ఖాళీలో నిలుచుట
1నెవిల్ సోదరుడా, వందనములు.
ఇప్పుడు ఒక్క క్షణము పాటు లేచి నిలబడి ప్రార్థనకు తలలువంచుదము. శిరములు వంచి యుండగా, మీకేమైనా ప్రత్యేక ప్రార్థనా విన్నపములున్న యెడల చేతులను పైకిఎత్తి తెలియచేయుడి. మీ అవసరతలు మీ హృదయములలోనే ఉంచుకొని పరమతండ్రిని అడుగుడి, ఆయన దానిని దయ చేయును.
MATT 21:22
2మా పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు నామములో ఇపుడు మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. మాకు అవసరమగు వాటిని ప్రార్థన ద్వారా తెలియజేయుటకు విశ్వాసముతో వచ్చి యున్నాము. మేమడిగిన వాటిని పొందియున్నామనిక మేము విశ్వ సించినయెడల అది మాకు దొరకును. ఆ వాగ్ధానము ఎంతో నిజమైనది. ఎన్నో సంవత్సరముల నుండి దానిని మేము పరీక్షించి చూచితిమి, అది నిజమని ఎరిగియున్నాము. నీకు మేము వందనములు చెల్లించగోరుచున్నాము, మా జీవితమలు కాపాడి, ఇక్కడికి తిరిగి రాగలుగునట్లు చేసినందులకు మొదట వందనములు చెల్లించుచున్నాము. అందరము కలిసి ప్రభుని యొక్క సమాజములో కూడికొనియున్నాము.
సంఘము కొరకును, సంఘకాపరి కొరకును, గొప్ప సత్యము కొరకును మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. అందుకొరకే ఇక్కడ ఇది నిర్మించబడి నిలచియున్నది. దైవ సన్నిధిలో యున్న ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ దినము నీవు మా పట్ల నీ కృప చూపుము, మాకు అవసరమగు అవగాహనను మాకు దయచేయుము. మేము నీకు మరి ఎక్కువగా సేవ చేయకలుగునట్లు చేయుము. గౌరవముతోను, నిజహృదయముతోను నీకు సేవ చేయవలెననునది మా హృదయ వాంఛయైయున్నది. మా జీవితములలో శ్రేష్టమైన దానిని నీవు తీసికొనుము. ప్రతి దినము మేము చేయుచున్న కార్యములు నీకు ఇష్టమగునట్లుగా మా అనుదిన నడకను సరిచేయుము. ఆలాగు నడచునట్లు చేయుము.
LUKE 24:32
3ఈ దినము ఇక్కడి దైవ సన్నిధిలో యున్న రోగులు మరియు అవసరతలో నున్న వారి కొరకు మేము ప్రార్థించుచున్నాము. ప్రపంచములోని ప్రతి పరిశుద్ధాలయ మందును ఉన్న వారి కొరకు ప్రార్థించుచున్నాము. ఆ గొప్ప యెహోవా తన శక్తితో వచ్చి రోగుల నందరినీ, శ్రమపడుచున్న వారినందరినీ బాగుపరచును గాక! నీ గొప్ప నామమునకే మహిమ తెచ్చుకొనుము. ఈ ఉదయ కాలమున ప్రతి హృదయములో యున్న రహస్యమును, ప్రార్థనా విన్నపములను దీవించుము. వారు తమ చేతులను ఎత్తియుండగా అందుకు వారి కారణము ఏమిటో నీవు చూచి హృదయ వాంఛను తీర్చుము. ప్రతి హృదయములోనికిని చూడుము. ఇంకా ముందుకు మేము నిన్ను ఆరాధించబోవుచుండగా నీవు దీవెన దయచేయుము. ఈ ఉదయమున ఈ భవనమును విడిచిపెట్టి మా గృహములకు వెళ్ళుచుండగా మేమును ఆ ఎమ్మాయు గ్రామస్థుల వలె చెప్పుదుము గాక, "ఆయన మార్గములో మనతో మాటలాడుచుండగా మన హృదయములు మనలో మండుచుండలేదా?" యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొన వచ్చును
4ఈ జన సమూహము మధ్యను, ప్రభువు యొక్క సన్నిధిలోను ఈ ఉదయము ఉండుట చాలా మంచిదిగా యున్నదని చెప్పుచున్నాను. నేనిక్కడికి వచ్చి కొన్ని నెలలయినది, గత ఆదివారము నేను రావలెనని ఉద్ధేశించాను గాని అది ప్రభువు చిత్తము కాదని తలంచాను, ఈ లోయ నా ఆరోగ్యమునకు మంచిది కాదు. ఈ లోయలోనికి వచ్చిన వెంటనే గాలి వలన నాకు అనారోగ్యము కలుగును, నా కడుపులో కొంత అలజడి ఏర్పడి జబ్బు చేయును, నాకు చాలా జబ్బు చేసియున్నది. చలి కుదుపు వచ్చి వణకిపోయాను, నేను రాలేకపోయాను, నేను బలవంతముగా నిలబడి రావలెనని ప్రయత్నించాను. ఈ లోయ చాలా నాకు అనారోగ్యము కలిగించును… ఇపుడు, నేను ఆరోగ్యముగా యున్నాను, కాని ఇక్కడ జీవించరాదని చెప్పిరి.
5ఇప్పుడు, ప్రభువు యొక్క పరిచర్యలో గొప్ప సమయమును అనుభవించియన్నామని మీకు చెప్పవలెను. దేశములోని వివిధ ప్రాంతములలో ప్రభుని సేవకు పిలువబడితిమి. ఈ ఉదయకాలమును నాకు బోధించుటకు ప్రత్యేక అంశము ఏమి లేదు. జనులకు ఏదయినా చెప్పమని నెవిల్ సోదరుడు కోరెను, ఆ విధముగా అతడు ఎల్లప్పుడును కోరుచుండును. నెవిల్ సోదరుని మనము ప్రేమించుదుము, మనందరికీ నెవిల్ సోదరుడు తెలియును, (ఆయనను గూర్చి, ఆయన భార్య, పిల్లలు, కుటుంబము గూర్చి తలంచుచుందును) ముందుకు కొనసాగిపోవుటకు దేవుడతనికి బలము దయచేయును గాక! సమయము గతించిపోవుచున్నదని మనమెరుగుదుము. రేపు అను దానికి మనం ఎంతో సమీపముగాయున్నాము, ఇది సాయంకాలపు వెలుగై యున్నది.
మరియు నేను…
ROM 8:35
6మా కుటుంబము పశ్చిమాన యున్నది. మేమందరమును బాగానే యున్నాము, అక్కడుండగా నా బరువు పన్నెండు పౌనులు పెరిగినది, ఇక్కడికి తిరిగి వచ్చిన తరువాత పది పౌండ్లు తగ్గిపోయాను. బిల్లీ పాల్ పద్దెనిమిది పౌనుల బరువు పెరిగెను; రిబ్కా , శారా, జోసెఫ్‌లు బరువును పొందారు. నా భార్య పెరగలేదు లెండి, నేను ఇంత ధైర్యంగా ఈ మాట ఇక్కడ చెప్పకూడదు, ఎందుకనగా కాసేపటికి నేను ఇంటికి వెళ్ళవలెను. చూచారా? అయితే మాకు అద్భుతమగు, అశ్చర్యకరమగు సమయము దొరికినది. చాలా వందనములు చెల్లించుచున్నాము.
మేము…
7తిరిగి వచ్చుట అంతగా బాగుగా లేదనుకొన్నాము, కాని ఒక గొప్ప సంగతి యున్నది… ముఖ్యంగా రెండు ముఖ్యమైన వాటిని పోగొట్టుకొన్నాము, ఆ ఖాళీని ఏదియూ భర్తీ చేయజాలదు. ఇక్కడున్న మా స్నేహితులను, సంఘమును చూడలేకపోయాము, ఎక్కడికి వెళ్ళినా గాని మేము స్నేహితులను ఏర్పరచుకొందుము. మా స్నేహితులను బట్టి మేము వందనములు చెల్లించుచున్నాము, కాని అత్యంత సన్నిహితులగు ఈ స్నేహితులు చాలా ప్రత్యేకమైన వారు. ఈ స్నేహితులకు సాటి ఎవరూలేరు. ఎంత గొప్ప స్నేహితులయినా మాకు దొరకవచ్చును గాని, వీరిని మేము మరువజాలము, అందుకు సాటియగు వారు ఎవరూ లేరు, వారిలో కలిసిపోయి ఒకటై పోయాము. అందరమూ కలిసి పయనించుచూ ప్రభుని రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము, వేరు చేయజాలని బంధము ఏర్పడినది. ఎడబాటును గూర్చి తలంచుచుంటేనే చాలా కఠినముగా యుండును..
8పౌలు వ్రాసెనని నమ్ముచున్న ఒక లేఖనము నా మనస్సులోనికి వచ్చుచున్నది, కొరింథీయులకు చెప్పెను, "ప్రస్తుతము ఉన్నవియైనను, రాబోవునవి గాని, అధికారములు గాని, వస్త్రహీనత గాని, ఆకలిగాని, అపాయము గాని, ఏ జీవిగాని, మరణము లేదా జీవము గాని యేసు క్రీస్తునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపజాలవు." మరణము సహితము మనలను వేరు చేయజాలదు, ఎందుకనగా మనము ఒకటిగా చేయబడి యున్నాము, దేవుని యొక్క వాక్యమందు గొప్ప సహవాసము కలిగి యున్నాము. మరణము కూడా మనలను వేరుచేయజాలదు, యుగ యుగములు, తర తరములు ఆ గొప్ప నిత్యత్వములో మనము ఏకమైయుందుము.
9మనము ప్రతి ఉదయము పిల్లలను చూచుచున్నాము. మనము ఆలయమునకు వెళ్ళుదము, ఎక్కడికయినా వెళ్ళండి, కాని ఈ మూలన ఉన్నచిన్న ఆలయములో ఒక ప్రత్యేకత యున్నది. ఆ చిన్న పాత గంటనాకు వినబడుట లేదు. ఒక ఉదయమున దానిని ఆశిఖరము మీదయుంచిరి, వారింకా ఆ గంట కొరకు తగిన ఏర్పాట్లు చేయలేదు గనుక అది మ్రోగుట లేదు.
ఈ ప్రథమ సంఘమును ఇక్కడ ఎట్టి పరిస్థితిలో నిర్మించానో తెలిసికొనుడి. ముప్పది అయిదు సంవత్సరాల క్రితం ఎనిమిది,పెన్ వీధిలో అందరం కలిసి మోకరించాము, ఇది ఒక బురద నేల. ఆ విషయములోప్రభువై యేసు నన్ను ఎట్లు బలపరచెనో ఎరుగుదును. ఈ దినము ఇక్కడ అది చిన్న వెలుగుగా నిలబడి యున్నది, ఇటుకలు మరియు సున్నము కాదు గాని ఒక వెలుగుగా ఇది ఇక్కడున్నది. నా హృదయాంతరంగములో ఈ వెలుగు నా జ్ఞాపక శక్తి నాలో యున్నంత కాలము నిలచియుండును.
సంఘమనగా భవనము కాదు, దేవునిని ఆరాధించుట కొరకు జనులు కూడి వచ్చుటయే సంఘము. ఈ సంగతులను బట్టి మేము వందనములు చెల్లించుచున్నాము.
10దాదాపు మన సమయము అయిపోయినదని నేను తలంచుచున్నాను, మనకు ఎంతో సమయము మిగిలి యుండలేదు, జరిగిన కొన్ని సంగతులను మీకు క్లుప్తముగా వివరించితిని. నేను ఇక్కడుండగా కొన్ని తయారు చేయగోరితిని, ఎందుకనగా మీ అందరికిని వాగ్ధానము చేశాను. ఈ వేదిక మీద నుండి వెలువడు మొదటి వర్తమానమును చేయుదురు. (టేపు వర్తమానము) ఇక్కడే తయారగుచున్నవి, ఆ బయట కాదు. సహోదరుడు జిమ్, తదితరులు వెళ్ళి కూటములలో అమ్ముచున్నారు. ఇక్కడ మొదటగా వచ్చు వర్తమానమును ఎల్లప్పుడూ చేయుదురు. మీరు గతంలో జరిగిన వానిని చూడండి. చూచారా? అది నా యొక్క వాగ్ధానము, ప్రభువగు దేవుడు మార్చు వరకును ఆలాగే జరుగును.
11వినువారు మనకు ప్రపంచమంతటా యున్నారు, ఇక్కడ నుండి వర్తమానము వెళ్ళి ప్రపంచమును చుట్టి వచ్చుచున్నది. చూచారా? ఈ రికార్డింగులు అరణ్యములు మొదలుకొని అన్ని ప్రాంతములకు వెళ్ళుచున్నవి, అన్యుల యొద్దకు వెళ్ళుచున్నవి, అనేక భాషలలోనికి అనువదింపబడుచున్నవి, కావున ప్రభుని చిత్తమయితే ఇక్కడున్న సమయములో నేను కొన్ని క్రొత్త తయారు చేయుదును. ఈ రాత్రికి సంఘకాపరి యొక్క హృదయములో దేనిని గురించి అయినా బోధించవలెనను మంట యున్నచో అతడే బోధించును, లేని యెడల ఈ రాత్రికి ఒక టేపు తయారు చేయుదును.
12రేపు నేను ఆర్కన్సాస్‌కు వెళ్ళుచున్నాను… లేనిచో మంగళవారము వెళ్ళెదను, మంగళవారం ఉదయము వెళ్ళుదును. క్రైస్తవుల యొక్క అంతర్జాతీయ సహవాసపు చిన్న కన్వెన్షున్ లో సహాయము చేయుదును, ఒక వేళనేను ఆ పేరును తప్పుగా పలికియుందును. దేశీయ క్రైస్తవుల సహోదర సహవాసమది, నాకు నిజంగా దానిని గూర్చి తెలియదు, క్షమించండి. అది వింత కదా? (అయ్యా, మీకు వందనములు) క్రైస్తవుల యొక్క సహాదర సమాఖ్య అది, ఆదివారము నుండి అక్కడ నేను ఉండవలసియున్నాను. కాని ఈ రోజు ఆలయములో ఉండవలెనని కోరాను. ఇక్కడే ఉండిపోయాను, శుక్రవారం వచ్చెదను. (అంతేనండీ?) శుక్రవారము అక్కడ కూటములు ముగియును. ఆదివారము ఉదయమున ఇచ్చట ఉండుటకు శనివారము రాత్రికే వచ్చెదను. ప్రభుని చిత్తమయితే మరో టేపు తయారుచేయుదును, నేను వెళ్ళు ము౦దుగా సమయమును బట్టి కొన్ని టేపులు తయారుచేయుదును.
13లూసియానా లోని బాటన్ రోజ్‌లో జరిగే కూటమునకు నిజంగా వెళ్ళగోరుచున్నాను, ఆ తరువాత వచ్చెదను. ఆ తరువాత ఎట్లయిననూ నేను ఏంకరేజ్‌కు వెళ్ళెదను. చూచారా? ఫెయిర్ బాంక్స్ నుండి ఏంకరేజ్‌కు వెళ్ళి క్రైస్తవ ఫుల్ గోస్పెల్ బిజ్నేస్మెన్ కూటమునకు హాజరవుదును. చూచారా? ఆ తరువాత తిరిగి వచ్చెదను, ప్రభుని చిత్తమయితే జూలై చివరి వారములో షికాగోకు వెళ్ళుదును.
దాదాపు అదే సమయములో నేను నా పిల్లను ఆరిజోనాలోని స్కూలులో చేర్చుటకు త్వరపడి వెళ్ళవలెను, ఎందుకనగా చార్లీ ఎరుగును, ఆగుస్ట్ 15 వరకు ఇచ్చట నేనుందును, ప్రభుని చిత్తమయితే ఆ తరువాత కెంటాకీలోనికి వెళ్ళెదను. అందరూ నవ్వుచున్నారు, బహుశా కొందరు క్రొత్తవారికి దాని భావము తెలియదు, ఈ వేదిక మీద నుండి ఆ మాట చెప్పుట బాగుండదు గాని చెప్పుచున్నాను, ఉడుతల కాలము వచ్చుచున్నది దాని భావమును మీరు ఎరుగుదురు. కొన్ని వారములు సెలవుగా అక్కడ గడుపుదును.
14బిల్లీ నాకు వ్రాసిన చిన్న చీటి ఇచ్చట యున్నది. "డాడీ! ఇద్దరు పిల్లలను ప్రతిష్టించుటకు కుదురునా, అని నెవిల్ సోదరుడు అడుగుచున్నాడు." తప్పకుండా… అది మంచిది. మనకు ప్రతిష్ఠ కార్యక్రమము ఉన్నది. ఇపుడే దానిని మనం జరిగించవచ్చును, ఆ తరువాత నలుబది ఐదు నిమిషములు లేదా కొంత సమయము పాటు జరిగిన సంగతులను గూర్చి క్లుప్తముగా తెలిసికొందము.
ఇపుడు, చాలా మంది జనులు మరియు సంఘములు ఇచ్చటకు చేరిరి, ఇది ఒక తెరువబడిన ఆలయము. ఇది ఎన్నడునూ ఒక శాఖగా యుండదు, ఆలాగుండకుండా దేవుడు సహాయము చేయును గాక! ఎందుకనగా ఈ స్థలములో ప్రేమకు తప్ప శాసనమునకు తావు లేదు, క్రీస్తుకు తప్ప ఆచారమునకు చోటు లేదు, బైబిలుకు తప్ప మరో గ్రంథమునకు చోటులేదు, మనకు సభ్యత్వము లేదు గాని సహవాసమున్నది. ఒకరితో ఒకరికిని, అందరితోను, అన్ని శాఖలతోను మనకు సహవాసమున్నది. అందరినీ ఆహ్వానించుచున్నాము, దేవుని యొక్క వాక్యముతో మనకు సహవాసమున్నది, అందరికీ సాదరముగా ఆహ్వానమందించుచున్నాము. ఒకే ఒక సూత్రము, అదేమనగా అందరము యేసును ప్రేమించవలెను, చదువుకొనిన గుంపు ఇచ్చట లేదు. మనము సామాన్య ప్రజలము, బైబిలు చదువుటకు ప్రయత్నించుచున్నాము. దానికి మన స్వంత అర్థము చెప్పుటకు ప్రయత్నించుట లేదు గాని ఉన్నదానిని ఉన్నట్లుగా చదువుచున్నాము.
15దేవుడు ఈ ప్రపంచమునకు ఒక దినమున బైబిలు ద్వారానే తీర్పు తీర్చునని నేను నమ్ముచున్నాను. ఆయన లోకమునకు తీర్పు తీర్చనైయున్నాడు. అయితే ఒక ప్రమాణమును బట్టి లోకమునకు తీర్పు తీర్చును, ఏమీ చేయవలెనో జనులకు ఎట్లు తెలియును? చూచారా? మీరు దేవుడు అన్యాయస్థుడని అనజాలరు. దేవుడు తనకొక ప్రమాణమును ఉంచుకొని యున్నాడు, దాని ద్వారానే ఆయనజనులకు న్యాయము తీర్చును. రోమను కాథలిక్కు సంఘము ద్వారా ఆయన తీర్పు తీర్చిన యెడల ఆ గ్రీకు చర్చి వారు, ఇంకా అనేకులు (ఆర్తోడక్సు కాథలిక్కు వారు) నశించిపోవుదురు, మిగిలిన లోకమంతయూ నాశనము కావలసియుండును. గ్రీకు ఆర్తోడక్సు కాథలిక్కు చర్చి ద్వారా ఆయనతీర్పు తీర్చిన యెడల, ఆ రోమను కాథలిక్కు చర్చి వారు, ఇంకా ఇతరులందరూ నశించెదరు. లూథరను చర్చి ద్వారా ఆయన తీర్పు తీర్చిన యెడల ప్రెస్బిటేరియనులు నశించెదరు. ప్రెస్బిటేరియను చర్చి ద్వారా ఆయన తీర్పు తీర్చిన యెడల లూథరనులు మరియు బాప్తీస్టులు నశించెదరు. చూచారా? పెంతెకోస్తు ద్వారా ఆయన తీర్పు తీర్చిన యెడల పెంతెకోస్తు కాని వారందరూ నశించెదరు.
ROM 3:6•
HEB 13:8•
REV 22:18,19
16నా అభిప్రాయమేమనగా, ఆయన ఏ సంఘమును బట్టియూ తీర్పు తీర్చడు, ఎందుకనగా ఎన్నో విభేదములు, ఎంతో గందరగోళము ఉన్నది. కాని "ఆయన లోకమునకు యేసు క్రీస్తు ద్వారా తీర్పు తీర్చునని" వ్రాయబడి యున్నది, అది బైబిలులోని లేఖనము, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను," అని బైబిలు చెప్పుచున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు; కావున ఆయన వాక్యమై యున్నాడు. ఇది క్రీస్తు యొక్క ఆక్షర రూపము. కాథలిక్కుల యొక్క అపోకలిప్స గ్రంథములోను; ప్రొటస్టెంటుల యొక్క ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములోను, యేసు ఇట్లు చెప్పెను, "ఈ గ్రంథములో నుండి ఏదయినా తీసివేసినా, లేదా మరేదయినా దీనికి కలిపినా, అట్టి వాని పేరు జీవ గ్రంథములో నుండి కొట్టివేయబడును." దీనిని మనము నమ్ముటకు ఒక కారణమున్నది. ఇక్కడ వ్రాయబడని కార్యములను ఆయన చేయగలడు, అది మన మెరుగుదుము. కాని ఆయన వ్రాసిన సంగతులలో మనము నిలచియున్నంత కాలము మేలు జరుగును.
MARK 10:14•
LUKE 18:16•
JOHN 1:1,14
17ఇప్పుడు, పిల్లలకు ప్రతిష్ఠ కార్యక్రమము, చాలా మంది, మెతడిస్టువారు చిలకరించుదురు, దాదాపు పండ్రెండు సంవత్సరముల వయస్సులో వారికి మొదటి ప్రభురాత్రి భోజనము ఇచ్చెదరు, కాథలిక్కు వారు మరియు లూథరనులు దీనిని చేయుదురు. వారు పుట్టిన నాడే ఆ విధమగు బాప్తీస్మ కార్యక్రమమును నెరవేర్చుదురు. పిల్లలకు చిలకరించెదరు, ఈ చిన్న పిల్లల బాప్తీస్మమును బట్టియే చాలా సంవత్సరముల క్రితం మెతడిస్టు వారితో నుండి నజరీన్ వారు చీలిపోయిరి. బ్రవున్ సోదరుడా, అది నిజమని తలంచుచున్నారు. మెతడిస్టు వారికి, నజరీన్ వారికి చీలిక అక్కడే వచ్చినది, నజరీన్ వారు చిన్న పిల్లల బాప్తీస్మమును అంగీకరించలేదు. కాని ఈ ఆలయములో యున్న మనము, వాక్యముతోనే నిలచి యుండవలెను. పిల్లలను గాని, పెద్దలను గాని చిలకరించినట్లుగా బైబిలులోని ఏ ఒక్క చోట కూడా కనబడదు. పిల్లల గురించి ఉదాహరించినా సందర్భము బైబిలులో ఒకే ఒకటున్నది. పిల్లలనువారు యేసునొద్దకు తీసికొని రాగా ఆయన వారి మీద చేతులుంచి ఆశీర్వదించెననియున్నది. "చిన్న పిల్లలను నా యొద్దకు రానీయకుండా ఆటంకపరచకుడి, ఇటువంటి వారిదే పరలోక రాజ్యము," అని ఆయన చెప్పెను.
MATT 19:13,14
18ఇప్పుడు, మన చేతులు పేద చేతులు, యేసు చేతులతో మన ఎవరి చేతులను పోల్చుకొనలేము, నేనయినా, మరే ఇతర సంఘకాపరి అయినా అంతే! ఆయన ఈ ఉదయమున ఇక్కడ ఉండిన యెడల ఈ తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీస్తునొద్దకే తీసికొని వచ్చెదరు. అయితే మేము ఆయనకు ప్రతినిధులమై యున్నందున పిల్లలను వారు మా యొద్దకు తీసికొని వచ్చిరి, మేము దేవుని ప్రతినిధులము. ఆయన యొక్క గొప్ప వాక్యమును మరియు కార్యమును జ్ఞాపకము చేసికొనుచూ మన చేతులుంచుట ద్వారా ప్రభువుకు వీరిని ప్రతిష్టించుచున్నాము.
ప్రభువుకు తమ పిల్లలను ప్రతిష్టించని తల్లి ఇక్కడ ఉండి యుండవచ్చును, అట్టి వారు ఈ పిల్లలను తీసికొని వచ్చుచున్న తల్లిదండ్రులతో కూడా రావచ్చును, ఆమె కోరికను బట్టి పని చేయుదుము. ఇక్కడికి వారిని తీసికొని వచ్చి దేవునికి వారిని ప్రతిష్టించుదుము, వారి కొరకు ప్రార్థించుదుము. ఆయనకు బదులుగా మేము చేతులుంచి యున్నామని ఆయనతో చెప్పెదము, వాక్యములో యున్న దానినే నేను మీతో చెప్పుచున్నాను. మీరు ఏదో ఒక గుంపు యొక్క పుస్తకము తీసి దానిని చూపించవచ్చును, కాని నేను వాక్యము చెప్పిన దానినే పలుకుచున్నాను. మీరు గమనించారా? మీకు నేను దానిని చాలా ఖచ్చితంగా చెప్పి యున్నానని తలంచుచున్నాను.
19పియానిస్టు ఇక్కడికి రావలెనని కోరుచున్నాను. (నీవే నా పియానిస్టు సోదరునివి?) నా స్వంత సంఘములోని పియానిస్టు ఎవరో నాకు తెలియకుండుట చాలా వింతగా యున్నది గదా? (నేను దాదాపు తలుపు కొట్టిన వాని వలెయున్నాను) మంచిది. వారు ఈ చిన్న పాట పాడుదురు లేదా వాయించుదురు:
వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,
చిన్న వారిని యేసు నొద్దకు తెండి.
జనులు దీనిని పాడుచుండగా మనము లేచి నిలబడుదము. తమ చిన్న వారిని తీసికొని వచ్చు తల్లిదండ్రులు రండి. ఇపుడు నిలబడండి. మంచిది:
వారిని లోనిక తీసికొని రండి, లోనికి తెండి.
చిన్నవారిని యేసునొద్దకు తెండి.
20ఇప్పుడు పాస్టర్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న సహచరుడు నిద్రించుచున్నాడు మరియు ఒక్కోసారి వారు "ఆమెన్" అని చిన్నగా అందురు, మనము వారు పిల్లలు అని మనము అర్ధం చేసుకుంటాము. అయ్యా, మీ పేరు ఏమిటి? విలియం హెన్రీ. మరి మీ చిన్న బిడ్డ? టిన మరియా విన్సెంట్. తన తండ్రి బుజముపై పడుకున్న ఎంతటి ప్రియమైన చిన్నది. నేను ఆమెను ఎత్తుకోవచ్చా? క్రిస్టినా, నేను మీ తండ్రితో నేను ప్రత్యామ్నాయంగా ఉండలేను. మనమ౦దరము ఇప్పుడు - మీరు మీ చేతులు ఈ బిడ్డపై ఉంచెదరా. మనము మన తలలు వంచెదము.
మా పరలోకపు తండ్రి, మేము ఈ రోజు మా విశ్వాసము దాటి మీ సింహాసనము దగ్గరకు వచ్చుచున్నాము. మహోన్నతుని సన్నిధికి చంద్రుని దాటి, నక్షత్రములు, మరియు సౌర వ్యవస్థను దాటి మమ్ములను పైకి ఎత్తుము. మేము ఈ ప్రియమైన బిడ్డను తెస్తున్నాము, మా చేతుల్లో మేము ఏమి కలిగియున్నమో మేము ఎరుగము, రాబోవు దినములలో మీకు గొప్ప దాసురాలు కావచ్చు. మేము ఆలాగు నమ్ముచున్నాము, కానీ ఈ బిడ్డ యొక్క తండ్రి ఈ చిన్నదానిని ఇక్కడకు తీసుకువచ్చెను. ఎందుకనగా మేము ఆమెపై చేతులు౦చి మేము మీ దాసురాలిగా మీరు వచ్చువరకు మీ స్థానములో పనిచేయుటకు ఒప్పుకోనుచున్నాము. అప్పుడు, మీరు అన్ని సంగతులు తీసుకొనుము, అప్పటివరకు ప్రభువా మేము మిమ్ము పరిచర్య చేయుటకు నమ్మకముతో మరియు సత్యవంతముగా మరియు చిన్న బాలికపై మా చేతులు౦చి మేము ప్రభువైన యేసుక్రీస్తు నామమున దీవిస్తున్నాము. నమ్ముచున్నాము, మీరు దీర్ఘాయువును దయచేయుదురని, ఒకవేళ యేసు రాకడ ఆలస్యమైతే మీకు గొప్ప సేవకురాలుగా ఉండును గాక. ఈమె పెంచబడు గృహమును దీవించండి, ఈమె జీవితములో అన్ని దినములోను సేవ చేయుచు దేవుని యొక్క హితబోధలో పెంచబడును గాక. తల్లితండ్రులని దీవించండి, వారు జీవించి వారి కుమార్తెను ప్రభువుకు ఒక ఘనమైన పాత్రగా వారు ఈ దినపు కార్యమును బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున. ఆమెన్.
దేవుడు మిమ్ములను దీవించును గాక.
దేవుడు మిమ్ములను దీవించును గాక, అయ్యా. ఆమె పేరు… [ఒక సహోదరి సహోదరుడు బ్రన్హంతో మాట్లాడుచున్నది.] ఈ సహోదరి టాబేట్ తెరెసా. నాకు తెలియదు, నేను ఈ తెరెసాను పట్టుకోగలనో లేదో తెలియదు. నేను అలా అనుకోవుట లేదు. ఆమెకు కొంచెము ఎక్కువగానే తెలుసు.
మంచిది, మనము మన తలలను వంచుదము.
మా పరలోకపు తండ్రి, మేము మా చేతులను ఈ చిన్న సహోదరిని సమర్పణ చేయుటకు ఉ౦చి ఉన్నాము, తల్లి తండ్రులు ఈ చిన్నదానిని సమర్పణ చేయగోరుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ బిడ్డపై ఉండును గాక, మరియు మీకు సేవచేయుట కొరకు దీర్గాయువును దయచేయండి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున. ఆమెన్.
దేవుడు మిమ్ములను దీవించును గాక, మిమ్ములను అందరిని దీవించును. మీరు గొప్ప అదృష్ట తల్లితండ్రులు, ఈ ఉదయాన ఈ ఇద్దరు ప్రియమైన చిన్నవారిని కలిగియుండుటకు.
21ఈయన పేరు? [తండ్రి చెప్పుచున్నాడు, "జో విలియం కార్ట్ రైట్"] జో విలియం కార్ట్ రైట్. ఈ ఉదయాన విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకున్నాను. మంచిది. ఇప్పుడు, మీరు అందరూ.. మీరు కావాల౦టే ఈయనను పట్టుకోండి - ఒక వేళ, మేడం, అది మంచిది. జోసెఫ్, ఇక్కడకు పైకిరా, మరియు మీరు కోరితే మీరు పట్టుకోవచ్చును.
మా పరలోకపు తండ్రి, ఈ చిన్న జోసెఫ్ విలియం కార్ట్ రైట్ను మీ దగ్గరకు తెస్తున్నాము. ఈ ఉదయాన తండ్రి నిలుచొని ఉన్నాడు, నీకు జీవితకాల సేవ కొరకు ఇచ్చుటకు మరి నీవు ఇచ్చిన దానిని తిరిగ ఇచ్చుచున్నాడు. దేవుడు ఈ చిన్నవాడిని ధీర్ఘాయువుతో, ఆరోగ్యముగా, బలముగా, మరియు నీ కొరకు గొప్ప సేవకుడుగా దీవి౦చును గాక. ఈయన తల్లి తండ్రిని మరియు పెరగబోయే ఇంటిని దీవించండి. ప్రతి సమయములోను క్రీస్తు కనపడని అతిధిగా ఉండును గాక. మరియు ఈ చిన్న బాలుడిని మీకు జీవితకాలపు సేవకొరకు ఇస్తున్నాము, యేసుక్రీస్తు నామమున. ఆమెన్.
మిమ్ము దివించును గాక. స్టీవ్ కార్ట్ రైట్.
22చిన్ని బాలిక. [సహోదరి చెప్పుచున్నది, "అవునండి, అయ్యా."] మేడం [పాం లేవేస్కి] సిల్వయ షిప్పి.
మా పరలోకపు తండ్రి, బలిపీటము దగ్గర నిలబడి, ఈ చిన్న బాలికను తమ ప్రియమైన వారు ఇక్కడకు ఈ ఉదయాన తెచ్చి ఉండగా, మా చేతులు పెట్టుచున్నాము. యేసుక్రీస్తు యొక్క శిలలతో గాయపరచబడిన చేతులు ఈ బాలికపై పెట్టినట్లైతే, అలా౦టి దీవెనలు ఈ చిన్నదానిపై ఉండును గాక. ఈమెను ఇప్పుడు దీవించండి, మరియు దీర్ఘాయువుతో జీవించుచు, సంతోషముగా, నీకు సేవకురాలుగా ఉండును గాక. ఈమె యొక్క ఇంటిని, తల్లితండ్రులని, మరియు ప్రియులను దీవించండి. బైబిల్ ప్రకారముగా యేసుక్రీస్తు నామమున ఈ కార్యమును చేయుచున్నాము. ఆమెన్.
దివి౦చుచూ…?… దివించును గాక…?…
23ఆమె ఒక గాయకురాలు కాబోతుంది. పేరు ఏమిటి? [సహోదరుడు చెప్పాడు, "రాయ్ మాయెర్"] రాయ్ అల్లెన్ మాయెర్. నేను చెప్పాను ఈయన గాయకుడు కాబోతున్నాడు.
అది నాకు గుర్తుచేస్తుంది. సంఘములో అది తప్పుగా ఉండబోదు అని నేను అనుకుంటున్నాను, కానీ నేను ఒక రోజు ఒక ఇండియన్తో మాట్లాడుచున్నాను. చిన్న పిల్లవాడు అక్కడ నిలబడియున్నాడు, నేను అన్నాను, "చక్కనివాడు ఆయన, మరియు ఆయన చక్కనివాడు."
మరియు ఆ యొక్క చీఫ్ కొద్ది నిమిషములు నన్ను గమనించి. తరువాత ఆయన కిందకు చూచి అనెను, "కానీ, ఆయన, ఒక ఆమె."
నేను అనుకుంటున్నాను, అది ఇంకా అలాగే ఉంది అనుకుంటున్నాను.
బాబు యొక్క పేరు ఎమిటి… [సహోదరుడు చెప్పాడు, "రాయ్ అల్లెన్."] రాయ్ అల్లెన్. అల్లెన్ మీ చివరి పేరా? ["మాయెర్"] మాయెర్. ["రాయ్ అల్లెన్ మాయెర్"] రాయ్ అల్లెన్ మాయెర్. ఈయన అందమైన చిన్నవాడు.
మా పరలోకపు తండ్రి, మేము ఈ చిన్న బిడ్డపై మా చేతులు పెట్టియుండగా, మరియు బైబిల్లో వారు చిన్న పిల్లలను మీ దగ్గరకు తీసుకోనివచ్చారు, మరియ మీరు మీ చేతులు వారిపై పెట్టి దీవించారు. అదే కార్యమును మీరు ఈ భూమిపై ఉన్నప్పుడు చేసిన కార్యమును మీ యొక్క సంస్మరణలో మేము చేయుచున్నాము. తల్లి తండ్రులను మరియు బిడ్డను దీవి౦చండి, వీరి గృహము నిత్యమూ ప్రార్ధనా మరియు సమాధానము గృహముగా ఉండునట్లు దీవించండి. అన్ని దినములలోను ఈ చిన్న బిడ్డ మీ యొక్క సేవకురాలిగా దీర్ఘాయువుతో సంతోషముగా ఉండునట్లు దీవించండి. మరియు ఎప్పుడూ కుడా ఈ కుటుంబము చక్రము విరిగి పోకుండా ఉండును గాక. ఆ మహిమలో, ఎల్లప్పుడు జీవించుచు ప్రతి కుటుంబ సభ్యులు ఆ దినమున దేవుని యొక్క గొప్ప సింహాసనము దగ్గర సమకూర్చబడును గాక. అప్పటి వరకు, ప్రభువా మీ యొక్క నిత్యపు దీవెనలు ఈ బిడ్డపై ఉండును గాక, యేసు నామములో దీవిస్తున్నాము…ఆమెన్..?..
ఈ చిన్న… అది ఆమె చిన్న సహోదరి, రిబ్కా.
పరలోకపు తండ్రి మేము ఈ చిన్న రిబ్కాపై మా చేతులు ఉంచి ప్రభువగు యేసు నామమున దీవిస్తున్నాము, నీటి యొద్దకు వెళ్ళు విధముగా, నేను నమ్ముచున్నాను, ప్రభువా, ఆ రోజు వచ్చును; ప్రభువైన యేసు నామమున ఆమె పాపములకు ప్రాయశ్చిత్తము కొరకు ఆ నీటి యొద్దకు బాప్తిస్మము కొరకై నడుచుకుంటూ వచ్చును అని నమ్ముచున్నాము. దయచేయుము తండ్రి, ఇప్పుడు ఆమె యొక్క సహోదరితో ఆమెను దీవి౦చండి. దీర్ఘాయువుతో జివించుచు, సంతోషముగా, నిన్ను సేవించును గాక. ఆమెన్.
ఆమెను దీవించండి. దేవుడు మిమ్ములను దీవించును గాక.
24ఇది అమ్మాయి? [తల్లి చెప్పుచున్నది, ఇది జాక్లిన్ గ్రేనట్."] చిన్ని జాక్లిన్ గ్రేనట్, మరొక చక్కని, చిన్ని బిడ్డ.
మా పరలోకపు తండ్రి, మేము ఈ చిన్న బిడ్డపై మా చేతులు పెట్టుచున్నాము, గొప్పనైన ప్రభువగు యేసు చేతులు చిన్నవారిపై పెట్టి దీవించిన విధముగా ఆయన సంస్మరణలో చేయుచున్నాము. మీ స్వంత చేతులు పెట్టిన విధముగా, ఈ దినము మీ దీవెనలు వచ్చును గాక. ఒకవేళ మీరు ఈ భూమిపై బౌతిక శరీరముతో ఉ౦డినట్లైతే, ఈ తల్లి మీ దగ్గరకు తీసుకువచ్చు విధముగా. కానీ మేము మీ ప్రతినిధులుగా, మా యొద్దకు వచ్చియున్నది, తండ్రి. మరియు మేము దీవించినవారిని, మీరును ఈ బిడ్డను దీవిస్తారు అని అడుగుచున్నాము. మీ యొక్క సేవలో దీర్ఘాయువుతో, సంతోషమైన జీవితముతో జీవించును గాక, యేసుక్రీస్తు నామములో పెంచబడు ఇంటిని దీవించండి, స్ధిరమైన ప్రార్ధనా గృహముగా ఉండును గాక, యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
25ఈయనను దీవించండి. మీరు ఇద్దరినీ కలిగి ఉన్నారా? [సహోదరి చెప్తు౦ది, "నేను ఇద్దరు అమ్మాయిలను కలిగి ఉన్నాను. మరోకరు కూడా వచ్చారు, సహోదరుడా." ] మంచిది. ఇప్పుడు, ఈ చిన్న బాబు…["జేమ్స్ డేవిడ్"] జేమ్స్ డేవిడ్. ["హూమ్స్"] హూమ్స్. నేను నిన్ను ఎరుగుదును అని అనుకుంటున్నాను, సహోదరి హూమ్స్. మీరు మరియు మీ బర్త మిషనరి, మీ బర్త మీతో ఉన్నాడా, ఈ ఉదయకాలమున? ప్రభువు సహోదరుడు హూమ్స్ ను దీవించును గాక. చెప్పాలంటే మీకు చక్కని మంచి చిన్న పిల్లలు ఉన్నారు. ఇది డేవిడ్ ఆ? మరి ఇది… ["జేమ్స్ డేవిడ్, మరియు జోసెఫ్…?… ఫ్లోరిడా..?…"] నేను ఇప్పుడే ఫ్లోరిడా నుండి సహోదరితో ఈ ఉదయ కాలమున చదివేటప్పుడు మాట్లాడుచున్నాను. ఈ చిన్న బాబు, ఎప్పుడైతే… వారు ఫ్లోరిడా నుండి వచ్చారు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో, చిన్న బాలుడు, కుర్రవాడు, చిన్నవాడు వెనకాల వెళ్ళాడు, మరియు చూస్తున్నాడు. యేసును చూసాను అని పేర్కొన్నాడు.
ఇప్పుడు, ఇది చిన్న డేవిడ్ హూమ్స్, యేసుక్రీస్తు సేవలో మేము ఆయనపైన చేతులు ఉంచి సమర్పిస్తున్నాము. ఈయన ఇంటిపై దీవెనలు కొనసాగించండి.
[టేపుపై ఖాలి]
26ముప్పై ఏళ్ళ క్రితం ఉటికా పైక్స్ కళాశాల ద్వారము యొద్ద నిలుచొని ఉండగా నేను ఎప్పుడైనా ఈ చిన్న బాలుడిని ఎరిగియున్నానా, ఒకరినొకరు సిగ్గుపడుతూ చూసుకుంటున్నారు, అదే రోజు నేను ఈయన మనమడిపై చేతులు ఉంచి ప్రభువగు దేవుడికి సమర్పించాను. ప్రభువా ఈ చిన్న జాన్ను మీ యొక్క సేవుకుడిగా స్వీకరించండి. తల్లి మరియు తండ్రి గొప్పగా వారి సంరక్షణకై ఇవ్వబడిన బహుమానమును తిరిగి దేవునికి తీసుకొని రాగా, దేవుని యందు నిశ్చయముతో వారు బలముతోను, ఆరోగ్యము శక్తితోను జీవించును గాక. ఇప్పుడు ఈ చిన్న బాబుని యేసుక్రీస్తు నామమున జీవితకాలపు సేవకై ఇస్తున్నాము. దీర్ఘాయువుతో, నీ సేవకై జీవించును గాక.
ఈ చిన్న బిడ్డ సమర్పించబడినదా? ఈమె పేరు ఏమిటి? క్యారోల్. అలాగుననే చిన్న క్యారోల్ పై మా చేతులు ఉంచి, యేసుక్రీస్తు సేవకై సమర్పిస్తున్నాము. దేవుడు ఈమెను దివించును గాక, దీర్ఘాయువుతో సంతోషముగా జీవి౦చును గాక. ఈమె జీవితములోని అన్ని దినములు నీ యొక్క సేవకురాలై యుండును గాక. దయచేయుము ప్రభువా. ఆమె ఇంటిని దీవించండి, ఆ ఇల్లు ఎల్లప్పుడూ ప్రార్ధనా మరియు విశ్వాసముతో కూడిన స్థలమై యుండును గాక. ఈ బలిపీటంపై నిలుచుని యున్న తల్లి మరియు తండ్రి హృదయములలో నేను ఈ చిన్న బిడ్డను నీకు ఈ ఉదయాన మేము యేసుక్రీస్తు నామమున, మీకు సమర్పిస్తున్నాము. ఆమెన్.
27ఒక చిన్న బాలుడు. మా పరలోకపు తండ్రి, ఈ ముగ్గురు చిన్నవాళ్ళ తండ్రి మీరు ఈయనకు ఇచ్చిన చివరి ఐశ్వర్యమును పిల్లవాని రూపములో మీరు ఇచ్చిన వీరిని, ఆయన చేతుల్లో పట్టుకొనియున్నాడు. ఈయన, ఈ తండ్రి యొక్క కలగా మారును గాక. బైబిల్ లోని యాకోబువలే జ్ఞానముతో ఈ మనుష్యుడు ఉండును గాక, దయచేయుము దేవా. ప్రభువా, మీరు ఈయనకు ధీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితము, ప్రసాదించుడి, ఒకవేళ రేపు అనేది ఉంటె దేవుని వాక్య ప్రకారము ఈయన ప్రవర్తి౦చునట్లు చేయండి. ఈ భూమిపై ఉన్నపుడు ప్రభువైన యేసు సంస్మరణలో ఆయన చేసిన విధముగా దయచేయండి ప్రభువా. నేను నా చేతులు ఈ చిన్న జేమ్స్ రూల్ పై ఉంచి, దేవుని సేవకోరకై సమర్పిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
ప్రభువైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు ఈ గ్యారీ జీన్ ఆడమ్స్ తలపై మా చేతులు ఉంచగా, మేము ఈ చిన్న యవ్వన ప్రాణమును మీకు సమర్పిస్తున్నాము. ఈయన ఇంటిని మరియు తల్లి తండ్రిని దీవించండి. ఈయనకు ధీర్ఘాయువుతో సంతోషముగా దేవుని సేవలో జీవించును గాక, యేసుక్రీస్తు నాముమలో ఆమెన్.
28దీనిని చేయవలెనని ఇప్పుడే నేను తలంచాను. ఇప్పుడు సరిగ్గా పదకొండు గంటలయినది. పిల్లలను తీసికొని తల్లిదండ్రులు వచ్చుచుండుటను నేనూహించాను. ఒక ఉదయాన యోసేపు మరియలు ప్రభువైన యేసును ప్రతిష్టంచుటకు మందిరములోనికి తీసికొని వచ్చిరి.
కిడ్ సోదరుడా, ఈ ఉదయమున కార్యాలయములో నేను కొందరిని కలిసికొన్నాను. నీ వయస్సులో అంత చలాకీగా ఉన్నవారిని నేను చూడలేదు. ఈ ఉదయమున, నీ ఉద్రేకం చూచాను. ప్రభువు నిన్ను ఎట్లు స్వస్థపరచెనో నీవు జనులకు చెప్పియున్నావు. ఒక ఉదయమున, నేను దాదాపు నా కారు అరిగిపోయేటంతగా పయనించి నిన్ను చూడ్డానికి వచ్చాను. ఈయన ఒక పెద్ద దైవజనుడు.
29కాస్త ఆలోచించండి! నేను పుట్టక ముందు నుండే ఆయన (ఆయన భార్య) సువార్త ప్రకటించుచుండిరి. కెంటాకీలోను, టెన్సీసీలోను యున్న కొండలలో, లోయలలో వారు సువార్త ప్రకటించుచుండిరి. అక్కడ బొగ్గు గని కార్మికులుండిరి. ఆహారము దొరకని చోట జీవించారు. ఆయన భార్య బట్టలు ఉతుకుచూ దినమునకు ఇరవై లేదా ముప్పది సెంట్లు సంపాదించెడిది. తన భర్తను సువార్త బోధించుటకు ఆలాగు పంపెడిది. దీని వలన మనకు ఎంతో ఉత్సాహ కలుగును కదా?
అతడు రోగియై పడియుండగా, వైద్యులు వచ్చి అతడు చనిపోవునని చెప్పిరి, వారు గొప్ప వైద్యులు, "కాన్సరు వచ్చెను, కొన్ని గంటలు మాత్రమే అతడు జీవించుననిరి. మహా అయితే ఒకటి లేదా రెండు దినములు బ్రదుక వచ్చుననిరి." ఇది జరిగి రెండు లేదా మూడేండ్ల అయినది, మూడు సంవత్సరాల క్రితం జరిగినది. ఈ ఉదయమున అతడు ఆరోగ్యంగా ఉండి దేవుని మహిమపరచుచున్నాడు. నీవు స్వస్థత పొందినప్పుడు, నీకెన్ని సంవత్సరములు కిడ్ సోదరుడా? ఇప్పుడతడు ఎంత వయస్సులో యున్నాడు? దేవుడతనిని స్వస్థపరచినప్పుడు అతని వయస్సు ఎనుబది సంవత్సరములు. దేవుడు మనముసలి వారిపట్ల శ్రద్ధ చూపునా? నిశ్చయంగా ఆయన చూపును. అవునండీ!
30వంద సంవత్సరముల వయస్సులో యుండిన అబ్రహామును దేవుడు స్వస్థపరచెను; అపుడు శారాకు తొంబది సంవత్సరములు. వారప్పుడు ఇశ్మాయేలును కనిరి, కాదు. క్షమించండి. ఇస్సాకును కనిరి. అవును గదా? దీనిని బట్టి మనమెంతో సంతోషించుచున్నాము.
మీరు చాలా చక్కగా యున్నారు, ఈలాగున ఈ ఉదయమంతా మీతో మాట్లాడగలను. కాని ప్రశస్త వాక్య భాగమును కొంత చదువుదము, తరువాత కూటములోనికి వెళ్ళెదము. దేవుని చిత్తమయినచో జరిగిన సంగతులను క్లుప్తముగా చెప్పెదను. ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రి ఒక అంశము మీద మాట్లాడుదును. బయటకు పంపించు ఉద్దేశముతోనే ముఖ్యంగా చేయుదుము, మీరు వచ్చి వినినట్లయితే మంచిది. వచ్చి వినండి. సంఘ కాపరి తన వర్తమానమును ముగించిన తరువాత ఈ టేపు చేయుదును. ఆయన రాకడ యొక్క మెరయుచున్న ఎర్ర దీపములు అను అంశము మీద బోధించెదను, ఒక దీపము ఇప్పుడు మన మీద పడుచున్నది. ఈ రాత్రి దాని మీదనే మాట్లాడుదును. ఆయన రాకడ యొక్క ఎర్రని దీపములు. ఇప్పుడాయన ఇచ్చటనే యున్నాడు, ఆ సూచన కనబడుచున్నది. బండి పట్టాల మీద కనబడుచున్నది.
31సంఖ్యాకాండము16వ అధ్యాయము, మీరు తీసి చదువుడి. ఇది నిత్యమగు వాక్యము గనుక మర్యాదగా చదువుదము. రెండు వచనములు చదువగోరుచున్నాను, సంఖ్యా కాండము 16వ అధ్యాయము 3 మరియు 4వ వచనములు, నేను చెప్పగోరుదానికి చిన్న నేపధ్యము వివరించగోరుదును.
ఇంకా టేపులు సిద్దపరచబడని యెడల, ఇపుడు సిద్ధము చేయవచ్చునని కోరుచున్నాను. ఈ భాగమును బయటకు పంపునట్లుగా తీయవలెనని కోరుచున్నాను, ఈ భాగమును మీరు చేయగలరా? మిగిలిన భాగము నుండి దీనిని వేరుచేయవలెను. చూడండి. ఇది క్రొత్త విషయము. ఇప్పుడు, మీరు మీకెట్లు వీలగునో ఆ ప్రకారము దీనిని ఆపు చేయుడి, నేను కొద్ది క్షణములు ఆగి ప్రారంభించినచో మీకు ఎక్కడ నుండి ఆరంభమాయెనో తెలియును అనుకొనుచున్నాను? లేక మీకు మరో పద్ధతి ఏదయినా ఉన్నదా? సరే. ప్రారంభించండి. మంచిది.
NUM 16:3,4•
PS 19:14
32సంఖ్యా కాండము 16:3 మరియు 4:
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు: యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారు?
అనగా మోషే ఆ మాట విని, సాగిలపడెను:
మా పరలోకపు తండ్రీ, ఈ కొద్ది మాటలను ఆశీర్వదించుము, మా హృదయ ధ్యానము మరియు మా నోటి ఫలము నీకు అంగీకారములగునట్లు చేయుము. మేము యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.
ఈ ఉదయకాలమున నేను చెప్పగోరు అంశము ఇది: ఖాళీలో నిలచుట.
EXOD 30:10•
NUM 16:3,4
33ఈ వాక్య భాగమును మనము చదువుకొనియున్నాము. మనందరికీ ఇది తెలియును, దాతాను మరియు కోరహులు, దేవుడు మోషే కిచ్చిన ఆజ్ఞ విషయములో తూలనాడిరి. మీరే పరిశుద్ధులు కారు గాని, మేమందరమూ పరిశుద్ధులమే అనిరి. మీకేమి మేము తీసిపోలేదనిరి, దేవుడు ఆ జనులను వాగ్ధాన దేశమునకు నడిపించమని మోషేకు ఆజ్ఞాపించెను. అందుకు వారు దీనిని పలికిరి, మీరు మరీ గొప్ప చెప్పుకొనుచూ, మీ వంటివారు ఇక లేరని చెప్పుకొనుచున్నారేల? అనడిగిరి.
ఇది దేవునిని ఎంతగానో బాధించెను. మోషేతో దేవుడు ఇట్లనెను, "నీవు వారి మధ్య నుండి ప్రత్యేకించుకొనుము. నేను మొత్తం ఈ గుంపును చంపి క్రొత్త తరమును లేపి, నీతో నడిపించుదును." అపుడు మోషే దేవుని సన్నిధిలో సాగిలపడెను. దేవుడతనిని ప్రక్కకు తోయలేదు. చూచారా?
34నేడునూ అంతే, దేవుడు జనులను వేరు చేయగోరుచున్నాడు… మన పాపములను దేవుడు చూచి సహించని కాలము వచ్చినది. (మనము నిరంతరమూ పొరపాట్లు చేయుచున్నాము).. మోషే వలె ఈనాడు జనుల తరుపున ఎవరు నిలబడగలరు? దేవునిచే అంగీకరింపబడిన మోషే వంటి మనుష్యుని మనము ఈ దినమున ఎచ్చట కనుగొనగలము? ఎవరు ఆ విధంగా నిలబడగలరు? మోషే, ఈ భూమి మీద జీవించుచున్న జీవితము దేవునికి ఎంతో ఇష్టమాయెను. దేవుని ఉగ్రతకు అతని ప్రాణము అడ్డు పడెను, దేవుడు మోషేను దాటివెళ్ళలేకపోయెను. ఇది నాకు ఎప్పుడూ ఆశ్చర్యముగానే మిగిలియున్నది. ఒకనాడు ఈ లేఖనము గూర్చి ఆలోచించుచుండగా, ఒక ప్రత్యక్షత దొరికినది. చూడండి. మోషే అన్ని కార్యములలోను దేవుని ప్రతినిధిగా యున్నాడు. అతడు యేసుక్రీస్తుకు మాదిరిగా యున్నాడు.
35సర్వ ప్రపంచములోని మానవులను, దేవుడు నాశనము చేయగోరెను. అందరినీ ఆయన చంపగోరెను, అయితే క్రీస్తు పాపులందరి కొరకు అడ్డుపడి చనిపోయెను. (చనిపోవ తెగించెను)… క్రీస్తును దాటి దేవుడు వెళ్ళలేకపోయెను. ఆయన స్వంత కుమారుడు, యేసు, తన్ను తాను స్వేచ్ఛగా సమర్పించుకొనెను. ఆయన వెలను చెల్లించెను, మోషే దానిని చేయలేకపోయెను, మోషేలో మానవ రక్తము తప్ప మరియొకటి లేదు, మన వంటి వాడే. అది చాలదు. యేసు దేవుని రక్తమైయుండెను, అది దేవుని యొక్క సృజనాత్మక రక్తము, దేవుడు మొత్తం మానవ జాతి పాపమును క్షమించెను. ఎందుకనగా అది అంతయూ ఆయన మీద వేయబడెను, ఆయన కల్వరి యొద్దకు వెళ్ళి దైవ సముఖమునకు వెలుపట చనిపోయెను, శ్రమ పొందెను. ఆయన పాపముగా మారి, పాతాళములో పడవేయబడెను. మన పాపములు ఆయన మీద వేసికొనెను, ఆయనే మన భారమును మోసెను. కల్వరి యొద్దకు మన పాపములను మోసికొనిపోయెను, కల్వరి యొద్ద నుండి పాతాళమునకు మోసికొనిపోయెను. కాని దేవుడాయనను మూడవ దినమున లేపి, మన పాపములకు పరిహారముగా చేసెను.
2COR 5:20•
1TIM 2:5
36ఈ రోజున దేవునికిని, మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, మనము ఉచితముగా క్షమింపబడియున్నాము మరియు శుద్ధి పొందియున్నాము. అసలు మనము పాపము చేయలేని వారిమిగా దేవునికి కనబడితిమి. మన పాపములను మరపు అను సాగరములో ఆయన పడవేసి మరెన్నడూ జ్ఞాపకము చేసికొనలేదు. దానిని మనంతట మనము చేయజాలము, మనము అంతము గలవారము. ఆయన అనంతుడు. మనము ఇంకా జ్ఞాపకముంచుకొనగలము, ఎందుకనగా మనము అంత పెద్దవారము కాము; కాని ఆయన మహోన్నతుడు, ఆయన మన పాపమును మరచిపోయి తిరిగి జ్ఞాపకము చేసికొనడు. మనము ఆయన సన్నిధిలో కుమారులమును, కుమార్తెలమును అయి యున్నాము, ఆయనకున్నవన్నియూ మనవే. ఆయన నా పాపమాయెను, నేను ఆయన నీతియగునట్లుగా ఆయన నా పాపమాయెను. ఆయన నీ పాపముగా అయ్యెను, నీవాయన నీతిగా కాగలవు. నీవు క్రీస్తుయేసు నందు క్షమాపణ పొందినంత కాలము నీ పాపమును దేవుడు అసలు చూడనే చూడలేడు.
37కొంతకాలం క్రిందట ఒకరిట్లనిరి, "అటువంటి దానిని నేను నమ్మిన యెడల నాలో మంట అసలు పుట్టదు, నేనీ పట్టణమునకు ఎర్ర రంగు పూయుదును. నేను ప్రతి డాన్సు హాలుకు వెళ్ళుదును. నేను బహుగా త్రాగుదును, అన్ని క్రియలలో పాలు పొందుదును…"
"ఎందువలన?"
"నీవు క్రీస్తులో ఎప్పుడో క్షేమంగా యున్నావు. ఇక ఏమి చేసినా పరవా లేదు, అనెను"
నేనిట్లన్నాను, "నీవు అసలది పొందలేదని దీనివలన తెలియుచున్నది." దేవుని ప్రేమ, నీ హృదయమును తాకిన యెడల, యేసు క్రీస్తును నీవు ప్రేమించుచున్నయెడల నీవు లోకము విషయములోను, పాపము విషయములోను చనిపోయెదవు. పరిశుద్ధాత్మను నీవు కలిగి యున్నట్లుగా తెలిసికొందువు. కేకలు వేసినందున కాదు, గోల చేసినందున కాదు, భాషలతో మాట్లాడినందున కాదు లేక మరేదో చేసినందు వలనకాదు. పాపము విషయములో నీవు చనిపోయినప్పుడే యేసుక్రీస్తులో జీవించెదవు. ఓ! దేవుని ప్రేమ ఎంతో గొప్పది! ఎంతో పవిత్రమైనది! చూచారా?
38కెంటాకీలోని లూయిస్ విల్‌లో కొంత కాలం క్రిందట ఒక సేవకుడు ఒక యువతితో మాట్లాడుచుండెను. ఆమె చాలా కాలము పాటు పెండ్లి చేసికొనక పోయెను. దాదాపుగా ఇరవై అయిదు లేక ముప్పది సంవత్సరములుండును. ఆమె చాలా చక్కని క్రైస్తవ యువతి. లూయిస్ విల్‌లో ఒక వ్యక్తి యుండెను, అతడు మంచి జీవితమును జీవించలేదు, డాన్సులను, నేర గృహములను అతడు నడిపియుండెను. అయితే ఒకనాడు అతడు మారుమనస్సు పొందెను, అతడు నిజమగు క్రైస్తవుడాయెను, చాలా గట్టి క్రైస్తవుడు. అయితే, ఒక సంవత్సరం తరువాత ఇతడు ఈ యువతి ప్రేమలో పడెను. ఆ యువతి అతనిని చాలా పిచ్చిగా ప్రేమించెను. వారు పెండ్లి చేసికొనిరి.
39వారు రెండు సంవత్సరములు కలిసి జీవించిన తరువాత, ఒకనాడు ఆ యువతి తన భర్తతో ఇట్లన్నదట, "ఏమండీ! మీరు క్రొత్త క్రైస్తవులు కాబట్టి చాలా కష్టముగా యున్నది కదా?" "నేను చిన్నప్పటి నుండియూ క్రైస్తవురాలనే." "మీరయితే నూతన క్రైస్తవులు. ఈ శోధనలను జయించుట చాలా కష్టము, ఎందుకనగా చాలా కాలము పాపమును రుచి చూచారు కదా?"
"అవును ఇది నాకు పోరాటముగా యున్నది," అన్నాడు
ఆమె అప్పుడిట్లన్నది, "ఒక సంగతి మీరు గుర్తుంచుకొనవలెనని కోరుచున్నాను, ఎక్కడయినా శత్రువు మిమ్మును ఎదిరించినప్పుడు, మీరు పడిపోయి తిరిగి పాపములో ప్రవేశించెదరు; అయినా గాని ఇల్లు విడిచి పోవద్దు. మీరు ఇంటికి రండి, ఇంటి యొద్ద మీకు మీరు పెండ్లి చేసికొనిన అదే భార్యను కనుగొందురు. మీరు తిరిగి లేచుటకు నేను ప్రార్థించెదను. బాగుగా ప్రార్థన చేసి, తిరిగి దేవుని యొద్దకు తీసికొని వచ్చెదను. మీరు ఇల్లు విడిచి దూరంగా పోవద్దు. చూడండి. మీరేమై యున్నారో దానిని మూలము చేసికొని మిమ్మును నేను పెండ్లి చేసికోలేదు గాని, మిమ్మును ప్రేమించినందునే పెండ్లి చేసికొన్నాను. మీరేమి చేసినా పరవాలేదు, ఇంకా మిమ్మును ప్రేమించుచునే యుందును, ఎందుకనగా నేను మిమ్మును ప్రేమించినందునే పెండ్లి చేసికొంటిని."
40ఒక రోజున అతడు మామూలుగా పనికి వెళ్ళెను. తన భార్య చెప్పిన మాటలే అతని చెవులలో గింగురు మనుచుండెను, "అటువంటి భార్యను కాదని ఎవరు పాపము చేయగలరు"? అతడేమి చేసినా గాని లెక్క చేయక, అతనిని ప్రేమించే భార్యను ఎట్లు అతడు మరువగలడు? అతడేమి చేసినా గాని, తిరిగి ప్రేమతో చేర్చుకొను ఆమెకు ఎవరు సాటి అవుదురు? ఇప్పుడు, దానిని కొన్ని బిలియను రెట్లు గుణించి చూడండి, అంతకన్నా దేవుని ప్రేమ గొప్పదై యున్నది.
యేసుక్రీస్తుతో ప్రేమలో పడిన వ్యక్తి లోక సంగతులను దృష్టించడు. ఆయన నీ కొరకు ఏమిచేసెనో దానిని లేఖనపు వెలుగులో చూడుము. ఉద్రేకపు వెలుగులో చూచుట కాదు, వాస్తవపు వెలుగులో చూడవలెను. అదేమిటో నీవు చూచినపుడు, నీకు క్రొత్త జన్మలభించును. నీలో ఒకటి జరుగును, పాపము కటిక చీకటంత మరణకరమైనది. ఆ వెలుగు నీలో యున్నంత కాలము చీకటి ఎట్లు ప్రకాశించగలదు? అది ప్రకాశించజాలదు. మానవునికి దేవుడు చేసినది అదే, మధ్యలో ఆయన నిలబడెను, వాగ్ధానమును ఇచ్చెను. మోషే ఇందుకు మాదిరి, ఆ కారణము చేతనే మోషే జనుల కొరకు ఖాళీలో నిలబడెను.
41ఈ దినము, నాకు ఆశ్చర్యము కలుగుచున్నది, పట్టుదల లేదు, సోమరితనమున్నది, మెత్తబడిపోయిన, లవొదికయ కాలములో మనము జీవించుచున్నాము. మనందరికిని తెలియును, సంఘ కాలములను చూచాము. మనము ఆఖరి సంఘ కాలములో జీవించుచున్నాము, ఇది లవొదికయ సంఘ కాలము. సోమరితనము, విచ్చలవిడి తనము, సుఖాసక్తి, సరసోక్తులు, దురాశలు చోటుచేసుకొనిన కాలములో మనము జీవించుచున్నాము. పాపపు యుగము. దేవుడు ఇంకా ఈలాగు చెప్పనందుకు ఆశ్చర్యపడుచున్నాను, "వెనక్కు వెళ్ళు, సంఘమా, అడ్డము లే! మొత్తం గుంపును నాశనము చేయుదునని," ఆయన అనుట లేదు. చూచారా? ఇటువంటి కాలములో మనము జీవించుచున్నాము. ఈ దినములలోనే ఒక దినమున ఆయన ఆలాగు కూడా చేయును, అది వచ్చుచున్నదని మనకు తెలియును. దీనికి అడ్డముగా ఏదియూ రాదు, ఎందుకనగా తప్పించుకొనగోరు వారి కొరకు ఎప్పుడో ఆయన చనిపోయెను. క్రీస్తును స్వీకరించి క్రైస్తవులయిన వారికని ఆయన స్వీకరించును. వారు ఉగ్రత నుండి తప్పించుకొందురు, కాని అప్పుడాయన మరేమీ చేయజాలడు. మోషే కాలములో దానిని దేవుడు చేయలేకపోయెను. మరో మార్గము లేదు.
42ప్రకటన గ్రంథములో, మనము లవొదికయ సంఘ కాలమును చూచెదము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఈ కాలమును గూర్చి బైబిలు చెప్పబడినది. లవొదికయ కాలము గ్రుడ్డిదని చెప్పబడెను, "నీవు ధనవంతుడవనియు, ధనవృద్ధి చేసికొనియున్నావనియు చెప్పుకొనుచున్నావు గాని, నీవు గ్రుడ్డి వాడవే." (గొప్ప ఆలయములు, చక్కని దుస్తులు ధరించిన ప్రజలు, ఏ కాలములోనూ లేని గొప్పవి నేడున్నవి) "నాకేదీ అవసరము లేదని చెప్పుకొనుచున్నావు గాని, నీవు గ్రుడ్డివాడవును, దరిద్రుడవును, దిక్కుమాలిన వాడవును, దౌర్భాగ్యుడవును, దిగంబరివియు అయి యున్నావని ఎరుగవు."
ఒక మనిషి ఈ స్థితిలో యుండినయెడల అతనెవరై యుండునో మీరు చెప్పగలరు. అతడు మానసికంగా సరైన స్థితిలో యున్న యెడల వస్త్రము ధరించుకొనును, కాని అతడు మానసికంగా సరైన స్థితిలో లేడు; అతనికి ఎవరునూ, ఏమీ చెప్పలేరు. తాను దిగంబరిగా యున్నానన్న సంగతిని ఎరుగడు, తాను అటువంటి వికృత రూపములో యున్నానని గ్రహించడు, అతడు గ్రుడ్డివాడు. ఈ యుగ సంబంధమగు దేవత వారి నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను, అందుకే వారు క్రీస్తును నిరాకరించుచున్నారు. వారెంతో గ్రుడ్డివారు. నేడు మనము జీవించుచున్న ఘడియ యొక్క సూచనను ఎరుగకున్నారు, నేడు మనము జీవించుచున్న కాలమును చూడలేకున్నారు. గుర్తుంచుకొనండి, ఒకాయన ఎప్పుడో ఆ ఖాళీలో నిలబడెను, మరెవరూ నిలబడ లేరు. దానిని నీవు అంగీకరించవలెను. అదే నిన్ను ఉగ్రత నుండి విడిపించును.
REV 3:17
43నేను చెప్పగోరు దానిని చెప్పుటకు సమీపముగా వచ్చి యున్నాను. మనము నిలబడగలమా…? (దీనిని నా కొరకే బోధించుకొనుచున్నాను) ఒక కొండ శిఖరము మీద నుండి క్రిందికి పడిపోవుచున్న గ్రుడ్డి వానిని చూచి మనము ఊరుకుండలేము. అతడు శారీరకంగా గ్రుడ్డివాడు గనుక హెచ్చరించుదుము. ఈ ఉదయము మనమానసిక పరిస్థితి ఎట్లున్నదో చూచుకొందము, ఒక గ్రుడ్డివాడు కొండ శిఖరము పైనుండి పడిపోవుటకు దగ్గరగా నడిచి వచ్చుట చూచి మనము హెచ్చరించకుండా ఉండగలమా? హెచ్చరించని యెడల చాలా క్రూరులమనిపించుకొందుము. మన హృదయము ఎట్టిదో అర్థమైపోవును. కొండ శిఖరము పైన నడచి పోవుచున్న గ్రుడ్డివాడు అగాధములో పడుటకు సిద్ధమైనప్పుడు చూస్తు కూడా హెచ్చరించక నవ్వుచున్న వాడెంత క్రూరుడో మనము గ్రహించగలము. (అతడు చూడలేడు, తన్ను తాను రక్షించుకొన లేడు) అట్టి వానికి సహాయము చేయక పోవుట, చెడ్డ విషయము.
44నా సోదరులారా, ప్రపంచమంతా చూడండి, ఈ మాట నేను చెప్పదలంచాను. దీనిని దీనముగా చెప్పుచున్నాను, నేను అదే చేయబోవుచున్నాను, నేను దానినే చేస్తూ యున్నాను. సంవత్సరాల తరబడి బోధించుచున్నాను, నేను ముసలివాడనై పోయాను, బోధించి అలసిపోయాను. గొప్ప పోరాటములను రుచి చూచాను, నాకు గాయపు మచ్చలేర్పడినవి, పోరాటము వలన నా అంతరంగము కోతకోయబడినది. కాని ఇది ప్రభువు నాకప్పగించిన బాధ్యత, పిల్లలను ముద్దు పెట్టుకొనుట కొరకు కాదు. యువకులకు పెండ్లి చేయుట కొరకు కాదు, ముసలి వారిని సమాధి చేయుట కొరకు కాదు, యుద్ధ రంగములో అగ్ర శ్రేణిని నిలబడి రెండంచుల ఖడ్గమును పట్టుకొనుట కొరకు వచ్చాను. అన్యుల ఆచారములను, దయ్యములను, అంధకార శక్తులను ఎదిరించుచున్నాను. దేవుని వాక్యముతో, వాటితో యుద్ధము చేయుచున్నాను. శత్రువు ఓడిపోవుట చూచు వరకు విశ్రమించను. చాలా సార్లు నాకు లోతయిన గాయములయినవి.
45ఈ దినపు వర్తమానముతో నేను వచ్చుచున్నాను, నేను చెప్పవలసి యున్న సంగతులను సంఘమునకు చెప్పాను. పరిశుద్ధాత్మ ఈ పనికి నన్ను పిలచిన అనేక సంవత్సరముల క్రితమే దీనిని ఊహించాను. దేవుడు తన నామములో నన్ను చెప్పమన్న దానిని నేను చెప్పాను, అది ఆలాగే ఖచ్చితంగా నెరవేరినది. అది జరుగక తప్పిపోయెనని ఈ భూమి మీద జీవించుచున్న ఏ వ్యక్తియూ చెప్పజాలడు.
మొదట ఆయన నన్ను ఎట్లు పంపెనో ఎరుగుదురు, మొదటి వరము, రెండవ వరము మీరెరుగుదురు. చెప్పిన సంగతులు, జరిగిన కార్యములు ప్రపంచమంతటా మారుమ్రోగుచున్నవి. అక్షరాలా మిలియనుల మంది క్రీస్తు నొద్దకు వచ్చిరి, వేలకొలది మందిగా బోధకులు దైవావేశమును పొందిరి. ఉజ్జీవము ప్రారంభమై ఈనాడు సర్వ భూమి మీదికి అది విస్తరించుచున్నది, నా వర్తమానమును చేర్చుకొనిన వారిలో పెంతెకోస్తు వారు ఒకరు, వారే నిలద్రొక్కు కొనిరి. పెంతెకోస్తు సంఘములోనే ఎక్కువగా రక్షింపబడిరి, చిన్న పెంతెకోస్తు గుంపులు ఆ సంఘము వారినందరినీ మించియున్నవి. అది గణాంక శాస్త్రము. ఎందువలన? వారు సత్యమును చేర్చుకొనినందున ఒక ఉజ్జీవమును పొందియున్నారు.
46రోగులు బాగవుట అనునది గొప్ప సమయముగా ఎంచబడుచున్నది, దయ్యములు పారిపోవుచున్నవి, మృతులు లేచుచున్నారు, అందుకు మనమంతా సాక్షులము. చాలామంది వైద్యులు, భూమి మీద చాలా గొప్పవారు అందుకు సాక్షులు. ప్రభువైన యేసు మనమధ్య ప్రత్యక్షమగుచున్నాడు, ఆ సూచనలో మీరు చూడండి, ఆ గోడ మీద లేదా మరోచోట అది వ్రాయబడి యున్నది, ప్రభుని దూతయే వ్రాసెను. శాస్త్రజ్ఞులు దానికి అవునని చెప్పిరి. అది అందరూ ఎరిగిన సత్యము, ప్రపంచమంతటా తెలిసినది, ఆయన చేసిన కార్యములను చూచిరి, ప్రతిసారి అవి నెరవేరినవి. మోషే దినములలో ఆ అగ్ని స్తంభము ఇశ్రాయేలీయులతో అరణ్యమందు పయనించినది. ఆ మోషేను "యెహోవా యొక్క దాసుడు," అని పిలచిరి. రాత్రి యందు అగ్ని స్తంభము, పగటి యందు మేఘము వారిని వెంబడించెను.
47ఆ దేవుడను నేనేయని, యేసు, ఈ భూమి మీద ఉండగా పలికెను. "అబ్రహాము కంటె నేనే ముందున్నానని," ఆయన చెప్పెను. ఆ ఉన్నవాడననువాడే అగ్ని స్తంభముగా మండుచున్న పొదలో ఉండి గతించిన దినములలో మోషేతో మాట్లాడెను. వైల్ సోదరుడా, అది సరి అని నేను తలంచుచున్నాను. నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని. దేవుని యొద్దకే ఎక్కిపోవుచున్నానని ఆయన చెప్పెను. ఆయన సిలువ వేయబడి మృతి నొంది పునరుత్థానుడై పైకి ఆరోహణుడాయెను. నిత్యుడగు దేవుని యొక్క మహా బలిపీఠము మీద ఆయన శరీరముంచబడి యున్నది. అక్కడ అది నిత్యమూ ఉండి మన స్థానములో పని చేయుచున్నది. ఆయన మన పాప రుణమును చెల్లించెనని తెలిసికొనవలెను. గొప్ప అగ్నిస్తంభము రూపములో ఆయన తిరిగి భూమి మీదికి వచ్చెను.
GEN 1:1•
JOHN 8:42,58•
ACTS 9:5,11
48పరిశుద్ధ పౌలు, దారిన పోవుచుండెను… అతడు పరిశుద్ధ పౌలుగా పిలువబడక ముందు, తార్సువాడగు సౌలుగా పిలువబడెను. అతడు దమస్కునకు పోవు దారిలో యుండెను, చాలా గోల చేయుచున్న కొందరిని అతడు బంధించుటకు వెళ్ళుచున్నాడు; వారు బోధించుచున్న సువార్త ఆనాటి సంఘ ఆచారములకు వేరుగా నున్నది. వారు కేకలు వేయుచున్నారు, ఒక దినమున అతడు ఇటువంటి వేళలో మార్గములో వెళ్ళుచుండగా, గొప్ప వెలుగును తాకి పడిపోయెను. ఇది గొప్ప వెలుగు… యూదుడగు అతడు ఇశ్రాయేలీయులను అగ్ని స్తంభమే నడిపించినదని ఎరుగును, అదే మరల అతనికి ప్రత్యక్షమాయెను. అతడు "ప్రభువా" అని పిలచెను.
ఇప్పుడు, కింగ్ జేమ్సు అనువాదములో గాని, స్టాండర్డు అనువాదములో గాని మీరు చూడండి, "ప్రభువా" అను మాట పెద్దక్షరములలో యున్నది, బైబిలును బాగుగా ఎరిగిన వారికిది తెలియును. పెద్ద అక్షరములలో ప్రభువు అని యున్నచో, అది ఎలోహిం; అనగా సర్వ సంభూతుడగు దేవుడు. ఆయనే భూమ్యాకాశములను సజించెను. ఆది కాండము 1:1 ప్రభువు! పౌలు ఏదో దృష్టి భ్రమలో లేడు. తనకు తెలియని వానిని "ప్రభువా" అని పిలువడు, ఎందుకనగా అతడు వాక్యములో శిక్షణ పొందిన వాడు. ఆనాటి గొప్ప బోధకుడగు గమలియేలు పాదముల యొద్ద కూర్చొని నేర్చుకొనెను, అతడు యెహోవా అని సంతప్తిపడని యెడల ప్రభువా అని పిలచి యుండెడి వాడు కాడు. "ప్రభువా, నీవెవరవు?" అని ప్రశ్నించెను.
ACTS 9:5•
HEB 13:8
49ఆ స్వరము ఎట్లు తిరిగి జవాబు ఇచ్చెనో చూడండి, "నేను యేసును, నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను."
ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాక ప్రపంచములోని చాలామంది దీనిని వినుచున్నారు. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడనునది అన్ని రకముల కార్యములు ధవీకరించబడినది, అవే కార్యములు జరిగి యున్నవి: రోగులు బాగయిరి, హృదయ రహస్యములు తెలిసినవి, జరుగబోవు సంగతుల గూర్చి చెప్పబడెను; ఇన్ని సంవత్సరములలో ఏ ఒక్కసారి తప్పిపోలేదు. నాకిప్పుడు ఏబదినాలుగు సంవత్సరములు, దాదాపు పద్దెనిమిది నెలల పసి బాల్యము నుండి నేను దర్శనములు చూచుచున్నాను, ఒక్కసారియు తప్పిపోలేదు… అయితే ప్రతిసారి సత్యమని రుజువాయెను. ఇప్పుడు, అది దేవుని వలననే వచ్చెను. "దీనిని ప్రజలు ఎందుకు చూడలేకపోవుచున్నారో నాకు అర్థమగుట లేదు?"
50స్త్రీలు జుట్టు కత్తిరించుకొనరాదని నిరంతరము చెప్పుచున్నాను, మరియు ఆ విషయములో బోధకులు నా మీద విరుచుకు పడుచున్నారు; అసహ్యమగు బట్టలు ధరించుచున్నారు, పొట్టి దుస్తులు వేసికొనుచున్నారు, ఆ చెడు మార్గములో పయనించుచున్నారు; అలాగే మగవారు ధూమపానమును చేయుచున్నారు, స్నేహపు విందులలో సారయి త్రాగుచున్నారు; అయినా మేము క్రైస్తవులమేనని చెప్పుకొనుచున్నారు. బల్ల యొద్ద ప్రభురాత్రి భోజనము తినుచున్నారు, ఎందుకనగా వారు ఒక సంస్థకు చెందియున్నారు. దేవదూషణ చేసితినని వారు నన్ను అందురు. స్త్రీలు ఏమయినా బాగయిరా? ఇంకా దిగజారి పోవుచున్నారు, దేశమంతా ఆలాగే యున్నది.
నాకు ఒత్తిడి ఎక్కువగుచున్నది… (నేనిది నెమ్మదిగా చెప్పుచున్నాను, ఒకవేళ నేను నరముల ఒత్తిడిగల వ్యక్తినై యుండవచ్చు) ఈ పనికి నేను తగనని ముందు నాకు తెలియలేదు, చాలా మంది ఆలాగే ఫిర్యాదు చేసిరి. అయినా ఈ పని చేయవలసి వచ్చెను. ఇది చాలా కష్టము. నేనిట్లు తలంచాను, "దేవా, నన్ను ఎందుకు పిలచావు? మరొకరిని పిలువ వచ్చును గదా! నన్ను క్షమించుము, నేను తప్పి పోయాను. జనులు నా మాట వినుట లేదు. నేను చేయవలసిన దానిని చేయలేకపోయాను. ఎక్కడో ఓడిపోయాను. వారు నా మాట వినరు."
51ఈ మధ్యనే నా తల్లి మహిమలో ప్రవేశించినది, (సంవత్సరము దాటినది)… ఆమె తండ్రి ఒక వేటగాడు… నాకు అతని స్వభావమే వచ్చినదనుకొంటాను. నాకు అడవులంటే ఇష్టము, "ఈ జనులు క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు గాని, నేను బోధించుచున్న వర్తమానమును వినరు. వారిని ఆలాగే ఉండనీయుడి, నేను మొత్తం ఆపుచేసి కొండల లోనికి పోయెదను…" ఇక్కడున్న చాలామందికి తెలియును, కాలమును గూర్చి నేనూహించిన సంగతి మీరెరుగుదురు, అది జరుటకు ఆరు నెలల ముందే చెప్పాను, (ఈ వేదిక మీద నుండే నేను చెప్పాను); ఒక చోట నేనుందును. దుప్పిని పోలిన ఒక జంతువుండును, దానికి పదునైన కొమ్ములుండును, అవి నలుబది రెండంగుళముల పొడవుండును. ఏడడుగుల వెండి మొన కలిగిన ఎలుగుబంటి వంటిది యుండునని చెప్పాను. అది మీ దగ్గర టేపుపై యున్నది, మీ అందరికి ఆ సమయము గుర్తున్నది. అది నా గదిలో యున్నది, అది సత్యమును చూపించుచున్నది.
52నా తల్లి వెడలిపోవుటకు ముందుగా ఇటువంటివి ఎన్నో జరిగియున్నవి. ఆ గొప్ప హఠాత్తు పరిణామమునకు నన్ను సిద్ధపరచెను, నన్ను ఆయన నెమ్మది పరచగోరెను. ఆమెను ఆయన తీసికొనునని తెలియును.
ఒక క్రైస్తవునిని నేను కలిసికొన్నాను… అలాస్కా దిగువన గల గొప్ప దేశమునకు చెందిన వాడతడు. ఈ స్థలమును విడిచిపెట్టి నేను పశ్చిమానికి వెళ్ళునప్పుడు, నా భార్యను అక్కడికి తీసికొని వెళ్ళుదుననుకొన్నాను, నేను మార్గదర్శిగా యుందును. ప్రభువు నన్ను చేయమనిన పనిని చేయుదును. నా జుట్టును పెరగనిచ్చెదను. నా మీసములను పెంచెదను, నేను తిరిగి వెళ్ళి మార్గదర్శిగా యుందును. ఆ దేశములో దాదాపు ఇద్దరు లేక ముగ్గురు ఇండియనులు మాత్రమే యున్నారు. ప్రభువు నన్ను ఏదయినా చేయమని కోరినచో ఆలాగే చేయుదును, "మంచిది ప్రభువా," అని చెప్పుదును. ఆయన నాకు దర్శనము ఇచ్చును. ఆ విధంగా నేను నడిపించబడుదును.
53నా యంతట నేను ఎన్నడూ చెప్పుకొనలేదు… భావించనూ లేదు. కాని జనులే నా యొద్దకు వచ్చి, "బ్రన్హం సోదరుడా, ప్రభువు నిన్ను తన ప్రవక్తగా పిలచుకొనెను అనిరి." మంచిది, నన్ను నేను, ఎన్నడూ ఆ విధముగా పరిగణించుకొనలేదు, కాని ఆ పనిని చేయు సమయము దాదాపు వచ్చినదని నేను తలంచి సిద్ధపడితిని: "మంచిది, ఒక వేళ అయితే అవవచ్చును. ఆలాగయితే నేను తిరిగి అరణ్యము లోనికి వెళ్ళుదును. అరణ్యములో నేను జీవించునప్పుడు ప్రవక్తగా యుందును." చూచారా? "ఆయన నన్ను ఎక్కడికి పంపితే అక్కడికే వెళ్ళుదును. ఆయన నన్ను వాడుకొనని యెడల నేను వెళ్ళిపోయి నిశ్చయంగా కొన్ని చక్కని చేపలను వేటాడుదును, మరికొన్ని కార్యములు చేయుదును." అది బహుశా స్వార్థపూరిత వైఖరి కావచ్చును. (చూచారా?) ఎందుకనగా ఆలాగును నేను చేయగోరాను. ఆలాగు అసలు చేయరాదు, కాని నా మనస్సులో ఆలాగు చేయగోరాను.
మరియు ఇప్పుడు, ఏడు సంఘ కాలముల గూర్చి బోధించక ముందు జరిగినది చూడండి. ఆ సమయములో ఇక్కడుండిన వారు చాలా మందియుండిరి. ప్రభువు ఎట్లు ఆశీర్వదించెనో ఎరుగుదురు, ఆ వెనుక గోడ మీద అది ప్రతిబింబించెను, ఆ దినమున ఆయన వచ్చుటను చూచితిని, వారు ఇక్కడ ఎందరున్నారు?
54సహోదరుడు జాక్సన్ గూర్చి నాకు ఒక సంగతి జ్ఞాపకమున్నది, సాధారణంగా మనతోనే యుండేవాడు. సహోదరుడు జూనియర్ జాక్సన్, ఒక మెతడిస్టు బోధకునిగా యుండెను. అవును, ఇపుడతడు ఇక్కడే కూర్చొని యుండెను. ఒక కలను నా యొద్దకు తీసికొని వచ్చెను, అదే రకమగు కలతో మరి కొందరు సోదరులును వచ్చిరి. ప్రభువు నా పట్ల ఎంతో మేలు చూపెను… (ఈ దినము దానిని మీ యెదుట రికార్డు చేయుచున్నాము). ఎన్నడయినా ఒక కలకు తప్పు భావమును చెప్పానా? లేదండీ! నేను దానిని చూచు వరకు అసలు ఏమీ మాట్లాడను. దానిని గూర్చి ఆయన చెప్పును, ఆ తరువాతనే మీతో చెప్పెదను. అతని సంఘములోని కూటమునకు నేను వెళ్ళవలసియున్నాను. ఆ రాత్రి నాకు చాలా అందోళనగా యున్నది, అతడు సంఘములో నుండి పరుగిడి వచ్చి మరో దారిన నన్ను కారులో కలిసికొనెను, జనులు దాటిపోవు చుండిరి. "నాకేదో చెప్పగోరుచున్నట్లుగా," తెలియజేసెను.
55తాను ఒక కల కనినట్లుగా చెప్పెను, ఇండియానా వంటి ప్రదేశములో అతడుండెను, ఒక పెద్ద కొండ యున్నది, దాని నిండా గడ్డి యున్నది. దాని మీద గల మట్టినంతటినీ నీరు కడిగి వేసినది, అది బండవలె యున్నది. ఆ కొండ బోడిగా యున్నట్లున్నది, ఆ బండ మీద ఒక వింత వ్రాత యుండెను. నేను సోదరులందరితో కలిసి అక్కడ నిలబడి యుంటిని, అది ఈ సంఘమే ఆ వ్రాతకు భావము చెప్పుచున్నాను. ఆ కలను ఏదో రీతిగా నేను అర్థము చేసికొన్నాను. నేను గునపము వంటిది పట్టుకొని యున్నాను. దానితో ఆ కొండ పైభాగమును పొడిచి పైకి లేపాను, దాని లోపట తెల్లని రాయి యున్నది, అది ఒక గ్రైనైట్ రాయి వలె యున్నది. ఆ తెల్ల రాయి మీద ఏ వ్రాతయూ లేదు. "ఇక్కడే నిలబడి యుండి దీనిని చూడుడని," నేను సోదరులతో చెప్పాను, వారందరూ చూచుచుండగానే, నేను వారి మధ్యలో నుండి జారుకొన్నాను, పశ్చిమ దిశగా పయనించసాగాను. నేను ఒక కొండను దాటి మరొక కొండమీదికి, దానిని దాటుకొని మరోదాని మీదికి వెళ్ళిపోతూ చిన్నగా కనబడసాగినట్లు సహోదరుడు జాక్సన్ చెప్పెను. మీకది జ్ఞాపకముండును.
REV 10:7
56అది జరుగక ముందే దాని యొక్క భావమును ఈ సంఘమునకు తెలియజేశాను… సంపూర్ణ ప్రత్యక్షతా కాలము ఇదేనని నేను నమ్ముచున్నాను. లూథర్, వెస్లీ, జాన్‌స్మిత్, అలెగ్జాండరు కేంప్ బెల్, ఇంకా తదితరులు బైబిలును తీసికొని బోధించిరి. ఏడవ దూత వర్తమానము ఉండునని మనము బైబిలులో చూచాము. ఏడవ దూత వర్తమానము అందించు సమయములో దేవుని యొక్క వర్తమానములన్నియూ తెలియచేయబడును. అపుడు ఏడు మర్మయుక్తమగు ఉరుములు వచ్చును.
అంత్యకాలములో మనము జీవించుచున్నాము. నీతీకరణను, శుద్ధీకరణను, పరిశుద్ధాత్మ బాప్తీస్మమును, అద్భుతములను, సూచక క్రియలను మనము దాటి వచ్చి యున్నాము. వరములు తిరిగి సంఘములోనికి వచ్చి యున్నవి దైవిక స్వస్థత, ప్రవచనము, భాషలతో మాట్లాడుట, దానికర్థము చెప్పుట ఇవన్నియూ చూచాము. దానికి తప్పుగా అర్థము చెప్పిన వారున్నారు, అయినా గాని దాని నెవరూ కాదనలేరు… మంచిది ఒకటున్నది. నిజమైనది ఒకటున్నది (అదే అసలయినది), భాషలలో మాట్లాడు వరము ఎల్లపుడూ సంఘములో ఉండవలసియున్నది.
MATT 7:20
57మనకు ఎన్నో అనుకరణలు వచ్చియున్నవి. క్రైస్తవులవలె నటించువారు మనకు చాలా మంది యున్నారు, వారి జీవితములు పోల్చి చూడండి, కావున ఎక్కడో ఏదో పొరపాటున్నది. "వారి ఫలముల వలన వారిని తెలిసికొందురని," యేసు చెప్పెను. చూచారా? ఒక క్రైస్తవుడు తన జీవితమును బట్టి తెలియబడును, కావున నీ జీవితము కంటె నీవు పైకి దూకుటకు ప్రయత్నించవద్దు. నిజమగు విశ్వాసులను సత్యమునకు దూరముగా ఉంచుటకు అపవాది దిష్టి బొమ్మను నిజమగు దాని వలె అపవాది చూపించుచున్నది. అయితే వేరుగా నుండుటకు మరియు తప్పు, ఒప్పులను వివేచించు ఆత్మను దేవుడు మనకు దయచేయును గాక! వాక్యము ఎల్లపుడూ సరిదిద్దును.
ఇప్పుడు, ఆ బండ మీది వ్రాత యొక్క భావమును నేను తెలిపియున్నాను. ఆ సోదరుని కలలో కనబడిన బండ క్రీస్తే. అది బైబిలు. ఇన్ని సంవత్సరములును బైబిలునకు అర్థము చెప్పుట జరిగినది, దానికి దైవ సంబంధమగు భావమును మనము ఇయ్యవలెను. లవొదికయ సంఘమునకు చివరి బహుమానము ఇయ్యబడినది, ఏడవ దూత లవొదికయ సంఘ కాలమునకు వర్తమానము అందించుటకు. ఆ సమయమున, అనేకమగు తప్పు సంగతులు సరిచేయబడును, యుగము లన్నిటనూ వాటికి తప్పు భావము చెప్పుట జరిగినది.
58లూథర్ నీతీకరణమును బోధించెను, అయితే అతడు ఎక్కువ కాలము జీవించనందున అది పెడదారి పట్టినది. ఆ తరువాత వారు దానిని సంస్థగా మార్చిరి. లూధరు ఎన్నడూ దానిని సంస్థగా మార్చలేదు. లూధర్ తరువాతనే జరిగినది. ఆ తరువాత వెస్లీ వచ్చెను. వెస్లీ తరువాత వెస్లీయగు సంఘము ఆవిర్భవించినది. దాని తరువాత జాన్ స్మిత్ వచ్చెను, అదే బాప్టిస్టు; ఆ తరువాత అలెగ్జాండరు కేంప్ బెల్ వచ్చెను, కాని వీటినన్నిటిని కలిపి సమకూర్చుటకు అతని జీవిత కాలము చాల లేదు. (వారు సంస్కరణ కర్తలు) చాలా చివరలు విడిచిపెట్టబడినవి. ఉదాహరణకు, జాన్ స్మిత్ నీటి బాప్తీస్మమును తిరిగి తీసికొని వచ్చెను. ముంచుట ద్వారా నీటి బాప్తీస్మమును తీసికొని వచ్చెను, కాని బిరుదులనే ఉపయోగించెను. అటువంటి చాలా సంగతులు ఇంకా ఆలాగే నిలచి యుండినవి. మనము చివరకు వచ్చియున్నాము, చివరి వర్తమానము దానినంతటినీ చక్కదిద్దవలసియున్నది. ఒకే విశ్వాసము, ఒకే ప్రభువు, ఒకే బాప్తీస్మము నొద్దకు వీటన్నింటినీ తీసికొని వచ్చును. చూచారా?
59మరియు ఇప్పుడు, బైబిలు సంపూర్తిగా అనువదించబడిన తరువాత మీరు ఇపుడు గమనించండి, పిరమిడ్ రాయివంటి దానిపై కప్పును అది తెరచి యున్నది. (పిరమిడ్ బోధ ఇది కాదు; పిరమిడ్ బోధను బోధించు వారికి ఇది తెలియును. దానిని గూర్చి నాకేమీ తెలియదు). ఏది ఏమైనా గాని అది పిరమిడ్ ఆకారములో యున్నది, కాని ఆ పిరమిడ్ పై మూత పెట్టబడలేదు. నేను ఈజిప్టులోని కైరోలో యున్నాను; ఆ పై మూత వాటికి పెట్టబడి యుండుట నేను చూడలేదు, ఎందుకనగా అది తలరాయి, అదే మూలరాయి. సంఘములో అదే మూలరాయియై యున్నది. నిండు సంఘములో అదే తలరాయియై యున్నది, కావున అది ఇంకా రాలేదు. అది నిరాకరించబడినది. క్రీస్తు! అది వచ్చును. నేను నమ్ముచున్నాను అది వచ్చునప్పుడు, సంఘము ఒక రూపుదిద్దుకొనును. లూధర్ ద్వారా నీతీకరణమును, వెస్లీ ద్వారా శుద్ధీకరణమును, పెంతెకోస్తు వర్తమానమును పొందియున్నది. సంఘము అల్ప సంఖ్యలో యున్నది. ఈ జనుల మధ్య ఒక పరిచర్య జరుగుచున్నది, అది కచ్చితముగా యేసుక్రీస్తు చేసిన పరిచర్యయైయున్నది. అది యేసును తీసికొని వచ్చును, అప్పుడు సమస్తమును పట్టుకోనును.
MATT 25:7
60యధార్థవంతులును, సత్యవంతులును అగు లూధరనులు, ప్రెస్బిటేరియనులు, బాప్టిస్టులు, మెతడిస్టులు యున్నారు. దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వారందరూ యేసుక్రీస్తు వచ్చినపుడు కొనపోబడెదరు. దానిని నేను నమ్ముచున్నాను. కొందరు పెంతెకోస్తు సోదరులతో నేను విభేదించుచున్నాను. సంఘములోని శేషము చివరి కాలములో కొనిపోబడునని వారు నమ్ముచున్నారు. అక్కడ నేను విభేదించుచున్నాను, "ఆయనెట్లు చేయగలడు?" అని అడుగుట లేదు, ఎందుకనగా ఆయన తన ఇష్టమైన దానిని చేయును. కాని దేవుడు, లూధరు ద్వారా నీతీకరణమును వారికి తెలియచేసెను. వారికి అదే తెలియును, చూచారా? సంఘమును కొనిపోదునని ఆయన వాగ్ధానము చేసెను… దేవుని కృపనుబట్టియు, లేఖనములనుబట్టియు దానిని నేను నమ్మి బలపరచుచున్నాను, ఎందుకనగా ఆయన మొదటి జాములో రాలేదు, మరియు అందువలన వారు కునికి నిద్రించుచుండిరి; రెండవ జాములో రాలేదు. ఏడవ జామున ఆయన వచ్చెను. అదే ఏడవ సంఘకాలము, అదే ఏడవ దూత వర్తమానము. చూచారా? ఆయన వచ్చినపుడు, ఆ కన్యకలందరూ మేల్కొని తమ దివిటీలు శుభ్రము చేసికొనిరి. ప్రెస్బిటేరియనులు, లూధరనులు, బాప్టిస్టులు, ఎవరైనా గాని వారు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన యెడల రాకడలో ఎత్తబడుదురు. ఆ సమయములో పెండ్లి కుమార్తె పిలువబడునని నేను నమ్ముచున్నాను. మరణమును రుచి చూడక ఒక్క క్షణములో, రెప్పపాటు కాలములో మార్పు పొందు జనులు కొందరు, చివరి దినములలో యుందురని నేను నమ్ముచున్నాను.
1COR 15:52
61మీరు చాలా వరకు గమనించారు, జాక్సన్ సోదరుని కలను చూచారు, ఈ రాతికి లోపలి వైపు వ్రాత ఏదియూ లేదు. అందుకొరకే నేను పశ్చిమానికి వెళ్ళాను. ఇప్పుడు, అది జరిగినది… "ఒక దినమున దాని అర్థము ఏమిటో" మీతో చెప్పుదునన్నాను. అందుకోసమే నేను పశ్చిమంగా వెళ్ళాను. ఆ దర్శనమును మీతో చెప్పితిని. టేపు మీద యున్నది. మీరు ఈ ఉదయ కాలమున విన్నారు. అయ్యలారా, ఎంత వేళయైనది? అను వర్తమానము వినండి. ఆ వర్తమానపు మీ యొద్ద లేని యెడల దానిని సంపాదించుకొనండి. అయ్యలారా, ఎంత వేళయైనది? ఇక్కడది జరుగుటకు కొన్ని నెలలు మరియు వారములకు ముందే, నేను టూసాన్‌లో యున్నట్లు దర్శనము చూచాను. టూసాన్‌కు ఉత్తరంగా యున్నాను. అది ప్లాగ్ స్టాఫ్‌కు తూర్పు, టూసాన్‌కు ఉత్తరము, నా పాంటు కాళ్ళ నుండి ముళ్ళు తీసాను. ఒక పెద్ద ప్రేలుడు ధ్వనించినది. మొత్తం దేశమును కుదిపి వేసినది. అది ఎందరికి జ్ఞాపకమున్నది? ఆ ప్రేలుడు మొత్తం దేశమును కుదిపివేసినది.
62మంచిది, అది జరిగినప్పుడు, అక్కడ నిలచి చూచిన వారిలో ఒకరు ఈ ఉదయమున ఇచ్చట యున్నారు. ఆ పర్వతముల మీది రాళ్ళు నిజంగా దొర్లి పోయినవి. ఆ సమయములో నేను ఏడు దూతలను చూచాను, పిరమిడ్ ఆకారములో యున్నవి, అవి దిగి వచ్చి నన్ను పట్టుకొనినవి. దేవుని కొరకు ఏడు ముద్రలను విప్పుటకై నేను తూర్పుకు తీసికొని రాబడితిని. యేసు రాకడ ఆలస్యమయినచో నా ముని మనుమడు, చిన్న పౌలు కుమారులు దానిని వినగలరు. ఎప్పటికయినా గాని అది నిత్య సత్యముగానే నిలచియుండును. సజీవ దేవుని శాశ్వత సత్యము. అది ఈ పర్వతము లోపల ముద్రించబడి యున్నది. అది వ్రాయబడలేదు. దానికి అనువాదము చెప్పబడవలెను. నేను తిరిగి వచ్చినప్పుడు, మొదటి దేవదూత, ఆ మొదటి రాత్రి ముద్రను విప్పినది, నా జీవితంలో వినిన దానికి అది భిన్నంగా యున్నది. ఆ ఏడును అదే విధంగా వచ్చి యున్నవి. మీకది తెలియును. అది జరిగినపుడు మీలో చాలామంది ఇచ్చటున్నారు; మీలో చాలా మందికి అది తెలియును.
ఆ సమయములో అది నాకు తెలియలేదు, కాని
63సహోదరుడు ఫ్రెడ్ సాద్‌మన్, ఇచ్చటున్నాడని నేనెరుగుదును. సహోదరుడు నార్మన్ తప్పకుండా ఇక్కడుండును. కరెంటు కుర్చీ ప్రమాదము నుండి రక్షింపబడిన బాలుని చూచుటకు నేను హూస్టన్ వెళ్ళవలసి వచ్చెను. నేను తిరిగి వచ్చి, సోదరులతో కలిసి వేటకు వెళ్ళాను. ఆ ఉదయమున నేనచ్చట నిలబడి, ఆ పిచ్చి ముళ్ళు తీసికొనుచున్నాను. పల్లేరు ముళ్ళు వంటివి తీసి పారవేయుచున్నాను. నా పాంటు కాళ్ళకు చిక్కు కొనినవి. అక్షరాలా చెప్పబడిన రీతిగానే ఆ ప్రేలుడు సంభవించినది. ఫ్రెడ్ సోదరుడా, అది నిజమేనా? నేను నెలపై నుండి పైకి ఎత్తబడినట్లు ఉన్నాను. నాకు పైన దేవదూతలు వారు వర్తమానము తిరిగి పంపి, నా కొరకు ఇక్కడకు వచ్చి ఈ ముద్రలను విప్పెను. ఇక్కడికే ఎందుకు? టాబెర్నికల్ లోనే ఎందుకు? మరొక చోట ఎందుకు జరుగలేదు? ఎందుకనగా నేను నా దేవునికిని, నా సంఘమునకును వాగ్ధానము చేసియున్నాను. ఏ క్రొత్త వర్తమానమయినా, ఈ టాబెర్నికల్ నుండియే రావలెను, ఇక్కడే రికార్డు కావలెను. ఆయన నా మాటను నిలబెట్టుటకు సహాయము చేసెను, దానిని చేయుటకు ఇక్కడే నిలచియుండెను. ఆ వెను వెంటనే నేను మరల వెనక్కు వెళ్ళిపోయాను.
64మరియు ఇప్పుడు, వారు ఫోటోలను తీయుచున్నట్లు ఆ సమయములో నేనెరుగను. శాస్త్రజ్ఞులుండిరి, వర్తమానమును తెచ్చుటకు దూతలు క్రిందికి దిగెను. మీకు గుర్తుండియుండును, ఆ వరుసకు కుడి వైపున రెక్కలుండుట గూర్చి మీతో చెప్పాను. దానిని నేను చెప్పినట్లు మీ అందరికీ గుర్తున్నదా? ఆయనను ఎట్లు నేను గమనించాను? ఆయన ఇతరుల కంటె ఎంతో ప్రత్యేకమైనవానిగా యుండెను. వారు దాని పటము తీయుచున్నట్లు నాకు తెలియదు, ఎందుకనగా వెంటనే నేను తూర్పుకు వెళ్ళాను. కాని టూసాన్‌లోని ఇంటికి తిరిగి వెళ్ళేసరికి, పేపరులన్నింటిలో అది ప్రకటించబడినది. దాదాపు దేశమంతా అది ప్రాకిపోయినది. మెక్సికో, మరియు పశ్చిమ రాష్ట్రములకు వ్యాపించినది. కొరియర్ అను పత్రికను చూచాను. అది అసోసియేటెడ్ ప్రెస్‌లో యున్నది. ఆకాశములోని మర్మమగు మేఘమును ఎందరు చూచిరి? చేతులను మీరు చూచారు. లైఫ్ పత్రిక దానిని వ్రాసినది. అక్కడ నేనుండిన సమయములోనే, అది జరిగినది. ఆ మేఘములోని పిరమిడ్‌ను చూచారా? నేను దీనికి దిగువన నిలబడియున్నాను. ఆ కుడివైపున ప్రత్యేకమగు దేవదూతను చూచారా? దాని యొక్క సూటియగు రెక్కను చూచారా? చెప్పిన ప్రకారమే అది ఉన్నది. మెక్సికో మరియు వివిధ ప్రాంతముల నుండి ఆ చిత్రమును తీసిరి. ఆ శాస్త్రజ్ఞుడు దీని యొక్క సమాచారమునంతటినీ సేకరించుచుండెను. ఆ చిత్రము ఎవరి యొద్ద నున్నదో వారిని అడుగుచుండెను. దానినతడు అధ్యయనము చేయుచుండెను.
65అక్కడ మేఘముండుట అసాధ్యమని అతడు పలికెను, ఎందుకనగా తేమ అంతపైకి పోజాలదు… ఆరు లేదా ఎనిమిది మైళ్ళ ఎత్తున ఉన్నదని, నేను చెప్పగలను. మేము విదేశములకు వెళ్ళినప్పుడు 19,000 అడుగుల ఎత్తులో దాదాపు ఎగురుచుందుము, తుఫానులకు ఆవలగా వెళ్ళుచుందుము. కాని ఈ మేఘము, ఈ శాస్త్రజ్ఞుని వ్యాసము ప్రకారముగా ఇరవై ఆరు మైళ్ళ ఎత్తులో యున్నది. తేమకు అది ఎన్నో మైళ్ళ దూరమున యున్నది. ఆ ప్రాంతమును అతడు పరీక్షించెను. అది విమానములోని ధ్వని చోదకము వలె వినిపించినదని, నేను చెప్పిన మాట ఎందరికి గుర్తున్నది? గుర్తున్నదా? అప్పుడు, ఆ జిల్లాలో ఏ విమానమును లేదు. ఆ పుస్తకములో ఆలాగున వ్రాయబడియున్నది. దానిని వారు పరీక్షించిరి. అక్కడ ఏ విమానమును లేదు. విమానము యొక్క.. ఎందుకనగా అది దీనిని పీల్చుకొనును, అది జెట్ఇంజను. అది ముందుకు పోవుచుండగా గాలిలోని తేమ విరిగిపోవుచుండును. అక్కడ జెట్ ఉన్నంత వరకూ అది తొలగిపోదు, ఎందుకనగా దానినే అది చెదరగొట్టుచుండును. దాని నుండి తేమ విరజిమ్ముకొనును.
66కాని ఇక్కడ చూడండి, ఎన్నో మైళ్ళ ఎత్తున ఆ వాతావరణము ఉన్నది, జిల్లాలో ఏ విమానమును లేదు. అంత పైన తేమ యుండదు, ఆ దినమున అది అక్కడే యున్నది. అడ్డంగా ముప్పయి మైళ్ళు పొడవున, ఇరవై ఆరు మైళ్ళ ఎత్తున అది యున్నది. మీరు చూచారా? ఆ చిత్రములో యున్న దానిని చూడండి, ప్రభువు యొక్క దూత అగ్నిస్తంభము వలె కనబడియున్నదని చాలా సంవత్సరాల క్రితం చెప్పియున్నాను. జరుగక ముందే నేను చెప్పాను, అది సత్యమని సైన్సు గుర్తించునట్లుగా దేవుడు చేసెను. ప్రవచనము ముందే చెప్పబడినది… అది సత్యమని సైన్సు సాక్షమిచ్చునట్లుగా దేవుడు చేసెను. ఇప్పుడు, మనం ఎచ్చట నిలబడి యున్నాము? ఈ ఉదయమున నా స్నేహితుడు ఒకాయన ఇచ్చట యున్నాడు. ఏడు ముద్రల గ్రంథము వ్రాయుమని అతనితో చెప్పాను. దీనినతడు ఉపయోగించుకొనవచ్చును. మరియు మీ యొద్ద దాని ప్రతి ఉన్నయెడల జాగ్రత్తపరచి దానిని సరిచూచుకొనండి. చూచారా?
MATT 7:6
67దానిని కనుగొనవలెనని అతడు ప్రయత్నించుచున్నాడు, కాని అతనికి దానిని గూర్చి చెప్పుట వలన ఏమీ ప్రయోజనముండును? దానిని చూచి అతడు నవ్వును. చూడండి, కేవలము అతడు నవ్వును, కావున మన ముత్యములను ఆలాగున విసరరాదు. కాని మన మెరుగుదుము, సంఘము ఎరుగును, అది సత్యమని దేవునికి తెలియును.
ఈ అంశము గూర్చి నేను ప్రార్థించుచున్నాను, నా కేమీ జరుగునోయని ఆశ్చర్యపడుచున్నాను, నేనెక్కడున్నానో మీరెరుగుదురా? టుసాన్‌కు ఉత్తరముగాను, ప్లాగ్ స్టాఫ్‌కు తూర్పుగాను ఉన్నాము; ఇది జరుగుటకు కొన్ని నెలల ముందే, నేను ఆ చోటులో నిలచియుందునని చెప్పాను. ఈ పేపరును బట్టి, ఈ పత్రికను బట్టి మీరు గ్రహించండి, మన స్వంత సాక్షమును ఎరుగుదుము; అక్షరాలా అక్కడే అది జరిగెను. దేవుడు పరిపూర్ణుడు మరియు అబద్ధమాడజాలడు. అది నెరవేరును.
68అయ్యలారా, ఎంత వేళయైనది? అను ప్రసంగము మీరు గుర్తు చేసికొనండి. అందులో నేను చెప్పాను, "ఒక పెద్ద సంఘటన జరుగబోవుచున్నదని — ప్రధానమైనది!" దానికి దేశమంతయూ సాక్షిగా ఉండునట్లు చేసినది. అసోసియేటెడ్ ప్రెస్‌లోని ప్రతి వార్తా పత్రికయు, ప్రముఖ వార్తా పుస్తకములును దానిని గూర్చి సాక్షమిచ్చుచున్నవి. ఇంకా అంతటితో అయిపోలేదు. క్రైస్తవులు ఎంత మహాభాగ్యము గల జనులు! సైన్సు ప్రకారము ఏ నిరీక్షణయు లేని కాలములో, చీకటి ఘడియలలో మనము జీవించుచున్నాము, మరియు మన కొరకు అణుబాంబు ఎదురు చూచుచున్నది. మన సంస్థలలో ఏ నిరీక్షణయు లేదు, అంతా ఏకమగుచున్నారు, మృగపు ముద్రకు వారు సిద్ధమగుచున్నారు. మన ఆర్థిక వ్యవస్థలో ఇక ఏ ఆశయూ లేదు. సంస్థల మధ్య మన క్రైస్తవ సహవాసము ఆలాగే యున్నది. కాతలిజం వైపుకు ఇది కొనసాగిపోవుచున్నది, సంఘ సమాఖ్యలో మృగపు ముద్ర వేయబడును.
అయితే దేవునిని ప్రేమించువారి కొరకు, నిజము కొరకు ఎదురుచూచు వారి కొరకు దేవుడు బైబిలులో వాగ్ధానము చేసెను. మన ముఖము యెదుటనే దానిని పరచెను, సంఘము, జనులు, సైన్సు, పత్రికలు, అన్నియూ దానిని గుర్తించియున్నవి. ఆయన ఇంకనూ దేవుడై యుండి సమయమును గూర్చి చెప్పుచున్నాడు. ఎట్టి కాలమిది!
69ఆ తరువాత సాబినో కాన్యాన్‌లో ఒక ఉదయమున, ప్రార్థించుచుండగా ఖడ్గము నా చేతిలోనికి వచ్చినది, ఏమి జరుగునో అని నేను ఆశ్చర్యపడుచుంటిని. ఆ పర్వతము మీద దేవునికి నా చేతులు చాపుచుంటిని. ఆ ఖడ్గము నా చేతిలో పడినది… దానికి వజ్రపు పిడి యున్నది, దానికి ఒరయున్నది, మరియు దాదాపు మూడడుగుల పొడవైన ఖడ్గము, మెరయుచున్నది క్రోమ్ వంటి ఖనిజము వలె యుండి, చాలా పదునుగా యుండెను; మరియు అది ఏమిటో నాకు తెలియలేదు. మరియు "నేను వీటికి భయపడుచున్నాను," అని చెప్పాను.
అప్పుడే ఒక స్వరము మాట్లాడెను, ఆ ప్రదేశము కంపించెను. "ఇది యెహోవా ఖడ్గము," అని చెప్పెను. యెహోవా ఖడ్గమనగా "ప్రభువు యొక్క వాక్యమే." ఎందుకనగా దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగలదైయున్నది.
70ఆ సమయములో ధైర్యముగల ఒక చిన్న సోదరుడు సంఘములో యుండెను, అతడు సైనికునిగా పనిచేయుచుండిన దినములలో ప్రేలుడు వలన దాదాపు ముక్కలై పోయెను. చచ్చిన వాడై, పడియుండెను; అతనిని ఇక బ్రదికించుట అసాధ్యము గనుక వైద్యులు ప్రయత్నములు మానిరి, అతడు అంతగా దెబ్బ తినెను. అతని కాలులోని ప్రధానమగు నరములు చిట్లి పోయినవి, మరియు అతని చిన్న చేయి దాదాపు తెగిపడినది, ఒక కాలు ముక్కలైపోయినది, కాని దేవుడు కృప చూపెను; అతనిని రక్షించి ఒక దినమున స్వస్థపరచెను.
అతడే సహోదరుడు రాయ్ రాబర్సన్. హూస్టన్‌లో ఆ చిత్రము తీయబడినప్పుడు అచ్చటనే యున్నాడు. దర్శనములో అతని భార్యను గూర్చి చెప్పబడినది; ఒక దినమున ఆమెకు బాధ కలిగినది, అదెట్లు బాగవునో చెప్పుట జరిగినది. మరియు అందువలన అతడు విశ్వాసి అయ్యెను. అయితే అతడు సైనికుడు గనుక ఒక రకముగా యుండేవాడు (ఇలాగు చెప్పినందుకు అతడు నన్ను క్షమించవలెను…) సైన్యములో అతడు ఆజ్ఞలు జారీ చేయుచుండెను, అది చాలా కరకుపని. మనుష్యులను ఆజ్ఞాపించువాడు, ఒక పనిని చేయమనగానే అవతలి వాడు చేయును. చూచారా? అయినా అతడు నమ్మెను. క్రమముగా ఆలయమునకు వచ్చుచుండెను, సహజాతీతమగు దానిని చూచుచుండెను. "దానిని నేను నమ్ముచున్నాను, అయితే అది వేరొకరి కొరకు," అనేవాడు.
71ఒక ఉదయమున ప్రభువు అతనిని లేపెను. మేము కూర్చొనియున్నాము, నేను మరియు అతడు కలిసియున్నాము, యెరూషలేములో కూర్చొని యున్నట్లుగా ప్రభువు యొక్క భోజనపు బల్ల వలే యున్నది, మరియు నేను మాట్లాడుచున్నాను. దానినతడు అర్థము చేసికొనలేకపోవుచున్నాడు. మరియు సహోదరుడు రాయ్ అక్కడ కూర్చొని యుండి, ఇప్పుడు నావైపు చూచుచున్నాడు; దానినతడు చూచెను. ఆరిజోనాలో అతడు నన్ను పిలచెను. నాకు ఉత్తరము వ్రాసి, నన్ను వెనుకకు రమ్మనెను. నాతో ఇట్లు చెప్పెను, "బ్రన్హం సోదరుడా, నీవు అక్కడ కూర్చొనియున్నావు, పెద్ద అగ్నిస్తంభము లోనికి వచ్చి నిన్ను ప్రభురాత్రి భోజనపు బల్ల యొద్ద నుండి దూరంగా తీసికొని పోయినది, మరియు నీవు పశ్చిమంగా పయనించావు." ఎందుకనగా అతడు తూర్పు వైపు కూర్చొని చూచుచుండెను, గనుక నేను పశ్చిమంగా వెళ్ళుటను చూచెను. ఈ వెలుగు లోనికి వచ్చి నన్ను బయటకు కొనిపోయినది.
అది ఒక ఉదయము వలె యుండెనని చెప్పెను, అది దర్శనము ప్రకారముగానే యున్నది. దాదాపు ఉదయం 3 లేదా 4 గంటలకు పడక మీద నుండి లేచెను. ఇది జరుగుటను చూచెను. అతడు కేకలు వేసెను, "బిల్ సోదరుడా, వెనక్కు రా!" రోయ్ మరియు నేను నిజమైన సోదరుల వలె యుంటిమి. మేము కలిసి జీవించాము, మరియు కలిసి వేటాడాము, మరియు మేము సోదరులమే. అతడు నా కొరకు కేకలు వేసి గొంతు బొంగురు పోయినది. "వెనక్కు రా, తిరిగి రా, తిరిగి రా," అని అతడు కేకలు చేయుచుండెను. ఆ అగ్నిస్తంభము లేక మేఘము తిరిగి వచ్చుటను అతడు చూచెను. నేను బల్ల మీద కూర్చొని మనిషిగా కనిపించుట రాయ్‌కు ఒక మర్మముగా కనిపించినది, నేను వేరే విధముగా మార్పు చెంది కనిపించుటకు. (ఇక్కడ నేను మరో సంగతి జ్ఞాపకం చేసికొనవలసియున్నాను) — "మార్పు చెందుట" — (దానికి భావం నేనతనికి చెప్పాను)
MATT 7:5
72ఏడు ముద్రలను బోధించుట కొరకు తిరిగి వచ్చు ముందే ఇది జరిగినది. ఏడు ముద్రలను బోధించుటకు వచ్చాను. ఒక ఉదయమున అతడు బిల్లీని పట్టుకొనెను, అతడు నాతో మాట్లాడగోరెను. నేను చాలా పనిలో యున్నాను, ఏడు ముద్రల కొరకు ప్రార్థించుచున్నాను. అపుడు మరలా, ఆ విధంగానే తిరిగి జరిగినదని అతడు చెప్పెను. రాయ్ సోదరుడా, నేను తప్పు చెప్పిన యెడల నన్ను సరిదిద్దుము. అతడు మరల ఉదయమునే మేల్కొనినట్లుగా చెప్పెను, నేను ఉహిస్తున్నాను బాగా పెందలకడనే మరలా లేచెను. గదిలోనికి అతడు తొంగి చూచెను, ఈ పెద్ద వెలుగు కనబడెను లేదా పర్వతము మీద మేఘము కనబడినది. "పర్వతము మీది మేఘము దేనికి సాదశ్యమని?" కొంత కాలం క్రితం అతడు నన్ను అడిగెను. "బైబిలులో యున్నది" అన్నాను.
"అవును, ఎప్పుడైతే పేతురు, యాకోబు, యోహానులు పైకి వెళ్ళి, ప్రభువైన యేసును మేఘము కమ్ముకొనెను, ఈయన నా ప్రియ కుమారుడని దేవుడు పలికెను." కొద్ది కాలం క్రిందట దాని మీద నేను ప్రసంగించాను. చిన్న వర్తమానము, టేపు సోదరులలకు బహుశా అర్ధమైయుంటుంది, ఆయన మాట వినుడి అనువర్తమానము. నేను అనుకుంటున్నాను కచ్చితముగా, అది తెపుపై ఉన్నది.
73అతడు కొండ మీదికి ఎక్కినట్లుగా చెప్పెను. అక్కడ నేను కూడా ఉంటిని, నిలబడి యున్నాను. మేఘములో నుండి ఒక స్వరము వచ్చినది (నిజమేనా, రాయ్ సాహోదరుడా?) ఈ ప్రకారముగా అది చెప్పెను: "ఇతడు నా దాసుడు. ఈ కాలమునకు ప్రవక్తగా యుండుటకు ఇతనిని నేను పిలిచాను, మోషే వలె జనులను నడిపించుటకు. మరియు అతనికి అధికారమియ్యబడినది… అతడు పలుకగా ( he can speak into existence) సృష్టి వచ్చును." మోషే పలుకగా ఈగలు వచ్చినట్లుగానే, ఉడుతలు మొదలగు వాటిని గూర్చి మనం ఎరుగుదుము, ఇట్టివి ముందే జరిగి యున్నవి. చిన్న హాటీ రైట్ అక్కడ వెనక ఉన్నది. ఆమె ఇంటి యొద్ద ఏమి జరిగినదో మీకు తెలుసు అనుకొనుచున్నాను. మోషే చేసిన రీతిగానే నేనును చేసితినని ఆయకు చెప్పెను.
74వేట పర్యటన నుండి తిరిగి వచ్చుచున్నపుడు, అతడు నాకు దీనిని చెప్పెను. బడ్ యొద్దకు వెళ్ళవలెనని నా మనస్సులో తలంచుకొని యున్నాను, ఎందుకనగా వేటలో అతనికి అపాయము సంభవించి చాలా భయంకర స్థితిలో యుండెను.
దీనిని ముగించుటకు ముందుగా ఒక సంగతి చెప్పెదను. మరియు మనము త్వరపడుదుము. ఒక వింత కల నాకు వచ్చినది, చాలా అరుదైన కల. నా బావగారు దీనిని విని బాధపడరని తలంచుచున్నాను. నా భార్య బాధపడరాదు, ఇప్పుడామె ఇక్కడే కూర్చొని యున్నది, కాని ఆమెకు అది తెలియును. చాలా నెలల క్రితం మాట, అక్టోబరు లేదా నవంబరు కావచ్చును. నేను కలలో చీకటిలో తిరుగుచున్నాను, నాకు ఎక్కడా స్థలము లేదు మరియు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నేను ఒక దిక్కులేని వాడిగా యున్నాను. నేను చల్లగా యున్నాను, మరియు దూరంలో నాకు ఒక నిప్పు మంట కనిపించినది. అక్కడికి నేను వెళ్ళి చూడగా, అది పట్టణములోని చెత్తమంట. అక్కడ గోతులున్నవి, ఆ గోతులలో ఆ మంట ఉన్నది. ఆ మంట ప్రక్కలందు దిక్కులేని వారు పరుండెదరు. చలి రాత్రులందు వారు గడ్డ కట్టుకొని పోకుండా యుండుటకు అక్కడ పరుండెదరు. (లేనిచో గడ్డ కట్టుకు పోదురు) నాకు చలిగా యున్నది. వేడి కొరకు నేను ఈ మంట యొద్దకు వెళ్ళాను. అక్కడ అందరూ దిక్కులేని వారే. వారిలో ఎవరిని నేను చూడలేదు, అయితే అది అందరు పడుకొను గదుల స్థలముగా అది యుండెను. అందులో నా బావ ఫ్లెచర్ బ్రాయ్ కనిపించెను.
75ఫ్లెచర్ నాకు బాగా జ్ఞాపకముండును. అతడు మంచివాడు. కాని ఇది యువకులకు ఒక పాఠము కావచ్చును. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక అందమగు జేమ్సు ఫ్లెచర్ బ్రాయ్, యువకుని నేనెరుగుదును, అతడు చెడ్డ సహవాసములో చేరి త్రాగుడుకు బానిసయ్యెను. నా ఇంటికి వచ్చి తెర వెనుక నుండి అతడు నన్ను పిలచుట నాకు గుర్తున్నది. అతని తండ్రి, కొన్ని సంవత్సరాల క్రితం మహిమలో ప్రవేశించెను. అతడు గిటార్ పట్టుకొని ఈ పాట పాడిడి వాడు:
దూరపు కొండ మీద ఒక పాత కరకు సిలువ నిలచియున్నది.
ఫ్లెచర్ నన్ను పిలచెను, "బిల్ సోదరుడా, నా కొరకు నీవు ప్రార్థించుము. నా తండ్రి ఆలాగు పాడెడి వాడు, కాని నేనయితే ఈనాడు త్రాగుచున్నాను."
ఆ దారిన పోవద్దని అతనికి నేను చెప్పాను. (ఫ్లెచర్ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడు) కాని ఎన్నడూ అతడు వినలేదు. అతడు ఆలాగే ముందుకు పోయి చివరకు పూర్తి త్రాగుబోతు అయ్యెను. అతని భార్య, పిల్లలు అతనిని విడిచి పెట్టిరి. నేనతనిని ఈ ఘడియ వరకు ప్రేమించుచున్నానని దేవునికి తెలియును.
తిరుగుబోతు అయిపోయిన అతనికి ప్రార్థించవలెనని నేను వెళ్ళాను. కొద్ది కాలం క్రిందట, ఏడు ముద్రల పనిలో నేనక్కడ ఉ౦డగ, నేను ప్రార్థించ వెళ్ళాను, అతడు గాయపడెను, నేను అన్నాను, "సహోదరుడా ఫ్లెచర్ కొన్ని సూట్‌లు నీకు ఇచ్చుటకు తెచ్చియున్నాను."
ఆయన అన్నాడు, "అది చేయవద్దు, బిల్ సోదరుడా."
అతనికి బట్టలు లేవని నేనెరుగుదును, "ఎందుకు నీవు బట్టలు తీసుకోనకూడదు?" అని అన్నాను.
అతడు నా వైపుతేరి చూచెను. " చూడు, వాటిని అమ్ముకొని త్రాగెదను," అని నాతో చెప్పెను.
"ఫ్లెచ్, నీకు కొద్దిగా డబ్బు ఇచ్చెదను," అన్నాను.
"బిల్ సాహోరుడా, ఆ పని చేయవద్దు. నీవు నాకు డబ్బు ఇయ్యవద్దనెను." అతని హృదయము చాలా గొప్పది. అతడు త్రాగుబోతుగా మారి దిక్కులేని వాడాయెను. అతని భార్య తప్పు త్రోవ పట్టెను. అతనికి ఎంతో ఘోరము జరిగినది.
76నేను మేల్కొనక ముందే, ఫ్లెచ్ నాతో కలలో ఇట్లనెను, "బిల్, నీకు ఒక చోటు నేను వెదకెదను. నా పిల్లలు ఆకలిగా ఉండినప్పుడు నీవు పోషించావు." "నీవు వారికి తండ్రివిగా ఉంటివి, కావున ఇక్కడ నీకు వెచ్చగా నుండు ఒక స్థలము చూచెదను." అతడు ఆ దిక్కు లేనివారందరూ పరుండియున్న చోటికి వెళ్ళి చివరకు ఒక చోట ఆగెను, ఆయన అనెను, "నేను ఇక్కడ కూర్చునెదను."
"నేను కూడా ఇక్కడ నడచి మరియు ఒక స్థలము దొరకునేమో చూస్తాను," అని నేను అన్నాను..
నేను నడచాను, చీకటి లోనికి చూచాను, చాలా చలి రాత్రి. నేనిట్లు తలంచాను, "దానిని గూర్చి ఆలోచించు! ఒకసారి సర్వశక్తుడగు దేవుడు తన సంఘమును నా ద్వారా నడిపించెను. ఒకసారి, ఆయన తన సువార్తను నాతో బోధింప చేసెను మరియు ఆత్మలు రక్షింపబడినవి. కొద్ది నిమిషములు నాతో మాట్లాడుట కొరకు స్త్రీలు, పురుషులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చుచుండిరి. ఇపుడు, నేను ఒక పనికిరాని వానిగా యున్నాను. ఎవరికీ నేను అక్కరలేదు. నేను చలితో యున్నాను. నేనేమి చేయవలెను?" అంతలో మెళకువ వచ్చినది.
77నా భార్యతో చెప్పాను, "బహుశా ఫ్లెచ్ ఏదో అవసరములో ఉండి యుండునేమో," అన్నాను. మేము త్వరపడి అతనిని కనుగొన వెళ్ళాము. అతని సోదరుడు అతడిని కనుగొనెను. అతడు "విద్నేర్స్" తో (weidners) నివసించుచుండెను. వారికి వ్యాపార గుర్రములు ఉన్నవి, ఒక శాల మూలలో అతడు పరుండి యుండెను. నేను వెళ్ళి చూచి ఆలాగే ఉండనీ అనుకొన్నాను.
ఫ్రెడ్, ఇంకా తదితరులతో నేను కెనడా నుండి వచ్చాను. నా మనస్సులో ఇట్లు తలంచాను, "ఈ జనులు నా వర్తమానము విననిచో పోనీ, వారు వినక్కర లేదు. ఇప్పటికి ముప్పది అయిదు సంవత్సరముల నుండి బోధించుచున్నాను." గత పదిహేను లేదా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏమీ నేను చేయుట లేదు. ప్రభువుకు దగ్గరగా జీవించుటకే ప్రయత్నించుచున్నాను. ఆయన మొదట నాకు చెప్పితేనే గాని ఒక్క మాట కూడా పలుకుటకు ప్రయత్నించుట లేదు.
78"అతడు వచ్చుచున్నాడని, బ్రన్హం సోదరుడు చెప్పునప్పుడు, గుర్తుంచుకొనండి, కూటము కొరకు ఎదురు చూడండి, ఎందుకనగా అతడు ప్రభుని నామము పేరట వచ్చుచున్నాడు. ప్రభు చెప్పు వరకు అతడేమియూ చెప్పడు," అని ప్రజలు అందురు. అది నిజము. ఆయన నాతో చెప్పు వరకు వేచియుందును. ఆయన నాతో చెప్పు వరకు కదలను. ఆయన నాతో చెప్పును, గత కొద్ది నెలల నుండి నేనెచ్చటకి వెళ్ళవలెనో ఆయన చెప్పుట లేదు.
కెనడా నుండి నేను వచ్చాను. రాయ్ సోదరుడు తన కలను నాతో చెప్పెను. అతడు, నేను, సహోదరుడు బాంక్స్ కలిసి తిరిగాము. మేము విడిపోవుముందు వరకు ఆలాగే యున్నాము.
ఆ మరుసటి దినము ఫ్రెడ్ సోదరుని యొద్దకు వెళ్ళాము. అతని కుమారుడు లిన్ ఇంటి యొద్ద లేడు, కనుక అతడు మాతో రాలేక పోయెను. కావు అతడు, అతని భార్య ఎదురు చూడవలసి వచ్చెను. రోజ్‌వుడ్ యొద్ద అతడు తన భార్యను కలిసికొనెను. సస్కాచివాన్‌లోని ఎల్ రోజ్ వద్ద కావచ్చును.
ఫ్రెడ్ సహోదరుని కారులో బిల్లీ మరియు నేను కలిసి వచ్చాము. ఆ రాత్రి అంతయూ దాదాపు మేము పయనించుచునే యున్నాము. ఆ మరుసటి రోజు పయనించాము. ఆ తరువాత ఉదయమున మేము మాంటానాలోని హెలీనాను విడిచిపెట్టాము. సరిహద్దు వైపుగా వచ్చాము.
దాదాపు 9 గంటల వరకు నేను మెళకువగా యుండగలను, కాని ఆ తరువాత నిద్ర వచ్చును. నేను నిద్రపోవలసియుండును. ఆ మరుసటి రోజు దాదాపు 10 గంటల వరకు బిల్లీ నిద్రపోయెను. తెల్లవారినది, కావున మేము చాలా చక్కగా ప్రయాణము చేశాము.
79నేను దరిదాపు 4 గంటకు మేల్కొని కారు నడుప సాగాను. బిల్లీ నిద్రపోవుచుండెను. ఒక చోటకు మేము వెళ్ళాము, నా మనస్సులో ఆలోచించసాగాను. "ఏమిటో మీరెరుగుదురా? ఈ రోజులలో ఒక రోజున నా భార్యను ఇక్కడికి తీసికొని రావలెను. ఏమి చేయబోవుచున్నానో ఆయనకు చెప్పను. అక్కడికి నేను చేరుకొందును, అపుడు నేను ఆమెతో ఇట్లు చెప్పెదను." "ఈ స్థలము నాకు చాలా ఇష్టము. మరెక్కడికిని వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. ఇక్కడే నివసించుదము." అది నాగరికతకు పదకొండు వందల మైళ్ళ దూరములో యున్నది. ఎటునుండయినా అంతే. చూచారా? అరణ్యములో యున్నది. ఇట్లనుకొన్నాను, అది చక్కగా యున్నది గదా? నాకు జుట్టు కత్తిరించుకోవలసిన పనిలేదు. దుస్తులు గూర్చి పట్టించుకొనవలసిన పని లేదు. కొండవాని వలె అయిపోదును. నేనెల్లపుడూ ఆలాగే యుండగోరుదును. ఇట్లనుకొన్నాను, "నా యొద్ద కొన్ని తుపాకులున్నవి, కొందరు వాటిని నాకు ఇచ్చిరి… నేను సాటిలేని మార్గ దర్శకునిగా యుందును. అది నాకు చాలా ఇష్టము. ఆ తరువాత ప్రభువు నన్ను వెళ్ళి ఎవరితోనయినా ఏదయినా చెప్పి రమ్మంటే పరుగెత్తికొని వెళ్ళి మరల వెనక్కి వచ్చుదును. బడ్‌కు నేను సహాయము చేయుదును. మనకు నిజంగా చాలా చక్కని స్థలం దొరికి యున్నది." ఆలాగు నేను తలంచుచుంటిని.
80దాదాపు 7 గంటలకు మేము భోజనము కొరకు ఒక బోజనశాల లోనికి వెళ్ళాము. (అది కొండలలో చిన్న చోటు) చాలా అలస్యమగుచున్నది, గనుక బిల్లీని నేను లేపాను. మా ఇంధనము అయిపోయినది, కావున కొంత ఇంధనము నింపుకోవలసి యుండెను. ఈ చిన్న చోటునకు వెళ్ళాము. అది చిన్న భోజనశాల, అక్కడుండగా ఒక వ్యక్తి వీధికి అడ్డంగా వచ్చెను. నా కంటె అతడు కొద్ది పెద్దవాడు, కాని నా వలె కనిపించెను. అతడు పాంటు, పైన చొక్కాయి, స్వారీ బూట్లు, నల్లని టోపి, ధరించి యుండెను. మీసాలు పెంచుకొని యున్నాడు. (చాలా తెల్లగా, మంచువలె యున్నవి) అతని టోపి క్రింద నుండి జుట్టు వ్రేలాడు చుండెను. నాకు మగవాని వలె కనిపించెను. సోమరిగా కనిపించలేదు. మెత్తగా కనబడలేదు. నోటిలో పొడవైన పొగ త్రాగే పైపున్నది. ఈత కొలనులో ఉపయోగించు పొట్టి దుస్తుల జత అతని యొద్ద ఉండెను. కుండ కడుపు గల తూర్పు వాడు. నా పదమును క్షమించండి. ఏమయినా గాని నాకు మగవాని వలె కనిపించెను. చాలా కరకుగా, మొరటుగా యున్నాడు. దేవుడు మానవుని ఎక్కడ జీవించుటకు నియమించెనో అక్కడే అతడు జీవించుచున్నట్లు కనిపించెను. అతనిని నేను మెచ్చుకొన్నాను.
81అతడు భోజనశాల లోనికి వచ్చి కొన్ని రొట్టెలు కావలెననెను. పదిహేను లేదా ఇరవై మంది జనులున్నారు. అతనికి తుమ్ము వచ్చెను. కొందరు ఎట్లు తుమ్ముదురో మీకు తెలియును, కాని అతడు చాలా పెద్ద, ఆరోగ్యకరమగు అడవి తుమ్మును తుమ్మెను: కెర్ చూ - ఈ, (సహోదరుడు బ్రన్హం అనుకరించి చూపించుచుండెను) అనెను. అక్కడ గాలి బలంగా వీచినట్లయ్యెను. అతనిని ఎవరూ ఏమీ అనుటకు తెగించలేదు. నేనిట్లన్నాను, "బిల్లీ, అతడు నాకిష్టానుసారుడగు మనుష్యుడు."
"ఏమిటి డాడీ! నీవాలాగుండగోరవు గదా?" అన్నాడు.
"భవిష్యత్తులో నేను ఆలాగే యుందును." చూచారా? "అది నేనే" అన్నాను.
82అక్కడ కొద్ది సేపు నేను కూర్చొన్నాను, మరియు బిల్లీ నా వైపు చూస్తూ తన భోజనమును తినుచుండెను. నా భోజనం ముగించాను. కొద్ది నిమిషములలో ఎవరో మా వెనుక నున్న గదిలో నుండి వచ్చెను. నేను సరిగ్గా ఎక్కడి నుండి అతడు వచ్చెనో చూడలేకపోయాను గాని, ఆ గది వైపు నుండి వచ్చెను. ఆ మనిషి అక్షరాలా నా రూపు రేఖల్లోనే యుండెను. దాదాపు డెబ్బది అయిదు సంవత్సరములుండును… చిన్నపాటి మనిషి. అతని బట్టలు చింపిరిగా యున్నవి. అతనితో కూడా లేచిన వ్యక్తి ఫ్లెచర్ బ్రాయ్, ఖచ్చితంగా! అతని గడ్డము నెరసినది. బిల్లీ నా వైపు తిరిగి ఇట్లనెను, "డాడీ, వారిరువురు నీ వలె, ఫ్లెచర్ వలెయున్నారు." నేనెట్లు అనుభూతి పొందానో మీరుహించగలరు. ఆ చిన్న మనిషి నా వలెనె కనిపించెను, ఒడలిపోయెను, చలిమంట యొద్ద నిలబడి యున్నందున బట్టలు పొగపట్టిపోయి ముఖములు మురికిగా యుండెను. వారు కలిసి భోజనం చేసిరి. ఇరవై సెంట్లు అతడు చెల్లించి యుండును. కాఫీ మాత్రమే త్రాగిరి. నా గుండె నాలో గంతులు వేసినది. నేను బాగా గమనించాను. బిల్లీ నన్ను "ఏమిటి సంగతని" అడిగాడు.
"ఏమీ లేదు" అన్నాను. ఆలాగే చూస్తూ ఉన్నాను. వారు కలిసి వెళ్ళిరి. బయటకు వచ్చేశారు.
"డాడ ఏమిటి ఆలాగున్నావు?" అనడిగాడు.
"ఏమీ లేదు అన్నాను." అతడు కారులో కూర్చొనెను.
"నీవు మరల కారు నడుపుదువా?" అనడిగాడు.
"నడుపను" అన్నాను.
"నా నిద్రమత్తు ఇంకా వదల్లేదు," అన్నాడు.
83అతడు మరల నిద్రపోయెను, నేను గంటకు ఏబది మైళ్ళ వేగంతో ట్రక్కును రోడ్డు మీద నడుపుచున్నాను. కొండలు దాటుచున్నాము. సరిహద్దువైపు వస్తున్నాము. ఆరిజోనా ఇంటికి వచ్చుచున్నాము, కాని ఇపుడు నేను యూటాకు వస్తున్నాను. పర్వతాలు దాటుకొంటూ మేము వచ్చుచున్నాము. పట్టణానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్నాము. నేను మీతో ఆ ఉదయం చెప్పిన సంగతి గుర్తుండి యుండును. ఉడుతల గూర్చిన, ఇంకా ఆయా సంగతుల గూర్చి చెప్పాను. ఎవరో నాతో మాట్లాడిరి. మీరు నా స్వరమును వినుచున్నట్లే అది ఉండెను. ఆ స్వరము చాలా ఉద్వేగపూరితమై యుండెను, కాని దానిని నేను వినగలిగాను నేను చెప్పినది ఎప్పుడైనా జరుగకుండా తప్పియినదా? ఒక స్వరము నాతో మాట్లాడెను. ఆయనతో నేను మాట్లాడాను.
"నీ ఉద్ధేశములు నీవు కొనసాగించు. నీవు ఆలాగే యుందువు," అని ఆ స్వరము పలికెను.
"ప్రభువా, నేను ఆలాగు ఉండగోరుట లేదు," అన్నాను.
"నీ భార్య కూడా నీతో వచ్చినచో ఆలాగే యుండును. ఆమె అటువంటి కొండలలో జీవించజాలదు. నీవు కలలో చూచినట్లుగా దిక్కులేని వాడివగుదువు," అని ఆ స్వరము పలికెను.
"నేను ఆలాగు ఉండగోరుట లేదు. ఆ విధంగా నేను జీవించగోరుట లేదు. నేను వేరే ఏదో చేయగోరుచున్నాను. నీవు నన్ను ప్రవక్తగా నుండుటకు పిలచినట్లు చెప్పావు, కావున ప్రవక్త వలె నేను అరణ్యములో జీవించగోరుచున్నాను," అని చెప్పాను. కాని నేను నా స్వంత నెపము చెప్పుచున్నాను; నా స్వంత మేలు కొరకు నేను వేటాడగలను.
ఆయన ఇట్లనెను, "అది పాత నిబంధనలోని ప్రవక్తల పని. నీవు అంత కంటె చాలా ఉన్నతమైన పనిలోనికి పిలువబడి యున్నావు. నీకు అంతకంటె ఎక్కువ వరములున్నవి. రోగులకు ప్రార్థించుటకును, సువార్త ప్రకటించుటకును నీవు పిలువబడితివి. అపోస్తలుల పరిచర్య నీకు తెలియును. గొప్ప సంగతులు, చాలా గొప్ప వరములు నీకున్నవి." ఆయన చెప్పెను, "నిన్ను ప్రతిసారి నేను ముందుకు త్రోయవలెనని ఎందుకు చూచుచున్నావు? నీ ప్రతిఫలము ఎక్కడున్నది?" మరియు ఆయన చెప్పెను "నీకు గుర్తున్నదా? నిన్న నేను చెప్పాను. సహోదరుడు రాబర్సన్ తనకలలో లేదా దర్శనములో ఏమి చెప్పెనో నీకు గుర్తున్నదా? నీవు మోషే వలె చేసియున్నావు. నీ జనుల యొక్క భావనను నీవు మరిచియున్నావు. నేను నిన్ను పిలచిన పిలుపును మరచియున్నావు."
PS 68:18•
HEB 13:8
84నేను రోగులను పరుండనిచ్చాను. ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళవలెనో అని ప్రభువును అడుగుచున్నాను. అది తప్పు. నా స్వంత విధానము నాకున్నది, ఎందుకనగా ప్రజలు నా వర్తమానము వినరని తలంచాను. ఇప్పటి నా జీవితమును మోషేతో నేను పోల్చుకొన్నాను. దేవుడు క్షమించు గాక! కాని అక్షరాలా మోషే అదే చేసెను. ప్రజలను విడుదల చేయుటకు అతడు వచ్చి నా ప్రజలు అతని మాటను వినలేదు. కావున వారిజోలికి పోలేదు. అతడు అరణ్యములోనికి వెళ్ళెను, కాని దేవుడతనిని వెనకకు మళ్ళించెను. మరియు అతడు బాధపడుచున్న ప్రజలను ఎప్పుడో మరచిపోయెను.
"ప్రభువా, అది నిజమేనని నేను చెప్పాను. నాకు విద్య లేదు, గ్రామరు స్కూలుకు మాత్రమే వెళ్ళాను. ఎక్కడ చూచినా ప్రజలు బారులు తీరి యున్నారు. సామాన్య సువార్తను వినగోరుచున్నారు." అది ఎక్కువ. పాత నిబంధనలో యున్నప్పటికన్న ఇది ఇంకా ఎక్కువగుచున్నది. ఆయన ఆరోహణమై పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. చూచారా? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. అప్పుడు నేను మాట్లాడుచున్నాను మరియు అది నాతో తిరిగి నాతో మాట్లాడుట వినుచున్నాను. తరువాత అది నన్ను విడిచిపోయెను.
85"బిల్లీ!" అన్నాను. అతడు గాఢంగా నిద్రపోవుచున్నాడు. నేను అన్నాను, "బిల్లీ, అది నీవేనా?" అతడు అసలు నిద్ర కూడా మేల్కొన లేదు.
(నేను కారు వేగం తగ్గించాను.) "ప్రభువగు దేవా…" "దీని భావమేమిటి?" అని నేను అనుకున్నాను.
"బిల్లీ! బిల్లీ!" అని లేపాను.
"ఏమి కావలెను?" అనడిగాడు.
"నీవు నాతో మాట్లాడుచున్నావా?" అనడిగాను.
"లేదు, ఏమీ, ఎందుకు?" అన్నాడు.
నేనిట్లు పలికాను, "ఒక సంగతి నీకు చెప్పగోరుచున్నాను. కొద్ది కాలం క్రిందట నేను ఒక కల కన్నాను. నా వలె మరియు ఫ్లెచ్ వలె యున్న మనుష్యులను నీవు చూచినది గుర్తున్నదా? నీవు టూసాన్‌కు వెళ్ళినపుడు మీ అమ్మను అడుగు. ఆమెకు నేను ఈ కల చెప్పాను. బిల్లీ, ఏదో జరుగుచున్నది. ఇప్పుడది కొనసాగుచున్నది. ఎవరో నాతో మాట్లాడిరి. అది నీవే అనుకొన్నాను."
LUKE 7:26
86అతడు నా వైపు ఒక వింతగా చూచెను, కొద్దిసేపు మౌనంగా యుండెను. మేము కారు నడుపుకొనుచున్నాము… కొద్ది నిమిషములలో… అతడు మరల నిద్రలోనికి జారుకొనెను. నేను దానిని గురించి ఆలోచించుకొంటూ కారు నడుపుచున్నాను. దాని భావము ఏమైయుండును? రోడ్డు మీద వెళ్ళుచునే యున్నాము. అకస్మాత్తుగా అది మరల నాతో మాట్లాడసాగినది.
ఆయన ఇట్లు పలికెను, "మరల చూడుము! సువార్తికుని పనిచేయుమని ఆదిలో నీకు నేను చెప్పలేదా? ఆ నది యొద్ద నిన్ను పిలచినప్పుడు, నీకు ఆ మాట చెప్పాను గదా?" "మొదటి రాకకు ముందు మార్గము సిద్ధపరచుటకు బాప్తీస్మమిచ్చు యోహానును పంపినట్లుగా…. నిన్ను, నేను పంపుచున్నాను. యోహాను ప్రవక్తల కంటె గొప్పవాడు కాదా?" యేసు స్వయంగా చెప్పెను గదా? "మీరు దేనిని చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా?" "ప్రవక్త కంటె గొప్పవాడు," అని చెప్పెను.
87అప్పుడది అంతయు నా యొద్దకు రాసాగినది. నేనాశ్చర్యపడ నారంభించాను. అప్పుడాయన మరల జనులను నా జ్ఞాపకములోనికి తీసికొని వచ్చెను. మోషే గూర్చి తెలియచేసెను. మోషే అరణ్యములో జనులను ఎట్లు చేరుకొనగలిగెను? ఈ అరణ్యములో నేను జనులను ఎట్లు చేరుకొగలను? నిశ్చయంగా ఆలాగే యన్నది. అప్పుడు, నాకు రెండవ తిమోతి 4 గుర్తుకు తెచ్చెను. ముప్పది సంవత్సరాల క్రితం ఆలయమును ప్రతిష్టించినప్పుడు ఆ ఉదయమున ఏమి జరిగెనో గమనించారా? (కొందరు పాతకాలపు వారున్నారు) ఇరువైపుల నేను నాటిన చెట్లను ఆయన నాకు ఎట్లు చూపించెనో గుర్తున్నదా? ఆ దర్శనమును మీరు గుర్తుచేసికొనండి. అది పుస్తకములలోను, భద్రపరచబడి యున్నది. ఎన్నో సంవత్సరాల క్రితం వాటిని నేను చూచాను. నేను ఏకత్వమును గాని, త్రిత్వమును గాని ఎన్నడూ దాటిపోలేదు. వాటి మధ్యనే నిలబడి యుండి, నేను ఈ చెట్లు నాటాను. రెండు చెట్లు మాత్రమే ఫలములను ఇచ్చుచున్నవి. మిగిలిన చెట్లన్నియూ దాదాపు ముప్పది అడుగులు ఎదిగి ఆగిపోయినవి, అవి ఆకాశములోనికి ఎదిగిపోయినవి. అదే కొమ్మ నుండి విరిగి పోయినవి. చూచారా? ఇరు ప్రక్కల ఉన్నవాటిని విరిచాను. మీకు ఆ దర్శనము గుర్తుండి యుండును. అవునా? అది పుస్తకములలో వ్రాయబడినది. అది నా జీవిత గాధలో యున్నది. అవి ఎంతో వేగముగా ఆకాశమును అంటుకొనినవి. ఫలము కొరకు నీ చేయి చాపి యుంచుమని, ఆయన నాతో చెప్పెను. నేనక్కడికి పరుగిడి వెళ్ళినపుడు, సిలువ యొద్ద దొరికిన ఫలమే నాకు దొరికినది. ఆయన అపుడిట్లు నాతో చెప్పెను, "సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యకు పూర్తి ఋజువును పొందుము. హిత బోధను సహించని కాలము వచ్చును. అయినా నీవు విడిచిపెట్టక, ముందుకు సాగిపోమ్ము." అది అంతయు నా మనస్సులోనికి వచ్చినది.
2TIM 4:3
88అప్పుడు నేను ఈ మార్లిన్ మన్రోను జ్ఞాపకం చేసికొన్నాను, ఆమె వారము రోజులకు చనిపోవుననగా నేనామెను చూచాను. ఆమె ఆత్మహత్య చేసికొనినదని వారన్నారు గాని అది నిజము కాదు. దానిని గూర్చి ముందుగానే నేను చెప్పాను. ఏమి జరుగునో, ఎట్లు జరుగునో నేను చెప్పాను; ఆ బాక్సర్లు గూర్చి కూడా చెప్పాను, ఒకరి నొకరు ఎట్లు చంపుకొందురో చెప్పాను. నేనా బాలికను తప్పుగా అర్థం చేసికొన్నాను. అక్కడ మరియొక బాలిక యున్నది. ఆమె బంధువు డానీ హెన్రీ. ఆమె పేరు ఏమిటి? జేన్ రస్సెల్. ఆమె బంధువు ఒక బాప్టిస్టు అబ్బాయి.
బిజ్నేస్మెన్ అల్ఫాహార విందులో లాస్ఏంజలస్ యొద్ద నేను బోధించుచుంటిని. ఆ సంస్థలలో ఏదో యున్నది, ఆ సంస్థల యొక్క అధిపతి అక్కడ కూర్చొని యుండెను, గొప్ప హోదా గలవారు అక్కడ కూడి యుండిరి. నేను బోధించిన తరువాత వేదికను విడిచిపెట్టాను, సిద్ధపడుచున్నాను… ఆ వర్తమానము రేడియో ద్వారా దేశమంతటికిని ప్రసారము చేయబడినది. అది మారి తిరిగి రావలసి యున్నది. ఈ మార్పు సమయములోనే అతడు రేడియోను ఆపు చేసెను. ఆ వర్తమానమును బయటకు పంపవలసియున్నారు. అప్పుడది బయటకు వచ్చి స్టేషనును వెల్లడి చేయును. నేను క్లిఫ్‌టన్ యొద్ద అల్ఫాహారము భుజింతిని. పై వేదిక మీద నుండి క్రింది దాని మీదికి నేను దిగుచుండగా, దాదాపు ముప్పది సంవత్సరముల వయస్సులో నున్న చక్కని అందమగు యువకుడు నన్ను ఆలింగనము చేసికొనెను. "నేను డానీ హెన్రీని" అని అతడు పరిచయము చేసికొనెను. టెలివైజింగు చేయుచున్నది అతని సోదరుడేనని నాకు తెలియదు. క్రైస్తవ బిజ్నేస్మెన్ ప్రసారమును వారే తీయుదురు. (చలన చిత్ర తారయగు జేన్ రస్సెల్‌కు అతడు సమీప బంధువు). ఆమె తల్లి ఒక పెంతెకోస్తు బోధకురాలు.
89అతడు నా వైపు పరుగెత్తనారంభించెను. నన్ను ఆలింగనము చేసికొని "బ్రన్హం సోదరుడా, దేవుడు నిన్ను దీవించును." "ఇది బక్తిహీనతగా ఉండునని నేను అనుకోవుట లేదు, నా దృష్టికి నీవు బోధించిన వర్తమానము ప్రకటన 23వ అధ్యాయములో యున్నది కాబోలు అన్నాడు." ఆ మాట పలుకగానే, అతడు భాషలలో మాట్లాడసాగెను. అతడు అసలు అటువంటిది ఎన్నడూ విననే లేదు, బాప్టిస్టు శాఖకు చెందిన వాడు. అతడు తెల్లబోయి నా వైపు చూచెను, ఏమి చేయవలెనో తోచలేదు. అప్పుడు అచ్చట ఉండిన ఒకతను ఇప్పుడిచ్చట యున్నాడు. నీవక్కడున్నావా ఫ్రెడ్? ఆ సమయములో అక్కడ ఎందరున్నారు? ఆ సమయములో అక్కడుండిన వారిలో ముగ్గురు ఇచ్చటున్నారు. ఏమి చెప్పవలెనో అతనికి తెలియలేదు.
ఒక గొప్ప ఫ్రెంచి స్త్రీ, అక్కడ కూర్చొని యున్నది. ఆమె ఇక్కడే యున్నది. ఆమె లేచి ఇట్లన్నది, "దానికి ఏమీ భావము చెప్పనవసరము లేదు." "అది శుద్ధమైన ఫ్రెంచ్ భాష."
"నాకు ఒక్క ఫ్రెంచి మాట కూడా తెలియదు," అని అతడనెను. అతడు పలికిన దానిని ఆమె వ్రాసెను.
ఆ మూలన కూర్చొని యున్న వ్యక్తి లేచి అది నిజమేననెను. నేను కూడా దానిని వ్రాసియున్నాను. అది ఫ్రెంచి భాష అని అతడు చెప్పెను. బాగా వెనుక భాగమున కూర్చొనియున్న అందమగు వ్యక్తి తాను వ్రాసిన దానిని సరి చూచుకొను చుండెను, అతనికి చక్కని జుట్టున్నది, గోడకు ఆనుకొని నిలబడియుండెను. ముందుకు వచ్చి ఈ చెప్పిన దానితో తాను వ్రాసినది పోల్చి చూచుకొనుచుండెను. అతడు ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచి అనువాదకుడు. ఇక్కడున్న ఈ వ్యక్తి విక్టర్ లాడ్యూక్సు. ఆర్నేవిక్ చర్చికి చెందిన వాడు, దానిని అతడు వ్రాసెను. దాని యొక్క భావము నా వద్ద ఉన్నది.
90దీనిని నేను చదివెదను, వినండి:
విక్టర్ లాడ్యూక్సు అను నేను పూర్తిగా ఫ్రెంచి రక్తము గలిగిన వాడిని; తిరిగి జన్మించిన క్రైస్తవుడను, పరిశుద్ధాత్మతో నింపబడి యున్నాను. నా అడ్రసు ఇది: 809 నార్త్ కింగ్ రోడ్, లాస్ ఏంజలస్ 46. నేను బేతెల్ ఆలయమునకు హాజరు అవుచున్నాను. దానికి సంఘ కాపరి పాస్టర్ ఆర్నివిక్.
బ్రన్హం సోదరుని గూర్చి చెప్పబడిన ప్రవచనమునకు ఒక నిజమగు అనువాదమును నేనిచ్చుచున్నాను. దీనిని డానీ హెన్రీ ఫ్రెంచ్ భాషలో ఇచ్చెను. ఫుల్ గోస్పెల్ బిజ్నేస్మెన్ అల్ఫాహార విందు యొద్ద 1961, ఫిబ్రవరి 11న ఇచ్చెను. ఆ ప్రవచనమునకు సరియైన తర్జుమా ఇది.
అతడు వ్రాసినది ఇట్లున్నది:
నీవు ఇరుకు మార్గమును ఎన్నుకొంటివి, అది కఠినమగు మార్గము, నీ స్వంత ఏర్పాటుతో దానిలో నీవు నడిచితివి. (దానిని నేను గ్రహించగలను. మోషే కూడా తన స్వంత మార్గమును ఎన్నుకొనెను. చూచారా?)
నీవు సరియైన, ఖచ్చితమైన మార్గమును ఎన్నుకొని యున్నావు. (సరియైన తీర్మానము.) అది నా మార్గము. (క్రింద గీత గీయబడెను "నా మార్గము" పరిశుద్ధాత్మ తిరిగి మాట్లడుచుండెను)
ఈ క్షణిక తీర్మానమును బట్టి, నీ కొరకు పరలోకములో పెద్ద భాగము ఎదురు చూచుచున్నది… నీ కొరకు కనిపెట్టుచున్నది.
ఎంత మహిమకరమగు నిర్ణయము. (ఇపుడు, జాగ్రత్తగా వినండి) ఎంత మహిమకరమగు నిర్ణయమును, నీవు తీసికొంటివి! ఇది దానికదే సమకూడును, నెరవేరును, దైవిక ప్రేమలో అద్భుతమగు జయమును ఇచ్చును.
91మీరు గమనించండి. అది క్రియా విశేషణమునకు ముందున్న క్రియా పదము. చూచారా? ఫ్రెంచ్ భాష, దానికి ఐక్యరాజ్య సమితి అనువాదకుడు అర్థము చెప్పెను. మాట్లాడిన వ్యక్తికి ఒక్క ఫ్రెంచి పదము రాదు. ఎన్నడూ వినలేదు, భాషలలో మాట్లాడుట అతనికి ఎంతో క్రొత్త సంగతి. అతడు ఒక బాప్టిస్టు వాడు. సంగీతము వినుటకు అక్కడికి అతడువచ్చుట జరిగినది, నేనచ్చటికి వచ్చితినని తెలిసికొని నా మాటలు వినుటకు ఆగెను.
ఇప్పుడు… "దైవిక ప్రేమలో" — దైవిక ప్రేమ. పరిశుద్ధాత్మ లేకుండా దైవిక ప్రేమ ఎక్కడ నుండి రాగలదు? పరిశుద్ధాత్మయే దైవిక ప్రేమ.
92నేను, బిల్లీ దారిన వచ్చుచున్నాము… చూడండి. మార్గములో దిగువకు వచ్చుచున్నాము, బిల్లీ మరల నిద్రకు ఉపక్రమించెను. "నీకు నిత్యమగు సూచన ఇచ్చెదను," అని స్వరము పలికెను.
నేను ఇంకొంతసేపు వేచి చూచాను గాని, మరేమియూ జరుగలేదు. "ప్రభువా, నిత్యమగు సూచన అనగా ఏమిటి?" అనడిగాను. కొద్ది నిమిషములు నేను ఆగాను. నేను బిల్లీని మరల చూచాను. అతడు నిద్రపోవుచుండెను.
"నేను నీకు నిత్యమగు సూచన ఇచ్చెదనని," ఆయన మరల నాతో చెప్పెను. "నీ వున్న చోట నుండి పశ్చిమ దిశగా చూడుమని నాకు చెప్పెను."
మరియు నేను ట్రక్కులో నుండి నా తలను త్రిప్పి చూచాను. (వేగము తగ్గించాను) ప్రభువు యొక్క ఆత్మ… నేను కేకలు వేసి గంతులు వేయవలెనన్న అనుభూతిని పొందాను. నేను తిరిగి చూచాను, మరియు కొండలన్నియూ తెల్ల టోపిలు ధరించినట్లున్నవి. "నాకు నిత్యమగు గురుతు ఏదీ కనబడుట లేదని చెప్పాను."
"దానంతటి మీద నీ పేరు వ్రాయబడియున్నదని," ఆయన చెప్పెను.
"ఇదేమిటని? నేను ఆలోచించసాగాను." నాకు చాలా బలహీనత కలిగినది. నేను ఆగసాగాను.
బిల్లీ మేల్కొని నాతో ఇట్లనెను, "నీతో ఏమి సంగతి?" నేను నా చేతులు ఇలాగు లాగుకొన్నాను; నా చేతులలో నుండి చెమట కారుచున్నది, మరియు మంచు కురుయుచున్నది.
93నేను అన్నాను, "బిల్లీ, ఏదో జరుగుచున్నది. ఎక్కడ నేను తప్పు చేశానో నాకు తెలియుట లేదు. మొత్తము మీద ఎక్కడో నేను, దేవుని పట్ల తప్పు చేశానని ఎరుగుదును అన్నాను." ఒక పాట ఎవరో పాడుచున్నట్లుగా నాకు వినబడినది. వేలాదిమంది కుంటివారు, గ్రుడ్డివారు, అవిటివారు పడియున్నట్లుగా భావించాను. బహు సమూహములు ఆ పాటను పాడుచున్నట్లుగా విన్నాను. బాగా తెలిసిన ఒక గొంతు పాడుచున్నది:
అపవిత్రత! అపవిత్రత! దురాత్మలు తరుమబడెను!
(ఆ పాట మీకు తెలియును.)
యేసు వచ్చి బానిసలకు స్వాతంత్య్రమిచ్చెను.
ప్రతి చోట రోగులు వరుసలలో పడియుండుట, నేను చూచాను. నేను ఆగిపోవలసివచ్చెను. ఏమి జరుగుచున్నదో బిల్లీకి తెలియదు, మరియు నేను పైకి చూచాను.
94నేను ఆగి పర్వతం మీదికి చూచాను, మరియు ఆ ఏడు కొండలు నాకు కనబడినవి. మరియు ఇక్కడ నీవు చూడాలనుకుంటే మరొక సంగతి! ఒక పర్వతము పై భాగమున ఏడు శిఖరములు కనబడినవి, ఒక పర్వతము, అది చాలా మైళ్ళ పొడవున యున్నది. ఆ చివరి పర్వతము దాటినచో మరొక దేశములోనికి నీవు చేరగలవు. దాని తరువాత ఇక పర్వతములు లేవు, అది తూర్పు నుండి పడమరకు పోవుచున్నది. దాని పై భాగాన మంచు కప్పబడియున్నది.
మొదట రెండు చిన్న కొండ చివరలు కనబడినవి, తరువాత పెద్ద శిఖరాగ్రమున్నది. ఆ తరువాత మరియొక చిన్న శిఖరాగ్రము, ఆ తరువాత పెద్ద శిఖరాగ్రము ఉన్నవి. ఆ విధంగా పెద్దవి, చిన్నవి, పెద్దవి, చిన్నవి కనబడినవి. ఆ పర్వతముల మీద మంచున్నది. "ప్రభువా, దాని అర్థము నాకు తెలియుట లేదు" అన్నాను.
"ఎన్ని కొండ శిఖరములున్నవి?" అనడిగెను.
"ఏడు" అన్నాను.
"నీ పేరులో ఎన్ని అక్షరములున్నవి?" అని ప్రశ్నించెను. B-R-A-N-H-A-M M-A-R-R-I-O-N. B-R-A-N-H-A-M
EXOD 20:9,10•
DEUT 5:13,14
95మూడు గొప్ప అసాధారణమగు శిఖరాగ్రములున్నవి. "ఆ మూడు శిఖరాగ్రములు ఒకటి, రెండు మరియు మూడు ఈడ్పులు. మొదటిది నీ పరిచర్యలోని తొలి భాగము, చిన్న కొండ; ఆ తరువాతది మొదటి ఈడ్పు ఇంకా హెచ్చుగా యుండును," అని ఆయన చెప్పెను. చేతిలోని గురుతును మీరెరుగుదురు. ఆ మధ్యలో ఆ తరువాత చిన్న ఖాళీ యున్నది, నేను బాగా అలసిపోయి దానిని దూరపరచుకొన్న సమయము. మీలో చాలామందికి అది గుర్తుండును. ఆ తరువాత వివేచన వచ్చెను, అది రెండవ ఈడ్పు. ఇప్పుడు, మరియొకటి నాకు ఉన్నది… కొద్ది సంవత్సరములే ఆ చిన్న కొండలు. చూచారా, గతమున, అప్పుడు నా పరిచర్య ఉన్నట్టుగా. ఆ తరువాత మూడవది వచ్చెను.
మూడు అనునది సంపూర్ణ సంఖ్య. చూచారా? మూడవది. ఆ తరువాత శిఖరము అయిదు. అది కృపా సంఖ్య. ఆ తరువాత శిఖరము ఏడు, అది పరిపూర్ణ సంఖ్య, ముగింపు. "ఆరు దినములు, మీరు కష్టించి పని చేయవలెను. ఏడవది విశ్రాంతి దినము, వారము యొక్క అంతము, కాలము యొక్క ముగింపు." చూచారా? నేను ఆగి దానిని బిల్లీకి చూపించాను. వాటిని నేను తేరి చూచాను.
ఆయన నాతో ఇట్లనెను. "దానిని ఆలాగే నిలవనిమ్ము. నీ మనస్సులో ఎన్నడయినా ఏదయినా సందేహము కలిగినయెడల, ఈ స్థలమును గుర్తుకు తెచ్చుకొనుము. ఇక్కడికి తిరిగి రమ్ము."
96బిల్లీ నా భుజం మీద తట్టి ఇట్లనెను, "డాడీ, తూర్పు వైపుకు చూడుము!" అదెట్లు ఏర్పడినదో నాకు తెలియదు, కాని ఆ రోడ్డుకు తూర్పు వైపున ఒక కుప్ప మండుచున్నది. ఏ పట్టణమును ఆ దరిదాపుల్లో లేదు, చాలా మైళ్ళ దూరంలో యున్నవి, ఒక పెంట కుప్ప ఆ రోడ్డుకు ఎడమవైపున యున్నది.
నేను పొలమునకు తిరిగి వచ్చుచున్నాను. ఆమేన్. ముసలితనమయినా, యవ్వనమయినా, చనిపోయినా, బ్రదికినా, నేను మరణము వరకు దేవునికి లోబడి యుందును. ఆయన నన్ను విడిపించెను… నేను దేవునిని నిందించినంత పని చేశాను… కాని తెలిసి చేయలేదు. నేను ప్రయత్నించాను. దీనిని నేను చెప్పగలను. చూచారా? (కొంత టేపు మిగిలియున్నదా?) దీనిని నేను అందులో చెప్పగలను. యేసు క్రీస్తుయొక్క ప్రత్యక్షతను, నేను ఏ మాత్రము సందేహించకుండా చూడగోరాను. ఈ వినుచున్న సోదరులు, ఈ సంఘము దీనిని గుర్తుంచుకొనవలెను. ఇన్ని సంవత్సరములు ఈలాగుండుటకు కారణమున్నది. చెప్పినదేదియూ జరుగకుండా ఎన్నడూ యుండలేదు. ఎవరూ అది జరుగలేదని చెప్పజాలరు. నేను సవాలు చేయుచున్నాను, వేలాది సంగతులను ఈ వేదికపై నుండి వెల్లడించాను, వివేచనలు చెప్పాను, జరుగబోవు వాటిని గూర్చి ముందే చెప్పాను… అక్షరాలా ఆ విధంగానే జరిగియున్నది! దానిని సంఘము నమ్ముచున్న యెడల, "ఆమేన్" చెప్పవలెను. ప్రపంచములో ఏ ఒక్కరును జరుగలేదని చెప్పజాలరు. అయితే సంఘమునకు ఇది తెలియును, ఆ తరువాత సంఘమునకు ఇది తెలియవలెను: దేవుడు ఒక మనిషిని పైపు గుండా ముందుకు త్రోసినట్లయితే మరియు అతడు దేవుడు చెప్పు వరకు కదలడు, అక్కడ దానికి విశ్వాసమునకు చోటుండదు. అది దేవుడు నిన్ను ఒకదాని కొరకు త్రోయుచుండెను. మరియు అది పరిచర్యను కట్టినది ఒక స్థానము వరకు, దానికి వ్యతిరేకముగా ఎవరునూ ఒక్క మాటయు పలుకజాలరు. కాని ఇక మీదట నుండి, నేను మీకు ప్రభువు నామములో చెప్పుచున్నాను, మీరందరూ వినండి, నేను విశ్వాసము ద్వారా ముందుకు పోవలసియున్నాను. విశ్వాసము ద్వారా దానిని నేను చేయవలసియున్నాను. నేను దానిని తప్పుగానో, ఒప్పుగానో భావించవచ్చు. నేను ఎన్నిక చేసికొనిన దాని ప్రకారము వెళ్ళి పని చేయుదును. ఎందుకనగా అది తప్పు కాదు, ఆయన నన్ను చేయుమని చెప్పు వరకు నేను ఎదురు చూచాను. నేను కాదు. ఆయన కొరకు నేను ఎదురు చూచాను. అది ఆయనే!
97కాని మీరు చూడండి, గొప్ప పరిశుద్ధుడగు పౌలు కూడా ఒకసారి సంకట పరిస్థితుల మధ్య చిక్కుకొనెను. అనేకసార్లు దేవుడు ఈ క్రియలను చేయును, లేదా తన దాసుల ద్వారా జరిగించును, అవి తప్పులుగా కనిపించవచ్చును గాని వాటి ద్వారా అన్నియూ రుజువగును. మానవులు పొరపాట్లు చేయుదురని మనకు తెలియును, కాని దేవుడు పొరపాటు చేయడు. నేను ప్రసంగించుచూ నా విధానమును కొనసాగించు చుండవచ్చును, ముందున్న కూటములకు సిద్ధపాట్లు చేయవలెను. అన్నియూ సరిదిద్ధవలెను. బహుశా గొప్ప కాలము వచ్చుచున్నది, అందుకొరకే మనము ఎదురుచూచుచున్నాము. నిశ్చయంగా, ఇది అద్భుతమగు విషయము, ఇది నెరవేరును, స్థిరపడనై యున్నది. దైవ ప్రేమలో అద్భుతమగు విజయముండును. (క్రియ విశేషణము ముందు క్రియ యున్నది) దైవిక ప్రేమ అనగా దేవుడే. చూచారా? దేవుని యొక్క ప్రేమ, ముందు వరుసలో ఉండి పనిచేయును మరియు జనుల కొరకు ఖాళీలో నిలచును.
98ఈ "రికీలు" మరియు రికెట్టులు చూడండి. ఇవి చాలా మోటు పదములు. వారిని నేను రికీ మరియు రికెట్టా అని పిలిచాను. దేవుడు నేను చేయరానిది చేయకుండునట్లు గ్రహింపునిచ్చును గాక! చాలామంది ఆయన పిల్లలు గానే యున్నారు. వారు ఎంతో వేరుగా ప్రవర్తించుచున్నారు, అది వారిచేతుల్లో లేదు. చల్లబడిన నామకార్థ సంఘములలో వారున్నారు. ఆ ఆత్మ వారి మీద యున్నది, వారు ఇశ్రాయేలీయులు చెరలో యున్నట్లుగా, చెరలోనే యున్నారు. వారి బానిసత్వము నుండి వారిని విడిపించుటకు మోషే వెళ్ళెను… యేసు క్రీస్తును ప్రేమించిన మానవులు దేనిద్వారా ఆయనకు సేవ చేయవలెనో తెలిసికొనినచో, ఆ ప్రకారముగా వారు సేవ చేయుదురు. శాఖత్వము అను దాస్యము క్రింద వారున్నారు. "ఇది చేయరాదు." "అది చేయరాదు" అని వారికి చెప్పుచున్నారు.
99కాని దేవుడు పిలుపు తప్పక రావలెను, "వాగ్ధాన దేశము వైపు పయనించుచున్న వారినందరినీ, పయనించనీయండి!" మనము వాగ్ధాన దేశమునకు పోవు మార్గములో యున్నాము. ఆమేన్! వారిని ముందుకు రానీయండి. అంత్యకాలమునందు క్రీస్తును కలిసికొను దారిలో మనం ఉన్నాము. మీరు దీనిని చూడునట్లుగా దీనిని మీ యొద్దకు తేగోరుచున్నాను. ఒక మనిషి తప్పు చేయవచ్చును, అయినా అతడు యధార్థవంతునిగానే యుండును.
మోషేకు తన ప్రజల యొక్క భారము పోయెను, ఎందుకనగా వారతని మాట వినుట లేదు. రాయ్ సోదరుడా, నీ కలను నీవు చూచావా? నా హృదయములో దానిని గూర్చి వేరే భావము రాని యెడల, నేను అటువంటి సేవలో ముందుకు పోజాలను, దేవుడు నాకు చెప్పినా. కాని అదే ఆ మార్పు సహోదరుడా రాయ్… (ఆయన అది వచ్చుట చూచెను). ఏదో నన్ను మార్చవలసి యున్నది, ఎందుకనగా నా హృదయములో అటువంటి భావన యున్నది. ఇపుడు, నేనున్న మాదిరిగా బయటకు వెళ్ళిన యెడల ఏమగును? వారు వర్తమానమును వినవలసియున్నారనే అనుకొందును. నాకుండవలసిన ప్రేమ జనుల మీద నాకుండదు. ఆ ప్రేమ భావము నాలో ఏర్పడు వరకు నేను పయనించవలసిన అవసరము లేదు, ఎందుకనగా నేను వేషధారినగుదును.
100నిజమగు హృదయముతో ఇన్ని సంవత్సరములు, నేను ఆయనకు సేవ చేయవలెనని ప్రయత్నించాను. వేషధారిగా ఉండి నేను ముందుకు వెళ్ళజాలను. వారు "రిక్కి మరియు రికెట్టా" గుంపు భావన నాకు రావలెను. దేవుని ప్రజలు దాస్యములో యున్నారు మరియు వారి యొద్దకు నేను తప్పక వెళ్ళవలెను. ఆ చింత నాకు రాకుండా, నేను తిరిగినందు వలన ఏమి ప్రయోజనము? కొన్ని కూటములలో నేను బోధించెదను, కాని ఆగుము.
101చిన్న పాట ఉన్నది. నేను పాడలేను. దానిని మీకు చూపించగోరుచున్నాను. దానిని నేను సరిగా పలుకలేకపోయాను. దానిని సరిగా వ్రాయలేదు. దానిని నేను చదువగలనో లేదో కూడా నాకు తెలియదు. అది దేశ యుద్ధ గీతము వలె రాగమును కలిగియున్నది.
మహిమ! మహిమ, హల్లెలూయా! (దానిని మీరు విన్నారు)
మహిమ! మహిమ, హల్లెలూయా! (మనమందరం విన్నాము)
తిరిగే స్వారీ బోధకుడు దేశమంతా స్వారీ చేసెను.
అతని భుజము మీద తుపాకీ యుండెను.
అతని చేతిలో బైబిలు ఉండెను.
ధన్యకరమగు వాగ్ధాన భూమిని గూర్చి
అతడు గడ్డి మైదానములలోని జనులకు చెప్పెను.
అతడు స్వారీ చేయుచూ,
గానము చేయుచూ వెళ్ళెను.
అనుకొనెను, ఆనుకొనెను, నిత్య హస్తము మీద
ఆనుకొనెను ఆనుకొనెను,
ఆనుకొనెను నిత్య హస్తము మీద ఆనుకొనెను.
అగ్ని గంధకములతో రాబోవుచున్న,
తీర్పు గూర్చి అతడు బోధించెను;
మహిమకరమగు, అనంతమగు పరలోకము,
నీతిమంతులకే అది చెందును.
అతడు పర్వతముల గుండా స్వారీ చేసెను,
అతడు ఈ పాట పాడుట మీరు వినగలరు.
అతడు స్వారీ చేయుచూ వెళ్ళెను.
అందులో శక్తి యున్నది,
శక్తి యున్నది అద్భుతములు చేయు శక్తి యున్నది
గొర్రెపిల్ల రక్తములో.
శక్తి యున్నది, శక్తి యున్నది,
ఓ! అద్భుతములు చేయు శక్తి యున్నది,
గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమగు రక్తములో.
102ఆ ముసలి స్వారీ బోధకుడు. అతడు మీకు గుర్తున్నాడా? చూచారా?
ఇపుడతని తుపాకీ పాతబడి తుప్పు పట్టినది
గోడ మీద వ్రేలాడుచున్నది;
అతని బైబిలు మాసిపోయి ధూళి పట్టినది
దానిని అసలు ముట్టుకొనుట లేదు; (ఇది నిజం)
కాని అది అందించు వర్తమానము
ఆ దినమున మనలను కలిసికొనును,
దేవుని సత్యము ఇంకా ముందుకు
కొనసాగిపోతున్నది.
అందరూ:
మహిమ! మహిమ, హల్లెలూయా!
మహిమ! మహిమ, హల్లెలూయా!
మహిమ! మహిమ, హల్లెలూయా!
ఆయన సత్యము ముందుకు పోవుచున్నది.
HEB 13:8
103దానిని నేను నేర్చుకొనగోరుచున్నాను. దానిని వ్రాయుచూ ఈ ఉదయమున నేను నిలబడ్డాను. గోడ మీద వ్రేలాడుచున్న పాత తుపాకీని పట్టుకొన్నాను. అది ఎంతో కాలము ఉండదని నేనెరుగుదును.
తుపాకీ పాతబడి తుప్పు పట్టినది,
అది గోడమీద వ్రేలాడుచున్నది (అది నిజము)
బైబిలు మాసిపోయి ధూళి పట్టి యున్నది.
దానిని అసలు ముట్టుకొనుట లేదు.
కాని బైబిలు నుండి వచ్చిన,
ఆయన వర్తమానము ఒక దినమున.
తీర్పు నొద్దకు వచ్చును;
ఆయన సత్యము, ముందుకు కొనసాగును.
ఈ బైబిలు దేవుని యొక్క సత్యము. మీద యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
104ఆ ముసలి స్వారీ బోధకుడు తన వీపు మీద తుపాకీని, తన చేతిలో బైబిలును మోసికొనిపోతూ గడ్డి మైదానముల మీద నుండి వెళ్ళిపోయెను, కొండ మీద నుండి వెళ్ళుచుండెను, గోతులలో నుండి దిగి పోవుచుండెను, అన్ని చోట్లకు వెళ్ళుచుండెను; రాబోవుచున్న వెయ్యేండ్లపాలన గూర్చి బోధించుచుండెను. రానున్న భయంకర తీర్పు గూర్చి చెప్పుచుండెను. దుర్నీతి పరులకు శిక్షపడును. నీతిమంతుల కొరకు దేవుని యొక్క రాజ్యము గూర్చి బోధించుచుండెను. అది నిజము. ఆ పాత వించెస్టర్ తుపాకీ తుప్పు పట్టుచుండెను. బైబిలుకు బదులుగా కొన్ని అసభ్య గ్రంథములు చోటు చేసికొనుచుండెను. కాని దేవుని యొక్క సత్యము ఇంకా ముందుకు కొనసాగి పోవును. ఆయన ఎల్లపుడూ ఉన్నరీతిగానే ఈనాడును వాస్తవ రూపములో యున్నాడు. నేడు నిజముగానే ఆయన యున్నాడు.
దేవుని సత్యము ముందుకు పోవుచున్నది.
మహిమా! మహిమా, హల్లెలూయా!
మహిమా!మహిమా, హల్లెలూయా!
మహిమా!మహిమా, హల్లెలూయా!
ఆయన సత్యము ముందుకే పోవుచున్నది.
HEB 13:8
105ఎందువలన? ఎవరో దానిని తీసుకొందురు. ఏలయనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. దానిని మరలా పాడుదుము. ఇప్పుడు, మనము మిశ్రిత జనాంగముగా ఉన్నాము. మెతడిస్టు, బాప్టిస్టు, లూధరన్ మొదలగు వారున్నారు. ఆ చివర వచనము మనము పాడుచుండగా, మీ చుట్టూ ఉన్నవారిలో ఒకరితో కరచాలనము చేయండి. తరువాత మనము ముగించుకొందుము.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, మీ సొంత సంఘములకు వెళ్ళవలసి ఉన్నవారు ఈ రాత్రికి వెళ్ళండి. మీ సంఘ కాపరికి నా వందనములు తెల్పండి. మీ ప్రతి ఒక్కరు నా కొరకు ప్రార్థించండి. ఆ తరువాత విషయము వినండి. మీకు ఎక్కడకీ వెళ్ళుటకు స్థలము లేనిచో ఇక్కడికి రండి. ఈ రాత్రికి సహోదరుడు నెవిల్ వర్తమానము అందించిన తరువాత నేను ఒక టేపు చేయగోరుచున్నాను, దాని పేరు: ఆయన రాకడ యొక్క ప్రకాశమాన ఎర్ర దీపములు. మీరు చూచారా? ఈ రాత్రి ప్రభు మిమ్ములను దీవించును. వచ్చే వారము అనగా వచ్చే ఆదివారము, ప్రభుని చిత్తమైతే నేను మరలా ఇక్కడకి వచ్చి మరియొకటి చేయుదును, ఎందుకనగా ఈ తరువాత వారములో నేను అర్కాన్సాస్‌లో ఉండవలసియున్నాను.
106సరే మంచిది. మరలా ఆ పాట పాడి కరచాలనము చేయుదుము.
మహిమా! మహిమా! హల్లెలూయా!
మహిమా! మహిమా! హల్లెలూయా!
(ప్రభువగు యేసు
ఈ చేతి రుమాళ్ళను దీవించండి. )
దేవునికి స్తోత్రములు! ఇప్పుడు, మనము తలలు వంచి ఒక క్షణము ప్రార్థించుదుము.
107రడిల్ సోదరుడా! సమయానికి వచ్చావు, ఒక నిమిషము ఇక్కడకి రమ్ము. ఆ రడిల్ సోదరుడు మన జత పని వారిలో మరియొక సహోదరుడై యున్నాడు. ఇది ఆయా సంఘముల చిన్న సమాఖ్యగా ఉన్నది, అందరము కలిసి యున్నాము. శాఖా బేధము ఇందులో లేదు. సువార్త కొరకు రడెల్ సోదరుడు ధైర్యముగా నిలబడి యుండుట నేను విన్నాను. రడెల్ సోదరునికి దీనిని చెప్పుచున్నాను, మనము ప్రయాణించు మార్గము సుఖమైన పూలపానుపు అని దేవుడు వాగ్ధానము చేయలేదు, కాని ఇది ఒక యుద్ధము యని ఆయన వాగ్ధానము చేసెను. అవును, అయితే జయము మనదే అని ఆయన చెప్పెను. అది మరువరాదు.
నేను మొదటిసారి ఈలాగు నిలబడినప్పుడు ఎట్లుండెనో మరిచిపోలేదు. నా సొంత తల్లిదండ్రులు నన్ను ఇంటిలో ఉండవద్దని కోరిరి చూశారా? ఓ మై! అయితే ప్రభువైన యేసు నామములో వారికి నేను తరువాత బాప్తీస్మము ఇచ్చాను. ఇలాగు గట్టిగా నిలబడి యుండుటయే నాకున్న ఒకే ఒక నిరీక్షణ. బైబిలు యొక్క వర్తమానము ఆ ముసలి స్వారీ బోధకుని కాలము మొదలుకుని నేటి వరకు మారలేనందుకు నాకెంతో సంతోషముగా ఉన్నది. కొందరు దానిని తమ చేతుల్లో పట్టుకొన్నారు, మరియు చుట్టూ కత్తిరించారు, శాఖలుగా మార్చారు. విశ్వాస ప్రమాణములు, సిద్ధాంతములు దానికి చేర్చారు, అయినా సత్యము ముందుకు కొనసాగుచున్నది. నిజము. అది ఇంకనూ ముందుకు పోవుచున్నది.
108మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును, బహు త్వరలోనే మిమ్మును మరలా చూచుదునని ఆశించుచున్నాను. అంతవరకు సోదరులగు మీరు అనగా ఇక్కడ ఉన్నవారు, వినుచున్న వారు నా కొరకు ఒక మేలు చేయగలరా? అక్కడి ఆ పరిస్థితుల్లో నేను పొగొట్టుకొనిన దానిని దేవుడు మరలా నా హృదయములో ఉంచునట్లు ప్రార్థించండి. ఒక విధమగు భావమును అల్లుకునుట చాలా తేలిక. ఇక్కడ కూర్చొని యున్న వే సోదరునితో ఒక రోజు నేను మాట్లాడుచుంటిని. అతడు ఇప్పుడు, ఇక్కడే ఉన్నాడు. మంచి మనిషి, కాని తనలో తాను ఏదేదో ఊహించుకొనుచుండును. అది మరో విధమగు స్వభావము. దాని వలన కూడా ఇదే జరుగును. వే సోదరుడా! నీవు తేలికగా దానిని చేయగలవు, చిన్న దానిని గూర్చి నీ మనస్సులో ఆలోచన అల్లుకొనుచుందువు. దానికి అంతు ఉండదు అందుకే నీవు వెనుకకు వచ్చి వాక్యముతో దానిని పరీక్షించుకొనుము. అది సరి అయినదో కాదో తెలుసుకొనుము, ఆ తరువాత అక్కడ నుండి కదులుము. జనులను గూర్చిన చింతను పొగోట్టుకొనవద్దు. చూశారా! వారు రంపపు పొట్టు నుండి తయారు కాలేరని తప్పక జ్ఞాపకం ఉంచుకొనవలెను. వారు రక్తమాంసములను, ఒక ఆత్మను కలిగి యున్న మానవ మాత్రులు. మీ అందరు మా కిష్టమైతే నా గూర్చి ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడు మిమ్ములను దీవించును.
మనము తలలు వంచుదుము. ఆ రడిల్ సోదరుని రమ్మని అడుగుచున్నాను.
109[ఒక మనుష్యుడు మాట్లాడుటకు అడుగుచున్నాడు.] సోదరుడా మంచిది. [ఆయన ఒక కలను చెప్పుచున్నాడు] దేవునికి స్తుతి కలుగును! ఈయన ఒక దైవదాసుడు. కొందరికి తెలియక పోవచ్చును. ఆ కలలో చెప్పబడిన ఒక గుంపుకు అతడు చెందియున్నాడు(ఈ ఉదయము నాకు సమయము లేదు) ఆ కలలో ఒక చోట నేను మరోదారికి పోవుచున్నట్లు చెప్పబడెను. చూడండి, పడమరకు వెళ్ళుచున్నాను, ఈ చివరిసారిగ పడమరకు వెళ్ళుచున్నాను. సహోదరుడు జె.టి. పార్నిల్.
110కలల గురించి కలలు కనువారు గురించి ఆశ్చర్యపడుచున్న క్రొత్త వారు కొందరు ఇక్కడ ఉండి యుండవచ్చును. అయితే, అన్ని రకముల కలలను తీసుకొనుట లేదు, కాని బైబిలు చెప్పెను అని మనము నమ్ముచున్నాము, "అంత్య దినములలో మనుష్యులందరి మీద, నా ఆత్మ కుమ్మరించెదననియు; వారు ప్రవచించెదరని, దర్శనములు చూచెదరనియు, కలలు కనుదురనియు." అది బైబిలు యొక్క పుటలలో ఉన్నంత కాలము దానిని నమ్మి బోధించవలసిన విధి నాకున్నది. జనులు వచ్చి కలలను చెప్పినప్పుడు, ప్రభువు దాని భావమును తెలియపరచనిచో ఊరకుందుము. ఎవరైన భాషలలో మాట్లాడినప్పుడు అది తప్పక సంఘమునకు క్షేమము కలిగించునదై యుండవలెను. మరియు తప్పక జరుగ వలయును, లేని యెడల అది దురాత్మ నుండి వచ్చినది. అది తప్పక నెరవేరవలెను, ఎందుకనగా భాషల యొక్క భావమే ప్రవచనమై యున్నది. అది నిజమని మనకు తెలుసును. బైబిలులో ఉన్న దాని ప్రకారముగా జీవించుటకే ఇక్కడ మనము ప్రయత్నించుచున్నాము. దాని నుండి ఏది తీసివేయరాదు, దానికి ఏదియు చేర్చరాదు. ఉన్నదాని ప్రకారముగా జీవించవలయును. ప్రభువు ఆశీర్వదించబడును. జే.టి సోదరుడా, అది నాకు సహాయము చేయును; బయటికి వెళ్ళి పాపములో రాజీపడమని దేవుడు నాకు చెప్పలేదు. కాని బయటకు వెళ్ళి పనిని కొనసాగించమని చెప్పెను.
111ఇప్పుడు మనము ప్రార్థించుకొనుదుము, [జనులలోని ఒక స్త్రీ కేకలు వేయుచున్నది] ఎవరో స్పహ తప్పి పడిపోయిరి. ఒక నిమిషం పాటు అందరు మౌనంగా ఉండండి!
మరమ తండ్రీ, నీ కృప అందించి వే సోదరుని స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామములో అతడు బాగుపడును గాక! లోకములో అతనికి శక్తి నిచ్చినందుకు ప్రభువా! నీకు వందనములు చెల్లించుచున్నాము.
నాకు సహాయము చేయండి, అతని గుండె మరలా కొట్టుకొనుట ఆరంభించినది. ప్రభువైన యేసు నీ కృపయు కనికరము ఆయనతో ఉండనిమ్ము. దాని పని అయిపోయినది. సమాధి కార్యక్రమములు బోధించబడిన ఈ వేదిక మీద నేను నిలబడియున్నాను. నేను నిలబడియున్న ఈ స్థలము మీద నుండి వందలాది జనులకు ప్రార్థన చేసి క్రీస్తు నొద్దకు నడిపించాను. నేను వంగి చూచినప్పుడు అతని కన్నులు మూసుకొని పోయినవి, అతని నాడి ఆగిపోయినది. యేసుక్రీస్తు నామమున ప్రార్థన ప్రారంభించగానే నాడి కొట్టు కొనసాగినది. సిలువ పరిచారకునిగా యేసుక్రీస్తు నామములో దీనిని చెప్పుచున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు కదా! ఒక గుండెపోటు చూచారా! అది ఇక్కడ జరిగినందుకు నేనెంతో వందనములు చెల్లించుచున్నాను. మనమంతా వెళ్ళిపోయిన తరువాత జరిగినచో, మరో విధంగా ఉండేది. దేవుని యొక్క కృపను చూచారా! ప్రభువే స్తుతింపబడును గాక! మన తలలు వంచుదుము.
112పరమ తండ్రీ, నీ మేలు నిమిత్తమును, నీ కృప నిమిత్తమును, ఇప్పుడు నీకు వందనములు చెల్లించుచున్నాము. నీవు నిత్యము మా మధ్య ఉన్నావు ప్రభువా! నా దీపములో నూనెను దయచేయుము. ప్రభువు యొక్క దండము నాకు అనుగ్రహించుము. దానిని నేను రోగుల మీదను, శ్రమపడుచున్న వారి మీదను చూపెదను. అవసరతలో నున్న వారికి విడుదల కలిగించెదను. దానిని నిరాకరించు వారికి తీర్పు తీసుకొని వచ్చెదను. తండ్రీ, దయచేయుము! మా మేలులన్నిటి కొరకు యేసుక్రీస్తు నామములో నీకు వందనములు చెల్లించుచున్నాము.
రడెల్ సోదరుడా! దేవుడు నిన్ను దీవించును. సోదరుడా.