నీ జీవితం సువార్తకు తగినట్లుగా వున్నదా?

నీ జీవితం సువార్తకు తగినట్లుగా వున్నదా?

1ఇప్పుడు మనమావిధముగానే నిలబడి తలలు వంచి ప్రభువును చూద్దాం. మీ విన్నపములు ఏమైనా వుంటే మీ చేతిని ఎత్తుట ద్వారా వాటిని ఆయనకు తెలుపడి. మరలాగే మీకవసరమైన వాటిని మీ హృదయమందు నిశ్చయించుకొనుడి.

మా పరలోకపు తండ్రి, మరోక దినము కొరకు నీకు కృతజ్ఞతలు. జ్ఞప్తి కొరకు ఇది ఆరంభమైనది; అది చరిత్రగును. ఈ ఉదయ కాలపు కూటములు ఇప్పటికే గతించినవి. చెప్పబడిన మాటలు గాలిలో వున్నవి, అలాగే టేపు మీద రికార్డయినవి. వాటిని ఒక దినాన మేము ఎదుర్కొనవలెను. మంచైనా, చెడైనా ఎదుర్కోక తప్పదు. అయితే అది మంచి కొరకే అని నమ్ముచున్నాను, ఎందుకనగా అది నీ కార్యమైవున్నది.

ఇప్పుడు, మేము అడుగుచున్న మనవులను ఇప్పుడు మీరు అనుగ్రహించవలసినదిగా అడుగుచున్నాను. మా చేతులను ఎత్తిచూపుట ద్వారా మా మనవులను తెలుపుచున్నాము. మా అక్కరలను మా మనవులను ఎరిగియుంటివి గనుక ప్రభువా వాటిని దయచేయమని, మా హృదయ-వాంఛలను అనుగ్రహించమని ప్రార్ధి౦చుచున్నాము. ప్రభువా, వాటిని నీ ఘనత కొరకు అడుగుచున్నాము.

మా మధ్యనున్న రోగులను బాగుచేయండి. సమస్త సందేహములను దోషములను తీసివేయండి. మాకనుగ్రహించండి నీ యొక్క… నీ వాక్యమును ధ్యానించుచుండగా, మేము జీవించుచున్న ఈ కాలానికి నీ యొక్క దీవెనలను ఈ రాత్రి మరోకసారి, ప్రభువా, మాకనుగ్రహింప రండి. తండ్రి మరింకా శ్రేష్ఠముగా ఎలా బ్రతకాలో, నీకింకా సమీపముగా ఎలా బ్రతకాలో నేర్చుకొనుటకు తప్ప మరీ కారణము కొరకు మేము సమాజముగా కూడియుండలేదు. ఆ దినము సమీపి౦చుట చూచుకొలది మరి తప్పక మేము సమాజముగా కూడుకోవలసివున్నది, నీ కట్టడలను పొందుకోవలసివున్నది. తండ్రీ యేసు నామమున వీటిని దయచేయండి ఆమేన్.

మీకు వందనములు. దయచేసి కూర్చోండి.

2ఈ చోటంతా పూర్తిగా నిండిపోయినది, భయంకరమైన వేడిగావున్నదని నాకు తెలుసు. గనుక దయతో మన్నించండి మనకు ఎటువంటి శీతలీకరణ (ఏ.సి.) లేనందుకు మాకెంతో బాధగా ఉ౦ది. ఈసారి నేను వచ్చేనాటికి సంఘము (మందిరము)లో రెండు వస్తువులు వుండవలెనని నేను కోరుచున్నాను. మొదటిది ఒక పియోనా, దానిని ఈలాగు నుంచుడి. అప్పుడు పియోనా వాయించువారు సమాజమును చక్కగా చూడవచ్చును. ఈ ప్రక్కన ఆర్గన్ వుండాలి. మరియు మరోకటి శీతలీకరణ యంత్రము (ఏ.సి). అప్పుడు అది బావుంటుందని అనుకొనుచున్నాను. మనము… వాటికొరకు మనము ప్రభువును నమ్ముదుము, వాటిని ఆయన మనకిచ్చునని మనమెరుగుదుము.

3నేననుకొనుచున్నాను, బ్రదర్ హికర్సన్ దీనిని మ్యాగజైన్లో నుండి తీసికొని వచ్చారని వారు నాకు చెప్పారు. అతడు దీనిని నా బల్లపై వుంచెను. దూతల సమాహార సంగతిని గూర్చిన పటమును తెలిపే పత్రిక అది. ఆ పిరమిడ్ ఆకారమును అందులో గమనించండి. ఈ ప్రక్కనున్న దూతను అనగా, రెక్కలు చాచి, ఎదురు రొమ్మును చూపునట్టి ఆ దూతను నా కుడి ప్రక్కన చూడండి. ఈ ప్రసంగ వేదికనుండే కొన్ని నెలల క్రితమే దానిని మీకు చెప్పితిని, చూశారా, అది ఇదే. లుక్ పత్రిక లేదా లైఫ్ పత్రికలో అది ప్రచురితమైనది. అది మే నెల పత్రికలో, మే 17 అని నేను అనుకొనుచున్నాను. అది అవునా? అవును. అది మే 17న అందులో వెలువడినది. దాని విషయమై అనేకులు ఆమెకు ఫోన్ చేసారని శ్రీమతి ఉడ్ నాకు చెప్పినది. మే 17న అది ఆ పత్రికలో వచ్చినది.

అదొక మర్మయుక్తమగు మేఘము. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వైశాల్యంలో ఏర్పడినది. దాని గూర్చే మేము మాట్లాడుచున్నది. ప్రభువు దూత అక్కడికి దిగివచ్చెను. అంతట ఆ చోటంతా కంపించెను. మరప్పుడు అక్కడ… గొప్ప శబ్దం సంభవించినది…

4అక్కడ ఒక మనిషి వుండెనని నాకు తెలుసు, అతడు బ్రదర్ సాద్మన్. ఇంత క్రితమే అతడిని నేనిక్కడెక్కడో చూచితిని. ఆ రోజున అతడు అక్కడుండెను. అది జరిగినప్పుడు అతడు అక్కడుండెను. అవును. అది జరిగినప్పుడు అతడక్కడేవున్నాడు. అప్పుడు నేను అతనికి సమీపములోనే వుంటిని, నేనతనిని చూచి నా చేతిని అతనికి ఊపితిని. అతని సూక్ష్మదర్శిని నా దగ్గర వుండెను. జంతువుల కొరకు మేము వేటాడుచుంటిమి. అయితే అవి ఆ కొండ మీద లేవు, అవి మరోక కొండ మీదకు వెళ్ళాయి. అంతకు ముందు రోజు నేను వాటిని కనుగొన్నాను, గనుక వెళ్ళవలసిన త్రోవను నేను వారికి చెప్పాను. అప్పుడు నేను అలా వెళ్ళి, వాటిని వారి వైపునకు త్రోలితిని, అవి వారివైపు వెళ్ళినవనుటకు గుర్తుగా నేను గాలిలో తుపాకి పేల్చుదునని వారికి చెప్పాను. తద్వారా వారు తాము వేటాడు జంతువులను సుళువుగా పొందుకోగలరు. అది అడవి పందుల వేట.

5కావున నేను ఆ వైపుకు వెళ్ళాను, అయితే అవి అక్కడ లేవు. మరియు ఈ ప్రక్కనను అవి కనిపించలేదు. బ్రదర్ ఫ్రెడ్ వాటిని వెతుక్కొంటు వచ్చాడు, కానీ అవి అతనికి కనపడలేదు గనుక అతడు తిరిగి వెనక్కి వెళ్ళెను. మరియు బ్రదర్ నార్మన్ కొండ మీదకి వెళ్ళెను. మరి నేను ఆ ప్రక్కకు తిరిగి క్రిందికి దిగి వెళ్ళాను, మళ్ళీ పైకి మరలాను, అలా సుమారు మైలున్నర ఆ రాత్రి ప్రదేశాలలో సంచరించాను. ఒక చోట కూర్చోని చుట్టూ చూచాను. అప్పుడు ప్రొద్దు పొడిచి సూర్యుడు పైపైకి వచ్చుచుండెను.

ఆ గొప్ప సంఘటన జరుగటానికి ఆరు నెలల క్రితమే నేను మీతో చెప్పిన ఆ దర్శనంలో నా ప్యాంట్ కు అతుక్కొని ఉన్న పల్లేరు కాయలను, పల్లేరు కాయలుగా మనం పిలిచే వాటిని నేను నా ప్యాంట్ కు అతుక్కొని వుండగా వంగి వాటిని తీసివేయుచుంటిని. ఏలాగైతే వాటిని నేను తొలగించుటను దర్శనములో చూచితినో, సరిగ్గా అలానే నేనక్కడ చేయుచుంటిని. నేను పలికాను, "అదోక వింత, టూసాన్ ఉత్తర దిక్కునున్నవానిగా నేను వుంటిని. అదెంత చక్కగా సరిపోయినదో చూడండి."

"టూసాన్" గుర్తుంచుకోండి, "నైరుతి దిక్కు" అని అంటిని.

నా ప్యాంట్ కు అంటుకొనియున్న పల్లేరు కాయలను తీయుచుంటిని. వాతావరణమనేది ఇక్కడున్నట్టుగా అక్కడ వుండదు, అదోక ఎడారి, కరుకైన ప్రాంతం. ఇక్కడున్నట్లుగా విస్తారమైన చెట్లు అక్కడుండవు. ఇక్కడికంటే ఇరవైరెట్లు ఎక్కువ వెలుతురు అక్కడుండును. అదొక కరుకైన ప్రాంతం. ము౦డ్లు తుప్పలు, ఇసుక నేల.

నేను ఇలా చూస్తున్నాను. నేను కనులెత్తి చూస్తుండగా, అరమైలు దూరాన అడవి పందుల గుంపును నేను చూసాను. అవి అలా వచ్చుచు ఏవో తినుచుండెను. అప్పుడు నేను ఇలా అనుకొన్నాను, "ఇప్పుడు నేను బ్రదర్ ఫ్రెడ్ ని, బ్రదర్ నార్మన్ని అటువైపుకి పంపినట్లైతే దొరుకుతాయి."

6అంతకుముందు సాయ౦కాల క్యాంపులో వున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎంతో శక్తివంతముగా మా మధ్య కదిలెను. జరిగినవాటిని ఆయన నాకు ఎంతో తేటగా తెలిపెను. నేను లేచి క్యాంపు బయటకు వెళ్ళవలసివుండెను.

తర్వాత ఉదయాన నేను పైకి వెళ్ళితిని. నేను బయలుదేరితిని, అప్పుడు వారితో ఇలా అంటిని, "ఇప్పుడు బ్రదర్ ఫ్రెడ్ మీరు ఆ వైపు నుండి రండి." అది సుమారు ఒక మైలు దూరం. నేను సుమారు రెండు మూడు మైళ్ళ దూరంకు వెళ్ళవలసివుంది. అతనిని కలిసికోవలసివుంది. అయితే వెళ్ళే ఆ మార్గము ఎంతో కరుకైన రాతి ప్రదేశం. అతనిని కలవాలంటే, ఈ దారిగుండా వచ్చి అక్కడ మలుపు తిరిగి, పైనుండి క్రిందివైపునకు వెళ్ళాలి. మరి అక్కడ నుండి బ్రదర్ జీన్ నార్మన్ని కలిసికోవలంటే సుమారు నాలుగు మైళ్ళ వెళ్ళవలసివుంది. మేము ఒకరినోకరం కలిసికొనుటకు అక్కడక్కడ కొన్ని గుర్తులను పెట్టుకొంటిమి, దాని ప్రకారం విడిపోతిమి.

7అంతట నేను ఒక రాతి గుట్ట మీదకి చేరుకొన్నాను. అదొక రాతి ప్రదేశం. అటు ప్రక్కగా కొద్ది దూరంలో ఒక దుప్పి వచ్చుచుండెను. అది ప్రొద్దు పొడుచుకాలం. ఉదయం 8 లేక 9 గంటలని అనుకొనుచున్నాను. అది ఉదయం తొమ్మిది గంటలేనా? ఆ అడవి పందులకు నేను కనబడకుండా నేను ఇటు ప్రక్కగా పరుగెత్తుచున్నాను చాలా త్వరగా, మీకు తెలుసా అవెంతో కృరమైనవి. అవి భీతిగొల్పేవి గనుక నేను ఈ దారిగుండా ఆ పర్వతం మీదకి చేరుకొన్నాను.

ఏదోలా పర్వతం మీదకి పరుగెత్తాను. నేనావిధముగా అక్కడికి చేరుకొన్నాక, అకస్మాత్తుగా గొప్ప పేలుడు శబ్దం వినబడింది. ఆ ప్రాంతమంతా అది మారు మ్రోగినది. అంత భయంకరమగు విస్ఫోటన శబ్దమును నేనెన్నడు వినియుండలేదు. అది సంభవించినప్పుడు, రాళ్ళు దొర్లిపడ్డాయి. సుమారు ఐదడుగుల ఎత్తులోకి నేను ఎగిరిపడినట్టు నాకనిపించింది. నేనెంతో భయంకంపితుడనైపోయాను. అయ్యో, నన్నెవరైనా తుపాకీతో కాల్చారేమోనని అనుకొన్నాను. ఎవరో… అప్పుడు నేను నల్ల టోపి ధరించియున్నాను. అడవి పందులను కాల్చబోయి పొరపాటున నా నల్ల టోపి చూచి నన్ను కాల్చారేమోనని నేననుకొన్నాను. ఆ శబ్దం అంత భయంకరముగా వుండెను. సరిగ్గా అప్పుడే, "పైకి చూడుము" అని ఎవరో పిలవటమును నేను విన్నాను. అవును. అంతట ఆయన నాతో ఇలా అనెను, "ఇది ఏడు ముద్రలను విప్పుటకు సమయము గనుక తిరిగి ఇంటికి వెళ్ళుము," గనుక నేను తిరిగి ఇక్కడికి వచ్చితిని.

8జరిగిన ఒక గంట తర్వాత నేను బ్రదర్ ఫ్రెడ్ని, బ్రదర్ నార్మన్ని కలుసుకొన్నాను. వారు ఎంతో ఉద్రేక భరితంగా దీని విషయమై నన్నడిగిరి. అవును. అక్కడ అల్లంత దూరానా అంత ఎత్తులో ఒక మేఘము (తేమ, పొగమంచు, ఆవిరి) అనేది ఏర్పడటము అసాధ్యమని సైన్స్ చెప్పినది. చూశారా? మామూలు మేఘమైతే కొద్ది ఎత్తులో మాత్రమే ఏర్పడును. వాటినిగూర్చి నాకు అంతగా తెలియదు. నాకు… నాకు.

మేము ఇతర దేశములకు విమానములో ప్రయాణించేటప్పుడు, తొమ్మిదివేల అడుగుల ఎత్తులో అది వెళ్తుంది. తుఫానులకు పైగా అది వెల్తు౦ది. బహుశా అది నాలుగు మైళ్ళ ఎత్తునకు సమానం కావొచ్చును. లేకుంటే 15 మైళ్ళ దూరం అని మీరనవచ్చును. అయినా అంత దూరానా తేమ ఆవిరి వుండుటమనేది అసాధ్యం. ఈ మేఘమైతే 26 మైళ్ళ ఎత్తులో ఏర్పడినది. దినమెల్ల అది అక్కడ వ్రేలాడుచూవుండెను. చూశారా? అది ఏమిటనేది లోకానికి తెలియదు. అయితే దేవునికి స్తోత్రం, అదేమిటో మనకు తెలియును.

బ్రదర్ హికర్సన్ నీకు ధన్యవాధములు, అక్కడ దానిని నేను నా బల్ల మీదనే వుంచెదను. పుస్తక రూపంలోకి ఆ విషయాలు వచ్చినప్పుడు, ఆ ఫోటోని అందులో పొందుపరుతుము.

9ఇక్కడ నాకొక చిన్న గమనిక ఇవ్వబడింది. గతములో నేనిక్కడ వున్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిగా మీరు వృద్ధి పొందిరని నేననుకొనుచున్నాను. బహుశా నేననుకొనుచున్నాను అతని పేరు… అతని తండ్రి పేరు డేవిడ్ వెస్ట్ అని. ఒక చిన్న బాలుడు ప్రభువుకి ప్రతిష్టంచబడుటకు ఇక్కడ వుండెను. అవునా? నీ పేరు డేవిడ్, అంతేనా? అదేనని నేను అనుకొనుచున్నాను. మంచిది. ఆ చిన్న బిడ్డను తెచ్చుట ఎలా?

మన సహోదరి పియోనా యొద్దకు వచ్చి, "లోపలికి తీసికొని రండి" అనే పాటను మనం పాడుచుండగా, ఆమె వచ్చి సంగీతమందించవలసినదిగా కోరుచున్నాను. మరలాగే పాస్టర్! మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లేతే, ఈ చిన్న బాలున్ని ప్రభువుకి మనం అర్పించెదం. ఇప్పుడు దానిని లేఖనాధారముగా చేయగోరుచున్నాము.

10బ్రదర్ వెస్ట్! ఈ బిడ్డ మీ మనవుడేనా? చూచుటకు అది అసాధ్యముగా వుండెను. కదా? సిస్టర్ వెస్ట్! దాని గూర్చి మరేమనుకొనుచున్నారు? అది అసాద్యముగా వుండెనా? నేనేమనుకొనుచున్నానో మీకు తెలుసా? నేను కూడా మీలాగే తాతనయ్యాను.

ఈ విషయం నాకు బ్రదర్ డిమోస్ షెకారియన్ని జ్ఞప్తికి తెచ్చుచున్నది. గొప్ప జనసముహము ముందు అతడు నిలువబడి యుండెను. మీకు తెలుసా? అతడు కూడా నాలాగే అన్నిటిని కలగలిపి ప్రసంగించువాడు. అతడు అక్కడ నిలువబడి అన్నాడు, "మీకు తెలుసా?" నేను రోజ్ తో చెప్పాను, నేనిలా అనుకొంటున్నాని, "రోజ్ అతని భార్య అందుకు ఆమె నేను నాయనమ్మను అయ్యాను. ముసలితనం మీదపడిందని అనుకొనుచున్నాను," అని అన్నది. అందుకతడు "లేదు, నీవు నాయనమ్మవి అయినంత మాత్రానా ముసలిదానివయ్యావని అనుకోవద్దు." మీకు తెలుసా నేను…

బ్రదర్ వెస్ట్! నీవు ఒంటరివి కావు. ఇక్కడ ఎంతో మంది నీకు సన్నిహితులున్నారు. అవును. అది నిజం. మనం మన మనవళ్ళను మనవరాండ్రను ఎంతో అభినంధించాల్సి వుందని నేను బావిస్తున్నాను. ఇది వినటానికి విడూరం కాదు కదా? మన పిల్లలతో మనం గడిపిన దానికంటే మరెంతో ఎక్కువగా మనం వారితో (మన సంతానం)తో గడపవచ్చును. ఒక రోజు నేను నా బార్యను అడిగితిని, ఆమె అన్నది, "నిజం, నీవు పిల్లల్ని ప్రేమించటానికి కొద్ది సమయాన్నే కేటాయించితివి. ఏదో అలా ముద్దాడి వెళ్ళేవాడివి."

11మంచిది, ఇదిగో ఆ వెనుక నా మనవడు వుండెను. వాడు ఇలా అడిగాడు, "తాతా బోధించు, తాతా బోధించు." గత ఆదివారం రాత్రి వారు కానుకలు పట్టి, ఈ బల్లమీద వుంచిరి. వారు మందిరంలోకి అతడిని తెచ్చిరి, నేను మాట్లాడుటను శబ్దయంత్రం (మైక్రోఫోన్) ద్వారా అతడు విని, "అదిగో తాత బోధించుచుచుండెను, తాత బోధించుచుచుండెను" అని అనెను.

అందుకు బిల్లీ, "అవును తాత అక్కడ నిలువబడి బోధించుచుచుండెను."

"కాదని" బిడ్డ పలికెను. కానుకలు పట్టియుండిరి, అవి క్రింద పడిపోయెను. వాడు ఇక్కడికి రావాలని మారం చేసాడు. ఏ కూటములో నేను బోధించటం అతడు విన్నా వెంటనే తెగ గొడవ చేసేవాడు, నా వద్దకు రావాలని గట్టిగా ఏడ్చేవాడు. అదెంతో ముద్దుగా వుంటుంది కదా! వారెంతో చక్కని వారు.

12వారి జట్టు ఎంతో ముద్దుగా వుంటుంది. సరే, బాబు పేరేమిటి? [డేవిడ్ జోనాథన్ అని సిస్టర్ వెస్ట్ చెప్పుచున్నది.] డేవిడ్ జోనాథన్ చక్కని పేరు. మంచిది. అతని పేరుకి తగ్గట్టుగానే అతని జీవితం వుండాలని నేను ఆశపడుచున్నాను. దావీదు ఒక రాజు, దావీదు సింహాసనము మీదనే క్రీస్తు ఆసీనుడవ్వాలి. ఆ పేరులో రెండవ భాగము జొనాథన్, ప్రియమైన మిత్రుడు. వారెంతో సన్నిహితమగు స్నేహితులు. వారినెంతో మనం అభినందించుదుము. ఓ, ఈ బిడ్డ నిద్రలేచాడు. మిగతా వాళ్ళవలే ఈ బిడ్డ కూడా ఒక దినాన "ఆమేన్" అని కేకలు వేయగలడు గనుక మనము ఎంత మాత్రము చింతపడనవసరము లేదు. బిడ్డను ప్రభువుకు ప్రతిష్టంచుచున్నాను.

దేవుడు ఈ యవ్వన జంటకు యిచ్చిన ఈ అందమైన బిడ్డను ప్రభువుకు ప్రతిష్టించుట అనేది గొప్ప మధురమైన అనుభూతి అని నేను అనుకొనుచున్నాను. మీరు దానిని చేయునప్పుడు, దేనినైతే దేవుడు మీకు ఇచ్చి యున్నాడో, దానిని తిరిగి దేవునికే ఇవ్వటం గొప్ప సంగతి. దేవుడు ఈ బిడ్డను దీవించును గాక.

13ఇప్పుడు, బిడ్డను ఎత్తుకోండి. నా చేతుల్లో పట్టుకొనుట కంటే ఆ తల్లియే ఆ బిడ్డను భద్రముగా పట్టుకొనునని నేను అనుకొనుచున్నాను. నేను ఎత్తుకొనుట కంటే మీరు ఇంకా భద్రముగా ఎత్తుకొందురు. నేను ఎత్తుకొన్నప్పుడు బిడ్డ పొరపాటున జారపడునేమోనని నాకు భయం. మీకు తెలుసా? చంటి బిడ్డలను ఎత్తుకొనుట నాకు ఎల్లప్పూడూ భయమే.

ఒకసారి మెడా నాతో అన్నది… "వేదిక మీద నీకు కష్టమైన పని అదే." ఆమైతే చంటి పిల్లలను చక్కగా ఎత్తుకోగలదు…

మంచిది, ఇక్కడ చూడండి, ఈ బిడ్డ నా వైపు చూస్తున్నాడు. బిడ్డ చాలా బాగున్నాడు. అవునండీ. బహుశా నేను ఎత్తుకోగలనేమో, వద్దు… సరే పడిపోడు అనుకొంటున్నాను. చాలా అందంగా వున్నాడు. కదూ, మీరు ఎలా వున్నారు? చాలా బాగున్నాడు. మంచిది.

14మన తలలు వంచుదాము.

ప్రభువైన యేసూ ఎన్నో ఏండ్ల క్రితం అభిషిక్తుడగు మెస్సీయా అనగా మానవరూపుదాల్చిన క్రీస్తు పేరిట క్రైస్తవ్యమనేది పుట్టియుండెను. ఆయన పేరు యేసు. జనులు తమ బిడ్డలను ఆయన యొద్దకు తెచ్చిరి. ఆయన వారి మీద చేతులుంచి వారిని దీవించవలెనని తెచ్చిరి. అప్పుడు ఆయన అన్నాడు, " చిన్న బిడ్డలను నా యొద్దకు తీసికొని రండి. వారిని ఏ మాత్రం ఆటంకపర్చకండి, ఎందుకంటే దేవుని రాజ్యము వీరి వంటిదే." ఈ యవ్వన దంపతులు మరియు తాత అవ్వలు నిజముగా వాక్యమును వెంబడించువారైయున్నారు.

ప్రభువైన యేసూ, ఈ రాత్రి నేను మరియు పాస్టర్ కలిసి చిన్న ప్రియ డేవిడ్ జోనాథన్ వెస్ట్ ను నీ యొద్దకు తీసికొని వచ్చుచున్నాము. ఇతని తల్లిదండ్రుల నుండి తీసికొని నీకు సమర్పించుచున్నాను. ప్రభువా, మంచి ఆరోగ్యము కొరకు బలము కొరకు మరియు ఇతనిని ఈ లోకంలో తీసుకొచ్చిన దేవుని మహిమ కొరకు ఇతడు దీర్షాయుష్మంతుడగునట్లు ఇతనిని నీకు సమర్పించుచున్నాము. దైవీక దీవెనలు ఇతని మీద నిలుచును గాక. ఈ చిన్న బిడ్డ మీద పరిశుద్ధాత్మ నిలుచును గాక. ఏ సువార్త నిమిత్తము ఇతని తల్లిదండ్రులు మరియు తాతా అవ్వలు బహు సంతోషముగా నేడు వున్నారో, మరి దాని కొరకే ఇతడును నిలబడి రేపు అనేది వున్నట్లేయితే, ఈ సువార్తను ఇతడు మోసికొనిపోవును గాక. ప్రభువా, దానిని దయచేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డను నీకు ప్రతిష్టించుచున్నాము. ఆమేన్.

15వారు ఫోటో తీసికొనుచున్నారని అనుకొనుచున్నాను.

సిస్టర్ దేవుడు నిన్ను దీవించును గాక. మీరు నిత్యము ప్రభువును ప్రేమించుచూ ఆయనను ఆనందింప జేయుదురు గాక, ఈ బిడ్డ దేవుని యొక్క మార్గములో ఆయన కిష్టమైన మార్గములో పెంచబడును గాక. నిశ్చయముగా దేవుడు ఇతనికి తోడై వుండునని నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఇప్పుడు మనము ఆ పాటను పడుదము, వారిని లోనికి తీసుకొని రండి. అందరు కలిసి, చిన్నవాని కొరకు. మంచిది. సిస్టర్.

వారిని తీసుకొని రండి.

చిన్నవారిని యేసు నొద్దకు తీసుకొని రండి.

పైన ఉంచుటకు ప్రభువైన యేసు హస్తములకంటే మరి శ్రేష్టమైన హస్తములు ఇంకేమి లేవు.

16ఇప్పుడు, అక్కడ వేడిగా ఉన్నదని నాకు తెలుసు. ఆ యొక్క బాధ్యతను నా తమ్ముడు ఎడిగర్ డాక్ చూడవలెనని నే చెప్పగోరుచున్నాను. కూర్చీలలో కూర్చున్న కొంతమంది సహోదరీల యొక్క వస్త్రములకు కుర్చీ యొక్క గ్రీజు అంటుకొన్నది. మీలో ఎంతమందికి అది అంటుకొన్నది. అక్కడ నా భార్య, నా ఇద్దరు కుమార్తెలు, చిన్ని బెట్టి కాలిన్స్, శ్రీమతి బీలర్ తదితరులు అక్కడ వున్నారని నాకు తెలుసు. అక్కడ గ్రీజు అంటుకొనుచున్నది. తమ్ముడా డాక్! దయతో ఆ సంగతిని చూడుము. అది బహుశా గ్రీజో లేక పెయింటో, మొత్తం మీద సీట్ల పని జరుగుచున్నదనుకొంటాను. అవునా? [అక్కడ గ్రీజు ఏమియు లేదని ఎడగర్ డాక్ చెప్పుచున్నాడు]. మంచిది, అదేమిటో నాకు తెలియదు. అయితే అక్కడున్న వారు దానిని నా దృష్టికి తెచ్చారు గనుక నేను దానిని మీ దృష్టికి తెచ్చుచున్నాను. అంతే.

బుధవారము రాత్రి కూటమున్నది గమనించండి. ఇంకా ఏమైనా చెప్పాలా? దానిని మీరు ప్రకటించారా? బ్రదర్ నెవిల్ ప్రకటనలు అయిపోయాయా? అన్ని ప్రకటించారా?

17ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే వచ్చే ఆదివారము క్రీస్తుని సిలువ వేసినందుకు ఈ తరము మీద నేరము మోపుట అనే అంశమును మాట్లాడగలననుకొంటున్నాను. "ఈ తరము దానిని చేయలేదని నీవనవచ్చును. వాక్యానుసారముగా వారది చేసారో లేదో మనము తెలిసి కొందాం. వచ్చే ఆదివారము ప్రభువు చిత్తమైతే, ఏదీ ఆటంకం లేకపోతే…

ఈవారము ఇప్పటి నుండి వచ్చే ఆదివారం వరకు కూటముల నిమిత్తం హూస్టన్లో ఉండవలసి వుంది. గనుక వచ్చే ఆదివారం అది సాధ్యమో కాదో చూడాలి. ఏదేమైనా, చెప్పుకొనుటకు మనకి మరో రెండు ఆదివారాలు ఉన్నవి. తర్వాత ఈ నెల చివరి వారమున కూటముల నిమిత్తము మేము చికాగోకి వెళ్తున్నాము. తర్వాత నేను నా కుటుంబమును తిరిగి అరిజోనాకి తీసికెళ్ళాలి, ఎందుకంటే అప్పటికి పాఠశాల సెలవులు ముగియును, పిల్లలు మళ్ళీ పాఠశాలలో చేరాలి.

18వాక్యపఠనమును బట్టి, వ్రభువు ఆశీర్వదములను బట్టి విమాలో ఎందరు ఆనందించారు? [సమాజము "ఆమెన్" చెప్పుచున్నది.] మనమంతా చాలా ఆనందించాము.

ఇప్పుడు చాలా వేడిగా వుంది. ఈ రాత్రి మీలో కొందరు తిరిగి గృహములకు వెళ్ళేదరని నాకు తెలసు. బ్రదర్ రాడ్ని మరియు చార్లీ తదితరులు చాలా దూరము కారులో ప్రయాణించుదురని నాకు తెలుసు. ఒక్క నిమిషం, మీకు సెలవులే కదా? మంచిది. మీరు చేపల వేటకు వెళ్తున్నారని నేను విన్నాను.

"ఒకడు చేపలు పట్టేటప్పుడు ప్రభువు అతనిని తొందరపెట్టడు. చేపలు పట్టుటవలన నీవు ముసలివాడివి కాలేవు" గనుక బాలికలు వారితో వెళ్ళవచ్చును. చూశారా? నాకు అవకాశం వున్నయెడల నేను కూడా వచ్చి మీతో చేరుదును. మీకు తెలుసా, ప్రభువు మంచివాడని వారన్నారు. చేపలుపట్టే వారికి సమయమును కేటాయించవద్దు. అన్నియు కలిసిపోయినప్పుడు నీవది చేయవచ్చు. చేపలవేట సమయము ఎంతో విశ్రాంతినిచ్చును. చేపలు వేటాడటములో నా జీవితమెంతో విశ్రాంతినొందును.

19ఒకసారి శ్రీ. ట్రౌట్మెన్ యొద్ద నుండి నాకొక కార్డు వచ్చినది. అతడు న్యూ-ఆల్బనీలో ఐస్ కంపెనినీ కలిగియున్నాడు. మీలో ఎందరికి అతడు గుర్తున్నాడు? అక్కడ అతనికి ఒక చిన్న కారు ఉన్నది. దానిమీద చేపలు వేటాడుట అని వున్నది. అతడు ఇలా అనును "ప్రతిఒక్కరు కలిగివుందురు. ప్రతి మనిషి, అతని సహోదరులు చేపలు వేటాడుటలో ఉందురు. సహాయపు చేతిని బట్టి వారు చక్కగా చేపలను పట్టుకొందురు." అది సరైనదని నేననుకొనుచున్నాను. "చేపలు పట్టుటకు ధనవంతులు పేదవారు అని లేదు, అందరు సమానులే." చూశారా? సహాయము చేసే చేతిని ఎవరైతే కలిగివుంటారో వారు చక్కగా చేపలు పట్టెదరు. ప్రతిదీ చేపలు పట్టుటలో వుంది.

మంచిది, మరోక చేపల వేటను నేను చేయుచున్నాను. గత ముప్పై-మూడేండ్ల నుండి నేను ఆ చేపలను పట్టుచున్నాను, అవి మానవుని ఆత్మలు. మనకు చేతనైనంతవరకు ఆ చేపలను సంపాదించుటకు ప్రభువు మనకు సహాయము చేయును గాక.

20ఇప్పుడు, ఈ రాత్రి ఇది టేపు అగుచున్నది. ఇప్పుడు ఈ ఉదయకాలము (జిమ్ ఇక్కడ ఉన్నట్లయితే, లేక టేపు చేయుచున్నట్లయితే) చెప్పిన టేపులో "రెండవ నిర్గమము" అని అన్నాను. కొందరు నాకు ఫోన్ చేసి దానిని నా దృష్టికి తెచ్చారు. నిజానికి అది "మూడవ నిర్గమము." ప్రొద్దుట దానిని రెండని చెప్పాను.

పరిశుద్ధాత్మ అగ్నిస్తంభపు రూపములో, దేవుడే తనను తాను బయలు పరచుకొనుటకు దిగివచ్చి మొదటి నిర్గమములో ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తెచ్చెను.

రెండవ నిర్గమములో క్రీస్తు యూదా మతములో నుండి సంఘమును బయటికి తెచ్చెను.

మరి ఇది మూడవ నిర్గమము. అదే అగ్నిస్తంభము తిరిగి దిగివచ్చి వధువును సంఘములో నుంచి బయటికి తెచ్చెను. చూశారా? ఒకటి ప్రకృతి సంబంధమైన దానిలో నుండి బయటకి వచ్చెను; రెండవది, ఆత్మ సంబందమైన దానిలో నుండి బయటకి వచ్చెను. మూడవది, ఆత్మ సంబంధమైన దానిలో నుండి ఆత్మ సంబంధమైనది బయటకి వచ్చెను. మూడు కాలములలో మూడు బయటకి వచ్చుట.

ఇప్పుడు, ఈ రాత్రి నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉన్నదా? అనే ఈ ప్రసంగమును కూడా టేపు చేయవలసినదిగా కోరుచున్నాను. బహుశా, ఇది ఎక్కువ సమయం తీసికోకపోవచ్చు. మంచిది. నేను కొంత నోట్సును, కొన్ని లేఖనాలను వ్రాసికొనియున్నాను. అయితే ముందుగా దేవుని వాక్యమును చదువుకొందాము. దానికి ముందుగా కొద్ది నిమిషములు మన హృదయములను ఆయన యెదుట వంచెదము.

21ప్రభువైన యేసూ, బైబిలులో ఉన్న ఈ పేజీలను నరమాత్రులేవరైనా త్రిప్పగలరు, కానీ అందున్న అర్ధాన్ని మాత్రము నీవే బయలుపరచగలవు. ప్రభువా, నా హృదయములో నీవుంచిన ఈ అంశము సర్వలోక జనులకు వెళ్ళాలని, తద్వారా జీవించుటకు ఎలాంటి జీవితము అవసరమో వారు తెలిసికొనునట్లుగా చేయమని ప్రార్ధి౦చుచున్నాను. అనేకులు నన్ను ఇలా ప్రశ్నించారు, "క్రైస్తవ జీవితమంటే సమాజానికి సేవ చేయటమేనా? అవసరతలో ఉన్నవారికి పేదవారికి సహాయపడటమేనా? శాశ్వత సంఘ సభ్యత్వము తీసికొవటమేనా? సంఘానికి పూర్తి నమ్మకత్వముగా జీవించటమేనా?" ఇలాంటి ప్రశ్నలు నన్నడుగుచున్నారు. తండ్రీ, ఈ రాత్రి వీటికి సరైన జవాబులు రావాలని, ప్రజలు వాటిని తెలిసికొనుటకు మేము పడుచున్న ఈ ప్రయత్నమును వారు గ్రహించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్ధి౦చుచున్నాము. ఆమెన్.

LUKE 14:14-24

 

22ఇప్పుడు మీ బైబిలును త్రిప్పండి, పరిశుద్ధ లూకా సువార్త, మనము 14వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలను మన అంశముగా తీసికొని, రాబోయే ముప్పై లేక నలభై నిమిషముల పాటు వాటిని ధ్యానింతుము. లూకా 14వ అధ్యాయము 16వ వచనము నుండి నేటి మన ప్రసంగము కొరకు చదువుకొందాం.

ఆయన అతనితో నిట్లనెను - ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

విందు కాలమందు అతడు - ఇప్పుడు సిద్దమైయున్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు - నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.

మరియొకడునేను అయిదు జతల యొడ్లను కొనియున్నాను, వాటిని వరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను.

మరియొకడు - నేనొక స్త్రీని వివాహాము చేసికొనియున్నాను, అందుచేత నేను రాలేననేను.

అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా,

గమనించండి, "దాసుడు," దాసులు కాదు!

ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంధులలోనికి వెళ్ళి, బీదలను అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని, ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను.

అంతట దాసుడు ప్రభువా నీవాజ్ఞపించినట్లు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పెను.

అందుకు యజమానుడు - నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోవలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము.

ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నానెను.

23ఇక్కడ గమనించండి, మూడు ఈడ్పులు మొదటిగా పిలువబడినవారు నిరాకరించిరి, రెండవదిగా స్వస్థత పిలుపు అనగా కుంటి వారు గ్రుడ్డివారు పిలువబడిరి, మూడవదిగా ఏ బేధము లేకుండా అందరికిని ఆహ్వానము పంపబడినది.

ఈ ఉపమానమునకు దగ్గరగా ఉండే మరో ఉపమానము మత్తయి 22:1-10 వచనములలో నున్నది. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత చదువుకొనండి. నా అంశము - నీ జీవితం సువార్తకు తగినట్టుగా నున్నదా?

24దేవుని వాక్యము వినకుండా, ఆయన ఆహ్వానమును నిరాకరించి మానవుడెప్పుడు నెపములు చెప్పుచున్నాడని యేసు ఇక్కడ చెప్పుచున్నాడు. ఇది దేవుని విందు అని ధృడంగా తెలిసినప్పటికిని నెపములు చెప్పుచూనే ఆయన ఆహ్వానమును తిరస్కరించి తప్పించుకొనుచున్నారు. మత్తయి ఇరవై-రెండవ అధ్యాయంలో కూడా ఇట్టి రీతిగానే నెపములు చెప్పిన వారిని మీరు చూడగలరు.

అన్ని యుగములలో ఇదే రీతిగా జరుగుచున్నది, ద్రాక్ష తోట యజమాని తన దాసులను ద్రాక్ష ప౦టను సమకూర్చుకొని రమ్మని పంపగా, వారు ఆ దాసుని తరిమివేసారు. రెండవ దాసుని రాళ్ళతో కొట్టారు. ఆ విధంగా దేవుడు ఒకరి తర్వాత మరొకరిని పంపుచూవచ్చాడు. ఎందరినో పంపాడు, కాని ఫలితం శూన్యం. కడసారి రాజు తన కుమారుని పంపెను. వారాకుమారుని చూచి వీడు వారసుడు కనుక వీడిని చంపుదము రండని ఆలోచన చేసిరి. అప్పుడా రాజు, "ఆ హంతకులను వధించి వారి పట్టణములను దహించుమని" చెప్పినట్టుగా యేసు పలికెను.

25దేవుడు ఒక ఆహ్వానమును ఇచ్చినప్పుడు ఎవడైనను దానిని తిరస్కరించిన యెడల, తీర్పు తప్ప మరేమియు వానికి మిగలదు, ఎందుకనగా కృపా కంచెను అతడు దాటియున్నాడు. కృప సరిహద్దును దాటిన వ్యక్తికి దేవుని ఉగ్రతయే మిగులును. అన్ని కాలములలోను మానవుడు ఆ విధంగానే చేశాడు. బైబిలుల్లో దరిదాపు అన్ని యుగములలోను అట్లే జరిగినదని మనం కనుగొన్నాము.

దేవుడు తన దాసుడగు నోవహును పంపగా, నోవహును చూచి ప్రజలు నవ్వుచూ వెక్కిరించసాగిరి. ఉగ్రత నుండి తప్పించుకొనే మార్గమును దేవుడు వారికి చూపించాడు. కానీ వారు నెపములు చెప్పిరి, వారియొక్క ఆధునిక ఆలోచనకు ఆ మార్గం సరిపోలేదు. వారికి కావలసిన మార్గం అది కాదు. అందుకనే నోవాహు దినములలో వారు నెపములు చెప్పసాగిరి.

26మోషే దినములలో వారు నెపములు చెప్పారు. ఏలియా దినములలోని వారును ఆ విధముగానే చెప్పారు. క్రీస్తు దినములలోను జనులు ఆ విధముగానే చేశారు. నేడు కూడా వారు ఆ విధముగానే చేస్తున్నారు.

ఆయన ఇశ్రాయేలీయులను విందుకు రమ్మని సూటిగా పిలిచియుండెను. దీనిని నేను నేటి జనులకు అనగా సంఘమునకు అన్వయించగోరుచున్నాను. ప్రభువు యొక్క ఆత్మీయ విందుకు రమ్మని నేడు కూడా ఆయన అనేకులను పిలుచుచున్నాడు. అయినను ఈ జనులు ఆ ఆహ్వానమునకు చెవియొగ్గుట లేదు, ఎందుకనగా వారికి అనేక ఇతర పనులున్నవి గనుకనే నెపములు చెప్పుచున్నారు.

ఇశ్రాయేలు రెండువేల సంవత్సరముల క్రిందట వారికియ్యబడిన ఆహ్వానమునకు లోబడియుండినచో నేటి స్థితిలో వారుండియుండెడివారు కాదు. పెండ్లి విందు ఆహ్వానమును వారు రెండువేల సంవత్సరముల క్రిందటనే నిరాకరించారు, అందువలన వారు తిన్నగా తీర్పులోనికి వెళ్ళిరి. వారు నెపములు చెప్పుచూ తమయొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్ళతో కొట్టి చంపిరని యేసు పలికెను. అనుదినము వారు ఏదో ఒక సాకు చెప్పుకొంటువచ్చారు.

27యేసు శరీరధారిగా వున్న దినాలలో ఆయన వారి ఆలోచనలకు అందలేదు. ఈయనెక్కడ నేర్చుకొన్నాడు, ఏ పాఠశాలలో చదివాడు? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఈయన తల్లి మరియు కాదా? యెహాను యాకోబులు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీలు మనతో ఉన్నారు కాదా? ఇతనికింత అధికారం ఎక్కడి నుండి వచ్చినది? ఇవి వారు వేసిన ప్రశ్నలు. వారు అనుకొన్నటుగా ఆయన కనిపించలేదు. అందువలననే వారు ఆయనను బెయల్జబూబు, సమరయుడు, అపవిత్రాత్మ పట్టినవాడు, పిచ్చివాడు అని పిలువసాగారు, ఆయన మాటలు వినవద్దని ప్రచారం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు బలంగా లేచారు. ఆయనను దూషించి శిక్షవిధించారు. ఈయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని పలికారు. ఆ శాపము ఈ ఘడియ వరకును వారిపై నుండినది.

28నీతిమంతులు ప్రవక్తలు చంపబడుటకు కారణము జనుల యొక్క సాకులే అని యేసు చెప్పుచుండెను. వాక్యమునకు బదులుగా మానవ కల్పిత సిద్దాంతముల పట్ల వారికెక్కువ విశ్వాసముండెను. ఆ విధముగా వారు దేవుని వాక్యమును నిష్ ప్రయోజనము చేసిరి.

ఇప్పుడు, ఇది దేవుని చిత్తం, దేవుని ఇష్టం అనైనా చెప్పాలి లేదా దానికి నీ సొంత ఆలోచనైన జోడించి చెప్పాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి నీవు తీసికోవలసినదే. దేవుడినైనా సేవించాలి, లేకుంటే దయ్యమునైనా సేవించాలి. ఇది సత్యము, సత్యములో ఇది భాగము. ఒకవేళ నీవు అసలు ఇది సత్యమే కాదు, ఇది సరిగా సమకూర్చబడలేదు, ఇది సరిగా అనువాదము చేయబడలేదు, అని అనైనా నీవు చెప్పాలి.

దేవుని వాక్యమునకు మానవ వ్యాఖ్యానం (అనువాదము) అవసరంలేదు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగానే తీసికొనవలెను. దేవుడే మనకొరకు చేసి దానిని వ్రాయించి ఇచ్చాడు. అది ఏమి చెప్పిందో అలానే దానిని మనము తీసుకొవాలి.

వారు మత సిద్దాంతములను అనుసరించుటవలన దేవుని వాక్యమును ఫలితం లేనిదిగా చేశారు. వారు వాక్యమను కంచెను దాటి వెళ్ళిపోయారు. రాజమార్గాన్ని విడిచి దొడ్డిదారిన వెళ్ళారు.

29డెబ్బై-ఐదేండ్ల క్రితం రష్యాలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారు పెంతెకోస్తు దీవెనలను అంగీకరించి యుండినచో, ఈ రోజున వారు కమ్యూనిష్ణులుగా యుండక పోయెడివారు. డైబ్ఫై-అయిదు సంవత్సరముల క్రితం రష్యాలో మహా ఉజ్జీవం వచ్చింది. దేవుడే వారి మధ్యకు దిగి వచ్చాడు. సైబిరియాలో మహా ఉజ్జీవం చేలరేగినది. అయితే ఆ జనులు దానిని తృణికరించారు. అందుకే ఈ రోజున ఆ దేశం నాస్తికుల చేతుల్లోకి జారిపోయింది. అనుమతి లేకుండా సంఘంను స్థాపించుకొనే హక్కు లేకుండ పోయింది. తీర్పు లోయలోనికి వారు జారిపోయారు. ఈ భీకర కమ్యూనిజానికి సాతాను వారిని అమ్మివేసినది.

యాబై ఏండ్ల క్రితం ఇంగ్లాండులో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ వెనువెంటనే జార్జి జెఫరీస్, ఎఫ్. ఎఫ్. బోస్వర్త్, చార్లెస్ ప్రైస్, స్మిత్విగెల్స్ వర్త్ మొదలగు విశ్వాస వీరులు ఇంగ్లాండుకు పరిశుద్ధాత్మ ఉజ్జీవమును తీసికొని వచ్చారు. అయితే జనులు వారినిచూచి హేళనచేస్తూ వారిని పిచ్చివారినిగా పిలుస్తూ వారికి మతిపోయిందని ప్రచారం చేసి జైళ్ళలో పెట్టారు. సంఘాలు తమ సభ్యులను వారి కూటాలకు వెళ్ళవద్దని ఖండితముగా ఆజ్ఞాపించాయి. ఆ మహా విశ్వాస వీరులు రోగులను స్వస్థపరచుచూ దయ్యములను వెళ్ళగొట్టుచు, మహా అద్భుత కార్యములను చేశారు. ఇంగ్లాండు దేశము సువార్తను విసర్జించినందున దాని పాపము లోకమంతటకు చుట్టుకొనినది. విశ్వాసము నుండి బొత్తిగా తొలగిపొయిన దేశం రోమ్ మరియు ఫ్రాన్స్ లో కన్నా ఇంగ్లాండని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఫిన్నీ వెస్లీ వంటి మహా భక్తులు వారి సంతవీధులలో ఎలుగెత్తి సువార్త ప్రకటించారు, కాని ఆ దేశప్రజలు సత్యమును ఎగతాళిచేశారు. అది నెపములు చెప్పింది గనుక దాని పనైపోయింది. ఎంతో కాలము క్రితమే ఇంగ్లాండు దేవునిచేత తుడిచి పెట్టబడింది.

30గతవారం, లేక ఆ క్రిందటవారం రెండు వార్తాపత్రికలలో ఆ దేశ పరిస్థితిని గురించి వచ్చినది. ఆ దేశ నాయకులు స్త్రీల ఉరుల్లో చిక్కుకొనినట్లుగా గూడాచార విభాగం కనుగొన్నది. ఈ నీచ క్రియల వలన ప్రపంచమంతట వారికి ఎంతో అవమానం సంభవించినది. ఆ దేశం తమకొచ్చిన సువార్త ఆహ్వానాన్ని తృణీకరించినందునే ఇట్టి దుస్థితికి లోనయినది, ఎందుకనగా తన ముందుకు వచ్చిన వాక్యమును అది విసర్జించి నెపములు చెప్పెను.

పదిహేనేళ్ళ క్రితం ఈ అమెరికా దేశం అంతటా మహా స్వస్థతా ఉజ్జీవం పెళ్ళుబికినది. రాజధాని నగరమైన వాషింగ్టన్ డి. సి లో ఉజ్జీవము మండినది. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు గవర్నర్లు ప్రదానాధికారులు దానిని చూచిరి. 66 సంవత్సరముల నుండి కుంటివాడుగా వుండి అద్భుతంగా స్వస్థత నొందిన సెనెట్ సభ్యుడు ఉప్షా యొక్క స్వస్థత కార్యాన్ని ఎవరైనా కాదనగలరేమో అడిగి చూడండి! అయినను ఈ జనులు ఆ మహా ఉజ్జీవాన్ని కించపరిచారు.

31అందుకే ఈ దేశం నిరీక్షణ లేనిదై తీర్పు వైపుకు పురోగమిస్తోంది. అది కృపా సరిహాద్దును దాటి పోయింది. పూర్తిగా చెడిపోయింది. ఎక్కడ లేనటువంటి అసభ్యత ఈ దేశములో ఉంది. రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. నైతికవిలువలు పతనమయ్యాయి. నైతికవిలువలుకన్నా, మత వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. సంఘ సమాఖ్యలో ఈ దేశ సంఘాలన్ని కలిసిపోయి మృగపు ముద్రను ఈ సంఘాలు పొందుకొన్నాయి. ఇదెంత భయంకరం. ఎందుకిలా? "నా విందులోనికి రండి." "పెంతెకోస్తు విందులోనికి రండి. "పెంతెకోస్తు అనగా యాబై" అని క్రీస్తు వారికి అవకాశం ఇచ్చాడు.

32రష్యా మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, పెంతెకోస్తు విందుకు వారు ఆహ్వానించబడ్డారు, కానీ వారు దానిని తిరస్కరించారు. అలాగే ఇంగ్లాడు మీద అది పోయబడింది. వారు కూడా దానిని తిరస్కరించారు (కించపర్చారు). మరలాగే అమెరికా మీద కూడా అది పోయబడినది. వీరు కూడా అలానే తిరస్కరించారు.

విందుకు రమ్మని ఆయన మూడుసార్లు ఆహ్వానాలు పంపించాడు గాని ఎవరిలోను చలనంలేదు. బలవంతం చేసి తీసికొని రమ్మని వారిని ఆయన పంపించెను. భోజనపు బల్ల సిద్దపరచబడినది. ఇంకా ఖాళీ మిగిలినది. రాబోవు కొద్ది నెలల్లో, లేదా సంవత్సరంలో దేవుడు మరో కదిలింపును ఈ దేశానికి ఇచ్చునని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా ముందుగా నిర్ణయించబడిన దేవుని సంతానము ఈ దేశములో ఇంకా మిగిలియున్నది. ఈ లోకము మీద దేవుని వెలుగు పడి తీరును.

33మొన్న నేను లిటిల్ రాక్లోనో లేక హాట్-స్ప్రింగ్స్ లో ఉన్నప్పుడు ఈ వారపు లైఫ్ మ్యాగజైన్ చూశాను. అందులో ఒక దానిని చూసాను. అదేమిటనగా న్యూయార్క్ గవర్నర్ స్త్రీలతో అసభ్యకరమగు డాన్స్ చేసినట్లుగా చూసాను. అంత గొప్ప హోదాలోవున్న వ్యక్తి ఇలాంటి సిగ్గుమాలిన పనుల్లో పాల్గొనటం ఎంత సిగ్గుచేటు. మన దేశ స్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. దానిని మీరు గమనించండి.

మరలాగే మన దేశ మతవిధానం వైపు ఒక్కసారి చూడండి. ఇటువంటి స్థితిలో సంస్థలు ఇంతకు ముందు ఎన్నడైనా వుండెనా? దేవుని వర్తమానమును, విందు ఆహ్వానమును తృణీకరించుట వలనే ఇదంతయు సంభవించినది. ఇటువంటి జీవితం సువార్తకు తగినదని చెప్పగలవా?నానా విధమగు చెడు కార్యములు చేయుటకు జనులకు అనుమతి ఇవ్వబడింది. సిగరెట్లు త్రాగటానికి, సారా సేవించడానికి అనుమతి ఇవ్వబడింది.

34మొన్న ఈ మధ్య ఈ ప్రాంతములో ఒక సంఘము పార్కు వద్ద ఒక క్రీడను ఆడుటకు కూడిరి. నా బావమరిది కొడుకు ఆ మైదానంలో పనిచేయుటకు అక్కడుండెను. ఆ మైదానంలో క్రీడాకారులతో ఆ సంఘ కాపరి కూడా వున్నాడు. అతడు అందరి యెదుటే ఒకదాని వెంట ఒకటి అనేక సిగరెట్లు కాల్చాడు. దాన్ని గమనించండి, ఆ క్రీడను వీక్షించే జనులు కూడా దానిని చూసారు. అయినా వారిలో ఏ ఒక్కరు పాస్టర్ సిగరెట్ త్రాగుటను మనస్కరించలేదు. ఏమిటి ఇదంతా?

ఇక్కడొక పెద్ద బాప్టిస్టు చర్చిని నేనెరుగుదును. ఆ సంఘంలో సండే స్కూలు జరుగును. సండే స్కూలు మధ్యలో వారికి 15 నిమిషములు విరామ సమయం ఉంటుంది. ఆ విరామ సమయంలో పాస్టరు మరియు పిల్లలు మరియు సభ్యులంతా కాస్త బయటకు వెళ్ళి, సిగరెట్లు కాల్చి తరువాత మరలలోనికి వచ్చి ప్రభువుని ఆరాధించెదరు. ఆ సంఘ సంస్థాపకుడు జాన్స్మిత్. అతడు దివారాత్రులు దేవుని సన్నిదిలో పడి ఆ సంఘములో ఉజ్జీవం పుట్టించమని ఎంతో ప్రార్ధి౦చేవాడు. కన్నీరు కార్చి కార్చి అతని కళ్ళ మూసుకొనిపోయినవి. అతని భార్య భోజనము బల్ల వద్దకి అతనిని తోడుకొని వెళ్ళి, చెంచాతో భోజనం తినిపించేది. ఒకవేళ అతడు గనుక తన సమాదిలో నుండి భయటకు వచ్చి తన సంఘ పరిస్థితిని చూస్తే, ఎంతో వేదన చెందును. ఆయన వారిని వి౦దుకు రమ్మని ఎంతో బలవంతం చేశాడు, కాని ఆయన ఆహ్వానాన్ని వారు కాదన్నారు. "ఆయన విందును నిరాకరించిన వారిలో ఒక్కరు కూడా దానిని రుచి చూడరని" యేసు చెప్పెను గదా?

35దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి మానవుని హృదయమును తట్టినప్పుడు, ఉద్దేశ పూర్వకముగా అతడు దానిని తృణీకరించినట్లైతే, ఇక ఎన్నటికి అతనికి అవకాశముండదు. నీవు సంఘములో కూర్చోవచ్చును, భోదింపబడే సువార్తను వినివుండవచ్చును, చివరికి దానిని అ౦గికరించవచ్చును. బోధించబడినది సత్యమని నాకు తెలుసు" అని కూడా నీవు అనవచ్చును. అయితే దానిని అనుసరించకపోతే, అది నీకు ఎంతమాత్రం ప్రయోజనకరం కాలేదు. చూశారా? "అది సత్యమని నేను నమ్ముచున్నాను" అని నీవు అనుచున్నావు, ఎందుకనగా దానిని నీవు విన్నావు. దానికి అనుకూలముగా కూడా నీవు మాట్లాడతావు.

నీవు ఇలా అనొచ్చు, "నూటికి నూరు శాతం అది ఖచ్చితం." అయితే ఏమిటి లాభం? దానిని నీవు చేయాలికదా! "నీరు చాలా చక్కగా మంచిగా వుంది" అని నీవంటే సరిపోదు. నీవు బ్రతకాలంటే దానిని త్రాగాలి కదా! నా భావం మీకర్థమైందా?

ఇది నిత్యజీవము. దానిని త్రోసివేసినట్లైతే కృపా గీతను దాటి తీర్పులో నీవు నిలబడవలసివుంటుంది. దానినిప్పుడు వద్దంటే మరెన్నటికి అది నీకు దొరకదు.

నా బోధ వినటానికి వచ్చిన మీరు మరొక బోధకుని మాటలకు బాధ్యులు కాలేరు. నేను చెప్పేది సరైనదైనట్లైతే దానికి మీ జీవితాలను సమర్పించుకొనుడి. నేను చెప్పే మాటలలో నిత్యజీవము గలదని నీవిప్పుడు తెలుసుకొనుటకంటే మరెక్కువైన ప్రయోజనం నీకు మరేమైనా వుందా?

36వెయ్యి సంవత్సరాలు వరకు బ్రతికే మాత్రలు (మందు బిల్లలు) సైన్స్ ద్వారా ఋజువు పర్చబడినవి అని చెప్పి, వాటిని నీకు ఇస్తాను అని నేను అన్నట్లైతే, నీవెలా స్పందిస్తావు? మంచిది. ఆ మాత్రలు వున్నాయని తెలిసికొంటే సరిపోదు. వాటిని నీవు తీసికొని, ఎంత కష్టమైనా వాటిని నీవు మ్రి౦గాలి. దానికి బలిపీఠపు పిలుపు అక్కర్లేదు. కేవలం దాని విషయమై నీవు క్రియ చేయాలి.

నిత్యుడగు దేవుడు తన పునరుత్తాన శక్తి ద్వారా నీకు నిత్యజీవమును వాగ్దానం చేశాడు. అది ఋజువు పర్చబడింది, అయితే దానిని నీవు పొందకుండా సాతాను తన సేనతో కలిసి సర్వవిధములుగా ప్రయత్నించును. వాడు నిన్ను సువార్తను విననిస్తాడు, అలాగే దానిలో ఆనందపడనిస్తాడు, కానీ దానిని నీవు పొందకుండా సకల విధములుగా అడ్డుపడతాడు. గనుక దానిని నీవు గుర్తించాలి, బోధను నీవు వింటావు, అది సత్యమని ఒప్పుకొంటావు, అంతవరకు సరే, మరి దాని ప్రకారం జీవించుటకు వచ్చేసరికి - ఎన్నో నెపములు చెప్తుంటావు.

"ఎదో ఒకటి, ఎదో ఒక రకమైన నెపములు, "చాలా వేడిగా ఉన్నది. నేను చాలా అలసిపోయాను. నేను రేపు చేస్తాను." వారు ఇలాంటి ఎదో ఒక రకమైన నెపములు చెప్తుంటారు. దేవుడు నిన్ను దర్శించు కాలమున నీవు తృణీకరిస్తే, దేవుని నుండి నీకు నిత్యఎడబాటే మరి.

37పాత నిబంధనలో సునాద సంవత్సరమను పండుగను మనము గమనించాము. సునాద శబ్దం వినబడగానే బానిసలందరు స్వేచ్చగా పోవచ్చును. ఆ సునాదమును విని కూడా ఏదో ఒక సాకు చెప్పి స్వదేశం వెళ్ళుటకిష్టపడని వ్యక్తికి చెవిపై ఇనుప పోగులతో ఒక గుర్తు పెట్టెదరు. ఆ తర్వాత ఇక ఎన్ని సునాద సంవత్సరములు వచ్చినను ఆ వ్యక్తికి విడుదల ఇక ఎన్నటికి ఉండదు, ఎందుకనగా అతడు అమ్మబడిన దాసుడు. అతడు తన ఆహ్వానాన్ని తృణీకరించాడు. ఇక చేసిది ఏమిలేదు. బానిస వెల చెల్లించే అవకాశం దాటిపోయింది. సునాద శబ్దం విని బయటకి వెళ్ళినట్లైతే, అతడు నిశ్చింతగా తన గృహం చేరవచ్చును. తన కుటుంబాన్ని కలుసుకోవచ్చును. తన ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చును. అయితే అతడు సునాధ శబ్దమును తృణీకరించినట్లైతే, ఇశ్రాయేలు దేశంలో ఎటువంటి స్వాస్థ్యము అతనికి ఉండదు. వేరొకరు దానిని చేజిక్కించుకొందురు.

ఆత్మీయముగా మనకును అది వర్తించును. నిత్యజీవ వారసులమగు మనం సువార్తను విని అది సత్యమని తెలిసికూడా నిరాకరించినట్లయితే, మృగము యొక్క ముద్రను వేసికొన్నట్లే అగును.

38మృగము యొక్క ముద్ర రాబోతుందని చాలా మంది చెప్తున్నారు కదా? అయితే దీనిని నన్ను చెప్పనివ్వండి, ఇప్పటికే అది వచ్చియున్నదని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడినప్పుడే మృగము యొక్క ముద్ర పనిచేయుట ఆరంభమైనది. చూశారా?

రెండు విషయాలున్నవి. ఘడియ వాక్యాన్ని అంగీకరిస్తే దేవుని ముద్రను పొందుతావు. దానిని తృణీకరిస్తే మృగము యొక్క ముద్ర పొందుతావు. అంతే. నీవు సువార్తను అంగీకరించి దేవుని ముద్రనైనా పొందవలెను లేదా దేవుని ముద్రను నిరాకరించి సాతాను ముద్రనైనా వేసికొనవలసి యుండును. అందరికి అర్థమైందా? [సమాజము "ఆమెన్" చెప్పుచున్నది.] దేవుని ముద్రను కాదనుటయే మృగం యొక్క ముద్రను పొందటం. దేవుని ముద్రతో ముద్రింపబడని వారందరు మృగము యొక్క ముద్రను పొందినట్లేనని బైబిలు చెప్పుచున్నది.

బూర ధ్వని వినపడగానే, ఆ బానిసలందరు స్వేచ్చగా వెళ్ళిపోవచ్చును. వెళ్ళుటకు ఇష్టపడని వారు, ముద్రింపబడుదురు.

ఇప్పుడు, మీకు చూడండి, మృగము యొక్క ముద్ర. మనము భవిష్యత్తును గురించి మాట్లాడినట్లయితే, నీవు అది చేసావు అని ఎరిగే లోపు అది బయలుపడును. చూచారా? ఆ విధముగానే పరిశుద్ధాత్మ, అది బయలుపడబోవుచున్నది. ఆ విధముగానే ప్రభువైన యేసు తన మహిమతో దిగివచ్చునప్పుడు, ప్రభువునందు మృతులైనవారు పునరుత్తాన శక్తితో మొదట లేచెదరు. మనము కూడా మార్పుచెంది ఆయనవలె శరీరము ధరించుకొందుము. అది వారికి బయలుపడును. తృనీకరించినవారు, విడవబడతారు.

39పెండ్లి కుమారుడగు యేసును కలిసికొనుటకు వెళ్ళిన పదిమంది కన్యకలు కునికి నిద్రించిరి. మొదటి జాము, రెండవ జాము, మూడు, నాలు, ఐదు, ఆరు జాములు, ఏడవ జాము వరకు, అయితే ఏడవ జామున "ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను కలిసికొనుడను స్వరము వినవచ్చినది. నిద్రించినవారు మేల్కొనిరి. ఏడవ సంఘకాలమునకు ముందుండినవారు అనగా, పెంతెకోస్తు వరకు వున్నవారంతా మేల్కొనిరి. అయితే ఈ సంఘకాలములో నున్నవారు సజీవులుగా శరీర మార్పునొంది ఆయనను కలిసికొనిరి.

వారు వెళ్ళిన తక్షణమే, ఈ నిద్రపోవుచున్న కన్యకలు (బుద్ధిలేని కన్యక) లేచి నూనె కొనుటకు తొందరపడినది. "మాకు నూనె అమ్ముడి" అని బుద్ధిగల వారిని అడిగిరి.

అయితే బుద్ధిగల వారు తమకున్న నూనె తమకు మాత్రమే సరిపోవునని, అమ్మువారి వద్దకు వెళ్ళమని వారికి చెప్పిరి.

"వారు నూనెను సంపాదించుకొను యత్నములో ఉండగా, అంతలోనే పెండ్లి కుమారుడు వచ్చెను." ఈ నిద్రించుచున్న కన్యకలగు ఎపిస్కోపివారు, బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్పిటేరియన్ వారగు వివిద మత శాఖలు పరిశుద్ధాత్మను పొందవలెనని యత్నించుచున్నట్లు, మత పత్రికలన్నిటిలోను ప్రచురించబడుచున్నది. పరిశుద్ధాత్మను, పెంతెకోస్తును తిరిగి పొందుకోవాలని ప్రయత్నించుచున్నారు. అయితే వారు తమ మార్గముల ద్వారా పొందజాలరని వాక్యము చెప్పుటలేదా? వారీవిధముగా ప్రయత్నము చేయుచున్న సమయములోనే పెండ్లి కుమారుడు తిరిగి వచ్చి పెండ్లి కుమార్తె సంఘమును ఎత్తికొని పోవును. వారు తమకియ్యబడిన ఆహ్వానమును తిరస్కరించినందున శిక్షకు లోనై, కటిక చీకటిలోనికి త్రోయబడెదరు.

అందరిని రమ్మని ఆయన ఆహ్వానించుచున్నాడు. అన్ని యుగములలోను దేవుడు తన వెలుగును పంపుచుండెను, కాని వారు మాత్రం దానిని విసర్జించుచునే వుండిరి.

40ఈ రోజున కూడా వారు ఆ విధముగానే చేస్తున్నారు. ఏ తేడా లేదు. వర్తమానముతో దేవుడు వారిని దర్శించుచున్నాడు, కానీ వారు తృణీకరిస్తున్నారు. దేవుడు తన సంఘమును లేదా జనులను దర్శించు సమయంలోనే నీవాయనను అంగీకరించాలి. మరో సంవత్సరం లేదా మరొక ఉజ్జీవం వచ్చే వరకు వాయిదా వేయకు సూమా, ఇదే సరైన ఘడియ, "నేడే రక్షణ దినము."

గుర్తుంచుకోండి, అతీతమగు కార్యముల ద్వారా ఋజువుపర్చకుండా దేవుడు ఏ కాలములోను వర్తమానమును పంపలేదు. నన్ను నమ్మనిచో నేను చేయు క్రియలను చూచి నమ్ముడని యేసు చెప్పెను. తండ్రి క్రియలు నేను చేయనిచో నన్ను నమ్మకుడని వారితో అనెను. తేటగా బయలుపడినప్పుడు దానిని నీవు నమ్మితీరాలి.

సంఘము దానిని తృణీకరించుచున్న సమయమొచ్చియున్నది గనుక మరెన్నటికి వినబడకుండునట్లు దాని చెవికి గుర్తు వేయబడినది. ఇప్పుడు అది మృగము యొక్క ముద్రను వేయించుకొనుటకు సంఘ సమాఖ్యలోకి పరుగుతీయుచున్నది.

41ఈ క్రొత్త పోపు సంఘాలన్నింటిని ఐక్యపరచాలనే దాహం కలిగియున్నట్టు వార్తాపత్రికలో చదివాను. నేను ఇక్కడ నిలబడినంత వాస్తవంగా అది జరుగును. ప్రొటస్టెంటులు అతడి ఉరిలో చిక్కుకొందురు. మొదట భ్రష్టత్వము సంభవించితేనే గానీ పాపపురుషుడు బయలుపడడని బైబిలు చెప్పుచున్నది. ప్రభువు యొక్క ప్రవక్త పౌలు చెప్పుచున్నాడు, "దేవుని ఆలయములో వాడు పీఠము వేసుకొని దేవునికంటే పైగా తన్నుతాను హెచ్చించుకొనుచూ, మనుష్యుల పాపములను క్షమించు అధికారమును తాను కలిగియున్నానని ప్రకటించుకొనుచున్నాడు. ఆత్మీయ పండుగ నుండి సంఘము దిగజారిపోయి బ్రష్టురాలయినప్పుడే ఈ దుష్కార్యము ఆరంభమైనది. అప్పటి నుండి అది ఒక సంస్థగా తయారయినది. కావున సంఘములో నుండి దైవ ప్రత్యక్షత వెడలిపోయినది.

42ఇశ్రాయేలు దివారాత్రులు అగ్నిస్తంభము ద్వారా నడిపింపబడిరని గుర్తుంచుకొనుడి. అగ్నిస్తంభము కదిలినప్పుడే వారును కదిలిరి. రాత్రి అగ్ని గాను, పగలు మేఘముగాను అది ఉండెను. అది ఎక్కడ ఏ రూపంలో నున్నప్పటికిని వారు చూడగలిగిరి, దానినే వారు వెంబడించిరి.

అదే విధంగా మార్టిన్ లూథర్ దానిని చూచి కాథలిజం నుండి బయటకొచ్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన వారు ఏమి చేసారు? వారు తమ చుట్టూ ఒక కంచె వేసుకొని మేము లూథరన్లమని చెప్పుకొన్నారు.

తరువాత వెస్లీ వారిలో నుండి అది కదిలి వెళ్ళిపోవుచున్నదని చూచి బయటకొచ్చి దానిని వెంబడించాడు. అయితే అతనిని వెంబడించినవారు మాత్రం తమ చుట్టూ ఒక గోడను కట్టుకొని మేము ఫలానా వారమని చెప్పుకొనిరి. వెలుగు ఏమయెను? అది వారిని దాటుకొంటూ ముందుకు వెళ్ళిపోయినది.

పెంతెకోస్తు దానిని చూసెను. వారేమి చేసారు? వెస్లి గుంపు నజరేనియన్ల గుంపు, మిగతా గుంపులన్నిటిలో నుండి వారు బయటికి వచ్చారు. తర్వాత వారు చేసిందేమిటి? వారు కూడా తమ చుట్టూ "మేము ఏకత్వపువారమని," కొందరు, "మేము త్రిత్వపువారమని" మరికొందరు, "మేము ఐక్యపువారమని" ఇంకొందరు అనిరి. గనుక ఆయన అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయెను. గమనించారా?

దానిని మనం సంస్థగా చేయలేం. ప్రతిదినము ప్రతి ఘడియ మనము ఆయన అడుగుజాడల మార్గమును వెండించవలసిన వారమైయున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నడిపించబడవలెను. ఆ విధముగా మనం చేయునిచో, మనం సంస్థాగత జీవితంలో పయనించుచున్నట్లే. మరియు అనుదినము క్రీస్తుని వెంబడించని జీవితము సువ్రార్తకు యోగ్యమైనది కాదు.

43ఆదివారపు క్రైస్తవుడు ఆదివారమున సంఘానికి వెళ్ళి, మూలన కూర్చొని సంఘానికి తానెంతో ప్రాముఖ్యమైనవాడనని ఆలోచనలు చేస్తుంటాడు. సంఘములో అది చేసాను, ఇది చేసాననుకొంటాడు, కానీ సోమవారం నుండి శనివారము వరకు దొంగతనం, అబద్దం, తదితర క్రీస్తువిరోధ కార్యములను చేస్తుంటాడు. స్త్రీలైతే సముద్ర తీరాలకు మరియు వీధులలో అసహ్యమగు వస్త్రాలు ధరించి పరుగెత్తుతుంటారు.

మన దేశపు ప్రధమ మహిళ గురించి నేను ఆలోచించాను, మేకపు వేసుకొని, పోపును దర్శించి వచ్చును. మరియు ఆ తరువాత ఒక రకమగు జుట్టును ఈ దేశపు స్త్రీలందరికీ నేర్పును. ఇలాంటి వస్త్రాలంకరణ, మరియు ఆమె ఒక తల్లి, దేశములోని ప్రతి స్త్రీ, తల్లి వంటి వస్త్రాలు ధరించాలని కోరుదురు. అది నిజము. అది ఉదహరణ. మరియు ప్రజలు అది చేయుదురు అని వారు ఎరుగుదురు. వారు లోకము యొక్క ఆత్మను తీసుకొనివచ్చును. అది జీవముగల దేవునికి సంఘమునకు చెందినది కాదు.

స్త్రీలు ప్రభువైన యేసు వైపు చూడాలి? పాత నిబంధనలోని శారా తదితర స్త్రీల వైపు నీవు దృష్టిని నిలపాలి.

44నేడు స్త్రీలు తమ భర్తలకు విధేయులు కావటం లేదు. ఈ అమెరికా దేశంలో వివాహా వ్యవస్థ పూర్తిగా విచ్చిన్నమయి పోయింది. నీవు నీ భర్తకు లోబడనిచో నీవు క్రీస్తు బిడ్డవు కానేరవు. నీవు ఎంత బాగా గంతులేసి భాషల్లో మాట్లాడుచున్నా, నీ భర్తకు విదేయురాలువు కానిచో, నీవు దేవునికిష్టురాలవు కావని నొక్కి చెప్పుచున్నాను. నీవు దేవుని చిత్తానికి బయట వున్నావు.

షార్టులు వేసుకొని వీధుల్లో అసభ్యకరంగా తిరుగుచున్న ఈ స్త్రీలు ఏ మాత్రం క్రైస్తవులుగా పిలవబడుటకు అర్హులు కారు. లోకాన్ని హత్తుకుంటూనే నీ సాక్షాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీవావిధముగా ప్రవర్తించుట దుర్లభం!

45గమనించండి, నీ చెవికి ముద్ర పడినయెడల ఇక నీ వెన్నడు వినలేవు. గుర్తు౦చుకోండి, నీ చెవులు మూసివేయబడినవనుటకు అదే సూచన. నీవెన్నడు వినలేవు. మరెన్నడు నీకు ఆయన స్వరం వినబడదు.

ఓ, "దానిని ఆమె నమ్మదు." ఓ మై! "ఆమెకి చెప్పకండి, ఆమె దానిని నమ్మును," లేదు "ఆమె సరైనది చెప్పును." ఆమెకది తెలియదు. ఒక స్త్రీ ఏ విధముగా…

వారం క్రితం, గత ఆదివారం రాత్రి "ఒక ఎర్రని దీపకాంతి" అనే దాని మీద ప్రసంగించాను. ఇది వరకు లేనంత వేగంగా స్త్రీ అందం కొరకు ఎలా పరుగెత్తుచున్నదో నేనిప్పుడు చెప్పాను. స్త్రీకి ఎదురు లేకుండా పోయింది. పెత్తనం ఆమె తీసికొన్నది. చూశారా? వృక్షము ఎదుట హవ్వ శోధించబడినట్టే నేటి స్త్రీ లోకపోకడలు మరియు అందము ఎదుట ఆమె శోధించబడుచున్నది.

46దేవుని దగ్గరకు వచ్చు ప్రతి మనిషి ప్రతి కుమారుడు ఈ శోధన ఘడియను ఎదుర్కొనవలెను. ఇది స్త్రీ యుగం అందుకే ఆమె ఈ శోధనను ఎదుర్కొనాలి. దేవుడు నీ అందమును మనస్కరించడు. నీవు ఒక సోదరిలా ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను దీవించును. అయితే చాలా మంది స్త్రీలు దయ్యాలు పట్టినవారై, దిగంబరులుగా కనబడుచున్నారు. చెడ్డగా ప్రవర్తించుచున్నారు. అది తప్పు అని వారిలో చాలా మంది ఎరుగకున్నారని నేను అనుకోవట్లేదు. అయితే వారు దానిని గుర్తించుట లేదు.

మర్యాదస్తురాలగు స్త్రీ ఇటువంటి అర్థనగ్న బట్టలు వేసుకొని వీధులలో తిరుగునా? మీరే చెప్పండి?

ఇక్కడ ఇద్దరు యవ్వనస్తురాండ్రులు కూర్చొనియున్నారు. వారు భవిష్యత్తులో ఎలా వుందురో నాకు తెలియదు, కాని వారి కొరకు ప్రార్ధి౦చెదను. నేడు పిల్లలు, నాకు తెలియదు… దానిని నేను చెప్పలేను. వారు లోకము బారినుండి బయటపడాలి. యేసుక్రీస్తు యెదుటికి వచ్చినప్పుడు వారే స్వయంగా జవాబివ్వవలసివుంది. నేను మరియు వారి తల్లలు దేనినైతే నమ్ముచున్నామో, దానితో వారు నడువలేకపోవుచున్నారు. వారెలా వుంటున్నారో నాకు తెలియదు. అయితే ఈ ఘడియలో ఆ బాలికలు వీధిలో నడిచినట్లైతే, వారి వస్త్రదారణను బట్టి ఎవరైనా పురుషులు వారిని హేలన చేసినట్లైతే, నేను వారిని వారించెదను. అవును. నేను వారిని ఖండింతును. అలాంటి సిగ్గుమాలిన వస్త్రములను ధరించవలదు.

47వినండి. "జంతువుకంటే మనిషి ఎక్కువేం కాదు. అతడు జంతు జాతినుండే బయటకి వచ్చాడు" అని వారు అనుకొని దానిని బోధించినట్లైయితే, ఇక వాడిని అక్కడే వదిలి వేయుము.

మగ కుక్క ఒకానొక కాలమున ఆడ కుక్క యొద్దకు చేరును. కంచెవున్నా మరేది వున్నా దానిని దాటుకొని అది వెళ్ళును. జంతువులన్ని అలాగే చేయును. మన శరీర నిర్మాణము జంతువు శరీరము వలే వున్నది, కానీ మనలో విచక్షణ వున్నది. మనము ఒకవేళ జంతు జీవము మన శరీరమందు కలిగివున్నట్లయితే, మరి స్త్రీ జంతువు కంటే నీచముగా ఎందుకు ప్రవర్తించుచున్నది. విచక్షణ జ్ఞానము లేని జంతువే ఆమె కంటే మెరుగు. ప్రకృతి సహజముగా పురుషుడు తనవైపు చూస్తాడని స్త్రీకి తెలుసును. అయిన ఆమె ఆ సిగ్గుమాలిన వస్త్రములు ధరించుచున్నది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు అప్పుడే తన హృదయమంలో అతడు వ్యభిచరించిన వాడగునని బైబిలు చెప్పుచున్నది.

48అలా చూచే సమయం నీకొక పరీక్ష సమయం. సాతాను స్త్రీలను దిగంబరులుగా చేసి, నీ ముందుకి పంపును. పురుషులారా? మీ తలలు త్రిప్పుకొనండి! దేవుని కుమారులవలె జీవించండి! స్త్రీలారా దేవుని కుమార్తెలవలె వస్త్రాలు ధరించుకొనండి, లేనిచో ఒక దినమున వ్యబిచార పాపమునకు నీవు శిక్షననుభవించెదవు.

నీవు చాలా అమాయకురాలివే కావచ్చు. ఎన్నడు నీకు చెడు ఉద్దేశ్యం ఉండకపోవచ్చు, కాని నీ వస్త్రదారణ వలన నీవు మరో వ్యక్తిని వ్యబిచార పాపము చేసిన వ్యక్తిగా తయారు చేస్తున్నావు. ఆ వ్యక్తి మాత్రమే కాదు, నీవునూ తీర్పు దినమున నిలబడవలెను. నీవే నేరస్తురాలువు! నీ అక్రమమే నీకు శిక్షకొని తెచ్చును.

49ఈ దేశం వైపు చూడండి. మన స్త్రీలను వస్త్రదారణ విషయంలో ప్యారిస్ కు పంపేవారు, ఎందుకంటే అక్కడి స్త్రీలు మోకాలి పైకి వరకు వుండే పొట్టి వస్త్రాలను ధరింతురు. నేడు పారిస్ వారు తమ స్త్రీలను మన స్త్రీల పొట్టి వస్త్రముల కొరకు పంపుచుండిరి. అది ఎంత మురికి అంటే, పారిస్ కూడా ఇక్కడితో పోటిపడలేకపోయినది. అయితే ఈ రోజున స్త్రీలు పూర్తిగా చెడిపోయిరి. అవును. ఎందుకనగా వారు సువార్తను నిరాకరించిరి.

ప్యారిస్ సువార్తను కలిగిలేదు. నూటికి నూరు మంది ఆ పట్టణవాసులు కాథలిక్కులే. ప్రొటస్టెంటులు కనీసం ఆ పట్టణములోనికి కూడా వెళ్ళలేరు. బిల్లీగ్రహంను చూడండి, లక్షలాది మందిలో కేవలం ఆరువందల మంది క్రైస్తవులు మాత్రమే పారిస్ లో వుందురని నేననుకొనుచున్నాను. ఆరు వందల మంది ప్రొటెస్టంట్లు మాత్రమే వున్నారు, కానీ వారు కూడా పరిశుద్ధాత్మపూర్ణులు కారు. తిరస్కరించే అవకాశం వారికి రాలేదు.

ఒకప్పుడు వీరి ముందుకు సువార్త తీసికొనరాబడింది, కాని వారు ఆ వర్తమానమును త్రోసివేసి అవహేళన చేశారు, ఎందుకనగా వారా పాత వేశ్య సిద్దాంతాలలో పాతుకుపోయారు. బోధకులు వేదిక మీద నిలబడి డబ్బును గూర్చి, ఒక పూట బోజనం గూర్చి ఆలోచిస్తున్నారే గాని, ఆత్మల కొరకైన యదార్థమగు ఆశ లేకుండెను. ఇప్పుడా దేశం ప్రపంచ ఫ్యాషన్లకు మార్గదర్శకురాలయింది.

50ఇరవై ఏండ్ల క్రితము నేను ఈ టాబర్నికల్లో నిలబడి, "అమెరికా దేవతను నేను మీకు చూపించెదను" అని నేను చేసిన ప్రసంగం మీరు గుర్తుచేసుకొండి. నేను భోదించిన దానితో బహు కొద్దిమంది మాత్రమే నేడు నిలిచియున్నారు. అది అంతే. ఇప్పుడు వారు ఇదివరికే దానిని పొందారు. దేనికొరకైతే వారడిగారో, దానిని వారు పొందుచున్నారు. ఇంకను పొందుదురు. అది అంతే.

వారు దీనిని నమ్మరు. అవునండి. వారు అమెరికా పౌరులని తెలుపుదురు. తమకిష్టమొచ్చినట్లు చేసెదరు. నేను నా ఇష్టం…

నేనొకటి చెప్పెదను, ఇప్పుడే నేనో విషయం చెప్పెదను. రాజకీయాలు ఎన్నడు పనిచేయవండి. ప్రజాస్వామ్యము ఎన్నడు పనిచేయదు. ప్రజాస్వామ్యము పూర్తిగా కుళ్ళిపోయినది. ఒకవేళ అది క్రైస్తవుల ద్వారా నడిపించబడితే, అది బావుంటుంది. కానీ దానిని నీవు లోకమందుంచిన యెడల లంగరు లేని తెరచాపవలె ఉండును. ఖచ్చితంగా అది వాస్తవం.

నేడు ఇక్కడ చూడండి. ఏదైన జరగొచ్చును. వారు… ఏదైన కొన్ని రాజకీయాల ఫలితంగా హత్యలు జరుగుచున్నవి.

51నేను బోధించుటకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు యువకుల జీవితాలను రక్షించుటకు నేనొక వకీలుతో మాట్లాడిన సంగతిని మీరెరుగుదురు. వారిద్దరు నిజంగా దోషులే. ఆ వకీలు నా వెనుక వుండి ఇలా అన్నాడు "అవును మనుషుల ప్రాణాలు తీయుట అనేది నేను కూడ నమ్మను. నేర చరిత్రుల యొక్క రికార్డు తిరగేస్తే ఎక్కువ శాతం పేదవారు, అమాయికులే ఈ కరెంట్ కుర్చీ (మరణశిక్ష)లలో చంపబడుచున్నారు. ధనికులు ఏదోరీతిగా ఒక లాయరును పెట్టుకొని కేసుల నుండి తప్పించుకొనుచున్నారు."

నేనా న్యాయవాదితో ఏం చెప్పానో తెలుసా? లోకములో మొట్టమొదటి హత్య అన్న తన తమ్ముడిని చంపినప్పుడు జరిగింది. అయితే దేవుడా హంతకున్ని చంపలేదు గాని, వాడి మీద ఒక ముద్రవేసి ఎవడును వాడి ప్రాణాన్ని తీయకుండునట్లు చేశాడు. ఆయన అత్యున్నత న్యాయాదిపతి.

నేనీవిధంగా ఆ వకీలుతో మాట్లాడిన తదుపరి ఆ యువకుల శిక్ష తగ్గించబడినది. పశ్చతాపపడేట్లుగా వారిని వదలాలి కాని చంపకూడదు. ఒకడి ప్రాణం ఇంకొకడు తీసే హక్కు ఏ ఒక్కరికి లేదు. అవునండి. ప్రాణం తీయుటయందు నాకు నమ్మిక లేదు. నిశ్చయముగా.

52ఓ! వారంటారు… ఎందుకు, ప్రభువు చిత్తమునకు తాము బయట వున్నామని వారు నమ్మరు, ఎందుకనగా వారికి తెలిసిందంతా అదే, వారు వినవలసిందాంతా అదే. అయితే వారు సత్యమును వినకుండా తమ చెవులను త్రిప్పుకొందురు.

ఆ పరిశుద్ద గుండ్రాళ్ళు దేవుని చిత్తములో అక్కడ వున్నారని ఐగుప్తియులు తెలుసుకొవాలనుకోలేదు. అయితే అక్కడ ఒక పిచ్చి వ్యక్తి గడ్డం పెరిగినవాడు అరణ్యంలో నుండి వచ్చి ఇలా అనెను. "ఫరో నా ప్రజలను విడిపించుటకు నేను ప్రభువు నామమున వచ్చియున్నాను."

"ఎవరు, నేనా? అతనిని బయటకు త్రోసివేయండి" అని ఫరో చెప్పినాడేమో.

అందుకతడు, "దేవుడు చెప్పిన రీతిగా నీవు చేయనిచో, ఈ దేశమును దేవుడు మొత్తును" అని పలికాడు.

"ఆ ముసలివాడిని బయటకు త్రోసివేయండి. అతనిని వెళ్ళనియ్యండి. సూర్యుని వేడికి అతడి మెదడు వేడెక్కినది." చూచారా? అతని మాట విననందున తీర్పు వారిమీది కొచ్చినది. అవును, ఎందుకనగా అతడొక ప్రవక్త, అతడు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడను" దానిని కలిగివుండెను. అది నిశ్చయం, కాని వారు దానిని నమ్ముటకు ఇష్టపడలేదు.

రోమ్ కూడా ఆ విధముగానే నమ్ముటకు ఇష్టత చూపనందునే ఈ గతి పట్టినది.

53అలాగే ఇశ్రాయేలీయులు ఆయన మెస్సీయా అని నమ్ముటకు ఇష్టపడలేదు. ఆయన గలలీయుడే గదా అనుకొన్నారు. అందరూ వెలివేసిన గుంపుతో అతడు స్నేహము చేయుచున్నాడేమిటని ప్రశ్నించారు. ఏమీ తెలియని, ఎందుకు పనికిరాని అయోగ్యులే ఆయన వద్దకు వచ్చెదరు. అదోక పేద గుంపు. వారికి విద్య, పాండిత్యము లేదు. ఈ దినపు ఉజ్జివము గురించి వారు చెప్పుట మీరు వినండి. "ఎలాంటి గుంపు వారిని వింటుంది? ఆ కూడికకు ఎవరు వెళతారు? వారు ఎలాంటి ప్రజలు?"

54హోప్ పినతండ్రితో నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము గూర్చి ఒక రోజున చెప్పాను. అతడు నాతో, "నేను అటువంటి విషయాలను నమ్మను, ఎందుకనగా నీ చుట్టూ ఉన్న గుంపు ఎటువంటి అపవిత్రులో నాకు తెలుసు. ఈ ప్రదేశములోని ఫలానా వ్యాపారి పరిశుద్ధాత్మను పొందామని వారిలో ఒక్కరిని చెప్పమను అప్పుడు నేను దానిని నమ్ముదును," అనెను.

"బాధపడకు. నీవెన్నడు అలాగు అనవు," అని నేను అన్నాను. ఆ వ్యక్తి తక్షణమే దేవుడు లేకుండా మరణించాడు. చూచారా?

నీవేమి మాట్లాడుచున్నావో దానిగూర్చి జగ్రత్తగా ఆలోచించు. నీవు చేయు ప్రతి కార్యమును గూర్చి నీవు జాగ్రత్త కలిగియుండు. సువార్తకు యోగ్యమైన జీవితమును నీవు జీవించాలి!

55నజరేయుడైన యేసు అను మనుష్యుడు వ్యభిచారమువలన పుట్టినాడని ఇశ్రాయేలియులన్నారు. యోసేపునకు ప్రధానము చేయబడిన మరియ వివాహమునకు ముందే గర్భము దరించినదని, అది కేవలము అక్రమ సంబంధము వలనే కలిగినదని నమ్మారు. అందుకే ఆయన మాటలను వినవద్దని జనులకాజ్ఞాపించారు. ఆ విధంగా వారు తమ ఆత్మలను నరకానికి నెట్టివేసుకొన్నారు.

గ్రుడ్డివాడు, గ్రుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరు కలిసి గుంటలో పడుదురని యేసు వారిని గూర్చి చెప్పెను. వారిని ఆ విధంగానే జీవించనీయండని చెప్పాడు. వారు దానిని నమ్మలేరు.

సామాన్య జనులు మాత్రమే యేసు బోధను సంతోషంగా విన్నారని బైబిలు తెలియజేస్తోంది. ఈ సాధారణ మనుష్యులు అర్ధం చేసికొనిన వర్తమానమును, మహాపండితులు అవగహన చేసికొనలేకపోయారు. అందుకే ఆ దేశం పతనమయిపోయింది.

56కొద్దికాలం క్రితం దేవునిచే ఎన్నుకొనబడిన జనరల్ వల్డెనా అను మెక్సికో యోధున్ని దేవుడొక కూటములో దర్శించాడు. కాథలిక్కువాడగు అతడు వేదికపైకి అణుకువతో వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్ళిపోయి స్థిరపడ్డాడు. అతడు తన ప్రాంతమునకు నన్ను రమ్మని పదేపదే బ్రతిమిలాడుచున్నాడు. చివరకు నేనాస్థలానికి వెళ్ళుటకు తీర్మానించుకున్నాను. నా భార్యకిచ్చిన ఒక దర్శనం ద్వారా దేవుడు నన్ను నడిపించాడు.

నేనక్కడికి వెళ్ళినప్పుడు, ఈ జనరల్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ దేశంలో ప్రొటస్టెంటులంటే ఎంతో ప్రతికూల వాతావరణం ఉంది. ఈ కూటం ఎంతో ఆత్మశక్తితో భీతావహంగా జరుగునని ముందే తెలుసు గనుక మిలటరి రక్షణకై మాట్లాడడానికి అతడు వెళ్ళాడు. వారు అతనికొక పెద్ద బహిరంగ స్థలం చూపించారు. ప్రభుత్వం నన్ను అనుమతించినది.

అ విధమైన అనుమతి మాకియ్యబడటం చూచి, ఒక పెద్ద కాథలిక్కు బిషప్పు గవర్నర్ వద్దకు వెళ్ళి, కాథలిక్కు కాని వాడిని మీరెట్లు అనుమతించుచున్నారని అడిగాడు.

"అతనికి ప్రవేశమిస్తే ఏమయింది?" అని గవర్నరు ప్రశ్నించాడు. "అటువంటి వ్యక్తిని మన దేశంలోనికి రానివ్వకూడదు, ఏ ప్రభుత్వము ఇప్పటి వరకూ ప్రొటస్టెంటు భోధకునికి ప్రవేశం ఇవ్వలేదు," అని అన్నాడా బిషప్పు.

57అయితే ఇప్పుడు మేమిస్తున్నాం. ఎందుకంటే అతడు ఎంతో పేరుగల వ్యక్తి. అతని ప్రసంగం వినుటకు వేలమంది హాజరగుదురని నాకు తెలుసు. అంతేకాకుండా జనరల్ వల్డెనా నా కుడిభుజం లాంటివాడు. జనరల్ వల్డెనా కూడా ఈయన బోధ విని మారిపోయాడట. అంతే కాదు, ఈ దేశ అద్యక్షడు కూడా ఒక ప్రొటస్టెంటు. ఆయనతోపాటు వేలాది జనులు ఈయన కూటానికి హాజరగుదురని మాకు నమ్మకమున్నది" అని గవర్నరు పలికెను.

అప్పుడు బిషప్పు ఆయనతో ఆయన కూటాలకు చదువులేనివారు, జ్ఞానంలేనివారు, సంఘములో ఎందుకు పనికిరానివారు మాత్రమే వెళ్లారండి" అని అన్నాడు.

అందుకా ప్రెసిడెంట్, "అయ్యా, 500 ఏండ్ల నుండి ఈ దేశంలో అధికారం కలిగియూ ఇంకా పనికిరాని అలాంటి వ్యక్తులను మీరు కలిగియున్నారన్నమాట," అని ప్రత్యుత్తరమిచ్చాడు.

58నేను విశ్వాసంతో వేదిక మీదకు నడిచి వెళ్ళి సువార్త బోధించుట ఆరంబించాను. భారి వర్షం కురుస్తోంది. ప్రతిరాత్రి 10వేల మంది రక్షించబడుచున్నారు.

ఒక పుట్టు గ్రుడ్డివాడు ఒక రాత్రి సంపూర్ణ దృష్టిని వేదికమీదనే పొందాడు. పాత దుప్పట్లు, టోపిలు కుప్పలుగా పడి ఉన్నాయి.

జన సందోహాన్ని అదుపులో పెట్టలేక నన్ను త్రాళ్ళ మీద ఆ వలయంలోనికి తీసికొని వచ్చారు. ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చి స్పానిష్ బాషలో ఈ ఉదయం 9:00 గంటలకు నా చిన్న బిడ్డ చనిపోయిందని చెప్పింది.

బిల్లీ, ఆ సమయంలో నా వద్దకొచ్చి, "నాయనా! ఈ స్త్రీకి నీవు ఒక గొప్ప సహాయం చేయబోతున్నావ్" అని చెప్పాడు. ఆ సమయంలో నా చుట్టూ 300 మంది అంగరక్షకులున్నారు, కానీ వారు ఆ చిన్న స్త్రీని నా వద్దకు రాకుండా ఆపుచేయలేకపోయారు. సుమారు పాతికేండ్ల ప్రాయంలోనున్న ఆమెకు ఈ చనిపోయిన బిడ్డ తొలి కాన్పు అని అనుకొంటాను.

59ఆమె జుట్టు క్రిందకి వ్రేలాడుతుంది. చేతుల్లో చనిపోయిన పసికందును పట్టుకొని నిలబడియున్నది. ఆమె ఆ కిక్కిరిసిన జనసమూహంపై నుండి, ప్రాణం తెగించి, బిడ్డను చేతిలో పట్టుకొని నడిచి వచ్చింది.

ఆమె ప్రార్ధనా వరుసలో లేదు. అసలు ప్రార్ధన కార్డు కూడా ఆమెకు లేదు. మూడు రోజుల నుండి ఎండనక వాననక వరుసలో నిలబడి యున్నా వారు ఈమె ఆ విధంగా వచ్చుట చూచి పెద్ద దుమారం రేపుతారేమోనని అక్కడున్న బిల్లీ భయపడ్డాడు.

బ్రదర్ మూర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అతనిది కూడా నాలానే బట్ట తల, నేను అతనిని మరియు టాబర్నికల్లోని కొందరు సహోదరులను పిలిచి "బ్రదర్ మూర్ నీవామెను ఆ వెనుకకు పిలుచుకొని వెళ్ళి ప్రార్థించు. ఆమెకు నేనెవరో, నీవెవరో తెలియదు. ఆమెకు ఇంగ్లీష్ కూడా రాదు. వెళ్ళి, ఆమెకు ప్రార్ధి౦చు" అని చెప్పాను.

సరేనని చెప్పి బ్రదర్ మూర్ నడక ప్రారంబించాడు.

60నాకండ్లముందు ఒక దర్శనం కనిపిస్తోంది. ఆ దర్శనంలో ఒక చిన్న మెక్సికన్ బిడ్డ నవ్వుతూ కనిపించాడు. నేను వెంటనే మూర్ ను వెనక్కి పిలిచాను. అందర్నీ ఒక్క నిమిషమాగమని చెప్పాను. ఆ స్త్రీని నా వద్దకు తీసుకొని రమ్మని పిలిచాను.

అప్పుడు బిల్లీ నాతో, "నాయనా నీవాపని మాత్రం చేయవద్దు. ఈ ప్రజావెల్లువ మన మీద విరుచుకు పడుతుంది. ఆ స్త్రీని ముందుకు పిలవవద్దు" అన్నాడు.

"లేదు, లేదు, నేను ఇప్పుడే దర్శనం చూచాను," అన్నాను.

"ఓ, అయితే అది సరి," అన్నాడు.

మేము జనాన్ని ప్రక్కకు నెట్టి ఆ స్త్రీని ముందుకు తెచ్చాం, ఆమె తన చేతిలో ప్రార్ధనాపూసల దండను లెక్కించుకొంటూ మోకాళ్ళ మీద నడుచుకొంటూ వేదికనొద్దకొచ్చింది. నేనామెను లేచి నిలువమని చెప్పి, "దేవా నీవిప్పుడేమి చేయుచున్నావో నాకు తెలియదు, ఈ స్త్రీని ఏ విధంగా పంపించెదవో నేనెరుగను. అయితే ప్రభువైన యేసు నామములో ఈ బిడ్డపై నా చేతినుంచుచున్నానని" చెప్పి ప్రార్ధించాను. టాబర్నికల్లో ఒక రోజు బ్రదర్ వే చనిపోయాడు. నేను అందరిని నిమ్మళపరచి ఏ విధంగా ప్రార్ధి౦చానో అదే విధంగా ఈ బిడ్డ కొరకు ప్రార్ధి౦చాను. కెవ్వున కేక వేసుకొంటూ దుప్పట్లో కదలాడెను.

61ఆ స్త్రీకి సహో ఎస్పినోసాను తోడిచ్చి డాక్టర్ నొద్దకు మరణ ధృవపత్రము కొరకు పంపించాను. ఆ బిడ్డ ఉదయం 9.00 గంటలకు న్యూమెనియాతో చనిపోయినట్లు వైద్యుడు ధృవపత్రం ఇచ్చి పంపించాడు. ఆ వైద్యుడిచ్చింది మామూలు ధృవపత్రము కాదు గాని, ప్రమాణ ధృవపత్రం.

చాలా మంది నన్ను కలసికొన్నారు. మా కాథలిక్కు పరిశుద్దులు కూడా కార్యములు చేయగలరు అని చాలా మంది నాతో అన్నారు.

"వారు సజీవులయితే ఖచ్చితంగా చేయగలరని" జవాబిచ్చాను.

"నీవు చనిపోతేనే గాని పరిశుద్ధుడవు కాలేవు గదా?" అని వారన్నారు. అక్కడే మీరున్నారు. చూశారా? మరియు ప్రజలు…

62మీరు చూడండి. ఒకనాడు పేపర్లో ప్రచురమైన కథాంశం ఒక నన్ గూర్చి, వందేళ్ళ క్రితం ఆమె చనిపోయింది. వారు ఆమెను పరిశుద్ధురాలిగా పరిగణించారు. లూకేమియా వ్యాధిగల వ్యక్తిని పరిశుద్ధురాలిగా, మృతులలో నిండి వచ్చి ప్రార్ధి౦చునని వారన్నారు. అది మాగజైన్ పత్రికల్లో ప్రచురితమైంది. వారు ఎలా దానిని చిత్రికరిస్తున్నారో చూడండి. వందల వేలకొలదిగా ఇలాంటి కథలను వారు అల్లుదురు. మరణించిన కాథలిక్కు నన్ల పేరున రోగాలను బాగు చేయుదుమని వారందురు. ప్రొటస్టెంట్లు ఇట్టి అద్భుత కార్యాలను చూచి కొన్ని అబద్ద కల్పనలు సృష్టించుచున్నారు. ఎన్నో జబ్బులు పరిశుద్ధుల ద్వారా బాగవుచున్నవని అబద్ద ప్రచారం చేస్తున్నారు. వందల సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక నన్ ను నేడు పరిశుద్ధురాలని పిలుస్తున్నారు.

అయితే ప్రభువు యొక్క సజీవ క్రియలను చూచియూ, వారు. సువార్తను అంగీకరించక త్రోసివేయుచున్నారు.

వారు ఒక సామాన్య వర్తమానమును అర్థము చేసికొనలేకపోవుచున్నారు. అందుకే వారు గందరగోళంలో పడిపోతున్నారు.

63ఒకసారి ఓరిగాన్లో నుండగా ఒక కాథలిక్కు బాలిక నా వద్దకొచ్చింది. ఆమె ఒక వార్త పత్రికకు నివేదికురాలిగా పనిచేస్తోంది, ఆమె చేతిలో ఒక సిగరెట్టు ప్యాకెట్టు ఉంది.

ఆమె నా వద్దకొచ్చి నిన్నొక ప్రశ్నవేయాలని అన్నది, "ఏమిటది?" అని అన్నాను. "నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నావు," అని ఆమె అడిగినది.

యేసుక్రీస్తు నామమున నాకున్న దైవపిలుపు ద్వారా ఈ కార్యములు చేస్తున్నాను" అని జవాబిచ్చాను.

అందుకామె, "నీ చుట్టూ మోటు జనాంగంలాంటి వారున్నారు గదా? నీకున్న గుంపులోని వారంతా అలానే యుంటారు. వారిలో ఒకరిలా ఉండవలసివచ్చునేమోనని నేను క్రైస్తవురాలను కావటంలేదు. ఈ భూలోకాన్ని పరిపాలించుదుమని వారు చెప్పకొనుచున్నారు. వారి రాజ్యంలో నేనుండలేను" అన్నది.

"సరే, నీవు వారి సహావాసంలో ఉండవద్దులే, కాని నీవు కాథలిక్కు స్త్రీవని నమ్ముచున్నావు గదా? కన్యయగు మరియ పరిశుద్ధాత్మను పొంది ఆత్మానందముతో గంతులేస్తు అన్య-భాషలు మాట్లాడుచూ, దేవునిని మహిమపరచిందన్న సంగతి నీవెరుగుదువా?" అన్నాను.

"నాకది తెలియదు బైబిలు చూచే అవసరం నాకు లేదు" అన్నది. "అయితే నీవు ఏది సత్యమో, ఏది అసత్యమో ఎట్లు తెలిసికొనగలవు?" అని ప్రశ్నించాను.

"నేను నా సంఘము చెప్పే మాటను నమ్ముతాను" అన్నది.

"ఇది దేవుని మాట! దీనివైపు చూడమని నిన్ను సవాలు చేస్తున్నాను. అందరితో కలిసి మరియ కూడా మేడ గదిలో ఉన్నది, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొంది, దేవుని స్తుతించినది. అట్టి మరియను మీరు దేవుని తల్లి అని పూజిస్తున్నారు గదా? నీవెవరిగురించి బాధపడవద్దు. ఎవరిని అసహ్యించుకోవద్దు నీ యొక్క పాపపు ఆత్మను గూర్చి చింతించు," అన్నాను. అంతట ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయినది.

64మీరు కూడా ఆలోచించండి! దేవుడు అంతటిని సామాన్యతలో చూపాడు.

ఆహాబు, ఎజెబెలు తదితరులు ఏలియాను ఏదో మంత్రగాడని తలంచారు.

ఇశ్రాయేలుకి శ్రమంతా ఏలియావలెనే వచ్చిందని ఆహాబు నేరం మోపాడు. అవును! ఏలియా వర్తమానం వారి తలకెక్కలేదు, ఎందుకంటే ఏలియా ఒక సామాన్యమైన వ్యక్తిగా కనిపించాడు. ప్రత్యేకమైన యాజక దుస్తులు అతడికి లేవు. బాహ్యాలంకారాలు లేవు.

పరో కూడా మోషేను ఒక దేశ ద్రోహిగా పరిగణించాడు. దేశాన్ని నాశనం చేసేవాడని తిట్టాడు. అవును! మోషేలో ఈలోక ఘనత ఏమీ కనిపించలేదు. ఏదో ఒక సామాన్యమైన పలుకుబడిలేని ముసలివాడిగానే వారు అతనిని చూశారు. అందుకే అతని వర్తమానం వారి తలకెక్కలేదు. నా జనులను పంపుము, లేనిచో దేవుని ద్వారా ఐగుప్తు నాశనమగును అనేదే అతని వర్తమానము.

65"ఆ ముసలివాడు చెప్పినదానికి నేను లోబడుటమా? అది అసాధ్యం. అతని ద్వారా దేశం నాశనమగునా? అది నమ్మశక్యంగా లేదు," అని ఫరో అన్నాడు. నేడును అదే పరిస్థితి.

మనము ఒక క్షణం నిలచి ఎటువంటి దినాల్లో మనం జీవించుచున్నామో ఆలోచిద్దాం! ఐగుప్తువలె మనం కూడా మరో ఆధునిక శాస్త్రీయ యుగంలో జీవిస్తున్నాం, మనుష్యులు ఒక్కసారి ఆగి ఆలోచించితే పరిస్థితి బాగవును.

ఈ ఆదునిక గొప్ప మత వ్యవస్థలో క్రైస్తవుడొక యాంత్రిక పనిముట్టు కాడు. మత సంస్థ చలనానికి ఉపయోగపడే సాధనం కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడనగా క్రీస్తును పోలినవాడు. క్రీస్తు జీవం ఒకనిలోనికి వస్తేనే గాని వాడు క్రైస్తవుడు కానేరడు. క్రీస్తు జీవం నీలోనికి వచ్చినప్పుడు, నీవును ఆయన చేసిన కార్యములనే చేయగలవు.

క్రీస్తుతో వ్యక్తిగత సంభందాన్ని గూర్చే నేను మాట్లాడుచున్నాను. అది ఏమిటి? నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉందా?

ఇప్పుడు మీకు చెప్పుటకు నేను ఒక నేపద్యమును వేయుటకు ప్రయత్నము చేయుచున్నాను. ప్రస్సిద్దిగాంచిన స్త్రీ మరియు పురుషులు.

66ఈ దినములు నోవాహు దినముల వలేనున్నవి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిరని ఆదికాండము 6 అధ్యాయము 4వ వచనములో వ్రాయబడెను. ఈనాడు స్త్రీలు ఒక వినూత్న శరీరేచ్చను కలిగియున్నారు. వారు వివాహము చేసికోవట్లేదు, కానీ ఎవరికిష్టమెచ్చినవారితో వారు వెళ్ళుచున్నారు. ఎక్కడయిననూ చూడండి! ఏ దేశం వైపయినను చూడండి? జారత్వము విచ్చలవిడిగా కొనసాగుతోంది. గొప్పవారు పెద్ద పెద్ద అధికారులు స్త్రీ ఉరిలో చిక్కుకొనిపోతున్నారు.

ఇంగ్లాండులోని ఒక మహాయోధుడు ఆ విధంగానే చిక్కుకొనిపోయాడని గతవారం పత్రికలో చదివాను, అతనికి చక్కని భార్యవుంది. రష్యా వేశ్యను చూడండి! దాని ఉరిలో ఎందరో పడిపోవుచున్నారు.

ఈ రోజున దేవుని కుమారులు చాలా అవసరమైయున్నారు. ప్రభుత్వంలో దేవుని కుమారులుండాలి. దైవ భక్తి కలిగిన మంచి రాజు సమస్త దుష్టత్వమును అరికట్టును. దావీదు వలె రాజ్యమును కాపాడును.

67దేవుడే మన రాజు, దేవుడు తన ప్రవక్తలను పంపుచుండును. సమూయేలు ఇశ్రాయేలీయులతో ఆ మాటనే చెప్పెను గదా? సమూయేలు వారివద్ద ఎప్పుడూ లంచం పుచ్చుకొనలేదు. ద్రవ్యము తీసికొనలేదు.

తాను స్వంతముగా వారికేమీ చెప్పలేదు, కాని అతడు దేవుని యొద్ద నుండి వాక్కును పొంది ప్రజలకు చెప్పెను. దేవుడే మీ రాజు అని వారితో అనెను.

సమూయేలు మంచివాడేనని ప్రజలందరూ ఏకగ్రీవంగా చెప్పారు. అయినను మాకు రాజు కావలెనని వారు కోరారు. దేవుడే మీ రాజని సమూయేలు చెప్పినను వారికది సరిపడలేదు.

పెంతెకోస్తు కూడా తక్కిన సంస్థలవలేనే ఒక సంస్థ కావలసివచ్చినది. అన్ని సంఘాలవలె తానూ ఉండగోరినది. కాని దేవుడే మన రాజు! అవును!

68క్రీస్తు దినములలో చెప్పినట్లుగానే ఈ మానవులు అన్ని కాలములలోను నెపములు చెప్పుచున్నారు. వారు తమ స్వంత సిద్ధాంతాలను విడువరు. బైబిలులో చెప్పబడిన సాకులే నీవు చెప్పకపోవచ్చును, గాని నీవు కూడా అనేక ఇతర నెపములు చెప్పుచున్నావు.

నేను ఫలానా శాఖ వాడిని, నేనిది నమ్మను, నా సంఘం దీనికి అంగీకరించదు, అని నానా విధములుగా నెపములు చెప్పుచున్నావు. ఈ నెపములు చెప్పుచున్న నీవు క్రైస్తవుడవు కానేకావు. నీవొక శాఖకు చెందిన వ్యక్తివే తప్ప క్రీస్తువాడవు కావు. లూథరన్ ఒక లాడ్జి, బాప్తిస్టు లాడ్జి, పెంతెకొస్తు లాడ్జి. ఈ సంఘాలెక్కడా బైబిల్లో లేవు.

ఒకే ఒక సంఘమున్నది. ఆ సంఘములోనికి నీవు తిరిగి జన్మించుట ద్వారా మాత్రమే చేరగలవు. యేసుక్రీస్తు సంఘములోనికి జన్మి౦చిన నీవు ఆయన శరీరంలో సభ్యునిగా వుండగలవు. పరలోకానికి వెళ్ళే ఆత్మీయ గుంపులో చేర్చబడెదవు. అప్పుడు క్రీస్తు నీతోనున్నట్లుగా గుర్తులు కనబడును. ఆయన నీ ద్వారా జీవించును.

69క్రైస్తవులారా! దేవునితో వ్యక్తిగత సంబంధం మీరు కలిగివుండాలి! ఆయనతో భాందవ్యంలేకుండా నీవాయన కుమారునివి కాజాలవు. నీకాయన తండ్రిగా వుండలేడు. సంఘ సభ్యులు కారు గాని, ఆయన కుమారులు - కుమార్తెలు మాత్రమే రక్షించబడెదరు. నూతన జన్మ మాత్రమే దైవ భాంధవ్యమును ఉత్పత్తి చేయును. [సమాజం "ఆమేన్" చెప్పుచున్నది.]

తిరిగి జన్మించిన పిదప మేము ఏమి చేయాలి? అనే ప్రశ్నను చాలామంది నాకు వేస్తుంటారు. నీవు నిజంగా తిరిగి జన్మించినట్లయితే, నీ స్వభావము పూర్తిగా మారిపోవును. ఇంతకు ముందు నీలోనుండిన లోక కార్యములు ఇక ఎన్నడూ నీలో వుండవు. ఈ లోకానికి చచ్చినవాడివిగా నీవుందువు.

70బ్రెన్హాం సోదరుడా, నేను సంఘములో కలిసినప్పటినుండి నాకీవిధమైన మార్పు వచ్చిందని నీవు చెప్పోచ్చు.

మరియితే నీవు దేవుడు స్వస్థపరచునని నీవు ఎందుకు నమ్మవు! ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడని వాక్యము చెప్పుచున్నది గదా?

"అవును గానీ నా సంఘం ఆ దైవీక స్వస్థతను ఒప్పుకోదండి," అని నీవు చెప్తావేమో. అయితే నీవు క్రైస్తవుడవు కావు. క్రీస్తు ఆత్మ నీలో వుండినచో ఆ ఆత్మ వ్రాసిన లేఖనములను ఎట్ల నిరాకరించుదవు? క్రీస్తు ఆత్మ క్రీస్తు వాక్యమును నమ్మదా?

"నేను సంఘములో చాలా మంచి వ్యక్తిగా పేరు పొందానండి," అని నీవు చెప్తావా?

ఆఫ్రికాలోని అన్యులు ఈ అమెరికాలోని క్రైస్తవులకంటె నూరు-రెట్లు నీతిగా జీవిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా తెగలలోని ఆచారములు బహు కఠినముగా నుండును. యుక్తవయస్సు వచ్చిన బాలికకు వివాహము కానిచో, ఆ బాలికలో ఏదో పోరపాటుయున్నదని తేల్చెదరు, కనుక వివాహము కాలేదని తలంచి వేలివేయుదురు. అట్టి స్త్రీ ఆ తెగను విడిచి పట్టణములలో దేశదిమ్మరివలె తిరుగును. వివాహాము కాబడిన కన్యక యొక్క కన్యత్వమును వారు పరీక్షించుదురు. వారు అన్యులే, కానీ వారు వచ్చి మీకు బోధించు గుణలక్షణములను కలిగియున్నారు.

దక్షిణఫ్రికాలో నేను ప్రయాణించుచునప్పుడు, నేను ఎక్కడా కూడా సుఖవ్యాధులు వుండుటను కనుగొనలేకపోయాను. వారెంతో నీతిగా జీవించుచున్నారు. మనం దేవుని నుండి దూరమై చాలా అపవిత్రంగా జీవిస్తున్నాం, కాని అన్యులు ఎంతో మంచిగా ఉన్నారు.

71నీవు నిజంగా దేవునిలో తిరిగి జన్మించినట్లైతే దేవుడు చేయమని చెప్పిన ప్రతి మాటను నీవు విందువు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నీవు అవునని చెప్పుదువు. ఆ వాగ్దానములను పొందుటకై దివారాత్రులు కనిపెట్టుదువు. ఆ విధముగా నీవు ఆత్మీయ ఫలమును ఫలించుదువు.

ఓ, నేను బాషలలో మాట్లాడుచున్నానండి అని నీవు చెప్పుచున్నావా? అది నీవు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు.

అయితే ఆత్మీయ ఫలమును మాత్రము నీవు ఖచ్చితముగా ఫలించి తీరవలెను. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, ధీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము, మొదలగునవి. నీకు ముక్కోపమున్నదా? అయితే నీలో పరిశుద్ధాత్మ లేడు. నీవు జగడగొండివా? అయితే పరిశుద్ధాత్మ నీలో నుండి దూరమాయెను. నీ ఫలమువలన నీవెవరివో తెలియును అని యేసు చెప్పెను.

72నీలో నిజంగా దేవుని ఆత్మ నివసించుచున్నచో దేవుడు చెప్పిన ప్రతీ వాక్యముతో నీవు ఏకీభవించెదవు. యేసు మాటలు నిత్యజీవము గలవి. వాక్యమే ఆత్మ మరియు జీవమైయున్నది. వాక్యము వాక్యమును తృణీకరించదు. ఆయన వాక్యమైయున్నాడు. అయితే నీవు నిత్యజీవమైయున్న దేవునిని కలిగియున్నానని చెప్పి వాక్యమును ఎందుకు నమ్మలేకున్నావు? దేవుడేమైవున్నాడో నీ ద్వారా తెలియబడాలి. ప్రతి వాక్యమును నీవు సమ్మతించినప్పుడే క్రైస్తవుడవని అనబడతావు.

మరియు నీవు నీ శత్రువును ప్రేమిస్తావు. ఎవరో అన్నారు, "మంచిది, అతడు ఒక పరిశుద్ధ గుండ్రాయి." మరియు నీవు… జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు. అవతలి వ్యక్తి నీకేమి చేసినప్పటికిని నీవు మాత్రం ప్రేమను కలిగివుండవలసియున్నావు. చూశారా?

73నీ సహనమునకు అంతముండరాదు. ఎవరైనా నిన్ను గూర్చి తప్పుగా చెప్పుచున్నారని నీకు తెలిసినప్పటికిని నీవు ఎగరకూడదు. నీకొక వేళ కోపం వచ్చినచో, వారితో మాట్లాడేముందు ఒకసారి వెళ్ళి ప్రార్థించు. చెప్పిన దానిని పరీక్షించి చూడు.

త్వరగా కోపపడవద్దు. కోపపడుటకు ఇష్టత చూపవద్దు; ఎవరైనా సంఘములో లేచి ఇలా చెప్పినట్లయితే, "నీకు తెలుసా, ఫలానా ఫలానా."

నీవు చెప్పుము, "సహోదరుడా ఆలాగు చెప్పుట నీకు అవమానకరము."

"ఓ, అలాగా," అని నీవు ఆ పుకారును విన్నత్లైతే? కనిపెట్టుకొనియుండుము.

పరిశుద్ధాత్మచే ఆవరించబడిన హృదయము కలిగి పరిశుద్దతతో నిండియుండి, దురాలోచనను విడిచిపెట్టి అన్నిటిని తాళుకొను స్వభావమును కలిగియుండుము. సంఘములో ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడితే వారితో గొడవపడకు, ఓర్చుకొనుము. చూచారా?

74నీ కుటుంబంలో కలహాలున్నాయా? నీవు మౌనంగా ఉండు! ఆలయానికి వెళ్ళవద్దని నీ తల్లి నీతో కలహం పెట్టుకొంటే, నీవు ఆమెతో వాగ్వావాదము పెట్టుకొనక, తల్లిని ప్రేమించుచూ, ఆమె కొరకు ప్రార్ధి౦చు.

ఆమె నిన్ను అపార్థం చేసికొనినను నీవిలా అనాలి, "అమ్మా, ఎప్పటివలే నిన్ను ప్రేమిస్తున్నాను. నేను బ్రతికినంతకాలం నీ కోసం ప్రార్ధిస్తాను."

చూశారా, కోపము తిరిగి కోపమునే రేపును. కోపమువలన నీలోనున్న పరిశుద్ధాత్మ దుఃఖపడి బయటకు పోవును. ప్రేమవలన ప్రేమ జన్మించును. మీర్తు ప్రేమించుటవలన నా శిష్యులై యున్నట్లుగా, లోకము గుర్తించునని యేసు పలికెను. అది పరిశుద్ధాత్మ యొక్క ఫలము, ప్రేమ.

75నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవేనని ఎప్పుడైనా గ్రహించావా? నీ జీవిత క్రియలు, మాటలు, సంబాషణ ద్వారా నీవు నీ చుట్టూ చక్కని వాతావరణమును సృష్టించగలవు. కొందరు ఎప్పుడూ ఎవరో ఒకర్ని విమర్శిస్తునే వుంటారు. మరికొందరైతే చాలా అసహ్యమగు మాటలు చెప్పుకొంటూ తిరుగుతారు. అటువంటివారి వద్దకు నీవసలు వెళ్ళనేవద్దు, ఎందుకంటే అట్టివారివలన చెడ్డ వాతావరణము సృజించబడును.

నీవు వారిని చూచిన ప్రతి సారి, నీవు — వారిని తప్పించుకొనుము. ప్రతిసారి, వారు చెడును గురించి మాట్లాడుదురు, మరియు వేరొకరి గురించి మాట్లాడుదురు. చెప్పుదురు, "ఓ, మై! వారు వచ్చారు. ఎవరినో విమర్శించుదురు. అతడు ఇక్కడ ఉన్నాడు, ఇతర మన్యుష్యుని గురించి మాట్లాడబోవుచున్నాడు. వారు చేసేదంతయు, మురికి జోకులు, మరియు స్త్రీల గురించి, మరి అలాంటివి." నీవు వారితో వెళ్ళుటకు ద్వేశించుదువు. చూచారా? వారు మంచి ప్రజలే, అయితే వారొక వాతావరణమును సృష్టిస్తారు.

నీవు చేయు పనులు, నీవు ఆలోచించు ఆలోచనలు, నీ ప్రవర్తన, నీవు మాట్లాడు మాటలు, ఒక వాతావరణమును సృష్టిస్తాయి.

76ఒక పట్టణములో వున్న ఒకాయన కార్యాలయానికి నేను వెళ్ళాను. అతడు ఒక గొప్ప సంఘానికి పెద్ద లేక ట్రస్టీ. అతని ఆఫీసులోనికి నేను వెళ్ళేసరికి అశ్లీల సాహిత్యపు సంగీతం రాక్-అండ్-రోల్ బాణి వినిపిస్తోంది. అతడెంత పెద్ద వ్యక్తి అయినప్పటికిని అతని సంగతి నాకర్థమయిపోయింది. నీవేం చదువుచున్నావో, ఎటువంటి సంగీతం వింటున్నావో, ఎటువంటివారితో సహావాసం చేయుచున్నావో చూస్తే నీ సంగతి అర్థమగును.

నీ మాట చాలా గట్టిగా వినపడును. సరేగాని నీ క్రియలు మరింత బిగ్గరగా వినబడునని నీకు తెలుసా? క్రైస్తవుడవని నీవు సాక్ష్యమిచ్చుకొనవచ్చును. అయితే జీవిత ఫలాల్ని బట్టి నీవేమైయున్నావో చెప్పవచ్చును.

77రక్షించబడితినని చెప్పుకొనుచున్న వ్యక్తి నాకు దైవీక స్వస్థతలో నమ్మకంలేదు. అది పక్షులకే కాని మనుష్యులకు కాదు. అది కొన్ని సంవత్సరముల ముందుమాట గాని ఈనాటికి కాదని చెప్పాడంటే, అతని జీవితము సువార్తకు యోగ్యమైనదిగానుండదు. ఆయన పొందిన దెబ్బలవలన మనకు స్వస్థత అనుగ్రహించబడినదని సువార్త చెప్పటలేదా? నేను సంఘ పెద్దను, లేదా బిషప్పును అని నీవు చెప్పుచున్నావా? నీ పెద్దరికం, నీ బిషప్పు ఎవరికి లెక్క?

రెండు సంవత్సరాల క్రిందట బిషప్ షీన్ అనునతడు ఈ విధముగా పలికాడు, "బైబిలును నమ్మి దాని ప్రకారం జీవించాలనుకొంటున్న వ్యక్తి ఊబిలో నడవాలనుకొంటున్న బుద్దిహీనుడు లాంటివాడే." నేను పరలోకంలో యేసుని కలుసుకొన్నపుడు, నేను బిషప్ షీన్" అని చెప్పుదును, అప్పుడు యేసు నాతో, "అవును! నీ గురించి నా తల్లి చెప్పింది," అని ఆహ్వానమిచ్చును. చూడండి!

వాక్యమే సత్యము. సరి. దేవుని ఆత్మ తన స్వంత చేతి వ్రాతను కనుగొనును. ఆయన వాక్యమును బట్టి గుర్తించబడును. అది ఆయన గురించి మాట్లాడును. దానిని నమ్ముట ద్వారా నీవు గుర్తించబడుదువు, మరియు అది నీకు గుర్తింపునిచ్చును.

ఎవరితోను కలహాములు పెట్టుకొనవద్దు. కుటుంబములో కుమ్ములాడుకొనవద్దు. కోపము - కోపమును, ప్రేమ - ప్రేమను జన్మి౦పచేయును.

78మనకు మాదిరిగావున్న యేసు వైపు ఒక్కసారి చూడండి! నేను మీకు చేసినట్లుగానే మీరును ఇతరులకు చేయుడని యేసు చెప్పలేదా? ఆయనే మనకు మాదిరిగానున్నాడు.

ఇప్పుడు గమనించండి. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు గాఢమగు అవిశ్వాసములో జనులుండిరి. అయినను ఆయన తన కార్యములను మానుకొనలేదు. ఆయన నేరుగా వెళ్ళి బోధించుచూ, వ్యాధులను స్వస్థపరిచెను. ఎందరో విమర్శకులు ఆయనను దూషించిరి, అయినను ఆయనేమి తొందరపడలేదు. ఆయన శిశువుగా నుండినది మొదలుకొని సిలువ మీద మరణించువరకూ విమర్శించబడుచూనేవున్నాడు. అయినను తన పని ఆపలేదు. ఆయనకొక గురియుండెను. తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరుచుటయే ఆయన లక్ష్యము.

79యేసులో వున్న దీనత్వమును, తగ్గింపును చూడండి! ఆయన ఒక చక్కని సౌకర్యముగల గృహములో జన్మించుటకు బదులుగా, పశువులపాకలో జన్మించాడు. ఎద్దులకు కాడిమోయుటకు మెడమీద పెట్టు పొత్తి గుడ్డలలో ఆయన చుట్టబడెను. ఆయనకంటే నిరుపేద మరెవరునూ లేరు. అయిననూ ఆయన భూమ్యాకాశముల సృష్టికర్తయే.

ఒక వర్షపు చలిరాత్రిలో వారాయనను చూచి "బోధకుడా! మేమును నీ నివాస స్థలమునకు వచ్చెదమని" అడిగారు.

అందుకాయన "నక్కలకు బొరియలును, ఆకాశపక్షులకు గూళ్ళను కలవు గాని, మనుష్యకుమారుడు తల వాల్చుటకైనను స్థలములేదని చెప్పెను."

యెహోవా దేవుడే నరునిగా నిన్ను, నన్ను నడిపించుటకై పాప శరీరమును ధరించుకొని వచ్చెను, ఆయనే అంతగా తగ్గించుకొనగా నేనేపాటి వాడిని, ఆయనే మన మాదిరి.

80ఈ మధ్యాహ్నం జరిగిన చిన్న కూటములో దేవుని వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి మొదట శ్రమపడవలసియున్నదని చెప్పాను. తిరిగి జన్మించినప్పుడు నేనెన్ని శ్రమలు అనుభవించానో వివరించాను. ఒకడు తిరిగి జన్మిచినప్పుడు దేవుడు అతనిలో వ్రేలిగోటంత పరిమాణములో ఒక విధానమును గుచ్చును. అది అతని హృదయంలో పడి అక్కడ లంగరు వేయబడి వుండును. తదుపరి సాతాను శోధించుట ద్వారా అతడు ఋజువు చేయబడును. ఒక వేళ అదే లేనట్లైతే అతని పని అయిపోయినట్లే మరి.

నేను 23 ఏడ్ల ప్రాయంలో ఉన్నప్పుడు వైద్యశాలలో నుండిన సంగతి గుర్తుకొస్తుంది. ఆ సమయంలో నా తండ్రి గుండెపోటుతో మరణించు స్థితిలో నా చేతులలో వుండెను. నేనాయన గూర్చి ప్రార్ధి౦చుచుండగానే ఆయన నావైపు చూచి కళ్ళు మూసెను. దేవుని కలుసుకొన వెళ్ళిపొయెను. నేనాయనను తీసికొని వెళ్ళి, నా సోదరుని సమాధి ప్రక్కనే ఉంచాను. నా తండ్రి సమాదిపైనున్న పూవులు వాడబారకముందే, నేను మరల "దేవుడు రోగులన స్వస్థపరచునను" బోధను ప్రారంభించాను. అప్పుడు నా కుమారుడు బిల్లీ 18 నెలలు ప్రాయంలో నుండెను. నేను నా భార్య హోప్ కలసి మా జీవనోపాది నిమిత్తం వేర్వేరు కంపెనీలలో పనిచేశాం.

అదిగో సిస్టర్ విల్సన్ తన తలను ఊపుటను నేను చూస్తున్నాను. ఆమెకి ఈ విషయాలు బాగా తెలుసు. అలాగే రాయ్ స్లాటర్ మరియు ఆరంభం నుండి ఇక్కడికి వచ్చుచున్న విశ్వాసులకు ఈ సంగంతులు జ్ఞాపకముండియే ఉండును.

81నా చేతులలో ఒక చిన్న శాండ్విచ్ (మాంసంతో వుండె రొట్టె) పట్టుకొని వీదిలో స్తంబాలెక్కి పని చేసికొనినను అవకాశం వస్తే దిగి వచ్చి వారికి యేసు ప్రేమను గూర్చి సాక్షమిస్తుండేవాడిని. వారి షెడ్లలో పనిచేసే వారియొద్దకు వెళ్ళి, వారి అనుమతితో వారికి రక్షణను గూర్చి మాట్లాడుచుండేవాడిని. రాత్రుల యందు కూరగాయలు కొట్టుకు వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. రాత్రంతా రోగుల కొరకు ప్రార్ధించి, ఎప్పుడో తెల్లవారుజామున ఇంటికి చేరుకొని, తర్వాత మళ్ళీ పెందలకడనే లేచి, చక చక పని దుస్తులు వేసికొని పరుగెత్తేవాడిని. సేవలో నేను బలపడుట కొరకు ఉపవాస ప్రార్థనలు చేసి చేసి చాలా సన్నబడ్డాను. దేవుడు గొప్పవాడని, దేవుడు కృపగలవాడని, దేవుడు ప్రేమ స్వరూపియని జనులకు ఎల్లప్పుడు ప్రకటించుచుండేవాడిని.

మరిక్కడ నా తండ్రి నా చేతుల్లోనే ప్రాణం విడిచెను. నా తమ్ముడు ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయమందు నేను ఒక నల్లజాతీయుల పెంతెకోస్తు సంఘములో వేదిక మీద బోధించుచుండగా, ఎవరో వచ్చి నాతో చెప్పారు, "నీ తమ్ముడు ప్రధాన మార్గపు రోడ్డు మీద చనిపోయాడు. ఒక కారు అతనిని గుద్దినది." అతనిని పాతిపెట్టిన తరువాత మా నాన్న ఎంతో కృంగిపోయి ఆవేదనతోనే ఆయన కూడా చనిపోయెను. నా బార్య సమాది ప్రక్కనే మా నాన్నను సమాది చేసాం.

82ఆ తరువాత నేను ఈ టాబర్నికల్ కి వచ్చి ఈ వేదికపైనుండి ఒక పెద్ద వరద రాబోవుతున్నదని ఆరు నెలలకు ముందే చెప్పాను. స్ప్రింగ్ వీదిలో ఒక దూత నిలబడి కర్రతో 22 అడుగుల లోతు నీటిని కొలుచుట నేను దర్శనంలో చూచాను.

శాండీ డేవిస్ మొదలగువారు ఇక్కడకూర్చోని నేను చెప్పినదానికి పగలబడినవ్వారు. "అబ్బాయి, 1884లో వచ్చిన పెద్దవరదకే 10 అడుగుల ఎత్తు కంటే నీరు ఎక్కువ రాలేదు కదా, ఇప్పుడు నీతో ఈ మాట చెప్పినదెవరు?" అని నన్ను ప్రశ్నించారు.

అది దేవుడు చెప్పాడు కాబట్టి జరిగి తీరునని జవాబిచ్చాను. వరదలోచ్చాయి ఆ విధంగానే స్ప్రింగ్ వీదిలో 22 అడుగుల లోతు నీరు వచ్చినది. ఈ టాబర్నికల్ మీదనుండే నేనొక చిన్న దోనెలో ఈదుకొని వెళ్ళాను. ఆ సమయంలోనే నా భార్యకు జబ్బుచేసింది. ఆమె కొరకు ప్రార్ధి౦చుట కొరకు టాబర్నికల్ కు వచ్చాను. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేను వారిలో నా భార్య చనిపోవునని చెప్పాను. వద్దు! ఆ విధముగా నీ భార్యను గురించి మాట్లాడవద్దని వారించారు. అవును! ఆమె నిశ్చయముగా మరణించునని పలికాను. నేనామెకొరకు వెళ్ళి చాలా సేపు ప్రార్ధి౦చాను, చేతులు పైకెత్తి దేవునికి మొర్ర పెట్టాను. ఆమె నా చేయి పట్టుకొని చివరిగా ఈ మాటలు పలికింది.

"ఏమండి మిమ్ములను ఒక ఉదయాన నేను ఆవలి గట్టున కలుసుకొంటాను. పిల్లల్ని భక్తిలో పెంచండి! ఆ గుమ్మము యొద్ద నిలబడి యుంటాను. మీరు నన్నక్కడ కలుసుకొండి!"

నేను బావురమని ఏడ్వనారంబించాను, నేను ఆవలి గట్టున మీ కోసం చూస్తుంటాను అని చెప్పి ఆమె కన్ను మూసింది. నేనామెను సమాధి చేయుటకై ఇంటికి తీసికొని వెళ్ళాను.

ఆ సమయంలో బిల్లీపాల్ చాలా అస్వస్థలో వున్నాడు. మా అత్త బ్రాయ్ వాడ్ని ఎత్తుకొన్నది. వాడు ఏదో ఒక క్షణంలో చనిపోవునని వైద్యులు చెప్పారు. నేను బిల్లీ కొరకు ప్రార్ధిస్తున్న సమయంలో బ్రదర్ ఫ్రాంక్ నా వద్దకు వచ్చి నీ కుమార్తె చనిపోతుందని చెప్పాడు.

83నేను ఆసుపత్రిలోనికి వెళ్ళాను. డాక్టర్ అడియార్ నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. నా కుమార్తె మెనింజైటిస్ వ్యాధితో బాధపడుతోందని తెలియచేశాడు. నర్పు నాకు ఏదో ఒక విధమగు మత్తుమందు ఇచ్చింది. అయినా నాకు నెమ్మదిలేదు.

నేను వారినందరిని త్రోసుకొని ముందుకు వెళ్ళి, ఒంటరిగా పరుండియున్న నా కుమార్తె గదిని చూచాను. ఆ పిల్ల కండ్ల నిండా ఈగలు ముసురుకొని ఉన్నవి. నేనా ఈగల్ని, దోమల్ని బయటకు తోలి చిన్న దోమ తెరను ఆ బిడ్డపై వేసి, మోకరించి, "దేవా! నా సోదరుడు నా తండ్రి సమాదులపై పెట్టిన పూలు ఇంకా వాడలేదు. ఇంతలోనే నా కుమార్తెను కూడా తీసికొందువా? ప్రభువా, ఈమెను తీసికొనవద్దు" అని ప్రార్ధి౦చాను. ఆయన నా కళ్ళకడ్డంగా ఒక తెరను దించెను.

నీ మొర్రను నేను విననని చెప్పటం నాకు వినబడింది. ఆ సమయంలో ఆయన నాతో మాట్లాడినట్టు లేదు. ఆయన నాతో మాట్లాడనిచో, ఆ సమయం సాతానుదని నేననుకొన్నాను.

ఆ సమయంలోనే సాతాను నాతో, "నీ దేవుడు మంచివాడని తెగ చెప్తున్నావుగా! చూడు నీవెంత శ్రమపడుతున్నావో! నీ తోటివారందరూ ఈ పట్టణంలో నీ గూర్చి ఏం చెప్పుకొంటున్నారో విన్నావా? నీకు మతిపోయిందని వారనుకొనుట నిజమే. నీ దేవుడు నీ పట్ల అసలు శ్రద్దవహించుట లేదు" అని చెప్పాడు. దేవుడు అనువాడు లేడని మాత్రం వాడు నాకు చెప్పజాలడు, ఎందుకంటే నేను ఆ దేవున్ని కళ్ళారా చూచాను. అయితే ఆ దేవుడు నా పట్ల శ్రద్ద కలిగిలేడనే చెప్పుటకు వాడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

84దివారాత్రులు నేను దేవునితో పోరాడాను, "దేవా! నేనేమి పాపము చేశానో నాకు తెలియచేయుము! నన్ను బట్టి నా అమాయకపు బిడ్డలను ప్రయాసపడనివ్వకుము అని ప్రార్ధి౦చాను. ఆయన నన్ను పరీక్షించుచున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. దేవుని వద్దకు వచ్చు ప్రతివాడు పరిశోధింపబడును. దివారాత్రులు ఆయన కొరకే నేను నా జీవితాన్ని ధారపోస్తున్నాను గదా అనుకొన్నాను, మరి నేనేం పొరపాటు చేశాను?" అని నాలో నేను పదే పదే ప్రశ్నించుకొన్నాను.

అప్పుడు సాతాను నాతో "అవును! నీ దేవుడు గొప్ప స్వస్థపరచువాడని నీవు అందరికి చెప్తున్నావు గదా! అయితే అంత గొప్ప దేవుడు నీ కూతురి మరణశయ్యపై పడియుండిననూ, నీ ప్రార్థనను వినలేదు కదా? నీ భార్య క్షయ (న్యుమోనియా)తో మరణించినది. నీవేమో జనులకు ఆయన క్యాన్సరు కూడా బాగుచేయగలడని ఎంతో మేలుచేసే దేవుడని బోధిస్తున్నావు కదా? నీ కాయన ఒక్క మాట కూడా చెప్పడంలేదు. నీ కుమార్తెనాయన బ్రతికించుటలేదు. నీవైతే ఆయన కొరకు ఎంతో పాటుపడుచున్నావు, కానీ ఆయనేమో నీ యెడల కొద్దిగైనను శ్రద్దకలిగిలేడు" అని నా మదిలో ఊదాడు.

ఆ సమయంలో వాడు చెప్పిన దానిని నేను విననారంభించాను. "అవును ఏమిటి? చూచారా? వాడన్నాడు, "ఆయన నీతో మాట్లాడగలడు, కానీ ఇన్ని జరిగినా ఒక్క మాట కూడా ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడలేదు. నీ బిడ్డను ఆయన బ్రతికించగలడు, అయినా ఏ మాత్రం పట్టి పట్టనట్లుగా వున్నాడు."

అందుకు నేను అవును "అది నిజం" అని అన్నాను. వాడింకా ఇలా అంటున్నాడు, "ఆయన కోసం నీవు ఎంతో చేసావు, కానీ నీ కోసం ఆయన ఏమి చేయలేదు. పైగా దెబ్బ మీద దెబ్బ నిన్ను కొట్టుచున్నాడు."

"అవును" అన్నట్టు తలంచాను. హేతువులు చూపుట వలన నేను దేవున్ని నిందిస్తానేమోనని వాడు నా మీద దాడి చేసాడు, కానీ నేను లొంగలేదు. కారణాలన్నిటిని ప్రక్కనపెట్టి, నిత్యజీవమును గూర్చి నూతన జన్మను గూర్చి తలంచనారంభించాను.

వెంటనే నాలో సందేహపు మేఘములన్ని తొలగిపోయినవి. ఒకవేళ నేను ఆ రోజున సాతాను ఆలోచనలకు లొంగినట్లైతే, నేడు ఈ జీవితము ఈ సంఘము ఈ ప్రపంచ వ్యాప్త పరిచర్య ఇలా వుండేది కాదేమో, దేవునికే స్తోత్రం, ఆయన నన్ను తన స్వాదీనమందుంచుకొనెను.

85దేవున్ని ఎదిరించి ప్రశ్నించుటకు నేనేపాటివాడిని! ఈ భూలోకములో నన్ను సృష్టించి జీవమిచ్చినవాడాయనే. ఆ కుమార్తెను నాకెవరిచ్చారు? ఆయన కొంతకాలం నాకా బిడ్డను అరువుగా ఇచ్చాడు. మరలా ఆయనే తీసికొన్నాడు. సాతానా! నా వద్ద నుండి పో!" అన్నాను. "ఓ, నా చిన్న బిడ్డా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ పరలోకపు తండ్రి చేతుల్లోకి, నీ తల్లీ కౌగిలిలోనికి నీ ఆత్మను దేవదూతలు తీసికొని వెళ్ళుదురు. ఒక ఉదయకాలానా నిన్ను నేను మరలా చూస్తాను.

దేవా! నీవే నాకాబిడ్డను ఇచ్చావు, నీవే మరల తీసికొనుచున్నావు. నీవు నన్ను చంపినా నిన్నే నే నమ్ముదునని యోబువలె దృడంగా చెప్పుచున్నాను. నీవు నన్ను నరకానికి పంపినా, నిన్నే నే ప్రేమింతును. నిన్ను నేను ఎన్నడు విడిచిపోను."

నా మనస్సులో కలిగిన సందేహాలు తొలగిపొయినవి. మరి నీవు కూడా ఇలా చెప్పాలంటే, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధముండాలి. తిరిగి జన్మించాలి.

86తిరిగి జన్మించని కారణమున నేడు అనేక మంది దేవుని సేవకులే దైవీక స్వస్థత లేదని, అలాంటి వాటిని తాము నమ్మమని అంటున్నారు. వారెన్నడు ఆ పరిశుద్ద స్థలములో వుండలేదు. గనుకనే దాని గురించి వారికేమియు తెలియదు, అని ఈ ఉదయకాలమున నేను చెప్పాను. గనుక దేవుని వాక్యమును వారు తృణీకరించుచు, తమ్మును తాము దేవుని పిల్లలమని ఎలా చెప్పుకోగలరు? ఏ పరిశుద్ధాత్మ అయితే నిన్ను కొనియున్నాడో ఆయనే లేడని నీవు ఎలా అనగలవు?

యేసు నీ కొరకు మరణపర్యాంతము వరకు తన్నుతాను తగ్గించుకొనెనని గుర్తు౦చుకొనుము. ఆయన ఎన్నడు రాద్దాంతం చేయలేదు. ఆయనపై ఉమ్మివేసిన వారిమీద తిరిగి ఆయన ఉమ్మివేయలేదు. తన గడ్డం పీకినవారి పట్ల ఆయన ఎన్నడు కోపము చూపించలేదు. తన చెంప మీద కొట్టినవారి చెంప మీద ఆయనెన్నడూ తిరిగి కొట్టలేదు. వారందరి కొరకు ఆయన ప్రార్ధి౦చాడు. అణుకువతో నడిచిపొయాడు. దీనత్వమునకు తగ్గింపునకు ఆయనే మన మాదిరి.

ఆయన విశ్వాసము అచంచలమైనది. ఆయన పలికిన మాటలు నిరార్ధకము కావని ఆయనెరుగును. ఆయన పూర్తిగా వాక్యమును బట్టే జీవించాడు.

దేవా! నీవలె నేనును జీవించునట్లుగా చేయమని ఈ సభావేదిక మీదనుండి నా చేతులెత్తుచున్నాను. అలా నన్ను జీవింపచేయుము. ఈ వాక్యము నేను ఒక్కటేనని ఋజువు చేయుము. నీ ఆజ్ఞలు, నీ జ్ఞానము నా హృదయ కవాటములకు అంటుకొననిమ్ము! శోధనలలో నిన్ను చూడనిమ్ము! ప్రతికూల పరిస్థితులలో నిన్ను చూడనిమ్ము! శత్రువు నా మీద పడి రేపునప్పుడు, యేసూ నీ ముఖమునే నన్ను చూడనిమ్ము.

87ఆయన విడువక వాక్యమందే వున్నాడు, ఆయన మరియు వాక్యము పూర్తిగా ఒక్కటే. వాక్యము ఆయన ఒక్కటే.

ఆయన ఆజ్ఞయే లోకమును జయించును. ఆయన ఎవరితోను వాదన పెట్టుకొనపనిలేదు. తాను మరియు వాక్యము ఒకటేనని ఆయనకు తెలుసు.

దయ్యము నాతో ఇలా అన్నాడు, "నీవిప్పుడు అద్భుతములు చేయగలవు, ఎందుకంటే నీకిప్పుడు చాలా గొప్ప విశ్వాసం ఉంది. నీవు అద్భుతములను చెయ్యగలవు. ఓరల్ రాబర్ట్స్ కట్టిన బిల్డింగ్ కంటే రెండింతల పెద్దది నీ కొరకు నేను కట్టెదను, ఎందుకనగా ప్రజలు… నీవు చేయవలసినదంతా దానిని (విశ్వాసాన్ని) బయటికి చూపించాలి. ఈ బిల్డింగ్ మీద నుండి క్రిందకి దుముకు, ఎందుకంటే వాక్యమిలా వ్రాయబడియున్నది. ఇక్కడ నుండి క్రిందికి దూకితే, "నీ పాదములు రాయికి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకొందురని" వాడు అన్నాడు. చూశారా?

యేసు తనయందున్న శక్తిని తాను ఎరిగియుండెను. దానిని తాను చేయగలడని తాను ఎరిగియుండెను. దేవుని శక్తి తనయందువున్నదని ఆయన ఎరిగియుండెను, కానీ తండ్రి చెప్పేవరకు తానేమి చేయలేదు. దేవుడు తన యందు వాక్యముగా వుండునట్లు ఆయన కోరుకొనెను. కనుక ఆయన దేనిని పలికినా అది దేవుని వాక్యమైవుండెను. భూమ్యాకాశములు గతించిపోవచ్చును, గానీ ఒక దినాన ఆయన వాక్యము ఈ లోకాన్ని జయించును.

88ఏ సందర్భములోను గడబిడపడలేదు, వాక్యాన్ని మాత్రమే పలికాడు. ఆయన పెదవులపై నుండి వచ్చిన ప్రతి మాట కూడా అభిషేకించబడినదే.

ఆ మాటనే మనం చెప్పుట ఎంత గొప్ప సంగతి? నా మాట ఆయన మాట ఒక్కటే. నేను చెప్పిన దానిని ఆయన గౌరవించును, ఎందుకనగా ఆయన ముందు నాతో చెప్తేనేగాని నేనేమియు పలుకను. అది సువార్తకు యోగ్యమైన జీవితం.

విద్యాజ్ఞానంతో ప్రసంగాలు చేసే బోధకులు, పొడవైన ప్రార్థనలు చేసే పాస్టర్లు, విధవరాళ్ళు గృహాలను దోచుకొంటూ, సమాజంలో ఉన్నత స్థానాలను అలంకరించాలని కోరుతూ సువార్తకు తగిన జీవితాలను జీవించలేకపోవుచున్నారు.

"ఈయన నా ప్రియ కుమారుడు, నేనతనియందు ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. ఆయనే నా వాక్యము. ఆయన నేను ఒక్కటే." ఆయన నిన్ను గూర్చి ఈలాగు చెప్పినప్పుడే నీ జీవితం సువార్తకు తగినట్లుగాయున్నదని ఋజువు.

89ఇప్పుడు దీనిని గమనించుడి, తెలిసికొనుడి. కడకు ఈ లోకాన్ని తన వాక్యమే గెలుచునని ఆయనకు తెలుసు. ఆ మాట ఎక్కడి నుండి వచ్చెనో ఆయనకు తెలుసు. అది ఎన్నటెన్నటికి తప్పిపోదని ఆయనకు తెలుసు. కారణం ఆయనన్నాడు, "భూమ్యాకాశములు గతించిపోవును, కానీ నా మాటలెన్నడు తప్పిపోవు." వాక్యము ఏలాగు వున్నదో ఆయన కూడా అలానే వున్నాడు. గనుకే ఆయనన్నాడు…

"మీరు వాక్యాన్ని చేయండి."

"నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా?" అని ఆయన అడిగాడు. అవిశ్వాసమే పాపము. దేవుని వ్రేలితో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. మరి మీ కుమారులు ఎవనివలన వెళ్ళగొట్టుచున్నారు? వారు చేసే విధానం ఆయన విధానం కాదు.

వారు ఇలా అంటారు, "మంచిది మేము కూడా దయ్యాలు వెళ్ళగొట్టుచున్నాము."

అయితే తేడా ఏమిటో మీరే గమనించండి. ఆయనన్నాడు, "నేను దేవుని వ్రేలితో చేయుచున్నాను. అది నిరూపించబడిన దేవుని వాక్యము. మరి మీ కుమారులు దేని ద్వారా వెళ్ళగొట్టుచున్నారు. దానికి మీరే తీర్పరులు."

ఆయన దినాల్లో జీవించిన జనులు ఎన్నో విధాలుగా ఆయనను తగ్గించి హేళన చేశారు. ఎన్నో దురాలోచనలు ఆయనకు వ్యతిరేకంగా చేశారు. అయినను ఆయన తలదించుకొని వెళ్ళాడు.

దీనిని చెప్పి, కొద్దిసేపట్లో నేను ముగించగోరుచున్నాను.

90ఈనాటి జనులు బహు బలహీనులు. ఈనాటి జనులు బహు ఉద్రేకపరులు. దేవుని వాగ్దానమును తీసుకొనుటకు వారు భయపడుచున్నారు. ఈ దినమునకు ఇవ్వబడిన దేవుని వాక్యమును స్వీకరించుటకు సంఘస్తులు, సంఘ సంస్థలు, శాఖలు బీతిల్లుచున్నవని. వారు గుర్తించారు. ఈ ఆధునిక పరిస్థితులు, వారిప్పుడు ప్రకటించుచున్న రాజీ సువార్త (మిళితిమైన బోధ) ఈ ఘడియ వర్తమానము ముందు నిలబడలేవని వారు గుర్తించారు. సంసోనువలే వారు అన్నిటికి లోబడిపోతున్నారు.

అయితే దేవుడు మాత్రం తన కార్యమక్రమమును జరిగించుట మానలేదు. ఆయన దానిని వాగ్దానం చేశాడు. ఒక నిమిషంలో దానిని మీకు చూపెదను.

ఆ మాటను కొద్దిసేపటి వరకు ఎత్తిపట్టగోరుచున్నాను. క్రైస్తవులమని చెప్పుకొంటూ వారు వాక్యానికి బదులుగా మానవ-కల్పిత సిద్దాంతాల్ని పట్టుకొని వ్రేలాడుచున్నారు. గనుక మనిషి కల్పించిన సిధాంతమునకే మొగ్గుచూపుతారు. మేము దేవున్ని ప్రేమిస్తున్నాము, అని చెబుతారు, కానీ ఆ దేవుని యొక్క వాక్యము న౦దు విశ్వాసముంచుటకు భయపడతారు. అవునండీ. ఆ జీవితము సువార్తకు యోగ్యమైనదేనని నీవనవచ్చు. కానేకాదండి, వారు సంఘసభ్యులైనప్పటికి నిశ్చయముగా సువార్తకు యోగ్యమైనవారు కారు.

91సువార్త! "సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడునని" యేసు సెలవిచ్చెను.

అద్భుతాలు జరగవని నీవెట్లు చెప్పగలవు? నీవు పది ఆజ్ఞలు అనుసరిస్తూవుండవచ్చు. ఏ చెడ్డ మాటలను నీవు మాట్లాడకపోవచ్చు. అయినను నీవు దేవుని వాగ్దానమును నమ్ముటలేదు. కాబట్టి నీవు సువార్తకు అయోగ్యుడవే. చూశారా? అది కుదరదు.

ఆ యాజకులు వాక్యానికి బదులు సిద్దాంతాలను ఎత్తిపట్టుకొన్నారు. అది సువార్తకు యోగ్యమైనది కాదు. ఆయనన్నాడు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబందులు." వారు వాక్యాన్ని చేయరు. వాక్యాన్ని చేసినవారిని రాళ్ళతో కనికరము లేకుండా కొట్టి చంపుతారు. ప్రజల దృష్టిలో వారు పరిశుద్దులు. యేసు అన్నాడు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబందులు."

వారు క్రైస్తవలని పిలిపించుకొన్నప్పటికి, సిద్దాంతాలనే ఆచారాలనే జరిగించుట వారికిష్టం. ఓ, శాఖ సిద్దాంతాలు ఆధునిక మానవుని తలంపులకు తగినట్లుగా తయారు చేయబడినవి. పరిచర్యలో ఒకడు రాణించాలంటే, అతడు వారికి అనుగుణముగానే వెళ్ళి తీరాలి. అవును. అది వాస్తవం. చూశారా? నీవు విజయవంతమైనవానిగా ఉండాలంటే, నీవు ఈ దినపు ఆధునిక ఆలోచనలతో ఉండాలి. మృదువుగా (సున్నితంగా) మాట్లాడితే చాలు, "అతడు చాలా బాగా చెప్పాడు. అద్భుతంగా మాట్లాడాడు. పదిహేను నిమిషములకంటే మించి చెప్పడు. మన బోధకుడు ఎక్కువసేపు మనలను వుంచడు." అంటూ పొగుడుతారు.

అయితే అటువంటి పాస్టరు నిశ్చయముగా సిగ్గుపడాలి. వేదిక మీద నిలచి ఆ దినపు పాపాన్ని ఖడించని బోధకుడెవరైనా వున్నారంటే, అతనిలో ఏదో తేడా వున్నదనే సంగతిని మనం గమనించాలి. అట్టివాడు సువార్తను బోధించుటకు యోగ్యమైనవారు కాదు. అది వాస్తవం. ఆలాగు చేయుట ద్వారా "ఇప్పుడు, నా సమాజమును చూడు," అని వారికి వారే నెపములు చెప్పుకొంటారు.

92ఒకసారి ఒక గొప్ప సంఘనికి చెందిన వ్యక్తి నా యొద్దకు వచ్చి నేను బోధించుచున్న దైవీక స్వస్తతను గూర్చి మెచ్చుకొంటూ, తాను కూడా ఒక పరిశోధనా వ్యాసాన్ని దైవీక స్వస్థత మీద వ్రాస్తున్నట్లు చెప్పి, పెంతెకోస్తులోని కొందరితో నేను నా సహవాసాన్ని తెగతెంపులు చేసుకొన్నట్లైతే, వారి శాఖలో నన్ను చేర్చుకొందురని సలహా ఇచ్చాడు. పెంతెకోస్తువారితో సహవాసం చేయటమే నాలోవున్న పొరపాటని చెప్పాడు. అతని సంస్థ ప్రపంచంలోనే చాలా గొప్పది. అ వ్యక్తి ఇప్పుడు జఫర్సన్ విల్ లో ఉన్నాడు.

"సరే, నేను వారందరినీ వదిలి నీ సంస్థలోనికి వస్తాను గానీ నా బోధలో మాత్రం ఏ మార్పు వుండదు. దానికి ఒప్పుకొంటావా," అని అతనిని అడిగాను.

అందుకు అతడు, "అయ్యో, ఆ విధముగా బోధిస్తే చాలా కష్టం, నా శాఖ దానిని ఒప్పుకొనదని," చెప్పాడు.

ఈ నెపము (సాకు) ఎద్దు కొనుట, వివాహాము చేసికొనుట, అను నెపముల వంటిదే. ఎన్నో డిగ్రీలు నీకుండొచ్చును, ఎంతో పెద్ద శాఖకు నీవు అధిపతివి కావచ్చును గానీ, నీ సేవ మాత్రము నిశ్చయముగా ఈ గ్రంధములో వ్రాయబడిన సువార్తకు యోగ్యమైనది కాదు, అని నేను చెప్పుచున్నాను.

93క్రైస్తవులమని చెప్పుకొంటూ స్త్రీలు జుట్టు కత్తిరించుకొని, వేయకూడని దుస్తులు వేసుకొంటూ, తిరుగుచున్నారు. భక్తిగలవారమని చెప్పుకొంటూ పురుషులు సారాయి త్రాగుచూ, సిగరెట్లు కాల్చుచూ, అనేక వివాహాలు చేసికొంటూ, సంఘాల్లో పెద్దలుగాను, పాస్టర్లుగాను చలామణి అవుచున్నారు. ఇట్టి విధమైన జీవితములు సువార్తకు యోగ్యమైనవి కానే కాదు.

ఫోన్లలలో వదరబోతు మాటలు పలికే స్త్రీలు, సంఘములోకి వచ్చి విద్వేషాలు మాట్లాడుచున్నారు. అట్టివారు సువార్తకు యోగ్యమైనవారు కారు. సంఘాన్ని చీల్చి ప్రజల మధ్య విభేదాలు పుట్టించే వారు ఎవరైనా సరే, సువార్త జీవితమునకు ఎంతమాత్రం యోగ్యులు కారు. పైకి భక్తిగలవారమని చెప్పుకొనుచు, దాని శక్తిని ఆశ్రయించనివారున్నారు. అట్టివారిలో నీవుండకుండా దేవుని శక్తి నిన్ను కాచును.

94గమనించండి, ఇప్పుడు దానిని వారు చేయరు. వారు దానిని చేయరు. వారికి నెపములున్నవి. వారి సంఘం వాటిని నమ్మదు.

అయితే యేసు ఈ రాత్రి ఒకని హృదయముతో మాట్లాడుచున్నాడు. ఆయన "నీవు వెళ్ళి సంపూర్ణ సువార్తను బోధించుము."

"ప్రభువా, నా సంఘము దీని పక్షాన నిలబడదు. గనుక నీ చిత్తమైతే నన్ను క్షమించు. ఈ పట్టణములో వున్న పెద్ద సంఘాలలో ఒక దానికి నేను పాస్టర్ని. నిశ్చయముగా మేము నీ నామమును స్తుతించుచున్నాము. అవునయ్యా. కానీ నీవు చెప్పిన సంపూర్ణ వాక్యాన్ని మాత్రం మేము చేయలేము." ఆ యవ్వన ధనంతుడు చెప్పినది కూడా సరిగ్గా అదే నెపము. అదే కార్యము. గనుక వారు ఆయన వాగ్దానము చేసిన ఆత్మీయ విందుకు అనగా ఋజువు చేయబడిన వాక్యము నొద్దకు రాలేకున్నారు.

పీనుగున్న చోట గ్రద్దలు పోగవునని యేసు చెప్పలేదా? చచ్చినదాన్ని గ్రద్దలు పీక్కుని తినును. అయితే పక్షిరాజు మాత్రం సజీవాహారాన్నే తినును. ఆ సజీవ ఆహారమే ఈ వాక్యం. ఎక్కడైతే వాక్యాహారముండునో, అక్కడికే పక్షిరాజులు కూడివచ్చును.

ఆహ్వానించబడిన ఆత్మీయవిందుకు వారు రాలేకపోవుచున్నారు. ఈ దేశానికి దేవుడెన్నో సంవత్సారాల నుండి ఆహ్వానమిస్తున్నాడు. 15 ఏళ్ళనుండి ఎన్నో ఉజ్జీవాలను రప్పిస్తున్నాడు, కానీ వీరు నిరాకరిస్తున్నారు. ఈ ఆత్మీయ విందును నిరాకరించిన వీరు క్రైస్తవులమని చెప్పుకొనుటకు యోగ్యులుకారని సువార్త చెప్పుచున్నది. [సమాజము "ఆమెన్" అనుచున్నది.]

95కొద్దికాలం క్రితం ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి టేబుల్ వద్ద కూర్చోని ఇలా అన్నాడు, "బ్రదర్ బ్రెన్హా౦ నేను ఈ టేబుల్ దాటి నీ యొద్దకు వచ్చి, నీ చేతిని పట్టుకొనగోరుచున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను." అతడు ప్రముఖమైన వ్యక్తి. అతని చర్చిలో నేనొకసారి అతని ప్రసంగాన్ని విన్నాను. అతడు నాతో ఇలా అన్నాడు, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవొక దైవసేవకుడవని నేను నమ్ముచున్నాను."

అందుకునేనన్నాను, "ధన్యవాదములు డాక్టర్ నేను కూడా నిన్ను ప్రేమించుచున్నాను."

అతడన్నాడు, "ఒక సహోదరునిగా నేనెంతో ఎక్కుగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో ఇక్కడ కూర్చోన్న నా భార్యా నీకు గుర్తున్నదా?"

"అవును" నాకు గుర్తున్నది అన్నాను.

"రొమ్ము కేన్సర్ వలన ఆమె రొమ్ము కేన్సర్ వల్ల చనిపోబోతున్నప్పుడు నీవు మా పట్టణానికి వచ్చి ఆమె కొరకు ప్రార్ధి౦చావు. అక్కడే ఒక దర్శనాన్ని చూచి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" నిశ్చయముగా ఆమె బాగుపడును అని చెప్పావు. నిశ్చయముగా ఆమె అలాగనే స్వస్థపడి సజీవరాలుగా మన మధ్య వుండెను. నా భార్య కొరకు విశ్వాససహితమగు ప్రార్ధన సలిపిన నిన్ను ప్రేమించుట కంటే మరేమి చేయగలను? మరలాగే నీవు నన్ను చూచి జరగబోయేదానిని నీవు చెప్పితివి గనుక నిన్ను ప్రభువు దాసునిగా ఎలా నమ్మకుండా వుండగలను. నీవంటే నాకు ఎనలేని అభిమానం. బ్రదర్ బ్రెన్హా౦ నీ కొరకు నేనొక వార్తను తీసికొనవచ్చితిని. నేను గొప్ప పెంతెకోస్తు సమైఖ్యకు చెందినవాడనని నీవెరుగుదువు.

"అవును అది నాకు తెలుసని" అన్నాను.

అప్పుడతడు ఈ మధ్యనే మా సంస్థ సహోదరులతో నేను మాట్లాడాను. వారి తరుపున నేను నీ యొద్దకు వచ్చితిని. దేవుడిచ్చిన ఈ గొప్ప సేవను నీవు అనామకుల మధ్య వుంచటం అనేది సిగ్గుకరమని వారన్నారు."

"అది నిజము," అని అన్నాను.

అందుకు నేను, "అవును. పెద్దవారిని, పేరు ప్రఖ్యాతి గలవారిని సిగ్గుపరచుటకై దేవుడు ఆ సేవను అక్కడ వుంచెనని," అన్నాను.

96అతడు నాతో మాట్లాడుచున్న ఆ సమయంలో అతడు కాదు గాని అపవాదియే నాతో మాట్లాడుచుండెనని నాకు తెలిసిపోయింది. ఇక్కడ నుండి దూకితే నీకు ఎంతో గొప్ప పేరును సంపదను ఇస్తానని వాడు మాట్లాడుచుండెను.

ఆవుకు పొడవైనా తాడు కట్టావంటే దానంతట అదే ఉరి పోసుకొని చచ్చునను సామెతను నా తల్లి తరచుగా చెప్తుండేది. అదే నాకు ఇతని సంబాషణలో గుర్తుకొచ్చింది. ఓరల్ రాబర్ట్ ను నాకు చూపిస్తున్నాడు. ఆయన సేవలో వందోవంతు కూడా నీకు లేదని చెప్పాడు.

"అవును! అది వాస్తవమే" అన్నాను.

అయితే మా సంస్థ నిన్ను తీసికొనును. నిన్ను మా సోదరునిగా బావించి చేర్చుకొంటాం. మా సహవాసం మొత్తం నీకు కుడిభుజంగా ఉంటుంది. మా ప్రణాళికలను మీకు వ్రాసిస్తాం. వారానికి ఐదువందల డాలర్లు నీకు జీతంగా ఇస్తాం. నీకొక విమానం ఇచ్చి దేశంలోని ప్రతి పెద్ద పట్టణానికి పంపిస్తాం. గొప్ప గొప్ప వారికి నీ సేవను చూపించుకొనే అవకాశమిది. నీతో పాటు నా భార్యను రుజువుగా తీసికొని వస్తాను. నీ మాటలు యదార్థమని అనేకులతో వ్యక్తిగతంగా సాక్ష్యమిప్పిస్తాం. ఇప్పటి వరకు నీవు అందరిని తప్పు చేస్తున్నారని బోధించుచున్నావు కదా? ఈ సారినుండి అంత కఠినముగా కాకుండా కాస్త మృదువుగా వుండే ప్రసంగాలు చేయాల్సివుంటుంది మరి," అన్నాడు. ఈ సంబాషణంతా అరిజోనాలోని ఫినిక్స్ లో ఒక బల్లముందు కూర్చున్నప్పుడు జరిగింది.

97"మీరు చెప్పినదంతా చాలా బాగుందయ్య" అన్నాను.

ఇప్పుడు, చూచారా, అలంటి వ్యక్తి, అతడికి లోక డిగ్రీలు అన్ని వున్నాయి, పుస్తక రచయిత, మంచి వ్యక్తి. అయితే అతడికి లేఖనం తెలియదు.

నీకు తెలుసా, అలాంటి క్రియలు చేసిన దూత ఎన్నడూ సోదోమకు వెళ్ళలేదు. అతడు పిలువబడిన అబ్రహాము గుంపుతోనే ఉండెను.

అతడికి అది తెలియదు. నేను అతడిని వంటరిగా వదిలేసాను. అక్కడ పొరపాటు ఏమిటో నేను చూడాలని నేను అనుకొన్నాను. "మంచిది, నేను ఏమి చేయుదును?" అని అనుకొన్నాను.

అయితే అతడు నీ బోధనంతా మామూలుగా జరిపించుకో గాని కొన్ని విషయాల్లో మాత్రమే మేం నీకు సలహా ఇస్తాం, అన్నాడు.

"ఏ విషయాలు?" అనడిగాను.

"నీవు ఈ ఏకత్వపు వారివలె బాప్తిస్మము గూర్చి బోధించకూడదు. మరియు అలాంటి చిన్న విషయాలు."

"ఓ" అలాగా, అని నేను వినసాగాను.

"భాషలు పరిశుద్ధాత్మకు ఋజువు కాదని చెప్తున్నావు గదా, మరియు స్త్రీలను వేదిక మీద బోదించుటకు అనుమతించరాదని చెప్తున్నావు గదా, మరియు ఇంకా అలాంటి చిన్న విషయాలు చెప్పుట మానివేయాలి" అని అతడన్నాడు.

98నేనొక్కనవ్వు నవ్వి" చూడు! నేను దేవుని ద్వారా పిలువబడిన సేవకుడని అభినందించి, ప్రవక్తనని నమ్ముచూ కూడా, ప్రభువు వద్దనుండి నేను పొందిన వర్తమానాన్ని బోధింపకుండా మీ సిద్ధాంతాలతో రాజీపడమని అడుగుట న్యాయమా? నేను చనిపోయిననూ ఆ పనిచేయను. ఎంత గొప్ప వారినైనా నేనీ విషయంలో లక్ష్యపెట్టను. దైవసేవకునిగా నన్నెన్నడు ఇట్టి విషయమడగవద్దు," అన్నాను.

అది ఏమిటి? నిత్యజీవపు విత్తనము; జీవము లేక మరణము, నీవు గొప్పవాడివైన లేక కాక పోయినను.

99నేనోకరోజున ఓక్లహామాలోని టుల్సాలో గుండా వెళ్ళుచుండగా, ఓరల్ రాబర్ట్స్ యొక్క పెద్ద ఫోటో వున్న భవనం చూచాను. సేవకులకు శిక్షణ నిచ్చుటకు అది ఏర్పాటు చేయబడినట్లు తెలిసికొన్నాను. దానికి 50 మిలియన్ డాలర్లు ఖర్చైనవని చదివాను. సెమినరీ నిర్వహించుచున్న భవనం విలువ మూడు మిలియన్ డాలర్లు. డిమస్ షెకారియన్ మరియు కార్డ్ విలియమ్స్ ఆ సంస్థకు కార్యనిర్వాహకులు. నేనద౦తా చూచి దేవుడాయనకది ఇచ్చాడు అని అనుకొన్నాను.

చెప్పాలంటే, "నేను ఈ విధమైన సెమినరీలకు బద్ద వ్యతిరేకిని."

100ఆధునిక సౌకర్యాలలో మునిగి తేలుచుండిన ఓరల్ రాబర్ట్స్, కాన్సాస్ పట్టణంలో చిరిగిపొయిన మురికి డేరాలో నేను బోధించుచున్న కూటానికి వచ్చాడు.

ఆ పట్టణం టామీ ఆస్బర్న్ భవిష్యత్ గృహంగా పిలువబడుచున్న రోజులవి. అది దాదాపు మూడు లేక నాలుగు మిలియనుల స్థలము అది.

నిజంగా దేవునిచే పిలువబడిన ఆ సత్ క్రైస్తవుడగు టామీ ఆస్బర్న్ వీధిలో ఒక కారులో చిన్న పిల్లలిద్దరితో కూర్చోనియున్నాడు. ఆ కూటములోనికి అతడు పరుగెత్తుకొంటూ వచ్చి, "యేసు నామంలో నీవు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వెళ్ళగొట్టుట చూచాను. వాడు నీ కాళ్ళ వద్ద పడుట కూడా నేను చూచాను," అన్నాడు.

"సాతానా అతనిలో నుండి బయటికి రా," అని నేనన్నాను. వెంటనే అతడు వెనక్కిపడిపోయి. నా కాళ్ళ వద్ద పడెను.

అతడన్నాడు, "బ్రదర్ బ్రెన్హా౦, దేవుడు దేవుడే. అవును, రెండు మూడు రోజులుగా నేను ఇంటికే పరిమితమయ్యాను." అతడు ఏ ప్రగల్భాలు పలుకలేదు. తన స్వస్థతను (విడుదలను)గూర్చి అతడు సాక్ష్యమియ్యగలడు. దాని విషయమై ఏ మాత్రం సిగ్గుపడడు. "నేను స్వస్థత వరమును పొందానని నీవనుకొనుచున్నావా," అని అతడు నన్నడిగెను.

"టామీ దాని విషయమై మరిచిపో, సువార్త ప్రకటించుటకు నీవు పంపబడితివి గనుక వెళ్ళి, దానిని ప్రకటించు. బ్రదర్ బోస్వర్త్ తో కూడా వెళ్ళుము" అని నేను అన్నాను.

101నేనక్కడ చూచాను, వారిరువురు కంటే నేనే ముందు ఆరంబించాను.

"ఓరల్ రాబర్ట్స్ కు ఉత్తర ప్రత్యుత్తరములు చేయుటకు కేవలం పనియంత్రాలే అయిదు వందలు వుండెను. గత ఎడాది అతనికి కానుక రూపములో వచ్చిన సొమ్ము నాలుగు మిలియన్ డాలర్లు." నాలుగు మిలియనులు; ఓ, అది ఎంతో ఎక్కువ మొత్తం, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సేవా పరిచర్యలకు వెళ్ళే సహాయము కంటే అది నాలుగు రెట్ల ఎక్కువ. అతనికి అంత ఎక్కువ వచ్చుచుండెను. నేనతని చోటును చూచి ఎంతో ఆశ్చర్యపోయాను.

సరే ఏదేమైనా, ఓరల్ నా తోటి సహోదరుడు. నేనాయనను ప్రేమించుచున్నాను. అతడు నిజమైనవాడు, యదార్థవంతుడు, నేనాయనను ప్రేమిస్తున్నాను. అతని యెడల నాకు ఎటువంటి మంచి భావమున్నదో, నా యెడలను అతడు అదే భావమును కలిగివున్నాడు. అయితే లేఖనాల విషయంలో మేమిరువురం కొన్నిటిని సమ్మతించము.

ఇక టామీ అస్బర్న్ విషయానికొస్తే, నేను కలిసినవారిలో టామీ ఆస్బర్న్ ఎంతో చక్కనివాడు.

వారి కార్యాలయాల్లోకి వెళ్ళి నేను చూచాను. నా కార్యాలయానికి వారు వస్తే నేను నిజంగా సిగ్గుపడతాను, ఎందుకంటే నా దగ్గర ఒక పాత టైపురైటర్ మాత్రమే ఉంది. నేనొకసారి వారి ధనసంపదలు గురించి ఆలోచిస్తూ, అది ఏమైయుండవచ్చు?" అని అనుకొన్నాను.

అలా అనుకొంటూ, రొడ్డు వెంబడి వెళ్ళిపోయాను, "మరి నా సంగతేమిటి?" అనుకున్నాను.

అప్పుడు "పైకిచూడు" అను స్వరం వినిపించినది.

అవును ప్రభూవా! నా ధనం పరలోకంలో ఉంది, అందుకే నా హృదయం అక్కడే ఉన్నది. ఈ మాటలు యధార్ధమని దేవుని సన్నిధిలో చెప్పుచున్నాను.

మీ ధనమెక్కడున్నది? నీవొక గొప్ప వ్యక్తివి కాగోరుచున్నావా? అయితే నీవంతా పోగొట్టుకొన్నావన్న మాట. నీవు ఎంత మాత్రమూ గొప్పవానిగా అవ్వాలని అనుకొని ఒక స్థలమునకు నీవు రావలసియున్నది. నీవు క్రీస్తులో గొప్పవాడివి కావాలంటే తగ్గింపు కలిగిన దేవుని సేవకునిగా వుండవలెను. అదొక్కటే మార్గం. అంతే.

102బ్రదర్ బోజ్ తదిదరులు ఫిలడెల్ఫియా సంఘశాఖ నుండి బయటకి వచ్చి, చికాగోలో ఒక సంఘాన్ని ఏర్పరచి దానికి పాస్టరుగా నుండుటకై ఒక డి.డి చదివిన వ్యక్తిని తీసుకొని వచ్చారు. మీరు కాలు జారారు, అని వారితో అన్నాను. "ఆ సంఘానికి నిజమైన దైవసేవకుడు కావాలంటే, మిక్కిలిగా తగ్గించుకొనిన సహోదరుని కోసం వెతకండి. ఆ వ్యక్తికి సంతకం చేయటం రాకపోవచ్చు, అయిననూ దేవుని కొరకు మండే హృదయమును కలిగియుంటాడు. అట్టి వ్యక్తి వలన మీ సంఘానికి అప్పులవ్వవు. వాక్యాహారం మీకు సమృద్దిగా పెట్టును." కావున వారికది నచ్చలేదు.

గనుక ఆత్మీయ విందుకు వారు రాలేకపోయారు. నేను ముగించవలసియున్నది. ఇప్పటికే ఎక్కువ సమయం తీసికొన్నాను. ప్రభువు చిత్తమైతే, మరో ఆరు నిముషాలలో కూటమును ముగింతును.

103ఎవరో ఇలా అన్నారు, " కానీ బ్రదర్ బ్రెన్హాం, నీవు చెప్పిన దానిని నీవు వెనక్కి తీసికొంటే మంచిదనిపిస్తుంది." ఎందుకనగా వీరు నరాల బలహీనులు కారు. వారు విద్య నేర్చినవారు. అవును. "వారు నరాల బలహీనులు కారు. విద్య నేర్చినవారు."

సరే నేనొక ప్రశ్న వేయగోరుచున్నాను. వారు నరాల బలహీనులు కాకపోతే మరెందుకు వాక్యమును కాదని ప్రతి ఒక్కరు శాఖల్లోకి లాగుకొనుచున్నారు, వారు దురాశను కలిగియున్నారు. యేసు అలా లేడు కదా. ఆయన దేనికి తొందరపడలేదు. చూచారా? ఆయనకు దురాశ లేదు. ఆయనే మనకు మాదిరి.

104ఎన్నడూ లేనంతగా నేరాలు దేశంలో పెరిగిపోతున్నాయి. యుక్తవయస్కులు, సంఘసభ్యులు ఆత్మహత్యలు చేసికొంటున్నారు. భర్తలు, భార్యలను తుపాకులతో కాల్చి చంపుచున్నారు. కుటుంబ సభ్యులు కాల్చుకొని చనిపోతున్నారు. నేరపు గాలులు బలంగా వీస్తున్నవి. వారు నరాల ఒత్తిడి కానివారు కాదంటారా చెప్పండి. వారి చేష్టలే వారిని తెలుపుతున్నవి.

దేశాలకు అధికార దాహం, యుద్ధ కాంక్ష పెరిగి పొయాయి. తలకొక పతాకం చేసుకొని ఎగరేస్తున్నారు.

అపవిత్రత ముందెన్నడూ లేనంతగా హెచ్చయింది. మతి లేకుండా స్త్రీలు వీధులలో తిరుగుచున్నారు. దిగంబరిగా స్త్రీలు బరితెగించి తిరుగుచు, అది స్వేచ్చ అని అనుచున్నారు. అది సరైనదేననుచున్నారు. కానీ అది హేయమైన క్రియ, వారాలా వుండకూడదు.

105వినండి. బట్టలు తీసేసి తిరిగినవాడు బైబిలో ఒకే ఒక్కడున్నాడు, అతడు సేన దయ్యం పట్టినవాడు. అతడికి మతి లేదు గనుకనే బట్టలు విప్పి తిరిగాడు. యేసు అతడిని కనుగొని అతనికి బుద్దిని తిరిగి ఇచ్చాడు గనుక వెంటనే అతడు బట్టలు ధరించుకున్నాడు.

అయితే నేడు మీరేందుకు గుడ్డలు విప్పుకొని తిరుగుచున్నారు. నిశ్చయముగా మీకు దయ్యము పట్టింది, గనుకనే కప్పుకొవలసిన ఒళ్ళును విప్పుకొని తిరుగుచున్నారు. నగ్నముగా ఉన్న స్త్రీని చూడకుండా ఈ వీధి నుండి నాలుగు వీధుల వరకు నడచి వచ్చి నాకు చెప్పండి. మంచిది. కనుగొనండి.

త్రాగుడు, నరహత్య, వ్యభిచార దయ్యాలు వారిని పట్టుకొని పీడిస్తున్నవి. వారు నరాల బలహీనులు కారు అంటున్నావు సరే, మరి ఈ చేష్టలేంటి? వారిమనస్సు వక్రీకరించబడింది. మంచి మనస్సును స్త్రీ అయితే అలాంటి వస్త్రధారణ చేయదు, ఆమెకు మంచి గుణం వుంది గనుక ఒళ్ళు పూర్తిగా కప్పుకొనే వస్త్రాలనే ధరిస్తుంది. త్రాగుడు, అపవిత్రత, మురికి, హత్య మొదలగునవన్ని ఆ పాపిష్టి దెయ్యాల పనే.

ఎన్నడూ లేనంత మద్యం ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అవుతోంది. కూరగాయలకు వెచ్చించు డబ్బుకన్నా ఎక్కువ డబ్బు మద్యమునకు ఖర్చు చేస్తున్నారు. మద్యము కోసమే అనేకులు అప్పులపాలవుతున్నారు. త్రాగుడు మీకేమిచ్చును? అది నిన్ను పిచ్చి ఆసుపత్రిలో దిగబెట్టును.

106క్యాన్సర్ ఉధృతమవుతోంది. సిగరెట్ల వలన క్యాన్సర్ వస్తుందని వైద్య నిపుణులు నిర్ధారణ చేస్తున్నారు. ఎలుకలు మీద దాన్నివేసి ప్రయోగం చేస్తే, వాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. ఈ పొగవలన నూటికి-డెబ్బై-మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోంది. వాళ్ళు తగలబడేది కాకుండా మన ముఖాల మీదకు ఆ పొగను ఊదుచున్నారు. ఇదంతా దయ్యపు చెష్టలే అని వేరే చెప్పనవసరంలేదు.

యేసుక్రీస్తు సువార్త వారికి ప్రకటించబడినప్పుడు, పరలోక దేవుడు అగ్నిస్తంభములో నుండి జనుల మధ్య కదులుచూ యేసుక్రీస్తు తన రాకడ యొక్క చివరి సూచనను చూపుచూవున్నప్పుడు, జనులు ఎలా స్పందించుచున్నారు? దానిని వారు ఎగతాళి చేస్తున్నారు. పైగా తమ్మునుతాము సంఘ సభ్యులుగా పిలుచుకొంటున్నారు; అది మనోదౌర్బల్యము కాక మరేమిటి? నా సమయము అయిపోవస్తుంది. వారినడగండి అదేమిటని? వారు చదువుకొన్న మూర్ఖులు. అది నిజం. వారి క్రియలే దానినంటోంది. వీరిస్థితి బహుభయంకరంగా ఉంది.

107లోకానుసారమైన బట్టలు వేసికొని, జుట్టులు కత్తిరించుకొనిన ఈ స్త్రీలు ప్రార్దన చేయుట బైబిలుకు పూర్తిగా విరోధము. అట్టివారిని అసలు అనుమతించకూడదు. ఆ విధంగా అవమానకరంగా జీవించుచున్న స్త్రీని విడనాడే హక్కు భర్తకున్నదని నేను చెప్పుదును. స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకొనరాదని బైబిలు బోధిస్తుంది. వీరు దానికి భిన్నంగా జీవిస్తూ, క్రైస్తవులమని పిలుచుకొనుచున్నారు.

ఉన్నత విద్యలు, డిగ్రీలు, కాలేజీలు. ఏమిటి ఇదంతా? మన పిల్లలకు బైబిలుగూ ర్చి యేసును గూర్చి తెలియచేయము, గానీ సమయమంతటిని జంతు శాస్త్రం, గణిత శాస్త్రం అధ్యయనం చేయుటకే వెచ్చించుదుము. డేవిడ్ క్రోకెట్ శాస్త్రవేత్త పేరు అడిగితే పిల్లలందరూ ఏక కంఠముతొ జవాబు చెప్తారు గాని యేసుక్రీస్తు ఎవరు? అని ప్రశ్నిస్తే నోరురాదు. ఈ విధముగా ఎంతకాలం గడుపుతాం?

కేవలం గుర్తుంచుకొండి. బైబిలు వద్దన్న దానిని సంఘాలు కౌగిలించుకొంటునాయి. పరిచర్య ఉద్రేక పూరితంగా చేస్తున్నారు. అవును. సంఘాలు వాక్యము కానిదానిని హత్తుకొంటున్నాయి.

108లోతును జ్ఞాపకము చేసికోండి. అతడు చాలా చురుకైనవాడు. అతని వైపు చూడండి.

ఇప్పుడు ఒక్క నిమిషం. సమయం ఎక్కువైపోతుంది. క్షమించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది టేపు అవుతుంది.

చూడండి. చూడండి. ఒక్క నిమిషం ఆగండి. హృదయంలో ఒక సెకను ప్రార్ధి౦చుకొండి, "ప్రభువా, దానిని నాకు చూపించు." నీ అవగహన పెంచుకొనుము, దేవుడు నీకు సహాయం చేయును గాక, చూడండి. ఈ దేశాన్ని తీసుకొండి. దేవుడు చెప్పిన దాన్ని చూద్దాం.

నీతిమంతుడగు లోతు హృదయం సొదొమాలోని పాపమును చూచి దినదినము నొచ్చుకొనెనని బైబిలులో వ్రాయబడినది. [సమాజము "ఆమెన్" అనుచున్నది.] అయితే దానికి వ్యతిరేకంగా నిలబడే దైర్యం లోతుకు లేదు. ఎందుకంటే ఆ పట్టణానికి లోతు ప్రదాన పాలకుడు, సొదోమవారు చేసేది తప్పు అని తెలుసు, హృదయంలో నొచ్చుకొనుటయే గాని బహిరంగంగా ఎదిరించలేకపోయాడు.

109ఇప్పుడు చూడండి. ఈ రోజున కూడా ఎందరో లోతులు అమెరికాలో ఉన్నారు. బైబిలు తీసికొని ప్రసంగం చేయుటకు వాక్యం సిద్దపడెదరు గాని బైబిలో వ్రాయబడిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గాని, పరిశుద్ధాత్మ బాప్తిస్మము గాని, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగానున్నాడన్న సంగతిని గాని." "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడునను వాక్యము" మార్కు 10ను గాని. "నా యందు విశ్వాసముంచిన వాడు నేను చేయు కార్యములు చేయునను" యెహాను 14:12 అనే వాక్యబాగమును గాని. "నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేదిష్టమో అడుగుడి అది మీకనుగ్రహింపబడునను," వాగ్దానమును గాని ఈ లోతులు ధైర్యముగా ప్రకటించక వదిలివేయుచున్నారు, ఎందుకనగా ఈ లోతులు తమ తమ శాఖలను గూర్చి భయపడుచున్నారు. బైబిలును ఈ సంఘసభ్యులను చూడండి, ఎక్కడా వారికి బైబిలుతో పొత్తు కలువదు.

మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళు వేసుకొని రోడ్ల మీద తిరుగుచున్నారు. వారు క్రైస్తవులు, సంఘ సభ్యులు కూడాను, అతనిలోని ప్రాణము దానికి విరోధముగా మొర్రపెట్టుచున్నది, అయినను అది పూర్తిగా వాక్యానికి విరుద్దమని ప్రకటించే ధైర్యము బోధకులకు లేదు.

ఈ ఆదునిక సొదోమాను గద్దించు వ్యక్తులను దేవుడు లేపును గాక! బాప్తిస్మమిచ్చు యొహానువలె ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినదని ధైర్యముగా భోధించువారు కావాలి!

110గమనించండి. ఈ భూబాగమంతయు నేడు ఆధునిక సొదొమ గొమోర్రాలుగా తయారయినది. నేడు లోతులు చాలా మంది జీవనం చేస్తున్నారు. అతడు తెలిసి ఉండియూ దాని నుండి దూరం కాకుండ ఉండెను. అది తప్పు అని వాక్యము ఘోషించుచున్నది.

చికాగోలో కూడుకొనిన 300 మంది బోధకులను గూర్చి ప్రభువు ఒక రాత్రి నాతో మాట్లాడాడు. వారేమి చేయబోవుచున్నారో నాకాయన తెలిపెను. నా కొరకు వారొక వలపన్నియున్నారు. బ్రదర్ కార్ల్సన్ కు నేనాసంగతి చెప్పినప్పుడు, అతడు తల క్రిందికి దించాడు. ఆ హోటల్ నందు వారు నా కొరకు వలపన్నియున్నారు. అయితే దేవుడు నాకు అంతా బయలుపరచెను.

చికాగో కూటములకు వెళ్ళుటకు ముందుగా నా ఆఫీస్లో కార్ల్సన్ నన్ను కలుసుకొని "బ్రదర్ బ్రెన్హాం! నేనావిషయం మరచిపోలేను" అన్నాడు.

"అవును. వారు నాపై కుట్ర పన్నిరి. నీవు టామీ హిక్స్ ఈ విషయాన్ని వెల్లడి చేయడానికెందుకు భయపడుచున్నారని" అన్నప్పుడు వారు తలలు క్రిందకి దించారు.

ఆ కూటం ఇంకొక భవనంలో జరుగునని రాత్రి ప్రభువు నాతో చెప్పాడు. డాక్టర్ మీడ్ అనునతడు ఒక ప్రక్కన వుంటాడనియు, నల్లజాతి దంపతులు ఆ కూటంలో పాటలు పాడెదరనియు, ఒక బౌద్ద గురువు అక్కడ వుంటాడనియు ప్రభువు ముందే చూపించాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మమును గూర్చి నేను బోధించుచున్నానని చెప్పి, వారు నా మీద కక్షతో నాకు వ్యతిరేకముగా కుట్రపన్నారు. సర్పసంతానమును గూర్చిన నా బోధ వారికిష్టంలేదు. బాషలు పరిశుద్ధాత్మకు ఋజువు కాదను నా బోధ వారికి కోపం పుట్టించినది, అయితే నేను చెప్పెదేమిటంటే, "వచ్చి దేవున్ని గుర్తించండి."

111అక్కడికి చేరుకొన్నారు, వారక్కడికి వెళ్ళారు, కూటములు జరుగులకు ముందు రెండు గంటలకు ముందు లేక ఆ మధ్యహ్నం వారు బ్రదర్ కార్ల్సన్న్ ని పిలచారు. అతడన్నాడు, "మనం కూటం జరుపు హాలు ఇదివరకే వేరే వారికివ్వడమైనదని గనుక కూటమును జరుప వీలు కాదని మేనేజర్ తెలియజేసాడు" అని చెప్పెను. ప్రభువు చెప్పిన రీతిగానే అది రద్దయింది.

గనుక మేము ఆ నగరానికి వెళ్ళాము. ఆ ఉదయము మేమక్కడికి చేరుకొన్నాము. అక్కడ నిలిచియున్నాము. అప్పుడు కార్ల్సన్ వారికి చెప్పెను, "ఒక్క నిమిషము, సహోదరులగు మీరు బ్రదర్ బ్రెన్హామ్తో ఏకీభవించక పోవచ్చును, కానీ అతడు దేనినైతే నమ్మియుండెనో, దానితో నిలబడియుండుటకు ఎంత మాత్రము భయపడడు. ఈ కూటము ఎక్కడ జరుగునో దానిని అతడు ముందే తెలియపర్చాడు. అతడు చెప్పినట్లే ఇక్కడ జరుగుచున్నవి గనుక ఇప్పుడు అతనిని మాట్లాడనిదాం."

112అప్పుడు నేను వాక్యము తీసి పౌలు పలికిన, "నేను చూచిన పరలోక దర్శనానికి అవిధేయుడను కాను" అనే మాటను చెప్పాను. ఇక్కడ కూడుకొనిన 300 మంది చాలా పెద్ద పెద్ద డిగ్రీలు కలిగియున్నట్లుగా పరిచయ వాక్యాల ద్వారా తెలిసికొన్నాను. అయితే నాకు కనీస విధ్య కూడా లేదని మీకు చెప్పుచున్నానని వారితో అన్నాను. మీరు నన్ను నీటి బాప్తిస్మము యేసుక్రీస్తు నామంలో ఇవ్వకూడదని ఎదురిస్తున్నారు గదా? అయితే బైబిలు పట్టుకొనివచ్చి నా ప్రక్కన కూర్చొని, నేను పలికిన మాటలోనైనా తప్పు కలదని వాక్యానుసారంగా రుజువు చేయవలెనని మిమ్ములనందరిని సవాలు చేయుచున్నానని వారికి చెప్పాను.

మీరి సంఘటనను టేపులో కూడా విని రుజువు పొందవచ్చు. వారందరూ చచ్చిన పేనుల్లా అయిపొయారు. ఎవరైన సవాలును ఎదుర్కొనేవారుంటే చేతులెత్తమన్నాను. ఆ సమూహమంతా నిశ్శబ్దమయిపోయింది. ఎవరైనా చేతులేత్తారేమోనని చుట్టూ కలియ చూచాను.

"నేను ముందుకొచ్చి మాట్లాడుచున్నప్పుడు మీరు దానికి మద్దతు తెలుపనట్లయితే, నా వెనుక నుండి తొలగిపొండి" అన్నాను. సమస్యతో ముఖాముఖిగా రండి, అది వేరే విషయము. అది నిజము. అందరూ జారుకొన్నారు.

113వెంటనే టామిహీక్స్ నా వద్దకొచ్చి నాకు తెలిసిన త్రిత్వ-బోధకులకు ఈ సంఘటను గూర్చి తెలియచేయటానికై 300 టేపులు కావాలని అడిగాడు.

మూడు వందలమంది బోధకులు నాకు కరచాలనం ఇచ్చి వెళ్ళిపోతూ ఆలయానికి వచ్చి బాస్తిస్మము పొందుతామని చెప్పారు.

వారి సంగతేమిటి? ఉన్నపాటున వారు పొందలేరు. వారి భార్యలు ఊరుకోరు. వారి శాఖలు బహిష్కరిస్తాయి, ఎన్నో నెపములు వారు చెప్తారు. అది నిజమేనా? [సమాజాము "ఆమెన్" చెప్పుచున్నది.] అట్టి జీవితము సువార్తకు యోగ్యమైనదా? ["లేదు."]

సువార్త సత్యమని నీవు నమ్మినట్లయితే, నీకున్నదంతా అమ్మి, నీవు దానికొరకు జీవించెదవు. అయ్యలారా! క్రైస్తవులుగా జీవించండి! ముగింపులోకి వచ్చుచున్నాము. ఆమెన్.

114అయితే వారి సంఘ సిద్దా౦తాలు, శాఖలే వారికి హేతువులై వారిని రానిచ్చుట లేదు.

అదొక వృక్షంలా ఉంది. సహో బాంక్స్ ఇంటి ఆవరణంలో ఒక మొద్దును చూచాను. ఎన్నో విత్తనాలు దానిచుట్టూ ఫలించుచున్నవి. గాని దాని క్రింద మాత్రం పచ్చ గడ్డి కూడా మొలవలేదు. నేను వెళ్ళి దాని ఎండు కొమ్మలన్నింటిని రంపముతో కోసేశాను. దాని క్రింద ఇప్పుడు అందమైన గడ్డి పుటుకొచ్చింది. ఎందువలన? భూమిలో విత్తనమున్నది. కాని వెలుగులేని కారణమున మొలకెత్తలేదు. వెలుగు చూసేసరికి జీవం వచ్చింది.

115నీలో ఉన్న విత్తనమును ఈ మత శాఖ లేక సిద్దాంతం అను వృక్షపు నీడ మొలకెత్తనివ్వటంలేదు. అందుకే నీవునూ లోతుతో పాలిబాగస్తుడవయ్యావు. అలంటివాటిని నరికేవేయండి, సువార్త వెలుగును పడనీయండి. యేసు క్రీస్తు శక్తి లోనికి రానివ్వండి. అవును. వెలుగు దూరమైనచో, జీవము ఉండదు. వెలుగును పడగానే నీలోనున్న విత్తనం జీవాన్ని పొందుతుంది.

ఈ విధంగా జీవిస్తుందని తెలియుట చేతనే చాలా మంది, "ఆ కూటములకు వెళ్ళకండని ప్రజలను హెచ్చరించుచున్నారు." వారి యొక్క స౦ఘ సభ్యులను ఆ వెలుగును తాకునని వారు భయపడుచున్నారు.

116బావినొద్దనున్న స్త్రీని జ్ఞాపకం చేసికొనండి. ఆమె ఒక వేశ్య.

ఆమె జీవించిన దినాల్లో యాజకులు అక్కడ ఉన్నారు. యేసు నతానియేలుతో చెప్పిన మాటలు వారెరుగుదురు.

అయితే యాజకులు యేసుని బయల్జేబూబు దయ్యము, సోది చెప్పువాడు అని అన్నారు.

అయితే ఆ చిన్న స్త్రీ ఆరుగురు పెనిమిట్లతో అక్రమంగా జీవించుచున్న సమయంలో యేసుతో సంబాషించుట జరిగింది. నాకు దహమునకిమ్ము, అనే దానితో వారి సంబాషణ ఆరంభమైనది. తర్వాత ఆయన నీ భర్తను తీసుకొని రమ్మని చెప్పగా

నాకు భర్త లేడని ఆమె అన్నది.

నీవు చెప్పినది నిజమే, ఎందుకనగా నీకు అయిదుగురు భర్తలున్నారు గాని ఇప్పుడున్నవాడు నీ భర్త కాడని యేసు చెప్పగానే, ఆమె గుర్తించినది.

"అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయును," అని ఆమె అనెను.

"నేనే ఆయననని" యేసు చెప్పెను.

అంతే ఆమె సమస్య పరిష్కారమయింది. ఆమెలో నున్న విత్తనాన్ని వెలుగు తాకింది. వేశ్య రోజులు గతించినవి. దేవున్ని మహిమ పరచుచూ ఆమె ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్ని నాకు తెలియజేసిన ఈయన మెస్సీయా కాడా? అని అన్నది. ఇంత వరకు వేశ్య నీడలో నిర్జీవంగా పడివున్న విత్తనాన్ని వెలుగు కిరణాలు తాకినవి. జీవంతో మొలక బయటకొచ్చింది. అవునండి.

దీనిని చెప్పి ముగిచుకొందాం. చెప్పాల్సినవి ఇంకా ఎన్ని పేజీలున్నవో నాకు తెలియదు. బహుశా ఇంకా పది పేజీలుండొచ్చు. అయితే అన్నింటిని నేను తీసికోలేను. ఇంకా పది పేజీలుండొచ్చు, కానీ వాటిలో సగం చెప్పి ముగింపులోకి వద్దాం.

117సువార్తకు యోగ్యమైన జీవితాన్ని పరిశీలిద్దాం! పరిశుద్ద పౌలు జీవితాన్ని ధనిక యువకునితో పోల్చి చూద్దాం. వీరిద్దరికిని ఒకే వెలుగు తాకింది. ఇద్దరికీ యేసుక్రీస్తు నుండి ఒకే ఆహ్వానం వచ్చింది. వారిరువురూ లేఖనాల్లో శిక్షణ గడించినవారే. వారిద్దరూ మహా వేదాంత జ్ఞానులే. ధనిక యువకుడ్ని యేసు, "ఆజ్ఞలన్ని నెరవేర్చుచున్నావా?" అని అడిగెను.

అందుకతడు, "బాల్యం నుండి నేను అనుసరించుచూనే యున్నానని" జవాబిచ్చెను.

పౌలు వలె అతడు కూడా మంచి తర్ఫీదునొందిన వ్యక్తి, వీరిద్దరికి వాక్యపరిజ్ఞానం బాగా ఉంది. ఒకరికి జ్ఞానం మానవ తెలివి తేటలవలన వచ్చింది. మరొకరి జ్ఞానంలో జీవకణం ఉంది. ముందర వెలుగు పడగానే ప్రభువా! "నీవెవరని ప్రశ్నించెను."

"నేను యేసును," అనే జవాబును ఆయన వినెను.

"నేనిక్కడ వున్నాను" అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు సిద్దపడెను.

118వారిద్దరినీ వెలుగు తాకింది. అయితే ఒకటి మాత్రమే మొలకెత్తినది; మరొకటి మొలకెత్తలేదు. ఈ రోజున కూడా ఆ విధంగానే ఆత్మీయ సంఘము, స్వాభావిక సంఘము మన ఎదుట ఉన్నది.

ధనికునికో నెపం ఉంది. అతనికి లోకంలో చాలా మంది స్నేహితులుకలరు. తన సహావాసం విడనాడ లేకపొయాడు.

ఈ నాడు చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. త్రాగుబోతుల, అల్లరి మూకల సహావాసం వదలేకపోతున్నారు. వారందరు కలిసి త్రాగుత మరియు అలాంటివి చేయుదురు. మంచిది, దానితో కోనసాగండి; సంఘమునకు మరియు ఆ లాడ్జీతో వ్యతిరేకత లేదు. నేను నీ గూర్చి మాట్లాడుచున్నాను. చూచారా? అవును. చూచారా? దానితో ఏమి లేదు. దేవుని వాక్యాన్ని నిరాకరించిన నీ సంఘము, సంఘ శాఖ, ఒక లాడ్జీ లాంటిదేనని నేను చెప్పుచున్నాను.

119గమనించు. ఈ ధనిక యువకునికి ఒక సాకు దొరికింది. వాడు తన సాక్ష్యం కూడా వదలలేదు. గొప్ప వ్యాపారంలోకి వెళ్ళిపోయాడని తర్వాత మనం కనుగొనవచ్చును. తన జ్ఞానాన్ని బట్టి చాలా సంపాదించి, కొట్లు నింపుకొనినాడు. అతడు సంఘ సభ్యత్వం కలిగియున్నాడు. అనేక మత కార్యక్రమాల్లో సహాయంచేసి ఉంటాడు. అతడు ప్రముఖ కూటాలలో చాలా గొప్ప వాడనియు, మహా శక్తిగల దేవుని బిడ్డ అనియు అందరూ పొగుడుదురు. అతడు చనిపోయినప్పుడు యాజకుడు లేచి, "మన భక్తిగల సోదరుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయెనని ప్రసంగం చేసియుంటాడు.

కాని పాతాళములో అతడు యాతనలో కన్నులేత్తి చూచెనని బైబిలు తెలియజేయుచున్నది.

అతడు ఒక ఇంకా పది పేజీలుండొచ్చు. అయితే అన్నింటిని నేను తీసికోలేను. కానీ వాటిలో సగం చెప్పి ముగింపులోకి వద్దాం.

120నరకంలో కూడా వీడు వ్యాపారం మానలేదు. చూడండి! అబ్రహాము రొమ్మున ఆనుకొనియున్న లాజరును తనయొద్దకు పంపమని అబ్రాహామును "తండ్రి"యని ఇంకా పిలుస్తూయున్నాడు.

అతడు చాలా తెలివితేటలు సంపాదించిన సంఘానికి వెళ్ళాడు. అయితే దైవ వెలుగు అతడిని తాకినప్పుడు, దానిని అతడు నిరాకరించాడు.

ఈనాటి సంఘ పోకడ కూడా ఇదే. దేవుడెంతగా వారి మార్గములను వెలుగుతో తాకుచున్నప్పటికిని అగ్నిస్తంబముతో వారిని దర్శించుచున్నప్పటికిని, వారు లోకజ్ఞానపు గుంపును సామాజీకంగా రాజీపడే సంఘాన్ని ఎన్నుకొంటూవున్నారు.

కాని పౌలు తన సామాజిక గౌరవమును, మహా పాండిత్య ప్రతిభను యాజకుల మధ్య తనకున్న పలుకబడిని, గమలియేలు శిక్షణ క్రింద పోందిన జ్ఞానమును, వెలుగు తన మార్గమును తాకిన వెంటనే యేసును గుర్తించి, అరణ్యములో ఇశ్రాయేలు వారిపైన నిలిచిన వెలుగు యేసు క్రీస్తేనని గుర్తించి, సమస్తమును వదిలి జీవము నొద్దకు వచ్చాడు.

121ఇంతకీ ఆ ధనికుని జీవితము సువార్తకు యోగ్యమైనదని చెప్పగలమా? అతడు విశ్వాసిగానే పిలువబడెను గాని అతని సహవాసం, వినోదాలు, తన ద్వారం ఎదురుగానున్న యాచకుడిని చూడనీయకుండా చేశాయి. అతని గృహంలో యాజకులు సర్వదా ప్రార్థనలు సలుపుచున్నారు. అయినను అతడు నరకానికి పోయాడు. అది నిజం. నీ తెలివితేటలు నిన్ను అక్కడికే తీసికొనిపోతాయి.

122పౌలును వెలుగు తాకగానే అంతా విడిచిపెట్టి వచ్చాడు. తన జ్ఞానం, సహావాసం విడిచిపెట్టి యేసుక్రీస్తు ఆత్మకు లోబడెను. ఎంతో మేధావి గాని ఎన్నడూ పెద్ద మాటలు వాడినట్లుగా మనం చూడం.

మానవ జ్ఞానంతోను మాటలతోను కాక, యేసుక్రీస్తు పునరుత్తాన శక్తి యందలి విశ్వాసం ద్వారా వచ్చానని కొరిందీయులతో చెప్పాడు. ఆ జీవితాన్ని పరిక్షించండి.

విద్యనెన్నడు అతడు తన బోధలో ప్రయోగించలేదు. దీనత్వముతో క్రీస్తు ఆత్మతో నడిపించబడుచూ, వాక్యమునకు లోబడుచూ వారి మత విశ్వాసాలకు భిన్నంగా జీవించాడు. తన జీవితం ద్వారా యేసుక్రీస్తు జీవమును ఆనాటి తరమునకు ప్రసరింపచేశాడు.

ప్రజలతని ద్వారా దైవాత్మను సందర్శించారు. అణుకువ గలవారు అతని వాక్యము నమ్మి, చేతిగుడ్డలు కూడా తీసికొని వచ్చిరి. అతడు తాకిన ప్రతీది ఆశీర్వధించబడినది. క్రీస్తుకు సజీవమగు ప్రతినిధిగా వుండెను. ఎంత గొప్ప మనిషి? తన జీవితమును సంపదలను, విద్యను, సమస్తమును విడిచిపెట్టి, జాలరులతోను వీధులలో తిరిగే పేదవారితోను గడుపుటకు తీర్మానించుకొనెను.

మూడు సార్లు 49 కొరడా దెబ్బలు తినెను. అతని శరీరంలో యేసుక్రీస్తు యొక్క గురుతులు ఉండెను. అతడు యేసు ప్రేమను ప్రతిబింబింపచేసెను. యేసు కొరకై ఎన్నో ముద్రలు శరీరంలో ఏర్పడెనట. ఎంత భయంకరమగు పరిస్థితి? అతని చుట్టూ హుందాగా జీవితమును సాగిస్తున్న యాజకులకు, అతనికి ఎంత వ్యత్యాసమో చూడండి.

123రోమాలో అతడు నిలిచియుండగా, ఎవరునూ అతనిని ఎదురించలేకపోయిరి, వారు అతని తలను చేదించుటకై ఒక సాధనమును తయారు చేయ సంకల్పించినప్పుడు, అతడు ధైర్యంతో, "నా కొరకు ఒక కిరీటమును న్యాయాదిపతియగు ప్రభువు ఆ దినమున ఇచ్చుటకు దాచి యుంచాడని" పలికాడు. తనకే కాదు గాని ప్రభువును ప్రేమించు వారికందరికిని దాచి యుంచబడినదని చెప్పెను." ఇట్టి జీవితమే సువార్తకు యోగ్యమైనది.

అతడు క్రీస్తు కొరకు నిలిచాడు. సువార్తను తన ద్వారా ప్రతిఫలింప చేశాడు. అరేబియాలో మూడు సంవత్సరములుండి, యేసుక్రీస్తే పాత నిబంధనలో నున్నాడను సువార్తను నేర్చుకొనెను. అతడన్నాడు, "కడుపు నిండి వుండటము నాకు తెలుసును, ఆకలి, అక్కరులును నాకు తెలుసును."

ఇన్ని గొప్ప ఆదిక్యతలున్న పౌలు, మిలియనుల కొలది డబ్బును, గొప్ప బవ౦తులను సంపాదించుకొనుటకు చాలా అవకాశమున్నది. కానీ సోదరులారా, అతనికొక వస్త్రము తప్ప మరేమియూ లేదు. ప్రదాన యజకునితో చేతులు కలిపితే పెద్దవాడవ్వచ్చు గానీ తిరస్కరించెను.

దేమా పౌలును అనుసరించాడు. కాని మధ్యలో ఇహాలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెనని, II తిమోతి 3లో వ్రాయుటను చూడగలం. ఆ సమయంలో పౌలు తిమోతికి, "నీవు వచ్చునప్పుడు, ఇక్కడ చలిగా ఉన్నది అక్కడే విడిచిపెట్టిన వచ్చిన చలికోటును తెమ్మని," వ్రాశాడు. అంత గొప్ప సేవ చేసిన వ్యక్తికి ఒక్క అంగీ మాత్రమే ఉండినది. దేవునికే మహిమ!

124అది నాకు పరిశుద్ద మార్టిన్ని గుర్తు తెచ్చుచున్నది. రక్షింపబడకమునుపు అతడు సువార్తకు నిలబడవలసిన సమయం వచ్చింది. నైసీయా సభకు, ముందు నైసీయా సభలో, నైసీయా తండ్రుల చరిత్రలో వుంది ఇది. అతడు ఒకనాడు ఫ్రాన్స్ లోని టోరాస్ గవిని గుండా వెళ్ళుచున్నాడు. అక్కడోక వృద్ధుడు, బట్టలు లేక మరణించు స్థితిలో పడియుండెను. చాలా మంది చూసుకొంటూ పోవుచున్నారు గాని ఏమి సహాయం చేయుటలేదు. ఆ వృద్దున్ని లక్ష్యపెట్టేవారు ఎవరూ కనబడలేదు. పరిశుద్ద మార్టిన్ అక్కడ నిలబడి అతని వైపు చూస్తున్నాడు.

వెంటనే తన వస్త్రము తీసి, రెండుగా చీల్చి - ఒక ముక్క అతనిపై కప్పి మన ఇరువురం ఈ ముక్కలతో జీవిద్దాం అంటూ ఇంటికి వచ్చేశాడు.

పడక మీదకు వెళ్ళిన అతని ఆలోచనలు ఆ వృద్దుని చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరో తనను లేపిన చప్పుడయితే పడక మీద నుండి లేచి కూర్చుని చూసేసరికి, ఏ బట్టయితే ఆ వృద్దునికి చుట్టి వచ్చాడో, అదే బట్టను చుట్టుకొని యేసుక్రీస్తు గదిలో నిలబడియుండెను. ఈ చిన్నవారిలో ఒకరికి నీవు సహాయం చేశావు గనుక నాకు చేసినట్లేనని ఆయన అతనితో చెప్పెను, అది నిజంగా సువార్తకు యోగ్యమైన జీవితం. మీకు తెలుసు ఆయన జీవితమును ఎలా ముద్రవేసెను, నీవును ఆలాగు చేయవా?

125పొలికార్పు వైపు చూడండి, రోమన్ కాథలిక్కు సంఘమునకు వ్యతిరేకముగా నిలబడి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గూర్చి బోధించగా, అతనిని స్తంబానికి కట్టి కాల్చిరి. ఈ విధముగానే శ్రమలనుభవించి హతసాక్షులైన ఐరేనియస్ తదితరుల జీవితాలు సువార్తకు యోగ్యమైనవి.

హెబ్రిలో పౌలు చెప్పిన దానిని చూడండి, 11వ అధ్యాయములో అన్నాడు, "మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రే చర్మములను మరియు మేక చర్మములను వేసికొని దరిద్రులైయుండి, శ్రమపడి హింసపొందుచు, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి." అక్కడే మేరున్నారు. ఇది సువార్తకు యోగ్యమైన జీవితం. అలంటి వ్యక్తులతో, తీర్పు దినాన నీ యొక్క మరియు నా యొక్క జీవితము ఎలా ఉండును.

126ఇప్పుడు పౌలు వైపు చూడండి. మనమంతా రాజీపడతాం, అతడు సువార్త కొరకు నిలబడ్డాడు. యేసు అతని ద్వారా ప్రవహించాడు. ఎవరు ఏది అనుకున్న పరువాలేదు, సువార్త కొరకు అతడు తన తలను చేదించుకొనుటకు అప్పగించుకొన్నాడు. ప్రధాన యాజకుడు అది వెర్రితనము అని పలికెను. సువార్తకు ప్రాతినిద్యం వహించుట యోగ్యతగా అతడు బావించెను. అక్కడ చూడండి. జనులు ఏమనుకొంటారొ లెక్క లేదు. నిత్యజీవము అతని ద్వారా ప్రవహించెను. అతడన్నాడు, "నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, శాపగ్రస్తుడనై యుండగోరుదును."

నిత్యజీవమును పొందినప్పుడు నీవేమి చేయాలో నీకు తెలుసా? అక్కడ నీ ప్రశ్న మరియు నీ జవాబు వున్నది. మానవ జ్ఞానము తీసికొంటావు, ఒక ప్రక్క; లేక, ఈ వైపు తీసుకొనుము, నీవు నిజముగా నిత్యజీవము పొందినట్లైతే అదే జరుగును.

అదే జరిగినది. పౌలు తన ప్రజల నిమిత్తం క్రీస్తు నుండి వేరై యుండగోరెను. వారు గ్రుడ్డివారు అమాయకులు గనుకనే తను చెప్పె సువార్తను వారు వినలేదు!

ఇది నాకు కొంత సిగ్గు కలిగి౦చినట్టుగా వుంది. నా బోధ విననందున నేను విడిచిపెట్టుటకు సిద్దపడితిని. గనుక నేను ఈ విషయమై పశ్చాతాపపడుచున్నాను. పశ్చతాపపడితిని. చూశారా?

127గమనించండి, ఎవరు ఏమనుకున్న, సువార్తకు యోగ్యమైన జీవితం ఇదే.

ఇప్పుడు నేను ముగించుచున్నాను.

ధనవంతుడు, నేడు మనలో అనేకులవలే జీవవాక్యాన్ని తృణీకరించి, పెడచెవినబెట్టాడు. అతడు సంఘ సభ్యుడే, నిత్యజీవము తన యొద్దకు వచ్చినప్పుడు దానిని త్రోసివేసి, సాదారణ సంఘ సభ్యత్వ జీవితం జీవించాడు. అది సువార్తకు యోగ్యము, కాని జీవితమని బైబిల్ ద్వారా ఋజువు చేయబడినది. [సమాజము "ఆమెన్" అనుచున్నది.] దేవుని శక్తిని ఒప్పుకొనని అలాంటి చీకటి బ్రతుకులో సువార్త ఎలా ప్రకాశించగలదు?

128ఇప్పుడు, యోగ్యమైన జీవితమును జీవించుటకు గల ఏకైక మార్గమేమనగా క్రీస్తుని ఆయన వాక్యము (వాక్యము ఆయన ఒక్కటే)ను పరిపూర్ణముగా నీ యందు ప్రచురించునట్లు అనుమతించాలి, తన వాక్యములో ఆయన దానిని నిరూపించే వరకు, దేవుని యెదుట బలిగా తన్నుతాను చూపుకొనుట కొరకు క్రీస్తు చనిపోయెను. తర్వాత పరిశుద్ధాత్మ రూపమున తిరిగి వచ్చెను. ఎందుకనగా తన ప్రజలగుండా అది ప్రచురించుటకు, తన పనిని కొనసాగించుటకు, ఈ దినములయందు ఇవ్వబడిన వాగ్దాన వాక్యము నీ ద్వారా ఆయన చూపించినట్టు ప్రసరింపజేయాలి.

క్రీస్తు రాకను బాప్తిస్మమిచ్చు యొహాను వినినట్టుగా అన్నమాట. క్రీస్తు నీటిలోకి నడిచివచ్చాడు. అప్పుడు యోహాను అన్నాడు, "ఇదిగో దేవుని గొర్రేపిల్ల."

దానిని వేరే ఇంకేవ్వరు చూడలేదు. అతడు మాత్రమే దానిని చూసాడు. పావురమువలె వెలుగు దిగివచ్చుటను అతను మాత్రమే చూడగలిగాడు, అలాగే స్వరమిలా పలికినది, "ఈయన ప్రియ కుమారుడు ఈయన యందు నేనెంతో ఆనందించుచున్నాను." అది వచ్చుటను అతడు చూచాడు.

యేసు నీటిలోకి నడిచి వెళ్ళాడు. ఇమ్మానుయేలుగా ఆయన ఒక కఠిన బోధకుని యెదుటికి వచ్చెను. ప్రజలయెదుట నీటిలోకి నడిచి వెళ్ళెను. "నాకు బాప్తిస్మమిమ్ము," అని అతడిని అడిగెను.

అందుకు యెహాను "ప్రభువా, నేను నీతో బాప్తిస్మం పొందవలసినవాడిని, మరి నీవేలా నన్ను బాప్తిస్మమిమ్మని అడుగుచున్నావు" వారిరువురి దృష్టి కలిసిపోయెను. ప్రవక్త మరియు అతని దేవుడు. ఆమెన్. నీవు గనుక… నేను… అక్కడ నిలిచి దానిని చూచుటకు ఇష్టపడుచున్నాను! దృడమైన చూపులు; వారిరువురు ఒకరినొకరు తీక్షణముగా చూచుకొనుచుండిరి.

యేసు అన్నాడు, "యెహాను ఇప్పటికి ఇలాగున కానిమ్ము, నీతియావత్తు ఈలాగున జరుగవలెను. ఈ ఘడియకు మనం వర్తమానికులం. ఇది ఇలానే జరిగితీరాలి."

యోహాను అనుకొన్నాడు "అవును, ఆయన బలిపశువు. అర్పించుటకు ముందు అది కడుగబడవలెను కదా!" అప్పుడతడు "ముందుకు రండి" అని పిలిచాడు. ఆయనకి బాప్తిస్మమిచ్చాడు. ఆమెన్. మరోలా చెప్పాలంటే, "నీతియావత్తు ఇలాగు జరిగించటం మంచిది."

అతడు నిజమైనవాడని ఎరిగియుండెను. గనుక ఇలా అన్నాడు, "స్త్రీ కనినవారిలో ఇతని వంటి వాడెవడును లేడు. ప్రవక్త కంటే ఇతడు ఎక్కువ; మీరు చేర్చుకోనవచ్చును, యేసు అతని హృదయమును చూచెను, దానిని ఎరిగెను. ఆయన తన సొంత దాయాదుని అక్కడ ముఖ ముఖిగా కలిసికొనును.

యోహాను ఇలా అనెను, " ప్రభువా, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసివుండగా, నీవు నా యొద్దకు రానేలా?"

అందుకాయన, "యెహాను, ఇప్పటికి ఇలా కానిమ్ము. దేవుని వాగ్దానం నేరవేర్చటం మనకు మంచిదని జ్ఞాపకముంచుకొనుము. బలిపశువును నేనే. అర్పించబడుటకు ముందు నేను కడుగబడవలెను." ఓ, మై! మై!

129మరి నేడు, సాయంకాలపు వెలుగు ప్రసరించుచున్నది, ఇది అంత్యకాలము కాదని ఏ బైబిల్ పండితుడైనా, మనసున్న వాడెవడైనా కాదనగలడా? మరి అది ఎరిగిన మనము శాఖల నుండి వేరవటం సంస్థల నుండి వేరవటం, ఈ అంత్యదినమున వచ్చిన యేసుక్రీస్తు యొక్క నీతిని పోందుకోవటం, దయ్యము వచ్చి మృగము యొక్క ముద్రను వేయకముందే - దేవుని యొక్క ముద్రను పొందుకోవటం అనేది మంచిది. ఓ, మై. అవును.

విధేయుడగు దైవ సేవకునిగా ఉండు నిమిత్తం ఈ దినపు వెలుగు నీలో ప్రకాశించు నిమిత్తం దేవున్ని ప్రార్థించుము. అప్పుడు ఆత్మ ఫలము నీలో ఎప్పటికి నీలో నిలిచియుండును. అదియే సువార్తకు యోగ్యమైన జీవితమగును.

130ముగింపులో దీనిని చెప్పగోరుచున్నాను. సువార్తకు యోగ్యమైన జీవితమును జీవించుటకు ఏకైక మార్గమేదనగా స్వయంగా సువార్తె, దానిలోని ప్రతి బాగము నీలోకి రావాలి మరియు ఆయన వాగ్దానాలు తిరిగి వచ్చి నీలో ప్రసరించాలి, ఋజువు పర్చబడాలి. ఈ దినపు వాగ్దానము నీలో ఋజువుపర్చు నిమిత్తము దేవుడే నీలో జీవించనిమ్ము.

యోహాను వలె, యోహానుతో యేసు ఇలా అన్నాడు, "యెహాను, ఇప్పటికి ఇలాగున కానిమ్ము అనెను. ఈ దినపు వర్తమానికులం మనము. గనుక సమస్తమగు నీతిని మనము నెరవేర్చవలసివున్నది."

మరలాగే మనము ఈ దినపు క్రైస్తవులమైతే, యేసుక్రీస్తుని మన హృదయములోనికి ఆహ్వానిదాం, ఆయన వాక్యమై యున్నాడు. బయలుపర్చబడిన వాక్యములో దేనిని తృణీకరించకు. అది సత్యమని చెప్పుము. దానిని నీ హృదయములో భద్రపర్చుకొనుము. ఆత్మఫలమును శ్రద్దగా ఫలించుము, మరియు బైబిల్ నందు ఆయన నీకిచ్చిన ప్రతి లేఖనబాగాన్ని చేయుము. దేవుడు ఆయన వాక్యాన్ని నెరవేర్చాలని కోరుచున్నాడు, మరియు ఆయనకు చేతులు లేవు, అయితే నీ యొక్క మరియు నా యొక్క చేతులనే ఆయన కలిగియున్నాడు. ఆయనకు నాలుక లేదు, కాని నీ యొక్క మరియు నా యొక్క నాలుకను ఆయన కలిగియున్నాడు. "నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు." కొమ్మలే ఫలించాలి. ఆ కొమ్మలకు సత్తువ ద్రాక్షావల్లే అదియే సువార్తకు యోగ్యమైన జీవితం.

131సమస్త కృపకు పాత్రుడైన దేవుడు, పరలోకపు దేవుడు తన పరిశుద్ధాత్మను రేడియో ద్వారా వింటున్న వారిమీదను, టేపు ద్వారా వింటున్నవారి మీదను మరియు ఇక్కడ కూర్చొని వింటున్న వారిమీదను ఈ రాత్రి ప్రకాశింపజేయుమనేదే నా ప్రార్ధన. తద్వారా ఒక దినాన దేవుడు, "నిన్ను బట్టి నేనెంతో ఆనందించుచున్నాను. లోకము పుట్టకముందే నీ కొరకు సిద్దపరచిన ఆనందంలోకి ప్రవేశింపుము," అని చెప్పె యోగ్యమైన జీవితమును నీవు జీవింతువు గాక. పరమ దేవుడు తన ఆశీర్వాదములను మీ మీదకి పంపును గాక.

జుట్టు కత్తెరించుకొంటున్న స్త్రీలారా మీరు జట్టు కత్తెరించుకోవటం వాక్యప్రకారం హేయమైన క్రియని ఎరిగి, ఈ దినపు నవీన పద్దతిలలో నుండి మీరు వైదోలిగి పోవునట్లుగా దేవుడు మిమ్ములను దీవించాలనేదే ఈ రాత్రి నా ప్రార్థన. అసహ్యవస్త్రదారణ విషయంలో ఈ రాత్రి మీరు మనస్సు నొచ్చుకొని, అపరాదులుగా ఎంచబడిన వారైనట్లైతే, పరమ దేవుడు తన కృపను మీ హృదయంలో కుమ్మరించి, ఇక మరెన్నడు అటువంటి హేయమైన వస్త్రదారణ చేయకుండా మిమ్మును నిలుపును గాక. పరిశుద్ధాత్మ మీకు తెరచి దానిని మీకు బయలుపరచును గాక. బాప్తిస్మము పొందనివారు…

132భార్యలకు పెత్తనం ఇచ్చి వారి ద్వారా నిడిపించబడుచున్న భర్తలారా, ఈ రాత్రి మీ భార్యలను వాక్యం వారికొచ్చిన స్థానంలోకి మిరు వారిని వుంచుటకు తన కృపను పరమ దేవుడు మీ కనుగ్రహించును గాక. అలాగే క్రీస్తులో మీరు మీ స్థానమును గుర్తించుదురు గాక. మీ పైవారు యజమానులు కాదు, గానీ గృహమునకు మీరె శిరస్సు. గుర్తుంచుకొండి, అసలు ఆమె మొదటి సృష్టి కాదు. సాటియైన సహాయముగా ఇవ్వబడిన ఉపఫలము (byproduct) గనుక ఆమె నీ బట్టలు శుభ్రపరచి, నీకు భోజనం సిద్దపరచి, నీ ఇంటిని చక్కపర్చవలెను. ఇంతే కానీ ఆమె నీకు అధికారి కాదు.

అమెరికా స్త్రీలారా! మీరు ఉద్యోగాల పేరట ముఖములకు రంగు పులుముకొని, తలబిరుసుగా వుంటూ, నియంతలుగా వ్యవహారిస్తున్నారు. ఒక ఆడండి వానికి నీవొక నియంతవు కావచ్చు, అయితే నీవు నిజమైన దేవుని కమారునికి నియంతవు కావు. అవును.

133నీవు నిజదేవుని కుమారునిగా నీ స్థానములో నిలబడివుండుము. అలా ఉండుటకు దేవుడు తన కృపను మీకనుగ్రహించును గాక. అది నిజం. మీరు మీ సిగరెట్లు పడవేసి, మురికి జోకులు ఆపివేసి, మిగతా వ్యర్థమైనదంతటిని వదిలివేయుటకు ఆయన నీకు కృపను అనుగ్రహించును గాక. దేవుని కుమారులుగా జీవించండి, అదియే సువార్తకు యోగ్యమైన జీవితం.

నీవు వీధిలో వెళ్ళుచున్నప్పుడు నిన్ను చూచిన వారు ఇట్లు అందురు గాక, "ఇదిగో క్రైస్తవుడంటే ఇలా వుండాలి. అతడు నిజమైన క్రైస్తవుడు, దేవుడు అతని జీవితంలో వున్నాడు. ఇదిగో ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ చూపుకు పాతకాలపు మనిషిలా వున్న ఆమె నిజమైన స్త్రీ." అది అలా వుండాలి.

పలుకుబడి కలిగిన క్రైస్తవునిగా ఉండుము, ఈ భూమి మీద మనము పరదేశులము. ఇది మన గృహము కాదు. మన గృహము పైనున్నది. మనము రాజు యొక్క కుమారులము, కుమార్తెలమై యున్నాము. మన జీవితములు మెచ్చుకోదగినవిగా వుండును గాక. క్రైస్తవునిగా ఉండే గొప్ప భాగ్యవంతమైన జీవితమును మనం జీవించుదుము గాక. అలాంటి జీవితమును నీవు జీవించనట్లైతే, క్రైస్తవుడనని అని చెప్పుకోవద్దు. ఆ పేరుకి అపకీర్తి తేవొద్దు.

134ఇంత వేడిగా వున్నప్పటికి ఓపికతో ఇక్కడ కూర్చున్నందుకు మీకు వందనములు. ఆ దినమున మీలో ఒక్కరు కూడా నశించపోకుందురు గాక. ఏదైతే సత్యమని నేను ఎంచుకొన్నానో దానికొరకు నేనెల్లప్పుడు నిలబడునట్లు దేవుని యెదుట నీవు మరియు నేను కృపను కనుగోనాలని నేను నమ్ముచున్నాను. మిమ్ములను బాధ పెట్టడం నా ఉదేశ్యము కాదు. మీతో అనిపించుకోవటం నా అభిమతము కాదు. చూశారా? నా కుమారుడు ఏది చేసినా నేను చర్య తీసికోకుండా మౌనంగా వున్నట్లైతే, నేను వాడి శ్రేయస్సును కోరే మంచి తండ్రిని కాబోను. వాడిని నేను సరిదిద్దాలి. ప్రేమించేవాడు సరిదిద్దుతాడు. ప్రేమ సరిదిద్దును. ప్యాట్ సహోదరుడా, ఆ రోజు నీవు నాకు వ్రాసిన దానిని నేను మరచిపోలేను. అదింకను నా వద్దనే వున్నది. ప్రేమ సరిదిద్దును. బైబిల్ అలా చెప్పుచున్నది. సరిదిద్దకపోతే… ఆ కారణమును బట్టియే దేవుడు మనల్ని సరిదిద్దుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు.

మృదువైన, చురుకైన యోగ్యమగు జీవితమును మనమిప్పటి నుండి జీవించుదుము గాక. "మంచిది, దేవునికే స్తోత్రం. దానిని పొందుకొన్నదని నాకు తెలుసు. ఆమె భాషలో మాట్లాడెను. ఆత్మలో నాట్యామాడెను." దీని మీద నీవు దృష్టి పెట్టవద్దు. అది మంచిదే. అయితే ఆమెలో ఆత్మఫలము లేకపోతే ఆమెలో ఆత్మ లేనట్టే ఆమె కేవలం ఉద్రేకపడుచున్నది. దానిని అనుకరణ చేయుచున్నది. పరిశుద్ధాత్మ నీలో వుంటేనే నీవు ఆత్మ ఫలము గల జీవితమును జీవిస్తావు. ఆయన పనిచేసే విధానము అదొక్కటే సుమా!

135దేవుడు మిమ్ములను దీవించును గాక. కొద్దిసేపు మన౦ తలలు వంచుదాం.

ఈ అంత్యదినాన తన వెలుగును ప్రసరింపజేసిన దేవుడు, నా యొదుట వ్రేలాడుచున్న వెలుగు, అది ఆయన వాక్యము, దూతల పఠము, పిరమిడ్ ఆకారంలో ప్రత్యక్షమైన మర్మయుక్తమగు వెలుగు, అది ఇక్కడ ఎలా వున్నదో కూడా సైన్స్ వారికి అర్థము కాలేదు. దానిని కనీసం వివరించజాలరు. అయితే తండ్రి, దానికొరకు మేము కృతజ్ఞలము. అది జరుగుటకు నెలలకు ముందే దానిని నీవు నీవు చెప్పియున్నావు గనుక మేము నీకు ఎంత ఋణస్తులము.

ప్రభువా, నీ పేరు ధరించిన నీ ప్రజలు పాపముల నుండి, అవిశ్వాసము నుండి వేరైపోవుదురు గాక. ప్రభువా! నా సహోదరీలా విషయంలో నేను ఎంతో కఠినముగా మాట్లాడవలసివచ్చింది. దానర్థం నేను వారిని ప్రేమించట్లేదని కాదు గానీ, వారు దైవసత్యాన్ని విని కూడా అపవాది ఉచ్చులోపడి, జీవితములను అలానే ముగించుకొని ఆ స్థితిలోనే వారు నిన్ను కలుసుకోవటం నాకిష్టంలేదు. గనుక వారు లేఖనములను పరిశోధించి నేను చెప్పెది సత్యమని గుర్తించి, యదార్థముగా మోకాళ్ళు మీదపడి, "దేవా, అది సత్యము" అని చెప్పుదురు గాక. ఆ అవసరతలను, ప్రభువా, వారు గుర్తించి యదార్థముగా వారు వుందురు గాక. నీ వాక్యమే సత్యము.

136ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు చెప్పబడిన వాటినిబట్టి గాయపడి వుండొచ్చును. అయితే నేను కాదు గాని దేవుని ఆత్మయే వారితో మాట్లాడినది, గనుక వారింకా కూర్చొని దానిని వినుచున్నారు. ఇప్పటికే ఎంతో సమయమైనది. ఈ సాయంకాలం ఎంతో సమయం గడిచిపొయింది. అలాగే నేను జీవించుచున్న ఘడియయు ఎంతో ఆలస్యమైపోయింది. సూర్యుడు అస్తమించుచున్నాడు. లోకము చల్లబడుతుంది. దేవా, త్వరలో అందకారము అలుము కొనబోవుచున్నది, ప్రభువు వచ్చి తన సంఘమును తీసికొని వెళ్ళబోవుచున్నాడు. ప్రభువా, మేమేలా నీకు వందనములు తెలుపుదుము.

ప్రతి ఒక్కరిని దైవీక సన్నిధిలో ఇప్పుడు ఆశీర్వధించమని ప్రార్ధి౦చుచున్నాము. ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా ఈ టేపును వినే ప్రతి ఒక్కరు సిద్దాంతాల నుండి ప్రతి విధమగు దానిని నుండి వేరైపొయి జీవము గల దేవుని సేవించుటకు దక్షిణ దేశపు రాణి చేసినట్లు, తమ జీవితములను పెట్టుబడిగా పెట్టునట్టు చేయుము. యేసుక్రీస్తును, పరమ దేవుని కనబరిచే సొలోమోనును చూచుటకు ఆమె మూడు నెలలుగా ప్రయాణం చేసి వచ్చెను. యేసు అన్నాడు, "ఆమె సొలోమోను జ్ఞానమును వినుటకు భూదిగంతము వచ్చెను, అయితే ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు." సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మేమెరుగుదుము, గొప్ప పరిశుద్ధాత్మ ఇప్పుడు ఉండి ప్రజల ద్వారా పనిచేయుచుండెను. తండ్రి, నీకెలా కృతజ్ఞతలు చెల్లించగలము. దీవెనల కొరకు మేమిప్పుడు ప్రార్ధించుచున్నాము.

137మా ప్రియమైన పాస్టర్, బ్రదర్ నెవిల్ ని దీవించుము. ప్రభువా, ప్రేమతో కూడిన తన ప్రయాసను తలంచుటను బట్టి నా హృదయమెంతో ఉప్పొంగుచున్నది. నేనతడిని ప్రేమించుచున్నను. అతని భార్యను, బిడ్డలను చుచుకొనుటకు అతనిని బలపరుచుము. అతనికి ధైర్యము ప్రసాదించుము. మేమున్న ఈ గొప్ప కోతకాలపు భూమిలో ఇంకా ఎక్కువ సంవత్సరములు అతడు నీ కొరకు చేయునట్లు అతనిని దీవించుము.

ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్న సేవక సహోదరులందరిని దీవించుము. వీరిలో చాలా మంది ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి అతిధిలుగా వచ్చియున్నారు. వారితో ఉండమని ప్రార్థించుచున్నాను. జాని మరియు రడెల్, ప్రశస్తమగు ఆ మనుష్యులు ఈ సంఘమునకు అనుబంధ సంఘములుగా వుండి, చుట్టు ప్రక్కల పట్టణాలలో ఈ సువార్త వెలుగు కొరకు నిలిచియున్నారు, ఈ వెలుగు కొరకు పోరాడుచున్నారు. ప్రభువా, అట్టి మనుష్యుల కొరకు వందనములు, వారిని ప్రోత్సాహించరండి. క్రైస్తవులుగా వారు తమనుతాము నిరూపించుకొనుటకు వారి మీదకి వచ్చుచున్న గొప్ప శ్రమలు, వ్యతిరేకతలను ఎదురొడ్డి నిలుచుటకు వారికి కృపను అనుగ్రహించండి.

ప్రభువా, రోగులను, బాదింపబడుచున్నవారిని స్వస్థపరచండి. ఈ రాబోవు వారమంతయు మాతో ఉండండి. ఈ చిన్ని ఆదివారపు బడి పాటాలు వారి హృదయములలో నుండి ఎన్నడూ తోలిగిపోనియకుండా చేయండి. దివారాత్రులు వారు వాటిని ధ్యానించుదురు గాక. తండ్రీ, ఈ దీవెనలు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్

138మీరాయనను ప్రేమించుచున్నారా? [సమాజము ఆమెన్ చెప్పుచున్నది.] మీరు దానిని నమ్ముచున్నారా? ["ఆమెన్."] మనమెక్కువగా ఇష్టపడే పాటను పాడుదాం. "నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను." మనమందరం కలిసి పాడుదాం, సిస్టర్ అంగ్రేన్ ఎక్కడ? పియోను వాయించె సిస్టర్డ్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నాకు కనబడుటలేదు. ఆ ఇక్కడ ఒక సిస్టర్ వుండెను. మంచిది. ఈ రాత్రి నేను బ్రదర్ అంగ్రేన్ని చూడలేదు. నీవెంతో గొప్పవాడవి! అనే పాటను అతడు పాడాలని నేను కోరియున్నాను. బహుశా, బ్రదర్ ఇంటికి వెళ్ళాడు అనుకొంటున్నాను. ఈ ఉదయమున నేనాపాటను విన్నాను. నిశ్చయముగా నేను అభినందించుచున్నాను. మై, ఓ మై! అది నా హృదయములో మ్రోగుచున్నది. అతడు ఆ పాటను పాడాలని నేను కోరుచున్నాను!

139ఇప్పుడు మనమందరం కలిసి, "నేనాయనను ప్రేమింతును" అను పాట పాడెదము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ఆయనవైపే చూచుచూ, "ప్రభువా, నాలో లోకమేదైనను వుంటే ఇప్పుడే దానిని తీసివేయండి" అని చెప్పుదాం. బయట ఉన్నవారు, ఈ టేపు వింటున్నవారు.

ఈ పాటను మీరు వింటున్నప్పుడు, వాక్యము చేత ఖండింపబడినట్లైతే, అది వాక్యానుసారము కాదేమోనని మీరు తలిస్తే దానికి సంబంధించి లేఖనాలను పరిశోధించండి. అవునండి. అది సరైనది. జీవమరణములు దానియందున్నవి.

గొప్ప దీవెనున్న ఈ సమయమందు మనము ఈ పాటను పాడుచుండగా, మీలో ఇంకా ఏదైనా లోపమున్నట్టు అనిపిస్తే మిరెక్కడున్న సరే, మీ చేతిని పైకెత్తండి. నీ చుట్టూవున్న నీ పిల్లలు, నీ భార్య అందరు కలిసి చేతులు పైకెత్తండి. "నేనాయనను ప్రేమించుచున్నాను" పాట పాడుచూ, మీ జీవితములను ఆయనకు అప్పగించుకొనుడి. "ప్రభువా, సమస్త దుష్టత్వము నుండి నన్ను శుద్దిచేయండి" అని చెప్ప౦డి.

మనము పాడుచుండగా, లేచి నిలబడుదుము.

నేనాయనను ప్రేమి౦చుచున్నాను.

ప్రభువైన యేసూ, జనులను స్వస్థపరచండి, యేసుక్రీస్తు నామమున ఈ చేతి గుడ్డలను దీవించండి. ఆమెన్.

నా రక్షణను కొనెను,

కల్వరి వృక్షముపై.

140ఇప్పుడు సిస్టర్ అలాగే వాయించండి, ఈ గొప్ప దీవెనను కొనసాగించండి. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకొండి. హృదయములో ప్రార్థించుదం ప్రభువైన యేసూ, నన్ను పరిశోధించుము. నేను నిజంగా ప్రేమించుచున్నానా? "మీరు నన్ను ప్రేమించిన యెడల నా మాటను చేయుము. మీరు నన్ను ప్రేమించించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని నీవు అన్నావు ప్రభువా. ఇప్పుడు, నీ హృదయములో చెప్పుము, "ప్రభువా, నీ వాక్యమును కాచుకొందును గాక. నా హృదయములో దానిని దాచుకొందును గాక. నీకు విరోదముగా ఎన్నడు పాపము చేయకుండునట్లు, నీవు చెప్పిన దానికి అవిదేయున్ని కాకుండునటు, వాక్యమును నాలో ఉ౦చుకొందును గాక."

నేను ప్రేమించుచున్నాను" అను పాట పాడుచుండగా మీ ప్రక్కవారితో, అందుబాటులో ఉన్నవారితో కరచాలనం చేయండి. దేవుడు నిన్ను దీవించును గాక, బ్రదర్. దేవుడు నిన్ను దీవించును గాక, సిస్టర్ అని చెప్పండి. నెమ్మదిగా చెప్పండి.

దేవుడు నిన్ను దీవించును గాక. బ్రదర్, దేవుడు నిన్ను దీవించును గాక. మై సిస్టర్, దేవుడు నిన్ను దీవించును గాక. సిస్టర్, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. సిస్టర్, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.

ఇప్పుడు ఆయన తట్టు మన చేతులెత్తుదాం.

నేనాయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా కల్వరీ వృక్షము పై

నా రక్షణను కొనెను.

మీరు సెలవు తీసికోగోరుచున్నారా?

141మీరాయనను ప్రేమించుచున్నారా? [సమాజం ఆమెన్ అనుచున్నది.] ఆయన అద్భుతమైనవాడు. ["ఆమెన్."] పిల్లలారా మీలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధి౦తును. నేను చెప్పిన మాటలు మీకు ప్రయోజనం కానట్లైతే ఏ౦ లాభం? నేను అలిసిపోవటం, పగలగొట్టబడటం ఎందుకు చెప్పండి? ఇక్కడ నిలబడివుండటం కష్టంగా వుంది. నా కాళ్ళు నొప్పి పుట్టుచున్నవి. నా బూట్లు, కాళ్ళు చెమటలు పుట్టుచున్నవి, తడిచిపొయినవి. నేనెంతో అలిసిపోయాను. ఓపిక లేదు. మూడు లేక నాలుగు గంటల సేపు వర్తమానమును బోధించితిని, రాత్రి౦బవళ్ళు రోగుల కొరకై ప్రార్ధి౦చితిని. నేనిక్కడ ఎందుకు నిలబడాలి మికు ఉపయోగంలేకపోతే?

ఈ ముపై ఏండ్లు నేను ప్రఖ్యాతి కొరకు చేయలేదు. పేరు ప్రఖ్యాతులు నాక్కర్లేదు. నేను ధనము కూడా తీసికొననని మీకు తెలుసు కదా? ప్రభు నామములో నేను చెప్పినది ఎన్నడైనా నెరవేరకుండా ఉన్నదా? అది మీకు తేలుసు.

మిమ్మును నేను ప్రేమించుచున్నాను. మిలో ప్రతి ఒక్కరికొరకు నా నా హృదయములో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని యెదుట నేను నిలువబడి "దేవా వారికి నేను సహాయం చేయునిమ్ము, వారికొరకు దానిని చెసెదను" అని చెప్పగోరుదును. దానిని నేను చేయలేను. ప్రతి ఒక్కడు తనకుతానే ఆయన ఎదుట నిలబడాలి.

142ఈ దినాలలో ఒక దినాన మనమంతా పైకి వెళ్ళబోవుచున్నామని నేను నమ్ముచున్నాను. దానికి ముందు మనం నిద్రి౦చినట్లైతే, నేను మీ యొద్ద నుండి తీసికొనిపోబడినట్లైతే, గుర్తుంచుకొండి - ఆవలి గట్టున నేను మిమ్మును కలిసికొందును. అది అక్కడ అని నాకు తెలుసు. ఏవైతే జరగబోవుచున్నవో వాటిని ఆయన నాకు దర్శన రూపమున చూపెను, అవి పరిపూర్ణమైనవి, అవి తప్పక నెరవేరును. ఇప్పటి వరకు నేను చెప్పినది జరుగలేదని మీలో ఎవరైనా చెప్పగలరా. ప్రపంచములో ఉన్నవారికీ అది తెలుసు. వేదిక మీద మీరెన్నడు చూడలేదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏది చెప్పారో, చూచారా? అదెల్లప్పుడు అలానే. కాలమనే తెరకు అవతలికి దేవుడు నన్ను తీసికెళ్ళెను. స్త్రీ పురుషులు అనేకులు నా చుట్టూ చేరీ, "ఓ బ్రదర్ బ్రెన్హా౦" అనుచు కౌగిలించుకొనిరి.

నేను కూర్చోలేను. నేను అలిసిపోయాను. ఎలాగ నేను వెళ్ళుదును. నా వీపు బాగం నొప్పిగా వుంది. ఇప్పుడు నా వయస్సు 54 సంవత్సరముల. ఏళ్ళ గడిచేకొద్ది బాదలెక్కువగుచున్నవి.

"దేవా నన్ను పట్టుకోండి. నన్ను పట్టుకోండి, వాక్యమును బోధించుటకు, సత్యము మీద నిలిచియుండుటకు. నా కుమారుడు జోసఫ్ పెరిగి పెద్దవాడై పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు, చిరిగిపోయిన నా పాత బైబిల్ ని అతని చేతిలో వుంచి - "కుమారుడా నీ జీవితాంతం దీనిని మోయుము. దీని విషయమై ఎన్నడూ రాజీపడవద్దు" అని చెప్పుదును.

143బిల్లీ సువార్తను ప్రకటిస్తాడేమోనని అనుకొనుచున్నాను. దేవుడతనిని పిలువలేదు.

కానీ బాలుడగు జోసఫ్ ను దేవుడు పిలిచాడని నేను నమ్ముచున్నాను. ఆ కారణమున తోటి పిల్లలు అతనిని తక్కువగా చూడరాదు. అతడొక నాయకుడు, దేవుడతనిని పిలిచాడని నాకు తెలుసు. వాక్య మార్గములో నేనతనిని తర్ఫీదునియ్యగోరుచున్నాను, ప్రభువు మార్గములో పెంచగోరుచున్నాను. అతడు పెద్దవడైనప్పుడు దాని నుండి తోలగిపోడు. దేవుని చిత్తమైతే, స్వయంగా నేనే అతనిని పెంచగోరుచున్నాను. నేను ముసలివాడినై వెనుక కూర్చొని, అతడు వేదిక మీద నిలబడి, "నా తండ్రి ప్రకటించిన అదే సువార్త కొరకు నేను నిలబడియున్నాను. నా తండ్రి అక్కడ అలసిపోయి, ముసలివాడై, ఈ రాత్రి కూర్చొనియున్నాడు. ఆయన స్థానమును నేను తీసికొనగొరుచున్నాను మరియు నిలబడియున్నాను" అని చెప్పును.

అప్పుడు నేను కన్నులేత్తి ఇలా అందును, "ప్రభువా, నీ దాసున్ని సమాదానముగా పోనిమ్ము." సమయమొచ్చినట్లైతే దానిని నేను చూడగోరుచున్నాను.

144ఈ తరములో కాక మరో తరములో నేను ఎలా రాగలను? రాలేను. నేను ఈ తరములో రావలసివుండెను. మీతో కలిసి నేను నిలబడవలసివుండెను. ఏ సువార్తనైతే నేను మికు బోదించితిని దాని విషయమై దేవుని యెదుట మీ కొరకు నేను లెక్క అప్పగించవలెను. ఏదైతే సత్యమని నేను అనుకొంటినో దానియందు నేను మిమ్మును పెంచితిని. దానియందే మీరు ముందుకెళ్ళాలని మిమ్మును ప్రోత్సాహపర్చుచున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు బోదిస్తే, దాని నేనే దేవునికి లెక్క అప్పజెప్పవలెను. హృదయపూర్వకముగా మీలో ప్రతి ఒక్కరిని దైవీక క్రైస్తవ ప్రేమతో ప్రేమించుచున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. నా కొరకు ప్రార్ధి౦చండి.

నా భవిష్యతు ఎలా వుండునో నేనెరుగను, కానీ నా భవిషత్తు, ఎవరి చేతిలో వున్నదో నేనెరుగుదును, గనుక దానియందు నేను విశ్రాంతి కలిగియున్నాను.

యేసుక్రీస్తు దాసునిగా ఆయన పై నాకు ఎక్కువ నమ్మకమున్నది. మన పాస్టర్, బ్రదర్ నెవిల్ కు ఈ వేదికను అప్పగించుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...