చిన్నాభిన్నములై విడిపోవుచున్న ప్రపంచము
1మన ప్రభువైన యేసుతో ప్రేమలో ఉన్న ఈ సహోదరుల నుండి మంచి సాక్ష్యములు వినుచు, ఇక్కడ ఉండుట, నిశ్చయముగా గొప్ప ఆధిక్యతయై ఉన్నది. ఇప్పుడు నేను…దానిపై ఇంకా జీవిస్తూ… నేను ఏమి చెప్పుదును?. గడచిన సాయంత్రం వాటిలో ఒక వర్తమానం నుండి ప్రేరేపణను నేను పొందుకున్నాను. నిజానికి వాటిలో అన్నిటి నుండి. కానీ ఇక్కడ ఈ సహోదరుడి వలన, అతని శ్రమను గూర్చి ఆలోచిస్తూ అతడు చేసిన విధముగా…యోబు వలె అది నన్ను ప్రేరేపించెను. కానీ చివరికి అతడు రెట్టింపు పొందెను. మరియు కూర్చుని, ఒకరి సాక్ష్యము వినుట ఎంతో అద్భుతమని నేను అనుకుంటాను. అప్పుడు వారి జీవితమును నీవు పోలి ఉండవచ్చు.
2క్రీస్తుతో మనలను గుర్తింప చేసుకొనుటకు, బైబిలు లోని ఆయనతో మనలను గుర్తింపజేసికొనుటపై ఈ మధ్యనే ఫోనిక్స్ లో నేను బోధించాను. ఆ దినములలో మనము జీవించినట్లయితే, ఏ గుంపుతో గుర్తింప చేసుకుంటాము? అప్పుడు గత రాత్రి తన సాక్ష్యముతో కూడిన ఈ అద్భుత వర్తమానమును క్రో సహోదరుడు (అది అతడి పేరని నేను నమ్ముతున్నాను) మనకు తెచ్చుచుండగా…. కొద్ది క్షణాల క్రితం ఇక్కడ మేమిద్దరము కూర్చుని ఒకరి జీవితమును మరొకరితో పోల్చుకుంటిమి. మొదటిలో మేమిద్దరము బాప్టిస్టులమే, బాక్సర్ లమే, మరియు అలా ముందుకు మాట్లాడుకుంటూ వెళ్లి చివరి పోట్లాటలో ఏమి జరిగిందో మాట్లాడుకున్నాం. మరియు అప్పుడు… నేను దానిని నిశ్చయముగా ఆనందించాను. వారు దీనిని టేపు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను.
3మరియు ఇప్పుడు ఈ ఉదయమున, మనం ఒక విందును లేక ఒక మధ్యాహ్న భోజనమును, మరికొంచెం సమయములో సేవకుల కొరకు ఇక్కడ కలిగి ఉన్నామని నేను ఎరిగియున్నాను. మరియు…ఏమి చెప్పుచున్నారు? (ఒకరు చెప్పుచున్నారు "పురుషులు అందరూ") పురుషులు, అవును. మరియు నేను అనుకుంటున్నాను ఈ రాత్రి విందు…(ప్రక్కన సంభాషణ) అవును, సేవకుడు లేక సేవకేతరుడు, పురుషుడు ఎవరైనా సరే (ఒకరు అనెను, "మధ్యాహ్నభోజనం 12:30 వరకు లేదు")12:30 ("రెండు, రెండున్నర, ఇప్పటి నుండి రెండు గంటలు.") దయగల వ్యక్తి సహోదరుడు షకారియన్, మరియు అతని భార్య.
సహోదరి విలియమ్స్, నేను ఒక విషయమును చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేదు. కొద్ది నిమిషముల క్రితం సహోదరుడు కార్ల్ సాక్ష్యం అసాధారణమైనది. అది మంచిది. మిమ్మల్ని ఎరిగి ఉన్నంతవరకూ, మొదటిసారి నేను దానిని తెలుసుకున్నాను, కానీ అది ఎంతో బాగుంది. నేను అన్ని పరిస్థితుల నుండి ఒక పాఠమును నేర్చుకున్నాను. మనం నేర్చుకున్నామా?
4కనుక అయితే, నేటి రాత్రి, ప్రభువు చిత్తమైతే, "వారు ఆయనను అక్కడ సిలువ వేసిరి" అనే అంశంపై నేను నేటి రాత్రి మాట్లాడనైయున్నాను.
మరియు ఇప్పుడు, నేడు ఈ చిన్న అంశంపై మాట్లాడేముందు ఒక చిన్న మార్పు …నేను మొదటిసారి నిన్న మీ నగరంలోకి వచ్చాను. న్యూ మెక్సికోలో నేను మాట్లాడుట (నాకు ఒక…) రెండవసారి. కొద్ది రాత్రులు, కార్ల్సబాడ్ ఒకసారి కూడికలను కలిగి ఉన్నాను. కానీ మునుపెన్నడూ ఇక్కడ ఈ అందమైన స్థలమునకు వచ్చు ఆధిక్యత నేను కలిగి ఉండలేదు. మరియు త్వరగా వచ్చుటకు నేను ఇష్టపడుతున్నాను. మరియు చుట్టూ చూసినప్పుడు, ఒక విధమైన అనుభూతి…. ఈ పట్టణమునకు ఏమి అవసరత ఉన్నది అని.
ఇప్పుడు, మేము సేవకులుగా పట్టణమునకు ఎన్నడూ రాలేదు…+
5ఇప్పుడు, వ్యాపారస్తులారా, ఇది ఒక కూడిక. మీ వ్యాపారములు, మరియు మీ బాధలు, మరియు ఆశీర్వాదములు మాట్లాడుకొనుటకు, ఒకరికొకరు వాటిని పంచుకొనుటకు మీరు ఇక్కడ ఉన్నారు. మరియు అది చాలా మంచిది. కానీ క్రీస్తు సేవకునిగా, ఆత్మీయ స్థితిని కనుగొనుటకు మేము ఇక్కడికి వచ్చాము. మరియు అప్పుడు వినిపించుటకు లేక చూపించుకొనుటకు ఇక్కడకు రాలేదు. కానీ ఏదో ఒక దాని ద్వారా దేవుని మహిమపరచుటకు, ఇక్కడ ఉన్న కార్యాలను దేవుని యెడల ఇంకా ఉన్నతమైన గ్రహింపునకు తీసుకురావడానికి ఇక్కడకు వచ్చాము. మరియు ఇప్పుడు, ఈ ఉదయం నేను అంశమును మార్చితిని.
మరియు ఇప్పుడు, మనము లేఖనము చదువుటకు మునుపు, చిన్న ప్రార్థన కొరకు కొద్ది నిమిషములు భంగిమను మార్చి, మనము నిలబడాలని నా కోరిక. మరియు ఇప్పుడు, మనము ప్రార్థించుటకు మునుపు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనే వారు ఎవరైనా ఇక్కడ ఉండినట్లయితే, మీ చేతులను పైకి ఎత్తుము. అది ఏదైనా సంబంధం లేదు. నీ చేతిలోపల ఏమి ఉన్నదో ఆయన ఎరిగియున్నాడు. మరియు నేను నా రెండు చేతులను పైకి ఎత్తియున్నాను. మనము ఆయనను సమీపించుటకు, ఇప్పుడు మనము మన తలలు వంచుదాము.
1COR 12:13•
EPH 2:6
6నా పరలోకపు తండ్రీ, నేడు క్రీస్తుయేసు తోడి పరలోక స్థలములలో మేము కూర్చుండి ఉండుట వలన మేము చాలా ఆధిక్యత కలిగిన ప్రజలమై ఉన్నాము. ఒకే ఆత్మ ద్వారా అందరమూ ఈ ఏక శరీరంలోనికి బాప్తిస్మము పొందియున్నాము. మరియు ఈ మీ బిడ్డల సాక్ష్యముల ఆశీర్వాదములు ఒకరికొకరు పంచుకుంటూ ఇక్కడ కూర్చుని ఉండుట ఆధిక్యతయై ఉన్నది.
మరియు ఇప్పుడు, సమయం ఆలస్యమగుచుండగా, నేను ప్రజలతో మాట్లాడవలసిన కీలక భాగములోనికి కొంచెం భయముతో దీనిలోనికి రావాలని కోరట్లేదు… దీనిని త్వరగా ముగించుకుందాము. కానీ మీరు మా మనసులను కొద్ది నిమిషములు నిమ్మళపరచి మరియు మా కొరకు మీ ప్రేరేపణలు, మరియు మీ హెచ్చరికలు ముందస్తుగా వినునట్లు మేము ప్రార్థిస్తున్నాను. మరియు ఈ సంగతుల కొరకే నేను నీ వైపే ఎదురుచూస్తున్నాను తండ్రీ.
మరియు ఇప్పుడు, ఈ వ్యాపారస్తులకూడిక, ఈ క్రైస్తవ సంపూర్ణ సువార్తికులను వారి సాక్ష్యము మరింతగా ఇంకనూ దూరమునకు మరియు విశాలమైనదిగా వ్యాప్తి చెందునట్లు మన ప్రభువు మహిమ మరియు గౌరవార్థమై దీవించమని మేము ప్రార్థించుచున్నాము.
MATT 4:9•
LUKE 4:5•
REV 11:15
7మరియు ఇప్పుడు, ఈ ప్రపంచ రాజ్యములు, మన ప్రభువు మరియు ఆయన క్రీస్తురాజ్యములగు సమయం వస్తున్నదని ఎరిగి మనము సంతోషించుచున్నాము. మనం ఆయనతో పాటుగా వెయ్యేండ్లు భూమిని పరిపాలన చేయుదము. మనము ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాము.
మనుషులు వారి శోధనలను గూర్చి చెప్పుట వినుచుండగా, మరియు ఏ విధంగా సాతాను మన ప్రభువును కొండపైన శిఖరమునకు తీసుకువెళ్లి, మరియు కొద్ది సమయములో అన్ని ప్రభుత్వములను మరియు ప్రపంచ రాజ్యములను ఆయనకు చూపి మరియు వాటిని ఆయనకు ఇవ్వబోయెను…. కానీ ఆయన వాటిని తేలికగా వ్యతిరేకించెను ఎందుకనగా ఒక రోజున ఆయన వాటికి వారసుడనగునని ఆయన ఎరిగియున్నాడు.
మరియు ఇప్పుడు, తాత్కాలికముగా జరుగుచున్న పరిస్థితుల వైపు మనము చూడవద్దు. కానీ మనము మార్గాంతమునకు చూచెదము. ఎందుకనగా అక్కడ బహుమానములు ఇవ్వబడినవి. తండ్రీ మా హృదయములను మీ ముందు మేము వినేటట్లుగా ఆసక్తి కలిగించమని ఈ ఉదయమున మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, మర్త్య పెదవుల ద్వారా నీవు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. మర్త్యమైన చెవుల ద్వారా మేము మీ మాటలను విందుముగాక. మరియు అప్పుడు, తిరిగి మేము మాకు అజ్ఞాపించిన ప్రతీదానికి మేము లోబడదుము గాక.
ఇప్పుడు, వ్రాయబడిన వాక్యములో మా విశ్వాస పునాది వేయబడినది గనుక మేము మీ అత్యున్నతమైన పరిశుద్ధ వాక్యము చదువుచుండగా మేము మీ కొరకు వేచియున్నాము. యేసుక్రీస్తు నామమున మేము దీనిని అడుగుచున్నాము ఆమెన్. మీరు కూర్చుండవచ్చు.
DEUT 4:10,11•
HEB 12:25
8మరియు ఇప్పుడు, మీ కొరకు వాక్యములోని లేఖనములో కొన్ని పేజీలను తిప్పాలని కోరుకుంటున్నాను. నేను రాసుకున్న కొంత నోట్స్ లో నుండి రెండు భాగములను గూర్చి సండేస్కూల్ పాఠము వలే నేను చెప్పాలని మీరు కోరినట్లయితే కొద్ది నిమిషములు దానిపైన వ్యాఖ్యానిస్తాను. ద్వితీయోపదేశకాండము నాలుగు మొదటి… ద్వితీయోపదేశకాండము 4 మరియు 10 మరియు11. ఈ లేఖనములను చదవాలని నేను ఆశపడుచున్నాను.
నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఈ భూమి మీద బ్రతుకు దినములన్నియు నాకు భయపడి నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము.
అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటిలో, మేఘమును, గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా.
మరియు తర్వాత హెబ్రీయులకు12:25, హెబ్రీయులకు12:25 నుండి వచనములను మనం చదువుదాం.
నీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల, పరలోకము నుండి బుద్ధి చెబుతున్న వానిని తప్పించుకొనక పోవుట మరి నిశ్చయము గదా.
9వ్యాపారస్తుల అల్పాహారం వద్ద ఆ విధమైన వచనములను చదువుట కొంచెం వ్యత్యాసముగా ఉంటుంది, కానీ మన హృదయములకు ప్రభువు వాటిని దీవించును గాక. మరియు ఇప్పుడు నేను కలిగియున్న ఈ చిన్న అంశమును నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ఉదయమున "వర్తమానము పై రక్తం" అను అంశముపై మాట్లాడాలని నా హృదయంలో ఉండెను. మరియు మరియొక కారణం వల్ల నేను దానిని దాటివేసాను. ఎందుకనగా నాకు తెలియదు. కానీ ఈ ఉదయమున ఇక్కడ ఈ భాగమును చెప్పాలని… విభిన్నమైనది, కానీ దాని పేరు "చిన్నాభిన్నములై విడిపోవుచున్న ప్రపంచము" అది ఒక విభిన్న భాగము. కానీ దానిపైన మాట్లాడుటకు నడిపించబడ్డానని నేను అనుభూతి చెందాను. "చిన్నాభిన్నములై విడిపోవుచున్న ప్రపంచము".
ఇప్పుడు మనము… మనము పిలుస్తున్న శుభ శుక్రవారం, లేక దేవుని శుభ శుక్రవారం. (శుభ శుక్రవారం అని దానినిఎందుకు మనము పిలుస్తున్నామో నేను ఎరుగను) కానీ మరియొక కొనసాగింపు అయిన సెలవుల ప్రారంభంలో మనం ఉన్నాము. హోలీడేస్ అనగా పరిశుద్ధ దినములను ప్రపంచము పక్కకు పెట్టెను. క్రైస్తవ ప్రపంచం గతంలో గొప్ప లేఖనానుసారమైన సంఘటనలు జ్ఞాపకార్థంగా జరుపుకునేవారు. గొప్ప సంగతులు జరిగేవి మరియు వాటిని మనం జరిగిన ఆ సంగతులను ఉత్సహించు సమయముగా ఉపయోగించాము.
ఒకవేళ ఈ సమయమున దేవుడు ఈ క్రైస్తవ ప్రపంచంలో ఇక్కడ ఉండినట్లయితే, (మరియు క్రైస్తవ ప్రపంచం అని పిలువబడే) ఈ గొప్ప దినములు మరియు సమయముల జ్ఞాపకార్థంగా మనం కలిగి ఉన్న ఈ ఉత్సవముల తీరుపట్ల ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉండునో అని నేను ఆశ్చర్యం చెందుతున్నాను.
10మరియు మనుష్యులు ఏదో ఒకటి కనుగొందామను ఆశతో ఒకరికొకరు కలిసి వచ్చెదరు. వారు ఈ జీవిత విధానంలో ఉన్న సమయం అంతాప్రపంచాన్ని ఏకపరచడానికి ఒక పరిష్కారం కనుగొనాలని లేక ఒక విధమైన వ్యవస్థ తెలుసుకోవాలని కోరుకొందురు.
ఈ ఉదయమున మనము ఆ ఉద్దేశం కొరకే ఇక్కడ కూడియున్నాము. ఏదో ఒక తప్పిదమును కనుగొనుటకు మనుషులు వివిధ కోణములలో ఏకమవుతారు. అది అలాగున్నదని మనకు అందరికీ తెలుసు. మరియు ప్రపంచములో ఏదో ఒక తప్పిదము ఉంది, మరియు మనము దీనిని కనుగొనుటకు తప్పక ప్రయత్నించాలి. మరియు మనుషులు పరిష్కారం ఏమిటి అన్న దానిని కనుగొనుటకు ఈ కోణంలోనే కూడుకొనెదరు. ప్రపంచములో ఇలా అనేకమార్లు జరిగెను. దానినే మనం "చిన్నాభిన్నమై విడిపోవుచున్నది" అని పిలుస్తున్నాం.
మనము ఏ సమయములో జీవిస్తున్నాము అంటే మన….కేవలం మన జాతి మాత్రమే కాదు, కానీ మన ప్రపంచం మొత్తము వేరుగా విడిపోయెను. ఇది ఏమి లేనిదిగా కనిపిస్తుంది అది నిలబడుటకు దానికి ఒక పునాది కావలెను.
11మనము దానికి వివిధ పద్ధతులలోప్రయత్నించాము. మనము ఒకరినొకరు అర్థం చేసుకొనుటకు ప్రపంచమునకు నేర్పించుటకు ప్రయత్నించాము. మరియు మనం మనుషులకు అర్థమయ్యేటట్లుగా చేయడానికి వివిధ వ్యవస్థల జాతుల పరస్పర సహకారమును మరియు యూ.ఎన్.లు, మరియు మొదలగునవి కలిగి ఉన్నాము. క్రైస్తవ ప్రపంచము ప్రజలు అర్థం చేసుకోవడానికి వారికి నేర్పుటకు ప్రయత్నించెను. ఒక గ్రహింపుకు తెచ్చుటకు వారిని శాఖగా చేయుటకు ప్రయత్నించాము. మరియు అది తిరిగి ఎప్పుడూ జరిగే విధముగా మనకు అది కనిపించెను. మొత్తము వ్యవస్థలు అన్నీ చిన్నాభిన్నముగా విడిపోవుచున్నవి. ఏదో తప్పిదము ఉన్నది.
12మిగిలిన కొద్ది నిమిషాలు మనం దీని గురించి తీవ్రంగా ఆలోచిద్దాము. ఇప్పుడు దీనిని మీరు రానీయకండి, "మంచిది, మనం వెళ్లి మరియు కూర్చుని, అల్పాహారం తీసుకుని, సాక్ష్యములు విన్నాము" మరియు మొదలైనవి అని చెప్పవచ్చు. కానీ దీనిని మన హృదయములలోకి తీసుకొని మరియు దానిగూర్చి ఆలోచిద్దాము.
జ్ఞాపకం ఉంచుకొనండి, ఇది మన జీవం మరియు మన జీవం కన్నా ప్రాముఖ్యమైనది ఇంకొకటి లేదు. ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచములో మనం ఎంత లాభం పొందాము లేక ఇక్కడ మనం ఎంత గొప్ప వారం అయ్యాము అన్నదానితో సంబంధం లేదు. కానీ మార్గం చివరికి మనం రావలసి ఉన్నది మరియు అదియే తెలియజేసే కాలం మరియు మనం ఏవిధంగా చేయాలో ఎరిగి మనం తప్పక
యదార్ధతతో దానిని సమీపించాలి.
13ప్రజలు అప్పుడు…ఇంకొక సమయములో ప్రజలు మరొక జీవన మనుగడ మార్గమును కనుగొనుటకు ప్రయత్నించారు. మరియు వారు విధి విధానములలోనికి వెళ్లిపోయారు. మరియు దేవుడు నడిపించే మార్గం కాక వేరొక వ్యవస్థలోనికి వారు వెళ్లే మార్గం అయినా గానీ అది వాక్యం నుండి తొలగిపోవుటే. గత కాలంలో మనుషులు దీనినే చేసేవారు. వారందరూ బయటకు రావడానికి ప్రయత్నించేవారు. ప్రపంచమును నియంత్రించుటకు ప్రయత్నించేవారు. మరియు రాజకీయమును మరియు వివిధ పరిస్థితులను ఒక వ్యవస్థగా చేసి నియంత్రించుటకు ప్రయత్నించి మరియు ప్రపంచాన్ని దానితో జతపరిచెను. మరియు దానిని అలా చేయుటకు దానిని చేయు దేవుని ప్రణాళిక నుండి వారు బయటకు రావలసిన వారై ఉన్నారు. చూడండి. దేవునికి ఈ విషయమును జతపరచి ఉంచడానికి ఒక మార్గం ఉన్నది. మరియు మానవుడు ఎప్పటికీ వేరొక మార్గమునే స్వీకరించెను. ఒక్కటే మార్గము. అక్కడ తన అసలు మార్గము నుండి బయటకి రావలసి ఉండెను.
14మీరు చూశారా, అక్కడ ఒక అబద్ధం ఉండక మునుపు ఆ అబద్ధం దేని నుండి రావలెనో ఆ సత్యము అక్కడ ఉండవలెను. ఎందుకనగా సత్యమును వక్రీకరించడమే అబద్ధం. పాపము అంతయూ నీతిని వక్రీకరించుటే. అది… పాపము అంతా….. చూడండి, అపవాది దేనిని సృష్టించలేడు. దేవుడు దేనిని సృష్టించెనో దానిని అతను చెడగొట్టును. అక్కడ సృష్టికర్త ఒకే ఒకరు ఉన్నారు. మరియు అదియే దేవుడు. అబద్ధము అనగా నిజమును వక్రీకరించుటయే. జారత్వము అనగా సరైన కార్యమును వక్రీకరించుటయే. మరియు తప్పిదమైనది ఏదైనా ఒక సరియైన దానిని వక్రీకరించుటయే.
15కనుక దేవుని వ్యవస్థకు బదులుగా వేరొక వ్యవస్థను ప్రపంచమును జత పరచుట కొరకు స్వీకరించుట అనేది వక్రీకరించుటయే.
కనుక, ఏదైనా చెడగొట్టబడే దానికి ఒక ముగింపు ఉండును. ఎందుకనగా ప్రారంభం అయ్యే ప్రతీ దానికి ముగింపు ఉండును. ప్రారంభం లేనివి ఎన్నడూ నశించవు. ఎన్నటికీ ముగింపు పొందవు. మరియు ఎన్నటికీ ప్రారంభం లేని కార్యము ఒకటి ఉంది. మరియు అదియే దేవుడు. కనుక మనం నిత్యము జీవించు మార్గం ఒకే ఒక్కటి ఏదనగా దేవుని జీవము మనలో ఉండుట, మరియు అదియే నిత్య జీవము. మరియు దేవుడు తనంతట తానే మన మధ్య విభజించబడి, మరియు పెంతెకొస్తు దినమున ఆయన చేసిన విధంగా తన ఆత్మను ఇచ్చెను. అది అగ్నిస్తంభం నుండి అగ్నిచిహ్నములుగా కనబడి, ప్రజలకు తన సొంత జీవమును ఇచ్చుటకు ప్రజల మధ్య తనకు తానే విభాగింపబడెను. మరియు దీని ద్వారా మన మధ్యలో క్రీస్తు మనస్సు పని చేయుచుండెను.
JOHN 1:1•
JOHN 15:7
16మరియు దేవుడు వాక్యమై ఉన్నాడు."ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని వద్ద ఉండెను, మరియు ఆ వాక్యం దేవుడై ఉండెను. మరియు అది ఇంకనూ దేవుడై ఉండెను. అది నిజము. అది వాక్యమై ఉండెను. మరియు మనము వాక్యము నుండి బయటకు వచ్చినప్పుడు, మనం దేవుని నుండి దూరము అవుతాము.
యేసు చెప్పెను "మీరు నాయందు నిలిచి ఉండినట్లయితే (అక్కడే తెలియనిది ఉన్నది అక్కడే రహస్యం ఉన్నది). మీరు నాయందు నిలిచి మరియు నా వాక్యము మీలో ఉన్న యెడల, మీకేది ఇష్టమో అడుగుడి," చూశారా. ఆలోచన ఏమిటంటే, మొదట ఇక్కడ దేవుని వాక్యము స్థిరముగా యున్నది. మీరు సిద్ధాంతములు, మరియు ఇజములు, మరియు మొదలైనవి మరియు వాటిని తీసుకుని మీలోకి వెళ్ళనివ్వకూడదు. మరియు కొన్ని సిద్ధాంతములు తీసుకుని మరియు
దేవుని వాక్యముతో కలిపి మరియు వాటిని నీలో ఎక్కించుకుని, దేవుడు వాటిని గౌరవించే లాగా నీవు చేయలేవు. అది ఖచ్చితంగా స్వచ్ఛమైనకల్తీ లేని దేవుని వాక్యము అయి ఉండాలి. మరియు అంతా అదియే. అంతా అదియే. చెడగొట్టబడిన దేనితో అయినను దేవుడు కలవడు. ఆయన ఖచ్చితంగా సంపూర్ణ దేవుడై ఉన్నాడు.
DAN 2:43
17ఇప్పుడు, అన్ని సమయములలోను ఎల్లవేళలా దేవుని వాక్యమును వక్రీకరించుటకు ప్రయత్నించు ఈ విధమైన ప్రజలను మనం కలిగి ఉన్నాము. మరియు వేరొక విధమైన వ్యవస్థలను తీసుకుంటారు. మరియు వారు కనుగొంటారు. చాలా కాలం తర్వాత నేడు మనం చూస్తున్న విధముగా వారు కనుగొంటారు. ఈ 1963 ప్రపంచం చిన్నాభిన్నమై విడిపోవుచున్నది అన్నదానిని కనుగొంటారు. ఖచ్చితంగా కనుగొంటారు. ఎందుకనగా అది కలిపి ఉంచదు. దానియేలు తన దర్శనములు ఏదైతే చెప్పెనో దానికన్నాకాదు. (రాజులకు తెలియజేసిన) ఇక ఎంత మాత్రమూ ఇనుము మరియు మట్టి ఒకదానికొకటి కలవదు. అలాగునే దేవుని వాక్యము దేనితోనూ కలవదు. అది ఆలాగున జరగదు. అది వాక్యము గానే ఉండును. అది అంతే.
MATT 24:37•
LUKE 17:26
18ఇప్పుడు, నోవహు జీవించిన ప్రపంచపు దినములలో రాజకీయం సంతరించుకుందని మనం కనుగొన్నాము మరియు విద్యాకార్యక్రమం మరియు ఆ దినపు గొప్ప వ్యాపార ప్రపంచము తనంతట తానే మెరుగులు దిద్దుకుని ఎక్కడ వరకు అంటే…వారి పిరమిడ్లు మరియు సింహ శరీరము ముఖము మనిషి కలిగిన రాతి విగ్రహము (స్ప్య్నిక్ష్) మొదలగునవి నేడు మనం నిర్మించలేము ఎవరైనా ఐగుప్తులో ఉండి ఆ పిరమిడ్లు మొదలైనవి చూసినట్లయితే అటువంటి విధమైనది ఒక్కటి కూడా మనం ఎన్నడూ నిర్మించలేము కానీ వారు మన కన్నా విద్యలో ముందున్నారు, వారు విజ్ఞాన శాస్త్రములో ముందున్నారు. మరియు తర్వాత వారు వచ్చి ప్రపంచం చిన్నాభిన్నమై విడిపోవుట ప్రారంభమగుటను కనుగొనెను మరియు దేవుడు వారికి వర్తమానం పంపెను కానీ వారు దానిని తిరస్కరించెను. మరియు అది సామాన్యమైనది, చాలా సామాన్యమైన వర్తమానం, చాలా సామాన్యమైన రైతు ద్వారా వచ్చిన వర్తమానం. కానీ వారు దానిని తిరస్కరించారు మరియు దానిని నిరాకరించారు, మరియు వారి ప్రపంచం చిన్నాభిన్నమై విడిపోయెను. అది ఖచ్చితం.
సొదొమలో కూడా అదే జరిగింది. అనైతికత సొదొమలో కదులుతున్న సమయములో మరియు వారు పట్టణములు మొదలగు వాటిని నిర్మించెను. కానీ వచ్చి కనుగొంటే, దేవుడు అక్కడికి ఆయన వ్యవస్థను పంపెను, అయితే వారు దానిని తిరస్కరించిరి. మరియు అది చిన్నాభిన్నమాయెను. అది ఎప్పటికీ జరుగును.
ఇప్పుడు అదే సంగతి నేడు జరుగుతున్నది. అదే దినములో మనము ఉన్నాము. యేసు అనెను, "నోవహు దినములలో మరియు సొదొమ దినములలో ఉన్నట్లుగానే మనుష్య కుమారుని రాకడ దినములలోను ఉండును". పరిస్థితి మొత్తం దిగజారుతూ మరియు చిన్నాభిన్నమవుచున్నది. అది ఇసుక పైన కట్టబడినదై, కొట్టుకొని పోవును. మరియు అప్పటి వలె గొప్ప కాలము నేడు ఉండుట మనం కనుగొంటాము.
19మరియు మన యేసు ప్రభువు రాకడ సమయములో ఆయన జన్మించిన మునుపటి దినములలో, ఆ దినమున ప్రపంచము విచ్చిన్నమాయెనని మనం కనుగొన్నాము. ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మనం ఆ మతపరమైన లోకమును కనుగొన్నాము. నేను ఈ రాత్రి సిలువను దాని సంబంధమైన దాని గూర్చి మాట్లాడాలని అనుకున్నట్లుగా, దేవుడు ఆయన తన వాక్యములో నుండి వారికి ఇచ్చిన ఆ వ్యవస్థను యూదులు చాలా కలుషితం చేశారు. ఎంత అంటే ఇక ఎంత మాత్రం యదార్ధత లేనంతగా…. ఎంత మాత్రమూ దానిని మనం కనుగొన్నాము వారి బలులు… అక్షర రూపముగా వారు దానిని తీసుకువెళ్లినప్పటికీ, మరియు వారు వారి బలులను చేసి……
యూదులు అప్పుడు…
20మనిషి పాపం చేసినప్పుడు, దేవుడు ఆ ప్రత్యామ్నాయం స్వీకరించుట కన్నా ఏదియు మధురమైనది కాదు. మరియు దేవుడు ప్రత్యామ్నాయమును అంగీకరించెను. ఆ కార్యమును చేయుటకు ఆయన నిండైన కృపను కలిగియుండెను. యూదుడు తన ఎద్దు లేక గొర్రె పిల్లతో రహదారిపైకి వచ్చి దానిని బలిగా అర్పించుటకు వెళ్ళినప్పుడు మరియు అతడు దానిని తన హృదయమంతటితో చేయుట, అది చాలా గొప్ప సంగతి. కానీ తర్వాత అది ఒక కుటుంబ సాంప్రదాయముగా అయిపోయెను. వారు కేవలం వెళ్లి మరియు ఎద్దును అర్పించి, మరియు "మంచిది, ఇప్పుడు బలిని ఇచ్చు సమయం వచ్చినది, కనుక మనం వెళ్లి ఈ ఎద్దును అర్పిద్దాము". మరియు అది సాంప్రదాయముగా అయిపోయెను.
మన క్రైస్తవ వ్యవస్థకు ఏమి జరిగెనో నమ్ముటకు నేను దాదాపు ఒప్పుకున్నాను. క్రైస్తవులని పిలవబడే వారు మన వివిధ సంఘ శాఖలు, మరియు తెగలు మనం ఆ స్థానమునకు వచ్చాము. మరియు మన పెంతెకొస్తులు కూడా… (ఇప్పుడు జ్ఞాపకం చేసుకొనండి మందు మొత్తం కుటుంబానికి వెళ్లెను). మరియు పెంతెకొస్తులు అయిన మనము మన అంతట మనమే దానిలోనికి వెళుతున్నాము. మరియు మనం ఆశ్చర్యపడు…
ISA 1:6
21పెంతెకొస్తు లోకము మొత్తం నేడు పడిపోయెను. మెతడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్ వ్యవస్థ మొత్తం మతపరమైన వ్యవస్థ మొత్తం పడిపోయెను. దానిని మనం చూసాము. అది నిజమని మనకు తెలుసు.
మన దేశ రాజకీయలోకం పడిపోయెను. పరిస్థితి మొత్తం ముగింపున ఉన్నది. యెషయా చెప్పినట్లుగా అది మొత్తం కుళ్ళిన కురుపులు ఆయెను. అది మొత్తం శరీరం పాడైపోయెను. ఏదో జరగవలసి ఉన్నది (మరియు అది ఏ విధమైన మనిషి చేసిన వ్యవస్థ లేక జ్ఞానమునకు దాటి ఉండవలసి ఉన్నది). మరల దాని సరైన పరిస్థితులకు తిరిగి తీసుకురావడానికి అది రోత అయిన దృశ్యమని నాకు తెలుసు. కానీ అది సత్యం. పరిస్థితులు ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నాయో వాటిని మనం చూడాలి, మరియు వేరే విధమైనది ఏది చెప్పే అవసరం లేదు. వేరేవిధంగా చెప్పే దానికన్నా, బయటకు వచ్చి మరియు దాని గూర్చి నిజము చెప్పాలి. నిజము నిజమే, మరియు తప్పిదము తప్పిదమే, చూశారా, మరియు దాని వైపు మనం చూడాలి.
22మరియు నేడు దేశములను మనం చూసాము. మన రాజకీయ మరియు జాతీయ జీవితము కేంద్ర భాగమునకు కుళ్ళిపోయెను. మన యవ్వనస్తుల ముందు అది అంతా పూర్తిగా ప్రసార మాధ్యమ (T.V) దుర్నీతి, అన్ని విధములైన మురికి అసహ్యమైన హాస్యములు మరియు గగ్గోలు పరిస్థితులతో ఉన్నది. మరియు పాఠశాలలు చాలా పాడైపోయాయి. మై, నాది ఆరిజోనా. ఒకనాడు నేను పాఠశాలల్లో పెద్దదైన ఒకదాని వద్ద ఉన్నాను. మరియు ఆ యవ్వన స్త్రీలు మరియు పురుషులు (అబ్బాయిలు) ఆ ప్రాంగణంలో ఒకరితో నొకరు దొర్లుతూ ఉండుట చూసాను. నేను అన్నాను, "నా బిడ్డలలో ఒకరిని కూడా ఆ విధమైన స్థలమునకు ఆ విధమైన పాడైపోయిన దాని వద్దకు పంపించకూడదని" నేను అనుకున్నాను. ఇంకా అమెరికా అని పిలవబడుతున్నది.
నేను చూసిన వాటిలో నీచమైనది దేశంలోని వివిధ భాగములలో ఉన్న అమెరికన్ల ప్రవర్తన. మనం ఎప్పుడూ ఇతర దేశమును గూర్చి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇతరులను గూర్చి మనం మాట్లాడే ముందు మన సొంత ద్వారములను మనం శుభ్రం చేసుకొనుట మంచిది. మరియు పెంతెకొస్తులమైన మనం కూడా ప్రెస్బిటేరియన్, మరియు బాప్టిస్ట్ గూర్చి వెళ్లి అరిచే ముందు మన ద్వారములను ఊడ్చుకుందాం. ఎందుకనగా మన వ్యవస్థ వారి వలెనే పాడైపోయి మరియు పడిపోయెను, చూశారా. మనం ఆ దినములోనే జీవిస్తున్నాము.
23మరియు ఇప్పుడు, మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకునేది ఏదనగా యేసు జన్మించిన ఈ దినములలో అదే విధమైన వ్యవస్థను వారు కలిగియున్న దానిని మనం కనుగొనవచ్చు. వారికి యదార్ధత లేదు. వారు కేవలం వెళ్లి యూదులుగా అయిపోయి మరియు ఎనిమిదవ దినమున సున్నతి చేసుకొనును. మరియు నిజముగానే అతడు యూదుడగును. మంచిది, నేడు మనము కూడా అదే పరిస్థితిని కలిగి యున్నాము. వారు సంఘమునకు వారిని తీసుకువెళ్లి మరియు శిశువులకు నామకరణం చేయుదురు. మరియు తర్వాత మీరు తెలుసుకోవలసిన మొదటి సంగతి, ఎందుకు, వారు ఆ సంఘమునకు చెందియున్నారు. మరియు వారు క్రైస్తవులు అయినట్లయితే మీరు వారిని అడగవచ్చు. "ఖచ్చితంగా నేను క్రైస్తవుడిని నేను అమెరికన్ని".
ఒకసారి ప్రార్థనా వరుసలో ఒకసారి నేను ఒక స్త్రీని అడిగాను, "నీవు క్రైస్తవురాలివా"?
ఆమె అనెను, "మంచిది, నేను మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. నేను ప్రతీ రాత్రి కొవ్వొత్తి వెలిగిస్తాను". ఇప్పుడు ఆ విధంగా క్రైస్తవ్యముతో ఏదైనా చేయవచ్చు.
ఒకరు అనెను,"నేను…. మంచిది, నేను ఫలానా…. ఫలానా".
"నేను ప్రెస్బిటేరియన్ కు చెందిన వాడను"
"నేను ఇది…". దానికి ఏ విధమైన సంబంధం లేదు. నీవు ఆవు చిహ్నం పెట్టినదానికన్నా అది ఎక్కువ కాదు. రాబందుపైన హియర్ ఫోర్డ్ చిహ్నము నీవు పెట్టుట వంటిది. అదికొంచెం కూడా వ్యత్యాసం లేనటువంటిది. అది లోపలి వ్యక్తిని మార్చలేదు. నీవు నీ పుట్టక ద్వారా ఏమైయున్నావో అదియే నీవు, మరియు అది క్రీస్తులో చూశారా. మనకు మనము కేవలం ఈ చిహ్నములను కలిగియున్నాము, మరియు మొదలగునవి. అది…. మనం మొత్తం పరిస్థితిని వ్యవస్థలో మరియు గందరగోళములో కలిగి ఉన్నాము.
MATT 15:3•
MARK 7:13
24యేసు ప్రభువు రాకడ సమయములో ఆ విధమైన పరిస్థితినే మనం కనుగొంటాము. (నేను ఆలోచించినట్టుగా ఆయన జీవమును తీసుకొస్తూ, ఆయన పుట్టుకకు మరియు ఆయన పరిచర్య తర్వాత నేటి రాత్రి ఆయనను సిలువ వేయుట) పరిస్థితి మొత్తం పాడవుటకు ప్రారంభమైంది. వారు దేవుని వాక్యమును వారి సాంప్రదాయములు ద్వారా పని చేయకుండా చేశారు. కనుక లోకం మొత్తం చిన్నాభిన్నమై విడిపోయెను. ప్రతీ దేశము ఒకరి కొరకు లేక ఒక వ్యవస్థ వారికి తీసుకువచ్చుట కొరకు చూచుచున్నది. అది… వారిని కలిపి ఉంచడానికి వారు చాలా పాడైపోయెను. ఎందుకనగా వారు వెళుతున్నపద్ధతిని వారు పట్టి ఉంచలేరని వారు ఎరుగుదురు. మరియు వారు వారిని కలిపి ఉంచగలిగే మరియొక దాని కొరకు చూసెను.
ఒకవేళ అది మన ప్రపంచం యొక్క దృశ్యము కానట్లయితే, నేను ప్రపంచమును ఎరుగను. అది అదియే. నాడు నేడు ప్రపంచము యొక్క దృశ్యము అదియే. ప్రతీదీ ఒక వ్యవస్థ లేక ఏదో మనల్ని కలిపి ఉంచే దాని కొరకు చూచుచుండెను. అదే నేటి దృశ్యం. అది ఒక వ్యవస్థ కొరకు లేక విచ్ఛిన్నమవుచున్న దాని నుండి పట్టి ఉంచే వేరొక పరిస్థితి కొరకు చూసెను. అప్పుడు ఉన్నట్లే, ఇప్పుడు కూడా ఉన్నది. అది మరలా పునరావృతం ఆయెను.
25మతపరమైన లోకము అప్పుడు వాగ్దాన మెస్సియా కొరకు చూచుచుండెను. యూదులు అందరూ చాలా నమ్మదగిన విశ్వాసులు మీకు చెప్పును…. "అవును మనం నాలుగు వేల సంవత్సరంలుగా మెస్సియా కొరకు చూచుచున్నాము, మరియు ఆయన వచ్చునని మనం నమ్ముచున్నాము. ఖచ్చితంగా దానిని మనం నమ్ముచున్నాము". ఆ దినపు రాజకీయ లోకము మెస్సయా కొరకు చూసెను. మరియు మిగిలిన దేశములు అన్నియు ప్రతీ ఒక్కటి మెస్సియా కొరకు చూసెను. మరియు ఆయన వచ్చినప్పుడు, మరియొక కాలములలో వారు చేసిన విధముగానే వారు ఆయనకును చేసిరి.
నోవహు దినములలో వారిని కలిపి ఉంచే మరియొక దాని కొరకు వారు చూసెను. మరియు వర్తమానికుడిని దేవుడు వారికి పంపినప్పుడు, ఏమి జరిగెను? వారు దాని నుండి తిరిగిపోయెను. మరియు వారు దాని కొరకు అన్నికాలములలోనూ చూసిరి. ఆ విధంగా అది జరిగినది. వారు కేవలం….. దేవుడు దానిని వారి వద్దకు పంపుతాడు. మరియు అప్పుడు వారు కేవలం…. వారు దాని నుండి తొలగిపోతారు. ఎందుకు అనగా ఆ విధంగా అది వారి అభిరుచిని కలుసుకోలేకపోయెను, చూసారా? దేవుడు పంపాలనుకున్న ఆ మార్గమును వారు కావాలనుకోలేదు. వారు కావాలనుకున్న ఆ మార్గమునే వారు కోరుకొనెను. వారు ఆ మార్గము ఫలానా విధంగా ఉంటుందని ఊహించుకున్నారు. మరియు అది ఆ విధంగా ఒకవేళ రాకపోయినట్లయితే, అప్పుడు అది దేవునిది కాదు. చూశారా? ఎల్లవేళలా అది ఆ విధంగానే జరిగెను.
26నేడు కూడా ఆ విధముగానే ఉన్నది. అది మన వేదాంత జ్ఞానము యొక్క మార్గంలో రాలేదు. కానీ అది శక్తితోను ఆ కాలపు దేవుని యొక్క వాగ్దానమును ప్రదర్శించుటలోను అది వచ్చెను. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు, అప్పటి విధముగానే వారు దానిని తిరస్కరించిరి. అప్పుడు దానిని వారు తిరస్కరించిరి. నేడు దానిని వారు తిరస్కరించెదరు. ఎందుకనగా ప్రజలు ఆ మార్గమును గూర్చిన ఆపేక్షను వారు ఆశించినట్లుగా అది అందుకోలేక పోయినది.
27దేవుడికి ఒక ఆపేక్ష ఉండెను. ఏమి జరగనై ఉన్నదో దేవుడు ఎరిగియుండెను. ఎందుకనగా ఆయన అనంతుడు. కనుక తప్పిదము ఏదీ జరగదు. అది అంతా ఖచ్చితముగా సరిగానే జరుగును. ఎందుకనగా ఆయన అనంతుడు. మరియు ఆయన ఆది నుంచి అంతమును ముందుగానే చెప్పగలడు ఎందుకనగా ఆయన దేవుడు.
సాతాను ఏదైనా ఆయనపై ఉంచగలడని తలంచవద్దు. ఓహ్, లేదు. అది అంతా అతని గుణ లక్షణములు ప్రత్యక్ష పరచబడుటకు ఆలాగుననే జరుగును. గొప్ప అనంతుడైన దేవుడు ప్రతీ దానిని ఎరిగియుండుట మరియు ప్రతీదీ ఎలా జరుగును… కేవలం అది దేవుని గుణ లక్షణములు ప్రత్యక్షమగుటకే. నీవు నీ జీవితమును ఒక వైపు మాత్రమే ప్రదర్శిస్తావు మరియు మన వ్యవస్థలు రావడానికి అదియే కారణం. మరియు వ్యవస్థ యొక్క మార్గము ఏదైనా వారు అంగీకరించును. అది ఎందుకనగా కేవలం దేవుడు వారి కొరకు సృష్టించి దానిని చేయుచున్న అసలైన మార్గం నుండి వారు బయటకు వచ్చెను గనుక. కొన్నిసార్లు ఆయన మార్గమున వచ్చిన పరిస్థితులు మన అభిరుచిని కలుసుకోలేవు. ఆశ్చర్యము నేడు మెస్సయా కొరకు నేడు మనం పెడుతున్న మొర్ర కొరకు, దేవుడు మన మొర్రకు సమాధానం ఇవ్వగలిగినట్లయితే, అక్కడ వారు చేసిన అదే పరిస్థితిని ఇక్కడ మనం కూడా చేస్తున్నామా? అని నేను ఆశ్చర్యం చెందుతాను.
28ఇప్పుడు మనము అందరము ఒకదానికొరకు చూస్తున్నాము. దానిని ఎరుగుదుము. ప్రతీ ఒక్కరూ ఒకదాని కొరకు చూచుచున్నారు. నేను ఈ గుంపు మాటలు విన్నాను. నేను వ్యాపారవేత్తల మాటలు విన్నాను. నేను సేవకుల యొద్దకు వెళ్లాను. నేను వివిధ సంఘ శాఖల యొద్దకు వెళ్లాను. ప్రతీ ఒక్కరూ ఒక దానిని ఆశించుచున్నారు. దేశము రాజకీయ సంగతులను వినుచుండెను. వారు రానున్న ఒక దాని కొరకు చూచుచుండెను. అది ఏమైయున్నది? దానిని నేను క్రైస్తవ వ్యాపారవేత్తల వద్ద విన్నాను. దానిని నేను సభలలో విన్నాను.
"ఓహ్, గొప్ప సమయము రానై యున్నది! ఒక గొప్ప సమయం రానై ఉన్నది!"
మీరు కేవలం జ్ఞాపకం ఉంచుకొనుము. అది వస్తుందని మీరు ఆలోచించిన దానికన్నా విభిన్న మార్గంలో అది వచ్చును, చూశారా. మీరు దాని గూర్చి ఏమి ఆలోచించారో అది ఆ విధంగా ఎప్పటికీ ఉండదు. అది ఎన్నటికీ ఉండదు, చూశారా.
29మరియు నేటి మన రాజకీయ లోకము, మరియు మన మతపరమైన లోకము మెస్సీయ మొదటి రాకడ దినములలో ఉన్నట్లుగానే అలాగునే ఉన్నది. అది కలుషితమైపోయెను. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయెను. మన రాజకీయం అద్వాన్నం అగును. మరియు మన మతము … నేను చూడలేనంత అద్వాన్నముగా ఇప్పుడున్నదానికంటే మారవచ్చు. పరిస్థితి మొత్తం పాడైపోయెను.
మన రాజకీయ లోకము, మనిషి చేసిన వ్యవస్థలు మరియు వైఖరులు, మనం కేవలం…కేవలం మనం ప్రతీదీ కోరుకొని…ప్రతీ దానిని మనం తేలికగా తీసుకొని, మరియు విరమిస్తూ మరియు జీవితమును తేలికగా తీసుకుంటారు. జీవితం తేలికగా ఉండుటకు ఉద్దేశించబడలేదు. జీవితం ఒక పోరాటము. జీవము పొందిన ప్రతీదీ పోరాటమే. చెట్లను చూడండి, అవి ఎలా పోరాడునో. జీవము ఉన్న ప్రతీ దానిని చూడండి… అది ఒక పోరాటము. మరియు ఒక విధమైన వ్యవస్థను తేలికగా తీసుకోవాలని మనం ప్రయత్నించినప్పుడు, మనం తప్పిదము చేయుచున్నాము. మరియు ఏదో తప్పిదము జరుగుచున్నదని మనకు తెలుసు.
30నేడు మన టెలివిజన్ మరియు కార్యక్రమములను, మరియు మన వార్తాపత్రికలను మరియు జరుగుచున్న అన్ని పరిస్థితులను గురించి నేను విన్నాను. మరియు ప్రతీ ఒక్కరూ హాస్యోక్తులు చెబుతూ, అమెరికాను నవ్వే గుంపుగా చేయడానికి ప్రయత్నిస్తూ, మరియు ఒక విధమైన హాస్యము… ఎర్నీ ఫోర్డ్ మరియు కొంతమంది టెలివిజన్ తారల వలే ఒక రకమైన హాస్యోక్తులు చెబుతూ…వారిని అలా చేయుటకు… మరియు మన సినిమాలు ఎంతగా పాడయ్యాయి అంటే వాటిని ఇక మరింతగా పాడు చేయాలేనంతగా. అంతా అదియే.
అది నన్ను ఒక చిన్న బాబు ఎలా ఈల వేస్తూ స్మశాన వాటిక గుండా వెళుతూ అతను భయపడుట లేదు అని ఆలోచింప చేసుకొనుటకు తనకు తాను ప్రయత్నిస్తూ ఉంటాడు అన్న తలంపులో ఉంచుతుంది. కానీ అతను ఈల వేయుటకు కారణం అదియే, చూశారా. అతడు భయపడుచుండెను. మరియు విషయం అంతా అదియే. వారు ప్రయత్నిస్తూ లోకం నేడు నవ్వుటకు ప్రయత్నిస్తున్నది. అమెరికా నవ్వుతూ ఉంది కానీ దాని సంఖ్య తేలిపోయిందని దానికి తెలుసు. ఆమె తూనికలో తూచబడి మరియు తక్కువగా కనబడుతుంది.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకవేళ ఈ దేశమును ముక్కలుగా చీల్చి వేయనట్లయితే, ఆయన సొదొమ మరియు గొమొర్రాకు కట్టుబడి ఆమెను పైకి లేపి మరియు ఆమెను దహించినందుకు ఆయన క్షమాపణ చెప్పును. అదిసరియే. మనం దుర్బరులము. ఆమె పడిపోయెను. మరియు దానిని రక్షించుటకు ఏ మార్గము లేదు. ఆమె తన కృపా దినమునకు బయట ఉంది. ఆమె పాపము చేసెను.
31మనము ఉజ్జీవము కొరకు మాట్లాడాలి. మనం ఉజ్జీవపు బూడిదపై జీవించుచున్నాము. ఒకప్పుడు అది గతము. మరియు ఇక్కడ మనం ఒక వ్యవస్థను ఒక దానిపైన నిర్మించాలని ప్రయత్నించుచున్నాము. ఓహ్, మై! అది పాడైపోయెను. మనం తిరిగి మరల తప్పక మొదలు పెట్టాలి…
మన మతపరమైన కార్యక్రమాలు దేవుని నాశికా రంధ్రములకు దుర్వాసన కలిగిస్తున్నది. ఇశ్రాయేలు దినములలో చేసినప్పటి వలె, మన మెథడిస్ట్ కార్యక్రమము, మన బాప్టిస్ట్ కార్యక్రమం, మన పెంతెకొస్తు కార్యక్రమములు.
కొంత కాలం క్రితం, ఒకరు నాతో అనెను, "నీవు ఆ పెంతెకొస్తు ప్రజలను చాలా ఖండిస్తావు. నీవు ఎందుకు వారితో ఉన్నావు"? నేను వారిని ప్రేమిస్తున్నాను. అదియే కారణం. ప్రేమ సరి చేయును. ఒకవేళ అలా అది చేయనట్లయితే….
32ఇక్కడ వీధిలో చిన్నవాడు నిలుచుని మరియు బయట కార్లు వెళుతూ ఉండగా, అతడు వీధి మధ్యలో మట్టితో బొమ్మలు చేస్తుంటే ఏమగును?" చిన్నవాడా, నీ చిన్న హృదయమును దేవుడు దీవించును గాక. హనీ నువ్వు బయట అక్కడ కూర్చోకూడదు. నీవు సిద్ధపడినట్లయితే, లోపలికి రా" అని నీవు అంటావా. అది ప్రేమ కాదు. నీవు నీ బిడ్డను ప్రేమించడం లేదు. నీవు అతడిని నిజముగా ప్రేమిస్తున్నట్లయితే, అక్కడి నుండి తీసుకువెళ్లి మరియు ఆ వీధి నుంచి అతడిని లాగి వేసి మరియు కర్ర తీసుకొని మరియు అతడు మరల అక్కడికి వెళ్లకుండా అతనికి బోధిస్తావు.
నేడు మన పరిచర్య యొక్క పరిస్థితి ఆ విధముగానే ఉన్నది. వారు… అది ఒక భోజన టికెట్. అది సంఘ శాఖకు చెందిన వ్యవహారము. మరియు వారు సువార్తను ప్రకటించవలసినరీతిగా ప్రకటించుటకు భయపడుతున్నారు. వారు అంతవరకు….నీవు దానిని సత్యము వద్దకు తీసుకొని రావాలి. ఏదో తప్పిదము జరిగెను. మరియు అది మనకు తెలుసు. అది కలుషితమాయెను.
33మన పెంతెకొస్తు దినములు దుర్గంధముగా మారెనని నేను అనుకుంటున్నాను. మనం సంగీతం విని, మరియు పైకి క్రిందకు సంఘం మధ్యలో దుముకుతూ, మరియు నాట్యం చేస్తూ మరియు అటు ఇటు పరిగెడుతాము. మరియు స్త్రీలు కత్తిరించిన జుట్టుతో మరియు వారి ముఖముల మీద లిప్స్టిక్ మరియు ఆ విధమైన సంగతులతో మరియు ఇక్కడ చుట్టూ పరిగెడుతూ బిగుతు దుస్తులతో శరీరం బయటకు వచ్చే విధంగా ఆత్మలో నాట్యం చేస్తున్నారు (దానిని అలా పిలుస్తున్నారు). మరియు ఆ విధమైన వ్యవస్థలో దేవుడు మనల్ని కలవాలని మనం ఆశిస్తున్నామా? ఎన్నడూ దానిని ఆయన చేయడు.
మీకు తెలుసా, దేవుడు మీ యొక్క నిబంధనలకు రాడు, మీరే ఆయన నిబంధనల యొద్దకు వెళ్లాలి. లేని యెడల నీవెన్నటికీ రాలేవు.
HEB 12:28
34ప్రజలు వచ్చి మరియు పరిశుద్ధాత్మను పొందుకొని మరియు ఆ విధమైన పరిస్థితులను గూర్చి మనం మాట్లాడుకుంటాము. మరియు నేను ఖచ్చితంగా దానిని అభినందిస్తాను. నేను దానిని అభినందిస్తాను. కానీ ఇక్కడ చూడండి మనం ఏమి చేసామంటే స్నేహితులారా, మనం మన సంఘ శాఖలను ఒక ఆధారముపై నిర్మించాము.
ఉదాహరణకు మనం భాషలలో మాట్లాడుటను తీసుకుందాము: భాషలలో మాట్లాడుటను నేను విశ్వసిస్తాను. నిశ్చయముగా; కానీ భాషలలో మాట్లాడే ప్రతీదీ పరిశుద్ధాత్మను పొందుకోదు. నేను సువార్తికుడను. మంత్రగత్తెలు భాషలలో మాట్లాడి మరియు అనువదించి మరియు సరైన అనువాదమును దానికి ఇచ్చుటను నేను చూసాను. మరియు మనిషి పుర్రె నుండి రక్తం త్రాగి, మరియు దయ్యమును పిలుచును. అది నిజము . నీవు దేనికైతే సంబంధించిన వాడవో, ఆ దేవుని వాక్యం యొద్దకు తిరిగి రమ్ము. ఈ కార్యముల నుండి దూరం కమ్ము.
నీవు క్రీస్తులో ఉండి మరియు ఈ విధానములను మరియు కార్యములను ఎలా పట్టుకుని ఉంటావు? చూశారా! ఎక్కడికి మనం వచ్చి ఉన్నాము? పెంతెకొస్తు సంఘం 50 సంవత్సరముల క్రితం ప్రారంభమై మరియు పరిశుద్ధాత్మ క్రిందకి రావడం ప్రారంభించెను. మరియు ప్రజలు భాషలలో మాట్లాడుట అను వరములను పొందుకొనెను. అప్పుడు నీవు దీనిని మరియు దానిని ప్రతి దానిని దానిలోనికి చొప్పించుట ప్రారంభించి సంఘ శాఖగా మార్చెను. మరియు నేడు నీవు ఎక్కడ ఉన్నావు చూడు. పరిస్థితి మొత్తం కుళ్లిపోయెను. నిజము. వ్యవస్థ మొత్తం పాడైపోయెను. మరియు ఆమె మిగిలిన ప్రపంచముతో పాటుగా పడిపోయెను. ప్రతీదీ దానిని చేయాలి కానీ మనం కదల్చబడని రాజ్యమును పొందుకున్నాము.
35ఇప్పుడు, మన రాజకీయం లోకము వెంబడి వెళ్లెనని జ్ఞాపకం ఉంచుకొనుము. మన సంఘములు లోకము వెనుక వెళ్లెను. అన్నీ కలుషితమయ్యెను. నేడు మన దినములు మనం నివసిస్తున్నటు వంటి….చాలా కాలం క్రితం అప్పుడు… నాకు జ్ఞాపకం వచ్చిన మన పాత బాప్టిస్ట్ సంఘం కెంటకి రాష్ట్రంలో అక్కడ ఉన్నప్పుడు, పాతవైఖరి కలిగిన స్త్రీ మరియు పురుషులు అక్కడ కూర్చుండి ఉన్నవారిని మీరు కలిగి ఉండెను.
గత రాత్రి ప్రసంగీకుడు సహోదరుడు క్రో, తలకు కట్టుకునే టోపీ వంటి వస్త్రమును ధరించుకుని ఉన్న ఆ స్త్రీలను గూర్చి మాట్లాడెను. మరియు దేనిని వారు పిలిచెనో దానితో వారు అక్కడ లేచి మరియు అరచి మరియు తలపిన్నులు వారి జుట్టు నుండి పడిపోవుటను వారు పరిశుద్ధ పరచబడుట అంటారు. వారు అరుస్తూ మరియు ఆ సంఘము మధ్య నుండి పైకి కిందకు నడుస్తూ దేవుడిని స్తుతించెదరు. ఎందుకు సహోదరుడా ఆ ప్రజలు పెంతెకొస్తు దినము తనకు తాను సిగ్గుపడేటట్లు చేయునంతగా తగిన మతమును వారు కలిగియుండిరి. అది నిజము. అది బాప్టిస్టులు, మెథడిస్టులు, మరియు ప్రెస్బిటేరియన్లు. అది నిజము.
36అప్పుడు, మీరు కెంటకీ వారిని విద్య లేని గుంపు అని పిలిచెదరు. మీరు ఒక కెంటకీ పాత వైఖరి కలిగిన తల్లిని లేక అమ్మమ్మను, తన బిడ్డ వారి వెనుక కొండలలో వీధిలో నుండి బయటకు , చిన్న నిక్కర్లను ధరించి మీ వలే వచ్చుటను చూడనిమ్ము. ఉదయమున ఆమెను రానివ్వుము. మరియు ఆమె రాత్రంతయు ఒక చిన్న రిక్కీతో బయటకు వెళ్లి వచ్చినప్పుడు, దుస్తులు సగము పైకి చుట్టుకుపోయి, మరియు ఆమె చేతుల అందము లిప్స్టిక్ అది ఏదైనా ఆమె ముఖం అంతా అంటుకొని ఉండును. ఏదైనా ఒక అవయవముపై వేడి కడ్డీ ఉపయోగించి బొబ్బ వచ్చునట్లుగా ఆమె చేయును. దానివలన ఆరు నెలలు మంచము మీద నుండి ఆమె లేవలేకపోవును. అప్పుడు మిమ్మల్ని మీరు పెంతుకోస్తు అని పిలిపించుకుంటారు. మనం జీవించుచున్న దినమును చూడండి.
మరియు ప్రసంగీకులు బలిపీఠము నుండి ఏదైనా చెప్పుటకు చాలా భయపడును. వారి సంఘ శాఖ నుండి వారిని బహిష్కరిస్తారని వారు భయపడుదురు. దేవుని వాక్యం యొద్దకు తిరిగి వచ్చుట మనకు అవసరము. తిరిగి ఏదో ఒక ఉద్రేకం కాదు. వాక్యం యొద్దకు తిరిగి రావాలనే మాట కాదు కానీ నా అర్థము వ్యక్తిలోని హృదయము మరియు ఆత్మ దేవుని వాక్యము వద్దకు తిరిగి వచ్చుట. ఖచ్చితముగా. మీరు ఏమి చేశారు? లేక దానిని చెప్పు నాకు ఎందుకు వారు భయపడుతున్నారు?. నీవు దాన్ని గూర్చి మాట్లాడాలి, మరియు నీ సంఘ శాఖ నిన్ను దాని నుండి బహిష్కరించును. అది నిజము.
37ఇక్కడ నాకు ఇచ్చిన కాగితంలోని కొంత భాగమును ఇప్పుడే నేను చదివాను. అది టెన్నిస్సీ, మెంఫిస్ నుండి వచ్చెను. అది "టోనీ ఫాన్ టైన్ కధ "గా పిలవబడెను. మీరు గనక బర్ల్ ల్క్స్ వాణిజ్య ప్రకటనను చూసినట్లయితే, పెంతెకొస్తు అనబడే దానిని వార్తాపత్రికలో మీరు చూడవచ్చు. దానిని సమర్పించు వారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, పెంతెకొస్తులోని పెద్ద సంఘ శాఖలలో ఒకటి. దానిని చూడండి. (దీనిని నేను ఇక్కడ వదిలిపెడుతున్నాను). ఒక కత్తిరించిన జుట్టు కలిగిన మరియు యెజెబెలు వలే కనబడు స్త్రీ, మరియు కొంతమంది ఫ్రెంచ్ పురుషులు అక్కడ ఉండెను. దానిని మీరు మారుట అని పిలుస్తారా? ఎందుకు అది ఉద్రేకం. అక్కడ మార్పునకు నడిపించేది ఏదియు లేదు. దేవుని యొక్క ఆత్మ పురుషుడిని లేక స్త్రీని శుభ్రపరచి మరియు వారిని ముందు ఉన్న దానికంటే భిన్నంగా చేయును. అది నిజము. కానీ మనం ఏమి పొందియున్నాము? మనం హాలీవుడ్ పెంతెకొస్తులోనికి కదలడాన్ని కలిగియున్నాము.
అది ఏమిటి? ఎందుకనగా వారి విద్యా కార్యక్రమాలు మరియు పరిస్థితులు,
38మనం ఉజ్జీవం కలిగి ఉండకపోవడానికి కారణం అదియే. ఏదో జరగకపోవడానికి కారణం అదియే. మనం వెళుతున్న దానికి కారణం అదియే. కాగా నా సహోదరుడా, తిరిగి నీవు మరలా వాక్యం యొద్దకు రావాల్సి ఉన్నది. అది నిజము. ఎటువంటి విచారకరమైన పరిస్థితి అనగా, పెంతెకొస్తు కదలికయైన శుభముల కింద ఆ విధమైన దానిని దేవుడు పోషించాడు అని నీవు చెప్పకూడదు. ఖచ్చితంగా కాదు.
కానీ అది ఏమిటి? అది ఒక విధమైన ఆకర్షణను పొందుకొనును. మీరు టెలివిజన్ ను చాలా ఎక్కువగా చూస్తారు. మీరు లోకమును చాలా ఎక్కువగా అనుకరిస్తారు. పరిస్థితి మొత్తము పోయి, మరియు అనైతికం అవుటకు, మరియు విచ్ఛిన్నమవుటకు కారణం అదియే. సత్యము. అది దేవుని ముందు దుర్వాసనగా ఉన్నది. మీరు ఎంతగా భాషలలో మాట్లాడినా, మీరు ఎంత అరచినా, మరియు గదిలో చుట్టూ పరుగెత్తినా, నాకు లెక్కలేదు. మీరు ఎంతగా ఇది చేసినా, లేక మీరు ఎంత పెద్దగా ఎదిగినా, మీలో మీరు ఎన్ని హోదాలు పొందినా నేను లెక్క చేయను. దానితో ఏమీ చేయలేము. దాని నుండి మీరు బయటకు వచ్చి మరియు మీలో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, అది మిమ్మల్నిశుభ్రపరచి మరియు మీలో నుండి నిజమైన సంఘమును తయారు చేయును. విషయము అదియే. అది ఖచ్చితంగా సత్యమై ఉన్నది.
39నేడు మనకు కావలసినది ఏదనగా, ప్రభువు యొక్క ప్రవక్త లోకపు పరిస్థితులతో రాజీ పడకుండా దేవుని వాక్యముతో రంగంలోకి వచ్చుట. రాబోయే జీవితంనకు ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ అదియే. మతపరమైన రబ్బరు తొడుగులతో ఎవరో సువార్తను తీసుకోకూడదు. చాలా విశ్వసించుము మరియు చాలా తీసివేయము. ఓహ్, మన సంఘ శాఖ వైవిధ్యము ఇప్పుడు తొమ్మిది వందలు వివిధ శాఖలలోనికి కలుపు మొక్కల వలె మనల్ని చేసింది. మన సంఘ పెద్దలు ఇద్దరు లేక ముగ్గురు భార్యలను కలిగి ఉండుటకు అనుమతి పొంది, మరియు ఇంకా సంఘ పెద్దలుగా సేవ చేయుచున్నారు.
కొన్నిసార్లు ఒక ప్రసంగీకుడు ఒక సంఘమును మరియు వేరొక సంఘమునకు వెళ్లును. ఎందుకనగా వేరే స్థలము కన్నాఒక స్థలము ఎక్కువ డబ్బు కలిగి ఉండుటయే. ఒక స్థలము యొద్ద పెద్ద గుంపు, మరియు మంచి చర్చి భవనము , మరియు మొదలగునవి. పెంపుడు జంతువులను మరియు తోలుబొమ్మలను కలిగి ఉండుట మరియు… ఓహ్, మై, మనకు దేవుడు పిలిచిన మనుషులు కావాలి…వర్తమానముతో అరణ్యము నుండి కఠినంగా….బాప్తిస్మమిచ్చు యోహాను వలే, మత సంబంధమైన కదలికలు అని పిలువబడుతున్న వాటిలో రాయబడియున్న కొన్నింటిని కదిలించాలి. అది పాపము. అది పరిశుద్ధాత్మను దుఃఖపరచుట.
కొన్నిసార్లు ప్రభువు దర్శనములలో ఇస్తాడు…. మంచిది, నేను ఇప్పుడు దానిలోనికి వెళ్ళను, చూశారా. ఇంకొక రోజున నన్ను అడిగారు….మంచిది, నేను కేవలం ….నేను… నన్నుమన్నించండి
40ఇప్పుడు, చిన్నాభిన్నమై విడిపోవుచున్నది అను వర్తమానమునకు వద్దాము. జరుగుతున్న కార్యములు, సంఘమునకు సంబంధం లేని కార్యాలుగా వాటిని చూసినా గాని , అది ఇంకను వారితో దాని గూర్చి మాట్లాడిననూ, వారు దానిని నమ్ముటను కోరుకోవడం లేదు.
నోవహు మాట్లాడినప్పుడు, వారు దానిని విశ్వసించలేదు. మోషే మాట్లాడినప్పుడు, వారు దానిని విశ్వసించలేదు. ప్రవక్తలు మాట్లాడినప్పుడు,దానిని వారు విశ్వసించలేదు. కనుక వారు వారి సొంత వ్యవస్థలను నిర్మించుకున్నారు. అవును అయ్యా. మన మాతృత్వము యొక్క అందమైన సద్గుణము (ఓహ్, మై,)….మన పెంతెకొస్తు స్త్రీ హాలీవుడ్ దేవత మందిరం వద్ద నమస్కరించెను. మరియు మనం దేనినైతే "సద్గుణము" అని పిలిచే వారమో, దానిని మనం "ఫ్యాషన్ " అని పిలుస్తున్నాము. అది అవమానము.
41కొద్దికాలం క్రితం ఎవరో నాతో అనెను, "సహోదరుడా బ్రాన్హామ్ ఎందుకు నీవు ఆ స్త్రీలను వారి జుట్టు కత్తిరించుకోనివ్వవు, మరియు పొట్టి దుస్తులను ధరించుకోనివ్వవు, మరియు అటువంటివి? ఎందుకు నీవు చేయనియ్యవు?" అనెను. "ప్రజలు నిన్ను ప్రభువు నుండి వచ్చిన దీర్ఘదర్శిగా పరిగణించుచున్నారు ఎందుకు నీవు వారికి దర్శనములు ఏ విధంగా చూడాలో చెప్పవు?" అనెను.
నేను అన్నాను, కనీసం వారి ఏ బి సి'లు వారికి తెలియనప్పుడు, నేను వారికి బీజగణితము ఎలా బోధిస్తాను? ఎంత ఎక్కువగా నీవు ప్రసంగించినా, మరింత అధ్వాన్నంగా వారు అయిపోతారు. కనుక మీరు చూడండి వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయెను విచ్చిన్న మాయెను. అది అంతే.
MATT 15:6•
MARK 7:13•
PHIL 4:19
42దేవుడు లోకమును సంస్థ లేక వ్యవస్థ ద్వారా రక్షింపడు. ఆయన దానిని పరిశుద్ధాత్మ ద్వారా రక్షించును. మరియు పరిశుద్ధాత్మ వాక్యమును ప్రత్యక్ష పరచును. అది దేవుని వాగ్దానములను ప్రత్యక్షపరిచేది. అవును అయ్యా! మనము మన సాంప్రదాయాలను తీసుకొని మరియు వాటితో దేవుని వాక్యమును ప్రభావం లేని దానివలే చేస్తున్నాము. యేసు వచ్చిన దినములలో వారు చేసిన విధముగానే. ఓహ్, అవును అయ్యా!
దేవుడు మన అవసరతలను తీరుస్తానని వాగ్దానం చేసెను. కానీ మన కోరికలను కాదు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాము. కానీ దానిని మన సొంత మార్గంలో మనం కోరుకుంటాం. నీవు అనవచ్చు "మంచిది, నాకు అది కావాలి. నేను….మంచిది, ప్రభువా మాకు ఇది పంపుము, మరియు మాకు అది పంపుము". అది ఖచ్చితంగా నిజం. ఆయన మన అవసరతను ఎరుగును.
43నీవు పదునైన బ్లేడుతో గడ్డం తీసుకొనుట నీ చిన్న బాబు చూసి, మరియు "నాన్న నాకు ఆ బ్లేడు కావాలి" అని అతను అంటే ఏమగును. ఆ బ్లేడు కన్నా మంచిది ఆ బిడ్డకు ఇవ్వాలని నీకు తెలుసు. మంచిది, అతడు ఇలా అన్నట్లయితే ఏమవును "నాన్నా నీవు దానిని చేయుట నేను చూసాను". మంచిది, అది వైవిధ్యమైనది. నువ్వు పెద్దవాడవు. ఆ బ్లేడును నువ్వు ఎలా ఉపయోగించాలో నీకు తెలుసు. నువ్వు పెద్దవాడవు బ్లేడు ఎలా ఉపయోగించాలి అన్న అవగాహన శక్తిని నీవు కలిగి ఉన్నావు.
మరియు ఇప్పుడు అనేకసార్లు మనం పెంతెకొస్తు ప్రజలను చూస్తూ ఉంటాం. కొందరు భాషలలో మాట్లాడుటను లేక మరొకటి స్వస్థత ఆరాధనలు చేయుట చూస్తాము. మరియు అప్పుడు శరీర సంబంధమైన అనుకరణల గుంపు బయలు వెళ్లుటతో వ్యవస్థ మొత్తం పాడగును. ఇతరులు అది చేయుటను వారు చూస్తారు, కానీ దేవుడు ఆ విధమైన దానిని చేయుటకు నిన్ను పిలువడు. మరియు అది ఏమి చేయును?అది శరీర సంబంధమైన అనుకరణలను తీసుకువచ్చును. అది దేవుడు పంపిన కారణం పైన నిందలు తెచ్చును. అది ఏమిచేయును? వ్యవస్థలు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లో ఒక మనిషి ఏదైనా చేయుటకు బయటకు వచ్చినట్లయితే, మరియు దేవుడు అతనితో ఉండి మరియు రుజువు పరిస్తే మరియు అలాంటి విధమైన దానిని మనం చూస్తే, అప్పుడు ఇతర గుంపులు కూడా అటువంటి ఒక దానిని కలిగి యుంటున్నారు.
44చిన్న దావీదు వ్యవస్థ బయటకువచ్చినప్పుడు, కొద్ది కాలం క్రితం చిన్నరూపాన్ని చూడండి. చూసారా…మరియు ప్రతీ సంఘం చిన్న దావీదును కలిగి ఉండాలి. చిన్న అమ్మాయి ప్రసంగీకులు, మరియు అబ్బాయి ప్రసంగికులు, మరియు… అది ఏమిటి? పోల్చుకొనుట, పోలిక, అనుకరించుటకు ప్రయత్నించుట. మనం నేడు ఉన్న గందరగోళములోకి మనల్ని తీసుకువచ్చింది అదియే. అది ఖచ్చితం.
అదే వ్యవస్థనుండి దేవుడు నిన్ను బయటకు తీసుకు వచ్చినప్పుడు, అసెంబ్లీస్ ఆఫ్ఫ్ గాడ్ నిన్ను తిరిగి సంస్థలోనికి తీసుకువెళ్తే ఏమవును? నీవు మెథడిస్ట్, మరియు బాప్టిస్ట్ తో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ కొత్త సమస్యతో ఏకత్వము నిన్నుఏమి చేయును? అదే పరిస్థితి నుండి నిన్ను ఆయన బయటకు తీసుకు వచ్చాక, సంస్థలోనికి వెళ్లేటట్లు చేసినది ఏమిటి? అది ఒకే విధమైన పరిస్థితి. నీవు దానిని మరల కేవలం చేస్తూ, మరియు చేస్తూ ఉంటావు. అది దేవునిది కాదని నీవు చూడలేవా? పరిస్థితి మొత్తం కుళ్ళిపోయి మరియు తప్పిదమాయెను. దేవుడు నిన్ను నీ సంస్థాగత ముద్రతో పిలువడు. నీ పుట్టక నుండే ఆయన నిన్ను పిలుచును. ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలిచేది అలాగే.
45దేవుడు మన అవసరతలను ఎరుగును. ఆయన దానిని కలిగి ఉన్న మార్గంలోనే మనం దానిని అంగీకరించవలెను. మన ఆచారములను బట్టి కాదు. మనం ఆ విధమైన మార్గమున దానిని స్వీకరించలేము. ఎందుకనగా దేవుడు దానిని స్వీకరించడు. దేవుడు దానితో ఏమీ చేయలేడు. మనం ఇతరులను చూసి…నీవు అనవచ్చు, కొంతమందిని చూడు అని…"నేను బ్రాన్హాం సహోదరుడా ఒక వ్యక్తి దీనిని చేయుట మరియు దానిని చేయుట నేను చూశాను. ప్రభువా దేవునికి మహిమ". మై! ఆయన చేసినట్లయితే, ఆయన దానిని చేస్తాడు. ఆయన దాని కొరకు నిన్ను పిలిచినట్లయితే, దానిని గూర్చి నీవు ఎవరికీ చెప్పనవసరం లేదు. దానంతట అదే దానిని చూపించును. అది ఖచ్చితంగా సరియే. కానీ మనం జొనెసెస్ వలే ఉండాలని అనుకుంటాం. మనల్ని మనం వ్యవస్థలోనికి రప్పించుకుంటాము ఇప్పుడు మనం ఉన్నట్లుగా.
46ఇప్పుడు. ఇప్పుడు, మన సంఘశాఖ రాజకీయాలలో మనల్ని మనం కనుగొంటున్నాము. మరియు మనం రాజకీయములను అంగీకరించాము. మరియు రాజకీయము మన పరిచారకులను నడిపించును-మతపరమైన రాజకీయము మన సేవకులను నడిపించును-మన సేవకులను పరిశుద్దాత్మ నడిపించుటకు బదులుగా. అది సరియే. ఒక మనిషి సత్యమును చూసి దానిని అతడు నమ్మితే, అతడు దాని దగ్గరకు వెళ్లడు. అతని సంఘము వెంటనే అతడిని బయటకు లాగును. చూశారా. కనుక మీరు చూడండి, మీరు దేవుని నడిపింపుకు బదులుగా మానవ నడిపింపును అనుమతిస్తున్నారు. ఎందుకనగా మీ తెగల యొక్క సిద్ధాంతములు మరియు మొదలైనవి ఆ వ్యక్తిని దాని నుండి వేరు చేసెను.
ఏ విధంగా మెథడిస్ట్ బయటకు వచ్చి మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ప్రసంగించును? ఇక్కడ మెథడిస్ట్ ప్రజలైన మీరు, మెథడిస్ట్ సేవకులైన మీరు దానిని మీరు ఏ విధంగా చేయగలరు?పెస్పెటేరియన్లయిన మీరు దానిని చేయుచు మరియు మీ సంఘంలో ఏ విధంగా నిలబడతారు? వారు మిమ్మల్ని వెలివేయును. మీకు అది తెలుసు. ఖచ్చితంగా వారు చేయును. మరియు పెంతుకోస్తులైన మీరు ఎంత చెడ్డగా ఉన్నారు. ఖచ్చితంగా అదే. అది వ్యవస్థగా ఉన్నంతవరకూ వ్యవస్థయే. అది వ్యవస్థయే. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయెను. మరియు ఆ స్థితి నుండి బయటకు రండి. తిరిగి మరల అది వచ్చే ముందు మనం ఖచ్చితంగా చేయవలసినది అదియే.
47మీరు దీనిని నమ్మకపోవచ్చు, కానీ ఇది టేపు చేయబడెను. నేటి నుండి కొన్ని సంవత్సరాల తర్వాత దీనిని వినండి. ఒకవేళ అటువంటిది ఉండినట్లయితే మరియు అది సత్యమా కాదా అని మీరు తెలుసుకుంటారు. ఒక దినమున సాయంకాలపు వెలుగులు నిలిచిపోయినప్పుడు (అది అప్పటికే చాలా ఆలస్యం) మీరు అంటారు, "మంచిది ఆ వ్యక్తి చెప్పినది నిజం ". కానీ అప్పటికే అది చాలా ఆలస్యమగును.
MATT 23:29
48ఆయన భూమి పైకి వచ్చినప్పుడు, యేసు చెప్పిన విధంగా ఖచ్చితంగా అలాగే ఉండును. ఆయన చెప్పెను, వారి లోకపు వ్యవస్థ అనగా వారి మత వ్యవస్థ విచ్చిన్నమైన ప్రతిసారీ, వారి కొరకు ఆ కాలమునకు ప్రవక్తలను దేవుడు పంపును . "ఆయనతో నీవు ఏమి చేయుదువు? దేవుడు ప్రవక్తను పంపెను. మరియు మీరు అతడిని సమాధిలో ఉంచిరి. (అది ఖచ్చితంగా అలాగే) మరియు వేరొక తరంలో మీరు మేల్కొని మరియు అతడు ఒక ప్రవక్తయని గుర్తించెదరు. మరియు అప్పుడు మీరు ఏమి చేయుదురు? సమాధిని శృంగారించుదురు" అని అనెను. మీరు ఏమి చేయుదురు? అతని జీవితమును ఒక ఆచారముగా మార్చెదరు. అది ఖచ్చితముగా ఇశ్రాయేలు చేసిన విధముగానే. మోషే ప్రవక్తను తీసుకుని మరియు అతని జీవితమును ఒక ఆచారముగా మార్చితిరి.
మరియు మనం చేసేది అదే విధానము. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఇతర మనుష్యులు. మనం ఎప్పుడూ వెనుకకు చూస్తున్నాము. చూశారా! ఆ పరిస్థితులను చూడండి మరియు వారి జీవితమును మీరు ఆచారముగా మార్చెదరు. వారి సమాధులను శృంగారించుదురు. మరియు వారి వర్తమానము వేరొక దినము కొరకు ఉండెను. నీవు లేచే ఈ సమయానికి, ఎందుకు, ఆ దినము ముగించబడింది, మనము మరొక దినములో ఉన్నాము. ఆది నుండి వ్యవస్థ మొత్తం ఆ విధముగానే పని చేసెను. ఖచ్చితముగా మనిషి తయారు చేసిన వ్యవస్థలు.
2TIM 3:5
49యేసు, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు, సంఘము మరియు లోకము నేడు ఉన్నట్లుగా అదే విధమైన స్థితిని ఆయన వచ్చి మరియు కనుగొనెను. ఆయన మరల వచ్చునని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అదే విధంగా నేను దానిని నమ్ముచున్నాను. దానిని రక్షించునది ఒకే ఒక విషయము మరియు అది ప్రభువు యొక్క రాకడ. ఏదీ దానిని చేయలేదు. నేను లెక్క చేయను. మెథడిస్టులమైన మనం దానిని చేయలేము. లేక పెంతెకొస్తులమైన మనం దానిని చేయలేము. యేసుక్రీస్తును పంపుటలోనే దేవుడు దానిని చేయును. ఆయన వస్తాడని నేను నమ్ముచున్నాను. నేను…లేఖనముల ప్రకారం ఆయన వచ్చును. అవును అయ్యా.
EXOD 7:11•
EXOD 8:7,18•
ISA 40:3•
MATT 24:35•
2TIM 3:3-5,8•
1PET 1:25
50మొత్తం కార్యము మతపరమైన సంఘ శాఖగా అయిపోయెను, పరిశుద్ధాత్మకు బదులుగా సంఘశాఖ చేత నడిపించబడెను. మన విద్యా సంస్థలు, మరియు మన సంఘ శాఖలు మనల్ని చాలా విభిన్న మార్గములలోనికి నడిపించెను. మరియు పైకి భక్తి పరులైయుండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా చేసెను. ఖచ్చితముగా లేఖనము ఏమి చెప్పెనో, దానిని మనం చేసాము.
రెండో తిమోతి 3లో ప్రవక్త చెప్పెను, అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చును. ఎలాగనగా మనుషులు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభమును ఎక్కువగా ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు.
"వారు కమ్యూనిస్టులు" అని మీరు అంటారు.
వారు క్రైస్తవులని పిలవబడినవారు! పరిశుద్ధ గ్రంథం చెప్పెను "పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, వారిని చెర పట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. యన్నే, యంబ్రే అనువారు కూడా ఖచ్చితంగా అలాగే చేశారు. వారివలే… వారు వేషధారులు.
ఆ కార్యము మిగిలిన వారిని ప్రభావితం చేసినట్లుగానే పెంతెకొస్తు వారిని కూడా తాకింది: అనుకరించేవారు. మోషే కర్రను క్రిందకు విసిరినప్పుడు, యన్నే మరియు యంబ్రేలు కూడా కర్రను విసిరి వేసారు. మోషే కార్యములను పలికినప్పుడు, వారు కూడా పలికెను . శరీర సంబంధమైన వేషధారణ! మరియు దాని నుండి ఏ విధంగా నీవు బయటపడగలవు? అది మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ కాదు. అది పెంతెకొస్తు, ఎందుకనగా వారు కనీసం అక్కడి అందరి పద్ధతిని ఆపలేకపోయారు. మిగతా వారి వలె చూసారా!
అది జరుగునని ప్రవక్త చెప్పెను. జరుగుచున్న దాని నుండి ఏ విధంగా మీరు తప్పించుకుంటారు.? పరిశుద్ధ గ్రంధం ఆలాగు చెప్పెను, దేవుని వాక్యము ఎన్నటికీ తప్పిపోదు. అది దేవుని వాక్యం కనుక దానిని మనం పొందుకుంటాము. మన ముందే అది నెరవేరుట మనం చూస్తాము. అప్పటికే ఆలస్యం కాకమునుపే, ప్రజలారా మేల్కొనండి.
2COR 5:17•
GAL 6:15
51నీవు ఏ వ్యవస్థ పైన, ఏ అనుభూతి పైన, ఏ ఇజం పైన ఆనుకోవద్దు. నీవు దేవునితో ఉండు, మరియు కేవలం దేవునితో మాత్రమే. నీ జీవితం మారేంతవరకు మరియు నీవు క్రీస్తులో క్రొత్త సృష్టి అయ్యేంత వరకూ అక్కడే ఉండుము. మిగిలిన దాని గూర్చి దేవుడు శ్రద్ధ వహించును. నీవు ఏదైనా చేయాలని ఆయన కోరుకున్నట్లయితే, ఆయనతో నీవు మాట్లాడగలిగితే, అప్పుడు ఆయన నీకు చెప్పును.
వేషధారి వలె ప్రయత్నించి మరియు ఇతరుల వలే చేయవద్దు. అతడు వెలుగును చూసినట్లయితే, మరియు ఇంకొకరు అంతటినీ కుదిపితే, మరియు మరొకరు ఇంకొకటి చేసినా, దానిపై నీవు నీ దృష్టి నిలుపవద్దు.
52ఇరవై ఐదు మంది ప్రజలు గత రాత్రి పరిశుద్ధాత్మను పొందుకొనుటకు వారి చేతులను చూపించెను. ఎంతమంది నేను ఆశ్చర్యపడ్డాను….అక్కడ ఆకలి ఉండినట్లయితే, ఆ హృదయము తట్టబడును. మీలోప్రతీ ఒక్కరూ అక్కడ మీరు కూర్చున్న చోటే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ ఆకలి ఉన్నప్పుడు, మీరు దానిని పొందే దానికన్నా దేవుడే దానిని మీకు ఇచ్చుటకు ఎక్కువ ఇష్టపడును. దేవుని ఆశీర్వాదములను నీవు ఖాళీ చేయలేవు. దేవుని మంచితనమును నీవు ఖాళీ చేయలేవు. నీవు దానిని చేయలేవు.
ఒక చిన్న ఒకటిన్నర అంగుళం పొడవు గల చేప సముద్రం మధ్యన ఉండి, "నేను ఈ నీటిని పొదుపుగా త్రాగుట మంచిది. ఎందుకనగా ఒక రోజున ఇది తరిగిపోతుంది" అని చెప్పుటను మీరు ఊహిస్తారా? ఐగుప్తు యొక్క గొప్ప నిల్వల క్రింద ఒక ఎలుక ఉండి, "రోజుకు ఒక్క ధాన్యపు గింజనే నేను తినుటకు మరియు నన్నునేను అనుమతించుకుంటాను. ఎందుకనగా తర్వాత పంటకు ముందు వరకు నేను పోషింపబడాలి కాబట్టి" అని చెప్పుటను మీరు ఊహిస్తారా? మంచిది, అది హాస్యాస్పదంగా ఉండును. మరియు యేసుప్రభువు యొక్క కృపను మరియు ఆయన శక్తిని మరియు ఆయన అభిలాషను మీరు ఖాళీ చేయుట అన్నది ఆలోచించుట, అది ఎక్కువ హాస్యాస్పదము. ఆయన వాక్యంలో దానిని వ్రాసారు. ఆయన దానిని నీకు వాగ్దానం చేసెను. మరియు మన యెదుటనే ఆ కార్యమును చూడటానికి ఈ ఉదయమున ఇక్కడ మనం ఉన్నాము.
53మరియు దేవుని యొక్క ఆశీర్వాదములు ఆయన ప్రజల వద్దకు తీసుకుని రావడానికి ఆయన ప్రయత్నించుట నీవు చూసినప్పుడు మరియు వారంతా అట్టి విధముగా వక్రీకరించబడుట చూచినప్పుడు…ఆయన ఆ విధమైన గందరగోళములోకి తన వాక్యం తీసుకొని రాలేడు. దానిని ఆయన చేయడు. అది అంతే. పాత్రలు శుభ్రపరచబడాలి.
పెంతెకొస్తు ప్రజల వద్దకు మనం వెళ్లినప్పుడు, జుత్తు కత్తిరించుకున్న స్త్రీలను చూస్తాము. స్త్రీ తన కత్తిరింపు జుట్టుతో కనీసం ప్రార్థన కూడా చేయకూడదని మీకు తెలుసా? ఏమి జరిగెను? మీ తల్లి ఎన్నడూ దానిని చేయకూడదు. ఏమి జరిగెను? నీవు బలిపీఠం వెనుక ఒక రిక్కీని పొందుకున్నావు. బైబిలు స్కూలు ద్వారా విద్యనభ్యసించడం ద్వారా దేవుని వద్దకు మరలా తిరిగి రాలేనంత దూరముగా వెళ్లిపోయిన ఒక వ్యక్తిని నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు . నీవు దేవుని సామాన్యతకు అడ్డంకి అయ్యావు. అది నిజము. నీవు ఏమి చేయవలెను? నీవు డాక్టర్ డిగ్రీ పొందుకుంటే దాని అర్థం దేవుని నుండి నీవు ఎంత దూరమయ్యావని చూపిస్తుంది. నువ్వు పీహెచ్డీ., ఎల్ఎల్డి., లేక బి.ఎ. పొందుకుంటే అది నీవు దేవుని నుండి ఎంత దూరమయ్యావని చూపిస్తుంది.
విద్యా వ్యవస్థ దేవుని నుండి నిన్ను దూరం చేయును.
54విద్య అనేది దయ్యం యొక్క ఆలోచన. ఆది నుండీ లోకపు జ్ఞానము అనగా దయ్యపు ఆలోచన. అవ్వ విషయములో అంతే మరియు అది కాలముగుండా వస్తూ ఉన్నది. దేవుని వాక్యమును నమ్ముటలో సామాన్య విశ్వాసమునకు ప్రత్యామ్నాయమును చేయుటకు అది ప్రయత్నించినది. అవ్వ కనుక అధిక జ్ఞానమును పొందుకొనుటకు బదులుగా, కేవలం దేవుని వాక్యమును నమ్మినట్లయితే…అక్కడ సెమినరీ అనుభవము ఆమె తీసుకుని, మరియు ఆమె హద్దులను మీరి, మరియు ఆమె దేవుని నుండి దూరమయ్యెను.
మరియు మనస్తత్వ జ్ఞాన సెమినరీలు మరియు ఇతర కార్యములు చేసినది అదియే. కార్యము యొక్క ఆచారమును తీసుకుని మరియు దాని వెనుక కూర్చొనెను.
55దేవుడు సామాన్యుడు చాలా సామాన్యుడు ఆయన ప్రజల పై నుండి వెళ్ళిపోయెను.
మనం జీవిస్తున్నదినము ఏమైయున్నది? మనకు అవసరత దేవుని యొద్దకు తిరుగుట. అప్పుడు ఉహ్…!అంగీకరిస్తారా? "మనం ఆలోచించి…" అవును. అప్పుడు ఆ ఆచారములో దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఆయన తప్పక దానిని చేయడు. ఆయన ఎన్నటికీ దానిని చేయడు. దేవుడు ఎన్నడూ చేయడు. అది అలా అయినట్లయితే, నన్ను గద్దించుటకు ఒక చరిత్రకారున్ని నేను కోరుకుంటాను. ఎప్పుడైనా ఒక మనుష్యుడిని దేవుని నుండి వర్తమానముతో భూమి పైకి పంపును. నాకు చెప్పండి మరియు అప్పుడు అతడు దానిని చేసిన వెంటనే అతడు గుంపు మనుషులతో కట్టకట్టి మరియు సంస్థగా చేయును. మరియు ఆ సంస్థ విత్తనముగా వెళ్లును. అది ఇక ఎంత మాత్రమూ పైకి లేవదు. దేవుడు దానిని అలమరలో ఉంచును. మరియు అది (గత రాత్రి చిన్న సేవకుడుచెప్పినట్లుగా) సంఖ్యను చూసుకునేదానిగా అయిపోయింది, ఆత్మను కాదు!
ప్రెస్బిటేరియన్ లేచెనా?, నైసియా సమాఖ్యనుండి కేథలిక్ లేచునా? మొదటి పెంతెకొస్తు సంఘం….పెంతెకొస్తు లేక కాథలిక్కులైన మీకు, సంఘం ఎన్నడూ రోములో ప్రారంభం కాలేదని నా ఉద్దేశం. సంఘం రోమ్ లో ఎక్కడ ప్రారంభం ఆయెను? ఎవరో ఒకరు నాకు చూపాలని నేను కోరుతున్నాను. రోములో సంస్థ ప్రారంభమైంది. అది సంఘమును చంపెను. కానీ సంఘము యెరూషలేములో ప్రారంభమైనది. నైసియాలోకాదు ఖచ్చితంగా.
56ఎక్కడ మనం ప్రారంభమయ్యాం? చూశారా, నీవు పొందుకొను… దేవుడు ఒక మనిషిని వర్తమానముతో పంపును. మరియు అతడు వివిధ సంగతులతో ఉన్న ప్రజాదరణతో అతడు కట్టబడును. మరియు అతని తలపైకి లేచును. మరియు సంస్థను అతడు తయారు చేయును. మరియు దేవుడు క్యాథలిక్ సంఘమును చేసిన విధముగా ఆయన దానిని వెంటనే అలమరలో పెట్టును. మరియు ఈ సర్వ కార్యములకు తల్లి వద్ద మనందరం కూర్చుంటాము. మరియు మన వ్యవస్థ విచ్చిన్నమాయెను.
ఎలాంటి కాలములో మనం జీవించుచున్నాము! ఆయన వర్తమానం తిరస్కరించి, ఆయన వాగ్దానములను తిరస్కరించి, సత్యముతో ఆయన పంపిన వాటిని తిరస్కరిస్తాము. ఆయన అప్పుడు ఏ విధంగా చేసెనో, ఖచ్చితముగా అలాగే మన దినములో కూడా దేవుడు చేయాలనే మనం కోరుకుంటాము. దాని కొరకు మనం పిలవబడ్డాం. కానీ తర్వాత మనలో మనం రాజకీయం కనుగొన్నాము. అంతారాజకీయం. సంఘ శాఖగా మనిషి చేసిన నేపథ్యాలయొక్క అవినీతితో అంతా కలుషితం అయింది. (నేను ఇక్కడ చాలా విషయమును వ్రాసుకున్నాను. దానిని ఇక్కడ నేను చదవలేదు. నేను దానిని ఆ విధంగా ఉంచాననినేను నమ్ముచున్నాను.) చూడండి.
JOHN 1:1,14•
JOHN 15:7•
2COR 5:19
57ఇప్పుడు, వాక్యపు సత్యం వద్దకు తిరిగి వెళ్లుము. దేవుడు ఒంటరిగానే ఉండును. దేవుడు తన ప్రజలను ఆయనతో మాత్రమే ఏకాంతమవ్వాలని కోరుతున్నాడు. మరియు వారిని వారు వేరే దానిలోకి…మరియొక అనుభూతి, ఆచారములలోకి కట్టుకున్నారు. ఆయన తన వాక్యమును వారిలో ఉంచే విధముగా ఆయన తన వాక్యము పట్ల పిల్లలు విధేయత కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు అనెను…యేసు అనెను, "మీరు నాలో ఉండి మరియు నా వాక్యము మీలో నిలిచి ఉండినట్లయితే, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది సత్యము అగును. లేక అది సత్యము కాకపోవును. అది సత్యమైనట్లయితే, అది పనిచేయును.
ఇప్పుడు శక్తి యొక్క, దర్శనముల యొక్క, మరియు కార్యముల యొక్క రహస్యము ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని మీరు కోరుతున్నారా? అది తిరిగి వాక్యం యొద్దనే ఉన్నది. అది దేవుని వాక్యము. యేసు వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయనే వాక్యము గనుక, దేవుడు క్రీస్తు ద్వారా లోకమును తనతో తిరిగి సమాధానపరచుకొనెను . "ఆదియందు వాక్యముండెను మరియు వాక్యం శరీరధారి ఆయెను".
మరియు వాక్యము మనలో శరీరధారి కావాలని కోరుకుంటున్నది. కానీ మనం అన్ని రకముల కార్యములు, మరియు ఆచారములలో కట్టబడి మరియు లోకం వలె జీవించుటకు మరియు ఆ విధమైన కార్యములను అనుమతించినప్పుడు, మరియు అప్పుడు దేవుడు దానిని చేస్తాడని ఆశిస్తామా? ఎందుకనగా, ఖచ్చితంగా ఆయన చేయడు.
మనం ఎన్ని విధములుగా అనుకరించినా నేను లెక్క చేయను.
58ఒక స్థలం వద్దకు రావాలి సహోదరుడా, ఏదో ఒకటి జరగనై యున్నది. మిమ్మల్ని గాయపరచాలని నేను కోరుకోను. మిమ్మల్ని దీవించాలని నేను కోరుతున్నాను. వినండి, ఈ దినములలో ఒకనాడు ఎత్తబాటు వచ్చి మరియు వధువు వెళ్లిపోవును. మరియు దాని గూర్చి ఏదియు నీవు ఎరుగవు. వారు దాని గూర్చిన ఒక్క మాట కూడా ఎరుగరు. ప్రతీ ఒక్కరూ ఆశిస్తున్నారు…ఓ, ఈ రోజులలో ఒక రోజు యేసు ఆకాశమందు నడుస్తూ మరియు చెప్పును," పెంతెకొస్తులైన మీరందరూ (లేక బాప్తిస్తులైన మీరు) రండి" మరియు దాని గూర్చి మన ఆచార సంబంధమైన ఆలోచనలు అది ఆ విధంగా ఉండదు.
నా ఉద్దేశం ఇది ఒక రోజు యేసు….ప్రవచించబడిన విధంగా యేసు భూమిపైకి వచ్చును. మరియు ఆయన వచ్చెను, ఆయన జీవించెను, ఆయన చనిపోయెను. దాని గూర్చి ఏదీ ఎవరూ ఎరిగి యుండలేదు. అది అతి కష్టంగా యూదులలో ఒక్క శాతం మంది కూడా ఆయన భూమిపై ఉన్నాడని ఎరుగలేదు. లోకంలోని ఒక వందవ వంతు మాత్రమే ఆయన అక్కడ ఉన్నాడని ఎరిగెను.
PS 114:4•
ISA 40:4•
MATT 16:21•
MATT 17:10,12•
MARK 9:11
59బాప్తీస్మం ఇచ్చు యోహాను-యెషయా నుండి, మలాకీ నుండి…ఎందుకనగా, ఆయన గూర్చి వారు ప్రవచించినప్పుడు, అనెను, "అన్ని పర్వతములు ఎత్తైన స్థలములు అణచబడవలెను. అన్నిపల్లపు స్థలములు పైకి హెచ్చింపబడవలెను. మరియు ఓహ్, పొట్టేళ్లు…ఏ విధముగా ఆకులు వాటి చేతులతో చప్పట్లు కొట్టును, మరియు పర్వతములు చిన్న పొట్టేళ్ల వలె గంతులు వేయును…. అవన్నియూ. మంచిది, ఈ ఆచార సంబంధమైన ప్రజలు దానినంతటినీ తీసి పక్కన పెట్టి, మరొక మార్గమును ఎన్నుకొన్నారు . మరియు ఇక్కడ యోహాను వచ్చి, మరియు ఆయన చెప్పిన విధంగా ఖచ్చితంగా అలాగే ప్రసంగించెను. మరియు కనీసం శిష్యులు కూడా దానిని గుర్తించలేదు.
ఒకరోజు వారు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన అనెను, "మనుష్య కుమారుడు యెరుషలేము వెళ్లబోవుచున్నాడు"
వారు ఇలా అన్నారు, "మంచిది, అది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఈ కార్యములు జరగకమునుపు ఏలియా రావలెనని లేఖనముల ద్వారా మరియు శాస్త్రుల ద్వారా మనము వింటిమి కదా?
ఆయన అన్నాడు, ఆయన ఇది వరకే వచ్చెను. మరియు అది మీరు ఎరుగలేదు. మరియు అప్పుడు ఆయన వారితో అనెను, అది యోహాను అనెను, అతడు ఏమి చేయాలని లేఖనములు చెప్పెనో అలాగే ఆయన చేసెను. మరియు లేఖనములు ఏమి చెప్పెనో అలాగనే వారు అతనికి చేసిరి. చూశారా.
MATT 24:37•
LUKE 17:26•
1PET 3:20
60మరియు ఈ దినములలో ఒక రోజు మీరు ఆశ్చర్యపడతారు… ఆ ఎత్తబాటు వచ్చినప్పుడు….జ్ఞాపకం ఉంచుకొనండి, భూమిపై ప్రతిరోజూ ఐదు వందలు, ఎనిమిది వందలు మంది ప్రజలు కనిపించకుండా పోవుదురు. వారు లెక్కకు రాకపోదురు. మరియు ఆయన అనెను, "నోవహు దినములలో ఉన్నట్లుగానే, మనుష్య కుమారుని రాకడ ఉండును. అక్కడ ఎనిమిది ఆత్మలు రక్షించబడ్డాయి".
నీ దినములలో ఒకనాడు తీర్పు లోకమును తాకబోతుంది. దేశమును తాకును. సంఘమును తాకును. రాబోవు గొప్ప వెయ్యేండ్ల పరిపాలన కొరకు ఆమెను శుద్ధిచేయును. మరియు అప్పుడు మీరు అంటారు, "మంచిది ఈ సంగతులు జరుగుటకు ముందు ఎత్తబాటు మొదట వచ్చునని ఎందుకు చెప్పబడెను?"
ఆయన అనెను, "అది ఇదివరకే వచ్చెను మరియు మీరు దానిని తెలుసుకొనలేదు."ఎవరో ఒకరు రోడ్డు నుంచి చర్చి వైపునకు వస్తుండగా, ఒక చిన్న యవ్వనస్తురాలు ఎక్కడికో ఒక దానిని దర్శించుటకు వెళుతుండగా, వారు వెళ్లిపోవుదురు. ఎప్పుడు అది జరిగెనో మీకు తెలియదు. కానీ జరిగిపోయి ఉండును. అది ఎల్లవేళలా ఆ విధముగానే ఉన్నది. కనుక అది మరలా అలాగే ఉండును.
61మేల్కొనుము,పెంతెకొస్తు ప్రజలారా, మీ మనస్సాక్షిని కదపండి. మీరు జీవించుచున్న ఘడియను గ్రహించండి. ఇది ఒక తీవ్రమైన గడియ. మీ ప్రజలను మీరు అటువంటి పరిస్థితులు కార్యములు చేయుటకు, ఆ మార్గములోకి ప్రజలైన మీరు చేయనిస్తున్నారా?
అది ఎంతో సిగ్గుచేటుగా ఉండును. అది క్రైస్తవునికి అవమానం సినిమాకు వెళ్ళుట. వారు ఆ విధంగా ఎప్పటికీ చేయకూడదు. దెయ్యం ఒక దానిని మీ పైన ఉంచెను. వాడు టెలివిజన్ మీ ఇంటిలోనికి తెచ్చి, మరియు సినిమాను అన్ని రకములైన అవినీతిని మరియు ప్రతీదానిని నీకు తీసుకుని వచ్చెను. మరియు దానిని మీరు అనుమతించారు.
మీ పాఠశాలల వైపు చూడుము. మన…..ఇక్కడ, చిన్న అమ్మాయిలు వీధిలో అన్ని రకముల అనైతిక దుస్తులతో విస్తరించారు. మరియు ఇక్కడ…చికాగో పట్టణములో ప్రతీ ముప్పై రోజులకు ప్రతీ నెల ముప్పైవేల అబార్షన్ కేసులు నమోదు అవుతున్నాయి.
కేవలం ఒక్క విషయములో,
MAL 4:3
62గత రాత్రి ఈ పట్టణములో ఎన్నిపాపములు జరిగాయి? కోయట్ అను జంతువు ఇక్కడ ఎడారిలో అరచుట, మరియు దేవుడు దానిని చూచుట దానికన్నా మేలు కదా? పాత హాపి, లేక నవాజో వారి బండి గుండా ఇక్కడ వెళుతుండగా? అప్పుడు ఈ మురికి మరియు ఆచారములు మరియు రాజకీయములవైపు శ్రద్ధ వహించి చూచునా. మరియు అదే రక్తం కారుచూ, రోత గందరగోళము ఉండి దేవుని నాసికకు దుర్వాసన అయినది. ఆయన ….ఆయన యెదుట పాడైపోయి …..ఆయన దానిని ముక్కలుగా ఈ దినములలో చేయును. మరియు అగ్ని పర్వత విస్ఫోటనముతో ఆమె తనను తాను పునరుద్ధరించుకొనుటకు, ఆయన భూమిని బ్రద్దలు చేయును.
మరియు అప్పుడు వెయ్యేండ్ల పరిపాలన వచ్చును. అక్కడ మలాకి 4 ప్రకారం నీతిమంతులు దుర్మార్గుల బూడిదపై నడచును.
63ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొనండి. అది జరగక మునుపు ఒక విషయం జరుగును. అది జరిగేముందు వర్తమానికుని నుంచి మనం కదిలింపును పొందుకుంటాము. అది సత్యము.
ఇప్పుడు నేటి కాలమునకు మనవర్తమానం. ఇప్పుడు గమనించుము. ప్రభువైన యేసు రాకడను గూర్చి మనము గమనించినట్లయితే, మరియు ఆయన తన దినమందు వచ్చినప్పుడు, గమనించండి. ఆయన తన దినములో వచ్చుటను మీరు గమనించండి.
ఇప్పుడు రోమా గ్రీకు దేశమును మరియు భూమి మిగిల్చిన వారిని పైనుంచి తన్ని వేసే గొప్ప మిలటరీ మేధావి అయిన మెస్సీయ కొరకు చూస్తుందని మనం గమనిస్తాము. మరియు వారు ఏమి కలిగి ఉన్నారు మీకు తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఒక చిట్కా తో మిగతా వారిని తమ్మునుగూర్చి తాము సిగ్గుపడే విధంగా చేస్తాడు. వారు తెలివైన మిలిటరీ మేధావిని కోరుకున్నారు. అదియే వారు కోరుకున్నది.
64ఇశ్రాయేలు దేనిని కోరుకొనెను? ఒక మెస్సీయను. వారు ఒక మెస్సీయను కోరుకొనెను …ఒక నాయకుడిని. నాయకుడు వచ్చి రోమన్లు అందరినీ తీసుకుని తన్ని, మరియు దేశం నుంచి వారిని కొట్టివేసి, మరియు యెరుషలేములో రాజ్యమును ఏర్పాటు చేస్తాడని వారు కోరుకొనెను. దేవుడు వారి అవసరతలను ఎరుగును. వారికి ఆయన ఏమి ఇచ్చెను? ఒక శిశువును, ఒక శిశువును, ఒక రక్షకుడిని. వారికి ఆయన ఒక రక్షకుడిని ఇచ్చెను. వారు రక్షింపబడ్డారని వారు అనుకొనెను, కానీ ఆయన వారికి రక్షకుడిని ఇచ్చెను.
నేడు కూడా అది అలాగునే ఉన్నది. మనం రక్షించబడ్డామని మనం అనుకున్నప్పుడు, ఆయన దేనినైనా మనకు పంపించాడంటే అది రక్షకుడినే అయి ఉండెను. వారికి ఏది అవసరమో ఆయన ఎరుగును. నేడు మన రాజకీయం వైపు చూడండి, అది ఎంతపాడయిందో.
అదే విధంగా నేడు దేవుడు దేనిని చూసెను?
65రష్యా వైపు చూడండి. రష్యా మెస్సీయ కొరకు మొర్ర పెట్టుచున్నది. శాస్త్రీయ మేధావిని, సంయుక్త రాష్ట్రములు ప్రారంభం మునుపు, వారిని చంద్రుని పైకి తీసుకువెళ్లే ఒకరిని, వారు కోరుకుంటున్నారు. ఖచ్చితముగా. మిగిలిన అన్ని దేశములు కూడా దాని కొరకు చూస్తున్నాయి. అంతటినీ నశింపజేసే ఒక రకమైన బాంబులు కనిపెట్టుటకు మరియు వారిని చంద్రుని మీదకు తీసుకువెళ్లేటటువంటి శాస్త్రీయ మేధావిని కోరుతున్నారు. అన్ని హైడ్రోజన్ బాంబులను తీసుకొని, మరియు వాటిని ఆపివేసి మరియు ఎవరైనా ప్రారంభించక మునుపు వారి సొంత బాంబులను తీసుకొని మరియు ప్రతి ఒక్కరిమీద, వాటిని వేయుదురు. మరియు అప్పుడు వారు మొత్తం ప్రపంచమును స్వాధీన పరచుకుందురు. ఆ విధమైన మెస్సీయ కొరకు రష్యా చూస్తున్నది.
66పంతొమ్మిది వందల సంవత్సరముల క్రితం నిజమైన మెస్సీయ సిలువ వేయబడెను. తిరిగి వస్తానని ఆయన వాగ్దానం చేసాడు. అంత్య దినములలో మరలా పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశించునని ఆయన వాగ్దానం చేసెను. ఆయన వచ్చినట్లయితే, మనం ఆ దినపు యూదులవలె మనం ఉన్నట్లయితే, నేను ఆశ్చర్యం చెందుతాను. మనం చూసినట్లయితే, సంఘం ఎలాంటి మెస్సీయ కొరకు చూస్తున్నది? బిల్లీ గ్రాహం కన్నా కొంచెం గొప్ప వ్యక్తి మరియు మెథడిస్ట్, మరియు ప్రెస్బిటేరియన్లు, మరియు పెంతెకొస్తులు, అందరినీ తీసుకుని మరియు "మీరందరూ ఊరుకోండి మీ అందరి నుండి నేను ఒక సంస్థను తయారు చేస్తాను" అని చెప్పే వాని కొరకు చూస్తున్నారు.
పెంతెకొస్తు వారు దేనికొరకు చూస్తున్నారు? వారు ఒక మేధావి లేచి, వారిని గుంపులుగా తయారు చేసే వాని కొరకు చూస్తున్నారు. మరియు ఏకత్వం వారు వారిని అందర్నీ ఏకత్వముగా చేసే ఏకత్వము కొరకు చూస్తున్నారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారు అందరినీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారినిగా చేసే వారి కొరకు చూస్తున్నారు.
మీరు ఏమి చేయుచున్నారు? మీరు బైబిల్ పాఠశాలలను తయారు చేసి, మరియు వారిని విద్యావంతులుగా చేసి, మరియు దేవుడు ఆదిలో తన నుండి దూరముగా పంపే వారి కన్నాఎక్కువగా వారిని పంపిస్తున్నారు. మీలో చాలామంది దానిని ఒప్పుకోరు అని నాకు తెలుసు. కానీ ఏదైనా….
67మా అమ్మ మాకు చెప్పేది…మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మేము పేదవారములాగా పెరిగాము. ఉడకబెట్టిన మాంసపు తోలునుండి తీసిన కొవ్వును మా జొన్న రొట్టెను చేయడానికి రాస్తాము. మరియు ప్రతీ శనివారం రాత్రి మేము కొంత ఆముదాన్ని సేవించాల్సి వచ్చేది. తిన్న విషపు ఆకుకూరల సముదాయాన్నే తింటూ ఉండేవారము. నాకు చర్మము మీద పోషకాహార లోపము వలన ఏర్పడిన మచ్చలు (పెల్లాగ్రా) ఉండేవి.
మరియు అమ్మ …నేను ఆ పదార్థములను ఇష్టపడే వాడిని కాదు. నేటికి కూడా నేను అదే చేస్తాను. నేను దానిని తీసుకున్నప్పుడు నా ముక్కును నేను పట్టుకుని, మరియు నేను అనేవాడిని, "అమ్మా నేను దీనిని తీసుకోలేను, అది నన్ను ఊపిరి ఆడకుండా చేస్తుంది. అది నాకు జబ్బును కలగజేస్తుంది".
ఆమె అన్నది, "ఏదైనా నీకు జబ్బు కలుగ చేయకపోతే, నీకు మంచి చేయదు".
నేడు పెంతెకొస్తు సంఘముతో ఉన్న సమస్య అదియే. నీకు మంచి చేసే దానిని ఏదైనా మీరు వినాలని అనుకోరు. మిమ్ములను వేదాంతం జబ్బు పడునట్లుగా చేయును. కానీ అది మీకు మంచి చేయును. అది మిమ్మల్ని బయటపెట్టి, మరియు దేవుని వాక్యము యొద్దకు తీసుకువచ్చును. మరియు పరిశుద్ధులకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం యొద్దకు తీసుకువచ్చును. ఈ బైబిల్ పాఠశాల మరియు సేవకులకు అన్నిరకముల పట్టాలను ఇస్తూ ఉంది.
ఆ విధమైన చేతినిండా ఉన్న పుల్లని ఆపిల్లను, ఎన్నడూ దేవుడు వాడుకోడు. జనులు విశ్వాసం కలిగి ఉండాలని, వ్రాయబడి ఉన్న దానిని నమ్మవలెనని ఆయన కోరుకుంటాడు. నీవు ఏదో మరల దానికి జత చేయకూడదు.
68అది కష్టమని నాకు తెలుసు. మిమ్మల్ని బుజ్జగించడానికి, మరియు మిమ్మల్ని నవ్వించడానికి, మరియు అరిచేలా చేయడానికి నేను ఇక్కడ లేను. దేవునితో సత్యమును చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒక దినమున మీరు చూస్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు నమ్మకపోయినట్లయితే, అది నిజమని మీరు చెప్పు ఒక దినము వచ్చును. నిజం. మీరు తిరిగి రావాల్సి ఉన్నది. మొత్తం కార్యం అంతా ఈ స్థితిలోనే ఉన్నది. రావలసినది ఏదీ లేదు, కానీ ప్రభువైన యేసు రాకడమాత్రమే. మరియు ఆయన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కొరకు రాడు. ఆయన బాప్టిస్ట్ కొరకు రాడు. ఆయన ప్రతీ వ్యక్తి కొరకు వచ్చును. అది నిజం.
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 4:16-29•
JOHN 8:44
69[ఖాళీ]…. మరియు ఆ విత్తనమును ఎప్పుడైతే వెలుగు తాకిందో, అక్కడ జీవము ఉన్నది. ఆ విధముగా అక్కడ చుట్టూ నిల్చుని ఉన్న ఆ వేదాంతులను చూడండి. వారి హృదయములలోని ఆలోచనలను ఆయన వివేచించుటను వారు చూశారు. వారు ముందు చాలా శరీర సంబంధమైన అనుకరణలను చూశారు. మరియు వారు అన్నారు, "ఈ మనిషి బయల్జేబూబు , ఒక జ్యోతిష్కుడు"వారు వేదాంతులు.
యేసు అన్నాడు, "మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మరియు వాడి క్రియలు మీరు చేయుదురు"
కానీ ఒక చిన్న వ్యభిచారిణి సమరయలోని అక్కడ బావి వద్దకు నడిచినప్పుడు, మరియు యేసు ఆమెతో అన్నాడు, "వెళ్లి, నీ భర్తను తీసుకుని రమ్ము". ఆమె అన్నది,"నాకు భర్త లేడు".
అనెను, "నీవు సత్యమే చెప్పితివి. నీకు అయిదుగురు భర్తలు ఉండిరి. మరియు ఇప్పుడు నీతో ఉన్న అతడు నీ భర్త కాడు".
ఆమె అన్నది, "అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయ వచ్చినప్పుడు, ఈ సంగతులన్నిటిని ఆయన చేయునని మేము ఎరిగియున్నాము ".
ఆయన అన్నాడు, "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను".
అది ఏమైయున్నది? ఆ వెలుగు ఒక చిన్న, ముందుగా నిర్ణయింపబడిన విత్తనమును తాకెను. మరియు వెనువెంటనే అది జీవమునకు వచ్చెను. ఆ వేదాంతులు, సర్వ ఉపదేశముల నుండీ ఎంత వ్యత్యాసముగా ఉన్నది.
ఆమె పట్టణములోనికి పరుగెత్తి అన్నది, "నేను చేసిన వాటిని అన్నీ చెప్పిన మనుష్యుడిని చూచుటకు రండి. మనం చూచుచున్న మెస్సీయ సూచన అది కాదా?
మరియు డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టా పొందిన వారు అక్కడ చుట్టూ నిల్చుని అన్నారు,"ఆ మనిషి బయల్జేబూబు". చూడండి వారు దానిని వివరించలేకపోయారు. దానిని వివరించే మార్గం వారికి లేదు. కనుక వారి సొంత ఆదిమ ఆలోచన విధముతో వారు వారి సమాజమునకు జవాబు ఇవ్వవలసి ఉన్నది.
70అదే సంగతి మరలా పునరావృతం అయ్యింది. మరియు పురుషులు విశ్వసించరు, ప్రజలు విశ్వసించరు, సంఘములు విశ్వసించరు. ఆశ్చర్యం లేదు. మీరు దాని వలన నిరుత్సాహంచెందవద్దు. ఎందుకనగా వారు దానిని చేయరని పరిశుద్ధ గ్రంథం చెప్పెను. కానీ వ్యక్తిగతముగా మీరు…మీరు జీవమునకు నియమింపబడియున్నారు. ఇప్పుడు పొలముల వైపు చూడుము. మరియు ఏ గడియలో మనము నివసిస్తున్నామో చూడండి. జీవము వద్దకు రండి. క్రీస్తులో ఉన్న జీవమును, మనసును… మీలోకి రానివ్వుము…
నీవు అంటావు, "ఓహ్నేను అనుకున్నాను ….నేను అనుకున్నాను. ఇది… నేను…"నీవు అనుకున్న ఆలోచనలను రానివ్వకు. క్రీస్తులో ఉన్న ఆలోచనలను నీలోకి రానివ్వుము. మరియు అదే వాక్యము. అది నిజము. ఆయన ఆలోచించే ఆలోచనలను మీరు ఆలోచించండి.
71ఇప్పుడు, నేడు నేను ఆశ్చర్యం చెందుతున్నాను, అమెరికా (మిమ్మల్ని ఎక్కువ సమయం ఉంచను) బిగ్గరగా నీవు ఏడ్చుచున్నావు. నీకు ఏమి కావలెను? ఇప్పుడు నేను పొలముల నుండి ఇంటికి వచ్చుచున్నాను. నీకు ఏమి కావలెను? నీ పైన పరిపాలన చేయుటకు నీకు ఏమి కావలెను? నీకు ఒక తెలివైన విద్యావంతుడు కావలెను. నీవు కోరుకున్నది అదియే. మరియు అతడిని నీవు పొందుకున్నావు. నేను మీ మనో భావములను గాయపరచాలని కోరుకోను. కానీ నేను మీకు సత్యము చెప్పాలని కోరుకుంటున్నాను. నీవు అతడిని పొందావు. ఓటు యంత్రమును వక్రీకరించుట ద్వారా అయిననూ, నీవు అతడిని పొందావు.
అమెరికా విద్యపైన చాలా ఆధారపడెను…పరిశుద్ధ గ్రంధం పైన కాదు. విద్యపైన. సంఘములు విద్యావేదాంత శాస్త్రం పైనే చాలా వరకు కట్టబడ్డాయి. మనిషి తయారు చేసిన ఒక విధమైన వ్యవస్థ, సిద్ధాంతములు. మరియు పెంతెకొస్తులు అదే పరిస్థితిలోనికి మెల్లగా వచ్చెను. ఎలాగనగా ఆనకట్టగుండా నీటి పైన తేలుతూ వెళుతున్న కొయ్య కర్రవలే. సరే మీకు సిద్ధాంతములు కావాలి. మీరు సత్యమును కోరుకొనరు.
72ఇప్పుడు గమనించండి. మీరు ఏమి చేశారు? మీరు ప్రతీదీ విద్య… ఎంతగా మీరు కావాలనుకున్నారంటే, మీరు మీ టెలివిజన్ ను తెచ్చుకొని మరియు దానిలో శ్రీ నిక్సన్, మరియు శ్రీ కెన్నెడీలను ఉంచి, మీరు దానిని చేసేముందు వారి తెలివితేటలను పరీక్షించేటంతగా. మరియు తర్వాత… కొద్దిమంది మంచి ప్రజలు, అమెరికాలో మిగిలినా కూడా దానిని చేయరు. వారు మన వారసత్వమును ఎరుగును. మనం దేనికి చెందిన వారమో మనకు తెలుసు.
మరియు డెమొక్రాట్లు (ప్రజాస్వామ్య వాదులు) అయిన మీరు; నేను డెమొక్రాట్ను కాను, రిపబ్లికన్కాను, నేను క్రైస్తవుడను. కానీ డెమొక్రటులు ఆయిన మీరు , కొంచెం చిన్న రిక్కీని తీసుకువచ్చి, మరియు మీ జన్మ హక్కులను మీ రాజకీయాల కొరకు అమ్మి వేసి, మరియు దేనికి వేరుగా మన దేశము స్థాపించబడినదో దానికే ఓటు వేయుచున్నారు. మీకు సిగ్గుచేటు! అదే అహాబు మరియు యెజెబేలు వలె!
MATT 23:9
73అమెరికన్ స్త్రీలు అయిన మీరు ఫ్యాషన్ కోరుతున్నారు. మీరు పొందిన… ఇప్పుడు మీరు పారిస్ వెళ్లనక్కర్లేదు. మీరు దానిని ఇక్కడే పొందుకున్నారు. ఒక నిజమైన ఫ్రెంచి మనిషి దానిని మీకు ఇచ్చును. మీకు మీ నీటి పొంగు జుట్టు కత్తిరింపులు, మరియు మీ అన్ని ఫ్యాషన్లు మరియు పరిస్థితులు పొందుకున్నారు. దానినే మీరు కోరుకున్నారు. మీరు ఏమి కావాలనుకున్నారో ఖచ్చితంగా దానినే పొందుకున్నారు! అది మిమ్మల్నిఎక్కడికి నడిపించును? తిరిగిరోమ్కు . ఖచ్చితంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే.
మరియు ప్రొటెస్టెంట్లు అయిన మీరు! మీరు కొంత పెద్ద సంస్థను మిమ్మల్ని నడిపించుటకు, నీపైగా వెళ్లుటకు, మిమ్మల్ని పరిపాలించుటకు కోరుకున్నారు. మీరు దానిని పొందుతారు-ప్రపంచ సంఘముల సమాఖ్య. ఎలా డేవిడ్ డూప్లెసిస్ , నా స్నేహితుడు, ఎప్పటికీ ఈ క్రైస్తవ సంబంధసమాఖ్య పైన అతడు మాట్లాడతాడు. మరియు ఈ పెంతెకొస్తు ప్రజలను దానిలోకి తెచ్చుట?.
పెంతెకొస్తులైన మీకు ఏమిటి సంగతి… డాక్టర్. పరిశుద్ధ తండ్రి గూర్చి అలాంటివారు లోపలికి వచ్చి అరచుట.
MATT 8:12•
MATT 25:10
74మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథం ఏ మనిషిని "తండ్రీ" అని పిలవకూడదు అని చెప్పెను. మీతో జరిగిన సంగతి ఏమిటి? అది మన ప్రభువు బోధ. ఏమిటి సంగతి? మీరు మీ పరిశుద్ధ గ్రంథమును ఎరుగరా? మీరు మీ ప్రభువుని ఎరుగరా? పరిశుద్ధాత్మ ఆ విధమైన దానిని చేయమని బోధించదు. ఈ ప్రెస్బిటేరియన్, మరియు పరిస్థితులు దానిని పొందుటకు వచ్చుటను ప్రయత్నించినప్పుడు, అది అంత్య కాలము అని మీరు గ్రహింపరా? వారు లోపలికి రారు. వారు రారు అని పరిశుద్ధ గ్రంథం చెప్పెను.
వారు నూనె తెచ్చుటకు రాగా, పెండ్లికుమారుడు వచ్చును. వారు నూనె తెచ్చుకొనుటకు వెళ్లెను. అయితే ఇప్పుడు ఎత్తబాటునుగూర్చి ఏమిటి? చూశారా? బుద్ధిలేని కన్యకలు నూనె కొనుటకు రాగా (అది సత్యం అని ఎంత మందికి తెలుసు?), బుద్ధిలేని కన్యకలు నూనెను తీసుకొనుటకు రాగా పెండ్లి కుమారుడు లోపలికి వచ్చెను అని పరిశుద్ధ గ్రంథం చెప్పెను. వారు దానిని పొందుకోలేదు. వారు తిరిగి వచ్చెను. మరియు వారు బయట చీకటిలోనికి త్రోయబడెను.
చాలామంది మెతడిస్టులు, ప్రెస్బిటేరియన్ , బాప్టిస్ట్ గూర్చిన ఈ పుకారులు మీరు వినినప్పుడు, మీతో ఏమిటి సంగతి? మేల్కొనుము! దీనికోసం ఆలోచించినంత ముందు స్థానంలో ఇది లేదు. వారు తిరిగి వచ్చెను. కానీ వారు ఉద్రేకమును కలిగి ఉండవచ్చు. కానీ వారు అక్కడ లేరు. జ్ఞాపకం ఉంచుకొనండి. వారు బయట చీకటిలోనికి వెళ్లెను.
వారు చెప్పవచ్చు, "మంచిది, ఇది ఎప్పుడు జరగబోవును?"
REV 10:1-7
75అది ఒకవేళ జరిగి ఉండవచ్చు ఇదివరకే, వీటిలో ఒక ఉదయమున, మరియు ఎందుకు, ఎలా అన్నది మీరు ఎరుగరు. మీరు చదువుతారని తగినంత నేను భావిస్తాను. మీరు పొందుకుంటారని నేను అనుకుంటున్నాను …. నేను ఏమి మాట్లాడుతున్నానో తెలుసుకొనుటకు తగినంత క్రీస్తు ఆత్మను మీరు పొందుకుంటారని నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దానిని మీకు తెలియజేయును. ఇవి అన్నీ టేపు చేయబడ్డాయి. మరియు అవి ప్రపంచం అంతటికీ వెళ్ళెను.
కానీ కొద్ది రోజుల క్రితం మీరు గ్రహించారు, ఏడు దూతలు ఆ దర్శనములో కిందకు దిగి వచ్చినప్పుడు- మీలో చాలామంది దానిని తెలుసుకొని యున్నారు…అనెను "టుసాన్ వెళ్లి మరియు అక్కడ కొంత సేపు వేచి చూడు. మరియు ఒక ప్రేలుడును నీవు వింటావు. అది జరిగిన తరువాత, నీవు తిరిగి రా". మరియొక దినమున గుడారము వద్ద ఏడు ముద్రలు తెరవబడెను. ప్రజలు వచ్చుటను నేను చూసినప్పుడు…. తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడ నిల్చుని, కూడిక జరుగు స్థలములోనికి వచ్చి స్థలము కొరకు మరియు అలాంటివి, ఆకలిగొన్న హృదయములు ప్రతి చోట నుండి వచ్చుటను చూసి అనుకున్నాను, "ఓ దేవా, మేము ఇప్పుడు ముగింపులో బాధ్యతను కలిగి ఉన్నాము".
జ్ఞాపకం ఉంచుకొనండి, ఏడవ దూత ఊదబోవుచుండగా దేవుని మర్మములు సమాప్తం అగును. మరియు పరలోకం నుండి దూత వచ్చి, మరియు పరలోకం నుండి ఆయన ఆకాశము తట్టు తన చేతులు ఎత్తి ఒట్టు పెట్టెను. (ప్రకటన 10: 1 నుండి 7), సమయమిక ఉండదు గానీ, అది ఖచ్చితముగా నిజం. ఆ ఘడియ…
REV 3:16
76ఆయన ఏ సంఘమునకు వస్తున్నాడు?. మనం జీవిస్తున్న సంఘములోనికి…. లవొదికయ సంఘకాలం, ఆఖరి సంఘకాలం, నులి వెచ్చగా ఉన్నప్పుడు….. కేవలం చుట్టూ నాట్యం చేస్తూ, అంటారు, "అవును, నేను పొందుకున్నాను. నేను భాషలలో మాట్లాడాను. నేను అరిచాను. హల్లెలూయ! నేను దానిని పొందుకున్నాను".
మరియు తిరిగి వచ్చి మరియు మన సంఘములు యెజెబేలు గుంపువలె కనిపించును. ఒక గుంపు వలె కనిపించును. అది ఏమిటో నాకు తెలియదు. అవినీతి!
జ్ఞాపకం ఉంచుకొనండి, మీ బయట స్వభావము నీ లోపలి స్వభావమును వ్యక్తపరుస్తుంది. నీ సాక్ష్యం ఎంత ఐనా, దానితో సంబంధం లేదు. మీ జీవితం నీ మాటలకన్నా బిగ్గరగా మాట్లాడును. మనం ఇక్కడ ఉన్నాము! మనం వచ్చి ఉన్నాము! ఏదో జరగబోవును. అది పైనుండి వచ్చును. ఇక్కడ ఏ విధమైన కార్యము నుండి కాదు. దేవుడు క్రీస్తును పంపును ఆమెన్.
AMOS 3:3
77అవును, మనం మన మేధావిని పొందుకున్నాము. అతడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు, మీ సంఘ ప్రపంచం ఒక మేధావిని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తిగతమైన వారి గురించి నేను అనడం లేదు. ఇది టేపు చేయబడెను. దాని గూర్చి ఏమిటి? మీరు దానిని కోరుతున్నారు. మీరు దానిని పొందుకుంటారు. నేరుగా సంఘముల సమాఖ్య లోనికి వెళ్లండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదే మీరు ఏమై ఉన్నారో తెలియజేయును. మరియు తర్వాత మీ సంస్థ మిమ్మల్ని నేరుగా తిరిగి మరల దానిలోనికి నడిపించును….ఖచ్చితముగా మీరు దేని నుండి వచ్చారో, దేవుడు శపించిన ఆ పరిస్థితిని… ఆ కలుషితమైన మురికి మరియు అసహ్యమైనది. ఆ సంఘముల సమాఖ్యలో కొంతమంది కన్యక జన్మనిచ్చుట, క్రీస్తు రాకడ, లేక దేనినీ ఎందుకు విశ్వసించరు? మరియు వారు ఏకీభవించకుండా ఎలా ఇద్దరు కలిసి నడచును? అక్కడే మీరు ఉన్నారు.
మంచిది, నిలిపి వేయుటకు నేను ఇదే సమయము అనుకుంటున్నాను.
78కానీ సహోదరుడా, మరియు సహోదరి, దీనిని జ్ఞాపకం ఉంచుకొనండి: మనం అంత్య కాలములో ఉన్నాము. విద్య, రక్షణ స్థానమును తీసుకొనెను. సంఘ సంస్థ క్రీస్తు యొక్క శరీరము మరియు వధువు యొక్క స్థానమును తీసుకొనెను. ఆ అవినీతి అంతటిలో కూర్చునుట… అదియే మీరు కోరుకున్నారు. అదియే ప్రజలు కోరుకున్నారు. అదియే అమెరికా సంఘములో ఉన్నది. అదియే పెంతెకొస్తులలో ఉన్నది. ఒకరు వచ్చి వారికి సత్యము చెప్పుటను వారు కోరుకొనరు. వారు దానిని కావాలనుకోరు. మీరు వారికి చెప్పండి, వారు అంటారు,"మేము ఆ విధమైన అటువంటి దానిని వినము". వారి చిన్న ముక్కును పైకి లేపి, మరియు భవనములో నుంచి బయటకు నడిచి వెళ్తారు. దానిని వారు వినరు.
ఎందుకు? వారి హృదయములో ఉన్నది అదియే. వారు ఏమై ఉన్నారో దానినే వారు తెలియజేస్తారు. పూర్వ దినములలో ఎటువంటి ప్రవక్తలు వచ్చిననూ, క్రీస్తు సూచనగా వచ్చిననూ పరలోకము నుండీ ఎటువంటి వర్తమానికుడు వచ్చినప్పటికినీ దానిని సంఘము తృణీకరించినది. మనము ఇక్కడ ఉన్నాము. లోకము చిన్నాభిన్నమవుచున్నది. సంఘం చిన్నాభిన్నమగుచున్నది. వ్యవస్థలు చిన్నాభిన్నమవుచున్నవి. ఎందుకు? ఎందుకనగా అది దేవునికి వేరైన ఒక వ్యవస్థ. అదియే. మనం అంత్యకాలములో ఉన్నాము. జరిగేది ఏదియూ లేదు. అవును, అయ్యా!ప్రతీదీ….
జ్ఞాపకం ఉంచుకొనండి…..
JOHN 6:44•
1COR 11:5
79మనం వెళ్లడానికిముందు ఈ ప్రశ్న అడుగుతాను: రష్యా వారి మెస్సీయను పొందినట్లయితే, ఏమగును? మనకు ఏమి జరుగును చూసారా? జర్మనీ కొద్దికాలం క్రితమే వారిది పొందుకొనెను. మనం దానిని బాగుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు తమ మెస్సీయను పొందుకున్నారు, తమ హిట్లర్ ను, తమ మేధావిని. రష్యావారిది ఏమి పొందుకున్నది? ఏమి జరుగును?
ఒకవేళ పరలోకములో కృపగల దేవుడు లేనట్లయితే మనం ఏమి చేయవలెనోనేను ఎరుగను. మన ఆశలన్నీ పోవును. ఒక నిజ సంఘం ఉన్నది. ప్రభువు రాకడ కొరకు ఎదురుచూసే నిజ సంఘం ఒకటి ఉన్నది. దేవుడు దానిని ఎల్లవేళలా అనుగ్రహించును. కానీ ఎవరైతే నియమింపబడ్డారో వారికే. మీరు అంటారు,"ఒకవేళ ఇది ఈ విధమైన వ్యవస్థ అయితే, నిలుచుటకు అది ఏ మంచి చేయును?".
ముందుగా నిర్ణయింపబడిన ఒక బీజం ఉన్నది. ఆ వెలుగు తాకినప్పుడు, వారు ఆ విధంగా దానిని పట్టుకుంటారు. ఇప్పుడే ఆమె వికసించును. తప్పకుండా ఇతరులు దాని పైనుండి వెళ్ళిపోవును. వారు వారి వ్యవస్థను నమ్మును, మరియు అది ఎల్లవేళలా ఆ మార్గములోనే ఉండును….నోవహు దినములలో వలే. వారు అదే విషయమును నమ్మెను. ఎవరైతే నిత్య జీవమునకు ముందుగా నిర్ణయింపబడ్డారో, వారు దానిని పొందుకున్నారు. యేసు అనెను,"తండ్రి ఒకరిని ఆకర్షించితే తప్ప ఎవరూ నా యొద్దకు రారు. మరియు తండ్రి నాకు ఇచ్చిన వారందరూ వచ్చును".
మనం కేవలం విత్తనములను చల్లి, వెలుగును ప్రసరించాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వెలుగు నిచ్చు ఉన్నతమైన దీపస్తంభమై ఉండాలి.
2KGS 9:33-36
80చాలా హక్కు కలిగి యున్నామన్నపెంతెకొస్తులైన మీరు క్రీస్తు ఆశీర్వాదముల యొక్క బంగారపు పాత్ర అంచులను ముద్దు పెట్టుకునేహక్కు ఉందనే పెంతెకొస్తులైన మీరు స్త్రీలైన మీరు, మిమ్ములను బయటకు వెళ్లనిచ్చి , మరియు అనుమతించి, మరియు చేసి, మరియు మీ కాలపు పరిచారకులు మిమ్మల్ని మోసగింప చేసి, మరియు మీ పిల్లలు పొట్టి దుస్తులు ధరించుట పరవాలేదు అని మీకు చెప్పును. మరియు స్త్రీలైన మీరు ….అమ్మమ్మలైన మీరు…..మీ జుట్టును కత్తిరించుకుని మరియు పరిశుద్ధ గ్రంధం ఏమి చెప్పినది మీకు తెలియదా? స్త్రీ…. స్త్రీతన జుట్టును కత్తిరించుకుంటే, ఆమె భర్తకు ఆమెను విడిచిపెట్టే హక్కు ఉందని పరిశుద్ధ గ్రంధం చెప్పెను. ఆమె గౌరవింపబడదు. అది తప్పిదము అగును.
రంగు? పరిశుద్ధ గ్రంథములోని తన ముఖమునకు ఎల్లవేళలా రంగువేసుకున్న ఒకే ఒక స్త్రీ ఉన్నది. మరియు ఆమె యెజబేలు మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారముగా చేసెను. మీరు చూశారా? సాధారణ కుక్కలకు ఆహారము. కనుక…అటువంటి విషయములకు దూరంగా ఉండుము. అది క్రైస్తవులనుగా చేయదు.
MATT 6:21•
LUKE 12:34
81దాని గూర్చి వారికి చెప్పుము, "మంచిది, నేను అసెంబ్లీస్లకు చెందిన వాడను, నేను ఏకత్వమునకు చెందిన వాడను, నేను దీనికి…చెందిన వాడను…."అది సరియే. అది నీవు దేనికి చెందియున్నావో అదియే. కానీ నువ్వు క్రీస్తుకు చెందినవాడవైతే, అది వ్యత్యాసముగా ఉండును. దేవుని వాక్యము మరియు దేవుని విత్తనము అక్కడ ఉన్నట్లయితే, అది క్రైస్తవత్వమునకు ఉదాహరణగా వికసించును. అది లోకము నవ్వునట్లుగా, మరియు ఎగతాళి చేయునట్లుగా, ఆయన వచ్చినప్పుడు ప్రభువుకు చేసిన విధంగా, వచ్చిన ప్రతి ప్రవక్తకు చేసిన విధంగా, అది వికసించును. వారు నవ్వి మరియు వారిని ఎగతాళి చేసెను. మరియు వారిని సమాధులలోకి త్రోసెను.
కానీ ఒక పునరుద్ధానంరానై ఉన్నది. ఈ లోకము….మనుషులు ఈ లోకము కొరకు జీవించును. లేక రానున్న…లోకము…. మీ ఆలోచనలు ఎక్కడ ఉండునో అన్నదానిపై ఆధారపడి జీవించెదరు. అక్కడనే మీ ధననిధులు కూడా ఉంటాయి. అది పరలోకములో, మరియు ప్రభువు రాకడలో ఉండనీయుము. స్త్రీత్వమునకు మాదిరిగా ఉండుము. పురుషత్వమునకు మాదిరిగా ఉండుము. క్రైస్తవ్య జీవితమును జీవించుము. ఏది సరైనదో అది చేయుము.
82ప్రజలు మరియు మన సువార్తికులు ఈ దినమున వారు కలిగియున్నదంతా కలిగి ఉండి ఎంతగానో డబ్బు చుట్టూ తిరుగుతూ, పెద్ద పెద్ద కార్యాలను చేస్తూ పెద్దసంస్థలను కట్టుచూ మరియు అటువంటి కార్యాలను చేస్తూ, ఏ పెంతెకొస్తు నుండైతే బయటకు వచ్చారో మరలా అదే కార్యాన్ని చేస్తున్నారు. తిరిగి మరలా అక్కడే. అది ఏమిటి? అంతా మెరుస్తున్నది మరియు ధగధగ లాడుతున్నది. మీకు తెలుసా, ప్రతీదీ మెరయును. హాలీవుడ్ మెరియును. నిజము. కానీ సువార్త ప్రకాశించును .
మెరయుటకు మరియు ప్రకాశించుటకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. సంఘము హాలీవుడ్ ఫ్యాషన్లు,పెద్ద సంఘములు, ఎత్తైన శిఖరములు, మంచి వస్త్రములు ధరించిన జనములు, మరియు మొదలగు వాటితో మెరుస్తున్నది. అది దానితో మెరుస్తున్నది. బాప్టిస్ట్ వారు అత్యధికమైన ప్రజలను కలిగి ఉన్నారు. డాక్టర్. బిల్లీ గ్రాహం ఆధ్వర్యములో పది లక్షల మంది, మరియు వారిలో అనేక మంది.
83మన పట్టణములో కొద్ది కాలంక్రితం ఇక్కడ నేను బిల్లీ గ్రాహం వద్ద అల్పాహారమునకు కూర్చున్నాను. గొప్ప దైవజనుడు, సువార్తికుడు. నేను అతని కొరకు నిరంతరం ప్రార్థిస్తున్నాను. అతడు అక్కడ జబ్బుతో పడియుండెను. నేను అతని పట్ల గౌరవాన్నికలిగి ఉన్నాను. ఆయన సొదమకు వెళ్లి, మరియు ఆ సొదొమీయులను బయటకు తీసుకువచ్చు ప్రతీ ఒక్కరిని బయటకు తెచ్చు వానికి మాదిరిగా ఉన్నాడు. కానీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఎన్నికైన సంఘము సొదొమలో లేదు. అక్కడ ఒక దూత కూడా ఉండెను. మరియు ఆయన వారికి సూచన చూపించెను. ఎన్నికైన సంఘమునకు.
కానీ అతడు చేసినప్పుడు, అక్కడ నిల్చుని (అతడు అక్కడ నుంచోవడం నేను చూసాను) ఆయన అనెను, "ఇక్కడ పరిస్థితి ఏమిటి?, అనెను, "నేను… "అనెను,"ఇదే ఇక్కడ ఉదాహరణ". అనెను, "పరిశుద్ధ పౌలు పట్టణములోనికి వెళ్లి మరియు ఒకరిని ఆయన మార్చెను. ఒక సంవత్సరము తర్వాత తిరిగి అతడు వెళ్లెను. అతడు ఏమి చేసెనో…. జరిగెను?. అతను ఆ ఒక్కరి వలన ముప్పై మందిని కలిగి ఉండెను". "నేను పట్టణములోనికి వెళ్లి ఆరు వారములలో ముప్పైవేల మందిని మార్చాను. ఒక సంవత్సరం తర్వాత తిరిగి నేను వచ్చాను మరియు ముప్పై మందిని కూడా కనుగొనలేదు. ఏమి జరిగెను? "ఆయన అనెను, "అది బద్దకస్తులైన ప్రసంగీకులు మీరు." అనెను, "మీరు మీ నిర్ణయపు కార్డులను తీసుకొని మరియు ఎక్కడో మీ పాదములు పైకి పెట్టి బల్లమీద కూర్చుని, మరియు ఫోనులో వారిని పిలుస్తారు". మరియు అతడు ముందుకు వెళ్లిపోయెను.
ఆ మనిషియొక్క ధైర్యమును చూసి నేను ఆశ్చర్యపడ్డాను.
84ఒక ఆడంగి వాడినిచూస్తే నాకు అసహ్యం. ఒక సంఘశాఖ కీలుబొమ్మ. నేను మనిషిని ఇష్టపడతాను. ఒక దేవుడు పంపిన మనిషి తన నేరారోపణల మీద నిలువక ఉన్నవాడు; అతడు తప్పిదమైన వాటిని రుజువైతే దానిని చేర్చుకుని మరియు తిరిగి వచ్చి మరియు మరల దానిని ప్రారంభించుము. అది సరియే. మరియు అక్కడ అతడు నిల్చుని మరియు ఆ విధముగా మాట్లాడెను. మరియు నేను అనుకున్నాను…. నేను డాక్టర్ మొర్దేకై హాంతో కూర్చున్నాను. అతడు నా వ్యక్తిగత స్నేహితుడు, బాప్టిస్ట్ సహోదరుడు. మరియు నేను అతడిని బాగా ఎరిగియున్నాను. చాలా సంవత్సరములుగా, మరియు మేము ఒకరితోనొకరము కలిసి ఉన్నాము. మరియు అతడు మరియు నేను ఒక బల్ల దగ్గర కలిసి కూర్చుని ఉన్నాము. నేను అతని ఇంటికి వచ్చాను. మేము కలిసి బయటకు వెళ్లాము.
మేము అక్కడ కూర్చుని ఉన్నాము. మరియు నేను అనుకున్నాను, "ఓహ్,మై, అంతరాయము కలిగించకుండా లేక గొప్ప సువార్తికుని గూర్చి ఏదైనా చెప్పకుండా ఎలా, కానీ నేను అనుకున్నాను, "బిల్లీ, అంతియొకయ యొద్ద పరిచారకులలో ఎవరు …. పౌలు అంతియొకయకు వెళ్లి మరియు మారుమనస్సు పొందిన వానిని అతడు పొందినప్పుడు అక్కడ ఏ పరిచారకుడు ఆ మారుమనస్సు పొందిన వాడిని అతని కార్యాలయములోకి వ్యక్తిగతమైన వాటిలోనికి తీసుకుని మరియు అతడిని పోషించి మరియు అతనితో మాట్లాడెను? ఎవరూ చేయలేదు". ఎందుకు? దేవుడు అతని హృదయములోనికి వేల్లూనుకొని మరియు నాటబడేంత వరకు పౌలు అతడిని లోక కార్యములకు దూరముగా తీసుకొనెను. ఓహ్, ఆ ఒక్క ఆత్మను అతను నిజముగా క్రీస్తులో వేల్లూనుకొని మరియు నాటబడే వరకూ ఆ అపొస్తలుడు వెళ్లనివ్వలేదు.
MATT 13:47
85మరియు నేడు మనం ఏమి చేస్తున్నాము? సంఘములకు చెందిన ఈ చిన్నపాటి అమ్మాయిలను, మరియు పురుషులు మరియు స్త్రీలను తీసుకుని, మరియు వారు ఒక నిర్ణయము తీసుకుని, ("నిర్ణయపు గడియలో" మరియు ఆ విధమైన పరిస్థితుల్లో) వారిని తీసుకువచ్చి, వారిని బయటకు పంపి…ఆ విధంగా మరియు ఏమిటి? వారు ఏ విధముగానూ దేనినీ పొందుకోరు. వారు దేనినీ కలిగి ఉండరు, కానీ వాక్యం వలన ఒక చిన్న ఉద్రేక పూరిత పని తప్ప అది నిజానికి దానిని చేయును. చూశారా. అది దానిని చేయును. అది ఉద్రేకమును కలిగించును.పెంతెకొస్తుకు జరిగినది అదియే. అది ఉద్రేకము క్రిందకు వెళ్లిపోయెను. దానికి జరిగినది అదియే.
86సువార్త ప్రచారం- అది ముందుకు వెళ్లే ఒక వల. యేసు అన్నాడు, "సముద్రములో వేయుము" మరియు అది తీసుకు వచ్చినప్పుడు, దానిలో తాబేలు, దానిలో తాబేలు వంటి రకములు, పాములు, కప్పలు మరియు ప్రతీదీ అందులో ఉన్నాయి. కానీ గుర్తుంచుకొనుము. అది అక్కడే ప్రారంభమయ్యెను. అక్కడ చేప కూడా ఉన్నది. కేవలం వల వేయుటే మన పని. ఏది చేప ఏది కాదో చెప్పుట దేవుని పని. చూశారా?వారు ఎందుకు లేరు? వారు దేవుని రాజ్యములోనికి తీసుకున్నట్లయితే ఆ ముప్పైవేల మంది పౌలు కలిగిన ఒక్కనివలె అతడు తిరిగి వచ్చినప్పుడు, ఆయన 430,000 మందిని కలిగి ఉండును. చూశారా, ఎందుకనగా అతడి హృదయం మండుచుండెను.
87చిన్న సహోదరుడు క్రో గత రాత్రి చెప్పిన విధముగా, అతని ధైర్యం చూసి నేను ఆశ్చర్యం చెందాను. అతని నేరారోపణ క్రింద అతడు నిలుచుట చూసి నేను ఆశ్చర్యం చెందాను. వెలుగు అక్కడ ప్రకాశించినప్పుడు, అతడు నిల్చొనెను. అతడు ఉన్నదారిలో అతడు నిల్చున్నట్లయితే, ఏ విధమైన వ్యవస్థల చేత మీరు ఎవరు అతడిని కదిలింపలేరు. లేదండీ. అలా ముందుకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి నేను ఎంతగానో ఆశ్చర్యపడుదును. అవునయ్యా. నేను ఒక దయ్యం కొరకు అలంకరింపబడిన మార్ది గ్రాస్ లా ఉండుట కంటే దేవుని కొరకు గాలికి కొట్టుకుపోయేవాని వలే ఉండుటకు ఇష్టపడతాను. ఏది ఏమైనా మీరు వేరొక దానికొరకు చూస్తారు. ఖచ్చితంగా. అది సరియే. మీరు అక్కడే ఉన్నారు.
కానీ చూడండి, మనం నేడు జీవిస్తున్న మరియు పని చేస్తున్న వ్యవస్థ మరియు పరిస్థితులు, వీటితోనే పరిస్థితి మొత్తం పాడైపోయి కేంద్ర భాగమునకు వచ్చును.
88ఇప్పుడు, మన రిక్కీని అక్కడ పొందుకున్నాము. ఇప్పుడు అతనితో నీవు ఏమి చేస్తావు? చూడండి, వారు కేవలం నల్లని పక్షులవలె ఎగురుతారు. ఖచ్చితంగా నిజం. మొత్తం వ్యవస్థ, మొత్తం పరిస్థితి ప్రతీ ఒక్కటి కోట్ల డాలర్ల వ్యవస్థ. అదియే మీరు కోరుకున్నది. అదియే సంఘము కోరుకున్నది. మీరు లోపలికి వచ్చు కారణం అదియే. ఇప్పుడు సంఘములోనికి వచ్చుట చాలా సామాన్యంగా ఉన్నది. ఓహ్, మై! పెంతెకొస్తులైన మీరు చేయగలిగేది అంతా కొంచెం కదులుట, కొంచెం గంతులు వేయుట, లేక మీరు ఒక విధమైన సాక్ష్యం పొందామని చెప్పుట.
ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరు.
89మీరు నాతో ఎప్పుడైనా భారత దేశమునకు వచ్చి మరియు హిందువుల సాక్ష్యమును వినండి. వారు మిమ్మల్ని మీరు సిగ్గుపడేటట్లుగా చేస్తారు. అది నిజం. మీరు తిరిగి ఆఫ్రికా వెళితే…. హాటెన్ టాట్ వారు… మరియు ఒక జంతువును చంపి, మరియు వారిని వారు అంతా రక్తము పూసుకుంటారు. మరియు వారి సాక్ష్యములను మరియు ఉద్రేకములను మరియు భాషలలో మాట్లాడుటను కచ్చితంగా వినండి. రక్తం చిందింపబడిన విగ్రహమును ఆరాధిస్తారు. ఓ దేవా, ఇక్కడ ఉన్న ప్రతీ వ్యక్తిని దానిని చూసేలా ఎలా నేను చేయగలను? ఖచ్చితంగా దయ్యం ప్రతీదీ అనుకరించును. దేవుడు ఉంచిన ప్రతీ దానిని అతడు దానిని అనుకరించును. దేవుని సత్యమును కూడా దానిని అతడు అనుకరించును. అది ఖచ్చితముగా నిజం.
గమనించండి. అక్కడే వారు ఉన్నారు. మంచిది, సంఘం ఏమి కోరుకొనెను?
MATT 4:8•
LUKE 4:5•
REV 13:8•
REV 17:5
90దేశం పొందుకొనుటకు ఏదో కోరుకుంటున్నది. అక్కడ కేబినెట్లో కూర్చుని ఉన్న అధ్యక్షుడు, ఈ అర్దం లేనిది ఆపి ఈ నగరాన్నిఏమీ కాకుండా చేయలేడు. అక్రమ కారుల నుండి వారికి ఉమ్మి వేయుటకు తేమ కలిగి ఉండటానికి అర్థగంట కావలెను. ఆ విధమైన వ్యక్తిని వారు కోరుకొనుట లేదు.
అక్కడ వారికి అందరికీ వారు కోరుకునే బీరును ఇచ్చే ఒక మనిషిని కోరుకుంటారు. మరియు దానిని చట్టబద్ధం చేయుదురు. మరియు తర్వాత అతడు ఎక్కువ తాగినట్లయితే, అప్పుడు అతడిని అరెస్టు చేయుదురు. మరియు రేప్ మరియు మతిస్థిమితం లేని వారి ఆశ్రయములు, మరియు ప్రతీదీ మరియు రోడ్లపైన వేల కొలది విధ్వంసకారులు, త్రాగినడిపేవారు. మరియు వారు ఇక్కడ రోడ్డుపైకి వెళ్లి మరియు మీరు ఒక త్రాగుబోతు డ్రైవరును బయటకు వెళ్లనిస్తే, మరియు ఎవరో ఒకరి మీదకు దూసుకెళ్లి, మరియు అతడిని చంపి… అతడు క్షమింపబడును. మరియు అది నాకు మాత్రము ఒక ముందుగా అనుకున్న హత్యే .
ఎవరో ఒక వ్యక్తి పండుగ జరుపుకుని మరియు బయటకు వచ్చి మరియు గాలిలో తుపాకీతో రెండు లేక మూడుసార్లు పేల్చితే, మరియు వారు అతడిని తిరిగి జైలులో పెడతారు. వారు అతడిని బయటకు తీసుకురాకముందే అతడు పుండును కలిగి ఉండును. అది ఏమిటి? అక్కడే మీరు ఉన్నారు. మీ లోకం యొక్క వ్యవస్థలు అక్కడే ఉన్నాయి. దానిలో న్యాయం లేదు.
ఈ మనిషి సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వం గూర్చి మాట్లాడుతున్నాడు. ఖచ్చితముగా లోకములోని ప్రతీ ప్రభుత్వం దయ్యముచే నియంత్రణ చేయబడెను. ప్రతీ వ్యవస్థ, యేసు అలాగే చెప్పెను.
సాతాను అనెను, "ఇవన్నియు నావి. నేను ఏమి చేయాలనుకున్నా వాటితో నేను చేయుదును".
నేడు మరి మనం ఎక్కడ ఉన్నాము. మనము ఎక్కడ నిల్చున్నాము.
చూడుము ఇప్పుడు దీని ముగింపులో నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను స్నేహితుడా?
EXOD 1:8•
JOHN 6:44
91మీరు చూశారా, రాజకీయ లోకం చిన్నాభిన్నమాయెను . ఇక్కడ సంయుక్త రాష్ట్రములలో మనం వెళ్లగలిగినంత వేగముగా తిరిగి మనం రోమాకు వెళ్తున్నాము. మనం దానిని చేస్తామని పరిశుద్ధ గ్రంధం చెప్పెను. (ప్రకటన 13) మరియు అక్కడే మనం ఉన్నాము. అది ఏమి చేయును. వారు పెద్ద గుంపు గల సంస్థలను కలిగియున్నారు. ప్రకటన 17లోకి వెళితే పెద్దతల్లి వేశ్య మరియు ఆమె యొక్క కుమార్తెలు అందరూ అక్కడ ఆమె తిరిగి వెళ్లి…… ప్రతి సంఘ శాఖ ఆమెతో ఉన్నది. అక్కడే వారు ఉన్నారు.
వారు యోసేపుని ఎరుగని ఫరో లేచుటను పొందుకున్నారు. మరియు ఇక్కడ మనం వెళ్లి…. పరిస్థితి మొత్తం. మన పెంతెకొస్తు నాయకులు కూడా ఆ పెద్దమెరుగులు దిద్దుకున్న హాలీవుడ్ లోనికి ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారు. మరియు పెద్ద గుంపులోనికి ప్రజలను మ్రింగుతున్నారు …..ఓహ్, అది….
ఈ దేశానికి దేవుడు సహాయం చేయాలి. ఈ ప్రజలకు దేవుడు సహాయం చేయాలి.
92కొన్నిసార్లు ఒక వ్యక్తి వీధిలోనికి వెళ్లి మరియు అరచునట్లు అనుభూతిని పొందునట్లుఇది చేయును . కానీ బైబిలు చెప్పినది నేను ఎరుగుదును "తండ్రి ఒకడిని ఆకర్షించితే తప్ప ఎవడును నా యొద్దకు రాడు". ఈ దినములలో ఈ సంగతులు జరుగుతాయని నేను ఎరుగుదును.
నేను వెలుగును చూసాను. దేవుని వెలుగు ముందుకు వ్యాపించుట. నేను అబద్ధమును కూడా చూశాను. మరియు అన్నీ ప్రకాశించుట లేక అందము మరియు ప్రకాశం కలిగి ఉండుట. మరియు నేను ఏమి చేయవలెను?
యేసు ప్రభువా, నీవు వచ్చేంతవరకు సత్యముగా ఉండుటకు నాకు సహాయం చేయుము. ఓ దేవా నన్ను నిలబెట్టుము. నా స్థానమును నేను తీసుకుని మరియు ఇక్కడ నిలువనీయుము, ప్రభువా, నీవు నన్ను కదిలించినట్లే కదలనీయుము.
దేవుడిని నిజముగా విశ్వసించే ప్రజలకు నేను ఏమి చెప్పాలి? నేను భయంకరమైన చిత్రమును చిత్రించాను. నేను ఇక్కడికి ఇరవై పేజీలు తీసుకుని వచ్చాను కానీ చాలా ఆలస్యం అయిపోయెను. నేను వర్తమానమును వ్రాయుటకు ఒక చిన్న సందర్భాన్ని కలిగి ఉన్నాను. ఈ ఉదయం నేను ఏమి చెప్పదును? ఇక్కడ మిమ్మల్ని నేను ఎట్లు విడిచిపెట్టను? మీరు ఎక్కడ ఉన్నారు?
93నేను మీ సంస్థలను ఖండిస్తున్నాను. మిమ్మల్ని కాదు. మిమ్మల్ని మీరు ఉన్న స్థలములోనికి తెచ్చిన వ్యవస్థను నేను ఖండిస్తున్నాను. నేను మిమ్మల్ని ఖండించుట లేదు, నాసేవక సహోదరులారా. మీరు నా మీద తప్పిదమైన అభిప్రాయమును కలిగియున్నారు. నేనుమీకు సహాయం చేయుటకు ప్రయత్నిస్తున్నాను. నదిలో జలపాతం వైపు వెళుతున్న పడవలో ఉన్న మిమ్మల్ని నేను చూసినట్లయితే, ఏమగును. మరియు నాకు తెలుసు ఆ పడవ ఆ జలపాతముకు తాళలేదని. మరియు నేను మీ వైపునకు అరుస్తాను, "అక్కడ నుంచి బయటకు రమ్మని. " ఎందుకనగా నేను మిమ్మల్ని ఇష్టపడటం లేదని కాదు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక. మీరు ఆనుకున్న ఆ వ్యవస్థ అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆ నరకానికే వెళ్ళాలి.
HAB 2:15
94ఒక రోజున ఒక పెద్ద మనిషితో మాట్లాడాను. ఒక చిన్న బాబు కొట్టులోకి వచ్చెను. టుసానులో అక్కడ నేను కొన్నిప్రత్యేకమైన అల్పాహారం కొరకు కొనడానికి వెళ్లాను. మరియు అక్కడ ఒక చిన్న బాబు నిల్చుని సిగరెట్లు కొంటున్నాడు. అన్నాను, "ఇవి ఎవరి కొరకు, మీ తల్లికా?"
అనెను,"కాదు". అనెను, "అక్కడ కూర్చున్న బాబు కొరకు"
అన్నాను, "అతడు పెద్దవాడా"?.
అతడు అన్నాడు, "ఔను".
ఆ నిత్యవసర వస్తువులు అమ్మేవానితో నేను అన్నాను, నేను అన్నాను, "అతను ఎన్నటికీ పెద్దవాడు కాదు". చూశారా.
కానీ మీరు….. అది సరైనదని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. పొగ త్రాగటం ప్రజాదరణ పొందెను. మరియు సంఘములో కేవలం సాంప్రదాయమైన దానిని అభ్యాసం చేస్తున్నారు, కేవలం నవీనమైన త్రాగుడు. ఓహ్, మంచి కొరకు? ఎక్కడి నుంచి మీరు ఆ విధమైన చెత్త ఎక్కడి నుంచి మీకు వచ్చెను?. అది వ్యవస్థ నుంచి వచ్చినది…దేవుని వాక్యం నుంచి కాదు. ఆయన త్రాగడమే కాకుండా పొరుగువానికి కూడా ఇస్తాడు. చూశారా? ఇది నిజం. ఇది హాలీవుడ్ అందాలతో మన దేశమును నాశనం చేస్తుంది మరియు చిన్నాభిన్నంచేస్తుంది. అటువంటి గందరగోళమైన పరిస్థితులలోనికి మనం రావలసి వచ్చింది. ఇక్కడ మనం అటువంటి పరిస్థితిలో ఉన్నాము.
95ఈ పెద్దమనిషి నాతో అన్నాడు, అతడు అన్నాడు, "మంచిది", అన్నాడు, "నేను వారి కొరకు బాధపడుతున్నాను" అన్నాడు. "మేము బయటకు వచ్చుటకు అది మాకు చాలా కష్టతరమైనది. అది కష్టమా….బయటపడుటకు నీకు అది కష్ట తరము కాదా?"
నేను అన్నాను, "నేను ఎన్నడూ ప్రారంభించలేదు".
ఆయన అన్నాడు," ఓహ్, నీవు పొగ త్రాగవు" అన్నాడు, "నేను నిన్ను చూసి ఆశ్చర్యపడుచున్నాను" అతడు డబ్బై సంవత్సరములు వయసు గలవాడు.
నేను అన్నాను, "ధన్యవాదములు"
ఆయన అన్నాడు, "నాకు విస్కీ ఇష్టం."
మరియు నేను అన్నాను, "నేను త్రాగాను."
అతడు అన్నాడు, "మంచిది దానిని నేను ఆశ్చర్యపడుచున్నాను." ఒక మనిషి ఇంటికి వచ్చి మరి ఒక గ్లాసు బీరు తాగాలని అనుకున్నట్లయితే", అన్నాను, "అది పర్వాలేదు కానీ ఈ స్త్రీలను మీరు తీసుకెళ్లి మరియు వారు అక్కడ వీధులలో ఉండి మరియు త్రాగుతూ మరియు చుట్టూ పరిగెడుతూ…వారి భర్త పని చేస్తే, మరియు అప్పుడు వారు కారు తీసుకుని మరియు బయటకు వెళ్ళును".
నేను అన్నాను, "వారు ఎన్నడూ స్త్రీని వాహనం నడిపే చక్రం (స్టీరింగ్) వెనుక ఉండనివ్వరు" బాలుడా, అక్కడ నేను ఉండినట్లయితే, ఆమె దానిని చేయదు నేను దాని గూర్చి ఏదైనా చెప్పినట్లయితే గనుక.
96వారు అంటారు స్త్రీలు అత్యంత సురక్షితమైన డ్రైవర్లు అని. నేను అంతర్జాతీయ ప్రయాణికుడిని. నేను మరియు నా కుమారుడు ఈ దేశములో ప్రయాణిస్తూ కారులో ఒక పుస్తకమును ఉంచాము మరియు ప్రతిసారి రోడ్డు మీద ఒక చిన్న గందరగోళం జరిగినప్పుడల్లా, మేము అది "పురుషుడు" లేక "స్త్రీ" అని గుర్తు వేసేవారము. 300లో 281 మంది స్త్రీ ద్వారా, పంతొమ్మిది మంది పురుషుల ద్వారా జరిగినవి. అది నిజం.
అక్కడ ఆమె అక్కడ ఆమె కూర్చున్నా కూడా ఆమె జుట్టు పైకి తోసుకుంటూ మరియు ఆమె ఆ విధంగా తిప్పుతూ మరియు ఎడమవైపు తిరుగుతూ మరియు ప్రతీది ఆ విధంగానే. కానీ పోలీసులు ఆ విధంగా చెప్పరు. పోలీసు శాఖలో కూడా వారే ఉన్నారు. ఎంత అవమానము!
1TIM 2:13,14
97ఎప్పుడైతే స్త్రీ వంటగదిలోని బల్ల వెనుక నుండి బయటకు వచ్చి మరియు తన ఇల్లు చక్కబెట్టుకోకుండా తన సొంత చిన్న పరిచర్యను (దేవుడు తన పిల్లలను ఆమెకు ఇచ్చెను) విడిచిపెడుతుందో, ఆమె దేవుని చిత్తమునకు బయట ఉండును.
బలిపీఠంపై ఆమెను ఉంచడం ఆమె దేవుని చిత్తమునకు వెలుపల ఆమెను ఉంచుటే. స్త్రీ ప్రసంగీకురాలి కొరకు ఏ లేఖనం లేదు దాని కొరకు నా యెదుట చెప్పే ఒక వ్యక్తి నాకు కావాలి. అటువంటిది ఏదియు లేదు. అది ఆ విధమైన కార్యానికి పెంతెకొస్తే మొదటి అడుగు వేసింది. ఆదాము మొదట నిర్మించబడెను, తరువాత అవ్వ. ఆదాము మోసపరచబడ లేదు. కానీ ఇది మీరు చేసినప్పుడు, మిమ్ములను మీరు ఎక్కడ కనుగొంటారు? కొమ్మ చివర నీవు ఇప్పుడు ఉండి అక్కడి నుండి వెనుకకు ఇప్పుడు రాలేవు. కానీ అక్కడే లోకము ఉన్నది. అదే మీకు కావలసినది. అదే మీరు పొందుకొనినది, చూసారా.
HEB 11:10
98మీరు కానీ ఎవరైతే కట్టువాడు మరియు నిర్మాణకుడు దేవుడే అయిన రాజ్యం కొరకు చూస్తారో, మనం రాజ్యమును పొందుకుంటాము. మనం సంఘ శాఖ కొరకు చూడటం లేదు. మనం చూడట్లేదు….ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, వారు వారి సంఘశాఖ మేధావి కొరకు చూడటం లేదు. మనం ఏదో గొప్ప పెద్ద గణితమును చెప్పేవారు ఇక్కడ నిలిచి మరియు మనకు ఏ విధంగా ఎక్కువ సంఖ్యలు చేయాలి మరియు మొదలగునవి చెప్పే వారి కొరకు చూడటం లేదు; మరియు వీధిలోనికి వెళ్లి మరియు మీరు చనిపోయేటంతగా సభ్యులను లోపలికి తీసుకువచ్చే పని చేసేవారి కొరకు చూడటం లేదు. మీరు ఏమి పొందారు? మీరు ఎక్కువ పందులను సాలలోనికి తీసుకు వస్తున్నారు. అదియే మరియు మీరు అతడిని అక్కడికి వెళ్లినప్పుడు మీరు ఏమి పొందుతున్నారు? బురదను చిందించుట. ఖచ్చితముగా వారిని రాజ్యములోనికిపైన దేవుడు జన్మింపజేసాడు. ఖచ్చితంగా అది నిజం.
MATT 23:15
99ఒక బాలుడు బాబ్ జోన్స్ ఏమి చేసాడో చెప్తూ, బిల్లీగ్రాహంను ఇలా అడిగాడు…. ("పోస్టు"లో మీరు దీనిని చదివారని నేను అనుకుంటున్నాను) బాబ్ జోన్స్ తన గురించి చెప్పుకొనుటకు దేవుని రాజ్యము కొరకు చాలానే చేశాడు. కాదా? కానీ బాబ్ జోన్స్ పది లక్షల సంవత్సరములు ఇక్కడ ఉండి సేవ చేస్తే ఎంత చేయగలడో దానికన్నా, ఈ కొద్దిసంవత్సరములలో బిల్లీ గ్రాహం ఎక్కువే చేశాడు. అది నిజము. కానీ అతడు ఏమి చెప్పాడు? " బిల్లీ గ్రాహం అది విని ఏమన్నాడంటే, మంచిది, అతడు వారిని ఏ సంఘ శాఖ దగ్గరకూ తీసుకు వెళ్ళలేదు". దానినిబట్టి దేవుడు ఆయనను దీవించును గాక. అవునయ్యా.
మీరు ఏమి చేస్తున్నారు? మీరు అతడిని లోపలికి తీసుకువచ్చి మరియు అతడు ఉన్న దానికన్నా రెట్టింపు నరకపాత్రునిగా చేయుదురు. మీరు అతడిని వీధిలో నుంచి తీసుకువచ్చిన దానికంటే, శిష్యులు వారిని ఎన్నడూ ఏరకమైన సంఘశాఖకు తీసుకు వెళ్లలేదు. వారు వారిని పరిశుద్ధాత్మచేత నింపబడునట్లు చేసి మరియు దేవుని రాజ్యములోనికి తీసుకువెళ్లారు. మరియు అక్కడ పరిశుద్ధాత్మ వారిని స్వాధీనం చేసుకొనెను. అవును, అయ్యా.
ఇప్పుడు. వారన్నారు అతడు సంఘమునకు తీసుకోకుండా రుణం ఉండెను. వారిని అందరిని సంస్థకు వెళ్లనివ్వండి. వారందరూ బాబ్ జోన్స్ కళాశాలకు చెందిన వారిగా ఊహించండి, చూశారా. అప్పుడు వారు నిజముగా పరిధికి బయట ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని పిలిచి….మౌలిక వాదులు అని పిలవబడే వారు మరియు అక్కడ ఈ పనికిరానిది అంతా- ఇదంతయూ బుద్ధిహీనత.
REV 11:15
100మనం దేని కొరకు చూస్తున్నాము, స్నేహితులారా? మనం ఏమై ఉన్నాము? నిజ సంఘం సంఘ శాఖ కొరకు చూడదు. అధ్యక్షుని కొరకు చూడటం లేదు. పైకి లేవనెత్తి మేధావి కొరకు చూడటం లేదు. కానీ వారు రాజ్యం కొరకు మరియు రానైయున్నా రాజు కొరకు చూస్తున్నారు. రాజ్యం అనగా ఏమిటి? అది భూమి పైనే ఉన్నది. అది ఆత్మ. క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శరీరమైయున్నది. దానిలో ప్రెసబిటేరియను, మెథడిస్టులు, పెంతుకోస్తులు, మరియు ప్రతి ఒక్కటి బయటకు వచ్చిరి. వారు అక్కడ జన్మించిరి. వారు అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా వచ్చిరి. మరియు వారు ఈ రాజ్యంలో ఉండిరి. మరియు మనం ఈ రాజ్యంలోకి రానైయున్న రాజు కొరకు చూస్తున్నాము. అప్పుడు తన రాజ్యము ఆయన ఇక్కడ భూమిపై స్థాపించును. ఆయన సింహాసనం పై దావీదు సింహాసనం ఆయన నిరంతరము పరిపాలన చేయును. సంఘము చూచునది.
EPH 2:6•
HEB 13:8
101మరియు దానిని గూర్చిన మంచి విషయం ఆలోచించుట ఇదియే స్నేహితులారా: ఈ రాజ్యమునకు మనం వచ్చు మునుపు ఈ రాజు వచ్చే ముందు ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కూర్చునియున్నాము- నేడు భూమిపై ఉన్న ఇతర అన్నిఅవినీతి అంతయూ, మరియు అన్ని టెలివిజన్ కార్యక్రమములు, అన్ని లోకం యొక్క పాడైపోయిన సంగతుల నుండి పైకెత్తబడుదుము. మరియు అన్ని కుళ్లిన కలుషితమైన మరియు వ్యవస్థలు మరియుప్రతీదీ. పరలోక స్థలములలో పైకెత్తబడును. మరియు పరిశుద్ధాత్మ తానే మన పైకి వచ్చి మరియు మాట్లాడి, మరియు మన పాపములను చెప్పి, మరియు ఏ విధంగా సరి చేసుకోవలెను మనకు తెలియజేసి …మరియు జీవితములో మనం ఏమి చేసామో, మరియు మనం ఏమి చేస్తున్నామో తెలియచేయును. అదియే పరిశుద్ధాత్మ… యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండును. ఒక దినమున తన రాజ్యమునకు వచ్చు రాజు ఆయనే మరియు ఆయన రాజ్యము ఇక్కడ భూమిపైన ప్రజల హృదయములలో ఇప్పుడు స్థాపింపబడియున్నది.
102దేవుడు మిమ్మల్ని దీవించును.
నేను ఒకవేళ… దీని తర్వాత మీరు నావలె ఉండకపోవచ్చు. చూశారా. మీరు నా వలే లేరు కానీ ఒక రోజున అది సత్యం అని మీరు గ్రహించెదరు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును. నేను మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచబోను. కానీ దీనిని మీరు జ్ఞాపకంచేసుకోవాలని నేను కోరుతున్నాను. మనం రాజ్యము కొరకు చూస్తున్నాము. మరియు ఇప్పుడు మనం కదల్చబడని రాజ్యమును పొందుతాము. మనం మన హృదయములలోనికి ఒక…. పొందుకుంటాము. పాతాళములోని ఏ దయ్యము దానిని కదిలించలేదు. ఏదీ లేదు.
103అక్కడ ఉన్న ఈ పెద్దమనిషి ఒకరోజు అన్నాడు, "మంచిది," అతను అన్నాడు, "నేను నీకు చెపుతాను". అతడు అన్నాడు, "అది ఏమిటి ఇక్కడ ఉన్నది అయ్యా". (నేను అతనికి చెప్పాను, "నేను సేవకుడినని ఆ కారణంచేతనే నేను పొగ త్రాగను మరియు త్రాగను, మరియు మిగిలినవి చేయను అని.) ఆయన అన్నాడు, "మంచిది నేను దాని గూర్చి మెచ్చుకుంటాను". ఆయన అన్నాడు, "అది సరియే". నేను అన్నాను."నేను పోలీసు బలగంలో ఉన్నప్పుడు ప్రతీదీ," అన్నాడు, "కానీ బాల్య నేరము నేడు మనం పొందినది అంతా అదియే."
నేను అన్నాను, "అయ్యా నేను మిమ్మును వ్యతిరేకించాలి అని కోరుకోను" కానీ, నేను అన్నాను, "అది బాల్య నేరం కాదు. అది తల్లిదండ్రుల నేరం". తల్లిదండ్రులే నేరస్తులు. అది సరియే. వారి పిల్లలను ఆ విధంగా చేయనిచ్చుటవారికి ఏది అవసరమనగా…. మీరు ఏమి చేసారు? మీరు బైబిల్ కు బదులుగా టేబుల్ పైన "నిజకధ" పత్రికను ఉంచుతారు. ప్రార్థన కూడికలకు బదులుగా మీరు వేరే దానికి పరిగెడతారు. మరియు వేరే పని చేస్తారు. నేడు లోకములో జరుగుచున్న సంగతి అదియే. మన క్రైస్తవులని పిలవబడుచున్న వారితో ఉన్న సంగతి అదియే. నాట్యం చేయుట, పార్టీలో, మరియు సామాజిక త్రాగుడు, మరియు ఓహ్, ప్రతీది, చూశారా. అది తల్లిదండ్రుల నేరము. బాల్య నేరము కాదు. తల్లి తండ్రి నేరము చేయుట-అది ఒక్కటే.
గమనించండి.
104నేను అన్నాను, "ఏమి జరిగెను అయ్యా"? నేను అన్నాను, "మీరు ఇక్కడ నిల్చున్నారు, మనం ఇద్దరు మనుషులము. జీవితములో ఇంతకు ముందు ఎన్నడూ కలుసుకోలేదు. మీరు (అతడు చెప్పాడు అతను డబ్బై సంవత్సరముల వయస్సు గలవాడని, ఆ వైపునకు పని చేస్తూ ఉంటాడని.) నేను అన్నాను, "నేను సేవకుడను". మరియు నేను అన్నాను, "మీరు భూమి యొక్క పౌర చట్టములకు ప్రతినిధి. నేను భూమి యొక్క న్యాయ చట్టములకు ప్రతినిధులు". మరియు నేను అన్నాను, "ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నీ పౌర చట్టము మీరినట్లయితే, ఏమి జరుగును? మీరు అతడిని చెరసాలలో ఉంచుతారు. ఉంచరా?. వారు పౌర చట్టములను మీరినట్లయితే మీరు తిన్నగా వారిని చెరసాలకు పంపుతారు.
అతడు అన్నాడు, "అది నిజం."
నేను అన్నాను, "వారు ఈ చట్టములను మీరితే వారు నరకానికి వెళ్లును." నేను అన్నాను, "ఒక న్యాయమైన న్యాయవాది ఎవరైతే దేవుడు అతని వాక్యముపై……వారి కేసులు దేశపు చట్టములపై ఆధారపడును. మరియు వారు దోషి అని దొరికితే, అప్పుడు ఏదీ ఉండదు. కానీ జరిమానా చెల్లించవలెను. మరియు ఏదైనా చట్టమునకు జరిమానా లేకపోతే అది చట్టం కాదు నిజము". మరియు నేను అన్నాను, "దేవుని చట్టం, ఆయన వాక్యము అతిక్రమిస్తే. అది ఆయన సన్నిధి నుండి నిత్యవేరుపడుటయగును. నేను అన్నాను, "ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మీరు చూడండి."
ఆయన అన్నాడు, "ప్రభువు నిన్ను దీవించును. నీవు ఎక్కడ ప్రసంగిస్తావు?".
మరియు నేను అన్నాను, "ఎక్కడైనా తెరచిన ద్వారము నేను పొందితే".
అక్కడే మీరు ఉన్నారు, చూడండి. ఆ కాలపు వృద్దుడు, చూశారా, మరియు ఆ సమయమును చూచుట. దేవుని చట్టములను అతిక్రమించుట, అనగా ఆయన వాక్యమును అతిక్రమిస్తే, నీవు నరకమునకు పాత్రుడవు. దానికి అంతా అక్కడ అదియే. దేవుడిని సేవించుము.
ఇప్పుడు,
105ఈ రాజ్యములోనికి మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా వచ్చాము. మరియు దానిలోనికి మనం వచ్చినప్పుడు, వేషధారిగా రాలేదు. కొంత…ఇప్పుడు నేను కాదు…. ఇప్పుడు మీరు…
ఇది మీ మనసులోనికి తీసుకోవద్దు. ఇప్పుడు నేను…."సహోదరుడు బ్రాన్హామ్ మీరు భాషలలో మాట్లాడుటను విశ్వసించడు." మీరు భాషలలో మాట్లాడుటను నేను విశ్వసిస్తాను. కానీ భాషలలో మాట్లాడినను, దానిని పొందని వారిని చూడండి. చూడుము. వారు ప్రవర్తించే విధానమును చూడుము. మరియు వారు చేసే పని చూడుము. మీరు దానిని పొందుకోలేదని మీరు చెప్తారు.
"మేమే సంఘము" అని చెప్పుకునే సంఘములను నేడు చూడండి. వారిలో ప్రతి ఒక్కరూ "మేమే సంఘము" అంటారు. ఒకే ఒక సంఘము ఉంది, మరియు అది క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శరీరము. మీరు అక్కడ ఉండి పరిశుద్ధాత్మచేత అక్కడ బాప్తిస్మం పొందితే మరియు అది మీ మొత్తం స్వారూప్యమనే మార్చును.
106కొద్దికాలం క్రితం …నా మనసులోకి ఒక విధమైనది వచ్చినందున నేను దీనిని చెప్పుచున్నాను. గత వేసవి నా భార్య మరియు…. కూడికల నుండి నేను ఇంటికి వచ్చాను. మరియు మేము నిత్యావసర వస్తువులు తెచ్చుటకు వెళ్ళాము. స్కర్ట్ వేసుకుని ఉన్న ఒక స్త్రీని మేము కనుగొన్నాము. మన దేశంలో అది విచిత్రమైన సంగతి. వారు అందరూ దిగంబరులు. కనుక అప్పుడు మేము ఆ స్త్రీని చూసాము. మరియు ఆమె అన్నది, ఆ విధంగా చెందిన స్త్రీతో కొందరు బృందంలో పాడుటను అక్కడ సంఘములో కూడా మేము గుర్తించాము.
మరియు ఆమె అన్నది, నా భార్య అన్నది, "బిల్లీ ఆ స్త్రీలను ఏది ఆ విధంగా చేసెను?" అన్నది, "ఎందుకు వారు అట్లు చేయుదురు" అన్నది, "మన ప్రజలు…..అన్నది, "ఎందుకు ఆశ్చర్యము"?
నేను అన్నాను, "మనం ఆలాగు కాదు, మనం ఆరాజ్యమునకు చెందము!"
మరియు ఆమె అన్నది, "మంచిది…" .
నేను అన్నాను, "వారు మనవంటి ప్రజలు కారు".
మరియు ఆమె అన్నది, "ఏమిటి మీరు అనేది"? అన్నది, "మనం అమెరికన్లము కామా"?
నేను అన్నాను, "ఓహ్, కాదు. లేదు, అయ్యా". నేను అన్నాను, "నేను జర్మనీ వెళితే జర్మనీ ఆత్మను కనుగొంటాము. ఒక దేశపు ఆత్మ. నేను స్వీడన్ వెళితే నేను స్వీడిష్ ఆత్మను కనుగొంటాను. నేను భారతదేశం వెళితే నేను ఆ దేశపు ఆత్మను కనుగొంటాను. మీరు అమెరికా వస్తే మీరు రిక్కి- ఆ విధమైన ఆత్మను కనుగొంటారు. అది అంతా అదే అనే అందరూ ఎరుగును.
107వారు ఇతర దేశమునకు వచ్చినప్పుడు వారిని గమనించండి. వారు ప్రవర్తించే విధమును బట్టి మీరు అమెరికన్ అని ఆలోచించడం కూడా మిమ్మల్ని జబ్బుకు గురిచేయును. అది నిజం. అత్యంత అసహ్యకరమైన ప్రవర్తన గల ప్రజలు—అత్యంత అవమానకరమైన విద్య కలిగిన మూర్ఖులు. అది నిజము. మరియు ప్రపంచం అంతటికీ అది తెలుసు.
మనం మన స్నేహమును మన డాలర్లతో కొనుటకు ప్రయత్నించుటలో ఆశ్చర్యము లేదు. మీరు స్నేహమను కొనలేరు. ఇప్పుడు ఒక…వారు …మన దేశము వేళ్ల వరకూ కుళ్ళిపోయెను. అది నిజం. దాని కొరకు ఆశ లేదు. అది అంతా పోయెను. ఒకే ఒక సంగతి ఎదురు చూసేది ఉంది: ప్రభువు యొక్క రాకడ. నిజము.
ఆమె అన్నది, "మంచిది, మనం అమెరికన్లముకామా?".
నేను అన్నాను, "లేదు మనము ఇక్కడ జీవిస్తున్నాము. మనము ఇక్కడ జీవిస్తున్నాము. ఇక్కడ వారము కాదు…". నేను అన్నాను, "ఎందుకు ఆ ప్రజలు అమెరికన్లని నీవు చూస్తావు? వారు అమెరికా ఆత్మను కలిగి ఉన్నారు. వారు హాలీవుడ్ వలె ఉంటారు. అది అమెరికాను పరిపాలిస్తుంది. తన దుస్తులు ధరించు విధము, తన ఫ్యాషన్, తన దేవత, మరియు ఇతరమైనవి. అది ఖచ్చితంగా వారు చేయు దానివలే". నేను అన్నాను, "వారు అమెరికన్లు. మనం పైనుంచి వచ్చిన వారము. మన సంఘంలోని స్త్రీలు దానిని చేయరు. వారు పరిశుద్ధముగా, శుభ్రంగా జీవిస్తారు".
108ఆ విధంగా దుస్తులు ధరించి మరియు వీధిలోకి వెళ్లే స్త్రీని మీరు తీసుకోండి. మీరు ఎంతో నైతిక విలువలతో జీవించుటకు ప్రయత్నించినా నేను లెక్క చేయను, కాలము అంతమున నీవు వ్యభిచారినిగా పిలవబడతావు. ఎవరైనా ఒక పురుషుడు కామముతో నీ వైపు చూస్తే, మరియు అతనికి నీ ప్రతిపాదనను చూపిస్తున్నావు. వ్యభిచారం చేసినందుకు నీవు దోషి అగుదువు. యేసు అలాగే చెప్పెను, నీవు భర్తకు లేక మగ స్నేహితునికి ఉండగలిగినంత నమ్మకముగా ఉండవచ్చు. కానీ నీవు ఆ విధంగా దుస్తులు ధరించినట్లయితే, ఒకపాపి నిన్ను చూస్తే తీర్పు దినమున అతడు దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. మరియు నిన్ను నీవు కనపరచుకున్నావు.
శుభ్రపడండి. స్త్రీలారా! దేవుని వద్దకు తిరిగి రండి. అది ….వారు మిమ్మును గూర్చి ఏమి అన్నా నేను లెక్క చేయను. దేవుని యొద్దకు తిరిగి వెళ్లుము! స్త్రీ ఒక స్తంభమువలె ఉంచబడినది. ఆమె దేశానికి వెన్నెముక మరియు ఇప్పుడు, ఆమె ఎక్కడ ఉన్నది? ఆమె దానిని తనంతట తానే తెచ్చినది. ఆమె వారితో మాట్లాడటానికి వారు కనీసం తమ టోపీలను కూడా తీయుటలేదు, లేక ఏమీ చేయడం లేదు. కేవలం అది అటువంటి పరిస్థితి. వారు ఎందుకు అలా చేసిరి ? వారి కొరకు వారే ఆ పరిస్థితిని తెచ్చుకొన్నారు.
అది ఎక్కడ ప్రారంభమయ్యెను? ఒక రిక్కి ఒక విధమైన సెమినరీ అనుభవంతో బలిపీఠం వెనుక ఉండి, ఏదో ఒక సంస్థకు తోలుబొమ్మగా ఉండి, దైవజనుడు ఆ వాక్యము తీసుకొనుటకు బదులుగా మరియు దానిని ముక్కలుగా చేయును. అది నిజము. అదే మన సంఘములో మనం పొందినది.
1THS 5:2•
2PET 3:10
109దేవా కృప చూపుము!
ఈ రాజ్యమునకు మనం వెళ్ళాలి. మనము ఎక్కడ కనుగొన్నామో అక్కడికి వెళ్లాలి. మరియు ఆ రాజ్యం కొరకు మనం జీవించాలి. అప్పుడు మీ తలంపులు పరిశుద్ధముగా ఉండును. మీ క్రియలు లేక ఆలోచనలు పైవైపుగానే, మీ స్వాస్యము ఎక్కడ నివసిస్తున్నదో అక్కడనే ఉండును. మన తలలు వంచుదాము.
గంభీరంగా నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. మీలో కొంతమంది ఈ రాత్రి తిరిగి వెళ్లకపోవచ్చు కూడా. ఈ భూమిపైన మిమ్మల్ని చూచుట ఇదే నా ఆఖరి సమయం అయి ఉండవచ్చు. యేసు రాత్రికి ముందే రావచ్చు. రాత్రికి మునుపే విపత్తు కలగవచ్చు. అది మీకు తెలుసా? ఏ సమయములోనైనా అది జరగవచ్చు. సంఘము యొక్క రహస్యమైన రాకడ.
మీరు అంటారు, "సహోదరుడా బ్రాన్హామ్, కొద్దిసేపటి క్రితం మరియు మీరు అన్నారు, "సంఘము వెళ్ళును, మరియు మనం ఎరుగము"? ఓహ్, అవును. బైబిలు దానిని చెప్పెను. లేదు, వారు దాని గూర్చి ఏమీ ఎరుగరు. అది ఒక రహస్యమైన రాకడ. ఆయన రహస్యముగా వచ్చి మరియు ఆయన యొక్క సంఘమును దొంగిలించి, ఆమెను తీసుకుపోవును. నేను పుస్తకమును ఒకసారి చదివినట్లుగా, రోమియో మరియు జూలియట్, చూడండి. ఆయన ఆమెను తీసుకొనుటకు వచ్చును. దానిగూర్చి ఎవరూ ఎరుగరు.
110లోకము…అనును, "మంచిది దీనిలో నుండి రెండు లేక మూడు…. అనును, ఎవరో వచ్చి గత రాత్రి తప్పిపోయిరి మరియు దేశం నందు రెండు లేక మూడు మంది అదియే ఆయన చెప్పినది జరుగును.
"ఓహ్, వారు ఎక్కడికో వెళ్లిపోయారు".
"వారు…ఒక అమ్మాయి తప్పు చేసెను, ఆమె పారిపోయెను".
"ఒక మనిషి, అతడు ఎవరో ఒకరి భార్యతో పారిపోయెను ". వారు ఎత్తబడెను. దాని గూర్చి వారు ఏమీ ఎరుగరు. వారిలో వందల మంది ప్రతీదినము వెళ్ళును. మరియు దాని గూర్చి వారు ఏమీ ఎరుగరు.
అది జరిగే సమయముకు ముందే, ఎందుకు నీవు దేవునితో సరి చేసుకోవు? "నేను తీర్పు వద్ద మిమ్మల్ని కలుసుకుంటాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను పెంతెకొస్తు ప్రజలను తిట్టను ఎందుకనగా… నేను మీకు రుణపడి ఉండటానికి ఎన్నడూ మీలోకి రాను. నేను వచ్చినది ఎందుకనగా దేవుడు నన్ను పంపెను ప్రభువైన యేసు నామమున నేను వచ్చాను. నేను ఎప్పుడైనా తప్పు ఏదైనా మీకు చెప్పానా? మీ నాయకులు ఎవరైనా లేచి నేను తప్పు అని నాతో చెప్పుటకు ఎప్పుడైనా ప్రయత్నించారా? దాని రుజువు చేయమని నేను వారిని అడుగుతున్నాను. దానికన్నా బాగా వారికి తెలుసు. అది నిజము.
ఇప్పుడు మీరు…. మీలో అనేకమంది కూడికలలో ఉన్నారు. మీకు తెలుసా… ఈ నగరానికి దాని అవసరత ఉంటే తప్ప ఈ ఉదయమున నేను దీనిని చెప్పను. అది అంతా ప్రతీదానికి ఇచ్చెను. అసహ్యత మరియు చెడుగు. మీకు క్రీస్తు అవసరము.
111మీ స్వారూప్యం మార్పు చెందగా, నిజమైన దేవుని రాజ్యం స్వీకరించుటకు మీరు ఇష్టపడుతున్నారా? మీరు రూపాంతరం చెంది, మరియు మీరు క్రొత్త సృష్టి అయ్యారు. జీవం యొక్క, నిత్య జీవం యొక్క వికసించిన సంపూర్ణత మీలో ఉన్నది. లోకపు సంగతులు చనిపోయెను. ఏ బలిపీఠము పిలుపునకు రమ్మని నేను మిమ్మల్ని అడగను. మీ యదార్థత కొరకు నేను మిమ్మల్నిఅడుగుతున్నాను. నేను ఆరాధన ముగిస్తుండగా మీ కొరకు ప్రార్థన చేయమని మీరు నిజంగా కోరితే, మీచేతిని పైకెత్తి చెప్పుము, "నా కొరకు ప్రార్ధించుము సహోదరుడా బ్రాన్హామ్" దేవుడు మిమ్మల్ని దీవించును. మంచిది దాదాపు తొంబై శాతంపైగానే.
MATT 11:7-10•
LUKE 7:24-26
112మా పరలోకపు తండ్రీ, నేను కళ్లను మూయుటకు ముందు నేను చూసి ఉండగా, ప్రభువా, మరియు ఈ ప్రజలను ఇక్కడ చూడగా, పత్రికలో ఈ ప్రకటనను టోనీ ఫాంటైన్ కథ అందగత్తెలు, జిమ్మిక్కులు, వేదిక పైన నాట్యములు, సంగీతము, స్త్రీ పురుషుల అనైతిక వస్త్రధారణ… యేసు చెప్పినట్లుగా, "మీరు ఏమి చూడవెళ్లితిరి?యోహానును చూచుటకు వెళ్ళినప్పుడు? సన్నపునార వస్త్రం ధరించుకొనినవాడనా? (చుట్టబడినకాలర్లు మరియు మొదలగునవి ) కాదు," అన్నాడు, "వారు రాజ గృహములలో ఉందురు.గాలికి కదులుతున్న రెల్లును చూడ వెళ్లితిరా? (ఎవరైనా కోరుకుంటే ఒక సంస్థ మిగిలిన వాటికన్నా కొంచెం ఎక్కువ ఇస్తుంటే, మరియు మీరు దాని వద్దకు వెళతారు) యోహానుకాదు. ఆయన గాలికి కదులుతున్న రెల్లు కాదు. ఆయన దేనికీ రాజీ పడలేదు. అన్నాడు, "మరి మీరు ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అన్నాడు,"నేను మీకు చెప్పుచున్నాను, "ప్రవక్త కంటే గొప్పవాడను."
HEB 13:8
113ఓ తండ్రియైన దేవా, సంఘ సంస్థకు ఏ నిరీక్షణలు విడిచిపెట్టబడలేదని మేము గ్రహిస్తున్నాము. ప్రభువా, అది పోయెను. ఆదిలో అది మీ చిత్తమునకు వ్యతిరేకము. దేశమునకు నిరీక్షణ లేదు. అది పోయెను.
ఈ దేశము ఇశ్రాయేలుకు పరిపూర్ణ మాదిరిగా ఉండుటను మేము చూసాము: మనము వచ్చినప్పుడు అమెరికన్ ఇండియన్లను బయటకు వెళ్ళగొట్టినట్లుగానే, ఇశ్రాయేలు స్వదేశమునకు వచ్చినప్పుడు అక్కడి నివాసులను వెళ్ళగొట్టెను. ఆ దినములలో వారు దావీదు, సొలొమోను, యెహోషువ వంటి గొప్ప వ్యక్తులను కలిగి ఉన్నట్లుగానే… అలాగే మనము ఇక్కడకు వచ్చి, ఇక్కడి నివాసులను వెళ్ళగొట్టి, మన దేశమును, మత స్వాతంత్ర్యం మీదుగా మన ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకున్నాము, కాగా మనము ఆచారాలు మరియు కార్యములతో నియంత్రించబడుతున్నాము. మనకు కూడా వాషింగ్టన్, లింకన్ వంటి గొప్ప వ్యక్తులు కలరు.
కానీ చివరికి, సంవత్సరములు గతించగా వారు చివరికి రంగులు వేసుకున్న యెజెబేలును కలిగియున్న ఆహాబును ఎన్నుకొనెను. లోకమునకు ఫ్యాషన్లు యెజెబెలే ఏర్పరచెను. కాగా మనము కూడా అదే కార్యమును చేసాము. మరియు ఇప్పుడు అదే పరిస్థితి నెలకొని ఉండుట మేము చూసాము. ఆ దినమున ఏలియా నిలబడి, మరియు దానిని ఖండించుటను మీరు కలిగియుండిరి. ఓహ్, అతడిని వారు ఎట్లు అసహ్యించుకొనిరి? కానీ ఆయన నిలబడెను. అతని స్వరము తీర్పు దినమున ఇంకనూ నిలబడి ఉండును.
తండ్రీ, ఏలియాను మాకు పంపుము. పరిశుద్ధ గ్రంథపు స్వరమును, దేవుని స్వరమును మాకు పంపుము. మరియు దానిని రుజువు పరచుము. మరియు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండి, అదే కార్యమును చేసే దేవుడు మీరు అని రుజువు చేయుము. ప్రజలు దానిని తెలుసుకొని, ఏ సంకోచం లేకుండా అది సత్యమని వారు చూడాలి. మరియు ప్రజలు…. బావి వద్ద ఆ చిన్న స్త్రీవలే అన్ని విధములైన కార్యములలో కలిసిపోయినట్లు, కానీ ఆ వెలుగు ఆమె నడుస్తున్న ఆ చిన్న మార్గం గుండా తాకినప్పుడు, ఆమె ఒకదానిని చూసెను. ఆమె ఇక ఎంత మాత్రమూ ఆ విధంగా ఉండలేదు. ఆమె ముందెన్నడూ దర్శించని ఊట యొద్దకు ఆమె వచ్చెను.
114నేడు అనేకమంది ఆ ఊట తెరవబడుటను చూచులాగున, మరియు నమ్మి మరియు దానిని పొందుకొను ప్రతివారికి దేవుని వాక్యం ఇంకనూ ప్రభావితంగా ఉండుటను నేడు అనుగ్రహించుము, ప్రభువా. ప్రభువైన యేసూ, చాలా మంది చేతులు పైకి లేచెను. వారు తప్పనిసరి అవసరతలో ఉన్నారు. వారికి అది తప్పనిసరి అని నేను నమ్ముతున్నాను. నేను కష్టతరంగా అనుకుంటున్నాను ఎవరైతే ప్రజలు ప్రయత్నిస్తూ మరియు ఈ పెంతెకొస్తు కదలికలోకి వస్తున్నారు, ఎందుకనగా వారు ఈ ఫ్యాషన్లు మరియు పరిస్థితుల గుండా వచ్చి మరియు వారికి ఏమీ లేదని చూస్తున్నారు…మరియు వారు అదే విధమైన హాలీవుడ్ సమ్మేళనం, అదే విధమైన విద్యా కార్యక్రమం, బలమైన వ్యక్తులు, భూమి పైన మనం దానిని అలా పిలిచినట్లుగా తమను తాము కనుగొనుటకు, ఇక్కడికి వచ్చును. ప్రభువా, ఓహ్, ఎంత…దేవా, నీవు వారికి సహాయం చేస్తావా, తండ్రీ?
115మరియు నేను నమ్ముచున్నాను. అక్కడ ఏదో ఒకటి వారి చేతులనుపైకి ఎత్తేలా చేస్తే తప్ప, వారు వారి చేతిని పైకి ఎత్తరు. వారి చుట్టూ ఆత్మ ఉండెను. ఈ పురుషులు మరియు స్త్రీలు- వారిలో తొంబై శాతం మంది వరకూ. ప్రభువా- ఏదో తప్పిదం ఉందని వారు గ్రహించి, మరియు ఆ మార్గమును వారు కోరుకొనక ఉందురు. మరియు ఇప్పుడు, విజ్ఞాన శాస్త్రం ప్రకారం, వారు వారి చేతిని పైకి లేపరు. గురుత్వాకర్షణ ఆ చేతిని క్రిందకు పట్టి ఉంచును.
కానీ వారు విజ్ఞాన శాస్త్రం ధిక్కరించిరి. ఎందుకనివారు మానవులు మరియు వారు ఆత్మను కలిగి ఉన్నారు. అది ఆ చేతిని పైకి లేపే అధికారముతో ఉన్నది మరియు అది పైకి లేచును.
116దేవా, మీరు మనిషితో తన సొంత నిర్ణయాలు తీసుకునే నైతికతను దానం చేశారు.
మరియు ఇప్పుడు వారి ప్రక్కన ఆత్మ నిల్చుని వారు ఆరాధిస్తున్న ఆత్మ తప్పిదమైనదని వారికి చెప్పెను. మరియు వారు నిర్ణయమును కోరుకొనెను. మరియు వారి చుట్టూ ఉన్న ఆత్మ- పరిశుద్ధాత్మ- వారి చేతులను పైకి ఎత్తు లాగున చేసి మరియు "దేవా మాకు అనుగ్రహించుము" అని అనును. ప్రభువా, వారి హృదయములు నీకు తెలుసు.
పరిశుద్ధాత్మ ఎక్కడో ఆనకట్ట తెగినట్లుగా వేగముగావచ్చి, మరి ఆ వేగముతోనే నిలచునట్లు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఎదురు చూపులు, వారి ఆత్మలను దేవుని ప్రేమయొక్క నిజమైన అగ్నితో సజీవంగా ఉంచునట్లు, చనిపోవుతున్నమానవత్వం కొరకు అక్కడ మండుచు ఉండునట్లు చేయును. సంస్థ కొరకు కాదు కానీ, చనిపోతున్నమానవత్వం కొరకు. రాజకీయం కొరకు కాదు. సంస్థాగత లోకము చిన్నాభిన్నమవుటను వారు చూసినట్లుగా. రాజకీయలోకం పడిపోవుట వారు చూశారు. మరియు యు.యెన్. ఒక గొప్ప పెద్ద రబ్బర్ బుడగ. అది ప్రతి రాజకీయ సిద్ధాంతం యొక్క గాలితో చుట్టూ నెట్టబడుట ఒక మార్గమునకు మరియు వేరొక మార్గమునకు తోయుట.
మరియు, ఓ దేవా, వారు ఈ సంఘ సమాఖ్యలను చూసి వారు దానిని పిలిచిన విధంగా అది అక్కడే ఒక ఉచ్చులోకి కదులుట వారు చూశారు. ఒకసారి పురుగు సాలిగూడు అల్లుతున్న విధంగా.
HEB 13:8
117దేవా,పెంతెకొస్తు త్వరితముగా మేలుకొనునుగాక, ప్రభువా, వారు మేల్కొనే సమయం ఇదియే. ఇక్కడ ఈ చిన్న నగరాన్ని మేలుకొలుపుము ప్రభువా. ఇక్కడకూర్చున్న ఈ స్త్రీలను మేలుకొలుపుము. ఈ పురుషులను మేలుకొలుపుము. దానిని దాటి పోకు ప్రభువా, కేథలిక్ సంఘం పరిశుద్ధ పాట్రిక్ చనిపోయిన తర్వాత మేల్కొన్న విధంగా, ఏలియా దాటిపోయాక యూదుల సంఘం మేల్కొన్న విధంగా, తర్వాత అతడి సమాధిని శృంగారించినరీతిగా, జోన్ ఆఫ్ ఆర్క్ చనిపోయిన తర్వాత క్యాథలిక్ సంఘం మేల్కొన్న రీతిగా, అది వెళ్లిపోయిందని వారికి తెలియదు. కానీ అది వెళ్లిన తర్వాత, అప్పుడు వారు గ్రహించిరి. యేసు శిలువ వేయబడిన తర్వాత సంఘం మేల్కొన్న విధంగా అప్పటికే చాలా ఆలస్యమాయెను. వారు దానిని చేసిరి.
ఓ దేవా, పెంతెకొస్తుని మేలుకొలుపుము ప్రభువా. నేను వారిని ప్రేమిస్తున్నాను, ప్రభువా. వారు నా పిల్లలను పోషించిన వారు. వారికి సహాయం చేయుము. ప్రభువైన దేవా, దేవుని వర్తమానము వారి సంస్ధాగత శ్రేణులకు రాదు అని వారిని తెలుసుకొననిమ్ము. మీరు ఏమి కోరుకున్నారో దానిని లేవనెత్తుము. నీవు దేవుడవు. ఈ ఉదయము వారి ఆత్మలను కదిలించుము, తండ్రీ, మరియు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మరియు ఇప్పుడు మనం పరలోక స్థలములలో ఆయన సన్నిధిని కూర్చుని వాక్యం చేత ఎత్తబడ్డాము అన్న గ్రహింపునకు తిరిగివారిని తీసుకురమ్ము.
ప్రభువా, వారు నీ వారు. సరిగా నీకు కనబడే వరకూ నీవు వారిని సరిచేయము. యేసుక్రీస్తు నామమున వర్తమాన విజయ చిహ్నములుగా వారిని నీకు సమర్పిస్తున్నాను. ఆమెన్.
118నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? మన సహోదరి "నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను" అనే సంగీతమును మనకు ఇచ్చినట్లయితే, మీరు నా మీద కోపంతో ఉన్నారా? మీరు ఉన్నట్లయితే, ఇక్కడకు వచ్చి మరియు నా చేతిని కలపండి. మరియు మనం ప్రార్థిద్దాం. నేను మీకు నిజమే చెప్పాను, ఇది సువార్త యొక్క మరణిస్తున్న నిజం. ఒక దినమున మీరు దానిని అర్థం చేసుకుంటారు. దానిని ఇంకా ఆలస్యం చేయవద్దు. ఒక నిమిషం మనం నిల్చుందామా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను. (అలా మీరు చేసినట్లయితే మీ చేతులను పైకి ఎత్తండి), నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
నా రక్షణను కొనెను.
ఆ కల్వరి వృక్షముపైనే.
ఇప్పుడు, మెథడిస్ట్ బాప్టిస్ట్ దగ్గరకు వెళ్ళును. ఏకత్వం త్రిత్వము దగ్గరకు వెళ్ళును. మరియు చర్చ్ ఆఫ్ గాడ్ అసెంబ్లీస్ వద్దకు వెళ్ళును. దీనిని పాడుతూ ఉండగా, మనలో ప్రతి ఒక్కరూ, యదార్ధతతో దీనిని చెప్పుము, "సహోదరుడా, సహోదరి నేను నిన్నుప్రేమించుచున్నాను. నేను నీ కొరకు ప్రార్థిస్తాను. నీవు నా సహోదరుడవు మరియు సహోదరివి". ఇప్పుడు మరలా దానిని చేద్దాము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్నుప్రేమించెను
నా రక్షణను కొనెను.
ఆ కల్వరి వృక్షముపైనే.
ఇప్పుడు అసెంబ్లీ ఆఫ్ గాడ్, ఇక్కడికి వచ్చి జరగబోయే దానిని చూసి మరియు అప్పుడు మారుమనస్సు పొందుము. మీ సంస్థ కొరకు ప్రార్ధించుము. లేక ఆ విధమైన నటన నుండి బయటకు రమ్ము. అసెంబ్లీ ఆఫ్ గాడ్ లో కొంతమంది నిజమైన దైవజనులను అక్కడ కలిగి ఉంది. నాకు వారు తెలుసు. ఏకత్వం నిజమైన దైవజనులను కలిగి ఉంది. అది నిజం. చర్చ్ ఆఫ్ గాడ్ నిజమైన దైవజనులను కలిగి ఉంది. బాప్టిస్ట్, మెథడిస్ట్ వారు దైవజనులను కలిగి ఉన్నారు. కానీ వారిని ఆ విధంగా వ్యవస్థకు తోలు బొమ్మలుగా ఉంచేది ఆ వ్యవస్థలే. వ్యవస్థకు తోలుబొమ్మలు.
నేను ఆయనను ప్రేమించుచున్నాను. (మనం ప్రేమించుచున్న ఆయన వైపునకు మనం చేతులను ఎత్తుదాము. నేను…ఇప్పుడు మీ హృదయమంతటితో) నేను ఆయనను ప్రేమించుచున్నాను…