ఎందుకు?

ఎందుకు?

1స్నేహితులారా, సాయంకాల శుభములు. ఈ రాత్రి ఇక్కడుండుటము తిరిగి అర్కన్సాస్ కి వచ్చుటయు, అందునా ఈ క్యాంప్ గ్రౌండ్ స్థలములో వుండుట ఎంతో గొప్ప భాగ్యమైయున్నది. చాలా కాలం తర్వాత జరుగుచున్న నా యొక్క మొదటి కూటాలు ఇవేనని నేననుకొనుచున్నాను. ఇక్కడికి వచ్చుటకు నాకు ఆహ్వానములు అందినవి గనుక మీతోనే నేను వాటిని ఆరంభించుచున్నాను. నేను లోపలికి వచ్చుచుండగా నాకు చెప్పబడినదేదనగా, ఇప్పటికే మీరు ఎంతో అద్భుతమగు సమయాన్ని కలిగియున్నారని దాని కొరకు నేనెంతో కృతజ్ఞడను.

కొద్దిసేపటి క్రితం నేను నా కుమారునితో కలిసి రోడ్డు మీద వచ్చుచుండగా, ఈ అర్కన్సాస్ లో ఆరంభమందు మేము జరిపిన కూటములను గూర్చి మాట్లాడుకొన్నాము. సువార్త కూటాలు పెట్టడము నేను ఆరంభించినప్పుడు, వాటిని మొదట ఈ అర్కాన్సాస్ లోనే ఆరంభించితిని. ఆ తదుపరి ప్రపంచమంతటా ఏడు పర్యాయములు వాటిని జరిపి, తిరిగి మళ్ళీ ఈ అర్కాన్సాస్ కే వచ్చితిని. చెల్లని నోటు అటు ఇటు తిరిగి గూటికి చేరినట్టుగా అది వున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములలో నేనెక్కడికి వెళ్ళినా "అర్కన్సాస్ నుండి వచ్చిన వారెవరైనా ఇచ్చట ఉన్నారా? అని అడిగేవాడిని. ప్రతీచోట నాకు అర్కన్సాస్ కి చెందిన మిత్రులున్నారు నేనేప్పుడు ఇలా అంటుండే వాడిని, "అర్కన్సాస్ లో పురాతన నీలిరంగు చొక్కాలు ధరించిన వారి గుండె చప్పుడు ఎల్లప్పుడు యధార్థముగా వుండును." నిజం. మీరెంతో చక్కని జనులు. మిమ్మును నేను ప్రేమించుచున్నాను.

2ఈ రాత్రి తిరిగి మీతో కలిసి ఈ అర్కన్సాస్ లో వుండుటను బట్టి నేనెంతో కృతజ్ఞడను. చక్కని సహోదరుల గుంపుతో మరియు ప్రియమైన జనులగు మీతోను సహవాసం చేయుటకై లోనికి వచ్చి యేసుక్రీస్తు యెడల నాకున్నట్టి ప్రేమను వ్యక్తపర్చుటకై మనకింకా రెండు రాత్రులు మిగిలియున్నవని నేననుకొనుచున్నాను. ఇక్కడ మీలో చాలా మంది నాకు తెలియనివారున్నారు. అయితే నేను కన్నులెత్తి చుట్టూ తేరి చూచినప్పుడు నాకు సుపరిచితులగు సహోదరుడు జాక్ మూర్ మరియు అతని భార్య సిస్టర్ మూర్ ఇక్కడుండుటను గుర్తించాను. ఇక్కడికి రావటం నిశ్చయంగా మాకెంతో సంతోషం.

ఇప్పుడు, దినమెల్లా మీరిచ్చట ఉండుటను బట్టి శారీరకంగా మీరెంతో అలసట చెందియున్నారని నేననుకొనుచున్నాను. అవునా? ఆయనెంతో అద్భుతమైనవాడని ఆయన మంచి తనమంతటిని బట్టి ఆయనను స్తుతించంటంలోను, ఆయనను ఆరాధించటంలోను మనమెన్నడు అలసిపోలేము. ధీర్ఘ ప్రసంగీకులలో నేనొకడిని, కాని అదిప్పుడు సాధ్యమగునని నేననుకోవట్లేదు. ఇప్పటికే మీరెంతగానో ఈ కూటాలలో పిండబడియున్నారు, సందేహమే లేదు, దినమంతా మీరు నిశ్చయముగా గొప్ప ప్రసంగీకుల యొద్దనుండి వినియున్నారు. ఇప్పుడు నేను ఈ చక్కని బోధకుల ముందు నన్నునేను అల్పునిగా భావించుకొనుచున్నాను.

3కొద్దిసేపటి క్రితం నాతో కరచాలనం చేసిన దైవసేవకులలో ఒకరు "ఈ గుడారములో ఇది నాకు మొదటి కూటమని" చెప్పెను. దీనిని నేను ఎలా పిలవాలో నాకు తెలియట్లేదు, దీనిని మందిరమని నేను పిలువగోరుచున్నాను. దేవుని గొప్పతనాన్ని తెలియపర్చుటకు మరియు దేవున్ని స్తుతించి ఆరాధించుటకు కట్టబడిన ఈ మందిరములోనికి తిరిగి వచ్చు అవకాశమును బట్టి ఎంతో కృతజ్ఞలము. ఎంత అద్భుతం.

మనమిప్పుడే… కదిలి వచ్చితిమి — లేదా కదిలివచ్చుట కాదండీ, తిరిగివచ్చితిమి. పిల్లలకు పాఠశాల సెలవులు ఇచ్చినందువలన మనమంతా ఇక్కడికి తిరిగి వచ్చితిమి. మేమిప్పుడు అరిజోనా రాష్టం టూసాన్ పట్టణంలో నివాసముంటున్నాము. అక్కడ ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఎండ తీవ్రత వున్నది. అయితే ఇక్కడ ఇంట్లో వున్నప్పుడు అక్కడి కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నట్టు మాకర్థమైంది. కారణం గాలిలో ఎక్కువ తేమ వున్నది గనుకనే ఉక్కపోత ఎక్కువగా వున్నది. అలాంటి వాతావరణానికి అలవాటుపడిన తర్వాత మరలా ఇలా వచ్చినట్లైతే ఇలాంటి వాతావరణం వలన మనం త్వరగా అలసిపొయినట్టుగా వుంటుంది.

4మేము గృహములోనికి ప్రవేశించి, మా మొదటి కూడికను గత ఆదివారమున జరిపించితిమి. ప్రజల మధ్య తన గొప్ప ప్రేమ కార్యాలను మరియు బలమైన కార్యాలను ప్రభువైన యేసు ఇంకనూ కొనసాగించుట మేము చూచితిమి. గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ అర్కన్సాస్ లో మీకు నేను ఏ సువార్తనైతే బోధించితినో, నిశ్చయముగా అదే సువార్తను నేడును బోధించుచున్నాను. కొంచమైనను మార్పులేదు. అది క్రీస్తే,

ఆదివారం నాడు ఒక ప్రత్యేకమగు సంగతి (కార్యం) చర్చిలో జరిగింది. ఆ అద్భుత కార్యం ఎవరికైతే జరిగిందో అతడు ఇక్కడ ఉన్నాడేమోనని అంతటా చూస్తున్నాను.

5గమనించండి, ప్రభువైన యేసును గొప్ప చేసి మాట్లాడటంను మనమంతా ఇష్టపడెదము. మనమందరం దానిని ప్రేమింతుము. ఒకసారి ఒక స్త్రీ నాతో మాట్లాడినది. యేసును గూర్చి గొప్ప చేసి మాట్లాడం (యేసుకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మాట్లాడం) అనే లోపమును ఆమె నాలో కనుగొన్నదట.

అందుకు నేను "అమ్మా, ఒకవేళ అదే నాలో వున్న లోపము అయినట్లైతే, నిశ్చయంగా నేను పరలోకమునకు వెళ్ళేదను," అని అన్నాను.

యేసుని గొప్ప చేసి మాట్లాడటం ఆమెకి ఇష్టం లేదు, ఎందుకనగా యేసు దేవుడని ఆమె నమ్మదు. యేసు దైవీకమగు వ్యక్తి అని ఆమె విశ్వసించదు. ఆయన కేవలం ఒక తత్వవేత్త అనో, ప్రవక్త అనో అలాంటి వాటిలో ఒక దానికి చెందినవాడై వుండునేమోనని ఆమె నమ్మకం; కాని ఆయన దేవుడై యున్నాడు అని నేనామెతో చెప్పాను. ఆయన దేవుడై యున్నాడు.

ఆమె అన్నది "ఆయన దేవుడు కాదని నేను నీకు నిరూపించగలను."

అందుకు నేను "ఓ, అది నీవు చేయగలవని నేననుకోవట్లేదు," అన్నాను.

అప్పుడు ఆమె "ఓ, ఆయన కేవలం మానవ మాత్రుడని నిరూపించుదును" అని అన్నది.

నేను అన్నాను, "ఆయన మానవుడని నేను ఒప్పుకొంటాను, అయితే అక్కడే ఆగిపోవద్దు. ఆయన మానవుడు మరియు దేవుడు కుడా."

అందుకామె, "అదెలా సాద్యం? మానవుడు దేవుడెలా అవుతాడు" అని అన్నది.

నేనిలా బదులిచ్చాను, "ఓ, అది సాద్యమే. మానవునిగా రాకముందే ఆయన దేవుడైయున్నాడు."

"ఆయన దేవుడు కాడని మీ బైబిల్లో నుంచే నేను నిరూపిస్తానని," ఆమె అన్నది.

"మంచిది," అని నేనన్నాను.

JOHN 11:35,39,43,44

 

6ఆమె ఇంకొంచెం ముందుకెళ్ళి, "యోహాను 11లో లాజరు కన్నీరు విడిచెను" అని బైబిల్ చెప్పుచున్నది కదా? అని నాకు చెప్పినది.

"అయితే ఏమిటి, దానికి దీనికి సంబందమేమిటి?" అని అడిగాను.

అందుకామె, "మంచిది, ఆయన కన్నీరు కార్చినయెడల దేవుడెలా అవుతాడు, దీన్ని బట్టి చెపొచ్చు ఆయన దేవుడు కాడని" అన్నది.

అప్పుడు నేనామెతో, "అమ్మా! బాగా బక్కచిక్కిపోయి చావుకి దగ్గరు పడ్డ కోడి యొక్క నీడను పులుసు బెట్టి వండినట్టుగా వుంది నీ వాదన." "నీకు అంటకంటే బాగా తెలుసు," అని నేను అన్నాను. "ఆయన కన్నిరుతో లాజరు సమాది యొద్దకు వెళ్లినప్పుడు, ఆయన ఒక మనిషి. అది నిజము. అయితే వెనువెంటనే ఆయన తన చిన్న భుజాలను పైకెత్తి, "లాజరు బయటకు రా" అని పిలవటమనేది ఆయన దైవత్వాన్ని చూపుతుంది. చనిపోయి నాలుగు దినములైన తరువాత వానిని బ్రతికించి నడిపించటం అనేది ఒక మానవునికంటే ఎక్కువ." ఇంకను నేను ఆయన దేవుడు అని నేను నమ్ముచున్నాను.

7ఆదివారం నాడు మాట్లాడుకొనుచునప్పుడు, మేము. టాబర్నికల్ లో వున్నవారంత ఒకరితో నొకరు కరచాలనం చేసికొమని నేను చెప్పాను. అక్కడ నాకు ప్రియమైన మిత్రుడొకరు వుండెను. నేనతనిని ఎంతో ప్రేమించుచుంటిని అతడు తన భార్యతో కలిసి చర్చికి వచ్చుచుండెను. అతని భార్య ఒక గుర్తింపబడిన నర్సు. అతడొక ఆంగ్లేయుడు. ఆమె మాత్రం నార్వే దేశస్తురాలు. వారిద్దరు ఎలా ఏకమయ్యారో నేనెరుగను. అయితే వారు ఎంతో చక్కని దంపతులు. ఈ సహోదరునికి గుండెలో కొ౦త సమస్య ఏర్పడెను. చాలా మంచి క్రైస్తవుడు, తెలివిగలవాడు కూడా, అకౌంట్స్ ఉద్యోగం అతనిది.

అప్పుడే ఆరాధన ముగించబడింది, ఒకరినొకరు కరచాలనం చేసికొనుచుండగా అకస్మాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది, వెంటనే నేల మీద కుప్పకూలి చనిపోయెను. అతని భార్య ఒక నర్సు గనుక వెంటనే అతన్ని పట్టుకొని అతని నాడిని పరిక్షించింది, అతని గుండె కొట్టుకొనుటను పరిక్షించింది. అతని ప్రాణం పోయిందని ఆమె గుర్తించినది. నేనతని ముఖమును చూశాను. అది నల్లబడినది. అతని కనుగుడ్డు తిరిగిపోయినవి. కళ్ళు మూసుకొని పోవటం కాదండీ, కనుగుడ్డు బయటకి వచ్చినవి. మరి అతడు….

నేను తిరిగి వేదిక మీదకి వచ్చాను, జనులను నిమ్మళపర్చుటకు ప్రయత్నించాను. చాలా మంది ఆ సిస్టర్ కి సహాయపడుచుండిరి, తన భర్త అటువంటి పరిస్థితిలో వుండుట చేత ఆమెంతో వేదనపడుచున్నది. కొందరు అతని తలక్రింద దేనినో ఉంచారు.

8నేను అతని గుండెను పరిక్షించాను, అతని నాడీ పనిచేయటం ఆగిపోయింది, చెక్కవలె ఒళ్ళంతా మొద్దుబారిపోయింది.

అప్పుడు నేను మోకరించి ప్రార్ధి౦చాను. "ప్రభువైన యేసూ 'సహోదరుడు వే' ప్రాణమును తిరిగి ఇవ్వమని ప్రార్ధి౦చుచున్నాను."

అప్పుడు అతని గుండె నాలుగు సార్లు కొట్టుకొనెను, మామూలు స్థితిలో పనిచేయటం ఆరంభించింది. అతడు దిగ్గున లేచి మాట్లాడుటకు ప్రయత్నించుచుండెను; మాట్లాడలేకపోయాడు, అతడు. గుండె కొట్టుకోవటం ఆగినప్పుడు… రక్తప్రసరణ కూడా ఆగిపోతుందని మీకు తెలుసా, రక్త ప్రసరణ జరుగుటకు ముందు కొద్దిసేపటి వరకు అతని గుండె స్తంబ్దంగా వుండెను. తర్వాతా అతడు నన్ను పేరుతో పిలిచాడు, తర్వాత నేను వేదిక మీదకి తిరిగి వచ్చాను.

సహోదరుడు వే, దయతో నిలబడండి, చనిపోయి బ్రతికిన నిన్ను జనులు చూచెదరు. అదిగో అతడేనండి, ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయింది. అతని భార్య సిస్టర్ వే అప్పుడు అతని యొద్దకు వెళ్ళి నాడీ పట్టి చూచినది. మీరు చూచారా.

ఈ విషయాలు నమ్మనివారికి బహుశా వింతగా ఉండవచ్చును. ప్రభువైన యేసు పలుమార్లు చనిపోయిన వారిని సజీవులుగా లేపుటను నేను చూచియున్నాను. అది మాకు కొత్తేమి కాదు, కనుక మేము… యేసును గొప్ప చేయుట మంచిదని నా బావం, అది ఒక సత్యముగా వున్నది.

గనుక గత పదిహేను సంవత్సరాల నుండి నేను మేము మృతులు లేపబడుట అనే అమోఘమైన కార్యామును పలుమార్లు చూచితిమి.

9వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరొకటి మెక్సికోలో జరిగినది. అచ్చట సహోదరుడు మూర్ మరియు నేను కూటములో వుంటిమి. వైద్యుని గదిలో ఉదయం తొమ్మిది గంటలకు ఒక చిన్న బాలుడు న్యుమోనియా జబ్బుతో చనిపోయాడు. ఆ బాలుని తల్లి చనిపొయిన బిడ్డను తీసికొని కూటమునకు వచ్చింది. విస్తారమైన జనసమూహము అచ్చట వుండెను. ఆమెను ఎవరూ ఆపలేకపోయిరి. సరే, అప్పటికే ప్రార్ధనా కార్డులన్ని పంచిపెట్టిరి. వరుస ప్రకారం మేము ప్రార్ధన కొరకు పిలుచుచుంటిమి. పంచిపెట్టుటకు ప్రార్ధనా కార్డులు లేకుండెను. ఈ చిన్న స్పానిష్ సహోదరి, బహుశా ఇరువై-ఐదు ఏళ్ళుండొచ్చును. చనిపొయిన బిడ్డను ఎతుకొని, జోరున వర్షం కురుస్తున్నందున, దుప్పటి కప్పి కూటానికి తీసికొని వచ్చింది.

అంతకు ముందు రాత్రి ఒక గ్రుడ్డివాడు తీసికొని రాబడెను. బహుశా అతడు నా తండ్రి వయస్సు ఉండొచ్చును, బహుశా డెబ్బై-ఐదు ఏండ్లు ఉండొచ్చును. నేనతనికి ప్రార్ధించినప్పుడు అతడు దృష్టిని పొందుకొనెను.

మరి ఆ రాత్రి, అక్కడ వేయబడిన వేదిక ఇచ్చటనున్న దానికన్నా ఎంతో పెద్దది. దాని మీద సుమారు రెండు మూడు అడుగుల ఎత్తున చేతి రుమాళ్ళు టోపిలు, పాత దుస్తులు పడవేసిరి,

10ఈ చిన్న బాలిక ఏదో రకంగా నన్ను సమిపించాలని ఎంతో ప్రయత్నించిది. అప్పుడు నా కుమారుడు బిల్లీ పాల్ నా యొద్దకు వచ్చి "డాడీ, సుమారు మూడు వందల మంది పరిచారకులు నాతో వుండిరి, ఆ మూడు వందల మంది కూడా ఆమెను నియంత్రించలేకపొయిరి" అని చెప్పెను. చనిపోయిన బిడ్డను దుప్పట్లో దాచుకొని ఆమె వచ్చినది.

అంతట నేనన్నాను "మంచిది, జాక్ మూర్ ని అచ్చటికి దిగిపొమ్మని చెప్పానులే" అని బిల్లీ పాల్ తో అన్నాను.

సహోదరుడు జాక్ మూర్ కి నాకు మధ్య చాలా విషయాలు ఒకేలా వుంటాయి. మా ఇద్దరి రూపం ఒకేలా వుంటుందని నేను చెప్పుటలేదు, ఎందుకనగా అతడెంతో అందగాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం మా యిద్దరి మధ్య ఒకే పోలిక వుంటుంది. అదేదనగా, మా జుట్టు. చాలా విషయాలు మా మధ్య ఒకేలా వుంటాయి. ఆమెకు ప్రార్ధి౦చుటకు నాకు బదులుగా వెళ్ళమని నేనతనితో చెప్పాను. ఎందుకనగా నేను మరియు అతను చూపునకు ఒకేలా వుంటాము. తేడాను ఆమె ఎన్నడూ గుర్తించలేదని నేను అనుకొన్నాను.

11తరువాత నేను తిరిగి మాట్లాడటం మొదలు పెట్టితిని, ఎప్పుడైతే సహోదరుడు ఎస్పినోజా, సహోదరులలో అనేకులు అతడిని ఎరిగియుందురు. అతడు పశ్చిమ కోస్తాకు చెందినవాడు, ఆ సమయంలో అతడు నాకు అనువాదం చేయుచుండెను. ఆ కూటం మెక్సికో నగరం బుల్-రిగ్ లో జరిగినది.

నేను ప్రేక్షకుల తట్టు చూస్తున్నాను, అప్పుడు నాకొక దర్శనం వచ్చినది, అందులో ఒక మెక్సికో బాలుడు కూర్చొని నా వైపు చూచి నవ్వుచుండెను.

అంతట నేను, "ఆ చిన్న బాలికను ఇచ్చటికి తీసికొని రండి" అని చెప్పాను.

అంతట నేను చనిపోయి చల్లబడి బిగుసుకుపోయిన ఆ బిడ్డ మీద చేతులుంచితిని, వెంటనే అతని బుల్లి పాదములు కదలనారంబించెను, తుమ్మడం ఆరంభించెను, సజీవునిగా ఆ బిడ్డ బ్రతికాడు.

ఆ సాక్ష్యమును ప్రచురించుటకు ముందు, డాక్టర్ నివేదిక కోసం నేను ఆ తల్లి బిడ్డలతో పాటు ఎస్పినోజాను ఇచ్చి డాక్టర్ నొద్దకు పంపితిని. బాలుడు ఉదయం తొమ్మిది గంటలకు తన సమక్షంలోనే చనిపోయెనని దృవపత్రం (అఫిడవిట్)ను యిచ్చెను. బాలుడు మరణంలో నుండి లేచినది ఆదే రోజు రాత్రి పది గంటలకు, దేవుని మహిమ కొరకు నేటికిని ఆ బిడ్డ బ్రతికే వున్నాడు, మంచి ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. దానికి మేమెంతో కృతజ్ఞలమై యున్నాము.

12అనేక కార్యాలు జరుగుచున్నవి, అందులో సహోదరుడు వే కి జరిగినది ఒకటైయున్నది. డాంబికంగా చెప్పటం కాదు, కాని సత్యము ఎన్నటికి సత్యమే. ఇంతకి దేవుడు ఈ కార్యాలను ఎందుకు జరిగించుచున్నాడు. దేవుని కృపను బట్టి సహోదరుడు వే ఈ రాత్రి సజీవునిగా మన మధ్య కూర్చోనివున్నాడు. అందుకు మేమెంతో కృతజ్ఞలము.

ఇప్పుడు, ఈ క్యాంపు గ్రౌండ్ లోకి వచ్చిన నేను, ఇక్కడున్న గొప్ప సమయాన్ని భంగం చేయాలనుకోవట్లేదు. ఈ మధ్యహ్నం బిల్లీ నాతో చెప్పుచున్నాడు, "నిజమైన పాతకాలపు పెంతెకోస్తు గురించి నీవు మాట్లాడితివి, దానిని పొందుకొనే వరకు అక్కడే వేచి ఉండమంటివి, యాభై ఏళ్ళ నుండి వారు దానిని కలిగియున్నట్లు పాటలు పాడారు."

అప్పుడు నేను, "బహుశా వారిలో కొందరు యాభై ఏళ్ళ నుండి దానిని కలిగి ఉన్నారేమోనని అనుకొనుచున్నాను."

13అటువంటి కూటాలకి వెళ్ళటమంటె నాకెంతో ఇష్టం. నాకే కాదు మనలో ప్రతి ఒక్కరికి అది ఇష్టమని నేను నమ్ముచున్నాను, మరి అటువంటి దానిలోనికి మనమిప్పుడు వచ్చియుంటిమి. చేపలు పట్టుటను గూర్చి తరచుగా నేను చెప్పె చిన్న కథవలె అది వున్నది. ఎగువున వున్న ఉత్తరపు న్యూ హ్యాంప్షైర్ యొద్ద నేను బ్రౌట్ (జల్లి) చేపల వేట కొరకు ఉంటిని. ఆ పర్వతము యొక్క శిఖరమున నాకు వేయబడిన టెంటు ఒకటి వుండెను, ఓ, ఆ చిన్న గుడారమును, ఆ చిన్న టెంటును ప్రభుత్వం వారు వేసిరి. ఒడ్డున ఉన్న పొదల మధ్య విస్తారమైన జల్లి చేపలుండే చోటును నేను కనుగొన్నాను. మరి అక్కడే విల్లోజాతి చెట్ల వుండెను. నా గాలంను చేపను పట్టుటకు గాలిలోకి దానిని లేపిన ప్రతిసారి అది ఆ చెట్లకు చిక్కుకొనేది. ఆ రోజు ఉదయం నేను పెందలకడనే లేచి, పైకి వెళ్ళితిని. విల్లో చెట్లు నాకు ప్రతిసారీ అడ్డు వస్తున్నవి గనుక వాటిని నరికి వేయాలని నేను అనుకొన్నాను. వాటిని నేను… ఒక చేపను నేను చంపినట్లైతే దానిని తిందును లేని పక్షాన వాటిని నేను పోగొట్టుకోవల్సివచ్చును. అక్కడ నేను ఉన్న ఆ వారమంతా అలానే చేయుచు వచ్చితిని. నా మట్టుకు నేనే అచ్చట వుంటిని, నాతో ఎవరు లేకుండిరి.

14ఆ ఉదయ కాలమున నేను తిరిగి ఆ దారి వెంబడి వెళ్ళితిని, అప్పుడు ఒక ఎలుగు బంటు తన రెండు పిల్లల్ని వెంటబెట్టుకొని నా గుడారములోనికి జోరబడినది. సామానులు ద్వంసం చేయటంను గూర్చి మీకు తెలుసు కదా! అవి నా గుడారమును పూర్తిగా ద్వంసం చేసినవి. పెద్ద శబ్దాలు చేసుకొంటూ అవి టెంటును, సమస్తమును ద్వంసం చేసినవి. మరి నేను అనుకొన్నాను… నేను తిరిగి వచ్చినప్పుడు వాటి అరుపులు నేను విన్నాను, పొదల మధ్య నిలబడి నేను తేరిచూచాను. ఆ పెద్దదగు ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి నా గుడారమును ధ్వంసం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై యున్నట్టు కనబడెను. అది నన్ను చూసింది, లోనికి పరుగెత్తికొనిపోయి తన రెండు పిల్లల్ని అప్రమత్తం చేసింది. వాటిలో ఒకటి తల్లి యొద్దకు చేరుకొన్నది, కాని మరొకటి చేరుకోలేదు.

ఆ చిన్నది, ఆ కూన, చాలా పొడవుగా వుంది. అది ఇలా కూర్చొన్నది, "ఆ చిన్నది దేని మీద అంత ఆసక్తిగా వున్నది" అని నేననుకొనుచున్నాను.

15నేను కొంచెం దగ్గరకి వెళ్ళి చూచాను.

నేను దానిని "అక్కడ నుండి వెళ్ళిపో, అక్కడ నుండి. వెళ్ళిపో" అంటు అరిచాను.

కాని అది అక్కడే కూర్చుండిపోయింది. నేననుకొనుచున్నాను… తల్లిని గమనించాను, మీకో విషయం తెలుసా, పిల్లల జోలికి వెళ్తే ఏ తల్లి మౌనంగా ఊరుకోదు. అది ఏదో రకంగా నిన్ను చీల్చివేస్తుంది. అంతట నేను, అలానే గమనించాను. అక్కడికి దగ్గర్లో ఒక చెట్టు వున్నది. మీకు తెలుసా, నా తుప్పు పట్టిన పాత తుపాకీ కూడా ఆ గుడారంలోనే వుండిపోయింది, బహుశా అది కూడా ధ్వంసమై యుండొచ్చును. ఒకవేళ అది నా వద్ద ఉన్నా, ఆ తల్లిని కాల్చి దాని పిల్లల్ని అనాధల్ని చేయటం నాకిష్టంలేదు. గనుక నేను ఆ చెట్టును గమనించుచు, దాని చుట్టూ తిరుగుచూ లోపల ఆ పిల్ల కూనలు చేయుచున్న దానిని ఆసక్తితో తిలకించగోరితిని.

మరి మీకు తెలుసా, నాకు, పెనం మీద కాల్చిన అట్ట అ౦టే ఇష్టమని. మనం, మనమంతా దక్షణాదివారము, కాదంటారా? ఫ్లాప్-జాక్స్ అనేవి ఇక్కడ బాగా ప్రాచుర్యమని మీకు తెలుసు కదా, వాటిని నేనెంతో ఇష్టపడతాను. నాకు, తెలుసు… నేను ఎక్కువగా మెథడిస్ట్ వారు వలె కాదు. నేను నిజముగా ఆ పెనం మీద కాల్చిన అట్టపై ఎక్కువగా ఆ మొక్కజొన్నతో చేసిన తీపి పదార్థమును పోయుటకు ఇష్టపడతాను. వాటిని (పాన్-కేకు) నేను నిజముగా వాటిని ఆ తీపిలో ముంచుతాను, దాని మీద నిండుగా పోస్తాను. కావున నేను కొద్దిగా వాటిపై చిలకరించుట కాదు. మీకు తెలుసా, నిండుగా పోయుట, అవి రెండు పూర్తిగా కలిసిపోవునట్లు.

16నా గుడారంలోవున్న బక్కెటు నిండా రుచికరమైన మొక్కజొన్నతో చేసిన తీపి పదార్థం వున్నది.

ఈ చిన్న ఎలుగు బంటి దాని మీద కూర్చొని దానిని ఎంతో చక్కగా దానిలోని దానిని ఆస్వాధించుచున్నది. నేను మూలన ఉండి అలాగే గమనించుచుంటిని. అది తన చిన్న గోళ్ళ పాదంను దానిలో ముంచుచున్నది. అయితే దానిలో ఉన్న తీపి రసమును ఎలా బయటకు తీయాలో దానికి అర్థం కావట్లేదు, గనుక అలానే తన పాదములను దానిలోనికి ముంచి వచ్చిన కాడికి తన కాళ్ళకున్న రసంను నాకుచున్నది.

చివరికి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, అది నన్ను గమనించింది, నావైపు చూసింది. అయితే అది నన్ను చూడలేకపొయంది, ఎందుకనగా ఆ తీపిరస పదార్థంను అది ఒంటినిండా పులుముకొన్నది. దాని కడుపు పట్టినంతవరకు తినేసింది. మీకు తెలుసా, అది కనీసం తన కన్నులు తెరిచి నన్ను చూడలేకపోయింది. మరి అంతగా అది దానితో నిండిపోయింది. నన్ను చూడాలని ప్రయత్నిస్తుంది. కాని ఒంటినిండా రసం పోసుకొన్నందున చూడలేకపోయింది. అప్పుడు నేనిలా తలంచాను, "మంచిది, తినే వారికి ఏ శిక్షవిధి లేదు." ఆ దృశ్యమును నేను చూస్తున్నప్పుడు, అది పాతకాలపు పెంతెకోస్తుల కూటంవలే నాకనిపించింది. మనము మన చేతులను ఆ తీపి పదార్ధములోకి, లోతులోనికి ముంచి, ఆ పెంతెకోస్తు మాదుర్యమును ఆస్వాధించినప్పుడు అదెంతో మధురంగా వుండును.

ఇంకో వింతైన సంఘటన నేను గమనించాను. ఆ చిన్న ఎలుగుబంటి కడుపునిండా తినిన తర్వాత నా బక్కెటును వదిలేసి తల్లి మరియు తోటి సహోదరుడగు చిన్న ఎలుగుబంటి యొద్దకు వెళ్ళినది, అప్పుడు తల్లి దానిని నాకటం ఆరంభించినది.

17మీరిక్కడ గమనించండి. మనకొక గొప్ప పాఠం ఇక్కడ దొరుకును, అదేదనగా తీపిపదార్థంలో మునిగితేలిన మనము, ఆస్వాధించిన మనము తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే కూటానికి రాలేదో వారు మనల్ని నాకటం ద్వారా, మన అనుభవాన్ని నాకటం ద్వారా ఎంతో ఆస్వాధించవచ్చును. హాట్-స్ప్రింగ్స్ లో ఉన్న మీరు ఈ కూటంలో ప్రభువు చేసిన గొప్ప కార్యాలను రానివారికి చెప్పండి. ప్రభువు మిమ్మును దీవించును గాక.

మరిప్పుడు, ప్రార్థనా కార్డులు అనుకున్న సమయానికి అందనందున వాటిని పంచలేదని వారు నాకు చెప్పారు. ఒకవేళ అలా యిచ్చి వున్నట్లైతే వాటి ప్రకారం పిలిచి ప్రార్ధించి వుండేవాడిని. ఏదిఏమైన మరొక రాత్రి మనకు మిగిలి వున్నది. గనుక రేపు రాత్రి కూటము కొరకు రేపు మధ్యాహ్నం ఏదో ఒక సమయములో వారు వాటిని మీకు అందజేతురు. అవును, ఇప్పటికే అందజేసారా…? రేపు సాయంత్రం ఆరు గంటలకా? సరే, రేపు సాయంకాలం ఆరు గంటలకి వారు ఆ పని చేయుదురట.

18ఇప్పుడు, ఈ రాత్రి లేఖనములలో నుండి ఒక చిన్న భాగమును తీసికొని చదివి, ప్రభువు దేనిని మనకు బోధించునో మనం చూద్దాం. అలా చెయ్యాలని నేననుకొనుచున్నాను. ఇప్పుడు గ్రంథమును తెరుచుటకు ముందుగా మనం గ్రంథకర్తతో ముచ్చటించెదము, అందరం తలలు వంచెదం.

ప్రార్థన కొరకు మీరు మీ తలలు వంచుచుండగా దినములో మనకున్న సాదక బాదలన్నిటిని, ఎగుడు దిగుడులన్నిటిని, మానవ ఆలోచనలన్నిటిని కొద్దిసేపు ప్రక్కకు నెట్టి మనమిప్పుడు రాజును సమీపించెదము. ప్రార్థనలో జ్ఞాపకం చేసికొనుటకు మీలో ఎవరికైనా ప్రత్యేక విన్నపము ఉందా? అలాగైతే మీరు మీ చేతిని పైకెత్తి చూపండి. "అవును ప్రభువా!" అని చెప్పండి. నీ హృదయంలో వున్న దానిని అలాగే ప్రభువుతో చెప్పండి. మీ విన్నపములను ఎత్తి పట్టుకొనండి.

ACTS 4:31

 

19మా పరలోకపు తండ్రీ, సర్వశక్తిగల దేవా, ప్రభువు యొక్క సమాజములోనికి వచ్చుటయు, ఒకరితోనొకరం సహవాసము చేయుటయు, సాక్ష్యములనిచ్చుటయు మేము వెళ్ళిన స్థలాల్లో మా కొరకు నీవు చేసిన గొప్ప కార్యములను చెప్పుకొనుటయు గొప్ప భాగ్యమని మేము ఎంచుకొనుచున్నాము. బైబిల్ నందు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో వారు తిరిగి వచ్చి తమ కొరకు ప్రభువు చేసిన గొప్ప కార్యములను పంచుకొన్న సంగతిని జ్ఞప్తికి తెచ్చుచున్నది. వారందరు ప్రార్ధి౦చగా వారు కూడుకొన్న ఆ చోటు (భూమి) కంపించెను.

దేవా ఈ రాత్రి మా ఆశ ఈ బిల్డింగ్ కదిలిపోవాలని కాదు, గానీ మమ్ములనే కదిలించమని, ప్రభువా మేము అడుగుచున్నాము. మా గ్రహింపును కదిలించుము. మాలో వున్న ఆత్మను కదిలించుము. మా బావోద్రేకములను, మా మనోనేత్రములను కదిలించుము. తద్వారా మేము ఈ రాత్రి కూటం అనంతరం నిన్ను మరెక్కువుగా సేవించేవారిగాను, తాజా పెంతెకోస్టు సన్నిధిని అనుభవించినవారిగాను, పరిశుద్దాత్మ మా మీద పోయబడిన వారిమిగాను.

యాభై ఏండ్ల క్రితం ఈ అర్కానసాస్ కొండల్లో పరిశుద్దాత్మ కుమ్మరించబడినప్పుడు మా పితరులు గుర్రముల మీదను పెద్దబండ్ల మీద ప్రయాణించి అంతట సువార్తను బోదించిరి, మరిప్పుడు అదే అనుభవం గలవారిమిగాను మమ్మును చేయమని కోరుచున్నాము. ప్రభువా, ఇక్కడ నుండి మేము ఆ గొప్ప సువార్తను మోసికొని పోవుదుము గాక, ఈ గొప్ప సువార్త కొరకు మేము సిగ్గుపడక యు౦దుము గాక. మా ముందున్న వారి అడుగుజాడలలో మేము నడిచెదము గాక, ప్రభువా, యేసు ప్రభువు యొక్క ద్వజమును మేము పైకెత్తుదుము గాక.

MATT 25:21,34

 

20లేఖనముల యందు దేవుడు మా కొరకు సిద్దపర్చిన గొప్ప రక్షణ ప్రణాళికను ఎవరైతే అంగీకరించలేదో, అట్టివారు ఈ రాత్రి దానిని అంగీకరింపజేయుము. ఆ గొప్ప రక్షణ పాత నిబందనంతటిలో ముందుగానే చెప్పబడి వున్నది. నేడు మేము దానియుందు ఆనందించుచున్నాము. ప్రభువా, మమ్ములను సంధించండి. మాలో కదలికను తీసికొని రండి, మా విశ్వాసమును మా ప్రయత్నములను నూతన పర్చండి.

ఈ కూటము కొరకు కృతజ్ఞతలు, ఇక్కడున్న జనులందరి కొరకు ప్రభువా కృతజ్ఞతలు. ఈ భూమి మీదికి వచ్చిన ఈ శ్రమలు క్రైస్తవులమని ఒప్పుకొనే వారిని పరీక్షించుటకే వచ్చినవి, భూమి పునాదులు వేయబడక ముందే విమోచింపబడిన వారి నిమిత్తం సిద్దపర్చబడిన ప్రభువు యొక్క సంతోషములోకి ప్రవేశించుటకు తగిన యోగ్యత అంతమందు మాయందు కనబడును గాక.

నీ వాక్యమును ఆశిర్వదించుము.

JOHN 1:1•

JOHN 11:43•

HEB 13:8

 

21ప్రభువా, పైకెత్తిన ప్రతి చేతిని జ్ఞాపకం చేసికోండి. దాని వెనుకున్న అవసరత, మరియు ఉద్దేశ్యమేమిటో నీవు ఎరిగియుంటివి. దేవా, ప్రతి ఒక్కరి మనవిని దయచేయమని ప్రార్ధి౦చుచున్నాను. చేతులెత్తిన ప్రతి ఒక్క పురుషుడు. ప్రతి స్త్రీ, ప్రతీ బాలుడు ప్రతీ బాలిక యొక్క హస్తమును మరియు దృష్టిని నీవైపునకు మరల్చండి. రక్షణ అవసరమైన వారకి రక్షణ, నీతో సన్నిహిత నడక అవసరమైన వారకి సాన్నిహిత్యమును, అలాగే నిన్ను రక్షకునిగా వారు తెలుసుకొనునట్లు చేయుము, వారి విన్నపములు పొందుకొనేటంత వరకు వారు ఈ చోటులోనే నిలిచివుందురు గాక.

స్వస్థత నొందగోరు వారికొరకు, అక్కర్లలో ఉన్నవారి కొరకు మేము ప్రార్ధి౦చుచున్నాము. దేవా, ఈ స్థలమంతయు నీ స్వస్థత తరంగములు పడి ప్రవహించును గాక, తద్వారా ఇచ్చటికి బలహీనముగా వచ్చిన ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళేటప్పుడు బలపర్చబడి స్వస్థత నొంది వెళ్ళుదురు గాక. నీవు లాజరు సమాధి నొద్ద నిలబడి మృతులలో నుండి అతనిని లేపితివి, మరి నేడు కూడా ఇతడి (వే) ని మృతులలో నుండి లేపి మా మధ్య నిలిపితివి, అందును బట్టి నీవు మార్పులేని దేవుడవని మాకు ఋజువగుచున్నది. తండ్రీ నీవు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా వున్నావని వారికి తెలియజేయుము. ఈ రాత్రి మా మధ్య ఒకరు (వే) నిలబడి వున్నారు, అతని (వే) ని నీవు కొద్ది దినముల క్రితం మానవుని గ్రహింపునకు అందని చోటులో నుండి పిలిచి మా మధ్యలో నిలిపితివి. అందును బట్టి మేము నీకు ఎలా కృతజ్ఞతలు చెల్లించెదము.

మేమందరం కలిసి పఠించిన నీ వాక్యమును దీవించుము, నిజముగా నీ వాక్యము సత్యమై వున్నది. నీవు మరియు వాక్యము ఒక్కటే. అవి విడదీయబడజాలనివి, గనుక తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడమని నీ యెదుట కనిపెట్టుచుండగా, మమ్మును దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

ఇప్పుడు, మీరు ఇష్టపడినట్లైతే, లేఖనముల తట్టు నేను తిరుగగోరుచున్నాను.

22నేను పరుపు మీద వుండి అలానే నిద్రపోయాను, అప్పుడు బిల్లి నా దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపి "మనము వెళ్ళుదుమా" అని అడిగెను.

"చర్చికి వెళ్ళే సమయమైందా?" అని అన్నాను.

గనుక హడావుడిగా బయల్దేరి వచ్చితిమి. సమయం లేనందున ఈ రాత్రి బోధించుటకు నేను ఇది వరకు చెప్పిన లేఖనాలలో కొన్నింటిని సమకూర్చుకొని తొందర తొందరగా వచ్చితిని, రోగుల కొరకు ప్రార్ధింప నిమిత్తం ప్రార్ధనా కార్డులు పంచారని నేననుకొనుచున్నాను. నేను లోపలికి వచ్చుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మంచాల మీద ఉండుటను నేను చూచాను, బహుశా వారు ఈ రాత్రి ప్రార్ధి౦పబడు నిమిత్తం తీసికొని రాబడియున్నారేమో.

ఇప్పుడు, మరి మరి బిల్లీ నా యొద్దకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు, "డాడీ ప్రార్ధనా కార్డులను పంచుటకు నేను సమయము ప్రకారం రాలేకపోతిని గనుక రేపు రాత్రికి దానిని ప్రయత్నించెదను."

"సరే, అలాగే కానిమ్ము. పంచే పనిని సహోదరులకు అప్పగింపుము" అని చెప్పాను.

2KGS 1:1-4•

JER 8:22

 

23మరిప్పుడు నాతో కలిసి మీరు II రాజుల గ్రంధము మొదటి అధ్యాయమును తీయుటకు మీ బైబిల్ని తీయమని కోరుచున్నాను. మరలాగే యిర్మియా 8వ అధ్యాయం 22వ వచనమును కూడా తీయండి, లేఖనములలోని కొద్ది భాగమును చదువుదుము.

ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.

అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికిలో నుండి క్రింద పడి రోగియై - మీరు ఎక్రోను దేవతయగు బయెల్జెబూబు నొద్దకు పోయి - ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా,

యెహోవా దూత తిష్భీయుడైన ఏలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజా వంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము - ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బెయల్జెబూబు నొద్ద మీరు విచారించబోవుచున్నారా?

కాగా యెహోవా సెలిచ్చినదేమనగా - నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి - మీ రెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారినడుగగా,

తరువాత, ఇప్పుడు యిర్మియా 8వ అధ్యాయం 22వ వచనం చదువుదుము.

గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవుచున్నది?

DEUT 33:27•

ISA 40:28•

JOHN 1:1,14

 

24నేను చెప్పగోరు అంశం: "ఎందుకు?" దానిని మనం అలా అనెదము. 'ఎందుకు?' అనేది ఒక ప్రశ్న. దేవుడు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు.

దేవుడు నిత్యుడు. ఆయన నిత్యుడని మనమెరుగుదుము, ఆయన నిత్యుడు, ఆయనకి ఆరంభమనేది లేదు, అంతమనేది ఉండదు; నిత్యత్వమనేదానికి ఆది అ౦తములు౦డవు, ఎందుకనగా అది అనంతము. అందుకే దేవుడు తన మనస్సును తన మార్గమును ఎన్నడూ మర్చుకొనడు. అలాగే ఆయన జనులుగా మనము కూడా మానవ కల్పిత సిద్దాంతాలను ఒప్పుకోం, కారణం అవి వాక్యానికి విరుద్దం, అందుకనే దేవుడు మరియు ఆయన వాక్యం ఒక్కటేనని మనం నమ్ముతాము. పరిశుద్ద యోహాను సువార్త 1వ అధ్యాయంలో "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ధ ఉండెను. ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను," అని బైబిల్ చెప్పే దానిని మనము నమ్ముదుము.

అందుచేత దేవుడు దేనినైనా అన్నట్లేతే, ఇక దానిని ఆయన ఎన్నడూ వెనక్కి తీసికోడు. దేవుడు రంగం మీదికి వచ్చి దేనినైనా వాగ్దానం చేసినట్లయితే, ఇక ఆయన దాని విషయంలో ఎన్నడు రాజీపడడు. మరిచిపోడు, ఒక్కసారి ఆయన నిర్ణయం తీసికొంటే, ఇక ఎన్నడూ అది మారదు.

25ఏదేను తోటలో మొదటిసారి పాపం జరిగినప్పుడు మానవాళి కొరకు నిర్ణయమొకటి తీసికొను నిమిత్తం దేవుడు పిలువబడెను. నశించిపోయిన తన కుమారున్ని విడిపించి తిరిగి తనతో సహవాసమును ఆయన పునరుద్ధారించగలిగెనా? అందుకొరకు ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అది రక్తప్రోక్షణ మార్గము. అదెన్నటికి మారిపోదు. లేఖనమును వెంబడించును. మరి అదెన్నడు మారిపోదు, ఎందుకనగా అది దేవుని నిర్ణయము, అది రక్తము ద్వారా జరుగునని ఆయన వాగ్దానం చేశాడు.

దానిని మనం మార్చాలని ప్రయత్నించితిమి, దానిని విధ్యాభ్యాసముగా మార్చ జూసితిమి, దానిని మనం ఒక సంఘశాఖగా తయారు చేయజూసితిమి, ఆదాము అంజూరపు కచ్చడములను తయారుచేసికొన్నట్టు మనం కూడా మానవ పద్దతుల చొప్పున సాధ్యమైనంత మట్టుకు దానిని మార్చుటకు ప్రయత్నించితిమి. అయితే అదెన్నటికి మారలేదు. సహవాసం చేసే ఏకైక చోటు రక్తము క్రిందే.

26కావున ఈ రాత్రి మనము అనేకమందిగా (వేర్వేరుగా) ఉన్నప్పటికిని, ఒక సంఘ శాఖగా కాక, ఏకముగా మనమిక్కడ నిలిచి యున్నాము. మనమొక సంఘశాఖకు ప్రాతినిద్యం వహించువారుగా మనమిక్కడ కూడుకోలేదు గానీ, యేసుక్రీస్తు యొక్క రక్తము క్రిందున్న సహవాసమందు మనమిప్పుడు నిలిచియున్నాము. మనమందరం సహోదరి - సహోదరులుగా ఇక్కడ కూడి యున్నాము.

మానవుని కొరకు దేవుడొక మార్గమును ఏర్పరచెను, మానవుడు దాని యందు నిలుచుటకు తిరస్కరించెను, గనుక దాని విషయమై ప్రశ్నించుటకు దేవుడు ఒక హక్కును కలిగియుండెను. నాడు నేడు మరియు తీర్పు దినమున కూడా ఆయన అదే ప్రశ్నను అడుగును. "ఎందుకు" అని వారు అడుగుదురు.

27ఇప్పుడు, మనం చదువుకొన్న లేఖనం, "ఆహాబు మరణమైన తర్వాత" అనే దానితో ఆరంభమైనది. ఆహాబు ఒక దుష్ట రాజు, సరిహద్దు విశ్వాసి, ఏది సరైనదో ఎరిగినవాడే, కాని దాన్ని చేసే ధైర్యం మాత్రం లేనివాడు - సరైనది తెలిసి కూడా దానిని చేయలేని పిరికివాడు.

దీనిని తలంచుచున్నాను, నేడు ఈ లోకం ఆహాబులను బట్టి కలుషితం కాలేదు. మనం జీవిస్తున్న ఈ క్రైస్తవ సమాజము అనేక మంది ఆహాబులను బట్టి కలుషితమైపోయింది. దేవునికి జీవితమును సమర్పించాలని తెలుసు, దేవుని ఆత్మతో నింపబడాలనీ తెలుసు, బైబిల్ బోధలను వెంబడించాలనీ తెలుసు, అయినా వాటిని చేయుటకు తగిన ధైర్యం (తెగువ) ఆహాబు లాంటి వానికి వుండదు.

సొదొమలో కూడా సరిగ్గా ఇలాంటి సంభవమే వుంది, అది నాకిప్పుడు గుర్తుకొస్తున్నది.

HEB 13:8

 

28"సొదొమా వారి పాపములను బట్టి నీతిమంతుడగు లోతు ప్రాణము దినదినము బాధ నొందెను" అని బైబిల్ చెప్పుచున్నది. అతడు నీతిమంతుడని ఎలా చెప్పగలం? ఎలాగంటే అతనికి ఏది తప్పో, ఏది దుష్ట కార్యమో తేటగా తెలుసును, గనుకనే తానెంతమాత్రం దానిలో పాల్గొనలేదు. అందువలనే అతడు నీతిమంతుడయ్యెను. ఇక రెండవ విషయం ఏదనగా, దేశములో జరుగుచున్న పాపిష్టి కార్యాలను తప్పు అని చెప్పే దైర్యం అతనికి లేకుండెను. తాను ఒప్పింబడెను గానీ, జనులను ఒప్పింపులోకి నడిపించలేని పిరికివాడు అతడు.

ఆశ్చర్యపడాల్సిన పనిలేదు, ఇప్పుడు దేశమంతా సోదొమ గొమొర్రాల వలే తయారయినది. దేశమంతా మరియు లోకమంతా అనేకమంది లోతులు నేడు ఉన్నారు. వారు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని, ఆయన శక్తి ఇదివరకు ఎలాగు పనిచేసిందో నేడు కూడా అలానే పని చేస్తుందని తెలిసి (ఒప్పింపబడి) కూడా దానిని దైర్యముగా సంఘ వేదికల మీద చెప్పుటకు జంకుచున్నారు, బలిపీఠము మీద నిలబడి పాపాన్ని ఖండించలేనంత పిరికి వారుగా వున్నారు. కారణం ధన సహాయం చేసేవారు దూరమౌతారేమోనిని భయం మరియు సహవాసములో నుండి గెంటివేస్తారేమోననే భయం (పిరికితనం).

వీటన్నిటికి విరుగుడు ఒక్కటే, అది యేసుక్రీస్తు యొక్క రక్తము క్రిందికి రావటమే. ఎందుకు? ఎందుకు?

1KGS 22:51•

2PET 2:7,8

 

29అహజ్యా అనువాడు ఆహాబు కొడుకు. అతడొక నులివెచ్చని ఇంట్లో పెంచబడినాడు. అది పూర్తిగా క్రైస్తవ గృహము కాదు. అతని తల్లి ఒక అన్యురాలు, అతని తండ్రి సహవాసమును మీరి అవిశ్వాసియైన స్త్రీని వివాహాం చేసికొన్నాడు. ఆమె విశ్వాసి కాదు, అన్యురాలు. అటువంటి అపవిత్రమైన కలయిక (పొత్తు) చెడ్డ గృహమునే తయారు చేయును. అచ్చట బిడ్డలను మంచిగా (భక్తిలో) పెంచటం అసాద్యం. విశ్వాసము మరియు అవిశ్వాసము ఒకటిగా పొసగలేవు, అలా ప్రయత్నిస్తే విఫలమే అగును.

మరిప్పుడు, విశ్వాసమందు బలవంతునిగా తండ్రి ఉన్నట్లైతే బిడ్డలు కూడా దైవీకంగా గాను భక్తిలో పెరుగుతారు. ఇక్కడ ఈ తండ్రి (ఆహాబు) విశ్వాసమందు బలవంతుడు కాదు. ఇతనికి దైర్యం లేదు. దేవుడున్నాడని ఇతనికి తెలుసు. ఆ దేవుడు యెహోవాయే అని కూడా తెలుసు, కాని ఇతని తల్లి యొక్క దేవతలు ఇంకా అలాంటివాటిని బట్టి ఇతడు తికమకపడెను, గందరగోలంలో పడెను. తన తండ్రి మరణాంతరం ఈ పిల్లవాని పరిస్థితి మరెంతగానో తారుమారయ్యెను. సత్యమైన దానిని తేల్చుకొలేని పరిస్థితి అతనికి తటస్థించెను.

నేడు కూడా సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దేశంలో కోకొల్లలుగా వుండటాన్ని మనం చూడగలం. కుటుంబములో ఒకరు ఈ మార్గములో వుంటారు, మరోకరు మరొక మార్గములో వుంటారు, ఒకరు ఈ దారిన వెళ్తుంటారు, మరొకరు మరొకదారిన వెళ్తుంటారు. క్రైస్తవ పేరు మీద నేడు అనేక రకములైన చెత్త కార్యాలు మరియు విచ్చలవిడిగా బాల్య-నేరాలు జరగుతాయి అనటంలో ఆశ్చర్యపోవల్సిన పనిలేదు. ఎందుకనగా ఎక్కడా ఐక్యత లేదు. నిజమైన పిలుపు, దేవుని కొరకు నిలబడుటమనేదే లేదు.

1KGS 22:51•

2KGS 1:2

 

30ఇప్పుడు, మనమొక విషయం తెలుసుకోగలం, అదేదనగా అతనికి సింహాసనం తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. ఒకరోజు అతడు మేడ గది అంతస్తులో అటు ఇటు నడుస్తూ పొరపాటున కిటికిలో నుండి క్రిందపడిపోయాడు. బహుశా త్రాగిన మైకంలో అలా పడిపోయి వుండొచ్చును. బహుశా పై అంతస్తులో నుండి నేలమీద పడిపోవుట వలన అతని ఎముకలు విరిగి ఉండొచ్చును. అతడి జ్వరానికి అదే కారణమై వుండొచ్చునేమో. ఏదేమైనా నయం కాని వ్యాధిలో అతడు చిక్కబడిపోయెను.

బహశా, నేడున్నంత వైద్య పరిజ్ఞానం, అధునాతన వ్యాధి చికిత్స వారికి వుండక పోవచ్చును. ఆనాటి వైద్యులు అతడికి చేయగలిగిన వైద్యమంతా చేసి ఉండొచ్చును. కాని అతనికి ఏ ఫలితం దొరకలేదు. అందువలన అతడు మెరుగైన చికిత్స కొరకు, వ్యాధిని బాపుకొనుట కొరకు ఇంకొద్ది పెద్ద శక్తిని ఆశ్రయించెను. తన ముందు ఏ ప్రత్యమ్నాయం అతనికి కనబడలేదు. తుదకు అతడు తన పరిస్థితి విషయమై తన తల్లికి కబురు పంపెను.

2KGS 1:2

 

31తల్లులైన వారికి ఇక్కడొక గొప్ప పాఠమున్నది. సాధారణంగా బిడ్డ ఎప్పుడు తల్లి వైపే ఎక్కువ మక్కువ చూపుతాడు.

అతడు ఎక్రోనులో వున్న తన తల్లి దేవతయగు బెయల్జెబూబ్ నొద్దకు విన్నపమును పంపెను, అక్కడ ఆ దేవత యొక్క విగ్రహము వున్నది. దూతలతో అతడు ఇలా చెప్పెను, "అక్కడున్న పూజారుల్ని సంప్రదించండి, వారు వెళ్ళి - నా రోగం కుదురుబాటు అగునో లేదో అని తెలుసుకొనుటకు బెయల్జెబూబ్ విగ్రహం నొద్దకు విచారణ చేయమని కోరండి."

HEB 12:6,7

 

32మీకు తెలుసా, అటువంటి ఒక వ్యక్తిని గూర్చి ఆలోచించండి? దైవ భయం కలిగి ఉండాల్సిన అటువంటి జనులు, దేవున్ని విడిచి అన్యదేవతల వైపు మొగ్గు చూపిన అలాంటి వ్యక్తిని తమపై రాజుగా, అధికారిగా కలిగివున్నారంటే కారణం నులివెచ్చని స్థితి. సరిగ్గా అలాంటి నులివెచ్చని స్థితే సంఘములోకి కూడా వచ్చింది. అందువల్లే అటుంవంటి వారిని వారు తమపై అధికారులుగా ఉ౦డు నిమిత్తం అనుమతించుచున్నారు. కాలంలో పెద్దగ మార్పు వచ్చిందని నేను అనుకోవట్లేదు, నేడు కూడా అంతట అదే జరుగుచున్నది. తన పరిస్థితిని మెరుగుపరచుకొనుటకు అన్య ఆలోచనలు మరియు వారి విగ్రహాలను ఆశ్రయించే అటువంటి వ్యక్తిని మనం అధికారిగాను, దేశమును పాలించు అధిపతిగాను నియమించుకొనుచున్నాము.

మరి మీకు తెలుసా, పరిస్థితులు ఎంత దయనీయంగా దిగజారిపోయినా, తన జనులకు దేవుడు తన ముఖమును మరుగుచేసికొన్నట్టు కనిపించినా ఏం పర్వలేదు. అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు, నీ వైఖరి మరియు నీ స్పందన ఎలా వుంటుందొ తెలిసికోడానికే దేవుడు కొన్నిసార్లు అలాగున చేయును. ఎందుకనగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి దేవుని కుమారుడు పరీక్షించబడాలి మరియు సరిచేయబడాలి.

33దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన ప్రతి దేవుని కుమారునిలోను, ప్రతి దేవుని కుమార్తెలోను నిత్యజీవమగు చిన్న మచ్చ ఉంటుంది. కొన్నిసార్లు నీవు ఒక చోటకి రప్పించబడతావు, అచ్చట ప్రతి ఒక్కరు అచ్చట దయ్యము, దయ్యము నిన్ను పలు విధములుగా శోధించి, అనేక కారణాలను నీ యెదుట వుంచును. అలాంటప్పుడు నిత్యజీవమనే కణం నీలో లేనట్లైతే నీవు తొట్రుపడతావు. దేవునిలో నుండి వైదొలిగిపోతావు, ఎందుకనగా దయ్యము నీ యెదుట ఉంచిన హేతువులు నీకు సహేతికంగా కనబడినవి, గనుక వాటిని బట్టి నీవు దేవునికి దూరమౌతావు.

నేనొక క్రైస్తవుడిని అని చెప్పుకొనే వ్యక్తి ప్రసంగించటానికి నిలబడాలన్నా కార్యలయమునందు పనిచేయాలన్నా, మరేవిధంగానైనా సరే నాయకునిగా పిలువబడాలన్నా, మొదట అతడు దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ చోటికి రాకుండా అతడు వాటిని చేయకూడదు. ఆ అనుభవం లేనట్లైతే, అతడు దానికి అనర్హుడు. ఒకవేళ అతడు ఆ అనుభవాన్ని కలిగి వున్నట్లైతే, దాన్ని గూర్చి అతడు తప్ప మరెవ్వరును వివరింపలేరు.

EXOD 3:1,2•

MATT 24:24•

MARK 13:22•

ACTS 7:22,23

 

34ఐగుప్తులో వున్న తన జనులను విడిపించుటకు దేవుడు మోషేను పంపడానికి ముందు ఆ ఎడారి వెనుక అతనిని కలిసికొని నలభై ఏళ్ళగా తానభ్యసించిన విద్యనంతటిని తీసివేశాడు. తర్వాతనే అతనికి తన్నుతాను ప్రత్యక్షపరచుకొన్నాడు. నలభై ఏళ్ళగా తాను నేర్చుకొన్నదానంతటితో దేవున్ని ఎరిగిన దాని కంటే కేవలం ఐదు నిమిషాలు ఆ మండుచున్న పొదలో దేవున్ని కలుసుకొనుట ద్వారా ఎంతగానో ఎరిగియుండెను.

ఈ రాత్రి సంఘానికి అవసరమైనదంతా అదే, మరో మండుచున్న పొద అనుభవములు దానికవసరం. ఆ అగ్ని తాకినప్పుడు వారు నత్తి పెదవులుగలవారై వుందురు. అంత్యదినములలో రెండు ఆత్మలు ఎంతో దగ్గరగా పనిచేయును, సాద్యమైతే ఏర్పరచబడినవారిని సహితం మోసపుచ్చునని లేఖనము సెలవిచ్చుచున్నది.

MARK 7:3-5

 

35దేవుని యొక్క పరిశుద్ద పర్వతము మీదకి మానవుడు రావల్సివుండెను. అప్పుడు ఏ వేదాంతపండితులు, వేదాంతపు డిగ్రీలు పొందినవారు, మరలాగే సకలహేతువులు, మరియు సమస్త నాస్తికులు మరింకా ఏదియు అతడిని కదల్చలేవు. ఆ పర్వతము మీదికి దేవుడు వచ్చినప్పుడు అతడక్కడుండెను, గనుక అక్కడేమి జరిగినదో అతనికి విపులంగా తెలియును. అక్కడేమి జరిగినదో అతడు పూర్తిగా ఎరిగియున్నాడు. గనుక అతడు ఎట్టి రకమైన హేతువులను ఎన్నడు మనస్కరించడు. నేడు మన ప్రభుత్వాలలోను, మన సంఘాలలోను మరియు అంతటా అటువంటి వారే మనకి వుండవల్సివున్నది. దేవుని ఆత్మతో నింపబడిన వారే మన మీద నాయకులుగా ఉండవలయును.

నేడు సంఘానికి కావల్సింది ఒక వేదాంతం కాదు. తిరిగి జన్మించి, ఆత్మతో నింపబడి, దేవుని పరిశుద్దాత్మ పూర్ణులుగా వుండే మనుష్యులు సంఘానికి అవసరం. అటువంటి వారు గనుక మన సంఘాలాలో వుంటే ప్రస్తుత కాలమందున్న సంఘముల కంటే ఎంతో మెరుగైన, ఎంతో వ్యత్యాసమున్న సంఘముగా అది కనబడునని నేను చెప్పుదును. దేవుని ఆత్మనింపుదల గల మనుష్యులు మన సంఘాలలో ఎంత ఎక్కువగా వుంటే అంత గొప్ప వ్యత్యాసము మన కార్యాలలో కనబడును. ఇక అప్పుడు పెద్దల ఆచారాల వెంబడి, మరలాంటి వాటి వెంబడి పరుగెత్తటం అనేవి వుండవు.

2KGS 1:2-4,6

 

36ఇప్పుడు, అహజ్యా అనే ఇతడు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నుండి సమాచారమును తెప్పించుకొనుటకై మనుష్యులను పంపెనని మనం చూశాం. ఎల్లప్పుడు తానేమి చేయుచుండెనో దేవుడు ఎరిగియుండెను. అక్కడ ఆయనకి ఒక ప్రవక్త వుండెను. అతని పేరు ఏలియా, అప్పుడు ఆయన ఏలీయాతో "ఆ దారి వెంట వెళ్ళి అక్కడ నిలబడియుండుము. దూతలు ఆ దారి వెంబడి వచ్చెదరు" అని చెప్పెను. మీరు చూడండి. దేనినీ నీవు దేవుని నుండి దాచి యుంచలేవు. గమనించావా, నీవు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు.

అరణ్యంలో ఒక మురికి గుంట వద్దనో లేక మరేదో ఒక చోట దేవుడు తన సేవకున్ని పిలిచి ఇలా చెప్పును, "వెళ్ళి ఆ మార్గము యొక్క మూలన నిలబడియుండుము. అక్కడికి దూతలు వచ్చెదరు, వెనక్కి తిరిగి వెళ్ళి ఎక్కిన మంచమును నీవు దిగవు, నిశ్చయముగా మరణమౌదువు అని "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" అతనితో చెప్పుము అని వారితో చెప్పుము అంటూ దేవుడు ప్రవక్తయగు ఏలీయాతో తన్ను గూర్చిన సమాచారం చెప్పి పంపుతాడని ఆ రాజు ఎరుగకుండను.

"అతనిని అడుగుము, ఎందుకు నీవిలా చేసితివి? ఏది నిన్ను అలా చేయమన్నది? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని ఇలా చేశావా? ఆయనకి ఒక ప్రవక్త ఉండలేదేమోనని అనుకొని చేశావా? నీవు అలాగున చేయటానికి హేతువేమిటి? దాని పర్యవసానమును నీవు ఎరుగవా? నీకు లేఖనములు తెలియక చేశావా? నీవున్నచోటనే లేఖనములున్నవి కదా! నీ చుట్టూ యాజకులున్నారు కదా! బాల్యము నుండి నీవు లేఖనములను అభ్యసించితివి కదా! ఇతర దేవతల దగ్గరికి వెళ్ళే చెత్తపనిని ఎందుకు చేసితివి? అని దేవుడు ప్రశ్నించుచున్నాడు."

37నేడు ఈ దేశమునకు విరోధముగా క్రీస్తు నిలబడి ఈ దేశమును తీర్పులో నిలబెట్టినట్లైతే, ఈ దేశము దేవునికి ఏమని సమాధానము చెప్పునోనని నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఆ రాజును అడిగినట్టే దేవుడు ఈ దేశమును అడిగినట్లైతే, దీని గతి ఏమవును? వీటిని మనమెందుకు చేయుచున్నాము? బహిరంగముగా మనం బైబిల్ చదివే స్వేచ్చను కలిగియున్నాము. కాని కొందరు పనిగట్టుకొని అలా చదవకుండా చెయ్యాలని ప్రభుత్వం మీద ఒత్తిడిని ఎందుకు తెచ్చుచున్నారు. ఇటువంటి దుర్మార్గపు పనులను ఎందుకు ప్రోత్సహించుచున్నారు? మన పూర్వీకులు రాజ్యాంగాన్ని సరైన రీతిలోనే నిర్మించారు కదా? బైబిల్ బోధల మీదనే కదా మన దేశము నిర్మించబడింది. మనకి మత స్వేచ్చ ఇవ్వబడింది కదా! దేవుడు దేనిని సత్యమని చేబితే దానిని స్వేచ్చగా పొందుకొని స్వేచ్చగా దానిని ప్రకటించే హక్కును మనం కలిగియున్నాం కదా?

2KGS 1:6•

JER 8:22

 

38కాని మీరు చూడండీ, వారు అక్కడ ఎలాగైతే చేశారో మనం కూడా అలానే చేసితిమి. దేవుని యందు మనకున్న విశ్వాసమును గౌరవించుటకు బదులుగా, సత్యము కొరకు నిలబడిన మనిషిని గౌరవించుటకు బదులుగా మనం రాజకీయములు మరింకా ఏవేవో మనల్ని మ్రి౦గి వేయుటకు అనుమతించుచున్నాము. వాటి మీద మన రాజకీయములు ఆదిపత్యం చేయునట్లు మరియు ఈ దేశమును చెరిపే వారికే ఓట్లేసి గెలిపించునట్లు మనము చేయుచున్నాము.

అందువలన మనం తీర్పుకి ఎంతో దగ్గరవుతున్నాము. ఒక దినాన దేవుడు ఒక గొప్ప ప్రవక్తను రంగము మీదకి లేపి ఈ తరము వారితో, ఈ జనులతో మాట్లాడును, దేవుడే ఆ ప్రవక్తలో వుండి తమతో మాట్లాడుచున్నాడని వారు చూచెదరు, కాని వారెంత మాత్రం మారుమనస్సు (పశ్చాతాపం) పొందరు. ఆనాడు ఏలావుందో మరి ఈనాడు కూడా అలానే వుంది.

ఆయన అడిగాడు "ఇశ్రాయేలులో దేవుడు లేడా? దేవుడు లేనట్టుగా నీవు దీనిని చేసితివా?"

యిర్మియా కూడా సరిగ్గా ఇలాగే అడిగెను, "గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా?" ఆ ప్రశ్నకి వారి యొద్ద సమాధానం చెప్పలేకున్నారు, ఎందుకనగా అక్కడ…

అప్పుడు ఆయన, "ఎందుకు? నీవు దీనిని ఎందుకు చేసితివి? నా జనుల కుమార్తె ఎందుకు స్వస్థత నొందకున్నది?"

JER 8:22•

JOHN 1:1•

JOHN 12:48•

ROM 2:16

 

39ఈ రాత్రి అది మనకి ఆశ్చర్యంగా వుండును? ఎందుకు? బైబిల్ అనేది లేదా? దేవుడనే వాడు లేడా? తేడా ఏం లేదా? జనులను దేవుడు తీర్పులో నిలబెట్టినట్లైతే, దేనిని బట్టి ఆయన తీర్పు తీర్చును? తీర్పు తీర్చుటకు అక్కడ ఒక ప్రామాణికము (లేదా) ఆధారము ఉండవల్సివున్నది కదా? ఆయన వారిని క్యాథలిక్ చర్చి ద్వారా తీర్పు తీర్చినట్లైతే గ్రీకు సంఘము మరియు ఇతర సంఘములు నశించిపోవును. గ్రీకు చర్చి ద్వారా ఆయన తీర్పు తీర్చినట్లైతే రోమా నశించిపోవును. దానిని ఆయన లూధరన్ ద్వారా తీర్పు తీరిస్తే మెథడిస్టు నశించిపోవును. మెథడిస్టు ద్వారా నైతే లూధరన్ నశించును. కావున ఆయన ఒక నిర్దేశిత సంఘము ద్వారా తీర్పు తీర్చడు. ఎందుకనగా లెక్కలేనన్ని సంస్థాగత సంఘములున్నవి. కావున వాటిలో దేని ద్వారాను ఆయన తీర్పు తీర్చడు.

యేసుక్రీస్తు ద్వారా దానికి (లోకానికి) తీర్పు తీర్చెదనని ఆయన సెలవిచ్చెను, ఎందుకనగా యేసుక్రీస్తు వాక్యమైయున్నాడు, వాక్యము దేవుడై యున్నాడు. ఈ బైబిల్ ను బట్టి ఆయన తీర్పు తీర్చును. ఇది దేవుని ప్రమాణికమై వున్నది. బైబిల్ చెప్పే దాన్ని బట్టి మన కొలత వుండాలి.

మనలో ఇంత గందరగోళమెందుకు వచ్చింది, ఇన్ని సంస్థలు ఎందుకు పుట్టుకొచ్చాయి, ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి, ఇంతగా సహోదరుల మధ్య విబేదాలు ఎలా ఏర్పడ్డాయి, ఇంకా అనేకమైన వాటిని బట్టి మనకి ఆశ్చర్యం కలుగక మానదు. వీటన్నిటికి కారణం ఒక్కటే, అదేదనగా గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? దేవుడు ఇలాంటి ప్రశ్నలను మనలను అడిగినయెడల ఎలాగుండునో అని ఆశ్చర్యపోవుచున్నాను.

EXOD 14:21,22•

EXOD 16:35

 

40ఇప్పుడు, నిజానికి వారికి అక్కడ ఏ వైద్యుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పజాలము. వారి వైద్యుడు దేవుడు. నిజానికి ఇశ్రాయేలులో ఏ దేవుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పలేము. వారికి నిజ దేవుడున్నాడు. ప్రతి విషయాన్ని తెలుసుకొనేందుకు సంప్రదించుటకు వారికి ఒక ప్రవక్త వున్నాడు. కాని రాజు యొక్క మొ౦డి వైఖరే ఈ అనర్ధాలన్నిటికి కారణం. అది నిజం!

నేడు ఈ దేశములో కూడా అదే రీతిగా జరుగుచున్నది. దేవుని విషయంలో ప్రజలు మొండికి పడుచున్నారు. తన జనులైన వారిని ఎర్ర సముద్రమును దాటించి, అరణ్యమందు నలువది ఏళ్ళు పోషించిన అదే దేవున్ని నేడు మనం కలిగియున్నాము. ఆరంభమందు ఏ దేవుడైతే పని చేసియుండెనో, మరి అదే దేవున్ని నేడు మనం కలిగియున్నాము. ఆయనలో ఏ మార్పు లేదు. చిక్కంతా జనుల యొక్క మొండి వైఖరి, మొండి విధానం, దేవునికి లోబడటం వారికి అవసరంలేదు. బైబిల్ తెలిపే పవిత్ర జీవన విధానం, పరిశుద్దత అనేవి వారికేమాత్రం పట్టవు. దానికి బదులుగా వారు ఒక సంఘమునకు చెందియున్నట్టు, సభ్యత్వ పుస్తకములో పేరు నమోదు చేసికోవటం లాంటివి చేస్తూ లోకస్తుల వలే జీవించుటకు ఇష్టపడుచున్నారు. ఆయన వాగ్దానాలకు ఆయన ఆజ్ఞలకు సాగిలపడటం వారికిష్టం లేకుండా పోయింది.

అదే సంగితి. ఆ కారణమును బట్టి జనులు ఎలాగైతే వున్నారో వారి కార్యాలు అలాగున వున్నవి. జనులు వాక్యములో నుండి వైదొలిగి పోవుచున్నారు. సరైన మార్గంలోకి నీవు వచ్చేటంత వరకు సరైన దానిని నీవు చేయలేవు.

ACTS 2:42•

ROM 1:16•

1COR 1:18

 

41పునాది లేకుండా నీవెన్నడు ఒక భవంతిని నిర్మించలేవు. భవంతి కట్టాలంటే నీవు తప్పని సరిగా పునాది వేయాలి. బైబిల్ ఆ పునాదియై వున్నది — అపోస్టులలు ప్రవక్తలు బోధయే ఆ పునాదియై వున్నది, బైబిల్ పునాది.

రాజు యొక్క మొండి వైఖరే వారి పతనానికి నాంది. దేవుని సామాన్యత మార్గం, ప్రవక్తను సంప్రదించటం అనేవి రాజు దృష్టికి సరిపోలేదు. అది అతని కంటికి దిసాయించలేదు. అది ప్రాచుర్యమైనదిగా అతనికి కనబడలేదు. దానికి ఏ హంగు ఆర్చటంలేదు. దేవుని రాజ్యమార్గంలో జీవించే జీవితం ఎన్నడూ ప్రాచుర్యంలోకి రాదు. అవును. అదెన్నడూ ప్రఖ్యాతి చెందదు. "నశించిపోవుచున్న వారికి సువార్త ప్రకటన వెర్రితనముగా ఉండునని," పౌలు అన్నాడు. మరలాగే "యేసుక్రీస్తు సువార్త విషయమై నేను సిగ్గుపడను, ఎందుకనగా దానిని నమ్మి రక్షించబడే వారికి అది దేవుని శక్తియైవున్నది" అని పౌలు అన్నాడు.

ఇప్పుడు, రాజు మొ౦డితనము కలిగివుండెనని మనమిక్కడ కనుగొంటిమి.

42ఒక రోగి వైద్యం కొరకు, అతడు వైద్య చికిత్స కొరకు అతి కష్టం మీద వైద్యుని గది తలుపు దగ్గరకు వెళ్ళాడు. అతడు మరణకరమగు జ్వరముతో వుండి అచ్చటికి వెళ్ళాడు. అప్పుడు అతని పరిస్థితిని గ్రహించి స్వయంగా వైద్యుడే ఆ ద్వారము నొద్దకు వచ్చి, "అయ్యా, మీ జ్వరం పోవుటకు ఇదిగో కొన్ని మందులు తీసికొండి" అని అడిగాడు.

రోగి అడుగుచున్నాడు, "అయ్యా, నా ఆరోగ్యం బాగా క్షీణించి౦ది."

అందుకు వైద్యుడన్నాడు

"లోపలికి రండి నీకు సూదినొక దానిని ఇచ్చెదను, టీకానిచ్చెదను."

అంతట రోగి "నీ మందు నాకొద్దు" అని పలికాడు.

అప్పుడు వైద్యుడు, "అయ్యా, నీవు లోపలికి రాకుండా నేనేం చేయ్యలేను."

రోగి మాత్రం అక్కడే నిలబడి "నేను లోపలికి రాను," అని అన్నాడు. తన మొండితనము వలన చివరికి ఆ రోగి అక్కడే పడి ప్రాణాలు విడిచాడు. మరణకరమగు టైఫయిడ్ జ్వరానికి అవసరమగు టీకాని తీసికోవటానికి అతడు అంగీరించలేదు. అతడు ఆ టీకాను వద్దన్నందున, డాక్టర్ తలుపు బయటే ప్రాణం విడిచాడు.

ఇప్పుడు అతడు వైద్యున్ని నిందించలేడు. ఎందుకనగా జబ్బును నయం చేసే మందును వైద్యుడు కలిగియుండుట మాత్రమే కాదు గానీ, దానిని ఇచ్చుటకు కూడా అతడు సంసిద్దమైన మనస్సును కలిగియుండెను. ఆ మందు అక్కడ సిద్దపర్చబడియున్నది. ఆ రోగి ఎంతో ప్రయాసపడి వైద్యుని తలుపు దగ్గరకు సహితం వచ్చాడు, కాని అతడు వైద్యం వద్దన్నందున వ్యాధి ముదిరి అక్కడే పడి చచ్చిపోయాడు, ఈ విషయంలో వైద్యునిది రవ్వంత తప్పలేదు. లోనికి వచ్చినట్లైతే, మందును తీసికొనుటకు అంగీకరించినట్లైతే బ్రతికివుండేవాడు, ఎందుకనగా అతన్ని బ్రతికించే మందు అచ్చట అందుబాటులోనే వుంది.

ఇదొక ఉపమానంగా వుంది.

43అయితే, దేవుడు తన రాజ్యములో ఒక మందును కలిగియున్నాడు, ఆ మందు లోకమందున్న జబ్బులన్నిటిని నయం చేస్తుంది. అంతే కాక సంఘ తలుపు వద్ద కూర్చున్నవారందరిని కూడా నయం చేస్తుందని నీకు తెలుసా. తలుపునొద్ద మాత్రమే కాదండీ, వారు సంఘమందున్న కుర్చీలలో కూర్చొని వైద్యుని మందు (ఔషదము)ను తృణీకరించుటచేత వారు నశించి, నరకానికి పోతున్నారు. ఆమేన్. అది నిజం. నిశ్చయంగా వారు డాక్టరు ఇచ్చే ఔషదమును తృణీకరించుచున్నారు, గనుకనే జ్వరపీడుతులై ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు.

జనులు సంఘములో కూర్చొని దేవుని వర్తమానమును విని వాటిని నమ్ముచున్నారు. అంత వరకు బాగానేవున్నది, కాని నమ్మిన దానిని అంగీకరించట్లేదు మరియు చేర్చుకోట్లేదు. "మంచిది, అది సత్యమని నేను నమ్ముచున్నాను" అని బాగానే అంటారు. వారిలో కొందరు వచ్చి నేను విన్న దానిని ఒప్పుకొంటున్నాను, అది సరైనదని నేను నమ్ముచున్నాను" అని అందురు. కాని విన్నదానిని చేయట్లేదు. అలా చెయ్యకపోతే నీవు చచ్చిపోతావు. ఔషదము (విరుగుడు)ను వారు చేర్చుకోనందున చర్చి కుర్చీలలోనే వుండి చచ్చిపోతున్నారు. వారు దానిని చేర్చుకోట్లేదు. చూశారా, అదేమి చేయును? అది వారిలో నున్న పేరు ప్రఖ్యాతులను బయటకి తీసేస్తుంది. అది వారిని కొద్దిగ బాదినట్టు వుంటుంది.

44వారు క్రొత్త జన్మ అంటేనే భయపడిపోవుచున్నారు.

జన్మించటం అంటే చాలాకష్టం. ప్రసవనొప్పులు వేదన కరముగా వుండును. జన్మిచటం అనేది చాలా వేదనతో కూడు కొన్నది. అదెక్కడైనా కావచ్చు అదొక పశువులశాల కావొచ్చు, లేక అదొక అందమైన ఖరీదైన ఆసుపత్రి కావొచ్చు, మరదేవిధముగా క్రొత్తజన్మ కూడా ఉంది, నీవు వేటినైతే చేయాలని తలంచావో, వాటిని చేయకుండునట్లు అది నిన్ను చేయును. అది నిన్ను సరి చేయును. నీవు సరి కావలంటే జన్మించుట అనే దానిని నీవు కలిగియుండాలి. అది నిజం. ఆమేన్.

ఒక విత్తనం మొలకెత్తాలంటే మొదటిగా అది భూమిలోపడి చచ్చిపోవాలి (నశించిపోవాలి). అలా నశించకపోతే అది మొలవదు. నేటి జనుల పరిస్థితిని గమనించండి. పరిశుద్దాత్మలో క్రొత్తగా జన్మించాలంటే నీవు ఈ లోకానికి చావాలి. అప్పుడే క్రొత్తగా జన్మించ గలవు. నేటి జనులు దానికి ఇష్టపడుటలేదు. గమనించారా, అది వాస్తవం. క్రొత్తగా జన్మించుట అ౦టే వారికి భయం. వారు దానిని చూచి భయపడుచున్నారు. వేటినైతే వారు చేయగోరట్లేదో వాటిని జరిపించునట్లు అది చేయును. క్రొత్త జన్మ వారిలో నుండి ప్రఖ్యాతిని బయటకు వెళ్ళగొట్టును. వారిలో నుండి మెడవంచని తనమును తీసివేయును.

ఓ, ఈ రాత్రి నేను చెప్పుచున్నాను, ఈ రాత్రి సహోదరుడా నీలో నుండి లోకమును తీసివేయగల టీకా వున్నదని చెప్పుటకు నేను సంతోషించుచున్నాను. అది జనులను సహోదరులుగా సంఘశాఖలకు అతీతంగా వారిని ఐక్యపరుచును. సహోదరుల మధ్యనున్న తారతమ్యములన్నిటిని అది తీసివేయును. అంతేకాక ఒకరినొకరు భుజమును తట్టుకొని "నిన్ను చూడటం నాకు చాలా సంతోషంగా వుంది" అని ఆప్యాయతగా చెప్పుకొనేటట్లు చేయును. ఆమేన్. నిశ్చయంగా అది చేయును. కాని కొందరు ఆ టీకాను చూసి భయపడుచున్నారు. ఓ, మై!

నీవు వైద్యునియొద్దకు వెళ్ళినప్పుడు, అతడు నీకు ఏ మందులనైతే సూచించి ఇస్తాడో, వాటిని వేసికోకపోతే అది నీకు గొప్ప అపాయమగును. నీవు భయపడి… మందు వద్దన్నావంటే నీ నూకలు చెల్లుతాయి. ఔషదమును కాదనటం ఎంతో అపాయకరము. భౌతికమగు మందులు వాడకపోతే భౌతిక మరణం సంభవించును. పాపము యొక్క విరుగుడుకు దేవుడిచ్చే టీకాను నీవు వాడనట్లైతే అది మరెంతో ప్రమాదకరమగును.

EPH 2:4

 

45కొంతకాలం క్రితం ఇక్కడ నేను కొంచం అస్వస్థతపడితిని, అప్పుడు ఒకరు నన్నిలా అడిగారు. "బిల్లీ నీ అస్వస్థత మధ్య కూడా నీవు నీ మతమును (విశ్వాసమును) కొనసాగించుదువా? నీవు దైవీక స్వస్థతను నమ్మేవాడివి కదా మరి అది నిన్ను స్వస్థపర్చగలదా (కాపాడగలదా)?"

అందుకు నేనన్నాను, "లేదండీ నేను దానిని కాపాడటం కాదు, అదే నన్ను కాపాడును."

కల్వరి మీద యేసుక్రీస్తు రక్తము చిందించినప్పుడు దేవుడు ఒక సిద్దపాటును సిద్దం చేసెను. మొదటిసారిగా మానవుడు పాపం చేసినప్పుడు దేవునికి అతనికి మధ్య అగాధం ఏర్పడింది. అతడు దేవున్ని కలుసుకోలేకపోయెను, కాని దేవుడే తన మహా దయచొప్పున అతని కొరకు ఒక ప్రత్యామ్నాయమును అంగీకరించెను. ఆ ప్రత్యామ్నాయం ఏదనగా ఎద్దుల యొక్క, గొర్రెల యొక్క రక్తము. ఎన్నో సంవత్సరములుగా అది అలా అంగీకరించబడుచు వచ్చింది.

EXOD 8:5,24•

PS 78:45•

HEB 9:13

 

46పాపమింకా వేరుచేయబడనప్పుడు, అనగా కేవలం అది ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము క్రింద కప్పబడివున్నప్పుడు మోషే దైవప్రేరణ క్రింద నిలిచియుండెను. దేవుని మహిమ అతని మీద నిలిచి యుండెను, గనుక అతడు ఈగలను ఉనికిలోనికి రమ్మని పిలిచెను, కప్పలు కలుగును గాక అని పలుకగా - అవి ఉనికిలోకి వచ్చెను. తలంపు యొక్క వ్యక్తికరణే పలుకు (మాట). దేవుడు తన తలంపులను మోషేలో వుంచెను, మోషే వాటిని మాటలుగా పలికెను. వాక్యము పలుకబడినప్పుడు ఈ సర్వలోకమును ఆ పలుకబడిన మాటను బట్టి కలిగెను.

బాల్యమందు నేను బడిలో వున్నప్పుడు నా చొక్కా మీద నల్ల సిరా తరచుగా పడుచుండేది. అమ్మ దానిని ఉతకాలన్నప్పుడు ఇలా అనేది "బాబు త్వరగా విప్పు, చొక్క నిండా సిరా మరకలే వున్నాయి," అప్పుడామె ఒక బొగ్గు మిశ్రమం లాంటిది దానిని తీసికొని ఆ మరక మీద పూసేది. సిరా మచ్చ పోవటమేమో కాని బొగ్గు మిశ్రమము వల్ల అవి ఇంకొద్దిగా పెద్దవయ్యెవి. ఆమెకు తెలిసిందల్లా అదే మరి.

47కాని నేడైతే ఆ విధానంలేదు. బ్లీచ్ అనే దానిని వారు కనిపెట్టారు. ఇక ఎంత మురికి (మచ్చ) వున్నా, అది ఇట్టే పోవల్సిందే. ఎందుకనగా ఆ నల్ల మచ్చలు క్లోరక్స్ లేదా బ్లీచ్ని తాకినప్పుడు, అవి తిరిగి ఆ పాత స్థితిలోనికే వెళ్ళును. (సిరా మచ్చలు బ్లీచ్తో కలిసిపోతాయి.) గనుక ఆ మచ్చలు ఇక కనబడవు, బక్కెటు బ్లీచ్లో చుక్క సిరా వేయి, అది అందులో కలిసిపోతుంది. దాని ఆవిరి కూడా నీవు చూడలేవు.

నేను రసాయన శాస్త్రమునకు చెందినవాడిని కాను, నేను చెప్పే ఈ మాటలు శాస్రానికి సరిపడేటట్టు వున్నాయో లేవో నేను ఖచ్చితంగా చెప్పలేను, అయినా వాటిని నేను చెప్పుటకు ప్రయత్నించుదును. "నీటిలో ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనే రసాయనాలు వున్నవి. దానిలో వున్న ఒక రసాయనం వలన అది నలుపుగా మారును." ఒకే ఒక నిజమైన రంగు వుంది, అదే తెలుపు రంగు, దానిని విడగొడితే మిగతా రంగులన్ని వచ్చును.

ఇప్పుడు నేను చెప్పుదును… దానిని నీవు అక్కడ నుండి విడగొడితే నీవిలా అందువు, "మంచిది, అది బ్లీచ్ని తాకినప్పుడు అదొక ఆమ్లము (రసాయనము) గా మారును. అదొక రసాయనముగా మారును." అప్పుడు ఆ రసాయనము ఎక్కడికి వెళ్ళును? ఆ రసాయనము తిరిగి… ఇప్పుడు మనం రంగులు ఎలా మారును అనే దానిని చెప్పుకొనుచున్నాము.

48ఆ రసాయనము తిరిగి పరమాణవుల యొద్దకే వెళ్ళును. మంచిది, నాలుగుసార్లు పరమాణువులను ఆరు రెట్లతో కలిపితే హైడ్రోజన్ పరమాణువు ఏర్పడుతుంది. అది అక్కడ నుండి విడిపోతే తిరిగి అది అణువుగా మారుతుంది. అప్పుడు అణువు ప్లస్ ఒకటి, ప్లస్ బి2, ప్లస్ మూడు మరియు ప్లస్ నాలుగు కలిస్తే హైడ్రోజన్ పరమాణువు అగును. దానర్థం ఏమిటి? నీవు తిరిగి నలుపు యొద్దకే వచ్చెదవు.

తర్వాత నీవు దానికి పైగా వెళ్ళితే ఎలెక్ట్రాన్స్ యొద్దకు వెల్లెదవు. అక్కడి నుండి నీవు ఎక్కడికి వెళ్ళేదవు. ఎక్కడి నుండి వచ్చితివో అక్కడికే తిరిగి వెళ్ళేదవు. ఎందుకనగా అదొక సృష్టి, అది సృష్టికర్త నుండి రావల్సి వున్నది. దానిని నీవు చేయవలెను. చిట్ట చివరిగా అది తిరిగి సృష్టికర్త యొద్దకే వెళ్ళిపోవును. ఆ సిరాలోవున్న ఆ వర్ణం ఎన్నడు తిరిగి రాదు.

JER 31:34•

JOHN 14:13•

HEB 10:4,17,18

 

49ఇప్పుడు, ఎడ్ల యొక్కయు మేకలయొక్కయు రక్తము పాపమును ఎంతమాత్రం తీసివేయజాలదని దేవుడు చూచియుండెను. ఆయన దానినెన్నడు ఉత్పత్తి చేయలేదు, కాని యేసుక్రీస్తు యొక్క రక్తమందు ఆయన ఒక రసాయనమును సృజించెను. ఆమేన్. సరైన రీతిలో పాపమును ఒప్పుకొన్నట్లైతే నీకు మరియు దేవునికి మధ్యనున్న అగాధము కోసం నీవు ఏ వంతెనను నిర్మించాల్సిన పనిలేదు. పాపమును నీవు పూర్తిగా తొలగించుకొన్నట్లైతే, అప్పుడు దేవుడు నీవు పాపమును చేశావన్న సంగతిని కూడా గుర్తుంచుకోడు. అది నిజం. ఆయన ఇలా అన్నాడు "మరుపు అను సముద్రములో నేను వాటిని పడవేసితిని," వాటిని ఆయన ఎన్నడు గుర్తు చేసికోడు. అప్పుడు దేవుని కుమారునివలె, దేవుని కుమార్తెవలే స్త్రీ పురుషులు దేవుని సన్నిధిలో నిలవబడి, వారి దేవుని యొక్క స్వభావమునే తమ హృదయములలో కలిగియుండెదరు.

స్నేహితుడా, నేడు సంఘము ఎక్కడున్నది? సంఘమునకు ఏమైంది? మన పాపములకు పరిహారమును యేసుక్రీస్తు రక్తమునందు మనం చూడగలిగితే కనీసం దేవుడు గుర్తుచేసికొనేవాడు కాదు. అప్పుడు "నా నామమున మీరు నన్నేమి అడిగినా, దానిని నేను చేతును."

ఏమిటి సంగతి? కొందరు లేఖనములను ప్రజలకు తప్పుగా బోధించిరి, అందుకే నేను వాటిని తేటగా విపులీకరించుచున్నాను, ఎందుకనగా దేవుని యొక్క పరిహారములో నేటికి ఏమార్పు లేదు. ఇప్పుడు, వైద్యుని యొక్క టీకాను తృణీకరించటం ఎంతగొప్ప ప్రమాదకరమో దేవుని యొక్క టీకాను తృణీకరించటమనేది అంతకంటే గొప్ప ప్రమాదకరము.

50మనుష్యుల ప్రయోజనార్ధం మానవుడు ఏ విధంగా ఔషదమును కనుగొనెను? ఆ శాస్త్రజ్ఞలు, రసాయన పండితులు ఏమి చేసేవారో తెలుసా? వారొక జబ్బును తీసికొని దానిలో ఏ క్రిములున్నాయో కనుగొందురు. ఆ క్రిములను సంహారించుటకు వాటి విరుగుడు కొరకు అవసరమైన మోతాదులో విషమును వాటి మీదికి పంపెదరు. ఆ ప్రయోగం సఫలమగు నిమిత్తం తాము కనిపెట్టిన మందును మొదటిగా ఒక గినియా పంది మీదికి ప్రయోగింతురు. మనిషికి వచ్చిన రోగమును దానిలోనికి పంపెదరు. తర్వాత తాము కనిపెట్టిన మందును దానికిచ్చెదరు. ఆ మందు వలన అది బాగుపడి బ్రతికినయెడల తర్వాత దానిని జబ్బున్న వానికి ఇచ్చెదరు. ఈ సంగతి మీకు తెలుసు. ఇక్కడ మరోక విషయం ఏమిటంటే గినియా పంది వలే అందరు దృడంగా వుండరు. ఆ మందు కొందరిని చంపును మరి కొందరికి ఉపశమనం కలిగించును.

51కాని యేసుక్రీస్తు ఇచ్చే టీకా మాత్రం అందరికి ఉపశమనం కలిగించును. ప్రతి ఒక్కరికి సహాయపడును. అదొక విరుగుడు కాదు గానీ, అదొక స్వస్థత,

అన్నిటికన్న ప్రమాదకరమైన జబ్బు గుండె జబ్బు అని జనులు చెప్పుట నీవు విని వింటావు. అయితే వారితో నేను సమ్మతించను, వారికంటే భిన్నంగా వుండాలని కాదు. వారి అభిప్రాయములో పొరపాటు వున్నది, గనుక నేను వారితో సమ్మతించట్లేదు. నిజానికి పాపమనే జబ్బు అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. అది నిజం. అన్ని అన్ని జబ్బులకంటే చివరికి గుండె జబ్బుకంటే కూడా అత్యంత ప్రమాదకరమైనది పాపమనే జబ్బు

మీకు తెలుసా, కొందరు ఇలా అందురు "మంచిది, బ్రదర్ బ్రెన్హా౦ నీవు దుప్పటిని ఇంకొంచెం నిండుగా కప్పితివని నేననుకొనుచున్నాను. మనిషి అన్నాక దైనందిన జీవితంతో ఏ పాపము చేయకుండా ఎలా వుండగలడు? దినములో లేచింది మొదలుకొని పడుకొనేటంత వరకు ఏదో రీతిగా పాపమును చేసే అవకాశం వుంది అని నీకు చెప్పగోరుచున్నాను." అందుకు నేనంటాను, నీకు టీకా పడలేదు, అంతే. నీవెన్నడు దేవుడిచ్చే విరుగుడును పొందుకోలేదు. అది నిజము. దాన్ని నీవు పొందుకొన్నట్లైతే, అప్పుడు నీవది చేయవు.

52"పొగత్రాగుటను నేను మానుకోలేకపోతున్నాను. ఏదోరకంగా దాని మీదకి మనస్సు వెళ్తుంది దానిని జరిగించునట్లు ఏదో నన్ను ఒత్తిడి పెడుతుంది," అని నీవు వాపోతున్నావా? అయితే ఒక్కసారీ దేవుని టీకాను తీసికో, అది చక్కగా పనిచేస్తుందో లేదో నీవే చెప్పెదవు.

కొందరిలా అందురు, "దానిని చేయలేకుండా నేనుండలేకపోతున్నాను." అలాగా? అయితే ఒక్కసారి దేవుని టీకాను తీసికో, అప్పుడు అది చక్కగా పని చేస్తుందో లేదో నీవే చెప్చెదవు.

కొద్ది కాలం క్రితం ఒక స్త్రీ నాతో సంబాషించినది. అసభ్యకరమైన వస్తదారణ విషయమై ఆమె నాతో మాట్లాడినది. దానిని ఆమె సమర్ధించుకొన్నది.

ఆమె ఇలా అన్నది, "బ్రదర్ బ్రెన్హా౦, వస్తదారణ గురించి నీకు మాట్లాడే హక్కులేదని నన్ను చెప్పనివండి. మేము ఏ దుస్తులైనా వేసికోవచ్చు, ఆ హక్కు మాకుంది. అవసరమైతే కురచ వస్రాలైనా సరే."

అందుకు నేను, "అది సరే కావొచ్చు. కాని నీవొక క్రైస్తవరాలివైతే మాత్రం అలాంటివాటిని ధరించ్చే హక్కు నీకు ఎంత మాత్రం లేదు" అని చెప్పాను.

ఆమె అన్నది. "మంచిది, ఆగండి బ్రదర్ బ్రెన్హా౦, మీకు తెలుసా తయారు చేసేవాళ్ళే అలాంటి లైంగిక ప్రేరణ కలిగించే దుస్తులను, మరలాంటి వాటిని తయారు చేస్తున్నారు. గత్యంతరం లేకనే మేము వాటిని ధరించుకొనుచున్నాము. అలాంటప్పుడు అది ఎలా తప్పు అవుతుంది?"

అందుకు నేన్నాను. "అమ్మా, కుట్టు మిషన్లు అవసరమగు ముడిసరుకులు ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చాయి. ఇక సాకులు చెప్పి తప్పించుకొనేదానికి వీల్లేదు."

అది నిజం. వీటన్నిటికి కారణం ఒక్కటే, అదేదనగా పరిశుదాత్మ నింపుదల, పరిశుద్దాత్మను పొందుట కొరకు ఆ పాతకాలపు రక్షణ సువార్త సభలనే టీకాను వారు తీసికొనుటకు ఇష్టపడకున్నారు. ఆమెన్!

MATT 6:21•

LUKE 12:34

 

53సమాజం దృష్టిలో వాటిని చేయటం నేరమనట్టుగా వున్నది. వారు దానిని ఇంకా తప్పు కిందనే చూచుచున్నారు. అవును. వారికి అది తప్పుగానే కనబడుచున్నది. విషయమేమిటి? అక్కడ వారికి ఏదో అయింది గనుకనే వారు ఆ విధముగా వుండిరి. వారలా వుండుటము లోకజనులకు ఇష్టముండదు, గనుక అట్టివారిని వారు తమ సమాజములలో నుండి వెలివేయుదురు. లోకస్తుల వలె వారు చేసేటంత వరకు వారిని సమాజములోనికి చేర్చుకోరు, చూశారా, నీవు గమనించుము. నీ హృదయమెక్కడ వున్నదో అనే దానిపై అది ఆధారపడి వున్నది. నీ ధనమెక్కడో, నీ హృదయమక్కడ వుండును. నీ పూర్ణ హృదయముతో ప్రభువును నీవు ప్రేమించిన యెడల నీవు తప్పక పరిశుద్దమైన, పరిశుభ్రమైన జీవితమును జీవించెదవని తప్పక గుర్తుంచుకొనుము.

HEB 11:10

 

54నిన్న రాత్రి, నేను నా భార్య సూపర్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మేమొక విచిత్రాన్ని చూశాము. అదేమిటంటే స్త్రీ యొక్క వస్రదారణ, మనదేశంలో అదొక వింత ఫ్యాషన్. అప్పుడు మెడా నాతో అన్నది, "బిల్లీ ఇదిగో ఆ అసభ్యకరమగు వస్రాలను ధరించిన వారిలో కొందరిని నేనెరుగుదును. వారిలో కొందరు చర్చి బృందములో పాటలు పాడేవారున్నారు. వాళ్ళకి ఏమైంది? ఇంత నీచమైన వస్రాలను వారు ఏలాగు వేసికొనుచున్నారు?"

అందుకు నేను "మంచిది. చూడు ప్రియా." "నేనొక మిషనరీని అయి వుండి. మనది ఒక భిన్నమైన దేశం," అని అన్నాను.

ఆమె "ఏమిటి?" అని అన్నది.

అందుకు నేను, "అవును, మనమొక విభిన్నమైన దేశానికి చెందినవారమి. ఒక విభిన్నమైన ప్రజలము."

అందుకామె "మనము అమెరికా దేశానికి చెందిన వారమి కాదా?" అని నన్ను ప్రశ్నించింది.

"మనం నివసి౦చేది అమెరికాలోనే, కాని ఇది మన గృహం కాదు. మనం యాత్రికులం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై యున్నాడో, ఆ పట్టణము కొరకు మనము ఎదురుచూచుచున్నాము.

నేను పిన్లాండుకి వెళ్ళాను - వారక్కడ ఎలా వుంటారో చూశాను. తర్వాత జర్మనీ వెళ్ళాను - జర్మనీ దేశపు ఆత్మను బట్టి వారెలా వున్నారో చూశాను. తర్వాత స్విట్టర్లాండ్ వెళ్ళాను - అక్కడ స్విట్జర్లాండ్ ఆత్మను వారు కలిగివుండుటను చూశాను. అమెరికా వచ్చాను - ఇక్కడ వారు అమెరికా ఆత్మను పొందుకొన్నారు." కొన్ని సంగతులు చెప్పాను.

"అయితే మన పరిస్థితి ఏమిటి?" అని ఆమె అడిగినది.

నేను ఇలా చెప్పాను. "మనం పైనుండి జన్మించిన వారము, అక్కడ పరిశుద్దత పరిశుభ్రత నీతి యధార్థత అనేవి వున్నాయి. అవును, వాటినీ ఎవరైతే ఒప్పుకొంటారో వారు ఈ లోక సంగతుల వైపు చూడరు. మనం మన జీవితాల ద్వారా, మాటల ద్వారా దేవున్ని కలిగియున్నామని, మనకొక రాజ్యమున్నదని, వెళ్ళుటకు మనకొక చోటు వున్నదని, ఇది మనకి శాశ్వత నివాసం కాదని తెలిపెదము." ఆమేన్!

మై, అది నా కిష్టం. ఇప్పుడు నేనెంతో మతపరమైన భావన పొందుచున్నాను.

అవునండీ. పాతకాలపు పరిశుద్దాత్మ రక్షణనందు నాకు నమ్మకమున్నది. ఓ, సహోదర - సహోరులారా అది మీకు ఏదో చేయును. ఒకప్పుడున్న ఆ దేవుడే నేడును జీవించుచున్నాడు. ఆనాడు ఆయన పరిశుద్దతను కోరుకొన్నాడు, మరి ఈనాడు కూడా అదే పరిశుద్దత ఉండాలని కోరుకొనుచున్నాడు. అవునండీ, గమనించండి. ప్రజలే దీనిని నుండి తొలగిపోయారు, అంతే. అవును.

ఇప్పుడు, అవునండి.

55నేడు జనులను చంపు మొట్ట మొదటి జబ్బు గుండె జబ్బు కాదండీ. అది పాపమనే జబ్బు. పాపమనగా అవిశ్వాసము. దేనిని సందేహించటం? బైబిల్ ను సందేహించటం. అది నిజం. అవును అదే అసలైన మొట్టమొదటి జబ్బు. ఈ పాపమనే జబ్బు నేడు ప్రజల్ని ఆత్మీయంగా చంపుచున్నది. అలాగే శారీరకంగాను చంపుచున్నది. వాస్తవానికి, వారు ఇదివరకే దానిని నిరూపించారు. అసూయపరులగు పురుషులు, రచ్చ రచ్చగా తగాదాలాడే స్త్రీలు, మరలాగే పోట్లాటలు, వాదించుకోవటాలు మొదలగు వాటన్నిటిని బట్టే వారు చనిపోవుచున్నారు. వీటివలన వారికి కేన్సర్ అవయవాలు చెడిపోవటం, ప్రేగు పూతలు లాంటి మొదలగు జబ్బులు వచ్చుచున్నవి.

సంతోషముగాను స్వేచ్చగాను వుండుటకే నీవు నిర్మించబడ్డావు. చూశావా, తండ్రి యెదుట కుమారుడు ఉన్నట్టుగా ఉండుటకే నీవు నిర్మించబడ్డావు. మరియు నీకు తెలుసా ఆయన నీ కొరకు ప్రతిదినమును మరియు ప్రతీకార్యమును సరిగ్గా వుండాలనే కోరుకొనుచున్నాడు. అవునండీ.

56అయితే జనులు ఈ క్రొత్త జన్మను చూచి భయపడిపోవుచున్నారు. అవును. దాని యొద్దకు రావాలంటేనే బెంబేలెత్తి పోవుచున్నారు, ఎందుకనగా అది వారి వంకరలన్ని సరి చేస్తుంది కదా! ఇది నిన్ను బింగో నాట్యాలు చెయ్యనివ్వదు కదా! చిల్లర పనులు అది నిన్ను చెయ్యనియ్యదు. కదా! బుదవారం జరిగే కుటాలకు ఇంకా ప్రత్యేక కూటాలకి పోకుండా నిన్ను ఇంట్లో వుండనివ్వదు కదా! హాలివుడ్ అందించే వెర్రి కార్యక్రమాలను "మేము సుసీని ప్రేమింతుమనే" టి.వి., కార్యక్రమాలను మురికి సరసోక్తులను నీవు చూడకుండా అది ఆపుతుంది కదా! నీ జట్టును పొడవుగా సాఫీగా పెరుగునట్లు అది నిన్ను చేస్తుంది కదా. అది నిన్ను ఒక సభ్యత సంస్కారం గల స్త్రీగా చేస్తుంది కదా! సంఘ పెద్దగా వుంటూ సిగరెట్లు తాగటం, దొంగిలించడం అనే వాటిని నీవు చేయకుండా అది నిన్ను చేస్తుంది కదా! అది నిన్ను ఒక ప్రత్యేకమైన వానిగా చేస్తుంది. అది నిన్ను పరిశుభ్రపరచి, నీకు రక్షణనిస్తుంది, లోకములో వున్న ఏదియూ నీవు పొందిన రక్షణను వివరింపలేదు, ఎందుకనగా నీలో ఏదో జరిగినదని నీకు మాత్రమే తెలుసును. అవునండీ.

ISA 7:14•

MATT 1:23•

JOHN 1:14

 

57ఇప్పుడు, కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా, ఎప్పుడైతే దేవుడు… మనిషి ఒక ఔషదమును కనిపెట్టినప్పుడు, వారు చేసేదేమిటంటే - దాని విరుగుడును వారు కనుగొంటారు. వారొక జబ్బును పలానా అని నిర్ధారించినప్పుడు, దానిని ఎలా నయం చేయాలి అనే పక్రియను మొదటిగా ఆ గినియా పందిలో ప్రయోగిస్తారు. అది దానిలో పనిచేసి అది చక్కగా బ్రతికిందంటే వారు తరువాత దానిని మానవునికి ఇచ్చెదరు.

ఇప్పుడు, ఈ రాత్రి నేను చెప్పుచున్న ఈ టీకాను, ఈ గిలాదు గుగ్గిలము మానవునికి అందుబాటులోనికి తెచ్చుటకు ఆయన ఒక గినియా పందిని ఎన్నుకోలేదు గానీ; తానే స్వయంగా రంగప్రవేశం చేశాడు. అది నిజము. ఆయన రాగలిగిన ఏకైక విధానం ఏదనగా, స్వయంగా ఆయనే కుమారుని రూపమున శరీరధారియై మనమధ్య నివసి౦చి మరణపు ముల్లును విరిచెను. చనిపోవుటకే ఆయన అరుదె౦చెను. ఆత్మగా వుండినప్పుడు ఆయన మరణించజాలడు. కావున ఆయనే స్వయంగా మానవ రూపం దాల్చి మరణించెను. గనుక ఆయన ఒక శరీరమును నిర్మించుకొనెను, దాని పేరు దేవుని కుమారుడగు యేసుక్రీస్తు, దేవుడు ఆ శరీరమందు నివసి౦చి మనిషి పాపమును పరిహారించుటకు భూమి మీద ఇమ్మానుయేలుగా తన్నుతాను కనబరచుకొనెను. రక్తమాంసములలో ఆయన పాలివాడగుటకు హేతువు అదే మరి. రక్తమందున్న రసాయనమదే.

కొందరన్నారు. "ఆయన ఒక యూదుడు" అని. ఆయన యూదుడు కాదు. మరి కొందరన్నారు, "ఆయన ఒక అన్యుడు" అని. ఆయన అన్యుడు కాదు. సాక్షాత్తు ఆయన దేవుడు. దేవుని కంటే తక్కువ వాడు కాదు. మనము దేవుని రక్తమందు రక్షించబడితిమని బైబిల్ చెప్పుచున్నది. పురుషునిలో నుండి రక్తము విడుదలవునని మనకి తెలుసు. పురుషుని రక్తములోనున్న హిమోగ్లోబిన్ యొక్క జీవకణము విడుదలవును, అది స్త్రీ యొక్క అండముతో ఫలదీకరణము చెందును. అది వాస్తవం.

58అక్కడ నేను ఇదివరకు దానిని చెప్పితిని, అదేదనగా వసంత కాలమందు తల్లి పక్షులు గూళ్ళు నిర్మించుకొని, గుడ్లు పెట్టును. గుడ్లుపెడితే సరిపోదు, అవి ఎంతో ఒపికతో వాటి మీద వుండి వాటిని పొదగాలి. అవి పొదిగేటంత వరకు ఎంతో కష్టపడి అక్కడ నిలిచియుండాలి, అలా వుండిన పిదప అది తన సత్తువునంతటిని పోగొట్టుకొంటుంది. అప్పుడు కనీసం ఎగురలేని పరిస్థితి కూడా దానికి వచ్చును. పొదగకుండా కూనలను బాగా పెంచుతాను కాపాడతాను నమ్మకంగా వాటిపట్ల వుంటాను అని ఎంత చెప్పినా, అది లెక్కలోకి రాదు. ఎందుకు? అది పోదగాలంటే, దాని జతగానితో అది కలవాలి. అప్పుడే ఆ గుడ్లు ఫలదీకరణం చెందుతాయి, అలా జరుగలేదంటే అవి అక్కడే పడివుండి కుళ్ళిపోతాయి.

మన కూటముల యొక్క పరిస్థితి కూడా అలానే వుంది. నేటి మన క్యాంపు కూటాలు మరియు సదస్సుల పరిస్థితి కూడా అలానే వుంది. మనము దేనిని పొందుకున్నాము? కూనల గుంపును మరియు ఆడంగి ప్రసంగీకులు… ఎందకు, అది సిగ్గుచేటు. అటువంటి ప్రసంగీకులు అక్కడికి వచ్చి తాము అభ్యసించిన మేదస్సును మరియు తమ పలుకుబడిని బట్టి జనులను దేనిపైకో నేట్టివేయుచున్నారు.

నేడు మనకి అవసరమైనది ఏమనగా…. మన గూటి నిండావున్న గుడ్లన్ని కుళ్ళిపోయాయి.

ISA 7:14•

MATT 1:23•

LUKE 1:35

 

59మన గూళ్ళను శుభ్రపరచుకొనె కాలము మనకి నేడు ఎంతో అవసరమై వున్నది, దానిలో, (గూటిలో)లో నుండి పనికిరాని దానంతటిని బయటకు పడవేయాలి, అందున స్త్రీ పురుషులు పరిశుద్దతతో నింపబడాలి. జతగాడు అగు యేసుక్రీస్తుతో కలవాలి (ఏకమవ్వాలి), ఆయనిచ్చే పరిశుద్దాత్మ బాప్తిస్మంను పొంది ఆత్మపూర్ణులుగా జీవించాలి. అది నిజం. ఈ ప్రక్రియ జరిగితేనే మన కూటాలు ప్రభావవంతంగా మారతాయి. (కూటాలకి జీవం వస్తుంది). అవునండి. ఔషదమును చూసివారు భయపడుచున్నారు.

దేవుని కుమారుడు, యేసుక్రీస్తు జన్మించినప్పుడు వారిలో కొందరిలా అన్నారు, "మంచిది, ఇప్పుడు, ఆయన మరియ యొక్క అండమై యుండెను." ఆయన మరియ అండము కాదండీ. స్వయంగా మరియ తన నాళములో గుండా గర్భ-సంచిలోనికి తన ఆండమును విడుదల చేసినట్లైతే, అక్కడొక స్పర్శ ఉండవల్సి వుంది, కావున దేవుడు పనిచేసే అవసరం అక్కడ లేకుండా పోతుంది, దానిలో ఆయన పాత్ర ఏమీ లేకుండా పోతుంది.

60సృష్టికర్తయగు దేవుడు, కన్య మరియను కమ్ముకొని, ఆమె గర్భమందు జీవకణమును సృజించి, ఇమ్మానుయేలను నామదేయమున ఒక నరుని తీసికొని వచ్చెను. ఏ మానవ సహాయం లేకుండా - తనకుతానే, దేవుడే, శరీరదారి అయ్యెను.

మొదటి నరుని సృజించిన సృష్టికర్త ఆయనే, ఆమేన్! ఓ, మై! ఆయనక్కడుండెను. ఆయన అక్కడ నిలిచెను. అవునండీ. ఆ టీకాను తీసికొను నిమిత్తము ఆయన దానిని చేసెను.

రోగాన్ని నయం చేసే ఏ మంచి వైద్యుడైనా, లేక ఏ శాస్త్రజ్ఞుడైన ఏం చేయును? వారిలో కొంతమంది ఒక ఖైది గుంపు నొద్దకు వెళ్ళి ఖైదీలలో కొందరిని ఎంచుకొని తాము కనుగొన్న మందును టీకాను వారి మీద ప్రయోగింతురు. వారికెట్టి హాని జరగనట్లైతే, వారు సఫలీకృతులగుదురు. ఖైదీ ఆ మందును తీసికొనుటకు ఇష్టపడినట్లైతే, అతడు స్వేచ్చగా పోవచ్చును. ఖైదీలు దాని కొరకు ఎదురుచూతురు. ఓ, వైద్యుడు కూడా తన టీకా విషయమై కొంత భయపడును.

MATT 3:16,17•

MATT 26:67•

MATT 27:30•

MARK 1:10,11•

MARK 10:34•

LUKE 3:22•

LUKE 18:32

 

61అయితే మీకు తెలుసా, తన సొంత మందు విషయంలో దేవుడు ఏ మాత్రం భయపడడు. [టేపు మీద ఖాళీ వున్నది]. తొట్టిలో.

యోర్దాను నది ఒడ్డున ఒకతను నిలబడివున్నాడు… టీకా అక్కడ పడినప్పుడు, ఆకాశము నుండి పావురము వలే అది పడటం అతడు చూసెను. ఆయన ఆ టీకాను పొందుకొనెను. ఒక స్వరము ఇలా పలికినది. "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను." ఆమేన్! నరునిలో దేవుడు — అదే టీకా. నరునిలో దేవుడు!

లోకము ఆయనను గమనించెను. ప్రతి శోధనకు ఆయన నిలిచి తట్టుకొనెను. వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసినప్పుడు, ఆయన గడ్డము పెరికి ఆయన మీద ఊసినప్పుడు, ఆ మందు ఆయనను శోధనల మధ్య నిలువబెట్టెను. శ్రమ ఘడియ యందు శోధనల యందు అది ఆయనను నిలువబెట్టెను. యోర్దాను యొద్ద ఆయన పొందుకొనిన ఆ టీకా ఆయనను అది ఎత్తి పట్టుకొనెను. ఆయన ఖ్యాతి, అంతట ప్రచురమైనప్పుడు అది ఆయనను ఎత్తి పట్టుకొనెను.

MATT 3:16,17•

MARK 10:11•

LUKE 3:22•

LUKE 4:5,6

 

62నేడు అనేక సంఘాల పరిస్థితి ఏమిటి? దేవుడు వారిని దీవించినప్పుడు, వారు అలా ఆరంభించినప్పుడు. నేను చెప్పే ఈ సంగతి పెంతెకోస్తు వారిని బాధపెట్టవచ్చును. పూర్వము మన పితరులు వీదుల మూలాన నిలిచి ఆ పాత-కాలపు వస్తువులతో పనిచేసిరి. మన పెంతెకోస్తులు కూడా ఇప్పుడు అలా వుంటే బావుండును. కాని వారు అ విధముగా కాక నాగరికత లోకము వైపు పరుగెడుచు, పెద్దపెద్ద కట్టడాలు నిర్మించుచు లోకస్తులవలె ప్యాషన్ల మీద తెగ మోజు పడుచున్నారు. అయితే పాతకాలపు పరిశుద్దాత్మ కుమ్మరింపుయే మనకు నేడెంతో అవసరమై వున్నది, దానివలన మనము శుద్ధి చేయబడుదుము. కేవలం మనము మాత్రమే కాదు, పెంతెకోస్తు సంఘపు గుంపు అయిన మీరు కూడా దానిని పొందుకోవల్సి వుంది. అది నిజం.

ఇప్పుడు, విషయాన్ని గమనించండి. తాను బాప్తీస్మము పొందుచున్నప్పుడు పరిశుద్దాత్మ తన మీదికి దిగివచ్చెను. అక్కడ యేసు టీకాను పొందుకొనెను. శ్రమ మరియు శోధన ఘడియల యందు ఆయన వాటిని ఎలా తట్టుకొని నిలబడియున్నాడో మనము గమనించితిమి, లొక రాజ్యములన్నిటిని అపవాది ఆయనకు ఇవ్వజూపినప్పుడు ఆయనేమి చేశాడు? ఆయన వాక్యముతోనే నిలిచి యున్నాడు. ఆమేన్!

63నేడు నేనొక విషయంకై ఆశ్చర్యపోవుచున్నాను, అదేమంటే, అంత్యకాల ఉజ్జీవమందు వరిచర్య పొలములో వున్న అనేక మంది సహోదరులు… కొంచెం డబ్బు మరియు కొంచెం మెరుగైన వస్రాలు వస్తే నీ స్థాయి పెరిగినట్టేనా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఒక ప్రత్యేకమైనవానిగా చూడవల్సిందేనా? ఇతరుల కంటె నీలో ఏమన్న ప్రత్యేకత గొప్పతనం వుందా? అలా భావించటం నీకు సిగుచేటు. అదొక ఎలుకల పందెంలాంటిది. ఆయన వచ్చి నీతో మాట్లాడగలిగిన చోటుకి నిన్నునీవు తగ్గించుకోవాలని దేవుడు నీ నుండి కోరుచున్నాడు. నేడు సేవకుల మధ్య ఎలుకల వందెముగా మారింది, ప్రతి ఒక్కరు మరొకరి కంటే గొప్పవారు అని తలంచుకొనుచున్నారు. చూచారా, వారు సాతాను శోధన యొక్క ఒత్తడిని తట్టుకోలేకపోవుచున్నారు.

MATT 4:6,7,10•

JOHN 10:37,38

 

64అయితే ఆ శోధనలో మన ప్రభువు పడిపోలేదు. ఆయనను టీకా ఎత్తి పట్టుకొనెను. లేఖనాల మీద తర్కము అనే శోధన కాలమొచ్చినప్పుడు, ఆయన ఖచ్చితంగా వాక్యముతోనే నిలబడియుండెను. "ఇలా వ్రాయబడినది అని సాతాను పలికాడు."

అ౦దుకాయన, "ఈ విధముగా కూడా వ్రాయడినది" అని బదులిచ్చాడు" మహిమ. నరునిలో దేవుడు. ఆయన ఏమి కలిగియున్నాడు? తాను ఏదైతే సెలవిచ్చాడో, ఆ ప్రతీమాటతో నిలుచున్నట్లు చేయు దానిని ఆయన కలిగియున్నాడు. ఆయన అన్నాడు, "నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. మీరు నన్ను నమ్మనియెడల, ఆయన నాయందు చేసే క్రియలను చూచి నన్ను నమ్ముడి." ఆమెన్.

నీవు ఉండాల్సింది అక్కడే.

ROM 8:38,39

 

65నేడు మనకు ఎటువంటి స్త్రీ, పురుషులు కావాలి? పరిశుద్దాత్మ యొక్క సూచనల చేత లోకము యొక్క నోరును మూయించే వారు కావాలి. మనకి అటువంటి క్యాంపు కూటాలు అవసరం. మనకి భూలోకమును తలక్రిందులు చేసేవారు కావాలి. సంఘములోనికి జొరబడుచున్న లోకాన్ని మరియు లోక కార్యాల్ని వెళ్ళగొట్టగలిగిన వారు నేడు ఈ అంత్యకాలమందు మనకి కావాలి. ధనము విచ్చల విడిగా దేశములో విస్తరించుచున్నది. దేవునికి బదులు మనుష్యుల మనస్సులలో పెద్ద పెద్ద కార్యాలు, ఇంకా ఏవేవో నిండిపోతున్నవి. లేఖనాల విషయంలో ఎప్పటికప్పుడు రాజీపడిపోవుచున్నారు.

పరిచర్య ఆరంభంలో ప్రతీ సహోదరుడు బాగానే వుంటాడు, కాని కొద్దిగ పేరు (ప్రఖ్యాతి) వచ్చిన తర్వాత తాను నమ్మిన దానితో రాజీపడటకు అలవాటు పడిపోతాడు. తిరిగి జన్మించిన వాని రక్తములో రాజీపడే తత్వముండదు. వాక్య విషయంలో పాతాళపు దయ్యములన్ని ఏకమై వచ్చినా, అవెంత మాత్రం అతనిని కదల్చలేవు. ఏది ఏమైనా, అతడు వాక్య పక్షమునే నిలబడతాడు… ఆమేన్.

పౌలు అన్నాడు, "ఉన్నవియైనా, రాబోవువైనా అవి ఏవైన సరే, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు." పరిశుద్దాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి, దేవుని కుమారుడై యున్నాడు. అతడి జన్మ వాస్తవమైనది. దేవునికి మరియు అతనికి మధ్య ఏ అగాదము ఉండదు. అతడు ఆయన సన్నిధిలో ఆయన కుమారుడై యున్నాడు. ఆమేన్. అది నాకిష్టం, అది వాస్తవం అని నాకు తెలుసు.

మంచిది.

MATT 26:67,68

 

66శోధన కాలమందు ఆ టీకా నిన్ను లోకములో పడకుండా కాపాడును అని మనము కనుగొన్నాము. రోమా సైనికులు ఆయనను అపహసించిరి, ఆయన ముఖముపై వస్త్రము కప్పి, ఆయన తల మీద కర్రతో మోది, "ఇప్పుడు నీవొక ప్రవక్తవైతే నిన్ను కొట్టింది ఎవరు చెప్పు" అని హేళనగా అడిగారు. పరిశుద్ద గుండ్రాళ్ళని ఆయనను వారు హేళన చేసే ఘడియ అది. వారు ఆయన యొక్క వివేచన వరమును కళ్ళారా చూచారు, అయినప్పటికి ఆయనను అపహసించారు.

ఈ రాత్రి ఆయన ఇక్కడ నిలబడివున్నట్లైతే, చుట్టూ తేరి చూసి, తనను ముట్టిన స్త్రీ ఎవరో ఆమె సమస్య ఏమిటో, ఇంకా ఆమెను గూర్చిన మిగతా విషయాలను ఏమైయుండినవో చెప్పి యుండేవాడు, ఎందుకనగా ఆనాడు ఆయన వాటిని చెప్పెను; ఈనాడు కూడా ఆయన ఆ విధంగానే చెప్పును, ఎందుకనగా ఆయన ఏ మార్పులేనివాడు. ఆమేన్.

ఆయన జీవము గల దేవుడని నీకు సంతోషంగా లేదా? ఒకడు మేడ మీద నుండి పడిపోవుట వలన ప్రాణం పోయింది, అప్పుడు అక్కడొక మనుష్యుడు నిలబడి వుండెను, దేవుడు అతని యందు వుండెను, అతడు చనిపోయిన వానిని తన భుజాలలోనికి చేర్చుకొని అతనికి ప్రాణం తెచ్చెను. దానిని చేసిన అదే దేవుడు, ఈ రాత్రి యిక్కడ వున్నాడు. ఆమేన్. ఆయన మార్పులేని దేవుడు.

సంఘమునకు ఆ టీకా కావలెయును. అది నిజం.

67డేవిడ్ డూప్లెసెస్ ఒకసారి ఇలా అన్నాడు, "దేవునికి మనవళ్ళు అంటూ ఎవరు లేరు." అది నిజం. మన పెంతెకోస్తు సహోదరులు ఆ విధంగా అక్కడ వున్నారు, వారి పిల్లలు సంఘములోనికి వచ్చి ఇలా అందురు, "మంచిది, మన పితరులు పెంతెకోస్తులు గనుక మనము కూడా పెంతెకోస్తులమై యున్నాము." నీ తండ్రి ఒక పెంతెకోస్టు వాడైయుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినవాడైనట్లైతే, మరి నీవు కూడా నీ తండ్రి వలే అదే రీతిగా ఉండవల్సివున్నది. ఆయనకి మనవళ్ళు లేరు. ఆయనకి కేవలం కుమారులు, కుమార్తెలు మాత్రమే వున్నారు. మనవళ్ళు, మనవరాండ్రు అంటూ ఎవరూ లేరు. అది నిజం.

పెంతెకోస్తునాడు వారు చేసినట్టే, నీవును, అదేరీతిగా చేయవలసి వున్నది. అదే అనుభవాన్ని నీవు కూడా పొందుకోవల్సి వున్నది. వారు కలిగియున్నదానినే నీవునూ కలిగియుండవలసియున్నది.

దేవుడెన్నడు తన కార్యక్రమాన్ని మార్చడు. తన మార్గములను ఎన్నడూ ఆయన మార్చడు. ఆయన ఎల్లప్పుడు తన కార్యములను ఒకే రీతిగా జరిగించును. ప్రతీకాలమందు దానికి అనుబంధంగా వుండేటట్టు ఆయన తన కార్యక్రమాన్ని రూపొందించాడు. అదే రీతిగా అది వుండవల్సి వుంది. అది వున్నట్టుగా నీవు జరిగించినట్లైతే, నీకు కూడా అదే జవాబు (ఋజువులు)లు వస్తాయి. ఆమేన్. అది మంచిది.

ISA 50:6•

MATT 27:30

 

68శోధన కాలమందు అది నిన్ను కాపాడును. నీకు అన్నీ విరోధమైనప్పుడు కూడా అది నిన్ను కాపాడును. ఆయన స్నేహితులందరు ఆయనను విడిచిపోయినప్పుడు కూడా, అది ఆయనను నిలువబెట్టింది. ఇప్పటికి అదే టీకా కాపాడును. ఆయన ఇప్పటికి దానిని కలిగియుండెను. అప్పుడు అపవాది ఇలా అనుకొంటుంది, "ఆయన నా చేతికి చిక్కాడు." అయితే తిన్నగా ఆయన కల్వరి వైపు ప్రయాణించాడు, ఆయన శరీరము నుండి రక్తము దారలుగా ప్రవహించుచున్నది, ఆయన చుట్టూ వస్త్రము చుట్టబడియున్నది, అయితే అది పూర్తిగా రక్తంతో తడిచి ముద్దయినది.

దయ్యము ఇలా అనుకొనియుండును, "ఆయన ఇప్పుడు నాకు చిక్కాడు, ఆయన దేవుడుగా ఉండజాలడు. ఆయన దేవుడైతే, తన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని ఏమి అనలేకపోయాడేమి? ఆయన దేవుడైతే, తన గడ్డం పెరికిన వారిని ఏమి అనలేదు, ఎందుకని? ఆయన దేవుడైతే దర్శనమొకటి చూచి చెప్పమని వారు సవాలు విసిరినప్పుడు, ఏ మాత్రం స్పందించలేదు, ఎందుకని? ఆయన ఎందుకు దానిని చేయలేదు? ఇప్పుడు ఆయన మౌనిగా తన సిలువనెత్తుకొని తిన్నగా కల్వరి గుట్టనెక్కుచున్నాడు. ఇంకొద్ది సేపట్లో ఆయన నా గుప్పిట్లోకి వస్తాడు" అని దయ్యము అనుకొనుచున్నది.

JOHN 1:14•

1COR 15:55,57

 

69మరణపు తుమ్మెద దిగి వచ్చి ఆయనను కుట్టాలని ఆయన చుట్టూ తిరుగుచున్నది. ప్రతీ తుమ్మొద (తేనెటీగ)కి ముళ్ళనేది వుండునని మీకు తెలుసా.

కాని, దేవుడు, ఆ సమయానికి మరణమనే తుమ్మెదతో కుట్టించుకొనెదానికై ఒక శరీరమును సిద్దపర్చెనని మీకు తెలుసా. ఆ శరీరము దేవుని యొక్క శరీరము. దేవుని కుమారుడగు ఇమ్మానియేలు శరీరమందు ముళ్ళు గ్రుచ్చుకొన్నప్పుడు, ఆయన దానిని పెరికివేసెను. మరణములో నుండి ఆయన దాని ముళ్ళను విరిచి వేసెను. "మరణమా నీ ముళ్ళెక్కడ? పాతాళమా నీ విజయమెక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి విజయమిచ్చిన దేవునికే కృతజ్ఞతా స్తుతులు కలుగును గాక" అని పౌలు అనుటలో ఏ మాత్రం సందేహంలేదు. అతడు ఏలియాను కుట్టి చంపగలిగెను, ఏలియాను కుట్టిన తర్వాత దాని ముళ్ళు యదావిదిగా వుండెను. కాని మీకు తెలుసా, ఒక తేనేటీగ ఒకసారి కుట్టిన తర్వాత మరలా అది కుట్టజాలదు. ఎందుకనగా మొదటి కాటుకే అది తన ముళ్ళను పోగొట్టుకొనును. అలాగే అతడు తన ముళ్ళను గ్రుచ్చుటకు అక్కడ అతనికి ముళ్ళు లేకుండెను. ఓ మై! గ్రుచ్చుటకు ఇక ముళ్ళు లేకపోయెను.

ఇమ్మానుయేలును కుట్టినప్పుడు (గ్రుచ్చినప్పుడు) వాడు తన ముళ్ళును పోగొట్టుకొనెను. దేవునికి స్తోత్రం. అవునండీ. ఇమ్మానుయేలును కుట్టుటవలన వాడు తన ముళ్ళను పోగొట్టుకొనెను. అవునండీ.

GEN 1:1•

MATT 27:40,51,54•

MARK 15:30

 

70ఆ ఔషదము కాపాడెనని వారు కనుగొనిరి. "నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి క్రిందికి దిగిరా," అని వారన్నారు. ప్రధానయాజకుడు, సంఘములోని ప్రముఖులు ఇలా అడిగారు, "ఇప్పుడు మాకు తేటగా చెప్పుము, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవే రక్షించుకొని సిలువలో నుండి క్రిందికి దిగిరమ్ము." ఇంకా అన్నారు, "ఆయన దేవుని కుమారుడో కాదో, మనం చూద్దాం." అయితే ఆయన ఎన్నడు నోరు తెరువలేదు. ఒక్క మాటైనా అనలేదు.

ఇప్పుడు, ఆయన చనిపోయాడని మనమిప్పుడు కనుగొంటిమి. ఆయన నిజంగానే చనిపోయాడు. సూర్య చంద్రులు దానికి సాక్ష్యమిచ్చారు. ఆయన చనిపోయాడని ప్రకృతి చెప్పింది. ఆయన చనిపోయాడని భూకంపం సాక్ష్యం పలికింది. ఈ భూమిని సృజించిన దేవుడు భూమిపై వ్రేలాడటం, ఇమ్మానుయేలు రక్తం ఆ భూమిపై పోయబడుటంను వారు కళ్ళారా చూశారు. ఆయన నిశ్చయముగా చనిపోయాడు. అందులో సందేహము లేదు. ఆయన చనిపోయాడని ప్రతీది సాక్ష్యమిచ్చినది.

MATT 27:66•

JOHN 2:19

 

71మనమొక సంగతిని తెలిసికొనబోవుచున్నాము, అదేదనగా తాను చనిపోవుటకు ముందు ఆయనిలా పలికెను, "ఈ దేవాలయమును పడగొట్టండి, మూడవ దినమున నేను దానిని తిరిగి లేపెదను. దానిని మీరు సమాధిలో ఎంత మాత్రం బందించలేరు. ఈ దేవాలయమును ధ్వంసం చేయండి, మూడవ దినమున దానిని నేను తిరిగి తీసికొని వచ్చెదను." ఆ టీకా ఆయనను ఎలా కాపాడునో అని తెలిసికొనుటకు వారు దాని చుట్టూ కాపలా వుంచెను. పాపపు శోధనల మధ్య అది ఆయనను ఎత్తిపట్టినట్లు వారు చూచిరి. పేదరికం మధ్యలో అది ఆయనను ఎత్తి పట్టెను. సంపసన్న స్థితి (సమృద్ధి)లోనూ అది ఆయనను ఎత్తి పట్టెను. అన్ని విధములగు శోధనలోను అది ఆయనను ఎత్తి పట్టెను. అది ఇప్పటికి ఎత్తి పట్టును (కాపాడును). మరిప్పుడు ఈ మరణ సమయమందు అది ఏమి చేయబోవుచున్నదో చూద్దాం.

JOHN 6:37,39•

1COR 15:4

 

72అయితే ఈస్టర్ ఉదయానా, (ఓ, మై!), సూర్యుడు ఉదయించుటకు ముందే ఆ టీకా ఆయనను ఎత్తి పట్టెను. అది దానిని చేసినప్పుడు, మరణము యొక్క హద్దులు తెంచెను, సమాది తెరుబడినది, మూడవ దినాన ఆయన తిరిగి లేచి, పరలోకమునకు ఆరోహణమయ్యెను. ఆ టీకా నిత్యజీవమనే టీకా అని దీనిని బట్టి మనం తెలిసికోవచ్చును. దానిని నీవు ద్వంసం చేయలేవు. చివరికి పాతాళము కూడా దానిని పట్టుకొనలేకపోయినది, ఏదియు దానిని పట్టుకోలేకపోయినది; అది తిరిగి లేచినది.

యేసుక్రీస్తు ఇలా అన్నాడు, "నా తండ్రి అనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు. అంత్యదినమున నేను వారిని లేపుదును." హల్లెలూయా!

ఆ టీకా తీసికొన్న ఏ స్త్రీయైనా లేక ఏ పురుషుడైనా సమాదిలో వుండలేరు. నీతిమంతులను ఏ సమాధి బందించలేదు, ఏ పాతాళము, ఏ సమాధియు వారిని పట్టుకొనజాలదు. దానిని లేపుదునని యేసుక్రీస్తు వాగ్దానము చేసెను. ఆమేన్! ఆ టీకాను బట్టి నేనెంతో సంతోషించుచున్నాను.

ఈస్టర్ ఉదయాన అది ఋజువైనదని నీకు తెలుసా.

73అదేమై వున్నదో నీకు తెలుసా? అదెంతో గొప్పది, నూట-ఇరవై మంది ఆ టీకాను తీసికోవాలని ఆశపడ్డారు. ఇప్పుడు శోధనల మధ్యలో ఆయన కాపాడునని నిజంగా ఎరిగిన నూట-ఇరవై మంది ఆ మందును కోరుకొనిరి.

కావున ఉన్నపాటునే ఆయన పరిశోధనశాలకు వెళ్ళి కొంత పరిశోధనను చేసిన తర్వాత ఆయన ఇలా అన్నాడు, "నేను దానిని మీ కొరకు తెచ్చే వరకు మీరు వెళ్ళి, యెరూషలేములో కనిపెట్టికొని వుండుడి. అన్ని సూత్రాలు ముగిసిన పిదప దానిని మీకు పంపెదను."

గనుక వారు మేడగది లోకి వెళ్ళారు. క్రైస్తవ సంఘములు ఎలా నడిపించబడాలి… ఏ రకమగు టీకాను అవి తీసికోవాలి? టీకా ఏమైయుండును? దానిని వారు ఎలా చేయాలి? తీసికొన్నాక ఏమి జరుగును? పి.హెచ్.డి., డి.డీ.లు చదువుటకు వారందరు ఖచ్చితంగా వెళ్ళవల్సిందేనా? తమ చేతులలో కోషేరు రొట్టె పట్టుకొని, ద్రాక్ష రసమును తీసికొని ప్రభురాత్రి బోజనమునమిచ్చుటకు, ఆ దారిన కొందరు యాజకులు ఖచ్చితంగా రావల్సిందేనా?

ACTS 2:2-4

 

74ఔషదము (టీకా) దాని మార్గమున దిగి వచ్చుచున్నది. "అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, వారు కుర్చుండి యున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరు పరిశుద్ధాత్మతో నింపబడినవారై, ఆ ఆత్మ వారికి మాట్లాడు శక్తి అనుగ్రహించినకొలది అన్యబాషలతో మాట్లాడసాగిరి."

పాత దేవలయము యొక్క పటమును మీరెప్పుడైన చూశారా? పైకి వెళ్ళుటకు ప్రక్కన ద్వారముండేది, మెట్ల గుండా పైకి వెళ్ళుటకు, మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళుటకు అది ఉండెను. సంఘ శాఖలకు వారు భయపడినందున పైకి వెళ్ళి తలుపులు వేసికొనిరి.

పొగరు మీద నున్న గిత్తను ఎలాగైతే నియంత్రించటం కష్టమో మరలాగే ఔషదము (టీకా)ను పొందిన వీరిని నియంత్రించటం కూడా కష్టం. అవునండీ, అతడు ఆ గదిలో నుండి ధైర్యంగా బయటికి వచ్చి వీదులలోనికి వెళ్ళెను. కారణం అతడు టీకాను పొందుకొన్నాడు. మరణము, పాతాళము, శ్రమ, హేళనలు, అపహాస్యములు అతనిని ఏమీ కదిలించలేవు. ఎందుకనగా అతడు టీకాను పొందుకొన్నాడు. ఆమేన్. ఓ, మై!

JER 8:22•

ACTS 2:38,39

 

75అక్కడ పేతురు నిలబడి చెప్పేది వినండి. వారు ఇలా అనటం మొదలు పెట్టారు, "గిలాదులో ఇంకా మరే గుగ్గిలం లేదా? గిలాదులో ఇంకా మరే గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా?"

ఓ, అవును గిలాదులో సరిపోయేటంతా (సమృద్ది) గుగ్గిలం వుంది. కావల్సినంతమంది వైద్యులు ఉన్నారు. ఆ దినమునకు వైద్యుడైన సీమోను పేతురు, అతడు ఒక వైద్యుడు. అతడన్నాడు, నేనొక మందు చీటిని మీకు వ్రాయబోవుచున్నాను. నేను మీకు చెప్పబోవుచున్నాను. నేను వ్రాసియిచ్చే ఈ మందు చీటి నిత్యమైనది, ఎందుకనగా అది మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని అవసరమై వుండును. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభువగు మన దేవుడు తన యొద్దకు పిలచిన వారందరికి అవసరం. దానిని నేను మీకు ఇవ్వబోవుచున్నాను.

వారడిగారు, ఆ టీకాను పొందుకోవాలంటే మేమేమి చేయ్యాలి? ఆ టీకాను తీసికోవాలంటే మేమేమి చేయాలి? అందుకతడు, "మీకు అవసరమైన మందు చీటి వ్రాస్తున్నాను, అదేమిటనగా "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం మిలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరమును పొందుదురు. ఈ మందు చీటి మీ కొరకు మీ పిల్లల కొరకు దూరస్తులందరి కొరకు, అనగా ప్రభువగు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరి కొరకు." ఓ, మై.

76ఒక జబ్బు తగించుట కొరకు వైద్యుడు ఒక మందును కనుగొంటే, దానిని మందు చీటి మీద వ్రాసి అది ఏ మందుల షాపునందు లభ్యమగునో అచ్చటికి పంపును. అయితే ఆ మందుల షాపువాడు దానిని కాకుండా మరేదేదో ఇచ్చి యుండినట్లైతే, ఈ రోగికి అది గిట్టోచ్చు లేక గిట్టక పోవచ్చు, అవసరమైతే అది వికటించి ప్రాణాలు కూడా పోవచ్చు. వైద్యుడు తన మందు చీటి మీద మంచి మందే వ్రాశాడు, కాని మందుల షాపువాడు చేసిన కపటపని వలన అపాయము సంభవించవచ్చును.

నేడు ఈ సెమినరీల మందుల షాపుల్లో కూడా ఇలానే వున్నది. మందు చీటిలో వ్రాసిన దానిని తొలగించి, దానికి బదులుగా వారు చీటిలో లేని మందులను అమ్ముచున్నారు. ఇందువల్లె ప్రపంచము మరణావస్థలోనికి దిగిపోవుచున్నది.

JER 8:22•

ACTS 19:2-7

 

77మందు చీటిలో ఇప్పటికి మార్పులేకుండా ఉన్నది.

సమరయులు దానిని పొందుకొన్నప్పుడు, వారు టీకాను తీసికొనిరి, వారు దానినే తిసుకోనిరి. అన్యులు దానిని తీసుకొన్నప్పుడు, వారునూ ఆ మందు చీటినే తిసుకోనిరి.

అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు కొంత మందిని కలిశాడు, వారు కూడా ఈ మందు చీతిలోని కొంత భాగమును కలిగియుండిరి, (పూర్తిగా కాదు, కొంత భాగము కలిగియుండిరి.) ఆయన ఇలా అన్నారు, "అది పనిచేయదు. దానిని ఇచ్చినట్లైతే ఇక్కడున్న వారంతా చచ్చెదరు." కావున అతడు అక్కడున్న కొందరికి ఆ ఔషదమును వ్రాసి ఇచ్చాడు, ఎలా పొదుకోవాలో వారికి చెప్పాడు, అందరు పొందుకొన్న రీతిగానే వారు పొందుకొనిరి.

నేడు కూడా సంగతి అదే. గిలాదులో ఎంతో సమృద్దిగా గుగ్గిలము వున్నది, అనేక మంది వైద్యులు కూడా అందుబాటులో వున్నారు; కాని జనులు ఆ మందు చీటిని చూసి భయపడుచున్నారు. మహిమ! దేవునికే స్తోత్రం. గిలాదులో ఏ గుగ్గిలం లేదా? పరిశుద్దాత్మ శక్తి అక్కడ లేదా?

ఇప్పుడక్కడ వున్నదా…? ఈ టీకా అందరికి పనిచేయును. అది యూదులకి పనిచేసింది. అది సమరయులకు పనిచేసింది. అన్యులకు కూడా అది పనిచేసింది, అది ప్రతి ఒక్కరికి ఒకే విదంగా పనిచేస్తు౦ది.

JOHN 15:5•

ACTS 2:39

 

78నేనొక మిషనరీని. నేనొక దేశము వెళ్ళాను, అక్కడ జనులు అనాగరికులు (కుడి ఎడమలకు తేడా తెలియదు) వారక్కడున్నారు. వారు మీవలే పరిశుద్దాత్మను పొందుకొన్నప్పుడు వారేమి చేసారో తెలుసా? మీరేమి చేశారో వారు కూడా అదే చేశారు.

ఓ, ఏమిటది? "అది మీకొరకు మీ పిల్లల కొరకు దూరస్తులందరి కొరకు, అనగా ప్రభువగు మన దేవుడు తన యొద్దకు పిలచినవారందరికి చెందినది." అదే మందు చీటి, అంతటా అందరికి ఒకేలా పనిచేస్తుంది.

ఆరంభమందు దేనినైతే సంఘము చేసిందో, మరిప్పుడు కూడా అదే కార్యమును అది చేస్తుంది. కచ్చితముగా నిజము.

యేసే నిజమైన ద్రాక్షవల్లి; మనము ఆయన తీగలము. ద్రాక్షవల్లిలో వున్న జీవము చేత మనం ఆ టీకాను పొందుకొనియున్నాము. టీకాను పొందుకొని బయటకు వెళ్ళిన సంఘము ఒక అపొస్తులుల కార్యముల గ్రంథమును వ్రాసెను. ఇప్పుడు, మనము కొన్ని ప్రత్యామ్నాయాలను పొందుకొన్నాం. మనము కొన్ని అంటుకట్టబడిన ఫలముల (మిశ్రమ ఫలముల)ను పొందుకొన్నాం. అవి చెట్టునుండి కోయబడిన తర్వాత తిరిగి ఫలించుటకు పనికిరావు. అది నిజము.

79కొద్దికాలం క్రితం నేను ఫినెక్స్ లో వున్న నా మిత్రుడు జాన్ షరియట వద్ద ఉన్నాను. అతడికి ఒక నారింజ (కమలా) చెట్టు కలదు. అయితే అదొక ప్రత్యేకమైన చెట్టుగా వున్నది, ఎందుకనగా ఆ చెట్టులో ఐదు రకములైన ఫలములను నేను చూశాను.

"ఓ, ఇలాంటి దానిని నేనెన్నడు చూడలేదు" అని అన్నాను.

అందుకు అతడన్నాడు, "అవి అంటుకట్టబడినవి."

నేను అడిగాను, "అసలు అదేరకమైన చెట్లు?"

అతడు చెప్పాడు "అది నారింజ (కమలా)చెట్టు."

"మంచిది, దానికి నిమ్మకాయ, దబ్బకాయ, నారింజకాయ, ద్రాక్షపండు ఇంకా ఏవేవో ఫలాలు దానికి పండినవి. ఆ ఒక్క చెట్టు నుండే ఇవన్ని పండినవా? అని నేనతనిని అడిగితిని."

"అవును, ఆ ఒక్కదానినుండే ఇవన్ని పండినవి?" అని అతడు నాకు బదులిచ్చాడు.

"ఓ, అది భలే వింతగా వుందే? సరే, ఈ సంవత్సర అన్ని పండ్లు రాలిపోయిన తరువాత, వచ్చే సంవత్సరం నారింజ పండ్లనే కాస్తుందా?" అని నేను అడిగాను.

"ఓ, లేదు, లేదు. దీని కొమ్మకు ఏవైతే అంటు కట్టబడినవో, ఆ కొమ్మ ప్రకారమే ఆ పండ్లను ఫలిస్తుంది," అని జవాబిచ్చాడు.

అందుకు నేను అడిగాను, "దానర్థం ఆ చెట్టు నారింజ చెట్టు నుండి మరి దేనికైనా మారునా…?"

"లేదు, లేదు. ఈ చెట్టు మరో కొమ్మ క్రొత్తగా పుడితే, ఆ కొమ్మకు నారింజ ఫలమే వస్తుంది," అని చెప్పాడు.

"అవునా" అని పలికాను. ఆమేన్.

HEB 13:8

 

80సహోదరుడా, సంఘ శాఖలు ఒకదానికొకటి ఆ విధంగా అంటుకట్టబడి తమ్మును తాము క్రైస్తవులమని చెప్పుకొంటున్నాయి. ఆ చెట్టులో వున్న జీవము తనలోనే మరొక కొమ్మను తీసికొని వచ్చినట్లైతే, దాని నుండి దాని ఫలమే పండును. నిజమైన చెట్టు తనలోవున్న జీవాన్నిబట్టి తన ఫలాన్ని ఫలించినట్టు నిజక్రైస్తవుడు కూడా నిజమైన వాక్యజీవం పొందుకొంటే, అప్పుడొక అపోస్తుల కార్యములు వ్రాయబడును. ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. వారికి ఈ లోకమును గూర్చి దాని సిరి సంపదలను గురించి ఏ మాత్రం పట్టదు.

జనులు బైబిల్ ను చదువుతారు, సంఘశాఖ కోణంలో నీవు ఈ బైబిల్ ను చదివినట్లయితే, దీనిలో నుండి ఎక్కువ నీవు పొందలేవు. అయితే నీవు కేవలము అది ఏమి చెప్పుచున్నదో నేవు చూచినట్లయితే, మరియు మందు చీటి ఏమి చెప్పుచున్నదో దానికి నీవు లోబడుము — చదువుము, లోబడుము — అది నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చువరకు.

81కొద్దికాలం క్రితమే నేను ఇండియా ట్రిప్పు ముగించుకొని వచ్చాను. ఇక్కడున్న ఒక స్త్రీని గురించి నేను విన్నాను. ఆమె కఠిక పేదరికంతో అల్లాడిపోతుంది. వైద్య చదువుల నిమిత్తం ఆమె కుమారుడు ఇండియా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు వైద్య వృత్తిని విడిచిపెట్టి మరొక రంగంలోకి అడుగు పెట్టాడు. అతడు ఒక ఎలక్టికల్ ఇంజనీర్ లేదా అలాంటిదేదో అని నేననుకొనుచున్నాను. ఈమె దిన దినము దారిద్ర్యంతో బ్రతుకును నెట్టుకొస్తుంది. ఆమె పరిస్థితి చాలా దిగజారి పొయింది. ఆమె ఏమీ లేని స్థితికొచ్చింది గనుక ఒక అనాదాశ్రయం వారు ఆమెను చేరదీయాలని ముందుకు వచ్చారు. వారు ఆమెను గూర్చి ఆరా తీశారు. అందులో ఆమెకంటు ఒక ఆధారం వున్నదని తేలింది. ఆ ఆదారం ఆమె కుమారుడని, ఇప్పుడతడు ఇండియాలో పెద్ద ధనవంతుడని వారికి తెలియవచ్చింది.

అప్పుడు వారు ఆమెను ఇలా అడిగారు "సరే, నీ కుమారుని నుండి నీవు సహాయము ఎందుకు తీసికోకూడదు?"

"ఓ నేను అతడిని అడుగలేను, నేను అతని తల్లిని. నోరు తెరచి నా కుమారున్ని అడుక్కునే దానికంటే అనాధాశ్రయంలో చేరటం మేలు అని నాకపించుచున్నది" అని ఆమె చెప్పింది.

వారడిగారు "అతనికి నీకు మధ్య ఎటువంటి రాయబారాలు, కబురు లేవా?" "లేకపోవటమేమిటి, నెలకి కనీసం ఒకటి రెండు సార్లు మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకొంటాం, అంతేకాదు మీరు ఎన్నడు చదవనంత మధురమైన ఉత్తరములు అతడు నాకు వ్రాయును" అని ఆమె పలికింది.

అందుకు వారు "మంచిది, తన తల్లిని అతడు ప్రేమించినట్లైతే, అతనికి బోలెడంతా డబ్బున్నట్లైతే మరి ఆ తల్లిని ఒంటరిని చేసి అనాదాశ్రయానికి ఎందుకు పంపును. తానే పూర్తిగా ఆమె బాధ్యతను తీసికొని ఆమె యొక్క ఆలనా పాలనా చూసుకోవచ్చుగా" అని వారన్నారు.

అందుకామె "మంచిది, నేనిలా వున్నానని ఒకవేళ అతనికి తెలిసినయెడల, అతడు తప్పకుండా నా అవసరాలు తీరుస్తాడు. అయితే నా సంగతిని నేనే అతనికి తెలియనియ్యలేదు, నా సంగతి తెలిస్తే అతడు కలవరపడునేమో, గనుక నా దీన పరిస్థితిని చెప్పి అతనిని బాధించటం నాకిష్టంలేదు" అని ఆమె పలికినది.

"అతని యొద్ద నుండి నీకింకా ఆ మధురమైన ఉత్తరాలు వచ్చుచున్నవా?" అని వారు అడిగారు.

"ఓ, ఎందుకురావు, అతడు వ్రాసిన కొన్ని మధురమైన ఉత్తరాలు మరియు వాటితో పాటు మీరింతవరకు చూడని చక్కని ఫోటోలు మీకిప్పుడే చూపెదను" అంటూ ఆమె పలికినది.

"చక్కని ఫొటోలా ఏవి చూపండి" అంటూ వారు ఆమెను అడిగారు.

ఆమె తన బైబిల్ని తెరచి, వాటిలోవున్న కొన్నింటిని బయటకు తీసి చూపినది. అయితే అవి ఏమిటో మీకు తెలుసా? బ్యాంక్ డ్రాప్స్ (ఇండియా రూపాయల నోట్లు తెలిపే డ్రాప్స్). మీరు చూడండి, అవి చాలా అందముగా ఉన్నాయి. ఆ ఇండియా రూపాయల్ని డాలర్లలోకి మారిస్తే అవి వేలాది డాలర్లు అగును. అటువంటివి ఆమె వద్ద చాలా వున్నాయి. ఆమె తన సొమ్మంతా బైబిల్ లోనే దాచుకొన్నది. కాని అది సొమ్ము అన్న సంగతి ఆమెకి తెలియదు (ఇండియా నోట్లని అందమైన బొమ్మలనుకొన్నది - అనువాదకుడు), తర్వాత అవి డబ్బులన్న సంగతిని ఆమె తెలుసుకొన్నది. అవి ఎంతో ఉపయుక్తముగా ఆమెకి ఉండినవి.

ACTS 2:39•

HEB 13:8

 

82సహోదరుడా, నీవు పెంతెకోస్తు అగ్నిని తేలిపే చిత్రీకరించబడిన సంగతులను నీవు తెలిసికొన ప్రయత్నించుచున్నప్పుడు, ఎవరో నీ యొద్దకు వచ్చి ఆ పరిశుద్దాత్మ పొందటం అనేది ఆ రోజులకే సరిపోయినది, ఈ దినాలలో అది కుదరదనియు, అద్భుతములు జరిగే రోజులు గతించిపోయాయి ఇక ఈ రోజున వాటిని నమ్మటం బూటకమనియు; యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకేరీతిగా వున్నాడని నమ్మటం వ్యర్ధం అనియు చెప్పుటకు ప్రయత్నించెదరు.

అవి చిత్రికరణలు కావండీ అవి వాస్తవములు. సర్వశక్తిగల దేవుడు ఆ వర్తమానమును నీకు పంపియున్నాడు, అది నిజం. "అది నీ కొరకు, నీ పిల్లల కొరకు, దూరస్టులందరి కొరకు పంపబడియున్నది. "దేవుడు ఇంకా దేవుడే. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకటేరీతిగా ఉన్నాడు. నశించిన వారిని రక్షించుటకు ఆయన ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. రోగులను స్వస్థపర్చటానికి, పరిశుద్దాత్మతో నింపబడాలని ఏవరైతే ఆశ కలిగివుంటారో వారిని నింపటానికి, ఆయన ఇక్కడ ఉన్నాడు.

దానిని మీరు నమ్ముదురా. మీరు నమ్మగలరా? అవునండీ.

నీవు నమ్మితే ఇక్కడ వాక్యమందున్న ఈ వాగ్దానమును నీవు చూచెదవు. నీవు దాని యొద్దకు వచ్చి అందున్న ప్రతి వాగ్దానమును కనుగొనగలవు. ఈ వాగ్దానము మీకు చెందినది. పేతురన్నాడు "ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికి చెందియున్నది." దానిని నీకు మార్చుకొనుటకు భయపడవద్దు. అది పరలోకపు బ్యాంక్ నగదు. దానిని నీవు పొందుకోవచ్చును. అవును, అది నిజం. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు!

83ఈ రాత్రి ఆయన ఇక్కడ నిలబడి జబ్బుతో వున్న ఆ స్త్రీని చూచుచున్నాడు. ఆమె చాలా బలహీనముగా కనబడుచున్నది, అవిటితనంతో వుంది, బహుశా పక్షవాతం, లేక మరేదో కావచ్చునేమో, ఇద్దరు స్త్రీలు. ఒక స్త్రీ, ఒక వర్ణసోదరుడు ఒక నల్లరంగు సోదరి వున్నారు, చిన్న బిడ్డతో వారు కనబడుచున్నారు. ఆయన ఈ రాత్రి ఇక్కడ ఒక వైద్యునిగా (స్వస్థతపర్చువాని)గా వున్నట్లైతే నీవు ఏం చేతువు? వారిని ఆయన బాగు చేయునని నీవనుకొనుచున్నావా? ఆయన దానిని ఇదివరకే చేసి ముగించాడు. గమనించారా? ఆయన కల్వరి యొద్ద చనిపోయినప్పుడే ఆయన దానిని చేసి ముగించాడు.

అనారోగ్యంతో వున్న మీరు దానిని నమ్ముదురా? అది నిజమని మీరు నమ్ముదురా? చిన్న బిడ్డతో అక్కడ వున్న నల్లరంగు స్త్రీ! యేసుక్రీస్తు కల్వరి యొద్ద చనిపోయెనని నీవు ఆయనను నమ్ముదువా? ఆయన నీ బిడ్డ స్వస్థత కొరకు వెల చెల్లించియున్నాడు.

అక్కడ మంచం మీదన్న నీవు. నీవు చాలా బలహీనంగా కనబడుచున్నావు. నీకు పక్షవాతం వచ్చింది, లేక అలాంటిదేదో వచ్చింది. నీ రోగాలనుండి నిన్ను రక్షించుటకు యేసుక్రీస్తు కల్వరి యొద్ద చనిపోయాడని నీవు నమ్ముదువా? ఈ రాత్రి నేను ఏదైతే చెప్పానో అది నిజమని నీవు నమ్ముదువా? మందు చీటి వాస్తవమని నీవు నమ్ముదువా?

ISA 53:5

 

84ఈ రాత్రి ఆయన ఇక్కడ నిలబడినట్లైతే, నీవు ఆయనను అడుగుము, "నీవు నా బిడ్డను స్వస్థపర్చవా?" అప్పుడు ఆయన ఏమి చెప్పునో నీకు తెలుసా?

"దానిని నేను ఇదివరకే చేసి ముగించితిని," గమనించావా. "నీవు కేవలం దానిని నమ్ము," చూశావా.

"అయ్యా, నేను అవిటివాడను. నేను నడువలేను, [లేక మరేదైనా]," అని నీవు చెప్పినట్లయితే.

"నేను చనిపోవుచున్నాను," లేక మరేదైనా.

"నన్ను రక్షించవా?" అని నీవు అన్నట్లైతే, ఆయన ఇలా అనును "దానిని ఎప్పుడో నేను చేసి ముగించితిని," చూశారా.

అది ఆయన స్వరమని నీవెలా తెలిసికొందువు? ఇది వరకు ఆయన వేటినైతే చేశాడో వాటినే ఆయన చేయును. అంతేకాదు ఆయన నీ గురించి, నీ అక్కర గురించి, నీ సమస్యను గురించి తెలియపర్చగలడు. ఎందుకనగా ఆనాడు ఆయన దానిని చేసియుండెను, మరి ఈనాడును ఆయన అదే చేయగలడు. అందును బట్టి అది ఆయన స్వరమని నీవు తెలిసికోవచ్చును. స్వస్థత విషయానికొస్తే, స్వయంగా నీవే దానిని ఒప్పుకోవాలి. "మన దోషముల నిమిత్తం ఆయన నలుగ గొట్టబడెను, ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థతనొందితిమి." దానిని మీరు నమ్ముదురా?

మీరెందుకు అక్కడ పడియున్నారో, మీ సమస్య ఏమిటో అనే దానిని ఆయన ఈ రాత్రి నాకు తెలుపగలడని మీరు నమ్ముదురా? చెప్పిన దానిని అంగీకరించి, ఆయన ప్రవక్తగా నన్ను మీరు నమ్ముదురా? మీరు?

ఆమె ప్రక్కనవుండి, బిడ్డ మీద చేతులుంచిన అమ్మాయా! ఏమిటి నీ సంగతి, నీవు నమ్ముదువా? మంచిది, దానిని ఎందరు నమ్ముదురు?

85ఇప్పుడు, పరమతండ్రీ, నేను నీ సేవకుడను. ఇప్పటి వరకు నీ వాక్యమును బోదించు బాద్యతను నేనిప్పటి వరకు చేసితిని. ఇప్పుడు ఇది అసాధారణమని నేనెరుగుదును, ఇది సత్యమని ప్రజలు తెలిసికొనునట్లు ఈ రాత్రి దీనిని అనుమతించమని నేను ప్రార్ధి౦చుచున్నాను.

మంచిది, ఈ వైపున చూడండి. నీ బిడ్డకి ఎముకలకి సంబందించిన వ్యాది వున్నది. దాని వల్ల కాలు బాగా వాచెను. అది నిజమేనా? బిడ్డ మీద చేతులుంచి నేను చెప్పింది చెప్పుము, "ప్రభువైన యేసూ, నా బిడ్డను స్వస్థపర్చండి, నా జీవితమంతా నేను నిన్ను సేవింతును." ఈ టీకాను ఇప్పటి వరకు నీవు తెలిసికొనకపోతే, నీ హృదయపూర్వకముగా దానిని నమ్ముము. అలాగే బిడ్డ కాలి చుట్టూ దారం పెట్టి ఈ రాత్రి కొలువుము, రేపు దానిని నాకు చూపించుము, ఈ రాత్రికి రేపటికి ఎంత తేడా వుందో నీకు అర్థమగును. దానిని నీవు చేయగలవా?

86అక్కడ, వారి తర్వాత పడివున్న నీవు! నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముదువా? నేనింత వరకు నిన్ను చూడలేదు, కాని నీవు అక్కడ పడియున్నావు. మరణఛాయ నిన్ను కమ్ముకొన్నది. ఆ స్త్రీ చుట్టూ చీకటి చాయ కమ్ముకొనియున్నది. ఆమె కాన్సర్ తో బాధపడుచు మరణానికి చాలా దగ్గరగా వచ్చినది. అది వాస్తవం. అయితే దేవుడు నిన్ను స్వస్థపర్చునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మగలవా? చనిపోయేటంత వరకు నీవు అక్కడ పడివుండటం ఎందుకు? నీ పరిస్థితిని ఏ వైద్యుడు బాగుచేయలేడు. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పైకి లేచి, నీ పరుపెత్తుకొని పొమ్ము.

నీవు నమ్ముచున్నావా? నమ్మేవారంతా మీ స్వస్థతను అంగీకరించి, లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతలు తెలపండి. "ప్రభువుకు స్తోంత్రం" అని అందరం చెప్పుదాం. ప్రతిఒక్కరు చెప్పండి మీరాయనను నమ్ముదురా? ఇప్పుడు, మీరు మీ చేతిని దేవునితట్టు ఎత్తి ఆయనను స్తుతించండి. మీరు నమ్ముదురా? గిలాదులో గుగ్గిలం లేదా? దేవుని శక్తి దానిని చేయును. మనమందరం లేచి నిలబడదాం, ఇప్పుడు ప్రతి ఒక్కరు, దానిని నమ్ముటకు అవసరమైన విశ్వాసము గలవారై నిలబడదాం, ప్రతిఒక్కరు, యేసుక్రీస్తు నామమున నీ విడుదలను అంగీకరించుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...