సామన్యతలో దేవుడు తనను తాను మరుగుపరచుకొనెను
1ధన్యవాదాలు సహోదరుడా, శుభ సాయంత్రం. ఈ శ్రేష్టమైన సహవాస సమయములో ఈ రాత్రి ఇక్కడ ఉండడం ధన్యతగా ఉన్నది. ఈ రాత్రి మేము కలిసి పంచుకుంటున్న శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, మా అనుభవములనుబట్టి సంతోషిస్తున్న ప్రజల సాక్ష్యాల్ని వినుట ఎంతో వాస్తవముగా అనిపిస్తున్నది. మరియు ఇప్పుడు, అల్బుకెర్కీలోని ఈ చక్కటి కూడికకు నన్ను ఆహ్వానించినందుకు సహోదరుడు షకారియన్ మరియు చాలా మంది … ఈ సహోదరుడు డానీ -మరియు నేను వారి పేర్లను పిలవలేని అనేకమందికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.
2నేను అనుకుంటున్నాను మనము అనుకుంటే… ఒక సమయములో, మీ తదుపరి కూడికను ఏర్పాటు చేస్తున్నపుడు, మీరు ఎవరినైనా లోనికి పంపి, మరియు ఒక చిన్న ఉజ్జీవముతో సంఘముల చుట్టూ పరుగెత్తనివ్వండి - వారిని ప్రార్ధించునట్లు, మరియు ఎదురుచూచునట్లు, మరియు సంఘములలో నిరీక్షించునట్లు చేయండి, దేవుని ఆత్మ అంతా కదలాడుచుండగా- ఆపై వీటిలో ఒకదానిలోనికి ప్రవేశించండి, అప్పుడు మీరు నిజముగా దేనినో కలిగియుండెదరు.
కానీ ఇక్కడ మీరు ఒక సామర్ధ్యన్ని కలిగి ఉన్నారు. మీరు శ్రేష్టమైన కొంతమంది ప్రజలను కలిగి ఉన్నారు . నేను వెళ్లిన ప్రతిచోటా నేను కనుగొన్నాను… ప్రసంగిస్తూ ఇప్పటివరకు గత కొద్ది సంవత్సరములుగా నేను ప్రపంచం చుట్టూ తిరిగాను. మరియు దేవుడు ప్రతిచోటా శ్రేష్టమైన ప్రజలను కలిగిఉన్నాడని నేను కనుగొన్నాను [అస్పష్టమైన పదము] ఇది అద్భుతమైన అనుభవం.
నేను ఆఫ్రికా, భారతదేశం మరియు దీవులలోని అడవులలోనికి వెళ్ళాను . కనీసం కుడిచేయి ఏదో ఎడమచేయి ఏదో తెలియని ప్రజలను, ప్రభువైన యేసు నామమును ఎన్నడూ వినని ప్రజలను, దాని గురించి ఎంతమాత్రమూ తెలియని ప్రజలను నేను కనుగొన్నాను. మరియు విచిత్రమైన విషయమేమిటంటే, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు ప్రవర్తించే రీతిగానే వారు ప్రవర్తిస్తారు. అది నాకు తెలుసు. వారు… మీరు చూడవచ్చు అది నిజముగా ఏదోఅయిఉన్నది. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు మరియు స్వస్థపరుస్తున్నాడు.
3ఇప్పుడు ఈ వ్యాపారవేత్తల కూడిక —ప్రపంచ సమాఖ్యకు సంబంధించి నేను అనుబంధించబడిన ఏకైక విషయం. అది… దానివల్ల… నేను ఒకప్పుడు సహోదరుడు క్రో తో పాటు ఉన్నప్పుడు, మా బాప్టిస్ట్ నేపథ్యాల గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక మిషనరీ బాప్టిస్ట్ సంఘము నందు అధికారిగా నియమించబడ్డాను. అయితే, వాస్తవానికి, (పరిశుద్ధాత్మ) అనుభవం వచ్చినప్పుడు, అది అక్కడికక్కడే స్థిరపడింది. కాబట్టి, మేము … నేను … ఆ సోదరులకు వ్యతిరేకముగా లేము. నేను ఆ స్థలములో అన్ని సంఘములు, శాఖల మధ్య కొంతమంది మంచి వ్యక్తులను చూశాను, కానీ… మేము వారిని ఎంతో అభినందిస్తున్నాము. ఇది నాకు గొప్ప సమయం. ఈ వ్యాపారవేత్తల కూడిక - నాకు మాట్లాడటానికి ఒక స్థలాన్ని ఇచ్చినది.
4ఇప్పుడు, పెంతెకొస్తు పేరు విన్నప్పుడు, ఎందుకనగా… నేను పేరు విన్నాను, కానీ వారు అది పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు అని,నేలపై పైకి క్రిందికి దొర్లుట , సొల్లు కార్చుట మరియు ప్రతీదీ చేసెదరని నాకు చెప్పారు. కానీ అది అలా లేదని నేను కనుగొన్నాను.
ఆపై, కానీ … నేను వచ్చినప్పుడు … వారి మధ్యకు వచ్చినప్పుడు, మేము బాప్టిస్టులుగా ఉన్నట్లుగా వారు చాలా వేరు వేరు సంఘశాఖలుగా విడిపోయారు, కేవలం … వారు కేవలం … వారు కేవలం ఒక గుంపు మాత్రమే అని నేను అనుకున్నాను. కానీ వారు కేవలం అన్ని రకముల గుంపుల వలె, బాప్టిస్టులైన మావలే మరియు మిగిలిన వారివలె ఒకరితో ఒకరు అనావశ్యముగా గొడవ పడుతున్నారని నేను కనుగొన్నాను. మరియు మేము దాదాపు ఒకే విధంగా ఉన్నాము.
ఆపై, అసంబ్లీలు, లేదా యునైటెడ్ లేదా చర్చ్ ఆఫ్ గాడ్-మరియు వారందరూ చాలా మంచి వ్యక్తులు, అన్ని గుంపులు వచ్చి చేరడానికి బదులు- నేను వారి మధ్య నిలబడి చెప్పాను, "మనం సహోదరులము. ఒకరితో మరొకరు వాదించవద్దు." ఇప్పుడు, సాతాను మనల్ని ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేయగలిగితే, అతను పోరాడవలసిన అవసరం లేదు, చూడండి. కానీ మనం అతనిపై మన తుపాకీలకు శిక్షణ ఇచ్చి, ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మరియు ఒకరితో ఒకరు సహవాసానికి వెళ్లినప్పుడు, వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభమవుతుంది.
కానీ… నా ఉద్దేశ్యం అదే … ఇక్కడ ఉన్న క్రైస్తవ వ్యాపారవేత్తల సంపూర్ణ సువార్త గుంపు కలసివచ్చుట నాకు ఎండమావిగా మారింది, ఎందుకంటే … మరియు వారు అనేకమైన నా కూడికలకు ఆర్థిక సహాయం అందిస్తారు. మరియు ఆ విధంగా ప్రజలు, వారి గౌరవం కాపాడుకోవడానికి రావాల్సిఉంది, చూడండి. కాబట్టి ఈ సంయుక్త రాష్ట్రములలో, ఈ దేశములో అది నాకు గొప్ప కార్యం చేసింది.
5ఇప్పుడు 5వ, 6వ తేదీలు, నాకు తెలుసు నాకు ఉన్నాయ్ … (ఈ కూడికలు గురించి ఏదైనా చెప్పడం సరైందేనా?)అక్కడ ఒక … 5వ, 6వ, మరియు 7వ … 5వ, 6వ, 7వ, మరియు జూన్ 8వ తారీఖున టక్సన్‌లో వారు విందు చేసే ప్రదేశంలో… వ్యాపారవేత్తల విందు- రమదా ఇన్లో మేము ఒక మైదానమును కలిగి ఉన్నాము. ఇది దాదాపు ఇరవై ఐదు, ముప్పై ఐదు వందలు సీట్లు కలిగి ఉన్నది , అన్నీ ఎయిర్ కండిషన్డ్ సీట్లు. ఇప్పుడు, ఉపన్యాసకుడిగా, నన్ను ఎరిగిన ఎవరికైనా నేను ఉపన్యాసకుడిని కాదని తెలుసు. నాకు వ్యాకరణ పాఠశాల విద్య మాత్రమే ఉంది మరియు అది చిన్నది-7వ తరగతిది మాత్రమే. అందుకే నేను…
చెప్పుకునేంత " బోధకుడిని", నేను కానని మీకు తెలుసు. కానీ నేను ప్రభువుకు సంతోషకరమైన శబ్దం చేస్తాను, ఆపై నేను ఆయన గురించి నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. జీవితములో నా పిలుపు అనారోగ్యము కొరకు ప్రార్థన , అనారోగ్యము బారిన పడిన వారి కొరకు ప్రార్ధించుట అయ్యున్నది . ఇంత గొప్ప కూడికలు పెట్టడానికి, ప్రజలను నడిపించడానికి దేవుడు నన్ను దీవించాడు. ఒకసారి ముంబై లో జరిగిన కూడికలో మునుపెన్నడూ లేనంత ఎక్కువమంది ఆ కూడికలో ఉన్నారు - (500,000) ఐదు లక్షల మంది ఒక్క కూడికలో.
6ఆపై ఆఫ్రికాలో, నేను నమ్ముతున్నాను, మేము లెక్కించినపుడు మారినటువంటి స్థానికులైన అన్యులు, కుడిచేయి ఏదో ఎడమ చేయి ఏదో తెలియని వారు - క్రీస్తుని రక్షకునిగా ఒకేసారి చేర్చుకొనినవారు వారిలో ముప్పైవేల మంది ఉన్నారు … వికలాంగుడైన అంధ బాలుడు, మానసికంగా కూడా సరిగా లేడు — వేదిక పై ఉన్న ఐదవ వ్యక్తి. మరియు పరిశుద్దాత్మ వచ్చినపుడు …
కొన్ని క్షణముల క్రితం ఈ మంచి వైద్యుని వంటి వైద్యులను నేను చూశాను … నేను ఈ పట్టణములో ఉండి జబ్బు పడితే, మరియు నాకు వైద్య సహాయము అవసరమైతే, నా మీద పనిచేయుటకు దేవునిలో నమ్మకము ఉన్న అటువంటి వ్యక్తి కావాలని నేను కోరుకుంటాను. నాకు అతని వైద్య సహాయం కావాలంటే, నేను ఖచ్చితంగా దేవున్ని నమ్మే అలాంటి వ్యక్తినే కోరుకుంటున్నాను, ఒక నిజమైన … అటువంటి ఒక వైద్యుడిని ఈ పట్టణములో కలిగిఉండుటకు మీరు అదృష్టవంతులు - ఒక నిజ దైవభయము కలిగిన వ్యక్తి, మరియు అతను శస్త్ర చికిత్సను చేయునపుడు లేదా అతను చేయు ఏ పనిలోనైనా దేవున్ని విశ్వసించేవాడు. అలాంటి వ్యక్తి పై నాకు నమ్మకం ఉంది. వైద్యులు ముందుకు వచ్చి క్రీస్తుకు తమ హృదయాలను సమర్పించడం మరియు అడవిలో మిషనరీలుగా మారడం నేను చూశాను. మరియు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను …
7ఇప్పుడు, అమెరికాలోని గృహము వద్ద , నేను అంతటా ప్రయాణిస్తాను మరియు చిన్న స్వస్థత కూడికను కలిగి ఉంటాను, జబ్బుపడిన దేవుని పిల్లలకు ప్రార్థిస్తాను. ఆ అవకాశాన్ని నేను ఎంతగానో అభినందిస్తాను . కాబట్టి మీరు జూన్ 5, 6, 7 మరియు 8వ తేదీలలో టుక్సన్ లో లేదా చుటుపక్కల ఉంటే , అక్కడ కూడికలకు ఆర్థిక సహాయము అందించే వారు (అది మనకు తెలిసినంతవరకు) అసెంబ్లీస్ అఫ్ గాడ్ అందరు. ఐదు లేదా ఆరు లేదా ఏడు అసెంబ్లీస్ అఫ్ గాడ్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా అనేకులు - చర్చ్ అఫ్ గాడ్, మరియు మొదలైనవారు ఈకూడికకు వారందరు కలసి సహవాసములోకి వస్తున్నారు. ఇప్పుడు, మీరు అనుకుంటే … అది ప్రకటించబడినది అని అనుకుంటున్నాను. అది జరిగే స్థలము రమదా ఇన్. సహోదరుడు స్ట్రోమెయి (దానిని ఎలా పలకాలో నాకు తెలీదు), కానీ అతడు ఒక… మీరు దానిలో చూస్తారు"… పురుషుల స్వరం" అక్కడ. సమయము గడిచే కొద్దీ దాని గురించి ఆయన మీకు ఎక్కువ విశదపరుస్తాడు.
ఎంకరేజ్‌లో ఒక కూడికను నిర్వహించడానికి నేను ఇప్పుడు నేరుగా అలస్కాకు వెళ్తున్నాను. కాబట్టి, నేను మరో వారం లేదా పది రోజులలో యుకాన్‌లోకి వెళుతున్నాను, మరియు కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాలలో-అక్కడ పరిచారకులు ఇష్టపడే … సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ మరియు టామీ ఆస్బర్న్ వంటి గొప్ప వ్యక్తులు మరియు వారిలో కొందరు గొప్ప అత్యుత్తమ పరిచర్యను కలిగి ఉన్నవారు, వారు ఆ ప్రదేశాలకు చేరుకోలేరు. వారు దానిని చేయలేరు. వారు అంత సమయాన్ని తీసుకోలేరు.
8సరే, ప్రభువు నాకు ఇచ్చే చిన్న పరిచర్యను నేను వినయముగా కొనసాగించుటకు ప్రయత్నించాను. నేను చేయను … నేను నా జీవితములో ఎప్పుడూ కానుకలు తీసుకోలేదు. ఆర్థిక సహాయం అందించుటకు నాకు కార్యక్రమములు లేవు, అమ్మడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను దానిని ఆవిధముగా కొనసాగించాలనుకుంటున్నాను కాబట్టి నేను పదిమందికి బోధించడానికి వెళ్ళాలని ప్రభువు కోరుకుంటే, నేను వెళ్ళగలను; మరియు నేను విదేశాలకు వెళ్లాలని అయన కోరుకుంటే, ఆయన దానికి ఆర్థిక సహాయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన నన్ను నడిపించే ఏ చోటికైనా నేను వెళ్ళగలను. నేను దానిని ఆ విధంగా ఇష్టపడుతున్నాను మరియు నాకు చాలా డబ్బు కలిగి ఉండవలెనన్న ఉద్దేశ్యము లేదు. నాకు దేవుని ఆశీర్వాదములు మాత్రమే కావాలి. కాబట్టి మీరు కోరితే నా కొరకు ప్రార్థించండి.
నేను ఆలోచిస్తున్నాను… కొంతకాలం క్రితం మన ప్రశస్తమైన, ధైర్యము గల ఆత్మ కలిగిన సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ నన్ను ఆహ్వానించారు మరియు నేను అతని స్థలములో నిలబడి ఉన్నాను. దానికి దాదాపు మూడు మిలియన్ డాలర్ల విలువ కలిగినదని అతను చెప్పాడని నేను నమ్ముతున్నాను—భవనం లేదా మరేదైనా. ఓ, మై! నేను హాలీవుడ్‌లో ఉన్నాను, రాజభవనములో కింగ్ జార్జ్ కోసం మరియు స్వీడన్‌లో గుస్తావ్ మరియు వివిధ ప్రదేశాలలో ప్రార్థించాను. మరియు నేను చాలా ప్రదేశాలలో ఉన్నాను, అక్కడ ఉండటం ఒక ప్రత్యేకత, మరియు నేను చాలా చూశాను- కానీ నేను అలాంటి భవనాన్ని ఎప్పుడూ చూడలేదు. మరియు నేను లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు వద్ద చాలా మంది వ్యక్తులు ఉన్నారు, పోలీసులు నన్ను చుట్టుముట్టారు మరియు నన్ను వెనుకకు తీసుకురావాలి, జబ్బుపడిన వారి కోసం ప్రార్థన చేయుటకు బయటకు రావడం కోసం వేచి ఉన్నారు. మరియు నేను వెనుక మార్గంలో వెళ్ళినప్పుడు (సోదరుడు ఫిషర్ నాకు భవనం ద్వారా చూపించిన తర్వాత నన్ను బయటకు తీసుకెళ్ళాడు), నేను అక్కడ నిలబడి ఆ గొప్ప, బహు విలువైన భవనం వైపు చూస్తున్నప్పుడు…
9నేను సహోదరుడు టామీ ఆస్బర్న్ వద్ద నుండి వచ్చాను. ఆ కుర్రాళ్లిద్దరూ తాము కూడికకు వచ్చామని, స్ఫూర్తి పొందామని చెప్పారు. నాకు పరిచర్యలో కొంత భాగాన్ని అనుమతించినందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాను. మరి సహోదరుడు ఆస్బర్న్ ఎలా-ఆ రాత్రి అతను అక్కడికి ఎలా వచ్చి, ఆ ఉన్మాది నన్ను చంపడానికి వేదిక పైకి పరిగెత్తడం చూసి, అతని చేతులు బయటకి విసిరి, "నేను నీ శరీరంలోని ప్రతీ ఎముకను విరగగొడుతాను" అని చెప్పాడు.
నేను ఇలా అన్నాను, "ఈ రాత్రి నీవు దేవుని ఆత్మను సవాలు చేశావు కాబట్టి, నీవు నా పాదాలపై పడతావు."
అతను నా ముఖం మీద ఉమ్మి, "నేను ఎవరి కాళ్ళ మీద పడతానో నేను మీకు చూపిస్తాను" అన్నాడు. మరియు అతను నన్ను కొట్టడానికి తన పిడికిలిని వెనక్కి ఎత్తాడు.
మరియు నేను, "సాతానా, ఈ వ్యక్తిని విడిచిపెట్టు." అతను చుట్టూ తిరుగుతూ నా కాళ్ళ మీద పడ్డాడు, మరియు పోలీసులు అతనిని ఆపవలసి వచ్చింది.
టామీ ఆస్బర్న్ ఇలా అన్నాడు, "దేవుడు ఒక మనిషికి అలా చేయగలిగితే, అయన మరొక వ్యక్తికీ చేయగలడు."
10కాబట్టి, టామీ ఆస్బర్న్ -ఒక ధైర్యమైన ఆత్మ, నిజమైన మనిషి… నేను అతని గొప్ప ప్రదేశానికి వెళ్లి అతని గొప్ప భవనాన్ని చూశాను, వచ్చి సహోదరుడు ఓరల్ రాబర్ట్స్‌ని చూశాను. అప్పుడు నేను వెనుకకు వెళ్ళాను, మరియు వారు నన్ను తీసుకువెళ్ళుటకు వచ్చుచున్నారు. మరియు నేను ఆ గొప్ప, విలువైన భవనాన్ని చూస్తున్నాను.
నేను అనుకున్నాను, "ఓహ్, మై ! సహోదరుడు టామీని చూడు ప్రభువా . మీరు అతన్ని ఎలా ఆశీర్వదించారు. " నేను ఇక్కడ చూశాను మరియు నేను సహోదరుడు ఓరల్‌ని చూశాను. నేను ఇలా అన్నాను, "ఒక చిన్న వినయస్థుని కోసం దేవుడు ఏమి చేయగలడో ఆలోచించండి. ఓరల్ రాబర్ట్స్, ఒక కందకములో జన్మించాడు, నేను అనుకుంటున్నాను, అక్కడ, ఒక చిన్న పేద బాలుడు; మరియు అతని చేతుల్లోకి మిలియన్ల డాలర్లు మరియు వస్తువులను ఇవ్వగలడు.
"సరే, నీ పరిస్థితి ఏమిటి ," అని నాతో ఏదో చెప్పింది.
11నేను అనుకున్నాను, "సరే, కాదు." నేను అనుకున్నాను, "అబ్బాయి, వారిలో ఒకరు నా స్థలమునకు వచ్చుటను బట్టి నేను నిశ్చయముగా సిగ్గుపడుతాను. భవనము చివరన నాకు ఒక టైపు రైటర్ యంత్రపు అమరిక ఉంది. సహోదరుడు ఓరల్ ఒక్క అంతస్థులో ఐదు వందల ఐబిఎం (IBM) యంత్రములు కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేను అనుకున్నాను, " సమస్తము మానవ చేతితో ఎన్నడూ తాకనంత గొప్పగా ."నేను అనుకున్నాను," ఓహ్, మై! అతను నా స్థలమునకు వస్తే మరియు చెప్తాడు, నేను మీ కార్యాలయము చూడాలనుకుంటున్నాను సహోదరుడు బ్రాన్హాం,"ఓహ్," నేను అనుకున్నాను, "నన్ను బట్టి నేను సిగ్గుపడుతాను." నేను అనుకున్నాను" సరే, ప్రభువా, బహుశా మీరు నన్ను నమ్మకపోవచ్చు. బహుశా నేను…ఆ విధముగా ఉండుటకు నాకు అది పనిచేయదు."నేను అన్నాను," కాదు, ప్రభువా. నీవు అనంతుడవు. నాకు అంత తెలివి లేదని మీకు తెలుసు". మరియు నేను అనుకున్నాను," వారు ఏమి పొందుకున్నారో చూడండి. "నేను అనుకున్నాను," సరే, నేను అధికముగా కలిగి లేనని అనుకున్నాను."
మరి ఏదో చెప్పింది, "పైకి చూడు!"
కాబట్టి అప్పుడు నేను చాలా సంతృప్తి చెందాను. ఏ పట్టణముకైతే దేవుడు శిల్పియు నిర్మాణకుడు అయిఉన్నాడో దానికొరకు నేను చూస్తున్నాను. ఇప్పుడు, నేను … దేవుడు ఆ విధముగా నమ్మగలిగేటువంటి ఈ సహోదరులకు నేను వ్యతిరేకిని కాను. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను, మరియు అటువంటి గొప్ప వ్యక్తులకు దేవుడు ఆవిధంగా చేసినదానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
12కానీ నాకు, అది నన్ను మరణమగునంతగా కలతపరచినది .
ఒక వ్యాపారాన్ని నిర్వహించడానికి నా దగ్గర రోజుకు ఇరవై లేదా ముప్పై వేల డాలర్లు ఉంటే… తగినంతగా నా ముగ్గురు పిల్లలకు, నా భార్యకు మరియు నాకు తినడానికి మరియు పడుకోవడానికి (ఒక స్థలము) ఉంటే, అది నాకు సరిపోతుంది. అప్పుడు ప్రభువు నన్ను ఎక్కడికైనా ఈ చిన్న దీనమైన ప్రదేశాలకు వెళ్ళమని కోరితే, అప్పుడు నేను వెళ్ళగలను. బహుశా ఆయన నన్ను ఆ విధముగా ఉంచి ఉండవచ్చు, చూడండి.
వారు కలిసినటువంటి మనుషులను నేను కలవలేకపొయాను. నాకు అంత తెలివి లేదు. నాకు అంత విద్య లేదు. కాబట్టి నేను వెళ్లి జబ్బుపడిన ఆయన పిల్లలకు ప్రార్ధన చేస్తాను,మరియు ఆ పరలోక స్థలములలో ఒకరోజు మరలా అందరం కలుసుకుంటామని ఆశిస్తున్నాను- అక్కడ ఇంక అనారోగ్యం ఉండదు, ప్రార్ధనా కూడికలు ఉండవు, లేదా పాపులకు ఇక బోధించడము ఉండదు. ఆ సమయము వరకూ, క్రీస్తులో నేను మీకు సహోదరుడను.
13ఇప్పుడు, ఇక్కడ తయారు చేస్తున్న టేపులు, అవి…మీరు వాటిని తీసుకోవచ్చు. (శ్రీ సోత్మాన్ ఇక్కడ ఉన్నారు) , అవి తయారు చేయబడ్డాయి. కూడిక ముగించబడిన వెంటనే మీరు వాటిని తీసుకోవచ్చు. వాటికొరకు మీరు వేచి ఉండనవసరం లేదు. అవి అక్కడే ఉన్నాయి , మీరు వాటిని తీసుకోవచ్చు. ఇప్పుడు, నా కొరకు ప్రార్ధించండి.
మరి ఇప్పుడు, సహోదరుడు షకారియన్ ఈరాత్రి నన్ను త్వరగా విడిచిపెడతాను అని అన్నాడు. త్వరగా బయటకి వెళ్ళమని దాని అర్ధం అని నేను అనుకుంటున్నాను. దానిని చేయుటకు నాకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాను. మరియు ఇది శుభ శుక్రవారపు ఉదయకాలము అయినందున, ఈ ఉదయకాలము నేను అనుకున్నాను …. [సహోదరుడు షకారియన్ మాట్లాడుతున్నాడు.] సహోదరుడా షకారియన్ నా ఉద్దేశ్యము అది కాదు, చూడండి . నేను … [సహోదరుడు షకారియన్ మాట్లాడుతున్నాడు.] ధన్యవాదాలు, ధన్యవాదాలు.
14నేను … మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు , నేను పదాలన్నిటిని కలిపినట్లైతే … ఇది నేను ఒకసారి విన్న ఒక చిన్న కథ, ఒక చిన్న పిల్లవాని గూర్చినది నాకు జ్ఞప్తికి వస్తుంది. ఒక సేవకుడు ఒక వీధిలో వస్తుండగా, ఒక పిల్లవాడు మూల నుంచి అక్షరాలు, "ఏ, బి, సి , డి," చెప్పడం వినబడింది మరియు అతను ఆ పిల్లవాడు చెప్పేది విన్నాడు.అతను అతని చేతులు పరలోకము వైపు ఎత్తియున్నాడు. అతను అన్నాడు… అతను దానిని పూర్తిచేసిన తరువాత, అతను పైకి లేచి మరియు తలపై టోపీ పెట్టుకున్నాడు.
మరియు అన్నాడు ,"కుమారుడా …"
తిరిగి చూశాడు.
అన్నాడు, "నేను ఒక సేవకుడను . నీవు మోకాళ్లమీద ఉండి , చేతులు పైకెత్తి అక్షరాలను చెప్పడం నేను విన్నాను."
అతను అన్నాడు, "అయ్యా," అతను చెప్పాడు, "నేను క్రైస్తవ కుటుంబములో పెరిగాను. హఠాత్తుగా తండ్రి మరియు తల్లి చనిపోయారు. నేను బయటకు తీసుకురాబడ్డాను." అన్నాడు, "నేను నివసిస్తున్నటువంటి వ్యక్తి నాపట్ల చాలా క్రూరముగా ఉన్నాడు," అన్నాడు, "నేను అతనికొరకు ప్రార్ధన చేస్తున్నాను. ఎలా ప్రార్ధించాలో నాకు తెలియదు." అతను అన్నాడు, "నేను అన్ని అక్షరాలను చెప్తున్నాను, మరియు వాటిని ఎలా పెట్టాలో దేవుడికి అర్ధమవుతుందనుకున్నాను."
కాబట్టి బహుశా… నేను … మీరు నా గురించి అదే అనుకోండి. బహుశా అయన అర్థం చేసుకోవచ్చు, మరియు నేను చెప్పవలసిన దానిపట్ల నా హృదయమునందు ఏ ఉదేశ్యముందో అది మీకు అర్థమయ్యేలా అయన దానిని కలిపి పెడతాడు.
15నేను ప్రయత్నించుటకు అభిముఖుడను కాలేదు… మనుషుల మధ్యలో కంగారుపడుటకు, ఎందుకంటే నేను మనుషుల మధ్యలో ఉన్నాను. నేను చూసే కార్యము ఒక్కటే, మరియు అది యేసుక్రీస్తు మరియు అయన సిలువ వేయబడుట.నేను ప్రేమించేటువంటి ఆయన ఏ సంఘము కొరకు చనిపోయాడో నేను దానిని చూస్తున్నాను , మరియు ఆ సంఘము పట్ల నేను అసూయ కలిగి ఉన్నాను. దేవుని వాక్యానుసారముగా, దేవుని క్రమములో నేను ఏది సరైనదని నమ్ముతున్నానో దానిని కొనసాగించుటకు నేను నాకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాను. మనము ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న విధముగా ఆ ఎడతెగని నిత్యత్వములో గడుపుటకొరకు ఎదురుచూస్తున్నాను.
16నేను చూసినపుడంతా… మనము ఉదయకాలపు అల్పాహారం, మరియు సాయంకాలపు ఆహారము మరియు ఆవిధమైన కార్యములు కలిగి ఉన్నపుడు … ఇప్పుడు, నేను ఒక దక్షిణాది వాడిని, మరియు అది నాకింకా "సాయంకాలపు ఆహారమే." వారు దానిని ఇక్కడ అల్పాహారం, మధ్యాహ్న భోజనము, మరియు రాత్రికాల ఆహారము అని పిలుస్తారు. దానిని నేను చేయలేను. నా … ఏది నా సాయంకాలపు ఆహారమవుతుంది, చూడండి? నేను కేవలం … నాకు సాయంకాలపు ఆహారము కావాలి. మధ్యాహ్న భోజనము నాకు ఏ మంచి చేయదు. నేను రోజుకు మూడుసార్లు తింటాను.
కానీ, కాబట్టి … నేను ఇక్కడ ఉన్న సేవకులలో కొంతమందితో కరచాలనం చేస్తున్నాను, నేను చూసినప్పుడు, నేను ఆలోచిస్తున్నాను- వయసు పైబడ్డ పరిచారకులు బహుశా నేను ఇంకను పాపిగా ఉన్నపుడే అతను ఈ పనిలో ఉండిఉంటాడు- మరియు నేను అతనిని చూసి , మరియు నేను ఆలోచించాను… (జుట్టులో ఆ తెలుపును చూసి) మరియు నేను అనుకున్నాను "మై! నేను మారడానికి ముందే ఆ మనుష్యులు పోరాడుతున్నారు. వేదిక మీద నిలబడి అటువంటి ప్రజలతో ఆ విధముగా మాటలాడుట నా పనికాదు." నేను బైటకు చూశాను…
17సరే, వారు చేసిన ఒకే కార్యం, వారు ప్రవచించి ఈ కార్యములు జరుగుతాయి అని చెప్పారు.
సహోదరులారా, మీరు ఈ కార్యము తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, మీరు పునాది రాళ్లను వేశారని నేను అనుకుంటున్నాను… పొలములను చదును చేసి - పెంతెకొస్తు సహోదరులైన మీరు వెళ్ళడానికి సంఘము లేనపుడు మీ చేతిలో ఒక కంజరితో ఇక్కడ నిలబడి ఉన్నారు; ప్రజలు మిమ్మల్ని పరిహసించి మీమీద కుళ్లిన గుడ్లను విసిరారు; మరియు రాత్రంతా మీరు జైలులో ఉన్నారు. రైలు రోడ్డు మార్గము పై మొక్కజొన్నను విరిచారు, మీ పిల్లలు ఆకలితో ఉన్నారు. మీ ధైర్యవంతమైన ఆత్మను దేవుడు దీవించును. ఇక్కడ ఉండవలసింది మీరు, నేను కాదు.
కానీ ఈ కార్యములు జరిగే సమయము వస్తుందని మీరు చెప్పారు. అది జరుగుట చూచుటకు మీరు జీవించియున్నందుకు నేను ఆనందిస్తున్నాను. సగం ఇంకా చెప్పబడలేదు. మరియు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
MATT 25:23
18నేను బల్ల కింద చూస్తున్నప్పుడు, విభిన్నమైన మిమ్మల్ని చూస్తున్నప్పుడు, నేను అనుకున్నాను, "ఈ భూమి మీద మీతో కలిసి మరల సాయంకాలపు ఆహారము తీసుకోకపోవచ్చు. కానీ ఒకరోజు జీవితము పూర్తయినపుడు, పైన తండ్రి గృహములో మనము మరల కలసి తింటాము [అది నిజము], మనము బల్ల చుట్టూ చూసినపుడు ఒకరిని ఒకరము చూసుకుంటాము."
ఇప్పుడు మనము యుద్ధ భూమిలో ఉన్నాము. మనము వెళ్లుటకు త్వరపడాలి. నేను దానిని కేవలము ఊహిస్తున్నాను నేను బల్ల చుట్టు చూసినప్పుడు విమోచింపబడిన వారందరు అక్కడ కూర్చొని ఉండడం, మిమ్మల్ని సమీపించి మీచేతులు పట్టుకోవడం ఎలా ఉంటుంది. మనం ఏడ్చుట ప్రారంభిస్తాము; మనము తప్పకుండా చేస్తాము. అప్పుడు ఆ రాజు బయటకు వచ్చి మన కన్నుల కన్నీటిని తుడిచివేస్తాడు, చెప్తాడు," బిడ్డలారా, ఏడవవద్దు. అదంతా అయిపోయింది. జగత్పునాది వేయబడకమునుపు నుండీ మీకొరకు సిద్ధపరచిన దేవుని ఆనందములోకి ప్రవేశించండి. " అప్పుడు మన చిన్న వ్యత్యాసములు వెలవెలపోతాయి , అప్పుడు ఒక గొప్ప నిత్యత్వము ఉంటుంది. నేను మీతో కూడా దానిని గడపాలనుకుంటున్నాను. మన తలలు వంచగా ఇప్పుడు మనం ప్రార్దిద్దాం.
GEN 1:3
19మా పరలోకపు తండ్రీ , ఆ గొప్ప బలిష్ఠుడైన యెహోవా, ఎవరైతే అది యందు ఉరిమాడో మరియు చెప్పాడు, "వెలుగు కలుగునుగాక," మరియు వెలుగు కలిగింది, ఓహ్ మరల ఉరుము- యెహోవా. ఈ రాత్రి మా మార్గముల మీద వెలుగు ప్రసరించండి. మీ వాక్యము మీద వెలుగు ప్రసరింపచేయండి, మేము జీవిస్తున్న ఈ దినము మీద వెలుగు నివ్వండి. వెలుగును పంపండి. దీనిని అనుగ్రహించండి, ప్రభువా.
ప్రపంచం చుట్టూ ఉన్న అన్యస్థలములలో ఆ కొండలవైపు ఎక్కడైతే ఉజ్జీవపు మంటలు మండుచున్నాయో అక్కడ ప్రపంచములో అన్నిచోట్ల ఉన్న మీ ప్రజలందరినీ దీవించండి. దేవుడు పంపిన ప్రతీ సేవకుడినీ మీరు దీవించాలని మేము ప్రార్ధిస్తున్నాము. ఓ ప్రభువా వారి జీవితాలకు ప్రేరేపణనివ్వండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు అని ఈ క్షణంలో సరిగా ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ నిమిషంలోనే స్వస్థత పొందుతున్నారు.
ఈ గొప్ప సార్వత్రిక ఆశీర్వాదముకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపగలము, మేము శుభశుక్రవారం జరుపుకొనుచుండగా, ఇది సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ మధ్యాహ్నం మీ కుమారుని మరణం ద్వారా సాధ్యమైంది. ప్రభువా, ఆయన పరిశుద్ధాత్మ ఇప్పుడు మా మధ్యకు రావాలని మరియు మాకు అవసరమైన జీవాహారములో కొంత భాగాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము ఈ కొద్ది రోజులుగా మైదానం నుండి బయటికి వచ్చి జీవ వృక్షం నీడలో కూర్చోవడానికి, ఒకరినొకరు మరియు మా సహవాసాన్ని ఆస్వాదించడానికి, తదుపరి ప్రయాణం కొరకు అది మమ్ములను నిలబెడుతుంది. దానిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇది తాజాగా ఉంది.
ఇప్పుడు ఈ రాత్రి మరియొకసారి దీనిని అనుగ్రహించండి, తండ్రీ, మరియు మా ఆత్మలను నింపండి.
20ఇక్కడ అనారోగ్యముతో ఉన్న ప్రతి వ్యక్తినీ స్వస్థపరచండి. చిన్న అవయవము మరియు చిన్న పాదము, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మా సహోదరిని మీరు ఈ దినమున స్వస్థపరిచినందుకు ఏవిధముగా మీకు కృతజ్ఞతలు తెలపాలి. ప్రభువా, మేము కృతజ్ఞులం. మీకు స్తోత్రములు. సజీవ దేవుడు మన మధ్య నివసించుచున్నాడని అది చూపుచున్నది.
గొంతులో వాపు ఉన్న సహోదరిని నయం చేసినందుకు మేము మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు చేసినది మాకు ఇంకా తెలియకపోవచ్చు. ప్రభువా, మీరు ఎలా కార్యములు చేస్తారో చూడటం విశేషమైనది. మేము మీకు కృతజ్ఞులం. ఇప్పుడు మమ్మల్ని మరింతగా ఆశీర్వదించండి. మీ వాక్య పఠనాన్ని ఆశీర్వదించండి. ఇప్పుడు మీ సేవకులను మరుగుచేయండి . మాట్లాడే పెదవులకు మరియు వినే చెవులకు సున్నతి చేయండి, యేసు నామములో మేము దీనిని అడుగుతున్నాము. ఆమెన్.
ISA 53:1-10
21ఇప్పుడు మనం చదవడానికి వాక్యం కోసం లేదా లేఖన పఠనం కోసం తిప్పండి. వాక్యము లో రెండు చోట్ల నుండీ నేను చదవాలనుకుంటున్నాను. అది యెషయా నుండీ , యెషయా 53 వ అధ్యాయం, 1 వ వచనము నుంచి 10 … 10 వ వచనము వరకు చదవాలనుకుంటున్నాను. అటుతరువాత మత్తయి 11 :25 మరియు 26 మనము చదువుకుందాం. ఇపుడు, మనం చదువుదాం.
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
అతడు తృణీకరింపబడినవాడు ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతివిు.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
MATT 11:25
22వాస్తవానికి అతను ఇక్కడ అసాధారణమైన మరియు అద్భుతమైన మన ప్రభువైన యేసును గురించి మాట్లాడుతున్నాడు.
మత్తయి 11 వ అధ్యయము మరియు ఇరవై … 25 మరియు 26 వచనములు :
ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
అవును తండ్రీ , ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
ఇప్పుడు, దేవుని చిత్తమైతే నేను సాధ్యమైనంతవరకు త్వరితముగా కొద్దిగా ఈ లేఖనముల మీద మాట్లాడుతాను; అటుతరువాత మరికొన్ని సాక్ష్యములను వినడానికి కూర్చుందాం. "దేవుడు తనను తాను సామాన్యతలో మరుగుపరచుకున్నాడు", అను అంశమును నేను ఇక్కడ తీసుకోదలచాను.
23మీకు తెలుసా, దేవుడు చాలా గొప్పవాడు. తనను తాను సామాన్యతలో మరుగుపరచుకున్నాడు , అటుతరువాత తనను తాను దాచుకున్న దానిలోనే తనను తాను బయలుపరచుకుంటాడు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయనను అయన సామాన్యునిగా చేసుకోగలడు. అదే ఆయనను గొప్పవానిగా చేస్తుంది. సామాన్యతలో ఆయనను చాలా మంది తప్పిపోతున్నారు…తనకు తాను సామాన్యమైన పద్దతిలో దాచుకుంటాడు. ఇప్పుడు, మానవుడు దీనిని చేయలేడు అని మనకు తెలుసు. మానవుడు సామాన్యముగా ఉండేంత గొప్పగా తనను తాను చేసుకోలేడు. ఇప్పుడు, దేవుడు చాలా సామాన్యముగా ఉండడమే ఆయనను గొప్పవానిగా చేస్తుంది; మరియు మనం గొప్పతనము అని పిలిచే గొప్పతనములో దేవుడు తనను తాను బయలుపరచుకొనడు.
24ఇప్పుడు, మనం వాక్యాన్ని చదువుచూ దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా, దేవుడు కార్యాలను చేసే విధానాన్ని మనం కనుగొన్నాం. అయన తన ప్రణాళికని ఎన్నటికీ మార్చడు. కానీ దేవుడు ఏమి చెప్తున్నాడు… అయన తన వాక్యమునకు ఎన్నటికీ వెనుదిరగడు. మనము ఏదైనా చేసినప్పుడు… నేను ఏదయినా చేసి ఈ సంవత్సరం అది సరైనదని నేను అనుకుంటాను. బహుశా తదుపరి సంవత్సరం లేక తదుపరి వారం నేను ఎక్కడ తప్పుగా ఉన్నానో చూడగలను. కానీ దేవుడు అలా కాదు, ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయన మొదటి నిర్ణయం… ఆయనను ఎప్పుడైనా ఒక పరిస్థితిని వ్యవహరించమని పిలిస్తే… అయన ఆ నిర్ణయము పైన వ్యవహరించిన విధంగానే, అదే నిర్ణయాన్ని తీసుకోవలసిన ప్రతీ సారీ అదే విధంగా అయన వ్యవహరించాలి. ఎందుకంటే అయన అలా చేయకపోతే… అయన ఒక నిర్దిష్ట పద్దతిలో ఈ నిర్ణయం పట్ల వ్యవహరించి, అదే అంశము మరలా వచ్చినపుడు, అయన మొదటిసారి చేసిన విధంగా వ్యవహరించకపోతే అప్పుడు ఆయన మొదటిసారి తప్పుగా వ్యవహరించాడు.
25అందువల్ల, ఒక మనుష్యుడు రక్షణ నిమిత్తము అయన వద్దకు వచ్చి, అయన అతనికి ఇచ్చిన రక్షణ ఏ ఆధారముగా కలిగినదో , అయన అదే ప్రాతిపదికన తదుపరి వ్యక్తిని రక్షించాలి. మరియు స్వస్థత నిమిత్తము అయన వద్దకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అయన ఒక నిర్దిష్ట ప్రాతిపదికన స్వస్థపరిస్తే, తదుపరి వ్యక్తి వస్తే కూడా అదే ప్రాతిపదికన అయన స్వస్థపరచాలి. అయన మారలేడు. ఆయన ఎల్లపుడూ ఏక రీతిగానే ఉండాలి.
మానవుడు ఆదిలో పాపం చేసినప్పుడు దేవుడు ఒక ప్రణాళికను రూపొందించాడు. వెనక్కు… అతడు తనకు తానుగా తప్పించుకునే మార్గాన్ని వెతకడానికి ప్రయత్నించాడు. అంజూరపు కచ్చడములు మొదలైన వాటితో తనను తాను కప్పుకొనుటకు ప్రయత్నించాడు. అది ఎన్నటికీ పనిచేయదు. కానీ దేవుడు మానవుడు ఆయనతో మళ్లీ సహవాసం చేసేలా ఒక మార్గాన్ని చేశాడు, అది ఒక అమాయక ప్రత్యామ్నాయం యొక్క చిందించబడిన రక్తం వలననే. మరియు దేవుడు మనిషిని కలుసుకున్న ఏకైక మార్గం ఇది. మరియు దేవుడు మనిషిని కలుసుకోగల ఏకైక మార్గం ఇది- ఒక అమాయక ప్రత్యామ్నాయం చిందించిన రక్తం కింద మాత్రమే.
26ఇప్పుడు, శుభశుక్రవారము నాడు మనము ఇక్కడ ఉన్నాము. మరియు ప్రపంచము ఈరోజు, కాథోలిక సంఘశాఖ వారు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారు మరియు అనేక సాంప్రదాయాలు పాటించి, తమ ఎముకలను అరగ గొట్టుకుంటారు. మరియు కొన్ని పంతొమ్మిది ఖచ్చితంగా నిరూపితమైన చీలలు వారు యేసు చేతులలో నుండి తీశారని, వారు పేర్కొన్నారు. ప్రతి సంఘమునకు ఒకటి ఉంది. అది చీల అయినా , లేదా అంగీ అయినా లేదా ఇంకేదయినా, అది ఏ వ్యత్యాసము కలుగజేస్తుంది? మనం పరిశుద్దాత్మను కలిగి ఉన్నాం. యేసు సంఘమునకు విడిచిపెట్టినది అదే- కానీ ఒక అంగీ , సిలువలో ఒక ముక్క , ఒక చీల లేక మరే ఇతరమైనది కాదు. అయన మనకు ఒక జ్ఞాపకార్ధమును విడిచి పెట్టాడు మరియు అయన సంఘము నిమిత్తము విడిచిపెట్టినది పరిశుద్దాత్మయే.
ఇప్పుడు. ఇప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ మధ్యాహ్నం కల్వరిలో అయన మరణించినపుడు అయన సంఘమునకు ఇచ్చినది అదే. అయన దేవుని చేతులకు తన ఆత్మను అప్పగించాడు, అది సంఘమునకు పెంతెకొస్తు దినము నాడు వెనుకకు పంపబడినది. ఇప్పుడు, ఆది యందు దేవుడు… మానవుడు పాపం చేసినప్పుడు అది మానవుని స్వభావాన్ని చూపించింది. అతను ఎల్లప్పుడూ దేవుని నుండీ దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరియు తనను తాను సమర్థించుకోగల మార్గమును ఏర్పాటు చేసుకుంటాడు- ఒక మతం. అది…"మతం" అంటే ఒక ముసుకు. అందుకే తన స్వంత మతాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాడు.
HEB 11:6
27కానీ దేవుడు మానవుడిని ఏ విధముగా కలుసుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు: అది చిందించబడిన రక్తము ద్వారానే. మరియు అది ఒక్కటే మార్గం. మనం ఏ ఇతర మార్గములో ఎంత ప్రయత్నించినా, దేవుడు మానవునితో సహవాసము చేయుటకు కలుసుకునే ఏకైక స్థలము - చిందించిన రక్తము కిందనే. దేవుడు ఇశ్రాయేలీయులను చిందించిన రక్తం క్రింద మాత్రమే కలుసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఆరాధించగలిగిన ఏకైక స్థలం చిందించిన రక్తం క్రిందనే.
మరియు ఈదినము మనము మానవుడిని సహవాస ఐక్యత లోనికి తీసుకొని రావడానికి సంస్థను ప్రయత్నించాము, సంఘశాఖను ప్రయత్నించాము, విద్యను ప్రయత్నించాము, శాస్త్రీయ విజయాలను ప్రయత్నించాము మరియు ప్రతీదీ ప్రయత్నించాము. వాటిలో ప్రతి ఒక్కటీ విఫలమైంది. ఇప్పుడు మనుష్యులు దేవుడిని కలుసుకొని ఆయనతో సహవాసం మరియు ఒకరితో ఒకరు సహవాసం చేసే స్థలం ఒకటి ఉంది. ప్రతి మనిషి యేసు క్రీస్తు రక్తాన్ని అంగీకరించినప్పుడు, అది సిలువ కింద ఉంది. నేను పట్టించుకోను… ఆయన విశిష్టతలలో, యేసు మరణించిన సిలువ వద్ద మనము కలుసుకొనినప్పుడు, అతను ఇంకను తన పక్కన ఉన్న వ్యక్తిని చేరుకొని అతని చేతిలో తన చేయి వేసి "సహోదరుడా" అని పిలువవచ్చు.
28మనము శాస్త్రీయ యుగముగా మారుతున్నాం. ప్రతీదీ శాస్త్రీయముగా నిరూపించబడాలి. పరిశుద్ధ గ్రంధములో చెప్పబడిన విజ్ఞాన యుగములో మనం జీవిస్తున్నాము - ముందుగా చెప్పబడినట్లుగానే బలహీనముగా మరియు తెలివిగా. మరియు మనము ఆ యుగములో జీవిస్తున్నాము. మరియు … మనం విజ్ఞాన శాస్త్రములోనికి చొచ్చుకుపోతున్న కొద్దీ , దేవుని నుండీ మరింత దూరమైపోతాము. దేవుణ్ణి శాస్త్రీయంగా ఎప్పటికీ నిరూపించలేరు. మరియు క్రైస్తవ సర్వాంగకవచం మొత్తం ఖచ్చితముగా సహజాతీతమైనది . సహజముగా ఏమీ లేదు. మీరు దేవుణ్ణి నిరూపించగలిగితే, విశ్వాసం అవసరం లేదు. అయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఇది విశ్వాసం ద్వారానే. విశ్వాసమే క్రైస్తవ సర్వాంగ కవచం.
29నా మొదటి కార్య నిర్వాహకులలో (మేనేజర్ ) ఒకరైన డాక్టర్. ఎఫ్. ఎఫ్. బోస్వర్త్ "అదృశ్యమైన వాటిని చూచుట" అనే పుస్తకాన్ని రాసాడు. ఇప్పుడు, మీలో చాలామంది దానిని చదివారు, కనిపించని వాటిని చూచుట - ఇది శ్రేష్ఠమైన పుస్తకము. ఇందులో ఏ సందేహము లేదు. క్రైస్తవుడు అతను చూడని కార్యాలను చూస్తాడు.
ఇప్పుడు క్రైస్తతత్వం యొక్క సర్వాంగ కవచాన్ని తీసుకుందాం మరియు అది సహజాతీతమైనది అని చూద్దాం: ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రతీదీ సహజాతీతమైనది . ప్రేమ - మందుల దుకాణానికి వెళ్లి నాకు పావు వంతు విలువైన ప్రేమను కొనండి. నాకు అది కావాలి. చూడండి, మీరు దానిని చేయలేరు. నాకు ఒక డాలర్ విలువైన శాంతిని కొనండి. మీరు దానిని చేయలేరు, చూడండి. ప్రతీదీ సహజాతీతమైనది. దేవుని సర్వాంగకవచము మొత్తము సహజాతీతమైనది. అయన సంఘము సహజాతీతమైనది. అది ఒక సంస్థ కాదు ; అది పరిశుద్ధాత్మ ద్వారా పురుషులు మరియు స్త్రీలు జన్మించిన సహజతీతమైన శరీరము.
మరియు ఇది … సులభమైన మార్గం.
MATT 11:25
30దేవుడు చాలా జపమాలలు, మరియు చాలా ఇది, మరియు ఇందులో చేరడం, మరియు చాలా విద్య, చాలా వేదాంతశాస్త్రం వంటి వాటితో కార్యములను క్లిష్టతరం చేయడు. ఎందుకు, అలా చేయడం వల్ల అన్ని సమయాలలో మనల్ని మనము దేవునికి మరింత దూరము చేసుకుంటాము. ఈరోజు, ఒక అణువును తయారు చేయడానికి ఎన్ని పరమాణువులు అవసరమో, ఎన్ని ఎలక్ట్రాన్‌లు అవసరమో మొదలైనవాటిని చెప్పగలిగేంత శాస్త్రీయముగా మనము ఉన్నాము; మరియు ఆ అణువును విభజించి, అది ఎలా జరిగిందో చెప్పి; మరియు అణు బాంబును తయారు చేయడం. ఆపై మనం ఎలా చేశామో వివరించవచ్చు; కానీ ఒక గడ్డి పరక వద్దకు వచ్చినపుడు మనం దానిని వివరించలేము.
సామాన్యత లో దేవుడు. దేవుడు తనను తాను సామాన్యతలో బయలుపరుచుకున్నాడు. జ్ఞానులు గ్రహించలేనంత సామాన్యముగా తనను తాను చేసుకున్నాడు. యేసు అన్నాడు, "నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను." దేవునికి మిమ్మల్ని మీరు విద్యావంతులుగా చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. చూడండి, మీరు అలా చేసినపుడు దేవుని నుండి దూరముగా మిమ్మల్ని విద్యావంతులుగా చేసుకుంటున్నారు. విద్య ద్వారా దేవుడు తెలియడు; విశ్వాసం ద్వారానే దేవునిని తెలుసుకుంటాం. అపవాది మొదట వేసిన దెబ్బ విద్యాభ్యాస కార్యక్రమం ద్వారానే, మరియు మానవుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. సరిగా అంతే. విశ్వాసం ద్వారానే అతను దేవునిని ఎరగాలి- అతను వివరించగలిగినదానిని కాదుగాని, అతను వివరించలేనిదానిని అతను నమ్ముటను , అది… మనం ఆ కార్యాన్ని తారుమారు చేశాం.
31ఇప్పుడు ఈరోజు ప్రతీదీ ఒక విద్యా కార్యక్రమం. అవును, మనం ఒక చిన్న గడ్డి పరక మీద నడుస్తున్నాం. మనం మన పిల్లలను బైబిల్ పాఠశాలలకు మరియు కళాశాలలకు పంపుతాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను దానిని ఖండించడం లేదు. నేను అజ్ఞానాన్ని సమర్ధించడం లేదు. కానీ అందులోని మూర్ఖత్వాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మరియు అక్కడే మనం తయారు చేసే దగ్గరే… మీకు తెలుసా అక్కడ ఏదో తప్పిదము ఉన్నది.
అది నా కూడికలలో వలే ఉంది. నేను కూడికలు కలిగి ఉన్నప్పుడు చాలా సార్లు నేను ఇతర సహచరుల సమావేశములో విఫలమైన వాటిని కనుగొంటాను, ఎందుకంటే… నేను చాలా సార్లు సహోదరుడు రోబెర్ట్స్ ను వీక్షించాను. ఎవరో అన్నారు," సహోదరుడా బ్రాన్హాం, సహోదరుడు రాబర్ట్ మీరు ముగ్గురికి ప్రార్ధించే సమయములో ఐదు వందలమందికి ప్రార్థిస్తారు." అది నిజమే. నిశ్చయముగా. అతను రెండింతల సాక్ష్యాలను పొందుతాడు. ఖచ్చితముగా. యాభై ఇంతలు సాక్ష్యాలు, చూడండి, ఎందుకంటే మీరు … కేవలం అది ప్రార్ధింపబడేవారి విశ్వాసము మీదనే ఆధారపడి ఉంటుంది.
కానీ అక్కడ విఫలమైన వారు, అప్పుడు వారు కూడికకు వస్తారు, ఎందుకంటే…
32ఇక్కడ ప్రస్తుతం ఒక వైద్యుడు కూర్చొని ఉన్నాడు… ఒక వైద్యుడు… మీరు వైద్యుని కార్యాలయానికి వెళ్లి, "నాకు కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పి వచ్చింది" అని చెప్పినట్లయితే; మరియు ఆ వైద్యుడు మీకు ఆస్పిరిన్ లేదా ట్రాంక్విలైజర్ లేదా మరేదైనా చిన్న మందుల చీటీని వ్రాస్తాడు, అతను ఆ విషయములో ఎప్పుడూ వ్యాధి నిర్ధారణ చేయడు. అతను మిమ్మల్ని కేవలము తన కార్యాలయము నుండి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు, చూడండి.
ఇప్పుడు, అతను మిమ్మల్ని తన హృదయములో ఉంచుకుంటే మరియు అతనికి ఆసక్తి ఉంటే , అతను కారణాన్ని కనుగొనే వరకు అతను ఆ సమస్యను పరీక్షించి నిర్ధారిస్తాడు.
33మరియు ఒక పురుషుడు (లేదా స్త్రీ) జబ్బు పడినప్పుడు, మరియు ఏదైనా జరిగినప్పుడు, దాన్ని సరిగ్గా పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది వెనుకకు వెళ్లి కారణాన్ని కనుగొనడం - మనం ఏమి చేశామో చూసే వరకు వెనుకకు వెళ్లండి.
కూడికలలో, వేదిక పై నిలబడ్డవారిని చూడండి. పరిశుద్ధాత్మ ఇలా అంటాడు, "పది సంవత్సరాల క్రితం మీరు ఒక నిర్దిష్ట ప్రదేశములో ఉన్నారు, మరియు మీరు ఒక నిర్దిష్ట పని చేశారు, మరియు మీరు దీన్ని చేశారు, మరియు ఖచ్చితముగా…" చూడండి, మీలో చాలా మంది కూడికలలో, మీరు దీనిని విన్నారు. "నీవు చేశావు. నీవు ముందు దాన్ని సరి చేసుకోవాలి." ఆపై, వారు దానిని చేస్తానని వాగ్దానం చేసినట్లయితే, అది బయటకు రావడాన్ని మీరు వింటారు, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు…" దానిని మీ పుస్తకాలలో వ్రాసుకొనండి. ఇది విఫలమవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? ఖచ్చితముగా అవ్వదు. అది అవ్వదు; అవ్వలేదు. అది ఏమిటి? చూడండి, మీరు … మొదటివిషయం, నయం చేయడం ప్రారంభించడానికి ముందు మీరు కారణాన్ని కనుగొనాలి. దానికి గల కారణాన్ని కనుగొనాలి.
34మరి ఇప్పుడు, దానికి ఈ రోజు మనం ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము …శాస్త్రీయ విధానములో దేవుని వద్దకు, మరియు మీరు దానిని చేయలేరు. విజ్ఞాన శాస్త్రం ద్వారా దేవుణ్ణి తెలుసుకొనలేము; కానీ విశ్వాసము ద్వారానే మనం దేవుణ్ణి తెలుసుకుంటాం. మరియు నేను దీనిని చెప్పాలి: ఒక మనిషి ఒక దగ్గర కూర్చుని యదార్ధముగా తన హృదయమంతటితో ఒక పువ్వుల గుత్తిని, ఒక పుష్పగుచ్చమును చూస్తూ ముప్పై నిముషాలు చదివినట్లయితే, బైబిల్ పాఠశాల ఇవ్వగలిగిన అన్ని డిగ్రీలు కలిగి ఉన్నదానికంటే ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోగలుగుతాడు.
ఎందుకంటే పువ్వులో దేవుడు తనను తాను బయలుపరచుకొన్నాడు.అది చనిపోవడం మరియు మళ్లీ లేవడం మనం చూస్తాము - పునరుత్థానం. ఒకే జాతి పువ్వులలో మనకు రెండు మూడు రకాల రంగులు కనిపిస్తాయి. ఆ రంగులు ఎక్కడ నుండీ వచ్చాయి? దానిని నాకు వివరించండి. అది అక్కడికి ఎలా వచ్చింది, ఎక్కడికి వెళుతుంది మరియు అది మళ్లీ తిరిగి ఎలా వస్తుంది? ఆ విత్తనం చనిపోయి కుళ్లిపోయి మళ్లీ తిరిగి ఎలా రావాలి?— దేవుడు తనని తాను సామాన్యతలో చూపిస్తూ, మరణంలో తనను తాను దాచుకొని , తనను తాను మళ్ళీ పునరుత్థానంలో చూపించడానికి, చూడండి.
అది కేవలం… మీరు పూర్తిగా తెలుసుకొనవలసిన అవసరం లేదు. చూడండి, మీరు తెలుసుకొనవలసిన ఏకైక విషయం మీరు దేనిని చూస్తున్నారో, దేనిని నమ్ముతున్నారో దానిపట్ల విశ్వాసం కలిగి ఉండడమే. నమ్మండి…ఒక గడియ నిజంగా దానిని రుజువు చేస్తుంది, మీరు కలిగి ఉన్న అన్ని డిగ్రీల కంటే దేవుని గురించి మీకు ఎక్కువ బోధిస్తుంది.
ISA 35:8
35దేవుడు చాలా గొప్పవాడు, ఆయన తనను తాను సామాన్యునిగా చేసుకోగలడు. దేవుడు తనను తాను ఎలా సామాన్యునిగా చేసుకుంటాడో - దేవుడిని నాకు గొప్పగా చేసేది అదే; మరియు అది, తనకొరకు చేసుకుంటూ, చురుకైన వారు మరియు జ్ఞానుల నుండి తనను తాను దాచుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి దానిని గురించి ఆలోచించండి!
యెషయా 35:8
అయన జ్ఞానుల నుండి తనను తాను దాచుకున్నాడు, మరియు దీనులకు తనను బయలుపరచుకున్నాడు. మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు అని పరిశుద్ధ గ్రంధం లోని యెషయా 35లో చెప్పబడినది.మరియు మీరు దానిని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు మరియు దానిని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు దేవునికి దూరంగా గుర్తిస్తారు. మీరు అలా చేసిన ప్రతిసారీ, మిమ్మల్ని మీరు దేవునికి మరింత దూరం చేసుకుంటారు. దానిని గుర్తించే ప్రయత్నాన్ని విడిచిపెట్టండి. కేవలం ఆయన చెప్పింది నమ్మండి. అంతే - దాన్ని నమ్మండి. అప్పుడు, జ్ఞానుల నుండి తనను తాను దాచుకొని, సామాన్యులకు తనను తాను బయలుపరుచుకుంటాడు.
మానవుడు అంత పెద్దగా ఉండలేడు.
JOHN 8:44
36ఒక వ్యక్తి తనకంటూ ఒక పట్టా పుచ్చుకున్న వెంటనే, తన పొరుగువానికంటే ఎక్కువగా తెలుసుకుని ఉంటాడు . మీరు అతనికి ఏమీ చెప్పలేరు. నేడు సంఘములు తమ కాపరి గురించి డంబములు చెప్పుకోవడానికి ఇష్టపడుతాయి, ఎందుకంటే అతను పలానా, ఫలానా సెమినరీకి చెందినవాడు. అతనికి బి.ఏ ఉంది, అతనికి డి.డి .యల్. డి ఉంది, అని అర్ధం, అది ఒక్క విషయం అని కాదు. దాని ఉద్దేశం అది కాదు అతను బి.ఏ., డి. డి. మరియు ఎల్ఎల్. డి కలిగి ఉండి కాఫీ గింజలకు బఠానీ గింజలకు తేడా తెలియకపోవచ్చు. దాని ఉద్దేశం అదికాదు… (ఆ వ్యాఖ్యను మన్నించండి. చూడండి, ఇది హాస్యోక్తులకు స్థలం కాదు. ఖచ్చితముగా నా ఉద్దేశమదికాదు. మీరు నన్ను మన్నించండి.) నా ఉద్దేశమేమిటంటే: దానితో చేయడానికి ఒక్కటి కూడా లేదు.
విశ్వాసం ద్వారానే మీరు దేవుణ్ణి తెలుసుకుంటారు, దాని ద్వారా మాత్రమే. యేసు భూమి మీదికి వచ్చినప్పుడు అది రుజువు చేయబడింది. మరియు ఆ పరిసయ్యులు మరియు మొదలైనవారు - గొప్ప డిగ్రీలు కలిగిన వారు, చురుకైన వారు, మనము కలిగిన అత్యంత పరిశుద్ధ పురుషులు- వారికి వ్యతిరేకముగా ఏ ఒక్క తప్పిదము ఉన్నా, కనికరము లేకుండా వారిని రాళ్లతో కొడతారు. మరియు యేసు అన్నాడు," మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు." వారి వైపు వేలు చూపి ఎవరు చెప్పగలరు…?
ISA 50:9•
JOHN 5:39
37వ్యభిచరించడం, అబద్ధమాడడం, ధూమపానం, పొగాకు నమలడం మనము పాపం అంటాం. అది పాపం కాదు. దానికి పాపానికి సంబంధం లేదు. అవి అవిశ్వాసం యొక్క గుణాలక్షణాలు. ఒక్కే ఒక్క పాపం ఉంది. అది అవిశ్వాసం. "విశ్వసింపనివానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను." ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తిరస్కరించినప్పుడు … , అదే పాపం, సరిగ్గా అక్కడే.
యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలా అన్నాడు," నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా గురించి ప్రవచించినవన్నీ నేను నెరవేర్చలేదని నాకు ఎవరు చూపించగలరు? నేను వచ్చినప్పుడు, నేను కొన్ని, కొన్ని పనులు చేయవలసి ఉంది. నేను చేస్తాను అని లేఖనం చెబుతున్నదానిని నేను సరిగ్గా చేయలేదని ఎవరు నిరూపించగలరు? లేఖనాలను వెతకండి; ఎందుకంటే వాటిలో మీకు నిత్య జీవం ఉందని మీరు అనుకుంటున్నారు. మరియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చునది అదే. [చూడండి?] నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?"
MATT 23:12•
JOHN 3:18
38ఇప్పుడు, అక్కడ ఉన్నవారు … ఓహ్, వారు తమ కుండలు మరియు పాత్రలను కడగాలి, తినడానికి ముందు కడగాలి, మరియు ఈ సాధారణ సాంప్రదాయాలన్నింటినీ వారు ఆచరించవలసి వచ్చింది. కానీ యేసు వారందరినీ ఖండించాడు మరియు వారందరినీ పక్కన పెట్టాడు మరియు వారు దయ్యాలు అని వారికి చెప్పాడు. మీరు అలాంటి విషయం గురించి ఆలోచించగలరా?
నేడు సంఘములో ఆయన అదే పని చేస్తాడని మీరు నమ్ముతున్నారా? అతను ఖచ్చితంగా చేస్తాడు. ఇదివరకు ఉన్న గందరగోళములో పడేవరకు మనము సాంప్రదాయాలు మరియు కార్యాల చుట్టూ అల్లుకున్నాము. మరియు ఇప్పుడు దేవుడు తనను తాను సామాన్యతలో బయలుపరచుకున్నపుడు, వారు దానిని అస్సలు గుర్తించరు. ఇది వారి ఆలోచనా విధానానికి పైగా ఉంది. వారు అది ఎలా ఉండాలనుకున్నారో అదే విధముగా ఉండడానికి నిశ్చయించుకున్నారు, అది వారు అనుకున్న పద్దతిలో రాకపోతే వారు దానిని స్వీకరించలేరు. అదొక్కటే మార్గం- సమస్య ఎల్లప్పుడూ అదే. గుర్తుంచుకొనండి, పైకి వెళ్లే మార్గము క్రిందికి ఉంటుంది. ఇప్పుడు, అది సరైనది. "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును."
HEB 13:8
39అది ఏది పైకి ఉందో ఏది కిందకి ఉందో మీకు ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతరిక్షంలో నిలబడితే, ఉత్తర ధృవం పైకి ఉందా లేదా దక్షిణ ధృవం పైకి ఉందా? అది ఏది? చూడండి? మరియు మీరు, "ఓహ్, ఉదయ నక్షత్రం మరియు సాయంకాల నక్షత్రం" అని అంటారు. రెండూ ఒకే నక్షత్రమే. చూడండి… ఉదయ కాలము వెలుగునిచ్చేది ఆ సాయంకాల నక్షత్రమే. ప్రపంచం చుట్టూ తిరిగింది, అంతే. చూడండి, అది ఏమంత క్లిష్టతరమైనది కాదు. దేవుణ్ణి నమ్మడానికి ఇది కేవలం సాధారణ విశ్వాసమే.
గమనించండి.పైకి వెళ్ళే మార్గం క్రిందికి ఉంటుంది అని అన్నాను. మనం దేవుణ్ణి నమ్మాలి. మనం అతని మాటకు కట్టుబడి ఉండాలి. మనం విషయాలను గుర్తించడానికి ప్రయత్నించకూడదు, కానీ దేవుడు ఏది చెప్పినా, వాస్తవముగా నిజమైన దేవుని ఆత్మ దేవుని ప్రతి మాటకు "ఆమేన్" అని అంటుంది. పరిశుద్ధాత్మ వాక్యాన్ని వ్రాశాడు. మరియు పరిశుద్ధాత్మ వాక్యాన్ని వ్రాసినట్లయితే, మరియు పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్లయితే, "సరే, అది మరొక కాలానికి సంబంధించినది" అని ఎలా చెప్పగలదు? అది ఎలా చెప్పగలదు … "యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్క రీతిగానే ఉన్నాడు" అని చెప్పినప్పుడు మరియు మీరు దానిని గడచినకాలములోను లేదా రాబోవుకాలములోను ఉంచితే?
40మానవుడు ఇంకా అలాగే ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ దేవుడు చేసిన కార్యముల నిమిత్తము స్తుతులు చెల్లించుచూ, దేవుడు ఏమి చేస్తాడా అని ఎదురుచూస్తూ, అయన చేస్తున్న దానిని విస్మరిస్తున్నాడు. ఖచ్చితముగా మానవుడు ఎల్లప్పుడు అలానే ఉన్నాడు. అతను ఈరోజు కూడా అదే కార్యాన్ని చేస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ , అది… అది మానవుడు. మరియు మీరు దాని నుంచి బయటపడాలి. క్రీస్తునకు కలిగిన యీ మనస్సు మీరునూ కలిగియుండాలి.
దేవుడు మానవునితో ఎల్లపుడూ దీనత్వములోనే వ్యవహరిస్తాడు. అయన మానవునితో ఎప్పుడూ పెద్ద వేదాంత పద్దతులలో వ్యవహరించడు. ఆయన ఒక్కసారైనా అలాచేసినట్లు చెప్పండి. అయన ఎప్పుడూ చేయడు. అయన తనను తాను సామాన్యముగా చేసుకుంటాడు; మరియు మానవుడు దానిని సంక్లిష్టముగా చేస్తాడు. అయన తనను తాను వినయవంతునిగా చేసుకొనుట ద్వారా తనను తాను గొప్పవానిగా చేసుకుంటాడు.
ఇప్పుడు మానవుడు అతనికి కొంత విద్య లేదా కొన్ని డిగ్రీలు పొందుకొన్నపుడు, అతనికి మీరు ఏమి చెప్పలేనంతగా అతనికి చాలా తెలుసు. కానీ అతను తనను తాను చిన్నవానిగా చేసుకునేంత వరకు, అతనికి ఏమీ తెలియనంత వరకు అతను తగినంత గొప్పగా ఉండగలిగితే, పర్వాలేదు. కానీ అతను అంత పెద్ద వానిగా అవ్వలేడు, చూడండి. అతను అంత పెద్ద వానిగా అవ్వలేడు.
GEN 2:17•
ISA 53:1•
MATT 11:25
41మరియు దేవుడు అంత పెద్ద వాడు. అయన తనను తాను వినయముగా చేసుకునేంత పెద్దవాడు. కానీ మనల్ని మనం వినయవంతులుగా చేసుకునేంత పెద్ద వారము కాలేము. వ్యత్యాసము అదే.
కాబట్టి దేవుడు తనను తాను వినయములో మరియు సరళతలో దాచుకుంటాడు. మరియు మానవుని లోక జ్ఞానము నేరుగా దాని పైగానే చూస్తుంది. యెషయా ఇలా అనడంలో ఆశ్చర్యం లేదు," మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?"
యేసు అన్నాడు, "తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను." వినయం, సరళత.
దేవుడు తనను తాను ఎలా సామాన్యముగా చేసుకుంటాడో చూడండి. చూడండి. ఏదేనును చూడండి. జీవించడానికి వారు చేయాల్సినదంతా కేవలం అయన వాక్యమును నమ్మడమే. ఇప్పుడు, ఈ మొదటి కార్యము నిమిత్తమే మీరు కలిగి ఉండవలసిన అన్ని డిగ్రీలు కలిగిఉండాలని ఎన్నడూ అనలేదు. అయన అన్నాడు," ఇది నా వాక్యము, నమ్మితే జీవిస్తారు; నమ్మకపోతే మరణిస్తారు." ఇప్పుడు, అవ్వ ఎప్పుడూ దానినంతటినీ నమ్మకుండా ఉండలేదు. ఆమె అందులోని ఒక చిన్న మాటను నమ్మలేదు.
42ఇప్పుడు, సహోదరులారా, సహోదరిలారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలచాను. అవ్వ ఒక్క చిన్న వాక్యాన్ని నమ్మనిదానిని బట్టి దీనినంతటినీ జరుగునట్లు దేవుడు దానిని అనుమతిస్తే మరియు అది మానవజాతి ఇప్పుడు ఉన్నస్థితిలో ఉండునట్లు చేస్తే, దానిలో ఒక్క వాక్యాన్ని నమ్మకపోవడం మనలను వెనుకకు తీసుకు వెళ్తుందని అనుకుంటున్నారా? దాని గురించి ఆలోచించండి. చిన్న పిల్లల కష్టాలు, యుద్ధాలు మరియు సమస్యలు , కరువులు మరియు ఆహార లేములు , అనారోగ్యం మరియు హత్యలు మరియు జరుగుతున్న అన్ని దేవుడు చూడగలిగితే, ఇదంతా అయన వాక్యములో చిన్న పదాన్ని నమ్మకపోవడము వల్లనే , దానిలోని ఒక్క పదాన్ని నమ్మకపోవడం వల్ల మనం వెనుకకు వెళ్తామని అనుకుంటున్నారా? ఇవన్నీ దీనికి వెల అయితే, అయన మిమ్మల్ని ఉచితముగా వెనుకకు పంపుతాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎలాగైనా వెళ్లనివ్వాలా?
అంటారు," నేను కాదు… అర్ధం కాలేదు. ఏమైనప్పటికీ నేను దానిని నమ్మను." లేదు, మీరు దానినంతటినీ నమ్మాలి. అది ఎంత దీనముగా కనిపిస్తున్నా, ఎలాగైనా దానిని నమ్మాలి.
అంటారు, "సరే, నాకు అది అర్థం అవ్వడం లేదు." ఏమైనప్పటికీ దానిని నమ్మండి. మీరు దానిని అర్ధంచేసుకోవలసిన అవసరం లేదు; మీరు దానిని నమ్మాలి. ఏమైనప్పటికీ , కేవలం నమ్మండి. ఇప్పుడు, ఈరోజు మనం ఉన్న విధము అదే. అదే కార్యము దేవుడు …
43యుద్ధం చేయబోయే సైన్యము వలెనే . మేము ఇంగ్లాండ్‌లో వేగులవారిని కలిగి ఉన్నాము; ఇంగ్లాండ్ వారు ఇక్కడ వేగులవారిని కలిగి ఉన్నారు. వేగులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకు? వారు మన సైన్య రహస్యాలను వెతుకుతున్నారు. మనము ఏదయినా ఒక సైన్య రహస్యాన్ని కనుగొనిన వెంటనే, వారు దానిని ఎదుర్కొనడానికి దానినే లేదా ఇంకేదయినా కనుగొంటారు. ఇది ఒక యుద్ధం. జరుగుతున్న గొప్ప యుద్ధం ఆధ్యాత్మిక యుద్ధం.
44ఇప్పుడు, దేవుడికి ఇది నెరవేరుతుంది అని తెలిసినప్పుడు, ఆయన తన పిల్లలకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు వారి సైన్యమునకు చేసినట్లే చేసాడు. మనము ఒక మానవుడు ధరించడానికి శిరస్త్రాణాన్ని ఇస్తాము ఎందుకంటె అతడు దానిని ఉపయోగిస్తాడు అని మనకు తెలుసు. మనము అతనికి తవ్వుటకు పారను ఇస్తాము. మనకు తెలుసు … పెద్దది… పౌండ్-అతని వీపుపై దాదాపు తొంభై పౌండ్ల ప్యాక్, కొందరు చిన్న రూకీ ప్యాక్ చేస్తున్నారు. అతను … ఖచ్చితంగా అతనికి చాలా కష్టమైన విషయమే, కానీ అతనికి అది అవసరం అవుతుంది కాబట్టి దాని కోసం అతనికి వారు శిక్షణ ఇవ్వాలని సైన్యానికి తెలుసు. అతను యుద్ధభూమిని తాకినప్పుడు ప్రతి సామగ్రి, అతనికి అవసరం అవుతుంది.
GEN 3:4
45ఈరోజు మనం చేయవలసింది అదే, మిత్రులారా. మనం దేవుని వాక్యం మొత్తాన్ని తీసుకోవాలి, ఎందుకంటే మనకు అది అవసరం అవుతుంది. అందులో ఉన్న ప్రతి పదాన్ని మనం ఉపయోగించాలి. ఇది "యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడు" మరియు మనము పూర్తిగా సువార్త మొత్తాన్ని ఉపయోగించాలి.
ఇప్పుడు, దేవుడు తన సంఘాన్ని బలపరచినప్పుడు, అది తన స్వంత పిల్లలు కాబట్టి, ఆయన కనుగొనగలిగే ఉత్తమమైన వాటితో దానిని బలపరిచాడు. ఆయన తన వాక్యం, తన సొంత వాక్యం ద్వారా సంఘాన్ని బలపరిచాడు-తన వాక్యాన్ని వారిని విశ్వసించమన్నాడు. అక్కడ ఉన్నదంతా అదే. మరియు సాతాను తన జ్ఞానం ద్వారా అవ్వ ఒకే చోట ఆ అడ్డుగోడను బద్దలు కొట్టేలా చేశాడు. సాతాను వాక్యంలోని ప్రతీది సరైనదేనని ఒప్పుకున్నాడు, కానీ అన్నాడు, "ఖచ్చితముగా…" అతను తెలుసుకోవలసింది అంతా అదే. "ఖచ్చితంగా నువ్వు చావవు." ఇప్పుడు, అది ఒక లొసుగు. ఒక చిన్న సందేహముతో వాక్యం వెనక ఉన్న అవ్వను పట్టుకున్నాడు.
వాడు ఈరోజు సంఘమును కూడా అదే కార్యములో పట్టుకుంటున్నాడు. కేవలము ఆ ఒక్క చిన్న సందేహము మిమ్మల్ని ఇటుపక్కకు తీసుకువస్తుంది. మరి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మీరు చెందిన సంఘము ద్వారా, సంఘశాఖ ద్వారా లేక ఒక గుంపు , లేక ఇంకేదయినా, లేక ఏదయినా అనుభూతి ద్వారా మిమ్మల్ని కనికరిస్తాడు అని ఆలోచించే మార్గమే లేదు. మీరు అయన వాక్యాన్ని నమ్మి, దాని ప్రకారము ప్రవర్తించాలి. నిజము. అది ఒక్కటే మార్గము. ఆది యందు దేవుని ప్రణాళిక అదే; జీవితకాలం అంతయూ దేవుని ప్రణాళిక అదే; ఇప్పుడు దేవుని ప్రణాళిక అదే- సంఘము వాక్యము వెనుక నిలిచివుండాలి. మీరు రక్షింపబడే ఏకైక మార్గం అది. అది ఒక్కటే మార్గము.
REV 13:8
46గమనించండి. నోవహు అతని రోజుల్లో (దానిని గురించి ఉదకాలమున మనం మాట్లాడుకున్నాం), అతని రోజుల్లో అది గొప్ప మేధః సమయం, మరియు జనులు తెలివైనవారు. నోవహు మరియు అతని మేధః యుగం, ఎన్నుకొనబడిన ప్రజలను రక్షించుటకు దేవుడు దిగివచ్చాడు. దేవునికి ఎన్నుకొనబడిన సంఘము ఉందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితముగా ఆయన కలిగిఉన్నాడు. ఆ ఎన్నుకొనబడిన వారిని రక్షించుటకు అయన వస్తాడు. మిగిలిన వారు కేవలము ఆ ఫిరంగులకు మేత మాత్రమే. అయితే వారిలో అనేకులు రక్షింపబడుతారని ఆయనకు తెలుసు ఎందుకంటే జగత్తుపునాది వేయబడకమునుపే ఆయన వారి పేర్లను గొఱ్ఱెపిల్ల జీవగ్రంధములో పెట్టిఉన్నాడు. అది లేఖనానుసారముగా నిశ్చయము.
మరియు జగత్తుపునాది వేయబడకమునుపు ఎవరి పేర్లు ఆ గ్రంధములో వ్రాయబడలేదో వారందరినీ అంత్యదినములలో క్రీస్తు విరోధి మోసము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పింది. క్రీస్తు విరోధి చాలా దగ్గరగా, పెంతెకొస్తు లాగా, చూడండి. అయితే గొర్రెపిల్ల వధించబడినప్పుడు జగత్పునాది నుండీ ఎవరి పేర్లు జీవగ్రంధములో లేవో వారిని అది మోసం చేస్తుంది.
47గమనించండి. సాతాను, ఆ గొప్ప ప్రతినిధి , మొదటిసారి సంఘము వాడి లోక జ్ఞానాన్ని నమ్ములాగా చేయుటద్వారా మాత్రమే సంఘాన్ని పట్టుకున్నాడు మరియు సంఘమును దేవుడు అయన వాక్యము పట్ల కలిగి ఉండమన్న సామాన్య విశ్వాసము నుండీ దూరము చేయగలిగాడు అని మనము ఇప్పుడు కనుగొన్నాము. అది వాడి మొదటి కార్యము. అతను అక్కడ విజయం సాధించాడు, చేసిన ప్రతిసారి దానినే చేసాడు. ఓహ్, మనం చూడగలిగితే అంతే! మరియు ఆ వాక్యము వెనుకనుండీ మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగితే, వాడు చేయవలసినదంతా అదే - తక్షణమే మీరు వాడి చేతులలో ఉన్నారు. గమనించండి. కేవలం ఆయన వాక్యాన్ని నమ్మి జీవించండి.
ఇప్పుడు. అవ్వ, ఆమెకు అది సరిపోలేదు. ఆమె లోకజ్ఞానం కొంత కావాలనుకున్నది. ఈరోజు మనం చేస్తున్నది అదే. దాని గురించి మనకు చెప్పడానికి మనం ఇప్పుడు కొంతమంది డాక్టర్, Ph.D., LL.D.ని కలిగి ఉన్నాము. సహోదరుడా, అది ఈ వాక్యమునకు విరుద్ధముగా ఉంటే దానిని విడిచిపెట్టు. అది రోమ్‌లోని పోప్ అయినా, లేదా అది … ఏదైనా క్రమం అయినా, లేదా కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ అయినా నేను పట్టించుకోను. ఎవరు అనేది నేను పట్టించుకోను. మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి, మరియు ప్రతి ఇతర మాటలు అబద్ధంగా ఉండనివ్వండి. ఈ వాక్యమునకు ఏదైనా విరుద్ధముగా ఉంటే … నేను ఈ ఒక్క విషయమును కనుగొన్నాను: వాక్యానుసారముగా జీవించండి. దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానమును అయన నిలబెట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతే అప్పుడు అది దేవుడు కాదు.
REV 22:18,19
48ఇప్పుడు, దేవుడు… ప్రపంచాన్ని ఏదో ఒకరోజు ఏదో ఒక ప్రమాణముతో తీర్పు తీర్చవలసి వస్తే. ఇప్పుడు, అయన దానిని సంఘ ప్రమాణము (రోమన్ సంఘము మనకు చెప్పినట్లు)తో తీర్పు తీర్చబోతే, అప్పుడు అది ఏ సంఘము? దాదాపు తొమ్మిది వందల సంఘశాఖలు ఉన్నాయి. అది ఏది? బాప్టిస్ట్ వారు వారిది ప్రమాణం అంటారు. పెంతెకొస్తు వారు వారిది అంటారు, కాథలిక్ వారు వారిదంటారు. నాకు, వాటిలో ఏ ఒక్కటీ కాదు. వాక్యమే సత్యము. "ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల లేక కలిపిన యెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను… వానికి పాలులేకుండ చేయును." అది దేవుని వాక్యము, దేవుడు మానవుడిని దానితోనే తీర్పు తీరుస్తాడు.
GEN 6:17
49నోవహు యొక్క గొప్ప తరము వారు అక్కడ చాలా తెలివిగా ఉన్నపుడు, దేవుడు వారికి ఒక వర్తమానము పంపాడు. మరియు ఆయన అలా చేసినపుడు, ఆయన ప్రధానదూతను పంపలేదు; ఆయన ఒక రైతును ఒక సామాన్య చిన్న వర్తమానముతో పంపాడు. కానీ అది వారికి చూపిస్తోంది. ఇప్పుడు, వారు దానిని స్వీకరించారు అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఎందుకంటే అది చాలా సామాన్యముగా ఉన్నది. అది అంత సామాన్యముగా ఉండిఉండకపోతే, వారు దానిని పొందుకునే వారు. అది ఏదయినా గొప్పది అయితే… మీరు వారు ఇదివరకు నిర్మించిన పిరమిడు కంటే గొప్ప పిరమిడును ఎలా నిర్మించాలో లేక అటువంటివి వారికి చెప్పిఉండినట్లైతే, వారు స్వీకరించి ఉండేవారు. కానీ ఆయన ఒక సామాన్య మానవుడిని వర్షం రాబోతుంది అనే వర్తమానముతో పంపాడు. అది వారి శాస్త్రీయ విద్యను అందుకోలేదు. ఎందుకు, వారు ఆకాశములోనికి రాడార్ లేదా ఇంకేదైనా పంపి, అక్కడ పైన వర్షపునీరు లేదని నిరూపించగలరు.
కానీ నోవహు అన్నాడు, "అక్కడ నీరు ఉంటుందని దేవుడు చెప్పాడు. మరియు అక్కడ నీరు ఉంటుందని దేవుడు చెబితే-అక్కడ ఏమీ లేకపోయినా-ఆయన దానిని అక్కడ ఉంచగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త." అంతే ఎవరెన్ని చెప్పినా, దేవుడు అలా చెప్పాడు; మరియు దేవుడు తన మాటను నిలబెట్టుకోగలడు. మరియు ఆ సాధారణ చిన్న సందేశం అతని రోజుల్లో ప్రపంచాన్ని ఖండించింది మరియు అతని స్వంత ఇంటిని రక్షించింది. అది నిజమే. ఒక సాధారణ… తిరుగుబాటు లేదు. కేవలం ఓడలో నడక. అక్కడ అవసరమైనదంతా అంతే. నమ్మి లోనికి నడవండి.
దేవుడు ప్రపంచాన్ని సామాన్యత ద్వారా, మరియు తనను తాను చాలా దీనముగా కనుపరుస్తూ రక్షించాడు. అది… అది ఏమిటి? దేవుడు మరలా తెలివైన, విద్యావంతుల నుండీ దాగుకొంటున్నాడు.
50జలప్రళయముకు ముందు ప్రజలు ఈ దినమున మనకంటే తెలివైనవారని ఎవరికైనా తెలుసా. విజ్ఞానములో మరియు మొదలైన వాటిలో ఈ దినమున ఉన్న మనకంటే ఎంతో అభివృద్ధి చెందినవారు. ఎందుకంటే వారు అక్కడ ఉన్న మమ్మీలను మరలా తవ్వగలరు, మరియు ఈ దినమున మనకు మమ్మీలు లేవు. మనము ఒక శరీరమును ఆ విధముగా శిలలాగా చేయలేము. వారు కలిగిన రంగులకు సరిపోవునట్లుగా ఈదినమున మనము కలిగిలేము. మనము కలిగి ఉన్ననూ సరిపోల్చలేని విధముగా వారు పిరమిడ్లను, స్పిన్క్స్ (మనుష్యుని శిరస్సు, సింహము శరీరాకృతిలోని పెద్ద రాతి శిల్పము) మొదలైన వాటిని నిర్మించారు. దీనిని నిర్మించడానికి మనవద్ద సామాగ్రి లేదు. దాన్ని పైకి ఎత్తే శక్తి మనకు లేదు. మనము దానిని నిర్మించలేకపోయాము; కానీ వారు దానిని నిర్మించారు. ఎందుకు? వారు మనకంటే తెలివైనవారు.
మరియు ఆ చక్కటి, విద్యావంతులైన, తెలివైన, జ్ఞానముగల ప్రజల జాతిలోనికి దేవుడు చాలా వినయంగా ఒక సందేశాన్ని పంపాడు, అది వారిని నేరుగా మొదటి నుండీ తడబడులాగా చేసింది. వారు దానిని తిరస్కరించారు మరియు ఆమోదించలేదు. మరియు దేవుని న్యాయమునకు ఆయన వర్తమానాన్ని తిరస్కరించినవారికి తీర్పు అవసరమైంది. అయన ప్రపంచాన్ని ఖండించి వరద ద్వారా భూమికింద దానిని ముంచివేశాడు; మరియు దేవుడు ఇచ్చిన సాధారణ చిన్న వర్తమానాన్ని నమ్మిన నీతిమంతుడైన నోవహును రక్షించాడు. అది ఏమిటి? దేవుడు సామాన్యతలో దాగుకొనుట. ఓహ్, అవును. అవునయ్యా. సాధారణముగా వారు ఎప్పటిలాగే… వారు దానిని నమ్మారు.
51మరొకసారి విమోచన కోసం సమయం సమీపముగా ఉన్నపుడు , దేవుడు ఒక సాధారణ వ్యక్తిని సాధారణ కుటుంబం నుండీ బయటకు పంపాడు. ఆయన ఎన్నడూ ఏ ప్రసిద్ధ కుటుంబాన్నీ తీసుకోలేదు … మోషే కుటుంబం. అతను సాధారణ వ్యక్తి అని మనము కనుగొన్నాము, లేవీ గోత్రముకు చెందిన సాధారణ కుటుంబం, నేను నమ్ముతున్నాను. మరియు అతను వారిని బయటకు తీసుకువచ్చాడు, ఈ కుటుంబాన్ని. అతను మోషేను లోపలికి అనుమతించి మరియు దేశంలోని అత్యున్నత విద్యావంతుడిగా చేశాడు. అతను ఐగుప్తీయులకు జ్ఞానాన్ని బోధించగలడు. అతను సైన్యమునకు చెందిన వ్యక్తి అని మనకు చరిత్ర చెబుతుంది. అతనికి అన్నింటిని ఎలా చేయాలో అన్ని మెలకువలు తెలుసు.
మరియు దేవుడు అతనిని అలాంటి శిక్షణపొందులాగా అనుమతించాడు మరియు మీరు ఆ పద్ధతిలో దేవుని కోసం సఫలతను పొందలేరని నిరూపించాడు. అతని సైన్యం, అతని మేధోవంతమైన మనస్సు, అతని విద్యాభ్యాసం అంతయూ - వాటి ద్వారా అతను తీవ్రంగా మరియు ఘోరంగా విఫలమయ్యాడు. దేవుడు అతనిని చేయనిచ్చాడు, అతనిని విద్యావంతునిగా మరియు తెలివైన వానిగా ఉండనిచ్చాడు. అప్పుడు అతనికి విద్యాబుద్ధులు నేర్పడానికి నలభై సంవత్సరాలు పట్టింది; అతనిని ఉపయోగించుకొనుటకు ముందే, ఆపై నలభై సంవత్సరాలు దానిని అతని నుండి తీసివేయుటకు పట్టింది. అది నిజము . అది వాస్తవము. అతన్ని ఎడారి వెనుక వైపుకు తీసుకు వెళ్లి , అతనికి ఉన్న విద్యనంతా వదిలించాడు.
52ఓహ్, ఒక్కటే విషయం ఏమిటంటే, ఈరోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే, రాకడ కోసం మనము ఎల్లప్పుడూ సర్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మనము రాకడ కొరకు ఖాళీ చేసుకోవాలి. అక్కడ ఖాళీ స్థలం ఉండాలి. అక్కడ ఏదో ఆకలి కలిగి ఉండాలి. మనము ఒప్పించడానికి మరియు లాగడానికి ప్రయత్నిస్తున్నాము-మనము అలా చేయకూడదు. ఒక వ్యక్తి దేవుని కోసం ఆకలితో ఉంటే, అతని కోసం ఒక స్థలం ఖాళీగా ఉంటుంది. అంతే. కానీ అప్పటివరకు మనం దేవుణ్ణి ఒక చోట పట్టి ఉంచలేము.
మనము అతను సిద్ధాంతములు, ఉల్లాస కార్యములు మొదలైనవి కలిగి ఉండులాగా చేసి మరియు వింతగా ప్రవర్తించవచ్చు. కానీ ఆ వ్యక్తి తనంతట తాను దేవుణ్ణి కోరుకునేంతవరకూ, అది ఖచ్చితముగా పనిచేయదు. అవును, అయ్యా. కాబట్టి మన మానవ నిర్మిత కార్యక్రమాలు మంచివి కావు. దేవుని ప్రణాళికలోకి రండి. అది ఖచ్చితంగా సరైనది. సంఘములో చేరడం, కరచాలనం చేయడం, బాప్తిస్మము మరియు ఆచారాల రూపాలు మరియు జపమాల చేయడం మరియు మొదలైనవి. బుద్ధిహీనత!
MATT 5:6
53ఇది ఒక పుట్టుక.
దేవుడు… "నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు." అది నిజము. మీరు ఖాళీ కలిగి ఉండాలి. మానవులకు ఆకలి కలిగించేది ఏది? ఇక్కడ పురుషులు బయటకు వెళ్లి వారు చేసేది చేయులాగా చేసేది ఏమిటి? అనైతిక మైన దుస్తులు ధరించి ఈ స్త్రీలు వీధులలో తిరుగులాగున చేసేది ఏమిటి? వారు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? వారు ఒక ఆకలిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు దేని నిమిత్తము ఆకలి కలిగి ఉన్నారు? వారు ఆకలి గొనుట నిమిత్తము సృష్టించబడి ఉన్నారు. కానీ ఆ ఆకలి…
దేవుడు మిమ్మల్ని ఆయనకొరకు ఆకలి గొనుటకు చేసిన ఆ పరిశుద్ధమైన ఆకలిని నిశ్శబ్దపరచుటకు ప్రయత్నించి మరియు దానిని లోకకార్యములతో తృప్తిపరచుటకు ప్రయత్నించుటకు ఏ వ్యక్తికైనా ఎంత ధైర్యము! దానిని చేయుటకు మీకు ఏ అధికారం లేదు. బింగో ఆటలు, మరియు నృత్యాలు మరియు సంఘములో కార్యాలు, మరియు సూప్ విందులు, మీ కాపరికి-ఒక రకమైన శారీరక వినోదం- చెల్లించడానికి మరియు మిమ్మల్ని మీరు మతపరమైన వారు అని పిలవడానికి ప్రయత్నించడానికి ఏ వ్యక్తికైనా ఎంత ధైర్యం; మరియు ఆ పవిత్రమైన ఆకలిని అణిచివేసేందుకు, మీరు అక్కడ ఆ మేడ గదిని కలిగి ఉండవలసి వచ్చినప్పుడు, ఆ ప్రజల సమూహాన్ని పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మము తో నింపడానికి ప్రార్థించుటకు. మీకు ఏ అధికారము లేదు.
54కానీ అది చాలా వినయవంతమైనది; ఇది మీ అవసరాలకు అనుగుణంగా లేదు. మీ చదువు దానిని దాటి పోయింది, చూడండి. మీరు చాలా తెలివైనవారు. మీరు ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నారు. పరిశుద్ధాత్మను ఎరిగిన కాపరి మీకు అవసరము లేదు. మీరు [అస్పష్ట పదం] మీ బలిపీఠము నుండీ అతనిని దూరముగా ఉంచారు. మీకు అది అవసరము లేదు ఎందుకంటే అతడు తన కార్డును చూపించలేడు, అతను ఏ పాఠశాల నుంచి వచ్చాడో చూపించలేడు. మోషే దానిని చూపించగలడని మీరు అనుకుంటున్నారా? ప్రవక్తలలో ఎవరైనా దానిని చూపించగలరని మీరు అనుకుంటున్నారా? యేసు దానిని చూపించగలడా?
వారు అన్నారు, "ఏ పాఠశాల … ఈ చదువు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడ నుండి వచ్చింది?" అతను తన జీవితంలో ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్లిన దాఖలాలు మన వద్ద లేవు.
JOHN 1:32
55యోహాను సంగతేమిటి ? -ఆ పాత ఉన్ని, గజిబిజి-పురుగు ముఖం, అలా అరణ్యం నుండీ బయటకు వస్తున్నాడు. (అతని తండ్రి బోధకుడు మరియు అతను పాఠశాల నుండీ బయటకు వచ్చాడు. అతను ఒక యాజకుడు.) అతను పాఠశాలకు వెళ్లిన దాఖలాలు మన వద్ద లేవు. అతని తొమ్మిది ఏళ్ళ వయసులో అరణ్యములోకి వెళ్ళాడు. ఎందుకు? చేయడానికి అతనికి ఒక ముఖ్యమైన పని ఉంది. వారికి ఉన్న ఆచారము ప్రకారము చేయక, అతని తండ్రి బాటలో అతను ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు, అక్కడ ఉన్న ఆ సెమినరీ అతనిని చాలా సందేహాల్లోకి త్రోసివేసి ఉండేది, వారు కలిగి ఉంటారు… ఇప్పుడు, అయితే… " మెస్సీయాను మీరు ప్రకటించాలని మీకు తెలుసు. ఇప్పుడు, సహోదరుడు జోన్స్ దానికి సరిపోతాడు అని మీకు తెలుసు."
"నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మ మరియు అగ్నితో బాప్తిస్మమిచ్చువాడు " అని ప్రభువు అతనితో చెప్పు వరకూ, అతడు అరణ్యములోనికి వెళ్లి దేవుని కొరకు వేచియుండెను. తన పరిచర్య విద్యను పొందడం చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా అది . అతనికి దేవుని శక్తి ఉండాలి. ఇప్పుడు మీరు మీ విద్యతో పాటు దేవుని శక్తిని పొందినట్లయితే, అద్భుతమైనది. అయితే ఆ విద్యను దేవుని శక్తి కంటే పైన ఉంచవద్దు, చూడండి. నిజంగా.
56ఇప్పుడు మనము ఆ మోషేను కనుగొన్నాము… ఇప్పుడు, అతను అక్కడ ఉన్నపుడు… తాను ఇశ్రాయేలు పిల్లలను విడుదల చేయాలని తన తల్లి ద్వారా తెలుసుకొని, నలభై సంవత్సరాలు తనను తాను తర్ఫీదు చేసుకున్నాడు. ఆ ఐగుప్తీయుడిని చంపినపుడు సహోదరులు దానిని ఖచ్చితముగా అర్ధం చేసుకుంటారని అతను అనుకున్నాడు, కానీ వారు అర్ధం చేసుకోలేదు. కాబట్టి అతని అన్ని పథకాల గుండా అతడు విఫలమయ్యాడు మరీ దయనీయముగా ఓడిపోయాడు. కానీ అక్కడ ఐదు నిముషాలు మండుచున్న పొద ప్రసన్నతలో నలబై సంవత్సరాలు ఆ సెమినరీ అతనిలో పెట్టినదానికంటే దేవుడు ఎక్కువ అతనిలో పెట్టాడు.
ఇప్పుడు, నేను ఒక విషయం ఒప్పుకుంటాను. మీరు దేవుణ్ణి నేర్చుకుంటే, దీనత్వముతో ఉన్న దేవుడు…పొద సంగతి ఏమిటి? ఒక వేళ మోషే, "ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నా చదువు చాలా ఉన్నతమైనది. కాబట్టి నేను అక్కడికి వెళ్లి, పొద లోని కొన్ని ఆకులను సేకరించి, వాటిని ప్రయోగశాలకు తీసుకువెళ్లి పరీక్షించి అది అగ్ని తాకినా కాలిపోకుండా ఉండుటకు ఏ రసాయనాలు దానిపైన చల్లారో చూస్తాను. చూడండి, అతను ఎప్పుడూ రహస్యాన్ని కనుగొనలేదు. కానీ అతను ప్రకృతి తల్లి వద్దకు వెళ్లి, తన పాదరక్షలను తీసి, మోకరిల్లి, దానితో మాట్లాడటం ప్రారంభించాడు. మరియు అది అతనితో తిరిగి మాట్లాడింది. మార్గం అది.
EXOD 2:15,21•
EXOD 3:2•
EXOD 4:2,20•
MATT 7:7•
LUKE 11:9
57ఏదో ఒకదానిలో మిమ్మల్ని మీరు విద్యావంతులుగా చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. కానీ నేరుగా యెహోవా దేవుని ఎదుటకు వెళ్ళండి. ఆయనతో మాట్లాడండి; ఆయన తిరిగి మీతో మాట్లాడతాడు. ఆది ఎంత దీనముగా ఉంది." అడగండి మీరు పొందుకుంటారు; తట్టుడి తెరవబడును; వెదకుడి దొరకును; అడుగుడి మీకియ్యబడును." అది అంత సులభమైనది.
నాకు ఒక విషయం తెలుసు: మీరు నిజంగా దేవుణ్ణి ఎప్పుడైనా కనుగొన్నప్పుడు అది మిమ్మల్ని వింతగా ప్రవర్తించేలా చేస్తుంది. మీరు మోషేను గమనించండి. మరుసటి రోజు తర్వాత… అతను అక్కడి నుండి పారిపోయాడు … అతను అప్పటికే ఐగుప్తు నుండి బయటకు పారిపోయాడు, మరియు అక్కడకు వెళ్లి సిప్పోరాను వివాహం చేసుకున్నాడు మరియు గెర్షోము అను చిన్న కుమారుడిని కలిగి ఉన్నాడు. మరియు ఇక్కడ అతను ఇప్పటికే ప్రజల బానిసత్వం గురించి మరచిపోయాడు. కానీ అక్కడ మండుతున్న పొదలో దేవుడు అతనికి కనిపించినప్పుడు, మరుసటి రోజు అతను సిప్పోరా ఒడిలో చిన్న పిల్లవాడితో గాడిద పైన అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చొని; మరియు తెల్లని గడ్డం అతని నడుము వరకు వేలాడుతూ, అతని బట్ట తల మెరుస్తూ మరియు చేతిలో కర్రతో అక్కడ ముందుకు వెళ్తూ. "దేవునికి మహిమ!" అయన కళ్ళు చూస్తున్నాయి.
"నీవు ఎక్కడికి వెళ్తున్నావు, మోషే?"
మేము ఐగుప్తును స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నాము"-ఒక్క వ్యక్తి దండయాత్ర. ఓ, ఇది మిమ్మల్ని తమాషా గా ప్రవర్తించేలా చేస్తుంది. అయితే అదంతా వాస్తవమే. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో మీకు తెలిసినంత వరకూ, అది సరైనదే.
"నీవు స్వాధీనం చేసుకోబోతున్నావని నీకు ఎలా తెలుసు?".
"దేవుడు అలా చెప్పాడు." అది దానిని స్థిరపరుస్తుంది - "దేవుడు అలా చెప్పాడు."
"అయ్యో, నీకు ఎనభై ఏళ్లు. నీకు నలభై ఏళ్ళ వయసులో అలా చేసి వుంటే…"
"అయితే దేవుడు చెప్పాడు, 'ఇప్పుడు వెళ్ళు. సమయం ఇదే.'" ఒక్క వ్యక్తి దండయాత్ర దీన్ని చేయడానికి వెళ్తుంది.
58భవనము పైన ఉన్న గాలివీచు దిక్కును చూపే సాధనములా దేవుడు మిమ్మల్ని వింతగా ప్రవర్తించేలా చేస్తాడు. కానీ అది దేవుడు చేస్తున్నంత కాలం, ఎందుకు, సరే. ఇది ఏ వ్యత్యాసము చేస్తుంది? ఇది మీ నుండి బాప్టిస్ట్ వేదాంతపరమైన శిక్షణను తీసివేయవచ్చు , కానీ దేవుడు దానిని చేస్తున్నంత కాలం అయన తనను తాను సామాన్యతలో బయలుపరచుకుంటాడు. ఆ బోధకుడికి తను పాఠశాలకు వెళ్లిన అన్ని సంవత్సరాల్లో నేర్చుకునేదానికంటే ఆ ఇంటి మీద నుండి దేవుడు రావడం గురించి ఎక్కువ తెలుసు. ఆమెన్! దేవుడు సామాన్యతలో తనను తాను బయలుపరచుకొని మరియు తనను తాను శక్తిలో చూపిస్తాడు. ఆమెన్! తనను తాను దాచుకుంటాడు , అటుతర్వాత తనను తాను బయలుపరచుకుంటాడు. మీరు ఎంత సులభంగా పొందగలరో చూడాలనుకుంటున్నాడు -మీరు ఎంత తెలివిగా పొందగలరో కాదు; కానీ మీరు ఎంత సులభంగా పొందగలరో.
59దేవుడు తనని తాను సామాన్యత లో తెలియజేసుకుంటాడు; తెలివి మరియు చాకచక్యం లో కాదు. అది అపవాదికి చెందినది. శిక్షణను అనుసరించండి. కయీను పిల్లలు ఎక్కడ ఉన్నారు, అతనికి ఏమి జరిగింది? దెయ్యాల పిల్లలు, వారికి ఏమైంది? వారందరూ తెలివైన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు మరియు మొదలైనవారు. షేతు పిల్లలను అనుసరించండి-వినయవంతులైన రైతులు, గొర్రెల కాపరులు మొదలైనవారు. యుగసమాప్తి లో, ఏమి జరిగింది? జలప్రళయమునకు ముందటి యుగం ముగింపులో, ఏమి జరిగింది? వారంతా ఓడిపోయారు. వారు కూడా మతపరమైనవారు. ఖచ్చితంగా, వారు. కానీ మీరు చూడండి, దేవుడు నోవహును పంపాడు. దీనమైన, సాధారణమైన వారిని తీసుకున్నాడు; మరియు కయీను పిల్లలు నాశనమయ్యారు.
GEN 3:4,5•
EXOD 3:2•
DEUT 23:4
60ఈరోజు కూడా అది అంతే. తెలివైన, వివేకము గల… చూడండి, ఏదెను తోటలో సాతాను అవ్వను అదే విధముగా మోసం చేశాడు. సాతాను పిల్లలు కూడా అదే విధముగా ఉన్నారు.
మోయాబును చూడండి—ఆ గొప్ప, చక్కని శాఖ కొండపై నిలబడి ఉంది. మై, ఎంత గొప్ప ప్రదేశం. ఇప్పుడు కాదు… వారు అదే దేవుణ్ణి ఆరాధించారు, ఎందుకంటే వారు వెళ్లి తమకు బిషప్పుగా బాలామును తెచ్చుకున్నారు. అతను అక్కడకు వచ్చి ఏడు బలిపీఠాలను, ఏడు బలులను-అదే బలిపీఠం, అదే బలిని పెట్టాడు. ప్రతీది అక్కడ ఉన్న చిన్న సంచారులైన ఇశ్రాయేలీయులు చేయునట్టే చేశారు. అటుతరువాత వారి సహోదరుడిని శపించడానికి ప్రయత్నించారు, చూడండి, అతను ఆ ప్రదేశము గుండా వెళ్లకుండా ఉండడానికి. అక్కడ ఉన్న పరిశుద్ధ గుండ్రాళ్ల ఉజ్జీవము వాటిలో ఏ ఒక్కటీ వారి ప్రజల మధ్యలో వారు వద్దనుకున్నారు.
ఏమి జరిగింది? ఏదోక విధముగా దేవుడు నేరుగా వెళ్ళాడు, ఎందుకంటే వారు వాగ్దాన భూమికి వెళ్ళడానికి వాగ్దానం చేయబడ్డారు, వారిని ఏదీ ఆపలేదు. దేవుడు వారితో వ్యవహరించాడు. దేవుడు తనను తాను సామాన్యతలో దాచుకున్నాడు. అయన ఎల్లప్పుడూ అదే రీతిగా చేస్తాడు, వారు సాధారణముగా దానిని తప్పిపోతారు.
మండుచున్న పొద వద్ద మోషే క్రీస్తు మరియు దేవునికి సమర్పణ చేయబడ్డ సేవకుడు. అతడు ఎక్కువగా తెలుసుకొనెను … అతను ఐగుప్తులో దేవుని గురించి చదివిన నలభై సంవత్సరాల కంటే ఎక్కువగా ఆ మండుచున్న పొద విడిచివెళ్ళినప్పుడు తెలుసుకొన్నాడు. అది నిజమని మనకు తెలుసు.
61అహాబు దినములలో ప్రపంచం అటువంటి స్థలముకు చేరుకుంది-అహాబు తెరపైకి వచ్చే వరకు (ఈ ఉదయకాలమున మనం మాట్లాడుకున్నట్లుగా) రాజకీయాలు అటువంటి పాత్రను పోషించాయి. ఇప్పుడు, అహాబు చెడ్డవాడు కాడు. అతను కేవలము నులివెచ్చగా ఉన్నాడు, వెనుకకు జారిన ఇశ్రాయేలీయుడు మరియు ఆతని భార్య అతనిని నడిపించనిచ్చాడు. ఆ తలను తిప్పే మెడగా ఆమె ఉంది.
ఇప్పుడు ఇక్కడ ఈ యునైటెడ్ స్టేట్స్ లో ఇదే కార్యాన్ని మనము కలిగి ఉన్నాం. ఖచ్చితముగా. "మన అధ్యక్షుడు పలానా - పలానా …" అని నేను చెప్పను అతను మంచి వ్యక్తి అయిఉండవచ్చు. కానీ అది దాని వెనుక ఉన్న పాత వ్యవస్థ - దానిని చేయునది అదే.
62మీరు చూడండి. మీరు గుర్తించండి… నేను ఇక్కడ నిలబడి ఏదో చెప్తున్నాను మరియు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలియదు అనుకుంటున్నారా. నేను మీకు చెప్పిన దానిని గుర్తుంచుకోండి. అది సరైనదే .
నేను ముసలివాడనవుతున్నాను. యేసు రాకడ ఆలస్యమైతే, ఈ భూమిమీద నాకు ఇంకా ఎక్కువ రోజులు లేవు. నేను చాలా త్వరగా వెళ్ళిపోతాను. కానీ ఇది టేపు చేయబడుతుంది, మీరు దానిని వేసినప్పుడల్లా, అది నిజమని మీరు కనుగొంటారు. మీరు ఛాయలలో జీవిస్తున్నారు. అస్సలు ఆశ లేదు. ఇప్పుడు గుర్తుంచుకొనండి, నేను ఒక వృద్ధుడిగా ఇక్కడ నిలబడి సమయము అయిపోతుందని నేను ఎరిగియున్నాను. మరియు నీవు చేయాల్సింది ఏమీ లేదు, దేశము చేయాల్సింది ఏమీ లేదు, మరియు సమస్తము పూర్తిచేయబడింది. అది నిజము. ఒకే ఒక్క విషయం, ఈ ముందు తరం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఎందుకంటే అది అంతా పూర్తి చేయబడింది. అది నిజము.
1KGS 19:2
63ఆహాబు… ఆ దినములలో ఆ యెజెబెలు లోపలికి వచ్చింది, ఆమె ప్రవర్తించు రీతిగానే అందరు స్త్రీ లు ప్రవర్తించులాగా, ఆమె చేసిన కార్యములను నేను ఊహిస్తున్నాను. ఆహాబు కార్యాలను జరగనిచ్చాడు… మరియు పరిచారకులందరు లోకస్థులయ్యారు.
కానీ అదే సమయములో దేవుడు ఒక శక్తిమంతుడిని లేపాడు. అతను ఎక్కడి నుండీ వచ్చాడో కూడా మనకు తెలియదు. అతని తండ్రి మరియు తల్లి ఎవరో మనకు తెలియదు. అతను తెలియని స్థలం నుండి వచ్చాడు కానీ మహిమలోకి వెళ్ళాడు. అతని తండ్రి మరియు తల్లి ఎవరో మనకు తెలీదు- ఒక్క దినము కూడా పాఠశాలకు వెళ్లలేదు . అతడు అరణ్యవాసి. అతడు ఎలా వచ్చాడో మనకు తెలియదు. అతడు వింతగా నేరుగా రంగం మీదకు వచ్చాడు, వింతగా రంగం మీద నుంచి వెళ్ళిపోయాడు. మరియు అతను అక్కడికి వచ్చాడు, మరియు ఆయన ఒక సామాన్య మానవునిలో ఆ తరమును కదిలించాడు. ఆ తత్వవేత్తలు ఆ దినమున అతడి గురించి ఏమి అనుకున్నారని మీరు అనుకుంటున్నారు? వారు ఏలియాకు ఏమి చెప్పారని మీరు అనుకుంటున్నారు? వారు అన్నారు "అతను ఒక ముసలి మూర్ఖుడు."
యెజెబేలు అన్నది, "నేను అతడిని ద్వేషిస్తున్నాను." మరియు ప్రతి ఒక్కరూ అతడిని ద్వేషించారు. కానీ దేశ రక్షణ కొరకు అతడు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ వారు దానిని నమ్మలేదు.
MAL 4:5,6
64ఏలీయా సామాన్యమైన వ్యక్తి. మరియు అతడు దేవుని ఉద్దేశాన్ని చాలా చక్కగా నెరవేర్చాడు- ఏలీయా లో ఉన్న ఆ సామాన్యమైన ఆత్మ- ఇదివరకే ముగ్గురు వ్యక్తులలో దానిని ఉపయోగించాడు, మరియు చివరి రోజులలో మరలా ఉపయోగిస్తాను అని వాగ్దానము చేశాడు. సరి. చాలా సులభము, అది నిలబడి సత్యమును మాత్రమే చెప్పునంతగా. అతని తరువాత ఎలీషాలో ఆయన దానిని ఉపయోగించాడు, బాప్తిస్మము ఇచ్చు యోహాను లో ఉపయోగించాడు, మరలా మలాకి 4లో పిల్లల విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించి పెంతెకొస్తు తండ్రులు మరియు నిజ సువార్త వైపు తిప్పుటకు వాగ్దానం చేశాడు. అయన వాగ్దానం చేశాడు, అయన దానిని చేస్తాడు! అది నిజము- ఆ సామాన్యమైన ఆత్మ -చురుకైనది కాదు, తెలివైనది కాదు.
ఏలీయా పండితుడు కాదు. అతను ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడో కూడా మనకు తెలియదు. కానీ అతనికి దేవుణ్ణి విశ్వసించేంత తెలివి మాత్రమే ఉంది. సామాన్యము, అంతే. ఆ రకమైన వారితోనే దేవుడు పనిచేస్తాడు- తనను తాను దాచుకుంటాడు. ఏలీయాలో దేవుడు తనను తాను దాచుకున్నాడు.
65మోషే వంటి ఒక సాధారణమైన వ్యక్తి అతను చేసిన పనులవంటి పనులు చేయగలడని మీరు ఊహించగలరా? ఆ ఏలీయా ని మీరు ఊహించగలరా- శరీరమంతా వెంట్రుకలు మరియు అతని చుట్టూ ఒక గొర్రె చర్మంతో కప్పబడిన ఒక ముసలి, ఉన్నిలా కనిపించే వ్యక్తి-దేవుడు అటువంటి దానిని తీసుకుంటాడు అని మీరు ఊహించగలరా? వస్త్రము ధరించి మరియు పెట్టగలిగినంత నునుపుగా వారి తత్వశాస్త్రానికి పదును పెట్టిన యాజకులు మరియు మత పెద్దలు అక్కడ నిలబడి ఉండగా. వారిలో ప్రతి ఒక్కరినీ దేవుడు దాటిపోయాడు. ఆయన ఎల్లప్పుడూ అలా చేస్తాడు. అయన అలా ఒక్కసారైనా చేసినట్లు చెప్పండి. ఎప్పుడు. లేదు, అయ్యా.
ఒక సామాన్య స్థితికి రావడానికి ఆయన మొత్తాన్ని దాటిపోయాడు. ప్రతి ఒక్కరూ దానిని గ్రహించులాగున ఆయన చాలా సామాన్య రీతిలో తనను తాను బయలుపరచుకుంటాడు మరియు సామాన్యతలోనే కార్యములు చేస్తాడు. ఆయనని గొప్పవానిగా చేయునది అదే. దానిని సామాన్యముగా చేస్తూ, ఆయన సామాన్యుడు అయ్యాడు.
MATT 12:31
66మరియు ఇప్పుడు అయన దాటిపోయాడు…
ఆ దినమున లోకము గొప్ప జ్ఞానులతో నిండి ఉన్నాకానీ, వారిలో ఏ ఒక్కరినీ ఆయన వాడుకోలేదు. ఒక సామాన్యమైన వ్యక్తిని కనుగొన్నాడు. కానీ గుర్తుంచుకొనండి, ఈ విధముగా ఆ కాలములో ఉన్నది. కానీ చూడండి, ఆయన వచ్చినటువంటి ఆ ఆత్మ వారి విద్యకు చాలా సామాన్యముగా ఉన్నది. ఏమి జరుగుతుందో వారు ముందే ఊహించారు. వారు దాని సామాన్యతను తప్పిపోయేంతగా మెరుగు పెట్టబడ్డారు, కొన్నిసార్లు దాని మీదగా నడచిపోయారు, దానిని యెగతాళి చేసారు.
అది నాకు ఒక పాత సామెతను జ్ఞప్తికి తెస్తుంది," దూతలు కాలు మోపుటకు భయపడు స్థలములో బుద్ధిహీనులు మేకులు కలిగిన బూట్లతో నడుస్తారు." ఒక మానవుడు దేవుని కార్యాలు జరుగుట చూస్తూ, అది దేవుని కార్యమని ఎరిగి, మరియు నిలబడి అది అపవాది కార్యములు అని పిలుస్తాడు.
అది దేవదూషణ అని యేసు చెప్పాడు. " దానికి వ్యతిరేకముగా మీరు ఒక్క మాట పలికిననూ - నేను, మనుష్య కుమారుడను - అది క్షమింప బడుతుంది. అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ లోకములో గానీ, రాబోవు లోకములో గానీ క్షమాపణ పొందరు," చూడండి. దూతలు కాలుమోపుటకు భయపడు స్థలములో మనము మేకులు కలిగిన బూట్లతో నడుస్తాము.
మనము చాలా తెలివైనవారము, మనము చాలా మెరుగుపెట్టబడ్డాము. మన అమెరికా అలాగే మారబోతుంది. మనము చాలా తెలివైనవారము. మనకి మనమే దేవునికి దూరముగా విద్యను అభ్యసిస్తున్నాం. మన పాఠశాలలు మన బోధకులను పంపిస్తున్నాయి … పొదుగుయంత్రములో పొదగబడిన కోడిపిల్ల లాగా.
MARK 16:15-17
67పొదుగుయంత్రములో పొదిగబడిన కోడిని బట్టి నేను ఎల్లప్పుడు జాలి పడతాను. అది కృత్రిమ వెలుగు కింద పొడగబడింది. మీకు తెలుసా అది మొదట చేసే కార్యం దాని తల్లి కోసం "కిచ, కిచ" అనడం ఎందుకంటే అది దాని స్వభావము. కానీ దానికి ఏ తల్లీ లేదు; అది ఒక ఇంక్యూబేటర్ లో పొడగబడింది. ఈ పట్టాలన్నీ/డిగ్రీలన్నీ చేసేది అదే అని నేను అనుకుంటాను- పొదుగు యంత్రంలో పొదగబడిన కోడి కిచ కిచ మనడం. అది … మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలీదు. అది నిజము. మీరు ఒక రకమైన దైవత్వమును కలిగి, మరియు ఆ వాక్యమును తిరస్కరించి పెంతెకోస్తు దినమున క్రుమ్మరించబడిన విధముగా ఈ దినమున పరిశుద్ధాత్మ లేదని తిరస్కరించి … అది కేవలం శిష్యుల కొరకే అని వారు అన్నారు. యేసు అన్నాడు, "మీరు లోక మంతటిలోకి వెళ్లి ప్రతీ జీవికి ఈ సువార్తను ప్రకటించుడి. విశ్వసించిన వారిని ఈ సూచనలు వెంబడిస్థాయి." ఎంతకాలము ? యుగసమాప్తి వరకు మరియు ప్రతీ జీవికి, ఈ సూచనలు వారిని వెంబడిస్తయి. ఖచ్చితముగా.
ఆయన సంఘమునకు శక్తి ఎక్కడ ఇచ్చాడో నేను చూపిస్తాను; దానిని ఎక్కడ తీసివేశాడో మీరు నాకు చూపించండి. అది అక్కడ లేదు. లేదు. కానీ మీరు చూడండి, మనం దాని నుంచి దూరముగా మనల్ని మనము విద్యావంతులుగా చేసుకునేంత తెలివి గలవారము అయ్యాము. మనము పని చేసే పరిభాషలు మరియు విషయాలను పొందాము. "సరే, అది కారణం…" అది అదే విషయం.
"మంచిది, ఇప్పుడు చూడండి . మనకు శ్రేష్టమైన వైద్యులు ఉన్నారు," ఈరోజు మనం చెప్తాము. "మనకు దైవిక స్వస్థత ఎందుకు అవసరం?"
68కాసేపటి క్రితం ఆ మంచి వైద్యుడు ఏం చెప్పాడో చూడండి. అతనికిక ఏ దారి లేనపుడు, అప్పుడు అతను దేవుణ్ణి నమ్ముతాడు. నీవు అక్కడ ఉన్నావు . అంతే. నీవు చెట్టు ఎక్కుతూ ఉన్నంతసేపు విజ్ఞానము సరిగానే పనిచేస్తుంది; నీవు ఇక ఎంతమాత్రమూ ముందుకు వెళ్లలేనంత వరకు వెళ్ళినపుడు; విశ్వాసమనే చెట్టు మీద కాలుమోపు; మరియు నడుస్తూ ఉండు, చూడండి, ఎందుకంటే దానికి అంతమనేది లేదు. "నమ్మువానికి సమస్తమూ సాధ్యమే."
అది వెళ్లునంతవరకు విజ్ఞానము మంచిదే. మీ ఐదు ఇంద్రియములు వాక్యముతో అంగీకరించినంతవరకు మంచిదే. కానీ మీ ఐదు ఇంద్రియములు వాక్యాన్ని ఖండించినపుడు, దాని నుండి దూరముగా వెళ్ళండి. లేదు. వాక్యానికి విరుద్ధముగా ఉంటే , నా భావాలను నేను నమ్మను, నా వినికిడిని నమ్మను , నా చూపును నమ్మను, ఇంకదేనిని నమ్మను.
69కొంతకాలం క్రితం ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు, "మీ పెంతెకొస్తు వారు ఎంతమందిని స్వస్థపరచామని మీరు నిరూపించగలరో నేను లెక్కచేయను, నేను దానిని నమ్మను."
నేను అన్నాను, "ఖచ్చితముగా కాదు. నీవు ఒక అవిశ్వాసివి. అది అవిశ్వాసులకొరకు కాదు; అది విశ్వాసుల కొరకే." సరిగ్గా అంతే. ఖచ్చితముగా. ఇది అవిశ్వాసులకు పంపబడలేదు. ఇది నమ్మువారి కొరకు పంపబడినది.
యేసు అవిశ్వాస దినమున సరిగ్గా వస్తాడు. ఆయనను ఎప్పుడూ ఆపలేదు. ఆయన సరిగ్గా అదే బోధించాడు. గొప్ప విద్యావంతులైన ప్రపంచంలో దేవుడు అదే విధంగా అద్భుతాలు చేశాడు. మనం ఈ రోజు గొప్ప విద్యావంతులైన ప్రపంచంలో జీవిస్తున్నాము, అణువులను విభజించడం మరియు బాంబులను తయారు చేయడం వంటివి మొదలైనవి; మరియు చంద్రుని వద్దకు ఎగురుతూ, మరియు వ్యోమగాములు మరియు భూమి చుట్టూ ఉన్న అన్నిటికీ. అది నిజము, మనము దానిని చేస్తున్నాము. అది మంచిదే. కానీ ఇప్పటికీ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ఎప్పటిలాగే ఉంటుందని నమ్మే వ్యక్తులు ఉన్నారు. వారు దానిని వివరించలేరు; కానీ వారు దానిని కలిగి ఉన్నారని వారికి తెలుసు. ఉన్న కార్యము అది ఒక్కటే. మీరు దానిని కలిగి ఉన్నంతవరకు మీరు దానిని వివరించనవసరం లేదు! ఆమెన్! ఆమెన్ అనగా," అలాగే అగును గాక". నాకు నేను ఆమెన్ అని అనుకొనుట లేదు ,… కానీ నాకు కేవలం… నాకు ఆ పదం ఇష్టం. అలాగే అగును గాక. అది సత్యము అని నాకు తెలుసు.
GEN 3:15
70దేవుడు తనను తాను చాలా సామాన్యముగా మార్చుకుంటాడు, అతను వారి పైభాగంలోకి దూసుకుపోతాడు. జ్ఞానులు చాలా తెలివైనవారు- ఆ చిన్న వేరుశనగ అంత మెదడు- మీకు తెలుసా - వారు దానినంతటినీ కనుగొన్నారు, మరియు మీరు దాని గురించి వారికేమి చెప్పలేరు. మీరు చూడండి, వారి దాని గురించిన జ్ఞానము లేకుండా ప్రపంచం లేవదు, సూర్యుడు ప్రకాశించలేడు , ప్రపంచము తిరగలేదు. దేవుడు వారి మీదగ కదలాడుతాడు, మరియు వారిని అక్కడనే కూర్చోనిస్తాడు. అయన ఎల్లప్పుడు చేయు అయన మార్గము అదే. అవును. అయ్యా.
71ఏదెను తోట మొదలుకొని మెస్సీయ వస్తాడని ప్రవచించబడింది. "నీ సంతానము సర్పము యొక్క తలను కొట్టును, మరియు అతని తల మీ మడిమను చిదిమివేయును." ఓహ్, మై! అది చెప్పింది…ప్రవక్తలు ఆయనను ముందుగా చూశారు, మరియు అయన ఎలా ఉంటాడో ఖచ్చితముగా చెప్పారు - అయన ఎక్కడ పుడతాడు, ఆయన ఎలా పుడతాడు, అయన ఏ రకమైన కార్యాలు చేస్తాడు, ఆయన మెస్సియా గుర్తు ఏమిటి. లేఖనము దానినంతా క్రమములో పెట్టినది.
కానీ వేదాంతవేత్తలు తమ మార్గాన్ని కనుగొన్నారు, మరియు వారు ఆయనని వంద మైళ్ల దూరములో తప్పిపోయారు. కానీ అయన వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడూ రాడు; ఆయన వాక్యం ప్రకారం వచ్చాడు. అయితే వారు ఆయనను ఎందుకు స్వీకరించలేదు? ఎందుకంటే ఆయన వస్తాడని వారు అనుకున్న విధంగా ఆయన రాలేదు. సరిగ్గా అదే విధంగా వారు నోవహును తప్పిపోయారు. ఆ విధముగానే వారు మోషేను తప్పిపోయారు. ఆ విధముగానే వారు దానిని యుగములన్నింటి గుండా తప్పిపోయారు.
72చూడండి, వారు దేవుడు సామాన్యత లో చేసే కార్యాన్ని తప్పిపోయారు…
దేవుడు తనను తాను అక్కడ దాచుకొన్నాడు, అయన చాల పెద్దవాడు కాబట్టి తెలివైన మరియు వివేకము గల వారి మీదగా వెళ్తాడు, చూడండి. ఈవిధముగా వచ్చేటువంటి రెండు వస్తువులను మీరు తీసుకోండి, అవి ఒకదానికొకటి దాటినప్పుడు… నా ఉద్దేశ్యాన్ని చూడండి? దేవుడు చేయగలిగిన మార్గం అది. ఆయన చాలా సామాన్యముగా ఉంటాడు ఎంతవరకు అంటే అయన చాలా దూరం వెళ్లేవరకూ, వారు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా కనుగొనలేనంత వరకు వెళ్తాడు. ఆమెన్! నేను దానిని ఇష్టపడుతున్నాను. ఆయన ఆ విధంగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అప్పుడు నేను దానిని అంగీకరించగలను, ఎందుకంటే నేను దానితో ఏమిచేయాలో తెలియని కొంత పాండిత్యము అక్కడ ఉన్నది . నావంటి ప్రజలు కూడా దానిని అర్ధం చేసుకునేలా, లేదా దానిని నమ్మేలా అయన దానిని చాలా సామాన్యముగా చేశాడు. కాబట్టి నేను దానినిమిత్తము చాలా కృతజ్ఞుడను.
73ఇప్పుడు ఆ మెస్సియాను గూర్చి చెప్పారు -ఆయన ఎలా వస్తాడు, ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఏమి చేస్తాడు, ఆయన పరిచర్య ఎలా ఉంటుంది, మరియు ఏ సమయానికి ఆయన వస్తాడు. కానీ ఆయన వచ్చే సమయానికి ఆనాటి ఆ పరిచారకులు మరియు మతాధికారులకు చాలా సాంప్రదాయాలు ఉన్నాయి మరియు ఆయన సరిగ్గా ఇలా వస్తాడని వారు అనుకున్నారు.
పరిసయులు అన్నారు," ఆయన వస్తే, ఆయన ఒక పరిసయ్యుడుగా వస్తాడు."
సద్దుకయ్యులు అన్నారు," బుద్ధిహీనము. ఆ స్వనీతిపరుల గుంపుతో కాదు. ఆయన ఒక సద్దుకయ్యుడు అవుతాడు."
కానీ ఆయన వచ్చినప్పుడు, ఆయన వారిలో ఏ ఒక్కనిగా ఉండలేదు. వారిది ఏదీ ఆశించలేదు…. తన కుమారుణ్ణి పంపించుటలో వారి జ్ఞానము చొప్పున దేవుడు చేయాల్సిన పని ఆయనకు లేదు.
74ఆయన ఏవిధముగా చేస్తాను అని చెప్పాడో ఆ విధముగానే ఆయనను పంపాడు. ఆయన ఆ ప్రకారం వచ్చాడు … మరియు ఆయన తీసుకువచ్చాడు … ఒక గోశాలలో పేడకుప్ప మీద పశువుల పాకలో వారి మెస్సియా ప్రకటించబడడం గురించి మీరు మాట్లాడినప్పుడు! మెరుగుచేయబడిన పరిసయ్యుల గుంపు- స్వనీతిపరులు- ఆడంబరమైన వేషధారులు -వారి మెస్సియా పశువుల పాకలో వస్తాడు అనేటువంటి కార్యాన్ని వారు ఊహించగలరా?
మంచిది, అదేమిటి ? అది యెహోవా, చిన్న యెహోవా శిశువుగా ఏడుస్తున్నాడు. సీనాయి పర్వతం నుండి ఉరుములు మ్రోగించిన, పర్వతానికి నిప్పంటించిన, ఎర్ర సముద్రాన్ని తెరిపించిన భయంకరమైన యెహోవా పశువుల శాలలో శిశువుగా మారతాడని వారు ఊహించగలరా? ఓహ్, వారి వేదాంత శాస్త్రం దానిని మింగలేదు! కాదు, నిజానికి-వారి మెస్సీయ కాదు.
వారు ఇలా అన్నారు, "దేవుడు ఒక మెస్సీయను పంపినప్పుడు, నిస్సందేహంగా ఆయన పరలోక వాకిళ్ళను కిందకి దించుతాడు. ఆయనకి పదిమిలియన్ మంది దేవదూతల కవాతు కిందకి వస్తుంది. ఆయన నేరుగా [మోషే] మనకోసం విడిచిపెట్టిన మందిరానికి , లేదా ఆ సొలొమోను ఇక్కడ మనకు కట్టిన మందిరానికి వస్తాడు, మరియు ఇక్కడే మనల్ని అంగీకరిస్తాడు. మరియు మనం ఎంచుకున్న మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన వ్యక్తి, మన రాష్ట్ర ప్రతినిధి [లేదా అది ఏమైనా], ఆయన అతని వద్దకు వచ్చి, 'నేను వచ్చాను. నేను ఇక్కడ ఉన్నాను. ఇది నేనే -నేను మెస్సీయను. మీరు నన్ను గుర్తించలేదా? నేను క్రిందికి దించిన వాకిళ్లను చూశావా? నేను పరలోకం నుండి వచ్చాను.' " వారు దానిని లెక్కించిన విధానం అది.
GEN 1:1•
LUKE 2:7,12,16
75కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక గాదెలో ఉన్నాడు…ఒక తల్లి ద్వారా జన్మించాడు మరియు ఒక తండ్రి … దానికి ఒక చట్టవిరుద్ధమైన నేపథ్యం ఉంది - వారు అనుకున్నట్లుగా కనిపించింది; చుట్టబడిన పొత్తిగుడ్డలు ఒక ఎద్దు కాడివి అని వారు చెప్పారు- అంత బీద; ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, క్రీస్తుయేసు ద్వారా సమస్తమును సృష్టించాడు.
మరియు ఆకాశము భూమిని సృష్టించిన ఆ సృష్టి కర్త ఇక్కడ ఉన్నాడు, తనంతట తాను సృష్టించిన గడ్డివాములో పశువుల శాలలో పడుకొని ఉన్నాడు- ఆకాశము భూమికిని సృష్టికర్త అయిన దేవుడు అంత తక్కువవానిగా తనను తాను వినయముగా చేసుకున్నాడు. అధికుడు తక్కువవానిగా అయ్యాడు, ఆయనను దేవునిగా చేసింది అదే. ఆయన ఏమైఉన్నడో ఆయనను చేసింది అదే. చూడండి, తనను తాను తక్కువవానిగా చేసుకున్నాడు.
మానవుడు దానిని చేయలేడు.
ACTS 10:44
76మీరు ఒక వ్యక్తిని నిలబెట్టండి, అతనికి సంస్థలో కొంచెం అధికారము ఇవ్వండి, సహోదరుడా , మీరు అతనిని పట్టలేరు. అంతే సంగతులు. అతను కేవలం చిన్నవాడు. తుపాకీ గుండు తింటున్న కప్పలా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మీరు అతనితో ఏమీ చేయలేరు.
కానీ మీరు చూడండి … కానీ దేవుడు తనను తాను తగ్గించుకోగలడు ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన మనం గొప్ప అని పిలిచే దాన్ని దాటిపోయాడు. ఆయన ఆవలిగట్టు వైపు ఉన్నాడు. మరియు ఆయన చాలా గొప్పవాడు, కాగా ఆయన తనను తాను వినయవంతునిగా చేసుకోగలడు. "ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను." చూడండి, నేను చెప్పిన విధముగా మనము పరమాణువును విభజించి మరియు ఒక గడ్డిపరకలో జీవమును వివరించలేకున్నాం. దేవుడిని నిర్దారించే ఆ కార్యాన్ని మనం దాని మీదుగా దాటిపోతున్నాం.
ఈ దినము మనము చేయునది అదే. అవును, అయ్యా. వాక్య రూపము (అది నిజము)లో ఉన్న దేవుని మీదుగా నడచిపోయి, దానికి బదులుగా ఎవరో వ్యక్తి యొక్క మతాచారాలను మరియు సిద్ధాంతాలను అంగీకరిస్తున్నాం- గంజి త్రాగుట కొరకు, ప్రజాదరణ కొరకు మీ జన్మహక్కును అమ్ముకోవడం, పొట్టి జుట్టు మరియు పొట్టి వస్త్రములు ధరించి, సాయంకాలపు విందులకు మరియు అలాంటి వాటికి పంపడానికి మిమ్మల్ని అనుమతించే సంఘము కోసం. ఆపై మిమ్మల్ని మీరు క్రైస్తవులు అని పిలుచుకోవడం. సిగ్గుచేటు! నిజం.
77నేను మిమ్మల్ని తిట్టడం లేదు; కానీ దైవిక గౌరవం మరియు ప్రేమ ద్వారా (అది సరైనది), అటువంటి వాటి నుండీ దూరంగా ఉండండి. దేవుడు మరియు ఆయన పరిశుద్ధ గ్రంధం వద్దకు తిరిగిరండి. సత్యసువార్త వద్దకు తిరిగిరండి. అవును. ఏదో ఒక సంస్థ మిమ్మల్ని దేవుని కార్యాల నుండి దూరముగా చుట్టులాగున - మీరు ఎన్నడూ దానిని చేయకండి. మీరు దేవుని యొక్క సామాన్య మార్గానికి తిరిగి రండి. కేవలం మొకాళ్ళ మీద పడి మరియు చెప్పండి , "ప్రభువైన దేవా, మీరు దానిని నాకు ఎలా ఇస్తారో నేను పట్టించుకోను, కానీ నేను ఇక్కడ దానికొరకు ఉన్నాను," ఏమి జరుగుతుందో గమనించండి.
దాని గురించి నిజాయితీగా ఉండండి.
మీరు దానిని పొందుకోవాలి అనేదానికంటే అది మీకు ఇచ్చుటకు ఆయన ఎక్కువ ఆతృతతో ఉన్నాడు. మీరు అతిగా ఆలస్యము చేయవలసిన పనిలేదు. అటువంటి ఒక కార్యం లేదు. "పేతురు ఇంకను మాట్లాడుతుండగా, నమ్మిన వారి మీద పరిశుద్దాత్మ దిగినది." దాని సమస్య ఏమిటంటే, తగినంతగా దానిని మనము కోరుకోము . మనము లేము… మనల్ని మనం తగ్గించుకోవాలనుకోవడం లేదు. అది నిజం.
78నేను కొద్ది కాలం క్రితం ఇక్కడ బోధిస్తున్నాను, మరియు అక్కడ ఒక మహిళ నిజంగా సంతోషించింది మరియు ఆమె కేకలు వేసింది. అక్కడ ఆ పట్టణములో బేస్ బాల్ ఆడే పిల్లవాడు ఒకడు ఉన్నాడు, అతడు అన్నాడు, "బిల్లీ, నేను బయట నిలబడి ఉన్నాను. లోపలికి రాలేకపోయాను." అతను అన్నాడు," ఆ స్త్రీ ఏడుస్తూ మరియు అలా చేయడం మొదలుపెట్టువరకూ నేను నీ వర్తమానాన్ని ఆనందిస్తూ ఉన్నాను." అతను అన్నాడు, "అటుతరువాత ఆ ప్రజలందరూ అరుస్తూ మరియు కేకలు వేయడం మొదలుపెట్టారు." అతను అన్నాడు, "అది నా వెన్నులో వణుకు పుట్టించింది."
"ఓహ్", నేను అన్నాను," నీవు దానిని నమ్మలేదా?"
అతను అన్నాడు, "లేదు."
నేను అన్నాను," వారు దానిని అలా చేయకపోతే, అది నా వెన్నులో వణుకు పుట్టిస్తుంది," చూడండి. నేను అన్నాను, "నేను ఎక్కడ మాట్లాడుతున్నానో… దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలియదు," చూడండి.
మరియు అతను చెప్పాడు … (అతను ఒక బేస్ బాల్ పిచ్చివాడు.) మరియు నేను మారాను… అతను అన్నాడు, "సరే, అటువంటి విషయం గురించి ప్రపంచంలో ఎవరు విన్నారు?" (నేను బయటకు వచ్చిన అదే సంఘ సంస్థకు చెందినవాడు.) మరియు అతడు , "సరే, ఇప్పుడు, మీ వర్తమానము బాగానే ఉంది, నీవు దేని గురించి మాట్లాడుతున్నావు. అయితే నీ మాట ఎవరు వినగలరు?"
నేను అన్నాను, "అప్పుడు ఎవరూ వినలేదు. పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు. ఆయన స్వాధీనం చేసుకున్నాడు," చూడండి. నేను అన్నాను, "అయన వచ్చినపుడు నేను నోరుమూసుకోవాలి, చూడండి, అయన ప్రజల మధ్య ఉన్నాడు."
మరియు అతను, "అయ్యో, బిల్లీ," అన్నాడు, "నువ్వు కేవలం ఒక మతోన్మాదివి, అంతే."
నేను, "అలాగే, బహుశా నేనే కావచ్చు." నేను అన్నాను, "నేను అయితే, మీరు ఇప్పటివరకు చూసిన సంతోషకరమైన మతోన్మాదులలో నేను ఒకడిని," చూడండి. మరియు నేను చెప్పాను …
అతను, "సరే, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను…. " అన్నాడు.
మరియు నేను అతనితో మాట్లాడాను, మరియు
MATT 4:4•
LUKE 4:4
79నేను అన్నాను, "చెప్పు [బేస్ బాల్ పార్క్ ఇంటికి చాలా దూరంలో లేదు]," అన్నాను,
"మొన్న రాత్రి ప్రపంచంలో ఏమి జరుగుతోంది?"
అతను చెప్పాడు, "మీరు తప్పక చూసి ఉంటారు!" "మీకు చార్లెస్ నోలెన్ తెలుసా?" అన్నాడు. మరియు, "ముగ్గురు వ్యక్తులు బేస్ మీద ఉన్నారు… ," అని చెప్పాడు మరియు అతను ఉత్సాహముగా ఉన్నాడు.
నేను చెప్పాను, "అలాగే, అపవిత్రమైన గుండ్రాళ్ల సమూహం అయిన మీరు! నా జీవితంలో ఇలాంటి శబ్దం ఎప్పుడూ వినలేదు." నేను చెప్పాను, "నేను అక్కడ ఉండి ఉంటే నేను దాని గురించి పెద్దగా చెప్పను. నేను కేవలము నిలబడి చూస్తాను."
అతను చెప్పాడు, "మీరు కాదు … మీరు బేస్ బాల్‌ను పెద్దగా పట్టించుకోరు."
నేను చెప్పాను, "ఖచ్చితంగా కాదు." నేను చెప్పాను, "నేను బేస్ బాల్ గురించి పట్టించుకోను. అందువల్ల నాకు దానిపై ఆసక్తి లేదు. " నేను ఇలా అన్నాను, "నాకు దానిపై ఆసక్తి ఉంటే, మీరు చేసే విధంగానే నేను ప్రవర్తించి ఉండేవాడిని. మరియు మీరు నా దేవుడు మరియు ప్రభువైన యేసు రాకడ మరియు దేవుని శక్తి పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ భవనాన్ని తాకినప్పుడు మీరు అదే విధంగా ప్రవర్తిస్తారు. ఇది మీలో ఎలాంటి ఆత్మ ఉంది, మీరు దేనితో పోషింపబడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం ఏదో ఒకదానితో పోషింపబడుతోంది".
మరియు నేను ఇలా అన్నాను, "భూమిలోని రోత పుట్టించే కళేబరాల యొక్క శిధిలాలను తినే రాబందులా ఉండకండి. దేవుని వాక్యమైన పరలోక కార్యములతో పోషింపబడండి."
యేసు చెప్పాడు, "మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును." ఆయన వాక్యముతో పోషింపబడండి.
80కాబట్టి, యేసు వచ్చినప్పుడు, వారు ఆయనను చాలా గొప్పగా పొందే వరకు వారు దానిని లెక్కించారు. ఇంతటి గొప్ప వ్యక్తి పశువులపాకలో ఎలా పుట్టాడో చూడలేకపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంత సామాన్యముగా ఎలా ఉంటాడో చూడలేకపోయారు. ఈదినము కూడా అదే విధముగా ఉంది. మతం-క్రైస్తవ మతం- ఉన్నతమైన పెద్ద సంఘము, గొప్ప పెద్ద భవనం, గొప్ప పెద్ద మిలియన్-డాలర్ విలువ గల పిల్లనగ్రోవి వాయిద్యము , చక్కటి ఖరీదైన పీఠాలు కలిగి ఉండాలని ప్రజలు భావిస్తారు.
81మీరు ఎప్పుడైనా ఐర్లాండ్‌లో ఉన్నారా? మీరు ఎప్పుడైనా సెయింట్ పాట్రిక్‌ని గమనించారా? మీరు కాథలిక్కులు ఎవరిని కాథలిక్ అని అన్నారు. అతను నావలే ఉన్నాడు. కాబట్టి, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? అతని స్థలంలో ఒక్క శిలువ కూడా వేలాడదీయలేదు. అతను రోమన్ సంఘమును వీలైనంత తీవ్రంగా నిరసించాడు. అతను ప్రజలను కనీసము కూర్చోనివ్వడు; అతను వారిని పాత బోర్డు ముక్క మీద చతికిలబడనిచ్చాడు - బోర్డు కాదు,కానీ భవనములోని బండ. ఆ భవనం ఇప్పటికీ అలాగే ఉంది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము గురించి వారికి బోధించాడు.
సెయింట్ ఫ్రాన్సిస్ మరియు సెయింట్…
82ఆ దినములలో గొప్ప ప్రారంభ సంస్కర్తలు మరియు పురుషులు-వారు పరిశుద్ధ ఆత్మ యొక్క బాప్తిస్మమును ఎలా బోధించారు; సెయింట్ మార్టిన్, ఐరేనియస్, ఆ గొప్ప వ్యక్తులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఎలా బోధించారు. వారు తమ ప్రజలను సుఖంగా , సౌకర్యవంతముగా ఖరీదైన పట్టు కుచ్చు వస్త్రములపై కూర్చోనివ్వరు మరియు ఈ దినమున మనము చేయునట్లు చేయరు. ఇంకా మనము దానిని సుసంపన్నమైన సంఘము అని పిలుస్తాము.
మానవుడు సమృద్ధిని, కొన్నిసార్లు మతం అని పిలుస్తాడు. కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి మూడు కాడిలాక్‌లను సొంతం చేసుకునేంత వరకు ఆత్మ సంబంధికాడని చెప్పబడింది. నా అభిప్రాయం ప్రకారం, అతను దేవుని నుండి దూరంగా జరిగేది అప్పుడే. అది నిజమే. ప్రస్తుత పెంతెకొస్తు సంఘం ఆది పెంతెకొస్తు సంఘం చేసినదానికి వ్యత్యాసముగా వ్యవహరిస్తుంది.
ACTS 2:45
83నేను అక్కడ క్రైస్తవ వ్యాపారవేత్తలతో ఒక సారి మాట్లాడుతున్నాను. వారు నన్ను ఎలా తిరిగి పొందారో నాకు తెలియదు. వారు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అలా కాదు… ప్రభువు చెప్పినట్లు నాకు తెలిసిన వాటిని మాత్రమే నేను వారికి చెప్తాను. నేను తెలివిగా చెప్పను. నేను అలా చేస్తే, నేను అక్కడ బలిపీఠం వద్ద ఉండాలి. నేను వారిని ప్రేమిస్తున్నాను, నేను వారిని గౌరవిస్తాను కాబట్టే నేను దానిని చెపుతాను.
ఒక రాత్రి అక్కడ సాక్ష్యం చెబుతూ, ప్రపంచంలోని వ్యాపారవేత్తల ముందు, వారికి ఎన్ని కాడిలాక్‌లు ఉన్నాయి మరియు వారి చిన్న వ్యాపారం ఏమిటి… నేను ఇలా అన్నాను, "వారి పురుషులకు అది అక్కర్లేదు. క్రీస్తు దీనత్వము గురించి వారికి చెప్పండి." మరియు నేను చెప్పాను, "మీరు ఆది పెంతెకొస్తు సంఘానికి చాలా భిన్నముగా ఉన్నారు. వారు తమ వద్ద ఉన్నదంతా అమ్మి, పేదలకు ఇచ్చి, సువార్త ప్రకటించడానికి బయలుదేరారు." మరియు నేను ఇలా అన్నాను, "మీరు ఎంత వర్ధిల్లుతున్నారో, ఎంత సంపాదించారో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంత సంపాదించారో కాదు; మీరు ఎంత వదిలించుకోగలరు."
ACTS 2:45
84(నేను అనుకున్నాను … గత రాత్రి ఆ వ్యక్తి అదే విషయం గురించి మాట్లాడుతున్నాడు.) మరియు చికాగో నుండి ఒక చిన్న పెంతెకొస్తు సోదరుడు లేచాడు. అతను చెప్పాడు, "సహోదరుడా, బ్రాన్హాం, నేను మీ చేతిని పిలవాలనుకుంటున్నాను ."
నేను అన్నాను , "పిలవండి."
మరియు అతను చెప్పాడు, "సంఘము తప్పు చేసింది అక్కడే."
నేను అన్నాను, "పరిశుద్ధాత్మ తప్పు చేస్తుందా? అలా జరగదు."
అతను చెప్పాడు, "అది అక్కడ జరిగింది. చూడండి, హింస పెరిగినప్పుడు, వారికి వెళ్ళడానికి ఇల్లు లేదు."
నేను చెప్పాను , "సరిగ్గా దేవుని చిత్తం. అప్పుడు వారు ప్రతిచోటుకి వెళ్లారు, సువార్తను చాటారు, ఎందుకంటే వారికి వెళ్ళడానికి వేరే స్థలం లేదు." మీరు దేవుడిని జయించలేరు. అవును అండి! దేవుడు వారి క్రింద ఉన్నవాటిని ప్రతిదీ విక్రయించాడు, కాబట్టి వారికి వెళ్ళడానికి స్థలం లేదు మరియు వారు ప్రతిచోటా బోధిస్తూ వెళ్లారు-దేవుడు వారిని వెళ్లేలా చేసే ఏకైక మార్గం.
కానీ ఈ రోజు మనం అణచివేయడానికి ఇష్టపడతాము, మీకు తెలుసా, మరియు మనము హాయిగా కూర్చుంటాము. మరియు అసెంబ్లీలలో కాపరి మనకు నచ్చనిది ఏదైనా చెబితే, మనం ఏకత్వం వైపు వెళ్తాము. అతను మనకు నచ్చనిది ఏదైనా చెప్పినప్పుడు, చివరికి మనం బాప్టిస్ట్‌లో చేరుకుంటాము, లేదా ప్రెస్బిటేరియన్, లేదా ఎక్కడైనా మనం కోరుకున్నది ఏదైనా చేయగలము. అది మనము. తర్వాత మనల్ని క్రైస్తవులని పిలుచుకుంటాము !
మీకు కొన్ని కావాలి…
MATT 3:9
85మీరు మీ కాపరికి ఓటు వేస్తారు, మీ సంఘములో చాలా మంది, మరియు మీరు అలా చేసినప్పుడు మీరు అత్యధికముగా మెరుగైన పండితులను కోరుకుంటారు కాబట్టి మీ పొరుగువారికి చెప్పవచ్చు," మా కాపరికి డాక్టర్ డిగ్రీ ఉంది, మా డాక్టర్ పలానా పలానా …" ఓహ్, మై! మీరు దేవుని నుండీ దూరమవుతున్నారు. దేవుడు తనను తాను సామాన్యతలో బయలుపరచుకుంటాడు. వినండి. ఆ దినములలో ఉన్నతులకు , పండితులకు , విద్యవేత్తలకు… చదువుకున్న వారికి అది చాలా ఎక్కువ- దేవుడు ఒక పసిబాలునిలో సామాన్యతలో తనను తాను దాచుకొనుట.
చూడండి. వారు ఆయనను సిలువ వేసినప్పుడు, ఓహ్, అది మేకుకు తగిలింది. పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ మధ్యాహ్నం వారు జీవమునకు రాజుకు సిలువ వేశారు. అప్పుడు ఆ ప్రధానయాజకులు, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఎవరైతే ఆశ్చర్యపోయారో, తమ సంస్థలను ఆయన ఖండించాడని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారిని ఆయన దిగంబరులుగా చేసాడు, వారి దాగు స్థలము కదలించాడు, వారు దెయ్యముల సమూహము తప్ప మరింకేమి కాదని, మారుమనస్సు పొందమని వారికి చెప్పాడు. మరియు వారు … "దేవుడు ఈ రాళ్లతో సమర్ధుడు," అని యోహాను అన్నాడు, "అబ్రాహాముకు సంతానమును ఇచ్చుటకు. మీరు యూదుడిగా జన్మించినందున మీరు దేవుని పిల్లలు అని అనుకోకండి," మరియు మొదలైనవి. అతను చెప్పాడు … అక్కడ వారిని "గడ్డిలో పాములు" మరియు ప్రతీదీ అని పిలిచాడు.
MATT 27:40•
JOHN 14:10
86అప్పుడు ఆయన అక్కడ సిలువపై వ్రేలాడినపుడు, వారు ఇలా అన్నారు: "ఇప్పుడు, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవై ఉంటే, నీవు ఎందుకు సిలువ నుండీ దిగకూడదు? మరియు మేము నిన్ను నమ్ముతాము." చూడండి, అదే విషయం. ఈ వ్యక్తి ఒక అద్భుతం చేస్తున్నాడని వారు ఆలోచించినప్పుడు, వారు దానిని తిరస్కరించలేరు. కానీ అక్కడ నిలబడి ఆయనను చూడడానికి, సృస్తికర్త అయిన దేవుడు.
ఈ ఆధునిక ధోరణి గల దినమున , ఆయనని వేరే వ్యక్తిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నాకు తెలుసు. కానీ అయన దేవుడు తప్ప వేరే వ్యక్తి కాదు. అది నిజమే. నేటి ఆధునిక పోకడలు ఆయనను గొప్ప బోధకుడు అనీ , ఆయన ప్రవక్త అనీ చెప్పారు. ఆయన ఒక గొప్ప బోధకుడు , మరియు ఆయన ఒక ప్రవక్త; కానీ ఆయన ఒక బోధకుని కంటే ఎక్కువ, ఆయన ఒక ప్రవక్త కంటే ఎక్కువ. ఆయన దేవుడు-దేవుని కంటే తక్కువ వాడు కాడు . దేవుడు క్రీస్తులో ఉన్నాడు, తనను తాను ప్రపంచముతో సమాధానపరచుకున్నాడు.
యేసు ఇలా అన్నాడు, "ఈ కార్యములు చేయునది నేను కాదు. అది నా తండ్రి మరియు ఆయన నాలో నివసిస్తున్నాడు. అది నాలో ఉన్న నా తండ్రి." ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైన దేవుడు.
87క్రైస్తవ విజ్ఞానానికి చెందిన ఎవరో ఒక స్త్రీ… (క్షమించండి, ఇప్పుడు ఆ పేరు పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. క్షమించండి నేను అలా అన్నాను.) కానీ ఆమె నాతో చెప్పింది, "మిస్టర్. బ్రాన్హాం, నేను మీ మాటలను బట్టి సంతోషిస్తున్నాను. కానీ, "యేసును గూర్చి నీవు డంబములు చెప్తావు." అని అన్నది.
నేను అన్నాను , "ధన్యవాదాలు. మరియు నేను అలా చేస్తే అది చాలా చెడ్డది," అప్పుడు మాత్రమే నేను పరలోకానికి వెళ్తాను అని నేను నమ్ముతున్నాను. "నేను ఆయన గురించి గొప్పగా చెప్పుకోగలిగే దాదాపు మిలియన్ భాషలు ఉంటే బాగుండేది" అని అన్నాను.
ఆమె అన్నది," సరే, అతను కాని దానిని మీరు అతనిగా చేస్తున్నారు."
మరియు నేను అన్నాను," నా సమస్తము ఆయనే."
మరియు ఆమె అన్నది, "సరే, ఇప్పుడు, మీరు ఆయనని దేవుడిని చేస్తున్నారని నేను మీకు రుజువు చేయగలను."
నేను అన్నాను, "అయన దేవుడు. అయన దేవుడు కాకపోతే, ప్రపంచము కలిగిన వారందరిలోకంటే గొప్పమోసగాడు." నేను అన్నాను, "అయన దేవుడు. అయన దేవుడికంటే తక్కువ వాడు కాడు. అయన స్వంత రక్తం దేవునిది. మనము దేవుని రక్తమువలన రక్షింపబడ్డాము."
అయన యూదుడు కాదు; అన్యుడు కూడా కాదు. పురుషుని కణం హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అది వైద్యునికి తెలుసు. కోడి గుడ్డు పెట్టగలదు. కానీ అది మగ పక్షితో ఉండకపోతే, అది పొదుగదు. అది ఫలవంతము కాదు. అది నిజమే. చూడండి, ఇది వచ్చింది … రక్త కణం పురుషుని నుండి వస్తుంది. మరియు ఈ సందర్భంలో యెహోవా దేవుడు పురుషుడు . అయన మరియలో రక్త కణాన్ని సృష్టించాడు.
JOHN 11:35,43
88మరియు మీరు కాథలిక్ ప్రజలు ఆమెను దేవుని తల్లి అని పిలుస్తారు! ఆమె ఎలా దేవుని తల్లి అవుతుంది, మరియు దేవుడు అనంతుడు, నిత్యుడు? ఆమె దేవుని తల్లి కాదు; ఆమె దేవుడు తన కుమారుడిని ఇక్కడికి తీసుకురావడానికి ఉపయోగించిన పొదుగుయంత్రం. ఖచ్చితముగా. కానీ చెప్పండి, "ఆమె గుడ్డా?" కాదు అయ్యా. ఆమె అయిఉంటే, ఆమె ఒక అనుభూతి పొందిఉండాలి. అప్పుడు మీరు దేవుడిని ఏమి చేస్తున్నారో చూడండి. అయన సంపూర్ణముగా సృష్టించబడిన దేవుడు- సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపములో సృష్టించబడుట. అది ఖచ్చితముగా నిజము. మరియు అయన చేసినపుడు…
ఆమె అన్నది," ఎందుకు, అయన మానవుడు తప్ప ఇంకేమి కాదు అని మీ స్వంత పరిశుద్ధ గ్రంధమునుండే నేను రుజువు చేయగలను."
నేను అన్నాను , "చేయి."
మరియు ఆమె చెప్పింది, "అయన పరిశుద్ధ యోహాను 11లో లాజరును లేపడానికి కిందకివెళ్ళాడు." మరియు "అయన వెళ్ళినప్పుడు, అయన ఏడ్చాడని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది " అని చెప్పింది. మరియు అన్నది, "అయన మర్త్యుడిగా ఉండాలని లేదా అయన ఏడవలేడని అది చూపించింది."
నేను, "ఆ వాదం ఆకలితో చచ్చిపోయిన కోడి నీడ నుండి చేసిన సూపు కంటే పలచగా ఉంది" అని అన్నాను.
నేను అన్నాను," నాకు దానిని చెప్పడానికి ప్రయత్నించవద్దు." నేను అన్నాను, "నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన అక్కడ సమాధి వద్దకు వెళ్లినప్పుడు, ఆయన ఏడ్చింది నిజమే. ఆయన ఏడుస్తున్న మానవుడు. కానీ ఆయన తన చిన్న సన్నని శరీరాన్ని కలిపి ఉంచి , 'లాజరూ , బయటికి రా!' అని చెప్పినప్పుడు, చనిపోయి నాలుగు రోజులు అయినటువంటి ఒక వ్యక్తి తన కాళ్ళపై నిలబడి తిరిగి జీవించాడు, అది మనిషి కంటే ఎక్కువ - చనిపోయినవారిని పిలవగలడు. అది కుమారునిలోని దేవుడు." అది ఖచ్చితంగా సరైనది.
MATT 14:18-21•
MATT 21:19•
MARK 4:39•
MARK 6:38,41•
MARK 11:13•
MARK 15:30•
LUKE 9:13•
LUKE 23:39•
JOHN 6:9,11
89ఇది నిజం, ఆయన ఆ రాత్రి ఆకలితో కొండ దిగి, తినడానికి ఏదైనా వెతుకుతున్నప్పుడు . ఆ చెట్టును చూసి తినడానికి ఏమీ దొరక్క ఆ చెట్టును శపించాడు. అది దేవుడు, ఆకలితో ఉన్నాడు. కానీ ఆయన ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు తీసుకొని ఐదు వేల మందికి ఆహారం ఇచ్చినప్పుడు, అది ఆయన కుమారునిలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు. అయనొక…
పదివేల సముద్రపు దెయ్యాలు ఆయనను ముంచివేస్తామని ప్రమాణం చేసినప్పుడు ఆయన ఆ రాత్రి ఆ ఓడ వెనుక నిద్రిస్తున్న వ్యక్తి. ఆ చిన్న పాత ఓడ అక్కడ సీసా మూతలాగా ఎగిరి పడింది. ఆయన అక్కడ నిద్రిస్తున్న మనుష్యుడు ; ప్రభావము అయన నుండి పోయింది. కానీ ఆయన పడవ యొక్క తెరచాప గుడ్డల మీద తన కాలుమోపి , పైకి చూసి "సమాధానము. నిశ్చలముగా ఉండు.", మరియు గాలులు మరియు అలలు ఆయనకు విధేయత చూపాయి, అది మానవుని కంటే ఎక్కువ. అది దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దైవ మానవుడు.
వారు దానిని చూడలేకపోయారు. మరియు సిలువపై వారు ఇలా అన్నారు… "నీవు దేవుని కుమారుడవైతే, నిన్ను నీవు రక్షించుకో," అని దొంగ ఆయనతో అన్నాడు.
మరియు, "నీవు మెస్సీయ అయితే, సిలువ నుండి కిందకి దిగి రా. మాకు చూపించు. నీవు యూదుల రాజువైతే, నీవే అయితే… దిగి వచ్చి మాకు చూపించు." అది అధికారాన్ని చూపుతూ ఉండేది. దేవుడు మృత్యువు రూపాన్ని ధరించి, సామాన్యతలో తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు, జీవము యొక్క అత్యున్నత రూపం అయ్యుండి జీవితం యొక్క అత్యల్ప శాపంగా మారాడు, పునరుత్థానాన్ని తీసుకురావడానికి పాపిగా చనిపోయాడు. ఓహ్, మై, దేవుడు తనను తాను మరణములో దాచుకున్నాడు, తనను తాను పునరుత్థానములో చూపించుటకు; అత్యున్నత రూపం, నిత్యజీవం, తాను నివసించుటకు ఒక మానవ శరీరమును చేసుకున్న దేవుడు దేవునిచే శపించబడిన మానవునిగా, అత్యల్పజీవిగా మారాడు; అయన మీద శాపమును తీసుకొని మరియు చనిపోయాడు, ఆ విద్యావంతులైన పండితుల నుండీ తనను తాను దాచుకున్నాడు.
MATT 27:30,32•
MARK 15:19•
LUKE 22:64•
JOHN 1:1
90అపవాది ఆయన్ని అక్కడికి తీసుకువెళ్లినప్పుడు, వారు అతని కళ్లకు గుడ్డ చుట్టి, అతని తలపై కొట్టి, "ఇప్పుడు, నీవు ప్రవక్త అని వారు నాకు చెప్పారు. నీవు ఇప్పుడు ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు. మేము నిన్ను నమ్ముతాము.", మరియు వారు ఒకరినుండి ఒకరు కర్రను మార్చుకున్నారు, ఆయన తన నోటిని మెదపలేదు. వారు ఆయన ముఖము మీద ఉమ్మినపుడు, చేతిలో పట్టినంత గడ్డములాగినపుడు, వారు అన్నారు, " ఆహ్ [ఆ అపవాది అన్నాడు], అది దేవుడు అయితే, మనము ఆయనను కలిగి ఉన్నాము, అంతే."
ఓహ్, అక్కడ ఆయనను చూడండి. ఓహ్ ఆయన దేవుడు. ఆయన పైకి వెళ్తున్నాడు… పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆ చీకటి మధ్యాహ్నమునకు, ఈ మధ్యాహ్నం మన కెమేరాలను తిప్పుదాం. కొండపైకి వెళ్తున్న ఆయనను చూడండి. నాకు చప్పుడు వినిపిస్తుంది. అది ఏమిటి ? అది కొండవైపు వెళ్తున్న పాత కరుకైన సిలువ. అది ఆ వీధిగుండా వెళ్లుచుండగా ఆ రాళ్లను కొట్టుకొని అది మోయుచున్న వాని రక్తపు కాలిముద్రలను లాక్కెల్తోంది.
ఆయన వీపు మీద కుట్టు లేని వస్త్రము పై అంతటా చిన్న మరకలను నేను చూశాను - సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సిలువను మోస్తున్నాడు. అక్కడ ఇమ్మానుయేలు రక్తం వీపుమీద చుక్కలు కనిపించడం ప్రారంభించింది.
ఆయన కొండపైకి వెళ్లగా, ఆ మచ్చలు పెద్దవిగా మారడం ప్రారంభమైంది. ఒక్కసారిగా అవన్నీ ఒక గొప్ప రక్తపుచుక్కలుగా మారాయి. మరియు ఆ చిన్న దీన బలహీన కాళ్ళ గుండా కారాయి. ఏమిటది?
ఆయన పడిపోయాడు. ఆయన భుజము, ఆయన మానవ బలము… అది ఏమిటి? దేవుడు- తనను తాను సామాన్యతలో దాచుకున్న దేవుడు. అది ఆ సిలువను మోస్తున్న దేవుడు. ఇక్కడ ఆయన తడబడుతూ కొండపైకి వెళ్ళాడు, అక్కడ రక్తం ఆయన నుంచి కారుతూ ఉంది. ఆయన పడిపోయాడు. సిలువను మోయడములో ఆయనకు సహాయము చేయడానికి సీమోను ఆ సిలువను పైకెత్తాడు.
91ఆయన కొండపైకి వెళ్తున్నపుడు, అపవాది అన్నాడు," నీకుతెలుసా?" అన్నాడు, "ఆయన దేవుడు కాదని నాకు ఇప్పుడు తెలుసు. ఆయన కాదని నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ అలా చేయడు. ఇప్పుడు ఆయనను నేను పట్టుకున్నాను. నేను ప్రతి మానవుడిని జయించాను. నేను ఆయనను పట్టుకున్నాను. కాబట్టి, ఆయన దేవుడు కాదని నాకు తెలుసు."
కాబట్టి అతడు ఆయనను కుట్టడానికి మరణం యొక్క తేనెటీగను పంపాడు. మరియు తేనెటీగ అతని చుట్టూ హమ్ చేయడం ప్రారంభించినప్పుడు… మీకు తేనెటీగలు, ముళ్లు కలిగి ఉండే కీటకాలు గురించి తెలుసు. మరియు మరణానికి ఒక ముళ్లు ఉంది. కానీ మీకు తెలుసా, ఒక కీటకం ఎప్పుడైనా లోతుగా కుట్టినట్లయితే, అది తన ముళ్ళను బయటకు తీస్తుంది. కాబట్టి అది ఎప్పుడైనా ఒక మనిషిలో, ఒక సాధారణ మనిషిలో లంగరు వేసినట్లయితే… అతను కేవలం ఒక సాధారణ మనిషి, ఒక ప్రవక్త అయితే… చాలా మంది ప్రవక్తలను కుట్టాడు మరియు అతను చనిపోయాడు. కానీ అతను ఆవ్యక్తిని కుట్టినప్పుడు, అతను తన ముళ్లును కోల్పోయాడు. ఆ తర్వాత అతడికి ఇంకే ముళ్లు లేదు. అతను తన మాంస శరీరాన్ని ఇమ్మానుయేలు లో ఉంచాడు మరియు అయన ముళ్లును మరణం నుండి బయటకు తీశాడు.
1COR 15:55
92కొన్ని సంవత్సరాల తరువాత, వారు అయన అపొస్తలులలో ఒకరైన గొప్ప పరిశుద్దుడైన పౌలును చంపబోతున్నప్పుడు, అతను కేకలు వేసి ఇలా అన్నాడు, "ఓహ్, మరణమా, నీ ముళ్లు ఎక్కడ? సమాధి, నీ విజయం ఎక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని అందించిన దేవునికి ధన్యవాదాలు". అవును అండి! అదేమిటి? దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు.
ఓహ్, మనిషి పాపం చేసినప్పుడు అతను అతనికి మరియు దేవునికి మధ్య ఒక పెద్ద అగాధాన్ని దాటాడు, అతని మార్గాన్ని ఎవరినీ వదిలిపెట్టలేదు. ఆపై దేవుడు ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకున్నాడు-ఒక ప్రత్యామ్నాయాన్ని అందించాడు మరియు దానిని అంగీకరించాడు. అప్పుడు మనిషి తన స్థానానికి ఈ ప్రత్యామ్నాయాన్ని అంగీకరిస్తే, నేను మొదట్లో చెప్పినట్లు అతను తిరిగి దేవునితో సహవాసంలోకి ప్రవేశించగలడు. ఆపై మనుషులు కొన్నేళ్లుగా మేకలు, గొర్రెలు, జంతువుల రక్తం ద్వారా వెళ్లారు. అవి పాపాన్ని ఎప్పటికీ తీసివేయలేవు ; అది పాపాన్ని కేవలం కప్పుతుంది అంతే.
అయితే అప్పుడు ఏం జరిగింది? ఏమైంది? ఒకరోజు పాపాన్ని పోగొట్టగల ఏదో ఒకటి వచ్చింది -తన స్వంత కుమారుని రక్తము. మరియు ఆయన పాపాన్ని క్షమించాడు.
93ఇప్పుడు ఇక్కడ కొద్దికాలం క్రితం… ఇప్పుడు నాకు తెలియదు… ఇక్కడ శాస్త్రవేత్తలు కూర్చుని ఉండవచ్చు. నేను ఒక వ్యాఖ్య చేయబోతున్నాను మరియు నేను దానిని ఏదో అని పిలుస్తాను. ఇది అస్సలు అర్థం కాదు. కానీ నేను చెప్పబోతున్నాను… మనం వాడేవాళ్ళం… మనకు దొరికేది… ఒక సామాన్యమైన చిన్న సిరా చుక్కలాగా, దేవుడు తనను దానిలో దాచుకోగలడు, చూడండి. అది ఒక సిరా చుక్క అయితే, అది సిరా చుక్క అవడానికిముంది అది ఇంకేదో అయిఉండాలి. అది ఏమిటో చూద్దాం.
మొదట, అది ఒక సిరా చుక్క. అది ఏమిటి? అది ఒక రసాయనం. మనము దానిని తిరిగి విచ్చిన్నం చేస్తాము. అది ఎక్కడి నుండి వచ్చింది? "సరే", మీరు అంటారు, "అప్పుడు, నుంచి … అది నీరు." అది H 2 O, సూత్రం, అది దానిలో భాగం. అప్పుడు దానిలో రంగుకు సంబంధించిన రసాయనముంది. రంగు ఎక్కడినుండి వచ్చింది? ఇప్పుడు, ఒకే ఒక్క అసలైన రంగు ఉంది, అది తెలుపు. మనకు అది తెలుసు. మిగిలిన అన్ని రంగులు తెలుపుతోనే తయారుచేయబడ్డాయి.
కాబట్టి, అది ఎలా వచ్చిందో మేము కనుగొన్నాము? ఇది ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడు, దానికి తిరిగి ఇంకా వెనుకకి వెళ్దాం. మీకు తెలిసిన మొదటి విషయం, "సరే," మీరు అంటారు, "ఇది ఆమ్లం అవుతుంది."
JOHN 3:16
94ఆమ్లం నుండి, అది ఏమి అవుతుంది? తదుపరి విషయం అది తిరిగి వస్తుంది, "అలాగే," మీరు చెప్తారు, "అప్పుడు అది ఒక కాంతి నుండి వస్తుంది."
కాంతి అంటే ఏమిటి? అనేక పరమాణువులు కలిసి మరియు ఒకటో పరమాణువు, నాలుగో పరమాణువు, ఎనిమిదో పరమాణువు కలిసినప్పుడు అనగా కొన్ని పరమాణువులు కొన్ని మోతాదులలో కలిసినప్పుడు నాలుగు లేదా ఆరు అణువులను తయారు చేయవచ్చు, అయిదు అనే అణువు నాలుగింతలుగా కలిసినప్పుడు బహుశా అది తెలుపు అనే రంగు అయి ఉండవచ్చు. కానీ అది ఆరుగా జరిగితే, దానిని ఏది నిర్ణయించింది? కానీ నేను ఏమిటి…? ఆ రంగు నలుపు సిరా చేయడానికి రసాయనాన్ని కలిపి, చూడండి. సరే.
అన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు అది ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడి నుంచో రావాల్సి వచ్చింది. ఇది సృష్టికర్త నుండి రావాలి ఎందుకంటే ఇది ఒక సృష్టి. సృష్టికర్త నుండి ఒక సృష్టి వచ్చింది. కాబట్టి అది సిరాలోకి వస్తుంది. ఇది ఒక ప్రయోజనం కోసం. ఇది మీ క్షమాపణను వ్రాయగలదు, యోహాను 3:16 వ్రాసి మీ ఆత్మను రక్షించగలదు. ఆపై అది మీ నిందను వ్రాసి, మిమ్మల్ని మరణ గది కి పంపగలదు. ఇది ఒక ప్రయోజనం కోసం ఇక్కడ ఉంది. ఇప్పుడు, ఇన్ని సంవత్సరాలలో అది కలిగి ఉన్నదిగా మారింది, అది ఏదైతే తయారు చేయబడాలో నిర్ణయించబడుతుంది. ఇప్పుడు, మీరు ఎప్పుడైనా దానిని తిరిగి అక్కడికి ఎలా తీసుకువస్తారు?
EXOD 8:21•
AMOS 3:7•
JOHN 10:34,35
95వారు బ్లీచ్ అనే పదార్థాన్ని తయారు చేశారు. మీరు స్త్రీలు దీనిని ఉపయోగిస్తారు, క్లోరాక్స్. ఇప్పుడు, నేను ఇక్కడ క్లోరాక్స్ ఉన్న టబ్బును కలిగిఉన్నాను , మరియు నేను ఆ చుక్క సిరాను క్లోరాక్స్ బకెట్‌లో వేస్తాను. ఇప్పుడు మీ రంగును కనుగొనండి. దానికి ఏమైంది? ఏమైంది? అది చేసిన మొదటి పని, అది నీటిని తాకింది, క్లోరాక్స్ ను తాకింది. ఆ రసాయనం చాలా గొప్పది, అది తిరిగి వెనక్కి పంపే అంత. మీరు దాని పొగలను చూడలేరు లేదా మరేమీ చూడలేరు. అది పోయింది. ఇది ఎప్పటికీ ఉండదు, ఎందుకంటే అది ఎక్కడ నుండి వచ్చిందో ఆ అసలు స్థితికి తిరిగి వచ్చింది.
ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము పాపమునకు చేయుచున్నది ఖచ్చితముగా అదే -యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తముపై మీ పాపాన్ని ఒప్పుకొనండి. అది కలుస్తుంది. అది దానిని మరుపు అను సముద్రంలో ఉంచుతుంది మరియు ఇకపై ఎన్నటికీ మీకు వ్యతిరేకంగా గుర్తుంచుకొనబడదు. ఇప్పుడు సంఘము ఎక్కడ ఉంది, సహోదరులారా? మనం దేవుని కుమారులుగా ఉండుటకు జన్మించినట్లయితే, మరియు యేసు స్వయంగా ఇలా చెప్పాడు, "మీ స్వంత ధర్మశాస్త్రం మీరు దేవుళ్లని [భూమిని నియంత్రించే చిన్న దేవుళ్లు] చెప్పినట్లయితే …" అని అతను చెప్పాడు, "ఒకవేళ దేవుని వాక్యము ఎవరివద్దకు [ప్రవక్తలు] వస్తే వారిని దేవుళ్ళని పిలిస్తే [ ప్రవక్తలు. ప్రభువు యొక్క వాక్యం ప్రవక్తల వద్దకు వస్తుంది], మీరు వారిని దేవుళ్లు అని పిలిస్తే, మీరు నన్ను ఎలా ఖండిస్తారు, "నేను దేవుని కుమారుడనని చెప్పినప్పుడు?"అని ఆయన అన్నాడు.
96ఇప్పుడు, ఎద్దుల మరియు మేకల రక్తం మోషేకు అక్కడికి వెళ్ళే శక్తిని ఇవ్వగలిగితే, దేవుని ఆజ్ఞ ద్వారా, మరియు ఆ కర్రను చాపి చెప్పు," అక్కడ ఈగలు వచ్చును," అతను దేవుని వాక్యం కలిగిఉన్నాడు; మరియు అతను ఆ వాక్యాన్ని పలికాడు. మరియు అతను అది చేసినపుడు, అది దేవుని యొక్క తలంపు అయింది. ఒక వాక్యం వ్యక్తపరచబడిన ఆలోచనే. కాబట్టి, దేవుడు దానిని ఆలోచించి, మోషే మనస్సులో ఉంచినప్పుడు, మరియు అతను దానిని పలికినప్పుడు, అది ఒక వాక్యంగా మారింది.
మరియు మోషే వెనక్కి తిరిగి వెళ్ళాడు-బహుశా దేశంలో ఒక్క ఈగ ఉండకపోవచ్చు. అప్పటికి ఒక గంటలో బహుశా ఒక ముసలి ఆకుపచ్చ ఈగ చుట్టూ సందడి చేయడం ప్రారంభించింది. ఒక అరగంటలో చదరపు గజానికి పది పౌండ్లు వచ్చాయి. అదేమిటి? మర్త్య మానవుని పెదవుల ద్వారా పలికిన దేవుని సృజించగల వాక్యం. దేవుడు మానవుడిని ఉపయోగించుకుంటాడు. దేవుడు సువార్తను బోధించడానికి సూర్యుడిని ఉపయోగించుకొనిఉండవచ్చు; దేవుడు సువార్తను బోధించడానికి గాలిని ఉపయోగించుకొనిఉండవచ్చు; కానీ సువార్తను బోధించడానికి దేవుడు మానవుడిని ఎన్నుకున్నాడు.
MARK 11:23
97ఈ దినమున సంఘము స్థితి ఏమిటి ? అక్కడ ఏదో తప్పిదము ఉన్నది. ఆ సరియైన కార్యమువద్దకు మనము యధార్ధతతో రావడం లేదన్నది నా ఉద్దేశం. పాపమును కేవలము కప్పివుంచే మేకలు మరియు ఎద్దుల రక్తముతో దేవుడు దానిని చేయగలిగితే , పాపికి ప్రాయశ్చిత్తము చేసాడు- కానీ పాపము ఇంకా అక్కడే ఉంది, కేవలము కప్పబడింది- పాపములను తుడిచివేసే ఆయన స్వంత కుమారుని రక్తముద్వారా ఆయన ఏమి చేయగలడు?
మరియు దేవుడు తయారుచేయలేదు, కానీ ఆయన పాపము అంతటినీ తీసివేసే రక్తాన్ని సృష్టించాడు.
MATT 17:20•
MATT 21:21•
MARK 11:23•
JOHN 14:12
98మరియు మార్కు 11 :24, "ఏమైనా … మీరు ఈ పర్వతమునకు 'కదలమని' చెప్పి, మరియు మీ హృదయమున సందేహింపక…నీవు చెప్పినది జరుగునని నమ్మినయెడల, నీవు చెప్పినది నీవు పొందుకొనవచ్చు." ఈ దినమున పెంతెకొస్తు సంఘము ఎక్కడ ఉన్నది? ఆమెన్! ఒప్పుకున్న, నిజముగా ఒప్పుకున్న పాపము, పాపమును తుడిచివేస్తుందని మీరు గ్రహించలేరు. దానికి తుడిచివేయుట లేకపోతే … అది మనవుని తన సృష్టికర్త సమక్షంలోకి తిరిగి తీసుకువెళ్లే ఆ అగాధం మీదుగా ఒక వంతెనను నిర్మించి, అతన్ని దేవుని కుమారుడిగా మారుస్తుంది. ఆమెన్.
నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడు చేయును. ఆమెన్. మీరు అక్కడ ఉన్నారు. " నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, 'కదలమని' ఈ పర్వతమునకు చెప్పినయెడల, మరియు మీ హృదయమునందు సందేహింపక, మీరు పలికినది జరుగునని నమ్మినయెడల, మీరు చెప్పినది జరుగును." దేవునికి మహిమ! చూడండి, అది దేవుడు తనను తాను దీనత్వములో బయల్పరచుకొనుట.
JOHN 14:12
99దేవుడు ఒక దీనుడైన పాపిని తీసుకొని, మరియు అతనిని ఆయన రక్తంలో శుద్ధి చేసి, క్లోరాక్స్ బ్లీచ్ అయిన దేవుని కుమారుని యొక్క రక్తములో ఆ ఒప్పుకొనబడిన పాపమును వేసి, పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా ఆ మానవునిలో తన స్వంత జీవము పెట్టుచున్నాడు. అప్పుడు, నిజమైన పరిశుద్దాత్మ బాప్తిస్మము మనలో ఉంటే, మనతో ఏమి తప్పిదము ఉన్నది?
మాదిరి… ఎలీషా కోసం ఏలీయా వస్త్రాన్ని విడిచినపుడు, అతడు దానిని రెండింతలు పొందుకున్నాడు. యేసు చెప్పాడు, "నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును." సంఘమా తప్పిదము ఏమిటి?
ఇప్పుడు మీరు మమ్మల్ని దర్శనాల బయల్జేబూబు అని పిలిచారు మరియు అలాంటివి. సహోదరుడా నన్ను విమర్శించడం మానండి. శిలువ వద్దకు రండి. సువార్త వద్దకు రండి. మనం నటించాల్సిన అవసరం లేదు. మీరు వేషధారణ ఎందుకు తీసుకుంటారు? మీరు దాని గురించి కొంత తప్పుడు భావన ఎందుకు తీసుకుంటారు? ఆకాశములు నిజమైన పెంతెకొస్తు శక్తితో నిండినప్పుడు, అది ఒక పురుషుడిని లేదా స్త్రీని దేవుని కుమారుడు లేదా కుమార్తె గా చేస్తుంది, అది అతన్ని తిరిగి దేవుని సన్నిధికి తీసుకువెళుతుంది. ఆమెన్! మనం ఇక్కడ ఉన్నాము, దీనత్వములో దేవుడు తనను తాను బయలుపరచుకున్నాడు.
MATT 11:25•
LUKE 10:21
100మీరు మీ స్వంత ఆలోచనల నుండీ దూరంగా ఉండాలి. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. భయం యొక్క ప్రతి పాపం, సందేహం యొక్క ప్రతి పాపం మీ హృదయం నుండి పోయే వరకు మీరు అక్కడే ఉండాలి. మరియు మీరు అక్కడ ఉన్నట్లయితే, దేవుడు మీ పాపములను తీసివేసి, విడిచిపెట్టి, మిమ్మల్ని దేవుని సన్నిధికి పంపకపోతే, మీ అనుభవంలో ఏదో తప్పు ఉంది.
మీకు ఎన్ని డాక్టరు డిగ్రీలు ఉన్నాయో, ఎంత పెద్ద సంఘములో ఉన్నారో, మీరు ఎలాంటి పెద్ద చక్రములో ఉన్నారో, ఎన్ని సంఘశాఖలకు చెందిన వారైనా లేక ఇంకేదయినా , నేను దానిని లెక్క చేయను… మీ పాపములు ఒప్పుకునేంతవరకు దానితో చేయగలిగింది ఏమీ లేదు. మరియు యేసుక్రీస్తు రక్తంలో మీరు కల్మషం లేకుండా నిలబడతారు, తిరిగి జన్మించించిన దేవుని కుమారుడు మరియు కుమార్తె, మీలోని దేవుని జీవముతో సృష్టించే వాక్కు పలుకుటకు- " ఈ పర్వతము కదులును గాక," మరియు అది మీకు లోబడుతుంది. ఆమెన్! దీనత్వములో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. విద్యలేనటువంటివారిని ఆయన ఎంచుకుంటున్నాడు. కేవలం దానిని నమ్మిన వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. "తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను మరియు …" [టేపు పై ఖాళీ ఉన్నది]
ISA 53:5
101…బాధింపబడెను మరియు మొత్తబడెను. అయినప్పటికీ నిశ్చయముగా దేవునిచే బాధింపబడినవానిగాను మరియు మొత్తబడినవానిగాను మనము ఆయనను ఎంచితిమి. కానీ మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను. క్లోరాక్స్ వచ్చింది. "మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది."
అయన ఏమి చేసాడు? శుభ శుక్రవారం మధ్యాహ్నం మరణము వరకు తనను తాను తగ్గించుకున్నాడు, తద్వారా ఈస్టర్ ఆదివారం నాడు పైకి లేచి (ఆమెన్!), రెండింతలుగా పరిశుద్దాత్మ ను సంఘమునకు తిరిగి పంపుటకు, తద్వారా మనము అయన చేసే అదే కార్యములు, చేసిన అదే కార్యములు మనము కూడా చేస్తాము. మరియు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయని అయన వాగ్దానము చేశాడు, మన సాంప్రదాయాల వల్ల అయన నుంచి యెంత దూరము వెళ్తున్నాము. మీరు అక్కడ ఉన్నారు: దీనత్వములో దేవుడు తనను తాను దాచుకొని, శక్తి లో తనను తాను బయలుపరుచుకున్నాడు. దానిని దేవుడు చేసే విధానము అది. కుమారులను ఈ అగాధమును దాటించుటకు, అది దేవుని ప్రణాళిక( అవును, అయ్యా).
102ముగింపులో దీనిని చెప్పదలచాను- పునరుత్థానములో తిరిగి వచ్చుటకు దేవుడు మరణములో మరుగై ఉన్నాడు.
ముగింపులో కొంత కాలం క్రితం నేను చదివిన ఒక చిన్న కథ మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పను… మొదటి ప్రపంచ యుద్ధము సమయములో, నేను కలిగి ఉన్నాను … నా తండ్రి యొక్క పెద్ద సహోదరులు, వారి … నా దాయాదులు ఆ యుద్ధములో ఉన్నారు. వారిలో చాలామంది చనిపోయారు. కానీ అక్కడ ఒక స్థలములో, వారు సైనికుల పటాలము మొత్తాన్ని కలిగి ఉన్నారు - అమెరికా సైనికులు - ముట్టడి వేయబడ్డారు. జర్మన్ సైన్యం వారిని ముట్టడించింది. మరియు మెషిన్ గన్ ఫైర్, మరియు పెద్ద ఫిరంగులు మరియు వారి వద్ద ఉన్నవి, మరియు మోర్టార్ ఫైర్ (అది ఏమైనా) వారిని ముట్టడించాయి. వారు బయటకు రాలేకపోయారు మరియు బయటకు వెళ్ళడానికి మార్గం లేదు.
సైనికుల మొత్తం పటాలము అక్కడే నశించిపోయింది, ఎందుకంటే వారు ప్రతి వైపు ఉన్నారు. వారికి ప్రణాళికలు ఉన్నాయి. ఒకదాన్ని పైకి పంపడానికి ధైర్యం లేదు; వారు దానిని కాల్చివేస్తారు. ఒక వ్యక్తి బయటకు రావడానికి ప్రయత్నించాడు … బాగా, వారు ప్రతి వైపు ఉన్నారు. ఏమీ లేదు… వారి చక్కటి తుపాకులు విఫలమయ్యాయి. వారి సైనిక వ్యూహాలన్నీ విఫలమయ్యాయి. వారు శత్రువులచే చుట్టుముట్టబడ్డారు. బయటకు వెళ్లే మార్గం కనిపించలేదు. ఏమీ లేదు.
103చివరకు ఒక చిన్న సైనికుడు వచ్చాడు. ఆ హోమర్ పావురాల్లో ఒక పావురాన్ని అతడు కనుగొన్నాడు. అదే వారి ఏకైక ఆశ. వారు ఒక సందేశాన్ని రాశారు, మరియు వారు అనుకున్నారు ఈ పావురము దీని గుండా వెళ్లి , అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కేంద్ర స్థానానికి తిరిగి వెళ్లి , ఈ సందేశాన్ని తీసుకువెళ్తే… సందేశపు పావురము, ఒక దూత పావురము, మరియు వారు కలిగి ఉన్నదంతా అదే- ఒక సామాన్య చిన్న పావురము.
అన్ని సైన్య కార్యాలు విఫలమయ్యాయి, కానీ వారు ఒక సామాన్య పావురాన్ని కలిగి ఉన్నారు. వారు ఒక సందేశాన్ని రాసి దాని చిన్న కాలుకి దానిని కట్టారు మరియు అది దానిని చేయులాగున దానిని దీవించి మరియు ప్రార్ధించి దానిని వదిలిపెట్టారు. అయితే, జర్మన్లు ఆ తెల్ల పావురం పైకి వెళ్లడాన్ని చూశారు మరియు వారు దానిపై కాల్పులు జరిపారు మరియు మిగతావన్నీ. ఒక బుల్లెట్ దాని రెక్క గుండా వెళ్లి, ఈకలను పడగొట్టింది; ఇంకొకటి దాని మెడను విడదీసి, అన్నాశయాన్ని తెగగొట్టినది . ఇంకొకటి సందేశము ఉన్న కాలికి తగిలింది. కానీ చిన్న పావురం ఎగురుతూనే ఉంది, సందేశాన్ని చేర్చుటకు ప్రయత్నిస్తూనే ఉంది. అతను తప్పక - అది ప్రమాదంలో ఉంది. చివరకు తన పోరాటాలతో, గాలిలో రెక్కలు కొట్టుకుంటూ, తిరగబడి చివరకు పడిపోయి, సైనికులు ఉన్న శిబిరంలోని సైనిక స్థావరములో పడిపోయాడు.
104ఒక సైనికుడు అతన్ని ఎత్తుకుని చూశాడు. మరియు ఈ చిన్న సహచరుడు, "అతను కాల్చి చంపబడ్డాడు." అతను తెరిచి, అతని చిన్న కాలు వైపు చూశాడు-తన చిన్న గాయపడిన కాలు మీద- మరియు అక్కడ ఒక గమనిక ఉంది. వారు గమనిక చదివారు. అది రక్తంతో కప్పబడింది. రక్తంతో కప్పబడి ఉన్నప్పటికీ, సందేశం వచ్చింది. అది చేరుకుంది. వారు త్వరగా ఉపబలాలను పంపారు మరియు సైనికుల మొత్తం పటాలాన్ని రక్షించారు.
… చిన్న పావురం దానంతటి గుండా వెళ్లకుంటే, వాళ్ళందరు మనుషులూ చనిపోయి ఉండేవారు. అది ఎంతటి విపత్తుగా ఉండేది! అది భయంకరమైన విషయముగా ఉండేది. మరియు ఆ చిన్న పావురం తన రక్తాన్ని ఖర్చు చేసినప్పటికీ అది చేయడం చాలా గొప్ప విషయం. సందేశం మీద అతని రక్తం ఉంది.
105అది గొప్ప విషయం. కానీ ఒక దినమున పాపము దేవుని కుమారులను బంధించిన విషయములో సగం కూడా గొప్పది కాదు. అక్కడ ఏ నిరీక్షణ లేదు. వాళ్ళు చేయగలిగిందియేమి లేదు. ఆశలన్నీ పోయాయి. కానీ అక్కడ వచ్చింది, గువ్వ కాదు, కానీ ఒక పావురము, పంతొమ్మిది వందల సంవత్సరాలక్రితం ఈ మధ్యాహ్నం సామాన్యతలో. ఆయన పశువుల తొట్టిలో పుట్టాడు, సిలువలో మరణించాడు. కానీ ఆయన వర్తమానముపై తన స్వంత రక్తముతో పరలోకము చేరాడు, మరియు ఆయన దేవుని కుమారులను విమోచించాడు. మరియు పవిత్రత మరియు స్వచ్ఛతతో జీవించడానికి, ఆయన సమక్షములో జీవించడానికి ఇప్పుడు మనం మరలా దేవుని కుమారులము మరియు దేవుని కుమార్తెలము.
మహిమ నుండి కిందకి దిగివచ్చిన ఆ పావురముకు నేను చాలా కృతజ్ఞుడను, అది నాకు అవసరమైన సందేశాన్ని తీసుకువచ్చింది మరియు దానితో పరలోకమునకు తిరిగి వెళ్ళింది. మరియు లోకం పాపాలు చేసిన చోటంతా రక్తసిక్తమైంది. కానీ ఈ రోజు నేను విముక్తి పొందాను. నేను స్వతంత్రుడను. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ISA 53:5
106మరియు ఇంకా సామాన్యులు దానిని అర్ధం చేసుకోగలరు. దానిని అర్ధం చేసుకొనుటకు నేను సామాన్యుడనైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దానిని బట్టి మీరు సంతోషముగా లేరా? మీకు కృతజ్ఞత లేదా? దేవుడు తనను తాను సామాన్యతలో దాచుకున్నాడు. అయన నిందలో గౌరవించబడ్డాడు. నిందించబడినవాడిగాను మరియు బాధింపబడినవాడిగాను మనము ఆయనను ఎంచాము. మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. ఆయన వారు అనుకునేంత గొప్ప సైనికుడు కాదు. వారు ఎదురుచూస్తున్న ఆ ధీర సైనికుడు ఆయన కాదు. అయితే వారు ఆయన నుంచి వారి ముఖమును దాచుకున్నారు. వారు సిగ్గు పడ్డారు. అయినప్పటికీ మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. అదేమిటి? దేవుడు తనకు తానుగా సామాన్యతలో దాగుకొనుట; యెహోవా మానవునిగా మారుట, ఆయన స్వంత రక్తముతో సందేశాన్ని తిరిగి తీసుకువెళ్ళుటకు మానవుని కొరకు చనిపోయాడు- దేవునికి ఆవశ్యకమైన వెల చెల్లించబడింది - మరియు మనము విమోచించబడ్డాము.
మరియు ఈ దినము మనము ఉండగలిగినంత సామాన్యతలో…. మీరు చురుకైన వారు కానవసరం లేదు, మీరు విద్యను కలిగి ఉండనవసరం లేదు; కేవలం దేవుని వాక్యమైన ఆ వర్తమానాన్ని నమ్మండి. మరియు మీరు కూడా రక్షింపబడి దేవుని కుమారునిగా ఉండవచ్చు, దేవుని సన్నిధిలో ఉండవచ్చు మరియు దేవుని కార్యాలు చేయవచ్చు.
ISA 53:2,3
107ఈ కార్యముల మీద దేవుని ఆశీర్వాదములు అడుగుటకు ఒక క్షణం మనం తలలు వంచుదాం. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈదినమున రేడియోలు వెళ్తున్న కొద్దీ, పత్రికలు - ఈ ఉదయమున ఒక చర్య గుండా వెళ్తున్న ఒక పత్రికను చూశాను - ఒక మానవుడు సిలువను మోస్తున్నాడు. వారు అన్ని రకాల కార్యాలను కలిగి ఉన్నారు. ఈస్టర్ ఉదయం ఆలయమంతటినీ లిల్లీ పుష్పములతో అలంకరిస్తారు; లిల్లీ పుష్పములతో వారి బలిపీఠాలను నింపుతారు; ఈస్టర్ కుందేళ్లు, కోళ్లు చోటుచేసుకుంటాయి. ఈస్టర్ తో దానికేమి సంబంధం అని నేను ఆశ్చర్యపోతున్నాను. కుందేలు, దేవుని దృష్టికి అపవిత్రమైన జంతువు! పరిశుద్ధ గ్రంథ సమయములో వాటిని తినుట లేక తాకుట కూడా నిషేధించబడినది. మరియు కోళ్లు, బాతులలో కూడా అదే కార్యము. అయినప్పటికీ అది పునరుత్థానపు స్థానాన్ని తీసుకుంది. క్రిస్ట్మస్ ను శాంతా క్లాజ్ తీసుకున్నాడు. ఓహ్, మై!
ప్రపంచం ఎక్కడికి వచ్చింది మిత్రులారా? మనము ఎక్కడ ఉన్నాము? చూడండి మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనము నేరుగా గోతి లోకి వెళ్తున్నాము. అది నిజము. మనము పాపము, మరియు మతాచారాలు మరియు సిద్ధాంతాలచే చుట్టుముట్టబడ్డాము.
108కానీ పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక వర్తమానికుడు వచ్చాడు. అవసరత తీరిపోయినది : దేవుని కుమారుడు, పాపపు శరీరములో చేయబడి, పశువుల తొట్టి లో పుట్టాడు. "…అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు." ఆయన నిందాక్రాంతుడు. మనము ఆయనను కోరుకొనలేదు. మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. ఈ దినము కూడా మనము అదే కార్యము చేయుచున్నాము.
మీరు చెప్పవచ్చు, "అయ్యో, నేను దానిని చేసి ఉండను."
109ఓహ్, ఈ రోజు మీ వైఖరి మీరు దీన్ని చేసి ఉంటారని రుజువు చేస్తుంది. మీరు ఇప్పుడు దీనిని చేస్తున్నారు. మీరు వినయంతో మీ దారిని తీసుకోలేరా? ఇలా చెప్పు, "ప్రభువైన దేవా, అది నాకు యెంత వెల అవుతుందో నేను దానిని పట్టించుకోను. అది ఏమిటో నేను పట్టించుకోను. ఇంక పాపముతో నాకు ఏ సంబంధము లేదు."
మీరు చెడ్డవారని నేను చెప్పడం లేదు. మీరు పొగతాగుతారు, మద్యం సేవిస్తారు లేదా ఏదైనా అని నేను చెప్పడం లేదు. కానీ మీరు వాక్యాన్ని నమ్మడం లేదు.
మీరు వాక్యాన్ని నమ్మితే చెప్పండి, "నేను పట్టించుకోను, ప్రభువా, అది నాకు ఏమి ఖర్చవుతుందో. అది నా సంఘశాఖ ఖరీదు అయితే, అది నా కుట్టు పార్టీ ఖరీదు అయితే, అది నా క్లబ్బు ఖరీదు అయితే, అది నా స్నేహితుల మధ్య నా ప్రఖ్యాతి ఖరీదు అయితే, అది యెంత ఖరీదు అవుతుందో నేను పట్టించుకోను, కలువరి వర్తమానాన్ని నేను అంగీకరిస్తాను. నేను తగ్గింపుతో ఉంటాను, ఈ సమయము నుండీ నన్ను నేను తగ్గించుకుంటాను. నాకు తెలుసు నేను నా జుట్టును పెంచుకుంటే [స్త్రీలు] వారు నన్ను పాతకాలపుదానిని అని పిలుస్తారు. వారు నన్నేమి పిలిచినా నేను లెక్క చేయను. నేను ఒక మహిళగా ఉంటాను. నేను పాలిపోయి మరియు మృతముగా ఉన్నానని వారు నాతో అంటారు. నేను క్రీస్తు లో మృతినొందాను. నేను దానిని చేస్తాను."
110పురుషులు: వారు నాలో సిద్ధాంతాలు మరియు మత విశ్వాసాలు యెంత గుచ్చడానికి ప్రయత్నించినా నేను దానిని లెక్క చేయను. ఇది మొదలుకొని నేను దేవుని దీనమైన వర్తమానాన్ని అంగీకరిస్తున్నాను. నేను దానిని నమ్ముతున్నాను. నా పాపములు పోయేంతవరకు నేను అక్కడే నిలిచిఉంటాను. వ్రాయబడిన ప్రతీ దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని పరిశుద్ద ఆత్మ కుమ్మరించునంతవరకు నేను అక్కడే ఉంటాను. దానిని ఆయన నాకు వాగ్దానము చేసాడు. మరియు ఒకవేళ నేను… ఆ అగాధమును ఆ నీతివంతమైన ఆయన రక్తముతో కట్టిన వంతెనతో దాటగలిగితే, అప్పుడు నేను దేవుని కుమారునిగా నిలబడగలను. నేను సువార్తనంతటినీ నమ్ముతున్నాను. నేను దానిని చేస్తాను."
మీరు అలా చేయాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడే ఆ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారా? మీరు కోరుకుంటే, దేవుని వైపు చేయి పైకెత్తి, "సహోదరుడా బ్రన్హాం, మీరు ప్రార్ధించుచుండగా నన్ను జ్ఞాపక పరచుకోండి. దేవుడు దానిని చేయాలని నేను కోరుకుంటున్నాను."
దేవుడు మిమ్మల్ని దీవించును. అది నిజము. సరే. ఆయన మీ చేతిని చూస్తాడు.
111మా పరలోకపు తండ్రీ, వినయము, మిమ్మల్ని విశ్వసించే దీనత్వము, మిమ్మల్ని మీరు దీనత్వముతో ఎలా బయలుపరచుకుంటారో , ఈ దినములలో మేము ఎలా కనుగొన్నాము, మరియు అన్ని దినములలో, సంఘము దానంతట అది ఆ స్థితిలోనికి వస్తుంది. అప్పుడు మీరు నేరుగా చెత్తలోకి వంగి, ఎక్కడినుంచో, ఏదో తీసుకొని, దానిని అభిషేకించి, దానిని బయటకు పంపుతారు, మరియు అది తిరస్కరింపబడుతుంది - మరియు ప్రపంచమును దానితో తీర్పు చెప్తారు.
దేవా, యాభై సంవత్సరాలుగా అమూల్యమైన పరిశుద్ధాత్మను—ప్రజలు సిద్ధాంతాల ద్వారా అంగీకరించడానికి ప్రయత్నించారని ఈరోజు మనం చూస్తున్నాము… ఇంకా, మీరు దానిని దాని శక్తితో మరియు దాని బయలుపాటుతో బయటకు తీసుకొచ్చారు. బయటకు నెట్టివేయబడిన, తృణీకరించబడిన వ్యక్తుల యొక్క ఒక పేద దీన సమూహం దానిని అంగీకరించింది, నమ్మింది. ప్రభువా, వారిలో మిమ్మల్ని మీరు ఘనపరచుకున్నారు . మరియు ఇప్పుడు వారు ఇంకొక తరములో దేవునికి మనవళ్ళుగా అవడానికి ప్రయత్నించుటను మనము చూస్తున్నాము. ఓ దేవా, యెంత భయంకరమైన కార్యము! పురుషులు మరియు స్త్రీలు సువార్తను నమ్మే దీనత్వానికి త్వరగా వచ్చులాగా. ప్రభువా, దీనిని అనుగ్రహించండి.
112ఈ రాత్రి చాలా మంది పురుషులు మరియు స్త్రీలు చాలా మంది చేతులు ఎత్తారు. మరియు ప్రభువైన దేవా, మీరు వారిని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వారి హృదయాలలో ప్రతి ఒక్కరిలో దేవుని శాంతిని పొందాలని, వారు మీ ఆత్మతో నింపబడి ఉండుటకు, వారు అద్భుతాలు చేయగలరని విశ్వాసం కలిగి ఉండుటకు, దైవిక జీవితాన్ని గడపడానికి విశ్వాసం కలిగి ఉండుటకు , వారు చెడుగా మాట్లాడినపుడు తిరిగి చెడు మాట్లాడనటువంటి మాధుర్యమైన జీవితమును కలిగి ఉండుటకు; వారు చెంపదెబ్బకు ముద్దును తిరిగి ఇచ్చేలా, వారు చెడుకు బదులుగా మంచిని ఇచ్చుటకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. మనుష్యులను దీనులుగా చేయండి. మీ పునరుత్థాన శక్తిలో మనుష్యులు నిన్ను తెలుసుకునేలా చేయండి. ఈ తరములో మాకు మీ మరణం వృధా కాకూడదు.
ప్రభువా మీరు మీ సంఘమును లేపాలి అని మేము ఇప్పుడు ప్రార్దిస్తున్నాము. దానిని మహిమపరచండి మరియు పెద్దదిగా చేయండి. మహిమలో దానిని గృహమునకు పంపండి. మేము ఈ కార్యాలను విశ్వసిస్తాము, తండ్రి. ఈ గడియలో ఆయనను కనుగొనవలెనని దేవుణ్ణి ఆపేక్షించువారు ఈ రాత్రి ఇక్కడ అనేకులు ఉండునట్లు చేయండి. . మేము దీనిని యేసు నామములో అడుగుతున్నాము.
మరియు మనము మన తలలు వంచి ఉండగా,
MARK 8:38•
LUKE 9:26
113నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను, మీరు ఆ దిశగా మరో అడుగు వేయాలనుకుంటే, మీరు లేచి నిలబడి ఇలా చెప్పాలనుకుంటే, "నేను సంఘానికి చెందినప్పటికీ, నేను సిగ్గుపడను. నేను మెథడిస్ట్ [బాప్టిస్ట్, లేదా పెంతెకొస్తు , లేదా మీరు ఏమైనా కావచ్చు]. నేను సిగ్గుపడను. నాకు తెలిసినదానిపై నేను చాలా విశ్వసించానని గ్రహించాను. కానీ నేను సంపూర్ణ సువార్తను పూర్తిగా విశ్వసించే మరియు నా జీవితంలో అది పని చేసే ప్రదేశానికి ఎన్నడూ రాలేదు. నేను కార్యాలను చూశాను. అవి వాగ్దానాలు అని నేను నమ్ముతున్నాను. నేను నమ్మాలనుకుంటున్నాను.
"కానీ నేను నమ్మితే అది పని చేస్తుందని అయన నాకు చెప్పాడు. కాబట్టి నాలో ఏదో లోపం ఉంది. ఇది పని చేయదు. నేను దీన్ని పని చేయడానికి ప్రయత్నించాను, కానీ అది చేయదు మరియు నేను దాని గురించి సిగ్గుపడుతున్నాను. మరియు ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఇక్కడి ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, నేను నిజాయితీపరుడిని మరియు నా జీవితంలో అది కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో సంపూర్ణ సువార్త ప్రత్యక్షమయ్యేలా నేను క్రీస్తుకు నిజమైన సాక్షిగా ఉండాలనుకుంటున్నాను." మీరు మీ కాళ్ళపై నిలబడి చెప్పండి, "నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. నేను దేవుణ్ణి వెతుకుతున్నాను." దేవుడు నిన్ను దీవించును. అది నిజమే.
చూడండి, "మనుష్యుల యెదుట మీరు నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే, నేను తండ్రి యెదుట మీ గురించి సిగ్గుపడతాను" అని యేసు చెప్పాడు.
114ఇప్పుడు పెంతెకొస్తు , లేదా మెథడిస్ట్ లేదా బాప్టిస్ట్ అయిన ఈ వ్యక్తులకు ఈ నిజమైన విషయాలు ఉన్నాయా…? మీరు దేవుని సన్నిధిలో విమోచించబడిన కుమారుడు మరియు దేవుని కుమార్తె అని మీకు సానుకూలంగా తెలియునంత వరకు మీరు ఆ అగాధాన్ని దాటారా? మరియు సూచక క్రియలు మరియు అద్భుతాలు- నమ్మడానికి వ్రాసినది కాదు-కానీ దేవుని యొక్క నిజమైన కథనం, పరిశుద్ధాత్మ, మీలో మండుతున్నదా? మరియు మీరు ఈ పర్వతానికి ఏమి చెప్తారు, అది కదులుతుంది? మీరు నమ్ముతారా? అది కదలకపోతే, ఇప్పుడు మీ సమయం.
"ఇది నా సమయం అని మీకు ఎలా తెలుసు?" మీరు చెప్పండి. "నేను ఇంతకు ముందు నిలబడ్డాను."
సరే, మీరు నిజంగా దేవుని కోసం ఆకలితో ఉంటే, అది వచ్చే వరకు మీరు నిలబడి ఉంటారు. దానికి అంతం లేదు. మీరు సురోఫెనికయ స్త్రీలా పట్టుదలతో ఉంటారు. ఆమె "లేదు" అని తీసుకోలేకపోయింది. ఆమె నిజంగా కోరుకుంది. మనము ప్రార్థించే ముందు ఇంక ఎవరైనా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారా?
అందమైన పాట: "అతను నా కోసం సిలువకు వ్రేలాడదీయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అక్కడ నా కోసం చనిపోయాడు."
"నాకు అది కావాలి, సహోదరుడా బ్రన్హాం. నాకు అది కావాలి, దేవా. నాకు అది నిజంగా కావాలి. నా జీవితం-నేను మార్చాబడాలనుకుంటున్నాను. నేను ఊహించినట్లు జీవించాను. నేను ఒక ఆశతో జీవించాను. నాకు ఏదో కావాలి… అది కావాలి. ఆ అపొస్తలులు ప్రతిసారీ సున్నా మార్కును కొట్టగలిగితే, నేను కూడా చేయగలను.
115నేను చెప్పేది అదే. ఇది అపొస్తలుల కోసం పని చేస్తే, అది ఇప్పుడు పనిచేస్తుంది. ఒకసారి జరిగితే మళ్లీ జరుగుతుంది. అతను ఎప్పుడైనా దేవుడైతే, అతను ఇప్పటికీ దేవుడే. అతను నిన్నా, నేడు మరియు నిరంతరమూ ఒక్క రీతిగానే ఉన్నాడు. అదే నా ప్రచార అంశము. మీ సంఘశాఖ దానిని నమ్మకపోతే, మీ సంఘశాఖ వారు ఏమి కోరుకుంటున్నారో దానిని విశ్వసించనివ్వండి; మీరు పరిశుద్ధ గ్రంధమును నమ్ముతారు. మీరు దానిని నమ్మండి. మీరు నిలబడతారా? దాదాపు ఎనిమిది లేదా పది మంది అప్పుడు లేచి నిలబడ్డారు. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. మరింత మంది నిలబడ్డారు, మరింత మంది నిలబడ్డారు. "నేను నిజంగా నిజాయితీగా ఉన్నాను, సహోదరుడా బ్రన్హాం. నాకు అది కావాలి."
116మరుసటి రోజు ఏదో జరిగింది. మీరు చదివారు … లేదా టేప్ విన్నారా, ఏడు ఉరుములు, "అయ్యా, సమయమిదేనా?" ఇది మరుసటి రోజు జరిగింది. ఈ సంగతులు మీకు తెలుసా… సంఘమా, సమయము సమీపముగా ఉంది. సమయము సమీపముగా ఉంది. ఇంకా వేచిఉండకండి. చూడండి, ఎత్తబాటు అన్ని సమయాలలో జరగదని మీకు ఎలా తెలుసు? మీకు తెలిసిన మొదటి కార్యము అది గతము- ఒకరు ఇక్కడ కనుమరుగవుట, మరియు అక్కడ. అది వెళ్ళుట మీకు తెలిసే మొదటి విషయం, మరియు మీరు… ప్రపంచమును తీర్పు తాకుతుంది.
మీరు అంటారు," సరే, నేను అనుకున్నాను ఇది…"
" ఇప్పుడు చాలా ఆలస్యమైంది." గుర్తుంచుకొనండి, వారు ఓడలోకి ప్రవేశించే దినమువరకు వారికి తెలియదు, మరియు అప్పుడు అది చాలా ఆలస్యమైంది. బుద్ధిలేని కన్యకలు ఎరుగరు, వారు తిరిగివచ్చి బుద్ధిగల కన్యకలు వెళ్లిపోయారు అని కనుగొనేంతవరకు. అప్పుడు ఆమె శ్రమల కాలముకు విడిచిపెట్టబడింది.
REV 6:12•
REV 7:4
117సంఘము, వధువు…. ఏ మంచి బోధకుడు నమ్మడు. సంఘము శ్రమలగుండా వెళ్తుంది; కానీ వధువు కాదు. ఆరవ ముద్ర కింద సంఘము నిశ్చయముగా శుద్దీకరణ గుండా వెళ్తుంది. నిజము. 144 ,000 మందికి కొరకు ఇశ్రాయేలు చేసింది అదే. కానీ వధువు కాదు. వధువు క్షమించబడినది. ఆమె ఎత్తబాటులో నేరుగా మహిమలోకి వెళ్తుంది. అది నిజము. ఆమె… నా ఉద్దేశ్యము , ఈ ఒకానొక దినములలో చివరి సభ్యుడు పట్టబడతాడు. అది రావచ్చు, మీకు దాని గురించి ఏమీ తెలియకపోవచ్చు. గుర్తుంచుకోండి, అది ఒక రహస్యము, రహస్యముగా కొనిపోబడుట. మీరు ఆలోచించని గడియలో అయన వస్తాడు. మీకు దానిగురించి ఏమీ తెలియదు- ఆమె వెళ్లిపోతుంది. అప్పటికే అది చాలా ఆలస్యం.
118మీరు అనవచ్చు, "నేను నిలబడి ఉంటే బాగుండేది." మీరు నిలబడాలని ఉద్దేశించుకుని ఉంటే, అల్బుకెర్కీలో ఈ సమావేశం అవ్వనివ్వండి , ఆ నిర్ణయం కొరకు నిలబడే సమయము ఇదే కానివ్వండి.
ఇప్పుడు, మీరు నిజంగా క్రీస్తు ద్వారా సురక్షితంగా ఉన్నారని భావిస్తే-మీరు పరిశుద్ధాత్మ మరియు యేసుక్రీస్తు రక్తాన్ని పొందారని మీరు భావిస్తే, అన్ని సూచక క్రియలు మరియు వాగ్దానాలు మీ ఆదేశానుసారం ఉన్నాయి, మరియు అవి మీ జీవితంలో వ్యక్తమవుతున్నట్లు మరియు పని చేస్తున్నట్లు మీరు చూస్తారు, మరియు అది నిజమని మీరు తెలుసుకుంటారు, మీరు ఆ విధముగా కూర్చొని, దానిని నమ్మితే, నేను దానిని బట్టి మీ మాటను తీసుకుంటాను. అది మీరే నిర్ణయించుకోవాలి. మీరునిర్ణయించుకోకపోతే, మీరు మీ పాదముల మీద ఉండాలి. కానీ మీరు దానిని నమ్మితే, యేసు చేసిన ఈ సూచక క్రియలు మరియు అద్భుతాలు మీకు తెలిస్తే… మెస్సియా మీతో మాట్లాడుట మీకు రుజువుచేయబడితే… అది కాకపోతే, అప్పుడు మీరు మీ పాదములపై ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును. అది నిజము.
119మీలో చాలామందికి నేను అపరిచితుడను. మీలో చాలామంది నన్ను దర్శనాలు చూసేవాడిగా భావించారు. నేను దానిగురించి ఏమీ చెప్పలేదు. అది మీకు తెలుసు. నేను దానిని పెట్టాను… ఇంకా ఆ సమయము కాలేదు. కానీ మీరు ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. దేవుని సేవకుడిగా మీరు ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. నేను ఎప్పుడైనా యేసుక్రీస్తు నామములో మీకు చెప్పి జరగనిది ఏమి ఉంది? అది అలా అయితే, చెప్పండి, "ఆమెన్." అది ఎన్నడూ విఫలమవ్వలేదు. వేలకొద్దీ కార్యాలు, కానీ ఒక్కసారి కూడా తప్పిపోలేదు, అది ఎల్లప్పుడు అది నిజము. చుట్టూ ఉన్న ప్రపంచములో అది మీకు తెలుసు.
మీరు నాతో విబేధించినప్పటికీ, వేదాంతశాస్త్రంలో చాలా మంది… నేను వేదాంతవేత్తను కాదు; నేను విన్నది మాత్రమే మాట్లాడతాను. ఆపై నేను అది విన్నప్పుడు, నేను పరిశుద్ధ గ్రంధము వైపు చూస్తాను. అది పరిశుద్ధ గ్రంధము ప్రకారము కాకపోతే, నేను దానిని స్వీకరించను; కానీ ఒక్కసారి కూడా అది వాక్యానికి విరుద్ధంగా లేదు, కానీ వాక్యాముతో ఉంది. అది ధృవీకరించబడటానికి కారణం అదే. దేవుడు దానిని రుజువు చేస్తాడు.
120ఇప్పుడు, అప్పుడు మీరు నన్ను గ్రహిస్తారు.
క్రీస్తు నుండి మీ వద్దకు పంపబడిన వర్తమానికుడను అని మీరు నమ్మితే, మీరు నన్ను నమ్ముతారు: మీరు దేవుని రాజ్యంలో లేకుంటే, మీరు త్వరగా సరిగా నొక్కడం మంచిది. ఇది మెరుగుపడదు; అది అన్ని వేళలా అధ్వాన్నంగా పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని గుర్తు పెట్టండి. గుర్తుంచుకోండి. ఇది సరియైనదా తప్పా అని చూడండి. ఇది సరియైనదా తప్పు అవుతుందా అని మీరు చూస్తారు. ఇది మెరుగుపడదు; అది మరింత దిగజారుతుంది. ఇది అన్ని వేళలా కష్టతరం అవుతుంది. ఉజ్జీవం పోయింది. మీరు పొలాల్లో మిగిలిపోయినదానిని మాత్రమే సేకరిస్తున్నారు. ఆమె అయిపోయింది.
ఇప్పుడు, మీరు అంటారు, "నేను దానితో ఏకీభవించను."
మంచిది. పర్వాలేదు. మీరు చేస్తే, అది సరే. అది నా ఒప్పుకోలు. అది పరలోకం నుండి నేను విన్నాను. లవొదికయ కాలము పెంతెకొస్తు కాలము అని నేను నమ్ముతున్నాను, ఆమె అక్కడ నులివెచ్చని స్థితికి వచ్చింది, మరియు దేవుడు ఆమెను ఆయననోటినుండి ఉమ్మివేసాడు. సరిగా ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చింది. పెంతెకొస్తు కదలిక ఇప్పుడు ఆ స్థలముకు వచ్చింది: నులివెచ్చని, బహు వేడిగా కాదు, బహు చల్లగా కాదు. మీరు చల్లగా లేరు, సాధారణ స్థితిలోనూ లేరు; వేడిగాను లేరు. మీరు ఉమ్మివేసే స్థితిలో ఉన్నారు, మరియు మీరు వెళ్తున్నారు….
MATT 18:20•
REV 3:20
121యేసు, ఆయన సంఘము వెలుపల నిలబడి ఉన్న ఏకైక కాలం … వారి సిద్ధాంతాలు ఆయనను బయటికి నెట్టివేశాయి - తడుతున్నాడు, లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. "ఇదిగో, నేను తలుపు దగ్గర నిలబడి తట్టాను. నా స్వరము ఏ మనుషుడైన వింటే…" ఈ రాత్రికాలం మీరు స్వరమును విన్నందుకు నేను ఆనందిస్తున్నాను.
ఇప్పుడు మిమ్మల్ని నిలబడమని మాత్రమే అడగగలను. ఆయన మీవైపు చూస్తున్నాడు. యేసు అన్నాడు," ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని అన్నాడు." అది అలా కాకపోతే, దేవుడు లేడు, పరిశుద్ధ గ్రంధము లేదు, సూర్యోదయము లేదు, సూర్యాస్తమయము లేదు, పువ్వులు లేవు, చెట్లు లేవు, మీరు వాస్తవముగా ఇక్కడ లేరు, మీరు ఒక కలలో ఉన్నారు, జీవితము నిజము కాదు, మీరు మనుషులు కాదు. కాబట్టి, అది అలా ఉండుట అసాధ్యము; కాబట్టి ఆయన ఇక్కడ ఉండకుండా ఉండుట ఆయనకు అసాధ్యము. మరియు మీరు" నా నామములో ఏది అడిగిన," విశ్వసించి నమ్మండి, ఆయన దానిని మీకు అనుగ్రహిస్తాడు.
122ఇప్పుడు అది మీరే. మీకు ఆయన కావాలి అని సాక్షిగా నిలబడ్డారు. ఇప్పుడు, మీ స్వంత మార్గంలో, మీరు ప్రార్థించే విధంగా, మీరు కోరుకునే విధంగా, మీ హృదయంలో, "ప్రభువైన దేవా" అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోకు…ఇక్కడ ఈ స్థలము మీకు కావలసిన సమయమంతా, దీని కోసం చాలా సమయాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ స్వంత మార్గంలో, మీ స్వంత మార్గంలో… ఇప్పుడు, ఒక వ్యక్తి నిలబడి, మరొకరు నిలబడటం వాడుక అని నాకు తెలుసు, మరొకరు ఈ విధంగా మోకరిల్లి-కానీ మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో- అది ఏమిటో నేను పట్టించుకోను.
"ప్రభూ, నన్ను ఇది చేయనివ్వండి, అలా చేయనివ్వండి" అని చెప్పకండి; "ప్రభువా, నన్ను నింపండి. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. నేను ఈ విషయంలో నిజాయితీగా ఉన్నాను. నేను నిజము చెప్పుచున్నాను."
ఇప్పుడు, మీరు అర్థం చేసుకుంటే, అది రావాలి. అది అసాధ్యం కాదు. ఆయన దానిని వాగ్దానం చేసాడు మరియు ఆయన మీ హృదయములోనికి నొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు.
123ఒక్కటే కార్యము, నీవు కేవలము కొద్ది భాగమే తెరచి ఇలా చెప్పెదవు "లోనికి వచ్చి ఇక్కడ నిలబడండి, కానీ నా వ్యక్తిగత జీవితంలోనికి వచ్చి హేళన చేయవద్దు". చూడండి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన మీ సమస్తాన్నీ కోరుకుంటున్నారు. ఆయన మీ హృదయములోని ప్రతి విభాగమునూ కోరుకుంటున్నాడు. ఆయన మీ వ్యక్తిగత జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మీ జీవితమంతా కోరుకుంటున్నాడు. ఆయన మీకు ప్రభువుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువే యాజమాన్యం. ఆయన మిమ్మల్ని స్వంతం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన మీకు మార్గనిర్దేశం చేయగలడు, మిమ్మల్ని నడిపించగలడు, మిమ్మల్ని తీసుకెళ్లగలడు, మిమ్మల్ని వాడుకోగలడు. మీరు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఉంటే, ఆయన లోపలికి రావాలనుకుంటున్నాడు, లేదా మీరు అక్కడ నిలబడి ఉండరు, చూడండి. కాబట్టి మీరు దానిని స్వీకరించవలసిన సమయము ఇప్పుడే.
124ఇప్పుడు అది మీ ఇష్టం.
ఇప్పుడు, మీరు మీ హృదయమంతటితో నమ్మితే , అది ఇప్పటి నుండీ పరిష్కరించబడుతుంది. ఇది ఒక జ్ఞాపకమున నిలిచే రాత్రి అవుతుంది. వారు బహుశా ఈ రాత్రికి ఈ తలుపులను మూసివేయరు; మీరు రాత్రంతా ఇక్కడే ఉండవచ్చు. కానీ మీరు ఇలా చేస్తే, "ప్రభువా, నేను నా పాదాలపై నిలబడి ఉన్నాను. మీరు మీ వాగ్దాన ప్రకారము నన్ను నింపే వరకు నేను నిలబడి ఉన్న చోటు నుండి ఎప్పటికీ కదలను" అని చెప్పండి. మీరు దేవునితో పనిచేయడం ప్రారంభిస్తే, ఆయన మీతో పని చేస్తాడు.
కానీ మీరు చేసే వరకు, మీరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు, "ప్రభువా, ఈ రాత్రి నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారా? నేను ఏ అనుభూతిని పొందలేదు . సరే, బహుశా నేను రేపు రాత్రి ప్రయత్నిస్తాను. మీరు దేవుని నుండి అలాంటిదేమీ పొందలేరు. మీరు అది లేకపోతే చనిపోవునంత గొప్ప అవసరతలోనికి రావాలి. అప్పుడు మీరు పొందుకుంటారు. అది నిజము. ఆయన దానిని వాగ్దానం చేశాడు. అది కాకపోతే, మీరు మీ సమయాన్ని దేనికొరకు ఉపయోగిస్తున్నారు? వారి వాగ్దానాలు నిజం కాకపోతే..
125ఈ కార్యాలు ఆవిధముగా జరుగుతాయి. అందువలననే నేను నిలబడి ప్రపంచానికి చెప్పగలను, " వాక్యము ఎప్పుడైనా విఫలమైందా?" దేవుడు దానిని నాకు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే వాగ్దానం చేశాడు. కారణము అదే….
మీరు అంటారు," మీరు విఫలమవుతారని మీకు భయం లేదా?"
నేను ఎప్పుడూ కాదు… నేనెప్పుడూ విఫలుడనే. ఆయన ఎప్పుడూ విఫలమవ్వడు. నేను నా మాటలను పలుకను; నేను ఆయన మాటలను పలుకుతాను. అవి ఎల్లపుడు నిజం అవుటకు కారణం అదే, చూడండి. నేను ప్రపంచాన్ని అడుగుటకు కారణం అదే," అది జరగకుండా ఒక్కసారైనా ఉండినట్లు నాకు చూపించండి. ఒక్కసారి దానిని చూపించండి. " ఆయన చెప్పిన వేల కార్యాలలో, ఒక్కసారి కూడా అది విఫలమవ్వలేదు. అది ఎప్పుడు విఫలమవ్వదు, ఎందుకంటే అది దేవుడు; మానవుడు కాదు.
కాబట్టి దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మీరు పరిశుద్దాత్మను పొందుకొనుటకు సిద్ధముగా ఉంటే ఆయన మీకు దానిని ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. వెల చెల్లించవద్దు - వెల ఇదివరకే చెల్లించబడినది. మీరు అంగీకరించడానికి సిద్ధముగా ఉంటే పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఈ మధ్యాహ్న సమయమున వెల చెల్లించబడినది. మీరు అయితే, ఇప్పుడు మీ హృదయాన్ని వెళ్లనివ్వండి. దాన్ని తెరవండి. అన్ని భయాలను, అన్ని సందేహాలను తొలగించండి. దేవుని వైపు చేతులు పైకిఎత్తండి. ఇలా చెప్పండి, "దేవా, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను యేసుక్రీస్తు నామములో నిలబడి ఉన్నాను". నేను మీ కోసం ప్రార్థించబోతున్నాను. మీరు కూడా ప్రార్థించండి.
126ప్రభువైన యేసు, వినయముతోను, అణకువతోను, వారి పాదములపై ఉన్న ఈ గుంపును మీకు సమర్పిస్తున్నాను. పిలుపునకు ప్రతిస్పందించి వారు నిలబడినందున వారిని మీకు సమర్పిస్తున్నాను. వారు లోతైన కార్యములను వెదకుచున్నారు. ఇక ఎంతమాత్రమూ ఏమీ లేకుండా యేసుక్రీస్తు రక్తము శుద్ధి చేసింది అని విన్నతరువాత వారు ఎక్కువగా జీవమును వెదకుచున్నారు; దేవుని యొక్క సంపూర్ణ వాక్యము వారిలో నిలిచి ఉండును. అది సృష్టించు శక్తి అయ్యున్న వారి స్వంత స్వరము పలికిన ఆజ్ఞ , ఎందుకంటే వారిలో పరిశుద్దాత్మ ఉంది. మరియు ఈ పరిశుద్ధాత్మ ఒక సృష్టి కర్త. ఆయన కార్యములు జరుగునట్లు చేయును ఎందుకంటే ఆయన వాక్యమును పలుకుతాడు. మరియు పలుకబడిన వాక్యం క్రియ చేసే దేవుడవుతుంది.
మరియు ప్రభువా, మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరిపైకి పరిశుద్ధాత్మను పంపి, క్రీస్తు పునరుత్థానం యొక్క శక్తితో, వారి హృదయంలో వారు కోరుకునే విషయాలు-మంచి జీవితాన్ని, ఆత్మ బాప్తిస్మాన్ని వారికి అందజేయాలని నేను ప్రార్థిస్తున్నాను.
ప్రభువా, ఈ ప్రేక్షకులు వెలిగింపబడులాగున, ప్రజల హృదయాలు దర్శనాలు చూసి మరియు దేవుని శక్తితో నింపబడులాగున. యేసుక్రీస్తు నామములో ప్రభువా నేను వారిని మీకు అప్పగిస్తున్నాను.
127ఇప్పుడు, కేవలము మీ చేతులు పైకి ఎత్తండి, మీ తల ప్రార్ధనలో ఉంచండి, మీ హృదయము నింపబడి ఉంచండి, చెప్పండి," ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను."
………… నన్ను నింపండి! నన్ను నింపండి! నన్ను రక్షించండి.
సజీవ దేవుని ఆత్మ, నా మీద నూతనముగా పడుము.
మీ పాటల నాయకుడిని పాటను నడిపించుటకు ఇక్కడకు తీసుకురండి. " నా మీద నూతనముగా పడుము, పరిశుద్దాత్మ." ఉంచండి…
"… పట్టి౦చుకోవద్దు. నేను ఇక్కడే నిలబడతాను ప్రభువా . అన్యాయమైన న్యాయమూర్తిలా నేను మీ చేతిలో ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను." అక్కడే నిలబడు. "నేను విగ్రహంలా నిలబడబోతున్నాను. ఆ బోధకుడు ఆరోజు రాత్రి పైకప్పు మీద నిలబడినట్లే నేను నిలబడతాను. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ప్రభువా. నన్ను ఎవరు చూస్తున్నారో నేను పట్టించుకోను. నేను పట్టించుకోను-ఇక్కడ ఉన్న నా కాపరి, అది ఎవరో నేను పట్టించుకోను. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఏదో వెతుకుతున్నాను. నాకు ఏదైనా జరగాలని కోరుకుంటున్నాను. మీరు వాగ్దానం చేశారు. దాన్నిస్వీకరించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇది ఇతరులకు పనిచేస్తే, అది నాకు పనిచేస్తుంది. దాన్ని స్వీకరించడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను కూర్చోబోవడంలేదు. నేను నిశ్చయించుకున్నాను." …?… ఓహ్ నన్ను క్షమించండి…?…
[వేదిక పై ఎవరో చెప్పారు, "ఒక పాట, సహోదరుడా. వారికి అది ఇష్టం. అతను మిమ్మల్ని ఇక్కడకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. సరియైనదా?"]
128అంతే. దానితోనే ఉండండి. మీరు నిజంగా అర్థం చేసుకుంటే, మీరు నిజంగా అర్థం చేసుకుంటే ప్రార్థిస్తూ ఉండండి. ఆమెన్. మీరు నిజంగా అర్థం చేసుకుంటే, అక్కడే ఉండండి. ఆయన మీకు అండగా నిలుస్తున్నాడు. దానితోనే ఉండండి. "నేను ఇక్కడ ఉన్నాను, ప్రభువా. నేను కదలబోవడం లేదు. నేను నిన్ను నమ్ముతాను. మీరు వాగ్దానం చేశారు. నేను ఒక ఊహను తీసుకోవడం లేదు. నాకు నిజమైన పరిశుద్ధాత్మ కావాలి. మీరు ఇప్పుడే నన్ను నింపాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడ వేచి ఉన్నాను."
ఆగవద్దు. కేవలం ప్రార్థన చేస్తూ ఉండండి. సంగీతంపై దృష్టి పెట్టవద్దు. కేవలం ప్రార్థన చేస్తూ ఉండండి. అదే ఈరోజు మనకున్న ఇబ్బంది. మనము సంగీతం వింటాము, మనము ఒక విషయం మరియు మరొకదాన్ని వింటాము. మనం దేవుని స్వరాన్ని వినాలి. వింటూ ఉండండి. అయన దానిని వాగ్దానం చేశాడు మరియు అయన వాగ్దానం చేస్తే అయన దానిని చేస్తాడు. ఆమెన్.
129ఇరవై ముప్పై వేల మంది కళ్లు తెరువబడడం నేను ఎన్నిసార్లు చూశాను! ఎన్ని సార్లు నేను చూశాను…? అక్కడ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో, నేను ఒకేసారి 25,000 అసాధారణమైన అద్భుతాలను చూశాను—ప్రజలు అలాగే నిలబడి ఉన్నారు. అందుచేత వారు ఏడు పెద్ద వ్యానుల చంక కర్రలు మరియు చక్రాల కుర్చీలను తీసుకున్నారు. ఎడమ నుండి కుడి చేయి తెలియని స్థానికులు అక్కడే నిలబడి క్రీస్తును అంగీకరించారు మరియు వికలాంగులు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు విడిచి వెళ్లిపోయారు . అది ఒక నల్లజాతి ఆఫ్రికన్ కోసం చేస్తే, అది ఒక సంఘములో, పరిశుద్ధాత్మ బయలుపరచబడిన స్థలములో నివసిస్తున్నట్లు భావిస్తున్న సమయములో ఉన్న మీ కోసం ఏమి చేస్తుంది? ఆమెన్!
తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. "ప్రభువా, నేను నమ్ముతున్నాను. నాకు అది తెలుసు. నేను…"
130అక్కడ ఏదో తప్పిదము ఉన్నది. దేవునితో ఏ తప్పిదము లేదు. దేవుడు దానిని వాగ్దానం చేశాడు. కాబట్టి నాకు సహాయం చేయండి, నేను ఇక్కడే నిలబడి, నడవ తర్వాత నడవకు దిగి, మీరు ఎక్కడ ఉన్నారో మరియు మీరు ఏమి చేశారో మీకు చెప్పగలను. ప్రభువైన యేసు నామములో నేను చెప్పుచున్నాను. అది నిజమని మీకు తెలుసు. మరియు మీరు మిమ్మల్ని వదులుకోవడానికి భయపడుతున్నారని నేను చూస్తున్నాను. మీరు ఏదో భయపడుతున్నారు. ఏదో తప్పు ఉంది. దేవుడు వాగ్దానము చేస్తే దానిని వెనుకకు తీసుకోడు, ఇదే నిజం. ఇక్కడే… మీకు కావాలంటే, అది మీ ఇష్టం. ఇది మీ మరణం. ఇది మీ సమాధి. ఇది మీ అంగీకారం.
వాక్యము అక్కడ ఉంది. కాబట్టి నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. కాబట్టి నాకు సహాయం చెయ్యండి, యేసు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నేను మీకు ఎప్పుడైనా ఏదైనా తప్పు చెప్పానా? అతను ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదో ఉంది… నేను ఇక్కడ నిలబడి చూస్తున్నాను… ఆ వెలుగు చుట్టూ తిరుగుతున్నట్లు చూడండి-ఇక్కడ భవనం అంతటా స్పష్టంగా, దాదాపు - ముందుకు వెనుకకు. మై, మై! అక్కడికే నీవు వెళ్ళు! అంతే. అదీ మార్గం. ఇక్కడ ఒక చిన్న మహిళను తాకింది. మార్గము అదే! ఇంకొకరికి తాకింది. అక్కడికే నీవు వెళ్ళు ! అది అక్కడ ఉంది. ఇప్పుడు దేవుడిని అంగీకరించే సమయం వచ్చింది. మహిమ! ఖచ్చితముగా అయన ఎక్కడో తాకుతాడు . దేవునికి స్తుతి. అక్కడే మీరు ఉన్నారు! ఆమెన్ ! అది దానిని తీసుకుంటుంది! అది ఇప్పుడు ఇక్కడ వేరొకరిమీదకు వెళ్తుంది. ఇంకొకరు, ఇంకొకరు! దేవునికి స్తోత్రము!
131చూడండి, ఆయనే సత్యము. ఆయనే మార్గము, సత్యము, వెలుగు, జీవము. అది ఇంకొకరి మీద దిగుతున్నపుడు అంగీకరించండి, ఇంకొకరి మీద ఉన్నపుడు. దానిని అంగీకరించండి. ఇది స్థలం చుట్టూ, చుట్టూ, మరియు చుట్టూ దిగుతుంది. నేను ఉద్రేకముతో లేను; నేను మీకు నిజం చెబుతున్నాను. మహిమ! అది నిజము.
దానితోనే నిలిచి ఉండండి. దానితోనే నిలిచి ఉండండి. అక్కడే నిలిచి ఉండండి. మీరు అక్కడ నిలబడి ఇంకా ఐదు నిముషాలు కూడా కాలేదు. అక్కడే నిలబడండి. " ప్రభువా, మీరు దానిని వాగ్దానము చేశారు. దానిని పొందుకొనుటకు నేను ఇక్కడ ఉన్నాను. " సరే, అది అక్కడ ఉంది. నేరుగా దానిని చేరుకొని , చెప్పండి," నేను దానిని పొందుకున్నాను. ప్రభువా, అది ఇక్కడ ఉంది. నాకు అది కావాలి. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను నిజాయితీ గా ఉన్నాను, నేను నిజము చెప్పుచున్నాను. మీరు దానిని నాకు వాగ్దానం చేశారు." ఆమెన్.
మహిమ, హల్లెలూయా! కేవలం నమ్మండి. నమ్మండి… మీరు నన్ను నమ్ముతున్నానని చెప్పారు. పరిశుద్దాత్మ, ఆ వెలుగు భవనము చుట్టూ తిరుగుతోంది. అది ఏమిటి? తెరువబడిన ఒక వ్యక్తిని అది వెతుకుతోంది. నేను నిజము చెప్తున్నాను. ఆమెన్. మీ చేతులను పైకెత్తుటకు ప్రయత్నించండి, మరియు ఆయనను స్తుతించండి. "ప్రభువా, నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు నాకు వాగ్దానం చేశారు. నేను వాగ్దానమునకు కట్టుబడి ఉంటాను. ప్రభువా, మీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు."
నేను దానినే చూస్తున్నాను. దేవునికి స్తోత్రము.
132దానితోనే ఉండండి. అక్కడే ఉండండి. "ప్రభువా, నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఉదయం అయినా పర్వాలేదు, ఇక్కడే నిలబడి నిన్ను స్తుతిస్తాను. మీరు దానిని పంపుతారని నాకు తెలుసు. ఈ సమావేశం ఈ రాత్రికి ముగుస్తుంది మరియు నేను పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ ఉన్నాను. నేను పరిశుద్ధాత్మతో నిండి ఇక్కడి నుండీ వెళతాను, కాబట్టి నాకు సహాయం చేయండి. మీరు దానిని వాగ్దానం చేశారు. నేను ఒక గాలివీచు దిక్కును చూపే సాధనములాగా నిలబడతాను, మీరు నేను చేయాలనుకున్నది ఏదైనా చేస్తాను, నాకు పరిశుద్దాత్మ మాత్రమే కావాలి. నేను దానిని పొందాలని నిశ్చయించుకున్నాను".
మీరు పూర్తిగా అప్పగించుకొనినప్పుడు, ఆయన పూర్తిగా లోపలికి వస్తాడు. కానీ మీరు అప్పగించుకునేంతవరకు, ఆయన పూర్తిగా లోపలికి రాలేడు. అప్పగించండి. మీ ఆలోచనలను అప్పగించండి, మీ చింతలను అప్పగించండి, మీ జీవితాన్ని అప్పగించండి, మీ సర్వస్వాన్ని అప్పగించండి, మీ ప్రతిష్టను అప్పగించండి. ఇప్పుడు ఆయనకి సమస్తమును అప్పగించుము, మరియు ఆయన లోపలికి వచ్చి నిన్ను పరిశుద్ధాత్మతో నింపును. ఆయన అలా చేయడానికే ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఇక్కడ భవనములో ఇద్దరు లేదా ముగ్గురిని తాకాడు. పరిశుద్ధాత్మను కోరుకోవడం అంతకంటే ఎక్కువే ఉంది. కేవలం నమ్మకం ఉంచండి. దేవునికి మహిమ!
మీ స్వంత ఆలోచనలను తగ్గించుకోండి. మీ స్వంత మార్గములను తగ్గించుకోండి.
133అక్కడే ఉండి, "ప్రభూ, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. మీరు దానిని ఈ రాత్రి ఇక్కడ ఎవరికైనా ఇస్తే, మీరు నాకు కూడా ఇవ్వబోతున్నారు. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పండి. మీరు మీ స్వరాన్ని, మీ చేతులను, మీ జీవితాన్ని ఎత్తినప్పుడు…
నా రక్షకుని పిలుపు నేను వింటున్నాను,
(మీ చేతులు పైకెత్తి అది ఆయనకు పాడండి.)
నేను నా రక్షకునిని వినగలను…,
(ఆయన నిన్ను పరిశుద్దాత్మ వద్దకు పిలిస్తే
ఇప్పుడే అప్పగించుకో, నీ సమస్తము అప్పగించుకో.)
నా రక్షకుని పిలుపు నేను వింటున్నాను,
"నీ సిలువ తీసుకొని, మరియు వెంబడించు, నన్ను వెంబడించు."
(ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు.) ఆయన ఎక్కడికి
నడిపిస్తే నేను వెంబడిస్తాను,
(మీరు నన్ను ఇంతవరకు నడిపించారు, నా పాదముల వద్దకు.
ఇక్కడ నేను నిలబడి ఉన్నాను.)
ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే………
ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే………
ACTS 10:44
134ఇప్పుడే సహోదరుడు డెమోస్ కు చూపించాను. ప్రభువు దూత దాటి వెళ్ళాడు, నేను "ఆ స్త్రీని చూడు" అని చెప్పాను. అది ఆమె మీదుగా వెళ్ళినప్పుడు, ఆమె తన చేతులను అలా పైకెత్తింది. మేము ఇప్పుడే చూపించాము … సహోదరుడు డెమోస్ అది ఇక్కడే ఉన్న ఒక స్త్రీ మీదగా ఇప్పుడే వెళ్ళుట చూసాడు. నేను, "సహోదరుడా డెమోస్, మీరు చూడలేదా?" ఇది భవనం గుండా కదులుతోంది. నేను అన్నాను, "ఇది ఇక్కడికి వెళుతున్నప్పుడు చూడండి."
చిన్న స్త్రీ చేతులు పైకి ఎత్తినది. అది ఒక చిన్న స్త్రీ గదులు గదులుగా రంగులు వేయబడిన వస్త్రమును ధరించి ఉంది. కొన్ని నిముషాల క్రితం ఆమెను ఏదో తాకింది. ఆమె చేతులు పైకి లేపింది. అది సరియైనదా, స్త్రీ? ఇక్కడ మీ చేతులు పైకెత్తి? ఇక్కడ ఆ నీలిరంగు వస్త్రములు ధరించిన స్త్రీ వెనుక? అది అక్కడ ఉంది, చూడండి. ఎందుకు, ఆయన మీద… నేను సరిగ్గా దానినే చూస్తున్నాను!
ఇప్పుడు, నేను మీకు ఎప్పుడైనా తప్పు చెప్పి ఉంటే… ఎప్పుడో నాకు చెప్పండి. అది ఇక్కడ ఉంది!
JOHN 8:42•
JOHN 16:28•
ACTS 9:3-5
135స్నేహితులారా మీరు ఆ గంజి పెట్టినట్టు నలుగకుండా ఉన్న పెంతెకొస్తు మార్గము నుండీ దూరముగా వెళ్ళాలి. మీరు నిజముగా చనిపోవాలి! మీరు దానిని నిజముగా అంగీకరించాలి! మీరు దేనినో కలిగి ఉన్నారు… మీరు పాక్షిక ఆకలిని కలిగి ఉన్నారు, కానీ నిజమైన ఆకలిని కాదు. మీరు దానిని అసలైనదిగా చేయాలి." పేతురు ఈ మాటలు మాటలాడుచుండగా విన్న వారిమీద పరిశుదాత్మ దిగెను."
మీ కళ్ళు మూసుకొని తల వంచండి. ఆలోచించండి. అక్కడ ఏదయినా తప్పిదము ఉన్నదా? "ప్రభువా, నా అవిశ్వాసాన్ని తీసివేయండి." ఇక్కడ, ఈ మర్త్యమైన కళ్ళతో… మన మధ్య చిత్రములో ఉన్న ప్రభువు దూత-శాస్త్రీయ రుజువు ద్వారా తీయబడినది-ఇశ్రాయేలు పిల్లలను అనుసరించిన అదే అగ్ని స్తంభం… అది యేసు.
ఆయన చనిపోయి, పాతిపెట్టబడి, దేవుని వద్దకు ఆరోహణమయ్యాక , సౌలు దమస్కునకు వెళ్లే మార్గములో అదే వెలుగుస్తంభం ద్వారా కొట్టబడ్డాడు. "ప్రభువా, నువ్వు ఎవరు?" అన్నాడు.
అతడు, "నేను యేసును" అన్నాడు. "నేను దేవుని నుండి వచ్చాను మరియు దేవుని దగ్గరకు వెళ్లాను" అని యేసు చెప్పాడు. ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నాడు, అదే యేసు మన మధ్య మనకళ్లతో చూచులాగున కనిపించాడు, కెమెరాకు చిక్కాడు, ఆత్మలో వ్యక్తమయ్యాడు. అయ్యో, సహోదరుడా, సహోదరి, దేవుడు ఇంకా ఏమి చేయగలడు? కృప యొక్క గడియ…
136మీరు యదార్ధముగా నమ్మాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను, కానీ మిమ్మల్ని మీరు దాచిపెట్టుకుంటున్నారు. దానిని పొందుకునేంత చిత్తశుద్ధి మీకు లేదు. కాబట్టి నాకు సహాయము చేయండి, అది ఇక్కడ ఈ భవనములో ఉంది. నేను అబద్ధము చెప్పడం లేదు.
మిమ్మల్ని మీరు ప్రశాంతముగా ఉంచుకొనుచుండగా ఒక్క క్షణం, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు అనుభూతి చెందారా? మీ చేతిని ముందుకి మరియు వెనుకకు ఊపండి. నేను జనులందరిపైనా దీనిని చూశాను. దీవించు.ఆశీర్వదించు. ప్రభువా దీవించు. ఆమెన్. రెండు, అది మూడు. సరే. నాలుగు. సరే. ఆ కుమ్మరింపులో నలుగురు పరిశుద్ధాత్మను పొందారు. ఆ సమయములో నలుగురు పరిశుద్ధాత్మను పొందారు. దేవునికి స్తోత్రము.
ఇప్పుడు కొద్ది క్షణాల క్రితం అది ప్రయాణిస్తోంది. ఒక వెలుగు ఈ దారిలో నుండి వస్తుంది, ఇటు తిరిగి వస్తుంది, ఇక్కడికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తుంది. నేను సహోదరుడు షకారియన్‌తో, "ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. ఇదిగో చూడండి, ఇక్కడికి వస్తుంది? అది వెళ్లుచున్నపుడు దానిని చూడండి. అక్కడ ఒక చిన్న స్త్రీ ఉంది. "నేను చెప్పినట్లుగా," అది ఆ స్త్రీ మీద ఉంది, "ఆ సమయములో ఆమె చేతులు పైకి ఎత్తినది మరియు కేకలు వేయడం ప్రారంభించింది." చూడండి, అది అక్కడ ఉంది, ఇప్పుడే అక్కడి నుండి వెళ్లి మరియు ఆ మూలకు వెళ్ళింది. ఈ మార్గములో వెనుకకు వచ్చింది. నేను ఇప్పుడు దానిని చూడలేదు, చూడండి. వాస్తవానికి అది నిజం. నేను మీకు నిజం చెప్తున్నాను. అది ఇక్కడ ఉంది, చూడండి. నలుగురు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు.
137ఇప్పుడు, మీకు కావాలంటే, అది మీది. మీరు తెరవడానికి సిద్ధంగా ఉంటే అది మీదే. ఇప్పుడు మీరు ఏమి చేయాలో మీకు ఒక భావన ఉంది. మీకు ఒక రకమైన ఆలోచన ఉంది, "సరే, ఇప్పుడు, నేను ఇక్కడ నిలబడితే, ఇది…" కాదు, కాదు. అది కాదు… మీరు కూర్చోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏ వ్యత్యాసము కలిగించదు, కానీ మిమ్మల్ని మీరు ఇక్కడ తెరుస్తారు . అప్పుడు పరిశుద్దాత్మ తాకుతుంది.
అప్పుడు, కొన్నిసార్లు అది మిమ్మల్ని అభిషేకించడం ప్రారంభించినప్పుడు, మీరు దానితో ముందుకు సాగరు. మీరు కొంచెం భయపడతారు. మీరు భయపడి, మీరు వెనక్కి లాక్కుంటారు. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్దాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మూఢభక్తికి భయపడకండి . అది దెయ్యము చేసే పని అయితే, అది మనము తెలుసుకుంటాము అని మీరు అనుకోవడం లేదా? అవును, అయ్యా! అతను మీ వద్దకు రాడు. మీరు దాని గురించి భయపడవద్దు. వద్దు. అతను నిన్ను బాధింపడు. ఆ మహిమను మీరు అనుభవించినప్పుడు పరిశుద్దాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి… నిలబడి ఆ రాత్రి ఈ చిన్న పరిచారకుడు చేసిన విధముగా. ఏదో వెచ్చనిది అతనివద్దకు వచ్చింది. అతడు ఏవిధముగా తనను తాను అప్పుడు అప్పగించుకోవాలో తెలిసి ఉండినట్లైతే … అంతే. కేవలము చెప్పండి," ప్రభువైన యేసూ, నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్ను అంగీకరిస్తున్నాను." అప్పుడు ఏదో జరగడం మొదలవుతుంది, చూడండి. మీ హృదయమునుండీ దానిని చెప్పండి- అప్పుడు అది జరుగుతుంది.
138ఓహ్, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? దేవుడు మీతో ఉండునుగాక. దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను… ఇక్కడ ఇంకా ఎంతమందికి పరిశుద్దాత్మ కావాలి? మీ చేతులు చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. మై , మై . అది లేకుండా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎనిమిది లేదా పది ఉన్నాయి, పదకొండు, సుమారు పదకొండు … పన్నెండు, బహుశా, ఇక్కడ ఇంకా పరిశుద్ధాత్మ కావాలి. మనకు ఆలస్యము అవుతుందని నాకు తెలుసు- బహుశా తొమ్మిదిన్నర లేదా అలాంటిదే. కానీ మనకు చాలా సమయము ఉంది. మనకు ఇంకా చాలా సమయము దొరికినది. స్నేహితుడా, నీవు రక్షింపబడాలని మేము కోరుకుంటున్నాము. మీరు నింపబడాలనుకుంటున్నాము. గుర్తుంచుకోండి, మీరు రక్షించబడ్డారు. మీరు యేసును అంగీకరించినప్పుడు మీరు రక్షించబడ్డారు. కానీ పరిశుద్దాత్మను పొందుకునేంత వరకు మీరు మార్పునొందరు. ఇప్పుడు అది మీకు తెలుసు. అది నిజం.
LUKE 22:32
139ద్రోహం జరిగిన రాత్రి పేతురుతో యేసు చెప్పాడు (అతను ఇదివరకే రక్షించబడ్డాడు) "ఇప్పుడు, నీవు మారిన తర్వాత నీ సహోదరులను బలపరచుము" అని చెప్పాడు. అది నిజమే. ఖచ్చితముగా. మీరు క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించారు. కానీ మీరు మారినప్పుడు మీరు నిజంగా మారినప్పుడు. అది నిజమే. అతను ఇంకా మారలేదు. అతను ప్రభువు ముందు శపించాడు, ఆయనని మరియు ప్రతీదీ తిరస్కరించాడు. కానీ అతని మార్పు తర్వాత… "నువ్వు మారిన తర్వాత నీ సహోదరులను బలపరచు." అది నిజమే. అది సరియైనదేనా? ఏది ఏమైనప్పటికీ, లేఖనము చెప్పేది అదే. మరియు అది దానిని సరి చేస్తుంది. యేసు పేతురుతో (అది అతనిని వెంబడించి, దయ్యాలను వెళ్లగొట్టాడు, అద్భుతాలు చేశాడు మరియు ప్రతీదీ చేసాడు) అన్నాడు, "నీవు ఇంకా మారలేదు. అయితే నీవు మారిన తర్వాత నీ సహోదరులను బలపరచుము." నిజము. అది సత్యము.
ఇప్పుడు మీరెందుకు చేయకూడదు…
140అటువంటి ఒక పిలుపును మీరెలా తిరస్కరించగలరు? అది మీ నిమిత్తము. సహోదరులారా, అది లేకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్లడాన్ని నేను చూడాలనుకోవడం లేదు. మనకు ఇంకొక కూడిక ఉండకపోవచ్చు. మనకు తెలియదు. మన ముందు ఏమివుందో మనకు తెలీదు. మనము ఎప్పటికి ఇంకొకటి కలిగి ఉండకపోవచ్చు. మీరు కూర్చొని కొద్దిసేవు ప్రార్ధించాలనుకుంటే మీ ఇష్టము. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. మీరు కూర్చోవాలనుకుంటే, లేదా నిలబడే ఉండాలనుకుంటే, మనం మరలా ప్రార్ధించబోతున్నాము. మీరు చేయాలనుకున్న ప్రతిచిన్నదీ చేయండి. కానీ మీరు పరిశుద్దాత్మను పొందుకోవాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు అది మీ కొరకు. ఇక్కడ దానిని నలుగురు పొందుకొని, మరియు మిగిలిన వారు ఎందుకు పొందుకోలేరు? చూడండి, మిమల్ని మీరు తగ్గించుకోవాలి, మీ హృదయములను తెరవండి, మరియు నిజముగా దానిని నమ్మండి.
141నేను ఇందులో మంచి భోదకుడిని కాకపోవచ్చు. జబ్బుపడినవారి కొరకు ప్రార్ధించుట నా పరిచర్య.
ఇక్కడ పెంతెకొస్తు పరిచారకుడు ఉన్నారా, ఎవరైనా పెంతెకొస్తు పరిచారకుడు ఉన్నారా? మీ చేయి పైకెత్తండి . జబ్బుపడిన వారికొరకు ప్రార్ధించే ఇతని సంగతేంటి? ఇక్కడ ఒకరు ఉన్నారు. ఇక్కడికి రండి. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు… నేను పెంతెకొస్తు వారి శ్రేణులకు బయటగా జన్మించాను . కానీ ఇక్కడ, ఇతను మీకొరకు ప్రార్ధించాలనుకుంటున్నాను. నేను అతని పక్కన నిలబడతాను. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును.
[సహోదరుడు: మీరు పరిశుద్దాత్మను మీ మీదకు రానిస్తే, మీ చేతులు పైకెత్తండి. సహోదరుడు భాషలలో మాట్లాడుతున్నాడు]
ఇప్పుడు మర్యాదగా ఉండండి. చూడండి, ఆయన ఎవరో ఒకరిమీద చేతులు ఉంచబోతున్నాడు. నిజముగా మర్యాదగా ఉండండి. చూడవద్దు… చుట్టూ చూడవద్దు. పైకి చూస్తూ ఉండండి, పైకి చూడండి, పైకి చూడండి. మీరు ప్రార్ధిస్తూ ఉండండి, ఇప్పుడు ప్రార్ధించండి.
సహోదరుడా దేవుడు నిన్ను దీవించును. దీనిని ఎలా చేయాలో మీకు నాకన్నా బాగా తెలుసు. నేను ఇక్కడ నిలబడి ప్రార్ధన చేస్తాను. మీరు వారికి ఎక్కువ సూచనలు ఇవ్వండి.