సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు
1మనము మన యొక్క తలలు వంచియుండగా, కొన్ని క్షణముల పాటు మనము ఇంకనూ నిలబడియే వుందాము. నేను ఆశ్చర్యపడుచున్నాను. మనము మన తలలు మరియు మన హృదయములను వంచి యుండగా, ఈ రాత్రి మీరు దేవుని నుండి కావలెనని అడిగే ప్రత్యేక విన్నపము ఏదైననూ ఉన్నచో, మరియు ప్రత్యేక మైనదేదైన మీ యొక్క ఎత్తబడిన చేతుల ద్వారా దానిని తెలియబడునట్లు మీరు చేస్తే, నేను చూడవలెనని ఆశిస్తున్నానను. ఇప్పుడు మీరు కలిగిన అవసరత ఏమిటో ఆయన ఎరుగును. మీ హృదయములో ఉన్నది, అది ఏమైయున్నదో దాని గూర్చి మాత్రమే ఆలోచించండి.
GEN 1:1•
MATT 21:22•
EPH 2:6
2మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశముల యొక్క సృష్టికర్తతో "తండ్రి" అని చెప్పే గొప్ప భాగ్యమును మేము కలిగియున్నందుకు ఈ రాత్రి మేము చాలా సంతోషిస్తున్నాము. నీ కుమారుడైన, క్రీస్తునందు పరలోక స్థలములలో ఈ రాత్రి ఇక్కడ మేము కూడియున్నామని తెలుసుకొనుటకు మేము ఎంతగానో ఆనందపడుచున్నాము. మరియు ఆయన నామములో మేము ఏదైననూ అడిగితే అది అనుగ్రహింపబడుతుందని ఆయన వాగ్దానము చేసెను. ప్రభువా, పైకి లేపిన ప్రతీ చేయిని నీవు చూసియున్నావు. ఆ చేతి వెనుక ఏమి ఉన్నదో నీవు ఎరుగుదువు. దేని నిమిత్తమో ఒక విన్నపము అక్కడ వున్నది, మరియు వారితోపాటు నా ప్రార్థనను నేను అర్పించుకొనుచున్నాను. విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆ గొప్ప ధవళ వర్ణపు సింహాసనము యొద్దకు ఇప్పుడు మేము సమీపించుచున్నాము. అక్కడ, బలిపీఠము మీద ప్రభువైన యేసు రక్తము ఉంచబడియుండుట మేము చూస్తూండగా, మా యొక్క విజ్ఞాపనకు సమాధానము వచ్చుట ఖచ్చితము. ఒకే ఒక్కటి విడిచిపెట్టబడింది: మేము దేని నిమిత్తము అడిగితిమో దానిని పొందితిమని మేము నమ్మినట్లైతే, అప్పుడు అది అనుగ్రహింపబడుతుంది. మా అవిశ్వాసమునకు సహాయము చేయుము.
JOHN 14:13,14
3మరియు, తండ్రి, మేము వాక్యమును తెరచుచుండగా దానిని మాకు బయలుపరచుదువని ఈ రాత్రి ప్రార్ధించుచున్నాము. దానిని వ్రాసినవాడవు నీవే, అని దానిని మేము ఎరుగునట్లు నీవు చేయబోవుచున్నావని మేము ప్రార్ధించుచున్నాము. మరియు అప్పుడు మా మధ్యకు వచ్చి, మరియు దానిని జీవింపజేయండి, మరియు మీరే ఋజువు చేయండి, అది ఈ గొప్ప విజ్ఞాన శాస్త్ర సాధనపు ఈ ఘడియలలో, సంఘం చల్లబడుతూ, ఆచారములోనికి సిద్ధాంతములోనికి వెళ్ళుచూ ఉండగా, నీవు ఒకే రీతిగా ఉన్నావని నిన్ను నమ్మవారికి నీవు ఇంకనూ ఒకే రీతిగా ఉన్నావు. అది పెంతెకోస్తునాడు నీ యొక్క శక్తిని కుమ్మరించిన అదే దేవునిగా నీవు యున్నావు. అరణ్యములో మోషేతో ఉన్న ఆ ఒక్కనిగా, శిష్యులతో నడిచిన అదే దేవునిగా నీవు వున్నావు. మరియు ఈ రాత్రి నీవు అదేరీతిగా ఉన్నావు. వాక్యము చుట్టూ మేము సహవాసము చేయుచుండగా ఇప్పుడు, మమ్ములనందరినీ ఆశీర్వదించండి. యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాము. ఆమెన్. కూర్చొనండి.
4ఎల్లప్పుడూ, దేవుని యొక్క ప్రజలు ఎక్కడ కలిసి కూడి యుందురో అది గొప్ప భాగ్యమని తలంచుచున్నాను, మన మధ్యలో క్రీస్తు ఉన్నాడని నేను దృఢముగా వున్నాను. గత సాయంత్రం గూర్చి మంచి నివేదికను (రిపోర్ట్) విన్నందులకు ప్రభువైన దేవునికి మనము కృతజ్ఞలమైయున్నాము, మరియు దేవుడు ఇంకనూ రోగులను… మరియు బాధింపబడుచున్న వారిని స్వస్థపరచుచున్నాడని తెలుపుచున్నది. మరియు ఇప్పుడు ఒకవేళ అక్కడ మన మనస్సులను క్రీస్తు మీద కేవలం నిలుపగలిగినట్లైతే, మరియు ఆయన సన్నిధి ఇక్కడున్నదని ఎరిగి, మరియు ఆయన దేని నిమిత్తం మరణించెనో, ఆ యొక్క ప్రతీ విమోచనా ఆశీర్వాదమును మీ కొరకు ఆయన ఇప్పటికే భద్రపరచియున్నాడు, అది మీదే. మీరు చేయవలసిన దంతయు దానిని నమ్ముటయే.
5మరియు ఈ రోజు మీరు మంచి విశ్రాంతి కలిగియున్నారని ఇప్పుడు మేము నమ్ముచున్నాము. మరియు మీరు సాద్యమైనంతగా ఈ రాత్రి మిమ్మును బయటకు పంపుటకు ప్రయత్నించెదము. రేపు రాత్రి, గురువారం రాత్రి అయివున్నది; మరియు శుక్రవారం రాత్రి, మరియు శనివారం ఉదయం - అల్పాహార విందు…
ఫీనిక్స్ ఛాప్టర్ నందు, ఫీనిక్స్ ఛాప్టర్ యొక్క అధ్యక్షుడు సహోదరుడు కార్డ్ విలియమ్స్ నుండి ఒక విజ్ఞాపనమును ఈ రాత్రి సంఘమును అడుగవలెనని నేను కోరుచున్నాను. ఈ మధ్యాహ్నము అతని యొక్క ఎనుబది అయిదు సంవత్సరాల వయస్సు గల తండ్రికి పక్షవాతము కలిగెను. మరియు అతడు ఈ రాత్రి ఇక్కడ ఉండవలసిన వాడైయున్నాడు. మరియు తన తండ్రిని చూచుటకు, ఉత్తరము దిక్కునకు ఎక్కడికో అతడు వెళ్ళియున్నాడు. వెంటనే వృద్ధాప్య వ్యక్తి కొరకు ప్రార్ధన చేయుటకు నేను వెళ్ళి యుంటిని. కొన్ని వారాల క్రితం నేను అతనితో ఉంటిని. మనము ఒక సభను కలిగియున్న అల్బూక్వెర్క్య నందు తన కుమారుని కంటే అతడు ఎక్కువగా జీవించియుండెను. మరియు ఈ రాత్రి, పక్షవాతముతో, అతడు పడి ఉండెను. ఎనుబది-అయిదు సంవత్సరముల వయసు. కానీ అతని నుండి ఆ దెబ్బను దేవుడు తీసివేయుచున్నాడని నా హృదయంతో నేను నమ్ముచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. చూడండి, నేను ప్రార్ధనలో ఉన్నప్పుడు అతడు కదులుటను నేను చూడగలిగితిని. మరియు అతడు నీవు కదలగలిగినప్పుడు, మీరు ఎరుగుదురు. కావున అతడు బాగుపడునని నేను ఎరుగుదును.
6విశ్వాసము, బుజువు మనతో ఉండి మనకు చెప్పుచున్న ఒక దాని నిమిత్తము మనము కృతజ్ఞలమైయున్నాము. ఇక ఊహించే కార్యము ఏది దానిలో లేదు. అనేక సంవత్సరాలుగా, దేవుని వాక్యము మనం కలిగియున్నాము; ఇప్పుడు మనం వాక్యము యొక్క దేవునిని పొందియున్నాము. చూడండి, ఇక్కడే ఆయన వాక్యము నేరుగా జీవించుచున్నది. కావున అది సత్యము, ప్రభువు యొక్క రాకడకు ముందు సంఘానికి వాగ్దానము చేయబడిన చిట్టచివరి గొప్ప సూచనలలో అది ఒకటి.
7చాలా కాలం క్రితం కాదు, నా కుమారుడు మరియు నేను… బొంబాయి, ఇండియా వెళ్ళి యుంటిమి. మన కూడికలలో ప్రభువు చేయునట్లు నేను ఎప్పుడూ కలిగియుండే, ఆ గొప్ప బలిపీఠపు పిలుపును అక్కడ మేము కలిగియున్నామని అనుకొనుచున్నాను. క్రీస్తునొద్దకు ఎంతమంది వచ్చిరో మేము అంచనా వేయలేకపోతిమి, ఎందుకనగా ఒక కూడికలో సుమారుగా పది లక్షలలో సగం అని అది అంచనా వేయబడింది, సుమారు ఐదు లక్షలు. అక్కడ ఒక గొప్ప కార్యముతో కూడిన సమయం ఉండెను. మరియు అక్కడ పరిశుద్ధ వ్యక్తులైన హిందువులు ఉండిరి, ఓ, మై, మతమును గూర్చి మాట్లాడుట, భారతదేశము దానిని పొందియుండెను. ఆ మధ్యాహ్నము, భారతదేశంలో పదిహేడు వేర్వేరు మతస్తులచే నేను ఆనందించియుంటిని. మరియు వారిలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును తిరస్కరించినవారే: వారిలో ప్రతి ఒక్కరూ మహ్మదీయులు, బుద్దులు, సిక్కులు, జైనులు, ఓ వారిలో చాలా మంది. మరియు నేను ఏమీ చెప్పలేదు. నేను కేవలం వారు చెప్పేది వింటిని. అలా జైనుల యొక్క మందిరము లోనికి వెళ్ళుటకు, మా బూట్లను తీసివేయవలసి వచ్చెను.
8ఆ ప్రజలు పైకి వచ్చుటకు ప్రారంభించినప్పుడు… ఆతిధ్యము ముందు రోజు రాత్రి, వారికి ముందున్న ఆ ప్రజల యొక్క చివరను నేను చూడలేకపోతిని. ఒక్కొక్కరిగా, సమయానికి ప్రజలను పంపించుటకు సైనిక శక్తి గలిగియుండెను. మొదటిగా వచ్చింది, ఒక కుష్టు రోగియై యుండెను; అరచేతులు కలిగిలేడు మరియు చెవులు తిని వేయబడ్డాయి. అతని సమస్య ఏమిటో ఎవరైనా ఎరుగుదురు, అయినప్పటికీ మరియు అప్పుడు ఇద్దరు, ముగ్గురు వెళ్లిపోయిన తర్వాత ఎందుకు, అక్కడ పరిశుద్ధాత్మ బయలుపరచుచుండెను. అభిషేకం వచ్చినప్పుడు ప్రజలు అనుకునేది ఏమిటో మీరు చెప్పగలరు. చూడండి, మీరు దానిని పట్టుకొనండి, అది టెలిపతి (టెలిపతి అనగా మనస్సులను చదువుట - తర్జుమాదారుడు) లాంటిది ఏదో అయి ఉండెనని వారు అనుకొన్నారు. మరియు టెలిపతి అంటే ఏమిటో ఎవరైనా ఎరుగుదురు… అది కావచ్చు… ఒకవేళ పరిశుద్ధాత్మ వివేచించుటయే టెలిపతి అని మీరు అనుకొన్నట్లయితే, అప్పుడు టెలిపతి గూర్చి మీకు ఎక్కువగా ఏమి తెలియదు.
9కావున అప్పుడు ఈ పరిశుద్దమైన వ్యక్తులు, మరియు రాజులు, మరియు మొదలగు వారు, వారి యొక్క తలగడల మీద మరియు… వారు ఒకరు మీద ఒకరు పడినప్పుడు, ఇద్దరు లేదా ముగ్గురు ఊపిరాడక మరణించిరి. ఆ కూడికలో, కేవలం ఒకరిపై ఒకరు పడుటకు ప్రయత్నం చేయుటవలన, మరియు నేను ఉండడానికి రెండు రోజులు మాత్రమే కలిగియుంటిని. మరియు నేను భద్రతను పొందలేకపోతిని, కారణం.. దానిని నేను నగరంలో కలిగియుండవలసియున్నది, మేము భద్రత పొందుటకు కేవలం ఒకే ఒక మార్గం. మేము నగరానికి బయట, ఒక స్త్రీ వచ్చి యుండగా, ఆమె ఒక చిన్న సమస్యను కలిగియుండెను, ఇద్దరు లేదా ముగ్గురు మరణించిరి, మరియు నగరానికి బయట వారు నాకు సైనిక భద్రతను ఇవ్వలేరు. మరియు చూచుటకు అది నిశ్చయముగా బాధాకరమైన సంగతి.
కానీ సుమారుగా నాలుగవ వ్యక్తి వచ్చెను, నాలుగు లేదా అయిదవ వాడు, ఒక గ్రుడ్డి వ్యక్తి మరియు అతడు ఒక బిక్షగాడు నిజానికి, భారతదేశం నాలుగు వందల డెబ్బది మిలియనుల ప్రజలను కలిగియున్నది, (47 కోట్లు) వారిలో సుమారు నాలుగు వందల లక్షల ప్రజలు బిక్షగాళ్ళు వలె నాకు కనబడిరి. అంత ఎక్కువ బిక్షగాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. అది అటువంటి బిక్షగాళ్ళు దయనీయమైన విషయం… ఒక్కసారి అటువంటి విదేశీయాత్రను తీసుకొనేంత వరకూ, మనము ఎంత మంచిగా ఉన్నామో ఎరుగము.
10ఇక్కడ తల్లి విధిలో పడియుండెను, ఆమె యొక్క చిన్న బిడ్డ పస్తుపడియుండెను. చిగుళ్ళు ఆ బిడ్డ పెదాలకు ఎదురుగా క్రిందికి యున్నాయి, చిన్నగా… ఆ బిడ్డ ఇక ఎంత మాత్రం ఏడ్వలేదు. ఆ తల్లి కూడా పస్తుపడియున్నది. చావు నుండి కాపాడమని ఆ బిడ్డను మీకు ఇచ్చివేయుటకు ఆమె కోరుచున్నది; ఏమైనా మరణం నుండి ఆ బిడ్డను నిలబెట్టండి. మరియు ఇక్కడ, మంచిది, ఆ బిడ్డను మీరు తీసుకొనెదరా? ఇక్కడ వేరొకటివున్నది, వేరొకటి, ఓ, మీరు, అక్కడ దానికి అంతమేలేదు. అక్కడ వారు ఉన్నారు. చాలా దయనీయస్థితి, మరియు వారు మానవులైయున్నారు. వారి కొరకే క్రీస్తు చనిపోయెను.
మరియు అక్కడ ఆ రాత్రి, అక్కడ నిలువబడి, మరియు ఈ గ్రుడ్డివ్యక్తి పైకి వచ్చెను. పరిశుద్ధాత్మ చెప్పెను, ఇప్పుడు, "అతడు ఒక బిక్షగాడు. మరియు అతడు సూర్యుని ఆరాధించువాడు. అతడు ఇరువది సంవత్సరాలుగా గ్రుడ్డివాడైయున్నాడు." మంచిది, అది చెప్పబడిన వెంటనే, మీకు అర్థమగును… మీకు తెలుసు, వారు మిమ్ములను…
11అటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడు, మీరు దేనిగూర్చి మాట్లాడుచున్నారో ఎరిగియుండుట మీకు మంచిది, కారణం దానితో వారు మిమ్ములను సవాలు చేసెదరు, ఏ సమయమందైనా సరే. మరియు దేవుడు మిమ్మును పంపియున్నాడనే ధృఢ నిశ్చయత కలిగియుండుట మీకు మంచిది. అక్కడ మీరు సంఘమును నడపలేరు; మీరు దేనిగూర్చి మాట్లాడుచున్నారో ఎరిగియుండుట మంచిది. దానిని మీరు కలిగియుండవలసినవారైయున్నారు. ఇక్కడ ఆమెరికాలో అదంతా సరే, కాని నిజంగా నీవు నిశ్చయముగా లేకపోతే పొలమును (సువార్త పొలమును) సంధించుటకు ఎప్పుడునూ ప్రయత్నం చెయ్యవద్దు. అప్పుడు ఆఫ్రికాలో, ఆ మాంత్రిక వైద్యులు, ఇంకా, వారు ఆత్మావేశులు - ఏదో మానసిక శాస్త్రంతో వారు వెర్రివారు కారు, వారు దెయ్యములచే నడిపించబడుచున్నవారు. మరియు వారు శక్తి కలిగియున్నవారు. మరియు (వాడు) కేవలం అది దేవుని శక్తిని తీసుకుని అతిక్రమించగలుగుచున్నది. నేను ఎప్పుడునూ అటువంటి సమయాన్ని చూడలేదు, అయినప్పటికీ, మన యొక్క మహా మహిమాన్విత ప్రభువైన యేసు దాని అంతటి శిఖరముపై సవారీ చేసెను, ప్రతీసారీ విజయాన్ని గెలిచెను. ఆయన సేవకునిగా, ఆయన నామములో దానిని నేను చెప్పుచున్నాను.
12మరియు ఈ రాత్రి అక్కడ, నాకు జ్ఞాపకమున్నది, ఈ వ్యక్తి, "నీవు గ్రుడ్డివాడివి" అని అది చెప్పెను. "నీవు ఒక బిక్షగాడివి మరియు నీవు సూర్యుని ఆరాధిస్తావు" మరియు వారు నమ్ముతారు, గ్రుడ్డివారు అయ్యేంతవరకూ వారు సూర్యుని చూచినట్లయితే, వారు పరలోకానికి వెళ్ళదురు. కావున వారి కొరకు అక్కడ ఒక పరలోకం వుంది. వారు సృష్టిని ఆరాధించుట ద్వారా వారు వెళ్తారు అని వారు నమ్ముచున్నారు.
మరియు వినండి, మీరు వచ్చి దానిని అనుభవించగలరు, వారు ప్రత్యేకంగా పరిశుద్ధమైన వ్యక్తులుగా వారు దేనిని పిలుచుచున్నారో, ఒలీవ నూనెతో వారంతట వారే అంతటను పూసుకొంటారు. చూచుటకు అది ఒక దృశ్యము — ఒక మేకను చంపి ఆరాధిస్తారు.
కావున అప్పుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చెప్పెను, "నీవు ఒక పెళ్ళైన వ్యక్తివి మరియు నీవు ఇద్దరు పిల్లలను కలిగి యున్నావు. వారు ఇద్దరూ మగపిల్లలు. వారిలో ఒకని వయస్సు సుమారు ఆరు సంవత్సరాలు, వేరొకరిది సుమారు తొమ్మిది." మరియు అనువాదకుడు దానిని అతనితో చెప్పినప్పుడు, అది సరిపోయెను. అయినా వారు దానిని వినలేదు. అది ఒక మానసిక శాస్త్రమని వారు తలంచిరి.
మరియు నేను అనుకొన్నాను, "ప్రభువా నీవు ఏదైననూ నాకు చూపిస్తే, దానిని వారు చూడగలుగునట్లు చేయి." పరిశుద్ధాత్మ ఏమి చెప్పుతుందో మీరు గమనించవలసినవారై యున్నారు. అదియే ఆయన మీతో చెప్పుచున్నది. ఆయన మీతో మరలా ఏమి చెప్పేది మీరు వినేంత వరకు చాలినంతగ మీరు అక్కడే నిలిచి ఉండండి, చూసారా. ఆయన మీతో ఏమి చెప్పుచున్నాడో వినండి, ఎందుకనగా అది నేను కాదు — దానీ గూర్చి నేను ఏమియూ ఎరుగను; అది ఆయనే. నేను ఏమి చెబుతున్నానో నాకు కూడా తెలీదు, మరియు నాకు టేపు వినేంత వరకు దానిని నేను ఎరుగను. అప్పుడు… ఆయన చేసినది చూచుటకు అది ఆశ్చర్యమై యున్నది.
13అప్పుడు నేను గమనించితిని, మరియు ఆ వ్యక్తిని నేను చూసితిని, ఒక దర్శనము వలె, పైన నిలువబడి, మరియు అతడు చూడగలిగెను. అతడు అతని యొక్క దృష్టిని కలిగియుండెను. "ఇది ఒక ఆశ్చర్యకరమైన సమయముగా ఉండబోతుంది" అని నేను తలంచితిని. మరియు నేను చెప్పాను, "ఈ రోజు నేను జైనుల దేవాలయములో ఆనందించితిని, ప్రస్తుతం ఇక్కడ ఉన్న వేర్వేరు నాయకులైన మీలో చాలా మంది అక్కడ వున్నారు. క్రైస్తవ్యము ఎంత తక్కువగా ఉండెనో అని, మరియు మీ మతం ఎంత గొప్పదై యుండెనో అని మీరు నాతో చెబుతూ ఉన్నారు. ప్రభువైన యేసు నిమిత్తం పైకి ఎత్తుటకు నేను ఏ అవకాశమును కలిగిలేను, కానీ" నేను చెప్పాను, "ఈ రాత్రి ఇక్కడ ఒక వ్యక్తి నిలబడియున్నాడు, అతడు గ్రుడ్డివాడు. ఒకవేళ ఇప్పుడు మహమ్మదీయ యాజకుని గనుక నేను అడిగితే, లేదా బుద్ధ యాజకుని లేదా ఎవరైనప్పటికినీ నేను అడిగినట్లైతే, అతడు తప్పు చేసియున్నాడని మీరు చెప్పగలరు, ఎందుకనగా సృష్టికర్తకు బదులుగా సృష్టిని అతడు ఆరాధించెను. దానికి నేను "ఆమేన్" చెబుతాను. అది నిజము — సృష్టికర్తకు బదులుగా సృష్టి."
"మంచిది, ఇప్పుడు, అతని దృష్టిని తిరిగి ఇచ్చిన దేవునిని అతడు సేవించెదనని ఈ వ్యక్తి కేవలం చెప్పితే! ఇప్పుడు, అతడు తప్పు చేసినట్లు కనుగొనబడతాడు. ఇప్పుడు మీరు అతనికి ఏమి చేసెదరు? భౌద్ధమతసులైన మీరు అతనిని దేవుని వదలినట్లు చేసి, మరియు రమ్మని భౌద్ధ మతంతో కలుపుదురు. మహమ్మదీయులు, మహామ్మదీయునిగా అతన్ని చేసెదరు. మరియు వేర్వేరు మతసులు. అది ఏమిటి? కేవలం అతని యొక్క తలంపులను మీరు మార్పుదురు. మీరు కేవలం… అది మానసిక శాస్త్రం." నేను చెప్పితిని, "అమెరికా కూడా అదే కార్యముతో నిండియున్నది. మెధడిస్టులందరూ, బాప్టిస్టులను మార్చాలని ఆశిస్తున్నారు, బాప్టిస్టు వారు పెంతెకోస్తు వారిని మార్చాలని ఆశిస్తున్నారు, ఏకత్వం వారు ద్విత్వం వారిని మార్చాలని ఆశిస్తున్నారు. ద్విత్వం వారు ఇంకొకరిని మార్చాలని. ఓ, మై, అటువంటిది నేను ఎప్పుడూ వినలేదు! కానీ ఒక కృతజ్ఞతతో కూడిన విషయం, మనమందరం అదే దేవున్ని ఆరాధించుదుము. కానీ అక్కడ అది వేరుగా ఉంది.
14అయితే నేను చెప్పాను, "అది మానసిక శాస్త్రం. అతని కండ్లను చేసిన సృష్టికర్త ఖచ్చితంగా ఎక్కడో ఉన్నాడు."
ఇప్పుడు, నేను మొదటిగా దర్శనం చూడనట్లైతే నేను ఏమియు చెప్పి యుండక పోదును, కారణం… నేను యాబై-నాలుగు సంవత్సరాల వయసు గలవాడను, పదునెనిమిది నెలల వయసు నుండి నేను దర్శనములను చూచుచుంటిని. ఎన్నడూ ఒక్కటి… ఒక్కటైన తప్పిపోయినట్లు ఎవరైనా చూసినట్లైతే నేను ఎవరినైనా అడుగుదును. లేదయ్యా. అది ఎప్పుడూ తప్పదు. దర్శనం ఎప్పుడు తప్పలేదు. మరియు దర్శనము ఎపుడూ తప్పిపోదు. అది ఎల్లపుడూ సరిగానే ఉంది. కారణం అది దేవుడై ఉన్నాడు. అతని దృష్టిని అతడు పొందబోవుచున్నాడని నేను ఎరుగుదును, కానీ అవిశ్వాసులైన కొందరిని పట్టుకొనుటకు ఒక చిన్న ఉచ్చును బిగించుటకు నేను ప్రయత్నం చేయుచున్నాను.
నేను చెప్పితిని, "ఇప్పుడు మహ్మదీయ మతమైతే, భారతదేశంలో ఇక్కడ ప్రధాన మతమై ఉన్నట్లైతే, మహ్మదీయ యాజకులు ఇక్కడకు వచ్చి, ఈ వ్యక్తికి దృష్టి తిరిగి ఇవ్వండి, నేను మహ్మదీయునిగా మారుదును." నేను చెప్పితిని, "భౌద్దం అటువంటి గొప్ప మతం అయితే బుద్ద యాజకులు రావచ్చు లేదా ఎవరైనా." నేను చెప్పితిని, "ఖచ్చితంగా ఈ వ్యక్తి సరియైన దేవునితో సరి అవ్వాలని ఆశిస్తే… ఖచ్చితంగా ఈ వ్యక్తి సరియైన దేవునితో సరి అవ్వాలని ఆశిస్తే, మొట్ట మొదట అతని కన్నులు చేసిన ఆ గొప్ప సృష్టికర్త రెండవ సారీ అతని కన్నులు చేయగలడు. ఆయన మహిమ కొరకు వాటిని ఉపయోగించవలెనని అతడు కోరినట్లైతే." అది నేను ఎప్పుడూ విన్నటువంటి అత్యంత నిశ్శబ్ద జనసమూహముగా ఉండెను.
15నేను చెప్పితిని, "ఇప్పుడు వేదిక తెరువబడియున్నది, మరియు అతనికి దృషిని ఇవ్వగల ఏ మనుష్యుడైన ఇక్కడకు వచ్చి… దేవుడు… ఆ నిజ దేవుడు మొదట స్థానంలో అతన్ని చేసినవాడు, అతని కన్నులు సృష్టించినవాడు, అతడు వచ్చి, అతని దృష్టిని తిరిగి ఇవ్వవచ్చు. మరియు ఆ మతం యొక్క అనుచరునిగా ఉండుటకు నేను సిద్దంగా యుంటిని."
ఎవ్వరునూ ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను చెప్పితిని, "మీరు ఏమి ఆలోచించుచున్నారో నేను ఎరుగుదును. ఆ ప్రజలతో వున సమస్య ఏమిటో అర్థం చేనుకొనుటకు అతీత శక్తిని నేను ఉపయోగించుచున్నాని మీరు అనుకొనుచున్నారు. ఇంకా వారు ఏమైయున్నారో వారు ఎవరైయున్నారో వారికి చెప్పుట, వారి పేరు కూడా నేను చదువలేను; దానిని బయటకు పలుకలేను. దానిని నేను ఉచ్చారణ చేయలేను, వారి భాషను కూడా నేను పలుకలేను. అది మానసిక శాస్త్రమని మీరు పిలుస్తారు. అది అలాగే అయితే, మానసిక శాస్త్రం గూర్చి ఒక్క విషయం కూడా నాకు తెలీదు. దానిలో మీరు నిపుణులు అటువంటి మానసిక శాస్త్ర నిపుణుడు వచ్చి, అతని దృష్టిని అతనికి ఇవ్వవచ్చు. చూడండి మానసిక శాస్త్రం ఆ గ్రుడ్డివానికి తిరిగి దృష్టిని ఇవ్వగలిగితే, అది ఇంకనూ ఒక నిశ్శబ్ద సభాసమూహముగా ఉండెను. ఏ ఒక్కడునూ ఒక్క మాట కూడ పలుకలేదు.
ROM 8:11
16"మీరు ఎందుకు ఏదో ఒకటి చెప్పుట లేదు?" అని నేను అడిగితిని. ఖచ్చితంగా ఏదో ఒకచోట ఒక దేవుడు ఉన్నాడు. అంతా ఇదంతా, జరుగుచున్న ప్రతీదీ, ఎక్కడో ఒకచోట దేవుడున్నాడని అది ఋజువు చేయుచున్నది. ఆయన ఎవరు?" నేను చెప్పితిని, "ఆ కారణం చేత మీరు ఏమియు మాట్లాడుటలేదు, ఎందుకనగా మీరు దానిని చేయజాలరు; నేను కూడా ఏమి చేయలేను. కాని పరలోకపు దేవుడు, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తును లేపినవాడు, ఆయన యొక్క సాక్షిగా ఉన్న నాకు, ఈ వ్యక్తి తన దృష్టిని పొందబోవుచున్నాడని నాకు ఒక దర్శనం చూపించెను. ఇప్పుడు, ఆయన దానిని చేయకపోతే, అప్పుడు నేను ఒక అబద్ధ ప్రవక్తనని, ఇండియాలో నుండి నన్ను తరిమివేయండి. కానీ, ఆయన దానిని చేసినట్లైతే… ఇక్కడే మహ్మదీయ ప్రజలైన మీరు, మీ యొక్క యాజకుల వారి యొక్క వస్త్రములతో నిలువబడియున్నారు. ఇక్కడ భౌద్ద మతసులు ఉన్నారు, వివిధ మతస్తులు. వారు ఇంకనూ ఎలా ఉన్నారో, మీ యొక్క నాయకులను మీరు చూస్తున్నారా? వారు ఏమియూ చెప్పుటలేదు; కాని నేను మాట్లాడుచున్నాను. ఈ మనిషిని గూర్చి ఒక దర్శనం నేను చూసితిని, తన దృష్టిని పొందబోవుచున్నాడు. మరియు దానిని ఇప్పుడు చేయబోవుచున్నాను. మరియు ఆయన చేయకపోతే అప్పుడు అక్కడ ఏదో తప్పువున్నది, బైబిల్ మరియు క్రీస్తు గూర్చి నేను తప్పుడు సాక్షినైయుందును."
ప్రతి ఒక్కరూ…
17నేను చెప్పాను, "ఈ గ్రుడ్డి వ్యక్తికి దేవుడు దృష్టిని తిరిగి ఇచ్చిన యెడల మీలో ఎంత మంది ఆయనను మీ రక్షకునిగా స్వీకరిస్తారు." మరియు ప్రతీచోటా మీరు చూడవచ్చు, మీరు చూడగలిగినంత మట్టుకు, నల్లని చేతులు పైకి లేచాయి. మంచిది, ఐదువందల వేలు (5 లక్షలు) ప్రజలుగా, అది అంచనా వేయబడింది అది మిలియనులో సగము. టుసాన్ ఉన్నదానికంటే అది చాలా, చాలా రెట్లు, కావున అక్కడ వారు ఒకే ప్రదేశంలో కూర్చొని యుండిరి.
నేను దగ్గరగా కదలితిని, నాకు దగ్గరగా ఆ వ్యక్తిని రమ్మని అడిగితిని. నా అరచేతులను అతని చుట్టూ ఉంచితిని, వారు ప్రార్థనను అనువదించలేదు. నేను చెప్పితిని, "ప్రభువైన దేవా ! ఇది నా యొక్క సొంత విశ్వాసమునకు సవాలుగా ఉన్నది. కానీ ఇప్పుడే ఈ అన్యుజనులందరూ ఇక్కడ చుట్టూ ఉన్న ఈ సమయంలో, నీవు ఎల్లప్పుడూ ఉన్న అదే దేవునిగా నీవు ఇంకను లేవా?" మరియు నేను చెప్పితిని, "ఇప్పుడు నీ యొక్క గౌరవము (లేదా పేరు) పందెముగా ఉన్నది. నీవు ఏమి చెప్పితివో నేను కేవలం దానినే చెప్పుచున్నాను. చిన్న బిడ్డగా ఉన్నపటినుంచి నీవు నాకు దర్శనములను చూపుచున్నావు. మరియు ఒక్కటి కూడా తప్పిపోయినట్లు నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు, ఈ వ్యక్తి తన దృష్టిని పొందుకొనునని నీవు నాకు చూపించితివి. యేసుక్రీస్తు నామములో, అతని దృష్టి కొరకు నేను నిన్ను పిలుచుచున్నాను."
ఆ వ్యక్తి ఒక మహా పెద్ద కేక వేసెను. ఆ నగర మేయరు అక్కడ కూర్చొని యుండెను. పరుగెత్తి, అతన్ని పట్టుకొని మరియు అతనిని కౌగలించుకొనెను. నేను లేదా ఎవరైన చూడగలిగినంత మంచిగా ఆ వ్యక్తి చూడగలిగెను. అప్పుడు నేను వేలకువేలమందిని చూచితిని.
MATT 16:5,16,24
18స్నేహితులారా, నేను మిమ్ములను తప్పు పట్టాలని దీనిని చెప్పుట లేదు, కానీ క్రీస్తు మనలను చేయమని పంపించిన ఆ ప్రణాళికను మోసుకొని పోవుటకు మనము తప్పిపోయియున్నాము, చూశారా. ఆయన చెప్పెను, "సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి." ఇప్పుడు, పాఠశాలలు నిర్మించమని ఆయన చెప్పలేదు. సంఘాలను నిర్మించమని ఆయన చెప్పలేదు. అవి, అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ పాఠశాలలను, సంఘాలను, మరియు సంస్థలను నిర్మించుటకు మన యొక్క సమయమంతటినీ వెచ్చించియున్నాము. ఒక పాత్రను పోషించినది. కానీ ఆయన చెప్పింది అది కాదు. "సువార్తను ప్రకటించండి," మరియు నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వేరే మాటల్లో, సువార్తను ప్రకటించుట పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించుటయే, మరియు మనము తప్పిపోయింది అక్కడే
సంఘానికి కావలసింది, ఈ రాత్రి, ఇప్పుడు సంఘం ఉన్నట్లుగా ఒక మృదువైన సంకర జాతి ఏదో, సుతిమెత్తని క్రొవ్వు పట్టిన స్థితి కాదు — కేవలం ఒప్పకోలు చేయుట, బాప్తిస్మం పొందుట, మరియు నీవు, నీవు ఒక క్రైస్తవునివి. క్రైస్తవునిగా వుండుట అనేది స్వతహాగా ఉపేక్షించుకొనుట. "నిన్ను నీవే ఉపేక్షించుకొనుము. నీ సిలువను ఎత్తుకొనుము. ప్రతి దినము నన్ను వెంబడించుము." ఈ దినమున చాలా సుకుమారంగా ఉండి, ప్రజలు వారంతట వారే క్రైనవులుగ పిలుచుకొనుచున్నారు. అప్పుడు, దాని అర్ధం మరణం, క్రీస్తును ఒప్పుకోవడానికి, నీకు కలిగిన ప్రతి అవసరం నిమిత్తం ప్రతి దినం ఆయన మీద నీవు ఆధారపడవలెను.
JOHN 12:32
19అదే దేవుడు ఈ దినమున జీవించుచున్నాడు. అది సత్యమని నేను ఎరుగుదును. ఆయన అప్పుడు ఉన్నట్లుగానే ఈ దినమున కూడా గొప్పవానిగా ఉన్నాడు. ఆయన అప్పుడు దేవునిగా ఉన్నట్లైతే, ఆయన ఇంకనూ దేవునిగానే యుండును. కానీ ఆయన దేవునిగా లేనట్లైతే, ఆయన ఎప్పటికిని దేవుడు కాడు, ఎందుకనగా సమస్త మానవ జాతికి ఆయన దేవుడైయున్నాడు. ఒకవేళ ఆయన అదే దేవునిగా లేనట్లైతే, అబ్రహాము యొక్క దేవుని గూర్చి మాట్లాడుట అది ఏ మంచి చేయును? ఆయన ఈ దినమున అదే కార్యమును చేయలేకపోతే, తప్పించుకొనునట్లు, ఆయన పిల్లల నిమిత్తం ఆయన చేయలేకపోతే. ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన దేవుని గూర్చి మాట్లాడుట. అది ఏ మంచి చేయును? సమాధిలో నుండి ఒక చచ్చినవానిని లేపగలిగిన దేవుని గూర్చి మనం మాట్లాడితే, ఈ దినమున అదే కార్యమును ఆయన చేయలేకపోతే? అది మనకు ఏ మంచి చేయును?
మీ యొక్క కెనారీ పక్షికి మంచి బలమైన ఎముకలు ఎదుగుటకు, రెక్కలు మరియు ఈకలు ఎదుగుటకు చక్కటి గింజలు ఇచ్చి, దానిని ఒక బోనులో ఉంచినప్పుడు వాటిని అది ఎట్లా ఉపయోగించుకొనును? ఏదో గొప్ప దేవుని గూర్చి బైబిల్ ను బోధించిన అది ఏ ప్రయోజనం కలిగించును? చలిలో గడ్డకట్టుకు పోవుచున్న ఒక వ్యక్తి, గీయబడిన అగ్ని పటము (చిత్రం) చేత అతడు వెచ్చదనం పొందగలడా? మరణమగునంతగా, గడ్డకట్టుకు పోవుచున్న ఒక వ్యక్తికి మీరు అతనికి అగ్నిని చిత్రపటమును వేసి, చెప్పండి, "అక్కడ ఉన్నది అదే." అది కాదు, వేడిని పొందవలసియున్నది. అతనికి కొంత మేలుచేయుటకు, దాని నుండి కొంత వేడి రావలసియున్నది.
మరలా జన్మించుట గూర్చి నూతన జన్మలో వాస్థవికత ఉండవలసియున్నది, ఆత్మతో నింపబడి ఇక్కడే ఉన్న ఆయన సన్నిధిని ఎరిగి, మరియు ఆయన వాక్యమును మోయుచూ, ఆయన చేసిన వాగ్దానమును మాత్రమే చూడండి. యేసు చెప్పెను, "నేను భూమి నుండి పైకి లేపబడినయెడల, మనుష్యలందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును."
20ప్రభువు మనకు సహాయము చేయును గాక. నేను తప్పిపోవలెనని దాని మీద లక్ష్యముంచలేదు, కానీ కేవలం మాట్లాడుచున్నాను.
ప్రభువు ఇప్పుడు మిమ్మును దీవించును గాక! ఈ రాత్రులలో ఒక రాత్రి, ముగించబడుటకు ముందు, మీ కొరకు ఒక రాత్రి నేను బోధించబోవుచున్నాను, నేను చేయబోవుచున్నాను.
నేను ఇప్పుడు దైవిక స్వస్థత గూర్చి మాట్లాడుచున్నాను, ఎందుకనగా ప్రభువు ఏదో చేయవలెనని ఎదురు చూచుచూ, చూచుటకు నేను కోరుచున్నాను. అది…..
మీకు తెలుసు, యేసు పరిచర్యలో సుమారు ఎనబై-ఆరు శాతం దైవీక స్వస్థత, మనము పెద్ద వాటి కొరకు దైవిక స్వస్థతను ఉపయోగించము. మీరు చిన్న వాటి మీద పెద్దవాటిని చేయలేరు, మీరు ఎరుగుదురు, దైవిక స్వస్థత యొక్క ఈ గొప్పకళ…
JOEL 2:25•
JUDE 1:3
21సంఘ ప్రారంభం గూర్చి గత నాలుగు లేదా ఐదు సంవత్సరాలు పాటు, నేను ఒక అధ్యయానన్ని పూర్తి చేసియుంటిని. ఫాక్స్ యొక్క హతసాక్షుల గ్రంధముతో ప్రారంభించితిని, హిస్లోప్ రెండు బబులోనులు గుండా దిగి ఇంకా, నైసియా మరియు పోస్ట్ నైసీన్ మరియు నైసిన్ పితరులు మరియు నైసియా సభ గుండా వెళ్లి యేసుక్రీస్తు మరణం తరువాత దానిని కనుగొనుచు వెళ్ళితిని. పోలికార్ప్ మరియు ఐరేనియస్ మరియు మార్టిన్ — మరియు అనేక మంది పరిశుద్దులు, ఆ గొప్ప పరిశుద్దులలో చాలా మంది యేసుక్రీస్తు మరణం తర్వాత వందల సంవత్సరాల పాటు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఆ విశ్వాసం నిమిత్తం కఠినంగా పోరాడుచూ భాషలతో మాట్లాడుతూ, చచ్చిన వారిని లేపుతూ, రోగులను స్వస్థత పరచుచూ నుండిరి. ఆ చీకటి యుగములో ఈ కార్యము గతించిపోయెను.
కానీ, ఓ, దేవుడు చెప్పెను, "నేను పునరుద్ధరింపబోవుచున్నాను." ప్రభువు సెలవిచ్చెను, "మిడతలు తినిన మరియు గొంగలి తినిన సంవత్సరములన్నియు…" దానిని ఆయన వాగ్దానము చేసెను, పునరుద్దరణ ఘడియ ఇదే. వృక్షము మరలా చిగురించును. దానిని నేను నమ్ముచున్నాను.
22ఇప్పుడు ప్రభువు మిమ్మును దీవించును గాక! మనము ఏమి చేయుటకు ప్రయత్నం చేయుచున్నామో దానిని మీరు తెలుసుకొనుటకు, లేఖనములలో, ఈ రాత్రి బాగా తెలిసిన చిన్న లేఖనమును తీసుకోవాలని కోరుచున్నాను. మీరు చూడండి, మీరు చేయగలిగితే. ఇక్కడ మీ మధ్యలో యేసుక్రీస్తు సజీవుడైయున్నాడని చూచుటకు, మరియు ఖచ్చితంగా తెలుసుకొనుటకు ఏకాత్మతో ఈ సభను పొందగలిగిన యెడల! ఓ, మీరు భౌతికంగా లేదా మానసికంగా దానిని నమ్మండి. కానీ అది మనస్సు దాటి ఆవలిగట్టుకు వెళ్ళగలిగినప్పుడు దానిని మీరు ఎరుగునంత వరకూ, ఏదో జరుగబోవును, చూడండి, మీరు గ్రహించగలిగినప్పుడు ఒకే ఒక విషయం ఏదనగా, మన యొక్క సన్నిధిలో క్రీస్తును చూచుటైయున్నది.
23దక్షిణ ఆఫ్రికాలో డర్బన్లో ఇరువై-ఐదు వేల చక్రాల కుర్చీలుగా అక్కడ అంచనా వేయబడింది. పాత పెట్టెల మీద మరియు బండ్ల మీద అరణ్యంలో నుండి ప్రజలను త్రోసుకొనుచూ వారాలు, వారాలు, అక్కడకి వచ్చుట మీరు ఎరుగుదురు. ఒక ప్రార్ధన యందు, కేవలం కొన్ని ప్రార్థన మాటలు, మరియు వారు అక్కడ నుండి వెళ్ళారు. ఆ తర్వాత ఉదయం. సిడ్నీ స్మిత్… ఆయనకు మీరు టెలిగ్రాం పంపవచ్చు, ఆయనకు ఉత్తరం వ్రాయవచ్చు. ఆయన డర్బన్ యొక్క మేయరు, అది ట్యూసాన్ పరిమాణానికి సుమారు రెండు లేదా మూడు రెట్లు ఉంటుంది. అవును, దానికంటే చాలా రెట్లు పెద్దది. మేము ఒక పందెపు గాడిలో అక్కడ ఉన్నాము. రెండు-వందల-యాభై వేల ప్రజల గుంపు అక్కడ అతడు కలిగి యుండెను.
24అతడు నన్ను పిలచి చెప్పెను. "సహోదరుడా బ్రెన్హాం, సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న మీ కిటికీ యొద్దకు వెళ్లండి. కిటికిలో నుండి హిందూ మహా సముద్రము చూడండి. మీరు ఎప్పుడు చూడని దానిని మీరు చూడబోవుచున్నారు. ఆ గొప్ప పెద్ద ఇంగ్లీషు ట్రక్కులు సుమారు పది అక్కడకి వచ్చెను. అవి సుమారు నలబై - యాబై అడుగుల పొడవు ఉండవచ్చు. పాత చంక కర్రలుతో, చక్రాల కుర్చీలతో అంతకు ముందు దినము, అరణ్యంలో నుండి కష్టం మీద వారు నడచి వచ్చుటకు వారు వాడిన వస్తువులతో ఆ ట్రక్కులు పూర్తిగా నిండిపోయినాయి, మరియు వారు స్వస్థత పొందిరి, ఆ కుర్చీలలో, ఆ వస్తువులలో ఉన్న ప్రజలు, ఆ నగరానికి వెనుక వచ్చుచూ ఉండిరి. వారు అందరు ఏకాత్మతో, వారి ప్రాంతీయ భాషలో "కేవలము నమ్ముము, అన్ని సాద్యమే," అని పాడుకుంటూ, నా హోటల్ దగ్గరకు నడచుచూ వచ్చిరి. అక్కడ ఒకేసారి ముప్పైవేల మంది ప్రాంతీయ వాసులు క్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించినట్లు మేము నమోదు చేసియుంటిమి.
25మన సహోదరీలను అవమానపరచడం కాదు, కానీ నేను స్వదేశమునకు వచ్చినప్పుడు నేను అర్ధ౦ చేసుకోలేనిది ఇదే. ప్రతి సంవత్సరము, నేను దూరమునకు పోయి, స్వదేశమునకు తిరిగి వచ్చినప్పుడు, మన అమెరికా స్త్రీలు తమంతట తామే వస్త్రములను ఎక్కువగా తొలగించుకొనుచున్నారు. అయిననూ బృంద గానములో పాడుచూ, తమంతట తామే క్రైస్తవులుగా పిలుచుకొంటున్నారు. అక్కడ నిలువబడి యున్నారు. వారిలో చాలామందికి, ఒక చిన్న గుడ్డ ముక్క తప్ప ఏమి లేదు. వారు యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన నిమిషం, వారు దిగంబరులైయున్నారని ఏ ఒక్కరు వారితో చెప్పలేదు. పురుషులు నిలువబడి యున్నచోట నుండి దూరముగా పోవుటకు వారి యొక్క అర చేతులతో వారు మూసుకొనిరి ఈ విధముగా,
ఒకవేళ ఆయనను గూర్చి ఏమి ఎరుగని మరియు ఆయనను రక్షకునిగా స్వీకరించిన ఆ స్త్రీకి దిగంబరియైయున్నట్లు, ఆమె గ్రహించునట్లు ఆ జ్ఞానము యేసుక్రీస్తు సన్నిధి తెచ్చినచో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగియున్నామని, నాగరికులమై యున్నట్లు భావించుచూ, ప్రతీ సంవత్సరము నిరంతరాయంగా వారే వస్త్రములను తొలగించుకొనుచున్న ఈ ప్రజలకు అది తప్పనిసరిగా ఏమి చేయాలి? ఎక్కడో ఏదో తప్పు ఉన్నదని నేను నమ్ముచున్నాను. అది నాతో ఉండవచ్చు. అటైతే, వాక్యముతో ఏదో తప్పుయున్నది. వస్త్రాలను తీసివేయుటకు బదులుగా వస్తాలను వేసుకొనునట్లు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ చేయునని నేను నమ్ముచున్నాను.
MATT 12:38-42
26నాతో ఇప్పుడు మత్తయి సువార్తకు త్రిప్పండి 12వ ఆధ్యాయము, 38వ నుండి 42 వరకు వాక్యం మనము చదువుచున్నట్లు ఒక చిన్న బాగుగా తెలిసిన లేఖనము ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
అప్పుడు శాస్త్రులలోను, పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా.
ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన "యోనా" ను గూర్చిన సూచక క్రియయే గాని, మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో వుండును
నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెనెవారు ఈ తరమువారితో నిలవబడి వారిమీద నేరస్థాపన చేతురు.
ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి యీ తరమువారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చును; ఇదిగో, సాలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
దానిని ఒక పాఠ్యంశముగా నేను పిలవవలెనంటే, చివరి ఐదు మాటలు తీసుకొనవలెనని ఇష్టపడుచున్నాను. "సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడున్నాడు."
MATT 12:24,32•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 4:7-26
27యేసు కోపంతో గర్జించుటను మనము కనుగొనుచున్నాము. ఆయన ఉన్న ప్రదేశాలను గద్దించి, గతరాత్రి ఆయన మనకు చూపబడినట్లుగా, ఆయనే మెస్సియానని నిరూపించెను. వారి బోధంతయూ అది మెస్సీయా సూచనని నమ్మునట్లు చేయుట. బావి వద్ద ఉన్న స్త్రీ గూర్చి గత రాత్రి మనం మాట్లాడుకున్నట్లుగా, ఈ చిన్న స్త్రీ కూడా, ఆమె ఎట్లా, ఆమె యొక్క వ్యభిచార స్థితిలో, అయినప్పటికీ దేవుని గూర్చి ఎక్కువ తెలుసుకొని, సద్దూకయ్యలు, పరిసయ్యులు, గుర్తించిన దాని కంటే ఆయనను ఎక్కువ గుర్తించెను. ఇది జరుగుట వారు చూసినప్పుడు ఇది ఒక రకపు ఆత్మయై ఉండునని వారు తీర్మానించిరి. "అది బయోల్జేబూబు దయ్యాలకు ప్రధాని — ఒక ఆత్మ, ఒక దెయ్యం. భవిష్యత్ చెప్పువానివలే, ఏదో దెయ్యపు ఆత్మ ద్వారా దానిని ఆయన చేయిచున్నాడని చెప్పిరి. భవిష్యత్తును చెప్పేవాడు (జ్యోతిష్యం) దెయ్యపు సంబంది అని ఎవరైనా ఎరుగుదురు. కావున దానిని చేయుట వలన మన ప్రభువు మీద నేరము మోపిరి.
మరియు ఆయన చెప్పెను, "మీరు నన్ను బయల్జేబూబు అని పిలిస్తే, అది క్షమించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు దాని నిమిత్తం మీకు పాపక్షమాపణ లేదు," ఎందుకనగా పని చేయుచున్న దేవుని యొక్క ఆత్మను అపవిత్రాత్మ అని మీరు పిలుచున్నారు. అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించుటయగును.
DEUT 18:15•
MATT 12:32•
MARK 3:28,29•
LUKE 12:10•
JOHN 9:22
28"పరిశుద్ధాత్మ యొక్క దూషణ అనగా నీ సొంత జీవితాన్ని తీసివేయుటేనని," నేను చిన్నపిల్ల వానిగా ఉన్నప్పుడు నా తల్లి నాతో చెబుతూ ఉండేది. మంచిది, అది అలాగు కాదు, చూసారా. బైబిల్ దానిని బోధిస్తుంది, "పరిశుద్ధాత్మకు వ్యతిరేఖముగా మాట్లాడుటయే పరిశుద్ధాత్మ యొక్క దూషణ." దూషణ అనగా, దానిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడుట. పరిశుద్ధాత్మ ఏదైనా చేయుట మీరు చూచినప్పుడు దానిని మీరు పరిహాసము చేసెదరు. మీరు ఎన్నడునూ తిరిగి దాటని రేఖను మీరు దాటియున్నారు. అది మీకు ఎప్పటికీ క్షమించబడదు.
కావున యేసు వారితో చెప్పెను, ఆయనే మెస్సియానని ఆయన వాక్యమును ఎట్లు నిర్ధారించుచున్నాడో ఆయన చెప్పెను. వారు దానిని తెలుసుకొనియుండాలి, ఎందుకనగా వారి నాయకుడు మోషే వారితో చెప్పెను, "ప్రభువైన మీ దేవుడు నా వంటి ప్రవక్తను లేపును." ఆ కార్యములు సంభవించుట వారు చూసినప్పుడు వారు ఇంకనూ ఆయనను నమ్మలేదు. అందుకు కాదు… ఆయనను వారు నమ్మిరని నేను నమ్ముచున్నాను, కానీ దానిని వారు ఒప్పుకొనుటకు కోరలేదు, ఎందుకనగా వారి యొక్క సాంప్రదాయాలను బట్టి, ఎందుకనగా పరిసయ్యులు చెప్పియుండిరి. "ఏ పురుషుడైనా లేదా ఏ స్త్రీ అయినా ఆయనను అంగీకరించిన వెంటనే సమాజ మందిరములో నుండి వెలివేయబడుదురు." రుజువుచేయబడిన వాక్యమును వారు ప్రేమించిన దాని కంటే వారి యొక్క సాంప్రదాయాలను ఎక్కువగా ప్రేమించిరి.
MATT 12:38•
JOHN 10:37,38
29మరియు కాలము ఎక్కువ మారలేదు. మీరు ఎరుగుదురు, దేవుడు ఆయన యొక్క మనిషిని తీసుకొనును గానీ ఆయన ఆత్మను కాదు. సాతాను తన మనిషిని తీసుకొనును గానీ ఆత్మను కాదు. ఎవరో ఒకరి మీదికి ఆయన నేరుగా తిరిగి వచ్చును, అలాగే క్రిందికి వెళ్ళును. ప్రతీ తరములోనూ దానిని మనము కనుగొనుచున్నాము. మరియు యేసు తానే స్పష్టముగా తెలియపరచుకొనెను. ఆయన చెప్పెను, "దేవుని యొక్క క్రియలు నేను చేయకుంటే అప్పుడు నన్ను నమ్మవద్దు; కానీ దేవుని క్రియలు నేను చేసినట్లైతే అప్పుడు క్రియలనైననూ నమ్మండి."
మరియు దీనినంతటినీ మనము కనుగొనుచున్నాము, ఇంకనూ వారు నమ్మలేదు. వారు ఆయన యొద్దకు వచ్చి, వాటినన్నింటినీ చూసిన తరువాత, మరియు చెప్పిరి, "యూజమానుడా, ఆకాశము నుండి ఒక సూచనను మేము చూడగోరుచున్నాము."
ఇప్పుడు మంచిది, అద్భుతము వంటి కార్యము లేనేలేదు. చేసిన దానిని నన్ను చూడనివ్వండి. నా కళ్లతో నన్ను దానిని చూడనివ్వండి. దానిని నన్ను పరీక్షింప నివ్వండి" అని చెప్పే అదే తరగతి ప్రజలను మనము ఇప్పుడూ కనుగొనుచున్నాము. మంచిది, ఆ వ్యక్తి పరిపూర్ణముగా నిరీక్షణ లేనివాడు, ఎందుకనగా నీవు రక్షింపబడినట్లైతే అది ఒక అద్భుతము. నీవు కేవలం… నీవు దేవున్ని నమ్మవలసినవాడవై యున్నావు. నీవు అద్భుతాన్ని వివరించలేవు.
EXOD 3:4,5•
HEB 11:6
30"మండుచున్న ఈ ఆకులలో కొన్నింటిని తీసుకొంటాను, అగ్ని మీద ఉంచి ప్రయోగశాలకు తీసుకొనివెళ్ళి వాటిని పరీక్షించి, అవి ఎందుకు మండలేదో కనుగొని, నేను నమ్ముతాను" అని మోషే చెప్పినట్లైతే ఏమి? దేవుడు అతనితో ఎన్నడూ మాట్లాడియుండెడివాడు కాదు. కానీ ఆ ఆకులు, వృక్షము కాలిపోయి ఉండలేదని అది ఒక అద్భుతమై ఉన్నదని అతడు గ్రహించియుండెను. కావున అతడు దానితో మాట్లాడుటకు దగ్గరగా చేరెను, అతని చెప్పులను తీసివేసి, దాని ముందు తానే తగ్గించుకొనెను. మరియు దేవుడు తిరిగి అతనితో మాట్లాడెను.
ఇప్పుడు అలాగే మనం చేస్తే, దేవుడు మనతో తిరిగి మాట్లాడును. కానీ అది దేవుడైయున్నట్లు నీవు గుర్తించవలసియున్నది. దేవుని నుండి ఏదైనా పొందుటకు ఏకైక మార్గం, ఆయనను నమ్ముట." దేవుని యొద్దకు వచ్చువాడు తప్పక ఆయన ఉన్నాడని నమ్మవలెను."
లేఖనానుసారము కాని సంగతులను మనం చూచుచున్నట్లైతే, నీవు ప్రశ్నించెడివాడవు. అయితే నీవు లేఖనము ద్వారా పూర్తిగా నిరూపించబడి, లేఖనాన్ని వ్రాసిన మరియు వాగ్దానమును చేసిన దేవునిచే అది గుర్తించబడినప్పుడు, మన చెప్పులను మనం తీసివేసి, అదే మాదిరిగా చెప్పండి, "ప్రభువైన దేవా, ఇక్కడ ఉన్నాను." మనం చేయవలసినది అదే.
LUKE 4:2,3•
JOHN 5:19•
JOHN 14:10
31మరియు అదే వారు దానికి బదులుగా వారు వచ్చి చెప్పిరి, "మేము అద్భుతాన్ని చూడగోరుచున్నాము." ఇప్పుడు ప్రతీ ఒక్కరు అద్భుతాన్ని చూడాలని కోరువారే. మనం కనుగొనినయెడల దెయ్యము కూడా, ఆకలి పరిస్థితులో ఉన్న యేసును, చూసినప్పుడు అది చెప్పెను. "నీవు దేవుని కుమారుడవైతే, రొట్టెలగునట్లు ఈ రాళ్లను ఆజ్ఞాపింపుము." చూశారా, "నీవు అయివుంటే…" అది ఖచ్చితముగా నమ్ముట లేదు. కానీ అది చూడగలుగునట్లు ఒక అద్భుతమును చేయమని అది కోరెను. ఇప్పుడూ అదే విధానము. చూశారా, నీవు అద్భుతాన్ని నమ్మవలెను. అద్భుతాన్ని చూచుటకు, నీవు నమ్మవలెను.
ఆయనను తాకింది ఎవరో ఎరిగి వివేచించి వారి ఆలోచనలను చెప్పగలిగెనని మనం తెలుసుకొన్నప్పుడు, ఆ పొలములలో మనం కనుగొంటాము. ఆయన యొక్క మొత్తం జీవితం అద్భుతముల రూపమై యుండెను, అందునిమిత్తం ఆయన స్తుతిని స్వీకరించలేదు. ఆయన చెప్పెను, "ఆ క్రియలు చేయుచున్నది. నేను కాదు; అది నా తండ్రి. ఆయన నాలో నివసించును. ఆయన క్రియలు చేయును. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, కుమారుడు తనంతట తానే ఏమీ చేయలేడు, కానీ తండ్రి ఏమి చేయుట, చూచునో అలాగే కుమారుడు దానిని చేయును," చూశారా. ఆయన ఘనతనంతటినీ తండ్రికి ఇచ్చుచున్నాడు. మరియు ఆయన ఇక్కడే ఉండెను, ఈ క్రియలను చేయుచూ ఉండెను.
MATT 26:67,68•
MATT 27:40,42•
MARK 14:65•
MARK 15:31,32•
LUKE 22:63-65
32మరియు దానియంతటి తర్వాత, సమాజంలో వారు ఆయనను పట్టుకొనినప్పుడు, ఆయన ముఖం చుట్టూ ఒక గుడ్డను ఉంచి, ఈ త్రాగుబోతు సైనికుల యొక్క కర్రను తీసుకొనెను. అక్కడ నిలువబడి, తలపై ఆయనను కొట్టుచూ ఒకరి నుండి మరొకరికి ఆ కర్రను మార్చుకొనుచూ, అన్నారు, "ఇప్పుడు నీవు ఒక ప్రవక్తవైతే, ప్రవచించి, నిన్ను కొట్టినదెవరో మాతో చెప్పుము. మేము నిన్ను నమ్ముతాము" అది ఎవరో ఆయన ఎరిగియుండెను.
కానీ, మీరు చూడండి, ఒక దేవుని మనిషి, లేక ఒక దేవుని సేవకుడు, దెయ్యాల నిమిత్తం హాస్యకునిగా చేయడు, చూశారా. దానిని చేయుటకు వారు బదులు కారు.
"మంచిది, అటువంటివి ఉంటే… దైవిక న్వస్థతలో మీరు నమ్మకముంచండి. రోగులు వున్న ప్రదేశంను నేను ఎరుగుదును. ఎక్కడ రోగులు ఉన్నరో గుంపు యొద్దకు, ఇక్కడవున్న హాస్పటల్ యొద్దకు వెళ్ళండి" అని మీరు వారు చెప్పుట విని యున్నారు.
అది బహుశా అదే రకపు సమూహంవలె ఉండొచ్చు, గ్రుడ్డి బర్తిమయి వచ్చినప్పుడు, వారు ఆయనను పరిహాసము చేస్తున్నప్పుడు, బహుశా ఇలా చెప్పిరి, "ఓయి, నీవు స్వస్థపరుస్తావని, చచ్చిన వారిని లేపుతావని మేము విన్నాము. ఇక్కడ చనిపోయిన పరిశుద్ధులతో నిండిన స్మశానము మేము కలిగియున్నాము. నీవు చచ్చినవారిని లేపితే, వెళ్ళి వారిని లేపు. చూశారా, అదే పాత కాలపు విమర్శించే దెయ్యం. శిలువ మీద ఆయన వ్రేలాడుచూ ఉన్నప్పుడు, అది చెప్పెను, "నీవు దేవుని కుమారుడి వైతే, అక్కడి నుండి దిగిరమ్ము మేము నిన్ను నమ్ముతాము." చూశారా?
ఆయన దానిని చేయగలడు. వారు ఆయనను పరిహాసము చేసిరి, వారు పరిహాసము చేసిరని ఎరుగకుండిరి. వారు చెప్పిరి, "ఆయన ఇతరులను రక్షించెను; ఆయన తన్నుతానే రక్షించుకొనలేడు." నిశ్చయముగా కాదు. తనను తానే రక్షించుకొంటే, ఆయన ఇతరులను రక్షించలేడు. కావున ఇతరులను రక్షించుటకు తన్నుతానే అర్పించుకొనెను — ఆయన దానిని చేసినందుకు నేను ఆనందించుచుంటిని. నిశ్చయముగా, చూశారా.
ఇప్పుడు, అక్కడే ఆయనను మనం కనుగొనుచున్నాము, మీరు చూడండి.
MATT 9:24•
MATT 12:24,39•
MARK 3:22•
MARK 5:35,36•
LUKE 8:52•
LUKE 11:15•
JOHN 9:6
33కానీ అది అదే పాతకాలపు ఆత్మ "నీవు ఇక్కడ ఏదో చేయుము. చేసిన
దానిని నన్ను చూడనిమ్ము." ఎందుకు, కావున అలాగు ఉన్నచోట దేవుడు పని చేయలేడు. ఒకసారి యేసు ప్రజల గు౦పులోనికి వెళ్ళి, చనిపోయిన బాలిక కేవలం నిద్రించుచున్నదని చెప్పెను, ఆయన నిష్ప్రయోజకుడిగా ఆయనను చూసి వారు నవ్విరి. ఆయన ఆమెను లేపుటకు ముందు, వారిని ప్రతీ ఒక్కరిని ఇంటి బయట ఉంచెను, చూశారా. ఆయన దానిని చేయవలెను. ఒకసారి ఒక గ్రుడ్డి వానిని తీసుకొనెను మరియు నగరము బయటకు తోడుకొని పోయి అతని కండ్లపై ఉమ్మిని పూసి, ఒక క్రమంలో జన సమూహం నుండి వానిని దూరముగా తీసుకొని పోయెను. అవిశ్వాసము ఎక్కడ ఉండునో అక్కడ దేవుడు క్రియ చేయలేడు.
నీవు నమ్మకం కలిగి యుండవలెను. ఆ స్థితిలోనికి మనము రాగలిగితే, ఈ రాత్రి, ప్రతీ సందేహానికి తీర్చుకొనుటకు, దేవుని యొక్క ప్రతీ వాక్యాన్ని నమ్ముచూ, మరియు యేసుక్రీస్తు సజీవుడై యున్నాడని తెలుసుకొనుటకు అది ఆయనే అని తన్నుతానే చూపించుకొనును. నేను మీతో చెప్పుచున్నాను, ఉదయకాలాన టుసాన్ లోని వార్త పత్రికలు ప్రధానాంశములు వ్రాయుదురు. అదే ఏకాత్మను మీరు పొందగలిగితే, ఈ భవనంలో ఏమి జరుగబోతుందో.
కానీ ఈ మనుష్యులు జరిగిన ఈ కార్యములు అన్నియు చూసి, మరియు దాని కొరకు విని దానిని వారు వారి సంఘానికి జవాబు చెప్పలసిన వారైయున్నారు. అది ఏదో కార్యమని వారు చెప్పవలెను. అది జరిగియుండెను. మరియు వారు చెప్పిరి, "అది బయల్జేబూబు." మరియు వారు వచ్చి చెప్పెను, "ఇప్పుడు మేము ఒక అద్భుతమును చూడగోరుచున్నాము. మేము పరలోకము నుండి ఒక సూచక క్రియను చూడగోరుచున్నాము, నీ నుండి ఒక సూచనను చూడగోరుచున్నాము." ఆయన అప్పటికే చాలా సూచక క్రియలు చేసియుండెను. కావున ఆయన ఎప్పుడు ఏ సూచక క్రియలు చేసినట్లు లేఖనము చెప్పుట లేదు.
JON 1:1,2
34ఇప్పుడు, దేవుడు అన్ని కాలములోనూ, సాక్షి లేకుండా కలిగియుండలేదు. దేవుడు ఒకానొక కాలములో ఒకే ఒక వ్యక్తి యొద్దకు దిగియుండెను. కానీ ఆయన ఎల్లపుడూ ఒక సాక్షిని కలిగియుండి, ఆయనను విశ్వసించిన ఒకరిని, అతీతమైన దానిలో నమ్మకముంచ గలిగిన ఒకరిని, దేవునిని నమ్మగలిగిన ఒకరిని, అది వ్రాయబడినట్లుగా మరియు ఆయన ఏమై యున్నాడో అదే విదముగా, మరియు ఇక్కడ వారిని సూచించున్నాడు, మనము కనుగొనునట్లుగా అన్ని కాలాలలో ప్రతి చోట ఆయన, ఆయన యొక్క సాక్షిని కలిగియున్నాడు.
ఇప్పుడు, ఇక్కడ ఒక ప్రదేశంలో "యోనాసు" అని పిలువబడేవానిని ఆయన సూచించుచున్నాడు, కానీ అతనిని మనం యోనా అని పిలుస్తాము. చాలా మంది యోనాను విమర్శిస్తారు, మరియు చెప్తారు, "ఓ ముసలి యోనా." ఆ యొక్క పేరు మీరు విని యున్నారు, కానీ కొద్ది సేపు యోనా కొరకు - నేను తీసుకొనవలెనని కోరుచున్నాను. యోనా ప్రభువు యొక్క చిత్తమునకు బయటలేడు. యోనా ప్రభువు యొక్క చిత్తములో ఉండెను. అతడు ఒక ప్రవక్త, దానికి అతడు సూచించబడెను. అతడు పరిశుద్ధ గ్రంధములో "ప్రవక్తయైన యోనా" అని పిలవబడ్డాడు. అతడు ప్రభువు యొక్క చిత్తమునకు బయటలేడు. కొంత కాలం క్రితం, చరిత్ర లాంటి దాని మీది వ్యాఖ్యనమును నేను చదివియున్నాను.
PS 37:23•
JON 1:1,2
35ఇప్పుడు యోనా నిజముగా నీనెవె వెళ్ళుటకు ప్రభువు చేత పంపబడి యున్నాడు. నీనెవె నగరం ఇక్కడున్న నగరానికి నాలుగు లేదా ఐదు రెట్ల పరిమాణం. అది అక్కడ ప్రపంచంలో గొప్ప వ్యాపార నగరం. నీనెవె, ఆ రోజున, చాలా ఎక్కువ దిగజారి పోయినది. మరియు వారు సముద్రము యొద్ద చేపలను పట్టేవారు. వారు దేవుని యొక్క నిజమైన జీవవాక్యము నుండి దూరముగా పోయి, జంతువులను, సముద్రపు వికృత ఆకారాలను ఆలాంటి వాటిని ఆరాధించడం మొదలుపెట్టిరి. వారు కలుషితమైన భయంకరమైన స్థితిలో ఉన్నారు. "నీనెవెకు వెళ్ళు" అని దేవుడు అతనితో చెప్పెను.
అతడు సముద్ర తీరానికి వచ్చుటను మరియు తర్శిషుకు వెళ్ళే ఓడ ఎక్కుటను మనము కనుగొనుచున్నాము. ఇప్పుడు, అక్కడ దేవుడు ఏమైతే చెప్పెనో దానినే అతడు చేసినట్లు ఎవరో నమ్మవలెను. నీతిమంతుల యొక్క అడుగుజాడలు ప్రభువు యొక్క ఆజ్ఞచేత నడిపించబడలేదో మనము కనుగొందుము. మరియు మన యొక్క పూర్ణహృదయముతో ఆయనను నమ్మినట్లైతే, మనము పొరబాటు చేసినప్పటికిని, దేవుడు దానిని ఆయన మహిమార్ధము పని చేయనట్లు చేయును.
JON 1:6,12,17
36యోనా… సముద్రము మీద తుఫానులు పైకి లేచుట ప్రారంభించుటను, ఓడ వెనుకకు ఎగిరి పోవుటను మనము కనుగొనుచున్నాము, వారు రక్షింపబడగలరన్న ఆశలు అన్నియు వెడలిపోయెను. యోనా, బహుశా బోధిస్తూ దానికి ముందుగా కొన్ని రాత్రులు, అలసిపోయెను. అతడు ఓడ అడుగు భాగములోకి పోయి కొంచెం స్వల్ప నిద్రలాంటి ఒక చిన్న పగటి నిద్రను తీయుచుండెను. "లే, మేలుకొనుము, ఓ సోమరీ, నీ దేవుని పిలువుము!" అని వారు వచ్చి, అతనితో అనిరి.
"ఇప్పుడు, మీరు ఏమి చేయవలెనని నేను మీకు చెప్పుచున్నాను. నా యొక్క చేతులను, నా వెనుకకు కట్టివేసి మరియు నా కాళ్ళను, ఓడలో నుండి నన్ను త్రోసి వేయండి" అని యోనా చెప్పెను. "ఓడ కొట్టుకొని పోవుట ఆగును, ఆలలు, ఓడ; ఓడ కొట్టుకొని పోవుట ఆగిపోవును, వేరే విధముగా, మీరు కేవలం నన్ను బయటకు త్రోసివేస్తే." కావునా, మీరు చూడండి, వారు దానిని చేసినప్పుడు, అతనిని బయటకు త్రోసివేసినప్పుడు, దేవుడు ఒక గొప్ప చేపను తయారు చేసి యుండెను, అది ఒక తిమింగలమైన్నట్లు మనం నమ్ముచున్నాము.
JON 1:17
37ఇప్పుడు అది విజ్ఞాన శాస్త్రముతో వివాదం కలిగి యుండెను. ఇక్కడే, కొన్ని సంవత్సరాల క్రితం, నేను కెంటకీ, లూయిస్ విల్ లో ఉన్నాను అది నా సొంత పట్టణము, జెఫర్సన్ విల్ ఇండియానా నుండి ఆ వైపుగా వుంది. కేవలం ఓహియో నది రెండు నగరాలను వేరు పరచుచున్నది. వారు ఒక తిమింగలాన్ని కలిగియున్నారు. ఒక వెడల్పాటి కారు మీద, ఒక తిమింగలము యొక్క అస్థిపంజరాన్ని కలిగియుండిరి. అక్కడ ఒక మనిషి నిలబడి, ఈ తిమింగలము మీద ఉపన్యాసం ఇస్తూ వున్నాడు. మరియు అతడు చెప్పెను… ఇప్పుడు, అతడు వచ్చెను… "అతడు ఏమి చెప్పబోవుచున్నాడు చూడాలని" నేను అనుకొన్నాను.
దాని నోరు యొక్క పరిమాణం గూర్చి మాట్లాడుచుండెను. ఆ మనిషి దాని నోటిలోనికి సులభంగా ఎలా నడువగలిగెను, మరియు చెప్పెను "వారు చెప్పే బైబిల్ కధను మీరు తెలుసుకోండి," మరియు ఒక వెర్రి నవ్వు అతడి ముఖము పై చూపెను. "యోనాను తిమింగలము మ్రి౦గినట్లు వారు చెప్పుచున్నారు, అయితే మీరు తెలుసుకోండి," అని అతడు చెప్పెను. "అది అలాగు ఉండలేదని దానిని మీరు తెలుసుకోవలెనని నేను కోరుచున్నాను" అని చెప్పెను. "ఎందుకనగా తిమింగలము యొక్క గొంతును మీరు గమనించినట్లైతే," అని చెప్పెను. "ఇంకా … దాని యొక్క గొంతు గుండా నాలుగు అంగుళాల బంతికంటె ఎక్కువగా దిగగలిగింది ఏదీ లేదు." అది అలాగు కాదు. అది కేవలం ఒక కల్పిత కధ," అని చెప్పెను.
JON 1:17
38అలా నిలబడుటకు, నా ఐరిష్ స్వభావానికి, అది చాలా ఎక్కువ. నేను అన్నాను, "మీ క్షమాపణను నేను అడుగుచున్నాను, అది అలాగే అయి ఉన్నది."
"అయ్యా" అని అతడు అన్నాడు, ఇక్కడ ఒక తిమింగలము ఉన్నది" అని అన్నాడు. అది ఒక పెద్ద రకపు తిమింగలము. దానిని ఎలా పిలుస్తారో అతడు చెప్పెను." వెనుకకు వెళ్ళండి, మీ అంతట మీరే సంతృప్తి చెందుటకు కోరితే అతడు (యోనా) దాని గుండా వెళ్ళుటకు ఆ గొంతును కొలత వేయండి. ఒక పూర్తిగా ఎదిగిన మనిషి ఆ గొంతు గుండా వెళ్ళగలిగితే, నాతో చెప్పండి."
"అది కేవలం నీవు అవిశ్వాసివి అయినందున," అని నేను చెప్పాను. "ఇది ఒక ప్రత్యేకంగా తయారు చేయబడిన తిమింగలము. ఆయన ఒక చేపను సిద్దపరచెను, అని దేవుడు చెప్పెను. అది ప్రత్యేకమైనది, సిద్దపరచబడినది. ఆయన కోరినట్లైతే మొత్తం వెడల్పాటి కారు లోనికి త్రోసి వేయునట్లు ఒక దానిని సిద్దపరచగలడు. ఆయన దేవుడు." కావున… అది సరియైనది. దేవుడు ఏమి కోరునో దానిని చేయును. నేను నమ్ముచున్నాను, తిమింగిలము యోనాను మ్రి౦గెను అని.
JON 1:17
39గుడారము నుండి చిన్న అమ్మాయి ఒక రోజు వస్తూ ఉండగా. మీరు ఎరుగుదురు గత రాత్రి లేదా ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఈ చిన్న స్సికిల్ ఫ్రిట్జ్ లాంటి ఆమె యొక్క జుట్టును చక్కగా వెనుకకు దువ్వుకొన్న చిన్న అమ్మాయి. ఆమె చిన్న… ఆమె చక్కని అమ్మాయి అని నేను అనుకొనుచున్నాను. చిన్న గాయని, ఆమె వినుటకు పట్టబడినది. ఆమెను నేను బాధపెట్టడం లేదని అనుకొనుచున్నాను. లేదని నేను ఆనుకొనుచున్నాను, కాని ఆమె నిజంగా చక్కటి అమ్మాయి. ఈ చిన్న అమ్మాయి ఇప్పుడే రక్షింపబడి, మరియు తన హృదయముపై పరిశుద్ధ గ్రంధాన్ని కలిగి, పాడుతూవుంది. నాస్తికుడైన ఒక వృద్దుడు, ఆ రోడ్డు పక్కగా, యుటికా, ఇండియానా అని పిలిచే చిన్న నగరంలో జీవిస్తున్నాడు. "ఈ ఉదయమున ఎందుకు నీవు అంత సంతోషంగా ఉన్నావు?" అని అడిగాడు.
"మంచిది, నేను ఇప్పుడే యేసును కనుగొన్నాను" అని చెప్పింది.
"నీవు ఆయనను కనుగొన్నట్లు నీకు ఎలా తెలుసు?" అని అన్నాడు. "నీ చేతిలో నీవు కలిగియున్నది ఏమిటి ఒక ప్రార్థనా పుస్తకమా?" అని అడిగాడు.
"కాదు, ఇది ఒక బైబిల్" అని చెప్పినది.
"దానిని నీవు నమ్ముచున్నావని నేను అనుకొనుచున్నాను" అని అన్నాడు.
"దానిలో ఉన్న ప్రతీ భాగాన్ని నేను నమ్ముచున్నాను" అని చెప్పింది.
"అక్కడ ఉన్న యోనా మరియు తిమింగిలము గూర్చిన కధను నీవు నమ్ముచున్నావా?" అని అడిగాడు
"అవునయ్యా, దానిలో వున్న ప్రతీ వాక్యాన్ని నేను నమ్ముచున్నాను" అని చెప్పింది.
"అయ్యో, అలా కాదమ్మా హనీ, దానిని నీవు నమ్మకు అన్నాడు."
"కానీ నేను అలాగే ఉన్నట్లు నమ్ముతాను," అని అన్నది.
"మంచిది, ఇప్పుడు విశ్వాసము అని నీవు చెపుచున్నట్లు ఆవల దానిని నీవు ఎలా రుజువు చేయగలవు?"
"మంచిది, నేను పరలోకము వెళ్ళినప్పుడు నేను యోనాను అడుగుతాను," అని అన్నది.
"అక్కడ యోనా లేకపోతే ఏమిటి?" అని ఆ నాస్తికుడు ఆ చిన్న అమ్మాయితో అన్నాడు.
"అప్పుడు ఆయనను నీవు అడుగవచ్చు" అని చెప్పి౦ది. కనుక దానిని గూర్చిన విధానం అదే, మీకు తెలుసు, అతడు అక్కడ లేకపోతే, అతడు ఎక్కడ ఉన్నాడో వారు ఎరుగుదురు.
కావున అది చెప్పింది చెప్పినట్లు, యోనా తిమింగలాన్ని మింగెను అని బైబిల్ చెబితే, దానిని నేను నమ్ముతాను. బైబిల్ అలాగే గనుక చెబితే ఆ సంగతులన్నీ సత్యమని నేను నమ్ముతాను. దానిలోని ప్రతీ వాక్యాన్ని మరియు బైబిల్లోని ప్రతి పదాన్ని నమ్ముతాను.
40చాలా మంది ప్రజలు యోనాను గూర్చి రకరకాలుగా మాట్లాడుతారు. ఇప్పుడు క్రైస్తవులుగా యోనాను గూర్చి మనం మాట్లాడుచున్నట్లు ఇక్కడున్న వ్యక్తులలో ఒకనిగా యేసు అతడిని సూచించున్నాడు. క్రీసుకు అనేక సంవత్సరాల ముందు, అతడు ఆ తరానికి ఒక సూచన. ఒక్క నిమిషం అతని గూర్చి ఆలోచన చేద్దాం. చేతులు, మరియు పాదములతో వెనుకకు కట్టబడి, అతడు ఉండెను. దేనినైనా కనుగొని తినడానికి, ఆ జలముల గుండా తిమింగిలం తిరుగుతూ ఉంది.
ఒక చేప తినినప్పుడు అది తిన్నగా అడుగు భాగానికి వెళ్ళి, అక్కడ విశ్రాంతి తీసుకొనునని మనం ఎరుగుదుము, ఈతగాళ్ళు, మహాసముద్రం యొక్క అడుగుభాగం మీద. మీ చిన్న బంగారు చేపలకు ఆహారం పెట్టండి, మరియు దానిని గమనించండి, దాని చిన్న కడుపు పూర్తిగా నింపుకుని, జాడి యొక్క అడుగు భాగానికి తిన్నగా వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనును. అది ఆకలి తీర్చుకొన్నది. ఏ జంతువైనా అంతే. ఆఫ్రికా సింహము తినడానికి ఏదైనా కనుగొనేంతవరకూ, అది తిరుగుతూ, మరియు దేనినైనా అది చంపును. వెంటనే అది ముక్కల ముక్కలుగా చేస్తుంది. కానీ, అది తినినప్పుడు అది వెళ్ళి, క్రింద పరుండుతుంది. దాని యొద్దకు నీవు నడువగలవు; అది నీకు ఏ హాని చేయదు. అది పైకి లేచి, గర్జించవచ్చును, ఒక యౌవ్వన సింహము, నిన్ను దూరముగా తరిమివేయవచ్చు, కానీ అది అప్పుడే భుజించి యున్నది. అంతే. చంపి, తినడానికి మాత్రమే దాని గొప్ప శక్తిని అది ఉపయోగించును.
41మరియు చేప, అది భుజించినప్పుడు, అది అడుగుభాగానికి వెళ్ళిపోవును. దాని కడుపులో చాలా చక్కగా నింపబడింది, నా అభిప్రాయం, దాని కడుపులో — ఈ చేప ఈ ప్రవక్తను, తన కడుపులో కలిగియున్నది.
అతని నిమిత్తం నేను ఎల్లప్పుడు దుఃఖపడుచు ఉంటాను, ఎందుకనగా… ప్రజలు ఎల్లప్పుడు మాట్లాడుతూ ఉంటారు, "మంచిది, బ్రెన్హాం సహోదరుడా, నేను అవిటి చేయిని కలిగియున్నాను, మరియు నేను ప్రార్ధించబడ్డాను, ఒకవారం క్రితం సహోదరుడా ఫలాన - ఫలాన, నా సంఘ కాపరి, నా నిమిత్తం ప్రార్థించెను, నిజంగా నాకు ఏ మంచి జరగలేదు." నీ చేయిని నీవు చూస్తున్నంత కాలం, నీవు ఎప్పటికీ బాగుపడలేవు. చేయిని నీవు చూడకూడదు; నీవు వాగ్దానమును చూడవలెను.
"మంచిది, నా కడుపులో నేను ప్రేగులో పుండును (అల్సర్) కలిగి యున్నాను, అది ఇంకా మండుతూ బాధపెడుతూ ఉంది," అని దానిని చూస్తు, చెబుతూ ఉంటావు. దానితో నీవు చేసేది ఏమీ లేదు. నీవు విశ్వాసమును కలిగి యుండవలెను. స్వస్థపరిచేది అదియే, నీ విశ్వాసము, చూశారా.
42ఇప్పుడు చూడండి, రోగ లక్షణాల గూర్చి మాట్లాడుము? యోనా నిజమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ చూడండి. అతడు వెనుకకు జారిపోయినవాడని అనుకుందాము. అతడు తిమింగిలం గర్భంలో ఉన్నాడు, సముద్రముపై తుఫానులో, మహా సముద్రములో సుమారు రెండువందల-నలభై అడుగుల లోతు కావచ్చు. అతని మెడను బయటకు చాచి, చుట్టూ చూచుచుండెను. సముద్రపు కలుపు అతని చుట్టూయుండెను, మొత్తం అంతా, ఈ వైపుకు అతడు చూసెను. అది తిమింగలము గర్భము, ఆ వైపు తిమింగలం గర్భం ఈ వైపు తిమింగలము గర్భం, తిమింగళం గర్భం మాత్రమే. ప్రతీచోటా అతడు చూడగలిగాడు. ఇప్పుడు, సరైన రోగ లక్షణాలను అతడు కలిగియుండెను. ఇక్కడ ఎవ్వరూ లేరు, చాలా చెడ్డ పరిస్థితులో ఉండెను, ఈ రాత్రి నేను ఖచ్చింతగా చెప్పుచున్నాను.
1KGS 8:35•
1CH 6:21•
2CH 7:1•
JON 2:4,8•
ROM 8:34
43కానీ, యోనా ఏమి చెప్పాడో మీకు తెలుసా? అతడు చెప్పెను, "వారు అసత్యమైన వ్యర్థ దేవతలు, నేను వారిని చూడను, కాని మరొకసారి నీ పరిశుద్ధ మందిరాన్ని చూసెదను" అని చెప్పెను. అక్కడ మీరు ఉన్నారు!
అతడు తిమింగిలము యొక్క గర్భమును చూచుటకు తిరస్కరించెను. అతడు రోగ లక్షణాలను చూచుటకు తిరస్కరించెను. ఎందుకు? సాలొమోను ఆ మందిరాన్ని దేవునికి సమర్పించినప్పుడు, ఆ గొప్ప అగ్నిస్తంభము, మరియు మేఘము అక్కడ వ్రేలాడుచున్నప్పుడు, సాలోమోను ప్రార్ధన ముగించగా అది క్రిందికి దిగి, నిబంధనా మందసముతో దాని విశ్రాంతి స్థానమును తీసుకొనును అని అతడు ఎరిగియున్నాడు. మరియు సొలోమోను ప్రార్ధించినప్పుడు, అతడు ప్రార్ధించెను, "ప్రభువా, నీ ప్రజలు ఎక్కడైనా సమస్యల్లో ఉంటే, ఈ పరిశుద్ధ పర్వతము, లేదా ఈ పరిశుద్ధ స్థలము వైపుకు తిరిగి, ప్రార్ధించినప్పుడు పరలోకము నుండి ఆలకింపుము. సొలోమోను యొక్క ప్రార్ధన దేవుడు విన్నాడు అనే నమ్మకాన్ని యోనా కలిగియున్నాడు, ఎందుకనగా అతడు దేవుని సేవకుడై యుండెను.
భూసంబంద మందిరాన్ని సమర్పించిన ఒక మనిషి యొక్క ప్రార్ధన పై అంత విశ్వాసమును అతడు కలిగియుంటే; ఒక మనిషి, ప్రార్ధన చేయుట తన జీవితంలో చిట్ట చివరిగా, వెనుకకు జారిపోయిన; ఆ పరిస్థితి క్రింద ఆ రోగ లక్షణములతో అతని ప్రార్ధన దేవుడు ఆలకించును అనే నమ్మకాన్ని అతడు అంతగా కలిగియుండగా; ఈ రాత్రి, పునరుత్థానుడైన యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చొన్న మనం, ఇంకెంత ఎక్కువ కలిగి యుండాలి, రోగ లక్షణాల వైపు చూడక, పరలోకము వైపు చూడండి. మన పాపపు ఒప్పుకోలుపై మధ్యవర్తిత్వం చేయుచూ, తన సొంత రక్తముతో, అక్కడ యేసు దేవుని కుడిపార్వమునందు కూర్చొండెను!
మన చుట్టూ , గొప్ప స్వస్థతా ఉజ్జీవములు తాకుచున్నవి, ఇక్కడే ఈ ఘడియలోనే ప్రజలు స్వస్థతను పొందుచున్నారు, ప్రపంచమంతా. ఆ ఘడియ ఇక్కడే ఉన్నది.
JON 2:8•
ROM 8:34
44ఇప్పుడు మన రోగ లక్షణాలను చూద్దాము? మనకు సిగ్గు కలుగును. ఆ పరిస్థితులలో యోనా రోగ లక్షణాలను చూడలేదు. వాటిని చూచుటకు తిరస్కరించుచున్నాడని, అతడే చెప్పుచున్నాడు. "వారు అసత్యమైన వ్యర్థ దేవతలు నేనైతే నీ పరిశుద్ద మందిరము వైపే చూచుచున్నాను" అని చెప్పెను.
ఓ దేవా, మొండి విశ్వాసముతో నిండిన పురుషులను, స్త్రీలను మాకు ఇమ్ము, అటువంటివారు రోగ లక్షణాలను చూడనివారు, దెయ్యం వారిని పట్టుకొన్నను చూడరు! దానిని మరలా దెయ్యానికే ఇచ్చివేతురు. "యేసుక్రీస్తు పునరుత్థానమును నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క చాలినంత శక్తిలో నేను నమ్మిక యుంచుచున్నాను. సాతాను నా మీద యుంచిన ఎటువంటి బంధకము నుండియైనను నన్ను స్వేచ్చగా విడుదల చేసే ఇక్కడే యున్న ఆయన సన్నిధిని నేను నమ్ముచున్నాను. నా నిమిత్తం మద్యవర్తిత్వం చేయుటకు ఎల్లప్పుడు జీవించుచూ, దేవుని కుడి పార్శ్వమున కూర్చొనియున్న ఆయన వైపునకే నేను చూచెదను. ఆయన సొంత రక్తముతో ప్రధాన యూజకునిగా, దాని మీద అక్కడ కూర్చొని ఉండెను. దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలమును మనం ఇంకెంత ఎక్కువగా చూడవలెను, అక్కడ యేసు తానే, మన మధ్యవర్తిగా, దేవునికి మానవునికి మధ్యలో వున్న ఒకే ఒక్కడు, తన సొంత రక్తముతో నిలబడి, మన ఒప్పుకోలు పై మధ్య వర్తిత్వం చేయుచున్నాడు! ఆమేన్. ఆమేన్ అనగా "అలాగు ఉండును గాక" అని అర్ధము. నా పూర్ణహృదయముతో దానిని నేను నమ్ముచున్నాను.
గమనించండి.
JON 3:2,5-9
45దేవుడు ఏమి చేశాడో మీకు తెలుసా? ఇది శాస్త్రవేత్తలకు అర్ధంకాని విషయం. ఆయన అక్కడ ఆక్సిజన్ సిలండర్ ఉంచాడో లేదో, లేక ఏమి చేసాడో నాకు తెలీదు, కానీ ఆ మనిషి మూడు పగలు, రాత్రులు ఆ తిమింగిలము యొక్క గర్భములో సజీవంగా జీవించెను. ఆయన ఏమి చేశాడో నాకు తెలీదు. కానీ ఆయన చక్కగా అతనిని తర్శీషు నుండి, తిరిగి నీనెవెకు స్వేచ్ఛగా తీసుకొని పోయెను.
మీకు తెలుసా, ఆ నగర వ్యాపార వేత్తలు, వారి వృత్తి ముఖ్యంగా చేపలు పట్టుట. మరియు ఒక రోజున, "సముద్రపు దేవుడు" గనుక వారు ఆ తిమింగిలాన్ని ఆరాధించిరి. అది సముద్రంలో గొప్ప అసాదారణ జీవి. ఒక రోజు ఆ పురుషులు అందరు బయటకు వెళ్ళి, సుమారు పదకొండు గంటలకు వారు వలలు లాగుచుండిగా, వారు ఆరాధించిన "సముద్రపు దేవుడు" పైకి వచ్చెను. ఒడ్డునకు అది పరుగెత్తుకుపోయి, నాలుక బయటకు చాపెను. మరియు దాని నోట్లో నుండి ప్రవక్త బయటకు నడచి వచ్చెను. వారి సొంత దేవుడు ప్రవక్తను బయటకు వెళ్ళగ్రక్కెను. వారు అతనిని నమ్మరి. అనుటలో ఆశ్చర్యం లేదు. వారి కొరకు దేవుడు దానిని ఏర్పరిచెను. వారు మారుమనస్సు పొందుటలో ఆశ్చర్యము లేదు, మరియు జంతువులపై గోనె బట్ట కప్పిరి. అతని వర్తమానమును వారు విశ్వసించిరి. కార్యములను ఎలా చేయాలో దేవునికి తెలుసు.
MATT 12:39
46యోనాను గూర్చి యేసు ఏమి చెప్పెనో చూడండి… "ఒక దుష్ట వ్యభిచారతరం సూచనను వెదుకుచున్నారు…" నేను ఇక్కడ మీ విశ్వాసమును కొంచెము నొక్కి దను, కానీ ఆయన ఈ తరమును సూచించుచున్నాడు నేను నమ్ముచున్నాను. ఎందుకో నేను మీకు చెప్పబోవుచున్నాను. ఎందుకనగా, ఇదియే దుష్ట వ్యభిచార తరమని మనము ఎరుగుదుము. ఇటువంటి కాలం ఇంతకు ముందెన్నడూ లేదు. సొదొమ నుండి స్వలింగ-సంపర్కులు మరియు అసాంఘిక లైంగిక కోరికలు ఇప్పుడున్నట్లు రోడ్లపై ఎప్పుడూ లేవు. మీరు తప్పనిసరిగా నా ఆఫీసుకు వెళ్ళి కాలిఫోర్నియా మరియు చుట్టుప్రక్కల నుండి తల్లులు వ్రాసిన ఉత్తరాలు చదవండి. వారియొక్క అబ్బాయిల జీవితం గూర్చి, ఓహ్, అది భయంకరము! మరియు ఒక పేపర్ నేను తీసుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం, లాస్-ఏంజిల్స్ వెళ్ళినప్పుడు, ఇంతకు ముందు సంవత్సరం కంటే, సొదొమ యొక్క గొప్ప పాపం ఇరవైశాతం అభివృద్ధి చెందినదని అక్కడ చెప్పబడినది. అందరూ, ప్రభుత్వ అధికారులతో సహా, అది ప్రతీచోటా ఉన్నది. పాపము!
అది ఎందుకనగా, స్త్రీలు వారినివారే చులకనగా చేసుకొనియున్నారు. వారి మీదకే దానిని వారు తెచ్చుకొనిరి. అది చాలా సిగ్గులేని కార్యము. ఒకప్పుడు వీదిలో వున్న ఒక స్త్రీని చూసి (గౌరవముగా) మీ టోపి తీసేవారు; మరియు ఇప్పుడు మీరు దానిని చేసినప్పుడు, ఆమె మీ ముఖమును చూసి నవ్వుతుంది. మనలను మనమే తప్పులతో కూడిన గుంపుగా చేసికొని యున్నాము. కనుక మనకు మనమే పరువు తీసుకొనుచున్నాము.
MATT 12:39,40•
2TIM 3:5•
HEB 13:8•
2PET 3:3•
REV 1:18
47దానిని ఇప్పుడు మనం గమనిద్ధాము, "ఒక దుష్ట వ్యభిచారతరం సూచనను వెదుకుచున్నారు. మరియు వారికి దానికి ఒక సూచన ఇవ్వబడుతుంది. యోనా తిమింగిలం యొక్క గర్భములో, మూడు రాత్రింబగళ్లు ఉండునట్లుగా అలాగుననే మనుష్యకుమారుడు భూమి యొక్క హృదయములో మూడు రాత్రింబగళు ఉండబోవుచున్నాడు" అని యేసు చెప్పినట్లు మనం కనుగొనుచున్నాము. ఆయన దేనిని గూర్చి మాట్లాడుచున్నాడు? ఒక దుష్ట వ్యభిచారతరం యేసుక్రీస్తు యొక్క, పునరుత్థానపు సూచనను తీసుకొనును. అదే మనము చేయుచున్నాము. ఆయన చనిపోలేదని ఈ రాత్రి మనం ఎరుగుదుము, కానీ ఆయన నిరంతరము జీవించుచున్నాడు, మరియు ఆయన మనతో ఉన్నాడు.
ఈ సంఘ లోకము యొక్క కాలంలో, సంఘము కలిసిపోతుంది. పైకి భక్తి వేషము, ఈ దినమున లోకములో ఇటువంటి కార్యములు మనం కలిగియున్నాము. నులివెచ్చని సంఘ సభ్యులు, ఎగతాళి చేసేవారు వేళాకోలము ఆడేవారు, "పైకి భక్తి గలవారివలె ఉండి మరియు పరిశుద్ధాత్మ శక్తిని తిరస్కరించుట." అదియే దాని నుండి వెనుతిరగవలెనని మనం ఆజ్ఞాపింపబడియున్నాము. ఇదే ఘడియలో దుష్ట వ్యభిచార తరానికి, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని ఆయన నిరంతరము జీవించువాడని నిరూపించుటకు ఆయన యొక్క పునరుత్థాన శక్తితో యేసుక్రీస్తు మనలను లేపును. ఒక దుష్ట వ్యభిచారతరం సూచనను వెదకుచున్నది. మరియు దానిని అది పొందుతుంది. వారికి ఈ సూచన ఇవ్వబడుతుంది, పునరుత్థానము గూర్చి, దానిని చూచుటకే ఈ దినమున మనము జీవించుచున్నామని నేను అనుకొనుచున్నాను.
2CH 7:1•
MATT 12:42•
LUKE 11:31
48ఆయన సొలోమోను తరమును సూచించుచున్నాడు, సాలోమోను రంగం మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు మన మందరం ఎరుగుదుము, సేవక సహోదరులుగా, చదువరులుగా, అదంతయు వేయ్యేండ్ల పాలనైయున్నది. అది ఇశ్రాయేలీయులకు సువర్ణ యుగము. ఆ యుగములో వారు మందిరాన్ని నిర్మించిరి. వారికి యుద్ధములు లేవు. సొలోమోను ఒక వరం కలిగిన మనుష్యుడు. దేవుడు అతనికి ఒక గొప్ప వివేచనా వరమును ఇచ్చెను. మరియు దేశములో ఉన్న ప్రతీ ఒక్కరూ, ఏక హృదయం, ఏక మనస్సుతో ఆ వరమునందు విశ్వాసము ఉంచిరి. ప్రతిచోట లోకము యొక్క మాటయైయున్నది, ప్రతిఒక్కరు వారికి భయపడిరి, ఎందుకనగా అది అక్కడ జీవముగల దేవుడు వారి మధ్య ఉన్నాడని వారు ఎరిగియుండిరి.
ఈ రాత్రి అది ఎంతో చక్కగా లేదా, మొత్తం సంయుక్త రాష్టములు అన్ని మొత్తం అమెరికా అంతా, దేవుడు మనకు ఇచ్చిన వరమును అంగీకరించినట్లైతే, పరిశుద్ధాత్మ ఆ దినమున వారు చేసినట్లుగా ఏక మనస్సుతో దానిని అంగీకరించి దానిని బలపరచి ఉంటే? ఓహ్, అది ఎటువంటి సువర్ణయుగంగా ఉంటుంది! "సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు" అనే గొప్ప వరము కానీ, సొలోమోను దినములలో వారు చేసినట్లు మనము దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చుట లేదు. సొలోమోనులో ఈ గొప్పవరం పనిచేయుట వారు చూచినప్పుడు, ఏక హృదయం, మరియు ఏక మనస్సుతో ప్రతీ ఒక్కరూ విశ్వసించిరి. యూదా గోత్రం వారు, బెంజమిను గోత్రంవారు, మరియు ఇతర గోత్రములన్ని ఎటువంటి బేధము వారిలో లేదు. ఏక హృదయం, ఏక మనస్సుతో ఉండిరి. వారు కలిసి ఉండి, "మన గొప్ప యెహోవా గూర్చి మాత్రమే ఆలోచించుము. ఆయన మన కొరకు ఒక వరమును పంపించెను. అది ఒక మనుష్యునిలో నివసించుచున్నది," అని వారు చెప్పారు.
2CH 9:1
49మరియు గొప్ప కార్యములు, ఎందుకనగా సొలోమోను యొక్క కీర్తి ప్రపంచమంతయూ సాగిపోయెను. మరియు ఇతర దేశములు అతనికి కప్పమును చెల్లించెను. అతనికి ఎద్దులు, ఒంటెలు, బంగారముతో చేయించిన గొప్ప బహుమతులు పంపించిరి. మరియు మందిరము కట్టించుటకు, రాళ్ళు మరియు ప్రతీ దానితోను అతనికి సహకరించిరి. ఈ రాత్రి, అమెరికాకు కావలసింది అదియే. రాజకీయాలలో ఒక క్రొత్త చేరిక కాదు; సంఘములో ఒక క్రొత్త శాఖ కాదు; అటువంటి దేనిలోను చేరుట కాదు. ఈ కడవరి దినాలలో దేవుడు మనకు పంపించిన పరిశుద్ధాత్మ యొక్క వరమును ఏక మనస్సుతో విశ్వసించి, అంగీకరించి, కలిసిరావలసిన అవసరతను కలిగియున్నారు. అక్కడ నుండే ఈ గొప్ప చివరి కాల అద్భుత ఉజ్జీవములు, దేశమంతయూ పెళ్ళుబికి వెళ్ళును.
కానీ, ఏ కాలమైనా ఒక దేశానికి దేవుడు ఒక వరమును పంపినప్పుడు, ఆ దేశము ఆ వరమును తిరస్కరించిన తల్లిదండ్రులున్న, ఆ దేశము అద్వాన్న స్థితి లోనికి వెళ్ళుపోవును. మీకు తెలుసా! సుమారు యాభై సంవత్సరాల క్రితం, ఆ రష్యా, రష్యాలో పెంతెకోస్తు ఆశీర్వాదం పెళ్ళుబికి వచ్చెను, సుమారు యాబై, డెబ్బది అయిదు సంవత్సరముల క్రితం అది ఇక్కడికి రాకముందే? అది సరే, దానిని వారు క్రిందికి నెట్టివేసిరి, మరియు వారు ఏమి పొందిరో మీరు చూడండి. ఏ దేశమైనా — ఈ దినమున ఇంగ్లాండు వైపునకు చూడండి; ఆ గొప్ప వెస్లీ ఉజ్జీవమప్పుడు, ఆ గొప్ప సంస్కరణ, కాలము. గొప్ప ఉజ్జీవములు తాకిన దేశములను చూడండి. వారు దానిని త్రోసివేసినప్పుడు, వారికి ఏమి సంభవించెను.
MATT 16:18
50ఏ దేశమైనా దేవుడు పంపించిన ఆశీర్వాదమును స్వీకరించినప్పుడు, ఆ దేశము అభివృద్ధి చెందును. నేను మీకు చెప్పుచున్నాను, నేను నమ్ముచున్నాను, ఈ రాత్రి మన భద్రత అనేది బాంబ్ షెల్టర్స్ ను నిర్మించుట లేదా అటువంటిది ఏదో చేయుటలో లేదు. నేను నమ్ముచున్నాను, మన రక్షణ అనేది ఆయన రెక్కల క్రింద ఉన్నది. మనము ఆ రెక్కల క్రింద విశ్రాంతి పొందెదము. ఓహ్, అవును! మీరు బాంబ్ షెల్టర్స్ లోనికి ఎట్లా వెళ్తారు? ఆ బాంబుల్లో ఒక బాంబు పేలి నూట-యాభై మైళ్ళ చదరపు విస్థీర్ణాన్ని పేల్చివేయును. భూమిలో అయిదు వందల అడుగుల లోతునకు పోవును. ఎందుకు, నీలోని ప్రతీ ఎముకను అది వదులుగా చేయును, ఒకవేళ నీవు గనుక భూమిలోని లావా యొద్దకు నిటారుగా కిందకు పడిపోయినట్లైతే.
కానీ ఒక భద్రతా స్థలం ఉంది, అది యేసుక్రీస్తులో, "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ ద్వారములు దాని యొదుట నిలువ నేరవు." అదే విశ్వాసి యొక్క భద్రత, నిశ్చయముగా ఆయన రెక్కల క్రింద క్షేమముగా నివసించుచున్నాము.
JOHN 5:44•
JAS 2:9•
REV 2:6,15
51ఈ గొప్ప సమయాన్ని గమనించండి, దేవుడు పంపించిన వారిని ప్రజలు కేవలం నమ్మియున్నట్లైతే ! కానీ, దానిని క్రింది నెట్టి వేయుటవలన గందరగోళంలోనికి వెళ్ళియున్నారు. మరియు దానినే మనం చేసియున్నాము, ఒక దేశముగా దేవుని ఆశీర్వాదములను క్రిందికి నెట్టివేసి యున్నాము. మరియు మన సంప్రదాయముల నిమిత్తం దానిని మనం మార్చివేసియున్నాము. కానీ దేవుడు ఒక సాక్షిని పంపియున్నాడు, మరియు ప్రజలు దానిని చూచుటలో తప్పిపోయిరి. మరియు నేను పెంతెకోస్తు ప్రజలను గూర్చి ఆలోచించుచున్నాను, దేవుడు ఎన్నో కార్యములను మీ యొద్దకు పంపిననూ, మరియు ఇంకనూ మన సంఘములు సగభాగం ఖాళీగానే ఉంటున్నాయి.
సంఘకాపరి తనంతట తాను సహాయం చేయలేడు. ఈ విషయంలో సంఘ సభ్యులు సహాయమును చేయవలెను. మనం అందరం భాగస్వాములము. నైసియా కౌన్సిల్ నందు, మొట్ట మొదటి సారిగా అదియే గందరగోళాన్ని ప్రారంభించినది. అప్పుడు "నికొలాయితుల సిద్దాంతమును" వారు కోరిరి. "నికొ" అనగా "జయించుట" మరియు "లాయితీ" అనగా "సంఘము" నుండి దూరముగా తీసివేయుట, ఒక పరిశుద్ద మనిషిని తయారు చేయుట. ఆయన పరిశుద్దమైన మనిషి కాడు. పరిశుద్దమైన కొండ, ఆయన పరిశుద్దమైన దేవుడు, ప్రజల మధ్యలో ఉన్న పరిశుద్ద దేవుడు. సంఘము దానితో భాగమును కలిగియున్నది. మనము పిల్లలమై యున్నాము. మన మధ్యలో గొప్ప వారంటూ ఎవరూ లేరు. ఒకరి నుండి నీవు గౌరవములను కోరుచున్నప్పుడు నీవు విశ్వాసమును ఏ విధముగా కలిగియుంటావు. యేసుక్రీసులో మనమందరము ఒక్కటే. పెద్దవారు, చిన్న వారు అంటూ ఎవరూ లేరు. మనం అందరం ఒక్కటే రీతిగా యున్నాము. మనము ఒకే తండ్రి యొక్క బిడ్డలము, మరియు మనమందరం ఆయన పిల్లలము.
52ఇప్పుడు, మనం గమనించాలి, ఈ దేశము నిమిత్తం దేవుడు గొప్ప కార్యములను జరిగించియున్నాడు. ఒక టామీ ఆస్పర్స్ ఒక ఓరల్ రాబర్ట్స్, మరియు గొప్ప గొప్ప వ్యక్తులను దేశమందంతటా, ప్రజల ముందు ప్రతీ చిన్న బహుమానమును ఉంచియున్నాడు. కానీ అది కేవలం పాత నావికునివలె ఉన్నది, ఒకసారి, సముద్రము నొద్దకు, వెళ్ళినట్లుగా ఉన్నది, వెళ్ళి - ఆ వ్యక్తి అతనితో చెప్పెను, ఈ పాత ఉప్పు… అతను ఎప్పుడు… ఈ వ్యక్తి, ఒక కవి, సముద్రమును గూర్చి వ్రాసెను, మరియు దానిని గూర్చి మాట్లాడెను, కానీ అతను ఎప్పుడు దానిని చూడలేదు. కావునా, అతను సముద్రము నొద్దకు వచ్చెను. ఓహ్, అతడు చెప్పెను. పాత ఉప్పును కలిసాను. "మంచివాడా, నీవు ఎక్కడకి వెళ్ళుచున్నావు" అని అతడు చెప్పెను.
"సముద్రము నొద్దకు వెళ్ళుచున్నాను, సముద్ర పక్షులు చేసే ధ్వనులను వినుటకు, ఉప్పుగా ఉండే సముద్రపు అలలను చూచుటకు, మరియు నీళ్ళలో తనంతట తానే ప్రతిబింబించే నీలపు ఆకాశమును చూచుటకు వెళ్ళుచున్నాను" అని ఆయన చెప్పెను.
అతని గొట్టాన్ని ఆ పాత ఉప్పు గాలితో వచ్చి కొట్టింది. నాలుగు లేదా అయిదు సార్లు "దానిని గూర్చి ప్రేరేపించే గొప్ప సంగతిని నేను ఎప్పుడూ చూడలేదు. యాభై సంవత్సరాల క్రితం నేను దాని మీదే పుట్టాను" అని అతడు చెప్పెను. అది అంతా సర్వ సాధారణం అయి పోయేటంత వరకు, ఆ ఉప్పును అతడు ఎంతో చూశాడు.
ఈ రోజు పెంతెకోస్తు ప్రజలతో వచ్చిన సమస్య కూడా అదియే. ఈ గొప్ప అవకాశం మన నుండి తీసివేయబడే ఒకానొక సమయం. వచ్చుచున్నది. అప్పుడు, దానిని గూర్చి మీరు ఎంతో ఏడుస్తారు, కానీ దానిని ఎంత మాత్రము కనుగొనలేరు, చూశారా. మీరు చాలా ఎక్కువగా చూశారు.
53ఎంతో కాలం క్రితం కాదు. లూయిస్ విల్, కెంటకీ నందు ఒక స్త్రీ ఉండెను. ఆమె అదంతా తిరుగుతూ, ఒక దుకాణంలోనికి వెళ్ళెను. ఆ చిన్న బిడ్డ వయస్సు సుమారు రెండు సంవత్సరములు, ఆమె ఆ బిడ్డను చేతులలోనికి తీసుకొని, చిన్న చిన్న వస్తువులను చూపుచూ ఉండెను" చూడు హానీ, చూడు" అని చెప్పుచూ ఉండెను. ఆ చిన్న పిల్లవాడు నిదానించి చూసెను. ఆమె ఇంకో చోటకు వెళ్ళి, "డార్డింగ్ దీనిని చూడుము" అని చెప్పుచూ ఉండెను. ఆ దుకాణంలో ఉన్న ప్రజలు ఆమెను గమనించుట ప్రారంభించిరి. ఆమె మూర్చబోవుట ప్రారంభించెను. ఆమె ఒక చిన్న గల గలమనే ఆట వస్తువును తీసింది. అది తప్పనిసరిగా ఆ చిన్న పిల్లవానిని ఆకర్షించుననీ "చూడు హనీ, చూడు, చూడు, చూడు, చూడు, హానీ, చూడు, డార్లింగ్ చూడు" అని చెప్పింది. ఆ చిన్న బిడ్డ నిదానంగా కన్నార్పకుండా చూచెను.
ఆమె ఆ కొంటర్ బల్లపై పడిపోయెను. అక్కడి జనులు, ఆమె యొద్దకు వచ్చి ఆమెను లేవదీసి, సమస్య ఏమిటో కనుగొనిరి. "నా చిన్న పిల్లవాడు శూన్యములోనికి కన్నార్పకుండా చూచుచున్నాడు" అని చెప్పింది. నేను అతన్ని వైద్యుని యొద్దకు తీసుకొని వెళ్ళితిని, మరియు ఆతడు బాగానే ఉన్నాడు. కానీ చిన్నపిల్లలను ఆకర్షించే వస్తువులు ఏవీ, ఇంకెంత మాత్రము అతన్ని ఆకర్షించవు ఆ విషయంలో గ్రుడ్డివాని వలె అయిపోయాడు" అని వైద్యుడు చెప్పాడు అని ఆమె వారితో చెప్పింది.
MATT 12:38•
MATT 17:10,12•
MATT 25:7•
MARK 9:11,13
54ఆ విధముగానే సంఘముగా ఈనాడు అది ఉన్నది. కుదుపుటకు, ఆయన వాగ్దానం చేసిన, ప్రతి విధమైన వరమును సంఘము ముందు కదిపి చూపించెను, మరియు మనం ఇంకనూ శూన్యములోనికి చూచుచున్నాము. "అయ్యలారా, మేము…. అయ్యా, యజమానుడా, మేము నీ నుండి ఒక సూచనను చూడ గోరుచున్నాము. చూశారా? "యజమానుడా, మేము దీనిని చూడగోరచున్నాము. అప్పుడు, బైబిల్లో ఆయన చేస్తానని, వాగ్దానము చేసిన ప్రతీ దానిని ఆయన చేసెను. మనము అంత్యకాలములో ఉన్నాము.
మరియు మొదటిగా మీరు తెలుసుకోదగినది, మీరు తెలుసుకొనుటకు వెళ్ళుచున్నారు, "మంచిది, మనము తప్పనిసరిగా ఎత్తబడుటను కలిగియుంటామని వ్రాయబడలేదా?" అని మీరు అంటారు. బాప్తిస్మమిచ్చు యొహాను వలెనే అది ఉండబోతుంది. "మొదటిగా, ఏలియా రావలెనని, అది తప్పనిసరిగా జరుగవలెనని లేఖనములలో అది వ్రాయబడలేదా?" అని వారు చెప్పిరి.
"ఏలీయా ఇదివరకే వచ్చెను. మీరు దానిని ఎరుగలేదు" అని ఆయన చెప్పెను.
ఈ దినములలో ఒక దినమున, శ్రమ కాలమువచ్చును, "మొదటిగా ఎత్తబాటు జరుగవలసియున్నది గదా?" అని మీరు చెప్పెదరు. అది ఉంటుంది, "అది ఇప్పటికే జరిగిపోయింది. మరియు దానిని గురించి మీరు ఏమి ఎరుగరు." చూడండి? అది రాత్రివేళ్ళ ఒక దొంగ వలె రాబోతుంది. నేను మీతో చెప్పుచున్నాను, విశ్వాసులు వారి దీపములను చక్కగా శుద్ధిచేసుకొను సమయం, వారి కాలి బొటనవ్రేళ్లపై నిలబడవలసిన సమయం అని నేను మీతో చెప్పుచున్నాను. పిలువబడే సమయం చాలా దగ్గరగా ఉంది. మనము తప్పనిసరిగా దానిని జ్ఞాపకము చేసుకొనవలెను.
55సొలోమోను, వారు అతనిని నమ్మిరి, మొత్తం ప్రజలు, ఏకాత్మ మరియు ఏక హృదయంతో, వర్తమానము ప్రతిచోటకూ వెళ్లిపోయింది అనడంలో ఆశ్చర్యమేమి లేదు. కానీ, ఈ రోజు, దేవుడు దేనినైననూ పంపిన యెడల, అది ఒకానొక సంస్థను, సంఘాన్ని తాకిన యెడల, దానితో చేసేది. ఇతరులకు ఏమీ లేదు. లేదయ్యా! అది బాప్టిస్ట్ ను గనుక తాకిన యెడల ఏదైనా చేయడానికి మెధడిస్టుల వైపు చూడవద్దు. అది పెంతెకోస్తును గనుక తాకిన యెడల, బయట నిలుచుటకు ఆ రెండింటిని చూడండి, కారణం దానిని వారు ఖచ్చితంగా చేస్తారు. కావునా అక్కడే మీరు ఉన్నారు. అది ఎక్కడి నుండి వచ్చినదో అక్కడే ఆధారపడండి. అది వారి యొక్క వృత్తము గుండా రావలసియున్నది లేదా అది మంచిది కాదు.
దేవుడు యేసును పంపినప్పుడు పరిసయ్యులు గుండా, సద్దుకయ్యుల గుండా, లేదా వారిలో కొందరి ద్వారా ఆయన అతనిని పంపినప్పుడు వారు ఆలోచించినది అదియే. మరియు వారిలో ఏ ఒక్కరి గుండా కాదు, వాళ్ల అందరి యొద్ద ఆయన అతనిని పంపెను. దేవుడు చేసే విధానము అదియే. ఆయన కేవలము. ఆయన, చూడండి, వారిలో ఏ ఒక్కరి యొద్దకో ఆయన రాడు. ఆయన వచ్చి, గడ్డిలోని సర్పములారా అని ఆయన వారిని పిలిచెను. అది నిజము.
56మరియు దేవుడు తన సొంత విధానములో కార్యములను చేస్తాడని మనం కనుగొనియున్నాము. మనం దేనిని కత్తిరించలేము. మరియు ఎండజేయలేము, "ఇది నా భాగము, నీకు ఏ పనిలేదు. నీవు నా కళ్ళ అద్దముల గుండా చూడవద్దు. నీవు చక్కగా లేవు అని చెప్పవచ్చు.
లేదు, చూచుటకు దేవుడు మన నిమిత్తం కళ్ళద్దాలను కలిగియున్నాడు, అదియే పరిశుద్ధాత్మ, అప్పుడు అది దేవుని వాక్యమును చూచును. మరియు దానినే విశ్వసించును, ప్రేమించును, మరియు దానితోనే సహవాసము చేయును, చుట్టు ప్రక్కల వారి నిమిత్తం కంబలి చాలినంత దూరంలో వున్నది. మరియు నా భావము ఏమిటో మియాకు తెలుసు. చిన్న ప్రేమ నిమిత్తం లోకము చనిపోవుచున్నది, మరియు ఎవరో ఒకరు వారి కొరకు జాగ్రత్త వహించవలెను. అది నిజము. ఈ చల్లటి, బిగుతుగా వుండే, పిండి పదార్ధమును వారు చాలా చూసిరి. కానీ, నేను మీతో చెప్పుచున్నాను, ఈ పాతకాలపు రక్షణ విధానం, ఒకరి మీద ఒకరు చుట్టూ చేతులు ఉంచునట్లు ఒక కాటన్ వస్త్రమును, సిల్క్ వస్త్రమును తయారు చేయును. అది ఒక టక్సిడో మరియు ఒక జత పొడవాటి పూర్తిగా కప్పియున్న వస్త్రములతో ఒకరినొకరు, "సహోదరుడా" అని పిలుచుకొందురు. అది ఖచ్చితంగా, ఎప్పుడైతే నీ జీవితంలోనికి క్రీస్తును నిజముగా తీసుకొన్నట్లయిన, సరైన మార్గములో, అది వేంటనే నీలో వున్న పిండిని తీసివేయును. ఖచ్చితంగా.
2CH 9:1•
ROM 10:17
57ఇప్పుడు, ఆ గొప్ప కాలము, ఆ సొలోమోనును మనము చూస్తున్నాము. అతని యొక్క కీర్తి అన్ని దేశముల గుండా వెళ్ళిపోయినది, మరియు దానిని గూర్చి విన్నవారు, ఇతర దేశములలోనికి దానిని తీసుకొని పోయిరి. మరియు వారు కలిగియున్న ఒకే ఒక విధానము దూరదర్శిని (టి.వి.) కాదు. మరియు అప్పుడు ఈనాడు కలిగియున్న వార్తపత్రికలు లాంటివి ఆనాడు లేవు. అది ఒకరి పెదవి నుండి చెవికి మాత్రమే. వారి యొద్దకు వచ్చే యాత్రికుల ద్వారా వినేవారు. మరియు వారు ప్రయాణాలు చేయుచూ, వ్యాపారాలు చేయుచూ, ఆ ఖ్యాతిని ఇతర దేశములకు తీసుకొనే పోయేవారు. చివరకు సహారా ఎడారి గుండా, షెబా అని పిలువబడే ప్రదేశములోనికి అతని యొక్క ఖ్యాతి చేరినది.
"దక్షిణ దేశపు రాణి" అని ఇక్కడ పిలువబడుతుంది. కొన్ని నిముషాలు, ఆమె గూర్చి మాట్లాడుకుందాము. ఆమె ఒక చిన్న అన్యురాలైన రాణి. ఆమె విగ్రహాములను ఆరాధించేది అని మీకు తెలుసు. "దేవుడు, ఒక జీవముగల దేవుడు, ఆయన ప్రజల మధ్య నివసించుచున్నాడు" అనే వాక్యము అక్కడకు వెళ్ళెను. ఆమె యొక్క చిన్న హృదయం ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించెను.
MATT 5:6•
ROM 10:17
58మరియు ఆమె రాజ్యములోనికి ప్రయాణించే, ప్రతీ ప్రయాణికుడు, వ్యాపారం చేస్తూ, ఆ రాజ్యము గుండా పోతూ ఉండగా, సుగంధ ద్రవ్యములను, లేదా వారికి కలిగినవి మార్చుకొనుటకు, మరియు నగలు అలాంటివి — ఎందుకు, ఆమె వారిని ఆ కోటలోనికి పిలువనంపేది. మరియు మీరు పాలస్తీనా గుండా ప్రయాణం చేసారా?" అని అడిగేది.
"అవును."
మీరు ఇశ్రాయేలు దేశము గుండా వెళ్ళిరా? చెప్పండి. నేను ఒక దాని గూర్చి అడుగదలంచితిని. వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అనేది నిజమేనా?
ఎందుకనగా, అలాంటి దానిని మీరు ఎప్పుడునూ చూడలేదు. వారి యొక్క దేవుడు క్రిందికి దిగి వచ్చి వారి సహోదరులలో ఒకనిని అభిషేకించెను, మరియు వారు అతనిని రాజుగా చేసిరి. ఓహ్, అది, ఆ ప్రజల యొక్క ఐక్యతను మీరు తప్పని సరిగా చూడవలెను! వారందరూ ఏక హృదయంతో మరియు ఏక మనస్సుతో ఉన్నారు. ఆ దేవుడు ఆశీర్వాదములను వర్షమువలె కురిపించుచున్నాడు. అతడు గొప్ప శక్తివంతమైన వివేచన వరమును కలిగియున్నాడు, అతడు కేవలం… అతని "వినుట ద్వారా విశ్వాసము వచ్చును దేవుని వాక్యము వినుట ద్వారా." "ఓహ్! దానిని నేను చూసియంటిని మీరు తప్పనిసరిగా చూడవలెను." ముందుకు మీరు వచ్చినప్పుడు, అది మానవునికి ఆవల (పరిధిదాటి) ఉన్నట్లు ఉంటుంది. అది. అది సహజాతీతమైనది, అతడు కార్యములను ఎట్లు తెలుసుకొనగలుగును, అది సహజాతీతమైనది.
"అక్కడ నిజమైనది ఏదో ఉంది." ఆమె చిన్న హృదయం కొట్టుకొనుట ప్రారంభించినది. ఆమె దానిని చూడగోరినది. మంచిది, అది అలా అలా సాగుతుంది. మొదటి సంగతి మీకు తెలుసు. మీకు తెలుసు, వినుట ద్వారా విశ్వాసము కలుగును. మరియు మానవ హృదయంతో దేవుడు సంబంధం కలిగినప్పుడు, లోలోపల ఏదో జరుగును, దానిని నీవు లెక్కింపలేవు. ప్రతి దినము, ఆమె దాహం గొనుట ప్రారంభించినది. ఆమె దానిని చూడగోరినది. మీకు తెలుసు, "నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు" అని పరిశుద్ద గ్రంథము చెపుతుంది.
JOHN 1:46•
JOHN 5:39
59ఇప్పుడు మనం దానిని చూద్దాం… దానిని చిన్న నాటక రూపంగా చెప్పుకొందాం, అప్పుడు చిన్న పిల్లలు దానిని గ్రహించెదరు. ఒకానొక రోజు అది నత్యమో కాదో అని కనుగొనుటకు ఆమె యొక్క మనసును నిబ్బరపరచుకొనుచున్నది, దానిని గూర్చి నేను ఆలోచించగలుగుచున్నాను. అది చాలా మంచి కార్యము. మంచిది, గత రాత్రి ఫిలిప్పును గూర్చి చెప్పుకొన్నట్లుగా, "వచ్చి, నీయంతట నీవే చూడుము." ఆమె బైబిల్ ను, పాత నిబంధన, తోలు చుట్టలతో కూడిన గ్రంథపు చుట్టలను కొనుగోలు చేయుట ప్రారంభించినది. ఈ దేవుడు ఎవరో చూడవలెనని, వారు మాట్లాడుకొనుచున్న దేవుడు ఎవరో చూడవలెనని, ఆయన తన స్వభావములో ఏలాగు పనిచేయుచున్నాడో చూడవలెనని, ఆమె చదువుట ప్రారంభించెను. మరియు సహజ స్వభావము మరియు ఆ దేవుని యొక్క జీవము ఒక మనుష్యుని ద్వారా ప్రత్యక్షపరచబడుట, ఆయన యొక్క ప్రజలకు తన్నుతాను తెలియపరచుకొనుట, తన ప్రజల ద్వారా ఆయన చేస్తానని ఏమి వాగ్దాన౦ చేసాడో తెలిసికొనుట ప్రారంభించినది. మంచిది, దానిని చూడవలెనని, ఆమె హృదయం ఆకలిగొనుట ప్రారంభించినది. కనుక ఇప్పుడు ఆమె.
ఒక రోజు, ఆమె అంతట ఆమె దానిని చూచుటకు వెళ్ళవలెనని ఒక నిర్ణయమును తీసుకొన్నది. ఇప్పుడు, అది ఒక మంచి ఆలోచన. నీయంతట నీవే వెళ్ళి కనుగొనుము. ఎవరు ఏమి చెప్పినా తీసుకొనవద్దు. వెళ్ళి కనుగొనుము, "లేఖనములను పరిశోధింపుము" అని యేసు చెప్పెను. "వాటిలో నిత్యజీవమున్నది, అవి నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నది." ఆయన అంతే చెప్పెను.
60ఇప్పుడు గమనించండి, యౌవ్వన స్త్రీ దీనిని చేయడానికి, చాలా ఆటంకములను కలిగియుండెను. ఇప్పుడు, ఆమె చేయవలసిన మొట్టమొదటి కార్యము, ఆమె… మొదటిగా ఆమె యొక్క అన్యమత యాజకుని యొద్దకు వెళ్ళి అనుమతిని పొందవలెను, ఎందుకనగా ఆమె ఒక రాణి గనుక, గౌరవనీయమైన స్త్రీ గనుక, మరియు రాష్ట్రీయ సంఘము, మీకు తెలుసా, అక్కడకు వెళ్ళవలసియున్నది. వారు విచారణ చేయవలెను, ఎందుకనగా నూతన భక్తిని గూర్చి చాలా ఆకలి గలిగియున్నది గనుక, ఏ మాత్రము తెలియని ఆ భక్తిని కనుగొనుటకు ఆమె యొక్క సొంత మతము యొద్ద వదిలి పెట్టవలసియున్నది.
ఆ అన్యమత ఆలయము యొక్క పరిశుద్ధ తండ్రి యొద్దకు ఆమె నడుచుకొనుచు వెళ్ళుటను నేను ఊహించగలుగుచున్నాను, "పరిశుద్దమైన తండ్రి, నేను కోరిక కలిగియున్నాను. ఇశ్రాయేలు దేశములో వారు ఒక్క గొప్ప దేవుని కలిగియున్నారు, ఆయన యొక్క ప్రజల ద్వారా తన్ను తాను వారికి తెలియపరచుకొనుచున్నాడు. వారు సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను జరిగించుచున్నారని" ఆమె చెప్పెను.
"ఇప్పుడు నా కుమార్తె, అదంతా ఏమి కాదు, అదంతా పరిశుద్ద గుండ్రాల్ల గుంపు, దానిని వినవద్దు. చూస్తున్నావా? ఇప్పుడు, ఒకవేళ అక్కడ ఏదైనా జరుగుచున్న అది మన యొక్క సొంత గుంపులో మాత్రమే జరుగవలెను. ఇక్కడ ఉన్న గొప్ప దేవతయైన దాగోను, ఇతర దేవతలను నీవు చూచుట లేదా? ఇక్కడ మనము కలిగియున్నా గొప్ప దేవుళ్ళను నీవు చూచుట లేదా," అని ఆ యాజకుడు చెప్పుట నేను వినగలుగుచున్నాను.
ఆ యౌవ్వన రాణి, కొన్ని నిముషాలు నడచింది.
61మీకు తెలుసా మనుష్య హృదయంతో దేవుడు ఏమైనా చేయబోవుచున్నట్లైతే, దాని నుంచి దూరంగా ఎవరైనా మాట్లాడుట అది చాలా కష్టముగా ఉంటుంది. "కానీ, చూడండి అయ్యగారు" అని ఆమె చెప్పింది. "అక్కడ వాస్తవమైన ఫలితాలు సంభవించుచున్నవని వారు నాతో చెప్పిరి. అక్కడ ఏదో జరుగుచున్నది, ఒక బాగా తెలిసిన వ్యక్తిని అటువంటి ఆతీతమైన జ్ఞానముతో మనుష్యుని పెదవులను దేవుడు ఉపయోగించుకొనుచున్నాడు. ఆయన యొక్క ప్రజల మధ్యలోనికి దేవుడు పంపిన శక్తి తెలుసుకొనుటకు కష్టముగా ఉన్నది. వారందరూ ఏక మనస్సుతో ఉన్నారు. దానిని నేను వెళ్ళి చూడవలెనని కోరుచున్నాను" అని అమె చెప్పింది.
"ఎందుకు" అని అతడు చెప్పెను, "ప్రియమైన దానా, ఈ సంఘాన్ని గనుక నీవు వదలి వెళ్ళిపోతే నీవు, నీవు ఉన్నతమైన స్థితిని దిగజార్చుకొంటావు. ఆ ఉజ్జీవమునకు నీవు హాజరు కాలేవు. కావున దానిని మేము ప్రోత్సహించము." కానీ, మీకు తెలుసా, ఎట్లాగైనా సరే, దేవుని కొరకు ఒక మానవ హృదయం ఆకలిగొంటూ వుంటే, ప్రోత్సహించిననూ, ప్రోత్సహించక పోయిననూ, నీవు వెళ్ళిపోతావు, ఎట్లాగైననూ, చూడండి, మనుష్య హృదయమును దేవుడు సందిస్తూ వుంటే, (నేను విమర్శగా చెప్పుచున్నట్లు మీరు భావించుట లేదని నేను ఆశించుచున్నాను. కానీ నేను ఒక సంగతిని తెలియపరచుచున్నాను. గమనిస్తున్నారా)…
62ఇప్పుడు గమనించండి. మొదటి కార్యము మీకు తెలుసా, ఎందుకు చూడండి, "ఇప్పుడు చూడండి. ఒక చిన్న బిడ్డగా నేను ప్రతిష్టంపబడినప్పటి నుండి, నేను ఇదే దేవాలయములో ఉన్నాను. నా తల్లి ఇక్కడే ప్రతిష్టింపబడినది. నా యొక్క అమ్మమ్మ ఇక్కడే ప్రతిష్టింపబడినది. ఆ దేవుని యొక్క శక్తిని గూర్చి మీరు నాకు మొత్తం చెప్పిరి. మీరు చదివిన మొత్తం పుస్తకాలన్నిటి గూర్చి నాతో చెప్పిరి. మరియు ఒక్క అడుగు కూడా ఆయన కదల్చలేదు. నేను మొత్తం చూశాను, ఒక పేపర్ మీద చదవడం అంతే. కేవలం చచ్చిన మత సిద్దాంతాల గుంపు. కానీ అక్కడ సజీవంగా ఏదో ఉన్నది అని వారు నాతో చెప్పుచున్నారు," అని ఆమె చెప్పినది. ఆమెన్. ఆ చిన్న రాణి యొక్క హృదయం ఆశీర్వదింపబడును గాక.
"నేను ఇక్కడ చెప్పిన క్రియలనే, నేను ఎరిగియున్నాను. సహజాతీతమైన కదలికను లేదా మరి దేనిని నేను చూడలేదు. ఖచ్చితముగా, మన తరములో ఎక్కడో ఒకచోట ఒక కదలిక ఉన్నది. కేవలం, ఒక చిన్న ఉద్రేకము, లోపలికి వచ్చి ఆరాధించుట, కానీ ఆయన ప్రజల మధ్యలో సజీవుడైన దేవుడు జీవించుచున్నాడని వారు నాతో చెప్పుచున్నారు; మరియు అదియే ఒక కట్టడ."
"ఇప్పుడు ఇలా చూడు, ప్రియమైనదానా, నీవు అక్కడకు వెళ్ళినట్లైతే గ్రంధములో నుండి నీ పేరు తీసివేయబడుతుంది. నేను నిన్ను వెలి వేయబోవుచున్నాను."
కానీ, అది ఆమెకు ఏ విధమైన భేదమును కలుగజేయలేదు. మీకు తెలుసా, ఆమె అనేకమైన అడ్డంకులను కలిగియున్నది, కానీ ఆమె యొక్క విశ్వాసము ఏ అడ్డంకులను కలిగిలేదు. నీ విశ్వాసమునకు ఏ అడ్డంకులు లేవు. అది ఎక్కడ ఉంచబడినప్పటికి, అది ఏమైననూ, నేను లెక్కచేయను, కాదని ఎవరు చెప్పినా సమస్యేలేదు. ఒకవేళ మానవ హృదయముతో దేవుడు సంబంధము కలిగియుండుటకు ప్రారంభిస్తే, అక్కడ నాఢిని కదిలించుట మొదలుపెడితే అది అది సత్యము, అని అది సత్యమై ఉన్నట్లు దాని కనుగొంటావు. యేసుక్రీస్తు నుండి నిన్ను దూరంగా ఉంచేది ఏదీ లేదు. నిజము, ఎట్లాగైననూ, నీవు వెళుతూ ఉంటావు.
63కావున అతడు ఎన్ని మత సిద్ధాంతములను కంఠస్తం చేసినప్పటికిని ఎంత మంచి విధ్యగల వాడైనప్పటికిని, విగ్రహానికి ముందు అతడు ఎంత సాగిల పడినప్పటికీ సమస్య లేదు, ఆమెకు కొంచెము కూడా తేడా కలుగజేయలేదు. ఆమె దేవుని కొరకు ఆకలిగలిగియున్నది. ఆమె కనుగొనాలని ఆశించినది. అయితే ఆమె తనంతట తాను కనుగొనేంత వరకు ఆమె తృప్తిచెందలేదు. ఆయన ఏమైయుండెనని, ఆమె లేఖనములలో చూచినది. కానీ, ఇప్పుడు, అది ఇప్పుడు పని చేయబోవుచున్నదా? అదియే తర్వాత సంగతి. నీవు దేనిగూర్చి అయినా మాట్లాడగలవు, కానీ అది పని చేస్తోందా? దాని గూర్చిన గణితశాస్త్రమంతా నీవు మాట్లాడగలవు; కానీ అది పని చేస్తోందా, అది తరువాత కార్యము.
ఇప్పుడు కనుగొందాం…
1KGS 10:2•
2CH 9:9•
MATT 12:42•
LUKE 11:31
64ఇప్పుడు వేరొక విషయము ఆమె కొన్ని సమస్యలను ఎదుర్కొన వలసియున్నది.
అక్కడకు వెళ్ళినట్లైతే, ఆమె ఆలోచించినది. గుర్తించుకోండి, ఆ ఎడారి అంతా ఇష్మాయేలీయులు పిల్లలతో నిండియున్నది. వారు నిలకడలేనివారు, దేశ దిమ్మర్లు, మరియు గజదొంగలు. ఆ దినాలలో ఆ ఎడారి అంతా గజదొంగలతో నిండియుండేది. మంచిది, ఆ చిన్న యవ్వన స్త్రీ ఈలాగు అనుకొన్నది: "అది సత్యమో కాదో నేను వెళ్ళి కనుగొనెదను. నేను ఒక అర్పణను తీసుకొని వెళ్తాను, మరియు అది నిజమైతే, దానిని నేను బలపరుస్తాను. ఒకవేళ అది నిజం కాకపోతే, నా అర్పణను తిరిగి వెనుకకు తెస్తాను." పెంతెకోస్తు ప్రజలు, తప్పని సరిగా ఆమె చెప్పేది విని తీరాలి. మిమ్మును ఆనందపరిచే వాటిని బలపరుస్తారా? మీ రేడియో కార్యక్రమములను ప్రక్కకు పెట్టండి, మీ సొంత ప్రజలకు సంభందించిన ప్రతీదీ ప్రక్కకు పెడుచున్నారా? సరే.
ఆమె కొంత ఇంగిత జ్ఞానమును కలిగియున్నది. "అది సత్యమే అని నేను కనుగొంటే, ప్రతీదీ నాకు యోగ్యమైనదే. కానీ అది సత్యము కాకపోతే అది సత్యము కాదని నేను తెలుసుకుంటాను. నేను వెళ్ళి, నా అంతట నేనే చూస్తాను. మరియు నేను తీసుకొని" అని ఆమె అనుకొన్నది. సాంబ్రాణి, బోళములను ఒంటెలపై నింపినది. మరియు బంగారము, వెండి, విలువగల సుగంధ ద్రవ్యములు, మరియు చాలా విలువ గల వసువులు. ఆమె ఒంటెల నిండా నింపినది. జ్ఞాపకముంచుకోండి, ఆమె ఎయిర్ కండీషన్ గల కాడిలాక్ కారులో వెళ్ళలేదు. సహారా ఎడారి, గుండా ఒంటె వీపుపై కూర్చొని వెళ్ళినది. ఈ తరములో ఆమె నిలువబడి, ఈ తరముపై నేరారోపణ చేయును, అని యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. మరియు ఇక్కడ ఉన్న కొద్ది మంది అదే కార్యములు జరుగుచున్నవని తెలుసుకొనగలుగుచున్నారు. వీధిని దాటుకొని వెళ్ళరు.
65పాలస్తీనా నుండి, యేరూషలేము నుండి ఆమె ఉన్న చోటికి ఎంతదూరమో కొలవండి. వారికి ఎంత కాలము తీసుకొనబడుతుందో మీకు తెలుసా? మూడు నెలలు మండుతూ వున్న వేడిగల ఎడారి గుండా, ఒంటె వీపు మీద, ఆమె ఏమి కలిగి యున్నది? కొద్దిమంది నంపుంసకులను, మరియు ఆమెతో పాటు స్త్రీ పరిచారకులను. బహుశా, ఆమె రాత్రివేళ ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. సహార ఎడారి యొక్క నిదానంగా పడుచున్న ఎండ చాలా భయంకరమైనది. ఆమె శరీరం అక్కడే కందిపోతుంది. మరియు అందుకే ఆమె రాత్రివేళ ప్రయాణం చేస్తున్నది.
కానీ మీకు తెలుసా, దానిని గూర్చి అక్కడ ఏదో ఉన్నది, దేవుని గూర్చి ఆకలి, దప్పులు నీకు ఉన్నట్లైతే, అపాయములకు గానీ, మరి దేనికైననూ, ఎక్కడైననూ, నీవు ఎటువంటి ఏకాగ్రతను వాటిపై చూపించవు. కేన్సర్ తో నీవు చనిపోతావు అని డాక్టర్ చెప్పువచ్చు, కానీ దేవుని యందలి విశ్వాసమును నీ హృదయం సంధిస్తూవుంటే, డాక్టర్ చెప్పిన దానిని నీవు మరచిపోతావు. నీ హృదయం విశ్వాసముతో నింపబడినంత కాలం, నీ హృదయానికి భయం ఉండదు.
HEB 13:8
66ఆమె వెళుతూ వుంది, రాత్రియే ప్రయాణం చేస్తూ ఉంది, పగలు లోపల ఉండి, ఆ గ్రంధపు చుట్టలను చదువుతూ ఉంది. "ఇప్పుడు యెహోవా ఏమైవున్నాడో, ఆయన ఏమై యుండెనో, ఆయన ఏమి వాగ్దానం చేసాడో, ఇంకా, ఆయన ఏమై యుండబోవుచున్నాడో, ఇప్పుడు తెలుసుకొందాము. ఈ వ్యక్తిలో ఆయన ఉన్నాడో, లేడో నేను కనుగొందును. మనుష్యులు ఏమైయున్నారో నేను ఎరుగుదును. దేవుడు ఏమైయున్నాడో నేను తెలుసుకొనబోవుచున్నానని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా ఆయన ఏమైయుండెనని నేను చదివియున్నాను."
ఈ రాత్రి ట్యూసాన్తో నన్ను ఇది చెప్పనివ్వండి. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అది నిజము. ఆయన మార్పులేనివాడు. ప్రజలు మారిపోతారు, కాలము మారిపోవును; కానీ మార్పులేని వర్తమానముతో, ఆయన మార్పులేని దేవుడు. మత సిద్దాంతములను బట్టి అది మార్చబడదు. మతశాఖ స్థానములను బట్టి అది మార్చబడజాలదు. పరిశుద్ధాత్మ ద్వారా, నూతన జన్మలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిగా, అది యున్నది. అదియే దేవునికి కావలసినది. తక్కువ లేదు, లేదా ఎక్కువ లేదు, కాని అదియే.
67చివరిగా, మనం కనుగొనుచున్నాము. ఆమె యొక్క సమస్యలన్నింటి ద్వారా ఆమె హృదయం, దాహము గొనుచున్నది. యెరూషలేము నగరమును ఆమె సమీపించుచుండగా, ఆమె యొక్క కన్నులు ప్రకాశవంతమగుటను, నేను చూడగలుగుచున్నాను. మరియు ఆమె గ్రంధపు చుట్టలను ప్రక్కకు పెట్టి రాజభవనపు ద్వారము నొద్ద, ఒక చోట, బయట శిబిరపు గుడారమును వేసినది, కూడికకు సిద్ధపడుచున్నది. ఇప్పుడు బహుశా, సాయంకాలపు సమయములో ఆమె వచ్చియున్నది.
మరుసటి ఉదయం, వేకువనే, సంఘకాపరి మాట్లాడబోవుచున్న సంఘమునకు ఆమె వెళ్ళినది. మరియు ఆమె సంఘానికి వచ్చినప్పుడు, జనులు వారి వారి స్థానములో కూర్చొనుట చూచినది, సంగీతము వాయించుట మొదలైనది, మరియు కొద్ది సమయం తరువాత, పాస్టర్ సొలోమోను నడచి వచ్చెను. సంఘానికి వెనుకనున్న కుర్చీలో ఆమె కూర్చొనియున్నది, కానీ ఏమి చెప్పబడుతుందో చూచుటకు, ఆమె ఉండుటకు ఇష్టపడినది.
2CH 9:2
68ఈ దినపు జనులవలె ఆమె లేదు, ఒక కాని విషయమును మీరు చెప్పవచ్చును. ఎవరో ఒకరు దానితో అంగీకరించరు, ఒక సెకను కూడా ఓర్పును కలిగియుండరు, చూశారా, ఆ కారణం చేతనే వారు ఇక్కడకు వచ్చిరి. కాని ఆమె తృప్తిపడగోరుచున్నది.
ఈనాటి ప్రజల వలె, "నేను అక్కడికి వెళతాను" అని ఆమె చెప్పుటకు రాలేదు. "నేను విశ్వసించిన దానికి విరుద్దముగా సువార్తికుడు వాక్యము చెబితే నేను లేచి బయటకు వెళ్ళిపోతాను." మంచిది, బహుశా, వారు దానినే చెయ్యవచ్చు, చూశారా, కానీ అది నీచముగా లేచిపోవుటను సూచిస్తుంది, మొదటిగా నీచమైన ప్రవర్తను అది కనుపరుస్తుంది. కానీ, ఎట్లాగైననూ, జనులు ఈ దినమున దానిని చేయుచున్నారు. కారణం, వారు దానిని చేయనవసరము లేదని అనుకొనుచున్నారు. వారు చేయరు. కానీ నీవు దేవునిని కలువవలసిన వాడవైయున్నావు. మరియు నీవు జవాబును ఇవ్వవలసిన వాడవైయున్నావు.
ఇప్పుడు ఈ స్త్రీ గూర్చి మనము తెలుసుకొనుచున్నాము, ఒక వర్తమానము నిమిత్తము ఆమె రాలేదు. అది తప్పో, ఒప్పో తెలునుకొనేంత వరకు (ఒప్పించబడేవరకు) ఆమె అక్కడే ఉండుటకు వచ్చి యున్నది. మరియు ఆమె స్థానము ఆమె తీసుకొనియున్నది, మరియు ఆమె ఎదురు చూసినది. అప్పుడు మొదటివాడు సొలోమోను ముందుకు వచ్చెను. ఆ వివేచనా జ్ఞానము ఖచ్చితముగా హృదయపు రహస్యములన్నింటినీ ఆ వ్యక్తితో చెప్పడం ఆమె గమనించినది. ఆమె హృదయం గంతులు వేయడం ప్రారంభించెను. అక్కడ నిజమైనది ఏదో ఉన్నట్లుగా ఆమె తెలుసుకొనెను, మరియు తర్వాత అతడు వచ్చెను, అదే కార్యము, అప్పుడు ఆమె తనంతట తానూ దాహంగొనుట ప్రారంభించెను.
1KGS 10:2,3,7,9•
2CH 9:2,5,7,8
69లేఖనములు మనకు చెప్పుచున్నవి, ఆమె చాలా సమస్యలను కలిగియుండెను, వాటిని గూర్చి తెలుసుకోగోరెను. చివరిగా, ఆమె వచ్చినది. బహుశా, ఆమె ఒక ప్రార్ధనా కార్డు కలిగియుండవచ్చు. బహుశా అది పిలవడాన్నిబట్టి, ఆమె నెంబరు పిలువబడియుండవచ్చును, (దానిని మనం కేవలము అనుకొందాము), కాని ఆమె సొలోమోను ముందుకు వచ్చినప్పుడు, ఎట్లాగైనా ఆమె సొలోమోను ముందుకు వచ్చెను, ఆమెకు బయలు పరుచుటకు సొలోమోనుకు తెలియనిది అంటూ ఏదీ లేదని బైబిల్ చెప్పుచున్నది. ఆమెకున్న సంగతులన్నీ, ఆమె హృదయంలో దాచబడినవన్నీ దేవుని ఆత్మ చేత సొలోమోను వాటిని ఆమెకు బయలుపరచెను. మరియు ఇది సంభవించుట ఆమె చూసినప్పుడు, ఆ చిన్న యవ్వన రాణిలో నుండి మొత్తం జీవం బయటకు వచ్చెను.
ఆ జనుల మధ్య ఆమె నిలువబడి, "ఇశ్రాయేలు యొక్క ప్రభువైన దేవుడు స్తుతింపబడును గాక! ఈ జ్ఞానమును కనుపరచి, ఆయన యొక్క రాజు మీద ఆయన యొక్క ఆత్మను ఉంచి, మరియు ఆయన యొక్క జనులుగా ఇశ్రాయేలును ఎన్నుకొనిన ప్రభువైన దేవుడు స్తుతింపబడును గాక!" అని చెప్పెను. "నీతో ఉండి ఈ గొప్ప వరమును చూచుచున్న మనుష్యులు ధన్యులు. నిన్ను చూచుటకు, నీవు ధన్యుడవు" అని చెప్పెను. ఇశ్రాయేలు దేశములో నుండి, కొంత మట్టిని కూడా ఆమె తన దేశమునకు తీసుకు వెళ్ళవలెనని ఆమె కోరినది. అది దేవుడే అని ఆమె పూర్తిగా ఒప్పించబడెను. "దానిని గూర్చి చెప్పబడినదంతా, విశ్వసించుటయా, లేదా అని నేను చాలా కష్టముగా తెలుసుకొని యుండలేదు. కానీ ఇప్పుడు అది ఇతరులపై పనిచేయుట నేను చూచితిని, మరియు ఇప్పుడు అది నాపై పనిచేసెను. అది నిజమే అని నేను ఎరుగుదును" అని ఆమె చెప్పెను.
MATT 12:42•
LUKE 11:31
70"తీర్పు దినమందు ఆమె లేచి, ఈ తరమును గద్దించును. ఇదిగో, సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు" అని యేసు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వివేచనా వరముతో కూడిన వ్యక్తి సొలోమోను. ఇప్పుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరములోని మొత్తం దైవీక వరములతో, ప్రత్యక్షపరచబడుచున్నాడు. సంఘానికి ఆయన వాగ్దానం చేసిన కార్యములన్నీ మనకు ప్రదర్శించబడుచుండెను. మనలో కొంతమంది కొంచెమే జాగ్రత్త వహిస్తారు. కొంతమంది అలా ఉంటారు…
మనం ముందుకు చూడవలెను. దేవుడు నీకు ఇచ్చిన అదే కార్యమును నీవు దాటిపోవునట్లు, సాతాను నిన్ను మరీ ముందుకు చూచునట్లు చేయును. దీనిని వినండి, "మనిషి ఎల్లప్పుడు దేవుడు చేసిన దాన్ని బట్టి దేవునిని స్తుతించును. ఆయన ఏమి చేయబోవుచున్నాడో దానిని చూచును. ఆయన ఇప్పుడు ఏమి చేయుచున్నాడో దానిని వదిలివేయుచున్నారు." అదియే మానవ జాతి యొక్క స్థితి. ఆయన ఎల్లప్పుడు దానినే చేసెను, ఈ రాత్రి అదే కార్యము జరుగుచున్నది. మనుష్యులు ముందుకు చూస్తారు, వెనక్కి చూస్తారు, మరియు ఇప్పుడు దేవుడు ఏమి చేయుచున్నాడో చూడండి; మరియు పెంతెకోస్తు దగ్గర గొప్పదేవుని గూర్చి మాట్లాడుకొనుట, ఆయన మరలా వచ్చినప్పుడు వెయ్యేండ్ల పాలనలో ఒక గొప్ప దినమును గూర్చి చూచుట మరియు ఆయన యొక్క జనుల సమక్షంలో ఆయన యొక్క ఉనికిని (ఆయననే) నిర్లక్ష్యం చేయుచూ, ఆ వెయ్యేండ్ల పాలనకు సిద్దపడుచున్నారు. దానిని వారు నిర్లక్ష్యం చేయుచున్నారు. దానిని చేయుట జనుల యొక్క స్వభావమే అది. వారి యొద్దకు దేవుడు పంపిన అవే కార్యముల నుండి వారి కన్నులను మూసి వేయుటకు వారి మధ్యలోనికి సాతాను వచ్చును. అతడు చేయవలసినదంతయు అదే. నీవు కోరినంతగా సంఘానికి వెళ్ళుచున్నావు. నీవు కోరినదంతా చేయుచున్నావు, కానీ మన యొద్దకు దేవుడు పంపిన ఆ నిజమైన దానినే నిర్లక్ష్యం చేయుచున్నావు, ఎందుకు, మనం తప్పిపోయాము.
MATT 23:29
71దానిని చెప్పునట్లు ఆ యవ్వన స్త్రీకి జరిగినది ఏమిటి? నిజమైన దానిని దేనినో ఆమె చూసెను. సిద్దాంతముల గుంపును, కాని దానిని ఏదో ఆమె చూసేను. ప్రత్యక్షపరచబడినది, అది నిజమైనదని దానిని ఆమె చూసెను. నా మట్టుకు, నిజమైనది అని నిరూపించబడినదేదైన అది నిజమైనది. పూర్తి లోకమంతయూ ఆసక్తి కలిగియుండవలెనని ఈ దినమున నేను అనుకొనుచున్నాను. అంత్యకాలములో మనము జీవించుచున్నామని మనము విశ్వసించినట్లైతే, ప్రభువైన యేసు రాకడ బహు సమీపమని మనము నమ్మినట్లైతే, మనము తప్పనిసరిగా ఈ దినమున జరుగుచున్న కార్యములలో ఆసక్తి కలిగియుండవలెను. దేవుని వాక్యముచేత దానిని తప్పని సరిగా పరీక్షింపవలెను, ఎందుకనగా మనము దానిని వెంటనే వదలివేయుదుము, అది గతించిపోవును మరియు ఎల్లప్పుడునూ అదే విధముగా ఉండును. దానిని గూర్చి ఏమియును మనము ఎరుగుట లేదు.
పరిశుద్దులు చనిపోయేటంత వరకూ వారిని గూర్చి జనులు ఏ మాత్రము ఎరుగలేదు. ప్రవక్తలు చనిపోయేటంత వరకు, ఆ ప్రవక్తలను వారు గుర్తించలేదు. "వేషదారులైన మీరు, ప్రవక్తల యొక్క సమాధులను ఏలాగున అలంకరించుచున్నారో, మరియు వాటిలో వారిని మీ తండ్రులే పెట్టిరి" అని యేసు చెప్పెను. పరిశుద్ద పాట్రిక్ చనిపోయంతవరకు వారు ఆయనను గుర్తించలేదు.
జోన్-ఆఫ్-ఆర్క్ ను పరిశుద్దురాలు అని వారు ఎపుడూ గుర్తించలేదు, కేథలిక్ సంఘము ఆమెను సజీవముగా ఒక కర్రకు కట్టి కాల్చివేసినది, మంత్రగత్తె అనే నెపముతో, ఆమె దర్శనములను చూచినది. మంత్రగత్తె అని ఆమెను పిలిచిరి. దయకొరకు అరుస్తుండగా, ఆ స్త్రీని కాల్చివేసిరి. రెండు వందల సంవత్సరాల తర్వాత వారు ఆమెను పరిశుద్ధురాలు అని కనుగొనిరి. బహుశా, వారు పరిహారమును చేసిరి. యూజకుల శరీరమును త్రవ్వితీసి, దానిని నదిలోనికి విసిరివేసిరి. "పరిహారము" నిశ్చయముగా, అది వారి తలలుపై నుండి వెడలిపోతుంది, మరియు వారు దానిని గుర్తెరుగుట లేదు. ఆయన యొక్క ఎన్నుకొనబడిన పిల్లలను బయటకు రప్పించుటకు, ఆయన వాక్యము ఆయన సన్నిధిని త్రోసివేసిన లోకము మీదకు గద్దింపును తెప్పించుటకు, దేవుడు అలాగుననే చేయును.
JOHN 4:19,29•
REV 21:27
72ఆ దినమున ఉన్న సేవకులను చూడండి, యేసుక్రీస్తులో దేవుని వరమును చూస్తూ "అది ఒక దయ్యము" అని చెప్పిరి. "మనము ఆయనను వినకూడదు. దానితో మన యాజకులు అంగీకరించుట లేదు" అని చెప్పిరి. ఈ రాత్రి వారు ఎక్కడ ఉన్నారు? ఆ పాత చెడ్డ పేరుగల యవ్వన స్త్రీని చూడండి. ఆమె హృదయంలో ముందుగా ఏర్పరచబడిన దేవుని యొక్క చిన్న విత్తనము మండుతూ వుంది. మరియు వెలుగు ప్రకాశించిన వెంటనే, "అయ్యా! నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. దీనిని చేయుటకు మెస్సీయ్యా వచ్చుచున్నాడని నేను ఎరుగుదును" అని ఆమె చెప్పినది. చూడండి, మొట్టమొదట కాంతి ప్రకాశించిన వెంటనే, ఆమె హృదయములో ముందుగా ఏర్పరచబడిన ఆ చిన్న విత్తనము. జగత్పునాధి వేయబడక మునుపే ఆమె పేరు గొర్రెపిల్ల జీవగ్రంధములో ఉంచబడినది. మరియు మీ పేరు కూడా అక్కడ ఉన్నట్లైతే, మీరు కూడా అంతే, చూశారా. అది నిజము.
ఆ ప్రకాశమైన వెలుగు అక్కడికి వచ్చిన వెంటనే… మెస్సీయా కొరకు వారు ఎదురు చూస్తున్న ఘడియ అదియేనని ఆమె గుర్తెరిగినది, మరియు అది జరుగుట ఆమె చూచినప్పుడు, ఆయన మెస్సీయాయేనని ఆమె చూసినది, అప్పుడు అసలు ఏ ప్రశ్న ఆమె ఆయనను అడుగలేదు. పట్టణంలోనికి ఆమె పరుగెత్తి పోయినది, "రండి, నేను చేసిన వాటిని నాతో చెప్పిన మనిషిని చూడండి. మెస్సీయా యొక్క సూచన అదియే కాదా?" అని ఆమె చెప్పినది. ఏదో నిజమైన దానిని ఆమె చూచినది. ఈ యవ్వన రాణి ఏదో నిజమైన దానిని చూచినది. అది జనుల యొక్క హృదయాన్ని మార్చును.
PS 42:7
73నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. మీరందరూ ఎరుగుదురు, వేటాడటం నేను ఇష్టపడతానని, తూర్పువైపున, ఆ పర్వతాలలో, ఇప్పుడు ముగిస్తూ వుండగా, నేను దీనిని చెవ్పగోరుచున్నాను. ఒక చిన్న సంఘటన జరిగెను. ఓ, సూర్యాస్తమయములను నేను ప్రేమిస్తాను, నేను ప్రకృతిని ప్రేమిస్తాను, ఆ పిలుపులను వినుటకు నేను ఇష్టపడతాను. ఆ తోడేళ్ళను మరియు అలాంటి వాటిని వారు చంపుదురు. వాటి యొక్క అరుపులను నేను వినుటకు ఇష్టపడతాను. దాని గూర్చి ఏదో ఉన్నది! దానిని నేను ప్రేమిస్తున్నాను. మరియు బయట ప్రాంతాలను నేను ఇష్టపడతాను, కరడు కరడును పిలుచుట. నాకు, అది దేవుడు. దేవదారు వృక్షముల యొక్క గుసగుసలు వినుట, పక్షులు యొక్క పిలుపులు వినుట. నాకైతే, దానిలో దేవుడు ఉన్నాడు.
ఇప్పుడు గమనించండి, బర్ట్ అనే వ్యక్తితో కలిసి నేను వేటకు వెళ్ళేవాడిని. అతడు ఒక మంచి వేటగాడు. అతని గూర్చి మీరు కలత చెందనవసరం లేదు. అతడు గురిచూసి కొట్టగలవాడు మరియు ఒక మంచి వేటగాడు. మరియు అతడు తప్పిపోవునెమోనని మీరు బాధపడనవసరం లేదు. అతడు ఎక్కడ ఉన్నాడో అతడు ఎరిగియున్నాడు.
74ఒక సంవత్సరం క్రితం, అతనితో వేటాడుటకు నేను ఆలస్యంగా వెళ్ళాను. బర్ట్ నందు ఒకే ఒక తప్పును నేను కనుగొన్నాను. అతడు ఒక మంచి వేటగాడు, కానీ నా జీవితంలో నేను కలుసుకొన్న ఒక నీచమైన వ్యక్తి, బల్లిలాంటి కన్నులుగలవాడు, అవి ఏటవాలుగా ఉన్న కన్నులువలె ఉంటాయి, ఈ రోజులలో కొంత మంది స్త్రీలు పిల్లి కన్నులవలె, వారి కన్నులకు రంగులు పూస్తున్నారు, మీకు తెలుసు. అటువంటి కన్నులు చూచుటకు వింత గొలిపే కన్నులు, అతడు చాలా క్రూరముగా ఉండేవాడు. నేను బాధపడనట్లుగా అతడు చిన్న, చిన్న జింకలను కాల్చి చంపేవాడు. "అయ్యో, భోధకులైన మీరు కోడిపిల్లల వంటి హృదయం గల గుంపు" అని నాతో చెప్పేవాడు. చూశారా.
మరియు నేను చెప్పాను, "బర్ట్, చట్టము చిన్న చిన్న జింక పిల్లలను మీరు చంపవచ్చు అని చెబితే, అది సరే సరి, కారణము చట్టము దానిని మీరు చేయవచ్చు అని చెబితే, ఒక జంతువు యొక్క పరిమాణం గానీ ఆడ - మగ అనేది గానీ సమస్య కాదు" అని నేను చెప్పాను, చూశారా. "గొర్రెపిల్లను చంపడం గూర్చి ఏమీ లేదు. అబ్రాహాము గొర్రెపిల్లను చంపాడు. దేవునికి దానిని వడ్డించాడు. అది నిజము" అని చెప్పాను. "ఒక చిన్న జింకపిల్లను చంపడం ఏమి కాదు. కానీ, బర్ట్, తమాషా కొరకు నీవు దానిని చేయుచున్నావు, నీవు ఒక దానిని కాల్చుచున్నావు, వేరొక దానిని కాల్చుచున్నావు, ఇంకొక దానిని కాల్చి చంపుచున్నావు. అది నీచమైన పని. అలా చేయుట సరికాదు. అది హత్య" అని నేను చెప్పాను.
"అహ్, బిల్లీ, నీ పని నీవు చూసుకో. మిగతా భోధకులవలె నీవు కోడిపిల్లల వంటి హృదయం గలవాడవు" అని అతడు చెప్పాడు ఓహ్! అతడు కఠినమైనవాడు.
75కానీ, నేను అక్కడకు వెళ్ళిన దినమున, నా భార్య నాతో కూడ ఉండెను. మేము చిన్న పూరి గుడిసెలోనికి వెళ్ళితిమి, అక్కడ బసలాంటిది, మరియు కొంత మంది స్త్రీలు కూడా సిద్దపడిరి. బర్ట్ మరియు నేను ఆ ఉదయకాలమున వెళ్ళితిమి. ధర్మాస్ బాటిల్ నిండుగా వేడి వేడి చాకోలెట్ మరియు సాండ్-విచ్లను మేము ఎల్లప్పుడూ తీసుకొని వెళ్ళేవారము. మధ్యాహ్నము వరకు మేము వేటాడేవారము, అప్పుడు మేము వేరుపడి, ప్రెసిడెన్సియల్ రేంజి, విల్సన్ పర్వతము, మౌంట్ ఆడమ్ పర్వతము, మొదలగు ప్రదేశాలకు వెళ్ళేవారము. మేము వేరుపడి, తిరిగివచ్చి, ఆ రాత్రి ఆ శిభిరములో కలుసుకొనేవారము. తెల్ల-తోక దుప్పిని వేటాడితిమి, నిజముగా చక్కటి దుప్పి.
కనుక మేము ఆ సంవత్సరము, అతడు నాతో చెప్పినాడు, ఆ ఉదయకాలమున మేము వెళ్ళేటపుడు, "హే, బిల్లీ నీకు ఆశ్చర్యము గొలిపే దానిని నేను కలిగియున్నాను. ఈ సంవత్సరము వాటిని పొందుతాను" అని చెప్పాడు.
"ఏమిటది, బర్ట్?" అని నేను అడిగినప్పుడు అతని జేబులోనికి పెట్టి అతడు తయారు చేసిన ఒక చిన్న ఈలను బయటకు తీసాడు. ఒక చిన్న జింక పిల్ల తన తల్లి కొరకు పిలుస్తున్నట్లుగా అది శబ్దము చేయును. మీకు తెలుసా, ఆ చిన్న"వీ" అనే శబ్దము చేసి, ఆ చిన్న జింకపిల్ల పిలచును.
"బర్ట్ అటువంటి దానిని నీవు ఉపయోగించవద్దు" అని చెప్పాను.
"అహ్, నీవు అక్కడే ఉన్నావు. నీవు ఇంకా కోడిపిల్లల వంటి హృదయాన్ని కలిగియున్నావు. అవును కదా?" అని అన్నాడు.
ఆలాగు మేము వెళ్ళితిమి.
76ఆ ఋతువులో అది ఆలస్యమైనట్లుగా ఉండెను. ఆ తెల్ల తోక జింక, అవి గురి చూడబడినప్పుడు, కొన్నిసారు, ఓ, మై! అవి దాగుగొనుట గూర్చి మీరు మాట్లాడుతూ ఉంటారు. హౌడిని (ప్రముఖ గారడివాడు, తప్పించుకొను విద్యలో నైపుణ్యత్య కలవాడు), అతడిని కూడా అవి మించిపోవును. కనుక అవి ఎట్లా దాగుకొనగలవో! అప్పుడు పదకొండు గంటలు అయ్యే వరకు మేము వెళ్ళేవారము, నేల మీద సుమారు ఆరు అంగుళాల మంచు ఉండేది. దారి కూడా కనబడేది కాదు. అవి చక్కగా దాగుకొనేవి. కావున సుమారు పదకొండు, పన్నెండు గంటల పాటు అక్కడ మంచు దిబ్బ ఉండేది, మరియు ఇక్కడ ఉన్నగది అంత పరిమాణంలో విశాలమైన స్థలము ఉండేది. బర్ట్ నాకు ముందుగా ఉండేవాడు.
అతడు ఈ విధముగా వంగేవాడు, తిరిగి వెనుకకు వచ్చేవాడు. మేము మా శాండ్-విచ్ ను తినేవారము, మరియు మేము వేరైపోయి. శిబిరానికి తిరిగి వెళ్ళి, రాత్రికి చేరే వారము. అతడు వెనుకకు వెళుచున్నట్లుగా కనబడ్డాడు. అతని యొక్క సీసా తెచ్చుకొనుటకు వెళుచున్నాడేమో అని నేను అనుకున్నాను, మీకు తెలుసు, అతని యొక్క వేడి చాకోలేట్, కనుక, నాదీ కూడా తీసుకొనుటకు నేను తిరిగి వెళ్ళాను. మరియు నేను వెళ్ళినప్పుడు, అతడు ఈ చిన్న ఈలతో బయటకు వచ్చాడు.
77అతడు బల్లి కన్నులతో నన్ను చూశాడు, మీకు తెలుసా, అతని నోటిలో ఆ చిన్న ఈలను పెట్టుకొని, ఆ విధముగా అతడు దానిని ఊదాడు. ఒక చిన్న జింక పిల్లవలె లేదా తన తల్లి కొరకు ఒక చిన్న పిల్ల పిలుస్తున్నట్లుగా.
అడ్డముగా, ఒక పెద్ద తల్లి జింక, ఆడ జింక, నిలబడింది. అది తల్లి జింక, అది దుముకినది. ఆ చిన్న పిల్ల పిలుపును అది వినేది. ఆ విధముగా అతడు నన్ను చూచుటను నేను చూసాను, మరియు అతడు పళ్ళు ఇకిలించాడు. "బర్ట్, నీవు అలా చేయకూడదు, ఖచ్చితముగా చేయకు" అని అనుకొన్నాను. అతడు బాతు వలె తలను వంచుకొనేవాడు. అతడు మరలా ఊదేవాడు. దాని యొక్క పెద్ద చెవులను, కపిల వర్ణముతో ఉన్న ఆ పెద్ద కన్నులను నేను చూసాను. అది నిదానంగా విశాల ప్రదేశముల లోనికి నడచి వచ్చెను. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ సమయమున, ఒక జింక అలా చేయడం చాలా వింత, అదీ వేటాడే సమయములో, ఆ విధముగా బయటకు నడచి వచ్చుట. కానీ ఒక పచ్చిక బయలు, విశాల స్థలములోనికి నడిచి వచ్చినది, అలా చేయడం దానికి చాలా అసాధారణం.
కానీ అది అలా ఎందుకు చేసింది? అది ఒక తల్లి, నిజముగా అది ఒక తల్లిగా జన్మించెను. మరియు తన చిన్న బిడ్డ యొక్క పిలుపు, అపాయం గూర్చి అది ఆలోచించలేదు. తన చిన్న బిడ్డను గూర్చియే అది ఆలోచించినది. అది ఒక్కసారిగా తిరుగుటను నేను చూసితిని. బర్ట్ 30.60 తుపాకి గురిపెట్టి నొక్కుట నేను విన్నాను. మరియు అతడు మరణకరమైన గురి. అతడు లేచి నేను చూచితిని. ఆ తుపాకి వాలును ప్రక్కకు తిప్పి దీనమైన హృదయం పైకి ఎక్కుపెట్టుట.
"బర్ట్! దానిని నీవు ఎలా చేయగలుగుచున్నావు? ఎలా చేయగలుగుచున్నావు? ఖచ్చితముగా దానిని చేయకూడదు" అని నేను అనుకొన్నాను. "ఆ తల్లి తన చిన్న బిడ్డను తీసుకొనుటకు బయటకు నడచి వస్తుంది. అప్పుడు దాని దీనమైన ఆ గుండెను నీవు కాల్చి వేయబోవుచున్నావు. దానిని ఎలా చేయగలుగుచున్నావు, బర్ట్? మరియు నేను అక్కడ నిలబడితిని. నిశ్శబ్దముగా తను నిలబడి ఆ తుఫాకిని గురి పెట్టుటను నేను చూస్తున్నాను.
78"ఓ! మై! నేను దానిని చూడలేను" అని అనుకొన్నాను. "ఆ తల్లి, అది సహాయం చేసుకొనలేదు." అది తెలివిగా ప్రవర్తించుట లేదు. అది ఒక ప్రదర్శనకు ఉంచబడినది కాదు. అది ఒక తల్లి, ఆమెతో, దాని యొక్క భాగము, దానిలోనే, అది ఒక తల్లి, సమస్యలో ఉన్న ఒక చిన్న బిడ్డ యొక్క పిలుపు, ఆ బిడ్డ కొరకు ఆ తల్లి వెదుకుచున్నది.
ఆ బోల్టు పడినప్పుడు, ఆ జింక వెనుదిరిగి, ఆ వేట గానిని చూచెను, కారణం అతడు పైకి లేచెను. అది దానిని ఎంత మాత్రము ఉద్రేక పరచలేదు. అది చనిపోవుటకు, సిద్ధపడినది. అది… ఓ, జనులు అలాగున ఉండగలిగినట్లైతే, నా తలను నేను త్రిప్పితిని. అతడు దానిని కాల్చుటను నేను చూడలేకపోతిని. నా తలను వెనుకకు త్రిప్పివేసితిని, మరియు నిస్సబ్దముగా, ప్రార్ధించుట ప్రారంభించితిని, ఎందుకనగా అది పారిపోయేటట్లు నేను ప్రయత్నం చేస్తే అతడు నాపై కోపపడి అరుస్తాడని నేను ఎరుగుదును. ఆ విధముగా నేను నా తలను త్రిప్పి, "తండ్రివైన దేవా, దానికి సహాయం చేయండి, దానికి సహాయం చేయండి. వద్దు - ఆ తల్లిని అతడు చంపనీయవద్దు, తన బిడ్డ కొరకు వెదుకుచుండగా, ఆ విధముగా అది అరచుచున్నది. వద్దు - దానిని అతడు చంపనీయవద్దు" అని చెప్పితిని. ఈ విధముగా, నేను వెనుదిరిగి, నేను గమనించితిని.
79ఆ తుపాకీ పనిచేయక పోవుటను, నేను వినుచున్నాను. ఏ క్షణమైనా ఆ తుఫాకీ పని చేయక పోవడం అంటూ ఏమిలేదు. నేను ఎదురుచూచితిని. మరియు చూచుటకు నేను చుట్టూ తిరిగినప్పుడు, అతడు ఈ విధంగా పట్టుకొని యున్నాడు. తుపాకీ ఇలా అయిపోవుటను నేను చూచితిని. అతడు వెనుతిరిగి, నావైపు చూసి, ఆ క్రూరమైన చూపుగల బల్లి కన్నులలో నుండి, అతని చెంపల మీదగా కన్నీరు కారుచుండెను. అతడు నేల పైకి తుపాకీని విసిరి వేసాడు. అకస్మాత్తుగా నా కాళ్ళను చుట్టూ గట్టిగా పట్టుకొని "బిల్లీ! నీవు ఎరిగిన యేసు నొద్దకు నన్ను నడిపింపుము," అని చెప్పాడు. అక్కడే ఆ మంచు మీద, ఆ క్రూరమైన వేటగానిని యేసు నొద్దకు నేను నడిపించితిని. ఇప్పుడు అక్కడ ఉన్న బాప్టిస్ట్ సంఘములో అతడు ఒక సంఘ పెద్ద.
ఎందుకు? అది ఏమిటి? అది బోధించుట కాదు. అది అతడు వినుచున్న పాటలు కాదు. కానీ అతడు అక్కడ ఉంచబడలేని దానిని చూసాడు. ముందు పెట్టలేని దానిని. నిజమైనదేదో దానిని చూసాడు. వారు నిశ్శబ్దముగా ఉన్నట్లైతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి." మరణపు నీడలో ఉన్న వ్యక్తిని అక్కడ ఎక్కడో అతడు చూశాడు. మరణపు నీడలో ఉన్నప్పటికీ, అక్కడకు పంపబడ్డ తల్లి జింక ప్రేమను చూసాడు. తన చిన్న జింక పిల్ల పిలుపులోవున్న ప్రేమను బట్టి, అ తల్లి జింక మరణముఖము దగ్గరకు వెళ్ళిన ఆ ప్రేమచేత, అది మరణానికి కూడా భయపడుటలేదు. ఆ విధమైన ప్రేమను దయచేసిన దేవుడు అక్కడ ఉన్నట్లైతే, ఆ దేవున్ని అతడు తెలుసుకొనగోరెను. అదే దినమున అతడు కనుగొనెను.
ISA 49:15,16•
MATT 12:42•
LUKE 11:31
80స్నేహితులారా, సాలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒకసారి యేసు చెప్పెను — అది పరిశుద్ధ గ్రంధంలో వ్రాయబడినది, "చనుపాలు త్రాగుచున్న తన బిడ్డను ఒక తల్లి మరచునా?" అని చెప్పెను. "ఆమె అలా చేయవచ్చెనేమో, కానీ నేను నిన్ను మరువలేను. నా అరచేతులలో మీ పేరు చెక్కియున్నాను" అని చెప్పాడు. అవి ఆయన చేతులలో చేతి గోరుచే ముద్రించబడ్డాయి. మనము ఎదురు చూచుచున్నాము. ఖచ్చితముగా, పురుషులు, స్త్రీలు ఆయనలో విశ్వాసముంచుచున్నారు. నిజమైన దానిని చూచుటకు ఎదురు చూచుచున్నారు. ఆ తల్లి జింకవలె అంత మంచి క్రైస్తవునిగా ఉండుటకు ఈ రాత్రి మీరు ఇష్టపడుట లేదా? చూస్తున్నారా? ఆమె ఒక కృత్రిమమైన తల్లి కానే కాదు. ఆమె ఒక తల్లిగా పుట్టినది. ఆమెలో ఏదో ఉన్నది, కావున ఆమె భయపడుటలేదు, ఎందుకనగా అదియే ఆమెను బయటకు పిలిచినది. ఆ తల్లి వలె, కేవలం అంత మంచి క్రైస్తవులుగా మనం ఉండగలిగితే! ఆ అనుభవము కలిగియుండవలెనని ఎంత మంది ఇష్టపడుచున్నారు.
"దేవా నన్ను సిద్దపరుచుము, దేనినైనా సరే ఎదుర్కొనుటకు, నాకున్న దేవుని ప్రేమను కనుపరచుటకు యేసుక్రీస్తు నొద్దకు, నమకముతో నడుచుటకు, నన్ను సిద్ధపరచుము. నా జనులు నన్ను వదలివేసినా, ప్రతి ఒక్కరూ నన్ను పాత నాగరికతవాడు అని పిలచినా, లేదా వారు ఏమి చేసినా, నా హృదయంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆ తల్లి తన మాతృత్వమును సద్భక్తితో కనబరచునట్లుగా, నన్నునూ కనబరచనిమ్ము." మీ హృదయములో దానిని మీరు కోరుచున్నారా? ఇప్పుడు మీ తలలు వంచండి మనము ప్రార్ధించుకొందాము.
ISA 53:5•
MATT 12:42•
LUKE 11:31
81పరలోకపు తండ్రి, సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ దినమున ఆ తల్లి జింక యొక్క ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఇక్కడ ఉన్నది. ఏ క్షణమందైనా దాని గుండె దానిలో నుండి పేలిపోవునని, అది ఎరిగినప్పుడు ఆ వేట గానిని, ఆ తుపాకిని ఎదుర్కొనుటకు ఎట్లా సిద్ధపడినదో, కానీ, ఓ దేవా, ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ లేదా ఒక జంతువు కూడా ఆ ప్రేమ కనబరుచుటకు సిద్ధపడియున్నది. తండ్రి, అటువంటి ప్రేమను, ఇంత కంటె గొప్పదైన ప్రేమను, ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతీ వ్యక్తి స్వీకరించుదురు గాక! అని నేను ప్రార్ధించుచున్నాను. వారి రక్షకునిగా యేసును అంగీకరించుటకు సిగ్గుపడకుందురు గాక! వారి నిమిత్తం ఆయన ఏమైతే చేస్తాడో దాని కొరకు వారు సిగ్గుపడకుందురు గాక! ప్రభువుగాను, రక్షకునిగాను వారు ఆయనను ఒప్పుకొనుటకు ఎప్పుడూ సిగ్గుపడ కుందురు గాక! "ఆయన దెబ్బలచేత మనము స్వస్థత పొందితిమి," అని వ్రాయబడినది గనుక వారు ఆయనను వారి యొక్క స్వస్థపరచువానిగా అంగీకరించుటకు ఎప్పుడునూ సిగ్గుపడకుందురు గాక!
దేవా, ఈ రాత్రి మీరు వచ్చి, అటువంటి వాస్తవమును మాకు కనబరచుము, మా మధ్యలో దేవుని యొక్క ఉనికి (సన్నిధిని) మేము చూచుదుము గాక, ఆ విధముగా సిలువ వేయబడిన ప్రభువు మృతులలో నుండి, లేచి మా మధ్యలో నిలబడిన యేసుక్రీస్తును ఎరుగుదుము. తండ్రి, నేను నమ్ముచున్నాను, ఈ రాత్రి జనుల ముందు దానిని మరొక సారి నీవు చేసి సొలోమోను కలిగియున్న దాని కంటే గొప్ప వరములో నీవు జీవించుచున్నావని నిన్ను నీవే కనబరుచుకొన్నట్లైతే! అది సంఘానికి పరిశుద్ధాత్మ యొక్క వరమై యున్నది. ఇక్కడ ఉన్న పురుషులు, స్త్రీలు, తండ్రీ నీ యొద్దకు ఆకర్షింపబడుదురు. ఆ తెల్లటి పర్వతములలో ఆ నవంబరు దినపు చిన్న వేటకు సంబంధించిన, పరిశుద్ధ గ్రంధములో ఈ సాధారణ చిన్న కధతో ఇప్పుడు దీనినంతయు నీకు ఆధీనము చేయుచున్నాను. అదంతయు ఇప్పుడు నీది, తండ్రీ, ఇక్కడ నుండి మీరు తీసుకొనండి. నన్ను నేనే, మరియు ఈ గుంపును నీకు సమర్పించుచున్నాను. యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
JOHN 14:12
82ఇప్పుడు క్రైస్తవ స్నేహితులారా, ఈ రాత్రి ఆయన మన మధ్యకు వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రేమను మీకు కనపరచినట్లైతో ఆయన ఇక్కడ ఉన్నట్లుగా ఋజువు చేస్తే, అది ఆయనే ఇప్పుడు. మనము చెప్పుకొన్నట్లు దానిని ఎవరైనా ఎరుగుదురు. అది యేసు అని మీరు ఎట్లా ఎరుగుదురు? చూశారా, దానిని మీరు ఎట్లా తెలుసుకొంటారు? నిశ్చయమైన చెట్టు, రావిచెట్టువలె కనిపించే చెట్టు, దొండ పండ్లలాంటి పండ్లను ఫలించినచో అది ఎటువంటి చెట్టెవుంటుంది. అది దొండ పండ్లను ఫలించే చెట్టు, అందులో ఉన్న జీవం దొండపండ్లను ఫలించును. మరియు ఒకవేళ నీవు క్రైస్తవుడైనటైన, యేసుక్రీస్తులోని జీవము నీలో ఉన్నది, ఎందుకనగా అది పరిశుద్ధాత్మ నీవు నమ్ముచున్నావా? అప్పుడు పరిశుద్ధాత్మ…
ఈ రాత్రి జాన్ డిల్లింజర్ యొక్క ఆత్మనాలో ఉన్నదని నేను మీతో చెబితే, అతనివలె తుపాకులు కలిగియున్నట్ను నేను గజదొంగనై యున్నట్లు మీరు నన్ను గూర్చి భావించవచ్చు. ఒక గొప్ప కళాకారుని ఆత్మ నాలో ఉన్నదని నేను మీతో చెబితే, ఇక్కడ ఉన్న ఈ పర్వతములను ఏలాగున్నవో అలాగే గీయగలనని మీరు నన్ను గూర్చి భావించవచ్చు, ఎందుకనగా ఆ కళాకారుని ఆత్మ నాలో ఉన్నది గనుక, మరియు క్రీస్తు ఆత్మ నాలో ఉన్నదని నేను మీతో చెబితే, మీరు క్రీస్తు యొక్క క్రియలను చేయుదురు అని ఆయన చెప్పెను. తానే "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములు అతడు కూడా చేయును; ఇంత కంటే గొప్పక్రియలు చేయును" అని పరిశుద్ధ యోహాను 14:12లో చెప్పెను.
దానిని నేను ఒకసారి చెప్పియున్నాను. "ఖచ్చితముగా, మేము గొప్ప క్రియలను చేయుచున్నాము. సర్వలోకానికి సువార్త ప్రకటించుచున్నాము. ఆయన దినమందున ఆయన దానిని చేయలేదు" అని ఆ వ్యక్తి చెప్పెను.
"మొదటిగా, ఆయన చేసిన క్రియలను నాకు చూపండి. మరియు ఆ గొప్ప క్రియలను గూర్చి అప్పుడు మనం మాట్లాడుకొందుము" అని నేను చెప్పాను. ప్రపంచంలో తొంబది శాతం మంది యేసుక్రీస్తును గూర్చి ఏమి ఎరుగరు. ఆయన నామమున గూర్చి వినకుండా, ప్రతీ సంవత్సరం అనేక లక్షల మంది చనిపోవుచున్నారు. ఇది ఇంతకు ముందు ఉన్న దానికంటే ఈ దినమున అతి తక్కువ సువార్త ఉన్నది. గొప్ప క్రియలను గురించి వారు మాట్లాడుట మీరు విందురు, సువార్తను ప్రకటించుట గూర్చి నిశ్చయముగా కాదు.
83అక్కడ ప్రార్ధనా కార్డులు ఉన్నవి, అవి ఈ రోజు ఇవ్వబడినవని నేను అనుకొనుచున్నాను. ప్రార్ధనా కార్డులు వారు ఇచ్చిరని నేను అనుకొనుచున్నాను. సరేనా, బిల్లీ? ఇక్కడ లేడా? అతడు బయటకు వెళ్ళి యుండ వచ్చును. మంచిది, నిన్నటి నుండి ఎవరైనా ప్రార్ధనా కార్డులు కలిగియున్నారా? మీ చేతులు ఎత్తండి, కొంత మంది మీకు ఇచ్చారు, మీరు పొందారు, మంచిది, వాటితో మనము ప్రారంభిద్దాము. చూద్దాం, ఎక్కడ ప్రారంభించాము? నంబర్ ఒకటి, కదా? నిన్నటి దినమున ఎక్కడ నుండి ప్రారంభించాము? నంబర్ ఒకటి నుండి పది లేదా పదిహేను వరకు? సరే. దానిని మార్చుదాం, ఇంకొక చోట నుండి, ప్రారంభిద్దాము. వారిలో ప్రతి ఒక్కరిని చేరుటకు మేము కోరుచున్నాము కానీ మనం మార్చుదాం, వేరొక చోట నుండి, వాటిలో చివరి పదిహేను తీసుకొందాం. ఎనుబది-ఐదు నుండి వంద వరకు. కార్డు ఎనుబది-ఐదును ఎవరు కలిగియున్నారు? మీ చేయి పైకెత్తండి.
ఆగండి. అక్కడ రెండు ఎనబై-ఐదులు ఉండవచ్చు. వాటిలో మొదటిది ఏది? ఎ, అది కాదా ? ఎ ఎ, ఎనభై-ఐదు ఎ, ఎనభై-ఐదు మీ చేయి ఎత్తండి ప్రార్ధనా కార్డు ఎ, ఎనభై-ఐదు ఇక్కడ ఉన్నదా? సరే. ఇక్కడకు రండి. ఎనభై-ఆరు, మీ చేయి ఎత్తండి. ఎనభై-ఏడు. ఇప్పుడు, మీరు పైకి లేవలేకపోతే, మేము చూస్తాము. మీ _సంఖ్య పిలవబడినప్పుడు ద్వార పాలకులు మిమ్ములను పైకి తీసుకొని వచ్చెదరు. ఎనభై-ఏడు, ఎనభై-ఎనిమిది, ఎనభై-తొమ్మిది, తొంబై చూద్దాం. ఇప్పుడు అక్కడ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు ఉండును. తొంబై-ఒకటి, - రెండు, -మూడు, - నాలుగు,- ఐదు. వంద వరకు ఇక్కడ ఈ వైపున నిలబడండి. అక్కడ అందరూ లేకపోతే, కార్డు కలిగిన వారు, ఇప్పుడు, మీ కార్డు పట్టుకొని యుండండి. తర్వాత తర్వాత నేను మిమ్ములను పిలుస్తాను.
MATT 8:8-10•
MARK 5:23
84ఇప్పుడు, మీరు చూస్తూ ఉండగా, ఇప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పునది ఏకాగ్రతతో జాగ్రత్తగా వినవలెనని నేను కోరుచున్నాము. మీ ప్రార్ధనా కార్డుతో చేసేది శూన్యము, కేవలం లైనులో ఉంచుటకే. మీరు స్వస్థపడబోవుచున్నారని దాని అర్థం కాదు. మీరు కేవలం స్వస్థపడేది, ప్రార్ధనా కార్డు ద్వారా కాదు, కేవలం విశ్వాసం ద్వారా, అది నిజము. ఇక్కడ వేదిక మీద స్వస్థపడిన దానికంటే సభలో ఉన్నవారే పదిమందిలో ఒకరు స్వస్థపడుచున్నారని కూడికలలో ఎంత మంది తెలుసుకొనుచున్నారు? ఖచ్చితముగా, అది మీ యొక్క విశ్వాసము. మీ విశ్వాసము. ప్రార్ధనా వరుస ప్రారంభించబడినది అంతే, ప్రార్ధనా వరుసలోనికి రండి.
ఇప్పుడు చూడండి, ప్రతీ ఒక్కరూ ఈ ఆచారమును బోధిస్తారు. మరియు నా సహోదరులతో చెప్పుచున్నాను. అది సరియే అది లేఖనమైయున్నది. కానీ ఒకరి మీద ఒకరు చేతులు ఉంచవలెనని మనం కోరుచున్నాము. దానిని గమనించారా? కాని అది అన్యులకు ఇవ్వబడలేదు. అది అన్యులు అంగీకరించిన విధానం కనుక. యూదులు, జ్ఞాపకముంచుకోండి, "వచ్చి నా కుమార్తె మీద నీ చేతులు ఉంచుము, ఆమె జీవించును" అని యాయీరు చెప్పెను. అది యూదుల ఆచారం. అది సరియేనా? "నా కుమార్తెపై చేతులు ఉంచుము, ఆమె బ్రదుకును."
కానీ ఆ అన్యుడు అన్నాడు ,"నా ఇంటికి నీవు వచ్చుటకు నేనెంతమాత్రము యోగ్యుడను కాను, కేవలము మాట మాత్రము సెలవిమ్ము అంతే, నా సేవకుడు బ్రతుకును."
యేసు చుట్టూ తిరిగి "ఇశ్రాయేలులో నేను ఎప్పుడూ ఇటువంటి విశ్వాసమును చూడలేదు" అని చెప్పెను.
"నేను అధికారము క్రింద ఉన్న ఒక వ్యక్తిని, నేను గనుక" అని అతడు చెప్పాడు. మరియు అతడు ఏమి గ్రహించాడు? ప్రతీ రోగము యేసుక్రీస్తు యొక్క అధికారము క్రింద ఉన్నది. ఆయన చేసేది అంతా మాట మాత్రము సెలవిచ్చుట. ఆయన ఇప్పటికే దానిని పలికాడు, చూశారా. దానినే మీరు గుర్తించవలెనని నేను ప్రయత్నం చేయుచున్నాను.
85ఓ, సహోదరుడు ఆస్బోర్న లాంటి ఒక గొప్ప సువార్తికుడు వచ్చేటంత వరకు ఎదురుచూడవలెనని చాలా మంది అనుకొంటారు. సహో, ఆస్బోర్న ఒక గొప్ప సువార్తికుడు. సహో, ఓరల్ రాబర్ట్స్ వేరొక గొప్ప సువార్తికుడు, సహో, టోమిహిక్స్ వీరిలో చాలా మంది ఈనాడు దేశములో ఉన్న గొప్ప సువార్తీకులు. స్వస్థపడుటకు అటువంటివారు వచ్చేటంత వరకు ఎదురు చూడవలెనని మీరు అనుకొనుచున్నారు. అలా ఉండకూడదు, అలా కాదు. వారందరి కన్నా అదే క్రియ చేసే అధికారమును మీ యొక్క సంఘకాపరే కలిగియున్నాడు. అవునయ్యా!
మన మధ్యలో గొప్పవారంటూ ఎవరూ లేరు. అలా ఉంటే గనుక, అప్పుడు ఆ వ్యక్తి తనకు తానే సహవాసము నుండి ప్రత్యేక ఏర్పాటును కలిగి యుంటాడు. "క్రీస్తు యేసులో మన మందరము ఒక్కటే." అది నిజము. మనము ఒక్కటే. మన మధ్యలో గొప్ప వారు లేరు. మీరు గొప్పవారు అయినప్పుడు, మీరు దేవుని నుండి దూరంగా మీకు మీరే బయటకు వెళ్ళిపోతారు. మనం అలా కాదు. మరియు మీ సంఘకాపరి లేకపోతే, కేవలం, నీవు చేయవలసిన ఒకే సంగతి, యేసుక్రీనును గూర్చి అతను బోధించినప్పుడు, నీవు విన్న వాక్యమును విశ్వసించుటయే. అంతే. గొప్ప సంగతులు జరుగును.
86ఇప్పుడు చూడండి. గత రాత్రి మనం చెప్పుకొన్న ఆ చిన్న స్త్రీని గూర్చి ఆలోచిద్దాము. ఒకసారి యేసు సముద్రమునకు అడ్డముగా. ఇక్కడ ట్యుసాన్లో కొన్ని వారములు, సమయం కలిగియున్నాము అని అనుకొనుచున్నాను. అక్కడ మీరు చూడండి, దానిలో ఒక కార్యము ఉన్నది, అది చాలా కఠినమైనది. మీరు ఒక ప్రదేశములోనికి వెళ్ళండి, అదంతా అక్కడి జనులకు క్రొత్తగా ఉంటుంది, వారు కేవలం ఒకసారి చూసి చెబుతారు, "మై, అది వింతగా ఉన్నది, కానీ దాని గూర్చి నాకేమి తెలియదు." చూశారా, దానిని చూసి మీరు తెలుసుకొనుటకు నేను చాలినంత కాలము ఇక్కడ ఉండను.
వినండి. ప్రభువైన దేవుడు నాకు అనుగ్రహించిన వేలకు వేలు దర్శనములను నేను చూసియుంటిని, మరియు అనేక ప్రదేశములకు, కూడికలకు వచ్చుచున్న ఇక్కడి జనులను నేను ఎరుగుదును. ఇతర కూడికలలో ఎంత మంది పాల్గొనియున్నారు? మీ చేయిని చూడనివ్వండి. ఇప్పుడు మిమ్ములను ఒకటి అడుగవలెనని కోరుచున్నాను. ఖచ్చితముగా సత్యము కానటువంటి పలుకుబడిన మాట ఎపుడైన, ఒక్కటైనా ఉన్నదా? అది సత్యమేనా? అయితే "ఆమేన్" చెప్పండి. ఎవ్వరూ చెప్పలేరు. ఆ దర్శనములలో ఒక్కటైన తప్పిపోయినట్లు ఎవ్వరైనా చెప్పగలిగితే మీరు స్వేచ్చగా వచ్చి నిలబడి, మరియు నాతో చెప్పండి. అనేక లక్షల మంది జనులకు, ప్రపంచము చుట్టూ తిరిగి నేను దానిని చెప్పగలను. అది ఏమిటో కొంచెమే వారు ఎరిగియున్నారు.
87గుడారములో ఉన్న జనులారా, గుర్తించుకోండి, లోపలికి వచ్చుచున్న కొంత మంది జనులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నా స్నేహితులలో ఇద్దరిని చూచుచున్నాను. శ్రీ. మరియు శ్రీమతి. డౌ అక్కడ కూర్చొనియున్నారు, ఓహియో నుండి వచ్చిన శ్రీమతి బ్రౌను. అక్కడ సంభవించిన ఆ కార్యము అదే విధముగా ఆ కేకలు వెళ్ళాయి. అది జరుగుటకు ముందు అనేక వారములు మరియు వారములు మరియు వారములు మరియు ముందుగా దానిలో ప్రతీది ముందే చెప్పబడిన ఏడు ముద్రల కొరకు అది తిరిగి పంపబడెను. ఇక్కడ ఉన్న ఎంత మంది దాని గూర్చి సాక్షిగా ఉన్నారు, కూడికలలో అది చెప్పడం ఎంత మంది విన్నారు? భవనములో ఉన్నవారు, మీ చేతులు ఎత్తండి. అక్కడే మీరు ఉన్నారు. దానితో విజ్ఞాన శాస్త్రం పోరాడుచున్నది.
జార్జ్, జె. లేసి దానిని పరీక్షించినప్పుడు, నేను అతనితో చెప్పితిని. "అది ఒక తరహా పసుపు పచ్చ రంగు గల కాంతి వంటిది. అది మండుతుంది" అని చెప్పితిని.
"ఓహ్! అది మానసిక శాస్త్రము" అని వారు చెప్పిరి.
"అది మానసిక శాస్త్రమే అని నేను కూడా అనుకొనుచున్నాను" అని శ్రీ. లేసీ అన్నారు. ఆయన ఇంకా కానీ, "ఈ కెమెరా యొక్క యాంత్రికమైన కన్ను మానసిక శాస్త్రమును తీయలేదు" అని అన్నారు. లేదు. అది అక్కడ ఉండెను. అది ఏమిటి?
JOHN 8:57,58•
JOHN 16:27,28•
1COR 10:4
88చూశారా, ఇప్పుడు గమనించండి. ఆ అరణ్యములో, ఆ అరణ్యము గుండా ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించినప్పుడు, క్రీస్తు ద్వారానే ఆ అరణ్యము గుండా ఆ జనులను ఆయన నడిపించెను. ఎంత మందికి అది తెలుసు, ఆ నిబంధన దూతయే అగ్ని స్తంభమని ఆదే యేసుక్రీస్తని ఎంత మందికి తెలుసు? నిశ్చయముగా అదే. ఖచ్చితముగా ఆయన చెప్పెను, వారితో ఆయన చెప్పెను. పరి, యొహాను 6లో… "యాభై సంవత్సరాల వయస్సు ఉన్నట్లు కూడా ఆయన కనబడుట లేదు" అని వారు అన్నారు. "అబ్రహాము కంటే ముందు?" అని అన్నారు
"అబ్రహాము కంటే ముందు, నేను ఉన్నాను అని ఆయన చెప్పెను. ఆ పొదలో ఉన్నవాడును అనువాడును ఆయనే. మరియు ఆయన, నేను అని చెప్పెను.
ఆయన "బండలో నుండి వచ్చిన నీళ్ళను మేము త్రాగితిమి," అని వారు చెప్పిరి. ఆ బండ ఆయనే అని ఆయన చెప్పెను. ఆమేన్.
చూడండి, "నేను ఒకప్పుడు ఉన్నాను," కాదు "నేను ఉన్నావాడను" అని ఆయన చెప్పెను. "నేను దేవుని యొద్దనుండి వచ్చితిని. నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను" అని ఆయన చెప్పెను. ఇప్పుడు, ఇశ్రాయేలు పిల్లలతో ఉన్న అదే అగ్నిస్తంభము ఆ అరణ్యములో ఉండెను. ఆ అగ్ని స్తంభము మన మధ్యలో మానవ శరీరమెత్తిన దేవునిగా శరీరమాయెను. దేవుని కుమారుని రూపంలో, ఆ కన్యకను కమ్ముకొని, మరియు ఆయనను తీసుకొని వచ్చెను, కనుక తన సొంత ధర్మశాస్త్రమునకు వెల చెల్లించుటకు మరియు దేవుడు మానవునిగా మారగలిగి చనిపోయెను, చూశారా. అదియే సువార్త.
ACTS 9:1-5•
HEB 13:8
89"నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని. నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను" అని ఆయన ఇప్పుడు చెప్పెను.
ఆయన మరణము, సమాధి మరియు పునరుత్థానము తరువాత వెంటనే, వెర్రి కోపముగల ఆ చిన్న యూదుడు, ప్రతీ వారిని పట్టుకొని చెరసాలలో వేయించుటకు ప్రయత్నించి, మరియు ప్రధాన యూజకుని నుండి పొందిన ఉత్తర్వులతో ప్రతివారిని బంధించుటకు అతడు దమస్కుకు పోవు రహదారి పై యుండెను. సుమారు మధ్యాహ్న సమయమున ఆ రహదారిలో అతడు కొట్టబడెను. మరియు అతడు కొట్టబడినప్పుడు, అతడు పైకి చూసెను, అక్కడ అతని కన్నులను తాకిన గొప్ప వెలుగు ఉండెను. దానిని ఎంతమంది ఎరుగుదురు? అదే అగ్నిస్తంభము, చూశారా. మరియు అతడు "ప్రభువా…" అని పిలిచాడు. ఒక యూదునిగా ఆ అరణ్యములో ఉండిన అగ్నిస్తంభము అదియేనని అతనికి తెలుసు. "ప్రభువా, నీవు ఎవరవు?" అని అడిగెను.
"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టము" అని ఆయన చెప్పెను.
"ప్రభువా నీవు ఎవరు?" అని అతడు అడిగెను. ఇప్పుడు ఆగండి, అదే అగ్నిస్తంభము.
"నేను యేసును" అని ఆయన చెప్పెను. ఊహ్, అది నిజమేనా?
ఒక రాత్రి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, జ్ఞాపక మున్నదా? అదియే చెరసాలలోనికి వచ్చి, అతని ముందు తలుపులను తెరచి, అతనిని బయటకు తీసుకు వచ్చెను. అది ఏమిటి ? యేసుక్రీస్తు, నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు, అది కానట్లైతే, అది వేరే ఏదో అయితే, అది వేరే రకపు పనిని చేయును. కాని అది ఇశ్రాయేలుతో అరణ్యములో ఉన్న అదే పరిశుద్ధాత్మ అయితే మరియు అది యేసుక్రీస్తులో కూడ ఉండెను, అది ఇప్పుడు సంఘములో ఉన్నది. అది అదే వెలుగు గనుక, అది అవే క్రియలను చేయును, చూశారా. అది అదే ఆత్మయైయున్నది. నీవు దానిని మాత్రమే నమ్మగలిగితే, స్నేహితుడా! నన్ను కాదు; ఆయనను, చూస్తున్నారా. ఆయనే ప్రధాన యాజకుడు.
MATT 9:20,21•
MARK 5:27,28,30,31•
LUKE 8:44-46
90ఒక చిన్న స్త్రీ ఒక రోజు, ఆయన దేవుని కుమారుడని ఆమె నమ్మెను, ఆమె రక్తస్రావ సమస్యను కలిగియుండెను. "ఆయన వస్త్రపు చెంగు మాత్రము నేను ముట్ట గలిగితే" అని ఆమె యొక్క హృదయములో అనుకొన్నది. దాని నుండియే ఆమె పొందుకొనెనని నేను అనుకొనుచున్నాను, బహుశా! ఏలియూ, మరియు "దండమును తీసుకొనుట." పౌలు అక్కడ నుండియే పొందుకున్నాడని నేను అనుకొనుచున్నాను. "చేతి రుమాళ్లను వేయుట" మొదలగున్నవి, దానినే ఎవరైనా చేసినచో,
"నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టగలిగితే నేను సంపూర్ణముగా బాగుపడుదునని నేను నమ్ముచున్నాను," అని ఆమె అన్నది. ఆమె ఆయన వస్త్రపు చెంగును తాకేటంతవరకు జనసమూహము గుండా నెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు పాలస్తీనా వస్త్రము స్వేచ్ఛగా వ్రేలాడుతుంది, మరియు అది క్రింద ఉండే వస్త్రమును కలిగియున్నది. కావున ఆమె వెళ్ళి సరిచేయబడెను.
భౌతికముగా, ఆయన దానిని అనుభూతిని చెందలేదు, చూడండి, ఎందుకనగా ఆ వస్త్రము స్వేచ్ఛగా వ్రేలాడుచున్న ఒక అంగీ మాత్రమే. కానీ, ఆయన ఆగెను. ఆయన చుట్టూ ప్రతీ ఒక్కరూ వారి చేతులను వేసియుండిరి, "హలో రబ్బీ" ఇశ్రాయేలు ప్రవక్త, ఇక్కడ మాతో పాటు నిన్ను కలిగియున్నందుకు మేము చాలా సంతోషించుచున్నాము.
"నన్ను ముట్టినది ఎవరు?" అని అడిగెను.
"ఎందుకు, ప్రభువా!" అని పేతురు చెప్పెను. అతడు ఆయనను గద్దించెను. వేరే మాటలలో, ఇలా చెప్పవచ్చు. "ప్రభువా, అలా ఏమి చెప్పవద్దు. జనులు నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. ఎవరు నిన్ను తాకిరి?" ప్రతీ ఒక్కరూ నీ చుట్టూ వారి చేతులను వేసియున్నారు. ప్రతీ ఒక్కరూ నిన్ను తటుచున్నారు. "నన్ను ముట్టినది ఎవరు?" అని చెప్పవద్దు.
"కానీ ఇది వేరే విధమైన తాకిడి, చూశారా. నాలో నుండి ఆ ప్రభావము వెడలి పోయినది నేను గ్రహించుచున్నాను," అని ఆయన చెప్పెను. ఆయన అక్కడ వున్న జనసమూహమును చూసెను. ఆ చిన్న స్త్రీ నిలబడి ఉండవచ్చు లేదా ఆమె కూర్చొనియుండవచ్చు. ఆమె ఎక్కడ ఉన్నదో, అక్కడ అది సంభవించెను. ఆయన ఆమెను చూసెను. ఆమే తనంతట తాను దాగి యుండలేక పోయింది. చూస్తున్నారా? ఆ మనిషి గుండా, ఆమె దేవుని తాకెను. ప్రభావము, బలము, ఆయన నుండి వెడలి పోయెను. ఆమె యొక్క రక్త రక్తస్రావ సమస్య గూర్చి చెప్పెను. అది ఆగిపోయెను.
HEB 4:14,15
91ఇప్పుడు, అదే యేసు ఈ దినమున అదే ప్రధాన యాజకుడైయున్నాడు. బైబిల్ అలాగున చెప్పుచున్నది. (అది సరియేనా, సేవకులైన సహోదరులారా?) చూశారా, అనగా "ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడైయున్నాడు, తండ్రియైన దేవుని యొక్క కుడిపార్వమున కూర్చొయున్నాడు. అక్కడ కూర్చొని, ఎల్లప్పుడు జీవించుచూ మధ్యవర్తిత్వము చేయుచున్నాడు. మన బలహీనతతో కూడిన అనుభూతి చేత ఆ ప్రధాన యాజకుడు తాకబడుచున్నాడు.
ఇప్పుడు… నీవు ప్రార్ధనా కార్డు కలిగియుండలేదు. ఇక్కడ ప్రార్ధన వరుసలో మీరు ఉండలేదు. అది సత్యమో కాదో అని మీరు తెలుకొనగోరితే, ఈ రాత్రి కేవలం దేవునితో చెప్పండి, "పరలోకపు తండ్రి, నేను రోగినైయున్నాను. నాకు తప్పనిసరిగా నహాయం కావలెను. నేను కలిగియున్న విశ్వానము అంతటినీ నేను ఉపయోగించుచున్నాను. అది అక్కడ నిలువబడిన ఆ మనిషి కాడని నేను ఎరుగుదును. అతడు కేవలం నాలాంటి, [లేదా నా భర్త లాంటి, లేదా నా సహోదరుడులాంటి ఒక మనిషి చూశారా?] కానీ, ఆ మనిషి చెప్పిన సత్యమును నేను విశ్వసించుచున్నాను, ఎందుకనగా అది లేఖనమైయున్నది. మరియు ఇప్పుడు నీవు ప్రధాన యాజకుడువని నేను విశ్వసించుచున్నాను. ప్రభువా, నన్ను నిన్ను తాకనిమ్ము మరియు నీవు నిన్న ఉన్నట్లుగానే ఇప్పుడును ఉన్నావు… నీవు… ఆ సహోదరునికి నన్ను గూర్చి ఏమియు తెలియదు, కానీ నీవు చుట్టూ తిరిగి, అతని పెదవులను ఉపయోగించుకొనుము, మరియు నాతో మాట్లాడుము. మరియు నీవు ఆ స్త్రీకి చెప్పినట్లుగానే చెప్పుము.
"యేసుక్రీస్తు నామములో, అదే రకపు విశ్వాసమును కలిగియుండవలెనని, నేను మీకు సవాలు చేయుచున్నాను, మరియు ఏమి జరుగునో చూడండి. అది నిజమో, కాదో చూడండి, అది సత్యము. దానిని కేవలం మీరు నమ్మండి. మరియు మీరు అలా చేయగలిగితే, మంచిది, దేవుడు మిమ్మును ఆశీర్వదించును.
92ఇప్పుడు, ఇంతకు ముందు కూటమిలో ఒక, ఒక దానిలోనైననూ లేనటువంటివారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మీరా చేయి పైకి ఎత్తండి. మై! ఓ, ఈ రాత్రి ఇక్కడ మిమ్ములను కలిగియున్నందుకు మేము చాలా సంతోషించుచున్నాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించును. కేవలం ఒక చిన్న కూడిక, సహవాస సమయం, ఇక్కడకు పరుగెత్తుకొని వచ్చి, ఉద్రిక్తతో, రెండు లేదా మూడు రాత్రుల పాటు, ఉండుటకు కొంత సమయం దేవుని యొక్క సేవకుల యొక్క సమ్మతితో మేము ఇక్కడకు తిరిగి రాగలిగి, రెండు లేదా మూడు వారములు మేము ఉండి, ఒక మంచి కూడికను కలిగియున్నాము.
రోగగ్రస్తులు, కొన్నిసార్లు, వారిలో ఒక, ఒక రోగ ఎదుగుదల కలిగియుందురు. ఆ ఎదుగుదల ఏమిటో కూడా వారికి తెలియదు అది దుష్టత్వము లాంటి లేదా అది ఏమైనప్పటికీ, అది ఒక జీవము. అది ఒక జీవము. ఆ జీవము, చేయలేదు. నా చేతిమీద, ఇప్పుడు కేన్సర్ లేదు, అనుకోండి. ఒకానొక దినమున, అది అక్కడకు ఉండవచ్చును. సర్వసాధారణంగా, ఒక కేన్సర్ దాని నుండి వచ్చును. అది ఒక దుష్టకణము. మరియు బుతుక్రమము ఆగిపోయే దశగుండా మీలో కొంతమంది సహోదరీలు వెళతారు, మరియు వారు మీకు హోర్మోనులను ఇచ్చుచుందురు. అలా దానిని చేయవద్దు. మీరు కేవలం దేవున్ని నమ్మండి. హర్మోను అనేది ఒక దుష్టకణము. మీరు కేవలం కేన్సర్ను నిదానంగా మీలోనికి చొప్పించుచున్నారు, చూశారా. నేను కాదు… వైద్యుడా, ఇక్కడ నీ స్థానమును నేను తీసుకొనుటకు ప్రయత్నించుచున్నావని భావింపవద్దు, కానీ ప్రార్ధనా వరుసలో అటువంటి చాలా మందిని కలిసితిని, చూశారా.
కావున, చేయవలసినది, నీవు దేవునిలో నీ యొక్క విశ్వాసమును ఉంచుము. మరియు నీ యొక్క నిజమైన మంచి, నీతిగల వైద్యుడు, మీ కుటుంబ వైద్యుడు, అది సత్యమే అని మీకు చెప్పును. మీరు కేవలం దేవునిలో విశ్వాసమును కలిగియుండి, ఆయనను నమ్మండి. ఛాయలగుండా ఆయన నిన్ను తీసుకొని వెళ్ళును. ఆయన ఎల్లప్పుడు నీకు సహాయము చేయుటకు అక్కడే ఉన్నాడు. అది నిజము.
93గమనించండి, మనం కనుగొనుచున్నాము, ఆ ఎదుగుదల, అది ఎదుగుదలను ప్రారంభించినదా? అది ఏమిటి? అది కణముల యొక్క అభివృద్ధి, ఒక్క కణము వేరొక కణము మీద కుప్పగా చేరును, అదియే మీరు, కణముల యొక్క సముదాయమై ఉన్నారు. మంచిది, మీరు ఎక్కడ నుండి వచ్చిరో మీకు తెలుసు. తండ్రి మరియు తల్లి మధ్యనున్న పరిశుద్ధ వివాహబంధం, ఒక చిన్న సూక్ష్మ కణం ఈ రాత్రి, మీ శరీరమును నేను చీల్చివేసిన యెడల కణము తరువాత కణమును చీల్చివేసిన యెడల అది ఒక సూక్ష్మమైన జీవకణమునకు వచ్చును. ఆ జీవకణము లోపల రక్తము యొక్క రసాయన శాస్త్రం ఉన్నది, మరియు ఆ రక్తము లోపల ప్రాణమున్నది, మరియు ఆ ప్రాణమే నీవు. అది కణములను వృద్ధి పొందించుట ప్రారంభించును. కావున, దీనిలో నుంచి ప్రతీజాతి, పక్షి తర్వాత పక్షి, కుక్క తరువాత కుక్క, మనిషి తరువాత మనిషి, మరియు అది తయారు చేయును.
కానీ, మీరు చూడండి దయ్యానికి రూపంలేదు. కేన్సర్, అది కేన్సర్ అని పిలువబడుతుంది. "పీత" (ఎండ్రకాయ). పదం నుండి వచ్చుచుచున్నది. పీల్చివేయుటకు "కాళ్ళు బయటకు చాపును" అని దీని అర్ధము. అది మీలో నుండి మీ రక్తమును పీల్చివేయును. అది వేరే జీవము. అది మీలో జీవించే ఒక జీవము. కావున ఒక మానవ జీవము ఉన్నది. వేరే రకపు జీవమూ ఉన్నది. ఆ జీవము గూర్చియే నేను మాట్లాడుచున్నది. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు, దానిని మీరు పిలుస్తారు "కేన్సర్" అని వైద్యుడు దానిని పిలుస్తాడు. వారిలో కొంతమంది దానిని "కేటరాక్ట్ " అని పిలుస్తారు. మీలో కొందరు దానిని వేర్వేరు, వైద్య పదములతో పిలుస్తారు. కానీ, యేసు దానిని "దెయ్యము" అని పిలిచాడు. మరియు అది అదియే, అది దెయ్యము అనగా, "హింసించేవాడు" అని అర్ధము, దెయ్యము నీ జీవాన్ని తీసివేయుటకు ఉన్నది.
94ఇప్పుడు, కొన్ని సార్లు, వైద్యుడు చుట్టూ కత్తిరించి, దానినంతా బయటకు తీసివేయును. అది ఆశ్చర్యమైనది. అది గట్టిగా పట్టుకున్నామా, ఏమి చేయలేదా? ఇప్పుడు, మనం కేన్సర్ గడ్డతో సంబంధం కలిగిలేము. దానితోనే సాతానా, బయటకు రా, అని మీరు చెప్పినప్పుడు, ఆ గడ్డలో ఉన్న జీవముతో సంబంధము కలిగియున్నాము. దానిని మీకు నేను నిరూపించగలను. ఒక వ్యక్తి యొక్క చేతులను నా చేతి మీద ఉంచండి. మరియు మీకు నిరూపిస్తాను. అక్కడ సంభవించే ఫలితాలను చూపించెదను. మీలో చాలా మంది, అది జరగడం మీరు చూసియున్నారు. అది సరియేనా?
ఇప్పుడు గమనించండి, అక్కడ నుండి ఆ జీవం వెడలిపోతే, ఏమి జరుగును? మీరు మరుసటి దినానికి వెళ్ళండి, అది కుంచించుకొనిపోవును. ఏదైనా తెలియును, దేని తరువాతైనా… అందరికి తెలియును, ఏదైన చనిపోతే, అది కుచించిపోవును. మీరు ఒక జింకను (దుప్పిని) చంపండి, అప్పుడు దాని బరువును తూయుండి మరియు అది ఎంత బరువు ఉందో సహోదరులతో చెప్పండి, ఉదయకాలమున దానిని బరువును తూచె తక్కెడలో పారవేయండి. అది ఫౌండ్లు (కొన్ని కిలోలు) తగ్గిపోవుచూ ఉండును. ఒక వ్యక్తి చెడ్డ పళ్ళను కలిగి చనిపోయినప్పుడు, వారు, వాటిని బయటకు తీసివేస్తారు; కృత్రిమమైన కన్ను, ఎందుకనగా అవి.. అవి కుంచించుకొనిపోవును, అవి బయటకు వచ్చును.
MATT 12:44,45•
LUKE 11:25,26
95మంచిది, కొద్దికాలం అది అక్కడ పడియున్న తర్వాత, ఒక చిన్న జంతువు లాంటిది. వీధిలో పరుగెత్తె కుక్క, ఎండలో ఉండుటచేత, అది ఉబ్బడం ప్రారంభించును, అప్పుడు అది మొదటి స్థానములో ఉన్న దాని కంటే పెద్దదగును. లోపల చెడిపోవడం జరిగినప్పుడు, సుమారు డెభ్బై-రెండు గంటల తర్వాత ఒక రోగి ఆరోగ్యము, క్షీణించడం జరుగును. "ఓ, నేను ఉండవలసిన దాని కన్న ఎక్కువగా చెడిపోయాను. నా యొక్క ఆరోగ్యాన్ని నేను కోల్పోయాను," అని వారు చెప్పడం ప్రారంభిస్తారు. "మరియు ఒక దురాత్మ ఒక వ్యక్తిలో నుండి బయటకు పోవునప్పుడు, అది పొడి ప్రదేశములలో తిరిగి వెనుకకు తిరిగి వచ్చును." చూశారా, మరి నీవు నిజముగా విశ్వసించక పోతే అది నీలో నుండి ఎంతగా తీసివేసినా సమస్యలేదు. దానిని ఎట్లు అంగీకరించవలెనో, నీవు ఎరుగకపోతే, మరియు దానిని విశ్వసించుము! ఆ దెయ్యము తిరిగి వచ్చునప్పుడు, అది వెళ్ళిపోయినదని నీవు ఇంకా ఎరిగియున్నావు, అయితే దానిని నీవు అంగీకరించినచో, అక్కడ ఏమీలేదు గానీ మరణమే ఉన్నది.
కానీ, సమస్య ఏమిటి? నీలో ఒక సర్పమును నీవు కలిగియున్నట్లైతే, సుమారు అంతకాలం నీవు చనిపోతావు. మంచిది, అది ఏమిటి ? నీ గుండె కొట్టుకొనుచూ, మరియు రక్త ప్రవాహమును శుద్ధి చేయును. మరియు నీకు జ్వరము కలుగజేసేది అదే, అంటువ్యాది, ఆ పెరుగుదల మానవ శరీరములో ఉన్నప్పుడు, ఆ శరీరము చనిపోయి, అంటువ్యాది లోనికి వచ్చును, లేదా ఉబ్బడం ప్రారంభించును, మరియు గుండె రక్తమును శుద్ధి చేయుచూ ఆ అంటువ్యాదిని బయటకు నెట్టి వేయును. ఎందుకు, బహుశా, నీవు మరీ జబ్బు పడుతూ ఉండవచ్చు. కానీ జనులు, విశ్వాసమును కలిగియుండకుండా కేవలం లోనికి వచ్చి మరియు వారు నిజముగా కొంచెం ఉపసమనం పొందుచున్నారు. నేను జనులను…
96ఒక రాత్రి, తన కండ్లపై కేటరాక్ట్ అనే జబ్బుగల వ్యక్తి వచ్చి, పియానోను వాయించాడు. మరియు చక్కగా చూడగలిగాడు. అతడు పైకి వచ్చి, ఇదే బైబిల్ ను తీసుకొని మరియు దానిలో నుండి చదివాడు. సుమారు నాలుగు రాత్రులు తరువాత అతని ముందున్న అతని యొక్క చేతిని కూడా చూడలేకపోయాడు. అతడు తిరిగి వచ్చి, "నా స్వస్థతను నేను కోల్పోయాను. అది అక్కడే ఉండుటకు కేవలం మంచిది," అని అతడు అన్నాడు."
"సహోదరుడా, అది తప్పు నీవు చేసినది. నీవు విశ్వసించలేదు" అని చెప్పాను.
"మంచిది సహోదరా బ్రెన్హా౦, నేను స్వస్థత పొందితిని, కానీ…" అని అన్నాడు.
"అయ్యా, లేదు, అది కేటరాక్ట్ వలన వాసినది (లేదా ఉబ్చినది), కేవలం విశ్వసిస్తూ ఉండుము. సందేహపడవద్దు. నీవు సందేహపడితే, అది మరలా తిరిగి వచ్చును. నీవు కేవలం నమ్ముతూ ఉండు. నీవు నమ్మావు అని చెప్పావు. అప్పుడు, నీవు చెప్పిన దానిని తిరిగి తీసుకొనుచున్నాను. దానిని నమ్మునంత వరకూ చెప్పవద్దు" అని నేను చెప్పాను. అతనితో చెప్పి, మరియు అతనిని ప్రోత్సహపరిచితిని. అతడు అక్కడే ఉండెను, రెండు వారముల పాటు అక్కడే ఉండెను. రెండు వారముల అంతమందు, ఎవరైనా చదువగలిగినంత మంచిగా, పరిశుద్ధ గ్రంధాన్ని అతడు చదువగలిగాడు, చూశారా.
97ఇప్పుడు, అతడు ఏమి చేయాలి అనే దానిపై సూచనలను…
మరియు అదే మీరు పొందుకొందురు. ఈ విధంగానే లోనికి పరుగెత్తి రండి. మొదటి కార్యము మీకు తెలుసా, అప్పుడు అదంతా సంఘకాపరిపై పడును, "మంచిది, సరిగా వారు లేరు" అని వారు చెప్తారు. చూడండి, ఎందుకనగా సంఘము శిక్షణ పొందలేదు. వారు ఎట్లా చేయాలి. వారు ఏమి చేయాలి అనేది వారికి అర్థం కాలేదు. అందరూ కలసి మరియు విశ్వాసమును, వారు కలిగిలేరు. వారందరూ ఎక్కువ ఆశను మాత్రం కలిగియున్నారు.
కానీ, ఇప్పుడు నేను ఏమి చెప్పుటకు ప్రయత్నించుచున్నానో, "ఏమిటో మీకు తెలుసా? సహోదరుడా బ్రెన్హాం, నాపై చేతులు ఉంచండి. సహోదరుడా, నేను బాగుపడతాను" అని మీరు చెప్పుట కొరకు నేను ప్రయత్నం చేయుటలేదు. నేను మిమ్ములను తాకవలెనని కూడా కోరుకొనుట లేదు; మీరు ఆయనను తాకవలెనని నేను కోరుచున్నాను, చూస్తున్నారా? దానితో నేను చేసేది ఏమిలేదు. కానీ దేవుడు నాకిచ్చిన ఆ వరములో, ఆయనను కనుపరుచుటకు, ఇక్కడ మీ ముందుకు వాస్తవమునకు ఆయనను తెచ్చి, నేను క్రీస్తును ప్రత్యక్షపరచినట్లైతే, ఆ వాక్యము మన మధ్యలో తానే శరీరధారి అయ్యి మరియు, ఆయన దేవుడైయున్నాడని కనబరచును, అప్పుడు మీరు కేవలం ఆయనను తాకండి. మరియు ఏమి జరుగునో చూడండి. నా భావమేమిటో మీరు చూస్తున్నారా, స్నేహితులారా?
98మీరు పెద్దవాటిని కోరవద్దు. మీరు అలా చేస్తే, చిన్న చిన్న స్థలములకు మీరు వెళ్ళలేరు. అనేక సంవత్సరాలు క్రితం, నేను సువార్త పొలములో ఉన్నాను. ఒకానొక స్థానమునకు నా కూడికలను వృద్ధి పొందించవలెనని నేను ఎప్పుడూ అనుమతించలేదు. నేను ఎటువంటి దూరదర్శినీలను (టి.వి.) కలిగిలేను. నేను ఎటువంటి అమ్మకాలు కలిగిలేను. నేను ఏమి కలిగిలేను — కేవలం క్రీస్తును. ఈ గొప్ప పెద్ద కార్యక్రమములకు వెళ్ళలేని ఆ సహోదరులు వున్న ఆ కరుకైన చిన్న స్థలములకు నేను వెళుతూ ఉంటాను, ఎందుకనగా వారి కార్యక్రమములను నడిపించుటకు, ఆ గొప్పవారు ప్రతీ దినము అనేక వేల డాలర్లను పొందుతారు. నేనైతే ఏమి కలిగిలేను, కేవలం దేవున్ని కలిగియున్నాను, చూశారా. మరియు ఆయన నన్ను ఎక్కడికి పంపిననూ అక్కడికి నేను వెళ్ళగలను, చూస్తున్నారా. అక్కడికే నేను వెళ్ళగలను.
ఎంతో కాలం కాదు, ఈ మద్యనే ఇరవైమంది కలిగిన ఒక సంఘములో ఇక్కడే ఒక ఉజ్జీవమును బోధించితిని. అది చాలా దయనీయమైనది, అక్కడకు వెళ్ళమని ప్రభువు నాతో చెప్పాడు గనుక ఎట్లాగైననూ మేము దానిని కలిగియుంటిమి, చూశారా. అప్పుడు నేను వెళ్ళి మరియు ఐదు లక్షల సమూహమునకు భోదించితిని. ఎవరో పెట్టుబడి పెట్టి ప్రోత్సహించి మరియు అక్కడకు నన్ను తీసుకొని వెళ్ళారు. నేను దేని గూర్చి చింతపడుట లేదు. ఆయన ముందు సరిగా ఉండుటకు మాత్రమే, చింత కలిగియున్నాను, చూస్తున్నారా. ఆయన నన్ను ఎక్కడికి పంపగోరుచున్నాడో అక్కడకి పంపును.
JOHN 5:19•
HEB 13:8
99ఇప్పుడు, ఈ రాత్రి, నేను ఎరిగినంత వరకూ, ఈ ప్రార్ధనా వరుసలోని, ప్రజలు నాకు క్రొత్తవారు. నాకు క్రొత్తవారైన వారు, అక్కడ ఎంతమంది ఉన్నారు. ఎత్తండి మీ… మీ గూర్చి నేను ఏమి ఎరుగనని మీలో ఎరిగిన వారు మీ చేయి పైకి ఎత్తండి. మీకు క్రీస్తు కావలిసినవారు. సరే, ఇప్పుడు మీరు కేవలం నమ్మండి. అది వంతశాతం అని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు మీరు ప్రార్ధనా వరుసపైకి వచ్చుచుండగా, దేవుడు చేయుట కొరకు, క్రింద మీరు ప్రార్ధన చేయుట ప్రారంభించండి. మరియు ఆయన దానిని చేసినట్లయితే, మీరు నమ్ముతారు, "ఆమెన్" చెప్పండి.
ఇప్పుడు, ఖచ్చితముగా దేవుని యొక్క మెస్సియూగా తన్నుతాను గుర్తించుకొనిన విధానం అదియేనని ఎంతమంది ఎరుగుదురు? దాని నుండి ఎంతమంది ఎరుగుదురు? చూశారా, అది ఖచ్చితంగా, అది ఖచ్చితంగా, మరియు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము, ఒక్కటే రీతిగా ఉన్నాడు. "తండ్రి ఏమి చేయుట నేను చూశానో, నేను అంతవరకు నేను ఏమి చేయను."
100దేవుని మహిమార్థం, యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉన్న ప్రతీ ఆత్మను నా స్వాధీనంలోనికి నేను తీసుకొనగోరుచున్నాను. మీ కుర్చీలలో కూర్చొని సరిగా ఉండుడి, చుట్టూ తిరుగవద్దు. మీరు కదిలినప్పుడు… చూడండి, ప్రతీ ఒక్కరూ ఒక ఆత్మ. మీరు సరిగా ఉండనట్లైతే, మీరు చనిపోతారు. అది మీకు తెలుసా? చూస్తున్నారా. మరియు, మీ యొక్క అవిశ్వాసము… మరియు "మీ తలను వంచండి," అని నేను చెబితే; దానిని చేయండి. పైకి లేవండి అని అది మిమ్ములను పిలుచుచున్నది అని నేను చెప్పినట్లయిన, పైకి లేవండి. మరియు అది ఏమి చెప్పిననూ చెప్పిన దానిని మాత్రమే చేయండి - ఎందుకనగా అది నేను కాదు; అది ఆయన. ఇప్పుడు, అది ఏమైననూ, మీ ప్రార్ధనా వరుసను ప్రారంభించండి.
101పరలోకపు తండ్రి, సమయం పరుగెత్తుచుండగా అది ఎంతో కాలము ఉండదు. ఇది జరిగినప్పుడు ఆ ఘడియ వచ్చునని ముందుగా చెప్పిన, నొక్కి వక్కాణించిన కాపరులు, సేవకులు, ఈ రాత్రి ఇక్కడ నావెనుక నిలువబడియున్నారు. అనేక సంవత్సరాల క్రితం, కొంతమంది వృద్ద యోధులు, వారి యొక్క చేతులలో గిటారుతో ఆ మూల నిలబడి ఒక దినము వచ్చునని, నొక్కివక్కాణించి చెప్పిరి. ఇక్కడ ఈ రాత్రి వారిలో కొందరు ఉన్నారు, మరియు వారి కుమారులు ఉన్నారు, వారు తండ్రి కేవలం దానిని నిజం చేయుటకు మార్గము సిద్ధపరచిరి. ప్రభువా, ఇప్పుడు దానిని మేము స్వీకరించుదుము గాక! దానిని అనుగ్రహించండి! మా యొద్దకు దేవుడు పంపిన యేసుక్రీస్తు అను ఈ గొప్ప వరము చుట్టూ, మేమందమును, కలసి సహవాసమును చేయుదుము గాక ! తండ్రి, దానిని అనుగ్రహించండి.
ఇప్పుడు, ప్రభువా! ఈ జనులలో ఏ ఒక్కరినీ నేను ఎరుగనని నీవు ఎరుగుదువు. నీవు వారందరినీ ఎరుగుదువ. ఈ జనులు దానిని చూచునట్లుగా నేను ప్రయత్నించుచున్నాను. ప్రభువా, అది ఏ గొప్ప వ్యక్తులు కాదు, గొప్ప సంఘము కాదు. అది గొప్ప దేవుడు, మరియు యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆయనను మేము ఎరుగునట్లుగా చేయుమని వినయముతో ప్రార్ధించుచున్నాను. ప్రభువా, నీ వైపు చూచునట్లు, ఇప్పుడు వినేవారిని సవాలు చేసియున్నాను.
ప్రభువా! ఆ బయట ఉన్నవారి కొందరి విశ్వాసమును పరిశుద్ధాత్మ పరీక్షించునట్లు చేయుమని, ఈ రాత్రి నేను ప్రార్ధించుచున్నాను. అది వినేవారిని, అత్యంత ఆసక్తిని పొందేటట్టుగా జరుగబోయేదానిని వారు చూచునట్లుగా చేయుము. వారు అర్ధం చేసుకుందురు గాక! మరియు ఒక్కొక్కరు మరియు ప్రతీ ఒక్కరు స్వస్థత పొందుదురు గాక! ఆరాధన ముగించుచుండగా, ఈ రాత్రి ఒక్క రోగగ్రస్తుడును మా మధ్యలో ఉండకుండును గాక! రక్షణ పొందని ప్రతీ వ్యక్తి రక్షణ పొందును గాక, వారు దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు, మరియు ఒకానొక దినమున వారికి తీర్పు తీర్చబోవు అదే దేవుని యొక్క సన్నిధిలో వారు ఉన్నట్లు తెలుసుకొందురు గాక. ఇప్పుడు సమస్తమును నీకు సమర్పించుచున్నాను. మరియు నీకు నన్నునేను సమర్పించుకొనుచున్నాను. నీవు చూడగా, తగినట్లు, ప్రభువా, నన్ను ఉపయోగించుకొనుము. యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
102ఇప్పుడు నిజముగా నిశ్శబ్దముగా ఉండమని, మరియు ప్రార్ధనలో ఉండమని నేను నేను మిమ్ములను అడుగుచున్నాను. ఇప్పుడు కేవలం తలంచండి, ఇప్పుడు ఇది దేవుని యొద్ద నుండి రావడం లేదని ఎవరైనా భావించినట్లైయితే వారు ఇక్కడకు వచ్చి అదే కార్యమును చేయవలసినదిగా యేసుక్రీస్తు నామములో నేను మీకు సవాలు చేయుచున్నాను. మరియు అప్పుడు, మీరు చేయలేకపోతే, దాని గూర్చి మీరు ఏమి చెప్పకండి. ఆ లేఖనములలో దానిని పరిశోధించండి, మీరు చూడండి.
ఇప్పుడు నేను ఎరిగినంత వరకు, నా ముందు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంధముతో, నన్ను చూస్తు ఈ మనుషుల గుంపు ఇక్కడ కూర్చొనియున్నారు. ఈ ప్రజల సముఖములో ఈ స్త్రీ నాకు పరిచయంలేనిది. నేను ఆమెను ఎరుగను. ఆమె కేవలం ఇక్కడ నిలవబడిన స్త్రీ - ఆమెను గూర్చి నేనేమియు ఎరుగను.
ఆమె వ్యాధిగ్రస్తురాలైతే నేను మరియు ఆమెను స్వస్థపరచుటకు నేను ఏదైనా కలిగివుంటే దానిని ఖచ్చితముగా చేసెదను. దానిని మీరు నమ్ముచున్నారా? నమ్ముట లేదా? నేను చేయగలిగితే దానిని నేను చేస్తాను, కాని నేను చేయలేను. ఏ ఒక్కరూ చేయలేరు. స్వస్థత దేవుని యొద్ద నుండి వచ్చును, మరియు ఆయన దానిని ఇప్పటికే చేసియున్నాడు. ఆయన ఇంకనూ ఇక్కడే ఉన్నట్లు నీకు అర్థమగునట్లు చేయుటకు మరియు ఆయన ఇక్కడ ఆయన యొక్క వాగ్దానమును నిలువబెట్టుకొనుటకు దేవుడు దేనినైననూ చేయగలిగితే… ఈ వాగ్దానమును ఆయన నిలువబెట్టుకొన్నట్లైతే, అప్పుడు నిలబెట్టుకొనును… స్వస్థత వాగ్దానమును నిలబెట్టుకొనును, ఖచ్చితముగా, చూచారా.
MATT 12:31•
MARK 3:28,29•
LUKE 12:10
103ఆయన నాకిచ్చిన ఈ సూటుతో యేసు ఇక్కడ నిలబడినట్లైతే, మరియు ఆయన యొద్దకు పైకి నీవు నడిచి వెళ్ళి మరియు, "నా ప్రభువా నేను రోగిని నన్ను స్వస్థపరుచుమని నేను నిన్ను కోరుచున్నాను" అని చెప్పుము.
అది ఈ విధముగా ఉండునని నేను నమ్ముచున్నాను. "బిడ్డా, పరిశుద్ధ లేఖనములను నీవు నమ్ముట లేదా? ఆ ఉద్దేశము నిమిత్తము నేను చనిపోయాను. నేను నీ నిమిత్తము బాధింపబడినప్పుడు, కల్వరి యందు నీ స్వస్థతను నేను కొనియున్నాను" అని ఆయన చెప్పెను.
"కానీ, నీవు ఎవరివో నేను తెలుసుకొనునట్లు, నీవు ఎవరవు? నీవు నా ప్రభువువా?"
"మంచిది, ముందుగా, ఈ జనులకు, యూదులకు మరియు, సమరయులకు ఇద్దరికినీ, నన్ను నేను తెలియజేసుకొనుటకు ఇక్కడ భూమి మీద నేను ఉన్నప్పుడు నేను ఏమి చేసితిని?"
ఒక్కసారి ఆ అద్భుతమును అన్యజనుల ముందు ప్రదర్శించలేదు. కారణం అన్యులు దాని కొరకు ఎదురు చూచుటలేదు. ఇప్పుడు వారివి వారు పొందుచుండగా, ఇప్పుడు అన్యుల యొక్క దినమైయున్నది. మరియు ఇది ఆ దినమే, "పరిశుద్ధాత్మకు వ్యతిరేఖముగా ఒక్క మాట, అది దురాత్మ అని పిలువబడును, జనులకు అది ఎప్పటికినీ క్షమింపబడదు," అని ఆయన చెప్పాడు.
104ఇప్పుడు, స్త్రీ, ఇక్కడ దేవుని ముందున్న మనమిద్దరం, మరియు పరిశుద్ధ గ్రంధము క్రింద మనం సంపూర్తిగా, నీవు చూస్తున్నావు. మనము ఒకరిని ఒకరు ఎరుగము, ఒకరిని ఒకరం ఎప్పుడునూ చూచుకోలేదు. మరియు నేను ఎరుగను, ఆమె దేని కొరకు నిలబడియున్నదో ఆమెకు ఏ మాత్రము ఎరుగదు. నా జీవితములో నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. మరియు ఇది నా చేతులలో ఉన్న పరిశుద్ధ గ్రంధము. మరియు ఒక సేవకునిగా అది తప్పైనప్పుడు నన్ను నేనే దండించుకొని దానిని చెప్పడం ద్వారా అది ఏమంచి చేస్తుంది?
దీనిని చేయుటకు ఇక్కడ నేను లేను. దేవుని చిత్తములో నేను ఉన్నట్లు నేను భావించితిని గనుక నేను వచ్చితిని. ఏదో ఒక దినమున దేవుని యొక్క తీర్పు దినం ఈ ట్యూసాన్ పట్టణమును తాకును, అని నేను ఎరుగుదును. గనుక నేను వచ్చి మీ యొద్దకు ఒక వర్తమానమును ఇచ్చుటకు దేవుడు ప్రయత్నించుచున్నాడు, మరియు నేను తప్పనిసరిగా ఆయన యొక్క సాక్షిగా ఉండవలెను. నాలో ఏమి లేదు — మీ మధ్యలో నేను చాలా తక్కువవాన్ని. నేను కేవలం మీ యొక్క సహోదరున్ని. అది యేసుక్రీస్తు. కానీ పని చేయుటకు ఎవరినో ఒకరిని ఆయన కలిగియున్నాడు. తనంతటతానే, ఆ ఎన్నికను ఆయనే చేయుచున్నాడు. అది ఉండునట్లు ఆయన ముందుగానే నిర్ణయించినాడు.
105ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో, ఆమె ఏమి చేసినదో లేదా ఆమె గూర్చి ఏదో ఒకటి పరిశుద్ధాత్మ నాకు చెప్పినట్లయితే, అది సత్యమో కాదో ఆమె ఎరుగును కదా? ఖచ్చితముగా, అది సత్యమో కాదో మీరు ఎరుగుదురు. మరియు అది సత్యము కాకపోతే, అప్పుడు అది దేవుడు కాడు. కానీ అది సత్యమే అయితే అప్పుడు ఆయన దేవుడైయున్నాడు. మీ పూర్ణ హృదయముతో మీలో ఎంతమంది ఇప్పుడు నమ్మబోవుచున్నారు? మరియు దానిని అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రమాణం క్రింద, పరిశుద్ద గ్రంధం క్రింద, ఆయన సాక్షుల ముందు, ఇక్కడ ఉన్న సాక్షులముందు మనము ఉన్నాము. మరియు బైబిల్ ఇక్కడ ఉన్నది, ఆ అన్యులముందు సొదొమ కాలిపోవుటకు ముందుగానే వాగ్దాన కార్యములు జరిగినవి, ముందుగానే వారు నశించిరి — అబ్రహాము యొక్క సంతానమునకు చివరి పిలుపు, రాజ సంతానమునకు!
106ఇప్పుడు స్త్రీ తన కండ్లు మూసుకొని నిలువబడియున్నదని, ఎవరైనా ఎరుగుదురు, ప్రార్ధనలో కేవలము, వాక్యమును మరల చెప్పడం, ఆమె ఒక క్రైస్తవరాలు గనుక, ఆమె పైకి వచ్చినప్పుడు. మీరు తెలుసుకొనండి, ఒకానొకసారి, పై వేషముచేత, ఒక క్రైస్తవుని వలె నటించుటకు ప్రయత్నం చేయుటకు అలా చేయుట ఎంతమంది చూసియున్నారు. వారికి ఏమి సంభవించినదో కూడా మీరు చూశారు. వారు అక్కడే పడిపోయారు, లేదా శరీరములో ఎటువంటి కదలికలు లేకుండా పడిపోయారు. వారు, వారిని బయటకు మోసుకొనిపోయిరి. అది అదియే. మనము ఆటలాడు సంఘము కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, దానిపై మీరు ఫీనిక్స్ పట్టణమును జ్ఞాపకం ఉంచుకోనండి.
ఇప్పుడు, ఆ స్త్రీ నిజముగా, ఆమె ఒక దాని గూర్చి భారము కలిగి ఉండెను. ఇప్పుడు, మీరు చూడగలిగినట్లైతే, ఆమెకు మరియు నాకు మధ్య, ఒక వెలుగుయున్నది. ఆమె యొక్క ముఖ వర్చస్సు తగ్గుచున్నది. కానీ ఆమె ఆత్మ శ్రమపడుచున్నట్లుగా అది కనబడుచున్నది. ఆమె ఆత్మసంబంధమైన సమస్యలు వలన ఆమె బాధపడుచున్నది. అది నిజము. అది నిజమైతే, నీ చేయి పైకెత్తు,
107అస్థిరముగా, ప్రతీసారి, "అతడు ఆ స్త్రీ యొక్క వునన్సును చదువుచున్నాడు" అనే మాటలు లోనికి వచ్చుటను నేను అనుభవించుచున్నాను. నేను కాదు. ఈ రాత్రులలో ఒక రాత్రి దానిని నేను కనుగొంటాను, మరియు దానిని కూడా బయటకు పిలుస్తాను. ఒక నిమిషము దానిని మనము ఊహించుచున్నట్లైతే, చూడండి. మనము చూద్దాం! మొదటిగా ఏమి చెప్పబడినదో నేనెరుగను. అక్కడ ఏదో ఉన్నది. అది ఏదో సమస్యవలె కనబడుచున్నది. ఓ, అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు దానిని చూచుచున్నాను. అది ఆత్మసంబంధమైన సమస్య.
వేరొక సంగతి, నీవు రోగపు కట్లను కలిగియున్నావు. నీవు పైత్యపు రాళ్ల సమస్యను కలిగియున్నావు. అది నిజము. అది నిజమేనా? అవునయ్యా, ఒక బలమైన వ్యక్తి గమనించండి, వేరొక విషయం, కొందరి గూర్చి నీవు భారము కలిగియున్నావు. అది కొందరు పిల్లలు. అది నీ పిల్లలు, వారి యొక్క రక్షణ, అది నిజము. ఆ భారము ఇంకొకరి గూర్చి గూడా, అది ఇక్కడే ఉన్నది. దానిని నేను తెలుసుకొనగలుగుచున్నాను. అది నీ యొక్క భర్త మరియు అది అతని రక్షణ గూర్చి. అది నిజము. అతడు ఇప్పుడు ఇక్కడే కూర్చొనియున్నాడు.
నీవు ఇక్కడ నుండి వచ్చినదానవు కాదు. ఎత్తైన పచ్చటి కొండలు, మరియు అత్యధికమైన నీరు ఉన్న ప్రదేశము నుండి నీవు నడచి వచ్చుటను నేను చూచుచున్నాను. అది ఇక్కడ నుండి దూరముగానున్నది. అది ఇక్కడ నుండి ఉత్తర దిక్కున ఉన్నది. ఒరేగాన్ రాష్ట్రం నుండి నీవు వచ్చియున్నావు. అది నిజము. ఆ కొండలు చుట్టు ఉన్న ప్రదేశము నుండి లేదా గ్రాండ్ పాస్ కు దగ్గరగా ఉన్న ప్రదేశము నుండి నీవు వచ్చియున్నావు. నీ మొదటి పేరు లేనా; నీ చివరి పేరు స్టోవెల్. అది నిజం. ఈ రాత్రి యేసుక్రీస్తు నీ విన్నపమును గౌరవించును. ఇంటికి వెళ్ళు - నీ భర్త రక్షింపబడియున్నాడు, నీ పిల్లలు కూడ, మరియు నీ స్వస్థతను నీవు స్వీకరించు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక.
HEB 13:8
108అది ఏమైనప్పటికి, నేను ఎరుగను. అది మాత్రమే టేపు మీద ఉండబోతుంది - కానీ ఆమె విశ్వాసం కలిగియుండి, దానిని నమ్మెనని నేను ఎరుగుదును. ఆయనను ఇప్పుడు నమ్ముచున్నావా? ఆయన, నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడా? అది ఆత్మయై ఉండవలెనని మీరు ఎరుగుదురు. అది ఏమై ఉండునని మీరు తలంచుచున్నారో దానిపైనే ఆధారపడియున్నది.
109ఎలా ఉన్నావు, అమ్మా? ఇప్పుడు, మనం ఒకరికి ఒకరం క్రొత్తవారం నేను, నేను నిన్ను ఎరుగను, మరియు నీవు నా కంటె చాలా చిన్నదానివి. నీ సమస్య ఏదో, లేదా నీ గూర్చినది ఏదైన యేసు నాతో చెప్పగలిగితే నీవు నమ్ముతావా? అది నీవు నమ్మునట్లు నీకు విశ్వాసమును ఇచ్చునా? నేను ఆయన సేవకుడనై యున్నానని నీవు నన్ను నమ్ముచున్నావా? నేను ఏమి ఎరుగనని నీవు ఎరుగుదువు. అది తెలుసుకొనుట నాకు అసాధ్యము. అది ఆయన నుండి రావలసియున్నది, ఆత్మ మరియు ఈ సమయమునందు ఏదో జరగబోవుచున్నది అని నీవు ఎరిగియున్నావు. అది ఆయన సన్నిధియైయున్నది.
నీవు ఖచ్చితముగా నీ అంతట నీవే నిలువబడలేదు. నీవు చాలా సమస్యలు కలిగియున్నావు. నీవు ఆత్మసంబంధమైన, ఆత్మసంబంధమైన చాలా సమస్యలు కలిగియున్నావు. వాటి గూర్చి నీవు విస్మయము చెందుచున్నావు. అది నీవు వాటి కొరకు నీవు సమాధానమును పొందబోవుచున్నావు. మీ సంఘములో జరుగబోవుదాని గూర్చి నేనేమైతే మాట్లాడుచున్నానో దానిని నేను ఎరిగినట్లు, కేవలం మీరును ఎరుగుడి. అది నిజము. అది నిజము. అది వ్యాపార సంబంధమైనది. అది మీ సంఘములో జరుగుచున్నది. అది సరైనదిగా నీవు భావించుట లేదు. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది సత్యము.
మరియు వేరొక సంగతి, దరిదాపు చనిపోయిన ఒక వ్యక్తి కనబడుటను నేను చూచుచున్నాను. అది ఒక కేన్సర్ కేసు. నీ దేశములో ఉన్న ఒకరి కోసం, ఆ కేన్సర్ నిమిత్తము నీవు ప్రార్ధించుచున్నావు. మరియు నీవు కూడా ఒరేగాన్ నుండి వచ్చియున్నావు. ఇక్కడ ముందుండిన స్త్రీ దేశము కుడా అదే, అది నిజము. నీవు దేని నిమత్తము అడిగితివో దానిని స్వీకరించు. ఇంటికి తిరిగి వెళ్ళు. నీ విశ్వాసము దానిని నీకు అనుగ్రహించును. ఈ స్త్రీని నేను ఎన్నడు తాకలేదు. కానీ ఆమె నిమిత్తం దేవుడు చేసెను. కేవలం నీవు నమ్ముము.
ఎట్లా ఉన్నావు, అమ్మా మనం ఒకరికి ఒకరం క్రొత్తవారము, ప్రభువైన యేసు మనలను ఇద్దరినీ ఎరుగును. ఇప్పుడు, ఒక్క క్షణం, వినేవారిలో ఏదో సంభవించినది. నిజమైన భక్తిగలవారుగా ఉండండి. ఇక్కడ ఉన్న స్త్రీ ముందు, ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు, విశ్వాసములో ఉన్న వ్యక్తి అది ఎవరైనప్పటికీ, కేవలం ప్రార్ధన చేయండి. అతన్ని నేను కోల్పోయాను. కేవలం ప్రార్ధన చేస్తూ ఉండండి.
మరలా, చూడండి. మీతో మాటలాడుటకు, ప్రతీ వారు ఒక ఆత్మ చూశారా? మరియు జనులు నమ్ముట ప్రారంభించుచున్నారు, మీరు చూడండి. మరియు అది దానిని చేయును, చూడండి, ప్రతీ వారి విశ్వాసము ప్రతీ మార్గమును లాగును, మీరు చూడండి. ఆ కారణంచేత ఇక్కడ నాకు ముందు ఎవరో ఒకరిని నేను కలిగియుండవలసియున్నది. ఇక్కడ దైవసేవకులు కూడా కూర్చొని యున్నారు, వారు రోగులు, వారు ఇప్పుడే ప్రార్ధన చేయుచున్నారు, చూశారా. మరియు వారు చూస్తున్నారా? మరియు ప్రార్ధనా కార్డుతో ఉన్న మిమ్ములను నేను పిలిచాను.
నేను మిమ్ములను ఎరుగను కానీ దేవుడు మిమ్ములను ఎరుగును. ఒకవేళ ప్రభువైన యేసు నీవు నీ జీవితములో చేసిన దేనినైనా, చేయబోవుచున్నదైనా, లేదా నీలో ఉన్న తప్పిదమేదైనా, ఒకవేళ నీవు రోగముతో ఉంటే, బహుశా గృహసంబంధమైన సమస్య, లేదా బహుళా ఆర్ధిక సమస్య ఏదైనా నాకు చెప్పిన ఎడల, అది ఏమిటో నాకు తెలియదు. కానీ అది ఏమైనా, ఒకవేళ ఆయన చెప్పినట్లైతే, అది సత్యమో కాదో నీవు ఎరుగుదువు. నీవు నమ్మెదవా, మరియు నీవు ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నావని నమ్మెదవా? నా సన్నిధి కాదు, లేదా ఈ జనులు, సన్నిధి, ఇప్పుడు నీవు అనుభూతి చెందుచున్న విధముగా అది నిన్ను అనుభూతి చెందించలేదు. అది ఆయన సన్నిధి.
110ఈ స్త్రీ ప్రక్కగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు స్తూలకాయుడు. అది ఏదో ఒక దానిలా ఉన్నది. నేను దానిని చూచుచున్నాను. నేను ఎరిగిన ఒక వ్యక్తి, పాల్కయిన్, ఒక దైవ సేవకుడు, అతనికి నీవు స్నేహితురాలివై ఉన్నావు. అతనిని నీవు ఎరుగుదువు. అది నిజము. కారణం అక్కడ అతడు ఉన్నాడు. అది నిజము. అతడు నీ నిమిత్తము ప్రార్ధించెను. మరియు నీ సమస్య, ఒక గాయమును, రొమ్ము మరియు కడుపు మధ్య భాగములో ఒక చిలికిన పుండును నీవు కలిగియున్నావు. అది నిజము. అది అనేకమైన కలతలను మరియు అనేక రకాల వ్యాధులను కలుగజేసెను. నీవు ఇక్కడ నుండి రాలేదు. నీవు ఇక్కడకు పశ్చిమ నుండి వచ్చితివి. నీవు కాలిఫోర్నియా నుండి వచ్చితివి. నీవు యేసుక్రీస్తును నమ్ముచున్నావా?ఆయనను నీవు అంగీకరించుచున్నావా? కుమారి మోస్, నీవు బాగుపడి, తిరిగి ఇంటికి వెళ్ళగోరుచున్నావా? తిరిగి వెళ్ళి మరియు దానిని నమ్ము, ఇప్పుడే దేవునియందు విశ్వాసమును కలిగియుండు. సందేహింపవద్దు, మరియు అది జరుగుటకు తీసుకొనిరాబడును.
మీరు యేసుక్రీస్తును నమ్ముచున్నారా? ఎట్లా ఉన్నారు? మనం ఒకరికి ఒకరం, క్రొత్తవారము, అవును. ప్రభువైన యేసు మన ఇద్దరిని ఎరుగును, నేను నిన్ను ఎరుగను. కానీ ప్రభువైన యేసు నిన్ను ఎరుగును. (అది ఒక వెలుగు. అది వేదికను ఇప్పుడే వదలి వెళ్ళుచున్నది. మీరందరూ అదే విధముగా నమ్మియుండుడి. ముందుకు సాగండి, కేవలం విశ్వసిస్తూ ఉండండి. చూస్తున్నారా? ప్రార్ధన చేస్తూ ఉండండి.) నీవు ఒక ఎదుగుదలతో బాధపడుచున్నావు. ప్రభువైన యేసు ఆ ఎదుగుదల ఎక్కడో నాతో చెబితే నీవు దానిని నమ్ముతావా? అది నీ కుడి రొమ్ము వైపు, ఊపిరి తిత్తుపై. అది నిజము.
నీవు ఇక్కడ నుండి రాలేదు. ఎవరో నిన్ను ఇక్కడకు పంపారు. చెప్పు, ఇంతకు ముందే ప్రార్ధన వరుసలో నీవు ఉన్నావు. నీవు చికాగో నుండి వచ్చియున్నావు. మరియు నీవు ఒకసారి కూటమిలో స్వస్థత పొందితివి. అది నీతో చెప్పబడినది, నీ ప్రక్కలో సమస్య, లేదా కాలు, లేదా అలాంటి ఏదో మరియు నీవు ఆ కూడికలో స్వస్థత పొందియున్నావు. బూడిద రంగు జుట్టు గల వ్యక్తి, మరియు అతడు కలిగియున్నాడు, మీసము గలవాడు. అతడు పాస్టర్ మట్సన్బోజ్, ఫిలడెల్ఫియా సంఘములో అతడే నీ సంఘ కాపరి, అక్కడ నుండే నీవు వచ్చావు, అతడే నిన్ను ఈ రాత్రి ఇక్కడకు పంపాడు. అది నిజము. యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా బాగు చేయుచున్నాడు. ఆనందిస్తూ, చికాగోకు తిరిగి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను పూర్తి బాగు చేయుచున్నాడు. "నీవు నమ్మగలిగితే, సమస్తము సాధ్యమే."
MAL 4:6
111ఎట్లా ఉన్నావు? మనము ఇరువురము క్రొత్త వారము. నేను నిన్ను ఎరుగను, కానీ యేసుక్రీస్తు నిన్ను ఎరుగును. ఆయన ఆత్మ నాకు అనుగ్రహించ సమర్దుడని నీవు నమ్ముదువా? అది, ఒక దైవ సేవకునిగా నేను సరిపోను, మీరు ఎరుగుదురు. కానీ చివరి దినములలో వాగ్దానము చేయబడిన పరిశుద్ధ గ్రంధములోని వరము ద్వారా "పిల్లల విశ్వాసమును తండ్రుల వైపునకు త్రిప్పును" దాని నిమిత్తం ఆ ఘడియ వచ్చెనని నీవు నమ్ముచున్నావా? మరియు ఈ దినమున సంఘములో జరుగుచున్న ఆ పరిచర్యను నమ్ముచున్నావా?
నీవు కూడా, చికాగో నుండి వచ్చితివి, ఎందుకనగా నీవు ఒక వీధిపై నడుస్తూ ఉండుట. నేను చూచుచున్నాను. నాకు, క్లార్క్ వీధివలె కనబడుతుంది. అది నిజము. నీవు కీళ్ళ సమస్యతోను శరీరములో అనేక సమస్యలతోను బాధింపబడుచున్నావు. ఇప్పుడు నీవు తిరిగి వెళ్ళవచ్చు. నీ విశ్వాసం నిన్ను బాగుచేయును. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక! నీ హృదయమంతటితో నమ్ముతూ, వెళ్ళుము.
కీళ్ళనొప్పులను దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? నీ కుర్చీ యొద్దకు తిరిగి వెళ్ళి మరియు దాని నిమిత్తం ఆయనకు వందనములు చెప్పు. స్వస్థపడుము, బాగవుము.
అమ్మా, ముందుకు రాగలవా? ఆ పాత కడుపు జబ్బుపోయింది. తినుటకు ఇష్టపడుచున్నావా? మరలా మంచిగా ఉండు, వెళ్ళు, తినుము, యేసు నిన్ను బాగుచేయుచున్నాడు.
112స్త్రీ, ఒక చిన్న బిడ్డతో ఒక స్త్రీ, ఆ బిడ్డను దేవుడు స్వస్థపరచబోవుచున్నాడని నీవు నమ్ముచున్నావా? ఆ బిడ్డ యొక్క సమస్య ఏమిటో నేను నీతో చెప్పగలను, కానీ నేను దానిని స్వస్థపరచలేను. మధురమైన హృదయమా, ఇలా చూడుము. ఒక చిన్న బాలికను. అక్కడ నేను చూస్తున్నాను, నీవలె యున్నది. చాలా సార్లు నేను ఆమెను విడచితిని, ఇప్పుడు నీవు చేయుచున్నట్లుగానే, ఏడ్చుచున్నది, వెళ్ళి చిన్న బాలికలను చూడుము. నీ గుండె జబ్బును యేసు స్వస్థపరచి బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? ఇక్కడకి, రమ్ము. నా యొద్దకు రమ్ము. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఈ బిడ్డ యొక్క ప్రాణమును రక్షింపనిమ్ము. యేసుక్రీను నామములో ఆమె ప్రాణము నిమిత్తం నేను అడుగుచున్నాను. ఆమేన్. దానిని సందేహించవద్దు, సహోదరీ, దానిని సందేహించవద్దు, వెళ్ళి నమ్ముము. అది అంతా సరగును. నీ పూర్ణహృదయముతో ఇప్పుడు నమ్ముము.
113అమ్మా, రమ్ము. ఆ స్త్రీ జబ్బును దేవుడు స్వస్థపరచగలడని, స్త్రీ సమస్యను,ఆ రక్తస్రావము ఆగిపోవునని నీవు నమ్ముచున్నావా? తిరిగి వెళ్ళు. నీ పూర్ణహృదయంతో దానిని నమ్ముము మరియు స్వస్థపడుము.
మరలా శ్వాసించునట్లు, మంచిగా మరియు స్వేచ్చగా, ఆ పాత ఉబ్బసం వ్యాధి మరియు అజీర్తి నుండి విడిపింపబడుము, ఇంటికి వెళ్ళి మరియు నీ హృదయమంతటితో నమ్ముము. నీవు స్వస్థపడి మరియు బాగుపడగలవు. నీ హృదయమంతటితో నమ్ముము.
దేవుడు గుండె జబ్బును కూడా స్వస్థపరచును. అది నిజము. దానిని నీవు నమ్ముచున్నావా? తిరిగి వెళ్ళి మరియు, "ప్రభువైన యేసు నీకు వందనములు" అని చెప్పు, మరియు ఆయన నామమును స్తుతించుము మరియు నీవు బాగుపడతావు. యేసుక్రీస్తు నామములో, దీనిని ఆమెకు అనుగ్రహించుము.
మీరు నమ్ముచున్నారా? ఎంత మంది నమ్ముచున్నారు?
114ఆ రోగపు మంచము మీద ఉన్న నీ గూర్చి ఏమిటి? నీవు నమ్ముచున్నావా? నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? నా భావము ఆయన యొక్క సేవకునిగా? (అది జనులను తడబడేటట్టుగా చేస్తుంది.) నిన్ను నేను ఎరుగను. నీవు కేవలం అక్కడ పడివున్న స్త్రీవి, నీవు రోగపు మంచముపై పడియుండుట నేను చూచుచున్నాను. నేను ఆయన సేవకునినని నీవు నమ్ముచున్నావా? నీ సమస్య ఏమిటో దేవుడు నాకు బయలు పరచగలిగితే, ఆయనను నిన్ను స్వస్థపరచువానిగా అంగీకరిస్తావా?
నీవు మరణపు నీడలో ఉన్నావు. నీపైన ఒక చీకటి నీడయున్నది. నీవు అక్కడే ఉంటే, నీవు చనిపోతావు. డాక్టర్ యొద్దకు వెళ్ళట నీకు ఏ మంచిని చేయదు. అతనిని సంబంధించినంత వరకు, అదంతా అయిపోయింది. నిన్ను చంపుచున్న ఆ కేన్సర్ రోగము నిన్ను స్వస్థపరచువానిగా యేసుక్రీస్తు నీవు ఎందుకు అంగీకరించవు? నీ రోగపు మంచముపై ఉండి చేయి ఎత్తి, దానిని తీసుకొని మరియు ఇంటికెళ్ళి మరియు దానిని నీవు నమ్ముచున్నావా? దానిని అంగీకరించుము, మరియు అప్పుడు ఇంటికి వెళ్ళు, పైకి లేచి, దానిని నమ్ము మరియు ఆయన లేచియున్నాడు.
తెల్లని కోటు ధరించి, చేయి పైకెత్తియున్న నీ గూర్చి ఏమిటి? నేను దేవుని సేవకుడునని నమ్ముచున్నావా? అయ్యా? నీ సమస్య ఏమిటో దేవుడు నాతో చెప్పగలడని, నీవు నమ్ముచున్నావా? నీవు మంత్రములతో కూడిన దానిని కలిగియున్నావు. అది మూర్ఛవ్యాది. అది నిజమైతే వేరొక చేయి పైకెత్తు, ఇప్పుడు, నీ హృదయమంతటితో ఆయనను విశ్వసించుము, మరియు ఎప్పుడు ఏ మంత్రమును కలిగియుండవు. దానిని నమ్మవలెనని సవాల్ చేయుచున్నాను.
115చొక్కా ధరించి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని, నా వైపు చూస్తున్నాడు. తిన్నగా ఇక్కడికే చూస్తున్నాడు. గుండె సమస్యతో నీవు బాధపడుచున్నావు. నేను నిన్ను ఎరుగను, కాని అది సత్యము. అది నిజమేనా? నన్ను నీకు మరలా చెప్పనీవు. నీవు ఒక దైవ సేవకుడవు. నీకు సంఘములు ఉన్నాయి. వాటిని నీవు దర్శిస్తువుంటావు. నల్లనిజాతి ప్రజలవలె కనుబడుతుంది. అది మెక్సికో, అది నిజము. నీవు ఒకరి యందు ఆసక్తిని కలిగియున్నావు. ఆమె నీ ప్రక్కనే కూర్చొనియున్న నీ భార్య - ఆమె యొక్క సమస్య ఏమిటో దేవుడు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? నేను ఆమెను స్వస్థపరచలేను, కానీ ఆమె సమస్య ఏమిటో నేను నీతో చెప్పగలిగితే, ఆమె స్వస్థత నిమిత్తము నీవు నమ్మగలవా? ఆమె చెవులు యందు ఆమెకు చెవుడు వున్నది. నీ చేతులను ఆమె చెవులపై ఉంచుము. మరియు నీ హృదయమంతటితో నమ్ముము. మరియు ఆమె స్వస్థపడగలదు.
అదే కార్యమును ఎంత మంది నమ్ముతారు? ఆమేన్! గాలిలోకి మీ చేతులు ఎత్తండి, మిమ్మును స్వస్థపరచువానిగా యేసుని అంగీకరించండి. ఆయనను నమ్ముచున్న నీవు ఎన్నడూ రక్షింపబడని నీవు, బలిపీఠము యొద్దకు ఇప్పుడే ఎందుకు రావడం లేదు? ఆ తల్లి జింక చేసినట్లుగానే, నీ హృదయంలో ఒక అనుభూతి కలిగి ఉండవలెనని నీవు ఆశపడుచున్నట్లు నీవే చెప్పావు. నీ రక్షకునిగా ఆయనను అంగీకరింపగోరుచున్నావా? ఇప్పుడే ఇక్కడకు వచ్చి బలిపీఠము నొద్ద నిల్చొని, ఆయన సన్నిధిలో నీవు ఉండగా, నన్ను ప్రార్ధింపనిస్తావా? మీలో ఇక్కడ చాలామంది, తప్పనిసరిగా వచ్చి మరియు ఇక్కడ నిలువబడండి. మీ రక్షకునిగా క్రీస్తుని నీవు అంగీకరింపగోరితే, ఇప్పుడే రమ్ము. అలాగ వస్తారా? అయ్యా! దేవుడు మిమ్మును దీవించును గాక! దేవుడు మిమ్మును దీవించును గాక. మంచిది.
116ఆయనను అంగీకరింపగోరువారు ఎవరైనా? ఆయన సన్నిధిలో, ఆయనకు అతి దగ్గరగా మీరు ఎట్లా రాగలరు? ఆయన, ఆయన మీ సమస్య ఏమిటో చెప్పగలిగితే, ఆయన చెప్పుచున్నాడు, ఆయన మీకు అవసరమైయున్నాడు. ఇప్పుడే పైకి రమ్ము. ఆయన లేని నీవు ఇప్పుడే రమ్ము మరియు నీ వ్యక్తిగత రక్షకునిగా ఆయనను స్వీకరించు. ఆయన సన్నిధిలో ఇక్కడ నిలువబడు. నీవు ఎవరైనప్పటికి, నీవు సంఘ సభ్యుడవైననూ, నీవు ఎవరైనప్పటికి సమస్యలేదు. దేవునితో నీవు సరిగా లేకపోతే, నేను నిన్ను అడుగుచున్నాను, యేసుక్రీస్తు నామములో సవాలు చేయుచున్నాను, విశ్వాస సహితమైన ప్రార్ధన నేను చేయుచుండగా, చోటికి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉండగనే, ప్రార్ధనా వరుసను మేము ముగింపక ముందే, ఇప్పుడే ముందుకు రమ్ము.
రోగులను స్వస్థపరచునట్లు, ఆయన నా మనవి ఆలకిస్తే, ఖచ్చితముగా నశించినరిని రక్షించుటకు, ఆయన నా మనవి ఆలకించును. ఆయనను నీ రక్షకునిగా కోరుకునే నీవు, యేసు నామములో ఇప్పుడే ముందుకు రమ్ము. ముందుకు నడువుము, ప్రార్ధన కొరకు ఇక్కడే బలిపీఠం చుట్టూ నిలువబడి, కేవలం ఈ సమయమందే. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. దానిని నేను ఇష్టపడుచున్నాను — నేరము క్రిందనున్న పురుషులును, స్త్రీలును, పరిశుద్ధాత్మ తానే బయటకు తెచ్చును, బలిపీఠము నొద్దకు వారిని తీసుకొని వచ్చును.
117ఈ చివరి దినములలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమునకు సాక్షిగా ఉన్నట్లు నమ్ముతున్న నీవు, అనగా, ఇదే కార్యమును పరిశుద్ధ గ్రంధము, వాగ్దానము చేసినది. అది నేనైయుండలేను; నేను ఒక మనిషిని. అది నీ రక్షకుడు. నేను మీతో చెప్పుచున్నాను, అతడే యేసుక్రీస్తు, వాక్యము మీద నా చేతితో, అతడు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. ఆయన జనుల మధ్యలో ఆయన శక్తి యొక్క సంపూర్ణతతో ఆయన తన్ను తానే ప్రత్యక్షపరుచుకొనినప్పటి నుండి, ఆయన యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది.
ఒకవేళ నీవు సందేహములను మరియు ఆటంకములను కలిగియుండిన ఎడల నులివెచ్చని సంఘ సభ్యునివలె, అయితే, ఈ రాత్రి వచ్చి మరియు ఆయన ఇక్కడ ఉన్నాడని, లేఖనము ద్వారా, తప్పిపోని ఋజువులను కనబరుచుచూ, పరిశుద్ధాత్మ తనంతట తానే ఇక్కడ ఉండగా పరిశుద్ధాత్మతో నింపబడుము. అది ఆయనే! నీ జీవితములో యేసుక్రీస్తు కోరుచున్న ప్రతీ ఆత్మ, ఇప్పుడే, రమ్ము, ఇప్పుడే ముందుకు రమ్ము మరియు ఆయనను అంగీకరించుము. ఇప్పుడే రండి.
…….. సాధ్యమే, కేవలం నమ్ముము.
దానిని మనం పాడుచుండగా, ఇప్పుడు మీరు రారా?
కేవలం నమ్ముము…….
"కేవలం నమ్ముము" ఏమిటి? మీకు ఏమి చెప్పబడినదో, ఆ బైబిల్ సత్యాన్ని కేవలం నమ్మండి. దానిని ఋజువు చేయుచూ, ఆయన ఇక్కడ ఉన్నాడు. స్వస్థతా ఆరాధన మధ్యలోనే ఆయన నాతో ఎందుకు చెప్పెను, "బలిపీఠము నొద్దకు జనులను పిలువుము" అని స్వస్థతా ఆరాధనలో ఆయన నాతో ఎందుకు చెప్పెను? అది ఎవరో ఒకరి యొక్క ఆఖరి అవకాశం అయ్యి ఉండవచ్చు. నేనెరుగను. నేనెరిగిన ఏకైక కార్యం, ఆత్మకు లోబడుట.
……, కేవలము నమ్ముము,
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము.
ప్రభువా, నేను నమ్ముచున్నాను;
ప్రభువా, నేను నమ్ముచున్నాను;
సమస్తమూ సాధ్యమే…..
118సరే, సేవకులైన సహోదరులారా, ఇక్కడే, ఈ మార్గమునకు రండి.
ప్రభువా, నేను నమ్ముచున్నాను…
ఒక ఖాలీ ప్రదేశం, సహోదరుడా, ఇక్కడకు రండి, వ్యక్తిగత పరిచారకులను ఇప్పుడు చేరనివ్వండి, ఈ జనుల నిమిత్తం మనం ప్రార్ధించెదము.
…నేను నమ్ముచున్నాను,
ప్రభువా, నేను నమ్ముచున్నాను;
సమస్తమూ సాధ్యమే…
"పెంతెకొస్తు దినమునాడు వారు చేసినట్లుగా పరిశుద్ధాత్మను పొందుట,
నాకు సాధ్యము కాదా?" నిశ్చయముగా, మీరు దానిని నమ్మితే,
……నమ్ముము,
కేవలం నమ్ముము, ………
LUKE 17:28,30
119తన బిడ్డ కోసం ఆ తల్లి జింక కలిగియున్న ఉన్నట్లుగా ఈ యొక్క నిజమైన ప్రేమ అనుభవాన్ని మీరు కోరుచున్నారా? మీ అనుభవము అలా లేకపోతే మీరు ఎదగనట్లే. రండి. మీ జీవితములో యేసుక్రీసును ప్రత్యక్షపరచుటకు మీరు కోరితే, రండి. సంఘము ఇక ఎన్నటికి ఆటలాడవద్దు.
ఆ ఘడియ ఇక్కడ ఉన్నది, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్పదానితో మనము వ్యర్ధముగా ప్రవర్తింపనే కూడదు, రెండు వేల సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈ దినమున యేసుక్రీస్తు యొక్క తప్పిపోజాలని ఋజువులు సజీవముగా ఉన్నాయి. మీరు రారా? నంఘము దాని యొక్క చివరి వరమును స్వీకరించుచున్నది. దేవుని వాక్యప్రకారముగా, యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా, సంఘమునకు రాబోవుచున్న చిట్టచివరి కార్యము ఇదియే, "లోతు దినములలో ఉన్నట్లుగా దేవుని కుమారుని రాకడ ముందును ఉండును," అని యేసు చెప్పెను. ఇక్కడే మనము ఉన్నాము.
120రమ్ము, మీరు రారా, ఆయనను ఎరుగని ప్రతీ ఆత్మ ఈ రాత్రి సందేహములో ఉన్న ప్రతీ ఆత్మ వచ్చుటకు ఇష్టపడుట లేదా? ఈ గొప్ప అవకాశమును మిమ్మును దాటిపోనియ్యకుడి. మనము ఈ స్థలము చుట్టూ కూడుచుండగా, ఇప్పుడు మీరు వచ్చి ప్రార్థన కొరకు నిలువబడరా? సరే. వస్తూ ఉండండి. మేము, మేము మిమ్ములను చూడగోరుచున్నాము, ప్రతీ ఒక్కరు. మీరు ఏ సంఘమునకు చెందిన వారైనప్పటికి సమస్యే లేదు. ఇక్కడకు తప్పనిసరిగా రావలెనని నేను నిజముగా కోరుకొనుచున్నాను. గనుక, మనము ఒక్క క్షణము ఎదురు చూద్దాం.
సంఘ సభ్యత్వం కొరకు మేము మిమ్ములను అడుగుట లేదు. మీరు వచ్చి క్రీస్తును స్వీకరించవలసినదిగా మేము మిమ్ములను అడుగుచున్నాము. గతించిన దినములలో ఆయన చేసిన రీతిగా, మీరు ఆలోచించే అవే ఆలోచనలను ఆయన ఎరిగి, వాటిని మీకు వివరించునట్లు, హృదయ రహస్యములను ఎరిగి, వాటిని ఇక్కడే బయలు పరచగలిగిన ఆ దేవునిని నీవు స్వీకరించుటకు ఇష్టపడుతున్నావా?
ఇప్పుడు, ప్రభువు దీవించును గాక.
121ఇప్పుడు, బలిపీఠం చుట్టూ వీరందరూ ఉండగా, మరియు ఇతరులు వచ్చుచుండగా, మనం ప్రార్ధన చేయుచుండగా, ఇప్పుడు ఒక క్షణం వినేవారిలో ఒక్కొకరు లేచి నిలువబడదాం. ఇప్పుడు, రోగులై బయట ఉన్నవారు ప్రార్ధనా వరుసలో ఉండకపోవచ్చు, మీరు మీ యొక్క చేతులను ఒకరిపై ఒకరు ఉంచండి. స్వకీయ పరిచారకులు, మరియు సేవకులు, చేతులను ఈ జనులపై ఉంచండి.
మీరు సిద్ధముగా ఉన్నారా? నిజమైన దానిని మీరు చూశారా? మీ హృదయమును ఏదైనా కదిలించినదా? "యేసుక్రీస్తు" ఈ రాత్రి సజీవుడని తెలుసుకొనుటకు ఒక్కసారిగా, ఏదైనా మీకు వాస్తవ్యముగా అనిపించినదా?
ఇప్పుడు మన తలలు వంచుదాం, ప్రతీ వారు మీ స్వంత విధానంలో ప్రార్ధించండి. గుర్తుంచుకోండి, ఇప్పుడే ప్రపంచమంతట లక్షల కొలది ప్రార్ధనలు పైకి వెళ్ళుచున్నవి. దేవుడు అనంతుడు, గనుక వాటిలో ప్రతీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించుచున్నాడు. మీ సొంత సంఘములో నీవు ప్రార్ధించు రీతిగా ఇప్పుడు ప్రార్ధించు. నీ పాపములు క్షమింపబడుటకు దేవునికి ప్రార్ధించుము. పరిశుద్ధాత్మతో నీవు నింపబడుటకు, ఆయనను ప్రార్ధించుము. నిన్ను స్వస్థపరుచుటకు దేవున్ని ప్రార్ధించు. సరే! ఆ విధముగా మీ మధ్యలోనికి పరిశుద్ధాత్మ దిగి, మీకు గొప్ప విజయమును మరియు స్వతంత్రమును అనుగ్రహించును.
122పరలోకపు తండ్రి, ఈ వినేవారిని ఇప్పుడే నీ యొద్దకు మేము తీసుకొని వచ్చుచున్నాము. సమాధిలో నుండి యేసుక్రీస్తును పైకి లేపిన ఆ శక్తి, ఈ సంఘమును ఇప్పుడే కదిలించును గాక! ఆ స్వస్థపరిచే శక్తి… సాతాను శక్తి నుండి ప్రతీ రోగి విడుదల నొందును గాక, నశించిపోయిన ప్రతీ ఆత్మరక్షింపబడును గాక, మరియు రక్షణ పొందిన ప్రతీ వ్యక్తిని పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముతో నింపండి. దానిని అనుగ్రహించండి, ప్రభువా.
ఇంతకు ముందెన్నడూ ప్రార్ధించని రీతిగా నీవు ప్రార్ధించుము. ఇదే నీ చిట్టచివరి క్షణముగా, చనిపోతున్న రీతిగా ప్రార్ధించు.