ఏడవ ముద్ర
1మీకు వందనములు, సహోదరుడా, మనము నిలబడి యుండగానే ప్రార్ధించెదము. సర్వశక్తిగల దేవా, జీవమునకు కర్త మరియు సమస్త మంచిని, ఆత్యీయ వరములను దయచేయువాడా, మీ యొక్క సన్నిధిలో నుండు, ఈ అత్యద్భుత, సాటిలేని ఒక సహవాసపు సమయము కొరకు, మేము నిజముగానే ఇప్పుడు కృతజ్ఞులముగా నున్నాము. ప్రభువా — మా యొక్క జీవితములలో మేము ఎన్నడును మరువలేని ఒక మహత్తరమైన కార్యముగా ఈ సమయమున్నది, మేము ఎంతసేపు ఇక్కడ ఉండవలసి వచ్చినను పరవాలేదు. మరియు మేము ప్రార్థించుచున్నాము, దేవా, ముగించు ఈ రాత్రియందు, లేఖనములను మేము గమనించుచున్నాము.
పండుగ యొక్క చివరి దినమున, యేసు వారి మధ్యను నిలిచి మరియు బిగ్గరగా ఇలా చెప్పెను, ''ఎవడైనను దప్పిగొనినయెడల, అతనిని నా యొద్దకు రానిమ్ము;'' మరియు పరలోకపు తండ్రీ అది ఈ రాత్రి మరల జరుగవలెనని నేను ప్రార్థించుచున్నాను, ఆయన కొరకు సేవచేయుటకును, ఆయనతో ఇంకా అత్యంత సన్నిహితముగా నడచుటకును మమ్ములను పిలుచు ఆ ప్రభువు యొక్క స్వరమును మేము వినునట్లుగా చేయుము. ఇది చివరి దినములనియు, మరియు సమయము సమీపించినదనియు చెప్పెడి ఆయన స్వరమును ముందుగానే ముద్రలు విప్పబడుచున్నప్పుడే, మేము వినియున్నామని భావించుచున్నాము. మేము అడుగు ఈ ఆశీర్వాదములన్నింటిని యేసుక్రీస్తు నామములో ఆయన మహిమార్ధమై అనుగ్రహించుము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
2నేను దీనిని చేర్చుటకు ఇష్టపడుచున్నాను: నా యొక్క జీవితములో నేను నడిపిన ఆరాధనలన్నింటికంటేను, ఈ వారము నా జీవితములోని అన్ని ఆరాధనలలో ఇది అతిమహిమకరమైన సమయముగా నున్నది. నేను ఏమి కలిగియున్నానో అది అనవసరము …. గొప్ప అద్భుతములు సంభవించుటను మరియు స్వస్థతా ఆరాధనలు ఇంతకు ముందు జరుగుటను నేను చూచాను. అయితే వాటన్నిటికంటేను ఇది శ్రేష్టమైనది. ఇక్కడుండుట నా యొక్క జీవితములోని గొప్ప సమయములలో ఇది ఒక సమయమైయున్నది. ఉత్తమ అనుభవములు ఇక్కడ నాకు యున్నవి, ఈ చిన్న గుడారము చూచుటకు విభిన్నమైన రూపములో ఇది కనబడుచున్నది, అంత మాత్రమే కాదు గాని లోపల కూడా ఒక విభిన్నమైన రూపమును ఇది కలిగియున్నది.
ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళుటకు బిల్లీ ఆలస్యముగా వచ్చెను. దానిని గురించి నేను అతడిని అడిగినందుకు, అచ్చట మరియొక గుంపు బాప్తీస్మమును తీసుకొనిరనియు, వందమందికి పైగా ఈ వారములో జనులు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొన్నట్లుగా అతడు నాతో చెప్పెను. కావున, మనము కృతజ్ఞులముగా నున్నాము! మరియు దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక!
మరియు, ఇప్పుడు, మీకు గనుక ఒక స్థానిక సంఘము లేనియెడల మీరు మాతో వచ్చి సహవాసము చేయవచ్చునని మేము మిమ్ములను ఆహ్వానించుచున్నాము. మీ కొరకు ఆలయము తెరచియుండునని గుర్తుంచుకొనండి. మేము ఒక సంఘశాఖ కాదు, మరియు ఇది ఎన్నటికిని ఒక సంఘశాఖ కాజాలదని నేను నమ్ముచున్నాను, మరియు ఆశించుచున్నాను — ఒక సహవాసముగా మాత్రమే పురుషులు మరియు స్త్రీలు, బాలురు మరియు బాలికలు దేవుని యొక్క బల్లచుట్టూ కలుసుకొందురు, మరియు వాక్యముతో సహవాసము చేయుదురు, మరియు ఇక్కడ అన్ని కార్యములు సమమే, హెచ్చు తగ్గులు లేవు.
3ఇప్పుడు, మనకు ఒక అద్భుతమైన సంఘకాపరి యున్నాడు, ఒక నిజమైన దైవజనుడు, మరియు అందుకు నేను కృతజ్ఞునిగా యున్నాను. మీరు గుర్తుంచుకొనినయెడల ఒక సంవత్సరమునకు ముందు వచ్చిన దర్శనము ప్రకారము ఆ ఆహారము ఈ స్థలములో సమకూర్చబడియున్నది, మరియు అది ఖచ్చితముగా వాస్తవము. మరియు మనము అన్ని వయస్సుల వారికి తగినట్లుగా ఆదివారపు పాఠశాలల కొరకు గాను తగినంత స్థలము ఇప్పుడు మనకున్నది, మరియు ఈ అవకాశమునకై మనము చాలా కృతజ్ఞత గలవారమైయున్నాము. కొంతకాలము క్రిందట ఎవరో చెప్పిరి, ఆదివారపు పాఠశాలలు గనుక ఉండినట్లైన వారి యొక్క పిల్లలను వారు పంపించెదరని వారు చెప్పిరి. ఇప్పుడు ఆ సౌకర్యము యున్నది, కావున ఇప్పుడు మీకు గనుక సంఘమేది లేనియెడల, మీరు వచ్చి మాతో సహవాసము కలిగియుండవచ్చు. మీకు మంచి సంఘము యుండి, అక్కడికి మీరు వెళ్ళుచున్నయెడల, వారు సువార్తను ప్రకటించుచున్నయెడల వెళ్ళండి, ఎందుకని అది ఎచ్చటవున్నా గాని మాలాంటి ఇంకొక గుంపుగా అది యున్నది. కాని మీకు సంఘమనేది లేనియెడల, మరి మీరు ….
4మరియు అనేకులు దీనిని వారియొక్క తల్లి సంఘముగా చేసికొనుటకు దేశములోని ఇతర ప్రాంతముల నుండి ఇచ్చటికి వచ్చియున్నారని నేను గ్రహించాను. మరియు ఇక్కడ ప్రభువు యొక్క వాక్యము నొద్దకు మిమ్ములను నిశ్చయముగా మేము ఆహ్వానించుచున్నాము.
మరియు నేను విడిచి వెళ్ళిపోయినప్పుడు, నేను చెప్పినది నాకు గుర్తున్నదనినేను అనుకొనుచున్నాను, నాకు సంబంధించినంత వరకు ఆరాధనలన్నియూ ఇచ్చట ఈ గుడారములోనే జరుగునని నేను చెప్పాను. మరియు రాబోవు దినములలో దేవుడు నా కొరకు ఏమి నిర్ణయించెనో ఇంకా నాకు తెలియదు. నేను ఏదో మూఢ నమ్మకములను లేక వేరేదైనను కాదు గాని నేను ఆయన హస్తమును మాత్రమే నమ్ముచున్నాను. ఆయనకు నేను ఎక్కడ మెరుగైన సేవచేయుదునో అక్కడికి ఆయన నన్ను నడిపించునట్లుగా నేను అను దినము ఆయనకొరకు ఎదురు చూచుచున్నాను. మరియు ఆయన నా పనిని ముగించినప్పుడు, పిమ్మట ఆయన నన్ను సమాధానముతో గృహమునకు తీసికొనునని నేను నమ్ముచున్నాను.
5మరియు ఇప్పుడు, ఈ ఆలయము యొక్క జనుల సహకారమును బట్టి నేను చాలా కృతజ్ఞునిగాయున్నాను. మరియు ఈ ఆలయము చుట్టుప్రక్కల నున్న గృహములు గలవారు ఎవరినో ఒకరిని ఈ వారమున తమతోపాటు ఉంచుకొని ఆతిథ్యమును ఇచ్చుచున్నారని బిల్లీ నాకు చెప్పెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియనివారిని తమ గృహములను తెరచి వారు ఆ జనులను తమతో చేర్చుకొనిరి, అవి నిజమైన క్రైస్తవ క్రియలుగా యున్నవి. మరియు కొన్ని గృహములలోనైతే వారి గృహములలోని ప్రతి మూలను తెరచి ఎంతమంది వీలైతే అంతమంది జనులను వారు చేర్చుకొనిరి, ఎందుకనగా ఇది బహు కఠినమైన సమయముగా నున్నది…. ఎక్కడ నూ స్థలము లేకుండా ఏదో ఒక విధమైన కార్యక్రమము కొనసాగుచున్నది, ఆటల ప్రపంచములో, బాస్కెట్ బాల్ లేక ఏదో రకమగు ఆటల పోటీలు జరుగుచున్నందువలన ముందుగానే అన్ని చోట్ల ఉన్న స్థలములు రిజర్వేషన్ అయిపోయినవి. ఈ చిన్న సంఘములో సుమారుగా చుట్టు ప్రక్కలనున్న ఇరువది-ఎనిమిది లేక ముప్పై రాష్ట్రముల నుండియు మరియు రెండు విదేశాలలో నుండి జనులు ఇచ్చటకు ప్రతినిధులుగా ఈ చిన్న ఉజ్జీవమునకై వచ్చియున్నారని నేను అనుకొనుచున్నాను, కావున అది స్థలమంతటిని ఆక్రమించుకొనియున్నది.
ఈ రోజు కొద్దిమంది జనులతో నేను అడిగాను, ''కూటములో జెఫర్‌సన్‌విల్ జనులు ఎక్కువ మంది లేనట్లున్నారని నాకు అర్థమయినది,'' అని చెప్పాను.
6ఎవరో నాతో మాటలాడుచు ''మేము లోనికి రాలేకపోయాము,'' అని చెప్పిరి. మంచిది, అచ్చట జరిగిన కార్యమదే. కారణము అదియే. కొందరు పోలీసులు రావలెననుకున్నారు, అయితే వారు వచ్చు లోపల స్థలమంతా జనులతో నిండిపోయినందువలన వారు లోనికి రాలేకపోయిరని వారు చెప్పిరి. కావున బహుషా వారు మరల వచ్చెదమని అనుకొనిరి మరియు వారు రాలేదు. అయితే, ఇప్పుడు ఇతర స్థలముల నుండి జనులు వచ్చుచున్నారు, కాబట్టి మనము చాలా కృతజ్ఞులముగా నున్నాము.
ఇప్పుడు, నాకు తెలియదు. దీని తరువాత ఏడు బూరలు అను ఇంకొక వర్తమానము వెలువడ వచ్చును. అయితే ముద్రలలో సమస్తమును ఇమిడియున్నవి. సంఘ కాలములు వచ్చినవి, మరియు వాటిని మనము మొదటే అమర్చితిమి. అది ప్రాముఖ్యమైనది, దాని యొక్క ఆ సమయము… మరియు సంఘము ఎచ్చటికి వెళ్ళుచున్నదో, మరియు అది ఎట్లు అంతమగుచున్నదో ఇప్పుడు ముద్రలు విప్పబడుటవలన చూపించుట జరిగినది. మరియు ఇప్పుడు మనము కలిగియున్న ఈ కార్యములను చూచుటకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి నిశ్చయముగా మనయెడల ఎంతో కృప కలిగియున్నాడని నేను తలంచుచున్నాను.
7మరియు నేను దీనిని చెప్పాలనుకుంటున్నాను. అనేక సంవత్సరముల క్రితము నేను ప్రసంగించిన పాత నోట్సులలోని గుర్తింపులను తీసి చూచినప్పుడు, నేను ఏదైతే సరియని అప్పుడు తలంచితినో దానినే నేను ప్రసంగించుచూ వచ్చాను. కాని అది నిజమైన కార్యమునకు భిన్నముగా యుండెను. మరియు నాలుగు ముద్రలను నేను సుమారు ఇరువది నిమిషములలో ప్రసంగించి ముగించితిని. ప్రకటనలోని నాలుగు గుర్రములను సవారీ చేయువారిని, నేను వాటన్నిటిని ఒక్కటిగా కలిపి చెప్పేశాను. ''ఒక తెల్లని గుర్రము బయలు వెళ్ళినది అది ఒకవేళ అది సంఘమై యుండవచ్చుననియు తరువాత గుర్రము బయలు వెళ్ళినది, అది కరువును సూచించుచున్నది అనియు నేను ఆ విధముగా ప్రసంగించాను.''
అయితే, ఓ, వాక్యము నిజముగా తెరువబడినప్పుడు, అది నిజముగా నేను ప్రసంగించిన కార్యములకు వందలకొలది మైళ్ల దూరమున నుండెను, కావున కనిపెట్టి మరియు వేచియుండుట మనకు యుక్తమైయున్నది. మరియు బహుశా ఇప్పుడు దానిని చేయవలసిన సమయముగా ఇది నుండవచ్చును. చెప్పబడిన అనేక విషయములు ఒకవేళ ఇతర జనులు వాటిని అంగీకరించకపోవచ్చును. అయితే నేను నమ్ముచున్నాను, ఆ గొప్ప ముగింపు సమయము వచ్చినప్పుడు, మరియు మనము మన ప్రభువును కలిసికొనినప్పుడు అది సత్యమని మీరు కనుగొనెదరు. అది నిజముగా ఆ విధముగా జరుగును.
8ఇప్పుడు, పట్టణమునకు వెలుపల నుండియు, చుట్టుప్రక్కలనున్న పలు విధములైన స్థలముల నుండియు, అనేక రాష్ట్రముల నుండియు, అనేక దేశముల నుండియు మీరు సెలవులు తీసికొని ఎంతో దూరము ప్రయాణము చేసి ఇక్కడికి వచ్చిన మీ యొక్క నిష్కపటమైన కార్యమును నేను మెచ్చుకొనుచున్నాను. మరియు మీలో కొందరికి కనీసము ఇచ్చట ఉండుటకు నేను స్థలములను మీకు సిద్ధపరచుటలో సహాయపడినందువలన దానిని నేనెరుగుదును. భోజనమునకు కూడా డబ్బులు లేకపోయినను వారు ఏమైనా సరే వచ్చి ఏదైనా జరుగునని కనిపెట్టుచుండిరి. మరియు అంతటి గొప్ప విశ్వాసముతో వారిచ్చటకు వచ్చిరి. భోజనము లేకపోయినా, ఉండుటకు స్థలము లేకపోయినా గాని, ఈ విషయములను వినవలెననియు, జరుగుచున్న కార్యములను చూడవలెనని ఆశించుచూ వచ్చిరి. అది నిజముగానే మహత్తరమైనదని మీరెరుగుదురు. మరియు ప్రతియొక్కరును నూటికి-నూరుపాళ్ళు విశ్వాసము కలిగియుండిరి.
అక్కడున్న నా యొక్క బావమరిదిని నేను కలుసుకొన్నాను, అతను ఆలయమును కట్టుటకై ఇటుకలు పేర్చెను మరియు మొదలగు కార్యములను ఆలయము కొరకు అతడు చేసెను. మరియు నేను అతని యొక్క పనిని ఏ విధముగా మెచ్చుకొన్నానో అతనికి చెప్పాను. నేను ఒక ఇటుక మేస్త్రీని కాదు లేక నాకు దానిని గురించి ఏమీ తెలియదు. అయితే నాకు ఒక చదరపు మూల అనగా ఏమిటనియు — అది సరిగ్గా అమర్చియున్నదో లేదోయని నేను చెప్పగలను.
9మరియు అతను చెప్పెను, ''మీరు ఎన్నడును చూడని విధముగా జనులందరును ఇక్కడ సమైక్యతతో కలిసి పనిచేసియున్నారు, వారు అందరును ఒక్కటిగా చేరి పని చేసియున్నారు.'' సహోదరుడు ఉడ్స్, సహోదరుడు రాబర్సన్ మరియు అందరూ ఎంతో ప్రయాసపడి దానికై శ్రమపడిరి. మరియు ఆలయములో మైక్ సిస్టమ్‌ను మరియు సమస్తమును ఒక సహోదరుడు చక్కగా ఏర్పాటు చేసెను. ''సమస్తమును సరిగ్గా క్రమముగా చేయబడియున్నది,'' అని వారు చెప్పిరి, వారికెవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు ఆ అవసరమును తీర్చుటకు అచ్చట ఒకరు అందుకొరకై నిలబడియుందురు. కావున అది…. సమస్త కార్యక్రమములోను దేవుడున్నాడు. దీనికొరకై మేము చాలా కృతజ్ఞులముగా యున్నాము.
ఈ ఆలయ నిర్మాణమునకై అనేకులు గొప్ప విరాళములను ఉచితముగా ఇచ్చిరి, ఇక్కడ కూర్చొనియున్న సహోదరుడు డౌచ్ మరియు సహోదరి డౌచ్, మరియు ఇంకా అనేకులు ఈ కార్యమునకై భారీగా విరాళములను యిచ్చిరి. మరియు ఈ సమయమున వారికి దేనికి కొదువలేదనియు మరియు సమస్తమును చెల్లించబడినదనియు నేను తలంచుచున్నాను. కావున దాని కొరకు మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము.
10గుర్తుంచుకొనండి, ఇది మీ యొక్క సంఘము, ఏలయనగా క్రీస్తుకు నీవు ఒక దాసుడవై యున్నావు — మరియు దేవుని దాసులకు ఇది ఎల్లప్పుడూ తెరచియుండును, అందుకొరకే ఇది ఇచ్చట నిర్మంచబడినది. మరియు క్రీస్తు కొరకు ఇదివరకే సేవకులుగా నున్నవారు లోనికి వచ్చి యేసుక్రీస్తు యొక్క సహవాసము చుట్టూ వారందరూ ఆనందించుట కోసమే ఇది నిర్మించబడినది. మరియు ప్రతి ఒక్కరిని ఇక్కడకు ఆహ్వానించుచున్నామని మీరు తెలుసుకొనవలెనని మేము మిమ్ములను కోరుచున్నాను.
మరియు కొన్ని సమయములలో నేను అభిషేకము క్రింద నున్నప్పుడు సంఘశాఖలపై ఒక విధముగా విరుచుకుపడుదును. నేను ఆ విధముగా చెప్పునప్పుడు మీ యొక్క సంఘకాపరికి లేక ఇతర సంఘములో నున్న ఏ సహోదరునికైనను, సహోదరికైనను విరోధముగా చెప్పవలెనన్న అర్ధముతో చెప్పుట లేదు, ఏలయనగా ప్రతియొక్క సంఘ సంస్థలోను దేవుడు ప్రజలను కలిగియున్నాడు. అయితే ఆయన సంఘసంస్థలను అంగీకరించడు; అయితే సంఘసంస్థలలో నున్న వ్యక్తులను వ్యక్తిగతముగా ఆయన అంగీకరించును. సంఘశాఖలను అంగీకరించడు. అందువలననే జనులు సంఘసంస్థల చుట్టూ ఆ విధముగా బంధింపబడినప్పుడు, సంఘము ఏమి చెప్పునో దానిని తప్ప మరి దేనిని వారు చూడలేరు, మీరు చూశారా! అది ఇతరులతో వారిని సహవాసము చేయనీయదు, మరియు అది దేవుడు ఇష్టపడని ఒక క్రమమైయున్నది, మరియు అది దేవునిచేత అభిషేకింపబడని, లోకపోకడలతో నిండిన కార్యముగా యున్నది.
11కావున ఇప్పుడు, వ్యక్తిగతంగా ఎవరికీ నేను విరోధిని కాను. కాథొలిక్కు, యూదుడు ఎవరైనను, లేక మెథడిస్టు, ప్రెస్‌బిటేరియన్, ఏ సంస్థయైనను, ఏ సంఘశాఖలలో లేనివారు కావచ్చును, సంఘసంస్థకు చెందనివారు కావచ్చును మరియు అన్నిటిలో — దేవుడు ఈ అన్ని చోట్లలో ఆయన బిడ్డలను కలిగియున్నాడు, చూశారా. మరియు ఏదో ఒక ఉద్దేశ్యము నిమిత్తమై వారు అచ్చట యున్నారని అనేక సమయములందు నేను నమ్ముచున్నా — వెలుగుగా నుండుటకు — మరియు చుట్టుప్రక్కలనున్న ప్రతి చోట నుండియు ఆ ముందుగా నిర్ణయింపబడిన వారిని బయటికి లాగుటకు వారు దానిలోనున్నారు. మరియు ఆ గొప్ప కూటమునకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము పిలువబడినప్పుడు మరియు మనము ఆయనను కలిసికొనుటకు పైకి వెళ్ళెదము. మరియు నేను ఆ ఘడియకొరకై ఎదురు చూచుచున్నాను.
ఇప్పుడు అనేక కార్యములు చెప్పుకొనవచ్చును. కూటములు ముగించు చివరి రాత్రియగు ఈ రాత్రి… స్వస్థపరచు కూటములలో ప్రజలు గొప్ప కార్యములు జరుగునని ఎదురుచూచి మరి అది వారిని ఉద్రిక్తతకు లోనగునట్లు చేయుచున్నది. మరియు ఈ రాత్రి నేను అదే కార్యమును కనుగొనుచున్నాను, అందరూ ఏ విధముగాయని ఒక గొప్ప ఆశలతో వచ్చిరి…. మరియు ఆ ముద్రలు ఎట్లు విప్పబడునో అని చూచుటకు ప్రతి రాత్రి వారు అదే విధముగా వచ్చుచున్నారు.
12ఇప్పుడు నేను దీనిని బహు తేటగా చెప్పగోరుచున్నాను. ప్రతిసారియు ముద్రలను గురించిన మర్మము నాకు గదిలో బయలుపడినప్పుడు, అది దానిని గురించి నాకు ఇదివరకే నున్న ఉద్దేశములకు, నేను దానిని గురించి ఇదివరకు నమ్మిన దానికిని, మరియు ఇతరులు వ్రాసిన వాటిని చదివిన దానికి అది వ్యతిరేకముగా నున్నది. మరియు ఈ సమయమున నా మనస్సు… ఈ ఉదయమున స్వస్థతా కూటములు నేను ఏర్పరచుటకు కారణము, నా యొక్క మనస్సు, నా యొక్క స్వంత ఆలోచంచే విధానమునకు చాలా దూరముగా నున్నది. మరియు నేను ఒక గదిలో తలుపులు మూసికొని ఒక లైటు మాత్రము వేసికొనియుండుటకు ప్రయత్నించితిని. ఆ విధముగా నేను గడుపుట ఇది ఎనిమిదవ దినము, ఎక్కడికైనను వెళ్ళుటకు నేను కనీసం నా కారును కూడా ఎక్కలేదు.
ఈ ఆలయ నిర్మాణమునకై అప్పు చేసిన కారణముగా కొందరు సహోదరులతో కలిసి సంతకము చేయుటకై మరియు ఆ విధమైన కార్యములకై బ్యాకుకు వెళ్ళవలసి వచ్చెను. అయితే నేను వెంటనే తిరిగి వచ్చి మరియు చదువుటకును, ధ్యానించుటకును కూర్చొన్నాను. మరియు వింత సంగతి ఏమనగా, ఒక్క వ్యక్తి కూడా దానిని గురించి ఏమీ చెప్పలేదు లేక… సాధారణముగా వారు వచ్చి తలుపులు తట్టుచు మరియు వచ్చి ఏదో ఒకటి అడుగుచు చుట్టూ తిరుగుచునే యుండెదరు. అక్కడ అటువంటిది ఒకటి కూడాలేదు. అది చాలా అసాధారణముగా నుండెను.
13నేను సహోదరుడు ఉడ్స్ ఇంటిలో భోజనము చేయుచున్నాను, సాధారణముగా ఆ స్థలము కార్లతో కిక్కిరిసి యుండును. మరియు ఈ సమయమున ఎనిమిది లేక పదిమంది వివిధమైన జనులు ఎల్లప్పుడు వారి ఇంటిలో ఉండెడివారు, అయితే మరియు ఇప్పుడు ఒక్కరు కూడా రాలేదు.
తరువాత ఈ ఉదయమున, అలసిపోయి, సొమ్మసిల్లిపోయిన ఆయన యొక్క సేవకునిపై ఈ ఉదయమున మన రక్షకుని యొక్క కృపను నేను మరువలేను. నేను ఒక దీన వ్యక్తి యొక్క ప్రశ్నకు నాకు తెలిసినంతమట్టుకు నేను సరిగ్గానే అతనికి జవాబిచ్చానని నేను తలంచుచున్నాను. అకస్మాత్తుగా ఒక బిడ్డ యొద్ద నుండి ఏదో లాగివేసుకున్నట్లనిపించింది. మరియు నాకు అదేమిటని తెలియలేదు. "ఒకవేళ నేను ఆ స్వస్థతా ఆరాధనకు వెళ్ళవలయునని సిద్ధపడుచుండగా, ఒకవేళ ఎవరో చాలా అస్వస్థతగా నున్నందువలన ఇప్పుడే ప్రార్ధనను కోరియుండవచ్చను, అందువలన నాకు ఆ విధమైన భావము కలిగినది," అని నేను తలంచితిని. మరియు నేను జనులను అడిగాను. కొద్ది నిమిషములలో అది బయలుపడెను. మరియు ''మీ యొక్క పాఠ్యభాగమును మీరు చదివితిరా?'' అని ఎవరో అడిగిరి, లేక ఆ విధముగా ఏదో. మరియు ఆ సమయమున నేను ఒక చిన్న కాగితమును తీసికొని మరల దానిని చదివితిని, అదేమి చెప్పియున్నదో గమనించండి. మరియు పుస్తకమును చూచితిని — నేను బదులిచ్చు ప్రశ్నకు అది పూర్తిగా వ్యతిరేకముగా నుండెను, చూశారా.
1KGS 18:38,40,45•
1KGS 19:2,3
14నేను దీనిని మీకు చెప్పవలసియున్నాను. అతీతమైన కార్యము వచ్చునప్పుడు, అది క్రీస్తు యొక్క మనస్సైయున్నది. మీరు మీ యొక్క స్వంత తలంపునకు చాలా దూరముగా నుండెదరు, మీ యొక్క సొంత మనస్సుకు… దానిని మీకు వివరించుటకు నేను ప్రయత్నించను, ఎందుకనగా నేను దానిని వివరించలేను. దానిని నేను చేయలేను. దానిని ఎవ్వరూ చేయలేరు. ఏ విధముగా ఆ మనుష్యుడు ఏలీయా అక్కడ కొండపైన నిలబడి, దేవుని యొక్క సన్నిధిలో, మరియు ఆకాశము నుండి అగ్ని రప్పించి మరియు అగ్ని వెనుకనే వర్షమును కురిపించెను? మరియు అటు పిమ్మట ఆకాశమును మూసివేసెను, మరియు అక్కడ మూడున్నర సంవత్సరములు వర్షము రప్పించెను! మరియు కురువకుండా నిలిపివేసెను, మరియు అదే దినమున మరల వర్షమును రప్పించెను! మరియు అదే అభిషేకము క్రింద, ఏ విధముగా… మరియు నాలుగువందల యాజకులను అక్కడ హతమార్చెను, మరియు తరువాత తన యొక్క ప్రాణమును కాపాడుకొనుటకై ఒక స్త్రీ యొక్క బెదిరింపులకు భయపడి అరణ్యములోనికి పరుగెత్తెను, చూశారా. యెజెబెలు అతని ప్రాణమును తీసెదనని ఆమె ప్రమాణము చేసెను. ఆహాబు మరియు తదితరులు అక్కడ దేవుని యొక్క ప్రసన్నతను వారు చూచుచున్నప్పుడు గొప్ప అద్భుతము జరిగెను.
1KGS 19:4-8
15చూడండి, ఆత్మ అతనిని విడిచి వెళ్ళెను. ఇప్పుడతడు తన ప్రకృతి సంబంధమగు ఆలోచనలో యుండుటచే అతడికి ఏమీ తోచలేదు, చూశారా. తనకుతానుగా ఆలోచించుకొను స్థితిలో అతడు లేడు. మరియు గుర్తుంచుకొనండి, దూత అతనిని పరు౦డబెట్టి అతనికి విశ్రాంతి నిచ్చెను, అతనిని మేల్కొలిపి అతనికి కొన్ని అప్పములను తినుటకు ఇచ్చెను, మరల అతనిని నిద్రపుచ్చి మరియు విశ్రాంతిని యిచ్చెను, మరల మేల్కొలిపి మరికొన్ని అప్పములను యిచ్చెను; మరి నలుబది దినములు అతనికి ఏమి జరిగినదో మనకు తెలియదు. అటు పిమ్మట అతను అక్కడెక్కడో ఒక గుహలోనికి వెళ్ళెను, మరియు దేవుడు అతనిని పిలిచెను.
16ఆ సహజాతీతమైన (Supernatural) కార్యములను వివరించుటకు ప్రయత్నించవద్దు; మీరు దానిని చేయలేరు. మీరు చేయవలసిన ఒక కార్యమేదనగా ముందుకు సాగిపోవుట మాత్రమే. మరియు నామట్టుకు నేను దానిని ఎంతో తేటగా చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, ఇక నుండి నేను దానిని ఆ విధముగా చేయుటకు ప్రయత్నించను. మీరు మరి పరిపూర్ణముగా నమ్మండి లేదా నమ్మకపొండి. మరియు నేనెందుకు ఆ విధముగా చెప్పానని తరువాత మీరు గ్రహించెదరు.
ఇప్పుడు, నేను యథార్ధముగానుండుటకు ప్రయత్నించాను. దేవుడు దానిని ఎరుగును. మరియు ఈ ఉదయమున ఆ ప్రశ్నకు నేను యథార్ధముగా నాకు తెలిసినంత మట్టుకు దానికి జవాబిచ్చుటకు నేను ప్రయత్నించాను. నేను వచనములోని మొదటి భాగమును మాత్రము చదివాను, మరియు అది సరిగా నుండలేదు. అయితే పరిశుద్ధాత్మ దానిని అర్ధము చేసికొనెను, అది నా…. స్వంత తలంపని… చూడండి, గత రెండు లేక మూడు దినములు, ఏమి జరుగుచున్నదో గమనించండి. చూడండి, నేను ఏడు వందలు అని చెప్పియున్నాను …. ''ఏడు వేలు,'' ఏడు వందలు. ఈ ఉదయమున నేను ప్రయత్నించుచుండగా, మరి జనుల వలన అది తెలియజేయబడినది, చూశారా, మరియు మీరు గమనించుచున్నారని అది చూపించుచున్నది.
17ఇప్పుడు ఇంకొకటి, నేను ఇక్కడ ''పావురము,'' అని చెప్పుటకు బదులుగా మరి దానిని నేను గొర్రెపిల్లయని చెప్పాను; అయితే దానిని వెంటనే గ్రహించితిని. మరియు అటు తరువాత ఇక్కడ నేను దానిని గ్రహించలేకపోయాను, పరిశుద్ధాత్మ నన్ను మరల పిలిచి ఆ కార్యమును చూచునట్లు చేసెను. ఆ కార్యములన్నియును నిజమని రెండింతలుగా ఋజువాయెను. దానిని క్రమమైన విధానములో ఉంచవలెనని దేవుడు వాటిని కనిపెట్టిచూచుచున్నాడు. అది నిజము. ఆయన దానిని కోరుకొనుచున్నాడు. అది సత్యమని మీరు తెలిసికొనవలెనని ఆయన కోరుచున్నాడు. దానిని పంపించునది ఆయనే అయియున్నాడు, ఎందుకనగా నిశ్చయముగా అది కాదు… మీకు అవి ఏ విధముగా నున్నవో అట్లే నేనును వాటిని నేర్చుకొనుచున్నాను.
మరియు కావున ప్రభువును గురించి మరియు మనము ఏ ఘడియలో జీవించుచున్నామని తెలిసికొను జ్ఞానమును గురించి నేను చాలా కృతజ్ఞునిగా యున్నాను. సంఘము ఎత్తబడుటకు ముందు సరిగ్గా చివరి కాలమందు జీవించుచున్నాము. ఇప్పుడు… మనము మాటలాడుకొనుచునే యున్నాము, కావున వాక్యమును ఆయన ఆశీర్వదించవలెనని మరలా మనము అడిగెదము.
18మాపరలోకపు తండ్రీ, ఒక గొప్ప కార్యము జరిగిన ఒక గొప్ప రాత్రి, ఒక గొప్ప సమయము ఇక్కడ వచ్చియున్నది. ఇక్కడ జనులందరును చుట్టు కూడుకొని యున్నారు. మరియు తండ్రీ, దేవుడింకను సింహాసనముపై నున్నాడనియును, మరియు ఆయనింకను ఆయన జనులను ప్రేమించుచున్నాడనియును, వారు తెలిసికొనునట్లు ఈ రాత్రి జనుల యొక్క హృదయములలోను, మరియు మనస్సులలోను ఎటువంటి సందేహము లేకుండా ఆ కార్యము తెలియజేయవలెనని నేను ప్రార్ధించుచున్నాను. మరియు లోకము ఈ ఘడియను చూడవలెనని ఎదురుచూచుచున్నది. ఇప్పుడు ఘడియ సమీపించుచున్నది, ఎందుకనగా అది విమోచన కొరకు కేకలు వేయుచున్నది.
మూల పధార్థములు దానిని తిరిగి తీసికొని వచ్చుటకు సిద్ధముగా నుండుట మనము చూచుచున్నాము. క్రీస్తు యొక్క సన్నిధిలోనికి సంఘమును తీసికొని వచ్చుటకు మూల పధార్థములు సిద్ధముగా నుండుటను మనము చూచుచున్నాము. మరియు వధువు తనను రూపుదిద్దుకొని, పెండ్లి వస్త్రములు ధరించుకొని సిద్ధముగా నుండుటను మనము చూచుచున్నాము. దీపములు మిణుకుమిణుకు మనుట మనము చూచుచున్నాము. మనము అంతమ౦దున్నామని మనము ఎరిగియున్నాము.
ఇప్పుడు పరలోకపుతండ్రీ, రెండు-వేల-సంవత్సరములకు ముందు మహిమలో జరిగిన మహత్తరమైన సంఘటనను మరియు ప్రియమైన గొప్ప అపొస్తలుడగు యోహానుకు ఇవ్వబడిన ఈ కార్యములను గురించి మేము ఇప్పుడు ప్రసంగింపబోవుచున్నాము లేక బోధించుటకు ముందుకు కొనసాగిపోవుచున్నాము. మరియు ఈ రాత్రి మేము దానిని గురించి మాటలాడబోవుచున్నాము. గడచిన రాత్రలలో ఆయన మాతో మాటలాడినట్లే, ఇప్పుడును పరిశుద్దాత్మ, ఆయన యొక్క ప్రత్యక్షతయను మహత్తరమైన శక్తితో ముందుకు వచ్చి మేము ఏ కార్యములను తెలిసికొనవలయునని ఆయన కోరుకొనుచున్నాడో, వాటిని ఆయనే మాకు బయలుపచును గాక! యేసు నామములో వాక్యముతో పాటు మమ్ములను మేము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్.
19ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథమును మీరు తెరువగోరుచుండగా, మరియు ఇది ఒక చిన్న వచనము, లేఖనములో ఒకే వచనము, అయితే ఇది చివరి వచనము, అది చివరి ముద్రలో కనుగొనబడినది…. ఇప్పుడు, గత రాత్రి మనము ఆరవ ముద్రను గురించి మాట్లాడుకొనియున్నాము. మొదటి ముద్ర, క్రీస్తువిరోధి పరిచయము చేయబడెను. వాడు ఏ కాలమున బయటికి వచ్చినది అతను ఏ విధముగా బయలువెడలినాడని మనము చూచియున్నాము. మరియు క్రీస్తువిరోధి యొక్క శక్తిని ఎదుర్కొనుటకు దేవుని శక్తితో ఆ జీవి బయలువెడలుటకు ఏ విధముగా పరిచయము చేయబడెనో దానిని మనము చూచియున్నాము! ఎవరి మనస్సులోను దానిని గూర్చి ఏ ప్రశ్న లేదని నేననుకొనుచున్నాను.
వెంటనే దానికి తరువాత, సంఘ కాలములకు తరువాత ఆ జీవులు వెళ్ళిపోయెనని మనము కనుగొనియున్నాము. మరియు దాని తరువాత దృశ్యము పూర్తిగా మారిపోయెను, ఏ జీవియు బయటికి రాలేదు, చూశారా? అయితే సంఘము వెళ్ళిపోయిన తరువాత శ్రమల కాలము వచ్చునని అది మనకు పరిచయము చేయుచున్నది. సంఘ కాలములతో ఎంతో చక్కగా అది సరిపోయినది! మరియు సంఘ కాలములతోను, సమయములతోను మరియు సమస్తముతోను అది రవ్వంత కూడా తేడా యున్నట్లుగా నేను కనుగొనలేదు. దానిని గూర్చి ఆలోచించండి. దేవుడు దానిని చేసినాడనుటకు అది చూపించుచున్నది. మానవ మనస్సు దానిని అర్ధము చేసికొనజాలదు.
REV 8:1
20మరియు ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, మరియు ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, మరియు, మనము… ఏమి సంభవించునని యేసు చెప్పెనో దానిని పరిశుద్ధ లేఖనము తెలుపుచుండగా, ఆ లేఖనములను మనము ధ్యానించుటకు ప్రభువు అనుమతించెను. మరియు ఆ విధముగా లేనియెడల మనమెట్లు దానిని కనుగొనియుండెదము? మరియు ఆయన ఇక్కడ వాటిని మనకు ప్రత్యక్షపరచి, వాటిని అట్లే వెలుపలకు తీసుకొని వచ్చుచున్నాడు. ఆయన అక్కడ ప్రశ్నలకు జవాబిచ్చు ఆ ప్రసంగము, అది ఆరు ముద్రలతో చక్కగా సరిపోవుచున్నది; కాని ఆయన ఏడవ ముద్రను గురించి చెప్పకుండా వదిలివేసెను.
తరువాత ఆయన ముద్రలను తెరచినప్పుడు, దేవుడు వాటిని తెరిచినప్పుడు, (ఇక్కడ గమనించండి), ఆయన కనీసం ఏడవ దాని యొక్క సూచననైనా బయలుపరచుటకు వదిలివేసెను. అది దేవునితోనే యున్న పరిపూర్ణమైన రహస్యము. గమనించుడి, ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథములో ఏడవ ముద్రను చదువబోవుచున్నాము. అది ప్రకటన 8వ అధ్యాయములో నున్నది.
ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. [మరియు దానిని గూర్చి మనము కలిగియున్నది, అంతే.]
21ఇప్పుడు మనము దీనిని గమనించబోవుచున్నాము, మరియు నేను మిమ్ములను ఎక్కువ సేపు ఉంచకుండుటకై ప్రయత్నించెదను, ఎందుకనగా మీలో అనేకులు ఈ రాత్రి మీ గృహములకు వెళ్ళవలెను. మరియు ఈ ఉదయమున ఒక స్వస్థతా కూటమును జరుపవలెనని తలంచాను, ఆ విధముగా చేసియుండినయెడల మీరు ఉదయముననే వెళ్ళుటకు అది అనుకూలముగాయుండియుండును, మీరు వేచియుండనక్కరలేకుండా యుండును. మరియు ఇప్పుడు మనము… మరియు నేను, కూడా, నేను నివసించుచున్న ఆరిజోనాలోనున్న టూసాన్‌కు ప్రయాణము చేయవలసియున్నది. మరియు ఇప్పుడు అది నా యొక్క గృహమైయున్నది. మరియు ప్రభువు చిత్తమైనయెడల నేనిచ్చటికి మరల రావలెనని ఆశించుచున్నాను… జూన్‌లో నా కుటుంబము ఇక్కడికి రావలెనని కొన్ని దినములుండవలెనని కోరుచున్నారు. మరియు ఇప్పుడు నేను ఆ సమయమున ఒక కూటమును ఏర్పరచి మిమ్ములనందరిని మరల చూచుటకు ఆశించుచున్నాను.
22ముందుగా ఏర్పరచబడిన నా యొక్క తదుపరి కూటము న్యూ-మెక్సీకోలోనున్న అల్బక్వర్క్యీ అది తొమ్మిది, పది మరియు పదునొకండు అని అనుకొనుచున్నాను. నేను అక్కడ గురువారము మరియు మంచి శుక్రవారములో ఉండెదను. కావున పూర్తిగా నాకు కూటములున్నవి మరియు ఇతరులు ముందుగా చెప్పియుంచిన మంచి కార్యక్రమములు కలవు. ఆ సమయము వారకు వాటిని గురించి ఏమీ చెప్పలేను, కావున గురువారము మరియు శుక్రవారము నేను అల్బకెర్క్యీ నొద్ద, న్యూ-మెక్సీకోలో ఉండెను.
మరియు అటు పిమ్మట పిదప ఉత్తర కరోలీనాలోనున్న దక్షిణ పైన్స్ అను స్థలమునందున్న "అర్ధరాత్రి కేక" (Midnight cry) అను గుంపు వారుగలరు. వారు నాకు మంచి స్నేహితులు, నేనచ్చట వారితో యుండెదను. అయినా నాకు నిశ్చయముగాయున్నదని తెలియదు. మరియు లిటిల్ రాక్ అను స్థలములోనున్న ఇంకొక గుంపు ఈ కూటములకు సమీపముననే వారు కూటములను కోరుచున్నారు, వారు టెలిగ్రాములు, వర్తమానములు, మరియు సమస్తమును పంపుచున్నారు; గత వేసవిలో కౌ పేలస్ అను చోట యేసు నామము అను గుంపుతో, నేను వారితో కూటములు జరిపాను. వారు అర్కాన్సాస్స్ లో నున్న లిటిల్ రాక్ అను చోట వారి కూటములు కలిగియున్నారు. మరియు గత సంవత్సరము నుండి వారు కనీసము ఒక రాత్రి కూటమైనను జరపాలని కోరుచున్నారు. లేదా పూర్తి కూటములను కోరుచున్నారు, అయినను వారు ఒక కూటముకైననుసరే సిద్ధముగా నున్నారు.
23మరియు కావున ఏమి చేయవలెనో నాకు తెలియుట లేదని వారికి నేను చెప్పాను. వారు దానిని గురించి ప్రచారము చేయవచ్చునని నేను వారికి చెప్పాను. ఇంకొద్ది రోజులైన తరువాత వారు దానిని గురించి సరిగ్గా తెలియజేసెదరు. అతనిప్పుడు పిలిచియున్నాడా? అది సరి. ఏమి చెప్పెను? హాట్ స్ప్రింగ్స్ అదేనా? నేను తప్పు చెప్పాను. మే ఇరువది నాలుగా? జూన్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు. ''ప్రభువు యొక్క చిత్తమైనయెడల'' అది సాధ్యమగునని ఇప్పుడు ప్రకటింపబడియున్నది.
చూశారా, నేను ఆ కార్యములు చేయుటకు కారణము ఇక్కడ కలదు. మీరు కొద్ది కాలమైన తరువాత దానిని నేర్చుకొనెదరు, చూశారా. నేను గనుక ఒక చోటికి వెళ్ళినయెడల, నేను ఏలయనగా ''అక్కడికి వెళ్ళుము,'' అని దేవుడు చెప్పుచున్నాడని తెలుసుకొనిన తరువాతే నా పాదమును అక్కడ మోపెదను, పిదప ఎక్కడైనను శత్రువు లేచినయెడల, ''ప్రభువైన యేసు నామములో నేనిక్కడకి యున్నానని,'' నేను చెప్పెదను. కావున శత్రువును చూచి ''వెనుకకు వెళ్ళుము!'' అని చెప్పెదను. మరియు మీరు నిశ్చయముగానున్నారు, మీ యొక్క స్థానము, చూడండి.
ఆయన గనుక మిమ్ములను ఎచ్చటికైనను పంపినయెడల మిమ్ములను గురించి ఆయన శ్రద్ధవహించును. అయితే మీరు గనుక ఒకవేళ ఆయన పంపెనని నీవు ఊహించుకొని వెళ్ళినయెడల ఏమగునో దానిని గురించి నాకు తెలియదు. ఆయన అక్కడ ఉండకపోవచ్చును. కావున నేనుండగలిగినంత నిశ్చయతతో నేనుండగోరుచున్నాను. ఆయన చెప్పని అనేక కార్యములను నేను చేసాను, అయినను ఆయన యొక్క చిత్తమును సాధ్యమైనంత వరకు ఖచ్చితముగా ఎరిగి నడుచుకోవలెనని ఆశించుచున్నాను. ఇప్పుడు ప్రభువు మిమ్ములనందరిని ఆశీర్వదించును.
24ఇప్పుడు, మనము గమనించాము, ఇది ఒక వచనము మాత్రమే ఇక్కడ, మన ముందు ఒక చిన్న కార్యమును మనము చేయవలెనని కోరుచున్నాము. మనము 7వ అధ్యాయమును వదలివేసామని మీరు గమనించితిరా? 6వ అధ్యాయములో ఆరవ ముద్ర సమమాప్తమైనది, అయితే ఆరవ ముద్రకును మరయు ఏడవ ముద్రకును మధ్యలో ఏదో కార్యము జరిగినది. చూశారా? మరియు ఎంత చక్కగా అది 6వ మరియు 7వ అధ్యాయములకు మధ్య అమర్చబడియున్నది.
ఇప్పుడు, మీరు 7వ అధ్యాయములో గమనించండి, ఆరవ మరియు ఏడవదికి మధ్యలో అక్కడ విరామమున్నది అని మనము గమనించాము. ప్రకటనలోని 6వ మరియు 7వ అధ్యాయములకు మధ్య ఒక విరామము గలదు; మరియు అది ఆరవ మరియు ఏడవ ముద్రలకు ఈ విరామము ఇవ్వబడియున్నది. ఇప్పుడు, మనము దీనిని గమనించవలెను. ఈ కొద్ది సమయమును మనము గమనించుట అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా యున్నది.
GEN 3:6•
ISA 14:12
25ప్రకటన 4వ అధ్యాయమునకు పిమ్మట సంఘము ఎత్తబడునని ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి. నాలుగు గుర్రములను స్వారీ చేయువారు బయలువెడలిన తరువాత సంఘము ఎత్తబడును, చూశారా? సంఘమునకు జరుగవలసిన కార్యములన్నియు ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము వరకు జరుగును. క్రీస్తువిరోధి యొక్క కదలికలో జరిగిన సమస్తమును 4వ అధ్యాయము వరకు జరిగియున్నది. మరియు క్రీస్తుకును, క్రీస్తువిరోధికిని యున్న సమస్తమును ప్రకటనలోని నాలుగవ ముద్రయందు సమాప్తమైనది. మరియు క్రీస్తువిరోధి తన యొక్క సైన్యముతో తన నాశనమునకు వచ్చును; మరియు క్రీస్తు ఆయన యొక్క సైన్యముతో వచ్చును.
ఇటువంటి ప్రాచీన యుద్ధము, కాలమునకు అవతల ప్రారంభమాయెను. మరియు అప్పుడు అక్కడ… సాతాను మరియు అతని దూతలు బయటికి నెట్టివేయబడెను మరియు అప్పుడు వారు భూమిపైకి వచ్చిరి. మరియు యుద్ధము మరల ఆరంభమాయెను, ఏలయనగా దేవుని వాక్యము వెనుక మరుగుచేయబడియున్న హవ్వ ఆ వాక్యమనే కంచెను దాటి వెలుపలికి వచ్చెను. ఆ ఘడియ నుండే సాతాను దేవుని వాక్యముపై యుద్ధము జరిపి జయించెను, ఏలయనగా ఆయన ప్రజలలో బలహీనులైన ఒకరు ఆ సరిహద్దును దాటినందువలననే సాతాను జయించెను.
26మరియు ప్రతిసారి అతడు ఆ విధముగానే ఖచ్చితముగా యుద్ధమును గెలుచుచున్నాడు, ఎందుకనగా ఆయన ప్రజలు వాక్యము నుండి దూరముగా తొలగిపోయి ఆ సరిహద్దును దాటుచున్నారు. మరియు ఈ చివరి సంఘకాలములో ఒక సంస్థ యొక్క క్రమము ద్వారా వాడు అదే కార్యమును చేసెను (సింహముపై సవారి చేయు, నిజమైన, స్వచ్ఛమైన జీవముగల దేవుని యొక్క పరిశుద్ధ సంఘము) వాక్యమును అంగీకరించకుండా, సంఘమును వాక్యము నుండి సిద్దాంతముల వైపుకు త్రిప్పివేసెను.
ఇప్పుడు, ఆ రోమను కాథలిక్కు సంఘము దేనిపై కట్టబడియున్నదో ఆ సిద్ధాంతములు ఎందరికి తెలియును? దానిని వారు అంగీకరించుచున్నారా? పరిపూర్ణముగా. నిశ్చయముగా వారు దానిని అంగీకరించుచున్నారు. కాథలిక్కులకు సంఘము దీనిని చెప్పుటవలన వారి యొక్క భావముకు కొంచెము కూడా దెబ్బ తగులదు, ఎందుకనగా వారు దానినెరుగుదురు. ఈ మధ్యనే వారు ఇంకొక క్రొత్త సిద్ధాంతమును ప్రవేశపెట్టిరి. అదేమనగా, మరియ పునరుత్థానమైనదని చెప్పిరి. అది ప్రవేశపెట్టి ఇటీవల — సుమారుగా పది సంవత్సరములైనదని మీలో ఎందరు జ్ఞాపకముంచుకొనియున్నారు. దానిని ఎందరు గుర్తుంచుకొనియున్నారు? దానిని గురించి ఒక పేపరు అక్కడ యున్నది. నిశ్చయముగా, సమస్తమును ''క్రొత్త సిద్ధాంతము'' చూడండి, అదంతా సిద్ధాంతమే — అది వాక్యము కాదు.
MATT 18:18•
REV 22:18,19
27ఒక కాథలిక్కు మతగురువుతో ఈ మధ్యన నేను సంభాషించినప్పుడు, అతడు చెప్పెను, ''శ్రీ. బ్రెన్హాం గారు,'' ''దేవుడు తనయొక్క సంఘములోనున్నాడు,'' అని అతను చెప్పెను.
''దేవుడు ఆయన యొక్క వాక్యములోనున్నాడు,'' అని నేను చెప్పాను.
''మనము తర్కించుకోరాదు,'' అని అతను చెప్పెను.
''నేను తర్కించుట లేదు,'' అని నేను చెప్పాను. నేను ఒక వాస్తవమైన కార్యమును చెప్పుచున్నాను. దేవుడు ఆయన యొక్క వాక్యములో నున్నాడు. అది నిజము. "ఎవరైనను దానిలో నుండి ఎదైనా తీసినను లేక దానికి ఏదైనా చేర్చినను," అని వాక్యము చెప్పుచున్నది.
అతను చెప్పెను, ''మంచిది, దేవుడు ఇచ్చెను… క్రీస్తు తన సంఘమునకు శక్తిని ఇచ్చెను, భూమి మీద వారు దేనిని బంధించెదరో, పరలోకములోను అది బంధింపబడును అని చెప్పెను కదా! మరియు ఏమిటి…''
''అది ఖచ్చితముగా సత్యమే,'' అని నేను చెప్పాను.
''ఈ సూత్రముపై, పాపమును పోగోట్టుటకు మాకు అధికారము కలదు,'' అని అతను చెప్పెను.
మరియు నేను జవాబిచ్చాను, ''ఆ కార్యము సంఘమునకు ఇవ్వబడిన విధముగా, మరియు దానిని వారు చేసిన విధముగా, మీరు గనుక ఆ విధముగానే వారివలె చేసినయెడల, నేను మీరు చెప్పు దానిని అంగీకరించెదను. ఇక్కడ నీరున్నది, మీ యొక్క పాపక్షమాపణ నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము ఇచ్చినయెడల — ఎవ్వరూ బాప్తీస్మమివ్వకుండానే మీకు మీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట కాదు.'' అది ఖచ్చితముగా యున్నది.
ACTS 2:38,39
28పెంతెకోస్తు దినమున పేతురు తలపుచెవులతో యున్న పెతురును గమనించండి. పెంతెకోస్తు దినమున వారు మాట్లాడుచున్న తాళపుచెవులను పేతురు కలిగియుండెనని గుర్తుంచుకొనుడి. మరియు ''అయ్యలారా! సహోదరులారా! రక్షింపబడుటకు మేమేమి చేయవలయును?'' అని అక్కడున్న వారు అడిగిరి.
పేతురు చెప్పెను, ''మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.'' అది నిజము. కావున ఆ కార్యము దానితో నిత్యము అది స్థిరపరచబడియున్నది. దానితో అది అంతయూ సమాప్తమైనది. అది దానిని చేసెను.
అయితే, ఇప్పుడు మీరు చూడండి, క్రీస్తువిరోధి వచ్చెను, మనము దానిని చిత్రీకరించియున్నాము మరియు దానిని చూపించియున్నాము. అది ఎటువంటి ఒక బయలుపాటు! మై, మై! మరియు దానిని గురించి ఇన్ని సంవత్సరములుగా తలంచుచుండగా, అది కదిలి వచ్చుటను చూచినప్పుడు ఇచ్చట అది ఇప్పుడు ప్రత్యక్షము గాను, పరిపూర్ణము గాను, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నదిగా యున్నది."
29ఇప్పుడు, 6వ మరియు 7వ అధ్యాయములకు మధ్యనున్న వ్యవధిని మనము గమనించుచున్నాము. ఇప్పుడు ప్రకటన 7వ అధ్యాయము, ఇక్కడ ఒక కార్యము జరుగుటను బయలుపరచుచున్నది. ఏమియును లేకుండా అదిక్కడ పెట్టబడి యుండలేదు. ఏ ప్రయోజనము లేకుండా వీటి మధ్య అది పెట్టబడదు, చూశారా. అదిక్కడ ఒక ఉద్దేశ్యమునకై యున్నది, మరియు ఏదో కార్యమును అది బయలుపరచు ఒక బయలుపాటుగా అది యున్నది.
అది ఎంత మర్మముగా మరియు ఎంతటి లెక్కపూర్వకముగా అది లేఖనములలో సరిపోవుచున్నదో గమనించండి, ఖచ్చితముగా. దేవుని యొక్క గణితములయందు మీకు నమ్మకమున్నదా? మీకు గనుక నమ్మకము లేనియెడల మీరు వాక్యములో తప్పిపోయెదరు, మీరు గనుక ఒక నాలుగు లేక ఆరు లేక ఏదో పెట్టుటకు ఆరంభించినప్పుడు అది వాక్యములోని లెక్కల ప్రకారము వాక్యక్రమములో అది లేనియెడల, మీరు ఒక దృశ్యమును పొందెదరు, అదెట్లుండును అనగా ఒక ఆవు చెట్లపై గడ్డిని మేయుచున్నట్లు యుండును. మీరు నిశ్చయముగా తప్పు చేయుదురు, ఎందుకనగా దేవుడు చేయడు… ఆయన యొక్క సమస్త వాక్యము లెక్కల ప్రకారము క్రమముగా నుండును. అవునండీ! పరిపూర్ణత, అతి పరిపూర్ణత! వాక్యములో ఉన్నంత ఖచ్చితముగా పరిపూర్ణముగా మరి ఏ ఇతర సాహిత్యములో కూడా ఆ విధముగా వ్రాయబడలేదు.
30ఇప్పుడు 8వ అధ్యాయము, ఏడవ ముద్రలోని దృశ్యమును మాత్రమే బయలుపరచుచున్నది, ఏడవ ముద్రలో ఏమీ బయలుపరచబడలేదు, ఏమీ ఇప్పుడుబయలుపరచబడలేదు. ఏడవ ముద్రలో అది బయలుపరచబడలేదు. ఇప్పుడు, ప్రకటన 7వ అధ్యాయముతో దానికి ఏ సంబంధమూ లేదు. అది ఏడవ ముద్రను బయలుపరచునదిగా, పరిపూర్ణముగా మౌనముగానున్నది. మరియు నాకు గనుక సమయమున్నయెడల (నేను కొన్ని భాగములను మీకు చూపించుటకు ప్రయత్నించెదను) అక్కడ వెనుక ఆదికాండము నుండి ఈ ఏడవ … ఏడవ ముద్ర పలుకబడుచున్నది. ప్రారంభము నుండి, ఆదికాండములో, ఈ ఏడవ ముద్ర… ఈ ముద్రలు విడువక కదలి వచ్చుచునే యున్నవి.
ఈ ఉదయమున ఈ కార్యములను తీసికొనివచ్చుట మీకు జ్ఞాపకము లేదా? మరియు వాటిని తీసికొని వచ్చుచున్నప్పుడు, ఆ కార్యములను గురించి పలుకునప్పుడు, ఆమె తెంచబడినట్లుగా మీరు కనుగొనగలరు. యేసుక్రీస్తు స్వయంగా మాటలాడినప్పుడు అంత్యకాలమును గురించి చెప్పెను. మరియు దానిని గురించి చెప్పునప్పుడు… ఆరు ముద్రలన్నిటిని గురించి చెప్పెను. ఆయన ఏడవ ముద్ర యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన నిలిపివేసెను. అక్కడే అది ఉన్నది, చూడండి. అది ఒక గొప్ప కార్యము.
DAN 12:11•
REV 7:4
31ఇప్పుడు ఈ యొక్క 7వ అధ్యాయము గురించి మనము మాటలాడబోవుచున్నాము, ఒక్క నిమిషము, ఆరవ ముద్రను మరియు ఏడవ ముద్రను కలుపు కార్యము దానిలో కలదు, ఏలయనగా, మనము కలిగియున్న ఒకే ఒక అంశము ఇప్పుడే చూడవలసియున్నాము, అది ఆరవది. ఆరవ మరియు ఏడవ ముద్రలకు మధ్యనున్న కార్యము, ఇశ్రాయేలు పిలువబడుటయై యున్నది.
ఇప్పుడు ఇక్కడ అనేకమంది నా మంచి స్నేహితులైన యెహోవా సాక్షులు కూర్చొనియున్నారు. వారందరు… వారిలో కొందరు ఇంకా యెహోవా సాక్షులుగానే యున్నారు. అయితే, వారు ఎల్లప్పుడును శ్రీ. రస్సెల్ చెప్పినదానిని, ఆ ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమందిని ఒక సహజాతీతమగు క్రీస్తు యొక్క వధువని అన్వయించెదరు, చూశారా. వారు కాదు. దానికి అసలు సంఘ కాలములతో ఎటువంటి సంబంధము లేనే లేదు. వారు పూర్తిగా ఇశ్రాయేలీయులై యున్నారు. (ఇప్పుడు ఇంకొద్ది నిమిషములలో మనము దానిని చదువబోవుచున్నాము.) ఇప్పుడు ఆరవ… ముద్రలకు మధ్యనున్న విరామము ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది యూదులను పిలిచి వారిని ముద్రించుటగా నున్నది, వీరు సంఘము వెళ్ళిపోయిన తరువాత శ్రమల కాలములో పిలువబడెదరు, చూశారా. దీనికి సంఘకాలముతో ఏ విధమైన సంబంధము లేదు. ఓ, వారు పిలువబడుట మరియు అది లేఖనముతో పరిపూర్ణముగా సరిపోవుచున్నది — దానియేలు యొక్క జనులకు నియమింపబడిన దానియేలు యొక్క చివరి మూడున్నర వారములుగా అది యున్నది, చూశారా. అన్యజనులు కారు — దానియేలు యొక్క జనులకు, మరియు దానియేలు ఒక యూదుడు.
32ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేలు ఆమె యొక్క ప్రవక్తలను నిరూపింపబడిన పిమ్మట, వారిని మాత్రమే నమ్మును. మరియు సంఘ కాలములలో ఎక్కడను, అది అపోస్తులుల సంఘము మొదలుకొని ప్రొటెస్టెంటు సంఘము వరకు ఎన్నడును ఒక ప్రవక్తను కలిగియుండలేదు. ఎవరైనా యున్నయెడల అదెవరని నాకు చెప్పండి మరియు నాకు దానిని చూపించండి. లేదు! అది అపొస్తలుల కాలములో వారికి ఆగబు అను ఒక నిరూపింపబడిన ప్రవక్త యుండెను. అయితే అన్యజనులు దేవుని స్వాస్థ్యములోనికి వచ్చినప్పుడు, పౌలు అన్యజనుల వైపుకు తిరిగెను (గత రాత్రి మనము చదివిన ప్రకారము) పేతురుకు పిమ్మట పౌలు దానిని ప్రభువు నుండి పొందెను, ''ఆయన తన నామము నిమిత్తము అన్యజనుల నుండి ఆయన వధువును తీసికొనుచున్నాడు,'' చరిత్రను చూచినయెడల ఆ తరువాత వారు ఎన్నడూ ఒక అన్యజనుల ప్రవక్తను కలిగియుండలేదు.
33ఇప్పుడు మీరు చరిత్రకు తిరిగి వెళ్ళి మరియు కనుగొనండి. ఎందుకని? అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉండును. ఖచ్చితముగా. మొదటిగా బయలువెడలినప్పుడు, అది ఒక సింహము. అది ప్రవక్త, వాక్యము. తరువాత బయలు వెడలినది, క్రియలు, త్యాగము లేదా బలి. తరువాత వచ్చినది ఒక మానవుని యొక్క జ్ఞానము. అయితే ఈ చివరి దినమున ఇదివరకు తప్పుగా నడిపింపబడిన కార్యములు, వదిలి వేయబడిన, చేయబడని కార్యములను సరిగ్గా బోధింపబడని కార్యములును, సమస్తమును క్రమపరచుటకు మరల సంఘమునకు తిరిగి వచ్చునని మనకు వాగ్దానము చేయబడియున్నది. ఎందుకనగా, ఏడవ దూత యొక్క వర్తమానము దేవుని యొక్క మర్మములను సమాప్తము చేయునని ముందుగానే చెప్పబడియున్నది. మరియు దానినంతటినీ ఇదివరకే చూచితిమి. మరియు అదంతా లేఖనములతో చక్కగా సరిపోవుచున్నదని మనము కనుగొన్నాము. అదియే కారణము.
34ఇప్పుడు ఈ వ్యక్తి రంగము మీదికి వచ్చినప్పుడు మీరు ఊహించగలరా? అతను వచ్చినప్పుడు, గుర్తుంచుకొనండి, అది చాలా దీనముగా నుండును, మరియు ఆ కార్యములు కూడా ఆ విధముగానే యుండును, సంఘములు దానిని తప్పిపోవు విధముగా నుండును. మరియు ఇంకా సంస్కర్తల యొక్క ఆచారముల ననుసరించు సంఘములు దేవుని యొద్ద నుండి వచ్చిన ఏ ప్రవక్తనైనను ఎన్నడైనను అంగీకరించునా? ఎవరైతే సంఘముల యొక్క ఆచారములకును మరియు బోధనలకును విరుద్దముగా యున్నాడో అతనిని అంగీకరించుటను మీరు ఊహించగలరా?
ఇప్పుడు, దానిని నెరవేర్చు ఒకే ఒక వ్యక్తి కలడు, నాకు తెలిసిన భూమి మీద నున్న ఒకే ఒక ఆత్మ కలదు. అది… అది అతని కాలములోనున్న ఏలీయాగా నుండవచ్చును. మరియు అది ఆ విధముగా ఉండవచ్చునని ముందుగానే చెప్పబడియున్నది, అది క్రీస్తుయొక్క ఆత్మ తప్ప మరేదియును కాదు. క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన పరిపూర్ణముగా నుండెను, ఆయన ప్రవక్తయైయుండెను, ఆయన ప్రవక్తల దేవుడు, చూశారా.
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15
35క్రీస్తును చూడండి, ఆయనను వారు ఎట్లు ద్వేషించిరో చూడండి. అయితే వాక్యము, ఆయన ఎట్లు వచ్చునని చెప్పుచున్నదో, ఆయన ఖచ్చితముగా ఆ విధముగానే వచ్చెను. ఆయన ప్రవక్తగా నున్నందువలన, వారు దేవుని రాజ్యమునకు దూరముగా నుండి మరి వారికి వారే దేవదూషణను చేసికొనుచు, మరియు వివేచించు, మరి ఆ విధమైన కార్యములను చూచి, అది ''ఒక అపవిత్రాత్మ'' యని దేవుని ఆత్మను పిలిచిరి. ఆయనను ఒక సోదె చెప్పువాడనియు లేక ఒక దయ్యమనియు, పిలిచిరి. సోదె చెప్పువాడు, ఒక దయ్యము, చూశారా, దయ్యపు ఆత్మ. నిశ్చయముగా. అది మీకు తెలియునా? పరిపూర్ణముగా! సోదె చెప్పుట ఒక ప్రవక్తను అనుకరించు కార్యముగా నున్నది, అది పూర్తిగా దేవునికి ముందు దేవదూషణగా యున్నది.
NUM 12:6•
DEUT 13:1-3•
DEUT 18:22•
JER 28:9
36ఇప్పుడు గమనించండి, దానియేలు యొక్క మూడున్నర సంవత్సరములు లేఖనములతో పరిపూర్ణముగా సరిపోవుచున్నవి. గమనించండి, పాత నిబంధనలో ఒక ప్రవక్త నిరూపింపబడిన పిమ్మట వారి ప్రవక్తలను వారు నమ్మవలెనని ఇశ్రాయేలు విశ్వాసులకు చెప్పబడియున్నది. ''మీ మధ్య ఆత్మ సంబంధియనబడినవాడు గాని ప్రవక్తయని పిలువబడినవాడు గాని యున్నయెడల, యెహోవాయగు నేను నన్ను అతనికి బయలుపరచుకొనెదను, మరియు దర్శనములతో అతనితో మాటలాడెదను, కలల ద్వారాను మాటలాడెదను మరియు కలల యొక్క అర్థమును వివరించెదను.''
ఎవరికైనను ఒక కల వచ్చినయెడల, ప్రవక్త దానియొక్క అర్ధమును చెప్పగలడు. మరియు అతనికి గనుక ఒక దర్శనము వచ్చినయెడల, అతను దానిని మాటలాడును. "దర్శనముల ద్వారాను మరియు కలల ద్వారాను, నన్నునేను అతనికి బయలుపరచుకొనెదను, మరియు నన్నునేను అతనికి తెలియపరచుకొనెదను. మరియు అతను చెప్పునది నెరవేరినయెడల, పిమ్మట ఆ ప్రవక్త చెప్పునది వినండి, ఎందుకనగా అతనితో కూడా నేను యున్నాను. అతను చెప్పినది గనుక జరుగకున్నయెడల, అతనికి మీరు ఏమాత్రము భయపడకండి." అది నిజము. దానికి దూరముగా నుండండి, అతనిని ఒంటరిగా వదలి వేయుడి, చూశారా.
37'' ఇప్పుడు అది… ఇప్పుడు ఇశ్రాయేలుఎల్లప్పుడూ దానిని నమ్మును. మరియు మీరు దానిని చూడలేకున్నారా? ఎందువలన? ఇప్పుడు, ఈ రాత్రి ఈ మంచి పాఠమును మీరు గ్రహించవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. ఎందుకని? ఎందుకనగా అది దేవుని యొద్ద నుండి వారికి వచ్చిన ఆజ్ఞయైయున్నది. మరియు అన్యజనులు ఎన్ని కరపత్రములు అచ్చటికి తీసుకు వెళ్ళి వారికిచ్చినను, నాకు లెక్కలేదు. మరియు ఒక పరిశుద్ధ గ్రంథమును మీరు మీ చేతిలోనుంచుకొని ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి ఇది, అది, లేక ఇంకొకటియని ఎన్ని విధములుగా పరిశుద్ధ గ్రంథమును నిరూపించినను, నాకు లెక్కలేదు. వారు ఒక ప్రవక్తను తప్ప మరి దేనిని అంగీకరించరు. అది ఖచ్చితముగా సరియే. ఏలయనగా ఒక ప్రవక్త మాత్రమే దైవవాక్యమును తీసికొని మరి దానిని స్థానములో నుంచును మరియు ఒక నిరూపింపబడిన ప్రవక్తగా యుండును. దానిని వారు నమ్మెదరు. అది నిజము.
ISA 9:6•
MATT 3:9•
LUKE 3:8
38ఇంచుమించు తన జీవితకాలమంతా జాన్ రైన్ గ్రుడ్డివాడుగా నుండి తనయొక్క చూపును పొందుకొనెను. ఆ సమయములో బెంటన్ హార్బర్ నందున్న ఒక యూదునితో దానిని గురించి నేను మాటలాడుచుంటిని. వారు నన్ను అక్కడున్న దావీదు యొక్క గృహమునకు తీసికొని వెళ్ళిరి. మరియు ఈ రబ్బీ తన యొక్క పొడవాటి గడ్డముతో బయటికి వచ్చెను. ''ఏ అధికారము వలన జాన్ రైన్‌కు నీవు చూపునిచ్చితివి,'' అని ఆయన అడిగెను.
''దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామములో,'' అని నేను చెప్పాను.
అతను ''దేవునికి ఒక కుమారుడు యున్నాడను కార్యము దూరముగా నుండనిమ్ము!'' అని చెప్పెను, మరియు ''మీరు దేవుణ్ణి మూడు ముక్కలుగా కోసి మరియు ఆయనను ఒక యూదునికి ఇవ్వలేరు. దేవుణ్ణి మూడు ముక్కలుగా చేయుచున్నారు. మీరు ఒక విగ్రహారాధికుల గుంపు," అని అతను చెప్పెను.
నేను చెప్పాను, ''నేను ఆయనను మూడు ముక్కలుగా చేయలేదు.'' నేను చెప్పాను, ''రబ్బీ, మీ యొక్క ప్రవక్తలలోఒకరు తప్పుగా చెప్పిన దానిని నీవు నమ్ముట నీకు ఒక వింతైన కార్యముగా నుండును కదా?''
అతను చెప్పెను, ''మా ప్రవక్తలు ఎన్నడును తప్పుగా చెప్పరు.''
''యోషయా 9-6 ఎవరిని గురించి మాటలాడుచున్నాడు?'' అని నేను అడిగాను.
''మెస్సీయాను,'' అని అతను చెప్పెను.
నేను చెప్పాను, ''అట్లైనయెడల మెస్సీయా ఒక మానవ ప్రవక్తగా నుండును గదా!'' అది నిజమేనా?
''అవునండి. అది నిజమే,'' అని చెప్పెను.
''యేసు ఆ విషయములో ఎచ్చట తప్పిపోయెనో మీరు నాకు చూపించండి,'' అని నేను అడిగాను. ''మెస్సీయా-ప్రవక్తకును దేవునికి గల సంబంధము ఏమిటి?'' అని నేను అడిగాను.
''అతను దేవునిగా నుండును,'' అని అతను చెప్పెను.
''అది నిజమే. ఇప్పుడు మీరు దానిని వాక్యము ద్వారా గ్రహించావు,'' అని నేను చెప్పాను. కావున నాకు సహాయపడుము, ఆ యూదుడు అక్కడ నిలబడియుండగా మరియు అతని చెంపల మీదుగా కన్నీరు కారుచుండెను, ''నేను కొంతకాలమైన పిమ్మట నీవు చెప్పునది వినెదను,'' అని అతను చెప్పెను.
నేను అడిగాను, ''రబ్బీ, నీవు దానిని నమ్ముచున్నావా?''
మరియు అతను చెప్పెను, ''చూడుము,'' అతను చెప్పెను, ''దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు.''
ఆయన క్రొత్త నిబంధనలో యున్నాడని నేనెరుగుదును. నేను అడిగాను, ''నిజమే, రబ్బీ, ఇప్పుడు దాని మాట ఏమిటి?''
అతను చెప్పెను, ''నేను గనుక దానిని ప్రసంగించినయెడల, నేను అక్కడ నుండి క్రిందకు త్రోయబడెదను,'' [వారియొక్క స్థానములు అక్కడ కొండపైన నుండునని మీకు తెలియునా,] ''వీధిలో అక్కడ నేను నా రొట్టెకై అడుక్కోవలసియుండును,'' అని అతను చెప్పెను.
నేను చెప్పాను, ''నేను నా యొక్క రొట్టెకై అడుగుకొనుటకే ఇష్టపడుదును గాని.'' [యూదులు ఇంకా డబ్బు మీదనే తమ చేతులను ఉంచియున్నారు, మీకు తెలియునా, చూశారా.] ''నేను ….'' [మరియు అతని పేరు బంగారులో నుండవచ్చును అక్కడ, …] నేను చెప్పాను, ''నా పేరు అక్కడ ఆ భవనముపై సువర్ణాక్షరములతో లిఖింపబడి మరియు నేను దేవునికి దూరముగా వున్నానని తెలిసికొనుటకంటె, నేను ఉప్పు బిస్కెట్లు తిని మరియు కొమ్ముల ద్వారా వచ్చు నీటిని త్రాగుచు దేవునితో సరిగ్గా సంబంధము కలిగియున్నానని తెలిసికొని, అక్కడే పడియుండెదను. దానిని నేనెరుగుదును.'' అతను నేను చెప్పునది ఇక వినదలచుకొనలేదు, కావున అతను లోపలికి వెళ్ళిపోయెను.
EXOD 20:2,3•
DEUT 6:4•
MARK 12:29
39అయితే దానిలోనున్న కార్యమదే. మీరు దేవుణ్ణి ''తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ, యని పిలిచి రెండు లేక మూడు ముక్కలుగా కోయలేరు మరియు మూడు దేవుళ్లను చేసి దానిని ఒక యూదునికి ఇవ్వలేరు. ఆయన యొక్క ప్రధానమైన ఆజ్ఞయే ఇది, ''నాకు ముందు వేరే ఏ దేవుని మీరు కలిగియుండకూడదు. నేను నీ దేవుడగు యెహోవాను.'' యేసు ఏమి చెప్పెను? యేసు చెప్పెను, ''ఓ, ఇశ్రాయేలు వినుము, మీ ప్రభువైన దేవుని నేనే." ఒకే దేవుడను; మూడు దేవుళ్ళు కాదు. మీరు ఆ విధముగా ఎన్నటికిని వారికివ్వలేరు. ఏ ప్రవక్తయు ఆ విధముగా మూడు దేవుళ్లను గురించి మాట్లాడలేదు. లేదు. ఎచ్చటా మాట్లాడలేదు. ఎచ్చటా దానిని మీరెన్నడూ మరిఎన్నడును వినలేరు. లేదండి. అది ఒక విగ్రహారాధన మరియు అన్యులనుండియే వచ్చినది. అవునండి.
DAN 12:12•
REV 7:4
40గమనించండి, అయితే ఈ ప్రవక్తలు వచ్చెదరు. అంత మాత్రమే కాదు… ఇప్పుడు ఆ ప్రవక్తలు ప్రకటన 11వ అధ్యాయములో నున్నారు. దానిలో కొంత భాగమును మనము చదివితిమి. మరియు మీరు దానిని చదువవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను, టేపులను మరి ఆ విధముగా వాటిని వినండి, చదువండి. వారు ప్రవక్తల యొక్క సూచనల ద్వారా పూర్తిగా ఒక నిరూపించబడిన ప్రవక్తలుగా యుందురు. తరువాత ఇశ్రాయేలు దానిని గురించి వినబోవుచున్నది.
ఇప్పుడు మీకు, యెహోవా సాక్షులైన నా స్నేహితులారా, ఇప్పుడు అర్ధము చేసికొనండి, ఈ ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమందికి, వధువుకు ఏ సంబంధములేదు. దానిని బలపరచు ఒక్క లేఖనమైనా లేదు. లేదండి. వారు వధువు కాదు. వారు యూదులైయున్నారు! — వారు దానియేలు యొక్క డెబ్బది వారముల చివరి మూడున్నర సంవత్సరముల కాలములో ఎన్నుకొనబడినవారు. ఇప్పుడు అది… నేను దీనిని మరల, మరల చెప్పుచునేయున్నాను. ఇక్కడున్న మీకు కాదు, దీనిలోనున్న అనేకములు, అయితే, చూడండి, జనులు… అ టేపులు ప్రతిస్థలమునకు వెళ్ళును. మీరు చూడండి, మీరు దానిని అర్ధము చేసికొనండి. నేను మరల వాటిని గుర్తించి చెప్పుటను మీరు వినుచున్నారు, అది ఆ ఉద్దేశము కొరకు మాత్రమే.
41గమనించండి, ఇప్పుడు, చూడండి, వారెట్లు గ్రుడ్డివారుగా… మీరు చూశారా వారు ఎట్లు… యేసు… లేదా ఇప్పుడు వారు యేసును గుర్తించకుండా దేవుడు వారిని గ్రుడ్డివారుగా చేయవలసి వచ్చెను. వారు గనుక దానిని ఎరిగియున్నయెడల, వారు గనుక దానిని ఎరిగియున్నయెడల… వారు వారియొక్క నిజస్థితిలో నుండి మరియు ఆయన చేసిన సూచనను చూచియున్నయెడల, ఒక ప్రవక్తను గురించి వారికి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వారు ధర్మశాస్త్రము క్రింద నుండి మరియు వారు యేసు దానిని చేయుట వారు చూచియున్నయెడల, ''ఇది మెస్సీయా,'' అని వార చెప్పియండెదరు. అదెందువలన?
42ఆ కాలములో నున్నవారును, ఎవరి పేర్లయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడియున్నవో, ఆయన అపొస్తలులును మరియు మొదలగువారును, వారు దానిని చూచిరి మరియు దానిని గుర్తించిరి. తక్కినవారు ఎందుకు చూడలేకపోయిరి? చూచారా? వారు గ్రుడ్డివారిగా నుండిరి. వారు దానిని చూడలేకపోయిరి; ఇంకను వారు దానిని చూడలేకున్నారు. మరియు ఆమె ఒక దేశముగా ఒకే సమయములో జన్మించువరకు వారు దానిని చూడలేరు. వాక్యము ఎన్నడూ తప్పిపోదు. గుర్తుంచుకొనండి, వాక్యము ఎన్నటికిని తప్పిపోదు. ఎన్ని ఉద్రేకములు మీరు కలిగియున్నను, మరియు ఏమి సంభవించినను, అయినప్పటికిని ఆ వాక్యము తప్పిపోదు. అదెట్లుండునని దేవుడు చెప్పెనో, ఖచ్చితముగా అది ఆ విధముగానే ఉండబోవుచున్నది, చూశారా.
43ఇప్పుడు ఈ సంగతులు జరుగవలెనని మనము గుర్తించుచున్నాము. మరియు ఆ కారణము చేతనే, ఆయన ప్రవక్తగా తననుతాను పరిపూర్ణముగా తెలియపరచుకొనినప్పటికిని యేసును వారు గుర్తించలేకపోయిరి. అక్కడ ఆ బావియొద్ద నిలబడియున్న చిన్న వృద్ధ సమరయ స్త్రీని చూడండి. ఆయన అంతకుముందెన్నడూ సమరయ పట్టణమునకు వెళ్ళలేదు. ఆయన అచ్చటికి వెళ్ళెను, మరియు చెప్పెను, ఆ దారి గుండావెళ్ళవలసిన పని నాకున్నది అనెను. మరియు ఆయన అచ్చటికి వెళ్ళెను, మరియు అక్కడ ఆ చిన్న స్త్రీ ఉండెను. మరియు ఆమె ఆ మతసంబంధమైన యాజకులు మరియు ఆ దినముననున్న వారికన్నను సువార్తను అంగీకరించు చక్కటి స్థితిలో ఆమె యుండెను. ఆమె దానిని చేసెను. నిశ్చయముగా. ఇప్పుడు చూడండి, అయితే వారందరూ ఆయనను నిరాకరించుచున్న సమయములో కూడా, వారిలోనున్న ఒక ఘనునిగా ఎంచబడిన ఏ వ్యక్తి కూడా ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక బోధకుడని అంగీకరించలేదు.
NUM 21:8,9
44ఈ మధ్యనే, దక్షిణ ప్రాంతములలోనున్న ఒక మంచి వైద్యునితో అతని కార్యాలయమునందు నేను మాట్లాడుచుంటిని, లూయిస్‌విల్‌లో నున్న ఒక మంచి ప్రత్యేకమైన వైద్యుడు, నిజముగా ఒక ధైర్యముగల వ్యక్తి, మరియు నేను అతనితో చెప్పాను, ''వైద్యుడా, నేను నిన్ను ఒక ప్రశ్న అడగవలెనని కోరుచున్నాను,'' అని నేను అడిగాను.
''మంచిది అడుగుము,'' అని అతను చెప్పెను.
నేను చెప్పాను, ''నేను మీ యొక్క వైద్య గురుతును గమనించాను. దండమును ఒక కొయ్యను చుట్టికొనియున్న ఒక సర్పమును మీరు కలిగియున్నారు. అది దేనిని సూచించుచున్నది?''
''నాకు తెలియదు,'' అని అతను చెప్పెను.
మరియు నేను చెప్పాను, ''అది దీనికొరకై యున్నది: అది దైవీక స్వస్థతకు ఒక సూచనగా యున్నది, అక్కడ మోషే అరణ్యములో ఒక ఇత్తడి సర్పమును పైకి ఎత్తెను, చూడండి, అది ఒక సూచన మాత్రమే, నిజమైన క్రీస్తుకు, కేవలం ఒక గుర్తుగా అది యున్నది.'' ఇప్పుడు, ఈ దినమున వైద్యము లేక మందు దైవీక స్వస్థతకు ఒక సూచనగా యున్నది. మరియు వారిలో అనేకులు దానిని నమ్మకుండినను, నిజమైన మంచి వైద్యులు దానిని నమ్మెదరు. అయితే వారిలో కొందరు దానిని నమ్మరు, అయితే వారు నమ్మినను లేక నమ్మకున్నను ఎత్తి పట్టుకొనియున్న ఆ చిహ్నమే సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తిని గురించి సాక్ష్యమిచ్చుచున్నది. అది నిజము. అక్కడ వైద్య చిహ్నముపై ఇత్తడి సర్పము ఒక కొయ్యపై వ్రేలాడుచున్నది.
ROM 11:24
45ఇప్పుడు, ఈ యూదులను గమనించండి. ఇప్పుడు, గ్రుడ్డితనపు పొరలు ఈ జనుల యొక్క కండ్లపై నున్నవి. దానికి వారు నిస్సహాయుటై యున్నారు. అది అక్కడ నుండెను, మరియు దేవుడు దానిని అక్కడనుంచెను. మరియు వారు వారికి వాగ్దానము చేయబడిన కాలము వచ్చు వరకు ఈ రాబోవు ప్రవక్తలు వచ్చు వరకు ఆ విధముగానే నుండెదరు. మీరు మిషనెరీలను పంపించ వచ్చును, మీరు కోరిన ప్రతిదానిని మీరు చేయవచ్చును. ఇశ్రాయేలు ఈ ప్రవక్తలు రంగము పైకి వచ్చు వరకు మారనేమారరు, మరియు అది అన్యజనుల సంఘము ఎత్తబడిన పిమ్మట జరుగును. ఎద్దు యొక్క కాలములో సింహము యొక్క పిలుపును ఎవరూ అంగీకరించని విధముగా, అది యుండును; ఎందుకనగా ఎద్దు యొక్క ఆత్మ బయలువెళ్ళెనని దేవుడు ఆయన వాక్యములో చెప్పెను. మరియు సంస్కర్తల కాలములో, ఒక మానవుడు బయలు వెళ్ళెను, చూశారా? మీరు ఊరక… అది ఒక్కటియే వారు అంగీకిరంచెదరు. అది మరియు ఇప్పుడక్కడ, వారు గ్రుడ్డివారిగా యున్నారు. మరి దానిలోనున్న కార్యము అదే.
ఇప్పుడు గమనించండి, అయితే అన్యజనుల కాలము పూర్తియగు కాలము వచ్చుచున్నది. అక్కడ ఒక చెట్టున్నది, మరియు వేర్లు యూదులుగా యున్నారు. మరి అది నరకబడెను, మరియు అన్యులు దానిలో అంటుకట్టబడిరి, ''అడవి, ఒలీవ చెట్టు,'' మరియు అది తన ఫలము నిచ్చుచున్నది, ఇప్పుడు అన్యవధువు తెంపబడినప్పుడు (నేను ఇంతకు మునుపు మాట్లాడిన వధువు వృక్షము), దేవుని యొక్క సన్నిధికి తీసికొనబడును, అవిశ్వాసులైన అన్యజనులను దేవుడు ప్రక్కకు తుడిచిపెట్టును (నిద్రించుచున్న కన్యకలు), మరియు మరల అంటుకట్టును. దానిని చేసెదనని ఆయన వాగ్దానము చేసెను. మరియు ఆ సమయము వరకు, మీరెక్కడ నున్నారని మీరు తెలుసుకొనవలెను…. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారని మీరు గనుక ఎరిగియున్నయెడల, మంచిది, అది సరి. మీకు గనుక తెలియకున్నయెడల, ఎందుకు, మీరు అంధకారములో తడబడుచున్నారు.
REV 7:4•
REV 11:3
46ఇప్పుడు, ఆ కాలమున యూదులు మారెదరు. ఇప్పుడు, అభిషేకింపబడిన వాగ్దానము యొక్క శక్తి క్రింద సంఘ కాలములో, జరిగినట్టు అదే విధముగా వారు క్రిస్తును అంగీకరించెదరు; అయితే ఇప్పుడు అన్యజనులు ఇక్కడ యున్నప్పుడు యూదులు క్రీస్తును అంగీకరించరు.
ఇప్పుడు, ప్రకటన 11వ అధ్యాయములోనున్న ఈ ప్రవక్తలిరువురు ఎటువంటి వర్తమానమును ప్రసంగించెదరో మనము చూచెదము. ఇప్పుడు వారు ఖచ్చితముగా ఏమి చేయబోవుచున్నారో మీరు సరిగ్గా చూడబోవుచున్నారు. మిగిలిన శేషము లేదా ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది ముందుగా నిర్ణయింపబడినవారు, దేవుని యొక్క ముద్రను పొందియున్నారు.
REV 7:1-4
47మనమిప్పుడు చదివెదము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు, మీకు గనుక వీలైనయెడల మీరు నాతో చదువవలెనని నేను కోరుచున్నాను, ఏలయనగా నేను దీనిని ఇంకొద్దిసేపటిలో మరల చెప్పబోవుచున్నాను. ఇప్పుడు 7వ అధ్యాయము, ఇది ఆరవ మరయు ఏడవ ముద్రకు మధ్యలో నున్నది.
…. అటు తరువాత (ఈ ముద్రలు) ….
ఆరవ ముద్ర విప్పబడెను, మరియు అది శ్రమలకాలమైయున్నది. ఇప్పుడు దానిని అందరూ అర్ధము చేసికొన్నారా? ఆరవ ముద్ర విప్పబడెను మరియు శ్రమల ప్రారంభమయెను. దీని తరువాత, గమనించండి.
అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవ దూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని యుండగా చూచితిని [నాలుగు దూతలు].
మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయదిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించువరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైననుహాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
వధువు కాదు; ''దాసులు.'' కుమారులు కారు; దాసులు. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ దేవుని దాసులే. జన్మించుట ద్వారా సంఘము కుమారులుగా వున్నది, చూశారా. ఇశ్రాయేలు ఆయనకు దాసుడు. గమనించండి, ప్రతీ చోటను, అది ఎల్లప్పుడును అలాగే యున్నది. అబ్రాహాము ఆయన యొక్క దాసుడు. మనము దాసులము కాము; మనము బిడ్డలము, కుమారులు మరియు కుమార్తెలము.
… మన దేవుడు వారి నోసళ్ళ యందు. [ఇప్పుడు గమనించండి, మన దేవుడు వారినొసళ్ల యందు.]
మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని [ఇప్పుడు వారిని గురించి చదువుచుండగా చాలా జాగ్రత్తగా మీరు వినవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను]: ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష-నలుబది-నాలుగు-వేలమంది.
REV 7:5-8
48ఆయన వారికి పరిపూర్ణముగా పేర్లు పెట్టెను. ఇప్పుడు, ఇక్కడ బ్రిటిష్-ఇశ్రాయేలు వివేచించువారు కూర్చొనియున్నయెడల, వారు అనుకొన్న కార్యములు ఎట్లు తప్పో ఇప్పుడు చెప్పబోవు దానిని చాలా జాగ్రత్తగా వినండి, చూశారా.
యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండు వేలమంది. [''గోత్రమని పిలువబడినది.''] రూబేను గోత్రములో పండ్రెండు వేల మంది. గాదు గోత్రములో… పండ్రెండు వేలమంది. [మీ యొక్క గోత్రములను ఇప్పుడు గమనించండి.]
ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది. నాప్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది. మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది.
షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రించబడిరి. లేవి గోత్రములో పండ్రెండు వేలమంది. ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది. [ఇశ్శాఖారు, మీరు దానిని చెప్పారని నేను ఊహించుచున్నాను] …పండ్రెండు వేలమంది.
జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది. మరియు యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రించబడిరి. బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
REV 7:9-13
49ఇప్పుడు, అక్కడ పండ్రెండు గోత్రములున్నవి, ఒక గోత్రము నుండి పండ్రెండు వేలమంది. పండ్రెండు గుణించినయెడల ఎంత వచ్చును? ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది. ఇప్పుడు గమనించండి, వారు ఇశ్రాయేలులో సకల గోత్రములోని వారైయున్నారు.
ఇప్పుడు గమనించండి, దీని తరువాత, ఇప్పుడిక్కడ ఇంకొక గుంపు వచ్చుచున్నది. ఇప్పుడు, వధువు వెళ్ళిపోయెను. మనము దానిని ఎరిగియున్నాము, అయితే ఈ గుంపు పైకి వచ్చుటను గమనించండి.
అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల యెదుటను నిలువబడి;
సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దల చుట్టును, ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్:
యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, … మహిమయు, … జ్ఞానమును, … కృతజ్ఞతా, … స్తుతియు, … ఘనతయు, … శక్తియు, … బలమును,… కలుగును గాకని చెప్పుచు, దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్.
పెద్దలలో ఒకడు…. [ఇప్పుడు అతను ఇక్కడ పెద్దల ఎదుట యున్నాడు. ముద్రలన్నిటిలోను మనము యితనిని చూచాము.] మరియు పెద్దలలో ఒకడు బదులిచ్చుచు నన్ను అడిగెను, వీరెవరు ….?
REV 7:14-17
50ఇప్పుడు యోహాను, ఒ యూదుడైయుండి, తన స్వంత జనులను గుర్తించెను. అతను వారిని గోత్రముల రూపమున చూచెను. అది సరియేనా? అతను గుర్తించి మరియు వారిలో ఒక్కొక్క గోత్రమును పిలిచెను. అయితే ఇపుడు, అతను వీటిని చూచినప్పుడు, అతను ఒక విధముగా ఆశ్చర్యపడెను. మరియు దానిని పెద్ద ఎరిగియుండెను, కావున అతను చెప్పెను: "తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? మరియు ఎక్కడ నుండి వచ్చిరి?" [ఇప్పుడు యోహాను జవాబిచ్చెను]:
మరియు నేను అతనితో చెప్పితిని, అయ్యా, నీకే తెలియును. [యోహాను వారిని ఎరుగడు, చూడండి. సకల జాతులలో నుండి, భాషలలో నుండి మరియు దేశముల నుండి వార వచ్చిరి.] మరియు అతను నాతో చెప్పెను, వీరు మహాశ్రమల [ఇంకొక మాటలో, మహాశ్రమలు] నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును.
వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలి యైనను వారికి తగులదు.
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును.
51ఇప్పుడు మనము తెరిచెదము…. ముద్రను తీసికొనెదము. మీరు గమనించితిరా, వారు… మనము ప్రారంభించెదము, మొదట ఇశ్రాయేలు నుండి; మరియు అటు తరువాత మనము శుద్ధీకరించబడిన సంఘమును చూచాము. వధువును కాదు; శ్రమల ద్వారా శీద్ధీకరించబడిన సంఘము ఇక్కడ వచ్చుచున్నది — మహా శ్రమలనుండి నిజమైన యధార్థమగువారు గొప్ప సంఖ్యలో వచ్చుచున్నారు. సంఘము కాదు. అది వెళ్ళిపోయినది, వధువు. అక్కడే సంఘమున్నది.
సింహాసనము వేయబడుననియు, మరియు వారు ప్రతిఒక్కరు తీర్పులో ఎట్లు నిలబడెదరనియు యేసు చెప్పినదానిని, ఇప్పుడు మనము కొద్దిసేపటిలో కనుగొనెదము. ఇప్పుడు, ఈ జనులు జీవము గల దేవుని యొక్క ముద్రతో ముద్రింపబడిరని మనము కనుగొన్నాము, (అది సరియేనా?), వారు యూదులు.
జీవముగల దేవుని యొక్క ముద్ర ఏమిటి? ఇప్పుడు, నేను ఎవ్వరిని వారి మనస్సులను నొప్పించుటకై దీనిని చెప్పుట లేదు, చూడండి? అనేకమంది వేదపండితులు దీనిని గురించి వ్రాసినది చదివిన పిమ్మట నేను చెప్పుచున్నాను, ఈ రక్తముతో కడుగబడినవారు నిజముగా వధువని వారు చెప్పుచున్నారని మీరెరుగుదురా? ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది కూడా వధువేనని అనేక వేదపండితులు చెప్పుచున్నారని మీరెరుగుదురా? అక్కడ ఏదో ఒకటి తప్పుగా జతపరచబడవలయును … సరిగ్గా ఇక్కడే, ఎందుకనగా ఇప్పుడు ఇక్కడ ఏదో తప్పు యున్నది.
EPH 4:30
52గమనించండి, మనయొక్క అడ్వెంటిస్టు సహోదరులు సబ్బాతు దినమును ఆచరించుటయే, దేవుని యొక్క ముద్రయని చెప్పుచున్నారు. మీకు అది తెలియును. అయితే ఆ సబ్బాతు లేక సబ్బాతు దినమును ఆచరించుటయే దేవుని యొక్క ముద్రయని చూపించు ఏ ఒక్క లేఖనమైనను నాకు మీరు చూపింపవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. చూశారా, ఎవరో ఒకరు ఆ అభిప్రాయమును వెల్లడించిరి. అయితే మీరు గనుక ఎఫెసీయులు 4:30 చదివిన యెడల, ''దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు,'' అని అది చెప్పుచున్నది, అవునండి.
మధ్యవర్తిత్వపు పని జరిగి ముగించిన పిమ్మట మరియు మీరు వచ్చియున్నారు… తన స్వంతవారినివి మోచించుటకు క్రీస్తు వచ్చెను. మీరు ముద్రింపబడియున్నారు, రానున్న ఉజ్జీవము వరకు ముద్రింపబడియుండుట కాదు. మీరు గనుక ఒకసారి పరిశుద్ధాత్మతో ముద్రింపబడినయెడల, అది ముగించబడిన కార్యము, దేవుడు మిమ్ములను తనయొద్దకు చేర్చుకొనెను. మరియు దానినుండి దూరముగా తొలగిపోవుటయనేది ఉండదు. ''మంచిది, నేను దానిని పొందుకున్నాను, కాని ఇప్పుడు దూరముగా నేను తొలగిపోయాను,'' అని నీవు చెప్పవచ్చు. లేదు, మీరు దానిని పొందలేదు. అది విమోచన దినమువరకు యుండునని దేవుడు చెప్పెను. ఇప్పుడు, మీరు ఇప్పుడే ఆయనతో వాదించుచున్నారు. ''మీ యొక్క విమోచన దినము వరకు.''
1KGS 19:18•
REV 7:4
53గమనించండి, ఎన్నిక ప్రకారము వారు ఒక శేషించిన జనాంగము, ఈ యూదులు ఇప్పుడు ఎన్నిక ప్రకారము శేషముగా యుండినవారైయున్నారు. ఏలీయా యూదులకు చేసిన మొదటి పరిచర్య దినములలో, అక్కడ దేవుని యొక్క హస్తము ద్వారా ఏడు వేలమంది విశ్వాసులు దూరముగా మరుగుచేయబడిరి, ఇప్పుడు ఈ శేషించిన కాలములో, వారియొక్క సమయమునకు వచ్చినప్పుడు, ఎన్నుకొనుట ప్రకారము వారు ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది యైయున్నారు. అది, ఆ కాలమున వర్తమానము, అంగీకరించి వర్తమానమును నమ్ముటకు ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది యుందురు.
ఇప్పుడు, ''ఓ, ఒక్క నిమిషము, సహోదరుడా,'' ఈ ''ఎన్నిక'' గురించి నాకు తెలియదు. మంచిది, ఎక్కడా దానిని నేను చదువలేదు," అని మీరు చెప్పవచ్చును. సరి, ఇప్పుడు అది సరియా, కాదా యని మనము చూచెదము. మనము మత్తయికి తిరిగి పోయెదము మరియు అక్కడెక్కడో ఒక చిన్న కార్యమును ఎక్కడైనా కనుగొనగలమాయని చూచెదము. నేను సరిగ్గా చెప్పితిననని నేను నమ్ముచున్నాను. (నేను దానినిక్కడ వ్రాసికొనియుండలేదు, అయితే అది ఇప్పుడే నా యొక్క తలంపుకు వచ్చినది.) మనము దానిని చివర తీసికొని చూచెదము… 30వ వచనము, గత రాత్రి మనము దాని యొద్దకు వెళ్ళాము — ఆరవ ముద్ర యొక్క ముగింపు, 30వ వచనము.
MATT 24:31
54ఇప్పుడు మనము దానిని చదివెదము మరియు చూడండి, మనమెచ్చటికి వెళ్ళుచున్నామో తెలియును. మనము 31వ వచనము తీసెదము, చూశారా. ''వారు మనుష్యకుమారుడు మహిమలో వచ్చుట చూచెదరు. ఇప్పుడు, 31వ వచనము:
మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, మరియు వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు.
REV 7:4
55''ఎన్నుకొనబడినవారు'' బయటికి వచ్చెదరు. అదేమిటి? — మరియు శ్రమల కాలము. దేవుడు ఆయన ఎన్నుకొనిన వారిని పిలచును, మరియు అది ఆ సమయమున యూదులు — ఎన్నుకొనబడినవారుగా వున్నారు. పరిశుద్ధ గ్రంథము దానిని గురించి మాట్లాడుచున్నది. పౌలు దానిని గురించి మాట్లాడుచున్నాడు. ఎన్నుకొనబడిన ప్రకారము అక్కడ ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది (ఎన్నుకొనబడిన ప్రకారము) వర్తమానమును నమ్మువారుండెదరు, ఎన్నో లక్షలకొలది జనులలో వారు ఎన్నుకొనబడినవారై అక్కడ యుండెదరు.
ఏలీయా ప్రవచించు దినములలో అక్కడ పాలస్తీనాలో లక్షలకొలది జనులు యుండిరి, మరియు లక్షలకొలది జనులలో ఏడువేలమంది మాత్రము రక్షింపబడిరి. ఇప్పుడు ''ఎన్నుకొనబడుట ప్రకారము.'' వారి మాతృదేశములో లక్షలకొలది యూదులు కూడుకొనుచున్నారు. అది ఒక దేశముగా నున్నది. అక్కడ లక్షలకొలది జనులుండెదరు, అయితే ఎన్నుకొనబడిన ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది మాత్రమే తీసికొనబడెదరు. వారే వర్తమానమును వినెదరు.
MATT 7:6•
MATT 15:14•
LUKE 6:39
56అన్యజనుల సంఘములో కూడా అదే కార్యము జరుగును. అక్కడొక వధువుండును, మరియు ఆమె ఎన్నుకొనబడియుండును. మరియు ఎన్నుకొనబడిన ప్రకారము అతను పిలువబడును. గమనించండి, ఇది సంఘమునకు మాదిరిగా యున్నది, పరిపూర్ణముగా, ఎన్నుకొనబడిన విశ్వాసులు. ఇతరులు నమ్మరు. మీరు ఊరికే దానిని చెప్పవచ్చును. మీరు ఒక వ్యక్తికి ఒక సత్యమును చెప్పవచ్చును మరియు అది వాక్యము ద్వారా నిరూపింపబడవచ్చును, మరియు అటు పిమ్మట ఋజువు చేయబడిన తరువాత: ''నేను దానిని నమ్మను.''
మీరు ఊరక…. దానిలో ఆటలాడవద్దు. యేసు ఆటలాడవద్దని చెప్పెను. ''అది పందుల ముందు ముత్యములను వేసినట్లుగా యున్నదని,'' చెప్పెను. చెప్పెను, ''వాటిని ఆ విధముగానే వదలివేయుడి. అవి మీ మీద పడి వాటి కాళ్ళ క్రింద మిమ్ములను త్రొక్కివేయును. వారు మిమ్ములను పరిహసించెదరు, మీరు వారిని వదలి వేయుడి. గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని నడిపించినయెడల …''
57నేను ఈ మధ్యనే ఒక వ్యక్తియొద్దకు వెళ్ళాను. ఇంకో విధముగా అతనే నా యొద్దకు వచ్చెను. అతను దైవీక స్వస్థతను గురించి ఎల్లప్పుడును ప్రతీ చోటా వాదించుచుండెను. మరియు అతను వచ్చి ''మీ యొక్క దైవిక స్వస్థతను నేను నమ్మను,'' అని అతను చెప్పెను.
నేను చెప్పాను, ''నా యొక్క స్వస్థతనా అది, నాదైనయెడల అది ఏ మంచియు చేయదు, ఏలయనగా, నా యొద్ద ఏమియును లేదు.'' అయితే దేవుడు పరిపూర్ణమైనవాడుగా యున్నాడు, అని నేను చెప్పాను.
అతను చెప్పాడు, ''అటువంటి కార్యము ఏదియును లేదు.''
నేను చెప్పాను, ''స్నేహితుడా, ఇది ఎప్పుడో చెప్పవలసింది. ఇప్పటికి చాలా ఆలస్యమైపోయినది. అవును, నీవు దానికొరకు చాలా కాలము కాచుకొనియున్నావు. నీవు కొద్ది సంవత్సరముల క్రితము దానిపై వివాదించావు, అయితే ఇప్పుడు ఇంకొక కాలము వచ్చుచున్నది. అక్కడ దానిని గురించి సాక్ష్యమిచ్చుటకు లక్షలకొలది జనులు ఉండెదరు, చూడండి.'' నేను చెప్పాను, ''నీవు ఆ విధముగా ఈ మాటను చాలా ఆలస్యముగా చెప్పుచున్నావు.''
అతను చెప్పెను, ''సరి, దానిని నేను నమ్మను, మీరేమి చేసినను నాకు అక్కరలేదు,'' అనిఅతను చెప్పెను.
''నిశ్చయముగా కాదు. మీరు నమ్మలేరు,'' అని నేను చెప్పాను.
అతను చెప్పెను, ''నన్ను గ్రుడ్డివానిగా మొత్తుము.'' చెప్పెను, "పౌలువలె నీవు గనుక పరిశుద్ధాత్మను పొందికొనియున్న యెడల, నన్ను గ్రుడ్డివానిగా మొత్తుము,'' అని చెప్పెను.
''నీవు ఇదివరకే గ్రుడ్డివానిగాయుండగా నేనెట్లు మరల నిన్ను గ్రుడ్డివానిగా చేయగలను?'' అని నేను చెప్పాను. ''నీ తండ్రి నిన్ను సత్యమును చూడనీయకుండా గ్రుడ్డివానిగా చేసెను,'' అని చెప్పాను, ''నీవు, ఇదివరకే గ్రుడ్డివానిగా యున్నావు,'' అని నేను చెప్పాను.
మరియు అతను చెప్పెను, ''నేను నమ్మను, మీరేమి చేసినను నాకు లెక్కలేదు. మీరెంత ఆధారములతో నిరూపించినను లేక ఏమి చేసినను నాకు లెక్కలేదు. నేను ఇంకను దానిని నమ్మను.''
నేను చెప్పాను, ''నిశ్చయముగా. అది అవిశ్వాసులకు కాదు; అది విశ్వాసులకు మాత్రమే.
MATT 15:14•
LUKE 6:39•
JOHN 6:37
58అదేమిటి? చూడండి, అక్కడ ఎన్నుకొనబడుట క్రియచేసియున్నది. అక్కడే దానిని మీరు చూచిరి. దానితో మీరు ఊరక ఆటలాడవద్దు. యేసు కూడా అదే కార్యమును చెప్పెను. ''వారిని వదిలివేయుడి. గ్రుడ్డివాడు గనుక గ్రుడ్డివానికి దారి చూపినయెడల ఇరువురును గోతిలో పడరా?'' అని ఆయన చెప్పెను. అయితే ఆయన ఒక దీనవేశ్య యొద్దకు వచ్చెను, ఆమెను అగ్ని తాకినది. అదేమిటి? అది ఎన్నుకొనబడిన విత్తనముగా అక్కడ యున్నది, చూచారా. ఇప్పుడే ఆమె దానిని చూచెను.
అది పేతురు యొద్దకు వచ్చినప్పుడు అక్కడ ఎన్నుకొనబడిన విత్తనము యుండెను, చూశారా, మరియు వారు దానిని చూసిరి. మరియు ''తండ్రి అనుగ్రహించిన వారందరును,'' [అనుగ్రహించిన, జరిగిన కార్యము] నాకు అనుగ్రహించిన వారందరును, వారు వచ్చెదరు. ''వారు నా యొద్దకు వచ్చెదరు.'' ఓ, మై! నేను దానిని ప్రేమించుచున్నాను! అవునండి. గమనించండి, దానిని విశ్వాసులు నమ్ముచున్నారు. అవిశ్వాసులు దానిని నమ్మలేరు. కావున, ఇప్పుడు ఎవరైనను సర్పము యొక్క సంతానమును గురించియు మరియు ఆ కార్యములను గురించి వాదించినప్పుడు మరియు మీరు, వారికి ఈ కార్యములను చూపించుటకు ప్రయత్నించునప్పుడు, వారు గనుక దానిని విననియెడల వారినుండి దూరముగా వెళ్ళిపోండి. వారిని అట్లే వదిలివేయండి. చూడండి, దేవుడు ఎన్నడును వాదించడు, ఆయన బిడ్డలు కూడా ఆ విధముగానే యుందురు.
REV 7:4
59గమనించండి, దేవుని యొక్క ఎన్నుకొనబడిన ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది యూదులు మృగమునకు, వాడి సంఘశాఖలకు లేక విగ్రహములకు లేక దేనికైనను నమస్కరించరు. అప్పుడు వారియొక్క దేశము ఒక నిబంధనను కలిగియున్నను — ఇశ్రాయేలు ఒక నిబంధనను కలిగియుండును — అయితే ఇక్కడ దానిని మ్రొక్కని ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది యుండెదరు. వారే ఎన్నుకొనబడినవారు.
ఇప్పుడు అన్యజనుల సంఘములోను అదే కార్యము కలదు, ఒక ఎన్నుకొనబడిన గుంపు యుండును. మీరు వారిని ఆ విధమైన కార్యములలోనికి లాగలేరు. వారు దానిని నమ్మరు. లేదండి. ఒక్కసారి వెలుగు వారిని తాకగానే, అంతటిలో అది వారిని అక్కడ స్థిరపరచినది. వారు చూశారు… జరుగుటను చూసిరి, పిదప ఆ విధముగానే అది బయలుపరచబడి మరియు ఋరువుపరచబడుటను చూచిరి. మరియు వారు అక్కడ పరిశుద్ధ గ్రంథములో ఆ వాక్యము నెరవేరుటను చూచుచున్నారు. మంచిది, మీరు వారిని మోసగించలేరు, ఎందుకనగా వారు దానిని నమ్మిరి. అదంతే. వారు దానిని వివరించలేకపోయినా గాని దానిని వారుపొందుకొనియున్నారని వారెరుగుదురు. నేను చెప్పునదేమనగా, "నేను అనేక కార్యములను వివరించలేను, అయితే ఎలాగైనను అది నిజమని నాకు తెలియును."
MATT 24:31•
REV 11:3
60అది సరి. ఈ సమయము ఆరవ ముద్రకును మరియు ఏడవ ముద్రకును మధ్యనున్న కాలమై యున్నది, మత్తయి 24వ అధ్యాయము మరి 31వ వచనములో యేసు చెప్పిన అదే జనులను ఆయన పిలుచును. మనము దానిని ఇంతకు ముందు చదివితిమి. ఇక్కడ బూరలను, ఇరువురు సాక్ష్యులను గమనించండి… చూడండి, బూర ధ్వనించినప్పుడు, అది యూదుల కొరకు ఇద్దరు సాక్ష్యులను గమనించండి… బూర ధ్వనించినప్పుడు, అది యూదులకొరకు ఇద్దరు సాక్షుల ద్వారా వినిపించు కృపా కాలము యొక్క బూరధ్వనియగును. ఒక బూర మ్రోగును — మీరు గమనించండి, ఒక బూర మ్రోగును. ''బూర ఊదుము,'' అని ఆయన చెప్పెను. ఇప్పుడు, ఇక్కడ గమనించండి — 31వ వచనము.
"మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును" (ఒకరు కాదు, చూడండి, అక్కడ వారిరువురు) అదేమిటి? దేవుడు మాట్లాడుటకు సిద్ధపడినపుడు, అక్కడ ఒక బూర ధ్వని యుండును. అది ఎల్లప్పుడును ఆయన యొక్క స్వరముగా యున్నది. అది యుద్ధమునకు పిలుచుట, చూచారా? దేవుడు మాటలాడును. ఈ దూతలు బూర శబ్దముతో వచ్చెదరు. మరియు మీరు గమనించండి, చివరి దూతయొక్క వర్తమానమున బూర మ్రోగును; మొదటి దూతయొక్క వర్తమానములో, ఒక బూర మ్రోగును; రెండువ దూతకు, ఒక బూర మ్రోగెను, ఆయన వాటిని బయటికి వదిలినప్పుడు బూర మ్రోగెను.
MATT 24:32
61అయితే గమనించండి, ముద్రలు ప్రకటింపబడినప్పుడు, ఒక గుంపు జనులను బయటికి పిలుచుటకు అవన్నియును ఒక గొప్ప దైవకార్యముగా నుండెను. అక్కడ ఒక బూర ధ్వనించెను మరియు ఏడు ముద్రలు విప్పబడెను.
గమనించండి, ''ఆకాశము యొక్క నాలుగు దిశలనుండి ఆయన తాను ఎన్నుకొనిన యూదులను పోగుచేయును…'' మనము చూచినట్లు ఆయన ఆరు ముద్రలను గురించి చెప్పెను, కాని ఏడవ ముద్రను గురించి చెప్పలేదు. ఎక్కడ కూడా ఆయన ఏడవ ముద్రను గురించి ఏమీ చెప్పలేదు. చూడండి, వెంటనే, 32వ వచనము ఎన్నుకొనబడిన యూదులను వెలుపలకు పిలుచు కాలమును గురించి ఉపమాన రీతిగా చెప్పుచున్నది.
MATT 24:31-33
62ఇప్పుడు ఇక్కడ గమనించండి, చూశారా. "మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరవరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేయుదురు." ఇప్పుడు ఆయన ప్రారంభించును… చూడుడి, ఆయన ఇక్కడ ఏడవ ముద్రను గురించి ఏమీ చెప్పలేదు, చూశారా. ఆయన ఆరవ ముద్రను గురించి చెప్పెను — మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, అయిదవ, మరియు ఆరవ ముద్రను గురించి ఆయన చెప్పెను — అయితే గమనించండి:
ఇప్పుడు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి; అంజూరపు కొమ్మ లేతదై, చిగిరించునప్పుడు, వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును:
ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు, ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.
MATT 10:22•
MATT 24:3,9,33•
MARK 13:13,29•
LUKE 21:17
63వారు ఆయనను అడిగిన చివరి ప్రశ్న: ''ప్రపంచము యొక్క ముగింపునకు సూచనలేమిటి?'' మీరు ఈ యూదులను చూచునప్పుడు… మరియు మీరు ఈ ఇతర కార్యములు నెరవేరుట చూచునప్పుడు, ఏమి జరుగుచున్నదని మీరెరుగుదురు. ఇప్పుడు, మీరు ఈ యూదులను చూచునప్పుడు… యూదులతో మాటలాడుచుండెను.
ఇప్పుడు గమనించండి, ఆయన ఏ గుంపుతో మాటలాడుచున్నాడు? అన్యులతోనా? యూదులు! యూదులు! చూశారా? ఇప్పుడు ఆయన చెప్పెను, ''నా నామము నిమిత్తము మీరు సకల జనుల ద్వారా ద్వేషింపబడెదరు, మరియు ఆ విధముగా చేయబడెదరు.'' ఇప్పుడు, ఆయన చెప్పెను, మీరు యూదులు చిగురించుటకు ప్రారంభించుటను అక్కడ మీరు చూచునప్పుడు, ఆ ఇశ్రాయేలు తనయొక్క స్వదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఆరంభించగా, ఆమె అక్కడకు చేరినవెంటనే, సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా యుండును, మరియు పాత ప్రపంచమును అంతమగుటకు ఇంకను మూడున్నర సంవత్సరములు మాత్రమే యున్నవి. మరియు ఆమె ఆ వ్యక్త స్థితిలోనికి వెళ్ళిపోవును. మరియు నూతన భూమి వెయ్యేండ్ల పరిపాలనలోనికి వచ్చును, ''ద్వారమునకు దగ్గరనే!'' అది యున్నదని ఆయన చెప్పెను.
MATT 24:34•
MARK 13:30•
LUKE 21:30•
2PET 3:8
64ఇప్పుడు భూమి మీద ఒక వెయ్యేండ్లు దేవునికి ఒక దినము మాత్రమే. మరియు మూడున్నర సంవత్సరములు దేవునికి ఎంత? ఆయన కాలము ప్రకారము కొద్ది క్షణాలు మాత్రమే, ఆ కారణము వలననే ఆయన చెప్పెను, ''అది ద్వారము దగ్గరనే యున్నది." ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, [ఈ జనులను నిర్మూలము చేయుట] ఇవనినయు జరుగువరకు… నిర్మూలము చేయుట అనగా ఏమిటి? వారు యూదులను చంపి భూమి మీద వారిని లేకుండా నిర్మూలము చేయవలయునని ఎల్లప్పుడూ ప్రయత్నము చేసిరి. కాని ఎన్నటికీ అది ఎవ్వరికినీ సాధ్యమవ్వదు.
అయితే గమనించండి, పాలస్తీనాకు తిరిగి వచ్చు అదే యూద సంతతియే ఈ సంగతులన్నీ జరుగుటను చూడగలరు. మరియు గత రెండు సంవత్సరములలో ఆమె పూర్తిగా ఒక దేశముగా ఏర్పడినది. స్వంత ద్రవ్యము మరియు సకలమును ఆమె కలిగియున్నది. అక్కడే ఆమె స్థితిని చూడండి.
65స్నేహితులారా ఇప్పుడు, మనము ఎక్కడ యున్నాము? ముద్రలు మరియు సమస్తమును తెరువబడియున్నవి — ఇప్పుడు మనము ఇక్కడ వీటి మధ్యలో నున్నాము. అచ్చటనే అది యున్నది. చూశారా, మనము ఎక్కడ కూర్చొనియున్నాము? మీరు దానిని గ్రహించితిరని అనుకొనుచున్నాను. నాకు ఎటువంటి విద్యలేదు. నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో దానిని నేనెరుగుదును, కాని దానిని మీకు అర్థమగునట్లుగా నేను వివరించలేకపోవచ్చును. కలగలుపుగా యున్న వాక్యమును తీసికొని మరియు వాటిని విడగొట్టి, మీరు గ్రహించునట్లుగా వాటిని చక్కగా అమర్చి, వాటిని ఆయన మీరు చూచునట్లుగా చేయునని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా మనము ద్వారమునొద్దనే యున్నాము. మనమిచ్చట ఆ ఘడియయందే యున్నాము.
ఇప్పుడు గమనించండి. చూడండి, ఇప్పుడే, ఆయన చివరి కాలములో ఈ యూదుల వైపునకు తిరుగుచున్నాడు. ఏమి జరుగబోవుచున్నదని ఆయన చెప్పుచున్నాడు. మనకు అది కూడా తెలియును, ఇప్పుడు (మనకు తెలియును, మనము బాగుగా ఎరిగియున్నాము), మనకు ఆ గోత్రములు చెదరగొట్టబడియున్నవి. ఇరువది-అయిదు-వందల-సంవత్సరములుగా అవి చెదరగొట్టబడియున్నది. ప్రపంచమంతటా వారా విధముగా చెదిరిపోవుదురని ప్రవచింపబడెను. అది మీకు తెలియునా? అది మనకు తెలియును. మరల వెనుకకు వెళ్ళి మరియు దానిని చెప్పుకోనక్కరలేదు, ఎందుకనగా నా యొద్ద ఒక నిజమైన ముఖ్యమైన కార్యమొకటి యున్నది, మీరు పూర్తిగా అలసట చెందక ముందే దానిని మీరు చూడవలెనని నేను కోరుచున్నాను.
66గమనించండి, ప్రతి గోత్రము గురించి మనమెరుగుదుము (దానిని మీరు గోత్రముల వంశావళి లేదా భూగర్భశాస్త్రము లేదా గోత్రముల స్థానమని లేదా దానిని మీరు ఏమైనా చెప్పండి.) ఇక నుండి అవి ఆ విధముగా లేవు. వారు ప్రతీ చోటకు చెదరగొట్టబడిరి. యూదులు యెరుషలేములో కూడుకొనుచున్నారు. వారు ఏ గోత్రమునకు చెందినవారని వారికే తెలియదు. వారు వారి గోత్రముల జెండాలు లేక దానికి సంబంధించినదేదియూ వారికి లేదు. అప్పటినుండి తాము యూదులము అని మాత్రమే వారెరుగుదురు. ప్రపంచమంతటా వారా విధముగా చెదిరిపోవుదురని ప్రవచింపబడెను.
ఇప్పుడు, వారి గ్రంథములన్నియును నాశనము చేయబడియున్నవి. వారికి తెలియదు వారే గోత్రమునకు చెందినవారని. మీరు అడగవచ్చును, ''మీరు ఏ గోత్రమునకు చెందినవారు?''
''నాకు తెలియదు.''
''ఏ గోత్రము…?''
''నాకు తెలియదు.'' ఒకరు బెన్యామీను గోత్రము నుండి, మరొకరు మరో గోత్రము నుండి, ఇంకొకరు ఇంకొక గోత్రము నుండి, వారే గోత్రము నుండి వచ్చిరో వారికి తెలియదు. యుద్ధముల వలన మరియు రెండు-వేల-అయిదు-వందల-సంవత్సరములుగా వారియొక్క గ్రంథములు నాశనము చేయబడినవి. తాము యూదులని మాత్రమే వారెరుగుదురు. అంతే. కావున వారు వారియొక్క స్వదేశమునకు మరల వచ్చి చేరినారని వారికి తెలియును. అయినప్పటికిని వారు…
గమనించండి, వారియొక్క గోత్రములను గురించి వారెరుగకపోయినా గాని, దానిని దేవుడెరుగును. నేను దానిని ప్రేమించుచున్నాను. మీకు తెలియును, ఆయన దీనిని కూడా చెప్పెను, ''మీ యొక్క తల వెంట్రుకలలో ప్రతి వెంట్రుకయును లెక్కింపబడియున్నవి.'' గమనించండి, ఆయన దేనిని పోగొట్టుకొనలేదు.'' అంత్యదినమున దానిని నేను తిరిగి లేపుదును.''
వారు వారియొక్క గోత్రముల గుర్తిపును పోగొట్టుకొనియుండవచ్చును, మరియు ఎవరు ఏ గోత్రమునకు చెందినవారని, ఇదియా లేక అదియా యని వారికి తెలియకపోవచ్చును, వారు బెన్యామీను లేక వారు రూబేను లేక ఇశ్శాఖారు లేక వేరే ఏ గోత్రమో వారికి తెలియదు. అయితే ఇక్కడ దేవుడు వారిని పిలిచియున్నాడు.
REV 7:4-8
67ఇప్పుడు గమనించండి, ప్రకటన 7వ అధ్యాయములో, మనము దీనిని చదువుచున్నాము. ''ప్రతి గోత్రములను పండ్రెండు వేలమంది వారందరిలో నుండి ఎన్నుకొనబడియున్నారు.'' ప్రతి గోత్రము నుండియు పండ్రెండు వేలమంది ఎన్నుకొనబడి మరిక్కడ క్రమముగా నున్నారు. ఓ, మై! వారెవరు? వారు గోత్రముల క్రమములో నున్నారు. అయినప్పటికిని ఇప్పుడు వారు ఆ విధముగా లేరు, అయితే వారు గోత్రముల ప్రకారము నుండెదరు. వారు గోత్రముల క్రమములో నున్నారు. గోత్రముల క్రమములో ఎట్లుడెదరు? సాధారణముగా వాడుకగా యున్న యూదుడు కాదు. ఆ విధంగా కాదు, అయితే ఎన్నుకొనబడినవారు — ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది, గోత్రముల క్రమములో నుంచబడెదరు. ఓ, మై! నేను దానిని మీకు ఏ విధముగా చూపింపగోరుచున్నానో. దానిలోనికి మనము పోబోవుట లేదు, అయితే సంఘము ఆ విధముగానే ఖచ్చితముగా నుండబోవుచున్నది, — సరిగ్గా క్రమముగా యుండును!
GEN 15:13,14•
EXOD 2:24•
EXOD 6:5•
DEUT 29:16-19•
REV 7:7,8
68ఇప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా గమనించి మరియు నాతో కూడా ఒక నిమిషము చదువండి. గోత్రములను పిలుచునప్పుడు మీరు గమనించని కార్యమొకటి ఇప్పుడిక్కడ యున్నది. కొద్దిసేపటి క్రితము మీరు ప్రటన 7వ అధ్యాయము చదువవలెనని నేను మీకు చెప్పాను. నాతో కూడా చదువండి మరియు ఆ గోత్రములను గమనించండి. ప్రకటన 7లో దాను మరియు ఎఫ్రాయము విడవబడియున్నవి. మరియు వారితో కూడా అవి లెక్కింపబడలేదు. దానిని మీరు గమనించితిరా? వారియొక్క స్థానములలో యోసేపు మరియు లేవీ వచ్చిరి. దానిని మీరు గమనించితిరా? దాను మరియు ఎఫ్రాయిము అక్కడలేదు. లేదండి. అయితే దాను మరియు ఎఫ్రాయిము స్థానములలో యోసేపు మరియు లేవీనుంచబడిరి. ఎందుకని? ఎన్నడూ మరువని దేవుడు, తనయొక్క ప్రతీ వాగ్దానమును జ్ఞాపకుము చేసికొనును. (ఓ, నేను దానిపై ప్రసంగింపవలెనని ఇష్టపడుచున్నాను!) దేవుడు మరచిపోయినట్లు కనిపించినను, ఆయన దేనిని మరువడు.
ఆయన మోషేకు చెప్పినట్లు… ఇశ్రాయేలు అక్కడ ''నాలుగు వందల సంవత్సరములుగా నుండెను.'' వారు ఆ సమయము వరకు అచ్చటికి వెళ్ళి ఉండవలసి వచ్చెను. ఆయన అబ్రాహాముతో చెప్పెను, ''మరియు అతని యొక్క సంతానము ఒక అన్యదేశములో నాలుగు వందల సంవత్సరములు నివసించెదరు, అటు పిమ్మట ఆయన వారిని ఒక బలమగు హస్తముతో బయటికి తీసికొని వచ్చును.'' అయితే తరువాత ఆయన మోషేతో చెప్పెను, ''నా యొక్క వాగ్దానమును నేను జ్ఞాపకము చేసికొనియున్నాను, మరియు నేను దానిని నెరవేర్చుటకు వచ్చియున్నాను.'' దేవుడు మరువడు. ఆయన తనయొక్క ఆశీర్వాదములను ఏ విధముగా మరువడో, ఆయన యొక్క శాపములను కూడా మరిచిపోడు. అయితే ఆయన చేయు ప్రతి వాగ్దానముతోను ఆయన నిలిచియుండును.
ఇక్కడ వారెందుకు తప్పిపోయిరో ఇచ్చట యున్నది.
DEUT 29:16-19
69ఇప్పుడు, మీరు గనుక గమనించినయెడల. ఇప్పుడు చదువండి… ఇప్పుడు మీరు నాతో కూడా చేరి చదువవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. ద్వితీయోపదేశకాండమునకు పోవుడి, 29వ వచనము… లేక 29వ అధ్యాయము. అక్కడ ఈ గోత్రములు లేకుండా నుండుటకు ఒక కారణము కలదు. ప్రతియొక్క దానికిని ఒక కారణము కలదు. ద్వితీయోపదేశకాండము, మనము ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయమును తీసికొనవలయునని యున్నాము. ఇప్పుడు మేము దానిని అర్ధము చేసికొనునట్లు, ప్రభువా మాకు సహాయపడుము. ఇప్పుడు మేము ద్వితీయోపదేశకాండుము 29వ అధ్యాయము, 16వ వచనము ప్రారంభింపవలెనని యున్నాము. ఇప్పుడు వినండి — మోషే మాట్లాడుచున్నాడు:
(మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు;
వారి హేయ క్రియలను, కర్రతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా.) [ఒక చిన్న విగ్రహమునో లేక అటువంటి దానిని దేనినో ఒక చిన్న పరిశుద్ధ సిసిలియా విగ్రహమును అందరూ మోసికొని వెళ్ళిరి, మరి ఆ విధముగా, చూడండి.]
''కావున….'' [వినండి.]
ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యోహోవా యొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను;
అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినునప్పుడు, మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును…
DEUT 29:20,21
70చూడండి, జనులు చెప్పెదరు, ''ఆహా! అతను తననుతాను ఆశీర్వదించుకొనుచున్నాడు.'' ఒక చిన్న సిలువను లేక మరి దేనినో చేసికొనుటను మీరెరుగుదురా! ఇప్పుడు కూడా దానిని చేయుచున్న కార్యమును, మీరు గమనించండి. మరియు మీరు గమనించండి, అది విగ్రహారాధన లక్షణము, అది విగ్రహారాధన. తన స్వంత హదయమునందు, తన స్వంత ఆలోచనలయందు, తన స్వంత మనస్సునందు అతడు తన్నుతాను ఆశీర్వదించుకొనును.
…తన దాహమునకు మద్యము చేత దప్పి తీర్చుకొనుచున్నాడు [కేవలం త్రాగుడు మాత్రమే, అది ఏ బేధమును చేయదు; మీరు త్రాగినను ఫరవాలేదు కాని సంఘమునకు వెళ్ళితే చాలు, అందురు.] అయితే యోహోవా వానిని క్షమింపనొల్లడు, అట్టివాడు మీలో నుండినయెడల, నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును, [దానిలో నుండి ఒక వాక్యమును కూడా తీసివేయవద్దు లేక దానికి చేర్చను వద్దు, చూడండి] ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండ తుడిచివేయును. [అది అతను ఇక్కడ భూమిమీదనున్నప్పుడు — ఆకాశము క్రింద.
మరియు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును.
71కావున, ''ఎవడైనను ఒక విగ్రహమును సేవించినయెడల, లేక ఒక విగ్రహమును నుంచుకొనినయెడల, లేక తన సొంత మనస్సులోని ఊహలో తననుతాను ఆశీర్వదించుకొనినయెడల మరియు విగ్రహములను ఆరాధించినయెడల.'' దేవుడు చెప్పెను, ''ఏ పురుషుడైనను, ఏ స్త్రీ యైనను, ఏ కుటుంబమైనను లేక ఒక గోత్రమైనను, అతని పేరు జనుల మధ్య నుండి పూర్తిగా తుడిచివేయబడును.'' ఇప్పుడు, అది నిజమేనా? ఎంతటి సత్యమది! చాలా సంవత్సరముల క్రితము విగ్రహారాధన సంఘమునకు ఏ కీడు చేసినదో మరల నేడు కూడా అదే చేయుచున్నది.
మరియు నేను గమనించాను. క్రీస్తువిరోధి ఏ విధముగా ఒక విరోధమైన కదలికను చేయుటకు ప్రయత్నించియున్నాడో గమనించండి. అపవాది దేవుని యొక్క పరిశుద్ధులను ఏ విధముగా అనుకరించుచున్నాడో, ఎందరికి అది తెలియును? పాపమనగా ఏమిటి? సక్రమైన కార్యమును వక్రీకరించబడుట. ఒక అబద్ధముగా ఏమిటి? సత్యము తప్పుగా వక్రీకరించి చెప్పబడుట. వ్యభిచారమనగా ఏమిటి? ఒక నిజమైన క్రియను, చట్టబద్ధమగు కార్యమును అక్రమముగా చేయుటయే, చూశారా.
1KGS 12:25-30
72''ఒక పేరును కొట్టివేయుట,'' దీనిని చేయుటకు ప్రయత్నించుటను సంఘ కాలములో మీరు గమనించితిరా. చనిపోయిన వారి స్వరూపములను ఆరాధించుట మరి ఆ విధమైన కార్యములను చేసిన అదే మృగము, ప్రభువైన యేసుక్రీస్తు నామమును కొట్టివేయుటకు ప్రయత్నించి తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అను బిరుదులను జనులకు ఇచ్చుటకు ప్రయత్నించెను. ఆ విధముగా చేయుటచే దాని వెనుకనున్న శాపము దానికొరకైయున్నది. యరొబాము అను ఒక వేషధారియగు, మరియు దుష్టరాజు ఇశ్రాయేలీయులను పరిపాలించుట వలన దాను మరియు ఎఫ్రాయిము దానిని జరిగించిరి.
I రాజులు 12వ అధ్యాయమును ఇప్పుడు గమనించండి. నాకు తెలియును మనము….. మనము చూడనైయున్న కార్యములకు ఇది, ఒక పునాది. 1 రాజులు, 12వ అధ్యాయము, 25వ వచనము నుండి 30వ వచనము వరకు నేను చదువవలెనను కొనుచున్నాను.
తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెనును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.
మరిప్పుడు యరొబాము తన హృదయములో చెప్పుకొనెను, [అతని హృదయములోనున్న ఆలోచనను గమనించండి], ఇప్పుడు మరల రాజ్యము దావీదు సంతతి వారిదగును [జనులు బయటికి వెళ్ళిపోవుదురేమోయని, అతనిలో భయము మొదలయ్యెను. మీరు చూడండి]:
ఈ జనులు యెరుషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల, ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి, యూదా రాజైన రెహబాము నొద్ద మరల చేరుదురు.
రాజ్యము మరల దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి, ఆలోచన చేసి, రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరుషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి.
ఒకటి బేతేలు నందును, ఒకటి దానునందును ఉంచెను.
దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
REV 2:6,15,20,23
73చూశారా? బేతులునందు, ఎఫ్రాయిము, మరియు దాను మరియు వారు విగ్రహములను అక్కడ పెట్టిరి. మరియు వీరు దీనిని ఆరాధించుటకు వెళ్ళిరి. మరియు ఇక్కడ మనమున్నాము, వెయ్యేండ్లపరిపాలన యొద్దకు ఇంచుమించు వచ్చియున్నాము, మరియు దేవుడింకను ఆ పాపమును జ్ఞాపకముంచుకొనియున్నాడు. వారు కనీసం అక్కడ లెక్కింపబడులేదు. ఆమెన్! మహిమ! ఆయన తనయొక్క మ౦చి వాగ్దానములను ఏ విధముగా గుర్తుంచుకొనియున్నాడో, ప్రతి చెడు కార్యమును కూడా ఆయన గుర్తుంచుకొనును… ఆ కారణము వలననే నేను నమ్ముచున్నాను, స్నేహితులారా, నేను ఎల్లప్పుడును ఆ వాక్యముతో నిలిచియుండుటకు ప్రయత్నించియున్నాను, అది ఎంత విడ్డూరముగా కనిపించినను ఫరవాలేదు.
చూడండి, ఈలాగు జరుగునని అప్పుడు వారు అక్కడ అనుకోలేదు. దాని గూర్చి అప్పుడు వారు తలంచలేదు. ''మంచిది, ఇది మంచిదేలే'' అని వారు దానితో రాజీపడిరి, ఆ విధంగా వారు తలంచిరి. అది సరి. అయితే ఇక్కడ వారు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించుచుండగా ఇక్కడున్నారు, వారి పేర్లు దాని నుండి కొట్టివేయబడియున్నవి, ఎందుకనగా దేవుడు శపించిన ఆ విగ్రహములను వారు సేవించిరి.
ఆయన చెప్పియుండలేదా, ఆయన నికొలాయితులను మరియు ఆ యెజెబెలును అసహ్యించుకొనెనని? దానినుండి దూరముగా నుండండి. ఆయన యెజెబెలు యొక్క కుమార్తెలను ''మరణముతో'' చంపును, అనగా ఆయన యొక్క సన్నిధి నుండి నిత్య ఎడబాటు చేయుట, ఆయన ఆ విధముగా చెప్పలేదా? దానిపై ఎన్నడూ నమ్మికయుంచవద్దు. దానినుండి దూరముగా తొలగిపోండి. కావున దేవుడు గుర్తుచుసుకొనును.
EZEK 48:1-7,23-29
74గమనించండి.
అయితే అది ''తుడిచివేయబడినట్లు'' అక్కడ దానిని మీరు గమనించితిరా ఎందుచేత? పరలోకము క్రింద వారికి ఎట్టి బలి చెల్లించబడలేనందువలన ఆ కార్యములను చూచునట్లుగా పరిశుద్ధాత్మ వారకి అనుమతి ఇయ్యలేదు. అయితే అతడు దానిని స్వార్ధపూరితముగా దీనిని చేసెను. అయితే యెహెజ్కేలు అతని యొక్క దర్శనములో వెయ్యేండ్లపరిపాలనలో, మరల వారిని సంపూర్ణమైన క్రమములో చూచెను. మీరు గనుక దానిని చదువగోరిన యెడల — యెహెజ్కేలు, దానిని గుర్తుంచుకొనండి, మరి కాలమును పొదుపు చేయుటకు గాను మీరు దానిని చదువుకొనుడి. యెహెజ్కేలు 48:1-7 మరియు 23 నుండి 29 వరకు చదవండి. యెహెజ్కేలు ప్రతి గోత్రమును ఖచ్చితముగా క్రమములో చూచెను.
DEUT 9:14•
DEUT 29:20•
2KGS 14:27•
REV 14:3
75అది సరి. మరియు ప్రకటన 14లో యోహాను మరల వారిని గోత్రముల క్రమములో చూచెను, అది సరియే, ప్రతి గోత్రమును వారి స్థానములో ఏమి సంభవించినది? ''ఆకాశము క్రింద అతని యొక్క పేరు గోత్రము నుండి కొట్టివేయబడునని,'' ఆయన చెప్పిన దానిని, మీకు గుర్తున్నదా. ఆకాశము క్రింద నున్నంతవరకు వారి పేర్లు కొట్టివేయబడును. మరియు ఈ ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది ఇంకను ఇక్కడ గోత్రములలో నుండెదరు. సరి. అయితే మీరు చూడండి, వారు గ్రుడ్డివారుగా చేయబడియున్నారు. వారు ఇంకా ఎద్దులు మరియు మేకల యొక్క బలి క్రింద ఉన్నారు, చూశారా.
ఇప్పుడు గమనించండి, ఆయన వారిని ''ఆకాశము క్రింద'' కొట్టివేసెను. అయితే అన్యజనులకు పరిశుద్ధాత్మ దినములలో పరిశుద్ధాత్మకు విరోధముగా యున్నయెడల మీ యొక్క పేరు జీవగ్రంథము నుండి పూర్తిగా తీసివేయబడును, ''మరియు పరిశుద్ధాత్మకు విరోధముగా నున్నయెడల ఈ లోకములోను లేక రానున్న లోకములోను అది క్షమించబడదు. అది సరియేనా? కావున, మనము అక్కడే నిలుచునియున్నాము. మేకలు, మరియు గొర్రెలు క్రింద — ఇశ్రాయేలుకు వారికి ఒక స్థానముండెను. వారు భూమిపై నుండువరకు ఇక్కడ, వారి గోత్రములు వదిలివేయబడెను. వారు ఎన్నడు చేర్చుకొనబడలేదు.
REV 7:7,8
76ఇప్పుడు, ఆయన వారిని పిలిచినప్పుడు, ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమందిని పిలిచినప్పుడు వారు వదిలివేయబడిరి. అది నిజము. కనీసము వారు అక్కడ లెక్కింపబడలేదు. మరియు యోసేపు మరియు లేవీ అక్కడ దాను మరియు ఎఫ్రాయిము స్థానములలో నుంచబడిరి. ఇప్పుడు మీరు దానిని చూడవచ్చును. అక్కడే అది మీకు ముందున్నది, చూశారా. మరిక్కడ దేవుని యొక్క వాగ్దానమున్నది, అక్కడ వెనుక దానికి మునుపు వందలకొలది వందలకొలది సంవత్సరములకు ముందు వాగ్దానము చేసెను.
ఇప్పుడు ఏమి జరిగినది? వారు భయంకరమైన శ్రమల కాలములో శుద్ధీకరింపబడిరి. ఇప్పుడు దేవుడు గనుక దానిని శుద్ధీకరించినయెడల, ఆ కన్యక, ఆమె ఒక మంచి స్త్రీ, అయితే ఆమె తనయొక్క దీపములో నూనె ఉంచుకొనుటలో విఫలమైనది, మరియు ఆయన అక్కడ హింసల ద్వారా ఆమెను శుద్ధీకరించును. ఆయన ఆ గోత్రములను అదే కారణము కొరకు అక్కడయుంచి మరియు శ్రమల కాలములో వారిని శుద్ధీకరించును, ఎందుకనగా అది శుద్ధీకరణ. అది న్యాయతీర్పు. అయితే మీరు చూడండి, వారు పిమ్మట…
GEN 25:33•
GEN 32:28•
REV 7:9
77మరియు ఇక్కడ చూడండి. ఇశ్రాయేలు శుద్ధీకరింపబడిన పిదప ఇక్కడ ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది వచ్చుచున్నారు. మరియు ఇక్కడ నిద్రించుచున్న బుద్ధిలేని కన్యక కూడా వచ్చుచున్నది, మరియు శుద్ధీకరింపబడి మరియు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్నది, చూశారా? ఎంత పరిపూర్ణముగా యున్నది, అది ఎంత చక్కగా యున్నది!
శ్రమల కాలములో యున్న యాకోబు వలె, చూడండి. యాకోబు శ్రమల కాలములో… అతను తప్పు చేసెను. అయితే అతను శుద్ధీకరణ కాలములో వెళ్ళెను, ఏలయనగా అతను తన సహోదరుడైన ఏశావు యెడల తప్పు చేసెను, చూశారా. అతను జ్యేష్టత్వపు హక్కును పొందుటకు మోసము చేసెను. అయితే అతను తనయొక్క పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారుటకు ముందు శుద్ధీకరణలోనికి వెళ్ళెను, అది దేవుని యొక్క క్రమమునకు మాదిరిగా యున్నది, ఈ దినమునకు సాదృశ్యముగా అది యున్నది.
REV 10:6
78ఇప్పుడు, మనము 8వ వచనమునకు త్రిప్పెదము… లేక 1వ వచనము, 8వ అధ్యాయములో నేను చెప్పుచున్నాను — ప్రకటన 8:1. మీరు అలసిపోయారని నేనెరుగుదును. అయితే, ఇప్పుడు కొద్ది నిమిషములు వినుటకు ప్రయత్నించండి. మరియు పరలోకపు దేవుడు మనకు సహాయపడుననునదియే నా ప్రార్ధనైయున్నది.
ఈ ఏడవ ముద్ర సకలకార్యముల యొక్క ముగింపు సమయమని మనము గుర్తుంచుకొనవలెను. అది సరియే. ఏడు ముద్రల గ్రంథములో వ్రాయబడిన కార్యములు, ముద్రింపబడి, జగత్తుకు పునాది వేయబడక ముందే ఆ విమోచన పధకము అవన్నియును ప్రతిదియు ముగింపబడును. అదియే అంతము. సతమతమవుచున్న ప్రపంచమునకు అదే అంతము, సతమతమవుచున్న సృష్టికి అదే అంతము. సమస్తమునకు అది సమాప్తము. బూరల యొక్క ముగింపు అక్కడుండును. అద పాత్రల యొక్క అంతము. భూమికి అది అంతముగా యున్నది. అది కాలము యొక్క ముగింపు కూడా. కాలమనునది ముగింపబడును. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పుచున్నది.
మత్తయి 7వ అధ్యాయము… నా భావము ప్రకటన 10వ అధ్యాయము, మరియు… మరియు 1వ నుండి 7వ వరకు, కాలము అంతమగుచున్నది. దూత చెప్పెను, ''ఇక సమయమనేది వుండదు గాని, అది ఎప్పుడు, ఈ గొప్ప కార్యము జరుగు దినములలో. ఈ సమయములో సమస్తమును ఏడవ ముద్ర యొక్క ముగింపులో సమాప్తమగును.
79గమనించండి. అది సంఘ కాలపు అంతమగును, అది ఏడవ ముద్ర యొక్క ముగింపు, అది బూరల యొక్క ముగింపు, అది పాత్రల యొక్క ముగింపు, మరియు వెయ్యేండ్ల పరిపాలన యొక్క ప్రారంభము కూడాను. అదంతయూ ఏడవ ముద్రలోనున్నది.
అది ఒక రాకెట్టును గాలిలోనికి ప్రేల్చినట్లుండును. మరియు ఆ రాకెట్టు ఇక్కడ ప్రేలును, మరియు అది పైకి పోయి మరియు అప్పుడు మరల ప్రేలును. అది అయిదు నక్షత్రములను బయటికి వదలును. ఆ నక్షత్రములలో ఒకటి ప్రేలి మరియు దానిలో నుండి అయిదు నక్షత్రములను బయటికి వదలును చూడండి, అది చివరకు కనబడకుండా పోవును. ఈ ఏడవ ముద్ర ఆ విధముగానే యున్నది… లోకము యొక్క కాలమునకు అది అంతమును కలుగజేయును. ప్రపంచము యొక్క కాలము ముగింపు, దీని యొక్క కాలమును అది అంతము చేయును, దానియొక్క కాలమును అది అంతము చేయును. దీనికి అది కాలమును ముగించును. అది కాలముల యొక్క అంతమగును.. ఆ ఏడు ముద్రలలో సమస్తము సమాప్తమగును.
80ఇప్పుడు, ఆయన దానిని ఎట్లు చేయబోవుచున్నాడు? అదియే మనకు తెలియదు, అవునున కదూ? మనకు తెలియదు. ఈ కార్యములకన్నిటికిని ఇదే ఆ సమయమై యున్నది మరియు వెయ్యేండ్లపరిపాలన యొక్క ప్రారంభమై యున్నది. గమనించండి, ఈ ముద్ర విప్పబడుట చాలా గొప్ప విషయముగా యున్నది, ఏలయనగా దానివలన పరలోకమే నిశ్శబ్దమాయెను. ''ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.'' ఇప్పుడు, అది చాలా గొప్ప కార్యము! అదేమిటి? అది పరలోకమునునిశ్శబ్దపరచెను. అర్ధగంటసేపు అక్కడ ఏదియూ కదలలేదు.
ఇప్పుడు, మీరు గనుక సరదాగా యున్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతసేపుగానో కనబడదు. అయితే, మరణము మరియు జీవములకు మధ్య అది ఊగులాడుచున్నప్పుడు, ఆ సమయము ఒక వెయ్యేండ్ల కాలమువలె నుండును. అది చాలా గొప్పది! దానిని గురించి యేసు ఏమియు చెప్పలేదు — ఇతరులు కూడా దానిని గురించి ఏమీ చెప్పలేదు. యోహాను దానిని గురంచి వ్రాయుటకు కూడా సాధ్యపడలేదు. లేదు, ఇక్కడ దానిని గురించి వ్రాయుటకు అతడు అనుమతింపబడలేదు. చూడండి, అక్కడ ఊరక…. అతడు కేవలము…. దానిని అతను వ్రాయలేదు, అయితే అది నిశ్శబ్దము.
ISA 6:2,3•
REV 4:8•
REV 8:1
81మరియు అక్కడ దేవుని ముందు నిలబడి వారి వీణెలతో వాయించుచున్న ఇరువది-నాలుగు పెద్దలు వారి వీణెలను వాయించుట నిలిపివేసిరి. పరలోకములో దూతలు వారి పాటలు పాడుటను నిలిపివేసి నిశ్శబ్దముగా నుండిరి. ఆలోచించండి, పరిశుద్ధ కెరూబులు మరియు సెరాపులు యెషయా వాటని ఆలయములో చూచెను, ఆరేసి జతలు… లేక మూడు జతల రెక్కలతో — రెండు అతని ముఖముపైన, మరియు రెండు అతని కాళ్ళపైన, కప్పుకొనుచు మరి ఎగురుచుండును. మరియు రాత్రింబగళ్ళు, వారు దేవుని ఎదుట నిలుచుని, ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వోన్నతమైన ప్రభువైన దేవుడు యని పాడుచున్నారు!'' మరియు వారు లోనికి వచ్చినప్పుడు లేక ఆలయములోనికి వచ్చినప్పుడు, వారి సన్నిధిలో ఆలయములోని స్తంభములు కదలాడినవి. మరియు ఈ పరిశుద్ధ సెరాపులు నిశ్శబ్దముగా నుండిరి. దూతలు పాడుటను నిలిపివేసిరి. (ఉహ్ - హు. వ్యూ!) దేవుని యొక్క సన్నిధిలో, ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఎగురుచు, పాడుచున్నవారు" — పాడుటను నిలిపివేసిరి.
ఏ దూతయును పాడుట లేదు, స్తోత్రములు లేవు, ఏ బలిపీఠపు ఆరాధనయు లేదు, ఏమియును లేదు, అక్కడ నిశ్శబ్దముండెను — సద్దుమణిగెను, పరలోకములో ఒక అర్ధగంట సేపు అతి నిశ్శబ్దముగా యుండెను. విమోచన గ్రంథములోనున్న ఈ ఏడు ముద్రల మర్మము తెరుబడుచున్నప్పుడు, ఈ అర్ధగంట సైన్యమంతా నిశ్శబ్దముగా నుండెను. దానిని గురించి ఆలోచించండి. అయితే అది విప్పబడెను. దానిని గొర్రెపిల్ల విప్పెను. ఏమైనదో మీరెరుగుదురా? దానివలన వారు భయకంపితులైరని, నేను నమ్ముచున్నాను. వారికది తెలయదు. అక్కడే అది యున్నది. వారు మాత్రం ఆగిపోయిరి. ఎందువలన? అదేమిటి?
REV 10:4
82ఇప్పుడు, మనలో ఎవరికిని తెలియదు. అయితే నేను దానిని గురించి నాకు కలిగిన ప్రత్యక్షతను మీకు నేను చెప్పెదను. మరియు ఇప్పుడు, నేను ఒక మూఢభక్తిగలవాడిని కాదు. నేను గనుక ఆ విధముగా నున్నయెడల దానిని గురించి నేను అవివేకినైయుందును, చూడండి. నాకు తెలియని కార్యములను నాకు తెలుసుననుకొని ఊహించుకొని చెప్పుటకు ప్రయత్నించను. నేను చెప్పిన కొన్ని కార్యములు అనేకులకు వింతగా కనిపించవచ్చు. కాని ఆ వెనుక వాటితోనే దేవుడు వచ్చి అది సత్యమని దానిని ఆయన నిరూపించినప్పుడు, అది దేవుని వాక్యముగా యుండును. ఆ విధముగా అది వింతగా కనిపించవచ్చును, చూశారా.
మరియు ఇప్పుడు, నేను ఈ రాత్రి ఈ వేదికపై నిలబడియుండుట ఎంతటి నిజమో, దానిని గురించి నాకు బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద యున్నది. అది మూడు రీతులుగా నున్నది. దేవుని సహాయము వలన నేను అందులోని ఒక దానిని మీకు చెప్పగోరుచున్నాను. మరియు అటు పిమ్మట మీరు… దాని యొద్దకు మనము మొదట వెళ్ళెదము. అదేమిటని నేను మీకు చెప్పగోరు ఆ బయలుపాటు ఇక్కడ యున్నది. ఏమి జరుగనైయున్నది, అతను వినిన ఉరుములు ఆ ఏడు ఉరుములు అతను వినినవి వ్రాయుటకు నిషేధించబడెను… ఆ ఏడు ఉరుములు ఒకదాని వెనుక ఒకటి ఉరుముట వలన ఆ మర్మమేమిటనేది ఆ ఏడు ఉరుముల వెనుక యున్నది.
83ఇప్పుడు, ఎందువలన? దానిని మనము నిరూపించెదము. ఎందువలన? అది ఎవరికిని తెలియని రహస్యమై యున్నది. దానిని గురించి వ్రాయవద్దని యోహానుకు చెప్పబడెను, దానిని గురించి కనీసము ఒక సూచనయైనను వ్రాయవద్దని చెప్పబడెను. ఎందువలన? ఈ కారణము వలననే. అక్కడ పరలోకములో ఏ కార్యమును జరుగక నిశ్శబ్దముగా నుండెను. ఒకవేళ అది రహస్యమును తెలియపరచి వేయును. ఇప్పుడు దానిని మీరు చూచుచున్నారా? అది చాలా గొప్ప విషయమైనయెడల, అది చేర్చుకొనబడవలెను, ఎందుకనగా అది సంభవించి తీరవలెను, అయితే ఏడు ఉరుములు….
ఇప్పుడు గమనించండి, ఆ ఏడు దూతలు వాటి బూరలను ధ్వనించుటకు వచ్చినప్పుడు, అక్కడ ఒక ఉరుము ఉరిమెను. ఇశ్రాయేలీయులు కూడుకొనినప్పుడు, అక్కడ ఒక బూర మ్రోగెను. ''ఇక ఆలస్యముండదు గాని,'' చివరి బూర, ఒక ఉరుము. అయితే ఇక్కడ ప్రత్యక్షముగా ఏడు ఉరుములు వరుసగా నున్నవి: ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు — అది పరిపూర్ణ సంఖ్య. ఏడు ఉరుములు ఒక వరుసగా, ఉరిమెను… ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు నేరుగా. పిమ్మట ఆకాశములు దానిని వ్రాయలేకపోయినవి. దానిని గురించి పరలోకమునకు తెలియలేదు, ఏమియూ తెలియలేదు, ఎందుకనగా అక్కడ ఏదియూ బయలువెడలలేదు. అది విరామ సమయముగా నున్నది. అది ఎంత గొప్పదనగా దూతలకు కూడా అది రహస్యముగా నుంచబడియున్నది.
ఇప్పుడు, ఎందులకు? సాతాను గనుక దానిని తెలిసికొనినయెడల, వాడు గొప్ప అపకారమును కలిగించవచ్చును. వాడికి తెలియని ఒక కార్యమున్నది. ఇప్పుడు, వాడు తనకు ఇష్టము వచ్చిన వాటికి అర్ధము చెప్పగలడు, ఎటువంటి విధమైన వరమునకైనను వాటిని అనుకరణ చేయగలడు, (మీరు తెలుసుకొనుచున్నారని నేను నమ్ముచున్నాను). అయితే వాడు దీనిని తెలిసికోలేడు. ఇది వాక్యములో సహితము వ్రాయబడలేదు! అది పూర్తిగా ఒక రహస్యము! దూతలు, సమస్తము నిశ్శబ్దముగా నున్నవి. వారు గనుక కొద్దిగా కదలినను ఆ కార్యము దేనినైనను బయలుపరచును, కాబట్టి వారు వీణెవాయించుట మానివేసి నిశ్శబ్దముగా నుండిరి. సమస్తమును ఆగిపోయెను.
MATT 24:36•
MARK 13:32•
REV 10:4
84ఏడు — దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్య. ఏడు ఒకే వరుస క్రమముగా, ఏడు ఉరుములు ఒకేసారి ఏకముగా ఉరిమెను, అని దేనినో చెప్పుచున్నట్లుగా అది ఉండెను. ఆ సమయమున గమనించండి, దానిని యోహాను వ్రాయుటకు ప్రారంభించెను. ''దానిని వ్రాయవద్దు,'' అని ఆయన చెప్పెను. దానిని గురంచి యేసు ఎన్నడూ ప్రస్తావించలేదు. దానిని యోహాను వ్రాయలేకపోయెను. దానిని గురించి దూతలకు ఏమియూ తెలియదు.
అదేమిటి? అది ఏ కార్యమనగా, యేసు చెప్పెను, ''పరలోకములోనున్న దూతలకు కూడా దానిని గురించి ఏమీ తెలియదు, చూశారా. ఆయనకే తెలియదు. దేవునికి మాత్రమే దానిని గురించి తెలియును," అని చెప్పెను. అయితే ఆయన మనకు చెప్పియున్నాడు, మనము ఈ సూచనలు వచ్చుటను చూచినప్పుడు, (ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళుచున్నారా? అది మంచిది.) గమనించండి, మనము ''ఈ సూచనలు జరుగనారంభించుటను చూచినప్పుడు,'' చూశారా. సాతానుడు గనుక దానిని తెలిసికొనియున్నయెడల….
85మీరు ఏదైనా కార్యము జరుగవలెనని కోరుకొనినయెడల… ఇప్పుడు మీరు దీనికి నా యొక్క మాటను తీసికొనవలెను. నేను దేనినైనను చేయవలెనని పధకము వేసినచో, దానిని గురించి ఎవరికి చెప్పను. ఆ వ్యక్తి చెప్పివేయునని కాదు గాని, సాతానుడు దానిని వినును, చూశారా? నా హృదయములోనున్న దానిని, దేవుడు పరిశుద్ధాత్మతో మరుగుపరచియున్నంత వరకు సాతానుడు దానిని తెలిసికొనలేడు. కావున అది నాకు మరియు దేవునికి మద్య మాత్రమే యుండు సంగతిగా యుండును, చూశారా. మీరు మాట్లాడు వరకు వాడికి దాని గురించి ఏమీ తెలియదు, మీరు మాటలాడినయెడల అతడు వినును.
మరియు నేను ప్రయత్నించాను… నేను ఫలానా-ఫలానా కార్యమును చేయుదునని నేను జనులకు చెప్పాను, మరియు దానిని చెదరగొట్టుటకు దయ్యము చేయు సకల ప్రయత్నములను మీరు గమనించండి, చూచారా, నన్ను పడగొట్టుటకై సాతానుడు దానిని చేయును. అయితే నేను దేవుని యొద్ద నుండి బయలుపాటును పొందుకున్నయెడల, మరియు దానిని గురించి ఏమి చెప్పనియెడల, పిమ్మట అది వేరుగా యుండును.
గుర్తుంచుకొనండి, సాతానుడు అనుకరణ చేయుటకు ప్రయత్నించును. సంఘము చేయు ప్రతి కార్యమును అతడు అనుకరణ చేయుటకు ప్రయత్నించును. దానిని చేయుటకు అతడు ప్రయత్నించియున్నాడు. క్రీస్తువిరోధి ద్వారా మనము దానిని గమనించితిమి. అయితే ఈ ఒక్కదానిని వాడు అనుకరణ చేయలేడు. దీనికి అనుకరణ లేదు, చూడండి, ఎందుకనగా దానిని గురించి వాడికి తెలియదు. దానిని తెలిసికొనుటకు వానికి ఏమీ లేదు. ఇది మూడవ ఈడ్పు. దానిని గురించి వాడికి ఏ మార్గము తెలియదు, చూశారా. దానిని వాడు అర్ధము చేసికొనలేడు.
86అయితే దాని వెనుక రహస్యము ఉన్నది. సర్వోన్నతుడగు దేవునికి మహిమ! నేను దానిని చూచినపుడు, దానిని గురించి అదే విధముగా నా శేషజీవితకాలమంతటిలో నేను ఆలోచించలేదు. నేను చూచినప్పుడు…
ఇప్పుడు అదేమిటని నేనెరుగను… కాని అక్కడయున్న దాని తరువాత మెట్టును నేనెరుగుదును, కాని అదేమిటనే దానిని వివరించి అర్ధమగునట్లుగా ఎట్లు దానిని చెప్పవలెనో నాకు తెలియదు. దానికి ఇంకా అధిక సమయము లేదు. అది జరిగినప్పుడు నేను ఇక్కడ వ్రాసుకొనియున్నాను, మీరు గనుక దానిని ఇక్కడ చూచినయెడల, ''నిలువుము! ఇక్కడి నుండి ఇంత కంటె ముందుకు వెళ్ళకుము,'' అనే ఆజ్ఞ వచ్చినది.
నేను మూఢుడుగా నుండవలెనని ఆశించుట లేదు. నేను సత్యమునే చెప్పుచున్నాను. అయితే ఆ చిన్న పాదరక్షను గురించి మీ యొద్ద వివరించి చెప్పిన దానిని మీకు జ్ఞాపకమున్నదా? ఏ విధముగా ఆ ఆత్మ ఫలానా మరి ఫలానా దానికి ప్రక్కగా నున్నది, మరియు అంతరంగ మనస్సాక్షి మరియు వాటన్నింటిని గూర్చి వివరించుటకు ప్రయత్నించాను. ఆ విధముగా చెప్పిన పిమ్మట దాని తరువాత అది అనుకరణ చేయువారిని అనేకులను తయారు చేసినది. జనుల యొక్క చేతులను వారిచేతులోనికి తీసుకొని ఏ విధముగా వారు వణుకుటను పొందుకున్నారు — మరియు ప్రతి ఒక్కరికి వారి చేతులయందు ఒక వణుకు యుండెను. అయితే మీకు గుర్తున్నదా, ఆయన నన్ను పైకి తీసికొనివెళ్ళి అక్కడ మరియు ఇట్లు చెప్పెను, ''ఇదియే ఆ మూడవ ఈడ్పు, మరియు ఎవరికి దీనిని గురించి తెలియదు!'' మీకు అది గుర్తున్నదా? దర్శనములు ఎన్నడును తప్పిపోవు! అవి పరిపూర్ణముగా సత్యము.
REV 6:1
87ఇప్పుడు గమనించండి, ఆ దూతల సమూహము వరుసగా వచ్చిన దర్శనము మీకు గుర్తున్నదా? (చార్లీ, నీవు ఇక్కడున్నావు.) ఏదో జరుగుచున్నదని, నేను మీకు చెప్పాను, ఈ వారము అది మీరు… అది మీ చుట్టునే యున్నది, అయితే మీరు దానిని గమనించాలని నేను కోరుకున్నాను. నేను ఆరిజోనాకు వెళ్ళవలెనని ఇక్కడ నుండది బయలుదేరి వెళ్ళినప్పుడు, దూతల యొక్క సముదాయమ యొక్క దర్శనము మీకు గుర్తున్నదా? మీకు గుర్తున్నదా ''అయ్యలారా, ఇది ఏ సమయము.'' మీకు అది గుర్తున్నదా?
గమనించండి, అక్కడ ఒక గొప్ప ఉరుము భయంకరంగా ఉరిమెను, మరి ఏడుగురు దూతలు ప్రత్యక్షమైరి. అది సరియా? ఒక ఉరుము ప్రేలినట్టు ఉరిమెను, ఏడుగురు దూతలు ప్రత్యక్షమైరి. "ఆ గొర్రెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ నాలుగు జీవులలో ఒకటి 'రమ్ము' అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని." గమనించండి, ఒక ఉరుము — ముద్రింపబడిన ఏడు వర్తమానములు మరియు ఈ కాలపు చివరి దినము వరకు అవి బయలుపడవు. నేను ఏ అర్ధముతో చెప్పుచున్నానో చూచుచున్నారా?
88ఇప్పుడు, ఈ వారములోని మర్మయుక్తముగా నున్న భాగమును మీరు గమనించితిరా? అదియే ఇది. అదే ఇదై యున్నది. అది మానవమాత్రులు కాదు, ఒక పురుషుడు కాడు; అది ప్రభువు యొక్క దూతలు. గమనించండి, (ఒక వారమునకు క్రితము) మెక్సీకోకు సమీపమున నేను ఆ కొండలపై నున్నప్పుడు అక్కడయున్న ముగ్గురు సాక్షులు, ఇక్కడ కూర్చొనియున్నారు. ఇక్కడ వారిలో ఇద్దరు సహోదరులు కూర్చొనియున్నారు. నా ఖాళి ఫ్యాంటుకు అంటుకొనిన పల్లేరు కాయవంటి దానిని లాగుచుండగా; ఒక పెద్ద ప్రేలుడు సంభవించి, అది కొండను క్రింద భాగమంతయును కుదిపివేసినట్లయ్యెను. ఇప్పుడు, అది సరియే. నేను దానిని గురించి నా సహోదరులకు చెప్పలేదు, అయితే వారు ఒక తేడాను గమనించారు. మరియు ఆయన నాతో చెప్పెను, ''ఇప్పుడు సిద్ధముగా నుండుము. తూర్పునకు వెళ్ళుము."
ఇదియే ఆ దర్శనము యొక్క తాత్పర్యము.'' చూశారా? ఇప్పుడు, మీకు దానిని తెలియజేయుటకు, సహోదరుడు సాద్‌మేన్ ఒక జంతువును వేటాడవలెనని వెళ్ళెను గాని, అది దొరకలేదు. అతని కొరకు మేము దానిని వేటాడగోరాము. మరియు ఆయన చెప్పెను, ''ఇప్పుడు ఈ రాత్రి మీకు ఒక సూచనగా, అతను దానిని వేటాడలేదు. ఈ దూతల యొక్క దర్శనము నిమిత్తము మీరు మిమ్ములను ఈ సమయమున పవిత్రముగా సమర్పించుకొనవలెను.'' మరియు నేను ఏమి చేయుచున్నానో నాకు తెలియని స్థితిలో నేను యుంటిని, మీకు గుర్తున్నదా? మరియు నేను పశ్చిమమున ఉన్నాను; దూతలు తూర్పు నుండి వచ్చుచుండిరి. మరియు వారు వచ్చుచుండగా, నేను వారితో పాటు పైకి తీసుకొనబడ్డాను. మీకు అది గుర్తున్నదా? — తూర్పుగా వచ్చుచుండెను.
89మరియు ఈ రాత్రి ఇక్కడున్న సహోదరుడు ఫ్రెడ్ మరియు సహోదరుడు నార్మన్ దానికి సాక్షులు. మేము క్రిందికి వెళ్ళుచుండగా నేను అతనిని అక్కడనే యుండి మరియు అతని వేటను కొనసాగింపవలెనని కోరాను. అది సరియేనా, సహోదరుడు సాద్‌మేన్? (సహోదరుడు ఫ్రేడ్ సాద్‌మేన్, ''ఆమేన్'' -సంపా.) అవును, అక్కడ నిలుచునియుండెను. నేను ఒప్పించుటకు ప్రయత్నించితిని… అయితే, అతను చెప్పెను, ''అతను దానిని చేయలేదు.'' నేనేమియు చెప్పలేదు — వెళ్ళిపోయాను. ఆ దినమున ఆ గుడారము ప్రక్కన కూర్చొనియున్న ఏదో యొకటి… నీకు గుర్తున్నదా, సహోదరుడా సాద్‌మేన్, ఏదో నాకు చెప్పబడిన పిమ్మట మరి నేను, నిన్ను మరయు సహోదరుడు నార్మన్‌ను (సహోదరుడు నార్మన్ ఎక్కడ? వెనుక అక్కడ యున్నాడు) జరిగిన కార్యములు ఎవరితోను చెప్పవద్దని వారి యొద్ద ప్రమాణము చేయించాను. అది నిజమనా? (సహోదరులు చెప్పిరి, ''ఆమేన్'' అది సత్యమ. - సంపా.) ఆ విధముగా నేను చుట్టూ తిరిగి ఆ గుడారము నుండి దూరముగా వెళ్ళిపోయానా? అది నిజమేనా? ఎందుకనగా ఇదియే అది — ఖచ్చితముగా అదే అది, మరియు జనులు దానిని అర్ధము చేసికొనునట్లుగా, అది జరుగు వరకు నేను దానిని చెప్పకూడదు.
90మరియు మీరు గమనించారా, ''ఆ ఒక్క దూత, '' ''అందులో ఒక వింతైన దూత" అని నేను చెప్పాను. వారందరికంటె అతడు వేరుగా ఏదో ప్రత్యేకముగా నుండెను. మీకు దాని గురంచి జ్ఞాపకమున్నదా? వారు ఒక గుంపుగా, ఒక సమూదాయముగా నుండిరి — ముగ్గురు ఒక ప్రక్క మరియు ఒకరు పైన. మరియు ఇక్కడ నా ప్రక్కన నున్న, ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కగా లెక్కించినప్పుడు ఏడవ దూతగా యుండును. మరియు అతను చాలా ప్రకాశముగా నుండి, తక్కినవారికంటె ప్రత్యేకముగా నుండెను. దానిని గురించి మీకు జ్ఞాపకమున్నదా? నేను చెప్పాను, ''అతను తన ఛాతిని ఈ విధముగా చాచి మరియు తూర్పు ప్రక్కగా ఎగురుచునుండెను.'' మీకు ఆ విధముగా గుర్తున్నదా? నేను చెప్పాను, ''అది నన్ను పైకి తీసికొనిపోయెను, పైకి లేవదీసెను.'' అది మీకు గుర్తున్నదా?
91నేను నా జీవిత కాలమంతయు ఆశ్చర్యపడుచుండిన కార్యము ఏడవ ముద్రతో, ఇదిగో ఇక్కడ యున్నది! ఆమేన్! ఆ మిగిలిన ముద్రలు కూడా నాకు ఎంతో విలువైనవి, భావయుక్తముగా నున్నవి. అయితే, ఓ, దీని యొక్క భావమేమిటో మీకు తెలియదు! జీవితములో ఒకే సారి… నేను ప్రార్ధించాను, నేను దేవునికి మొర్రపెట్టాను. ఆ ఫినిక్సు కూటమునకు పిమ్మట, నాతో కూడా అక్కడ యున్న వారికెవరికైనా అది తెలియును, నేను కొండలపై పండుకొనియుంటిని. ఒక రోజు ఉదయము, నేను లేచి మరియ సాబినో కెన్యాన్ వైపు పైకి ఎక్కుచున్నాను — అవి గొప్ప, మెరక పల్లములు గల, కరుకైన, ఎత్తైన కొండలు. మరియు నేను దానిపైకి అక్కడకు వెళ్ళాను, మరియు అక్కడ ఒక చిన్న అడుగుజాడలుండెను, వాటిని వెంబడించి వెళ్ళగా — అది లెమ్మాన్ కొండలపైకి వెళ్ళెను, అది ముప్పై-మైళ్ళ కాలి నడకగా యుండెను, అక్కడ ముప్పై-అడుగుల మంచు ఉండును.
92కావున కొండపై, వేకువజామును ఈ చిన్న కలి త్రోవగుండా వెళ్ళసాగాను, దారిలో బండలు దొర్లిపడుచున్నట్లుగా నుండెను. నేను ఈ ప్రక్కగా తిరుగునట్లుగా ప్రేరేపింపబడితిని. మరియు నేను తిరిగి మరియు ఒక గొప్ప వందలకొలది అడుగులు ఎత్తుగానున్న కరకు బండల పైకి వెళ్ళాను. మరియు నేను ఆ బండల మద్య మోకరించితిని. నేను ఈ పరిశుద్ధ గ్రంథమును క్రిందనుంచితిని, మరియు ఈ పుస్తకము క్రింద నుంచితిని — ఈ చిన్న గుర్తులను వ్రాసియున్న పుస్తకమును కూడా క్రింద ఉంచాను. (సహోదరుడు బ్రెన్హాం తన పరిశుద్ధ గ్రంథమును మరియు తన పుస్తకమును చూపించుచున్నారు - సంపా.) నేను చెప్పాను, ''ప్రభువైన దేవా, ఈ దర్శనము యొక్క భావమేమిటి?'' నేను అడిగాను, ''ప్రభువా, నేను చనిపోవుదునని దీని భావమా?'' (మీకు గుర్తున్నదా, నేను మీకు చెప్పాను, ''అది నా యొక్క మరణమని, దానినే అది సూచించుచున్నదని నేను అనుకొన్నాను, ఎందుకనగా ఏదో ప్రేలి నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చినట్లు చేసినది.'' మీకది గుర్తున్నదా, ఎందరికి అది తెలియును మరియు ఎందరు దానిని వినియున్నారు? ఖచ్చితముగా మీలో అ౦దరు దానిని విన్నారు.) మరియు అది నా యొక్క మరణమును గురించిన కార్యమని నేను అనుకొన్నాను.
మరియు అటు పిమ్మట గదిలో ''అదేమిటి, ప్రభువా, దాని యొక్క అర్ధమేమిటి? అని నేను అడిగాను, నేను చనిపోవుచున్నానని దానియొక్క అర్ధమా? మరి నా మరణమును గూర్చిన సంగతైతే ఫరవాలేదు, నేను నా కుటుంబమునకు చెప్పను. నా పరిచర్య సమాప్తమైనచో నన్ను వెళ్ళిపోనీ," అని నేను చెప్పాను. చూశారా! మరియు నేను అడిగాను… ఇప్పుడు అదేమిటి? అయితే ఆయన ఒక సాక్షిని నాకు పంపెను అని మీతో చెప్పిన సంగతి మీకు గుర్తుండియుండును — అయితే అది నేను అనుకొన్న ప్రకారము కాదు, అది నేను కొనసాగించవలసిన విస్తరింపబడియున్న నా యొక్క పరిచర్యను గూర్చిన సంగతి.
93ఓ! మీరు దానిని గ్రహించితిరా, చూశారా? మరియు సాబినో కెన్యాన్ మీద కూర్చొనియున్నాను — పరలోకమందున్న తండ్రి దానిని ఎరుగును — అది నెరవేరుటను మీరు చూచినది ఎంత వాస్తవమో, ఆ విధముగానే ఆ దేవదూతలు అక్కడికి దిగి వచ్చి ప్రతీ వర్తమానము ఒకే రీతిగా యున్నవని ఋజువుపరచెను. పిదప అవి దేవుని యొద్ద నుండి వచ్చినవా, కావా అని దీని ద్వారా మీరు కనుగొనగలరు. అది ఒక దర్శనము ద్వారా మీకు ముందు గానే తెలుపబడినది. ఆరాధన ముగియ వరకు నేను దానిని చెప్పలేకపోయాను, ఎందుకనగా నన్ను చెప్పవద్దని నివారించెను.
ఆ రోజు ఉదయము సాబినో కెన్యాలో అక్కడ పైన చేతులు పైకెత్తి కూర్చొనియున్నాను. మరియు నా యొక్క పాతనల్లని టోపీని గాలి ఎగరగొట్టినది. నేను అక్కడ నిలువబడి, నా చేతులు పైకెత్తి పట్టుకొనియుండగా ప్రార్ధించుచుంటిని. నేను అడిగితిని, ''ప్రభువైన దేవా, దీని యొక్క అర్ధము ఏమిటి? ప్రభువా, దీనిని నేను అర్ధము చేసికొనలేకపోవుచున్నాను. నేనేమి చేయవలెను? ప్రభువా దీనిని నేను అర్ధము చేసికొనలేకపోవుచున్నాను. నేనేమి చేయవలెను ఇది గనుక నేను ఇంటికి (మరణించవలసిన) వెళ్ళిపోయే సమయమైనచో, నన్నిచ్చటను౦డి పైకి తీసుకొనుము, వారు నన్ను కనుగొనలేరు. నేను చనిపోయినయెడల ఎవరూ నా కొరకు ఏడ్వడము నేను ఇష్టపడుట లేదు. నేను ఎచ్చటికో నడిచి వెళ్ళానని, నా కుటుంబస్తులు తలంచవలెనని నేను కోరుచున్నాను, మరియు వారు నన్ను కనుగొనలేరు. నన్ను ఎక్కడైనను దూరముగా దాచివేయుము! నేను వెళ్ళవలసియున్నచో, ఎందుకు, నన్ను వెళ్ళనిమ్ము. ఒకవేళ జోసఫ్ ఇక్కడున్న నా పరిశుద్ధ గ్రంథమును ఒకానొక దినమున కనుగొని మరియు దానిని అతను ఉపయోగింపనిమ్ము. [చూడండి?] నేను వెళ్ళవలసినయెడల నన్ను వెళ్ళుటకు అనుమతించుము, ప్రభువా''
94మరియు నేను నా చేతులను పైకెత్తి యుంచాను, మరియు ఉన్నట్టుండి ఏదో నా చేతిని తాకినది. నాకు తెలియదు. నేను చెప్పలేను. నేను నిద్రించుచుంటినా? నాకు తెలియదు. నేను ఏదైనను అపస్మారక స్థితిలోనికి వెళ్ళుచున్నానా? నాకు తెలియదు. అది ఒక దర్శనమా? నేను దానిని మీకు చెప్పలేను. నేను చెప్పగలిగిన ఒకే కార్యము ఏమనగా నేను… అదెటువంటి కార్యమనగా, ఆ దేవదూతలువలె నేను! మరియు అది నా చేతిని తాకినది, మరియు నేను దానిని చూడగా అది ఒక ఖడ్గమైయున్నది. మరియు దానికి ముత్యపు పిడియుండెను — చాలా అందముగానుండెను. దానిపైన బంగారపు ఒర యున్నది. మరియు దాని అంచు క్రోమ్, వెండివలె అది ప్రకాశించుచుండెను. మరియు అది చాలా పదునుగా యుండెను, ఓ, మై! మరియు నేను అనుకొంటిని, ''అది చాలా అందముగాయున్నది కదూ!'' — నా చేతికి ఖచ్చితముగా సరిపోయినది! నేను తలంచాను, ''అది ఎంతగానో చక్కగానున్నది. అయితే, ''హే, నాకు ఎప్పుడూ ఈ ఖడ్గము మరియు ఇటువంటి ఆయుధము అంటే భయము కదూ!'' ''దానితో నేనేమి చేయగలను?'' అని అనుకున్నాను.
మరియు సరిగ్గా అప్పుడే అక్కడ ఒక స్వరము వినబడెను, అది అచ్చట యున్న బండలను దద్ధరిల్లజేసినది. ''ఇది రాజు యొక్క ఖడ్గము!'' అని చెప్పెను, మరియు అటు తరువాత నేను నా మామూలు స్థితికి వచ్చాను. అది ''రాజు యొక్క ఖడ్గము.'' ఇప్పుడు, ''ఒక రాజు యొక్క ఒక ఖడ్గము'' అని అది చెప్పలేదు…." అయితే అది చెప్పెను, ''రాజు యొక్క ఖడ్గము." మరియు అక్కడ ఒకేఒక రాజు యున్నాడు, మరియు అది దేవుడే అయియున్నాడు! మరియు ఆయనకు ఒక ఖడ్గమున్నది. అదియే ఆయన వాక్యము — దాని ద్వారానే నేను జీవించుచున్నాను! కావున నాకు సహాయపడుము, దేవా… ఆయన యొక్క పరిశుద్ధ బల్ల (వేదిక) యొద్ద ఈ పరిశుద్ధ వాక్యమును తీసుకొని వచ్చి ఇక్కడ యుంచగా నేను ఇక్కడ నిలబడియున్నాను. ఇది వాక్యమైయున్నది. ఆమేన్!
95ఓ, ఎటువంటి దినమున మనము జీవించుచున్నాము! ఎటువంటి ఒక గొప్ప కార్యము! మర్మమును మరియు రహస్యమును చూచితిరా? మూడవ… అది నన్ను వదలి వెళ్ళిన పిమ్మట నేను అక్కడ నిలువబడియుంటిని, ఏదో ఒకటి నా యొద్దకు వచ్చి ''భయపడవద్దు,'' అని చెప్పెను. ఇప్పుడు, నేను ఏ స్వరమును వినలేదు — నాలోపల నుండి ఏదో మాటలాడినది. నేను ఖచ్చితముగా ఏమి జరిగినదో, ఆ సత్యమును మీకు చెప్పవలెను. ఏదో నన్ను తాకి, ''భయపడవద్దు. ఇదియే మూడవ ఈడ్పు, అని చెప్పెను.
మూడవ ఈడ్పు! దానిని మీరు గ్రహించితిరా? ఆయన చెప్పెను, ''దీనిపై అనుకరణ చేయువారు అనేకులు వచ్చెదరు, నీవు వివరించుటకు ప్రయత్నించావు.'' చెప్పెను, ''దీనిని చెప్పుటకు ప్రయత్నించవద్దు.'' ఇది మీకు జ్ఞాపకమున్నదా? ఎందరికి ఆ దర్శనము జ్ఞాపకమున్నది? ఎందువలన, అది సమస్తము సమాప్తమైనది. అది టేపు చేయబడి అన్ని చోట్లకు వెళ్ళినది. అది జరిగి సుమారుగా ఆరు సంవత్సరముల క్రితము అయినది లేదా, ఏడు సంవత్సరముల క్రితమగును — ఏడు సంవత్సరముల క్రితము. చెప్పెను, ''దానిని వివరించుటకు ప్రయత్నించ వద్దు.'' చెప్పెను, ''ఇదియే మూడవ ఈడ్పు, అయితే నేను అక్కడ నిన్ను కలిసికొందను.'' అది నిజమేనా? ''ప్రయత్నించ వద్దు… '' అని ఆయన చెప్పెను.
96నేను ఒక చిన్న బిడ్డ యొక్క బూటును వేసుకొని నిలబడియుండగా, ఆయన నాతో, ''ఇప్పుడు నీ యొక్క మొదటి ఈడ్పును చేయుము. మరియు నీవు చేసినప్పుడు, చేపలు ఆకర్షింపబడి నీ గాలము వెనుక వచ్చును,'' అని చెప్పెను, "పిమ్మట ఆయన నీ యొక్క రెండవ ఈడ్పును గమనించుము," అని చెప్పెను, చెప్పెను, ''ఏలయనగా చిన్న చేపలు మాత్రమే యుండును.'' ''తరువాత మూడవ ఈడ్పు ద్వారా వాటిని పొందుకొనెదవు," అని ఆయన చెప్పెను.
మరియు ఆ సేవకులందరూ నా యొద్దకు వచ్చి గుమిగూడిరి, చెప్పిరి, ''సహోదరుడా బ్రెన్హాం, మాకు తెలియును నీవు దానిని చేయగలవు. హల్లేలూయా! సహోదరుడా బ్రెన్హాం.'' (ఆ విధముగానే నేను ఎల్లప్పుడూ ఒక గుంపు ప్రసంగీకులతో చుట్టబడియుండెదను. నేను జనులను ప్రేమించుచున్నాను, మరియు ప్రతిదీ వివరించమని వారు అడుగుచుందురు — అది, ఇది.)
97మరియు నేను చెప్పాను, ''మంచిది," నేను చెప్పాను, ''నాకు తెలియదు." నేను చెప్పాను, ''నేను చేపలు పట్టుటను గురించి నేనెరుగుదును.'' నేను చెప్పాను, ''ఇప్పుడు, నీవు మొదట చేయవలసిన కార్యము… అది చేయవలసిన విధానము ఇదియే. మీరు చుట్టు ఉన్న చేపలను చూడండి. మీరు ఎరను కుదుపవలెను.'' మంచిది, ఖచ్చితముగా అదియే చేపలు పట్టుటలో గల నైపుణ్యము. కావున నేను చెప్పాను, ''ఎరను కదుపుచుండవలెను.'' ఇప్పుడు మీరు చూడండి, నేను ఎరను కదిలించినపుడు, మొదటిసారి చేప దాని వెంబడివచ్చును, అయితే అవి చిన్నవి. మరియు అది చేపలను పట్టుచున్నట్లేయున్నది. కాబట్టి పిమ్మట నేను చెప్పాను, ''పిదప మీరు సిద్ధపడి…'' మరియు ఒడ్డుకు నేను దానిని లాగినపుడు మరియు నేను ఒక చేపను పట్టితిని, అయితే అది ఎరపైన చర్మమువలె కనిపించెను, అది ఉత్త… అది చాలా చిన్నదిగా నుండెను. మరియు నేను అక్కడ నిలబడియుండగా, మరియు ఏదో నాతో ''నీవు దానిని చేయకూడదని నేను నీతో చెప్పాను కదా!'' అని చెప్పెను. నేను ఏడ్చుటకు ప్రారంభించితిని.
సమస్తమును నా చుట్టూ చుట్టబడి ఈ విధముగా నుండెను. మరియు నేను ఆ విధముగా నా తలవంచుకొని ఏడ్చుచుంటిని. నేను చెప్పాను, ''దేవా, ఓ, నన్ను మన్నించుము. నేను బుద్ధిహనుడను, ప్రభువా. నన్ను మన్నించుము." మరియు త్రాడు నా యొద్ద యున్నది, మరియు నా చేతిలో నున్నది సుమారుగా ఇంత పొడవుగా యున్న ఒక చిన్న బిడ్డ యొక్క బూటు యున్నది. మరియు ఆ త్రాడు నా వ్రేళియంతటి, అనగా — సమారుగా అర అంగుళమంత పొడవున్నది. మరియు ఆ షూలోని ద్వారములు ఒక-అంగుళములో-పదహారవ-భాగము. మరియు ఇంత పెద్ద త్రాడును అంత చిన్న ఆ రంధ్రములోనికి ఎక్కించుటకు నేను ప్రయత్నించుచుంటిని.
ఒక స్వరము వచ్చి చెప్పెను, ''నీవు పెంతెకోస్తు పసిబిడ్డలకు సహజాతీతమగు కార్యములను బోధింపలేవు.'' ''ఇప్పుడు వారిని అలాగే వదిలి వేయుము!'' అని చెప్పెను.
98మరియు సరిగ్గా అప్పుడే ఆయన నన్ను పైకి ఎత్తెను. ఆయన నన్ను పైకి లేవదీసి మరియు ఒక కూటము జరుగు స్థలములో ఎత్తుగా నన్ను కూర్చుండబెట్టెను — అది ఒక గుడారమువలె లేక ఆలయమువలె కనిపించినది. మరియు నేను చూచినప్పుడు మరియు అక్కడ ఒక చిన్న పెట్టె, దాని ప్రక్కన ఒక చిన్న స్థలములో నుండెను. మరియు మీరు అక్కడ పటములో చూచుచున్న నాకు పైగానున్న — ఆ వెలుగు ఎవరితోనో మాటలాడుచుండుట నేను చూచితిని. మరియు అది నా యొద్ద నుండి పోవుచు ఆ విధముగా సుడులు తిరుగుచూ, మరియు ఆ గుడారమునకు పైగా వెళ్ళిపోయెను, మరియు ''నేను నిన్ను అక్కడ కలిసికొనెదను,'' అని చెప్పెను. మరియు ''ఇది మూడవ ఈడ్పుగాయుండును, మరియు నీవు దానిని వేరే ఎవరికిని చెప్పకూడదు,'' అని చెప్పెను.
మరియు సబినో కెన్యాన్ వద్ద, ఆయన చెప్పెను, "ఇది మూడవ ఈడ్పు." మరియు అక్కడ మూడు కార్యములు దానితో సంభవించియున్నవి. మరియు వాటిలో ఒకటి నేడు విప్పబడియున్నది… లేక నిన్నటి దినమున, ఇంకొకటి ఈ దినమున విప్పబడినది, మరియు ఇంకొకటి యున్నది దానిని నేను అనువదించలేను, ఎందుకనగా అది తెలియని భాషలోయున్నది. అయితే నేను అక్కడ నిలువబడి మరియు దానివైపు సూటిగా చూశాను, మరియు పైకి వచ్చుచున్న మూడవ ఈడ్పు ఇదియే. మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ … ఓ, మై! ఆ కారణము చేతనే పరలోకమంతా నిశ్శబ్ధముగా నుండెను.
REV 10:7
99ఇప్పుడు నేను ఇక్కడ నిలిపివేయుట మంచిది, చూడండి. నేను దాని గురించి ఇంక ఏమీ చెప్పకూడదని నాకు అనిపించుచున్నది. చూశారా? కావున, ఏడవ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణమును గుర్తుంచుకొనండి, దానిని ఆయన బయలుపరచకపోవుటకు కారణమేమనగా: దానిని గురించి ఎవ్వరికీ తెలియకూడదని. మరియు మీరు దీనిని తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను, దానిని గురించి నాకు ఏమి తెలియక ముందే, చాలా సంవత్సరముల క్రితము ఆ దర్శనము వచ్చినది. దానిని మీరు గుర్తుంచుకొనియున్నారా? మరియు అది ఇచ్చట యున్నది — అది తక్కినవాటి వలె ఖచ్చితముగా దేవుని వాక్యముతో సరిపోవుచున్నది. మరియు నా హృదయమును దేవుడెరుగును, మరియు అటువంటి దానిని గురించి నా హృదయములో నేనెన్నడూ ఆలోచించలేదు, మరియు అది ఇక్కడ యున్నది. మనము తలంచిన దానికంటే ఆలస్యమైపోయినది. ఓ, మై! అది దేవుని యొద్దనుండి వచ్చిన కార్యమని చూపించుచున్నది, ఏలయనగా చూడండి, చివరికాల వర్తమానములో దేవుని యొక్క వాగ్ధానములతో అది ఖచ్చితముగా సరిపోవుచున్నది.
మీరు గమనించండి. ఇప్పుడు గమనించండి, కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్రయున్నది… ఆయన ఆరు ముద్రలను బయలుపరచెను, అయితే ఏడవ దానిని గురించి ఏమీ చెప్పలేరు. దాని గురించి తెలిసికొనుటకు ముందు పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఇది, అంత్యకాలపు ముద్రయగును. అది ప్రారంభింపబడినప్పుడు అది ఒక పూర్తి రహస్యముగా నుండును. మరియు గుర్తుంచుకొనండి, ప్రకటన 10:1-7, (1 to 7, అధ్యయము 10:1 నుండి 7), ఏడవ దూతయొక్క వర్తమానపు చివరి దేవుని యొక్క మర్మములన్నియును తెలియజేయబడును. మనము ఏడవ ముద్ర విప్పబడుచున్న — అంత్యకాలములో యున్నాము.
100ఇప్పుడు నాకు ఎట్లు తెలియును, ఆ దినమున — గడచిన ఆదివారము, ఒక వారమునకు క్రితము, నేను ''దీనులుగా యుండుడి! దీనులుగా యుండుడి!'' అను దానిపై నేను ప్రసంగించుచున్నప్పుడు. గుర్తుంచుకొనండి, దేవుడు అల్పమైన వాటి ద్వారా వ్యవహరించును." ఆ దీనత్వమనునది దేనిని గురించి నిజముగా మాట్లాడుచున్నదియని నేను గుర్తించలేదు, మరియు ఇప్పుడు నేను దానిని చూచుచున్నాను. అది అటువంటి దీన మార్గమున యున్నది! మీరు అటువంటి ఎదో ప్రాముఖ్యమైన కార్యము వాటికన్ కు బయలుపడవచ్చును అని మీరు అనుకొనవచ్చును; అయితే బాప్తిస్మమిచ్చు యోహానువలె అది వచ్చును. అది మన ప్రభువు ఒక పశువుల పాకలో జన్మించిన విధముగా వచ్చును. దేవునికి మహిమ! కావున, నాకు సహాయపడుము, ఘడియ సమీపించియున్నది! మనమిక్కడ యున్నాము. ఓ, మై! ఇప్పుడు దానిని మీరు చూచారా? — దేవుని దర్శనము యొక్క సత్యమును, ఏడు దూతలు, పశ్చిమము నుండి నన్ను తీసికొని పోవుటను మీరు దానిని చూచితిరా. అవి పశ్చిమము నుండి తూర్పు ప్రక్కగా వచ్చుచున్నవి, ఈ రాత్రి అనుగ్రహించిన ఈ వర్తమానమను ఇచ్చుటకు తీసుకొని వచ్చినవి. ఓ, మై!
101ఇప్పుడు, ఆ గొప్ప ఉరుము యొక్క స్వరము మరియు అది ఇక్కడికి తీసికొని రాబడిన ఉద్దేశ్యము బయలుపడియున్నది, మరియు ఇది దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడినదని నిరూపించబడినది. ఇప్పుడు దానిని ఆలోచించండి. ఈ ముద్రలను గురంచి నాకు తెలియదు, మరియు అవి ఈ వారము బయలుపడినవి. ఎవరైనను దానిని గురించి ఆలోచించితిరా? ఆ ఏడు దూతలు… రానున్న వర్తమానము ఇదియేననియు, ఆ దూతలు దానికొరకై ఇక్కడికి నన్ను తీసికొని వచ్చునని ఎవరైనను దానిని గురించి ఆలోచించారా?
గుర్తుంచుకొనండి, ఏడవ వర్తమానికుడు… ఆ ఏడుగురు వర్తమానికులు… ఏడవ దూత నాకు ప్రత్యేకముగా కనిపించుచున్నాడు, వారందరికంటే ఎంతగానో నన్ను ఆకర్షించుచున్నాడు. ఇప్పుడు చూడండి, వారు ఈ విధముగా నిలబడియున్నారు (ఇప్పుడు, మీరు గమనించవలెనని మేము మిమ్ములను కోరుచున్నాము), మరియు నేనిక్కడ నిలబడియున్నాను, మరియు నేను ఆ ఇతర వాటిని గమనించుచున్నాను… చూడండి, మొదట చిన్న పక్షుల గుంపు, రెక్కలన్నియును క్రిందికి కొట్టుకొనుచున్నవి. వాటి గురించి మీకు జ్ఞాపకమున్నదా? మరియు అవన్నియును తూర్పువైపుకు ఎగురుచున్నవి. మరియు రెండవ గుంపు, ప్రకాశవంతమైన వర్ణములతో, పెద్ద పక్షులు — పావురమువలె సూదికోన వలెనుండు రెక్కలున్నవి. అవి తూర్పు వైపుకు ఎగురుచున్నవి. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, పిమ్మట తరువాతది దూతలు!
102నేను సరిగ్గా అక్కడే నిలబడియున్నాను, మరియు ఈ ప్రేలుడు వెళ్ళిపోయెను, మరియు నేను ఈ ప్రక్కన, పశ్చిమ దిక్కుగా చూచుచుంటిని, మరియు వారు వచ్చి అక్కడ నన్ను పైకి తీసికొనిపోయిరి, నాకు తెలియని స్థితిలో నేను వెళ్ళాను. మరియు వారిలో ఒకరు వచ్చుచుండగా (అతను నాకు చాలా వింతగా కనిపించెను), అతను నా ప్రక్క, నేను ఆ దూతల సమూహములో ఏ వైపు నేను వారిమధ్య ప్రవేశించానో, ఆ వైపుగా ఎడమవైపుగా వచ్చెను; అయితే ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కకు లెక్కించినప్పుడు, అది ఏడవ దూతగా నుండవలెను, చూడండి, అడ్డముగా వచ్చునప్పుడు.
ఇప్పుడు ఏడు వర్తమానికులను గుర్తుంచుకొనండి. నేను మీకు జూనియర్ జాక్సెన్ యొక్క కలలోని భావమును చెప్పిన తెల్లని రాయి యొక్క పిరమిడ్ మీకు గుర్తున్నదా? గమనించండి, నేను వెళ్ళిన రాత్రి… అక్కడ ఆరు కలలు వచ్చెను, మరియు వాటిలో ప్రతి యొక్కటియు అదే కార్యమునకు సంబంధించినది. పిమ్మట దర్శనము ప్రారంభమైనది మరియు నన్ను పశ్చిమమునకు పంపియున్నది. మరియు జూనియర్, అతను గమనించుచుండగా….. ఇప్పుడు గమనించండి. ఎంత పరిపూర్ణముగా నున్నదో చూడండి. ఇప్పుడు, నేను ఈ కృపను దీనికంతటికి గ్రంథకర్తయైన యేసుక్రీస్తుపై నుంచుటకు ప్రయత్నించునపుడు జనులైన మీరు దానిని గుర్తించెదరని నేను నిరీక్షించుచున్నాను మరియు నమ్ముచున్నాను. మరియు ఒకే ఒక్క కారణమేదనగా… మీ యొక్క జీవితములో నేను ముందెన్నడూ ఈ విధముగా మాట్లాడుట మీరు వినలేదు, అయితే కారణము ఈ ఘడియ సమీపించుచున్నది.
NUM 12:6
103గమనించండి. ఇప్పుడు మీలోలప నున్న సందేహములను నిశ్చయముగా నేను పారద్రోలవలెను. నేను మరల మిమ్ములను విడిచి వెళ్ళిపోవుచున్నాను. నేనక్కడికి వెళ్ళెదనో నాకు తెలియదు. నేను ఇంకా ఇతర స్థలములలో సువార్తను ప్రకటింపవలెను. అయితే ఇప్పుడు, ఆ…. ''ఇటువంటి పిచ్చి మాటలు చాలా ఇంతవరకు విన్నాము,'' అని మీరు అనవచ్చు. ఏమిటో నాకు తెలియదు… నేను ఏ వ్యక్తికి తీర్పు తీర్చను. నేను దేవునికి నా కొరకు జవాబు చెప్పుకోవలసియున్నాను. కాని ఇన్ని సంవత్సరములలో నేను ప్రభువు యొక్క నామములో చెప్పిన ఏదైనా ఒక్కటి సరిగ్గా లేని దానిని ఎన్నడైనా మీకు చెప్పానా? ఎవరూ నేను ఆ విధముగా తప్పైన కార్యములు చెప్పినానని చెప్పలేరు, ఎందుకనగా నేను ఎల్లప్పుడూ ఆయన ఏమైతే చెప్పెనో దానినే మీకు చెప్పాను.
ఇప్పుడు, ఇది ఖచ్చితముగా సత్యమని మీకు చూపించుచు మరియు దానిని నిర్ధారణ చేయనివ్వండి. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ''మీలో ఆత్మసంబంధినని గాని… లేక ఒక ప్రవక్తనని గాని చెప్పుకొనుచున్న వాడున్నయెడల ప్రభువైన నేను దర్శనముల ద్వారా అతనితో మాటలాడి మరియు కలల ద్వారా నన్ను నేను అతనికి బయలుపరచుకొనెదను" — కలలకు అర్ధము చెప్పుటయనేది అదియే. యోసేపు, అతడు కలల భావమును చెప్పగలడు మరియు దర్శనములను చూచును. అది సత్యమేనా?
104ఇప్పుడు దీనిని గమనించండి — ఇది జరిగినప్పుడు జూనియర్ జాక్సన్ ఒక పెద్ద పిరమిడ్ వున్న ఒక పొలములో నిలబడియుండెను, ఆ విధముగా; మరియు ఆ బండలపై ఏదో వ్రాయబడియుండెను, మరియు నేను దానిని జనులకు బయలుపచుచుంటిని. అది సరియేనా, జూనియర్? ఇంచుమించు ఒక సంవత్సరమునకు ముందు అది జరిగెను.
ఇప్పుడు తరువాత కార్యమును గమనించండి. నేను ఒక విధమైన ఇనుప గడ్డపారను తీసికొని మరియు దానిని విరిచితిని, మరి దానిలోపల దానిపై ఏమయూ వ్రాయబడని తెల్లని బండయుండెను. మరియు ఆ సమయమున, నేను పశ్చిమమునకు వెళ్ళుటకు ప్రారంభించితిని. మరియు నేను వారందరికిని చెప్పితిని, ''పశ్చిమమునకు వెళ్ళవద్దు. ఇక్కడనే యుండి మరియు నేను తిరిగి వచ్చువరకు దీనివైపు చూస్తూ ఉండండి,'' అని నేను చెప్పాను. ప్రేలుడు కొరకు పశ్చిమమునకు వెళ్ళాను, పరిశుద్ధాత్మ ఈ వ్రాయబడని వాక్యము యొక్క భావమును తెలుపగా తూర్పునకు మరల తిరిగి వచ్చాను. ఇప్పుడు, అది ఖచ్చితముగా పరిపూర్ణముగా సర్వోన్నతుడగు దేవుడు కానియెడల, అదేమిటని మీరు తెలుసుకొనవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను, స్నేహితులారా?నేను ఎందుకొరకు దీనిని చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, మనము చివరి కాలములోనున్నామని మీకు చూపించుటకే.
105ఇప్పుడు, ఇతర కార్యములు సరిగ్గా వాక్య ప్రకారము ఖచ్చితముగా నున్నయెడల, ఇది కూడా వాక్య ప్రకారముగానే నున్నది! మనమిక్కడయున్నాము. స్నేహితులారా, మనము అంత్యకాలమందున్నాము. చాలా త్వరగా ''సమయము గతించును.'' లక్షలకొలది జనులు తమ ప్రాణములను పోగొట్టుకొనెదరు. లక్షలకొలది జనులు ఇప్పుడు వారు రక్షింపబడి యున్నామని అనుకొనుచున్నారు — వారు ఈ అణు యుగమునకు మేతగా మారెదరు.
మనము చివరి యుగములో జీవించుచున్నాము. సర్వోన్నతుడగు దేవుని యొక్క కృప వలన, ఆయన జనులకు ఆయన చేయు సహాయము ద్వారా, త్వరలో ప్రత్యక్షముకానున్న క్రీస్తు కొరకు వారు ఎదురుచూచెదరు గాక! ''ఎంతకాలము సహోదరుడా బ్రెన్హాం?'' ఒకవేళ ఇరవై సంవత్సరములు, ఒకవేళ ఇంకా ఏభై సంవత్సరములలో, ఒకవేళ వంద సంవత్సరములలో ఉండవచ్చును — నాకు తెలియదు. మరియు ఒకవేళ ఉదయము రావచ్చును, ఒకవేళ రాత్రి యుండవచ్చును — నాకు తెలియదు. మరియు ఎవరైనా వారికి తెలుసునని చెప్పినయెడల వారు తప్పిదములైయున్నారు. వారికి తెలియదు. దేవునికి మాత్రమే తెలియును.
106ఇప్పుడు, గమనించండి. కావున నాకు సహాయపడుము, నేను పరిశుద్ధాత్మ ద్వారా వివేచింపబడి మరియు ఆత్మీయముగా నాకు ఈ కార్యములన్నియును వివేచింపబడి దేవుని ద్వారా నేను సత్యమును చెప్పుచున్నాను, మరియు వాటిలో ప్రతీదీ పరిశుద్ధ గ్రంథములో వాటి స్థానమును గుర్తించియున్నది. ఇప్పుడు, ఈ ముద్ర వెనుకనున్నఈ గొప్ప మర్మము ఏమిటో నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు. అదేమిటని నేను గ్రహించలేకున్నాను. అదేమి చెప్పుచున్నదని నేను చెప్పలేను, అయితే ఆ ఏడు ఉరుములు ఒకదానికొకటి దగ్గరగా ధ్వనించి, ఏడు వేర్వేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియును. మరియు అది నేను చూచిన దేనినో విప్పి బయలుపరచుచున్నది.
పిదప నేను దానిని చూచినప్పుడు, నేను దాని భావముకొరకై ఎదురు చూశాను, అది అచ్చట అడ్డముగా ఎగిరి వెళ్ళిపోయినది, మరియు దానిని నేను గ్రహించలేకపోయాను. అది ఖచ్చితముగా సరియే. చూశారా. దానికొరకైన ఘడియ ఇంకా రాలేదు, అయితే అది ఆ వృత్తము లోనికి కదలి వెళ్ళుచున్నది, గమనించండి. అది చాలా సమీపముగా నున్నది. కావున నేను ప్రభువు నామములో మీతో మాటలాడుచున్నాననే దానిని మీరు చేయవలసిన, గ్రహించవలసిన కార్యముగా యున్నది. సిద్ధముగానుండండి, ఏలయనగా ఏదో ఒక కార్యము ఏ సమయమున జరుగనైయున్నదో మీకు తెలియదు.
107ఇప్పుడు, ఇది టేపులలో రికార్డు చేయబడిన పిమ్మట ఇప్పుడు జరుగుచున్నది, అది బహుశా నా పది వేలమంది స్నేహితులను నాకు దూరముగా నుంచును; ఎందుకనగా వారు ఈ విధముగా చెప్పెదరు, ''సహోదరుడు బ్రెన్హాం తననుతాను ఏదో గొప్ప వ్యక్తిగా చేసికొనుటకు ప్రయత్నించుచున్నాడు, ఒక సేవకునిగానో లేక ఒక ప్రవక్తగానో, లేక ఏదో ఒకనిగా దేవుని ఎదుట చేసుకొనుచున్నాడు.'' నా సహోదరులారా, ఆ విధముగా మీరు భావించినయెడల అది తప్పని నేను మీకు చెప్పుచున్నాను. నేను దేనినైతే చూశానో మరియు నాకు ఏమి చెప్పబడినదో, దానిని మాత్రమే నేను మీకు చెప్పుచున్నాను. మరియు ఇప్పుడు మీరు కోరినదేనినైనను చేయుడి. ఏమి జరుగనైయున్నదో నాకు తెలియదు. నాకు తెలియదు. ఆ ఏడు ఉరుములు ఆ మర్మమును కలిగివున్నదని నేనెరుగుదును. పరలోకము నిశ్శబ్దముగా నుండెను. (అందరూ అర్ధము చేసికొన్నారా?)
అది ఈ సమయము కావచ్చును. ఇప్పుడు ఆ ఘడియ కావచ్చును, రంగము మీదికి లేచి రావచ్చును మనము ఎదురు చూచుచున్న ఆ గొప్ప వ్యక్తి రంగము మీదికి లేచి వచ్చుట ఈ సమయమున కావచ్చును, లేక ఆ ఘడియ ఇప్పుడైనను కావచ్చును. ఒకవేళ నేను జనులను మరల వాక్యము నొద్దకు తీసికొని పోవుటకు ప్రయత్నించుట వలన ఈ పరిచర్య ఒక పునాదిని వేసియుండవచ్చును. మరియు అది గనుక ఆ విధముగా చేసియున్నయెడల, మిమ్ములను నేను విడిచి వెళ్ళుచున్నాను. ఒకే సమయములో మేమిరువురమును ఇక్కడ ఉండలేము. ఆ విధముగాయైనయెడల, అతను హెచ్చింపబడవలెను; నేను తగ్గించబడవలెను. నాకు తెలియదు. అయితే అదేమిటోయని నేను చూడగలిగిన భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించెను, గమనించండి — అంతవరకు నాకు విప్పబడి బయలుపడెను. ఇప్పుడు అది సత్యమై యున్నది.
108మరియుఈ వారములో జరిగిన సంగతులను నిశ్చయముగా మీరు గ్రహించియుందురని నేననుకొనుచున్నాను. ఆ చిన్న బాలుడు కాలిన్స్ ఆ రోజు రాత్రి చావుబతుకుల మధ్య అక్కడ పడియుండుటను మీరు గమనించారని నేను నమ్ముచున్నాను, ఆ చిన్న బాలిక లుకేమియా వ్యాధితో బాధపడుచుండెను. దేవుని యొక్క రాజ్యము వచ్చుచున్నది. మరియు అది ఒక ఛాయ లేక నీడవలె నుండి ఎంతో నిజమైన రూపమును అది దాల్చుచున్నది. ఇప్పుడు అది జనులను గుక్క తిప్పుకొనకుండా చేయకూడదు. నీతీకరణము నుండి శుద్ధీకరణములోనికి, శుద్ధీకరణము నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి వచ్చి ఇప్పుడు ఇచ్చుటకు, ఇక్కడకు వచ్చాము. అన్ని సమయములలోను మనము అంతకంతకు దేవునికి అత్యంత సన్నిహితులమగుచున్నాము.
మెథడిస్టు సేవకులారా, మీ యొక్క శుద్ధీకరణ వర్తమానము లూథరు ప్రసంగించిన దానికన్నను పైగా యున్నదను సంగతిని మీరు చూచుట లేదా? పెంతెకోస్తువారలారా, బాప్తిస్మమున మీ వర్తమానము మెథడిస్టులు ప్రసంగించిన దానికన్నను మిన్నగా నుండుట మీరు చూచుట లేదా? నేను అర్ధముతో చెప్పుచున్నానో మీకు తెలియునా? ఓ, అనేక కార్యములు బయలువెడలుటను మనము చూచాము! మరియు అది సరియే. మరియు ఎవరైనను తప్పును తృణీకరించిన, మరియు జనులు సత్యము కాని అబద్ధమైన కార్యములను చెప్పినయెడల, నేను దానిని అసహ్యించుకొనెదను; అయితే నేను దృఢమైన సత్యమును ప్రేమించెదను. అది ఎంతగా ఈ విధముగా లేక ఆ విధముగా ఇబ్బంది కలిగించినను ఫరవాలేదు, అది గనుక సత్యమైనయెడల దేవుడు చివరకు అది సత్యమని చూపించును. మరియు ఆయన గనుక దానిని చేయనియెడల, రాబోవు దినములలో నేను చూచిన దర్శనము నిజము గనుక దానిని చేయనియెడల, రాబోవు దినములలో నేను చూచిన దర్శనము నిజము కాదని ఋజువగును. ఇప్పుడు, నాకు నేనుగా ఎచ్చటయున్నానో మీరు చూడండి?
109''సహోదరుడా బ్రెన్హాం అదెప్పుడు జరుగును?'' నేను మీకు చెప్పలేను. నాకు తెలియదు. అయితే ఏదో ఒక దినమున మనము మరల ఈ భూమిపై కలిసికొననియెడల మనము దూరముననున్న క్రీస్తు యొక్క తీర్పుసింహాసనమునొద్ద కలుసుకొనెదము. మీరు కనుగొనబోవునది ఏమనగా, ఆ గదిలో దేవుని యొద్దనుండి (తక్కినవాటివలె) బయలుపాటు వచ్చినప్పుడు, అవి… ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మము, అది బయలుపడకుండుటకు కారణము, అది ఏడు ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే; మరియు అది అక్కడ ఖచ్చితముగా నున్నది, ఎందుకనగా దానిగురించి ఏమీ తెలియలేదు. అది వ్రాయబడికూడాలేదు. కావున మనము అంత్యకాలములో నున్నాము. మనమిక్కడ యున్నాము.
ఆయన యొక్క వాక్యము కొరకు నేను ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు కొరకు నేను ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. మన పాపముల పరిహారార్థము నిమిత్తము ఆయనను పంపనియెడల మనమందరమును ఏ నిరీక్షణ లేక పాపమును పెంటలో పడియుండెడివారము. అయితే ఆయన యొక్క కృపవలన, ఆయన యొక్క రక్తము పాపములన్నిటిని శద్ధీకరించినది. ఒక చుక్క సిరా ఒక బక్కెట్టులో యున్న క్లోరాక్స్‌లో వేసినయెడల ఆ సిరాను మీరు మరల ఏ విధముగా చూడలేరో, ఆ విధముగా మన పాపములు యేసుక్రీస్తు రక్తములో కనపడకుండా పోవును. మనయొక్క పాపములు ఒప్పకొనబడినప్పుడు అది యేసుక్రీస్తు రక్తములో వేయబడును, ఆ పాపములు మరల జ్ఞాపకము చేసికొనబడవు. దేవుడు వాటిని మరచిపోయెను. అసలు ఆ పాపములు చేయబడనే లేదు. మన పాపపరిహారము కొరకు ఆ బలి అక్కడయున్నంతవరకు, అది అంతే. దానిలో ఉన్న కార్యము అదే, చూశారా. మనము ఇక నుండి పాపులము కాము; దేవుని యొక్క కృప వలన మనము క్రైస్తవులమైయున్నాము.
110మరియు గుర్తుంచుకొనండి, మనకు మనము ఎంత చెడ్డవారుగా యుండవలెనో అంతగా యున్నాము. అయితే చూడండి, దేవుని యొక్క కృప మనకు అనుగ్రహింపబడి, ఈ దినమున క్రైస్తవులమైయున్నాము. సహోదరులుగా మరియు సహోదరిలుగా ఇప్పుడున్న విధముగా అది మనలను మార్చియున్నది.
ఈ వారము నాకు చాలా శ్రమతోకూడిన వారము. నేన అలసిపోయాను. నా యొక్క మనస్సు అలసిపోయినది, ఎందుకనగా నేను… ఇదియే నేన చేయగలిగిన శ్రేష్టమైన కార్యము. మరియు ప్రతి దినమున ఏదో వింతైన కార్యము జరుగుచునే యున్నది. నేను గదిలో నడచునప్పుడు నేను చాలా ఆశ్చర్యపడెదను, మరియు అక్కడ కొద్ది నిమిషములు ఉండెదను, మరియు ఏదో కార్యము నన్ను పూర్తిగా మలచిన సంగతిని చూచెదము. మరియు ఇక్కడ నేను వెళ్ళి నోట్స్ తీసికొనెదను. నేను డాక్టర్. స్మిత్, ఉరియా స్మిత్, మరియు ఓ, మరియు ఇంకా ఇతరులు వ్రాసిన పుస్తకములు తీసికొని మరియ చదివెదము. నేను చెప్పెదను, ''ఇప్పుడు ఇక్కడ ఆరవముద్ర యున్నది; ఇక్కడ నాలుగవ ముద్ర యున్నది. ఇప్పుడు ఈ వ్యక్తి దానిని గురించి ఏమి చెప్పుచున్నాడు?''
అతను చెప్పుచున్నాడు, ''మంచిది, ఇక్కడున్న కార్యము ఇదియే, అది లేక ఇంకొక విధముగా చెప్పవచ్చును,'' నేను ఇక్కడ దానిని గుర్తించుకొని మరియు ఇంకొక వ్యక్తి వ్రాసిన దానిని చదివెదను. అది ఫలానా - మరియు ఫలానా అని అతను చెప్పును, మరియు అది నాకు కనిపించును… అది సరిగ్గా క్రమముగా నున్నట్లు నాకు అనిపించదు.
111తరువాత నేను తలంచెదను, ''మంచిది, ప్రభువా, ఇదేమిటి? దీని కార్యము ఏమిటి? మరియు నేను నేలపై క్రిందికి పైకి కొద్దిసేపు నడచుచుండెదను. నేను మోకరించి ప్రార్ధించెదను. వెనుక వెళ్ళి మరియు పరిశుద్ధ గ్రంథమును తీసికొని, కూర్చొని చదివెదను. ముందుకు వెనుకకు నడచుచుండెదను. పిమ్మట ఉన్నట్టుండి, నేను నెమ్మదిగా ఆలోచించుచుండగా, ఇక్కడ అది ఆ విధముగా బయలుపడినది. వెంటనే నేను ఒక కలమును తీసికొని మరియు దానిని నేను చూచినది చూచినట్టుగా మరి నేనేమి చేసితినో దానిని వ్రాసెదను. నేను వ్రాసి ముగించు వరకు నేను దానిని గమనించుచుండెదను. అటు తరువాత నేను పగటి సమయములో విశ్రాంతి తీసికొని మరియు ఈ కార్యములన్నిటని వెదకి లేఖన వాక్యములతో ఇవి జతపరచబడియున్నవా లేవాని చూచెదము. పిమ్మట, ''అన్ని కార్యములు ఋజువగును.''
ఇక్కడ నేను దీనిని పొందుకున్నాను, మరియు ''ఇప్పుడు అనేక మంది జనులకు దర్శనములు వచ్చినవి, అనేకులకు బయలుపాట్లు వచ్చుచున్నవి,'' అని నేను తలంచుచుండెదను అది గనుక వాక్యమునకు విరోధముగా నున్నయెడల, దానిని అట్లే వదిలివేయుడి, వాటిని ఆ విధముగా వదలివేయుటయే మంచి పద్దతి, వాటిని పట్టించుకొనక వదిలివేయుడి.
112ఇప్పుడు, ఇప్పుడు నేను వాటిని చూచి ఈ విధముగా, ఈ విధముగా చదివెదను. ఇక్కడ నేను కొన్ని కార్యములను గుర్తించుకొన్నాను. నేను తలంచాను, ''మంచిది, ఇప్పుడు దీనిని వినుచున్న జనులు వినుటకు సంతోషించెదరు, ఎందుకనగా అది ఇక్కడ వీటితో ముడిపడియున్నది, వీటితో సరిగ్గా జతపర్చబడియున్నది.'' ఇప్పుడు ఇది ఇక్కడ ఏమి చెప్పుచున్నదని మనము చూచెదము. అవును. మరియు అవును, ఇది ఇక్కడ యున్నది, సరిగ్గా ఇక్కడే యున్నది. చూశారా, మరియు ఈ వారమంతా ఆ కార్యములను పరిశుద్ధ గ్రంథము ద్వారా చూసి మరియు దానితో వాటిని జతపరచితిని. అవి టేపులలో యున్నవి. మీరు వాటిని తీసికొనవచ్చును. మరియు క్రైస్తవ సహవాసము క్రింద నాకు సాధ్యమైనంతవరకు నేను దానిని చేసాను — యేసుక్రీస్తు ద్వారా మానవులందరికి దేవుని కృప అనుగ్రహింపబడుచున్నది. నాకు తెలిసినంతమట్టుకు శ్రేష్టమైన విధముగా నేను వాటిని చేసాను.
మీరు మంచి విద్యార్ధులుగా నుంటిరి. మీవలె ఇంత చక్కగా క్రమముగా ఎవరూ కూర్చొనియుండలేరు. వారు జనులలోనికి అనుమతించుటకు ఆలయము తెరచువరకు మీరందరును పగలు ఒంటి గంటకు ఇక్కడికి వచ్చి అయిదు గంటల వరకు వేచియుండిరి. మీరు చలిలో నిలబడియుండిరి; మీరు మంచులో కూర్చొనియుండిరి; మీరు సమస్తమును చేసిరి — మీ యొక్క కాళ్లు నొప్పి పుట్టు వరకు గోడల చుట్టూనిలబడియుండిరి. మరియు పురుషులు క్రింద కూర్చొని స్త్రీలకు కూర్చొనుటకు కుర్చీలను ఇచ్చిరి. మరియు పలువులు ఆ విధముగా చుట్టూరా నిలబడుకొని మరియు క్రింద కూర్చొనియుండిరి.
113నేను తలంచాను, ''ప్రభువా….'' ఇది ఒక మర్మమైన వారముగా నుండెను. సమస్త కార్యములు ఒక విధమైన వింతగా ఆశ్చర్యముగా నుండెను, ఈ విధముగా జనులు వచ్చినప్పుడు, వెలుపల చుట్టూను వారు నిలబడియుండుటయు, కిటికిలలో, ద్వారముల యొద్ద, వెనుకను దాని చుట్టూ వెనుకను, ప్రతీచోటా వినుచుండిరి. మరియు నేను ఉపన్యాసకునిగా లేను, నేను సరైన ప్రసంగీకుని కాను. నేను ఒక మంచి ఉపన్యాసకుని కాదని గ్రహించు జ్ఞానము నాకున్నది. ఆ సంగతిని నేనెరుగుదురు. అయితే ఎందుకొరకు జనులు కూర్చొని మరియు ఆ విధముగా వినుచున్నారు? దానిని జనులేల చేయుచున్నారు? నావంటి ఒక వ్యక్తి నుండి వినుటకు వారు రాలేదు. అయితే ఎందుకనగా జనులను దాని యొద్దకు ఆకర్షించునట్లుగా దానిలో ఏదో కార్యమున్నది. అక్కడ దానిలో ఏదో కార్యమున్నది. అది వారిన ఆకర్షించుచున్నది. నేను ప్రారంభించినప్పుడు నా యొక్క భార్య ఇక్కడ వేదికపై నిలువబడి మరియు పాటను పాడినట్లు:
వారు తూర్పు నుండియు మరియు పడమర నుండియు వచ్చెదరు,
వారు దూర ప్రదేశముల నుండి వచ్చెదరు,
రాజుతో విందారగించుటకు,
ఆయన యొక్క అతిథిగా భుజించుటకు;
ఈ యాత్రికులు ఎంత ధన్యులు!
దైవీక వెలుగుతో ప్రకాశించెడి,
ఆయన పవిత్రమైన ముఖమును చూచుచు,
ఆయన కృపలో ఆశీర్వదింపబడిన పాలుపంచుకొను వారై,
ఆయన కిరీటములో రత్నములుగా ప్రకాశించెదరు.
114మీరు ఎల్లప్పుడు దానిని మీ మనస్సులో నుంచుకొనెదరు గాక, ''యేసుక్రీస్తు కిరీటములో ఒక రత్నముగా నుండుట '' పౌలు సంఘమునకు చెప్పెను, ''మీరు ఆయన యొక్క కిరీటములో ఆభరణములు, మణులు.'' యేసుక్రీస్తు యొక్క కిరీటములో మనము మణులుగా నుండవలెనని కోరుచున్నాము. దానిలో ఒక మనుష్యుని పెట్టకూడదు, మనము ఆ విధముగా చేయుటకు కోరుట లేదు. నా గురంచి ఏదైనా కార్యమున్నయెడల, మీరు దాని గూర్చి మరచిపోవుడి. నేను జీవించుటకు అర్హతలేనివాడనై, కృప ద్వారా రక్షింపబడిన ఒక పాపిని, మీ సహోదరుడిని. అది ఖచ్చితముగా సత్యము. నేను దీనునిగా నుండవలెనని దీనిని చెప్పుట లేదు — అది వాస్తవము. నాలో ఏ విశేషమైన కార్యమును లేదు, ఏ చెప్పుకోదగ్గ కార్యము లేనే లేదు. అయితే నాలాటి దృష్టిహీన కన్నులకు, బీదవాడినైన నన్ను తెరకు ఆవలనున్న కార్యములను చూచుటకు అనుమతించి మరియు నన్ను మరల ఇచ్చటికి తీసికొని వచ్చినది, దేవుని యొక్క కృప మాత్రమే.
115నేను చిన్నపిల్లవానిగా నున్నప్పుడు నేను జనులను ప్రేమించాను, నేను ఎల్లప్పుడూ ఎవరైనా నన్ను ప్రేమించవలెననియు మరియు నాతో మాట్లాడువలెననియు కోరుకొనేవాడిని. నా యొక్క కుటుంబమునకు గల చెడ్డ పేరు నిమిత్తము ఎవ్వరూ అట్లు చేసేవారు కారు. ఎవ్వరూ నాతో మాట్లాడరు. అయితే నేను దేవునికి నన్నునేను అప్పగించుకొనినప్పుడు, పిదప మా జనులు పూర్వీకులు ఐరీష్, ''ఒకవేళ (వారందరూ కాథలిక్కులు), అవన్నీ చక్కబడునులే,'' అని నేను తలంచాను. నేను అచ్చటికి వెళ్ళాను, మరియు ఆయన ఇంకొక మార్గమున నుండెను; మరియు నేను మొదటి బాప్టిస్టు సంఘమునకు వెళ్ళాను, మరియు ఆయన ఇంకొక మార్గమున నుండెను. ''ప్రభువా! సత్యమైన మార్గము ఏదో ఒకటి యుండవలెను గదా,'' అని నేను అడిగాను. మరియు ఏదో చెప్పెను, ''అది వాక్యమైయున్నది.''
2TIM 4:2-4
116నేను ఆ వాక్యమును పట్టుకొన్నాను. ప్రతీసారి వచ్చు ప్రతి దర్శనమును గమనించండి. నేను పునాది వేసిన ఆ దినమున, ఆ రోజు ఉదయము దర్శనములో నాకు చూపించిన వాక్య భాగమునే నేను అక్కడ వ్రాసి పునాదిలో యుంచాను: ''సమయమందును, అసమయమందును ప్రయాసపడుము, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకకు తిరుగు కాలము వచ్చును.'' మరియు నేను అక్కడ నిలబడి ఆ రెండు చెట్లను చూచాను, అదే కార్యము చేయుచుండుటను చూశాను. అది నిజము. మరియు మనము అక్కడే యున్నాము. మరియు అది సత్యము.
117మరియు ఇపుడు…. గుర్తుంచుకొనండి. మీకు నేను మరల బుద్ధి చెప్పనివ్వండి. మీరు ఎవరికిని, ఎన్నడూ ''వందనములు,'' అని చెప్పవద్దు. చెప్పవద్దు… దానిని ఆలోచించండి, ఒక సేవకుడు లేక ఏదో కార్యము, ఏదో మర్త్యుడగు మానవుడులో మంచి ఏమియూ లేదు, ఎందుకనగా అతనిలో ఏమీ లేదు. వారు ఎవరైనా గాని నేను లెక్క చేయను. ఏ మనిషిలోను ఏ మంచి లేదు. అది నిజము. ఇక్కడ గనుక ఒక కుప్పగా బూరలు పడియున్నయెడల, మరియు వాటిలో ఒకటి ప్రత్యేకమగు సంగీతమును వాయించవలెననినయెడల దానికి ఎవరు కావలెను, ఒక మనిషి. ఆ బూరలు నిశ్శబ్దముగా నుండును వాటికి అవే వాయించలేవు. వాటిని వాయించునది ఒక మనిషి, ఆ బూరను తీసికొని తాన ఏమి చేయబోవుచున్నాడని అతనికి తెలియును. బూరకు దానితో ఏ సంబంధమును లేదు. దాని వెనుకనున్న జ్ఞానము వలన ఆ స్వరము లేక ధ్వని దాని నుండి వచ్చుచున్నది. అది నిజము. కావున అన్ని బూరలును ఒక్కటే, మానవులందరూ ఒక్కటే. క్రైస్తవులందరూ ఒక్కటే.
118మనలో గొప్పవారు ఎవ్వరూ లేదు. మనము గొప్ప పురుషులము కాము, గొప్ప స్త్రీలము కాము. మనమందరమును సహోదర సహోదరిలము, అందరూ ఒక్కటే, అదే గీతలలోపుయున్నాము. మనము ''గొప్ప'' కాదు. ఒకరికంటె ఒకరు గొప్పవారని ఎంచరాదు — అటువంటి కార్యము లేనే లేదు. లేదండి! అయితే మనమందరము మానవమాత్రలమై యున్నాము. సంగతులకు నీ స్వంత అనువాదమును యిచ్చుటకు ప్రయత్నించవద్దు. యేసుక్రీస్తుకు స్తుతి మరియు ఘనత చెల్లించుచు ఒక సన్నిహితమై జీవితమును జీవించుట తప్ప మరేమియు చేయుటకు ప్రయత్నించవద్దు. ఇప్పుడు దానిని అందరూ అర్ధము చేసికొన్నారా? ఆమేన్ . మీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించండి. దానిని మీరు చేయరా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఏలయనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను
మరియు కల్వరి వృక్షముపై,
నా రక్షణను కొనెను.
119దేవునికి స్తోత్రము! అందరూ పూర్తిగా అర్ధము చేసికొనియున్నారా?ప్రతియొక్కరు నమ్ముచున్నారా? నేను మొదట ప్రారంభించినపుడు ఆ మాటను గుర్తుంచుకొనండి, ''మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఆయన మీకు ఆయన కృపను, ఆయన మంచితనమును బయలుపరచియున్నాడా? ఆమేన్.
మీ హృదయమంతటితో ఆయనను ప్రేమించుటకు గుర్తుంచుకొనండి. నేను తిరిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళుచున్నాను. జూన్ మొదటి తేది ప్రభువు చిత్తమైనయెడల నేను యిక్కడికి మరల వచ్చెదము. ఒకవేళ ప్రభువు నా యొక్క హృదయములో గనుక ఉంచినయెడల, ఈ వేసవి ప్రారంభములో, జూన్ లేక ఆ విధముగా అప్పుడు, ఒకవేళ ఆకురాలు కాలము ఆరంభములో, ప్రభువు రాకడ ఆలస్యమైనయెడల, నేను మరల తిరిగివచ్చి, మరొక ఏడు రాత్రులను, ఏడు బూరలకై సిద్ధపరచవలెననుకుంటున్నాను. మీరు దానిని ఇష్టపడెదరా? దేవుడు నాకు సహాయము చేయునట్లుగా, మీరు నా కొరకు ప్రార్ధించెదరా? అది మంచిది. నేను మరల మిమ్ములను కలిసికొను వరకు ఈ పాత చక్కని పాటను గుర్తుంచుకొనండి:
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను
మరియు కల్వరి వృక్షముపై
నా రక్షణను కొనెను.
ఇప్పుడు మీ తలలు వంచవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. నేను మీ కొరకు ప్రార్ధించవలెననియున్నాను. సంఘకాపరి మిమ్ములను పంపించుటకు ముందు నేను మీ కొరకు ప్రార్ధించాలనుకుంటున్నాను.
120మా పరలోకపు తండ్రీ, ప్రభువా, జనులు గ్రహించెదరు గాక. కొందరు అర్ధము చేసికొనలేదని నాకు నిశ్చయముగా తెలియును. అయితే తండ్రీ, వారు ఉద్దేశ్యమును ఎరుగుదురు గాక. మరియు తండ్రీ, ఈ కార్యములు బయలుపడుట అది వారియెడలనున్న మీ యొక్క కృప మాత్రమే అని వారు అర్ధము చేసికొనెదరు గాక. మరియు మీరు మాకు బయలుపరచిన ఈ కార్యములను గ్రహించుకొను జ్ఞానమును మాకిచ్చినందులకు, మేము మీకు వందనములు చెల్లించగోరుచున్నాము, ప్రభువా! మరియు నేను ఇక్కడున్న ప్రతియొక్కరి కొరకును, కూటములకు హాజరైన ప్రతియొక్కరి కొరకును ప్రార్ధించుచున్నాను.
ఒకవేళ నమ్మనివారు ఎవరైనను ఇక్కడున్నయెడల, ప్రభువా, వారు విశ్వాసులుగా మార్చబడెదరు గాక. ఈ వర్తమానములను టేపు ద్వారా వినువారినందరి కొరకు నేను ప్రార్ధించుచున్నాను. మరియు నిస్సందేహముగా ఈ వర్తమానము ఇండ్లలోను మరియు అనేక అవిశ్వాసులున్న స్థలములలో, వేరే విధముగా దీనిని తలంచు వారియొద్దకు పోవును… అయితే, తండ్రీ, నేను ఒక్కొక్కరికొరకు ప్రార్ధించుచున్నాను, వారు ఏదైనను దేవ దూషణకరమైన మాటలు చెప్పుటకుముందు, మొదట వారు కూర్చొని ఏమి చెప్పబడియున్నదో యని లేఖనములను వెదకి మరియు అటు తరువాత వారు యధార్థముగా మరియు సత్యముగా, ఇది సత్యమా లేక కాదాయని మిమ్ములను అడుగునట్లుగా వారుండవలెనని నేను వారి కొరకు ప్రార్ధించుచున్నాను, తండ్రీ!
121మరియు ఈ గోడల ప్రక్కల నిలబడియున్న వారందరికొరకును, బయట నిలబడియున్న వారికొరకును, వారి కార్లలో కూర్చొనియున్న వారికొరకును, చిన్న చిడ్డలకొరకును, మరియు లోపలయున్న వారందరికొరకును నేను ప్రార్ధించుచున్నాను. మరియు వారందరికొరకు, ప్రభువా, వారికొరకు నేను ప్రార్ధించుచున్నాను. మరియు నా ప్రార్థనలకు బదులివ్వబడునని, మీరు వారిని ఆశీర్వదించెదరని నేను ప్రార్థించుచున్నాను.
ప్రభువా, మొదటిగా ప్రతియొక్కరికి నిత్యజీవమును అనుగ్రహించుము. వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని, ఒక్కరు కూడా తప్పిపోకూడదని నేను ప్రార్ధించుచున్నాను. మరియు ఇప్పుడు, తండ్రీ, ఎప్పుడు ఈ గొప్ప సంఘటన జరుగునో మాకు తెలియదు. అయితే మేము ఈ సూచనలు ప్రత్యక్షమగుటను, మరియు లేఖనముల సంభవములు చూచునప్పుడు అవి మా హృదయములను చెప్పశక్యముగాని ఉత్సాహముతో సిద్ధపరచుచున్నవి. తండ్రీయైన దేవా, మీరు మాకు సహాయపడవలెనని నేను ప్రార్ధించుచున్నాను.
మా యొక్క ప్రియమైన కాపరి, సహోదరుడు నెవిల్‌కు మీరు సహాయపడవలెనని నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా, పూర్తి కృపతోను మరియు పూర్తి శక్తితోను మీరు అతనిని నింపి మరియు గ్రహింపును దయచేసి, అతను ఇక్కడ నిలువచేయబడియున్న ఆహారమును దేవుని యొక్క గొర్రెపిల్లలకు తినిపించునట్లుగా చేయుము.
ప్రభువా, మీరు మా యొద్ద నుండి వ్యాధిని దూరముగా నుంచవలెనని నేను ప్రార్ధించుచున్నాను. మరియు జనులు వ్యాధితో నున్నప్పుడు, మరి వారు సకలమునకును సరిపడ్డ యేసుక్రీస్తు రక్తపు బలిపీఠముపై ఇప్పుడు పాప పరిహారార్థమునకై యున్నదనివారు గుర్తుంచుకొనెదరు గాక. మరియు వారు వెంటనే స్వస్థత నొందవలెనని నేను ప్రార్ధించుచున్నాను. మరియు వారిని అధైర్యపరచుచు లేక వారు ఒక విధమైన పద్ధతులను తయారు చేసికొనునట్లుగా చేయు సాతాను యొక్క శక్తికి వారిని దూరముగా నుంచవలెనని నేను ప్రార్ధించుచున్నాను. లేక ప్రభువా! శత్రువు యొక్క శక్తులన్నిటిని దూరముగా నుంచుము. మీ యొక్క వాక్యమునకు మమ్మును శుద్ధీకరించుము. దానిని అనుగ్రహించుము, ప్రభువా.
122పిమ్మట ప్రభువా, మీరు నాకు సహాయపడవలెనని నేను ప్రార్ధించుచున్నాను. నేను వాడిపోవుటకు ప్రారంభించితిని, ప్రభువా. నాకు ఇంకా ఎన్నో దినములు లేవని నాకు తెలియును. మరియు నేను సత్యముగా నుండుటకును, మరియు యధార్ధతతో మరియు నమ్మకముతో నుండి, నేను ఎంతవరకు వర్తమానమున మోసికొనిపోవలెనని నిర్ణయింపబడియున్నానో, అంతవరకు దానిని చేయుటకు నాకు మీరు సహాయపడవలెనని నేను ప్రార్థించుచున్నాను. మరియు నేను చనిపోవలసిన సమయము వచ్చినప్పుడు, నదియొద్దకు పోవలెననియుండగా, మరియు అలలులోనికి వచ్చుటకు ప్రారంభింపగా, ఓ దేవా, ఈ పాత ఖడ్గమును వేరెవరికైనను అందించునట్లు నన్ను యుండనిమ్ము. ప్రభువా, దానితో వారు నమ్మకముగా ఉండి మరియు సత్యమును మోసుకొని వెళ్ళును. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మరియు, అంతవరకు నేను దృఢముగాను, మరియు ఆరోగ్యముగాను మరియు ధైర్యముగాను నుండుటకు సహాయపడుము. నా యొక్క సంఘమునకు సహాయపడుము. ప్రభువా, మమ్ములనందరిని కలిపి దీవించుము, మేము నీవారము. మీ యొక్క ఆత్మ మా మధ్య నున్నదని మేమిప్పుడు అనుభూతినొందుచున్నాము. మా యొక్క ప్రార్ధనలకు మీరు బదులిచ్చెదరని మేము నమ్ముచున్నాము, ఎందుకనగా మీ యొక్క వాక్యముతో, భూమి మీద మీకు సేవకై మాకు మిగిలియున్న దినములను మాతోపాటు మీకు, దేవుని యొక్క కుమారుడును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మమ్ములను మేము సమర్పించుకొనుచున్నాము, ఆయన మహిమకై. ఆమేన్.
నేను (దేవుడు మిమ్ములను ఆశీర్వదించును!) ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను, (నా పూర్ణ హృదయముతో),
ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను.
నా రక్షణను కొనెను.
కల్వరి వృక్షముపై
123[సహోదరుడా బ్రెన్హాం 261-374 భాగములకు లోపలయున్న కార్యములను ప్రారంభములో విడుదల చేయలేదు, అయితే 377-414 భాగములను సోమవారము, మార్చి 25, 1963 కొనసాగించి, మరియు ఆ సమయములో పంచియిచ్చిన ఏడు ముద్రల టేపును వీటితో ఆధికారపూర్వకముగా ముగించెను - సంపా.]
124[సహోదరుడు బ్రెన్హాం గారి యొక్క వ్యాఖ్యలు] … దానిని గురించి వానికేమి తెలియకుండా ఉండుటయే మంచిది, ఎందుకనగా వానికి గనుక అది తెలిసినయెడల వాడు దానిని అనుకరణ చేయును. వాడు అటువంటి కుయుక్తులను పన్నును. కావున, దేవుడు దానిని ప్రపంచమునకు తెలియకుండా మరుగుపరచెను, పరలోకమునకు కూడా తెలియకుండా మరుగుపరచెను, దానిని అర్ధము చేసికొనుటకు వేరే మార్గము లేదు, దేవుడు మాత్రమే దానిని బయలుపరచును, ఆయనకు మాత్రమే అది తెలియును.
ఇప్పుడు ఈ రాత్రి మీరు గమనించవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను, అది ఆరవ ముద్రలో, అక్కడ ఆరవ ముద్రలో మూడు రకముల ఉద్దేశములు కలవు. గుర్రపు సవారి చేయు వారిని గురించి మూడు రకముల ఉద్దేశములు కలవు. ఈ కార్యములన్నిటిలోను మూడు రకములైన ఉద్దేశములు కలవు. అది మనలను మూడు యొద్దకు తీసికొని వచ్చుచున్నది. మరియు మరల ఏడు, చూడండి, ఏడు ముద్రలు, ఏడు పాత్రలు, మరి ఆ విధముగా యుండును.
125ఇప్పుడు, దేవుడు ఆయన యొక్క వాక్యమును బయలుపరచునప్పుడు మూడు, ఏడు ఇవన్నియూ దేవుని యొక్క లెక్కలలో దేవుని సంఖ్యలు. ఇప్పుడు మీరు గమనించండి, సవారి చేయువారిలో యున్న విధముగా, ఇప్పుడు అక్కడ ముగ్గురు సవారి చేయువారు బయలువెడలిరి. వారిలో ఒకటి తెల్లనిది, ఒకటి ఎరుపు, ఒకటి నలుపు. మరియు అటు పిమ్మట, నాలుగవ గుర్రములో, అవన్నియును ఏకముగా మిళితమైనవి. చూశారా, ఒక మూడు విధములగు ఉద్దేశ్యములున్నవి.
ఇప్పుడు, దేవుడు అదే కార్యమును చేసెను. ఆయన తనయొక్క సింహమును బయటికి పంపినప్పుడు దేవుడు అదే కార్యమును చేసెను, క్రీస్తువిరోధిని ఎదుర్కొనుటకు అది ఆయన యొక్క వాక్యమై యున్నది. తరువాత బలియిచ్చు జంతువుగా, శ్రమలకాలములో ఆయన ఎద్దును పంపుట మనము కొనుగొన్నాము. మరియు ఈ శ్రమల కాలములో జనులు చేయగలిగిన కార్యమంతా, పని చేసి, బానిసలుగా నుండి మరియు ఒక బలిగా వారిని వారు సమర్పించుకొనుటయే.
126తరువాత యుగము సంస్కర్తల కాలమని మనము కనుగొన్నాము, దేవుడు మానవుని యొక్క జ్ఞానమును పంపెను — జీవి మనిషి వంటి తల, అదియే సంస్కర్తలలో నుండి బయలువెడలిన శక్తి.
ఇప్పుడు మీరు గమనించుచున్నారా, ప్రతి… ఈ దినమున కూడా జనులు సంస్కర్తల కాలములోనున్న విధముగానే వాటినే పాటించి జీవించుచున్నారనుటలో ఎటువంటి ఆశ్చర్యములేదు, ఎందుకనగా వారి బోధకులు ప్రసంగించిన రీతిగా వారు చూచుచున్నారు. ఒకప్పుడు అది దేవుని మార్గము, అయితే మనము ఇప్పుడు ఆ కాలమును దాటి జీవించుచున్నాము.
REV 7:9•
REV 10:7
127ఇప్పుడు, మనము పక్షిరాజు కాలములో యున్నాము — సమస్త కార్యముల ప్రత్యక్షత ద్వారా బయలుపడవలసియున్నది. ఇప్పుడు దీనిని ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనముతో పోత్చి చూడండి. మరియు ఇక్కడ ఈ ప్రకటనలో మనము చూచుచున్నాము, ఇక్కడ ప్రకటన 10:1-7, 1వ వచనము నుండి 7వ వచనము వరకు, అది, ''ఏడవ దూత యొక్క వర్తమానము ధ్వనించు దినములలో దేవుని యొక్క మర్మములన్నియూ పూర్తిగా సమాప్తమగును.''
ఇప్పుడు మనము ఆ ఆరవముద్ర, ఇప్పుడు తెరువబడియున్నదని దీనిలో కనుగొనియున్నాము, అది మూడు విధములగ ఉద్దేశముకొరకై తెరువబడియున్నది. ఇప్పుడిక్కడ, ఉద్దేశములున్నవి: మొదటి కార్యము, ఆ నిద్రించుచున్న కన్యక, శుద్దీకరణకై శ్రమలగుండా వెళ్ళవలసియున్నది. ఆమె యొక్క అవిశ్వాసమనే పాపము నుండి మరియు వర్తమానమును తిరస్కరించినందులకు ఆమె పరిశుద్ధపరచబడవలెను. ఇది ఆమె శ్రమలకాలములో పరిశుద్ధపరచబడినది. వారు ప్రకటన 7వ అధ్యాయములో 6వ మరియు 7వ అధ్యాయమునకు మధ్యలో వారిని గురంచి సమాప్తమైనది, ఆమె పరిశుద్ధపరచబడి మరియు ఆమెకు వస్త్రములు ఇయ్యబడెను.
128ఇప్పుడు ఈమె వధువు కాదు; అయితే అది సంఘమై యున్నది — పరిశుద్ధమగు జనులే గాని వర్తమానమును ఒకవేళ అంగీకరించుటకు అవకాశము లేక యుండవచ్చును, లేక వారు ఈ అబద్ధపు ప్రవక్తల ద్వారా ఏదో విధముగా గ్రుడ్డివారిగా చేయబడియుండవచ్చును. మరియు వారు ఒక అవకాశమును పొందలేకపోయిరి, అయినప్పటికిని వారు, వారి హృదయములో చాలా నిజాయితీగా నుండిరి. మరియు దేవుడు వారి హృదయములను ఎరిగియున్నాడు, మరియు ఇక్కడ వారు ఈ సమయమున పరిశుద్ధ పరచబడియున్నారు.
ఇశ్రాయేలుకు, ఆమె కూడుకొనినప్పుడు ఇంకొక పరిశుద్ధపరచబడు సమయము వచ్చుటను మీరు గమనించండి. అది రెండవ ఉద్దేశ్యముగా నున్నది. దేవుడు ఇశ్రాయేలును శ్రమలకాలమున పరిశుద్ధపరచును. అక్కడ కూడుకొనియున్న లక్షలకొలది జనులలో, ఒక-లక్ష-నలభై-నాలుగు-వేలమంది ఎన్నుకొనబడినవారు మాత్రమే పరిశుద్ధపరచబడెదరు. దేవుడు ఇశ్రాయేలును పరిశద్ధపరచుచున్నాడు.
129గమనించండి, అక్కడ భూమి యావత్తును పరిశుద్ధపరచబడవలెను. చంద్రుడు, నక్షత్రములు, మరియు ప్రకృతి యావత్తును పరిశుద్ధపరచబడవలసిన ఒక కార్యమక్కడ నుండును. అదేమిటని మీరు చూశారా? భూమి తననుతాను నూతనపరచుకొని, పరిశుద్ధపరచుకొని వెయ్యేండ్ల పాలనకై సిద్ధపడుచున్నది. వెయ్యేండ్ల పరిపాలన వచ్చుచున్నది. మరియు, చూడండి, మురికి, అసహ్యము దానిలోయున్న ప్రతియొక్కటియు ఆరవ ముద్రలో పరిశుద్ధపరచబడును.
ఇప్పుడు, మీరు గమనించుచున్నారా, ఈ ఏడవ ముద్ర తెరువబడగానే, ఇది కూడా ఒక మూడు మడతలుగానున్న మర్మమైయున్నది. ఇది దీనిని గురించి, నేను… మాట్లాడబోవుచున్నాను మరియు మాట్లాడియున్నాను, అది ఏడు ఉరుముల యొక్క మర్మముగా యున్నది. పరలోకములోనున్న ఏడు ఉరుములు ఈ మర్మమును తెరచి బయలుపరచును. అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడలో నుండును, ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికిని తెలియదని క్రీస్తు చెప్పెను.
MATT 24:36•
MARK 13:32
130యూదులు ఆయనను దానిని గురించి అడిగినప్పుడు, మీరు దానిని గమనించితిరా? తెలియునా ఇక్కడ మనము లేఖనములలో మత్తయి 24లో నున్న వచనములను ఆరు ముద్రలతో పోల్చి చూచినప్పుడు, ఏడవ ముద్ర విడిచిపెట్టబడెను, ఎందుకనగా మీరు చూడండి, ''దేవుడు మాత్రమే దానిని ఎరిగియున్నాడు — దూతలకు కూడా తెలియదు,'' అని క్రీస్తు చెప్పెను. అది వ్రాయకపోవుటలో కూడా ఆశ్చర్యము లేదు. మీరు చూడండి, వారు నిశ్శబ్దముగా నుండిరి. అప్పుడు ఏమీ జరుగలేదు. దానిని గురించి దూతలకు తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. అయితే అక్కడ….. ఆ సమయములో గొప్ప బయలుపాటును బయలుపరచు ఈ ఉరుముల యొక్క ఏడు స్వరములు అక్కడ ఉండును.
కావున, మనకు ఎవరికైతే… దానిని గనుక మనకు తెలియనియెడల, మరియు ఆ సమయము వరకు అది తెలియపరచబడదు అని నేను నమ్ముచున్నాను. అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలెనో, అప్పుడు ఆ దినమున బయలుపరచబడవలసిన ఘడియలో అది బయలుపరచబడును. కావున, దేవునికి ముందు భయభక్తులతో నుండి మరియు ఆయనను సేవించుచు, మరియు ఏ విధముగా చేయవలెనని మనకు తెలిసియున్నదో, దానినంతటిని చేయుచు, మరియు మంచి క్రైస్తవ జీవితమును జీవించుటయే మనము చేయవలసిన కార్యము.
ఇప్పుడిక్కడ మనము చూచుచున్నాము ఆరవ ముద్ర మనకు తెరువబడియున్నది. దానిని మనము చూచుచున్నాము. మరియు ఈ ఏడవ ముద్ర ఆ ఘడియ వచ్చువరకు బహిరంగముగా విప్పబడదని మనకు తెలియును.
131ఇప్పుడు, దేవుడు ఈ ఏడు స్వరములు ఉరుముటను అనుమతించుటకు ఒక కారణము కలదు, ఏలయనగా అది తప్పక రావలెను, చూడండి. ఎందుకనగా… మనము కనుగొనియున్నాము, క్రీస్తు, గొర్రెపిల్ల, గ్రంథమును ఆయన చేతిలో తీసికొని, మరియ ఆయన ఆ ఏడవ ముద్రను విప్పెను. అయితే మీరు చూడండి, అది మరుగుచేయబడియున్న మర్మమైయున్నది. దాని గురించి ఎవరికీ తెలియదు. అయితే దాని… ఆయన చెప్పుచు వచ్చునది కూడా ఆదియే: ''ఆయన రాకడను గురించి ఎవరు ఎరుగరు.'' వారికి ఈ ఏడు ఉరుముల రహస్యమును గురించి కూడా తెలియదు. కావున మీరు చూడండి, అది ఒకదానితో ఒకటి సంబంధము కలిగియున్నది.
దానిని గురించి అంతవరకే మనకు అర్ధమైనది, ఎందుకనగా ఈ దినమున మిగిలినదంతా విప్పబడినది గాని ఇది విప్పబడలేదు, అయితే నా యొక్క గదిలో కూర్చొని, మరియు నేను దీనిని విన్నాను… లేక దానిని వినలేదు, అలా కాకుండా, అయితే అది ఈ ఏడు ఉరుముల వరకు విప్పబడుటను చూచాను. ఇప్పుడు, మనము అంతవరకు మాత్రమే వెళ్ళగలము, సరిగ్గా అక్కడ వరకు.
మరియు ఇప్పుడు మీలో ప్రతియొక్కరు దేవుని సేవించుచు, మరియు ఏది సరైనదో దానిని చేసెదరని నేను నమ్ముచున్నాను. మరియు మీ జీవితకాల మంతా ఆయనను ప్రేమించుడి మరియు ఆయనకు సేవచేయుడి, మరియు తక్కిన కార్యములను దేవుడు చూచుకొనును.
MATT 24:32,33•
MARK 13:28,29•
LUKE 21:29,30
132ఇప్పుడు, మనము ముగించునప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన ఆరు ముద్రల యొక్క మర్మములన్నియూ తెలిసికొన్నాము, మరియు ఏడవ ముద్ర బహిరంగముగా బయలుపరచబడదని మనము ఇక్కడ గ్రహించాము.
ఇప్పుడు, ఆయన యొక్క రాకడ, ఆయన రాకడ యొక్క ఘడియలో, భూమి యొక్క నాశనము… మీకు తెలియునా, ఆయన అక్కడ చెప్పెను, "ప్రపంచపు యొక్క ముగింపు వచ్చుచున్నదనుటకు సూచన ఏమిటి?" మత్తయి 24లో అక్కడ వారు ఆయనను ఆ ప్రశ్న వేసిరి, ఆయన వాటికి జవాబిచ్చెను. ఆయన ఇశ్రాయేలు ఒక దేశముగా కూడుకొనుటను గురించి 31వ వచనములో చెప్పెను, మత్తయి 24:31. అయితే ఆయన అప్పుడు వాటిని ఉపమానములుగా చెప్పుటకు ప్రారంభించెను, చూచారా? పిమ్మట మీరు అక్కడ చూడండి, ''అంజూరపు చెట్టును గురించిన ఒక ఉపమానము నేర్చుకొనుడి. అది చిగురించుటకు ఆరంభించినప్పుడు వసంతకాలము సమీపముగా నున్నదని తెలిసికొనుడి." మరియు అప్పుడు, "మరియు ఇదంతయు నెరవేరుచుండగా, అప్పుడు సమయము సమీపించియున్నదని తెలిసికొనుడి.''
133ఇశ్రాయేలు తన స్వదేశములో కూడుకొనుచున్నది. అయితే మీరు గమనించండి, ఆయన ఏడవ ముద్ర యొక్క బయలుపాటును వదిలివేసెను. మరియు ఇక్కడ, ఏడవ ముద్ర, ఆయన దానిని తెరచినప్పుడు, ఆయన మరల దానిని వదిలివేసెను, చూడండి. కావున మనము అది పూర్తిగా మర్మమని చూచియున్నాము. కావున, మర్మము బయలుపరచుటకు సమయము ఇంకా రాలేదు. కావున, మనము ఇంతవరకు కార్యములను చూచాము, మిగతా విషయములు యేసు భూమి మీదికి మరల తన వధువు కొరకు వచ్చు సమయములో, లేక ఆ సమయమున ఏమి జరుగునో అప్పుడు తెలియును.
ఇప్పుడు, ఆ సమయము వరకు, మనమందరమును ప్రార్ధించి, మంచిగా, నిజాయితీగా, క్రైస్తవ జీవితమును జీవించి ఆయన రాకడకొరకు ఎదురుచూచుచుండెదము.
134మరియు ఇప్పుడు, ఈ టేపు గనుక ఎక్కడో ఒక చోట ఎవరి చేతిలోనైను పడినయెడల దాని నుండి ఏ సిద్ధాంతమును తయారు చేయుటకు ప్రయత్నించవద్దు. మీరు దేవుని సేవించుచు నుండుటయే మీరు చేయవలసిన ఒకే కార్యము, ఎందుకనగా ఈ రహస్యము చాలా గొప్పది, దేవుడు యోహానును కూడా దానిని వ్రాయుటకు అనుమతింపలేదు. అది ఉరిమెను… అయితే, ఆయన…. దానిని ఎరిగియుండి… అది తెరువబడునని మనకు వాగ్దానము చేసెను. అయితే ఈ సమయము వరకు అది విప్పబడలేదు.
135మరియు ఇప్పుడు, మనము ఆయన ఎంతవరకు మనకు చూపించియున్నాడో దాని కొరకు దేవునికి కృనజ్ఞులముగా నున్నాము. నేను అక్కడ గదిలో ఎనిమిది దినములుగా కూర్చొనియున్నాను. మరియు ఇప్పుడు మీకు నేను వివరించుచుండగా, నేను చెప్పిన వర్తమానమున ఇక్కడున్న మీలో అనేకులు అర్ధము చేసికొనెదరు. మరియు ఏదో అత్మసంబంధమగు కార్యము ఒకటి జరుగుచూ వచ్చుచున్నదని నేను మీకు తెలియజేసితిని, మీరు దానిని వదిలివేయుచున్నారని నాకు ఖచ్చితముగా తెలియును. మరియు ఇక్కడ అదేమైయున్నది. అది దేవుని వలన పంపబడిన ఈ లేఖనముల అర్ధము యొక్క పరిపూర్ణ నిరూపణయైయున్నది, ఎందుకనగా మనము ఆ కార్యములలోనికి వెళ్ళుటకు ముందే, మరియు నేను పశ్చిమమునకు వెళ్ళినప్పుడు, ఒకరోజు సుమారుగా ఉదయము పది గంటలప్పుడు ప్రభువు నాకు ఒక దర్శనమును చూపించెను. మరియు నేను దానిని చూచి ఇక్కడికి వచ్చి మరియు దానిని వివరించి చెప్పాను, అదేమిటని నాకు తెలియదు. అది ఏడు దూతలు సమూదాయముగా వచ్చిన దర్శనమది. దానిని మనము గుర్తుంచుకొనియున్నాము. మీరు దానిని "అయ్యలారా, ఇదేనా సమయము?" యను టేపులో చూడగలరు, మంచిది ఇప్పుడు, మరి దానినే ఖచ్చితముగా ఇప్పుడు మీరు చూచుచున్నారు.
136ఏడు దూతలు…. నేను పశ్చిమాన ఉన్నాను. మీకు గుర్తున్నదా, ఆ చిన్న వర్తమానికులు — వారు తూర్పువైపుకు వెళ్ళిరి. రెండవ వర్తమానికులు, పావురములు (చిన్న ఇంకొద్దిగా పెద్ద పక్షి), వారు తూర్పునకు వెళ్ళిరి. మరియ అటు తరువాత నేను చూచాను…. వారు అన్ని సమయములలోను వారు నాతోనే యుండిరి. అదియే మొదటి మరియు రెండవ ఈడ్పులు. ఇప్పుడు, మూడవది పడమటి నుండి గొప్ప కదలికతో భయంకరమగు వేగముతో దూసుకొంటూ వచ్చి, మరియు అవి నన్ను పైకితీసికొనిపోయినవి. అదియే నేను ఈ ఏడు ముద్రల మర్మములతో మరల తూర్పునకు వచ్చిన కార్యముగా నున్నది. జూనియర్ జాక్సన్ కలలో చెప్పిన విధముగా, అక్కడ జరిగిన దానిని అతని కొరకై అనువదించుటకై ప్రభువు నాకు అనుమతించెను.
ఆ పిరమడ్ యొక్క లోపల, దానిపైన ఏమియు వ్రాయబడని ఒక తెల్లని బండ యుండెను. మరి ఆ కారణము వలననే నేను ఈ దూతల వర్తమానముతో దానిని సంబంధపరచుటకు గాను పడమటికి వెళ్ళవలసియుండెను, మరియు అటు తరువాత ఇక్కడికి తిరిగి వచ్చి దానిని సంఘమునకు బయలుపరచవలసియుండెను. మీకు జ్ఞాపకమున్నదా, ''తరువాత జరుగవలసిన కార్యములు ఇక్కడ సంఘములో జరుగును,'' అని నేను చెప్పాను. అది ఖచ్చితముగా నున్నది.
137ఇంకొక కార్యము, ఏమి జరిగియున్నదని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. మీరు గనుక "అయ్యలారా అదేనా సమయము?" యను టేపును గనుక వినుచున్నయెడల, ఒక దూత నాకు చాలా గుర్తింపతగినదిగా యుండినదానిని మీరు గమనించగలరు. తక్కిన మిగిలినవన్నియును సాధారణముగానే నుండెను, అయితే ఈ దూత ఒక ప్రత్యేకముగా గుర్తింపదగిన దూతగా నుండెను. అతను పిరమిడ్ రూపములోనున్న గుంపులో నాకు ఎడమ ప్రక్కగా నుండెను. మరియ దానిపైన వ్రాయబడని మర్మమైన తెల్లని బండ పిరమిడ్‌లో నుండెనని గుర్తుంచుకొనండి. మరియు పిరమిడ్‌గా యున్న దూతలే నన్ను ఆ పిరమిడ్ లోనికి స్వయంగా తీసుకొని వెళ్ళిరి — దేవుని యొక్క మర్మములు వారికి మాత్రమే తెలియును. మరియు ఇప్పుడు, ఆ పిరమిడ్‌ను లేక ఆ పిరమిడ్ లోపలనున్న ఈ ఏడు ముద్రల మర్మము యొక్క వర్తమానపు భావమును తెలుపుటకు వచ్చిన వర్తమానికులు వారే.
138ఇప్పుడు, మనము గనుక ఎడమ నుండి కుడి ప్రక్కకు లెక్కించినయెడల, నాకు ఎడమ ప్రక్కగానున్న ఆ దూత నిజముగా చివరి దూత లేక ఏడవ దూతగా యుండును — ఎందుకనగా అతను నాకు ఎడమ ప్రక్కగానుండెను, నేను అతనిని పశ్చిమ వైపుకు చూచుచుంటిని, అతను తూర్పు ప్రక్కగా వచ్చుచుండెను, నాకు ఎడమ ప్రక్కగా నుండెను. కావున అది చివరి దూత యొక్క వర్తమానము — చాలా గుర్తింపతగిన ప్రత్యేకమైనది. నేను ఎట్లుండునని చెప్పినది గుర్తుంచుకొనండి… అతను తన తలను వెనుకకు త్రిప్పిన విధము, మరియు అతడు గొప్ప వాడియగు రెక్కలను కలిగియుండెను రెక్కలు మరియు అతనెట్లు నాకు ఎదురుగా ఎగురుచూ వచ్చెనని మీకు చెప్పితిని. ఇప్పుడు, అదియే ఈ ఏడవ ముద్ర. అదింకా ఒక ప్రత్యేకమైన గుర్తింప తగ్గ కార్యముగానే యున్నది. మరియు మనము… ఇప్పటకిని అదేమిటని మనకు తెలియదు, ఎందుకనగా అది విప్పబడుటకు అనుమతింపబడలేదు.
అయితే ఇప్పుడు, కూటములో నున్న ప్రతిఒక్కరూ దానిని గమనించి యుండెదరు… ఎటువంటి ఒక కూటమది! ప్రతి ఒక్కరూ ఉత్సాహముతో వారి యొక్క సీట్ల అంచున కూర్చొనియున్నట్లుగా వారు నాకు కనిపించారు. మరియు ప్రతి ఒక్కరూ ఇక్కడ మధ్యాహ్నము ఒకటి మరియు రెండు గంటలకే వచ్చి, ముందు సీట్లలో కూర్చొనుటకు, ఎప్పుడు తలుపులు తెరుచుదురా యని ఇక్కడ చుట్టూ నిలబడి వేచియుండిరి. గోడలచుట్టూ ఆ విధముగా నిలబడియుండుట వలన కాళ్ళ నొప్పులతో మరియు చాలా శ్రమపడిరి. అదేమిటి? అది పరిశుద్ధాత్మ ఈ వర్తమానికులను క్రిందికి పంపించుటయే మరియు తరువాత వారు దానిని మనకు బయలుపరచుచున్నారు. మరియు తరువాత అదెట్లు సరిపోవుచున్నదని గమనించండి, ఖచ్చితముగా వాక్యముతో సరిపోవుచున్నది.
139మరియు ఇది సత్యమని మీ అందరు తెలుసుకొనుటకు గాను, అది జరుగుటకు ముందే సుమారుగా రెండు నెలల లేక దానికి పైగా ఆయన ముందుగానే వాటి గురించి చెప్పెను. దాని గురించి నాకు ఏమీ తెలియకుండానే — నేను పశ్చిమమునకు వెళ్ళితిని, ఆయన నాకు దానిని గురించి ఇచ్చిన అనువాదముతో ఇచ్చటికి తిరిగి వచ్చాను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, దర్శనములో, ఆయన నన్ను పైకి తీసికొని వెళ్ళినప్పుడు, దర్శనములో ఆయన నాకు ఒక్క కార్యమును కూడా చెప్పలేదు. చనిపోవుదునేమోనని నేను భయపడ్డాను — ప్రేలుడులో చనిపోయెదనని భయపడ్డాను. మీరు చూడండి, వారు దానిని చేయలేకపోయిరి. దాని గురించిన అవసరము కలిగినప్పుడు, నాకు దాని అనువాదము అనుగ్రహింపబడెను — అది ఆ గదిలో. మరియు ఆయన నాకు దానిని ఏ విధముగా అనుగ్రహించెనో, అదే విధముగా దానిని నేను మీకు వివరించి చెప్పాను.
ఇప్పుడు, స్నేహితులారా, మీరు చూడండి, దర్శనములు తప్పిపోవు. అవి ఎల్లప్పుడూ ఖచ్చితముగా నుండును. అవి ఎల్లప్పుడూ ఖచ్చితముగా సత్యము.
ఇప్పుడు, దర్శనము మరియు వాక్యము, మరియు చరిత్ర, మరియు సంఘ కాలములు — మరియు అన్నియు మిశ్రమముగా కలిసియున్నవి. కావున, నాకు తెలిసినంతవరకు మరియు దేవుని యొక్క వాక్యప్రకారము, దర్శనము ప్రకారము, మరియు బయలుపాటు ప్రకారము మీకు ఇవ్వబడిన అనువాదము, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" అని నేను నిజముగా చెప్పగలను.
ఇప్పుడు, మనము ఈ పాత-చక్కని సంఘపు పాటను నిలుచుని పాడుచుండగా, ప్రభువు మిమ్ములను అందరిని ప్రతియొక్కొక్కరిని నిజముగా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్ములను, ప్రతి యొక్కరిని ఆశీర్వదించును గాక, ఆమేన్.
140నేను (దేవుడు మిమ్ములను ఆశీర్వదించును!) ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను (నా పూర్ణ హృదయముతో),
ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను.
నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షముపై.