సమావేశములు
1సువార్త పొలములో కొద్దికాలం ఉండి పిమ్మట వచ్చి మీ సాక్ష్యములను వినుటకు, మరియు ఎవరో ఒకరు సాక్ష్యం ఇచ్చుట. జెఫరీస్ సోదరుని చూచుటకు నేను నిశ్చయముగా సంతోషిస్తున్నాను. నేను అక్కడ క్రిచీని కూడా పిలిచాను. అతడు సభలోనే ఉన్నాడా లేదో నాకు తెలియదు. అయితే ఇవి మీకు చాలా ఎక్కువేనని నేను ఎరుగుదును. యుద్ధ రంగము నుండి వచ్చి కాంతులు సరిగ్గా లేని స్థలం నుండి రావటం, పిమ్మట ఇలాంటి క్రైస్తవ అద్భుతవాతావరణం కిందకు రావడం, మరియు ఇచ్చట ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా ఆత్మలో స్వాతంత్రం కలిగి ఉన్నారు. ఎక్కడైతే ప్రజలు స్వాతంత్రం కలిగి ఉంటారో, స్వేచ్ఛా భావన కలిగి ఉంటారో అలాంటి దానిని గూర్చినది. మేము బిగుతైన వస్త్రధారణతో ఉండాలనుకోవడం లేదు. వారి గృహాలలో మేము స్వేచ్ఛగా ఉండాలని వారు మాకు చెప్పారు. నేను దానిని ఇష్టపడతాను. మేమంతా అలాగే ఉంటామని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. అలా ఉండము అంటారా? [సమాజము "ఆమెన్" అని చెప్పుచున్నది.]
2నేను నా కుమార్తె రిబకా వైపుగా ఇచ్చట చూసి నేను ఆలోచిస్తూ ఉండగా. ఒకసారి నేను నాకు గుర్తున్నది, సభకు ఆవలి వైపునకు వెళ్ళినది. మరియు అప్పుడు ఆమె చాలా చిన్నది, మరియు ఆమెకు ఒక చిన్న చెల్లి ఉన్నది, తనకన్నా నాలుగు సంవత్సరముల చిన్నది. మరియు బెక్కి నీలవర్ణపు-కండ్లు గలది మరియు కొద్దిగా పొడుగ్గా ఉంటుంది, మరియు శారా అయితే బూడిదరంగు-కండ్లను కలిగి ఉంటుంది మరియు ఆమె కొద్దిగా పొట్టిది. అయితే వారిద్దరూ నాయొక్క కుమార్తెలే మరియు నేను నిజముగా పిల్లలను ప్రేమిస్తాను, మరియు ప్రభువు నాకు మంచి చక్కని పిల్లలని ఇచ్చారు.
మరియు వారు నన్ను చూచుటకు ఎదురుచూస్తున్నారు. నేను లోనికి వచ్చినప్పుడు, నాతో వారు కొద్దిసేపు ఆడుకోవాలని అనుకున్నారు. అయితే వారిని నిదురపుచ్చే బూచోడు వారి కళ్ళ మీదకు వచ్చాడు. వారు ఇప్పుడు నిద్రలోనికి వెళ్లాలి, పన్నెండు లేదా ఒంటిగంట సమయం మధ్యలో సుమారుగా మరియు ఉదయం రెండు లేక మూడు గంటల సమయం వరకు. ఆ యొక్క పండుకొనే ఉపరితలం సరిగ్గా లేనందువలన నేను క్రిందికి వెళ్ళాను, అయితే అచ్చట కూడా నిద్రపోలేకపోయాను. నేను నా యొక్క పడకగదిలో ఉన్న కుర్చీలోనికి వెళ్లి కూర్చున్నాను. అయితే ఇచ్చట ఒక రకమైన హాస్యము జరిగినది వారిమీద, అది నేను మీకు చెప్తాను అదేమిటంటే….
3కొంత సమయం పోయాక, సూర్యోదయం జరిగినది, మరియు రిబ్కా ఇచ్చట నిద్రలేచినది. మరియు ఆమెకు తెలుసు నేను ఇంటివద్ద ఉండాలని మరియు శారా ఇంకా నిద్రపోవుచుండట ఆమె చూచినది. అయితే నేను గదిలో ఉండుట ఆమె చూసినది. మరియు ఇచ్చటకు ఆమె వచ్చినది, ఆమెకు రాగలగినంతగా వచ్చినది, మరియు నా యొక్క ఒడిలోనికి దూకినది, రెండు చేతులతో. మరియు ఆ సమయంలో, శారా, ఆమె యొక్క చిన్న చెల్లి కూడా నిద్రలేచినది. మంచిది, ఆమె చూసినది, అయితే బెక్కి ఆమెను ఇదివరకే నా దగ్గరకు పంపినది.
కావున ఇది ఇక్కడున్న సంఘముతో చాలా కాలం క్రితం దీనిని సరిపోల్చుచున్నాను.
మరియు బెక్కి కొద్ది సన్నగా ఉంటుంది. పొడుగాటి కాళ్లు కలిగినది. మరియు ఆమె నా యొక్క ఒడిలో మంచిగా వాస్తవముగ కూర్చుంటుంది. మరియు అప్పుడు తన కాళ్లు నేలకు తాకుతాయి, అయితే ఆమె సరిగ్గా వాటిని సంతులనం చేసుకుంటుంది. ఆ విషయం మీకు తెలుసా.
ఇట్టి రకమైన ఒక మెథడిస్ట్ సహోదరుడు, ఇచ్చట ఒక వ్యక్తి ఉన్నాడని నేను చెప్పుచున్నాను, ఎంతో కాలము నుండి ఇక్కడే ఉన్నాడు, మీకు తెలుసా, మరియు చిన్ననాటి నుండి పెరిగి ఉన్నాడు.
మంచిది, శారా ఒక చిన్న పొట్టిది. మరియు మీ యొక్క పిల్లలు అలా ఉంటారో లేదో నాకు తెలియదు. నా వాళ్లు అయితే అలా ఉంటారు. ఒకరు పెద్దది మరియు ఇంకొకరు చిన్నది. మరియు వీరిలో ఒకరికొకరు పక్కపక్కగా వెళ్తారు. మరియు శారా బెక్కి యొక్క రాత్రి దుస్తులు వేసుకున్నది. అవి కుందేలు-కాళ్లు లాంటి దుస్తులు. వారు అలా వేసుకుంటారు, మీకు తెలుసా, అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, మరియు ఆమె యొక్క చిన్న పాదములు వాటికి సరిగ్గా సరిపోవు. కావున ఆమె ఇంటి చుట్టూ వాటితో తిరుగుతూ ఉంటాది.
4మరియు రిబకా తన యొక్క రెండు చేతులను నా చుట్టూ వేసి నన్ను పట్టుకొన్నది. మరియు ఆమె చుట్టూ తిరిగి, శారా వైపు తిరిగి చెప్పినది, "శారా, నా చెల్లి, నీకు నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేమనగా నేను మొట్టమొదటిగా ఇచ్చటకు వచ్చాను." ఆమె చెప్పినది, "డాడీని నేనే మొత్తము పట్టేసుకున్నాను నీకు ఇంకా ఎక్కడ చోటు లేదు". మంచిది, శారా ముందుగా వచ్చినట్లుగా భావించినది, మీకు తెలుసా, అప్పుడు ఆమె యొక్క పెదాలు క్రిందికి ఒరిగినవి.
మరియు నన్ను ఒక రకముగా ఏదో గుర్తుకు తెచ్చుచున్నది, బహుశా చాలా కాలం క్రితం, రహదారి పైన ఉన్న సంఘములు, మీకు తెలుసా. వారు దాని యొక్క లోపటా మరియు బయట అన్నియు కలిగియున్నారు, మరియు వారు వారి యొక్క సమస్త వేదాంత శాస్త్రముతోను పట్టుకొని ఉన్నారు, మరియు దానిని వివరించారు, మరియు దానిని గ్రీకు భాషలో మాట్లాడారు, మరియు అలాంటివి చేశారు. వాటిని ఇప్పుడు నేను రిబ్కాతో సరిపోలుస్తున్నాను.
కావున పిమ్మట శారా చుట్టూ చూసినది, ఆమె యొక్క పెదాలు క్రిందికి జారినవి, మరియు ఆమె తిరిగి గదిలోనికి వెళ్ళిపోయినది. నేను ఒక రకముగా ఆమె వైపు చూచి నా కన్ను కొట్టాను, మరియు ఇలా చెప్పాను, నా యొక్క మరియొక కాలును నువ్వు పట్టుకో అని. దానికొరకే ఆమె కూడా ఎదురు చూస్తున్నది. ఇప్పుడు ఆమె ఇచ్చటకు వచ్చినది, ఎగిరి నా యొక్క ఇంకొక కాలుపట్టుకున్నది. అప్పుడు ఆమె… తన యొక్క కాళ్లు చాలా పొట్టివి, మీకు తెలుసా, మరియు ఆమె అలా ఉన్నప్పుడు తన కాళ్లు నేలకు తాకలేకపోయినవి. అప్పుడు ఆమె తలకిందులుగా వేలాడినది. అప్పుడు నేను నా యొక్క చేతులను ఆమె చుట్టూ ఉంచాను. అనగా ఆమె అంతా అక్కడి నుండి పడిపోకుండా ఉంచుటకు నాకు దగ్గరగా ఆమెను కౌగిలించుకున్నాను. ఆమె తన యొక్క తలను నాయొక్క గుండెకు మీదకు ఉంచినది. ఆమె రిబ్కా వైపు చూచినది, ఆమె చెప్పినది, "రిబ్కా, నా చెల్లి, చూడు, చెప్పాను, "నీవు కూడా ఒక విషయం అర్థం చేసుకొనవలెనని నేను కూడా నీకు చెప్పుచున్నాను, నీవు మొదటిగా ఇచ్చటకు చేరుకున్నప్పటికీ, నీవు డాడీని మొత్తముగా పట్టుకున్నప్పటికి, అయితే ఒక విషయం నువ్వు తెలుసుకో ఇప్పుడు, డాడీ నన్ను మొత్తముగా పట్టుకొనియున్నాడు తెలుసా."
కావున, అది ఆ రీతిగా ఉన్నది మీకు తెలుసా దానిలో ఉన్న లోపల మరియు బయట విషయాలు నాకు తెలియకపోవచ్చు అయితే అతడు నన్నుమొత్తముగా పట్టుకొని ఉన్నాడు కనుక ఇప్పుడు మనము దాని గూర్చి జాగ్రత్త తీసుకుంటున్నాము. కావున ఆయన మనలను తీసుకొననివ్వండి మరియు ఆయన కోరుకున్నట్లుగానే మనము ఉండెదము.
5నేను నిశ్చయంగా ఇక్కడ ఉండుట అభినందిస్తున్నాను, మరియు ఈ యొక్క మంచి సహోదరుల మధ్య, సేవకుల మధ్య, వ్యక్తిగత పనులు చేసే వారందరి యొక్క సహకారం మధ్య, ఇట్టి సహవాసముతో ఉండుటకు సంతోషిస్తున్నాను, మరియు రమడాకు వెళ్ళుటకు సమస్తమును సిద్ధమైనది. మరియు వారి యొక్క మంచి సహకారము కొరకు అయితే అది కేవలం నాలుగు రోజులు మాత్రమే అని నేను చింతిస్తూ ఉన్నాను. చూచారా, మీరు ఆ ప్రజలను తెలుసుకొనండి, మరియు ఆ ప్రజలు మిమ్ములను తెలుసుకొనుట ప్రారంభిస్తున్నారు. నిజముగా ఏదో ఒకటి అక్కడ జరిగినప్పుడు అనగా వాస్తవముగా దేవునిని మహిమపరచవలసి ఉన్నది.
మరియు ఆ యొక్క విషయాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు వాటిలో అనేకమైనవి మీకు నూతనముగా ఉండవచ్చు, మరియు వాటిని మీరు అర్థం చేసుకొనకపోవచ్చు. ఒకటి రెండు రాత్రులలో ఆ విషయంలు మీరు వివరించలేరు. అయితే పిమ్మట మీరు అక్కడ స్థిరపడిన తర్వాత, మీరు వాటిని అర్థము చేసుకొనగలరు. చాలా విషయములు జరిగినవి.
కాపరులైన మీకు గుర్తున్నదా, మీ యొక్క సంఘాలలో, అనేకమైన వారములు, చాలామంది స్త్రీలు మీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పిరి, "మీకు తెలుసా, నేనొక స్త్రీకి సంబంధించిన వ్యాధితో ఉన్నాను. అయితే అది బాగుపడినది." ఒకటి, "నేను ఒక కడుపునొప్పి సమస్యను కలిగి ఉన్నాను అయితే అది పోయినది." నేను వాటిని పేరు పెట్టి చెప్పలేదు. అలాంటివి ప్రతిచోటను జరిగినవి, విశ్వాసము ప్రతి ఒక్క చోట వెళ్ళి పనిచేసినది.
6ఉదాహరణకు, కొద్ది క్షణాల క్రితం, ఒక మనిషి ఇచ్చటకు వచ్చెను—మరియు అతడు తన యొక్క చేతిని నా భుజాలపైన ఉంచెను. మరియు అతడు చెప్పెను… నేను ఆ మనిషి వైపు చూశాను. నేను భావించాను, "ఆ మనిషి నాకు తెలిసే ఉండవచ్చు" నేను అతనిని ఎచ్చటో ఒకచోట చూచితిని.
మరియు అతడు చెప్పెను, "మీరు నన్ను గుర్తుపట్టగలిగారా?" మరియు నేను గుర్తుపట్టగలిగానని అనుకోవడం లేదు".
పిమ్మట అతడు చెప్పెను, "సాస్కటూన్లో మీ యొక్క సభలలో నేను ఉన్నాను, మరియు సాస్కట్ చెవాన్ లో నలభై మరియు నలభై రెండు మధ్యలో ఉన్నాను, లేక అలాంటి సంవత్సరంలో. ఆ వెనుక, చాలా సంవత్సరాల క్రితం".
మరియు నేను చెప్పాను, "అవును" నేను భావించాను, "ఆ మనిషిని ఎక్కడో నేను చూచి ఉన్నాను, అయితే నాకు అది గుర్తు రావటం లేదు." మరియు మేము వెళ్లి ఉన్నాము, అతడు ముందుకు కొనసాగెను, మాట్లాడుచున్నాడు.
కొన్ని క్షణాల క్రితం నేను దానిని గుర్తించుకొనుటకు ప్రారంభించాను, కొన్ని రాత్రుల క్రితం, ఒక సభలో, అక్కడ ఒక స్త్రీ, ఆమె ఆ వేదిక పైన నిలబడి ఉండెను, ఆమె ఒక రకమైన తెల్లని-జుట్టు కలిగిన స్త్రీగా ఉన్నది.
మరియు నేను తూర్పు వైపునకు వెళ్ళుచున్నచో, అది వాస్తవముగా ఒక సాంప్రదాయంగా వెళ్లేవాడిని అనగా నేను తూర్పు వైపునకు వెళ్ళుటకు ఇష్టపడేవాడిని, ఎందుచేతననగా ఆయన తూర్పు నుండే వచ్చును. గనుక నేను బాప్తిస్మము ఇచ్చునప్పుడు నేను ఆ మార్గంలోనే బాప్తిస్మము ఇస్తాను, మరియు చూడండి… ఎల్లప్పుడూ నాయొక్క కుడి వైపునకే ఉండేటట్లుగా, ఎందుచేతననగా ఈ యొక్క వెలుగు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి అలాగే వస్తున్నది, అది నా యొక్క కుడివైపునకు వచ్చుచున్నది, మరియు ప్రజలు ఎల్లప్పుడూ నా యొక్క కుడి వైపునకే రావాలని ప్రయత్నిస్తాను. మరియు నేను అలా నిలవబడి, ఈ మార్గంలోనే ఉంచి, వారిని ఒక స్థానములో ఇప్పుడు ఉంచి, ఇప్పుడు ఈ యొక్క భవనము కూడా అదే రీతిగా ఉంచబడినది.
7మరియు నా యొక్క ఎడమ వైపునకు, నేను గమనించితిని నా ప్రక్కగానే నిల్చుని ఉండుట, ఒక స్త్రీ నాకు ముందుగా నిలబడిన స్త్రీ కన్నా చిన్నది. ఈమె మరియు ఆమె ఒక గులాబీ రంగు వస్త్రములు ధరించి ఉన్నది. ఆమె అచ్చట నిలబడిన స్త్రీకు విభిన్నముగా ఉన్నది. నేను గమనిస్తూ ఉన్నాను, మరియు నేను కొద్దిగా క్రిందికి దిగియున్నాను.
మరియు నేను …..
దానిని ఏ విధంగా కూడా వివరించలేము. మీరు కేవలం దానిని నమ్మవలసి ఉన్నది. అది అంతే.
నేను క్రిందికి చూశాను. ఇచ్చట ఒక స్త్రీ ఉన్నది. నా యొక్క ఎడమ వైపునకు ఉన్నది. మరియు ఆమె ఒక రకమైన….. ఏదో ఆమెతో ఒక సమస్య ఉన్నది. మరియు నేను వెనుకకు చూసి ఉన్నాను, మరియు అయితే ఆమె ప్రక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే నేను భావించాను, "అతడు ఎవరో గాని ఒక వింతగా ఉన్నాడు." అయితే నేను నా మనసును ఆ స్త్రీ పైన పెట్టుచున్నాను. ఆమెతో మాట్లాడుచున్నాను.
ఎందుచేతననగా, మీరు చూడండి, బహుశా అచ్చట ఏదో కలిగి ఉండట మీరు గమనించినచో, చూచారా, ఆ యొక్క స్త్రీకి ఆమె ఏమి కలిగియున్నదో చెప్పబడుచున్నది. చూచారా! కావున మీరు ఇది చాలా….మరియు సాతానుడు వాడు చేయగలిగిన ప్రతిఅవకాశాన్ని వినియోగించుకుంటాడు. అది కేవలం దేవుని యొక్క కృపయైయున్నది, చూచారా, అది జరుగుటకు ఆయన అనుమతించెను.
8పిమ్మట నేను చూచి ఉన్నాను. ఆ స్త్రీ ఒక రకమైన… ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి కన్నా చిన్నది. మరియు ఆ స్త్రీ ఒక రకమైన…. ఆమె నష్టపోయినట్లుగా ఉన్నది. మానసికముగా ఆందోళనలో ఉన్నది. మరియొక స్త్రీ చాలా నిజముగా ఏదో రుగ్మత కలిగి ఉన్నది. పిమ్మట ఈ యొక్క మనిషి…
మరియు ఈ ఉదయకాల సమయాన, దానిని గుర్తించుటకు నేను ఇచ్చట నిలబడినప్పుడు, ఆ మనిషి అక్కడ ఉన్నాడు. మరియు నేను చెప్పాను, "మానసికముగా ఆందోళనతో జబ్బుతో ఉన్న నలిగిపోయిన భార్యను మీరు తీసుకొనలేరా?"
మరియు అతడు చెప్పెను, "అవును".
మరియు నేను అడిగాను, "గత రాత్రి సభలో ఈమె ఉన్నదా?". మరియు ఈమె నా యొక్క ఎడమ వైపు ఉన్నది, ఒక గులాబీ రంగు లాంటి దుస్తులు ధరించి లేదా అలాంటిదేదైనా కలిగి ఉన్నది."
"అవును" అని చెప్పెను.
మరియు అది ఈమెయే. ఆ రీతిగా ఆ మనిషిని నేను గుర్తించాను. నేను నమ్ముచున్నదేమనగా అతని యొక్క పేరును నేను క్రింద రాసియుంచాను. నేను ప్రయత్నిస్తున్నాను, నేను బాగా గుర్తించు కొనలేకపోవుచున్నాను. అతడు ఒక కాపరి మాక్ (M-a-c-k), అతను ఇచ్చటే ఎచ్చటో ఉన్నాడు. మరియు అది నిజం కాదా? మరియు అతడు నాతో చెప్పెను, చెప్పెను, "నా భార్య చాలా సంవత్సరాల క్రితం మీ యొక్క సభలకు వచ్చి ఉన్నది, మరియు మీరు చేసే అద్భుతాల ద్వారా వెంటనే స్వస్థత పొందుకొని యున్నది, ఆమె గురించి అప్పుడు మీరు చెప్పారు, మరియు ఆమెకున్న సమస్యను కూడా అప్పుడు మీరు చెప్పారు. అయితే ఆమె వెనువెంటనే స్వస్థత పొందుకొని ఉన్నది; మరియు చాలాసార్లు లేదా రెండుసార్లు, రక్తానికి సంబంధించిన వ్యాధిని కలిగియున్నది. మరియు కొన్ని పుండ్లు అలాంటివి కలిగి ఉన్నది".
9ఇప్పుడు చూడండి ఏమి జరిగినది, నా భావం ఏమిటో మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. ఆ స్త్రీ విశ్వాసం కలిగి ఉన్నది. చూచారా? మరియు ఆమె యొక్క విశ్వాసము, ఆమె నమ్ముచున్నది, ఆమె ఎటువంటి ప్రార్థన అట్టను కలిగిలేదు. అలాంటిది తీసుకొనలేదు. అయితే ఆమె నమ్ముచున్నది, మరియు నా ఎదుట ఉన్న స్త్రీ కన్నా చాలా బలంగా ఉన్నది.
మరియు ఇప్పుడు, నేను నమ్ముతున్నది ఏమనగా, తన భార్యలోనికి వచ్చుచున్నదని అతడు చెప్పెను. నేను తప్పుగా చెప్పినట్లయితే, ఆమె ప్రక్కగా నిలబడి ఉన్నది. ఆ స్త్రీ ఆమెయే. ఆ స్త్రీ ఆమెయే. ఆమె వైపునకు చూచుట అనగా ఆమె ఆ స్త్రీ, అది నిజము.
ఇప్పుడు, మీరు చూడండి— దేవుని యొక్క కృప, ఆమెకు? ఆ స్త్రీ, వాస్తవముగా, ఆమె హృదయమంతటితో నమ్మి ఉన్నది. నా వద్ద నిలుచున్నవ్యక్తి కన్నా ఆమె యొక్క విశ్వాసము చాలా గొప్పగా ఉన్నది, అది ఆమెకు వెళ్ళినది. అయితే, ఇప్పుడు, ఆ మనిషి నన్ను అడిగి ఉన్నాడు, అతను చెప్పెను, "బ్రాన్హాం సోదరుడా, నా భార్యకు ఏదైనా చాలా అపాయకరమైనది ఉన్నదా? ఆమె బాగుపడుతుందా లేదా ఏదైనా జరుగుతుందా? అని.
నేను చెప్పాను, "అయ్యా అది నాకు తెలియదు."
చూచారా, ఆ దర్శనం చూసినది మీరు. మీ సొంత విశ్వాసమే
అది చేస్తుంది. చూచారా? నీ విశ్వాసమే అది చేస్తుంది, నేను కాదు. అది మీరే చూచారా ?
యేసు, ఆ యొక్క ప్రజల ముందు నిలబడియున్నాడు, మరియు ఆ స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని ఉన్నది. అసలు ఎవరు అతనిని తాకియున్నారో కూడా అతడు ఎరుగలేదు. అతడు ఇలా అడిగాడు, "నన్ను ముట్టుకొనినది ఎవరు?" ఇప్పుడు, యేసు ఇంకా ఏమియు చెప్పలేదు. వాస్తవంగా ఆయనను ఎవరు తాకియున్నారో ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన చుట్టూ చూసి ఉన్నాడు, ఆయన ప్రేక్షకుల వైపు చుట్టూ చూసి ఆ స్త్రీని కనుగొన్నాడు. చూచారా ? అప్పుడు ఆమె విశ్వాసము ఆమెకు ఏమి చేసినదో ఆయన చెప్పియున్నాడు.
10ఇప్పుడు, నాకు అది తెలియదు. అయితే కొన్ని సందర్భాలలో…. దానిని వివరించలేము, చూచారా, నేను అలా అనుకుంటున్నాను అయితే ఇప్పుడు, చూడండి, నీవు ఏమై ఉన్నావు, నీతో ఎలాంటి తప్పిదం ఉన్నదో, అది పరిశుద్ధాత్మయే బయలు పరుస్తుంది. మరియు కొన్నిసార్లు నేను దీనిని గమనించాను, అప్పుడు అక్కడ చాలా నలుపుగా నీడవలె మారిపోతుంది, దాని గురించి నేనేమీ చెప్పను, ఎందుచేతననగా బహుశా అలాంటిది ఒక మరణం కావచ్చు. కావున నేను చెప్పుచున్నది ఏమనగా? "వెళ్ళుము, ప్రభువు నిన్ను దీవించును గాక."
మరియు బహుశా వారు ఎక్కువసేపు ఉండొచ్చు, కేవలం అచ్చటే వేచి ఉండండి. ప్రభువు ఏమి చెప్పినా చూడండి. మరియు పిమ్మట అదియే ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు అదే నీతో ఏదైతే అనారోగ్య సమస్య ఉన్నదో ఆ దర్శనము చెప్పియున్నది, లేక నీవు ఏమి చేసియున్నావో. అయితే ఇంకా నువ్వు అలాగే నిల్చుని ఉండి, వేచి చూడు. ప్రజలు అలా నడిచి వెళ్లిపోవటం నేను గమనించాను. చూచారా? కేవలం అలా నిలిచి ఉండి. అచ్చట నిలిచి ఉండి, పిమ్మట చూడండి ఆయన ఏమి చెప్పునో, మరియు నీవు దానిని కనుగొంటావు.
అది మరలా తిరిగి వచ్చినచో, మరియు నీవు ఏమై ఉంటావో అని ఆ దర్శనము చెప్పుట నేను చూచెదను. నీవు అప్పటినుండి ఏమై ఉన్నావో అది చూపించును. ఎలా ఉండబోవుచున్నావో నేను చూడగలను. మీరు దానిని గమనించెదరు, అది ఎల్లప్పుడూ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా ఉండును. మరియు పిమ్మట నీవు దానిని గుర్తించుము. ఒకవేళ అది జరగనిచో అది అలాగే ఉన్నది. అది దర్శనం అయినచో అది ఎన్నడూ విఫలము కాదు.
11అది ఏమిటో ఇచ్చట ఉన్నది. నేను నమ్మకాన్ని కలిగి ఉన్నాను. దర్శనం వచ్చిన ఉదయకాల సమయంలో, నాకు చెప్పినది జార్జ్ వాషింగ్టన్ తన యొక్క అధ్యక్ష సమాధి నుండి లేవబోవుచున్నాడు అని నాకు దర్శనము చెప్పినచో, నేను అప్పుడు అచ్చటికి వెళ్లి అతనిని పిలిచి లేపి ప్రపంచమంతటిని ఆహ్వానించి ఇది జరగును చూడండి అని పిలిచెదను. నిజం. అది విఫలం కాదు. అది ఎన్నడూ విఫలం కాదు. అది ఎప్పుడూ అలా జరగలేదు. మరియు ఎప్పుడూ జరుగబోదు, నీ యొక్క సొంత తలంపును నీవు ఉపయోగించలేనంత వరకు అది ఎన్నడూ విఫలము కాదు. మరియు చాలాసార్లు……
ఈ యొక్క ఉదయకాల సమయాన ఇప్పుడు నేను భావిస్తున్నదేమనగా, మనమందరము ఇచ్చట పెంతుకోస్తు వారము. మనం కాదా? [సమాజం "ఆమెన్" అని చెప్పుచున్నది]. చాలా సార్లు, ప్రజలు చాలా అత్యుత్సాహంగా ఉంటారు. మీరు చూడండి, ప్రభువు ఇది చెప్పెను లేక అది చెప్పెను అని మీరు మీ సొంత భావాన్ని కలిగి ఉంటారు. మరియు మీరు దానిని చెప్తారు, అయితే… అది వాస్తవముగా అలా కాదు. కావున అలా చెప్పటం అది తప్పై యున్నది. చూచారా? దేవుడు నీతో నిశ్చయముగా మాట్లాడాడు అనేంత వరకు నీవు వేచి ఉండాలి. అప్పుడు ప్రతిసారి అది సంపూర్ణమవుతుంది. అయితే దానిని చెప్పుటకు నీవు నీ సొంత భావాన్ని కలిగి ఉండొచ్చు. నీవు దానిని అలా చెప్పవచ్చు, అయితే మరి నీవు దానిని చెప్పినప్పుడు అది ఒక భౌతికమైన సొంత అభిప్రాయము వలే ఉంటుంది. మరియు నీవు నిజముగా అలా చేసినట్టు సహోదరుడా, సహోదరి, అది దేవునికి ఏ సహాయం చేయదు; అది దేవునిని ఆటంక పరుస్తుంది. చూచారా? అయితే బహుశా దేవుడు నిన్ను ఒకదాని కొరకు సాక్షిగా పిలువ వచ్చును. అప్పుడు దేవుడైతే నీకు చెప్పమని చెప్పియున్నాడు దానికి నీవు నమ్మకముగా ఉండాలి. నీవు ఒక నిజసాక్షిగా ఉండాలి.
12ఇప్పుడు, ఇది ఒక గొప్ప సభగా ఉన్నది, నా వెనుక ఒక అద్భుతమైన విశ్వాసపు గుంపు ఉన్నది, వీరిలో చాలామంది సేవకులు, నేను ఇదివరకు ఎన్నడైనా కలిగిలేని సేవకులు, మీరు మరియు అచ్చట ఆ యొక్క జనసమూహంలో వారంతా అద్భుతమైన వారు. అయితే ఈ మార్గంలో దీనిని మేము చాలా త్వరితముగ ముగించుచున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. అయితే నేను నిరీక్షిస్తున్నది, ఏమనగా ఏదో ఒక దినాన, దేవుని చిత్తమైనచో, మరల మేము వచ్చుదము.
మరియు ఆ సభల నిర్వాహకుడు ఇచ్చట ఉన్నాడని నేను ఊహిస్తున్నాను, అతడే సహోదరుడు బోర్డర్స్, అతడు ప్రజలకు పరిచయమయ్యాడు. ఆయన మరియు అతడు లేచి నిలబడాలని నేను కోరుకొనుచున్నాను. అతడు సహోదరుడు రాయ్ బార్డర్స్. అతడు నాతో అనేక గొప్ప సమస్యలలో కలసి ఉన్నాడు. బోర్దెర్స్ సహోదరుడా, నీవు లేచి నిలువబడగలవా? అతను చాలా దీనమైన వ్యక్తి. బార్డర్ సోదరునికి ఈవిషయం తెలియదు, అయితే అది నన్ను మరలా తాకినది. ఇప్పుడు అతనికి నేను మరలా అది చెప్పెదను. బార్డర్ సోదరుడు ఒక రోగి. నేను అతనిని కలిసి అతనితో వెళ్ళవలసి ఉన్నది, ఈ యొక్క ఉదయకాలమున ఈ కూడికలు ముగిసిన పిదప, బోర్డర్స్ సోదరుడా ఇది నిన్ను ఆశ్చర్యానికి గురి చేయట్లేదు కదా. అయితే సహోదరుడు బోర్డర్స్ ని ప్రభువు ముట్టునుగాక. ప్రభువు ఇప్పుడే ముట్టును గాక. అతడు తన యొక్క గుండెలో కవాటం మూసుకుపోయి ఉన్నది. అది నిజమండి. మీరు అతనిని ఈ యొక్క వేదిక మీద చూచుచున్నప్పుడు కంటే అతడితో ఇంకా నేను ఎన్నడూ ఎక్కువగా మాట్లాడలేదు, అది నిజమండి.
13పరిశుద్ధాత్మ నా మీద ఉంటుండగానే ఈస్త్రీకి నేను ఇది చెప్పాలని అనుకుంటున్నాను. మరియు పిమ్మట నేను విడిచిపెడతాను. చూడండి, ఎందుచేతననగా ఇది కదులుట ప్రారంభమైనది. ఇచ్చట ఉన్న ఈ యొక్క స్త్రీ ఇప్పుడు ఇటువైపుగా చూచుచున్నది, ఆ మనిషి అడిగి ఉన్నాడు. అయితే ఇది ఏమీ అపాయకరమైనది కాదు. ఇది జీవితము యొక్క మార్పు, అనగా రుతుస్రావం ఆగిపోయే దినాలు, ఎక్కువగా అలసిపోవుట, ఎక్కువగా నిరసించిపోవుట, అలాంటివన్నీ స్త్రీకి వచ్చేటటువంటి సమయం. మీరు బాగుపడెదరు. భయపడవద్దు. చూచారా? అది ఇదియే. ఇప్పుడు ఆ గొప్ప పరిశుద్ధాత్మ తన యొక్క సన్నిధిలో ఉన్నాడు.
14ఈ మనిషి మాట్లాడిన ఆ చిన్న బాలిక ఇచ్చట ఉన్నది, నేను ఇచ్చట ఏదో ఒకటి రాసుకొని ఉన్నాను. ఈ చిన్న బాలికకు శస్త్రచికిత్స జరిగినదని, అది నిన్న ఫీనిక్స్ లో జరిగినది, ఒక మూత్రపిండాన్ని తొలగించారు, లేదా అలాంటిది. అది సహోదరుడు అవుట్లా యొక్క సంఘమునుండి జరిగినది, అతని వద్దకు నేను ఎన్నడూ వెళ్ళలేదు. అది నూట రెండు మైళ్ళ దూరంలో ఉన్నచో అతడు ప్రతి సభకు హాజరవుతాడు. మరియు అతని యొక్క సంఘ సభ్యులలో కొంతమంది ఈ ఉదయకాల సమయాన ఇక్కడ ఉన్నారు. మరియు ఈ యొక్క చిన్న బాలికకు శస్త్ర చికిత్స జరిగినది. ఆ కిడ్నీ మీద ఉన్న కణితిని తొలగించారు, అది పెరుగుతూ ఉన్నటువంటి ఒక ముద్ద. అయితే దేవుడు మాత్రమే చిన్నదాని యొక్క జీవితాన్ని కాపాడగలరు.
సహోదరుడు జెంకిన్స్ మాట్లాడిన ఒక చిన్న చెవిటి అమ్మాయి. అయితే ఆమె రోగగ్రస్తురాలు మరియు అవసరతలో ఉన్న వ్యక్తిగా ఉన్నది.
మరియు ఇప్పుడు, ఈ యొక్క కూడికలో మాట్లాడడానికి ముందుగా కొద్దిసేపు మనము ప్రార్థించవలెనని నేను కోరుచున్నాను. మనము మన తలలు వంచెదము. మరి మిగతా విన్నపాలు ఉన్నచో మీరు మీ యొక్క చేతిని ఎత్తండి.
15మా పరలోకపు తండ్రి, అచ్చు వేయబడిన, ప్రేరేపింపబడిన దేవుని వాక్యపు గొప్ప దైవిక లేఖనాలలో, మేము బోధించబడ్డాము. అదేమనగా, "యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడే మనము పరలోక స్థలములలో కూర్చుని ఉన్నాము." మరియు ఈ ఉదయకాల సమయంలో మేము భావిస్తున్నది ఏమనగా, పరలోకానికి బంధించబడిన ప్రజల సమూహమును చూచుట, అనేక సంఘశాఖల నుండి కలిసికట్టుగా కలసివచ్చిన వారు ఉన్నారు. నాకన్నా వృద్ధులు ఇచ్చట ఉన్నారు. వారిని చూచుట, అలాగే కొంతమంది యవ్వనస్తులు కూడా వచ్చి ఉన్నారు. వారంతా ఆకులు మరియు పువ్వులవలె ఉన్నారు. మరియు సమస్త ప్రకృతి పనిచేయుచున్నది. పాత ఆకులు రాలిపోతాయి మరియు కొత్తవి చిగురిస్తాయి. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ కొరకు మీకు వందనములు. అదే మాకు ఈ యొక్క గొప్ప నిశ్చయతను ఇచ్చుచున్నది, మేము మరియొక గొప్ప దినాన మరలా కలుస్తాము.
ఆయన యొక్క గొప్ప శక్తికొరకు మీకు మేము వందనములు చెల్లిస్తున్నాను. ఇది మా బలహీనతలకు సహాయము చేయుచున్నది. కిడ్నీలో నుండి గడ్డను తొలగించబడిన ఈ చిన్న పాపకోసం మేము ప్రార్థించుచున్నాము. మరియు అది క్యాన్సర్ సంబంధమైనది. ప్రభువైన దేవా, ఈ చిన్న పాపకు కనికరము చూపించండి. ఒకవేళ ఈమె నా యొక్క పాపయైనచో ఎట్లుండును? అయితే ఈమె ఎవరో ఒకరి యొక్క ప్రియమైనది. ఆమెను మీరు బాగు చేయవలెనని నేను ప్రార్థించుచున్నాను. సాతాను యొక్క శక్తి ఇచ్చట నుండి తీసివేయబడును గాక. దేవుని మహిమ కొరకు ఈ పాప జీవించును గాక.
16ఆశీర్వదించండి, నేను ఈ ఉదయకాల సమయంలో, ప్రార్థిస్తున్నాను, చెప్పబడిన ఈ యొక్క చిన్న పాప కోసం ప్రార్థిస్తున్నాను , ఈ యొక్క చిన్న జంకిన్స్ పాపకు మరల తాను వినగలిగే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను.
పరలోకపు తండ్రి , నేను ప్రార్థిస్తున్నాను, సహోదరుడు బోర్డర్స్ కొరకు, నా యొక్క ప్రశస్త్రమైన సహోదరుడు, సువార్త పొలములోనుండి అతనిని తీసివేయవలెనని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. దేవా, రాజ్యము కొరకు మేము అతని జీవాన్ని ప్రకటిస్తున్నాం.
మరియు మేము ఈ ప్రత్యేక ప్రార్థన విన్నపాలు అన్నింటి కొరకు ప్రార్థించుచున్నాము. మరియు గతరాత్రి అక్కడ నిలబడి ఉన్న ఆ స్త్రీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము, విశ్వాసము పైకి కదులుచున్నది, ఇప్పుడు మీరు ఆమెకు వివరించారు, ప్రభువా, ఇప్పుడు ఇదంతయూ బాగుగా ఉంటుంది. మీరు మాతో కొనసాగుతారని ప్రార్థించుచున్నాము.
ఈ సేవకులను దీవించండి. సహాయము చేసినవారందరినీ దీవించండి; సంగీత విద్వాంసులను, ఈ చిన్న పాటను పాడిన వారిని, మరియు సంఘము నుండి ఆ చిన్న పల్లవి, చరణం అక్కడ పాడిన వారిని అద్భుతమైన ఆ యవ్వన సహోదరులను సోదరులను ప్రత్యేక పాటలు పాడిన ఆ స్త్రీని దీవించండి. మరియు ప్రభువా, ఈ విషయాలన్నీయు మా యొక్క మనసులో గుర్తించుకొనుట చాలా కష్టం, అయితే అవన్నీ మీకు తెలుసు.
ఈ యొక్క రమాడా సత్రములో, కొద్ది క్షణాల క్రితం ఇచ్చట నిలువబడిన అద్భుతమైన ప్రజల కొరకు మరియు చెప్పుచున్నాము, "దేవుడు మిమ్మును దీవించునుగాక" అని, ఇవి తిరిగేటట్లు ప్రార్థిస్తున్నాము. మరియు ప్రభువా, అతడు పరిశుద్ధాత్మతో నింపబడును గాక, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క గొప్ప సాక్షిగా మారును గాక, గొప్ప విషయములు సంభవించును గాక, తండ్రి.
17మీరు సోదరుడు టోనీని ఆశీర్వదిస్తారని మేము ప్రార్థించుచున్నాము. మరియు ఇచ్చట ఉన్న ఈ యొక్క మంచి మనుషులు మరియు ఈ సంఘంలోనున్న సాధారణ విశ్వాసులను కూడా మరియు ఇంకను బిజినెస్ మెన్ వారికి కూడా వారు ప్రయత్నించుచున్నారు, వారందరూ కలిసికట్టుగా వ్యవస్థగా మారుచున్నారు, మరియొక కొద్ది సాక్షులను తయారు చేయుటకు. దేవా వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయండి, వారు ఆత్మతో నింపబడుదురు గాక. మరియు ఏమి చేయగలను ఎరిగి వివేచించి ప్రభువైన యేసు కొరకు వాటిని చేయుచున్నారు.
నేను మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో, వర్తమానాన్ని దీవించండి, ప్రభువా. మరియు మీరు మీ యొక్క దీవెనలతో దీనిని అభిషేకించుదురని ప్రార్థించుచున్నాను. మరియు మేము ఇచ్చట నుండి దూరముగా వెళ్లినప్పుడు, ఆ ఎమ్మాయి మార్గంలో చెప్పినవారు "మన మార్గంలో మన హృదయములు మండ లేదా" అని చెప్పినట్లు చెప్పుదురు గాక.
పిమ్మట, తండ్రీ, ఇచ్చట ఎవరైనా ఇంకా రక్షింపబడని వ్యక్తి ఉన్నచో, మిమ్మల్ని ఎరగని వ్యక్తి ఉన్నచో, లేక సంఘ సభ్యుడైనా సరే, దేవుని యొక్క సరియైన మార్గము ద్వారా నేడు వారు రక్షణ అనే అవసరత కలిగి ఉన్నారని పరిశుద్ధాత్మ యొక్క గొప్ప శక్తి వారికి బయలుపరచునుగాక. అనగా యేసుక్రీస్తే ఆ మార్గమని, ఈ ప్రార్థన ఆయన నామములో అడుగుచున్నాము. ఆమెన్.
18మీ అందరికీ మరల ధన్యవాదాలు. ఒక్క క్షణము క్రితం ఒక విషయము చెప్పట నేను మరచిపోయాను. వారు… సోదరుడు టోనీ, గత సాయంకాలము తన కారులో నుండి అతడు బయటకు వచ్చినప్పుడు, అతడు చెప్పెను…. నేను చెప్పాను, "నేను ఎన్నడూ అలాంటిది చూడలేదు…" నేను ఇప్పటికీ సుమారు ముప్పై-మూడు సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. పదిహేడు సంవత్సరాలుగా జఫర్సన్ విల్ లోగల గుడారానికి నేను సంఘ కాపరిగా ఉన్నాను. అయితే ఒక రూపాయి కూడా జీతం తీసుకొనలేదు. మరియు నా యొక్క జీవితమంతా నేను ఎన్నడూ కానుకలు తీసుకొనలేదు. ఎన్నడూ అలా చేయలేదు, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలని అనుకోలేదు. అయితే గతరాత్రి టోనీ సోదరుడు చెప్పియున్న రీతిగా వారు… నేను అడిగాను, "మీరు ఆ ఖర్చులు భరించారా?"
ఈ యొక్క మంచి సహోదరుడైన బరాక్ ను కలిసినప్పుడు, అలాంటి అవగాహన, నేను అతని పేరును "బరాక్" అని బాగానే పిలిచానా? మరియు ఆ గతరాత్రి సహోదరుడు గిల్మూర్, మరియు మరికొంతమంది సహోదరులు అక్కడ ఉన్నారు. నేను చెప్పాను, "వారు ఆర్ధిక విషయాల స్థితిగతుల గురించి అడిగారు". నేను చెప్పాను, "ఖర్చులు ఏమైనా సరే ఎంత ఉన్నాయో అవి అంతే."
"మంచిది," అతడు చెప్పాడు, "నీ కొరకు మేము కానుక పట్టవలెను అనుకుంటున్నాము."
నేను చెప్పాను, "లేదు, లేదు అలా చేయవద్దు. నేను నా సంఘము నుండి వారానికి వంద డాలర్లు పొందుచున్నాను. మరియు అవి నాకు చాలు". నేను చెప్పాను, "నాకు కావాల్సినదంతా అదే. దానికన్నా ఇంకా ఏమీ నాకు వద్దు, చూచారా." నేను, వేరొక మార్గంలో ఉన్న దానినిచూస్తున్నాను. అనగా నేను నా పరిచర్యను కొనసాగించవలెనని ప్రయత్నిస్తున్నాను…
కావున అనేకమంది వచ్చి ఉన్నారు. మరియు సభల నిర్వహకుడు, చెప్పియున్నాడు, "బ్రాన్హాం సోదరుడా, ఇది చాలా వెలుగు కాంతులతో నిర్వహించబడాలి."
19మరియు ఫోర్ రోజ్ విస్కీ యొక్క అధ్యక్షురాలు మాయొక్క స్థలానికి వచ్చినది. ఇచ్చటకు కొద్ది సమయం క్రితం మరియు ఆమె తన కుమార్తెను కూడా తీసుకొని వచ్చినది. మరియు ఆమె చెప్పినది, ఓ, ఆమె యొక్క చిన్న పాప స్వస్థత పొందుకోవాలని కోరుకొనుచున్నది. మరియు ఆమె చెప్పినది, ఆమె గురించి ఆమె దీనిని గూర్చి విన్నది, మరియు ఆమెకు ఒక శస్త్రచికిత్స జరగవలసి ఉన్నదని చెప్పిరి. మరియు వారు చెప్పారు…. ఓ, ఆమె ఇచ్చటికి రావలయునని అనుకొనుచున్నది. ఎందుకనగా ఆమె శస్త్రచికిత్స జరగవలెనని కోరుకొనటం లేదు.
మంచిది, నేను మాట్లాడుచుండగా ఆమె సరిగ్గా పరిగెత్తుకుని వచ్చినది, ఆ రాత్రి ఆమె కొరకు అప్పుడే ప్రార్థన చేయాలని కోరుకొనినది, మంచిది, ఇప్పుడు, ఆమె వేచి ఉండలేకపోవుచున్నది. ఆమె వెనుక ఆమె తల్లి ఉన్నది. కావున తల్లి ఆ గదివెనుక నుండి వచ్చుచున్నది, ఆ యొక్క వార చూపుతో వచ్చుచున్నది. కావున మేము వచ్చి ఉన్నాము, ఆ యొక్క అమ్మాయి కోసం ప్రార్ధించాము. మరియు వెనుకకు తిరిగి వెళ్ళాము.
మంచిది, రెండు దినములు గతించిన పిమ్మట ఆ వైద్యుడు చెప్పియున్నాడు, చెప్పెను, "మంచిది ఇదంతయూ కూడా బుద్ధిహీనమైనది చెప్పెను."
అయితే ఆమె చెప్పెను," లేదండి నేను మంచిగా ఇప్పుడు ఉన్నాను. నాతో ఎలాంటి అపెండిక్స్ వ్యాధిలేదు. నేను ఇప్పుడు బాగుగానే మరియు ఉల్లాసంగానే ఉన్నాను".
కావున వారు వెనుకకు వెళ్ళిపోయారు, నాలుగు లేదా ఐదు రోజుల క్రితం వెళ్లిపోయారు. ఆ తర్వాత మీరు చూడండి, నేను దీనిని వివరించిన రీతిగానే, డెభ్బై-రెండు గంటల తర్వాత ఆ యొక్క వ్యాధిలక్షణాలు మరలా రావటం ప్రారంభమైనవి. మీరు నిజముగా స్వస్థపరచబడినచో, చూచారా, స్వస్థత. నేను అద్భుతాల గురించి మాట్లాడటంలేదు. అది మరలా సంభవించినది ఎందుకనగా ఆ యొక్క అపెండిక్స్ మరలా ఉబ్బినది. మరియు ఆయొక్క వైద్యుడు చెప్పెను, "ఇప్పుడు మీరు చూచారా, ఇప్పుడు మీరు వెళ్లి ఆ పరిశుద్ధ బండ బోధకుని దగ్గరకు మరల వెళ్లడం మంచిది కదా" అని అన్నారు.
20కావున పిమ్మట, అతడు శస్త్రచికిత్స చేయలేదు. అయితే, సుమారు పదిహేను వందల డాలర్లు ఇచ్చిన, అతడు దానిని చేస్తాడు. అయితే అతడు చెప్పాడు, దానిని అతడు చేయబోనని, అయితే అతడు దానిని చేశాడు. ఆ యొక్క అనేక మందిలో అతడు నాకు ఒక స్నేహితుడిగా మారిపోయాడు, వారు దానిని తొలగించినప్పుడు, ఆ యొక్క అమ్మాయిని చూపించారు, ఆ యొక్క అపెండెక్స్ ని తొలగించారు, అచ్చట ఎలాంటి తప్పిదము లేదు. చూచారా? అయితే వారు ఏమీయూ లేని దాని కొరకు శస్త్రచికిత్స చేశారు. వారు ఆ యొక్క అపెండిక్స్ ను అక్కడే ఉంచేశారు, ఎందుకనగా అది ఆ లోపట ఆ పాపకి ఏమాత్రం చెడు ప్రభావం చూపలేదు. శస్త్రచికిత్స విషయంలో సహాయం చేసిన నా యొక్క స్నేహితులలో ఒకరు మరియు ఆ వైద్యుడు వచ్చి, దానిగూర్చి నాకు ఇలా చెప్పియున్నాడు.
21ఇప్పుడు అది ఏమిటో మీరు చూడండి. ఆమె చాలా ఉద్వేగభరితురాలు అయినది మరియు ఆ విశ్వాసమును ఎలా పట్టుకుని ఉంచవలెనో ఆమె ఎరుగలేదు. చూచారా, మరియు అచ్చట దానిని వివరించటానికి మనకు అవకాశం లేదు. నా యొక్క స్నేహితుడైన వైద్యుడు ఆమె యొక్క తల్లికి చెప్పియున్నాడు, మరియు చెప్పెను, "ఆ యొక్క అపెండిక్స్ అనేది అచ్చట ఇంకా ఉన్నది". వారు చెప్పిరి, "ఆమెకు ఆ యొక్క అపెండిక్స్ ఉండవలసి ఉన్నది, మరియు అయితే అది కలుషితం కాలేదు. దానికి అది ఏమీ చేయలేదు. అది సంపూర్ణంగా సహజంగానే ఉన్నది, గులాబీ రంగులో అది ఎలా ఉండవలెనో అలాగే ఉన్నది."
మరియు ఆ యొక్క తల్లి ఒక విశ్వాసిగా మారినది. పిమ్మట ఆమె నాకు ఇలా చెప్పినది, "ఇంకా ఏమీ చేయవలసి ఉన్నది, మీ యొక్క పరిచర్య కొద్దిమంది సామాన్య ప్రజలు గుంపు వద్ద మూలలో కూర్చుని చేయడం కాదండి. అది ప్రతి చోటను, సమస్త దేశం అంతా వెలిగింపబడవలసి ఉన్నది. మరియు ప్రకటనల బోర్డుల మీద రాయవలసి ఉన్నది." ఇప్పుడు అదే దయ్యం కోరుచున్నది. అది నిజము. చూచారా అయితే చూడండి, లేదండి, నేను దానిని అలా చేయాలని అనుకోవడం లేదు.
నేను— నేను ఎవరినైనా, ఏ స్థలములోనైనా ఎచ్చటైన దర్శించవలెనని కోరుచున్నాను. అయితే ప్రభువు నన్ను ఎక్కడకి పిలుస్తున్నాడో అచ్చటికి నేను వెళ్లాలని కోరుకొనుచున్నాను. ఎక్కడ దానిని వినయముగా ఉంచాలని అనుకుంటున్నాడో మరియు మనలను ప్రభువు ఎక్కడికి కదిలించాలని కోరుకుంటున్నాడో అచ్చటకే కదిలెదము.
22మరియు ఇప్పుడు ప్రజలైన మీకు, మీరు ఒకవేళ దాని కొరకు ప్రార్ధించబడినది. డెభ్బై రెండు గంటల తర్వాత అది కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. మనకు అది తెలియును. డెభ్బై రెండు గంటల తర్వాత మృత్యువు అచ్చట పని చేస్తుంది. ఇప్పుడు ఏదైనా సంభవించినచో… మీరు మీ హృదయమంతటితో నిజముగా దానిని నమ్మినచో, అప్పుడు దానిని ఏదియు ఆపు చేయలేదు. మీరు ఎలాగైనా సరే దానిని నమ్ముచున్నారు. దానితోనే నిలిచి ఉండండి. అది జరుగుతుంది. మీరు అలా నమ్మరా…
అయితే ఇప్పుడు మీరు దానిని మోసం చేయలేరు. అది జరిగే ఉన్నదని మీరు వాస్తవముగా దానిని ఎరుగవలసి ఉన్నది. చూచారా? నిరీక్షణ మరియు విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉన్నది. నిరీక్షణ అనగా ఒక దాని కొరకు నిరీక్షిస్తుంది. విశ్వాసము అనగా అది ఇదివరకే జరిగిపోయినది అని అర్థము. అదియే ఆ రెండింటికి మధ్య వ్యత్యాసమై ఉన్నది.
ISA 1:18
23ఇప్పుడు, ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను నేను ఎక్కువగా ఉంచదలుచుకోలేదు. ఇప్పుడు పది గంటలు అయిపోయినది, మరియు, చూడండి, ఆరు నిమిషాల తర్వాత, బిల్లీ నాకు ఇచ్చిన ఈ యొక్క గడియారం ద్వారా.
మరియు ఇప్పుడు, యెషయా గ్రంథము నుండి ఒక వచనము చదవదలుచుకున్నాను, మొదటి అధ్యాయము కొన్ని మాటల కొరకు మరియు ఇచ్చట నేను కొన్నిలేఖనములను రాసుకున్నాను. వాటిని రెఫరెన్స్ గా ఉంచుట కొరకు మరియు మిమ్ములను ఒక ముప్పై నిమిషములు వుంచదలచుకున్నాను, సిద్ధపడుదాం. ప్రభువు చిత్తమైనచో. యెషయా ఒకటవ అధ్యాయం 18వ వచనము.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చువలె తెల్లనివగును.
ఇప్పుడు, ఆయన యొక్క వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వచనము జతచేయును గాక. మరియు నేను ఇప్పుడు సమావేశములు అనే అంశము మీద మాట్లాడబోవుచున్నాను. ఒక సమావేశాన్ని నిర్వహించడం లేదా ఒక సభను నిర్వహించుట!
ప్రభువా, ఇప్పుడు ఈ వాక్యమును దీవించండి, మరియు ఎచ్చటైతే మాకు అవసరమో అచ్చటే విత్తనాలు మా హృదయములో పడును గాక. మరియు, ప్రభువా, మా హృదయములు తెరవబడును గాక, ఇచ్చట ఉన్న ప్రతి ఒక్కరికి మేము జీవించుచున్న గడియ అర్థము చేసుకుందుము గాక, మరియు మేము ఎలా చేయవలెనో అలా చేయుదుముగాక. దీనిని యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
24సమావేశముల గూర్చి మాట్లాడుట, మనము—మనము ఈ రోజులలో దీనిని గూర్చి చాలా- వింటూ ఉన్నాము. ప్రతిదీ కూడా సమావేశమే. మరియు, వాస్తవముగా చెప్పాలంటే, ఈ ఉదయకాల సమయంలో మనము అలాగే ఇచ్చట కూడియున్నాము. ఇది ఒక సమావేశం మరియు వాటిని గురించి చాలా ఎక్కువగా మనము విన్నాము, మరియు అవి చాలా చాలా స్థలాలలో జరిగియున్నవి, చాలా విషయాల్లో సమావేశముల ద్వారానే పరిష్కారమైనవి. మనము అది చేయవలసిన ఒక కార్యమని నేను భావిస్తూ ఉన్నాను. అదేమనగా సమావేశం అగుట మరియు సర్వసాధారణంగా ఇవి అత్యవసర సమయాలలో వారు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అత్యవసర సమయాలలో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరు దానిని ఒక అత్యవసర సమావేశం అని పిలుస్తారు. దాని యొక్క నిబంధనలు గూర్చి మనము ఆలోచిస్తూ ఉంటాము.
25ఇప్పుడు మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది….. ఉదాహరణకు, ప్రపంచ ఆర్థిక మాంద్యము సమయములో మనము ఒక సమావేశాన్ని కలిగి ఉన్నాము, జర్మనీ మరియు మిగతా ప్రపంచ యుద్ధంలో ఉన్నప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రముల యొక్క అధ్యక్షుడు అయినటువంటి రోజ్వెల్త్ అధ్యక్షుడుగా ఉన్నాడు. మరియు— అవతల వైపు మరి నాలుగు శక్తులు వారు సమావేశమునకు పిలచి ఉన్నారు. వారు దానిని చర్చిల్ యొక్క నాలుగు గొప్ప సమావేశములుగా పిలిచిరి, మరియు వారు కలిసికట్టుగా సమావేశం అయ్యారు, స్వేచ్ఛా ప్రపంచానికి "నాలుగు పెద్ద సమావేశములుగా" వారు దానిని పిలిచిరి. ఎందుచేతననగా వారందరూ కలిసి సమావేశమై వారి భావనలను లేక ఆలోచనలను పంచుకోవడానికి మరియు ఏదో ఒక వ్యూహాన్ని రచించుట కొరకు, ఇందుచేతననగా శత్రువు దాడి చేయబోవుచున్నాడు గనుక వారిని ఆపు చేయుటకు వారు అలా చేసిరి.
26మరియు వారంతా కూడా సమావేశము కలిసికట్టుగా కావలసి ఉన్నది, కావున వారు చేయగలరు, ఆ యొక్క గుంపులలో తెలివైన వారు. పిమ్మట వారు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను మరొకరు తీసుకున్నారు. మరియు మిగతా వారియొక్క ఆలోచనలను మరొకరు తీసుకుని వాటిని కలిపిరి, మరియు వాటితో ఏ రీతిగా వారు బయటకు వచ్చిరో చూడండి. అవి ఆ యొక్క నాలుగు సమావేశములు. మరియు వాటిని వారు తిరిగి వెనుకకు తెచ్చిరి, వారు వారి యొక్క సైన్యములను అచ్చట ఉంచిరి, నిశ్చయముగా వారి యొక్క ఐదవ సైన్యము, లేదా [పదాతి దళము] మరియు నాలుగవ సైన్యము, మరియు పదవ సైన్యము, మొదలగు వారు అలా కలిసికట్టుగా పనిచేసిరి. మరియు వారు ఎందుకు అలా చేసిరి అనగా, వారియొక్క శత్రువు చాలా బలముగా ఉండెను.
గనుక మరియు మీరు గమనించినచో, వారు ఎల్లప్పుడూ ఆ యొక్క సైన్యము యొక్క వెన్నెముకను కొట్టడానికే ప్రయత్నించిరి. అది ఒక జీవన రేఖ. మరియు అది ఎల్లప్పుడూ, శత్రువును కొడుతుంది, దానిని మీరు చంపవలెనని ప్రయత్నించిన, వాడిని మీరు ప్రాథమిక స్థలములోనే కొట్టాలి. అలా మీరు చేయనిచో, మీరు వాడిని చంపలేరు. మరియు కావున అచ్చట, ఒక విషయం జరగవలసి ఉన్నది.
27ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడంలాంటిది. మనము దేవుని రాజ్యాన్ని ఉదాహరణకు తీసుకొన్నచో, పరిచర్యలో చాలా సార్లు, ఆ మనుషులు చెప్పిన రీతిగా మరియు ఆ స్త్రీకి చెప్పిన రీతిగా చెప్పిరి. "మీరు ఆ యొక్క గొప్ప ప్రజలను కలిసికట్టుగా తీసుకున్నచో, గొప్ప మేధావులు, వారందరూ కలిసికట్టుగా ఉన్నారు. మరియు అక్కడ నుండే మీరు కొట్టగలిగినచో." అయితే, చూడండి, మీరు తప్పుడు దానిని కొట్టుచున్నారు. చూచారా ?
నేను సేవకులందరినీ పొందుకొనగలిగినచో, నేను దేవుడు రక్షించిన ప్రజలందరి గుంపును పొందుకొనినచో, మరియు క్రీస్తుయేసులో ఉన్న శక్తిని నేను చూడగలిగినచో అనగా ఆయన మన హృదయాలలో వాస్తవముగా జీవించుచున్నాడని చూడగలిగినచో, మన మనసు యొక్క తలంపులు గ్రహించగలిగినచో, మరియు వాటిని చెప్పగలిగినచో, మరియు మొదలగు విషయాలు మరియు… మరియు వాటిని పరిపూర్ణముగా చేయగలిగినచో, అప్పుడు ఆ సేవకులు ఎంతో ప్రేరణ పొందుకొని వాటిని వారి ప్రజలకు అందిస్తారు. నా భావాన్ని మీరు గ్రహించారా? అచ్చటే మనము గురిపెట్టవలసియున్నాము, ఎచ్చటైతే ఆ తుపాకీలు గురి పెట్టబడినవో. ఇప్పుడు అచ్చట.
28మరియు ఆ యొక్క గొప్ప నలుగురిలో వారు గొప్ప సమావేశం నిర్వహించినారు. దాని తరువాత మరియొక గొప్ప సమావేశము నిర్వహించిరి. అదే జెనీవా సమావేశం. ఆ యొక్క జెనీవా సమావేశం నిర్వహించబడినప్పుడు మీలో చాలామందికి గుర్తున్నదని నేను భావిస్తున్నాను. అటుపిమ్మట పారిస్ సమావేశము కూడా జరిగినది, వారు పారిస్ లో సమావేశమైనప్పుడు దానిని చేసిరి. అది వారు ప్రతీసారి, నిరంతరాయంగా కొనసాగించేవారు, సమావేశం వెంబడి సమావేశం, సభ వెంబడి సభ, అలా కలిసికట్టుగా కూడుకునేవారు. ఎందుచేతను అనగా వారి జాతి యావత్తును రక్షించడానికి అది వారికి అవసరమైనది. ప్రపంచ శక్తుల యొక్క మెదడు లేక మేధస్సు చిక్కులలో పడినట్లుగా అయిపోయినది. అనగా వారు ఎక్కడ ఏమి చేయవలెనో ఎరుగలేకయున్నారు. మరియు సర్వ ప్రపంచం ఇప్పుడు మరణానికి భయపడుచున్నది.
ఇది ఒక చిన్న బాలుడు చీకటి రాత్రుల్లో ఇంటికి వెళ్ళుచున్నట్లుగా ఉన్నది, అనగా ఆ బాలుడు సమాధులను దాటుకుంటూ వెళ్ళుచున్నట్లుగా, అప్పుడు తాను ఈల వేసుకుంటూ వెళుతున్నట్లుగా ఉన్నది. అతడు ఎంత గట్టిగా ఈలా వేయగలడో అంత గట్టిగా ఈల వేసుకుంటూ వెళ్ళుచున్నాడు, ఎందుచేతననగా అతడు తనకు తాను గానే భుకాయించుకున్నట్లుగా ఉన్నది. అతడు- అతడు తనకుతాను గానే భయపడుతున్నట్లుగా భావించుకొనుటలేదు, అనగా తనకు తానుగా ఆ ఈల ద్వారా భయంనుండి ఉపశమనం పొందుకుంటున్నాడు. అయితే అతని హృదయం లోపల అతడు భయపడుతున్నాడు, "ఎందుకనగా ఆ యొక్క సమాధి రాయి లోపట ఏదో ఒక భూతము ఉన్నట్లుగా అతని భావము." లేక, చూచారా, అతను భయపడుతున్నాడు. మరియు తనకు తానుగా నిమ్మళముగా ఉంచుకోవడానికి ఈల వేసుకుంటున్నాడు.
29మరియు అందు నిమిత్తమే మనము ఈరోజు రేడియో మరియు టెలివిజన్లో టామీ రైట్ లను కలిగి ఉన్నాము, అనగా అనేకమైన తలాంతులు కలిగినవారు, పాటలు పాడు వారు మరియు ఎల్విస్ ప్రెస్లే లాంటివారు, అనగా వీరు వారి యొక్క జన్మహక్కును క్షయమైన ఆనందాల కోసం అమ్ముకుంటున్నారు. వారు అచ్చట నుండి బయటకు వచ్చి ఒక నవ్వులు చిందించే జోకర్లుగా, లేదా అలాంటి దానిని చేసేటటువంటి వారుగా, అనగా అమెరికా ప్రజలను నవ్వించేవారుగా తయారవుతున్నారు. వారిని నిశ్శబ్దంగా ఉంచుటకు ప్రయత్నించుచున్నామని మీరు భావించినప్పుడు; మీకు తెలుసా దాని వెనుక, ఒక తీర్పు దాగి ఉన్నదని. అదినిజము. వారు దానిని ఎదుర్కొనవలసి ఉన్నారు. మనము రహదారి చివరకు వచ్చియున్నాము, సోదరులారా. మరియు ఆ యొక్క ఎన్ని హోల్డ్ నవ్వులు, మరియు ఎల్విస్ ప్రిస్లే రాక్-మరియు-రోల్స్ సంగీతము అలాంటివన్నీ కలిసి అది నెబెకదెనెజర్ విందుగా ఉన్నది. అది ఏ చిన్న మంచి కూడా చేయలేదు. తీర్పు రాబోవుచున్నది.
30ఆ యొక్క దేశము సొదొమ గొమర్రా లాంటి స్థితికి వచ్చి ఉన్నది. కావున నీతి గల దేవుడు, ఇది ఇప్పుడు ఏమి చేయుచున్నదో ఆ విధముగానే దీనిని ఉంచబోవుచున్నాడు, కావున ఆయన నీతిగల దేవునిగా సొదొమ గొమర్రాలను పైకి లేపి వారిని కాల్చివేసినందుకుగాను క్షమాపణ అడుగవలసి ఉన్నాడ, అది నిజం, అనగా ఈ దేశానికి ఆయన తీర్పు తీర్చనిచో అలా చేయవలసి ఉన్నాడు. అయితే, గుర్తుంచుకోండి, ఆ తీర్పు మనకు రాబోవుచున్నది.
మీరు ఎంత వేగముగా పరిగెత్తగలరో అంత వేగంగా ఆ బండ వద్దకు పరిగెత్తుడి. దానిని విడిచి పెట్టవద్దు. ఇక్కడ జరుగుతున్న సంగతులు అన్నీ పట్టించుకోవద్దు, అనగా సంఘములో చేరుట లేదా ఒక సిద్ధాంతాన్నివెంబడించడం మొదలగునవి. ఈ యొక్క మెథడిస్ట్ సహోదరులు ఏమి చేయుచున్నారో అలా చేయుట మొదలైనవి: ఏదో ఒకటి మీ వెనుక నుండి ప్రతిధ్వనించేంతవరకు ఆ యొక్క బండ వద్దకే పరిగెత్తుడి, అనగా క్రీస్తు ప్రతిబింబించుట. మీరు చూసేంత వరకు అది మిమ్ములను కొద్దిగా కొట్టవచ్చు. ఆ పురాతన పరిశుద్ధ గ్రంథకాలములో వారు అలా చేసినప్పుడు…
31ఈరోజులలో ఇచ్చట ఈ యొక్క ఆరిజోనా బంగారు రాష్ట్రంలో, ప్రాచీన కాలంలో, వీరు ఇచ్చట లోహమును కనుగొన్నారు, ఇప్పుడు ఆయొక్క పైరేట్, మరియు ఇనుము లోహాన్ని కరిగించుటకు …అనగా వారు దానిని మెరిసే బంగారం అంటారు, మరియు దానిని వారు కరిగించి నిజమైన బంగారు రూపంలో కరిగించే యంత్రము ద్వారా మారుస్తున్నారు.
పురాతన కాలంలో అయితే, వారు దానిని వేరుపరచడానికి ఒక రకమైనటువంటి కొట్టే వస్తువు ఉండేది, అనగా ఒక సుత్తితో బంగారాన్ని కొట్టేవారు, భారతీయులు కొట్టినట్లుగా. మరియు ఆ యొక్క కంసాలి బంగారం తయారు అయినది అని తెలుసుకునే ఒకే ఒక్క మార్గం ఏమనగా, దానిలో నుండి అతడు సమస్త చెత్తను కొట్టి, వేరు చేస్తాడు, అతడు దానిని కొడతాడు, దానిని మలుస్తాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ కొడతాడు, ఆ యొక్క చెత్త పోయేంతవరకు. అప్పుడు అతడు దాని గుండా తన ప్రతిబింబాన్ని చూడగలిగినప్పుడు, ఆ చెత్త అంతా పోయిందని అతడు గుర్తిస్తాడు, మరియు ఆ బంగారములోనున్న ఇనుము మరియు వేరే పదార్థాలు అన్నిటిని వేరు చేస్తాడు.
32ఆ రీతిగానే దేవుడు ఆయన యొక్క సంఘాన్ని తయారుచేస్తూ ఉన్నాడు, అనగా సమస్త మానవ సిద్ధాంతములు, మరియు బుద్ధిహీనత, మరియు సమస్తలోకమును, దేవుడు దానిలో నుండి బయటకు కొట్టి, వేరు చేస్తూ, యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబం దానిలో కనబడేంతవరకు చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, అదే సంఘమై ఉన్నది! నేను గృహము నుండి గొప్ప సభ నుండి ఇప్పుడే బయటకు వచ్చియున్నాను, ఆ యొక్క ఆరు ముద్రలు, మరియు ఆ యొక్క ఆరవ ముద్ర ….. లేక, ఏడు ముద్రలు. ఆ యొక్క ఆరో ముద్ర అనేది సంఘం యొక్క శుద్ధికరణకు సంబంధించినది. అది సంఘమే, అయినప్పటికీ, వారు వారి యొక్క శుద్ధికరణ కోసం శ్రమల కాలం గుండా వెళ్తారు. అయితే, వధువు ఎత్తబడుతుంది, అనగా వధువుకు మరియు సంఘానికి వ్యత్యాసము ఉన్నది.
33నేను ఇచ్చట సిద్ధాంతీకరిస్తున్నాను అని అనుకోవడం లేదు. మీరు ఏదైనా నమ్మని ఒక సిద్ధాంతాన్ని నేను చెప్పినచో, అప్పుడు నేను ఒక చెర్రీ పై తినినట్లుగా ఉంటుంది. నేను చెర్రీ పై ఎంతో ఇష్టపడతాను. అయితే నేను ఆ యొక్క విత్తనాన్ని తాకినప్పుడు, ఆ యొక్క తొక్కును దూరంగా పారవేయనుకదా; దాని యొక్క విత్తనాన్ని మాత్రమే పారవేయగలను మీరు కూడా అదే విషయాన్ని చేస్తారు. కోడి మాంసం తినేటప్పుడు, మీకు ఎముకలు తగిలినచో, అప్పుడు మీరు మాంసాన్ని పారవేయరు కదా, ఆ యొక్క ఎముకలు మాత్రమే పారవేస్తారు కదా. కావున మీకు నచ్చని ఏ సిద్ధాంతానైనా నేను చెప్పినప్పుడు, అప్పుడు మీరు ఆయొక్క ఎముకను పారవేయండి, చూచారా.
అయితే, ఇప్పుడు అత్యవసర సమయాలలో మాంధ్యము ఉన్నప్పుడు, అధ్యక్షుడు నిరంతరముగా సమావేశాలకు మరియు చివరి సమావేశానికి పిలుస్తాడు, మరియు వారు దీనికైనా లేదా దానికైనా హాజరవాల్సిందే. మరియు క్యూబా దేశము ఎగిరి వెళ్లి వారిని కూడా ఆ యొక్క సమావేశానికి పిలుస్తారు. మరియు ఏదో ఒకటి ఎగిరివెళుతుంది, వారు సమావేశమునకు పిలిచెదరు. దాని గురించి మనం వింటూ ఉంటాము, చాలాదగ్గరలో సమావేశము జరగబోవుచున్నదని.
ఆ సమావేశంలో వారు ఏమి చేయుదురు? అది ఎలా సమావేశం అవుతుంది?
34మొదటి విషయం, ఏమనగా వారందరూ కలిసికట్టుగా పిలవబడతారు, మరియు కలిసికట్టుగా పిలవబడతారు, మరియు పిమ్మట ఒక స్థలాన్ని ఎన్నుకుంటారు. జెనీవాలో, అయితే నేను అచ్చట ఉన్నాను. అది ఒక చాలా గొప్ప అందమైన ప్రదేశము. మరియు వారు సాధారణంగా అలాంటి ఉత్సాహభరితమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటారు, కావున వారు అలా అచ్చటకు చేరుకుంటారు, పిమ్మట ఈ స్థలాన్ని ఎన్నుకుంటారు, అప్పుడు గొప్ప మనుషులందరినీ ఈ ఒక్క ప్రదేశానికి పిలుస్తారు. మరియు… నేను దానిని ఇచ్చట రాసుకొనలేదు. అది స్విజర్లాండ్ లో, ఎచ్చట ఉన్నదో మేము అచ్చటకు వెళ్లి ఉన్నాము, బిల్లీ? వారు ఎచ్చటనున్నారు… అది జెనీవాలో ఉన్నది, కాదంటార? మరియు అది ఒక అందమైన దేశం అని నేను భావిస్తున్నాను. ఆ సమావేశం యొక్క పేరును నేను రాసుకొనలేదు, అయితే అది జరుగుతున్నప్పుడు, నేను అచ్చట ఉన్నట్టు నాకు గుర్తు ఉన్నది. మరియు వారు కలుసుకున్నారు మరియు ఈ స్థలాలలో వారు చేయగలిగినంత ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారు, దానిమీద పనిచేశారు.
35ఇప్పుడది. లోకసంబంధమైనది. మరియు అందులో సమస్తమును తప్పుయైయున్నది, అనగా లోకంలో ఉన్న సమస్తమును అది తప్పేయై ఉన్నది, అనగా సరియైన దానికి అది మాదిరిగా ఉన్నది.
ఇప్పుడు, పాపమనగా ఏమిటి? నీతిని వంకర చేయుటయే పాపం. ఇప్పుడు కేవలం ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, అతడు దేవుడై ఉన్నాడు. మరియు సాతాను సృష్టికర్త కాదు. అతడు వాస్తవమైన సృష్టిని కేవలం వంకర చేస్తూ ఉంటాడు. అబద్ధం అనగా సత్యాన్ని తప్పుగా చెప్పటమే. అబద్ధం అనగా సరైన కార్యక్రమాన్ని తప్పుగా చేయుటయే. వాస్తవమైన దానిని ప్రతిసారి వంకర చేయుటమే తప్పు. సాతానుడు వంకర చేస్తాడు కానీ సృష్టించలేడు. చూచారా? మరియు … మరియు మనకు అది తెలుసు, అది తప్పు అని, అది ఒక అబద్ధము, లేక పాపమైన ప్రతిదీ నీతిని వంకర చేయటమే. కావున సాతానుడు ఎల్లప్పుడూ కూడా ఆ మాదిరిని తీసుకుంటాడు, అనగా దేవుడు చేసిన దానిని వాడు వంకర చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాడు.
36ఉదాహరణకు, చాలామంది ప్రజలు సభను చూసి, వారు చెప్తారు, "ఇది ఒక టెలిపతి మాయాజాలం లేక ఇది ఒక …. ఆ యొక్క మనిషి, ఏమని పిలవబడ్డాడు? గారడివాడైన సీమోను, మరియు — మరియు అలాంటిది ఏదో ఒకటి." చూచారా? ఎందుకని? మీరు ఒక ఆత్మ సంబంధమైన మనిషినిలేదా ఒక దయ్యపు కార్యాన్ని చూసినప్పుడు, దేవుడు కలిగి యున్న ఒక వాస్తవమైన దానిని వంకర చేయడమే దయ్యం కార్యము. అది నిజం. దీనిని చూచారా?
మరియు మనుషులు తెలుసు కొనవలసియున్నారు, ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవలసియున్నారు, ఎంతగా ఆత్మ సంబంధంగా ఉండాలో, తప్పు మరియు ఒప్పు ఏదో ఎరుగవలసియున్నారు. దయ్యములను ఒక ఆత్మసంబంధమైన మనిషి వెళ్ళగొట్టడం మీరు ఎన్నడైనా చూచారా? మరియు—మరియు రోగులను స్వస్థపరచడం, మరియు సువార్తను బోధించడం? "వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు". చూచారా? వారు ఎచ్చటో ఒక చిన్న సందులో నిలబడి, మరియు మీ యొక్క చేతి రేఖలను చదివి నాలుగు లేక ఐదు విషయాలు ఊహించి చెప్తారు, అయితే వాటిలో ఒక డజను తప్పుగా ఉంటాయి. మరియు మీరు చూచారా? అచ్చటే మీరు ఉన్నారు. అదియే వంకర అయి ఉన్నది, ప్రజల యొక్క మనసులను ఆకర్షించుట, అది ఒక ప్రయత్నం, వాస్తవం నుండి దూరంగా వెళ్ళిపోవుట, నిజమైన పరిశుద్ధాత్మనుండి, అనగా మనం పరలోక స్థలంలో కలిసికట్టుగా కూర్చున్న దగ్గర, మరియు మనము ఏమి చేయవలెనో క్రీస్తు మనకు ప్రత్యక్షపరుస్తున్న చోటు.
37సంఘములు ఆ రీతిగా ఉండవలసి ఉన్నది. భాషలలో మాట్లాడుతున్న ప్రజలు ….. నేను దీనిని చెప్పవలెనని తలుస్తున్నాను, ఎందుచేతననగా నేను మీ యొక్క తండ్రినై ఉన్నట్లుగా, ఇది ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో నేను దానిని చేసినట్లుగా. చూచారా? మనకు చాలా గొప్ప విషయమును పొందుకొని ఉన్నాము. అయితే ఇది …… మరియు ఇది కచ్చితంగా ప్రతినిత్యం తీసుకొనలేదని నేను నమ్ముతున్నాను. చూచారా? మరియు ఇది సంపూర్ణంగా సరిగ్గా ప్రతినిధిగా ఉన్నచో, ఇది దీనికి అదే అమ్ముకున్నది. ఇప్పుడు, ఈ యొక్క చాలామంది మెథడిస్టులు, ఈ యొక్కస్తు బాప్టిస్టు లు, మరియు ప్రెసిబిటేరియన్లు దీనిని కలిగి ఉండాలని కోరుకొనుచున్నారు. అయితే ఈ రీతిగా దీనిని వీరికి మనము చూపించవలసి ఉన్నాము. చూచారా?
38ఇప్పుడు, ఒక వ్యక్తి గృహాన్ని కట్టుట మీరు చూసినట్లయితే, మరియు అతడు ఒక సుత్తి తీసుకొని మేకులను ఆ గృహములో కొట్టుచు ఉన్నట్లుగా ఉన్నది. మీరు నడుస్తూ వెళ్తారు. మీరు ఒక యంత్రం తీసుకొని దానిలోనికి ఒక మేకు యొక్క క్రింది భాగాన్ని లోపలకు మీరు కొట్టినట్లుగా ఉన్నది. అప్పుడు అది ఒక రకమైన శబ్దం చేస్తుంది, అనగా పైకి దానిని కొట్టినప్పుడు, రెండుసార్లు త్వరగా మంచిగా కొట్టినప్పుడు. అయితే మీరు అతని వద్దకు వెళ్లి ఇలా చెప్పినచో , "ఆహ, నీవేమీ చేయుచున్నావు? నీవు ఒక ప్రాచీనమైనవాడవు. నీవు దానిని చేయరాదు. అది తప్పుడు మార్గంలో ఉన్నది. ఇచ్చట, నావద్ద ఒక యంత్రం ఉన్నది, అది దానిని చేస్తుంది". వెంటనే మీరు, మీ యొక్క అమ్మకాన్ని నాశనము చేశారు. బిజినెస్ మెన్ అంటే మీకు అది తెలియను. మీ వ్యాపారాన్ని మీరు నాశనం చేశారు. మీరు వెళ్లి అచ్చట చేయవలసిన విషయం ఏమనగా మీరు అతనిని ఒక విధముగా ఆకర్షించవలసి ఉన్నారు, అతను మంచిగా ఎలా దానిని నిర్మించగలడు, అతనికి ఆయొక్క ఉత్పత్తిని పరిచయం చేయుట. అది ఏదైనా మంచిగా ఉన్నచో, అది అమ్ముడుపోతుంది. అమ్మకపు దారులైన మీకు అది బాగా తెలుసు.
కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము కన్నా మంచిది ఏదీ లేదని మీకు తెలుసు. పరిశుద్ధాత్మ తప్ప పరలోకము నుండి మనిషికి మంచిది ఏదీ ఇవ్వబడలేదు. అయితే, మీరు చూడండి, మనము ఒక వ్యక్తిని క్రిందికి దించాలని శబ్దం చేస్తున్నాను. అతనిని కొద్దిగాపైకి లేపి పట్టుకొనండి, పిమ్మట ఆతని చుట్టూ మన చేతులు వేద్దాం, మరియు ఆ యొక్క మంచము చుట్టూ దుప్పటిని పరిచి వేయుచున్నామని అతను గ్రహించనివ్వండి. చూచారా ? మరియు అలాంటి సమావేశాన్ని ఏర్పరచాలి, మీరు చూచారా. అతనికొక చిన్న గదిని కూడా ఇవ్వండి, అయితే ఆ తర్వాత అతడు పోరాటంలో పడతాడు.
39ఇప్పుడు, మీరు చూడండి, మన సంఘాలలో చాలాసార్లు మీరు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, వారు లేవటాన్ని మనం అనుభవిస్తుంటాము, మరియు వారు ఆ సమయంలో భాషలతో మాట్లాడుట, మరియు మనము బలిపీఠమునకు రమ్మని పిలుపునిచ్చుట, ఎవరో ఒకరు భాషలతో మాట్లాడుట, మరియు ఎవరో ఒకరు వాటికి అర్థము చెప్పుట మొదలగునవి జరుగును. కేవలం వారిలో ఎవరో ఒకరు, నేను నమ్ముచున్నాను, ఆ వ్యక్తి నిజముగానే భాషలతో మాట్లాడుతూ ఉండవచ్చును, అయితే మరొక వ్యక్తి, ఎక్కువగా లేదా తక్కువగాను ప్రవచించవచ్చు, అని నమ్ముచున్నాను. ఎందుచేతననగా ఒకరు భాషలతో మాట్లాడవచ్చు, ఒక ఐదునిమిషాలు, అలా చేయవచ్చు మరియు మరొక వ్యక్తి ఒక నాలుగు మాటలు తర్జుమాను చెప్పవచ్చు. చూచారా? అది ఒకే రకమైన స్వరాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మరియు ఆ యొక్క స్వరములేదా ధ్వని పైకి లేవటము తగ్గటము ఒకే రకంగా ఉండవలసి ఉన్నది.
40మరియు పిమ్మట దానిని మరలా చెప్పినచో మరియు అది అలా జరగనిచో అప్పుడు ఆ యొక్క దయ్యపు ఆత్మను నీ నుండి దూరపరుచుకో. నీవు దానిని కోరుకొనరాదు. నా గుడారంలో, ఒకరు మాట్లాడినచో, అతడు దానిని కలిగి ఉండవచ్చు. అది ఇచ్చట రాయబడి ఉంది. అది అతడు మాట్లాడిన తర్వాత అలా జరగనిచో, వారు వారి నుండి ఆ యొక్క అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుకొంటారు. అది అలాగే ఉండవలసి ఉన్నది, అంతేగాని ప్రతిసారి చెప్పినదే చెప్పడం కాదు. యేసు చెప్పెను, "అన్యజనులు ఉచ్చరించు రీతిగా మీరు వ్యర్థమైన మాటలు పలకవద్దు" అది ఏదో ఒకటి ప్రత్యక్షంగా ఎవరికో ఒకరికి చెందవలసి ఉన్నది, లేక సంఘానికి అయినా, లేదా అవసరతలో ఉన్నవారికైనా అవసరమై ఉండవలసి ఉంటుంది. అది అచ్చట రాయబడి ఉన్నది. మరియు అది అలా కానిచో… భాషలతో మాట్లాడే ప్రజలు, మరియు క్రీస్తు యొక్క గొప్ప వరములుగా ఉండవచ్చును, మనము అచ్చటికి వెళ్ళటానికి కొన్నిగంటల ముందే అవి రావచ్చును, మరియు పరిశుద్ధాత్మ వారి ద్వారా పనిచేస్తుంది. పిమ్మట అవి ఒక అరలో ఉండవలసి ఉన్నవి, మరియు వారు ఇచ్చట ఏమి చెప్పియున్నారో మనం చెప్పవలసి ఉంటుంది. మరియు వారు చెప్పిన రీతిగా ఇచ్చట జరగలేదనుకోండి, వారిలో నుండి ఆ యొక్క అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయేంతవరకు మరల వారు ఇచ్చట అలా ప్రవచించరాదు.
"బ్రాన్హాం సోదరుడా, మీరు అలా చెప్పుచున్నారా?" అని మీరు చెప్పవచ్చు.
మంచిది, చూడండి. మరియు నేను ఇచ్చట అలా నిలవబడవలసియున్నాను. నేను భయపడరాదు, ఎందుచేతననగా ఇది దేవునిది. సరిగ్గా ఉండవలసి ఉన్నది, మరియు అవి సరిగ్గా ఉండవలసి ఉన్నది, ఇచ్చట ప్రతిసారి. మరియు అవి జరుగుట ప్రజలు చూసినప్పుడు, అప్పుడు మాత్రమే వారు వాటిని నమ్మెదరు.
41ఈ ఉదయకాల సమయంలో, పెంతుకోస్తు సంఘానికి కావలసినది ఏమనగా, ఒక మంచి సమావేశము. అది వాస్తవం. అన్ని సంఘశాఖలు అనగా ఏకత్వమువారు, ద్విత్వమువారు, త్రిత్వమువారు, చతుస్టియంవారు, మరియు మనలో మిగతావారు, మరియు దేవుని సంఘము వారు, అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారు, వారంతా కలిసికట్టుగా కూడుకొని మరియు ఈ విషయములను పరిష్కరించుకొనవలసియున్నారు, అది నిజము, మరియు అప్పుడు సంఘము కదులుట ప్రారంభమగును.
సాతాను ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుకునేటట్లుగా చేసినంతకాలం, వాడు విశ్రాంతిగా వెనుక కూర్చుని చెప్తాడు, "సహోదరుడా, నేను యుద్ధము చేయవలసిన అవసరం లేదు".
అయితే మనము కేవలము అందరము కలిసినచో, మరియు దేవుని వైపునకు తిరిగినచో, సహోదరులుగా, పిమ్మట ముందుకు అడుగు వేసి, గురిపెట్టి, ఐక్యత కలిగి ఉండవలెను. మీరు మారనవసరం లేదు, మరియు ఒకరు ఇంకొక సంఘమునకు వెళ్ళుదురు. మరియు మీరు కోరుకునే మార్గము మీరు చేయవచ్చును. పిమ్మట చిన్నచిన్న వ్యత్యాసములు. మీరు ఎలాంటి వ్యత్యాసం చేయనవసరం లేదు. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించియున్నాడు. కావున బైబిలు చెబుతున్నది ఏమనగా, "దేవుడు విధేయులగు వారందరికీ ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. కావున ఎవరో ఒకరు దేవునికి విధేయత చూపియున్నారు.
42అయితే, ఈ చిన్న చిన్న వ్యత్యాసములను సాతానుడు ఉంచగలిగినంత కాలము, అప్పుడు వాడు సంఘాన్ని ఒక గందరగోళములో నేడు ఉంచగలడు. కావున దానిని మనము మరిచిపోయి కలిసికట్టుగా ఎప్పుడూ రావల్సి ఉన్నది.
గుర్తించుకొనండి, ఆ మరో సోదరుడు క్రీస్తులో ఎలా అయితే ఉన్నాడో, మనము కూడా అలాగే ఉన్నాము. పెద్ద వ్యక్తులని చిన్న వ్యక్తులని అధికారులని ఎవరూ లేరు. మనమందరము పిల్లలము. మనమందరము క్రీస్తులో ఉన్నాం. మనలో ఉన్న చిన్న చిన్న వ్యత్యాసములు అసలుపెద్ద వ్యత్యాసం ఏమీ కాదు. బెక్కి నీలపు రంగు దుస్తులు కావలసిన, లేదా శారాకు ఎరుపురంగు దుస్తులు కావలసిన, వారిద్దరికీ దుస్తులు అందజేయబడతాయి. నా భావాన్ని మీరు గ్రహించారా? కావున వారు దాని గూర్చి వాదించుకోరాదు. కావున మనము దానిని కచ్చితంగా చేయవలసియున్నది అని నేను భావిస్తున్నాను.
43ఇప్పుడు, ప్రపంచ సమావేశములను గూర్చి మాట్లాడుదము, అది ప్రపంచ ఆర్థిక మాంధ్యమందు జరిగినది, మీకు తెలుసా? దేవుడు కూడా కొన్ని సమావేశములను ఏర్పాటు చేస్తాడు. మనము పారిస్, మరియు జెనీవాలో, మరియు నాలుగు పెద్ద, సమావేశములను గూర్చి ఆలోచిస్తున్నాము. మరియు మిగతా ఇతర సమావేశములను గూర్చికూడా. అయితే దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని సమావేశములను గూర్చి ఇప్పుడు మనము ఆలోచించెదము. ఇవి దేవుడు ఏర్పాటు చేసిన వాటికి మాదిరిగా ఉన్నవి.
మొదటి సమావేశమును గూర్చి నేను ఆలోచిస్తూ ఉన్నాను, దాని గూర్చి నేను ఇప్పుడు ఆలోచిస్తాను, నేను లేఖన పూర్వకముగా మాట్లాడుచున్నాను, నేను దానిని దేవునియొక్క ఏదేను సమావేశముగా పిలిచెదను. "దేవుడు మనిషిని తన సొంత పోలికలో సృష్టించి ఉన్నాడు, అతనిని ఆయన స్వరూపమందు సృజించెను; స్త్రీని గానూ మరియు పురుషుని గాను వానిని సృజించెను." వారు ఆయన యొక్క ప్రియమైన పిల్లలు. మరియు వారు తమ యొక్క సొంత నైతిక నిర్ణయ హక్కును తీసుకునే వారిగా సృజించబడ్డారు.
ఆ యొక్క ఒక ప్రాచీనమైన అవిశ్వాసి చాలా సార్లు ఇలా చెప్పాడు, "ఒక నీతి గల దేవుడు అలా ఎందుకు చేయుచున్నాడు, మరియు కాలమంతటి గుండా ఆ బాధలను భరించేటట్లుగా ఎందుకు చేశాడు?"
దేవుడు అలా చేయలేదండి. మనిషి అలా తనకు తానుగా చేసుకున్నాడు. మనిషి అలా చేయవలెనని దేవుని ఉద్దేశ్యం కాదు.
"మంచిది పిమ్మట, ఏమి జరిగినది, దేవుడు సర్వశక్తిమంతుడైనచో అది అలా జరుగుటకు ఆయన ఎందుకు అనుమతించాడు? అని వారంటారు. దేవుడు మనిషిని పరిపూర్ణునిగా ఎందుకు చేయలేకపోయాడు?"
44ఆదిలో దేవుడు తప్ప మరొకటి ఏదియూ లేదు. మరియు దేవునిలో కొన్ని లక్షణములు ఉన్నవి, ఆయన యొక్క ఒక లక్షణమేమనగా రక్షకుడు. అది అలా ఉన్నదని మనమెరుగుదము. ఆయన ఒక రక్షకుడు, మరియు అది ఆయనలో ఉన్నది. మరియు అప్పుడు రక్షింపబడుటకు ఏదియు కోల్పోలేదు. ఆయనలో తండ్రి, అనే లక్షణం ఉన్నది. మరియు అయితే ఆయన తండ్రిగా ఉండుటకు అచ్చట ఏమియూ లేదు. ఆయనలో స్వస్థపరచువాడు అనే లక్షణం అన్నది. అయితే అచ్చట ఏదీ రోగిగా లేదు. కావున ఇప్పుడు ఆయన మనిషిని ఒక స్వేచ్ఛా నైతిక నిర్ణయ హక్కుదారునిగా చేయవలసి ఉన్నాడు, అతడు దానిని చేస్తాడని ఎరిగి దానిని చేసెను. దేవుడు తనకు తానుగా, అలా చేయలేదు. మానవుడే తనకు తానుగా, అలా చేసుకున్నాడు.
కావున మీరు ఈ ఉదయకాల సమయంలో ఆ రీతిగా ఉన్నారు. మీరు జీవాన్ని అంగీకరించగలరు లేదా దానిని తిరస్కరించగలరు. అయితే దేవుడు మానవుని ఆ రీతిగా చేసి ఉన్నాడు, అది అతడు …… అతడు అలా చేస్తాడని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు, అతను అలా చేయాలని ఆయన సంకల్పం కాదు గాని, అతడు అలా చేస్తాడని ఆయన ఎరిగి ఉన్నాడు, అప్పుడు ఆయన యొక్క లక్షణంలో ప్రదర్శనలోనికి రావాల్సి వున్నది. కావున కాలానికి అతీతంగా ఏమియూ అచ్చటలేదు. సమస్తము దేవుని యొక్క కాల గడియారం ప్రకారముగా కొట్టుచున్నవి. చూచారా? మరియు ఇది కేవలం ఆయన యొక్క లక్షణాలను ప్రదర్శిస్తున్నది, ఎవరైతే ఆయనను నిజముగా ప్రేమిస్తారో మరియు ఆయనను నమ్ముతారో వారిని ఎన్నుకొనుట కొరకు. మరియు ప్రతి మనిషి సమాన హక్కును కలిగియున్నాడు.
దేవుడు ఒక అనంతమైన వ్యక్తిగా, ఏమి జరగబోవుచున్నదో లేదా ఏమీ జరగదో ఆది నుండే ఆయన ఎరిగి ఉన్నాడు. కావున ఎవరును నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదని ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే, ఆయన అనంతమైనవానిగా అవన్నీ ముందుగా ఎరుగువలసి ఉన్నది. కావున అచ్చట కళంకమైనను, ముడత అయినను, మచ్చ అయినను, లేనటువంటి సంఘము ఒకటి ఆయన కలిగి ఉండవలెనని కోరుకున్నాడు. అనగా అలా ఉండునని ఆయనకు తెలిసియున్నది. ఆయన దేవుడైయున్నాడు.
45ఇప్పుడు, ఏదేను తోటలో ఆ యొక్క సుందరమైన స్థలములో, పురుషుడు మరియు స్త్రీ కలిసి నివసించే చోట. దేవుడు గొప్ప కాంట్రాక్టర్.
అది కట్టబడుచుండగా ఇప్పుడు మీరు ట్యూసాన్ లో దానిని ఎక్కువగా కలిగి ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, నేను అచ్చట ఉన్నప్పుడు ఒక చిన్న నగరము ఉన్నది. మరియు ఇప్పుడు అచ్చట నేను జీవించుచున్నాను. అయితే అచ్చటకు నగరానికి వలస వచ్చిన వారు మరియు అమెరికన్ ఆదివాసీలు ఉండేవారు. అనగా నేను ఇచ్చట కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు, మరియు ఇప్పుడు అచ్చట చాలా పెద్ద గృహాలు ప్రాజెక్టులు మరియు భవనాలు అక్కడ బయట, అక్కడ బయట, అక్కడ బయట, కట్టబడి ఉన్నవి. మంచిది, ఏమి జరుగుచున్నది? చూచారా, కాంట్రాక్టర్లు లోపలికి వచ్చి వారు కొంత భూమిని కొనుచూ ఉన్నారు. పిమ్మట దానిని విభాగిస్తూ ఉన్నారు. పిమ్మట అక్కడ వారు గృహాలు కడుతున్నారు.
46ఇప్పుడు, దేవుడు దానిని చేసి ఉన్నాడు. చూచారా? ఆయన— ఆయన యొక్క పదార్థములన్నియూ అచ్చట ఉంచాడు, అనగా మన శరీరములను తయారు చేయుటకు, ఈ ప్రపంచమంతా నిర్మాణం అయ్యేటప్పుడు అలా ఉంచాడు. ఇప్పుడు, మనము పదహారు రకాలైన మూలకాల ద్వారా నిర్మించబడ్డాము, అవేవనగా పొటాషియం, మరియు కాల్షియం, మరియు పెట్రోలియం, మరియు విశ్వసంబంధమైన వెలుగు, మరియు మొదలగునవి. మరియు ఇవన్నీయూ మానవుని తయారు చేయుటకు దోహద పడినవి. అయితే ఇవన్నియూ మానవుడు ఈ భూమి మీదకు రాకమునుపే అవి ఇచ్చట ఉన్నవి. చూచారా? అసలు భూమి ఇక్కడ లేక ముందే దేవుడు మన శరీరములను మరియు మన నిర్మాణానికి కావలసిన పదార్ధములను ఇచ్చట ఉంచియున్నాడు.
ఇప్పుడు, మీరు ఇచ్చటికి వచ్చి ఉన్నారు. మరియు మీరు దేవుని ద్వారా ఇచ్చటికి వచ్చి ఉన్నారు. కావున మీరు ఎన్నుకున్నచో నిత్యము జీవించే అవకాశంను మీరు కలిగి ఉన్నారు. అది నిజము. ఆదాము మరియు హవ్వ వారు దానిని కలిగి ఉన్నారు. ప్రతి …… దేవుడు మారనివాడు. ఆయన మారనివాడైయున్నాడు. ప్రతి మనిషికి ఆయన ఒకే రకమైన అవకాశమును ఇచ్చాడు.
ఇప్పుడు, మనము దేవునిని కనుగొన్నాము, ఆయన మానవుని సృజించినప్పుడు సంతోషించాడు. ఆయన తన కుమారుడు మరియు కుమార్తె వైపు చూశాడు, మరియు వారితో ఎంతో సంతోషించాడు. పిమ్మట మనము కనుగొనినదేమనగా, ఆదాము మరియు హవ్వలు పాపము చేసిన వెంటనే దేవుని ముందుకు ఒక వర్తమానము వచ్చినది, మా తండ్రి, "మీ కుమారుడు కృపలో నుండి పడిపోయాడు. అతడు మీ నుండి దూరముగా పోయాడు". ఓ, అది ఆయన యొక్క హృదయానికి ఎలాంటి శబ్దముగా ఉంటుంది!
47ఇప్పుడు ప్రకృతిని గమనించండి. ఆదాము తాను నశించిపోయాడు అని తెలుసుకున్నప్పుడు, అతడు తప్పు చేశాను అని తెలుసుకున్నప్పుడు, మరియు అది అప్పుడు అతని ముందుకు తేబడినది అనగా అతడు తప్పై ఉన్నాడు అని తెలియపరచబడినది. అప్పుడు "ఓ తండ్రి, నా వద్దకు రండి; నేను నశించిపోయాను. నేను తప్పు చేశాను; మోసగించబడ్డాను; నా వద్దకు రండి" అని చెప్పుటకు బదులుగా అతడు దాగునియున్నాడు.
మరియు అది దేవుడై ఉన్నాడు, ఆయన ఆ తోటలోని పైకి కిందికి వెళ్ళాడు, "ఆదామా, నీ వెచ్చటనున్నావు?"
నేడు కూడా ఆయన అలా లేడా? మానవుడు విఫలమైనప్పుడు దేవుని వాక్యం ద్వారా అతనికి మీరు చూపించవచ్చు. అది నిజము. ఆదాము అతడు విఫలమయ్యాడని అతనికి తెలుసు. అతడు దేవుని వాక్యవిషయములో విఫలమైపోయాడు.
మరియు మీకు గుర్తున్నది, అది మొత్తంగా తెలుసుకొని తీసుకొనుట లేదు. గాని జబ్బులు రావటానికి కారణమేమిటో మీకు తెలుసు, మరియు ఈ సమస్యలన్నియు, మరియు మరణము, మరియు దుఃఖము, ఆరువేల సంవత్సరములుగా? ఇవన్నియు సంభవిస్తూ ఉన్నవి. ఎందుచేతననగా, ఒక స్త్రీ ఒక చిన్న మాటను అవిశ్వాసపడటం వలన. దేవుని వాక్యం యొక్క ఒక చిన్న భాగాని అవిశ్వాస పడినది. ఆమె మొత్తముగా నమ్మినది. దాని గూర్చి సాతాను ఆమెకు కొంత సత్యమును చెప్పాడు. "మీరు ఇది చేయవచ్చు, మరియు అది చేయవచ్చు." పిమ్మట వాడు చెప్పెను, "నిశ్చయముగా మీరు చావనే చావరు".
అయితే వారు దానిలో చిన్నభాగాన్నే అవిశ్వాస పడ్డారు, దాని మూలముగా సమస్యలన్నీ వచ్చినవి. అది నిజమేనా? [సమాజం"ఆమెన్" అని చెప్పుచున్నది] వాక్యంలోని ఒక చిన్న భాగమును మీరు అవిశ్వాసపడినచో అది మిమ్ములను వెనుకకు తీసుకు వెళుతుంది అని మీరు భావిస్తున్నారా? అదియే ఈ యొక్క అన్ని సమస్యలకు కారణమని అనుకుంటున్నారా? ("లేదండి") లేదండి.
మనము వాక్యము నొద్దకు రావాల్సి ఉన్నది. అది మాత్రమే మరియు అదియే దేవుడై ఉన్నాడు. "ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను."
48మరియు, చూడండి, దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆయన భూమి మీద పొదుగు ప్రారంభించినప్పుడు, బయటకు ఆ యొక్క తూర్పు పుష్పములు రావడంప్రారంభించినవి, పిమ్మట గడ్డి పైకి వచ్చినది, రకాలైన జీవులు జాతులు పైకి మరియు పైకి రావడం ప్రారంభమైనవి. ఆ గొప్ప పరిశుద్ధాత్మ, వీటన్నింటిని పొదిగినది, లేక పొదుగుట అనగా "తల్లిగా ఉండుటకు అని చెప్పుట". "కూ, కూ అని." పుష్పములు పైకి వచ్చినవి. తండ్రి చెప్పెను, "అది మంచిగా ఉన్నది. అది అలాగే ఉండనివ్వు." మరియు ఆయన పొదిగెను. కొద్దిసేపటి తర్వాత, పక్షులు వచ్చినవి. పిమ్మట తర్వాత విషయం వచ్చినది, పిమ్మట జంతువులు వచ్చినవి. ఆయన వాటన్నిటినీ గొప్పగా, గొప్పగా, గొప్పగా, గొప్పగా, ఉంచియున్నాడు.
మరియు, చిట్టచివర, ఆయన అనగా దేవుడు దానిని పొదిగినప్పుడు, భూమి తన ప్రతిబింబాన్ని ఆయన యొక్క ప్రతిబింబముగా ప్రతిబింబించినది. మరియు అతడు దేవుని యొక్క రూపమై ఉన్నాడు. మనిషి కన్నా గొప్ప విషయము ఏదియూ అచ్చట రాలేదు, మన ప్రియమైన సహోదరులకు కూడా, అనగా ఒక స్త్రీ కన్నా గొప్పది లేదు. అయితే ఆమె దేవుని యొక్క ఆది సృష్టిలో ఆమె లేదు. ఆమె పురుషునిలో నుండి ఉప ఉత్పత్తిగా బయటకు వచ్చినది, అతని భాగంలో నుండి; మరియు క్రీస్తులో వారిద్దరు ఏకమై ఉన్నారు. ఇప్పుడు మనముందు ఎంత గొప్ప పాఠాన్ని మనం కలిగి ఉన్నాము, దానిమీద కొన్ని గంటలు మనము బోధించగలము, దానిమీద వెలుగును ఇవ్వగలము! గమనించండి.
49ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, పిమ్మట ఈ మనిషి దేవునిని ప్రతిబింబింప చేసినప్పుడు, పిమ్మట దేవుడు తన యొక్క సొంత ప్రతిబింబములో దిగివచ్చియున్నాడు, అదే మానవుని యొక్క రూపంలో, అనగా యేసుక్రీస్తు రూపంలో. మరియు దేవుడు క్రీస్తు నందు ఉన్నాడు. క్రీస్తు నందు ఉన్న దేవుడు, భూమికి ప్రతిబింబింప చేయుచున్నాడు, అనగా ఆయన ఏమై ఉన్నాడో అని: ఒక రక్షకునిగా, ఒక దేవునిగా, ఒక స్వస్థపరచువానిగా. దేవుడు, ఆయన యొక్క వాస్తవమైన లక్షణాలను ప్రదర్శిస్తున్నాడు, మానవుని ద్వారా, అనగా అతనిని ఆయన యొక్క ప్రతిబింబముగా తయారు చేసెను. మరియు దేవుడు, దీనిని పొందుకొనుటకు, ఆయన మానవ శరీర కలయిక ద్వారా రాలేదు, అది ఆదిలో వారు అలా చేసిరి, అయితే ఆయన దానిని ఒక కన్య జన్మ ద్వారా వచ్చెను.
మీరు దానిని చూచుట లేదా, ఆ యొక్క ఆదిపాపము, అది ఏమైయున్నది? [సమాజము "ఆమెన్" అని చెప్పుచున్నది.] చాలామంది దానితో ఏకీభవించుటలేదు, మరియు మీరు ఆ యొక్క "సర్పం యొక్క సంతానము" మీద గట్టిగా అరుస్తున్నారు, అయితే అది అచ్చట ఉన్నది. చూచారా ?
50ఇప్పుడు ఆ యొక్క ప్రతిబింబము దేవుడు క్రీస్తు ద్వారా ప్రతిబింబించుచున్నాడు. అయితే పిమ్మట ఈ మనిషి పడిపోయినప్పుడు…..
నేడు, మనిషి చూపించబడినప్పుడు అనగా దేవుని వాక్యం ద్వారా అనగా అతడు ఈవిషయంలో చేయరాదని చెప్పబడినప్పుడు, అతడు సంఘమునకు కొన్నిసార్లు విశ్వాస పాత్రునిగా ఉండవలసి ఉన్నాడు.
ఈ ఉదయకాల సమయంలో ఇచ్చట నా యొక్క క్యాథలిక్ స్నేహితులు ఎవరైనా ఉన్నచో, ఒక క్షణము నన్ను మన్నించండి. నాయొక్క ప్రజలు చాలామంది కేథలిక్లే మీకు ఆ విషయం తెలుసా?
ఇప్పుడు గమనించండి. ఈ యొక్క బోధకుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, చాలా గొప్ప స్వస్థతలను గూర్చి అతడు చెప్పెను, "నీవు కాథలిక్ నేపథ్యం నుండి వచ్చి ఉన్నావు కదా. మరి నీవు క్యాథలిక్ గా ఎందుకు ఉండలేదు"?
నేను చెప్పాను, "నేను ఒక క్యాథలిక్ ను."
మరియు అతడు చెప్పెను, " ఓ, నేను దానిని నమ్మలేకపోవుచున్నాను".
నేను చెప్పాను, "మీ యొక్క సంఘము దానిని పరిశుద్ధ గ్రంథము నుండి బోధించడం లేదా, యేసుక్రీస్తు మొట్టమొదటి క్యాథలిక్ సంఘాన్ని స్థాపించాడు, మరియు ఈ యొక్క అపోస్తలులందరూ క్యాథలిక్లే.
"అవును".
నేను చెప్పాను, "అయితే వారు ఏమైతే వ్రాసి ఉన్నారో దానిని నేను నమ్ముచున్నాను".
అతడు చెప్పెను, "అయితే, బ్రాన్హాం గారు," చెప్పెను సంఘము ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. పేతురుకి ఆయన తాళపుచెవులు కలిగి ఉండే అధికారంను ఇచ్చారు కదా, మరియు అతను బంధించగలడు, మరియు పేతురు తర్వాత వచ్చిన వారే పోపులు మరియు మొదలగునవి."
నేను చెప్పాను, "మీ యొక్క రాతలన్నియూ నా యొద్ద ఉన్నవి, లేదా వాటిలో చాలా వరకు, అచ్చట మన యొక్క విశ్వాసపు వాస్తవాలు, మరియు మొదలగునవి. అయితే," నేను చెప్పాను, "చూడండి. ఆ పరిశుద్ధ గ్రంథము రాసిన మనుషులే, యేసునకు ప్రక్క ప్రక్కనే నడిచారు కదా, వారు క్యాథలిక్లని మరియు వారి పరిశుద్ధ గ్రంధం రాసి ఉన్నారని, దేవుని యొక్క చిత్తమును వారు ఎరిగి ఉన్నారని మీరు ఆలోచించటలేదా? మరియు దేవునియొక్క ఆజ్ఞలు, అనగా నేడు ఉన్న ఈ ఆధునిక గుంపు వారి కన్నా వారికి ఎక్కువ తెలియునుకదా! మరియు నేను చెప్పాను, "గమనించండి, ఇప్పుడు ఇది సంఘమయినచో, దేవుడు ఏమి చెప్పియున్నాడో వారు విధేయత చూపినచో, వాస్తవముగా, అది దేవుని యొక్క వాక్యమే ఉన్నది, అద్భుతాలు, సూచనలను చూడండి, మరియు మొదలైనవి వారు కలిగియున్నారు. అయితే నేడు క్యాథలిక్ లు ఆయన పేరు వాటిని ఎంతమాత్రం కలిగి లేరు కదా. కావున దేవుడు ఇప్పుడు మీతో లేడని ఇది ఒక నిరూపణగా ఉన్నది.
అతడు చెప్పెను, "బ్రాన్హాంగారు మనము వాదించరాదు కదా".
నేను చెప్పాను, "అయ్యా, నేను ఎవరితోనూ వాదించటలేదు. నేను కేవలము మిమ్మల్ని ఒకటి అడుగుచున్నాను." పిమ్మట నేను నైసియా ఆలోచన సభ గురించి మొదలగువాటి గురించి చెప్పాను.
అతను చెప్పెను, "మనము వాదించటలేదు" అతడు చెప్పెను, "మీరు పరిశుద్ధ గ్రంథమును దాని యొక్క వాక్యంలో చెప్పుటకు ప్రయత్నించుచున్నారు". చెప్పెను, దేవుడు ఆయన యొక్క సంఘములో ఉన్నాడు. అదియే సంఘము అనగా, నేడు అది అలా ఉన్నది. సంఘమును నేడు మనము వినవలసియున్నాము."
నేను చెప్పాను, "దేవుడు ఆయన యొక్క వాక్యములో ఉన్నాడు." అతడు చెప్పెను, "దేవుడు ఆయన యొక్క సంఘములో ఉన్నాడు." నేను చెప్పాను, "ఆయన తన యొక్క వాక్యంలో ఉన్నాడు". మరియు ఆయన యొక్క వాక్యము ఆయన సంఘము కానప్పుడు దేవుడు ఆయన యొక్క సంఘములో లేడు. ఎందుచేతను అనగా వాక్యమే దేవుడై ఉండెను. మరియు నేను చెప్పాను, "మీరు అపోక లిప్స్ ను నమ్ముతున్నారా? దాని అర్థమేమనగా "ప్రత్యక్షతలను" అది గ్రీకు పదం. ఆపోకలిప్స్ అనేది ప్రేరేపించబడినది అని మీరు నమ్ముతున్నారా?
చెప్పెను, "నిశ్చయముగా."
నేను చెప్పాను, "అయితే యేసుక్రీస్తే చెప్పియున్నాడు కదా, ఆ యొక్క అపోకలిప్స్ లో ఎవరైతే దానిలోనుండి ఒక వాక్యమును తీసినా లేదా కలిపినా అప్పుడు అతని యొక్క భాగము జీవగ్రంధములోనుండి తొలగించబడును". మరి అలాంటప్పుడు దానిలో నుండి మీరు ఒకటి తీసివేయగలమని ఏ అధికారంతో చెప్పెదరు? లేక క్రైస్తవ సంఘము స్థాపకుడైన యేసుక్రీస్తు ద్వారా నిషేధించబడినది. మీరు మీకు నచ్చినట్లుగా చేయుచున్నారు. మీరు దానిని చేయరాదు"?
51ఓ, ఈ మనము నివసిస్తున్న ఈ గడియ చాలా భయంకరమైనది. మరియు మనుషులకువారి యొక్క తప్పులు చెప్పబడినప్పుడు, వారు, "తండ్రి నేను తప్పు చేసి ఉన్నాను నన్ను క్షమించండి", అని వచ్చి చెప్పటానికి బదులుగా వారు ఇంకనూ ఆ యొక్క అంజూరపు ఆకులు వెనకాల దాగు కొనుచున్నారు. ఆ యొక్క అంజూరపు ఆకులను వారికి వారే కుట్టుకొనుచున్నారు. మరియు వారు ప్రయత్నించుచున్నారు. మతము అనె పదానికి అర్ధ మేమనగా "ఒక కప్పుకొనుట". వారు చేతుల ద్వారా తయారు చేయబడిన దానిని కప్పుకొనుటకు ప్రయత్నించుచున్నారు. మరియు మనిషి ఇప్పటికీ ఇంకా మార్పు చెందలేదు.
కావున దేవుడు ఒక సమావేశానికి పిలవవలసి ఉన్నాడు. ఆయన దానిని ఆయన యొక్క మనిషి ద్వారా ఆయన యొక్క బిడ్డ ద్వారా చేయవలసియున్నాడు.
మరియు గుర్తించుకోండి, ఆయన ఆజ్ఞలు ఏమనగా నీవు దానిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు" మరియు దేవుడు తన యొక్క సొంత చట్టాలను తృణీకరించడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడై ఉన్నాడు. కావున ఇప్పుడు ఆయన మనిషికి మరియు ఆయనకు ఒక గొప్ప అగాధాన్ని ఉంచి ఉన్నాడు. కావున వారు దానిని ….
ఆయన తన యొక్క బిడ్డను విమోచించడానికి ఆయన వారిని అలా వెళ్ళిపోవుటకు కోరుకోలేదు, కావున ఆయన అతనిని విమోచించవలసిన ఉన్నాడు. కావున వారు సమావేశమునకు పిలిచిరి. మరియు దేవుడు మనిషితో చేసిన మొట్టమొదటి సమావేశము అదియే అదేమనగా ఏదేనులో సమావేశం.
52ఆ మనిషిని ఆయన ఎలా రక్షించబోవుచున్నాడు? ఆయన యొక్క తప్పిపోయిన పిల్లలను అతని వద్దకు వెనుకకు తెచ్చుటకు ఆయన ఏమి చేయగలడు? గుర్తుంచుకోండి ఆయన యొక్క మొదటి నిర్ణయమే పరిపూర్ణమైనది ఎల్లప్పుడూ కూడా.
అవి సిద్ధాంతములుగా ఉన్నచో అనగా ఆ యొక్క అంజూరపు ఆకులు ఆయన అప్పుడు ఇలా చెప్పవలసి ఉన్నాడు. "ఆదామా, నీవు సరిగ్గానే చేసి ఉన్నావు. నీవు ఆ యొక్క చెట్లుచాటు నుండి బయటకు రమ్ము. నీవు చాలా తెలివైనవాడవు. నీవు నన్ను ప్రతిబింబిస్తున్నావు, ఎందుచేతననగా చాలా తెలివైనవాడవు. నీవు కట్టుకున్నటువంటి అంజూరపు ఆకులు అవి నీతిగలవి. మనిషి ఆ యొక్క అంజూరపు ఆకులతో ప్రయత్నిస్తూ ఉన్నాడు.
అయితే దేవుడు ఆ నిర్ణయాన్ని చేసి ఉన్నాడు. మరియు ఆ నిర్ణయం ఏమనగా ఏదో ఒకటి చనిపోవలసి ఉన్నది. ఎందుకనగా అది ఆయనను గూర్చి మాట్లాడుతున్నది. ఆయన యొక్క పరిశుద్ధత మరియు నీతిని గూర్చి ఆయన యొక్క సొంత చట్టము. అది నీవు దానిని తిను దినమున నీవు చచ్చెదవు. మరియు అచ్చట ఒక ఉద్వేగముతో ఒక ప్రత్యామ్నాయం ఉండవలసినది. వృక్ష జీవము ఎలాంటి ఉద్వేగము కలిగి లేదు. కావున చర్మములు పొందుకొనే క్రమంలో అతడు దేనినో చ౦పవలసి ఉన్నాడు. అనగా వారిని కప్పి ఉంచటానికి. మరియు అది దేవుని యొక్క నిర్ణయం అనగా మనిషిని ఎలా రక్షించాలి ఆయనలో మరలా తిరిగి సహవాసానికి మనిషిని ఎలా తీసుకురావాలి, ఏదేనులో అచ్చట ఆ రీతిగా నిత్యము గుర్తుగా ఉంచబడినది. ఏ మనిషి కూడా….
53మనిషిని విద్యావంతునిగా చేయటానికి వారుఎన్ని సార్లు ప్రయత్నించారో నేను చెప్పలేను. ఒక విద్యా సంబంధమైన కార్యక్రమము దానిని చేస్తుందని అతనికి వారు చెప్పుటకు ప్రయత్నించిరి. సంఘములో ఎన్నిసార్లు దానిని ప్రయత్నించిన అవి ప్రతిసారీ విఫలమగుచున్నది. మరియు అది విఫలం అవుతూనే ఉంటుంది. మేము సంస్థ గతం చేయడానికి ప్రయత్నిస్తాము. ప్రతి ఒక వ్యక్తి కూడా ….ఇప్పుడు నేను విద్యకు వ్యతిరేకిని కాను. అలాగే నేను సంస్థలకి కూడా వ్యతిరేకినికాను. అయితే ఈ యొక్క సంస్థలు మరియు విద్యాకార్యక్రమాలు అవన్నీ అన్నియు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మానవుని చేత తయారు చేయబడిన అంజూరపు ఆకులే.
54ఏదేనులో జరిగిన ఆ యొక్క మొట్టమొదటి సమావేశంలోనే అది దేవుని యొక్క ఆదినిర్ణయానికి వెళ్ళినది అనగా రక్తమునకు తిరిగి వెళ్ళినది. ప్రాచీన కాలంలో ఆ యాధుడు….
ఇప్పుడు నేను గృహానికి వస్తున్నాను అనగా పెంతుకోస్తు కొరకు కొద్ది నిమిషాలు.
ఆ ప్రాచీన దినాలలో దేవుడు ఈ యొక్క ప్రత్యమ్నాయాన్ని అంగీకరించినప్పుడు ఆ యొక్క యూదుడు తన మృదువైన ఎడ్లతో రహదారి మీద క్రిందికి వస్తూ ఉన్నప్పుడు, మరియు అతని ఇలా చెప్తాడు, "మీకు తెలుసా నేను ఒక పాపిని. యెహోవా రక్తమును అర్పించమని నాకు చెప్పి ఉన్నాడు" కావున అతడు వెళ్లి తన యొక్క గొర్రెపిల్లనో లేదా అతని యొక్క ఎడ్లతో అతడు వాటిని ప్రధానయాజకుని వద్దకు తీసుకుని వస్తాడు, ఆ దేవాలయములోనికి పిమ్మట అతడు ఆ యొక్క బలిఅర్పణ మీద తన చేతులు ఉంచుతాడు. అది ఏమి చేస్తుంది? అది ఆ యొక్క ప్రార్థించే వారిని తన యొక్క బలితో గుర్తిస్తుంది. పిమ్మట ఆ యొక్క యాచకులు వచ్చి ఆ యొక్క ఎడ్లను వధిస్తాడు. పిమ్మట ఆ యొక్క రక్తమును తీసుకొని అతని మీద ప్రోక్షిస్తాడు. పిమ్మట ఈ యొక్క ఆరాధకుడు వాస్తవముగా తెలుసుకుంటాడు. ఈ యొక్క యూదుడు అదియే తన యొక్క యెహోవా అతడి నుండి కోరుకున్నచున్నది అని..
పిమ్మట ఆ మనిషి ఒక మంచి భావనతో తన గృహానికి వెళ్తాడు. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క వణుకు అనే ఉద్వేగముతో వెళ్తాడు. ఆ రక్తము తన యొక్క చేతులు అన్నింటి మీద ప్రోక్షికరించబడుతూ ఉంటుంది. మరియు అలా మరియు అప్పుడు చూడండి ఆ చిన్న గొర్రెపిల్ల వణికిపోతూ తణుకు తాను తన్నుకుంటూ చనిపోతుంటుంది. ఎందుకనగా తన యొక్క గొంతును కోసివేస్తారు. అతనికి తెలుసు అది అతడుగా ఉండవలసి ఉన్నదని. అతడు తన యొక్క బలివైపు చూస్తాడు. తాను తన చేతులను దానిమీద పెడుతూ తనను తాను గుర్తించుకుంటాడు. "ఇది నేనేమై ఉండవలసి ఉన్నది". మరియు పిమ్మట వారు దాని యొక్క గొంతును కోసినప్పుడు అది చనిపోతూ రక్తస్రావముతో ముందుకు వెళుతుంది. కనుక ఆ చిన్న గొర్రెపిల్ల వణుకుతూ క్రిందికి వెళుతుంది, పిమ్మట అక్కడ ఆ యొక్క ఆరాధకుడు నిలబడి చెప్తాడు, "ఓ, యెహోవా నాకు బదులుగా మీరు దీనిని అంగీకరించారు. నేను చేసిన దానికి నేను ఎంతో సిగ్గుపడుచున్నాను." పిమ్మట ఆ మనిషి గృహానికి వెళ్లి నీతిమంతుడు అవుతాడు. ఎందుచేతననగా యెహోవా ఏమి ఆశించాడో దానిని అతడు చేశాడు. అది మంచిది.
55అయితే రాను రాను అది ఒక కుటుంబ ఆచారముగా మారిపోయినది. ఇప్పుడు అతడు తన యొక్క బలిని తీసుకుని చెప్తాడు, "మంచిది, ఇప్పుడు మనము చూచెదము. ఓ, అవును ఇది ఇప్పుడు ఒక నూతన పౌర్ణమిగా ఉంటుంది. ఒక పండుగగా నేను మంచిగా ఉంటుందని ఊహిస్తున్నాను. ఇది గుడారములో ఒక శుద్ధమైనదిగా ఉంటుందనిపెంతుకోస్తు పండుగగా. కావున నేను ఇంకా మంచిగా అచ్చటికి వెళ్ళవలెనని ఊహిస్తున్నారు. నాకు ఒక గొర్రెపిల్లను అర్పించండి. మీరు అచ్చటికి వెళ్లి దానిని చంపండి, ఏ విధమైన ఉద్వేగాలు లేవు, అయితే అతడు వెనుక కలిగియున్న అదే రకమైన ఆలోచనతో వెళ్ళండి అచ్చటకు వచ్చుచున్నాడు.
పిమ్మట అతడు ఏమి చేశాడు? యెహోవా చెప్పెను, ఇచ్చట యషయాలో తర్వాత మాట్లాడుతున్నది. అతడు చెప్పెను, "మీ యొక్క పవిత్ర పండుగలు నాకు కంపుకొట్టుచున్నవి". [టేపు మీద కాళీ ఉన్నది.]
మనము తప్పక రావాల్సి ఉన్నది. ఒక ఆధునిక రేకేట్టాస్ గుంపు వచ్చినట్లుగా మాత్రము కాదు. మనము తప్పక రావాల్సినది, ఏదో ఆచారపరంగా వచ్చే వారి వలె కాదు, ఈనాడు అలాంటి వారు ఉన్నారు ఈ ఒక్క మత సంబంధమైన సంప్రదాయ వాదులు. మనము పెంతుకోస్తు వారము. మనము చాలా యధార్ధతతో రావాల్సి ఉన్నది. కల్వరిలో చిందించబడిన మన బలి మీద మన చేతులు ఉంచవలసి ఉన్నాము. పిమ్మట యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బాధలను మనము అనుభవిస్తున్నట్లుగా భావన చెందాలి. మనలను మనము లోక సంబంధమైన విషయాలకు మరియు ఈ దినపుయొక్క ఆధునిక ఆలోచనలకు చనిపోయిన వారముగా గుర్తుంచుకోవాలి.
56మనము సోదొమ మరియు గొమోరాల వలె ఉన్నాము. మరియు మనము దానిలో జీవిస్తున్నాము. ఆ యొక్క నీతి గల ఆత్మ మనలో ఉండునుగాక….. ఈ యొక్క పాపమును ప్రతిదినము మన ప్రాణమును క్షీణింప చేయుచున్నవి. ఈప్రపంచం యొక్క పాపములు, మరియు ఈ హాలీవుడ్ ఫ్యాషన్లు, మరియు ఈ యొక్క హాలీవుడ్ సువార్త, మరియు ఈబుద్ధిహీనత, ఈ మేకప్లు, ఈ యొక్క చెడు సంగీతము, పైకి మరియు కిందికి ఎగురుట మొదలగునవి. ఆ సంగీతము ఆగితేనే గాని నీవు క్రిందికి వెళ్ళటం లేదు.
ఒక మనిషి గొర్రెపిల్ల రక్తముచేత కడుగబడినప్పుడు, అతనికి అలాంటి సంగీతం కానీ మరి ఏదీ కానీ అవసరంలేదు. దేవుని శక్తి అతని మీద పనిచేయును. మరియు అతడు శబ్దం చేయును, స్తుతించును లేక అలాంటిదేదో చేయును. అనగా సంగీతము ఉన్నా లేకపోయినా ఏమీ కాదు. పరిశుద్ధాత్మ ఆయనలో ఉంటుంది. మరియు అతడు యేసుక్రీస్తుతో గుర్తించబడతాడు.
అయితే నేడు మనము కోరుకొనుచున్నాము. మనము కొద్దిగా చుట్టూ ఎగురుచున్నాము. పెంతుకోస్తు వారివలె ఎందుచేతననగా మన పూర్వతండ్రులు అలా చేసిరి గనుక. వారు చుట్టూ ఎగరటానికి వారు ఏదో కలిగియున్నారు. ఈ పరిశుద్ధాత్మ వారిని పైకి ఎగిరేటట్లుగా చేసినది. మరియు పిమ్మట వారు తిరిగి మరలా వచ్చినప్పుడు, నీవు ఎంతగా జీవించెదవో అంత పైకి ఎగురు. నువ్వు ఎలా జీవించలేనిచో పైకి ఎగురవద్దు. నేడు మనము క్రిందికి వచ్చి ఉన్నాము. అన్ని రకాల జీవితాల్లో జీవిస్తున్నాము. మనము నిలవబడుచున్నటువంటి దానిమీద ప్రతిబింబాన్ని తీసుకురావాలని.
57మరియు మన సంఘ శాఖలు లోకసంబంధమైనవిగా మారిపోవుచున్నవి. వారు అచ్చటికి వెళ్లి మరియు ఈ యొక్క గొప్ప పాఠశాలలలో మన యొక్కపెంతుకోస్తు సహోదరులను పొందుకొనుచున్నారు. వారందరూ సరియే. వారికి వ్యతిరేకంగా ఏమీలేదు. అయితే నేను ఒక విషయం చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. వారు వారిని విద్యావంతులుగా చేయుచున్నారు. మరియు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నారు. మరియు బి.ఏ. డిగ్రీలు ఇస్తున్నారు. మరియు మిగతావారు చేసిన రీతిగా వీరును చేస్తున్నారు. మరియు అచ్చటకు వారిని పంపిస్తున్నారు. కావున వారు ఏమై ఉన్నారనగా వారు సంపూర్ణంగా …… వారు పెంతుకోస్తు వారు కాదు.
దేవునికి మనుమలు, మనవరాలు లేరు. దేవునికి కుమారులు ఉన్నారు. మన యొక్క తల్లి పెంతుకోస్తు అనే మనము ఆలోచించుటకు ప్రయత్నిస్తున్నాము. మరియు మన యొక్క తండ్రి పెంతుకోస్తు అని, మరియు మనమందరము సండే స్కూల్లో పెరిగి ఉన్నాము. మరియు మనము అనుకోకుండానే పెంతుకోస్తు వారము అయి ఉన్నాము. అదియే మనుమలు లేదా మనమురాండ్రు అయితే దేవునికి మనుమలు లేదా మనుమరాలు లేరు.
58ఆయనకు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారు. మరియు ఆ మొదటి వ్యక్తి చెల్లించిన రీతిగానే ప్రతి ఒక్కరూ అదే వెల చెల్లించవలసి ఉన్నారు. అతడు తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క రక్తము క్రిందకు రావాల్సి ఉన్నాడు. అదే అతను చేయవలసి ఉన్నాడు. మనం ఇప్పుడు దానిని కనుగొని యున్నాము అనగా ఆదిలో యదార్ధముగా అదియే జరిగినది.
ఇప్పుడు మనము ఆలోచించుటకు ప్రయత్నించుచున్నాము. ఎందుచేతన అనగా ఇక్కడ ఒక యవనస్తుడు ఒక విద్యను కోరుకొనుచున్నాడు. అతడు పాఠశాలలోనికి వెళ్లి మొదలగు చేసెను. పిమ్మట అతడు విద్యతో బయటకు వస్తాడు. అతను చాలా మంచిగా మాట్లాడుతాడు. అతడు వేదిక మీద నిలబడతాడు. అతను ఒక ఆకర్షణీయంగా ఉంటాడు. మంచిది, అదే హాలీవుడ్. వారికి మెరుపులు కావాలి. ఒక నాగరికత కలిగిన మనిషిని మీరు కోరుకొనుచున్నారు. ఒక గొప్ప విద్యావేత్తని. పెద్దగా ఆలోచించే మనిషిని మీరు కోరుచున్నారు. అనగా స్త్రీలు తమ యొక్క జుట్టు కత్తిరించుకొనినను దానిని పట్టించుకోలేని ఒక బోధకుని మీరు కోరుకొనుచున్నారు. ఆమె అలా చేయరాదని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. దానికొరకు అసలు పట్టించుకోలేని ….. ఒక ఢీకన్ ఆ సంఘంలోనికి వచ్చినప్పుడు, అతడు ఒక మంచి వ్యక్తి ఆయినచో అతడు ఒకసారి లేదా రెండుసార్లు పెండ్లి చేసుకున్నా సరే వారు అతనిని గూర్చి ఏమీ పట్టించుకోరు. "అది నిజమండి. అతని ఒక మంచి వ్యక్తి అంటారు". అయితే పరిశుద్ధ గ్రంధము దానిని తిరస్కరించుచున్నది. నిజం.
59మనము సంఘానికి వేదాంత పాండిత్యం ద్వారా రావటం లేదు. అయితే మనం ప్రార్థనా శాస్త్రము ద్వారా వచ్చుచున్నాము. అది నిజమండి. మనము క్రీస్తులోనికి వచ్చుచున్నాము.
అయితే మీరు చూడండి, ఈ రోజు మనము ….. మనము ఈ ఆలోచన పొందుకున్నాము. అదేమనగా మిగతా వారివలె మనము కూడా చేయాలని. అదియే సమస్యలోనికి నెట్టినది. మిగతావారు వలే వారు కూడా చేయాలనుకున్నారు. మన మన యొక్క పవిత్రమైన పెంతుకోస్తు పండుగ కూడా కేవలం ఆచారపరమైన ఆరాధనగా మారిపోయినది. మనమందరము దానిని ఎరిగియున్నాము. మరియు అది అలా అవ్వటం మనము చూస్తున్నాము. మనం అలా చేయరాదు.
మనం చేయవలసినటువంటి అసలు విషయం ఏమనగా మనం వెనుకకు వెళ్లి యేసుక్రీస్తుతో గుర్తించబడాలి. ఆయన యొక్క మార్గమును చూసుకొనండి మరియు మన ద్వారా ఆయనను పనిచేయనివ్వండి. పిమ్మట వారికి బోధించబడిన రీతిగా మనుషులు ఆయనను ఆనందముతో వెంబడించెదరు. "నేను అందర్నీ నా వైపునకు ఆకర్షించెదను."
మనం ఒక చిన్న దాని కొరకు వెళ్లటానికి ఎలా ఇష్టపడుతున్నాము మరియు ఆ యొక్క ఏదేను సమావేశమునకు మరికొంత విషయాన్ని మనము వ్యక్తీకరించాలని అనుకుంటున్నాము. అయితే నేను మరియొక సమావేశమునకు వెళ్ళవలెనని నేను కోరుకొనుచున్నాను.
60ఉదాహరణకు మనం మరియొక సమావేశములను కలిగి ఉండెదము. అదేమనగా మండుచున్న సమావేశం నేను దానిని మండుచున్న పొదయొద్ధ సమావేశం అని పిలిచెదను. ఇప్పుడు, దేవుడు పరిగెత్తి పారిపోయిన ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని ఒక విషయం చేయమని చెప్పినప్పుడు, అతను దానిని చేయుటకు రావాల్సి ఉన్నది. లేక తన జీవితం అంతయు అతడు చాలా దీనమైన పరిస్థితిలోనికి నెట్టబడతాడు. మోషే దానిని చేయటం ప్రారంభించాడు. అతడు దేవుని చేత పిలవబడ్డాడు. అతడు ఒక పని కొరకు అభిషేకించబడ్డాడు. అయితే అతడు దానిని చేయటం ప్రారంభించినప్పుడు, ప్రజలు అతన్ని నమ్మలేకపోయారు. కావున అతడు ప్రజలను వెళ్ళుటకు అనుమతించాడు. అతడు బయటకు వెళ్ళిపోయి ఒక అందమైన ఇతియోపియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరియు అక్కడ ఆ ఆస్తిని పొందుకున్నాడు. మరియు కొన్ని గొర్రెలను స్వతంత్రించుకున్నాడు. మరియు అతడు ఇప్పుడు అచ్చట ఉన్నాడు. ఆ బయట అక్కడ మరియు జీవం గల దేవుని సంఘము యొక్క ప్రజలనుగూర్చి దర్శనాన్ని అతడు ఇప్పుడు కోల్పోయాడు. అయితే దానిని చేయుటకు దేవుడు అతనిని అభిషేకించియున్నాడు. ఆయన ఇతనిని పైకి లేపాడు. "తన తల్లి గర్భము నుండి ఒక మంచిపిల్లాడిగా ఎదిగాడు". మరియు ఈ ఉద్దేశం కొరకే ఆయన ఇతనిని పైకి లేపాడు. కావున దానిలో నుండి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయరాదు. ఎందుకనగా ఎలాగైనా సరే నీవు దానిని చేయవలసి ఉన్నావు.
61మరియు మీరు కేవలం సంఘ సభ్యులు, మరియు మీ హృదయముతో ఏదో ఒక బలమైనది ఉన్నదని మీరు భావిస్తున్నారు. క్రీస్తును ఆ రీతిగా నీవు అంగీకరించేంత వరకు నీవు ఒక దౌర్భాగ్యునిగా ఉంటావు. ప్రజలలో యదార్ధమైన పరిశుద్ధాత్మ పని చేయుట మీరు చూస్తున్నారు. అది నీకు రానంతవరకు నీవు ఒక దయనీయమైన స్థితిలో ఉన్నావు. ఇది దేవుడే నిన్ను పిలుచుచున్నాడు. నీకు నీవు విడిచిపెట్టి పొదలలో నుండి బయటకురా. ఇదివరకే చేయబడినది. దేవుడు ఆయన యొక్క మార్గాన్ని చేశాడు. ఇది రక్తము ద్వారా జరిగినది.
"మంచిది, నేను ఒక సంఘానికి చెందిన వాడను" అని నీవు చెప్పవచ్చు, అయితే అది నీవు ఒక ప్రదర్శన లేదా పోటీకి సంబంధించిన మనిషివి అనే విధముగా ఉన్నట్టుంది". ఆ సంస్థకి ఏ విధమైన వ్యతిరేకిని నేను కాదు. అయితే ఆ సంస్థలో ఉన్న ప్రజలకు నేను వ్యతిరేకిని కాదు గాని దాని యొక్క పద్ధతికే నేను వ్యతిరేకిని.
62ఇప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు మనము ఈ యొక్క మండుచున్న పొదను కనుగొన్నాము. దేవుడు అచ్చట ఆ యొక్క ప్రవక్త ప్రశాంతంగా జీవిస్తున్నాడని ఎరిగి ఉన్నాడు. కావున ఈ ప్రవక్తతో ఆయన మాట్లాడవలెనని నిర్ణయించుకున్నాడు. కావున, ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. అత్యవసరముగా, "నేను నా ప్రజల యొక్క మొరలను వినియున్నాను అని చెప్పాడు. మరియు అచ్చట ఒక మనిషి ఉన్నాడు. వారిని విడిపించుటకు నేను పంపియున్నాను, మరియు అతడు చాలా బక్కపలుచగా ఉన్నాడు".
ఓ దేవా, ఇచ్చట ఈ ఉదయకాలసమయంలో ఆయన ఒకరిని పిలుచుచున్నాడు. ఇచ్చట ఉన్న సేవకులు అగ్నివలె రగులుకొనబడాలి. ఆ దర్శనాన్ని చూడండి. మనము చనిపోవుచున్నాము. ప్రపంచము పతనమైనది. సంఘము లోకములోనికి వెనుకకు జారినది. దేవుడు వధువును బయటకు పిలుచుటకు ప్రయత్నించుచున్నాడు.
కావున, ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. అది మనకు చాలా వింతైన ప్రదేశం. అది పర్వతం మీద ఒక పొద. అయితే అది ప్రవక్త యొక్క శ్రద్ధను ఆకర్షించినది. మరియు ఆయన ఇతనిని ఒక సమావేశమునకు అచ్చటకు పిలిచాడు.
63గమనించండి. అతడు ప్రతి మాటకు కూడా అక్కడ విధేయత చూపవలసి ఉన్నాడు. "నీ యొక్క చెప్పులు విడువుము. మోషే నీవు నిలబడిన ప్రదేశము పవిత్రమైనది".
"మంచిది, ఇప్పుడు, ప్రభువా, నేను దానిని గూర్చి కొంత నేర్చుకోవాలి గనుక గౌరవము అనగా టోపీ తీసివేయడం కదా కనుక నా యొక్క టోపీ తీసి వేస్తాను" అని మోషే చెప్పినచో అది ఎన్నడూ పనిచేయదు.
"చెప్పులు" ఆయన అర్థము "చెప్పులు" అని దేవుడు చెప్పినప్పుడు,
"తిరిగి జన్మించు" అని దేవుడు చెప్పినప్పుడు, ఆయన అర్థము నూతనజన్మ అని అంతేగాని కరచాలనం చేయండి అని ఆయన భావముకాదు కదా. లేక సిద్ధాంతాన్ని పునఃచరణ చేయండి అని కాదు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క నూతనజన్మ గురించి భయపడ్డారు.
దయ్యము దాని కొరకు ప్రత్యామ్నాయంగా కరచాలనము అనే దానిని తీసుకు వచ్చినది. లేక ఒక రకమైన మానసిక సంబంధము. అది నీకు ఇలా తెలియజేస్తుంది అవును నేను తిరిగి జన్మించాను అయితే నీ జీవితమే నీవేమిటో తెలియజేస్తుంది. నీలో ఉన్న జీవితం.
దేవుని యొక్క ఆత్మ ద్వారా నీవు జన్మించానని చెప్పవచ్చు. మరియు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క ఒక్క మాటను తిరస్క రించినచో అప్పుడు నీవు తిరిగి జన్మించలేదని అర్థం. నీవు దానిని ఎక్కడో వెనుకకు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. అది నా పరిశుద్ధాత్మ కాదని చూపిస్తున్నది. ఎందుచేతననగా ఆయన తనయొక్క సొంత వాక్యమును ఎన్నడూ తృణీకరించుకోడు కదా. నీవు ఇలా చెప్పవచ్చు, "మంచిది, నా యొక్క సంఘము దానిని బోధించుచున్నది." నీవు కలిగే లేవని అది చూపిస్తున్నది. నీవు సంఘము ద్వారా జన్మించావు అంతేగాని దేవుని ద్వారా కాదు. ఇది దేవుడు. ఆయన యొక్క వాక్యము.
ఇచ్చట అతడు మోషేయైయున్నాడు అనగా అభిషిక్తుడు."నీ యొక్క చెప్పులను విడువము. నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు".
మంచిది, "నా యొక్క టోపీ దీనికి బదులుగా మంచిగా పనిచేయలేదా?". అయితే ఆయన చెప్పులు అని చెప్పాడు కదా. అదియే ఆయన భావము. చెప్పులు.
అయితే "నీవు తిరిగి జన్మించాలి" అని దేవుడు చెప్పినప్పుడు, నీవు తిరిగి జన్మించడమే దాని అర్థం.
64ఇప్పుడు వినండి. ఓ, నేను ఒక మిక్కిలి మిశ్రిత జనాంగంలో ఉన్నాను. మరియు యవ్వన పిల్లలమధ్య. అయితే నీవు నీ యొక్క వైద్యుని వినాలి. నీవు విను. మీరు నా మాట విని అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను.
ఏ జన్మ అయినా సరే అది ఒక గందరగోళమే. అది ఒకవేళ పందుల గూడెం అయిన నాకు అనవసరం లేక ….. లేక గులాబీ రంగుతో అలంకరించబడిన ఆసుపత్రి గది అయినా సరే. ఏ విధమైన గందరగోళమైనా ఒక జన్మ అనేది గందరగోళమైనది. మరియు కావున ఇది నూతన జన్మ. ఇది ఒక గందరగోళంగా వారికి ఉన్నది. నీవు ఆలోచించని వాటిని అది నీ కొరకు చేస్తుంది. అయితే ఆ యొక్క మరణం మరియు క్షయత నుండి జీవం బయటకు వస్తుంది.
65మరియు ఏ విత్తనమైన సరే అది సంపూర్తిగా చనిపోయి కుళ్ళిపోయేంత వరకు కూడా జీవాన్ని బయటకు తీసుకుని రాలేదు. మరియు ఆ యొక్క కుళ్ళిపోయిన చెత్త నుండి, మరల ఇంకా ఏమీ కుళ్ళిపోవడానికి విడిచిపెట్టబడడానికి ఏమీ మిగలదు, అప్పుడు కేవలం జీవము మాత్రమే జీవిస్తుంది. అదేరీతిగా ఒక కుమారుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, అతడు పరీక్షించబడతాడు.
నేను ఆ దినమున నిలబడియున్నాను. నాకు గుర్తు ఉంటది నేను నా యొక్క పరీక్షను స్వీకరించినప్పుడు, నేను రోజుల తరబడి రోజులుగా, నెలలు తరబడి నెలలుగా, సంవత్సరాల గుండా నాలుగు లేక ఐదు సంవత్సరాలు ఆ యొక్క వీధులలో సందులలో సువార్తను ప్రసంగించే వాడను మరియు దేవుని దృష్టిలో అది సరైనదని చేయుటకు నేను ప్రయత్నించియున్నాను. మరియు నా భార్య నా నుండి వెళ్ళిపోవుటకు ఆయన అనుమతించాడు. నా బిడ్డ అచ్చట ఉన్నది. చనిపోవుచున్నది. మరియు నేను నా బిడ్డ వద్దకు వెళ్లి నేను ఇలా చెప్పాను, "ప్రభువైన దేవా, నా పాప చనిపోకుండా సహాయం చేయండి." ఎనిమిది లేక తొమ్మిది మాసాల పాప అప్పుడు ఆమె.
నేను పైకి చూశాను, మరియు ఒక నల్లటి దుప్పటి క్రిందికి దిగి రావటం చూసాను. ఆయన నా ప్రార్ధన వినుటకు నిరాకరించాడు. ఆయన నా వైపు చూడలేదు కూడా. నేను పైకి లేచాను. ఇరవై-మూడు సంవత్సరాల వయస్సు. అచ్చట నా భార్య శవాల గదిలో ఉన్నది. ఆమె కొరకు కూడా ఆయన నా ప్రార్థన వినలేదు. నేను అన్ని చేసినప్పటికీ, నేను చెప్పాను, "దేవా, నేను ఏమి చేసి ఉన్నానో చెప్పుము. నేను ఒకవేళ తప్పు చేసినచో నన్ను శిక్షించండి అంతేగాని వారిని కాదు." నేను చెప్పాను, "నేను ఏమి చేశాను? ప్రభువా? రోజంతా పనిచేశాను మరియు రాత్రంతా ప్రసంగాలు చేశాను మరియు సందులు గొందుల గుండా ప్రసంగించాను. మరియు ప్రతి … నేను ఏమి చేశాను? నేను ఏమి చేశానో చెప్పండి?." అయితే నేను ఏమి చేశానో కూడా ఆయన నాకు చెప్పలేదు.
66అప్పుడు సాతానుడు నా ప్రక్కకు వచ్చి ఇలా చెప్పెను. ఒక మాట సమస్త పరిస్థితిని మార్చి వేసినప్పుడు, ఒక్క మాట నీ యొక్క పాపను రక్షించగలిగినప్పుడు, అయితే ఆయన దానిని చేయటం లేదు కదా? ఆయన దానిని చేయడు. ఆ ఒక్క మాట పలికితే చాలును కదా. అప్పుడు నీవు ఇంకా ముందుకే వెళ్లి ఆయనను సేవించుదువు కదా"?
ఆ యొక్క మానవ తర్కము అది నిజమే. ఆయన నాయొక్క పాపను బాగు చేయనప్పుడు నేను ఆయనను ఎందుకు సేవించాలి? అది మిగతా విషయాలన్నిటినీ తీసుకుంటుంది. నేను ఆయన కొరకు చేయగలిగేవన్నీ చేసినప్పుడు ఆయన "నా యొక్క పాపను గూర్చి వినలేనప్పుడు, ఎందుకు సేవించాలి? అలా నాకు చాలా బలమైన శోధన వచ్చింది. అయితే సమస్త మానవ తర్కములన్నియు బద్దలైపోయినవి. ఆయన దానిని నా కొరకు కొద్దిగా చేయలేనప్పుడు నేను ఎందుకు ఆయనను సేవించాలి? మరియు నేను ఆయన కొరకు రాత్రి పగలు సేవ చేస్తున్నాను మరియు నేను ఏమి తప్పు చేసి ఉన్నానో కూడా ఆయన నాకు చెప్పలేదు". మంచిది మానవ తర్కములు వెళ్లినవి.
67అయితే, ఓ, ఒక మనిషి తిరిగి జన్మించినప్పుడు, అతనిని ఏదో ఒకటి పట్టుకుంటుంది. ఆ ప్రదేశానికి అది వస్తుంది. నేను ఇలా తలంచినప్పుడు "ఆమెను నేను ఎచ్చట నుండి పొంది ఉన్నాను? ఆమె ఎచ్చట నుండి వచ్చినది? నేను ఏమైయున్నాను? ఏ రీతిగా ఉన్నాను? నేను ఎచ్చట నుండి వచ్చాను? చూశారా? ఇక మానవభాగం అంతయు బద్దలైపోయినది. పిమ్మట ఆ యొక్క వాస్తవమైన దేవుని యొక్క ఆత్మ అచ్చటికి వచ్చినది.
నేను ఆమె వద్దకు నడిచి వెళ్లాను. నాయొక్క చేతులు ఆమె తలపై ఉంచాను. ఆమె చాలా ఎక్కువగా బాధపడుతున్నది. అనగా ఆమె చిన్నకళ్ళు అడ్డంగా తిరుగుచున్నవి. నేను చెప్పాను, "ఓ తీయని హృదయమా, మరికొద్ది నిమిషాలలో నేను నిన్ను తీసుకుని అమ్మ యొక్క చేతులలో పెడతాను. ఆ యొక్క శవాల గదిలో ఉన్న అమ్మ ప్రక్కనే పెడతాను. నేను నిన్ను ఆపైన వృక్షాల క్రింద పాతి పెడతాను. ఏదో ఒక దినాన ఈ డాడీ నిన్ను మరలా చూడబోవుచున్నాడు."
నేను పైకి చూశాను. నేను చెప్పాను, "దేవా నీవు నన్ను చంపినను నీ యందు నేను నమ్మక ముంచెదను. నీవే కదా ఆమెను నాకు ఇచ్చితివి. నీవే మరలా ఆమెను తీసుకున్నావు. ప్రభువు నామమునకు స్తుతి కలుగును గాక."
అప్పుడు, నాయొక్క మానవ తర్కములన్నియు నాశనమైపోయినవి. నేను నా రహదారి చివరన ఉన్నాను. అయితే నీవు నీ యొక్క రహదారి చివరకు వచ్చినప్పుడు, దేవుని యొక్క నిజ ఆత్మ నిన్ను తీసుకుంటుంది. ఆ సమయంలో నిన్ను పైకి లేవనెత్తుతుంది.
68నీవు తప్పక తిరిగి జన్మించవలెను. సమస్తమును చనిపోవాల్సి ఉన్నది. నీ వేదాంతమంతయు, నీ ఆలోచన అంతయు, నీవు ఎలా ఉండాలని ఎప్పటినుండి అనుకుంటున్నావో, అది అంతయు కూడా నీ జీవితము మరియు నీలో ఉన్న సమస్తమును చనిపోవాల్సినదే. పిమ్మట ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చును. అప్పుడు నీవు నీ యొక్క టోపీని తీసివేసినప్పుడు, చెప్పులను తీసివేసి దేవుని ముందు నిలవబడు. "నా చేతులలో ఏదియు నేను తీసుకుని రావడం లేదు. కేవలము నీ యొక్క సిలువను నేను పట్టుకుని ఉన్నాను."
అచ్చటికే మోషే వచ్చి ఉన్నాడు, అచ్చట అతడు దేవుడు చెప్పినదానికి విధేయత చూపించెను. అదియే మండుచున్న పొద సమావేశం. పిమ్మట దేవుడు చెప్పెను, "నేను ఇచ్చట నీకు నా మహిమను చూపెదను". అతడు వెళ్లడానికి ఇష్టపడిన తర్వాత అప్పుడు అతడు ఐగుప్తులోనికి వెళ్లి ఉన్నాడు.
69ఇప్పుడు అచ్చట ఏదైనా సమావేశము, అచ్చట మండుచున్న పొద సమావేశము.
ఇప్పుడు వెంటనే, మనము మరియొక సమావేశాన్ని తీసుకుందాము. ఎర్ర సముద్రపు సమావేశమును చూచెదము. మీకు తెలుసా, కొన్నిసార్లు మన యొక్క విధినిర్వహణలో భాగంగా సాతానుడు మన యొక్క మార్గమునకు అడ్డుగా వస్తాడు. సేవక సోదరులారా, మీ అందరికీ అది తెలుసు. క్రైస్తవుల్లారా మీకు అది తెలుసు. అది నిజము.
ఇచ్చట మోషే, ఆ క్రిందికి నడిచి వెళ్ళుచున్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు సూచనలు చూపిస్తున్నాడు. మొట్టమొదట దానిని చూపించిన అతడే అయినా వారు దానిని వినలేదు. అతడు తన యొక్క విధి నిర్వహణలో వెళ్ళుచున్నాడు. దేవుడు అభిషేకం క్రింద వెళుతున్నాడు. దేవుని యొక్క స్వరముతో పలికినచో విషయములు ఉనికిలోనికి వచ్చే శక్తితో వెళ్ళుచున్నాడు. అతడు ఈగల కొరకు పిలువగలడు. అతడు దేవుని స్వరాన్ని ఉపయోగించగలడు. అతను చెప్పెను, "ఈగలు వచ్చుగాక". అప్పుడు దేశంలో ఒక్క ఈగ కూడా లేదు. అతడు వెనుకకు నడిచాడు. అది జరుగునని అతనికి తెలియదు. అతడు దేవుని వాక్యాన్ని పలికాడు. అతడు వెనుకకు నడిచాడు. అప్పుడు నేరుగా ఒక ప్రాచీన పచ్చని ఈగ గుండ్రంగా తిరగడం ప్రారంభించినది. ఒక చదరపు గజానికి రెండు పౌండ్ల ఈగలు రావడం ప్రారంభించినది.
సృష్టికార్యము, అది నేడు యేసుక్రీస్తు యొక్క సంఘానికి సంబంధించినది. క్రీస్తు యేసు యొక్క రక్తము క్రింద ఆయన వాక్యము ద్వారా ఆయనతో మనము సందర్శనలో ఉన్నాము. ఏ వ్యత్యాశము లేదు. మనము వినుచున్న వాక్యము అది ఇచ్చట ఉన్నది. మరియు అది దేవుడే. ఆయన ఇచ్చట నిలవబడుట మనము చూచుచున్నాము. ఆయన మనతో మాట్లాడుచున్నాడని మనము ఎరిగియున్నాము. అదే విషయము అది జరుగుట నేను చూశాను. మరియు అది సత్యమని నేను ఎరుగుదును. అది బైబిల్ ప్రకారము ఉన్నది.
70అచ్చట మోషేకు అధికారం ఇవ్వబడినది. అతను వెళ్లి ఇశ్రాయేలు సూచనలు చూపించాడు. మరియు ఇశ్రాయేలు అతనితో బయటకు వచ్చి ఉన్నది. మరియు వారు అచ్చట వారి విధి నిర్వహణలో ఉన్నారు. మరియు ఎర్ర సముద్రం చినిపోవాల్సి ఉన్నది. మోషే ఒక సమావేశమునకు పిలిచాడు. దేవుడు బండ వెనకాల ఒక స్థలాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నాడు. మోషే అక్కడికి వెళ్ళుచున్నాడు. మరియు అతడు, "ప్రభువా!" అని పిలిచెను.
నీవు విధి నిర్వహణలో నడుస్తూ ఉండగా, నీవు ఒక సమావేశమునకు పిలువవచ్చును. దాని కొరకే మనము ప్రార్థించుచున్నాము. అందుకొరకే మనము ఆసుపత్రికి పంపబడ్డాము. అందుకొరకే పరుపు మీద రోగులుగా ఉన్న వారి వద్దకు మనం వెళుతున్నాము. సమావేశమునకు పిలుచుట, ఓ, మై, ఇప్పుడు నేను భక్తి భావనలో పరవశించుచున్నాను. ఒక సమావేశమునకు పిలుచుట. అదే నేడు వెంతుకోస్తు ప్రజలకు అవసరమయి ఉన్నది. అదేమనగా ఒక సమావేశమునకు పిలుచుట. విషయము ఏమిటి మనము నెమ్మదించాము. ఆ యొక్క శిబిరంలో ఎచ్చటో ఒక చీలిక అన్నది ఉన్నది. ఒక సమావేశమునకు పిలుచుట.
71మోషే ఒక సమావేశమునకు పిలిచాడు, చెప్పెను, "ప్రభువా, నీవు చెప్పిన రీతిగా నేను చేశాను. మరియు ఇచ్చట మేము ఒక వలలో చిక్కి ఉన్నాము. ఒక క్యాన్సర్ రోగి ఉన్నట్లుగా ఉన్నది. మరణము మాపైన వేలాడుచున్నది." మరియు వారు దేవుని నుండి స్వరము వినేంతవరకు మోషే అచ్చటే నిలవబడియున్నాడు. దేవుడు మాట్లాడేంత వరకు అతడు అచటే ఉన్నాడు. ఆయన యొక్క స్వరాన్ని అతడు ఎరుగును. ఆయన ప్రవక్తగనుక.
చెప్పెను, "మోషే నీవెందుకు నాకు మొర్రపెట్టుచున్నావు? అచ్చట ఉన్న ప్రజలను తీసుకుని వెళ్ళుటకు నేను నీకు అధికారం ఇచ్చితిని గదా. మరియు నీవు దానిని చేయవలసిందిగా నీకు చెప్పి ఉన్నాను కదా. ప్రజలతో మాట్లాడి ముందుకు కొనసాగు." ఆమెన్. వెంటనే ఎర్ర సముద్రము చీలిక అవ్వటము ప్రారంభమైనది మరియు సమస్తమును దేవుడు వాక్యంను పలికినప్పుడు, అతని కొరకు ఏమీ చేయవలెనో ఆ నిర్ణయము వచ్చినప్పుడు
"నేను ఇచ్చట ఉన్నాను. నేను దానికి విరోధిని. నేను ఇప్పుడు ఏమి చేయవలెను?"
"మాట్లాడు ముందుకు కొనసాగు." పిమ్మట మృత సముద్రము కదిలినది.
మన సమయము అయిపోవుచున్నది. మరియు నేను ….. నేను ఎన్నో వివిధ రకాలైన స్థలాలను చూచి ఉన్నాను. దానిని చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనం త్వరగా వెళ్లెదము. మరి అనేకమైనవి ఉన్నవి దావీదు మొదలగునవి ఉన్నవి.
72అయితే ఇచ్చట గుర్తుంచుకొనండి. సరిఅయిన సమయంలో గెత్సేమనే సమావేశం అచ్చట ఉన్నది. దేవుడు మరియు ఆయన యొక్క కుమారుడు కలిసినప్పుడు, లోక పాపముల కొరకు మరణించుటకు ఎవరూ అచ్చట లేనప్పుడు, ఏ ఒక్కరూ కూడా చనిపోవుటకు లేనప్పుడు, ఏ మనిషి కూడా లేనప్పుడు.
ఈ లోకములోనున్న ప్రతి మనిషి శృంగార వాంఛ ద్వారా ఇచ్చటకు వచ్చి ఉన్నారు. అదియే ఆదిలో జరిగిన ఒక గందరగోళం. అదే జరిగినది. ఒక హైబ్రిడ్ సృష్టిగా మార్చినది. మనము శృంగారము ద్వారా జన్మించాము. మానవ వాంఛ ద్వారా ఇది కలుషితమైనది. ఏదో ఒకటి …… అందుకే ఇచ్చట మరణము వచ్చినది. దానిగూర్చి నేను గతరాత్రి మాట్లాడాను. అయితే దేవుడు ఆయన యొక్క మొదటి మనిషిని సృజించినప్పుడు, అతడు పురుషుడు మరియు స్త్రీ కలిసి ఉండవలెనని చెప్పలేదు. ఆయన అతనిని భూమిలో నుండి తీసి సృజించెను. అతడు ఒక వాస్తవమైన మొక్క. అయితే అతని యొక్క పాపమే అతనిని హైబ్రిడ్ మనిషిగా చేసినది.
అదియే నేడు ఉన్న అంశం, అనేకమంది హైబ్రిడ్ పెంతుకోస్తు వారిని మనము నేడు కలిగి ఉండడానికి గల కారణం. అదియే మీరు తర్కించుట వినుచున్నారు. దేవుని వాక్యాన్ని నమ్ముటకు బదులుగా తర్కించుట. ప్రజలారా వెనుకకు రండి.
73గమనించండి, అచ్చట మిశ్రిత గుంపులతో కలిసి పోవుట. నేను దీనిని చెప్పలేదు. ఇది మీకు మరియు మీ పెంతుకోస్తు వారికి మధ్య ఇచ్చట ఉన్నది. మరియు మనకు మనము ఇచ్చటకు వినుటకు రాలేదు. మనము ఇచ్చటకు సహాయం చేయుటకు వచ్చాము. నేనూ వచ్చాను. నేను ఇచ్చట నిలుచున్నచో, ఒక అంశము మీద ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినచో, అప్పుడు నేను ఒక వేషధారినై ఉండెదను. నేను ఇచ్చటకు ఒక సత్యముతో వచ్చి ఉన్నాను. మరియు మీరు తెలుసుకోవలసిన సత్యమేమనగా నా హృదయములో దేవుడు ఉంచిన ఏదో ఒక దానిని ఏ గడియలో మనము జీవిస్తున్నాము ఆ సత్యము తెలుసుకొనవలసి ఉన్నది చూచారా?
74అచ్చట గెత్సమనే సమావేశము జరిగినది. ఆ గడియ కొరకు చనిపోవుటకు ఒకే ఒక వ్యక్తి వచ్చినప్పుడు, అది జరిగినది. పిమ్మట ఆ యొక్క గొప్పసమయము ఆసన్నమైనప్పుడు, అచ్చట ఆయన తన యొక్క అంతిమ నిర్ణయాన్ని తెలియజేయవలసియున్నాడు. అయితే తండ్రి ఇలా చెప్పటంలో ఏ సందేహమూ లేదు. "కుమారుడా, దీని ద్వారా నేను వెళ్ళుటకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నావా"?
ఆయన చెప్పెను, "ఇది సాధ్యమే, నా తండ్రి, ఇంకా ఎచ్చటో ఒకచోట మీరు ఒక వ్యక్తిని దీనికొరకు కనుగొనగలరా? నేను నా ప్రజలను ప్రేమిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన నా సహోదరులను ప్రేమిస్తున్నాను. ఇంకా ఎవరో ఒక వ్యక్తి దీనిని చేయుట సాధ్యమేనా?"
"లేదు. నీవు ఒక్కడివి మాత్రమే దీనిని చేయగలవు నీవు మాత్రమే కన్యక ద్వారా జన్మించి ఉన్నావు. నీవు మాత్రమే శృంగార కలయిక లేకుండా జన్మించి ఉన్నావు." ఇంక ఏ మనిషిని గాని, ఏ బిషప్ గాని, ఏ పోపు గాని, ఏ కార్డినల్ గాని, ఇంకా ఎవరూ నీకు సహాయ పడలేరు.
"నీవు ఒక్కడవు మాత్రమే, నీవు ఒక్కడవు మాత్రమే దీనిని చేయగల సమర్థుడవు." పిమ్మట అదియే అచ్చట ఆ సమావేశం.
సాతానుడు అచ్చట నిలవబడియున్నాడు. మానవజాతిని తీసుకొనుటకు వాడు సిద్ధంగా ఉన్నాడు. వారు పాపము చేసి ఉన్నారు. కనుక వారిని తీసుకొనుటకు అతడు హక్కులను కలిగి ఉన్నానని చెప్పుచున్నాడు.
75ఇచ్చట ఉన్న ప్రజలైన మీరు ఏడుముద్రలను గూర్చిన టేపులు మీరు కలిగి ఉన్నారు. ఆ గొర్రెపిల్ల తనవారిని విమోచించుటకు ముందుకు వచ్చినప్పుడు, అతడు దేనిని విమోచించాలో దానిని విమోచించుటకు వచ్చినప్పుడు, కాలము అక్కడ సంపూర్తి అయినది. ఆయన ఇప్పుడు పనిలో ఉన్నాడు. విమోచనచేసే పనిలో ఉన్నాడు. అయితే ఏదో ఒక రోజు అతడు పరిశుద్ధ స్థలము నుండి బయటకు వచ్చును. అనగా ఆయన యొక్క సొంత రక్తము చేత కొనిన వారిని విమోచన గ్రంథము నుండి తీసుకొనిటకు. అప్పుడు ఆ గడియ సమాప్తియగుతుంది. ఆయన ఎవరినైతే విమోచించి ఉన్నాడో వారిని తీసుకొనుటకు ఆయన రాబోవుచున్నాడు.
ఇచ్చట ఆయన గెత్సేమనేలో నిలబడి ఉన్నాడు, ఆ యొక్క గొప్ప శ్రమలలో. ప్రతి ఒక్కరి యొక్క పాపము ఆయన మీద మోపబడినది. ప్రతి ఒక్కరి కోసం చనిపోయినటువంటి అనగా అందరి మరణము ఆయన మీద మోపబడియున్నది. మరియు ఆయన అయితే నిర్దోషి అయితే ఆయన పాపముగా మారియున్నాడు.
"దేవుని యొక్క పరిశుద్ధ కుమారుడు వ్యభిచారం యొక్క పాపమును తీసుకొనగలడా? నీవు ఆ పాపమును తీసుకొనగలవా, వ్యభిచారమునకు కొన్న శిక్షను నీవు తీసుకొనగలవా? ఈపాపములన్నిటికీ శిక్షను మీరు తీసుకొనగలరా? మరియు వాటిని మీపైన మీరు వేసుకొనగలరా? అనగా మీరు వాటిని చేయకపోయినా వాటిని మీ మీద వేసుకొనగలరా?" అయితే ఆయన మాత్రమే అలా చేశాడు. అక్కడ సమావేశము జరిగినది.
ఆయన ఏమి చెప్పాడు? "అయినను నా చిత్తము కాదు; మీ చిత్తమే సిద్ధించును గాక."
ఓ దేవా, మేమందరము ఆ గెత్సేమనే సమావేశము చేరుకొనగలమా? ఆ చివరి పరీక్ష?
76పిమ్మట ఇంకొకసారి మరి ఒక సమావేశము జరిగినది. దానికి కొన్ని రోజుల తర్వాత అనగా నలభై రోజులు తర్వాత మరొక సమావేశము జరిగినది. అది ఆయన యొక్క మరణము సమాధి మరియు ఆరోహణము తర్వాత జరిగినది. క్రైస్తవ సంఘము సంస్థీకరించబడినప్పుడు.
బాప్టిస్టులు, ప్రెస్బెటేరియన్లు, లూదరన్లు, వారందరూ ఇప్పుడు ఒక నిమిషము చాలా దగ్గరగా వినండి.
దేవుడు తన ప్రజలను మాత్రమే తీసుకొనుటకు వచ్చిన ఆ సమయమున….
అనగా ఆయన యొక్క ప్రజలైన ఇశ్రాయేలు వలే "ఇశ్రాయేలీయులు ఒక జాతిగా రక్షించబడతారు." పరిశుద్ధ గ్రంధం అలా చెప్పుచున్నది. ఒక్క దినములోనే వారందరూ జన్మించుట దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక జాతిగా వ్యవహరిస్తాడు. అనగా ప్రజలు అందరితో ఒకేసారి.
అయితే ఆయన సంఘముతో మాత్రము వ్యక్తిగతముగా ఒక్కొక్కరితో వ్యవహరిస్తాడు. "అన్యజనులలో నుండి ఆయన వారిని పిలిచెను. అనగా ఆయన నామము నిమిత్తము అన్యజనులను ఆయన పిలిచెను".
ఇప్పుడు, ఆ గడియ వచ్చి ఉన్నదని మనము కనుగొని ఉన్నాము. ఆయన తన యొక్క సంఘాన్ని కొనసాగించవలసి ఉన్నాడు. వారు నిషేధించబడి ఉన్నారు, వారు ప్రసంగించినప్పటికీ, స్వస్థతలు చేసినప్పటికీ, నా మాట వినండి. వారు బోధించినప్పటికీ, వారు స్వస్థపరచినప్పటికీ, గొప్ప సూచనలు మరియు అద్భుతాలు వారు చూసినప్పటికీ, మరియు ఆయన దేవుని యొక్క కుమారుడని వారు సాక్ష్యం ఇచ్చినప్పటికీ, ఈ సమావేశంలో వారు నిర్వహించేంత వరకు ఆయన వారిని ప్రసంగించుటకు నిషేధించాడు. ఆ యొక్క యెరుషలేములో మీరు నిలిచి ఉండండి. క్రైస్తవ సంఘము ఎలా కొనసాగి వెళ్లవలెనో నేను మరలా వాక్యమును మీకు పంపే అంతవరకు. నేను ఒకవేళ ఒక బిషప్పును, పంపగలిగినచో దానిని మీకు చెప్పెదను. లేక ఒక కార్డినల్ను, లేక ఒక హోప్ నో, లేక ఇంకెవరినైనా పంపిన చెప్తాను. నేను మిమ్మును వెనుకకు పంపెదను. నేను పరమనకు ఎక్కుచున్నాను. ఒక సమావేశము కొరకు వెళుతున్నాను. నేను పంపించే వరకు మీరు నన్ను వింటూ వేచి ఉండండి ఆమెన్. ఆమెన్.
77వారు జెనీవా సమావేశమును ఏర్పాటు చేసినప్పుడు నాకు గుర్తున్నది, నాకు స్నేహితుడైన ఒక పాత మంత్రి గారు అతడు డాక్టర్ పెట్టిగ్రూ, లూయిస్ వీల్ కు చెందినవాడు. అతడు రేడియో వార్తలు వింటున్నట్లుగా నాకు చెప్పాడు. ఆ దేశం అంతా ప్రమాదంలో ఉన్నదని అయితే వారు ఏమి నిర్ణయం తీసుకొనిపోవుచున్నారో అతడు చూడాలని ఆశిస్తున్నాడు. వారు ఏమి చేయబోతున్నారో చూడాలని. పిమ్మట ఒక సామాజిక ఉద్యమకారుడు ఆ తలుపు దగ్గరకు వచ్చి ఉన్నాడు. అతని యొక్క జుట్టు తన ముఖము మీద వేలాడుచున్నది. మరియు చెప్పెను, "చూడండి డాక్టర్ పెట్టిగ్రూ, నేను మీగురించి అర్థం చేసుకునుచున్నదేమనగా… ఏమనగా…… మీరు ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి." చెప్పెను, "నేను, కొన్ని రాక్ అండ్ రోల్ పాటలు కలిగి ఉన్నాను. ప్రజలు నా మాట వినటం లేదు. మీరు నాకు కొద్దిగా ప్రోత్సాహాన్ని ఇవ్వగలరా!"
అతడు చెప్పెను, "కుమారుడా, ఒక్క క్షణము అక్కడ నిలబడి ఉండుము" చెప్పెను, "ఏమి పర్యవాసనము జరగబోవుచున్నదో నేను చూడబోవుచున్నాను".
అతడు చెప్పెను, "అయితే డాక్టర్ పెట్టిగ్రూ," చెప్పెను, "ఇది ఒక గొప్ప విషయం. అతను చెప్పెను, "ఇది నాకు ఎంతో ఎక్కువైనది అనగా ఆ నాలుగు గొప్ప సభల నుండి ఏమి రాబోవుచున్నదో నేను వినవలెనని ఆశిస్తున్నాను."
నేడు ప్రజలు అలా ఉన్నారండి. కొంత చిన్న ఉద్యమకారులు లేదా అలాంటివారు. మతము పేరునా కొంత మంది మిమ్ములను ఆకర్షించుటకు చుట్టూ వచ్చుచున్నారు. ఆ వాస్తవమైన ఉత్పత్తుల నుండి కొంతమంది చిన్న నపుంసకుల లాంటివారు, పిరికివారు, మతసంబంధమైన వారు, (అలాంటి పదాలను నేను ఉపయోగించవచ్చేమో) మీరు ఎక్కువ మంది సభ్యులను తీసుకొనుచున్నారు. మరియు మేలు రకమైన ప్రజలను పెద్ద సంఘములను మరియు ఎక్కువ అనుచరులను మీ శ్రద్ధను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు, సహోదరులారా. అయితే వారిని వినవద్దు. మనము ఇచ్చట వ్రాసుకున్న ప్రతిఫలములను పొందుకొని ఉన్నాము.
78అది ఒక పెంతుకోస్తు సమావేశం. చెప్పెను, "నీవు వేరొక పాట పాడలేవా, వేరొక వాక్యము బోధించలేవా, అచ్చటకు వెళ్లి మరియు ఆ సమావేశము అయిపోయేంతవరకు వేచియుండు. నేను వార్తలు మీకు పంపెదను. మీ మధ్య గొప్పవారు ఎవరో నేను చెప్పెదను. నీవు కచ్చితంగా ఏమీ చేయవలెనో నేను నీకు చెప్పెదను. మీరు ఒక సంస్థను స్థాపించవలెనా? మీరు ఒక పోపును కలిగి ఉండవలెనో, లేక ఒక బిషప్ ను లేక మీరు ఏమి కలిగి ఉండవలెనని కోరుకొనుచున్నారో, అతనిని దానిని గూర్చి నేను చెప్పెదను. అయితే ఆ ప్రతిఫలమును గూర్చి మీరు వినేంతవరకు మీరు వేచి ఉండండి. ఆ విషయమును నిర్ణయించుటకు మేము పరలోకమునకు వెళ్ళుచున్నాము."
మరియు ఆయన పరమునకు ఆరోహణమై చెరను చెరగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుని పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడియున్నది. సంపూర్ణముగా వచ్చినప్పుడు వారందరూ వేచి ఉన్నారు.
ఓ, అది వచ్చినా సరే ఏమవుతుంది, అది ఆరు రోజులు తర్వాత రాబోవునని, ఆంధ్రెయ చెప్పినచో ఏమవును? "సహోదరులారా, మీకు తెలుసు మనము ఇక ఎంత మాత్రమును వేచి చూడనవసరం లేదు. నేను దానిని విశ్వాసం ద్వారా నమ్ముతున్నాను. మనము మన పరిచర్యను పొందుకుంటాము. మనము ఇప్పుడు ముందుకు కొనసాగెదము. ఇప్పుడే మనము ముందుకు కదిలి మన యొక్క పరిచర్యను ప్రారంభించెదము."
ఈనాడు అనేక మంది సేవకులతో ఉన్న సమస్య అదియే. వారు ఎక్కువ కాలం వేచి ఉండలేకపోవుచున్నారు, ఆ తిరిగి రాక వచ్చేంతవరకు, ఆ పని మొదలు పెట్టమని స్వరము వినేంత వరకు వేచి ఉండలేకపోవుచున్నారు.
79మంచిది, మీకు తెలుసు మరి ఒక వ్యక్తి పిలుపును చూడండి. అతడు లేచి ఇలా చెప్పినచో మీకు తెలుసు నేను చాలా మంచి భావనతో ఉన్నాను. దీనిని గూర్చి మనకు జ్ఞానము తెలిసిన తర్వాత ఆయన ఏమి చేయవలెనని కోరుచున్నాడు."
సహోదరులారా, అది అలా కావచ్చు. మీరు మీ యొక్క బి.ఎ., డి.డి., ఎల్,ఎల్., క్యు.యు.ఎస్.టి., కలిగి ఉండవచ్చు. మరియు అది ఏవిషయం కానేరదు. మీ యొక్క జ్ఞానము అసలు ఏమీ కాదు. మీ సెమినేరీలు అవన్నీ ఏమీ కాదు. మీరు ప్రతిఫలము కొరకు ఎదురు చూడవలసి ఉన్నారు. ఆయనను కలుసుకునేంత వరకు ఏ మనిషి కూడా బోధించుటకు హక్కును కలిగి లేడు. వ్యక్తిగతముగా మొట్టమొదటగా యేసుక్రీస్తును కలుసుకొనవలసి ఉన్నది. అంతేగాని ఏదో ఒక వేదాంత విద్య కాదు. వేదాంతము కాదు. మంచిది. నా భావము మీరు గ్రహించారా? ఏదో ఒక వేదాంత డిగ్రీలు కలిగి ఉండటంకాదు. వేదాంత డిగ్రీ కలిగి ఉన్న వ్యక్తి దానిని చేయుటకు ఏ విధమైన హక్కును కలిగిలేడు. అతడు ఎంతగా వివరించినప్పటికీ కూడా అది అసలు కానే కాదు.
80మోషేవలే. అతను ఐగుప్తీయుల యొక్క జ్ఞానాన్ని బోధించగలడు. అతడు ఆ దేశంలో చాలా మేధావి అయినప్పటికీ అతడు దేవునితో సమావేశమునకు వెళ్ళవలసి ఉన్నాడు. మరియు దేవుని కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన నేలను తాకేంతవరకు ఏ మనిషి లేదా ఏ స్త్రీ, ఏ బిడ్డ, ఏ బోధ కూడా క్రైస్తవునిగా ప్రకటించుకొనుటకు హక్కు కలిగి లేరు. ఆయన యొక్క మార్గంలో ప్రపంచంలో ఉన్న సమస్త వేదాంత పండితులు, లోకంలో ఉన్న సమస్త అవిశ్వాసులు, ఆయన గూర్చి వివరించలేరు. ఆయన అచ్చట ఉన్నాడు. అది జరిగినది అదే అతనికి జరిగినది. అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు.
అచ్చట వారు పెంతుకోస్తు దినమునకు వెళ్లి ఉన్నారు. మరియు మేము దానిని చూడలేదు. ఇప్పుడు నేను కాదు ….. నేను ఒక వ్యక్తీకరణ చెప్పుచున్నాను. మేము అచ్చట దానిని చూడలేదు. ఆ యొక్క బిషప్ తన చేతిలో ఒక సంచిని వేలాడ తీసుకొని రహదారి మీద నడుస్తున్నాడు. మరియు అతడు చెప్పెను, "నేను ప్రభువు నుండి పంపబడ్డాను. నేను ఆ సహోదరుల మీద నా చేతుల నుంచి వారిని కూడా బయటకు పంపించడం." అదియే 1963 యొక్క అనువాదం, ఆ బిషప్ మరియు తన యొక్క అనుచరులు.
మంచిది, వారిని గూర్చి మనం ఆలోచించెదము. దానిని మనము మన యొక్క కేథలిక్ స్నేహితులకు చాలినంత గౌరవము ఇచ్చెదము. ఆ రహదారి మీదకి ఒక యాజకుడు అచ్చటకి వచ్చుచున్నాడని చెప్పెదము. ఆ యొక్క చివరి ఆచార సంప్రదాయాలను చేసెదము. "మీ యొక్క నాలుకను బయటకు తీసి మరియు ఈ దివ్యసత్ ప్రసాదాన్ని తీసుకొనండి, మరియు నేను ద్రాక్షారసము త్రాగెదను. అప్పుడు మీరు ఈ సంఘ సభ్యులుగా మారెదరు." అది అలా జరిగినప్పుడు అది మొదటి స్థానముగా ఉంటుంది.
దేవుడు అనంతమైన వాడు. ఆయన యొక్క నిర్ణయము ఏదేనులో ఎలా ఉన్నదో అలా ఉంటుంది. ఆయన యొక్క మొదటి నిర్ణయమే దానిని స్థిరపరుస్తుంది.
81మంచిది, వారు ఏమి చేసి ఉన్నారు? వారు వేచి ఉన్నారు. మరియు వారు వేచి ఉన్నారు. మరియు వారు సంతృప్తిచెందలేదు. వారు ఎంతవరకు వేచి ఉన్నారనగా "పరలోకము నుండి బలమైన గాలి వంటి ధ్వని క్రిందికి దిగివచ్చెను. అది వారున్న ఇల్లంతా నిండుకొని అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై, ఆ ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి".
కొంతమంది పిరికివారు సువార్త గూర్చి భయపడిరి. మత సంబంధమైన విమర్శకులు, మరియు నగరం యొక్క ప్రముఖులు, మరియు గొప్పవారిని, ఎదుర్కొనుటకు కొంతమంది పిరికివారు భయపడిరి. అనగా వీధులలో ఉన్న వారినిగూర్చి "అది ఇదే" అదియే దేవుని యొక్క నిర్ణయమున సాక్ష్యం ఇచ్చిరి.
దాని తర్వాత కొద్ది దినములు పిమ్మట సమరయలకు పిలుప్పు వెళ్ళి వారికి బోధించెను. మరియు వారికి యేసుక్రీస్తు నామములో బాప్తీస్మం ఇచ్చెను. అంతవరకు పరిశుద్ధాత్మ వారిలో ఎవరు మీద దిగి ఉండలేదు. కావున వారు పేతురును పంపిరి. మరియు అప్పుడు ఆయన వారి మీదికి దిగివచ్చెను. వారు గొప్ప ఆనందం కలిగి ఉన్నారని వారు ఎరిగిరి. సంతోషించి గంతులు వేసిరి. అప్పుడు వారు గొప్ప సమయాన్ని అనుభవించారు. మరియు వారు గొప్ప స్వస్థతలను అలాంటివి కలిగియుండెను.
ఇప్పుడు నాజరీలు, పిలిగ్రిం హోలీ వారు, మెథడిస్ట్ సోదరులు, వినండి అది స్వస్థత కాదు, అది ఆనందం కాదు, అది ఒక అనుభవము. ఇది పరిశుద్ధాత్మ క్రీస్తే మీ లోనికి వ్యక్తిగతంగా వచ్చుచున్నాడు.
82వారు అచ్చటకు వారిని పంపించిరి. మరియు యోహాను కూడా వచ్చెను. మరియు వారిపైన వీరు చేతులుంచిరి. పరిశుద్ధాత్మ వారి మీద దిగినది. అది అపోస్తులుల కార్యములు 10:49 లో ఉన్నది. అచ్చట మనము పేతురు అతడు అన్య జనులతో మాట్లాడుచుండగా, "పేతురు ఈ మాటలు చెప్పుచుండగా, ఆ మాటలు వినినవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చెను. వారు భాషలతో మాట్లాడుట చూచిరి. వారు దేవుని మహిమపరిచిరి. మరియు పేతురు చెప్పెను, 'వీరికి బాప్తిస్మం ఇచ్చుటకు ఈ నీళ్లు ఆటంకముగా ఉన్నవా?' మనము ఆదిలో పొందుకున్న రీతిగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొనిరి."
పౌలుగారు కొంతమంది బాప్టిస్టులతో మాట్లాడిరి. అపోస్తులుల కార్యములు 19, ఎఫెస్సులో ఎగువ కోస్తా తీరంలో. అచ్చట ఆయన కొంతమంది శిష్యులను కనుగొనెను. వారు సంతోషించారు. అచ్చట వారు గొప్ప బాప్టిస్ట్ బోధకుని కలిగి ఉన్నారు. అతని పేరు అపొల్లో. మరియు అతడు న్యాయవాదిగా ఉండి మార్పు చెందాడు. మరియు అతడు చెప్పెను, "యేసే క్రీస్తు అని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఎత్తి చూపి అతడు నిరూపిస్తూ వచ్చాడు."
83అచ్చట అకుల మరియు ప్రిస్కిల్లా అనువారు పౌలుతో కూడా డేరాలు తయారు చేయువారు. చెప్పెను, "మన సహోదరుడైన పౌలు అచ్చట చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఒక బోధకునికి అది సరైన స్థలము కాదా?" అతడు చెరసాలలో ఉన్నాడు. ఎందుచేతను అనగా అతడు పుతోను అను దయ్యమును వెళ్ళగొట్టియున్నాడు గనక. మరియు అతను చెప్పెను, "అతను చెరసాలలో ఉన్నాడు అయితే త్వరలో అతను మనలను దర్శించబోవుచున్నాడు. మరియు మీకు దేవుని యొక్క వాక్యమును అతడు పరిపూర్ణంగా వివరించబోవుచున్నాడు".
మరియు వారు ఒక మంచి సమయాన్ని కలిగి ఉన్నారు. ఇతర మంచి బాప్టిస్టులు చేసిన రీతిగా పెద్దగా శబ్దములు చేయుట, దేవుని స్తుతించుట, స్వస్థతలు కలిగి ఉండుట మరియు సూచనలు మరియు మొదలగునవి.
అయితే పౌలు అచ్చటకు వచ్చి వారిని గూర్చి వినినప్పుడు, అపోస్తలునిగా అతడు చెప్పెను, "మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?" వారు కలిగి ఉన్నామని అనుకున్నారు. చూచారా? "మీరు విశ్వసించినప్పటి నుండి" మేము నమ్మినప్పుడే దానిని పొంది ఉన్నామని మేము భావిస్తున్నాము. అది తప్పు. అతడు చెప్పెను, "మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?"
వారు చెప్పెను, "అది ఏమిటో మేము ఎరుగము లేక అలాంటిదంటూ ఒకటి ఉంది అని మేము ఎరుగము."
అతడు చెప్పెను, "మీరు మరి ఎలా బాప్తిస్మము పొందారు?" చెప్పెను, "బాప్తీస్మం ఇచ్చు యోహాను ప్రకారముగానే". అతడు చెప్పెను, "అయితే అది ఇంకెంత మాత్రమూ పనిచేయదండి. మీరు మరల బాప్తీస్మం పొందాలిసుమా."
కావున, అతడు యేసుక్రీస్తు నామమున వారికి బాప్తీస్మం ఇచ్చెను. పిమ్మట వారి మీద చేతులు ఉంచెను. అప్పుడు పరిశుద్ధాత్మ వారిమీదికి దిగెను. మరియు వారు భాషలతో మాట్లాడి దేవుని మహిమ పరిచితి. ఎలా? వారు ఆదిలో ఎలా చేశారో అలానే అదేవిధంగా ముందుకు కొనసాగినది.
84ఒక వైద్యుడు తాను ఒక ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు, ఈ యొక్క మందుల షాపులో పనిచేయువారు దానిని ఎట్టి పరిస్థితులలో మార్చరాదు. వారు మీకు చాలా ఎక్కువ విరుగుడు ఇచ్చుచున్నారు. అయితే అది మీకు సహాయ పడదు. మరియు వారు అతి ఎక్కువ విషయాన్ని ఇచ్చిన అది మిమ్ములను చంపుతుంది.
దేవుని యొక్క విధానమును మార్చవద్దు. ఆ యొక్క సమావేశంలో ఎలా జరిగినదో అలాగే కొనసాగండి. అవియే ఆదేశాలు. ఆమెన్. నేను ఆయనను ప్రేమిస్తాను.
ఇది నాకు యేసు యొక్క తల్లిదండ్రులను గుర్తు చేయుచున్నది. వారు పెంతుకోస్తు పండుగ దినమునకు వెళ్లారు. వారు రహదారి మీద ఉన్నారు. వారు మూడు లేక నాలుగు దినాలు ఉన్నారు. మరియు వారి మధ్య ఆయనను కనుగొనలేకపోయిరి. వారు ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నది. ఆ సంఘములు ఆయనను కనుగొనుటకు ప్రయత్నించుచున్నవి. "యేసువలె ఏమి మారిపోయినది? ఏమి జరిగినది? మనము పెంతుకోస్తు వారము కదా? అయితే మనకు ఏమి జరిగినది? మనం మెథడిస్టులము కదా కానీ ఏమి జరిగినది? యేసు దేనిగా మారియున్నాడు?"
వారి జాతి మధ్య ఆయనను వెతుకుటకు వారు ప్రారంభించారు.
85మనము ఆ రీతిగా ఆలోచించుటకు ప్రారంభించాము. "మూడీ గారు ఏమి చెప్పారు? సాంకి ఏం చెప్పాడు? ఫిన్ని ఏం చెప్పెను?" అది వారి యొక్క దినము. మనము ఆ రహదారి మీదనున్నాము. వారు చేసిన రీతిగా మనము వెనుకకు చూసినచో!
వారు వారి యొక్క బంధువుల వద్దకు వెళ్లారు. ఆయనను… ఆయనను వారు కనుగొనలేదు. వారు వారి యొక్క బంధువులందరి యొద్దకు వెళ్లారు. ఆ బిషప్పులు మరియు మిగతా వారందరి వద్దకు. అయినను వారు ఆయనను కనుగొనలేకపోయారు. చిట్టచివరుగా, వారు ఎక్కడైతే ఆయనను విడిచి పెట్టారో అక్కడే కనుగొన్నారు. ఎక్కడ ఆయనను విడిచిపెట్టారు? పెంతుకోస్తు పండుగ యొద్ధ ఆయనను కనుగొనుటకు ఎచ్చటైతే ఆయనను విడిచిపెట్టారో అచ్చటికి తిన్నగా వెనుకకు వారు వెళ్ళవలసి ఉన్నారు.
మరియు, సంఘమా, మనము ఇప్పుడు అదే చేయవలసి ఉన్నాము, ఆయనను ఎక్కడ విడిచిపెట్టామో అచ్చటకు వెళ్లాలి. మన ఆచారంల నుండి మీరు దూరముగా పొండి. ఆయనను ఎక్కడ విడిచిపెట్టామో అక్కడకు వెనుకకు వెళ్ళండి. ఆయనని మీరు ఎచ్చట విడిచిపెట్టి ఉన్నారో అచ్చటకు వెళ్ళవలెనని కోరుతున్నారా? అయితే ఒక చిన్న బైబిల్ సమావేశమును కలిగి ఉండండి. మరియు ఏ విధమైన పిడికిలిని లాగవద్దు, కేవలం సత్యమునే చెప్పండి.
అది ఎలా ఉండబోవుచున్నదో మనము వేచి ఉందాం. ఏ బిషప్పు కాదు. ఇంకేదియు కాదు. పరిశుద్ధాత్మ మాత్రమే సంఘమును నడిపించవలసి ఉన్నది. మనము కలిగియున్న ఆ ఒకే ఒక్క నాయకుడు పరిశుద్ధాత్మ. మరియు ఆయన వాక్యానుసారముగా నడిపించును.
మీరు ఇలా చెప్పవచ్చును. "మంచిది, నేను ఇదివరకే పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను," అయితే నీవు వాక్యమును తృణీకరించుచున్నావు; ఇది పరిశుద్ధాత్మ కాదు అయ్యా, ఎందుచేతననగా ఆ పరిశుద్ధాత్మయే పరిశుద్ధ గ్రంథమును రాసినది కదా. నిజం. కావున, నీవు కలిగియున్నది పరిశుద్ధాత్మకాదు.
86ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచ సమావేశాలలో వారు ఏమి చేయుదురు? వారు కలసి భోజనం చేయదురు. వారు కలిసి మాట్లాడెదరు. వారు కలిసి గొడవపడెదరు. వారు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు, ప్రపంచ సమావేశంలయందు, జాతుల ప్రపంచ సమావేశములయందు.
అయితే దేవుడు పిలిచిన సమావేశాలలో, ఏమి జరుగుతుంది? ఏమి జరుగును? వారు ఐక్యంగా కలిసెదరు. వారు పండగచేసుకొనరు, అయితే వారు ఉపవాసం ఉండెదరు. వారు గొడవపడరు, కానీ వారు ప్రార్ధించెదరు. వారు ఆదేశాలు పొందునంతవరకు వేచి ఉంటారు, మరియు ముందుకు కొనసాగెదరు.
నేడు సంఘమునకు కావలసినది అదియే. ముందుకు కొనసాగుట, ఆదేశాలు పొందుకొనుట, మరియు మీరు ఎలా చెప్పవచ్చు, "నేను ఆదేశాలను ఎలా పొందుకొనగలను"? అవి ఇచ్చట ఉన్నవి. ఇవియే ఆ ఆదేశాలు. "బ్రాన్హాం సోదరుడా, మీకు ఎలా తెలియును?" దేవుడు రక్తం ద్వారా ప్రణాళిక వేసిన మొట్టమొదటి విమోచన మార్గము ఏది? అనగా మరియు ఆయన ఎన్నడూ మారనివాడు. దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఎప్పుడూ అలాగే చేస్తుంటాడు. ఆ కారణం వల్లనే మీరు మీ పరిశుద్ధ గ్రంథముల మీద మీ ప్రాణములను ఉంచుకొనవచ్చును. ఏ దశలోనైనా అది అలా చెప్తుంది,
ఎందుచేతననగా అది దేవుని యొక్క వాక్యము గనుక.
మరియు దేవుడు, అనంతమైనవానిగా ఆయన ఇలా చెప్పలేడు. మంచిది, నేను తప్పుచేశాను, రెండువేల సంవత్సరాల క్రితం అలా చేశాను. దేవుడు నిత్యమైన వాడు ఆయనకు ప్రారంభమే లేదు. ఆయనకు అంతము కూడా లేదు.
87మరియు నీవు ఆయనవలే ఉండుటకు ఒకే ఒక్క మార్గమేదనగా, ఆయనలో భాగస్వామ్యం కావటమే. ఆ పెంతుకోస్తు దినమున…..
ఇశ్రాయేలును వెంబడించిన ఆ గొప్ప అగ్నిస్తంభము లేక అరణ్యముగుండ ఇశ్రాయేలువారు దానిని వెంబడించిరి, చూచారా, ఆ గొప్ప అగ్నిస్తంభము దేవుడు నిబంధన దూత, యేసుక్రీస్తు. "మోషే ఐగుప్తు ధనముకన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను, కావున అతడు ఐగుప్తును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించెను."
గమనించండి, ఆ పెంతుకోస్తు దినమున దేవుడు ఏమి చేసెను? ఆయన ఆ గొప్ప అగ్నిస్తంభమును తీసుకొని మరియు దానిని విభాగించెను. అది ఆయనే. అగ్ని నాలుకలుగాను, విభాగంపబడిన అగ్నిగాను, విభాగింపబడిన జ్వాలలుగా, నాలుకలు గాను, క్రిందికి దిగివచ్చెను. విభాగింపబడిన నాలుకలు మరియు ప్రతి ఒక్కరి మీద వాలియున్నవి.
ఓ, మనము సిగ్గుపడాల్సిన విషయంలో మన సంస్థలను విభాగించి ఉన్నాము. దేవుడు మన మధ్య తనకు తాను విభాగించుకుంటే అప్పుడు మనమందరము ఒక్కటి అయ్యాము. "దీనివలన మీరు నా శిష్యులు అనబడుదురు". మీరు దానిని వినుచున్నారా? సోదరుడా సోదరి? దేవుడు తనకు తానుగానే విభాగింపబడి ఉన్నాడు. మనం ఎన్నడూ విభాగింపబడరాదు. ఒకరికొకరం విడిపోరాదు. ఎందుచేతను అనగా మనమందరము దేవుని యొక్క భాగములుగా యున్నాము.
88ఈ యొక్క అగ్ని ఆ యొక్క అగ్నికి వచ్చి చేరునుగాక. మరియు కొద్ది సమయం తర్వాత మీరు దానిని కనుగొంటారు. ఇది అచ్చటకు కదులుతుంది. ఇది లూథర్ ద్వారా వచ్చినది. వెస్లీ, పెంతుకోస్తు ద్వారా, ఆ యొక్క పిరమిడ్ పై కప్పుగా, ఈ దినాలలో ఏదో ఒక దినమున రావటం మనము చూడగలము.
మీకు తెలుసు అది ఇంతవరకూ పైకప్పుగా రాలేదు. ఆ పిరమిడ్ మీ యొక్క కరెన్సీ డాలర్ నోటు వెనకాల ఉన్నది. "ఆ యొక్క గొప్ప ముద్ర" దానిని చెప్పుచున్నది. మరియు అమెరికాలో మనము కరెన్సీకి ఇటువైపు అమెరికా యొక్క ముద్రయున్నది. అయితే అది ఎందుకలా చెప్పుచున్నది. అది ఒక గొప్ప ముద్ర. దానిని హనోకు కట్టియున్నాడు. అయితే ఇప్పుడు పిరమిడ్ సిద్ధాంతములుకాదు గాని ఎందుచేతననగా అలాంటి సిద్ధాంతములను నేను నమ్మను. అయితే వారు ఎన్నడూ పిరమిడ్లను మూయలేదు. ఎందుకనగా? ఆ యొక్క తలరాయి తృణీకరించబడినది. అయితే అది ఏదో ఒక దినాన మరల రాబోవుచున్నద, ప్రభువుకు స్తోత్రము.
మరియు, చూడండి, ఆ యొక్క పిరమిడ్ లో నేను దానిని చూశాను. దానికి ఒక సన్నని రేజర్ బ్లేడ్ కూడా లోపలికి చొప్పి౦చలేము. ఎందుకనగా అది ఒక దానికి ఒకటి బాగా సాన బెట్టబడినది. ఆ రెండింటి రాళ్లను అతికించే దేనినీ వారు వాడలేదు. అయితే అవి ఒకదానికొకటి ప్రతి రాయి పరిపూర్ణంగా అమర్చబడినది.
సంఘము యేసు క్రీస్తు యొక్క రూపంనకు పరిపూర్ణమగా సానబెట్టుబడినప్పుడు, ఆయన వచ్చును. పరిశుద్ధులందరినీ దేవుడు లేపును. ఆయన వచ్చినప్పుడు అప్పుడు వారిని తనతో కూడా వెంటబెట్టుకుని వెళ్లును. అప్పుడు జీవం గల దేవుని సంఘము ఎత్తబాటులో వెళ్ళును.
89అయితే, సహోదరులారా, మనము హవ్వ వలే ఉండబోము. ఒక వ్యక్తి దీనిని కలిగి ఉండటం మరియు ఇంకొక వ్యక్తి దానిని కలిగి ఉండుట అమరిక లేని శరీరం వలే. అది వాక్యం వెంబడి వాక్యంగా దేవుడు చెప్పిన రీతిగా ఉండబోవును.
చెప్పవచ్చు, "బ్రాన్హాం సోదరుడా, ఆయన అప్పుడు ఏమి చెప్పెను? మీరు మాకు చెప్పలేదే".
మంచిది, పేతురు దానిని చెప్పెను. వారు దానిని తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు, "మనము దానిలోనికి ఎలా వెళ్లగలము? ఏమి జరిగి యున్నది ఆయన మనకు ఆ పద్ధతిని ఇచ్చెను.
ఇప్పుడు, ఆయన ఇలా చెప్పినచో కరచాలనము చేసి సంఘములో చేరండి." అది అలా ఉన్నది. మరియు ఆయన ఇలా చెప్పినచో మీ తలతో మీరు నిలవబడండి. అది అలా ఉండబోవుచునది. మరియు ఆయన చెప్పెను, మేము గొప్ప మనుషులను వ్యవస్థీకరిస్తాం మరియు గొప్ప శరీరమును నిర్మించబోవుచున్నాము. మరియు గొప్ప పోపును, మరియు గొప్ప దానిని, లేక దీనిని చేయబోవుచున్నాము. ఆ రీతిగా ఇప్పుడు ఉన్నది.
అయితే అతడు ఏమి చెప్పెను? "మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈవాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికి చెందును."
90మరియు దేవుడు పిలిచినంతవరకు, అదియే విధానము ఉంటుంది. అంతేగాని కరచాలనము ఉండబోదు. సిద్ధాంతాన్ని పునఃశ్చరణ చేయడం ఉండదు. అయితే యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందవలెను. ఆ మార్గంలో క్రైస్తవ సంఘం నడిపించబడవలెను. సిద్ధాంతం ద్వారా కాదు. సంస్థ ద్వారాకాదు. విద్య ద్వారా కాదు. వేదాంతము ద్వారా కాదు. అయితే పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మం ద్వారా మాత్రమే స్త్రీలను పురుషులను నడిపించబడవలెను. మరియు ఆయన మిమ్మల్ని ఎన్నడూ దేవుని వాక్యము నుండి దూరముగా నడిపించడు. ఆయన ఖచ్చితంగా మిమ్ములను దేవుని వాక్యమునకు నడిపించును, ఎందుచేతననగా "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును."
నీకు ఇంకా రెండు లేదా మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు సమయం ఉన్నదా? సమాజం "ఆమెన్" అని చెప్పుచున్నది. నేను మిమ్మును మరియొక సమావేశమునకు పిలువ వలననే కోరుచున్నాను. దానిని నేను ఇచ్చట రాసుకొని ఉన్నాను. నేను ఇచ్చట రాసుకొని ఉన్నాను.
"అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము," ఇచ్చట చెప్పబడుతున్నది. ఏమనగా దీని యొక్క అర్థం ఏమిటో నాకు తెలుసు.
అపోస్తులుల కార్యములు 4, శిష్యులు బోధించడం ప్రారంభించినప్పుడు, సంఘములు విమర్శించుట ప్రారంభించినది. వారు వారిని ….. ఆ సంఘంములు చెప్పినవి. "ఇప్పుడు ఒక్క నిమిషము మీరు అలా ఉండండి. మీరు ముందుకు కొనసాగి అద్భుతములను చేయండి. ఈ విషయంలన్నీ మీరు చేయవచ్చు. అయితే యేసుక్రీస్తు నామమున మాత్రం మీరు బోధించవద్దు." వారిని కొట్టిరి, మరియు కొరడాలతో కొట్టిరి. అలాంటివన్నీ చేసిరి. కావున వారు ఏం చేశారు? వారు నిషేధించబడ్డారు. ఈ మార్గంలో వారు ఎంత మాత్రమును ఇక బోధించరాదని చట్టం చేసిరి.
91ఓ, సహోదరుడా. నాకింకా కొద్ది సమయం ఉన్నదని నేను భావిస్తున్నాను. ప్రపంచ సంఘశాఖల సమావేశంలోనికి నీవు నీ యొక్క సంస్థను చేర్చుటకు సమయము వచ్చుచున్నది. మీరు చేయరు. మీరు దానిని చేసినచో మీరు మృగం యొక్క ముద్రలు పొందుకున్నట్టే. ఎందుచేతననగా రోములో అది శక్తిని పొందుకున్నట్లే మీరు పొందుకుంటారు. మరియు మీరు దాన్ని అందరు వ్యక్తిగతమైన సంఘముగా ఉందురు. మరియు మీరు దానిని అలా చేయనప్పుడు ఆ మృగం యొక్క ముద్ర వచ్చి నీ యొక్క తలుపులను మూసివేయును. మరియు మీరు నిషేధించబడతారు. అప్పుడు మీకు ఒక సమావేశం కావాలి. చూశారా?
92"మనము దానిని ఇక ఎంత మాత్రం చేయలేమని చెప్పుదురు. యేసు నామములో మనము బోధించలేము. దేవుని దగ్గర మనము సమావేశమై మేము దానిని చేయగలమా లేదా అని అడిగెదము." కావున వారు పైకి వెళ్లి ఒక సమావేశమును కలిగియుండిరి. ఓ, ఓ, ఓ, ఓ! నన్ను మన్నించండి. ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఒకరు మనకు అవసరం. "మేము మనుషులకు లోబడవలెనా లేదా దేవునికా?" ఒక అపోస్తులుడు అలా చెప్పియున్నాడు. వారు ఒక సమావేశమును కలిగియుండిరి. ఈ ఉదయకాల సమయములో మనము ఏది పొంది ఉన్నామో అది. మరియు వారు నిల్చుని సంఘమునకు ఇలా చెప్పిరి, మనము వారి గుంపులో చేరేంతవరకు మనము అలా బోధించలేమండి. ఈ యొక్క సంస్థ అనుమతి ఇచ్చేంతవరకు బోధకుడిని మనము అంగీకరించలేము. అది ఎంత అభిషేకించబడినప్పటికీ మనకు అనవసరం. మనము దీనిని అలా చేయవలసి ఉన్నాము"? మరియు ప్రతి ఒక్క గుంపు ఎలా ఉన్నదో మీకు తెలుసు. మనము ఏమి చేయబోతున్నాము?"
మరియు వారు సమావేశమును కలిగియుండిరి. మరియు వారు అచ్చటకు వెళ్లి ప్రార్ధించిరి. అది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయములో ఉన్న సమావేశం. మరియు వారు దానిని చేసినప్పుడు వారందరూ ఏకాంగీకారముతో దానిని చేసిరి. ఎందుకని ఒక వ్యర్థమైన దానిని తలస్తున్నారు. ఎందుకు అల్లరి రేపుచున్నారు. మరియు ప్రజలు వ్యర్థమైన దానిని తలుస్తున్నారు. రోగులను బాగుపరచుటకు మీ పరిశుద్ధ కుమారుడైన యేసు హస్తమును చాపండి. మేము దీనిని చేయుటకు నియంత్రించబడుచున్నాము. మరియు వారందరూ ఏక హృదయముతో ప్రార్ధించిరి.
93ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో ప్రార్థన చేయుచున్నారని కొంతమంది మనలను విమర్శించుట గూర్చి మీరు మాట్లాడుతున్నారు. అలాంటి గుంపులో మీరు ఎలా ఉంటున్నారు? "అందరూ ఏకాంగీకారముతో" ఎవరో చెప్పిరి, "దేవుడు అలా ఎలా వింటాడు"? అన్ని ప్రార్థనలు ఒకేసారి ఆయన ఎలా వింటాడు? ఎలాగైనా సరే? మీరు మర్చిపోయారు ఆయన పరిమితమైన దేవుడు కాదండి ఆయన అనంతమైన దేవుడై ఉన్నాడు. చూశారా?
"మరియు వారందరూ ఏకాంగీకారముతో ఒకేసారి ప్రార్థించినప్పుడు," పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "వారు కూర్చుండి యున్న భవనమంతయూ కదిలిపోయినట్లుగా మనము చూస్తున్నాము". ఆమెన్. ఆ ఫలములు తిరిగి వచ్చినవి. "పిమ్మట వారు యేసుక్రీస్తునుగూర్చి ప్రకటించుచు వెళ్ళిరి, ప్రతీ స్థలమందును, దేవుడు వారితో కూడా ఉండెను, వాక్యమును స్థిరపరచుచుండెను." అపోస్తులుల కార్యములు నాలుగు యొక్క సమావేశము అది.
94ఓ, సహోదరుడా, ఒక నిమిషం, మరియొక సమావేశం కూడా ఉన్నది. ఈ సమావేశములలో దేనికి హాజరు కాలేదేమో. ఈ యొక్క ప్రపంచ సమావేశాలకు మీరు వెళ్లలేదేమో. బహుశా మీరు ఈ సమావేశములలో దేనికి హాజరు కాలేదేమో. ఈయొక్క ప్రపంచ సమావేశాలకు మీరు వెళ్ళలేదేమో. బహుశా మీరు వెళ్లి ఉండకపోవచ్చు అని గుర్తుంచుకోండి. అయితే గుర్తుంచుకోండి, మరి యొక్క సమావేశం ఉన్నది దానినిగూర్చి ఇప్పుడు నేను మాట్లాడబోవుచున్నాను. దానికి మీరు హాజరు కావలసి ఉన్నది. మీరు ఎవరైనా సరే నేను లెక్క చేయను. మీరు దానికి హాజరు కావలసినదే. నీవు క్షమాపణ పొందవచ్చు. ఇంతవరకు అయితే ఇప్పుడు మాత్రము కాదు. ఆ యొక్క సమావేశము తీర్పుదినాన జరిగే సమావేశం. అది నిజం. మీరందరూ అచ్చటకు వెళ్ళవలసి యున్నారు. మనలో ప్రతి ఒక్కరము కూడా. మరియు మనము చేసి యున్న ప్రతి దానికిని మనము అచ్చట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మరియు ఈ భూమి మీద చెప్పిన ప్రతి దానికి ఆ ఒక్క సమావేశానికి నీవు తప్పక హాజరు కావలసినది.
ప్రతిసారి మీరు ఆ యొక్క బూర మ్రోగినప్పుడు వీధిలోనికి వెళ్తారు, గుర్తుంచుకోండి, అది నిన్ను గుర్తు చేస్తుంది. ఇచ్చట నీవు చాలా ఎక్కువ కాలం ఉండవు. అచ్చట మీరు పండిపోయిన జుట్టుతో రాబోవుచున్నారు. భుజాలు వంగిపోయి వస్తారు. ఆసుపత్రిచూస్తూ, సమాధిని చూస్తూ, అది ఏమిటి? ఒక సాక్ష్యం అనగా ఇచ్చట నీవు అన్ని కాలాలలో ఉండబోవు. మరియు నీవు ఆయొక్క సమావేశమునకు కదులుతూ ఉన్న మరియు మనమందరము అచ్చటకు వెళ్ళవలసినదే.
95యేసుక్రీస్తుతో మనము ఏమి చేసియున్నామో ఆ యొక్క లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. అది నిజమేనా? [సమాజం "ఆమెన్" చెప్పుచున్నది.] మరియు యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరదారియై మన మధ్య నివసించెను." "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు."
దేవుడు, మూడు యుగాలు గుండా ఆయన పనిచేస్తున్నాడు. అందు నిమిత్తమే ఆయనను "తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ" అని పిలిచి ఉన్నాడు. చూచారా! దాని అర్థం ముగ్గురు దేవుళ్ళని అర్ధం. అచ్చటే మీలో చాలామంది కలవరపడ్డారు. అది ముగ్గురు దేవుళ్ళు అని అర్థం కాదు. అది ఒకే ఒక్క దేవుడు. మూడు ప్రత్యక్షతలలో వచ్చి ఉన్నాడు. చూశారా! ఒక్క దేవుడే. మనం కేవలము ఒక్క దేవునినే కలిగి ఉన్నాము. మనము అన్యజనులము కాదు. చూశారా? అయితే మనము ఒక్క దేవునినే కలిగి ఉన్నాము. అయితే మూడు బయలుపాటులా ఉన్నాడు. అందుకే మత్తయి ఇలా చెప్పెను, "వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నామములో బాప్తీస్మం," ఎందుచేతననగా, చూడండి, అది ఒక్కటే. అదే దేవుడు: పాతనిబంధనలో ఆయనే అదే దేవుడు బయలుపరచబడ్డాడు. మరియు అదే దేవుడు నేడు ఇచ్చటనున్నాడు. యేసుక్రీస్తు అదే వ్యక్తి మోషే ఐగుప్తులో ఆ లోకాన్ని విడిచిపెట్టి యున్నాడు. ఆయనే నేడు ఇచ్చట ఉన్నాడు. మరియు ఆయనే నిరంతరము ఉండబోవుచున్నాడు. యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమెన్.
96దేవుడు సంఘమును ఏదో ఒక దాని ద్వారా తీర్పు తీర్చవలసి ఉన్నాడు. ఏదో ఒక ప్రమాణము ద్వారా దేవుడు ప్రపంచాన్ని తీర్పు తీర్చవలసి ఉన్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? [సమాజము "ఆమెన్" చెప్పుచున్నది] మంచిది. ఆయన సంఘము ద్వారా దీనిని తీర్పు తీర్చుచున్నచో ఏ సంఘము ద్వారా ఒకవేళ ఆయన రోమన్కాథలిక్ సంఘము ద్వారా అయినచో, అప్పుడు గ్రీకు సంఘము వెళ్లిపోయినట్లే. ఒకవేళ గ్రీకు సంఘం ద్వారా ఆయన తీర్పు తీర్చినచో, అప్పుడు రోమన్ సంఘము వెళ్లిపోయినట్లే. ఒకవేళ మెథడిస్ట్ సంఘము ద్వారా తీర్పు తీర్చినచో బాప్టిస్టులు వెళ్లిపోయినట్లే. ఒకవేళ బాప్టిస్ట్ సంఘం ద్వారా తీర్పు తీర్చినచో అప్పుడు మెథడిస్టులు వెళ్లిపోయినట్లే; మొదలగునవి. ఒకవేళ ఆయన ఏకత్వము వారి ద్వారా తీర్పు తీర్చినచో, అప్పుడు ద్విత్వం వారు పని అయిపోయినట్లే. ఒకవేళ ఆయన ద్విత్వపు వారిద్వారా తీర్పు తీర్చినచో, అప్పుడు త్రిత్వము వారి పని అయిపోయినట్టే. ఒకవేళ ఆయన త్రిత్వము వారిద్వారా తీర్పు తీర్చినచో, అప్పుడు ఇద్దరూ వెళ్లిపోయినట్టే. అచ్చట మీరున్నారు. అది ఏమిటి? అది ఏమిటి సహోదరులారా? ఇది ఒక బుద్ధిహీనమైన గుంపు.
97దేవుడు ఏదో ఒక ప్రమాణమును కలిగి ఉండవలసి ఉన్నాడు. నేను ఒక సంఘములో చేరాలనుకున్నచో, ఏ సంఘంలో నేను చేరవలెను? కేవలము ఒకే ఒక్కటి ఉన్నది. మరియు దానిలో నీవు చేరలేవు.
నేను బ్రాన్హాం అనే కుటుంబంలో జన్మించాను, యాభై-నాలుగు సంవత్సరాల క్రితం, మరియు నేను ఈ కుటుంబంలో చేరలేదు. నేను ఒక బ్రాన్హాంగా పుట్టాను. నేను ఒక బ్రాన్హాం ఎందుకనగా నా తండ్రి ఒక బ్రాన్హాం గనుక.
మరియు నేను ఒక క్రైస్తవుడిని. ఏలయనగా నా తండ్రి దేవుడు గనుక. "ఆమెన్" దాని ఆధారంగానే మనము క్రైస్తవులము అయ్యాము. మనము క్రైస్తవులం. మనం ఆయన యొక్క ఆత్మద్వారా జన్మించాము. మరియు నా యొక్క తండ్రి ఆత్మ నాలో ఉన్నది. నాలో నా తండ్రి యొక్క లక్షణములు ఉన్నవి. మరియు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తులో అవి ప్రదర్శించబడిన రీతిగానే నాలో కూడా అవి ఉన్నవి. అచ్చటే మీరున్నారు.
"ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. రక్తమాంసములు దీనిని నీకు బయలు పరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరిచి ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును."
98దేవుడు ఒకవేళ కాథలిక్ సంఘము ద్వారా తీర్పు తీర్చినచో అప్పుడు ప్రొటెస్టెంట్ వారందరూ నశించిపోయినట్టే. అతడు ప్రొటెస్టెంట్ ద్వారా చేరుచున్నాడు, ఏమిటది? ఆయన క్యాథలిక్ సంఘము ద్వారా తీర్పు తీర్చినచో, అనేక వివిధ రకాలైనటువంటి కేథలిక్ సంఘం యొక్క గోళాలకు భయపడుతున్నారు, మరి అటువంటిప్పుడు దేని ద్వారా అది జరగబోవును? మీరు చూడండి, ఒక వ్యక్తి గందరగోళంలో ఉంటున్నాడు. ఏమి చేయవలెనో మీకు తెలియటం లేదు.
అయితే ఇచ్చట దేవుడు వాక్యము ద్వారా తీర్పు తీర్చబోవుచున్నాడు. అదే ప్రమాణం. "ఆకాశము మరియు భూమి గతించినా, కానీ నా మాట ఎన్నడూ గతించనే గతించదు." నా ప్రమాణమును దీనిమీద చూసుకుంటున్నాను. మిగతా నేల అంతయు కృంగిపోయే ఇసుకే. మిగతా నేల అంతయూ కృంగిపోయే ఇసుకయే.
నేను క్రీస్తు అనే బండమీద, నిలబడి ఉన్నాను;
మిగతా నేల అంతయు కృంగిపోయే ఇసుకయే.
నేను దానిమీద ఆధారపడుచున్నాను. నేను ఏమై ఉన్నానో దానిమీద నేను నా నమ్మకాన్ని ఉంచుకొనుటలేదు. ఆయన ఏమంటున్నాడో దానిమీద నా నమ్మకం ఉంచుకొనుచున్నాను. నేను వెళ్లలేను, నేను పరలోకము వెళ్ళలేను; యేసు చెప్పెను, అచ్చటకు వెళ్లడానికి నేను పరిపూర్ణుడను కావాల్సి ఉన్నాను. "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉండులాగున మీరును పరిపూర్ణులుగా ఉండవలసి ఉన్నారు." నీవు ఎలా ఉండగలవు? అయితే నీవు అలా మారినప్పుడు నీ వైపు చూడవద్దు గాని నీ యొక్క బలి వైపే చూడు.
99మంచిది, పాత నిబంధనలో ఒక చిన్న కంచర గాడిద పిల్ల జన్మించినప్పుడు. వాని యొక్క చెవులు కత్తిరించబడతాయి, మరియు అది మోకాలు వంచుకొని కాళ్లతో అడ్డంగా చూస్తుంది. ఎందుకనగా, తలలో దానికి కొట్టబడినది అని దానికి తెలుసు. అది ఇప్పుడు ఏ మంచిది కాదు. అయితే ఆ తల్లి దానికి చెప్తుంది, "కుమారుడా, నీవు ఒక జన్మహక్కు తో పుట్టావు. ఎందుచేతననగా నీవు అలా పుట్టావు, ఈ మార్గంలోనే నీవు జీవించవలసి ఉన్నావు. అయితే నీ కొరకు ఒకటి చనిపోయినది. అది ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల, అది నీకొరకు అర్పించబడగా నీవు జీవించగలవు." వారు ఆ యొక్క గుర్రం యొక్క మెడను కొడతారు, అది మంచిగా లేనట్లైతే, మరియు అది మంచిదిగా లేదు. అయితే, మీరు చూడండి, ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల అర్పించబడాలి. అప్పుడు మిగతావారు జీవించగలరు.
నీవు మంచి వాడవు కాదని నీవు చెప్పినచో, "నేను స్వస్థ పరచబడుటకు యోగ్యత లేని వాడను, బ్రాన్హాం సోదరుడా. క్రీస్తు వద్దకు వచ్చుటకు యోగ్యత లేని వాడను." అయితే నీ వైపు నీవు చూసుకోవద్దు. నీకొరకు అర్పించబడిన బలివైపు చూడు. నేను మంచివాడను కాను. నాలో ఏ మంచి లేదు, ఒక ఆలోచన కూడా మంచిది లేదు. ఏ విధమైన మంచి లేదు, నీలో ఏ విధమైన మంచి లేదు. మనలో ఎవరు కూడా దేనికీ అర్హులము కాదు గాని నరకానికి మాత్రమే అర్హులం. అది నిజమండి.
100అయితే, ఓ, చూడండి మన కొరకు ప్రాతినిధ్యం వహించుటకు ఎవరు నిలబడుచున్నారు? మన కొరకు ప్రతినిధిగా ఎవరు నిలబడుచున్నారు? మరియు ఇచ్చట ఆయన యొక్క జీవమున్నది. అది ముద్రగా మన ద్వారా బయలుపడుచున్నది. పిమ్మట ఒక చిన్న సిద్ధాంతము ద్వారా దానిని మనము క్రిందికి నెట్టుచున్నాము. ఓ, మనకు ఒక సమావేశం అవసరమైనది. అవునండి.
ఆ కారణము చేతనే నేను వేదిక వద్దకు నడుచుచున్నాను, ఏదో ఒకటి రాబోవుచున్నదని భయంతో కాదు, ఈ మార్గంలో లేదా ఆ మార్గంలో ఏదో ఒకటి జరుగును అని కాదు, లేదా విఫలమవుతుందని కాదు. లేక ఏదో తప్పు జరుగుతుందని కాదు. లేదండి. నేను నా కొరకు ఉంచబడిన బలిని చూస్తున్నాను.
"బిల్లి ఈ వారం మీరు ఏమి చేయుదురు?"
ఒక గంటలో నేను చెప్పినది ఏమనగా, నేను చాలినంతగా చనిపోయాను. ప్రారంభముతోనే, నేను ఒక పాపిని. అయితే నాకు ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చి ఉన్నారో దానిని చూస్తున్నాను. ఎవరు చెప్పియున్నారు ఆయనను చూస్తున్నాను, "నీవు భయపడటం లేదా. ఇచ్చట నిలువుము. ఈ కారణము నిమిత్తమే నీవు జన్మించి యున్నావు. ఈ ఉద్దేశము నిమిత్తమే నేను నిన్ను లేపి ఉన్నా ను." కావున నరకంలో నుండి వచ్చు అన్ని దయ్యములు కూడా ఇక నన్ను అస్సలు కదిలించలేదు. స్థిరమైన బండ అయిన క్రీస్తులో అచ్చట నేనున్నాను.
101మీలో ఎవరికైనా పాలు రాడార్ గుర్తున్నాడా? అతడు దేవుని యొక్క గొప్ప యోధుడు. నేను ఒక చిన్న బాలునిగా అతని యొక్క పాదముల వద్ద ఉన్నాను. అతను కాలిఫోర్నియాలో మృతి చెంది ఉన్నాడు కొద్దికాలం. అతడు చనిపోవుచున్నప్పుడు… అతడు మరియు అతని యొక్క సహోదరుడైన లూకా ఇద్దరు కలిసికట్టుగా ఇరుక్కుపోయారు. నేను మరియు ఇచ్చట నా కుమారుని వలె వారు కలిసి వెళ్లారు. చేతిలో చేయి వేసుకొని సహోదర సహోదరవలె. అవి కేవలం తండ్రి మరియు కుమారుని వలె. మరియు పౌలు రహదారి చివరకు వచ్చి యున్నాడు.
మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ వారు పాటలు పాడే నలుగురు గాయకులను అక్కడకు పంపించారు. వారు అచ్చట ఆ తెరలను లాగి సమస్త ప్రదర్శనలు ఇచ్చారు. అచ్చట వారి ఛాయలు ఆ యొక్క ఆసుపత్రి మొదలగునవి. మరియు లూకా ఒక రకమైనటువంటి …..నా భావమేమనగా, పాల్ రాడార్ ఒక నవ్వులు కలుగజేసే వ్యక్తి. మీకు తెలుసా? కావున ఆ యొక్క నలుగురు గాయకులు చుట్టూ అతడు చూశాడు. మరియు వారు దేవునికి దగ్గరగా రావటం అనే పాట పాడుతున్నారు. అతడు చెప్పెను, "ఎవరు చనిపోవుచున్నారు, నేనా లేక మీరా?" అతడు చెప్పెను, "అచ్చట ఆ తెరలను పైకి లేపండి. మరియు నా కొరకు మంచి పాట పాడండి. ఒక మంచి చురుకైన సువార్త పాటలు పాడండి." పిమ్మట వారు పాడుచున్నారు.
ఆ కల్వరిలో నా రక్షకుడు చనిపోయిన చోట;
పాపము నుండి పవిత్రపరచుటకు నేను అరచితిని;
అచ్చట నా హృదయమందు రక్తము ఉంచబడును;
ఆయన నామమునకే మహిమ.
అతడు చెప్పెను, "అది మంచిగా ఉన్నట్టుంది". చెప్పెను, "లూకా ఎక్కడ ఉన్నాడు. నాకు అత్యంత సన్నిహితముగా ఉన్నటువంటి అతడు ఎక్కడ?".
తన సహోదరుడు చనిపోవుట అతడు చూడలేదు. అతడు ప్రక్క గదిలో ఉన్నాడు. వారు వెళ్లి అతనిని తెచ్చి ఉన్నారు. పాల్ అతని యొక్క పెద్ద చేతిని పైకెత్తియున్నాడు. మరియు లూకా అతని యొక్క చేతులు పట్టుకొని యున్నాడు. కన్నీళ్లు అతని యొక్క చెంపల నుండి కారుచున్నవి.
చెప్పెను, "లూకా దీని గురించి ఆలోచించు. మనం ఎంతో కాలము కలసి నడిచాము. మనం అనేకమైన వాటిని ఇష్టంగా కలిసి పంచుకున్నాము. మరియు అనేక గుంటల ద్వారా కలిసి నడిచాము. అయితే దీనిని గూర్చి ఆలోచించు. ఇచ్చట నుండి ఐదు నిమిషాలలో నేను యేసుక్రీస్తు సన్నిధిలో నిలవబడతాను. ఆయన యొక్క నీతి వస్త్రంతో చుట్టబడతాను. అది నిజం.
102పాల్ నాకు చెప్పియున్నాడు. అతడు చెప్పెను… అతడు ఒక యవ్వనస్తునిగా ఉన్నప్పుడు అతడు ఓరిగాన్ నుండి వచ్చి ఉన్నాడు. అతడు ఒక చెక్క పనులు చేసే వ్యక్తి మరియు అతడు చెట్లను నరుకుతూ ఉంటాడు. మరియు అతడు ఈ దీవులలో ఉన్నప్పుడు అతడు చెప్పెను, … అది ఎచ్చటో నేను మర్చిపోయాను. దక్షిణ అమెరికా కావచ్చు. అది అచ్చట ఉండవచ్చు. మరియు అతడు అచ్చట మిషనరీగా పనిచేశాడు. మరియు అతనికి ఈ యొక్క బ్లాక్ఫీవర్ వచ్చి ఉన్నది. బ్లాక్-వాటర్ జ్వరము. ఓ, మీకు తెలుసా, అది ఏమిటోనని, అది ఖచ్చితంగా మరణం. ఆ యొక్క అరణ్యంలో నుండి వైద్యుని యొద్దకు చాలా మైళ్ళ దూరం ఉంటుంది.
దైవిక స్వస్థతలో పాల్ గారు గొప్ప విశ్వాసి అని మీకు తెలుసు. మరియు పిమ్మట అతడు—అతడు తన భార్యకు చెప్పెను, అతడు చెప్పెను… వారు వైద్యుని వద్దకు వెళుతున్నారు. అతడు చెప్పెను, "ఇది ఏ విధమైన వ్యత్యాసము కలుగు చేయదు. నేను ఎక్కువ కాలం జీవించలేను." కావున అతని యొక్క భార్య….. చెప్పెను, "హనీ, మీరు ఇచ్చటకు రండి ఈ పరుపు ప్రక్కకు రండి, మరియు మీరు మా యొక్క వైద్యునితో మాట్లాడండి. అతనిని మనము రంగము మీదకి పిలిచెదము."
కావున తన యొక్క భార్య ప్రార్ధించుట ప్రారంభించినది, "దేవా, నా యొక్క భర్త చనిపోయేటట్లుగా చేయవద్దు, ఈయన ఇచ్చట సువార్త పొలములో నీ కొరకు పని చేయుచున్నాడు. అతనిని చనిపోనివ్వవద్దు."
103నూట మూడు జ్వరము అతని మనసులో నుండి అధికమగుచున్నది, దగ్గరగా అది తగ్గుతూ ఉన్నది, మరలా వస్తూ ఉన్నది. అతడు చెప్పెను, "హాని, ఇది ఇంకా చీకటిగా చీకటిగా మారుతున్నది. నేను ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చు కానీ కొద్ది కాలమే". చెప్పెను కేవలం ప్రార్థిస్తూనే ఉండండి అని.
మరియు అతడు కోమాలోనికి జారిపోయి యున్నాడు. అతడు చెప్పెను, అతడు ఒక కలను కన్నాడని అతడు ఆ యొక్క కలలో ఓరిగాన్లో ఉన్నాడు. ఒక యవ్వనస్తుడు మరియు అతనికి లంబార్ శిబిరంలో ఒక అధికారి ఉన్నాడు. అతను చెప్పెను, "పాల్, పైకి వెళ్ళు. ఆ పైన ఒక కొండ ఉన్నది. ఒక కొలతతో ఉన్నటువంటి చెట్టును నరికి దానిని నా యొద్దకు తీసుకు రమ్మని చెప్పెను."
"అలాగే నా యజమాని".
మరియు అతడు ఆ యొక్క కొండపైకి వెళ్లి యున్నాడు. మరియు అతడు అచ్చట అదే గొడ్డలిని చూచి ఉన్నాడు. అయితే మీరు ఆ యొక్క దూరముగా ఉత్తరము వైపు వెళ్ళుచుండగా మీకు అచ్చట చెట్లుచాలా మృదువుగా కనిపిస్తాయి. అలాగే దక్షిణముకు వెళ్ళుచునుండగా ఆ చెట్లు చాలా కరుకుగా కనిపిస్తాయి. కావున అతడు అచ్చటకు వెళ్లి ఉన్నాడు. అతడు అచ్చట చెప్పెను, "ఆ యొక్క గొడ్డలి చాలా లోతుకు వెళ్ళిపోయినట్లుగా, అతడు చూచే గొడ్డలి యొక్క భాగము చెట్టులోనికి దూరినది. ఆయన చెట్టును కొట్టుచుండగా అలా జరిగినది. అయితే అప్పుడు అతడు దానిని చిత్తు చేశాడు. దానిని పైకి తీసి మళ్లీ బిగించాడు. ఆ గొడ్డలిని చెట్టు మొండెము లోనికి దూర్చాడు అనగా దాని యొక్క పెద్ద భాగము మరియు మీకు తెలుసా అతని యొక్క మోకాళ్ళను దగ్గరగా ఉంచి దానిని పైకి లేపాడు. అతను చాలా బలమైన మనిషి అని చెప్పెను. పొట్టివాడు బలమైన మనిషి.
కావున అతడు ఆ యొక్క చెట్టును పైకి లేపటానికి ప్రయత్నించాడు, అయితే దానిని అతడు పైకి లేపలేకపోయాడు. అతడు చెప్పెను, "నేను చాలా బలంగా ప్రయత్నించాను, మరియు నేను భావించాను…… నేను ఆ యొక్క దొంగను నా యజమాని దగ్గరకు తీసుకువెళ్లగలనని." అతడు చెప్పెను, "కానీ నేను దానిని పైకి లేపలేకపోయాను." చెప్పెను, "నేను తడబడ్డాను, లాగాను, లాగాను, మరియు లాగాను మరియు ముందుకు లాగాను." అతడు చెప్పెను, "నా బలమంతాపోయేంత వరకు" మరియు చెప్పెను, "నేను ఆ చెట్టుకు ఎదురుగా నిలువబడ్డాను మరియు తలంచెను, నేను చాలా అలసిపోయాను! ఇక నేను ఎంత మాత్రమును ముందుకు కదలలేను."
చెప్పెను, "అప్పుడు నేను ఎన్నడూ వినని మధురమైన ప్రత్యక్ష స్వరాన్ని విన్నాను. అది నా యొక్క యజమాని. మరియు అతడు చెప్పెను, "పాల్ దాంతో నీవు ఏమి శ్రమ పడుతున్నావు"?
అతడు చెప్పెను, "నా యజమాని, నేను-నేను-నేను దానినిపైకి లేప లేకపోవచ్చును. ఇది చాలా బలంగా ఉన్నది. నేను మోయటానికి ఈ బరువు చాలా ఎక్కువగా ఉన్నది. ఇక నేను దీనితో ముందుకు ఎంత మాత్రం కదలలేను."
అతడు చెప్పాడు, "పాల్ అక్కడ ఒక సెలయేరు ఉన్నది. నీ ప్రక్కనే ఉన్నది. దానిని నీవు ఆ సెలయేరు లోనికి ఎందుకు త్రోసి వేయరాదు? మరియు అప్పుడు దానిమీద నీవు దూకి దానితో కలసి ప్రయాణం చేయము. అప్పుడది శిబిరము వద్దకు చేరిపోతుంది".
అతడు చెప్పాడు, "నాకు అలాంటి ఆలోచన రాలేదండి." మరియు అతడు ఆ యొక్క సెలయేరు లోనికి దానిని త్రోసి వేసినప్పుడు అతడు వెనుకకు చూచెను. అప్పుడు అతని యొక్క యజమాని యేసు ఉన్నాడు. మరియు చెప్పెను, అతడు ఆ యొక్క దుంగ మీదకు దూకి యున్నాడు మరియు ఆ యొక్క సెలయేరు గుండా వెళ్ళి ఉన్నాడు. నీటిని చిమ్ముతూ ఉన్నాడు. గర్జిస్తూ ఉన్నాడు. "నేను దానిమీద స్వారీ చేయుచున్నాను! దానిమీద స్వారీ చేయుచున్నాను! దానిమీద స్వారీ చేయుచున్నాను!" మరియు చెప్పెను, అతడు వచ్చి ఆ యొక్క నేల మధ్యలో నిలుచున్నాడు, తన రెండు చేతులను గాలిలోనికి చాచి చెప్పుచున్నాడు , "నేను దీని మీద స్వారీ చేయుచున్నాను! నేను స్వారీ చేయుచున్నాను! నేను స్వారీ చేయుచున్నాను"!
"అంటే నా చేతులలో నేను ఏమీ తీసుకుని రాలేదు. కేవలం నీ వాక్యానికి నేను కట్టుబడి ఉన్నాను!"
104సహోదరుడా, సహోదరి ఏ మనిషిలో ఏ మంచి కూడా లేదు. ఏ వ్యక్తిలో కూడా ఏ మంచి కూడా లేదు. అయితే యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. కావున నేను ఇచ్చట ఈ ఉదయకాల సమయంలో ప్రతి వాగ్దానాన్నిస్వారీ చేస్తున్నాను. మరియు ఏదో ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిందించిన రక్తము మీద నేను ఆయన యొక్క సన్నిధిలోనికి స్వారీ చేస్తాను.
మనము మన తలలు వంచెదము.
నేను దాని మీద స్వారీ చేస్తున్నాను. నేను దాని మీద స్వారీ చేస్తున్నాను. నా యొక్క అనుబంధం మీద కాదు, నా యొక్క సంస్థ మీద కాదు, నా యొక్క స్వనీతి మీద కాదు. అయితే దేవుని వాక్యము మీద నేను స్వారీ చేస్తున్నాను. నేను దానిని నమ్ముతున్నాను. నీతివంతమైన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏదో ఒక దినాన నేను ఆయనను చూచెదను. నేను ఆయన యొక్క సొంత మహిమకరమైన శరీరమునకు మార్పు చెందుతున్నాను. నేను ఆయన యొక్క రూపంలోనికి మారుదును. ఆయనను ఉన్నట్లుగానే నేను ఆయనను చూచెదను.
105సంవత్సరములు గడుచుట నేను చూస్తూ ఉండగా, నా తలపైన ఉన్నటువంటి జుట్టు నెరవడం ప్రారంభిస్తున్నది, నా భుజాలు వంగిపోవుచున్నవి, నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. నేను సుమారు ముప్పై సంవత్సరాలుగా వేదికపై నుండి ప్రసంగిస్తున్నాను. ఒకవేళ నాకు వేయి జీవితాలు ఉన్నచో, నేను ఆయనకు వాటిని ఇచ్చెదను. అయితే నాకు ఒకే జీవితం ఉన్నది. నేను ఆయన ప్రజలను ప్రేమించెదను.
ఈ ఉదయకాల సమయమున నీవు దేనిని నమ్ముచున్నావు? నీవు చేసిన ఏదైనా ఒక మంచి కార్యమున నీవు వెళుతున్న ఏదైనా ఒక సంఘమున నీవు నిజంగా దేవుని వాక్యము మీద నిలబడి ఉన్నావా? నీవు నిజంగా అనుభవాన్ని కలిగి ఉన్నావా? నీవు దానిని గూర్చి విన్నావా? నీవు దేవునితో ఒక ప్రత్యేకమైన సమావేశం కలిగి ఉన్నావా? మరియు అలా వెనుకకు తిరిగి పెంతుకోస్తు దినమున వచ్చినట్టుగా వచ్చి ఉన్నావా? ఏదో ఒక ప్రత్యామ్నాయమైనది కాదు. కరచాలనం కాదు. మానసిక ఒప్పుకోలుకాదు. అయితే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మీద అది నీ జీవితంలోనికి వచ్చి నీవు చేయుచున్నవి అన్నియు మరియు నీవు చెప్పుచున్నవి అన్నియు మార్పు చేయాల? నీవు అలాంటిదానిని కలిగి లేనిచో నీవు ఇప్పుడు నీ చేతులను ఎత్తి ఇలా చెప్పగలవా, "బ్రాన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధించండి. నేను అలా లేను…" దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించును గాక. మై, అచ్చట చేతులు లేచినవి!
106మీ సంగతి ఏంటి పెంతుకోస్తు వారలారా? మీలో కొంతమంది ప్రజలు, మీకు తెలుసు, మీరు—కేవలం సాంప్రదాయ బద్దంగానే సంఘానికి వెళుతున్నారు, మరియు మీరు సంగీతముని ఇష్టపడతారు, మరియు మీరు పెంతుకోస్తువలే నటిస్తారు, అయితే వాస్తవముగా మీరు హృదయాంతరంగములలో మీరు ఏదో ఒక దానిని కోల్పోయారు, అది మీకు తెలుసు ఏదో ఒకటి మీరు కోల్పోయి ఉన్నారని మీకు తెలుసు. ఈ ఉదయకాల సమయంలో మీరు నిజముగా దానిని కోరుకున్నచో ఈ యొక్క అల్పాహార బల్లమీద.
మీకు తెలుసు, నేను మరలా ఇంకొక అల్పాహారాన్ని మీతో పంచుకోలేకపోవచ్చుగాని, మీతో నేను రాత్రి భోజనాన్ని ఇదంతా అయిపోయిన తర్వాత చేయవచ్చు. మీరు అలాంటి అనుభవాన్ని మరలా పొందుకొనలేరు. మీరు మీ చేతిని ఎత్తి ఇలా చెప్పగలరా, "బ్రాన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధించుము. నేను అలా లేను"…..? నేను ఇప్పుడు మార్పు చెందాలని కోరుచున్నాను." దేవుడు నిన్ను దీవించును గాక. అది నిజము.
మీరు ఇలా చెప్పవచ్చు "నా యొక్క చేతిని ఎత్తటం వలన నాకు ఏదైనా జరుగుతుందా?" మీరు అలా భావించినచో, అది జరుగుతుంది. ఆయన మిమ్ములను చూస్తాడు.
107ఇప్పుడు, నేను ఆయన యొక్క సేవకుడినని మీరు నమ్ముతున్నారు. చాలామంది నన్ను ప్రవక్త అని పిలుచుచున్నారు. అయితే నేను ప్రవక్తగా ప్రకటించుకొనుటలేదు. లేదండి. అయితే దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అని మీరు నమ్మినచో, ఇప్పుడు మీరు నేను చెప్పినది వినండి. యదార్ధముగా, మీరు మీ చేతులను పైకెత్తినచో, దానిని నమ్మండి. మరియు మీకు ఏమి జరుగునో చూడండి. మీ హృదయాలలో ఏమున్నదో ఆయన నాకు చెప్పినచో మీరు మీ గృహాన్ని విడిచి పెట్టడానికి ముందుగానే మీరు దేనికొరకు ప్రార్థింపబడవలెనని కోరుచున్నారో, ఆయన దానిని నాకు చెప్పినచో, మరియు మీరు దేనిని చేసి ఉన్నారో, మీరు చెప్పిన ఆ మాటలు మీ జీవితములో మీరు ఏమి చేసి ఉన్నారో, మరియు మీరు ఏమై ఉన్నారో, మరియు మీరు ఎచ్చట నుండి వచ్చి ఉన్నారో, మరియు ఇచ్చట నుండి మీకు ఏమి జరగబోవునో మరియు అది జరుగుతుంది. అంటే ఆయన నిశ్చయముగా ఇప్పుడు నాతో మాట్లాడుచున్నాడు.
ఈ ఉదయకాల సమయంలో ఈ సమావేశమును మనము చేద్దాం. మెథడిస్టులను గూర్చి, బాప్టిస్ట్లను గూర్చి, ప్రెసిబిటేరియన్ ల గూర్చి, పెంతుకోస్తుల గూర్చి, ఏకత్వం గూర్చి, ద్విత్వము గూర్చి, ఓ, దేవుని సంఘము గూర్చి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ గూర్చి, మీరు ఏదైనప్పటికీ మీ గురించి ఏమిటి సంగతి? మనమందరము ఒక సమావేశమును కలిగి ఉన్నాము. ఒకరికొకరం మనము ఒక చిన్న ప్రేమను కలిగి ఉండుట అవసరమా లేదా అనే విషయము చూద్దాం. అది ఒక రకమైన ఉపశమనమా కాదా? మనము చూచెదము. మనము కొద్ది ప్రేమను మరియు గౌరవాన్ని ఒకరికొకరం కలిగి ఉండవచ్చు. మీరు అలా కలిగి యుండరా? మంచిది.
108మనము అపోస్తులుల కార్యములు 4 అధ్యాయములో ఉన్న సమావేశంవలె ఒకటి కలిగి ఉన్నాము, అది తప్ప మీరు కలిగియున్న ప్రతిదీ తప్పైయున్నది. మరియు మీరు ఆ యొక్క బల్ల యొద్ద ఉన్నారు. బలిపీఠపు బల్లయొద్ద దీవెన కోరుచున్నారు. ఆ కుటుంబ బలిపీఠము వద్ద ప్రతిదినపు ఆహారము కొరకు మీరు దేవునికి అచ్చట వందనాలు చెల్లిస్తున్నారు.
మరియు, గుర్తించుకొనండి, మీరు దానిని భుజించినప్పుడు ఎందుచేతననగా మీరు తినుచున్నారు. అంటే ఏదో ఒకటి చనిపోవాల్సి ఉన్నది కదా. అప్పుడు మీరు భౌతికంగా జీవించగలరు. అది మీకు తెలుసా? మీరు మాంసం తినదలచినచో ఒక జంతువు చనిపోవాల్సి ఉన్నది. మీరు రొట్టె తినాదలచినచో గోధుమ మొక్క చనిపోవలసి ఉన్నది. మీరు గింజలు తినదలచినచో ఆ గింజలు చనిపోవాలి. అది ఒక జీవపు రూపమై ఉన్నది. మరియు భౌతికముగా నీవు జీవించే ఒకే ఒక్క మార్గమేదనగా ఏదో ఒకటి చనిపోవాల్సి ఉన్నది. కావున అప్పుడు నీవు భౌతికముగా జీవించగలవు.
స్నేహితులారా, ఇది సరియా కాదా, మీకు అంజూరపు ఆకులు చూపిస్తున్నాను. మరియు మానవ ఆలోచనలతో తయారు చేసినవి పనిచేయవు. ఏదో ఒకటి చనిపోవాల్సి ఉన్నది. అప్పుడు మీరు నిత్యము జీవించగలరు. ఏదో ఒకటి చనిపోవాల్సి ఉన్నది; ఒక సంఘము కాదు, నీవు కాదు. ఇది క్రీస్తు, నీ కొరకు చనిపోయెను. ఇప్పుడు దానిని నీవు అంగీకరించు. అంగీకరించెదవా?
మనము మన తలలు వంచి ఉండగా మీ హృదయములో ప్రతి ఒక్కరు ఏమి అవసరం మీరు కలిగి ఉన్నారో దానిని తలంచుకొనుడి. మరలా మనము కలిసేంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
109పరలోకపు తండ్రీ, నేను ఈ యొక్క ప్రియమైన ప్రజలను ఇచ్చుట ఉంచియున్నాను. ఎందుచేతననగా నేను ఎరుగను. మీరు ఎరుగుదురు. బహుశా ఇదే చివరి సమయం కావచ్చు. ఒక విషయం మీరు రాత్రికి ముందే రాగలరు. నేను మరలా ప్రారంభించడానికి ముందుగానే మీరు రాగలరు. ఒక విషయము నిశ్చయము మీరు వస్తున్నారు. నేను చనిపోవచ్చు. నేను ఈ భూమిని విడిచి పెట్టవచ్చు. అయితే ఇచ్చట చాలామంది ఉన్నారు. ఈ దినము నుండి మరల ఈ సభకు నేను ఒక సంవత్సరంనకు వచ్చినచో ఇచ్చట ఉన్న ప్రజలు ఇచ్చట ఉండకపోవచ్చు. సందేహం లేదు. వారు వెళ్ళిపోవచ్చు. ప్రభువా ఇది మా యొక్క చివరి సమయము కావచ్చు. మేము కలవబోవుచున్నాము. మాలో ఇచ్చట ఉన్న కొంతమంది మాకు తెలుసు. ఈ భూమి మీద ఇదే చివరి సభ కావచ్చు. మరలా మేము ఇంకొకసారి కలుసుకునే చోటు తీర్పు దినము కావచ్చు. మరియు వారికి నేను ఏమి చెప్పి ఉన్నానో దానికి నేను లెక్క చెప్పవలసి ఉన్నాను. అనగా ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకునిగా నేను అలా చేయాలి. తండ్రీ, వారిని నేను వాక్యం వద్ద ఉంచాను. చేయవలసినదంతా నేను అదియే చేశాను.
110ఇప్పుడు చాలామంది ప్రజలు అలా చెప్పిరి, ఈ సమావేశంలో ఉదయకాల సమయంలో వారు దానిని గూర్చి మీతో మాట్లాడదలచుకున్నారు. వారు దీనిని ఇప్పుడే చేయుచున్నారు, ప్రభువా. వారు వారి యొక్క చేతులను ఎత్తియున్నారు. వారు దానికి సాక్షులుగా ఉన్నారు. వారు- వారు-వారు- వారు-వారు అలసిపోయారు, ప్రభువా. వారు నీరసించి పోయారు. మరియు లోకం యొక్క సమావేశంలో జరిగిపోయినవని వారు అడిగి ఉన్నారు.
ఇక ఏ నిరీక్షణయు లేదు. మేము ఇంకా ఏమియు నిర్మించలేము. ప్రతి దేశము యొద్ద ఆటం, హైడ్రోజన్ బాంబులు ఉన్నవి, మరియు విషపూరిత బాంబులు మరియు అంతరిక్ష వాసులు మరియు అలాంటివి ఉన్నవి, ప్రభువా. ఈ సమస్త ప్రపంచం భయంతో వణుకుచున్నది. ఇది చాలా వేగంగా శుద్ధికరింపబడబోవుచున్నది. మరియు గొప్ప వెయ్యి ఏండ్ల రాజ్యం నాకు సిద్ధమవుతున్నది. అది ముక్కలు ముక్కలుగా బ్రదలవుచున్నది. ఆమె తడబడుచున్నది. అర్ద రాత్రిన త్రాగుబోతు చీకట్లో తడబడినట్లుగా ఆమె ఎక్కడకి వెళ్లు చున్నదో ఆమె ఎరుగదు.
111ఓ తండ్రీ, అయితే ఒక పునాది ఉన్నది. ఒక నిశ్చయత ఉన్నది, "మేము ఎన్నడూ కదలని ఒక రాజ్యాన్ని పొందుకొనబోవుచున్నాము." తండ్రీ, నేను ప్రార్థించుచున్నాను, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు యేసుతో ప్రతి ఒక్కరు ఆరాజ్యమునకు పరిగెత్తి వెళ్ళుదురుగాక. తండ్రీ, వారిని ఆశీర్వదించండి, వారి తలలు వంచి వింటుండగా, వారి హృదయము లోబడి ఉంటుండగా. వారు ఎప్పుడో సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు. మేము ఒక సమావేశంలో ఉన్నాము. ఇప్పుడే సమాధానం పంపించండి, తండ్రీ, ప్రతి ఒక్కరికి పంపండి.
వారిలో కొంతమందికి రక్షణ కావలసి ఉన్నది. వారు కొంతమంది ఇదే మొదటిసారి రావటం. మరికొంతమంది అయితే …. మరియు వారు—వారు వారి సిద్ధాంతములను మరచిపోవుచున్నారు. ఆ రీతిగా వారు మొదటిసారి ఇచ్చటకు వచ్చి ఉన్నారు. మీ యొక్క నిర్ణయాన్ని వారు కోరుచున్నారు. సంఘము యొక్క నిర్ణయం కాదు. ఏదో సిద్ధాంతం. ఎక్కడ నిర్ణయం కాదు గాని పరిశుద్ధ గ్రంథము యొక్క నిర్ణయము. అపోస్తలుల కార్యములు రెండో అధ్యాయంలో, దేవుడు చేసిన నిర్ణయం. ఆయన పరిశుద్ధాత్మను పంపి ఆ యొక్క సంఘము మీదకు అగ్నిని పంపించిన రీతిగా. అది ఆయన యొక్క నిర్ణయం. ఆ సంఘము ఎలా జీవించవలసి ఉన్నది, మరియు వారు అలా చేయవలసి ఉన్నది. సమస్తమును వెనుకకు విడిచిపెట్టి, తండ్రి, మేము ఆ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాము. ఓ ప్రభువా, ఇప్పుడే మీ యొక్క శక్తిని పంపించండి మరియు ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి. మనము మన యొక్క తలలు వంచి ఉంటుండగా:
వారు ఆ యొక్క మేడగదిలో ఉన్నారు,
వారందరూ ఒకే హృదయముతో ఉన్నారు,
ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు
ప్రభువు ద్వారా వాగ్దానము చేయబడినది.
అది ప్రభువు ద్వారా వాగ్దానం చేయబడినది.
అది ఆయన యొక్క వాక్య వాగ్దానం.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపించండి.
ఇప్పుడు ప్రార్థించండి.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ప్రతి ఒక్కరికి బాప్తిస్మము ఇవ్వండి.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి…
112సేవకులు ప్రజలను ఆ బల్ల చుట్టూ ఉంచుచున్నట్టు నేను చూస్తున్నాను. వారితో ప్రార్థించుటకు అలా చేయుచున్నారు. అది మంచిది. "ఆ యొక్క శక్తి ఇప్పుడే…"
ఇచ్చట మనము కేవలం నిలబడి మాట్లాడుచున్నాం అనుకోవద్దు. ఆయన ఇచ్చట ఉన్నాడు. "ఓ ప్రభువా…" మీరు ఇచ్చట ఉండొచ్చు. మీరు ఎవరూ కూడా ఇంకెవరు వైపునకు చూడవద్దు. మీ కళ్ళు మూసుకొని రండి మరియు ఆయన వైపు విశ్వాసముతో చూడండి. "ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి." గుర్తుంచుకోండి.
వారు ఆ మేడ గదిలో ఉన్నారు,
వారందరూ ఒకే హృదయముతో ఉన్నారు,
ఆ పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు
అది మన ప్రభువు ద్వారా వాగ్దానం చేయబడినది.
మనము ఇచ్చట అనేక సిద్ధాంతములు కలిగి ఉన్నాము. "ఓ ప్రభువా…" మనము ఇప్పుడు ఇచ్చట ఐక్యతతో ఉన్నాము, ఇప్పుడు, నమ్మండి.
ఓ ప్రభువా, మీ శక్తిని పంపించండి.
ఈ వారం అంతటిలో ఆయన మన దగ్గరకు ఎలా వచ్చి చెప్పాడో చూడండి. ఆయన ఇచ్చట ఉన్నాడు, ఇప్పుడే ఇచ్చట ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, మీరు కేవలం నమ్మినచో.
ఇప్పుడు, ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
ఓ ప్రభువా, ఇప్పుడే మీ శక్తిని పంపండి,
ఓ ప్రభువా, మీ యొక్క….
"నేను నా హృదయమును నీకు ఇచ్చుచున్నాను, ప్రభువా. నేను సమస్తమును మీకిచ్చుచున్నాను. ఇచ్చట నా చేయి ఉన్నది. నేను-నేను-నాకు నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను. ఇప్పుడే, ఇప్పుడే మీయొక్క శక్తిని నాకు పంపండి.
ప్రతిఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
మరలా, "ఓ,ప్రభువా…." ఇది నీకు వాస్తవంగా అనిపించేంతవరకు ఇలాగే పాడండి. చూశారా? ఇప్పుడు, మీ యొక్క కన్నులు మూయండి. బయట ఉన్న దానికి మరియు సమస్త బుద్ధిహీనతకు మీరు హృదయాన్ని మూసుకొనండి. …ఇప్పుడే నేరుగా,
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి.
మరియు ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ఓ, ఇప్పుడు ప్రార్థించండి. దాని కొరకు ఆయనను అడగండి. "ఇప్పుడే శక్తిని." ఓ, మీ యొక్క తప్పిదములను ఒప్పుకొనండి. ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
మరియు ఇప్పుడే ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
113ఇప్పుడు, తండ్రీ, మీరు ప్రతి ఒక్క హృదయమును శుద్ధి చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. మేము మా పాపములను ఒప్పుకొనుచున్నాము. మా తప్పిదములను ఒప్పుకొనుచున్నాము. ప్రభువా, మేమందరము కలిసికట్టుగా తప్పుయైయున్నాము. మేమందరము నేరస్తులుమైయున్నాము. మేము దేవుని మహిమను పొందలేకపోతున్నాము. ఓ దేవా, మా పైన ప్రభువా మీరు కృప కనికరము చూపించరా? మేము అవసరతలోనున్న ప్రజలము.
మరియు ప్రభువు యొక్క రాకడ దర్శనమును మేము చూచుచున్నాము;
ఆ పాత కాలపు కోపపు ద్రాక్షలు నిలువచేయబడిన దానిని ఆయన తొక్కుచున్నాడు;
ఆయన యొక్క భయంకరమైన వాడిగల ఖడ్గము చేత ప్రకాశమానమైన వెలుగును విడిచిపెట్టాడు.
ఆయన యొక్క సత్యము, పరిశుద్ధ గ్రంథము, ముందుకు నడుచుచూ పోవుచున్నది.
అవి సిద్ధాంతంనకు పైగా వెళ్ళుచున్నవి. సంస్థలకు పైగావెళ్ళుచున్నవి. ప్రతి దానికి పైగా వెళ్ళుచున్నది. మీ యొక్క సత్యము ముందుకు కొనసాగుతున్నది.
మీ శక్తిని ఇప్పుడే పంపించండి,
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
మరియు ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి….
నేను దీనిని నమ్ముచున్నాను, ప్రభువా. నేను దీనిని నమ్ముచున్నాను.
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ఓ ప్రభువా, మీ శక్తిని ఇప్పుడే పంపండి,
ప్రతి ఒక్కరికి బాప్తీస్మం ఇవ్వండి.
114సంగీతము మోగుచూ ఉండగా మరియు మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ఇప్పుడు, మీ యొక్క హృదయమంతయు పరిశుభ్రపరచుకొనినచో, సమస్తము మీరు నిజంగా బలిపీఠము మీద పెట్టబడ్డారు. ఇప్పుడు, మీ బలహీనతలకు ఆయన ప్రధాన యాజకుడై యున్నాడు. ఆయన మాత్రమే మీకు సహాయం చేయగలడు. మీరు నమ్మినచో, మీరు మీ పాపములను ఒప్పుకొనినచో, మీ తప్పిదములను మీరు ఒప్పుకొనినచో, మీరు చేసిన సమస్తమును వాయిదాలు వేసే మనస్తత్వమును మీరు ఒప్పుకొనినచో, లేదా దేనినైనను మీరు ఒప్పుకొనినచో, ఇప్పుడు అది బలిపీఠము మీద పెట్టబడినది. ఇప్పుడు మీరు యేసు మీద మీ చేతులను ఉంచండి. మరియు మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. నిన్ను నీవు గుర్తుంచుకో. విశ్వాసం ద్వారా, నీ చేతులను యేసు మీద పెట్టండి. పిమ్మట మీరు దానిని చేసినప్పుడు ఆయన వైపు చూచి ఇలా చెప్పండి. "ప్రభువా, దీనిని నేను పొందుకొని ఉన్నాను. ఇప్పుడే నేను నిన్ను నమ్ముతున్నాను."
నేను చేయగలను, నేను చేస్తాను, నేను విశ్వసిస్తాను;
నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేయుదును…
మీ హృదయమంతటితో దీనిని మీరు నమ్మండి.
నేను చేయగలను, నేను చేస్తాను, నేను విశ్వసిస్తాను
యేసు నన్ను ఇప్పుడే రక్షిస్తాడని.
115ఓ, దీనిని ఇప్పుడు మీరు నమ్ముతున్నారా, మీ యొక్క బలిని బలిపీఠం మీద ఉంచుచు, బలిపీఠం మీద పెట్టొచ్చు? మీ యొక్క తారతమ్యాలు అన్నియు వాటిని ఏమైనప్పటికీ వాటిపైన ఉంచుచు వాటిని మీరు బలిపీఠము మీదపెట్టి ఉన్నారు. ఇప్పుడు, విశ్వాసము ద్వారా, మీ యొక్క చేతులను మీ బలిపైన పెట్టండి, ఆయనకు సమర్పించినది ఆయన అంగీకరించి ఉన్నాడని, నీ హృదయమంతటితో నీవు నమ్మవలసి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేనినైతే అర్పించి దానిని యేసుక్రీస్తు అంగీకరించి ఉన్నాడని నీవు నమ్మినచో, నేను నా జీవితాన్ని నీకు అర్పించెదను. "ప్రభువా, నేను ఇంతవరకు చల్లగా ఉన్నాను. నేను విభేదముగా ఉన్నాను. నేను, చాలా విషయములు చేసియున్నాను. అనగా నేను చేయరానివి చేసి ఉన్నాను. అయితే, ఈ గడియ నుండి, నేను మీకు దగ్గరగా సమీపించాలని అనుకుంటున్నాను. మరియు నేను దానిని పొంది యున్నానని నమ్ముచున్నాను. నేను ఇప్పుడు, నా చేతులను మీ పైన పెట్టుచున్నాను. అనగా నా యొక్క ఒప్పుకోలు ఒప్పుకుంటూ అలా చేస్తున్నాను."
నీవు దానిని నమ్ముతున్నావా? [సమాజము "ఆమెన్" అని చెప్పుచున్నది.] దేవుడు నీ ప్రార్థనను వినియున్నాడని నీవు నమ్ముతున్నావా? "ఆమెన్" నువ్వు అలా నమ్మినచో దేవునికి నీ చేతులెత్తి ఇలా చెప్పు, మీరు నా ప్రక్కన ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేను నా యొక్క ఒప్పుకోలు ఒప్పుకొని ఉన్నాను. "నీవు నాయొక్క ప్రార్థన విన్నావని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను నిలవబడుచున్నాను. దాని కొరకు నేను నిన్ను స్తుతించబోవుచున్నాను. నేను మీకు ధన్యవాదాలు చెల్లించుచున్నాను."
మీరు ఇప్పుడు నిలబడండి, మరియు ఇలా చెప్పండి, "ప్రభువా, మీకు వందనములు. ప్రభువా, మీకు వందనములు. నేను మిమ్మును నమ్ముతున్నాను. నా హృదయములో మీరు నాకు అనుగ్రహించిన నిశ్చయత కోసము మిమ్మల్ని నేను స్తుతించుచున్నాను."
దేవుడు నిన్ను ఏ రీతిగా చేయమని కోరుకుంటుంన్నాడో, ఇప్పుడు ఆ పాతకాలపు పద్దతిలో చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి.