విజయోత్సవ దినము

విజయోత్సవ దినము

1మీరు కోరినయెడల మీరు కూర్చొనవచ్చును. నేను ఇక్కడ ఉండుటను బట్టి మరియు దేవుని యొక్క రాజ్యవాసులను కలుసుకునే భాగ్యమును బట్టి దేవునికి నా కృతజ్ఞతలు వ్యక్తపరచగోరుచున్నాను. ఈ ఉదయము ఈ సహోదరుని గృహములో మనము ఒకరితో ఒకరము కొంత సహవాసమునకై కూడుకొనుట యనునది నాకు ముందటి సంఘమును జ్ఞాపకమునకు తెచ్చుచున్నది. క్రైస్తవ్యము మొట్టమొదటిగా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి యను విధానములో ప్రారంభమైనదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. వారు కలుసుకొని ఏక మనస్సుతో రొట్టెను విరిచిరి. మరియు ఒకే ఉద్దేశ్యముతో ఏక మనస్సు కలిగి ఈ ఉదయం మనమిచ్చట ఉండగా అదే మనము కావలెనని కోరుచున్నాము.

మనము ఈ భూమిపై ఉండగా, ఒక కార్యమును సాధించుటకు మనము ప్రయత్నించుచున్నాము, అదేదనగా, మన జీవితముల కొరకైన దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్పుచేయుటయై యున్నది. మరియు బహుశా దేవుడు, కొన్ని వేల సంవత్సరముల క్రితమే, తన అనంత జ్ఞానమును బట్టి, ఈ ఉదయం మనము ఇక్కడ ఈ పచ్చిక భూమిలో లేదా ఇచ్చట ఏడారిలోని ఈ చిన్న భవనములో మన ముండెదమని ఎరిగియుండెను. దానిని ఆయన కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఎరిగియుండెను.

2ఇప్పుడు, టూసాన్ నుండి ఈ ఉదయము ఇచ్చటికి వచ్చుచున్న మా స్నేహితులను కొందరిని, సైక్కర్ కుటుంబమును మేము కలుసుకొన్నాము. వారి కారులో జనరేటర్ చెడిపోయినది. మాకు సాధ్యమైనవన్నియు సేకరించి ఆ స్త్రీని మరియు పిల్లలును ఇచ్చటకు తీసుకొని వచ్చితిమి. మరియు వారి జనరేటర్ను అమర్చిన యెడల వారు కొద్దిసేపటి తర్వాత వచ్చెదరు. అది ఇక్కడినుండి కొద్ది దూరములోనున్న కూడలియై యున్నది. అది ఎచ్చటనున్నదో నేనెరుగను. అయితే మనము ఇచ్చట నుండుటకు మనము సంతోషించుచున్నాము.

మరియు ఇప్పుడు, ఇచ్చటనున్న సహోదరుడు ఐసాక్సన్, మరియు మేము ఇరువురము ఒకరినొకరము అంతగా ఎరుగనివారము. మేము క్రీస్తులో సహోదరులుగా నుంటిమని ఎరుగుటకు తప్ప ఇక వేరే ఏ పరిచయము లేదు. మేము కలిసి సహవాసము చేసిన సమయములున్నవి. మా మొదటి కలయిక కొన్ని సంవత్సరముల క్రితము ఫీనిక్స్ లో అని నేను నమ్ముచున్నాను. మరియు అతని భార్య ఇచ్చటనున్నయెడల, నేను ఆమెను ఎరుగను. ఇప్పటికి మా పరిచయము అంతవరుకే యున్నది. అతని భార్య, అతని కుటుంబము ఎవరనేది తెలియదు.

నేను లోపలికి వచ్చినప్పుడు, ద్వారము నొద్ద మన సహోదరుడైన ఒక నల్ల-జాతియుని కలిసికొంటిని, కరచాలనము చేసెను, అతను చక్కని వ్యక్తియై యుండెనని మీకు తెలియును. మీకు తెలియునా, లోపలికి వచ్చి ఈ ఉదయమున ఈ సమూహములో ఉండునట్లుగా మీరెంతగా ఆహ్వానించబడితినన్న అనుభూతిని అది కలిగించును. అది నాయొక్క ధన్యతయైయున్నది.

MATT 18:20

 

3మరియు ఇప్పుడు, ఎక్కడైతే వేలవేల కొలది జనులు గుంపులుగా కూడెదరో ఆ ప్రాంతాలలో మాటలాడే ధన్యతను నేను కలిగియుంటిని. అయితే నేను… నా పరిచర్యలో జ్ఞాపక చిహ్నములుగానున్న సమయములు ఏవనగా ఇక్కడున్నట్లుగా, ఒకటి లేదా రెండు డజన్ల మంది కూడుకున్నప్పుడేయైయున్నది. దేవుడు తన ప్రజలతో అత్యంత సమీపముగా వ్యవహరించుచున్నట్లు అగుపించుచున్నది, మరియు… మనము చిన్న గుంపుగా కూడుకొనుటవలన మనము ఎక్కువగా పరిచయస్తులుగా నుండు అనుభూతిని అది కలుగజేయునని నేను తలంచుచున్నాను. ఎప్పుడైతే మనము… "ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామమున కూడెదరో, వారి మధ్యన నేనుందును" అని ఆయన చెప్పినట్లు, అప్పుడే దేవుని యొక్క వాక్యము మనకు అత్యంత ప్రాముఖ్యమైనదిగా అగుపించును.

గతరాత్రి, దాదాపు అర్థరాత్రి, ఒక వ్యక్తి మరియు అతని భార్య మరియు ఒక యౌవ్వనస్తురాలు, ఒక జరిగిన సంఘటన విషయమై ఆమె తన మానసిక స్థిరత్వమును కోల్పోవుటచే ఆ గృహములో నేను వారితో కూడియుంటిని. మరియు మేము కలిసి కూడుకొనియుండగా, చెప్పవలసిన కొన్ని విషయములు చెప్పుట కొరకు నేను, ఆ యవ్వన స్త్రీ మాత్రమే గదిలో యుంటిమి… మేము ఆ విధముగా కలిసియుండుట మంచిదని తీర్మానించితిని, మరియు దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుకొనును అని చూపించుచూ అక్కడికి ఈ వెలుగు వచ్చెను, మరియు మేము సరిగ్గా కూడుకొనియున్న ఆ స్థలమునకు ఈ ప్రభువు యొక్క దూత వచ్చెను.

4మరియు నిన్నటి దినమున, ఒక చాలా ప్రసిద్ధమైన కుటుంబమునకు చెందిన ఇరువది-రెండు సంవత్సరములు గల ఒక యౌవ్వనునికి గవద బిళ్ళల వ్యాధి సోకెను, మరియు ఆ గవద బిళ్ళల వ్యాధి అతని తాకెను. ప్రత్యేకించి పురుషులలో కలిగే ఆ వ్యాధి ఏమిటో పెద్దవారైన మీలో అనేకులకు తెలియును. అది వాస్తవముగా ఇంచుమించు వారిని చంపివేయును. మరియు ఈ పిల్లవాడు, అనేక దినములుగా, రెండు వారాలుగా 105 డిగ్రీల జ్వరముతో బాధపడుచుండెను. ఇప్పుడు, అది పోటును కలుగజేయు పరిస్థితని మీకు తెలియును, మరియు ఆ సూక్ష్మజీవులవల్ల వచ్చిన ఆ జ్వరమును ఎదుర్కొనుటకు వైద్యులు పెన్సిలిన్ ఇంజక్షన్లతో సకల విధములుగా ప్రయత్నించిరి. అయితే అది ఎటువంటి ప్రభావమును చూపలేనట్లు అగుపించెను. అయితే దేవుని ఎదుట ఒక్క నిమిషములో, ఆ జ్వరము యొక్క ప్రతీ ఆనవాలు ఆ యౌవనస్తుని విడిచిపెట్టెను. అతడు బాగుపడినవాడై లేచెను. దానికి ముఖ్యమైన కారకుడు క్రీస్తేయని చూపుటకు వెళ్ళెను. మరియు అందు నిమిత్తమే ఈ ఉదయము ఈ గృహములో ఈ విశ్రాంతి దినమును క్రీస్తును సేవించుటకు మనమిచ్చటనున్నాము.

5నేను ఇక్కడికి వచ్చి మన ప్రశస్త సహోదరులను మరియు ప్రజలైన మిమ్మును కలుసుకొను సమయము కొరకు ఎదురు చూచియుంటిని. ఈ చిన్న సమూహము నుండి అనేకసార్లు సహోదరుడు నాకు పంపిన దశమ-భాగములను నేను స్వీకరించియుంటిని. మరియు అటువంటి ధనమును నేను ఎంతో పవిత్రముగా ఉంచుదును, ఎందుకనగా అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళెనో దానికి నేను ఏదో ఒక దినమున జవాబు చెప్పవలసియున్నదని నేనెరుగుదును.

మరియు నేను నిశ్చయముగా మిమ్మును అభినందించగోరుచున్నాను, మరియు మీ యొక్క నమ్మకమైన గుణము కొరకు నేను నా కృతజ్ఞతలను తెలుపగోరుచున్నాను. ఈ ఆలోచనను మీరు పాటించుచున్నారు, మీ యొక్క దశమ-భాగములు ఈ రీతిగా గృహములలో కూడుకొనుటనుబట్టి మరియు మీరు ఎరిగినంతవరుకు, పరిచర్యను బలపరచుటకై వెళ్ళవలయుననే జ్ఞానమును కలిగిన మిమ్మల్ని బట్టి మీ విశ్వాసమును బట్టి, నేను కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాను. అటుపిదప నేను దానికి బాధ్యుడనై యున్నాను. మరియు మనము భూమిపై ఏమి చేసి యున్నామో దానికి లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు, ఆ దినమున, మన ప్రభువునకు నేను ఒక మంచి గృహనిర్వాహకునిగా ఉండగోరుచున్నాను.

6ఇప్పుడు ఒక కార్యమేదనగా, వెనుక ఇక్కడ మనము వాహనముల రద్దీ వలన ఇబ్బంది పడవలసిన పనిలేదు. మరియు అది మంచిది. కావున ఇప్పుడు, నేను దీనిని ఏ విధముగా చెప్పవలెనో ఎరుగను, కానీ మనము అనేక దినములు కలిగియుండగల ఒక ఉజ్జీవ కూటములను ఇచ్చట వెనుక భాగమున జరిపినయెడల బాగుండునని నేను తలంచుచున్నాను. ఏలయనగా ఈ మార్గములో మీరు కేవలం లోపలికి వచ్చి మరియు, "నీవెలాగు ఉన్నావు, నిన్ను కలుసుకొనుటకు ఆనందంగా ఉన్నది" అని చెప్పుదురు. మరియు కొద్దిసేపు ప్రభువు గూర్చి మాటలాడెదరు మరియు తిరిగి వెళ్ళెదరు (నేను టూసాన్లో గం 1:30 నిమిషములకు ఉండవలసియున్నది అని చెప్పుదురు) మరియు అది ఎట్లు, మనము ఎట్లు ఆ విధంగానే ఇక్కడ కలుసుకొందుము, ఒకరితో ఒకరము కరచాలనము చేసెదము, మరియు "నీవెలాగు ఉన్నావు, నిన్ను కలుసుకొనుటకు ఆనందించుచున్నాను" అని చెప్పెదరు. మరియు వెళ్ళిపోయెదరు. అయితే మీకు తెలియునా, ఎక్కడైతే మనము ఇక వీడ్కోలు చెప్పుకోనటువంటి ఒక దినము ఉన్నదో దాని గూర్చి నేను ఆలోచించుచున్నాను. "నిన్ను చూచుట చాలా మంచిది. నీవు మరలా వచ్చుదువని నిరీక్షించుచున్నాను" అని ఇక మనము చెప్పము. ఇక్కడ బహుశా రెండు గంటలసేపు కలిసియుండెదము, అక్కడైతే సమయమనేది ఒకవేళ ఉన్నచో ఒక పది లక్షల సంవత్సరములు మనము కూర్చుని మాటలాడుకొనెదము. మనము కూర్చొన్నప్పుడు తక్కువ సమయము గడపము, చూశారా. అది కేవలం నిత్యత్వమైయున్నది. దానికి… దానికి అంతమేలేదు. మరియు మనము అక్కడ ఆ విధముగా ఉండునటువంటి సమయము గూర్చి తలంచుట ఎట్లుండును, దేవుని గొప్ప పరదైసు గుమ్మములలో మనము నడుచుట మరియు దూతలు గీతములు పాడుట మరియు …

7మనము పోరాడి యుద్ధమును గెలుచుటకు మరియు లోకపు కార్యములను జయించుటకు ఇదే సమయమైయున్నది. మరియు అక్కడ ఇక ఎటువంటి పోరాటము ఉండదు. ముగింపు ప్రార్ధన చేయబడును. ఇక ఎన్నటికి ప్రార్ధనా కూటములు ఉండబోవు. ఇక రక్షించబడుటకు జనులకు ఎటువంటి తావులేదు. స్వస్థపరచబడుటకు ఇక ఎటువంటి వ్యాధియు ఉండదు. మరియు అదంతయు ఒక గొప్ప మహిమకరమగు కార్యముగా నుండును.

మరియు ఈ ఉదయమున మానవ మాత్రులముగా మనము ఏమి వాగ్దానము చేయగలము? ఆ ఘడియ యొక్క వాగ్ధానము వైపు చూచుటకంటే గొప్పదైన మరిదేని వైపుకు మనము చూడగలము, చూశారా.

8మనము దీనిని ఆలోచించెదము… వారి తల్లి ఒడిలో పాలు త్రాగు చిన్న పిల్లలుగా ఉండుటనుండి పాఠశాల పిల్లలుగా, తర్వాత యవ్వనకాల అమ్మాయిలు మరియు అబ్బాయిలుగా, మరియు అటు పిదప మధ్య-వయస్సునకు మరియు తరువాత పెద్ద వయస్సునకు ఆ రీతిగా, కాలములు మారుటను నేను చూచుచున్నాను, చూశారా. మరియు గత సంవత్సరము తల్లి ఒడిలో పాలు త్రాగే పిల్లవాడు ఇప్పుడు పాఠశాల పిల్లవాడిగా నుండుటను, చూశారా. మరియు గత సంవత్సరములో పాఠశాలకు వెళ్ళెను, కాని ఇప్పుడు యౌవ్వనస్తునిగా మారెను. మరియు ఒక యౌవ్వనస్తుడు ఇప్పుడు మధ్య-వయస్సునకు మరియు పిదప పెద్ద వయస్సునకు, ఆ రీతిగా నుండెను, చూశారా. అది భూమిపై అంతరించిపోవు ఆవిరి వంటిదై యున్నది. అది ఒక పువ్వువలె నున్నదని సొలోమోను చెప్పెనని నేను నమ్ముచున్నాను. అది పువ్వువలె వికసించును మరియు పిదప అది రాలిపోయి, వాడిపోవును. మరియు మనము ఇక్కడ జీవించు సమయమునే మనము ఉపయోగించుకోగోరుచున్నాము.

9కావున ఇప్పుడు ప్రార్థనలో మన తలలు వంచియుండగా, ఆయనతో మాటలాడెదము. మరియు ఇక్కడ ఎవరైనా వ్యాధి కలిగియుండి, లేదా అవసరత ఏదైనా యుండి మీ హృదయములో దేవునికి దానిని తెలియజేయుటకు ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనవలెనని కోరినయెడల, ఇట్లు చెప్పుడి, "ఇప్పుడు, ప్రభువా ఈ విన్నపము అడుగుటకు నేను ప్రవేశించితిని…" మరియు మీరు గనుక నేను తెలుసుకొనునట్లు… మీ చెయ్యి పైకెత్తి కేవలం, "నన్ను జ్ఞాపకము చేసికొనుము" అని చెప్పండి. ప్రభువు మిమ్మును అత్యధికముగా దీవించును.

10సర్వశక్తుడవగు దేవా, నీ మాట చేత భూమ్యాకాశములను కలుగజేసినవాడా, ఈ ఉదయం ఈ వాక్యము గూర్చి, వాక్యమైయున్న గొప్ప వ్యక్తి గూర్చి మాటలాడుటకు మేము ఇచ్చట కూడుకొనియున్నాము. ఎడారి వెనుకకు వచ్చు గొప్ప భాగ్యము కలుగజేసినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఒక దినమున పారిపోయిన ఒక ప్రవక్త యొక్క దృష్టిని మరల్చుటకై, ఒక మండుచున్న పొద ద్వారా ఆకర్షించితివి, కావున అచ్చట అతడు ఒక నూతనమైన ఆజ్ఞను పొంది మరియు పంపబడెను, తద్వారా బంధకములోనున్న ఆ దినము యొక్క దేవుని వారసులైన ప్రజలకు ఒక గొప్ప విమోచకుడాయెను.

ఓ గొప్ప దేవుడా, ఈ ఉదయం మాతో కూడా ఎడారి వెనుకకు మీరు రాలేరా? నీవు ప్రపంచములోని గొప్ప మందిరములలో ఉన్నావని మేమెరుగుదుము. అయిననూ నీవు అనంతుడవైన దేవుడవు గనుక ఈ స్థలము చిన్నది, ఇచ్చట నీవు ఉండవు అనుటకు తావులేదని మాకు తెలియును, లేదా ఏ స్థలము… లేదా భూమిపై మేమెంతగా చెదరిపోయినా సరే, నీవు సర్వాంతర్యామివి గనుక అన్నివేళలా, అన్నిచోట్లా నీవు ఉండవగలవు. దీనికొరకై నీకు వందనములు చెల్లించుచున్నాము.

11మరియు ఈ ఉదయం ఈ సహవాసములో, మా సహోదరుని బట్టి మరియు ఇక్కడున్న అతని చిన్న మందను బట్టి మరియు భూమిపైనున్న దేవునిపట్ల వారియొక్క విధేయతను మరియు వారి ధైర్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, మరియు మీ ఆశీర్వాదములు వారికి దయచేయుమని మేము అడుగుచున్నాము. మరియు క్రీస్తు కొరకు వాంఛగలిగిన హృదయము ఉన్నంతవరకూ, ఆ ఆకలిగొను హృదయమునకు వర్తమానమును తెచ్చుటకై ఎల్లప్పుడూ ఎక్కడో ఒక వర్తమానికుడు ఉండియుండును.

మరియు, పరలోకపు తండ్రీ, ఇప్పుడే తమ చేతులను పైకెత్తిన ప్రజల యొక్క అవసరత కొరకై మేము ప్రార్థించుచున్నాము. వారి హస్తము క్రింద, వారి హృదయము చుట్టూ ఏది తట్టుచున్నదో మీరు ఎరుగుదురు. వారికి ఒక అవసరత ఉన్నది. అది వ్యాధియైనయెడల, ప్రభువా, పాల్ షార్రిట్ (ఇంతకు ముందే కొన్ని గంటల క్రితమే మేము మాటలాడుకున్న ప్రకారము), వైద్య శాస్త్రమంతయు నివారించ లేనటువంటి తీవ్రమైన జ్వరముతో అతడు జీవ, మరణముల మధ్యన పడియుండగా… అయిననూ ఒక చిన్న ప్రార్థన ద్వారా తక్షణమే ఆ జ్వరమును నిర్మూలము చేసితివి.

నీవు దేవుడైన యెహోవావై యున్నావు. అది ఏమి చూపించుచున్నదనగా, నీవు అక్కడ ఎడారి వెనకాల మోషేతో వున్న దినము వలె ఇప్పుడును అదే రీతిగా వాస్తవముగా ఇక్కడ ఎడారి వెనుక మాతో నున్నావని చూపించుచున్నది.

12నీవు ప్రార్ధన వినెదవని నేనెరుగుదును గనుక నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు మా మనస్సులోనున్న ఊహల ప్రకారము నిన్ను కార్యములను అడ్డుగుట తప్పని తెలిసినవారమైయుండి, ఇప్పుడు దీనముగా, యధార్థతతో నీయొద్దకు వచ్చుచున్నాము. మేము ఏదైతే అడుగుచున్నామో దాని విషయమై చిత్తశుద్ధి గలిగి మరియు పూర్తి నిశ్చయతతో మేము దానిని నమ్మవలసియున్నది, మరియు మాకు అనుగ్రహించుటకు అది దేవుని చిత్తమైయున్నదని తెలుసుకొనవలెను. ఏలయనగా, ప్రభువా, మేమెరిగినదానంతటితో దానిని మా హృదయములలో పరిష్కరించుకొని యున్నాము.

కావున ఈ ఉదయం నీవు ఇక్కడనున్న ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచెదవనియు, తప్పిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించెదవనియు నేను ప్రార్ధించుచున్నాను. దీనిని అనుగ్రహించండి. ఈ దినమున ఏదో ఒకటి చెప్పబడుటయో లేక చేయబడుట ద్వారానో, ఇక్కడ గోడల చుట్టూ కూర్చున్న లేదా నిలబడియున్నవారి హృదయములలో దేవుని యొక్క లంగరు వేయబడు విశ్వాసము కదిలింపబడును గాక మరియు దానితో అంతయూ కుదర్చబడును. తండ్రీ, దీనిని అనుగ్రహించండి.

తన గృహములో కూటము కొరకు మాకు అనుమతినిచ్చిన సహోదరుని ఆశీర్వదించండి. ఇప్పుడు, నీ వాక్యము ద్వారా మాతో మాటలాడండి, ప్రభువా, దానికొరకే మేమిచ్చటనున్నాము. మేము ఒకరితో ఒకరము సహవాసము కలిగియుండుటను ప్రేమించుచున్నాము, అయితే ప్రభువా, మాకు కావలిసినది నీవేయై యున్నావు. మేము వెలుపలికి వెళ్ళి ఎక్కడో ఒక చోట చెట్లక్రింద కూర్చొని మరియు ఒకరితో ఒకరము మాటలాడుకోగలము. అయితే ఇక్కడ, నీ దృష్టిలో దయను పొందుటకై మేము కూడియున్నాము. ప్రభువా, మమ్ములను మీరు సంధించరా? ఈ దినమున మీరు మాతో మాటలాడుటయనునది మా హృదయములో ఒక విత్తనమును తెరవమని మేము ప్రార్ధించుచున్నాము, మరియు మేము కలిగియున్న మా అవసరతలను మాకు తెల్పండి. మరియు మేము మా ప్రేమను వ్యక్తపరిచినట్లు మీ ప్రేమను మీరు మాకు వ్యక్తపరచండి. దీనిని మేము యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

13అక్కడ… ఆ వెనకాల ఎవరైనా అక్కడున్నవారిలో కూర్చొనదలచినట్లైతే ఇక్కడ కొన్ని కుర్చీలను నేను చూచుచున్నాను. మీరు కూడుకొని మరియు చాలా సంతృప్తికరముగా ఉండవచ్చును.

ఇప్పుడు, మనము జీవిస్తున్న ఈ కాలములు మహత్తరమైన కాలములైయున్నవి. ఇక్కడికి వచ్చుట గూర్చి తలంచినవాడనై, ఈ ఉదయం నేను ఏమి మాటలాడవలెనాయని నిన్నటి దినమున ఆలోచించితిని, మరియు నేను ఇక్కడికి ఈ చిన్న ప్రార్ధనా కూటమునకు వచ్చినప్పుడు ఏమి చెప్పవలెను? అని అనుకొంటిని. మరియు నాకు సహాయము చేయమని ప్రభువును కోరితిని. మరియు ప్రభువు యొక్క ఆశీర్వాదములకై మనము వేచియుండగా ఈ ఉదయము ప్రజలైన మీతో వ్యక్తపరచుటకు కోరినదానిని నేను ఒక లేఖనముపై కొంత పాఠమును తీసికొంటిని.

మరియు ఇప్పుడు, మీరు మీ హృదయమును తెరిచెదరనియు, మరియు మరియు మీరు హృదయమునొద్ద క్రీస్తు యొక్క స్వల్పమైన, దీనమైన, మెల్లగా తట్టుటను గ్రహించెదరనియు మేము ప్రార్ధించుచున్నాము. గుర్తుంచుకొనుడి, మీరు నీవు విశ్వాసివి కానియెడల, మరియు క్రీస్తునెన్నడూ అంగీకరించనియెడల, అయినను, ఇది ఈ ఉదయము ఈ గృహములో కూడుకొనుట నీకు ఎన్నడూ జరగని గొప్ప కార్యముగా ఇది ఉండును, ఆ తట్టుట నీ హృదయమునొద్దకు వచ్చినప్పుడు, నీవు దానిని స్వీకరించినయెడల, అది జీవమునకు ద్వారమైయుండును. దానిని నిరాకరించుట మరణమైయున్నది. మరియు అందునిమిత్తమే, నమ్మగలిగిన ప్రతి విశ్వాసికి ఒక తెరవబడిన ద్వారమున్నదని చూపించుటకే ఈ ఉదయము మనమిచ్చటనున్నాము.

REV 15:1-4

 

14ఇప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథములో నుండి నేను చదువగోరుచున్నాను, 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము మొదటి నాలుగు వచనముల నుండి ఒక భాగమును నేను చదువగోరుచున్నాను.

మరియు ఆశ్చర్యకరమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్ళు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.

మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమును దాని ప్రతిమకును దాని వేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని.

వారు - ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని ఆరాధన చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

REV 15:2,3

 

15మరియు ప్రభువు చిత్తమైతే, దానినుండి "వి-దినము, (V-Day) విజయోత్సవ దినము," అను పాఠమును నేను తీసికొనగోరుచున్నాను, ఒక పూర్తి విజయమునకు గుర్తుగా మనము దానిని ఉంచెదము. మనము ఇప్పుడు చదివిన అధ్యాయములోని ప్రజలు, వారు అప్పుడే విజయమును పొందినవారైయున్నారు. ఆంగ్ల భాషలోని విజయము ( Victory) అను పదము ఒక గొప్ప పదమని నేను తలంచుచున్నాను. దాని భావమేదనగా, మీరు మీ శత్రువును ఓడించియున్నారు, మరియు మీరు జయించి, మరియు మీరు ఒక జయమును పొందిన జయశీలియై జయమును పట్టుకున్నవాడవని అర్ధము. మనము విజయోత్సవముతో పాడుచు మరియు ఆనందించెదము. ఇచ్చట ఈ జనులు ఆ అగ్నితో మరియు స్ఫటికముతో కలిగియున్న సముద్రము వంటి ఏదో ఒకదాని యొద్దకు వచ్చియున్నట్లుగా మనము చూచుచున్నాము. కాబట్టి వారు మృగము మీదను, వాడియొక్క ప్రతిమ మీదను, వాడి నామము యొక్క సంఖ్య మీదను, ముద్ర మీదను జయమును పొందినవారైయుండిరి. ఈ కార్యములన్నిటిపైన, వారు వాటన్నిటిపైన జయము పొందిరి, మరియు అవతలి గట్టువైపు ఆ అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రమునొద్ద విజయశీలులుగా నిలబడుకొని, సర్వశక్తుడగు దేవునికి స్తుతి గీతములు పాడుచుండిరి.

GEN 4:4,5,8

 

16ఇప్పుడు, విజయమును గూర్చి మాటలాడుటకు, మరియు "విజయోత్సవ దినములు (V- Days) మరియు ఆ రీతిగా, విజయోత్సవ దినము గూర్చి తలంచినప్పుడు, అది మనలను తిరిగి యుద్ధమును గూర్చిన ఆలోచనకు తీసికొని వచ్చును. ఏలయనగా ఈ మధ్యనే, గత కొద్ది సంవత్సరములలో, మనము యుద్ధము యొక్క విజయోత్సవ దినము అనెడి దినమునకు వచ్చియుంటిమి, అక్కడ వారు వారియొక్క శత్రువుపై జయము పొందిరి. మరియు దానిగూర్చి తలంచుటకైననూ అది చాలా బాధకరమైన కార్యముగానున్నది, అయితే నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని లోకము మానవ రక్తముతో తడిసిపోయి యున్నది. భూమిని తాకిన మొట్టమొదటి మానవ రక్తము నీతిమంతుడైన హేబెలు రక్తమైయున్నది.

మరియు అతను… అతను తన రక్తమును కార్చుటకు కారణమేదనగా, అతడు దేవునితో సరిగా నుండుటవలనే. మరియు దేవుడు అతను అర్పించిన అర్పణను అంగీకరించెను — ఈ గొర్రెపిల్లను, అతడు విశ్వాసము ద్వారా దేవునికి అర్పించెను.

GEN 4:3•

HEB 11:4

 

17మరియు అతని యొక్క అసూయ సహోదరుడు, అతని పట్ల అసూయగల వాడైనందున నీతిమంతుడైన హేబెలును చంపి వేసెను.

మరియు అదే కారణము, భూమిపైన సమస్త మానవాళి యొక్క రక్తము ఒలికించబడుటకు కారణమాయెను. మరియు నిశ్చయంగా పాత భూమి దానితో తడిసిపోయెను, ప్రపంచమంతటా - మానవ రక్తముతో నిండెను. దానికి ఒక కారణము కలదు. ఈ మానవ రక్తము చిందించబడుటకు ఒక కారణము ఉండియున్నది. మరియు దానికి గల మొదటి కారణము అసూయనే యని మనము కనుగొనియుంటిమి, హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినందున, హేబెలు పట్ల కయీను అసూయగలవాడైయుండెను. మరియు హెబ్రీ 11 దానినిగూర్చి మనకు చెప్పుచున్నది - అదేదనగా — హేబెలు కయీనుకంటే మరి శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. మరియు దేవుడు దానిగూర్చి సాక్ష్యమిచ్చెను. మరియు కయీను, దీనినిబట్టి అసూయగలవాడాయెను; ఏలయనగా అతని అర్పణ నిరాకరించబడెను, మరియు హేబెలు అర్పణ అంగీకరించబడెను. మరియు హేబెలు దానిని విశ్వాసము ద్వారా చేసెను. అతను దీనిని విశ్వాసము ద్వారా చేసెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, ఆ ఇద్దరు పిల్లలు అప్పుడే జీవపు తోటనుండి తోలివేయబడినవారని వారు ఎరిగియున్నారు గనుక వారు తిరిగి వచ్చుటకై దేవుని దయను పొందుటకు ప్రయత్నించుచున్నట్లుగా అగుపించుచున్నది.

మరియు వారు వారి తల్లితండ్రుల అతిక్రమమువలన అవతలివైపునకు పడిపోయిరి. ఈ ఉదయము మనము మరణమునకులోనై నిలుచుండినట్లు వారును మరణమునకు లోపరచబడిరి. మరియు వారు తిరిగి ఏ విధంగా జీవమును కనుగొనే స్థలమునకు రావలెనో తెలుసుకొనగోరియన్నారు. మరియు ఆ విధానములో, వారు - దేవుని దృష్టిలో దయను పొందగోరియన్నారు. మరియు కయీను పుష్పములు మరియు పంట ఫలములతో కూడిన అందమైన బలిని అర్పించెను, లేదా ఇంకా ఏదైననూ దానిని అతను బలిపీఠముపై ఉంచెను.

GEN 4:4

 

18అయితే హేబెలు, ఆత్మీయ ప్రత్యక్షత్ర ద్వారా - మరణమును కలుగజేసినది పంట యొక్క ఫలము కాదు కానీ, రక్తమే మరణమునకు కారణమాయెనని అతనికి బయలుపరచబడెను. కావున అతను తిరిగి ఒక నిర్దోషమైన ప్రత్యామ్నయము యొక్క రక్తమును అర్పించెను మరియు దేవుడు దానిని అంగీకరించెను. మరియు ఆ దినమునుండి అదే మన పాపములకు, దేవుని యొక్క సమాధానపరచు బలియైయున్నది. ఇక వేరే ఏ మార్గము లేదు, ఏలయనగా వేరే మూలమును ఆయన అంగీకరించినయెడల, అప్పుడు మనము దేవుని దృష్టిలో దయపొందుటకు ఆ మూలము యొద్దకే రావలసియున్నది. అయితే దేవుడు ఒక నిర్దోషమైన దానియొక్క నిర్దోషమైన రక్తమును మాత్రమే అంగీకరించెను, చూసారా.

మరియు కావున, గొప్ప స్థలముల యొక్క అందమే దేవుని యొక్క అంగీకారమైనయెడల, ఈ దినమున "ఆయన తిరిగి ఈ ఎడారి వెనకాల రైలు పట్టాల ప్రక్కన ఉన్న ఈ చిన్న గృహము నొద్దకు ఆయన వచ్చునా? ఆయన తిరిగి ఇచ్చటికి వచ్చి మరియు మనలను కలుసుకొనునా?" అని మనము ఆశ్చర్యపోవుదుము. అయితే అది గనుక ఒక గొప్ప భవనమో లేక కయీను అర్పించిన అందము వంటిదో అయియున్నయెడల, ఎందువలన, అది మనలో మనము మాట్లాడుకొన్నట్లుగానో మరియు గాలితో మాట్లాడుచున్నట్లుగానో అగుపించును. కానీ దేవుడు చిందించిన రక్తము యొక్క సూత్రము ప్రకారమే వచ్చెను. కావున మనము ఎంత కొద్దివారమైననూ లేదా ఎంత పేదవారమైననూ ఫరవాలేదు, లేదా మనము ఎంతటి గొప్ప స్థలమును దేవునికి అర్పించదలచిననూ; ఆయన సరిగ్గా ఇప్పుడు అంగీకరించిన ప్రకారమే ఇకను ఎన్నడూ దానిని అంగీకరించడు, ఏలయనగా మనము ఒక నిర్దోషమైన ప్రత్యామ్నాయము యొక్క చిందించబడిన రక్తము యొక్క సూత్రము ప్రకారము వచ్చుచున్నాము, అది పాపులమైన మనకొరకు చనిపోయిన క్రీస్తు అయి యుండెను.

19ఇప్పుడు, ఈ రక్తము చిందించబడుటకు కారణమేదనగా, అది ఎందుకొరకని నేను నమ్ముచున్నాననగా, మానవుడు గమనించవలెనని దేవుడు ఆహ్వానించుచున్నాడు; కాని మానవుడు తనను తాను కనబరచుకోగోరుచున్నాడు. దేవుడు చూపించగోరు దానిని తన సూత్రప్రకారము దాని విషయమై తన ఆలోచన ప్రకారముగా మానవుడు చూడగోరుచున్నాడు, చూశారా. మానవునికి దేనినో చూపించవలెనని దేవుడు ప్రయత్నించుచున్నాడు, అయితే మానవుడు తానే విధముగా దానివైపు చూచుచున్నాడో, ఆ ప్రకారముగానే అంగీకరించగోరుచున్నాడు,

అయితే ఎవరో ఒకరు ఒక దృశ్యమును చూపించగోరుచున్నట్లుగా ఇది ఉన్నది. ఈ దృశ్యమును చూపించుటకు ఒక కారణము ఉండవలసియున్నది. ఒకవేళ నీవు, "పర్వతము వైపు చూడుము" అని చెప్పినయెడల, అప్పుడు అక్కడ నీ దృష్టిని ఏదో సంధించి యుండును, అందునుబట్టి ఇప్పుడు నీవు నన్ను ఆ పర్వతము వైపు చూడమని చెప్పుటకు ప్రయత్నించుచున్నావు, చూశారా. లేదా, "ఈ చెట్టు వైపు చూడుము." చూడండి, ఆ చెట్టు విషయమై ఏదో ఉన్నది కావున నీవు నన్ను చూడమని కోరుచున్నావు.

ఇప్పుడు, తిరిగి వచ్చు మార్గము కొరకు మానవుడు ఆ నిర్దోషమైన ప్రత్యామ్నయము వైపు చూడవలెనని దేవుడు ప్రయత్నించుచున్నాడు. మరియు మానవుడు దానివైపు తన స్వంత విధానములో చూడగోరుచున్నాడు. ఈ నిర్దోషమైన ప్రత్యామ్నయములో తనకు దేనిని చూపుటకు దేవుడు ప్రయత్నించుచున్నాడో, దానిని అతడు చూడగోరుటలేదు. అందునుబట్టి, అదియే సమస్యకు కారణమాయెను. పిదప మానవుడు చేసినప్పుడు, దేవుడు తనకు దేనిని చూపుటకు ప్రయత్నించెనో, దానిని చూచుటకు అద్దములను తీసికొని దృశ్యము వైపునకు దూరము నుండి చూసినప్పుడు, అతను తన అద్దములను సరిగ్గా కేంద్రీకరించుటలో విఫలమాయెను.

20ఈ మధ్యనే కొండ ప్రాంతము నుండి వచ్చుచుండగా దారిలో, ఎవరో ఇట్లు చెప్పిరి, "ఇదిగో, ఈ అద్దములు తీసికొని ఫలానా దానివైపు చూడుము." మంచిది, నేను అద్దములను తీసుకొంటిని. నేను చూడగా, మూడు లేదా నాలుగు వివిధ వస్తువులను చూసితిని. ఇప్పుడు, మీరు చూడండి, దానిలో ఏదో పొరపాటు వున్నదని నేనెరిగితిని, చూశారా. అక్కడ పొలములో ఒక దుప్పి నిలబడియుండెను, అయితే అక్కడ మూడు లేదా నాలుగు కలిసి నిలబడినట్లుగా అగుపించెను. ఇప్పుడు, అదేమైయున్నది, అక్కడ పరిపూర్ణముగా ఒకే ఒక దుప్పి నిలబడియున్నది. అద్దము కూడా సరిగ్గానే యున్నది. అయితే నేను చేయవలసినది ఏదనగా అక్కడున్న మూడు దుప్పిలు ఒకటిగా కనిపించునంతవరకు మరియు ఒకే ఒక దుప్పిగా అగునట్లు కటకమును కేంద్రీకరించవలసియున్నది, చూశారా. మరియు పిదప… చూడండి, నా వెనకాల, ఒకే ఒక దుప్పి ఉన్నదని నేనెరుగుదును, ఎందుకనగా నాకు చెప్పబడినది అదియే. కాని అద్దమును తీసికొని దానినుండి చూసినప్పుడు, అక్కడ మాకు దుప్పిలు నిలబడి యుండుటను నేను చూశాను. మంచిది, ఆ అద్దము కేంద్రమును తప్పిపోయినది. నేను ఒకే ఒక దుప్పిని చూచునంతవరకు, ఆ అద్దము యొక్క కటకమును తిరిగి సరిచేయవలసియున్నది. మరియు తరువాత, అది ఎట్లు౦డెనో అట్టే అగుపడునట్లు, ఆ అద్దము దానిని సరిపడునంత దగ్గరగా తీసుకు వచ్చును.

21ఇప్పుడు, దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చును. ఇప్పుడు, పరిశుద్ద గ్రంథము వాక్యమైయుండెను మరియు వాక్యము దేవుడైయుండెను. కావున అదియే మన బైనాక్యులర్స్; అదియే మన అద్దములైయున్నవి. (దూరపు దృశ్యాలను బాగా చూచుటకు ఉపయోగించే రెండు కటకాల పరికరము - Binoculars.) అయితే ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో మనము చూచునప్పుడు, నాలుగు లేదా అయిదు విధానములు అగుపించునప్పుడు, దానిని కేంద్రీకరించవలెను, మీరు చూశారా. దేవుని కొరకైన ఒకే ఒక గంభీరమైన ఉద్దేశ్యమును ఎక్కడ మనము చూచెదమో ఆ స్థలమునకు మనము ఆ కార్యమును తీసుకురావలసియున్నది.

అయితే మానవుడు ఒక సంస్థను ప్రారంభించగోరుచున్నాడు, ఆ దిశగా పరుగిడుచున్నాడు. మరియు మరియొకరు ఒకటి చేయగోరుచున్నారు, "మంచిది, నేను… అతనికంటె నేను గొప్పవాడిని కాగలనని నేను తలంచుచున్నాను, కావున నేను ఇక్కడి నుండి ప్రారంభించెదను. మరియు మా పిల్లలకి మంచి విద్యనిచ్చెదము. మరియు మేము దీనిని చేసెదము," మరియు ఆ రీతిగా చూడండి, వారు కటకమును కేంద్రీకరించుటలో విఫలమవ్వుచున్నారు. వారు ఒక కార్యమును చూడవలెనని దేవుడు కోరుచున్నాడు, అదేదనగా, వారి పాపముల కొరకు చిందించబడిన నిర్దోషమైన రక్తమైయున్నది. ఖచ్చితముగా అదే. అదే వాస్తవమైన కార్యము, ఏది ఏమైననూ…

మనకొక సంస్థ అవసరము లేదు. వారిపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, వారు హానిచేయు కార్యము ఏదనగా, వారు ప్రజలను లాగుటకు సహోదర ప్రేమ నుండి వేరుచేయుదురు మరియు అటువంటి కార్యములను చేయుదురు.

22అయితే మనము ఒకే ఒక కార్యము వైపు చూడవలసియున్నది, అది మనకు ప్రత్యామ్నాయముగా యున్నది. అది నిజము. ఆ ప్రత్యామ్నాయము యేసుక్రీస్తు. ఈ దినమున మనము సంస్థలలో ఎంతగా వక్రీకరించబడియున్నామో మీరు చూడండి. మరియు "మెథడిస్తువారు ఉజ్జీవమును కలిగియున్నారని" వారు చెప్పుదురు. అయితే బాప్టిస్తు వారికి లేదని అర్ధము కాదు; అది మెథడిస్టువారు. మరియు వారు ఒకే ఉజ్జీవమును కలిగియున్నారు, అనునటువంటిది, మరియు వారు ప్రతీసారి తోటివారిని త్రోసివేయుదురు.

అయితే మనము దానిని ఆ రీతిగా చూడగోరుటలేదు. ఒక్కడే దేవుడున్నాడని మనము కనుగొనేంతవరకు మనము ఆ కటకమును లాగవలసియున్నది. అక్కడ గనుక మీరు ముగ్గురిని చూచుచున్నయెడల, మీరు కటకమును మరికొద్దిగా సరిగ్గా కేంద్రీకరించుట మంచిది, చూశారా. మీరు ఏదో తప్పిదముగా చూచుచున్నారు. కావున మీరు దానిని తీసుకువచ్చుట మంచిది, మరియు మనందరికి పైగా ఒకే ఒక దేవుడున్నాడని కనుగొనవలసియున్నది, ఆయనే మానవజాతంతటికి దేవుడైయున్నాడు.

JOHN 1:29

 

23మరియు ఆయనే దేవుడైనచో, ఆయన ప్రతీ మానవమాత్రునిపై ఆసక్తి కలిగియున్నాడు, ఎందుకనగా అదంతయూ ఆయన సృష్టియున్నది. మరియు ఆయన పిల్లలపై ఆసక్తి కలిగియున్నాడు; ఆయన వృద్దులపైనా మరియు మధ్య-వయస్కులపైనా ఆసక్తి కలిగియున్నాడు. మరియు ఆయన మన రంగులపై ఆసక్తి కలిగియుండెను. తెలుపు, గోధుమ రంగు, నలుపు, పసుపు, మన పూర్వీకుల నుండి మనము వివిధ దేశముల నుండి కలిగియున్న మన వివిధమైన చర్మపు ఛాయలన్నిటియందు ఆయన ఆసక్తి కలిగియుండెను. ఆయన మనందరిపై శ్రద్ద కలిగియున్నాడు.

ఆయన కేవలం యూదులపై మాత్రమే ఆసక్తి కలిగియుండుట కాదు, లేదా పసుపు రంగు జాతి, నల్లజాతి, శ్వేతజాతి, మరి అది ఏదైననూ దానిపై మాత్రమే ఆసక్తి కలిగియుండుట కాదు. ఆయన సర్వమానవజాతంతటి పైనా ఆసక్తి కలిగినవాడై యుండెను. ఆయన మానవజాతిని తన వాక్యముపై, దేవుడు ఒక్కడే అనే ఒకే ఒక అంశముపైనే కేంద్రీకరించవలెనని ప్రయత్నించుచున్నాడు. మరియు దేవుడు ఒక నిర్దోషమైన ప్రత్యామ్నయమును పాపమును తీసివేసి సమస్త మానవాళిని రక్షించుటకు ఆయన తనంతట తానే మానవునిగా మారెను.

"ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల," అని బాప్తిస్మమిచ్చు యోహాను ఎంతో చక్కగా దానిని ఉదహరించెను. ఎవరైననూ… సమస్త పాపము యొక్క సమస్య, ఆ ఒక్క నిర్దోషమైన ప్రత్యామ్నయముతో తీరిపోయినది.

24కానీ ఇక్కడ మానవుడు దేవుని బైనాక్యులరును తీసికొనినప్పుడు, అతడు సహజమైన దానివైపు ఎంతగా చూచుచున్నాడనగా, వాక్యము ఇచ్చు ఆత్మీయ అర్ధమును చూచుటలో విఫలమగుచున్నాడు, ఇప్పుడు, చూడండి, మానవుడు చూచుటకు ప్రయత్నించినప్పుడు అతడు చేయు గొప్ప కార్యములలో అది ఒకటైయుండెను, ఏలయనగా అతడు కయీను చూచినట్లుగా అద్దములలో నుండి చూచుచున్నాడు. అతడు వ్యక్తిగతంగా తాను సాధించిన దానివైపు చూచెను.

కయీను ఇట్లు తలంచెను, "ఇప్పుడు నేను గనుక హేబెలును మార్గము నుండి తప్పించగలిగినయెడల, అప్పుడు నేను ఒకే ఒక్కడినిగా ఉందును. చూడండి, అప్పుడు, మరియొకడు మార్గములో లేడు."

మానవుడు యుగముల నుండి చేయ ప్రయత్నించుచున్నది అదియే. ఒక సహోదరునిగా ఉండి, మీరు చూశారా, అతనితో పాటు మార్గములో వుంచుటకు ప్రయత్నించవలసినవాడైయుండి, అతనిని త్రోవలోనుండి తొలగించుటకు ప్రయత్నించుచున్నాడు. ఇట్లు చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు, "ఓ, ఆ చిన్నగుంపువారు — వారిని తొలగించుడి. మరియు ఇక్కడున్న వీరు, ఓ, మంచిది, వారు ఇది లేదా అది," చూశారా.

మనము ఆ రీతిగా చేయకూడదు. మనము సమస్తమైన కార్యమును ఒకే ఒక స్థిరమైన దృశ్యమునకు తీసుకు వచ్చుటకు ప్రయత్నించవలెను: మరియు అది యేసు క్రీస్తే.

25గత రాత్రి ఒక యవ్వన స్త్రీ, ఒక ముఖాముఖి సమావేశములో ఆమె ఇట్లు చెప్పినది, "కాని" ఆమె చెప్పెను…

ఒక సేవకుని కుమార్తె ఒక ప్రేమ వ్యవహారమును కలిగియుండెను, మరియు దాని విషయమై ఆమె తన మతి స్థిమితమును కోల్పోయెను. మరియు ఆమె ఆరోగ్యం చెడిపోయెను. చాలా అందమైన యవ్వన స్త్రీ, ఇరువది-మూడు సంవత్సరముల వయస్సు కలిగియుండెను, మరియు ఆమె చిన్న బాలికగా ఉన్నప్పుడు, దాదాపు పన్నెండు సంవత్సరములు ఆమె చికాగోలో ఉండెను. మరియు ఎల్టిన్ వద్ద కూటములో కూర్చొనియుండెను. మరియు కూటములో కూర్చొన్నప్పుడు పరిశుద్దాత్మ జనులగుండా వెళ్ళెను మరియు ఆమెను పిలిచెను, ఆమె ఎవరో చెప్పెను, మరియు ఇట్లు చెప్పెను, "నీకు గుండె అదనపుముగా కొట్టుకొను సమస్య ఉన్నది. పదిహేను సంవత్సరముల వయస్సు వరకు నీవు బ్రతుకవని వైద్యులు చెప్పిరి. కానీ ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థపరచబడితివి." మరియు అప్పటి నుండి ఆమె మరెన్నటికి గుండె సమస్య అనుభవించలేదు.

మరియు గతరాత్రి ఆమెకు మరియొక విధమైన గుండెనొప్పి కలిగెను. అది ఒక ఆత్మీయ గుండె బాధ. ఆమె యొక్క ప్రియుడు పారిపోయి మరి యొక స్త్రీని వివాహము చేసికొనెను. అయిననూ ఆమె ప్రేమలోనే యుండెను. మరియు ఈ అబ్బాయి కూడా వారితో ఇంకనూ ఆ అమ్మాయిని తాను ప్రేమించుచుండెనని చెప్పుచుండెను, మరియు అతని తండ్రి దానికి కారకుడాయెను.

"ఓ, బుద్ధిహీనత! అతను వేరొక అమ్మాయిని వివాహము చేసికొనకుండవలెను. అతను నీ యెడల సరియైన ప్రేమను కలిగియుండుటలో విఫలమయ్యెను గనుక అతడు ఆ పనిని చేసియుండెను" అని నేను చెప్పాను. అది ఖచ్చితము.

26అయితే, చూడండి, దానంతటిని బట్టి, ఆ అమ్మాయి ఆ విధముగా అంతగా కృంగిపోయెను. "ఓ, జాని నన్ను ప్రేమించునని నాకు తెలియును…" అని ఆమె చెప్పెను. చూశారా.

ఆమె చూడగలిగినదంతా అంతే. ఆమె తనకు తాను ఆ చిన్న ప్రపంచములో నివసించెను. ఆమె అక్కడే తన్నుతాను రూపించుకొనెను. మరియు నేను ఆమె చేయి పట్టుకొని, నేను ఇట్లు చెప్పాను, "నేను చెప్పునది విను."

మరియు ప్రభువు ఒక దర్శనమును చూపించెను, మీరు చూడండి, అదేదనగా వారి మధ్యలో ఏదో కార్యము జరిగెననియు, దానిగూర్చి నాకేమి తెలియదని ఆమెకు తెలిసి యుండెను. మరియు ఆ విషయము చెప్పబడినప్పుడు, అది వెంటనే ఆమెను తట్టినట్లాయెను.

నేను చెప్పాను, "ఇప్పుడు, నీవక్కడనున్నప్పుడు, కల్వరివైపు చూడుము. అక్కడ నీవెచ్చటికి వెళ్ళుచున్నావు, ఒక సేవకుని కుమార్తెవు, ఒక పెంతెకోస్తు సేవకుని కుమార్తెవైయుండి మరియు త్రాగుటకు ప్రయత్నించుచున్నావు మరియు నీవు ఇలాంటి కార్యములు చేయుచు, ఆ బాధను దిగమింగుకొనుటకు ప్రయత్నించుచున్నావు. ఆ మనుష్యుడేమో నిన్ను గూర్చి శ్రద్ధ వహించనివానిగా నున్నాడు." నేనిట్లు చెప్పాను, "అమ్మాయి, కల్వరి వైపునకు చూడుము. అదొక్కటే మార్గమైయున్నది."

27మనము బ్రతికిననూ లేదా చనిపోయిననూ, పడిపోయిననూ లేదా మునిగిపోయిననూ మనము ఒకదానివైపు కేంద్రీకరించబడ వలసియున్నాము, అది కల్వరి, క్రీస్తైయుండెను. ఆ కార్యము వైపునకే మనము వెనుదిరిగి రావలెనని దేవుడు కోరుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో కేంద్రీకరించుటకు… దానిని సమకూర్చి దేవుడు దానిని ఏ అర్థమిచ్చునట్లు చేసెనో దానికి బదులుగా సహజమైన దాని వైపు మనము చూచుచున్నాము.

కావున, అది… మానవుడు దానిని చేయుటను బట్టి, అతడు తనకు అనుగ్రహింపబడిన దానిని అతడు అట్టే దానిని నిరాకరించుచుండెను. ఇక్కడ ఒక అవకాశముండెను, మనము… చిన్నమంద, మనము దీనిని చేయగలము, మరియు మనము చేయగలము… తక్కినవారితో మనము చేయునదేదియూ లేదు, మరియు… అది చూశారా, మొదటిగా అనుగ్రహింపబడినది అదియే, మనము కలిగియుండవలసినది ఒకరిపట్ల ఒకరికి సహోదర ప్రేమ, ఒకరిని ఒకరు అర్థము చేసికొనుట, మరియు ఒకరినొకరు ప్రేమించుట మరియు ఒకరితో ఒకరు కలిసి ఆరాధించుట అని తెలిసికొని దానివైపు కేంద్రీకరించుటకు బదులు వారు ఒక వ్యక్తిని తను ధరించిన దుస్తులను బట్టి, అతను కలిగియున్న చదువును బట్టి లేదా అతడి శరీర ఛాయను బట్టి లేదా అటువంటి దానినిబట్టి అతనిని అవమానించుచున్నారు; అందువలన అది ప్రజలను వేరు చేయుచున్నది. మరియు మానవుడు దానిని వెంబడించుచుండెను.

28అది అంతరంగ మనుష్యుడు పనిచేయుటకు ఎంత మాత్రము అవకాశము నివ్వదు. ఇప్పుడు, మనము మూడింటిని కలిగియున్నాము: ప్రాణము, శరీరము, మరియు ఆత్మ. ఇప్పుడు, అయితే ప్రకృతి సంబంధమైన మనస్సు… మీలో పనిచేసే రెండు ఆత్మ సంబంధమైన శక్తులు ఏవనగా మనస్సు మరియు మీ ఆత్మయైయున్నది, చూశారా. ఇప్పుడు, ప్రకృతి సంబంధమైన మనస్సు అధికమైన తెలివితో దాని యొక్క తెలివితేటల ద్వారా దేనినైనా సాధించవలెనని ప్రయత్నించును, చూశారా. మరియు అతను దానిని చేసినప్పుడు, అసలైన కార్యము… అతను దానిని చేసినప్పుడు, అతనిలో నున్న ఆత్మసంబంధమైన మానవుని నుండి అతను తనంతట తానుగా దూరముగా తొలగిపోవుచున్నాడు. సరిగ్గా అక్కడే అది సమస్యకు కారణమగును, చూశారా. అతను తనకుతానుగా దానిని చేయుటకు ప్రయత్నించును.

29ఇటీవల నేను ఇక్కడ చెప్పినట్లుగా — అది గుడారములోనే అని నేను నమ్ముచున్నాను, అదేదనగా, దేవుడు ఎంతో సామాన్యుడిగా మారుటయే ఆయన గొప్పతనమై యున్నది. ఇప్పుడు, చూడండి, మనము గొప్పవారమైనప్పుడు, మనము సామాన్యులుగా ఉండలేము, చూశారా. మనమెంతో ఎరిగినవారము. మరియు మనకు… ఓ, ఇది ఈ రీతిగా ఉండవలెను, మనము చెప్పినట్లుగా అది ఉండవలెను, లేనత్లయితే అది అలాగు కాదు, చూశారా. మంచిది, ఆ విధముగా మనము దేవుడిని తప్పిపోవుచున్నాము.

అయితే, ఒక మనుష్యుడు గనుక… ఒక గొప్ప వ్యక్తి, ఇంకా గొప్పవానిగా, మరియు ఇంకనూ గొప్పవానిగా మరియు ఆ రీతిగా గొప్పవానిగానే అగుచునుండగా, అతడేమి చేయును? అతడు అట్టే మరలా తిరిగి బహు దీనునిగా మరియు బహు సామాన్యునిగా మారుటచే తద్వారా ప్రజలు అతనికి మీదుగా నడిచిపోయెదరు, మరియు వారి మధ్యలోనేయున్న ఆ గొప్ప వ్యక్తిని ఎరుగకుందురు, చూశారా.

సరిగ్గా మనము చేయునట్లే అది ఉన్నది: మనము ఒక ఎలెక్ట్రాన్ను కొలిచెదము, మనము ఒక అణువును విచ్చిన్నము చేయుదము, మరియు చంద్రమండలమునకు ఒక వర్తమానమును మనము పంపెదము, మనకు ఏమియూ తెలియనటువంటి సామాన్యమైన గడ్డిపై మనము నడిచెదము. అది నిజము. చిన్న పుష్పము, రానున్న సంవత్సరమునకు ఒక పుష్పమును తీసికొనివచ్చుటకు ఆ చిన్న విత్తనములో భూమిక్రింద దాగియున్న ఆ జీవమును గూర్చి ఎవ్వరూ వివరించలేరు, లేదా ఎవ్వరూ కనుగొనలేరు. ఒక సామాన్యమైన గడ్డి పూస, ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఒక గడ్డి మొక్కను, ఒక గడ్డి పూసనైనను చేయలేరు, చూశారా. మీరు దానిని చేయలేరు, ఎందుకనగా అది జీవమును కలిగియుండినది.

కావున, చూశారా, మనము…

30ఇట్లు చెప్పుబడినది, "దేవదూతలు కాలు మోపుటకు భయపడు స్థలములో బుద్ధిహీనులు నడచుచుండిరి," మరియు అది వాస్తవముగా సత్యమైయున్నది. మనము సామాన్య విషయములను దాటుచూ వెళ్ళిపోయెదము. దేవుడిని దాటుచు వెళ్ళిపోతూ వుంటాము. మనము డైసీ (daisy) పుష్పము కొరకు చూచుచూ అందమైన ఆర్చిడ్ ( Orchid) పుష్పమును దాటి వెళ్ళెదము. ఇప్పుడు, అది అంతే, చూశారా, అందమైన ఆర్చిడ్ (orchid) పుష్పమును దాటుచూ వెళ్ళిపోవుటయే.

మనలను మనలో సామాన్యులుగా తగ్గించుకొనినయెడల, మరియు… అక్కడున్న ఆ ద్రాక్ష వైపు ఎవ్వరూ చూడరు. అదేమైయున్నది? దేవుడు. అదేమై యున్నది? అది దానిలోపల జీవము కలిగియున్న అగ్నిపర్వతము యొక్క బూడిదయై యున్నది. త్రిప్పి చూడుము. అక్కడ ఒక గొప్ప చెట్టు నిలబడియున్నది. బూరుగు చెట్టు వంటిది, అని నేను నమ్ముచున్నాను. అదేమైయున్నది? అది మరొక విధమైన జీవము కలిగియున్న అగ్నిపర్వతపు బూడిదయైయున్నది. ఈ విధమైన ఒక జీవము ఒక చెట్టును చేసినది. ఆ రకమైన జీవము ఒక ద్రాక్షను చేసినది, చూశారా. మరియు మనమేమై యున్నాము? తనలో జీవమును కలిగియున్న అగ్నిపర్వతపు బూడిద అది. మనమేమై యుంటిమో అట్లు మనలను చేసినది ఏమిటి? మనము అంతకంటె ఇంకా ఎక్కువగా ఉండలేము. అయితే దేవుడు మనలోపల నిత్యజీవమును పెట్టెను. పిదప మనము దేవునికి చెందినవారమైతిమి. అప్పుడు మనము గమనించుచు — వాక్యమును దేవుని తట్టు కేంద్రీకరించియున్నాము.

31అయితే ఏది నిజమో వివరించుటకు అంతరంగ మనుష్యునికి మానవుడు అవకాశమును ఇచ్చుట లేదు. కావున, అదే సమస్యను కలిగించుచున్నది.

గమనించండి, మనము కనుగొన్నాము… అతడు దానిని చేయనియెడల, అప్పుడు ఏమి సంభవించును. కయీనువలె వెంటనే అతని కోపము పైకి వచ్చుటను మనము కనుగొనెదము, చూశారా, తన అర్పణకు బదులుగా దేవుడు హేబేలు అర్పణను అంగీకరించుటను అతడు ఇష్టపడలేదు. అతడు తన స్వంత అర్పణను కలిగియుండగోరెను. అతడు తన స్వంత విధానమును కోరుకొనెను, చూశారా. అతడు హేబెలు వద్దకు వచ్చి, "ఓ, నా సహోదరుడా, దేవుడు అంగీకరించుట వలన నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు, యొహోవా ఈ విధానమును అంగీకరించును అను ఒక మార్గమును మనము తెలుసుకొన్నాము, ఎందుకనగా ఆయన నీ అర్పణను అంగీకరించుట ద్వారా దానిని ఋజువు చేసెను" అని చెప్పుటకు బదులు, అతను చేయవలసిన కార్యము అది కాదా? అయితే అట్లు చేయుటకు బదులు, అతనికి అసూయ కలిగెను.

MATT 28:20•

MARK 6:17•

JOHN 14:19

 

32ఇప్పుడు, ఈ దినమున మానవులలో అదే కార్యమును మీరు చూచుట లేదా, చూశారా? అది సరిగ్గా అతని మార్గమేయైయున్నది, చూశారా.

ఇప్పుడు, దేవుడు సత్యమని నిరూపించిన మార్గమును అంగీకరించుటకు బదులు; దేవుడే రంగము మీదికి కదిలి వచ్చి మరియు చెప్పెను, "అది ఇదేయైయున్నది. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. నేను మీతోను, మీలోను వుందును. కొంతకాలమైన పిదప లోకము నన్ను ఎన్నటికి చూడదు; అయిననూ మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీతోను మీలోను వుందును." చూడండి, లోకము, మీరు… "లోకము నన్ను చూడదు, అయితే మీరు చూచెదరు," చూశారా. "కయీను నన్ను చూడలేడు, కాని హేబెలు, నీవు చూచెదవు." మీరు చూశారా? ఏలయనగా అది అదే కార్యమైయున్నది.

మరియు వచ్చి "మంచిది, అద్భుతము. దేవుడు ప్రజల మధ్యన పనిచేయుటను మనము చూసియున్నాము. దానిని మనము చేయదము" అని చెప్పుటకు బదులు. లేదండి! ఆచారముతో (అదే కార్యము), అతికాంక్షతో, మరియు అసూయతో - కయీను కలిగియున్న అదే కార్యమును కలిగియుండెను, అతను తన సహోదరుని రక్తమును కోరెను. అతడు ఆయనను తమ మార్గము నుండి తుడిచి వేయుటకును, ఆయనను వదిలించు కొనుటకు ప్రయత్నించును. "వారు పరిశుద్ద గుండ్రాళ్ళు, తప్ప ఎవరో కారు, వారు అల్పులైన…", చూశారా. నా భావము ఏమిటో మీరెరుగుదురు. అదే సమస్యను ఆరంభించునది. అక్కడే సమస్య ప్రారంభమగుచున్నది. అక్కడే ప్రమాణములు బ్రద్దలగును… అక్కడే సహవాసము బ్రద్దలై వేరగుచున్నది. ఆ కార్యమే కుటుంబములను బ్రద్దలు చేయుచున్నది. ఆ కార్యము వలననే విడాకుల వైపు చక్రము తిరుగుచున్నది. సరిగ్గా ఆ కార్యమే సహవాసమును బ్రద్దలు చేయుచున్నది.

33ఏదెనులో సహవాసమును బ్రద్దలు చేసిన కార్యము అదేయైయున్నది, ఏలయనగా హవ్వ దేవుని వాక్యము వైపు దృష్టిని కేంద్రీకరించుటలో విఫలమాయెను. మరియు శత్రువు యొక్క ఆలోచనలను వినెను. చూడండి. చూశారా? కేవలం, "దేవుడు ఇట్లు చెప్పెను, అది స్థిరపరచును. దేవుడాలాగు చెప్పెను," అనుదానితో ఆమె నిలిచియున్నయెడల సరిపోవును. అయితే ఆమె అట్లు చేయగోరలేదు, చూశారా. ఆమె తన కటకము యొక్క కేంద్రమును మార్చివేయుటచే ఒకే ఒక మార్గమును చూచుటకు బదులుగా రెండు మార్గములను చూచెను, చూశారా. ఆమె చూసెను, "మంచిది ఇప్పుడు, ఈ వ్యక్తి సరియై యుండవచ్చు. బహుశా అతడు సరియై యుండవచ్చు. ఇప్పుడు, దేవుడు సరియేనని మనమెరుగుదుము మరియు బహుశా ఇతను సరి కావచ్చును. దేవుడు చెప్పినదానికన్నా ఇది ఎక్కువ వెలుగువలె నున్నది." దానిని మీరు చూచుచున్నారా?

ఈ దినమున కూడా అదే కార్యము జరుగుచుండెను, ఖచ్చితముగా తిరిగి అదే కార్యము, చూడండి. మీరు రెండు ఉపాయములను చూశారు; అక్కడ ఒకే ఒక్కటి వున్నది. అక్కడ ఎటువంటి ఆచారము లేదు, అది వాక్యమైయున్నది. దేవుని వాక్యమైయున్నది, దేవుని ఉద్దేశ్యము యున్నది, దేవుని ప్రణాళిక యున్నది. వేరే ఇతర ప్రణాళికలు మంచివి కావు. హవ్వ ఈ చెడు కార్యమును చేసెను. ఆ కారణము చేతనే ఈ దినమున దేవుడు తన వాక్యములో స్త్రీలను సేవకులుగా ఉండుటకు ఎన్నడూ అనుమతించలేదు, చూశారా. అది వాక్యములో అనుమతించబడియుండలేదు.

34ఈ ఉదయం మా ఇంటిలో పెందలకడ అల్పాహార భోజన బల్లవద్ద మేము కూర్చుని మాటలాడుకొనుచున్నాము. మేము బయలుదేరి ఇక్కడికి సరియైన సమయమునకు వచ్చి, మరలా తిరిగి మరొక పని విషయమై వెళ్ళవలసియున్నాము. కావున మేము… నేను చెప్పాను… మేము బల్లయొద్ద మాటలాడుకొనుచున్నాము, మేము దేనిగూర్చి మాటలాడుకొనుచున్నామనగా… దూతలగూర్చి మాటలాడుచున్నాము. నా చిన్న బాలుడు, జోసఫ్ అక్కడ కూర్చొని, దూతలను గూర్చి ఏదో కార్యమును చెప్పెను.

మరియు అతను చెప్పెను, "ఇప్పుడు, డాడీ," అతను చెప్పెను, "దూతలు…"

నేను చెప్పాను, "దేవుడు ఒక మనిషై యుండెను."

అయితే అతను చెప్పెను, "దూతలు స్త్రీలై యున్నారు."

నేను చెప్పాను, "అటువంటి కార్యము లేనేలేదు," చూశారా.

అతను చెప్పెను, "మంచిది, వారు ఆ విధముగా…"

"నా కుమార్తెయైన శారా ఇట్లు చెప్పెను, "కానీ, డాడీ" చెప్పెను, "వారు గౌనులను ధరించియున్నారు." "వారు స్త్రీలే" అని చెప్పెను.

అది ఎవరో మానసిక తత్వవేత్త ఆ చిత్రమును గీసెను" అని నేను చెప్పాను.

1TIM 2:12-14

 

35పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా దూతను ఆమె అని సంబోధించినట్లు కనిపించదు. అతను అని యుండును. ఎల్లప్పుడూ అతను, ఆయన, ఆయన. ఆమె కాదు. దూత ఒక స్త్రీ అనే కార్యము ఏదియూ లేదు. పరిశుద్ధ గ్రంథములో, మరియు జీవముగల దేవుని సంఘములో ఎక్కడా అటువంటిది లేదు. స్త్రీ ఒక వర్తమానికురాలుగా యున్నటువంటి కార్యము అసలు లేనేలేదు. ఒక "దూత" అనగా "ఒక వర్తమానికుడు." కావున దేవుడు ఎన్నడూ దానిని అనుమతించలేదు, ఏలయనగా పరిశుద్ధ గ్రంథము ఈలాగు చెప్పుచున్నది, "మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి." మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను," చూశారా. కావున, ఆమె చెప్పెను… పౌలు ఇట్లు చెప్పెను, "స్త్రీ మౌనముగా వుండవలసినదే గానీ, ఉపదేశించుటకైనను, లేదా ఎటువంటి అధికారమునైనా చేయుటకైనను సెలవియ్యను, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది."

1COR 14:28

 

36ఇప్పుడు, ఆ కార్యములో, మీరు చూశారా… ఇప్పుడు, మన పెంతెకోస్తు గుంపులవలె — అది దాని యొక్క వేరు వలెనున్నది, చూశారా. వారేమిచేయుదురు, వారు కనబరచుకొనుచున్నారు… మంచిది, ఇప్పుడు ఇక్కడ… ఒక మెరుపువలె ప్రసంగించు ఒక స్త్రీ ఇచ్చటనున్నది. మంచిది, దానిలో ఎటువంటి సందేహము లేదు, సంపూర్ణముగా, కనీసం పురుషులు అట్లు చేయుటకు వారి నీడలో కూడా నిలబడలేనంతగా ప్రసంగించగల స్త్రీలున్నారని నేను వినియున్నాను. అయితే నీతి ఏమైయున్నదో దానితో ఇది ఏమియు చేయలేదు, చూశారా. అది ఒక్కటైనను కలిగిలేదు…

పౌలు ఇట్లు చెప్పెను, "ఒకరు భాషలతో మాట్లాడినయెడల, మరియు అనువదించువారు లేనియెడల మౌనముగా ఉండవలెను."

"నేను మౌనముగా ఉండలేను" అని అతను చెప్పెను.

అయితే మీరు ఉండగలరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, చూశారా. కావున అది అదేయైయున్నది, చూశారా. దానిని నేను క్రమముగా చేయవలయును, క్రమములో ఉంచవలెను, దానిని స్థానములో ఉంచవలెను, అది అచ్చటే దాని స్థానములో యుండును. చూడండి, అచ్చటే మీరు స్పష్టమైన దానినుండి తప్పిపోవుచున్నారు. అది కఠినమైన భావములను, అత్యాశను మొదలగునవి కలుగజేయును. వాక్యముతో మనలను మనము స్పష్టముగా మరలా తీర్చిదిద్దుకొనుటకు బదులుగా మనలను మనమే బయటకు కనబరచుకొనుచున్నాము, చూశారా, "మంచిది, వారు కోరినది వారిని చేయనీయుడి…" నా భావమును చూచారా?

అది సరియే.

37ఇప్పుడు, కుటుంబముల యొక్క సహవాసమును అది బ్రద్దలు చేయునని మనము కనుగొంటిమి. అది సంఘముల యొక్క సహవాసమును బ్రద్దలు చేయును. అది దేశముల యొక్క సహవాసమును బ్రద్దలు చేయును, అదే కార్యము. దేశములు వాటి సొంత మార్గములను చూడగోరుచున్నవి. జర్మని దానియొక్క సొంత మార్గమును చూడగోరుచున్నది. రష్యా వారియొక్క సొంత విధానమును చూడగోరుచుండెను. అమెరికా దానియొక్క సొంత విధానమును చూడగోరుచున్నది, చూశారా. పిదప అది… చూడండి, అది అంతే. అది దేశముల యొక్క ఆత్మయైయున్నది, మీరు దానిని కనుగొనెదరు. మీరు ఎక్కడికి పెళ్ళినా మీరు ఒక జాతీయ ఆత్మను కనుగొనెదరు. అవి వేరువేరు విధానములను కలిగియున్నవి. అది ఎంతో ఆశ్చర్యకరము. నాకు సమయమున్నయెడల, నేను కొన్ని దేశములగూర్చి చెప్పుచు మరియు మీకు చూపించెదను.

జర్మనీకి మీరు వెళ్ళినప్పుడు, మీరు ఒక సైనిక (military) ఆత్మను కనుగొందురు. ప్రతిదీ సైన్యమే. మీరు తిన్నగా నిలబడవలెను, తిన్నగా నడవవలెను, వంకరలు సరి చేయబడవలెను మరియు ప్రతిదీ అట్లుండును. అది సైన్యమైయున్నది. మీరు ఫ్రాన్స్ కు వెళ్ళ౦డి, మీరు ఒక అనైతిక ఆత్మను కనుగొందురు — కేవలం స్త్రీలు, మద్యము మరియు మత్తుపానీయము, అటువంటి చెత్త అంతయు అక్కడుండును, చూశారా.

38మీరు ఫిన్లాండ్ కు వెళ్ళినయెడల, మీరు ఒక విశ్వాసనీయమైన ఆత్మను కనుగొందురు. ప్రతిది ఒక విధమైన నిజాయితీగా నుండును, మనము ప్రతీ విధమైన బాకీ చెల్లించుటయైయున్నది, చూశారా. నేను దానిని చేసి తీరవలయును. అది కేవలం ఆ విధముగా ఉండవలసియున్నది. వారెంత కష్టపడి పనిచేయవలసి వచ్చినా సరే, అది ఎంత ఖరీదయిననూ, అది ఆ విధముగానే యుండవలసి యున్నది.

మీరు అమెరికాకి వచ్చినయెడల, మీరు ఒక పెద్ద "హా! హా! హా! హా! హా!"ను కనుగొందురు. అది అదేయైయున్నది. అదే అమెరికా ఆత్మయై యున్నది. ఎవరో ఒకరు రేడియోలో ఒక ఛండాలమైన పరిహాసము (Joke)ను చేసెదరు. మరియు అందరూ నవ్వెదరు… ఎర్నీ ఫోర్డ్, లేదా వారిలో కొందరు, హాస్యాస్పదమైన మాటలు మాటలాడుచుందురు, ప్రతీచోటా అట్టే యుండుటను మీరెరుగుదురు. ఆర్థర్ గాడ్ఫ్రే మరియు ఆ గుంపు ఆ రీతిగా, చూశారా, అదే అమెరికా ఆత్మయై యున్నది. దానిని మీరు ఆ విధంగా కనుగొందురు.

MATT 4:8-10•

LUKE 4:5-8

 

39మరియు పిదప ఆ ఆత్మలన్నియు వేరొక ఆత్మతో అసూయను కలిగియున్నవి. వారేమి చేయుదురు? వారు యుద్ధమును కలుగజేయుదురు. అది నిజం, ఇప్పుడు, మీరు చూడండి, ప్రతి దేశము సాతాను యొక్క అదుపులోనున్నవి. పరిశుద్ధ గ్రంథము ఆలాగు చెప్పుచున్నది. వాడు దేశములకు దేవుడైయున్నాడు. సాతానుడు యేసును పర్వతము యొక్క పై భాగమునకు తీసికొని వెళ్ళెను, లోకములోని రాజ్యములన్నింటిని ఆయనకు చూపించెను. ఒక్క క్షణములో అన్ని రాజ్యములను చూపించి మరియు ఇట్లు చెప్పెను, "ఇవన్నియు నావి. నేను కోరినదెల్లా వాటియెడల జరిగింతును." మరియు ఇట్లు చెప్పెను, "నీవు నన్ను ఆరాధించినయెడల, నేను వాటిని నీకిచ్చెదను." "సాతానా, నా వెనుకకు పొమ్ము," అని యేసు చెప్పెను. వెయ్యేండ్ల పరిపాలనలో దానంతటికి ఆయన వారసుడగునని ఆయనకు తెలిసియుండెను, చూశారా. కావున ఆయన వాడికి సాగిలపడవలసిన పనిలేదు.

ఇప్పుడు, దేవుడు మరలా వచ్చినప్పుడు, ఆయన రాజ్యమును ఇక్కడ స్థాపించినప్పుడు, చూశారా, ఒక జర్మని ఆత్మ మరియు ఒక ఫ్రెంచి ఆత్మ ఒక నార్వగేన్ ఆత్మ మరియు అమెరికా ఆత్మలాంటి వివిధములైన ఆత్మలు ఉండవు. ఇక అలాంటిది ఉండదు. ఒకే ఒక ఆత్మ ఉండును (ఆమేన్!), దేవుని యొక్క ఆత్మ, ప్రతి ఒక్కరి హృదయములో నివసించును. అది నిజం. మరియు ఒక్కటే జెండా, ఒక్కటే జాతి, ఒకే ప్రజలు, సహోదరత్వము, దేవుని యొక్క తండ్రి తత్వము, మరియు మనుష్యుల యొక్క సహోదరత్వము, కుమారత్వము మాత్రమే అక్కడ ఉండును. అవును.

MATT 24:6

 

40అయితే ప్రజలు దీనిని చేయుట ద్వారా మరియు ఈ పెద్ద అందోళనలను కలిగించుటను బట్టి మనము దానిని కనుగొనుచున్నాము, ఆ రీతిగా… ఇప్పుడు చూడండి, సాతాను దానిని తన అదుపులో నుంచునంతవరకు యుద్ధములు మరియు సమస్యలు కలుగును. "మీరు యుద్ధముల గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు విందురు" అని మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు చెప్పెను. ఎందువలన? ఎందుకనగా ఈ లోకాధిపతి, సాతానుడు, రాజ్యముల యొక్క శక్తిని కలిగియుండెను. ఇక్కడ ఒక దేశపు ఆత్మ అక్కడ ఒక దేశపు ఆత్మ అవన్నియు దయ్యములైయుండెను. వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు, చూశారా.

ఎస్కిమో ప్రాంతములో ఎక్కడైతే ఉత్తర అలస్కాలోని మంచు ప్రాంతములో కుక్కలు లాగు బండియొద్దకు, ఆ ఉత్తర పశ్చిమ ప్రాంతమునకు ఎప్పుడైనా ఒక గుంపును తీసుకొని వెళ్ళితిరా? అక్కడున్న మార్గదర్శి హస్కీలు (Huskies) అనబడు ఈ కుక్కలను కట్టివేయుచున్నప్పుడు - మరియు అతను ఒకదానిని ఇక్కడ, మరియు ఒకదానిని అక్కడ, మరియు ఇంకొక దానిని ఇక్కడ కట్టివేయును.

"నీవు దేనికొరకు అట్లు చేయుచున్నావు" అని నేను అడిగాను.

"అవి పూర్తిగా దయ్యములతో నిండియున్నవి, అవి ఒక దాని నొకటి చంపుకొనును" అని అతడు చెప్పెను.

చూడండి, కేవలం చంపుకొనుటయే. అవి తలంచునదంతయు అదేయైయున్నది. సరి, అది దయ్యమై యుండెను, మీరు చూశారా. వాడు ఒక హంతకుడు. వాడు కేవలము… ఆయా దేశములు కేవలం… దయ్యములు దయ్యములతో పోరాడుట. చూశారా, అవి ఒకదానితో మరొకటి పోరాడుచుండెను.

అయితే దేవుడు పూర్తిగా ప్రేమైయుండెను, చూశారా. కావున మీరు ఒకరినొకరు ప్రేమించుట తప్ప మరేమియు చేయలేరు. కావున మీరు చూడండి, ఆ ప్రాధమిక సూత్రమంతయు సరిగ్గా తిరిగి మరల ఆ ఆత్మలపై ఆధారపడియున్నది, ఖచ్చితముగా తిరిగి ప్రారంభమునకై యున్నది. ఆదికాండము విత్తనపు అధ్యాయమై యున్నది, మరియు ఈ దినమున మనము కలిగియున్నదంతయు అది ఉత్పత్తి చేయును.

41ఇప్పుడు మనము యుద్ధములను మరియు విజయములను, గొప్ప విజయములను కలిగియున్నాము. ఒక దేశము లోపలికి వచ్చి మరొక దానిని జయించి ఇట్లు చెప్పెను, "మహిమ, మనము విజయము పొందియున్నాము. మనము వారిని జయించితిమి." మరియు - మొదటి విషయము ఏదనగా, మీకు తెలియునా, వారు స్నేహితులగుదురు మరియు కరచాలనం చేయుదురు. వారివురి మధ్య వ్యాపారమును కలిగియుందురు. కొంతకాలమైన పిదప, మరియొక అధ్యక్షుడు లేదా మరియొక రాజు వచ్చును, లేదా మరొక పరిపాలకుడు, లేదా మరొక పద్ధతి వచ్చును. మరియు మొదటి కార్యము మీకు తెలియునా, ఇక్కడ - వారి మనవళ్ళు మరల ఒకరితో నొకరు తుపాకీలతో పోరాడుదురు. యుద్ధములు మరియు యుద్ధములను గూర్చిన సమాచారములు మరియు… ఈ మరియొకడు వేరొకడిని చిన్నచూపు చూచును, "ఇప్పుడు నీవు నాకు సేవ చేయుదువు. నేను విజయము పొందితినని నీకు తెలియును, నీవు ఓడిపోయినావు." మరియు ఆ రీతిగానే నుండును. మీరు కేవలం…

నేను ఒకసారి ఒక వ్యాఖ్యానము విన్నట్లుగా, "దేవుడు మానవుని చేసెను, మానవుడు బానిసలను చేసెను." మానవుడు ఒకనిపై ఒకడు ఏలునట్లుగా దేవుడు మానవుని చేయలేదు. దేవుడు మానవుని ఒకనితోనొకడు సహోదరులుగా నుండుటకు చేసెను (అది నిజము), సహోదరులుగా నుండుటకే గాని ఒకనిపై నొకడు ఏలునట్లు వానిని చేయలేదు, శ్రేష్టమైన జాతి అనేది లేదు, శ్రేష్టమైన దేశమనేది లేదు, శ్రేష్టమైన భాష అనేదేమీ లేదు, ఒకే భాష మనకు కలదు; అది పరలోక భాష. అది నిజము. మనము ఒకే సహోదరత్వమును కలిగియున్నాము: అది మానవుని సహోదరత్వము. అతను ఎవరైనను సరే అది మానవ సహోదరత్వమైయున్నది.

42ఎందుకొరకు మనము ఒకనితోనొకడు పోట్లాడి మరియు చంపుకొనవలయును? అయితే వారు అట్లు చేయుదురు. అప్పుడు కొన్నిసార్లు ఒక మంచి దేశము, లేదా ఒక దేశము ఒక విధానమును కలిగియుండి మంచి కార్యములను చేయుటకు ప్రయత్నించుచు దానియొక్క హక్కుల కొరకు పోరాడుచున్నది. మరియొక చెడు దేశము దాని లోపలికి వచ్చును. పిదప, వారు వచ్చి వారిని జయించెదరు, మరియు ఈ దేశం - పిదప తిరిగి ఆ విధముగ, కేవలం మూరుచుండెను.

అనేక దేశములు - వారు ప్రయత్నించినట్లు, వారు స్వేచ్చ నిమిత్తము పోరాడుటకు వారు ప్రయత్నించినట్లు మరియు వారు స్వంతముగా కలిగియున్న వాటి కొరకు పోరాడుటను బట్టి అనేకమైన గొప్ప జాతీయ విజయములను వారు పొందితిరి. మరియు వారు - వారేమి కలిగియున్నారు. సాతానుడు వారిని అదుపులో నుంచునంత వరకు వారు పోరాటములు చేయుచునే యుందురు. అయితే వారు పలు గొప్ప విజయములను పొందితిరి — మహా గొప్ప విజయములు. వెనుకకు వెళ్ళి చూచిన, ఆదికాలపు ప్రారంభము నుండియే ఏ విధముగా దేశములు దేశములను పరిపాలించెననేది, పలు గొప్ప విజయముల మహోత్సవములను జరుపుకున్నారనే కార్యములను మనము చూపించగలము. మొదటి ప్రపంచ యుద్ధమువలె, మనము మొదటి ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు, జర్మిని గడ్డపై అనేక దేశములు కలిసికట్టుగా వచ్చి అచ్చట తలపడినవి. మరియు బెల్జియము మరియు వివిధములైన దేశములు మొదటి ప్రపంచ యుద్ధము అను జెండాలను కలిగి, యుద్ధము చేయుచుండిరి.

ఇప్పుడు, నేను…

43ఇచ్చట ఇద్దరు, లేదా ముగ్గురు, లేదా నలుగురు ఆ సంఘటనను జ్ఞాపకముంచుకొన్న సహోదరులు ఇచ్చట కూర్చొనియున్నారు. నేను దానిని గుర్తించుకొనగలను. నేను ఇప్పుడు యాభై-నాలుగు సంవత్సరముల వాడను.

మరియు నేను తొమ్మిది, ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరముల వయస్సుగల చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దానిని జ్ఞాపకముంచికొనియున్నాను. 1914వ సంవత్సరములో (మనం చూద్దాం, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పధ్నాలుగు), అది బ్రద్దలైనప్పుడు నేను అయిదు సంవత్సరముల వయస్సుగలవాడను. యుద్ధము జరుగునని వారు చెప్పుట నాకు జ్ఞాపకమున్నది. మరియు మా నాన్నగారు ఇరవై-రెండు సంవత్సరములవాడు, మరియు వారాయనను యుద్ధమునకు పంపించవలసి వచ్చెను. ఓ, మా నాన్నగారిని యుద్ధమునకు పంపుటను గూర్చి నేను తలంచలేను. అతను ఆ రోడ్డు మీదుగ ఒక స్ప్రింగ్ వ్యాగన్ ( Spring Wagon)పై వచ్చును, మరియు ఒక అతను మాకు దిగువగా ఎన్నో మైళ్ళు దూరమునగల స్టోరునకు వెళ్ళును. మరియు అతను చిక్కుడు గింజలుగల పెద్ద గోనె సంచిని కలిగియుండెను. కావున నేను ఆ చిక్కుడు గింజలను తీసుకుంటిని. నేను ఇట్లు తలంచితిని, "వారు వచ్చి యుద్ధమును ప్రారంభించినట్లయితే, ఈ గోనె సంచిలోని చిక్కుడు గింజలతో నేను వారిని కొట్టెదను," చూశారా. ఇప్పుడు వారు కేవలం యుద్ధమును గూర్చిన ఆలోచనయైయున్నది, మా నాన్నగారు యుద్ధమునకు వెళ్ళవలసియుండెను…

44మంచిది, బూర మ్రోగును, మరియు "మీ పత్రములను కొనుక్కొనుడి," మరియు నేను దానిని గుర్తించుకొనినట్లు అది ఆ విధముగా నుండెను. మనము వెళ్ళి మరియు ఈ ప్రపంచ యుద్ధమును చేసెదము, అంతటితో అది అయిపోవును. మరియు తరువాత వారు వ్యవస్థీకరణ చేయుదురు (వారు దేశముల రాజ్య సమితి అని పిలువబడిన ఒక వ్యవస్థీకరణ చేసిరి), మరియు పిదప శాంతి ఉండును, కేవలం నిత్యశాంతి ఉండును — యుద్ధమే ఇక ఉండదు అని చెప్పుదురు. అయితే ఇరవై సంవత్సరముల లోపలే మరలా ఇంతకముందెన్నడు లేనంతగా తిరిగి మరియొక ప్రపంచ యుద్ధములోనికి మనము వెళ్ళియుంటిమి, చూశారా.

యుద్దములు ఎందువలన? అది అత్యాశ, అసూయయై యుండెను, చూశారా. కైసర్ విల్హెం (Kaiser Wilhelm) జర్మని విడిచిన వెంటనే అప్పుడు అస్త్రియా వాడైన అడాల్ఫ్ హిట్లర్ ( Adolf Hitler) అను పేరుగల ఒకడు వచ్చెను. మరియు ఆ ప్రజల మనస్సులను చెదరగొట్టెను (అది దయ్యపు ప్రేరణయై యున్నది), వారు ప్రపంచమును శాసించుదుము అనుకున్నారు. మరియు వారు… అక్కడే మీరున్నారు, చూశారా.

అది మరలా దయ్యమునకు విరోధముగా దయ్యమువలెనున్నది, మీరు చూశారా, ఆ దేశాల యొక్క అమాయక ప్రజలు… వారు కేవలం యుద్ధమునకు, యుద్ధమునకు, ఒకనినొకరు యుద్ధమునకు నడిపించుచుండిరి. మరియు అది కేవలం ఎప్పుడూ ఆ రీతిగానేయున్నది.

45ఇప్పుడు… ఇప్పుడు, పిదప మనము కనుగొన్నాము, తరువాత సంభవించిన కార్యమును మీరెరుగుదురా, మరియొక యుద్ధము వచ్చును. ఇప్పుడు, మరలా ప్రపంచమంతయు, మెరుగైన పరికరములతో, మెరుగైన విమానాలతో మరియు పెద్ద బాంబులతో యుద్ధమునకు వెళ్ళెను. వారు యుద్ధము చేసిరి మరియు రక్తము ఒలికించితిరి, మరణించితిరి, ఆకలితో అలమటించితిరి, మంచుకి గడ్డకట్టిరి, మరియు ప్రతీది అట్లు జరిగెను. యుద్ధము, యుద్ధము, యుద్ధము.

46పిదప మనము విజయోత్సవ దినము (V-day) అని చెప్పినట్లు ఆ దినము వచ్చెను. దాని నుండే నేను నా అంశమును తీసుకొంటిని, ఆ విజయోత్సవ దినము, "విజయోత్సవ దినము" వారు విజయము పొందిన దినము అదేయైయున్నది. ఎక్కడైతే సైన్యము వేరొక సైన్యముపై విజయము పొందెనో అదే డి-దినము. ఈ డి-దినము ( D-Day) అనగా యుద్ధమునకు వారు వెళ్ళిన దినమై యున్నది. విజయోత్సవ దినము (V-Day), వారు శాంతి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, జర్మని మరియు వారికి సంబంధించిన ఇతర దేశాలు వేరే ఇతర దేశాలకు లోంగిపోయినప్పుడైయున్నది.

మరియు మనము ఏమి చేసితిమి? విజయోత్సవ దినమున పాటలు పాడితిమి, మనము కేకలు వేసితిమి, మనము మన టోపీలను గాలిలోకి విసిరితిమి, మనము తుపాకీలను గాలిలో పేల్చితిమి, మనము ఏడ్చాము, మనము ఈలలు వేసితిమి, మనము డప్పులు కొట్టాము, మనము సంగీతమును వాయించితిమి, ఒకరినొకరు వెన్ను తట్టికొనిరి. అదేమై యున్నది? అది ఒక విజయమై యున్నది. ఓ, మనము విజయము పొందితిమి. ఎట్లు ఈ… ఎందువలన, మనము అనుభవించాము, "మనము గెలిచాము. మనము గెలిచాము." జెండాలు పైకి ఎగిరినవి, బూరలు మ్రోగినవి, ఓ, ఎటువంటి సమయమును మనము కలిగియుంటిమి, "విజయము, విజయము, విజయము! మనము గెలిచాము."

మరియు అది ఒక గొప్ప కార్యమైయున్నది. అది క్రైస్తవులుగా పేరొందిన దేశాలకు శాంతిని తీసికొని వచ్చెను. మరియు కొద్దిగా శ్వాస పీల్చుకునే సమయమును కలిగియుంటిమి. బ్రతికియున్న కొందరు అబ్బాయిలు తిరిగి గృహమునకు వచ్చిరి. అయితే అనేక గొప్ప.. ఆ దినాలలో, వారిలో అనేకులు, మరియు గొప్ప యుద్ధములు జరిగినవి.

47అయితే, మీకు తెలియునా, అటువంటి యుద్ధపు పోరాటం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దేవుని నమ్ము ప్రజలు కూడా అనేక గొప్ప విజయోత్సవ దినములను (V-days) కలిగియున్నారు. ఓ, అవును. అచ్చట ఇరువైపులనున్నది. అద్దము కేంద్రీకరింపబడి ప్రకృతి సంబంధమైన విజయోత్సవ దినములను చూపుచున్నది, మరియు కొన్నిసార్లు అది లేఖనములోని వాక్యములోనికి కేంద్రీకృతమై అది మరియొక విజయోత్సవ దినములను తీసికొని వచ్చుచున్నది. మనము అటువంటివి, మన శత్రువుకి విరుద్ధముగా గొప్ప పోరాటములు కలిగినవి. మరియు ముందు వరుసలో నిలబడి దేవుని ఆత్మవలన ప్రజల యొక్క ఆలోచనలను వశపరచుకొని మరియు వారిని అక్కడ దేవుని రాజ్యములోనికి త్రోసి విజేయులుగా తిరిగి వచ్చు గొప్ప మనుష్యులను దేవుడు కలిగియుండెను. మనము అనుదినము దానితో పోరాడుచున్నాము. ప్రతీ క్రైస్తవుడు ప్రతీ దినము ఒక యుద్ధమును చేయును. మనము మనలోని తప్పు, ఒప్పుల మధ్య స్థిరముగా సరిగ్గా ఇప్పుడే ఒక యుద్ధ పరిస్థితిని కలిగియుందుము. మనము దానిని పొందగలమా? మనమేమి చేయవలెను? మనము లోకమునకు సాగిలపడవలెనా? మనకు గల ఈ ఆలోచనలను మనము విడిచిపెట్టగలమా?

HEB 13:8

 

48మనం దానిని చూచినయెడల, దానిని కేంద్రీకరించినయెడల, ఆదికాండము నుండి ప్రకటన వరకు దానిని తీసికొనినయెడల ప్రతీసారి సరిగ్గా అక్కడినుండి అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయియున్నది — మనము దానిని వదులు కోలేము. మనము ఆ ఇతర కార్యములతో రాజీపడలేము. మనము దానిని చేయలేము. మనమిక్కడనే నిలబడవలసియున్నాము, అది అంతే. శత్రువు ఎంత గొప్పవాడైనా సరే మరియు అతను మనకు విరోధముగా ఎంతటి ఆయుధ సామాగ్రి కలిగియున్నా సరే, మరియు ఎన్ని సంస్థలను కలిగియున్ననూ, ఇవి అవి లేదా వేరే ఇతరమైనవి ఎన్ని కలిగియున్ననూ ఫరవాలేదు. మనము ఈ దేవుని వాక్యమును మనము ఒక కార్యమును కనుగొనేంతవరకు కేంద్రీకరించితిమి, మరియు అది యేసుక్రీస్తు యొక్క రక్తమైయుండెను. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగానున్నాడు.

కావున, ఎవరు ఏమి చెప్పినను అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. వారిట్లు చెప్పెదరు, "అద్భుతములు జరుగు కాలము గతించెను. దైవికస్వస్థత అనునటువంటి కార్యమే లేదు. పరిశుద్దాత్మ బాప్తిస్మము అనునది లేనేలేదు. మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము — అది కేవలం శిష్యులకు మాత్రమేయైయున్నది," మరియు ఇటువంటి కార్యములు. వారు దానినుండి దృష్టిని మళ్ళించుటకు ప్రయత్నించెదరు. అయినను తిరిగి సరిగ్గా అది వాక్యమునొద్దకే దృష్టిని కేంద్రీకరించును. మరియు అది లేదని ఎవరును చెప్పలేదు. అది నిజము.

49కావున మనము ఒక యుద్ధ వాతావరణములో ఉన్నాము. మరియు దేవుని నాయకులు ఎల్లప్పుడు యుద్ధ పరిస్థితిని కలిగియుందురు. మరియు మీరు, చిన్న సంఘమా, మీరు అందులో పాలిభాగస్తులైయున్నారని జ్ఞాపకముంచుకొనుడి. మీరు అక్కడ ఒక సైనిక పరిహార బృందమైయున్నారు. ఇప్పుడు ఒక సైనిక దళము అనగా ఏమిటో మీకు తెలియును. సరిగ్గా ఇక్కడే మీలో కొందరు ఆ సైనిక సమూహమైయున్నారు. కావున మీరు జెండాలను ఎత్తిపట్టుటకు, సరియైనదేదో దానిచేయుటకు, మెథడిస్తు సంఘము కాదు, బాప్టిస్తు సంఘము, ప్రెస్బిటేరియన్ యొక్క ఉపాయము, కథోలిక్ లేదా యూదా లేదా అది ఏదైననూ జాతీ, తెగ లేదా రంగు; ఏదియూ కాదు. కానీ ప్రపంచమునకు నిరీక్షణ యేసుక్రీస్తు మాత్రమేనని ఇంకను ప్రకటించుటకు మీరు సైనిక విహార బృ౦దమై యున్నారు.

అది యేసు క్రీస్తుయై యున్నాడు, చూశారా. ఆయన మాత్రమే. ఆయనే మన విజయము. ఆయన ఒక్కడేయైయున్నాడు. ఆయన కదలిక యొక్క ముఖ్య నాయకుడైయున్నాడు. ఇవి ఆయన ఆజ్ఞలైయున్నవి. ఆ ఆజ్ఞలను మనము పాటించవలెను. మీరు ఎట్లు…

మీలో కొందరు అబ్బాయిలు యుద్ధములో పరిచర్య చేసిరి. మీరు ఎట్లు నాయకుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మీరు చుట్టూ తిరిగి మరియు వెనుక దేనినో చేయుదురు. ఎందువలన, మీరు మొత్తము సైన్యమును గందరగోళము చేయుదురు. అది నిజము. మీరు దానిని ఒక కలవరములోనికి త్రోసివేయుదురు. మీరు ఆ ఆజ్ఞలను పాటించవలసినవారిగా నున్నారు. మీరు దానిని చేయు ఒకే ఒక్క విధానము ఏదనగా, దానిపై దృష్టిని కేంద్రీకరించి మరియు ఉద్దేశ్యమును చూచి, అదంతయు దేనిగూర్చియని చూచుటయైయున్నది. అది నిజం.

50మనము అనేకమైన గొప్ప యుద్ధములను, ఆత్మీయ యుద్ధములను కలిగి యుంటిమి. సంఘము అనేక గొప్ప విజయోత్సవ దినములను కలిగియున్నది. సంఘమనగా నా భావము క్రీస్తు యొక్క శరీరమైయున్నది. నేను ఇప్పుడు సంస్థ యొక్క విధానమును గూర్చి మాటలాడుటలేదు. నేను క్రీస్తు యొక్క శరీరమును గూర్చి మాటలాడుచున్నాను. విశ్వాసులతో కూడిన శరీరం యుగములన్నిటిలో అనేక గొప్ప విజయోత్సవ దినములను కలిగియున్నది.

మనం మాటలాడునది మనకు అనేక యుద్ధములు జరిగెను, యుద్ధములు మరియు యుద్ధ సమాచారములు మరియు విజయోత్సవ దినములు, విజయోత్సవ దినములు, మరియు విజయోత్సవ దినములను కలిగియున్నాము. మరియు చివరిగా అదంతయు హర్మొగిద్దోనను గొప్ప యుద్ధమునకు చుట్టబడును. వాటిలో అది చివరిదైయుండెను. ఆమె హార్మొగిద్దోను యుద్ధమునకు వచ్చినప్పుడు సమస్తమును అది స్థిరపరచును.

గొప్ప వెయ్యేండ్ల పరిపాలనకు ముందు, హార్మొగిద్దోను భూమిని శుద్ధి చేయుటకై యున్నది. ఈ అణుబాంబులు విసిరినందువలనను, అగ్నిపర్వతములు బ్రద్దలగుటచే దానిలోనుండి వెలువడిన లావా ద్వారా ఏర్పడే బూడిద వలనను మరియు అటువంటి కార్యములు, పాపమును మరియు నేరమును, మనుష్యుల యొక్క రక్తమును భూమిపై నానబెట్టుట ద్వారా అది భూమి యొక్క అడ్డుగునకు మునిగిపోవును, మరలా అగ్ని పర్వతముల నుండి లావా బ్రద్దలగును, మరియు గొప్ప వెయ్యేండ్ల పాలనకై ఈ భూమిని నూతనపరచుటకు అది శుద్దీకరించబడును. ఆ సమయములో ఒక గుంపు జనులు ఇక్కడ జీవించుటకై ఆయన తన సంఘమును శుద్ధి చేయును. ఆ సమయములో ఒక జనము ఇక్కడ జీవించుటకై ఆయన తన సంఘమును శుద్ధి చేయును. ఆమేన్. నేను చెప్పుచున్నాను, నేను దానిని ఇష్టపడుచున్నాను! అవునండీ. ఒక ఉండబోవు సమయము వచ్చుచున్నది అది గొప్ప …

HEB 13:8•

REV 22:17

 

51ఇప్పుడు గొప్ప విజయోత్సవ దినములు… మనము కొన్ని సమయముల గూర్చి తలంచుదము… మనము వెనుకకు వెళ్ళెదము. కొందరు యోధుల గూర్చి తలంచుటకు ఇప్పుడు మనకు కొన్ని నిమిషములు ఉన్నవి. వెనుకకు వెళ్ళి ఒకరి గూర్చి ఆలోచించెదము… మనము వెనుకకు వెళ్ళగలము. అయితే కేవలం మోషే వరకు వెళ్ళెదం. మోషే ఒక గొప్ప యుద్ధ వాతావరణమునకు వెళ్ళు సమయమును కలిగియుండెను, ఏలయనగా సంఘము తనకుతాను విజయమును మరచి చాలా కాలమాయెను.

ఈ దినమున సంఘము యొక్క పరిస్థితి అదేయై యున్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరమూ ఏకరీతిగానున్నాడు అను విషయమును మనము చాలా కాలంగా మరచిపోయాము. దేవుడు స్వస్థపరచువాడని, రోగులను బాగుచేయువాడని మనము మరచిపోయాము. పరిశుద్దాత్మ బాప్తిస్మము శిష్యులపై కుమ్మరించబడెననియు మరియు తరతరములకు వచ్చువారెవరికైననూ అది అనుగ్రహించబడెననియు మనము మరచిపోయాము. మనము దానిని బహు కాలముగా మరచిపోయాము.

52ఆ ప్రకారమే ఇశ్రాయేలు కూడా మరచిపోయెను. వారు ఐగుప్తులో సంతృప్తి చెంది మరియు తరువాత బానిసలుగా మారిరి. మరియు ఇప్పుడు మోషే తన స్వంత తెలివితో లేదా తెలివి చేత సాధించుటకు అచ్చటకు వెళ్ళెను, ఇశ్రాయేలును సైనిక శక్తి ద్వారా బయటకు తీసికొని రావాలని ప్రయత్నించుటకై వెళ్ళెను. దానిని చేయుటలో విఫలుడాయెను. అయితే ఆ ఎడారి వెనకాల దేవుని యొద్దనుండి వచ్చిన ఒకే ఒక్క మాట, ఆ కార్యమునంతటిని మరలా ఉడకబెట్టినది. మోషేకు ఏమి జరిగెను? అతను తన అద్దములను కేంద్రీకరించెను. ఈ అందమైన ఇతియోఫియా నల్లజాతి అమ్మాయిని వివాహమాడి మరియు పిల్లలను కని, అక్కడ తన మామ యొక్క మందను మేపుతూ ఉండుట మాత్రమే దేవుని యొక్క ఉద్దేశ్యమైయుండలేదు. కాని అతనికి ఆజ్ఞాపించబడినది ఏమనగా, దేవుని యొక్క పిల్లలను ఆ బానిసత్వము నుండి విడిపించి వెలుపలకు తీసుకు వచ్చునదై యున్నది. అదే అతనికి అప్పగంపబడిన ఆజ్ఞ. దానికొరకే అతడు జన్మించెను.

మరియు మనలో ప్రతీ ఒక్కరము ఏదో ఒక దాని కొరకు జన్మించియున్నాము. మనము ఏ ఉద్దేశ్యము లేకుండా ఇచ్చట యుంచబడలేదు. ఆ పర్వతము ఏదో వట్టిగా అక్కడ కలుగలేదు. ఆ చెట్టు ఒక ఉద్దేశ్యము కొరకే అక్కడ పెట్టబడినది. ప్రతీది ఒక ఉద్దేశ్యము కొరకే వున్నది. అది దానియొక్క విధులను నిర్వర్తించవలసియున్నది. మరియు మనము ఒక ఉద్దేశ్యము కొరకై ఇక్కడ వున్నాము. బహుశా అది ఒక వ్యక్తికి సాక్ష్యమిచ్చి అతడిని రక్షణలోకి నడిపించి తద్వారా రక్షింపబడిన ఆ వ్యక్తి ఒక ప్రసంగికుడిగా మారి అతడు ఒక పది లక్షల ఆత్మలను క్రీస్తు చెంతకు నడిపించవచ్చును.

53డ్వయిట్ మూడి యొక్క మారుమనస్సును మరియు ఆ విధముగా అనేకులను మీరు చూడండి, మీరు చూశారా… కేవలం ఒక చిన్న వృద్ద స్త్రీ, ఒక దేవునికొరకు ఏదైన చేయవలెనని తన హృదయములో ఒక వర్తమానము కలిగియున్న చిన్న వృద్ధ బట్టలు ఉతుకు స్త్రీ, మరియు ఆమె ఒక గుర్రములు పెట్టు స్థలమును అద్దెకు తీసుకొని ఒక సేవకుడు అచ్చటికి వచ్చి ప్రసంగించుటకు ఆహ్వానించెను. మరియు ఆ రాత్రి ఎవ్వరునూ రాలేదు, కాని మెడపై నుండి వ్రేలాడుచున్న జుట్టును మరియు తన తండ్రి యొక్క వదులుగానున్న ప్యాంటును ధరించియున్న ఒక చిన్న బాలుడు అచ్చటకు వెళ్ళి మరియు వేదికపై మోకరించెను, యేసుక్రీస్తు నొద్దకు ఐదు లక్షల ఆత్మలను పంపిన డ్వయిట్ మూడి అతనే. ఆ స్త్రీ ఏదో చేయవలసియుండెను. ఆమె… అది ఒక ఉద్దేశ్యము కొరకే ఉండెను. ఆమె ఒక ఉద్దేశ్యము కొరకే ఒక బట్టలు ఉతుకు స్త్రీగా చేయబడెను. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టియుండెనో దాని విషయమై అలక్ష్యముగా యుండవద్దు, అయితే నీవు ఏ ఉద్దేశ్యము కొరకై చేయబడితివో దానిని నెరవేర్చు. ఈ దినములలోని ఒక దినము, అచ్చట ఆ గొప్ప విజయపు దినము రాబోవుచున్నది, అప్పుడు అచ్చట యుద్ధము సమాప్తమగును.

MATT 21:21•

MARK 11:23

 

54ఇప్పుడు గమనించండి, మోషే… తన అద్దములను కేంద్రీకరించిన పిమ్మట అతడు ఏమి చేయవలసియుండెనో అది దేవుని యొక్క ప్రణాళికయై యుండెనని అతడు చూచెను. అతడు వెళ్ళెను. అతడు కఠినముగా పోరాడెను. అతడు ఎన్నో గొప్ప యుద్ధములు చేసెను. అయితే అతను ప్రయత్నించిన పోరాటములలో ఒక గొప్ప కార్యము, నేను దానిని తీసుకు రాగోరుచున్నాను… అతడు అద్భుతములు మరియు సూచక క్రియలు ద్వారా సాధించినప్పుడు, దేవుడు తనకు చూపించిన వివిధ కార్యములు ద్వారా, వాక్యము పలుకగా అది పదార్థముగా మారి మరియు అది జరుగుట.

ఈ దినమున అదే కార్యమును మనము కలిగియున్నాము, వ్యాధిగ్రస్తులపై వాక్యమును పలుకుట మరియు అది స్వస్థపరచబడెనని గమనించుట, మరియు మానవుని పెదవుల ద్వారా దేవుని వాక్యము పలుకుట ద్వారా ఈ ఇతర కార్యములను చేయుటయైయున్నది. "ఈ కొండ వెళ్ళి ఆ సముద్రములో పడద్రోయబడుమని చెప్పి, సందేహింపక మీరు చెప్పినది జరుగునని నమ్మినయెడల మీరు చెప్పునది జరుగును" అని యేసు చెప్పెను. ఇప్పుడు, మనము దానిని నమ్ముచున్నాము, మరియు దానిని హత్తుకొనియున్నాము, దానిని తీసికొనియున్నాము మరియు దానినే నమ్ముచున్నాము.

మరియు ఇప్పుడు, మోషే దానినే జరిగించెను. అతను అచ్చటికి వెళ్ళియుండెను, మరియు తనతో ఆయన ఉన్నాడని దేవుడు రుజువుపరచెను. అయితే వారినందరిని చేర్చిన పిదప, దేవుడు…

EXOD 14:15

 

55అది క్రైస్తవ జీవితమువలె కనబడుచున్నది… ఒకవేళ ఆ వ్యక్తి సంపూర్ణంగా క్రీస్తుపై కేంద్రీకృతమై లేనియెడల క్రైస్తవ జీవితం అనేక నిరుత్సాహాలు కలిగియుండునట్లు అగుపడును. అయితే ఆ నిరుత్సాహాలు - మనకొరకై జరుగుచున్న దేవుని యొక్క దైవిక చిత్తమైయున్నది. ఇప్పుడు, అది ఆ రీతిగా ఉండునట్లు కనబడకపోవును, అయితే అది కార్యములను చేయు దేవుని యొక్క విధానమైయున్నది. మనము ఏమి చేయుదుము చూచుటకు ఆయన మనలను నదియొద్దకు నడిపించును.

మరియు ఫరో సైన్యము తన వెనుక ఉండి మరియు ఐదు లక్షలమంది ఆయుధములను ధరించిన సైన్యము నుండి పైకి ఎగసిపడే ధూళిలో మోషే ఇశ్రాయేలు జనాంగమును సరిగ్గా కర్తవ్య మార్గములో నడిపించెను. ఇరువది లక్షల యూదా పురుషులు, స్త్రీలు, పిల్లలు మొదలగు వారందరూ నిస్సహాయ స్థితిలో అచ్చట నిలబడి యుండిరి. ఎర్ర సముద్రము అతడిని అడ్డుకొనెను. మృత సముద్రము అతనికి అడ్డుపడెను. అతను వెళ్ళుటకు అచ్చట ఏ దారి లేకుండెను, చూశారా. అయితే మోషే ప్రార్ధించగా అతనికి ఒక విజయోత్సవ దినము కలిగెను. అతను వెళ్ళి ప్రభువుకు మొర్రపెట్టుచుండెను.

మరియు ప్రభువు ఇట్లు చెప్పెను, "నీవేల మొర్రపెట్టుచున్నావు? దానిని చేయునట్లు నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను. వారు కర్తవ్యము యొక్క వరుసలో వెళ్ళునట్లు బిడ్డలతో మాట్లాడుము." ఆమేన్. అక్కడే మీరున్నారు." నాకు మొర్రపెట్టకుము. ఈ ప్రజలను అచ్చటకు తీసుకు వెళ్ళుటకు నీకు ఆజ్ఞ ఇవ్వబడినది. కేవలం వారు ముందుకు వెళ్ళునట్లు వారితో మాటలాడుము. కర్తవ్యము యొక్క బాటలో సరిగ్గా నిలువుము." ఆమెన్!

వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి అది ఎటువంటి ఒక ధైర్యమును ఇచ్చుచున్నది. పడిపోయిన వ్యక్తికి అది ఎటువంటి ఒక ధైర్యమును ఇచ్చుచున్నది. వెనుకకు తిరిగి మరలా ప్రారంభించుము. కర్తవ్యము యొక్క వరుసలో నిలువుము. ఎర్ర సముద్రమును తెరుచుట దేవుని యొక్క కర్తవ్యమైయున్నది. అది దేవుని యొక్క కర్తవ్యము. నీవు కేవలము పలుకుము మరియు ముందుకు కొనసాగుము. నీవు చేయవలసినదంతా అదేయై యున్నది.

EXOD 15:20•

REV 15:2,3

 

56మరియు మోషే, అక్కడ ఆ సముద్రము నొద్ద గొప్ప విజయోత్సవ దినము కలిగెను. ఓ, మోషేకును, వారియొక్క ప్రవక్త స్వరమునకు విధేయత చూపిన ఇశ్రాయేలు ప్రజలకును అది ఎటువంటి విజయోత్సవ దినమై యున్నది. వారు పలికి మరియు ముందుకు వెళ్ళినప్పుడు మోషే చెప్పెను, "మీరు ఇదివరకే పది అద్బుతములను చూసి కూడా, మీరు ఇంకా సందేహపడుచున్నారు? తన చేతిలో ఆ కర్రతో అతను సముద్రము నొద్దకు నడచుట మొదలుపెట్టెను. మరియు ఆ రాత్రి దేవుడు గాలిని రేపగా, ఆ సముద్రము ఇరుప్రక్కలకు చీలిపోయెను, ఆరిన నేలపై వారు నడుచుకుంటూ దానిని దాటిరి. ఒక విజయోత్సవ దినము.

ఇట్లు చూడండి, వారు నిలబడిరి. ఈ రోజు మన పాఠము ఏమి చెప్పుచున్నదనగా, వారు నిలబడి మరియు "అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటి దాని పై మోషే కీర్తనను పాడుచుండిరి," చూశారా. చూడండి, వారు పాడితిరి… మోషే, అతను దాటి వెళ్ళినప్పుడు ఏమి చేయవలెనో అతడెరుగకయుండెను, మరియు అతడు… భౌతికమైన పోలికలతో, అతను చేయుచున్న కార్యములను అనుకరించుటకై ప్రయత్నించుచు ఫరో సైన్యము వచ్చెను. ఏమి జరిగెను? సముద్రము లోపలికి పొర్లెను మరియు వారిని ప్రతి ఒక్కరిని ముంచివేసెను. తమతో వెట్టి పనులను చేయించిన యజమానులు చనిపోవుటను వారు చూచిరి.

మిర్యాము ఒక తంబూర తీసుకొని, తంబురను వాయించుచు ఒడ్డునకు వెళ్ళెను. మరియు ఇశ్రాయేలు కుమార్తెలు, కేకలువేయుచు, తంబురలు వాయించుచు, నాట్యమాడుచూ ఆమెను వెంబడించిరి. మరియు మోషే ఆత్మలో పాడెను. నేనెన్నడూ చూడని పరిశుద్దాత్మ కూటము అది కాదా. "నీవు ఈ దినమున చూచిన ఐగుప్తియులను తిరిగి మరెన్నడూ వారిని చూడవు." ఆమేన్! ఎటువంటి దినము! అది అంతయు అయిపోయినది! ఏదో ఒక దినమున క్రైస్తవులకి కూడా మరొక విజయోత్సవ దినము వచ్చును. అది నిజము.

57గమనించండి, యెహోషువావా కూడా నది వద్ద విజయోత్సవ దినమును కలిగియుండెను. యొరికో వద్ద ఒక విజయోత్సవ దినమును కలిగియుండెను. అతను ఖచ్చితంగా కలిగి యుండెను. అతను అక్కడ దాటెను, అతను మొట్ట మొదటి విజయోత్సవ దినమును నది వద్ద కలిగియుండెను. అక్కడ అతను ఏప్రిల్ మాసములో ఉండెను. బహుషా యోర్దానుకు ఒక మైలు దూరమైనదై యుండును, ఏలయనగా అక్కడ ఆ కొండలపైన అక్కడ మంచు కరుగుచుండెను. మైదానములంతటి పై నది వ్యాపించియుండెను.

మరియు శత్రువు ఈలాగు చెప్పెననుటలో ఎటువంటి సందేహము లేదు, "ఇప్పుడు, దేవుడు ఎటువంటి సైన్యాధిపతియై యుండెను, కాదా? ఆయన సరిగ్గా వసంత ఋతువులో నదిని దాటుటకు బహు కష్టమైన సమయములో, నది బహుగా పొర్లి పారునటువంటి సమయమునకు ఆయన తన సైన్యమును తీసికొనివచ్చెను, ఆయన తన సైన్యమును ఇచ్చటకు నడిపించెను. వారిని దాటుటకు నడిపించెను!" ఆలాగున కాదు! దేవుడు విజయమును చూపించుటకై, నిరుత్సాహాలు జరుగునట్లు అనుమతించును.

ఓ, మనము కేవలం దానిని చూడగలిగినట్లైతే! మిమ్మల్ని ముండ్లవలె బాధించనట్లు మరియు మిమ్మల్ని భంగపరచునట్లు అగుపించు ఈ కార్యములు, అవి పరీక్షలేయని మీరు చూడగలిగినయెడల అవి, మీరు స్థిరముగా నిలచునట్లును, మీ అద్దములను దేవుని వాక్యముపై కేంద్రీకరించి మరియు వాక్యమును పలుకుటకును పిదప కేవలం ముందుకు సాగిపోవునట్లు చేసెడి కార్యములైయున్నవి. దానిని చేయవలసినది అదేయై యున్నది. "దేవా, ఏమి చేయవలెనో నాకు తెలియదు. నేను దానికెదురుగా వచ్చియున్నాను" అని చెప్పు సమయమునకు వచ్చెదవు. "ప్రభువా, నేను నమ్ముచున్నాను," అని వాక్యమును పలుకుము మరియు కేవలం ముందుకు నడచిపొమ్ము. సముద్రమును తెరుచు కార్యమును దేవుడు చేయును. మీరు కేవలం నడిచిపోవుడి, చూశారా.

JOSH 1:5

 

58ఇప్పుడు, యెహోషువావా, అతను సరిగ్గా ప్రార్ధించిన సమయముననే ఏమి జరుగునో దేవుడు అతనికి చెప్పెనని మనము కనుగొనియున్నాము. మరియు అతను ఒక విజయోత్సవ దినమును కలిగియుండెను. అతడు జయించెను. తరువాత అతను ఆ నదిని జయించి, అవతలి గట్టునకు వెళ్ళినప్పుడు, అతనేమి చేసెను? అతను మందసమును పెట్టెను, వాక్యము ఆ మందసములో నుండెను, అతడు దానిని ముందుకు తెచ్చెను. తరువాత గాయకులు మరియు మిగిలినవారు దాని వెనుక వచ్చిరి. అయితే మందసము ముందుగా బయలుదేరెను. ఇశ్రాయేలీయులు యుద్ధమునకు వెళ్ళునప్పుడు, ముందుగా వెళ్ళునది గాయకులు, మరియు గాయకులు పాడుచూ వెళ్ళిరి. పిదప వారు బూరను ఊదిరి మరియు అట్లు చేసిరి. అప్పుడు మందసము ముందుకు కదిలెను. పిదప ఆ మందసము ముందుకు కదిలినప్పుడు, వారు ఆ మందసమును అక్కడ పెట్టి మరియు - యుద్ధము ప్రారంభమగును.

గమనించండి. ఇప్పుడు ఈ విషయములో అయితే, యెహోషువా మొదటిగా వాక్యమును తీసికొన్నప్పుడు, మరియు వాక్యమును ముందు ఉంచినప్పుడు, అతను దాటివెళ్ళెను… "నేను మోషేకు తోడైయుండినట్లు, నీకునూ తోడైయుందును. నేను నిన్ను విఫలుడను కానివ్వను, నేను నీతో ఉందును. నీ జీవితకాలమంతా ఏ మనుష్యుడు నీ యెదుట నిలువలేడు. నేను సరిగ్గా అక్కడ నీతో ఉందును. ఏమి జరుగునోయని భయపడకుము. నేను సరిగ్గా అక్కడ నీతో ఉండెదను" అని దేవుడు అతనితో చెప్పెను. పిదప, అటువంటి ఒక ఆజ్ఞతో యెహోషువా ఏమి చేసియుండును, అయితే వాక్యమును ముందుగా ఉంచెను. ఆమేన్. అక్కడే మీరున్నారు. అక్కడ దేవుని యొద్దనుండి ఆజ్ఞను కలిగియుండి, వాక్యమును ముందుగా ఉంచెను. మరియు అది ఒక విజయోత్సవ దినమును తెచ్చెను. ఓ, అది రావలసియున్నది, అంతే.

JOSH 6:3-5

 

59అతడు వాక్యమునే ముందు ఉంచెను మరియు ఏమి జరిగెను? మందసము మొదటిగా నీటిలోనికి వెళ్ళెను. మరియు అట్లు చేయబడినప్పుడు సముద్రము, లేదా ఆ నది తెరువబడెను మరియు వారు దానిని దాటి వెళ్ళిరి. మరియు అతను అక్కడికి వెళ్ళిన తరువాత, అతను ఏమి చేయనై యున్నాడు? తరువాత జరుగబోవు కార్యమేమై యున్నది? అతను అవతలి గట్టుకు వెళ్ళినప్పుడు, వారు అతనికి భయపడి, గోడ అవతల వారుండుటను అతడు కనుగొనును, అతను అక్కడికి వచ్చినప్పుడు. అయితే ఒక దినమున అతను ప్రధాన నాయకుడిని కలిసికొనెను, మరియు అతనికి మరొక విజయోత్సవ దినము కలిగెను. అతను సరిగ్గా ఏమి చేయవలెనో ఆయన చెప్పెను మరియు యెరికో గోడలు కూలిపోయెను.

దానిని అతనెట్లు చేయబోవుచున్నాడు? అక్కడ ప్రకృతి సంబంధమైన మనిషి తన అద్దముల ద్వారా చూచి ఇట్లు చెప్పును, "ఇప్పుడు, నీవు ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చియున్నావు మరియు నేనిక్కడ వున్నాను. ప్రత్యర్దుల వైపు చూడుము. ఎందువలన, వారంతా వారి ఒడిసెళ్ళతో లోపల ఉన్నారు. ఆ గోడను మేము సమీపించినట్లైతే మాకు శ్రమ కలుగును. వారక్కడ బండలను పరచి యుంచారు, పెద్ద ఒడిసెళ్ళు వారియొద్ద ఈటెలు గలవు, వారియొద్ద బాణములు గలవు, వారియొద్ద సమస్తము గలవు. మరియు వారు కేవలం …"

అయితే, చూడండి, యేహోషువా మొదట దేవునిని ముందుంచెను. ఎప్పుడైతే అతడు… అచ్చటకు నీవెట్లు వెళ్ళగలవనేది కాదు, దానిని దేవుడు చూచుకుంటాడు. కేవలము ఆ వాక్యమును వెంబడించుచూ ముందుకు కొనసాగిపోవలెను. "ఏడు దినములు దానిచుట్టు తిరుగుడి. ఏడవ దినమున ఏడుమార్లు తిరుగుడి. మరియు ఆఖరి చుట్టు తిరుగునప్పుడు, బూరను ఊదుడి," అని ఆయన చెప్పెను. ప్రకృతి సంబంధమైన దానిని తొలగించుట దేవుని స్థానమైయున్నది, ఆత్మసంబంధమైనది లోనికి కదిలెను మరియు గోడలు కూలిపోయెను. వారు సరిగ్గా తిన్నగా వెళ్ళి, దానిని వశము చేసుకొనిరి. అవునండి. అప్పుడు, దేవునికి ఒక విజయోత్సవ దినము కలిగెను.

GEN 22:2

 

60ఈ కుమారుని కొరకు వాగ్దానము పొందిన చాలాకాలం తరువాత అబ్రాహాముకు ఒక విజయోత్సవ దినము కలిగెను, మనము దేవుడిని విశ్వసించిన యెడల, మనము ఎవరి భీజముగా యున్నామని, ఎరుగుటకై దేవుడే అతని ప్రేమను, అతడి భక్తి విశ్వాసములను పరీక్షించును. అబ్రాహాము ఒక విజయోత్సవ దినమును కలిగియుండెను. అది ఎప్పుడు కలిగెను? అతను షీనారు మైదానములను విడిచిపెట్టిన దినమునా? వాస్తవముగా అప్పుడు కాదు. అతడు స్వల్పకాలము నివాసముండుటకై యూఫ్రటీసు దాటి మరియు అవతలి గట్టుకు వచ్చెను. (అది నిజము). అది ఒక చక్కని దినమై యుండెను. అది ఇంకను ఒక విధమైన. అయితే అతను ఒక్కగా నొక్క కుమారుని కలిగియుండినప్పుడు, దేవుడతనికి ఆఖరి పరీక్షపెట్టినప్పుడు, అతను అక్కడ ఆ దినమున మోరియా పర్వతముపై నున్నప్పుడు అది అతని ముఖ్యమైన విజయోత్సవ దినమైయుండెను. ఆయన ఇట్లు చెప్పెను, "ఇప్పుడు, అబ్రహామా, అతనిని ఆ కొండపైకి తీసుకొని వెళ్ళుము మరియు బలికై అతనిని అర్పించుము. నేను నిన్ను జనములకు తండ్రిగా చేసియున్నాను. ఇక్కడ… నిన్ను జనములకు తండ్రిగా చేయు ఒకే ఒక కార్యమేదనగా, ఈ కుమారుని ద్వారానేయై యున్నది. మరియు నీవు అతనిని చంపవలెనని నేను కోరుచున్నాను."

ఓ, మీరు దానిని చూశారా? సమస్తమును నాశనము చేయుట. అసలైన ఉద్దేశ్యమునే నాశనము చేయుట. "అబ్రహామా, నీవిప్పుడు నూటా-పధ్నాలుగు, పదిహేను సంవత్సరముల వయస్సుగలవాడవు. మరియు నీవు కుమారుని కొరకు ఇరువది-ఐదు సంవత్సరములు వేచియుంటివి. ఇప్పుడు కుమారుని వయస్సు పదిహేను లేదా పదహారు సంవత్సరములు. నీవు అతనిని పైకి తీసుకు వెళ్ళి, అతనిని చంపివేయుము. తద్వారా నేను నిన్ను జనములకు తండ్రిగా చేయుదును." ఓ, మై! అవును!

61అబ్రాహాము ఏ మాత్రము కదిలింపబడలేదు. దేవునియొక్క మాట పట్ల అతను ఎంత మాత్రము భయపడలేదు. "చిత్తము, ప్రభువా. నేను ఇప్పుడే వెళ్ళెదను!" అని అతను చెప్పెను. సంపూర్ణముగా విధేయుడై, కట్టెలు తీసికొని మరియు ఇస్సాకును తీసికొని, ఆ కొండపైకి వెళ్ళెను. ఎందుచేత? దేవుని యొక్క ఆజ్ఞను అతడు మొదట ముందుగా యుంచెను. ఇప్పుడు వంద సంవత్సరములకు పైగా నుండి, ఒక్కగానొక్క కుమారుడిని అతడు కలిగియుండి, మరి ఏ విధముగా అతడు జనములకు తండ్రి అగును? అతడు దానిని ఎట్లు చేసెను? ఏట్లనగా, ఆయన దీనిని చెప్పెను, "నేను మృతులలో నుండి ఒకనిని లేపినట్లుగా అతనికి ఇస్సాకును దేవుడు ఇచ్చినయెడల, అతను చనిపోయినను మరలా ఆయన తనను తిరిగి లేపగలడని అతను తలంచెను.

ఇప్పుడు, స్నేహితులారా, ఈ లోకపు యొక్క కార్యముల నుండి మరియు ఈ భూమి పైనున్న దుర్నీతి నుండి మనలను లేవనెత్తిన దేవుడు, మనకింకను అత్యధికమైన నిత్యజీవమునిచ్చి మరియు మరణము లేనటువంటి దేశములో మనలను ఉంచలేడా, చూశారా? మనము ఈ చిన్ని పరీక్షలవైపు చూసి మరి అవి ఏవోయని మనము అనుకొందుము. ఎందువలన, అవి స్వల్పమైన పరీక్షా సమయములే తప్ప మరేమియు కావు, చూశారా? దేవుడు అబ్రాహామును పరీక్షించెను. అయితే అతను ఎప్పుడు విజయోత్సవ దినమును కలిగియుండెననగా దేవుని వాక్యమునకు విధేయుడై కొండపైకి వెళ్ళినప్పుడే.

ACTS 2:38

 

62వారు ఈ దినమున చెప్పుచున్నట్లు నాకు తెలియును. ఒక సేవకుడు అపోస్తుల కార్యములు 2:38ని చదువుటను కొద్దిసేపటి క్రితం నేను విన్నాను, కాని అతడు దానిని తప్పిపోయెను, చూశారా. "పేతురు, వారు బాప్తిస్మము పొందవలెను తరువాత వారు పరిశుద్దాత్మను పొందెదరు" అని అతను చెప్పెను. దానిలోని మిగతా భాగమును చదువుటను అతను తప్పిపోయెను. ఎందువలన? చూడండి, సంస్థలు దాని విషయములోనే పోట్లాడుచున్నవి. ఇప్పుడు, మీకు అది తట్టినదా? చూడండి, ఎందుకొరకు మీరు దానిని చేయుచున్నారు? మిమ్మల్ని ఆ కార్యములను దాటిపోవునట్లు చేయునది ఏమిటి? పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పినయెడల, అది ఎట్లు చెప్పబడెనో ఆ విధముగానే దానిని చదవండి, మరియు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్న కార్యమునే చెప్పండి. అది ఎప్పుడనగా మీ కేంద్రీకరణను తిరిగి సరిచేసి యున్నప్పుడు, చూశారా. వాక్యము ఏమి చెప్పుచున్నదో దాని యొద్దకు రండి. ఇప్పుడు, మనము ఏమి కనుగొన్నామనగా… మీరు అక్కడ కేంద్రము నుంచి తప్పిపోతిరి.

GEN 17:5

 

63ఇప్పుడు, అబ్రాహాము తనయొక్క కేంద్రీకరణను సరిగ్గా కలిగియున్నాడు, ఏలయనగా దేవుడిట్లు చెప్పెను, "నేను నిన్ను జనములకు తండ్రిగా చేయబోవుచున్నాను," ఎప్పుడనగా అతను డెబ్బది-అయిదు సంవత్సరములు మరియు శారా అరువది-అయిదు సంవత్సరముల వయస్సుగలవారై యున్నప్పుడు మరియు అతడు దేవుని అతడు అతడేమి చేసెను? అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అనునది ఏమైయుండెనో దానిపై కేంద్రీకరించెను. అవునండి! మరియు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనునది ఏమై యుండెనో దానితోనే తిన్నగా అతడు నడిచెను. దినము వెంబడి దినము అతడు నడిచెను, సంవత్సరము వెంబడి సంవత్సరము అతను నడిచెను, దానికి భిన్నముగా ఏది ఉన్ననూ అది తప్పని ఒప్పుకొనెను. లేదండి! అది ఆ విధముగానే ఉండవలసియున్నది. దేవుడాలాగున చెప్పెను.

అతని శతృవులు కొందరు అతని చుట్టు నడచుచు, "జనములకు తండ్రీ, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు?" అని చెప్పుటను నేను ఊహించుచున్నాను.

"ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నారు అనునది వ్యత్యాసమును కలిగించదు, నేను జనములకు తండ్రిని; అది - అంతే."

"నీకెట్లు తెలియును?"

"దేవుడాలాగున చెప్పెను. అది దానిని స్థిరపరచును. దానికి కావలసినదంతా అదే. దేవుడే దానిని చెప్పెను, మరి అది దానిని స్థిరపరచును."

కావున అబ్రాహాము వెంబడించెను. ఆయన చివరిగా ఆ అసలైన దానియొద్దకు వచ్చెను… పిదప చూడండి, అంతటి భక్తి విశ్వాసములుగలవాడై, అధిక విశ్వాస్యతలు, అధికమైన పరీక్షలు, చూశారా. కావున ఆయన అతనిని తిరిగి వెనుకకు తెచ్చెను.

JOB 2:3-6

 

64ఇప్పుడు, గుర్తుంచుకొనండి. ఎప్పుడైతే… నీవు ఒక పరీక్షను కలిగియున్నప్పుడు దేవుడు నిన్ను అర్హునిగా ఎంచును.

ఇప్పుడు దీనిని పొందుకొనుటలో తప్పిపోకుడి. మీరు ఒక కష్టము లేదా ఒక పరీక్షను కలిగియున్నప్పుడు దేవుని యొక్క కృప దొరికెనని అది చూపించుచున్నది… మీరు దేవుని దృష్టిలో దయపొందియున్నారు. మీరు పరీక్షకై నిలువగలరని దేవుడు నమ్ముచున్నాడు.

యోబు విషయములో ఆయన ఆ ప్రకారమే చేసెనని మీరు గుర్తు౦చుకొనుడి. "ఓ, ఔను, యోబును అక్కడ నేను చూశాను" అని అపవాది చెప్పెను.

"అతను పరిపూర్ణమైన ఒక సేవకుడు. భూమి మీద అతనివంటి వారెవ్వరూ లేరు. యోబువంటివారు ఎవ్వరూ లేరు. అతను ఒక పరిపూర్ణమైన మానవుడైయుండెను. ఇప్పుడు, అతడు నా ఆత్మగౌరవము మరియు ఆనందమై యుండెను" అని దేవుడు చెప్పెను.

సాతానుడు ఇట్లు చెప్పెను, "ఓ, నిశ్చయంగా, అతను అడిగినదల్లా పొందుచుండెను." చెప్పెను, "అతన్ని ఒక్కసారి నాకు అప్పగించుము." మరియు "అతడు నిన్ను ముఖము ఎదుటనే దూషించునట్లు నేను అతనిని చేసెదను" అని చెప్పెను. "అతడు నిన్ను శపించునట్లు నేను అతడిని చేసెదను" అని చెప్పెను.

"అతను నీ చేతులలో వున్నాడు, అయితే అతని ప్రాణమును నీవు తీయవద్దు" అని దేవుడు చెప్పెను, చూశారా. యోబుపై దేవుడు నమ్మకమును కలిగియుండెను. ఆమేన్!

1PET 1:7•

1PET 4:12,13

 

65ప్రతిదీ తప్పుగా జరిగినట్లు కనిపించినప్పుడు, దేవుడు మీకు ఒక పరీక్షను ఇచ్చుచున్నాడు. ఆయన మీపై నమ్మకమును కలిగియున్నాడు. మిమ్మల్ని లాలించవలసిన పని ఆయనకు లేదు. నీవు ఒక పరిశోధనపు మొక్కవు కాదు, ఒక సంకరజాతివాడవు కాదు. నీవు ఒక నిజమైన క్రైస్తవుడవు. నీవు ఏమి చేయుదువాయని చూచుటకు దేవుడు ఒక పరీక్షను నీకు పెట్టుచున్నాడు. ఆమేన్.

పేతురు ఇట్లు చెప్పెననుటలో ఆశ్చర్యము లేదు, "ఈ అగ్నిపరీక్షలు, వీటిని ఆనందముగా ఎంచుడి. అవి మీకు బంగారము కంటె అధికముగా ప్రశస్తమైనవి." అనేకసార్లు మనము సణుగుచు మరియు గొణుగుచు నుందుము. "ఓ, సరి! నేను కేవలం…" మంచిది, అది నీవు జయించుటకై అది దేవుడిచ్చు కార్యమైయున్నది. నీవు దానిని చేయుదువని ఆయన ఎరిగియుండెను. ఆయన నీపై నమ్మకమును కలిగియుండెను.

GEN 22:2,7,9,10

 

66ఆయన అబ్రాహామును నమ్మెను… అబ్రాహాము కూడా దేవునిని నమ్మెను. సందేహము లేకుండా సాతానుతో దేవుడిట్లు చెప్పెను, "అతడు నన్ను ప్రేమించుచున్నాడని నీకు ఋజువు చేసెదను." "నేను నేను దానిని వాగ్దానము చేసితిని గనుక అతడు ఆ వాగ్ధానమును నమ్ముచుండెను" అని చెప్పెను. కావున దేవుడు చెప్పిన దినమున అతడు తన స్వంత కుమారుడిని పర్వతము పైకి తీసికొని వెళ్ళి, తన చేతులను వెనుకకు కట్టివేసెను.

నీకు తెలియునా, చిన్న ఇస్సాకునకు అనుమానము కలిగెను. అతడు చెప్పెను (ఆదికాండము 22), అతను ఇట్లు అడిగెను, "తండ్రీ…"

అందుకతడు, "ఏమి నా కుమారుడా" అనెను.

"కట్టెలు ఇక్కడ వున్నవి మరియు బలిపీఠము మరియు ప్రతీది వున్నవి. కాని దహన బలికొరకు గొర్రెపిల్ల [చూశారా] ఎచ్చటనున్నది? అని అతను అడిగెను. [అతను హాస్యముగా తలంచుట మొదలుపెట్టెను. "ఇదంతయు ఏమైయున్నది?] మనము దేనినో వదిలిపెట్టితిమి."

నీవు దేనిని విడిచిపెట్టితివాయని తలంచుట అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. నీవు ప్రతీదానితో సహవాసమును విడిచి పెట్టితివి. సరి, నీవు నీకు పేకాట విందులు గలవు. నీవు దానిని చేయవలెను. నీవు కొద్దిగా త్రాగవలెను, నీవు నీవింకను దేనిని విడిచిపెట్టలేదు. వెళ్ళుము, వాక్యమునకు విధేయుడవగుము, చూశారా, అంతే. కేవలము వాక్యమునకు లోబడుము. నీవు దేనిని వదిలివేయలేదు. కేవలం వాక్యమునకు లోబడు.

"అతనిని ఇక్కడికి తీసుకొని రమ్ము, అతను పర్వతము పైకి వచ్చును. నేను దేనినో చేయబోవుచున్నాను. నేనక్కడ నుండి దానిని చేయుదునని దేవుడు చెప్పెను" అని అతను చెప్పెను. కావున అతడు అక్కడికి వచ్చెను మరియు అతని చేతులను కట్టివేసి బలిపీఠముపై ఆ విధంగా పరుండబెట్టెను. ఇస్సాకు అసలు సణగలేదు, విధేయునిగానుండెను (చూశారా), క్రీస్తుకు మాదిరైయుండెను. ఎప్పుడైతే అతడు తన కత్తిని ఒరనుండి లాగి, మరియు వెండ్రుకలను అతని ముఖము మీది నుండి లాగి అతడి ప్రాణమును తీయబోయెనో, అప్పుడది అబ్రాహామునకు విజయోత్సవ దినమైయుండెను. (ఓ, మై!), అతడు సహించుకొనుటకు చిట్టచివరి ఆశగాయున్న తన ఒక్కగానొక్క కుమారుని బలిగా కోరి ఆయన అతడిని పరీక్షించబడినప్పుడే.

GEN 17:4,5•

HEB 11:19

 

67ఇప్పుడు, మీరు కేవలం ఆత్మీయ దాహము గలవారైనయెడల, దేవుడు విజయోత్సవ దినమున దయచేయు పరీక్షకు దానిని తీసుకు వెళ్ళండి. ఆయన దేనిని ప్రేమించెను. ఆదాము యొక్క పడిపోయిన సంతతిని దేవుడు ఎంతగానో ప్రేమించెను. కొద్దిసేపటిలో మనము దానిలోనికి వెళ్ళెదము.

గమనించండి, విజయోత్సవ దినము, అతని కుమారునికి బదులుగా అతనికి ఒక బలిని దేవుడు ఎక్కడైతే ఏర్పాటుచేసెనో ఆమోరీయా పర్వతముపై అబ్రాహామునకు విజయోత్సవ దినము కలిగెను. ప్రేమ, చూశారా, ప్రేమ… ఆ దినమున, ఎటువంటి సందేహము లేకుండా అబ్రాహాము దేవునికి తన భక్తి విశ్వాసములను ఋజువు పరచుకొనెను. దేవుని పట్ల తనకున్న విశ్వాసమును అబ్రాహాము నిరూపించుకొనెను, ఎట్లనగా అతడిట్లు చెప్పెను, "నేను వంద సంవత్సరములవాడిగా యున్నను, ఒక వాగ్ధానమును నమ్ముట ద్వారా ఈ కుమారుడిని నేను పొందుకున్నాను. నేను జనములకు తండ్రినని ఆయన నాతో చెప్పెను. ఇతని ప్రాణమును తీయమని ఆయన కోరినయెడల, మృతులలో నుండి అతనిని లేపుటకు దేవుడు సమర్దుడైయుండెను." ఊ! మై! ఓ, మై! అది ఒక ప్రెస్బిటేరియనును సైతం అరచునట్లు చేయును, కాదా? చూశారా. "ఇప్పుడు, ఆయన నాకు వాగ్ధానము చేసెను. ఆయన దేని యొక్క సాక్ష్యమును ఇప్పుడు నాకు చూపించెను. ఆమేన్. ఆయన తన మాటను నిలబెట్టుకొనునని నాకు రుజవు చేసెను."

GEN 17:19•

GEN 22:2,3•

ROM 4:20

 

68మంచిది, ఎక్కడి నుండి ఆయన మనలను కలిగియుండును? నేను ఎటువంటి గందర గోళము నుండి బయటకు వచ్చియున్నాను? మీరు ఎటువంటి దానినుండి బయటకు వచ్చిరి? ఈ ఉదయము మన ఆలోచనలు ఎక్కడ ఉన్నవి? ఆయన మనమధ్యలో ఏమైయుండెనని ఋజువుపరచెను? దానిగూర్చి ఎటువంటి సందేహము లేదు. ఆమేన్. నిశ్చయంగా ఒక విజయోత్సవ దినమైయున్నది. మనము దానిని పొందుకొనవలసి యున్నాము. ఆయన దానిని రుజువు చేసెను.

అబ్రాహాము చెప్పెను, "ఆయన దానిని నాకు ఋజువు చేసి యున్నాడు. నేను సంతానములేనివానిగా నుంటిని. నేను ఒక వృద్దుడను. నేను నిస్సారముగా నుంటిని మరియు నా భార్య గర్భము మృతతుల్యమైయున్నది. ఆమె అరువది-ఐదు మరియు నేను డెబ్బది-అయిదు సంవత్సరము గలవారము, అయినా గానీ, ఆమె ద్వారా నేను నీకు కుమారుని ఇవ్వబోవుచున్నానని," దేవుడు చెప్పెను. అది దానిని స్థిరపరచును. దానికి సరిపడినది అదే. "నేను దానిని నమ్ముచున్నాను" అని అబ్రాహాము చేప్పెను.

పిదప దేవుడు అతనిని ఇరువది-ఐదు సంవత్సరముల పరీక్షలోనికి త్రోసివేసెను. అది అబ్రాహామునకు ఏమీయూ కాదు. అతను ముందుకంటే మరి ఎక్కువ బలవంతుడాయెను, ఇంకనూ దేవుని స్తుతించుచుండెను. దేవుడు క్రిందికి చూసి మరియు "ఎటువంటి ఒక సేవకుడు!" అని చెప్పెననుటలో ఎటువంటి సందేహము లేదు. చెప్పెను… సాతాను చెప్పెను, "ఓ, అవును."

ఆయన ఇట్లు చెప్పెను, "అతడు నిన్ను ప్రేమించుచున్నాడని నేను రుజువు చేయుదును. అతనిని అక్కడికి ఆ కొండపైకి తీసుకు వెళ్ళుము మరియు ప్రత్యక్ష సాక్ష్యమును నాశనము చేయుము. అతనిని అక్కడికి పైకి తీసుకు వెళ్ళుము." మరియు దానిని చేయుటకు అబ్రాహాము పైకి వెళ్ళెను. అది నిజము.

GEN 22:10,12,17

 

69మరియు అబ్రాహాము తన బిడ్డ యొక్క ప్రాణమును తీయుటకు ఆరంభించినప్పుడు, పరిశుద్దాత్మ అతని చేతిని నిర్భందించెను, "అబ్రహామా, నీ చేతిని నిలుపుము, నీవు నన్ను ప్రేమించుచున్నావని నాకు తెలియును." ఆమేన్.

నేను ఆ విధమైన ఒక వ్యక్తిగా ఉండగోరుచున్నాను. ఏది జరిగినను దేవునినే ప్రేమించెదను. "నీ హస్తమును నిలుపుము." నీ స్వంత ఆలోచనకు సైతం భిన్నముగా ఉండునటువంటి పరీక్షను నీకు పెట్టెదను, అయితే వాక్యము ఆలాగు చెప్పనంతవరకు, ఏ విధముగానైనా దానిని చేయుము. "నీ హస్తము నిలుపుము. నీవు నన్ను ప్రేమించుచున్నావని నేనెరుగుదును, ఎందుకనగా నీ ఒకగానొక్క కుమారుని నీవు నాకు ఇచ్చుటకు వెనుదీయలేదు." "… ఆశీర్వాదము, నేను నిన్ను ఆశీర్వదించెదను," అని ఆయన చెప్పెను. "అతని సంతానము శత్రువు యొక్క గవినియొద్ద నిలబడును, మరియు అతను జయించును," అని చెప్పెను. ఓ, మై! అతను అట్లు చేసెను కూడా. కొద్ది సమయములో మనము అబ్రాహాము సంతానము యొద్దకు వెళ్ళబోవుచున్నాము.

అది సరియే. అబ్రాహాము యొద్ద నుండి సందేహములు తొలగిపోయెను. అతను నిజ వాక్యమును విన్నప్పుడు, సందేహములు విడిచిపెట్టెను. దేవుడు వాక్యమును బుజువుపరచుటను అతడు చూచినప్పుడు, సందేహములు వెడలిపోయెను. దాని స్థానమును ప్రేమ తీసికొనెను. "అబ్రహామా నీవు నన్ను ప్రేమించుచున్నావని నేనెరుగుదును. నీవు కొద్దిగైననూ నా పట్ల సందేహము కలిగిలేవు. నీవు ఎంతకాలము వేచియుండవలసి వచ్చిననూ, నీవింకనూ నన్ను నమ్మియున్నావు. నేను నీకిచ్చిన ప్రత్యేక్ష సాక్ష్యమును నిర్మూలము చేయమని నేను నిన్ను అడిగియుంటిని. సాక్ష్యము నీకు ఇచ్చితిని, పిదప దానిని నాశనము చేయమని నిన్ను అడిగితిని. నీవు నన్ను ఎంతగానో ప్రేమించితివి, అవి ఏమైయుండినప్పటికీ నీవు నా మాటను పాటించితివి." ఆమేన్. అది దేవునికి కూడా ఒక నిజమైన విజయోత్సవ దినమై యుండెను.

GEN 31:3•

1PET 5:8

 

70ఒకప్పుడు యాకోబు విజయోత్సవ దినమును కలిగియుండెను. అతడు తన సహోదరుడికి కీడు చేసెను గనుక అతను తిరిగి తన సహోదరుని యొద్దకు వెళ్ళుటకు భయపడెను. అయిననూ, "నీవు వచ్చినటువంటి నీ స్వదేశమునకు తిరిగి వెళ్ళుము" అని పరిశుద్దాత్మ అతనిని తన హృదయములో హెచ్చరించుటను ప్రారంభించెను. "నీవు ఎచ్చట నుండి వచ్చితివో, ఆ స్వదేశమునకు నీవు తిరిగి వెళ్ళుము." అతను తన స్వదేశము నుండి వచ్చెను. "నీవక్కడ కీడు చేసితివి, ఇప్పుడు నేను నిన్ను తిరిగి పంపుచున్నాను." మరియు అతను సమీపముగా వచ్చినకొలది…

అతను నిశ్చయంగా. అందుచేతనే సాతాను బహుగా మనలను వెంబడించుచు వచ్చును. గమనించితిరా? అంతేకాకుండా సాతాను ఇప్పుడు అదే విధముగా వధువును, సంఘమును బహుగా వెంబడించుటకు కారణము అదేయగును. అదేమనగా, విజయోత్సవ దినమునకు సమీపించుటగా అది యున్నది. అది నిజము ఆమె నిజముగానే సమీపముగా యున్నది. అది నిజము. ఆ సమయమునందే శత్రువు తీక్షణముగా వానియొక్క బహు నీచమైన కార్యమును ఏ మార్గములోనుండైనా చేయును. పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పెను, "భూమికి శ్రమ, ఏలయనగా అంత్యదినములలో దయ్యము ఎవరిని మ్రి౦గుదునాయని గర్జించు సింహమువలె తిరుగులాడుచుండెను," మీరు చూశారా. వారికి శ్రమ కలుగును, హింస మరియు అటువంటి కార్యములు సంభవించును. దానిని సరిగ్గా పట్టుకొనియుండుడి. కుడికి గాని ఎడమకు గాని మీరు తొలగకుడి. వాక్యముతోనే సరిగ్గా నిలిచియుండుడి. దేవుడాలాగు చెప్పెను. అది దానిని చేయును.

GEN 25:30-34•

GEN 32:3,6•

GEN 35:1

 

71యాకోబు తన హృదయములో తృష్ణ కలిగియుండెను, ప్రతీది తప్పుగా కనిపించుచుండెను, అతడు తిరిగి ఇంటికి వెళ్ళగోరెను. పరిశుద్దాత్మ అతనిని నడిపించుచుండెను. అతడు దేవునికి ఒక వాగ్ధానము చేసెను. ఈ దశమ భాగములను చెల్లించుటకు అతడు బేతెలునకు వెళ్ళవలసియుండెను, మరియు కావున… ఇక్కడ తిరిగి తనయొక్క మార్గములో తన శత్రు సహోదరుడైన ఏశావు నది అవతలి ప్రక్క ఒక సైన్యముతో తనకొరకు వేచియుండెనని అతడు కనుగొనెను. కావున తనకు దేవుని యొక్క ఆశీర్వాదములు కలిగియున్నప్పటికినీ యాకోబు భయపడెను. అతనిని ఆశీర్వదించెదనని దేవుడు వాగ్ధానము చేసెను. అతడు జేష్ఠత్వపు హక్కును కలిగి యుండెను. ఆమేన్. ఈ దినమున పరిశుద్దాత్మ బాప్తిస్మము కలిగియున్న సంఘమునకు, దానిని ఋజువు చేయుటకు దేవుని యొక్క వాక్య వాగ్ధానముతో నుండిన సంఘమునకు అది ఎటువంటి ఒక మాదిరిగ వున్నది, ఏలయనగా మీరు ఆ వాక్యములో భాగమైయున్నారు - జేష్ఠత్వపు హక్కు.

మరియు యాకోబు జేష్ఠత్వపు హక్కును కలిగియుండెను. ఆమేన్. అతను దానిని అతని సహోదరుడు లెక్క చేయలేదు. అతడు జేష్టత్వపు హక్కును కలిగియుండెను, ఏలయనగా కూరగాయల భోజనము కొరకు అతని సహోదరుడు దానిని అతడికి అమ్మివేసెను. ఆ విధముగానే ఈ దినమున లోకపు సంఘము వారియొక్క జేష్ఠత్వపు హక్కును అమ్మివేసెను. దేవునికి స్తోత్రము, మనము దానిని కలిగియున్నాము. అవును. మనము దానిని కలిగియున్నాము. మీరు జేష్ఠత్వపు హక్కును కలిగియున్నంతవరకూ సంఘముల సమైక్య గూర్చి గాని, దేశముల రాజ్య సమితిని గూర్చి గాని, మరియు ఇతర కార్యముల గూర్చి గాని మనము ఎందుకు లెక్క చేయవలెను.

GEN 32:24,26•

GEN 33:15

 

72సంఘమునకు అవసరమైనది ఏదనగా, యాకోబువలే చేయవలెను — ఒక విజయోత్సవ దినమును మీరు పొందుకునేంతవరకు పార్ధి౦చుడీ. యాకోబు ఒక మల్లయుద్ధమువలె పెనుగులాడెను. అతను రాత్రంతయు ప్రభువుతో పెనుగులాడెను. అయితే, "నేను ఈ విజయమును పొందునంతవరకు నేను నిన్ను వెళ్ళనీయను," అని అతను చెప్పెను. అతను ఒక ఉదయమున తెల్లవారుచున్నప్పుడు, అతడు ఒక విజయోత్సవ దినమును కలిగెను. అతను ఎంతమాత్రము ఆ రీతిగా నడువలేదు. అయితే ఈ ప్రక్క అతను ఒక పెద్ద, బలమైన భయము గల సంఘ సభ్యుడైయుండెను, అయితే మరొక ప్రక్క అతడు ఒక కుంటి నడక నడుచు యాజకుడు, లేదా యువరాజై యుండెను, పూర్తి సైన్యముతో పోరాడుటకు సరిపడు ధైర్యము కలిగిన ఒక చిన్న కుంటి నడక నడుచుచు యువరాజై యుండెను.

"నీ సైన్యమును తుడిచిపెట్టుదును," అని ఏశావు చెప్పెను.

అతను చెప్పెను, "నీకది అవసరము లేదు." అతను ఒక విజయోత్సవ దినము కలిగియుండెను.

మనకు వారి సంస్థలు అవసరము లేదు. మనకు వారియొక్క ఈ లోకపు చెత్త అవసరము లేదు. మనకు వారియొక్క… లోకము యొక్క కార్యములతో గుర్తించబడవలసిన అవసరత మనకు లేదు. మనకు ఒక విజయోత్సవ దినము కలిగెను. మనము ఒక దినము, లేదా ఒక రాత్రి పెనుగులాడియున్నాము.

GEN 32:24

 

73ఓ, నేను నాకు నేనుగా చనిపోవలసి వచ్చినప్పుడు, ఆ పెనుగులాటనో నాకెంతగానో జ్ఞాపకమున్నది. అయితే నేను విజయమును పొందినప్పుడు ఒక విజయోత్సవ దినము వచ్చెను. అప్పుడు దేవుని వాక్యమే సరియైనదాయెను, నాకిక బాప్టిస్తు సంఘము కూడా వేరే ఇతర సంస్థ వంటిది అని అనిపించెను. అది నిజము. నాకొక విజయోత్సవ దినము కలిగెను. దేవుని యొక్క వాక్యమే నిజము.

"ఎందువలన, నీవు ఒక పరిశుద్ధ గుండ్రాయివగుదువు" అని డా. డేవిస్ చెప్పెను. "ఒక పరిశుద్ధ గుండ్రాయా, లేదా పరిశుద్ధ గుండ్రాయి కాదా" అని నేను అన్నాను

అక్కడ గ్రీన్స్ విల్ వద్ద ఆ ఉదయమున ఆ వెలుగులో అక్కడికి దూత వచ్చునంతవరకు ఆ రాత్రంతయూ నేను ప్రార్ధనలో గడిపియుంటినని చెప్పెను… పోరాడుటకై దేవుడు నాకు అనుగ్రహించిన ఆ దర్శనమనే కార్యములను, నేను నా నుండి వాటిని తొలగించుకోవాలని ప్రయత్నించుటను, అచ్చట దేవుడు నాకు దానిని గ్రహించునట్లు చేసెను, అవి దయ్యము వలన వచ్చుచున్నవని, వారు చెప్పుచున్నప్పుడు ఆయన మరలా వచ్చి నాకు చెప్పి, పరిశుద్ధ వాక్యములలో లేఖనములను తీసి చూపించి, "వారు దేవుని కుమారుని గూర్చి ఆ విధముగానే చెప్పలేదా?" అని నాతో చెప్పెను. నాకొక విజయోత్సవ దినము కలిగెను. దానికంటే ఎక్కువ నాకేదియూ లేదు. నేను పొలమునకు తీసికొనిపోబడితిని, మరియు ప్రపంచమును చుట్టి మరియు చుట్టితిని. ఒక విజయోత్సవ దినము, చూడండి.

యాకోబు ఈ విజయోత్సవ దినమును కలిగియుండెను. అతడు రాత్రంతయూ పెనుగులాడెను. అయితే తెల్లవారునప్పుడు, అది అతనికి ఒక విజయోత్సవ దినమైయుండెను.

74ఈ గొప్ప విజయోత్సవములు మరియు అటువంటి కార్యములు, ఈ సంగతుల గూర్చి మాటలాడుట మొదలుపెట్టినయెడల, ఇక ఆపుటకు స్థలము లేదా? ఈ గొప్ప విజయోత్సవములన్నియు చక్కగానున్నవి. మనము వాటిలో ప్రతీయొక్క దానిని అభినందించుచున్నాము. అవన్నియు గొప్ప విజయములైయుండెను. గొప్ప యుద్ధముల విజయోత్సవములు, మరియు గొప్ప ఆత్మీయ యుద్ధముల విజయోత్సవములు, మరియు అటువంటివన్నియు గొప్పవైయుండెను. అయితే మీరు గమనించండి, వాటిలో ఏ ఒక్కటియూ కొనసాగుటలేదు, చూశారా. మనకు ఒక గొప్ప విజయము తాత్కాలికముగా కలిగెను.

ఇప్పుడు, మనము కేవలం… ఈ మధ్యనే మనము జపాన్ తో యుద్ధమునకు వెళ్ళినప్పుడు, ఇక్కడ మనము కనుగొన్నాము, ఎందువలన, నేను… నేను మా స్వంత ఇంటిలో ఒక చిన్న యంత్ర పరికరము వుండెను. ఎవరో ఒక బొమ్మవంటి ఒక చిన్న చవక రకము చెక్క పెట్టె మాకు ఇచ్చియుండిరి, మీకు తెలియును. మరియు దానిపై "జపాన్లో తయారీ" అని ఉండెను. ఒకడు దానిని విసిరివేసి మరియు దానిని పగులగొట్టెను, చూశారా. "జపాన్లో తయారీ" అని ఉండుటవలన వారు దానిని బయటకు విసిరివేసిరి అని మీరు చెప్పవచ్చును. వారు చిన్న పదిసెంట్లు అను దుకాణమునకు వెళ్ళుదురు, వారు ఒక రిక్కీల గుంపైయున్నారు, మీకు తెలియును… కాదు… తప్పుడు ప్రజలు. కేవలం తెలివిగా ప్రవర్తించుటకు పదిసెంటుల దుకాణమునకు వెళ్ళెదరు, చూశారా - లోపలికి వెళ్ళి జపాన్ నుండి వచ్చిన వస్తువులను తీయుదురు. వారు ఒక దేశమునకు తమ విశ్వాస్యతను చూపించగోరుచున్నారు.

75దేవుడైన ఆయన ముఖముపై అపహాస్యము చేసినయెడల ఏమి జరుగును, చూశారా?. జపాన్తో యుద్ధము జరుగుచున్న కారణమువలన చిన్న చిన్న బొమ్మలను అలంకరించు ఆభరణములవంటి వాటిపై జపానులో తయారుచేయబడినవి అని వ్రాయబడియున్న కారణము చేత, వారు అంత సులువుగా పది సెంటుల దుకాణముపై దాడిచేసి మరియు గల్లా పెట్టెలు ధ్వంసం చేసినయెడల, నిజమైన దేవుని సైన్యం, సిగరెట్లు త్రాగుతూ, మరియు మద్యపానము సేవించుచూ, అబద్ధములాడుచూ, దొంగతనములు మరి ఇంకా అటువంటివి చేయుచున్నప్పుడు, వాటి సంగతి ఏమిటి? వారు విశ్వాస్యతగలవారుగా ఉండదలచిరి. అట్లైన మన విశ్వాస్యతను గురించి సంగతి ఏమిటి?

అది చేయుటవలన వారు చెరసాలకు వెళ్ళినయెడల, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించును? వారు వారి దేశమునకు, జెండాకు విశ్వాస్యత గల వారిగా ఉండుటకు ఇష్టపడిరి. అయితే క్రైస్తవుడైన వ్యక్తి కొన్నిసార్లు మాట్లాడుటకు కూడా భయపడును, చూశారా. ఆ కారణము చేతనే నీయంతట నీవు జయించునటువంటి మరి ఎక్కువ విజయోత్సవ దినములు మనకు కావలసియున్నవి, చూశారా. దేవుడు, నిన్ను తన ప్రేమ యొక్క శక్తి చేత జయించుకొననిమ్ము.

76ఈ విజయములన్నియూ, మోషే పొందిన విజయముతో కలిసి, తాత్కాలికములైయున్నవి. ఇశ్రాయేలీయులు మరలా తిరిగి బానిసత్వములోనికి వెళ్ళిపోయిరి. మనము చూచినట్లైతే ప్రతిసారి లోపలికి వెళ్ళుట మరియు బయటకు వచ్చుట, లోపలికి వెళ్ళుట మరియు బయటకు వచ్చుటవలెనున్నది. అయినను ఎంతోమంది కధానాయకులు యుద్ధము చేసి మరణించిరి. వారు ఇంకనూ యుద్ధములలో ప్రకృతి సిద్ధమైన ఆ అద్దము యొక్క తేజస్సులో చూచుచున్నారు. వారు దానిని ఆత్మీయతలో చూచుచున్నారు. కధానాయకులు పోరాడి మరియు చనిపోవుదురు.

మనము ఏ విధముగా లోతులోనికి వెళ్ళుదుము. దానియేలు, హెబ్రీ బాలురు, మరియు విజయములు పొందిన గొప్ప వీరులను నేను ఇచ్చట ఒక వరుసంతయు వ్రాసికొనియుంటిని. అయితే వారు తదేకముగా చివరిగా మరణము అను ఒకటి వచ్చి వారిని తీసుకొనిపోయెను, చూశారా. ఏ విధమైన తేడా కూడా లేకుండా, వారు తిన్నగా ఇంకనూ యుద్ధము చేయుచూ చనిపోవుచూ, యుద్ధము చేయుచూ, చనిపోవుచూ, విజయుములు జయించుచూ, చనిపోవుచూ, విజయములు జయించుచూ చనిపోవుచునుండిరి.

అయితే, మీరు చూశారా, ఏది ఏమైననూ, మానవుడు మరణించుటకు చేయబడలేదు. మానవుడు జీవించుటకు సృజింపబడెను. మరియు అతడు ఎంతటి ఘనకార్యములు సాధించినప్పటికీ, అతడు ఇంకనూ అదే విధముగా చనిపోయెను. అతడు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు, వారు అతనిని పాతిపెట్టుదురు, మరియు అది అంతటితో సమసిపోతుంది. వారు అతని సమాధికి ఒక సమాధి రాయిని పెట్టి మరియు ఒక సమూధిని నిర్మించుటతో అది ఒక ముగింపునకు వచ్చును. మరణము అతనిని మ్రింగివేసెను. ఒకరిద్దరిని తప్ప ఆ ఘనుడైన మోషే ఘనుడైన యెహోషువావా, దాదాపు బైబిలులోని గొప్ప ప్రవక్తలందరి యొక్క సమాధులు ఎచ్చటనున్నదో, వారు ఎక్కడ ఆనవాల పెట్టారో మనమెరుగుదుము. మరణము వారిని మ్రి౦గివేసి, తిన్నగా వారిని తీసుకొనిపోయెను, చూసారా.

MATT 4:3,6,8,9•

LUKE 4:3,5,6,9

 

77అయితే ఒక దినమున ఒక యుద్ధము సంభవించెను. దేవుని కుమారుడును ప్రధాన యోధుడైన యేసుక్రీస్తు క్రిందికి దిగివచ్చెను. అచ్చట ఒక పునరుత్థానము జరిగెను, అదే నిజమైన విజయోత్సవ దినము. యేసు పోరాడి మరియు గెలిచిన తరువాత… ఆయన యుద్ధము చేయవలసిన ప్రతి శత్రువుపై యుద్ధము చేసెను. మొదటిగా, ఆయన జన్మించినప్పుడు, ప్రారంభములోనే ఆయన ఒక నీచమైన పేరుతో జన్మించెను, ఒక వ్యభిచారములో పుట్టిన బాలునివలె ప్రజల మధ్య వుండెను. ఆయన సరిగ్గా దానితోనే పోరాడియుండెను, వివాహము జరుగక మునుపే మరియ, యోసేపుకు ఈ బిడ్డను కనెను. ఆయన చిన్న బాలుర మధ్య ఒక నీచమైన పేరుతో వచ్చెను. అయితే ఆయన హృదయములో, ఆయన దేవుని కుమారుడని ఆయన యెరిగియుండెను, చూశారా. ఆయన దానిగుండా పోరాడెను.

ఆయన పరిశుద్దాత్మను పొందుకొన్న పిదప ఆయన ఏమి చేయనైయుండెనో ఆయన తీర్మానము చేసికొను దినములకు ఆయన వచ్చెను.

సాతాను ఆయనను కొండపైకి తీసుకొని వెళ్ళి, మరియు అతడు ప్రపంచ రాజ్యములన్నిటిని చూపించి, "నేను నిన్ను ఒక రాజుని చేసెదను, ఇప్పుడు, నీవు దేవుని కుమారుడవువనియు, నీవు శక్తిగలవాడవనియు చెప్పుచున్నావు, నేను నిన్ను ఈ దేశములన్నియు ఏలువానిగా నేను నియమించెదను," ఈ దినమున క్రీస్తువిరోధి చేయ ప్రయత్నించుచున్నది కూడా అదియే. అయితే అచ్చట ఒక విజయోత్సవ దినము ఉండెను. ఆయన దానియందు సరిగ్గా పోరాడెను. "నీవు దేవుని కుమారునివైతే…" అని చెప్పెను. ఆయన వాక్యము చేత సవాలు చేయబడిన సమయము వచ్చియున్నది. "నీవు దేవుని కుమారునివైతే, ఈ రాళ్ళు రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపించుము, చూశారా. "నీవు ఆకలిగొనియున్నావు, ఇప్పుడు వాటిని తినుము," చూశారా. "నీవు దేవుని కుమారునివైనయెడల, నీవు దానిని చేయగలవు." ఆయన చేయగలిగెడివాడు, అది సత్యము.

అయితే అక్కడ ఒక విజయోత్సవ దినము వుండవలసియున్నది. ఆయన ఆ శోధనపై విజయము పొందెను, చూశారా. ఆయన విజయము నొందెను…

MATT 4:6,10•

MATT 8:14,15•

MARK 1:30,31•

LUKE 4:8-11,38,39

 

78"ఇప్పుడు, నీవు ఒక ఉన్నతమైన వ్యక్తిగా వుండగలవు. నీవు ఏమిటో నీవు కనపరచుకోవచ్చును." ఆయనను ఆలయ శిఖరము పైకి తీసికొని వెళ్ళి, ఈ విధముగా చెప్పెను, "క్రిందికి దూకుము.

నేను నీకు లేఖనములు చూపించగలను, ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు." ఆ తత్వవేత్తయైన సాతానుని చూడుడి, చూశారా.

"సాతానా, నా వెనుకకు పొమ్ము," అని వాక్యము వెలువడెను. అది ఒక విజయోత్సవ దినము. ఆయన ప్రతియొక్క విజయోత్సవ దినమునకు వచ్చెను.

ఆయన సన్నిధిలో నడిచివచ్చెను - జ్వరముతో పడియున్న పేతురు భార్య యొక్క తల్లి యొద్దకు, జ్వరము ఆమె శరీరములో తీవ్ర రూపములో నున్నది. వారికి సేవ అవసరమై యున్నది. ఆయన నడిచి వెళ్ళి, ఆమె చేతిని ముట్టుకొనెను. సాతాను ఆయన సన్నిధిలో నిలువలేకపోయెను. నిశ్చయముగా నిలువలేకపోయెను.

JOHN 11:39,43

 

79అంతట ఆయన ఎక్కడైతే మరణముండెనో ఆ స్థలమునకు వచ్చెను. ఒక కుటుంబములో ఆయన స్నేహితుడైన లాజరు అను వ్యక్తి వున్నచోటికి వచ్చెను. చనిపోయి సమాధిలో పెట్టబడియుండెను, మరియు సమాధిలోనుండెను, మరియు కంపుకొట్టుచుండెను, దాదాపు నాలుగవ దినమున. మూడు దినములలో శరీరము కుళ్ళుపడుతుంది, చూశారా — 72 గంటలు, కుళ్ళుపడుతుంది.

జీవము మరియు మరణము ఎదురుపడిన ఒక స్థలము వచ్చెను. ఇచ్చట ఆయన జీవమైయున్నాడు. ఆయన స్నేహితుడిని కబళించిన మరణము అచ్చట వుండెను. ముఖాముఖి సంఘర్షణకు ఆయన సమాధి యొద్దకు వచ్చి మరియు ఆ చిన్నభుజములను వెనుకకు లాగుకొని, "లాజరూ బయటకు రా!" అని చెప్పెను. ఓ, మై! ఆ వాక్యము బయలు వెళ్ళెను. అది దేవుని వాక్యమైయున్నది. జీవము దానంతట అదే మరల జీవముతో తిరిగి వచ్చెను. నిశ్చయముగా, ఆయన విజయమునొందెను. అది సరియే.

వ్యాధి, శోధన, మరేదైననూ, సమస్తముపై, దానియొక్క ప్రతీ జాడపై ఆయన పోరాడెను. ఒక విజయోత్సవ దినము. అది ఖచ్చితముగా సరియే.

అంతట లోకమంతయూ చీకటిలో, మరణచ్చాయలో పడియున్న సమయము వచ్చెను. ఆయన పంపిన ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి ప్రవక్త ప్రతి గొప్ప వ్యక్తి ఈ గొప్ప కధానాయకులందరును, ఆ వెనుక పడియుండిరి. నమ్మికయుంచుచునే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు మరియు అందరూనూ ఆ వెనుక తట్టు సమాధిలో పడియుండిరి. దేవుని వాక్యము ఆ విధముగా చెప్పెను అనునది తప్ప మరే ఆధారమునూ లేదు. దేవుడే ఆ విధముగా సెలవిచ్చెను.

GEN 50:25•

JOB 2:9,10•

JOB 19:17•

JOB 32:2•

JAS 5:11

 

80గొప్ప పోరాటములో నున్న యోబును చూడండి. అతని భార్య - అతని భార్య కూడా, అతని సహచారి గూర్చి కూడా ఈలాగు చెప్పెను, "ఆమె ఊపిరి నాకు అసహ్యమాయెను," మరి ఇంకనూ అలాంటివి అతడు… ఆ వ్యక్తి ఎటువంటి ఒక శోధనా కాలమందు యుండెను, శోధనలు, అతని సొంత … బెల్శజరు మరియు తక్కిన వారందరును చెప్పిరి… మరియు ఎలీహు అతనిని నిందించుటకును ప్రయత్నించెను, అటువంటి సంగతులు జరిగెను, అయితే అతడు వాక్యముతో నిలచియుండెనని అతడు ఎరిగియుండెను.

అతని భార్య వచ్చి ఈలాగు చెప్పెను, "యోబు, నీవు దయనీయముగా కనబడుచున్నావు." "నీవు దేవుని దూషించి, ఎందుకు మరణించవు."

"నీవు మూర్ఖురాలివలె మాట్లాడుచున్నావు," అని అతడు చెప్పెను. ఓ, మై! ఎటువంటి కధానాయకుడు!

"మీరు యోబు సహనము గూర్చి వినలేదా?" అని యేసు కూడా అతని గూర్చి ఎత్తి చెప్పెను.

యోబు తనకివ్వబడిన కర్తవ్యములో కొనసాగిపోయెను, అబ్రాహాము తనకివ్వబడిన కర్తవ్యములో కొనసాగిపోయెను. అవునండి! ఇస్సాకు తనకివ్వబడిన కర్తవ్యములో కొనసాగిపోయెను. యోసేపు తనకివ్వబడిన కర్తవ్యములో కొనసాగిపోయెను. యోసేపు ఈలాగు చెప్పెను, "నన్ను ఇక్కడ పాతిపెట్టవద్దు; నన్ను ఇచ్చట పాతిపెట్టండి. నా పితరులతో పాటుగా నన్ను ఇచ్చట పాతిపెట్టండి. వారు ఏలాగు పాతిపెట్టబడిరో ఆలాగునా నన్నునూ పాతిపెట్టండి — వాక్యము, వారు పాతిపెట్టబడిన మైదానములోనే, వారు పాతిపెట్టబడిన స్థాలములోనే." నా విషయములో కూడా అదియే. ఆ కారణము చేతనే నేను యేసు నామములో పాతిపెట్టబడగోరుచున్నాను; క్రీస్తులోనున్నవారిని దేవుడు తనతో కూడా తీసికొనివచ్చును.

JOSH 10:14

 

81అందుచేత, ఆ విధముగా, ఆ విధముగా, ఆ విధముగా కధానాయకులు బయలు వెళ్ళుటను మనము చూడగలము. వారిని పంపించిన ప్రధాన నాయకుడి (కెప్టెన్)… సమయము ఆసన్నమాయెను. వారు యుద్ధభూమిలో కూలి, గొప్ప విజయములు పొందిరి.

వారు వారియొక్క విజయోత్సవ దినములకు వచ్చి, మరియు వారి శత్రువుపై విజయము పొందిరి. వారు, యెహోషువావ కూడా ఒక దినమున తన స్వంత మాటలతో అతడు సూర్యుని నిలిపివేసెను. అది ప్రకాశించలేదు. మరియు 24 గంటల వరకూ సూర్యుడూ ఆస్తమించలేదు. అంతకు ముందు గానీ దాని తరువాత గానీ, ఎవరునూ సూర్యుని ఆగునట్లు ఆజ్ఞాపించగా ఒక మానవునియొక్క మాటను దేవుడు విన్నట్లుగా లేదు అని బైబిలు సెలవిచ్చుచున్నది.

JOSH 10:12,13•

DAN 12:13

 

82ఎందుచేత? చూశారా, అతడు శత్రువును చిత్తుగా ఓడించెను, చూశారా. వారు చిత్తుగా ఓడించబడి ప్రతి వైపునకు తరుమబడ్డారు. అతడు వారికొరకై వేటాడి మరియు వారిని చంపవలసి వచ్చెను, దానికి జరగవలసినదంతయు అదే, ఏలయనగా అది అతనికివ్వబడిన కర్తవ్యము మరియు అది రాత్రివేళ అయినచో, వారు మరలా తిరిగి సమీకరించుకుని, ఒక దగ్గరకు వచ్చి మరియు ఆ విధముగా వారు ఎక్కువమందిని కోల్పోవుదురు.

అందుచేత అతడు ఈ విధముగా చెప్పెను "నాకు సమయము కావలెను, నాకు వెలుగు కావలెను. సూర్యుడా, ఆగిపొమ్ము." ఆమేన్. ఓ, దేవుడు! దేవుడు ఒక మానవుని యొక్క మాటలు విని సూర్యుని నిలిపివేసెను. అతడు వెంబడించి, శత్రువులలో ప్రతి వారినీ ఏరి మరియు వారిని హతమార్చేవరకూ అది 24 గం.ల వరకూ అదే స్థానములో నిలిచెను. వారు లేకపోయిరి… వారు తిరిగి సమకూరు వరకూ సమయమివ్వలేదు. అతడు కదులుచూ వెళ్ళెను, అయినను యెహోషువా తన ప్రాణము విడిచి భూమి ధూళిలో పడియున్నాడు.

అయితే దానియేలు చూచినటువంటి ఈ గొప్ప యువరాజైన క్రీస్తు వచ్చినప్పుడు… ఆ గొప్ప యోధుడైన దానియేలు సమస్యలు మరియు అటువంటి విషయముల మధ్య మరియు గొప్ప… (ఎక్కడైతే, మనకు సమయముండిన యెడల, అతనిగూర్చి చెప్పుకొనెదము) అయినను, భూధూళిలో అతడు పడియుండెను. "నీవు అంత్యము వరకు నిలకడగా వుండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీవందులో నిలిచెదవు," అని ఆయన చెప్పెను. ఇప్పుడు, అతనికివ్వబడిన ఈ వాగ్ధానము ఈ మిగతా కధానాయకులందరికీ ఇవ్వబడెను… చివరిగా ఆ నిర్ణయాత్మకమైన గడియ వచ్చు సమయమునకు అది చెల్లించబడును.

యేసు భూమి మీదికి వచ్చెను. ఆయన ప్రతీ వ్యాధిని జయించెను. ఆయన ప్రతీదానిని జయించెను. ఇప్పుడు, ఆయన సమాధిని జయించవలసియుండెను. ఆయన మరణమును జయించెను. మరణము ఆయన సన్నిధిలో నిలువలేకపోయెను. ఆయన ఎన్నడూ కనీసము ఒక్క భూస్థాపన ప్రసంగమునైనను ప్రసంగించలేదు. లేదండి. నాయీను విధువరాలు, ఆమె కుమారునితో ఆ రీతిగా బయటకు వచ్చెను. ఆయన దానిని నిలిపి మరియు అతనిని పైకి లేపెను. ఓ మై! అవునండి! ఆయన తనకు మరణముపై అధికారము కలదని ఋజువు చేసెను.

JOHN 14:19•

EPH 4:8

 

83ఇప్పుడు, అక్కడ ఇంకనూ ఇద్దరు శత్రువులున్నారు: అది సమాధి మరియు పాతాళము (నరకము, సమాధి). కావున ఆ దినమున ఆయన మరణించినప్పుడు, సూర్యుడు ప్రకాశించలేనంతగా, భూమికి నరముల ఉద్రిక్తత కలుగునంతగా, బండలు కొండల నుండి దద్దరిల్లినట్లుగా మరియు ఆ రీతిగా అంతగా ఆయన మరణించెను. ఆయన చనిపోయెను. ఆమేన్. పాతాళమునకు వెళ్ళెను. ఆయన మరణమును జయించెను. ఆమేన్. ఆయన పాతళమును జయించెను. ఈస్టరు ఉదయమున ఆయన సమాధిని జయించెను. ఆమేన్. ఒక పూర్తి విజయోత్సవ దినము గూర్చి ఒక నిజమైన విజయోత్సవ దినమును గూర్చి మాటలాడుడి. వారిని బయటకు తెచ్చెను. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి నుండి బయటకి వచ్చినప్పుడు, అక్కడ బంధీలైనవారిని ఆయన తీసుకువచ్చెను. ఆయన చెరను చెరగా కొనిపోయెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయన ఆ కధానాయకులందరినీ తనతోపాటు సమాధి నుండి బయటకు తీసుకు వచ్చెను. ఆ దినమున వారు రాజ్యములోనికి ప్రవేశించునప్పుడు, అది ఒక గొప్ప సమయమై యున్నది మీరెరుగరా? మై! దేవుని రాజ్యమునకు వెళ్ళెను, అక్కడికి బంధీలైన భక్తులను తీసుకు వచ్చెను.

అది ఒక సంపూర్ణ విజయమైయుండెను, ఒక సంపూర్ణ విజయము. ఆయన చనిపోయిన కధానాయకులందరిని బయటకు తీసుకొనివచ్చెను. ఆయన అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును, యోబును మరియు ఆ తక్కినవారందరిని బయటకు తీసుకొనివచ్చెను. తనతో పాటు సమాధి నుండి వారిని బయటకు తీసికొనివచ్చెను. ఆయన బంధించెను… చూడండి, ఆయన భూమి మీదికి వచ్చెను మరియు మరణమును బంధించెను, ఆయన పాతాళమును బంధించెను, ఆయన సమాధిని బంధించెను. ఆయన ప్రతి దానిని బంధించెను.

మరియు ఇప్పుడు, ఆయన తన పరిశుద్దులతో కలిసి లేచెను (ఆమేన్!).

84ఇప్పుడు, "ఆయవ పైకి ఆరోహణుడై మరియు మనుష్యులకు తిరిగి ఈవులను అనుగ్రహించెను." అది ఏమైయున్నది? ఖడ్గములు, వారి చేతిలో ఖడ్గములనుంచెను, చూశారా, జయించుటకు వాక్యమును ఖడ్గమును ఉంచెను. ఓ, మై! ఆయన వారికి ఖడ్గములను ఇచ్చెను. దేని కొరకు? వాక్యము, దేనిని జయించుటకు వచ్చెను? వ్యాధిని, పాపమును, మూఢ నమ్మకములను, దుష్టత్వములను జయించుటకు, జీవించగోరు ప్రతి ప్రాణిని తీసుకువచ్చుటకు, ప్రతి ఒక్కరిని, "నేను జీవించుచున్నాను గనుక, మీరునూ జీవించెదరు" అను గ్రహింపునకు తీసికొని వచ్చుటకై యున్నది.

విశ్వాసము యొక్క పోరాటమును మనము కలిగియున్నాము. మంచి పోరాటము… మనము మన విజయమును పూర్తి చేయుదము, ఏలయనగా మన సంపూర్ణ విజయము ఖచ్చితమై యున్నది. అది నిశ్చయంగా అది ఉండవలసియున్నది. మనము దానియొక్క ప్రధమ ఫలములను కలిగియున్నాము. ఇప్పుడు, మనము మన హృదయములో దానిగూర్చిన ఋజువును కలిగియున్నాము, ఏలయనగా ముందుగానే మొదటి యుద్ధము మన వెనకాలనున్నది. యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము జయించుటకు సమర్దులమైయున్నాము. మనకొక విజయోత్సవ దినముండెను.

85నాకు జ్ఞాపకమున్నది. ఒక రాత్రి పది గంటల సమయములో, అక్కడ ఆ చిన్న పాత గ్యారేజి వద్ద నేను ప్రార్ధించుచుండినప్పుడు, "దేవా నన్ను చంపుము లేదా నన్ను రక్షించుము." నేను సంఘములకు వెళ్ళితిని, మరియు వారు నన్ను వచ్చి, బోధకునితో కరచాలనము చేయుటకు కోరిరి.

నేను చెప్పాను, "నాకు అంతకన్నా అధికమైనది కావలెను," చూశారా.

పిదప ఆ గ్యారేజి వద్ద ఆ రాత్రి నేను ఇట్లు చెప్పినప్పుడు, "దేవా, నేనింక ఎంతమాత్రము ముందుకు వెళ్ళలేను. నేను చనిపోవుదును." ఆ పాత, తేమ భవనములో నేను అక్కడ మోకరించి వున్నప్పుడు మరియు… ఆ పాత గడ్డి బస్తాపై మోకరించి, నా చేతులు పైకెత్తి, "దేవా, ఎట్లు మాట్లాడవలెనో నాకు తెలియదు," అని చెప్పుచుంటిని. నన్ను క్షమించుమని ఆయనకు నేనొక ఉత్తరమును వ్రాయగోరితిని. ఎట్లు ప్రార్దించవలెనో నేనెరుగను.

నేను క్షమించబడగోరితిని.

86నేను ఆ పడకపై మరణించుచుండగా నేను దానిని వాగ్ధానము చేసితిని, ఆయన నాకు అనుమతించెను. వైద్యులు నన్ను వదిలివేసినప్పుడు, నా గుండె కేవలం నిమిషమునకు పదిహేడు సార్లు మాత్రమే కొట్టుకొనుచుండెను. అది ఎంత నెమ్మదిగా కొట్టుకొనుచున్నదో మీరెరుగుదురా, "ఈయన చనిపోవుచున్నాడు" అని అతను చెప్పెను. మరియు నేను అది వింటిని. మా నాన్నగారితో చెప్పి మరియు తెరలను నా చుట్టూ దించిరి.

ఆ గదిలో అక్కడ ఆ గడియకు పెద్ద పాల పిట్ట పక్షులు అన్నివైపుల నుండి వచ్చుటను నేను చూశాను, ఆ తెర నా చుట్టూ ఆ రీతిగా నుండెను. ఆ నర్సు ఏడ్చుటను నేను వింటిని. "అతను ఒక పిల్లవాడు కాక మరేమి కాదు, చూశారా, మరియు అతను పోవుచున్నాడు." వెన్నులోని మత్తుమందు బయటకు వచ్చి మరియు నా గుండెలోనికి వెళ్ళెను, చూశారా. అది ఒక నిమషమునకు కేవలం పదిహేడు సార్లు మాత్రమే కొట్టుకొనుచుండెను.

నేనింటికి వచ్చినప్పుడు, నేను దేవుని ప్రేమించుచున్నానని ఋజువుపరచుకొనవలసియుండెను. నేను అక్కడ ఆ నేలపైన పడి మరియు నేను చెప్పితిని, "నాకెట్లు ప్రార్ధించవలెనో తెలియదు." మరియు నేను నా బొటనవేలి యొక్క గోరును కొరికితిని. బహుషా నేను చిత్రపటములను చూచితిని. నేను ఈ విధముగా నా చేతులు ముడుచుకొని వ్రేళ్ళను దగ్గరకు పెట్టి వుంచితిని.

"ప్రియమైన అయ్యా: నేను నీతో మాటలాడుటకు ఇష్టపడుచున్నాను," అని నేను చెప్పితిని. నేను విన్నాను. నేను ఇట్లు చెప్పాను, "నాకు వినబడుటలేదు." "నేను నా చేతులను తప్పుగా ముడుచుకున్నానేమో, బహుషా ఈ విధముగా చేయవలెనేమో," అని నేను అన్నాను. మరియు నేను నా…

నేను ఇట్లు అన్నాను, "ప్రియమైన అయ్యా, నేను… యేసు క్రీస్తు, నేను నీతో మాటలాడగోరుచున్నాను." నేను అన్నాను, "అయ్యా, నీవు నాకు జవాబిచ్చినట్లుగా, ఏమియూ నాకు వినబడలేదు. 'దేవుడు నాతో మాటలాడినాడు' అని ఇతరులు చెప్పుటను నేను విన్నాను. ఇప్పుడు నేను ఈ విషయమును మీతో మాటలాడగోరుచున్నాను. నేను దానిని చేసెదనని నీతో ప్రామాణము చేయుచున్నాను. అయ్యా, దయచేసి నీవు వచ్చి, నాతో మాట్లాడవా?"

"కాదు, నేను నా చేతులను సరిగ్గా పట్టుకొనలేదు, లేదా ఆయన ఏదైన చెప్పియుండును," అని నేను తలంచాను. అది ఎట్లు చేయవలెనో నేనెరుగను. ఎన్నడూ నా జీవితములో ప్రార్దించలేదు. ఏమి చేయవలెనో తెలియదు - ఈ పాత కట్టడము.

87ఒక దినమున, పిదప, నేను దీనిని తలంచితిని… "లేఖనముల ప్రకారము, నేను దానిని వినిన ప్రకారము, ఆయన ఒక మానవుడైయుండెను. ఆయన ఒక మానవుడైయుండినయెడల, ఆయన ఒక మానవునిగా అర్ధము చేసికొనును." [నిజము] "ఇప్పుడు, నీవు వింటున్నావో లేదో నాకు తెలియదు" అని నేను తలంచితిని.

అపవాది ఇట్లు చెప్పెను, "ఎందువలన, నీవు పాపము చేసితివి, నీ కృప దినము నుండి తొలగిపోతివి, ఇక అది ఎంతమాత్రమూ లేదు, చూశారా. నీవు ఎంతగా దానిని కలిగించితివనగా - ఆయన నిన్ను క్షమించడు."

నేనిట్లు చెప్పాను, "నేను దానిని నమ్మను. నేను అసలు దానిని నమ్ముట లేదు. ఆయన నాతో మాటలాడునని నేను నమ్ముచున్నాను" అని నేను చెప్పాను. "అయ్యా నేను తప్పు చేసితినేమో నాకైతే తెలియదు, ఒకవేళ నేను నా చేతులను సరిగ్గా మడత పెట్టకపోవచ్చును, లేదా అటువంటిది ఏదైననూ, దాని విషయమై నీవు నన్ను క్షమించుము. అయితే నేను నీతో మాటలాడగోరుచున్నాను." "నేను లోకములో హీనమైన వంచకుడను" అని నేను చెప్పాను. నేను ఇట్లు అన్నాను, "నేనీ కార్యములన్నియూ చేసియున్నాను మరియు నీ యొద్ద నుండి పారిపోయాను. మరియు అన్నియూ చేసాను."

నేను ఆ విధముగా మాటలాడుతూనే ఉన్నాను. మొదటి కార్యము మీకు తెలియునా, నేను మాటలాడుచుండగా, ఒక వెలుగు ఆ గదిలోనికి వచ్చెను. గోడ ప్రక్కకు వెళ్ళి, దాని మీదుగా సిలువ యొక్క వెలుగువలె మారెను. ఆ వెలుగు ఒక భాషలో మాటలాడుట ప్రారంభించెను, "అన్యభాషలలో మాట్లాడుట" అను ఒక కార్యమును గురించి నాకు తెలియనే తెలియదు. కనీసం పరిశుద్ధ గ్రంథమునైననూ ఎన్నడూ చదువలేదు. నేను యాకోబు 5:14ను ఆది కాండములో వెదకుచున్నాను. నేన్నక్కడ చూచుచున్నాను, మరియు ఆ వెలుగును నేను చూశాను. అది ఒక విధమైన భాషలో మాటలాడుచుండెను. పిదప అది వెళ్ళిపోయెను.

"అయ్యా" అని నేనన్నాను. నేనిట్లు చెప్పాను, "ఈ క్రైస్తవ జీవితము గురించి నాకేమియూ తెలియదు." నేను చెప్పాను, "నాతో మాటలాడునది నీవే అయినచో, అయ్యా, నేను నీ భాషను గ్రహించలేకపోవుచున్నాను. అయితే నీవు మాటలాడినయెడల… నీవు నా భాషలో మాట్లాడలేనియెడల, చూశారా, నేను నీ భాషను గ్రహించలేను, అయితే బహుశా మనము ఒకరిని ఒకరము ఈ విధముగా గ్రహించగలము. నీవు మరలా తిరిగి అక్కడికి వచ్చినట్లయితే, నీవు నన్ను క్షమించినావనుటకు అది నీకు మరియు నాకు మధ్య ఒక సూచనగా నుండును." అది మరలా అక్కడికి వచ్చెను.

ఓ, విజయోత్సవ దినమును గూర్చి మాటలాడుట! నేను ఒక నిజమైన విజయోత్సవ దినమును కలిగియున్నాను, అవును అక్కడే అది మరలా అదే విధముగా నాకొక విజయోత్సవ దినము కలిగెను. ఓ, మై! అప్పటి నుండి ఆయన తన వాక్యమును నా చేతిలో పెట్టినప్పుడల్లా, రక్తపు సముద్రముల గుండా పయనించుచు, బహుమానము పొందునట్లుగా నేను పోరాడితిని.

88మనందరికీ ఒక విజయము ఉన్నది. మనము ఎన్నో విజయముల ద్వారా పోరాడియున్నాము, సరిగ్గా అతి త్వరలోనే, కొద్దికాలములోనే ఒక గొప్ప విజయము రాబోవుచున్నది. మన సంపూర్ణ విజయోత్సవ దినము అతి త్వరలోయైయున్నది, ఎప్పుడనగా దేవుని కుమారుడు గగనమును చీల్చికొని — ప్రధాన దూత శబ్దముతో కేకవేయునప్పుడై యున్నది — ఆయన మరలా వచ్చినప్పుడై యున్నది. సమాధులు తెరువబడును, మరియు మృతులు నడిచి వచ్చెదరు.

నా టేపులను మీరు ఇచ్చట వేసి వినియందురని నేను తలంచుచున్నాను. నేను ఇప్పుడే పొందుకొన్న ఒక దర్శనమును గూర్చి (లేదా మరు రూపమును గూర్చి, అది ఏదైయున్నను) ఒక గదిలో. నేను అచ్చటకు వెళ్ళి, నేను మిమ్మల్ని చూచునట్లుగానే, ఆ ప్రజలను చూచితిని. ఈ పరిశుద్ధ గ్రంథమును నాకు ముందుగా తెరచియుంచబడినది. మరియు అది సత్యమేనని దేవుడు ఎరుగును, చూశారా. అక్కడ వారు యౌవ్వనస్తులుగా ఉన్నారు, కేవలం అదే విధంగా.

1THS 4:16

 

89మీరందరూ కూటములలో ఉన్నారు, మీరా దర్శనములను గ్రహించియున్నారు — ఒక్కటైననూ తప్పిపోవుటను మీరు ఎన్నడైననూ చూశారా? లేదండి.

ఈ మధ్యనే ఒకని దగ్గరికి ఆయన నన్ను పంపెను మరియు ఏమి జరిగెనో నాకు చెప్పెను. దానిగూర్చి మీ అందరికీ తెలియును. అది ఖచ్చితముగా అక్కడుండినట్లే జరిగెను. అది ఎన్నడూ తప్పిపోదు.

ఈ ఉదయమున ఒక చిన్న క్రైస్తవ గుంపుగా ఇక్కడ కూర్చొనియున్న మీతో నేను చెప్పునది ఏమనగా, మారని దేవుని హస్తమును పట్టుకొనియుండుడి. మీరు ఒక తాత్కాలికమైన విజయమును కలిగియున్నారు. అయితే యేసు వచ్చునప్పుడు, మరియు బూర మ్రోగునప్పుడు, క్రీస్తునందున్న మృతులు లేచినప్పుడు, నిజమైన, సంపూర్ణమైన ఒక విజయోత్సవ దినము వచ్చుచున్నది. ఆ నిరీక్షణ మీలో లేనట్లయితే, అది పొందుకోకుండా ఈ దినమును గడిచిపోనియ్యకుడి.

90కొద్దిసేపటి క్రితం నేను తిరిగి చెప్పగోరుచున్న ఒక చిన్న కార్యమును విని యున్నాను. ఆది నుండి వచ్చెను. ఆదివారమున ఆ వ్యాఖ్యానమును చేసినది బిల్లీయై యుండెనని నేను నమ్ముచున్నాను. ఒక నేరమును చేసిన ఒక పిల్లవాడుండెను. దానిగూర్చి మీరు విన్నారో లేదో నాకు తెలీదు. అతడొక నేరమును చేసెను, వారతనిని చెరసాలలో వేసిరి. వారు అతను కావునా అతనికి ఒక న్యాయవిచారణ ఉండెను. న్యాయమూర్తి చెప్పెను.

మరియు న్యాయస్థానములో ప్రమాణ పూర్వకముగా నియమితులైన సభ్యులతో కూడిన సంఘము వారు వచ్చిరి. వారిట్లు చెప్పిరి, "మేము ఆ నేరము విషయములో ఆ పిల్లవానిని దోషిగా కనుగొంటిమి. మేము…" "అతని ప్రాణము కొరకు మేమడిగెదము," అని సభ్యులు చెప్పెను.

"నీ నశించిపోవు జీవము పోవునంతవరకూ నీవు ఒక త్రాడుకు వ్రేలాడదీయబడి చనిపోవలసిందిగా నేను ప్రకటించుచున్నాను. దేవుడు నీ యొక్క ప్రాణముపై కనికరము చూపును" అని న్యాయమూర్తి చెప్పెను.

ఆ పిల్లవాడు చెరసాలలోనికి తీసికొనిపోబడి, మరియు లోపల అతడు చనిపోవునంతవరకూ అతడక్కడ నుండుటకై కారాగారములో నుంచెను. స్నేహితులు వచ్చి న్యాయమూర్తితో ఇట్లు చెప్పిరి, "జడ్డిగారు, ఈ పట్టణములో నిన్ను ఎన్నుకొనుటకై మేము సహాయము చేసితిమి. దయచేసి, దయచేసి ఆ యౌవ్వసుడిని ఆ రీతిగా చనిపోనీయకుడి."

నేను ఇప్పుడే మరొక దానిపై టెక్సాస్ నుండి వచ్చితిని… ఆ విధముగా ఏదో కార్యము. ఒక యౌవ్వనుడు మరియు ఒక యౌవ్వనురాలు… మరియు దేవుడు వారి ప్రాణములను రక్షించెను. వారు రెండు, మూడు దినములలో చావవలసినవారై యున్నారు. వారు వారియొక్క ప్రాణములను విడిచిపెట్టిరని దినపత్రికలో (మీరక్కడ నాతో ఉన్నారు), మీరందరూ చూసియున్నారని నేను ఊహించుచున్నాను.

91కావున వారు (ప్రజలు) బ్రతిమాలిరి. ఆయన దానిని చేయకుండునట్లు బ్రతిమాలిరి. కావున కొద్దిసేపయిన తరువాత రాష్ట్ర గవర్నరు వద్ద… ఒక దినమున ఆ తల్లి ద్వారము వెలుపల ఆ రీతిగా ద్వారము వద్ద పడిపోయెను. లోనికి వెళ్ళుటకై ఏడ్చెను. మరియు చివరిగా ఆ వ్యక్తి లోపలికి వచ్చెను.

"గవర్నరు గారు, ఆ పిల్లవాని తల్లి బయట ఉన్నది. ఆమె మిమ్మును చూడగోరుచున్నది" అని చెప్పెను.

మరియు "ఆమెను లోపలికి తీసికొని రండి," అని గవర్నరు చెప్పెను.

ఆ స్త్రీ ఎంతో దీనముగా ఆమె చేతులు మరియు కాళ్ళపై ప్రాకుతూ గవర్నరు యొద్దకు వచ్చి, అతని బూట్లను గట్టిగా పట్టుకొనెను. "అయ్యా, వాడు నా పిల్లవాడు. అతన్ని చంపవద్దు. అతన్ని చంపవద్దు. అతడు ఒక్కడినే కలిగియున్నాను. అతన్ని చంపవద్దు," అని ఆమె అనెను. ఆమె ఇట్లు చెప్పెను, "గవర్నరు గారు, దానిని చేయుట అతని ఉద్దేశ్యము కాదు. అతనిని చెరసాలలోనే జీవించనీయుడి; అయితే అతని ప్రాణమును తీయకుడి."

"మంచిది, నేను వెళ్ళి అతన్ని చూచెదను," అని గవర్నరు చెప్పెను.

"మంచిది…" అనెను

కావున అతడు ఎక్కడుండెనో ఆ వారునకు గవర్నరు వెళ్ళియుండెను, మరియు వారు లోపలికి వెళ్ళిరి, మరియు ఆ పిల్లవాడు పొగరుగా ప్రవర్తించగోరెను.

చెప్పెను, "నిన్ను ఎవరో చూచుటకు వచ్చిరి."

గవర్నరు లోపలికి వెళ్ళి, "యౌవ్వనస్తుడా, నేను నీతో మాటలాడగోరుచున్నాను" అని చెప్పెను.

అతడు నిజముగా పొగరుబట్టిన వాడాయెను, కేవలము కూర్చొని, మౌనముగా వుండి, ఏమియూ మాటలాడలేదు.

ఆయన చెప్పెను, "యౌవ్వనస్తుడా, నీవు నాతో మాటలాడవలసిందిగా కోరుచున్నాను. నేను నీతో మాటలాడగోరుచున్నాను."

"ఆ పిల్లవాడు అతను చెప్పినది ఏమియు విననట్లుగా నటించెను.

ఆయన చెప్పెను, "యౌవ్వనస్తుడా, నీవు నాకు చెప్పినయెడల, నేను నీకు సహాయము చేయగలను."

"ఇక్కడి నుండి బయటికి వెళ్ళుము. నీవు చెప్పునది ఏదియూ నేను వినగోరుట లేదు" అని అతడు చెప్పెను.

"సరి, కుమారుడా.." అని ఆయన అనెను.

"నోరు మూసుకొనుము. నేను ఉద్రిక్తుడనై ఉండుటను నీవు చూచుట లేదా? నీవు చెప్పబోవునది ఒక్క మాటయైననూ నేను వినగోరుట లేదు" అని అతడు చెప్పెను.

ఆయన చెప్పెను, "మంచిది, నేను వచ్చిన…"

"ఈ గది నుండి బయటికి పొమ్ము," అని అతను చెప్పెను.

కావున అతడు బయటకు నడచి వెళ్ళెను. వారు ద్వారములు మూసివేసిరి.

కావున అతడు వెనుకకు నడిచినప్పుడు… ఆ ద్వారము దగ్గరనున్న పోలీసు ఇట్లు చెప్పెను, "నీవు చాలా బుద్ధిహీనుడవై యున్నావు."

"చికాకుపడే స్వభావం గల వ్యక్తి ఎవరైయుండెను, ఏదేమైనా?" అని అతడు చెప్పెను.

"ఆయన రాష్ట్రము యొక్క గవర్నరై యుండెను" అని ఆయన చెప్పెను.

అతను చెప్పెను, "కాదు, గవర్నరు కాదు! నన్ను క్షమించగల ఒకే ఒక వ్యక్తి మరియు నేనతన్ని నా గది నుండి వెళ్ళగొట్టితిని. నా క్షమాపణ పత్రముపై సంతకము చేయగల ఒకే ఒక వ్యక్తి, మరియు నేనతన్ని గది నుండి బయటకు వెళ్ళగొట్టితిని!"

గవర్నరు బయటకు వెళ్ళి వెంటనే, "అతడు తన ఎన్నికను చేసికొనెను," అని చెప్పెను.

92కావున ఆ పిల్లవాడు చెప్పిన చివరి కార్యము… అతన్ని వ్రేలాడదీయుటకై తన ముఖముపై వారు నల్లని ముసుగును వేసినప్పుడు, తాడును బిగుతుగా వారు లాగినప్పుడు, ముసుగు వేసినప్పుడు, "దానిగూర్చి ఆలోచించుము! గవర్నరు నా గదిలో నిలబడెను మరియు నేను అతనిని బయటకు త్రోసివేయని యెడల ఆయన నన్ను క్షమించియుండును" అని అనెను.

ఈ ఉదయము ఆ గవర్నరు మన గది ప్రక్కన నిలబడియుండలేడని మనమెట్లు తలంచగలము? ఆయనను త్రోసివేయకుడి. మీరు ఆయన యొద్దనుండి క్షమాపణ పొందనెడల, (ఆయన గవర్నరు మాత్రమే కాదు కాని రాజైయుండెను), నిన్ను క్షమించగల ఒకే ఒకాయన, ఆయన మాత్రమే. నీవు ఎంతోకాలంగా నివసించుచున్న ఆ చిన్న గది ప్రక్కన ఆయన నిలబడియుండెనేమో. ఎందుకొరకు ఆయనను నీవు లోపలికి రానీయకూడదు, నీవు దానిని చేయనియెడల, నీవు సంపూర్ణముగా ఆయనకు లోబడనియెడల…

ఈ దీనమైన మార్గమును నీవు ఏదో ఒక దినమున కనుగొనెదవు. వీరు బుద్ధిహీనులవలె యున్నారు, వారేమి మాట్లాడుచున్నారో వారికే తెలియని ఒక గుంపు ప్రజలుగా వీరున్నారని నీవు ఒకవేళ నీలో తలంచుకోవచ్చు, కాని నీవు ఆ దీనమైన మార్గమును కనుగొనే తీరుదువు. గవర్నరు ఈ ఉదయమున ఇచ్చట ఉన్నాడు. నీవు అవసరతలో యున్నయెడల, గదిలో వ్యాధి కలిగియుండి నీవు దానినుండి విడుదల పొందకున్నయెడల, గవర్నరు ఇచ్చట ఉన్నాడు — లోకము యొక్క గవర్నరైయుండెను. ఆయన నీతిమంతుడైయుండెను. ఆయన నిన్ను బయటకు తప్పించును. ఆయన వచ్చెను, ఆయన నీ క్షమాపణపై సంతకము చేసెను. ఆయన ఈ ఉదయమున దానిని నీకివ్వగోరుచున్నాడు. దానిని త్రోసివేయకుము.

ఒక నిమిషము మన తలలు వంచెదము.

93నీవు గనుక ఒక నిజమైన విజయమును ఇప్పుడు పొందగోరినట్లైతే, నీ తలను వంచినవాడవై, ఎందుకొరకు ఈ ఉదయమున లోబడకూడదు మరియు ఎందుకొరకు నీ క్షమాపణ కొరకై గవర్నరును సంతకము చేయునట్లు అనుమతించకూడదు. ఆయన నిన్ను బయటికి తీయుటకు సిద్ధముగా నున్నాడు — పాపము నుండి నిన్ను బయటకు తీయుటకు, అవిశ్వాసము నుండి నిన్ను బయటకు తీయుటకు, వ్యాధి నుండి నిన్ను బయటకు తీయుటకు — నీవు దేనినుండి బయటకు తీయబడగోరెదవో, దానినుండి నిన్ను బయటకు తీయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము ప్రార్ధన చేయుచుండగా నీవు దానిని చేయుము. ఇప్పుడు, మీ స్వంత విధానములో మీరు ప్రార్దన చేయండి. మీరు ఆయనతో మాటలాడండి, చూశారా.

ఆ వార్డెను గవర్నుతో మాటలాడగలిగియుండును. దానివలన ఎటువంటి మంచి జరిగియుండదు, చూశారా. ఆ పిల్లవాడు గవర్నుతో మాటలాడవలసియుండెను, చూశారా. మీరు గవర్నుతో మాటలాడవలసియున్నది. మీరు వ్యాధిగ్రస్తులైనయెడల, ఆయనతో మాటలాడుడి. మీరు పాపము చేసి మరియు తప్పిదము చేసినయెడల, ఆయనతో మాటలాడుడి. మీ కొరకు ఆయన వద్ద క్షమాపణ ఉన్నది.

94పరలోకపు తండ్రీ, మేము ధన్యులమైయున్నాము. ప్రభువా, నేను నీకు ఎంతగానో ఋణపడియున్నాను. నా పాపము యొక్క ఋణమును నేను చెల్లించుటకు ఎటువంటి మార్గము లేకుండెను. నేను ఒక దినమున కారాగారములో నుంటిని, ఏలయనగా నేను ఆ గదిలోనే జన్మించితిని. స్వేచ్చయనగా ఏమిటో నాకు తెలియకుండెను. వెల ఎంతో అధికముగా నుండెను, నేను దానిని చెల్లించలేను. అయితే నీవు నా గదిని దర్శించిన దినమున నేను ఎంతగానో ఆనందించుచున్నాను, అది మాత్రమే నన్ను క్షమించగలిగెనని నేను దానిని గుర్తించాను. నేను స్వతంత్రుడునై, విజయమును కలిగి, ఒక సంపూర్ణమైన విజయమును కలుగుటకు ఒకే ఒక మార్గమేదనగా, నీవు నా కొరకై సంతకము చేసిన క్షమాపణను స్వీకరించుటై యున్నది.

ఈ దినమున నేను స్వతంత్రుడను, నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ప్రభువా, నేను బంధీగృహము నుండి బంధీగృహమును దర్శించుచున్నాను, ఎవరైతే… వివాహ విషయములో ఇబ్బందులు గలవారు, వ్యాధిగ్రస్తులు మరియు జ్వరపీడితులు, వ్యాధిగ్రస్తులై చెరసాలలో నుండువారియొద్దకు, పాపభరితులై చెరసాలలో నుండు వారియొద్దకు ధైర్యము కోల్పోయి మరియు సందేహము గలిగి చెరసాలలో ఉండినవారిని నేను దర్శించుచున్నాను. నేను వారియొద్దకు ప్రతి గది నుండి గదికి వెళ్ళుచు, ప్రతి ఒక్కరినీ క్షమించుచు, ప్రతి ఒక్కరిని వెలుపలికి తీయుచు, గవర్నరు నేరుగా వచ్చుచున్నాడని వారికి చెప్పుచున్నాను.

95తండ్రీ, ఈ ఉదయమున ఇక్కడున్న ప్రజల యొక్క హృదయమును నీవెరుగుదువు. ఇది ఒక విజయోత్సవ దినము, ఒక సంపూర్ణమైన విజయోత్సవ దినముగా ఉండనిమ్ము… ప్రతి ఒక్కరూ, ప్రభువా, ఈ దినమున, విజయమును స్వీకరించునట్లుగా ఉండనిమ్ము. ప్రభువా, దీనిని అనుగ్రహించండి.

ఈ దినమున ఈ భవనములో వున్న ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడనిమ్ము. ఎడారి వెనకాల విశ్వాసము యొక్క మండుచున్న పొదనుండి దేవుని యొక్క స్వరము మాటలాడునప్పటి సహాయముగా దీనిని ఉండనిమ్ము. ఓ దేవా! విశ్వాసము యొక్క ఆ చిన్న మంట ఎక్కడైతే మండుచున్నదో, ఆ చిన్న నిరీక్షణ ఎక్కడైతే మండుచున్నదో, దాని ద్వారా ప్రతి ఖైదీతో ఈ ఉదయము దేవుని యొక్క స్వరమును మాడలాడనిమ్ము, మరియు "నేను నిన్ను స్వతంత్రునిగా చేయుటకై ఈ దినమున వచ్చియున్నాను" అని చెప్పుము.

ప్రభువా, ఒక అబ్బాయి లేదా అమ్మాయి, పురుషుడు లేదా స్త్రీ నిన్ను వారియొక్క రక్షకునిగా ఎరుగకుండినయెడల, ఆ చిన్న స్వరమును మాటలాడనిమ్ము, "అవును, దేవుడున్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన ఏమైయుండెనని వారు చెప్పినట్లు, ఆయన ప్రతీదియై యుండెనని నేను నమ్ముచున్నాను" అని ఆ చిన్న విశ్వాసము యొక్క స్వరమును ఇప్పుడు మాటలాడనిమ్ము. ప్రభువా, ఆ చిన్న విశ్వాసము ఇప్పుడు వారిని స్వతంత్రులనుగా చేయనిమ్ము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము.

వారిని ఆశీర్వదించుము. ప్రభువా, ఇచ్చటయున్న ఐసాక్సన్ను ఆశీర్వదించుము. ఈ యవ్వనస్తుడుని, ఇతడి భార్యను, మరియు ఇతడి చిన్న పిల్లలను మేము ప్రేమించుచున్నాము. చిన్న సంఘమును ఆశీర్వదించుము, ఓ దేవా, వారి నిమిత్తము మేమెంతో ఆనందించుచున్నాము. ఇచ్చట వారి తలలపై ఇంటి పైకప్పుయు, ఇచ్చట ఒక స్థలము వారికి యుండుటను చూచి మేమెంతో సంతోషించుచున్నాము. ప్రభువా, నీవు వారికి ఎంతో మంచివాడివిగా యున్నావు. మేము నీకు ఎంతో కృతజ్ఞలమై యున్నాము. వారెప్పుడూ దేవుని సన్నిధిలో విధేయులుగాను, మరియు మధురముగాను నిలిచియుందురు గాక.

96ద్వారమునొద్ద ఈ క్రొత్తవారిని ఆశీర్వదించండి. ప్రభువా, సందర్శకులను ఆశ్వీరదించండి. నీవు వారితో ఉండునట్లు మేము ప్రార్ధించుచున్నాము. దేవుడు మాటలాడు ప్రతి మాటకు, "ఆమేన్" అని చెప్పగలిగిన ఈ సంపూర్ణ విజయోత్సవమును వారు ఎన్నడూ స్వీకరించనియెడల, ప్రభువా, ఈ ఉదయము వారు నీలో కలిగియున్న విశ్వాసము, ప్రతి మాటను, "ఆమేన్" తో ముగించును గాక. ప్రభువా, అనుగ్రహించండి. మమ్ములను ఆశీర్వదించండి. వ్యాధి, బాధల నుండి విడిపించుము. నీకే మహిమను తెచ్చుకొనుము.

ప్రియమైన దేవా, దీని తరువాత మేము బాధపడకుందుము గాక, ఈ కష్టములు మరియు కార్యములు కేవలము దేవుడు మమ్ములను ప్రేమించుటవలనేయని మమ్ములను గుర్తుంచుకొననిమ్ము. ఆయన వాటిని మా కిచ్చుచున్నాడు, ఏలయనగా ఆయన మాయందు నమ్మిక కలిగియున్నాడు. మేము విశ్వాసమును కలిగియుండి, ఆయన కొరకై ప్రేమను కలిగియుండి, జయించుటకు మేము సమర్దులమై యుందుమని ఆయన విశ్వాసించుచున్నాడు. ఆయన దానివైపు చూచుచున్నాడు. మేము దుఃఖపడి మరియు దాని విషయమై మదనపడకుందుము గాక. మేము కేవలం అక్కడికి నడిచి వెళ్ళి, మరియు వాక్యమును పలికి ముందుకు నడిచిపోదుము గాక. సముద్రములు తెరువబడును. విజయోత్సవ దినములు వచ్చును. ప్రభువా, దానిని అనుగ్రహించండి. మీ కాలములో ఇది ఒక గొప్ప విజయోత్సవ దినములుగా ఉండనిమ్ము. మేము మరలా కలుసుకొనువరకు మమ్మల్ని ఆశీర్వదించండి, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

97నేను వెళ్ళుటకు ముందు నేను దీనిని చెప్పగోరుచున్నాను. నేను టూసాన్కు వెళ్ళుటకు ఇంకా గంటన్నర మాత్రమే ఉన్నది. అది ఒక చిన్న ప్రయాణమే. అయితే నేను దీనిని చెప్పగోరుచున్నాను, నేను ఇక్కడ ఉండుటవలన మీరు కలిగియున్న విశ్వాసమును అనుభూతి చెందుటవలన నేను నిజముగా ఆనందించియున్నాను. దానినుండి ఎన్నడూ దూరంగా వెళ్ళకుడి. ఆ చిన్న మంటను మండుచూ, మరియు మండుచుండనీయుడి. గుర్తు౦చుకొనుడి, దేవుడు ఆ చిన్న మంటలలో మాటలాడును.

సహోదరుడు ఐసాక్సన్, నేను - దానిని ఎట్లు వ్యక్తపరచవలెనో నాకు తెలియడం లేదు. నీవు ఇక్కడికి వచ్చి మరియు ఈ గుంపును పట్టుకొనియుండుట ఎటువంటి ఘనమైన కార్యమై యున్నది. నా సహోదరుడా, నీవింకనూ కొనసాగుటకు దేవుడు నీకు బలమును దయచేయును గాక. వినుటకు వచ్చు ప్రజలైన మీరు, మీరు కొనసాగునట్లు దేవుడు మీకు బలమును, దైవీకమైన బలమును దయచేయును గాక. ఇప్పుడు, ఒకవేళ… కొద్ది నిమిషములలో ఇక్కడి నుండి వెళ్ళుటకు ముందు మీరు సాధారణముగా జరుపునట్లు జరుగునని నేను ఊహించుచున్నాను. సహోదరుడా ఐసాక్సన్… నేను అతనికి ఆరాధనను అప్పజెప్పుచున్నాను.

మీలో ఎవరైనా తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అను బిరుదులు గాక యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మము గూర్చి ధ్యానించుచున్నయెడల, మా చిన్న పాస్టరుగారు ఇక్కడ సిద్ధముగానున్నారు - బాప్తిస్మమిచ్చుటకు దానిని చేయుటకు మేము ఆనందించుచున్నాము. మీ హృదయములో ఎటువంటి సమస్యలైనా యుండినయెడల, మీతో కలిసి అతను ప్రార్ధించుటకు మీరు కోరవచ్చును, అతను దానిని చేయుటకే ఇచ్చటనున్నాడు. మరియు నాకు తెలియును… నాకతను తెలియును, మరియు అతన్ని కలిసాను, అతనితో కూర్చొన్నాను మరియు అటువంటివి, ఒక చక్కని, మర్యాదగల, చిన్న క్రైస్తవ ఆత్మ ఆ చిన్న సహోదరునిలో కనుగొనబడును. మరియు అటువంటి ఒక ప్రార్థనను దేవుడు వినునని నిశ్చయత నాకున్నది.

98హే, అను వేరుగల ఒక వృద్దుడు మా రాష్ట్రములో నివసించెను. అతను ఒక గొప్ప వృద్దుడైయుండెను. అతను ఒక… ప్రతిసారి ఎవరైనా… అతను దీనుడు మరియు మర్యాదగలవాడు. అయితే… కొందరు అతను కేవలం మతపిచ్చి లేదా అటువంటిది గలవాడని తలంచిరి. అయితే మీకు తెలియునా, ఎవరికైనా అస్వస్థత కలిగితే, ఆ వృద్ద నాన్నగారైన, హే ను వచ్చి వారికొరకై ప్రార్ధించుటకు పిలిపించెదరు. అప్పుడు అతను ఎంతమాత్రము పిచ్చివాడు కాదు; అతను ఒక నిజమైన వ్యక్తియై యుండెను.

ఆ వృద్ధ సైనికుడు, ఒక నాస్తికుడు, ఒక పొలమును కలిగియుండి, అక్కడ ఆ కొండపైన నివసించుచుండెను. ఆయన మా నాన్నగారికి స్నేహితుడై యుండెను. నా తండ్రి త్రాగును. దానిని చెప్పుటకు నేను సిగ్గుపడుచున్నాను, అయితే సత్యమేమై యుండునని మీకు తెలియును. పరిశుద్ధ గ్రంథమొక్కటే సత్యమును చెప్పునదైయున్నది, చూశారా.

PS 51:5•

PS 58:3•

2PET 2:8

 

99ఇప్పుడు, చరిత్రయను పుస్తకము మనకున్నది. జార్జి-వాషింగ్టన్ ఎన్నడూ అబద్ధమాడలేదని అది చెప్పెను. దాని విషయమై నేను సందేహపడుదును. దాని విషయమై నాకు సందేహము కలదు. అవునండీ. నేను దానిని నమ్ముట లేదు. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు… మీరు పాపములో జన్మించి, అతిక్రమముతో రూపుదాల్చి, అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చిరి, అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున జార్జి-వాషింగ్టన్ గూర్చియైన ఆ చారిత్రక అంశమును నేను సందేహించుచున్నాను. అయితే అది మానవుని యొక్క మంచి విషయములనే ప్రస్తావించును. పరిశుద్ధ గ్రంథమయితే మనుష్యుని యొక్క రెండు వైపులను గూర్చి చెప్పును.

సొదొమలో లోతు అను ఒక మంచి వ్యక్తియైయుండెను. ఆ పట్టణము యొక్క పాపములు అతని నీతిగల ఆత్మను నొప్పించెను. అయితే అతను తన స్వంత కుమార్తెతో పోయేననియు మరియు ఒక కుమారుని కలిగెననియు చెప్పుటలో విఫలమవ్వలేదు, చూశారా. అది దానియొక్క రెండు వైపులను గూర్చి చెప్పును. కావున మనము రెండు వైపులను చెప్పవలెను.

100మా నాన్నగారు, త్రాగుచూ, ఈ నాస్తికునితో పోవుచుండెను. మరియు అతను ఈ వృద్దుడిని చూసి నవ్వెడివాడు. ఎప్పుడూ అతని వెక్కిరించెడివాడు. వృద్ధ పాప్ హే అని మేమతనిని పిలిచెడివారము, డాడీ హే — కేవలం కొద్దిగా అంచున జుట్టును కలిగియుండేవాడు. అతను ఒక వృద్ధ ప్రసంగీకుడు. కావున ఒక సమయమున వారు వర్షము రావలెనని కోరుచున్నారు. వారి పంటలన్నియూ మండుచున్నవి. కావున వారు గత్యంతరము లేక కెంటకీలోనున్న పాస్టమ్ కింగ్డమ్ అనబడు ఒక చిన్న మందిరమునకు వారు వచ్చిరి. వారక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన చెప్పెనని వారు చెప్పుదురు… అతను…

వృద్ధ డాడీ హే ఒక నానుడి చెప్పేవాడు "ప్రియా, నా ఆత్మను దీవించుము" అని చెప్పెడివాడు. చిన్న దీనుడైనవాడు, పాత గుర్రముపై స్వారీ చేసేవాడు, వృద్ధ సువార్తికుడు మరియు వారు అతనికి ఒక గంపనిండా ఎండిన గుమ్మడికాయలను జీతముగా ఇచ్చెడివారు, మీకు తెలియునా, వారింకా ఏమి కలిగియుండేవారు, మీకు తెలియునా, కొద్దిగా క్రొవ్వు లేదా మరేదైనా… ఆ రీతిగా ఆ పాత సువార్తికులకు వారు జీతమును ఇచ్చేవారు. ఆ తూర్పు వృద్ధ సువార్తికులను మీలో అనేకులు గుర్తుంచుకొనియుందురు.

101ఒక దినమున పంటలన్నియు తగలబడుచుండెను. మరియు వృద్ధ డాడీ హే ఇట్లు చెప్పెను, "మంచిది, ప్రియ నా ఆత్మను దీవించుము." అటువంటి ఒక కూటమును అతడు కలిగిన తరువాత చెప్పెను, "మీలో ఎవరైనా ఉండగోరి, వర్షము కొరకు, దేవుడు మీ పంటలను బ్రదుకనిచ్చునట్లు ప్రార్ధి౦చినయెడల" అతను చెప్పెను, "నాతో మీరు నిలువవచ్చును." సంఘమంతయూ సరిగ్గా అతనితో నిలిచెను.

పాప్, బయట వెలుపలకి వెళ్ళెను (ఒక యౌవ్వనస్తునిగా నుండెను), గుర్రము యొక్క జీనును తీసి, చర్చ్ క్రింద దానిని ఉంచెను. ఏలయనగా, వర్షము పడునని అతనికి తెలుసును. ఆ వృద్దుడు వేదికయొద్దకు వెళ్ళెను. అతడు తన మోకాళ్ళ మీద నుండి కనీసం లేవలేదు.

దానికి గంట తరువాత, అతనొక శబ్దమును విని, చుట్టూ చూచెను. కొండపై నుండి ఒక నల్లని మేఘము వచ్చుచుండెను. అక్కడే అది వున్నది, చూశారా.

102ఆ నాస్తికుడు, మా నాన్నగారి స్నేహితులలో ఆ వృద్ధ బోధకుని వెక్కిరించువారిలో ఒకడు, అతను చనిపోయినప్పుడు, వారతనిని పడకలో పట్టుకొనవలసి వచ్చెను. వాకింగ్ టైఫాయిడ్ జ్వరము అతనికి కలిగెను. అది ఏమిటో బహుషా చాలామందికి తెలియకపోవును. ఓ, అది ఒక ఘోరమైనదై యుండెను. అతను దయ్యములతో గంటల కొలదిగా మూడు లేదా నాలుగు దినముల వరకు పోరాడెను.

అతను "చార్లి, చార్లి" అని అనెను. చార్లి అనగా మా నాన్నగారు. అతను చెప్పును, "ఆయన నన్ను తీసుకొనివ్వకుము, ఆయన నన్ను తీసుకొననీయకము. గొలుసులతో చుట్టూ చుట్టుకొని ఆయన పడక ప్రక్కనే కూర్చొనియుండుటను నీవు చూచుట లేదా. అతను వాటితో నన్ను బంధించనీయకుము. ఓ!" అతను కేకలు వేసెను.

వారు అతడిని పట్టుకొనేవారు, నాలుగు లేదా ఐదుగురు వ్యక్తులు అతడు చనిపోవుటకు ముందు అతడిని ప్రక్కలో గట్టిగా పట్టుకొనేవారు. కెంటకీలో గొడ ప్రక్కకు వారు వారియొక్క బట్టలను తగిలించుకొనుటకు పాత మేకులను కలిగియుండేవారు. మేకులను అట్టే పెట్టియుంచిన ఇల్లును ఎవరైనా చూశారా? అతడి పాత కోటు అక్కడ తగిలించియుండెను. అతను చెప్పెను, "చార్లీ. నా జేబులో కొంత విస్కీ వున్నది. వెళ్ళి, దానిని నా పిల్లలకు ఇయ్యము."

అతని భార్య ఒక క్రైస్తవురాలు, వంటగదిలో, ఏడ్చెను, భోజనమును వండుచుండెను.

"నేను దానిని చేయలేను" అని అతడు చెప్పెను.

అతను చనిపోయే వరకు వారతనిని పడకలో గట్టిగా పట్టుకొనియుండిరి, దయ్యములు అతనితో పోరాడుచుండెను.

103ఎవరినైతే అతడు వెక్కిరించెనో, ఆ వృద్ధ డాడీ హే, అతడు చనిపోవుటకు సిద్ధపడినప్పుడు, బహుషా ఎనుబది-యైదు, తొంబది సంవత్సరములుగలవాడై అతను నిద్రలోనికి వెళ్ళెను. పిల్లలందరూ లోనికి గుమికూడిరి. అతని ముని మనవళ్ళు సైతం అతని ప్రక్కచుట్టూ పోగైరి. అతని గడ్డము, మీకు తెలియునా, తలచుట్టూ కొద్దిగా అంచున జుట్టు ఉండేడిది. ఏమిటి… తలపైన బట్టతల ఉండియుండెను.

అతడు చెప్పెను, "ప్రియ, నా ఆత్మను దీవించుము." ఇట్లు చెప్పెను, "మీరంతా వృద్ధ డాడీ హే చనిపోయేనని తలంచారు కదా? అతడు ఇంకా ఇట్లు చెప్పెను, "మంచిది, నేను చనిపోను," "నేను వంద సంవత్సరముల క్రితమే చనిపోయాను" అని చెప్పెను. "నేను కేవలం యేసుక్రీస్తును కలిసికొనుటకై వెళ్ళుచున్నాను," అని చెప్పెను. "ఓ, అది ఎంతో గొప్ప కార్యము." నా పిల్లలైన మీరందరూ నా పడక చుట్టూ గుమికూడండి," అని చెప్పెను. అతడు పెద్దవారి దగ్గర నుండి చిన్నవారి వరకు తన చేతిలో పట్టుకొని వారిని ఆశీర్వదించెను.

పిదప అతడు, "నన్ను పైకి లేపండి" అని తన ఇద్దరు పెద్ద కుమారులతో చెప్పెను. వారాయనను ప్రక్కలో పైకి లేపిరి. అతను తన చేతిని ఎత్తి పట్టియంచలేకపోయెను. అతను చాలా శక్తిహీనుడాయెను.

అతను తన ఇంకొక కుమారునితో "నా చెయ్యి పై కెత్తుము" అని చెప్పెను.

అతను అతడి చేతులను ఆ విధంగా పైకెత్తెను.

అతను చెప్పెను, "సంతోష దినము, సంతోష దినము, యేసు నా పాపములను కడిగివేసినప్పుడు, సంతోష దినము నేనెట్లు మెలకువతో ప్రార్దించవలెనో నాకు నేర్పించెను. ప్రతి దినము ఆనందముగా జీవించుటను నేర్పించెను." అతడు తన తలను వంచుకొని మరియు వెళ్ళిపోయెను. మంచిది, మనము కూడా వాటిలో ఏదైనా ఒక అంతమునకు రావలసియున్నాము.

104ఇటువంటి దీనమైన వ్యక్తి, ఎవరిలోనైతే మీ నమ్మకమును ఉంచారో ఆయన మీ మధ్య ఈ రీతిగా ఉండుటను బట్టి నేను ఆనందించుచున్నాను. ఆయనను నమ్ముడి, దేవుడు మీ కొరకై, మీ మధ్యన అద్భుతములను జరిగించును. నా కొరకై ఒక కార్యమును, నేను ఈ చిన్న సంఘమును అడగగోరుచున్నాను. నా కొరకు ప్రార్ధి౦చండి, మీరు ప్రార్థించెదరా? నేను కూడా మీ సహోదరులలో ఒకనివంటివాడను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండగోరెదను.

ఇక్కడ మీరు టేపులు మరియు అటువంటి కార్యములను కలిగియున్నారు. నేను అక్కడ ఒక పెద్ద యుద్ధ రంగములో ఉన్నాను. ప్రభువు యొక్క రాకడకై ఎదురు చూచుచున్న సైన్యములో కేవలం ఇది ఒకటైయున్నది. నా కొరకు ప్రార్ధించండి, ఏలయనగా నాకు నిజముగా మీ ప్రార్థనలు అవసరమైయున్నవి. నేను ఆధారపడియున్నాను…

అనేకసార్లు, నేను కఠినమైన స్థలములకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకముగా విదేశాలలో, అక్కడ మంత్రగాళ్ళు, మరియు ప్రతీది వేలవేలసార్లు అక్కడ నిలబడి మిమ్మల్ని సవాలు చేయును. మీరు ఒంటరిగా అచ్చటకి నడిచెదరు. ఏలయనగా, వారు దేనినైనా చేయగలిగియున్నప్పుడు నీవు ఏమి మాటలాడుచున్నావో, నీవు తెలిసికొనియుండుట మంచిది. (ఓ, మై!) దేవుడు ముందుగానే చేసిన ప్రతి దానిని వారు అనుకరించెదరు. వారు చేయగలరు… యన్నె మరియు యంబ్రేలవలె దేవుడు కలిగియున్న ప్రతిదానికి దగ్గరగా ఉండునట్లు వారు అనుకరించగలరు. పిదప నాకు గుర్తున్నది చిన్న విశ్వాస గుంపు గూర్చిన తలంపు (దినము యొక్క ఏ సమయమైయుండెను?) అక్కడ ఎడారి వెనకాల యై యుండెను. సియెరా-విస్టా అను ఒక చిన్న స్థలము వద్దనై యున్నది, చూశారా. ఒక చిన్న ప్రార్ధనా కూటము ఈ సమయమునకు పర్వతము యొక్క అవతలివైపు జరుగుచుండెను. అక్కడ ఆ కౌ-క్యాంప్, అటువంటి మరియొక చోట వారు ప్రార్ధించుచుండిరి.

నేను వెలుపల నడుస్తున్నప్పుడు ఇట్లు చెప్పెదను, "సాతానా, నేను ప్రార్థనతో కప్పబడియున్నాను, నీవు నన్ను ఏమియూ చేయలేవు. నేను యేసుక్రీస్తు నామములో వచ్చియున్నాను," మీరు చూశారా. ఏదో జరుగును.

105మీరు నా కొరకు ప్రార్ధించండి. మీరందరూ ఇప్పుడు దానిని చేయుదురా? ఆమేన్.

సహోదరుడా ఐసాక్సన్, ఇక్కడికి రమ్ము మీకు తెలియును. నేను మీ అందరికి ఇక్కడే ఉండి మరియు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి భోజనము చేయుదునని ఇష్టపడుచున్నాను. అది నాకు ఎక్కువ సమయము తీసికొనును. పురుషులైన మీరు ప్రపంచములోకెల్లా చక్కని వంటచేయువాడిని కలిగియున్నామని తలంచుదురు. మీరు కలిగియున్నారనుటలో ఎటువంటి సందేహము లేదు, చూశారా. నేను నిశ్చయముగా దానిని చేయుటకు ఇష్టపడుచున్నాను. అయితే నేను దానిని ఈ దినమున చేయలేను. మీరందరూ దానిని అర్థం చేసుకొనెదరు. కాదా? మీరు చేయండి, నేను దానిని సరిగ్గా ఇప్పుడు చేయలేను. నేను ప్రస్తుత సమయములో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. నేను క్రిందికి వచ్చి మీతో చిన్న సహవాసమును కలిగియుందును. తిరిగి మరలా రావలెనని మరియు మీతో ఉండవలెనని కూడా నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.

ఇప్పుడు, సహోదరుడా ఐసాక్సన్, ప్రభువు నిన్ను చేయమని కోరిన దేనినైననూ చేయుము. ఇప్పుడు, క్రీస్తుకు ఇంకా లోబడక మరియు ఈ ఉదయము ఇక్కడకు వచ్చి సహోదరుడు ఐసాక్సన్ మరియు నేను ఎక్కడైతే నిలబడియున్నామో, సరిగ్గా ఈ వేదిక ప్రక్కకు ఎవరైననూ రావలెనని కోరియుండి మరియు ప్రార్ధి౦పబడవలెనని కోరినవారు, దేవుడు మిమ్మును రక్షించునట్లు ప్రార్ధించగోరువారు ఇప్పుడు వచ్చెదరా? ఈ దినమున మీరు ఒక సంపూర్ణ విజయమును కలిగియుండెదరు.

1COR 15:54•

1THS 4:16,17•

HEB 13:8

 

106మీరు… మీలో ఎవరైనా పడిపోయినవారై, దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయి మరియు మీరు ఆ సహవాసమును ఎటు తప్పిపోయెరో తెలియక యుండి గత రాత్రి ఆ స్త్రీ వలె ఉండినయెడల. ఓ, మీరు దేవుని యొద్ద నుండి దూరమైనప్పుడు చీకటి మిమ్మును కమ్మును. మీరు మట్టి దారిపై ఉన్నారు, మీరు కోల్పోయెదరు. మీరు పొందవలసిన విజయమును కలిగిలేనియెడల, మీరునూ రాలేరా? ఇది ఒక సంపూర్ణమైన విజయమైయున్నది. ఇది లోకము యొక్క కార్యములన్నింటికంటే ఇది మీకు ఒక విజయోత్సవ దినమైయుండెను.

మీరిట్లు చెప్పుదురు, "సహోదరుడా బ్రెన్హాం నాకనేకమైన కష్టములున్నవి, నేను పైనుంచి క్రింది వరకూ గందరగోళములో ఉంటిని." అది దేవుడైయుండెనని, ఆయన మీయందు నమ్మకముంచియున్నాడని, నేను ఇప్పుడే మీతో చప్పలేదా? మీరాయనను విఫలము చేయలేరు, అవునా? మీరు పడిపోయి ఉండవచ్చును, నీవు ఒక తప్పిదము చేసియుండవచ్చును. అయితే నీవు ఆయనను విఫలము చేయలేవు, చేయుదువా? నీవు మరలా ఒక నిజమైన సైనికునివలె ఖడ్గము పట్టుకుని పైకి లేచెదవు మరియు మరల ముందుకు వచ్చెదవు. అది చేయుటకు మనము ఆనందించుచున్నాము. నిశ్చయంగా, లేనియెడల పిదప సహోదరుడు ఐసాక్సన్ మీ కొరకు మాటలాడుటను కొనసాగించును.

మీరు నన్ను క్షమించినయెడల, నేను టుసాన్ వెళ్ళుటకు బయలుదేరెదను. ప్రభు చిత్తమైతే మరలా మిమ్మును చూచుటకై తిరిగి వచ్చెదను, ప్రభువు మిమ్మును దీవించును. ఇప్పుడు నా కొరకు మీరు ప్రార్ధి౦చెదరా?

గుర్తుంచుకొనండి, ఒక సంపూర్ణ విజయము మరియు మీ కటకమును యేసుక్రీస్తు పై కేంద్రీకరించుడి. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకటే రీతిగానున్నాడు. ఏదో ఒక దినమున మీ కనురెప్పపాటున ఆయన ఆకాశము నుండి ఆర్బాటముతో, ప్రధాన దూత శబ్దముతో వచ్చును, క్రీస్తునందున్న మృతులు లేచెదరు. ఈ మృత-శరీరములు అమర్త్యతను ధరించుకొనును, మనము ఆయనతో కూడా నిత్యము ఉండుటకై వెళ్ళెదము. అంతవరకూ కనిపెట్టుడి మరియు, ప్రార్ధించుడి. ప్రభువు మిమ్మును దీవించును. ఆమెన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...