ఓ ప్రభువా, కేవలం మరొక్కసారి
1స్నేహితులారా, ఉదయకాల శుభాకాంక్షలు లేక మధ్యాహ్నశుభాకాంక్షలు. నా చేతి గడియారంను పోగుట్టుకున్నాను. ఇప్పుడు ఏ సమయమో నేను చెప్పలేను. [ఒక సహోదరుడు అన్నాడు, "ఇంకా ఉదయమే, సహోదరుడా."] ఇంకా ఉదయమేనా, మంచిది.
మనము నిత్యత్వములో జీవిస్తున్నాం, మనకు కాలము లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నాలో జీవించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడో అప్పుడే కాలము యొక్క పరిది నిలిచిపోయింది. కాబట్టి మనము ఇప్పుడు యేసుక్రీస్తులో పరలోక స్థలములలో కూర్చొని ఉన్న నిత్యులం. ఆహా! ఏమి సమయము.
ఇక్కడ మీతో ఇది నా రెండవ రోజు, కానీ ఉదయకాల మన చల్లని మొలాసిస్ వలె ఉంది. ఇది ఏంతో దట్టముగా మరియు అద్భుతముగా ఉంది. నేను ఈ విధముగా మరి ఏ కూడికలోనూ ఆనందించలేదు. రాత్రి ప్రజలు చాల ఎక్కువ ఉన్నందున ఎవరినీ కలుసుకోనలేకపోయాను కానీ ఈరోజు చూడగలుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన పరిచారకుల గుంపుతో కరచాలనము చేసే భాగ్యం నాకు దొరికింది.
2మా సంఘమునకు వచ్చే జాన్ రియాన్ అనే వృద్దుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. అతడిని రియాన్ పెద్ద అని పిలిచేవారు. అతను మిచిగాన్ లోని డోవాజియాక్నుండి వచ్చాడు. అతడు కొంచెం ప్రసంగించి, నాదగ్గరకు వచ్చి కరచాలనం చేసి తర్వాత వెళ్లి మరి కొంచెం ప్రసంగించి మరలా వచ్చి కరచాలనం చేసేవాడు. "సహోదరుడా రయాన్, నేను దానిని అభినందిస్తున్నాను, కానీ మీరు చేస్తున్నది నాకు అర్దం కాలేదు" అని అన్నాను."
బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు నాకు ఛార్జ్ కావాలి, అందువల్ల నేను ఛార్జ్ చేసుకుంటున్నాను " అని అతను చెప్పాడు.
పరిశుద్ధాత్మను పొందుకొనిన, మెథడిస్ట్ పరిచారకుడిని నేను ఇక్కడ చూసాను -నేను అతనికి బాప్తిస్మము ఇచ్చాను. సహోదరుడు జూనియర్ జాక్సన్, నాకు ఎడమ వైపునకు కూర్చొని ఉన్నాడు. ఆ విధముగా అతడు కరచాలనం చేయడం చూశాను, అది నాకు సహోదరుడు రియాన్ను గుర్తుచేసింది. మెథడిస్ట్లు పరిశుద్ధాత్మను పొందుకోలేరు అని ఎంతమంది అనుకుంటున్నారు? మీరు పొరబడ్డారు. సహోదరుడా జూనియర్ జాక్సన్, లేచి నిలబడండి. అతను మరియు అతని ప్రియమైన భార్య, వారు ఇండియానా నుంచి వచ్చారు, అతను ఒక మెథడిస్ట్ పరిచారకుడు.
3విల్లార్డ్ కాలిన్స్ ఎక్కడ? అతను ఈ ఉదయం భవనంలో ఉన్నారా? సోదరుడు విల్లార్డ్ మీరు ఎక్కడ ఉన్నారు? అతను ఇక్కడ ఉన్నాడు అని నేను అనుకుంటునాను. మెథడిస్ట్లు పరిశుద్ధాత్మను పొందుకోగలరని, మరల బాప్తిస్మము తీసుకుంటారు అని మీరు అనుకొనకపోతే, సహోదరుడా కాలిన్స్, లేచి నిలబడండి, అదిగో మరొక మెథడిస్ట్ పరిచారకుడు అక్కడ నిల్చొని ఉన్నాడు. అక్కడ మరొకరు ఉన్నారు. కెంటకి నందు గల విల్మోర్‌లోని అస్బరీ కళాశాలకు చెందిన సహోదరులు, వారు చక్కని మెథడిస్ట్ నేపధ్యం నుంచి వచ్చారు.
ఇప్పుడు ఇక్కడ నాతోపాటు మరికొంత మంది ఉన్నారు. వారు "ఆమేన్," చెప్పడం విన్నాను. మరియు వారు ఇక్కడ ఉన్నారని తెలుసు, కాని వారిని చూడలేకపోతున్నాను. జెఫెర్సన్‌విల్లే వద్ద గల టబర్నకల్ నుంచి సహోదరుడు ఫ్రెడ్ . ఫ్రెడ్ నీవు మరియు సహోదరుడు టామ్ ఇక్కడ ఉన్నారా? అతను, "ఇక్కడ ఉన్నాను", అని చెప్పడం ఆ మూలనుంచి వినిపిస్తుంది.
వీరిని పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. కచ్చితముగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడలేకపోతున్నాను. బహుశా ఇంకా చాల మంది ఉండవచ్చు. మాటలాడుచుండగా సహోదరుడు జాక్ మోర్ ను చూసాను. వీరు శ్రేష్టమైన ప్రజలు మరియు మనము వారిని ప్రేమిస్తున్నాము.
EPH 2:6
4ఇక్కడ ఉండుట ఏంతో అద్భుతమైన సమయం. "ఈ కూడికకు నీవు వచ్చి ఉంవలసింది" అని నా భార్యతో అన్నాను. మనము పాతకాలపు పెంతెకోస్తు కూడికను నమ్ముచున్నాము. ఎక్కడైతే స్వేచ్చ మరియు దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ అన్ని సంఘశాఖల వారు ఒక్కటిగా కలసి సంఘముగా పరలోక స్ధలములో ఉంటారు అని నమ్ముచున్నాము. మన వ్యత్యాసములు అక్కడ ఏ వ్యత్యాసము చూపవు.
మనము క్రీస్తులో ఉన్నప్పుడు, మనము ఆయన రక్తము క్రింద మరియు అయన ప్రేమ సహవాసములో ఉంటాము.
పరిచారకులకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను బాప్టిస్ట్ మిషనరీ నుంచి పెంతెకోస్తుకు వచ్చాను, మరియు పెంతెకోస్తు వారిని గౌరవిస్తున్నాను. వారు నా ప్రజలు, వారిని నేను ప్రేమిస్తున్నాను. దీని కంటే మరేదైనా సరియైన సంఘము ఉందని అనుకొని ఉంటే, నేను ఇతర సంఘములో ఉండేవాడిని కాను. నేను పెంతెకోస్తుతో ఉన్నాను. ఎందుకంటే లేఖనములకు దగ్గరగా ఇది ఉండటాన్ని నేను చూస్తున్నాను. ఏ ఇతర నమ్మకాలను విస్మరించడం లేదు, కానీ, నేను పెంతెకోస్తు గురించి ఆలోచించడానికి గలకారణం అది నాకు తెలిసిన ఏ ఇతర కార్యములు కాదు కాని, నేను ఏది వాక్యానుసారం అని అనుకుంటున్నానో దానికి అది దగ్గరగా ఉంది.
5ఈ కూడికలో నేను ఒక అద్భుతమైన విషయాన్ని గమనించాను. అది శుభ్రంగా ముఖం ( ముఖమునకు రంగు వేసుకోని) కలిగినటువంటి స్త్రీలు. మ్యనిక్యూర్ మొదలైనవి, మీకు తెలిసిన అలాంటి ఏమి లేకుండా, నేను దానిని ఇష్టపడను. అది క్రైస్తవులకు తగినది కాదు. అది నిజము. నేను దానిని ఇష్టపడుతున్నాను. చూడండి, నేను యదార్థమైన ముఖమును ఇష్టపడు పాతకాలపు వాడిని. నేను స్త్రీలను చూచుటకు ఇష్టపడతాను … నేను ఆ విధముగా అనడంలేదు…
ఇది పరిహాసం చేయుటకు మరియు తప్పిదముగా ప్రవర్తించుటకు స్థలము కాదు. నేను దీనిని ఆ అర్థముతో చెప్పలేదు. దానికి ఇది స్థలము కాదు.
అయినను, మీరు దీనిని ఎప్పుడు తెచ్చారు? చూడడానికి ఇది నా మందిరము నుండి వచ్చినట్టు ఉంది. కచ్చితంగా అలానే ఉంది. సంఘమా, నేను చెప్పింది నిజమేనా? మంచిది, ఏది ఏమైనా మనం అక్కడ భోదించిన ఆ పాత వర్తమానము ఇప్పుడు దీనిగుండా మనం వింటాము అని అనుకుంటున్నాను.
2KGS 9:30,33•
EPH 2:19
6పరిశుద్ధ గ్రంధములో ముఖమునకు రంగు వేసుకున్న ఒకే ఒక్క స్త్రీ ఉందని మీకు తెలుసు. ఆమె దేవుడిని కలుసుకోవడానికి ముఖానికి రంగు వేసుకోలేదు. ఆమె పురుషులను కలుసుకోవడానికి రంగు వేసుకుంది. అది నిజము. దేవుడు ఆమెకి ఏమి చేశాడో మీకు తెలుసా? ఆమెను కుక్కలకు ఆహారముగా చేశాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ముఖానికి రంగువేసుకున్న స్త్రీ ని చూస్తే," కుక్క ఆహారమా, ఉదయకాల శుభాకాంక్షలు" అని చెప్పండి. అది కచ్చితంగా అదే అయి ఉన్నది. అది భయంకరంగా ఉంది, కాదా? కానీ దేవుడు దాని గురించి అదే అనుకుంటున్నాడు. అడవి కుక్కలకు ఆహారముగా ఆమె చేయబడింది. ఈలలు వేసుకుంటూ కొన్ని అడవితోడేళ్ళు తిరుగుతూంటాయి, మీకు తెలుసా అవి మ్రింగేస్తాయి. ఆమె అదే అయి ఉన్నది, కేవలము కుక్క ఆహారం.
స్త్రీ లైన మీకు నా కృత్ఞతలు. సిలువ ద్వారా దేవుడు మీకు కృపను ఇచ్చాడు. భూలోకసంబంధమైన కార్యముల నుండి పారిపోండి. మనము మహిమకై మార్గములో ఉన్నాము. మనము వేరొక రాజ్య పౌరులము.
7చాలా కాలం క్రితం… నేను ఆ ప్రజలలో ఒక్కరినైనా చూడగలనా అని ప్రేక్షకులలో చూస్తున్నాను. మరియు అది మన నల్లజాతి సహోదరులు, నీగ్రో. మీకు తెలుసా చాలా కాలం క్రితం ఇక్కడ దక్షిణాదిలో, వారు వీరిని బానిసలుగా చేసేవారు. ఇప్పుడు నేను ఒక దక్షినాదివాడిని. మరియు నేను వారి గురించి చెప్పదలచిన కార్యం ఒకటి ఉంది, నేను మార్టిన్ లూథర కింగ్ తో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ మనుష్యుడు, క్రైస్తవుడు అయ్యుండి, తన ప్రజలను మరణ ఉచ్చులోకి నడిపిస్తున్నాడు అని అతనికి తెలియదు, అక్కడ లక్షలాది మంది చంపబడుతారు, చూడండి. అతను చేసేది తప్పు.
నేను నా నల్ల జాతి సహోదరులను ప్రేమిస్తున్నాను. నేను వారిని ప్రేమించకపోతే, ఈ ఆఫ్రికాలో మరియు చుట్టుపక్కల వారికి బోధించుచు (ప్రసంగించుచు) ఉండేవాడిని కాదు. మనలాగే వారు కూడా దేవుని ప్రజలు. కానీ నేను దానిని నమ్మను… ఆ మనుష్యుడు, దీని క్రింద చాలా మంది చనిపోవుటకు కారణమవుతున్నాడు. అప్పుడు అది మళ్ళీ ఒక విప్లవకారుడుని తీసుకువస్తుంది, అది ఇక్కడ ఉన్న ప్రజల నుండి ఎప్పటికి బైటకి రాదు. కాబట్టి వారు బానిసలు కారు. ఇతరులకు ఉన్నంత స్వేచ్ఛ వారికి ఉంది. వారు బానిసలైతే, నేను ఆ వైపు ఉండేవాడిని. కానీ వారు బానిసలు కారు.
8అది వారు పాఠశాలకు వెళ్ళాలనుకోవడం వలననే. వారికి పాఠశాలలు ఉన్నవి. వారిని పాఠశాలకు వెళ్లనివ్వ౦డి. అది మంచిది.
ఆ అల్లరులలో ఆ ఉదయం నిల్చొని ఉన్న ఆ నల్లజాతి సహోదరుడు గుర్తున్నాడా? అతను మిలీషియా ను మాట్లాడవచ్చా అని అడిగాడు. అతను అన్నాడు" నేను ఒక నల్లజాతీయుడను అని ఎప్పుడూ సిగ్గుపడలేదు. నన్ను చేసినవాడు (దేవుడు) నన్ను ఒక నల్లజాతీయడిగా చేశాడు. కానీ ఈ ఉదయము నేను నా జాతి వారి ప్రవర్తనను బట్టి సిగ్గుపడుతున్నాను. ఆ ప్రజలు మాకు ఏమి చేస్తున్నారు? మాతో మంచిగా ఉండటం మాత్రమే."
ఒక తెల్లజాతి మహిళ లేచి" నా పిల్లలు ఒక తెల్లజాతి మహిళ దగ్గర విద్య నేర్చుకోడం నాకు ఇష్టం లేదు" అని చెప్పింది, ఎందుకంటే నల్ల జాతి స్త్రీ వలె ఆమె నా పిల్లల పట్ల ఆసక్తి చూపదు." వారు… మా పాఠశాలలను చూడండి. మాకు ఈతకొలనులు ఉన్నాయి. మాకు మంచి పాఠశాలలు మరియు అన్ని ఉన్నాయి. మేము వారి పాఠశాలలకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాము? అది నిజం.
9నేను నమ్ముచున్నాను దేవుడు… , వైవిధ్యమునకు దేవుడై ఉన్నాడు. అని నేను చెపాను. ఆయన పెద్ద పర్వతములను మరియు చిన్న పర్వతములను చేశాడు. ఆయన ఏడారులను చేశాడు. ఆయన అడవులను చేశాడు. ఆయన తెల్లని వారిని, నల్లని వారిని, ఎర్రని వారిని చేశాడు. దానిని మనం ఎప్పటికి దాటకూడదు అది సంకరం అవుతుంది. సంకరమైనది ఏది తనంట తానుగా ప్రత్యుత్పత్తి/పునరుత్పత్తి చేయలేదు. మీరు ప్రజల జాతులను నాశనం చేస్తున్నారు. ఒక తెల్ల జాతీయుడు కలిగి లేనటువంటి కొన్ని గుణలక్షణాలు నల్లజాతీయుడులో ఉన్నాయి. తెల్లజాతీయుడు ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు. నల్లజాతీయుడు అతను ఉన్న స్థితి లో సంతృప్తి చెందుతాడు. కాబట్టి వారికి ఆ విషయాలు అవసరం లేదు.
10కానీ బానిసలు ఉండే కాలంలో మనుషులను, వాడేసిన కారులను వేలం వేసే విధంగా బానిసలను అమ్మేవాళ్లు. మీరు వాడిన కారు లేదా మరి ఏదైనా అమ్మి ఎలా సంపాదిస్తారో, అదే విధముగా ఒక కొనుగోలుదారుడు ఆ దేశం గుండా వచ్చి వారిని కొని, అమ్మి డబ్బులు సంపాదిస్తాడు.
దేవుని ప్రణాళిక అది కాదు! దేవుడు మనిషిని చేశాడు; మానవుడు బానిసను చేశాడు. ఒకరు మరొకరిని పాలించకూడడు. మనము ఐకమత్యము మరియు సమాధానము/ శాంతితో కలసి జీవించాలి.
11మరి ఈ మనుష్యుడు ఒక పాత తోట వద్దకు వచ్చి,"నీ దగ్గర ఎంతమంది బానిసలు ఉన్నారు?"అని అన్నాడు." "వంద లేక అంతకంటే ఎక్కువ" అని అన్నాడు.
అతను వారిని చూస్తూ ఉండగా వారిలో ఒక బానిసను గమనించాడు. బానిసలు విచారంగా ఉన్నారు. ఆఫ్రికా బోరేస్ ఆ బానిసలను పట్టుకొని వారిని ఇక్కడికి తీసుకువచ్చి అమ్మివేసారు. వారు ఎప్పటికి వారి సొంత దేశమునకు వెళ్ళలేరు అని ఆ బానిసలకు తెలుసు. వారి జీవితకాలం ఇక్కడే ఉంటారు అని వారికి తెలుసు. వారి పిల్లల్ని వారు ఇక ఎప్పటికీ చూడలేరు. వారి తండ్రిని మరియు తల్లిని వారు ఇక ఎన్నటికీ చూడరు. వారి కాలమంతా ఇక్కడే ఉంటారు. అందువలన వారు విచారంగా ఉన్నారు. వారు కొరడాలను తీసుకువెళ్ళారు. మరియు వీరు పనిచేయుటకు కొరడాలతో కొట్టారు. బానిసలు పనిచేయుటకు ఇష్టపడని కారణాన్ని బట్టి వారు కోరడాకు పని చెప్పవలసి వచ్చింది. వారు కృంగిపోయారు.
JOB 38:7•
HOS 1:10•
JOHN 1:12•
ROM 8:4,19•
PHIL 2:15•
1JN 3:1,2
12బానిసలను కొనే వ్యక్తి అక్కడంతా పరిశీలించి చూసాడు. అతను ఆ బానిసలలో, ఒక యవ్వనస్తుడిని కనుగొన్నాడు. వారు అతనిని కొరడాలతో కొట్టనవసరం లేదు; రొమ్ము పైకి ఎత్తుకొని, తల ఎత్తి, అతను తన పనిలో ఉన్నాడు. మరియు కొనుగోలుదారుడు ఆ బానిసల యజమానితో, "నేను అ బానిసను కొనాలనుకుంటున్నాను" అని అన్నాడు.
"అతను అమ్మకానికి లేదు" అని యజమాని అన్నాడు.
కొనుగోలుదారుడు అన్నాడు" అతను ఇతర బానిసలకంటే భిన్నంగా ఉన్నాడు "
యజమాని అన్నాడు "అతడు భిన్నమే."
కొనుగోలుదారుడు "తేడా ఏంటి?, అతను మిగతావారికి యజమానా?"
యజమాని "లేదు, లేదు. అతను కేవలం ఒక బానిస."
కొనుగోలుదారుడు "మీరు మిగిలిన బానిసల కంటే అతనికి భిన్నంగా ఆహారం పెడుతున్నారా?"
యజమాని అన్నాడు "లేదు. అతను మిగిలిన బానిసలతోపాటు గల్లిలోనే తింటాడు ."
కొనుగోలుదారుడు అన్నాడు "అతనిని ఇంత భిన్నముగా ఏమి చేస్తుంది?"
అతను అన్నాడు "కనుగోనేంతవరకు ఎల్లప్పుడు నేను ఆశర్యపడ్డాను. ఆఫ్రికాలో ఉన్న తన స్వస్థలం లో అతని తండ్రి ఆ తెగకు రాజు. మరియు అతను ఇక్కడ ఉన్నప్పటికీ అతను ఒక రాజు కుమారుడు అని అతను ఎరిగి ఉన్నాడు మరియు అతను అలానే ప్రవర్తిస్తున్నాడు."
హల్లెలుయ! నీవు రాజు కుమార్తెవైతే లోకస్తులవలె ప్రవర్తించకు. నీవు రాజు కుమారుడవైతే, లోకస్తులవలె ప్రవర్తించకు. మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలము అని మనకు తెలుసు. మరణము మరియు దుఃఖము ఉన్న ఈ చీకటి ప్రపంచంలో మనము ఉన్నప్పటికి, మన స్వాస్త్యం ఎక్కడ ఉందో మనకు తెలుసు. మనము ఒక రాజు కుమారులము మరియు కుమార్తెలము; ఒక రాజు కాదు కానీ ఆ ఒక్కడే రాజు. ఆ విధంగానే ప్రవర్తిద్దాం.
MATT 27:32•
MARK 15:21•
LUKE 23:26
13కొద్ది క్షణాల క్రితం, నేను ఆలస్యం కావడానికి కారణం, గది శుభ్రం చేస్తున్న ఒక చిన్న ఇథియోపియన్ అమ్మాయి, మరియు ఆమె ఏదో చేస్తున్నట్లు నేను గమనించాను. నేను మాట్లాడాలని అనుకున్నాదానికోసం కొన్ని లేఖన వాక్యాలను రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కేవలం వినడానికి, మాట్లాడానికి రాకండి, సంఘానికి సహాయపడేది చెప్పడానికే నేను వస్తాను, కొంత సహాయం చేయడానికి. ఆపై అధ్యయనం చేస్తుండగా, ఈ చిన్న స్త్రీ అక్కడే ఉంది. నేరుగా ఆమె అన్నది, "అయ్యా మీరు నన్ను క్షమించుతారా?"
మరియు నేను, "అవును మామ్" అని అన్నాను.
మరియు ఆమె అన్నది , "మీరు దేవుని వద్ద అనుగ్రహం పొందిన వ్యక్తి అని, జబ్బుపడినవారి నిమిత్తము మీరు దేవుడికి ప్రార్ధించినప్పుడు, దేవుడు మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అని వారు నాకు చెప్పారు."
నేను అన్నాను, "అతను నాకు మాత్రమే సమాధానం ఇవ్వడు, కాని ఆయనను విశ్వసించే ఎవరికైనా ఆయన సమాధానం ఇస్తాడు."
ఆమె, "అయ్యా నేను అనారోగ్యంతో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయమని అడగడం మిమ్మల్ని అభ్యంతరపరచదు కదా? "
"అస్సలు కాదు" అన్నాను .
నేను ఆమె దగ్గరకు అడుగు వేసి, నేను ఇలా ప్రార్థించాను: "ప్రభువైన యేసు, చాలా సంవత్సరాల క్రితం, మీరు కఠినమైన శిలువను ఇసుక కొండపైకి లాగుతున్నప్పుడు, మీ భుజము నుంచి కారిన రక్తంతో అడుగులు వేసారు. మీ చిన్న, బలహీనమైన శరీరం చాలా బలహీనపడింది. మీరు ఆ భారము క్రింద పడిపోయారు. సీమోను అను పేరుతో ఒక నీగ్రో వ్యక్తి నిలబడి ఉన్నాడు, అతను సిలువను ఎత్తుకొని, దానిని మీరు మోయడానికి మీకు సహాయం చేశాడు. ఈ ఉదయం అతని పిల్లలలో ఒకరు ఇక్కడ అనారోగ్యంతో ఉన్నారు." అది జరిగిన సమయములో, ఆయన సమస్త మానవాళికి దేవుడు.
14స్నేహితులారా , మీరు మంచి ప్రేక్షకులు. మరియు నేను … సుదూర ప్రదేశం నుంచి పరిచర్య నిమిత్తము దెయ్యములు, మంత్రగత్తె మొదలైనవారి ముందు నుంచి వచ్చునప్పుడు అవి మిమ్ములను సవాలు చేయవని మీరు అనుకుంటున్నారా. వాటి ముందుకు మీరు వచ్చినప్పుడు మీరు ఏమి మాట్లాడుతున్నారో యెరిగి ఉండుట మంచిది. అలాంటి పరిస్థితుల గుండా వచ్చే, క్రైస్తవులైన మీ మద్యలోకి రావడం, ఈ విధముగా ఇక్కడ నిలబడే వ్యక్తికి ఎంత విశ్రాంతిని ఇస్తుందో మీకు తెలీదు. నేను ప్రేక్షకులలో ఆ వెనుక కూర్చుని అభిషిక్తులైన ఈ సహోదరులు వాక్య ప్రసంగాన్ని విని, చేతులు పైకెత్తి, ఏడుస్తూ, అరుస్తూ ప్రార్దన చేయడానికి ఆశపడుచున్నాను. ఈ చక్కటి మాటలు వినాలని కోరుకుంటున్నాను. అభిషిక్తులైన సహోదరులు వాక్యాన్నిప్రకటిస్తూ ఉండగా, నేను నా చేతులను పైకి లేపి ఏడుస్తూ, కేకలు వేస్తూ ప్రార్దిస్తాను. ఆహా, అగ్ని ద్వార వేడెక్కడం. ఇది చాలా అద్భుతమైన విషయం.
15నా సహోదరులారా, నన్ను ప్రేమించే చాలా మంది సహోదరులను నేను కలిగి ఉన్నాను, మరియు వారు నన్ను మాట్లాడమని అడుగుతారు. అందువలన నన్ను ఆ రాజు పరిచర్యకై పిలిచారు అని నాకు తెలుసు, నేను చేయగలిగినంత శ్రేష్టముగా దానిని చేయడానికి నేను ప్రయత్నించాలి, కానీ నేను చాలా సమయము చెప్పడం వలన ఎక్కువ సేపు చేస్తాను. మీరు మీ భోజనం కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు, ఈ ఉదయము ఎనిమిది గంటల నుండి మీరు ఇక్కడే ఉన్నారు. కానీ మద్యాహ్నము కొంత సమయము మాత్రమే మీతో మాట్లాడాలి, అని నేను అనుకున్నాను. నేను చెప్పదలచిన కొన్ని సంగతులు మరియు కొన్ని లేఖన వాక్యాలు ఇక్కడ రాసుకున్నాను. మరియు దానిని చేస్తున్నప్పుడు మీరు నాకన్నా ఈ స్ధలములో నిలబడుటకు శ్రేష్టమైన మరియు దైవపిలుపు కలిగిన మనుష్యులను మీరు కలిగి ఉన్నారు అని ఆలోచించాను. కానీ నా పరిచర్య జబ్బుపడినవారి కోసం ప్రార్దించడం, దర్శనాలను చూడటం మొదలైనవి.
16కొన్ని నిమిషాల క్రితం ఒకరితో మాట్లాడుతున్నాను. గత మాసపు లైఫ్ మ్యాగజైన్ సంచికలో మీరు దానిని చూస్తారు. మీరు ఆ టేప్ తీసుకుంటే. నేను టేప్ సేల్స్ మాన్ కాదు. కానీ మీరు నేను ప్రసంగించిన మాటలు నమ్మి, మీరు దానికి అయ్యే ఖర్చు భరించగలిగితే "ఏడు ముద్రలు" తీసుకోండి మరియు "అయ్యా ఇది ఏ సమయము"ను మొదట తీసుకోండి, ఇది జరగడానికి ఆరు నెలల ముందు చెప్పబడింది, దానిని వినండి. సైన్సు ఆశ్చర్యపోయింది. అది ఎక్కడ జరుగుతుందో అక్కడే నిలుచొని, ఆరు నెలల క్రితం, ఏడుగురు దూతలు పిరమిడ్ లా కనిపించే ఒక కూటమిగా కిందకెలా దిగి వచ్చారో వారితో చెప్పాను. మరియు నేను అరిజోన లోని దక్షిణ టుసాన్ లో నిలబడియుండగా అక్కడ పర్వతములలోని రాళ్ళను కూడా కదిలించగలిగే ఒక గర్జన ఉన్నది. అది జరిగినప్పుడు, ఇక్కడ కూర్చొని ఉన్న సహోదరురుడు ఫ్రెడ్సోత్మంన్ మాతో నిలబడి ఉన్నాడు మరియు వారిలో చాలామంది మాతో ఉన్నారు.
17సైన్సు దాని చిత్రం తీసింది, మీరు దానిని చూసారు… దాని గురించి అసోసియేటెడ్ ప్రెస్ లో వచ్చింది. అది ఏమైయున్నదో వారికి తెలీదు. ఇరవై ఆరు మైళ్ల ఎత్తులో ఒక మేఘం వేలాడుతోంది. అది పదిహేను లేదా ఇరవై మైళ్ళు, ఆవిరి ఉన్న చోట కన్నా పైన. దేని నిమిత్తము ఇది జరుగుతుందో వారికి తెలియదు, మరియు వారు దానిని పరిశోధించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ, దాని కింద, నేను నిలబడి ఉన్నాను. మరియు అక్కడ నిలబడి … ఆ ఏడు దేవదూతలు ఆ ఏడు ముద్రలను వారి స్వరముతో గర్జిస్తున్నారు. మరియు "అయ్యా ఇది ఏ సమయము" టేప్‌లో ప్రవచించిన విషయములకు మేము ముగ్గురము సాక్షులము. మరియు వారు … ఇప్పుడు వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వారికి ఒక మర్మము. వారిలో కొందరు,"వెళ్ళు, వెళ్ళు, మీరు వెళ్లి వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు?" అని అన్నారు.
టెక్సాస్లోని హ్యూస్టన్లో దేవుని దూత వెలుగులో కనిపించిన విధముగా ఉంటుంది. నేను ప్రజలకు చెప్పాను, "నా జీవితమంతా ఆ వెలుగును చూశాను. సంఘమునకు అది తెలుసు. సైన్స్ కి తెలుసు. యేసుక్రీస్తు ఒక కార్యం చేసినప్పుడు ప్రతిది సాక్ష్యమివ్వాలి. మీరు దానిని పత్రికలో చూడొచ్చు, చూడాలనుకుంటే, అది రాక్‌ఫెల్లర్ మరియు అతని భార్య వెనుక భాగంలో ఉన్నటువంటి పత్రికలో ఉంది. అది లైఫ్ పత్రిక యొక్క మే నెల సంచిక అని నేను అనుకుంటున్నాను. ఆయన దేవుడు. మనము చివరి దినములలో జీవిస్తున్నాము.
18సంఘం నిమిత్తము ఏంతో జాగ్రతగా కష్టపడి పనిచేస్తున్న ఈ సహోదర పరిచారకులకు ఉపయోగపడే విషయాలను మాట్లాడానికి ఈ ఉదయం నేను ఇక్కడికి కొన్ని వాక్యాలతో వచ్చాను. మనము సహోదరులము, మరియు వారు అదే పరిచర్యను నమ్ముచున్నారు కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. మీరు ఈ కూడికలో ఈ సమయంలో' రక్షింపబడితే, ఈ రకమైన పరిచర్యను నమ్మేటువంటి ఇక్కడున్న శ్రేష్టమైన సంఘములో మీరు ఎందుకు సభ్యత్వం తీసుకోకూడదు. వారు దానిని నమ్ముచున్నారు, దాని వెనక నిలబడ్డారు.
సంఘమునకు ఉపయోగపడే విషయము చెప్పడానికి నేను వచ్చాను. ఈ దినము పెంతెకోస్తు సంఘము స్థితి అనునది ఈ ఉదయకాలము నా అంశము. మనము ఏ స్థితి మరియు ఏ సమయం లో ఉన్నాము మరియు దాని అవకాశాలు ఏంటి. దానిని మరల నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉంది మరియు దాని ముందు ఉన్న అవకాశాలు ఏంటి.
JUDG 16:27,28
19వాక్యం కొరకు నేను లేఖనము చదవాలనుకుంటున్నాను. మరియు న్యాయాధిపతులు గ్రంధం నుంచి 16 వ అధ్యాయం 27 మరియు 28 వ వచనం చదవాలనుకుంటున్నాను:
ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పుపైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.
అప్పుడు సంసోను "ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనియ్యి" అని యెహోవాకు మొర్ర పెట్టాడు.
నేను దాని నుండి ఒక వచనాన్ని తీసుకోవాలనుకుంటునాను "ఓ ప్రభువా, కేవలం ఒక్కసారి" దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.
JUDG 16:23,27
20ఇది ఒక మాధుర్యమైన మధ్యాహ్నం, ఈరోజు అర్కాన్సాస్‌లోని క్యాంపు గ్రౌండ్స్ లో, హాట్ స్ప్రింగ్స్ నందు మనం ఆనందిస్తునాం. మరియు అక్కడ ఒక గొప్ప వేడుక జరుగుతుంది కానీ ఈరోజు వేడుక దానికి చాలా వ్యత్యాసమైనది. ఆ గొప్ప ప్రాంగణంలో ప్రవేశించిన ఒక వింత అగ్నిని గల్లీలనుంచి మూడువేలకు పైగా ఫిలిష్తియులు చూస్తున్నారు. మరియు అత్యంత గౌరవనీయులైన యుద్దవీరులు మరియు ఫాన్సీ ఆభరణాలుతో అలంకరించిన వారి స్త్రీలందరూ వారి స్థానాలలో కూర్చొని ఉన్నారు.
మరియు అది, ఆ భవనం పుట్టగొడుగు ఆకారము పోలిన ఆధునికమైన కట్టడం వలే ఉన్నది. ఈ గొప్ప వేడుక కోసం ఈ ఫిలిష్తీయులందరూ అక్కడ గుమిగూడి తమను తాము సిద్దపరుచుకున్నారు. ఆ గొప్ప సంబరంలో, ఆ ప్రాంగణం కేంద్రభాగం లో అందరి కళ్ళు కేంద్రీకృతమైయున్నాయి. జరగబోవు ఆ గొప్ప వేడుకను బాగా చూడడానికి వారు నిలబడాలి.
JUDG 16:23,26
21మరి ఇప్పుడు మనము ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నప్పుడు, ఊహత్మక మనస్సుతో, మనకు సాధ్యమైతే చూద్దాం, ఈ దృశ్యాన్ని చూడటానికి మనల్ని ఆ స్థితిలో ఉంచండి.
మనం ఏమి చూస్తున్నాం? ఆ ప్రాంగణం మద్యలోకి పడిపోతూ, దొర్లతూ గుడ్డివాని చేయి పట్టుకొన్న ఒక చిన్న పిల్లవాడు వస్తున్నాడు. చాల కోతుల ప్రదర్శనలు, చిన్న ట్రిక్స్ మొదలుగునవి వారు కలిగియున్నారు, కానీ ఇప్పుడు ప్రధాన కార్యక్రమానికి సమయం వచ్చింది, వారు దాని కొరకు చాలాసేపు వేచివున్నారు, అది ఆ దినము యెక్క ముఖ్య కార్యక్రమం. ముందస్తు పోటీ ముగిసింది, మధ్యాహ్నం హాల్ అంతా తాగిన ఉత్సాహంతో ప్రతిధ్వనించింది. మందసము మరియు యెహోవా దేవుని వాగ్దానం మీద వారి మత్స్య దేవుడైన దాగోను విజయోత్సవాన్ని వారు జరుపుకుంటున్నారు.
JUDG 16:26
22యెహోవా సేవకుల మీద అన్యజనుల దేశం యొక్క మత్య్సదేవుడి విజయాన్ని జరుపుకోవడం, ఇది ఎంత అవమానకరమైన దృశ్యం, అలాంటిది జరుగుతుందని మనం ఊహించగలమా; ఇదంతా కార్యములు చేయుటకు నియమించబడిన వ్యక్తి పనులను నిర్వర్తించడంలో విఫలమగుట వలననే. మరి ఇక్కడ అన్యురాలు, తాగి, గర్షణపడుతూ, ఆభరణములు ధరించిన స్త్రీ, ముఖమునకు రంగు వేసుకొని, ఆధునికమైన హాలీవుడ్ ఉత్సవము మద్యాహ్నం ముఖ్య కార్యక్రమం కొరకు సంకెళ్ళతో బంధించిన యెహోవా దేవుని సేవకుడిని తీసుకు వస్తుంది.
ఆ కుర్రవాడు, తడబడుతూ, ఆ గొప్ప మానవ శరీరము, రెండు కళ్ళు బైటకు వచ్చి, జుట్టు అతని వెనుక భాగంలో వేలాడుతూ, కట్టి, కట్టబడి, తాగి ఘర్షణపడుతున్న అవిశ్వాసులను వినోదపరచుటకు అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకు రాబడ్డాడు. అతనిని ఎగతాళి చేయడం ఎక్కడ నుండి ప్రారంభిస్తారో అని అతను తడబడి ఉంటాడు.
JUDG 16:27
2323.నేను దాని గురించి ఆలోచించినప్పుడు, నేను దేవుని కొరకు దేవుడు నియమించిన సంఘం గురించి ఆలోచిస్తాను. సజీవదేవుని వాక్యముకు మరియు ఆయన ఆజ్ఞకు, మరియు అది చేయడానికి దేవుడు నియమించిన కార్యములకు అపవాదిచే కళ్ళుగుడ్డి చేయబడి, తాగిన, ముఖమునకు రంగు వేసుకొనిన, ఆభరణాలతో అలంకరించబడిన, పొట్టి వస్త్రములు ధరించిన, జుట్టు కత్తిరించబడిన లోకానుసారమైన స్త్రీ మరియు పురుషులు దాగు స్ధలములో కేవలము వినోదముగా చేయబడెను. దేవునిశక్తీ మరియు బలముతో వెలగవలసిన సంఘం!
ఎంత అవమానం! సంసోనుకు ఇది ఎంత అవమానకరముగా ఉండాలి, అతని ఆకృతితో, అతను చేయగలిగినదానికన్నా ఎక్కువ, మరియు తన ఆకృతి ద్వారా దేవుడతనికి బలాన్ని ఇచ్చాడు. మరియు అతను కలిగి ఉన్న ప్రతి కండరం ఇప్పటికి అతని శరీరంలో ఉంది, కానీ ప్రభువు యొక్క ఆశీర్వాదం అతనిని విడిచిపెట్టింది.
JUDG 16:26,28
24మనకి మన పరిదిలు ఉండవచ్చు. మనకి మన సంఘశాఖ ఆచారాలు/సిద్దంతాలు ఉండవచ్చు. మన పేర్లు కాగితములో మరియు పుస్తకము లలో ఉండవచ్చు. కానీ నేను ఆశ్చర్యపోతున్నాను, ఈ దినము పెంతెకోస్తు సంఘము అదే స్ధలములో నిలబడక, దేవుని వాక్యము నుండి కన్నులు తీసివేయబడి, యేసుక్రీస్తు చనిపోయిన కారణము, దేవుని వాక్యముతోనూ మరియు దేవుని కార్యములతో మనము సహవాసము చేయుటకు.
అవమానంతో, అతను నివసించిన సమయం మధ్యలో ఉన్నాడు. అక్కడ నిలుచొని ఉన్న సంసోను ఒక మాదిరిగా చూస్తున్నాను. పడిపోయిన, నైతికంగా చెడిపోయిన దేశం మరియు నైతికంగా పడిపోయి, చెడగొట్టబడిన సంఘముకు అతను మాదిరి. అతను దేశముగా ఇశ్రాయేలుకు మరియు సంఘముకు చెందిన దేవుని శక్తికి మాదిరి గా ఉన్నాడు. మనం చూస్తున్నట్లుగా అతను అక్కడ నిలబడి ఉండడం ఖచ్చితంగా దయనీయమైన దృశ్యం. అతను అక్కడికి తీసుకురావడం, మరియు ఆ కుర్రవాడు అతనిని నడిపించడం, మరియు కళ్ళు లేవు.
దేవుని వాస్తవ కార్యమునకు అపవాది మీ కళ్ళు గుడ్డివిగా చేస్తే మీరు దానిని దాటిపోతారు మరియు అది మీకు తెలియదు. దేవుడు ఏమి చేసినా, మరి దానిని ఆయన లేఖనముల ద్వారా బయలుపరచి, తన శక్తి ద్వారా రుజువు చేసినా మీ కన్నులు దేవుని కార్యములకు తెరవబడకపోతే మీరు దానిని గుడ్డివారివలె దాటిపోతారు.
JUDG 13:24,25•
JUDG 15:15
25అతను అక్కడ నిలుచొని ఉన్నాడు. అది ఒక ఉత్కంటభరితమైన సమయం, ఆ తాగినటువంటి సైనికులు మరియు స్త్రీలు, మద్యం గ్లాసులు వారి చేతులలో కలిగి ఉన్నారు. నేను ఇది ఆ భవనమంతా ప్రతిధ్వనిస్తుండడం వింటున్నాను, "ఇది సంసోను, దేవుని శక్తిమంతుడు, పరాక్రమవంతుడు, గొప్ప యోధుడు" ఆ స్థితిలో నిలబడి ఉన్నాడు. నేను ఉహించగలను, ఆ యుద్దవీరుల ద్వారా, వారు వారి ఆధునికమైన హాలీవుడ్ ప్రియులు చుట్టూ చేతులు వేసుకొని, వారి శ్రేష్టమైన ఆభరణాలు వేలాడుచుండగ, దాగోను సంఘ సభ్యులు.
సంసోను అను పేరు ద్వారా వారిలో కొందరు గుర్తిస్తారు అని నేను ఊహిస్తున్నాను, అతని పేరు వారిని కలవరపెట్టిoది. అతను దేవుని అభిషిక్తుడైనందున అతని పేరు వారికి భయాన్ని కలిగించింది. వారిలో చాలామందికి ఇది జ్ఞాపకం వచ్చింది.
గాడిద యెక్క దవడ ఎముకను తన చేతిలో పట్టుకొని నిలబడివున్న అతనిని, అక్కడ చచ్చి పడివున్న వేయిమంది ఫిలిష్తియులును అక్కడ నిలబడి ఉన్న చాలా మంది సైనికులు జ్ఞాపకం చేసుకున్నారు. అది ఎలా జరగగలదు? ఒకటిన్నర అంగుళం మందము కలిగిన ద్రుడమైన ఇత్తడి శిరస్త్రాణములలో ఒకదానిని గాడిద దవడ ఎముకతో కొట్టినప్పుడు, ఆ గాడిద దవడ వేయి ముక్కలవును. కాని సంసోను, అతనిపై గల దేవుని శక్తి తో, వేయి మంది ఫిలిష్తియులను కొట్టి పడేసి, వారి కవచాలని విరగగొట్టి అతని పాదాల వద్ద పెట్టాడు. ఆ సమయములో పారిపోయిన చాల మంది సైనికులు అక్కడ నిలుచొని అతనిని జ్ఞాపకం చేసుకున్నారు. "అది సంసోను?"
JUDG 15:15
26చేతిలో దవడ ఎముకను పట్టుకొని "ఇంకెవరికైన దీనిలో కొంచెం కావాలా" అని అతను చెప్పడాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అతను మాట్లాడగల వ్యక్తి, దేవుని అభిషేకము కలిగినవాడు. అతనిని దీవిస్తాను అని దేవుడు వాగ్ధానం చేసాడు. యెహోవా శక్తిలో అతను ఉన్నాడు.
ఓహ్, సంఘము ఆ విధమైన శక్తితో ఉండడం ఇక్కడ ఉన్న చాలామందికి గుర్తు ఉందనడంలో ఏ సందేహము లేదు, కానీ ఇప్పుడు, అంతా విడిపోయింది. అన్ని సంఘశాఖలు ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు. ఆ పాత రాత్రి ప్రార్ధన కూడికలు ఇంక ఎంత మాత్రమూ వినబడడం లేదు. వీధి పరిచర్య పూర్తిగా పోయింది. అవి వాడుకలో లేవు/గతించిపోయాయి. అయినప్పటికీ, మనకు మన పరిదిలు ఉన్నాయి, కానీ అద్భుతాల దేవుడు ఎక్కడ? వాస్తవానికి, చాలామంది దానిని తిరస్కరించారు. దైవిక స్వస్ధతను కూడా తిరస్కరిస్తున్నారు.
27ఇక్కడే ఈ దేశములోనే, ఒక గొప్ప సంఘముతో, ఒక సంఘశాఖ వ్యక్తిని కలిగి ఉన్నాను. నేను మరియు సహోదరుడు మోరే అక్కడ ఉండగా, అర్మోరిలో హాట్ స్ప్రింగ్స్ వద్ద కొన్ని కుర్చీలు/ స్థలాలు కావాలనుకున్నాను. ఒక పెంతెకోస్తు వ్యక్తి అన్నాడు, "నేను అనుమతించను …" స్థలమును అతను నాకు అనుమతించలేదు. అతను అన్నాడు, "దైవిక స్వస్ధతయందు నమ్మకము ఉన్నవారిని నా స్థలములో కూర్చొనుటకు నేను అనుమతించను ."అది ఇక్కడే కాదు; ఏ స్థలములోనైన. ఎంటి సంగతి? పక్షపాతం! స్పాన్సర్‌షిప్‌లు మరియు ఇతర సంస్థల వలన. పుట్టుకతో మనం దేవుని ప్రజలు అని మర్చిపోతున్నాం. సంసోను కూడా దానిని మరచిపోయాడు. నాకు గుర్తుంది…
JUDG 6:37•
JUDG 16:3
28అతను అక్కడ నిలబడి ఉన్నప్పుడు, గతంలో గాజా వద్ద ఒక రాత్రి జరిగిన దానిని వారిలో కొందరు జ్ఞాపకం చేసుకున్నారు. వారు అతనిని బంధించుటకు ప్రయత్నించినప్పుడు, ఆ గాజా పట్టణపు గవునులను పైకెత్తి ఏవిధముగా తన భుజముల పైన పెట్టుకున్నాడో వారు జ్ఞాపకం చేసుకున్నారు.
దేవుని అభిషేకములో ఉన్నదానిని మీరు కంచె వేయలేరు. దానిని ఏ సంఘము నిలుపలేదు. ఆమెన్. దేవుడు అతను పిలిచిన వారిని రక్షిస్తాడు. "తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు".
మంచిది, వారు అతనిని కంచె వేద్ధామనుకొన్నారు. అతను ఆ తలుపులు తన భుజముల పైన పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కొండ పైకి పరిగెత్తి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. ఒక చిన్న వ్యక్తి దేవుని మార్గములో అడ్డుగా నిలిచిన టన్నుల కొద్దిబరువు ఉన్న ఇత్తడి తలుపులను రాళ్ళలో నుంచి పెకిలించి, మడిచి తన భుజము మీద పెట్టుకొని ఆ కొండ మీదకి నడుచుకొని వెళ్ళాడు.
JUDG 16:5
29అక్కడ తాగి గర్షణ పడుతున్న వారిలో చాల మందికి ఇంతకుముందు సంసోను చేసినది జ్ఞాపకం ఉంది. కాని ఈరోజు పరిస్తితి ఏంటి? అతను చేయలేకపోయాడు…సంసోను అక్కడ నిలుచొని ఉన్నాడు. కాని దేవుని ఆత్మ అతని మీదకి ఇంక ఎంత మాత్రమూ రాలేదు. అతను అభిషేకించబడలేదు. దేవుని ఆజ్ఞలకు దూరంగా అతనిని ఆకర్షించిన మహిళ వలన అతని శక్తి అతని నుండి తీసివేయబడింది.
నేను ఆశ్చర్యపోతున్నాను, అది ఈరోజు మన సంఘం వలే లేదా, చూడండి, పరిశుద్ధ గ్రంధం లో స్త్రీ సంఘమును సూచిస్తుంది. మనము ఇతర సంఘశాఖల ఆకర్షణలో ఉంటే మనము కూడా మన పరిచారకులను బిఏ డిగ్రీ చదివించే వారము, మన సంఘము కూడా మా కాపరి బి.ఏ., డి.డి., యల్ డి., అని చెప్పి ఉండేవారమేమో అని ఆశ్చర్యపోతున్నాను. మనము ఆ గొప్ప తంత్రముల గుండా వెళ్లి ఉంటే మనము కూడా మెథడిస్ట్ లేక ప్రెస్బిటేరియన్ వారి కంటే కొంచం మెరుగైన సంఘమును నిర్మించడానికి ప్రయత్నించి ఉండేవారమని ఆశ్చర్యపోతున్నాను. ఈ స్తితిలో ఉండుటకంటే దేవుని ఆత్మ మన మీద ఏదో ఒక కార్యంలో ఉండుట మంచిది. మన సంస్థ పెరగడానికి ఒక సిద్ధా౦తము నుంచి ఇందులోకి లాగుకొనేవాళ్ళమని నేను ఆశ్చర్యపోతున్నాను. మరియు మనకు గొప్ప స్ట్రక్చర్ ఉంది కానీ దేవుని ఆత్మ ఎక్కడ ఉంది?
JUDG 16:5,28
30ఒక స్త్రీ ద్వారా పోగొట్టుకొని అతను అక్కడ నిలుచొని ఉన్నాడు. అతను అక్కడ నిలుచొని ఉండగా, అతని మనసు దేనిగుండా వెళ్ళింది. దానిని గురించి మరి ఒకసారి ఆలోచించడానికి అతనికి సమయము ఉంది.
అంత సమయము సంఘముకు దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏది ఎక్కువ, ఒక మిలియను కంటే ఎక్కువ లేక మీ ఆత్మకు లోతైన దేవుని ఆశీర్వాదమా? మనము దీనిని పరిశీలించాం. ఆ ప్రభువులు గురించి మరియు సంసోను ఏమి చేసాడు అనే కార్యములు గురించి నేను చాలా విషయాలు కలిగి ఉన్నాను - వారు ఏమి ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు మనము సంసోను దగరకు వెళ్దాం. మరియు అతని మనస్సులో ఏమి జరుగుతోందని మీరు అనుకుంటున్నారు, అతను సాధించిన అనేక విజయాలలో, దేవుని ఆత్మ అతని పైన ఉన్నప్పుడు అతను చేసిన అనేక గొప్ప పనులా? అతని శరీరములో ప్రతి కండరాన్ని అతను కలిగి ఉన్నాడు అని యెరిగి ఉన్నాడు, కాని దేవుని ఆత్మ లేదు. సంఘమా, నన్ను మీకొక సంగతి చెప్పనివ్వ౦డి. చాలా అనర్గళమైన అత్యంత ఫాన్సీ సంఘములో చేరడానికి ప్రయత్నించకండి. మీరు క్రీస్తుతో నిలిచి ఉండండి, దేవుని ఆత్మ క్రీస్తులో ఉంది.
JUDG 16:21,28•
ACTS 19:5•
GAL 1:8
31అప్పుడు దేవుడు తనకు ఇచ్చిన గొప్ప విజయాల గురించి, మరియు తన కళ్ళు తెరిచినప్పుడు, అతను దేవుని వాగ్దానాలను చూడగలడు. కానీ ఇప్పుడు, అతను ఈ విషయంలో చిక్కుకున్నప్పటి నుండి, అతని కళ్ళు మూసివేయబడ్డాయి.
చాలా మంది, ఈ రోజు మానసిక భ్రమల్లో చిక్కుకుంటున్నారు, అది సరైనదా కాదా అని తెలుసుకోవడానికి లేఖనము చూడాలని ఎప్పుడూ అనుకోరు. మరికొందరు "అది ఏ వ్యత్యాసము చేయదు" అని చెప్పడానికి ప్రయత్నిస్తారు.
అపోస్తుల కార్యములు 19 వ అధ్యాయము మార్పు తెస్తుందని పౌలు అనుకున్నాడు. అతను చెప్పాడు "పరలోకం నుంచి వచ్చిన దూత మరేదైనా బోధిస్తే, అతను శపించబడాలి." అది మార్పు తెస్తుంది.
JUDG 16:28
32మనము ఇప్పుడు, సంసోను అక్కడ నిలుచొని దేవుని రాజ్యముతో ఇదివరకు తను చేసిన కార్యాలు ఏ విధముగా అలోచిస్తున్నాడో చూస్తున్నాము. మరియు దేవుడు ఎలా… అతను దేవునిని విఫలపరిచాడు, మరియు దేవుని ప్రజలను విఫలపరిచాడు. దేవుడు అతనిని ఏ దేశం నాశనం చేయడానికి లేపాడో, అతను ఇప్పుడు ఆ దేశం యొక్క ఖైదీ.
నేను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను. పెంతెకొస్తు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. జాక్ మూర్, రిచర్డ్, టి. రీడ్, బ్రదర్ జి.హెచ్. బ్రౌన్, బ్రదర్ బెన్ పెంబర్టన్, మరియు ఇతర గొప్ప వ్యక్తులు, మీరు కలిగిన కార్యములు తెలుసుకోవడానికి మీ వద్దకు వచ్చినప్పుడు, మనము చాల విషయములపట్ల ఒకే రకమైన అభిప్రాయము ఉన్నట్టు అనిపించింది. చేతి తొడుగు చేతికి సరిగా సరిపోయినట్లు, నేను మీతో సరిగా సరిపోతాను. నేను నమ్మే వర్తమానమున సంఘము ఉందని తెలీదు కానీ ఇక్కడ ఒక గుంపు ప్రజలు అందరూ దానిని పొందుకొనుటకు సిద్దముగా ఉన్నారు. నేను ఇప్పటికీ సహోదరుడు బ్రాన్హాంనే. నేను ఇప్పటికీ మీ సోదరుడిని, నేను మిమల్ని ప్రేమిస్తున్నాను.
దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశము నిమత్తము లేపాడో, ఆ కార్యానికి మీరు అప్పగింపబడ్డారు అని మీరు గ్రహించారా. మీలో నుండి ప్రజలను తీసుకురావడానికి దేవుడు సంవత్సరాల క్రితం సంస్థల నుండి మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చాడు, మీరు వెనుదిరిగి ఆ కార్యాని ఒక క్రమముగా చేసారు. దేవుడు మిమల్ని ఎందు నిమిత్తము బైటకు తెసుకు వచ్చాడో దానిని మీరు దిక్కరించారు.
33మొట్టమొదటగా రోములో కాకుండా ఆ లవొదికయలో … నైసియాలోని రోమను క్యాతోలిక్ సంఘము సంస్థగా మార్చబడినప్పటి నుండి, చరిత్రలో ఈ విధముగా జరగని చోటు చూపించమని నేను ఏ వ్యక్తినైనా సవాలు చేస్తున్నాను. మార్టిన్ లూథర్నుంచి ఏ సంఘమైన, ఈ వైపు …
దేవుడు మార్టిన్ లూథర్ కు నీతికరణ యొక్క బయల్పాటును ఇచ్చాడు… లూథర్ చనిపోయిన తరువాత, వారు దాని నుండి ఒక సంస్థను తయారు చేసారు, అది పడిపోయింది. తరువాత వెస్లీ వచ్చాడు, అటు తరువాత అస్బరీ, మొదలైన వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, దానిలో నుండి సంస్థను చేసారు, అది పడిపోయింది. అలెగ్జాండర్ కాంప్బెల్ వచ్చాడు, మరియు అది సంస్థతో పడిపోయింది. బాప్టిస్టుల కోసం జాన్ స్మిత్ వచ్చాడు, అది పడిపోయింది. మానవుడు తనకు తానూ స్వయముగా క్రమపరచాలకొను ప్రతీ సారి, అది పడిపోయింది మరి మరలా ఎప్పటికి తిరిగి లేవలేదు.
EXOD 13:21,22
34ఆ ఇశ్రాయేలీయులు, ఆ అగ్ని స్తంభమును వెంబడించి వెళ్ళాలి. క్రమపడి కూర్చోనుటకు కాదు కాని, ప్రతి రాత్రి వారు ఆ అగ్ని స్తంభమును వెంబడించుటకు సిద్దపడి ఉండాలి.
దేవుడు తన ప్రజలు ఆత్మను వెంబడించాలని, కాలమును వెంబడించాలని కోరుకుంటున్నాడు.
"మంచిది బ్రాన్హాం సహోదరుడా మేము, అన్ని రకాల వర్షాలను కలిగి ఉన్నాము లోపలి వర్షమును మరియు వెలుపలి వర్షమును కలిగి ఉన్నాము " అని మీరు చెప్పవచ్చు. మీరు తెలివైనవారు. అది ఏరకమైన ప్రత్యక్షత అయినా, అది ఎంత మంచిగా కనిపించినా, దేవుని వాక్యనుసారముగా అది లేకపోతే నేను దానిని లెక్కచేయను . మీరు దానిని అక్కడే విడిచిపెట్టండి. దేవుని వాక్యము, అరణ్యము ద్వారా దేవుడు మనకు ఇచ్చిన నమూనా ఇదే.
JUDG 13:5
35సుమారు ఇరవై లేక ముప్పై పైగా వేరు వేరు సంఘాల ప్రజలు, వారు అది, వీరు ఇది అని హేళన చేసుకుంటున్నారు, ఈ దినము పెంతెకోస్తు సంఘము కూడా అక్కడే నిలబడి ఆ విదముగానే ఉంది. దేవుడు మిమల్ని ఏ కార్యము నిమిత్తము ఆ సంఘశాఖలలో నుంచి బైటకు తీసుకువచ్చాడో, మీరు మరలా వెనుదిరిగి వారు చేస్తున్న అదే కార్యాన్ని మీరు చేస్తున్నారు అది ఎంత అమర్యాద?. సంసోను కూడా అదే చేశాడు. ఆ దేశమును నాశనం చేయడానికి దేవుడు సంసోనును లేపాడు. దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా చేసుకొనుటకు లేపాడు, కాని మీరు ఒక సంఘశాఖగా ఉండడానికి కాదు.
EXOD 3:3,10•
EXOD 12:6•
EXOD 15:20•
NUM 14:33•
NUM 32:13•
JOSH 5:6
36దేవుడు ఇస్రాయేలీయులను ఐగుప్తు లోనుండి బైటకు తీసుకు వచ్చినప్పుడు వారు వాగ్ధాన దేశము చేరుకొనుటకు కేవలము పదిరోజుల ప్రయాణము, సుమారు నలభై మైళ్ళదూరములో ఉన్నారు. కానీ వారు నలభై సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించారు. ఎందుకు? వారికి పాపపరిహరార్ధం గొర్రెపిల్లను, సూచకక్రియను, సాక్షిగా అగ్ని స్ధంభమును, మోషేను ప్రవక్త గా ఇచ్చాడు. వారికీ అవసరమైన సమస్తాన్నీ కృప వారికి సమకూర్చింది, కానీ తమకొరకు వారు సొంతముగా ఏదైనా చేయాలనుకున్నారు. తంబురతో మిరియం నృత్యము చేస్తున్నప్పుడు, ఆ ఇశ్రాయేలీయులు ఆమెతో కలిసి నృత్యం చేస్తున్నారు . మరియు మోషే ఆత్మలో పాడుతున్నాడు, ఆ వాగ్ధాన స్ధలమునకు కేవలము పదిరోజుల ప్రయాణము అని వారికి తెలియదు. వారి నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణిస్తారు అని మరియు వారి మృతదేహం అరణ్యంలో కుళ్ళిపోతుంది వారికీ తెలియదు. ఈవిధముగా వారిని చేసింది ఏమిటి? ఇశ్రాయేలు కృపకు బదులు చట్టాన్ని తీసుకొని ఇదివరకు ఎన్నడు తీసుకోననటువంటి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. వారు కొంతమంది బిషప్‌లను చేయాలనుకున్నప్పుడు మరియు వారు స్వంతముగా ఏదో చేయాలి అని ఆశ పడినప్పుడు, వారు దానిలో చేయవలసి ఉంది. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, వారిని నడిపిస్తున్నాడు.
37పెంతెకోస్తు చేసింది కూడా అదే. దేవుడు వారికీ లేఖనములలో ఒక కొత్త కార్యమును బయలుపరచినప్పుడు, దానిని వారు అంగీకరించుటకు బదులు దానిని ఒక కొత్త సమస్యగా చూసారు. లేదా వారికి నచ్చినట్లు మార్చి వేశారు. దేవుడు వారికీ ఒక కార్యాన్ని బయలుపరిచినప్పుడు, ఆ సత్యమును అంగీకరించి, దానిని పరిశుద్ధ గ్రంధముతో సరిచూచుటకు బదులు వారు దానిని తీసుకొని ఒక సిద్దాంతముగా మార్చి వారు ఉన్న సంఘము నుంచి వేరుపడ్డారు. అటుతరవాత అది ఇది అంటూ కొత్త సిద్దాంతములతో పెంతెకోస్తు సంఘము చెడగొట్టబడి, సంఘ సిద్దాంతములతో బంధించబడియున్నది.
మరియు ప్రతి ఒక్కరము అపరాధులమై ఉన్నాము. కుండ మట్టిని నీవు నల్లగా ఉన్నావు అని అనలేదు. మనము మన తప్పిదములను చూడకుండా ఎదుటి వారిలోని తప్పులను చూస్తున్నాము . మనము అందరమూ దోషులమై ఉన్నాము, ఏకత్వము వారు, ఇద్దరు దేవుళ్ళు అనే వారు, త్రిత్వమును అనుసరించే వారు.
అది ఎంత అమర్యాద. యేసుక్రీస్తు మీదకి మీరు ఎంత నిందను తీసుకువచ్చారు. పెంతెకోస్తు పేరుకు ఎంత నింద. దాదాపు ఆ పేరు అమర్యాదకరమైనది అనేంతగా వారు నిందను తీసుకువచ్చారు. మీరు ఏదైతే చేయకూడదో దానినే చేసిన కారణమును బట్టి ప్రజలు ఆ పేరుతో కలిసి ఉండుటకు ఇష్టపడుటలేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించి వెళ్ళడమే, విజయము వైపుకు కవాతు చేయుటకు ఈ దినమున మనకు ఉన్న ఒక గొప్ప మార్గం.
REV 17:5
38అతను ఒక స్త్రీని దేవుని వాక్యానికి అతనిని దూరం చేయటానికి అనుమతించాడు, ఇప్పుడు అతను అపవాది కొరకు పన్నాగాలు ఉపాయాలు చేస్తున్నాడు. అది నిజం. సరిగ్గా. ఈ దినమున కూడా అదే జరుగుతుంది వేశ్యల తల్లి అయిన జెజెబెలు … ప్రక 17 వ అధ్యాయం ఆమె వేశ్యలకు తల్లి అని చెప్తుంది. ఆమె వేశ్య అయితే, ఆమె తన భర్తకు అసత్యముగా జీవిస్తుంది. ఆమె క్రీస్తు తన భర్త అని చెప్పుకుంటుంది కానీ అయన ఆజ్ఞానుసారముగా జీవించదు. మరి ఇతర సంఘములు ఏమి చేస్తున్నాయి? వేశ్య అనగా ఏమి? ఇతర కార్యముల వలే ఇది కూడా అంతే. ఏమిటి అది? దేవుని వాక్యమునకు వ్యభిచారము. ఆమె వేశ్యలకు తల్లి. కొంతమంది మేధావులు ఆ జెజెబెలు సిద్దాంతములు మొదలైన వాటిని అనుమతించుచూ, వారందరూ ఒక్కటిగా కలసి వచ్చి ఏదైనా ఒక కార్యాని చేసి దాని ద్వారా వారు తమకు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అశపడుచున్నారు. సంఘము స్ధితి అలా ఉంది, సహోదర భావము విభాగించబడినది. అది ఎంత అమర్యాద. ఆత్మీయ గుడ్డితనము - ఇది ఎంత భయంకరమైన విషయము . ఓహ్ "మేము ఆత్మీయ గుడ్డి వారము కాము" అని మీరు అనవచ్చు. మనము చెప్పే మాటలకన్న మన ప్రవర్తన మన నిజ వైఖరిని తెలియజేస్తుంది- మీరు కొన్ని విషయములలో చేసే పొరపాటులే మీరు గుడ్డితనములో ఉన్నారు అని నిరూపిస్తుంది.
ROM 3:4
39ఇప్పుడు మీరు దీనిని గుర్తుంచుకోండి, తయారు చేయబడుతున్న ఈ టేపులు ప్రపంచవ్యాప్తంగా పంపబడుతుంది. చూడండి నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడడం లేదు కానీ, ఈ టేపులు సుమారు పదిహేడు వేర్వేరు దేశాలకు, దేశం నలుమూలకు వెళుతుంది.
ఆత్మీయ గుడ్డితనము! ఏ కార్యమునకు గుడ్డితనము? దేవుని వాక్యమునకు, దేవుని సత్యమునకు. మీ సంఘము నిజదేవుని వాక్యమును అనుమతించదు…
శ్రేష్టమైన పరిచారకులు నా వద్దకు వచ్చి "బ్రాన్హాం సహోదరుడా అది సత్యము అని మేము నమ్ముచున్నాము. కానీ మేము దానిని ప్రసంగిస్తే…" మీరు అక్కడ ఉన్నారు. నేను దానిని నమ్మితే, మంచిది, ప్రజలు …
దేవుడు ఇది సత్యము అని చెప్తే ప్రజలు ఏమన్నా నేను పట్టి౦చుకోను, సంఘములు చెప్పేదానిని నేను లెక్క చేయను. అది దేవుని సత్యము అయితే ఆయనే దానికి సహాయము చేస్తాడు. ఒకరినొకరు గౌరవించుకోవాలనే కోరికలు ఉన్నప్పుడు, మీరు విశ్వాసం కలిగి ఉండాలని ఎలా ఆశిస్తున్నారా? చూడండి, ఇది మీనుంచి విశ్వాసమును తీసివేస్తుంది.
2PET 2:22
40సంఘ శాఖలకు బయట పుట్టినటువంటి పెంతెకోస్తు, తిరిగి సంఘశాఖల వద్దకు వెళ్ళింది. పెంతెకోస్తు సంఘశాఖలలో పుట్టలేదు, సంఘశాఖ బైట పుట్టిoది. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును, కుక్క తన వాంతికి తిరిగినట్టును, ఆ అపవాది యొక్క కుయుక్తి మీరు ఎక్కడ నుంచి బైటకు వచ్చారో తిరిగి అందులోకే తీసుకువెళ్తుంది. ఓడించబడిన వారిని చూడండి.
వాగ్ధాన భూమిలో మనము ఇదివరకే ఉండాలి. ఇక ఏ వ్యాది లేనంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ప్రముఖుడుగా ఉండాలి. ఓహ్, అది ఎంతో మహిమకరముగా ఉంటుంది.
జుట్టు కత్తిరించుకున్నటువంటి స్త్రీలు, పొట్టి దుస్తులు ధరించిన స్త్రీలు అక్కడ ఉండకూడదు. మన సంఘములో మూడు లేక నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి డికనులు ఉండకూడదు. పెంతెకోస్తులో అది లేదని నాకు చెప్పకండి. అది కచ్చితముగా ఉంది. కానీ అది సామాజిక ప్రతిష్ఠ కారణంగా ఉంది. అది కచ్చితముగా ఉండకూడదు కానీ ఉంది. ఎందుకు? ఎందుకంటే వాక్యముతో జీవించుటకు బదులు సంఘశాఖల వత్తిడులు రాజకీయాలు, డబ్బుల వలన. శ్రేష్టమైన సహోదరుడుని తిరస్కరించి అతని స్ధానములో వేరొకరిని పట్టణములో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న కారణముగా పెట్టుట.
మహిమలో స్ధానము కలిగిన వ్యక్తి నాకు కావాలి. అతనికి తన ఏబిసి తెలియకపోతే అది ఏమి వ్యత్యాసము చేస్తుంది. ఏబిసి అంటే ఎంటో మీకు తెలుసా? ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్ (ఎల్లప్పుడు క్రీస్తును నమ్ము). అది సరైనది. మీరు దానిని నేర్చుకొండి.
41కొంత కాలము క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి "బ్రాన్హాం సహోదరుడా "… ఈ పట్టణములో బాగా తెలిసినటువంటి ఒక పెంతెకోస్తు పరిచారకుడు నన్ను తన గదిలోకి తీసుకువెళ్ళి "నేను మీ కోసం ప్రార్థించాలనుకుంటున్నాను" అని చెప్పాడు.
"నేను అనారోగ్యంతో లేను" అని అన్నాను.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని అన్నాడు.
నేను చెప్పాను,"ఇది పరస్పరం భావించబడింది".
"స్త్రీలు జుట్టు కత్తిరించుకోవడము గురించి, సంఘము గురించి మరియు మెదలైన కార్యములు గురించి చెప్పడం మీరు ఎందుకు వదిలిపెట్టరు" అని అతను చెప్పాడు. "అది నీ పని కాదు" అని చెప్పాడు.
"ఐతే మరి ఆ పని ఎవరిది" అని నేను అన్నాను.
అతను అన్నాడు" ఒక సమయము వస్తుంది, మీరు భోదించడానికి కేవలము కాళీ కుర్చీలు తప్ప మరేమీ ఉండదు."
" అపవాదితో రాజీపడే దాని కన్నా నేను ఆ విధముగానే చేసి సత్యమునే భోదిస్తాను" అని అన్నాను.
"బ్రాన్హాం సహోదరుడా దేవుడు మిమ్మల్ని జబ్బుపడినవారి నిమిత్తము ప్రార్థి౦చుటకు పిలువలేదా'' అని అతను అన్నాడు.
మరి నేను "అవును అయ్యా" అని అన్నాను.
అతను అన్నాడు "ప్రజలు మీరు ప్రవక్త అని నమ్ముచున్నారు."
మంచిది, నేను ఎప్పుడూ అలా అనలేదు"అని అన్నాను.
అతను అన్నాడు "కాని వారు నిన్ను ఆ విధముగా నమ్ముచున్నారు" మరియు "నీవు ఒక ప్రవక్తవైతే నిరంతరము స్త్రీలను గద్దించుట, పురుషులను గద్దించుట మరియు ఇటువంటి కార్యములకు బదులు మీరు మీ సమయమును ఆత్మ వరములు ఎలా పొందుకోవాలి, జబ్బుపడిన వారిని ఎలా స్వస్ధపరచాలి వంటి కార్యములను నేర్పించి సంఘముకు సహాయపడుటకు మీరు మీ సమయాన్ని ఎందుకు ఉపయోగించకూడదు." అని అన్నాడు.
నేను అన్నాను, "వారికి ఎబిసి'లు తెలీనప్పుడు బీజగణితము ఎలా నేర్పించగలను?" మంచిది. వారిని మొదట ఎబిసి'లను నేర్చుకోనివ్వ౦డి.
42ఒక వృద్దుడైన పరిచారకుడు ఉజ్జీవ కూడికకు వెళ్లి ఐదు రోజులు ప్రతి రాత్రి నీతీకరణను ప్రసంగించారు. డీకనులు ఆయనను పిలిచి "రెవరెండ్, గారు మీకు నీతీకరణ కాకుండా మరి ఏ భోదా తెలియదా" అని అడిగారు.
అందుకు అతడు "ఓహో తప్పకుండా, కానీ మొదట వారిని నీతిమంతులను కానివ్వండి అటుతరవాత ఇతర కార్యములను గురించి ప్రస౦గిద్దాం". అది నిజము!
మీరు మీ పునాది దగ్గరకు రాగలిగితేనే! సంసోను అక్కడే నిలబడ్డాడు - ఓడిపోయి.
చూడండి మనము అందముగా ఉండవచ్చు, అది ఆలాగు ఉండవచ్చు. కానీ అది ఎలా ఉంటుందంటే, నేను దారిలో వస్తూ ఉండగా ఒక పెద్ద గుర్తును చూసాను "ఫంక్ వారి మిశ్రమజాతి మొక్కజొన్న" అది ఎంత గొప్పగా ఉన్నది. కానీ దానిలో ఏ మంచిలేదు. అది మంచిది కాదు, అది దేశాన్ని చంపుతోంది. మీరు రీడర్స్ డైజెస్ట్ లో ఇది చదివి ఉంటారు, స్త్రీలు ఈ సంకరజాతి మాంసం మరియు మొక్కజొన్న తినడం కొనసాగిస్తే రాబోయే ఇరవై ఏళ్ళలో పిల్లలు పుట్టరు" అందులో ఏమంచి లేదు.
43కృత్రిమ, మిశ్రమజాతి మొక్క అంటే ఏమిటి? ఇది సహజముగా పెరిగిన మొక్క కాకపొతే, పురుగులు ఆ మొక్క దగ్గరికి రాకుండా ఎల్లప్పుడు క్రిమిసంహారకాలు చల్లుతూ ఉండాలి. పురుగులు దానిని తింటాయి. అదే సహజమైన మొక్క అయితే మీరు మందులు చల్లాల్సిన అవసరము లేదు. ఏ పురుగులు దానిని పాడుచేయవు, అది మంచి ఆరోగ్యమైన మొక్క.
ఈ కారణముననే సంఘములో ప్రజలను మీరు ఎల్లప్పుడు బుజ్జగిస్తున్నారు " దేవునికి మహిమ సహోదరి" చూడండి మీరు మిశ్రమము చేయబడ్డారు. మీరు వేరొక మార్గములో తీసుకొని రాబడ్డారు.
మీరు ఆ సంకరము చేయబడిన మొక్కజొన్నను తీసుకొని తిరిగి దానిని నాటండి, ఇప్పుడు మీకు ఏమి వచ్చింది. ఏమిరాదు. అది అసలు ఏమి చేయదు.
ఈరోజు సంఘము అందముగా ఉంది, ఇదివరకెన్నడూ లేనంత గొప్ప భవనాలు, మీరు ఎప్పుడు ప్రసంగించనంత గొప్ప సమూహము, మీరు ఇదివరకు కలిగి ఉండిన వారికంటే శ్రేష్ఠమైన పరిచారకులు, ఇది నిజం. జొన్న పొలము లోనుండి మీరు మనుషులను కలిగి ఉండేవారు, గడ్డి పొలములలోనుండి దేవుడు పిలిచినవారు ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు మీ పిల్లలను పాఠశాలకు పంపారు మరియు వారి నుండి మనవళ్ళు వస్తున్నారు , వారు పిహెచ్.డి.'లు మరియు ఎల్‌ఎల్.డి.'లతో తిరిగి వస్తున్నారు. మరియ ఈదినము ఒకానొక పెంతెకోస్తు సంఘము, ఒక వ్యక్తిని పరిచర్యకు పంపేముందు అతడు మానసికముగా తెలివి కలిగి ఉన్నాడని ఒక మానసిక వైద్యుని దగ్గర రుజువు చేసుకోవలసి ఉంటుంది. ఆలోచించండి!
44పెంతెకోస్తులో అర్హత మానసిక పరీక్ష కాదు, కానీ అది ఆ పెంతెకోస్తు దినమున కలిగిన పరిశుద్ధాత్మ యొక్క పరీక్ష. ప్రజలకు ఈ దినము అది అసాధ్యమైనది.
రోమన్ కాథలిక్ సంఘము మొదట పెంతేకొస్తు సంఘము అని మీకు తెలుసా? ఈ రోజు ఉన్న స్థితిలోకి రావడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది. ఈ పెంతేకొస్తు సంస్థ మరో యాభై సంవత్సరాలు ఆవిధముగానే కొనసాగితే, ఇది కాథలిక్ చర్చి కంటే అధ్వానంగా ఉంటుంది. ఇది నిజం. పాపం అన్నివైపులా పెరుగుతుంది. ఇప్పుడు, మీరు ఇలా అనుకోనవద్దు… నేను వెర్రి వాడను అని. కానీ నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు . ఇది నిజము. మీరు కొద్ది సమయము వేచి ఉండండి మీరు కనుగొంటారు.
45సంకరజాతి మొక్కజొన్న, స్త్రీలలో నడుము సన్నగాచేసి భుజాలలో వెడల్పు చేస్తుంది.
పరిణామ క్రమం మనకు ఏమి చెప్తుంది. అంటే, పరిణామంలో కొన్ని జంతువులు కలిసిపోయి, భిన్నమైన వాటిని తీసుకువచ్చాయి అని, అలా మనిషి వచ్చాడు. వారు తమ సొంత సిద్ధాంతాన్ని ఖండించే వరకు పరిశోధించడం కొనసాగించారు.
ఇక్కడి రైతులారా, నేను మీకు ఒక విషయం చెప్తాను. కంచర గాడిద ఎలా వస్తుంది. అది ప్రపంచంలో భయంకరమైన జంతువు. అది సంకరము. దానికి జ్ఞానము లేదు. దానికి ఏమీ నేర్పించలేము. ఆనంది౦చుటకు చనిపోయే వరకు ఎదురుచూస్తూ ఉంటుoది. దానికి ఏమి చెప్పలేము. అది ఏమిటి? ఎందుకంటే అది సంకరము.
HEB 13:8
46ఇది నాకు సంకరజాతి క్రైస్తవులను, నామకార్దపు క్రైస్తవులను జ్ఞప్తికి తెస్తుంది. మీరు కంచెరగాడిదకు ఎమన్నా చెప్పడానికి ప్రయత్నిస్తే, అది దాని చెవులను నిక్కబొడుచుకొని "హ!హ! హ!" అంటూ వెళ్ళిపోతుంది. దానికి తెలిసిందంతా ఓండ్ర పెట్టడం. మీరు దానికి నిజం చెప్పలేరు మరియు ఏమి నేర్పించలేరు. ఈ ప్రజలు కూడా అదే విధముగా ఉన్నారు. నిన్న, నేడు, నిరంతరం ఏక రీతిగా ఉన్న క్రీస్తును గురించి వారికి చెప్పండి. "హ! హ !అద్భుతాల రోజులు గడిచిపోయాయి" ఇది మనము నేర్చుకున్నా సెమినార్ యొక్క ఓండ్ర. ఇది సంకరము!
పరిశుద్ధాత్మ దేవుని ప్రతీ ఆజ్ఞకు "ఆమెన్" అని చెప్తుంది. అది సేమినరీ - మరేదో ఆత్మ దేవుని వాక్యమునకు ఓండ్ర పెడుతుంది. అది పరిశుద్ధాత్మ అయితే దేవుని వాక్యమునకు "ఆమెన్" అంటుంది, చూడండి.
GEN 1:11,12,26
47కంచెర గాడిదకు ఏమీ తెలియదు అని నేను అనుకుంటాను. మీకు ఇది తెలుసా? దాని తండ్రి లేదా తల్లి ఏవరో దానికి తెలియదు. దాని తండ్రి చిన్న గాడిద, దాని తల్లి ఆడగుర్రం, కానీ అది తిరిగి పునరుత్పత్తి చేయలేదు.
మొక్క తనంతట తానుగా పునరుత్పత్తి చేయలేదు. ఒక తెల్ల రంగు వైలెట్ మొక్క ను నీలం రంగు వైలెట్ మొక్కతో సంకరము చేస్తే గులాబీ రంగు (పింక్) వస్తుంది, ఆ మొక్కను రెండు లేదా మూడుసార్లు మరలా నాటండి, అది తెలుపు లేదా గులాబీ రంగు వస్తుంది.
ఇది అవి ఇదివరకు ఎప్పుడు అలా లేదని రుజువు చేస్తుంది. దేవుడు "తమ తమ జాతి ప్రకారము ప్రతిదీ ప్రత్యుత్పత్తి " చెప్పాడు అది అలాగే ఉంది. మానవుడు దేవుని స్వారూప్యములో చేయబడ్డాడు. కోతిలాగా కాదు. అది వెర్రితనము.
గమనించండి కంచెర గాడిద అజ్ఞానం మీకు తెలుసు. మీకు ఇది తెలుసా? దానికి మీరు ఏమీ నేర్పించలేరు. అది మూర్ఖమైనది.
కానీ ఒక సంకరము చేయబడని నిజమైన గుర్రము, దానికి దానితల్లి ఏవరో తెలుసు, తండ్రి ఏవరో తెలుసు. అది ఒకే వంశానికి చెందింది. అతనికి తన తాత ముత్తాతల వివరములన్నీ తెలుసు. ఎందుకంటే అతను ఆ వంశమునకు చెందినవాడు.
JOHN 3:3,5,7•
1PET 1:23
48క్రైస్తవులు అని పిలువబడే, ఈ సంకర జాతి వారి విషయములో కూడా ఆ విధముగానే ఉన్నది. "అద్భుతముల కాలము గతము. మంచిది, ప్రెస్బిటేరియన్లు అయిన మనము, మెథడిస్టులు అయిన మనము, పలానా - పలానా వారమైన మనము, దీనిని నమ్మతాము. త్రిత్వము వారమైన మనము, పలానా - పలానా వారమైన మనము, దీనిని మనము చేయము". చూడండి, మీరు ఎక్కడ నిలబడి వున్నారో మీకు తెలియదు.
కాని ఒక నిజమైన నూతనముగా జన్మించిన, వంశమునకు చెందిన క్రైస్తవుడికి పరిశుద్ధగ్రంధం లోని అపోస్తలుల కార్యముల ప్రకారము తను ఎక్కడ ఉన్నాడో తెలుసు. అతను ఆత్మానుసారముగా జన్మించినవాడు, మరియు ఇక్కడ అతని వంశము ఉన్నది. అతను దేవుని భాగము నుండి వచ్చాడు. ప్రతిసారి ఇది ఒకేరకమైన దానినే ఉత్పత్తి చేస్తుంది.
ఆశ్చర్యము లేదు, సంఘము మరింత అందముగా ఉంది. కానీ విషయము ఏమిటి? దానిలో ఆత్మ కొదువగా ఉంది. అది తనంతట తాను లోకముతో కలసి పునరుత్పత్తి చేస్తుంది. మహిళలు పొట్టి దుస్తులు వేసుకొని, పియానోను వాయించనిస్తారు. ముఖమునకు రంగు వేసుకొనుటను అనుమతిస్తారు. పురుషులు నాలుగు లేదా ఐదు సార్లు వివాహం చేసుకుంటారు. మరియు వారి స్థలమును, స్థానమును పట్టుకొని ఉంటారు. వారు చేసే ఈ రకమైన కార్యములన్నీ, ఖచ్చితముగా లేఖనములు చెప్పిన విధముగానే ఉన్నది. సంసోను వలే ఆమె కూడా ఓడించబడింది. సరిగ్గా. అవును అండి.
JUDG 16:28•
PS 107:4•
ISA 16:8
49ఓహ్, సంసోను అనుకున్నట్లు! నేను… నేను మిమ్మలి ఎక్కువసేపు పట్టి ఉంచుటకు ఇష్టపడను; నేను ఇక్కడ ఉన్న కొన్ని వాక్యాలను విడిచిపెడుతాను. సంసోను అక్కడ నిలబడి తను చేసిన తప్పు గురించి, మరియు తను ఎక్కడ ఉండి ఉండేవాడో ఆలోచించి ఉంటాడు!
ఇశ్రాయేలును జ్ఞాపకపరచుకోండి. నేను… ఒక్క నిమిషం మీరు నన్ను మన్నిస్తారా, ఇశ్రాయేలు దగ్గరకు తిరిగి వెళ్ళుటకు? అక్కడ వారు ఒక సంస్థను తయారు చేసినప్పుడు ఆ నలభై సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఏమి చేశారో, మీకు తెలుసా? యేసుక్రీస్తే ప్రభువు దూతగా అగ్ని స్తంభములో ఉండి నడిపిస్తూ ఉండగా, వారు ఆయనను మరియు దానిని అనుసరించి నడుచుటకు బదులు. సమారు పది దినములలో, వారు సంపూర్ణ వాగ్ధాన స్థలములో ఉండెడి వారు. కాని మీకు తెలుసా? "వారు అరణ్యములో సంచరించారు" అని పరిశుద్ధ గ్రంధం చెప్తుంది.
NUM 13:30,31•
DEUT 1:19
50తీర్పు స్థలము అయిన కాదేషు- బర్నియాకు వారు వచ్చారు, మరియు వేగుచూచు వారు తిరిగి వచ్చి ఆ స్థలమును గురించి మాటలాడినప్పుడు. "మనము దానిని చేయలేము" అని వారు అన్నారు.
యెహోషువా మరియు కాలేబు" మనము దానిని చేయుటకు సమర్దులము" అని అన్నారు, వారు దేవుని వాగ్దానమును చూస్తున్నారు, పరిస్థితిని కాదు.
"సంస్థ లేకుండా మనము ఒక సంఘమును కలిగి ఉండలేము." మంచిది, మీరు దేవుడు ఏమి చెప్తున్నాడో దానిని చూడడం లేదు. అది నిజం.
వారు ఏమి చేశారు? వారిని దేవుడు ఆశీర్వదించాడా? కచ్చితముగా, కచ్చితముగా. వారు సంచరించారు. వారు వివాహములు చేసుకున్నారు. వారు ద్రాక్షతోటలను నాటారు, మరియు వారికి పిల్లలు పుట్టారు, మరియు వారు అభివృద్ది అయ్యారు. మరియు వారు అరణ్యములో బాగున్నారు. అది నిజం. కాని వారు ఇప్పటికీ పరిపూర్ణ ఆశీర్వాదములో లేరు.
EXOD 14:22,23•
NUM 27:22,23•
JOSH 11:23
51కాబట్టి ఈ గొప్ప పెద్ద సంస్థను చేసిన ప్రతి ఒక్కరు (పాతయోధులు అని పిలువబడేవారు), చనిపోయేంత వరకు దేవుడు వారిని అక్కడే ఉంచాడు. అటు తరువాత వాక్యమును విశ్వసించిన యెహోషువా నాయకత్వములో కొత్త తరం వారితో ప్రారంభించాడు. ఆమెన్! అతడు వారిని వాగ్ధాన స్థలమునకు తీసుకువెళ్ళాడు.
ఓ దేవా, ఈ యవ్వన పెంతెకోస్తు వారు దర్శనమును పొందుకొందురు గాక. చూడండి, వారు వాగ్ధాన స్థలమునకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకములైన దేవుని బహుమానములు ఎక్కడ ఉన్నాయో మనము అక్కడ ఉండాలి.
మనము భాషలలో మాట్లాడుతాం. అది నిజం. అది మంచిది. దానికి వ్యతిరేకముగా ఏది లేదు. మోషే ఎర్ర సముద్రం దాటాడు; శత్రువు అతని వెనుక చంపబడాడు. దానిని మనం అభినందిస్తున్నాము. కానీ అదే అంతా కాదు.
మీ తండ్రులు మరియు తల్లులు వారు అక్కడ నిలబడి ఉన్నప్పుడు మరియు వారిని కిటికీలలోనుంచి తుపాకీతో కాలుస్తున్నప్పుడు, మరియు వారు ఆత్మలో నృత్యం చేస్తునప్పుడు వారు ఆలోచించలేదు, వారి పిల్లలు ఎప్పటికైనా అక్కడికి వస్తారా? కానీ అది జరిగింది.
కాని ఒక క్రొత్త తరం వస్తూ ఉంది. చూడండి సంసోను జుట్టు తిరిగి పెరగటం ప్రారంబించింది .
JUDG 16:6,22•
ROM 11:29•
1COR 12:1,4,9,28,31•
1COR 14:1
52చూడండి! దెలీల మిమ్మల్నిఎప్పుడూ అలాంటిదానిలో నేట్టివేయడానికి అనుమతించకండి. దానికి దూరముగా ఉండండి. ఆ కార్యమే మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేసింది. మీరు దానిని ఖండించడానికి లేపబడ్డారు. నేను ఒంటరిగా నిలబడినా, దానిని చేయుటకు నాకు సాధ్యమైనంతవరకు నేను చేశాను. దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండుటకు నాకు సాధ్యమైనంత వరకు ఉన్నాను. దేవుని శక్తి తీసివేయబడి, ఆశీర్వాదములు తీసివేయబడి, వరములు తీసివేయబడి, సంఘము అక్కడ నిలబడి ఉండుట నేను చూస్తున్నాను.
దేవుడు తన వరములు కుమ్మరిస్తాడు… అప్పుడు వారు అంటారు" అది మనస్సు చదవడం, మానసిక టేలీపతి". వారు వాటిని హత్తుకోవలసినప్పుడు. " మంచిది అతను ఇప్పుడు ఏకత్వము వారి వద్ద ఉన్నాడు. నేను … అది … బహుశా … అది ఇదే, అది లేక మరొకటి" ఓహో! మీకు మీ రోజు మాత్రమే తెలిసి ఉంటే! అది మిమ్మల్ని దాటిపోనివ్వకండి. క్రీస్తులో ఐక్యమయ్యే సమయము ఇదే.
గమనించండి.
JUDG 16:28
53సంసోను అక్కడ నిలబడి తను చేసిన తప్పును - తను చేసిన కార్యములను ఆలోచిస్తున్నాడు. చివరికి అతను ఆ విధంగా ఉండడానికి కారణమేమిటో అతను గ్రహించాడు. శత్రువు అతని కళ్ళు మూసివేసింది.
సంస్థ చేసే మొదటి కార్యం అదే, వారి సొంతవాటికీ తప్ప ఇతర సహవాసములకు మీ కళ్ళను మూసివేస్తుంది. ఆమెన్. అక్కడే నేను చాలా విషయాలు చెప్పగలను … కానీ నేను దానిని చేయను. కాని మీరు, ఆత్మీయ మనసు కలిగినవారైతే, నేను ఏమి మాట్లాడుతున్నానో మీరు యెరిగి ఉన్నారు. అది మీ కళ్ళు మూసివేస్తుంది! మీరు బాప్టిస్టు వారు అయితే, మీరు బాప్టిస్టు వారు మాత్రమే. మీరు ప్రెస్బిటేరియను వారు అయితే మీరు ప్రెస్బిటేరియను వారు మాత్రమే… మీరు ఏకత్వము వారు అయితే, మీరు ఏకత్వము వారు మాత్రమే, మీరు త్రిత్వము వారు అయితే, లేక ఇంకా ఎంతమంది వారికీ ఉన్నారో, చూడండి, మీరు కేవలము అదే అయి ఉన్నారు. మిగిలిన వారిలో ఏ మంచి లేదు.
JOHN 3:3,5,7•
1PET 1:23
54బిల్లీ గ్రాహం యొక్క ప్రారంభ రోజులలో బాప్టిస్టులకు ఒక నినాదం ఉండేది, "44, ఒకమిలియన్ కన్నా ఎక్కువ." మీకు ఏమి అర్ధమైంది ? పొగ -త్రాగెడి, సంఘములో- చేరేటువంటి, వేషదారుల గుంపు.
బిల్లి మరియు నేను, అతని అల్పాహారము వద్ద ఉన్నప్పుడు "నీకు విషయం ఏమిటో తెలుసా?" అని అతను అన్నాడు. "ఉదాహరణ ఇక్కడ ఉంది." అతను అన్నాడు, "నేను లోపలికి వెళ్తాను …" అన్నాడు" పౌలు ఒక నగరములోకి వెళ్ళాడు, ఒక మారుమనస్సు కలిగిన వ్యక్తిని పొందుకున్నాడు. ఒక సంవత్సరము తరువాత అతను అక్కడికి మరలా వెళ్ళాడు" అని చెప్పాడు, " ఆ ఒక్క మారుమనస్సు కలిగిన వ్యక్తి ఇంకా ముప్పై మందిని తీసుకువచ్చాడు." అతను అన్నాడు, "నేను ఒక నగరముకు ఆరువారల పాటు వెళ్తాను, మరియు ముప్పైవేల నిర్ణయాలు తీసుకుంటాను. నేను ఆరు నెలలో తిరిగి వచ్చాక ముప్పై కూడా కనుగొనలేకపోయాను." [ఖాళీ ..]
మంచిది, ఆ వ్యక్తి ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, కానీ అతనిని నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుచున్నాను. పౌలు మార్చిన వారిని ఎవరు తీసుకున్నారు? అతను ఎంత సోమరి కాపరి. అదేమిటి? అతను పూర్తిగా దేవుని బిడ్డగా, ఆత్మలో జన్మించేంత వరకు పౌలు అతనితో ఉన్నాడు. అతనిని క్రీస్తులో ఎంత దూరం తీసుకెళ్ళాడు అంటే, అతను వెనుకకి తిరిగి చూడలేనంతగా.
NUM 4:33•
NUM 32:13•
JOSH 5:6•
PS 107:4•
ISA 16:8•
ACTS 2:4•
1COR 12:10•
GAL 5:22•
COL 1:27
55వారు సంఘములో చేరవచ్చు, లేక భాషలలో మాట్లాడవచ్చు. భాషలలో మాట్లాడం నేను నమ్ముతాను. పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడుతుందని నేను నమ్ముతాను. భాషలలో మాట్లాడేది అంతా పరిశుద్ధాత్మ కాదు. అని నాకు తెలుసు. మంత్రగత్తెలు భాషలలో మాట్లాడడం మరియు ఒక మనిషి పుర్రె లోనుంచి రక్తం తాగడం మరియు దెయ్యాలను పిలవడం నాకు తెలుసు. భాషలలో మాట్లాడం మరియు దానిక అర్ధం చెప్పడం. అది ధృడమైన రుజువు కాదు. మీలో ఉన్న క్రీస్తు జీవం. ఆ ఫలము తనంతట తానుగా రుజువు చేస్తుంది, అంతే. కాని మనము దాని పైనే స్థిరపడదాం. "ఒక వ్యక్తి భాషలలో మాట్లాడితే, అతనిని లోపలికి రానివ్వ౦డి, అంతే." మీరు ఈ దినమున ఏమి కలిగి ఉన్నారో చూడండి. అది నిజము, భాషలలో మాట్లాడడం, కానీ అంతా సత్యము కాదు. ఒక పుచ్చకాయ ముక్క తింటున్నా నల్ల జాతీయుడు, అన్నాడు " నీకు ఇది ఎలా అనిపిస్తుంది మోషే?" అతను అన్నాడు, "అది బాగుంది, కానీ నిశ్చయముగా అందులో ఇంకొంచెం ఉంది."
నేను భాషలలో మాట్లాడగలిగితే, కచ్చితముగా దాని కన్నా ఎక్కువ ఉంది. చూడండి, కానీ మనమేమి చేస్తున్నాము? ఇశ్రాయేలు వారివలె, ఆ ఒక్క విషయము మీదనే స్థిరపడ్డాము, మరియు ఇప్పటికి అరణ్యములో నలభై సంవత్సరాలు తిరిగి, వాగ్ధాన స్థలములో నెమ్మది లేకుండా. కచ్చితముగా మనము కూడా అదే చేశాం.
GEN 19:28
56సంసోను అక్కడ నిలబడి (నేను త్వరపడాలి.), వెను తిరిగి, ఇదివరకు జరిగిన కార్యములు అన్నింటిని ఆలోచించాడు. మరియు ఇక్కడ అతడు ఉన్నాడు, అతను ఏ కార్యము నిమిత్తము లేపబడ్డాడో - ఆ కార్యమునకు అతడు గుడ్డివానిగా చేయబడ్డాడు. అక్కడ అతని గొప్ప ఆకృతి, అతని గొప్ప మానవ శరీరము సమూహము, ఒక పర్వతమంత మాంసము అక్కడ నిలబడి ఉంది, అతని గొప్ప ధృడమైన కండరాలు, కానీ బలము లేదు. మనము ఇక్కడ నిలబడి ఉన్నాము. చాలా కాలం క్రితం పెంతెకోస్తు వారిని లెక్కించినప్పుడు, దేశమంతటా కలిపి సుమారు నాలుగు లేక ఐదు వందల మంది ప్రజలు ఉండేవారు. ఈరోజు ప్రపంచంలో ఇదే త్వరగా పెరుగుతున్న సంఘము. మనము లోపలికి ఏమి తీసుకు వస్తున్నాము? సభ్యుల సమూహము. మనకు ఉన్న ఆ గొప్ప చట్రంతో మనము ప్రారంభములో ఉన్నదానికంటే పదివేల రెట్లు బలిష్టముగా ఉండాలి. మనము ప్రారంబించినప్పటి కంటే ఇప్పుడు పదివేల రెట్లు బలహీనముగా ఉన్నాము, ఎందుకనగా మనము దానిని నిరాధారమైన పునాదిపైన కట్టుచున్నాము, సంఘశాఖల పైన! దేనినైతే దేవుడు శపించాడో. సొదొమ మరియు గొమొర్రా లక్షణముల మీద మనము సంఘమును ఎలా నిర్మించగలము.
మీరు నన్ను ద్వేషించరని నేను నమ్ముతున్నాను, కాని మీరు ఒక్క నిమిషం కూర్చుని వినండి.
అతడు దానిని చేయలేడు. దేవుడు దేనిని శపించాడో, శపించాడు. కావున దేవుడు శపించిన దాని నుండి నన్ను దూరముగా ఉంచండి. దేవుడు దేనిని ఆశీర్వదిస్తున్నాడో నాకూ అదే కావాలి. నిజము.
JUDG 14:6•
JUDG 15:15•
JUDG 16:3,23,24,26
57గమనించండి, అతను అక్కడ నిలబడి, ఆలోచిస్తున్నాడు. యుద్దవీరులు, మద్యంసేవించి, అక్కడ నిలుచొని," ఆ గోప్పవ్యక్తి నాకు గుర్తు ఉన్నాడు. అతను తన చేతిలో గాడిద దవడ ఎముకను పట్టుకొని నిలబడి ఉండటం నాకు గుర్తు ఉంది. అతను ఆ గాజా పట్టణపు గవునులను మడిచి ఎత్తుకొని ఆ కొండపైకి నడచి వెళ్ళడం నాకు గుర్తు ఉంది. ఈ కార్యములు అన్నీ నాకు గుర్తు ఉన్నాయ్. సింహము అతని మీదకు గర్జించినప్పుడు, ఆ చిన్న పిల్లవాడు, ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు కేవలము తన రెండు చేతులతో ఆ సింహమును చీల్చివేశాడు. మరి ఇప్పుడు అతనిని నడిపిస్తున్న ఆ చిన్న బిడ్డ చేత బంధించబడి, ఇక్కడ నిలుచోని ఉన్నాడు. మరియు మన దేవుడు, మత్స్య దేవుడైన దాగోను, అతని మీద గెలుపొందాడు."
58మీరు అక్కడ ఉన్నారు. లోకము సంఘములోకి ప్రాకుకుంటూ వచ్చింది మరియు దానిని జయించింది. అది మన స్త్రీలను వస్త్రహీనులుగా చేసింది. అది ప్రజల సంఘముకు మరియు ప్రార్ధనా కూడికకు వెళ్ళుటకు బదులు గృహములోనే నిలిచి టీవీ కార్యక్రమాలను వీక్షించే విధముగా ప్రజల యొక్క హృదయములో కోరిక పెట్టింది. లోకపు ప్రేమ లోపల ప్రవేసించి మన పెంతెకోస్తు సంఘమును పాతాళమునకు తీసుకువెళ్ళింది.
కోరిక మరియు విశ్వాసం? ప్రార్ధనా వరుసలో ఒక వక్తిని నడవనివ్వండి మరియు ఏమి జరుగుతుందో వారిని చూడనిద్దాం. ఆ మరుసటి రాత్రి, వారు మరలా ఆ ప్రార్ధనా వరుసలో వస్తారు. అబ్రహాము సంతానం? విశ్వాసము లేదు. అది ఉండాలి, కానీ లేదు. ఎప్పుడైతే మీరు …
GEN 17:16
59దేవుడు అబ్రహాముకు ఒక్కసారి చెప్పాడు, మరి అతడు దాని నిమిత్తము ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసాడు. ఎంత కాలము క్రిందట అతడు దానిని పొందుకున్నాడో దానితో సంభందము లేదు. శారాకు అతను చెప్పడం నేను వింటున్నాను," అక్కడికి వెళ్ళు, నీకు అరవై - ఐదు సంవత్సరాలు. వెళ్లి కొంత ఉన్ని కొను, కొన్ని సూదులు తీసుకో మరియు దానితో కొన్ని బూట్లు తయారు చెయ్. మనము బిడ్డను కలిగి ఉండబోతున్నాము."
"మీరు దానిని పొందుకోబోతున్నారు అని మీకు ఏలా తెలుసు?"
"దేవుడు చెప్పాడు." అది స్థిరపరుస్తుంది.
మొదట , చూడండి, ఆమె ఋతుదర్మం దాటి ఇరవై సంవత్సరాలు అవుతుంది. ఆమెకు పదహారు సంవత్సరాల వయసు గలదిగా ఉన్నప్పటి నుంచి అతను ఆమెతో నివసిస్తున్నాడు, ఒక యవ్వనస్తుడిగా. ఏ తేడా చేయలేదు. అతడు దానిని చూడలేదు, అతను దానిని పరిగణించలేదు. దేవుడు చెప్పినదానినే అతను పరిగణించాడు. అవిశ్వాసములన్నిటి నుండి వేరుపడ్డాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు.
ఈ రోజు ఇబ్బంది అదే. లోక విషయాల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి బదులుగా మిమ్మల్ని మీరు ఒక సంస్థ యొక్క అవిశ్వాసముతో కలిసిపోవాలనుకుంటున్నారు; పాపపు అంచుకు ఎంత దగ్గరగా మీరు రాగలరో చూడాలనుకుంటున్నారా. మీరు దాని నుండి ఎంత దూరంగా ఉండగలరో చూడండి.
GEN 17:5
60కానీ వారు ఇక్కడ ఉన్నారు. మొదటి ముప్పై దినములు లేక ఇరవై-ఎనిమిది దినములు గడిచిపోయాయి. ఇపుడు మిశ్రమ ప్రేక్షకులు, మరియు పెద్దవారైనా మీకు తెలుసు నేను ఏమి మాట్లాడుతున్నానో." ప్రియమైన సారా, నీకు ఎలా అనిపిస్తుంది?"
" నాకు ఏ వ్యత్యాసము తెలియడంలేదు అబ్రహాము."
"దేవునికి స్తోత్రం, మనము ఎలాగైనా దానిని పొందుకోబోతున్నాము."
"నీకు ఎలా తెలుసు?"
" దేవుడు చెప్పాడు."
పది సంవత్సరాలు గడిచిపోయింది. " సూదులు, పిన్నులు అక్కడే ఉంచు, మరియు అన్ని దుస్తులు .
అతని స్నేహితులు కొందరు వచ్చారు,"అబ్రహాము, జనములకు తండ్రి, నీకు ఎంత మంది పిల్లలు?"
"దేవునికి మహిమ! ఈ సమయములో, ఎవరు లేరు, కానీ నేను వారిని పొందబోతున్నాను."
" నీకు ఎలా …? ఎందుకు, నీకు ఇప్పుడు తొంభై సంవత్సరాలు."
"కొంచం కూడా తేడా ఉండదు. అది ఇప్పుడు జరిగితే ఇరవై సంవత్సరాల క్రితం కంటే గొప్ప అద్భుతం."
కాని ఈ రోజు," గడచిన రాత్రి ప్రార్థించాను.
ఈరోజు నాకు ఏమీ మంచిగా అనిపించలేదు." అబ్రహాము సంతానము?
విషయం ఏంటి? మీరు తొలగించబడ్డారు! ఇప్పటికి మీ సంఘము యొక్క వేరులు ఉన్నాయి; మీ సంస్థ మెథడిస్ట్ లేదా బాప్టిస్ట్ లు వలే గొప్పది. ఈ వేరులకే మీరు ఎల్లప్పుడు కట్టబడుతున్నారు, కానీ ఆ నిజ విశ్వాసము ఎక్కడ ఉన్నది? ఓహ్, మీరు చప్పట్లు కొడుతారు, మీరు కేకలు వేస్తారు మరియు పాటలు పాడుతారు మరియు నృత్యం చేస్తారు. నేను, చాలామంది వైద్యులలో ఇది చూశాను … మంత్రగత్తె వైద్యులు ' కూడికలలో వారు చప్పట్లు కొట్టడం, మరియు భాషలో మాట్లాడటం మరియు అర్థం చెప్పడం మరియు పైకి-కిందకి దూకడం. పవిత్రుడైన తండ్రికి అదే ఉంది. నేను మాట్లాడుతున్నది అది కాదు!
నేను దేవుని వాగ్దానాన్ని విప్పగల నిజమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను, అక్కడ నిలబడండి మరియు దానిని వాస్తవం చేయండి-ఇది వాక్యనుసారమైనది.
JOHN 14:6
61మహమ్మదీయులు, వారు వీధిలో పడి అరవడం నేను చూశాను, "అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్," వారికి స్పృహ వచ్చేవరకు.
నేను మరియు బిల్లీపాల్ అక్కడ నిలబడి ఒక వ్యక్తిని చూశాము. ఒక కత్తి తీసుకొని అతని గుండె కింద గుచ్చారు, మరియు ఒక వైద్యుడు దీనిద్వారా నీరు పోస్తే మరొక వైపు బయటకు వస్తాయి. అతను ఒక ముక్క … ఒక శూలం తీసుకొని అతని పెదవుల గుండా దానిని పంపి అతని ముక్కు ద్వారా దానిని తీస్తాడు, మరియు ఒక చుక్క కూడా రక్తం కారదు. అతని చేతిగోళ్లులో చీలికలు పెట్టుకొన్ని, పెద్దగా కేకలు వేస్తూ, "అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్!" ఆ విధముగా. యేసుక్రీస్తు ఆలోచనలను తృణీకరించే ఒక మహమ్మదీయుడు. అతనికి పరిశుద్ధాత్మ లేదు, కానీ అతనికి ఉద్రేకం ఉంది. అది నిజం.
క్రైస్తవ్యం ఖచ్చితంగా భావోద్వేగం కాదు. అన్యమతము క్రైస్తవ మతం వలె మనస్తత్వశాస్త్రంను ఉత్పత్తి చేస్తుంది; కానీ అది నిజం కాదు! మాకు నిజం కావాలి! క్రీస్తే ఆ నిజం.
మనము ఏమి చేస్తాం? ఆవిధంగా మనల్ని మనము స్తిరపరచుకున్నాం కాబట్టి సంసోను వలే నిలబడ్డాం, ఇప్పుడు, అతను అక్కడ నిలబడి అతను ఏమై ఉండెడివాడో ఆలోచించాడు. నేను అనుకుంటున్నాను, ఈ రోజు, సంఘము నాతోకలసి నిలబడి ఆలోచించాలి, కొన్ని నిమిషాలు, ఈ కార్యములు దీనిని చేసి ఉండకపోతే ఏమై ఉండెడివారమో అని మనము ఆలోచించాలి.
62అప్పుడు అతని మనసుకు అది వచ్చింది, ఏదో వచ్చింది. దేవుడు దానిని చేశాడని నేను నమ్ముతున్నాను. ఓహ్, అది చేయగలిగితే ఈ క్యాంప్‌గ్రౌండ్‌లో మాత్రమే జరుగుతుంది! "అవకాశం ఉంది." ఒక అవకాశం ఉంది. దేవుడు క్షమిస్తున్నాడు. ఒక అవకాశం ఉంది.
మనకు ఇక్కడ ఉండటానికి ఎక్కువ సమయంలేదు. మన సమయం అయిపోయింది. సంఘముల యొక్క సమాఖ్య దేశాన్ని తీసుకుంది. ఇది కాథలిక్కులతో ఏకం అవుతుంది. మన మనిషి అక్కడ ఒకరు ఉన్నారు, ఇదే విధముగా.
ఈ దేశం ఇజ్రాయెల్ మాదిరిగానే ఉందని మీకు చూపించడానికి నాకు సమయం కావాలని కోరుకుంటున్నాను. వారు ఒక వింత భూమిలోకి వచ్చి, ఆక్రమణదారులను తరిమివేసి, భూమిని వారసత్వంగా పొందారు. మనము చేసింది కూడా అదే. ఇశ్రాయేలీయులికి, వారికీ మొదటి వ్యక్తి ఉన్నాడు, గొప్ప వ్యక్తి, యెహోషువ వంటి వారు , దావీదు వలే, సొలొమోను వలే. కాని చివరికి రాజు స్థానములో ఒక మనుష్యుడు వచ్చాడు, ఆహాబు, ఒక తిరుగుబాటు. మనము గొప్ప వ్యక్తులను, వాషింగ్టన్ను, లింకన్ను కలిగి ఉన్నా౦; కానీ ఇప్పుడు మీరు ఏమి చేసారు? మనము ఇక్కడికి వచ్చిన విషయం స్వేచ్చ, మీరు దానిని వైట్హౌస్ లో పెట్టారు, ఎందుకంటే మీరు క్రీస్తు కొరకు చేసేదానికంటే మీ రాజకీయాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు. ఖఛ్చితంగా నిజం
EXOD 1:8
63గుర్తుంచుకోండి, ఆ సమయంలో, మంత్రులందరూ హాజరు అయ్యారు. జెజెబెలు ఒక నాయకురాలు. వినండి, అహాబు స్వయంగా చాలా మంచి వ్యక్తి, కానీ అతని ఆలోచలన వెనక దాగివున్న తల జెజెబెలు. ఆమె దానిని చేసింది . ఆమె తిరుగుబాటుదారురాలు. ప్రెసిడెంటు అనే వ్యక్తి మీద నాకు ఏ వ్యతిరేకతలేదు, కానీ దాని వెనుక ఉన్న జెజెబెలు వ్యవస్థ మీదనే. మీరు చూడలేరు, వస్తున్నటువంటి ఈ పోపులు మరియు కార్యాలను , మీరు చూడలేరు, ఆ యోసేపు ఎవరో పెంచుతున్న వారికే తెలీదు. మరియు మీకు తెలిసే మొదటి విషయం … మనము ప్రస్తుతం ప్రొటెస్టంట్ సంఘము దానితో ఏకీకృతం చేయమని అడుగుతున్నాము. సంఘ సంస్థ సమాఖ్యలోకి వెళుతుంది, మరియు అక్కడ మీరు చిక్కుకుంటారు!
మేము ఈరోజు నుండి నలభై సంవత్సరాలలో చెల్లించాల్సిన పన్ను డబ్బుతో జీవిస్తున్నాము. దేశం విడిపోయింది. ఇది ఎక్కడ ఉంది? ఎవరికి డబ్బు వచ్చింది? మనకు అది రాలేదు. మన బంధాలు మంచిగా లేవు. మనకు బంగారం ఉంది. అది ఎవరికి దొరికింది? కాథలిక్ సంఘమునకు. వారు ఏమి చేస్తారు? ముందు ఈ విస్కీ పురుషులు మరియు ఈ గొప్ప హోల్డర్లు మరియు స్టాక్ హోల్డర్లు ఎప్పుడైనా దానిని వదులుకుంటారు, వారు ఖచ్చితంగా అమ్ముతారు, మరియు సంఘము దేశానికి డబ్బు ఇస్తుంది. మరియు అది ఏమి చేస్తుంది, అది దాని జన్మహక్కులను నేరుగా కాథలిక్కులోకి అమ్ముతుంది. అప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు? అది ప్రపంచంలోని బంగారం, వారు మరియు యూదులు, మరియు అతను చేసే ఒడంబడిక అది చూడండి, బైబిల్ పాఠకులు మీ సంఘములో బోధించగలరు. మీరు చూస్తున్నారు, నేను మీకు చూపిస్తున్నాను నేను అదే విషయాన్ని నమ్ముతున్నాను. ఇజ్రాయెల్తో. అప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు? అది ప్రపంచంలోని బంగారం, వారు మరియు యూదులు, మరియు అది అతను ఇజ్రాయెల్ తో చేసే ఒడంబడిక
చూడండి, బైబిల్ పాఠకులైన మీరు సంఘములో దీనిని బోధించగలరు. చూడండి, నేను మీకు కేవలం చూపిస్తున్నాను. నేను అదే విషయాన్నినమ్ముతున్నాను.
REV 13:14,16,17
64అది ఈవిధముగానే జరగవలసి ఉంది, మనము ఇప్పుడే దానిని పోందుకున్నాము. మనము ఎక్కడ ఉన్నాము, మృగం ముద్ర ఉన్న సంఘము మనమీద, మొదటి మృగం వలే, దానికి ప్రతిబింబం, సంఘముల సమాక్య, ఒక అధికారాన్ని కలుస్తుంది. మరియు వారు, మృగమును ప్రతిమను చేసారు, అది మాట్లాడగలదు, మరియు అది మొదటి మృగము మొదట చేసినదే చేసింది. మీచేతులలోనే! ఓహ్, పిల్లలారా!
("అయ్యా ఇది ఏ సమయము") అక్కడ ఒక అవకాశం ఉందా?" సంసోను అక్కడ నిలబడి అన్నాడు (ఏమి సమయము?) "కనీసము … ఒక అవకాశము ఉందా?" సంసోను ఆలోచించసాగాడు, "ఆ గొప్ప దేవుడు! అయన సర్వశక్తి గల దేవుడు. ఆయన నిత్య దేవుడు. నా తప్పు నేను చూస్తున్నాను. నేను పశ్చాత్తాపపడబోతున్నాను. " మరియు అతను బిగ్గరగా ఏడ్చాడు.
మనము అదేపని చేసే అవకాశం ఉంది. ఆ దినము వారు, ఈ దినము వారు, సంసోను వలె దర్శనము చూడలేదు. అవకాశము యొక్క దర్శనము మాత్రము మనము చూడగలిగితే! ఇక్కడ, ఇప్పుడే మొదలుపెట్టండి. ఒక అవకాశము, చూడండి.
65వారు గట్టిగా కూర్చుని చప్పట్లుకొడుతూ, అది ఏమి అవుతుందో అని ఆశ్చర్యపోతున్నారు. మీరు ఒక రోజు తెలుసుకోబోతున్నారు, మీరు కొమ్ము యొక్క చిన్నచివర నుండి బయటకు రాబోతున్నారు, చూడండి, ఆ సమయం. గొప్ప సమావేశాలు, మరియు మెరిసే, లోక కార్యాలు కలిగి ఉంటారు. ఓహ్, " ఈలాగు అనుకుంటాము , సరే మీకు తెలుసా? మాకు ఇది వరకు ఎన్నడూ రానంతమంది సభ్యులు వచ్చారు. మరియు మనము మిలియను డాలర్ల భవనాలు నిర్మించగలము, మనకు ఇంతకుముందు కంటే ఎక్కువ డబ్బు వచ్చింది. కొంతమంది ప్రొటెస్టంట్ లేదా మరికొందరుకంటే మంచి సంఘము పొందారు. ఓహ్ మానవుడా! స్కాలర్‌షిప్; మంచిది, మనము మన పిల్లలను పాఠశాలకు తీసుకువేల్దాం మరియు వారు వెళ్ళడానికి కొత్త సెమినరీలను నిర్మిస్తాము."
ఇప్పుడే ఇది మీకు చెప్పనివండి. పరిశుద్ధాత్మ లేకుండా, విద్య కలిగి ఉన్న వ్యక్తి, తను కలిగిన ప్రతీ డిగ్రీ , దేవుని నుంచి తనను దూరం చేస్తుంది. అది నిజం. మీరు అనవచ్చు" నేను బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కలిగి ఉన్నాను అని మీరు అనవచ్చు." ఇప్పుడు మీరు ఇదివరకు కంటే దూరం జరిగి ఉన్నారు. వారు ఒక అణువును విభజించి దానిని గడ్డి మీద వేసి దానిగురించి ఏమి తెలీనట్లు ఉంటారు. మీరు పాత సామెతను విన్నారు " దేవదూతలు నడుచుటకు భయపడు స్ధలములో మూర్ఖులు మేకులు కలిగిన బూట్లతో నడుస్తారు" అది నిజం, స్కాలర్షిప్, కానీ అది ఆత్మను తీసుకురాలేదు. ఇది యేసుక్రీస్తు యొక్క కార్యాలను మరియు జీవమును తీసుకురాలేదు.
JUDG 16:30
66దాని ఇబ్బంది ఏమిటంటే, ఈ దినపు సంఘము సంసోనువలే లేదు. వారు వెల చెల్లించడానికి సిద్ధంగా లేరు. "ప్రభూ, నన్ను శత్రువుతో చనిపోనివ్వండి" అని ప్రార్థించినప్పుడు సంసోను సరిగ్గా ప్రార్థించాడు. అది అతనికి ఏదో ఖర్చు అవుతుందని తెలుసు. ఏదో వెల చెల్లించవలసి ఉంటుంది అని అతనికి తెలుసు. ఇది మీకు కొంత ఖర్చు అవుతుంది, ఇది నాకు ఏదో ఖర్చు అవుతుంది; మీ సామాజిక ప్రతిష్ట, సంఘశాఖలో మీ స్ధితి మరియు స్థానం. "ప్రభూ, అయితే నన్ను చనిపోనివ్వండి. నేను మీ ఉద్దేశ్యాన్నిచూస్తున్నాను". దానికి అతను వెల చెల్లించవలసి వస్తుంది అని అతనికి తెలుసు. దేవుని ఆశీర్వాదాలను పొందడానికి మీరు మీ శత్రువుకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. సంసోను దేవుని శక్తి మళ్ళీ అతనిపై ఉండుటకు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను దీన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్దముగా ఉన్నారా?
మీరు మీ టెలివిజన్ కార్యక్రమాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మరియు మీకు తెలుసా అది అలానే ఉండేది. మనం సినిమాలకు వెళ్లడం తప్పు. కానీ ఇప్పుడు దెయ్యం మీ మీద ఒకదాన్ని పెట్టింది, మీతో పాటు నేరుగా ఇంట్లో పెట్టింది. అది నిజం. చూశారా?
67నేను పాత మెథడిస్ట్ బోధకుడి వద్దకు వెళ్ళేవాడిని. నేను ఒకపాట పాడేవాడిని.
మేము అడ్డుగోడలను తీసేసాము, మేము అడ్డుగోడలను తీసేసాము.
మేము పాపముతో రాజీపడ్డాము ;
మేము అడ్డుగోడలను తీసేసాము,
గొర్రెలు బైటకు వెళ్ళాయి,
కానీ మేకలు ఎలా లోపలికి వచ్చాయి?
మీరు అడ్డుగోడలను తీసేయండి, అంతే.
ఓహ్, "ఒక నిమిషం ఆగండి, సహోదరుడా బ్రాన్హాం, మాకు ఉజ్జీవాలు ఉన్నాయి" అని ఎవరో చెప్పడం నేను విన్నాను. అవును, అది ఏమిటి? ఒక సంఘశాఖ ఉజ్జీవం. అది నిజం. మీ నీతులు మరియు మీ వ్యత్యాసాలను చూడండి. ఇది ఉజ్జీవమా? విడిపోయే సమయం ఉన్నదా? అందరూ కూడుకొని సహవాసముచే మరియు బైబిల్ ద్వారా మీకు తెలుసు. సమయము ఉన్నదా? మీ సంస్థ అందులో ఉంటే, మంచిది. వాక్యమునకు దూరముగా అన్ని సమయములలో వెళ్ళిపోవుట, అది నిజం, కొత్త బిషప్‌లను తయారు చేయడం మరియు ప్రతీది, చూడండి.
68ప్రస్తుతము తను ఉన్న పడిపోయిన స్థితి ఈ గడియ యొక్క సవాలును ఎదుర్కొనుటకు తనకు కావలసిన శక్తిని ఇవ్వలేదు అని సంసోను యెరిగి ఉన్నాడు.
పురుషులు, స్త్రీలు, నా సహోదరులు మరియు సహోదరీలు, దీనిని నన్ను చెప్పనివ్వoడి: సంఘము తను ఉన్న ప్రస్తుత సంఘశాఖ స్థితిలో కాలము యొక్క సవాలును- కాలము యొక్క పిలుపును ఎదుర్కొనుటకు చాలినంత శక్తిని ఉత్పత్తి చేయదు. పురుషులు మరియు స్త్రీలు దేవుణ్ణి, యదార్ధ హృదయాన్ని కోరుకుంటారు. మీరు ఏకత్వమును వదిలి ద్విత్వవమునకు వెళ్ళవచ్చు. ద్విత్వమును వదిలి మీరు త్రిత్వమునకు వెళ్ళవచ్చు, మరియు మీరు దీనినంతటిని చేయవచ్చు, అది లేక మరొకటి; ఒక చిన్న పిల్లవాని వలే కాగితము లాగడం, లేక అటు ఇటు తిరగడం లేక నటించడం మొదలిన విధముగా. అది నిజం. మీరు దానిని ఆవిధముగా పొందుకొనలేరు. సంఘశాఖలు వాక్య బయల్పాటును తీసుకోవు.
JOHN 4:19
69యేసు క్రీస్తు, నేను గత రాత్రి మీకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, చివరి రోజుల్లో ఈ మాట ఇచ్చినప్పుడు, అయను ఇక్కడ కలిగి ఉంటానని వాగ్దానం చేశాడు. మరియు బైబిలు ద్వారా అది మీకు తెలుసు. పదిహేనేళ్ళక్రితం మరియు దేశవ్యాప్తంగా, మరియు ఇది అన్ని సమయాలలో అధ్వాన్నమవుతుంది. అది నిజం. వారికి అది అవసరం లేదు.
వారు "సరే, ఇప్పుడు అతను ఏకత్వంతో కలిసి ఉంటాడు" లేదా "అతను త్రిత్వముతో కలిసి ఉంటాడు. అతను ఇది, అది లేక మరొకటి చేస్తాడు." మేము క్రీస్తుతో సహవాసము చేస్తాము, ప్రతీ సంస్థకు వెలుపల, ప్రయత్నిస్తూ …
కానీ దేవుడు దానిని చూస్తాడు, వారు దానిని చూస్తారు. నిజమైన విశ్వాసులు గత రాత్రి చిన్న వేశ్యవలే ఉన్నారు. అది ఆమె దారిలో వెలిగిన వెంటనే, మరియు ఆ జీవన విత్తనం అక్కడ ఉండగా, ఆమె దానిని నమ్మింది. జరిగినదంతా అదే, అది మండించబడిండి. అక్కడ వేలమంది నిలబడి, పరిహాసం చేస్తూ, కానీ ఆమె చేయలేదు. అది మెస్సీయా అని ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసు అది వాగ్దానం అని, అతను వచ్చినప్పుడు అతను అలాచేస్తాడు అని.
MATT 4:4•
LUKE 4:4
70ఆశ్చర్యపోతున్నాను, మనకు కేవలం ఆ విషయము మాత్రమే తెలిసి ఉంటే! మన సంస్థలో మనము దానిని చూచుటకు కూడా నిషేధించేంతగా చుట్టబడ్డామా? ఆశ్చర్యపోతున్నాను మీరు మీ పరిశుద్ధ గ్రందమును చదవలసిన విధముగా చదువుటకు బదులు పత్రికలూ మరియు చిత్రాలు మరియు లోకపు పాత మురికి మలినాలను చూస్తూ? "మానవుడు రొట్టె ద్వారానే కాదు కాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును."
మన పిల్లలు, మన అబ్బాయిలు, చిన్న రికేయ్స్ మరియు రికేట్టాస్ గుంపు గా తయారు అయ్యారు, మీకు తెలుసా అది నిజం, పాతకాలపు కారు వలె, మరియు అలాంటిది. మరియు పెంతెకోస్తు బాలుడును మీరు ఎక్కడ కనుగొంటారు? వీధిలో తన పాట కారుతో. మీరు సోదరిని ఎక్కడ కనుగొంటారు? ఎక్కడో క్యాంటీన్ వద్ద, రాక్ 'ఎన్' రోల్ చేస్తూ. మీరు తండ్రి మరియు తల్లిని ఎక్కడ కనుగొంటారు? తండ్రి బైట గోల్ఫ్ ఆటలోనూ, లేక అటువంటి ఇతర కార్యములో, మరియు తల్లి ఆమెకు చెందిన క్లబ్ లోని వేడుకలోనో, లేక ఇతర కార్యములోనో. వారు అందరు పరిశుదాత్మ నాయకత్వములో గృహములో సమకూడి, పరిశుద్ద గ్రంధముతో ఉండవలసి ఉండగా. ఇక్కడే మనం తప్పిపోతున్నాము. మిమల్ని విమర్శించటం లేదు కాని, కొంచెం కదిలిస్తున్నాను, చూడండి, మీరు అర్ధం చేసుకుంటారు.
HEB 13:8
71ఎల్లప్పుడు, మరియు (నేను ముగించాలని తెలుసు ) ఫిలిష్తియులు ఏమి జరుగుతుందో గమనించలేదు. అక్కడ ఏదో జరుగుతోంది, ఎందుకంటే సంసోను హృదయంలో ఏదో కదులుతోంది. అక్కడ ఒక అవకాశము ఉంది. కొంతమంది స్త్రీలు దీన్ని చేయటానికి చాలా కష్టపడుతున్నారు, అది కలిగి ఉండాలి. అయితే చూడండి అతని వాగ్దానం ఇంకా ఉంటే, అతను ఇంకను చేస్తుంటే… కేవలము అనుభూతి చెందండి మరియు అతను నిన్న, నేడు, నిరంతరం ఒక్క రీతిగానే ఉన్నాడో లేదో చూడండి.
అతను దానిని అనుభవించాడు. ఏదో ఉందని అతనికి తెలుసు. తల ఎత్తాడు. అతనికి కళ్ళు ఎంత మాత్రము కనిపించడం లేవు. ఆ కన్నులు ఎంత మాత్రమూ లేకుండా ఆ కాళీ కనుగుడ్ల గ్రందులలో నుంచి వస్తున్నఆ కన్నీళ్లను వారు గమనించలేదు. అతని తల పైకెత్తి, మెల్లగ పెదాలు కదుపుతూ, మూసుకుపోయిన ఆ కనుగుడ్ల లో నుంచి కన్నీళ్ళు కారుతూ - అతను పశ్చాత్తాపపడుతున్నాడు. యెహోవా ఇంకా సజీవుడని అతనికి తెలుసు. అతను తప్పు చేసినప్పటికీ, ఆయన దేవుడు అని యెరిగి ఉన్నాడు. అతను నిలబడి ఉండగా అతని చెంపల నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. దానిని గమనించలేనంతగా ఫిలిష్తియులు తాగి ఉన్నారు.
72మీ సంఘసభ్యులు, సంఘములోని మీ సహచరులు దీనిని గమనించకపోతే, మీరు ప్రార్థన కొనసాగించండి. దేవుని వాక్యం, ఆ గుడ్డి, తాగుబోతు అన్యజనుల సమూహం, అవిశ్వాసులైన వారిముందు మరొకసారి వెల్లడి కావాలని చూసాడు. ఈ దినము సంఘము యొక్క ఆశ అదే, మరొక్కసారి దేవుని నుంచి వచ్చినటువంటి ఆ పాతకాలపు ఉజ్జీవము కలిగి ఉండాలని. దేవుని శక్తితో పాతకాలపు ఉజ్జీవము. మానవుని పూర్తిగా లోపలి నుంచి బైటకు శుభ్రము చేయునటువంటి ఉజ్జీవము.- తుపాకీ గురికి నేరుగా. పాతకాలపు, పాపమును చంపునటువంటి మీలోనుండి హాలీవుడ్ ను తీసివీసేటువంటి మతము - ఆసక్తి ఉన్నవారిలో.
అక్కడ అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు క్రొత్త తెగ కాదు, లేదా కొత్త మతం కాదు, కానీ రుజువు చేయబడిన దేవుని వాక్యమ. "ప్రభూ, మీరు ఒకప్పుడు నాపై ఉన్నారు, ఒకప్పుడు మీరు నాకు బలం ఇచ్చారు! నాకు ఆ బలం మాత్రమే ఉంటే! నాకు కండరాలు ఉన్నాయి, కానీ అవి బలహీనంగా ఉన్నాయి!"
GEN 19:28,29
73మునము సభ్యులను కలిగి ఉన్నాము, కానీ వారు బలహీనముగా ఉన్నారు. వారు చేసే కార్యములకంటే లోకకార్యములను ఎక్కువగా ప్రేమిస్తున్నారు…మీరు అనవచ్చు నేను అంతా … సంఘములను చూచి కనుగొనండి. దానిని తిరస్కరించడానికి ప్రయత్నిం చేయవద్దు. మీ చర్యలు మీ మాటల కంటే ఎక్కువగా మాట్లాడుతాయి. చూడండి. ఓహ్, అవును, మరింత మంది సభ్యులు, పెద్ద కండరాలు, కానీ ప్రభువు బలం ఎక్కడ ఉంది? మీపెద్ద కండరాలు ఈ గడియ యొక్క సవాలును ఎదుర్కోనడానికి, తీర్పు భూమిని తాకుటకు ముందే సంఘము ఎత్తబడు విశ్వాసమునకు తీసుకోనిపోవుటకు సరిపోవు.
తీర్పు రాబోతుంది. నా స్నేహితుడు జాక్ మూర్ చెప్పినట్లు నేను చెబుతాను, "దేవుడు అమెరికాను ఇప్పుడు అది చేస్తున్న పనులతో విడిచిపెడితే, నైతికముగా సొదోమా మరియు గొమొర్రాలే దానిని కాల్చివేసినందుకు క్షమాపణలు చెప్పాలి." నిజం! తదుపరిది తీర్పే.
LUKE 17:34,36
74దేవా, నా నుండి లోకమునంతా తీసివేయండి. ఓహ్ ప్రభువా, ఎత్తబడుటకు, నాకు విశ్వాసమును ఇవ్వండి. ఇద్దరు పడకలోఉంటే, ఒకరు ఎత్తబడుతారు, ఒకరు విడిచిపెట్టబడుతారు. ఇద్దరు అటోమోబల్ సీట్లో ఉంటే ఓకరు తీసుకోనబడుతారు మరొకరు విడిచిపెట్టబడతారు. ఇది క్షణంలో జరగబోతోంది.
"సహోదరుడా బ్రాన్హాం, అది ఎప్పుడు జరుగుతుంది?" అని మీరు అనవచ్చ.
మీరు దీన్ని విమర్శించవచ్చు. చెప్పడం సరైనదే అయితే. కొంచెం ఇక్కడ నన్ను చెప్పనివ్వ౦డి.
మీరు అక్కడ చెప్తారు" ఒహొ, ప్రభువు రాకడకు మునుపు అదీ, ఇదీ మరియు ఇతర కార్యములు జరుగుతాయని నేను నేర్చుకొనివున్నాను . ఒక గొప్ప శ్రమకాలం ఉంటుంది మరియు మేము దాని గుండా వెళ్తాము", చూడండి.
MATT 17:10,11•
MATT 24:43•
1COR 15:52-54•
1THS 4:15,16•
1THS 5:2
75మీకు తెలుసా, యేసును ఒకసారి ఈ ప్రశ్న అడిగారు, అతను అన్నాడు," ఏలియా తప్పక మొదట రావలెను అని లేఖనకారులు ఎందుకు అన్నారు ?"
యేసు అన్నాడు , "నేను మీతో చెప్తున్నాను, అతను ఇదివరకే వచ్చాడు, అది మీకు తెలియదు."
ఒకానొక రోజు మీరు ఇది చెప్తారు," మంచిది, నేను సంఘం వెళ్తుంది అని అనుకున్నాను… ఇది చేయాలి, అది లేక మరొకటి. ఎత్తబాటు ఉంటుందని అనుకున్నాను. నేను అనుకున్నాను…"
చూడండి, ఇది రహస్యంగా జరుగుతుంది. ఆయన ఇక్కడ హాట్ స్ప్రింగ్స్‌లో ఒకరిని, మరొకరిని వేరే స్ధలములో, ఒకరిని ఇక్కడ, ఒకరిని అక్కడ, తీసుకుంటే వచ్చే వారు సుమారు మిలియన్లు అవుతారు.
మరియు ప్రపంచంలో ప్రతి రోజు కనీసం ఐదు వందల మంది తప్పిపోతున్నారు, మరియు వారు ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలియదు. చూడండి, ఎత్తబాటు ఎవరైతే భూమి మట్టిలో నిద్రించారో వారు నేరుగా దేవునితో ఉండులాగా చేస్తుంది.
వారు అంటారు," ఎత్తబాటు జరుగుతుంది అనుకున్నాను."
"అది ఇది వరకే జరిగిపోయింది, మీకు తెలియదు. మీరు విడిచిపెట్టబడ్డారు," చూడండి.
"సరే, అంతా జరుగుతోంది …" అవును సార్.
ఇది ఒక రహస్య రాకడ , ఎత్తబాటు, దొంగిలించడానికి వస్తుంది. ఆ సమయములో నేను చదివిన పుస్తకంవలే ( అదేమిటి), రోమియో మరియు జూలియట్ . లోకముతో ప్రజలు, సగము నిద్రపోతున్నప్పుడు అయన వస్తాడు. అకస్మాతుగా కేక వస్తుంది, వారు వెళ్లిపోతారు.
MATT 25:10
76వినండి, క్రిస్టియన్ బిసినెస్మెన్ , ఫుల్ గ్స్పాల్ మెన్, వీరు చెప్పింది మీరు చాలా విన్నారు" ఓహ్, మీకు తెలుసా రెవరెండు పరిశుద్ద తండ్రి మొదలైనవి! ప్రేస్బిటేరియన్లు పరిశుద్ధాత్మను పొoదుకొనుట ప్రారంభమైంది. లూతరన్లు పరిశుద్ధాత్మను పొoదుకొనుట ప్రారంభమైంది.
నిద్రిస్తున్న ప్రజలారా! మీకు తెలియదా? యేసు అన్నాడు, "నిద్రిస్తున్న కన్యలు నూనె కొనుటకు వెళ్ళినప్పుడు, ఆ సమయంలోనే వరుడు వస్తాడు, మరియు ఆమె లోనికి వెళ్తుంది". గుర్తుంచుకోండి, వారు దానిని పొందలేదు! అది సరియైనదేనా? బూత్- క్లిబ్బోర్న్ చెప్పినట్లు, "హుహ్." వాళ్ళు కొన్ని భావోద్వేగాల ద్వారా వెళ్ళి ఉండవచ్చు, కాని వారు నిజంగా దాన్ని పొందలేదు. వారు నూనె కొనడానికి వచ్చినప్పుడు, చాలా ఆలస్యం అయింది!
77ఇక్కడ వారు ఇప్పుడు ఉన్నారు ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు; సంపూర్ణ సువార్త వర్తకులు వారి స్వరమును వినండి మరియు సంఘశాఖ సహోదరులతో పెంతెకోస్తు మనవళ్ళు, వారు అది గొప్పదిగా అనుకుంటున్నారు. మీరు ఒకానొక రోజున అడుగవచ్చు, "మంచిది, నేను ఇలా అనుకున్నాను."
"ఇది ఇప్పటికే ముగిసింది, మీకు తెలియదు." నేను ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే సిద్ధాంతాన్నిబోధించడానికి నేను ఇక్కడలేను.
కానీ, అవకాశాలు! మీరు ఆ అవకాశాన్ని తీసుకోకండి. ఇదే ఆ రోజు. ఇదే గడియ. ప్రస్తుతం ఒక అవకాశం ఉంది, బహుశా ఐదు గంటలకు ఉండకపోవచ్చు. అవకాశం ఉంది. "ప్రభువా, నీవు దేవుడవని నాకు తెలుసు. నేను మీకు దూరంగా ఉన్నాను. కానీ నాకు తెలుసు నా నరములు దేవుని శక్తితో పులకించెను. నేను ఈరోజు జాగ్రత్త వహించే కార్యాలు, పెంతెకోస్తుగా ప్రకటించుచున్నాను"; స్త్రీలు, "నేను జుట్టు కత్తిరిస్తాను"; పురుషులు, "నేను ఇది, అది లేక వేరొకటి చేస్తాను."
మరియు మీ భార్యలు షార్ట్స్ ధరించి పనులు చేయనివ్వండి. అటు తర్వాత మిమ్మల్ని దేవుని కుమారుడని పిలుచుకోవడం, మీకు సిగ్గుచేటు.
GAL 5:22
78నేను చాలా కాలం క్రితం ఒక గొప్ప సంఘానికి వెళ్ళాను, ఒక … వారికి ఒక కూడిక ఉంది , మరియు నేను వారిని సందర్శించడానికి వెళ్ళాను. పాస్టర్ నన్ను బయటకు తీసుకువెళ్ళాడు, అతను తన భార్యకు నన్ను పరిచయం చేయడానికి వెళ్తున్నాడు. ఆమె పియానిస్ట్. ఆమె ధరించిన దుస్తులు ఆమె చర్మం బైటకు వచ్చేంత బిగుతుగా ఉన్నాయ్. ఆమె మేకప్ వేసుకుంది, ఇంకా చెవులకు అన్ని రకాలు వేసుకుంది. నేను అన్నాను, "సహోదరుడా, మీ భార్య పరిశుద్దురాలు అని చెప్పాలనుకుంటున్నారా?"
అతను అన్నాడు , "అవును, సార్."
నేను, "ఆమె ఒక హాంట్లాగా ఉంది" అని అన్నాను. నేను అన్నాను , "పెంతెకోస్తు మరియు పవిత్రత పేరిట నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు!"
ఓహ్, సోదరుడా, మాకు బలిపీటం నుండి పునాది వరకు పూర్తిగా శుభ్రపర్చుట అవసరం. ఈ దినములలో … "నేను పెంతెకోస్తు"అని మీరు అంటున్నారు. దేవునికి అది పంది కంటే ఎక్కువ కాదు. దానికి క్రీస్తుతో సంబంధం లేదు. అది కేవలం పేరు. మీరు పెంతెకోస్తుగా హృదయం ఉండొచ్చు. ఆత్మ యొక్క ఫలములు.
గమనించండి, ఓహ్, నా!
79దేవుడు తన ప్రార్థనకు సమాధానం ఇస్తే ఏమి జరుగుతుందో అతనికి తెలుసు.
మీకు తెలుసా? మీ సంస్థ మిమ్మల్నిబహిష్కరించబోతోందని మీకు తెలుసా? లేదా మీరు సంఘ సమాఖ్య నుండి బయటికి వెళుతున్నారని మీరు గ్రహించారా? మీరు ఏ కార్యముల గుండా వెళ్తున్నారో తెలుసా? మీకు ఏమి చెల్లించవలసి వస్తుందో మీరు గ్రహించారా? పేకఆట, అదే స్త్రీలు మిమ్మల్ని పాతకాలపు వారు అని పిలుస్తారు అని మీకు తెలుసా? మీరు మీ పిల్లలను షార్ట్స్ ధరించనివ్వరు, మరియు మీరు ఈ పనులు చేస్తున్నారు, మీకు తెలుసు ఇందుకు మీరు ఏమి చెల్లించవలసి ఉంటుందో? మీరు ప్రారంభించడానికి ముందే దాన్ని బాగా లెక్కించండి, చూడండి. మీరు దాని గురించి ఆలోచించడం మంచిది. మీరు ప్రారంభించడానికి ముందు, మొదట దేవునితో మాట్లాడటం మంచిది.
అతనికి తెలుసు, తన ప్రార్థనకు సమాధానం లభిస్తే; కానీ అతను సిద్ధంగా ఉన్నాడు, మరియు అతను నిజాయితీగా ఉన్నాడు.
సంఘము ఆ స్థితి లోనికి వస్తేనే! మీరు ఇప్పుడే సిద్ధంగా ఉంటే, మీరు హృదయపూర్వకముగా ఉంటే, నేను చుట్టూ తిరిగి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదానికి మీ కళ్ళు తెరిచి ఉంటే! మీరు చిత్తశుద్ధిగా ఉంటే , "ప్రభువా, నేను ఏమైయున్నానో పట్టించుకోను, నేను సిద్ధం. నేను సూచనలు చూస్తున్నాను. ఇది మనం అనుకున్నదానికన్నా ఆలస్యమని నాకు తెలుసు. ఇది వచ్చుటకు సమయం."
JUDG 16:26,28•
ACTS 2:2
80అప్పుడు సంసోను, "ప్రభూ, వారు నా కళ్ళను బయటకు తీశారు! మీరు దేవుడు అని నాకు తెలుసు. మీకు దీన్ని చేయగల శక్తిఉందని నాకు తెలుసు. ఈ సంకెళ్ళ నుండి మీరు నన్ను విడిపి౦చగలరు అని నాకు తెలుసు."కేవలం ఒక్కసారి, ప్రభువా, కేవలం ఒక్కసారి."
కేవలం ఒక్కసారి, ప్రభువా, కేవలం ఒక్కసారి. కొండ పక్కన క్యాంప్మీటింగ్ లు ఉండనివ్వ౦డి, మెడ గది వద్ద కొండ ఉన్నట్టుగా. పరలోకమునుండి ఒక స్వరము శక్తివంతమైన పెద్ద గాలి వలే వచ్చి, గృహమంతా నింపును గాక, పునరుత్థానుడైన క్రీస్తు సాక్ష్యాలు.
"కేవలం మరొక్కసారి, ప్రభువా, కేవలం మరొక్కసారి," అని మొర్రపెట్టాడు. అతను యదార్దముగా మొర్రపెట్టాడు, అతని గుడ్డి కళ్ళలో అక్కడ నిలబడి, "నాకు వెల తెలుసు, ప్రభువా కానీ మరోసారి."
దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అతని కండరాలకు పటుత్వం వస్తుంది. అతని కాళ్ళ శక్తీ తిరిగి రావడం ప్రారంభించింది. అతను చిన్న పిల్లవాడితో, "నన్నుఇప్పుడు ఆ స్తంభం వద్దకు నడిపించు. "
ప్రభువా, నన్ను నడిపించు. నన్ను ఆ స్ధంభమునకు నడిపించండి, కల్వరికి నడిపించండి. నా పాత ప్రాపంచిక జీవితం ఇక్కడ చనిపోయే వరకు, మరియు మేమంతా. నన్నుఆ స్ధంభమునకు నడిపించండి, ప్రభువా.
JUDG 16:30
81దేవుని శక్తితో అతని కండరాలు బిగుతుగా అనిపించడం ప్రారంభించినప్పుడు, అతను ఏమి జరుగుతుందో చూడలేదు, ఏమి జరుగుతుందో దానిని అతను అనుభూతి చెందాడు. అతను తన భుజాలు తిప్పడం ప్రారంభించాడు. అతను అలా చేసినప్పుడు, భవనం క్రిందికి వెళ్ళింది. ఆరోజు అతను జయించాడు, తన జీవితంలోని అన్ని రోజులు కంటే ఎక్కువ మంది ఫిలిష్తీయులును చంపాడు.
స్నేహితులారా, సంఘము ఈ స్థితిలో ఒక అవకాశం ఉంది. మూడు లేక నాలుగు పేజీలను నేను విడిచిపెడుతున్నాను. ఈ కూడికలో ఇక్కడే ఈ గడియలోనే అవకాశం ఉంది. మనము వెల చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, కార్యాలు జరుగుట మనం చూడవచ్చు.
ACTS 1:14,15•
ACTS 2:2
82మరోసారి ప్రభువా! మేము దానిని గందరగోళపరిచాము. మేము క్రమపరిచాము. మేము సోదరభావంను విడిచిపెట్టాము . మేము మా సహవాసమును వేరు చేసాము. మేము ఇక్కడ ఒక చిన్న గుంపును తీసుకున్నాము. మేము ఒకరితో ఒకరు గొడవపడుతున్నాము, అపవాది మా వెనుక కూర్చొని , మమ్మల్ని గమనిస్తూ కొరడాతో కొట్టుచున్నాడు. ప్రభువా, మేము 120 మంది ఒకే స్ధలములో ఒకే మనసులో ఉండుటకు మరి ఒకసారి అవకాశం ఉందా? పరలోకము నుండి గొప్ప శక్తీవంతమైన గాలి వచ్చుటకు అవకాశము ఉన్నదా? మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి!"
లేచి నిలబడండి, చెప్పండి, "మరొక్కసారి , ప్రభువా, మరొక్కసారి!"
ఓ ప్రభువా, నా ప్రార్ధన ఆలకించండి, ప్రభువా. మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి శక్తీ లోను మరియు మహిమలోను మీ ఆత్మను ఈ కూడికలో మామీద తీసుకు రండి!