ఆయన యొక్క రాకడను సూచించు ప్రకాశించెడి ఎర్రని దీపము
1సహోదరుడు నెవిల్ మీకు కృతజ్ఞతలు. మనము ఒక్క క్షణము లేచి నిలబడి ప్రార్థన కొరకు మన తలలు వంచెదము. మా పరలోకపు తండ్రి, మా యొక్క చెవులు వినిన వాటికిని మరియు మా కన్నులు చూచిన వాటికి మీకు మా స్తోత్రములు చెల్లించుచున్నాము. మరియు మేము మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము, ఏలయనగా మీరు ఎల్లప్పుడును నిత్యముగా మారని ఏకరీతిగా నుండు గొప్ప యొహోవాయని ఈ రోజు మేమెరిగియున్నాము.
ఆయన యొక్క నిర్దోషమైన రక్తము చిందించుట ద్వారా మేము మరల మీ యొక్క దైవ సహవాసములో పాలుపంచుకొనుటకు మాకు అనుగ్రహించి దానిని మాకు సాధ్యపరచినందులకు మేము యేసుక్రీస్తు కొరకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము, ఆ యొక్క రక్తము ప్రాయశ్చిత్తముగా చెల్లి౦చుట వలన మేమిప్పుడు దేవుని యొక్క కుమారులుగాను మరియు కుమార్తెలుగాను నున్నాము. చివరికి మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మరియు తండ్రి, ఆయనవలె ఆయన యొక్క ఛాయలో చివరి వరకుండుటయే మాకు చాలినదిగా నున్నది.
మరియు ఇప్పుడు, తండ్రి, మేము ఈ యొక్క వేళలో ప్రపంచము యొక్క కార్యములను అనుసరింపకోరుటలేదు, అయితే మా ఆత్మలను నూతనపరచబడి పరిశుద్దాత్మ ద్వారా మేము రూపాంతరపరచబడి, ఆయన వచ్చి మమ్ములను మా జీవితములను ఆయన యొక్క ఆధిక్యతలోనికి తీసికొని మరియు మాకు భూమిపై మిగిలియున్న దినములలో మాకు నాయకునిగా నుండి మమ్మును నడిపించి మరియు ఆయన యొక్క గొప్ప నామమును ఘనపరచును గాక.
ఈ యొక్క కార్యములన్నిటికి మేము మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఇప్పుడు మేము కూడుకొని యుండగా, ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించెదరని మేము మీ కొరకు ఎదురుచూచుచున్నాము. మరియు మీరు వాగ్దానము చేసిన ప్రకారము, మీరు మమ్ములను సంధించెదరని మేము నమ్ముచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.
PS 122:1
2దావీదు దీనిని చెప్పియున్నాడని అనుకొనుచున్నాము, "యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని." ఈ రాత్రి ఇక్కడుండుటకు మనము చాలా కృతజ్ఞలుగా నున్నాము, మరియు ఇక్కడ జనులైన మీతో మాటలాడుటకు ఈ యొక్క గొప్ప అవకాశమునకై ఇదొక భాగ్యమని అనుభూతినొందుచున్నాము.
నేను కొన్ని టేపులను రికార్డు చేయుచున్నాను. కావున సహోదరులు టేపులు రికార్డు చేయుచున్నారాయని నేను గదిలోనికి వెనుదిరిగి చూచుచున్నాను, అవి ఇప్పుడు టేపులు రికార్డు చేయబడుచున్నవి. మంచిది. ఈ టేపులు రికార్డు చేయు ఉద్దేశమేమనగా, నేను వర్తమానములను ఈ యొక్క గుడారము నుండి టేపులు రికార్డు చేసి పంపించెదనని వాగ్ధానము చేసియున్నాను.
ఇప్పుడు, మనము…
3ఈ రోజు ఉదయమున జరిగిన ఒక కార్యమును నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను. ఈ రోజు మధ్యాహ్నము మనము ఉదయకాలపు ఆరాధన ముగించు సమయమున ఒక కార్యము సంభవించెను, మీలో కొందరు అప్పుడిక్కడ నుండలేదు మరియు దానిని గురించి మీరు వినియుండలేదు. నేను ఆరాధనను ముగించుచుండగా, మరియు నేను — ఇక్కడ వేదికపై నుండి మాటలాడుచుండగా, ఇచ్చట జనులతో కరచాలనము చేయుచు నిలబడియున్న ఒక సహోదరుని చూచితిని, అతని పేరు సహోదరుడు వే, అతనిని ఆ విధముగా పిలిచెదము. అతని యొక్క భార్య ఒక మంచి రిజిష్టర్డ్ నర్స్.
మరియు సహో, వే దేవుని యొక్క సేవకులలో ఒకడు, మరియు అతను ఉద్యోగము కూడ చేయుచున్నాడు, అయితే అతను మిషనరీగా దేవుని సేవ చేయవలయునని చాలా సంవత్సరములుగా అతని హృదయములో ఒక పిలుపు ఉండెను. మరియు వాక్య సేవకై పోవుటకై తదుపరి ఆజ్ఞలు పొందువరకు అతను ఇక్కడికి వచ్చి కాచుకొనియుండులాగున దేవుని ద్వారా నడిపింపబడెను.
కొన్ని దినములకు మునుపు అతనితో మాట్లాడుచుంటిని, మరియు అతనితోను మరియు అతని భార్యతోను కలిసి సంభాషించుచుంటిని….
4మరియు ఈ ఉదయమున నాకు ఒక జటిలమైన స్వభావము కలదని నేను ఒప్పుకొనునప్పుడు, నేను సహోదరుడు వే కు కూడా ఒక జటిలమైన స్వభావము కలదని నేను చెప్పియుంటిని. అది ఆ విధముగా సహజముగా ప్రజలందరిలోను ఉండును. మరియు ఒక క్షణము పిదప సహోదరుడు వే గుండె నొప్పి వచ్చి మరి క్రిందపడి చనిపోయెను. మరియు నేను అతని భార్యను చూచితిని, మరియు నేను గమనించియున్నాను… నేను అనేక జనులు చనిపోవుటను చూచియున్నాను, మరియు నేను దీనిని చెప్పనక్కర లేదు…
యేసుక్రీస్తును గురించియు మరియు ఆయన శక్తిని గురించియు నేను పొగడవలయునని యున్నాను. అయితే ఈ సమయమున ఆయన చేయని కార్యములను గురించి డంబములు పలుకుట మనమెప్పుడును చేయకూడదని నేను అనుకొనుచున్నాను. అయితే యేసుక్రీస్తు అనేక సమయములలో చనిపోయిన వారిని లేపుటయు, మారని ఆయనను గురించి వైద్యులు అది నెరవేరుటను గురించి పరీక్షించిరి…
ఉదాహరణమునకు, కొనెటికట్ అనుచోట కొద్ది కాలము క్రిందట జరిగిన కూటములో ఆ పాత ప్రఖ్యాతిగాంచిన హాలులో డాక్టర్. బార్టన్, అను ఒక వైద్యుడొకడు అచ్చట నుండెను. ఒక క్రైస్తవ వైద్యుడు వేదికపై నాతో కూడయుండెను. మరక్కడ ఒక ప్రసిద్ధి చెందిన క్రైస్తవ స్త్రీ, ప్రేమగల ధనికురాలైన స్త్రీ ఒకామె అచ్చట వుండెను. ఆమె నాకు ఎడమ ప్రక్కగా కూర్చొనియుండెను, మరియు నేను ప్రార్థనా వరసను పిలిచితిని, మరియు నేను ఆ స్త్రీని గమనించుచుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా …
5ఎవరైనను వారి యొక్క గుండె నిలిచిపోయిన యెడల… మీ కన్నులు మూసుకొని పోవును, అయితే మీరు అనుకొనకుండా ఆకస్మిక మరణము సంభవించినప్పుడు, మీ యొక్క గుండె నిలిచి పోయినప్పుడు మరియు మీ యొక్క కనుపాపలు తేలిపోయి మరియు మీ కనుగ్రుడ్డు బయటికి వచ్చును. మరియు ఆమె క్రిందపడినప్పుడు నేను దానిని గమనించాను. మరియు ఆమె క్రిందపడిన వెంటనే వారు వైద్యుని పిలిచిరి, ఆయన మరి పరుగెత్తుకొని ఆమె యొద్దకు వచ్చి ఆమె నాడిని చూచెను, మరియు తన తలను ఆడించెను, తన చెయ్యిని ఆమెపై నుంచెను, తన చెవిని ఆమె గుండెపై నుంచెను. మరియు ఆమె మరణించినది. ఆమె నేల మీద పడి చనిపోయెను, మరప్పుడు ఆమె యొక్క కుమార్తె కేకలు వేసెను, ఏడుస్తూ అరచుచున్న ఆ కేకలు కూటమునకు ఆటంకము కలిగించెను… నేను కూటమును కొనసాగించితిని, ఏలయనగా ఆ స్త్రీని గురించి ప్రభువుయొద్ద నుండి నాకు ఏ వాక్యమును రాలేదు. మరియు నేను కూటమును కొనసాగించుచుంటిని.
వారు సహోదరుడు బ్రెన్హాంను పిలుచుటను గురించి మాటలాడు కొనుట నేను వింటిని, మరియు వారు చెప్పిరి, "ప్రార్ధనా వరుసలో మనము ఆయనను పిలువనక్కర లేదు, ఏలయనగా ఆయనకు వివేచన వరము కలదు." మరియు వారు చెప్పిరి, "చిన్న బ్రెన్హాంను తీసికొని రండి, అది బిల్లీయే. మరియు బిల్లీ ఆమె చనిపోయుండుట వలన అతను అచ్చటికి పోదలచుకోలేదు…
6మీకు తెలియును, ఎవరైనను చనిపోయిన యెడల జనులకు సందేహము వచ్చుచున్నది. అది ఒక ఉత్త శరీరమనే కవచము మాత్రమే. అక్కడ వేరే ఏమియును లేదు. దానిని… జనులు వింతగా అనుకొనుచున్నారు… అది. ఆ యొక్క వ్యక్తి అక్కడ లేడు, వారు ముందుకు సాగిపోయున్నారు. మరియు అందువలన అతడు ఆ స్త్రీ యొద్దకు వెళ్ళుటకు భయపడెను, ఎందుకనగా ఆమె చనిపోయివున్నది.
నేను వున్న స్థలము నుండి వెనుదిరిగి, ఎచ్చట ఆ స్త్రీ పడియున్నదో అచ్చటకు నేను నడుస్తూ వెళ్ళుచున్నాను, ఆమెయున్న చోటికి నేను సమీపించుచుండగా, పరిశుద్దాత్మ నాతో మాట్లాడెను, "మేరి!" అని నేను పిలిచాను.
ఆమె బదులిచ్చెను, "అవును, సహోదరుడా బ్రెన్హాం." ఆమెకు ప్రాణము వచ్చి బాగున్నది. ఇంతకు మునుపు ఆమె మమ్ములను ఎన్నడును చూడలేదు, మరియు అదియే కూటములలో మొదటిసారిగా ఆమె మమ్ములను చూచుట.
7పిదప కొద్ది కాలము క్రిందట షావానో నందు — ఓ, నేను చెప్పాను, నాలుగు లేదా ఇందు సంవత్సరముల క్రిందట… ఒక రాత్రి సమయమున అయుధశాల యందు జరిగిన కూటమునందు నేను మాట్లాడుచు౦టిని అక్కడ బహు జనసమూహముండెను, మరియు ఒక ఎనుబది సంవత్సరములు వయస్సు కలిగిన వృద్దుడు మరియు అతనితో కూడ చక్కటి అతడి భార్య అనుకుంటున్నాను అచ్చట నున్నారు… వారు లూథరను విశ్వాసులు, వారు అక్కడున్న గొప్ప ప్రసిద్ధి చెందిన లూథరను ఆలయమునకు వెళ్ళువారు. ఇప్పుడు దాని యొక్క పేరును నేను మరచిపోయున్నాను. అమెరికాలో లూథరనులు అధికముగా కూడుకొను స్థలము అది, ఒక్క కూడిక లోనే విస్తారముగా కూడుకొను సంఘ సభ్యులను కలిగియున్న సంఘమది. మరియు అది లూథరనులకు ఒక గొప్ప దేశము. మరియు నేను మాటలాడుచుండగా అతడు తన తలను ప్రక్కగా వాల్చెను, అతని చేతులు పట్టు సడలెను, మరియు తన కుర్చిలోనే అతడు ముందుకు పడి చనిపోవుటను నేను గమనించితిని, మరియు అతని భార్య అతను చనిపోవుట చూచి కేకలు వేసెను మరియు, "ఎవరైనను నాకు సహాయపడుడి! నాకు ఎవరైనను సహాయపడుడి" యని కేకలు వేసెను.
మరి నేనక్కడ చూచితిని. నేను చెప్పాను, "ప్రతి యొక్కరు నెమ్మదిగా మీ సీటులో కూర్చొనుడి. చూశారా? ప్రభువు నాకు వాక్యమును సెలవిచ్చు వరకు నేను కాచుకొని యుంటిని, నేను… సాతాను… నేను ఆ సమయములోనే బలిపీఠపు పిలుపును ఇవ్వదలచుకొని యుంటిని, మరప్పుడే అతను తనను చూపించుకొనతలచెను.
కావున, మీరు బలిపీఠపు పిలుపును ఇచ్చుటకు ఆరంభించునప్పుడు, చిన్న పిల్లలు కూడ కేకలు వేయుచు ఏడ్వటము వంటి కార్యములు ప్రారంభమవ్వటమును మీరెప్పుడైనను గమనించియుంటిరా? అది సాతాను చేయు క్రియ. మీలో ఆత్మీయముగానున్న వారు దానిని గ్రహింపగలరు.
8కావున ప్రభువు అతని పేరును నాకు తెలియపరచెను, మరియు నేను అతనిని పేరు పెట్టి పిలిచితిని, మరి అతను ప్రాణముతో తిరిగి ఉన్న విధముగానే లేచెను.
మరియు ఈ ఉదయమున నేను వెనుదిరిగి చూసినప్పుడు… చూచారా? అనేక మార్లు ప్రభువైన యేసు చనిపోయిన వారిని తిరిగి ప్రాణముతో టేపుట నేను చూచియున్నాను. మెక్సీకోలో ఆ చిన్న బిడ్డ ఆ రోజు ఉదయము తొమ్మిది గంటలకు చనిపోయెను, మరి ఆ రోజు రాత్రి పది లేక పదునొకండు గంటలకు ప్రాణముతో లేచెను. మరియు ఆ రోజు ఉదయము ఆ బిడ్డ తన వైద్యశాలలో ఉదయుము తొమ్మిది గంటలకు మరణించినదని వైద్యుడు యథార్థముగా సాక్ష్యమిచ్చియున్నాడు, (చూశారా?) ఆ బిడ్డ ఊపిరితిత్తుల వాపుతో కూడిన జ్వరము (న్యుమోనియా) వంటి వ్యాధితో మరణించినదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఆ బిడ్డ ఈ రోజు వరకు జీవించుచున్నది. మరియు ఆ సంఘటన ముప్పది లేక నలుబది వేల జనుల మధ్య సంభవించెను.
మరియు పిదప ఈ రోజు ఉదయుము నేను సహోదరుడు వే కూర్చొనియుండుటను చూచియున్నాను… అతనిప్పుడు ఇక్కడ కూర్చొని యున్నాడు. మరియు మేము "మహిమ, మహిమ, హల్లెలూయా," అని దేవుని మహిమ పరచుచు, పాడుచు, ఒకరికొకరు కరచాలనము చేసికొనుచుండగా, అతను కూడ లేచి నిలుచుకొనియుండెను. గుండెపోటు అతనిని తాకినప్పుడు, నేను అతడిని గమనించాను. మరియు అతని తలను వెనుకకు వాల్చెను, అతడు పోవుటయో లేక ఇతరే విధమైన బలహీనతలతో వే సహోదరుడి యందు అటువంటి కార్యములు లేవు. మరియు అతడు… అతను వెనుకకు తిరిగి పడిపోవుటను నేను చూశాను. మరియు అతని భార్యను నేను చూశాను, ఆమె ఒక ప్రభుత్వ ఆస్పత్రి నర్స్. ఆమె అతని నాడిని పరీక్షించి మరియు అతడు చనిపోయెనని గుర్తించి ఆమె అరుచుచు కేకలు వేయసాగింది.
9మరియు అటు పిదప ఇచ్చట ఒక స్త్రీ కలదు, సంఘమునకు వచ్చు ఒక నలుపు రంగు గల స్త్రీ, ఆమె కాదు సహోదరి నాష్ అని నేను నమ్ముచున్నాను; కొంతమందితో కలిసి పరిగెత్తుకొంటూ వచ్చినది మరియు ఇప్పుడు, ఆమె శ్రీమతి వే, నా కొరకు వేదికపై వచ్చుటకు ప్రయత్నించుచుండెను. మరియు, "అందరు నిశ్శబ్దముగా వుండవలెను. మీ కుర్చీలలో మీరు కూర్చొనియుండవలయును," అని నేను చెప్పాను. ఇటువంటి సమయములలో మీరు వారిని ఉద్రేకమునకు లోనగునట్లు చేయవద్దు. చూశారా? సాతాను దానినే చేయుటకు ప్రయత్నించును. కొంచెం నిరీక్షించి మరియు ఆయన ఏమి చెప్పునని వేచి చూడండి. ఒక వేళ ఎవరైనను మహిమలోకి వెళ్ళవలసిన యెడల, మంచిది, మనము కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవలసినదే, అయితే సంఘములో ప్రాణము పోవుట కంటేను శ్రేష్టమైన స్థలము వేరొకటి లేదు. అందువలన, కావున పిదప, అప్పుడు ప్రభువు యొక్క ఆలయములోనే అది జరిగెను… కావున అప్పుడు…
అయితే ఈ మనుష్యుడు వెనుకకు తిరిగెను. నేను అతనికి ఏదో సంభవించినదని అతడు మూర్చపోయినాడని లేక ఆ విధముగా ఏదో అతడికి సంభవించినదని నేను తలంచితిని. అయితే నేను అతని తల ఈ విధముగా తిరుగుట, కండ్ల క్రింది భాగమున చూచిన అవి బయటికి వచ్చియుండెను… మీ కళ్ళను ఆ విధముగా మూసియుంచలేరు — ఆ విధముగ కండ్లను మీరు ఉంచలేరు; గుండె ఆగిపోవుటవలన ఆ విధముగా ఏర్పడెను. మరియు నేను అటు ఇటు చూచితిని, మరియు అతడు… అతని తల క్రింద ఎత్తుగా పెట్టుటకు ఒక దానిని అచ్చట వున్న దయగల వ్యక్తి అతడి తలక్రింద ఎత్తుగా వుండుటకు ఒక దానిని తీసుకొని వచ్చిపెట్టెను. మరి అతని కాళ్ళు, చేతులు, మరియు సమస్తమును బిగుసుకు పోయెను. అవి పనిచేయుట నిలచిపోయెను… అతని ముఖము నా యొక్క కోటువలె నలుపుగా మారెను, మరియు అతని కండ్లు తేలిపోయెను. మరియు నాకు గుండెపోటును గురించి తెలియును. నాకు గుండెపోటు వలన ఏమి సంభవించునో, వారు ఏ విధముగా మారిపోదురో నేను ఎరుగుదును. దానిని చూచిన ఎవరికైనను అది తెలియును… కావున నేను నా చేతిని అతని నాడిపై ఉంచి చూడగా, నాడి కదలిక లేదు, ఒక చిన్న చెక్కబల్లపై నుంచినట్లు చలనము లేకుండెను. ఏమియును లేదు! ఇక్కడ అతని భార్య ఒక ప్రభుత్వ నర్స్, అతని నాడిని పరీక్షించెను. అక్కడ నాడి స్పంధన లేకుండా స్త౦భించిపోయినది.
10ఆ దినమున ఒక రోజు నేను వివేచించు సమయమున సహోదరుడు వే కు గుండె సరిగా పనిచేయుట లేదని గ్రహించియున్నాను. కావున అతను చనిపోయిన కారణము "అదియే" అని అనుకొన్నాను. కావున నా యొక్క చేతులు అతని పై నుంచాను, నేను చెప్పాను, "ప్రియమైన దేవుడా, నా యొక్క సహోదరుని ప్రాణమును, అతని జీవమును తిరిగి రమ్మని యేసు క్రీస్తు నామమున నేను పిలుచుచున్నాను. మరియు పరిశుద్ద గ్రంథము నా ముందర ఇక్కడ నున్నది, ప్రభువైన యెహోవా ఎరిగి యున్నాడు, నేను నా చేతులను అతని నాడిపై నుంచగనే. నేను ఒక వేళ తప్పుగా చెప్పినయెడల, దీనికి న్యాయతీర్పు దినమున నేను జవాబుదారుడనవ్వెదను. మరియు అతని నాడి నాలుగు లేక ఐదు సార్లు కొట్టుకొనుచుండెను, వేగముగా "పంప్, పంప్, పంప్, పంప్, పంప్"; మరియు నాడి పనిచేయుట ప్రారంభించెను, "పంప్, పంప్, పంప్, పంప్!"
మరియు అతను నోరు తెరచి నాతో ఏదో చెప్పుటకు ప్రయత్నించెను — మరియు నోరు తెరచుటకు ప్రయత్నించుచు గరగరమనే అస్పష్టమైన స్వరముతో ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు. మరి "సహోదరుడు బ్రెన్హాం," అని మెల్లగా అతడు మాటలాడటం ప్రారంభించెను. అప్పుడు అతను మరల నిద్రపోవులాగున లేక ఆ విధముగా నిరసంగా వుండునట్లు అతడు కనిపించెను. మరియు మరల నేను ఒక్క క్షణము వేచియుంటిని, మరల అతని నాడిని పరీక్షించితిని. అది చక్కగా సహజముగా కొట్టుకొనుచుండెను. మరల అప్పుడు నేను, అతనిని చూచితిని, మరియు అతను నన్ను చూచెను. మరి అతను నేను అతని ప్రక్కనుండుటను గమనించెను, అతనికి అతను ఎక్కడుండుట తెలియలేదు, అయితే అతని గుండె సహజముగా క్రియ చేయుచున్నది… మరియు అతని జీవమును దేవుడు మరల పిలచి అతనికి అనుగ్రహించెను.
HEB 13:8
11కావున నేను దీనిని యేసుక్రీస్తు యొక్క ఘనతకై చెప్పుచున్నాను, ఆయన మారని దేవునిగా యున్నాడు. ఈ రోజు ఉదయము నేను చాలా సేపు దీర్ఘముగా ప్రసంగించియున్నాను. నిర్ణీత సమయము కంటె నేను అధికముగా ప్రసంగించితిని, మరి అలసిపోయున్నాను. మరి సహోదరుడు వే కు రెండు కార్యములు సంభవించి యుండవచ్చును. అతను ఒకవేల అధిక సమయమై నందువలన అలసిపోయి యుండవలెను, లేదా జటిలమైన స్వభావమును (complex - ఆంగ్లములో కాంప్టెక్స్ అనే పదమునకు అర్థముగా జటిలమైన స్వభావముతో ఒక వ్యక్తి తనలోనున్న ఒక గొప్ప కార్యమును లేక హీనమైన కార్యమును గురించి పదే పదే తనలోతాను తలంచుకొంటు ఉండుట — తెలుగు తర్జుమాదారుడు.) గురించి మాటలాడినప్పుడు, "నా సహోదరుని తికమక పరచవలయునని కాదు, ఏలయనగా నాకు కూడా జటిలమైన స్వభావము కలదని నేను ఒప్పుకొనుచున్నాను. మరియు నేను ఊహించుకొనుచున్నాను, ఈ రాత్రి ఇక్కడున్న జనులలో నేనిట్లు అడిగిన, "ఇక్కడున్న ఎందరికి తెలియును మీకు కూడ జటిలమైన స్వభావము గలదు? నిజముగా అనేక హస్తములు పైకి లేచును. మీరు తెలుసుకొనులాగున సహోదరుడు వే, అది ఆత్మ వివేచనయా కాదా యని నేను మీకు చూపించనిమ్ము. మీలో జటిలమైన స్వభావము గల వారెందరో మీ చేతులు పైకెత్తుడి. అక్కడ చూడుడి! చూశారా? అయితే నేను ఆ విధముగా చెప్పినందువలన అతనిని కఠినముగా గద్దించినాననుకొని సహోదరుడు వే, దానిని తలంచుకొని, తనలో ఇంతగా కలవరపడతాడని నాకు తెలియదు, అటు పిదప అతడు ఈ విధముగా పడిపోయే స్థితికి అది తెస్తుందని కూడా నేను అనుకోలేదు, మరి మృతుడై క్రిందపడిపోయిన అతడికి మరియు ప్రభువైన యేసు అతనిని తిరిగి జీవములోనికి తీసికొని వచ్చియున్నాడు.
ఇప్పుడు నేను అనుకొనుచున్నాను, పౌలు ప్రసంగించుచున్న ఆ దినములలో ఒక రోజు రాత్రంతయు దీర్ఘముగా ప్రసంగించుచుండగా, ఒక మనుష్యుడు క్రిందపడి మరి చనిపోయెను, మరియు పౌలు ఆ మనుష్యుని యొద్దకు పోయి అక్కడ వినుచున్న వారితో దేవుని యొక్క కృప వలన, "అతని యొక్క జీవము అతనిలో నున్నదని," చెప్పెను. ఇప్పుడు, అది మనకు నిరూపించుచున్నది లేక మీరు గనుక దానిని ఇంతకు మునుపు చూడనియెడల, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడు.
12మరియు పిదప అది ఒక వేళ ఈ విధముగా నుండవచ్చునని, నేను ఈ మధ్యాహ్నము దానిని గురించి ఆలోచించుటకు ప్రయత్నించుచుంటిని. ఇచ్చట నేను నిలబడి నా హృదయపూర్వకముగా ఖచ్చితమైన సత్యమునే నేను మీకు చెప్పితిని, మరియు బహిరంగముగా నా యొక్క జటిలమైన స్వాభావము గురించి మరియు దానిని జీవించులాగున మీరు నా కొరకు ప్రార్ధింపవలయునని నేను మిమ్ములను అడుగుచున్నాను, మరియు ప్రభువు చెప్పినట్లు నేను చేయవలయుననియు కోరుచున్నాను. మరియు ఆయన ఇంకను వాక్య పరిచర్యకై అనేక స్థలములకు నన్ను పంపించునని నిరూపించుటకు, ఆయన జరిగిన సంభవములను చూపించుచు ఆయన ఇంకా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుచుండెను మరియు మరణించినవారిని జీవముతో లేపుచున్నాడు. మరియు ఈ కార్యములన్నియును నేనేమి ప్రసంగించుచున్నానో, మరియు దేవుని రాజ్యమునకై ఏ విధముగా సాక్ష్యముగా నున్నానో వీటి ద్వారా రూఢి చేయునట్లున్నదని నేను అనుకొనుచున్నాను. కొద్దిసేపటికి మునుపు ఆయన అక్కడ సహాదరుడు రాబర్సన్ తోను, మరియు ఇంకొక సహోదరునితోను చెప్పినట్లు ఆ వరుసలో ఇదియును నున్నది.
అందుకొరకు ఇప్పుడు, మనము ఆయనను ప్రేమించుచున్నాము. మరియు ఈ రాత్రి సహోదరుడు వే తో కూడ నున్నందులకు మనము కృతజ్ఞులుగా నున్నాము. మరియు నిశ్చయముగా దేవుడు మన సహోదరుని యొక్క కార్యములను ఇంకా సమాప్తము కానివ్వలేదు, లేనియెడల ఈ రోజు ఉదయము అతను చనిపోయుండెడివాడు. అతను చేయవలసిన కార్యమేదో ఒకటి నున్నది. మరియు సహోదరుడు వే మీరు దీనిని తెలుసుకొనవలయునని నేను కోరుచున్నాను. ఈ యొక్క సంఘమంతయును మరియు నేను మీ కొరకును, మీ భార్య కొరకును దేవుడు నిర్ణయించిన కార్యక్రమమును ఆయన మీ జీవితములో మీకు చూపించవలయునని మేము ప్రార్థించుచున్నాము, మరియు ఆ విధముగా జరిగిన వెంటనే దేవుడు మిమ్ములను అక్కడ ఆ కార్యములో నుంచవలయునని ప్రార్థించుచున్నాము. సహాదరుడు వే, నిశ్చయుముగా ఆయన దీనిని చేయునని నేను నమ్ముచున్నాను. మరియు క్రైస్తవులైన మనమ౦దరమును సహోదరుడు వే కు కృతజ్ఞలముగా నున్నాము. సంఘమా, అది సరియేనా? వారి యొక్క జీవితములో వారు చేయనైయున్న సేవలో ప్రభువునందు వారి యొక్క స్థానమును అతను మరియు సహాదరి వే కనుగొనవలెనని ప్రార్థించుచున్నాము.
13ఇప్పుడు, కూడ నేను సహోదరుడు వే తో మాటలాడవలయునని అనుకొన్నాను. ఏమి సంభవించినదని లేదా అతని వైఖరి ఏమిటని తెలుసుకొనవలయునని నేను ముందుగానే వచ్చితిని. మరియు అతనికి ఏమి జరిగినదో తెలియలేదు. చూడుడి? అతను క్రిందపడి చనిపోయినది తెలియును; అంతే.
మంగళవారము లేదా నేనెప్పుడు ఈ కూటముల కొరకు వెళ్ళానో, అవి అర్కన్సాస్ అనే స్థలమునందు జరుగును, ఈ భవనములో ఇక్కడున్న వారెవరైనా అచ్చటకు వెళ్ళుచున్నరేమో అడిగి తెలుసుకొనమని సహోదరుడు వే కోరుచున్నాడు. ఇప్పుడు, అది ఒక చాలా చిన్న కూటము. అక్కడ కొద్ది సహోదరులు మాత్రమే కూడెదరు. మరియు అది ఎక్కడో అరణ్య ప్రాంతములో లేక ఆ విధమైన ప్రదేశములలో జరుగనైయున్నవి, ఒకవేళ అనేకులు అచ్చటికి రాలేరు అని నేను ఊహించుచున్నాను; యధార్థముగా చెప్పువలయుననిన, అక్కడ నేను వచ్చుచున్నానని ఇంత వరకు వారికి తెలియదు. చూశారా? మరియు అక్కడున్న నా యొక్క స్నేహితులు ఒకటి లేక రెండు రాత్రులకు మునుపు మాత్రమే దాని నెరుగుదురు, అర్కన్సాన్ నున్న నా స్నేహితులు కూడ అక్కడ నన్ను ఎరిగిన వారు కూడ ఆ కూటములలో పాల్గొనెదరు. అయితే మీలో ఎవరైనను కూటములకు బయలుదేరుచున్నయెడల, మీ కారులో ఇంకొకరికి స్థలమున్న యెడల సహాగోదరుడు వే మీతో వచ్చుటకు ఇష్టపడుచున్నారు. అతను ఈ విధముగా చాటింపమని కోరియున్నాడు, అతనిని తీసికొనిపోవువారికి అతను మీకు శ్రమను ఇయ్యక తననుతాను చూచుకొనగలడని చెప్పెను, అయితే ఎవరైనను తనను తీసికొనిపోవుచున్నయెడల, అది దేవుడు తనను ప్రేమించుచున్నాడనియును, లేదా అక్కడికి తాను పోవుట దేవుని యొక్క చిత్తమైయున్నదనుటకు సూచనైయున్నదని అతను చెప్పెను. కావున ఆ మూలలో కూర్చొనియున్న సహోదరుడు వే ను మీరెరిగియున్నారు. మరి కావున అక్కడికి వెళ్ళే వారెవరైనా — మీరు ఒకరిని తీసుకొని వెళ్ళుటకు మీకు అవకాశమున్న యెడల, అతను మీతో వచ్చుటకు ఇష్టపడుచున్నాడు.
14మరియు రాబోయే ఆదివారము రాత్రి, ప్రభువు చిత్తమైన యెడల నేను తిరిగి వచ్చెదను లేక వచ్చే ఆదివారము ఉదయము వచ్చెదను. మరియు సహోదరుడు నెవిల్ ఆదివారపు పాఠశాల ముగించిన పిదప నేను ఇంకొక టేపును వీలైతే టేపు చేయవలయునని యున్నాను. మరి నేను గనుక పొరబడనట్లయితే, నేను మీ యొక్క జీవితము — మీ యొక్క జీవ సువార్తకు తగినట్లుగా నున్నదా? అది… లేదా, మీ యొక్క జీవితము సువార్తకు తగినట్లుగా నున్నదా? అదే నేను చెప్పుదలచుకొనినది. మీ యొక్క జీవితము సువార్తకు తగినట్లుగా నున్నదా? మరి ప్రభువు చిత్తమైన యెడల, దానిపైన ఒక టేపును రికార్డు చేయవలెనని నేను కోరుచున్నాను.
మరిప్పుడు, ఈ రాత్రి… నేను టేపు చేయబోవుచున్నానని చాటించి యున్నాను. మరియు ఇక్కడున్న సంఘకాపరి ప్రసంగించనే లేదని నేను అనుకొనుచున్నాను. నన్ను ప్రసంగించమని వేదికపైకి పిలిచెను. ఇప్పటి వరకు నాకు తెలియదు… ఇప్పుడు పిదప నాకు తెలియదు… ఇప్పుడు, వారు టేపును చేయుచున్న యెడల… మీరు అలసిపోయియున్నను లేదా కొంచెముసేపు బయటకు వెళ్ళాలనుకున్నా, వీలైనంత వరకు నిశ్శబ్దముగా వెళ్ళవలెను, ఎందుకనగా మనము… మీరు చూడండి, ఈ మైక్రోఫోనులు చాలా చాలా సున్నితమైనవి మరి అవి చిన్న శబ్దమును కూడ గ్రహింపగల శక్తి గలవి. మరియు మేము ఈ టేపులను ప్రపంచమంతటికిని పంపుటకు రికార్డు చేయుచున్నాము.
MATT 24:32-37
15మరియు ఈ రాత్రి నా యొక్క పాఠ్యాంశమును నేను చాటింపకోరుచున్నాను — దేవుని వాక్యము చదివిన పిదప, పరి. మత్తయి వ్రాసిన సువార్త, 24వ అధ్యాయము. పరి. మత్తయి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము ప్రకారము, మరియు మనమిప్పుడు 32వ వచనము నుండి ప్రారంభించి మరి లేఖనములను చదివేదము.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియును జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.
ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
ఆకాశమును భూమియు గతించును గాని, నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును)గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.
నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
MATT 24:1-3
16ఇప్పుడు, మనము చదవియున్న వాక్యములలో ఈ రాత్రి మనము కనుగొనియున్నాము, మనము చదువుచుండగా, ఈ యొక్క అధ్యాయపు మొదటి భాగములో ఆయన శిష్యులు ఆయనను వేరుగా కొండపైకి పిలుచుకొని వెళ్ళి మరియు ఆయనను అడిగిరి, "నీ రాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మరియు దేవాలయపు కట్టడములో రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ నుండు కాలమెప్పుడు వచ్చును?" ఇప్పుడు, ఆయన బదులిచ్చుచున్నాడు… చూడండి, ఇచ్చటనున్న మొదటి వచనమును చూడండి…
… యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారుగదా, రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడడ్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాని వారితో అనెను.
మరియు ఆయన శిష్యులు — మరియు ఆయన కొండవైన కూర్చొని యున్నప్పుడు [నన్ను మన్నించుడి!] ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి యున్నప్పుడు, శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పుమనగా?
MATT 24:2,3•
MARK 13:2,4•
LUKE 21:6,7
17చూశారా, వారు మూడు ప్రశ్నలను అడిగిరి, మరియు ఆయన అడిగిన ఆ మూడు ప్రశ్నలకు బదులిచ్చుచున్నాడు. "రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచి యుండకుండ పడద్రోయబడు కాలము ఎప్పుడు వచ్చును? మీ యొక్క రాకడకు సూచన లేమి? ప్రపంచపు యొక్క ముగింపు గురించి యేమిటి? మరియు అనేకులు మన సహోదరులు వీటినన్నిటిని ఆయన యొక్క రాకడకు ప్రయోగించుచున్నారు. అయితే వారు అడిగిన మూడు వేర్వేరు ప్రశ్నలకు ఆయన బదులిచ్చుచున్నాడు. ఎందుకు "రాతి మీద రాయి యొకటియైనను నిలిచియుండని కాలము వచ్చును, ఇది ఎప్పుడు సంభవించును? మరియు మీ యొక్క రాకడకు సూచనలేమి? మరియు ఈ యుగ సమాప్తికి సూచనలేమి? చూడుడి, మూడు వేర్వేరు ప్రశ్నలు. ఆయన బదులిచ్చుచున్నాడు, ఎప్పుడు రాతి మీద రాయి యొకటియైనను నిలువని కాలము వచ్చును. మరియు ఆ ప్రశ్నకు బదులిచ్చిన పిదప ఆయన ఆయన రాకడకు సూచనను గురించి చెప్పెను, మరటు పిదప ఈ యుగ సమాప్తికి గురించిన ప్రశ్న యొద్దకు వెళ్ళెను.
MATT 24:37•
LUKE 17:26
18మనము ఇచ్చట గమనించిన యెడల, ఇప్పుడు, ఈ రాత్రి యందు నేను మాట్లాడుటకు ఇష్టపడుచున్న ఒక అంశము ఏదనగా… "ఆయన యొక్క రాకడను సూచించు ప్రకాశించెడి ఎర్రని దీపము, మరియు మనము నోవహు దినముల గురించి ధ్యానింపబోవుచున్నాము, "నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును." మరి యిప్పుడు నాకు — ఇది ఆ దినమున తోచెను, మరి నేను ఈ అంశమును తీసుకొని, దానిపై ప్రసంగించుటకు ప్రయత్నించవలెనని నేను తలంచితిని. మరియు నేను వ్రాసియుంచుకున్న కొన్ని లేఖనవాక్యమును దానికి సంబంధించిన వాటిని కొంచెం కొంచెముగా చదువుచు వాటిని తరచి చూడవలెనని నేను కోరుకుంటున్నాను…
MATT 24:32,34,35•
MARK 13:28-31•
LUKE 21:29-33
19ఇప్పుడు, మన ప్రభువైన యేసు ఈ ప్రశ్నను అడిగెను, మరి ఆయన వారికి తన రాకడను గురించిన సూచన నిచ్చెను. మరప్పుడు వెంటనే ఆయన దీనిని చెప్పెను, "ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు." మరియు అప్పుడు ఆయన చెప్పెను, "అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు, వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." ఏ సంతతి? సత్యమును విశ్వాసమును త్యజించిన వారిని చూచు సంతతి మరి వారిని గురించి ఈ రాత్రికి మనము మాటలాడబోవుచున్నాము.
20కావున ఆయన యొక్క రాకడను సూచించు ప్రకాశించెడి ఎర్రని దీపము? అనే నా అంశమును గురించి మనము ఆలోచించేటపుడు, ఒక వ్యక్తి లేదా జనులు అచ్చట నీరీక్షించుచు నిలబడియుండు మరియు ఆ రైలుబండి కొరకు అనేకులు ఎదురుచూచుచు వుండు, ఆ యొక్క రైల్వేస్టేషను యందు వేచియుండునది నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది మరియు మనకు ఆ రైలుబండి యొక్క శబ్దము వినబడదు, లేదా నీవు ఆయనను చూడలేవు, అయినా అది ఇప్పుడు వచ్చు సమయము ఆసన్నమైనదని నీవు ఎరుగుదువు. రైలుబండి రాకపోకల సమయమును తెలిపేవాడు చెప్పవచ్చు, "ఆయన ఇంకా కొద్దిగా అలస్యంగా రావచ్చును, ఆయన ఖచ్చితమైన సమయమునకు రాకపోవచ్చు, కాని ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు, అయితే ఆయన త్వరలో వచ్చును." మరియు ఆ రైల్వే స్టేషనులో మనము మన జేబులలో చేతులుంచుకొని ఇటు అటు తిరుగుచుండెదము, మరియు పెట్టెలను సర్దుకొనెదము, మరియు బయటకు వెళ్ళి వేరుశెనగలు కొనుక్కొని తినుచు, అటు ప్రక్కగా వెళ్ళే వారితో మాట్లాడుచు వుండెదము. ఆ బండి వచ్చు దారియందు ఒక శబ్దము వచ్చుచుండును, ఆ సమయమున ఆ సంకేతము క్రిందికి పడి, అచ్చట ఎర్రని దీప కాంతిని ప్రకాశింప చేయుచు ఆయన యొక్క రాకడను అది సూచించుచున్నది, అటు పిదప నీవు ఆ రైలు బండిలో ప్రయాణించాలనుకున్న యెడల, నీ యొద్దనున్న ఆ వేరుశెనగలను నీవు క్రిందికి విసిరివేయటము మంచిది, మీ మాటలను నిలిపి వేయవలెను, మీ పెట్టెలను తీసుకొని మరియు మీరు సిద్దముగా వుండవలెను, లేదా నీవు విడువబడెదవు, ఏలయనగా ఆయన కొద్ది నిమిషములు మాత్రమే అచ్చట నిలబడును. నీవు ఇంకా ఆ వీధి ప్రక్కగా వెళ్ళుచున్న వానితో మాట్లాడుచు అక్కడే నిలబడియుండిన యెడల, అది వెళ్ళిపోవును, నీవు విడువబడేదవు.
GEN 6:1•
MATT 24:37•
LUKE 17:26
21ఒక ప్రకాశించెడి సంకేతమయిన నిలబడియున్న స్థలమ౦దు ఆయన వుండుటను మనము చూచినప్పుడు, ఆ రైలుబండి కొరకు సిద్ధపడే దానికంటే ఇంకా ఎంతగా మనము త్వరితముగా వుండవలెను. సువార్తయిన పాత రైలుబండి త్వరలో రాబోవుచున్నది మరియు మనము ఈ రాత్రి ధ్యానించబోయే ఈ గొప్ప అంశమగు, ప్రకాశించెడి సూచనను…
మరియు మన ప్రభువు కొండపై కూర్చుని మరి వారికి ఈ కార్యములన్నియును సంభవింపనైయున్నవని చెప్పెను, "నోవహు దినముల వలె మనుష్యకుమారుని రాకడయును ఆలాగే యుండును…"
ఇప్పుడు, మనము వెనుదిరిగి నోవహు దినములలో జరిగిన కార్యములు మరి ఆలాటివి ఈ యొక్క దినమున మనము కనుగొనగలమా చూచెదము. మనము గనుక నోవహు దినములవలె ఏమైనను ఈ దినమున సంభవించు వాటిని చూచిన యెడల అప్పుడు మనము ప్రభువు పలికిన ఆ దినమున ఎక్కడ మనము ఉన్నామనే దానిని చెప్పగలము. మనము దీనిని తెలుసుకొనవలయుననిన మనము ఆదికాండములోనున్న నోవహు దినముల యొద్దకు తిరిగి పోవలసియున్నది. మరియు మీరు గనుక నాతో లేఖనములను త్రిప్పినయెడల ఆదికాండము 6వ అధ్యాయుమునకు, మరియు ఆ దినములలో సంభవించిన జలప్రళయుమును, మరియు వారియొక్క ప్రవర్తన, మరియు ఆ దినపు పరిస్థితిని చూడగలవు, ఆదికాండము 6వ అధ్యాయము. ఇప్పుడు, మనము దానిని చదివి, చూచి, మరియు ఆ దినమును ఈ దినముతో పోల్చి చూడబోవుచున్నాము. గమనించుడి!
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత,…
22మొట్ట మొదటి వాక్యములోనే పరిపూర్ణంగా ప్రకాశించుచున్న దీపమును ఆ దినము యొక్క చేతిలో యుండుటను మనకు తెలుపుచున్నది. ఇప్పుడున్న అనేక మంది జనులను మరియు అతి వేగముగా విస్తరించుచున్న జనాభాను ఈనాడు మనము కలిగియున్న విధముగా సమస్త చరిత్ర యంతటిలోను ఎన్నడును ఇటువంటి ఒక సమయమును మనము కలిగియుండలేదు, జనులు నివసించుటకు కూడా ఒక స్థలమును పొందుకొనుటకు చాలా కఠినముగా నున్నది. ఈ భూమిపై అనేక మంది జనులు విస్తరించుచునే యున్నారు; ఇదే విధముగా ఈ జనాభా విస్తరించుట ఇంకా కొనసాగుచు వుంటే, ఇంకా ఇరువది సంవత్సరములలో జనులు భుజించుటకు కూడా ఈ భువిపై ఆహారము చాలదని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు. "రీడర్స్ డైజస్ట్," అనే పత్రికలో దీనిని ప్రచురించిరని నేను నమ్ముచున్నాను; వారు ఇదే విధముగా అతి వేగముగా విస్తరించుచు పోతే, ఇక అచ్చట జనులకు ఆహారమనేది దొరకనే దొరకదు.
మనము చుట్టు చూసినప్పుడు ఒకప్పుడు అరణ్యములుగానున్న ప్రదేశములన్నియును ఇప్పుడు నగరములుగా మారి యున్నవి, మరి జనాభా విస్తరణను అదుపులో ఉంచు కార్యక్రమమును ఎంత తీవ్రముగా అమలుపరచినను జనాభా విస్తరించుచునే యున్నది. చికాగోను గురించి అందులో జరుగు సంభవములను గురించి అని నేననుకొనుచున్నాను, ఈ గణాంకములను నేను తప్పుగా చెప్పుటు లేదని నేను నమ్ముచున్నాను. అయితే ప్రభుత్వ పుస్తకములలో వ్రాసియుంచిన పట్టీ ప్రకారము ప్రతి అరవై దినములకు ముప్పది వేల గర్భ స్రావములు చికాగోలో జరుగుచున్నవి. గర్భ స్రావములు ప్రతి అరువది దినములకు వ్రాసియుంచబడుచున్నవా! ఆలాగైన పట్టీలలో వ్రాయబడకుండా గర్భ స్రావము చేసుకొన్న వారి లెక్క ఏమిటి? చూడుడి, నలుబది లక్షల జనాభా గల ఒక్క నగరములోనే ఆ విధముగా నున్నది. మరి ప్రపంచపు గతి ఏమిటి? మరిట్లున్నను జనాభా అధికమగుచున్నది, ఎంతవరకు అనగా జనులు దానిని గురించి శ్రద్ధతీసుకోలేనంతగా.
GEN 6:1-4
23ఇండియాలో జనాభా అత్యధికముగా విస్తరించుచుండుటచే శస్త్రచికిత్స (ఆపరేషన్) ద్వారా పురుషులకు కుటుంబ నియంత్రణను చేసి పిల్లలను పుట్టనివ్వకుండా తద్వారా విస్తరించే జనాభాను నివారించుచున్నారు, ఏలయనగా ఇండియాలో జనాభా విపరీతముగా పెరిగిపోవుచున్నది. నాలుగు వందల మరియు డెబ్బది మిలయన్లు జనాభా ఇప్పుడు ఇండియాలో విస్తరించియున్నది.
బహుగా జనాభా విస్తరించుచున్న చైనా సంగతేమిటి, ఆ విధముగానే జనాభా విస్తరించుచున్న ప్రపంచములోని రష్యా మరియు పలు దేశముల సంగతేమిటి? నరులు భూమి మీద విస్తరింప నారంభించినప్పుడు… చూశారా? ఇప్పుడు, మనము జలప్రళయమునకు మునుపటి కాలమునకు పోయి చూచుచున్నాము.
… కుమార్తెలు వారికి పుట్టినప్పుడు,
దేవుని కుమారులు నరుల కుమారెలు చక్కనివారని వారిని చూచి వారందరిలో తమ కుమారులను వివాహము చేసికొనిరి. తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి.
అప్పుడు యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు, అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
24ఓ, ఎటు వంటి ఒక అంశమును మనమిక్కడ కలిగియున్నాము! చూశారా? ఇప్పుడు, మొదటి కార్యముగా వున్నదానిని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వారు చక్కని వారు. ఇప్పుడు, నేను దీనిని ప్రపంచమంతటిని గురించి చెప్పుచున్నాను. అయితే భూమి మీద ఆ సమయములో ఎన్నడును లేనటు వంటి ఒక చక్కదనము భూమిపై ఎన్నడును ఏ కాలములోను లేని విధముగా, స్త్రీలు బహు సౌందర్యవంతులుగా ఎన్నడును లేనట్లుగా అందమునంతా నేను అనుకున్నట్లుగా ఆ కాలమున మాత్రమే స్త్రీలు కలిగియుండిరి.
ఇప్పుడున్న విధముగా పెద్దవారగు కొంతమంది స్త్రీలు, మరియు మీలోని కొంతమంది జనులు, పురుషులు గడచిన ఆ వెనుక స్త్రీని కాలముననున్న వారికి ఈ విషయుములు గుర్తుండియుండవచ్చు. ఆ దినములలో సొగసైన వారిని చూచుట అరుదుగా యుండెడిది. అయితే ఈ రోజు మీరు అందమైన దానినే కనుగొందురు. ఏలయనగా ఈ దినములలో వారు వెంట్రుకలు కత్తిరించుకొనుచు మరియు ముఖముకు రంగులను పూసుకొంటు, మరియు పలురకములైన అర్థ నగ్నపు దుస్తులను వేసుకొనేటి వంటి దిగజారిపోయిన కార్యములను కలిగియున్నది. ఆ విధముగా వారు తమ్ము తామును చూపించుకొనుచున్నారు… మరియు కాలచక్రము వారిని లేఖనముల ప్రకారము ఈ దినములకు తీసికొనివచ్చి యున్నది. స్త్రీలు తమ అందచందాలను వృద్ధి చేసుకొనుటలో తీక్షణమైన ఆసక్తిని కలిగియున్నారు.
25నా యొక్క పాఠశాలలో నేను చిన్న బాలునిగా యున్న దినములు నాకు గుర్తున్నవి మరియు ఎదిగి వచ్చుచున్న ఈ కాలపు చిన్న పిల్లలను మరియు చిన్న బాలికలను నేను చూచుచున్నాను. నేను ఒక యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు స్త్రీలను గురించి మరియు ఈ కాలముననున్న బాలికలను చూచుచున్నాను. ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక అమ్మాయి ఆ దినములలో వుండటం నాకు గుర్తునది (ఆమె ఇరువద-ఐదు సంవత్సరములు కూడా దాటని అందమైన అమ్మాయి) — ఒక ప్రసిద్ది చెందిన అమ్మాయి, ఒక నాజూకైన అమ్మాయి, ఆ గుంపుకు రాణిగా యుండుటచే ప్రతీ ఒక్క అబ్బాయి కూడా ఆమె వెంట వెళ్లవలెనని వాంఛిస్తాడు. ఒకవేళ ఆ నగరమంతటికిని ఇద్దరు లేదా ముగ్గురు అందమైన స్త్రీలే కనబడెడివారు. ఇప్పుడు, మొత్తమంతా, ప్రతీ ఒక్కొక్కరును అందంగా కనబడుచున్నారు. అది లేఖనముల నెరవేర్పుగా నున్నది, మరియు ఎర్రని దీపము ప్రకాశించుచున్నది అది కాలము సమీపముగా నున్నదని తెలియపరచుచున్నది.
స్త్రీ యొక్క ముఖమునకు ఇంకా వన్నె కల్పించు విధముగా అనేక రకములైన అలంకరణ (మేకప్)ను కనిపెట్టియున్నారు. అంద విహీనంగా యున్న ఒక స్త్రీ కూడా ఈ యొక్క అలంకరణ సాధనములచే పెదవుల రంగును మరియు పలురకముల వర్ణములు ద్వారా వారిని అందముగా కనిపించునట్లు చేస్తుంది — ఈ అలంకరణ సామాగ్రి ద్వారా లేని అందాన్ని వారి ముఖములకు, పెదవులకు, ఈ వర్ణములను పూసుకొని ఇంకా అందముగా వారికి వారు తీర్చిదిద్దుకుంటున్నారు.
MATT 24:37•
LUKE 17:26
26మరియు అమెరికాలో ఒక సంవత్సరమునకు చిల్లర వంట సామగ్రికి వాటికి ఖర్చు చేసే దాని కంటేను అందమునకు వన్నె తెచ్చు పరిమళ ద్రవ్యములకు ఎక్కువగా వారు ఖర్చు చేయుచున్నారు, ఎందుకనగా ఆ స్త్రీ అందముగా కనబడుటకై తాను అంతగా ఖర్చుపెట్టుచున్నది. అది సరియే. మన స్త్రీల అందమునకు వన్నె కల్పించు పరిమళ ద్రవ్యముల ఉత్పత్తికై ఒక సంవత్సరమునకు ఎన్నో కోట్ల డాలర్లను వెచ్చించుచున్నారు. అదెంతో అని నేను ఇప్పుడు మరచిపోతిని.
ఇప్పుడు, నేను దానికి వ్యతిరేకముగా ఏమియు మాటలాడుట లేదు. కాలము యొక్క చేతిలోనున్న ఒక ప్రకాశించెడి ఎర్రని దీపమనే దానిని నేను మీకు చూపించుచున్నాను. ఏలయనగా యేసు తానే స్వయముగా చెప్పెను, "నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును." చూచారా, అదే కార్యము.
GEN 6:2,3•
MATT 24:37•
1TIM 3:16
27గమనించుడి, నరులు విస్తరింపనారంభించిన తరువాత, అధిక జనులైరి. నరుల కుమార్తెలు చక్కగా నుండిరి. "మరియు దేవుని కుమారులు వారిని చూచి మరి ఆ స్త్రీలను వివాహము చేసికొనిరి." ఇప్పుడు, ఇది నా యొక్క స్వంత మాటలు కావు; పరిశుద్ద గ్రంథము నుండి దానిని నేను చదువుచున్నాను, ఏలయనగా యేసు మనకు చెప్పెను ఆదికాండమునకు పోయి మరియు ఈ దినములతో వాటిని పోల్చి చూడుడి. జనులు, విపరీతముగా విస్తరించుట, మరియు స్త్రీల యొక్క సౌందర్యము, ఇప్పుడు అది ఒక గొప్ప సూచన.
ఇప్పుడు యొహోవా యొక్క హెచ్చిరిక, 3వ వచనము.
మరియు యెహోవా చెప్పెను…
ఇది సంభవించిన వెంటనే… గుర్తు౦చుకొనుడి, పరిశుద్దాత్మ పరిశుద్ద గ్రంథమును వ్రాసెను, మరియు యేసు పరిశుద్దాత్మను పరిపూర్ణముగా పొందియుండెను. మరియు ఆయన పరిశుద్దాత్మ ద్వారానే పలికెను. మరియు లేఖనములు పరిశుద్దాత్మ ద్వారా వ్రాయబడెను. మరియు ఆదికాండము 6వ అధ్యాయమును వ్రాసిన ఆయనే మత్తయి 24లో మనకు చెప్పియున్నాడు, కాలము సమీపముగా నున్నప్పుడు ఆదికాండము 6కు వెనుతిరిగి వెళ్ళి, దీనిని దానితో పోల్చి చూడుడి.
భూమిపైన జనులు విస్తరించుట. మరియు పుట్టుకను అదుపులో నుంచు మరియు ఆలాటి కార్యక్రమములు ఎన్ని అమలు పరచినను జనాభా విస్తరించుటను నివారించలేకపోవుచున్నారు. అది ఆ విధముగానే సాగిపోవుచున్నది, ఏలయనగా మనము అంత్యకాలమందు నున్నాము.
మరియు మనము గమనించగలము, స్త్రీలు బహు సౌందర్యవంతులుగా నుండిన ఒక కాలము కలదు, చాలా సొగసుగా నుండిరి. మరి మనము దానిని ఇప్పటి కార్యములతో సరిచూచుకొని మరి దానిని నిరూపింప వచ్చును.
28మన యొక్క పితరులు సమభూమిని దాటి వచ్చునప్పుడు, చాలా కాలము క్రిందట తీయబడిన కొన్ని చిత్రములను నేను చూచుచుంటిని. మరి నేను ఆమె యొక్క పేరును చెప్పలేను, అయితే ఆమె పేరు సాన్ ఫ్రాన్సిసిన్కో నుండి బోస్టన్ వరకు ప్రబలియుండెను, ఆమె దేశములోనే బహు సౌందర్యమైన స్త్రీ, ఆమె పేరు పెర్ల్ వైట్ అని నేను నమ్ముచున్నాను, చాలా కాలము క్రిందటి కార్యమిది. ఆమె తన యొక్క ప్రేమికుని ద్వారా చంపబడెను. అతని పేరు స్కాట్ జాక్సన్ మరి దేశమంతటిలోను ప్రసిద్ధిగాంచిన ఒక అందగత్తెగా ఆమెను మీరు చూచినయెడల, ఆమెను చూచుటకు మీరు ఏవగించుకొందురు. ఇక్కడ వీధులలో ఉండే అందవికారులలో ఆమెయు ఒకత్తెగా కనిపించును. మీరు ఏ స్త్రీనైన ఒక స్త్రీతో ఈమెను పోల్చిచూచిన యెడల, ఈమె కంటేను మీరు చూచిన ఆ స్త్రీయే మూడు రెట్లు అందముగా కనిపించును. దారిన వెళ్ళే ఏ స్త్రీనైన నీవు ఈ దినమున చూచిన ఆమెను నీవు ఆ విధముగా గుర్తించగలవు. చూచారా అది, ఆమె యొక్క నాజూకును పెంచుకొనుచున్నది.
29మరి మన యొక్క స్త్రీలు దీనిని గుర్తించుచున్నారాయని నేను ఆశ్చర్యపడుచున్నాను మరియు… ఆ కారణము వలననే ఈ యొక్క టేపు సకలచోట్లకు పోవలయునని నేను కోరుచున్నాను, అటు మీరు ఆ విధముగా ఉండకూడదు… మీరు చక్కగా నుండవలయునని కోరుచున్నాము. అయితే మీరు అసహజమైన అలంకరణతో కాకుండా, సహజమైన అందముతో మీరు ఉండవలెనని మేము కోరుకుంటున్నాము. చక్కటి స్త్రీలను కొంతమందిని, మీరు వస్త్రములను ఉతికే ఒక తొట్టిలో వారిని వేసి కొంచెం సేపు ఉతికిన యెడల, వారి అలంకరణ (మేకప్) అంతా పోయి కొంచెం భేదముగా కనిపించెదరు; మరియు వారికి చక్కటి దుస్తులను ధరింపజేయండి. కాని వారు దానికి అంగీకరించరు, మరియు మీరు ఎంత చెప్పినను వారిలో ఏ మార్పు రాదు. మరియు ఆ కార్యములోనికి కొద్దిసేపైన పిదప పోయెదము. అయితే ఇదియే ఒక ప్రకాశించు ఎర్రని దీపము.
GEN 6:2-4
30మరియు గుర్తుంచుకొనుడి, నరులు భూమి మీద విస్తరింప నారంభించినప్పుడు మరియు స్త్రీలు చాలా చక్కని వారుగా నుండిరి, ఇది ఆ సమయమై యున్నది, ఇది ఆ సమయమైనప్పుడు అప్పుడు యెహోవా, "నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు." మీరు ఆ పట్టును చూచియున్నారా? దేవుని యొక్క హస్తమును మీరు చూచుచున్నారా? "నా యొక్క ఆత్మ…" "నరుల కుమార్తెలు చక్కని వారు. మరియు దేవుని కుమారులు వారిని వివాహము చేసికొనిరి." మరి అప్పుడు ఆయన చెప్పెను, "నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు. నేను అతని యొక్క దినములను నిర్ణయించెదను."
ఇప్పుడు, 4వ వచనము:
ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు వేరు పొందిన శూరులు వీరే.
GEN 6:2,3
31మీరు గమనించియున్నారా, పైన చదివిన వాక్యములలో అక్కడ వివాహమును గురించి చెప్పబడలేదు కదూ? గమనించుడి, "దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు," అని వున్నది. అక్కడ వివాహమును చేసుకొన్నట్లుగా లేదు. మరియు మీరు గనుక అసలైన గ్రీకు భాషలో దీనిని చదివినయెడల, ఆ వచనము అర్ధము… ఇలా చెప్పుచున్నది… దానిని నేను ఇక్కడెక్కడో వ్రాసియుంచాను — భార్య. "వారిని భార్యలనుగా చేసుకొనిరి," 3వ వచనములో స్త్రీలను వివాహము చేసికొనిరి… ఈ రోజు మధ్యాహ్నము దీనిని నేను గ్రీకులో చూశాను, "స్త్రీలను వివాహము చేసికొనిరి," అని లేదు. "స్త్రీలను తీసికొనిరి," యని అది చెప్పుచున్నది, భార్యలుగా కాదు. ఇప్పుడు, మీరు నేను చెప్పునది సరియా కాదాయని అసలైన గ్రీకు భాషలో చెప్పబడిన దానిని దీనితో సరి చూసుకొనుడి.
"స్త్రీలను తీసికొనిరి," భార్యలుగా చేసుకొనలేదు. ఈ రోజులలో ఉన్న విధముగా స్వేచ్చాయుక్తమైన ప్రేమికులవలె, ఆ స్త్రీలను వారి ప్రియురాళ్ళుగా వుంచుకొనిరి. ఇంకొక విధముగా చెప్పవలయుననిన ఈనాడు వలె వారు ఆనాడు ప్రియుడు, ప్రియురాలిగా వారు వుండిరి వారికి ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు, వారికి నచ్చిన స్త్రీని వారు వాంఛించవచ్చు.
32"మరియు దేవుని కుమారులు…" ఇప్పుడు, వారిని పడిపోయిన దేవదూతలనియు మరియు ఇంకా ఏదో అంటు ఆ స్త్రీలను మరియు పురుషులను గూర్చి అనేక మ౦ది చెప్చెదరు. అయితే అది తప్పని ఇది కనబరచుచున్నది, అది నిశ్చయముగా తప్పే, పరిశుద్ద గ్రంథములో దేవ దూతలను స్త్రీగానో, లేదా పురుషునిగానో ఎక్కడా చెప్పుబడలేదు. మరియు ఎచ్చట చూచినా, పరిశుద్ద గ్రంథములో ఒక స్త్రీ వలె దూత మాట్లాడినట్లుగా ఎచ్చటను లేదు, లేనే లేదు. ఇప్పుడు, మీరు దానికి లేఖనములు కోరినయెడల మత్తయి 22:20 మరి మొదలగు కార్యములు, అక్కడ మీరు చూడగలరు.
ఇప్పుడు, అది … దూత ఒక స్త్రీ అన్నట్లుగా ఎచ్చటను ఒక కార్యముగా లేదు. ఆ కారణము వలననే ఒక స్త్రీ ప్రసంగి… దూత అనగా వర్తమానికుడని అర్థము. మరియు అది ఒక — మరియు అది ఒక దూత అనబడే ఒక వర్తమానికుడుగా ఉన్నాడు… మరియు స్త్రీ వర్తమానికురాలిగా అచ్చట లేదు. అయితే మీరు గమనించండి, ఆ దినములలో మార్పులు చేసినట్లుగా ఈ దినములలోను చేసిరి. మరియు ఇంకొద్ది నిమిషములలో మనము వాటిని చూచెదము.
GEN 6:2
33గమనించుడి , ఆ దినములలోనున్న స్త్రీలను గురించి — నోవహు దినములలోవున్న స్త్రీల గురించి ఈ దినములలో మాట్లాడవలసియున్నది. చూచారా, కయీను కుమార్తెలను చూచి, వారు అందమైన వారని దేవుని కుమారులు (షేతు యొక్క కుమారులు) కనుగొనిరి. ఎందువలన? వారు దుష్టులు మరియు వారు కయీను యొక్క కుమార్తెలు. దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారని చూచి, వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన వారిని స్త్రీలగా తీసికొనిరి. అప్పుడు దేవుని కుమారులు దేవునితో వారికున్న స్థానమును వారు కోల్పోయి, మరియు స్త్రీలను వెంటాడు వేటగాళ్ళగా వారు మారిపోయిరి. నేటి దినమున కూడ ఆ విధమైన చిత్రము (సంభవములు) కనిపించుట లేదా, అదేమిటనేది నాకు తెలియదు. అది సత్యము.
నరులు… ఈ రోజు మన సంఘములను చూడుడి, మీకు తోచిన వాటన్నిటిని చూడుడి; దానిని గమనించుడి. ఆ దినములవలె నేడు కూడా ఎటు చూచిన అందచందాలతో నిండిన స్త్రీ కనిపించుచున్నారు. పురుషుడు స్త్రీకి బానిసగా మారిపోయినాడని చరిత్ర చెప్పుచున్నది, వాస్తవముగా పురుషుడు స్త్రీకి బానిసగా అగుచున్నాడంటే, వారియొక్క అతి సౌందర్యమునుబట్టే, పురుషుడు వారికి బానిసగా మారిపోతున్నాడు. అక్షరాలా పురుషుడు వారికి దైవ పీఠములను నిర్మించి మరియు వారిని ఆరాధించుచున్నారు. చరిత్ర యొక్క ఆధార పూర్వకముగా వారు అక్షరాలా స్త్రీ యొక్క శరీరమును మరియు రక్తమును అరాధించిరి. దానిని గురించి తలంచి చూడండి.
34మరి దానిని ఈ దినములతో కూడ పోల్చి చూడుడి. అదే సంభవములే ఇవి కూడా, నా సహోదరుడా, నరులు స్త్రీలను ఆరాధించుచున్నారు. అంతెందుకు, మన సొంత దేశములోనే జనాధ్యక్షుడు కెన్నడి కంటెను అతని భార్య శ్రీమతి కెన్నడి అధికంగా గౌరవింపబడుచున్నది. అది సరియే. మరియు మీరు గనుక ఒక మనుష్యుని గురించి ఎల్లపుడును మాటలాడుచుండిన యెడల అతనికి ఒక ఆకర్షించు భార్య యుండవలయును, దానిలోనున్న కార్యమదియే.
మరియు ఇప్పుడు, వాహనమును నడుపు దానిని గురించి — వారు చెప్పెదరు. బహు జాగ్రత్తగా వాహనమును నడిపే వారు స్త్రీలే అని వారు చెప్పుటను నీవు వినియుందువు. అది తప్పు, ఏలయనగా దానికి కారణము నేను చెప్పెదను. బిల్లి మరి నేను ఈ యొక్క సంయుక్త రాష్ట్రములలో చక్కటి కండిషన్లోనున్న కారును తోలుచున్నప్పుడు మేము ఒక రోడ్డు మ్యాపును మా కారులో నుంచుకొని, ఒక చిన్న పుస్తకములో "స్త్రీ" అని ఒక ప్రక్క మరి "పురుషుడు" అని మరియొక ప్రక్క వ్రాసియుంచుకొంటిమి. మరియు స్త్రీ తప్పు చేసినప్పుడు - దానిని స్త్రీ ప్రక్కగా గుర్తుచేసి, మరి పురుషుడు తప్పు చేసిన - దానిని పురుషుని ప్రక్క గుర్తుచేసికొనుచుంటిమి. మరియు మూడు వందల మంది రోడ్డుపై కారు సరిగ్గా తోలక తప్పు చేసి పట్టుబడియున్నారు, దానిని మేము "బూ బూస్" అని చెప్పెదము…. మీరు ఆశ్చర్యపడెదరు; మూడు వందల మంది పట్టుబడగా దానిని లెక్క తీయగా రెండువందల-ఎనభై మంది స్త్రీల తప్పుగా గుర్తించబడినది, మరియు పురుషుల వైపు పందొమ్మిది మంది తప్పుగా గుర్తించబడిరి. అది ఎందులకు ఆ విధముగా తెలియునా? వారు స్త్రీలను న్యాయస్థానాలకు పిలువరు. పోలీసులు ఒక సొగసుగా నుండు స్త్రీని ఖైదు చేయరు, వెయ్యి మందిలో ఒకరిని ఖైదు చేసెదరు. నిజముగా వారు ఆ విధముగా చేయుచున్నారు, ఆమె టెలిఫోను నంబరును మాత్రము తీసికొని మరి వారిని వదిలి వేయుచున్నారు. మరి ఆ విధముగానే జరుగుచున్నది… అవి నమోదు అవుచున్నట్లుగా చూపించు నేరాలను పొందుపరచు పుస్తకములలో లేకపోవటం మరి అతిశయోక్తి కాదా! చూశారా? ఏలయనగా, ఈ దినములలో నరులు నోవహు దినములవలె నున్నారు, ఆరాధ్యమైన స్త్రీ యొక్క అందమునకు వారి తలలను వారు వంచుచున్నారు. అవును, నిజము.
ఓ, మై!
LUKE 17:27,28
35ఆకర్షనీయముతో మెరిసిపోయే రీతిగా యున్న ఆ స్త్రీలను చూచి, ఆ దినములలో వారు ఆ విధముగా వారిని ఆరాధించటం ఎంతటి భయంకరమైన కార్యముగా అది యున్నది… మరియు ఈ కాలపు స్త్రీలను మించి ఆ కాలపు స్త్రీలు యుండిరనగా, నేను ఆ సమయములో అక్కడ లేకుండుటకుగాను సంతోషించుచున్నాను. దానిని గురించి ఆలోచించుడి, ఇప్పుడు ప్రవర్తించునట్లే, ఆ కాలములో కూడ స్త్రీలు ప్రవర్తించుచుండిరి.
గమనించుడి. బైబిలు చెప్పుచున్నది, "వారు తినుచును మరి త్రాగుచును యుండిరి." ఇప్పుడు అది న్యాయమైనదే. నిశ్చయముగా! "వివాహము ఘనమైనది." ఒక పురుషుడు, ఒక స్త్రీని వివాహమాడుట, అది ఘనమైన కార్యము, దేవునివలన నిర్ణయించబడినది. అయితే ఎప్పుడైతే ఆ పురుషుడు ఇంకొక పురుషుని యొక్క భార్యను స్వీకరించునట్లుగా సమయము ఆసన్నమైనప్పుడు, లేదా ఒక యవ్వన స్త్రీని స్వీకరించినా, లేదా ఇంకొక స్త్రీనైనా వుంచుకొనిన ఆమె ఎవరైనా అవ్వనీ, తన వివాహము యొక్క నిబంధనను అతడు ఛేదించినవాడై మరియు ఆ విధమైన ఏదో ఒక నేరమును అతడు చేసినవాడవుతాడు. అది దేవుని యొక్క దృష్టిలో పాపముగా పరిగణింపబడుచున్నది. మరియు పరిశుద్ద గ్రంథము దానిని గురించి చాలా కఠినముగా ఖండించి చెప్పుచున్నది.
GEN 2:24•
EXOD 20:14•
LUKE 17:27,28
36ఇప్పుడు గమనించుడి, వివాహమును నియమించినది ఆ దేవుడే ఏదేనులో దానిని నియమించెనని చెప్పుబడియున్నది, అయితే ఆయన నిశ్చయముగా వ్యభిచారమును ఖండించెను. మరియు ఈ యొక్క పురుషులు మరి స్త్రీలు ఆ దినములలో దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మరి వారి కిష్టము వచ్చిన రీతిగా వారు వ్యవహరించుచుండిరి. ఇప్పుడు దానిని నేటి దినములను ఆనాటి దినములతో సరి పోల్చి చూడండి. దానిని గమనించి చూడండి. మీరు గనుక స్టేషనుకు బయట మార్గ మధ్యమున నిలిపియుంచిన రైలు బండిని చేరవలయుననిన, ఇప్పుడు మీరు లోతుగా దానిని గురించి ఆలోచించి చూడవలయును, ఏలయనగా ఎన్నడు మారని యేసుక్రీస్తు ఈ యొక్క మాటలను చెప్పియున్నాడు. చూశారా?
మరియు గమనించుడి! "వారు తినుచు మరి త్రాగుచు నుండిరి అని పరిశుద్ద గ్రంథము ఇక్కడ తెలుపుచున్నది, మరి ఆ చక్కని స్త్రీలతో వారు ఆ విధముగా నుండిరి. ఇప్పుడు మనము గుర్తెరిగియున్నాము, తినుట మరి త్రాగుట, అది స్వభావ సిద్దముగా జీవితము యొక్క ఒక కార్యమైయున్నది. దానిని మనము చేయవలసినదే. అయితే మీ మనస్సు వాటికొరకే ఆరాటపడుతుంటే… ఈ దినములలో ప్రజలు కేవలము తిండిబోతులుగా త్రాగుబోతులుగా వుంటున్నారు మరియు హోటళ్లలో స్త్రీలు త్రాగుచున్నారు. మరియు మీరు గనుక మధుపానశాలలకు వెళ్లిన యెడల అక్కడ పురుషుల కంటెను స్త్రీలు ఎక్కువగా త్రాగుచున్నారు.
MATT 24:38•
LUKE 17:27
37యేసు చెప్పెను, "నోవహు దినముల వలె వారు తినుచును మరి త్రాగుచును పెండ్లి చేసికొనుచు నుండిరి." ఇంకొక విధముగా చెప్పవలయుననిన వారు వివాహము చేసికొనకయే స్త్రీలతో వారు జీవించుచుండిరి. మరి ఈ దినములలో, అది ఎట్లు అనేకమంది జీవితాలలో అవలంభింపబడుచున్నది… వారికి రీనో అను ఒక చోటుండెను, మీరు వివాహము చేసుకొని మరియు విడాకులు చేయవచ్చు మరియు వెంటనే మళ్ళీ వివాహమును చేసికొనవచ్చును; ఇవన్నియు ఒకే దినమున చేయవచ్చును. అయితే ఇప్పుడది పాతపద్దతిగా నున్నది. ఊరకే పేరుకు - భర్తలలాగా పిలువబడుచు మరియు ఇంకొకరి గది తాళములను తీసికొని వేరొకరి భార్యతో లేక వేరొకరి భర్తతో గడుపుచున్నారు, ఇవంతయు పెద్ద పెద్ద నగరములలో జరుగుచున్నది. ఇప్పుడు నేను అనేక నగరములలో ప్రయాణము చేయుచుండెదను మరి నేను చెప్పున దంతయును వాస్తవమని నేనెరుగుదును, భర్తలు వేరొకని భార్యలతో మరి భార్యలు వేరొక భర్తతో తేదీలను నిర్ణయించుకొనుచున్నారు. సరి, ఇటువంటి క్రుళ్ళు పట్టిన అసహ్యమైన కార్యములన్నియును అది అలా కొనసాగిపోతు వుండవలసినదిగా పనికి మాలిన, సోమరి పోతులను, నరకమునకు పోవు సంతతిని ఉత్పత్తి చేయుచున్నది.
38కొద్ది సంవత్సరముల క్రితము… నరుని యొక్క శరీరము ఏ విధముగా నుండెనని చూడుడి మరిప్పుడు అతడు చేసుకొనిన కార్యములవలన అతనిప్పుడు ఎట్లున్నాడో గమనించండి. విజ్ఞాన శాస్త్రము ఒక మంచి ఆహారమును, మిశ్రితమైన ధాన్యములను మరియు మిశ్రితమైన టమోటాలను, మిశ్రితమైన గొడ్డు మాంసమును ఉత్పత్తి చేయుటకు నిర్విరామంగా అది ప్రయత్నించుచున్నది, మరియు ఇటువంటి ఆహారము ఎప్పటికిని మంచిది కాదు. అవి జనులను చంపుచున్నవి, మరి వారు దానిని గుర్తెరుగకయున్నారు. ఏలయనగా ఇంకొద్ది సంవత్సరములలో వారు జెల్లి చేపలవలె మృదువుగా బలహీనముగా శక్తి లేక అధ్వానమైన వారుగా మారిపోవుదురు.
ఏబది సంవత్సరములకు మునుపు బంతి ఆటలు ఇప్పుడున్న విధముగా ఆడుచునుండెడివారు, మరియు ఆ ఆటలలో ఎవరును గాయపరచబడినట్లు మీరు వినియుండరు. అయితే ఇప్పుడు, ఆ ఆటలు ఒక డజను లేక రెండు డజను జనులను ఒక సంవత్సరమునకు చంపుచున్నది. ఒక బంతి ఒక మనుష్యునికి తగిలిన యెడల అతడు ఆ దెబ్బకు తట్టుకొనలేక పోవుచున్నాడు. అతను ఒక పిట్టవలె నుండుటచే, అతడు ఎంతో మృదువుగా నుండుటచే ఆ దెబ్బ తగులుటచే అతడు మరణించుచున్నాడు.
39బాబ్ ఫిట్టిసిమన్స్ మరియు కర్బెట్ట్ వారే అని నేనను కొనుచున్నాను, వారు పిడికిలికి ఏమియు చేతి మేజోడు ధరించుకొనక నూట-ఇరువది-ఐదు రౌండ్లు ముష్టి యుద్దము చేసెడి వారు. వారు గట్టిగా దృఢముగా నుండు పిడికిలితో బాక్సింగ్ చేయుచుండెడి వారు. పండుకొనునప్పుడు వారి చేతులను గట్టిగా కఠినముగా నుంచుటకొరకై వెనిగరులో పెట్టి పండుకొనెడి వారు. మరియు ఈ రోజులలోవలె చిన్న రెండు లేక మూడు నిమిషముల బాక్సింగ్ రౌండు కాదు వారు చేయు ముష్టి యుద్ధము. వారి వ్రేళ్ళకు వారు ఏ విధమైన గ్లవుస్ ధరించుకొనక పోటిలో యుద్ధము చేసెడి వారు మరియు ఎవరును చంపబడరు. మరి వారు ఆ విధముగా యుద్దము చేయు వారు. ఒక రౌండు ఒకే దెబ్బలో క్రింద పడత్రోసివేయుదురు. ఒకరిని ఓడించవలయుననిన వారు నూట-ఇరవై-ఐదు రౌండ్లు పోటీ చేసి ఓడింపవలసినదిగా నుండెను. వారు నిజమైన పురుషులు. అయితే ఈ రోజులలో వారు బాక్సింగ్ను నిలుపవలసినదిగా యున్నది, వారు ఈ దినములలో చేతుల చుట్టును, పిడికిలి చుట్టును దెబ్బలు తగులకుండా గ్లవుస్ వేసికొనుచున్నారు, రెండు మూడు చుట్టు కూడ ఎవరిని చంపక పోటీ చేయలేకున్నారు. దానికి కారణము ఏమిటి? అతను మృధువైన కార్యములతో మిశ్రితమైన వాటితో తయారగుచున్నాడు, ఈ విధమైన మిశ్రితమైన కార్యములు వలన సంతతి యూవత్తు చనిపోవువరకు అటువంటి పోషణయే యుండును.
40వారు శరీరములో బలహీనులుగా నుండి మరి జ్ఞానవంతులుగా నుండెదరని పరిశుద్ద గ్రంథము దానిని గురించి చెప్పుట లేదా? ఏల ఇంకొక జాతి జనులు రావలసి యుండిన ఇంకొక సంతతి జీవించవలసియున్న యెడల వారు వారి యొక్క భోజనమునకై ఒక మాత్రను మ్రి౦గెదరు. ఈ జనులంతయును పొగ పీల్చుచు, విస్కీను త్రాగుచు, మద్యపానశాలలు చుట్టు తిరుగుచు, మత్తు మందులకు బానిసలైన గుంపుగా మరియు మత్తు కొరకు సూదులు పొడుచుకొను వారిగా నున్నారు. పదహారు మరి పదిహేను వయస్సులోనున్న పాఠశాలలోని పిల్లలు, బాల్య ప్రాయుములోనే తప్పులు చేయుటలో ఆశ్చర్యపడనక్కర లేదు, ఏలయనగా వారి తల్లి అక్కడ వీథులలో ఆమె కిష్టము వచ్చినట్లు తిరుగుచున్నది, మరి బిడ్డలను ఆ విధముగా పెరుగులాగున చేయుచున్నది.
EXOD 20:14•
MATT 19:18•
MARK 10:19•
LUKE 18:20
41అందమైన చక్కని స్త్రీలు విస్తరించుచున్నారు; సమాజము యొక్క సంస్కారము వినాశమవుచున్నది. ఓ, మై, మనము ఎటువంటి సంభవములు సంభవించుచున్న ఈ దినములలో జీవించుచున్నాము! వారు ఎట్లు ఈ విధముగా చేయగలుగుచున్నారు - మరి దానితో ముందుకు సాగిపోవుచున్నారు. వారు దానినుండి తప్పించుకొనలేక పోవుచున్నారు. వారు ఏమి చేయుచున్నారు? అప్పుడు వారు చేసినట్టే వారు దేవుని ఆజ్ఞలను పరిహాసము చేయుచున్నారు. దేవుడు చెప్పెను, "వ్యభిచారము చేయకుడి." అయితే వారు దానిని చేసెదమని చూపించుకొనుచున్నారు మరి దాని ద్వారా శాపము పొందక తప్పించుకొనెదమని చెప్పుకొనుచున్నారు. వారు అనుకొనుచున్నారు దానిని చేయుట పరవాలేదనియు, అయితే వారు శాపము నుండి తప్పించుకొనలేరు. మీరు రాకుండ యుండి యుండవచ్చును, అయినను దీనిని వినుడి. ఏది ఏమైనను, ఎర్రని దీపము ప్రకాశించు సమయము ఇదియే అని దేవుడు చెప్పియున్నాడు. యేసు కూడా దానిని చెప్పియున్నాడు.
42ఇప్పుడు, వారు ఎటువంటి ఒక ఘోరమైన పాపమును చేయుచున్నారు, మరియు అది పాపము అని అంటే నవ్వుచున్నారు… అనేక సమయములలో పరిశుద్ద గ్రంథము దేనినైతే దుర్నీతి అని చెప్పుచున్నాదో మరి దానిని ప్రపంచము నీతియని చెప్పుచున్నది. మీరు ఒక యౌవ్వన బాలికలను తీసికొని వారి దుస్తులను తీసివేసి కురచ వస్త్రముల వంటి నిక్కరు, మరియు చొక్కాయిలను, మరియు ఆ విధమైన దుస్తులను మీరు వారికి ధరింపజేసి మరి వీథులలో ఆ విధముగానే నడుస్తూ వెళ్ళుతు౦టే, మరియు ఆ విధముగా ఆ యౌవ్వన స్త్రీ తన శరీరము యొక్క అంగసౌష్టవమును చూపించటం అది నీతియనియు వారు అనుకొనుచున్నారు. అది భయంకరమైన పాపమని పరిశుద్ద గ్రంథము తెలియజేయుచున్నది, అది ఘోరమైనది అయితే ప్రపంచము దానిని నీతియని చెప్పుచున్నది. చూడుడి, వారు దేవుని యొక్క ఆజ్ఞలను… మరి సంఘము ఆ విధమైన అసభ్యమైన కార్యములను గురించి ఏమియు చెప్పుట లేదు. నీతిమత్వమును నామములో, యేసుక్రీస్తు నామములో ఎవరైనను ఒకరు లేచి, మరి ఈ విధమైన నీచమైన కార్యములకు ముద్ర వేయవలసిన సమయము ఇదియే, ఏలయనగా న్యాయతీర్పు దినమున దాని నిమిత్తము మనము లెక్క అప్ప చెప్పవలసియున్నది.
GEN 6:2•
ISA 3:16
43ఇప్పుడు, నేను చెప్పు ఈ కార్యములు పాతవి మరి అస్పష్టమైనవిగా కొందరికి అగుపించవచ్చును, ఇప్పుడు ఏమి సంభవించుచున్నవనే వాటిని కొన్ని సంవత్సరముల కాలము క్రిందటి కార్యములను పరిశీలించి చూడండి. అటు పిదప భవిష్యత్తులో ఏమి సంభవించనైయున్నవో ఊహించి చూచుకో. భవిష్యత్తు అనేదేదియు లేదు, అయితే ప్రభువు రాకడయే మిగిలియున్నది.
ఈనాటి స్త్రీలయొక్క అడుగుజాడలను అనాటి జలప్రళయమునకు మునుపువున్న స్త్రీల యొక్క ప్రవర్తనతో పరిశీలించి చూడండి. దేవుని కుమారులు ఏమి చేసిరో చూడుడి. ఈ దినమున వారేమి చేయుచున్నారో చూడుడి.
నేను ఒక కూటములో కొద్ది కాలము క్రిందట కూర్చునియున్నాను మరియు ఒక కార్యము నన్ను గాయపరచినది అక్కడున్న అందరును… వేదికపై ఒక వాక్యపరిచారకుడు ప్రసంగించుచుండగా ప్రతి ఒక్కొక్కరు దానిని వింటూ ఆనందించుచున్నారు. మరియు నేను ఒక మూలన కూర్చునియుంటిని. మరప్పుడు ఒక యౌవ్వన స్త్రీ లోనికి వచ్చెను, మరి ఆమె అసభ్యముగా దుస్తులు ధరించియుండెను. మరియు సంఘము మధ్యలో నుండి ఆమె నడుచుచు వచ్చుచున్నది, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నట్లుగా కులుకుచు నడుచుకుంటూ ఆమె వెళ్ళుచుండెను. మరియు వేదికపైనున్నటువంటి ప్రతీ బోధకుడు మరియు సంఘ సభ్యులందరు కూడా మరియు ప్రతీ ఒక్కొకరు వారి తలలను త్రిప్పి వెళ్ళుచున్న ఆ యౌవ్వన స్త్రీని చూచుచున్నారు." దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచిరి," అనే లేఖనము యొక్క భాగములు నాకు గుర్తుకు వచ్చినవి. పాపులు, భక్తిహీనులు, అనే లేఖనము యొక్క భాగములు నాకు గుర్తుకు వచ్చినవి. అందమైన స్త్రీలు అయ్యో, వారు సంఘములను అనేక ముక్కలుగా చీల్చివేయుచున్నారు. అది దేవుని యొక్క ఆత్మను వారియొద్ద నుండి తీసివేయుచున్నది. గమనించుడి! నరుల కుమార్తెలను చూచిరి.
MATT 24:37-39•
JOHN 8:32,45•
2THS 2:10-12
44ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఈ యొక్క దినములలో ఈ కార్యములు ఈలాగుండునని ఎన్నడు మారని యేసుక్రీస్తు చెప్పియున్నాడు. మరియు ఆయన చెప్పెను, "మీరు ఈ కార్యములన్నియును నెరవేరుట చూచునప్పుడు సమయము సమీపముగానున్నదని ద్వారము నొద్దనేనున్నదని అప్పుడు మీరు తెలుసుకొనుడి." ఇప్పుడు, అనేకమంది జనులు దీనిని చెప్పుట లేదు. అనేకమంది బోధకులు ఆ విషయములను చెప్పుట లేదు. అతడు చెప్పాలనుకొనిన యెడల చెప్పవచ్చును, అయితే అతడు అట్లు చెప్పిన యెడల, సంఘ సభ్యులు అతడిని త్రోసివేయుదురు. అది నిస్సందేహముగా సత్యమై యున్నది.
అయితే ఇక్కడున్న విషయమేమంటే, దేవుని ద్వారా ఒక వ్యక్తి పిలువబడిన యెడల అతడు పరిశుద్ద గ్రంథము పైనే ఆధారపడియుండును. అతడు ఏమి చేసినా కూడా నాకనవసరము. అది సత్యమైనదని దానిని నీవు గుర్తించవలసియున్నది. మరియు సత్యము మిమ్ములను బంధించును లేక సేచ్చాపరులు చేయును. ఇదియే యేసుక్రీస్తు చెప్పిన వాస్తవమైన విషయమైయున్నది.
GEN 6:2•
MATT 5:28•
MATT 24:37,38
45నరుల కుమార్తెల యొక్క అందమైన ముఖములను మరియు సౌందర్యమైన రూపములను దేవుని కుమారులు చూచి పడిపోయిరి. నేటి దినములలో కూడా ఖచ్చితముగా అటువంటి కార్యములే సంభవించుచున్నవి, మరల అదే విధమైన సంభవములే సంభవించుచున్నవి.
ఇప్పుడు, దానిని ఈ రోజులతో సరిపోల్చిచూడుడి: జనులు విస్తరించుట, స్త్రీలు అధిక సౌందర్యవంతులుగా నుండుట, దేవుని కుమారులు పడిపోవుట, వివాహము చేసికొనుట మరియు వివాహమున కియ్యబడుట, విడాకుల వాదములు వ్యభిచారములో జీవించుట, మరియు మొదలగు కార్యములన్నియు జరుగుచున్నవి.
"సహాదరుడు బ్రెన్హాం, ఒక్క నిమిషము ఆగుము, ఇవన్నియు ఈ విధముగా ఎందుకని నాకు అర్థము కావటం లేదు" అని నీవు అడుగవచ్చును. సహోదరుడా వినుము, మీరు ఏదైనను చెప్పుటకు మునుపు వినుము, దీనిని వినుము. యేసుక్రీస్తు చెప్పియున్నాడు, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును." మరియు మీరు చూచిన యెడల… ఒక మనుష్యుడు తన ఆఫీసును వదిలి బయటికి వచ్చునప్పుడు, సంఘము నుండి బయటికి వచ్చునప్పుడు, తన ఇంటి నుండి బయటికి వెళ్ళునప్పుడు, వీథులలో నడుచుచున్నపుడు మీరేమి చూచుచున్నారు, అందమైన ముఖములతో, చక్కటి శరీర అంగ సౌష్టవములు గల రూపములతో ఎటు చూసినా బిగుతైన వస్త్రములను ధరించుకొని స్త్రీలు ఆకర్షించుచు… నిన్ను మరులు గొలుపుచున్నారు! అదియే జరుగునైయున్నదని దేవుడు చెప్పియున్నాడు. మరి ఈ కార్యములన్నియును సంభవించునప్పుడు సమయము ద్వారము దగ్గరనేయున్నదని రుజువగుచున్నది. "నోవహు దినముల వలె, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసినప్పుడు ఆ స్త్రీలను వారు గైకొనిరి." చూశారా? నీవు అక్కడే యున్నావు.
46ఇప్పుడు గమనించుడి! ఈ రోజులలో కూడ అదే కార్యమును మనము కనుగొనుచున్నాము. అటువంటి లజ్ఞాకరమైన ఆకృతిని (స్త్రీలు) కలిగియున్నట్లు మనము చరిత్రలో చూచుచున్నాము, చివరకు దేవుని కుమారులు స్త్రీల యొక్క అంగసౌష్టవములను ఆరాధించే వారుగా వారు మారిపోయిరి. అది సౌందర్య దేవతగా పరిగణింపబడు శుక్రుడు ( Venus) ని మొదలగు వాటిని వారు ఆరాధించిరి. గమనించితిరా? వారు వాటికి దైవపీఠములను నిర్మించి మరియు వాటి ముందు సాగిలబడి మొక్కితిరి. "ఆ నాటి దినములలో జరిగిన కార్యములు సహోదరుడు బ్రెన్హాం ఈనాడు మన మధ్య లేవు కదా, అని నీవు చెప్పువచ్చు; నీవు వాటిని నేటి దినములతో సరిపోల్చలేవు!" నన్ను మన్నించండి. అప్పుటి కంటేను అవి నేడు బహు నీచమైన స్థితికి దిగజారిపోయినవని నేను నమ్ముచున్నాను.
మనమేమి చూచుచున్నాము? టెలివిజన్. మీరు ఒక వార్తా పత్రికను కూడ చూడలేని పరిస్థితులలో యున్నారు, అదంతయు స్త్రీ లతో నిండియున్నది. ప్రతీ విస్కీ సీసా కవరుపై నాజూకుగా కనిపించేది స్త్రీయే, అర్థ నగ్నంతో లజ్ఞాకరంగా వస్త్రములను ధరించుకొనియున్న స్త్రీలే మాస పత్రికలలోను కనిపించుచున్నారు. టెలివిజన్లోను సమస్త కార్యములలోను అసహ్యంగా అర్థనగ్నంగా దుస్తులు ధరించుకొనియున్న కొంతమంది స్త్రీ మరియు ఒయ్యారాలు ఒలకపోస్తూ కనిపించే స్త్రీలే కనిపించుచున్నారు. మరియు మనము కనుగొనగలము సిగరెట్ట్ ప్రకటనలయందును సమస్త ప్రకటనలలోను నీవు చూడగలవు. దానిపైన, వాటిల్లో ఆకర్షించుచున్న స్త్రీని నీవు కనుగొనగలవు. స్త్రీలు ధరించు మేజోడు ప్రకటనలలో దానిని వేరుగా చూపించక సన్నని స్త్రీల కాళ్ళ దానిలో దూరులాగున చూపించుచున్నారు. మరి అవన్నియును సరియే. అయితే అదేమిటి? ఎందులకు ఆ విధముగా నున్నది?
47ఈ మూలలో నున్న క్రిన్ మెయిసనర్ అను వ్యక్తి కలడు అతని యొద్ద నేను పనిచేసియున్నాను అతనిని నాకు గుర్తున్నది. మీలో అనేకులకు అతను గుర్తున్నాడు. అతని భార్య లిల్లియన్, ఆమె పేరు లిల్లీ, ఆమె ఎలింజర్ కుటుంబమునకు చెందిన వారని నేను అనుకొనుచున్నాను. మరియు ఆమె ఆ వ్యక్తి వచ్చెను. ఆమె చాలా అందమైన ఒక అమ్మాయిగా వుండెను; మరియు ఒక వ్యక్తి ఆమె యొక్క మోమును, ఆమె యొక్క చిత్రమును, ఆమె యొక్క రూపమును ఒక పంచదార మిఠాయి పెట్టెపై వేయుటకు ఆమె యొక్క తండ్రి అనుమతి కోరుటకై అచ్చటికి వచ్చెను. మరి ఈ పాత జర్మను లూథరను సంఘమునకు చెందిన వ్యక్తి తన కాళ్ళపై నిలచి మరి చెప్పెను, "దేశము నలుమూలలకు పోవు ఆ మిఠాయి పాకెట్టుపై నా యొక్క కుమార్తె పటమును వేయుట నాకు అవమానకరమైన కార్యము." ఈ రోజలలోనున్న కార్యమేమిటి? టెలివిజన్లలో, ప్రకటనా పలకలపై, సమస్తమును ఏమి చూసినా అయోగ్యముగా, అసహ్యముగా, అసభ్యముగా, భక్తిహీనత గల స్త్రీల బొమ్మలే కనిపించుచున్నవి. అది సరియే. అదేమిటి? పురాతనమైన రైలు బండి ఇప్పుడు ఆమె యొక్క స్థలము నందు నిలుపబడియున్నది. పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, ఆ రైలుబండి త్వరగా రానున్నదని. మనము దాని శబ్దమును వినుచున్నాము.
MARK 4:22
48దీనితో పాటు మనము ఇతర కార్యములను గురించి మాట్లాడుకొనెదము, కాని గమనించండి, ఇది ఇంకొక మెరుపు కాంతియై యున్నది, నేడు మన ముందు ప్రకాశించుచున్న కాంతితో ఇది కూడా ఒక ప్రకాశించు కాంతియై యున్నది. ఓ, మనము దేశము యొక్క స్థితిని చూచుచున్నాము; రాజకీయ కలవరమును చూచుచున్నాము; సంఘము యొక్క స్థితిగతులను చూచుచున్నాము; మనము వాటన్నింటిని గురించి ప్రసంగించాము, కాని ఇది క్రొత్త విషయమై యున్నది. మనము మాట్లాడుచున్నది ప్రఖ్యాతిగాంచిన విషయమైయున్నది, అయితే ఇది ప్రసంగించవలసిన కార్యమై యున్నది. ఏలయనగా అక్కడొక స్వరము కేక వేయుచున్నది. గుర్తుంచుకొనుడి, ఈ రాత్రి నేను పలుకు ఈ వాక్యములు నేను తప్పు చెప్పిన యెడల ఆవలి తీరమున నన్ను న్యాయతీర్పున సంధించును.
49ఈ యొక్క స్త్రీని నేను చాలా కాలము క్రిందట ప్రభువు చూపించిన దర్శనములో చూసినప్పుడు, ఆమె మరణావస్థలో నున్నట్లుగా చూచితిని… ఆమె యొక్క పేరు నాకు గుర్తుకు రావటము లేదు, ఆమె, మార్లిన్ మన్రో మరియు నేను ఇదివరకు ఆమెను చూడలేదు, ఆ యువతిని చూచాను మరియు ఆమె ఆకర్షణీయమైన స్త్రీ. అయితే నేను ఆమెను చూసియున్నాను, మరి ఆమె చాలా ఆకర్షణీయముగా నుండెను. మరియు ఆమె దేనినో తీసికొనుటకు ప్రయత్నించుచున్నది; ఆమె చనిపోవుచున్నది, గుండె పోటు వచ్చెను. మరియు "ఇప్పుడు దీనిని నీవు చెప్పుము, ఆమె సరిగ్గా నాలుగు గంటలకు చనిపోయెను. ఆమె ఆత్మహత్య చేసికొనలేదు, అని ప్రభువు సెలవిచ్చెను. అయితే నీవు ఆమె నాలుగు గంటలకు చనిపోయినదని చెప్పవచ్చును, ఏలయనగా అప్పుడు నాలుగు గంటలకు కొద్ది సెకెండ్లు మాత్రమే యున్నవి," అని చెప్పెను. వారెక్కడ ఆమెను కనుగొనిరో, అచ్చటే నేను ఆమెను చూచాను. మరియు నేను బిల్లితో, నా కుటుంబస్తులతో, నాతో కూడనున్న వారితో దానిని గురించి చెప్పియున్నాను. మరియు కొన్ని దినములకు పిదప మార్లిన్ మన్రో చనిపోయినదని తెలిసినది.
50ఇప్పుడు, నేను కెనడాలో నున్నప్పుడు మేము అద్దెకు వున్న ఇంటిలో, ఆ ఇంటి యుజమానురాలి గదిలో ఎచ్చట టెలివిజన్ వున్నదో నా పిల్లలు చెప్పుచుండెడి వారు దానిలో "ది రివర్ అఫ్ నో రిటర్న్" అను ఒక సినిమాను వెయ్యబోవుచున్నారని నా పిల్లలు నాతో చెప్పిరి, ఆ నదిలో నేను ఎల్లప్పుడును చేపలు పట్టియున్నాను. మరియు జాన్ స్మిత్ అనునతను ఆ యాత్రను ఏర్పరచెను, ఆ గుంపులో పటము తీయు వారుండిరి. "దాని నుండి వారు ఒక సినిమాను తీసియున్నారు." మరియు పిల్లలు చెప్పిరి, "డాడీ, స్మిత్ ఆ యొక్క కార్యక్రమములో నున్నాడు. దానిని మీరు చూడ నిష్టపడుచున్నారా?"
"సరి," అని నేను చెప్పాను, "నేను కెనడా నుండి వచ్చిన పిదప నాకు గనుక సమయమున్న యెడల నేను దానిని చూచెదను." సరి, ఆ సినిమాను వచ్చినప్పుడు నేను దానిని చూచుటకు వెళ్ళాను. మరియు నేను చూచునప్పుడు దానిలో చూశాను, దానిలో నటించునది వేరెవరో కాదు మార్లిన్ మన్రో. అదిగో అక్కడ ఆమె యున్నది - ఒక సంవత్సరమునకు లేక దానికి మునుపు ఆమె చనిపోయిన పిదప - దానిని నేను చూశాను, దానిలో ఆమె అసభ్యముగా దుస్తులు ధరించి యుండెను. దానిలో ఆమె స్వరము టేపులో నున్నది, ఇంకను ధ్వనించుచున్న ఆ స్వరము అనేక సంవత్సరములకు నుండును. అది మేగ్నటిక్ టేపులో తీయబడి యున్నది. ఆ మేగ్నటిక్ టేపు ఆమె యొక్క నటనను పట్టుకొనిన యెడల — ఈ రాత్రి ఆమె ఎచ్చటయున్నదో ఆచ్చటినుండే ఆమె దీనిని చూచును (ఆమె రక్షింపబడి యున్నదని నేను నమ్ముచున్నాను, అయితే నాకు తెలియదు; అది దేవునికే తెలియును) - ఆమె గనుక వెనుదిరిగి చూచిన యెడల ఆమె యొక్క చర్యలను ఆమె నిరాకరించ లేదు. దానిని ఆమె కాదనలేదు, ఏలయనగా మనము ఆమె నటించియున్న టేపులను కలిగియున్నాము. ఈ లోక రికార్డింగ్ ఆ విధముగా నున్న యెడల, దేవునియొద్ద గల మేటియైన టేపు ఎట్లు మన ప్రతీ కదలికను, ప్రతీ చర్యను సమస్తమును ఆ మహా సర్వోన్నతుని యొక్క టేపుపై నమోదై యున్నది. మనము దాని నుండి తప్పించుకొనలేము. అది అక్కడ నున్నది.
MARK 4:22•
REV 20:12
51మరియు గుర్తు౦చుకొనుడి, ఇక్కడ గనుక మైక్రోఫోను గనుక అమర్చబడియున్న యెడల మరి నేను ప్రపంచమునకు ఇక్కడ నుండి పలు తావులకు నా యొక్క శబ్దమును ప్రసారము చేయుచున్నయెడల, ఆ యొక్క శబ్దము పలుచోట్లకు ఇప్పుడు దీనిని నేను ప్రసారము చేయుచున్నాను, ఈ ప్రసంగ వేదికను దాటి మీ యొద్దకు వచ్చులోపల ప్రపంచమంతట యుండే జనులు నా యొక్క స్వరమును వినెదరు. అది ఈ ప్రపంచము యొక్క విద్యుత్ యొక్క (electronics) ప్రభావమై యున్నది.
మరియు మీకు తెలియునా, ఆ స్వరము ఎన్నటికిని చనిపోదు. అది చనిపోనే చనిపోదు. ఇప్పుడున్నవిధముగానే విజ్ఞాన శాస్త్రము ఇంకా కొంచెం ముందుడగు వేస్తే యేసుక్రీస్తు భూమిపై యున్నప్పుడు ఆయన మాట్లాడిన ఖచ్చితమైన స్వరమును ఇప్పటి నుండి ఇంకో ఇరువది సంవత్సరాలలో దానిని వెలికి తీయగలరని వారు చెప్పుచున్నారు. అది ఒక కొలనులో గులక రాయిని వేసినట్లుగా వుండును; ఆ శబ్ద తరంగాలు మీ కనుదృష్టి నుండి మరుగైపోవునట్లుగా కనిపించును, కాని అవి ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకు ప్రయాణించి సాగరమునందు దాటి వేరొక చోటుకు వెళ్ళును మరల అవి ముందుకు మరియు వెనుకకు కదులుచు నుండునని ఆ తరంగములు ఎన్నటికిని మరుగవ్వలేవని (చనిపోవని) విజ్ఞాన శాస్త్రము వాదించుచున్నది, నీవు మాట్లాడే మాటలు కూడా ఆ విధముగానే యుండును; న్యాయతీర్పు దినమందు అవి నిన్ను శిక్షించుటకో లేక రక్షించుటకో ఆ మాటలు నిన్ను సంధించును. దానిలో నుండి నీవు ఏ ఒక్క దాని నుండి తప్పించుకోలేవు.
PHIL 2:16
52మరియు మనము గనుక ఎరిగియున్న యెడల ఇప్పుడు ఈ గదిలో ఆ స్వరములు మరియు జనుల యొక్క చిత్రములు ఇచ్చటకు వచ్చుచున్నవి. మీరు గనుక దానిని నమ్మని యెడల మీ యొక్క టెలివిజన్ను త్రిప్పుడి. ఇంకా మన జ్ఞానేంద్రియములు వాటిని గ్రహించక ముందే అవి జనుల యొక్క స్వరమును అచ్చట అది ధ్వనింప చేయుచున్నది.
ఇప్పుడు, వారికి ఒక ప్రసార కేంద్రము గలదు మరియు అయస్కాంతపు స్తంభము, లేదా గొట్టము లేదా స్పటికము వారి యొక్క స్వరములను గ్రహించుకొని మరియు వాటిని అవి ప్రత్యుత్పత్తి చేయుచున్నవి మరియు ఇప్పుడు, వాక్యమనే యేసుక్రీస్తు ఆయన పలికిన మాటలు నేటి రాత్రియందు ప్రపంచములోనున్న ఇతరుల మాటలు ఎట్లు నిలచియున్నవో, ఆ విధముగానే ఆయన మాటలు అక్షరాల సజీవమై యున్నవి, ఆ ఒకే ఒక కార్యము మాత్రమే పరిశుద్ద గ్రంథమందు గలదు.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
HEB 13:8
53యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ హృదయము శుద్దీకరించబడి యుండినట్లైతే, అనుగ్రహించు సాధనము నుండి నీ హృదయము స్వీకరించు సాధనముగా నుండును ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు; ఏ కార్యములైతే ఆనాడు చేసెనో, ఆదే కార్యములను ఆయన నేడు చేయగలడు, ఎందుకనగా ఆయన మాటలు గతించిపోవు. ఆ మాటలు నిరంతరము సజీవములై యున్నవి ఇప్పటి నుండి ఇరువది సంవత్సరముల వరకు వాటికి గ్రహించుకొను సాధనము వారికి లేదు, అయితే మనము దానిని ఇప్పుడే గ్రహించగలము.
సజీవమైయున్న ఈ మహా దినమున మనము జీవించుచున్నాము, మనుష్యకుమారుని యొక్క రాకడ సమీపముగా యున్నది మరియు ఆయన యొక్క రాకడ కాంతులు ప్రతీ చోట ప్రకాశించుచున్నవి… రాజకీయములలో మనము దానిని చూచుచున్నాము; సంఘములో దానిని మనము చూచుచున్నాము; కాలములో మనము దానిని చూచుచున్నాము; మనమెక్కడ చూసినను ఆయన రాకడను చూచుచున్నాము. ఒకప్పుడున్న రీతిగా సూర్యుడు లేకుండుట మనము చూచుచున్నాము. ప్రపంచము యొక్క స్థితిగతులు సరిగా లేకున్నవి. వారు నాకు చెప్పి యున్నారు. ఉత్తర ధ్రువము దగ్గర నున్న సముద్రము యొక్క లోతు ఇంకా అధికమైనదని వారు ఇప్పుడే దానిని నాకు తెలిపితిరి, దానిని నేను మరచిపోయాను. బేరింగు జలసంధిని ఒకప్పుడు నీవు దాటగలవు, ఆ బెరింగ్ జలసంధి ఇప్పుడైతే చాలా చాలా చాలా లోతుగా నున్నది. ఎందువలన? భూమి యొక్క మధ్య భాగము ఉబ్బి పోవుచున్నది. ఎచ్చట లోతు లేదో అచ్చట లోతు ఏర్పడుచున్నది, మరియు ఎచ్చట లోతుగా నున్నదో అచ్చట మెరక ఏర్పడుచున్నది. ప్రపంచము తలక్రిందులగుచున్నది. ఆమె ఊగుచున్నది; ఆమె ఊగిసలాడుచున్నది. మరి సృష్టి యావత్తు నశించుచున్నది మనము చూచునదంతయును నశించుచున్నది.
GEN 6:2•
MATT 24:37
54మరి ఈ రాత్రి మనము కనుగొనియున్నాము, మానవ సంతతిలో ఆయన యొక్క రాకడను తెలుపు సూచనను సహజమైన రీతిలో ఉత్పత్తి చేయుచున్నది, "ఏలయనగా దేవుని కుమారులు మరియు నరుని కుమార్తెలు చక్కగా తయారగుచున్నారు, మరియు వారెట్లు స్త్రీలను గైకొనుచున్నారో చూచియున్నాము." ఎంతటి ఘోరమైన ఘడియలలో మనము జీవించుచున్నాము. ఓ, మై మరి ఆ దినములలో ఎట్లు౦డెను!
పిమ్మట పురుషులు స్త్రీలను ఆరాధించుచున్నారనే వికృతమైన కార్యాన్ని చరిత్ర ఆధారముగా మనము చూచితిమి. మరియు ఈ రోజు ఇది స్త్రీల ప్రపంచము అని కూడా మనము కనుగొంటిమి.
55కొద్ది కాలము క్రిందట నేను స్విట్జర్లాండు దేశములో నుంటిని, మరియు నేను కొందరితో మాట్లాడుతు… ఇప్పుడు, మన క్రైస్తవ స్త్రీల గురించి నేను వ్యతిరేకముగా మాట్లాడుట లేదు (కాదయ్యా!); వారియొక్క ఆభరణములను గురి౦చే మాట్లాడుచున్నాను. నేను ప్రపంచము ఏ విధముగా నడచుచున్నదో దానిని గురించి మాటలాడుచున్నాను. నాతో కూడ సహోదరుడు గగ్గన్బల్ మరియు అతని స్నేహితురాలైన స్త్రీ కారులో వచ్చుచుండిరి. అతడు ఇంచుమించు నా వయస్సు గలవాడు, వివాహము చేసికొనలేదు, వయస్సులో పెద్దవాడైన అవివాహితుడు, మరియు ఎవరో ఒక యవ్వన స్త్రీతో అతడు వెళ్ళుచుండెను. అటు పిదప - మరియు అక్కడున్న స్త్రీలలో ఒక ఆమె మరి ఆమె నన్ను అడిగెను, "సహోదరుడు బ్రెన్హా౦, మాకు అమెరికా గురించి చెప్పుము, ఆ స్త్రీలను గురించి మేము అర్థము చేసుకున్నాము, అచ్చట, అదొక స్త్రీల ప్రపంచమై యున్నది, నిజమే కదూ."
"అది నిజమే!" అని నేను అన్నాను.
"నేనెల్లప్పుడును అక్కడికి వెళ్ళవలెనని కోరుకుంటాను" అని చెప్పెను. పిదప నేను ఆమెకు వివరించి చెప్పుటకు ప్రారంభించితిని. ఆమె అడిగెను, "ఏమిటి?"
నేను చెప్పాను, "అవును!" నేను అమెరికను స్త్రీలను గురించి చెప్పిన వెంటనే ఆమె తన ఉద్దేశమును మార్చుకొనెను.
"సరి," ఆమె అడిగెను, "అటువంటి స్థలములో మీరెట్లు ఒక క్రైస్తవునిగా జీవించగలుగుచున్నారు?" దానిని గురించి ఆలోచించుడి!
నేను రోము నగరము నందలి సాన్ ఏంజిలో అనే చోటుకు వెళ్ళితిని అచ్చట క్రైస్తవుల సమాధులున్న కాటూకోంబ్స్ అనే స్థలమునకు వెళ్ళినప్పుడు, నాకు దిగ్ర్భాంతి కలిగినది… నేను నా యొక్క హోటలు నుండి బయటికి వచ్చి "ఆ ఒక ఊటలో మూడు నాణెములున్న (Three Coins in a Fountain) అను చోటికి వెళ్ళుచుండగా, ఆ వీధిలోనున్న స్త్రీ, ఎంతటి నీచమైన స్థితి అది. పలు విధములైన స్త్రీలు, పలు ఆకృతిగల స్త్రీలు, మరియు పలు రకములైన స్త్రీలు, మీ యొద్దకు వచ్చి వారిని బయటకు తీసుకు వెళ్ళుమని అడిగెదరు. మరియు నేను, బిల్లీ, మరి సహూ, బాక్స్టర్, టిడబ్లుఎ నుండి ఆ పరిసర ప్రాంతములను మాకు చూపించే వ్యక్తి మేము ఆ నీటి యొద్దకు పోవు లోపల ఎందరు స్త్రీలు మా యొద్ద వచ్చిరో నాకు గుర్తుకు రావటము లేదు. "ఈ యొక్క స్త్రీలు ఆ విధముగా జీవించవలయునా?" అని నేను అడిగాను.
56అతను చెప్పెను, "కాదు, ఒకప్పుడు సైనికులు ఇక్కడ ఉన్నప్పుడు మరి వారికి ఆ విధముగా అలవాటైనది, మరియు ఆ స్త్రీలకు మంచి ఉద్యోగములున్నవి, అయినను వారు ఈ విధముగ కొనసాగించుచునే యున్నారు." అయినప్పటికిని అటువంటి స్థలములో, సాన్ ఏంజిలో అను చోటకి నేను వెళ్లినప్పుడు, వాటికన్ నగరము నుండి వచ్చిన అక్కడున్న పెద్ద సూచన పలక ఇట్లు చెప్పెను, "అమెరికను స్త్రీలకు ఒక గమనిక! మృతులను గౌరవించుటకు మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ముందుగా మీరు మీ పై వస్త్రములను ధరించుకొనుడి."
ఒక అమెరికా యువతి, పారీస్ నగరములో దిగుట నేను చూచాను. వాస్తవముగా… పారీస్ నగరములో నుండి వచ్చిన నాగరికతనే మన వారు కూడ వినియోగిస్తారు. కాని నిజముగా, ఆ యువతి అతి నీచముగా వస్త్రములను ధరించుకొని, తన తల్లి మరియు దండ్రులతో యున్నది, ఆ యువతి ఆ విధముగా వెళ్ళుచుంటే, ఆ దృశ్యమును తిలకించుటకై అచ్చట పనిచేయుచున్న సైనికులు తమ గడ్డపారలు, పారలను పడవేసి అచ్చటకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
MATT 24:37•
JOHN 11:43
57నాగరికత (Fashion) విషయములో మనము ఆదర్శముగా యున్నాము. పారీస్ నగరములో వాడుకలోనున్న నాగరికత ఇప్పుడు అది నీచమైన, దిగజారిపోయిన అసహ్యకార్యములతో ఇచ్చటకు దిగి వచ్చినది. నోవహు దినముల వలె ప్రతి ప్రక్కలను దీపపు వెలుగు ప్రకాశించుచుండగా… ప్రేమగల యేసుక్రీస్తు ఆయన యొక్క సూచనలను మరియు దయతో అద్భుతములను చూపించుచుండగా పరిశుద్దాత్మ బాప్తిస్మముతో ఉజ్జీవము జరిగియుండగా… మరి ఈ దేశములో ఇటువంటి కార్యములు జరుగుచున్నవి. మృతులైన వారిని తమ పడకల నుండి జీవముతో లేపగల ఒక దేవుడు, వ్యాధి గ్రస్తులను స్వస్థపరచు ఒక దేవుడు, జరుగుటకు మునుపే జరుగనైయున్న కార్యములను చెప్పగల ఒక దేవుడు, కాలము గాని మరి చెప్పినది చెప్పినట్లు జరుగుచు ఎన్నడును తప్పిపోని ఆయన కార్యములు… మరియు మీరు అమెరికాలోనున్న స్త్రీలకు ప్రసంగింప వచ్చును మరి వారు సంవత్సరము సంవత్సరమునకు చాలా దిగజారి పోవుచున్నారు.
నేను బాంబే అనుకొనుచున్నాను,
58దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ అను ప్రాంతములో అక్కడ రెండు లక్షల మంది నాగరికత తెలియని వారు స్వదేశీయులు ఒక కూటములో పాల్గొనిరి, దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతమును చేసెను… మరియు నేను ముప్పది వేల దుప్పటి కప్పుకొనియున్న ఆదిమ వాసులను చూశాను. స్త్రీలు దుస్తులు ఏమియు ధరించుకొనక, నాలుగు అంగుళములు కలిగిన గుడ్డపేలికతో చుట్టియున్న పూసలను వారి శరీరములపై వ్రేలాడేసుకొని యుండిరి. మరియు పురుషులు వారిపై దుస్తులు లేక ఒక నాలుగు అంగుళముల - గుడ్డ పేలికతో నుండిరి. దిగంబరులుగా! వారు పండుకొనుటకు ఒక దుప్పటి, మేక చర్మమును నిర్ణీతమైన వయస్సు వచ్చినప్పుడు అవి వారి కివ్వబడును. మరియు వారు దానితోనే జీవిస్తారు, దానిపైనే నిద్రపోతారు, మరణించిన దానితోనే చుట్టబడి మరియు దానితోనే పాతిపెట్టబడెదరు. వారు అక్కడ మరుగులలో పాతిపెట్టబడుచుండిరి.
GEN 3:7
59మరియు వారు ఎంతటి అమాయకులు ఏమియు తెలియనివారనగా ఒకరు నాకు ఇరువది అడుగుల దూరములో ఒక బిడ్డను ప్రసవించెను. ఆమె ఏ వైద్యశాలకు వెళ్లలేదు. వారు - ఒక స్త్రీ ఆమెకు ఒక నిమిషము సహాయము చేస్తుంది, మరియు అంతయును ఐదు నిమిషములలో జరిగిపోయెను. బిడ్డ పుట్టిన వెంటనే ఆమె బిడ్డను తనపై రొమ్ములకు హత్తుకొని ఆ బిడ్డకు పాలియ్య తొడగెను. ఎంతో వ్యాధిగ్రస్తుడై, మరియు మతిస్థిమితము లేని ఒక బాలుడు దిగ్గున లేచి మామూలు వ్యక్తివలె మంచి బుద్ధితో స్వస్థత నొందినవాడై - దేవునికి స్తోత్రములను చెల్లించుటను వారు చూచి, అది సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తి అని గ్రహించి ముప్పది వేల మంది దుప్పట్లను కప్పుకొనియున్న గ్రామనివాసులు యేసుక్రీస్తును వారి యొక్క స్వకీయ రక్షకునిగా అంగీకరించిరి, మరి ఏమి సంభవించెను? మీరు గుర్తు౦చుకొనుడి, అది పెంతెకోస్తు కంటెను పది రెట్లు పెద్దది — ముప్పై వేల మంది!
మరియు ఎవరును… మరియు నా యొక్క సొంత కండ్లతో నేను ఆ స్త్రీలను గమనించితిని. వారు నేలపైపడి మరి వారి విగ్రహములను బ్రద్దలుగొట్టి, వారి యొక్క జీవితములను యేసుక్రీస్తుకు సమర్పించిరి… వారికి తెలియదు, వారిలో అనేకులు ఆయన యొక్క పేరును కూడ వినియుండలేదు. అయితే వారు — వారి మోకాళ్ళపై మోకాళ్ళూనినప్పుడు, వారు వారి విగ్రహములను విరగగొట్టిరి. వారట్లు విగ్రహములను విరగ గొట్టటయు వారి యొక్క యదార్ధ హృదయముతో దానిని చేయుచున్నారా అని నేను వారిని అడిగితిని. మరియు వారు వారి మోకాళ్లపై పడినప్పుడు, వారి జీవితములను క్రీస్తుకు సమర్పించినప్పుడు, నేను వారి కొరకు ప్రార్థించితిని, మరి వారు మోకాళ్లనుండి పైకి లేచిరి. మరియు ఆ యొక్క స్త్రీలు వారు నగ్నముగా నున్నారనుట యెరుగక వారి చేతులను వ్రేలాడుదీసుకొని యుండిరి; మరియు క్రీస్తుయొక్క జీవము వారిని తాకిన వెంటనే, ఆ స్త్రీలు పురుషులకు మునుపు వారి చేతులతో వారి రొమ్ములను కప్పుకొని బయటికి వెళ్ళుటను నేను చూచాను. దుప్పట్లను కప్పుకొనియున్న ఆ ఆది నివాసులను యేసుక్రీస్తు సృజించినప్పుడు ఆ నాగరికత తెలియని ఆ స్త్రీలను ఆ విధముగా మార్చినప్పుడు - వందలకొలది సంవత్సరములుగా సువార్తను విను ఒక దేశమును ఏ విధముగా మార్చవలయును? అక్కడే మనము యున్నాము. నేను దానిని చూచియున్నాను. అది వేరెవరో చెప్పు కార్యము కాదు. నేను దానిని చూచియున్నాను. ప్రతీ సంవత్సరము సగానికి సగము మ౦ది దిగజారిపోతు మనలను మనము క్రైస్తవులమని చెప్పుకొనుట ఎంత విడ్డురముగా నున్నది. సంఘములకు దానిని గురించి అసలు బాధ్యత లేదు.
60టి.వి. కార్య క్రమములలో ఆ యొక్క స్త్రీల అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నవి… సాక్షాతు లేఖన భాగమును నేరువేర్చునట్లు అమెరికా అమర్చబడుచున్నది. వారు దేవుళ్ళు కారు. వారు దేవతలు కారు, అయితే ఇదంతయును వాక్యము నెరవేరునట్లుగా అమెరికాను సరిగా నుంచి యున్నవి. అమెరికా యొక్క సంఖ్య పదుమూడు. అమెరికా ఎల్లప్పుడు ఒక స్త్రీ ఆరాధికురాలు అది మన ద్రవ్యముపై నున్నది. అది అన్నిటి పైనను నున్నది. మరిప్పుడు అమెరికను దేవతను మనము కలిగియుందుమని చెప్పుటకు చాలా సమయము పట్టదు, అది చాలా సమీపములో నున్నది. మీరు గోడ మీది చేతి వ్రాతను చూడగలరు.
ఓ మనమేమి చేయగలము? మీరు వీథులలో నడువను కూడ వీలుపడదు… వీథులలో చూడుడి, నగరములలో వెళ్తున్నప్పుడు స్త్రీ తన అంగ సౌష్టవములను ప్రదర్శించుటను చూడండి, వారెట్లు వస్త్రములను ధరించుకొని - ఏ విధముగా యుంటున్నారంటూ, యధార్థంగా చెప్పాలంటే - వస్త్రాలను ధరించుకునే గదిలో ఒక స్త్రీ నిలబడియున్న విధముగా వీరు కనబడుట ఎంత సిగ్గు చేటుగా యున్నది. బెత్తెడు గుడ్డలతో మరియు చాలా బిగుతుగా ధరించుకొని వీధులలో నడుచుకుంటూ వెళ్లారు. మరియు సముద్ర తీరములందు స్నానము చేయుటకై ఈ విధమైన బెత్తెడు కొలత గల గుడ్డలను "కినిస్ (Kinis)" లేదా మరే మందురో నాకు తెలియదు, ఇటు వంటి కార్యములను కలిగి, మరియు దురాత్మ వారిలో నున్నదని వారెరుగకున్నారు. ఈ విధముగా నున్నవారే సంఘములో గాయకుల బృందములో అనేకులు పాటలు పాడెదరు. ఇదే జరుగునని యేసు సెలవిచ్చెను.
MATT 5:28
61స్త్రీ యొక్క శరీరము! వారు రక్త మాంసములు గలవారే. వారు దేవుళ్ళు కారు. నా యొక్క ఉద్దేశములో — నేను తప్పుగా చెప్పినట్లైన యెడల దేవుడు నన్ను మన్నించనిమ్ము — అది ఒక టోకు బేరము వంటి దిగంబర రూపము. మీరు ఊరకనే ఒక పురుషుని నిందించకూడదు, అతడు గనుక ఒక క్రైస్తవుడు కానియెడల, శోధనలలో పడి తనకుతానుగా నిగ్రహించుకో లేక ఏదో ఒక చోటు ఏదైనా ఒక దోషము చేయును. అనేకమైన దుర్మార్గపు క్రీయలు ఎక్కువగా జరుగకుండుటకు ఆశ్చర్యపడనవసరము లేదు, ఎందుకనగా అనేక కార్యములకు స్త్రీయే బాధ్యురాలు అగుచున్నది. మరి ఆ విధముగా లేనియెడల మీరెట్లు పురుషుని నిందించగలరు? ఎవరిని నిందించవలయునో వారిని నిందించుడి.
ఒక స్త్రీ చెప్పవచ్చును, "ఇప్పుడు సహోదరుడా బ్రెన్హాం, నేను నీతి గలదానను, ఏలయనగా నేను…" దానిని గురించి సందేహము లేదు. అయితే, నా యొక్క సహోదరి, నీవు ఆ విధముగా దుస్తులు అసభ్యముగా ధరించుట వలన మరి పురుషులు నిన్ను చూచినందులకుగాను నీవు వ్యభిచారము చేసినందులకు న్యాయతీర్పు దినమున నీవు లెక్క అప్పజెప్పవలసియున్నదని నీకు తెలియునా? ఆయన చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును మరి దానికి బదులు చెప్పవలయును." మరియు మీరు ఒకవేళ దానిని క్రియ రూపములో చేయుకున్నను ఆ వ్యభిచారపు ఆత్మ నీలో పెట్టుటకు సాతానుకు నీవు అనుమతినిచ్చితివి గనుక నీ స్వభావము సహజముగా అది తప్పని బోధించుచున్నను నీవు దానిని అనుమతించినావు… దేవుని ఆత్మ లేకుండా ఆ స్వభావము అది తప్పని నీకు బోధించదు.
62అంజూరపు ఆకు ఎలా చిగురించునో అదే విధముగా ఈ విధమైన కార్యములతో చాలా త్వరగా వారు ఉద్భవిస్తారు అని నేను ము౦దుగా తెలియజేయుచున్నాను. దానిని నేను ముప్పది సంవత్సరములకు మునుపే ఎదురు చూశాను. (చూశారా!) బైబిలును కించపరచుట. చూశారా? వారు దానిని చేసెదరు. అది బహిర్గతముగా అర్థనగ్నముగా నుండి దుస్తులు విప్పుటయే.
ఇప్పుడు, ఈ రోజు దేవుని కుమారులకు దయ్యము అదే కార్యమును చేయుచున్నది. మరి అది సరియే. మన యొక్క వర్తక కార్యక్రమములను చూడుడి. అనేక వర్తక వ్యాపారములు స్త్రీల ద్వారా నడుపబడుచున్నవి, అనేకములు. అది సరియే. మన యొక్క సంఘములను చూడుడి, మన దేశమును చూడుడి, దేవుని యొక్క కుమారులు ఏ విధముగా ఈ కార్యక్రమములకు తలను వంచి వాటిని ఆరాధించుచున్నారు. ఈ స్త్రీలు వారు… నా మట్టుకు వారు ప్రజా వేశ్యలే అగుదురు. అది చెప్పుటకు ఎంతో నీచమైనదే కాని అది ఒక నగ్నసత్యమై యున్నది. ఈ టేపులను వినుచున్న వారు ఈ విషయములను చెప్పెదరని నాకు తెలుసు, అయితే నీవు దీనిని ఎలా చేయగలగుచున్నావు? నీవు నీ యొక్క శరీరమును నీకు నీవుగా బహిర్గతమును చేసుకొనుటచే, ఒక పురుషుడు నిన్ను చూచుచున్నాడు, అతడు నీతో వ్యభిచరించు వాడగుచున్నాడని యేసు చెప్పెను; వ్యభిచరించుటచే ఆ పురుషుడు జవాబు చెప్పుకోవలసియున్నది; దానికి బాధ్యులు ఎవరు, అది ఎవరి దోషమై యున్నది? ఆ పాపి ముందు వస్త్ర విహీనురాలైన దిగంబరిగా తనకు తానుగా బహిర్గతము చేసుకున్న స్త్రీయే అందుకు కారకురాలుగా యుండును. అది నిజము. దానియొక్క సూచన ఏమిటి? చివరి కాలము, ఎర్రని దీపము.
MATT 5:28•
MATT 24:37
63మాతృత్వము అనే భావము తునాతునకలై పోయినది; దేశములు బీటలు బారిపోయినవి. ఇప్పుడు, యేసు ఎక్కడ దానిని చెప్పియున్నాడని మీరు చూడగోరిన యెడల మత్తయి 5:28 చదువుడి. అక్కడే అది యున్నది. పడిపోవుటకు కారణము స్త్రీ జీవితమే, కారణమై యున్నది… స్త్రీ, పురుషుల యొక్క శారీరక సంబంధము విచ్చినమవుటచే అది పడిపోవుటకు హేతువైనది… వాటి యొక్క విషయములను నీవు గుర్తించుకోవలెనని కోరిన యెడల ఇచ్చట విచ్చినమైన కొన్ని దేశములను నేను గుర్తించియున్నాను. ఒకటి ఐగుప్తు, అస్సిరియా, రోము ఆ విధముగా అనేక దేశములు స్త్రీ శక్తి వలన వినాశనమై పోయినవి.
64గమనించుడి, రక్షణకు తరువాత మానవునికి దేవుడు అనుగ్రహించునది ఒక మంచి భార్య తప్పనిచ్చి మరొక కార్యము ఏదియును లేదు. ఒక వ్యక్తి అలసి పోయినప్పుడు లేక సొమ్మసిల్లినప్పుడు వేరే ఏ ఇతర వ్యక్తియును ఆ వ్యక్తికి ఓదార్పు నివ్వలేడు, ఒక వ్యక్తి తనయొక్క సొంత భార్యయొద్ద తప్పనిచ్చి వేరెవరి యొద్దను ఆదరణ పొందలేడు. మరియు సహోదరులారా, మీకు గనుక ఒక శుద్దమైన, నీతి కలిగిన, మంచి ప్రవర్తన గుణములు కలిగిన ఒక మంచి భార్యను కలిగియుండి నీవు నీరాశ నిసృహతో వచ్చిన సమయములలొ నీ భార్య నీ ప్రక్కన కూర్చొని, మరియు నీతో సంభాషించు భార్యను నీవు కలిగియున్న, నీవు ఎంతో భాగ్యవంతుడవుతావు. మరేతరేతర వ్యక్తి కన్నను ఆమె నీకు ఎంతో ఆదరణను ఇచ్చును. ఆమెయే నీకొక ఆభరణము; ఆమెయే నీకొక రాణియై యున్నది.
GEN 3:1,6•
ISA 37:32•
1COR 11:9
65అయితే గుర్తుంచుకొనుడి, "పురుషుని కొరకే స్త్రీ సృజింపబడినది, స్త్రీ కొరకు పురుషుడు సృజింపబడలేదు. దేవుడు సృష్టించిన వాటిలో పురుషుడు కడపటి సృష్టిగా నున్నాడు. స్త్రీ పురుషుని యొక్క ప్రత్యుత్పత్తై యున్నది. పురుషుని కొరకే ఆమె చేయబడినది, పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు, స్త్రీ యొక్క సౌందర్యమునకు దాస్సోహమై దానిని వారు తలక్రిందులుగా చేసి పురుషుడు స్త్రీని ఆరాధించువాడుగా దిగజారిపోయాడు. సృష్టి ఆదిలో సంభవించిన కార్యము అదియే. దేవుని కుమారుడైన ఆదాము దోషమును చేయుటకు శోధింపబడ లేకపోయెను, అందువలననే అతి దగ్గర పోలికలతో నున్న మానవుని వంటి వ్యక్తిత్వము గల సర్పము యొద్దకు సాతానుడు వచ్చెను. హవ్వ దేవుని యొక్క వాక్యము నుండి వెనుకకు వెళ్ళి పోవుటచే మరక్కడే అది ఆరంభమాయెను. అందుచేతనే ప్రతీ హృదయ భారమునకు, ప్రతీ సమాధి తోటకు చేసిన ప్రతి పాపములచే ఆ దుష్కార్యము అచ్చట నుండియే ఆరంభమాయెను. మరలా అది ఇచ్చట ప్రత్యక్షమగుచున్నది.
ఏమిటిది… మొట్టమొదటి పతనమునకు స్త్రీయే కారకురాలు, కాలము అంతమవుటకు కూడా స్త్రీయే కారకురాలైయున్నది. ఆమెయే దానిని ఆరంభించి; ఆమెయే దానిని అంతం చేయుచున్నది. పరిశుద్ద గ్రంధము దీనిని చెప్పుటలో ఏ ఆశ్చర్యమును లేదు, "సియోను నుండి తప్పించుకొనిన వారు ప్రభువు దృష్టిలో మహిమకరముగా నుండెదరు."
ISA 3:16,18,20,22,24•
ISA 4:1
66యెషయా 5లో ఈ కడవరి కాలములో స్త్రీలు ఎంతటి నీచ స్థితికి దిగజారిపోయెదరో అనే దానిని గురించి చెప్పుచున్నది, మరియు వారేవిధముగా దుస్తులు ధరించుకొనెదరు మరి వారు ఏ విధముగా వెంట్రుకలు కత్తిరించుకొనెదరు మరి ఆ విధమైన కార్యములను గురించి అందులో చెప్పబడియున్నవి. యెషయా 5లో పరిశుద్ద గ్రంథములో ఇవన్నియును చెప్పబడి యున్నవి. ఎతైన చెప్పులతో ఆమె ఎట్లు మెడ చాచి నడచుచు, ఓర చూపులు చూచుచు కులుకుతు నడచుచు, కాళ్ళకు గజ్జలను కట్టుకొని ఆ విధముగా ఆమె నడుచుచు వెళ్ళును, మరియు ఆమె తన మేజోళ్ళను వేసికొనుచు మరి ఆమె చేయు కార్యములు మరియు అనేక విధమైన మార్పులతో — అలంకరణతో మరియు అనేక విధమైన కార్యములను కలిగియుండును. మరియు ఆమె యొద్ద నుండి సమస్తమును తీసికొనబడును మరియు దుష్కార్యములతో దుర్గంధమై ఆమె కూర్చొనియున్నది. ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మరియు ఇలా చెప్పెదరు, "మా పనిని మేమే చేసుకొందుము, కేవలము నీ పేరు మాత్రము మాకు పెట్టుము మాపై నిందనను తీసివేయుము" అని కూడా అచ్చట చెప్పబడియున్నది.
ISA 4:2
67అయితే అతను చెప్పెను, "ఈ కార్యములన్నింటి నుండి తప్పించబడే ఆ చిన్న వేరు చిగురు ఎంతటి మహిమకరమైయున్నది. అది ప్రభువునకు ఆ దినమునకు పరిశుద్దమై యుండును. అసలైన, యధార్థమైన మరల జన్మించిన ఒక ఆమెను చూచి పరిహసించినను, పిచ్చిదని పిలిచినను, మరియు పాత కాలపు బొమ్మ అని అనినను మరియు ఎన్ని తిట్టినను, కాని ఆమె స్త్రీగానే ప్రవర్తించుచు, ఒక ఆడదాని వలెనే జీవించుచు తన స్థానాన్ని ఆమె గుర్తెరిగియుండును… ఒక స్త్రీగానే తన స్థానమందు తాను నిలుచును; ఒక స్త్రీ వలెనే వస్త్రధారణ చేయును, ఒక స్త్రీ వలెనే సంభాషించును, ఒక ఆడబడుచు వలెనే జీవించును. అవును! ఆమేన్. అనగా "జరుగును గాక" అని అర్థము. భయపడవద్దు; అది మిమ్ములను భాధించదు. సరే మంచిది!
LUKE 17:28
68యేసు తానే స్వయముగా చెప్పెను, ఏమి జరుగనైయున్నదని, అది గొప్ప ప్రదర్శనైయున్నది.
లోతు దినములలో ఎలా వుండునో అవి అలాగుండునని కూడా ఆయన చెప్పెను… మీరు లేఖన భాగములను గుర్తించుకొనవలసిన గుర్తుంచుకొనుడి, అది లూకా సువార్త 17:28. ఆయన చెప్పెను, జనులు తినుచు, త్రాగుచు, కొనుచున్నారు…" సహజముగానే ఇవన్నియు కూడా అవసరమైన విషయములే. కాని గమనించండి, మరియు అది వారిని అక్రమించుకొన్నది… కాని వారు వారి యొక్క మనస్సునంతా వాటియందే నిమగ్నమై పోయినది
మరియు లోతు దినములలో స్త్రీలు చాలా నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయి స్త్రీలను స్త్రీలుగా వినియోగింపబడనంతగా వారి స్థితి విచ్చినమైపోయినది, అది చాలా సామాన్యమై పోయినది, స్త్రీ అనే విషయములో చాలా సాధారణమయి పోయి, వారు పురుషుడు పురుషునితో జీవించేంతటి వరుకు దిగజారిపోయేంతటి దుస్తితిలోనికి వెళ్ళిరి. సృష్టిచే కలిగిన లైంగిక కణములను దాని స్థానము నుండి మార్పిడి చేయుచున్నారు, ఎందుకనగా ఆ స్త్రీ అంత చులకనైపోయినది.
69కొద్ది దినముల క్రితము నేను టుసాన్ లో వుంటిని. నేను ఒక రొట్టెను కొనుటకై వెళ్ళితిని, మరియు అక్కడ ఒక అబ్బాయి కూర్చొనియున్నాడు మరియు ఇద్దరు చిన్న బాలురు కారు లోపల వున్నారు. అందులో ఒకడు ఒక ప్యాకెట్ సిగరెట్లను కొనుటకై వచ్చుచుండెను. వృద్దాప్యుడైన నెరసిన వెంట్రుకలుగల ఆ పెద్ద మనిషి అబ్బాయిని అలా చూచి, "ఈ సిగరెట్లు ఎవరికి, మీ తల్లికా?" అని అడిగెను.
"కాదు, ఇవి ఆ అబ్బాయికి," అని అన్నాడు.
"సిగరెట్లను త్రాగేంతటి వయస్సు వారికి వుందా?" అని అతడు అడిగెను.
"అవునండీ!" అని అబ్బాయి చెప్పెను.
అతడు వెదుదిరిగి చూచెను. నేను రొట్టెను మరియు కొన్ని పాలును పట్టుకొని నిలబడియుండుట అతడు గమనించెను. "సరే మంచిది," అని అంటూ వెళ్ళి అతడు వాటిని ఆ అబ్బాయికి ఇచ్చెను. అతడు నావైపు తిరిగి ఇలా అన్నాడు, " "నాకు అనుమానముగా వున్నది!"
నేను చెప్పాను, "దానిని చేయుటకు అతనికి చాలిన వయస్సు లేదు; అతను చాలా… సిగరెట్లు పీల్చుటకు అతను ఏ వయస్సులోను సరిపడ్డవానిగా లేడు."
అతను చెప్పెను, "నేను మీతో ఏకీభవించుచున్నాను." అడిగెను, "మీరు సిగరెట్లు అలవాటును వదలుటకు చాలా కష్టపడియున్నారా?"
నేను చెప్పాను, "నేను సిగరెట్లు పీల్చుటను ఆరంభింపలేదు." నేను చెప్పాను, "నా యొక్క తల్లి తండ్రులు పొగాకును వాడి మరి సిగరెట్లు పీల్చియున్నారు, కాని ప్రభువగు దేవుడు వాటి నుండి నన్ను దూరముగా నుంచియున్నాడు."
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
70అతను నా తట్టు తిరిగి వింతగా నన్ను చూచెను మరియు అతను చెప్పెను, "భలే, అదొక — అలాంటి వారిని ఈ దినములలో చూస్తే అదొక సరైన విషయము." "మనము స్త్రీకి ఆ స్థానమును కల్పించాము" అని చెప్పెను. "మనము ఏ విధముగా స్త్రీలను గౌరవించెడి వారము; మనము వారిని చాలా ఉన్నత స్థితిలో నుంచియున్నాము. ఆమె సముఖములో మన టోపీలను తీసివేసియున్నాము. మరియు మనము వీథులలో నడచి వెళ్ళుచున్నప్పుడు, ఎవరైనా స్త్రీలను గురించి అవమానముగా మాటలాడిన యెడల అక్కడనున్న పెద్దమనుష్యులు ఆ విధముగా స్త్రీని అగౌరవముగా మాటలాడిన వారిని దేహశుద్ధి చేసెడివారు." చూశారా? మరియు చెప్పెను, "వారు స్త్రీలను గౌరవించెడి వారు." అయితే అతను చెప్పెను, "అయ్యా, స్త్రీలు తమకు తామే ఆ స్థానాన్ని తెచ్చుకున్నారు." అని చెప్పెను, "ఇప్పుడు వారు లేచుట లేదు… ఇంతకు మునుపు వీథి కారులలో వారు లేచి నిలబడెడి వారు.. ఒక స్త్రీ నిలబడిన యెడల … ప్రతి యొక్క వ్యక్తియును తనయొక్క టోపిని తీసివేసి మరి ఆమెకు కూర్చొనుటకు స్థలము నిచ్చును." చెప్పెను, "ఇప్పుడు జనసందడిగా యుండిన త్రోసికొని పోయెదరు" అని చెప్పెను. "వారిని ఆ విధముగా వారే చేసుకొనిరి." అది యథార్థమై యున్నది. హాలివుడ్ అను దయ్యము ఈ విధమైన అసహ్యమైన కార్యములతో ఆమెను దూరదర్శిణిలలోను, పత్రికలలోను ఆ విధముగా చిత్రించి ఒక మహా, పెద్ద మురికి ముంతగా ఆమెను మార్చివేసినది. ఇది వాస్తవమైయున్నది!
వాటిని వారు అంగీకరించరు అని నాకు తెలుసు, అయితే అది ఒక నిజమైన సత్యమైన కార్యము. అది సత్యము. అది ప్రభువు యొక్క వాక్యము మరియు ఈ యొక్క సంతతిలో క్రీస్తు వచ్చుచున్నాడను హెచ్చరికతో కూడిన సూచనయై యున్నది. చెప్పెను, "ఈ యొక్క కార్యములు నెరవేరుటను చూచు వారందరును, ఈ కార్యములు సంభవించుట నెరవేరు వరకు యుండెదరు." చెప్పెను, "ఆకాశమును భూమియును గతించును, గాని నా యొక్క వాక్యములు ఎన్నడును తప్పిపోవు. అది ఒక హెచ్చరిక. ఇది ప్రకాశించెడి ఎర్రని దీపకాంతి. తెర క్రిందికి దింపబడి ముగింపబడ బోవుచున్నది. మనము చివరి కాలములో నున్నాము.
GEN 6:2•
MATT 24:32,39•
MARK 5:8•
MARK 6:41•
LUKE 21:29,30•
HEB 13:8•
REV 3:14,15
71ప్రభువైన యేసు యొక్క సూచనలైన వ్యాధిగ్రస్తులను గుణపరచుట, చనిపోయిన వారిని లేపుట, దయ్యము ఆత్మలను వెళ్లగొట్టుట మనము చూచుచున్నాము. జనులు పరిశుద్దాత్మతో నింపబడి మరి పరిశుద్దముగా పవిత్రముగా నుండుట చూచుచున్నాము. వారి జీవితములు మారుటను చూచుచున్నాము. మనము గొప్ప సూచనలను చూచుచున్నాము. ఎగిరే తట్టుల వంటి మర్మమైన సూచనలను ఆకాశములో మనము చూచుచున్నాము. అమెరికాలోని పెంటగన్ లో అనేక జనులు వాటిని గురించి వ్రాయుచున్నారు, టెలివిజనులలో చెప్పుచున్నారు. అవేమిటని వాటిని గురించి తలంచుటకు వారికి తెలియుట లేదు. సకల విధమైన మర్మమైన సూచనలు! ప్రభువైన యేసు క్రిందికి దిగి ఒక అగ్ని స్తంభము ద్వారా దిగివచ్చి ఆయన యొక్క పటము కూడ తీయబడియున్నది ఆయన మన మధ్యలో జీవించుచున్నాడు, ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా నున్నాడని నిరూపించుచున్నాడు.
ఈ కార్యములన్నియును నెరవేరుట మనము చూచుచున్నాము. సంఘము చల్లగా నుండుట మనము చూచుచున్నాము. విస్తరించుచున్న సంఘ శాఖలను మనము చూచుచున్నాము. మీరు అంజూరపు చెట్టును చూచినప్పుడు, మరియు ఇతర చెట్లు మొలచుటకు ఆరంభించినప్పుడు, యూదులు తిరిగి వచ్చుచున్నారు, వారి యొక్క స్వదేశమునకు వారు వచ్చుచున్నారు. ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు, బాప్టిస్తులు, లూథరనులు, పెంతెకోస్తులు, అన్ని సంఘములు ఉజ్జీవమను వారియొక్క ఆకులను మొలిపించుచున్నవి. "సిద్దపడియుండుడి, ఆ సమయము ఆసన్నమైయున్నదని" ఆయన చెప్పెను. అదంతయు జరుగట మనము చూచినప్పుడు, అప్పుడు ఆయన ఎన్నుకొనిన వారిని పిలుచుటకు ఆరంభించును. ఇంకొక సూచన చెప్పెను, "మీరు స్త్రీలు చాలా సౌందర్యవంతులుగా నుండుట చూచినప్పుడు, మరియు దేవ కుమారులు వారిని భార్యలుగా తీసికొనినప్పుడు, మరి వారిని భార్యలుగా తీసికొనినప్పుడు, మరియు దీనిని, దానిని లేక మరేదో చేయుచున్నపుడు," చెప్పెను, "ఇవన్నియును జరుగు చున్నప్పుడు, అది సూచనయని తెలుసుకొనుడి." అక్కడే మనమున్నాము!
LUKE 17:28
72ఇప్పుడు నేను వేరొక కార్యమును వ్రాసియుంచి కొనియున్నాను. లోతు యొక్క ఇరువురు కుమార్తెలను గుర్తుంచుకొనుడి. (అవును మనము దానిని గుర్తుంచుకొని యున్నాము!) సోదొమ. ఇక్కడ యేసు చెప్పెను, లూకా 17, "సొదొమ దినములలో నుండిన విధముగా," గర్తుంచుకొనుడి, పురుషులు స్త్రీలను స్వభావ సిద్దమైన వా౦ఛలను ఉల్లంఘించున౦తవరకు ఆ పురుషులు స్త్రీలను దుర్వినియోగపరచుకొనిరి దానివలన ఆ పురుషులకు స్త్రీలపై మోజు తగ్గినది. మరియు ఓ, దీనిని వేదిక నుండి చెప్పుటకు భయంకరముగా నున్నది, అయితే ఇది… సత్యమనునది ఉన్న యెడల అది ఇక్కడి నుండియే పోవలయును. మరియు ఆ దినములలో నుండిన విధముగా ఈ దినము అది చాలా ఘోరముగా నున్నది. ఈ విధముగా తారుమారు కాబడుట అనేక వేల పదివేల రెట్లు ఈ విధమైన కార్యములు పెరిగిపోవుచున్నది, ప్రతియొక చోటును సొదొమ కార్యములు.
అది ఆ దినములవలె నేటి దినములలో, ఏలయనగా స్వభావ సిద్దముగా నరుల సంతానోత్పత్తికి ఏర్పరచబడిన విధానమును నీచమైన ధోరణిలో అవలంభించుచు తమ జీవితములను వక్ర మార్గములకు మళ్ళించుచున్నారు. వాంఛ గతించిపోయే వరకు అది ఆ విధముగానే వక్ర మార్గములో వెళ్ళుచున్నది. ఇంకో పది లేదా పదిహేను సంవత్సరములలో అవి చాలా వేగముగా విస్తిరించిపోవును, ఇప్పటికే ఆ కార్యములు ఎంతో విస్తరించి పోయినవని నేను చెప్పగలను. ఘోరమైన సంభవములు… వాటిని గురంచిన సంగతులను ఎడ్డీర్ మూవర్ నుండి నేను సేకరించాను. (అయితే నాకు తెలియదు. ఇక్కడ అవి యున్నవని నేను అనుకొన్నాను, అయితే నా యొద్ద లేవు), ఆయన ఏమి చెప్పి యున్నాడని.
మరియు ఇప్పుడు మనము ఈ కార్యములను కనుగొనుచున్నాము. ఓ, మై!
JUDE 1:7
73యూదా తన యొక్క చిన్న పుస్తకములో 7వ వచనములో వ్రాసియున్నాడు, దానిని మనము చదివెదము. దీనిని నేను చదువగోరుచున్నాను. యూదా 7వ వచనము ప్రకటన గ్రంథమునకు మునుపున్న చివరి పుస్తకము ఇదే. నేనిక్కడ గుర్తుంచుకొనియున్నాను, యూదా 7 — వచనము 7. భార్య భర్తలుగా ప్రమాణము చేసి, వాటిని త్రుంచివేసి పరశరీరాశలను కలిగియున్న స్త్రీలు మరియు పురుషులు… దీనిని వినండి.
ఆ ప్రకారముగానే సోదొమ గొమొర్రాలును వాటి చుట్టు పట్ల నున్న పట్టణములును వీరి వలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. [అదెట్లనగా, సమూలముగా దహింపబడి మరి నాశనము చేయబడును.]
74ఇక్కడ కొద్ది కాలమునకు మనము లాస్ ఏంజిల్స్ లో నేను కాంప్ మైదానము నొద్ద కాచుకొనియున్నాను. నేను కారులో పోవుచుంటిని. మరియు ఒక చిన్న స్త్రీ, ఒక అందమైన బాలిక, చాలా అందమైనది రోడ్డుపై పోవుచునుండెను. మరియు "ఆమె ప్రదర్శనకు వెళ్ళుచున్నదని" నేను అనుకొంటిని. మరియు ఆమె తన ముందు భాగములో ఒక ఆరు లేక ఎనిమిది అంగుళముల వెడల్పు గుడ్డను ధరించియుండెను, మరి దానిపై మూడు లేక నాలుగు అంగుళముల వెడల్పు అంచుయుండెను. మరియు ఆమె శరీరమునకు పై భాగమున ఒక చిన్న బిళ్ళను పెట్టుకొనియుండెను. అది మీ పిడికిలిలో ఇమిడిపోయేంతగా ఒక్కొక్క గుడ్డ చాలిచాలనంతగా ఆమె శరీరముపై ధరించుకొనియున్నది. దానిని ఇలా తగిలించుకొనియున్నది. కాళ్లకు బూట్లు వేసుకొని, దానికి కుచ్చులను తగిలించుకొని, కౌబాయ్ టోపిని పెట్టుకొని వెళ్ళుచున్నది, ఎంతో ఆకర్షణీయంగా ఆమె కనిపించుచున్నది… ప్రతి యౌవ్వనస్తుడైన పురుషుడు ఆమె ప్రక్కనే కొంతసేపు ఆగి కులుకుచు నడుచుచుండే ఆమెను చూస్తూ వుంటాడని నేను అనుకుంటున్నాను.
JOB 21:26
75నేను కాంప్ గ్రౌ౦డ్ నొద్దకు వెళ్ళుటకు సిద్దముగా నుంటిని, మరియు నేను ఆ కాంప్ గ్రౌ౦డ్ యొద్దకు వెళ్ళితిని. తిరిగి వెళ్ళుటకు నేను వెనుదిరిగాను. నేను ఆ యువతి యొద్దకు వెళ్ళి యిలా చెప్పాలనుకున్నాను, "యౌవ్వనస్తురాలా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నీతో మాటలాడవలయునని యున్నాను. నీవు అందముగా నుండుటలో సందేహము లేదు, నీవు మంచి దేహ సౌందర్యమును కలిగియున్నావు… నిన్ను చూచి నిలుపు బ్రేక్ల శబ్దములను వినవలయునని యున్నావా, నీవు ఆ విధముగా చేయుట వలన నిన్ను అట్లు చేయించు ఆ దురాత్మ రాబోవు కాలములలో నిన్ను నరకములో వేసి బాధించునని నీవు ఎరుగకున్నావా? అందచందాలతో యున్న నీ దేహము, నీ చెక్కిళ్ళు, మరియు నీ కేశాలంకరణ మొదలగునవన్నియు మరి ఆ విధముగా ఎర్రని పెదవులు మరి ఇంకొక ఆరు నెలలలో ఆ విధముగా చక్కగా అమరియున్న శరీరము లోపలను మరియు బయటను పురుగులు ప్రాకులాడుచు మన్నులో నుండునని నీవు గుర్తింపకున్నావా? మరియు ఈ రోజు అక్కడనున్న ఆత్మ దయ్యము యొక్క చెరలో ఉండునని నీకు తెలియదా?"
76ఏదో నన్ను ఆపినట్టయి దేవుడు నాతో చెప్పెనట్టనిపించింది, "నీవు ఆ విధమనగా చెప్పిన యెడల ఆ దూరముననున్న వారు నిన్ను చెరశాలలో వేసెదరని చెప్పెను." చూచారా? అక్కడే నీవు వున్నావు! అప్పుడు బిల్లీ బయటికి వచ్చి సమయమగుచున్నది రమ్మని చెప్పెను. వారు నమ్ముడి అను పాటను పాడుచుండిరి.
ఓ, మై! ఏ విధముగా అటువంటి కార్యములలో జనులు వశపరచబడుచున్నారు? ఏలయనగా వారు దేవుని యొక్క వాక్యమును లెక్క చేయుట లేదు.
మరియు ఇంకొక కార్యము వేదిక వెనుకనున్న సంస్థలతో కట్టబడియున్న వాక్యపరిచారకులు, దానిని చదవి మరి దేవుని వాక్యమును ఎరిగియున్న వారు, దానిని గురించి చెప్పుటకు నిషేదింపబడియున్నారు, ఏలయనగా వారు దానిని చెప్పినట్లైన సంఘము వారిని వదిలివెళ్ళిపోవును. మరియు సంఘములు సభ్యులు కొరకు ఎదురు చూచుచున్నది. అయితే దేవుడు నక్షత్రములవలె ప్రకాశించుటకు జీవముగల దేవుని యొక్క మరల జన్మించిన పరిశుద్దుల కొరకు ఎదురు చూచుచున్నాడు. యేసుక్రీస్తు ఏమి చెప్పియున్నాడో దానిని నిష్కపటముగా మరి సత్యమును చెప్పుటకు దేవుడు మాకు సహాయపడును. అయితే అటువంటి దినములలో మనము జీవించుచున్నాము. మరి యేసు చెప్పినట్లు ఆ విధముగా నుండునని చెప్పిన సూచన ఇదియే, మరి దానిని మనము మనముందు చూచుచున్నాము.
GEN 2:24•
JUDE 1:7
77ఇప్పుడు, మరల యూదా 7వ అధ్యాయము చూడుడి, సొదొమ మరియు గొమొర్ర. ఓ, మై, ఎటువంటి భయంకరమైన కార్యము! స్త్రీలను వివాహము చేసికొనకుండ, వారి శరీరమును యిచ్చించి వారి వెంటబడుట ఎంతటి నీచమైన కార్యము, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహమాడిన యెడల ఆమె అతని భార్యగా నుండి మరి వారిరువురు కాదు, వారు ఏకశరీరమైయున్నారు. మరియు ఒక పురుషుడు ఇంకొక స్త్రీని యిచ్చించి వెళ్తునప్పుడు యధార్థముగా అతడు తన భార్యను తనలో నుండి వేరుచేయుచున్నాడు మరియు ఆ విధముగానే ఒక స్త్రీ ఇంకొక పురుషునితో వాంఛించి పోయినప్పుడు ఆమెను తన భర్తకు దూరమై అతని యెడల ఆమె చనిపోయినదిగా నుండును ఆమె తన యొక్క సొంత శరీరమును పరిత్యజించి, ఆమె నుండి అతడిని ఖండించి పారవేయుచున్నది. అది సరియే. దానికొరకై న్యాయతీర్పు దినమున జవాబు చెప్పుకోవలసియున్నది.
COL 1:14•
2TIM 4:2-4
78అయితే ఈ దినమున అటువంటి వర్తమానమును వారు వినుటకు సిద్ధముగా లేరు. దానిని జనులు వినుటకు కోరుట లేదు. వారు వారి చెవులలో సున్నితముగా నుండు వర్తమానమును కోరుకొనుచున్నారు. ఖచ్చితముగా పరిశుద్దాత్మ నాకు ఏదైతే బోధిస్తాడో, ఆ దినమున అక్కడ ఆ పునాది రాయిని వేస్తాను, ఇలా చెప్పబడినది, "వాక్యమును ప్రకటించుము; సమయుమ౦దు, ఆ సమయుమ౦దు ప్రయాసపడుము, జనులు హిత బోధను సహించని కాలము ఒకటి వచ్చును, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసికొని - సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము. చెప్పెను, "ఆ దర్శనము గతించిన పిదప వెంటనే నీవు II తిమోతి 4 చదువుము" అని చెప్పెను. "II తిమోతి 4, మరువ వద్దు!" మరియు ఆ దర్శనము నన్ను వదిలి పోయినప్పుడు అక్కడ 7వ వీధిలో ఒక పందొమ్మిది సంవత్సరములు వయస్సుగల బాలుడు నిలుచుకొని యుండెను, దేవుని యొక్క స్వరము ఆ గదిలో పలికెను, మరియు ఆయన చెప్పెను, "II తిమోతి 4." అదియే సరిగ్గా జరిగెను. ఏమి జరుగనైయున్నదో అదియే ఖచ్చితముగా జరిగినది.
హితబోధను సహించని కాలమొకటి రానైయున్నది.
79జనులు దేనినో కోరుచున్నారు.. వారి యిష్టానుసారముగా జీవించుటకు, వారి వీపులపై నిమురుతు వారిని బుజ్జగించే మెత్తని ప్రసంగములను పెంతెకోస్తు వారు కోరుకుంటున్నారు. మరియు వారు పియోనాను ఒక సెకండ్లకు నలుబది సార్లు శబ్దముతో వాయించుచుచున్నారు మరి పైకి క్రిందికి దూకి ఆ వాయిద్యముతో డాన్స్ చేయుచున్నారు, స్త్రీలు వారి యిష్టానుసారమైన దానిని చేస్తున్నారు మరియు పురుషులు తాము కోరుకొను దానిని తాను చేయవచ్చును. ప్రెస్బిటేరియన్లలో, మెథడిస్టులలో, లూథరనులలో మరియు బాప్తిస్తులలో ఆ యొక్క సంఘ స్థాపన శాఖలలో చాలా ఉత్తమమైన జనులు కలరు. అది ఖచ్చితముగా సరియే. అయితే వారు ఏ విధముగా వారి బంధకములలో కట్టబడియున్నారనగా, వారు ಆ స్థాపన సంఘములలో ఉన్నంతవరకు ఆ సంఘ శాఖకు చెందినంతవరకు వారి పేరు ఆ పుస్తకములలో నున్నంతవరకు వారు పరలోకమునకు వెళ్ళేదరను ఊహతో ఆ విధముగా తలంచుకొనుచున్నారు. ఈ భూమిపైనున్న పుస్తకములలో మీ పేరు కలిగియుండుట దేవునికి దానికి ఏ సంబంధము లేదు. మీ యొక్క పాపములు మన్నింపబడియున్నవని మీరెరుగులాగున యేసుక్రీస్తు రక్తము ద్వారా గొర్రెపిల్ల యొక్క గ్రంథములో మీ పేరు వ్రాయబడి యుండవలయును. అది నిజము!
80అయితే వారు దానినే కోరుకొనుచున్నారు. అటువంటి సత్యమును చెప్పని కాపరులను వారు కోరుకొనుచున్నారు. వారికి వేరేమియును అక్కర లేదు. పరిశుద్ద గ్రంథములో అంత్యకాలమునకై సిఫారసు చేయబడిన పరలోకపు సంబంధమైన ప్రతీ వరమును దేవుడు కదిలించుచు, ప్రతీ వరము, ప్రతీ సూచన, మరియు ప్రతీ కడవరి కాలపు సూచనలు, పరిశుద్ద గ్రంథములో వాగ్ధానము చేయబడిన సమస్తము వరము యేసుక్రీస్తు ద్వారా వాగ్ధానము చేయబడినది. నాకు తెలిసినంత మట్టుకు నేను చూచులాగున ఈ యొక్క పరిశుద్ద గ్రంథములో వాగ్ధానము చేయబడిన సమస్తమును దేశమునకు ముందు కదిలింపబడెను. అయితే ఆమె ఇంకా నరకములోనికి ఎంతగా చొచ్చుకొని పోవలయునో అంతకంతగా చొచ్చుకొని పోవుచున్నది. వారికి చెప్పండి, ఎట్లయినను వారు దానినుండి పరిగెత్తుకొనిపోయెదరు.
ముగించుటకు మునుపు నేను కొన్ని లేఖనములను చూచెదను. అది సరియే. ఓ, "నిత్యముగా నశించుటకు వారు సిద్దపరచబడియున్నారు," వారు అందుకొరకే అని పరిశుద్ద గ్రంథము తెలియజేయబడుచున్నది.
GEN 6:12
81ఇదే విధమైన మురుగుడు యొద్ద ఈ దేశము పండుకొనియున్నది. సాంఘికపరమైన ఈ దుర్గంధము యొద్ద ఈ దేశము ఈ రాత్రి సమయమున పండుకొనియున్నది. మీకది తెలియును! ఇది హాస్యము కాదు. ఇది కట్టుకథ కాదు. ఇది సత్యమైయున్నది. ఆదికాండము 6:12. "భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని యుండిరి, దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి తమ స్వకీయ తలంపులతో నడుచుకొనుచున్నారు. ఈ దినమున మనుష్యుడు చేయునది అదియే. దేవుని యొక్క వాక్యమును నరుడు వినుటకు కోరుట లేదు. దానిని జనులు వినుటకు కోరుట లేదు; వారి కిష్టమైన మార్గములో వారు నడువ దలచుకొనుచున్నారు.
1KGS 19:18
82ప్రభువు యొక్క వాక్యమును వినుటకు యొజెబెలు నిరాకరించెను. గాలికి ఎగిరిపోయేలా వింతగా కనిపించే ఆ వృద్దుడైన ఏలియాను ఆమె తన కాపరిగా పిలుచుటకు అంగీకరింప లేదు. అయితే ఏది ఏమైనను అతను ఆమె యొక్క కాపరియే. అది వాస్తవమైయున్నది. దేవుడు అతనిని పంపించెను, అతను తన వర్తమానముతో గర్జించెను. అతను చదువులేనివాడై, అతను ఎక్కడి నుండి వచ్చెనో లేక ఎక్కడికి వెల్లెనో వారికి తెలియదు. ప్రభువు యొక్క వాక్యముతో అతను రంగమందు ప్రవేశించెను. ఆయన పంపిన వర్తమానమును అతను ప్రసంగించెను, పాపమను ప్రతి దానిని అతను ఖండించెను. ఆ యొక్క నవీన యొజెబెలు తన యొక్క శక్తియుక్తులతో జనులను ఆకర్షించి సమస్త దేశమును వినానశనమగునట్లు వారిని పురికొల్చెను. మరి ఏలియా ఒక్కడు ఏకాకిగా అక్కడ కొండపై నిలిచెను. దేవుడు చెప్పెను, "ఏలియా, నీవు ఒంటరిగా నున్నావని తలంచుకొనవద్దు. ఇంకను హృదయమందు పవిత్రత కలిగియున్న ఏడు వేల మంది క్రింద కలరు." అది అతని యొక్క రెండవ ఈడ్పు మరి మూడవ ఈడ్పు వారి యొద్దకు వెళ్ళెను.
GEN 6:5•
MATT 24:37•
LUKE 17:26
83అయితే గుర్తుంచుకొనుడి, దేవుడు దయగల వాడు, మరి ఆయన… మరి ఏలియా యొక్క వర్తమానము ఆ అవిశ్వాసమైన సంతతిని ఖండించెను. నోవహు వర్తమానము ఆ సంతతిని ఖండించెను మరియు దానిని వినుటకు నిరాకరించిన వారిపై న్యాయ తీర్పును మరియు దానిని నమ్మిన వారికి రక్షణను ఆ వర్తమానము తీసికొని వచ్చెను. మరియు నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు ఆలాగే ఉండును.
ACTS 20:27•
1COR 11:5,6,15
84ఆదికాండము 6, దేవుని ఆజ్ఞలను వారు ఎరుగకుండుట. "దేవుని యొక్క ఆజ్ఞలా," అని అంటున్నారు.
పరిశుద్ద గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఈ రోజు చెప్పుచున్నది… ఇప్పుడు వినుడి, నేను ఏ వ్యక్తిని గురించి దీనిని నేను సంబోధించుట లేదు. నేను మీ యొక్క సహోదరునిగా బాధ్యత కలిగియున్నాను. గొప్ప పరిశుధుడైన పౌలు తాను విడిచి వెళ్ళుటకు ముందు చెప్పినటు, "దేవుని సంకల్పమ౦తయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు, ఆ విధముగా నేను మీకు సమస్త సత్యమును చెప్పుటకు బాధ్యుడను.
ఇప్పుడు, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, ఈ రోజు స్త్రీలు వారియొక్క వెంట్రుకలను కత్తిరింపకూడదు. ఎంతమంది ప్రసంగికులు అది పరవాలేదని చెప్పినను నేను దానిని లెక్కచేయను; అది తప్పు ఎన్ని సంఘములు ఆ విషయుమును బలపరచినను అది నాకు అనవసరము, ఆ తప్పు తప్పేయని సరిగ్గా పరిశుద్ద గ్రంథము చెప్పుచునేయున్నది. "ఆ విధముగా స్త్రీ చేయుట ఆమెకు అవమానకరము." అయినను వారు చేయుచునే యున్నారు. వారేమి చేయుచున్నారు? వారి స్వకీయ తలంపులతో వారిని వారే అందగత్తెలుగా చేసుకొనుచున్నారు. వారు అందగత్తెలని వారు తలంచుచున్నారు.
DEUT 22:5
85ఆమే ఈ కార్యములను చేయకూడదని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. పురుషుల వస్త్రములను, లేదా పైజామాలను, లేదా పురుషునికి సంబంధించిన ఏ దుస్తులనైనను ఆమె ధరించకూడదు, కాని వాటినే అదే విధముగా ఆమె చేస్తూ కొనసాగిపోవుచున్నది. ఆమెను నివారించుటకు ప్రయత్నించండి. "సహోదరుడు బ్రెన్హా౦ దానిని గురించి అరవటం వలన నీకు కలుగు ప్రయోజనమేముంది, ఎందుకు అలా చెప్పుకుంటూ పోతావు? నీవు చెప్పకుండ ఊరకే ఉండుట మంచిది," అని నీవు అనవచ్చు… అయినను దానిని నేను లెక్క చేయను. జనులు ఏమి అనుకుంటున్నారో అది నాకు అనవసరము. జనులు ఏమి తలంచుకొనుచున్నారని నేను లెక్క చేయను. ఇప్పుడు నన్ను తప్పుగా అర్థము చేసికొనవద్దు. అయితే నేను దేవుడు ఏమి తలంచుచున్నాడని దానియందు ఇష్టపడుచున్నాను మరియు ఇది ఆయన యొక్క వాక్యము!
అవును, మీరు గనుక దానిని చేయుట తప్పని ఆమెకు చెప్పినను అయినను దానినే ఆమె చేయును. గమనించితిరా! ఎందుకలా చేస్తుంది? క్రైస్తవత్వములోని స్త్రీలందరు ఆ విధమైన కార్యములను చేయుచున్నారు, మరి సంఘము దానిని గురించి పట్టించు కొనకున్నది. అదెందువలన? స్త్రీ యొక్క శరీరములను యిచ్చించి దేవుని యొక్క కుమారులు పతనమైపోతున్నారు. మరియు ఈ విధమైన అసహ్యమైన కార్యముల నుండి వారిని వేరుపరచుటకు దేవుడు తనయొక్క రక్తము ద్వారా వారిని కొనియున్నాడను సంగతిని వారు తృణీకరించుచున్నారు. ఆమేన్! అది సత్యము! కావున దేవుడా నాకు సహాయపడుము, అది సత్యము!
MARK 4:22•
REV 20:12
86ఆమె అట్లు చేయకుండా వుండునట్లు ప్రయత్నించండి. నోవహు వర్తమానమును ఏదైన అటంకపరచినదని నీవనుకుంటున్నావా? లేదయ్యా. అయితే అదేమిటి ? అది ఒక స్వరము, స్వరము. మరియు మనము న్యాయ తీర్పునకు కొని రాబడిన యెడల, ఏ వర్తమానమును ఈ రాత్రి సమయమున ప్రసంగించుచున్నావో అదే వర్తమానము అక్కడ నన్ను వాక్యము వె౦బడి వాక్యము ద్వారా నన్ను కలిసికొనును. మరి అప్పుడు మీరేమి చేయబోవుదురు? ఇది ప్రకాశించెడి ఎర్రని దీపపు కాంతి.
ఒకప్పుడు స్త్రీలలో మిగుల తల గర్వముతో మాట వినని వారుండిరి. మనము… మనము దీనిని అమర్చెదము, ఏలయనగా ఇది స్త్రీలను గురించిన కార్యముగా నున్నది. మరియు మీరు అనుకొనవచ్చును ఏల నేనెల్లప్పుడను దీనిని గురించి కేకలేయుచున్నానని. ఇప్పుడు నేను అనేక లేఖనములను ముగించుటకు మునుపు మీముందు ఉంచబోవుచున్నాను మరి ఎందుకని చూపించబోవుచున్నాను. మరి ఆ కారణము వలననే నేను ఈ వాక్యమునకు సత్యముగా నుండవలయునని యున్నాను, మరియు ప్రతియొక్క దేవుని సేవకుడును వాక్యమునకు నిజముగా సత్యముగా నుండవలయును. దానికి వ్యతిరేకముగా ఎక్కడో ఒక స్వరము కేకలు వేయుచున్నది గనుక నీవు వాక్యమందు నిలకడగా నిలబడవలసియున్నది. తక్కిన వారు ఎవరు చెప్పినను నాకు లెక్కలేదు, వారు చేసే కార్యములకు మీరు బాధ్యులు కారు. వ్యక్తిగతముగా నీకు నీవు జవాబు చెప్పుకోవలసియున్నది. మీరు ఒక మెథడిస్తుగా బదులివ్వనక్కర లేదు, ఒక బాప్తిస్తుగా, లేక ఒక పెంతొకోస్తుగా మీరు బదులివ్యనక్కరలేదు. మీరు వ్యక్తిగతముగా మీ యొక్క జీవితమునకు దేవునికి బదులు చెప్పవలయును.
GEN 2:17
87మరియు మనము ఈ యొక్క సూచనలను చూచుచున్నాము మరైనను వారు దానిని చేయుచు పోవుచున్నారు. అది తప్పని ఆమెకు చెప్పుడి, ఆమె ఏమి చెప్పునో చూడుడి. తల బిరుసు తనము గలది! హవ్వ దానినే చేసెను. దానిని చేయ కూడదని హవ్వకు బాగుగానే తెలియును. ఆమెకు తెలియదా? ఆమె దేవుని వాక్యమును కలిగియుండెను. చెప్పెను, "నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు." సరి, ఆమె దానిని ఎందులకు చేసెను? ఆమె తన సొంత మార్గమును కోరెను. మరియు స్త్రీలు ఎందులకు వారి వెంట్రుకలు కత్తిరించుకొనుచున్నారు? ఏల ఈ యొక్క దుస్తులను ధరించుచున్నారు, మరి బైబిలు వారు ఆ విధముగా చేసెదరని చెప్పుచున్నది కావున వారు సరిగా అట్లే చేయుచున్నారు. మరియు వారు చేయు కార్యములకు వారు తీర్పుకు లోనగుచున్నారు. సరిగా అట్లే జరిగియున్నది. అయితే ఆమె ఏల దానిని చేయుచున్నది? ఆమె తన సొంత బుద్ధితో చేయుచున్నది. అవునయ్యా! ఆమె తన యొక్క సొంత మార్గమును కలిగియున్నది. దానిని గురించి సంఘము ఆమెకు ఏమియు చెప్పుట లేదు. మరియు సంఘము యేసుక్రీస్తు యొక్క వధువుగా నుండవలయును, మరి దానిని గురించి సంఘము ఏమియును చెప్పుట లేదు.
MATT 7:16•
MATT 12:34
88దానిని గురించి వారిలో ఎవరికైనను చెప్పి చూడుడి, వారేమి చెప్చెదరో మీకు తెలియునా? వారేమి చెప్పెదరనగా, "కొంచెం లోక కార్యములలో నుండుటకు నా మార్గమునకు పాత నిబంధన గ్రంథము నాకు అడ్డముగా ఉండదు" అని అవహేళనగా మాట్లాడెదరు. ఇప్పుడు సరిగా అట్లే యున్నది. మీరు అవన్నియును పరిశుద్ద గ్రంథములో వ్రాయబడియున్నదని చెప్పుడి… ఓ, వారు ఆ యొక్క వాక్యములను చెప్పరు, అయితే వారు దానిని వ్యక్తపరచెదరు. చెప్పే మాటలు కంటే చేసే కార్యములు ఎక్కువగా ఉండాలి అను పాతకాలపు సామెతను ఎప్పుడైనా విన్నారా? మంచిది, అది ఆ విధముగా యున్నది. చెప్పే కార్యముల కంటేను చేసే కార్యములు ఎక్కువ. ఏమి చెప్పినను అది అనవసరము. ఈ ఉదయమున నేను చెప్పిన రీతిగానే ఎంతమంచిగా జీవించుచున్నావో ఎంత ఎక్కువగా గంతులు వేసినను నీ సాక్ష్యాన్ని వారు వినేంత వరకు నీ జీవితము యొక్క నడవడికను ఎక్కువగా ప్రతి ధ్వనింపచేయవలెను. తెలిసిందా? నీ క్రియలు నీ మాటలు కంటె నేను ఎక్కువగా వుండాలి. మీరు ఈ విధముగా వచ్చి చెప్పవచ్చును, ఎందుకనగా వారి మాటలే వారిని గురించి చెప్పును… నీ మాటలు ఏమైయున్నను నీ యొక్క క్రియలు నీవేమైయున్నావని చూపించును. మీరు నిజముగా ఎట్లున్నారో మరి దానికి వ్యతిరేకముగా మీరు పలికిన యెడల అది వేషధారితనమగును. యేసు చెప్పెను, "వేషదారులైన వారలారా! మీరెట్లు మంచి కార్యములు చెప్పగలరు, హృదయము నిండియుండు దానిని బట్టి యొకని నోరు మాటలాడును." చూడుడి, వారు అనుకొనని కార్యమును వారు పలికెదరు. స్త్రీ చాలా… ఈ విధముగా దానిని చెప్పెను. ఓ, మై! "మా స్వకీయ సంతోషాలు, సంబరాలు మాకు గలవు."
TIT 2:5
89ఏమి జరుగును? వివాహము జరుగునప్పుడు… పరిశుద్ద గ్రంథములో ఇచ్చట ఇంకొక స్థలమందు వివాహ సమయములో విధేయత యుండుట - ప్రమాణాలతో సాగిపోవుచున్నవి, విధేయుతగా వుంటున్నారా? "లోబడుడి. లోబడుట? మంచి కార్యములు చేయుచు, పవిత్రులుగా ఇంట నుండి పనిచేసికొను వారుగా నుండవలయును. నీ ముఖమున ఆమె ఒక చిరునవ్వు నవ్వి, పౌవర్ ప్లాంటు దగ్గరకో లేదా ఇంకొకరి ఆఫీసు యొద్దకో వెళ్ళును. "నా యొక్క భర్తయని…" ఓ, అలా చెబుతాదో లేదో అని నాకు అనుమానము.
ఈ రక్షణ భటుల కార్యాలయాన్ని నేడు చూచిన యెడల… స్త్రీలను పోలీస్ ఫోర్స్ లో ప్రవేశపెట్టడము ఎంతో అవమానకరమైన విషయము. అది ఎటువంటి పట్టణములోనైనను జారత్వము ముద్రగా నున్నది కదూ! మరి అనేక పురుషులు ఉద్యోగములు లేకుండా యుండగా, వారు అచ్చట స్త్రీలను ప్రవేశ పెట్టుచున్నారు. ఆమె పతివ్రత మరియు మంచి గృహిణిగా ఇంటి పనులను చేసుకొను దానివలె నుండవలెనని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. అయితే ఆమె తనయొక్క యజమానుని పుస్తకములను మరియు ఇతరేతర కార్యములను చక్కబెట్టవలయును… అది… నేను ఇప్పుడు మంచి స్త్రీలను గురించి మాటలాడుట లేదు. నిజముగా దేవుని భక్తిగల స్త్రీలకు మీకు దీనిని నేను చెప్పుట లేదు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. అది టేపులో నున్నది లేక వేరే విధముగాను నున్నది. అయితే నేను మాటలాడునది ఒకరు మంచివారుగా నున్న యెడల మీరు పదిహేను వందల మంది ఇతరులను ఆ మార్గమున పోవువారిని చూడగలరు. వారు ఒక వాక్యమును కూడ వినరు. "మీ యొక్క బైబిలును ఉంచుకొనుడి! మీకు మీరే ప్రసంగించుకొనుడి. దానిని వేుము వినుటకు ఇష్టపడము."
లోబడుము! ఓ!
90ఆమె దీనిని చెప్పవచ్చును, "మీ యొక్క బైబిలు కథలను వేరొకరికి చెప్పుడి. మీ దేవుని ఇంకొకరికి ఇచ్చుకొనుడి మరి నన్ను మాత్రము వదలి వేయుడి. నన్ను గురించి ఏల కేకలు వేయుచున్నావు? ఈ కార్యములను చెప్పమని నేను మిమ్ములను ఎన్నడును కోరలేదు." నాకు తెలియును, అయితే దేవుడు నేను ఆ విధముగా చెప్పులాగున చేసెను. చూశారా? కావున అది అంతే.
కావున వారింకను అదే మార్గమున పోయి చెడిపోవుచున్నారు. ప్రభువు యొక్క దినములలో వారు చేసిన విధముగా, ఆ దినములలో చేసిన విధముగా, ఈ దినములలో అదే విధముగా చేయుచున్నారు. అది మారలేదు. అది మారదు; అది మారనే మారదు.
చిన్ననాడు ఆమె చేసిన ఈ అపరాధముల వలన చివరకు బిడ్డలకు అవి అంటుకొనును. చెరశాల ఆ ఇరువరి పురుషులలో ఒక భాగమై చోటు చేసుకొనును. నరకము సమస్తమును స్వీకరించుచున్నది ఇది యథార్థముగా వాస్తవము. తలలకు పైగా పోవుచున్నది. వారు దానిని ఎన్నడును వినలేదు. వారియొక్క సొంత మార్గములో వారు కొనసాగెదరు మీరు వారికి చెప్పవచ్చును, బైబిలు దీనిని చెప్పుచున్నది. వారు చెప్పెదరు, "మీ బైబిలును మీరే ఉంచుకొనుడి. మేము మా యొక్క కులాసా కార్యకలాపాలకు వెళ్ళవలెననుదురు."
TIT 2:5
91ఇప్పుడు మీలో కొందరు సహోదరిలు ఒకవేళ వారిక్కడ నుండక పోవచ్చును, అయితే మీరు చెప్పునది వినబడుచున్నది, "ఎవరు నేనా, నా భర్తకు లోబడియుండాలా? హు! అతడు నాకు లోబడేటట్టు చేస్తాను." మంచిది, అక్కడే నీవు పొరబాటు పడుచున్నావు. ఇంటి యొద్దనే వుంటు, పతివత్రగా వుండాలి? పరిశుద్ద గ్రంథము ఏమి చెప్పుచున్నదో నాకు అనవసరము, నా జోలికి రాకుండా, నా దారిన నన్ను వదలి వేయుము. సహోదరీ వినుము, అది — చీకటి కాలములలో ఆ విధముగా నుండలేదు, అది ఈ రోజు యొక్క స్వరము. జలప్రళయమునకు మునుపు ఆ విధముగా జరిగి యుండలేదు, ఈ దినములలో అది జరుగుచున్నది. అదే కార్యము.
మరల వారు చెప్పెదరు, "నేను ఒక నవీన నాగరిక స్త్రీని. నేను అమెరికాలో జీవించుచున్నాను." సరి, అది మీరు పందుల దొడ్డిలో నుండుటకు సమానము. మీరు ఎక్కడ జీవించుచున్నారనుట దేవునికి ఏ బేధమును కలిగించదు. మీరు మీ హృదయములో ఎట్లున్నారో ఆ విధముగా నుండెదరు. అది సరియే. మరియు ఈ దినము మీరు చెప్పదలచుకొనునట్లు సహోదరి మీరు తలంచుకొనవద్దు, మీరు చాలా నాగరికులనియు, మీరు నాగరిక స్త్రీలలో ఒకరని. మీరు చీకటి యుగములలో, జలప్రళయమునకు మునుపు ఉన్నటు వంటి నాగరికత కంటెను చాలా వెనుకబడియున్నారు. నోవహు కాలమున వారు అదే కార్యమును చేసియున్నారు. కావున మీరు అనుకొనునట్లు మీరు నవనాగరికులు కారు. అవును కదూ? చూశారా? ఆ విధముగానే వారు జలప్రళయమప్పుడు ప్రవర్తించిరి. చూశారా? మరియు ఆ విధముగానే ఈ దినము వారు ప్రవర్తించుచున్నారు, సుదూరములోనున్న ఆ వెనుకటి మహాగాథాంధకారమై యున్నది, కావున ఇది మరల చీకటి యుగమై యున్నది.
92మరియు పురుషులైన మీరు మీ యొక్క భార్యలను ఆ విధముగా ప్రవర్తించుటకు అనుమతించిన యెడల మీరు దేవుని కుమారులు కారు. కాదు, మీరు సోదొమలాటి కార్యములలో పడినయెడల, (అది సరియే!), స్త్రీలు మీపై అధికారము చెలాయించుటకు అనుమతించుచున్నారు. ఓ, మై!
ఇది చెప్పవలయునా లేక చెప్పకూడదా నాకు తెలియదు. ఈ యొక్క భాగమును నేను దాటి పోనిమ్ము. అయితే… అది సరి. ఇది భయంకరమైనది.
అయితే ఈ కార్యములన్నిటికి మనము ఈ కాలములో ఎదురు చూచుచున్నది. మీరు ప్రకాశించుచున్న ఎర్రని దీపమును చూచుచున్నారా?
ప్రభువు యొక్క బూర ధ్వనించుచుండగా
మరి కాలము ఇక ఉండబోదు గతించును,
ప్రకాశమైన మరియు అందమైన
నిత్యమైన ఉదయము ఉదయించును;
అప్పుడు ఆయన యొక్క ఎన్నుకొనబడినవారు కూడుకొనెదరు,
(భూమి ధూళినుండి)
ఆకాశములకు పైగా దూరముగానున్న వారి ధూళి
ఓ, అది ఎటువంటి దినముగా నుండును! అది సరి. ఓ, అవును!
93సోదొమకు పోయున్నారా. దిగులు పడవద్దు, అక్కడొక ఏ-బాంబు దానిని శుద్దీకరించుటకు కాచుకొనియున్నది, (అది సరియే), సమస్త ప్రపంచమును తుడిచివేయుటకు అది సిద్దముగా యున్నది. అది దానిని చేయును. మరటు పిమ్మట మనము ఆరవ ముద్రలో చూచులాగున, అది మరల నూతనపరచబడును, ప్రభువైన యేసును అంగీకరించి విమోచింపబడిన జనులు, ఎవరైతే క్రైస్తవులుగా నుండిరో, ఎవరైతే వారి యొక్క అక్కరలను మరి వారి యొక్క ఈ ప్రపంచపు ఫాషన్లను వదిలివేసి మరి యేసుక్రీస్తు యొద్దకు వచ్చిరో, మరి ఆయనను మాత్రము ఆయనను మాత్రము చూచుచు; ఆయన యొక్క సామాన్యమైన పథకములో వచ్చి మరి ఆయనను నమ్ముదురో, వారు నిత్య జీవమును గైకొనెదరు. మరి మీరు గనుక మీకు నిత్యజీవము కలదని మీరు చెప్పుకొని, ఈ యొక్క బైబిలుతో మీరు ఏకీభవించని యెడల మరి మీరు కలిగియున్న నిత్యజీవము దేవుడు అనుగ్రహించు నిత్యజీవము కాదు. మీరు మరణము ద్వారా మోసగింపబడియున్నారు మరియు అది జీవమునకు సంబంధించిన కార్యము కాదు. అది సరియే.
MATT 24:37•
LUKE 17:26
94ఇప్పుడు, ఓ, "దేవునికి భయపడి మరి ఆయన వాక్యమును కాచుకొనుడి, ఏలయనగా ఇదియే పరిపూర్ణమైన ఆజ్ఞగా నున్నది. " ఎర్రని దీపములు ప్రకాశించుచున్నవి, మరి కాలము సమీపించుచున్నది. నోవహు దినములవలె వారు యుక్తమైన సహజ కార్యమును తీసికొని వారు వాటిని తలక్రిందులుగా చేసిరి. వారు తినుచును, మరి త్రాగుచును మరియు వారు ఇండ్లు కట్టి మరియు వారు అన్ని రకములై కార్యములను అచ్చట నుంచిరి మరి దానిని తారుమారు చేసిరి. ఇప్పుడు యేసు మనలను ఒక గృహము కట్టునట్లు ఎదురు చూచుచున్నాడు. చూచారా? అయితే ఆ కార్యములో ఏమి సంభవించినదో ఊరక చూడుడి. తినుట, ఆయన మనము సాధారణముగా తినుటను ఎదురు చూచుచున్నాడు; అది సరియే, ఆ తినుటలో ఏమి జరిగెనో చూచుడి. త్రాగుట, మనము మన నీటిని మరి మనము త్రాగవలసిన వాటిని త్రాగవలసిన వారముగా నున్నాము, అయితే దానికి బదులుగా వారు త్రాగుడు అలవాటు చేసికొని మరి మధుపానము చేయుచున్నారు మరి సమస్తమును, మిశ్రమ మధుపానములు త్రాగుచు మరి స్త్రీలను ఆ త్రాగుడులోనికి తీసికొని వచ్చుచున్నారు. చూశారా?
GEN 6:3•
2TIM 3:4
95మరియు నోవహు దినములవలె జనాభా విస్తరించుటను గురించి ఏమిటి? స్త్రీల యొక్క సౌందర్యము దినదినమునకు అధికవుగుచు పోవుచున్నది దానిని గురించి ఏమిటి? చూశారా? ఎర్రని దీపము! తన యిష్ణానుసారముగా వుండే కాలమిది, ఏమిటది? తల బిరుసుతనముతో, అహంభావముతో సమస్తమును కలిగియున్న ఆమెతో నీవేమి చెప్పలేవు. వారికి వాక్యము ప్రసంగించినను వారు ఎట్లైనను దానినే చేయుదురు. చూశారా? ఏమి జరుగును? సరిగా నోవహు దినముల వలె జరుగును. ఒకానొక దినమున కృపయొక్క తలుపులు మాయుబడును. అప్పుడు లేఖనములు చెప్పుచున్నవి, పరిశుద్ద స్థలము పొగమయమై యుండును, దాని అర్థము అక్కడ నుండి మధ్యవర్తి (విజ్ఞాపన కర్త) వెళ్ళిపోయినాడని అర్థము. మరియు గొర్రె అక్కడున్నంత వరకు — నేను ఈ ఉదయమున చెప్పినట్లు లేక నేనెక్కడో ప్రసంగించినట్లు, అక్కడ గొర్రెపిల్ల మధ్యవర్తిత్వము జరుపు వరకు అక్కడ కృప నిలచియుండును. అయితే మనకు ఏమి నిశ్చయమున్నది, మనము రైలు బండి స్టేషనుకు బయట పట్టాలలో నున్నది, మనము ప్రభువు వచ్చుటను చూచుచున్నాము, ప్రకాశించు ఎర్రని దీపము?
96ఆయన చివరి దినములలో ఇక్కడ ఆయన చేసెదనని వాగ్ధానము చేసిన కార్యములకు మరి ఆ కార్యములు మన ముందే జరుగుచుండగా నేనెట్లు దానికి విరోధముగా వేరే కార్యములను పలుకగలను. మరియు మనము ఈ రాత్రి ఈ యొక్క అంశములో ఇంకొక ప్రకాశించు దీపమును చూచియున్నాము, ఎట్లు మన స్త్రీలు యున్నారనియు వారు చేయు కార్యములు చూచియున్నాము. ప్రతి యొక్క మైలు స్తంభమును, సమస్తమును, ప్రతియొక అన్వేషణ చూచియు, ప్రతియొక దిక్సూచి, ఆయన యొక్క రాకడను సూచించుచున్నది.
మనము చివరి కాలములో ఉన్నాము. ప్రభువు యొక్క రాకడ తప్పనిచ్చి మరి నాకు తెలిసి జరుగవలసిన ఏ కార్యమును లేదు. మరి నా యొక్క ప్రియ స్నేహితుడా క్రీస్తుకు వెలుపట దీనిని గురించి నీవేమి తలంచుకొనుచున్నావు? నీవు విశ్రాంతి నొందుచున్నావా… నిష్కపటముగా, స్నేహితుడా, నేను నిన్ను ఒక సాధారణమైన ప్రశ్న అడుగదలంచి యున్నాను. నీవు ఏదో ఉద్రేకముపై ఆధారపడియున్నావా లేక ఆ విధమైన నీవు పొందిన మరేదో కార్యముపై నున్నావా? పరిశుద్ద జనులు మరియు పెంతెకోస్తులు, మరియు నజరేయులు, మరియు యాత్రిక పరిశుద్దులు వలె నీవు ఒక మారు సంతోషముగా నున్న యెడల నటనమాడుచున్నావా. అది అదేనని సంతోషముగానున్నప్పుడు నాట్యమాడేంత వరకు దానిని వారు నమ్మితిరి. అంతే చాలని అనుకొనుచున్నారు. మరియు పిదప నీవు నీ వెంట్రుకలు కత్తిరించుకొని మరి పొట్టి దుస్తులు వేసికొనుచున్నావా? బైబిలులో దానిని తప్పని నిందించుచుండగా మీరు ఆ విధముగా చేయుటను పరిశుద్దాత్మ ఆనుమతించునా?
MATT 12:33•
LUKE 6:44•
1COR 11:5,6,15
97"సరి, నేను సంఘమునకు చెందియున్నాను," అది చెప్పు నీ గురించిన కార్యమేమిటి. నేను ఒక పెంతెకొస్తుని, నేను ఒక మెథడిస్తును (లేక నేనెవరైనను కావచ్చును); నేనొక సభ్యుని. నా తల్లికి సంఘములో జీవిత సభ్యత్వము కలదు. నేను కూడ జీవిత సభ్యత్వము సంఘము నందు కలిగియున్నాను." నీవు చేయకూడదని పరిశుద్ద గ్రంథము ఏయే కార్యములను గురించి చెప్పుచున్నదో, ఆ కార్యములను నీపై గల ఆత్మ నీ ద్వారా చేయించుచున్నది. మీరు చెప్పవచ్చును, "నేను అన్య భాషలలో మాటలాడగలను, సహోదరుడు బ్రెన్హాం, ఇప్పుడు మీరు దానిని మాత్రము పట్టుకొని లేక ఆధారపడి యుండకుడి. నేను అన్యభాషలలో మాటలాడియున్నాను మరి అది పరిశుద్దాత్మకు ఆధారముగా నున్నది." మీ యొక్క జీవితము… మీరు గనుక ఇంకను వెంట్రుకలు కత్తిరించుకొనుచున్న యెడల, బైబిలు చేయవద్దని చెప్పు కార్యములను మీరు చేయుచున్నయెడల, మీరు రాత్రింబగళ్ళు అన్యభాషతో మాటలాడ వచ్చును, మరియు వాటికి దేవునికి సంబంధము లేదు. వృక్షము దానియొక్క ఫలముల వలన తెలిసికొనబడును.
98నేను వృద్దుడగుచున్నాను. నాకది తెలియును. ప్రతి దినమును నాకు క్రొత్త నొప్పులు వచ్చుచున్నవి. మనలో ప్రతియొక్కరికిని అంతే. మీరు కూడ సత్యమునే చెప్పవచ్చును. నేను అనుకొంటిని, "దేవుడా, నన్ను…" ఒక భయంకరమైన నిర్భాగ్య కార్యమేదనగా ఒక పురుషుడు లేక స్త్రీ క్రీస్తును అంగీకరింపక మరి పాచి పెరిగినట్లు సంఘ సభ్యునిగా నుండుట చూచుటయే, అతను సాతాను కంటె కూడ అథముడు, అతను ఏదో పాత కార్యములను గట్టిగా పట్టుకొని, "సరి, నేను మీకు చెప్పుచున్నాను, నేను నమ్మను దేవుని…" దేవుడు ఎన్నడూ… ఆ సాతానుడు ఒక జీవితముపై నుంచు భయంకరమైన కిరీటము (అవిశ్వాసము మరి తప్పుడు జీవిత కార్యములను కిరీటము నుంచుట - తెలుగు తర్జుమాదారుడు.) ఒక మూలుగుచున్న సుమారుగా అరువది లేక డెబ్బది సంవత్సరముల వయస్సు గలిగిన వృద్ధురాలు ఆమె చేతులలో కండరములు వ్రేలాడుచుండగా, మరియు ముఖమంతయును ముడతలతో మరి ఆమె వెంట్రుకలు కత్తిరింపబడి, నాలుగు లేక ఐదు రంగులు పూసుకొని, మరియు పొట్టి దుస్తులతో తనను అలంకరించుకొని యుండుట; అది సాతానుడు నీకు కిరీటము ధరింపజేయుట కాదా, దానిని ఒక మనుష్యుడు ఎండ్రకాయవలె దేనినో పట్టుకొని యుండుట, సాతాను కిరీటము కాక ఇంకొక విధముగా నేను చూచి యుండలేదు.
GAL 5:22
99ఓ దేవుడా, నాకు తెలియును… ఫిర్యాదు చేయకుండునట్లుగా నాకు కృపను అనుగ్రహించండి. మరియు నా యొక్క జీవితము, ప్రభువా, నా యొక్క ప్రజలు జీవితము నేను కోరుచున్నాను… దేవుడా మా యొక్క జీవితములు కిరీటము ధరింపబడులాగున అనుగ్రహించుము, మేము బాధపడినను పరవాలేదు ఏమి సంభవించినను, ఎందరు నాకు విరోధముగా నున్నను పరవాలేదు. అలాగు ఫిర్యాదు ఈ ఒక్క కార్యమును నా జీవితములో నేను ఎరిగియున్నాను, నా వయస్సు పెరుగుచున్న కొలది, సెలయేరువలె నా వెనుకనున్న నా స్నేహితులు నన్ను వీడి త్వరితముగా పరిగెత్తుకొని పోవుచున్నారు, నా మార్గమున నేను వెళ్ళుచుండగా వారు తరిగిపోతు, ఇంకా తరిగిపోతునే యున్నారు. కొద్ది కాలమైన పిదప ఏ ఒక్కరు కూడా నా యొద్దకు వచ్చి నాకు సలహా చెప్పరు — నన్ను సలహా అడుగరనే ఒక కార్యమును నేను ఎరిగియున్నాను. నేను గనుక ఒక వేళ జీవించియున్న యెడల నా యొక్క బాల్య ప్రాయములో నేనెరిగిన వారు చనిపోయుండుదరు. నా స్నేహితులు కొద్ది కొద్దిగా తరిగిపోయారు, ఇప్పుడు నేను కూడా వృద్దుడనైపోతిని.
ఒకానొక దినమున నేను చనిపోయెదనని నాకు తెలియును. ఒక పాత బొంతగా, వికృత రూపముగల మనిషిగా నాకు సాతానుడు మకుటమును ధరింపజేయుటను దేవుడు అంగీకరించడని నేను నమ్ముచున్నాను. మరియు నా భార్య వృద్దురాలై సణుగుచు వుండే స్త్రీగా లేదా మీ భార్య లేదా మీరు అలా వుండకూడదని నేను కోరుకుంటున్నాను. మన యొక్క జీవితములు ఆత్మ యొక్క ఫలముల వలన కిరీటాన్ని ధరించాలని నేను ప్రార్థించుచున్నాను, సహోదరుడా, ఆత్మఫలమేమనగా: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మ౦చి తనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, పరిశుద్దాత్మతో నిండిన విశ్వాసమును కలిగి వుండాలనేదే నా ప్రార్థన.
2COR 5:1
100నా జీవిత దినములు గతించిపోవుచున్నవి… సుమారుగా ముప్పది-ఐదు సంవత్సరములకు మునుపు నేను ప్రసంగ వేదికలో ఒక చిన్న బాలునిగా ఇక్కడ నిలుచుకొనియున్నాను. ఈ రాత్రి, నేను నెరసిన వెంట్రుకలతో, మరియు బట్టతలతో, వంగుచున్న భుజములతో; ఒక వృద్దుడనై నేను కృంగిపోవుచున్నాను. నా యొక్క జీవితము ముగించిపోవుచున్నది మరియు నేను నడచు మార్గములు నా అడుగులు పెళుసైనవిగా ఉన్నవి. నేను ఈ ప్రవాహములో పోవుచుండగా, నాకు స్నేహితులు తగ్గిపోవుచున్నారు. మరియు ఆ పిదప నేనొక స్థానానికి వచ్చినప్పటికి, నేను ఆనందించి పాడిన పాటలే నాకు అయిష్టముగా అనిపించును. ఒక వేళ నా యొక్క మనవుడు మరి మనువరాలు చెప్పెదరు, "తాతకు చికాకు కలిగించకు," అని చెప్పెదరు. నేను గనుక జీవించియుంటే, ఆ విధముగా జరుగును.
అటు పిదప నేను కుర్చీలో నుండి లేవలేని పరిస్థితి సంభవింపవచ్చును. అటు పిదప ఒక ఉదయమున పొగ మంచు నా గదిలోనికి వచ్చును, మృత్యువనే సరిహద్దు యొద్దకు నేను కదలి వెళ్ళేదను. అతను నన్ను తన చేతులతో తీసికొని పోయి, మరి నా యొక్క యజమానుని యొద్దకు నడిపించును. ఆ మరణమును అతడు నన్ను ఒక బానిసవలె తీసికొని వెళ్లడు; నేను అతని బానిసను కాను; అతడే నాయొక్క బానిస. క్రీస్తు నా కొరకు మరణమును జయించెను. మరియు అతను చేయగలిగిన ఒకే కార్యము, "భూసంబంధమైన ఈ గుడారము శిధలమై పోయినప్పుడు," నా సృష్టికర్త యొక్క సన్నిధిలోనికి నన్ను అతడు తీసుకొని వెళ్ళును.
GEN 2:7•
JOHN 14:1-3•
2COR 5:1
101ఒక తల్లి బిడ్డను ప్రసవించుటకు మునుపు — మీరు గమనించండి, ఆమె ఎటువంటిదైనను, ఎంత నీచురాలైనను, నాకు లెక్క లేదు — ఆ బిడ్డ ఇంకా కొద్దిసేపటిలో జన్మించుననగా, ఆ తల్లి చాలా సాధువుగా నుండును. అదెందువలన? ఆ యొక్క గర్భములో చిన్న కండరములు కదలుచు ఆ విధముగా ఎగురుచున్నప్పుడు, దాని కొరకు ఒక పరలోక శరీరము కాచుకొని యుండును. మరియు తల్లి నుండి బిడ్డ బయటికి వచ్చినప్పుడు, వైద్యుడో లేక నర్పు ఆ బిడ్డను తీసికొని మరి దానిని కొట్టి కదలించిన వెంటనే, లేక ఆ విధముగా బిడ్డ కదలులాగున చేసిన యెడల, ఆ బిడ్డ కదలుచున్నప్పుడు, వెంటనే అది జీవాత్మను గ్రహించి, ప్రాణముగల బిడ్డగా మారును. అక్కడ ఒక చిన్న దూత ఆత్మలోనికి వచ్చును, అది జీవాత్మ అగును, పిదప జీవించే ప్రాణిగా అది అగును. మన హృదయములో మనము క్రీస్తును పొందుకొనినప్పుడు, అది ఒక చిన్న పసికూనవలె క్రీస్తు మన హృదయములో నిజరూపము ధరించును.
"భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను…" యోహాను 14లో యేసు చెప్పెను. ముగించుటకు మునుపు దీనిని నేను చెప్పుచున్నాను. ఆయన చెప్పెను, "మీ హృదయములను కలవరపడ నియ్యకుడి; మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి; నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్దపరచ వెళ్లుచున్నాను." ఈ భూమి మీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, మనకు పరలోకమందు మనకు ఒక స్థలము కలదని మనము ఎరుగుదుము. "నేను వెళ్ళి మీకు నేనుండు స్థలములో స్థలము సిద్దపరచుదును, మీరును నాతో కూడ నుండులాగున." ఆయనతో కూడ నుండ గోరుచున్నారా.
అటు పిదప క్రీస్తు ద్వారా ఈ చిన్న బిడ్డ నూతన జన్మతో రూపొందింప సమస్త జీవితమ౦తా సంబంధాలను తెంచుకొనిన తర్వాత -ఈ భూసంబంధమైన గుడారము గతించిపోవును. ఆ పిదప నిన్ను ఒకటి కదిలించును. మృత్యువు నిన్ను తాకినప్పుడు, అది నిన్ను స్తంభింప జేయుచున్నది. నూతన రాజ్యములోనికి అది నిన్ను మరల జన్మింపజేయు చున్నది, ఆవలి తీరమున వ్యాధి నుండదు, దుఖము ఉండదు, వృద్దులుగా నుండరు, లేక వేరే ఈ లోక కార్యములు ఉండవు. దేవుడు మనకు సహాయము చేయును గాక!
102యేసు క్రీస్తుకు వెలుపట, ఈ ప్రపంచములో వేరే ఏ నమ్మకము లేదని చూచుచు, స్నేహితుడా, మీరు ఆ విధమైన రక్షణ కార్యమును త్రోసివేయదగునా? ఎర్రని దీపములు ప్రకాశించుచున్నవి!
దేశములు విరిగి పోవుచున్నవి; ఇశ్రాయేలు మేలుకొనుచున్నది;
బైబిలు ము౦దుగానే చెప్పిన సూచనలు;
(స్త్రీలు వారి యొక్క వెంట్రుకలను కత్తిరించుకొనుట,
పొట్టి దుస్తులు ధరించుకొనుట,
ఎర్రని దీపము వెలుగుచున్నది, చూశారా?)
అన్యజనులు దినములు లెక్కి౦పబడుచున్నవి, బాధలు చుట్టుకొనియున్నవి.
ఓ, చెదరి పోయిన వారలారా,
మీ యొక్క స్వదేశమునకు తిరిగి రండి,
విమోచన దినము సమీపించుచున్నది,
మనుషుల హృదయములు భయముతో నశించి పోవుచున్నవి;
ఆత్మతో నింపబడుడి;
మీ యొక్క దీపములు వెలిగింపబడి మరియు శుద్ధి చేసికొనుడి;
పైకి చూడుడి, మీ యొక్క విమోచన సమీపముగా నున్నది.
GEN 6:2•
LUKE 17:28
103నేను ఆయనను ప్రేమించుచున్నాను; మీరు ఆయనను ప్రేమించవలెనని నేను కోరుచున్నాను. ముగించుటకు మునుపు మరి మనము మన తలలు ఒక క్షణము ప్రార్థన కొరకు వంచెదము… ఎర్రని దీపములు ప్రకాశించుచున్నవి; సంకేతము వేయబడియున్నది. ప్రభువు యొక్క రాకడ సమీపముగా నున్నది. ఆయన దేశములతో మాట్లాడుచున్నాడు; ఆయన జనులతో మాట్లాడుచున్నాడు; ఆయన అద్భుతముల ద్వారా, సూచనల ద్వారా మాట్లాడుచున్నాడు. మనము సొదొమను సాదృశ్యముగా చూసియున్నాము మరియు ఆ యొక్క దూత ఏ విధముగా అబ్రాహాము నొద్దకు వచ్చినది చూచియున్నాము, అగ్ని కుమ్మరించుటకు ముందు సూచన క్రియలను ఆయన ఏ విధముగా చేసెననే దానిని మనము చూచియున్నాము. మనము దానిని చూచియున్నాము.
అయన చెప్పెను, "లోతు దినములలో వారు కట్టుచు, అమ్ముచు" అని చెప్పెను. ఈనాటి కాలమును గ్రహించు, "నోవహు దినముల వలె, స్త్రీలు చాలా చక్కగా తయారవుచుండిరి, దేవుని కుమారులు పడిపోవుచుండిరి. మానవ శరీరములైన స్త్రీలను ఆరాధించుట ఈ కార్యములన్నియును జరుగుచుండెను, ఈ రాత్రి మనము మాటలాడిన విధముగా. దీపములు ప్రకాశించుచున్నవి, ప్రభువు యొక్క రాకడ సమీపముగా నున్నది. మీరింకను ఒక సంఘసభ్యునిగా ఉండగోరెదరా ? మీరు నిశ్చయముగానున్నారా, నా స్నేహితుడా? ఈ రాత్రి మీరు జీవించెదరని మీకు తెలియునా? సహోదరుడు, వే ను, గమనించుడి - ఈ రోజు ఉదయము ఇక్కడ నిలుచుకొని వేరొకరితో కరచాలనము చేయుచు తిరుగుచున్న ఒక క్షణములో అతను దారిలో పడి చనిపోయెను. మరి మీకు ఇంకొక తరుణము ఇచ్చుటకు దేవుడు అంత దయామయుడుగా ఉండనేరడు. మీ యొక్క గుండె కొట్టుకొనుట ఎప్పుడు విశ్రమించునో మీకు తెలియదు. దానిని గురించి ఆలోచించుడి!
MATT 24:34•
MARK 13:30•
LUKE 21:32
104క్రీస్తు యొక్క రాకడ సూచనలు ప్రకాశించుచున్నవి. వాటిని చూడుడి. ఈ రాత్రి నేను మీతో చెప్పిన కార్యములు చూడుడి… అవి చాలా ప్రభలమైన కార్యములుగా వుండకపోవచ్చు, అయితే అది సత్యము. దేవుడు ఏమైతే చెప్పియున్నాడో, అక్కడే మనము యున్నాము.
స్త్రీలు గృహముల యొద్ద యుండుట ఇష్టపడుట లేదు, వారియొక్క కుటుంబ బాధ్యత వారికి లెక్క లేదు. వారు బిడ్డలను చూచుకొనుటకు అయాలకు అప్పుజెప్పి, ఏదో ఒక విందులకు హాజరగుటకు ఆశిస్తారు. బాల్యతనపు చేష్టలవలె చేయుచు, ఆ విధముగా వ్వవహరించుచున్నారు. వారి వెంట్రుకలు కత్తిరించుకొనుచున్నారు, పొట్టి దుస్తులు ధరించుకొనుచున్నారు, ముఖమునకు రంగులు పూయుచున్నారు. వారియొక్క అందచందాలను వృద్ధి చేసుకోవటము హద్దులు దాటిపోవుచున్నవి. దేవుని కుమారులు పడిపోవుచున్నారు. దేవుని కుమారులు దానిలోనికి పడిపోవుటకు సాతాను ఉపయోగించు ఉచ్చగా అది యున్నదని యేసు చెప్పినట్లు. అది జరిగి తీరవలయును. అయన చెప్పియున్నాడు, ఆ కాలములో అక్కడ ఆ విధముగా నుండెను మరిక్కడ అది ఉన్నది. ఆయన చెప్పెను, "ఈ కార్యములన్నియును నెరవేరు వరకు ఈ సంతతి గతించదు. మరియు అవి సంభవించుటకు నలుబది సంవత్సరములు పట్టినది." దానిని గురించి ఆలోచించుడి!
105మీరింకను ఒక సంఘసభ్యునిగా నుండగోరుచున్నావా? మీరు తప్పుచేసి యున్నారా? స్త్రీ, పురుషులారా వాటిని చూచి ఈ రాత్రి మీ యొక్క జీవితములను పరీక్షించుకొనుడి. నిన్నునీవు పరీక్షించుకో, నీ స్వకీయ దోషములను పరిశీలించుకో. ఇప్పుడున్న మీ యొక్క ప్రస్తుతపు స్థితి ఎట్లున్నది… దీనిని క్రీస్తు ఒకవేళ భూమిపై యుండి ప్రసంగించిన యెడల… ఒకవేళ ఆయన ప్రసంగించిన యెడల… ఆయన యొక్క ప్రసంగమును నేను వినిన యెడల, నేను మారుమనస్సు చెందియుందును అని నీవు అనవచ్చును. మీరు గనుక ఆ విధముగా చేసియున్నట్లైన, నేను ప్రసంగించు ఈ ప్రసంగము ఈ రాత్రి ఆయన యొక్క స్వీయ వాక్యముగా నున్నది, ఇప్పుడు మీరు చెప్పిన విధముగా చేయుదురు.
మీరు గనుక దేవుడు లేకుండ ఉన్నట్లైన, మరి మీకు తెలియును… ఓ, మీరు చెప్పవచ్చు, "నేను సంఘమునకు చెందినవాడను. నేను అన్యభాషలలో మాటలాడియున్నాను. నాకు తెలియదు…" ఇప్పుడు మనము దానిని ప్రక్కకు పెట్టియున్నాము. మిమ్ములను మీరు చూచుకొనుడి, ఇప్పుడు దేవుని వాక్యముతో మీ జీవితమును సరిచూచుకొనుడి. "నాకు బైబిలు ఏమి చెప్పుచున్నదో దానితో నాకు అక్కరలేదు, సహోదరుడు బ్రెన్హాం మీరు పొరబాటుపడుచున్నారని, నేను అనుకొనుచున్నాను," అని చెప్పు వ్యక్తి మీలో ఎవరైనను ఉన్నారా? నేను పొరబాటు పడుట లేదు. దానిలో ఏదైనను పొరబాటు వున్నయెడల అది వాక్యములో నున్నది అన్న యెడల. మరియు మీరు దేవుని ఇంకా నెరుగకున్నారు, మరియు ఒకవేళ యేసు గనుక ఈ యొక్క వేళలో వచ్చినయెడల మీరు పోవుటకు సిద్ధముగా నున్నామను నిశ్చయతను మీరు కలిగియుండ లేదు… మరణము చాలా సమీపముగా నుండగా, ముగింపు చాలా సమీపముగా నుండుట చూచుచుండగా మీరెందుకు అట్లు నిర్లక్యము చేయుచున్నావు.
106ఇప్పుడు మన తలలు వంచియుండగా, మనము ముగించుచుండగా ఇక్కడున్న మీలో ఎవరైనను ప్రార్ధనలో మిమ్ములను జ్ఞాపకము చేసికొనవలయునని కోరుచున్నారా, మరి ఆ విధముగా కోరిన యెడల "సహోదరుడా, నా కొరకు ప్రార్థించుము." మీరు మీ చేతులను పైకెత్తి మరి చెప్పగలరా, దేవుడు నిన్ను ఆశీర్వదించును సహోదరి. దేవుడు నిన్ను ఆశీర్వదించును, సహోదరుడా, సహోదరి. ఓ, కట్టడమునకు బయటనున్న వారిని కూడ. అది అంతే.
ఇప్పుడు చిన్న జాబితా గురించి తెలిసికొనెదము. సహోదరిలైన మీరు మంచి విశ్వాసముతో మరి నీరీక్షణ గలవారై దీనిని గురించి ఆలోచించుడి. "నేను నిజముగానే దేవునికి విధేయతను కలిగియున్నానా? నిజముగా నా యొక్క కోరిక దేనిపై నున్నది? "సహోదరుడు బ్రెన్హాం, నేను ఇంకను ఈ కార్యములను చేయుచున్నాను. నేను మంచిగా నున్నాను అనుభూతితో నున్నాను. నేను ఆనందముతో నున్నానను అనుభూతితో నున్నాను." విగ్రహారాధికులు కూడ చాలా ఆనందముతో నుండెదరు మీకు తెలియునా? మీకు తెలియునా, ఒక త్రాగుబోతు మద్యము త్రాగి మీరు వాక్యము ద్వారా ఎంత ఆనందముతో నుండెదరో, ఆ విధముగా అతను కూడ త్రాగి ఆనందముతో నుండును. మరియు మీరు వాక్యమునకు విరోధమైన మరి ఏ కార్యముతోనైనను ఆనందముగానున్నయెడల అది పిశాచి యొక్క కార్యముగా నున్నది. మీరు గనుక "నేను నా సంఘముతో తృప్తిపడుచున్నాను," అని చెప్పిన యెడల, మరి మీరు దేవుని వాక్యము ప్రసంగింపబడుట వినినయెడల మరి దాని ప్రకారము జీవించని యెడల మీరు మీ యొక్క ప్రేరేపణ ఎట్లున్నను మీరు తప్పైన కార్యముతో ప్రేరేపింపబడి యున్నారు. నేను వారు అరచుటను మరియు ఎగురుటను మరియు కేకలేయుటను మరియు సమస్త కార్యములను, మరియు మనుష్యుని యొక్క కపాలము నుండి రక్తము త్రాగుచు మరి దయ్యములను పిలుచుటయు చేస్తారు (అది నిజము!), ఆ విధముగా చేయుచు మీరు ఎంత ఆనందముగానున్నారో, అట్లే వారును యున్నారు. విగ్రహారాధన మరి ఇతర కార్యములవలె మనస్తత్త్వ శాస్త్రమును ఉత్పత్తి చేయును, మనస్సుకు సంబంధించిన సంగతులను సృజించెదరు. అయితే క్రీస్తుతో కూడిన అనుభవము హృదయుమునకు సంబంధించినది, అది సమస్త కార్యములను మార్చివేయును, ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మార్చును. దానిని గురించి నిజముగా అలోచించుడి.
MATT 24:37•
MARK 16:17,18•
LUKE 17:26
107మిమ్ములను మీరు చూచుకొనుడి. మీ ముందు ఒక అద్దమున్నదని ఊహించి మిమ్ములను మీరు చూచుకొనుడి. "నేను నిజాయితిగా నున్నానా? నేను నిష్కపటముగా నున్నానా? నేను నిజముగానే హృదయములో ఆ విధముగానున్నానా, నేను ప్రభువును సేవించుచున్నానా? చెప్పెదరా, "నేను దానిని సేవించుచున్నానా?"
వెంట్రుకలు కత్తిరించు కొని పొట్టి దుస్తులు ధరించుకొనియున్న స్త్రీలారా, ఇటు చూడుడి. ఈ కార్యములను చేయు స్త్రీలారా, మిమ్ములను మీరు చూచుకొనుడి. మీ భార్యలను ఆ విధముగా చేయుటకు అనుమతించు పురుషులారా, చూడుడి. చెప్పెదరా, "నేను దేవుని కుమారుడనా? లేక నేను సొదొమకు చెందిన పట్టణవాసిగా యున్నానా?"
స్త్రీలైన మీరు చెప్పెదరా, "నేను నిజముగానే నవీన నాగరికతకు చెందిన స్త్రీవలె నున్నానా! లేక కడపటి దినములలో నుండెదరని యేసు చెప్పిన జలప్రళయము ముందు ఉన్న నాగరికతకు చెందిన స్త్రీ వలె నున్నానా?" దానిని గురించి ఆలోచించుడి. మిమ్ములను మీరు గమనించుకొనుడి మరియు చూడండి.
నీ మనస్సాక్షియే నీవు ఎవరనేది నీ గురించి తెలియజేస్తుంది. మరియు ఇప్పుడు మీరు గనుక ఒకవేళ నిజాయితిగా లేనియెడల దానిని సరిజేసుకొనుటకు యదార్థమైన హృదయముతో — నీ యదార్థతో ఇప్పుడు — మీ చేతులను వైకెత్తి మరి చెప్పెదరా, "క్రీస్తు నేను నా యొక్క చేతిని సహోదరుడు బ్రెన్హాం గారికి లేక మరెవరికి ఎత్తుట లేదు, అయితే మీకు ఎత్తుచున్నాను, నేను తప్పుగా నున్నాను. నన్ను మన్నించుడి. సహోదరుడు బ్రెన్హాం నా కొరకు ప్రార్థించెదరని వాగ్ధానము చేసి యున్నారు, ఇప్పుడు నేను నా యొక్క చేతిని పైకెత్తి మరి చెప్పబోవుచున్నాను, "ఈ రాత్రి యేసు నాపై దయనుంచుము. క్రీస్తు కొరకు నన్ను రక్షింపుము. నేను నశించిపోవుటను కోరుట లేదు. నా జీవిత పరమావధినంతటిని నీవే నాకు అనుగ్రహించి యున్నావు, దానిని నేను తిరస్కరించి విసర్జించివేయుట ఎంతో ఘోరమైన కార్యము. ఈ రాత్రి సమయమున మేలిమి వంటి సువర్ణపు తరుణమును కలిగియుండి ప్రకాశించుచున్న ఎర్రని దీపపు కాంతులు ప్రతీచోట నా కన్నులారా నిజముగా చూచుచున్నాము. మరియు ప్రభువు యొక్క రాకడకై ఆయన వాగ్ధానము చేసిన ఈ సూచనలు, మరియు ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును, ఆయన చనిపోయిన వారిని లేపును, ఆయన దయ్యములను వెళ్ళగొట్టును, ఒక చిన్న గుంపు ప్రజలు ఉండెదరు, ప్రపంచము ద్వారా పరిహసింపబడు చాలా తక్కువ సంఖ్యలో ఒక గుంపు యుండెదరు మరి వారిని ప్రపంచము చెడ్డ పేరులతో దూషించును, మరియు ఆ విధమైన కార్యములు ఇవన్నియును నేను చూడలేక పోయినయెడల నా యొక్క జీవితము చాలా దౌర్భాగ్య స్థితిలో నుండును."
MATT 12:32•
MARK 3:28,29•
LUKE 12:10•
ACTS 2:41
108మరియు వారు మనలను చెడ్డ పేరులతో పిలిచెదరు; వారు సత్యమును దూషణకరమైన నామములతో పిలిచెదరు. యేసు చెప్పెను, "మనుష్యకుమారునికి విరోధముగా ఎవరైనను పలికినయెడల మన్నించబడును," అయన అదే కార్యమును చేయుట మీరు చూచెదరు. ఆయన చెప్పెను, "పరిశుద్దాత్మకు విరుద్దముగా మాటలాడిన వానిని, అదే కార్యమును ఆయన చేయుటకు వచ్చినప్పుడు ఈ లోకములో అట్టివానికి పాపక్షమాపణ లేదు. చూశారా, వారు దానిని ఆ విధముగా పరిహసింపవలయును. ప్రజలు దానిని పరిహసించులాగున అటువంటి ఒక వర్తమానము ఉండవలయును, ఏలయనగా ప్రపంచమంతటిని దేవుని యొక్క నీతి దండించులాగున మరి నాశనము చేయులాగున ఆ విధముగా జరుగవలయును.
కృప ఉన్నప్పుడే మరి దేవునికి మానవునికి మధ్య యేసుక్రీస్తు ఉన్నప్పుడే మరియు ఈ రాత్రి తెరువబడిన ఒక తలుపు ఉన్నప్పుడే, నీవు ఆయనను అంగీకరింపకూడదా, నా స్నేహితుడా?
ఇప్పుడు, వాడుక చొప్పున బలిపీఠమునొద్దకు వచ్చుట కలదు. అది సరియే; దానికి నేను వ్యతిరేకిని కాను. అయితే లేఖనములు చెప్పుచున్నవి, "విశ్వసించినవారెందరో వారందరును బాప్తిస్మము నొందిరి." మీ యొక్క పూర్ణహృదయముతో మీరు కూర్చున్న చోటి నుండి యేసుక్రీస్తు మీతో మాటలాడి మీరు చేతులెత్తిన ఆ చోటు నుండి మీరు గనుక మీ జీవితములను యేసుక్రీసుకు అర్పించినయెడల…
ఈ ఉదయమున నాకు ముందు చనిపోయి పడిపోయిన ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితమును ప్రాణమును మరల పిలువగలిగిన అదే దేవుడు నేను మీకు సత్యమును చెప్పుచున్నానని నిరూపించగలడు. దేవుడు తప్పనిచ్చి ఎవరు చనిపోయిన వారిని లేపగలరు? అది సరియే. కావున ఇది చేసినది మీ యొక్క బలహీనమైన కాపరి కాదు, అది నిన్ను ప్రేమించుచున్న క్రీస్తు. మరియు ఆయన ఈ రాత్రి మీకు తనను బయలుపరచుకొనుచున్నాడు, "మీరు సత్యమును వినియున్నారు. మీరు సత్యమును చూచియున్నారు. యేసు చెప్పుచున్నాడు, అది నా వాక్యము నుండి వచ్చియున్నది. నా యొక్క వాక్యము జీవమును మరల పిలుచుటను మీరు చూచియున్నారు. నా యొక్క వాక్యము ఈ కార్యములు జరుగునని చెప్పుట మీరు చూచియున్నారు. వాటిలో ఏ ఒక్కటి కూడ ఈ గడచిన సంవత్సరములలో తప్పిపోకుండ నెరవేరుటను మీరు చూచియున్నారు."
HEB 12:1
109ఇప్పుడు, ఎర్రని దీపము ప్రకాశించుచుండగా యేసు కొరకు మీరేమి చేయబోవుచున్నారు? దీనిని నీవు ఎందుకు చేయకూడదు, ప్రపంచమును వేరుశెనగకాయల పాత సంచిని ఏల విసిరివేయకూడదు? చెత్త కథలను చిత్రించే నీచమైన పత్రికలు, నీ ఆత్మను దిన దినము దిగజారిపోవునట్లు ప్రేరేపించుచు ఆకర్షించు ఆ యొక్క పాత పనికిమాలిన చెత్తను మీరేల విడువకూడదు! మీరు సంఘమునకు పోకుండ మిమ్ములను ఆటంకపరచి సంఘము నుండి దూరముగా నుంచు ఆ టెలివిజనును ఒక మూల, ఏల విసిరివేయకుడదు? దానిని ఏల వదిలివేయకూడదు? నీచుట్టు వుండే బలంగా అవరించియున్న బంధకములన్నింటిని ప్రతీదానిని నీవు ఎందుకు ఒక ప్రక్కగా వాటిని నెట్టివేయకూడదు! "క్రీస్తు నా యొక్క కార్యము ముగించియున్నది. నేను సిద్ధపడుచున్నాను. మీరు వచ్చుటను నేను చూచుచున్నాను, నిత్యజీవమును భధ్రపరచియున్న దేవుని యొక్క పరిశుద్ద గ్రంథమనే సూటుకేసును నా చేతిన పట్టుకొనియున్నాను. ఇకనుండి నేను దీనికోసమే జీవిస్తాను, అని ఆ విధముగా చెప్పుచు క్రీస్తుకు మీరేల మీ హృదయములను పైకెత్త కూడదు! మనము ప్రార్థించుచుండగా, దానిని మీరు చేసెదరా.
1TIM 3:16
110మా యొక్క పరలోకపు తండ్రీ, ఏ విధముగానైనను కఠినముగా నుండవలయునని కాదు ప్రభువా, అయితే వర్తమానము కాలమునుద్దేశించి చెప్పబడియున్నది, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఒక ప్రత్యేకమైన మనుష్యుని ఉద్దేశించి కాదు, అయితే అది కాలమును సూచించి చెప్పబడియున్నది. ఈ వర్తమానమును టేపు చేయమని పరిశుద్దాత్మ నన్ను ఒత్తిడి చేసిన సమయమిది. ఈ యొక్క ప్రసంగ వేదిక నుండి అనేక సార్లు ప్రసంగింపబడియున్నట్లు మనము లోతు యొక్క దినములను, సొదొమ దినములను, యేసు పలికిన దినములను, కాలముల యొక్క సూచనలను, ప్రభువు యొక్క రాకడను అనేక విధములుగా మనము చూపించియున్నాము. మరియు పిదప నేను నేటి దినములలోని దేశమంతటను ఉన్న స్త్రీలను గురించి చాలా కఠినముగా మాటలాడియున్నాను, తండ్రీ నేనేల ప్రజల మద్యలో ఈ విధముగా మాటలాడియున్నానని అనుకొనగా, పరిశుద్దాత్మ ఈ విధముగా పలుకమని నాతో మాటలాడియున్నారని నేను తలంచితిని. ఏలయనగా ఉత్తేజపూరితమైన మీ వాక్యము నా హృదయములో చెప్పమని ఒత్తిడి చేయుట వలననే అది అలా జరిగినది, ఇంకా కూడా నేను నెమ్మది పరచలేకపోతున్నాను.
ఒక కఠోరమైన, ప్రభువా మీ వాక్యముచే చెక్కుట వలన ఏబది లేక డెబ్బది-ఐదు చేతులు తండ్రీ ఈ కట్టడములో పైకెత్తబడియున్నవి, అయితే అది వారిని ఒక కదిలించబడే స్థితికి తీసికొని వచ్చినవి ఎట్లనగా వారు ఈల యొక్క ధ్వని వినులాగున. పరిశుద్దులు అందరును కూడుకొనుటను చూచులాగున, దేశములన్నియును తునాతునకలై పొవుచున్నవి. రాకడ యొక్క సూచనలు, ఎర్రని దీపములు ప్రకాశించుటను చూచులాగున వారిని ఆ స్థితికి తీసికొని వచ్చినవి. మరియు బైబిలులో మన స్త్రీలు ఏ విధముగా నుండెదరోయని చెప్పబడిన విధముగా నుండుటను మనము వారి క్రియల ద్వారా చూచియున్నాము, మరిక్కడ వారు యున్నారు.
GEN 6:2•
MATT 24:37•
LUKE 17:26•
HEB 6:19
111ఎన్నడు తప్పని యేసుక్రీస్తు యొక్క స్వరము నోవహు యొక్క దినములను మనము జీవించు దినముతో పోల్చి చూచుకొనమని హెచ్చరించియున్నాడు. మరటు పిమ్మట మనము ఈ యొక్క కార్యములు సంభవించుటను చూచునప్పుడు, స్త్రీలు సౌందర్యవంతులుగా నుండుటచే, మరి దేవుని కుమారులు వారిని తీసికొనుటయు, మరియు ఏ విధముగా ఈ కార్యకలాపాలు జరుగుచున్నవనే దానిని చూచుచున్నప్పుడు పిదప మనము ప్రభువు యొక్క రాకడను ఆ సంతతియే చూచునని ఎరిగియున్నాము. అప్పుడు ప్రకాశించు దీపమును మనము ఎరిగి యున్నాము, ఆయన రాకడ సమీపముగా నున్నది.
ప్రతీ ఒక్కొక్కరిని పరలోకపు తండ్రి, నీవు వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాను, నా దీన విజ్ఞాపనను, విధేయత ప్రార్థనను నీ యొద్ద సమర్పించుకొంటున్నాను, నీవు దీనిని ఆలకించెదవని నేనెనుగుదును. ఈ ఉదయకాలమందు సహోదరుడు వే పట్ల నీవు ఎంతో దయను చూపితివి. ఒక దీన ప్రార్ధనచే మరల ఆ గుండె వ్యాకోచించుట ఆరంభించినది. తన భార్య ఒడిలో మృతతుల్యమైన వ్యక్తికి ఒక నిష్కపటమైన ప్రేమ దానికి హేతువాయెను… ప్రభువా, పాపమునందు అక్రమముగా చనిపోవుటనునది బాహ్యమైన మరణము కంటేను చాలా భయంకరమైనదని ఈ రాత్రి సమయము నందు జనులు గ్రహించునట్లు చేయుము; ఎందుకనగా తెరకు అవతలి ప్రక్కకు వెళ్ళుచున్న వారు ఆ ఘడియలలో పాపమునందు మరియు అతిక్రమమునందు ఉన్నయెడల ఏ ఒక్కరును నిన్ను సంధించలేరు.
చేతులు పైకెత్తిన ప్రతి యొక ఆత్మకు ప్రభువా, ఈ రాత్రి అనుగ్రహించుము; నేను ఈ యొక్క ప్రార్థనను ప్రభువైన యేసు నామమున ఈ ప్రార్థనను చేయుచున్నాను; వారి యొక్క జీవితములలో అటువంటి ఒక ప్రత్యక్షతను పొందుకొని, అది అచ్చట అటువంటి ఒక సంకల్పమును వారి హృదయములలో చోటు చేసుకొని, అది వారి హృదయములో నున్న సంకల్పముచే ఇకమీదట దేవునికి వ్యతిరేకముగా ఎప్పటికిని పాపము చేయకుండునట్లు అది చేయును. ఈ క్షణము నుండి వారు దేవుని యొక్క నిత్యజీవమును, ఆశీర్వదింపబడిన వాక్యముపై నిలువబడి మరి పరిశుద్దాత్మ ద్వారా పోషింపబడినిమ్ము, మరియు ఈ సమయము నుండి ఇకమీదట వారు అనుదినమును జీవమార్గములో నడిపింపబడనిమ్ము.
JOHN 5:24
112ఇప్పుడు పరలోకపు తండ్రి, నేను మరల వారిని చూడలేక పోవచ్చును, నేను కరచాలము చేయాలని ఆశించి భూమిపైనున్న వాని భౌతిక హస్తాన్ని నేను మరల తాకలేనేమో. కావున ప్రభువైన దేవుడా, ఈ యొక్క ప్రార్థనకు బదులిచ్చుదరని నేను ప్రార్థించుచున్నాను. మీరు మీ యొక్క వాక్యములో చెప్పియున్నారు, "నా మాటలు విని మరి నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువానికి నిత్య జీవము కలదు; వాడు తీర్సులోనికి రాక మరణములో నుండి జీవము లోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." దేవుని యొక్క వాక్యమును చాలా వినయవిధేయతలో నేను ఈ రాత్రి తీసికొని వచ్చియుండగా, అనేకులు వాక్యమును వినియున్నారు. వారిని రక్షించెదనని నీవు వాగ్ధానము చేసితివి, వారు నశించరని వాగ్ధానము చేసితివి, మరియు వారిని మీ చేతిలో నుండి ఏ మనుష్యుడును లాగివేయలేరు. మరియు మీరు వారిని కడపటి దినములలో లేపెదననియు, వారి యొక్క తలవెంట్రుకలలో ఒక్కటైనను నశింపదని మీరు వాగ్ధానము చేసియున్నారు.
ఇప్పుడు, ప్రభువా, ఒక ప్రార్థనగా, ఒక సేవకునిగా మరియు వారికి ఒక సహోదరునిగా నేను ఈ ప్రార్థనను ప్రార్థించుచున్నాను మరియు వారిని దేవుని యొక్క చేతిలో నుంచుచున్నాను, ఏలయనగా ఎటువంటి ఆపద కూడా వారి యొద్దకు రాకుండునట్లు సాతానుడు దేవుని యొక్క చేతిలో నుండి వారిని అపహరింపకుండునట్లుగా వారిని నీకు అప్పుగించితిని. వారు నీవారు, నీ యొక్క జయ చిహ్ననములైయున్నారు. మరియు మీరు వారికి దీర్ఘాయువును అనుగ్రహించుడి, మరియు వీలైనయెడల వారు ప్రభువైన యేసు యొక్క రాకడను చూడనిమ్ము, మరియు వారు ఇచ్చటి నుండి ఈ రాత్రి బయలుదేరి వెడలి ఆత్మలను సంపాదించువారిగా నుండనిమ్ము, ఇతరులకు చెప్పు వారివలెనుండి క్రీస్తు రక్షించునన్న జ్ఞానమునకు వారు ఇతరులను నడిపించులాగున చేయుము. దానిని అనుగ్రహించుము. వీటన్నిటిని మీ చేతులకు అప్పగించుచున్నాము, తండ్రి. యేసుక్రీస్తు నామములో.
113మరియు మనము తలలను వంచియున్న వేళలో ఒక క్షణము. ఇప్పుడు ఇక్కడ ఒక వేళ మనము ప్రార్థనలో నుండగా మనలో ఎవరికో ఒకరికి అసాధారణముగా ఏమైనను సంభవించియున్నదాయని నేను ఆశ్చర్యపడుచున్నాను, ఇది మొదలుకొని క్రీస్తుకు అర్పితమైన జీవితమును జీవించు, మరియు ప్రభువు రాకడను నీవు చూచెదవు. ప్రకాశించెడి ఎర్రని దీపకాంతిని ఇతరేతర విషయములను గురించి నేను ప్రసంగించుచున్నపుడు, అది సత్యమని నీవు నమ్మితివి, మరియు అది ప్రభువు యొక్క వాక్యమని నీవు గ్రహించావు, ఎందుకనగా ఆ వాక్యమే క్రీస్తు కాబట్టి. మరియు ఈ రాత్రి నుండి మీరు ఇంకొద్ది మెరుగైన, క్రీస్తుకు చేరువైన జీవితము జీవించెదమని నమ్ముచున్నారు, ఎందువలననగా ఈ రాత్రిలో నేను చేసిన ప్రార్థన, నీవు తెలిపిన అంగీకారము నిన్ను ఆ విధముగా చేసియున్నది. మరియు మీ యొక్క తలలు వంచియుండగా, మీ యొక్క చేతులను మీరు పైకెత్తి మరి చెప్పుడి, "దానిని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి నుండి నేను వేరైన మంచి జీవితమును జీవించెదను." దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. అది మంచిది. అది అద్భుతముగా నున్నది, నిజముగా చెప్పవలయుననిన, ప్రతి యొక్కరు కొద్దిసేపటికి మునుపు వారి చేతులను పైకెత్తిన వారు దానిని అంగీకరించియున్నారని నేను నమ్ముచున్నాను.
ACTS 2:38•
ACTS 4:12•
ACTS 19:2,3
114ఇప్పుడు, మీరు గనుక యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందని యెడల, గుర్తు౦చుకొనుడి, మీరు రక్షింపబడులాగున పరలోకము క్రింద మనుష్యునికి వేరే ఏ నామమును ఇయ్యబడలేదు, యేసుక్రీస్తు నామము తప్పనిచ్చి, గుర్తుంచుకొనుడి, ఒకే ఒక వధువు ఉన్నది, ఆయన యొక్క నామమును ధరించుకొనియున్న క్రీస్తు యొక్క వధువు.
ఇప్పుడు, మీరు గనుక నీటిలో మునిగి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందకున్న యెడల ఆయన యొక్క సేవకునిగా… దేవుడు మీకు సూచనల ద్వారా మరియు అద్భుతముల ద్వారా మరియు ఆయన వాక్యము ద్వారా నిరూపించియున్నయెడల నేను సత్యమునే మీకు చెప్పుచున్నాను; పరిశుద్దుడైన పౌలు అపొ. కార్యములు 19లో అతను కొందరు బాప్తిస్తులను కనుగొనినప్పుడు, వారితో చెప్పినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వారు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము నొందిరి. అతను అడిగెను, "మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా?"
వారు చెప్పిరి, "పరిశుద్దాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు."
ఆయన అడిగెను, "ఆలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి?"
వారు బదులిచ్చిరి, "మేము యోర్దానునొద్ద యేసు క్రీస్తుకు బాప్తిస్మమిచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా పొందితిమి."
ACTS 2:38,39•
ACTS 19:4,5•
GAL 1:8
115అది ఒక అద్భుతమైన బాప్తిస్మము, అయితే పౌలు చెప్పెను, "అది ఇప్పుడు పనిచేయదు దానివలన ప్రయోజనము లేదు. అపో. కార్యములు 19:5 ప్రకారము అతను వారిని యేసుక్రీస్తు నామమున మరల బాప్తిస్మము పొందుడని ఆజ్ఞాపించెను. మరియు పౌలు చెప్పియున్నాడు, "గలతీయులు 1:8, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను - పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక." పిదప దానిని మరల చెప్పెను, "నేను చెప్పినట్లు మరల నేను దానిని చెప్పుచున్నాను, "ఒక దూతయైనను," (ఒక వాక్య పరిచారకుడైనను కాదు, బిషప్పు అయినను, పోపు అయినను, లేక వేరేదైనను, వీరందరి కంటెను) - ఒక దూతైనను పరలోకము నుండి వచ్చిన యెడల, ఒక కెరూబు పరలోకము నుండి వచ్చి ఇంకొక సువార్తను ప్రసంగించిన యెడల దూతనైనను కెరూబునైనను కాదు, మరి ఎవరైనను వేరొక సువార్త ప్రసంగించిన యెడల అతను శాపగ్రస్తుడవును." మీరు మడుగులో నుండగా, మరియు బాప్తిస్మమిచ్చు దుస్తులు మీ కొరకు కాచుకొనియుండగా, రండి, వచ్చి బాప్తిస్మము పొందుకొనుడి. మీరు గనుక యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందకున్న యెడల మీరు వచ్చి బాప్తిస్మము పొందుడని నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, "ప్రభువగు యేసుక్రీస్తు నామమున పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మయను వరమును పొందెదరు, ఈ వాగ్దానము మీకును - మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
ACTS 2:38•
ACTS 19:2
116మా పరలోకపు తండ్రీ, ఇప్పుడు ఇక మీ వంతుగా నున్నది, నేను మనుష్యులు సమ్మతింపబడులాగున నేను ప్రయత్నించాను," అయితే మీరే వారిని అంగీకరించులాగున చేయవలెను నేను చేయలేను. మరియు మీరు మనుష్యుల చిత్తమునకు విరోధముగా క్రియ చేయరు, ఏలయనగా ఒక పురుషుడో లేక స్త్రీ నిత్యజీవమునకై నియమింపబడియున్న యెడల, దేవుని యొక్క వెలుగు ఆ యొక్క విత్తనముపై ప్రకాశింపబడిన యెడల అది జీవమును పొందుకొనును. మరియు ఈ రాత్రి మా మధ్యలో జీవమున్న యెడల, తండ్రీ, మీరు మీ యొక్క వెలుగును దానిపై పకాశింపజేసియున్నారు మరియు వారు సత్యమును చూసియున్నారు, మరి వారు వినయతతో మరియు నమ్రతతో మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు నీటి మడుగు నొద్దకు నడిచెదరు గాక.
లేఖనములలో ప్రతి ఒక్కరు బాప్తిస్మము పొందినట్లుగానే మరియు మరల బాప్తిస్మమును పొందికొనినట్లుగాను మేము తెలుసుకొంటిమి… యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని వారు మరల బాప్తిస్మము యేసుక్రీస్తు నామములో పొందవలయును. మరియు దేవుని యొక్క పరలోక రాజ్యపు తాళపుచెవులు కలిగియున్న గొప్ప అపొస్తలుడు పెంతెకొస్తు దినమున ఇలా చెప్పియున్నాడు, "మీ యొక్క పాపములకు క్షమాపణ దొరుకులాగున మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మయను వరము పొందుదురు." ఈ రాత్రి ఆ విధముగా జరుగులాగున దానిని పరిపూర్ణముగా అనుగ్రహించుము, తండ్రి.
ఇప్పుడు వారిని నేను మీకు అప్పగించుచున్నాను. "నా యొక్క ఈ కొద్ది మాటలును మరియు నా హృదయు ధ్యానమును మీ యొక్క దృష్టికి అంగీకారములగును గాక, ఓ, ప్రభువా, మరియు మీ బిడ్డలను స్థిరపరచి మరి వారికి నిత్యజీవమును అనుగ్రహించుము. ఎవరెవరైతే రక్షింపబడవలయునని యున్నారో, వారిని రక్షించుము, మరియు వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచుము. ఇప్పుడు మేము వారిని మీకు యేసు నామములో అప్పుగించుచుండగా, దేవుని యొక్క కృప వారిలో ప్రతి యొక్కక్కరిపై నుండును గాక.
117ఇప్పుడు, మన తలలు వంచియుండగా, నేను ఫియోనా వాయించు మన సహోదరిని ఇచ్చటికి రమ్మని పిలువబోవుచున్నాను. ఒక్క క్షణము, ఇంకొక ఐదు నిమిషములు మాత్రము. మరియు పాపములనొప్పుకొని మరి విశ్వసించి… ఇప్పుడు బాప్తిస్మము పొందవలయునని కోరువారు. ఎవరైనావున్న యెడల యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, దానిని మరి మీ పూర్ణహృదయుముతో విశ్వసించిన, ఏదో ఒక ఉద్రేక పూర్వకముగా కాదు, అయితే మీరు దానిని నమ్ముడి, మరియు మీ తప్పులను మీరు ఒప్పుకొనుటకు సిద్దముగా నున్నవారు, మరియు మీరు మీ యొక్క స్వశక్తిపై మీరు ఆధారపడియుండ కూడదు, అయితే ఆయన చేసి ముగించిన దానిపై ఆధారపడియున్నారు, నీవు ఆయన నామమును నీటి బాప్తిస్మము ద్వారా ధరించుకొనుటకు, నీవు ముందుకు కొనసాగిపోవుటకు సిద్దముగా వుండవలెను. అందువలన పరిశుద్దాత్మ ద్వారా ఆయన శరీరములో ఒక భాగస్తుడునిగా కాగలవు. బాప్తిస్మమునకు మీరు దుస్తులు మార్చుకొనుటకై మరియు ఇతర వాటికిగాను స్త్రీల యొక్క గది నాకు కుడి ప్రక్కనున్నది, మరియు పురుషుల యొక్క గది నాకు ఎడమ ప్రక్కగా నున్నది.
ACTS 8:12
118మన తలలు మనము వంచియుండగా, మన సహోదరి వాయించుచుండగా, "నా రక్షకుడు నన్ను పిలుచుటను నేను వినుచున్నాను," అను పాటను మరి పాటలను నడిపించునతను ఆ పాటను పాడుచుండగా. ఇప్పుడు మన తలలు వంచియుండగా, ఈ ఆరాధన సర్వోన్నత్తమైన దేవుని హస్తము నందున్నది. ఎవరెవరైతే బాప్తిస్మము పొందవలయునని యున్నారో, పరిశుద్దాత్మ యొక్క అభిషేకము కొరకు ఎవరెవరు ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్ధింపవలయునని ఎవరు కోరుకొనుచున్నారో, ఏమేమి చేయవలసియున్నదో అనే వివరములను చెప్పి మిమ్ములను నడిపించుటకై అచ్చట వారు సిద్దముగా నున్నారు. ఆయన వాక్యములు నిష్ఫలము కాకూడదు, కాని అవి సంపూర్ణముగా నెరవేరబడవలసి యున్నది. మన తలలు వంచియుండగా మనము ఇప్పుడు ప్రార్ధి౦చెదము. మరియు ఆయన ఎచ్చటికి మిమ్ములను నడిపించునో అచ్చటికి ఆయనను వెంబడించుము.
నేను వినగలుగుచున్నాను నా యొక్క రక్షకుడు,
(ఇప్పుడు, ప్రతి ఒక్కొక్క పాపియు ప్రార్థించుము!)
నేను వినగలుగుచున్నాను నా రక్షకుడు పిలచుచున్నాడు,
(ఈ ఉదయమున ఆయన చనిపోయిన మనుష్యుని లేపినప్పుడు
మీరు ఆయన పిలుపును వినియున్నారా?)
నేను వినగలుగుచున్నాను…
ఆయన వాక్యము తన వెలుగును ప్రకాశించుచుండగా, మీరు ఆయన పిలుచుటను వినగలుగు చున్నారా?
నేను ఆయనతో కొనసాగిపోయెదను, పోవుటకు ఇష్టపడుచున్నారా.
(మీరు చివరి వరకు ఎచ్చటికి ఆయన (దేవుడు నిన్ను ఆశీర్వదించును నా సహోదరుడా.
ఎడమ ప్రక్కనున్న పురుషులను కుడి ప్రక్కనున్న స్త్రీలు.)
ఆయన ఎచ్చటికి నన్ను నడిపించునో నేనక్కడికి వెళ్ళేదను,
ఆయన ఎచ్చటికి నడిపించునో (బైబిలు చెప్పుచున్నది,
ఎందరైతే విశ్వసించిరో వారు బాప్తిస్మము పొందిరి.)
వెంబడించుము, నేను ఆయనతో కొనసాగిపోయెదను,
ఆ మార్గము యొక్క చిట్ట చివరి వరకు ఆయనతో కొనసాగెదను.
నేను ఆయనతో తోట ద్వారా వెళ్ళేదను,
నేను ఆయనతో తోట ద్వారా వెళ్ళేదను,
నేను ఆయనతో వెళ్ళేదను…
పరిశుద్దాత్మను పొందుటకు వెళ్ళుగోరు వారెవరైనను ఆ స్త్రీలతో మీరు కుడి ప్రక్క నున్న గది లోనికి ప్రభువు ద్వారా నడిపింపబడిన యెడల మీరు వెళ్ళుడీ.
…………. చివరి వరకు.
ఆయన ఎచ్చటికి నడిపించునో….
యథార్థమైన హృదయముతో నీవు దానిని చెప్పగలవా? "ఆయన నన్ను ఎచ్చటికి నడిపించునో అచ్చటికి నేను ఆయనను వెంబడించెదను." నీవు దానిని చేయగలవా? ఆ మెల్లని స్వరము నీతో మాటలాడుచుండగా నీవు ఆయన ఎచ్చటికి నిన్ను నడిపించునో, నీవు అచ్చటికి వెళ్ళేదవా? ఎర్రని దీపమును గమనించండి. ప్రకాశించుచున్న కాంతిని చూచావా? మనము కడవరి కాలమందు యున్నాము.
ఆయన నన్ను ఎచ్చటికి నడిపంచునో నేను ఆయనను వెంబండించెదను,
నేను ఆయనతో పోయెదను, ఆయనతో చివరి వరకు పోయెదను.
నా యొక్క రక్షకుని స్వరమును నేను వినగలుగుచున్నాను…
ఆయన ఏ విధముగా మాటల్లాడును? మీ హృదయుములో ఆయన వాక్యము ద్వారా మాట్లాడును. మీరిప్పుడు వచ్చెదరా? ఇది మీకు ఆహ్వానముగా నున్నది. గుర్తుంచుకొనుడి, మనము మరల కూడుకొను లోపల అది సంభంవించిన యెడల మరి మీరు హెచ్చరింపబడియున్నారు.
నా యొక్క రక్షకుడు పిలుచుట నేను వినుచున్నాను,
"నీ యొక్క సిలువను తీసికొని మరి వెంబడించుము, నన్ను వెంబడించుము.
ఆయన ఎక్కడ ఎచ్చటికి నన్ను నడిపించునో…
ఇప్పుడు, కొందరు సహోదరులు బాప్తిస్మమునకు సిద్ధపడు సహోదరులకు ఏమి చేయవలెనని వారికి చెప్పుటకు నా ఎడమ ప్రక్కనున్న గదికి వెళ్ళేదరా. సహోదరులు బాప్తిస్మమునకు సిద్దపడియున్నారా? కొంతమంది సేవచేయు సహోదరులు ఇచ్చటికి వచ్చి మరియు మనకు సహాయము చేయుదురు. ఆ గదిలోనికి మాతో లోనికి ప్రవేశించండి
…. వెంబడించండి,
ఆయన నన్ను ఎచ్చటికి నడిపించునో (మీరు నిజముగానే
అది మీ భావమా?) …. వెంబడించండి,
నేను ఆయనతో పోయెదను, ఆయనతో చివరి వరకు పోయెదను.
119ఇప్పుడు, ఒక్క క్షణము. ఇప్పుడు, మీరు గనుక ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచుట ద్వారా బాప్తిస్మము తీసికొనకున్నయెడల, మీరు ఊరక బిరుదులలో, "తండ్రి, కుమార, పరిశుద్దాత్మ" అను బిరుదులలో తీసికొనియున్న ఎడల, మీరు చూచిన యెడల బైబిలులో ఏ ఒక్కరు కూడ "తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ," లలో బాప్తిస్మము పొందియుండ లేదు అవి పేరు కాదు, బిరుదులు మాత్రమే. చరిత్రలో మొదటి మూడు వందల సంవత్సరముల వరకు ఎవరును ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్పనిచ్చి వేరే ఏ బిరుదులలో బాప్తిస్మము పొంది యుండలేదు; అయితే రోములోని నైసియాలో జరిగిన నైసియా ఆలోచన సభలో రోమను కాతోలిక్కు సంఘము స్థాపింపబడి అక్కడ వారు మొట్ట మొదటిగా సంఘ శాఖగా మారి మరి యేసుక్రీస్తు నామమును తీసివేసి దానికి బదులుగా తండ్రీ, కుమారుడు, పరిశుద్దాత్మ, యను బిరుదులను సంఘములో ప్రవేశపెట్టిరి నైసియాలో రోమను కాథోలిక్కు సంఘము స్థాపించి బిరుదులలో బాప్తిస్మము ఇచ్చుట ఆరంభించు వరకు.
120ఏ ఒక్క చరిత్రకారుడైనను, ఒక వాక్య పరిచారకుడైనను లేక టేపులలో, రేడియోలో వినుచున్న ఎవరైనను అంతకు మునుపు యేసుక్రీస్తు నామము తప్పనిచ్చి వేరే ఏ నామములో బాప్తిస్మమిచ్చినట్లు నాకు నిరూపించి చెప్పుడి, ఏలయనగా నేను చెప్పునది తప్పైన యెడల మీరు అది నా దృష్టికి ఆధారములతో తీసికొని రావలయును నేను దానికి మన్నింపు అడిగెదను. అటువంటి కార్యము లేనే లేదు. లేదు! మరియు ముంచుట ద్వారా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని ప్రతి యొక్కరును వారు మహిమలో పోవుటకు మునుపు మరల వచ్చి తిరిగి బాప్తిస్మము పొందవలయునని ఆజ్ఞాపింపబడియున్నది. ఇప్పుడు, అది మీ ఇష్టము.
ఈ రోజు మరి జనులు బాప్తిస్మము ఇచ్చులాగున, "తండ్రి, కుమారుడు పరిశుద్దాత్మ" అను నామమును ఉపయోగించి బాప్తిస్మము ఇచ్చిన లాగున బైబిలులో ఏ ఒక్క లేఖన ఆధారము లేదు. ఏ ఒక్క వాక్యమును ఆ విధముగా బాప్తిస్మము పొందినట్లు లేదు. అది కాథోలిక్కు కార్యము, రోమను కాథోలిక్కు యొక్క మత విశ్వాసము అది మార్టిన్ లూథరు, మరియు జాన్ వెస్లీ ద్వారా వచ్చి మరి ఆ విధముగానే కొనసాగింపబడుచున్నది. మరియు చివరి దినముల వరకు ఆ విధముగానే జరుగునని బైబిలు ముందుగానే చెప్పియున్నది, మరియు ద్వారము తెరువబడుననియు దానిని చూచుటకు మనము సంఘ కాలములను ధ్యానించియున్నాము.
121ఇక మీ ఇష్టము. నేను వర్తమానము యొక్క దూతను మాత్రమే. దానిని మనము నమ్మెదము. తలుపులు తెరువబడియున్నవి. బాప్తిస్మము గది నిండుగా యున్నది, తీసికొనకుండ నుండుటకు కారణము… దుస్తులు సిద్దముగా నున్నవి మరియు ఇంకొద్ది నిమిషములలో మనము బాప్తిస్మమిచ్చుటకు సిద్దముగా నున్నాము.
ఇక్కడున్న మీరు గనుక బాప్తిస్మము పొందకున్నయెడల మరల మనము పాడెదము, మరి రండి, మీరు రారా? నెరవేరు…
మీరు చెప్పవచ్చును, "సహోదరుడు బ్రెన్హాం దానిని నేను ఇంకొక రోజు చేసెదను." అయితే ఈ ఉదయము సహోదరుడు వే చనిపోయినట్లు మీకు ఆ విధముగా సంభవించును, అయితే ఉదయమువలె మీకు కృపలేకపోవచ్చును. మీరు ఏ క్షణమైనను చనిపోవచ్చును. మీరు యౌవ్వనస్తులుగా నున్నను, ఈ రాత్రికి మీరు బ్రతికెదరా… మరియు మీరు అనేక పది వయస్సు సంవత్సరములు వారిని, మరియు పదిహేను ముప్పది సంవత్సరముల వారిని దాటివచ్చి యుండవచ్చును. ఒక్క రాత్రిలోనే వేలాది వేల జనులు చనిపోవుచున్నారు. అది సరియే. మీరు ఎప్పుడు చనిపోయెదరని మీకు తెలియదు. నిశ్చయతతో నుండుడి. దానితో దానిని గూర్చిన ఇంకొక తరుణము నీకు ఉండక పోవచ్చునేమో, గుర్తించుకో. నీ ఉద్యోగములో నీకు ఒక తరుణమును ఇవ్వవచ్చు, లేదా ఇంకొక దానిలో దేనిలోనైను తరుణము వుండవచ్చు, కాని దానిని గూర్చిన తరుణమును నీవు కోరుకోవద్దు. గుర్తుంచుకొనుడి, దానికి విరోధముగా న్యాయతీర్పు దినమున నా యొక్క స్వరము దేవుని యొక్క అయస్కాంత టేపుపై సాక్షిగా నుండును. అయితే మన తలలు వంచి మరల పాడుచుండగా, ఇప్పుడు దానిని గురించి ఆలోచించుడి,
"ఆయన ఎచ్చటకి (సహోదరుడు నెవిల్) నన్ను నడిపించునో,
నేను వెంబడి౦చెదను,
ఆయన ఎచ్చటకి నన్ను నడిపించునో ఆయనను వెంబడి౦చెదను,
ఆయన ఎచ్చటికి నన్ను నడిపించునో ఆయనను వెంబడించెదను,
నేను ఆయనతో వెళ్ళేదను, చివరి వరకు ఆయనతో వెల్లెదను.