్తేజము. చూశారా ప్రత్యక్షత యొక్క ఉత్తేజము.
110 గడచిన దినమున నేను అక్కడ కూర్చొనియున్నంత వరకు నాకు తెలియదు. చూశారా? అది, “నూనె, ద్రాక్షారసము ఏమైయున్నదో…?” అవి, “చూడూ, మీరు వాటిని పాడుచేయవద్దు.” అది నల్లని గుర్రం మీద స్వారీ చేయువాడు. మరియు అది అంధకార యుగము సంఘము యొక్క మూడవ కాలము.…గమనించు. మరియు “అక్కడ అందులోనికి కొద్దిగా, కొద్దిగా మిగిలియున్నది. అయితే దానిని పాడుచేయవద్దు.”
111 మరియు నేను నమ్ముతున్నాను. మీరు టేపు మీద మూడవ ముద్రను పొందుకున్నట్లయితే, మీరు…మీరది అక్కడ చూస్తారు. మేమక్కడ వివరంగా విశదీకరించాము.
179. సహోదరుడా బ్రెన్‌హాం, గొఱ్ఱెపిల్ల యొక్క జీవ గ్రంథము, జీవ గ్రంథము, ఒకే గ్రంథమా?
112 ఖచ్చితం, ఔనా. ’ఎందుకనగా ఈ గ్రంథములోనే సమస్త విమోచనా వ్రాయబడియున్నది. చూశారా? వారి పేర్లు…నీవు అడుగుతావు, “సరే, మా యొక్క పేరు గొఱ్ఱెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పెట్టబడియున్నదా సహోదరుడా బ్రెన్‌హాం, గతరాత్రి అది పెట్టబడినది.” లేదు. నీ పేరు ఇపుడు పెట్టబడలేదు. లేదు. లేదు. అది అక్కడ యున్నదని గతరాత్రి నీవు అది కనుగొన్నావు. చూశారా, ఎందుకనగా, భూమికి పునాది వేయబడకమునుపే వారి పేరులు వ్రాయబడియున్నవి. చూశారా? అదంతయు ఒకే గ్రంథము. చూశారా.
180. ఇపుడు, సహోదరుడా బ్రెన్‌హాం, క్రీస్తు వచ్చినప్పటి నుండి జన్మించిన ప్రతి యూదుడును రక్షించబడుననుట నిజమా? మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలమంది ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడుటకై ముందుగా నిర్ణయింపబడినవారు వీరా? మరియు వారి యొక్క పని ఏమిటి?
113 అక్కడ ఒకదానిలో మూడు ప్రశ్నలున్నవి. అయితే, ఇక్కడ మొదటిది:
క్రీస్తు వచ్చినప్పటి నుండి జన్మించిన ప్రతి యూదుడు రక్షింపబడునను మాట నిజమా?
114 లేదు. ఎవ్వరూ రక్షింపబడరు. వారు యూదులుగాని లేక అన్యులుగాని జగత్తు పునాదికి ముందే ఎవరి పేరులైతే గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడునో, వారు మాత్రమే రక్షింపబడతారు. చూశారా. అంతే. ఆ మర్మమును గ్రంథము పట్టుకొనియున్నది. గ్రంథము మాత్రమే దానిని తెరచి చూపించును; ప్రతియొక్కరి పేరు కాదుగాని, అది ఆ పేర్లను పిలచుచుండగా గ్రంథము యొక్క మర్మమేదని బయలుపరచును. చివరికిప్పుడు దానిని మీరు గ్రహించారా? చూశారా?
115 “ఇపుడు, ఈ సంఘకాలములో లీ వైల్ రక్షించబడబోవుచున్నాడు, లేక ఆర్మన్ నెవిల్,” లేక—లేక ఎవరైనను అని గ్రంథము చెప్పుట లేదు. లేదు. అది అది చెప్పుట లేదు. అది మర్మమును చూపుచున్నది, విషయమేమన్న మర్మమును బయలుపరచుచున్నది. అయితే విశ్వాసము వలన మనకై మనము అది నమ్ముచున్నాము. అదే గతరాత్రి నేను చెప్పినది.
116 ఒకరన్నారు, “సరే. దానిని ప్రయత్నించ నాకు అవసరము లేదు. సహోదరుడు బ్రెన్‌హాం చెప్పాడు, జఫర్ సన్ విల్ లో ఒక్కరే రక్షించబడతారు” అని. చూశారా? ఇపుడు, చూశారా అది ఉపమానమును చూపుతుంది. అది—అది—అది కాదు, అది—అది కాదు. లక్షల మంది రక్షించబడవచ్చు. నాకు తెలియదు. వారిలో ప్రతియొక్కరు రక్షించబడాలని నా నిరీక్షణ. చూశారా, అయితే నాకు తెలియదు.
అయితే ఇక్కడ నేను నమ్ము విధమొకటి యున్నది, “ఆ ఒక్కడను నేను.” నీ కొరకు అదే నమ్ము. నీవు కానట్లయితే, ఆలాగైతే నీ విశ్వాసములో తప్పు ఒకటియున్నది. నీవేమి చేయుచున్నావో నిశ్చయత లేకుండా ఉన్నావు.
117 నీవు ఏలాగు—నీవు రక్షించబడ్డావో లేదో ఖచ్చితంగా తెలియకుండా ఏలాగు మరణమును ఎదుర్కొనగలవు? చూశారా? నీవు ఇక్కడకు వెళ్లి, ఇక్కడ పడియున్న ఈ కుంటివాని యొద్దకు వెళ్లి, మెలికలు తిరిగిన గ్రుడ్డివాని యొద్దకు “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు లేచి నిలబడు అని చెప్పగలవు? యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును” అని ఎట్లు చెప్పగలవు?
118 అక్కడొక చనిపోయి చల్లబడిపోయి, బిగుసుకుపోయిన ఆ మృత శరీరము అక్కడ గంటల కొలది పడియుండగా నీవు అక్కడ నిలబడి, “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, లేచి నీ కాళ్ళపై నిలబడుమని నీవెలా చెప్పగలవు?” నీవేమి మాటలాడుచున్నావో దానిని తెలుసుకొనుట మంచిది. చూశారా?
119 మంచిది. చెప్తావు, “మరణము సమస్తమును హక్కు పొందియున్నది. అంతా అయిపోయినది.” ఆఁ, అయితే వాక్యము బయలుపరచబడినపుడు, మరియు మీకు తెలుసా అది దేవుడు, అది కార్యములను మార్చును. ఔను.
120 ఇపుడు, ఔను, ఈ యూదులు…యూదులందరు రక్షించబడరు. లేదండి. వారు రక్షించబడరు; కేవలం ఎవరైతే…యూదుని గూర్చి ఆయన మాట్లాడుచున్నపుడు, వారు వదలి వెళ్లునపుడు, “యూదుడు” అని ఇవ్వబడెను…నేను అనుకుంటాను, మొదటిగా నెబుకద్నెజరు “యూదుడని” వారిని పిలిచెను. ఎందుకనగా యూదా గోత్రము అక్కడకు కొనిపోబడ్డారు. మరియు “యూదుడని” పేరు పెట్టారు, ఎందుకనగా వారు యూదయ నుండి వచ్చారు. మరియు యూదుడని పేరు పొందుకున్నారు.
121 అయితే, ఇశ్రాయేలు వేరు. ఇశ్రాయేలు మరియు యూదుడు వేరువేరుగా ఉన్నారు. ప్రతి యూదుడు—ప్రతి యూదుడు ఇశ్రాయేలీయుడు కాదు. చూశారా. లేదు. అతడు యూదుడు. అయితే ఇశ్రాయేలు…యూదులందరు రక్షింపబడతారని పౌలు చెప్పలేదు. అతడు చెప్పాడు, “ఇశ్రాయేలీయులందరు రక్షింపబడెదరు.” ఎందుకని? ఇశ్రాయేలు యొక్క పేరు, అది—అది ఆది నుండియు విమోచనా నామము. చూశారా? ఇశ్రాయేలీయులందరు రక్షింపబడతారు. అయితే యూదా అంతా కాదు—యూదా మతస్తులందరు రక్షింపబడెదరు. చూశారా?
122 అన్యులవలె. అక్కడ…అక్కడ వేలకొలది వేలకొలది మంది ప్రజలు, ఔను, అక్షరాల లక్షలు లక్షల మంది ఈ సంఘ సంస్థలలో నున్నారు. వారు “క్రైస్తవులని, క్రీస్తు సంఘమని” పిలచుకుంటారు, ఆలాటి పేర్లు కలిగియుంటారు. ఆ విధముగా పిలువబడుటలో ఏ అర్థము లేదు. లేదు…వారు రక్షింపబడ్డారని దాని అర్థం కాదు.
ప్రజలు చెప్తారు, “ఇపుడు నీవు దీనికి చెందవలసియున్నది లేక దానికి చెందవలసియుంది, ఒక సంస్థకు, పలానా సంస్థకు చెందవలసియున్నది అని. నీ పేరు మా పుస్తకములో లేనట్లయితే నీవు నశించిపోతావు.” ఇపుడు అది అన్య ఆచారము. చూశారా? అది అన్య ఆచారము. చూశారా?
123 నీవు రక్షించబడు ఒకే ఒక మార్గము, అదేదనగా, “ఇచ్ఛయించువాని వలనైనను లేక పరుగెత్తు వానివలనైనను కాదు…తరువాత, అది కరుణించు దేవుని వలననే జరుగును.” మరియు దేవుడు, ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన మహిమ నిమిత్తము ఒక సంఘమును ముందుగా నిర్ణయించెను. మరియు అదీ రక్షించబడునది. ఔను. నీ యొక్క విశ్వాసము దానిలో ఎంతగానో లంగరు వేయబడినది!
124 నీవు చెప్తావు, “సరే, నా యొక్క విశ్వాసము అక్కడ లంగరు వేయబడినది” యని. చూడు, ఏలాటి జీవితం నీవు జీవిస్తున్నావో. చూశారా, మీరు అక్కడ యుండుటకు యోగ్యులు కారు. మీ లంగరు తప్పు. బండకు బదులుగా ఇసుకపై ఉంచారు. మొట్టమొదటి చిన్న అల దానిని త్రోసివేస్తుంది. ఊఁ హుఁ.
125 దేనిలోనైనా వాక్యము బయలుపడనిమ్ము. “నా యొక్క సంఘము దానిని బోధించుట లేదు!” ఆలాగైతే నీవు బండపైన లంగరు వేయబడలేదని అది చూపుతుంది. నీవు ఇసుకపైనున్నావు. ఊఁ హుఁ. ఔనది నిజం. కాబట్టి ఇపుడు చూడు, ఇపుడు.
మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలమంది, వారు ముందుగా నిర్ణయింపబడినవారా?
126 ఔనండి. వారు ఇశ్రాయేలీయులు, ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయలు.
127 ఆలోచించు. అక్కడ లక్షల లక్షల మంది యుంటారు. ఇపుడు అచట ఎందరున్నారో నాకు తెలియదు; మొత్తము గుంపును నేనూహిస్తున్నాను. అయితే వారందరు రక్షింపబడరు, ఎందుకనగా వారు యూదయలో ఉన్నారు. చూశారా?
ఇపుడక్కడ ఎంతమంది ఉన్నారని మీకు ఏదైనా అభిప్రాయమున్నదా? నాకు తెలియదు. అయితే బహుశా వారు…ఈ హింస వారిపైకి వచ్చినపుడు…వారు కూడుకొనుచున్నారు…మీకు తెలుసా, వారిని గూర్చిన టేపు ఉన్నది నా యొద్ద. దానిని నేను పశ్చిమమునకు వెళ్లినపుడు ఆ—ఆ—ఆ నిబంధన సంఘమునకు…
128 అది పాతది…ఓ, నేను దానిని మరచిపోయాను. అది ప్రారంభించబడినది. వారు ఆఫ్రికాలో అది ఉంచారు. డచ్ సంస్కరణ. అది డచ్ రిఫార్మ్ చర్చి, ఆ నిబంధన యున్నది. ఇపుడు, దానిలో ఎవరైనను మీరు కూర్చున్న యెడల, ఎందుకని నేను మీకు చెప్తాను. మీరు ఇంకా ఆ పాత హీడల్‌బర్గ్ మత బోధలను పట్టుకొనియున్నారు. ఖచ్చితంగా ఆ కారణం చేతనే డచ్ సంస్కరణలో ఉన్నారు. కాబట్టి, మీరు ఒక అమెరికన్ పేరుతో దానికి మెరుగు దిద్దవచ్చును. దాని—దాని వెనుక కార్యము అదే, ’ఎందునగా ఆ మత బోధచేత మీరు బోధింపబడుచున్నారు. ఆ పాత హీడల్ బర్గ్ చేత. అది సరియా, కాదాయని మీ కాపరిని అడగండి. చూశారా? కావున ఇపుడిది గమనించండి.
ఒక లక్ష నలభై నాలుగు వేలమంది పరిశుద్ధాత్మతో ముద్రించబడుటకు వారు ముందుగానే నిర్ణయించబడియున్నారా?
129 ఔనండి. అది ఖచ్చితంగా సరియే. ఔను. ఇపుడు ఇక్కడెవరైనా…ఇపుడు నేను గనుక…
ఒక వేళ మీకు అనుకూలంగా నేను జవాబు ఇవ్వనియెడల…నేను తప్పుగా యుండవచ్చును. చూశారా. అయితే నాకు తెలిసినంత వరకు ఇదియే. మీరు చూశారా, నాకు తెలిసినంత వరకు ఇదియే సరియైనది.
181. సహోదరుడా బ్రెన్‌హాం, సర్పము యొక్క సంతానమును గూర్చి…నీవు ప్రయాసతో ప్రసంగించియుంటివి… (ఓ, దీనిని నేను గమనించనే లేదు. ఇది నా యొద్ద నుండి జారిపోయినది.) ఈ వాదము సర్పము యొక్క సంతానమును గూర్చి, ఈ ప్రశ్న అడుగుట క్రమముగా నుండునా? ఆదికాండము 4:1 నా యొక్క స్నేహితులు వివరించమని నన్ను అడుగుచున్నారు. మరియు నేను చెప్పలేకపోతిని. నీవు నాకు సహాయపడగలవా?
130 ఇది—ఇది మన యొక్క అంశమునకు సంబంధించినది కాదు. అయితే, ఏలాగైనా, ఏలాగైనా దేవుని యొక్క సహాయము వలన నేను—నేను—నేను వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. ఇపుడు మనము దానిని చూద్దాం. నన్ను కొద్దిగా చెప్పనీయండి. అక్కడే ఆమె చెప్పినది అనుకుంటున్నాను. “నేను యెహోవా వలన ఒక మనుష్యుని సంపాదించుకొన్నాను.” నేను—అది అదేనని నేననుకొనుచున్నాను. అది హవ్వ చెప్పిందని నేననుకొంటున్నాను. దానిని నేను పరీక్షించబోవుచున్నాను. నిశ్చయత కొరకు.
131 ఎందుకంటే, ఆ రాత్రి నేను ఏడు…బదులుగా…ఏడు వేలకు బదులు ఏడు వందలు అని చెప్పాను. కాబట్టి అది నన్ను భయభీతున్ని చేసింది. చూడు. మరియు మీరు గమనించవలయును. శత్రువు అన్ని ప్రక్కల ఉంటుంది. మీరు—మీరు దాన్ని గూర్చి మెళకువతో నుండవలయును. ఔనా. ఔను. అంతే.
మరియు ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని—యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.
132 నా సహోదరుడా లేక సహోదరీ, నేను మీ యొక్క ప్రశ్నకు జవాబివ్వబోతున్నాను. మరియు ఇపుడు జ్ఞప్తించుకోండి. కాదు—మీ మీదికి త్రోయుట కాదు. కాదు నేను మీకు సహాయము చేయ ప్రయత్నిస్తున్నాను. చూశారా. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. దానిని గూర్చి విమర్శించు ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను. అయితే ఈ వ్యక్తి విమర్శకుడని నేను అనుకొనుట లేదు. వారన్నారు “నాకు సహాయపడుము” అని అన్నారు. చూశారా, ఎందుకనగా ప్రజలు అది నమ్మారు. అయితే వారిని ఆ ప్రశ్న అడిగిన వారికి, వారు బదులు చెప్పగలుగునట్లు వారికి ఆత్మ ద్వారా ఇంకా దానిని గూర్చి పూర్తిగా నాటబడలేదు.
133 ఇపుడు, ఇక్కడ ఆమె చెప్తుంది ప్రశ్న ఏమిటని, ఏలాటి సందేహము లేదు, వారు చెప్తున్నారు. “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.” అని హవ్వ చెప్పింది.
134 తప్పయినది లేక సరియైనదో జీవము దేవుని యొద్ద నుండి తప్ప మరి ఎక్కడనుండి వచ్చునని మీరు తలస్తున్నారు? ఎవరు—ఇస్కరియోతు యూదాను ఈ లోకమునకు పంపినదెవరు? అది నాకు చెప్పండి.…“నాశనపుత్రుడుగ” అతడు మన మధ్య జన్మించెనని బైబిల్ చెప్తుంది. అది వారిని అడగండి; నిమ్మకాయలో పురుగున్నట్లు వారుంటారు. చూశారా. చూశారా? ఇపుడు మీరు చూడండి, వారు చేయలేదు…అది.
135 గమనించండి. మీరు వారిని ఇంకొంచెముగా చాకచక్యముగా తీసుకొని పోవలెయునంటె చూడండి. హవ్వ ఇక్కడ మాట్లాడినది. ఇక్కడున్న భాషలో మీరు అది తీసుకోవాలంటే అది జ్ఞానులకు వివేకులకును మరుగు చేయబడినది. అది ఏ విధముగా బోధింపబడినది అనగా, హవ్వ దేవుని వలన ఈ కుమారుని పొందియున్నది. మరియు ఆయన ఆత్మయైయున్నాడు, మరియు దానిని ఆయన చేయలేదు. చూశారా? ఇపుడు ఇక్కడ గమనించండి. మీరు అది గమనించగోరితే, “నేను ప్రభువు వలన ఒక—ఒక మనుష్యుని పొందితిని.” చూడండి, అది అర్థ రహితంగా లేదు…అయితే దాని సరియైన అనువాదము యుండవలసియున్నది. ఔను. ఔనండి.…లేదండి, అట్లయిన యెడల, ఆత్మ…
136 మరియు మనమెల్లపుడు, మన తల్లిదండ్రుల స్వభావమును పోలియుంటాము. అది మీకు తెలుసు. ఆ బిడ్డ యొక్క స్వభావమును గమనించండి. సరే. ఆదాము దేవుని కుమారుడు; హవ్వ దేవుని కుమార్తె. దేవుని యొక్క సృష్టిలో, ఎక్కడైనా రవ్వంతైనా చెడు అను కార్యము లేదు. చెడు అసలు తెలియనే తెలియదు.
137 ఆలాగైతే కయీను ఏల ఒక అబద్ధికుడు, హంతకుడు మరన్ని కావలసియున్నది? అదెక్కడ నుండి వచ్చినది? నీకు నీవు ఆ ప్రశ్న అడుగు. అది సర్పము యొక్క సంతానము. చూశారా? బైబిల్ ఆలాగు చెప్పుటలేదా? అతని సంతానమును మొదటి నుండి గమనించండి. అందులో అతడు…
138 ప్రపంచము ఎవరికి సంబంధించినది? దయ్యానికి. ఇపుడు దానినెవరు పరిపాలన చేస్తున్నారు? దయ్యము. ఖచ్చితంగా నిజం. దయ్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అతడు యేసుతో చెప్పాడు. అన్నాడు, “చూడు, అది ఎంత అందంగా ఉన్నదో, దాని మహిమ? నీవు నన్ను ఆరాధిస్తే నేను నీకది ఇస్తాను” అని. చూశారా. దానిని నడిపించువాడు అతడు, అది ఇపుడు అతని ఆధీనములో ఉన్నది.
139 ఇపుడు గమనించు. అతని బిడ్డలు తెలివైనవారు; దయ్యపు బిడ్డలు. లేక కయీను బిడ్డలను తీసుకో. కావలయునంటె, అతని యొక్క వంశావళిని క్రింద నుండి గమనించు. వారిలో ప్రతియొక్కరు చాలా తెలివైనవారు.
140 అయితే అప్పుడు అతడు హేబెలును చంపినపుడు; మరియు దేవుడు అతనికి మరలా షేతును ఇచ్చాడు. చనిపోయిన నీతిమంతులు విమోచించబడినపుడు వారు మరలా లేచుటకు గాను షేతు ఒక మాదిరిగా యుంచబడ్డాడు. మరియు అక్కడ నుండి…ఇపుడు గమనించండి. స్వాభావికముగా మొదటి విత్తనము నుండి కాదు; వారు మరణించారు. ఇపుడు మీ యొక్క మనస్సులు తెరవబడియున్నవా? చూశారా? [సభ “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] స్వాభావికముగా మొదటి సంతానము, అది మామూలుగా మంచిది. అది నవీన సంఘమునకు మాదిరిగా నున్నది, హేబెలు.…వచ్చుచున్న ఆ వరుసను భద్రపరచుటకు, ఆ ఒక్కడు చనిపోయెను ఇంకొకరు లేచుటకు, చూశారా. కాబట్టి అది మరలా తిరిగి జన్మించుటయై యున్నది. అది గ్రహించారా? [“ఆమేన్”] మంచిది. కాబట్టి మీరు దాని గ్రహించారు, చూశారా, చూశారా?
141 పరిపూర్ణ మాదిరిగా అక్కడే మీరున్నారు. కనుక, సహజమైన మానవుడు ఆదాము వలన పుట్టినవాడు, అని తండ్రి ఆ ప్రకృతి విధానమును చూపించుచున్నాడు. అది పనిచేయదు; ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయాలను గ్రహింపడు. కాబట్టి, ప్రకృతి సంబంధమైన మనిషి వచ్చి, తిరిగి పునరుద్ధరణ చేయుటకు చావవలసియుండెను; మరియు హేబెలు మరణములో షేతు అతనికి ప్రతిగానుండుట ద్వారా అది సాదృశ్యముగా చూపబడినది.
142 మరియు గమనించండి. ఆ ప్రజలు ఏ విధముగా యున్నది మరియు ఎటువంటి ఆత్మను అది తీసుకొని వచ్చినది; దీనులు, వ్యవసాయకులు, గొఱ్ఱెలు మేపువారు. ఇక్కడ ప్రపంచము యొక్క జ్ఞానము నుండి ఏమి వచ్చినదో గమనించండి; తెలివైనవారు, కట్టడాలు నిర్మించువారు మరియు—మరియు లోహముల పని చేయువారు మరియు అన్ని విధములుగా తెలివైనవారు మొదలగునవి. చూడు, వారు ఎక్కడ అంతమైనారో, అక్కడ, అక్కడ వారున్నారు. మరియు దేవుడు వారిలో ప్రతియొక్కరిని, వారిలో ప్రతియొక్కరిని నాశనము చేసి దీనులను రక్షించాడు. మత్తయి 5 లో యేసు చెప్పలేదా, “సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు.”
143 కనుక, అఁ, భయపడవద్దు. వారు పాదము పెట్టుటకు స్థలమైనా లేదు. చూశారా? వారు, అది కయీను సంతతియని నమ్ముటలేదు. అయితే, మీరు వినాలనుకుంటే (వినుటకు అది వివరముగా తెలియజేయబడినది.) అది టేపు మీద మనకున్నది. మీరు అది వినవలెనని యున్న, అది విశదముగానున్నది. చూశారా? లేదండి.
144 మరియు విజ్ఞానము దానిని నిరూపించుటకు వారొక కాగితములో అక్కడ వ్రాయించుకొనియుండుట నేను చూశాను. “హవ్వ యాపిల్ పండు తినలేదు, ఆమె ఆప్రికాట్ ను తిన్నది.” చూశారా? ఇపుడు దానిని గూర్చి, ఆ కాగితము ఇంటియొద్దనున్నది. చూడండి. “అది ఆప్రికాట్” ఎంతవరకు—ప్రజలు ఎంతవరకు…అది ప్రకృతి సంబంధమైన మనస్సు, చూశారా.
“అటుతరువాత, మోషే నీళ్లను అసలు దాటలేదు. అతడు రెల్లుపై నడిచాడు; ఇశ్రాయేలును మృత సముద్రము పై భాగమున నడిపించి తీసుకొని వెళ్లాడు. అక్కడ గుత్తిగా రెల్లు ఉండెను. సముద్రమంతా రెల్లుయుండెను. అక్కడ ఒకప్పుడు నీళ్లుండి, తగ్గిపోయెను. మోషే, అడ్డదారి గుండా, ఆ దారిన వెళ్లాడు.” మరియు పారంపర్యాచార సంఘములు దానిని అంగీకరించినవి. అది ఆలాగని.
145 ఓ, మనుష్యుడా, అది సర్పము యొక్క సంతానమని నీవు చూచుటలేదా, ఆ అంత్యక్రీస్తు, మరియు సమస్తమును అక్కడనే యున్నది కదా? నిజం. ఔనండి.
సహోదరుడా బ్రెన్‌హాం, దయచేసి నా చిన్న… (అది యొక ప్రార్థనా విన్నపము; నేను దానిని చూశాను.) ఫ్లూ వ్యాధితోనున్న నా చిన్న మనవని కొరకు ప్రార్థించు. అతడు రివర్‌వ్యూ హోటల్‌లో ఉన్నాడు.
146 ప్రభువైన యేసు, ఈ దీన వ్యక్తి ఇక్కడ ఇది వ్యర్థముగా వ్రాయలేదు. గతరాత్రి ఒక చిన్న బాలుని యొక్క వాత రోగమును నీవు ఉద్దేశ్య పూర్వకముగా తీసివేసిన కార్యమును ఆమె చూచినది. నీవు గొప్ప దేవుడవని ఆమె ఎరిగినది. ఆ చిన్న బాలుని కొరకు మా ప్రార్థనలు అర్పిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో అతడు స్వస్థత నొందుగాక. ఆమేన్.
147 ఒకరు ఏదైనా వ్రాసిన యెడల, అది వ్యర్థము కాదు. వారు—వారు—వారు…అది మనకు ఎంత చిన్నదిగా అగుపించినను, దాని వెనుక ఏదో కార్యమున్నది. మీరు చూశారా; ఆ స్త్రీ, ఆ చిన్న పిల్లవాడు, ఏదో ఒకటియున్నది.
182. యూదులకు బోధించుట కొరకు వచ్చు ఏలీయా, భూమి మీద జీవించిన నిజమైన మనిషియా లేక ఏలీయా ఆత్మ కలిగిన ఇంకొక వ్యక్తియా?
ఇపుడు, అది, నేను—నేను చెప్పుటకు భయపడుచున్నాను. నాకు తెలియదు. దానిని నేను మరలా చదువుతాను.
యూదులకు బోధించుటకు వచ్చు ఏలీయా (ఓ, ఔను) భూమి మీద జీవించిన నిజమైన మనిషియేనా, లేక ఏలీయా ఆత్మ కలిగిన ఇంకొక వ్యక్తియా?
148 ఇపుడు, అది నేను సరిగ్గా జవాబు ఇవ్వగలిగిన యెడల, హనోకును గురించి మీకు చెప్పగలను. అయితే నేను—నేనది చేయలేను. చూశారా. నాకు తెలిసిన ఒకే ఒక విషయము లేఖనము ఏమి చెప్పినదో అదే. మరియు ఇపుడది ఒకవేళ…ఇపుడు, నేను—నేను చెప్పవలయుననిన దీనిని ఈ విధంగా చెప్పనీయండి. మరియు టేపులు వినుచున్న సహోదరులు ఇది గ్రహించగలరు. నేను ఉద్దేశింపబడిన వారి ఆత్మలతో అభిషేకించబడిన మనుష్యులని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా, చూడండి. అతడు చెప్పుచున్నాడు…“ఎలీషా మీద? ఏలీయా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలచియుండలేదా?” చూడండి “ఏలీయా ఆత్మ.” ఏలీయా చేసినట్లే అతడు చేశాడు. ఔనా. కాబట్టి, నేను, నేనైతే…అయితే అది నిజమని నేను చెప్పలేను. నాకు—నాకు తెలియదు. చూశారా. నేను మీతో యథార్థంగా ఉంటాను. నాకు తెలియదు.
183. సహోదరుడా బ్రెన్‌హాం, బాప్తిస్మమును గూర్చి ఈ ప్రశ్నకు దయచేసి నాకు జవాబు ఇవ్వగలవా? మత్తయి 28:19 బోధిస్తుంది, “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని” మరియు పేతురు, అపొస్తలుల కార్యములలో 2:38 లో “ప్రభువైన యేసు నామములో” యని, అపొస్తలుల కార్యములో ఈ మార్పు ఎప్పుడు జరిగెను? ఇపుడు నేను “ప్రభువైన యేసు,” నందు నమ్ముచున్నాను.
149 మంచిది, సహోదరుడో లేక సహోదరియో ఎవరు ఇది వ్రాసియున్నను, అక్కడ ఏలాటి మార్పులేదు. చూడండి. అది…యేసు ఏమి చేయమని చెప్పాడో ఖచ్చితంగా పేతురు దానినే చేశాడు. ఇపుడు, ఒకరు వచ్చి, ఇలా చెప్తే, “తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యను బిరుదులు వాడమని చెప్తే,” పేతురు ఏది చేయవద్దని చెప్పియున్నాడో అది చేయుట మాత్రమే కాదుగాని దేవుడు ఏమి చేయవద్దని చెప్పెనో దానిని చేస్తున్నారు. చూశారా. ఇపుడు, యేసు దానిని చెప్పాడు…
150 మనము—చిన్న ముక్కను తీసుకుందాము. నేను మీకు ఇక్కడ ఒక కార్యము చూపించగోరుచున్నాను. గమనించండి. ఆ వ్యక్తి ఇక్కడ యున్నట్లయితే ఇపుడు గమనించు. నేను ఇక్కడ మూడు ముక్కలను ఉంచబోవుచున్నాను. ఇపుడు చూడు. [సహోదరుడు బ్రెన్‌హాం మూడు వస్తువులను ఉదాహరణగా అక్కడ ఉంచాడు.—సంపా.] ఇది తండ్రి, ఇది కుమారుడు, ఇది పరిశుద్ధాత్మ; త్రిత్వము వారు నమ్ముచున్నట్లుగా అవి మూడును మూడు వేర్వేరు వ్యక్తులు. వారది నమ్ముతారు. చూశారా? మంచిది, ఆ తరువాత, ఇపుడు నేను…
151 అటుతరువాత మత్తయి 28:19 లో, యేసు చెప్పాడు, “మీరు సర్వలోకమునకు వెళ్లి మరియు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన…” కాదు. నన్ను క్షమించండి. నేను ఇపుడు అపొస్తలుల కార్యములు చెప్పుచున్నాను, లేక అపొస్తలుల కార్యములు 2, అని నేననుకుంటాను. కాదు, లూకా 24:49 నేను నిర్వచిస్తున్నాను. ఆయన చెప్పాడు…దానిని నేను చదవనివ్వండి. అప్పుడు నేనది పొందుకున్నాను. చూశారా. తరువాత…’ఎందుకనగా క్రితం దినం నేనది చెప్పాను. నాకు నిశ్చయముగా అది సరియని నాకు తెలియాలి. అక్కడ మీరు ఏమి చెప్పబోవుచున్నారో యను బిరుదులు నాకు తెలియును. అయితే ఆయన ఏమి చెప్పాడో నేను గ్రహించవలెనని మనం 16వ వచనము, 29వ చదువుదాం. “తరువాత పదకొండుమంది భోజన పంక్తిని కూర్చొనియుండగా…”
…పదనొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.
వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని, కొందరు సందేహించిరి.
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది…పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడియున్నది.
152 ఇపుడు, దేవుని యొక్క శక్తి ఎక్కడున్నది? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందున్న సర్వాధికారమును మరియు భూమి మీదనున్న సర్వాధికారమును ఇప్పుడివ్వబడినయెడల ఇపుడు దేవుడు ఎక్కడున్నాడు? అక్కడే ఆయన ఉన్నాడు. చూడండి. అదే మీతో మాట్లాడుచున్నది. సరే.
కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులకు బోధించుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు.
153 ఇపుడు అది త్రిత్వము అవలంభించు వారి యొక్క పరిధి. “నేను నిన్ను తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో పరిశుద్ధాత్మ యొక్క నామములో.” అది పరిశుద్ధ లేఖనములలో కూడా ఆ విధముగా వ్రాయబడి యుండలేదు. చూశారా? ఆయన చెప్పాడు, “తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు…నామమున.” కాదు…ప్రతిదానికి ముందు పేరును పెట్టలేదు. ఒక నామము! ఇక్కడ గమనించండి. “నామములలో బాప్తిస్మము ఇయ్యుడి” అని చెప్పబడలేదు. N-a-m-e ఒక పేరు, “తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కయు.” చూశారా?
154 ఇపుడు నేను అడుగవలెనని ఉన్నాను. “తండ్రి” యనునది ఒక నామమా? [సభ “కాదు” అని చెప్పుచున్నది—సంపా.] “కుమారుడు” ఒక నామమా? [“కాదు”] ఎంతమంది తండ్రులు ఇక్కడ ఉన్నారు? మీలో ఎవరికి “తండ్రి” యని నామము కలదు? ఎంతమంది కుమారులు ఇక్కడున్నారు? ఎంతమంది మానవులు ఇక్కడున్నారు? చూశారా? సరే. మీలో ఎవరు “తండ్రి” “కుమారుడు” లేక “మానవుడు” యను నామమును కలిగియున్నారు? చూశారా?
155 ఒకప్పుడు ఒక స్త్రీ అన్నట్లు, ఆమె అడిగినది, “సహోదరుడా బ్రెన్‌హాం, ‘పరిశుద్ధాత్మ’ ఒక నామము. అది ఒక వ్యక్తి.”
156 నేను చెప్పాను, “ఔనండి. నేనొక వ్యక్తిని. అయితే నా నామము ‘వ్యక్తి’ కాదు, నేనొక వ్యక్తిని. చూశారా, నా నామము విలియం బ్రెన్‌హాం; అయితే నేనొక వ్యక్తిని.”
పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. అది అదే. అది నామము కాదు; దేవుడను వ్యక్తి యొక్క బిరుదు. చూశారా. అది దేవుని వ్యక్తిత్వము యొక్క బిరుదు, ఆయన ఏమైయున్నది అని. ఇపుడు—ఇపుడు…
157 ఆయన చెప్పాడు, “మీరు వెళ్లి, సమస్త జనులకు బోధించి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు.” “తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో” కాదు. లేక “తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో” కాదు. అయితే “తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో.” మరియు “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ” నామము కాదు. ఆలాగైతే అదేంటి?
158 అది “నామము” యైనట్లయితే, సరే. ఏదది? ఒక దానిని నీవు నామము అనిన యెడల అది ఏ నామము? బిరుదును ఒక నామమని పిలచిన యెడల, అయితే ఏ నామము, ఏ బిరుదుతో బాప్తిస్మము ఇవ్వగోరుచున్నారు “తండ్రా” లేక “కుమారుడా?” అది ఏకవచనము, ఔనా.
ఇపుడు, ఇక్కడకు త్రిప్పుదాము—లో…మరియు అది మత్తయి చివరి పుస్తకము.
159 దానిని నేను ఎల్లపుడు వివరించు విధముగా. మీరు ఒక ప్రేమ కథను చదివినట్లయితే మరియు చెప్పబడుతుంది, “యోహాను మరియు మరియ సుఖముగా జీవించారు.” చూశారా, అదెందుకనగా మీకు తెలియదు—ఎవరు యోహాను, మరియలో మీకు తెలియదు. మీ కథ యొక్క ఆరంభమునకు వెళ్లుడి. యోహాను ఎవరో మరియ ఎవరో కనుగొనండి. చూశారా?
160 ఇపుడు, మత్తయిలో అదే మీరు చేస్తుంది. దాని యొక్క చివరి భాగాన్ని మాత్రమే మీరు చదువుచున్నారు. మత్తయి మొదటికి వెళ్లండి, కథ ఏంటో చదవండి. అది మత్తయి ఆఖరి అధ్యాయము, ఆఖరి వచనాలు.
161 ఒక విధంగా నీవు ఒక పుస్తకమును తీసుకొని, “యోహాను మరియలు ఆనందంగా జీవించారు. అది జాన్‌జోన్స్ మరియు మేరీ తదితరులు? అది…? కాదు, అది జాన్…? అది జాన్ హెన్రీ మరియు పలానా పలానా? ఇది ఎవరో జాన్ మరియు పలానా పలానా?” కాదు, ఇంకా నీకు తెలియదు. ఔనా. చేయవలసిన ఒకే విషయం ఏదనగా, నిజం తెలుసుకోవాలి, పుస్తకంలోకి వెళ్లి చదవాలి. చూశారా, మీరు ఒక ముక్కను మాత్రము ఇక్కడ తీసుకోలేరు. మీరు సరైన చిత్రమును తయారు చేయవలయుననిన సమస్తమును ఒక్కటిగా పెట్టవలెను.
162 ఇపుడు, మత్తయి మొదటి అధ్యాయమునకు వెళ్లుడి. మొదటి అధ్యాయం క్రిందకు వస్తున్నపుడు వంశావళిని అది తెలియపరుస్తుంది. తరువాత అది 18వ వచనమునకు వచ్చునప్పటికి చెప్తుంది, “ఇపుడు యేసుక్రీస్తు జనన విధమెట్లనగా” అది సరియేనా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది—సంపా.]
163 ఇపుడొకటి మిమ్ము అడుగుతాను. ఇపుడు మరలా వినండి. మీరు, మీరు అది పిలువండి. [సహోదరుడు బ్రెన్‌హాం మూడు వస్తువులను చూపించుచు ఒక ఉదాహరణగా—సంపా.] ఇది ఎవరు? దేవుడు. [సభ, “తండ్రి” అని చెప్పెను.] దేవుడు…[“కుమారుడు”] దేవుడు…[“పరిశుద్ధాత్మ”] ఇప్పుడు ఇది ఎవరు? [“తండ్రి”] ఇది ఎవరు? [“పరిశుద్ధాత్మ”] ఇది ఎవరు? [“కుమారుడు”] కుమారుడు. సరే. ఇపుడు మనమది పొందుకున్నాము.…ఇపుడు ఇది ఏమని చెప్తున్నారు; దేవుడగు ఎవరు? [“పరిశుద్ధాత్మ”] పరిశుద్ధాత్మ. సరే. ఇపుడు మంచిది.
యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె…వలన గర్భవతిగా ఉండెను.
164 [“పరిశుద్ధాత్మ” వలన యని సభ చెప్పుచున్నది—సంపా.] ఇపుడు, దేవుడు ఆయన యొక్క తండ్రియని మీరు చెప్పారనుకుంటాను. ఇపుడక్కడ ఏదో తప్పుయున్నది; ఆయన ఇద్దరు తండ్రులను కలిగియుండలేడు. అది మీకు తెలుసా. ఔనా? ఇపుడు అక్కడ తప్పు ఉన్నది. అక్కడ ముగ్గురు వ్యక్తులైతే వీరిలో ఏ మనుష్యులు, వారిలో ఎవరు ఆయన తండ్రియై యుంటాడు? బైబిల్ ఇక్కడ విశదంగా చెప్తుంది, “ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను,” అని. తండ్రియైన దేవునితో ఆ కార్యమునకు ఏలాటి సంబంధం లేదు. మరియు యేసు చెప్పాడు దేవుడు ఆయన తండ్రియని. దేవుడు ఆయన తండ్రియని మనకు తెలుసు. ఆలాగైతే ఆయనకు ఇద్దరు తండ్రులున్నారు; ఇపుడు ఆయన అక్రమ సంతానము, నిశ్చయంగా. ఇపుడు చూడండి మిమ్ములను మీరు ఎక్కడకు తెచ్చుకున్నారో? ఇపుడు:
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి…ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా,…
165 జ్ఞప్తించుకోండి, అతడొక మంచి మనిషి, ఇపుడు. మరియు ఇపుడున్న విధముగా ప్రభువు యొక్క హస్తము; ముందుగా నిర్ణయించబడినవారు ఎవరో వారు దానిని పట్టుకుంటారు. చూశారా?
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై…
…మీరు మీ బైబిల్‌ను చూచుచున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది—సంపా.] మంచిది.
దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము…ఆమె గర్భము ధరించినది…
166 “దేవుడు తండ్రియా?” నేను తప్పుగా చదివానా? [సభ “అవును” అని చెప్పింది—సంపా.] ఔను. తప్పక. “అది ఆమెలో గర్భము ధరించినది.” తండ్రియైన దేవునితో సంబంధం లేదు, అది “పరిశుద్ధాత్మ.” మరియు ఇపుడు దేవుడు ఆయన యొక్క తండ్రి అని మనకు తెలుసు. ఔనా? [“ఆమేన్”] కాబట్టి అదేంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ. ఇపుడు మీరు అది గ్రహించారా. చూశారా?
167 తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి. లేనట్లయితే ఆయనకు ఇద్దరు తండ్రులు ఉంటారు. అలాటపుడు ఏ రకపు వ్యక్తిని నీవు ఆరాధన చేస్తున్నావు? ఇపుడు ఏలాటి దేవుని నీవు కలిగియున్నావు? చూశారా? చూశారా? పరిశుద్ధాత్మయగు దేవుడు, తండ్రియైన దేవుడు ఒక్క ఆత్మయే.
మరియు ఆమె ఒక కుమారుని కనును… (ఈ వ్యక్తి ఇక్కడ)…ఆయనకు పేరు పెట్టుదువు…
ఏంటది? [సభ “యేసు” అని చెప్పెను—సంపా.] “ఆయన పేరు!” [“యేసు.”] ఇపుడు జ్ఞప్తించుకోండి.
…ఆయన పేరు యేసు: తన ప్రజలను…వారి పాపముల నుండి ఆయన రక్షించును.
అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు అదంతయు జరిగెను.
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును…ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
168 దేవుని పేరేంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క పేరేంటి? [సభ “యేసు” అని చెప్తుంది—సంపా.] “యేసు” అనునది ఆయన నామమని బైబిల్ చెప్తుంది.
తరువాత ఇక్కడున్న వ్యక్తి దానిని గూర్చి వాదించుటకు ప్రయత్నించుచు ఇక్కడ మందిరములో చెప్పాడు, “సహోదరుడు బ్రెన్‌హాం, వారిది తప్పు అని చెప్పాడు. అయితే దేనిని అతడేమి చేయలేడు.” అన్నాడు, “ఇక్కడ అది మూడు వేర్వేరు వ్యక్తులను చూపుతుంది. ఖచ్చితంగా పరిపూర్ణంగా.” చెప్పాడు, “మత్తయి 3వ అధ్యాయము! ఇక్కడ యోహాను నిలబడి బోధిస్తున్నాడు; ఇక్కడ బాప్తిస్మము పొందుటకు కుమారుడు నడచి వస్తున్నాడు, ఆయన నీటిలోకి వెళ్లి యోహాను ద్వారా బాప్తిస్మము పొందాడు. ఆయన నీటిలో నుండి పైకి వచ్చాడు. మరియు ‘ఇదిగో,’ ‘ఆకాశములు ఆయన కొరకు తెరవబడెను.’ మరియు చెప్పబడినది, ‘ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చెను. ఆకాశము నుండి ఒక స్వరము పలికెను. “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు…”’ మూడు ప్రత్యేకమైన వ్యక్తులు ఒకే సమయములో” ఓ, మై!
169 ఆ. అది దేనిని చూపించుచున్నదనగా బాప్తిస్మము పొందనివారు మరియు వాక్య పరిచర్యకు పిలవబడనివారు, వేదిక యొద్ద నుండుటకు అనుమతిలేదు. అవును.
నేను—నేను—నేను దేవుని సహాయము వలన ఆ వ్యక్తిని తీసుకొని అతని తల తిరుగున్నట్లు అన్నిటిని ఒక ముడివలె బిగించవచ్చును. చూడూ, అదేదైనది నాకు లెక్కలేదు…
“నేనని” కాదు నా అర్థం. అది సరిగా లేదు. నన్ను క్షమించండి. అదని కాదు నా అర్థం, ప్రభువా నేను కాదు. దానిని గూర్చి ఆయన నన్ను ఆటంక పరచాడు, ఆ విధముగా చెప్పుటయనికాదు నా భావము. నన్ను—నన్ను క్షమించండి. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ఒక రహస్యమును బయలుపరచునని నేను నమ్ముచున్నాను. అది మంచిగా అర్థమిస్తుంది. ఉమ్.
170 మీరు తప్పు చేసినపుడు, అది యొక సాధనమును సరిగా శృతి చేయుట వంటిది. ఒక క్రైస్తవునిగా నీవది చెప్తావు, నీవు ఒక తప్పు చెప్పావు. దానిని ఆయన ఇష్టపడడు. చూశారా. అది నన్ను అక్కడ పెట్టుచున్నది. చూశారా? నేనా దృశ్యములో ఉండనేలేదు. నేను…నేను నా యొక్క స్వంతంగా ఏదీ చెప్పుటకు కోరుకొనుట లేదు. ఆయనే, పని ఆయన చేయనీయ్. ఆయన పలుకనీయ్. బూర తనంతట తానే పలుకదు; దాని వెనకాల శబ్దమున్నది, శబ్దాన్ని ఇచ్చేది అది.
171 ఇపుడు, ఇక్కడ చూడండి. వాక్యానికి తప్పుడు అనువాదము చెప్పాడు ఆ మనుష్యుడు. చూడూ, అది…గుర్తుంచుకో, “జ్ఞానులకు వివేకులకు అది మరుగు చేయబడింది; పసిపిల్లలకు బయలుపరచబడింది.”
ఇపుడు, ఇక్కడ ఆ వ్యక్తి, యేసుక్రీస్తు, భూమి మీద నిలబడియున్నాడు. ఇపుడు ఆకాశములు; అక్కడ పైన వాతావరణము ఉన్నది. ఇపుడు గమనించండి, “మరియు యోహాను దీనికి సాక్షిగా ఉన్నాడు…”
172 ఆ మనుష్యుడు చెప్పవలసియున్నది “ఇక్కడ తండ్రియైన దేవుడున్నాడు; మరియు ఇక్కడ పావురము వలె పరిశుద్ధాత్మయైన దేవుడున్నాడు; మరియు ఇక్కడ కుమారుడైన దేవుడున్నాడు; ముగ్గురు వ్యక్తులను చేస్తూ.” అది తప్పు.
173 యోహాను ఇక్కడ వెనుక నిలబడియున్నాడు, ఇది దేవుని గొఱ్ఱెపిల్ల యని ఎరిగియున్నడు. యోహాను అన్నాడు, “దేవుని యొక్క ఆత్మ ఒక గొఱ్ఱెపిల్ల వలె నుండుట చూశానని నేను సాక్ష్యమిచ్చుచున్నాను…” అక్కడ దేవుని ఆత్మ పావురము వలె యున్నది, నా అర్థము. ఇపుడు, ఆరోజు రాత్రి అదే విషయమును నేను చెప్పాను. మీరు చూశారు; ఏడు వందలకు బదులుగా…చూశారా? దేవుని యొక్క ఆత్మ! ఇక్కడ ఇది గొఱ్ఱెపిల్ల. మరియు దేవుని యొక్క ఆత్మ, పావురము, దేవుడైయుండెను. “దేవుని యొక్క ఆత్మ ఆకాశము నుండి దిగివచ్చుచున్నది. మరియు ఆకాశము నుండి ఒక స్వరము చెప్పుచున్నది. ‘ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను.’”
“పరలోకమున మరియు భూలోకములోన సమస్త అధికారములు నా చేతికి ఇవ్వబడినవి.” చూశారా? చూశారా? చూశారా? అది ఆయన. ఇపుడు ఆయన పేరేంటి? [సభ “యేసు” అని చెప్పినది—సంపా.] ఖచ్చితంగా. చూశారా?
174 కాబట్టి, ముగ్గురు దేవుళ్లున్నారను త్రిత్వవాదుల సిద్ధాంతము ప్రకారముగా అది అన్యత్వము! బైబిల్ గ్రంథములో అదెన్నడు బోధింపబడలేదు. సింహపు వర్తమానములో అది బోధింపబడలేదు, అయితే తరువాత అది చేర్చుకొనబడెను. అది అంత్యక్రీస్తు. మీరు కోరిన ఎవరినైనా అడగండి, ఏ వేదాంతినైనా అడగండి. అదెన్నడు రాలేదు. నీకొలాయితుల బోధ ద్వారా తప్ప. కావున అది మార్టిన్ లూథర్‌తో వచ్చినది. ఆ కారణము చేతనే అది జాన్‌వెస్లీతో కొనసాగినది; పెంతెకొస్తు వారి పైనను క్రుమ్మరించబడింది.
175 పెంతెకొస్తు బయటకు వచ్చిన దినమున వారు “యేసు మాత్రమే” అను గుంపును కలిగియుండిరి. ఇపుడు మరలా అది తప్పు. యేసు ఏ విధముగా తనకుతానే తండ్రి కాగలడు. చూశారా, ఆ విధమైనది కొట్టివేయబడింది.
176 అయితే పక్షిరాజు కాలము ఒకటి రాబోవుచున్నది. చూశారా? ఆ కాలములో ఈ కార్యములన్నియు తేటపరచబడి బయలుపరచబడును. చూశారా?
177 “తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ” ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బిరుదులు. ఆ మూడింటిని గమనించండి! మత్తయి చెప్పాడు, “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యని.” పేతురు చెప్పాడు, “ప్రభువైన యేసుక్రీస్తు” యని. ఎవరు తండ్రి? “ప్రభువు నా ప్రభువుతో చెప్పెను ‘నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని.’” ఔనది నిజమేనా? తండ్రి, కుమారుడు, యేసు; పరిశుద్ధాత్మ, దేవుని నుండి బయలువెడలిన లోగాస్. “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ” దేవుడగు వ్యక్తి యొక్క మూడు ఖచ్చితమైన బిరుదులు, మూడు విధములుగా బయలుపడుచున్నవి. లేక ఆయన యొక్క మూడు లక్షణాలు.
178 ఎవరైతే అర్థం చేసుకోరో వారికి గ్రాహ్యమగునట్లు, అది ఒకే దేవుని యొక్క మూడు కార్య నిర్వహణలు. వాస్తవముగా అది ఒకే దేవుని యొక్క మూడు గుణ లక్షణాలు. దేవుడు, మూడు వేరు వేరు విధముగా కార్యాలు జరిగిస్తున్నాడు; పితృత్వము ద్వారా, కుమారత్వము ద్వారా, పరిశుద్ధాత్మ గృహనిర్వాహకత్వము ద్వారా. దేవుడు మూడులో సంపూర్ణుడు. అంత్యక్రీస్తు సంఖ్య మీకు జ్ఞప్తియుందా, నాలుగు? ఔనా?, “తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ” ఖచ్చితంగా “ప్రభువైన యేసుక్రీస్తు” యై యున్నది.
179 మీరు “యేసు” నామమున బాప్తిస్మము తీసుకున్నట్లయితే, అది తప్పు. “యేసు నామమున మాత్రమే బాప్తిస్మము తీసుకున్నట్లయితే,” అది ఖచ్చితంగా తప్పు. నేను చాలామంది యేసులతో పరిచయము కలిగియున్నాను. లాటిన్ దేశాలలో నిండుగా యేసులున్నారు.
180 ఈయనైతే “ప్రభువైన యేసుక్రీస్తు” ఆయనెవరైనది ఖచ్చితంగా చెప్పుచున్నది.
181 చాలామంది బ్రెన్‌హాంలు యున్నారు, నన్ను గూర్చి వ్యక్తిగతంగా మాట్లాడవలయునంటె, అయితే నేను—నేనొకడను మాత్రమే విలియం మారియన్ బ్రెన్‌హాంను. అది—అది నేను. అయితే చాలామంది విలియం బ్రెన్‌హాంలు ఉన్నారు. ఆ విధముగా, అన్నిచోట్ల.
182 అయితే, ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలచుటయైయున్నది, ప్రభువైన యేసుక్రీస్తు. చూశారా. అభిషేకించబడిన ఒకడు. అక్కడ వారిలో ఒక్కడే ఉన్నాడు. ఔను.
కాబట్టి, దాన్ని గూర్చి ఇంకా ఏదైనా యున్నట్లయితే నాకు ఒక ఉత్తరము వ్రాయండి లేక ఏదైనా వ్రాయండి. లేక నేనితర ప్రశ్నలు చూడవలెను, నేను వీటిని త్వరగా చూడవలెను. బాధతో నున్న ఈ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను.
184. సహోదరుడా బ్రెన్‌హాం, ఈ ప్రశ్న సరికానిచో—సరికాని యెడల…జవాబు ఇవ్వవద్దు. (అది మంచిది, నేనది అభినందిస్తున్నాను.) ఏ బిడ్డలు—ఏ బిడ్డలు ఎత్తబడుటలో వెళ్తారు, ఏ చిన్న బిడ్డలైనను ఎత్తబడతారా? మీకు ధన్యవాదాలు.
వారి పేరును వారిక్కడ వ్రాయలేదు. ఇపుడు మీరు వ్రాయని యెడల అది అవసరము లేదు.
183 అయితే, చూడూ. జగత్తుకు పునాదికి మునుపే గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు దేవుడు పేరు ఉంచినపుడు దానిని తుడిపి వేయుటకు ప్రపంచములో ఏదియు లేదు. ఎందుకనగా అది క్రీస్తు రక్తము అను సిరా ద్వారా వ్రాయబడినది. అది పెద్దదిగానున్నను, అంత పెద్దదిగానున్నను, లేక అంత పెద్దదిగానున్నను, లేక ఏదైనున్నప్పటికి, అది ఆ విధముగానే ఉండును. చూశారా? బిడ్డలందరు, సంఘమంతయును, అక్కడున్న అంతా…దేవుని యొక్క ముందు జ్ఞానము వలన జరుగును.
184 ఇపుడు, మనకు తెలియదు. మీరు అడగవచ్చు, “సహోదరుడా బ్రెన్‌హాం, నీవక్కడ యున్నావని రుజువు చేయగలవా?” లేదండి. నేనది రుజువు చేయలేను. దేవుడు నన్నొక సాధనముగా లేక దేనిగానైననుఉపయోగించుకొనును. మరియు మిమ్ములను ఉపయోగించుకొనును. అయితే నేను నమ్ముతున్నాను విశ్వాసమును బట్టి నేను రక్షింపబడ్డాను. జ్ఞానము ద్వారా నేను రక్షించబడలేదు; విశ్వాసమును బట్టి. ఆ విధముగా నీవు రక్షించబడతావు. ఆలాగున మనమందరము రక్షించబడతాము.
185 అయితే, జ్ఞప్తించుకో, దేవుడు అనంతుడు. మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పింది. సంపా.] అనంతుడు! సరే, అనంతుడైయుండి…మరియు, తరువాత, ఆయన సర్వజ్ఞాని. మీరది నమ్ముతున్నారా? [“ఆమేన్”] సర్వజ్ఞాని యనగా అర్థం “ఆయనకు అన్నియు తెలుసు.” ఆయన కాలేడు—ఆయన అనంతుడు కాకుండా సర్వజ్ఞాని కాలేడు. చూశారా, ఆయనకు తెలియకుండా ఏదియు లేదు. భూమి మీదనున్న ప్రతి ఈగను ఆయన ఎరిగియున్నాడు. మరియు ఎన్నిసార్లు అది తన రెప్పను కొట్టునో మరియు ఎంత కొవ్వును తయారు చేయునో, అవన్నియు కలసి ఎంత తయారు చేయునో ఆయన ఎరిగియున్నాడు. నీవు గాలి పీల్చు ప్రతి శ్వాసను, నీ ఊపిరితిత్తులలో అది ఎంతగా వెళ్లునది ఆయనకు తెలుసు. అదీ అనంతుడనగా.
186 ఆయన అనంతుడైతే, అది ఆయనను సర్వజ్ఞానిగా చేయుచున్నది. ఔనా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది—సంపా.] మరియు ఆయన సర్వజ్ఞానియైతే, ఆయనను అది సర్వాంతర్యామిగా చేయుచున్నది. ఎందుకనగా ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఆ నిముషము, ఆ గంట, ఆ సమయము, ఆ సెకండును యాభై అయిదు వేలుగా భావించిన మరి ఆ సమయమున ఏమి జరుగునని ఆయన చెప్పును. చూశారా? ఇపుడు ఉద్దేశమును గ్రహించారా? [“ఆమేన్”] ఆలాగైతే, ఆయనకు అన్నీ తెలుసు. మరియు ఆ కారణము చేత ఆయనకు సర్వాధికారమున్నది, అన్ని విషయాలు తెలుసు మరియు అన్ని చేయగలడు.
187 ఇపుడు మనము చూద్దాం. “మరియు పిల్లలందరు…దేవుడు, అందరు…వారు…” ఇపుడు జ్ఞప్తించు యేసు…బైబిల్ చెప్తుంది…
188 ఇపుడు, సుమారు క్రీ.శ. 30 లో యేసు చంపబడ్డాడని మనకు తెలుసు. ఔనా? సుమారు అది సుమారు, సంవత్సరము యొక్క మధ్యలో క్రీ.శ. 30.
189 ఇపుడు, బైబిల్ చెప్తుంది, లోకము సృజింపబడక ముందే ఆయన చంపబడెను. మరియు నీ యొక్క పేరు…ఈ గ్రంథమును విమోచించుటకు గొఱ్ఱెపిల్ల వధింపబడినపుడు…ఇక్కడొక గొప్ప విషయముంది. అది ఉత్తేజాన్ని కలిగించవచ్చు. చూడూ, అపుడు—అపుడు—గొఱ్ఱెపిల్ల, అపుడు…ఇపుడు జ్ఞప్తించుకోండి, బైబిల్ చెప్తుంది, భూమికి పునాది వేయబడక మునుపే గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథము వ్రాయబడియున్నది యని. గ్రంథమందు వ్రాయబడిన ప్రతిపేరును విమోచించుటకై, లోకము పునాది వేయబడకమునుపే గొఱ్ఱెపిల్ల వధింపబడెను మరియు నీ పేరు పెట్టబడియుండెను. చూశారా? ఇపుడు మీకు అర్థమైందా?
190 చూశారా. అక్కడ ఏదియు క్రమము లేకుండా లేదు. అది దేవుని యొక్క పెద్ద గడియారము ప్రకారముగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక గడియారము చుట్టు తిరుగుచున్నట్లున్నది. ఆ గ్రంథములోనున్న దానిని విమోచించుటకు గొఱ్ఱెపిల్ల వధింపబడినపుడే జగత్తుకు పునాది వేయబడక మునుపే నీ యొక్క పేరు అందులో యున్నది. ఆయన విమోచనా హక్కును పొందుకొనుటకు ఆ గ్రంథమును తీసుకొనుటకు ఆయన ముందుకు వచ్చుచున్నాడు.
నేనక్కడ దానిని ప్రారంభించలేను; ఈరోజు మనము ఇంకొక ప్రశ్నకు జవాబు ఇవ్వలేము. సరే. ప్రశ్న:
185. నరకము మరియు గంధకముతో మండు అగ్నిగుండము ఒకటేనా?
191 కాదు. నరకము, బైబిల్ గ్రంథములో అనువాదము, నేనకుంటాను…ఇపుడు ఇక్కడ పండితులు కూర్చున్నారు, అది నేను గౌరవించవలసియున్నది. మన సహోదరుడు ఐవర్‌సన్ ఇక్కడ కూర్చున్నాడు, మరియు సహోదరుడు వైల్, ఇంకా చాలామంది సహోదరులు నిజంగా వేదాంత పండితులున్నారు. తర్జుమా చేయబడిన పదము హేడ్స్ అనగా “సమాధి.” ఔనా? సమాధికి గ్రీకు పదము. అయితే అగ్నిగుండము అనునది వేరే మాట. ఎందుకనగా, ప్రకటనలో, “హేడ్ మరియు అందరు, అగ్నిగుండములో పడద్రోయబడెదరు.” చూశారా? సరే. ఇపుడు మనము చూద్దాం.
186. ఆ విధముగా కానియెడల, అగ్నిగుండము, నరకము నిత్యమైనదా?
192 కాదండి. కాదండి. సృష్టింపబడిన యేదియు నిత్యమైనది కాదు. కాదు. సృజింపబడిన దేదైనను…ఆ కారణము చేత నిత్య నరకము యుండదు. మీరు నిత్య నరకములో కాల్చబడ బోతున్నారని చెప్పినయెడల, దానికి లేఖనము నాకు కావాలి, అక్కడ అటువంటిది లేదు.
193 అపవాది కొరకు మరియు అతని దూతల కొరకు, అంత్యక్రీస్తు కొరకు అతని జనుల కొరకు సృజించబడినది; అది దయ్యము, అవతారమెత్తిన దయ్యము. అది నశింపబడుటకు సృజింపబడినది. మరియు ఏదైనను…ఏదైనను…
194 అక్కడున్న ప్రతిదానిలో, ప్రపంచమంతటిలో, నిత్యత్వము గల ఒకటే ఒకటి యున్నది. అది దేవుడు. ఒక అణువు లేకముందు లేక ఎలక్రాన్స్ లేకమునుపు, సూర్య వెలుగు లేకమునుపు, ఎలక్ట్రాన్స్ మరియేది లేకమునుపు ఆయన దేవుడైయుండెను. ఆయన సృష్టికర్త.
195 నిత్యునిగా యుండుటకు, అనగా నిత్యజీవమును కలిగియుండుటకు ఒకే యొక మార్గము కలదు. అక్కడున్నది గ్రీకు పదమని అనుకుంటున్నాను, అది జోయీ. అది సరియేనా? జోయీ. జోయీ. మరియు అటుతరువాత ఆ—ఆ జీవము, దేవుడు మీకిచ్చును. ఒక తల్లిదండ్రుల వివాహము వలన వారిరువురు ఏకమౌట వలన నీ యొక్క తండ్రి ద్వారా నీకు జీవము నిచ్చునట్లున్నది. ఒక కుమారునికి జీవమిచ్చుటలో ఆనందమున్నది. [గ్రహించండి.] ఆ విధముగా దేవుడు చేయును. ఆయన యొక్క జీవము కుమారునికి ఇచ్చుట ద్వారా కలుగు ఆనందమున్నది. చూశారా? మరియు, అప్పుడు నీవు ఆయనలో భాగమౌతావు. అది జోయీ. దేవుని స్వంత ప్రాణము. “నేను వారికి నిత్యజీవము…అనుగ్రహింతును.”
196 “చివరి దినములో వారిని లేపెదను.” అదొక్కటే కార్యము. ఆ—ఆ…నీవు నిత్యజీవాన్ని కలిగియున్నావు. మరియు ఆ నిత్యజీవము తన యొక్క శరీరమును ఎరుగును, మరియు అది ముందుకు రావలయును. అది…అది అక్కడుండుట అసాధ్యము. క్రీస్తు యొక్క ఆత్మ శరీరమును ఆవరించియున్నట్లుగా, ఆ గొప్ప దినమున దేవుని యొక్క ఆత్మ క్రీస్తుపై, అది తిరిగి లేచునని దానికి తెలియును, ఆ విధముగానే పరిశుద్ధులు కూడా తమ శరీరమందు లేస్తారు.
197 ఇపుడు జ్ఞప్తించుకోండి. యేసు, ఆయన చనిపోయినపుడు, ఆయన పాతాళమునకు వెళ్లెను. కారణం, ఆయన అక్కడకు వెళ్లవలసియున్నది; ఆయన పాపమునకు అడ్డుగా యుండెను. “మరియు దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినపుడు పూర్వము నోవహు దినాలలో మారుమనస్సు నొందని ఆత్మలు పాతాళములో నున్నపుడు ఆత్మలకు ఆయన బోధించెను.” ఔనది నిజమేనా? మరియు ఆయన పాతాళమునకు వెళ్లి దేవుని నుండి దూరముగా తొలగిపోయిన ఆత్మలకు ఆయన బోధించెను. మరణము అనగా “ఎడబాటు.” వారు దేవునికి వేరైపోయిరి, ఇక ఎన్నడును వెనుకకురారు. మరియు యేసు, స్త్రీ సంతానము ద్వారా వచ్చునని పలుకబడినవాడు ఆయనేయని సాక్ష్యమిచ్చుటకు అక్కడకు వెళ్లెను.
198 సర్పము యొక్క సంతానము, సర్పము యొక్క సంతానము ఏమి చేసినదో చూశారా? అంత్యక్రీస్తు; మరణముతో వాని అంతము ముగిసిపోయెను, ఎడబాటు, ఎర్రని గుర్రము. స్త్రీ యొక్క సంతానము, జీవము, తెల్లని గుర్రం మీద అంతమగును, యేసుక్రీస్తు. చూశారా? అదేంటి? ఒకదానికి ఒకటి విరుద్ధం; సర్పసంతానము స్త్రీ సంతానమునకు విరుద్ధం. మీకు అర్థమైందా? ఓ మనము దానిపై కొద్దిసేపు ధ్యానించవచ్చును. అది బాగుండును కదూ? అయితే దీనిమీద ఉందాము.
187. సహోదరుడా బ్రెన్‌హాం, మొదటి ముద్రలో మొదటి గుర్రమును స్వారీ చేయువాడు రెండవ థెస్సలోనీకయులకులో “పాపపురుషుడు బయలుపడుటను,” నెరవేర్చుచున్నదా?
199 ఔను. అది నిజము. అది నెరవేర్చుచున్నది. అది సులభము. అది నెరవేర్చుచున్నది. అతడే పాపపురుషుడు. ఈ ఒకే వ్యక్తి దశలు మార్చుచు గుర్రముల మీద బయలువెళ్లుచు చివరిగా పాండుర వర్ణ గుర్రము మీద ఎక్కి స్వారీ చేశాడు. దాని పేరు “మృత్యువు.” క్రీస్తు కూడా ముందుకు వచ్చుచున్నాడు. నీతీకరణ, శుద్ధీకరణ, ఆ విధముగా తెల్లని గుర్రం వరకు వచ్చెను. మరియు జీవము నిచ్చుటకు వచ్చాడు. చూడండి.
188. క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెలో లేకుండా పలు విధములైన సంఘశాఖలలోనున్న తిరిగి జన్మించిన విశ్వాసులకు ఏమి సంభవించెను? వారికి ఏమి సంభవింపనైయున్నది?
200 సరే, కొద్దిసేపటి క్రితం, మనం దానిని వివరించామని అనుకుంటున్నాను. ఔనా? వారు శ్రమలోనికి వెళ్తారు. శ్రమకాలంలో వారు హతసాక్షులౌతారు. వెయ్యేండ్ల పరిపాలన తరువాత వారు తీర్పు కొరకు చివరిగా వస్తారు. చూశారా? ఎందుకనగా, బైబిల్ చెప్తుంది, మిగతా సజీవులు…“ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు మిగిలిన మృతులు బ్రతుక లేదు.” ఆ తరువాత ఒక పునరుత్థానముండును, తరువాత నీతిమంతులును, అనీతిమంతులును వచ్చెదరు, మరియు వారు క్రీస్తు మరియు పెండ్లికుమార్తె ద్వారా తీర్పు చేయబడతారు. ఆయన భూమిమీదికి, పదివేలకొలది పదివేలకొలది పరిశుద్ధులతో వచ్చెను. ఔనది వాస్తవమా? ఆయన పెండ్లికుమార్తె.
201 తీర్పు ప్రారంభమైనది. గ్రంథములు తెరువబడెను. గ్రంథములు తెరువబడెను. మరియు వేరొక గ్రంథము తెరువబడెను, అది జీవగ్రంథము. అక్కడ నుండి ఆయన గొర్రెల నుండి మేకలను వేరుచేసెను. ఔనా? దానికి పెండ్లికుమార్తెకు ఏ సంబంధము లేదు. ఆమె అక్కడ తీర్పులో నిలబడియుండును…రాణి మరియు రాజు కలసి ఒక్కటిగా అక్కడయుంటారు. “ఆయన తన పరిశుద్ధులతో వచ్చును; పదివేలకొలది పదివేలమంది ఆయనకు పరిచర్య చేస్తారు,” ఆయన భార్య. తరువాత తీర్పు ప్రారంభమగును, మరియు తరువాత గొర్రెల నుండి మేకలు వేరుపరచబడును. ఆరోజు రాత్రి నేను ఆ చిన్న ధ్యాన మాలికను మీకు అందించాను, గుర్తుంది, కనుక అది మీరు గ్రహిస్తారు, ఆవుల కాపరి ధ్యానమాలిక. చూశారా, మీరది అర్థం చేసుకొనియుంటారు.
202 లేదు. వారు, ఆ—ఆ—సంఘము, సంఘశాఖలలోనున్న ప్రజలు—నిజమైన క్రైస్తవులు, ఎవరైతే వర్తమానమును స్వీకరిస్తారో వారు, వారది చూడరు. అదివారికి ప్రకటించబడదు. మరియు మిశ్రిత గుంపులో ఎవరుంటారో, ఎవరికైతే అది ప్రకటించబడుతుందో వారి తలలు పైగా అది వెళ్తుంది. వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఉంటే తప్ప. ఆఁ. అయితే వారు మంచివారు.
203 మరియు వారు మరలా లేపబడి, మరియు విచారణ జరుపబడును మరియు వారు ఆ విచారణలో వారికి బోధించిన వారి ద్వారా తీర్పు తీర్చబడెదరు. “పరిశుద్ధులు భూమికి తీర్పుతీర్చెదరని మీకు తెలియదా?” వారికి ప్రసంగించబడును, చూశారా. “దానిలోనుండి బయటకు రమ్మని,” ఆ వర్తమానమును గూర్చి ఏ ప్రజలైతే వారికి సాక్ష్యమిచ్చారో వారి ద్వారానే వారికి మరలా బోధింపబడును. చూశారా? మీకు ఈ వివరణ చాలని నేననుకుంటున్నాను. నా దగ్గర చాలా ఉన్నవి…
189. సహోదరుడా బ్రెన్‌హాం, ఏలీయా ఆత్మగల ఏడవ దూతయు; ఎత్తబడిన తరువాత మూడున్నర సంవత్సరములలో ఒక లక్ష నలభై నాలుగు వేలమంది యూదులకు పంపబడు ఏలీయాయు ఒకే వ్యక్తియా? మాలో కొందరు ఇందును గూర్చి మిశ్రితంగా ఉన్నారు.
204 కాదు. అతడు ఒకే వ్యక్తి కాదు. చూశారా, అది ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. ఏలీయా రూపములో వచ్చిన ఎలీషా, ఏలీయా కాదు. మరియు ఏలీయా ఆత్మ అతనిమీదికి వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను, ఏలీయా కాదు. మరియు లవొదికయ కాలము యొక్క అంతములో ఏడవ దూత వర్తమానికుడు అక్షరాలా ఏలీయా కాదు. అతడు తన ప్రజలకొరకైన అన్యుడు.
205 ఏలీయా, లేక అప్పుడు ఏలీయా ఆత్మ…అక్కడున్న ప్రజలకు అతడు యూదుడై యుంటాడు, ఏలయనగా వారు తమ స్వంత జనులయొద్దకు పంపబడెదరు. అది నా యొక్క ప్రత్యక్షత. కారణం నేను…టామీ ఆస్‌బర్న్, ఆ సమయములో దాని గూర్చి మాట్లాడుకుంటున్నపుడు టామీ మరియు నేను, దాన్ని గూర్చి నాకు తెలియదు. నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థించుచుంటిని.
206 మరియు నేనక్కడకు వచ్చినపుడు, విదేశీ పొలములలో పనిచేయుచున్న ఒక స్త్రీ ఫోర్ట్ వేన్ గాస్పల్ టాబర్నకల్ నుండి అక్కడకు వచ్చినది. ఆమె రొమ్ములు అంత పెద్దవిగా యుండి కాన్సర్‌తో తినివేయబడెను. మరియు ఆమె మేము నివసించు అదే వీధిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తు యుండేది. మేము ఆ ప్రియమైన సహోదరి కొరకు ప్రార్థించాము. ఆమె స్వస్థత నొందింది, సువార్త పొలానికి తిరిగి వెళ్లింది. ఆఫ్రికా నుండి ఆమె వచ్చింది. మిషన్‌ల గూర్చి, ఒక చిన్న పుస్తకం అక్కడ విడచి వెళ్లింది.
207 నేను—నేననుకున్నాను, “భలే, మిషనరీలు మంచివారు.” నేను…మిషనరీలు గూర్చి నేనెన్నడు ఎక్కువగా తలంచలేదు. మరియు నేననుకున్నాను, “మంచిది, అక్కడ బయట ఒక దేవుని యొక్క కార్యాలయముగా ఉన్నది. కాబట్టి, ఇదే…ఇక్కడే నా స్థలము ఎనిమిది, పెన్ వీధిలో.” నేను నా శక్తికొలది నేను కొనసాగించుచున్నాను.
208 అయితే ఒకరోజు చదువుకొనటానికి కూర్చున్నాను, ఆ పుస్తకము తీసుకున్నాను. నీగ్రో జాతికి చెందిన బొమ్మ అందులో ఉన్నది, ఒక వృద్ధుడైన తండ్రి, తెల్లని వెంట్రుకలు అతనికున్నవి. మరియు క్రింద ఈలాగు వ్రాయబడియున్నది, “తెల్లవాడా, తెల్లవాడా నీ తండ్రి ఎక్కడ? చూశారా, నేనిప్పుడు వృద్ధుడను మరియు బుద్ధిమాంధ్యము గలవాడను, నేను బాగా అర్థం చేసుకోలేను. నేను యౌవ్వనస్తునిగా యున్నపుడు నేను యేసును ఎరిగినట్లయితే నేను ఆయనను నా ప్రజల యొద్దకు తీసుకొని వెళ్లేవాడను.” సరే, నేనది చదువుచుంటిని.
209 ఒకటి నాతో ఈలాగు చెప్తూనే యుండెను, “మరలా చదువు. మరలా చదువు” యని. నేను చదువుతూనే యున్నాను. ఓ, నీవు అనేకసార్లు వాటిని చదివితివి. “దానిని మరలా మరలా చదువు. అక్కడొకటి యున్నది.”
210 ఆరోజు గ్రీన్ మిల్ లో అక్కడ నేను గుహలోనుండి బయటకు వచ్చినపుడు, జరిగినట్లు జరిగింది. నేనది అర్థం చేసుకోలేకపోయాను. ఏ విధంగా ప్రజలు నిజమైన పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడి కేకలు పెట్టిరి, అయినను ఇంకను అంత్యక్రీస్తు. భాషలతో మాట్లాడి, నిజమైన పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడిరి అయినను ఇంకా దయ్యమైయుండిరి. ఔనది నిజం. అది నేను మీకు రుజువు చేయగలను. ఔను. నిజంగా. తరువాత గమనించండి…వారక్కడ నిలబడినపుడు.
211 కాబట్టి భాషలు పరిశుద్ధాత్మకు రుజువు కావు. అది పరిశుద్ధాత్మ యొక్క వరము. చూశారా? ఆయనకు గల ప్రతిదానికి దయ్యము అనుకరణ చేయగలదు, దైవిక స్వస్థత మొదలగునవి.
ఆయన చెప్పాడు, “ఆ దినమున అనేకుల నా యొద్దకు వచ్చి ఇలా చెప్తారు, ‘ప్రభువా, నేను దయ్యములు వెళ్లగొట్లలేదా…?’” అది సువార్తను ప్రకటించుట. “‘నీ నామము బట్టి గొప్ప కార్యములు చేయలేదా, ఇవన్ని కూడా?’ ‘అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపొండి. మీరెవరో కూడా నాకు తెలియదు.’” అని నేను చెప్తాను.
212 బైబిల్ చెప్తుంది, “వర్షము నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను ఒకే విధముగా కురియుచున్నది.” మరియు అదే గురుగు చెట్టు [ముండ్ల చెట్టు] గోధుమ పొలములో నిలబడియుంది, వాటివలె చాలా ఆనందంగా కేకలు వేయును. అదే వర్షము అతనిమీద పడుటను బట్టి. “అయితే వారి ఫలముల వలన నీవు వారిని తెలుసుకుంటావు.” ఆ చిన్న గురుగు తాను ఎంత ఆనందంగా కేకలు వేయాలో అంతగా కేకలు వేయుచు గోధుమల కన్నా నిండు నీటిని కలిగియుండి అక్కడ నిలబడియున్నది.
213 అక్కడే నీవున్నావు. కాబట్టి వారు కేకలు పెట్టగలరు, భాషలతో మాట్లాడగలరు. వారు కోరిందల్లా అనుకరణ చేయగలరు; ఆ దినమున “అక్రమము చేరయువారలారా” అని పిలువబడతారు.
214 కొద్దిసేపటి క్రితము నేను చెప్పినట్లుగా, నేను చెప్పింది వినండి! జాగ్రత్తగా వినండి. వెనుతిరిగి చూచి, వాక్యముతో మిమ్ములను మీరు పరీక్షించుకొని మీరెక్కడున్నారో చూచుకోండి.
215 పొట్టి వెంట్రుకలు గల స్త్రీలైన మీరు, మీ వెంట్రుకలు పెంచుకోండి. మీరు పొట్టి వస్త్రాలు ధరిస్తున్నారు; వాటిని తీసివేయండి. గౌరవింపదగిన స్త్రీవలె యుండండి. ఇంకా సిగరెట్లు త్రాగుచున్న పురుషులైన మీరు మరియు అపహాస్యపు ఆటలలోనున్న మీరు అది నిలిపివేయండి. మీరెంతగా చెప్పుకున్నను నాకు లెక్కలేదు. మీరింకా ఆ సంస్థను పట్టుకొని, “ఇది అది మరియు ఇది అది” చెప్తుంటే మీరు మానుకొనుట మంచిది. వెనుకకు చూచి వాక్యముతో దానిని పరీక్షించుకోండి. మనము వాటినుండి బయటకు వచ్చి…
216 పొట్టి వెంట్రుకలు మరి తదితరమైన వాటికంటె పైగా మనము జీవించవలసియున్నది. ఇపుడు మనము జీవించుచున్న ఈ కాలంలో మనము ఏదో కార్యములో నున్నాము, జగత్తుకు పునాది వేయబడక మునుపు అందులోనున్న మర్మములను దేవుడు మనకు బయలుపరచుచున్నాడు. మరియు ఈ చిన్న కార్యములకు ఎవరు విధేయులౌదురో వారు ఈ ఇతర విషయాలు పట్టించుకుంటారు. వారు కాకపోతే, పడమటకు తూర్పు ఎంతదూరమో మరి అంతదూరము అది వారి తలలపైగా వెళ్లును. అది…
217 గిద్యోను తన ప్రజలను వేరుపరచినట్లుగా ఉండును. వేలకు వేలమంది ఉండిరి. దేవుడన్నాడు, “వారు ఎక్కువమంది. మరలా వేరుపరచు” అతడు వారికి మరొక పరీక్ష పెట్టాడు. మరియు “వారిని మరలా వేరుచేయుము, మరలా వేరు చేయుము.” ఇంకా ఆలాగే పిడికిడు అంత అగువరకు. ఆయన చెప్పాడు, “కార్యము చేయుటకు నాకు కావలసిన గుంపు అదే.” ఖచ్చితంగా అదే జరిగినది.
218 అక్కడ కూర్చున్న పెంతెకొస్తు స్త్రీలు (ముందుకు వెనుకకు ఊగుచున్నారు.) వాక్యము ద్వారా వింటున్నారు, తెలుసుకుంటున్నారు, అది తప్పు అని. నేను చెప్పుదానిని వారు గైకొంటారని మీరు అనుకుంటారా? లేదండి. ప్రతిసారి నేను దాటిపోవునపుడు నేను ఆరంభించినపుడు ఉన్నదానికంటే స్త్రీలు తమ జుట్టును కురచగా కత్తిరించుకొను వారిగా ఉన్నారు.
219 అన్నారు, “అవన్ని చెప్పుట వలన ఏమి లాభం…మీరు…” ఒకరున్నారు, “ఎందుకు సహోదరుడా బ్రెన్‌హాం! ప్రజలు నిన్నొక ప్రవక్తగా గౌరవిస్తారు.”
నేను ప్రవక్తనని నేను చెప్పుటలేదు. ఎవరూ నేనది చెప్పుట వినలేదు. అయితే నేనిది చెప్తాను, అనగా నీవు అది చేస్తే, నీవు దానిని ఎంచితే…
అన్నారు, “ఏ విధముగా పరిశుద్ధాత్మను పొందుకోవాలో ప్రజలకు నీవెందుకు బోధింపకూడదు. అది ఏలాగు పొందుకోవాలో, గొప్ప ఆత్మ సంబంధమైన వరములు పొంది, సంఘానికి ఏలాగు సహకారము చేయాలో నీవెందుకు చెప్పకూడదు?”
వారు వారి యొక్క అ, ఆ, ఇ లు విననపుడు వారికెలాగు నేను ఆల్‌జీబ్రా నేర్పగలను? ఔనా. ఈ చిన్న విషయాలు నీవు చేయి. ఇక్కడకు దిగి, దుమ్ము దులుపుకొని, ముందుగా ప్రారంభించు. ఆమేన్. సరేనా.
220 నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నాను? చూద్దాము. నేను ఆ అంశము నుండి తొలగిపోకూడదని అనుకొనుచున్నాను. క్షమించండి. చూశారా. సరే. “కొందరు…మనలో కొందరు పొరపాటు పడుచున్నారు. అదే ఏలీయా…” అ, ఉహు, ఔను.
కాదు. అన్యుల యొద్దకు వచ్చు ఈ ఏలీయా, ఆ ఆత్మతో అభిషేకించబడిన అన్యుడైయుంటాడు. ఎందుకనగా, ప్రతిసారి గందరగోళము నుండి ఆయన ప్రజలను తెచ్చుటకు దేవుడు అదే ఆత్మను ఉపయోగించాడు. మరియు అది ఆయన ఉద్దేశమును బాగుగా నెరవేర్చెను. కాబట్టి ఆయన మరలా వచ్చును. ఎందుకనగా, చూడండి…
ఎందుకనగా, ఇపుడు బాగా మెరుగు దిద్దుకొనిన, విద్యగలవానిని ఉపయోగించుకొనిన, ఆ విధముగా యుండేవారే దానిని గ్రహించగలరు.
221 అ, ఆ, లు కూడా రానివాడిని, అక్షరములను పలుకుటకు తెలియనివాడిని, తన పదములను సరిగ్గా ఉచ్ఛరింపలేనివాడిని, ఏమి తెలియని ఒక వ్యక్తిని ఆయన తీసుకొని వచ్చును, మరియు సామాన్యమైన ప్రజల యొద్దకు, వారి మధ్యకు త్రోయును. [సహోదరుడు బ్రెన్‌హాం తన వ్రేలిని ఒకసారి విరచుచున్నాడు—సంపా.] మరియు ఆ విధంగా అర్థం చేసుకుంటారు. వారు స్వీకరిస్తారు. అది వస్తే…
222 పౌలు చెప్పినట్లు “నేను మీ యొద్దకు విద్యా నునుపులతో రాలేదు. అయితే, పునరుత్థాన బలముతో మీ యొద్దకు వచ్చితిని.” అతనిలో నుండి, అతని విద్యను తీసివేయుటకై, అక్కడ అరేబియాలో దేవునికి మూడున్నర సంవత్సరములు పట్టెను. తీసివేయుటకు—మోషేలో నుండి తీసివేయుటకు ఆయనకు నలభై సంవత్సరములు పట్టెను. చూశారా? కాబట్టి, అక్కడే నీవున్నావు. అది…
దేవుడు చెప్పుచున్నాడని నేను చెప్పుటలేదు…ఇపుడు, నేను నిరక్షరాస్యతను బలపరచుటలేదు. అయితే నేను—నేను నీకు చెప్పబోతున్నాను…విద్య…
223 ఈ లోక జ్ఞానము విరుద్ధము. విద్య సువార్తకు పెద్ద ఆటంకముగానున్నది. మనకు విద్యలేని యెడల మనకు ఈ పెద్ద సెమినరీలు మనకున్న ఇవన్ని యుండెడివి కాదు. సాధారణ మనస్సుతోనుండు సామాన్య మనుష్యులు మాత్రమే వాక్యమును వింటారు. అయితే వారెంతగానో సమ్మిళితమైపోయి, ఆ సంస్థలతో ముడివేయబడి దానితో నిలచి యుండేంతగా వారున్నారు. అది అంతే. వారు ఆ ఆత్మను ధరించుకొన్నారు. మీరు ఒక మంచి స్త్రీని తీసుకొని హీన స్థితిగల ఒక పురుషునికి వివాహము చేయగలరా? ఆ హీనస్థితి గల పురుషుడు ఆ స్త్రీ వలె మంచి పురుషుడైనా అవుతాడు లేక ఆ స్త్రీ అతనివలె హీనముగా మారిపోవును. చూశారా? అది నిజం.
224 ఆ కారణం చేత ఆయన చెప్పాడు, “వారి మధ్య నుండి బయటకు రండి, నేను ఎత్తబడుటను నిర్వర్తింపనైయున్నాను.” ఇక్కడ నుండి నిన్ను తీసుకొని వెళ్లుటకు నీకు ఒక విధమైన విశ్వాసము యుండవలసియున్నది.
190. దానియేలు 9:27 లోని నిబంధన, ఎప్పుడు ఒక వారమునకు స్థిరపరచబడెను?
225 యేసుక్రీస్తు భూమి మీద యూదులకు బోధించుచున్నపుడు నిబంధనలో సగ భాగము స్థిరపరచబడెను. ఆయన అన్యుల యొద్దకు వెళ్లలేదు. మరియు ఆయన ఆయన యొక్క శిష్యులకు చెప్పాడు, “అన్యజనుల యొద్దకు వెళ్లకుడి” అని. అది యూదులకు మాత్రమే. ఔనా? ఆయన మూడున్నర సంవత్సరములు బోధించెను. అది డెబ్బదియవ వారములో సగము, దానియేలు ఆయన చేయునని చెప్పిన విధముగా అది జరిగినది.
226 ఇపుడు జ్ఞప్తించుకోండి, ఆయన యూదులకు రూఢిగా నిరూపింపబడ్డాడు. అయితే అన్యజనులకు ఈ సమయము అనుగ్రహించబడుటకై వారియొక్క కన్నులు గ్రుడ్డిగా చేయబడెను. మీరు ఆ నిండు ప్రణాళికను చూచుటలేదా? ఔనా? మరియు ఆయన ఒక ప్రవక్తగా తనని తాను రుజువుపరచుకున్నాడు; ప్రవక్త చేయవలసినవి చేశాడు, వారికి ప్రవక్త సూచనను చూపాడు. “అనగా, నీ యొక్క స్వంత వాక్యము చెప్తున్నది, ‘ఒకడు ఆత్మ సంబంధినని లేక ప్రవక్తనని చెప్పుకొనినయెడల అతడు చెప్పినది గమనించుడి; అది జరిగినట్లయితే, ఆయన చెప్పినది నెరవేరుచునే యుండవలెను.’”
227 నీవు బైబిల్‌లో చూచినట్లుగా. అది చెప్తుంది, “తట్టుడి, అది మీకు తీయబడును; వెదకుడి, కనుగొనబడును; అడుగుడి, ఇవ్వబడును.” ఇపుడు మీరు గమనిస్తే, అది “తట్టుచుండుట.” ఆలాగే తట్టుట. [సహోదరుడు బ్రెన్‌హాం ఇరవై మూడు సార్లు ఆలాగే వేదికను తట్టుచున్నాడు—సంపా.] అక్కడే యుండు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, స్త్రీకి జవాబు ఇవ్వనట్లుగా; అతడు ఆగకుండ ఆమె తలుపును కొట్టుచునేయున్నాడు. చెప్పెను “నేను నీ ప్రక్కనున్నాను.” [సహోదరుడు బ్రెన్‌హాం తట్టుట నిలుపు చేశాడు.] వెదకుట కాదు, చెప్పుము, “ప్రభువా, నేను ఇది పొందుకొనుటకు ఇష్టపడుచున్నాను. ఆమేన్.” అది అది కాదు. నీవు అది పొందుకునే వరకు అక్కడే నిలచియుండు. అది రాబోతుందని నీకు తెలుసా. కాబట్టి, ఆయన అది వాగ్దానము చేశాడు. దానిని నీవు పట్టుకునే వరకు అక్కడే నిలచియుండు. చూశారా?
ఇపుడు, ఇపుడు, డెబ్బదివారము యొక్క ఆఖరి భాగము, దానియొక్క చివరి భాగము సంఘము ఎత్తబడిన తరువాత యుండు శ్రమకాలమే డెబ్బది వారములోని చివరి భాగము. తరువాత ఇక్కడ ప్రకటన 11 లోని మోషే మరియు ఏలీయా అను ఆ ప్రవక్తల వలన మరలా వారికి మూడున్నర సంవత్సరములు స్థిరపరచబడును. ఇపుడు అదేమిటని మనము చూద్దాం:
191. ఆయన ఎన్నుకొనిన వారిలో నీవు ఒకరైతే, పెండ్లికుమార్తెలో పైకి వెళ్తావా? [ఔనండి. ఉహ్—హు—అవునండి. అది సులభం.]
192. సహోదరుడా బ్రెన్‌హాం, బయలు దేవతకు మోకాళ్లు వంచనివారు ఏడువేల మందియా లేక ఏడువందల మంది యను అర్థముతో నీవు చెప్పుచున్నావా?
228 నేను చెప్పుటలో అర్థం, ఏడు వేలు. అందుకై నన్ను క్షమించండి. చూశారా. అది—అది ఊరక—ఒక విధమైన మాట ధోరణిగా నున్నది. నేను ఊరక…
కొద్దిసేపటి క్రితము చెప్పినట్లు. ఇక్కడ నేను నిలబడి చెప్పుట మీరు గమనించారా, నేను చెప్పాను, “మరియు—మరియు గొఱ్ఱెపిల్లను చూచినట్లుగా, వారు సాక్ష్యము కలిగియుండిరి…?” చూశారా? చూశారా? గొఱ్ఱెపిల్ల భూమి మీద ఉన్నది. ఔనా? “దేవుని యొక్క ఆత్మ గొఱ్ఱెపిల్ల మీదికి వచ్చినదనుటకు వారు సాక్ష్యము కలిగియుండిరి.”
229 ఇపుడక్కడ ఇలాగు చెప్పబడినది, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను.” అని. మీరు గమనించారా? ఇపుడది వాస్తవమైన గ్రీకు రూపములో వ్రాయబడినది, క్రియను క్రియావిశేషమునకు ముందుంచారు. అయితే మీరిక్కడ గమనిస్తే ఇక్కడ అది నిజంగా ఇదే. ఇపుడు ఊరక వాక్యమును తీసుకోండి. చూశారా. పరిశుద్ధ జేమ్స్ అనువాదములో బైబిల్ చెప్తుంది. “ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను”. అయితే వాస్తవముగా మనము ఈ దినమున చెప్పినట్లుగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను.” దానిని త్రిప్పి చూడవచ్చును. చూడండి. చూశారా? “నేను నివసించుటకు ఆనందించుచున్న ఈయన నా ప్రియ కుమారుడు” చూశారా? ఈ దినమున మనము ఈలాగు చెప్తాము, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను.” చూడండి, అదే వాక్యము త్రిప్పి చూడండి. చూశారా?
230 ఇపుడు, ఔను, నా భావము…దయచేసి నన్ను క్షమించండి. నేను…మరియు—మరియు అక్కడ, బయట టేపులు వినుచున్నవారు, స్నేహితులు వినండి. ఆ విధంగా చెప్పుటయని కాదు నా భావము. నేను—నేను—నేను ఒక సువార్త పరిచారకుడను. నేనది చాలాసార్లు బోధించాను. అది ఏడు వేలు యని నాకు తెలుసు. నేను ఏడు వందలని చెప్పుట సంభవించినది. ఏడు వందలని కాదు నా భావము. నా భావము…లేఖనములలో నుండి నేనది చదువలేదు. నేను మాట్లాడుచున్నపుడు అది నా తలంపులలోకి వచ్చెను, ఏడువేలకు బదులు నేను ఏడువందలని చెప్పాను. ఆ తప్పులు నేను అన్నిసార్లు చేస్తాను. నేను—నేను నిజంగా మొద్దును, కాబట్టి నన్ను క్షమించండి. చూశారా? ఆలా చేయాలని నా భావము కాదు.
193. క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె మరియు క్రీస్తు యొక్క శరీరము ఒకటేనా?
231 ఔనండి! చూడండి? ఇపుడు ఇక్కడ, చూడండి, దానిని నేను ప్రారంభించాలని అనుకొనుటలేదు. ’ఎందుకనగా నేను…దానిమీద ఒక ప్రసంగం చేయగలను. చూశారా. అయితే నేనది చేయను. అయితే నేను మీకు చూపుతాను. దేవుడు ఆదాముకు అతని ప్రక్కలో నుండి అతని పెండ్లికుమార్తెను ఇచ్చినపుడు అతడన్నాడు, “ఆమె నా మాంసములో మాంసము నా ఎముకలలో ఎముక” అని. ఔనా?
232 దేవుడు క్రీస్తుకు ఆయన వధువును ఇచ్చినపుడు, ఆత్మ వధువను శరీరమును ఇచ్చెను. ఆయన పొడవబడ్డాడు, ఆయన గుండె క్రింద అనగా ప్రక్కలో పొడిచిరి, మరియు నీరు, రక్తము మరియు ఆత్మ బయటకు వచ్చెను; అది “ఆయన మాంసములో మాంసమును మరియు ఎముకలో ఎముకగ మారెను.” మనమే ఆ మాంసమును ఎముకలనైయున్నాము; పెండ్లికుమార్తె క్రీస్తు మాంసమును ఎముకలనైయున్నది, ఖచ్చితం. వారే…అదియే ఆయన పెండ్లికుమార్తె.
194. క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె…? ఎత్తబడుటకు ముందుగా క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె ఒక పరిచర్య కలిగియుండునా?
233 తప్పకుండా. ఇపుడు జరుగుచున్నది అదియే. చూస్తున్నారా? క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె. నిశ్చయంగా. అది ఘడియకు చెందిన వర్తమానము, చూస్తున్నారా, క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె. నిశ్చయంగా. ఆమె అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మరియు కాపరులను కలిగియున్నది. ఔనా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది—సంపా.] అది క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె. నిశ్చయంగా. ఆమెకొక పరిచర్య యున్నది. గొప్ప పరిచర్య, ఘడియ యొక్క వర్తమానము. అదెంతో దీనమైనది.
234 ఇపుడు జ్ఞప్తించుకోండి. మొదట నేను, ఇక్కడ ఇపుడు ఎందరున్నారు. చూడండి, గత ఆదివారం, దేనిమీద నేను బోధించానో జ్ఞాపకమున్నదా? దీనత్వము. ఓ, అది మరచిపోకండి. దానిని మరలా హెచ్చరిక చేయుటకై నేను ఒక నిముషము నిలపుజేయ బోతున్నాను. జ్ఞప్తించుకోండి, దేవుడు ఏదైనను గొప్పకార్యము జరుగునని చెప్తే, ప్రజలు తమ జ్ఞానము ద్వారా దానిని చాలా దూరముగా చూచుచున్నారు, అది వారి మధ్య జరుగునపుడు దానిని తప్పిపోవుచున్నారు. దేవుడు ఏదైనా గొప్పయని చెప్పినపుడు, దాన్ని చూచి లోకం నవ్వుతుంది. “ఆ అజ్ఞానులైన గుంపు!” అది నిజం.
అయితే గొప్పలోకము, గొప్ప సంఘము, “అబ్బాయ్, అది మహిమకరమైనది!” అని చెప్తే, దేవుడు “అది బుద్ధిహీనమైనది!” అని చెప్తాడు. కనుక చూడు నీవు గమనించవలసియున్నది. అది ఆ విధంగా యున్నదని నా భావము కాదు, ఖచ్చితంగా ఆలాగునని, అయితే అది ఆ విధముగానే యుండును.
235 చూడు! ఇక్కడ గొప్ప పరిశుద్ధ పారంపర్యాచార సంఘమున్నది, “మాకు వాక్యము తెలుసు. మాకు పాఠశాలలున్నవి. మాకు సెమినరీలున్నవి. ఎంతగానో మెరుగులు దిద్దిన మనుష్యులు మాకున్నారు. సంవత్సరముల తరబడిగా యెహోవాకు మేము నమ్మకముగా ఉన్నాము. మేమే సంఘము. మేమే సన్హెద్ర సభ. ఇక్కడ సంఘముల సమాఖ్య మాకున్నది. పరిసయ్యులము, సద్దూకయ్యులము ఇరువురమున్నాము. అన్ని సంఘశాఖలు కలసియున్నాము, కలసియుంటాము,” అని చెప్తున్నది. చూశారా? “మేమందరము ఒకటే—సంఘముల సమాఖ్య. మేము గొప్పవారము. ఆ లేఖనము మాకు తెలుసు. ముఖాన చిన్న గడ్డము వ్రేలాడ వేసుకొని, గొఱ్ఱె చర్మము ధరించి, అక్కడ నది యొద్ద నున్న ఒక చిన్న విద్య లేని పామరుడు ఏంటి?” నిశ్చయంగా వారది నమ్మరు?
236 బైబిల్ గ్రంథము చెప్తుంది, మలాకీ 4వ…లేక 3వ అధ్యాయములో, “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను,” అక్కడ ఏడువందల పండ్రెండు సంవత్సరములకు మునుపు, యోహాను…ఓ, గొప్ప ప్రవక్తయైన యెషయా అక్కడ నిలబడి అన్నాడు, “అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ‘యెహోవాకు మార్గము సిద్ధము చేయుడి, ఆయన త్రోవను సరాళము చేయుడి.’” అది నిజము. మరియు చెప్పాడు…మరియు…ఓ, అనేకులు! చెప్పబడినది, “ప్రతి ఎత్తైన స్థలము చదును చేయబడును.”
237 ఓ, వారన్నారు, “అచటికి…ఈ మనిషి వచ్చినప్పటికి, అతను వచ్చి తన వ్రేలిని చూపించి మరియు అతను పర్వతములను కదిలించును. ఓ, మరియు అన్ని పల్లపు స్థలములు, గుంటలు లేపబడును. అటుతరువాత కరకు స్థలములన్నియు చదును చేయబడును. సహోదరుడా, ఇక్కడున్న ప్రతి పొలములో ధాన్యమును పండింతుము. మరియు ఓ, ఈ మనుష్యుడు వచ్చినపుడు మనము గొప్ప కార్యములు చేయబోవుచున్నాము.” చూశారా.
238 దేవుడు ఒక యంత్రము యొక్క పిడిని త్రిప్పి, వసారా క్రిందికి వచ్చునట్లు చేసి, “మెస్సీయా యొక్క రాకకు ముందుగా వెళ్లు గొప్పవాడా, క్రిందికి రా!” అని చెప్పును అని వారు అనుకున్నారు. మరియు అతడు వెళ్లిన వెంటనే, దానిని వెనుకకు లాగివేశారు, మరియు అతని పరిచర్య ముగింపబడినది. మరలా వారు యంత్రమును త్రిప్పి, సెమినరీ ప్రక్కకు త్రిప్పి, “మంచిది, నా ప్రియకుమారుడా వెలుపలికి వచ్చి వారికి చెప్పు” అని చెప్పునని వారు ఎదురు చూచుచుండిరి. చూశారా? ఓ, మై!
239 అతడు వచ్చినపుడు, చూడండి. ఏమి జరిగింది? వారి పాఠశాలలను గూర్చి ఏమి తెలియని వ్యక్తి అక్కడకు వచ్చాడు. సహవాస కార్డు కూడా లేదు. ఓ! యోగ్యతా పత్రాలు లేవు. లేవు. అతడు తన జీవితంలో ఎన్నడైనా పాఠశాలకు వెళ్లినట్లు ఎవరికి తెలియదు. అతని సంభాషణలోనైనా నీవు చెప్పలేవు. మతసంబంధమైన పదజాలమును కూడా అతడు వాడలేదు. అతడు సర్పములను గూర్చి, గొడ్డళ్లను గూర్చి, అరణ్యమును గూర్చి, మరియు—మరియు—మరియు, చెట్లను ఆలాటి విషయాలను గూర్చి అతడు మాట్లాడెను. ఆనాటి లేక ఈనాటి వారి మతసంబంధరీతిగా అతడు మాట్లాడలేదు.
240 ఇక్కడ ఇండియానాలో మనము పిలిచినట్లు “సస్సాఫ్రాస్” తో అతడు వచ్చాడు. అతడు ఒక చోట పొదలనుండి వచ్చాడు. క్షౌరము చేయించుకొనలేదు, అతని తల నుండి వెంట్రుకలు వ్రేలాడుచున్నవి. అతడు స్నానం చేశాడని నేను ఊహించుటలేదు; రెండు లేక మూడు నెలలకు ఓసారి. మంచిది. రాత్రులలో పైజామా ధరించుటలేదు. కారులో ఎన్నడూ ప్రయాణము చేయలేదు. అతడు ఎన్నడు పళ్లను తోముకోలేదు. అయ్యో! ఏలాటి మనిషి ఈ వ్యక్తి. నిశ్చయముగా కాదు.
241 ఆ విధంగా అడవిలో గుండా ఆ విధముగా అడుగు వేసుకుంటూ ఇక్కడ అతడు వస్తున్నాడు. “నేను అరణ్యములో కేకవేయు ఒక శబ్దము, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరాళము చేయుడి!” అని అన్నాడు.
242 కొందరు ఉపదేశకులు నిలబడి అన్నారు, “ఊఁ, ఓ వ్యక్తి, నీది నీవు కలిగియున్నావా…? మేము నీ కూటములో నీతో సహకరించము. ఇక్కడ మేము ఇది చేయలేము. సరే. ఏది నీ యొక్క—ఏది నీ యొక్క కార్డు? నీ గుర్తింపు ఏది?” అతడు వారిని లెక్క చేయలేదు. అతడొక వర్తమానము కలిగియున్నాడు, కాబట్టి దానితోనే అతడు వెళ్లవలసియున్నది, మీరు చూశారా, అదే బోధించుచుండెను.
243 వారన్నారు, “సరే, మనము అక్కడకు వెళ్లినట్లయితే, ఈరోజు మన బిషప్పును కూడా తీసుకొని వెళ్లి, దానిని గూర్చి అతడేమి చెప్పునో చూద్దాము. మనము అక్కడకు వెళ్లి తెలుసుకుందాము. వారు సంఘమునకు పెద్దలు. అతడు దానిని గుర్తింపగలడని మనకు తెలుసు. అతడు దేవునికి చెందిన వాడైతే, అతడు మన బిషప్పులను గుర్తించును.”
244 ఆ హోదాగల వారందరిని అక్కడ వరుసగా నిలబెట్టి.
245 అతడన్నాడు, “సర్పసంతానమా! గడ్డిలో సర్పములారా!” గుండ్రని కాలర్లను ధరించి, “పరిశుద్ధ గుంపులు” గా మీరు పిలచుకుంటున్నారు. “రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవారెవరు? మీ కాలము సమీపమైనదని మీకు తెలుసు. మీరు ఆ విధంగా తలంచవద్దు…మీరు చెప్తారు, ‘సరే. మేము దీనికి సంబంధించినవారమని దానికి సంబంధించిన వారమని.’ నేను చెప్తాను, నేను సేవించు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడు” అని. ఓ, మై!
246 ఇపుడు అతడు వారి మత సంబంధమగు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచుండెను. “గొడ్డలి చెట్లు వేరున ఉంచబడియున్నది. కాబట్టి మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును! ఓ, నేను మీకు మారుమనస్సు నిమిత్తము బాప్తిస్మము ఇచ్చుచున్నాను, అయితే నాకు వెనుక వచ్చుచున్నాడు. చంద్రుడు రక్తముగా మారును! మరియు…ఓ, మై, ఆయన కళ్లమును ఆయన బాగుగా శుభ్రము చేయును! మరియు ఆయన పొట్టును తీసివేసి, దానిని ఆరని అగ్నితో కాల్చివేయును, మరియు ఆయన గోధుమలను కొట్టులో చేర్చును. ఆయన గోధుమలను, గురుగులను వేరుపరచును.” ఓ, మై! ఎంతటి వర్తమానము!
247 వారన్నారు, “ఇతడా? ఊహు! అతనేమి చెప్పుచున్నాడు, ఏంటి—ఏంటి—ఏలాంటి సమయమది? ఓ, తెలియకుండ ఉన్నారు! మనమక్కడ ఒక మనిషిని కలిగియున్నాము, సహోదరుడు జోన్స్. ఈ కాలంలో ఎవరైన యున్నట్లయితే అతడు దానిని చేయగలడు. పలానా—పలానా బిషప్పు దానిని చేయగలడు. పలానా—పలానా పరిశుద్ధ తండ్రి.” ఓ, మై. చూశారా?
సామాన్యతలో దేవుడు, చూశారా, సామాన్యతలో పనిచేయుట.
248 అటుతరువాత, మొదటి విషయమేదో మీకు తెలుసా, అతడు ఒకరోజు అచట నిలబడియుండెను, అతడన్నాడు, “ఔను, ఆయన మీ మధ్య నిలబడియున్నాడు!” మార్గమును సరాళము చేయువాడు అతనేయని అతనికి బాగుగా తెలియును. అతనెవరని అతనికి తెలియును. ఆ కారణము చేత అతడు వారి చర్మమును వలవగలిగెను. చెప్పాడు, “ఇపుడు భయపడకండి, ముందుకు సాగిపొండి. సైనికులారా, మీరు మీ యజమానులకు లోబడియుండుడి. మీరేదైనా తప్పు చేస్తే, దానిని మీరు…”
249 “మేమేమి చేయాలి? ఇది చేయుట నిలుపు చేయమా? ఇది ఆపు చేయమా?”
250 అతడన్నాడు, “మీరు చేస్తున్నట్లుగానే చేయుడి. కొనసాగించుడి. కొనసాగించుడి. ముందుకు వెళ్లుడి. బంగాళాదుంపలను పెంచుచున్నచో, అదే చేయండి. చూశారా? సైనికులైన మీరు దౌర్జన్యము చేయవద్దు. మరియు—మరియు మీరు ఇది చేయండి. మరియు మీరు దేనిని చేసినను మీరున్న విధముగనే దానిని చేయండి. మీ యొక్క యజమానులకు విధేయులుగా యుండుడి.”
“రబ్బీ, మేమేమి చేయాలి?”
251 “మీరు చేయునదే చేయండి. చూశారా. అయితే మీకు తెలియని ఒకరు మీ మధ్య ఉన్నారు.” అతని వర్తమానము యొక్క ఘడియ అతడు ఎరుగును. ఆ వ్యక్తిని అతడు పరిచయం చేయవలసియున్నాడని అతనికి తెలుసు. ఆయన అక్కడ ఉన్నాడని అతనికి తెలుసు. “మీ మధ్యలో ఒకడు! మీరు ఆయనను చూడలేదు. విషయాలు జరుగుచునే యున్నవి, దానిని గూర్చి మీకేమి తెలియదు.” మరియు కాబట్టి, “అక్కడ—అక్కడ ఏదో సంభవించనైయున్నది.” అతడు చెప్తున్నాడు, “ఆయన ఇక్కడున్నాడు, నేనాయనను ఎరుగుదును.”
252 మరియు, ఆఖరుగా ఒక దినాన, అతడు చెప్పాడు. “ఇదిగో ఆయన అక్కడున్నాడు! లోక పాపములు మోసికొనుపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!” చెప్పాడు, “మరియు నా యొక్క సమయం సమాప్తమైనది. నేను ఆయనను మీకు పరిచయము చేశాను. ఇపుడు నేను తగ్గవలసియున్నది. దృశ్యమునుండి నిష్క్రమించవలసియున్నది. ఇక్కడ నుండి ఆయన బాధ్యత తీసుకొనును.”
“వెయ్యేండ్ల పరిపాలన ఇపుడే ఆరంభమగుచున్నది. చూస్తున్నారా, మరియు—కాలము సమీపమైయున్నది.” అటుతరువాత ఆయన వచ్చునపుడు…
253 చివరకు యోహాను చెప్పాడు, “ఆయన, ఆయన చర్మమును వలిచివేయబోవుచున్నాడు. ఆయన పొట్టు నుండి గోధుమను వేరుపరచనైయున్నాడు, ఆయన దానిని కాల్చివేయనైయున్నాడు. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయనైయున్నాడు, మరియు ఆయన చేట ఆయన చేతిలో నున్నది!” అయితే ఆయన ఏమైయున్నాడు? చిన్న, చిన్న…
254 ఇపుడు, వారు దానినంత చిత్రీకరించుకున్నారు, “ఓ, మనుష్యుడా! ఒక మైలు పొడవుండు ఈటెను ఆయన కలిగియున్నాడు. ఆయన ఇక్కడ పాలస్తీనాలో నిలబడియుండును…ఒకానొక తెల్లని మేఘముపై నిలబడి వచ్చి ఈ రోమన్ లందరిని, ఈ విధముగా ఎత్తి వారిని నరకములో వేయును. ఆయన వారందరిని చేయు వరకు ఆ విధముగనే వారిని చేయుచునుండును.” వారాలాగు యుండిరి.
మరియు అది ఆ విధంగా యుండగా, ఒక చిన్న గొఱ్ఱెపిల్ల వారి మధ్య నుండి కదలివచ్చుచు దీనముగా, సాత్వికముగా, ఈ విధముగాను ఆ విధముగాను వచ్చుచుండెను.
255 చివరకు యోహాను చెప్పాడు. ఇపుడు ప్రవక్తయైన యోహాను వైపు చూడు; అతడన్నాడు, “వెళ్లి ఆయనను అడగండి. అసలు నిజముగా ఈయనేనా?” ఆ ప్రవక్త తప్పిపోయినంతగా దీనుడైయుండెను. అన్నాడు, “ఈయనేనా లేక ఇంకొకరి కోసము మేము ఎదురు చూడవలెనా?”
256 ఇపుడు, మత్తయి 11 లో, అతను తన యొక్క శిష్యులకు ఏ పుస్తకమును ఇవ్వలేదు. యోహాను శిష్యులు వచ్చి ఆయనను అడిగినపుడు…
యోహాను చెరసాలలో ఉండెను. కాబట్టి అతడు చాలా సంశయాలతో ఉన్నాడు…అది పెంబర్ చెప్పాడనుకుంటాను, “అతని యొక్క పక్షిరాజు చూపు కలిగి, కంటికి పొర ఏర్పడినది” అని. ఔనా. అతడు…అతడు—అతడు భూమి పైకి వచ్చాడు; అంతవరకు అతను పైన ఆకాశములో ఉండెను. అయితే అతని యొక్క ప్రవచనము ముగించిన తరువాత మరల క్రింద భూమికి వదలబడెను, ’ఎందుకనగా, అతడు చెరసాలలో ఉంచబడెను. చూశారా. అతనికి ఇక ఆ పెద్ద రెక్కలు అవసరం లేదు, కనుక అతను అక్కడ క్రింద నుండెను. అయితే అతను ఆ కాలము నాటి వారందరికంటె చాలా ఎత్తుగా ఎగిరెను.
257 నేనొకటి మీకు చూపుతాను. దేవుడతనిని వినియోగించుకున్నాడు మరియు యేసు ఎరుగును, ఔనా, ’ఎందుకనగా అది—అవతారమెత్తిన దేవుడు అక్కడున్నాడు. చూశారా? ఆయన…కాబట్టి ఆయన—ఆయన అక్కడ చెప్పాడు, ఆయన చెప్పాడు…
ఇపుడు ఆయన యోహాను చెరసాలలో ఏ విధముగా ప్రవర్తించవలెనో దానిని గూర్చిన పుస్తకము ఏమీ ఇవ్వలేదు; “ఒక నిముషము ఆగు. నేనొక చిన్న వ్యాసమును వ్రాస్తాను. నీవు తిరిగి వెళ్లి, అతడు చెరసాలలో నున్నపుడు నా కొరకు ఎలా ప్రవర్తించవలెనో యోహానుకు చెప్పు” అని అతడు చెప్పాడా. చూశారా? లేదు. అతడలాగు చెప్పలేదు.
258 “పోయి యోహానుతో చెప్పు, అతడు బయటకు వచ్చుటకు ముందు అతడు పిహెచ్.డి డిగ్రీ పొందవలయును” అని ఆయన చెప్పలేదు. ఔనా? అతడు ఆ విధంగా చేస్తే మిగతా వారితో కూడా; అతను కూడా నిరాకరింపబడువానిగా యుండేవాడు.
యోహాను యథార్థపరునిగా యుండి ప్రశ్నను అడిగాడు.
259 మరియు ఆయన చెప్పాడు, “కూటము ముగించువరకు వేచియుండుడి. అటుతరువాత వెళ్లి ఏం జరిగిందో యోహానుకు చూపండి. అపుడతడు తెలుసుకుంటాడు. ఏమి జరుగుచున్నదో మీరు ఆయనకు చెప్తే అతడు తెలుసుకుంటాడు.” చూశారా? చూశారా? “వెళ్లి…అతనికి చెప్పండి. అతనికి చెప్పండి, అది…అతడు చెరసాలలో ఉన్నాడు, ఇక్కడకు రాలేదు. అయితే—అయితే మీరు కూటములో కూర్చున్నారు. ఏం జరిగిందో మీరు చూశారు. వెళ్లి అతనికి చెప్పండి.”
కాబట్టి, ఆలాగైతే, శిష్యులు అన్నారు, “చాలా బావుంది, యజమానుడా.”
260 వారు కొండ ఆవలకు వెళ్లారు. యేసు ఈ బండ మీద కూర్చొని, వారు అది దాటి వెళ్లు వరకు కొండ మీదకెక్కి వెళ్లువరకు వారిని గమనించుచునే యుండెను.
261 ఆయన సభ వారివైపు తిరిగి, అన్నాడు, “యోహాను కాలములో మీరు ఎవరిని—ఎవరిని చూచుటకు వెళ్లారు?” చూస్తున్నారా? అన్నాడు, “ఏమి చూచుటకు మీరు వెళ్లారు? తన యొక్క కాలరు త్రిప్పుకొని, మెత్తని వస్త్రములు ధరించుకొని విద్యా ప్రావీణ్యతగల మనుష్యుని చూచుటకు వెళ్లారా? అటువంటి వ్యక్తిని చూచుటకు మీరు వెళ్లారా?” అన్నాడు, “కాదు. వారెటువంటి రకమైన వారని మీరెరుగుదురు? వారు చిన్నపిల్లలను ముద్దు పెట్టుకొందురు. రాజుల’ గృహాలలో పనిచేయుదురు. వారు—అది—యోహాను అటువంటి వాడు కాదు.”
262 “సరే” అన్నాడు, “ఆలాగైతే, మీరెందుకు వెళ్లారు? ఒక పరిచర్యను ఇవ్వబడిన ఒక వ్యక్తి ఒక సంస్థలో విలీనమైపోయి లేక అటువంటి కార్యములలో ఐక్యమైపోయి అందరితో కరచాలము చేయుచు ఉండునటువంటి ఒక వ్యక్తిని చూచుటకు వెళ్లారా? తరువాత, ఏకత్వము వారు అతన్ని వద్దంటె త్రిత్వము వారి యొద్దకు పోవు ఒకనినా? మరియు త్రిత్వము వారు అతన్ని వద్దంటె, అక్కడెక్కడైనాయుండు చర్చ్ ఆఫ్ గాడ్‌కు వెళ్లునా? నీవు చూచుటకు వెళ్లినది ఆలాటి వ్యక్తినా, గాలికి కదులుచున్న రెల్లును చూచుటకు వెళ్లితిరా? ఓ, కాదు. యోహాను కాదు.”
263 ఆయన అడిగాడు, “ఆలాగైతే మరి ఏమి చూచుటకు వెళ్లారు? ఒక ప్రవక్తనా?” ఆయన అన్నాడు, “అది నిజము. అయితే మీకు తెలియని ఒకటి మీకు చెప్పుచున్నాను; అతను ప్రవక్తకంటె గొప్పవాడు. అతను గొప్పవాడు. మీరు ఆయనను స్వీకరిస్తే, బైబిల్ గ్రంథములో వ్రాయబడినవాడు ఈయనే. చూశారా, అక్కడ వెనుక లేఖనములో, మలాకీ 3 లో ‘నాకంటె ముందుగా నేను నా దూతను పంపెదను.’ ‘మరియు నాకు ముందుగా అతడు మార్గము సిద్ధపరచును.’” చూశారా?
264 మరియు వారు అర్థం చేసుకోలేదు. చివరకు శిష్యులు గ్రహించలేదు. చూశారా? ఔను. ఓ, మై! సామాన్యత! దీనత్వము కలిగియుండుడి. చూశారా. కొనసాగుచూ యుండుడి…దేవుడు గొప్ప కార్యమును వాగ్దానం చేసినపుడు, అది ఆయన దృష్టిలో అది గొప్పదే.
265 ఇపుడు, దీనిని ఎల్లపుడు మీ మనస్సులో ఉంచుకోవాలనుకున్నట్లయితే, నేను…దీనిని మనస్సులో ఉంచుకొనండి. ఇది జరిగినపుడు, మీరు దానిని మార్చవచ్చును. మీరు క్రిందికి వంగి ఈ సంవత్సరం రాబోవుచున్న ఈ చిన్న వసంత ఋతువు పువ్వులలో ఒకదానిని తెంపి చూడండి, లేక మామూలు గడ్డిపూచను తెంపి, దానిని మీ చేతిలో ఉంచుకొని, చెప్పండి, “ఇపుడు నేను దీనిని పట్టుకొనబోవుచున్నాను, ఎంతో సమాన్యమైనది, చూడండి. దీనిని అది చేసినది. మరియు చంద్రుని యొద్దకు రాకెట్‌ను పంపిన మేథాశక్తి ఈ గడ్డిపూచను తయారుచేయగలదా యని నేను చూడగోరుచున్నాను.” మీరు ఎల్లపుడు దానిని కలిగియుందురు. మీరు దానిపై నిశ్చయముగా ఆధారపడి యుండవచ్చును. మీరు ఎల్లపుడు దానిని కలిగియుండవచ్చును. చూశారా? గడ్డిపూచ అందులో జీవాన్ని కలిగియున్నది. అదెంతో సామాన్యమైనది, స్వల్పమైనది.
266 మీరు చూడండి. ఒక మనిషి పెద్ద మనిషి అయినట్లయితే, పరవాలేదు. అయితే అతడు సామాన్యుడుగా నుండగలిగినంత పెద్దవాడుగా నున్న యెడల, చూశారా. అతడు దేవుని కనుగొనును. అయితే అతడు చిన్నవాడు [సామాన్యుడు] కానట్లయితే ఆయనను ఎన్నడు చూడలేడు. కాబట్టి నీవు సామాన్యుడవు కావలసియున్నది. ఇపుడు…
195. ప్రకటన 5:9 లో గొఱ్ఱెపిల్ల గ్రంథమును తీసినపుడు…నుండి తీయుచున్నప్పుడు పాటలు పాడుచునుండు వీరెవరు? వీరు ఎత్తబడిన పరిశుద్ధులా?
267 కాదు. ప్రకటన 6…5:9. కాదు. మీరు గమనిస్తే, వీరు పరిశుద్ధులు కారు. వారు…ఆయన ఆస్థిని ఆయన ఇంకా అడుగుటలేదు. చూశారా? వీరు పరిశుద్ధులు కారు. మీరు గమనిస్తే, వారు పెద్దలు మరియు జీవులు, వారు పాడుచున్నారు.
268 మనమది చదువుదాం, తద్వారా…మరియు తరువాత నేను ప్రయత్నించబోతున్నాను…ఇక్కడ నాకు సుమారు అరడజను కంటె ఎక్కువ యున్నవి. కొద్ది నిముషములలోగా నేను వాటిని చేరుకోగలనని అనుకుంటున్నాను. చూద్దాం. ప్రకటన 5:9. ఇపుడు మనము ముందుగా కొంచెము చదువుకుందాము. తద్వారా ఈ వ్యక్తి దీనిని గూర్చి యథార్థముగా తెలిసికొనగోరుచున్నారు. గమనించు.
ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, (చూశారా,)…నీవు మమ్ములను విడిపించియున్నావు…మరియు వారు ఒక నూతన పాటను పాడెదరు…
మమ్ములను యాజకులుగాను మరియు రాజులుగాను చేసియున్నావు…
269 అది పరలోకపు గుంపు. ఇంకా వారు విమోచింపబడలేదు. సరే. ఇపుడు.
సహోదరుడా బ్రెన్‌హాం, అందరు గనుక…
ఇపుడు, ఓ క్షణం [సహోదరుడు బ్రెన్‌హాం ఆగాడు—సంపా.] నేనూహిస్తున్నాను. ఏంటి…నన్ను క్షమించండి.
సహోదరుడా బ్రెన్‌హాం, భక్తిగలవారందరు, [అవును] ఎత్తబడుటలో ఎత్తబడిన యెడల ఏలీయా మరియు మోషేలు ఎక్కడ నుండి వచ్చెదరు?
270 అక్కడ ఒక తప్పుయున్నది. అక్కడేదో తప్పుయున్నది. అక్కడ దానిలోయున్నది అంతే. అక్కడ ఒకటి జరిగినది. చూశారా? అక్కడేదో పొరపాటు జరిగినది. అందరూ మంచి అనుభూతిని పొందుచున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పుచున్నది—సంపా.] ఎక్కడ…ఏలాటి వ్యాధి లేక మరేది లేదు?
[సభలో ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, “ప్రకటన 5 లోని 9వ వచనము, చదువుము.”] ప్రకటన, చూద్దాము. ఎక్కడ సహోదరుడా అది [“5.”] 5. [“5.”]
ఓహో, ప్రశ్న! ఆ ప్రశ్న నేను దానికి ఇపుడే జవాబు ఇచ్చాను. ఇపుడు మనం చూద్దాం. “నీవు…” సరైన స్థలము:
ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు: నీవు వధింపబడిన వాడవై…గనుక వారు…క్రొత్త పాట పాడుదురు.
ఇక్కడ అది ఉన్నది! ఇక్కడ అది ఉన్నది! దానిని తప్పుగా చెప్పాను. ఔనా?
…దేవునికి రక్తము ద్వారా మమ్ములను విమోచించియున్నావు…ప్రతి వంశములో నుండియు…
271 అది సరే. ఇపుడు, దానిని గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? ఓహో, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ లేనట్లయితే, ఏమి జరిగియుండును? ఆయన అనుమతించియుండడు…చూశారా, ఆ వచనము యొక్క మొదటి భాగాన్ని మాత్రమే నేను చదివాను. ఆ గడియారాన్ని చూస్తూ, నేను దానిలోనున్న దానిని చూచుటకు ప్రయత్నిస్తున్నాను. అయితే ఆయన నన్ను నిలిపివేయుటను చూశారా? మహిమ! గమనించారా, అవతల భాగాన్ని నేను చదవలేదు. చూశారా, నేనిక్కడ కలిగియున్నాను, “మరియు…” ఇక్కడ చూడుడి, “మరియు వారు—మరియు వారు ఒక క్రొత్త పాట పాడిరి,” మరియు నేను ఆగిపోయాను, చూశారా. అయితే ఇక్కడ చూడండి, “వారు పాడిన పాట చెప్తుంది, ‘నీవు ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోనుండి మమ్ములను విమోచించినావని,’” చెప్పుచు ఒక క్రొత్త పాట పాడిరి. నిజం. అది వారే. మై! ఓ, మై! ఓ, మై! అది చూశారా? మరియు ఆ విధముగానే ఇక్కడ క్రింద, మరొక ప్రశ్న కూడా ఉన్నది.
196. ఆ ఇవ్వబడిన వారిని [c-o-n-t-r-o-…] అలాగే, ప్రకటన 6:11 లో “అక్కడ తెల్లని వస్త్రములు ఇవ్వబడిన వారిని,” “గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా వారి తెల్లని వస్త్రములను కడుగుకొనిన వారిని” వారిని వీరితో నీవు నియంత్రించగలవా?
272 ఇపుడు, మనము ప్రకటన 6 చూద్దాము. ఇక్కడ దీని వలె, దీని మీద నేను తొందరపడలేను. ఎందుకనగా…నేను ఒకటి తప్పు చెప్పబోతున్నాను. ఇపుడు, ఆయన—ఆయన ఆ విధంగా చేయుటకు ఆయన ఇష్టపడుటలేదు. అది సత్యము, కనుక నాకు సహాయము చేయండి. అది సత్యమని దేవుని యొక్క పరిశుద్ధాత్మకు తెలుసు. ఔనా? నేను…అక్కడ…నేను—నేను దానిని గమనించాను…నేను గడియారము వైపు చూశాను, పదకొండు ముప్పయ్ యని నేననుకున్నాను, “ఇపుడు నేను తొందరపడకపోతే నేను రోగుల కొరకు ప్రార్థన చేయలేను.” మరియు దానిని పొందుటకు నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకనగా నేను…నా మనస్సులో ఎంతో…నేను…
273 మీరు గుర్తుంచుకోండి. ఇపుడు మీరు అర్థం చేసుకొనవలసియున్నది, నేను—నేను మానవుడనే, ఔను. నేను—నేను ఏడు దినములుగా అక్కడే యున్నాను, మరియు నా యొక్క…మరియు ఈ మధ్యాహ్నం నాకు వేరేయున్నవి, నేను దేవుని యొద్ద నుండి కనుగొనవలెను.
274 అయితే, నేను ఆ తప్పును చేయకూడదని ఆయనెంతగానో తీర్మానించుకొన్నాడ, ఆ వచనపు మిగతా భాగమును చదువుటకు వారు నన్ను వెనుకకు పిలిచారు. నేను…మరి ఏదో కార్యము అక్కడ నన్ను దాటుకొని దొర్లిపోయినట్లయి, “వెనుకకు వెళ్లు! వెనుకకు వెళ్లు!” అని చెప్పబడినది.
నేననుకున్నాను, “వెనుకకు వెళ్లుటా? ఏంటి? వెంటనే నిలుపు చేసి, రోగులకు ప్రార్థించుటా? అయితే ఏంటి—ఏంటది? నేనేమి చేశాను?” అని నేను ఆలోచించాను.
మరియు నేనది చేరుటకు అప్పుడే నేను ఆరంభము కాగా, ఒకరు నాతో అన్నారు, “మరలా వచనము చదువు” యని. మరియు దానిని మరలా చదివాను. మరియు అక్కడ, ఈ ప్రశ్న యొక్క అడుగు భాగాన, అక్కడ అది ఉన్నది, చూశారా, “ప్రకటన 6.”
275 చూశారా, నేను మొదటిది చదివాను. అది మొదటిగా అన్పించినది. చూశారా, “మరియు వారు ఒక క్రొత్త పాటను పాడిరి.”
అయితే ఇక్కడ క్రింద అదేమిటని చూశారా? తరువాతది క్రింద వచ్చుచున్నది, “మనలను విమోచించెను.” ఖచ్చితం. అది పెండ్లి కుమార్తె, ఎత్తబడిన పరిశుద్ధులు. “మీరు…?” ఇక్కడ ఖచ్చితంగా, గొఱ్ఱెపిల్ల తన చేతిలో గ్రంథాన్ని కలిగియున్నాడు. మధ్యవర్తిత్వపు కృపగల సింహాసనము నుండి ఆయన లేచెను. చూశారా? పరిశుద్ధాత్మ ఏ విధముగా దానిని గమనిస్తుందో మీరు చూశారా? కారణం, గతరాత్రి నేను చెప్పినది అదే.
276 ఆయన గదిలో నాతో మాట్లాడిన తరువాత, నేను ఇక్కడకు వచ్చి మీతో “గొఱ్ఱెపిల్ల ఆ స్థలమును వదలి వచ్చినపుడు,” మరియు దానినంతటిని నేను మీకు బోధించాను. ఓ, మై! ఇపుడు దానిని ఒక పాఠముగా మనము తీసుకొనవచ్చునని నేను అనుకొనుచున్నాను. చూశారా, “గొఱ్ఱెపిల్ల ఆయన సింహాసనమును వదలి బయటకు వచ్చెను.” చూడండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు నేను లేచాను, ఆ వెలుగు క్రీస్తు; ఆయన అక్కడ యున్నప్పుడు, దానిని గూర్చి చెప్పాడు. ఒక మధ్యవర్తిగా, ఆ గొఱ్ఱెపిల్ల ఆయన సింహాసనమును విడిచిపెట్టినపుడు, ఆయన ఇక్కడకు వచ్చాడు, మరియు సంఘమునకు విమోచనా దినము ముగించబడెను.
277 తరువాత విమోచన తెరవబడెను. అది యూదులకు. ఒక లక్ష నలభై నాలుగు వేలమందికి. ఔనా? కారణం ఆయన చెట్టు నరికి వేస్తానని వాగ్దానము చేశాడు, మీకు తెలియునా.
278 ఇపుడు ఇక్కడ, ఇపుడు ఇక్కడ ఆయన బయటకు వచ్చుచున్నాడు, గొఱ్ఱెపిల్ల, అప్పుడు విమోచనా దినము సమాప్తమగును. మరియు విమోచింపబడు వారందరు ఇది వరకే విమోచించబడిరి మరియు గ్రంథములో పెట్టబడిరి. ఆయన ఇక్కడ గ్రంథమును తెరచుచున్నాడు. సరే!
279 ఓ, ధన్యవాదాలు నీకు ప్రభువా. చూశారా? త్వరగా ముగింపవలెనని ఒక విషయము దాటిపోవుటకు ప్రయత్నించుచు తొందరపడి ఉద్రిక్తతకు లోనైన నీ దాసుని క్షమించు.
ఇపుడు, ప్రకటన 6:11 లో “తెల్లని వస్త్రములు వారికి యియ్యబడెను,” మీరు సహించగలరా? [ఏకీభవించగలరా?]…
280 ఇపుడు మనం చూద్దాం, 6:11 సరే. ఇపుడు దీని మీద ఎంతవరకు వచ్చాము? “తెల్లని అంగీలు,” అవును, బలిపీఠము క్రిందనున్న సిలువ వేయబడినవారు. ఆ—ఆ కాలము మధ్యనున్న యూదులు, “వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను.”
…ప్రకటన 7:14 లో, “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని; వారితో?”
281 కాదు. ఇపుడు, అది వ్యత్యాసమైనది, ఖచ్చితం. కారణం, ఇక్కడ చూడండి. “వీరికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను” ఇక్కడ మనమది చూస్తున్నాము. ఇక్కడ అది ఈ కాలమున అని. “వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను,” కృప ద్వారా వారికి. మరియు ఇక్కడ వీరికి, “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనిన వారు” మరియు ఇక్కడ ప్రకటనలో, “దేవునికి ముందు వచ్చు గొప్ప జన సమూహము, ప్రతి వంశము నుండియు, భాష నుండియు, దేశము నుండియు వచ్చువారు.” ఇక్కడ యూదులు ఖచ్చితముగా హతసాక్షులుగా మరణించిన వారు. చూశారా, ఇపుడు, ఇపుడది వాస్తవము, ఇపుడు.
197. సహోదరుడా బ్రెన్‌హాం, భక్తిగలవారందరు ఎత్తబడుటలో కొనిపోబడినట్లయితే, ఏలీయా మరియు మోషేలు ఎచ్చట నుండి వచ్చెదరు? వారు యూదులా? లేక మన కొరకు ఇవ్వబడిన మన ఏలీయా-వారితో ఉండునా?
282 కాదు. అన్యజనులను బయటకు పిలచుటకు ఈ ఆత్మతో అభిషేకించబడు అన్యుడు తీసుకొనిపోబడును. ఎందుకనగా, చూడండి. సంఘమంతా, అందరూ పైకి తీసుకొనబడును. మరియు 11 వ అధ్యాయములోని ఈ ఇద్దరు ప్రవక్తలు క్రిందికి తీసుకొని రాబడతారు. మరియు అన్యులకు కృపాకాలము ముగిసి మరియు యూదులకు అది అనుగ్రహించబడును. కాదు. అతను అదే వ్యక్తి కాదు. నేను—నేనది ఖచ్చితంగా చెప్పగలను. ఇపుడు జ్ఞప్తించుకోండి, నాకు తెలిసినంత వరకు ఖచ్చితం.
ఇక్కడ ఇది ఏం చెప్తుందో చూద్దాం. ప్రశ్న, “గోధుమ మరియు ద్రాక్షారసము…?” ఓ, W-h-e-a-t కాదు. దానిని నేను ఊహిస్తున్నాను, “దాని అర్థం ఏంటి…?” “ఏమిటి” అక్కడ లేదు. అది చెప్పుచున్నది:
198. ఏమిటి మరియు ద్రాక్షారసము, లేక గోధుమ మరియు ద్రాక్షారసము, ప్రకటన 6:6 లో యున్నదేంటి?
ఇప్పుడు ఇక్కడున్న దాని యొద్దకు నేను వెళ్లినపుడు అదేంటి అని మనము చూడగలము.
మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను…ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
283 “గోధుమలు మరియు ద్రాక్షారసము,” దాని అర్థం అదేనని నేను ఊహిస్తున్నాను. అది ఒక దానికొకటి సంబంధం కలదు.
అది ఒక సూచనా, ప్రభురాత్రి భోజనము బల్లయొద్ద తీసుకొను ద్రాక్షారసము…ఒకటవ కొరింథీయులు 11:24?
284 “ద్రాక్షారసము—ద్రాక్షారసము…?” కాదు. వాటిలో ఒకటి ఆత్మీయ సూచన, ఔనా. మరియు ఇంకొకటి వాస్తవంగా వాక్యము యొక్క ప్రత్యక్షత.
199. ప్రభువు శరీరమని మనము వివేచింపకుండుట వలన, ఆ కారణము చేత అనేకులు రోగులుగా నున్నామా? [ఔనా!]
…అయితే ఇప్పుడు ఆరవ ముద్ర తెరువబడుట వలన అది ప్రత్యక్షపరచబడినదా?
285 ఇపుడు, చూద్దాం. ఇపుడు నేను దానిని పొందుకోగలనేమో నన్ను చూడనివ్వండి. అది మీరు కాదు; అది నేను. మీరు…మీరు సరిగ్గా దానిని వ్రాశారు; అది నేను.
ప్రభువు యొక్క శరీరమని మనము వివేచించకుండుట చేత మరియు అనేకులు రోగులుగా యుండుటకు అది కారణమా? [దాని చివర ప్రశ్నార్థకం యున్నది.]
286 సరే. లేఖనము చెప్తుంది, “ప్రభువు శరీరమని వివేచించనందువలన మీలో అనేకులు రోగులును బలహీనులైయున్నారు.” అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే చూడూ, ప్రభువు శరీరము పెండ్లికుమార్తె. మరియు వారిలో అనేకులు వెళ్లిపోతారు, వారు దానితో కలసియుండరు. అది నిజం. ఏ విధంగా ప్రవర్తించవలెనో వారికి తెలియదు. ఏలాటి జీవితమైనా జీవిస్తారు; సంసర్గం తీసుకుంటారు, ఏదైనా చేస్తారు. అది క్రమము కాదు. చూశారా? అబద్ధమాడుచు, దొంగిలించుచు మరియు మద్యపానం సేవిస్తూ సంసర్గము స్వీకరించుట అది—అది—అది భయంకరము. మీరు ఆలాగు చేయకూడదు. చూశారా?
…అయితే ఇపుడు ఆరవ ముద్ర తెరవబడినందున అది ప్రత్యక్షపరచబడినదా?
287 “ఆరవ ముద్ర విప్పబడుట.” ఇపుడు మనము చూద్దాం. కాదు. ఇపుడు, ఆరవ ముద్ర, ఇక్కడ విప్పబడుట మనము చూస్తున్నాము, అది యూదులకు. చూశారా, సంఘము వెళ్ళిపోయినది. ఇది శ్రమకాలము, కాబట్టి అది ఆలాగుయుండదు. కాదు. కాదు. అది కాదు.
288 వాటిలో ఒకటి ఆత్మ సంబంధమైన ద్రాక్షారసము, అనగా వాక్య ప్రత్యక్షత. తరువాత—వాక్య ప్రత్యక్షత ద్వారా విశ్వాసి ఉత్తేజింపబడతాడు. మరియొకటి ప్రభువు బల్ల యొద్ద తీసికొను యేసు రక్తమునకు సూచనగాయున్నది. ఇది నాకు తెలిసినంత మట్టుకు అదే.
200. ముందుగా నిర్ణయింపబడని వారు ప్రభువును అంగీకరిస్తారా? వారు అంగీకరించిన యెడల వారు పడిపోయెదరా?
వారు ముందుగా నిర్ణయించబడినట్లయితే పడిపోరు. కాదు. చూశారా, వారు పడిపోరు.
201. కథోలిజం యూదులను మోసము చేసి మరియు వారి సంపదను పొందుకొనును అని చూపించు ఆ లేఖనము ఎక్కడయున్నది?
289 ఇపుడు, “మృగము మోసము చేసి సంపదను స్వాధీనము చేసికొనునని ఎక్కడ చెప్పినట్లుగానున్నది?” అది దానిని చెప్పుటలేదు. అయితే మనము దానిని అనుకొనుచున్నాము…ఇపుడు గతరాత్రి, మీకు జ్ఞప్తిందా. టేపును జాగ్రత్తగా వినండి. వారు ఆలాగు చేస్తారని నేను చెప్పలేదు. నేను చెప్పాను…చూడండి, కథోలిక్ వారు ప్రపంచములో బహు ధనవంతులైన గుంపు. వారివలె నున్నవారు లేరు. మరియు వారి యొద్ద ఏది లేదో మిగిలినది యూదుల యొద్దనున్నది.
290 ఇపుడు, ఈ దేశపు ఆర్థిక నిర్వహణ అక్కడేయున్నది…లైఫ్‌లైన్ పత్రిక ప్రకారము మనము ఇపుడు చెల్లించు పన్నుల ద్వారా వచ్చు డబ్బు వలన మనము జీవించుచున్నాము, (అది వాషింగ్‌టన్, డి.సి నుండి వచ్చుచున్నది) నేటి నుండి నలభై సంవత్సరముల వరకు చెల్లించినా అది తీరదు. ఇప్పుడు మనము దానిని ఖర్చు చేయుచున్నాము. ఇప్పటి నుండి నలభై సంవత్సరములలో మనము చెల్లించబోవు ఆ పన్నులకు మనము నోట్లను ఇచ్చుచున్నాము. దేశము విచ్ఛిన్నమైపోయినది. ఆమె పనియైపోయినది.
291 ఇపుడు, కాస్ట్రో చేసిన ఒకే ఒక తెలివైన పని ఏదనగా అతడు నకిలీ డబ్బును తయారు చేసి మరియు నోట్లకు, బాండ్లకు డబ్బు చెల్లించి వాటిని విడిపించి మరియు వాటిని కాల్చివేసెను. మరియు ముద్రణ డబ్బును మార్చివేశాడు. అతడు చేయగలిగిన పని అదొక్కటే.
సంయుక్త రాష్ట్రములు చేయగల్గిన ఒకే ఒక పని మిగిలినది. ఇపుడు జ్ఞప్తించుకోండి, ఇది విలియం బ్రెన్‌హాం మాట్లాడుచున్నాడు, చూడండి. ఇది నా అభిప్రాయము. ఇది కేవలం ఊహ మాత్రమే. ప్రకృతి సంబంధముగా చూచుచున్నాను, అది ఒకవేళ లక్షల లక్షల మైళ్ళు దూరంగా యుండవచ్చు. అక్కడున్న దానిని నేను నమ్ముతున్నాను, ఆ డబ్బులో…“ధనాపేక్ష సమస్త కీడులకు మూలము.” అదియే సమస్త కార్యములు చేయునట్లుగా ప్రారంభించుచున్నది.
292 ఇపుడు కథోలిక్ సంఘము వెనుక నుండి ఆరాధనలకు డబ్బులు వసూలు చేసి మరియు అటువంటి వాటి ద్వారా సమకూర్చుట ద్వారా ప్రపంచ సంపదను కలిగియున్నది. మీకు జ్ఞప్తిన్నదా, బైబిలు చెప్తున్నది, “ఆమె ధనికురాలు” అని మరియు ఆమె ఏలాగు ఆయెను. మరియు గుర్తుంచుకోండి. ఒక్క దేశములో కాదు. ఆకాశము క్రిందనున్న ప్రతి దేశము కన్నను ఆమె ధనికురాలు. ఆమె ప్రాకిపోయినది. ఆమె ధనమును కలిగియున్నది. ఇపుడు, వారి యొద్ద ఏమి లేదో, వాల్ వీధి దానిని కలిగియున్నది, అది యూదుల ఆధీనంలోనున్నది.
293 ఇపుడు, మీకు జ్ఞప్తిండును, యాకోబు తిరిగి వచ్చినపుడు అతడు డబ్బును కలిగియుండెను (గతరాత్రి మనమది చూశాము) మరియు అతను ఇశ్రాయేలు అయెను. అతడు నిజంగానే ధనమును కలిగియుండెను. అయితే అతని డబ్బు అతనికి దేనిని కొనివ్వలేకపోయెను. ఏశావు కూడా కలిగియున్నాడు. చూశారా. ఇద్దరూ విరోధులు, మరియు—మరియు. చూడండి. అది పరిపూర్ణంగానున్నది.
294 ఇపుడు ఇక్కడ గమనించండి. డబ్బు విషయంలో వారు కలసిపోవచ్చునని నేను చెప్పాను. మరియు—మరియు రోమన్ శక్తి యూదుల శక్తిని మరియు వారి డబ్బును తీసుకొని నిబంధనను ఉల్లంఘించును. అది ఆ విధంగా ఉండకపోవచ్చును. చూశారా, వారు దానిని విభేదిస్తారు, అయితే ఏ కారణమో నాకు తెలియదు, ’ఎందుకంటె వారు ఏమి చేయబోవుచున్నారనునది నాకు బయలుపరచబడలేదు.
295 అయితే చూడండి. ఇపుడు, ఈ దినము మనము చేయగల ఒకే ఒక కార్యము ఏమి చేయగలము? మనము చెల్లించిన పన్నుల నుండి తీసికొనుచు [ఆ వివరణ సరైనదైనట్లయితే] పన్నులను ఇప్పటి నుండి నలభై సంవత్సరములకు చెల్లించవలయును, చూశారా, మన బంగారము…మనము వాటిని ఖర్చు చేశాము. మనము దివాళా తీశాము. మన యొద్ద ఎట్టి డబ్బులేదు. మనము వెనుకటి కీర్తిని చెప్పుకొని జీవించుచున్నాము.
296 అదే, నేటి దినమున సంఘము చేస్తున్నది, సంఘము చేయుచున్నది; పెండ్లికుమార్తె కాదు. సింహపు కాలపు పరిచర్య క్రిందయుండిన ఆ గతించిన కీర్తి క్రింద వెనుకటి దానిని చెప్పుకొనుచు సంఘము జీవించుచున్నది. “మేమే సంఘము! మేమే తల్లి సంఘము! మేము ప్రారంభించాము…” ఔను. చూడండి? అది వెనుకటి కీర్తి చేత జీవించుచున్నది.
297 మెథడిస్టులు వారి కీర్తి ప్రభావములు చేత జీవించుచున్నారు. బాప్టిస్టులు వారి కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. మరియు పెంతెకొస్తు వారు వారి యొక్క కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. “దేవునికి మహిమ! చాలా కాలము క్రిందట, పరిశుద్ధులు ఆత్మలో నాట్యమాడుచుండిరి, మరియు వారు…ప్రభువు దీనిని మరియు దానిని చేశాడు.” అది, అది జరిగిపోయిన ఒకటి. “సహోదరుడా, ఇపుడు ఎంతోమందిని కలిగియున్నాము.” ఓ. మై! చూడండి. అంతా గతకాలపు కీర్తి ప్రఖ్యాతి!
298 ఈ దేశము పూర్వికుల కీర్తి ప్రభావముల మీదనే కొనసాగుతూ జీవించుచున్నది, ఆ కారణము చేత మనమంతా రక్షింపబడ్డామని తలంచుచున్నాము. ఇశ్రాయేలీయులు వారేమైయున్నదని, వారు ఏమి కలిగియున్నారని; అప్పుడు వారు ఏమైయున్నారని దేవుడు గౌరవించలేదు…గమనించండి.
299 అయితే ఇపుడు, ఇక్కడ నేనేమి తలంచునది, ఏమి జరుగుతుందని నేను తలంచునది ఇక్కడున్నది. అది ఆ విధముగా కాకపోవచ్చును. మనము బలవంతముగా దానిని చేయవలసి వచ్చు ఒక సమయము వచ్చును. మరియు ఆ విధముగా చేయవలసి వచ్చినప్పుడు, కరెన్సీ మార్చుటకు బదులు…ఫిలిప్ మారిస్‌కు అదేమి చేయును? విస్కీ కంపెనీలకు అదేమి చేయును? ఉక్కు పరిశ్రమకు అదేమి చేయును? సమస్త వ్యాపారానికి అదేమి చేయును? అదేమి చేయును? అది వాటిని విచ్ఛిన్నం చేస్తుంది. అవి ముక్కలుగా చేస్తుంది. అయితే “మనము ధనమును అప్పు తీసికొనగలిగిన యెడల.” అతడు ఎంతటి తెలివైన వాడో చూడండి?
300 అప్పుడు దేశము సంఘమునకు అమ్మివేయబడును. మరియు అప్పుడు దేశము మరియు సంఘము తిరిగి ఏకమౌను. అక్కడే ఆమె వచ్చును. చూశారా? అది అదే. గమనించుడి. సరే. ఇపుడు, ఇందులో:
202. ఒకడు ప్రభుత్వముచే అంగీకరింపబడిన ఒక అసోసియేషన్ సంస్థలో ఉంటూ తన హృదయములో నున్న దానినే చేయుచున్నాడు, లేక కడపటి దినము యొక్క సత్యమును ప్రకటించుచున్నాడు. అతను “వేశ్యలలో” ఒకనిగా పేర్కొనబడునా?
301 మనము చూద్దాం. “ఒకడు సంఘశాఖలో వాటి సహవాసములోనున్న యెడల…?” సరే. చూడండి. అసోసియేషన్ సంస్థ; సంస్థకు ప్రభుత్వము మాట్లాడుటకు అధికారము ఇచ్చియున్నది. చూడండి. ఆ కార్యమునకు అతని హృదయముతో ఏ సంబంధము లేదు. చూశారా? ఇపుడు, అతడు నిజమైన విశ్వాసియైతే, మరియు దేవుని ఆత్మవలన జన్మించినవాడైతే, ఏదో ఒకప్పుడు పరీక్షించబడును. చూశారా? అది అంతగా తేటగా ఉండదు. దానిని అతడు చూడలేకపోవచ్చును.
302 ఇపుడు, నేను…చూడండి. స్నేహితుడా, మీరు దీనిని గుర్తుంచుకొనవలెను. దేవుడు—దేవుడు ఎన్నడును, దేవుడు అది చేయలేదు, నాకు జ్ఞప్తిన్నంత వరకు. చూడండి అయితే…
303 చూడండి, యేసు వాటన్నిటికి మూలము, ’ఎందుకనగా ఆయన దేవుడు, ఇమ్మానుయేలు, శరీరధారియాయెను. ఇపుడు, ఈ వ్యక్తిని చూడూ, యేసును. మీకు తెలుసా, ఆయన భూమి మీదకి వచ్చినపుడు, నేను ఊహిస్తున్నాను, లోకంలో పదియవ భాగము ఆయన ఇక్కడున్నాడని ఎరుగరు? యని.
మీకు తెలుసా, ఆ ముందుండు వాడు వచ్చినపుడు, “పర్వతములన్నియు” మరియు ఆ కార్యములన్నియు జరుగుచుండగా ఇశ్రాయేలు ప్రజలలో నూటికి ఒక్కరైనా అది ఎరిగియుందురా? అది వింతగా లేదు?
304 అదెందుకు, యూదులును మరియు ప్రపపంచమంతట ప్రజలు కార్యములెన్నోయున్నవి. ఇపుడు జ్ఞప్తించుకోండి. యేసు ఒక సాక్షిగాను, లోక రక్షకునిగాను వచ్చెను. ఔనా? ఎందుచేత, అక్కడ జనులుండిరి, జనుల తరువాత జనులుండిరి, జనులకు తరువాత జనులుండిరి, అయినప్పటికి ఎవరికి దానిని గూర్చి తెలియలేదు. అయితే లోకం దాన్ని గూర్చి ఏమి తెలియనట్టుగా అది ఆ విధంగానే జరుగుచున్నది. చూశారా?
305 వారినెందుకు ఆయన తెలుసుకోనివ్వలేదు? ఆయన వచ్చాడు, నిత్యజీవమునకు నిర్ణయించబడిన వారే ఆయనను స్వీకరించిరి. మిగతా వారికి ఎంత చెప్పినను ఎటువంటి ప్రయోజనము లేదు, ఎందుకనగా ఆయన వారిని విమోచించలేదు, ఎందుకనగా వారు విమోచించ తగినవారు కాదు. అదెందుకని, ఆ యాజకులు అక్కడ నిలబడియున్నపుడు, ఆయన ఆ స్థానమునకు వచ్చినపుడు ముందుగా నిర్ణయించబడిన వారు ఆయన చుట్టూ గుమికూడిరి. కాబట్టి ఆయన ఆ గుంపుకు ప్రసంగించవలసి వచ్చెను.
306 మరియు ఆయనను ఎరుగవలసిన గొప్ప పండితులు అన్నారు, “ఈ మనుష్యుడు బయల్జెబూబు. ఈ మనుష్యుడు మా మీద అధికారము చేయుటకు వీలులేదు. చూశారా? మేమది చేయము.”
అయితే ఒక చిన్న పాత వేశ్య, ఆమెలో జీవము గలదై, నిత్యజీవమునకు నిర్ణయించబడినదై, మరియు ఆమె యొక్క పేరు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నిరంతరం అక్కడకు నడిచి వెళ్ళింది. ఆ వెలుగు మొట్టమొదటిగా ఆ విత్తనమును తాకుట, త్వరగా ఆమె అది తెలుసుకున్నది. [సహోదరుడు బ్రెన్‌హాం తన వ్రేలిని ఒకసారి విరచుచున్నాడు—సంపా.]
307 చూడూ. అక్కడొక వృద్ధుడైన జాలరి వచ్చాడు. ఇక్కడ ఆయన అద్భుతాలు, సూచక క్రియలు చేస్తూ మరియు పలుపలు విధములగు ప్రజల హృదయాలోచనలు తెలియజేస్తూ, ఆయనను బయలుపరచుకొనుచుండెను.
మై, అక్కడొక పరిసయ్యుడు నిలబడియున్నాడు, మరియు అన్నాడు, “ఈ మనుష్యుడు బయల్జెబూబు” అని. వారి సంస్థకు జవాబు చెప్పవలసియుండెను.
308 వారందరు చుట్టూ నిలబడి, “డాక్టర్ జోన్స్ నీవు అచటకు వెళ్ళి ఈ మనుష్యుడు చెప్పినది వింటావా? ఆయన—ఆయన ఏమి మాట్లాడుచున్నాడో తాను ఎరిగే మాట్లాడుచున్నాడు. ఆయన సాధారణమైన మనుష్యుల వలె మాట్లాడుట లేదు.”
309 “నేను అతను చెప్పునది వింటాను.” అక్కడకు నడచి వెళ్ళాడు, చూశారా. ఆ, దేవుడు—దేవుడు అతని యొద్దకు వెళ్ళాడు.
మరియు ఆయన అక్కడ నిలబడియున్నాడు. ఆయన చెప్పాడు…
వారన్నారు, “ఇపుడు అక్కడ చూడు, అక్కడ చూడూ, అక్కడ ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. అక్కడ ఆయన శిష్యులలో ఒకడు. అక్కడ ఒక మనుష్యుడు వస్తున్నాడు. ఇపుడు, ఆ వ్యక్తి పేరు, అతడు అంద్రెయ. నీకు జ్ఞాపకముందా. ఓ, ఇక్కడున్న వృద్ధులైన జాలరులు నీకు జ్ఞప్తిన్నారా? అది వారే. ఆఁ అక్కడ—అక్కడ సీమోను, అతని సోదరుడు, ఔనా? అది—అది వృద్ధుడైన యోనా బిడ్డలు. ఇపుడు, అక్కడ…చూడూ, అతడు—అతడు ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చుచున్నారు. అదెవరు? ఆఁ. ఇపుడు ఆయన ఏమి చేయును చూడండి. అతడు—అతడు తరువాత వాడు.” అతడు పైకి నడచి వెళ్ళెను.
మరియు ఆయన చెప్పాడు. “నీ యొక్క పేరు సీమోను, మరియు నీవు యోనా కుమారుడవు.”
310 “ఈ మనుష్యుడు బయల్జెబూబు! చూశారా, అతడు ఒక విధమైన ఆత్మను అతనిపై ఉంచుకొనియున్నాడు. అతడొక వింత వ్యక్తి. చూశారా? సూటిగా పోవును, ఆలాటిది మీరు వినవద్దు. చూడండి. దానికి దూరంగా ఉండండి. ఈలాటి కూడికలకు నేను హాజరు కాను. చూశారా. ఈ విషయము అయిన వెంటనే, ఇక్కడ నుండి మేము వెళ్లిపోతాము. మరెన్నడును చుట్టు ప్రక్కలకు రాకూడదు.” చూశారా? ఎందుకని? అదీ అతను తలంచినది. మరియు అయినప్పటికి ఆ ఒక్కడు ఆయనే. చూడూ, ఆయన ఎవరి యొద్దకు వచ్చెనో వారే ఆయనను సిలువ వేశారు. చూశారా?
311 అయితే, అక్కడ ప్రతి ఒక్కరు నెట్టి వేసిన వేశ్యయుండెను! నేను వేశ్య వృత్తిని బలపరచుట లేదు. లేదు. నిజంగా లేదు! అయితే ముందు నిర్ణయ ఏర్పాటులోనున్న విత్తనాన్ని నేను చూపుతున్నాను.
312 ఈ వ్యక్తిని ఇక్కడ చూడండి. ఈ వృద్ధుడైన జాలరి…బైబిల్ చెప్తుంది అతడు విద్య లేనివాడని. ఔనా? అది మాత్రమే కాదు అయితే అతడు పామరుడు. ఇపుడు ఔనా లేక తప్పా? ఓ, ఈనాడు మనకు తెలియుననుకొనుచున్న చాలా విషయాలు మనకు తెలియకుండనే యుంటే ఎంతో బావుండును. గమనించారా? సరే, చూడండి. అతడు రెండూ, విద్యలేని పామరుడు, మరియు ప్రభువైన యేసు సన్నిధానంలోకి అతడు నడుచుకుంటూ వెళ్ళాడు. అతడెవరో ఆయన అతనికి చెప్పాడు. అప్పుడే ఆ కార్యము స్థిరమైంది.
313 ఇపుడు, దానికి వ్యతిరేకముగా ఈ మరొక వ్యక్తి వాదన ఏంటి? “సరే, చూడూ, అతడు అది నమ్మాడు. అదెవరైనది చూడు. అది ఎవరైనది మీకు తెలుసా. సరే. ఆ మనిషి…ఎందుకని. అతడొక చేపలు పట్టువాడు. అతని అ ఆ ఇ లు అతనికి తెలియవు. నేనతని యొద్ద చేపను కొన్నాను; నాకు రసీదు మీద సంతకం చేయలేడు. ఆలాటివాడు, చూడండి, ఆలాటి వ్యక్తి! ఆ విధమైన వ్యక్తులు ఆ విధమైన యొక దానిని వింటారు.” ప్రభువా ధన్యవాదాలు, ఆమేన్. చూశారా. “ఎందుకని—ఎందుకని అతను…అతని తండ్రిని చూడు; అతడు పామరుడు. అతడు వారిని పాఠశాలకు కూడా పంపలేదు.” అయితే అటువంటి వానిని ఆయన పాఠశాలకు పంపి; ఆయన కోరిన విధముగా అతనికి బోధించాడు.
314 పాఠశాలకు వెళ్ళకూడదనుటను నేను సమర్ధించుట లేదు. ఇపుడు మీరు అర్థం చేసుకొన్నారని నేననుకుంటున్నాను. అయితే దానియందున్న ఒక పోలికను మీరు గ్రహిస్తారు. అందుచేత, ఆ కారణము చేత, అది వారి పైకి పోవుచున్నది.
315 మరియు అదేంటి మీకు తెలుసా? ఒకటి కాదు…నే చెప్తున్నాను. ఆ దేశములోనున్న యూదులలో మూడు వంతులలో ఒక వంతు కూడా ఆయన రాకడను గూర్చి ఎరుగకయుండిరి. మరియు—మరియు, తరువాత మూడులో ఒక భాగములో అయిదుగురిని, ఒక భాగములో ఒక శాతము మాత్రమే దానిని అంగీకరించారు. ఆయన ఎంతమందిని కలిగియుండెనో తెలుసా. గుంపు అంతటిలో ఆయనకై సిలువ యొద్ద నిలబడిన వారు పండ్రెండు మంది. మిగతా వారు ఏరి? చూశారా? డెబ్బయ్ మంది వెళ్ళిపోయారు.
316 ఇపుడు, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నపుడు, మరియు వెళ్ళుచున్నపుడు ఆయన సిద్ధాంతాన్ని గూర్చి ఏమి చెప్పలేదు; ఆయన కొనసాగిపోతూ రోగులను స్వస్థపరుస్తు తదితరమైనవి చేస్తున్నాడు. ఓ. మై! అది, దేవుని ఆత్మ ఆయనపై యుండెను. మీరది నమ్ముతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పినది—సంపా.] ఆయన రోగులను స్వస్థపరుస్తున్నపుడు, అద్భుతం! “అది గొప్ప రబ్బీ అన్నారు. సహోదరులారా మీరందరు, మీరంతా మీ ఆలయంలో ఆయనను ఉంచుకొనవలసినది. అబ్బాయ్, శక్తిని గూర్చి మాట్లాడు, అతను నిజంగా రోగులను స్వస్థపరచగలడు! నీవు చూడవలసియున్నది, అతనికి స్వస్థతా వరమున్నది.”
317 సరే. కావచ్చు. దానికి వారి యొద్ద కొన్ని అనుకరణలున్నవి. ఇక్కడకు వారు వచ్చి, ’ఎందుకనగా, ప్రతి గుంపు తన స్వంత వారిని కలిగియుండవలెను.
ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు. తరువాత, మొదటి విషయం మీకు తెలుసా. ఒక రోజు ఆయన కూర్చున్నాడు.
“ఓ, తప్పక రబ్బీ, మేము నీతో వస్తాము.”
318 “మంచిది, కూర్చోండి. మనము వెళ్దాం.” సరే, డెబ్బయ్ మందిని పంపాడు.
తరువాత ఒకరోజు, గొప్ప అద్భుతం జరిగిన తరువాత ఆయన కూర్చొని, వాక్యమును గూర్చి చెప్పుట ప్రారంభించాడు, చూడండి. “ఊదుట ప్రారంభించాడు…” సరే. వాక్యమును చెప్పుట ఆయన ఆరంభించాడు, సత్యమును గూర్చి.
వారన్నారు, “ఆఁ. ఇపుడు ఒక నిమిషం ఆగు! హుం! దీనిని గూర్చి నాకు తెలియదు.” ఇది వారి సిద్ధాంతమునకు విరుద్ధం. అన్నారు, “సరే, సమాజ మందిరాన్ని నేను వదలి పెట్టానని, ఆలాటివన్నీ చేశానని నాకు తెలుసు. అయితే మేము తప్పు చేసియుండవచ్చు. సహోదరులారా, మేము వెనుకకు వెళ్ళిపోవుట మంచిది. ’ఎందుకనగా ఆ మనిషి ఉపమాన రీతిలో మాట్లాడుచున్నాడు. అతడొక రకమైన వింత వ్యక్తి. నేను అది అర్థం చేసుకోలేకున్నాను.” చూశారా? ఏంటది? ఆరంభం నుండి విత్తనము ముందు నిర్ణయంలో లేదు.
319 అటుతరువాత, ఆ మొదటి విషయం ఏంటో తెలుసా, ఆయన యొద్ద ఒక చిన్న సేవకుల గుంపుయున్నది, ఆయన వారితో మాట్లాడాడు. వారన్నారు, “ఆఁ! హుం! మనము కూడా వెనుకకు వెళ్ళుట మంచిది. తిరిగి వెళ్ళి సంస్థలో చేరి, తిరిగి మన కాగితములు తీసుకొందాం. చూశారా. కారణం ఈ మనిషి, ఈ మనిషిని ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన చెప్తున్నాడు, ఇది ఇక్కడ మరియు అతడు చెప్తున్నాడు ఇది ఇక్కడ. అఁ!”
320 ఆ ఇతరులు ఆ విధంగా అర్థం చేసుకొనలేరు. వారిలో కొందరికి ఆయన ఉపమానములు చూపుచున్నాడు, అయితే ఇతరులకు కాదు.
కాబట్టి వారు వెళ్ళిపోయారు. అటు తరువాత ఆయన తిరిగి ఇక్కడ నిలబడియున్న పండ్రెండు మంది వైపు చూచి, అడిగాడు, “మీరూ వెళ్ళాలని ఉన్నారా?” చూశారా.
321 ఇపుడు గమనించండి. పేతురు అన్నాడు, “అదేంటో మీకు తెలుసా? ప్రతిసారి అక్కడున్న ఆ పాత స్థలమునకు నేను హాజరయ్యాను, ప్రపంచములో వేరే ఎచటకు నేను వెళ్ళగలను? నేనెక్కడకు వెళ్ళగలను? ఎచటికి—నేనెచటికి వెళ్ళగలను? తరువాత నేను—నేను నేనిక్కడ ఒక పని చేసిన తరువాత…మరియు, తిరిగి ఆ పెంట కుప్పల మీదికి; ఎక్కడైతే ప్రపంచము యొక్క మురికియంతా యున్నదో అట్టివాని మీదికి నేను వెళ్లజాలను. చూడూ. నేను—నేనూ…నేను ఎక్కడకు వెళ్లగలను. నేను—నేనది చేయలేను.”
322 ఆయన చెప్పాడు, “తరువాత, సరే, వచ్చి వెంబడించు.” ఇపుడు, అక్కడే నీవున్నావు, చూశారా? అప్పుడేవిధంగా ఉంది. పండ్రెండు మంది సుమారు రెండున్నర మిలియన్ల మందికి మరియు లోక రక్షకుడు బిలియన్ల మందిలో అయినా దీనునిగా యుండెను. చూశారా. దీనులుగా యుండుడి. గమనించుడి.
ఇపుడు, ఆ అందరి పరిసయ్యులలో; ఒక చిన్న వేశ్య అక్కడకు వచ్చినది. ఆమె అన్నది, “ఇదిగో, నీవు తప్పకుండా ప్రవక్తవైయుండవలసియున్నది! ఇపుడు అది మాకు తెలుసు, మెస్సీయా వచ్చును, ఆయన వచ్చినపుడు ఆయన దానిని చేయునని మాకు తెలియును.”
ఆయన అన్నాడు “ఆయనను నేనే.”
323 ఆమె అన్నది “అది అదే,” ఆమె వెళ్ళిపోయినది. ఆమెను ఒకసారి ఆపుచేయ నీవు ప్రయత్నించవచ్చు? నీవు అది చేయలేవు.
203. సహోదరుడా బ్రెన్‌హాం, ప్రభువైన యేసు నామములో శుభములు. మత్తయి 22:11 లోనున్న ఆ మనిషి, ఎవరైనది దయచేసి వివరించుము. పెండ్లి వస్త్రము లేని మనిషి, పెండ్లి వస్త్రము ధరించుకొనకుండా ఈ మనిషి పరలోకములోనికి ప్రవేశింపలేడని నాకు తెలియును. ఇతడు ఒక అతిధియనియు పెండ్లికుమార్తె కాదనియు నాకు తెలియును.
324 ఔను, అవునది నిజము. అతడు…అఁ. అతడు మెల్లగా దూరి వచ్చెను. చూశారా? ఇప్పుడు చూడూ. ఇపుడు, నేను…దానిపై సంపూర్తి ప్రసంగం నేను చేయవలెను.
ఇపుడు, రోగుల కొరకు ప్రార్థించుటకు, ఇది ముగించుటకు నాకు పది నిముషములున్నవి. సగము భాగము నేను ముగించానని అనుకుంటున్నాను. గమనించండి. అయితే నేను—నేను తప్పకుండా, ఇది అయిన తరువాత నేను త్వరపడుచున్నాను. ఔనా?
325 ఇక్కడ ఏమి జరిగింది, మీరు తూర్పు దేశము ప్రజల ఆచారములు ఎరిగినట్లయితే, చూడండి. పెండ్లి కుమారుడు, తన యొక్క పెండ్లి కొరకు ఆహ్వానాలు ఇచ్చినట్లయితే, అతడు చాలా ఆహ్వానాలు ఇచ్చును. మరియు అతడు ఇచ్చిన ప్రతి ఆహ్వానమునకు లోనికి వచ్చిన ప్రతివానికి కప్పుటకు ద్వారము నొద్ద ద్వారపాలకుని నిలబెట్టును. వచ్చినవాడు పేదవాడు గాని లేక ఏలాటివాడైన…అతడు ధనవంతుడైన, పేదవాడైన, అతడెవరైన, అందరు, అతడు ఈ పెండ్లి వస్త్రము ధరించుకొనవలెను.
326 వారు తలుపునొద్ద నిలబడియున్నట్లయితే, వారు దీనిని అతనిపై కప్పుతారు, అది అతని బాహ్య రూపమును కప్పుతుంది. అతడు ఆహ్వానించబడతాడు. అతడు కోటీశ్వరుడైనా లేక అతడు ఒక దరిద్రుడైనా, అతడు ఒక వ్యవసాయదారుడైనా, గోతులు త్రవ్వేవాడైనా లేక అతడేదైనా లేక ప్రభుత్వపు హోదాలోయున్ననూ, అతడు—అతడిక్కడ వస్త్రము ధరించుకొనవలయును. ఎందుకనగా అతడు ద్వారములోకి ప్రవేశించునపుడు, ద్వారము నొద్ద వస్త్రము అతనిపై ధరించబడుచున్నది.
327 ఇపుడు, పరిశుద్ధ యోహాను 10 తీసుకోండి, అదే అనుకుంటాను, ఆయన అన్నాడు, “నేనే ద్వారమును” అని. చూశారా? “మీరు లోపలకు ప్రవేశించు…ద్వారము నేనే.” ఇపుడు, అతడు అక్కడ ద్వారములో నిలబడ్డాడు. ఇక్కడున్న మనిషి అతనికి వస్త్రమును, పరిశుద్ధాత్మను ధరింపజేస్తున్నాడు. అతడు లోపలకు వచ్చునపుడు నీతియను వస్త్రమును అతనికి ఇచ్చుచున్నాడు.
328 ఇపుడు, ఈ మనిషి, ఇక్కడకు ఒక కిటికీ ద్వారా, కన్నం ద్వారా, ఒక సంస్థ ద్వారా వచ్చాడు. మరియు అతడు లోపలకు వచ్చి బల్ల యొద్ద కూర్చున్నాడు. అటు తరువాత పెండ్లి కుమారుడు వచ్చి, ఆయన చుట్టూ చూశాడు. అతడు…అతడు…కొన్ని వింతైన బాతులు, ముందున్నవి, అతను వింతైన బాతు. చూడూ? “పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు ఇవన్ని లేకుండా ఇక్కడ నీవేమి చేయుచున్నావు? ఇక్కడకు ఏలాగు వచ్చావు?” తలుపు ద్వారా కాకుండ ఇంకో రీతిగా అతడు లోపలకు వచ్చాడు. మరియు సరియైన ఆహ్వానం లేకుండా అతడు వచ్చాడు. చూశారా? అతడొక విధమైన విద్యా ప్రణాళిక ద్వారా వచ్చాడు. లేక ఆలాటి విధంగా. అతడు లోపలకు వచ్చాడు.
329 మరియు, ఆయన వారితో చెప్పాడు, “వీని కాళ్ళు, చేతులు కట్టి; వెలుపట చీకటి లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును” అని. చూశారా? అతడు శ్రమ కాలంలోకి వెళ్ళిపోయాడు. ఔనా? అతడు ద్వారము ద్వారా లోపలకు రాలేదు, కాబట్టి. సరే. ప్రశ్న:
204. ప్రకటన 11:3 లో చెప్పబడిన ఏలీయా మలాకీ 4 లో నున్న ఏలీయా ఒక్కరేనా? మరియు ఇతర సాక్షులు…తక్కిన ఇద్దరు సాక్షులు వేర్వేరు వ్యక్తులా, వేర్వేరా?
330 ఔను. మలాకీ 4 లోని ఏలీయా మలాకీ 3 లోని ఏలీయా కాడు. గతరాత్రి మనము అది చూశాము. “మరియు ఆ ఇరువురు సాక్షులు వేర్వేరు వ్యక్తులా?” ఔనండి. మోషే మరియు ఏలీయా; మన యొక్క ప్రత్యక్షత. ఇపుడు, ఎక్కువ సేపు నేనిక్కడ మిమ్ములను ఉంచను.
205. మొదటి రాజులు 19, సహోదరుడా బ్రెన్‌హాం, నేను నమ్ముచున్నాను, మోకాళ్ళు వంచని వారి యొక్క సంఖ్య…
331 ఔను. అది వాస్తవము. ఏడు వందలకు బదులు…ధన్యవాదాలు. అది వాస్తవం. అది ఏడు వేలకు బదులు ఏడు వందలు…“సహోదరుడా బ్రెన్‌హాం…” ఏడు వందలకు బదులు ఏడు వేలు. ఇపుడు అది చూడండి?
332 మీకు తెలుసా, వాస్తవముగా—బోధించుటకు ఒక వ్యక్తి ఈ విధముగా వచ్చినపుడు…నేనొకటి మిమ్ములను అడగాలని ఆశిస్తున్నాను, తద్వారా మీరు అర్థం చేసుకుంటారు.
ఏలీయా అరణ్యములో నుండి వచ్చినపుడు, అతడొక వర్తమానము కలిగియుండెను. అతడు ఆ అరణ్యములో నుండి కొన్ని వింతైన అడుగులు వేసుకుంటూ నేరుగా వచ్చి రాజుతో చెప్పాడు, “నేను తిరిగి దాని కొరకు పలుకు వరకు ఆకాశము నుండి మంచైనను పడదు” అని అన్నాడు. ఆ మాటలే అతడు కలిగియున్నాడు. మరియు ఆ విధముగా చెప్పిన తరువాత తిరిగి అరణ్యమునకు వెళ్ళిపోయాడు, ఎవరితో ఏమి చెప్పలేదు. చూశారా?
333 అతను అక్కడ ఇంకొక వర్తమానమును పొందిన తరువాత, అతడు వచ్చి ఈ వర్తమానము చెప్పాడు. మరియు వెను తిరిగి అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. చూశారా?
334 ఇపుడు, మీరు గమనిస్తే, ఆ మందిరానికి నేను మూలరాతిని వేస్తున్నప్పుడు, ఆయన చెప్పాడు, “సువార్తికుని పనిచేయుము” అని. ఇపుడు పని విభజింపబడు సమయము వచ్చినది. ఒక పని జరుగుచున్నది. తరువాత…చూడండి, నేనిక్కడకు వచ్చి సువార్తికునిగా మరేదో చేయుటకు ప్రయత్నించుట, మీరెక్కడ యున్నారో చూడండి. చూశారా? మీరు…ఓ, నేను—సంఘము, అది అర్థం చేసుకొనుటకు ఆత్మీయ స్థితికి ఎదుగవలెనని నేను ఎదురు చూచుచున్నాను.
206. సహోదరుడా బ్రెన్‌హాం, ఏలీయా మూడు సార్లు రావలయునని నేను అర్థం చేసుకున్నాను. అతడు ఇది వరకే రెండు సార్లు వచ్చెనని మరియు మరలా వచ్చునని నీవు మాకు చెప్పావు. ఇపుడు, ఏలీయా ఆత్మను తనపై కలిగియున్నతను, మరియు ఇరువురైన మోషే మరియు ఏలీయాల్లో అతడు అక్కడ ఒకనిగా నుండునా?
335 కాదు. కాదు. అతడు అన్యుడైయుండవలసియుంది, అన్యుల సంఘానికి, చూశారా. తన స్వంత ప్రజల యొద్దకు దేవుడెప్పుడు పంపుతాడు, చూశారా. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.” ఆయన ఎల్లపుడు ఆయన కాలము యొక్క వర్తమానమును పంపును.
336 దేవుడు, యూదులతో సంప్రదింపులు చేస్తున్నపుడు, ఏ అన్య ప్రవక్తలు రాలేదు. దేవుడు, అన్యులతో సంప్రదింపులు చేస్తున్నపుడు, యూదా ప్రవక్తలు లేరు. దేవుడు యూదుల వైపునకు మరలా తిరిగినపుడు, అన్య ప్రవక్తలు లేరు. ఔనా? నా భావమేదో మీరు చూశారా? సరే.
ఎత్తబడుట జరిగిన తరువాత…
337 ఇపుడు ఒక వర్తమానము నుండి ఇంకొక వర్తమానమునకు వెళ్లునపుడు, మధ్యలో ఒక సమయముండును. అది ఈ విధముగా రావలెను. చూశారా, పౌలు అన్యులకు తెలియపరచిన రీతిగా నేనది విశదపరచాను. సరే.
207. ఎత్తబడుట జరిగిన తరువాత, ఎత్తబడుటలో విడువబడిన సంఘము ఏదైనను అంతము నందు రక్షించబడునా?
338 లేదు. హు—హు. కారణం రక్తము ఇక లేదు. చూడండి. అక్కడ మధ్యవర్తిత్వము లేదు. అన్యజనులు కాలము ముగించబడినది. ఎత్తబడుట తరువాత ఎవరూ రక్షించబడరు లేక సంఘములో, ఉహు—ఉహు, సంఘము. “అపవిత్రుడు ఇంకను అపవిత్రునిగా ఉండనిమ్ము; పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్ము” చూశారా? సంఘము వెళ్ళిపోయిన తరువాత అది జరుగును.
208. సహోదరుడా బ్రెన్‌హాం, మొదటి ముద్ర యొక్క వర్తమానంలో, నీవు దానియేలు యొక్క డెబ్బది వారములను గూర్చి చెప్పుచున్నపుడు నేను గమనించాను. దానియేలులో, దానియేలు యొక్క టేపులలో నేను విన్నాను. సువార్త యూదులకు తిరిగి వచ్చినపుడు, డెబ్బది వారములు ప్రారంభమగును. అక్కడ ఒక డెబ్బది…ఒక వారము, అనగా ఏడు సంవత్సరములు యూదులకు మిగిలియున్నవా? లేక ఇంకను అక్కడ ఒక అర్ధ వారము, అనగా ఒక మూడున్నర సంవత్సరములు మాత్రమే వారికి మిగిలియున్నవా?
339 కేవలం ఒక అర్ధ వారం. ముందుగా ఊహించిన రీతిగా, మొదటి అర్ధ వారము యేసు ప్రవచించాడు. వారికి కేవలం అర్ధ వారము మాత్రమే మిగిలింది.
సహోదరుడా బ్రెన్‌హాం వారమంతా నీవు రోగుల కొరకు ప్రార్థించలేదు కనుక నీవు…? [అది దానికొరకైన విన్నపము.]
సహోదరుడా బ్రెన్‌హాం, పరిచర్య తరువాత నీవు నన్ను చూస్తావా…? [అదొక విన్నపము అక్కడ, చూడండి.]
209. సాతాను వెయ్యేండ్లు బంధింపబడి మరియు ప్రకటన 20:8 ప్రకారము యుద్ధమునకు విడిపింపబడును—దానిని మీరు దయచేసి వివరించగలరా? నాలుగవ ముద్రలో చెప్పబడిన హార్మెగిద్దోను యుద్ధమునకును దీనికిని ఎటువంటి సంబంధము కలదు? మరియు నూతన భూమిలోనున్న జనుల నుండి గోగు మాగోగు పోగు చేయబడెదరా?
340 సరే. ఇది చాలా పెద్దది, మరియు నేను—నేను దానిని సూటిగా చెప్పవలయును, చూడండి. ఇపుడు మొదటి విషయము, “అది…?” ఇపుడు, దానిని నేను వివరించలేననుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను.
సాతాను ఒక వెయ్యి సంవత్సరములు బంధింపబడి, ప్రకటన 20:8 లో నున్న యుద్ధమునకు మరలా ఎట్లు విడిపంపబడునో దయచేసి నాకు వివరించగలరా?
341 అది హార్మెగిద్దోను యుద్ధం కాదు, హార్మెగిద్దోను యుద్ధము ఇటువైపున జరుగును, చూడండి. సరే శ్రమకాలం ముగిసిన తరువాత.
ఇపుడు దీనికిని గోగు మాగోగు యుద్ధమునకు ఏంటి సంబంధం?
342 ఏమియు లేదు. ఒకటి ఈ వెయ్యి సంవత్సరములకు ముందు, మరొకటి ముగింపు…వెయ్యి సంవత్సరాల ముగింపు తరువాత.
…నాలుగవ ముద్రలో చెప్పబడిన ప్రకారము? నూతన భూమిపైనున్న జనులలో నుండి గోగు మరియు మాగోగు పోగు చేయబడెదరా?
343 సాతాను తన యొక్క చెఱ నుండి విడిపింపబడి మరియు అది ఈ స్థలమునకు తీసుకొని వచ్చుటకు జనులలోని దుర్మార్గులను పోగుచేయును. మరియు దేవుడు ఆకాశము నుండి అగ్నిని, గంధకమును కురిపించును మరియు వారు దహించబడతారు. చూడండి. అవి మొత్తము రెండు యుద్ధములు. ప్రశ్న:
210. రోమన్ కథోలిక్ సంఘము వలన వధింపబడిన అరవై ఎనిమిది మిలియన్లు, వారిని గూర్చి చరిత్రలో ఏ కాలంలో ఇది జరిగినది? మరియు ఎంత కాల వ్యవధిలో ఇది జరిగెను?
344 స్మక్కర్ యొక్క మహిమ గల సంస్కరణ అనునది తీసుకోండి. కొందరు పండితులు అది కలిగియున్నారని నేననుకుంటున్నాను. అది సంఘము యొక్క చరిత్ర. అది ఏ పుటలోయున్నదో నేను మరచాను, అయితే అది వారికి, ఆఫ్రికాలోని హిప్పో వాసియగు పరిశుద్ధ అగస్టీన్ ద్వారా ఇవ్వబడెను. అది క్రీ.శ 354 అది ఐర్లండ్‌లో మూకుమ్మడి హత్యాకాండ జరుగుచు 1850 వరకు యుండెను. చూశారా. కాబట్టి ఆ సమయము క్రీ.శ 33 నుండి లేక క్రీ.శ 30…354. నేను సరిగా చూస్తాను. చూడండి. క్రీ.శ 3-5-4 నుండి క్రీ.శ 1-8-5-0 వరకు, 1850, చరిత్ర ప్రకారము, రోమ్‌లోనున్న పోపుతో ఏకీభవించని కారణంగా, రోమన్ హతసాక్షుల గ్రంథములో వ్రాయబడినట్లు అరవై ఎనిమిది మిలియన్ల పొటస్టెంటులు చంపబడ్డాడు. అది చరిత్రయైయున్నది. అది తప్పుయని చెప్తే, సరే, అలాగైతే జార్జి వాషింగ్‌టన్ లేక లింకన్ ఇచ్చట లేనట్లు అది అర్థమిచ్చును. ఎందుకనగా, అది చూచుటకు మనలో ఎవరు వెనుక లేరు. అయితే వారిక్కడ యున్నారని నేను నమ్ముతున్నాను. వారిక్కడ నున్నారనుటకు సూచనలు నేను నమ్ముతున్నాను.
211. సహోదరుడా బ్రెన్‌హాం, 19వ అధ్యాయములో…18వ వచనము, “అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.” నాకు దీనిని గూర్చి దయచేసి వివరించుము—ఏడు వందలను గూర్చి.
345 అది ఏడు వేలు. ఔనా? మరియు ఆ “బయలునకు ముద్దు పెట్టుకొనుట,” మీకు తెలియదా…ఇక్కడున్న వారు, క్రితం ఎంతమంది కథోలిక్‌లుగా యుండిరి? నిజంగా. గమనిస్తున్నారా? మీరు విగ్రహాలను ముద్దు పెట్టుకొనియుందురు. ఔనా?
346 మరియు, జ్ఞప్తించుకోండి, బబులోను మరియు నెబుకద్నెజరు కాలంలో, అన్యజనుల రాజ్యము ప్రారంభించబడినపుడు, చూశారా, అన్యజనుల కాలము మొదలైనపుడు మనుష్యుని ఆరాధించుట వచ్చినది. నెబుకద్నెజరు మనుష్య విగ్రహమును చేశాడు. మరియు మీరు ఆత్మీయ మనస్సు కలిగియున్నట్లయితే, ఇపుడు ఈ ప్రత్యక్షతను వినండి. ఆ ఆత్మ మరియు అతని యొక్క ప్రత్యక్షత వలన దానియేలు యొక్క విగ్రహమును చేశాడు. భక్తిపరుడైన ఒకడు ఆరాధింపబడుట. అది చూశారా? ఎందుకనగా అతనికి అతడు బెల్తెషాజరు అని పేరు పెట్టెను, ఔను కదా? లేక బెల్తెషాజరు అతని దేవుని యొక్క పేరు. ఆ దేవుని యొక్క విగ్రహమును అతడు చేశాడు. అదే దానియేలు యొక్క విగ్రహము. దానియేలు, తన స్వంత విగ్రహమునకు సాగిలపడుటకు తిరస్కరించాడు. ఔనా? ఔనా?
347 ఇక్కడ మరలా అది. చూశారా. ఇపుడు గమనించండి. రాజైన నెబుకద్నెజరు ద్వారా బబులోను దినాలలో అన్యుల రాజ్యము ఆరంభించబడినది. ఒక అన్య రాజు, పరిశుద్ధుడైన ఒకని తీసుకొని…పరిశుద్ధుడైన ఒక మనుష్యుని ప్రతిమను తీసుకొనుట ద్వారా, బలవంతంగా అది ఆరాధించుట ద్వారా సంఘాన్ని రాజ్యాన్ని ఐక్యపరచాడు. ఒక రాజకీయ అధికారము ద్వారా గోడ మీద చేవ్రాత వలన అన్యజనుల రాజ్యము పాదములయందు సమాప్తమగును. అదే కార్యము ఒక పరిశుద్ధ వ్యక్తి యొక్క ప్రతిమను తయారు చేసి, మరలా ప్రతిమలను ముద్దు పెట్టుకొనుటకు బలవంతపరచినది. నిశ్చయముగా.
212. సహోదరుడా బ్రెన్‌హాం, ఈ ఎత్తబడుట సంభవించునపుడు—ఎత్తబడుట సంభవించునపుడు తప్పు, ఒప్పు తెలియని చిన్న పిల్లలు ఎత్తబడెదరా?
గ్రంథములో వారి పేర్లు ఉన్న యెడల. అవును. అది నిజం. చూశారా? సరే.
213. సహోదరుడా బ్రెన్‌హాం, గత రాత్రి…అక్కడ రక్షించబడవలసియున్నవారు ఏడు వందలమంది యున్నారనియు, వారు ఏలీయా యొక్క బోధ క్రింద రక్షించబడెదరని నీవు చెప్పావు. నీ అర్థం ఏడు…?
348 ఆఁ. ఔను. అందుకొరకు దయచేసి నన్ను క్షమించండి. చూశారా. అది సరియే. చూడండి. నేను చెప్పాను.
సహోదరుడా బ్రెన్‌హాం, నీవు…? నీవు తెరచిన తరువాత…సహోదరుడా బ్రెన్‌హాం, (d-e-s-p-e…) కాలము…
నన్ను క్షమించండి “కాలము…?” ఇపుడు, అది నీవు కాదు. అది నేను, ఔనా.
214. నీవు ఏడవ ముద్రను తెరచిన తరువాత కృపా కాలము ముగియునా?
349 కాదనుకుంటాను. కాదు. కాదు. స్నేహితులారా, అది, ఇపుడు మీ మనస్సులోకి తేకండి. చూడండి. మీరు ముందుకు సాగండి. బంగాళాదుంపలు త్రవ్వండి, సంఘమునకు వెళ్లండి, మరియు కొనసాగించండి. అది ఉదయం జరిగినట్లయితే, మీరు ఏ కార్యమైతే చేయవలసియున్నదో దానిని చేయుచునుండండి. వద్దు—ఆరంభించకండి…
350 చూస్తున్నారా, మీరు చేసినట్లయితే, అది ఏ ఉద్దేశ్యము కొరకై చేయబడెనో, ఆ కార్యము నుండి మీరు దూరముగా త్రిప్పివేయుచున్నారు. మరియు మీరు విషయాలను గూర్చి మీ స్వంత అభిప్రాయాలు కలిగియున్నారు. మీ స్వంత అభిప్రాయాలను తీసుకొనవద్దు. మీరు కూర్చొని ఆ విధమైన కార్యములు వినునపుడు “ప్రభువా, ధన్యవాదాలు నీకు; నేను నీకు కొంచెం సమీపంగా నడుచుచున్నాను,” అని చెప్పండి. చూశారా? “నేను నడవబోవుచున్నాను…” పని మానేసి, “నేను సమస్తమును అమ్మివేయుచున్నానని” చెప్పవద్దు.
351 మేము విడిచిపెట్టుటకు కొంచెం ముందు, గత దినము, నార్త్ కరొలినా నుండి ఒక మనిషి ఇక్కడకు పరుగెత్తుకొని వచ్చాడు. మరియు అతడు చెప్పాడు, “దేవునికి మహిమ! ఆ గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడో నాకు చెప్పగలవా?” అని.
మరియు నేను చెప్పాను, “లేదు” అని.
352 “ఓ, అవునండి,” అన్నాడు, “ఈ వ్యక్తి…” అన్నాడు, “ఈ వ్యక్తి ఆడియో మిషన్ యొక్క అధ్యక్షుడు.”
నేనడిగాను, “ఏంటి?”
చెప్పాడు, “ఆడియో మిషన్.”
“నాకు అర్థం కాలేదు” అని నేను చెప్పాను.
మరియు అతడు చెప్పాడు, “ఓ,” అన్నాడు, “ఈ వ్యక్తి అధ్యక్షుడు.”
నేను అడిగాను “అతని పేరు ఏమని చెప్పావ్?”
353 అతడన్నాడు, “బ్రెన్‌హాం అని అనుకుంటాను. ఆ విధంగా, బ్రౌన్ లేదా బ్రెన్‌హాం.”
నే చెప్పాను, “సరే, నా పేరు బ్రెన్‌హాం.”
అతడడిగాడు, “ఆడియో మిషన్ యొక్క అధ్యక్షుడవా నీవు?”
“కాదండి,” అని నేనన్నాను.
అతడడిగాడు, “సరే. వెయ్యేండ్ల పాలన ఎక్కడ?”
“నాకు తెలియదు” అని చెప్పాను.
354 అతడడిగాడు, “ఏంటి, నీవు ఒక…నీ—నీ అర్థం అది—అది—అది—అది ఇక్కడ జరుగుచున్నది, నీకు తెలియదా?”
నేను చెప్పాను, “లేదండి, నాకు తెలియదు,” అని.
355 అతడన్నాడు, “సరే. దేవునికి మహిమ కలుగును గాక!” అన్నాడు, “నాకు కొందరు—కొందరు స్నేహితులున్నారు, వచ్చి నాతో చెప్పారు,” “పనిని వదలిపెట్టమని,” చెప్పారు. అతడింకా తన ఉద్యోగ వస్త్రములతోనే యున్నాడు. “సహోదరుడా నాకు వెయ్యేండ్ల పాలన కావలెను,” అని అడిగాడు.
356 నేను చెప్పాను, “సరే. నేను—నీవు కొద్దిగా అయోమయ స్థితిలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. ఔనా, సహోదరుడా?”
357 ఆ సమయానికి ఒక అద్దె కారు వచ్చింది, ఆమె అన్నది, “నిలువు! నిలువు! నిలువు!” అని చెప్పింది. ఒక చిన్న స్త్రీ అక్కడకు వచ్చింది, అన్నది, “ఇపుడు నీవు నా భర్తకు ప్రార్థించబోవుచున్నావు.”
నేనన్నాను, “ఔనమ్మా. ఏంటి—ఏంటది?”
358 ఆమె అన్నది, “సరే, నీ యొద్ద ప్రార్థన చేయించుకోవలెననిన ఒక నెల మీ కొరకు వేచియుండవలెను” అని విన్నాను అని ఆమె అన్నది.
“ఏంటీ?” అని నేను అడిగాను.
359 ఆమె చెప్పింది, “ఔనండి” చెప్పింది, “అయితే నేను నిరాశలోనున్నాను. నీవు నా భర్తకు ప్రార్థించవలసియున్నది.”
నేను చెప్పాను, “తప్పక. అదెక్కడ? అతన్ని తీసుకొనిరా.”
360 అక్కడ నిలబడియున్న వ్యక్తి నన్ను చూస్తూ, “రోగుల కొరకు కూడా నీవు ప్రార్థన చేస్తావా?”
నేనన్నాను, “ఔనండి” అని.
361 అన్నాడు, “నీ యొక్క పేరు ఏమని చెప్పావు, బ్రెన్‌హామా?” నే చెప్పాను…“వెయ్యేండ్ల పాలన గూర్చి నీకేమి తెలియును?”
362 నేను చెప్పాను, “సరే. నేను…కాదు, నేను కాదు.” నేను చెప్పాను, “నేను అర్థం చేసుకొనుట లేదు. అది బైబిల్ గ్రంథములోనేయున్నది.”
363 అతడు చెప్పాడు, “కాదు, ఇది ఇపుడు కాదు. ప్రజలు అన్ని చోట్ల నుండి వచ్చారు.”
నేను అడిగాను “అదెక్కడయున్నది?”
అతడు చెప్పాడు, “జఫర్‌సన్‌విల్, ఇండియానా, వంతెన క్రింద.”
364 నేనన్నాను, “అయ్యా, నీవు నన్ను అయోమయ స్థితియందుంచుచున్నావు” మరియు నేను అన్నాను, “అందును గూర్చి నాకు ఏమి తెలియదు.” నేను చెప్పాను, “మనము లోపలకు వెళ్ళి లోపల కూర్చుందాం. మనము ఈ కార్యము గూర్చి మాట్లాడుకుందాము.” మేము చేశాము, చూశారా.
365 మీరు చూచుట లేదా స్నేహితులారా, మీరొక పరిచర్యను ఆశించవద్దు. నా భావమేదో మీకు అర్థమైందా. చూశారా? మీరున్న చోటునే మీరు ఆనందంగా ఉంటారు. చూశారా? మీరు ఆ విధంగా ముందుకు సాగుడి.
215. పెండ్లి కుమార్తె ఎత్తబడిన తరువాత, శ్రమల ద్వారా వెళ్లవలసిన సంఘము ఎప్పుడు న్యాయతీర్పుకు నిలబడును? (అది న్యాయ తీర్పుకు నిలబడదు…) అది వెయ్యేండ్ల పాలనకు ముందా లేక తరువాతా?
ఏలయనగా “సంఘము” ఓ, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి, దీనిని ఎవరు వ్రాశారో వారు. “సంఘము ఎప్పుడు…?”
పెండ్లికుమార్తె ఎత్తబడిన తరువాత, శ్రమల ద్వారా వెళ్లవలసిన సంఘము ఎప్పుడు న్యాయతీర్పులో నిలబడును? అది వెయ్యేండ్ల పాలనకు ముందా లేక తరువాతా…?
366 తరువాత! పెండ్లికుమార్తెతో ఎత్తబడని వారు, “ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు.” మనము చూద్దాం.
216. రాజైన నెబుకద్నెజరు వలె, కమ్యూనిజమును దేవుడు తన యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు లేపియున్నాడని నీవు చాలా సార్లు చెప్పావు. చివరగా…ఉండబోవు ప్రపంచ స్థానమందు కమ్యూనిజము ఏ స్థానమందుండును? అదేవిధంగా ముగియును? అనేకమంది పండితులు ఉత్తరదేశపు రాజ్యములో లేఖనములలో చెప్పబడిన ప్రకారము గోగు మరియు మాగోగులు లేచి ఇశ్రాయేలుకు విరోధముగా పోయెదరని నమ్ముచున్నారు… (అదేంటో నాకది అర్థం కాలేదు. అవును. అవును.) నేను నమ్ముచున్నాను…నీ టేపులలో కొన్నిటిలో అది చివరకు ఆ కమ్యూనిజంను నాశనము చేయునని లేక వాటికన్‌ను ఒక ప్రేలుడు ద్వారా నాశనము చేయునని నేను వినినట్లు నేను నమ్ముచున్నాను. ఇది నిజమేనా?
367 ఔను. ప్రకటన 16, మీరు అది కనుగొనగలరు, మరియు ప్రకటన 18:8 మరియు 12. వ్యక్తియున్నట్లయితే, దానిని గూర్చి ఈ కాకితపు ముక్కను తీసుకొనగోరితే మీరు దానిని చూడగలరు, ఔను. చూడండి. “అయ్యో, అయ్యో ఆ గొప్ప పట్టణము ఒక ఘడియలోనే దాని నాశనము ఆమెకు వచ్చెను.” మీరు చూడండి, వర్తకులు మరియు సమస్తమును ఆమెకు సరుకులు తీసుకొని వచ్చారు. అది ఆలాగు. ఔను. మరియు…
368 వదలివేయుడి, కమ్యూనిజంను గూర్చి మరచిపోండి. చూశారా. ప్రపంచంలో అదేమి కాదు అయితే వారు క్రూరమైన గుంపు. వారు భక్తిహీనులు. అదొక క్రమము. నేనొకటి మీకు చూపిస్తాను. అదెంత సాధారణమైనదో మీకు చూపుతాను. ఎందుకని, రష్యా అంతట ఒక శాతం మాత్రమే కమ్యూనిజంను కలిగియున్నది. వారికి ఒక వర్తమానికుడు కావాలి. చూశారా? ఒక్క శాతం; తరువాత వారిలో తొంభై తొమ్మిది శాతము ఇంకా క్రైస్తవుల పక్షముగనున్నారు. ఒక్క శాతం, ఏ విధముగా ఒక్క శాతం తొంభై తొమ్మిది శాతాన్ని అదుపుతో నుంచగలుగుచున్నారు. అదే మీకు అక్కడున్న కార్యమును వివరింపగలదు. దేవుడు దానిని అనుమతించని యెడల, సరే. వారు చాలా కాలము క్రిందట త్రోసివేయబడియుందురు. చూశారా? తప్పక.
217. సహోదరుడా బ్రెన్‌హాం, ఆఖరి మూడున్నర సంవత్సరములలో రోమ్ యూదుల యొక్క ప్రభుత్వమును తీసుకొనునని నీవు చెప్పావు. అది శ్రమ కాలములో మొదటి మూడున్నర సంవత్సరములలోనా లేక ఆఖరి మూడున్నర సంవత్సర కాలములోనా? ఇది ఔనా?
369 అది ఆఖరి మూడున్నర సంవత్సరములు. ఔను. మొదటిది కాదు. ’ఎందుకనగా అది ఇది వరకే గతించింది.
దీని తరువాత మరొకటి ఉన్నది:
218. నా ప్రియ సహోదరుడా, ఒకటవ రాజులు 17 లో ఏలీయా చేసినట్లు మనకు చెప్పబడినట్లుగా, మలాకీ 4:5లో నున్న ఏలీయా అరణ్యములోకి వెళ్ళునా?
370 మంచిది. అతడు అరణ్యములోకి వెళ్తాడని నేను ఖచ్చితంగా చెప్పలేను. అయితే అతడు ఈ విధంగాయుండెను. చూశారా, అతడు…ఎలీషా మరియు ఏలీయా, మీరు గమనించారా? ఆ విధమైన మనుష్యులు దాదాపుగా దూరముగా ఉన్నారు, వారు ప్రజలకు దూరంగా ఉంటారు. వారు బహు వింతైనవారు. వారు ఎక్కువగా ప్రజలతో కలవరు.
371 ఎలీషా ఏలాగుండెనో, ఏలీయా ఏలాగుండెనో మరియు బాప్తిస్మమిచ్చు యోహాను ఏలాగుండెనో, ఆ ఆత్మ స్వభావమేలాగుంటదో మీరు గమనించారా. ఔనా. వారు…అతడు—అతడు, ఆ మనుష్యుడు అరణ్యమును ప్రేమించువాడు అని నేననుకుంటున్నాను, ఒకవేళ అరణ్యములో నివసించువాడు. అయితే, ఇపుడు, అతను ఒక సన్యాసి వలె ఉంటూ మరియు అరణ్యములో ఉంటూ, దానిని గురించి నాకు తెలియదు. కొన్ని సమయములలో వారు చేశారు. ఎలీషా చేయలేదు. అయితే ఏలీయా చేశాడు. తరువాత, యోహాను, అతడు—అతడు అరణ్యములో జీవించాడు.
372 ఈ ఇతర ప్రవక్తలు, అక్కడ యూదయలో నుండి వచ్చునపుడు, వారెక్కడ నివసించిరో నాకు తెలియదు. చెప్పుట కష్టం. వారు, అక్కడ కొండపైనుందురేమో. లేక—లేక వారి యొక్క ప్రవచించు దినములలో వారేమి చేయుదురో నాకు తెలియదు.
అయితే నీవు…నేను చెప్పుటకు ప్రయత్నించునది ఇది. “వారు, వారు ఒక—ఒక—ఒక…”, “వారు అరణ్యములో నివసించువారిగా ఉంటారా?” ఆ ప్రశ్ననే వారు అడుగుటకు ప్రయత్నించారు.
373 మంచిది. వారు నివసించుటకు తగిన అరణ్యములున్న స్థలము కావలయునంటే ఇపుడు వారు అదెక్కడోయున్న ఉత్తర బ్రిటిష్ కొలంబియాకు వెళ్లవలెను. మీరు గమనించారా. కాబట్టి, అదెవరో ఒకరు…అరణ్యములన్నియు నరికివేయబడినవి. చూశారా? అక్కడ అధికమైన అడవులు విడిచిపెట్టబడలేదు. మరియు చూశారా? కావున, కేవలం ఒక విషయమేమనగా, వారు—వారు అరణ్య ప్రేమికులుగా యుండవచ్చును, చూడండి, అరణ్యములో ఎక్కువగా ఉండవచ్చు, మరియు వారు…వారి స్వభావమును గమనించుడి, వారు రాజీపడరు. చూశారా, మీరు—మీరు అది వచ్చినపుడు దానిని మీరు ఎరుగుతారు. చూశారా? మీరు అది చూస్తారు; మీరు మేల్కొనియుంటే అది చూస్తారు.
374 ఇపుడు, ఇక్కడ ఒక్కటి, అదెలాగు తాకవలెనో నాకు తెలియదు. మరియు దీనికి ముందు మరొకటి నా యొద్దనున్నది, ఆ తరువాత టేపును ఒక నిముషము ఆపు చేయాలని అడగబోవుచున్నాను.
219. దేవుడు ఒక వ్యక్తిత్వము కలిగియుండిన యెడల, రూపాంతరపు కొండ మీద ఆయన తనలో తాను ఏ విధముగా మాట్లాడుకొనెను?
375 సరే. దానిని ఇపుడు వివరించాను, ఔనా. చూశారా? నేనిది అడగాలనుకుంటున్నాను. నేను…యేసు, తండ్రికి ప్రార్థించునపుడు, చూశారా.
[సహోదరుడు బ్రెన్‌హాం సభలో ఒక సహోదరునితో మాట్లాడుట మొదలు పెట్టెను—సంపా.] నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందియున్నావని నేను అనుకుంటున్నాను. ఔను కదా, సహోదరుడా? ఒక నిముషము లేచి నిలబడగలవా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగియున్నావని నీవు ఒప్పుకుంటున్నావు? [“ఔనండి” అని సహోదరుడు చెప్పుచున్నాడు.] నేను కూడా. అలాగైతే, అదేంటి? తరువాత ఈ యొక్క మర్మములను తెలియపరచుటకు—నాలో శక్తి కలదని నేను చెప్పుకొనుట లేదు. రోగులను స్వస్థపరచుటకు నాలో శక్తి లేదు. అది దేవుడే.
376 [సహోదరుడు బ్రెన్‌హాం సభలోని సహోదరునితో మాట్లాడుతూనేయున్నాడు—సంపా.] నీవు సేవకుడవని నేననుకొంటున్నాను. నేను పొరపడకపోతే, నీవు అర్కన్‌సాస్‌కు చెందినవాడవు. సరే. ఇపుడు, మరియు నీలో, నీవు సువార్తను ప్రకటించాలని కోరుచున్నావు. సాధారణముగా నీవు వ్యవసాయ వృత్తిలోనుండి, అటువంటి దానిలో నుండి పెరిగావు. దానిని గూర్చి ఏమి తెలియదు; అయితే సువార్త ప్రకటించుటకు ఒకటి నీలోకి వచ్చినది. అది నీవేయని నీవు చెప్పుకొనుటలేదు. అది వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మయని పిలువబడును. ఔనా? [“ఔనండి.”] సరే.
377 [సహోదరుడు బ్రెన్‌హాం సభలోని సహోదరునితో మాట్లాడుతూనేయున్నాడు—సంపా.] నేనిపుడు నిన్ను అడుగుతాను…పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. ఔనా? [“ఔను” యని సహోదరుడు చెప్తున్నాడు] నీవు ఆయనతో మాట్లాడుచున్నావా? [“ఔనండి.”] ఆయనతో సంభాషిస్తున్నావా? ఆయనకు ప్రార్థిస్తున్నావా? సరే. అదే నాకు కావలసింది. చాలా ధన్యవాదాలు, నీకు.
చూశారా? ఇపుడు మీకు అర్థమైందా? [సభ “ఆమేన్” అని చెప్పింది—సంపా.]
378 ఒకటి మిమ్ములను అడుగుతాను…యేసు, పరిశుద్ధ యోహాను 3 లో, ఆయన చెప్పాడు, “ఇపుడు పరలోకములోనుండువాడే…భూమి మీదకి వచ్చెను.” చూశారా? “ఇప్పుడు పరలోకములోయుండు మనుష్యకుమారుడు,” ఇక్కడ ఆయన నిలబడి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇపుడు నీవు దాని అర్థం చెప్పవలెను. యేసు మరియు తండ్రి ఒకే వ్యక్తి.
379 పరిశుద్ధాత్మ నీలోనున్నట్లుగా; నేను ప్రసంగించుచుండగా మీరు చూస్తున్నారు, అయితే అది నేను కాదు.
ఒక మాట పలుకగా అది ఒక జంతువును తీసుకొని వచ్చుట లేక సృజించుటను మీరు ఎరుగుదురు. అక్కడ కూర్చొని దానివైపు చూచి మరియు ఆ జంతువును చంపి, దానిని తినుట జరిగినది. అది సృజనాత్మక శక్తి. అది మానవులలోయుండదు.
380 ఇక్కడ పండుకొనియుండు ఆ చిన్న బాలుని నేను కాదు…వైద్యులు అతనిని వెనుకకు పరుండబెట్టారు, ఈ రాత్రి గుండె జబ్బుతో యున్నాడు. మరియు “విలియం బ్రెన్‌హాం సెలవిచ్చుచున్నాడని?” చెప్తే, లేదు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అది అయిపోయింది.” మరుసటి రోజు అతనిని వైద్యుని యొద్దకు తీసుకొని వెళ్ళినపుడు, అదంతా అయిపోయింది.
381 లుకేమియా [రక్త కాన్సర్] జబ్బుతోనున్న ఒక చిన్న బిడ్డ, వాని కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చి, శరీరమంతా, కడుపు పసుపుగా మారినది. రక్తము ఇతరమైనవి ఇచ్చుటకు ఇక్కడకు ఆసుపత్రికి తెచ్చారు. మరియు ఐదు నిముషాలలో’ హాంబర్గర్ కోసము ఏడ్చింది! తరువాత రోజు వైద్యుని యొద్దకు తీసుకొని వెళ్లినపుడు దాని గురుతులు కూడా కనబడలేదు. అది “విలియం బ్రెన్‌హాం సెలవిచ్చుచున్నాడనునదా?” అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అనునది. అయినను ఆయన నాకు వేరే వ్యక్తి, అయితే నా ద్వారా ఆయన తనను తాను వ్యక్తపరచుకొను ఒకే మార్గము అదొక్కటే. ఔనా?
382 ఆ విధముగానే యేసు, మరియు తండ్రి ఉన్నారు. యేసు చెప్పాడు, “కార్యములు చేయునది నేను కాదు; నాయందు నివసించు తండ్రియే.”
ఇపుడు, “పరలోకము నుండి క్రిందికి దిగినవాడును పరలోకములో ఇపుడున్న మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కినవాడు ఒక్కరు కూడా లేరు.” చూశారా? అదేంటి? ఆయన సర్వాంతర్యామి, ఎందుకనగా ఆయన దేవుడైయుండెను.
383 ఇపుడు, ఇది ఇంకొకటి, నేను…[సహోదరుడు బ్రెన్‌హాం తన వ్రేలిని ఒకసారి విరచుచున్నాడు—సంపా.] ఈ మాటలు నేను చెప్పాలని ఉన్నాను.
నీవు మాట్లాడుచున్నది వివరించుము…
[టేపులో ఖాళీ స్థలమున్నది. సభలో ఒక సహోదరుడు మాట్లాడుచున్నాడు—సంపా.]
తండ్రియైన దేవా, నీకు కృతజ్ఞతలు. నీవిక్కడ ఆత్మగా ఉన్నందుకు నీకు మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఒకసారి మాకు ఈ విధంగా చెప్పబడింది, తండ్రీ శత్రువు వచ్చుచుండగా ఆత్మ ఒకనిమీదకి వచ్చి అతనితో మాట్లాడి మరియు అతనితో ప్రవచించెను. అది విషయాన్ని క్రమపరచి, ఏ విధంగా వెళ్లవలెనో, శత్రువును ఏలాగు ఓడించవలెనో మరియు శత్రువును ఏలాగు కనుగొనవలెనో ఆ విషయాన్ని క్రమపరచినది.
384 నీవు క్రితమున్న దేవుడుగానే నీవున్నందుకు, తండ్రీ, నీకు నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీవు ఇంకా ఆలాగే ఉన్నావు. మేము మారుతాము, కాలములు మారుతవి మరియు సమయాలు మారుతవి మరియు ప్రజలు మారుతారు. అయితే నీవెన్నడు మారవు. నీ పద్ధతులు ఏకరీతిగా ఉన్నవి. నీ కృప ఏకరీతిగా ఉన్నది. నీ క్రియలు ఏకరీతిగా ఉన్నవి, ఎందుకనగా అవి అద్భుతకరమైనవి. అవి మానవ జ్ఞానమునకు అందని విధముగాను ఉన్నవి.
385 కాబట్టి, నీ యొక్క రహస్యములు, నీ దాసుల యొక్క హృదయములలో దాగియున్నందుకు ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేమెంతో ఆనందంగా ఉన్నాము. స్థల స్థలానికి…మేము ప్రకాశించు దీపములుగా మేము వెళ్లుదుము గాక. ప్రేమతో ఇతరులను లోపలకు తెచ్చుటకు ప్రయత్నింతుము గాక; ప్రతి చిన్న మూలలో మేము వలవేసి, దానిని లోనికి వదలి నీకు చెందిన ప్రతి చేపను నిశ్చయముగా పొందునట్లు చేయుము. మరియు ఆ పిదప, నిరంతరము ఆయన ప్రక్కన నిత్యము యుండుటకు గొఱ్ఱెపిల్ల ఆయన పెండ్లికుమార్తెగా తీసుకొనును. మేము ఆ సమయమునకై ఎదురు చూచుచున్నాము, యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
386 ఇక్కడెంతమంది రోగులున్నారు? మీ చేతులు చూడనివ్వండి. సరే. అది కన్పిస్తుంది…మీ చేతులు మరలా పైకెత్తండి. అది సుమారుగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవై…[సహోదరుడు బ్రెన్‌హాం మరియు ఇంకొకరు ఎత్తబడిన చేతులను నిశ్శబ్దంగా లెక్కిస్తున్నారు—సంపా.] నలభై-ఏడు, సుమారు నలభై-ఏడు. సరే.
387 ఇది పదకొండు-ముప్పయ్. ఇపుడు మనము రోగుల కొరకు ప్రార్థిద్దాం; ఈ రాత్రి…అది చేయుటకు మీరు ఇష్టపడుతున్నారా? [సభ “ఆమేన్” అని చెప్పెను—సంపా.]
388 అది చేయుటకు ఇపుడే మంచి సమయమని నేననుకుంటున్నాను. ఎందుకని నేను మీకు చెప్తాను: ఇక్కడ నిలబడియున్న పరిశుద్ధాత్మ అభిషేకమున్నది. ఇపుడు, మనము ఆ ఆత్మలోనికి ప్రవేశించినందు వలన, చూడండి, ఆ ఒక్కటి, ఆ ఒకటి తెలుసా—ఆ ఒకటి ఇక్కడ యున్నదని మీరు ఎరుగుదురు. మీరు ఎప్పుడైనా నమ్మితే, ఇపుడే నమ్మవలసి యున్నది. చూశారా? మీరు ఎప్పుడైనను నమ్మితే, అది ఇపుడే.
389 ఇపుడు, మీరు నెమ్మదిగా రావలెనని కోరుచున్నాము. అక్కడ ప్రక్కగా నిలబడి చేతులెత్తినవారు, ఈ ప్రక్కకు వచ్చి ఈ దారిన వెళ్లుడి. ఒక్కొక్క ప్రక్కల నున్నవారిని తీసుకుందాము. మరియు నలభై-అయిదు—నలభై-అయిదు, నలభై-ఏడులో అది అది ఎక్కువ సమయము కాదు.
390 అతను రాగలిగితే, నేను సహోదరుడు నెవిల్‌ను అడుగబోతున్నాను నాతో క్రిందకు వచ్చుటకు, మేము వారికి ప్రార్థించబోవుచున్నాము.
391 మొదట, ఈ సంధులోకి ఇపుడు వచ్చినవారు, ఒక్క నిముషము నిలబడండి. ఇక్కడున్న మీకు ప్రార్థించి, ప్రతి యొక్కరి మీద చేతులుంచులాగున. ఇపుడు, అది మంచిది. ప్రార్థనా వరుసలో వచ్చు అందరు, చూశారా, ప్రార్థనా వరుసలో వచ్చువారు. ఔను. ఇపుడు—ఇపుడు సమయాన్ని సద్వినియోగపరచుటకు, అందరము అది పొందుకొంటాము. ఇపుడు మీ కొరకు ప్రార్థించబోతున్నాము.
392 స్నేహితులారా, చూడండి. ఇపుడు ఇది మీకు వివరించనీయండి. యేసుక్రీస్తు ఇది చెప్పాడు, “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును.” ఇపుడు గమనించుడి. ఇపుడు గమనించుడి, ఆయన ఎన్నడూ చెప్పలేదు, “వారి కొరకు వారు ప్రార్థిస్తే” యని “రోగుల మీద వారు చేతులుంచినపుడు వారు స్వస్థతనొందెదరు!” మరియు దేవుడు తనలో తాను విశ్వసించలేని ఒక చిన్న బాలికలోని లుకేమియా వ్యాధిని తీసివేసి, దానిని పరిపూర్ణము చేసిన ఆయన; ఆయన, తరువాత కార్యముగా ఒక బాలుని తీసుకొని వైద్యులు ఆ బాలుని రక్తములో, దేనిలోను వ్యాధి లక్షణమును కూడా కనిపెట్టుటకు వీలు లేకుండా, దాని జాడే లేకుండా అతనిలోని వాత జ్వరమును స్వస్థపరచగలిగిన యెడల ఆయన మీ కొరకు ఏమి చేయగలడు? ఇపుడు ఆ చిన్న బిడ్డలు ప్రార్థనంటే ఏంటో అర్థం చేసుకోలేరు. అయితే వారిపైన చేతులుంచుట వలన అది చేయబడెను. మనమది అర్థం చేసుకుంటాము.
ఇపుడు, మీరు ప్రార్థనకై నిలబడియుండగా.
393 పరలోకపు తండ్రీ, నీ యొక్క మహోన్నతమైన సన్నిధి, గొప్ప పరిశుద్ధాత్మగా ఇక్కడున్నపుడు, ఎవరి యొక్క ఛాయా చిత్రమును మేము తీశామో, ఎవరిని గూర్చి మేము బైబిల్ గ్రంథములో చదువుచున్నామో ఆయన ఇపుడు ఇక్కడయున్నాడు. ఆయన మానవ శరీరము ద్వారా తన్ను తాను బయలుపరచుకుంటున్నాడు.
394 ఇన్ని సంవత్సరములలో ఒక్కసారి కూడా ఆయన తప్పిపోలేదని మేము చూచియున్నాము, మానవ హృదయ తలంపులను బయలుపరచువానిగా, వారు చేసిన పాపములను బయలు పరచి, ఏమి జరిగినదో ఖచ్చితంగా వారికి చెప్పి, ఏమి జరుగునో అని చెప్పినవి ఒక్కసారి కూడా తప్పిపోలేదు. అటు తరువాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడు యేసుక్రీస్తు అను వ్యక్తిలో ఇంకా దేవుడుగా ఉన్నాడని మేమెరిగియున్నాము.
395 మరియు కల్వరిలో చిందించిన రక్తము క్రిందనున్న ప్రజల మధ్యకు ఇపుడు కూడా ఆయన యొక్క ఆత్మ ద్వారా పరలోకము నుండి క్రిందికి దిగివచ్చి ఈ ప్రపంచము దహించబడుటకు ముందు తన్నుతాను మానవ శరీరమందు బయలుపరచుకొన్నాడు, గొప్ప పరిశుద్ధాత్మ మానవ శరీరమున ప్రాతినిధ్యము దాల్చియున్నది. ఎవరైతే రక్త పరిహారార్ధమును అంగీకరించిన ప్రశస్త ప్రజలైయున్నారో, వారు మానవ శరీరములో ప్రత్యక్షమైన దేవుని వారు వారి లోపలకు స్వీకరించుచున్నారు.
396 కాబట్టి, అది మానవ శరీరము కాదు. అది కేవలం క్రియ చేయుటకు మాత్రమేయున్నది. అది ఆ విధముగా జరుగుచున్నవి, బాప్తిస్మము ఆలాటివి జరుగుచున్నవి. “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును.” రోగుల మీద చేతులు ఉంచుట వలన, వారు నమ్మితే వారు స్వస్థతనొందులాగున పరిశుద్ధాత్మ చేయును. ఇపుడు, తండ్రీ, ఈ కార్యములు సత్యములని మేమెరుగుదుము.
397 నిలబడియున్న ఈ ప్రజలు ఈ పరిశుద్ధాత్మ పొందిన సేవకుల హస్తాల క్రింద నుండి దాటిపోవుచున్నారు, రోగులపై చేతులు పెట్టుటకు వారు సంసిద్ధులుగానున్నారు, ప్రభువా. తండ్రీ, ఈ జనులు నమ్మిక మాత్రముంచిన చాలును. నీవు వాగ్దానము చేసిన ప్రతి వాక్యము వలె అది జరుగవలెను…విశ్వాసము లేకుండా అది జరుగదు. ఎందుకనగా విశ్వాసము లేకుండ దేవుని ప్రీతి పరచుట అసాధ్యము. దానిని మేము చేయలేము.
398 మరియు ఇపుడు విశ్వాసముతో నమ్మి, మా ముందుంచబడిన ఈ వాగ్దానములు బైబిల్ గ్రంథమందున్న ముద్రలు తెరవబడియుండుట ద్వారా దేవుడు తన యొక్క మాటను నిలబెట్టుకొనును! ఈ ప్రశస్త ప్రజలు, వ్యాధితో ఎవరున్నారో అట్టి ఈ ప్రశస్త ప్రజలు, ప్రభువా,…వారివలె మర్త్య శరీరముతోనుండిన ఒక మానవునిగా వారికై చింతించుచున్నాను. మరియు…ప్రభువా, మాయందు నివసించు అదే పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తుంది. ఒకరి కొరకు ఒకరం మేము చింతించుచున్నాము. మరియు క్రొత్త రక్తములోని క్రొత్త నిబంధనను ఎరిగినవారమై…పాతది స్వస్థతను అనుగ్రహించినట్లయితే, ఈ “క్రొత్తది మరియు శ్రేష్టమైనది” మరెంతగా చేయును? తండ్రీ, ఆలాగు అవును గాక, ఈ ప్రజలు అపజయమొందకుండ యుందురు గాక. అయితే నీ సేవకుల హస్తాల గుండా దాటి వెళ్ళుచుండగా వారి స్వస్థతను పొందుకొందురు గాక, యేసుక్రీస్తు నామములో ఆమేన్.
399 ఇపుడు—ఇపుడు మనము, ఇపుడు ఈ ప్రక్కనున్నవారు కూర్చుండగా, ఈ ప్రక్కనున్నవారు వస్తారు. తరువాత ఈ ప్రక్కనున్నవారు, మరొక ప్రక్క…ఇపుడు, కొందరు సహోదరులు నిలబడతారు. అక్కడున్న అందరూ సేవకులని నేను అనుకుంటున్నాను.
ఎక్కడ డాక్టర్, సహోదరుడు నెడ్? సహోదరుడా నెడ్ ప్రార్థనా వరుసలో ఉండబోతున్నావా? [“ఔను. నేను వేరొకని కొరకు నిలబడియున్నాను” అని సహోదరుడు నెడ్ ఐవర్‌సన్ చెప్పాడు—సంపా.] మంచిది, సహోదరుడా నెడ్, మంచిది. నీవు ప్రార్థన ముగించిన వెంటనే వరుసలో తప్పుకొండి.
400 ఇపుడు, ఈ ప్రక్కనున్నవారు, ఓ క్షణం కూర్చొండి. నేను ఈ ప్రక్కనున్న వారిని తీసుకుంటాను. అటుతరువాత మేము క్రిందికి దిగివచ్చి మధ్యలోనున్న వారిని తీసుకొని ఈ మార్గము గుండా వెనుకకు పంపుదాము. తరువాత ఈ ప్రక్కనున్న వారిని తీసుకొని ఈ మార్గముల గుండా వీరిని పంపుదాము, అందరికొరకు ప్రార్థిద్దాము.
401 నేను సహోదరుడు టెడ్డీని అడగబోవుచున్నాను…అదెక్కడ? [సహోదరుడు టెడ్డీ ఆర్నాల్డ్ చెప్పుచున్నాడు “ఇక్కడే” యని—సంపా.] సరే. అక్కడ నీవు “మహా వైద్యుండు ఇక్కడ సమీపముననే ఉన్నాడు” అను పాటను నీవు వాయించవలెనని కోరుచున్నాను. పియానో వాయించు వారు ఎక్కడున్నను, మీకిష్టమైతే అతనిని అనుసరించుడి.
402 విను. అది వాయించుచుండగా, ఒక చిన్న పిల్లవాడు వేదిక పైకి తీసుకు రాబడినపుడు జరిగినది మీకు జ్ఞప్తియుందా? చిన్న అమిష్ అమ్మాయి “మహా వైద్యుండు ఇక్కడ సమీపముననే ఉన్నాడు” వాయించుచుండెను. ఆమెకు పొడవైన నల్లని వెంట్రుకలు, లేక—లేక రంగు వెంట్రుకలు కలిగియుండెను. ఆమె ఒక మెనోనైట్ లేక ఒక అమిష్ అమ్మాయి, తన తలను వెనుకకు వాల్చుకొనియుంది.
403 మరియు పరిశుద్ధాత్మ చిన్న పిల్లవాన్ని తాకెను. కుంటివాడు. అతడు నా చేతుల నుండి ఎగిరిదూకి వేదికలోకి పరుగెత్తాడు, అతని తల్లి లేచి వెనుకకు పడిపోయినది. ఆమె ప్రారంభం నుండి ఒక మెనోనైట్.
404 మరియు దేవుని యొక్క ఆత్మ ఈ చిన్న మెనోనైట్ అమ్మాయిని తాకినది. లేక అమిష్ మరెదో. ఆమె తండ్రి, ఇతరులు అక్కడ కూర్చున్నారు. మెనోనైట్ మరేదో దుస్తులు ధరించియున్నారు. మరియు ఆమె పియానోను విడచి గెంతులేస్తూ లేచి తన చేతులను గాలిలో పైకెత్తింది. మరియు ఆమె అందమైన వెంట్రుకలు ప్రక్కకు వాలిపోయినవి. ఆమె దేవదూత మాదిరిగా కన్పించినది. ఆత్మలో పాటపాడుట ప్రారంభించినది; ఆమె అలా చేస్తుండగా “మహా వైద్యుడు సమీపముగానున్నాడు, జాలిగల యేసు” అను దానిని ఆగకుండా పియానో వాయించుచుండెను.
405 ప్రతి ఒక్కరు, వేలమంది అక్కడ నిలబడి పియానో మెట్లు పైకి క్రిందకు కదలుట చూస్తుండిరి. “మహావైద్యుండు సమీపముగా ఉన్నాడు, జాలిగల యేసు.” జనులు చక్రాల కుర్చీలలోనుండి, మంచాలలో నుండి, స్ట్రఛర్లలో నుండి లేచి వెళ్లారు.
406 ఆ సమయంలో ఏలాగుండెనో, ఈ ఉదయం అదే ప్రభువైన యేసు ఇక్కడున్నాడు. ఇపుడు నమ్మితే చాలు.
మీరు ఇష్టపడితే ఆ పాట వాయించుడి, మహా వైద్యుడు.
ఇప్పుడు అందరం ప్రార్థిద్దాం.
వారు గది గుండా నడచి వెళ్లనీయండి, ఈ మార్గము గుండా వెళ్లండి, మీరు కూర్చొనియున్న స్థలము యొద్దకు మీరు వెళ్లగోరినా లేక మరెచటకైనా వెళ్లగోరినా దారిని చూచుకొని వెళ్లండి. వెనుక అక్కడ ఖాళీ అయినదా? సరే. మీ స్థలము యొద్దకు వెళ్లండి. తరువాత మనము నిలబడదాము.
407 ఇపుడు వినండి. వీరి కొరకు ప్రార్థించునపుడు, మీరు వారి కొరకు ప్రార్థించుడి. తరువాత అపుడు మీ కొరకు ప్రార్థించునపుడు వారు మీ కొరకు ప్రార్థిస్తారు.
ఇపుడు ఇక్కడున్న సేవకులైన మీరు, నిలబడండి. ఇక్కడున్న వారు వచ్చుచుండగా మీ చేతులను వారిపై నుంచవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను.
408 ఇపుడు ప్రతియొక్కరు తలలు వంచియుండగా మరియు మీ చేతులు వంచండి. ప్రార్థనలో ఉండండి. మీరు దాటిపోవునపుడు…చేతులు మీ మీద పెట్టబడును. జ్ఞప్తించుకోండి. ఆయన గ్రంథములోని మర్మములను మరియు మానవ హృదయములోని మర్మములను బయలుపరచుట అది దేవుని యొక్క వాగ్దానము. నీవది నమ్మినట్లయితే దానిని స్థిరపరచుటకు ఆయన దేవుడు. చూశారా? ఇపుడు ప్రతి యొక్కరు ప్రార్థనలో ఉండండి.
ఇపుడు సేవకులైన సహోదరులు, ఇక్కడ మీరు నిలబడండి, మీరిష్టపడితే.
సరే. మనము తలలు వంచుకుందాము.
409 ఇపుడు ప్రభువైన యేసూ, ఈ ప్రజలు వచ్చుచుండగా, వారు దాటి వెళ్లుచుండగా సర్వశక్తిమంతుడగు దేవుని శక్తి వారి యొక్క విశ్వాసమును తక్షణమే మేల్కొల్పును గాక! సమస్తమును యేసు’ నామములో.
410 ఇపుడు సరే. వరుస ఈ ప్రక్కగా ప్రారంభించండి. సేవకులైన మీరు, వారు నడచి వచ్చుచుండగా, మీరందరు మీ చేతులను వారిపై ఉంచండి.
411 [సహోదరుడు బ్రెన్‌హాం మరియు సేవకులు ప్రార్థించుటకు ప్రారంభించిరి. ఆర్గను వాయించువారు మహా వైద్యుడు అను పాటను వాయించుచుండగా ప్రార్థనా వరుసలో వచ్చు ప్రతి వ్యక్తి పైనను తమ చేతులుంచుచున్నారు—సంపా.]
ప్రభువైన యేసు నామములో!
నా సహోదరుడా, ప్రభువైన యేసు నామములో నేను నా చేతులుంచుచున్నాను.
ప్రభువైన యేసు నామములో!
దేవా, నా సహోదరీ రోజెల్లాకు, యేసు నామములో దయచేయుము.
యేసుక్రీస్తు నామములో!
యేసుక్రీస్తు నామములో!
412 మీరు అక్కడనే యుండండి; వరుస ముగించు వరకు దానిని గమనించుడి.
ప్రభువైన యేసు నామములో!…?…
జ్ఞప్తించుకోండి, ఆయన దీనుడు. దీనులుగా రండి.
413 [సహోదరుడు బ్రెన్‌హాం మాటలు ఒక భాగముగా వినబడినవి. వ్యక్తపరచబడిన తలంపును సంపూర్తిగా ముద్రించబడలేదు. ఇక్కడ ప్రార్థనా వరుస ఆరు నిముషాల ఇరవై అయిదు సెకన్లు కొనసాగినది—సంపా.]
414 [టేపులో ఖాళీ స్థలమున్నది. సహోదరుడు బిల్లీ పాల్ బ్రెన్‌హాం మైక్రోఫోన్ యొద్దకు వచ్చి చెప్తున్నాడు, “ప్రజలైన మీరు వెనుకకు జరుగుతారా, దయచేసి? అటు ప్రక్కన నిలబడిన వారలైన మీరు ఆ ప్రక్కన నుండి జరిగి మరి వెనుకకు వెళ్లగలరా? దయచేసి వెనుకకు వెళ్లండి. ధన్యవాదాలు మీకు. మధ్యలోనున్న మీరు ఆ వైపునకు వెళ్లగలరా?”—సంపా.]
415 [సహోదరుడు బ్రెన్‌హాం మాటలు ఇక్కడ కొంత భాగమే వినబడుట వలన, అతడు బయలుపరచిన పూర్తి తలంపులు ముద్రించుటకు వీలు కాలేదు. ప్రార్థనా వరుస రెండు నిముషాలు మరియు ఇరువది సెకన్లు కొనసాగినది—సంపా.]
యేసుక్రీస్తు నుండి, సహోదరుడా, నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా మిట్‌చెల్ నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ యొక్క స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి, నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి, నీ స్వస్థతను పొందుకో
యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థత పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థత పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి, నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
నా సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
నా సహోదరుడా, స్వస్థత పొందుకో.
యేసుక్రీస్తు నుండి స్వస్థత పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి స్వస్థతను పొందుకో.
సహోదరీ, స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
నా సహోదరీ, నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, స్వస్థతను పొందుకో
సహోదరీ, నీ స్వస్థతను పొందుకో…?…
సహోదరీ, నా స్వస్థతను పొందుకో…?…
సహోదరుడా, నీ స్వస్థతను పొందుకో.
నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, నీ స్వస్థతను పొందుకో…?…
సహోదరీ, నీ స్వస్థతను పొందుకో…?…
యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, స్వస్థత పొందుకో…?…, యేసుక్రీస్తు నుండి.
స్వస్థత పొందుకో.
స్వస్థత పొందుకో…?…
నా సహోదరుడా, యేసుక్రీస్తు నుండి స్వస్థత పొందుకో.
స్వస్థత పొందుకో.
సహోదరీ, స్వస్థత పొందుకో…?…
యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకో.
యేసు నామములో స్వస్థత పొందుకో. ఆమేన్.
స్వస్థత పొందుకో.
స్వస్థత పొందుకో.
నీ స్వస్థత పొందుకో.
నీ స్వస్థత పొందుకో.
యేసుక్రీస్తు నుండి నీ స్వస్థత పొందుకో.
416 [సహోదరుడు బిల్లీ పాల్ బ్రెన్‌హాం మైక్రోఫోన్ యొద్దకు వచ్చి చెప్తున్నాడు, “ఎవరైనను ప్రార్థనా వరుసలో వచ్చుటకు ఆశించుచున్నారా? దయచేసి వరుసలోకి రండి. ఎవరైనను ప్రార్థనా వరుసలోకి వచ్చుటకు కోరిన యెడల, దయచేసి, రాగలరా.”—సంపా.]
నా యొక్క సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ యొక్క స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ యొక్క స్వస్థతను పొందుకో.
417 సహోదరి ఉడ్, యేసుక్రీస్తు హస్తము నుండి నీ స్వస్థతను పొందుకో.
నీ స్వస్థతను పొందుకో…?…
స్వస్థతను పొందుకో…?…
418 సహోదరి రాబర్‌సన్ యేసుక్రీస్తు హస్తాన్ని బట్టి నీ స్వస్థతను పొందుకో.
నా సహోదరుడా, యేసుక్రీస్తు హస్తాన్ని బట్టి స్వస్థతను పొందుకో.
యేసుక్రీస్తు హస్తము నుండి…? సహోదరీ స్వస్థతను పొందుకో.
యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో.
యేసుక్రీస్తు నామములో అతని స్వస్థపరచు.
సహోదరీ స్వస్థతను పొందుకో…?…
కుమారుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో
సహోదరుడా, వీట్స్ నీ స్వస్థతను పొందుకో, యేసుక్రీస్తు నుండి సహోదరుడా.
సహోదరీ, యేసుక్రీస్తు నుండి నీ స్వస్థతను పొందుకో.
సహోదరుడా, నీ స్వస్థతను పొందుకో…?…
సహోదరుడా, యేసుక్రీస్తు నామమును బట్టి పొందుకో…?…
యేసుక్రీస్తు నామములో…?…
యేసుక్రీస్తు నామములో…?…
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో, నీ స్వస్థతను పొందుకో
యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో, నా సహోదరుడా.
యేసుక్రీస్తు నామములో…?…
యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో, సహోదరీ.
యేసుక్రీస్తు నామములో…?…
419 [సహోదరుడు బిల్లీ పాల్ బ్రెన్‌హాం మైక్రోఫోను యొద్దకు వచ్చి, “ఇప్పుడు ప్రార్థింపగోరువారు ఇంతమందేనా?” అని అడుగుచున్నాడు—సంపా.]
420 [సహోదరుడు లీ వైల్, సహోదరుడు బ్రెన్‌హాంతో మాట్లాడుచున్నాడు—సంపా.] మీ ప్రియమైన వారికి కోరిన ఈ కోరికను, సహోదరుడా వైల్, ప్రభువైన యేసు హస్తము అనుగ్రహించుగాక.
421 [సహోదరుడు బిల్లీ పాల్ బ్రెన్‌హాం, సహోదరుడు బ్రెన్‌హాంతో మాట్లాడుచున్నాడు—సంపా.] బిల్లీపాల్, నీవు అనేకమైన ప్రార్థనా కార్డులు ఇచ్చావు, ఇపుడు యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో.
మహా వైద్యుండు ఇపుడు సమీపంగా ఉన్నాడు,
జాలిగల యేసు,
క్రుంగిపోవుచున్న హృదయమును ఉల్లసించులాగున ఆయన పలుకుచున్నాడు,
ఓ, యేసు యొక్క స్వరము వినుడి.
అందరు కలసి:
సెరాపుల పాటలో మధురమైన నామము,
మర్త్యుల భాషలో మధురమైన నామము,
ఎన్నడూ పాడని మధురమైన గీతము,
422 దేవా, ఈ ప్రియమైన చిన్న దంపతులను లోకములోకి తెచ్చియున్న…?…యేసుక్రీస్తు నామములో, ప్రభువా, వారు వారి యొక్క విన్నపమును పొందుదురు గాక.
423 …?…యేసుక్రీస్తు యొక్క, ఇపుడు మా యొక్క సహోదరి యొక్క తలంపులలోనున్న ఆ వ్యక్తిని గురించిన ఆ విన్నపముతో, దేవుని యొక్క శక్తి వెళ్ళును గాక. అది విడిపింపబడును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఆమేన్.
424 ప్రభువైన దేవా, యేసు’ నామములో, ఈ మనుష్యుని విన్నపము అంగీకరించుము. ప్రభువా, ఇతని కొరకు ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనతో. ఆమేన్.
425 ఓ, అది అద్భుతము కాదా! [సభ ఆనందించి “ఆమేన్” అని చెప్పింది—సంపా.] ఈ ఉదయం ఈ మహాత్తరమైన అభిషేకము క్రింద ఇక్కడికి వచ్చు ప్రతి వ్యక్తియును, నేను—నేను నమ్ముచున్నాను…ఇపుడు ఏదో గొప్ప కార్యమునకై మీరు ఎదురు చూడకండి. ఆయన దేనినైతే వాగ్దానం చేశాడో దానిని నమ్ము, సాధారణ కార్యమును గుర్తించుకొనిన చాలును.
426 ఇపుడు అందరము అది కలసి చెప్దాము. [సభ, సహోదరుడు బ్రెన్‌హాం చెప్పింది మరలా పునరుచ్ఛరణ చేసినది.—సంపా.] ఒక గొప్ప కార్యమునకై మనము చూడము, అయితే యేసు’ నామములో ఆయన వాగ్దానమును మనము పొందుకున్నాము.
427 దానిని అది నిర్ధారణ చేస్తుంది. అది దానిని ముగించుచున్నది. [సభ, “ఆమేన్” అని చెప్పింది, గొప్ప శబ్దంతో ఆనందించుచున్నది.] ఆమేన్! దేవుడు మిమ్ము ఆశీర్వదించును!
63-0324M — ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు
Rev. William Marrion Branham