వచ్చి, నన్ను వెంబడించుడి

వచ్చి, నన్ను వెంబడించుడి

 సరి, కాదు, అది బెక్కీ పుట్టక మునుపైయున్నది. మరియు కావున నేను—నేను అనుకున్నాను, “మంచిది, మీకు తెలియును…” నేను—నేను కేవలం ఒక డైము ఖరీదు చేసే ఒక గిన్నెడు అటుకులను తినేవాడిని. సరి, నేను కేవలం…వారు దానిపై సంతకం చేసి, నాకు నా టిక్కెట్టును ఇచ్చేవారు, మీరు చూడండి, మరియు నేను దానికి వెల చెల్లించేవాడిని, మరియు నేను దానిని తిరిగి ఇచ్చేవాడిని, ఉద్యోగస్తులకు ఇచ్చే ఒక అకౌంటును నేను కలిగియున్నాను గనుక దానిపై రాసి తిరిగి ఇచ్చేవాడిని.

2 మరియు ఒక దినమున ఒక—ఒక గస్తీ దారుల కూటమును మేము కలిగియున్నాము. అప్పుడు వారిట్లన్నారు, “మై,” “అటువంటి దానిని రాసి ఇచ్చిన ఈ వెఱ్ఱివాడు ఎవరు?” చూశారా? ఆ—ఆ అధికారి, “ఒక ప్రాతఃకాల భోజనానికి పది సెంట్లేనా?” అన్నాడు. కావున మీకు తెలుసు కదా అది ఇతరుల దానికంటే చాలా చౌకగా అనిపించుచున్నది. వారిలో కొందరు ఒక డాలరని రాసి ఇచ్చారు, చూడండి; భోజనానికి రెండు డాలర్లని రాసిచ్చేవారు. మరి నేనేమో సరిగ్గా అది ఎంత అయినదో అంతే రాసిచ్చాను.

3 సరి, నేనిట్లన్నాను, “మంచిది, ఇప్పుడు, నేను మార్చవలసిన అవసరంలేదు. నేను కేవలం పది సెంట్లు ఖరీదు చేసే భోజనం చేసినప్పుడు, అంతకన్నా నేను ఏమి చేయాలి?”

4 అసిస్టెంట్ సూపరింటెండెంటు, అయిన శ్రీ ఫీల్డ్స్, ఇట్లన్నాడు, “బిల్లీ, కనీసం ఎట్లైనా గానీ, ఒక్క డాలరనియైనా రాసి ఇవ్వు.” ఇంకా ఇట్లన్నాడు, “ఆ మిగతా వారు చేస్తున్నది అదే కదా.” “నీవునూ వారితో పాటు ఉండవలసియున్నది,” అని అతడు చెప్పాడు.

5 “మంచిది” నేనిట్లన్నాను, “నేను—నేను కేవలం ఒక గిన్నెడు అటుకుల భోజనం తప్ప మరేమి తినను, మరియు దాని మట్టుకే నేను డబ్బులు తీసుకొందును.”

“ఓ, ఎన్నడూ, దానిని చేయకు” అని అతడన్నాడు.

6 మంచిది, అప్పుడు నేనిట్లనుకున్నాను, “నేను దానితో ఏమి చేసెదను?” అప్పుడు నేను ప్రాతఃకాల భోజనం కొరకు యాభై సెంట్లు తీసుకున్నాను. పిదప దానిలోనుండి నలభై సెంట్లు తీసుకొని, నేను దానిని ఖర్చు చేయాలనుకుంటే, వీధిలోని కొందరు పిల్లలకు ఇస్తాను; మీకు తెలుసు కదా; ఒక చిన్న సాండ్ విచ్, బన్ను రొట్టె కూడా అవసరమున్నట్లు అగుపించే కొందరు పిల్లలకు ఇచ్చేవాడిని. మంచిది, నేననుకొన్నాను, బహుశా నేను…నిజమే, నాతో అట్లు మాట్లాడుచున్నది స్వయంగా ఆ కంపెనీయేగదా. అది ఆ కంపెనీకి చెందిన వ్యక్తియేయైయున్నాడు.

అయితే, “బహుశా నేను ఏదో తప్పు చేశానేమో! అని నేననుకున్నాను.”

7 అయితే ఇచ్చట కొంత కాలం క్రితం, ఒక గస్తీ చేయు పోలీసు అధికారితో…ఇప్పుడు, మీరు చూడండి, వారు హెలికాప్టర్ల ద్వారా గస్తీ చేయుదురు. కావున అతడు వచ్చి మరియు ఆగాడు. అతడిట్లన్నాడు, “చెప్పండి సహోదరుడా బ్రెన్హామ్,” అతడన్నాడు, “ఈ చెట్టు పెరుగుచున్నది కదా.”

“అవును,” అని నేనన్నాను. ఇంకా నేనిట్లన్నాను, “అచ్చట బయట చిన్నపిల్లలు దాని క్రింద ఆడుకొంటారు.”

“మేము దానియొక్క పైకొమ్మలను కత్తిరించవచ్చా?” అని అతనడిగాడు.

“హో కత్తిరించవచ్చు, కానీ దానిని మొత్తం నరికివేయకండి. చూశారా?” అని నేనన్నాను.

“మంచిది, మేము దానిని నరికివేయగోరుచున్నాము. దాని కొరకు మేము నీకు వెల చెల్లిస్తాము,” అని అతడన్నాడు.

8 “లేదు, లేదు. మీరు దానిని నరికివేయుటను మేము కోరడంలేదు” అని నేనన్నాను. మంచిది, నేను కూడా రైట్-ఆఫ్-వే యొక్క చట్టములను ఎరిగియున్నాను, మీకు తెలుసుకదా, ఎందుకంటే నేను దానిలో ఏడు సంవత్సరాల వరకు ఉండియున్నాను. నేనిట్లన్నాను, “వద్దు” “అది నరికివేయబడాలని కోరుటలేదు, అయితే మీరు దానియొక్క పై కొమ్మలను మాత్రం కత్తిరించవచ్చు,” అని నేనన్నాను. నేనిట్లన్నాను “నేను—నేను దాని కొసలను కత్తిరించి ఉంచుతుంటాను, అయితే,” ఇంకా నేనన్నాను, “మీరు చేయవచ్చు, మీరు కోరిన యెడల మీరు దాని పైకొమ్మలను కత్తిరించవచ్చు.” “సహోదరుడు వుడ్ మరియు నేను దాని పైకొమ్మలను కత్తిరించుటకు సిద్దపరచుచున్నాము. దీనితోపాటు ఈ దారి గుండా ఉన్న ఈ ఇతరవాటిని కూడా మేము కత్తిరించి ఉంచుతాము,” అని నేనన్నాను. మరియు నేనిట్లన్నాను, “అయితే, ఆ చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని మేము దానిని అక్కడ ఉంచగోరుచున్నాము, మీకు తెలుసు కదా, జో మరియు ఆ చిన్న పిల్లలు ఆ చెట్టు క్రింద ఆడుకుంటూ ఉంటారు.”

9 నేను ఒక చిన్న ప్రయాణంపై వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి, అది నరికివేయబడి మరియు తీసివేయబడియున్నది. ఓ, మీరు చూడండి, ఆ చెట్టును నరికివేసినందుకు, ఆ కంపెనీపై అది ఎటువంటి ఒక ఫిర్యాదు అవుతుంది కదా, మీరు చూడండి. మరియు కావున నేనిట్లనుకున్నాను, “ఇప్పుడు,” నేనిట్లన్నాను, “ప్రభువా, నేను కనీసం దానిని ప్రస్తావించబోవడంలేదు.” చూశారా? “నేను—నేను కొన్నిసార్లు కేవలం ఒక డైము ఖరీదుచేసే భోజనం తిని, మరియు ‘యాబై సెంట్లు’ అని మార్చిన విషయమై ఒకవేళ ఏమైనా ఉన్నదేమో.” చూశారా? నేనిట్లన్నాను, “ఒకవేళ దాని విషయమై, నేను—నేను—నేను దానిని అట్లు చేసిన విషయమై ఏదైనా ఉన్నయెడల, దానిని సరిచేయబడనిమ్ము. నేను…” అప్పుడు నేను ప్రజా సేవా సంస్ధలో ఉండుటను గూర్చి కలలు కనడం మానేసాను, చూడండి, ఎందుకంటే అక్కడే ఏదో విషయము ఉండియుంటుంది.

మనము ఏమి చేస్తున్నామన్న దానిని మనము గమనించవలసియున్నది. మనము దానిని ఏదో ఒక రోజు ఎదుర్కొనవలసియున్నది.

10 ఇచ్చటకు వచ్చుచున్నటువంటి, చిన్నపిల్లలున్నారు. ట్రూడీ, మీ అమ్మగారు కూడా ఈ రోజున వచ్చారు. మీకు తెలియదు, మీకు తెలియదని నేననుకొనుచున్నాను. ఇది ఆశ్చర్యకరముగా ఉందని, నేను చూడగలను. మరియు మీరు ఉన్నత విద్యను అభ్యసించుటకు సిద్దపడుచున్నారు. మరియు మనము కలిసి ఇచ్చట ఈ చిన్న ప్రయాణం చేశాము. ఇప్పుడు, ఈ కూటము అయిపోయిన వెంటనే నేను ఒక కూటమునకు వెళ్తాను. మరియు మేము ఇంటికి వెళ్ళనున్నాము.

11 మీ అందరితో మాటలాడుటకు ఇదొక మంచి అవకాశముగా ఉంటుందని నేను తలంచాను, మరియు పిదప మీరు ఉన్నత విద్యకు వెళ్ళడానికి ముందు పిల్లలైన మీతో కొద్దిగా మాట్లాడుట మంచిదని కూడా నేను అనుకున్నాను. బైబిలు గ్రంధములో నుండి ఒక వచనము చదివి, మరియు దాదాపు పది నిమిషాల వరకు, నా హృదయపూర్వకంగా మీతో మాట్లాడుతాను. నేను మీ దారి నుండి జారుకుంటాను. చూశారా?

12 నేను పిల్లలతో మాట్లాడుటకు ముందు, పెద్దలైన మీ అందరితో కూడా కేవలం ఒక నిమిషము నేను మాట్లాడగోరుచున్నాను. ఇప్పుడది, బహుశా ఒక ప్రయాసతో కూడిన ప్రయాణమైయ్యుండవచ్చును, అది అట్లే ఉండినది. అయితే నేను ఇక్కడ ఉన్నప్పటినుండి ప్రభువు వద్ద నేను నేర్చుకున్నదానికి, నేను ప్రభువు వద్ద నేర్చుకున్న ఆ అనుభవానికి పదివేల డాలర్లు ఇచ్చినా నేను తీసుకోను. సర్వశక్తునియొక్క ఆజ్ఞకు పూర్తిగా విధేయుడనై నేను వచ్చియున్నానని నేను నిజంగా నమ్ముచున్నాను, మరియు నేను—నేను ఎల్లప్పుడు ఆ విధంగానే ఉండగలగాలని ఆశిస్తున్నాను. మరియు అక్కడ ఒక…

13 నేను వచ్చినప్పుడు, ఒక విషయమేదనగా, ఒక—ఒక—ఒక ప్రేలుడు సంభవించినప్పుడు, ఇక్కడ టూసాన్ పైన నేను నిలబడియున్నానన్న దర్శనము ద్వారా వచ్చితిని. సరి, అది సంభవించినప్పుడు సహోదరుడు ఫ్రెడ్ అచ్చట ఉండియున్నాడు. మరియు వారు ఆకాశములోని ఆ దృశ్యమును ఫోటో తీసారని మీకు తెలియును. మరియు దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు, దానిని అసలు గమనించనేలేదు. కావున ఒక దినమున, ఏదో విధంగా అది నన్ను ప్రభావితం చేయడం మొదలుపెట్టినది. మరియు సహోదరుడు నార్మన్, ఇచ్చటనున్న నార్మన్ యొక్క తండ్రి నాతో చెప్పిరి, “నువ్వు దీనిని గమనించావా?” అని అనిరి.

14 మరియు నేను చూసిన వెంటనే, సరిగ్గా అక్కడే వారు ఉండగలగినంత తేటగా, ఆ దూతలు, సరిగ్గా అక్కడ ఆ పఠములో ఉండియున్నారు. చూశారా? అది ఎప్పుడు జరిగినదని కనుగొనుటకు నేను చూశాను, మరియు అది దాదాపు నేనక్కడికి వెళ్ళడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు లేదా ఒకటి లేదా రెండు రోజుల తరువాత, అదే సమయానికైయ్యున్నది. అది ఎక్కడ జరిగినదాయని నేను చూశాను. “అది ఫ్లాగ్ స్టాఫ్ కి ఈశాన్యమున, లేదా ఫ్లాగ్ స్టాఫ్ క్రిందనున్న ప్రెస్ కాట్ వద్దనైయున్నది.” సరి, మేమున్నది సరిగ్గా అక్కడేయైయున్నది, చూడండి, ఖచ్చితంగా అక్కడే ఉన్నాము.

15 “ఇరువది-ఆరు మైళ్ళ ఎత్తు.” అంతేకాదు, మీరు చూడండి, నాలుగు లేదా ఐదు మైళ్ళ ఎత్తుకి పైగా—ఆవిరి కానీ తేమ కానీ, ఏ విధమైన పొగ లేదా మరేదైనా వెళ్ళలేదు. విమానాలు పంతొమ్మిది వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అది ఈ మేఘాలన్నింటిని దాటుకొని పైకి వెళ్ళుట కొరకైయున్నది, మీరు చూడండి. మరియు పంతొమ్మిది వేల మీటర్లు అనగా దాదాపు నాలుగు మైళ్ళ ఎత్తుయైయున్నది. ఇదైతే, మీరు గనుక ఆ పఠమును చూసినట్లయితే, అది ఇరవై-ఆరు మైళ్ళ ఎత్తులో మరియు ముప్పై మైళ్ళ వెడల్పుతో ఉండి, మరియు ఒక పిరమిడ్ ఆకారములో ఉండియున్నది.

16 మరియు నేను మీతో చెప్పినట్లు, కుడి-చేతి వైపున, అసాధారణమైన ఆ దూతను, నేను గమనించాను. ఛాతిని విరుచుకొని, రెక్కలు వెనుకకు చాపి, లోపలికి వచ్చుచూ, సరిగ్గా అది ఉన్నట్లే అతడక్కడ ఉండియున్నాడు. వారు మొదటిగా…నేను దానిని అసలు గమనించలేదు. అచ్చట చాలా సంగతులు ఉండియున్నవి.

17 ఒక రోజున నేను దారి గుండా వచ్చుచుండగా, నేను—నేను చేయవలసిన కార్యమును గూర్చి నాతో పలికినటువంటి సంగతి ఏదో అక్కడ జరిగినది. మరియు అది—అది నా సందేశం కాదు.

18 ఒకసారి లియో మెర్సియర్ ఇట్లు చెప్పెను, “సహోదరుడా బ్రెన్ హామ్, దీని తర్వాత ఒక సమయం వస్తుంది,” అని అన్నాడు. దాదాపు ఐదు లేక ఆరు సంవత్సరాలు, బహుశా ఏడు సంవత్సరాల క్రితం ఇట్లు చెప్పెను, “సహోదరుడా బ్రెన్ హామ్, ప్రభువు నీ పరిచర్యను మార్చబోవుచున్నాడు.” ఇంకా ఇట్లన్నాడు, “ఆయన అట్లు చేసినప్పుడు, బహుశా నీవు ఆసుపత్రులను వరుసలో ఉంచి మరియు వారిని ఆ—ఆ పడకల మీది నుండి మరియు అటువంటి వాటి మీది నుండి బయటకు రమ్మని పలికెదవు.” దాని విషయమై సహోదరుడు లియో యదార్ధముగా ఉండుటకు ప్రయత్నించుచున్నాడని నేను నమ్మినప్పటికినీ, అది సరిగా అనిపించడం లేదు.

19 అయితే అది వాస్తవంగా అనిపించడం లేదు, ఎందుకనగా చూడండి, మన ప్రభువైన యేసు ఎన్నడూ దానిని చేయలేదు. చూశారా? ఆయన ఆసుపత్రులకు వెళ్ళెను. ఆ ఆసుపత్రిలో ఒకడున్నాడు. అది బైబిల్ గ్రంధములో ఎచ్చటనున్నదో మీకు జ్ఞాపకమున్నదా? అది బెతెస్ద కోనేరు వద్దనైయుండెను. రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు ఇంకా బలహీనులనేకులు ఆ దూత కొరకు వేచి చూస్తు, అక్కడ గుంపులుగా పడియుండిరి. ఇప్పుడు, ప్రజలు దైవిక స్వస్థత కొరకు వేచియున్నది ఒక ఆత్మీయమైన ఆసుపత్రిలో యైయున్నది. మరి ఇక్కడ స్వయంగా ఆ దైవిక స్వస్థకుడే లోపలికి వచ్చి ఒక్కడిని మాత్రమే స్వస్థపరచి మరియు బయటకు వెళ్ళిపోయెను. కావున ఒక మర్త్యుడైన మానవుడో లేక ఒక పరిచర్యనో ముందుకు వచ్చి, దానికంటే ఏమాత్రం గొప్పగా ఉంటుందని మీరు ఆశించలేరు. చూశారా? నేను దానితో ఏకీభవించలేను.

20 అయితే, నేను వెనుకకు తిరగబోవుచుండగా, పరిశుద్ధాత్మ నా పైకి వచ్చెను. ఒక కలము కావలెనని నేను లియోని అడిగాను. నేను ఒక కాగితం ముక్కను తీసుకొని, మరియు నేను దానిని వ్రాసాను. అది ఉన్న చోటుకు మీరెప్పుడైనా వెళితే, ఈనాడు అది అతని మోటారు వాహనంలో ఉండియున్నది. అది ఆ పాత అల్యూమినియం మోటారు వాహనమైయున్నది, దానిలో సామానులు తరలించడానికి నేను వాడుతుంటాను. ఆ తలుపు దగ్గరికి మీరు వెళ్ళినవెంటనే, సరిగ్గా ఆ వాహనానికి ఎదురుగా, ఆ కుడి-చేతి వైపున ఒక అర ఉంటుంది. అది అక్కడ క్రింద ఉండియున్నది. నేను దానిని అక్కడ పెట్టాను. ఇట్లు చెప్పాను, “ఏదో ఒకరోజు మీరు దీనిని బయటకు తీయవచ్చును. ‘దేవుడు పరిచర్యను ఎన్నడూ మార్చడు, కానీ ఆయన ఆ పరిచర్యను కలిగియున్న మనిషిని మార్చుతాడు.’” జరగవలసినది అదేయైయున్నది.

21 చూడండి, నేను ఏమి చేయవలసియున్నదో నాకు—నాకు తెలియును, కానీ నేను—నేను—నేనిప్పుడున్న స్థితిలో దానిని చేయలేను. ఎందుకనగా, నేను…నా లోపల ఏదో జరగవలసియున్నది, మరి దానిని దేవుడే చేయవలసియునాడు.

22 మేము తిరిగి ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యమును కలిగియున్నాము. పిల్లలు ఇంటి మీద బెంగ పెట్టుకొనియున్నారు, వారంతా తిరిగి వెళ్ళవలెనని కోరుచున్నారు. కావున ప్రభువు చిత్తమైతే వారిని తిరిగి తీసుకొని వెళ్ళాలని నేను తలంచుచున్నాను, బహుశా శనివారము కూడిక తర్వాత తిరిగి వెళ్తాము. ఇక అక్కడినుండి, నాకు తెలియదు. అయితే ఇప్పుడు నేను చేసేదానికి భిన్నంగా, ప్రజల పట్ల భారాన్ని కలుగజేయునటువంటిది ఏదైనా నాలోపల జరిగిన వెంటనే నాకు తెలియును. నేను ప్రజలను తిరస్కరించాను, చూడండి, మరియు నేను—నేనిక వారితో కలిసి చేయునటువంటిది ఏదియూ కలిగియుండగోరడం లేదు. నా భావము మీకు తెలుసు కదా, “రిక్కీ, రిక్కేట్టా,” అని నేను పిలిచేటటువంటి వారితోయైయున్నది, వారు చేసినటువంటి ఆ సంగతులను వారు కలిగియున్నారు. నేను ఎంతో యదార్ధముగా బోధించాను, మరియు దేవుడు అన్ని విధాలుగా దానిని ధృవీకరించాడు. “మరి, వారు దానిని నమ్మగోరనియెడల, ఇక ఏముంది, అటువంటప్పుడు వారిని అలా వదిలివేయడమే.”

23 రానున్న ఆకురాలు కాలమున అంకురముతో చేరుటకు నేనక్కడికి వెళ్తున్నాను, అక్కడినుండి సన్నద్ధుడనవుతాను. నా జుట్టు మరియు గెడ్డం పెరిగేవరకు అరణ్యములో వేచియుంటాను. మరియు నేను ఎక్కడికైనా వెళ్లాలని ప్రభువు కోరినయెడల, ఆయన నాకు మాట సెలవిస్తాడు, మరియు నేను అక్కడికి వెళ్ళి, దానిని చేస్తాను.

24 మరియు ఒకరోజు వచ్చుచుండగా, దారిలో, ఆయన నన్ను ఆపినాడు. మరియు అక్కడ…నేను దేనిని సమీపిస్తున్నానన్నది నేను చూశాను. నేను—నేనప్పుడు వేరొక దానివైపు వెళ్తున్నాను. మరియు నేను ఇంటికి చేరుకున్న తర్వాత, మనస్పూర్తిగా మాట్లాడటం అని మనము అంటాము కదా, ఆ విధంగా నేను మాట్లాడెదనని అనుకున్నాను, మరియు పిదప ఈ ఆకస్మిక మార్పు ఎందువలన అన్నది ప్రజలు చూచునట్లు, దానిని టేపుపై ఉంచాలనుకున్నాను.

25 ఇప్పుడు, పిల్లలైన మీరు, మనము కేవలం…మనమిప్పుడు ఒక చిన్న ప్రార్ధన చేసుకుందాము.

26 ప్రభువైన యేసు, యౌవనస్థులు, వృద్ధులు, మరియు నడి-వయస్కులమైన మేము ఇక్కడ కూడుకున్నామని తెలుసుకొను ఈ సమయముకొరకై మేము కృతజ్ఞత కలిగియున్నాము. నిత్యత్వమునకు ఈవలి వైపున, నీ గురించి మరియు నిత్యజీవమునకు సంబంధించిన విషయముల గురించి మాట్లాడుకొనుటకు, మరొక్కసారి మేము కూడుకొనియున్నాము.

27 మరియు ఈ రాత్రి ఇక్కడ కూర్చునియున్న ఈ యౌవనస్థులలో, కొందరు ఉన్నతవిద్యను అభ్యసించుచున్నారు, కొందరు ఇదివరకే ఉన్నతవిద్యను పూర్తి చేశారు. అయితే ప్రభువా, ఉత్తర టూసాన్ వద్ద, ఆ పర్వతము మీదకి ప్రభువు యొక్క దూతలు దిగి వచ్చినప్పుడు, ఆ తీవ్రమైన కుదుపు లేదా ఆ గొప్ప ప్రేలుడు సంభవించుటకు, కేవలం కొన్ని గంటలకు ముందు సంభవించిన ఒక కార్యమును నేను గ్రహించియున్నాను. మరియు—మరియు ప్రత్యేకించి యౌవస్థుల గురించి ఏమి చెప్పబడినదో నాకు జ్ఞాపకం ఉన్నది. ప్రభువా, మేము అర్ధం చేసుకొనునట్లు, సహాయము చేయమని నేను నీకు ప్రార్ధించుచున్నాను. మరియు ఈ రాత్రి ఈ యౌవనస్థులైన పిల్లలకు వారి ప్రయాణములో, వారికి సహాయపడునటువంటిది ఏదైనా నేను చెప్పగలుగుదును గాక. ఎట్లనగా ప్రభువా, ఈ సమయంలో మా అందరికి అట్టి సహాయము అవసరమైయున్నది.

28 మా అందరిని ఆశీర్వదించండి. మా పాపములను క్షమించండి. మరియు మేము ఇక్కడకి వచ్చినప్పటినుండి, నీకు ఆయాసకరమైనది ఏదైనా మేము చేసినట్లైతే, దాని విషయమై నీవు మమ్మల్ని క్షమించమని ప్రార్ధించుచున్నాము. ఏలయనగా రేపటిని గూర్చి ఎటువంటి—ఎటువంటి భరోసా మాకు లేదని మేము ఈ రోజు గ్రహించియున్నాము. రేపు ఏమి జరుగునో మేము ఎరుగము. రేపటిని ఎదుర్కొనుటకు మేము ఈ రోజే సిద్ధపడవలసియున్నది. మరియు తండ్రివైన దేవా, దీనిని చేయుటకు ఒకేఒక మార్గమున్నది, అదేదనగా, నిన్ను చూడటానికి సిద్ధపడుటయేయై యున్నది, ఏలయనగా, త్వరలో మేమంతా దానిని చేయబోవుచున్నామని మేము ఎరిగియున్నాము. మరియు ఏదో ఒక సమయమున, సమాధానంగానో, ఒక స్నేహితుడిగానో, లేదా ఒక కుమారుడిగానో, లేదా ఒక శత్రువుగానో దానిని మేము ఎదుర్కొనవలసియున్నది. ప్రభువా, మేము నీ స్వంత ప్రియమైన పిల్లలమవ్వడం కాకుండా, మరేదైనా అవ్వడమనేది దూరమగును గాక. ఈ విన్నపములను అనుగ్రహించమని, మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

29 ఈ రోజు, ఈ ఉదయమున పెందలకడనే నేను కలుపుమొక్కలను కత్తిరించుచుండగా, పరిశుద్ధ గ్రంధములో ఒక చోటును నేను కనుగొన్నాను, దానిని ఈ సమయములో చదవడం మంచిదని నేను తలంచాను. మరియు అది ఒక…బహుశా అది అంత సముచితంగా ఉండకపోవచ్చును, కానీ…కేవలం ఒక—కేవలం కొన్ని నిమిషాలు మాట్లాడవలెనని నేను తలంచాను. నేను దీనిని పరిశుద్ధ లూకా సువార్త 18వ అధ్యాయము నుండి చదువగోరుచున్నాను. మొత్తం నాలుగు సువార్త రచయితలు దానిని వ్రాసిరి. 18వ అధ్యాయము మరియు 8వ వచనము.

మరియు ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? అని ఆయనను అడిగెను.

అందుకు యేసు, నేను సత్పురుషుడనని నీవేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.

వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిని మరియు…తండ్రిని సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను.

మరియు…అతడు బాల్యమునుండి వీటన్నింటిని అనుసరించుచూనే ఉన్నానని చెప్పెను.

యేసు ఈ సంగతులు విన్నప్పుడు, నీకు ఇంకనూ ఒకటి కొదువుగానున్నది; నీకు కలిగినదంతయూ అమ్మి…మరియు బీదలకిమ్ము,…పరలోకమందు నీకు ధనము కలుగును;…నీవు వచ్చి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

30 వచ్చి, నన్ను వెంబడించుము, అనే ఈ మాట, నేను పదివేల మంది పిల్లలతో మాట్లాడుచున్ననూ, లేదా కేవలం ఇప్పుడున్న ఇంతమందితో నేను మాట్లాడుచున్ననూ, నేను ఇవ్వగలిగిన ఉత్తమ సలహా అదేయైయుండునని నేను తలంచుచున్నాను. అది ఒక ఆజ్ఞయైయున్నది, మరియు ఎప్పుడైనా, ఎవరికైనా, ప్రత్యేకించి ఒక యౌవనస్థుడికి ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశం ఉన్నదంటే, అది “నన్ను వెంబడించుము,” అనునదే అని నేను తలంచుచున్నాను,

31 మీరు ఎవరో ఒకరిని వెంబడిస్తారు. ఇప్పుడు, మీరు కేవలం…మీరు దానిని గుర్తుంచుకోండి. మీరు ఎవరినో ఒకరిని వెంబడిస్తారు. మరియు మీరు ఆ వ్యక్తిని వెంబడిస్తున్న తరుణంలో, ఆ వ్యక్తి ఎవరిని వెంబడిస్తున్నాడనే విషయంలో, ఖచ్చితంగా ఉండండి. చూశారా? మనము…

32 ఒకసారి పౌలు ఇట్లు చెప్పెను, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరునూ నన్ను పోలి నడుచుకొనుడి.” ఇంకో మాటలో చెప్పాలంటే, “సరిగ్గా నేను క్రీస్తును వెంబడించుచున్నట్లే, మీరు నన్ను వెంబడించుడి.”

33 మరియు ఇప్పుడు, ఈ కీలకాంశములో, జీవితంలోని ఈ—ఈ దశకు మనమందరము వచ్చియున్నాము. మరియు చాలా సార్లు, “రిక్కీ, రిక్కెట్టా,” మరియు అటువంటి వాటిపై నేను కేకలు వేయుటను మీరు వినియున్నారు. అది, ఈ కాలం అటువంటిది. వాస్తవానికి ఆ ప్రజలు కాదు కానీ, మనము జీవిస్తున్న కాలమే అటువంటిది.

34 ఆ ప్రజలు మనవంటి ప్రజలేయైయున్నారు. ఈ హాట్-రాడ్ కార్ల మీద, వీధుల్లో అటు-ఇటు తిరుగుచు, వారున్న స్థితిలో కొనసాగుచు, పొగత్రాగుచు, మద్యం సేవిస్తున్న ఈ పిల్లలు, మరియు అసభ్యంగా దుస్తులు ధరించి, అటువంటివి చేయుచున్న అమ్మాయిలు, మరి ఆ అమ్మాయిలు మరియు అబ్బాయిలు మనవంటి వారే. చూశారా? వారు మనుష్యులే. వారు ప్రేమిస్తారు. వారు తింటారు. వారు త్రాగుతారు. వారు నిద్రపోతారు. వారు శ్వాస పీల్చుకుంటారు. వారు కూడా మరణించాల్సిందే. వారు కూడా సరిగ్గా మనవంటి ప్రజలే. మరి అయిననూ వారు…

35 వారు ఒక దురాత్మ చేత పట్టబడియున్నారు. దానిని వారెరుగకయున్నారు. ఆ ప్రజలను బట్టి కాదు కానీ—కానీ కొన్నిసార్లు, వారు వెంబడించుచున్న నాయకుడు వారిని తప్పుదోవలో నడిపించుటవలనై యున్నది.

36 ఇప్పుడు, మీకు తెలుసు. అమ్మాయిలు, మరియు అబ్బాయిలు అయిన మీకు అంతకంటే మంచిది తెలుసు. మీకు అంతకంటే మంచిది నేర్పించబడినది. అటువంటి వాటిని చేయకూడదని వివరించి, మీకు నేర్పించే మంచి తల్లిదండ్రులను మీరు కలిగియున్నారు. కావున మీకు బాగుగా తెలియును.

37 అయితే వారికది తెలియదు, చూడండి, ఎందుకనగా వారు వెళ్ళునట్టి సంఘములు ఆధునిక, నవనాగరికమైన సంఘములైయున్నవి. మరియు వారు—వారు పేరు ప్రఖ్యాతలు పొందే రోజు కోసమే బ్రతుకుతారు. మరియు ఓ, మై! ఏదైతే…నీతులు వారికి ధర్మంగా మారుతాయి. చూశారా? కావున వారు…ఈ మధ్యనే నేనిక్కడ చూసిన సొదొమ మరియు గొమొఱ్ఱాల నాటికను గురించి నేను ఒకసారి చెప్పినట్లు, ఆ దురాత్మతో-పట్టబడిన స్త్రీ లోతుతో—ఇట్లు చెప్పెను, “నీవు అనైతికమని పిలిచే దానిని నేను ధర్మం అని అంటాను.”

38 “నోవహు దినములలో జరిగినట్టు, మనుష్యకుమారుని రాకడలో జరుగును,” అని యేసు చెప్పెను. కావున మనము తిరిగి మరలా ఆ చోటుకు వచ్చాము.

39 మనము చదివినట్టి ఈ వ్యక్తి గురించి, కొద్ది నిమిషములు మనం చూద్దాము. పిల్లలైన మీవలెనె ఈ పిల్లవాడు కూడా ఒక మంచి కుటుంబములో పుట్టాడనుటలో ఎలాంటి సందేహము లేదు. అతడు మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాడు. ఎందుకనగా, దేవుని యొక్క ఆజ్ఞలను, యేసు అతని యెదుట ఉంచినప్పుడు, అది ఋజువు చేయబడినది. “బాల్యమునుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను,” అని అతడు చెప్పెను. అతడు సరిగానే పెంచబడినాడని అది—అది చూపించుచున్నది. అతడు ఆషామాశీగా పెరిగినవాడు మాత్రం కాదు. మరియు పిల్లలైన మీ అందరిలాగానే, అతడు—అతడు ఏది సరైనదో తెలుసుకొనేటట్లు పెంచబడినాడు. బహుశా అతడు పిల్లవాడిగా ఉన్నప్పుడు, అతడికి—సరైనది నేర్పించుటకు ఒక దైవ-భయముగల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అతడు పెరిగియున్నాడు. సరి, అది మంచిది.

40 బహుశా, ఏదో ఒక రోజున అతడొక గొప్ప వ్యక్తి అవ్వాలని, అతడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటినుండే అతని తల్లికి గొప్ప ఆశయాలు ఉండవచ్చును. అతనికి చదువు చెప్పించి, మరియు—మరియు మంచి విద్యతో బయటకు వచ్చి మరియు…ప్రపంచంలో ఏదైనా అగుటకు సమర్ధుడిగా ఉండులాగున, అతనికి విద్యను అందించుటకు తగినంత డబ్బును తన తండ్రి కలిగియున్నాడు. మరియు ఈ పిల్లవాడిని చదివించుటలో ఈ తల్లిదండ్రుల యొక్క యదార్ధతనుబట్టియే అతడు మీలాగ ఉన్నత విద్యాభ్యాసము చేసే సమయమునకు చేరుకున్నాడు, చూడండి, అది తన పాఠశాలను దాటి మరియు తన విద్యను పూర్తిచేసుకున్న సమయమైయున్నది. బహుశా ఆ తల్లిదండ్రుల జీవితం యొక్క సంతోషము మరియు గర్వకారణము ఆతడే అనుటలో ఎటువంటి సందేహము లేదు. మీరు కార్లను కలిగియున్నట్లే, ఆ రోజుల్లో, అతడు మంచి గుఱ్ఱములను కలిగియున్నాడనుటలో ఎటువంటి సందేహము లేదు, మరియు సరిగ్గా మీరు ఈనాడు కలిగియున్నవాటివలె అనగా, మంచి దుస్తులను, మరియు—మరియు కార్లను కలిగియుండి, మరియు…జీవితాన్ని ఆనందంగా గడుపునట్లు చూసుకునే మంచి తల్లిదండ్రులను మీరంతా కలిగియున్నట్లే అతడును కలిగియున్నాడు.

41 మరియు ఆ తల్లిదండ్రులు…వారి కుమారుడు కేవలం ఒక—ఒక సాధారణమైన వ్యక్తిలా కాకుండా, ఒక అసాధారణమైన వ్యక్తియగునట్లు నిత్యమూ ప్రార్ధించుచుండిరి. తల్లిదండ్రులందరూ దానిని కోరుకుంటారు. “నీ తల్లిదండ్రులను సన్మానించుము,” అనే ఆజ్ఞను యేసు ప్రస్తావించి మరియు అంతటితో ఆపివేయుటను మీరు విన్నారా? చూశారా? మరియు ఏ తల్లిదండ్రుల యొక్క ఆశయమైనా అదేయైయున్నది, అదేమనగా, వారి పిల్లల కొరకు వారు చేయగలిగినంత ఉన్నతమైన దానిని చేసి, వారిని చదివించి, బహుశా వారు పొందుకోలేనటువంటి వాటిని వీరికి అందించుటయైయున్నది. నా పిల్లల విషయమై నేను కూడా ఆ విధంగానే భావిస్తాను.

42 పాఠశాలకు పంపు విషయంలో కొన్నిసార్లు నేనిట్లు తలంచుతాను, ఇప్పుడు; ఎచ్చటైతే ఇదంతా జరుగుచున్నదో, ఆ ఉన్నత పాఠశాలలు మరియు వాటిలోనికి బెక్కీ, శారా, మరియు జోసఫ్ లను పంపించాలా? అని నేను తలంచుదును. నేను వారిని తీసుకొని మరియు ఆ కొండలలోనికి వెళ్ళి, మరియు—మరియు ఆ ఇండియన్లు నివసించునట్లు…వారిని అక్కడ పెంచాలని తలంచుదును.

43 అయితే విషయమేమిటంటే, పిల్లవాడి లోపల ఏమున్నదో అదే బయటకు వచ్చును. అది ఎక్కడైనా గానీ, అది, బయటకు వచ్చును. ఒకవేళ అచ్చట చెడు ఉన్నట్లయితే, అది ఇండియను క్యాంపులోనైనా బయటకు వస్తుంది. అచ్చట మంచి ఉన్నట్లయితే, అది ఏ క్యాంపులోనైనా బయటకు వస్తుంది. చూశారా? అది ఆ పిల్లవాడిలో ఏమి ఉన్నదో, ఆ పిల్లవాడు దేనితో చేయబడినాడో, మీ లోపల ఏమి ఉన్నదో అనుదానిపై ఆధారపడియున్నది. మరియు ఇప్పుడు మీరేమైయున్నారో బహుశా, మీ మిగతా జీవితమంతా కూడా అదేయైయుంటారు. మీరు ఒక మార్పుచెందే చోటులో ఉన్నారు.

44 మీకు తెలుసా? ఎనభై-ఆరు శాతం, యేసుక్రీస్తువైపుకు మార్చబడుటయన్నది ఇరువది-ఒక్క సంవత్సరాలలోపు వయస్సప్పుడే జరిగినది. అది దానిని చూపించుచున్నది. గణాంకాలు దానిని చూపించుచున్నవి. క్రీస్తు నొద్దకు వచ్చు ఎనభై-ఆరు శాతం వారు, ఇరువది-ఒక్క సంవత్సరాలలోపు వయస్సునందే వచ్చుదురు. మీరు, ఆ వయస్సును మీరు దాటిన తర్వాత, మీరు బాగా మలచబడి, లేదా మీ మార్గాలలో మీరు స్థిరపడియుంటారు. ఓ, నిశ్చయంగా, డెబ్బై, ఎనభై ఏండ్లవారు కూడా రావడం సాధ్యమే, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. చూశారా?

45 మీరు యౌవనంలో ఉన్నప్పుడే, మిమ్మల్ని మీరు నిర్మించుకుంటారు. మీరు చేయగోరుదానిని మరియు జీవితంలో మీరు సాధించుటకు ప్రయత్నించగోరుదాని విషయమై మీరు మీ ఆశయాలను స్థిరపరచుకుంటారు. మీరు దాని గురించి ఆలోచిస్తారు. అవునండీ. మరియు మీరు మీ మనస్సులో ఆలోచిస్తుండగా, మీ మనస్సును ఆధిపత్యం చేసే ఏదో తెలియని విషయం—మీ మనస్సులోనికి సమర్పించబడుతుంది. మరియు పిదప ఎప్పుడైతే అది మీ మనస్సులోకి వస్తుందో, అప్పుడు మీరు దానిని చేయబోవుచున్నారని, దానిని మీరు చెప్తారు. మరి అప్పుడు మీ ఆశయాలు మిమ్మల్ని దానివైపు నడిపిస్తాయి.

46 కావున, ఈ పిల్లవాడిగూర్చి…అతడి ఆశయాలు గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు; దానిని నిర్వహించడానికి సరిపడా డబ్బును కలిగియున్నారు. మరియు పిదప, ఈ—ఈ యౌవనస్థుడికి ఆ అవకాశము లభించాలని వారు ప్రార్ధించారనుటలో ఎలాంటి సందేహము లేదు. మీరు చూడండి, వారు—వారు చేయగలిగినదంతా చేశారు. బహుశా అతడు చక్కని గుఱ్ఱములను కలిగియుండవచ్చును, మరియు—మరియు బహుశా స్త్రీలలో బాగా పేరుపొందినవాడై యుండవచ్చును.

47 మరియు పురుషులకు ఏమి జరుగుతుందో అదే స్త్రీలకు కూడా వర్తిస్తుంది, చూడండి, ఎందుకనగా మనము మానవ జీవితం గురించి, అనగా స్త్రీలు, మరియు పురుషులు ఇరువురి ఆత్మల గురించి మాట్లాడుచున్నాము.

48 మరియు పిదప, ఆ పిల్లవాడు ఈ అవకాశమంతటిని పొందుకున్న తరువాత, చూడండి మనం వాడుకలో “సంపన్నుడు,” అని అంటాము కదా, అతడావిధంగా అయ్యాడు, అతడు అంతగా విచారపడవలసిన అవసరం లేనటువంటి ఒక స్థాయికి వచ్చాడు. అతని తల్లిదండ్రులు డబ్బును కలిగియున్నారు. అతడు…అతడు చాలా…అతడొక అధికారి అయ్యాడు. బైబిల్ గ్రంధము ఇచ్చట దాని గూర్చి,…ఒక యౌవ్వనస్థుడైన, ధనవంతుడైన యౌవ్వనస్థుడగు అధికారిగా ప్రస్తావించుచున్నది. మరియు మనము చూచుచున్నాము…ఒక యౌవన వయస్సులో, బహుశా అతనియొక్క యౌవన కాలములో కేవలం పాఠశాల నుండి, ఉన్నత విద్య నుండి బయటకు రాగానే, బహుశా కొన్ని నెలల లోపే అతడొక…అతడొక అధికారి అవ్వడాన్ని మనం చూస్తాము, మరియు హృదయము కోరుకునేవన్నియూ అతడు కలిగియున్నాడు.

49 మరియు ఆ పిల్లవాడు ఆధునిక రిక్కీ వంటివాడు కానే కాదు. అతడొక మంచి పిల్లవాడు. లూకా దాని గూర్చి వ్రాసినప్పుడు, లేదా అది మార్కు అని నేను నమ్ముచున్నాను, యేసు అతనివైపు చూసి మరియు నిట్టూర్పు విడిచెను, ఎందుకనగా ఆయన అతడిని ప్రేమించెను. చూశారా ఆ పిల్లవాడి గూర్చి ఏదో విషయం ఉన్నది. ఈ పిల్లవాణ్ణి ఒక మంచి వ్యక్తిత్వం అంటిపెట్టుకొని ఉంది. అతడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని ఆజ్ఞలు అతనికి బోధించి మరియు అతడు వాటిని ఆచరించునట్లుగా చూసుకునే ఒక చక్కని కుటుంబం నుండి అతడు వచ్చాడు. మరియు అతడు వాటిని బాల్యం నుండియే పాటించాడు.

50 మరియు ఆ పిల్లవాడు ఒక ఆశయాన్ని కలిగియున్నాడు; అతడు నిత్యజీవమును కోరుకున్నాడు. అతడిట్లనెను, “సద్బోధకుడా, నిత్యజీవమును స్వతంత్రించుకొనుటకు నేనేమి చేయవలెను?”

51 చూడండి, లోకములో మీరన్నింటిని కలిగి ఉన్నప్పటికిని, మీకు అవసరమైనదానిని మీరు కలిగిలేరని, మీలోపలున్న మీ అంతరాత్మ మీకు చెప్తుంది. కేవలం ధనము వలన…లేదా, అది ఎప్పుడూ ధనమేయైయుండనక్కర్లేదు. అది పేరు ప్రఖ్యాతలైయుండవచ్చు, తన అందం గూర్చి ఆలోచించుకొనే ఎవరో ఒక అందమైన అమ్మాయైయుండవచ్చును. బహుశా ఆమె పాఠశాలలో పేరు పొందినదైయుండవచ్చును. బహుశా తాను కోరుకున్న ఏ అమ్మాయినైనా పొందగలిగిన అబ్బాయైయుండవచ్చును. అతడు చాలా భద్రతలో ఉన్నాడని అతడు భావించును. అది భద్రత కాదు. అది సరిగ్గా పొలములోని పువ్వువలె వాడిపోవును. చూశారా? అది వెళ్ళిపోవును. ఎంతోకాలం ఉండదు. కేవలం కొన్ని పొద్దులు గడిచిన పిమ్మటనే, అది వెళ్ళిపోవును, పిదప నిత్యమూ జీవించవలసిన ఒక ఆత్మను మీరు కలిగియున్నారు.

52 మరియు అతడు మోకరించి, తనను తాను ప్రభువైన యేసుకు తెలియజేసుకొనుటను బట్టి, యౌవనస్థుడైన ఆ పిల్లవాడు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగియుండవచ్చును. అతడిట్లనెను, “సద్భోదకుడా, నిత్యజీవమును స్వతంత్రించుకొనుటకు నేనేమి చేయవలెను?”

53 అందుకాయన ఇట్లనెను, “దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడని నీవు ఎరిగియుండియు,” “నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు?” అనెను. చూశారా? ఇందులో ఆ యౌవనస్థుడు ఏమి వ్యక్తపరిచాడు? ఆయన దేవుడని వ్యక్తపరిచాడు. చూశారా? “ఆజ్ఞలను నీవెరుగుదువు గదా. వాటిని అనుసరించుము,” అని ఆయన చెప్పెను.

అందుకతడు, “బోధకుడా, ఏ ఆజ్ఞలు?” అని అడిగెను.

54 “ఆజ్ఞలు, ‘నీ తల్లిదండ్రులను సన్మానించుము,’ మరియు మొదలగువాటిని,” అని ఆయన చెప్పెను.

55 “బాల్యమునుండే వీటన్నిటిని అనుసరించాను. నేను దీనిని పాటించాను,” అని అతడు చెప్పెను. చూడండి.

56 అందుకాయన, “అయిననూ నీకింకా ఒకటి కొదువగానున్నది. వెళ్ళి, నీకు కలిగినవన్నియు అమ్మి, బీదలకు పంచిపెట్టుము, మరియు నన్ను వెంబడించుము.” అని చెప్పెను.

57 ఎటువంటి అవకాశము కదా! అది పేతురు, యాకోబు లేదా యోహాను, వారిలో ఎవరైనా అయ్యుండవచ్చును. చూడండి, ఆ పిల్లవాడు తర్ఫీదు చేయబడి సరిగానే పెంచబడినాడు, మరియు అతనిలోనున్న సామర్ధ్యాలన్నిటిని, అనగా బహుశా అతడు కలిగియున్న విద్య, యౌవనము, ధనము, పలుకుబడిని వినియోగించుకొని, అతడు సువార్తను అందించునట్లు అతడిని వాడుకొనుటకు క్రీస్తు యెదుట ఉంచబడినాడు, మరి అయిననూ అతడు దానిని నిరాకరించెను. ఎటువంటి ఒక—ఆ యౌవనస్థుడిది ఎటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి కదా! చూశారా?

58 “నన్ను వెంబడించుము.” ఇప్పుడు, చూడండి, అతడు ఎవరినో ఒకరిని వెంబడించవలసియున్నది. అతడు సహవాసం కలిగియున్న ప్రజల యొక్క పలుకుబడినో, ఎవరైనా యౌవనస్థురాలి పలుకుబడినో, అతని సహచరులగు ఎవరైనా అబ్బాయిల గ్యాంగు యొక్క పలుకుబడినో, తన పాఠశాలలోని స్నేహితులనో అతడు వెంబడించవలసియున్నది, లేదా యేసుక్రీస్తును వెంబడించవలసియున్నది. అతడు అంతటి మంచితనమును కలిగియున్నప్పటికినీ, తాను నిత్యజీవమును కలిగిలేడని అతడెరిగియున్నాడు.

పిల్లలారా, మీరు ఆలోచించవలసింది దానిగూర్చియేయైయున్నది. చూశారా?

59 ఇప్పుడు ఈ రాత్రి ఆ పిల్లవాడిని చూడండి, అతడు ఏమైయుండగలిగేవాడు, కానీ అతడేమైయున్నాడు, ఈ రాత్రి అతడేమైయున్నాడు. అతనెక్కడో ఉన్నాడు. అతడొక మానవుడే. అతనెక్కడో ఉన్నాడు. అతను తీర్పుకొరకు వేచియున్నాడు. దాదాపు అదే పరిస్థితుల క్రింద, పిల్లలైన మీకు ఇవ్వబడిన అదే అవకాశమును త్రోసివేయుటనుబట్టి, ఆ దినమున న్యాయతీర్పును ఎదుర్కొనుటకు అతడు వేచియున్నాడు; చక్కని పిల్లలు, మంచి వ్యక్తిత్వం, చక్కని తల్లిదండ్రులను మీరు కలిగియున్నారు, మీరు చేయగోరితే తప్ప, అసలు పనిచేయాల్సిన అవసరమే లేదు. చూశారా?

60 అయితే దానితో పాటు వెళ్ళునట్టి విషయము వేరొకటి ఉన్నది. దానితో పాటు ఏదో విషయం ఉంటుంది. ఈ రాత్రి, ఆ మాట అస్సలు మరణించదు. “నన్ను వెంబడించుము,” అనే ఈ మాట, ప్రతీ యౌవనస్థుడికి, ప్రతీ యౌవనస్థురాలికి ఇంకను ఒక సవాలుగా ఉన్నది. చూశారా?

61 మాటలు మరణించవు. మీరు ఏదైనా మాట్లాడినప్పుడల్లా, కేవలం గుర్తుంచుకొనండి, అది రహస్యంగా మీ కారులోనైనా, అది ప్రసంగ వేదిక మీదనైనా, అది మీ ప్రియురాలు లేదా ప్రియుడితో వీధి చివరననైనా, అది ఎక్కడైనాగానీ, అది ఎన్నడూ మరణించదు. అది—అది ఎప్పటికీ జీవించవలసియున్నది.

62 నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు…హాలీవుడ్ నటియైన అందమైన యౌవనస్థురాలిని ఒక రాత్రి నేను దర్శనంలో చూశాను, మరియు సహాయం పొందుటకు ప్రయత్నిస్తూ, ప్రాకులాడుచు ఆమె చనిపోవడాన్ని నేను చూశాను. ఆమె గుండెపోటుతో మరణించినది, ఆమె కుమారి మన్రోయైయున్నది. మరియు ఇది రెండు సంవత్సరాల క్రితమైయున్నది, మరియు ఆమె చనిపోవుటను నేను చూశాను. మరియు రెండు రోజుల తర్వాత ఆమె మరణించినది.

63 పిదప, ఒక రాత్రి, నేను ఆ అమ్మాయియొక్క స్వరమును విన్నాను. ఏ విధంగా? “డాడీ, నీవు తిరిగిరాని ఆ నది వద్దకు అన్నివేళలా వెళ్తుంటావుగదా,” అని పిల్లలు నాతో చెప్పుచుండిరి. “ఈ రాత్రికి అటువంటి ఒక నాటికను వారు కలిగియున్నారు” అని చెప్పారు. ఫలానా రాత్రి అది ప్రదర్శించబడుతుందని, ఒక వారము లేదా రెండు వారాలకి ముందే వారు నాతో చెప్పారు. నేనిట్లనుకున్నాను, “సరే, నేను దానిని చూడగోరతాను, ఎందుకనగా నేను ఆ నది దగ్గర రెండు లేదా మూడు సార్లు; దాదాపు ఐదుసార్లు ఉన్నానని నేను తలంచాను.” సరి, నేను—నేను దానిని చూడాలనుకున్నాను.

64 మరియు కుమారి మార్లిన్ మన్రో అందులో నటించినది. సరి, నేను దర్శనములో చూసినది ఆ అమ్మాయేయైయున్నది. మరియు అక్కడ ఆ చిత్రములో ఆమె ఉన్నది, మరియు ఆ ప్రదర్శనలు, సరిగ్గా ఆ రివర్ ఆఫ్ నో రిటర్న్ లో ఆమె చేసిన నటన, ఆ చిత్రము ఆమె తీసినప్పుడు, బహుశా అది పదిహేను సంవత్సరాల క్రితముదైయున్నది. అది ఒక పాత చిత్రమైయున్నది, బహుశా ఇరువది సంవత్సరముల క్రితముదైయున్నది. మరియు ఆమె చనిపోయి రెండు సంవత్సరాలు అయినది. మరియు ఆమె ప్రతీ చర్యతో మరియు ప్రతీ మాటతో, మరలా అక్కడ సజీవముగా ఉన్నది. చూశారా? అది మరలా సజీవముగా ఉండేంతగా ఆ ఆయస్కాంత టేపుపై అది పట్టబడియున్నది.

65 అది మాత్రమే కాదు గానీ, మనం మాట్లాడే ప్రతీది సజీవంగా ఉంటుంది. మనము మాట్లాడే ప్రతీ మాట మరణించనేరదు. ఇప్పుడా గదిలోనుండి వచ్చుచున్నవి మనుష్యునియొక్క మాటలు, ఆకారములైయున్నవి. టెలివిజన్ దానిని పట్టుకుంటుంది. మీరు సరిగ్గా ఇక్కడుండి మాట్లాడవచ్చును, అయితే అదే క్షణములో, ప్రపంచమంతటా, దానిని వారు వింటారు. నీవు దానిని కనీసం ఈ గదిలో వినడానికి ముందే, అది ఎలక్ట్రానిక్ ద్వారా ప్రపంచమంతటకీ వెళ్తుంది.

66 మరియు దేవునియొక్క గొప్ప తెర దానిని పట్టుకుంటుంది. మరియు నీవు చేయు ప్రతీ కదలిక మరియు ప్రతీ చర్యను, నీవు న్యాయ తీర్పులో ఎదుర్కోవలసియుంటుంది. చూశారా? కావున, యౌవ్వనస్థుడా, ఆగి, ఈ సంగతులను ఆలోచించడం మంచిది, చూడండి, ఎందుకనగా మీరు మరలా దానిని ఎదుర్కొనవలసియున్నది. చూశారా?

67 ఈ యౌవ్వనస్థుడియొక్క జాడను, అతడు కలిగియున్న అవకాశమును మనము కనుగొందాము. మరియు అతడి స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూడండి. మరియు బెక్కీ మరియు మార్లిన్ వలెనే ఒక అమ్మాయైతే, సరిగ్గా అతడి స్థానములోనే మిమ్మల్ని మీరు ఉంచుకొనుడి, మరియు ఇంకనూ సజీవముగా ఉన్న ఆ స్వరమును మీరు వినగలరు.

68 అది ఇంకనూ సజీవముగా ఉన్నది. అది ఇంకనూ కదులుచున్నది. “ఇప్పటినుండి ఇరువది సంవత్సరములలో, రెండువేల సంవత్సరముల క్రితం ఆయన మాట్లాడిన, అక్షరాల ఆయనయొక్క స్వరమును వారు పట్టుకుంటారు,” అని సైన్స్ చెప్తుంది. అది ఇంకనూ సజీవముగా ఉన్నది. ఒక గులకరాయిని నదిలో వేసినట్లే అది ఉన్నది, ఆ తరంగము ఎన్నటికీ ఆగిపోదు. అది వేల మైళ్ళు దాటి ఒడ్డును తాకుతుంది, మరియు తిరిగివస్తుంది.

69 అటువలెనె గాలిలోకి ఒక్కసారి గనుక ఒక స్వరము పలుకబడితే, అది ఎన్నడూ అంతరించదు. ఆ న్యాయతీర్పు వద్ద ఇక మీరు చెప్పడానికి ఏమియూ ఉండదు. అది సరిగ్గా అక్కడ ఉంటుంది. “నన్ను వెంబడించుము,” అని ఆ యౌవనస్థుడికి ఆజ్ఞాపించిన యేసుక్రీస్తు యొక్క ఆ స్వరమును, మరియు విచారముతో అతడు దానిని నిరాకరించుటను, ఆ తెరమీద ఉండును, ఎందుకనగా అతడు గొప్ప ఆస్తులను కలిగియుండెను. చూశారా? మనము కనీసం…ఎల్లప్పుడూ డబ్బేయై ఉండనక్కరలేదు. అది ఇతర సంగతులు కూడా అయ్యుండవచ్చును. చూశారా? మనము ఆ పిలుపు కంటే, ప్రియముగా హత్తుకునే ఏదైనను, చూడండి అది మనకు ఆ డబ్బులాగానే మారుతుంది. అది మనలను చెరుపునటువంటిదిగా మారుతుంది.

70 ఇప్పుడు కొద్దిగా అతడిని వెంబడించుదాము. అతడు నిరాకరించినప్పుడు ఏమి జరుగుతుంది? అతడు క్రీస్తుయొక్క ఆ స్వరమును వినలేదు. అతడు తన స్నేహితులతో వెళ్ళిపోయెను.

71 పిల్లలైన మీ వలెనె, మీరంతా చక్కని పిల్లలైయున్నారు, మరియు మీరు స్నేహితులను కలిగియుండ బద్ధులైయున్నారు, కానీ మీరెటువంటి స్నేహితుడిని కలిగియున్నారో గమనించండి. ఆ స్నేహితుడు క్రీస్తును వెంబడించుచున్న యెడల, ఆ స్నేహితుడితో వెళ్ళండి. క్రీస్తును కూడా వెంబడించండి. అయితే అతడు వెంబడించనియెడల, దానిని చేయకండి.

72 మనం అతడివైపు చూద్దాము. అతడు బహుశా అతడి స్నేహితులను నిలిపుకొనుటను, మనం కనుగొంటాము. అతడొక గొప్ప అధికారి అయ్యాడు. అప్పుడతడు ఒక అధికారిగా ఉండెను. తర్వాత, అతడు—అతడు—అతడు తన ధాన్యమును నిలువచేయుటకు అదనంగా కొట్లను నిర్మించుకొనేంతగా అతడు ఫలించుటను మనం కనుగొంటాము. మరియు పిదప తనలో తాను అనుకున్నాడు, అతడు వయస్సు మళ్ళిన తర్వాత, మరియు యౌవన జీవితపు విచారములు మరియు అట్టి సంగతులన్నియు గతించిన తర్వాత, బహుశా అతడు చేసినదంతా ఏమిటంటే, వినోదంగా గడపడమేయైయుండెను.

73 నా వలె, నా భార్య వలె, మీ తల్లిదండ్రుల వలె, ఒక వృద్ధుడు, లేదా ఒక వృద్దురాలు ఉన్నారంటే, అప్పుడు వారు అలోచించుటకు ఇక ఏమీయు ఉండదు. వారట్లు చేయలేరు, యౌవనస్థులు మరియు యౌవనస్థురాళ్ళ వలె, బయటకు వెళ్ళి, మరియు—మరియు వీధుల్లో అటు-ఇటు పరుగెత్తడం వంటివి వారు చేయగోరరని మీకు తెలియును. ఎవరు నీకు భార్య, లేదా భర్త అవ్వబోతారని, బయట తిరిగడానికి వెళ్ళరు, లేదా, చూడండి, వారు మనస్సులో అటువంటివాటిని కలిగియుండరు. వారు, వారు పిల్లల్ని కలిగియున్నారు, మరి వారిపట్లనే ఆసక్తి కలిగియుంటారు. రేపన్నది ఉన్నట్లయితే, రేపు మీరంతా ఆవిధంగానే అవుతారు. చూశారా?

74 మరియు ఈ వ్యక్తిని చూడండి, తర్వాత, బహుశా…బహుశా అతడికి వివాహము కూడా అయ్యుండకపోవచ్చును. మరి, అయితేనేమి, అతడొక గొప్ప అధికారియైయుండెను. మరియు అతడు స్థిరపడినాడు…

75 మరియు యెరూషలేములో ఉన్నట్లే, నేటికినీ, సాయంకాల వేళలో, చల్లగానున్నప్పుడు ఈ సమయానికి, వారు ఇంటిపైనే ఆహారము తింటారు.

మరియు అతనితో పాటు మరొక పాత్ర జోడించబడుటను మనం కనుగొంటాము; ఒక భిక్షగాడు.

76 మరియు పొరుగువాడిని ఘనపరచవలెననియు, ఇతరులు నీకు చేయాలని నీవు అనుకున్నట్లే, వారికిని చేయవలెనన్న విధంగా ఆ వ్యక్తి పెంచబడినాడు. చూడండి, క్రీస్తుయొక్క పిలుపును త్రోసివేయుటను బట్టి, తుదకు…అటువంటి కుటుంబములో పెంచబడిన ఒక అబ్బాయినుండి, అది ఎన్నడూ తొలగిపోవునట్లు కనిపించదు, కానీ అది జరిగినది. అదే జరిగినది.

77 మరియు అతడిని ఆహారము కొరకు యాచిస్తూ, ఆ గేటు వద్ద, లాజరు అను పేరుగల ఒక వ్యక్తి పడియుండెను. ఆ భిక్షగాడు తన కొరకు కాదు గానీ, అతడు ఊడ్చి, కుక్కలకు వేసిన పనికిరాని రొట్టె తునకలను తినేవాడు. మరియు అతడు పూర్తిగా పుండ్లతో ఉండెను. కానీ అప్పుడు ఆ మనిషైతే సమాజంలో చాలా మెరుగైనవాడిగా ఉండెను, అయితే అతడికి ఎంతమాత్రము కనికరం లేదు. అతడు మొద్దుబారిపోయెను, ఎందుకనగా క్రీస్తుయొక్క ఆ ప్రతిపాదనను అతడు తృణీకరించెను.

78 మరియు బహుశా ఒక సాయంకాలం ఈ సమయానికి, చక్కని ద్రాక్షారసమును సేవిస్తూ, మరియు అతని చుట్టూ నగలు ధరించిన అందమైన స్త్రీలతో, మరియు అటువంటి వాటితో, అతని హృదయం కోరిన వాటన్నింటితో ఉండెను, మరియు అభినందనలు తెలుపుచు త్రాగుచునుండెను. ఒక భిక్షగాడు మాత్రం ఆ గేటు వద్ద పడియుండెను.

79 మరియు మరుసటి ఉదయమున, సూర్యోదయం కాకముందే, అతడు పాతాళములో ఉండెను, లాజరు వచ్చి తన నాలుకను నీటితో తడపవలసిందిగా కేకలు వేయుచుండెను. అది సంఘటనయొక్క మార్పుయైయున్నది.

80 మరియు, “తండ్రివైన అబ్రాహామా,” అని అతడు అన్నప్పుడు, అబ్రాహాము యూదులకు తండ్రియని, అతడింకను గుర్తుంచుకొనుటను మీరు గమనించండి. అతడిట్లనెను, “తండ్రివైన అబ్రాహామా, తన వ్రేలును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ భిక్షగాడైన లాజరును ఇక్కడకు పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నాను.”

81 అందుకతడు…మరియు అబ్రాహాము, “అది, నేనట్లు చేయలేను,” అని ఖండితముగా చెప్పెను. “నీవు చూడుము, ఇదంతయు కాదుగానీ, జీవితంలో నీ అవకాశము నీకు వచ్చినది,” అని అనెను.

82 అది అతనికి ఎప్పుడు కలిగెను? “నన్ను వెంబడించుము,” అని యేసు చెప్పినప్పుడేయైయున్నది. కానీ, అతడు దానిని నిరాకరించెను. అతడు డబ్బును సంపాదించుకొనగలిగే దారిలో వెళ్ళాడు. మరియు అది సరియే, డబ్బు సంపాదించడంలో తప్పేమీ లేదు, అయితే దానిని మీరు చేస్తుండగా, యేసును వెంబడించండి. చూశారా? మరియు అతడు ఆ గుంపుతో మరొక దారిలోనికి వెళ్ళిపోయాడు.

83 మరియు ఆయన, అబ్రాహాము ఇట్లు చెప్పుటను మీరు కనుగొంటారు, “అంతేకాకుండా, ఇక్కడినుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, ఏ మనుష్యుడు ఎన్నడూ దాటియుండలేనటువంటిదియై, ఇకమీదట దాటలేనటువంటిదియైన, ఒక మహా అగాధము, మాకును మీకును మధ్య ఉంచబడియున్నది. అది ఉంచబడియున్నది, ఏ మనుష్యుడును దాని దాటలేదు మరెప్పుడును దాటరు.”

84 అప్పుడతడు చెప్పేది వినండి. అప్పుడు అతడొక సువార్తికునిగా ఉండగోరాడు. ఒక యౌవనస్థుడిగా, ఆత్మలను గెల్చుకునే వాడిగా ఉండుటకు, ఆయనను వెంబడించమని యేసు అతనికి ఇచ్చిన పిలుపు తిరిగి మరలా అతనివద్దకు వచ్చినది. భూమి మీద తనకు ఐదుగురు సహోదరులు ఉన్నారన్న విషయం అతడికి గుర్తుకువచ్చినది, మరియు వారు ఆ స్థలమునకు రాకూడదని అతడు కోరుకున్నాడు.

85 అతడిట్లన్నాడు, “నా సహోదరులు ఇక్కడికి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై, లాజరును పంపుము.” ఇంకొక మాటలో చెప్పాలంటే, “‘నన్ను వెంబడించుము,’ అనే పిలుపును అంగీకరించుము.” చూశారా?

కానీ, “వారు దానిని చేయరు,” అని ఆయన చెప్పెను.

86 “అవును, లాజరువంటి వాడు మృతులలో నుండి వారియొద్దకు వెళ్ళి మరియు వారికి చెప్పినట్లైతే, వారు మారుమనస్సు పొందుదురు,” అని అతడు చెప్పెను.

87 మీరు చూడండి, మనము మరణించిన తర్వాత కూడా మీరు స్పృహలో ఉంటారని అది చూపించుచున్నది. అతనికి జ్ఞాపకమున్నది. అబ్రాహాము ఇట్లన్నాడు, “కుమారుడా, నీ దినములను జ్ఞాపకం చేసుకో.” చూశారా? మీకింకను జ్ఞాపకం ఉంటుంది. మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోరు. మీకు జ్ఞాపకమనేది ఉంటుంది.

88 మరియు ఆ మనుష్యుడికి ఉన్న జ్ఞాపకాలతో, ఇంకనూ అదే స్థలములో ఉండగనే, “నన్ను వెంబడించుము,” అని యేసు చెప్పుటను వినడానికి అతనికి వచ్చిన అవకాశమును జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అతడు తప్పుడు వ్యక్తిని, తప్పుడు గుంపును వెంబడించాడు. అతడు తప్పుడు గుంపులో చేరి, మరియు తప్పుడు స్థలమునకు వెళ్ళి, మరియు తప్పుడు నిత్యత్వములో తన జీవితాన్ని ముగించుకున్నాడు; ఆ దినమున దేవునియొద్ద నుండి, శాశ్వతంగా నశింపజేయబడెను.

89 యేసు కూడా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు, “‘మృతులలో నుండి ఒకడు లేచి వారియొద్దకు వెళ్ళినా గానీ, వారు నమ్మరు. ఎందుకనగా వారియొద్ద మోషే ధర్మశాస్త్రము ఉన్నది, మరియు వారు దానిని విననియెడల, అప్పుడు మృతులలో నుండి ఒకడు లేచినా కూడా వారు వినరు. వారు విననే వినరు’”

90 ఎందువలన? ఎందువలన? ధర్మశాస్త్రము అటువంటిదేదైనా మాట్లాడినదా? అవును. “ఇతరులు మీకు చేయవలెనని మీరు కోరినది, మీరును వారికి చేయండి.” మరియు అతడు ధర్మశాస్త్రము క్రింద జీవించెను. కానీ ఆ భిక్షగాడు ఆ గేటు వద్ద చనిపోవుచున్నను పట్టించుకోలేదు. చూశారా? అతడు—అతడు దేవునియొక్క ఆజ్ఞల క్రింద జీవించాడు, మరియైనను ఆ గొప్ప నిత్యజీవమును చూచుటలో విఫలమయ్యాడు.

91 పిల్లలారా, మీరు ప్రతియొక్కరు నా పిల్లలవలె కనిపించుచున్నారు. మీరు ప్రతియొక్కరు సరిగ్గా నా కుమారులు మరియు కుమార్తెలవలె అనిపించుచున్నారు. ఒక విధంగా మీరు నా పిల్లలే, చూడండి, ఆత్మీయంగా మాట్లాడుచున్నాను. అది నిజము. మీరు వచ్చి నేను చెప్పునది వింటారు గనుక, ప్రభువైన దేవుడు మీ ఆత్మలను నా—నా భద్రతలో ఉంచాడు. మీరు నన్ను నమ్ముదురు. చూశారా? మరియు వాక్యప్రకారమైన ఒక విధానంలో, మీరు నా కుమారులు మరియు కుమార్తెలైయున్నారు. అది వాస్తవం.

92 ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి, దేవుడియొక్క ఆజ్ఞలను పాటించుటయన్నది ఒక గొప్ప విషయమైయున్నది. ఒక మంచి కుటుంబములో పెంచబడటం అనేది దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమైయున్నది. మరియు మీరు కలిగియున్నటువంటి వ్యక్తిత్వములతో చక్కని పిల్లలుగా ఉండుట మంచిది. విద్యను అభ్యసించడం, అద్భుతమైన విషయమైయున్నది. ఈ స్వతంత్ర్య దేశంలో నివసించుట కూడా అద్భుతమైన విషయమే. కృతఙ్ఞతలు చెల్లించుటకు మనము అనేక సంగతులను కలిగియున్నాము.

93 అయితే మీరు ఊరకే వారసత్వంగా పొందనటువంటి కార్యము ఒకటి ఉండియున్నది. దానిని మీరు స్వీకరించవలసియున్నది. అది నిత్యజీవమైయున్నది. మరియు మీరు ఒక తిరిగి-జన్మించిన అనుభవంచేత, యేసును వెంబడించుట ద్వారా మాత్రమే దానిని చేయగలరు. దానిని నిర్లక్ష్యం చేయకండి.

94 పేదవాడైన ఒక వ్యక్తిని గూర్చిన చిన్న కథను ఒకసారి నేను వినియున్నాను. మరియు అతడు—అతడు ఎల్లప్పుడు…అది ఒక చిన్న కల్పిత కథ వంటిదైయున్నది. అయినప్పటికీ అది ఎల్లప్పుడూ నా మనస్సులో ఉంటుంది. మరియు ఒకరోజు అతడు ఒక పువ్వును తెంపుకున్నాడు. మరియు అది ఒక మ్యాజిక్ పువ్వైయున్నది, మరియు ఆ పువ్వు అతనితో ఇట్లన్నది, “నీ జీవితమంతా నువ్వొక పేదవాడిగా ఉన్నావు.” అది ఇంకా ఇట్లనెను, “ఇప్పుడు నీకు ఇష్టమైన దానిని అడుగుము, మరియు అది నీకు ఇవ్వబడును.”

95 అతడిట్లు చెప్పెను, “అక్కడున్న ఆ పర్వతము తెరవబడాలి, మరియు నేనందులోనికి వెళ్ళి మరియు ఆ పర్వతములో బంగారమును కనుగొనాలి.”

96 “సరి,” ఆ పువ్వు ఇట్లు చెప్పెను, “నీవు వెళ్ళిన చోటుకెల్లా నీతోపాటు నన్ను తీసుకొని వెళ్ళవలసియుంటుంది. చూశావా? నీవు నన్ను, నీతోపాటు తీసుకొని వెళ్ళవలసియున్నది. కావున నేను ఉన్నచోటనే, నీవు కోరుకున్నది నన్ను అడుగవచ్చును.”

97 అతడు నడుచుకుంటూ ఆ పర్వతం వద్దకు వెళ్ళెను, మరియు ఆ పర్వతం తెరుచుకొనెను మరియు అతడు లోపలికి వెళ్ళెను. ఆ చిన్న కల్పిత కథ కొనసాగిన ప్రకారంగా, ఆ అరలు మొత్తం బంగారము మరియు వజ్రములతో ఉండెను. అతడు అ పువ్వును ఒక—ఒక బల్ల, లేదా బండ మీద పెట్టెను. మరియు అతడు పరుగెత్తుకొని పోయి ఒక పెద్ద రత్నమును అందుకున్నాడు, మరియు అతడు, “నేను వెళ్ళి దీనిని నా స్నేహితులకు చూపించవలెను. ఇప్పుడు నేనొక ధనవంతుడను. ఇప్పుడు నేను సమస్తమును కలిగియున్నాను. ఇప్పుడు నేను దీనిని చూపించవలెను,” అని అన్నాడు.

98 అప్పుడు ఆ పువ్వు ఇట్లు పలికినది, “కానీ,” “నీవు ముఖ్యమైన దానిని మర్చిపోయావు” అని చెప్పినది.

99 కావున అతడు వెనుకకు పరుగెత్తుకొనిపోయి, “సరి, బహుశా నేను—నేను కొద్దిగా బంగారమును తీసుకుంటాను. నేను కొంచెం వెండిని తీసుకుంటాను,” అని చెప్పి వాటిని అందుకున్నాడు. మరియు కావున అతడు, “నేను—నేను ఎంతటి ధనవంతుడనో, మరియు నేను ఏమేమి కలిగియున్నానో ప్రజలకు చెప్పుటకు నేను త్వరగా బయటకు వెళ్ళాలి,” అని అన్నాడు.

100 మరియు అతడు ద్వారమునొద్దకు వచ్చెను, అప్పుడు ఆ పువ్వు అతనితో ఇట్లు చెప్పెను, “కానీ నీవు ఆ ముఖ్యమైన దానిని మర్చిపోయావు.”

101 కావున అతడు మరలా వెనుకకు పరుగెత్తెను. “ఇక్కడ మనము అన్ని రకములైన పదార్ధములను కనుగొనుచున్నాము,” అని అతడనెను. కావున, అతడొక రాయిని తీసుకొనెను. “నేను ఈ రాయిని తీసుకు వెళ్ళి, మరియు ఈ పర్వతము ఎటువంటి రాయితో చేయబడినదో ప్రజలకు చూపిస్తాను, తద్వారా తిరిగి నేను దానివద్దకు నా దారిని కనుగొనగలను.” అని అన్నాడు. చూశారా?

102 మరియు బయటకు వెళ్ళుటకు అతడు ద్వారము దగ్గరకు వచ్చాడు, మరియు ఆ పువ్వు…ఇక చివరిసారిగా చెప్పెను, “నీవు ముఖ్యమైన దానిని మరచిపోయావు.”

“ఓహ్,” “ఓ, నోరు మూసుకో,” అని అతడన్నాడు.

103 చూడండి, “ముఖ్యమైన దానిని మర్చిపోయావు,” అనే మాటను అతడు ఇక ఎంతమాత్రము వినగోరలేదు, కావున అతడు ఆ ద్వారము నొద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. మరియు అతడట్లు చేసినప్పుడు, ఆ పువ్వు లోపల ఉండగా, తన వెనుక ఆ ద్వారము మూసుకుపోయినది. ముఖ్యమైనది ఆ పువ్వేయైయున్నది. చూశారా? ముఖ్యమైనది ఆ పువ్వే.

104 సంవత్సరాల క్రితం, మీవలేనే ఒక పిల్లవాడిగా, ఫినిక్సు లో ఇక్కడ, పైన గడ్డి బీళ్ళ వద్ద, ఒక ఖనిజ పరిశోధకుని గూర్చి ఒక కాగితమును చదువుచుంటిని. అప్పుడు, అప్పుడిక్కడ రోడ్లు లేకుండెను, కేవలం మట్టి దారులు ఉండేవి. ఇప్పటికీ వారిక్కడ అనేక ఖనిజ పరిశోధనలు జరుపుతూనే ఉంటారని, మీకు తెలుసు కదా.

105 అయితే ఈ ఖనిజ పరిశోధకుడు వచ్చి, అతడు చాలా ధనమును కనుగొన్నాడు మరియు అతడికి చాలా బంగారము దొరికినది. మరియు అతడి మార్గంలో, అతడు కనుగొన్న ఒక గుడిసెలో అతడు ఆగినాడు. మరియు తనతో పాటు అతడొక కుక్కను కలిగియున్నాడు, మరియు, ఆ—ఆ కుక్క బయట కట్టివేయబడినది. మరియు ఆ రాత్రి ఈ బంగారమును దోచుకొనుటకు ఒక దుండగుల ముఠా అతడిని వెంబడించుచుండెను. అతడు దానిని ఆ పాత స్పానిష్ గనులలో నుండి తీసుకుని, దానితో తిరిగి వచ్చుచున్నాడు. మరియు ఆ కుక్క మొరగడం మొదలు పెట్టినది.

106 మరియు ఆ మనుష్యుడు ఆ కుక్క వలన ఇబ్బంది పడగోరలేదు. “నోరు మూసుకో”, అని అతడనెను. “రేపు నేను—నేను దీనిని పట్టణమునకు తీసుకువెళ్తాను,” అని అన్నాడు. మరియు అది …ఆ కథలోని నీతి ఈ విధంగా ఉన్నది. “మరియు నేను దానిని తూకం వేయిస్తాను మరియు నేనొక ధనవంతుడనవుతాను. మరియు నేను పెద్ద కార్లను కొంటాను. మరియు నేను రకరకాల స్త్రీలను మరియు పెద్ద పార్టీలను కలిగియుంటాను. మరియు నేనొక ధనవంతుడనవువుతాను, ఎందుకంటే నేను ఇప్పటికే దీనిపై హక్కు పొందాను. దానిలో, ఎక్కువశాతం బంగారాన్నే నేను కలిగియున్నాను.” ఇంకా ఇట్లనెను, “నేను…”

107 మరియు అతడు నిద్రపోవుటకు ప్రయత్నించుచుండగా, ఆ కుక్క మొరుగుతూనే ఉన్నది, ఎందుకనగా ఆ దుండగులు మెల్లగా జొరబడి వచ్చి, ఆ ఖనిజదారుడు నిద్రపోవుట కొరకు వేచియుండుటను ఆ కుక్క చూసినది.

108 అతడు లేచి, మరియు మరల ఆ కుక్కపై కేకలు వేసి, “నోరు మూసుకో,” అని అన్నాడు. మరియు పాపం ఆ కుక్క మూలుగుతూ మరియు ప్రమాదం పొంచియున్నదని దాని యజమానుని హెచ్చరించుటకు ప్రయత్నించినది. మరియు ఎప్పుడైతే అది…

109 మళ్ళీ ఆ కుక్క మొరగటం మొదలుపెట్టినప్పుడు, ఆ ఖనిజదారుని వద్ద ఒక తుపాకి ఉన్నది. అతడు ఇక ఇబ్బందిపడగోరలేదు, కాబట్టి అతడు వెంటనే లేచి మరియు ఆ కుక్కను పేల్చివేసెను. మరియు ఆ రాత్రి, ఆ దుండగుల చేత ఆ ఖనిజదారుడు చంపబడినాడు. అతని యొక్క అందమైన కలలన్ని అతనికి ఏ మంచి చేయలేదు. ఎందువలన? అతడిని హెచ్చరించుచున్న ఆ స్వరమును అతడు ఆపివేసాడు.

110 ఎవరైననూ దేనినైనా చేయుటకు ప్రయత్నించలేరు, పిల్లలైన మీరు, మీరున్న విధానంలో పెంచబడిన తరవాత, దానిని చేయవద్దు అని ఏదో మీతో చెప్తుందని మీకు అనిపించినంతవరకు, ఎన్నడూ ఏ తప్పును చేయలేరు. ఇప్పుడు, మిమ్మల్ని హెచ్చరించ్చున్న ఆ స్వరమును ఎన్నడూ ఆపివేయకండి.

111 మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి, “నన్ను వెంబడించుము,” అని చెప్పిన ఆ స్వరమును స్వీకరించండి, మరి అప్పుడు మీరు ఎల్లప్పుడూ సరిగానే ఉంటారు. మీరలా చేస్తారని నేను నమ్ముచున్నాను. నాకు మీ మీద నమ్మకమున్నది. అయితే యేసు యొక్క ఆ స్వరము, ఈ రాత్రి భూమిమీద సజీవముగా ఉన్నదని మాత్రం ఎల్లప్పుడూ గుర్తించుకొనండి.

112 గాలిలోని ఈథర్ తరంగములోనికి ఆ స్వరము వెళ్ళినప్పుడు, మనం మాట్లాడిన ప్రతీ మాట మరియు ప్రతీ స్వరము ఇంకను సజీవంగా ఉన్నరీతిగానే, సరిగ్గా అది అట్లేయున్నది. అది…చూడండి, దానిని బయటకు పంపించే ప్రసార యంత్రాన్ని మీరిచ్చట కలిగియున్నారు. దానిని బయటకు పంపే ప్రసార సాధనము మీరేయైయున్నారు. ఇప్పుడు దానిని పట్టుకొనుటకు ఆ ప్రసార కేంద్రము అవసరమైయున్నది.

113 మరియు యేసు, దేవుని వాక్యముయొక్క ప్రసార సాధనమైయున్నాడు, ఎందుకనగా ఆయన—ఒక్క మనుష్యునిలో ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క త్రిఏకత్వమైయున్నాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు మరియు పరిపూర్ణమైన మానవుడైయుండెను.

114 మరియు దేవునియొక్క త్రిత్వము, అనగా, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మగా నున్న దేవునియొక్క త్రిత్వ గుణలక్షణములు, యేసుక్రీస్తు అను ఆ ఒక్కడిలో ప్రతిబింబించబడెను. కావున, అచ్చట, ఆయనే వాక్యమైయున్నాడు.

115 మరియు “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు,” అని చెప్పిన ఆ ప్రసార సాధనం ఆయనేయైయున్నాడు. చూశారా? “నా మాటలు విని మరియు నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఇప్పుడు, ఆ మాట ఒక ప్రసార సాధనము నుండి బయటకు వెళ్ళెను. ఒక దినమున ఆయనిట్లు చెప్పెను, “ఈ కొండను చూచి, ‘కదలిపొమ్ము,’ అని చెప్పి, మరియు మీ హృదయములో సందేహింపక, మీరు పలికినది జరుగునని విశ్వసించినయెడల, మీరు చెప్పినది మీరు పొందుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.”

116 ఇప్పుడు, విశ్వాసం ద్వారా, మీలోనున్న ఏదో నియంత్రణ ద్వారా, మీరు గనుక కేవలం దానిని పట్టుకునే ప్రసార కేంద్రముగా ఉండినయెడల, అది మిమ్మల్ని నేరుగా దేవునియొక్క చక్రములోనికి, నూతన జన్మలోనికి తీసుకువెళ్ళి, మరియు తిరిగి జన్మించినవారిగా చేస్తుంది. అప్పుడు ప్రమాదము పొంచియుండగా మిమ్మల్ని ఎల్లప్పుడూ హెచ్చరించే ఆ స్వరమును వినుటకు మీరు నిత్యము సంబంధం కలిగియుంటారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు, తప్పుగా జరుగుచున్నప్పుడు, అది ఎల్లప్పుడూ మీకు ఒక హెచ్చరికగా ఉంటుంది. మరియు పిదప ఏదో ఒకరోజు మనము మాట్లాడుకొనుచున్నటువంటి ఆ యౌవ్వనస్థుడైన ధనవంతుడివలె ఉండుటకు బదులు; అపోస్తలుడైన పేతురువలె, పౌలువలె, లేదా యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుకున్న ఒక వ్యక్తివలె ఉండెదము. పిల్లలారా, మీరు దానిని చేయండి.

మనం ప్రార్ధించుకుందామా?

117 ప్రభువైన యేసు! రేపన్నది ఉన్నయెడల, ఈ యౌవ్వనస్థులే, రేపటి స్త్రీలు మరియు పురుషులౌతారు. ప్రభువా, మేము వారికి తర్ఫీదు ఇవ్వవలసియున్నది. రేపన్నది ఉందన్నట్లుగానే వారికి తర్ఫీదు ఇవ్వవలెనన్న ఆ భారమును మేము కలిగియున్నాము. లేనియెడల, అప్పుడు ఇదే ఆ రోజైయున్నది.

118 మరియు పిదప, తండ్రీ, నీ దృష్టిలో ఎవ్వరూ అంగీకరించబడరని మేమెరిగియున్నాము. ఏ శరీరియు అతిశయింపకూడదు. ఈ సంగతులు ఎంతో మంచిగా ఉన్నప్పటికినీ, పరిశుద్ధాత్మ తప్ప, ఏ విద్యగానీ, ఏ మంచి పనులైనా గానీ, ఏ మత సంబంధమైన సంస్థగానీ, ఏ మనోవిజ్ఞాన శాస్త్రం గానీ, మరేది గానీ, దేవుడిని నిర్ధారించలేదు. ఆయనే ఆ సాధనమైయున్నాడు, స్వయంగా దేవుడే నిత్యజీవపు రూపములో, వ్యక్తిగతంగా మన వద్దకు రాగలిగియున్నాడు. మరియు దీనినిబట్టి మేము కృతజ్ఞులమైయున్నాము.

119 పేతురు ఒప్పుకోలు చేసినప్పుడు నిశ్చయంగా అది వ్యక్తపరచబడినది. యేసు అతనితో ఇట్లు చెప్పెను, “రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవెన్నడూ ఒక సెమినరీలో దీనిని నేర్చుకొనలేదు. నీవెన్నడూ ఒక పాఠశాలలో దీనిని నేర్చుకొనలేదు.” అది ప్రతీయొక్కరూ పొందుకొనవలసిన ఒక వ్యక్తిగత విషయమైయున్నది. “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు,” అని నీవు చెప్పావు. ప్రభువా, అందుకు మేము కృతజ్ఞులమైయున్నాము.

120 ఈ రాత్రి ఆ స్వరము ఇంకనూ సజీవముగా ఉన్నది. మరియు దానిని స్వీకరించగల విశ్వాసముయొక్క సాధనములు, విను సాధనములు, స్వీకరించే కేంద్రములు ఇంకనూ ఉండియున్నవి. ప్రభువా, ఈ పిల్లలందరూ వారి హృదయములలో దానిని స్వీకరించుదురని మేము ప్రార్ధించుచున్నాము. మరియు మంచిగా ఉండుటకు వారేమి చేసారన్నది కాదని వారు గుర్తుంచుకొనెదరుగాక, అయితే వారు…మేము ఏమి చేశామన్న దానినిబట్టి కాదు, గానీ మేము దేనిని స్వీకరించామన్న దానినిబట్టియే దేవుడు తీర్పు తీర్చుతాడు. మా క్రియలవలన కాదు గానీ, మా విశ్వాసముచేతనే మేము రక్షించబడియున్నాము. కావున, పరలోకపు తండ్రీ, ఇప్పుడు వారు ఆ దర్శనమును పట్టుకొని, మరియు “వచ్చి, నన్ను వెంబడించుము,” అను ఆ గొప్ప ఆహ్వానమును విని మరియు దానిని చూడవలెనని మేము ప్రార్ధించుచున్నాము.

121 ప్రభువా, వారిలో ప్రతియొక్కరు, ఈ మర్త్యమైన, పరిమితిగల జీవితముయొక్క లోకసంబంధమైన కార్యముల నుండి ప్రక్కకు తొలగుదురుగాక. వారు ఈ రాత్రి ఇచ్చటనున్నారు, వారు తమ బంగారు రంగు జుట్టుతోను, మరియు వారిలో కొందరు నల్లని జుట్టుతోను, మరియు నల్లని కళ్ళతో మరియు నీలము రంగు కళ్ళతో మరియు వారెన్నడూ ఉండనటువంటి శ్రేష్టమైన స్థితిలో వారిచ్చట కూర్చునియున్నారు.

122 మరియు “దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములయందే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము,” అని ఆ గొప్ప రచయిత చెప్పెను. ప్రభువైన యేసు, నీవు పేతురుతో, “నీవు యౌవనస్థుడవై యుండినప్పుడు, నీయంతట నీవే నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. కానీ నీవు ముసలివాడవైనప్పుడు, వేరొకడు నీకిష్టముకాని చోటుకు నిన్ను మోసుకొనిపోవును,” అని ఎట్లు చెప్పితివో కదా. “ఇప్పుడిదే అనుకూలమైన దినము. ఇదే అనుకూలమైన సమయము,” అని వారు జ్ఞాపకము చేసుకొందురు గాక. తండ్రీ, దానిని అనుగ్రహించండి.

123 ఈ రాత్రి ఇక్కడున్న ప్రతియొక్క పిల్లవానిని, వారిలో ప్రతీయొక్కరినీ నా స్వంత పిల్లలుగా హక్కు పొందుచున్నాను. వారిని కాయుటకు, నీవు వారిని నా చేతిలో ఉంచావని నేను భావించుచున్నాను. అపవాది నుండి, మరియు మరణము నుండి, యేసుక్రీస్తులోని జీవమునకు వారందరిని నేను సంపాదించుకొనుచున్నాను. ఆమేన్.

124 పిల్లలారా, మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ కొద్ది మాటలను మీకు చెప్పడం నిజంగా చాలా బాగుంది. మరియు బిల్లీతో, నేను తిరిగి వెళ్తాను. చక్కని పిల్లలు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సహోదరుడా ఫ్రెడ్, ప్రభువు నిన్ను దీవించును. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును. 


    63-0601 — వచ్చి, నన్ను వెంబడించుము
    Rev. William Marrion Branham

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...